Sri Sathya Sai
-
సాయం చేసేందుకు వెళితే దగా చేశారు!
బత్తలపల్లి: ద్విచక్ర వాహనంపై నుంచి అదుపు తప్పి కిందపడుతున్న యువకుడికి సాయం చేసేందుకు వెళ్లిన వ్యక్తి సెల్‌ఫోన్‌ను చాకచక్యంగా అపహరించడమే కాక, ఆ సెల్‌ఫోన్‌లోని యూపీఐ బదలాయింపుల ద్వారా రూ.1.82 లక్షలను కాజేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన మేరకు... బత్తలపల్లిలోని ధర్మవరం మార్గంలో శనివారం ఉదయం రాజారెడ్డి ఎలక్ట్రికల్ షాపు వద్ద ముళ్లగూరు అయ్యప్ప నిల్చొని ఉండగా... ధర్మవరం వైపు నుంచి ద్విచక్రవాహనంపై వచ్చిన ఓ యువకుడు బండి స్కిడ్ అవుతున్నట్లు నటించి, అక్కడే ఉన్న అయ్యప్పను సాయం కోరాడు. దీంతో అయ్యప్ప ద్విచక్ర వాహనాన్ని ఎత్తే ప్రయత్నం చేస్తుండగా మరో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు చాకచక్యంగా అయ్యప్ప చొక్కాలోని సెల్‌ఫోన్‌ను అపహరించారు. అయితే తన సెల్‌ఫోన్ పోయిన విషయం ఆలస్యంగా గుర్తించిన అయ్యప్ప దాని గురించి రెండు రోజులుగా ఆరా తీశాడు. ఫలితం దక్కలేదు. ఈ లోపు ఆయన కుమారుడు తన తండ్రి బ్యాంక్ ఖాతాలో నగదు జమ చేసి, విషయాన్ని తెలపడంతో సోమవారం ఉదయం బ్యాంక్‌కు వెళ్లి పరిశీలించుకున్నాడు. అదులో రూ.1.82 లక్షలు తక్కువగా ఉన్నట్లుగా నిర్ధారించుకున్న వాటి గురించి బ్యాంక్ అధికారులను ఆరా తీయడంతో వివిధ రకాల వస్తు కొనుగోళ్లకు యూపీఐ బదలాయింపులు చేసినట్లుగా నిర్ధారించారు. దీంతో జరిగిన మోసాన్ని గ్రహించిన అయ్యప్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.20 వేలు విలువ చేసే సెల్‌ఫోన్‌ను అపహరించడమే కాక, దానిని ఉపయోగించి రూ.1.82 లక్షలు కాజేసిన యువకులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. -
బుల్లెట్ షెల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనుల పరిశీలన
చెన్నేకొత్తపల్లి: మండలంలోని న్యామద్దెల సమీపంలో నిర్మాణంలో ఉన్న బుల్లెట్ షెల్ (తుపాకులలో ఉపయోగించే) ఫ్యాక్టరీని జిల్లా ఎస్పీ రత్న మంగళవారం పరిశీలించారు. ఎంత విస్తీర్ణంలో ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారంటూ యాజమాన్య ప్రతినిధులతో ఆరా తీశారు. కంపెనీ వివరాలు, చేపట్టిన పనులు ఎంత వరకూ పూర్తి అయింది అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె వెంట ధర్మవరం డీఎస్పీ హేమంత్‌కుమార్, రామగిరి సీఐ శ్రీధర్, చెన్నేకొత్తపల్లి ఎస్ఐ సత్యనారాయణ, కంపెనీ సిబ్బంది ఉన్నారు. నేరాల నియంత్రణకు చొరవ తీసుకోండి పెనుకొండ రూరల్: అసాంఘిక కార్యకలాపాలు, నేరాల నియంత్రణకు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సిబ్బందిని ఎస్పీ రత్న ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కియా పీఎస్‌ను ఆమె తనిఖీ చేశారు. పలు రికార్డులు పరిశీలించారు. ముఖ్యంగా మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలన్నారు. ప్రతి గ్రామ ప్రధాన కూడలిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో సీఐ రాఘవన్, ఎస్ఐ రాజేష్, సిబ్బంది పాల్గొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : ఎస్పీ చెన్నేకొత్తపల్లి: మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని ఎస్పీ రత్న అన్నారు. సీకేపల్లిలోని టింబక్టు కలెక్టివ్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా ఎస్పీ రత్న హాజరయ్యారు. అంతకు ముందు మహిళలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎస్పీతో పాటు టింబక్టు కలెక్టివ్ సంస్థ వ్యవస్థాపకురాలు మేరి మాట్లాడారు. మహిళల రక్షణకు ఉన్న చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ధర్మవరం డీఎస్పీ హేమంతకుమార్, సీఐ శ్రీధర్, ఎస్ఐ సత్యనారాయణ, సంస్థ ఏడీ సుకన్య, మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు. -
వివాహిత అనుమానాస్పద మృతి
● అల్లుడే కారణమని మృతురాలి తల్లి ఫిర్యాదు ధర్మవరం అర్బన్: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ధర్మవరం వన్‌టౌన్ పోలీసులు తెలిపిన మేరకు... పట్టణంలోని నేసేపేటకు చెందిన లక్ష్మీపతి భార్య నీరుగంటి అఖిల(21) ఓ పైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. రెండేళ్ల క్రితం వివాహమైన వీరి సంసారం కొంత కాలం సజావుగానే సాగింది. ఆ తర్వాత మనస్పర్థలు చోటు చేసుకుని తరచూ గొడవపడేవారు. ఈ క్రమంలో మంగళవారం ఇంట్లోనే ఉరి వేసుకుని అఖిల ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు అక్కడకు చేరుకుని బోరున విలపించారు. అల్లుడు లక్ష్మీపతి, ఆయన కుటుంబ సభ్యుల వేధింపులే తమ కుమార్తె మృతికి కారణమంటూ మృతురాలి తల్లి కళావతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. లక్ష్మీపతిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. విద్యార్ధిని బలవన్మరణం సోమందేపల్లి: స్థానిక పాతూరులో నివాసముంటున్న ఈడిగ సురేష్ కుమార్తె పూజిత (15) ఆత్మహత్య చేసుకుంది. కేజీబీవీలో పదో తరగతి చదువుతున్న పూజిత... తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని నోట్ రాసి మంగళవారం సాయంత్రం ఇంట్లోనే పైకప్పునకు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. బాలిక మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ‘క్లస్టర్ సమావేశాన్ని రద్దు చేయాలి’ పుట్టపర్తి రూరల్: పదో తరగతి, ఇంటర్, ఓపెన్ స్కూల్ పరీక్షల నేపథ్యంలో బుధవారం నిర్వహించనున్న పాఠశాల క్లస్టర్ సమావేశాన్ని రద్దు చేయాలని ఏపీటీఎఫ్ 1938 రాష్ట్ర ఉపాధ్యక్షుడు విశ్వనాథ్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పదో తరగతి విద్యార్థులకు గ్రాండ్ టెస్ట్‌లు జరుగుతున్నాయని, చాలామంది టీచర్లు ఇంటర్, ఓపెన్ స్కూల్ పరీక్షల విధుల్లో ఉన్నారన్నారు. ఈ పరిస్థితులో ఈ నెల జరగాల్సిన పాఠశాల క్లస్టర్ సమావేశాన్ని రద్దు చేయడం ఉత్తమమన్నారు. ఈ అంశంలో ఒంటెద్దు పోకడలకు పోకూడదని ప్రభుత్వానికి సూచించారు. ఆకట్టుకున్న కర్రసాము పెద్దవడుగూరు(యాడికి): మండల కేంద్రమైన యాడికి చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన కర్రసాము పోటీలు ఉత్సాహంగా సాగాయి. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన యువకులు పోటీ పడగా, యాడికి గ్రామానికి చెందిన నాగార్జున ప్రథమ, శివకుమార్ ద్వితీయ, మహేష్ తృతీయ స్థానాన్ని దక్కించుకున్నారు. విజేతలను అభినందిస్తూ నిర్వాహకులు నగదు పురస్కారాలతో సత్కరించారు. -
‘మామిడి తోటల్లో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి’
అనంతపురం అగ్రికల్చర్: మామిడి తోటలు పిందె దశలో ఉన్నందున మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు వస్తాయని ఉద్యానశాఖ ఉమ్మడి జిల్లా అధికారులు జి.చంద్రశేఖర్, బీఎంవీ నరసింహారావు తెలిపారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల పిందె రాలడం, బంక కారడం, నల్లతామర, రసంపీల్చు పురుగులు, తేనె మంచు పురుగు ఆశించి నష్టం కలిగించే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం వారం లేదా ఐదు రోజులకోసారి నీటి తడులు ఇవ్వాలన్నారు. రసంపీల్చుపురుగు జాతికి చెందిన నల్లతామరను సకాలంలో నివారించుకుంటే మంచి దిగుబడులు వస్తాయన్నారు. నివారణలో భాగంగా తోటలో కలుపు లేకుండా జాగ్రత్త తీసుకోవాలన్నారు. ఎకరాకు 40 నుంచి 50 నీలి లేదా తెలుపు రంగు జిగురు అట్టలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. పూత ప్రారంభ దశ నుంచి మొదట వేప సంబంధిత మందులు పిచికారీ చేయాలన్నారు. అందులో 2 మి.లీ అజాడిరక్టిన్ ( పది వేల పీపీఎం) లేదంటే 3 మి.లీ 1,500 పీపీఎం లేదా 3 వేల పీపీఎం ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. అలాగే 7.5 గ్రాములు పొంగానియా లేదా నీమ్ సోప్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలని తెలిపారు. అలాగే 5 గ్రాములు బవేరియా బాసియానా లేదా లేకానిసిల్లియం లేకాని లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలని సూచించారు. వీటన్నింటికీ నల్లతామర అదుపులోకి రాకపోతే చివరగా 2 మి.లీ పిప్రొనిల్ లేదా 0.3 మి.లీ ఇమిడాక్లోప్రిడ్ లేదా 0.3 గ్రాములు థయామిథాక్సామ్ లేదా 1 మి.లీ స్పైరోటేట్రామెట్ లేదా 1 మి.లీ స్పైనోటోరం లేదా 1 మి.లీ ఫ్లూక్సా మెటామైడ్ మందులు మార్చి మార్చి రెండు మూడు దఫాలుగా పిచికారీ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందని తెలిపారు. -
కార్మికులను మోసగిస్తున్న ప్రభుత్వం
అనంతపురం అర్బన్: వేలాది మంది ప్రజల దాహార్తిని తీరుస్తున్న శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కార్మికులను ప్రభుత్వం దగా చేస్తోందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.ఓబుళు మండిపడ్డారు. కార్మికులకు 10 నెలల వేతనం, 35 నెలల పీఎఫ్ బకాయిలు చెల్లించకుండా అన్యాయం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వేతన, పీఎఫ్ బకాయిల మంజూరుతో పాటు లీటర్ బేస్ విధానం రద్దు చేయాలనే డిమాండ్‌తో మంగళవారం కలెక్టరేట్ ఎదుట శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కార్మికులు నిరసన తెలిపారు. ఓబుళు మాట్లాడుతూ... శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కింద 600 మంది కార్మికులు పనిచేస్తున్నారన్నారు. వేతనాల కోసం ఏడాదిలో మూడు దఫాలు సమ్మెలు చేయాల్సి వస్తోందన్నారు. సరైన బడ్జెట్ కేటాయించి కార్మికులకు వేతనం, పీఎఫ్ సక్రమంగా చెల్లించాలన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన లీటర్ బేస్ విధానం కారణంగా నీటి సరఫరాలో చాలా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. అయితే వీటికి కార్మికులను బాధ్యులను చేస్తూ ఒక్కొక్క కార్మికుడికి రూ.2,500 చొప్పున వేతనంలో కోత విధించడం సబబు కాదన్నారు. సరైన వసతులు కల్పించని కారణంగా తలెత్తుతున్న ఈ వైఫల్యానికి తొలుత ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉందన్నారు. ఆ తరువాత చీఫ్ ఇంజనీర్, సూపరింటెండెంట్ ఇంజనీర్, ఈఈలు, డీఈఈ వరకు అధికారులను ఎందుకు బాధ్యులను చేయడం లేదని ప్రశ్నించారు. పంపు హౌస్‌లో ఆపరేటర్లు, హెల్పర్లకు మూడు షిఫ్ట్‌లు ఉంటే... కార్మికులను తగ్గించి రెండు షిఫ్ట్‌గా పనిచేయించాలని టెండర్లలో పెట్టినట్లు తెలుస్తోందన్నారు. దీంతో వందల గ్రామాలకు నీరందిస్తున్న ఈ పథకం నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉందన్నారు. పథకాన్ని కాపాడుకునేందుకు పోరాటం సాగిస్తామని, ప్రజలు కూడా ముందుకురావాలని పిలుపునిచ్చారు. అనంతరం డీఆర్ఓ ఎ.మలోలను ఆయన చాంబర్లో నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో శ్రీరామరెడ్డి నీటి సరఫరా పథకం కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రాము, నాయకులు హొన్నూరు స్వామి, ప్రభాకర్, సోము, చిక్కన్న, హనుమంతరాయ, నాగేంద్ర, కార్మికులు పాల్గొన్నారు. వేతన బకాయిల కోసం ఏడాదిలో మూడు సార్లు ధర్నాలు చేయాలా? సరైన బడ్జెట్ కేటాయించి జీతభత్యాలు సక్రమంగా చెల్లించాలి సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబుళు -
హంస వాహనంపై వీణాపాణి
కదిరి: బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఖాద్రీ లక్ష్మీ నారసింహుడు మంగళవారం రాత్రి వీణాపాణిగా హంసవాహనంపై చదువుల తల్లి సరస్వతి అవతారంలో తిరుమాడ వీధుల్లో దర్శనమిచ్చారు. చేతిలో వీణ, విశేష దివ్యాభరణాలు, పట్టు పీతాంబరాలు ధరించి తిరువీధుల్లో ఊరేగుతున్న శ్రీవారి దివ్యమంగళరూపాన్ని దర్శించుకుని భక్తజనం తన్మయత్వం చెందారు. నారసింహుడు హంస వాహనాన్ని అధిరోహించి తిరువీధుల్లో దర్శనమివ్వడం ద్వారా భక్తులలో అహంభావాన్ని తొలగించి శరణాగతిని కల్గిస్తాడని అర్చక పండితులు తెలిపారు. పరమాత్మ వేదోపదేశాన్ని హంస రూపంలోనే చేసినందున తుచ్ఛమైన కోర్కెల అంధకారం వీడి శాశ్వతమైన పరబ్రహ్మ చెంతకు చేరే ముక్తిమార్గం వైపు నడవాలని ఈ హంసవాహనం ద్వారా స్వామివారు తన భక్తులకు చాటిచెబుతారని అర్చకులు వెల్లడించారు. ఉభయదారులుగా పట్టణానికి చెందిన తోటంశెట్టి రాజుగోపాల్‌శెట్టి కుటుంబీకులు వ్యవహరించారని ఆలయ ఈఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు. కాగా,బ్రహ్మోత్సవాల్లో భాగంగా కాటమరాయుడు బుధవారం మాడవీధుల్లో సింహవాహనంపై దర్శనమివ్వనున్నారు. -
సాయం చేసేందుకు వెళితే దగా చేశారు!
బత్తలపల్లి: ద్విచక్ర వాహనంపై నుంచి అదుపు తప్పి కిందపడుతున్న యువకుడికి సాయం చేసేందుకు వెళ్లిన వ్యక్తి సెల్‌ఫోన్‌ను చాకచక్యంగా అపహరించడమే కాక, ఆ సెల్‌ఫోన్‌లోని యూపీఐ బదలాయింపుల ద్వారా రూ.1.82 లక్షలను కాజేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన మేరకు... బత్తలపల్లిలోని ధర్మవరం మార్గంలో శనివారం ఉదయం రాజారెడ్డి ఎలక్ట్రికల్ షాపు వద్ద ముళ్లగూరు అయ్యప్ప నిల్చొని ఉండగా... ధర్మవరం వైపు నుంచి ద్విచక్రవాహనంపై వచ్చిన ఓ యువకుడు బండి స్కిడ్ అవుతున్నట్లు నటించి, అక్కడే ఉన్న అయ్యప్పను సాయం కోరాడు. దీంతో అయ్యప్ప ద్విచక్ర వాహనాన్ని ఎత్తే ప్రయత్నం చేస్తుండగా మరో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు చాకచక్యంగా అయ్యప్ప చొక్కాలోని సెల్‌ఫోన్‌ను అపహరించారు. అయితే తన సెల్‌ఫోన్ పోయిన విషయం ఆలస్యంగా గుర్తించిన అయ్యప్ప దాని గురించి రెండు రోజులుగా ఆరా తీశాడు. ఫలితం దక్కలేదు. ఈ లోపు ఆయన కుమారుడు తన తండ్రి బ్యాంక్ ఖాతాలో నగదు జమ చేసి, విషయాన్ని తెలపడంతో సోమవారం ఉదయం బ్యాంక్‌కు వెళ్లి పరిశీలించుకున్నాడు. అదులో రూ.1.82 లక్షలు తక్కువగా ఉన్నట్లుగా నిర్ధారించుకున్న వాటి గురించి బ్యాంక్ అధికారులను ఆరా తీయడంతో వివిధ రకాల వస్తు కొనుగోళ్లకు యూపీఐ బదలాయింపులు చేసినట్లుగా నిర్ధారించారు. దీంతో జరిగిన మోసాన్ని గ్రహించిన అయ్యప్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.20 వేలు విలువ చేసే సెల్‌ఫోన్‌ను అపహరించడమే కాక, దానిని ఉపయోగించి రూ.1.82 లక్షలు కాజేసిన యువకులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. -
●గాలేరు–నగరి ద్వారా కుప్పంకు నీరు తీసుకెళ్లొచ్చు ●జిల్లా రైతులను ఇబ్బంది పెట్టేందుకే హంద్రీ–నీవాకు లైనింగ్ పనులు ●రైతు సదస్సులో విశ్వేశ్వరరెడ్డి
కూడేరు: ఉమ్మడి అనంత జిల్లా రైతులపై సీఎం చంద్రబాబు కక్షకట్టి హంద్రీ–నీవా కాలువకు లైనింగ్ పనులు చేపట్టేందుకు సిద్ధమయ్యారని ఉరవకొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. గ్రావిటీ ద్వారా కుప్పం ప్రాంతానికి గాలేరు–నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు నుంచి కృష్ణా జలాలను తీసుకెళ్లే అవకాశమున్నా... కాదనీ జిల్లా రైతాంగం సంక్షేమాన్ని కూటమి సర్కార్ కాలరాస్తోందన్నారు. మంగళవారం కూడేరులోని శివరావు కల్యాణమంటపం వేదికగా హంద్రీ–నీవా కాలువ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో కమిటీ సభ్యుడు, ఎంపీపీ నారాయణ రెడ్డి అధ్యక్షతన ‘రైతు సదస్సు’ జరిగింది. సదస్సులో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు స్వార్థానికి జిల్లా రైతాంగం తీవ్రంగా నష్టపోతోందన్నారు. గత ప్రభుత్వంలో గాలేరు–నగరి ద్వారా కుప్పం ప్రాంతానికి నీరందించేందుకు అప్పటి సీఎం వైఎస్ జగన్ చర్యలు తీసుకుని 75 శాతం పనులు పూర్తి చేశారని గుర్తు చేశారు. మిగిలిన పనులు పూర్తి చేస్తే జగన్‌కు మంచి పేరు వస్తుందన్న అక్కసుతో సీఎం చంద్రబాబు హంద్రీ–నీవా కాలువకు లైనింగ్ పనులకు టెండర్లు పిలిచారన్నారు. సుమారు రూ.736 కోట్లతో పూర్తయ్యే లైనింగ్ పనులకు రూ.200 కోట్లు అధికంగా పెంచి టెండర్లను తన అనుయాయులకు కట్టబెట్టారని మండిపడ్డారు. ఈ పనులు పూర్తయితే ఉమ్మడి అనంతపురం జిల్లాలో హంద్రీ–నీవా కాలువ ద్వారా 3.5లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలన్న లక్ష్యం నీరుగారిపోతుందన్నారు. లైనింగ్ పనులతో కాలువ గుండా ప్రవహిస్తున్న నీరు భూమిలోకి ఇంకదన్నారు. పక్కలకు ఊట రాదన్నారు. దీంతో భూగర్భ జలాలు అడుగంటి బోరు బావుల్లో నీటి లభ్యత పూర్తిగా తగ్గి పండ్ల తోటలు, ఇతర పంటలు సాగు చేసుకునే రైతులు తీవ్రంగా నష్ట పోతారన్నారు. భూములు బీళ్లుగా మారుతాయన్నారు. భవిష్యత్‌లో కాలువ వెడల్పు చేయడానికి అవకాశముండదన్నారు. లైనింగ్ పనులు ఆపాలని రైతులే వేడుకుంటున్నా... ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుండడం దుర్మార్గమన్నారు. కుప్పం ప్రాంతానికి హంద్రీ–నీవా ద్వారానే నీళ్లు తీసుకెళ్లాలనుకుంటే ముందుగా కాలువను వెడల్పు చేస్తే ఉమ్మడి అనంత జిల్లా రైతులు స్వాగతిస్తారన్నారు. జిల్లా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికై న లైనింగ్ పనులు ఆపాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కోశాధికారి రాయుడు, అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు రమణ, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు కృష్ణ, వైఎస్సార్సీపీ రైతు సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు సిద్ధార్థ, మండల అఽధ్యక్షుడు సిద్ధారెడ్డి, ఏపీ రైతు సంఘం మండల నేతలు నారాయణరెడ్డి, వీరప్ప, వెఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, నేతలు రామచంద్రారెడ్డి, రంగారెడ్డి, రామ్మోహన్, క్రిష్టప్ప, గంగాధర్, నరేష్, కేశన్న తదితరులు పాల్గొన్నారు. ఆత్మహత్యలే శరణ్యం హంద్రీ నీవా కాలువకు కాంక్రీట్‌తో లైనింగ్ పనులు పూర్తయితే ఆత్మహత్యలు తప్ప మరో మార్గం లేదని రైతులు, రైతు సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సదస్సులో జయపురం, ఎంఎంహళ్లి, చోళసముద్రం, పి.నారాయణపురం, తిమ్మాపురం, కరుట్లపల్లితో పాటు మరికొన్ని గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. హంద్రీ నీవా కాలువ పరిధిలో రూ.లక్షల్లో పెట్టుబడితో వివిధ రకాల పంటలు, పండ్ల తోటలను సాగు చేస్తున్నామన్నారు. కాలువకు లైనింగ్ పనులు చేపడితే భూగర్భ జలాలు అడుగంటి పోయి బోరు బావులో నీటి మట్టం తగ్గి పంటలు సాగు చేసుకోలేక నష్టపోవాల్సి వస్తుందన్నారు. ఈ ప్రభుత్వం తమకు మేలు చేయకపోయిన పర్వాలేదని, నష్టం కల్గించే చర్యలు చేపట్టకుండా ఉంటే చాలన్నారు. హంద్రీ–నీవా కాలువ పరిరక్షణకు కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామన్నారు. -
సాంకేతికత నేర్పించడమే జీవాగ్రో ముఖ్య ఉద్దేశం
బత్తలపల్లి: మహిళా రైతులకు విలువ ఆధారిత సాంకేతికతను నేర్పించడమే జీవాగ్రో ముఖ్య ఉద్దేశమని డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ కేఎన్.నరసయ్య పేర్కొన్నారు. మంగళవారం స్థానిక మండల సమాఖ్య కార్యాలయంలో గ్రాంట్ థార్న్టన్ ఆధ్వర్యంలో జీవాగ్రో ప్రాజెక్టులో భాగంగా సామూహిక సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా డీఆర్డీఏ పీడీతో పాటు జీవాగ్రో ప్రాజెక్టు అసిస్టెంట్ సేల్స్ మేనేజర్ కుళ్లాయప్ప, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సుధారాణి, జిల్లా హార్టికల్చర్ అధికారి చంద్రశేఖర్, డాట్ టీసీ నుంచి డాక్టర్ రామసుబ్బయ్య, సీఎస్ఏ ఆదినారాయణ, గ్రాంట్ థార్న్టన్ రామాంజులు, రాధ, హరిబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏడాదిన్నరగా అనంతపురం రూరల్, ముదిగుబ్బ, బత్తలపల్లి ప్రాంతాల్లో గ్రాంట్ థార్న్టన్ అమలులో ఉందని, పండ్ల తోటల పెంపకంపై మహిళా రైతులు దృష్టి సారించేలా చేయడం, వారికి సుస్థిరమైన వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించడం, మార్కెటింగ్ పరంగా వారికి సహాయపడటం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో ఏరియా కోఆర్డినేటర్ సత్యనారాయణ, ఏపీఎం సుదర్శన్‌రాజు, హరిప్రసాద్, శోభా, సీసీలు, బత్తలపల్లి ఎఫ్‌పీఓ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ తదితరులు పాల్గొన్నారు నిలకడగా ఎండుమిర్చి ధర హిందూపురం అర్బన్: ఎండమిర్చి ధర నిలకడగా కొనసాగుతోంది. మంగళవారం స్థానిక వ్యవసాయ మార్కెట్‌కు మంగళవారం 120.05 క్వింటాళ్ల ఎండుమిర్చి రాగా, అధికారులు ఈ–నామ్ పద్ధతిలో వేలం పాట నిర్వహించారు. ఇందులో క్వింటా ఎండుమిర్చి గరిష్టంగా రూ.15 వేలు, కనిష్టంగా రూ.7 వేలు, సరాసరిన రూ.13,500 ప్రకారం ధర పలికినట్లు మార్కెట్ కార్యదర్శి జి. చంద్రమౌళి తెలిపారు. ధర్మవరం–మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ పాక్షికంగా రద్దు గుంతకల్లు: డివిజన్ పరిధిలోని ధర్మవరం రైల్వే జంక్షన్లో 5వ నంబర్ ప్లాట్ఫారం ఏర్పాటు పనుల్లో భాగంగా ధర్మవరం–మచిలీపట్నం మధ్య తిరుగుతున్న ఎక్స్‌ప్రెస్ రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ మంగళవారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. అనంతపురం–మచిలీపట్నం మధ్య మాత్రమే నడుస్తున్నట్లు వెల్లడించారు. మచిలీపట్నం–ధర్మవరం (17215) ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెల 12 నుంచి 30 వరకు, ధర్మవరం–మచిలీపట్నం (17216) ఎక్స్‌ప్రెస్‌ను 13 నుంచి 31 వరకు పాక్షికంగా రద్దు చేసినట్లు వివరించారు. ప్రయాణికులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. -
అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్
అనంతపురం: ఆలయ నిర్మాణానికి పోగు చేసిన మొత్తాన్ని దొంగలించిన ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.10.05 లక్షల నగదు, పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నారు. అనంతపురంలోని పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను అడిషనల్ ఎస్పీ డీవీ రమణమూర్తి వెల్లడించారు. కణేకల్లు మండలం సొల్లాపురం గ్రామంలో సీతారామాంజినేయులు ఆలయ నిర్మాణం కోసం గ్రామస్తులు చందాల రూపంలో పోగు చేసిన రూ.12 లక్షలను గుర్రం లక్ష్మన్న అనే వ్యక్తి వద్ద భద్రపరిచిన విషయం తెలిసిందే. ఈ మొత్తాన్ని దుండగులు అపహరించారు. ఘటనపై ఈ నెల 4న కణేకల్లు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. పాములు పట్టుకుంటూ .. తమిళనాడుకు చెందిన గురునాథం రాజు.. బాతులు మేపుతో జీవనం సాగించేవాడు. గురునాథానికి వరుసకు మేనమామ అయిన జానయ్య ఇటుకల బట్టీలో పనిచేస్తుండేవాడు. వీరి తల్లిదండ్రులు ఊరారా తిరుగుతూ గ్రామాల్లో పాములు ఆడిస్తూ జీవనం సాగించేవారు. తమిళనాడు బాతులు మేపుతున్న సమయంలోనే అక్కడే వీరికి కార్తీక్ అనే యువకుడు పరిచయమై, మంచి స్నేహితులుగా మారారు. ఈ క్రమంలో వలస వచ్చిన ముగ్గురూ గత 20 రోజులుగా కణేకల్లు మండలంలో మోటార్ సైకిల్‌పై గ్రామాల్లో సంచరిస్తూ ఊరు చివర గుడారాలు వేసుకుని రెండు, మూడు రోజులు అక్కడే ఉంటూ పాములు ఆడిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆలయాల్లో హుండీలను అపహరించి, అందులోని భక్తుల కానుకలనూ అపహరించేవారు. దారిన పోతూ చోరీ ఈ నెల 2న కర్ణాటక ప్రాంతానికి వెళ్లిన గురునాథం రాజు, జానయ్య, కార్తీక్... రాత్రి ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యారు. అర్ధరాత్రి సమయంలో సొల్లాపురం వద్దకు చేరుకున్న వారికి గుర్రం లక్ష్మన్న అనే వ్యక్తి తాళం వేసిన ఇల్లు కనిపించడంతో పథకం వేసి 3వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత ఇనుపరాడ్‌తో తలుపు తాళాలు మెండి లోపలకు ప్రవేశించారు. స్క్రూడ్రైవర్ సాయంతో బీరువా తెరిచి అందులో ఉన్న రూ.12 లక్షల నగదు అపహరించారు. చోరీ అనంతరం జీడిపల్లి డ్యామ్ చేరుకుని రూ.50 వేలను జానయ్య తీసుకుని స్వగ్రామానికి వెళ్లిపోయాడు. మిగిలిన డబ్బు తర్వాత పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేయడంతో భయపడి కర్ణాటకలోని సిరిగుప్పకు మకాం మార్చేందుకు మంగళవారం జీడిపల్లి డ్యామ్ మీదుగా ద్విచక్ర వాహనంపై వెళుతుండగా పోలీసులు గుర్తించి కణేకల్లు క్రాస్ వద్ద అరెస్ట్ చేశారు. గురునాథం రాజుపై వైఎస్సారఱ్ జిల్లా యర్రగుంట్ల, కర్నూలు జిల్లా హాలహర్వి పీఎస్‌ల పరిధిల్లో చోరీ కేసులు ఉన్నాయి. తమిళనాడులోని పోలూరు, శ్రీపెరంబూరు పీఎస్‌ల పరిధిల్లోనూ ద్విచక్రవాహనాల అపహరణ కేసులు, కర్ణాటకలోని బొమ్మనహళ్లి, ఏపీలోని వి.కోట పీఎస్ పరిధిలోనూ మోటార్ సైకిళ్ల చోరీ కేసులు ఉన్నాయి. నిందితుల అరెస్ట్‌లో చొరవ చూపిన కళ్యాణదుర్గం డీఎస్పీ పి.రవిబాబు, రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ, కణేకల్లు ఎస్ఐ నాగమధు, డి.హీరేహళ్ ఎస్ఐ గురుప్రసాద్రెడ్డిను ఏఎస్పీ అభినందించారు. రూ.10.05 లక్షల నగదు, పల్సర్ బైక్ స్వాధీనం -
భూసేకరణ పనులన్నీ పూర్తి చేయాలి
ప్రశాంతి నిలయం: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన భూసేకరణ పనులన్నీ సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్‌హాలులో ఎన్‌హెచ్ 342, ఎన్‌హెచ్–716జీ, జాతీయ రహదారులు, వివిధ ప్రాజెక్టుల భూసేకరణకు సంబంధించిన పనుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. జాతీయ రహదారుల కోసం సేకరించిన భూముల రైతులకు ఇచ్చిన పరిహారం వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే భూసేకరణ పెండింగ్ పనులపై ఆరా తీశారు. ప్రమాదాలు జరిగేందుకు అస్కారం ఉన్న ప్రాంతాల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని, విద్యుత్ లైన్లు మార్పు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. బుక్కపట్నం మండలం సిద్దరాంపురం పంచాయతీ భవనం, చిన్నరాయునిపల్లి ప్రాథమిక పాఠశాల కాంపౌండ్ వాల్ సమస్య, బుక్కపట్నం గ్రామ గోశాల సమస్య, పుట్టపర్తి, పెడబల్లి, బూదిలి భూసేకరణకు సంబంధిత అంశాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఎన్‌హెచ్ ఏఐ పీడీ బి.అశోక్ కుమార్, ముత్యాలరావు, నాగరాజు, ఎల్. సుజాత, తహసీల్దార్లు కళ్యాణ్ చక్రవర్తి, మారుతి, సురేష్ బాబు పాల్గొన్నారు. ‘పురం’ మున్సిపల్ కమిషనర్ నియామకంపై రిట్ చిలమత్తూరు: హిందూపురం మున్సిపల్ కమిషనర్ సంగం శ్రీనివాసులు నియామకంపై హైకోర్టులో ఎస్.శ్రీధర్ అనే వ్యక్తి మంగళవారం రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కమిషనర్ అయ్యేందుకు సంగం శ్రీనివాసులును కనీస విద్యార్హత లేదన్నారు. కానీ ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్‌లో హిందూపురం కమిషనర్‌గా నియమిస్తూ జీఓ ఇచ్చిందన్నారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు. వెంటనే ఆ నియామకాన్ని రద్దు చేయాలని కోరారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వాన్ని, మున్సిపల్ శాఖ డైరెక్టర్, ‘పురం’మున్సిపల్ కమిషనర్‌ను ప్రతివాదులుగా చేర్చారు. కాగా, ఇష్టారాజ్యంగా బిల్లులు మంజూరు చేయించుకునేందుకు ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏలు సంగం శ్రీనివాసులును పురం మున్సిపల్ కమిషనర్‌గా నియమించాలని సిఫారసు చేసినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆయన నియామకాన్నే సవాల్ చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడం సంచలనంగా మారింది.మాతాశిశు సంరక్షణే ధ్యేయంగా పని చేయాలి ● సిబ్బందికి డీఎంహెచ్ఓ ఫైరోజాబేగం పిలుపు పుట్టపర్తి అర్బన్: మాతాశిశు సంరక్షణే ధ్యేయంగా వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది పని చేయాలని డీఎంహెచ్ఓ ఫైరోజాబేగం పిలుపునిచ్చారు. మంగళవారం డీఎంహెచ్ఓ తన కార్యాలయంలో మాతాశిశు మరణాలకు సంబంధించి జిల్లా స్థాయి సబ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ ఫిబ్రవరి నెలలో రెడ్డిపల్లి, సోమందేపల్లి, శివనగర్, చిలమత్తూరు, కొక్కంటి, దర్శినమల, పెద్ద మంతూరు పీహెచ్‌సీల పరిధిలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 7 శిశు మరణాలు సంభవించాయన్నారు. తల్లీబిడ్డలను సంరక్షించుకునేందుకు వైద్య,ఆరోగ్య శాఖ సిబ్బంది చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. బాలింతలు, గర్భిణులకు అవగాహన కల్పించడం ద్వారా మాతాశిశు మరణాలను తగ్గించవచ్చన్నారు. ప్రతి నెలా 9వ తేదీన జరిగే శిక్షణలో గర్భిణులకు అవగాహన పెంపొందించాలన్నారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ తిప్పేంద్రనాయక్, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్ఓలు డాక్టర్ మంజువాణి, డాక్టర్ సెల్వియా సాల్మన్, డాక్టర్ నాగేంద్రనాయక్, డాక్టర్ సునీల్, గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రీలత, పీడీయాట్రీషియన్ డాక్టర్ జోయెల్ వెస్లీ, డీపీహెచ్ఎన్ఓ వీరమ్మ, 108 ఈఓ అబ్దుల్ హుస్సేన్, పీహెచ్సీ వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ గొప్ప మనసు..
2019 మే నెలలో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు విద్యార్థులకు రాజకీయాలకు అతీతంగా అండగా నిలిచింది. 2017–19 మధ్య టీడీపీ ప్రభుత్వం పెట్టిన బకాయిలను సైతం చెల్లించి చేయూతనిచ్చింది. అలాగే నాలుగేళ్లలో జిల్లాలో 44,082 మంది ఉన్నత విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు ఒక్క విద్యా దీవెన కిందే రూ.314 కోట్లు అందించింది. వసతి దీవెన కింద జిల్లాలోని 43,301 మంది విద్యార్థులకు జగన్ సర్కార్ రూ.162.38 కోట్ల అందించింది. కానీ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిధులు విడుదల చేయకుండా విద్యార్థులను తీవ్ర ఇబ్బందులు పెడుతోంది. వసతి దీవెనకు కూడా రూపాయి కూడా విడుదల చేయలేదు. ● హిందూపురానికి చెందిన రమేష్‌కు అనంతపురంలోని కళాశాలలో బీటెక్ కంప్యూటర్ సైన్సెస్ పూర్తి చేశాడు. బెంగళూరులోని ఓ ఎంఎన్సీ కంపెనీలో ఏడాదికి రూ.9 లక్షల వేతనంతో ఉద్యోగం సంపాదించాడు. అయితే, ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వాలని కంపెనీ కోరగా.. రమేష్ కళాశాలలో సంప్రదించాడు. ప్రభుత్వం ఇంతవరకూ ఫీజు రీయింబర్స్మెంట్ చేయలేదని, సర్టిఫికెట్లు కావాలంటే ఫీజు చెల్లించాలని కళాశాల యాజమాన్యం చెప్పింది. దీంతో రమేష్ అప్పు చేసి ఫీజు కట్టి సర్టిఫికెట్లు తీసుకున్నాడు. ● నిరుపేద కుటుంబానికి చెందిన ధర్మవరానికి చెందిన మహిత అనంతపురం జిల్లాలోని ఓ కళాశాలలో ఎంసీఏ పూర్తి చేసింది. హైదరాబాద్‌లోని ఓ పేరొందిన కంపెనీలో ఉద్యోగం రావడంతో తల్లిదండ్రులు ఎంతో సంతోషపడ్డారు. అయితే సర్టిఫికెట్లు సమర్పించాల్సి రావడంతో కళాశాలను వెళ్లగా...ఫీజు బకాయిలు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు అందిస్తామని నిర్వాహకులు తేల్చిచెప్పారు. దీంతో మహిత తండ్రి వడ్డీకి అప్పు తెచ్చి మరీ ఫీజు చెల్లించారు. ..ఇలా జిల్లాలోని వేలాది మంది విద్యార్థులు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ చేయకపోవడంతో సర్టిఫికెట్లు కళాశాలల్లోనే ఉండిపోగా..చాలా మంది ఉద్యోగం సంపాదించినా అందులో చేరలేకపోయారు.పుట్టపర్తి: విద్యార్థుల జీవితాలతో చంద్రబాబు ప్రభుత్వం చెలగాటమాడుతోంది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా వారి భవిష్యత్తును అంధకారంలోకి నెడుతోంది. అలాగే వసతి దీవెనకు కూడా పూర్తిగా మంగళవారం పాడింది. ఇక ఎన్నికల్లో ఇచ్చిన నిరుద్యోగ భృతి ఊసే లేకుండా 9 నెలలుగా పాలన సాగిస్తోంది. నిధులు నిలిపిన కూటమి వాస్తవానికి గడిచిన విద్యా సంవత్సరంలో చివరి రెండు త్రైమాసికాలకు ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన గత జూన్ నెలలో చెల్లించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. మళ్లీ వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చి ఉంటే ఆ నిధులు విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లోకి జమయ్యేవి. కానీ, అధికారంలోకి వచ్చిన ‘కూటమి’ నిధులు చెల్లించకుండా నిలిపివేసింది. పాత విద్యా సంవత్సరంలో రెండు త్రైమాసికాలు, ఈ విద్యా సంవత్సరంలో పూర్తయిన మూడు త్రైమాసికాలకు కలిపి రూ. 100 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. ఈ విద్యా సంవత్సరంలో ‘వసతి దీవెన’ పథకానికి కూడా చంద్రబాబు సర్కారు పూర్తిగా మంగళం పాడటం గమనార్హం. ఫీజు కడితేనే సర్టిఫికెట్లు.. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి 5 త్రైమాసికాలుగా అన్ని రకాలు ఫీజులు పెండింగ్‌లో ఉంచి పేద విద్యార్థుల భవిష్యత్‌ను అంధకారం చేస్తోంది. గత ప్రభుత్వం కంటే మెరుగ్గా విద్యార్థులను ఆదుకుంటామని ఎన్నికల వేళ ప్రగల్భాలు పలికిన కూటమి నేతలు.. అధికారం చేపట్టాక వాటన్నింటినీ తుంగలో తొక్కారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఉన్నత విద్య, ఉద్యోగాల సమయంలో సర్టిఫికెట్లు తప్పనిసరి కావడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఫీజులు చెల్లిస్తేనే పరీక్షలకు అనుమతిస్తామని కళాశాలల నిర్వాహకులు తేల్చి చెబుతుండటంతో బాధిత తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ కాలేజీలకు ఫీజులు చెల్లిస్తున్నారు. పరిశ్రమల స్థాపన ఊసే లేదు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పుట్టపర్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లా ఏర్పాటు చేసింది. దీంతో పరిపాలన సౌలభ్యం ఏర్పడింది. అలాగే హిందూపురం పారిశ్రామిక వాడతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. తద్వారా స్థానిక యువతకు ఉపాధి లభించింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్న జిల్లా కేంద్రంతో పాటు మిగిలిన ఏ ప్రాంతంలోను నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు ఒక్క పరిశ్రమ స్థాపించలేదు. నోటిఫికేషన్ లేదు... భృతి అందదు రాష్ట్రంలో ఉన్న 20 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, లేకపోతే ఉద్యోగం వచ్చేవరకూ నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి అందిస్తామని 2024 ఎన్నికలప్పుడు కూటమి నేతలు నమ్మ బలికారు. ఉద్యోగల భర్తీకి ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. దీంతో జిల్లాలోని సుమారు 2 లక్షల మంది నిరుద్యోగులు భృతి కోసం ఎదురుచూస్తున్నారు. నెలకు రూ.3 వేల చొప్పున ఇప్పటికి 10 నెలలకు ఒక్కొక్కరికి రూ.30 వేల కింద రూ.600 కోట్లు చంద్రబాబు సర్కార్ నిరుద్యోగులకు బకాయి ఉంది. మెడికల్ కళాశాలకు మొండి చేయి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం జిల్లాలో ఏకై క ప్రభుత్వ మెడికల్ కళాశాలను పెనుకొండలో ఏర్పాటు చేసింది. ఈ భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పనులు ఎక్కడికక్కడ నిలిపివేసింది. మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేసేందుకు సిద్ధమైంది. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ జిల్లా నుంచే ప్రాతినిథ్యం వహిస్తున్నా.. మెడికల్ కళాశాల పనులు ముందుకు సాగకపోవడం దురదృష్టకరమని జిల్లా వాసులు పెదవి విరుస్తున్నారు. పెనుకొండలో ‘యువత పోరు’ పోస్టర్లను ఆవిష్కరిస్తున్న ఉషశ్రీచరణ్10 నెలల భృతి ఇవ్వాల్సిందే గత జగన్ సర్కార్ తొలి రెండేళ్లలోనే ఏకంగా 5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసింది. ప్రస్తుత కూటమి సర్కార్ అధికారం చేపట్టి 9 నెలలు పూర్తవుతున్నా... ఇప్పటి దాకా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతి కూడా మంజూరు చేయలేదు. డీఎస్సీ నోటిఫికేషన్ అయినా విడుదల చేయాలి. లేకపోతే నిరుద్యోగ భృతి కింద ఒక్కొక్కరికి 10 నెలల కాలానికి రూ.30 వేలు ఇవ్వాలి. – అనిల్, నిరుద్యోగి, బుక్కపట్నందీవెన అందలేదు గత ప్రభుత్వంలో ప్రతి మూడు నెలలకోసారి ఫీజు రీయింబర్స్మెంట్ సక్రమంగా పడేది. గతంలో బకాయిలు ఉన్నా ..వైఎస్ జగన్ చెల్లించారు. పేదింటి బిడ్డలను అక్కున చేర్చుకున్నారు. నేను బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నా. ఇప్పటికీ ఫీజు రీయింబర్స్మెంట్ సొమ్ము బకాయి ఉంది. వసతి దీవెన సొమ్ము రూ.20 వేలు జమ కాలేదు. వస్తుందో...రాదో తెలియని అయోమయం నెలకొంది. అప్పటికీ, ఇప్పటికీ తేడా తెలుస్తోంది. విద్యార్థులను రాజకీయాల్లోకి లాగకుండా దన్నుగా నిలవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది. – విశ్వనాథ్, బీటెక్ విద్యార్థి, పుట్టపర్తి పుట్టపర్తి/పెనుకొండ రూరల్: విద్యార్థులు, యువతను దగా చేసిన కూటమి ప్రభుత్వం మెడలు వంచడమే ధ్యేయంగా బుధవారం వైఎస్సార్ సీపీ ‘యువత పోరు’కు సిద్ధమైంది. విద్యార్థులకు ఫీజురీయింబర్స్‌మెంట్, వసతి దీవెన, నిరుద్యోగులకు భృతి మంజూరు చేయకపోవడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కదం తొక్కనున్నాయి. ఉదయం 9.30 గంటలకు పుట్టపర్తిలోని వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ ఉంటుందని జిల్లాలోని అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, యువకులు, వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్, పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి పిలుపునిచ్చారు. అంతకుముందు మంగళవారం ఉషశ్రీచరణ్ పెనుకొండలోని పార్టీ కార్యాలయంలో ‘యువత పోరు’ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... విద్యార్థులు, యువకుల భవిష్యత్ కోసమే వైఎస్సార్ సీపీ ఉద్యమానికి సిద్ధమైందన్నారు. -
ప్రతి నిత్యం.. ప్రజాపక్షం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చాయి తర్వాత కాలగర్భంలో కలిసిపోయాయి. దేశాన్ని శాసించిన జాతీయ పార్టీలు సైతం ఏపీలో గల్లంతయ్యాయి. కానీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించి నిలబడ్డ పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే. ‘‘పార్టీ అంటే ప్రజలు.. పాలకులంటే ప్రజలే’’ అంటూ సరిగ్గా 14 ఏళ్ల క్రితం 2011 మార్చి 12న ఆవిర్భవించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీ రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లోనే పెను సంచలనంగా మారిందనడంలో అతిశయోక్తి లేదు. ప్రాంతీయ, జాతీయ పార్టీల ప్రజా వ్యతిరేక పాలనకు ఎదురొడ్డి పోరాడిన పార్టీగా వైఎస్సార్ సీపీ ముద్ర వేసుకుంది. కష్టాలొచ్చినా ఎదురొడ్డి.. పార్టీ అధ్యక్షుడి హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన పోరాటం చిరస్థాయిగా నిలిచింది. ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజల తరఫున కూడా ఆయన ఎన్నో పోరాటాలు చేశారు. ‘అనంత’ రైతుల ఆక్రందనలపై 2014–19 కాలంలో అసెంబ్లీలో గళమెత్తారు. రీయింబర్స్ మెంట్ రాక ఇబ్బంది పడుతున్న విద్యార్థుల తరఫున నిలబడ్డారు. డ్వాక్రా మహిళల అభ్యున్నతి కోసం శ్రమించారు. 2014లో చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వం చేసిన కుట్రలను ధీటుగా ఎదుర్కొన్నారు. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి మోసం చేసిన తీరును ఎండగట్టారు. చివరకు సుదీర్ఘ పాదయాత్ర చేసి అన్ని వర్గాల ప్రజలతో మమేకమయ్యారు. పాలన అంటే ఇలా ఉండాలని.. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 12 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాలు గెలిచింది. సాధారణంగా ఎన్నికలముందు హామీలివ్వడం, ఆ తర్వాత తుంగలో తొక్కడం చూసి ఉంటాం. కానీ పాలన చేపట్టిన రోజు నుంచే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తూ.చ.తప్పకుండా జగన్ అమలు చేశారు. జిల్లాలో లక్షలాది మంది రైతులకు చెప్పిన తేదీకే ‘రైతు భరోసా’ అందించారు. డ్వాక్రా మహిళలకు ఆసరా, ‘సున్నా వడ్డీ’తో అండగా నిలిచారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పేద విద్యార్థులను ఆదుకున్నారు. ప్రాథమిక ఆరోగ్యానికి పునరుజ్జీవం పోశారు. పాలన వికేంద్రీకరణ జరిగితేనే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని గ్రామ వార్డు సచివాలయాలు తెచ్చారు. ఈ క్రమంలో జిల్లాలో వేలాది మందికి ప్రభుత్వ ఉద్యోగాలొచ్చాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోనే పెనుకొండకు మెడికల్ కాలేజీ, అనంతపురంలో ఎంసీహెచ్ బ్లాకు, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు, పీహెచ్‌సీకి ఇద్దరు డాక్టర్లు ఇలా ఒకటేమిటి ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఘనత జగన్‌దే. అయితే, ప్రజలను మభ్యపెట్టి 9 నెలల క్రితం గద్దెనెక్కిన చంద్రబాబు.. వచ్చీ రాగానే విద్యార్థులు, రైతులు, డ్వాక్రా మహిళలు, అంగన్వాడీ కార్యకర్తలపై ఉక్కుపాదం మోపుతున్నారు. దీనిపై వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు నేడు ‘యువత పోరు’కు శ్రీకారం చుడుతున్నారు. ఆటుపోట్లకు ఎదురొడ్డి నిలిచిన ‘వైఎస్సార్ సీపీ’ ఉమ్మడి అనంత జిల్లాలో రైతులు, మహిళల పక్షాన ఎనలేని పోరాటాలు 2019లో అత్యధిక మెజారిటీతో అధికారంలోకి.. సీఎంగా పాలన అంటే ఇలా ఉండాలని చూపించిన జగన్ నేడు పార్టీ ఆవిర్భావ దినోత్సవం -
భూ ఆక్రమణలను అరికట్టండి
బత్తలపల్లి మండలం సంజీవపురం సర్వే నంబర్ 97లోని ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని, వెంటనే చర్యలు తీసుకోవాలని మాజీ సర్పంచ్ ముల్లుగూరు సంజీవరాయుడు ఆధ్వర్యంలో పలువురు గ్రామస్తులు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో డీఆర్ఓ విజయసారథికి విన్నవించారు. సర్వే నంబర్ 97లో గ్రామసచివాలయం, ఆర్ఎస్కే, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మించారని, మిగిలిన స్థలంలో ‘చింత–నిశ్చింత’ కార్యక్రమం క్రింద చింత చెట్లు నాటారన్నారు. గ్రామానికి చెందిన కొందరు నాయకులు చింత చెట్లను నరికేసి అక్రమంగా ఇంటి పునాదులు తవ్వుతున్నారని, చర్యలు తీసుకోవాలని కోరారు. -
‘చింత’కు రికార్డు ధర
హిందూపురం అర్బన్: చింతపండు ధర అమాంతం పెరిగింది. సోమవారం క్వింటా రూ.40 వేలు పలికి ఈ ఏడాది గరిష్ట రికార్డును తాకింది. స్థానిక వ్యవసాయ మార్కెట్‌కు 2146.80 క్వింటాళ్ల చింత పండు రాగా, అధికారులు ఈ–నామ్ పద్ధతిలో వేలం పాట నిర్వహించారు. ఇందులో కరిపులి రకం క్వింటా చింతపండు గరిష్టంగా రూ.40 వేలు, కనిష్టంగా రూ.8 వేలు, సరాసరిన రూ.15 వేల ప్రకారం ధర పలికింది. ఇక ప్లవర్ రకం చింతపండు క్వింటా గరిష్టంగా రూ. 12,400, కనిష్టంగా రూ.4,200, సరాసరిన రూ.6 వేల ప్రకారం క్రయ విక్రయాలు సాగాయి. ఈసారి చింతపండు దిగుబడి తగ్గడం, డిమాండ్ పెరగడంతో మార్కెట్లో మంచి ధర దక్కుతోంది. 140 మంది విద్యార్థుల గైర్హాజరు పుట్టపర్తి: ఇంటర్ పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా సాగుతున్నాయి. సోమవారం జిల్లాలోని 42 కేంద్రాల్లో ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం విద్యార్థులకు మ్యాథమ్యాటిక్స్–2బీ/జూవాలజీ–2/ హిస్టరీ పేపర్– 2 పరీక్ష జరిగింది. జనరల్ విద్యార్థులు 6,339 మంది పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా, 6,236 మంది హాజరయ్యారు. ఇక ఒకేషనల్ కోర్సులకు సంబంధించి 1,144 మందికిగానూ 1,107 మంది పరీక్షకు హాజరయ్యారు. మొత్తంగా 140 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఇంటర్మీడియెట్ జిల్లా విద్యాఽశాఖాధికారి రఘునాథరెడ్డి తెలిపారు. జిల్లా స్పెషల్ ఆఫీసర్ చెన్నకేశవ ప్రసాద్, పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు సురేష్, రామరాజు, శ్రీనివాసరెడ్డి, జిల్లా ఇన్చార్జ్ వెంకటేశ్వర ప్రసాద్ తదితరులు వివిధ కేంద్రాలను తనిఖీ చేశారు. పరారీలో రెడ్డెప్పశెట్టి !● ఇప్పటికే రెండు కేసులు.. అరెస్ట్ భయంతో అజ్ఞాతంలోకి..? సాక్షిక్షి టాస్క్‌ఫోర్స్: చిలమత్తూరు మండలం కోడూరు రెవెన్యూ గ్రామ పరిధిలో చిత్రావతి నదీ పరివాహక భూములను ఆక్రమించిన రియల్టర్ రెడ్డప్ప శెట్టి పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. చిత్రావతిపై అక్రమంగా బ్రిడ్జి నిర్మించడంతో ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇప్పటికే రెడ్డప్పశెట్టిపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా తన పొలానికి వెళ్లే దారిని రెడ్డెప్పశెట్టి మూసివేయడంతో పాటు ప్రశ్నించిన తనను బెదిరించాడని స్థానిక రైతు నరసింహులు స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు రెడ్డెప్పశెట్టిపై 341 సెక్షన్ కింద మరో కేసు నమోదు చేశారు. కంచె వ్యవహారంలో మరో కేసు రైతుల పొలాలకు వెళ్లేందుకు వీలు లేకుండా కంచె వేయడం, నదిని తన ఆధీనంలో ఉంచుకోవడం వంటివి రెడ్డెప్పశెట్టి మెడకు చుట్టుకుంటున్నాయి. రెవెన్యూ అధికారుల విచారణలో రెడ్డప్పశెట్టి అసైన్డ్ భూములను కొనుగోలు చేశారని తేలడంతో ఆ భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో రెడ్డెప్ప శెట్టి పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టుగా సమాచారం. రెవెన్యూ అధికారులు మరో నోటీసు ఇవ్వాల్సి ఉండగా.. ఆయన అందుబాటులో లేరని తెలుస్తోంది. -
అర్జీల పరిష్కారంపై శ్రద్ధ చూపాలి
ప్రశాంతి నిలయం: ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో అందే అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజలు వివిధ సమస్యలపై మొత్తంగా 218 అర్జీలు అందించారు. కలెక్టర్ చేతన్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ప్రతి అర్జీకి అర్థవంతమైన పరిష్కారం చూపాలన్నారు. ప్రతి నెలా 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. ‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించాలి’ అన్న నినాదంతో ఈనెల 15వ తేదీన స్వచ్ఛత కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు కార్యక్రమంలో పాల్గొని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పీ–4 సర్వేను మండలాల ప్రత్యేక అధికారులు పర్యవేక్షించాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డీఆర్ఓ విజయసారథి, ఆర్డీఓ సువర్ణ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణరెడ్డి, పట్టుపరిశ్రమ శాఖ జేడీ పద్మావతి, సీపీఓ విజయ్ కుమార్, డీసీహెచ్ఎస్ డాక్టర్ తిప్పేంద్ర నాయక్, డీఎంహెచ్ఓ ఫైరోజా బేగం పాల్గొన్నారు. ఉగాది నుంచి జిల్లాలో పీ–4 సర్వే ‘స్వర్ణాంధ్ర–2047’లో భాగంగా పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం జిల్లాలో ఉగాది నుంచి పీ–4 సర్వేకు శ్రీకారం చుట్టిందని కలెక్టర్ టీఎస్ చేతన్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో పీ–4 కార్యాచరణకు సంబంధించి వాల్ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. పేదరికం లేని సమాజం కోసమే రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పార్టనర్షిప్ (పీ–4) సర్వే చేస్తోందన్నారు. కార్యక్రమం అమలుపై ప్రజల అభిప్రాయాన్ని సేకరిస్తామన్నారు. ఈనెల 25వ తేదీలోపు అభిప్రాయాలు తెలియజేసే వారికి ప్రశంసా పత్రం అందిస్తామన్నారు. వర్మీకంపోస్టుపై అవగాహన కల్పించాలి చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల గురించి ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆవరణలో గోరంట్ల గ్రామపంచాయతీ ఏర్పాటు చేసిన ఆర్గానిక్ వర్మీ కంపోస్ట్ స్టాల్‌ను ఆయన సందర్శించారు. కలెక్టర్ టీఎస్ చేతన్ -
పతాక స్థాయికి నిరుద్యోగం
● గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్లు ఉన్నా ఫలితం శూన్యం ● ఎంఎస్ఎంఈలు ఏర్పాటు కాక చిన్న ఉద్యోగాలకూ దిక్కులేని వైనం ● 20 లక్షల ఉద్యోగాలిస్తామని ముఖం చాటేసిన చంద్రబాబు ● భృతి ఇస్తామని చెప్పి రిక్తహస్తం చూపడంపై నిరుద్యోగుల మండిపాటు అనంతపురం నగరంలోని ఓ హోటల్లో రెండు రోజుల క్రితం ఓ ప్రముఖ జ్యువెలరీ సంస్థ సేల్స్‌మెన్ ఉద్యోగాలకు నిర్వహించిన వాక్ఇన్ ఇంటర్వ్యూలకు పోటెత్తిన నిరుద్యోగులు వీరు. ఇంజినీరింగ్ మొదలు ఎంబీఏ పట్టభద్రుల వరకు వందల మంది హాజరయ్యారు. దీంతో హోటల్ ప్రాంగణం కిక్కిరిసి పోయింది. చిన్న సేల్స్‌మెన్ ఉద్యోగం కోసం వచ్చిన వీరిని చూస్తే జిల్లాలో నిరుద్యోగ సమస్య ఎంతలా ఉందో అంచనా వేయొచ్చని పలువురు అభిప్రాయపడ్డారు. ● గార్లదిన్నెకు చెందిన రాజశేఖర్ ఇటీవల బీఎస్సీ పూర్తి చేశాడు. ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసినా రాలేదు. దీంతో ఆస్పత్రిలో ఔట్సోర్సింగ్ విధానంలో సెక్యూరిటీ గార్డుగా చేరాడు. మరో ఉద్యోగంలో చేరదామని ఎంత ప్రయత్నిస్తున్నా ఫలితం లేకపోతోందని రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ● రాప్తాడుకు చెందిన శీనయ్య అనంతపురంలో బీకాం పూర్తి చేశాడు. తన అర్హతకు తగిన జాబు కోసం కొన్ని నెలలుగా ప్రయత్నించినా ఎక్కడా దొరకలేదు. దీంతో ఇటీవల ఓ పెట్రోలు బంకు యజమాని వద్ద నిర్వహణ మేనేజర్‌గా చేరాడు. రేయింబవళ్లు పనిచేస్తే రూ.12 వేలు వేతనం. వీరే కాదు.. ఉమ్మడి జిల్లాలో ఎంతో మంది నిరుద్యోగులది ఇదే పరిస్థితి. -
యువత పోరుతో బాబుకు బుద్ధి చెబుదాం
పరిగి: ‘చదువుకునే పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు... చదువుకున్న వారికి ఉద్యోగాలు లేవు. కనీసం ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతి అయినా ఇస్తారంటే..అందుకూ చంద్రబాబుకు మనసు రావడం లేదు.. అలవిగాని హామీలతో నమ్మించి యువతను మోసం చేసిన సీఎం చంద్రబాబుకు ‘యువత పోరు’తో బుద్ధి చెబుదాం’ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పెనుకొండ నియోజకవర్గ సమన్వయకర్త ఉషశ్రీచరణ్ పిలుపునిచ్చారు. సోమవారం ఆమె పరిగిలో ఈనెల 12న వైఎస్సార్ సీపీ తలపెట్టిన ‘యువత పోరు’ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను పార్టీ శ్రేణులతో కలిసి విడుదల చేశారు. అనంతరం ఉషశ్రీచరణ్ మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు కావస్తున్నా.. ఎన్నికల హామీలలో ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. కేవలం పింఛన్లు చూపుతూ ఆర్భాటం చేయడం తప్ప, ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. నయవంచన ప్రభుత్వ మెడలు వంచుదాం ఫీజు రీయంబర్స్మెంట్ పథకం కింద రూ.4,500 కోట్లు బకాయిలున్నాయని, వాటిని తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి రూ.3 వేలు, 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన చంద్రబాబు... మాట తప్పారన్నారు. అందరూ సంఘటితమై ఈ ప్రభుత్వ మెడలు వంచుదామని ఉషశ్రీచరణ్ పిలుపునిచ్చారు. ఈ నెల 12వ తేదీ ‘యువత పోరు’లో భాగంగా పుట్టపర్తిలో పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకూ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ నరసింహమూర్తి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రూ.4500 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి వెంటనే విడుదల చేయాలి 12న ‘యువత పోరు’కు అన్ని వర్గాలు కలిసివచ్చి విజయవంతం చేయాలి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ పిలుపు -
పక్కా గృహాల కూల్చివేత
మడకశిర: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద ఏర్పాటు చేసిన మైనార్టీ కాలనీలోని పలు పక్కా గృహాలు, ఇంటి పునాదులను అధికారులు తొలగించారు. గుట్టుచప్పుడు కాకుండా, లబ్దిదారులకు కనీస సమాచారం ఇవ్వకుండా ఈ ప్రక్రియను సెలవు రోజైన ఆదివారం చేపట్టడం విమర్శలకు దారి తీసింది. సోమవారం కూడా తొలగింపు ప్రక్రియను అధికారులు కొనసాగించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మడకశిరలోని మైనార్టీలకు ప్రత్యేకంగా ఇళ్లు మంజూరు చేశారు. ఇందు కోసం వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద అప్పట్లో భూసేకరణ చేసి మైనార్టీ కాలనీని ఏర్పాటు చేశారు. దాదాపు 180 మందికి కాలనీలో పక్కా గృహాలు మంజూరు కాగా, ఆర్థికంగా స్థోమత ఉన్న వారు ఇళ్లను నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. మరికొందరు పునాదులు వేసుకున్నారు. కొంత కాలంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మడకశిర మీదుగా రాయదుర్గం– తుమకూరు రైల్వే లైన్ నిర్మాణాన్ని చేపట్టాయి. ప్రస్తుతం ఈ పనులు మడకశిర సమీపంలో జరుగుతున్నాయి. ఈ కాలనీ గుండానే రైల్వేలైన్ పోతోంది. దీంతో కాలనీలోని దాదాపు 73 పక్కా గృహాలు రైల్వే లైన్ పనులకు అడ్డంకిగా మారాయి. వీటిని తొలగించాలని సంబంధిత అధికారులు కొన్నేళ్లుగా లబ్దిదారులకు సూచిస్తూ వచ్చారు. అయితే తమకు ప్రత్యామ్నాయం చూపించి ఇళ్లు, ఇంటి పునాదులు తొలగించుకోవాలని స్థానికులు కోరుతూ వచ్చారు. ఈ క్రమంలోనే ఆదివారం అధికారులు భారీ యంత్రాలతో అక్కడకు చేరుకుని కూల్చివేతలు చేపట్టారు. ఈ మొత్తం ప్రక్రియను జేసీ అభిషేక్‌కుమార్, పెనుకొండ ఆర్డీఓ ఆనంద్‌కుమార్ దగ్గరుండి పర్యవేక్షించారు. బాధితులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో జేసీ అభిషేక్‌కుమార్ కల్పించుకుని బాధితులకు న్యాయం చేస్తామని భరోసానిచ్చారు. మడకశిరలో రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా తొలగింపు -
‘పోలీసు స్పందన’కు 55 వినతులు
పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (స్పందన)కు వివిధ సమస్యలపై 55 వినతులు అందాయి. ఎస్పీ రత్న స్వయంగా వినతులు స్వీకరించారు. సమస్య తీవ్రత అడిగి తెలుసుకుని చట్టపరిధిలోని అంశాలకు సంతృప్తి కరమైన పరిష్కారం చూపాలని సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఆదేశించారు. కార్యక్రమంలో మహిళా పీఎస్ డీఎస్పీ ఆదినారాయణ, లీగల్ అడ్వైజర్ సాయినాథ్‌రెడ్డి పాల్గొన్నారు. పల్లె అక్రమాలపై ఈడీ విచారణ చేయించాలి ● కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల్లో ఫిర్యాదు చేసిన ఎంపీపీ ఆదినారాయణయాదవ్ సాక్షి, పుట్టపర్తి/పుట్టపర్తి టౌన్: టీడీపీ నేత, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అక్రమ వ్యాపారాలు, మనీ లాండరింగ్, విద్యాసంస్థల పేరుతో ఫీజుల దోపిడీ ద్వారా రూ.వేల కోట్లు సంపాదించారని, వీటన్నింటిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)తో విచారణ చేయించాలని ముదిగుబ్బ ఎంపీపీ, బీజేపీ నాయకుడు ఆదినారాయణ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన జిల్లా కేంద్రం పుట్టపర్తిలోని కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల్లో ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక పల్లె రఘునాథరెడ్డితో పాటు బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి, ఇంకొందరు కలసి తనను అంతమొందించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వారం క్రితం సంకేపల్లి వద్ద వాహనంపై రాళ్లతో దాడి చేశారని, ఇప్పుడు పుట్టపర్తికి వస్తుండగా దారి పొడవునా అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. కియా వద్ద ఉన్న తన భూమిని కాజేసే ప్రయత్నంలో భాగంగా పల్లె రఘునాథరెడ్డి తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. దొంగ పత్రాలు, నకిలీ అగ్రిమెంట్లతో బెదిరింపులకు దిగుతున్నారన్నారు. ఈ భూ వివాదాలతో మంత్రి సత్యకుమార్‌కు సంబంధం లేకున్నా.. తరచూ వీటిలోకి లాగుతున్నారన్నారు. -
పారిశుధ్య కార్మికుడి ఆత్మహత్య
పెనుకొండ: స్థానిక నగర పంచాయతీ పరిధిలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్న నరసింహులు (34) ఆత్మహత్య చేసుకున్నాడు. కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం నొప్పి తీవ్రత తాళలేక కొండాపురం సమీపంలో పట్టాలపై చేరుకుని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని బోరున విలపించారు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. యువకుడి బలవన్మరణం హిందూపురం అర్బన్: జీవితంపై విరక్తితో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. హిందూపురంలోని ఆటోనగర్‌కు చెందిన లక్ష్మీకాంత్ (21)కు భార్య జ్యోతి, ఓ కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం ఆమె గర్భిణి. తల్లిదండ్రులు బతుకు తెరువు కోసం బెంగళూరుకు వలస వెళ్లారు. బేల్దారి పనులతో జీవనం సాగిస్తున్న లక్ష్మీకాంత్ కొంత కాలంగా వ్యసనాలకు బానిసయ్యాడు. ఈ క్రమంలో తన అవసరాలు తీర్చుకునేందుకు అవసరమైన డబ్బు సమకూరక ఇబ్బంది పడిన లక్ష్మీకాంత్ సోమవారం వేకువజామున ఆటోనగర్ వద్ద పట్టాలపైకి చేరుకుని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. యువకుడి దుర్మరణం ఉరవకొండ: స్ధానిక అగ్నిమాపక శాఖ కార్యాలయం ఎదురుగా ఉన్న రోడ్డు డివైడర్‌ను ఢీకొని ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. ఉరవకొండలోని ఇంద్రా నగర్‌కు చెందిన కార్తీక్ (18), నందకుమార్ సోమవారం ఉదయం ద్విచక్ర వాహనంపై వెళుతూ వేగాన్ని నియంత్రించుకోలేక డివైడర్‌ను ఢీకొన్నారు. ఘటనలో కార్తీక్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన నందకుమార్‌ను స్థానికులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై సీఐ మహనంది కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
ప్రభుత్వ డాక్టర్ అత్యాశ
కదిరి అర్బన్: స్థానిక ఏరియా ఆస్పత్రి వైద్యురాలి ధన దాహానికి పేదలు బలవుతున్నారు. రూ. లక్షల్లో జీతం తీసుకుంటూనే కమీషన్ కోసం కక్కుర్తి పడి స్కానింగ్లన్నీ ప్రైవేట్ ల్యాబ్‌కు సిఫారసు చేస్తున్నారు. ఫలితంగా ప్రతి స్కానింగ్‌కు రూ. వేలల్లో గర్భిణులు నష్టపోతున్నారు. స్కానింగ్ యంత్రాలున్నా.. రోజూ 2 వేల ఓపీ ఉన్న కదిరి ఏరియా ఆస్పత్రిలో అత్యాధునిక స్కానింగ్ యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. వీటి పనితీరు సక్రమంగానే ఉంది. అయినా ఆస్పత్రిలోని గైనకాలజీ విభాగంలో పనిచేస్తున్న ఓ మహిళా వైద్యురాలు మాత్రం వీటి సేవలను ఏ మాత్రం వినియోగించుకోవడం లేదు. ప్రతి సారీ స్కానింగ్‌కు ప్రైవేట్ ల్యాబ్‌కు సిఫారసు చేయడం ద్వారా రూ.వేలల్లో ఆమెకు కమీషన్ దక్కుతున్నట్లు సమాచారం. కమీషన్ల కక్కుర్తిలో పడిన ఆమె దోపిడీకి అడ్డూఅదుపు లేకుండా పోతోందని పలువురు రోగులు ఆరోపిస్తున్నారు. అక్కడ కూడా ‘ఆమె’నే ఈ నెల 7న కదిరి మండలంలోని ఓ గ్రామానికి చెందిన గర్భిణి పురిటి నొప్పులతో కాన్పు కోసం కదిరి ఏరియా ఆస్పత్రికి వచ్చింది. ఆమెను పరీక్షించిన వైద్యురాలు.. గర్భంలో సమస్య ఉందని నాలుగు స్కానింగ్‌లను ఆస్పత్రి పక్కనే ఉన్న ప్రైవేట్ ల్యాబ్‌లో చేయించుకుని రావాలని రాసిచ్చింది. ఆస్పత్రిలో స్కానింగ్ చేయరా? అని ఆమె బంధువులు అడిగితే ఇక్కడ అలాంటి సౌకర్యం లేదని బుకాయించినట్లు సమాచారం. దీంతో గర్భిణిని పిలుచుకుని డాక్టర్ చెప్పిన స్కానింగ్ సెంటర్‌కు బంధువులు వెళ్లారు. కాసేపటి తర్వాత స్కానింగ్ గదిలోకి గర్భిణిని తీసుకెళితే అక్కడ సదరు డాక్టరే ప్రత్యక్షమై స్కానింగ్ చేసి, రిపోర్టులు తీశారు. ఈ మొత్తం ప్రక్రియకు రూ.4,500 ఫీజును చెల్లించుకోవాల్సి వచ్చిందని, స్కానింగ్‌లో ఎలాంటి అనుమానాస్పద రిపోర్టులూ రాలేదని బాధితులు వివరించారు. ఇదే తరహాలో రోజూ పదుల సంఖ్యలో గర్భిణులను ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లకు పంపుతూ నిర్వాహకుల నుంచి కమీషన్లను ప్రభుత్వ గైనకాలజిస్ట్ దండుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. స్కానింగ్లన్నీ ప్రైవేట్ ల్యాబ్‌కు ఆస్పత్రిలో స్కానింగ్ సౌకర్యమున్నా కమీషన్ కోసం కక్కుర్తి గర్భిణులకు రూ.వేలల్లో ఖర్చు ఈ విషయం తెలుసు ఏరియా ఆస్పత్రిలో గర్భిణులకు స్కానింగ్ పరీక్షలు నిర్వహించేందుకు రూ.45 లక్షలు విలువ చేసే యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. అయినా డాక్టర్ బయటకు రాసిస్తున్నారు. ఈ విషయం తెలుసు. ఇప్పటికే చాలా ఫిర్యాదులు కూడా అందాయి. తీరు మార్చుకోవాలని ఆమెకు చెప్పినా పట్టించుకోవడం లేదు. బాధితులు ఎవరైనా రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ హుస్సేన్, సూపరింటెండెంట్, కదిరి ఏరియా ఆస్పత్రి -
చంద్రబాబు మోసం చేశారు
పెనుకొండ రూరల్: డిమాండ్ల సాధనలో భాగంగా సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. కార్యక్రమానికి సీఐటీయూ నేతృత్వం వహించింది. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి రమేష్ మాట్లాడారు. ఎన్నికల సమయంలో అంగన్వాడీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అధికారం చేపట్టిన తర్వాత సీఎం చంద్రబాబు నెరవేర్చకుండా మోసం చేశారని మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడచిన అంగన్వాడీ కార్యకర్తల సమస్యలకు పరిష్కారం దొరకలేదన్నారు. ఇచ్చిన హామీ మేరకు అంగన్వాడీలకు రూ.26 వేలు కనీస వేతనం చెల్లించాలన్నారు. అలాగే వేతనంతో కూడిన మెడికల్ లీవులను కనీసం 3 నెలలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సాధికార సర్వేలో ప్రభుత్వ ఉద్యోగులు అనే పదాన్ని తొలగించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు. ఫ్రీ స్కూల్ విద్యార్థులకు కూడా తల్లికి వందనం ఇవ్వాలని కోరుతూ కార్యాలయ ఏఓ గిరిధర్ నాయక్‌కు వినతి పత్రం ఇచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు బాబావలి, రంజిత్ కుమార్, అంగన్వాడీ యూనియన్ నాయకులు జయమ్మ, జయతుంబి, లక్ష్మీదేవి, పార్వతి, శాంతిబాయి, సరస్వతి తదితురులు పాల్గొన్నారు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట అంగన్వాడీల ధర్నా -
ఎస్సీ, ఎస్టీ కేసులంటూ వేధిస్తున్నారు
ప్రశాంతి నిలయం: విధులకు ఆటంకం కలిగించడంతో పాటు ఎస్సీ, ఎస్టీ కేసుల పేరుతో బెదిరిస్తున్నారని, తమను రక్షణ కల్పించాలని పంచాయతీ కార్యదర్శుల సంఘం, సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్‌ను కోరారు. ఈ మేరకు వారు సోమవారం జేసీని కలిసి వినతిపత్రం అందజేశారు. గత శుక్రవారం సాయంత్రం పెడపల్లి సచివాలయానికి రంగప్ప, తిప్పన్న అనే వ్యక్తులు వచ్చి రూ.1.5 లక్షలకు ఇంటి పన్ను మదింపు సర్టిఫికెట్ ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శిని అడిగారన్నారు. వారిచ్చిన ఆధారాల మేరకు అంత మొత్తానికి సర్టిఫికెట్ ఇచ్చే అవకాశం లేదని తెలియజేస్తే సదరు వ్యక్తులు ఆగ్రహంతో ఊగిపోతూ దుర్భాషలాడుతూ దౌర్జన్యానికి ప్రయత్నించారన్నారు. మీరెలా విధులు నిర్వహిస్తారో చూస్తామంటూ బెదిరించారని, అంతటితో ఆగకుండా నలుగురు సచివాలయ ఉద్యోగులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారన్నారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నాయకులు గోపాల్‌రెడ్డి, ప్రభాకర్, సురేంద్ర, గణేష్, ఓం ప్రసాద్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. రక్షణ కల్పించాలని జేసీకి ఉద్యోగుల వేడుకోలు -
పెట్టుబడి కూడా అందలేదు
కక్కలపల్లి టమాట మండీలో కొనసాగుతున్న క్రయవిక్రయాలుఅనంతపురం అగ్రికల్చర్: టమాటను నమ్ముకున్న రైతులు ఈ సారి కూడా భారీగా నష్టాలు మూటకట్టుకున్నారు. అనంతపురం జిల్లాలో ఏకంగా ఖరీఫ్, రబీలో ఈ ఏడాది 45 వేల ఎకరాల భారీ విస్తీర్ణంలో టమాట సాగులోకి వచ్చింది. ఈ సారి 8 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా దిగుబడిని రైతులు సాధించారు. టన్ను సరాసరి కనిష్టంగా రూ.15 వేలు ప్రకారం అమ్ముడుబోయినా ఈ సారి రూ.1,200 కోట్ల మేర టర్నోవర్ ఉండేదని అంచనా. కానీ మార్కెట్ హెచ్చుతగ్గుల కారణంగా 80 శాతం మంది రైతులు భారీగా నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. రారష్ట్‌ర వ్యాప్తంగా 26 జిల్లాల పరిధిలో అనంతపురం జిల్లాలో 45 వేల ఎకరాల టమాట సాగులో మొదటి స్థానంలో ఉండగా... 22 వేల ఎకరాలతో శ్రీసత్యసాయి జిల్లా రెండో స్థానంలో ఉండటం విశేషం. ఆ తర్వాత అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, వైఎస్సార్ జిల్లాలు ఉన్నాయి. నాలుగు నెలలుగా పతనావస్థలో.. సీజన్ ఆరంభమైన జూలై నుంచి అనంతపురం సమీపంలో ఉన్న కక్కలపల్లి మండీలో టమాట అమ్మకాలు మొదలయ్యాయి. మొదట్లో పరిస్థితి ఆశాజనకంగా ఉండటంతో రైతులు టమాట సాగుపై ఎక్కువగా దృష్టి పెట్టారు. ఫలితంగా సెప్టెంబర్ నుంచి పంట దిగుబడులు, మార్కెట్‌కు సరుకు రావడం పెరిగింది. ధర కొంచెం బాగున్నప్పుడు మధ్య మధ్యలో వర్షాలు రావడంతో పంట తడిసిందని, మచ్చ ఉందంటూ మండీ నిర్వాహకులు, వ్యాపారులు ‘నో సేల్’ పెట్టడంతో చాలా మంది రైతులకు అసలుకే మోసపోయారు. ఇలా డిసెంబర్ వరకు టమాట అమ్ముడుపోక కొందరు రైతులు తల్లడిల్లిపోయారు. ఇక డిసెంబర్ నుంచి మార్కెట్ పూర్తిగా పతనమైంది. గరిష్ట ధర రూ.10, కనిష్టం రూ.5, సరాసరి రూ.7 చొప్పున గత మూడు నెలలుగా మార్కెట్లో ధరలు కొనసాగుతుండటంతో టమాట రైతులు పూర్తిగా చిత్తయ్యారు. నాలుగైదు లాట్ల గరిష్ట ధర రూ.10 ప్రకారం అమ్ముడుబోగా మిగతాదంతా రూ.5 నుంచి రూ.7 కి మించి ధర పలకలేదు. దీంతో చాలా మంది రైతులు.. కూలీలు, రవాణా ఖర్చులు కూడా రాదని గ్రహించి పంటను పొలాల్లోనే వదిలేశారు. ‘కూటమి’ మోసం.. జిల్లాలోని 31 మండలాల్లో ఖరీఫ్‌లో 42 వేల ఎకరాలు, రబీలో 3 వేల ఎకరాల్లో టమాట సాగు చేసినట్లు ఉద్యానశాఖ నివేదికలు చెబుతున్నాయి. టమాట రైతులు ఇబ్బంది పడకుండా కిలో రూ.8 చొప్పున టన్ను రూ.8 వేలతో కొనుగోలు చేస్తామని కూటమి ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. అయితే ఆచరణకు వచ్చేసరికి మార్కెటింగ్‌శాఖ ద్వారా ఇటీవల కేవలం 60 టన్నులు అంటే రూ.4.80 లక్షల విలువ చేసే టమాట మాత్రమే కొనుగోలు చేసి చేతులెత్తేసింది. అనంతపురం మండీకి ప్రస్తుతం కొంత తగ్గినా డిసెంబర్ నుంచి పరిగణనలోకి తీసుకుంటే రోజుకు సగటున 500 టన్నుల వరకు సరుకు వస్తోంది. కనీసం రోజుకు 100 టన్నులైనా కొనుగోలు చేస్తే కొంత వరకు రైతులకు వెసులుబాటు ఉంటుంది. కానీ సీజన్ అంతా కొన్నది కేవలం 60 టన్నులు మాత్రమే అంటే రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. నాలుగు నెలలుగా గిట్టుబాటు ధర లేక భారీగా నష్టాలు కిలో రూ.8 చొప్పున కొంటామని చెప్పిన కూటమి ప్రభుత్వం కేవలం 60 టన్నులతో చేతులెత్తేసిన మార్కెటింగ్ శాఖ రాష్ట్రంలోనే అత్యధికంగా 45 వేల ఎకరాల్లో టమాట పంట ఎకరాకు రూ.50 వేలకు పైగా పెట్టుబడి పెట్టి రెండున్నర ఎకరాల్లో టమాట సాగు చేశా. పంట దిగుబడి బాగా వచ్చింది. మార్కెట్లో గిట్టుబాటు ధర లేక భారీగా నష్టపోయాను. ఇటీవల మండీలో 15 కిలోల బాక్సు రూ.70కు మించి పలకలేదు. అంటే కిలో రూ.5 చొప్పున కూడా కొనుగోలు చేయడం లేదు. మొదటి నాలుగైదు కోతల్లో నాణ్యమైన కాయ ఉన్నా కొనలేదు. పెట్టుబడి మాట దేవుడెరుగు కనీసం కూలీలు, రవాణా ఖర్చులు కూడా చేతికి అందలేదు. ఇలా అయితే రైతులు ఎలా బతకాలి. – సుధాకర్, టమాట రైతు, దయ్యాలకుంటపల్లి, బీకేఎస్ మండలం -
నేడు ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
కదిరి: ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆదివారం అంకురార్పణ చేయనున్నారు. బ్రహ్మోత్సవాల్లో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యముంది. నవ ధాన్యాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు. బ్రహ్మోత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామివారి ఆశీస్సులు పొందటమే ఈ అంకురార్పణ ఘట్ట ముఖ్య ఉద్దేశం. సూర్యుడు అస్తమించిన తర్వాతే అంటే రాత్రి సమయంలో ఈ అంకురార్పణ ఘట్టం నిర్వహిస్తారు. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో నిర్వహించే అంకురార్పణ ఘట్టంలో అగ్నిహోమం ద్వారా బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, శంత, ఇంద్ర, ఇసాన, జయ అనే సకల దేవతలను ఆహ్వానిస్తారు. నవధాన్యాల మొలక.. సకల దేవతల ఆహ్వానం అనంతరం భూమాతను ప్రార్థిస్తూ పాలిక (కొత్తకుండ)లను మట్టితో నింపుతారు. చంద్రున్ని ప్రార్థిస్తూ అర్చక బృందం వాటిలో నీరు పోసి నవ ధాన్యాలు చల్లుతారు. ఈ పాలికలకు నూతన వస్త్రాన్ని అలంకరించి పుణ్యాహవచనం గావిస్తారు. అనంతరం అర్చక పండితులు సోమరాజ మంత్రం, వరుణ మంత్రం, విష్ణుసూక్తం పఠిస్తారు. బ్రహ్మోత్సవాల్లో అర్చక పండితులు ప్రతి రోజూ ఈ పాలికల్లో కొద్దిగా నీరు పోసి నారు పెరిగేందుకు సహకరిస్తారు. ఈ మొత్తం తంతు వేద మంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల నడుమ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసే భక్తుల కోసం పట్టణ నలుమూలల ఆలయ అధికారులు స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. జిల్లా హాకీ జట్టు ప్రతిభ ధర్మవరం అర్బన్: ఆంధ్రప్రదేశ్ హాకీ ఆధ్వర్యంలో గుంటూరు నాగార్జున యూనివర్శిటీలో జరిగిన 15వ రాష్ట్రస్థాయి సీనియర్ పురుషుల హాకీ పోటీల్లో శ్రీసత్యసాయి జిల్లా జట్టు రజత పతకం సాధించిందని హాకీ ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్ బి.సూర్యప్రకాష్, జిల్లా ఉపాధ్యక్షుడు గౌరిప్రసాద్, జిల్లా హాకీ కోచ్ హసేన్ తెలిపారు. ఈ సందర్భంగా క్రీడాకారులను వారు శనివారం అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈనెల 6 నుంచి 8 వరకు జరిగిన 15వ రాష్ట్రస్థాయి సీనియర్ పురుషుల హాకీ పోటీలలో క్వార్టర్ ఫైనల్లో విజయనగరం జిల్లా జట్టుపై 3 గోల్స్, సెమీ ఫైనల్లో గుంటూరు జిల్లా జట్టుపై 3–1 గోల్స్ తేడాతో గెలుపొందిందన్నారు. ఫైనల్లో తిరుపతి జిల్లా జట్టుపై 6–2 గోల్స్‌తో ఓటమి చెందిందన్నారు. -
నేడు ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
కదిరి: ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆదివారం అంకురార్పణ చేయనున్నారు. బ్రహ్మోత్సవాల్లో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యముంది. నవ ధాన్యాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు. బ్రహ్మోత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామివారి ఆశీస్సులు పొందటమే ఈ అంకురార్పణ ఘట్ట ముఖ్య ఉద్దేశం. సూర్యుడు అస్తమించిన తర్వాతే అంటే రాత్రి సమయంలో ఈ అంకురార్పణ ఘట్టం నిర్వహిస్తారు. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో నిర్వహించే అంకురార్పణ ఘట్టంలో అగ్నిహోమం ద్వారా బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, శంత, ఇంద్ర, ఇసాన, జయ అనే సకల దేవతలను ఆహ్వానిస్తారు. నవధాన్యాల మొలక.. సకల దేవతల ఆహ్వానం అనంతరం భూమాతను ప్రార్థిస్తూ పాలిక (కొత్తకుండ)లను మట్టితో నింపుతారు. చంద్రున్ని ప్రార్థిస్తూ అర్చక బృందం వాటిలో నీరు పోసి నవ ధాన్యాలు చల్లుతారు. ఈ పాలికలకు నూతన వస్త్రాన్ని అలంకరించి పుణ్యాహవచనం గావిస్తారు. అనంతరం అర్చక పండితులు సోమరాజ మంత్రం, వరుణ మంత్రం, విష్ణుసూక్తం పఠిస్తారు. బ్రహ్మోత్సవాల్లో అర్చక పండితులు ప్రతి రోజూ ఈ పాలికల్లో కొద్దిగా నీరు పోసి నారు పెరిగేందుకు సహకరిస్తారు. ఈ మొత్తం తంతు వేద మంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల నడుమ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసే భక్తుల కోసం పట్టణ నలుమూలల ఆలయ అధికారులు స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. జిల్లా హాకీ జట్టు ప్రతిభ ధర్మవరం అర్బన్: ఆంధ్రప్రదేశ్ హాకీ ఆధ్వర్యంలో గుంటూరు నాగార్జున యూనివర్శిటీలో జరిగిన 15వ రాష్ట్రస్థాయి సీనియర్ పురుషుల హాకీ పోటీల్లో శ్రీసత్యసాయి జిల్లా జట్టు రజత పతకం సాధించిందని హాకీ ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్ బి.సూర్యప్రకాష్, జిల్లా ఉపాధ్యక్షుడు గౌరిప్రసాద్, జిల్లా హాకీ కోచ్ హసేన్ తెలిపారు. ఈ సందర్భంగా క్రీడాకారులను వారు శనివారం అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈనెల 6 నుంచి 8 వరకు జరిగిన 15వ రాష్ట్రస్థాయి సీనియర్ పురుషుల హాకీ పోటీలలో క్వార్టర్ ఫైనల్లో విజయనగరం జిల్లా జట్టుపై 3 గోల్స్, సెమీ ఫైనల్లో గుంటూరు జిల్లా జట్టుపై 3–1 గోల్స్ తేడాతో గెలుపొందిందన్నారు. ఫైనల్లో తిరుపతి జిల్లా జట్టుపై 6–2 గోల్స్‌తో ఓటమి చెందిందన్నారు. -
5,847 కేసుల పరిష్కారం
అనంతపురం: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన ‘జాతీయ మెగా లోక్ అదాలత్’లో 5,847 కేసులకు న్యాయమూర్తులు పరిష్కారం చూపారు. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా మొత్తం 24 బెంచ్‌లు నిర్వహించారు. బాధితులు రాజీకి సమ్మతించడంతో 886 క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు 80, మోటారు వాహన ప్రమాద పరిహార కేసులు 48, ప్రీ లిటిగేషన్ కేసులు 388 పరిష్కారమయ్యాయి. ప్రమాద కేసుల్లో బాధితులకు రూ. 3.83 కోట్లు పరిహారంగా అందించారు. సివిల్ కేసుల్లో రూ.2.82 కోట్లు, ప్రీ లిటిగేషన్ కేసుల్లో రూ.68 లక్షలు రాజీ ప్రకారం బాధితులకు ఇప్పించారు. లోక్‌అదాలత్‌ను జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షుడు, ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. శ్రీనివాస్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జి. శివప్రసాద్ యాదవ్ పర్యవేక్షించారు. జిల్లా కోర్టులో కక్షిదారులకు న్యాయమూర్తి జి. శ్రీనివాస్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఇంటర్ పరీక్షకు 319 మంది గైర్హాజరు పుట్టపర్తి టౌన్: ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు శనివారం సెట్–3 ప్రశ్నపత్రంతో పరీక్షలు నిర్వహించారు. జనరల్ విద్యార్థులు 8,198 మందికి గాను 7979 మంది, ఒకేషనల్ విద్యార్థులు 1,641 మందికి గాను 1,541 మంది హాజరయ్యారు. మొత్తం 319 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యా శాఖాధికారి రఘునాథరెడ్డి తెలిపారు. ధర్మవరంలో పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా పరీక్షలను స్పెషల్ ఆఫీసర్ చెన్నకేశవప్రసాద్, కమిటీ సభ్యులు సురేష్‌బాబు, రామరాజు, శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరప్రసాద్ పర్యవేక్షించారన్నారు. కిరికెర సర్పంచ్‌కు ఉత్తమ పురస్కారం హిందూపురం: పంచాయతీ స్వశక్తి అధినేత్రి ఉత్తమ పురస్కారాన్ని హిందూపురం మండలం కిరికెర పంచాయతీ సర్పంచ్ వైఎన్ భాగ్యమ్మ అందుకున్నారు. ఢిల్లీలో 5, 6 తేదీల్లో ముందస్తుగా జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి రాష్ట్రం నుంచి ఆరుగురు మహిళా ప్రజాప్రతినిధులను ఎంపిక చేశారు. అందులో ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి కిరికెర సర్పంచ్ భాగ్యమ్మ ఉన్నారు. కార్యక్రమంలో ఆమె మహిళా సాధికారత, ఫ్రెండ్లీ ఉమెన్, గ్రామ పంచాయతీల అభివృద్ధి గురించి క్లుప్తంగా ప్రసంగించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. దీంతో సర్పంచ్ భాగ్యమ్మకు కేంద్ర గ్రామీణ అభివృద్ధి కమిషనర్ వినోద్‌కుమార్ చేతుల మీదుగా ‘పంచాయతీ స్వశక్తి అధినేత్రి పురస్కారం’తో జాతీయ ఉత్తమ ప్రశంసాపత్రం షీల్డ్ అందించి అభినందించారు. ఈ సందర్భంగా భాగ్యమ్మకు ఉమ్మడి జిల్లా మహిళా సర్పంచులు, స్థానిక పంచాయతీ ప్రజలు శుభాకాంక్షలు తెలియజేశారు. అలరించిన సంగీత కచేరీ ప్రశాంతి నిలయం: సత్యసాయిని కీర్తిస్తూ నిర్వహించిన సంగీత కచేరీ భక్తులను అలరించింది. శనివారం సాయంత్రం ప్రశాంతినిలయం సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత సత్యసాయి విద్యాసంస్థల ఫర్మార్మింగ్ ఆర్ట్స్ విభాగం విద్యార్థులు సంగీత కచేరీ నిర్వహించారు. గంటపాటు నిర్వహించిన సంగీత కచేరీతో సభా మందిరం మార్మోగింది. -
రైలులో తమిళనాడు వాసి మృతి
ధర్మవరం: అనారోగ్యంతో రైలులో తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి మృతి చెందిన సంఘటన ధర్మవరంలో శనివారం జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు.. తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లా అత్తూరు తాలూకాకి చెందిన శ్రీనివాసం దురైస్వామి(46)కి మూడునెలల క్రితం స్వగ్రామంలో కుక్క కరిచింది. వైద్యం చేయించుకోకుండా బోర్వెల్ పనిచేసేందుకు మహారాష్ట్రలోని ఒక గ్రామానికి వెళ్లాడు. కుక్క కరిచిన చోట ఇన్ఫెక్షన్ అయి అనారోగ్యానికి గురికావడంతో మహారాష్ట్ర నుంచి స్వగ్రామానికి రైలులో బయలుదేరాడు. రైలు ధర్మవరం రైల్వేస్టేషన్‌లోకి చేరుకునే సమయానికి దురైస్వామి మృతి చెందాడు. రైలులో ఉన్న ప్రయాణికులు ధర్మవరం రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య ప్రసన్న, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
మహిళాభ్యున్నతే లక్ష్యం
పుట్టపర్తి అర్బన్: మహిళాభ్యున్నతే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కలెక్టర్ చేతన్ సూచించారు. శనివారం బ్రాహ్మణపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఎస్పీ రత్న, ఐసీడీఎస్ పీడీ వరలక్ష్మి, డీపీఓ సమత, డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజ్ బేగం, డీఆర్డీఏ పీడీ నరసయ్య, మెప్మా అధ్యక్షురాలు పద్మావతి, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు రాజేశ్వరి ఆధ్వర్యంలో జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలు ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా పలు శాఖలకు చెందిన మహిళా సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు. ముఖ్య అతిథి కలెక్టర్ మాట్లాడుతూ బాల్య వివాహాలు ఎక్కడ జరిగినా కఠిన చర్యలు తీసుకొని పూర్తిగా నిర్మూలించాలన్నారు. ఈ విషయంలో ప్రతి మహిళా ప్రభుత్వానికి తోడ్పాటునందించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల హక్కులు, సామాజిక ఆర్థిక సహకారంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నాయన్నారు. ప్రతి మగాడి విజయం వెనుక తల్లి, చెల్లి, అక్క, కూతురూ ఇలా ఎవరో ఒకరు ఉంటారన్నారు. ప్రతి విజయం వెనుక మాతృమూర్తి దీవెన ఉందని, అందుకే లోకంలో తల్లిని మించిన దైవం లేదన్న విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. ఎస్పీ రత్న మాట్లాడుతూ జిల్లాలో మహిళల భద్రతకు పెద్ద పీట వేస్తున్నట్లు చెప్పారు. ప్రతి మహిళా చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు, పోక్సో శక్తి యాప్ తదితర అంశాల గురించి క్షుణ్ణంగా వివరించారు. అనంతరం పలువురి మహిళలను మెమొంటోలు, ప్రశంసాపత్రాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నారుల నృత్య ప్రదర్శన ఆహూతులను ఆకట్టుకుంది. అనంతరం డీఆర్డీఏ ద్వారా మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకు లింకేజీ కింద 4,380 మందికి రూ.74 కోట్లు, సీ్త్రనిధి ద్వారా 2,979 మందికి రూ.29.79 కోట్లు, మెప్మా ద్వారా 4,205 మందికి రూ.21.34 కోట్లు, ఎంఎస్ఎంఈ ద్వారా ఐదుగురికి రూ.60 లక్షలు, పరిశ్రమల ద్వారా ముద్ర స్టాండప్ పథకాల ద్వారా 59 మందికి రూ.4 కోట్లు, పీఎం విశ్వకర్మ పథకం ద్వారా 160 మందికి రూ.1.15 కోట్ల చొప్పున చెక్కులను అందించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, పరిశ్రమల శాఖ జీఎం నాగరాజు, స్కిల్ డెవలప్మెంట్ అధికారి హరికిరణ్, మెప్మా ప్రతినిధులు, డీఆర్డీఏ సిబ్బంది, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించాలి చట్టాలపై మహిళలకు అవగాహన ఉండాలి మహిళా దినోత్సవంలో కలెక్టర్ చేతన్, ఎస్పీ రత్న -
అమ్మాయిల సంఖ్య తగ్గడానికి కారణాలివే..
● లింగనిర్ధారణ నిరోధక చట్టం సరిగా అమలు కాకపోవడం. ● డయాగ్నస్టిక్ సెంటర్ల రిజిస్ట్రేషన్లు, రెన్యూవల్స్ సరిగా చేయకపోవడం. ● ఫిర్యాదులను పట్టించుకోకపోవడం. ● కేసులు నమోదవుతున్నా కఠిన చర్యలు తీసుకోకపోవడం. ● జిల్లా స్థాయి కమిటీల పర్యవేక్షణ లేకపోవడం. ● లింగనిర్ధారణ నిరోధక చట్టం అమలుకు నిధులు ఇవ్వకపోవడం. ● ఇచ్చిన నిధులు కూడా సరిగా వినియోగించకపోవడం. -
ఘనంగా ఏపీఆర్ఎస్ వార్షికోత్సవం
పరిగి: కొడిగెనహళ్లి ఏపీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో శనివారం వార్షికోత్సవంతో పాటూ ఫేర్వెల్ డేను ప్రిన్సిపాల్ ఎన్వీ మురళీధర్‌బాబు ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు పలుకుతూ ఏర్పాటు చేసిన కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులకు విద్యార్థులు పాదాభివందనాలు చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. విద్యార్థులు ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ భావోద్వేగాలకు గురయ్యారు. కార్యక్రమంలో ఎంఈఓ శేషాచలం, పూర్వ విద్యార్థులు వెంకటకృష్ణ( బ్యాంక్ ఆఫ్ అమెరికా ఈడీ, న్యూజెర్సీ, యూఎస్ఏ), కృష్ణవేణి(మేనేజర్, పీవీహెచ్ కార్పొరేషన్, న్యూజెర్సీ), పాఠశాల చైర్పర్సన్ కుమారి, వైస్ చైర్మన్ రామాంజనేయులు, ఉపాధ్యాయులు, పుర ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు. మహిళ మెడలో బంగారు గొలుసు అపహరణ గుత్తి రూరల్: మండలంలోని అబ్బేదొడ్డి గ్రామంలో ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును శనివారం గుర్తు తెలియని దొంగ అపహరించాడు. బాధితురాలి వివరాల మేరకు.. గ్రామానికి చెందిన లక్ష్మిదేవి వేకువజామున ఇంటి బయట పనిలో నిమగ్నమైంది. ఇంతలో ముసుగు ధరించిన ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆమైపె ఒక్కసారిగా దాడి చేసి మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కొని పరిగెత్తాడు. మహిళ బిగ్గరగా కేకలు వేయడంతో విషయం తెలుసుకున్న కొందరు గ్రామస్తులు దొంగను వెంబడించారు. అయితే దొంగ వారికి దొరకకుండా పారిపోయాడు. దొంగ మహిళ మెడలోని గొలుసును లాగిన సమయంలో సగం తెగిపోయి అక్కడే పడిపోగా సగం గొలుసును ఎత్తుకెళ్లాడు. పోలీసులు గ్రామానికి చేరుకొని వివరాలు సేకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
జగన్ హయాంలోనే మహిళా సాధికారత
చిలమత్తూరు: వైఎస్ జగన్ హయాంలో మహిళా సాధికారతకు పెద్దపీట వేశారని వైఎస్సార్సీపీ జిల్లా అద్యక్షురాలు ఉషశ్రీ చరణ్ అన్నారు. హిందూపురంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఉషశ్రీచరణ్, నియోజకవర్గ సమన్వయకర్త హాజరై మహిళలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం ఉషశ్రీచరణ్ మాట్లాడుతూ డ్వాక్రా రుణాలు మాఫీ చేసి లక్షలాది మంది మహిళలకు మేలు చేకూర్చిన ఏకై క సీఎం వైఎస్ జగన్ అని కొనియాడారు. ప్రతి కుటుంబంలోనూ మహిళకు ప్రాధాన్యత లభించేలా ఆనాడు చేసి చూపించారన్నారు. మహిళలకు అనేక సంక్షేమ పథకాలతో పాటు రాజకీయ రంగంలోనూ మంత్రి పదవులు, 50శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. 30 వేల మంది ఆడబిడ్డలు రాష్ట్రంలో కనిపించకుండా పోయారని ఎన్నికల సమయంలో ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు వారి గురించి ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ మహిళలను ఓటుబ్యాంకుగా మాత్రమే చూశారని వదిలేశారని మండిపడ్డారు. మహిళలకు మళ్లీ పాత రోజులు రావాలంటే, సంక్షేమం జరగాలంటే ఈ ముంచే కూటమి ప్రభుత్వం పోవాలని, ఆ దిశగా మహిళాశక్తి పోరాడాలని పిలుపునిచ్చారు. హామీలు నెరవేర్చరా..? ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలు ఒక్కటైనా నెరవేర్చారా అంటూ వైఎస్సార్సీపీ సమన్వయకర్త టీఎన్ దీపిక సీఎం చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. ఉచిత బస్సు ప్రయాణ పరిధి జిల్లా వరకు మాత్రమే అంటూ కొర్రీ వేయడం.. అది కూడా ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పకపోవడం మహిళలను నమ్మించి మోసం చేయడమేనన్నారు. మహిళల సంక్షేమం, భద్రత ఒక్క జగన్ హయాంలోనే ఉందని, నేడు మహిళలకు రక్షణ కరువైందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు లక్ష్మి, రాధమ్మ, సర్పంచ్‌లు లలితమ్మ, వైఎన్ భాగ్యమ్మ, కో ఆప్షన్ సభ్యురాలు కాంతమ్మ, సాహెరాబాను, కవితారెడ్డి, హరితారెడ్డి, సిద్దగంగమ్మ, హిమబిందు తదితరులు పాల్గొన్నారు. ఆడబిడ్డల మిస్సింగ్‌పై నోరు మెదపని పవన్ కూటమి పాలనలో మహిళలకు భద్రత కరువు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ ధ్వజం -
ఆధిపత్యం.. ఉపాధి ఖతం
ముదిగుబ్బ: ఉపాధి హామీ పథకానికి రాజకీయ గ్రహణం పట్టుకుంది. తొమ్మిది నెలలుగా పనులు కల్పించకపోవడంతో కూలీలకు కడుపు కోత మిగిలింది. ధర్మవరం నియోజకవర్గంలోని ముదిగుబ్బ మండలంలో కూటమిలోని టీడీపీ–బీజేపీ–జనసేన నేతల మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. పదవులు, పోస్టులు.. ఆదాయ వనరులను హస్తగతం చేసుకునేందుకు తీవ్రస్థాయిలో పోటీపడుతున్నారు. ఈ క్రమంలో రాజకీయ నాయకులు తమ స్వలాభాలు చూసుకుంటున్నారు తప్ప ప్రజల గురించి పట్టించుకోవడం లేదు. ఉపాధి హామీ పథకంలో కూలీలకు పనులు కల్పించడంలో ఫీల్డ్ అసిస్టెంట్ల పాత్ర కీలకం. కూటమి కొలువు దీరిన తర్వాత ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించారు. మండలంలో 25 గ్రామపంచాయతీలు ఉన్నాయి. పంచాయతీకి ఒకటి, మేజర్ పంచాయతీల్లో ఇద్దరు లేదా ముగ్గురు చొప్పున ఫీల్డ్ అసిస్టెంట్లు అవసరం ఉంటుంది. ఆయా పోస్టుల్లో తమకు అనుకూలంగా ఉన్నవారిని నియమించుకునే విషయంలో టీడీపీ– బీజేపీ నాయకుల మధ్య సయోధ్య కుదరలేదు. దీంతో ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకాల ప్రక్రియ నిలిచిపోయింది. ఫలితంగా ఉపాధి పనులపై ఆధార పడి జీవనం సాగిస్తున్న పేద కుటుంబాలకు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. అదనపు పని దినాలు లేనట్లే! గత ఏడాదిలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలోని ముదిగుబ్బ, తాడిమర్రి, తలుపుల, కనగానపల్లి, ధర్మవరం, ఎన్పీ కుంట, గాండ్లపెంట, బుక్కపట్నం, పరిగి, రాప్తాడును కరువు మండలాలుగా ప్రకటించారు. దీంతో ఆయా మండలాల్లో 50 అదనపు పని దినాలు మంజూరు చేశారు. ముదిగుబ్బ మండలం మినహా అన్ని మండలాల్లో ఆ మేరకు పనులు జరుగుతున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్, మే నెలల్లో మాత్రమే ఉపాధి పనులు కల్పించారు. ఏడాదిలో 5 లక్షల పనిదినాలు కల్పించాలని లక్ష్యం ఉండగా.. జూన్‌లో కూటమి ప్రభుత్వం కొలువు తీరే నాటికి 2,72,406 పని దినాలు కల్పించారు. ● ఒక ఏడాదిలో కల్పించిన పనిదినాల ఆధారంగా ఆయా మండలాల అభివృద్ధికి 40 శాతం మేర మెటీరియల్ కాంపోనెంట్ నిధులు కేటాయిస్తారు. అయితే ఇంతవరకు ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకం పూర్తికానందున 2.28 లక్షల పనిదినాలను కూలీలు కోల్పోయారు. దీంతో అభివృద్ధి పనులకు నిధుల కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ● ఈ విషయంపై ఎంపీడీఓ దివాకర్‌ను వివరణ కోరగా ప్రజాప్రతినిధులతో చర్చించి త్వరగా ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకం చేపట్టి మార్చి 31 నాటికి వీలైనన్ని పని దినాలు కల్పిస్తామని చెప్పారు. కూలీలు పొట్టచేతపట్టుకుని ఇతర ప్రాంతాలకు వలస పోకుండా ఉన్న ఊరిలోనే పనులు కల్పించాలని ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టారు. ఏడాదిలో వంద రోజులు పనులు కల్పించాల్సి ఉంది. కూలీల నుంచి పని దినాల సంఖ్య పెంచాలని అంతటా డిమాండ్లు వస్తున్నాయి. ప్రస్తుత 2024–25 ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇక 23 రోజులు మాత్రమే మిగిలి ఉంది. కానీ పని దినాల సంఖ్య లక్ష్యంలో 50 శాతానికి మించలేదు. ఇది ఎక్కడో కాదు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి వై.సత్యకుమార్ ప్రాతినిథ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గంలోనే. కూటమి పాలనలో పనులు కరువు నిలిచిన ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకాలు ‘ఉపాధి’ చరిత్రలో చీకటి రోజులు ఇదీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఇలాకాలో దుస్థితి -
ఎన్టీఆర్ వైద్య సేవ సిబ్బంది విధుల బహిష్కరణ రేపు
కదిరి టౌన్: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం విధులను బహిష్కరించనున్నట్లు ఎన్టీఆర్ వైద్య సేవ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు షేక్బాబ్జాన్, పవన్‌కుమార్, అమరేంద్ర హరికృష్ణ తెలిపారు. ఈమేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. విధుల బహిష్కరణపై ఇప్పటికే జిల్లా కోఆర్డినేటర్‌కు వినతిపత్రం అందించామని తెలిపారు. సమస్యలు పరిష్కరించకపోతే యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈనెల 17, 24 తేదీల్లో కూడా విధులను బహిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. కల్లు దుకాణం పై దాడి మడకశిర: పట్టణంలోని చీపులేటిలో శనివారం రాష్ట్ర ఎకై ్సజ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు కల్లు దుకాణం పై దాడి చేశారు. ఈసందర్భంగా కల్తీకల్లు, కల్తీ చేయడానికి వినియోగించే మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకోవడంతోపాటు పలువురిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ కల్లు దుకాణాన్ని లైసెన్స్‌దారుడు కాకుండా వేరే వ్యక్తి నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఎకై ్సజ్ టాస్క్ ఫార్స్ అధికారులకు అందిన సమాచారం మేరకు ఈ దాడి చేసినట్లు సమాచారం. స్థానిక ఎకై ్సజ్ అధికారులు కూడా ఈ ఘటనపై వివరాలను అందించలేదు. మామిడి, చింతచెట్లు దగ్ధం గుడిబండ: మందలపల్లి సమీపంలోని కొండకు నిప్పుపెట్టడంతో దగ్గరలోని మామిడి, చింతచెట్లు దగ్ధమయ్యాయి. బాధిత రైతుల వివరాల మేరకు.. రైతు చిక్కన్న, సన్నమారప్ప 30 ఏళ్లుగా మామిడి, చింత, కొబ్బరి చెట్లను అభివృద్ధి చేశారు. శనివారం మధ్యాహ్నం ఆకతాయిలు ఎండుగడ్డికి నిప్పుపెట్టడంతో చిక్కన్న, సన్నమారప్ప తోటలకు వ్యాపించాయి. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బందిని మంటలు ఆర్పివేశారు. అయితే అప్పటికే దాదాపు 400 మామిడి చెట్లు, 100 చింత చెట్లు కాలి బూడిదయ్యాయి. ఘటనలో దాదాపు రూ.20 లక్షలు నష్టం వాటిల్లినట్లు బాధితులు వాపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. -
ఖర్చులు నిల్.. లాభాలు ఫుల్
మడకశిరరూరల్: నియోజకవర్గంలోని రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించడంతోపాటు గిట్టుబాటు ధర లభిస్తోంది. దీనికితోడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం అందిస్తుండడంతో ప్రకృతి వ్యవసాయం కింద పంటల సాగు పెరిగింది. వ్యవసాయశాఖ ద్వారా 2016లో మడకశిర మండలంలో 15 గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించారు. ఈ పద్ధతి లాభదాయకంగా ఉండటంతో మిగతా రైతులు దాన్ని అనుసరిస్తున్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలోని మండలాల్లో 137 గ్రామాల్లో 25,500 మంది రైతులు ప్రకృతి పద్ధతిలో పంటలు సాగు చేస్తున్నారు. వేరుశనగ, కంది, పూలతోటలు, మొక్కుజొన్న, మిరప, రాగి, కూరగాయలు, అరటి, వక్క, మామిడి పంటలతో పాటు అంతర పంటలను డ్రిప్ సౌకర్యంతో సాగు చేసి అధిక దిగుబడులు పొందుతూ ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు. పంటల సాగు ఇలా.. బీడ భూముల్లో నవధాన్యాల విత్తనాలు అలసంద, సజ్జ, అనుములు, అముదంతో పాటు 24 రకాల జీవ వైవిధ్య పంటల విత్తన గుళికలు సాగు చేయిస్తున్నారు. దీంతో నవధాన్యాలు పండడంతో పాటు భూమి సారవంతమై ఖరీఫ్‌లో సాగు చేసే పంటలు మంచి దిగుబడి పొందడానికి ఆవకాశం లభిస్తోంది. పొలంలో సూర్య మండల మోడల్ ఆకారం ఏర్పాటు చేసి బహుళ పంటలు, బహుళ–స్థాయి సాగు విధానంపై రైతులకు అవగాహన కల్పించి పంటలు సాగు చేయిస్తున్నారు. మడకశిర నియోజకవర్గంలో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయం విధానాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 15 దేశాలకు చెందిన 30 మంది విదేశీ సభ్యుల బృందం అధ్యయనం చేసింది. లాభదాయకంగా ప్రకృతి వ్యవసాయం తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు మడకశిర నియోజకవర్గంలో 137 గ్రామాల్లో పంటల సాగు -
అయినా.. అట్టడుగునే!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఐఐటీల్లో సీట్లు సాధిస్తున్నా.. సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా రాణిస్తున్నా.. జననాల పరంగా మాత్రం అమ్మాయిలు ఇంకా వెనుకబడే ఉన్నారు. 30 ఏళ్లుగా ఇదే దుస్థితి కొనసాగుతోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో గడిచిన ఐదు దశాబ్దాల్లో ఒక్కసారైనా అబ్బాయిల కంటే అమ్మాయిల సంఖ్య పెరగలేదు. తాజా సామాజిక, ఆర్థిక సర్వే ప్రకారం అమ్మాయిల సంఖ్యా పరంగా ఇప్పటికీ ఉమ్మడి అనంతపురం జిల్లా అట్టడుగున ఉన్నట్లు వెల్లడైంది. యథేచ్ఛగా లింగనిర్ధారణ.. ఉమ్మడి జిల్లాలో పలు రేడియోడయాగ్నస్టిక్స్ సెంటర్లలో యథేచ్ఛగా లింగనిర్ధారణ జరుగు తోంది. ఈ దురవస్థ వ్యాపారంగా సాగుతోంది. కొంతమంది గైనకాలజిస్టులు, రేడియాలజిస్ట్‌లు అత్యంత గోప్యంగా ఏజెంట్ల ద్వారా అబార్షన్లు నిర్వహిస్తున్నారు. జిల్లా ఆరోగ్యశాఖ అధికారులు డయాగ్నస్టిక్ సెంటర్లు, సంబంధిత డాక్టర్లపై చర్యలు తీసుకోలేకపోతున్నారు. వారసుల కోసం ఆరాటం.. ఆస్తిపాస్తులు లేకపోయినా చాలా కుటుంబాల్లో ‘మగపిల్లాడు ఉండాలి.. వారసుడు అంటే మగపిల్లవాడే’ అన్న మూఢ విశ్వాసంతో ఉన్నారు. మహిళ గర్భం దాల్చిందని తెలియగానే ముందుగా ఆడపిల్లా, మగపిల్లాడా అని తెలుసుకునేందుకు రకరకాల మార్గాలు ఎంచుకుంటున్నారు. తొలికాన్పులో ఆడపిల్ల పుట్టిన వారు రెండో కాన్పులోనైనా మగ పిల్లవాడి కోసం ఇలా చేయడం పరిపాటిగా మారింది. ఇలాంటి నమ్మకాల వల్ల కూడా ఆడపిల్లల సంఖ్య తగ్గుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు అమ్మాయిలు లేక అబ్బాయిలకు 30 ఏళ్లు దాటినా పెళ్లిళ్లు కావడం లేదు. అమ్మాయిల సంఖ్యలో చివరి స్థానంలో ‘ఉమ్మడి అనంత’ ప్రతి వెయ్యిమంది అబ్బాయిలకు 977 మందే అమ్మాయిలు సామాజిక ఆర్థిక సర్వేలో వెల్లడి -
మాటకు కట్టుబడి ఉన్నా
రాప్తాడురూరల్: ‘ఈ ఈవీఎంలతోనో, మరేదో కారణంగానో గెలిచారు. నన్ను ఆర్థికంగా, రాజకీయంగా అణచివేయాలనే దురాలోచనతో రాష్ట్రంలోని 50 వేలమంది మహిళల సొంతింటి కలను పరిటాల సునీత చిదిమేశారు. ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే ఆలమూరు, కొడిమి జగనన్న కాలనీల్లో 7,500 ఇళ్లను 7 నెలల్లో పూర్తి చేస్తా. ఇది నా ఛాలెంజ్’ అని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సవాల్ విసిరారు. శనివారం నగర శివారులోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అనంతపురం ఎమ్మెల్యే...పరిటాల సునీతకు భయపడుతున్నారో లేదంటే ఇళ్ల నిర్మాణం బాధ్యతను వదులుకున్నారో తెలీదన్నారు. జన్మలో ఆమె కానీ, ఆమె భర్త కాని సొంత డబ్బు ఖర్చు చేసి పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకొచ్చారా?, పేదలకు రూ.1.80 లక్షలతో ఇల్లు కట్టాలనే ప్రయత్నం చేశారా? అని పరిటాల సునీతను ప్రశ్నించారు. దప్పికయినప్పుడు బావి తవ్వాలనే విధానం.. పేరూరు డ్యాంకు హంద్రీ–నీవా మడకశిర బ్రాంచ్ కెనాల్ నుంచి రొద్దం మండలంలోని పెన్నానది మీదుగా నీళ్లు తీసుకురావొచ్చని తాము చెప్పినా వినలేదన్నారు. దప్పికయినప్పుడు బావి తవ్వాలనే విధానంతోనే పరిటాల సునీత 2018లో జీడిపల్లి నుంచి పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకొచ్చేందుకు కాలువ నిర్మాణానికి టెండర్లు పిలిపించి 2019లో పనులు ప్రారంభించారన్నారు. ముందుగానే కాంట్రాక్టర్ నుంచి కమీషన్లు దండుకున్నారన్నారు. ఒక రూపాయి కూడా నిధులు తేలేదన్నారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత వారికి సంబంధించిన కాంట్రాక్టర్‌కు రూ.170 కోట్ల నిధులు ఇప్పించి పనులు వేగవంతం చేయించామన్నారు. పూర్తిస్థాయిలో పనులు అవ్వాలంటే పదేళ్లు పడుతుందని భావించి అప్పటిదాకా ఈ ప్రాంత రైతులను ఎండబెట్టడం సరికాదని, అప్పటి సీఎం జగనన్నతో మాట్లాడి ప్రత్యేకంగా మడకశిర బ్రాంచ్ కెనాల్ నుంచి పేరూరు డ్యాంకు ఒక టీఎంసీ నీళ్లు తీసుకొచ్చేందుకు జీఓ తెచ్చామన్నారు. తర్వాత దాతలు, రైతుల సహకారంతో 45 కిలోమీటర్ల మేర కాలువ నిర్మించి డ్యాంకు నీళ్లు తీసుకొచ్చామని గుర్తు చేశారు. పరిటాల సునీత తత్వం రైతులకు బోధపడింది.. ప్రస్తుతం శ్రీశైలం డ్యాంలో పుష్కలంగా నీళ్లున్నాయని, చంద్రబాబుతో పరిటాల కుటుంబం సన్నిహితంగా ఉంటోందని, పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకొచ్చేందుకు అవకాశాలున్నా పరిటాల సునీత ఏరోజూ చంద్రబాబుతోగాని, లోకేష్‌తో గాని మాట్లాడలేదన్నారు. తీరా మడకశిర బ్రాంచ్ కెనాల్‌కు నీళ్లు వదిలే సమయంలో రిపేరీల పేరుతో డ్యాంకు ఉన్న గేట్లు తీయించారన్నారు. వచ్చే ఏడాది నీళ్లిస్తామంటూ కట్టుకథలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిటాల సునీత తనకు లాభం లేనిదే ఏపనీ చేయదనే తత్వం రైతులకు బోధపడిందన్నారు. ఇక కమీషన్ల కోసమే హంద్రీ–నీవా కాలువ లైనింగ్ పనుల కోసం కక్కుర్తి పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. పేరూరు డ్యాం, చెరువులను ఎండబెట్టి మీ జేబులను మాత్రం కమీషన్లతో నింపుకుంటారా?అని ప్రశ్నించారు. ఫీజు పోరును జయప్రదం చేయండి.. ఈనెల 12న పుట్టపర్తిలో నిర్వహించే ఫీజు ఫోరు, యువత పోరును జయప్రదం చేయాలని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పిలుపునిచ్చారు. నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు, యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నాయకులు న్యాయవాది కురుబ నాగిరెడ్డి, ఆత్మకూరు మండల కన్వీనర్ బాలపోతన్న, పార్టీ నాయకులు నీరుగంటి నారాయణరెడ్డి, మాదన్న, ఈశ్వరయ్య, వీరాంజి పాల్గొన్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే 7 నెలల్లో 7,500 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తాం 50 వేల మంది మహిళల సొంతింటి కలను చిదిమేసిన పరిటాల సునీత మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ధ్వజం కౌంటరు దాఖలు చేయని దద్దమ్మ ప్రభుత్వం.. ఇళ్ల నిర్మాణాల నిలుపుదలపై రాక్రీట్ సంస్థ కోర్టుకు వెళ్తే...మీ చేతకాని చవట దద్దమ్మ ప్రభుత్వం ఇప్పటిదాకా కనీసం కౌంటర్ వేయలేదని ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాకుండానే విజిలెన్స్ విచారణ ఏంటని, రాక్రీట్ సంస్థకు ఎందుకు బిల్లులు ఆపారని జడ్జిగారు ప్రశ్నిస్తే.... తమకు, ఆ సంస్థకు సంబంధం లేదని అడ్వొకేట్ జనరల్ చెప్పారని గుర్తు చేశారు. ఈ కేసు నుంచి ఏమీ సాధించలేమని భావించి కౌంటరు వేయకుండా నిలిపేశారన్నారు. 9 నెలలుగా మీ ప్రభుత్వమే అధికారంలో ఉందని, విజిలెన్స్ విచారణలన్నీ పూర్తి చేశారన్నారు. మళ్లీ ఈరోజు సునీత అసెంబ్లీలో రాక్రీట్ సంస్థ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. -
శ్రీవారి హుండీల లెక్కింపు
కదిరి టౌన్: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులు సమర్పించిన హుండీ కానుకలను శుక్రవారం ఆలయ అధికారుల సమక్షంలో బ్యాంకు అధికారులు లెక్కించారు. 47 రోజులకు గాను రూ.62,73,741 నగదు, 20 గ్రాముల బంగారం, 340 గ్రాముల వెండి, 55 అమెరిక డాలర్లు సమకూరినట్లు ఆలయ ఈఓ వి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. గతంలో కంటే ఈసారి ఆదాయం ఎక్కువగా వచ్చిందన్నారు. కార్యక్రమంలో హుండీల పర్యవేక్షాణాధికారి ఎన్.ప్రసాద్, కెనరా బ్యాంక్ మేనేజర్ అనంతబాబు, బ్యాంక్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుపై శిక్షణ పుట్టపర్తి: ఆసక్తి ఉన్న యువతకు సీసీ కెమెరా (సీసీ టీవీ)ల ఏర్పాటుపై బుక్కపట్నంలోని శ్రీసత్యసాయి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని స్కిల్ హబ్ సెంటర్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు ఏపీ నైపుణ్యాభివృద్ధి జిల్లా అధికారి హరికృష్ణ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇంటర్, ఐటీఐ, డిగ్రీ పాస్ లేదా ఫైయిల్ అయిన వారితో పాటు ఆపై చదువులు అభ్యసించిన వారూ అర్హులు. ఆధార్ లింక్ ఉన్న మొబైల్ ఫోన్ నంబర్ కలిగి ఉండాలి. మూడు నెలల శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. ఆసక్తి ఉన్న యువతీయువకులు పూర్తి వివరాల కోసం స్కిల్ హబ్ కో–ఆర్డినేటర్ (79815 41994)ను సంప్రదించవచ్చు. ఫారం పాండ్ పనుల పరిశీలనఅగళి: మండలంలోని అగళి, పి.బ్యాడగెర, హెచ్,డి.హళ్లి గ్రామాల్లో ఉపాధి హమీ పథకం కింద చేపట్టిన ఫారం పాండ్ పనులను శుక్రవారం ఇన్చార్జ్ ఏపీడీ లక్ష్మీనారాయణ పరిశీలించారు. మండలంలో మార్చి, ఏప్రిల్, మే నెలలకు గాను 239 ఫారం పాండ్ల ఏర్పాటు లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలిపారు. ఫారం పాండ్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా రైతులకు నీటి నిల్వ ఉంటూ అవసరమైన సమయంలో పంటల సాగుకు ఉపయోగించుకోవచ్చునన్నారు. కంపోస్టు ఫిట్ల నిర్మాణం కూడా చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. రోజుకు సగటున రూ.300 వేతనం పడేలా కూలీలకు పనులు కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఏపీఓ శివన్న, సిబ్బంది పాల్గొన్నారు. -
‘కరుణ’జ్యోతి
ఇక్కడ ఓ వృద్ధురాలికి తల దువ్వుతూ కనిపిస్తున్న మహిళ పేరు అరుణజ్యోతి. స్వగ్రామం మండల కేంద్రమైన అమడగూరు. 16 ఏళ్ల వయసున్నపుడే వరుసకు మేనమామకు ఇచ్చి వివాహం జరిపించారు తల్లిదండ్రులు. పెళ్లయిన పదేళ్లకే భర్త రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. అప్పటికే బుద్ధిమాంద్యంతో పుట్టిన కుమారుడికి అన్నీ తానైంది అరుణజ్యోతి. కుమారుడిని వివిధ ఆస్పత్రులకు తీసుకెళ్తున్న క్రమంలో బుద్ధిమాంద్యులు, అనాథలు పడే ఇబ్బందులను స్వయంగా చూసి చలించిపోయింది. వారికోసం ఏదో ఒకటి చేయాలనే తలంపుతో అనాథ వృద్ధులకు అండగా నిలవాలని నిశ్చయించుకుంది. నాలుగేళ్ల కిత్రం తనకున్న బంగారు నగలను విక్రయించి వచ్చిన సొమ్ముతో అమడగూరు మండలం, గాజులపల్లి సమీపంలో వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేసింది. తనకు, బుద్ధిమాంద్యుడైన కుమారుడికి ఇచ్చే పింఛను డబ్బుతో ఆశ్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఈ ఆశ్రమంలో 20 మంది వృద్ధులతో పాటుగా ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. ఎక్కడైనా వృద్ధులు ఆలనాపాలనా లేక రోడ్డుమీద ఉంటున్నారని తెలిస్తే చాలు అరుణజ్యోతి చలించిపోయింది. ఎంతదూరమైనా వెళ్లి వారిని ఆశ్రమానికి తీసుకువస్తుంది. చిన్న వయసులోనే జీవితంలో ఎన్నో ఒడి, దుడికులను ఎదుర్కొన్నా... కుంగిపోకుండా ధైర్యంగా నిలబడి అనాథ వృద్ధులకు సేవ చేసుకుంటూ పలువురి మహిళలకు ఆదర్శంగా నిలుస్తోంది. -
అవార్డుల కండక్టరమ్మ
కదిరి డిపోలో కండక్టర్‌గా పని చేస్తున్న లక్ష్మీనరసమ్మ కష్టేఫలి సూత్రాన్ని నమ్ముకున్నారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఆమె ఆర్టీసీ కండక్టరుగా రాణిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ప్రస్తుతం కదిరి డిపోలో పనిచేస్తున్న లక్ష్మీనరసమ్మ.. మదనపల్లి, హిందూపురం పల్లెవెలుగు సర్వీసుల్లో డ్యూటీ చేస్తున్నారు. అందరికంటే మిన్నగా కలెక్షన్‌ను రాబట్టి సంస్థ అభివృద్ధికి దోహదపడుతున్నారు. వృత్తిపట్ల ఆమె అంకితభావం...సంస్థ పురోభివృద్ధిలో ఆమె భాగస్వామ్యాన్ని గుర్తించిన ఉన్నతాధికారులు ఉత్తమ కండక్టర్‌గా రాష్ట్రస్థాయి అవార్డు అందించారు. అలాగే 2023, 2024 సంవత్సరాల్లో కదిరి డిపోలోనూ పలుసార్లు ఉత్తమ కండక్టర్‌గా నగదు అవార్డులు అందించారు. అటు కుటుంబాన్ని, ఇటు వృత్తి బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తున్న లక్ష్మీనరసమ్మ ఎందరో మహిళా ఉద్యోగులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. – కదిరి అర్బన్: -
ఆత్మ విశ్వాసానికి ప్రతిరూపం దాసరి లక్ష్మీదేవి
రెండు కాళ్లు చచ్చుబడినా... ఆమె జీవితంలో నిలబడింది. స్వశక్తితో జీవనం సాగిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. ఆ స్ఫూర్తిదాత పేరు దాసరి లక్ష్మీదేవి. తాడిమర్రి మండల కేంద్రానికి చెందిన దాసరి యంగన్న, నారాయణమ్మ దంపతులకు రెండో సంతానం దాసరి లక్ష్మీదేవి. ఆరు నెలల వయసులోనే పోలియో సోకి రెండు కాళ్లూ చచ్చుబడి పోయాయి. అయినా ఆమె తల్లిదండ్రులు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. ప్రస్తుతం ఆమె వయస్సు 45 ఏళ్లు. లక్ష్మీదేవి పెద్దగా చదువుకోకపోయినా...ఆర్థికంగా ఎవరిపైనా ఆధారపడకూడదని భావించేది. ఈక్రమంలోనే ఆదాయ మార్గాలను అన్వేషించింది. 2002లో ఆర్డీటీ సహకారంతో రూ.1,500 మొత్తంతో గ్రామం నడిబొడ్డున చిన్నపాటి బంకు ఏర్పాటు చేసుకుని వ్యాపారం ప్రారంభించింది. మొదట్లో ట్రైసైకిల్‌పై ఆమె కూర్చుంటే వాళ్ల నాన్న బండిని తోసుకుంటూ అంగడి వరకూ వచ్చేవాడు. తిరిగి సాయంత్రం వచ్చి ఇంటికి తీసుకుని వెళ్లే వాడు. కష్టపడటం ఒక్కటే తెలిసిన లక్ష్మీదేవి చిన్నపాటి వ్యాపారంతోనే తల్లిదండ్రులకు చేదోడుగా నిలిచింది. అయితే 2006 లక్ష్మీదేవి తల్లి నారాయణమ్మ అకాలం మరణం ఆమెను కుంగదీసింది. అయినా జీవితంపై ఎంతో ఆశ ఉన్న లక్ష్మీదేవి ధైర్యంతో ముందుకు సాగి తిరిగి వ్యాపారం ప్రారంభించింది. అంతా బాగుందనుకుంటున్న తరుణంలోనే...తండ్రి యంగన్న వయస్సు మీదపడి ఇంటికే పరిమితమయ్యాడు. దీంతో లక్ష్మీదేవి భవిష్యత్ ప్రశ్నార్థకమైంది. కనీసం అంగడి వరకూ తీసుకెళ్లే తోడులేక తీవ్ర ఇబ్బందులు పడింది. ఈ క్రమంలోనే రూ.40 వేలు వెచ్చించి ట్రైసైకిల్‌ను కొనులోగు చేసింది. దాన్ని రిక్షాలా మార్చి మోటర్ ఏర్పాటు చేసుకుంది. అప్పటి నుంచి ఎవరి సాయం లేకుండా ఆమె సొంతంగా ట్రైసైకిల్‌పైనే వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. రోజూ రూ.400 నుంచి రూ.500 వరకూ వ్యాపారం చేసుకుంటూ ఒకరికి భారం కాకుండా స్వశక్తితో జీవిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. తన కాళ్లు మాత్రమే చచ్చుబడ్డాయని, సంకల్పం కాదని చెబుతున్న దాసరి లక్ష్మీదేవి కళ్లలో జీవితం పట్ల ప్రేమ కనిపిస్తుంది. – తాడిమర్రి: -
బాబు ‘ష్యూరిటీ’.. ‘మోసం’ గ్యారంటీ
కదిరి: పింఛన్లు మినహా ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజలను సీఎం చంద్రబాబు నేతత్వంలోని కూటమి ప్రభుత్వం మోసగించిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు తాను ష్యూరిటీ అంటూ ప్రజలను నమ్మించిన చంద్రబాబు... అధికారం చేపట్టిన తర్వాత మోసం గ్యారంటీ అనేది మరోసారి రుజువు చేశారన్నారు. శుక్రవారం తన స్వగహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అభివద్ది, సంక్షేమం పూర్తిగా పక్కనబెట్టి కేవలం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించడంపైనే ఎక్కువగా దృష్టి సారించిందని మండిపడ్డారు. రైతులకు ఏటా అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకూ ఒక్క పైసా కూడా ఇచ్చిన పాపాన పోలేదన్నారు. తల్లికి వందనం పేరుతో ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంత మందికి రూ.15 వేలు చొప్పున ఆ ఇస్తామని చెప్పిన చంద్రబాబు నేడు తల్లులను మోసగించారన్నారు. నిరుద్యోగ భృతి, 50 ఏళ్లకే పింఛన్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తదితర ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా చంద్రబాబు చేసిన మోసంపై ప్రజలు మండిపడుతున్నారన్నారు. ఇప్పటికై నా రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ప్రజా సంక్షేమం కోసం పాటుపడక పోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాసరెడ్డి -
కూలి బిడ్డ డిప్యూటీ కలెక్టర్
కూలికి వెళితే తప్ప పూట గడవని కుటుంబంలో పుట్టింది స్వాతి. స్వగ్రామం పరిగి మండలం మోదా పంచాయతీ పరిధిలోని గొరవనహళ్లి గ్రామం. తల్లిదండ్రులు రత్నమ్మ, నాగరాజు. దంపతులిద్దరూ కూలిలుగా పని చేసేవారు. వీరికి ఇద్దరు సంతానం కాగా, స్వాతి పెద్దకూతురు. తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని చూస్తూ పెరిగిన స్వాతి... పేదరికాన్ని విద్యతోనే జయించాలని భావించింది. ఎన్ని కష్టాలు ఎదురైనా చదువును మాత్రం ఆపలేదు. ఆర్థిక స్థోమత సరిగా లేని కారణంగా ప్రాథమిక విద్యాభ్యాసం నుంచి డిగ్రీ వరకూ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోనే చదువుకుంది. ఆ తర్వాత పట్టుదలతో చదివి 2016లో ఎస్ఐగా ఎంపికై ంది. రెండేళ్ల కఠోర శిక్షణ తర్వాత 2018లో విధుల్లో చేరింది. అయినా ఎక్కడో అంసతృప్తి. తనలాంటి పేదలకు ఏదైనా చేయాలంటే ఇంకా ఉన్నతస్థానంలో ఉండాలని భావించింది. ఈ క్రమంలోనే గ్రూప్స్‌కు ప్రిపరేషన్ కొనసాగించింది. 2023లో గ్రూప్–1లో సత్తాచాటి ఏకంగా 8వ ర్యాంకు దక్కించుకుంది. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. సంకల్పబలం ముందు కష్టాలన్నీ కరిగిపోగా.. స్వాతి ఎందరికో ఆదర్శంగా నిలిచింది. – పరిగి: -
హామీల అమలులో ‘కూటమి’ విఫలం
సోమందేపల్లి: హామీల అమలులో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ ధ్వజమెత్తారు. శుక్రవారం సాయంత్రం ఆమె సోమందేపల్లిలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఊరికో హామీ ఇచ్చిన చంద్రబాబు... ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నాక డబ్బులు లేవంటూ అన్ని వర్గాలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. తన అసమర్థ పాలనను ప్రశ్నిస్తారన్న భయంతోనే వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా దక్కకుండా కుట్ర చేస్తున్నారన్నారు. సీట్ల గురించి మాట్లాడుతున్న కూటమి పార్టీల నేతలు..రాష్ట్రంలో 40 శాతం మంది వైఎస్సార్ సీపీకి ఓటు వేసిన విషయాన్ని మరచిపోకూడదన్నారు. కూటమిలోని మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే 60 శాతం ఓట్లు వచ్చాయన్నారు. ప్రజలు తప్పక బుద్ధి చెబుతారు.. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ వైఎస్ జగన్ క్యాలెండర్ ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేశారని, ప్రస్తుత కూటమి సర్కార్ మాత్రం ఒక్క పథకం కూడా అమలు చేయకపోవడం దౌర్భాగ్యపాలనకు నిదర్శనమన్నారు. మహిళలు, నిరుద్యోగులు, రైతులు, ప్రతి ఒక్కరినీ కూటమి ప్రభుత్వం మోసం చేసిందన్నారు. అందుకే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూటమి పార్టీలను చిత్తుగా ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. విద్యార్థుల కోసం ఉద్యమబాట.. ఫీజురీయింబర్స్ నిధులు విడుదల చేయకుండా నిరుపేద కుటుంబాల్లోని విద్యార్థులను కూటమి ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని ఉషశ్రీచరణ్ మండిపడ్డారు. అందుకే వైఎస్సార్ సీపీ విద్యార్థుల తరఫున ఉద్యబాట పట్టిందన్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 12వ తేదీన ‘ఫీజు పోరు’ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యారంగ నిపుణులు అందరూ తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ గజేంద్ర, జెడ్పీటీసీ అశోక్, పార్టీ గ్రీవెన్స్ సెల్ జిల్లా అధ్యక్షుడు రమాకాంత్ రెడ్డి, వైస్ ఎంపీపీ వెంకటనారాయణ రెడ్డి, సర్పంచ్‌లు కిష్టప్ప, జిలాన్ ఖాన్, పరంధామ తదితరులు పాల్గొన్నారు. అన్ని వర్గాలనూ మోసం చేసిన బాబు విద్యార్థుల కోసం 12న వైఎస్సార్సీపీ ‘ఫీజు పోరు’ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ -
ధైర్యమే ఊపిరిగా ముందుకు సాగాలి
పుట్టపర్తి టౌన్: ఇంటాబయట ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవాలంటే ధైర్యమే ఊపరిగా ముందుకు సాగాలని మహిళలకు ఎస్పీ రత్న పిలుపునిచ్చారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం పుట్టపర్తి సమీపంలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నుంచి పోలీస్ కార్యాలయం వరకు ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పోలీస్ కార్యాలయంలో ఓపెన్ హౌస్ ఏర్పాటు చేసి, ఆయుధాల వినియోగంపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సవాళ్లనుఽ అధిగమించాలంటే ఆత్మస్తైర్యంతో ముందుకు సాగాలన్నారు. సెల్‌ఫోన్ వినియోగం వల్ల ఒనగూరే లాభాలు, అనర్థాలపై షార్ట్ ఫిలిం ద్వారా వివరించారు. కార్యక్రమంలో డీఎస్పీలు విజయకుమార్, ఆదినారాయణ, శ్రీనివాసులు, ఏఓ సుజాత, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఎస్పీ కార్యాలయంలో మహిళా దినోత్సవం అంతర్జాతీయ మహిళా వారోత్సవాల్లో భాగంగా పోలీస్ కార్యాలయంలో ముందస్తుగా శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. డీపీఓ మహిళా సిబ్బందితో కలసి ఎస్పీ రత్న కేక్ కట్ చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. -
10న ఖాద్రీశుడికి పట్టు వస్తాల సమర్పణ
సాక్షి, అమరావతి: కదిరిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 10న ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను మంత్రి నారా లోకేష్ సమర్పించనున్నారు. ఈ మేరకు దేవదాయ శాఖ కార్యదర్శి వినయ్ చంద్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఇంటర్ పరీక్షకు 245 మంది గైర్హాజరు పుట్టపర్తి: ఇంటర్ పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా సాగుతున్నాయి. శుక్రవారం జిల్లాలోని 42 కేంద్రాల్లో సీనియర్ ఇంటర్ విద్యార్థులకు నిర్వహించిన మ్యాథమ్యాటిక్స్–2ఏ/బాటనీ/సివిక్స్ పేపర్ –2 పరీక్షలకు 245 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విద్యార్థులు 9,410 మందికి గాను 9,202 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇక ఒకే షనల్ కోర్సులకు సంబంధించి 1,151 మందికిగానూ 1,114 మంది పరీక్షకు హాజరయ్యారు. మొత్తంగా 245 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఇంటర్మీడియెట్ జిల్లా విద్యాఽశాఖాధికారి రఘునాథరెడ్డి తెలిపారు. జిల్లా స్పెషల్ ఆఫీసర్ చెన్నకేశవ ప్రసాద్, పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు సురేష్, రామరాజు, శ్రీనివాసరెడ్డి, జిల్లా ఇన్చార్జ్ వెంకటేశ్వర ప్రసాద్ తదితరులు వివిధ కేంద్రాలను తనిఖీ చేశారు. ఓపెన్ ఇంటర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ హిందూపురం: స్థానిక ఎంజీఎం, అజిజీయా మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా సాగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షల్లో జోరుగా మాస్ కాపీయింగ్ సాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దాదాపు 250 మంది ఈ కేంద్రాల్లో పరీక్షలు రాస్తున్నారు. అభ్యర్థుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుని రెండు కేంద్రాల్లోనూ మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం. గేట్లకు తాళాలు వేసి గదుల కిటికీలు మూసి పుస్తకాలు, చీటీలు అందజేసి పరీక్షలు రాయిస్తున్నారు. నాణ్యతలేని గుడ్ల సరఫరాపై ఫిర్యాదు పుట్టపర్తి అర్బన్: జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యతలేని, గోలీ సైజు గోడి గుడ్లు సరఫరా చేస్తున్నారని, సంబంధిత ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని జైభీంరావు భారత్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగరాజు కోరారు. శుక్రవారం ఈ మేరకు ఐసీడీఎస్ పీడీ సుధావరలక్ష్మికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని నెలలుగా అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలకు గోలీ సైజు కోడి గుడ్లు సరఫరా చేస్తున్నారన్నారు. ఇప్పటికై నా సంబంధిత ఏజెన్సీపై చర్యలు తీసుకుని నాణ్యమైన గుడ్లు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. -
గంగమ్మ.. నీకు సాటిలేరమ్మా
పొలంలో పనిచేసుకుంటున్న ఈమె పేరు గంగమ్మ. పాతికేళ్ల క్రితం మద్దనకుంట గ్రామానికి చెందిన హనుమంతరాయప్పతో వివాహమైంది. ఏడాది తిరిగే సరికి పండంటి బిడ్డ (బాలచంద్ర)కు జన్మనిచ్చింది. పూర్తిగా వ్యవసాయ కుటుంబం. ఉన్నంతలో హాయిగా సాగుతున్న ఆమె జీవితంలోకి చీకటి తొంగిచూసింది. బిడ్డ పుట్టిన మరుసటి ఏడాదే భర్త హనుమంతరాయప్ప మృతితో అంధకారం అలముకుంది. గుండెల్లో అలజడి.. ఒడిలో రెండేళ్ల బిడ్డ..గంగమ్మ దిక్కుతోచని స్థితిలోకి వెళ్లింది. బిడ్డకోసం ధైర్యం కూడదీసుకుని పొలం బాట పట్టింది. పొలం పనులు చేసుకుంటూ కుమారుడిని పోషిస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చింది. బిడ్డను డిగ్రీ వరకూ చదివించింది. అయితే గంగమ్మపై విధి మరోసారి కక్షగట్టింది. పోలియో రూపంలో కుమారుడు బాలచంద్రను ఇంటికే పరిమితం చేసింది. అయినా గంగమ్మ వెనకడుగు వేయలేదు. తనరెక్కల కష్టంతో కుటుంబానికి అండగా నిలిచింది. తనకున్న 4 ఎకరాల్లో బోరు వేయించి అందులో రెండు ఎకరాల్లో వక్కతోట, మరో రెండెకరాల్లో అరటి తోట సాగు చేసింది. ప్రస్తుతం అందులో అంతర పంటలను సాగు చేస్తూ ఆదాయాన్ని పెంచుకుంది. నీరు కట్టడం, కలుపు తీయడం, మొక్కలు నాటడం తదితర వ్యవసాయ పనులన్నీ తానే స్వయంగా చూసుకుంటుంది. భర్త దూరమైనా..చెట్టంత కుమారుడు ఇంటికే పరిమితమైనా వెరవని ధీశాలి గంగమ్మను చూసి జనమంతా...నీకు సాటిలేరమ్మా అంటున్నారు. ఎందరికో ఆదర్శంగా నిలిచిన ఆమె జీవిత ప్రస్థానాన్ని వేనోళ్ల పొగడుతున్నారు. – అమరాపురం: -
జనరిక్ మందులపై ప్రచారం చేయండి
పెనుకొండ: జనరిక్ మందులపై ప్రజల్లో అవగాహన పెంచి వాటిని ప్రజలు వినియోగించేలా విస్తృత ప్రచారం చేయాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్‌కుమార్ పిలుపునిచ్చారు. ప్రధాన మంత్రి జన ఔషది దివస్‌ను పురస్కరించుకుని శుక్రవారం పట్టణంలోని సీమాంక్ సెంటర్లో వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బందితో జాయింట్ కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జనరిక్‌లో మందులు అందుబాటులో ఉన్నా.. ప్రజలు బ్రాండెడ్ పేరుతో ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు. దీనిపై వైద్య,ఆరోగ్యశాఖ సిబ్బంది గ్రామగ్రామానా ప్రచార కార్యక్రమాలు నిర్వహించి, ప్రజలకు వివరించి జనరిక్ ఔషధాలను వినియోగించేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ ఆనంద్‌కుమార్, డీఎంహెచ్ఓ ఫైరోజాబేగం, డీసీహెచ్ఎస్ తిప్పేంద్రనాయక్, డ్రగ్ ఇన్స్పెక్టర్ హనుమంతు, డిప్యూటి డీఎంహెచ్ఓ మంజువాణి, వైద్యాధికారి మోహన్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ అభిషేక్‌కుమార్ -
విధి నిర్వహణలో నైపుణ్యం మెరుగు పర్చుకోవాలి
పుట్టపర్తి టౌన్: విధి నిర్వహణలో నైపుణ్యత మెరుగు పరుచుకొని ప్రజలకు మంచి సేవలు అందించాలని హోం గార్డులకు రాయలసీమ రీజియన్ హోంగార్డుల ఇన్చార్జ్ కమాండెంట్ మహేష్‌కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన ఆయన హోంగార్డుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం విధి నిర్వహణలో ప్రతిభ కనబరచిన హోంగార్డులకు ప్రశంసా పత్రాలు అందజేసి, మాట్లాడారు. హోంగార్డుల విధులు సవాళ్లతో కూడుకుని ఉంటాయన్నారు. ఆరోగ్యానికి ప్రాధాన్యతనివ్వాలన్నారు. అనంతరం పోలీస్ దర్బార్ ఏర్పాటు చేసి హోం గార్డుల సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ విజయకుమార్, ఆర్ఐలు మహేష్, వలి, ఆర్ఎస్ఐలు వీరన్న, ప్రదీప్‌సింగ్ పాల్గొన్నారు. -
మామిడి చెట్లు దగ్ధం
రొళ్ల: ఆకతాయిలు నిప్పు రాజేయడంతో మంటలు చెలరేగి మామిడి తోటలో కాపు కాసిన 150 చెట్లు కాలి పోయాయి. రొళ్ల మండలం మల్లసముద్రం గ్రామంలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. మహిళా రైతు గంగమ్మ తనకున్న పొలంలో ఆరేళ్ల క్రితం 200 మొక్కలతో మామిడి తోటను అభివృద్ధి చేశారు. గత రెండేళ్లుగా ఏటా పంట కోతలతో ఆదాయం గడిస్తున్నారు. ప్రస్తుతం పంట బిందె నుంచి కాయ దశలో ఉంది. ఇలాంటి తరుణంలో శుక్రవారం ఉదయం తోటకు సమీపంలోని బయలు భూమిలో ఎండుగడ్డికి ఆకతాయిలు నిప్పు రాజేయడంతో మంటలు చెలరేగి తోటను చుట్టుముట్టాయి. ప్రమాదాన్ని గుర్తించి బిందెలతో నీటిని పోసి మంటలు ఆర్పారు ఈ లోపు 150 మామిడి చెట్లు కాలిపోయాయి. అధికారులు పరిశీలించి, తనకు పరిహారం అందించాలని బాధిత మహిళా రైతు కోరారు. వ్యక్తి బలవన్మరణం అగళి: జీవితంపై విరక్తితో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... అగళి మండలం హళ్లికెర గ్రామానికి చెందిన బసవరాజు (55)కు 27 సంవత్సరాల క్రితం జయమ్మతో వివాహమైంది. వీరికి ఓ కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ముగ్గురు కుమారైలకు పెళ్లి చేసి, అత్తారింటికి పంపారు. కుమారుడు బెంగళూరులో నివాసముంటూ కూలి పనులతో జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో జయమ్మ కూడా బెంగళూరులోనే కుమారుడితో కలసి ఉంటోంది. బసవరాజు అప్పుడప్పుడు కుమారుడి వద్దకు వెళ్లి తిరిగి వచ్చేవాడు. ఇటీవల స్వగ్రామానికి తిరిగి రావాలని పలుమార్లు భార్యకు సూచించాడు. అయినా ఆమెలో మార్పు రాలేదు. దీంతో మనస్తాపం చెందిన బసవరాజు... జీవితంపై విరక్తి పెంచుకుని శుక్రవారం తన పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. మెడికల్ రెప్ ఆత్మహత్య ధర్మవరం రూరల్: మండలంలోని ఓబుళనాయనపల్లి గ్రామానికి చెందిన బాలగాని నరసింహుడు కుమారుడు చక్రవర్తి(32) బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన మేరకు... ఆరేళ్ల క్రితం బుక్కపట్నం మండలం గూనిపల్లికి చెందిన చంద్రకళతో బాలగాని చక్రవర్తికి వివాహమైంది. భార్యతో కలసి బెంగళూరులో నివాసముంటూ మెడికల్ ఏజెన్సీలో రెప్రజెంటిటివ్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. మూడు రోజుల క్రితం గ్రామానికి వచ్చిన చక్రవర్తి కడుపునొప్పితో తీవ్రంగా బాధపడ్డాడు. నొప్పి ఎంతకూ తగ్గకపోవడంతో జీవితంపై విరక్తితో శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం నిద్రలేచిన కుటుంబసభ్యులు ఉరికి విగతజీవిగా వేలాడుతున్న చక్రవర్తిని గమనించి బోరున విలపించారు. సమాచారం అందుకున్న ధర్మవరం రూరల్ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. టీడీపీ కార్యకర్తల దాడి సోమందేపల్లి: ఈదుళబలాపురంలో టీడీపీ కార్యకర్తలు హనుమంతరాయుడు, నరేష్ తదితరులు తమ ఇంటిలోకి చొరబడి దాడి చేశారని జగదీష్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమ ఇంటి వద్ద ఉంచిన గడ్డిని హనుమంతరాయుడు గొర్రెలు తినడంతో తాము ప్రశ్నించామని, దీంతో వారు తమపై గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపాడు. అంతటితో ఆగక అదేరోజు రాత్రి ఉద్దేశపూర్వకంగా తమ ఇంటిలోకి చొరబడి హనుమంతరాయుడు వర్గీయులు దాడి చేయడంతో లక్ష్మీదేవి, నాగార్జునకు గాయాలయ్యాయని శుక్రవారం పోలీసులకిచ్చిన ఫిర్యాదులో జగదీష్ పేర్కొన్నాడు. చోరీ కేసులో ముద్దాయికి మూడేళ్ల జైలు పుట్టపర్తి రూరల్: చోరీ కేసులో ముద్దాయికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ పుట్టపర్తి జేఎఫ్‌సీఎం కోర్టు న్యాయమూర్తి రాకేష్ తీర్పు వెలువరించారు. వివరాలు... ధర్మవరం మండలం ఉప్పునేసినపల్లి గ్రామానికి చెందిన భీమినేని అమర్నాథ్నాయుడు బుక్కపట్నం పీఎం పరిధిలో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడ్డాడు. అతనిపై 2020లో రెండు కేసులు నమోదయ్యాయి. సమగ్ర విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో ముద్దాయి అమర్నాథ్నాయుడుకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.500 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి రాకేష్ తీర్పు వెలువరించారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున వాదనలను ఏపీపీ రాజేంద్రనాథ్ వినిపించారు. ప్రమాదంలో చిన్నారి మృతి పుట్టపర్తి టౌన్: ఆటో బోల్తాపడిన ఘటనలో ఓ చిన్నారి మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు... కొత్తచెరువు మండలం బండ్లపల్లి గ్రామానికి చెందిన వినోద్‌కుమార్, నాగలక్ష్మి దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. శుక్రవారం ఉదయం తమ కుమార్తె రిషిక (9)ను పిలుచుకుని పెనుకొండకు వెళ్లారు. అక్కడ పని ముగించుకుని ఆటోలో తిరుగు ప్రయాణమైన వారు బండ్లపల్లి క్రాస్ వద్ద దిగారు. అదే సమయంలో వేగంగా దూసుకొచ్చిన బొలెరో వాహనం రోడ్డు పక్కన నిలబడిన రిషికను ఢీకొని వెళ్లిపోయింది. ఘటనలో చిన్నారి అక్కడికక్కడే మృతిచెందింది. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ప్రమాద ఘటనపై ఆరా తీశారు. ఘటనపై కేసు నమోదు చేసి, సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. -
No Headline
అన్నింటా ఆమెఆమె శాంతం... ఆమె సహనం... ఆమె రౌద్రం... ఆమె లౌక్యం... అన్నింటా ఆమె... అన్నీ ఆమే! జీవన పోరాటంలో ఎన్ని గాయాలైనా లెక్కచేయదు. నేటి మహిళలు అడుగు మోపని రంగమంటూ లేదు. నైపుణ్యమున్నా ఆర్థిక పరిస్థితులు సహకరించక ఇంటికే పరిమితమైన గ్రామీణ మహిళలు సైతం తర్వాతి క్రమంలో అవకాశాలను అందిపుచ్చుకుని సాధికారతే లక్ష్యంగా సాగుతున్నారు. ‘ఆమె’ అంటే ‘ఆకాశంలో సగం’ అనేవారు ఒకప్పుడు.. కానీ ‘ఆమె’ ఇప్పుడు ‘సగం’ మాత్రమే కాదు.. ‘సర్వం’. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం: -
వేపకుంటలో టీడీపీ కార్యకర్త దాష్టీకం
సాక్షి, టాస్క్‌ఫోర్స్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి రాప్తాడు నియోజకవర్గంలో అరాచక పాలన రాజ్యమేలుతోంది. చిన్నా.. పెద్దా తేడా లేకుండా కార్యకర్తలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రైతులను ఇబ్బందులు పెట్టడం.. పొలాలు ఆక్రమించడం పరిపాటిగా మారింది. తాజాగా కనగానపల్లి మండలం వేపకుంటలో రైతు అశ్వత్థప్పకు చెందిన తోటలో నాలుగు ఎకరాల పంటకు అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త ముత్యాలన్న శుక్రవారం ఉద్దేశపూర్వకంగా నిప్పు పెట్టాడు. ఇరుగు పొరుగు వాళ్లు చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎందుకిలా చేశావంటూ అడగడంతో.. సరదా కోసమని వ్యంగ్యంగా మాట్లాడి తప్పించుకున్నాడు. అంతేకాక వాళ్లతో (బాధిత రైతుతో) ఏం అవుతుందిలే అంటూ రుబాబు చేసినట్లు సమాచారం. దీనిపై బాధిత రైతు అశ్వత్థప్ప గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ చేయగా.. తనకు సంబంధం లేదని బుకాయిస్తూనే ‘నన్నేమీ చేయలేరు. కేసు పెడితే అంతు చూస్తా’ అంటూ బెదిరింపులకు దిగాడు. రూ.లక్ష వరకు నష్టం.. రైతు అశ్వత్థప్ప తనకున్న నాలుగు ఎకరాల పొలంలో ఇటీవల ఆముద పంట సాగుచేశారు. ఇంకా పంట సగంలో ఉన్నందున డ్రిప్ పరికరాలు తీయలేదు. ఈ క్రమంలో శుక్రవారం పట్ట పగలే ముత్యాలు నిప్పు పెట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. చాలా సేపటి తర్వాత ఇంటికి చేరుకున్న అతడిని గ్రామస్తులు నిలదీశారు. ‘ఏం కాదులే.. అవసరమైతే రోజూ నిప్పు పెడుతా. ఎవరేమీ చేసుకోలేరు’ అంటూ మాట్లాడటంతో గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. మంటలు పొలమంతా వ్యాపించడంతో 15 కట్టల డ్రిప్పు లాడర్, 30 పీవీసీ పైపులు, నాలుగు గేట్‌వాల్వ్‌లు, మూడు ఫిల్టర్లు కాలిపోయాయి. సుమారు రూ.లక్షకు పైగా నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు వాపోయారు. పొలంలో చెత్తకు నిప్పు పెట్టి అగ్ని ప్రమాదానికి కారణమైన ముత్యాలుతో పాటు మరో గొర్రెల కాపరిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు బాధిత రైతు ఫిర్యాదు చేశారు. నిందితుడి బెదిరింపులు.. తనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే భవిష్యత్తులో పొలాల్లో పంట పెట్టుకోలేరని, అవసరమైతే రోజూ నిప్పు పెడుతూ ఉంటానని, తనను ఎవరూ ఏమీ చేయలేరని బాధితు రైతు కుటుంబ సభ్యులకు ముత్యాలు ఫోన్ చేసి బెదిరించాడు. ఎవరు నిప్పు పెట్టారో తనకు తెలుసంటూ ఓ పదేళ్ల బాలుడి గురించి ప్రస్తావించాడు. అంతటితో ఆగకుండా తనతో పాటు మరో ముగ్గురు మూల్యం చెల్లించుకోవాల్సిందేనని తన సన్నిహితుల వద్ద చెప్పినట్లు తెలిసింది. ముత్యాలు వైఖరితో గ్రామస్తులు భయబ్రాంతులకు లోనయ్యారు. గతంలో ఎన్నడూ ఇలాంటి విధ్వంసాలను తాము చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పొలంలో వ్యవసాయ పనిముట్లకు నిప్పు దిక్కున్న చోట చెప్పుకోవాలంటూ రుబాబు రూ.లక్షకు పైగా నష్టపోయిన రైతు -
క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యలు పరిష్కరించండి
ప్రశాంతి నిలయం: క్షేత్రస్థాయిలో పర్యటిస్తేనే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని, అందువల్ల ఆర్డీఓలంతా ఆయా ప్రాంతాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించాలని కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్లోని కోర్ట్ చాంబర్లో రెవెన్యూ డివిజనల్ అధికారులతో నియోజకవర్గాల విజన్ ప్రణాళికపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆయా నియోజకవర్గానికి సంబంధించిన విజన్ ప్రణాళికలో రాబోయే ఐదేళ్లలో నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, ఇందుకు ప్రతికూల, సానుకూల అంశాలను ప్రస్తావిస్తూ సమగ్ర నివేదికలు అందజేయాలన్నారు. ఆయా నియోజకవర్గ పరిశ్రమలు స్థాపించేందుకు స్థల సేకరణ వేగవంతం చేయాలని, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో చర్చించి కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. అలాగే జిల్లాలో గిరిజన కాలనీలకు రోడ్డు కనెక్టివిటీ ఉండే విధంగా పనులు చేపట్టాలని ఇందుకు మండలాలు, గ్రామాల వారీగా జాబితా సిద్ధం చేయాలన్నారు. అనంతరం జిల్లాలో సోలార్, వ్యవసాయ, అనుబంధ రంగాలకు, పారిశ్రామిక రంగాల ప్రస్తుత పరిస్థితి, పర్యాటక సర్కూట్ ఏర్పాటుకు సంబంధించిన పీపీటీని ప్రదర్శించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ధర్మవరం, కదిరి, పెనుకొండ ఆర్డీఓలు మహేష్, శర్మ, ఆనంద్‌కుమార్, మడకశిర నియోజకవర్గ ప్రత్యేక అధికారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణరెడ్డి, గ్రామ/వార్డు సచివాలయాల నోడల్ అధికారి సుధాకర్‌రెడ్డి, డీఈఓ కృష్ణప్ప, సీపీఓ విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్లో ‘షీ బాక్స్’ ఏర్పాటుకు చర్యలు.. జిల్లాలోని మహిళా ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని కలెక్టర్ టీఎస్ చేతన్ తెలిపారు. శుక్రవారం ఏపీ జేఏసీ అమరావతి మహిళా విభాగం ఆధ్వర్యంలో పలువురు మహిళా ఉద్యోగులు కలెక్టర్‌ను ఆయన చాంబర్లో కలిశారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టర్‌కు తెలిపారు. కలెక్టరేట్లో ‘షీ బాక్స్’ ఏర్పాటు చేయాలని కోరారు. స్పందించిన కలెక్టర్.. కలెక్టరేట్లోని ఏఓ కార్యాలయం వద్ద ‘షీ బాక్స్’ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం జేఏసీ జిల్లా చైర్మన్ మైనుద్దీన్ మాట్లాడుతూ, మహిళా ఉద్యోగులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను పేపర్‌పై రాసి ‘షీ బాక్స్’లో వేస్తే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం ‘షీ బాక్స్’ను కలెక్టర్‌కు అందజేశారు. కార్యక్రమంలో ఏపీజేఏసీ మహిళా విభాగం జిల్లా చైర్పర్సన్ విజయభారతి, జనరల్ సెక్రెటరీ మధునాయక్, ఏపీఆర్ఎస్ఏ జిల్లా అధ్యక్షులు గీతాంజలి, సెక్రెటరీ సుభాషిణి, డివిజనల్ సెక్రెటరీ రమాదేవి, ప్రభావతి, రమాదేవి, తదితరులు పాల్గొన్నారు. ఆర్డీఓలతో కలెక్టర్ టీఎస్ చేతన్ -
గురుకులాల్లో ప్రవేశాలకు ఆహ్వానం
అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలోని ఏపీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరంలో ఐదో తరగతి ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఏపీఆర్ గురుకుల పాఠశాలల జిల్లా కన్వీనర్ జీఏ విజయలత సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. గుత్తి బాలికల గురుకుల పాఠశాల, నూతిమడుగు బాలుర గురుకుల పాఠశాల, గార్లదిన్నె మైనార్టీ బాలుర పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఐదో తరగతిలో 80 సీట్లు (ఇంగ్లిష్ మీడియం), 6, 7, 8 తరగతుల్లో మిగిలిపోయిన ఖాళీలకు ఈ నెల 31లోపు https://aprs.apcfss.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు అర్హులేనని కన్వీనర్ స్పష్టం చేశారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఏప్రిల్ 25న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. దరఖాస్తు గడుపు పెంపు రొళ్ల: మండల పరిధిలోని దొమ్మరహట్టి వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో (2025–26 విద్యా సంవత్సరం) 5వ తరగతి ప్రవేశానికి దరఖాస్తు గడవును పొడిగించినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ మైలారప్ప తెలిపారు. వాస్తవానికి మార్చి 6వ తేదీ వరకే గడువు ఉండగా... ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈనెల 13వ తేదీ వరకూ పొడిగించినట్లు వెల్లడించారు. పాఠశాలలో 80 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. బీసీ గురుకుల ప్రవేశ పరీక్ష కేంద్రాల పెంపు అనంతపురం ఎడ్యుకేషన్: మహాత్మ జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరానికి గాను ఐదో తరగతి ప్రవేశాలకు నిర్వహించనున్న రాత పరీక్షకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏడు కేంద్రాలను పెంచారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 16 కేంద్రాలు ఉండగా.. దరఖాస్తులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో అదనంగా ఏడు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అనంతపురం జిల్లా కన్వీనర్ జోనాథన్ తెలిపారు. కొత్త పరీక్ష కేంద్రాలు శనివారం నుంచి ఆన్లైన్లో కనిపిస్తాయని పేర్కొన్నారు. అదనంగా పెంచిన కేంద్రాలివే.. ● ప్రభుత్వ బీసీ కళాశాల బాలికల వసతి గృహం, కళ్యాణదుర్గం ● ప్రభుత్వ బీసీ కళాశాల బాలికల వసతి గృహం, శింగనమల (అనంతపురం రామ్‌నగర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ పక్కన) ● ప్రభుత్వ బీసీ కళాశాల బాలుర వసతి గృహం, నార్పల (అనంతపురంలోని కొత్తూరు బాలుర జూనియర్ కళాశాల) ● ప్రభుత్వ బీసీ కళాశాల బాలికల వసతి గృహం, నార్పల (అనంతపురం హౌసింగ్‌బోర్డు మెయిన్ రోడ్డు ఎస్వీఆర్ కేఫ్ పక్కన) ● ప్రభుత్వ బీసీ బాలుర వసతిగృహం, రాయదుర్గం ● ప్రభుత్వ బీసీ కళాశాల బాలికల వసతి గృహం, అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి వెనుక, అరవిందనగర్) ● ప్రభుత్వ బీసీ కళాశాల బాలుర వసతి గృహం, మోడల్ స్కూల్ దగ్గర ధర్మవరం. 15లోపు సప్లి ఫీజు చెల్లించాలి అనంతపురం ఎడ్యుకేషన్: నగరంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో 2016–17 నుంచి 2018–19 విద్యాసంవత్సరాల డిగ్రీ విద్యార్థులకు మెగా సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ పద్మశ్రీ ఓ ప్రకటనలో తెలిపారు. 1 నుంచి 6 సెమిస్టర్ల విద్యార్థులకు ఈ పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. పరీక్ష ఫీజు ఈ నెల 15లోగా చెల్లించాలని సూచించారు. అపరాధ రుసుముతో పరీక్షలు ప్రారంభమయ్యే వరకు ఫీజు చెల్లించవచ్చని స్పష్టం చేశారు. ఎండుమిర్చికి ధరాఘాతం హిందూపురం అర్బన్: ఎండుమిర్చికి మార్కెట్లో డిమాండ్ తగ్గిపోతోంది. ఫలితంగా ధర రోజురోజుకూ పడిపోతోంది. శుక్రవారం స్థానిక వ్యవసాయ మార్కెట్‌కు 84.80 క్వింటాళ్ల ఎండుమిర్చి రాగా, అధికారులు ఈ–నామ్ పద్ధతిలో వేలంపాట నిర్వహించారు. ఇందులో మొదటి రకం ఎండుమిర్చి క్వింటా గరిష్టంగా రూ.12 వేలు, కనిష్టంగా రూ.7 వేలు, సరాసరిన రూ.7,200 మేర ధర పలికింది. గత వారంతో పోలిస్తే క్వింటా గరిష్ట ధరపై ఏకంగా రూ.2,500 తగ్గింది. మార్కెట్‌కు నాణ్యమైన మిర్చి రాకపోవడంతో ధర తగ్గినట్లు కార్యదర్శి చంద్రమౌళి తెలిపారు. -
కష్టాలను దాటి.. ఖాకీ తొడిగి
ఈమె పేరు కె. ఉదయ పావని. శిక్షణలో ఉన్న డీఎస్పీ. ప్రస్తుతం మడకశిర సర్కిల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. విజయనగరం జిల్లాకు చెందిన ఉదయపావని పేద కుటుంబంలో జన్మించారు. తండ్రి నారాయణప్ప అప్పలనాయుడు వ్యవసాయం చేస్తుండగా.. తల్లి భారతి అంగన్వాడీ కార్యకర్త. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే అయినా ఉదయపావని కృషి, పట్టుదలతో చదువుకున్నారు. 1వ తరగతి నుంచి డిగ్రీ వరకూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివారు. తన కలల ‘ఖాకీ’ కొలువుకోసం కంటిమీద నిద్రలేకుండా చదివారు. ఎన్నో కష్టాలు ఎదురైనా వెరవక ముందుకు సాగారు. చివరకు గ్రూప్స్‌లో సత్తా చాటి డీఎస్పీగా ఎంపికయ్యారు. చదువుకు పేదరికం అడ్డుకాదని, కష్టపడి చదివితే ఫలితం ఉంటుందని చెప్పడానికి ఉదయ పావని ఉదాహారణగా నిలిచారు. – మడకశిర రూరల్: -
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం
ఆది యందు ‘ఆమె’ ఉండెను అప్పటి నుంచీ అన్నీ ‘ఆమె’ అయెను... బడిలో, గుడిలో, నారుమడిలో.. ఆమెలేని చోటులేదు.. ఆమెకు సాటి లేదు.. కలం పట్టినా... హలం దున్నినా.. అధికారం చూపినా.. అక్కున చేర్చుకున్నా.. అంతా ఆమె... అన్నింటా ఆమె.. సృష్టి, స్థితి, లయకారులకూ ‘ఆమె’నే ధైర్యం.. ‘ఆమె’కెన్నో రూపాలు.. మనం కూడా ప్రతిరూపాలమే.. ఆమె ఒక ధైర్యం.. ఆ ఆదరణ లేకపోతే అంతా శూన్యం.. ఆమెను దలిస్తే అన్నీ దర్శించినట్టే.. అందుకే ఆమె కోసం ఓ రోజు.. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బతుకుపాఠంలో చెరగని ముద్ర వేసిన మహిళామణుల గురించి ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. ●వివిధ రంగాల్లో మహిళల ప్రతిభ ●పురుషులతో దీటుగా రాణిస్తున్న వైనం బొమ్మలకే అమ్మ.. శివమ్మ ఆమె చేతిలోని బొమ్మ అంతర్జాతీయ ఖ్యాతిని దక్కించుకుంది. తోలుతో చేసిన ఆ బొమ్మకు ప్రాణం పోసి అమ్మ శివమ్మ. ధర్మవరం మండలం నిమ్మల కుంటకు చెందిన తోలుబొమ్మల కళాకారిణి శివమ్మ జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. ఏడు పదుల వయస్సులోనూ కళపై ఆమెకున్న మమకారం అచంచలం. అందుకే ఆదరణ కోల్పోయిన తోలుబొమ్మలతో నూతన అడుగులు వేస్తోంది. ఎంతో అందమైన చిత్రాలను తయారు చేస్తూ అబ్బుర పరుస్తోంది. విశ్వరూప హనుమాన్, రామాయణ, సుందరకాండ ఘట్టాలు, శ్రీకృష్ణలీలలు తదితర చిత్రాలను వినూత్నమైన డిజైన్లలో తోలుబొమ్మలను తయారు చేస్తోంది. అంతేకాక ల్యాంప్ సెట్లు, డోర్ హ్యాంగర్స్, తోలుబొమ్మలను మన దేశంలోని వివిధ దేశాలకూ ఎగుమతి చేస్తోంది. శివమ్మ ప్రతిభను గుర్తించి కేంద్ర ప్రభుత్వం 2019లో జాతీయ అవార్డు, గత ఏడాది ‘శిల్పగురు’ జాతీయ అవార్డుతో సత్కరించింది. ఈ ఏడాది పరంపరాగత్ అవార్డును కేంద్ర ప్రభుత్వం నుంచి అందుకుంది. కృషి, పట్టుదల ఉంటే మహిళలు సాధించలేనిది ఏదీ లేదని నిరూపిస్తోంది శివమ్మ. – ధర్మవరం: -
క్వాలిటీ కంట్రోల్.. వసూళ్లు ఫుల్!
పంచాయతీరాజ్ శాఖ క్వాలిటీ కంట్రోల్ విభాగంపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ‘క్యాష్’ కొడితే గానీ క్వాలిటీ కంట్రోల్ రిపోర్ట్ (ధ్రువీకరణ పత్రం) ఇవ్వడం లేదని పలువురు కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిల్లులు ఒక శాతం, ఇతర లోపాలు ఏమైనా ఉంటే అదనంగా మరింత అదనంగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. కమీషన్లు ఇచ్చుకోలేక కాంట్రాక్టర్లు నలిగిపోతున్నారు. ● పంచాయతీరాజ్ క్వాలిటీ కంట్రోల్ విభాగంలో వసూళ్ల పర్వం ● టార్గెట్లు విధించి మరీ లాగుతున్న ఓ డీఈ స్థాయి అధికారి ● గగ్గోలు పెడుతున్న కాంట్రాక్టర్లు అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి క్వాలిటీ కంట్రోల్ పరంగా నాలుగు సబ్ డివిజన్లు ఉన్నాయి. వీటిలో ప్రతి డివిజన్‌కు ఒక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(డీఈఈ), ముగ్గురు లేదా నలుగురు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు(ఏఈఈ)లు ఉంటారు. వీరందరిపై ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఈఈ) ఉన్నారు. రోడ్డు గానీ, భవనాలు గానీ నిర్మించాక.. ప్రభుత్వ నిబంధనల మేరకు నాణ్యతాప్రమాణాలు పాటించారా లేదా అని క్వాలిటీ కంట్రోల్ అధికారులు తనిఖీ చేస్తారు. నిర్దేశిత నిష్పత్తి మేరకు సిమెంట్, ఇసుక తదితరాలు వాడారా లేదా పరిశీలించి రిపోర్ట్ ఇస్తారు. రూ.30 లక్షల్లోపు బిల్లులు అయితే డీఈఈ స్థాయి, అంతకన్నా ఎక్కువైతే ఈఈ స్థాయిలో క్యూసీ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని బట్టి కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు ఉంటుంది. యథేచ్ఛగా వసూళ్లు.. అయితే, క్యూసీ(క్వాలిటీ కంట్రోల్ రిపోర్ట్)ల మంజూరు మాటున కొందరు అధికారులు యథేచ్ఛగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక బిల్డింగ్ లేదా రోడ్డు నిర్మాణానికి రూ.40 లక్షలు మంజూరు చేస్తే.. అందుకు ఒక శాతం అంటే రూ.40 వేలు కమీషన్ ఇచ్చుకోవాల్సిందేనని సమాచారం. దీంతో కొందరు కాంట్రాక్టర్లు రిపోర్ట్ తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. ‘క్యూసీ’ సమర్పిస్తే ఎంత బిల్లు వస్తుందో అంతకంటే ఎక్కువ నష్టపోయినా పర్వాలేదంటున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బరితెగించిన డీఈఈ.. కూటమి ప్రభుత్వం వచ్చాక బదిలీపై వచ్చిన ఓ డీఈఈ బరితెగించినట్లు తెలుస్తోంది. ప్రజాప్రతినిధులతో పరిచయాలున్నాయని చెబుతూ అందిన కాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. టార్గెట్లు విధించి మరీ కమీషన్లు వసూలు చేసి ఇవ్వాలని తన కింది స్థాయి సహాయ ఇంజినీర్లకు పట్టుబడుతున్నట్లు శాఖలో చర్చ జరుగుతోంది. మరి కొందరు ఉద్యోగులపైనా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పనులను చెక్ చేసేందుకు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లాలంటే వాహనాలు ఏర్పాటు చేయడంతో పాటు సకల సౌకర్యాలు కల్పించాల్సి వస్తోందని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. ఇక.. క్వాలిటీ కంట్రోల్ విభాగంలో కొందరు ఇష్టారాజ్యంగా విధులకు డుమ్మా కొడుతున్నట్లు తెలిసింది. పర్యవేక్షణ కరువవడంతోనే ఇలా తయారయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటా నా దృష్టికి రాలేదు. కమీషన్ కోసం వేధించే అధికారుల గురించి బాధిత కాంట్రాక్టర్లు ఎవరైనా రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే పరిశీలించి తగు చర్యలు తీసుకుంటా. – మల్లికార్జున మూర్తి, ఈఈ -
సవాళ్లు అధిగమిస్తేనే మహిళా సాధికారత
పుట్టపర్తి టౌన్: సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని అధిగమిస్తేనే మహిళా సాధికారత సాధ్యమవుతుందని ఎస్పీ రత్న అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం సాయి ఆరామంలో డీఎస్పీ విజయకుమార్ ఆధ్వర్యంలో ‘మహిళా సాధికారత –సవాళ్లు–పరిష్కారాలు’ అనే అంశంపై వర్క్‌షాప్ నిర్వహించారు. ఎస్పీ రత్న ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన ఐదుగురు మహిళలను ఎస్పీ రత్న శాలువలతో సత్కరించి మెమొంటోలు అందజేశారు. అనంతరం 59 మంది నిరుపేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఎస్పీ రత్న మాట్లాడుతూ మహిళలు తమని తాము నిరూపించుకోవాలని ఎప్పుడైతే ప్రయత్నిస్తారో అప్పుడే అనేక ఆటంకాలు ఎదురవుతాయన్నారు. వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని వెల్లడించారు. మహిళలు, చిన్నారుల రక్షణకు అత్యవసర సమాయాల్లో సహాయం కోసం చైల్డ్ హెల్ప్‌లైన్ నంబర్ 1098, ఉమెన్ హెల్ప్‌లైన్ నంబర్ 181, పోలీస్ హెల్ప్‌లైన్ నంబర్ 100, 112, సైబర్ క్రైమ్‌కు 1930 కాల్ చేసి సహాయం పొందవచ్చన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు విజయకుమార్, ఆదినారాయణ, ఆర్టీడీ రీజనల్ డైరెక్టర్ ప్రమీలా కుమారి, రెడ్స్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి భానూజ, సింగర్ సరళ, సీడీపీఓ గాయత్రి, సీఐలు సునీత, ఇందిర, ఎస్ఐలు లింగన్న, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
కూటమి ప్రభుత్వం వైద్య రంగాన్ని నిర్వీర్యం చేస్తోంది. పేదలకు ఉచితంగా ఆరోగ్య సేవలు అందించే ఆరోగ్య శ్రీ పథకాన్ని అటకెక్కించే యత్నం జరుగుతూనే ఉంది. అలాగే ప్రభుత్వాస్పత్రుల్లో ఉచితంగా కంటి పరీక్షలు చేసి.. కళ్లజోడు అందజేసే ముఖ్యమంత్రి ఐ–కేర్ పథకానికి మంగళం పాడ
సాక్షి, పుట్టపర్తి: ప్రభుత్వ వైద్యసేవలపై కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోంది. పేదలకు మంచి చేసే కార్యక్రమాలకు గండి కొడుతోంది. చాలా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు కూడా సక్రమంగా లేని పరిస్థితి నెలకొంది. దీనికితోడు వైద్య సిబ్బంది లేక రోగులు అవస్థలు పడుతున్నారు. ఈ–ఐ కేర్ కేంద్రాలు ఎత్తేయడంతో పేదలు వైద్యసేవలకు దూరమయ్యారు. ‘ఈ–ఐ కేర్’ సేవలకు మంగళం.. జిల్లాలోని పెనుకొండ, ధర్మవరం, మడకశిర, చెన్నేకొత్తపల్లి, నల్లమాడలో కంటి పరీక్ష కేంద్రాలు ఉండేవి. 2018లో ఎన్నికల ముందు ప్రారంభించిన చంద్రబాబు.. మళ్లీ ఆయనే అధికారం చేపట్టిన తర్వాత వ్యవస్థను రద్దు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా 115 కేంద్రాలు మూతపడ్డాయి. దీంతో సుమారు 200 మంది ఉపాధి కోల్పోయారు. జిల్లాలోని ఐదు కేంద్రాల్లో రోజుకు సగటున 200 మందికి కంటి పరీక్షలు చేసేవారు. ఉద్యోగుల రోడ్డు పాలు.. రాష్ట్ర వ్యాప్తంగా 115 కేంద్రాల్లో జనాభా ఆధారంగా ఒక్కో ఈ–ఐ కేర్ కేంద్రంలో ఒకరు లేదా ఇద్దరు చొప్పున పని చేసేవారు. ప్రతి నెలా ఒక్కొక్కరికి రూ.18 వేలు చొప్పున వేతనం ఇచ్చేవారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఈ–ఐ కేంద్రాలు మూతపడటంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 200 మంది ఉపాధి కోల్పోయారు. అదేవిధంగా లక్షల మంది ఉచిత కంటి పరీక్షలు దూరమయ్యారు. అదేవిధంగా ఎంపీహెచ్ఏలను ఉన్నఫలంగా తొలగించడంతో చాలా మంది కుటుంబ భారం మోయలేక ... ఉద్యోగం కోసం విజయవాడ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఇందులో ఉమ్మడి అనంతపురం జిల్లాలకు చెందిన 58 మంది ఉన్నారు. పట్టించుకోని ఆరోగ్యశాఖామంత్రి.. ప్రభుత్వ వైద్య సేవలను బలోపేతం చేస్తామని ౖపైపెకి చెబుతున్నా కూటమి సర్కార్ చర్యలు మాత్రం దానికి భిన్నంగా ఉన్నాయి. ఎంపీహెచ్‌ఏల తొలగింపు, ఆరోగ్యశ్రీపై సేవలు ఎత్తివేత దిశగా చర్యలు, ఈ–ఐ కేంద్రాల మూత నిర్ణయాలు దానికి బలాన్నిస్తున్నాయి. అయితే జిల్లాకు చెందిన ఎమ్మెల్యేనే వైద్యశాఖ మంత్రిగా ఉన్నా ఎలాంటి ఉపయోగం లేకపోయిందని , తామంతా రోడ్డున పడ్డామని ఎంపీహెచ్ఏలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వైఎస్సార్సీపీ మండలిలో డిమాండ్ చేసినా కూటమి ప్రభుత్వం మాత్రం నోరు విప్పలేదు. రద్దు చేయడం బాధాకరం ఐదేళ్ల పాటు ఉచిత సేవలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి ఈ–ఐ కేంద్రాలు రద్దు చేయడం బాధాకరం. పరీక్షలు చేయించుకోవడానికి వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వంలో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అద్దాలను అందజేశారు. – వెంకటేష్, మడకశిర లక్షల మంది పేదలకు ఉపయోగపడే కంటి పరీక్ష కేంద్రాలను రద్దు చేయడం దారుణం. రాష్ట్ర వ్యాప్తంగా వందల మంది ఉపాధి కోల్పోవడంతో పాటు రోజూ సగటున సుమారు 50 వేల మందికి రాష్ట్ర వ్యాప్తంగా కంటి పరీక్షలు నిర్వహించేవారు. అంతమంది పేదలు ఇక నుంచి ప్రైవేటు ఆస్పత్రుల బాట పట్టాల్సిన దుస్థితి. చంద్రబాబు తీరు మార్చుకోవాలి. – గోపాల్, పెనుకొండ ఇప్పటికే ముఖ్యమంత్రి ఐ కేర్ ఎత్తివేత మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ల తొలగింపు ‘ఆరోగ్యశ్రీ’ పథకం అమలు అంతంత మాత్రమే ప్రభుత్వ తీరుపై సర్వత్రా విమర్శలు -
క్వింటా చింతపండు రూ.31 వేలు
హిందూపురం అర్బన్: చింతపండు ధర మార్కెట్లో నిలకడగా కొనసాగుతోంది. స్థానిక వ్యవసాయ మార్కెట్‌కు గురువారం 1,214.70 క్వింటాళ్ల చింతపండు రాగా, అధికారులు ఈ–నామ్ పద్ధతిలో వేలం పాట నిర్వహించారు. ఇందులో కరిపులి రకం చింతపండు క్వింటా గరిష్టంగా రూ.31 వేలు, కనిష్టంగా రూ.8,100, సగటున రూ.18 వేల ప్రకారం ధర పలికింది. ఇక ప్లవర్ రకం చింతపండు క్వింటా గరిష్టంగా రూ. 12 వేలు, కనిష్టంగా రూ.4,200, సగటున రూ. 6,500 ప్రకారం క్రయవిక్రయాలు సాగినట్లు మార్కెట్ కార్యదర్శి జి. చంద్రమౌళి తెలిపారు. ఏపీఆర్‌ఎస్‌లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం పరిగి: మండలంలోని కొడిగెనహళ్లిలో ఉన్న ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ బాలుర పాఠశాలలో (ఏపీఆర్‌ఎస్‌ఓఈ) ప్రవేశానికి 2025–26 విద్యా సంవత్సరానికి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విద్యా సంస్థల జిల్లా కన్వీనర్, ప్రిన్సిపల్ ఎన్వీ మురళీధర్‌బాబు ఓ ప్రకటనలో తెలిపారు. ఈమేరకు గురువారం స్థానిక పాఠశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. పాఠశాలలో 5వ తరగతిలో ప్రవేశానికి ఉన్న 80 సీట్లకుగాను రాయలసీమలోని ఉమ్మడి నాలుగు జిల్లాలతో పాటూ నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న బాలురు మాత్రమే ఇందుకు అర్హులన్నారు. ఏపీఆర్ఎస్ క్యాట్ (ఏపీఆర్ఎస్ సీఏటీ) అర్హత పరీక్ష ద్వారా ప్రవేశం పొందవచ్చన్నారు. అర్హులైన విద్యార్థులు https://aprs.apcfss.in అనే వెబ్సైట్లో వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 31 వరకూ గడువు విధించామన్నారు. అదేవిధంగా ఏప్రిల్ 25న జరిగే ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన వారి మార్కుల ప్రతిభ ఆధారంగా ప్రవేశాన్ని కల్పిస్తున్నట్లు వివరించారు. మరిన్ని వివరాలకు 87126 25065 సెల్ నంబరును సంప్రదించాలన్నారు. అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలి ప్రశాంతి నిలయం: రెవెన్యూ సదస్సుల్లో ప్రజలు అందజేసిన అర్జీలతో పాటు పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ సూచించారు. గురువారం స్థానిక కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో అర్జీల పరిష్కారం, వెబ్‌ల్యాండ్ పెండింగ్ ఫైల్స్‌పై ఆర్డీఓలు, తహసీల్దార్లు, మండల సర్వేయర్లతో ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల జరిగిన రెవెన్యూ సదస్సులు, పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలను మార్చి 15లోపు పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి అర్జీని రిజిస్టర్లో తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణరెడ్డి, పలువురు అధికారుల పాల్గొన్నారు. నీటితొట్టెలో పడి చిన్నారి మృతి ఓడీచెరువు: నీటి తొట్టెలో పడి చిన్నారి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని వేమారెడ్డిపల్లిలో గురువారం చోటు చేసుకుంది. వేమారెడ్డిపల్లికి చెందిన గంగరాజు, రాధిక భార్యభర్తలు. వారికి బాలిక (5)తో పాటు బాలుడు ద్వారక (4) ఉన్నారు. దంపతులిద్దరూ పనుల నిమిత్తం పొరుగు గ్రామానికి వెళ్లారు. నానమ్మ, తాత వద్ద పిల్లలు ఉన్నారు. అయితే బాలుడు ఆడుకుంటూ ఇంటి వెనుక పశువుల పాకలో ఏర్పాటు చేసిన నీటితొట్టెలో పడిపోయాడు. చుట్టు పక్కలవారు గట్టిగా కేకలు వేయడంతో ఆ బాలుడిని తొట్టెనుంచి బయటకు తీశారు. వెంటనే కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే ద్వారక చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఎస్ఐ మల్లికార్జునరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
బెణికల్లులో ‘బెల్టు’ చిచ్చు
సాక్షి, టాస్క్‌ఫోర్స్: ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో ‘బెల్టు షాపు’ చిచ్చును టీడీపీ నేతలు రాజేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక ‘వీధికోటి... సందుకోటి’ చొప్పున బెల్టుషాపులు వెలిశాయి. తమ అనునూయులకు ఆదాయం చేకూర్చడమే లక్ష్యంగా కూటమి నేతలు గ్రామాల్లో బెల్టుషాపులు పెట్టించారు. ఈ నేపథ్యంలో ‘బెల్టు షాపు’ నిర్వహణ అంశంలో స్థానిక టీడీపీ నేత తీసుకెళ్లిన ఒత్తిడి ఆ గ్రామంలో ఉద్రిక్తతకు దారి తీసింది. న్యాయ పోరాటానికి సిద్ధమైన బాధితుడు కణేకల్లు మండలం బెణికల్లులో టీడీపీ నేత, మాజీ ఎంపీటీసీ ఎర్రిస్వామి తమ పార్టీ కార్యకర్త జీవనోపాధి కోసం బెల్టుషాపు పెట్టించాడు. గత పది రోజులుగా బెల్టు షాపు ద్వారా ఆశించిన మేర వ్యాపారం జరగలేదు. ఈ విషయాన్ని టీడీపీ కార్యకర్త ఎర్రిస్వామి దృష్టికి తీసుకెళ్లడంతో గ్రామానికి చెందిన వన్నూరుస్వామి ఎన్డీపీఎల్ (నాన్ డ్యూటీఫైడ్ లిక్కర్) అమ్మడం వల్లే బెల్టు షాపులో అమ్మకాలు తగ్గాయని, వెంటనే వన్నూరు స్వామిని అరెస్ట్ చేయాలంటూ ఎకై ్సజ్ సీఐ ఉమాబాయిపై ఒత్తిళ్లు తీసుకెళ్లాడు. దీంతో తన సిబ్బందితో కలసి ఎకై ్సజ్ సీఐ ఉమాబాయి బుధవారం సాయంత్రం వన్నూరుస్వామి ఇంట్లో తనిఖీలు చేపట్టారు. అక్కడ ఎలాంటి మద్యం దొరకలేదు. ఇదే విషయాన్ని సదరు టీడీపీ నేతకు ఆమె ఫోన్ చేసి తెలిపారు. అయితే ఎలాగైనా వన్నూరుస్వామిపై కేసు బనాయించి గ్రామంలో బెల్టుషాపు సజావుగా జరిగేలా చూడాల్సిందేనంటూ ఆయన హుకుం జారీ చేయడంతో రాత్రికి రాత్రి వన్నూరు స్వామిని స్టేషన్‌కు తరలించి చితకబాది తాను కర్ణాటక మద్యం అమ్ముతున్నట్లు ఒప్పించేలా చేశారు. ఈ మొత్తం వ్యవహారం ఎందుకు చేయాల్సి వచ్చిందో కాసేపటి తర్వాత వన్నూరుస్వామి కుటుంబసభ్యులకు ఓ అధికారి తెలిపారు. దీంతో అదే రోజు రాత్రి గ్రామానికి చేరుకున్న వన్పూరుస్వామి కుటుంబసభ్యులు నేరుగా ఇంటికెళ్లి తప్పుడు కేసు ఎందుకు పెట్టించావంటూ నిలదీశారు. ఆ సమయంలో ఎర్రిస్వామి రెచ్చిపోవడమే కాక తన వర్గీయులతో దాడులకు తెగబడ్డాడు. అంతటితో ఆగకుండా తనపై వన్నూరుస్వామి, ఆయన తండ్రి మల్లికార్జున, తల్లి లింగమ్మ, కుటుంబసభ్యులు అనిత, భూలక్ష్మి, చిన్న వండ్రయ్య దాడి చేశారంటూ ఫిర్యాదు చేయడంతో ఆ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చావుదెబ్బలు తిన్న తల్లి లింగమ్మ ఫిర్యాదను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. ఘటనపై వన్నూరు స్వామి మాట్లాడుతూ... తనను స్టేషన్‌కు తీసుకెళ్లి కొట్టి కర్ణాటక మద్యం అమ్ముతున్నట్లు అక్రమంగా కేసు నమోదు చేశారని, అంతేకాక తన కుటుంబసభ్యులపై దాడి చేసి చితకబాదారని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై న్యాయపోరాటం సాగిస్తానని పేర్కొన్నారు. గ్రామంలో ఇరువర్గాల ఘర్షణ.. ఏకపక్ష దాడులతో ఉద్రిక్తత -
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
పెనుకొండ: బెంగళూరుకు చెందిన శివకుమార్, కార్తీక్ బుధవారం రాత్రి చిక్కబళ్లాపురం వైపుగా కారులో వెళుతుండగా పులేకమ్మ గుడి సమీపంలో 44వ జాతీయ రహదారిపై వాహనం మొరాయించడంతో రోడ్డు పక్కన ఆపేశారు. అర్ధరాత్రి కావడంతో ఆ మార్గంలో వెళుతున్న వాహనదారులను ఆపి లిఫ్ట్ అడిగే ప్రయత్నం చేశారు. అదే సమయంలో అటుగా వచ్చిన ద్విచక్ర వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తుండగా వాహనదారుడు నియంత్రణ కోల్పోయి శివకుమార్, కార్తీక్‌ను ఢీకొన్నాడు. ద్విచక్ర వాహనంపై ముగ్గురు ప్రయాణిస్తుండగా ఆఖరున కూర్చొన్న యువకుడు కిందపడి డివైడర్‌ను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడిని సోమందేపల్లికి చెందిన మనోజ్ (22)గా గుర్తించారు. తన స్నేహితులు ప్రేమ్, అర్షద్‌తో కలసి ద్విచక్ర వాహనంపై పెనుకొండ వైపు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రేమ్, శివకుమార్, కార్తీక్, అర్షద్‌ను అటుగా వెళుతున్న వారు పెనుకొండలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉన్న ప్రేమ్‌ను కర్నూలుకు రెఫర్ చేశారు. ఘటనపై పెనుకొండ ఎస్ఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా, మనోజ్ పుట్టిన రోజే ప్రమాదంలో మృతిచెందడంతో కుటుంబసభ్యుల రోదనలకు అంతులేకుండా పోయింది. ● పెనుకొండ రూరల్: కర్ణాటకలోని పావగడ తాలూకా కడుమలకుంట గ్రామానికి చెందిన లక్ష్మీదేవి (33), నాగేంద్ర దంపతులు గురువారం ఉదయం తమ కుమార్తె మహితతో కలసి ద్విచక్ర వాహనంపై కనగానపల్లి మండలం దాదులూరు వద్ద వెలసిన పోతలప్ప స్వామి ఆలయానికి వెళ్లారు. పూజలు ముగించుకున్న అనంతరం తిరుగు ప్రయాణమైన వారు గుట్టూరు శివారులోకి చేరుకోగానే బెంగళూరుకు వెళుతున్న కారు వెనుక నుంచి వేగంగా ఢీకొంది. ఘటనలో నాగేంద్రమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. స్వల్ప గాయాలతో నాగేంద్ర బయటపడ్డాడు. ఘటనపై కియా పోలీసులు కేసు నమోదు చేశారు. పెనుకొండ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై చోటు చేసుకున్న వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. వీరిలో ఒకరు కర్ణాటక ప్రాంతానికి చెందిన మహిళ కాగా, మరొకరు సోమందేపల్లికి చెందిన యువకుడు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తుండగా చోటు చేసుకున్న ప్రమాదాల్లో వారు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాలు... -
అన్యాయాలకు తావులేకుండా బదిలీల చట్టాన్ని రూపొందించాలి
ఎన్పీకుంట: ఏ ఒక్క ఉపాధ్యాయుడికీ అన్యాయం జరగకుండా బదిలీల చట్టానికి రూపకల్పన చేయాలని ప్రభుత్వాన్ని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు హరిప్రసాదరెడ్డి డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల బదిలీ ముసాయిదా చట్టంపై స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. బోధనకు ఆటంకం లేకుండా వేసవిలో మాత్రమే బదిలీలు నిర్వహించేలా ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడం మంచి పరిణామమన్నారు. మేధావులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల సలహాలు, సూచనలు స్వీకరించి వాటికి అనుగుణంగా అందరికీ ఆమోదయోగ్యమైన చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఖాళీలను బ్లాక్ చేయకుండా బదిలీల సమయంలో అన్ని వెకెన్సీలను చూపాలన్నారు. సీనియర్, జూనియర్ అనే బేధం లేకుండా రీఅపోర్సన్ పాయింట్లు ఇవ్వాలన్నారు. రీ అపోర్సన్ అయ్యే స్కూల్ అసిస్టెంట్లకు అదనపు ప్రాధాన్యత ఉండేలా చూడాలన్నారు. ఏదైన పనిస్మెంట్కు గురైన వారికి పాయింట్స్ తగ్గింపు విషయాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మురళి, సందీప్, గోవర్ధన్, షఫీ, రమణయ్య, రామ్మోహన్ తదితరులు ఉన్నారు. బావిలో పడి యువకుడి మృతి గుడిబండ: ప్రమాదవ శాత్తు వ్యవసాయ బావిలో పడి ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... గుడిబండలోని రాజు కాలనీకి చెందిన పార్వతమ్మ, క్రిష్టప్ప దంపతుల కుమారుడు భోజరాజు (23) గురువారం ఉదయం బహిర్భూమికని వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు గాలింపు చేపట్టినా ఆచూకీ లభ్యం కాలేదు. సాయంత్రం వ్వవసాయ బావి వద్దకు వెళ్లిన క్రిష్టప్పకు అక్కడ బావి వద్ద భోజరాజు చెప్పులు కనిపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మోటార్ ద్వారా నీటిని తోడేసి భోజరాజు మృతదేహాన్ని వెలికి తీశారు. ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడి మృతి చెందినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. తండ్రి క్రిష్టప్ప ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మాట్లాడుతున్న ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు హరిప్రసాదరెడ్డి -
పేరూరు డ్యాంకు నీళ్లివ్వాలి
రాప్తాడు రూరల్: శ్రీశైలంలో కృష్జజలాలు పుష్కలంగా ఉన్న నేపథ్యంలో రానున్న రోజుల్లో పేరూరు డ్యాంకు నీళ్లిచ్చేలా స్థానిక ఎమ్మెల్యే పరిటాల సునీత చొరవ తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. త్వరలో హంద్రీ–నీవా కాలువకు నీటి సరఫరా నిలిపేస్తున్నట్లు అధికారులు చెబుతున్న నేపథ్యంలో గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. శ్రీశైలం డ్యాంలో 70 టీఎంసీల నీటి నిలువ ఉందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు రోజూ అర టీఎంసీ చొప్పున నీటిని వినియోగిస్తున్నాయని, ఈ లెక్కన 140 రోజుల వరకు నీరు అందే అవకాశం ఉంటుందన్నారు. ఈలోపు పేరూరు డ్యాంకు నీళ్లు నింపేందుకు అన్ని అవకాశాలూ ఉన్నాయన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ను పరిటాల సునీత కలిసినా పేరూరు డ్యాంకు నీళ్లు ఇవ్వాలని అడగక పోవడం బాధాకరమన్నారు. అప్పట్లో వరుసగా మూడేళ్లు నింపాం.. వైఎస్ జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరుసగా మూడేళ్లు పేరూరు డ్యాంను నీటితో నింపినట్లు ప్రకాష్‌రెడ్డి గుర్తు చేశారు. డ్యాంలో నీళ్లు లేకపోతే రాబోయే ఎండాకాలంలో నియోజకవర్గంలో వందలాది గ్రామాలు కనీసం తాగునీటికి కూడా తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటాయన్నారు. భూగర్భజలాలు పూర్తిగా అడుగంటిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. పేరూరు డ్యాంను నీటితో నింపడం ద్వారా రామగిరి, కనగానపల్లి, రాప్తాడు, ఆత్మకూరు మండలాల్లో భూగర్భజలాలు పెరిగి, 10 వేల ఎకరాల్లో పంటల సాగు అందుబాటులోకి వస్తుందన్నారు. రొద్దం మండలం తురలాపట్నం వంకలో నీళ్లు వదిలితే నేరుగా డ్యాంకు చేరుకుంటాయన్నారు. దీనికి కరెంటు ఖర్చు తప్ప ఇతర ఖర్చులేమీ ఉండవన్నారు. ఇంత చిన్న అంశాన్ని పరిటాల సునీత ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. డిమాండ్ రాగానే గేట్లు తొలిగించారు.. పేరూరు డ్యాంకు నీళ్లు ఇవ్వాలనే డిమాండ్ రైతుల నుంచి మొదలవగానే మరమ్మతుల పేరుతో ఉన్న గేట్లను తొలిగించడం దారుణమన్నారు. రైతులపై కక్ష తీర్చుకునేలా డ్యాంలో ఉన్న కొద్దిపాటి నీటిని కూడా పరిటాల సునీత వైఖరి కారణంగా దిగువకు వృధాగా పారాయన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 40 టీఎంసీల నీటి ప్రవాహ సామర్థ్యంతో హంద్రీ–నీవా కాలువను తెచ్చారని, వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ కాలువను 83 టీఎంసీల నీటి ప్రవాహ సామర్థ్యానికి పెంచారని గుర్తు చేశారు. పీఏబీఆర్ నుంచి రూ. 90 కోట్లతో మంచినీటి పైపులైను ఏర్పాటు చేశారన్నారు. జీడిపల్లి అప్పర్ పెన్నార్ లిఫ్ట్ ఇరిగినేషన్ స్కీమ్‌కు రూ.170 కోట్ల నిధులిచ్చారన్నారు. అయితే టీడీపీ హయాంలో చేసిందేమీలేదని, రూపాయి ఖర్చు లేకుండా నీళ్లిచ్చే అంశాన్ని సైతం ఎమ్మెల్యే సునీత నిర్లక్ష్యం చేస్తుండడం గమనిస్తే నియోజకవర్గ రైతులు, ప్రజల సంక్షేమం పట్టలేదనేది అర్థమవుతోందన్నారు. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి -
చిత్తడి నేలలు పరిరక్షించుకోవాలి
ప్రశాంతి నిలయం: చిత్తడి నేలలు పరిరక్షించుకోవాలని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్‌హాల్ లో చిత్తడి భుముల పరిరక్షణ, నిర్వహణ అన్న అంశాలపై కలెక్టర్ అధ్యక్షతన జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మండలాల వారీగా చిత్తడి నేలల డేటాను సేకరించి నివేదిక ఇవ్వాలని డీఎఫ్ఓను ఆదేశించారు. మండలస్థాయి కమిటీలు ఏర్పాటు చేసి కమిటీ సభ్యులుగా తహసీల్దార్లు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, నీటిపారుదలశాఖ ఇంజనీర్, ఈఓఆర్డీ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. జేసీ అభిషేక్ కుమార్, జిల్లా అటవీ అధికారి చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. మెరుగైన వైద్య సేవలందించాలి తాడిమర్రి: ప్రభుత్వాస్పత్రికి వైద్యం కోసం వచ్చే గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్ఓ ఫైరోజా బేగం వైద్యాధికారులకు ఆదేశించారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కాన్పుల గది, ల్యాబ్, మందుల గది, ఓపీ తదితర గదులను పరిశీలించి, రికార్డులను పరిశీలించారు. ఏడాది వయసులోపు చిన్నారులు, బాలింతల మరణాల గురించి ఆరాతీశారు. అలాగే గర్భిణీలు ప్రసవం కోసం 108 వాహనాన్ని వినియోగించుకుంటున్నారా, ప్రసవానికి ప్రభుత్వా ఆస్పత్రికి వస్తున్నారా లేదా అని విచారించారు. ప్రభుత్వాస్పత్రులకు వచ్చేవారు చాలామంది పేద కుటుంబాలకు చెందిన వారని, వారిని ప్రేమతో పలకరించి వైద్య సేవలు అందిస్తే సంతోషిస్తారన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారులు హరిత, గోవర్ధన్‌నాయుడు, హెల్త్ సూపర్వైజర్ రాంకుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఎరువులను ఎమ్మార్పీకే విక్రయించాలి
ధర్మవరం రూరల్: ప్రభుత్వం నిర్ధేశించిన ధరలకే ఎరువులను, పురుగు మందులను విక్రయించాలని ఎరువుల దుకాణదారులకు జిల్లా వ్యవసాయాధికారి వైవీ సుబ్బారావు సూచించారు. గురువారం ధర్మవరం వ్యవసాయ సబ్ డివిజన్లోని ఎరువులు, పురుగు మందులు, విత్తనాల డీలర్లతో స్థానిక ఎన్జీఓ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. వైవీ సుబ్బారావు మాట్లాడుతూ నిర్ధేశించిన ధరలకే ఎరువులను విక్రయించి రైతులకు తప్పనిసరిగా రసీదులను ఇవ్వాలన్నారు. స్టాక్ బోర్డు, ధరల పట్టికలు ప్రదర్శించాలన్నారు. అలాగే రైతులకు అవసరమైన మేరకు మాత్రమే పురుగు మందులను విక్రయించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వనరుల కేంద్రం ఏడీఏ సనావుల్లా, సహాయ వ్యవసాయ సంచాలకులు కృష్ణయ్య, ఏఓలు ముస్తఫా, ఉదయ్‌కుమార్, ఓబిరెడ్డి, రమాదేవి, కృష్ణకుమారి, కవిత, ఆత్మ బీటిఎం ప్రతిభా, సబ్ డివిజన్లోని పురుగుమందుల డీలర్లు తదితరులు పాల్గొన్నారు. -
లేగ దూడ దవడకు శస్త్రచికిత్స
అనంతపురం అగ్రికల్చర్: మూగజీవాలకు పశు సంవర్ధకశాఖ ఏడీలు, డాక్టర్లు అరుదైన శస్త్రచికిత్సలు చేస్తూ రైతుల మన్ననలు పొందుతున్నారు. తాజాగా విరిగిపోయిన లేగదూడ దవడకు శస్త్రచికిత్స చేశారు. వివరాలు.. గార్లదిన్నె మండలం తలకాసులపల్లి గ్రామం వడ్డే నరేష్‌కు చెందిన పాడి ఆవు మూడు రోజుల కింద కోడేదూడను ఈనింది. దూడ ఆరోగ్యంగా ఉన్నా కింది దవడ ఎముక విరిగిపోవడంతో వేలాడసాగింది. దవడ నొప్పి వల్ల పాలు తాగలేక రోజురోజుకూ నీరసిస్తున్న దూడను గమనించి స్థానిక పశువైద్యాధికారి శింగనమల పశువైద్యశాల ఏడీ డాక్టర్ జి.పద్మనాభానికి రెఫర్ చేశారు. దీంతో ఆటోలో అనంతపురంలోని సాయినగర్‌లో ఉన్న పశువైద్యశాలకు దూడను తీసుకువచ్చి తన బృందంతో డాక్టర్ పద్మనాభం శస్త్రచికిత్స చేశారు. దవడ ఎముకకు రెండు వైపులా 2.5 మి.మీ స్టెయిన్లెస్ స్టీల్ పిన్నులను అమర్చారు. శస్త్రచికిత్స తర్వాత దూడ దవడ సాధారణ స్థితికి చేరుకోవడం, పాలు తాగడం మొదలు పెట్టింది. దూడకు అవసరమైన ఫ్లూయిడ్స్, యాంటీబయాటిక్స్, అనాల్జిసిక్స్ లాంటి మందులు కూడా అందించినట్లు పద్మనాభం వెలిపారు. శస్త్రచికిత్సలో 1962 అంబులెన్స్ డాక్టర్ సునీత, ట్రైనీ డాక్టర్ నేహ, కమలాకార్, గీత తదితరులు పాల్గొన్నట్లు తెలిపారు. -
ఏక పంట విధానంతో నష్టాలు
పుట్టపర్తి అర్బన్: ఏక పంట విధానంతో నష్టాలు వస్తాయని, పంట మార్పిడి ఎంతో అవసరమని నంద్యాల వ్యవసాయ పరిశోధనా స్థానం అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ ఎం జాన్సన్ పేర్కొన్నారు. గురువారం జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయంలో జిల్లా వ్యవసాయాధికారి సుబ్బారావు అధ్యక్షతన నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పంట మార్పిడిపై రైతులకు అవగాహన పెంచాలన్నారు. వ్యవసాయ ప్రదర్శనా క్షేత్రాలను తరచూ సందర్శించాలన్నారు. నూతన రకాల సాగు పద్దతులు, నూతన వంగడాల సాగు సమస్యలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. మల్బరీ సబ్సిడీలపై సెరికల్చర్ అధికారి పద్మమ్మ వివరించారు. చేపల పెంపకంపై ముందుకు వచ్చే రైతులకు సంపూర్ణ సహకారం అందిస్తామని ఫిషరీస్ అధికారి చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. -
బైక్ ఢీ.. యువకుడి దుర్మరణం
● పోలీస్ శాఖ ప్రతిష్ట పెంచాలిరెండో రోజూ కొనసాగిన ఆర్డీఓ విచారణ పుట్టపర్తి టౌన్: ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ పోలీస్ శాఖ ప్రతిష్టను మరింతగా పెంచాలంటూ ప్రొబేషనరీ ఎస్ఐలకు ఎస్పీ రత్న సూచించారు. ఇటీవల శిక్షణ పూర్తి చేసుకున్న పలువురు ప్రొబేషనరీ ఎస్ఐలు గురువారం డీపీఓలోని చాంబర్లో ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... నిజాయితీ, క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తూ జవాబుదారీతనంతో వ్యవహరించాలన్నారు. నూతన టెక్నాలజీని అందిపుచ్చుకుంటే కేసుల దర్యాప్తులో మెరుగైన ఫలితాలు ఉంటాయన్నారు. నాలుగు నెలల గ్రేహౌండ్స్ శిక్షణలో భాగంగా బేసిక్ పోలీసింగ్ విధానాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఏఓ సుజాత, ఎస్బీ సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. పట్టపగలే చోరీ రాయదుర్గం టౌన్: స్థానిక మారెమ్మ గుడి ప్రాంతంలోని ఓ ఇంట్లో పట్టపగలే చోరీ జరిగింది. వివరాలు... ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న మంజునాథ్ భార్య స్థానిక ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం ఇంటికి తాళం వేసి ఆటో అద్దెల కోసం మంజునాథ్, ఆయన భార్య ప్రైవేట్ స్కూల్‌కు వెళ్లారు. మధ్యాహ్నం 1 గంటకు భోజనానికి ఇంటికి చేరుకున్న మంజునాథ్.. అప్పటికే ఇంటి తలుపులు తీసి ఉండడం గమనించి లోపలకు వెళ్లి పరిశీలించాడు. లోపల వస్తువులన్నీ చెల్లాచెదురు చేసి ఓ క్యారియర్‌లో దాచి ఉంచిన రూ.80 వేలును అపహరించి, ఇంటి వెనుక ఉన్న మరో తలుపు నుంచి దుండగులు ఉడాయించినట్లుగా గుర్తించాడు. బీరువాకు వేసిన తాళం తీసేందుకు విఫలయత్నం చేశారని, బీరువా తలుపు తెరుచుకోకపోవడంతో అందులో ఉంచిన బంగారు నగలు భద్రంగా ఉన్నట్లు బాధితుడు తెలిపాడు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నాడు. మట్కా నిర్వాహకుల అరెస్ట్ తాడిపత్రి టౌన్: స్థానిక పలు ప్రాంతాల్లో మట్కా నిర్వహిస్తున్న పలువురిని అరెస్ట్ చేసినట్లు సీఐ సాయిప్రసాద్ తెలిపారు. పట్టుబడిన వారిలో వైఎస్సార్ జిల్లా బాపనపల్లికి చెందిన కొండమనాయుడు, తాడిపత్రిలోని అంబేడ్కర్ నగర్ నివాసి నాగల మణికంఠ, భగత్‌సింగ్ నగర్‌కు చెందిన సుబ్బరాయుడు, చాకలి ఆదినారాయణ ఉన్నారు. వీరు గురువారం ఉదయం తాడిపత్రిలోని ఆర్టీసీ బస్డాండ్ వద్ద అరెస్ట్ చేసి రూ.30వేలు నగదు, పట్టీలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కర్ణాటక మద్యం విక్రేతల అరెస్ట్ హిందూపురం అర్బన్: స్థానిక ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో బుధ, గురువారాల్లో చేపట్టిన తనిఖీల్లో కర్ణాటక మద్యం విక్రయిస్తున్న పలువురు పట్టుబడ్డారు. వీరి నుంచి 418 టెట్రా ప్యాకెట్ల కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్నారు. పట్బుడిన వారిలో హిందూపురం మండలం కొల్లకుంటకు చెందిన వెంకటేష్, కొడిగెనహళ్లికి చెందిన గిరీష్‌కుమార్, గోళ్లాపురానికి చెందిన జయలక్ష్మి, మేళాపురానికి చెందిన లత, లక్ష్మి, సదాశివనగర్ నివాసి భూపతి ఉన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎకై ్సజ్ సీఐలు గురునాథరెడ్డి, లక్ష్మీదుర్గయ్య తెలిపారు. వ్యక్తి అనుమానాస్పద మృతి రామగిరి: మండల కేంద్రానికి చెందిన తలారి రాజన్న (48) బుధవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పోలేపల్లి సరిహద్దులో ఉన్న రాజన్న పొలం పక్కనే మరొకరికి సంబంధించిన పొలం ఉంది. వీటి మధ్య ఉన్న వేప చెట్టు తమకు చెందుతుందంటే తమకు చెందుతుందని బుధవారం ఇరువురు రైతులు వాదించుకున్నారు. అనంతరం రాజన్న ఇంటికి చేరుకున్న కాసేపటికే తీవ్ర అస్వస్థతకు లోనవ్వడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. రాజన్న మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆయన భార్య శ్యామల చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ముదిగుబ్బ: మండలంలోని ఏబీపల్లి తండాలో గిరిజన, గిరిజనేతర భూములను ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ ఆక్రమించిన అంశంపై ధర్మవరం ఆర్డీఓ మహేష్ గురువారం రెండవ రోజు గురువారం కూడా విచారణ చేపట్టారు. ఆరోపణలు ఉన్న సర్వే నంబర్ 1858, 1962, 1963, 1809లలో ఉన్న భూములను ఆర్డీఓ స్వయంగా వెళ్లి పరిశీలించారు. ఏబీపల్లికి చెందిన బాధిత రైతులు రవిశంకర్ నాయక్, గాయత్రి బాయి, నారాయణమ్మ, జయమ్మ, కుల్లాయప్ప నాయక్, బాలునాయక్‌తో మాట్లాడారు. తమ భూములను ఎంపీపీ ఆన్లైన్లో ఎక్కించుకున్నాడని, ఆ భూములపై బ్యాంకులలో రుణాలను కూడా తీసుకోవడం అన్యాయమని, తమ వద్ద భూములకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని ఆర్డీఓ దృష్టికి వారు తీసుకెళ్లారు. సకాలంలో వర్షాలు పడకపోవడంతో పంటలు పెట్టలేకపోయామని, గతంలో చాలా సార్లు పంటలు సాగు చేసి పెట్టుబడులు కూడా రాకపోవడంతో ప్రస్తుతం పంటలు సాగు చేయలేక బీళ్లుగా పెట్టుకున్నామన్నారు. ఆర్డీఓ మాట్లాడుతూ... అర్హులైన రైతులకు న్యాయం చేస్తామని భరోసానిచ్చారు. బొమ్మనహాళ్: ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో మరో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... బొమ్మనహాళ్ మండలం నేమకల్లుకు చెందిన తలారి హనుమంతు, పార్వతి దంపతుల కుమారుడు లోకేష్ (35)కు ఏడేళ్ల క్రితం కల్లుహోళ గ్రామానికి చెందిన అంజలితో వివాహమైంది. వీరికి ఓ కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. సొంతూరిలోనే ఫర్టిలైజర్ షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న లోకేష్ బుధవారం వ్యక్తిగత పనిపై బొమ్మనహాళ్‌కు వచ్చాడు. పనిముగించుకుని రాత్రి ద్విచక్ర వాహనంలో తిరుగు ప్రయాణమయ్యాడు. నేమకల్లు చెక్‌పోస్టు దాటగానే ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం ఢీకొనడంతో లోకేష్‌కు తీవ్ర రక్తస్రావమై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ప్రమాదానికి కారణమైన మరో ద్విచక్ర వాహనదారుడు తమిళనాడుకు చెందిన రాజుకూ తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు వెంటనే అంబులెన్స్ ద్వారా బళ్లారిలోని విమ్స్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న రాజును కుటుంబసభ్యులు బెంగళూరుకు తీసుకెళ్లారు. లోకేష్‌ను మెరుగైన చికిత్స కోసం అనంతపురానికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ నబీరసూల్ తెలిపారు. కాగా, బాధిత కుటుంబసభ్యులను వైఎస్సార్సీపీ సర్పంచ్ పరమేశ్వర పరామర్శించి, అండగా ఉంటామని భరోసానిచ్చారు. -
9న రెడ్డి ఉచిత వివాహ పరిచయ వేదిక
రాప్తాడు రూరల్: రాయలసీమ రెడ్డి జన సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 9న ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉచిత రెడ్డి వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు సంఘం వ్యవస్థాపకుడు రొద్దం సురేష్‌రెడ్డి, గౌరవ అధ్యక్షుడు చిన్నరాసి చంద్రమౌళి రెడ్డి, సెక్రటరీ కిషోర్‌రెడ్డి తెలిపారు. అనంతపురం రూరల్ మండలం పాపంపేటలోని రెడ్డి జన సంఘం కార్యాలయంలో జరిగే వేదికకు హాజరయ్యేవారు కాబోయే అబ్బాయిలు, అమ్మాయిల వివరాలు తీసుకురావాలని తెలిపారు. పూర్తి వివరాలకు 94415 75641, 93902 84296, 94907 67224 సంప్రదించాలని కోరారు. డీఎంఎల్టీలో స్టేట్ టాపర్‌గా కావ్య అనంతపురం మెడికల్: ఇటీవల జరిగిన డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ పరీక్ష అనంతపురం వైద్యకళాశాలలోని పారామెడికల్ కోర్సు విద్యార్థిని కావ్య... రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంక్‌ను దక్కించుకుంది. ఈ ఏడాది జనవరిలో జరిగిన పరీక్షల్లో 480 మార్కులకు గానూ 87.77 శాతంతో 416 మార్కులు సాధించింది. విద్యార్థిని ప్రతిభను గుర్తించిన మెడికల్ కళాశాల (జీఎంసీ) ప్రిన్సిపాల్ డాక్టర్ మాణిక్యరావు గురువారం ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థిని మంచి మార్కులు సాధించం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాళ్లు డాక్టర్ షంషాద్‌బేగం, డాక్టర్ షారోన్, డిప్యూటీ ఆర్ఎంఓ డాక్టర్ హేమలత తదితరులు పాల్గొన్నారు. ఆడపిల్లకు చదువే ఆస్తి ఓడీచెరువు: ఆడ, మగ భేదం లేకుండా పిల్లలను బాగా చదివించాలని ఆడపిల్లకు చదువే ఆస్తి అని రాష్ట్ర గురుకుల పాఠశాలల కార్యదర్శి మస్తానయ్య పేర్కొన్నారు. ఓడీ చెరువులోని కేజీబీవీని గురువారం ఆయన జీసీడీఓ సంపూర్ణ, ఏపీఎంఓ మాలిక్‌తో కలసి సందర్శించి, మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా లింగ ఆధారిత వివక్ష చూపుతున్న ఐదు మండలాల్లో ఓడీచెరువు మండలం ఒకటని పేర్కొన్నారు. ఈ వివక్షతను నిర్మూలించేందుకు అన్ని శాఖల అధికారులు విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. బాల్య వివాహాలు జరుగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. అనంతరం ఆయన పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను ఆరా తీశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రాబర్ట్ విల్సన్, ఎంఇఓలు సురేష్‌కుమార్, రమణ, ఎస్ఓ గీతాబాయి తదితరులు పాల్గొన్నారు. -
ముగ్ధ శారీస్ ఎండీపై కేసు నమోదు
ధర్మవరం అర్బన్: స్థానిక పట్టుచీరల వ్యాపారస్తుల వద్ద పట్టుచీరలు, పట్టు పావడాలు కొనుగోలు చేసి, ఇందుకు సంబంధించిర రూ.3.53 కోట్లను ఇవ్వకుండా మోసం చేసిన మహిళపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు ధర్మవరం వన్‌టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ తెలిపారు. గురువారం రాత్రి 10 గంటలకు ఆయన వివరాలను వెల్లడించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు పట్టణాల్లో ముగ్ధ పేరుతో రిటైల్ దుకాణాలు నిర్వహిస్తున్న వంగపల్లి శశి... ధర్మవరం పట్టణానికి చెందిన దాసరి నాగభూషణంతో రూ.1.73కోట్ల విలువ చేసే పట్టు పావడాలు, లక్ష్మి హన్షిక శిల్క్ శారీస్ యజమాని ముక్తాపురం బాలకృష్ణ వద్ద రూ.1.80కోట్లు విలువ చేసే పట్టుచీరలను కొనుగోలు చేసింది. రోజులు గడుస్తున్నా డబ్బు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది. దీంతో విసిగిపోయిన బాధితులు గురువారం రాత్రి చేసిన ఫిర్యాదు మేరకు విచారణ అనంతరం ముగ్ధ శారీస్ మేనేజింగ్ డైరెక్టర్ వంగపల్లి శశిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. యువకుడి బలవన్మరణం ఆత్మకూరు: మండల కేంద్రానికి చెందిన ఎగ్గిడి లోకేష్ (20) ఆత్మహత్య చేసుకున్నాడు. గేదెల పోషణతో జీవనం సాగించే లోకేష్ కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం కడుపు నొప్పి తీవ్రత తాళలేక స్థానిక బైపాస్ సమీపంలోని ఓ రేకుల షెడ్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఇంటర్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం
మడకశిరరూరల్: మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల జూనియర్ కళాశాలల్లో 2025–2026 సంవత్సరానికి (ఇంగ్లిష్ మాధ్యమం) ప్రవేశ పరీక్షకు బాలురు, బాలికల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గురుకుల పాఠశాల, కళాశాల కన్వీనర్ రమాదేవి తెలిపారు. జూనియర్ ఇంటర్మీడియట్ (ఇంగ్లిష్ మాధ్యమం) ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థులు ఈనెల 15 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోచ్చని పేర్కొన్నారు. బాలికలకు (టేకులోడు, గుండిబండ, బాలురకు లేపాక్షి, గుండుమల కళాశాలలు ఉన్నాయని తెలిపారు. ఆస్తకి గల అభ్యర్థులు ఈ నెల 15 లోపు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. -
టీడీపీ నేతల అవినీతి బాగోతం బట్టబయలు
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: కదిరిలో టీడీపీ నేతల అవినీతి బాగోతం బయటపడింది. ఒక్కో ఇంటి పట్టాకు రూ. 50 వేలు టీడీపీ నేతలు వసూలు చేస్తున్నారు. కదిరి ఆర్డీవో కార్యాలయం ఎదుట ఇంటి పట్టాలు ఇప్పిస్తామంటూ దందా సాగిస్తున్నారు. టీడీపీ నేతలు పబ్లిగ్గా డబ్బు వసూలు చేస్తున్నా కానీ రెవెన్యూ, పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదు. టీడీపీ నేతల వసూళ్ల పర్వం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.స్టోర్ డీలర్‌పై టీడీపీ నేత దాడిమరోవైపు, టీడీపీ నేతల దౌర్జన్యాలకు అంతులేకుండా పోతోంది. తాము హెచ్చరించినా రేషన్ దుకాణం వదులుకోలేదన్న కోపంతో టీడీపీ నాయకుడు అంజినప్ప దళిత సామాజిక వర్గానికి చెందిన ఓ రేషన్ షాపు డీలర్‌పై దాడి చేశాడు. ఈ ఘటన బుధవారం హిందూపురం మండలం కగ్గల్లు గ్రామంలో చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు... దళిత సామాజిక వర్గానికి చెందిన ఆదినారాయణ దివ్యాంగుడు. 2006 నుంచి గ్రామ (ఎఫ్ఫీ షాప్‌నంబర్ 1257060) డీలర్‌గా పనిచేçసూŠత్ జీవనం సాగిస్తున్నాడు.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే డీలర్ షిప్ వదులుకోవాలని టీడీపీ నేతలు ఆదినారాయణను బెదిరించారు. దీని గురించి గ్రామ సర్పంచ్ హనుమంతు రాయప్పకు బాధితుడు చెప్పుకోగా.. సర్పంచ్ కూడా టీడీపీ నేతలకే వత్తాసు పలుకుతూ రేషన్ డీలర్ షిప్ వదులుకోవాలని బెదిరించాడు. దీంతో ఆదినారాయణ తప్పనిసరి పరిస్థితిలో కోర్టును ఆశ్రయించి డీలర్‌గా కొనసాగేలా అనుమతులు తెచ్చుకున్నాడు.దీంతో రెవెన్యూ అధికారులు ఆదినారాయణ ఎఫ్‌సీ షాపునకు నెలసరి రేషన్ బియ్యం కోటాను మంజూరు చేశారు. ఈ క్రమంలో ఆదినారాయణ బుధవారం బియ్యం బస్తాలను లారీ నుంచి దించుకుంటుండగా.. టీడీపీ నాయకుడు అంజినప్ప అక్కడికి వచ్చి పరుష పదజాలంతో దూషించాడు. అంతేకాకుండా భౌతికదాడి చేయడంతో పాటు అందరి ముందు చెప్పుకాలితో తన్నాడు. తనకు కోర్టు అనుమతి ఉందని ఆదినారాయణ చెబుతున్నా ‘ప్రభుత్వం మాది... మాదే జరుగుతుంది... కోర్టు గీర్టు జాన్తా నై.. నీ ఇష్టం వచ్చిన వాడికి చెప్పుకో’’ అంటూ అందరి ముందు దుషించాడు. దీనిపై బాధితుడు బుధవారం హిందూపురం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంజినప్పపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
రీ సర్వే పక్కాగా చేయాలి
లేపాక్షి: భూవివాదాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చేపట్టిన రీ సర్వే పక్కాగా చేయాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్‌కుమార్ అఽధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన మండలంలోని మానేపల్లి గ్రామంలో జరుగుతున్న రీ సర్వేను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. భూముల రీ సర్వే వల్ల అటు రైతులకు, ఇటు ప్రభుత్వానికి మేలు జరుగుతుందన్నారు. అలాగే భూ తగాదాలను శాశ్వత పరిష్కారం చూపవచ్చన్నారు. అనంతరం అక్కడికి వచ్చిన రైతులతో, సర్వేయర్‌తో మాట్లాడి రీ సర్వేలో ఉత్పన్నమైన సమస్యలు, గ్రౌండ్ వాలిడేషన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. జేసీ వెంట తహసీల్దార్ సౌజన్యలక్ష్మి, ఏడిఏ అల్తాఫ్ అలీఖాన్, ఏఓ శ్రీలత, రెవెన్యూ, వ్యవసాయ సిబ్బంది ఉన్నారు. ఈ–క్రాప్ సూపర్ చెక్.. ఈ–క్రాప్ సూపర్ చెక్‌లో భాగంగా జేసీ అభిషేక్‌కుమార్ కొండూరు గ్రామ రైతులు నందిని, ఈడిగ వెంకటరమణప్ప సాగు చేసిన రాగిపంటను, లేపాక్షి గ్రామానికి చెందిన ఆదినారాయణరెడ్డి సాగుచేసిన మొక్కజొన్న పంటను పరిశీలించారు. రైతులతో ఈ–క్రాప్ బుకింగ్ విధానం, పంట దిగుబడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆన్లైన్లో నమోదు చేసిన విస్తీర్ణం, పంట వివరాలను పరిశీలించారు. తహసీల్దార్ కార్యాలయం తనిఖీ.. లేపాక్షి తహసీల్దార్ కార్యాలయాన్ని జాయింట్ కలెక్టర్ అభిషేక్‌కుమార్ బుధవారం తనిఖీ చేశారు. వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చిన అర్జీదారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కార్యాలయ సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, వీఆర్ఓలతో సమావేశమయ్యారు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలైన అందరికీ ఇళ్లు, ఇళ్ల పట్టాల క్రమబద్దీకరణ, పొజిషన్ సర్టిఫికెట్, ఫ్రీ హోల్డ్ వెరిఫికేషన్, భూ కేటాయింపు పరిశీలన తదితర అంశాలపై తగు సూచనలు ఇచ్చారు. అధికారులకు జాయింట్ కలెక్టర్ అభిషేక్‌కుమార్ ఆదేశం -
ఆక్రమిత భూములపై ఆర్డీఓ విచారణ
ముదిగుబ్బ: మండల పరిధిలోని ఏబీపల్లి తండాలో ధర్మవరం ఆర్డీఓ మహేష్ బుధవారం విచారణ చేపట్టారు. ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ గిరిజనుల భూములను ఆక్రమించి తమ బంధువుల పేరుతో ఆన్లైన్లో ఎక్కించుకుని బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్నారని బాధితులు ఆరోపిస్తుండగా... మంగళవారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఏబీపల్లి తండాలో పర్యటించి బాధితులతో మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఆర్డీఓ మహేష్, తహసీల్దార్ నారాయణస్వామి, సర్వేయర్ శివకుమార్ నాయక్ ఏబీపల్లి తండాలో పర్యటించారు. సర్వే నంబర్ 1858, 1962, 1963, 1809లలోని భూములను ఆర్డీఓ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు రవిశంకర్ నాయక్, గాయత్రిబాయి, నారాయణమ్మ, జయమ్మ, కుల్లాయప్ప నాయక్, బాలునాయక్‌లు తదితరులు ఆర్డీఓ ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ తమ భూములను ఆన్లైన్లో ఇతర పేర్లపై ఎక్కించాడని, ఆ పత్రాలతో బ్యాంకుల్లో రుణాలు కూడా తీసుకున్నాడని వాపోయారు. తమ వద్ద భూములకు సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. స్పందించిన ఆర్డీఓ... గ్రామస్తులు, పెద్దల సమక్షంలో గ్రామసభ నిర్వహించి రైతులకు న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇచ్చారు. వెంటనే గ్రామ సభల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. గ్రామ సభలు నిర్వహించి అర్హులకు న్యాయం చేస్తామని వెల్లడి -
సమష్టి కృషితోనే మహిళాభ్యుదయం
కదిరి అర్బన్: సమష్టి కృషితోనే మహిళాభ్యుదయం సాధ్యమవుతుందని ఎస్పీ రత్న అన్నారు. ప్రస్తుతం పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నప్పటికీ, మహిళల హక్కులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత మున్సిపల్ కార్యాలయం నుంచి వందలాది మంది మహిళలు ర్యాలీగా జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలకు చేరుకున్నారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఎస్పీ వి.రత్న, ఆర్డీఓ వీవీఎస్ శర్మ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... మారుతున్న కాలానికి అనుగుణంగా మహిళలు కూడా మారాలన్నారు. మహిళలకు వ్యక్తిగత స్వేచ్ఛ చాలా ముఖ్యమన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో సీఐలు నారాయణరెడ్డి, ఎంపీడీఓ పోలప్ప, సీడీపీఓ రాధిక, రెడ్స్ సంస్థ అధ్యక్షురాలు భానూజా పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా ‘పూల’
కదిరి: వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శిగా కదిరికి చెందిన పూల శ్రీనివాసరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. పూల శ్రీనివాసరెడ్డి వైఎస్సార్ సీపీ ఆవిర్భావం నుంచీ పార్టీ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. 2014తో పాటు 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ కదిరి నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థుల గెలుపునకు ఎంతో కృషి చేశారు. పార్టీ సీఈసీ సభ్యులుగా, గత సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ కదిరి నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జ్గా పని చేసిన అనుభవం ఉంది. ఈ నేపథ్యంలోనే పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఆయన్ను నియమించారు. తన సేవలను గుర్తించి పదవి కట్టబెట్టిన పార్టీ అధినేతకు, పార్టీ పెద్దలకు పూలశ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం తన శక్తి వంచన లేకుండా కష్టపడి పనిచేస్తానని, జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవడమే తన లక్ష్యమని తెలిపారు. ఐసీడీఎస్ పీడీగా శ్రీదేవి అనంతపురం సెంట్రల్: శ్రీసత్యసాయి జిల్లా ఐసీడీఎస్ పీడీగా టి. శ్రీదేవి నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె తాడిపత్రి సీడీపీఓగా పనిచేస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో మహిళా,శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వ కార్యదర్శి సూర్యకుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో తాడిపత్రి సీడీపీఓగా ఉన్న టి.శ్రీదేవికి శ్రీసత్యసాయి జిల్లా పీడీగా అదనపు బాధ్యతలు (ఆన్‌డ్యూటీ) అప్పగించారు. అలాగే అనంతపురం జిల్లా ఐసీడీఎస్ పీడీగా ఎం.నాగమణిని నియమించారు. ప్రస్తుతం ఆమె కర్నూలు జిల్లా మంత్రాలయం సీడీపీఓగా పనిచేస్తుండగా, పదోన్నతి కల్పించి పీడీగా బాధ్యతలు అప్పగించారు. -
స్టోర్ డీలర్‌పై టీడీపీ నేత దాడి
హిందూపురం: తాము హెచ్చరించినా రేషన్ దుకాణం వదులుకోలేదన్న కోపంతో టీడీపీ నాయకుడు అంజినప్ప దళిత సామాజిక వర్గానికి చెందిన ఓ రేషన్ షాపు డీలర్‌పై దాడి చేశాడు. ఈ ఘటన బుధవారం హిందూపురం మండలం కగ్గల్లు గ్రామంలో చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు... దళిత సామాజిక వర్గానికి చెందిన ఆదినారాయణ దివ్యాంగుడు. 2006 నుంచి గ్రామ (ఎఫ్ఫీ షాప్‌నంబర్ 1257060) డీలర్‌గా పనిచేసూ్త్ జీవనం సాగిస్తున్నాడు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే డీలర్ షిప్ వదులుకోవాలని టీడీపీ నేతలు ఆదినారాయణను బెదిరించారు. దీని గురించి గ్రామ సర్పంచ్ హనుమంతు రాయప్పకు బాధితుడు చెప్పుకోగా.. సర్పంచ్ కూడా టీడీపీ నేతలకే వత్తాసు పలుకుతూ రేషన్ డీలర్ షిప్ వదులుకోవాలని బెదిరించాడు. దీంతో ఆదినారాయణ తప్పనిసరి పరిస్థితిలో కోర్టును ఆశ్రయించి డీలర్‌గా కొనసాగేలా అనుమతులు తెచ్చుకున్నాడు. దీంతో రెవెన్యూ అధికారులు ఆదినారాయణ ఎఫ్‌సీ షాపునకు నెలసరి రేషన్ బియ్యం కోటాను మంజూరు చేశారు. ఈ క్రమంలో ఆదినారాయణ బుధవారం బియ్యం బస్తాలను లారీ నుంచి దించుకుంటుండగా.. టీడీపీ నాయకుడు అంజినప్ప అక్కడికి వచ్చి పరుష పదజాలంతో దూషించాడు. అంతేకాకుండా భౌతికదాడి చేయడంతో పాటు అందరి ముందు చెప్పుకాలితో తన్నాడు. తనకు కోర్టు అనుమతి ఉందని ఆదినారాయణ చెబుతున్నా ‘ప్రభుత్వం మాది... మాదే జరుగుతుంది... కోర్టు గీర్టు జాన్తా నై.. నీ ఇష్టం వచ్చిన వాడికి చెప్పుకో’’ అంటూ అందరి ముందు దుషించాడు. దీనిపై బాధితుడు బుధవారం హిందూపురం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంజినప్పపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. బియ్యం వేయకూడదని హుకుం -
నవోదయంతో నాటుసారా నిర్మూలన
ప్రశాంతి నిలయం: నాటుసారా రహిత జిల్లాగా శ్రీసత్యసాయిని తీర్చిదిద్దేందుకు అందరూ సమష్టిగా పనిచేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ పిలుపునిచ్చారు. ఇందుకోసం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో ‘నవోదయం 2.0’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. నవోదయం కార్యక్రమం ద్వారా ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించి నాటుసారా నిర్మూలనకు కృషి చేస్తామన్నారు. అందుకోసం ఎకై ్సజ్ అధికారులు బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు. ‘నవోదయం 2.0’ కార్యక్రమంలో భాగంగా నాటుసారా అనర్థాలను ప్రజలకు వివరించేందుకు ఏర్పాటు చేసిన కళాజాత బృందం ప్రచార రథాన్ని బుధవారం కలెక్టరేట్ ప్రాంగణంలో జెండా ఊపి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కళాజాతా బృందాలు నాటుసారా వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించి చైతన్యం తేవాలన్నారు. కార్యక్రమంలో అధికారులందరూ పాల్గొనాలని ఆదేశించారు. గ్రామ, పట్టణ, డివిజన్ స్థాయిల్లో అవగాహన సదస్సులు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. నాటుసారా వినియోగం వల్ల కలిగే నష్టాలు, ఆరోగ్య ఇబ్బందులు, సామాజిక, ఆర్థిక సమస్యలపై ప్రజలు కూడా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ టీఎస్ చేతన్ -
8న జాతీయ లోక్‌అదాలత్
● అదాలత్ తీర్పు ‘సుప్రీం’ ● ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. శ్రీనివాస్ అనంతపురం: ఉమ్మడి జిల్లాలో మార్చి 8వ తేదీన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జాతీయ లోక్ అదాలత్‌లో ఇచ్చే తీర్పులు సుప్రీం కోర్టు తీర్పుతో సమానమన్నారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని కోర్టుల్లోనూ లోక్ అదాలత్ ఉంటుందన్నారు. గత లోక్ అదాలత్‌లో కేసుల పరిష్కారం దృష్ట్యా రాష్ట్రంలోనే అనంతపురం జిల్లా 9వ స్థానంలో నిలిచిందని, ఈ సారి మరింత మెరుగ్గా జాతీయ లోక్ అదాలత్ నిర్వహించి ఆ స్థానాన్ని మెరుగుపరచాలన్నారు. మార్చి 8న నిర్వహించే జాతీయ లోక్‌అదాలత్‌లో 6,294 కేసులను పరిష్కారం చేయడానికి ఆయా బెంచ్‌లు కృషి చేస్తాయన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జి. శివప్రసాద్ యాదవ్ పాల్గొన్నారు. ఇంగ్లిష్–2 పరీక్షకు 215 మంది గైర్హాజరు పుట్టపర్తి: ఇంటర్ వార్షిక పరీక్షల్లో భాగంగా బుధవారం జిల్లాలోని 42 కేంద్రాల్లో జరిగిన ఇంగ్లిష్ పేపర్–2 పరీక్షకు 215 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జనరల్ విద్యార్థులు 9,221 మందికిగాను, 9,045 మంది హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సులకు సంబంధించి 1,148 మంది విద్యార్థులకు గాను 1,109 మంది హాజరయ్యారు. మొత్తంగా 215 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరైనట్లు ఇంటర్మీడియెట్ జిల్లా విద్యాఽశాఖాధికారి రఘునాథరెడ్డి తెలిపారు. జిల్లా స్పెషల్ ఆఫీసర్ చెన్నకేశవ ప్రసాద్, పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు సురేష్, రామరాజు, శ్రీనివాసరెడ్డి, జిల్లా ఇన్చార్జ్ వెంకటేశ్వర ప్రసాద్, ఆర్డీఓలు వివిధ కేంద్రాలను తనిఖీ చేశారు. ఆగ్రోస్ మేనేజర్లుగా ఓబుళపతి, శ్రీనివాసులు అనంతపురం అగ్రికల్చర్: ఏపీ ఆగ్రోస్ అనంతపురం జిల్లా మేనేజర్‌గా కె.ఓబుళపతి, శ్రీసత్యసాయి జిల్లా మేనేజర్‌గా శ్రీనివాసులును నియమిస్తూ కమిషనరేట్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం ఓబుళపతి అనంతపురంలోని భూసార సంరక్షణ విభాగం ఏడీగా,. శ్రీనివాసులు హిందూపురంలోని భూసార సంరక్షణా విభాగం ఏడీగా పనిచేస్తున్నారు. ఇరువురూ గతంలో ఏపీ ఆగ్రోస్ మేనేజర్లుగా పనిచేసిన అనుభవం ఉండటంతో తిరిగి మరోసారి వారినే మేనేజర్లుగా నియమించినట్లు తెలిసింది. ప్రస్తుతం వ్యవసాయశాఖ పరిధిలో యాంత్రీకరణ పథకం అమలులోకి రావడంతో నోడల్ ఏజెన్సీగా ఆగ్రోస్‌కు బాధ్యతలు అప్పజెప్పడంతో ఖాళీగా ఉన్న మేనేజర్ పోస్టులను భర్తీ చేసినట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. ఒకట్రెండు రోజుల్లో వీరివురూ బాధ్యతలు తీసుకోనున్నట్లు సమాచారం. ఇంటర్ సిటీ ప్యాసింజర్ రైళ్లకూ బ్రేకులు గుంతకల్లు: హుబ్లీ–తిరుపతి మధ్య గుంతకల్లు జంక్షన్ మీదుగా తిరుగుతున్న ఇంటర్ సిటీ ప్యాసింజర్ రద్దును కూడా ఈ నెల 31 వరకు పొడిగించారు. ఈ మేరకు బుధవారం దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ ఆదేశాలు జారీ చేశారు. తిరుపతి–హుబ్లీ (57401) ప్యాసింజర్ ఈ నెల 30 వరకు, హుబ్లీ–తిరుపతి ప్యాసింజర్ (57402) ప్యాసింజర్ రద్దును ఈ నెల 31 వరకు పొడిగించినట్లు వివరించారు. కాగా, కుంభమేళాకు తరలించిన పలు ప్యాసింజర్ రైళ్లు ఈ నెలాఖరు వరకూ రాకపోకలు సాగించవని ఇదివరకే అధికారులు ప్రకటించారు. -
పట్టా కోసం పచ్చ పన్నాగం
సాక్షి టాస్క్‌ఫోర్స్: బత్తలపల్లి మండలం సంజీవపురం గ్రామ సచివాలయం వద్ద జాతీయ రహదారికి ఆనుకుని అర ఎకరం ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిని ఏదైనా ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు ఉపయోగించుకోవాలని గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం భావించింది. ఇందుకోసం స్థలాన్ని అభివృద్ధి చేసింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీడీపీ నేతలు ఆ స్థలంపై కన్నేశారు. జిల్లాకు చెందిన ఓ మంత్రి సాయంతో ఇళ్ల పట్టాల పేరిట రూ.లక్షలు విలువ చేసే ఆ స్థలాన్ని కొట్టేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఏడుగురు పొజిషన్ సర్టిఫికెట్లు పొందారు. మరికొందరు దరఖాస్తు చేసుకున్నారు. ఇక్కడ 24 మందికి రెండు సెంట్ల చొప్పున స్థలం పంపిణీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా సంజీవపురంలోని పలువురు ఇళ్లు కోల్పోయారు. దీన్ని సాకుగా చూపి విలువైన భూమి చేజిక్కించుకునేందుకు టీడీపీ నేతలు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా మొత్తంగా 40 మంది దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. అందులో ఏడుగురికి పొజిషన్ సర్టిఫికెట్లు మంజూరు కాగా, మరో 24 మందికి నేడో, రేపో పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వనున్నారు. మిగిలిన వారు కూడా స్థలం కోసం పట్టుబట్టడంతో సచివాలయం సమీపంలోనే జాతీయ రహదారికి ఆనుకుని రెండు ఎకరాల్లో ఉన్న చింతవనంలో చెట్లు కొట్టేసి అక్కడ ప్లాట్లు వేసేందుకు పనులు ముమ్మరం చేశారు. కలెక్టరేట్ ఆదేశాల మేరకే.. ఈ విషయమై తహసీల్దార్ స్వర్ణలతను వివరణ కోరగా... కలెక్టరేట్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన వారికి పట్టాలు ఇచ్చామన్నారు. 16 మందికి గాను ఏడుగురు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారికి పట్టాలు ఇచ్చామని వివరణ ఇచ్చారు. అంతా ఒకే సామాజిక వర్గం వారే.. జాతీయ రహదారి విస్తరణలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఇలా పలు సామాజిక వర్గాల వారు ఇళ్లు కోల్పోయారు. కానీ ప్రస్తుతం పట్టాలు పొందిన వారు, పొందేందుకు సిద్ధంగా ఉన్న వారంతా ఒకే సామాజిక వర్గం వారు కావడంతో ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ సామాజిక వర్గాల వారు అభ్యంతరం తెలుపుతున్నారు. ఒకే సామాజిక వర్గానికి పొజిషన్ సర్టిఫికెట్లు ఎలా ఇస్తారంటూ నిలదీస్తున్నారు. అంతేకాకుండా ఇప్పటికే గ్రామంలో రెండు ఇళ్లు, స్థలాలు ఉన్నవారికి కూడా పట్టాలు ఇస్తారా.. అని ప్రశ్నిస్తున్నారు. ఇది అనంతపురం–కదిరి జాతీయ రహదారిపై బత్తలపల్లి మండల పరిధిలోని సంజీవపురం గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం వద్ద ఉన్న ప్రభుత్వ స్థలం. సెంటు ఇక్కడ కనీసంగా రూ.4 లక్షలపైనే ఉంటుంది. అర ఎకరా స్థలం ఖాళీగా ఉండగా టీడీపీ నేతలు కన్నేశారు. ఇళ్ల పట్టాల పేరుతో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కొట్టేసేందుకు సిద్ధమయ్యారు. ఏడుగురు పట్టాలు పొందారు. మరికొందరు పచ్చ నేతలు అందే దారిలో నడుస్తున్నారు. ప్రభుత్వ స్థలంపై కూటమి నేతల కన్ను ఇళ్ల స్థలాల పేరిట రూ.లక్షల విలువైన స్థలానికి టెండర్ ఇప్పటికే ఏడుగురికి పట్టాలు మంజూరు పొజిషన్ సర్టిఫికెట్ల కోసం మరికొందరు దరఖాస్తు భూములు కోల్పోయామన్న సాకుతో... -
హంద్రీ–నీవాకు లైనింగ్ వద్దు
పుట్టపర్తి: హంద్రీ–నీవా కాలువకు సిమెంట్ లైనింగ్ పనులు వెంటనే రద్దు చేయాలని ఉమ్మడి అనంతపురం జిల్లా జలసాధన సమితి నాయకులు డిమాండ్ చేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కాలువ వెడల్పు కోసం ఇచ్చిన అనుమతుల మేరకు పనులు చేయాలని కోరారు. బుధవారం ఉమ్మడి అనంతపురం జిల్లా జలసాధన సమితి ప్రధాన కార్యదర్శి వాటర్‌షెడ్ గంగిరెడ్డి, ఓపీడీఆర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, సభ్యులు నవీన్, జలీల్, రైతు కూలీ సంఘం నేత ఖాసీమ్, రైతులు ప్రభాకర్‌రెడ్డి తదితరులు బుక్కపట్నం మండలం జానకంపల్లి వద్ద హంద్రీ–నీవా కాలువ సిమెంట్ లైనింగ్ పనులకు భూమి పూజ చేసిన చోట ఆందోళన చేపట్టారు. హంద్రీ–నీవా కాలువ సిమెంట్ లైనింగ్ పనుల కోసం కూటమి ప్రభుత్వం జారీ చేసిన 404, 405 జీఓలను వెంటనే రద్దు చేయాలని, ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 10 క్యూసెక్కులకు పెంచాలని డిమాండ్ చేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. లైనింగ్‌తో తీరని నష్టం.. గత ఆరేళ్లుగా హంద్రీ–నీవా కాలువలో ఏడాదిలో ఆరు నెలలు నీరు ప్రవహిస్తుండగా.. భూగర్భ జలమట్టం పెరిగి బోరు బావుల్లో నీరు పుష్కలంగా ఉండేదని జలసాధన సమితి నేతలు గుర్తు చేశారు. తద్వారా రైతులు పంటలు పండించుకుంటూ హాయిగా ఉన్నారన్నారు. తాజాగా కూటమి ప్రభుత్వం చేపట్టిన సిమెంట్ లైనింగ్‌తో భూ గర్భ జలాలు హరించుకుపోతాయని, బోర్లు ఒట్టిపోయి రైతులను తీరని నష్టం జరుగుతుందన్నారు. లైనింగ్ పనులు ఆపకపోతే ఉమ్మడి అనంతపురం జిల్లా మళ్లీ కరువుకోరల్లో చిక్కుకుంటుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కాలువ వెడల్పుతో రైతులకు మేలు.. ఉమ్మడి అనంతపురం జిల్లా రైతుల సాగునీటి కష్టాలు చూసిన నాటి ముఖ్యమంత్రి వైఎస్సార్ హంద్రీ–నీవాకు కాలువ పనులు పూర్తి చేశారని జలసాధన సమితి నేతలు గుర్తు చేశారు. 2014లోనే జీడిపల్లి వరకు కృష్ణా జలాలను తీసుకొచ్చారని, 2017 నుంచి శ్రీసత్యసాయి జిల్లాకు హంద్రీ–నీవా ద్వారా సాగునీరు అందుతోందన్నారు. అయితే కాలువ వెడల్పు లేకపోవడంతో తగినంత నీరు తీసుకోలేకపోతున్నామన్నారు. ఈ క్రమంలోనే హంద్రీ–నీవా కాలువను వెడల్పు చేసేందుకు సిద్ధమైందన్నారు. మొత్తంగా 6,300 క్యూసెక్కుల కృష్ణాజలాలను తీసుకునేందుకు వైఎస్ జగన్ సర్కార్ 2021లో కాలువ వెడల్పు పనులకు రూ.6,182 కోట్లకు అనుమతులు మంజూరు చేసిందని జలసాధన సమితి నేతలు గుర్తు చేశారు. ఈ మేరకు పనులు చేపడితో రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికై నా అనంత రైతన్న ఆవేదనను అర్థం చేసుకుని లైనింగ్ పనులు నిలిపివేసి హంద్రీ–నీవా కాలువ వెడల్పు పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కాలువ వెడల్పుకు చర్యలు తీసుకోవాలి ఉమ్మడి అనంతపురం జిల్లా జలసాధన సమితి డిమాండ్ -
‘పది’ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి
పుట్టపర్తి: రెగ్యులర్, ఓపెన్ పదో తరగతి పరీక్షలు ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని, ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని విద్యాశాఖ ఆర్జేడీ శామ్యూల్ ఆదేశించారు. మంగళవారం బుక్కపట్నం డైట్ కళాశాల ఆర్డీటీ సమావేశపు భవనంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లకు ఒక రోజు శిక్షణ ఇచ్చారు. శిక్షణ కార్యక్రమంలో డీఈఓ కృష్ణప్పతో కలిసి పాల్గొన్న ఆర్జేడీ శామ్యూల్ మాట్లాడుతూ... పదో తరగతి పరీక్ష నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. పరీక్ష నిర్వహణలో ఎక్కడా తప్పిదాలు దొర్లకూడదన్నారు. అందరూ సమష్టిగా పనిచేసి పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ఉప విద్యాశాఖ అధికారి పద్మ ప్రియ, ఏడీలు రామకృష్ణ, లాజర్, టీసీఈబీ భాస్కర్‌రెడ్డి, డైట్ కళాశాల ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ హయాంలోనే బీసీల అభ్యున్నతి
పెనుకొండ రూరల్: బీసీ అంటే బ్యాక్ వర్డ్ కాదని, బ్యాక్‌బోన్ అని చాటిచెప్పిన నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ అన్నారు. మంగళవారం ఆమె తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మంగళవారం బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత టీడీపీ అధినేత వద్ద మార్కులు కొట్టేసేందుకు బీసీలను తామేదో ఉద్ధరించినట్లు అసెంబ్లీలో అబద్ధాలు చెప్పారన్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం... బీసీలకు ఇసీ్త్ర పెట్టెలు, కత్తెర పెట్టెలు తాయిలాలుగా ఇస్తే, బీసీల ఆత్మబంధువు వైఎస్ జగన్ మాత్రం అన్ని రంగాల్లో బీసీలకు సముచిత స్థానం కల్పించి పాలనలో భాగస్వాములను చేశారని ఉషశ్రీ గుర్తు చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి తన కేబినెట్లో 11 మంది బీసీలకు అవకాశమిచ్చారని, 56 బీసీ కార్పొరేషన్లతో పాటు అనేక కమిటీల్లో బీసీలకు 50 శాతం పదవులు ఇచ్చి మేలు చేశారన్నారు. అలాగే చేనేతలకు ఏడాదికి రూ. 24 వేల ఆర్థిక సాయం అందించి ఆదుకున్న ఘనత వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికే దక్కిందన్నారు. వీటన్నింటినీ విస్మరించి బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం ఏదో చేసినట్లు గొప్పలు చెప్పడం చూసి జనం నవ్వుతున్నారన్నారు. మంత్రికి నిజంగా ధైర్యం ఉంటే బీసీలకు ఏ ప్రభుత్వంలో మంచి జరిగిందో చెప్పేందుకు బహిరంగ చర్చకు రావాలన్నారు. బీసీలకిచ్చిన హామీలేమయ్యాయి సవిత? మంత్రి సవితకు బీసీల సంక్షేమంపై చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు చేనేతలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇప్పించాలన్నారు. అలాగే కురుబ గుడికట్లు పూజారులకు నెలకు రూ.5 వేల వేతనం ఇప్పించే బాధ్యత తీసుకోవాలన్నారు. కనీసం పెనుకొండ నియోజకవర్గంలోని పరిగి కాటన్ మిల్లు మూతపడకుండా చూసి బీసీలకు ఉపాధి కల్పించాలన్నారు. మంత్రి సవిత నిజంగా బీసీల అభివృద్ధి, మంచిని కాంక్షిస్తే ఆమె మంత్రి భర్త బీసీల్లో భాగమైన మైనార్టీలపై ఎందుకు దాడులకు తెగబడ్డారో చెప్పాలన్నారు. గత ప్రభుత్వంలో వైద్య కళాశాలల నిర్మాణం చేపడితే, నేడు ఆ కళాశాల నిర్మాణాలను ప్రైవేటీకరణ చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. మంత్రి సవిత నియోజకవర్గ అభివృద్ధిని ఆకాంక్షిస్తే, వైద్య కళాశాల ప్రైవేటీకరణ ఆపాలన్నారు. జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ -
వైభవం.. గావుల మహోత్సవం
కనగానపల్లి: ఉరుముల శబ్దాలు, పోతురాజుల నృత్య విన్యాసాలు, భక్తుల కోలాహలం మధ్య దాదులూరు పోతలయ్యస్వామి గావుల మహోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. స్వామి కాపులు, భక్తులు వేకువజామునే ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామి వారికి బోనాలు సమర్పించారు. అనంతరం ఉరుముల శబ్దాలకు అనుగుణంగా పోతురాజులు నృత్య విన్యాసాలు చేసుకుంటూ ఆలయంలోకి వచ్చారు. ఆలయ పూజార్లు పోతలయ్యస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల కోలాహలం మధ్య 11 మంది పోతురాజులు మేకపోతు పిల్లలను స్వామికి గావుల (బలి) మహోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం భక్తులు ఆలయం ముందు వందలాది పొట్టేళ్లు, మేకపోతులను బలి ఇచ్చి మొక్కులు తీర్చుకున్నారు. లక్షమంది రాక పోతలయ్యస్వామి గావుల మహోత్సవాన్ని తిలకించేందుకు ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలిరావటంతో పోతలయ్యస్వామి ఆలయ ఆవరణమంతా కిక్కిరిసిపోయింది. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం సాయంత్రం వరకు సుమారు లక్ష మంది వరకు భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. దాదులూరు పరుషలో భక్తజన సందోహం -
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి
పుట్టపర్తి టౌన్: ప్రకృతి వ్యవసాయం వల్ల కలిగే లాభాలు రైతులకు వివరించి జిల్లాలో విస్తీర్ణం పెరిగేలా వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు కృషి చేయాలని కలెక్టర్ చేతన్ ఆదేశించారు. ఊరూరా అవగాహన కార్యకమ్రాలు ఏర్పాటు చేసి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలన్నారు. మంగళవారం స్థానిక సాయి ఆరామంలో వ్యవసాయ, ఉద్యానవన శాఖల ఆధ్వర్యంలో ‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం –ప్రజాభాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం’పై జిల్లా స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ టీఎస్ చేతన్ మాట్లాడుతూ... రైతు సేవా కేంద్రాల పరిధిలోని మహిళా సంఘాల ద్వారా ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. రైతులకు పెట్టుబడి తగ్గించి ఆదాయం చేకూరే విధంగా సహకారాన్ని అందించాలన్నారు. జిల్లాలోని బీడు భూముల్లో ప్రకృతి వ్యవసాయ విధానాల్లో రైతులు పంటలు సాగు చేసేలా చూడాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సుబ్బారావ్, డీఆర్డీఏ పీడీ నరసయ్య, డీపీఎం లక్ష్మానాయక్, ఉద్యాన శాఖ అధికారి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. తగ్గిన ఎండుమిర్చి ధర హిందూపురం అర్బన్: ఎండుమిర్చి ధర కాస్త తగ్గింది. స్థానిక వ్యవసాయ మార్కెట్‌కు మంగళవారం 82.40 క్వింటాళ్ల ఎండుమిర్చి రాగా, అధికారులు ఈ–నామ్ పద్ధతిలో వేలం పాట నిర్వహించారు. ఇందులో మొదటి రకం ఎండుమిర్చి క్వింటా రూ. 13 వేలు, రెండో రకం రూ.8 వేలు, మూడో రకం రూ.7 వేల ప్రకారం ధర పలికినట్లు మార్కెట్ కార్యదర్శి జి. చంద్రమౌళి తెలిపారు. గత వారంతో పోలిస్తే క్వింటాపై ఎండుమిర్చి రూ.1,200 మేర తగ్గింది. నెలాఖరు వరకూ ఆ ప్యాసింజర్ రైళ్లు తిరగవ్! గుంతకల్లు: కుంభమేళాకి వెళ్లిన ప్యాసింజర్ రైళ్లు తిరిగి గుంతకల్లు డివిజన్ చేరుకునేందుకు ఈ నెలాఖరు వరకూ సమయం పడుతుందని డివిజన్ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో తిరుపతి–కదిరిదేవరపల్లి (57405) ప్యాసింజర్ రద్దును ఈ నెల 30 వరకూ పొడిగించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా కదిరిదేవరపల్లి–తిరుపతి (57406) ప్యాసింజర్‌ను ఈ నెల 31 వరకు, గుంతకల్లు–తిరుపతి (57404) ప్యాసింజర్ 30 వరకు, తిరుపతి–గుంతకల్లు (57403) ప్యాసింజర్ ఈ నెల 31 వరకు తిరగవన్నారు. తిరుపతి–హుబ్లీ (57401) ప్యాసింజర్‌ను ఈ నెల 15 వరకు, హుబ్లీ–తిరుపతి ప్యాసింజర్ రద్దును ఈ నెల 16 వరకూ పొడిగించినట్లు వెల్లడించారు. -
226
జిల్లాలోని ప్రాథమికోన్నత పాఠశాలలుఆకలితో ఉన్నాం.. పచ్చడి మెతుకులు పెట్టమంటే... ఆర్నెల్లు ఆగు బిర్యానీ పెడతానన్నట్లుగా ఉంది కూటమి సర్కార్ తీరు. గ్రామంలో ఇంటికి సమీపంలో ఉన్న పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించమని అడుగుతుంటే...పంచాయతీకో ‘మోడల్ ప్రైమరీ స్కూల్’ అంటూ అరచేతిలో వైకుంఠం చూపుతోంది. 50 మందిలోపు ఉన్న ప్రాథమిక పాఠశాలలను విలీనం చేసేందుకు సిద్ధమైంది. అదే జరిగితే ఆయా గ్రామాల్లోని విద్యార్థులు చదువుకునేందుకు కి.మీ దూరంలోని పాఠశాలకు రోజూ పాదయాత్ర చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది.కూటమి ప్రభుత్వం మోడల్ ప్రైమరీ పాఠశాలల ఏర్పాటు పేరుతో ప్రాథమిక పాఠశాలలను నిర్వీర్యం చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈ విధానానికి స్వస్తి చెప్పకపోతే ప్రజాగ్రహం చవిచూడాల్సి వస్తుంది. పంచాయతీకో మోడల్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు వల్ల 50 మందిలోపు విద్యార్థులున్న ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు మూతపడతాయి. అలా కాకుండా 50 మంది విద్యార్థులకంటే అధికంగా ఉన్న అన్ని పాఠశాలలను మోడల్ స్కూళ్లుగా మార్చాలి. – పీవీ రమణారెడ్డి, వైఎస్సార్‌టీఏ జిల్లా అధ్యక్షుడు ప్రభుత్వం పంచాయతీకో మోడల్ స్కూల్ ఏర్పాటు చేసే ప్రతిపాదన విరమించుకోకపోతే విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. మోడల్ స్కూళ్ల ఏర్పాటు పేరుతో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు, విద్యార్థుల తల్లిదండ్రులతో బలవంతంగా తీర్మానాలు చేయించటం సరైంది కాదు. విద్యార్థుల ఇబ్బందులు పట్టించుకోకుండా ప్రభుత్వం మొండిగా పాఠశాలల విలీనంపై ముందుకు వెళితే ఆందోళన తీవ్రతరం చేస్తాం. – శెట్టిపి జయచంద్రారెడ్డి, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడుబుక్కపట్నం మండలం బుచ్చయ్యగారిపల్లి పంచాయతీ పరిధిలోని జానకంపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రస్తుతం 21 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ ఇద్దరు టీచర్లు ఉన్నారు. ప్రభుత్వం ‘మోడల్ ప్రైమరీ స్కూళ్ల’ ఏర్పాటుకు సిద్ధం కాగా, నిబంధనల మేరకు 50 మందికిపైగా విద్యార్థులున్న బుచ్చయ్యగారిపల్లి పాఠశాలను ‘మోడల్ స్కూల్’గా మారుస్తారు. అంతేకాకుండా జానకంపల్లి ప్రాథమిక పాఠశాలను ‘మోడల్’లో విలీనం చేస్తారు. దీంతో ప్రస్తుతం జానకంపల్లి స్కూల్లో ఉన్న విద్యార్థులు 4 కి.మీ దూరంలోని బుచ్చయ్యగారిపల్లి ‘మోడల్ స్కూల్’కు నడిచి వెళ్లాలి. లేదా బుక్కపట్నంలోని పాఠశాలకు వెళ్లాల్సి ఉంటుంది. ● చెన్నేకొత్తపల్లి మండలం న్యామద్దలలో మోడల్ ప్రైమరీ పాఠశాల ఏర్పాటు చేస్తే ఆ పంచాయతీలోని హరియాన్‌చెరువు, చిన్నపల్లి పాఠశాలలు మూతపడే ప్రమాదం ఉంది. ఆయా పాఠశాలల్లోని విద్యార్థులు 2 నుంచి 4 కిలోమీటర్ల మేర దూరం నడుచుకుంటూ న్యామద్దలకు రావాల్సి వస్తుంది. ... ఇలా ‘మోడల్ ప్రైమరీ’ స్కూళ్ల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలలు మూసివేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించింది. ప్రభుత్వం అనుకున్న ప్రకారం జరిగితే నిరుపేద విద్యార్థులకు విద్య అందని ద్రాక్షగా మారనుంది. పుట్టపర్తి: వైఎస్ జగన్ సర్కార్ ‘నాడు– నేడు’తో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దితే...కూటమి సర్కార్ ప్రభుత్వ పాఠశాలల మూతకు రంగం సిద్ధం చేస్తోంది. మోడల్ ప్రైమరీ పాఠశాలల ఏర్పాటు పేరుతో పంచాయతీలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను మూసి వేసేందుకు కుట్ర పన్నుతోంది. ఇప్పటికే దీనిపై ప్రభుత్వం పెద్ద ఎత్తున కసరత్తు ప్రారంభించింది. జిల్లాలో మోడల్ ప్రైమరీ స్కూళ్లు ఏర్పాటు చేస్తే 1,527 ప్రైమరీ పాఠశాలల మనుగడ ప్రశ్నార్థకం కానుంది. పేద విద్యార్థులకు చదువు దూరం చేసే కుట్ర వైఎస్ జగన్ ప్రభుత్వం పేద విద్యార్థులు ప్రభుత్వ బడులలో చదివేందుకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందించింది. పాఠశాలలను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దిడంతో పాటు ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టింది. అంతేకాకుండా ‘జగనన్న విద్యాకానుక’ పేరుతో నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, యూనిఫాం, బ్యాగ్, షూ, టై తదితర వాటినన్నీ అందించింది. అలాగే ‘జగనన్న అమ్మఒడి’ పేరుతో ఏటా రూ.15 వేల ఆర్థిక సాయం అందిస్తూ పేదింట చదువుల వెలుగులు ప్రసరించేలా చేసింది. దీంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ‘డ్రాపౌట్’ల సంఖ్య భారీగా తగ్గింది. కానీ కూటమి సర్కార్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. కార్పొరేట్‌కు కొమ్ముకాస్తూ ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేసేందుకు సిద్ధమైంది. ఇందుకోసం మోడల్ ప్రైమరీ పాఠశాలలు అంటూ కొత్త ఎత్తుగడ వేసింది. పంచాయతీకో మోడల్ ప్రైమరీ పాఠశాల ఏర్పాటు చేస్తే జిల్లాలో 1,527 ప్రైమరీ స్కూళ్లపై తీవ్ర ప్రభావం చూపనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పాఠశాలకు తాళం తప్పదా? పంచాయతీకో మోడల్ ప్రైమరీ పాఠశాల ఏర్పాటు చేయటం వల్ల ఆయా పంచాయతీల్లోని మిగిలిన పాఠశాలలు మూతపడనున్నాయి. ఇప్పటికే ఈ మేరకు విద్యాశాఖ స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఓ పంచాయతీ పరిధిలో రెండు, మూడు గ్రామాలు ఉంటాయి. పంచాయతీ కేంద్రానికి ఆయా గ్రామాలకు కనీసంగా 3 నుంచి 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అందువల్లే గత ప్రభుత్వాలు ప్రతి గ్రామంలోనూ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేశాయి. కానీ కూటమి ప్రభుత్వం ‘మోడల్ ప్రైమరీ పాఠశాల’ పేరుతో గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలలను మూసివేసేందుకు సిద్ధమైంది. బలవంతంగా తీర్మానాలు మోడల్ ప్రైమరీ స్కూళ్ల ఏర్పాటు కోసం మిగిలిన పాఠశాలల్లోని స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలతో బలవంతంగా తీర్మానాలు చేయించుకునే కార్యక్రమానికి విద్యాశాఖ అధికారులు శ్రీకారం చుట్టారు. ఇలా చేయటం వల్ల విద్యార్థులు మైళ్ల దూరం నడిచి ఇతర గ్రామాలకు వెళ్లి చదువుకోవాల్సి వస్తోందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాలల విలీనానికి వ్యతిరేకంగా ఇప్పటికే జిల్లాలోని చెన్నేకొత్తపల్లి మండలం న్యామద్దెలలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. విలీనం చేయొద్దని పాఠశాల ముందు నినాదాలు చేశారు.విలీనం చేయొద్దు ఉద్యమం తప్పదు మోడల్ ప్రైమరీ పాఠశాలల ఏర్పాటు పేరుతో స్కూళ్ల కుదింపు పంచాయతీల్లోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల విలీనం జిల్లాలో 1,527 ప్రాథమిక పాఠశాలల మూత? తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులు41,524 ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు15,465 మంది ప్రాథమికోన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు 1,527 ప్రాథమిక పాఠశాలలు -
ఎంపీపీ ఆది భూ అక్రమాలపై విచారణ చేపట్టాలి
ధర్మవరం: నిరుపేద గిరిజనులు, ఎస్సీలు సాగు చేసుకుంటున్న వందలాది ఎకరాలను ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ ఆక్రమించారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ అన్నారు. తాను ఆక్రమించిన భూములను బంధువుల పేరిట ఆన్లైన్ చేసుకుని ప్రభుత్వ ఫలాలు పొందుతున్న ఆది భూ అక్రమాలపై సీనియర్ ఐఏఎస్ అధికారితో విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. మంగళవారం ముదిగుబ్బ మండల పరిఽధిలోని అడవి బ్రాహ్మణపల్లి గ్రామంలో సీపీఐ నాయకులు పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ చేతిలో మోసపోయిన బాధితులు తమ సమస్యలు చెబుతూ సీపీఐ నాయకుల ఎదుట కంటతడి పెట్టారు. తాము తాతల కాలం నుంచి భూములు సాగు చేసుకుంటున్నామని, అప్పట్లో ప్రభుత్వం తమకు పట్టాదారు పాసుపుస్తకాలు సైతం మంజూరు చేసిందన్నారు. కానీ వన్‌బీ, ఆడంగల్లో మాత్రం ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ తన బంధువుల పేర్లు ఎక్కించుకుని తమకు అన్యాయం చేశారన్నారు. స్పందించిన రామకృష్ణ... ఎంపీపీ ఆది నారాయణ యాదవ్ భూఆక్రమణలతో నష్టపోయిన నిరుపేద గిరిజన, ఎస్సీలకు న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామన్నారు. మండలంలో 400 ఎకరాల దాకా ఎంపీపీ చేతిలో భూములు ఉన్నాయని, ఆదినారాయణ యాదవ్ అమాయక రైతులకు అన్యాయం చేస్తుంటే మంత్రి సత్యకుమార్ మౌనం వహించడం ఆశ్చర్యమేస్తోందన్నారు. ధర్మవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా, రాష్ట్రానికి మంత్రిగా ఉన్న సత్యకుమార్ సొంత నియోజకవర్గంలో ఉన్న బాధితులకు న్యాయం చేయడంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈనెల 7న రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను కలిసి బాధితులకు న్యాయం చేసి భూయాజమాన్య హక్కులు కల్పించేలాగా చర్యలు చేపట్టాలని కోరతామన్నారు. అప్పటికీ ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటమయ్య, చేనేత సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకా చలపతి, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు, రవి, రమణ, శ్రీరాములు, సంతోష్‌కుమార్, బండల వెంకటేశ్, లక్ష్మీనారాయణ, వెంకటనారాయణ, వెంకటస్వామి, శ్రీనివాసులు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. గిరిజనులు, ఎస్సీల భూములు ఆక్రమించి అన్యాయం చేశారు బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతాం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ -
రంజాన్ మాసంలో మద్యం తాగొద్దన్నందుకు...
బత్తలపల్లి: ‘పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష ఉండక పోయినా పర్వాలేదు. మద్యం మాత్రం తాగొద్దు’ అని కుటుంబసభ్యులు చెప్పడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... బత్తలపల్లికి చెందిన షేక్ జిలాన్ సాహెబ్ కుమారుడు షేక్ మహబూబ్ బాషా(30)కు భార్య భానుబేగం, నాలుగేళ్ల వయసున్న కుమారుడు ఉన్నారు. బత్తలపల్లి కూడలిలో పాన్‌షాపు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసైన మహబూబ్‌బాషా రోజూ వ్యాపారం ముగించుకుని ఫుల్‌గా మద్యం సేవించి ఇంటికి చేరుకునేవాడు. ఆ సమయంలో కుటుంబసభ్యులు నిలదీస్తే భార్యతో గొడవపడేవాడు. మద్యం తాగొద్దంటే తాను చనిపోతానని బెదిరించేవాడు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి ఆలస్యంగా ఇంటికి చేరుకున్న మహబూబ్‌బాషాను భోజనానికి రావాలని భార్య పిలిచింది. అయితే తనకు భోజనం వద్దని తాను మద్యం తాగి వచ్చినట్లుగా తెలిపాడు. దీంతో అసహనానికి గురైన భార్య ‘నీవు మారవు. మా బతుకులు ఇంతే. కనీసం రంజాన్ మాసంలోనైనా ఉపవాస దీక్ష లేకపోయినా పర్వాలేదు... మద్యం మాత్రం తాగొద్దు’ అంటూ హితవు పలికి, ఏడుస్తున్న తన నాలుగేళ్ల వయసున్న కుమారుడిని ఎత్తుకుని సముదాయిస్తూ ఇంటి బయటకు వచ్చింది. ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న మహబూబ్ బాషా.. తన కుమారుడి కోసం ఊయలగా వేసిన చీరతో ఉరి వేసుకున్నాడు. అదే సమయంలో ఇంట్లోకి వచ్చిన భానుబేగం కేకలు వేస్తూ ఎదిరింట్లో ఉన్న అత్తామామలను అప్రమత్తం చేసింది. కుటుంబసభ్యులందరూ కలసి మహబూబ్ బాషాను కిందకు దించి ఆర్డీటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మహబూబ్‌బాషా మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
వేసవి జాగ్రత్తలపై ప్రజలను చైతన్యపరచండి
● డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజాబేగం చెన్నేకొత్తపల్లి: ప్రస్తుత వేసవిలో ఎండ ప్రభావం తీవ్రంగా ఉండనుండడంతో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను చైతన్య పరచాలని వైద్య, ఆరోగ్య సిబ్బందిని డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజాబేగం ఆదేశించారు. మంగళవారం సీకేపల్లిలో ఆమె పర్యటించారు. మురుగునీరు నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం ఎన్ఎస్గేట్లోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. సిబ్బంది వివరాలు, మందుల నిల్వలపై ఆరా తీశారు. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఎలా చేస్తున్నారంటూ వైద్యాధికారి డాక్టర్ రవినాయక్‌ను అడిగి తెలుసుకున్నారు. పీహెచ్సీలో ప్రసవాల సంఖ్య పెరగాలన్నారు. రాత్రి సమయాల్లో రోగులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ప్రాణాలు బలిగొన్న మద్యం అమడగూరు: మద్యం సేవించిన కాసేపటికే ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన మేరకు... అమడగూరు మండలం జేకేపల్లికి చెందిన గుడిసిపలిల గంగులప్ప (55) మంగళవారం ఉదయం గ్రామంలోని బెల్టుషాపులో మద్యం బాటిల్ కొనుగోలు చేసి అక్కడే తాగాడు. కాసేపటి తర్వాత అపస్మారకస్థితికి చేరుకోవడంతో బెల్ట్‌షాపు నిర్వాహకుడి సమాచారంతో కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. అప్పటికే మరణించినట్లు నిర్ధారించుకుని బోరున విలపించారు. కాగా, అతిగా మద్యం సేవించి మృతి చెందాడా? లేదా కల్తీ మద్యం ప్రభావంతో మరణించాడా? అనే అనుమానాలు స్థానికుల నుంచి వ్యక్తమయ్యాయి. దుకాణం దగ్ధం తనకల్లు: మండలంలోని ఏనుగుగుండుతండాలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ కిరాణా దుకాణం దగ్ధమైంది. తండాకు చెందిన రమణానాయక్ మంగళవారం తన కిరాణా దుకాణానికి తాళం వేసి బోరు బావి వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో దుకాణంలో షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకుని నిప్పు రవ్వలు ఎగిసి పడి మంటలు వ్యాపించాయి. దుకాణంలో నుండి దట్టమైన పొగ బయటకు వస్తుండడంతో గమనించిన స్థానికుల సమాచారంతో రమణానాయక్ అక్కడకు చేరుకున్నాడు. స్థానికుల సాయంతో తలుపులను బద్దలుగొట్టి మంటలను ఆర్పి వేశారు. ఇతరులకు ఇచ్చేందుకు దుకాణంలోని ఓ పెట్టెలో ఉంచిన రూ. 3 లక్షల నగదుతో పాటు రూ.లక్ష విలువైన సరుకులు కాలిపోయాయి. -
ప్రేమ తెచ్చిన తంటా... జైలుపాలైన విద్యార్థి
రాప్తాడు రూరల్: ప్రియురాలిపై హత్యాయత్నం చేసిన కేసులో ఎస్కేయూ పీజీ విద్యార్థి జైలు పాలయ్యాడు. ఇటుకలపల్లి పోలీసులు తెలిపిన మేరకు... గార్లదిన్నె మండలానికి చెందిన కురుబ బ్యాళ్ల విష్ణువర్దన్ ఎస్కేయూలో ఎంఎల్ఐసీ చదువుతున్నాడు. ఈ క్రమంలో ఎస్కేయూలో బీటెక్ చేస్తున్న అనంతపురం రూరల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో పరిచయమై, ప్రేమకు దారితీసింది. ఇద్దరూ సన్నిహితంగా ఉన్న సమయంలో ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. కొంత కాలంగా ఆమె స్వగ్రామానికి చెందిన మరో యువకుడితో చనువుగా ఉంటోందన్న అనుమానంతో విష్ణువర్దన్ రగిలిపోయాడు. ఫిబ్రవరి 27న యువతిని ఓ గదికి తీసుకెళ్లి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా వారిద్దరూ చనువుగా ఉన్న సమయంలో తీసుకున్న ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశాడు. ఘటనకు సంబంధించి బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఇటుకలపల్లి పోలీసులు... అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశులు నేతృత్వంలో దర్యాప్తు వేగవంతం చేశారు. మంగళవారం ఉదయం పూలకుంట గ్రామ శివారులోని కురుబ తిమ్మప్పస్వామి గుడి వద్ద తచ్చాడుతున్న నిందితుడు బ్యాళ్ల విష్ణువర్దన్‌ను గుర్తించి అరెస్ట్ చేశారు. అతడి నుంచి ఓ ద్విచక్ర వాహనంతో పాటు మూడు సెల్ఫోన్లు, ఫొటోలు, వీడియోలు ఉన్న పెన్‌డ్రైవ్ స్వాధీనం చేసుకుని, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. -
ఇంగ్లిష్ పరీక్షకు 514 మంది గైర్హాజరు
పుట్టపర్తి: జిల్లాలోని 42 కేంద్రాల్లో మంగళవారం నిర్వహించిన ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం ఇంగ్లిష్ పరీక్షకు 514 మంది విద్యార్థులు గైర్హాజయ్యారు. జనరల్ విద్యార్థులు 12,162 మంది పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా, 11,749 మంది, ఒకే షనల్ కోర్సులకు సంబంధించి 1,696 మందికిగానూ 1,595 మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ మేరకు ఇంటర్మీడియెట్ జిల్లా విద్యాశాఖాధికారి రఘునాథరెడ్డి తెలిపారు. కలుషిత నీరు తాగి గొర్రెల మృతి బ్రహ్మసముద్రం: కలుషిత నీరు తాగి 24 గొర్రెలు మృతి చెందాయి. వివరాలు.. బ్రహ్మసముద్రం మండలం కన్నేపల్లి పంచాయతీ ముద్దలాపురం గ్రామానికి చెందిన ఎరికల రామన్న... గొర్రెలను మేపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజు లాగే మంగళవారం జీవాలను మేపునకు తోలుకెళ్లాడు. మధ్యాహ్నం సమీపంలోని తోటలో మొక్కజొన్న పంటకు డ్రిప్ ద్వారా వదిలేందుకు యూరియా కలిపిన నీటిని గొర్రెలు తాగాయి. కాసేపటి తర్వాత ఒకదాని వెనుక ఒకటి చొప్పున మృతి చెందాయి. సమాచారం అందుకున్న పశువైద్యాధికారులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. కలుషిత నీరు తాగడం వల్లనే గొర్రెలు మృతి చెందినట్లుగా నిర్ధారించారు. ఘటనతో రూ.2 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోయాడు. -
లోక్ అదాలత్‌లో కేసుల పరిష్కారానికి చొరవ తీసుకోండి
● ఎస్పీ రత్న ఆదేశంపుట్టపర్తి టౌన్: ఈ నెల 8న జరిగే జాతీయ మెగా లోక్‌అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా చొరవ తీసుకోవాలని సిబ్బందిని ఎస్పీ రత్న ఆదేశించారు. మంగళవారం డీపీఓ నుంచి వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో ఆమె మాట్లాడారు. రాజీ చేయదగిన క్రిమినల్, సివిల్, రోడ్డు ప్రమాదాలు, కుటుంబ తగాదాలకు సంబంధించిన కేసుల్లో ఇరుపక్షాల సమ్మతితో వారి కేసులను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కువ కేసుల పరిష్కారానికి చొరవ తీసుకున్న సిబ్బందికి ప్రోత్సాహాకాలు అందజేస్తామన్నారు. జూదరుల అరెస్ట్ కదిరి అర్బన్: మండలంలోని ముత్యాలచెరువు వద్ద పేకాట ఆడుతున్న ఆరుగురుని అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.1,05,500 నగదు, రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు కదిరి రూరల్ అప్‌గ్రేడ్ స్టేషన్ సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. అందిన సమాచారం మేరకు మంగళవారం తనిఖీలు చేపట్టి జూదరులను అరెస్ట్ చేసినట్లు వివరించారు. రైలు ఢీకొని వ్యక్తి మృతి హిందూపురం అర్బన్: స్థానిక సత్యనారాయణ పేటకు చెందిన ఇంద్రనాథ్గుప్తా (55) హిందూపురం రైల్వే స్టేషన్లో ఒకట ప్లాట్‌ఫారమ్ నుంచి రెండో ప్లాట్‌ఫారమ్ వైపుగా పట్టాలు దాటుతుండగా బెంగళూరు నుంచి వస్తున్న వందే భారత్ రైలు ఢీకొని మృతి చెందాడు. మంగళవారం సాయంత్రం 5.10 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. బరువు ఎక్కువగా ఉన్న ఆయన ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఎక్కలేక పట్టాలు దాటే ప్రయత్నం చేశాడు. ఆయనకు భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. వృద్ధుడి ఆత్మహత్య హిందూపురం: మండలంలోని దేవరపల్లి గ్రామానికి చెందిన బి.అంజినప్ప(60) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... గ్రామానికి చెందిన అంజినప్ప వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. రోజూ తన రేషం షెడ్డు వద్ద పడుకునేవాడు. ఈ క్రమంలోనే ఒంటరి తనాన్ని తాళలేక మంగళవారం రేషం షెడ్డులోనే పైకప్పునకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న హిందూపురం రూరల్ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కర్ణాటక మద్యం స్వాధీనంహిందూపురం టౌన్: హిందూపురం ఎకై ్సజ్‌స్టేషన్ పరిధిలో దాడులు చేసి కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్ సీఐ లక్ష్మీదుర్గయ్య తెలిపారు. మంగళవారం ఎకై ్సజ్ పోలీస్‌స్టేషన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. పోచనపల్లి నుంచి హిందూపురానికి వెళ్లే రహదారిలో పెన్నా నది బ్రిడ్జి వద్ద మంగళవారం చాకలికుంటకు చెందిన రాకేష్ వద్ద నుంచి 11 బాక్సుల్లోని 1059 టెట్రాప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశామన్నారు. -
నెలాఖరులోపు టార్గెట్ పూర్తి కావాలి
అనంతపురం అగ్రికల్చర్: నెలాఖరులోపు నిర్ధేశిత లక్ష్యాలను చేరుకోవాలని మార్కెటింగ్ శాఖ అధికారులను ఆ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ) సి.రామాంజినేయులు ఆదేశించారు. జిల్లాకు వచ్చిన ఆయన మంగళవారం స్థానిక మార్కెటింగ్‌శాఖ కార్యాలయంలో రెండు జిల్లాల ఏడీఎంలు పి.సత్యనారాయణచౌదరి, ఎల్ఎన్ మూర్తితో కలసి మార్కెట్ కమిటీ ఆదాయ వనరులపై సెక్రటరీలు, సూపర్వైజర్లతో సమీక్షించారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫీజు వసూళ్లలో రెండు జిల్లాలు నిర్దేశించిన శాతానికన్నా ఎక్కువ ప్రగతి సాధించాలన్నారు. అనంతపురం జిల్లాలో ఈ ఏడాది రూ.12.06 కోట్లకు గానూ 82 శాతంతో రూ. 9.97 కోట్లు, శ్రీసత్యసాయి జిల్లాలో రూ.5.31 కోట్లకు గానూ 82 శాతంతో రూ.4.37 కోట్లు సాధించినట్లు తెలిపారు. రాప్తాడు, ఉరవకొండ, గుంతకల్లు, ధర్మవరం, హిందూపురం కమిటీలు వెనుకబడినందున ఆర్థిక సంవత్సరం ముగిసే ఈ 25 రోజుల్లో ప్రత్యేక దృష్టి సారించి లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. పశువులు, జీవాలు, మిరప, చింతపండు, చీనీ మార్కెట్లలో లీకేజీలు అరికట్టాలని, రెన్యువల్స్, గోదాముల అద్దెలు పూర్తి స్థాయిలో వసూలు చేయాలని ఆదేశించారు. మార్కెట్ కమిటీల్లో ఇతర అభివృద్ధి కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే 2025–26కు సంబంధించి బడ్జెట్ ప్రతిపాదనలు తయారు చేసి పంపాలన్నారు. ఈ ఏడాది కన్నా వచ్చే ఏడాదికి టార్గెట్లు పెంచుకుని లక్ష్య సాధనకు గట్టిగా పనిచేయాలని సూచించారు. మార్కెటింగ్‌శాఖ ఆర్జేడీ రామాంజినేయులు ఆదేశం -
పీజీ తెలుగు పాఠ్యాంశంగా ‘తడియారని స్వప్పం’
అనంతపురం: ప్రముఖ కవి లోసారి సుధాకర్ రచించిన ‘తడియారని స్వప్నం’ కవితా సంపుటిని ఎస్కేయూ ఎంఏ తెలుగు కోర్సులో పాఠ్యాంశంగా చేర్చారు. 2025–26 విద్యాసంవత్సరం నుంచి 2027–28 విద్యా సంవత్సరం వరకూ ఈ పాఠ్యాంశం ఉంటుంది. ఈయన ప్రస్తుతం విజయవాడ ఏసీబీ అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్నారు. ఆయన రచించిన మొదటి కావ్యం ‘మైనపు బొమ్మలు’ సైతం ఎస్కేయూతో పాటు యోగివేమన వర్సిటీ, రాయలసీమ విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు పాఠ్యాంశంగా చేర్చిన విషయం తెలిసిందే. తడియారని స్వప్నం కవితా సంపుటిలో వస్తు వైవిధ్యం, సామాజిక స్పృహ, సీ్త్ర దృక్కోణం, దళిత స్పృహ అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. కాగా, శ్రీసత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం కర్ణాటక నాగేపల్లికి చెందిన లోసారి సుధాకర్ ఎస్కేయూలో 1990–92 బ్యాచ్‌లో ఎంఏ పొలిటికల్ సైన్సెస్ పూర్తి చేశారు. పొలిటికల్ సైన్సెస్ చదివినప్పటికీ, తెలుగు సాహిత్యం, కవిత్వంపై మంచి పట్టు ఉంది. అనేక కవిత్వాలు, గ్రంథాలు రచించారు. -
ఇదెక్కడి నవోదయం?!
కదిరి అర్బన్: ప్రతి కార్యక్రమానికి రెండు కోణాలు ఉంటాయని పెద్దలు అంటుంటారు. అలాగే నవోదయం 2.0 కార్యక్రమానికి రెండో కోణం కదిరిలో బహిర్గతమైంది. మంగళవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో నవోదయ 2.0 సమావేశం ఏర్పాటు చేశారు. నాలుగు గోడల మధ్య అధికారులందరూ సమావేశమై నాటుసారా అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. అయితే అదే సమయంలో సమావేశం జరుగుతున్న భవనానికి కూతవేటు దూరంలో కొందరు ఫుల్‌గా నాటుసారా సేవించి రోడ్డు పక్కనే మత్తులో పడిపోయారు. మరికొందరు తూలుతూ వాహనాల కిందపడి గాయాలపాలయ్యారు. ఇదంతా గమనించిన పలువురు ‘అయ్య బాబోయ్ ఇదెక్కడి నవోదయం’ అంటూ చర్చించుకోవడం గమనార్హం. -
ఆగ్రో ఫాం ముసుగులో అడ్డగోలు దందా
లేపాక్షి: రియల్ ఎస్టేట్ వ్యాపారులు బరి తెగిస్తున్నారు. సంపాదనే లక్ష్యంగా ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే యథేచ్ఛగా వ్యాపారం చేస్తున్నారు. అగ్రి ఫాం (వ్యవసాయ క్షేత్రం) ముసుగులో ‘రియల్’ దందా నడుపుతున్నారు. ఇలాంటి బాగోతమే తాజాగా లేపాక్షి మండలం చోళసముద్రంలో వెలుగు చూసింది. ప్రభుత్వ నిబంధనలేవీ పాటించకుండా, అధికారుల నుంచి అనుమతులు లేకుండా రిసార్ట్ ఏర్పాటు చేశారు. దీన్ని మంగళవారం తనిఖీ చేసిన తహసీల్దార్ సౌజన్యలక్ష్మి అక్కడి వ్యవహారం చూసి కంగుతిని.. రిసార్ట్ యజమానికి నోటీసులు జారీ చేశారు. ఆగ్రో ఫాం అంటూ... లేపాక్షికి సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో కొడికొండ– శిర మార్గంలో చోళసముద్రం గ్రామ సర్వే నంబర్ 333–9లో మొత్తం 14 ఎకరాల భూమిలో నింబస్ గ్రూప్ ఆధ్వర్యంలో ‘నంది ఫాం రిసార్ట్’ ఏర్పాటు చేశారు. ఇందులో 51 సెంట్ల విస్తీర్ణంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా, ల్యాండ్ కన్వర్షన్ కూడా చేసుకోకుండానే క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, పార్టీ హాల్, పార్కింగ్ ఏరియా, వసతి గదులను అధునాతనంగా నిర్మించారు. మిగిలిన భూమిలో కూడా కన్వర్షన్ లేకుండానే రోడ్లు, ప్రహరీలు, లైటింగ్స్ ఏర్పాటు చేశారు. ప్లాట్లుగా విభజించి విక్రయాలు వ్యవసాయ భూమిని కొనుగోలు చేసిన రియల్టర్ ల్యాండ్ కన్వర్షన్ లేకుండానే 25 నుంచి 50 సెంట్ల వరకు విస్తీర్ణంలో ప్లాట్లు ఏర్పాటు చేసి విక్రయాలు సాగిస్తున్నారు. ప్లాటు విస్తీర్ణాన్ని బట్టి రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల దాకా విక్రయిస్తున్నారు. బెంగళూరు, ఇతర ప్రాంతాలకు చెందిన ఉద్యోగులు, వ్యాపారులు ఇక్కడ ప్లాట్లు కొనుగోలు చేస్తున్నారు. వ్యవసాయ భూమిగానే చూపుతూ రిజిస్టర్ చేయిస్తుండడంతో కొనుగోలుదారులు ప్రభుత్వ పథకాలకు సైతం అర్హత పొందుతున్నారు. రిసార్ట్ ఏర్పాటులో నిబంధనలేవీ పాటించకపోవడంతో తహసీల్దార్ సౌజన్యలక్ష్మి నోటీసులు అందజేశారు. వెంటనే వివరణ ఇవ్వాలని యాజమాన్యాన్ని ఆదేశించారు. ‘నంది ఫాం రిసార్టు’లో నిబంధనల ఉల్లంఘన అనుమతులు లేకుండానే నిర్మాణాలు నోటీసులు జారీ చేసిన తహసీల్దార్ -
హెంజేరు.. భక్తజనహోరు
‘ఓం నమఃశివాయ’ అన్న పంచాక్షరీ మంత్రం ప్రతిధ్వనించింది. ఓంకార నాదం మార్మోగింది. ‘సిద్ధేశ్వరస్వామికి జై’ అంటూ భక్తకోటి చేసిన నినాదం హోరెత్తింది. శివనామస్మరణ మధ్య హేమావతి గ్రామంలో వెలిసిన హెంజేరు సిద్ధేశ్వరస్వామి బ్రహ్మరథోత్సవం సోమవారం రమణీయంగా సాగింది. ఉత్సవాల్లో భాగంగా అర్చకులు ఉదయం సుప్రభాతసేవ, రుద్రాభిషేకం తదితర పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి మేళతాళాలతో తీసుకువచ్చి రథంపై కొలువుదీర్చారు. ఓంకారనాదం చేస్తూ రథాన్ని ముందుకులాగారు. ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు కర్ణాటక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన జనం రథంపైకి అరటిపండ్లు, బెల్లం, పూలు, మిరియాలు విసిరి మొక్కులు చెల్లించుకున్నారు. కర్ణాటక నుంచి వచ్చిన గురువులు చేసిన ‘వీరగాసే’ నృత్యం ఆకట్టుకుంది. – హేమావతి (అమరాపురం): వైభవంగా సిద్ధేశ్వరస్వామి బ్రహ్మరథోత్సవం -
మాట తప్పడం చంద్రబాబు నైజం
పరిగి: ‘‘మోసం..నమ్మక ద్రోహం..మాట తప్పడం.. చంద్రబాబు నైజం. అందుకే ఆయన ఇచ్చిన హామీలేవీ అమలు చేయరు’’ అని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ ధ్వజమెత్తారు. సోమవారం ఆమె మండలంలోని ఊటుకూరులో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, చంద్రబాబు విధానాలను తప్పుబట్టారు. నిరుపేదల సంక్షేమంపై చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ‘సూపర్ సిక్స్’ హామీల అమలుకు బడ్జెట్లో నిధులు కేటాయించేవారన్నారు. అలవిగాని హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావడం...ఆ తర్వాత అధికారమిచ్చిన ప్రజలను అష్టకష్టాలు పెట్టడం చంద్రబాబుకు కొత్తేమీకాదన్నారు. పింఛన్లను చూపుతూ ప్రచార ఆర్భాటం తప్ప.. కూటమి సర్కార్ 9 నెలల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. గత వైఎస్సార్ సీపీ హయాంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల కాలంలోనే 90 శాతం హామీలు అమలు చేశారని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించారని గుర్తు చేశారు. అర్హతే ప్రామాణికంగా కుల, మత, రాజకీయాలకు అతీతంగా వైఎస్సార్ సీపీ సర్కార్ నిరుపేదలందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయగా... ప్రస్తుత సీఎం చంద్రబాబు మాత్రం ‘‘వైఎస్సార్ సీపీ వాళ్లకు మేలు చేస్తే పాముకు పాలు పోసినట్టే’’ అని వ్యాఖ్యానించడం దురదృష్టకరమన్నారు. నాడు జగనన్న మంచి చేశారు కాబట్టే నేడు గ్రామాల్లో వైఎస్సార్సీపీ శ్రేణులు కాలరు ఎగరేసుకుంటూ తిరుగుతున్నారన్నారు. జనం కూడా జగనన్న పాలనను మెచ్చుకుంటున్నారన్నారు. అన్యాయం జరిగితే సహించం.. సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందించాలని ఉషశ్రీచరణ్ డిమాండ్ చేశారు. చంద్రబాబు చెప్పినట్లు వైఎస్సార్ సీపీ మద్దతుదారులకు అన్యాయం చేయాలని చూస్తే రోడ్డెక్కి పోరాడతామన్నారు. అర్హత ఆధారంగా నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందించాల్సిందేనన్నారు. పవన్, పురంధేశ్వరి ప్రశ్నించరా..? ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చానంటున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. నిరుపేదలకు అన్యాయం జరిగితే సహించబోమంటూ ప్రగల్భాలు పలికిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కూటమి సర్కార్ వైఫల్యంపై ఎందుకు ప్రశ్నించడం లేదని ఉషశ్రీచరణ్ మండిపడ్డారు. గద్దెనెక్కి 9 నెలలు గడిచినా హామీలు అమలుకు ముందుకు రాని చంద్రబాబును వారు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారో ప్రజలకు చెప్పాలన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ నరసింహమూర్తి, సర్పంచ్ దిలీప్, ఎంపీటీసీ సభ్యురాలు అమరావతి, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ‘సూపర్‌సిక్స్’కు బడ్జెట్లో కేటాయింపులు శూన్యం అర్హులకు సంక్షేమ పథకాలు అందకపోతే రోడ్డెక్కుతాం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ -
బాలింత మృతి
● డాక్టర్ నిర్లక్ష్యమే కారణమని బంధువుల ఆరోపణ హిందూపురం టౌన్: పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన బాలింత కొద్ది గంటల్లోనే మృతి చెందగా, వైద్యుల నిర్లక్ష్యమే కారణంటూ బంధువులు ఆరోపించారు. మృతురాలి భర్త హరి తెలిపిన వివరాల మేరకు...పట్టణంలోని సూరప్ప కట్ట ప్రాంతానికి చెందిన ప్రీతి(25) ఈ నెల 1వ తేదీన ప్రసవ నొప్పులతో హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. డాక్టర్ నీరజ ఆమెను పరీక్షించి సిజేరియన్ చేశారు. ప్రీతి మగశిశువుకు జన్మనివ్వగా కుటుంబీకులంతా ఆనంద పడ్డారు. అయితే సిజేరియన్ తర్వాత ప్రీతికి రక్తస్రావం ఎక్కువగా జరిగి ప్లేట్ లెట్స్ తగ్గిపోయాయి. దీంతో డాక్టర్ నీరజ అనంతపురం రెఫర్ చేశారు. ఆ సమయంలో 108 అందుబాటులో లేకపోవడంతో.. ప్రైవేటు అంబులెన్సులో ప్రీతిని బంధువులు అనంతపురం సర్వజనాస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న ప్రీతి 2వ తేదీన మధ్యాహ్నం మృతి చెందింది. అయితే డాక్టర్ నీరజ నిర్లక్ష్యం వల్లే తన భార్య చనిపోయిందని ప్రీతి భర్త హరి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం హిందూపురం ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు మౌఖికంగా ఫిర్యాదు చేశారు. అంత్యక్రియల తర్వాత ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. దీనిపై డాక్టర్ నీరజను వివరణ కోరగా.... సిజేరియన్ సమయంలో ప్రీతికి రక్తస్రావం జరిగి ప్లేట్లెట్లు తగ్గిపోయాయన్నారు. దీంతో స్థానికంగా ప్లేట్లెట్స్ అందించడానికి అవకాశం లేకపోవడంతో అనంతపురానికి రెఫర్ చేశామన్నారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందిందని తెలిపారు. వైద్యసేవల్లో ఎలాంటి నిర్లక్ష్యమూ వహించలేదన్నారు. -
నిలకడగా చింతపండు ధరలు
హిందూపురం అర్బన్: మార్కెట్లో చింతపండు ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. స్థానిక వ్యవసాయ మార్కెట్‌కు సోమవారం 1,390 క్వింటాళ్ల చింతపండు రాగా, అధికారులు ఈ–నామ్ పద్ధతిలో వేలం పాట నిర్వహించారు. ఇందులో కరిపులి రకం చింతపండు క్వింటా గరిష్టంగా రూ.30 వేలు, కనిష్టంగా రూ.8 వేలు, సగటున రూ.18 వేల ప్రకారం ధర పలికింది. ఇక ప్లవర్ రకం చింతపండు క్వింటా గరిష్టంగా రూ. 13 వేలు, కనిష్టంగా రూ.4,500, సగటున రూ. 6,500 ప్రకారం క్రయవిక్రయాలు సాగినట్లు మార్కెట్ కార్యదర్శి జి. చంద్రమౌళి తెలిపారు. మార్కెట్లో చింత పండు ధరలు నిలకడగా కొనసాగుతుండటంతో చిరు వ్యాపారులు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ ఇంటర్ పరీక్షలు ప్రారంభం ● తొలిరోజు 214 మంది గైర్హాజరు పుట్టపర్తి: ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు లాంగ్వేజ్ పేపర్–2 పరీక్ష 42 కేంద్రాల్లో నిర్వహించారు. ఒకేషనల్, జనరల్ విభాగాల్లో 214 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరైనట్లు ఇంటర్మీడియెట్ విద్య జిల్లా అధికారి రఘునాథరెడ్డి తెలిపారు. జనరల్ విద్యార్థులు 9,256 మంది గాను 9,080 మంది హాజరయ్యారు. అలాగే ఒకేషనల్ కోర్సులకు సంబంధించి 1,141 మందికి గాను 1,103 మంది మాత్రమే హాజరయ్యారు. రెండు విభాగాల్లోనూ కలిపి 214 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ‘పచ్చ’ పైశాచికం! ● వివాహితను వేధించిన టీడీపీ నాయకుడు, కేసు నమోదు పెనుకొండ రూరల్: వివాహితను వేధించడంతో పాటు అసభ్యంగా ప్రవర్తించిన టీడీపీ నాయకుడితో పాటు అతని తల్లి, భార్యపై ‘కియా’ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ రాజేష్ తెలిపిన వివరాల మేరకు... మండలంలోని వెంకటగిరి పాళ్యం గ్రామానికి చెందిన వివాహిత ఆదివారం మధ్యాహ్నం ఇంటి ఎదుట దుస్తులు ఉతుక్కుంటుండగా... అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు వడ్డి మంజునాఽథ్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె కేకలు వేయగా అక్కడి నుంచి పారిపోయాడు. ఆయితే మంజునాథ్ గ్రామం వదలి వెళ్లేందుకు సదరు వివాహితనే కారణమంటూ మంజునాథ్ తల్లి, భార్య ఇతర కుటుంబ సభ్యులు వివాహితపై దాడి చేశారు. దీంతో బాధితురాలు ‘కియా’ పోలీసులకు ఫిర్యాదు చేయగా...మంజునాథ్‌తో పాటు అతని తల్లి, భార్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజేష్ తెలిపారు. -
నాణ్యమైన పరిష్కారం చూపకపోతే చర్యలు
ప్రశాంతి నిలయం: ‘‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో అందే అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలి. అధికారులు తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటే.. అర్జీ దారు మళ్లీ పీజీఆర్ఎస్కు వస్తారు. అందువల్ల ప్రతి అర్జీకి నాణ్యమైన పరిష్కారం చూపాలి. ఏ సమస్యపై అయినా అర్జీ రీఓపెన్ అయితే సంబంధిత శాఖ అధికారిపై చర్యలు తీసుకుంటాం’’ అని కలెక్టర్ టీఎస్ చేతన్ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లోని ‘పీజీఆర్ఎస్’ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యలపై ప్రజల నుంచి 246 అర్జీలు అందగా, కలెక్టర్ పలువురి నుంచి అర్జీలు స్వీకరించారు. ఎక్కువగా సామాజిక ిపింఛన్లు, ఇంటి పట్టాలు, భూ సమస్యలపై అర్జీలు అందాయి. అనంతరం అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలకు అధికారులు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. అర్జీలు పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. రోజూ అన్ని శాఖల అధికారులు పీజీఆర్ఎస్ ద్వారా వచ్చిన అర్జీల స్థితి గతులను పరిశీలిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డీఆర్ఓ విజయ సారథి, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, పరిశ్రమల శాఖ జీఎం నాగరాజు, పట్టు పరిశ్రమ శాఖ జేడీ పద్మావతి, ఏపీఎంఐపీ పీడీ సుదర్శన్, సీపీఓ విజయ్‌కుమార్, డ్వామా పీడీ విజయేంద్ర ప్రసాద్, ల్యాండ్ సర్వే ఏడీఈ విజయశాంతి బాయి, ఎల్డీఎం రమణకుమార్, ఉద్యాన శాఖ అధికారి చంద్రశేఖర్, మత్స్యశాఖ అధికారి చంద్రశేఖర్ రెడ్డి, డీసీహెచ్ఎస్ డాక్టర్ తిప్పేంద్రనాయక్, డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజా బేగం, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శివరంగ ప్రసాద్, గిరిజన సంక్షేమ అధికారి మోహన్ రావు, గ్రామ/వార్డు సచివాలయాల నోడల్ అధికారి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. లేపాక్షిలో భూఆక్రమణకు అడ్డుకట్ట వేయండి ప్రపంచ ప్రసిద్ధి చెందిన లేపాక్షి వీరభద్ర స్వామి దేవాలయం తూర్పు ద్వారం ఎదురుగా 396 సర్వే నంబర్లోని ప్రభుత్వ భూమిని కొందరు అక్రమించి భవన నిర్మాణం చేపట్టారని హిందూపురానికి చెందిన నాగరాజు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. భూ ఆక్రమణపై లేపాక్షి తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ భూమిని కాపాడాలని ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీ సమర్పించారు. స్పందించిన కలెక్టర్... వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. ‘పీజీఆర్ఎస్’లో అందే అర్జీలు పునరావృతం కాకూడదు అధికారులను హెచ్చరించిన కలెక్టర్ టీఎస్ చేతన్ -
ఆటో బోల్తా – మహిళ మృతి
ముదిగుబ్బ: ఆటో బోల్తాపడిన ఘటనలో ఓ ప్రయాణికురాలు మృతి చెందింది. ముదిగుబ్బ మండలం సంకేపల్లి క్రాస్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సోమవారం ఉదయం ప్రయాణికులతో కదిరికి వెళుతున్న ఆటో సంకేపల్లి క్రాస్ వద్దకు చేరుకోగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది. ఆటోలో ప్రయాణిస్తున్న గుర్తు తెలియని మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. కాగా, మృతురాలు కదిరిలో ఉన్న తన కుమార్తెను చూసేందుకు వచ్చినట్టుగా తమతో చెప్పినట్లు పోలీసులకు తోటి ప్రయాణికులు తెలిపారు. తొలుత గుర్తు తెలియని మహిళ మృతిగా ముదిగుబ్బ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే గంటల వ్యవధిలోనే మృతురాలిని అనంతపురానికి చెందిన జల్లా భారతి(45)గా గుర్తించారు. కదిరిలో ఉన్న తన కుమార్తె జల్లా ఉదయలక్ష్మిని చూసేందుకు వచ్చిన ఆమె తిరిగి అనంతపురానికి వెళ్తుండగా ప్రమాదంలో మృతి చెందినట్లుగా పోలీసులు నిర్ధారించారు. కనికరం లేని చంద్రబాబు ● అర్హులైన పేదలకు ఇంటి పట్టాలు పంపిణీ చేయాలి ●● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశాంతి నిలయం: గద్దెనెక్కి ఎనిమిది నెలలు గడుస్తున్నా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క నిరుపేదకూ కూటమి ప్రభుత్వం ఇంటి పట్టా ఇచ్చిన పాపాన పోలేదని, పేదల ఇంటి పట్టాలపై ముఖ్య మంత్రి చంద్రబాబుకు కనికరం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ట మండిపడ్డారు. జిల్లాలో అర్హులైన నిరుపేదలకు వెంటనే ఇంటి పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సత్యమ్మ దేవాలయం నుంచి వేలాది మంది పేదలతో కలసి ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకుని ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతి నిరుపేదకు ఇంటి స్థలంతో పాటు రూ.4 లక్షలతో ఇంటిని నిర్మించి ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీనిచ్చారని గుర్తు చేశారు. ఎనిమిది నెలల గడుస్తున్నా ఇప్పటికీ ఆ హామీపై నోరు మెదపడం లేదన్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం మేల్కొని వెంటనే పేదల ఇంటి పట్టాల మంజూరుకు చర్యలు తీసుకోవాలని, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల చొప్పున స్థలాన్ని మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు చెల్లించాలన్నారు. టిడ్కో గృహ నిర్మాణాలను పూర్తి చేసి లబ్దిదారులకు అందజేయాలన్నారు. జిల్లాలో పేదల స్థలాలు కొల్లగొట్టడంపై ఉన్న శ్రద్ధ వారికి భూములు పంచడంపై చూపడం లేదని మండిపడ్డారు. మంత్రి సత్యకుమార్ అనుచరుడు, ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ వ్యవహారమే ఇందుకు నిదర్శనమన్నారు. ఆదినారాయణ యాదవ్ కబ్జా చేసిన పేదల భూములను త్వరలో సీపీఐ ఆధ్వర్యంలో ఆక్రమించుకుంటామన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీఓ సువర్ణకు అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రామచంద్రయ్య, జగదీష్, సీపీఐ అనుబంధ సంఘాల నాయకులు దుర్గా భవానీ, ఆవుల శేఖర్, కాటమయ్య, తదితరులు పాల్గొన్నారు. -
చెవులను రక్షించుకోవాలి
పుట్టపర్తి టౌన్: విపరీతమైన శబ్దాల నుంచి చెవులను రక్షించుకోవాలని, చెవికి సంబంధించిన అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే చికిత్స చేయించుకోవాలని కలెక్టర్ టీఎస్ చేతన్, జిల్లా వైధ్యాధికారి ఫైరోజా బేగం పేర్కొన్నారు. ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా సోమవారం పుట్టపర్తిలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కలెక్టర టీఎస్ చేతన్, డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజా బేగం ముఖ్య అతిథులుగా హాజరై, ర్యాలీని ప్రారంభించారు. ఎనుములపల్లి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నుంచి గణేష్ కూడలి వరకూ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. పిల్లలు, వృధ్ధులు వినికిడి లోపాలకు గురవుతుంటారని, ఎక్కువ శబ్దాలు వినడం వలన సమస్యలు ఉత్పన్నమవుతుంటాయన్నారు. వినికిడి లోపాలు ఉన్నవారికి కాక్లియర్ ఇంప్లాంట్ లాంటి శస్త్ర చికిత్సలు అందుబాటులో ఉన్నాయన్నారు. ముఖ్యంగా పిల్లల్లో వినికిడి లోపాలు ఉంటే త్వరగా గుర్తించి చికిత్స చేయించాలన్నారు. చెవుల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. కార్యక్రమంలో ఆర్బీఎస్కే ప్రోగ్రాం అధికారి డాక్టర్ నివేదిత, లెప్రసీ అధికారి తిప్పయ్య, డిప్యూటీ డీఎంహచ్ఓ డాక్టర్ సునీల్, పీహెచ్సీ సిబ్బంది పాల్గొన్నారు కలెక్టర్ టీఎస్ చేతన్ -
అప్పుల బాధతో యువరైతు ఆత్మహత్య
రొద్దం: అప్పులు తీర్చకపోతే గ్రామంలో పరువు పోతుందని భావించిన ఓ యువరైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాలు... రొద్దం మండలం పెద్దకోడిపల్లి గ్రామానికి చెందిన బోయ వంశీ (28)కు భార్య కుమారి, ఇద్దరు కుమారులు ఉన్నారు. తన తండ్రి పేరుతో ఉన్న 6 ఎకరాల పొలాన్ని సాగు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో పంటల సాగు, ఇతర అవసరాల కోసం ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద రూ 5 లక్షల అప్పుతో పాటు, తన భార్య బంగారు నగలు బ్యాంక్‌లో తాకట్టు పెట్టి మరో రూ 2 లక్షల రుణం తీసుకున్నాడు. అయితే పంటలు సక్రమంగా పండక పోవడంతో అప్పులు తీర్చలేక పోయాడు. దీంతో వడ్డీల భారం పెరిగి అప్పులు రూ.10 లక్షలకు చేరుకున్నాయి. ఈ క్రమంలో అప్పులు తీర్చలేకపోతే గ్రామంలో తలెత్తుకుని తిరగలేమన్న మనోవేదనకు లోనైన వంశీ... సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పైకప్పునకు తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కూలి పనులకు వెళ్లిన భార్య మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇంటికి చేరుకుని తలుపు తట్టినా లోపల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చి కిటికిలో నుంచి చూసింది. విగతజీవిగా ఉరికి వేలాడుతున్న భర్తను చూసి గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకుని తలుపులు బద్ధలుగొట్టి లోపలకు ప్రవేశించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడు తండ్రి నరసింహప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. వివాహిత ఆత్మహత్య తనకల్లు: మండలంలోని పెద్దపల్లికి చెందిన శాంతమ్మ (30) ఆత్మహత్య చేసుకుంది. చింతామణి తాలూకా రామాపురం గ్రామానికి చెందిన శాంతమ్మకు 15 సంవత్సరాల క్రితం పెద్దపల్లికి చెందిన వెంకటేష్‌తో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాగా, ఆమె ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. -
‘పోలీసు స్పందన’కు 44 వినతులు
పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 44 వినతులు అందాయి. ఎస్పీ రత్న స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని వాటి పరిష్కారానికి చట్టపరిధిలో చొరవ తీసుకోవాలని సంబంధిత ఎస్హెచ్ఓలను ఆదేశించారు. కార్యక్రమంలో మహిళా పీఎస్ డీఎస్పీ ఆదినారాయణ, లీగల్ అడ్వైజర్ సాయినాథ్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. దళిత, గిరిజన ఉద్యోగులపై కక్ష సాధింపులు మానాలి ● ఏపీ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జయరామ్ పుట్టపర్తి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దళిత, గిరిజన ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్‌కుమార్ సస్పెన్షనే ఇందుకు నిదర్శమని ఏపీ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కటిక జయరామ్ మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సహజ న్యాయ సూత్రాలను కూటమి సర్కార్ తుంగలో తొక్కుతోందని విమర్శించారు.అనుమతి లేకుండా విదేశీ పర్యటన చేసినందుకు సునీల్‌కుమార్‌ను సస్పెండ్ చేసినట్లు ప్రభుత్వం చెప్పుకోవడం సబబు కాదన్నారు. సునీల్‌కుమార్ తన సొంత ఖర్చులతోనే అమెరికా పర్యటనకు వెళ్లారని, ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. దీనిపై కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఆయనపై చర్యలు తీసుకోవడం కుట్రలో భాగంగానే అర్థమవుతోందన్నారు. వెనుకబడిన కులాలకు చెందిన పలువురు ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగులకు పోస్టింగ్‌లు కల్పించక పోవడం కూటమి ప్రభుత్వ కక్ష సాధింపులకు పరాకాష్టగా పేర్కొన్నారు. ఇప్పటికై నా దళిత, గిరిజన ఉద్యోగులపై కక్ష సాధింపులు మానకపోతే కూటమి ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. -
తాగునీటి ఎద్దడి తలెత్తకూడదు
ప్రశాంతి నిలయం: వేసవిలో జిల్లాలో ఎక్కడా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం ప్రతి ఎంపీడీఓ కార్యాలయంలోనూ కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టరేట్ నుంచి అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఈఓఆర్డీలు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాగునీటి సరఫరా, ఉపాధి హామీ పనులు, ఎంఎస్ఎంఈ సర్వే తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... తాగునీటి పైప్లైన్లను తనిఖీ చేయాలన్నారు. వేసవి నేపథ్యంలో రానున్న మూడు నెలలూ నీటి ఎద్దుడి తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. బోరు బావులు, చేతి పంపులను మరమ్మతులు చేపట్టాలన్నారు. ఎంఎస్ఎంఈ సర్వే వేగవంతం చేయాలన్నారు. సమీక్షలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డీఆర్ఓ విజయ సారథి, జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల అధికారులు పాల్గొన్నారు. -
దొంగ బంగారం కలకలం
హిందూపురం అర్బన్: స్థానిక బంగారు దుకాణాల్లో సోమవారం కర్ణాటక పోలీసులు తనిఖీలు చేపట్టారు. కర్ణాటకలోని చిత్రదుర్గలో దొంగలించిన బంగారాన్ని హిందూపురంలోని రెండు దుకాణాల్లో విక్రయించినట్లుగా పట్టుబడిన నిందితుడి సమాచారం మేరకు ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిసింది. అయితే ఎంత బంగారం దొంగలించారు? ఎవరు కొన్నారు? అనే వివరాలు వెల్లడించేందుకు కర్ణాటక పోలీసులు విముఖత వ్యక్తం చేశారు. హెచ్ఎం సెల్‌ఫోన్ చోరీ పెనుకొండ: బస్సు ఎక్కబోతున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడి వద్ద నుంచి సెల్‌ఫోన్‌ను దుండగులు అపహరించారు. వివరాలు... రొద్దం మండలం పెదకోడిపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం హరినాయక్ సోమవారం మధ్యాహ్నం పాఠశాలకు సెలవు పెట్టి అనంతపురం వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో పెనుకొండలోని అంబేడ్కర్ సర్కిల్ వద్ద ప్రైవేట్ బస్సును ఎక్కుతున్న సమయంలో ఓ యువకుడు ఆయన జేబులోని సెల్‌ఫోన్‌ను అపహరించాడు. విషయాన్ని పసిగట్టిన హెచ్ఎం వెంటనే ఆ యువకుడిని పట్టుకోవడంతో స్థానికులు చుట్టుముట్టి సెల్‌ఫోన్ గురించి ఆరా తీశారు. యువకుడు తనకు తెలియదని బుకాయించాడు. దీంతో సదరు యువకుడిని ఆటోలో పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. స్టేషన్ వద్ద ఆటో దిగిన యువకుడు అందరినీ పక్కకు తోసి ఒక్కసారి శ్రీరాములయ్య కాలనీ వైపు ఉడాయించి తప్పించుకున్నాడు. బాధిత హెచ్ఎం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
ఇది పూర్తిగా వంక ప్రాంతం
రాప్తాడు రూరల్: అనంతపురం నగరం చుట్టూ భూములకు విపరీతమైన ధరలు రావడంతో తెలుగుదేశం పార్టీ చోటా నాయకులుగా చెలామణి అవుతున్న కొందరు ప్రభుత్వ భూములపై కన్నేశారు. అధికారం ఉందనే ఽధైర్యంతో రెచ్చిపోతున్నారు. పైసా పెట్టుబడి లేకుండా అప్పనంగా రూ. లక్షలు సంపాదించాలంటే ప్రభుత్వ భూములు కబ్జా చేయడమే మార్గంగా ఎంచుకున్నారు. ఇందులో భాగంగానే 20 ఏళ్ల కిందట ఓపెన్ స్థలాలుగా వదిలిన వాటిని దర్జాగా ఆక్రమించేస్తున్నారు. అనంతపురం రూరల్ మండలం కురుగుంట సమీపంలోని మటన్ మార్కెట్ కాలనీ (ఇందిరమ్మకాలనీ)లో ఆక్రమణే ఇందుకు ఉదాహరణ. నాలుగు రోజుల క్రితం రంగంలోకి తమ్ముళ్లు కురుగుంట పొలం సర్వే నంబర్ 83–11, 12లో దాదాపు 20 ఏళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ అర్బన్ హౌసింగ్ స్కీమ్ కింద 178 పాట్లు మంజూరు చేసింది. ఇందులో గుడి, పార్క్ కోసం వేర్వేరు ప్రాంతాల్లో స్థలాలను వదిలి పెట్టారు. అప్పటి నుంచి ఈ స్థలాలు ఖాళీగానే ఉన్నాయి. ఇక్కడ సెంటు ధర రూ.3 లక్షలకు పైగా పలుకుతోంది. గుడి కోసం వదిలిన దాదాపు 22 సెంట్ల స్థలంపై కన్నేసిన టీడీపీ చోటా నాయకులు వెంటనే రంగంలోకి దిగి బండలు నాటించేస్తున్నారు. సెంటున్నర ప్రకారం 15 ఇళ్ల నిర్మాణాలకు స్కెచ్ వేశారు. బరితెగించి కబ్జా చేస్తుండడం వెనుక కనగానపల్లి మండలానికి చెందిన ఓ టీడీపీ నాయకుడి హస్తమున్నట్లు విశ్వసనీయ సమాచారం. తన వాటాగా లక్షలాది రూపాయలను ఆయన ముందుగానే తీసుకుని అభయం ఇవ్వడంతో చోటా నాయకులు మరింత రెచ్చిపోయారు. వంకను కుదించి.. చదును చేసి.. కురుగుంట పొలం సర్వే నంబర్ 83–11, 12కు సమీపంలోనే సర్వే నంబరు 89లో రెవెన్యూ రికార్డులలోని డైక్లాట్ ప్రకారం తడకలేరు వంక స్థలంగా గుర్తింపు ఉంది. ప్రస్తుతం ఈ వంక స్థలాన్ని సైతం కబ్జా చేసి పేదలకు అమ్మకానికి పెట్టారు. వర్షాకాలం వస్తే ఈ వంక ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఉపరితల ప్రాంతాల నుంచి వచ్చే వరద ప్రవాహాన్ని తట్టుకోలేక సమీప కాలనీలన్నీ మునిగిపోయిన సందర్భాలూ చాలా ఉన్నాయి. ఇలాంటి వంకను సైతం ఆక్రమించి ఆనకట్టలా మట్టితో నిర్మించి దాని పక్కనే ఇళ్ల స్థలాల కోసం బండలు నాటుతున్నారు. ‘డబ్బు కొట్టు–స్థలం పట్టు’ అన్న చందంగా పేదల నుంచి డబ్బు వసూళ్లు చేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోతే భవిష్యత్తులో పండమేరు వాగులో కాలనీలకు కాలనీలు మునిగిపోయిన ఘటన ఇక్కడ కూడా పునరావృతం అయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అది ప్రజాప్రయోజనాల స్థలం ఇందిరమ్మ అర్బన్ హౌసింగ్ స్కీమ్ కింద ఏర్పాటైన కాలనీలో ప్రజాప్రయోజనాల కోసం కొంత స్థలాన్ని వదిలారు. గుడి కోసం వదిలిన స్థలంలో కొందరు బండలు నాటుతున్న విషయం తెలుసుకుని పనులు నిలబెట్టాలని చెప్పాం. తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లి సర్వే చేయించి ప్రభుత్వ స్థలమంతా హద్దులు నాటి బోర్డులు ఏర్పాటు చేస్తాం. – చరణ్, పంచాయతీ కార్యదర్శి, కురుగుంటసర్వే నంబరు 89 అనేది పూర్తి వంక ప్రాంతం. ఈ ప్రాంతాన్ని చదును చేసి బండలు నాటుతున్నట్లుగా తెలియడంతో అక్కడికెళ్లి పనులు అడ్డుకున్నాం. ఎవరైనా మొండిగా బండలు నాటించాలని చూస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తాం. ఈ విషయాన్ని తహసీల్దార్ దృష్టికీ తీసుకెళ్లాను. – రామకృష్ణ, వీఆర్వో -
వివాహేతర సంబంధంతోనే హత్య
పుట్టపర్తి టౌన్: వివాహేతర సంబంధంపై మోజు ఓ వ్యక్తిని దారుణంగా పొట్టనబెట్టుకుంది. ప్రియుడితో కలసి భర్తను హతమార్చిన భార్యను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సోమవారం ఉదయం పుట్టపర్తి డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను డీఎస్పీ విజయ్‌కుమార్ వెల్లడించారు. ఈ నెల 1న హత్య.. బుక్కపట్నం మండలం కొత్తకోటకు చెందిన చియ్యేడు గంగన్న కుటుంబం సుమారు 15 ఏళ్ల క్రితం వెంగళమ్మచెరువులో స్థిరపడింది. గంగన్న కుమారుడు చియ్యేడు నగేష్(35) సొంతంగా ట్రాక్టర్ పెట్టుకొని బాడుగలకు తిప్పడంతోపాటు బేల్దారి పనులకు వెళ్లేవాడు. శుక్రవారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన అతడు తిరిగిరాలేదు. స్థానిక షిర్డీ సాయిబాబా ఆలయం సమీపంలోని వెంకటేషు మామిడి తోటలో శనివారం సాయంత్రం నగేష్ మృతదేహాన్ని గుర్తించిన పశువుల కాపరుల సమాచారంతో కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకుని బోరునవిలపించారు. విషయం తెలుసుకున్న పుట్టపర్తి రూరల్ ఎస్ఐ లింగన్న సిబ్బందితో కలసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ రప్పించి ఆధారాల కోసం గాలింపు చేపట్టారు. మృతుడి భార్య సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. మృతదేహం పక్కన మద్యం బాటిళ్లు పడి ఉండటంతో మద్యం మత్తులో గొడవ జరిగి హత్యకు గురయ్యాడా లేదా అక్రమ సంబంధం నేపథ్యంలో ఘటన జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగింది. మిస్టరీ వీడిందిలా... సీసీటీవీ ఫుటేజీల్లో అదే గ్రామానికి చెందిన దివాకర్ అనే వ్యక్తి నగేష్‌ను తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని వెళ్లినట్లుగా ఫుటేజీలు లభ్యం కావడంతో పోలీసులు ఆ దిశగా విచారణ వేగవంతం చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. నగేష్ ఇంటికి దివాకర్ తరచూ రాకపోకలు సాగిస్తుండేవాడు. ఈ క్రమంలో నగేష్ భార్య సునీతతో ఏర్పడిన చనువు కాస్త వివాహేతర సంబంధంగా మార్చుకున్నాడు. వీరిద్దరూ రోజూ గంటల తరబడి వీడియో కాల్లో మాట్లాడుకుంటుండడం గమనించిన నగేష్ పలుమార్లు తన భార్యను మందలించాడు. దీంతో నగేష్‌ను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ప్రియుడు దివాకర్‌తో కలసి సునీత పథకం వేసింది. ఇందులో భాగంగానే ఈ నెల 1న నగేష్‌ను నమ్మించి మందు పార్టీ చేసుకుందామంటూ ద్విచక్ర వాహనంపై దివాకర్ పిలుచుకుని వెళ్లాడు. కర్ణాటక నాగేపల్లి శివారున ఉన్న మద్యం దుకాణంలో రెండు బాటిళ్ల మద్యం కొనుగోలుచేసి వీరాంజనేయపల్లి గ్రామ శివారన ఉన్న వెంకటేష్ మామిడి తోటలోకి వెళ్లారు. అక్కడ నగేష్‌తో ఫుల్‌గా మద్యం తాపించి అనంతరం తాను తెచ్చుకున్న కొడవలితో దాడి చేసి హతమార్చాడు. నిందితులను సోమవారం వారి ఇంటి వద్దనే పోలీసులు అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. హత్య కేసులో మిస్టరీని ఛేదించి, నిందితులను అరెస్ట్‌లో చొరవ చూపిన సీఐ సురేష్, ఎస్ఐలు లింగన్న, కృష్ణమూర్తితో పాటు సిబ్బందిని ఎస్పీ రత్న అభినందించారు. ప్రియుడితో కలసి భర్తను హతమార్చిన భార్య నిందితుల అరెస్ట్ వివరాలు వెట్టడించిన డీఎస్పీ విజయకుమార్ -
ఉలవ రైతు నిలువు దోపిడీ
నల్లమాడ: ఉలవ రైతు నిలువు దోపిడీకి గురవుతున్నాడు. ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తున్నామంటూనే ఆ పంట దిగుబడులను కూటమి ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు సంకట స్థితిని ఎదుర్కొంటున్నారు. గతేడాది రబీలో ప్రత్యామ్నాయ పంటగా రైతులు ఉలవ పంట సాగుచేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పంట నూరి్పడి చేసి దిగుబడిని అమ్మేందుకు రైతులు సిద్ధమయ్యారు. అయితే కూటమి ప్రభుత్వం ఉలవకు మద్దతు ప్రకటించకపోగా కొనుగోలు సైతం చేయకపోవడంతో రైతులు బహిరంగ మార్కెట్లో దళారులను ఆశ్రయించి మోసపోవాల్సిన దుస్థితి నెలకొంది. పెరిగిన సాగు విస్తీర్ణం ప్రధాన వేరుశనగ పంట వల్ల పెద్దగా లాభం లేకపోగా పంట సాగు ఖర్చు తక్కువగా ఉండటం, కలుపు తీయడం, మందులు పిచికారీ చేసే అవసరం లేకపోవడంతో ఉలవ పంట సాగుపై రైతులు దృష్టి సారించారు. సబ్సిడీపై విత్తనం కూడా సరఫరా చేయడంతో గతంలో కంటే రబీ సీజన్లో ఉలవ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. పుట్టపర్తి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో దాదాపు 13,606 ఎకరాల్లో రైతులు ఉలవ పంట సాగు చేసినట్లు అధికారుల అంచనా. ఉలవను కొనుగోలు చేయని ప్రభుత్వం రైతు సంక్షేమ తమ ధ్యేయమంటూ బాకా ఊదుతున్న కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు ఉలవకు మద్దతు ధర ప్రకటించకపోగా కొనుగోలు ప్రయత్నం కూడా చేయలేదు. ఉలవ పంట నమోదు (ఈ క్రాప్ బుకింగ్) చేసినా ఎలాంటి ప్రయోజనం లేదని రైతన్నలు నిట్టూరుస్తున్నారు. దీంతో గిట్టుబాటు ధర కోసం రైతులు ఉలవలను సంచుల్లో పోసి ఇళ్లలో నిల్వ చేయడం ప్రతి గ్రామంలోనూ కన్పిస్తోంది. నెలల తరబడి ఉలవలు అలాగే నిల్వ ఉంచితే పురుగులు పడి పాడైపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. బహిరంగ మార్కెట్లో నిలువుదోపిడీ ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో క్వింటా ఉలవలు రూ.3,500 నుంచి రూ.3,700 వరకు ధర పలుకుతోంది. అయితే నాణ్యత లోపించిందని, తేమ శాతం ఎక్కువగా ఉందని సాకులు చూపిపారులు ఒక క్వింటాకు ఎనిమిది నుంచి 10 కిలోల ఉలవలను అదనంగా తీసుకుంపలువురు రైతులు వాపోతున్నారు. ఉలవ పంట సాగుకు ఒక ఎకరాకు రూ.10 వేలు పెట్టుబడి పెట్టారు. ఎకరాకు మూడు క్వింటాళ్లు దిగుబడి రావడంతో బహిరంగ మార్కెట్లో విక్రయిస్తే తమకు మిగిలేదేమీ ఉండదని రైతన్నట్లు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి ఉంటే క్వింటా రూ.4 వేలకుపైగా ధర లభించేదని చెబుతున్నారు. ఉలవలు కొనుగోలు చేయాలి ఉలవకు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో బహిరంగ మార్కెట్లో వ్యాపారులు అడిగిన ధరకు ఉలవలు అమ్ముకోవాల్సిన దుస్థితి వచ్చింది. ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తున్నామంటూ వాటి దిగుబడులను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం బాధాకరం. అన్ని విధాలుగా రైతుకు నష్టమే జరుగుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఉలవకు మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేయాలి. – ఎం. నరసింహులు, రైతు, దొన్నికోట, నల్లమాడ మండలంపంటను గొర్రెలకు వదిలేశా నేను ఐదెకరాల్లో ఉలవ పంట సాగుచేశా. ట్రాక్టర్‌తో సేద్యం, క్వింటా విత్తన ఉలవలకు రూ.10 వేలకు పైగా ఖర్చు వచ్చింది. పంట నూరి్పడికి వచ్చే సమయానికి మార్కెట్లో క్వింటా ఉలవ ధర రూ.3,500 పలుకుతోంది. నూరి్పడి ఖర్చులు అన్నీ కలిపితే ఏం గిట్టుబాటు కాదని భావించి పంటను గొర్రెలకు వదిలేశా. ప్రభుత్వం స్పందించి ఉలవ రైతులను ఆదుకోవాలి. –దేవళానాయక్, రైతు, గోపేపల్లి తండా, నల్లమాడ మండలం -
వరల్డ్ రికార్డులో రాయదుర్గానికి చోటు
రాయదుర్గంటౌన్: నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో రాయదుర్గానికి చోటు దక్కింది. శ్రీకళారాధన భరతనాట్య డ్యాన్స్ అకాడమీ 12వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం చిందనూరు కళ్యాణమంటపం వేదికగా సామూహిక లలితా సహస్ర నామ పారాయణం నిర్వహించారు. దాదాపు 200 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ మొత్తం ప్రక్రియను చైన్నె నుంచి విచ్చేసిన నోబెల్ బుక్ ఆఫ్ రికార్డు ప్రతినిధులు ప్రదీప్, హేమంత్ నాగరాజు రికార్డు చేశారు. 32 నిమిషాల 47 సెకన్లలో లలితా సహస్ర పారాయణాన్ని పఠించడం అంతర్జాతీయస్థాయిలో మొదటి సారి కావడం విశేషం. ఆధ్యాత్మిక గురువు, విప్రమలై లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ గౌరవాధ్యక్షుడు రామ్మూర్తిస్వామిజీ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి డ్యాన్స్ అకాడమీ టీచర్ జ్యోతి నగేష్, శ్వేతాపద్మని నేతృత్వం వహించారు. కో–ఆర్డినేటర్‌గా ఆల్ ఇండియా రేడియో అనౌన్సర్ లంకా ప్రసాద్ వ్యవహరించారు. కార్యక్రమం అనంతరం నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సర్టిఫికెట్‌ను నిర్వాహకులకు ప్రతినిధులు అందజేశారు. ముఖ్య అతిథులుగా వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి సతీమణి మెట్టు యశోదమ్మ, వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌని ఉపేంద్రరెడ్డి హాజరయ్యారు. -
దూసుకొచ్చిన మృత్యువు
‘నాన్నా.. అమ్మ ఎప్పుడొస్తుంది? నాకు లడ్డూ తెస్తోందా?’ అంటూ సరస్వతి రెండేళ్ల కుమార్తె జ్యోత్స్న అమాయకపు మాటలు విన్న ప్రతి ఒక్కరి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. మర్తాడు నుంచి ఒడిబియ్యం పోసుకుని తోబుట్టువులతో కలిసి రాయంపల్లిలోని మెట్టినింటికి వస్తున్న సరస్వతి రోడ్డు ప్రమాదంలో తన నాలుగు నెలల కూతురుతో పాటు మృతి చెందింది. వంటమాస్టర్ అయిన సతీష్ కాన్పు కోసం భార్య సరస్వతిని పుట్టింటికి పంపి.. పెద్ద కుమార్తె జ్యోత్స్నను తానే చూసుకునేవాడు. ఈ క్రమంలో ఆదివారం కుమార్తెను బంధువుల వద్ద ఉంచి కర్ణాటకలోని చేళ్లగురికిలో వంట పనికి వెళ్లాడు. ఇంటికి తిరిగొచ్చిన తర్వాత ‘ఈరోజు మీ అమ్మ, బుజ్జి పాప వస్తారు. నీకు లడ్డూ కూడా తెస్తారు’ అని కుమార్తెతో చెప్పాడు. అంతలోనే భార్య, చిన్నకుమార్తె మృతి చెందారన్న వార్తతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. తన రెండేళ్ల కుమార్తె ‘నాన్నా.. అమ్మ ఎక్కడ? నాకు లడ్డూ కావాలి’ అంటూ అమాయకంగా అడగడంతో ఏం సమాధానం చెప్పాలో తెలియక సతీష్ కన్నీరు మున్నీరుగా విలపించాడు. కూడేరు/గార్లదిన్నె/ఉరవకొండ: గార్లదిన్నె మండలం మర్తాడుకు చెందిన జంగం పార్వతమ్మ, బసవరాజు (లేట్) దంపతులకు లీలావతి(45), పుష్పావతి, యోగేశ్వరి(40), సరస్వతి(37) సంతానం. పెద్ద కుమార్తె లీలావతికి కళ్యాణదుర్గం మండలం అప్పిలేపల్లికి చెందిన శ్రీకంఠంతో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు అచ్యుత్ కుమార్ ఉన్నాడు. మణికంఠ అనంతపురం శివారులోని వడియం పేట ఆంజనేయస్వామి ఆలయంలో అర్చకుడిగా పని చేస్తూ అక్కడే జీవనం సాగిస్తున్నారు. రెండో కుమార్తె కుషావతికి వివాహమై మర్తాడులోనే ఉంటున్నారు. మూడో కుమార్తె యోగేశ్వరికి కళ్యాణదుర్గం మండలం పూలంపల్లికి చెందిన రుద్రేశ్వర్‌తో వివాహమైంది. వీరికి ఒక కూతురు ఉంది. యోగేశ్వరి ఇటీవల పుట్టింటికి వచ్చింది. ఇక చిన్న కుమార్తె సరస్వతికి ఉరవకొండ మండలం రాయంపల్లికి చెందిన సతీష్‌తో వివాహమైంది. ఈమె రెండో కాన్పు కోసం పుట్టింటికి వచ్చింది. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సరస్వతికి ఆదివారం మధ్యాహ్నం పుట్టింట్లో ఒడిబియ్యం పెట్టిన అనంతరం అత్తారింటిలో వదిలి పెట్టేందుకు అక్కలు లీలావతి, యోగేశ్వరి, లీలావతి కుమారుడు అచ్యుత్‌కుమార్‌తో కలిసి మర్తాడు నుంచి ఆటోలో రాయంపల్లికి బయల్దేరారు. ఇదిలా ఉండగా.. కళ్యాణదుర్గం, అనంతపురానికి చెందిన తరుణ్, యశ్వంత్, రంజిత్, మరో ఇద్దరు యువతులు పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని కారులో అనంతపురం వస్తున్నారు. కూడేరు మండలం బ్రాహ్మణపల్లి – కమ్మూరు మధ్య మలుపు వద్ద కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఆటోను వేగంగా ఢీకొంది. దీంతో ఆటో, కారు ముందు భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. ఆటోలో ఉన్న సరస్వతి తలకు, ముఖానికి బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. యోగేశ్వరి, లీలావతి, చంటి పాప, అచ్యుత్ కుమార్‌తో పాటు ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. కారులో ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో అందులోని వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. 108కి సమాచారం ఇచ్చినా.. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు 108కు సమాచారం ఇచ్చినా అంబులెన్స్ సకాలంలో రాలేదు. కొద్దిసేపటి తర్వాత సీఐ రాజు తన సిబ్బందితో అక్కడికి చేరుకుని క్షతగాత్రులను ప్రైవేటు వాహనాల్లో అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చంటి పాప, లీలావతి, యోగేశ్వరి మృతి చెందారు. అచ్యుత్ కుమార్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానికంగా ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. దీంతో బాధిత కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. పెద్ద కుమార్తె జ్యోత్స్న రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం మృతుల్లో ముగ్గురు అక్కాచెల్లెళ్లు, ఒక చంటిపాప ప్రసవమైన నాలుగు నెలల తర్వాత పుట్టింట్లో ఒడిబియ్యం పెట్టించుకున్న ఆమె.. అక్కలను తోడుగా తీసుకుని అత్తారింటికి ఆటోలో బయల్దేరింది. చంటిబిడ్డను ముద్దాడుకుంటూ.. కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా వెళుతున్న సమయంలో రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. కూడేరు మండలం బ్రాహ్మణపల్లి – కమ్మూరు మధ్య ఆదివారం ఆటోను కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు, నాలుగు నెలల చంటి పాప దుర్మరణం చెందారు. ఈ ఘటనతో మూడు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. -
సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు దుర్మార్గం
పరిగి: ‘కులం, మతం, ప్రాంతం, రాజకీయాలతో సంబంధం లేకుండా అర్హతే ప్రామాణికంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జగనన్న ఆధ్వర్యంలో అందరికీ సంక్షేమ ఫలాలు అందాయి. టీడీపీతో పాటు వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కూడా లబ్ధిపొందడం మనమందరమూ చూశాము. అయితే అందుకు విరుద్ధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తుండటం దుర్మార్గం’ అని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ విమర్శించారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల శ్రేణులను రెచ్చగొట్టేలా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులకు పనిచేయొద్దని ప్రజా వేదిక సాక్షిగా వ్యాఖ్యానించడం దురదృష్టకరమన్నారు. పరిగి మండలం ధనాపురంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలేనా ? గత శనివారం చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో నిర్వహించిన సభలో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో యావత్ రాష్ట్ర ప్రజానీకం సిగ్గుతో తలదించుకుంటున్నారని మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజాప్రతినిధులకు ఎలాంటి పని చేయకూడదని, ఒక వేళా చేస్తే పాముకు పాలు పోసినట్టేనని సాక్ష్యాత్తు సీఎం వ్యాఖ్యానించడందురదృష్టకరమన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున రాజ్యాంగబద్ధంగా, దేవుడిపై ప్రమాణం చేసి పక్షపాత ధోరణితో వ్యవహరించనని ప్రమాణం చేసిన విషయాన్ని అప్పుడే మర్చిపోయారా అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ వాళ్లకు పనులు చేయొద్దని సీఎం చంద్రబాబు చెప్పడం అటు అధికారులను, ఇటు కూటమి శ్రేణులను రెచ్చగొట్టడమేనన్నారు. ముఖ్యమంత్రిగా ఐదేళ్లు పరిపాలించిన వైఎస్ జగన్ ఏరోజైనా చంద్రబాబులాగా వ్యాఖ్యలు చేశారా? అని ధ్వజమెత్తారు. రాబోయే రోజుల్లో కేవలం కూటమి నాయకులకు, కార్యకర్తలకు మాత్రమే తమ ప్రభుత్వం పని చేస్తుందన్నది స్పష్టమైందన్నారు. సూపర్ సిక్స్ పథకాలను కేవలం తమ పార్టీ శ్రేణులకు అందించాలన్న దురుద్దేశాన్ని నింపుకుని మిగిలిన వారికి దక్కించవద్దని సూత్రప్రాయంగా చెప్పడం సబబుకాదన్నారు. ప్రశ్నిస్తామన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారంపై తన స్పందన తెలపాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని వెంటనే రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. వైఎస్సార్సీపీ వాళ్లకు పనిచేయొద్దని చెప్పడం శోచనీయం జగనన్న హయాంలో అందరికీ సంక్షేమ ఫలాలు అందించాం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ -
నేడు కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
ప్రశాంతి నిలయం: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ టీఎస్ చేతన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాస్థాయి అధికారులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో తెలియజేయవచ్చని తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో.. పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫెరెన్స్ హాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు ఎస్పీ వి.రత్న ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ ఆధార్‌కార్డును తప్పనిసరిగా వెంట తీసుకొనిరావాలన్నారు. ప్రజలు వివిధ సమస్యలపై నేరుగా ఫిర్యాదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. భూకబ్జాకు పాల్పడిన ముగ్గురి అరెస్ట్హిందూపురం: తప్పుడు పత్రాలు సృష్టించి భూమిని కొట్టేయాలని చూసిన ముగ్గురి అరెస్టు చేసినట్లు హిందూపురం రూరల్ సీఐ ఆంజనేయులు తెలిపారు. ఆయన వివరాలమేరకు... మండలంలోని సంతేబిదనూర్‌కు చెందిన ఎస్ఎన్.శివయ్య, హిందూపురం వాసవిఽ ధర్మశాలకు ఏరియాకు చెందిన ఆర్.భరత్, హిందూపురంలోని గాంఽధీనగర్‌కు చెందిన కె.ఫైరోజ్‌ఖాన్ మండలంలోని కిరికెర గ్రామంలో సర్వేనెంబర్ 243–2లోని ప్లాటు నంబరు 91కి సంబంధించి తప్పుడు పత్రాలు, ఆధార్‌కార్డులను సృష్టించారు. ఇందులో భాగంగానే ఆ భూమిని కబ్జా చేశారు. ఏకంగా ఇల్లు కట్టేందుకు ప్రయత్నించారు. అయితే ఆ భూమి అసలు యజమానురాలు, ముద్దిరెడ్డిపల్లికి చెందిన సువర్ణమ్మ ఆ భూమి తనదని వారితో వాదించినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో ఆమె పోలీసులకు అన్ని ఆధారాలను సమర్పించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి తప్పుడు పత్రాలతో మోసం చేసేందుకు ప్రయత్నించిన శివయ్య, భరత్, ఫైరోజ్‌ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. న్యాయమూర్తి ముందు హాజరుపర్చగా వారిని ఏడు రోజులు రిమాండ్‌కు ఆదేశించారు. రాష్ట్రపతి భవన్ నుంచి పట్టు చీరల డిజైనర్‌కు ఆహ్వానంధర్మవరం: న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ నుంచి ధర్మవరం పట్టుచీరల డిజైనర్ జుజారు నాగరాజుకు ఆహ్వానం అందింది. కేంద్ర ప్రభుత్వం చేనేతకు ప్రోత్సాహం కల్పించేందుకు అమృత్ మహోత్సవంలో భాగంగా ధర్మవరం పట్టుచీరల ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు నాగరాజు తెలిపారు. రాష్ట్రపతి భవన్లో నిర్వహించే ఎక్స్‌పోలో పాల్గొనాలని తనను ఆహ్వానించారన్నారు. దేశ రాజధానిలో ధర్మవరం పట్టుచీరల ప్రత్యేకత తెలిపే అవకాశం తనకు దక్కడం చాలా సంతోషంగా ఉందని నాగరాజు తెలిపారు. ఈనెల 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకూ ఎక్స్పో ఉంటుందన్నారు. -
ఐక్యతతోనే సమస్యల పరిష్కారం
ధర్మవరం: ప్రభుత్వ ఉద్యోగులంతా ఐకమత్యంతో ఉన్నప్పుడే సమస్యలు పరిష్కారమవుతాయని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి రమేష్‌కుమార్, జిల్లా అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి తెలిపారు. పట్టణంలోని సీఎన్బీ గార్డెన్స్‌లో ఆదివారం ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రథమ కౌన్సిల్ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వాలకు, ప్రజలకు అనుకూలంగా విధులను బాధ్యతగా నిర్వర్తిస్తున్నామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు. పీఆర్సీపై ప్రభుత్వం తక్షణం జుడీషియల్ పే కమిషన్ ఏర్పాటు చేయాలని, ఇప్పటికే ఆలస్యమైన దృష్ట్యా ఐఆర్ వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. సరెండర్ లీవులు, జీపీఎఫ్ లోన్ల ఆర్థిక ప్రయోజనాలను తక్షణమే చెల్లించాలన్నారు. ఇప్పటికే మూడు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్న ఎఫ్ఆర్సీ, పదోన్నతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలిపారు. మూడు దశాబ్ధాలుగా ఉన్న ఉపాధ్యాయుల ఏకీకృత సమస్యను తక్షణమే పరిష్కార మార్గం చూపాలని కోరారు. పదవీ విరమణ వయస్సు మినిమం టైం స్కేల్ ఉద్యోగులకు వర్తింపచేయాలన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల పక్షాన నిలబడే ఏకై క సంఘం ప్రభుత్వ ఉద్యోగుల సంఘమన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రామంజనేయులు యాదవ్, సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పఠాన్ బాజీ, గ్రామ సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ రజాక్, ఆర్టీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేదార్నాథ్, ఐక్యవేదిక కోచైర్మన్ కరణం హరికృష్ణ, ఏపీజీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లక్ష్మీపతి, పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆత్మరెడ్డి, ఎంటీఎస్, ఎన్ఎంఆర్ రాష్ట్ర అధ్యక్షుడు సురేష్, వివిధ జిల్లాల నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ -
ప్రశ్నపత్రాల లీకేజీలో 14 మంది నిందితులు!
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం దూరవిద్య విభాగానికి సంబంధించిన ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం మరో దఫా తెరమీదకు వచ్చింది. ఈ కేసు విచారణ సీఐడీ కోర్టుకు రావడంతో ప్రస్తుతం చర్చనీయాంశమైంది. వివరాలు... 2011, నవంబర్‌లో ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా ఎస్కేయూ దూరవిద్య విభాగంలో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, పరీక్షలు నిర్వహించారు. అప్పట్లో దూరవిద్య విభాగం డైరెక్టర్‌గా ప్రొఫెసర్ పసల సుధాకర్ ఉండేవారు. 32 వేల మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా, మొత్తం 56 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే ప్రకాశం జిల్లా పొదిలి పొరుగున ఉన్న అధ్యయన కేంద్రం నిర్వాహకులు పరీక్ష కేంద్రం కావాలని అప్పట్లో పట్టుబట్టారు. ఈ అభ్యర్థనను దూరవిద్యా కేంద్రం అధికారులు తిరస్కరిస్తూ పొదిలి కేంద్రంలో పరీక్షలు జరిగేలా ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే 2011, నవంబర్ 23న జరగాల్సిన పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రం అదే నెల 22న బయటకు వచ్చింది. కొన్ని ప్రశ్న పత్రాలు ముందు రోజే తీసి ఉద్ధేశ్యపూర్వకంగా లీక్ చేశారు. ఇలా మొత్తం 21 ప్రశ్న పత్రాలు లీక్ అయ్యాయి. వీటిని లీక్ చేసిన వారు నేరుగా వీసీ కార్యాలయానికి ఫ్యాక్స్ చేయడం గమనార్హం. అప్పటికే 2011, నవంబర్ 11న నూతన వీసీగా బాధ్యతలు స్వీకరించిన ఆచార్య రామకృష్ణారెడ్డి ఈ అంశాన్ని ప్రతిష్టాత్మకంగా స్వీకరించారు. అప్పటి రిజిస్ట్రార్ రవీంద్ర ఫిర్యాదు మేరకు ఇటుకలపల్లి పీఎస్‌లోనూ కేసు నమోదైంది. అనంతరం ఈ కేసు దర్యాప్తును సీబీసీఐడీకి అప్పగించారు. విచారణ పూర్తి కావడంతో సీఐడీ కోర్టులో చార్జీషీట్ దాఖలైంది. ప్రస్తుతం సీఐడీ కోర్టులో ఈ కేసు విచారణ సాగుతోంది. మొత్తం 14 మందిని నిందితులుగా పేర్కొన్నారు. 42 మంది సాక్షులను చేర్చారు. కాగా, దూరవిద్య విభాగంలో పనిచేస్తున్న సింహభాగం అధికారులు ఉద్యోగ విరమణ పొందారు. అప్పటి డైరెక్టర్ ప్రొఫెసర్ పి.సుధాకర్ దివంగతులయ్యారు. ఎస్కేయూ దూరవిద్య విభాగానికి సంబంధించి 2011లో ప్రశ్నపత్రాలు లీకేజీ సీఐడీ కోర్టులో కేసు విచారణ ప్రారంభం 42 మంది సాక్షులను విచారించనున్న న్యాయస్థానం -
తొలి పూజలందుకున్న పోతలయ్య స్వామి
కనగానపల్లి: మండలంలోని దాదులూరు గ్రామంలో పోతలయ్య స్వామి జాతర ఆదివారం భక్తుల కోలాహలం మధ్య ప్రారంభమైంది. తొలి రోజు వేకువజామునే గంతిమర్రి, కలికివాండ్లపల్లి గ్రామాల నుంచి భక్తులు ఎలవగంపలో స్వామి ఆభరణాలు, పూలను ఊరేగింపుగా తీసుకు వచ్చారు. ఆలయంలో విశేష పూజల అనంతరం మూలవిరాట్‌ను ఆభరణాలతో అలంకరించారు. అలాగే చెన్నకేశవస్వామి ఆలయంలోనూ ప్రత్యేక పూజలు చేసి స్వామి కాపులు దాసంగాలు (పంక్తి భోజనాలు) నిర్వహించారు. తొలిరోజు పూజా కార్యక్రమాల్లో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నేడు జ్యోతుల మహోత్సవం జాతరలో భాగంగా సోమవారం పోతలయ్య స్వామికి జ్యోతుల మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ కమిటీ సభ్యులు ఆదివారం తెలిపారు. ఆలయం చుట్టూ పన్నేరపు బండ్లను ప్రదక్షిణ చేసేందుకు వీలుగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. కాగా, కీలకమైన గావుల మహోత్సవాన్ని మంగళవారం నిర్వహించనున్న నేపథ్యంలో ఇప్పటికే పోతురాజులు ఆలయం వద్దకు చేరుకున్నారు. -
విద్యుత్ శాఖలో డిప్యుటేషన్ల లీల
● శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం విద్యుత్ డివిజన్ పరిధిలోని చెన్నేకొత్తపల్లి సెక్షన్లో పని చేస్తున్న సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ సూర్యనారాయణ డిప్యుటేషన్‌పై అనంతపురం నగరంలోని బళ్లారి రోడ్డులో ఉన్న డీ5 సెక్షన్లో నాలుగు నెలలుగా పనిచేస్తున్నారు. ఇందుకు గాను అప్పట్లో అనంతపురం విద్యుత్ సర్కిల్లో పనిచేసిన ఓ ఎస్ఈని అన్ని విధాలుగా సంతృప్తి పరిచి ప్రసన్నం చేసుకున్నట్లుగా ఆరోపణలున్నాయి. ఈ కారణంగానే నిబంధనలకు విరుద్ధంగా ఆయనకు ఆగమేఘాలపై అనంతపురం జిల్లాకు డిప్యుటేషన్ ఆర్డర్ ఇచ్చేసినట్లుగా సొంత శాఖలోని ఉద్యోగులే చెబుతున్నారు. ఫలితంగా చెన్నేకొత్తపల్లి సెక్షన్లో ఎస్ఎల్ఐ కొరత వేధిస్తూ ఉంది. ● గుత్తి విద్యుత్ డివిజన్ పరిధిలో పనిచేస్తున్న ఓ లైన్మెన్, కళ్యాణదుర్గం డివిజన్లో పనిచేస్తున్న ఓ లైన్ ఇన్స్పెక్టర్, పుట్టపర్తిలో పనిచేస్తున్న ఓ ఫోర్‌మెన్ డిప్యుటేషన్‌పై నగరంలోకి వచ్చి దాదాపు 6 ఏళ్లు గడుస్తోంది. ఏటా ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకుంటూ అనంతపురం నగరంలోని వివిధ సెక్షన్లలో వారు కొనసాగుతుండడం గమనార్హం. అనంతపురం టౌన్: విద్యుత్ శాఖ అధికార యంత్రాంగం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. ఉద్యోగులకు అనాధికారికంగా డిప్యుటేషన్లు ఇస్తూ వారికి అనుకూలంగా ఉన్న ఉద్యోగులను నగరంలోకి తీసుకువచ్చేస్తున్నారు. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాలను విద్యుత్ ఉద్యోగుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకున్న జిల్లా వ్యాప్తంగా 50మందికి పైగా క్షేత్రస్థాయి ఉద్యోగులు.. నిబంధనలకు విరుద్దంగా డిప్యుటేషన్‌పై అనంతపురంలోని వివిధ సెక్షన్లలో కొనసాగుతున్నారు. వీటితోపాటు సర్కిల్ కార్యాలయంలోనూ పదుల సంఖ్యలో ఉద్యోగులను అంతర్ జిల్లాల డిప్యుటేషన్లపై అనంతపురానికి రప్పించుకున్నారంటే ఉన్నతాధికారులు ఏ స్థాయిలో పైరవీలు సాగించారో అర్థమవుతోంది. వేధిస్తున్న ఉద్యోగుల కొరత.. విద్యుత్ శాఖలో అక్రమ డిప్యుటేషన్ల కారణంగా రూరల్ ప్రాంతాల్లో క్షేత్రస్థాయి విద్యుత్ ఉద్యోగుల కొరత తీవ్రంగా ఉంది. ప్రస్తుతం వేసవి కాలం ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సమస్యలు అధికంగా వేసవిలోనే ఉత్పన్నమవుతుంటాయి. ఇంతటి కీలకమైన సమయంలోనూ అధికారులు అక్కడ పోస్టులను భర్తీ చేయకుండా అనధికారికంగా డిప్యుటేషన్లను ఇచ్చేస్తూ ఉద్యోగులు కోరుకున్న ప్రాంతాలకు పంపించేస్తున్నారు. అనంతపురం నగర పరిధిలో ఆరు విద్యుత్ సెక్షన్లు ఉన్నాయి. వీటన్నింటిలోనూ దాదాపు 25 మందికి పైగా లైన్ ఇన్స్పెక్టర్లు, లైన్మెన్లు, ఫోరుమెన్లు, జూనియర్ లైన్మెన్లు డిప్యుటేషన్‌పై కొనసాగుతుండడం గమనార్హం. అక్రమ డిప్యుటేషన్ల అంశంలో ఉన్నతాధికారుల తీరుపై కొందరు ఉద్యోగులు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. రద్దు చేస్తాం విద్యుత్ శాఖలో డిప్యుటేషన్ అనే విధానమే లేదు. అయితే దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న ఉద్యోగులకు వైద్యుల సూచన మేరకు డిప్యుటేషన్ ఇచ్చేందుకు అవకాశం ఉంది. డిప్యుటేషన్లపై పదుల సంఖ్యలో నగరంలో తిష్ట వేసిన ఉద్యోగులపై విచారణ చేపట్టి వారి డిప్యుటేషన్లను రద్దు చేస్తాం. వారిని పాత స్థానాల్లోకి వెళ్లేలా రెండు మూడు రోజుల్లో చర్యలు తీసుకుంటాం. – శేషాద్రి శేఖర్, విద్యుత్‌శాఖ ఎస్ఈ, అనంతపురం కొన్నేళ్లుగా నగరంలోనే తిష్ట 50 మందికి పైగా ఉద్యోగులు వివిధ సెక్షన్లలో పాగా రూరల్ ప్రాంతాలను వేధిస్తున్న ఉద్యోగుల కొరత -
సిద్ధేశ్వరా.. పాహి పాహి
అమరాపురం: హేమావతిలో హెంజేరు సిద్ధేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం చిన్నరథోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఉదయం స్వామివారికి సుప్రభాతసేవ, రుద్రాభిషేకం, పంచామృతాభిషేకం తదితర పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని వివిధ రకాల వెండి ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించి మహామంగళహారతి ఇచ్చారు. ఉత్సవ కమిటీ చైర్మన్ కరేగౌడ, ఈఓ నరసింహరాజు ఆధ్వర్యంలో సాయంత్రం స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. అనంతరం మేళ తాళాలతో చిన్న రథంపై అధిష్టింపజేసి సిద్ధేశ్వరస్వామి మహారాజ్‌కు జై అంటూ భక్తులు అరటిపండ్లు, పూలు, బెల్లం, బొరుగులు, జిలకర్ర తదితర వాటిని రథంపైకి విసిరి మొక్కులు తీర్చుకున్నారు. చిన్నరథాన్ని ఆలయం నుంచి హంపన్నస్వామి గుడివరకు లాగారు. రాత్రి ముత్యాల పల్లకీలో స్వామివారిని గ్రామ పురవీధుల గుండా మేళతాళాలతో ఊరేగించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు కర్ణాటక రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఆ ప్రాంతమంతా కిటకిటలాడింది. సీఐ రాజ్‌కుమార్, ఎస్ఐ. ఇషాక్‌బాషా ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. నేడు బ్రహ్మరథోత్సవం సిద్ధేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం 5 గంటలకు బ్రహ్మరథోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఈఓ నరసింహరాజు, ఉత్సవ కమిటీ ఛైర్మన్ కరేగౌడ తెలిపారు. -
నీటికుంటలో పడి చిన్నారి మృతి
తాడిపత్రి రూరల్: మండలంలోని చుక్కలూరు సమీపంలోని నల్లబండల యూనిట్‌కు చెందిన నీటి కుంటలో పడి మూడేళ్ల చిన్నారి మృతిచెందాడు. వివరాలు... పామిడికి చెందిన గంగారాజు, తన కుటుంబసభ్యులతో కలసి బండల పాలీసు యూనిట్లో పనిచేస్తున్న చెల్లెలు ఇంటికి ఇటీవల వచ్చాడు. ఈ నేపథ్యంలో యూనిట్ వద్ద ఇన్ఫిల్స్ట్రేషన్ గుంత వద్ద అడుకుంటున్న గంగరాజు కుమారుడు గౌతమ్‌నందా (3) ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు గుంతలో పడిన చిన్నారిని వెలికి తీసి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు నిర్ధారించారు. -
ప్రాథమిక పాఠశాలలను నిర్వీర్యం చేస్తే ఊరుకోం : యూటీఎఫ్
పుట్టపర్తి: పంచాయతీకి ఒక మోడల్ పైమరీ స్కూల్ పేరుతో ప్రాథమిక పాఠశాలలను నిర్వీర్యం చేస్తామంటే ఊరుకోబోమంటూ కూటమి ప్రభుత్వాన్ని జిల్లా యూటీఎఫ్ అధ్యక్షుడు శెట్టిపి జయచంద్రారెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శి సుధాకర్ హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఒక పంచాయతీ పరిధిలోని ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5వ తరగతులను మోడల్ ప్రైమరీ పాఠశాల పేరుతో ఓ పాఠశాలకు విలీనం చేసేందుకు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలతో తీర్మానాలు చేయించాలంటూ విద్యాశాఖ ఆదేశించడాన్ని వారు తప్పు బట్టారు. ఈ విలీన ప్రక్రియపై విద్యార్థుల తల్లిదండ్రులు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అభిప్రాయాలను స్వచ్ఛందంగా కాకుండా బలవంతంగా తమకు అనుకూలమైన రీతిలో తీసుకునేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే ఈ కుట్రకు స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. 50 మందికి పైగా ద్యార్థులున్న ప్రతి పాఠశాలను మోడల్ పాఠశాలగా మార్చి, 50 మంది విద్యార్థులున్న మిగిలిన ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను యథాతథంగా ఉంచాలన్నారు. యువకుడి దుర్మరణంహిందూపురం: స్థానిక ఆటో నగర్‌కు చెందిన చాంద్ (30) ఆదివారం రాత్రి ట్రాక్టర్ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. చౌళూరు గ్రామంలో బంధువుల ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనపై హిందూపురం రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
చంద్రబాబు నిజ స్వరూపం ఇదే
అనంతపురం ఎడ్యుకేషన్: ‘పేదలపై సీఎం చంద్రబాబుకు ఉన్న వైఖరి మరోసారి బయటపడింది. ఆయన నిజస్వరూపం ఇదే’ అంటూ రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భయం, పక్షపాతం లేకుండా, రాగద్వేషాలకు అతీతంగా ప్రజలందరికీ న్యాయం చేస్తానని శాసనసభ్యుడిగా ప్రమాణం చేసిన చంద్రబాబు... ఈ రోజు వైఎస్సార్సీపీ సానుభూతిపరులు, కార్యకర్తలకు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కాని ఎలాంటి పనులు చేయబోమంటూ తెగేసి చెపుతుండడం దుర్మార్గమన్నారు. ఇప్పటి వరకూ ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఎంతోకొంత జవాబుదారీతనంతో వ్యవహరిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ప్రయత్నాలు చేశారన్నారు. అయితే ప్రజలతో కాకుండా జనసేన, బీజేపీ, ఈవీఎంఓలతో పొత్తు పెట్టుకుని గెలిచిన చంద్రబాబుకు ప్రజలంటే లెక్కలేని తనమని, అందుకే ప్రజలను ధిక్కరించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ భృతి అందక 9 నెలలుగా నిరుద్యోగులు నానా పాట్లు పడుతున్నా ప్రభుత్వంలో కనీస స్పందన కూడా లేదన్నారు. 18 ఏళ్లు నిండిన అక్కచెల్లెమ్మలకు ప్రతినెలా రూ.1,500 ఇస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పాపాన పోలేదన్నారు. డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు రూ. 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని, 50 ఏళ్లు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పింఛన్లు ఇస్తామని చెప్పి బడ్జెట్లో రూపాయి కూడా కేటాయించలేదన్నారు. కులం, మతం, పార్టీలను ఏనాడూ జగనన్న చూడలేదన్నారు. కేవలం పేదరికం ప్రామాణికంగా చేసుకుని అందరికీ సంక్షేమ ఫలాలు అందజేశారన్నారు. జగన్ అప్పులు చేస్తున్నారని, రాష్ట్రాన్ని మరో శ్రీలంకగా మారుస్తున్నారంటూ నాడు మొసలి కన్నీరు కార్చిన చంద్రబాబు ప్రస్తుతం చేస్తున్నదేమిటో చెప్పాలన్నారు. 2023–24లో జగనన్న రూ.79 వేల కోట్లు అప్పులు తెస్తే.. 2024–25కు గాను రూ.98వేల కోట్ల అప్పులు తీసుకురావాలని చెప్పి రూ.1.31 లక్షల కోట్ల అప్పులను చంద్రబాబు తీసుకువచ్చారని తెలిపారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.1.14 లక్షల కోట్లు అప్పులు తీసుకురావాలని చెప్పి రూ.1.50 లక్షల కోట్లు తెస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజల నెత్తిన అప్పుల భారం మోపి సంక్షేమ పథకాలకు ఎగనామం పెడుతున్నారని ధ్వజమెత్తారు. తల్లికి వందనం పథకానికి రూ. 12 వేల కోట్లు అవసరం కాగా రూ. 9,400 కోట్లు బడ్జెట్లో కేటాయించారని, అన్నదాత సుఖీభవకు రూ. 12 వేల కోట్లు అవసరం కాగా రూ. 6,300 కోట్లు మాత్రమే కేటాయించారు. అరకొర నిధుల కేటాయింపులు చూస్తుంటే సగానికి పైగా లబ్ధిదారులను మోసం చేసే కుట్ర బహిర్గతమవుతోందన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలెవరూ కూటమి ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూడడం లేదన్నారు. తామంతా జగనన్న వెంటే ఉంటామని, జనంతోనే ఉంటామని, కాదూకూడదని జైల్లో పెట్టినా సంతోషంగా అక్కడే ఉంటామన్నారు. ఈ నిరంకుశ పాలనకు త్వరలో చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. సమావేశంలో మీనుగ నాగరాజు, ఆత్మకూరు వైస్ ఎంపీపీ విజయ్‌కుమార్, నవీన్ పాల్గొన్నారు. పేదల సంక్షేమానికి ఎగనామం పెట్టనున్నారు వైఎస్సార్సీపీ శ్రేణులే లక్ష్యంగా కుట్ర ఇందులో భాగంగానే ప్రజలను ఽధిక్కరించి మాట్లాడుతున్నారు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి -
ప్రశ్నపత్రాల లీకేజీలో 14 మంది నిందితులు!
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం దూరవిద్య విభాగానికి సంబంధించిన ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం మరో దఫా తెరమీదకు వచ్చింది. ఈ కేసు విచారణ సీఐడీ కోర్టుకు రావడంతో ప్రస్తుతం చర్చనీయాంశమైంది. వివరాలు... 2011, నవంబర్‌లో ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా ఎస్కేయూ దూరవిద్య విభాగంలో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, పరీక్షలు నిర్వహించారు. అప్పట్లో దూరవిద్య విభాగం డైరెక్టర్‌గా ప్రొఫెసర్ పసల సుధాకర్ ఉండేవారు. 32 వేల మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా, మొత్తం 56 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే ప్రకాశం జిల్లా పొదిలి పొరుగున ఉన్న అధ్యయన కేంద్రం నిర్వాహకులు పరీక్ష కేంద్రం కావాలని అప్పట్లో పట్టుబట్టారు. ఈ అభ్యర్థనను దూరవిద్యా కేంద్రం అధికారులు తిరస్కరిస్తూ పొదిలి కేంద్రంలో పరీక్షలు జరిగేలా ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే 2011, నవంబర్ 23న జరగాల్సిన పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రం అదే నెల 22న బయటకు వచ్చింది. కొన్ని ప్రశ్న పత్రాలు ముందు రోజే తీసి ఉద్ధేశ్యపూర్వకంగా లీక్ చేశారు. ఇలా మొత్తం 21 ప్రశ్న పత్రాలు లీక్ అయ్యాయి. వీటిని లీక్ చేసిన వారు నేరుగా వీసీ కార్యాలయానికి ఫ్యాక్స్ చేయడం గమనార్హం. అప్పటికే 2011, నవంబర్ 11న నూతన వీసీగా బాధ్యతలు స్వీకరించిన ఆచార్య రామకృష్ణారెడ్డి ఈ అంశాన్ని ప్రతిష్టాత్మకంగా స్వీకరించారు. అప్పటి రిజిస్ట్రార్ రవీంద్ర ఫిర్యాదు మేరకు ఇటుకలపల్లి పీఎస్‌లోనూ కేసు నమోదైంది. అనంతరం ఈ కేసు దర్యాప్తును సీబీసీఐడీకి అప్పగించారు. విచారణ పూర్తి కావడంతో సీఐడీ కోర్టులో చార్జీషీట్ దాఖలైంది. ప్రస్తుతం సీఐడీ కోర్టులో ఈ కేసు విచారణ సాగుతోంది. మొత్తం 14 మందిని నిందితులుగా పేర్కొన్నారు. 42 మంది సాక్షులను చేర్చారు. కాగా, దూరవిద్య విభాగంలో పనిచేస్తున్న సింహభాగం అధికారులు ఉద్యోగ విరమణ పొందారు. అప్పటి డైరెక్టర్ ప్రొఫెసర్ పి.సుధాకర్ దివంగతులయ్యారు. ఎస్కేయూ దూరవిద్య విభాగానికి సంబంధించి 2011లో ప్రశ్నపత్రాలు లీకేజీ సీఐడీ కోర్టులో కేసు విచారణ ప్రారంభం 42 మంది సాక్షులను విచారించనున్న న్యాయస్థానం -
సకల కళావల్లభుడు ఈ ’భాస్కరుడు’
కదిరి టౌన్: గ్రామీణ సాంస్కృతిక కళలు కనుమరుగువుతున్న ప్రస్తుత రోజుల్లో వాటి పరిరక్షణకు పరితపించిపోతున్నాడు కదిరికి చెందిన యర్రగుడి భాస్కర్. కళలే తన ప్రాణంగా భావిస్తూ కొన్ని సంవత్సరాలుగా నటుడిగా, తబలిస్టుగా, డప్పిస్ట్గా, గాయకుడిగా ఆయన రాణిస్తున్నారు. తాను నమ్ముకున్న కళ తనతోనే అంతరించి పోకూడదన్న లక్ష్యంతో 20 మంది ఔత్సాహిక కళాకారులను నిష్ణాతులుగా తీర్చి దిద్దుతున్నారు. కదిరిలోని గంగిరెడ్డిపల్లి కాలనీలో నివాసముంటున్న ఆయన చిన్నమ్మ కథలో తలారి, రాఘవరెడ్డి పాత్రలకు పెట్టింది పేరుగా ఖ్యాతిగాంచారు. ఏటా ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో ఉచిత ప్రదర్శనలిస్తూ వేలాది భక్తులకు వినోదాన్ని పంచుతుంటారు. ఆయన సేవలకు ప్రతిగా ఆలయ అధికారులు పలు ప్రశంసాపత్రాలను అందజేసి సత్కరించారు. కళలను ప్రోత్సహించాలని, కళాకారులకు రుణ సౌకర్యం కల్పించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఆయన కోరుతున్నారు. -
పెళ్లి కాలేదని యువకుడి ఆత్మహత్య
కదిరి టౌన్: స్థానిక మారుతీనగర్‌కు చెందిన బీఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగి పెద్దపల్లి లక్ష్మణ్ కుమారుడు పి.అవినాష్ (28) ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం రాత్రి భోజనం ముగించుకుని కింద ఉన్న ఇంట్లోకి పడుకోవడానికి వెళ్లాడు. ఆదివారం ఉదయం ఎంతసేపటికీ తలుపు తీయకపోవడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చి తలుపులు బద్ధలుగొట్టి లోపలకు వెళ్లి చూశారు. అప్పటికే ఫ్యాన్‌కు విగతజీవిగా వేలాడుతున్న అవినాష్‌ను గమనించి, ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అవినాష్ మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా, బీటెక్ పూర్తి చేసిన అవినాష్... పెళ్లి సంబంధాలు కుదరకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుని ఉంటాడని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. సాయి బాట .. సత్కర్మకు రాచబాట ప్రశాంతి నిలయం: ప్రశాంతి నిలయం: ‘సత్యసాయి బాబా చూపిన ఆధ్యాత్మిక సేవా మార్గమే మానవులు సత్కర్మను ఆచరించడానికి రాచమార్గం’ అనే సందేశాన్నిస్తూ నిర్వహించిన ‘కర్మ’ నాటిక భక్తులను ఆకట్టుకుంది. పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా భక్తులు సత్యసాయి మహాసమాధి చెంత భక్తిరస సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సత్యసాయి యూత్ సత్యసాయిపై భక్తిభావన, ప్రేమను చాటుతూ సంగీత కచేరీ నిర్వహించారు. అనంతరం జిల్లాకు చెందిన సత్యసాయి యూత్ బృందం ప్రదర్శించిన కర్మ నాటిక అందరనీ ఆకట్టుకుంది. తర్వాత భక్తులు సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు. -
ఆయుర్వేద డాక్టర్ల జిల్లా కమిటీ ఏర్పాటు
హిందూపురం టౌన్: స్థానిక ఫాతిమా క్లినిక్ వేదికగా ఆదివారం జిల్లా ఆయుర్వేద వైద్యులు సమావేశమై నూతన కమిటీను ఏర్పాటు చేశారు. జిల్లా అధ్యక్షురాలిగా డాక్టర్ అనురాధ, ఉపాధ్యక్షుడిగా డాక్టర్ ఇమ్రాన్ ఖాన్, జనరల్ సెక్రెటరీగా డాక్టర్ తేజ, ట్రెజరర్‌గా డాక్టర్ మధు ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా డాక్టర్ షాహిద్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కమిటీలు విస్తరించాయని, ఇందులో భాగంగా జిల్లాలో కూడా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. జూదరుల అరెస్ట్ హిందూపురం: స్థానిక చెర్లోపల్లి–పత్తికొండ మార్గంలో పేకాట ఆడుతున్న 17 మందిని అరెస్ట్ చేసినట్లు సీఐ చంద్ర ఆంజనేయులు తెలిపారు. అందిన సమాచారం మేరకు ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో తనిఖీలు చేపట్టామన్నారు. చెర్లోపల్లి సమీపంలోని కొండ వద్ద స్థావరం ఏర్పాటు చేసుకుని ‘లోపల–బయట’ ఆట ఆడుతూ 17 మంది పట్టుబడ్డారన్నారు. వీరి నుంచి రూ.81 వేల నగదు, పది ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని జూదరులతో పాటు కేంద్రం నిర్వాహకుడు అశ్వత్థప్పపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసినట్లు వివరించారు. బీటెక్ విద్యార్థి బలవన్మరణంనల్లమాడ: మండలంలోని వేళ్లమద్ది గ్రామానికి చెందిన గ్రామానికి చెందిన కె.వెంకటపతి, వెంకటలక్ష్మి దంపతుల రెండో కుమారుడు కె.ప్రేమసాయి(20) ఆత్మహత్య చేసుకున్నాడు. చిత్తూరులోని ఓ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ప్రేమసాయి కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతుండేవాడు. ఈ నేపథ్యంలో ఐదు రోజుల క్రితం కళాశాల నుంచి ఇంటికి వచ్చాడు. కడుపునొప్పి తీవ్రత తాళలేక ఆదివారం మధ్యాహ్నం కళింగర పంటకు పిచికారీ చేయగా మిగిలిన పురుగుల మందును తాగాడు. అపస్మారకస్థితికి చేరుకున్న కుమారుడిని గుర్తించిన తల్లిదండ్రులు 108 అంబులెన్స్ ద్వారా కదిరిలోని ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై నల్లమాడ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
తొలి పూజలందుకున్న పోతలయ్య స్వామి
కనగానపల్లి: మండలంలోని దాదులూరు గ్రామంలో పోతలయ్య స్వామి జాతర ఆదివారం భక్తుల కోలాహలం మధ్య ప్రారంభమైంది. తొలి రోజు వేకువజామునే గంతిమర్రి, కలికివాండ్లపల్లి గ్రామాల నుంచి భక్తులు ఎలవగంపలో స్వామి ఆభరణాలు, పూలను ఊరేగింపుగా తీసుకు వచ్చారు. ఆలయంలో విశేష పూజల అనంతరం మూలవిరాట్‌ను ఆభరణాలతో అలంకరించారు. అలాగే చెన్నకేశవస్వామి ఆలయంలోనూ ప్రత్యేక పూజలు చేసి స్వామి కాపులు దాసంగాలు (పంక్తి భోజనాలు) నిర్వహించారు. తొలిరోజు పూజా కార్యక్రమాల్లో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నేడు జ్యోతుల మహోత్సవం జాతరలో భాగంగా సోమవారం పోతలయ్య స్వామికి జ్యోతుల మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ కమిటీ సభ్యులు ఆదివారం తెలిపారు. ఆలయం చుట్టూ పన్నేరపు బండ్లను ప్రదక్షిణ చేసేందుకు వీలుగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. కాగా, కీలకమైన గావుల మహోత్సవాన్ని మంగళవారం నిర్వహించనున్న నేపథ్యంలో ఇప్పటికే పోతురాజులు ఆలయం వద్దకు చేరుకున్నారు. -
జెడ్పీ నిధులపై తమ్ముళ్ల కన్ను
లేపాక్షి: జెడ్పీ నిధులు కాజేసేందుకు అధికార పార్టీ నాయకులు కన్నేశారు. గ్రామీణా ప్రాంతాల అభివృద్ధికి పెద్ద పీట వేస్తూ ఆరు నెలల కిందట మండాలనికి జెడ్పీ నుంచి రూ. కోటి నిధులు మంజూరయ్యాయి. మొదటి విడతలో రూ.40 లక్షల నిధులతో పనులు చేసిన ఓ అధికార పార్టీ నాయకుడు నిధులు మంజూరు చేయించుకున్నాడు. రెండో విడతలో వచ్చిన రూ. 64 లక్షల జెడ్పీ నిధులు సైతం తనకే దక్కాలంటూ ఆయనతోపాటు ఆయన వర్గీయులు పంచాయతీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అయితే అదే పార్టీకి చెందిన మరోవర్గం వారిని అడ్డుకుంటున్నారు. మండలంలోని కంచిసముద్రం పంచాయతీలో తెలుగుదేశం పార్టీలో రెండు వర్గాల మధ్య కొంతకాలంగా ఉన్న విబేధాలు భగ్గుమంటున్నాయి.అధికార పార్టీకి చెందిన సర్పంచ్ అధికారంలో ఉన్నప్పటికీ అక్కడున్న రెండు వర్గాల నాయకులు సర్పంచ్‌ను డమ్మీ చేశారు. పంచాయతీకి మంజూరైన జిల్లా పరిషత్ నిధులను చేజిక్కించు కోవడానికి హిందూపురం పట్టణానికి చెందిన ఓ నాయకుడు స్థానిక టీడీపీ నాయకులతో కలిసి సర్పంచ్‌ను కాదని పనులు చేయడానికి అధికారులతో కుమ్మక్కై తీర్మాణాలు కూడా చేయించాడు. టీడీపీలో మరో వర్గం నాయకులు స్థానికంగా ఉండే నాయకులే పనులు చేయాలని, బయట ప్రాంతాల నుంచి వచ్చిన వారు పనులు చేయడం వల్ల గ్రామాల్లో ఘర్షణలు, విభేదాలు చోటు చేసుకునే అవకాశం వుందని సర్పంచ్‌కు మద్దతుగా నిలిచారు. దీంతో రెండు వర్గాల మద్య విబేధాలు తారస్థాయికి చేరుకున్నాయి. పంచాయతీలో సమావేశం కంచిసముద్రం పంచాయతీలో జెడ్పీ నిధులతో పనులు చేయడానికి శనివారం సమావేశం ఏర్పాటు చేసారు. వార్డు సభ్యులు అందరూ అత్యవసర సమావేశానికి హాజరు కావాలని పంచాయతీ కార్యదర్శి అజెండా కాపీలను జారీ చేశారు. అయితే 12 మంది వార్డు సభ్యుల్లో నలుగురు సభ్యులు మాత్రమే హాజరయ్యారు. అజెండాలో ఉన్న అంశాలను కార్యదర్శి సభ్యులకు చదివి వినిపించకుండా సంతకాలు తీసుకున్నారు. వారు సంతకాలు చేసిన వెంటనే తీర్మానం చేశామనే సాకుతో వెళ్లి పోయారు.దళిత సర్పంచ్‌కు ఇచ్చే గౌరవం ఇదేనా? అధికార పార్టి నాయకుడు హిందూపురం పట్టణానికి చెందిన గ్రీన్ పార్కు నాగరాజుతో పాటు ఆయన అనుచరులు దళిత మహిళా సర్పంచ్ అయిన నన్ను ప్రతి విషయంలోను అగౌరవ పరుస్తున్నారు. పంచాయితీ నిధులు కేటాయింపుల్లో తన ప్రమేయం లేకుండా వ్యవహరిస్తున్నారు. దళిత మహిళ సర్పంచ్‌కు ఇచ్చే గౌరం ఇదేనా సర్పంచ్ గంగలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. వారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని ఆమె పేర్కొన్నారు. -
రుణానికి సువర్ణ అవకాశం
హిందూపురం అర్బన్: బంగారం.. ఇప్పుడు అందరికీ అత్యవసర నిధి. అందుకే ధర భగ్గుమంటున్నా కొనేందుకు జనం ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. చాలా మంది బంగారు ఆభరణాలు ఒంటిపై ఉంటే సమాజంలో గౌరవంగా చాలా మంది భావిస్తున్నారు. అలాగే అత్యవసర సమయంలోనూ ఆదుకునే అత్యవసర నిధిగా భావిస్తున్నారు. అందుకే ధర ఎంతగా ఎగబాకినా...కొనేందుకు జనం మొగ్గుచూపుతున్నారు. బంగారం చేతిలో ఉంటే క్షణాల్లో రుణం.. ఏదైనా రుణం కావాలంటే బ్యాంకులకు వెళితే.. సవాలక్ష నిబంధనలు చెబుతారు. కొన్నిసార్లు నెలల తరబడి తిరిగినా రుణం మంజూరు కాని పరిస్థితి. కానీ ‘గోల్డ్ లోన్’(Gold loan) అలా కాదు. చేతిలో బంగారు నగలుంటే చాలు బ్యాంకర్లు, ఫైనాన్స్ సంస్థలు క్షణాల్లో రుణం మంజూరు చేస్తున్నారు. దీంతో పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన వారు తమ ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు కోసం ‘గోల్డ్ లోన్’ తీసుకొంటున్నారు. గ్రామగ్రామానా వెలిసిన సంస్థలు.. ‘గోల్డ్ లోన్’ వ్యాపారం భారీగా జరుగుతుండగా... హిందూపురం, ధర్మవరం, కదిరి లాంటి పట్టణాల్లోనే కాకుండా మారుమూల గ్రామాల్లోనూ బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు వెలిశాయి. అవసరానికి అప్పులు పుట్టని చాలామంది ‘గోల్డ్‌లోన్’ తీసుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ‘ప్రైవేట్’ వ్యక్తుల వద్ద తీసుకునే రుణానికి వడ్డీ కొండంత ఉండటంతో చాలా మంది బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను సంప్రదిస్తున్నారు.బ్యాంకులతో పాటు ప్రైవేటు సంస్థలు బంగారం నాణ్యతను బట్టి లోన్ మంజూరు చేస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో 10 గ్రాముల బంగారానికి రూ.52 వేలకుపైగా రుణం ఇస్తున్నారు. పైగా తక్కువ వడ్డీలకే రుణాలు మంజూరవుతుండటంతో చాలా మంది ‘గోల్డ్‌లోన్’ తీసుకుంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో ప్రధాన బ్యాంకులతో పాటు సహకార సంఘ బ్యాంకులు, ముత్తూట్ మనీ, మణప్పరం, శ్రీరామ్ చిట్స్ తదితర సంస్థలు విరివిగా ‘గోల్డ్‌లోన్’ మంజూరు చేస్తున్నాయి. కొందరైతే బంగారాన్ని కుదవపెట్టి లోన్ తీసుకొని దాని ద్వారా వ్యాపారాలు చేస్తుండటం విశేషం. లాకరు అద్దె ఎందుకనీ... డబ్బున్న వారు సైతం బంగారాన్ని లాకర్లలో ఉంచడం తగ్గించేశారు. అదే బంగారాన్ని తాకట్టు పెట్టి అప్పు తీసుకొని ఇతర రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. లేదంటే తీసుకున్న రుణంలో 90 శాతం మొత్తం నెలలోపు తీర్చేస్తున్నారు. మిగిలిన 10 శాతం మొత్తాన్ని ఏడాది తర్వాత వడ్డీతో కలిపి కట్టేస్తున్నారు. మళ్లీ బంగారాన్ని లోన్ కోసమంటూ బ్యాంకుల్లో పెట్టేస్తున్నారు. దీంతో జిల్లాలో ప్రధాన పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లోని వివిధ బ్యాంకు శాఖల్లో కిలోల కొద్దీ బంగారం నగలు ఉంటున్నాయి. గోల్డ్ రుణాలు పొందేవారి సంఖ్య పెరుగుతుండటంతో బ్యాంకుల్లోని సేఫ్ లాకర్లలో నగల మూటలూ పెరిగిపోతున్నాయి. నెలకు రూ.12 కోట్ల పైమాటే⇒ జిల్లా వాసులు ప్రస్తుతం బ్యాంకులు, వివిధ ప్రైవేటు సంస్థల్లో నెలకు రూ.12 కోట్ల దాకా బంగారంపై రుణాలు తీసుకుంటున్నారు. గతంలో ఈ మొత్తం రూ.9 కోట్లలోపే ఉండేది. సంక్షేమ పథకాలు అమలుకాకపోవడం, ఇతరత్రా కారణాల వల్ల ప్రజల చేతిలో డబ్బు ఉండడం లేదు. దీంతో అవసరాల కోసం బంగారాన్ని తాకట్టు పెట్టి రుణాలు తీసుకునే వారి సంఖ్య ఇటీవల బాగా పెరిగింది. ⇒ 80 శాతం మంది బ్యాంకుల్లోనే తాకట్టు పెడుతున్నారు. మిగిలిన 20 శాతం ప్రైవేటు సంస్థల్లో తాకట్టు పెట్టి రుణాలు పొందుతున్నారు. ⇒ బంగారు రుణాలపై బ్యాంకులు 8.5 శాతం నుంచి 9 శాతం వరకు, ప్రైవేటు సంస్థలు 10 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయి. ⇒ గ్రామీణం, పట్టణం అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ బంగారాన్ని తాకట్టు పెట్టి రుణాలు పొందేవారి సంఖ్య ఇటీవలి కాలంలో బాగా పెరిగింది.⇒ హిందూపురానికి చెందిన నరేష్ చిరు ఉద్యోగి. ఇద్దరు పిల్లల చదువు కోసం రూ.3 లక్షలు అవసరం కాగా, పలువురి వద్ద రుణం కోసం ప్రయత్నించినా... ఫలితం లేకపోయింది. మరోమార్గం లేక తన భార్య నగలను తాకట్టు పెట్టి బ్యాంకులో రుణం తీసుకున్నాడు. ప్రతి నెలా జీతం వచ్చినప్పుడు వాయిదాలు చెలిస్తున్నాడు. అవసరానికి బంగారం లేక పోతే పిల్లలను చదివించడం కష్టమయ్యేదంటున్నాడు.⇒ ధర్మవరానికి చెందిన బాలాజీకి అత్యవసరంగా డబ్బు అవసరమైంది. ఎవరినైనా అడగాలంటే మొహమాటం.. అడిగినా ఇస్తారో లేదోనన్న అనుమానం. దీంతో భార్యతో చర్చించి చివరకు బంగారు నగలతో బ్యాంకుకు వెళ్లి ‘గోల్డ్ రుణం’ తీసుకున్నాడు.⇒ పుట్టపర్తికి చెందిన శిరీష్ కు ఇటీవలే వివాహమైంది. అత్తింటివారు తనకూ భార్యకు బంగారు నగలు చేయించారు. వాటిని ఇంట్లో పెట్టుకునేందుకు ధైర్యం చాలడం లేదు. బ్యాంకుకు వెళ్లి లాకర్ అడగ్గా...అందుబాటులో లేదన్నారు. పైగా ఏడాదికి అద్దె భారీగా చెల్లించాలని చెప్పారు. దీంతో శిరీష్ నగలను బ్యాంకులో పెట్టి రుణం తీసుకున్నాడు. నెలలో 90 శాతం మొత్తం రుణం చెల్లించాడు. మిగతా 10 శాతానికి వడ్డీ లాకర్ అద్దె కంటే తక్కువే అయ్యింది.⇒ ఇలా అవసరానికి ఒకరు..భద్రపరిచేందుకు మరికొందరు బ్యాంకుల ద్వారా ‘గోల్డ్ లోన్’ తీసుకుంటున్నారు. ఎవరి వద్దా చేయిచాపాల్సిన అవసరం లేకుండా ఏ ఆర్థిక అవసరం వచ్చినా ‘గోల్డ్’వైపు చూస్తున్నారు. -
సిద్ధేశ్వరా.. సిడిమాను చూడరా
అమరాపురం: సిద్ధేశ్వరుడి సిడిమాను ఉత్సవం కమనీయంగా సాగింది. హేమావతిలో వెలిసిన హెంజేరు సిద్ధేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం సిడిమాను ఉత్సవం నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం సిద్ధేశ్వరస్వామిని అర్చకులు వెండితో చూడముచ్చటగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయ ఆవరణలో కుడివైపున ఉన్న సిడిమాను ముందు ఉన్న కట్ట వద్దకు తీసుకువచ్చి పూజలు చేశారు. అనంతరం సిడిమాను ఉత్సవాన్ని నిర్వహించారు. సిడిమానుకు వేలాడేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. సాయంత్రం 5.30 గంటలకు ఉత్సవ కమిటీ చైర్మన్ కరేగౌడ, ఈఓ నరసింహరాజు, అర్చకులు, గ్రామ పెద్దలు సిడిమాను వద్దకు చేరుకుని ముందుగా నమోదు చేసుకున్న పేర్ల వారీగా ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన పెద్ద సిడిమానుకు ఒకవైపు భక్తులు వేలాడుతుండగా, మరోవైపు తిప్పుతుంటారు. ఇలా సిడిమానుకు వేలాడుతూ తిరగడం వల్ల కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. రాత్రి స్వామివారిని ముత్యాలపల్లకిలో కూర్చోబెట్టి ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ తిప్పేస్వామి, గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు. కాగా, బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం చిన్న రథోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఆలయకమిటీ ఈఓ నరసింహరాజు, ఉత్సవ కమిటీ చైర్మన్ కరేగౌడ తెలిపారు. -
9 నుంచి ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలు
కదిరి టౌన్: ఖాద్రీ లక్ష్మీనారసింహుడి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 9వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఖాద్రీ ఆలయంలో అన్ని శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడుతూ.. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తారని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. అందరం సమష్టిగా పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయంతం చేద్దామని పిలుపునిచ్చారు. అనంతరం ఖాద్రీశుని బ్రహ్మోత్సవాల పోస్టర్లను ఎమ్మెల్యే అధికారులతో కలిసి ఆవిష్కరించారు. సమావేశంలో ఆలయ ఈఓ వి.శ్రీనివాసరెడ్డి, ఆర్డీఓ వీవీఎస్ శర్మ, మున్సిపల్ కమిషనర్ కిరణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే పార్థసారథి, బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా వంశీకృష్ణ, ప్రధాన అర్చకులు పార్థసారథి ఆచార్యులు, నరసింహాచార్యులు, అంజన్‌కుమార్ స్వామి, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. స్క్రీనింగ్ పరీక్షలు సజావుగా జరగాలి ● డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజాబేగం పుట్టపర్తి అర్బన్: సంక్రమిత, అసంక్రమిత వ్యాధులను గుర్తించేందుకు గ్రామాల్లో జరుగుతున్న స్క్రీనింగ్ పరీక్షలు సజావుగా నిర్వహించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజాబేగం ఆదేశించారు. శనివారం ఆమె పుట్టపర్తి మండలం బత్తలపల్లిలో జరుగుతున్న స్క్రీనింగ్ పరీక్షలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... స్క్రీనింగ్ సమయంలో ప్రతి ఇంటినీ సందర్శించాలని, ఆయా కుటుంబాల్లోని ప్రతి ఒక్కరినీ పరీక్షించాలన్నారు. అలాగే ప్రతి కేసునూ నమోదు చేయాలన్నారు. డీఎంహెచ్ఓ వెంట జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ శ్రీనివాసరెడ్డి, వైద్యాధికారి డాక్టర్ జ్యోత్స్న, సూపర్వైజర్ రమణ, ఎంఎల్‌హెచ్‌పీ సత్యమ్మ తదితరులు ఉన్నారు. -
తొలిరోజే 479 మంది గైర్హాజరు
● ప్రారంభమైన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ● మంగళకర కళాశాల పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ చేతన్ పుట్టపర్తి: ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. జిల్లాలో ఏర్పాటు చేసిన 42 కేంద్రాల్లో జనరల్ విద్యార్థులు 11,843 మందికిగాను 11,460 మంది, ఒకేషనల్ కోర్సుకు సంబంధించి 1,580 మందికి గాను 1,484 మంది తొలిరోజు జరిగిన సెకండ్ లాంగ్వేజ్ పేపర్–1 పరీక్ష హాజరయ్యారు. రెండు విభాగాల్లో 479 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఇంటర్ విద్య జిల్లా అధికారి రఘనాథరెడ్డి తెలిపారు. సోమవారం (3వ తేదీ) ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. కాగా తొలిరోజు శనివారం మంగళకర కళాశాలలో పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ టీఎస్ చేతన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలో ఏర్పాటు చేసిన మౌలిక వసతుల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పటిష్ట భద్రత.. ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా సాగేలా పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్ష కేంద్రంలోనికి పంపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. అభ్యర్థులను మినహా ఎవరిని అనుమతించలేదు. -
విలీనం.. నిరసనాగ్రహం
చెన్నేకొత్తపల్లి: మండల పరిధిలోని న్యామద్దెల గ్రామంలోని దళితవాడలోని ప్రాథమిక పాఠశాలను గ్రామంలోని మరో పాఠశాలలో విలీనం చేసేందుకు శనివారం పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశాన్ని నిర్వహించారు. పాఠశాలలను విలీనం చేసి మోడల్ పాఠశాలగా చేయాలని ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిందని తెలపగా, తల్లిదండ్రులు తీవ్ర అభ్యతరం తెలిపారు. తమ పిల్లలకు ‘మోడల్ స్కూల్’ అవసరం లేదని, ఇప్పుడున్న పాఠశాలను కొనసాగిస్తే చాలన్నారు. పాఠశాలలో 50 మందికిపైగా విద్యార్థులు ఉన్నారని, వారి భవిష్యత్‌తో ఆడుకోవద్దని వేడుకున్నారు. అనంతరం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాఠశాల గేటు ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపారు. ‘విలీనం’ అలోచనను అధికారులు మానుకోవాలని, లేకపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. దీంతో ఉపాధ్యాయులు ఈ విషయాన్ని మండల విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళతామని చెప్పడంతో ఆందోళన విరమించారు. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు
నల్లమాడ: అరవవాండ్లపల్లి తండా సమీపాన నల్లమాడ–పుట్టపర్తి రహదారిలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. వివరాలు.. మండలంలోని తిప్పయ్యగారిపల్లికి చెందిన రామప్ప, రమేష్‌బాబు, కిరణ్‌కుమార్ బైక్‌పై నల్లమాడ మీదుగా పుట్టపర్తి బయలుదేరారు. అరవవాండ్లపల్లి సమీపానికి వెళ్లగానే బైక్‌పై అదుపుతప్పి కింద పడటంతో ముగ్గురికీ ముఖం, చేతులు, కాళ్లు, ఛాతీపై బలమైన రక్తగాయాలయ్యాయి. స్థానికులు 108లో క్షతగాత్రులను నల్లమాడలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం 108లో కదిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
మామిడితోటలో వ్యక్తి దారుణ హత్య
పుట్టపర్తి అర్బన్: మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తిని గొంతు కోసి హతమార్చిన ఘటన వెంగళమ్మచెరువు సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు అందించిన వివరాలు.. బుక్కపట్నం మండలం కొత్తకోటకు చెందిన చియ్యేడు గంగన్న కుటుంబం సుమారు 15 ఏళ్ల క్రితం వెంగళమ్మచెరువులో స్థిరపడింది. గంగన్న కుమారుడు చియ్యేడు నగేష్(35) సొంతంగా ట్రాక్టర్ పెట్టుకొని బాడుగలకు తిప్పడంతోపాటు బేల్దారి పనులకు వెళ్లేవాడు. శుక్రవారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన అతడు తిరిగిరాలేదు. స్థానిక షిర్డీసాయి బాబా ఆలయం సమీపంలోని వెంకటేషు మామిడితోటలో శనివారం సాయంత్రం నగేష్ మృతదేహాన్ని గుర్తించిన గ్రామానికి చెందిన పశువుల కాపరులు మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. దీంతో వారు అక్కడికి చేరుకుని బోరునవిలపించారు. విషయం తెలుసుకున్న పుట్టపర్తి రూరల్ ఎస్ఐ లింగన్న సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ రప్పించి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా గ్రామంలోని సీసీటీవీ ఫుటేజీల్లో అదే గ్రామానికి చెందిన దివాకర్ అనే వ్యక్తి నగేష్‌ను బైకుపై ఎక్కించుకెళ్లినట్లు నమోదవడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మృతదేహం పక్కన మద్యం బాటిళ్లు పడి ఉండటంతో మద్యం మత్తులో గొడవ జరిగి హత్యకు గురయ్యాడా లేదా అక్రమ సంబంధం నేపథ్యంలో ఘటన జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. మృతుడి భార్య సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
ప్రజాసేవే పరమావధిగా పనిచేయాలి
అనంతపురం: పోలీసులు ప్రజా సేవే పరమావధిగా పనిచేయాలని, పోలీసు స్టేషన్ గడప తొక్కే బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత సూచించారు. అనంతపురంలోని పోలీసు శిక్షణ కళాశాల(పీటీసీ)లో స్టైఫండరీ కేడెట్ ట్రైనీ (ఎస్సీటీ)–2024 ఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారు మొత్తం 394 మంది ఎస్ఐలు కాగా... ఇందులో 300 మంది సివిల్ ఎస్ఐలు, 94 మంది ఏపీఎస్పీ ఎస్ఐలు ఉన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన హోం మంత్రి మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణతో అనేక కఠిన సవాళ్లను ఎదుర్కొని ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో పోలీస్ శాఖ కృషి మరువలేనిదన్నారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లో చేరబోతున్న నూతన ఎస్‌ఐలందరికీ అభినందనలు తెలిపారు. 394 మంది ఎస్ఐలలో 97 మంది మహిళా ఎస్ఐలు ఉండడం సంతోషంగా ఉందన్నారు. ఇటీవల కాలంలో మహిళలపై దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలు, చిన్నారులపై ఏ చిన్న నేరమూ జరగకుండా వారిని కాపాడే బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. జవాబుదారీతనంతో విధులు శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్ఐలు జవాబుదారీతనంతో విధులు నిర్వర్తించి మంచి పేరు తెచ్చుకోవాలని రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా సూచించారు. అనంతరం శిక్షణ సమయంలో ఫైరింగ్, ఇండోర్, అవుట్డోర్ విభాగాల్లో రాణించిన, ప్రతిభ కనబరిచిన వారికి హోం మంత్రి చేతుల మీదుగా పతకాలు, ట్రోఫీలు అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ట్రైనింగ్స్ విభాగం ఐజీపీ కేవీ మోహన్‌రావు, ఏపీఎస్పీ బెటాలియాన్స్ విభాగం ఐజీ రాజకుమారి, కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, అనంతపురం ఎస్పీ పి.జగదీష్, శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ వి.రత్న, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్యేలు దగ్గుపాటి ప్రసాద్, ఎమ్మెస్ రాజు, పల్లె సింధూరరెడ్డి, పీటీసీ కోర్సు డైరెక్టర్ మల్లికార్జున వర్మ, తదితరులు పాల్గొన్నారు. శిక్షణలో రైతుబిడ్డ టాపర్ బెళుగుప్ప మండలం రమనేపల్లికి చెందిన రైతు దంపతులు ఆంజనేయులు, సాలమ్మల కుమారుడైన మంజునాథ్ ఎస్ఐ పరీక్ష ఫలితాల్లో అర్హత సాధించి అనంతపురం పోలీసు శిక్షణ కళాశాల(పీటీసీ)లో శిక్షణ పొందాడు. శిక్షణలో అవుట్డోర్ టాపర్‌గాను, ఓవరాల్ టాపర్‌గాను, గోల్డ్ మెడల్‌తో పాటు సీఎం పిస్టల్ విజేతగా నిలిచారు. హోంమంత్రి అనిత చేతుల మీదుగా పిస్టల్ అందుకున్నారు. రైతు బిడ్డ ఎస్ఐ శిక్షణలో టాపర్‌గా నిలిచి బెళుగుప్ప మండలానికే పేరుతెచ్చారని సర్పంచ్ రమేష్ తదితరులు అభినందనలు తెలిపారు. ఎస్ఐల పాసింగ్ అవుట్పరేడ్లో హోం మంత్రి అనిత -
మహిళ సాధికారతతోనే సమాజాభివృద్ధి
ప్రశాంతి నిలయం: మహిళా సాధికారతతోనే సమాజాభివృద్ధి సాధ్యమని కలెక్టర్ టీఎస్ చేతన్ అన్నారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా శనివారం జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించగా, గణేష్ సర్కిల్ వరకూ కొనసాగింది. అక్కడ మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సమాజంలో మహిళల ప్రాధాన్యత, మహిళలకు ఇవ్వాల్సిన గౌరవం, బాల్య వివాహాల అనర్థాలను వివరిస్తూ నినాదాలు చేశారు. అంతకుముందు కలెక్టర్ మాట్లాడుతూ మహిళలపై హింసను నిరోధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఐసీడీఎస్ పీడీ సుధా వరలక్ష్మి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలు జిల్లా వ్యాప్తంగా మార్చి 8వ తేదీ వరకూ నిర్వహిస్తున్నామన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ ఫిరోజ్ బేగం, సీడీీపీఓ గాయత్రి, జిల్లా కో ఆర్డినేటర్ సురేష్ కుమార్, నాగలక్ష్మి, పీఓ మురశీధర్ తదితరులు పాల్గొన్నారు. విద్యుదాఘాతంతో రైతు మృతి గోరంట్ల: బూచేపల్లిలో ఓ రైతు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. సీఐ బోయ శేఖర్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన రైతు శివప్ప (33) ఇటీవల తన పొలంలో బోరు వేశాడు. దీంతో కట్టెలపై తాత్కాలికంగా విద్యుత్ కేబుల్‌ను లాగాడు. శనివారం విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో కట్టైపె ఉన్న కేబుల్‌ను పరిశీలించేందుకు యత్నించాడు. కేబుల్ దెబ్బతిన్న చోట తాకడంతో ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై అక్కడికిక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. -
●గుంతకల్లుకు చెందిన రోషన్ ఆలీకి ఇరవై ఏళ్లు. తండ్రి మటన్ వ్యాపారం చేస్తాడు. అయినా సరే రోషన్‌కు చికెన్ అంటే ప్రాణం. రోజూ రెండు ముక్కలైనా చికెన్ ఉండాల్సిందే అంటున్నాడు.
●అనంతపురంలోని పాతూరుకు చెందిన షణ్ముగ వయసు 15 ఏళ్లు. చికెన్ అంటే మహా ఇష్టం. ఒక్క రోజులోనే కేజీ చికెన్ ఫ్రైచేసి ఇచ్చినా తినేస్తానంటాడు. నెలలో 10 రోజులు చికెన్ ఉండాల్సిందే అంటున్నాడు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: యుక్తవయసు పిల్లలు శాకాహారం కన్నా మాంసాహారానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. మెజారిటీ పిల్లలు చికెన్ అంటే మరీ లొట్టలేసుకుని తింటున్నారు. రాష్ట్రంలో మిగతా జిల్లాలతో పోలిస్తే చికెన్, మటన్ తింటున్న వారిలో ఉమ్మడి అనంతపురం జిల్లా మూడవ స్థానంలో ఉన్నట్టు తేలింది. నేషనల్ న్యూట్రిషనల్ సర్వే ఈ విషయాలను వెల్లడించింది. 10 నుంచి 19 ఏళ్ల మధ్య వయసు గల పిల్లల్లో 75.3 శాతం మంది చికెన్ తింటున్నారు. తర్వాతి స్థానం 51.6 శాతంతో మటన్ ఆక్రమించింది. దేశంలో మాంసాహార వినియోగంఏపీలో ఎక్కువగా ఉండగా, అందులో ఉమ్మడి అనంతపురం జిల్లాలో తక్కువేమీ కాదన్నట్టుంది. కూరగాయలు, పండ్లు తినడంలో వెనుకంజ ఉమ్మడి జిల్లాలో చిన్నారులు, కుర్రాళ్లు చికెన్, మటన్‌ను ఇష్టపడినట్టుగా కూరగాయలు, పండ్లపై మక్కువ చూపడం లేదు. ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఆంధ్ర అని జిల్లాకు పేరున్నా ఇక్కడ పండ్ల వినియోగం చాలా తక్కువగా ఉంది. 2–4 ఏళ్ల మధ్య వయసు చిన్నారుల్లో విటమిన్–ఏతో కూడిన తిండి, కూరగాయలు తినడంలో మిగతా జిల్లాలతో పోలిస్తే చాలా వెనుకబడి ఉన్నట్టు తేలింది. పండ్లు, కూరగాయలు తినడంలో కృష్ణా, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలు ముందంజలో ఉన్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో చేపల లభ్యత బాగానే ఉన్నప్పటికీ చికెన్, మటన్‌తో పోలిస్తే తక్కువ వినియోగం ఉన్నట్టు తేలింది. మాంసాహారంపైనే మక్కువ ఉమ్మడి జిల్లాలో ఎక్కువ మంది కుర్రాళ్లు మాంసాహారం తినడానికి రకరకాల కారణాలున్నాయి. వాటిని ఒక్కసారి చూస్తే... కుటుంబ నేపథ్యంలో చిన్నప్పటినుంచే మాంసాహారంపై మక్కువ పెంచుకోవడం. చికెన్ ఉత్పత్తులు ఎక్కువగా అందుబాటులో ఉండటం. సామాన్య, మధ్యతరగతి కుటుంబాల్లో కొనుగోలు స్థాయి పెరగడం. మాంసాహారాన్ని సాధారణ మెనూగా భావించి వినియోగించడం. యువతను ఎక్కువగా ఆకర్షించేలా విభిన్న రుచుల్లో మాంసాహార వంటకాలు ఉండటం. మాంసాహార వినియోగం పెరుగుతున్న స్థాయిలో వ్యాయామం చేయడం లేదు. వయసుకు మించి బరువు ఎక్కువగా ఉన్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.ఇదీ యుక్త వయసు పిల్లల ఆహారశైలి 75.3 శాతం మంది చికెన్‌పై అమితాసక్తి కూరగాయలు, పండ్లు, పీచు పదార్థాలపై నిరాసక్తత చేపల వినియోగంలో ఉమ్మడి జిల్లా టీనేజర్ల వెనుకంజ -
ఫైబర్ ఆహారం తినడం లేదు
● శరీరానికి అత్యవసరమయ్యే ఫైబర్ (పీచు)తో కూడిన ఆహారం కుర్రాళ్లకు రుచించడం లేదు. ● చిక్కుడు, గోరు చిక్కుడు, బీన్స్ వంటి కూరగాయలను పట్టించుకోవడం లేదు. ● మొలకలతో కూడిన గింజలు, చిరుధాన్యాలను దరిచేరనివ్వడం లేదు. ● గోబీ మంచూరియా, పానీపూరీ, కట్లెట్ లాంటి అనారోగ్యకర ఆహారంపై మక్కువ. ● పాలు, పాలపదార్థాలతో కూడిన ఆహారం కూడా తక్కువగా వినియోగిస్తున్నారు. ● ఫ్రైడ్ ఆహారం తినడం వల్ల 30 ఏళ్లకే గ్యాస్ట్రిక్, అల్సర్ సమస్యలతో సతమతం. -
వైభవంగా వసంతోత్సవం
లేపాక్షి: శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం లేపాక్షి వీరభద్రస్వామి ఆలయంలో శివపార్వతులకు వసంతోత్సవం నిర్వహించారు. నాట్యమంటపంలో శివపార్వతుల ప్రతిమలను ప్రత్యేకంగా అలంకరించి విశేషంగా పూజలు చేశారు. వేదపండితులు హోమాలను నిర్వహించి గ్రామానికి, ప్రజలకు మంచి జరగాలని ఆ దేవదేవుడిని వేడుకున్నారు. అదేవిధంగా ఆలయంలో ధ్వజాఅవరోహణ కార్యక్రమం, సాయంత్రం శయనోత్సవం తదితర కార్యక్రమాలు నిర్వహించి మహాశివరాత్రి ఉత్సవాలకు ముగింపు పలికారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కరణం రమానందన్, ఈఓ నరసింహమూర్తి, గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
నిత్యావసరాలను సక్రమంగా పంపిణీ చేయాలి
తాడిమర్రి: ప్రభుత్వ చౌక ధాన్యపు దుకాణాల ద్వారా ప్రజలకు నిత్యావసరాలను సక్రమంగా పంపిణీ చేయాలని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి పీజీ వంశీకృష్ణారెడ్డి డీలర్లను ఆదేశించారు. తహసీల్దార్ కార్యాలయంలో శనివారం మండలంలోని డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యావసరాల పంపిణీలో అవకతవకలకు పాల్పడొద్దన్నారు. ఎవరైనా తూకాలు తక్కువగా ఇచ్చినా, సరుకులను బ్లాక్ మార్కెట్ తరలించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అందుబాటులో ఉన్న సరుకులు అన్నింటికీ డీడీలు తీసి పంపాలని సూచించారు. అంతకు ముందు ఆయన స్థానిక బీసీ కాలనీలో ఉన్న 1వ చౌక దుకాణాన్ని తనిఖీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ భాస్కర్‌రెడ్డి, సీఎస్టీడీ శారద తదితరులు పాల్గొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు కదిరి అర్బన్: నిబంధనల ప్రకారం ఎరువులు, పురుగు మందులు విక్రయించాలని లేనిపక్షంలో చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయాధికారి(డీఏఓ) సుబ్బారావు ఎరువులు, పురుగు మందుల డీలర్లను హెచ్చరించారు. శనివారం స్థానిక వ్యవసాయ పరిశోధనా స్థానంలో అగ్రి ఇన్పుట్ డీలర్స్ మీట్– 2025 జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి డీలర్ ఎమ్మార్పీకే విక్రయాలు జరపాలన్నారు. ఈ పాస్‌తో విక్రయాలు చేస్తూ రైతులకు బిల్లులు ఇవ్వాలన్నారు. ఎరువులు పురుగుల మందుల చట్టంపై అవగాహన కల్పించారు. వ్యవసాయాధికారులు క్రమం తప్పకుండా ఎరువులు, పురుగుల మందుల దుకాణాలపై తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ఏడీఏ సత్యనారాయణ మాట్లాడుతూ లైసెన్స్ కలిగిన డీలర్స్ మాత్రమే విక్రయాలు చేయాలన్నారు. దుకాణాల వద్ద ధరల పట్టిక ఉంచాలన్నారు. బ్లాక్‌లో అమ్మకాలు సాగిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యవసాయ పరిశోధనాస్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. కిరణ్‌కుమార్‌రెడ్డి విత్తన నాణ్యత, పరిశుబ్రత, మొలకశాతంపై అవగాహన కల్పించారు. డీఆర్సీ ఏడీ సనావుల్లా, కదిరి డివిజన్ పరిధిలోని డీలర్లు, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు. -
పవిత్ర మాసం.. ఆధ్యాత్మిక వికాసం
ఎన్పీకుంట/ హిందూపురం అర్బన్/ బత్తలపల్లి: ముస్లింలకు పరమ పవిత్రమైన మాసం రంజాన్. సత్కార్యాలు, మానవతా విలువలు పరిమళించే వరాల వసంతం. మానసిక ఆధ్యాత్మిక వికాసానికి, జీవన సాఫల్యానికి అవసరమైన సమస్త విషయాలు ఈ మాసంతో ముడిపడి ఉన్నాయి. ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ ఇదే నెలలో అవతరించింది. అందుకే ఈ మాసంలో ముస్లింలు భక్తిశ్రద్ధలతో గడుపుతారు. శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా 300 పైగా మసీదులు ఉన్నాయి. రంజాన్‌తో మసీదులన్నీ ఆధ్యాత్మక శోభను సంతరించుకున్నాయి. 30 రోజులు.. మూడు భాగాలు... రంజాన్ మాసం 30 రోజులపాటు ఉండగా దీనిని మూడు భాగాలుగా విభజిస్తారు. ఇందులో మొదటి 10 రోజుల పాటు ఉపవాసం ఉండటాన్ని రహ్మత్ (దయను పొందటం) మొదటి భాగంగా పరిగణిస్తారు. రెండవ భాగం 10 రోజులను మగ్ఫిరత్ (క్షమను కోరడం)గా విశ్వశిస్తారు. చివరి 10 రోజులను జహ్హన్నం సే నజాత్ (నరకం నుంచి విముక్తి) గా చూస్తారు. మూడో భాగంలో వచ్చే 21, 23, 25, 27, 29వ రాత్రులను పరమ పవిత్రమైనవిగా భావించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఉపవాస దీక్షలు.. పవిత్ర రంజాన్ మాసంలో రోజూ తెల్లవారు జాము నుంచి సాయంత్రం వరకు ముస్లింలు కఠిన ఉపవాస దీక్షలను పాటిస్తారు. పొద్దంతా ఉపవాసంతో ఆరోగ్యం దెబ్బతినకుండా పౌష్టికాహారం తీసుకుంటారు. ఉపవాస దీక్షతో ఎదుటివారి ఆకలి బాధ తెలియడంతోపాటు సహన గుణం పెరుగుతుంది. కష్టాలను ఎదుర్కొనే శక్తి లభిస్తుంది. దాన, ధర్మాలు.. ప్రతి ముస్లిం తన స్థోమతకు తగినట్లు ఈ మాసంలో దాన, ధర్మాలు చేయడాన్ని విధిగా భావిస్తారు. ఒక ముస్లిం వద్ద ఏడాది పాటు ఉన్న నగదు, బంగారంతో పాటు ఇతర సంపదను లెక్క వేస్తారు. ఇందులో నుంచి కొంత భాగం జకాత్ పేరిట దానాలు చేస్తారు. ప్రతి మనిషి (గర్భంలో ఉన్న శిశువుకు సైతం) ఫిత్రా చెల్లిస్తారు. నిరుపేదలకు ఈ మొత్తం అందేలా చూస్తారు. ప్రత్యేక ప్రార్థనలు.. ఈ మాసంలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. రోజూ చేసే ప్రార్థనల కన్నా తరావీహ్ నమాజ్‌కు ప్రత్యేక స్థానం ఉంటుంది. దురలవాట్లకు దూరంగా సత్యనిష్టగా ఉంటారు. దివ్య ఖురాన్ ప్రబోధాలను తెలుసుకొని ఆచరించడానికి ప్రయత్నిస్తారు. వయోబేధం లేకుండా ప్రార్థనలు ఆచరిస్తారు. ప్రారంభమైన రంజాన్ సందడి నేటి నుంచి ఉపవాస దీక్షలు -
కబళించిన మృత్యువు
పెళ్లయిన నెల రోజులకే రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. కొద్దిసేపటి క్రితం ఆనందంగా గడిపిన భర్త విగతజీవిగా పడి ఉండటాన్ని చూసిన భార్య కన్నీరుమున్నీరైంది. అల్లా నాకు ఇంకెవరు దిక్కు అంటూ ఆమె రోదించిన తీరు చూపరులను కంటతడిపెట్టించింది. ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మృతుడి తమ్ముడి పరిస్థితి విషమంగా ఉంది. కదిరి టౌన్: మున్సిపల్ పరిధిలోని కుటాగుళ్ల గ్రామంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తపాలా ఉద్యోగి మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాలు.. పట్టణానికి చెందిన దాదాపీర్(25) తపాలా ఉద్యోగిగా అగళిలో పని చేస్తున్నాడు. శనివారం ఇంటర్ పరీక్షలు రాసిన తన తమ్ముడు సయ్యద్‌బాషాను బ్లూమూన్ కళాశాల నుంచి తన బైక్‌పై ఎక్కించుకుని ఇంటికి బయలుదేరాడు. కుటాగుళ్ల సర్కిల్ వద్ద పులివెందుల రోడ్డుపై ఆర్టీసీ బస్సును ఢీకొన్నాడు. ఘటనలో తలకు తీవ్రగాయాలు కావడంతో దాదాపీర్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన సయ్యద్‌బాషాను అక్కడి నుంచి కదిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం తీసుకెళ్లారు. సయ్యద్‌బాషా కోమాలో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మిన్నంటిన రోదనలు.. దాదాపీర్ నెల రోజుల క్రితం కుటాగుళ్లకు చెందిన అల్పియాను వివాహం చేసుకున్నాడు. దాదాపీర్ మృతి చెందిన విషయం తెలుసుకున్న భార్య, తల్లిదండ్రులు, అత్తమామలు, బంధువులు పెద్దసంఖ్యలో ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. ఈసందర్భంగా మృతుడి భార్య, కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. దేవుడా మాకు ఇంత అన్యాయం చేశావా అంటూ కన్నీరుమున్నీరయ్యారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయనున్నట్లు ఎస్ఐ బాబ్జాన్ తెలిపారు. పెళ్లయిన నెలరోజులకే రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి మృతుడు తపాలా ఉద్యోగి -
అనంతపురంలో దళిత సంఘాల నేతలకు అవమానం
సాక్షి, అనంతపురం జిల్లా: అనంతపురంలో దళిత సంఘాల నేతలకు అవమానం జరిగింది. హోంమంత్రి అనితను కలిసేందుకు వెళ్లిన దళిత సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. హోంమంత్రి అనిత తమను పట్టించుకోవడం లేదని దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దళితులపై దాడులు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని నేతలు మండిపడ్డారు. హోం మంత్రి అనితను కలిసి వినతి పత్రం అందజేసేందుకు వెళ్లిన ఎస్సీ ఎస్టీ సంఘాల జేఏసీ అధ్యక్షుడు సాకే హరి వెళ్లగా.. అంబేద్కర్ విగ్రహం వద్ద పోలీసులు అడ్డుకున్నారు.కారు కూడా దిగకుండా.. మంత్రిగారూ.. ఇదేం తీరు!కర్నూలు: మంత్రి హోదాలో ఉన్న టీజీ భరత్ కనీసం ప్రజల సమస్యలను వినడానికి కూడా ఇష్టపడటం లేదు.పింఛన్ రావడం లేదని సమస్యను చెప్పుకోవడానికి వెళ్లిన వృద్ధురాలి మంత్రి పట్టించుకోలేదు. నడవడానికి ఇబ్బంది పడుతున్న వృద్ధురాలు మంత్రి దగ్గరకు వెళ్లగా.. టీజీ భరత్ కారు కూడా దిగలేదు. తనకు పింఛన్ రావడం లేదని.. ఇప్పించాలంటూ మంత్రిని వృద్ధురాలు కోరింది. కొత్త పింఛన్లు వస్తే ఇస్తామంటూ మాట దాటేశారు. సమస్యలను వినాల్సిన మంత్రి.. కారు కూడా దిగకుండానే ప్రజలు సమస్యలను ఏసీ కారులో కూర్చోని విన్నారు. మంత్రి తీరుపై స్థానికులు మండిపడ్డారు. -
ఎండుమిర్చి @ 14,500
హిందూపురం అర్బన్: స్థానిక వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం క్వింటా ఎండుమిర్చి గరిష్టంగా రూ.14,500 పలికింది. మార్కెట్‌కు 106.60 క్వింటాళ్ల ఎండుమిర్చి రాగా, అధికారులు ఈ–నామ్ పద్ధతిలో వేలం పాట నిర్వహించారు. ఇందులో మొదటి రకం మిర్చి క్వింటాకు గరిష్టంగా రూ.14,500, కనిష్టంగా రూ.8 వేలు, సగటున రూ.11 వేలు ప్రకారం ధర పలికినట్లు మార్కెట్ కార్యదర్శి జి. చంద్రమౌళి తెలిపారు. గత వారం క్వింటా గరిష్టంగా రూ.11 వేలు పలుకగా ఈ వారం 3,500 అధికంగా పలకడం విశేషం. నేటి నుంచి ఇంటర్ పరీక్షలు పుట్టపర్తి టౌన్: ఇంటర్ వార్షిక పరీక్షలు శనివారం ప్రారంభం కానున్నాయి. తొలిరోజు మొదటి సంవత్సరం, 3వ తేదీ నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతాయి. ఈ నెల 20 నాటికి ముగుస్తాయి. రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు ఉంటాయి. జిల్లా నుంచి మొదటి సంవత్సరం విద్యార్థులు 13,083 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 10,904 మంది మొత్తం 23,987 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరికోసం జిల్లా వ్యాప్తంగా 42 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రత్న తెలిపారు. కేంద్రాల్లోకి సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించబోమన్నారు. పరీక్ష కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లు, సెల్‌ఫోన్ దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. బాధిత కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ● ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలతో దిగివచ్చిన విద్యుత్ శాఖ మడకశిర: ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిపై విద్యుత్తీగ తెగిపడి మృతి చెందగా.. బాధిత కుటుంబానికి ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలతో రూ.5 లక్షల పరిహారం దక్కింది. వివరాల్లోకి వెలితే... 2024 జూలై 27న మడకశిరకు చెందిన పెన్న ఓబిలేసు(39) వ్యక్తిగత పనిపై ద్విచక్రవాహనంలో ఇంటి నుంచి బయలుదేరాడు. యాదవ కల్యాణ మండపం వద్దకు చేరుకోగానే 11 కేవీ లైన్ విద్యుత్ తీగలు తెగి పెన్న ఓబిలేసుపై పడ్డాయి. విద్యుదాఘాతానికి గురైన పెన్న ఓబిలేసు అక్కడికక్కడే మృతి చెందారు. పెన్న ఓబిలేసు మృతితో ఆ కుటుంబం ఆర్థిక అండ కోల్పోయింది. ఆదుకోవాలని బాధిత కుటుంబీకులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా విద్యుత్ శాఖ స్పందించలేదు. దీంతో పెన్న ఓబిలేసు కుటుంబీకులు న్యాయం కోసం జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ)ని ఆశ్రయించారు. స్పందించిన ఎన్హెచ్ఆర్సీ మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందించాలని గురువారం విద్యుత్ శాఖను ఆదేశించింది. దీంతో విద్యుత్‌శాఖ శుక్రవారం మృతుడి భార్య ఖాతాలో రూ.5 లక్షలు జమ చేసింది. తమ కుటుంబానికి నష్ట పరిహారం అందే విధంగా కృషి చేసిన ప్రతి ఒక్కరికీ మృతుని భార్య కృతజ్ఞతలు తెలిపారు. -
టీడీపీ x బీజేపీ
ముదిగుబ్బ: మండలంలో టీడీపీ, బీజేపీ నాయకుల మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. శుక్రవారం సంకేపల్లి గ్రామంలో బీజేపీకి చెందిన ఎంపీపీ ఆదినారాయణ వాహనాన్ని టీడీపీ శ్రేణులు అడ్డుకుని వాహనంలోని వారిపై దాడి చేశారు. వాహన అద్దాన్ని కూడా ధ్వంసం చేశారు. గురువారం వీరనారాయణస్వామి పరుషలో ఎంపీపీ ఆదినారాయణ అనుచరులు టెంకాయల వ్యాపారి మల్లికార్జునపై దాడి చేశారు. అతను టీడీపీకి చెందిన వ్యక్తి కావడంతో ఆ పార్టీ నాయకులు దాడిని తీవ్రంగా పరిగణించారు. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఎంపీపీ ఆదినారాయణ స్వగ్రామం బి.కొట్టాల నుంచి ముదిగుబ్బకు బయలుదేరారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు మార్గమధ్యంలోని సంకేపల్లిలో కాపు ఒక్కసారిగా వాహనంపై దాడి చేశారు. అద్దాన్ని పగులగొట్టారు. వాహనంలోని వీరాంజి, ఉపేంద్ర అనే వ్యక్తులను బయటకు లాగి కొట్టారు. ఎంపీపీ మాత్రం వాహనంలోనే ఉండిపోయారు. నిన్న వీరనారాయణస్వామి పరుషలో తన భర్త మల్లికార్జునపై ఎందుకు దాడి చేశారంటూ భార్యతో పాటు బంధువులు ఎంపీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే సంకేపల్లికి చేరుకుని గుంపులను చెదరగొట్టారు. ఎంపీపీని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇరువర్గాల వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ధర్మవరం డీఎస్పీ ముదిగుబ్బకు చేరుకొని పరిస్థితిని పర్యవేక్షించారు.ముదిగుబ్బ ఎంపీపీ వాహనంపైటీడీపీ శ్రేణుల దాడివాహనంలోని వ్యక్తులను బయటకు లాగి కొట్టిన వైనం -
చేనేతలకు తీవ్ర అన్యాయం
రాష్ట్ర బడ్జెట్ అంతా అంకెల గారడీ. ఏ ఒక్కరికీ ఉపయోగం లేదు. చేనేత రంగానికి సరిపడా నిధులు కేటాయించకుండా నేతన్నలకు తీవ్ర అన్యాయం చేశారు. పెరిగిన ముడిపట్టు ధరలు, పట్టుచీరలకు మద్దతు ధర లేక చేనేత కార్మికులు అవస్థలు పడుతుంటే ఆదుకునేందుకు బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ‘నేతన్న నేస్తం’ ద్వారా ఏటా ఒక్కో చేనేత కుటుంబానికి రూ.24 వేలు ఇచ్చాం. ప్రస్తుతం ఆ పథకాన్ని చంద్రబాబు అటకెక్కించారు. –కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే -
విద్యారంగాన్ని విస్మరించారు
బడ్జెట్లో విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించారు. బడ్జెట్లో ప్రభుత్వ విద్యకు 20 శాతం నిధులు కేటాయించాలని కొఠారి కమిషన్ చేసిన సూచనలు పూర్తిగా విస్మరించారు. పాఠశాల విద్యాశాఖకు బడ్జెట్లో 9.86 శాతం మాత్రమే నిధులు కేటాయించడం అన్యాయం. ‘నాడు–నేడు’ పెండింగ్ పనుల గురించి బడ్జెట్లో ఎక్కడా ప్రస్తావించ లేదు. మోడల్ ప్రైమరీ స్కూళ్లకూ ఎలాంటి నిధులు కేటాయించ లేదు. 12వ పీఆర్సీ, ఆర్థిక బకాయిలు చెల్లింపు ఊసే కూడా లేకపోవడం అన్యాయం. – శెట్టిపి జయచంద్రారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి, యూటీఎఫ్