Srikakulam
-
లక్ష్మీ గణేష్ చిట్స్ యజమానుల ఆస్తుల జప్తు
నరసన్నపేట: నరసన్నపేటలో లక్ష్మీ గణేష్ చిట్స్ సంస్థకు చెందిన యజమానుల ఆస్తులను జప్తు చేస్తూ హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జీఓ నంబరు 46 ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమార్ విశ్వజీత్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో చిట్ ఫండ్ వ్యాపారి కోరాడ గణేశ్వరరావు, ఆయన భార్య కోరాడ లక్ష్మి, బంధువులు అంధవరపు సూర్యనారాయణమూర్తి, అంధవరపు భారతిల పేరిట ఉన్న ఆస్తులను జప్తు చేస్తున్నట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు. స్థానిక కలివరపుపేటలో నివసిస్తున్న గణేశ్వరరావు 2021 జూన్ 30న కుటుంబంతో సహా పరారయ్యాడు. దీంతో బాధితులు పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించారు. నరసన్నపేట పోలీసులు కేసు నమోదు చేయగా.. అనంతరం కేసు సీఐడీకి అప్పగించారు. సీఐడీ అదనపు ఎస్పీ రవివర్మ నరసన్నపేటకు పలుమార్లు వచ్చి వివరాలు సేకరించారు. అప్పటి వరకూ తప్పించుకు తిరుగుతున్న గణేష్, భార్య, బంధువులను అరెస్టు చేశారు.తాజాగా ఆస్తుల జప్తుకు ఆదేశాలు జారీ అయ్యాయి. నిందితులు రూ.2.5 లక్షలు, రూ.5 లక్షలు, రూ.10 లక్షలు చిట్టీలను నడిపి 48 మంది బాధితల నుంచి రూ.3.26 కోట్లు, మరో 26 మంది బాధితుల నుంచి రూ. 2.59 కోట్లు డిపాజిట్లు రూపంలో సేకరించినట్లు తేలింది. -
లోయలో పడి ఇద్దరు మృతి
● ఒడిశాలో దుర్ఘటన ● మృతులు సూదికొండ వాసులు కాశీబుగ్గ: ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా రాయఘడ బ్లాక్ అర్సిలింగి ఘాట్ వద్ద మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని సూదికొండకు చెందిన ఇద్దరు మృత్యువాతపడ్డారు. సూదికొండకు చెందిన ముగ్గురు కొయంపూర్కు వ్యక్తిగత పనిపై వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న స్కూటీని తప్పించబోయి లోయలో పడిపోయినట్లు తెలిసింది. ఈ ఘటనలో సూదికొండకు చెందిన సయ్యద్ ఫరీద్ (27) అక్కడికక్కడే మృతిచెందగా, బుట్ట గంగాధర్ (35) గజపతి జిల్లా పర్లాఖిమిడి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. గంగాధర్ భార్య బుట్ట సరళకు తీవ్ర గాయాలు కావడంతో బరంపురం పెద్దాసుపత్రికి చికిత్స అందిస్తున్నారు. బుధవారం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను బాధిత కుటుంబాలకు అప్పగించనున్నారు. గారబంద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కార్గో ఎయిర్‌పోర్టును అడ్డుకుందాం
వజ్రపుకొత్తూరు రూరల్: పచ్చని ఉద్దాన ప్రాంతంలో కార్గో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి వ్యతిరేకంగా ఈ నెల 18, 19 తేదీల్లో బాధిత ప్రాంతాలలో చేపట్టనున్న ప్రచార యాత్రను విజయవంతం చేయాలని ఎయిర్ పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఈ మేరకు వజ్రపుకొత్తూరు మండలం ఒంకులూరులో మంగళవారం వామపక్ష పార్టీలతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఉద్దాన ప్రాంతాన్ని నమ్ముకొని వేలాది మంది ప్రజలు జీవనోపాధి పొందుతుంటే ప్రభుత్వం ఈ ప్రాంతంలో విధ్వంసకర ఎయిర్ పోర్టుతో వారి బతుకులను నాశనం చేయాలని చూస్తోందని మండిపడ్డారు. ప్రజలకు మేలు చేయాలంటే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయాలని, ఉద్యాన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. కార్యక్రమంలో పోరాట కమిటీ అధ్యక్షుడు వాసుదేవరావు, సీపీఐ(ఎం.ఎల్) కార్యదర్శి చాపర వేణుగోపాల్, న్యూ డెమొక్రసీ నాయకులు వంకల మాధవరావు, జోగి అప్పారావు, ఎల్.రామస్వామి, రామ్మూర్తి, ధనుంజయ, గుంటు రామారావు, జోగి శ్రీదేవి, వల్లభరావు, మైనపల్లి శేఖరం, గుంటు రామస్వామి తదితరులు పాల్గొన్నారు. -
బ్యాంక్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
శ్రీకాకుళం అర్బన్: బ్యాంక్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని యూఎఫ్‌బీయూ జిల్లా కన్వీనర్ బి.శ్రీనివాసులు డిమాండ్ చేశారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు మంగళవారం శ్రీకాకుళం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ కార్యాలయం వద్ద ఉద్యోగులు, అధికారులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ రంగ బ్యాంకులపై ప్రభుత్వం చేపడుతున్న వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ధర్నాచేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఐ బోక్ రీజనల్ కార్యదర్శి కె.తేజేశ్వరరావు, కో–ఆర్డినేషన్ కమిటీ అధ్యక్షులు గిరిధర్ నాయక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల ఉపాధ్యక్షురాలు జి.కరుణ, ఇండియన్ బ్యాంక్ మహిళా కన్వీనర్ శ్రావణి, కో–ఆర్డినేషన్ జాయింట్ కార్యదర్శి ఎ.సూర్య, ఓబీసీ ఉద్యోగ సంఘ నాయకులు సూర్యకిరణ్, నరేష్ శ్రీనివాస్, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు. మార్చి 24, 25 తేదీలలో సమ్మె శ్రీకాకుళం అర్బన్: యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్న్స్ ఆధ్వర్యంలో దాదాపు పది లక్షలమంది ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు, అధికారులు ఈ నెల నెల 24, 25 తేదీల్లో సమ్మెకు దిగుతున్నట్లు యూనియన్ ప్రతినిధులు తెలిపారు. యూనియన్ శ్రీకాకుళం కన్వీనర్ కేసీహెచ్ వెంకటరమణ ఆధ్వర్యంలో మంగళవారం శ్రీకాకుళం పెద్దపాడు రోడ్డులోని ఎస్బీఐ రీజనల్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. సమ్మె ఉద్దేశం, ప్రధానమైన డిమాండ్లను వివరించారు. కార్యక్రమంలో ఎస్బీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ రీజనల్ సెక్రెటరీ కృష్ణ కిషోర్, లోకల్ సెక్రటరీ నాయుడు, ఐబోక్ కిషోర్, బెఫి మండ శ్రీనివాసరావు, ఏఐబీఈఏ శ్రావణి పాల్గొన్నారు. -
ముగిసిన జాతీయ విజ్ఞాన దినోత్సవ పోటీలు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్సవ పోటీలు ముగిశాయి. శ్రీకాకుళం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో శ్రీకాకుళం, టెక్కలి, పలాస మూడు డివిజన్ల పరిధిలో విజేతలగా నిలిచిన పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ప్రాథమిక, సెకండరీ విభాగాల్లో క్విజ్, ఎక్పైర్మెంట్, సింపోసియం (విశ్లేషనాత్మక చర్చ) అంశాల్లో పోటీలు జరిగాయి. విజేతలకు రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు కాంతారావు, డీఈఓ తిరుమల చైతన్య బహుమతులు అందజేశారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు శాసీ్త్రయమైన దృక్పథాలను అలవర్చుకోవాలని, పరిశోధనలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. అంతకుముందు కార్యక్రమ కో–ఆర్డినేటర్, శ్రీకాకుళం ఉప విద్యాశాఖాధికారి ఆర్.విజయకుమారి పోటీలను పర్యవేక్షించారు. వీటి కొనసాగింపుగా జరిగే రాష్ట్రస్థాయి విజ్ఞానశాస్త్ర దినోత్సవ పోటీలు (తేదీలు ఖరారుకాలేదు) శ్రీకాకుళంలోనే జరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉప విద్యాశాఖాధికారి(టెక్కలి)పి.విలియమ్స్, జిల్లా సైన్స్ అధికారి ఎన్.కుమారస్వామి, సైన్స్ ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. విజేతలు వీరే.. క్విజ్: ప్రాథమిక స్థాయిలో ఎంపీపీ స్కూల్ గంగువాడ, ఎంపీపీ స్కూల్ నందిగాం మెయిన్, ఎంపీపీ స్కూల్ పెద్దలంకాం మొదటి మూడుస్థానాల్లో నిలిచారు. సెకండరీ స్థాయిలో జెడ్పీహెచ్ స్కూల్ కొయ్యాం, జెడ్పీహెచ్‌స్కూల్ ప్లస్ హరిపురం, జెడ్పీహెచ్ స్కూల్ బోరివంగ తొలి మూడుస్థానాలు సాధించాయి. ఎక్పైర్మెంట్: ప్రాథమిక స్థాయిలో జరిగిన ఈ పోటీల్లో జెడ్పీహెచ్ స్కూల్ కోటబొమ్మాళి, ఎంజేపీడబ్ల్యూఆర్జీ స్కూల్ హయాతీనగరం, జెడ్పీహెచ్ స్కూల్(బోర్డు) నరసన్నపేట మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. సింపోసియం: సెకండరీ స్థాయిలోనే జరిగిన ఈ పోటీల్లో జెడ్పీహెచ్ స్కూల్ రొంపివలస, జెడ్పీహెచ్ స్కూల్ కొసమాల, జీహెచ్ స్కూల్ కవిటి పాఠశాలలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. -
ఎత్తిపోతల పథకం సామగ్రి చోరీ
ఆమదాలవలస రూరల్: రైతులకు సాగునీరందించేందుకు ఆమదాలవలస మండలం అక్కులుపేటలో బొడ్డేపల్లి రాజుగోపాలరావు వంశధార కుడిప్రధాన కాలువ 20ఎల్ ఎత్తిపోతల పథకం వద్ద చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి కరెంట్ సరఫరా నిలుపుదల చేసి మూడు ట్రాన్స్ఫార్మర్లలోని రాగి కాయిల్స్, కరెంట్ ఆయిల్ పట్టుకుపోయారు. పాటు అందులో ఉండే కరెంట్ ఆయిల్ అపహరించుకుపోయారు. విషయం తెలుసుకున్న రైతులు, శ్రీనివాసచార్యులుపేట సర్పంచ్ గౌరిపతి ఆమదాలవలస పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ ఎస్ బాలరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ కమిటీ ఏర్పాటు శ్రీకాకుళం కల్చరల్: రాష్ట్ర వ్యాప్తంగా గ్రంథాలయ పునర్వికాస ఉద్యమం కోసం జిల్లా, డివిజన్ కన్వీనర్లను నియమిస్తున్నట్లు ఉద్యమ రాష్ట్ర కన్వీనర్ వల్లూరి శివప్రసాద్ మంగళవారం ప్రకటించారు. జిల్లా కన్వీనర్‌గా విద్యావేత్త బుడుమూరు సూర్యారావును నియమించారు. ఈయన ప్రస్తుతం బూర్జ మండల ఉపాధ్యక్షునిగా ఉన్నారు. గ్రంథాలయ వ్యవస్థ పట్ల అభిమానం ఉన్నవారినే ఉద్యమ కమిటీలో ఏర్పాటు చేస్తున్నామని, వారి రాజకీయ కార్యకలాపాలతో తమకు సంబంధం లేదని శివప్రసాద్ స్పష్టం చేశారు. శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్ కన్వీనర్‌గా విద్యావేత్త డాక్టర్ జామి భీమశంకర్, టెక్కలి డివిజన్ కన్వీనర్‌గా బెండి నర్సింగరావు, పలాస డివిజన్ కన్వీనర్‌గా చాపర వేణుగోపాల్‌ను నియమించారు. సాహితీ స్రవంతి జిల్లా కన్వీనర్ కె.శ్రీనివాస్, న్యాయవాది బొడ్డేపల్లి మోహన్‌రావు, విశ్రాంత లైబ్రేరియన్ డి.గోపాలరావు, అరసం జిల్లా కార్యదర్శి చింతాడ కృష్ణారావు, విద్యావేత్త శాసనపురి మధుబాబు, ఇస్కఫ్ జిల్లా అధ్యక్షులు ఎం.వి.మల్లేశ్వరరావులను సభ్యులుగా ఎంపికచేశారు. ఈ నియామకాలపై రచయిత అట్టాడ అప్పలనాయుడు, అరసం జిల్లా అధ్యక్షులు నల్లి ధర్మారావు, కథానిలయం ప్రతినిధి దాసరి రామచంద్రరావు, శ్రీకాకుళ సాహితీ ప్రతినిధులు, కవులు కంచరాన భుజంగరావు, కలమట దాసుబాబు తదితరులు హర్షం వ్యక్తం చేస్తూ ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు. పరిశ్రమ వ్యర్థాలతో భూగర్భ జలాలు కలుషితం రణస్థలం: మండలంలోని పైడిభీమవరం పారిశ్రామికవాడలో సరాకా లేబొరేటరీ పరిశ్రమ వ్యర్థ జలాలు బయటకు విడిచిపెట్టి భూగర్భ జలాలు కలుషితం చేస్తున్నారంటూ నారువ పంచాయతీ ప్రజలు మంగళవారం ఫ్యాక్టరీ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. గతంలో పైపులైన్లు ద్వారా సముద్రంలో విడిచిపెట్టేవారని, కొన్నాళ్లుగా పరిశ్రమ పక్కనే గెడ్డ, కొండదిబ్బ దిగువ ప్రాంతాల్లో విడిచిపెడుతున్నారని చెప్పారు. వ్యర్థ జలాల కారణంగా ప్రాణాంతక వ్యాధులు సంక్రమిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై కాలుష్య నియంత్రణ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికై నా వ్యర్థాలు పారబోయడం ఆపకపోతే పోరాటం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. నిరసన కార్యక్రమంలో నారువ, అక్కయ్యపాలెం, బోయపాలెం తదితర గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. ప్రకృతి సాగుకు ప్రాధాన్యం ఎచ్చెర్ల క్యాంపస్: వచ్చే ఖరీఫ్‌లో జిల్లాలో 1.40 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం సాగు చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ పి.రేవతి తెలిపారు. ఎచ్చెర్లలోని సాంకేతిక శిక్షణ కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు రిసోర్సుపర్సన్లకు మూడు రోజుల శిక్షణ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 70వేల మంది రైతులకు ప్రకృతి వ్యవసాయ సాగుపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. పురుగుల మందులు, రసాయన ఎరువుల రహిత వ్యవసాయం లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. అనంతరం శాస్త్రవేత్తలు, నిపుణులు ఆన్లైన్లో పలు అంశాలపై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ ధనుంజయరావు, సిబ్బంది సూర్యనారాయణ, పీఎస్ బాబు పాల్గొన్నారు. -
విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం
ఆమదాలవలస: సంక్షేమం, అభివృద్ధి అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కేవీజీ సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఆమదాలవలసలోని పార్టీ కార్యాలయంలో యువత పోరు పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందని దుయ్యబట్టారు. సూపర్‌సిక్స్ హామీలు నెరవేర్చకుండా నయవంచన పాలన చేస్తోందని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ.3600 కోట్లు బకాయిలు ఉంటే ఇటీవల బడ్జెట్లో రూ. 2,600 కోట్లు మాత్రమే కేటాయించడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పేదలకు నేరుగా వారి ఖాతాలోకి సంక్షేమ పథకాలు అందాయని గుర్తు చేశారు. ●రాష్ట్ర కాళింగ సామాజిక వర్గం అధ్యక్షుడు దుంపల లక్ష్మణరావు (రామారావు)మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న కూటమి ప్రభుత్వంపై యువత పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కూటమి పాలనను ప్రజలు గమనిస్తున్నారని, ఇటీవల జరిగిన ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే వారి పాలనకు నిదర్శనమన్నారు. కలెక్టరేట్ వద్ద జరిగే యువతకు పోరుకు ప్రతిఒక్కరూ తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో ఆమదాలవలస మండల పార్టీ అధ్యక్షుడు తమ్మినేని శ్రీరామమూర్తి, పొందూరు మండల పార్టీ అధ్యక్షుడు పప్పల రమేష్‌కుమార్, సరుబుజ్జలి మండల పార్టీ అధ్యక్షుడు బెవర మల్లేశ్వరరావు, మాజీ పీఎసీఎస్ అధ్యక్షుడు గురుగుబెల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
కేరాఫ్ దివ్యాంగులు
సహజ రంగులు.. పూలరెక్కలను ఎండబెడుతున్న దివ్యాంగులు శ్రీకాకుళం కల్చరల్ : రంగుల కేళీ హోలీ పండుగ సమీపిస్తోంది. ఈ నెల 14న జరిగే ఆనందాల వేడుకకు ఇప్పటికే తాత్కాలిక రంగుల దుకాణాలు సిద్ధమయ్యాయి. అయితే రసాయనాలతో తయారుచేసే కృత్రిమ రంగులు కాకుండా పర్యావరణ హితమైన రంగులు వాడాలని పర్యావరణవేత్తలు ఎప్పటి నుంచో విజ్ఞప్తులు చేస్తున్నా అలాంటి రంగులు ఎలా తయారవుతాయో..అవి ఎక్కడ దొరుకుతాయో చాలామందికి తెలియదు. ఈ నేపథ్యంలో రసాయనాలు లేని రంగులు తయారు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు జిల్లా కేంద్రంలో ఉంటున్న బెహరా మనోవికాస కేంద్రంలోని దివ్యాంగులు. అందమైన, పర్యావరణానికి హాని చేయనటువంటి రంగులను స్వహస్తాలతో తయారు చేస్తున్నారు. పూలరెక్కలతో.. హోలీ రంగులు పర్యావరణానికి హాని చేయకుండా ఉండడానికి రసాయనాలు లేకుండా కేవలం పూల రెక్కలతోనే ఇక్కడ సహజ సిద్ధమైన రంగులు తయారు చేస్తున్నారు. 74మంది మానసిక దివ్యాంగులు ఈ రంగుల రూపకల్పనలో పాలుపంచుకుంటున్నారు. ముందుగా వివిధ రకాల పూల రెక్కలను ఆరబెడతారు. అవి పూర్తిగా ఆరాక రంగుల వారీగా విడదీసి యంత్రంలో వేసి పౌడర్‌గా చేస్తున్నారు. వాటిని చిన్నచిన్న ప్యాకెట్లలో కట్టి అమ్మకానికి సిద్ధం చేస్తున్నారు. కేంద్రంలో మానసిక దివ్యాంగులు తయారు చేసిన సహజ సిద్ధమైన రంగులు, ఇతర ఉత్పత్తులతో ఎగ్జిబిషన్ సైతం ఏర్పాటు చేశారు. వీటిని కొనుగోలు చేయడం ద్వారా మానసిక దివ్యాంగులను ప్రోత్సహించిన వారవుతారు. దివ్యాంగులకు ప్రోత్సాహం దివ్యాంగుల సృజనకు మా వంతు ప్రోత్సాహం ఇస్తున్నాం. పూలతో సహజ సిద్ధంగా తయారు చేసిన ఈ రంగులు ప్యాకెట్ రూ.30 నుంచి మొదలుకుని సెట్ రూ.150 వరకు విక్రయిస్తున్నాం. దివ్యాంగులను ప్రోత్సహించేందుకు ఎవరైనా కొనుగోలు చేయాలంటే కేంద్రంలో సంప్రదించవచ్చు. – శ్యామల, బెహరా మనోవికాస కేంద్రం నిర్వాహకులు, పాత హౌసింగ్ బోర్డు కాలనీ, శ్రీకాకుళం పూలతో పర్యావరణ హితమైన రంగుల తయారీ అబ్బురపరుస్తున్న మనోవికాస కేంద్రం దివ్యాంగులు 14న హోలీ వేడుకలకు రంగులు సిద్ధం -
నిర్లక్ష్యపు చెదలు
కిడ్నీ ఆస్పత్రికి.. కాశీబుగ్గ: ఉద్దానంలో కిడ్నీ మహమ్మారిని కట్టడి చేయడంతో పాటు కిడ్నీ వ్యాధిగ్రస్తులతో అత్యుత్తమ వైద్యసేవలు అందించిన గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా పలాసలో కిడ్నీ పరిశోధన కేంద్రం, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, డయాలసిస్ యూనిట్లను ప్రారంభించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సమున్నత లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ ఆస్పత్రిపై కూటమి సర్కారు నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. నిర్వహణను గాలికొదిలేసింది. సిబ్బంది కొరత, మందుల లేమి తదితర సమస్యలతో కిడ్నీ బాధితులు సతమతమవుతున్నారు. ఇదీ పరిస్థితి.. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.85 కోట్లతో కిడ్నీ పరిశోధన కేంద్రం, 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, డయాలసిస్ యూనిట్‌ను ప్రారింభించారు. ఉద్దాన కిడ్నీ బాధితులకు సేవలు అందిస్తున్న తరుణంలో ప్రభుత్వం మారడంతో సేవలు మృగ్యమవుతున్నాయి. గత ఎనిమిది నెలల వ్యవధిలో సర్కారు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుండటంతో ఇరవై ఐదు మందికిపైగా మరణించినట్లు సమాచారం. మృతదేహాలను గుట్టుచప్పుడు కాకుండా తరలించేస్తున్నారు తప్ప మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయి..తదితర కారణాలను పట్టించుకునే వారే కరువయ్యారు. ఇవీ సమస్యలు.. ● పలాస కిడ్నీ ఆస్పత్రిలో పూర్తి స్థాయిలో వైద్యులు లేరు. కిడ్నీ వ్యాధి నిపుణులు ఒక్కరే కావడంతో అతని కోసం వేలాది మంది రోగులు వేచి ఉండాల్సిన పరిస్థితి. ●గత ప్రభుత్వంలోనే పూర్తిస్థాయి మెషీన్లు సిద్ధం చేసినా ప్రస్తుత ప్రభుత్వం ఆపరేటర్లను ఇంతవరకు నియమించలేదు. దీంతో బయటే పరీక్షలు చేయించుకోవాల్సి వస్తోంది. ● ఆస్పత్రిలో అరకొరగా మందులు మాత్రమే అందిస్తున్నారు. గత ప్రభుత్వంలో 40 రకాల మాత్రలు మందులు అందించేవారు. ఇప్పుడు 23 రకాలు అందిస్తున్నా అందులో చాలావరకు స్టాకు లేదు. స్కానింగ్, ఇంజక్షన్లదీ అదే పరిస్థితి. ● ఇన్‌పేషెంట్‌కు డైట్ ఇవ్వడం లేదు. వారం నుంచి పది రోజులు ఉండాల్సిన వ్యాధిగ్రస్తులు, వారికి సహాయంగా వచ్చేవారికి ఇబ్బందులు తప్పడం లేదు. మందులు ఇవ్వడం లేదు.. కిడ్నీ సమస్యకు సంబంధించిన మాత్రలు ప్రభుత్వం ఇవ్వమని రెండు వారాలుగా అడుగుతున్నా ప్రభుత్వం సరఫరా చేయడం లేదని చెబుతున్నారు. అధికారులు స్పందించి పలాస కిడ్నీ ఆసుపత్రికి పూర్తి స్థాయిలో మందులు అందుబాటులోకి తీసుకురావాలి. – పిట్ట నీలయ్య, ఆర్అండ్ఆర్ కాలనీ, కోసంగిపురం కూడలి అధికారుల దృష్టికి తీసుకెళ్లాం.. పలాస కిడ్నీ పరిశోధన కేంద్రంలో సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఆసుపత్రిలో డైట్ ఇవ్వకపోవడం వాస్తవమే. వైద్యులు, మిషన్ ఆపరేటర్లు, ఇతర సిబ్బందిని నియమించాల్సి ఉంది. – డాక్టర్ అల్లు పద్మజ, సూపరింటెండెంట్, కిడ్నీ పరిశోధన కేంద్రం, పలాస నిర్వహణను గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం వసతుల లేమి..మందుల కొరత -
బంగారు అవకాశం.. హద్దు ఆకాశం
ఎన్నాళ్లుగానో మదిలో మెదులుతున్న రూపం కళ్ల ముందు కదలాడే క్షణాలవి.. ఎన్నో కలలు, మరెన్నో ఆశల ప్రతిరూపాలుగా వాహనాలు మెరుపులా దూసుకెళ్లే అపురూప ఘడియలవి. గోకార్టింగ్ అంటే కేవలం వాహనాల పోటీ కాదు. ఎంతో ఇష్టపడి తయారు చేసుకున్న మోడల్, కష్టపడి తయారు చేసుకున్న ఇంజిన్, వాహనంలో ప్రతి విభాగంపై సొంత ముద్ర.. ఇలా ప్రతి అంశంలోనూ విద్యార్థులు తమను తాము చూసుకుంటారు. పోటీలో బండి పరుగులు పెడుతుంటే చూసి మురిసిపోతారు. ఓ కొత్త వాహనానికి పురుడు పోసే దశను గుండెతో ఆస్వాదిస్తారు. టెక్కలి: శ్రీకాకుళం జిల్లాలో జరిగిన జాతీయ స్థాయి గోకార్టింగ్ పోటీలు ఇంజినీరింగ్ విద్యార్థుల మనసు దోచుకున్నాయి. ఆటోమొబైల్ రంగంలో ఎదగాలనుకునే విద్యార్థులకు ఈ పోటీలు ఒకరకంగా తొలి పరీక్ష లాంటివి. ఈ పోటీలు నిర్వహించడం, అందులో పాల్గొనడం, వాహనాలు తయారు చేయడం ఆషామాషీ విషయం కాదు. చాలారకాల దశలు దాటాకే బండిని ట్రాక్ మీదకు ఎక్కించాలి. గోకార్టింగ్ పోటీలు ఎందుకు నిర్వహిస్తారు..? ఆటోమొబైల్ రంగంపై ఆసక్తి కలిగిన ఇంజినీరింగ్ విద్యార్థుల్లో అంతర్లీనంగా ఉండే సృజనకు పరీక్ష పెట్టేందుకే ఈ గోకార్టింగ్ పోటీలు నిర్వహిస్తారు. ఇందులో రెండు రకాల వాహనాలు తయారు చేస్తారు. వాటిలో సీవీ(ఇంజిన్‌తో తయారుచేసినవి) ఈవీ(ఎలక్ట్రికల్ వాహనాలు) ఉంటాయి. వాహనాల తయా రీతో పాటు బిజినెస్ ఆలోచనలు సైతం పంచుకునే విధంగా ఈ గోకార్టింగ్ పోటీలు నిర్వహిస్తారు. అర్హతలు ఉండాల్సిందే.. గోకార్టింగ్ పోటీల్లో పాల్గొనాలంటే కళాశాల స్థాయి లో ‘మోటార్ స్పోర్ట్ కార్పొరేషన్’ తయారు చేసిన రూల్ బుక్ ఆధారంగా గ్రాఫికల్‌గా డిజైన్ చేస్తూ వాహనాన్ని తయారుచేయాలి. ఆ తర్వాత పోటీల్లో పాల్గొనేందుకు ఆయా కళాశాలలు నిర్వహించే ఆన్లైన్ పరీక్ష ఉత్తీర్ణత సాధించాలి. పోటీల్లో పాల్గొనే ముందు కూడా డిజైనింగ్ చెక్, ఇన్నోవేషన్ చెకింగ్‌లో భాగంగా కొత్తగా ఐఓటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్), ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారిత ఆలోచనలకు ప్రాముఖ్యతనిస్తారు. అలాగే బ్రేక్ టెస్ట్, లోడ్ టెస్ట్, స్పీడ్ టెస్ట్, స్టీరింగ్ టెస్ట్ తో పాటు ఇండ్యూరేషన్ టెస్ట్కూడా చేస్తారు. చివరగా బిజినెస్ రౌండ్లోనూ నెగ్గితేనే అర్హత సాధించినట్టు. ఒక్కో వాహనానికి 20 నుంచి 30 మంది టీమ్ సభ్యులు ఉంటారు. వారిలో కెపె్టన్, రైడర్, కో రైడర్ ఉంటారు. వాహనం తయారీ » గోకార్టింగ్ వాహనం తయారీకి సుమారు రూ. 70వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చవుతుంది. »ఇందులో సీవీ వాహనాలను పూర్తిగా ఇంజిన్‌తో తయారు చేస్తారు. ఇంజిన్, మోటారు, వీల్స్, స్టీరింగ్, ఇతర పార్టులు ఉంటాయి. »ఈవీ వాహనాలను బ్యాటరీ ఆధారంగా తయారుచేస్తారు. దీనికి బ్యాటరీ, వీల్స్, స్టీరింగ్, మోటారు ఇతర పార్టులు ఉంటాయి. ఒక్కో వాహనం సుమారు 80 నుంచి 100 కిలోల వరకు బరువు ఉంటుంది. అఫిడవిట్ కచ్చితం.. గోకార్టింగ్ పోటీల్లో రైడర్ల పాత్ర కీలకం. కానీ రైడర్‌గా మారాలంటే విద్యార్థి తల్లిదండ్రులు, కళాశాల సిబ్బంది నుంచి అఫిడవిట్‌ను సమర్పించాల్సిందే. గోకార్టింగ్ తో వచ్చే అవకాశాలు గోకార్టింగ్ పోటీల్లో పాల్గొనే అవకాశం రావడమే విద్యార్థుల విజయానికి తొలిమెట్టు లాంటిది. వాటి లో ప్రముఖ కోర్ కంపెనీల్లో ఉద్యోగవకాశాలు, ఆటోమొబైల్ రంగంలో సొంతంగా వ్యాపారం చేయాలనే ఆలోచన ఉన్న వారికి ప్రాథమిక ప్లాట్‌ఫామ్‌గా గోకార్టింగ్ ఉపయోగపడుతుంది. ప్రమాదమైనా ఇష్టమే.. గోకార్టింగ్ లో రైడింగ్ ప్రమాదకరమైనప్పటికీ ఎంతో ఆసక్తిగా ఉండడం వలన రైడర్‌గా మారాను. 60 ఓల్ట్స్ బ్యాటరీ సామర్థ్యంతో వాహనం తయారుచేశాం. మా కళాశాల ప్రిన్సిపాల్ కె.వీ.ఎన్.సునీత, ఫ్యాకల్టీ లు రూపత్, గోపీకృష్ణ సహకారంతో గోకార్టింగ్ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నాం. అందరి సహకారంతో ఈవీ వెహికల్ రైడ్‌లో మొదటి స్థానంలో నిలిచాం. – జననీ నాగరాజన్, రైడర్, బీవీఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాల, హైదరాబాద్. రెండు సార్లు రైడర్‌గా మొదటి స్థానం మా కళాశాల సీనియర్స్ ఇన్స్పిరేషన్తో గోకార్టింగ్ రైడర్ గా పోటీల్లో పాల్గొంటున్నాను. 150 సీసీ పల్సర్ ఇంజిన్‌తో వాహనం తయారుచేశాం. రైడర్‌గా రెండు సార్లు మొదటి స్థానంలో నిలిచాం. మాది మధ్య తరగతి కుటుంబం. మా నాన్న ఆటోడ్రైవర్, అమ్మ గృహిణి. భవిష్యత్‌లో మంచి కోర్ కంపెనీలో ఉద్యోగం సాధించడమే లక్ష్యం. – వి.సునీల్, రైడర్, రఘు ఇంజినీరింగ్ కళాశాల, విశాఖపట్టణం -
ఏ ఇంటి తలుపు తట్టినా... గుండెల్ని పిండేసే ఉద్దానం కథలు
నిత్యం పంటలతో తొణికిసలాడే ఉద్దానం విషాదాలకు నిలయంగా మారింది. ఏ ఇంటి తలుపుతట్టినా కన్నీటిచారలే కనిపిస్తున్నాయి. గుండెలను పిండేసే కిడ్నీ బాధలు అడుగడుగునా తారసపడుతున్నాయి. ఇంటికి పెద్ద దిక్కు కిడ్నీ వ్యాధితో మంచాన పడితే.. ఆ పెద్ద దిక్కును దక్కించుకోవడానికి ఉన్నదంతా అమ్మేసి రోడ్డున పడ్డ కుటుంబాల దర్శనమిస్తున్నాయి. ఎదిగొచ్చిన కన్న కొడుకు కిడ్నీ వ్యాధితో కళ్లేదుటే కూలిపోతుంటే భరించలేని ఆ తల్లిదండ్రులు, భారీగా అప్పులు చేసి ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు. ఆ కుటుంబాలను ఒకసారి పలకరిస్తే... – ఇచ్ఛాపురం రూరల్ ఇల్లు అమ్మేశాం భర్తే సర్వస్వంగా భావించి తన ఐదో తనాన్ని కాపాడుకునేందుకు నీడనిచ్చే ఇంటిని అమ్మేసి అతడిని రక్షించుకునే పనిలో పడింది ఈ ఇల్లాలు. ఇచ్ఛాపురం మండలం నీలాపపుట్టుగ గ్రామానికి చెందిన కోనేటి తులసీరావు, దమయంతి దంపతులకు పిల్లలు లేకపోవడంతో ఒకరి కొకరు కంటి పాపల్లా బతుకుతున్నారు. విసనకర్రలు తయారు చేస్తూ ఊరూరా తిరిగి అమ్ముతూ, వచ్చే ఆదాయంతో కడుపునింపుకునేవారు. అయితే ఈ దంపతులపై కిడ్నీ భూతం పంజా విసిరింది. ఐదేళ్ల క్రితం కిడ్నీ వ్యాధికి గురైన తులసీరావును రక్షించుకునేందుకు శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో భర్తను చేరి్పంచింది. ఖరీదైన వైద్యం కోసం భార్య దమయంతి రెండు ఇళ్లను అమ్మేసింది. 8 నెలలు నుంచి వ్యాధి మరింత తీవ్రరూపం దాల్చడంతో ప్రస్తుతం కవిటిలో డయాలసిస్ చేయిస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న అరకొర మందులతో ఇబ్బంది పడుతున్న భర్త బాధను చూడలేక ప్రస్తుతం తాము నివసిస్తున్న ఇంటిని సైతం తాకట్టుపెట్టింది. రోజుకు పది విసనకర్రలు తయారు చేసి అమ్మితే రూ.100లు వస్తుందని, అయితే ఆ డబ్బులు మందులకే సరిపోవడం లేదని వాపోతోంది.ఉన్నదంతా వైద్యానికే ఇచ్ఛాపురం మండలం సన్యాసిపుట్టుగ గ్రామానికి చెందిన ఆయన పేరు నందూరి విజయ భూషణ్. ఛండీగడ్‌లో కూలి పనులు చేసుకొని కుటుంబాన్ని పెంచుకుంటూ వస్తున్న దశలో కిడ్నీ మహమ్మారికి గురయ్యాడు. శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ఖరీదైన చికిత్స తీసుకున్నప్పటికీ ఫలితం కనిపించలేదు. రూ.లక్షలు అప్పులు చేసి నెలకు రూ.20 వేలు చొప్పున చెల్లించి ఏడాది పాటు డయాలసిస్ చేయించుకున్నాడు. ప్రస్తుతం కవిటిలో డయాలసిస్ చేయించుకుంటున్నారు. డయాలసిస్‌కు వెళ్లిన ప్రతిసారి కేవలం ఆటో ఖర్చులే రూ.600 వరకు అవుతున్నాయని, ప్రభుత్వం ఇచ్చే పింఛన్ ఆటో ఖర్చులకే అయిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కళ్లముందు అప్పులు కనిపిస్తుంటే తమ కుటుంబ భవిష్యత్తు ఎలా ఉంటుందోననే భయమేస్తోందని విచారం వ్యక్తం చేస్తున్నాడు. మునుపటిలా 108 వాహనం ద్వారా తమను ఆస్పత్రికి తీసుకెళ్లడం, రావడం వంటి సదుపాయాలు కల్పించాలని కోరుతున్నాడు.ఇదీ చదవండి: అప్పుడు వెడ్డింగ్ గౌను, ఇపుడు ఎంగేజ్మెంట్ రింగ్ : సమంత అంత పనిచేసిందా?నాడు భర్త, కొడుకు – నేడు తల్లి కవిటి మండలం బొరివంక గ్రామంలోని హరిజనవాడకు చెందిన ఈమె పేరు బలగ కామాక్షి. భర్త తలయారీగా పనిచేస్తూ పన్నెండేళ్ల కిత్రం మూత్రపిండాల వ్యాధితో మృతి చెందగా, తండ్రి ఉద్యోగాన్ని సంపాదించిన కొడుకు బాలరాజు తల్లితో పాటు భార్య, పిల్లలను సాకుతూ వచ్చాడు. విధి ఆడిన వింత నాటకంలో కొడుకు బాలరాజు సైతం కిడ్నీవ్యాధి బారినపడ్డాడు. కొడుకు వైద్యం కోసం తల్లి అప్పులు చేసినా ఎంతో కాలం బతకలేదు. ఈ పిరిస్థితుల్లో కోడలు పిల్లలను వదిలేసి వెళ్లిపోయింది. దీంతో ఎదిగొచ్చిన పిల్లలను పెంచి పోషించే బాధ్యత కామాక్షిపై పడింది. అప్పులు చేసి పిల్లలకు పెళ్లి చేసిన కామాక్షి, ఇప్పుడు తాను సైతం కిడ్నీ భూతం కబంధ హస్తాల్లో చిక్కుకుంది. నెలకు సుమారు రూ.10 వేలు వరకు వైద్యానికే ఖర్చవుతోందని, ప్రభుత్వం వితంతు పింఛన్ మాత్రమే ఇస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తోంది -
TDP: చెరువు దగ్గరకొస్తే.. తేల్చుకుందాం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: విజయనగరం జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి సంధ్యా గజపతిని తోటి టీడీపీ నాయకుడు, నీటి సంఘం అధ్యక్షుడు, చౌదరి బాబ్జీ అనుచరుడు సంపతిరావు గణపతి ఫోన్ చేసి బెదిరించారు. పల్లవాని చెరువు భూమిని ఆనుకుని ఆక్రమించారని చెరువుల పరిరక్షణ పేరుతో ఫిర్యాదు చేయడమేంటని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ‘సత్తా ఉంటే.. చెరువు దగ్గరకొస్తే తేల్చుకుందాం. అది చెరువు అని ఉందా. నీకు జ్ఞానం ఉందా?’ అని రాత్రి 9.20గంటల సమయంలో ఫోన్ చేసి ఇష్టారీతిన మాట్లాడారు. దీంతో ఆమె పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. జిల్లాలోని పలుచోట్ల చెరువులు ఆక్రమణకు గురయ్యాయని, ఆక్రమణలు తొలగించాలని కోరుతూ ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్‌లో ఆ సంఘం ప్రతినిధులు కృష్ణమూర్తినాయుడు, సంధ్యా గజపతి తదితరులు ఫిర్యాదు చేశారు.ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నాయకుడు, నీటి సంఘం అధ్యక్షుడు సంపతిరావు గణపతి నేరుగా సంధ్యా గజపతికి రాత్రి 9.20గంటల సమయంలో ఫోన్ చేసి బెదిరిస్తూ మాట్లాడారు. డీ పట్టాయే కొన్నానని ఒప్పుకుంటూనే.. ‘ఇంకా ఏమీ చెరువులు కనిపించలేదా? బాబ్జీ చెరువును జన్మలో తీయించగలవా? ఊర్లో పెద్ద చెరువు 165ఎకరాలు ఉంటే 60ఎకరాలకు వస్తే అప్పుడెక్కడికి వెళ్లిపోయావు? చెరువులన్నీ తీయడానికి పోటుగెత్తివా...మండలంలో అన్నీ తీయ్...రాష్ట్రంలో ఉన్న చెరువులన్నింటిని తీయ్. అప్పుడు ఇక్కడికి రా...సత్తా ఉంటే చెరువు దగ్గరికి రా..’ అని బెదిరించారు. ‘రికార్డు చేసుకో...ఎవరికిచ్చినా నష్టం లేదు’ అని వార్నింగ్ ఇచ్చారు.ఫిర్యాదులో పేర్కొన్న చెరువు వివరాలివి ఎచ్చెర్ల రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 1బీలోని ఎకరా 58సెంట్లు మేర భూమిని 1971లో మొహమ్మద్ ఫజుల్లాత్ అనే వ్యక్తికి డీ పట్టా కింద ఇచ్చారు. అయితే, ఈ భూమిని తర్వాత సంపతిరావు గణపతితో పాటు మరో నలుగురు కొనుగోలు చేశారు. రికార్డుల్లో కూడా అనుభవ స్వభావం కొనుగోలు అని నమోదు చేశారు. దీనిపై ఫిర్యాదులు వెళ్లాయి. సుధాసాగర్ అనే తహసీఉన్నప్పుడు డీ పట్టా భూమిని కొనుగోలు చేయడం కుదరదని, నిబంధనల ప్రాప్తికి అమ్మకం, కొనుగోలు చేయకూడదని, దీన్ని స్వాధీన పర్చుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని విచారణలో నిగ్గు తేల్చడమే కాకుండా దాన్ని ప్రభుత్వ భూమిగా మార్చేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పల్లవాని చెరువుకు ఆనుకుని ఉన్న ఈ భూమిలో ఉన్న వాటిని తొలగించాలని ఆదేశాలిచ్చారు. అప్పట్లో సదరు ఉత్తర్వుల మేరకు తొలగింపులు జరిగాయి. కానీ మళ్లీ అక్కడే కట్టడాలు జరిగాయి. వాటిని తొలగించాలని కోరుతూ మళ్లీ సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్‌లో ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి «ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు చేసిన వారిలో సంధ్యా గజపతి కూడా ఉండటంతో ఆమెకు సంపతిరావు గణపతి అనే వ్యక్తి ఫోన్ చేసి బెదిరింపులకు దిగారు. ఈ ఫోన్ సంభాషణను సంధ్యా గజపతి రికార్డు చేశారు. దీన్ని పట్టుకుని పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని సోమవారం రాత్రి మీడియాను ఆశ్రయించి జరిగిందంతా వివరించారు. దీనిపై గణపతిని ‘సాక్షి’ వివరణ కోరగా.. తాను మాట్లాడానని, తన భూమి విషయంలో ఫిర్యాదులు చేస్తున్నారని, ఆమె రికార్డు చేస్తుందని తెలిసినా కూడా మాట్లాడానని, తానేమీ బెదిరించలేదని, ఆమే తిరిగి బెదిరించిందని తెలిపారు. -
విధి రాత: ప్రసవం కోసం వెళ్తూ..!
మరో రెండు రోజుల్లో ఆమెకు ప్రసవం. ఆ దంపతుల ఆలోచనలన్నీ పుట్టబోయే బిడ్డపైనే ఉన్నాయి. అంతా సవ్యంగా జరగాలని దేవుళ్లందరికీ మొక్కారు. డాక్టర్లు సోమవారం నుంచే ఆస్పత్రిలో ఉండిపొమ్మన్నారు. కానీ వారి విధిరాత మరోలా ఉంది. వస్తువులన్నీ సర్దుకుని వస్తామని చెప్పి వచ్చేశారు. అదే వారి తప్పైపోయింది. ఇంటికి వెళ్తుంటే బస్సు రూపంలో మృత్యువు ఎదురొచ్చింది. తల్లిని, కడుపులోని బిడ్డను తనతో తీసుకెళ్లిపోయి.. కుటుంబానికి శోకం మిగిల్చింది. శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా కేంద్రంలోని డేఅండ్‌నైట్ కూడలి సమీపంలో సోమవారం జరిగిన ప్రమాదంలో యంపాడ రాజేశ్వరి(20)(Rajeshwari) అనే నిండు గర్భిణి దుర్మరణం పాలయ్యారు. మరో 48 గంటల్లో ఆమె ప్రసవానికి సిద్ధమవుతుండగా.. ఈ దుర్ఘటన జరగడంతో కుటుంబం తల్లడిల్లిపోతోంది. స్కూటీని(Scooty) ఆర్టీసీ బస్సు (rtcbus)ఢీకొట్టడంతో ఆమె బస్సు చక్రాల కింద నలిగిపోయి ప్రాణాలు విడిచారు. ఘటనలో ఆమె భర్త దుర్గారావు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ట్రాఫిక్ సీఐ నాగరాజు, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. ఎచ్చెర్ల మండలం కుంచాల కూర్మయ్యపేటకు చెందిన యంపాడ దుర్గారావు అర్బన్ కాలనీలో తన ఇంటికి సమీపంలోనే టిఫిన్‌షాపు నడుపుతున్నారు. ఆయనకు అదే గ్రామానికి చెందిన రాజేశ్వరితో నాలుగేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఏడాదిన్నర వయసు గల పాప ఉంది. రాజేశ్వరి మళ్లీ గర్భం(pregnant woman) దాల్చడంతో శ్రీకాకుళం రిమ్స్‌లో తరచూ చూపిస్తున్నారు. ఆ క్రమంలోనే సోమవారం ఉదయం 9:30 గంటలకు దంపతులిద్దరూ స్కూటీపై బయల్దేరారు. రిమ్స్‌లో వైద్యులకు చూపించాక బుధవారం ప్రస వం జరిగే అవకాశం ఉందని, ఇప్పుడు వెళ్తే రావడం కష్టమవుతుంది కాబట్టి సోమవారమే ఇక్కడ ఉండిపోవాలని వైద్యులు సూచించారు. కానీ వస్తువులన్నీ సర్దుకుని వచ్చేస్తామని భార్యాభర్తలు తిరుగు ప్రయాణమయ్యారు. డేఅండ్‌నైట్ కూడలి సమీపానికి ఉదయం 11.48గంటలకు వారు బండిపై చేరుకున్నారు. కూడలి దాటుకుని బ్రి డ్జి వైపు వెళ్లిన కొద్ది సేపటికే విశాఖ వెళ్తున్న ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు వీరిని దాటుకుంటూ వెళ్లింది. అయితే బస్సు స్కూటీ అద్దాన్ని తాకడంతో.. బండి అదుపు తప్పి దుర్గారావు డివైడర్ వైపు పడిపోయా రు. రాజేశ్వరి మాత్రం బస్సు వెనుక చక్రాల కింద పడిపోవడంతో తీవ్ర రక్తస్రావమైంది. ప్రమాదం జ రిగినా బస్సు డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోవడం అక్కడి వారిని నిశ్చేషు్టలను చేసింది.వెంటనే అక్కడున్న వా రి సాయంతో భర్త దుర్గారావు రాజేశ్వరిని ఆటోలో మెడికవర్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. కానీ తీవ్రంగా గాయపడిన ఆమె సాయంత్రం నాలుగు గంటలకు మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రమాద దృశ్యాలన్నీ మెడిల్యాబ్ సీసీ కెమెరా ఫుటేజీలో నిక్షిప్తమయ్యాయి. దాని ప్రకారం పోలీసులు బస్సును గుర్తించి డ్రైవర్‌కు ఫోన్ చేసి రమ్మని పిలిచారు. అయితే తనకు ఏం జరిగిందో తెలియ దని డ్రైవర్ చెప్పడం గమనార్హం. దీనిపై కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మెట్ట సుధాకర్ తెలిపారు. 20 ఏళ్లకే .. చనిపోయిన రాజేశ్వరి వయసు కేవలం 20 ఏళ్లు. పదహారేళ్లు దాటాక పెళ్లి చేసుకుని 18 ఏళ్లకు తల్లిగా మారిన రాజేశ్వరికి 20 ఏళ్లకే ఆయుష్షు రేఖ ఆగిపోయింది. ఇంత చిన్న వయసులో అది కూడా గర్భిణిగా చనిపోవడంతో ఊరంతా శోకసంద్రమైంది. -
కొనసా..గుతున్న పడిగాపులు
● గ్యాస్ సరఫరా కాక ప్రజల ఇబ్బందులు పొందూరు: స్థానిక ఇండేన్ గ్యాస్ కస్టమర్లకు సోమవారం కూడా పడిగాపులు తప్పలేదు. గత పది రోజులుగా గ్యాస్ సరఫరా కాకపోవడంతో కస్టమర్లకు వంట తిప్పలు తప్పడం లేదు. పొందూరు ఏజెన్సీ బాధ్యతలను రణస్థలం, వజ్రపుకొత్తూరు ఏజెన్సీలకు అప్పగించారు. ఈ మేరకు రణస్థలం ఏజెన్సీ స్పందన సరిగ్గా లేకపోయిన్పటికీ వజ్రపుకొత్తూరు ఏజెన్సీ స్పందించింది. సోమవారం నుంచి గ్యాస్ సరఫరా చేయనున్నట్లు ప్రచారం జరగడంతో పలువురు గ్యాస్ ఆఫీసుకు మధ్యా హ్నం 2 గంటలకు చేరుకున్నారు. గ్యాస్ ఆఫీసుకు వజ్రపుకొత్తూరు సిబ్బంది వచ్చా రు. అయితే ఆన్లైన్లో సమస్య తలెత్తింది. దీంతో సాయంత్రం 6 గంటల వరకు గ్యాస్ కస్టమర్లు ఆఫీసుకు రావడం, వెళ్లడం మాత్రమే జరిగింది. గ్యాస్ ఆఫీసుకు వచ్చిన వారందరికీ మంగళవారం నుంచి గ్యాస్ సరపరా చేస్తామని చెప్పి పంపించేశారు. చుట్టు పక్కల గ్రామాల నుంచి పలువురు ఆటోల్లో సిలిండర్లు తీసుకువచ్చారు. ఆటోలకు ఎక్కువ చార్జీలు చెల్లించి అక్కడే గంటల తరబడి ఉన్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో ఉసూరుమని వెనుదిరిగారు. మంగళవారమైనా గ్యాస్ సరఫరాను కచ్చితంగా చేయాలని ప్రజలు కోరుతున్నారు. తప్పెవరిది.. శిక్ష ఎవరికి? -
మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
హిరమండలం: బంధువుల ఇంటికి వెళ్లి వస్తానని చెప్పిన భార్య, సమయానికి రాకపోవడంతో మండలంలో ధనుపురం గ్రామ సమీపంలోని తోటలో చెట్టుకు ఉరేసుకొని గొర్లె కన్నారావు (34) అనే వ్యక్తి ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పొందూరుకు చెందిన కన్నారావు దంపతులు ఊరూరా గాడిద పాలు అమ్ముకొని జీవనం సాగిస్తుంటారు. ధనుపురం స్పైసీ దాబా సమీపంలోని ఖాళీ గదుల్లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే కొన్నిరోజులుగా దంపతుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల అతడి భార్య ఆమె చెల్లెలు ఉన్న కవిటి గ్రామానికి వెళ్లింది. ఆదివారం తిరిగి వస్తానని చెప్పి రాలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కన్నారావు చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు తల్లి జి.సీతమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఎండీ యాసిన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాతపట్నం సీహెచ్‌సీకి తరలించారు. మృతుడికి భార్య, ఎనిమిదేళ్ల పాప, ఆరేళ్ల బాబు ఉన్నారు. -
అర్జీలు సత్వరమే పరిష్కరించాలి
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశం ● మీకోసంలో 141 వినతుల స్వీకరణ శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజల నుంచి వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక(మీకోసం)ను సోమవారం నిర్వహించారు. దీనిలో భాగంగా రెవెన్యూ, పంచాయతీరాజ్, సర్వే అండ్ లాండ్ రికార్డులు, హౌసింగ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, విభిన్న ప్రతిభావంతులు, గ్రామీణాభివృద్ధి, వాటర్ రిసోర్సెస్, సీ్త్ర, మహిళా, శిశు సంక్షేమ శా ఖ, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్, దేవ దాయశాఖ, మైన్స్ అండ్ జియాలజీ శాఖ లకు సంబంధించి 141 అర్జీలను స్వీకరించారు. అర్జీలు స్వీకరించిన వారిలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, డీఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, జెడ్పీ సీఈ వో ఎల్ఎన్ వి.శ్రీధర్ రాజ పాల్గొన్నారు. ఆగడాలు అరికట్టాలి శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆమదాలవలస నియోజకవర్గంలో కూటమి నాయకుల ఆగడాలు అరికట్టాలని ఆ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ కోరారు. ఈ మేరకు మీకోసంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌కి వినతిపత్రం అందజేశారు. కూటమి నేతలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమదాలవలస మండలం ముద్దాడపేట, సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం వంటి అధికారిక అనుమతులు ఉన్న ఇసుక రీచ్‌ల నుంచి, అలాగే ఆమదాలవలస మండలం తోటాడ, పొందూరు మండలం బొడ్డేపల్లి, సింగూరు, నెల్లిమెట్ట వంటి అనుమతులు లేని ఇసుక రీచ్‌ల నుంచి ప్రతిరోజూ వందలాది లారీల ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని తెలిపారు. దీనివలన సాగునీటి వనరులకు, పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతోందని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా రాత్రి వేళల్లో ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని తెలిపారు. సీసీ కెమెరాలు పనిచేయకుండా చేస్తున్నారని, అటువంటి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని విన్నవించారు. అలాగే పొందూరు మండలం గోకరతపల్లి గ్రామానికి చెందిన వీవోఏను రాజకీయ కక్షతో తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నారని, ఆమెను కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా పొందూరు మండలం గోకర్ణపల్లి గ్రామంలోని పంతకోనేరు, నూకమ్మ చెరువుల్లో ఆక్రమణల వలన ఆయకట్టు రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. అధికారులు స్పందించి ప్రభుత్వ స్థలం, చెరువులను కాపాడలని కోరారు. ఈ విషయంలో గతంలోనే ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. -
గర్జిద్దాం రండి
కన్నీరే మిగిలిందిక నేస్తం..కిడ్నీ బాధితుల కష్టాలు అంతులేనివి. ప్రాణాలతో పాటు ఆస్తులు కూడా హరించుకుపోతున్నాయి. –8లోవిద్యార్థులకు జరుగుతున్న అన్యాయంపై వైఎస్సార్ సీపీ పోరుబాట పట్టనుంది. యువత పోరు పేరుతో 12న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేయడానికి సిద్ధమైంది. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వానికి చెమటలు పట్టేలా ఈ ఆందోళన నిర్వహించాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకుండా కాలయాపన చేస్తున్న సర్కారు మొద్దు నిద్ర వీడేలా నినదించాలని కోరారు. కార్యక్రమానికి శ్రేణులను సమాయత్తం చేస్తూ పార్టీ నేతలు అన్ని నియోజకవర్గాల్లో సోమవారం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థి లోకానికి తోడుగా ఆ రోజు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. -
తుది దశకు ఇంటర్ పరీక్షలు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియెట్ (ఐపీఈ మార్చి–2025) పబ్లిక్ పరీక్షలు తుది దశకు చేరుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా 75 కేంద్రాల్లో జరుగుతున్న పరీక్షల్లో భాగంగా 8వ రోజు సోమవారం సెకెండియర్ విద్యార్థులు సెట్–2 ప్రశ్న పత్రంతో మ్యాథ్స్ 2బి, జువాలజీ, హిస్టరీ–2 తదితర పేపర్లకు పరీక్ష రాశారు. జనరల్, ఒకేషనల్ రెండు విభాగాల్లో కలిపి 17523 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 351 మంది గైర్హాజరయ్యారు. అధికారులు, స్క్వాడ్లు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ సీజన్లో మొదటిసారి బ్లాంక్ ఓఎంఆర్ షీట్‌ను ఉపయోగించారు. పొందూరు ప్రభు త్వ జూనియర్ కళాశాలలో ఓ విద్యార్థికి బ్లాంక్ ఓంఆర్ను వినియోగించినట్టు ఆర్ఐఓ పి.దుర్గారావు ధ్రువీకరించారు. మంగళవారం ప్రథమ సంవత్సం హెచ్ఈసీ, తదితర గ్రూప్‌ల పరీక్షలు ముగియనున్నాయి. రెండో రోజూ నిరాశే అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో తొలి సూర్యకిరణాలు స్వామి మూలవిరాట్టును తాకే అద్భుత దృశ్యానికి మరోసారి మబ్బులు అడ్డంకిగా మారాయి. తొలిరోజున కూడా ఇలాగే మబ్బులు అడ్డుగా రావడంతో భక్తులకు నిరాశ మిగల్చగా.. రెండో రోజూ కూడా భక్తులకు అదే పరిస్థితి ఎదురైంది. దీంతో సోమవారం ఉదయం 4 గంటల నుంచి వేచి చూసిన భక్తులకు నిరాశ తప్ప లేదు. ఉదయం 6.45 గంటల తర్వాత సూర్యకిరణాలు ఆలయంలోని గోపురం స్థాయికి చేరిపోయాయి. దీంతో మళ్లీ ఈ ఏడాది అక్టోబర్ 1,2 తేదిల్లో ఇలాగే కిరణ దర్శనం ఉంటుందని, అంతవరకు భక్తులకు ఆగాల్సిందేనని ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ తెలియజేశారు. ఘనంగా ఆదిత్యుని కల్యాణం అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి కల్యాణం సోమవారం ఉదయం ఘనంగా జరిగింది. ఫాల్గుణ శుద్ధ ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీ ఉషా పద్మిని ఛాయాదేవేరులతో శ్రీవారి కల్యాణ మూర్తులను అనివెట్టి మండపంలో వేంచేసింపజేసి ఆగమశాస్త్ర ప్రకారం కల్యాణాన్ని నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో అర్చకులు వేదమంత్రోచ్ఛరణలతో శాస్త్రోక్తంగా కల్యాణాన్ని జరిపించారు. రూ.500 చెల్లించిన భక్తదంపతులు కల్యాణ సేవలో పాల్గొనగా, ఆలయం తరఫున స్వామి వారి శేషవస్త్రాలను, తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు ఇప్పిలి సాందీప్‌శర్మ, సూపరింటెండెంట్ కనకరాజు పాల్గొన్నారు. -
చెరువు దగ్గరకొస్తే
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : విజయనగరం జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి సంధ్యా గజపతిని తోటి టీడీపీ నాయకుడు, నీటి సంఘం అధ్యక్షుడు, చౌదరి బాబ్జీ అనుచరుడు సంపతిరావు గణపతి ఫోన్ చేసి బెదిరించారు. పల్లవాని చెరువు భూమిని ఆనుకుని ఆక్రమించారని చెరువుల పరిరక్షణ పేరుతో ఫిర్యాదు చేయడమేంటని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ‘సత్తా ఉంటే.. చెరువు దగ్గరకొస్తే తేల్చుకుందాం. అది చెరువు అని ఉందా. నీకు జ్ఞానం ఉందా?’ అని రాత్రి 9.20గంటల సమయంలో ఫోన్ చేసి ఇష్టారీతిన మాట్లాడారు. దీంతో ఆమె పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. జిల్లాలోని పలుచోట్ల చెరువులు ఆక్రమణకు గురయ్యాయని, ఆక్రమణలు తొలగించాలని కోరుతూ ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్‌లో ఆ సంఘం ప్రతినిధులు కృష్ణమూర్తినాయుడు, సంధ్యా గజపతి తదితరులు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నాయకుడు, నీటి సంఘం అధ్యక్షుడు సంపతిరావు గణపతి నేరుగా సంధ్యా గజపతికి రాత్రి 9.20గంటల సమయంలో ఫోన్ చేసి బెదిరిస్తూ మాట్లాడారు. డీ పట్టాయే కొన్నానని ఒప్పుకుంటూనే.. ‘ఇంకా ఏమీ చెరువులు కన్పించలేదా? బాబ్జీ చెరువును జన్మలో తీయించగలవా? ఊర్లో పెద్ద చెరువు 165ఎకరాలు ఉంటే 60ఎకరాలకు వస్తే అప్పుడెక్కడికి వెళ్లిపోయావు? చెరువులన్నీ తీయడానికి పోటుగెత్తివా...మండలంలో అన్నీ తీయ్...రాష్ట్రంలో ఉన్న చెరువులన్నింటిని తీయ్. అప్పుడు ఇక్కడికి రా...సత్తా ఉంటే చెరువు దగ్గరికి రా..’ అని బెదిరించారు. ‘రికార్డు చేసుకో...ఎవరికిచ్చినా నష్టం లేదు’ అని వార్నింగ్ ఇచ్చారు. ఫిర్యాదులో పేర్కొన్న చెరువు వివరాలివి ఎచ్చెర్ల రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 1బీలోని ఎకరా 58సెంట్లు మేర భూమిని 1971లో మొహమ్మద్ ఫజుల్లాత్ అనే వ్యక్తికి డీ పట్టా కింద ఇచ్చారు. అయితే, ఈ భూమిని తర్వాత సంపతిరావు గణపతితో పాటు మరో నలుగురు కొనుగోలు చేశారు. రికార్డుల్లో కూడా అనుభవ స్వభావం కొనుగోలు అని నమోదు చేశారు. దీనిపై ఫిర్యాదులు వెళ్లాయి. సుధాసాగర్ అనే తహసీఉన్నప్పుడు డీ పట్టా భూమిని కొనుగోలు చేయడం కుదరదని, నిబంధనల ప్రాప్తికి అమ్మకం, కొనుగోలు చేయకూడదని, దీన్ని స్వాధీన పర్చుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని విచారణలో నిగ్గు తేల్చడమే కాకుండా దాన్ని ప్రభుత్వ భూమిగా మార్చేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పల్లవాని చెరువుకు ఆనుకుని ఉన్న ఈ భూమిలో ఉన్న వాటిని తొలగించాలని ఆదేశాలిచ్చారు. అప్పట్లో సదరు ఉత్తర్వుల మేరకు తొలగింపులు జరిగాయి. కానీ మళ్లీ అక్కడే కట్టడాలు జరిగాయి. వాటిని తొలగించాలని కోరుతూ మళ్లీ సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్‌లో ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి ఽఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు చేసిన వారిలో సంధ్యా గజపతి కూడా ఉండటంతో ఆమెకు సంపతిరావు గణపతి అనే వ్యక్తి ఫోన్ చేసి బెదిరింపులకు దిగారు. ఈ ఫోన్ సంభాషణను సంధ్యా గజపతి రికార్డు చేశారు. దీన్ని పట్టుకుని పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని సోమవారం రాత్రి మీడియాను ఆశ్రయించి జరిగిందంతా వివరించారు. దీనిపై గణపతిని ‘సాక్షి’ వివరణ కోరగా.. తాను మాట్లాడానని, తన భూమి విషయంలో ఫిర్యాదులు చేస్తున్నారని, ఆమె రికార్డు చేస్తుందని తెలిసినా కూడా మాట్లాడానని, తానేమీ బెదిరించలేదని, ఆమే తిరిగి బెదిరించిందని తెలిపారు. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి సంధ్యా గజపతికి బెదిరింపులు బెదిరించింది తోటి టీడీపీ నాయకుడే చౌదరి బాబ్జీ అనుచరుడు సంపతిరావు గణపతి బెదిరించారని మీడియాను ఆశ్రయించిన సంధ్యా గజపతి -
హామీలు నెరవేర్చాలి
● కలెక్టరేట్ వద్ద అంగన్వాడీల నిరసన శ్రీకాకుళం పాతబస్టాండ్: ఎన్నికల ముందు అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు, ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కె.కల్యాణి డిమాండ్ చేశారు. అంగన్వాడీల ఛలో విజయవాడపై రాష్ట్ర ప్రభుత్వ నిర్భందానికి నిరసనగా, 42 రోజుల సమ్మె మినిట్స్ అమలు చేయాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద సోమవారం అంగన్వాడీలు నిరసన తెలిపారు. ముందుగా వాంబే కాలనీ జంక్షన్ నుంచి ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చిన జీవోనే మరలా ఇచ్చి మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. శాంతియుతంగా ఛలో విజయవాడకు పిలుపునిస్తే రాష్ట్రవ్యాప్తంగా గృహ నిర్భందాలు, అరెస్టులు చేయడం సరికాదన్నారు. ఎన్నికల ముందు 42 రోజుల సమ్మె సమయంలో టీడీపీ నాయకులు మద్దతు తెలిపి, అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కరిస్తామని హామీలు ఇచ్చి, ఇప్పుడు కనీసం స్పందించడం లేదని పేర్కొన్నారు. కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించి అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ – హెల్పర్స్ యూనియన్ నాయకులు కె.సుజాత, కె.హేమలత, కె.లక్ష్మి, మాధవి, చంద్రమౌళి, పి.భూలక్ష్మి, టి.రాజేశ్వరి, అప్పమ్మ, లలిత, ఇ.అప్పలనర్సమ్మ, కె.జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
తప్పిపోయిన బాలుడు తల్లి చెంతకు
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం తండ్రితో పాటు వెళ్లిన ఒక బాలుడు తప్పిపోయాడు. అయితే మూడు గంటల వ్యవధిలోనే తప్పిపోయిన బాలుడిని రెండో పట్టణ పోలీసులు సాంకేతికత సాయంతో తల్లి చెంతకు చేర్చారు. రెండో పట్టణ సీఐ పి.ఈశ్వరరావు తెలిపిన వివరాల మేరకు.. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో నగరంలోని సత్యలాడ్జి ఎదురుగా ఉన్న దుకాణం వద్ద బాలుడు ఏడుస్తూ కనిపించడంతో స్థానికులు 112కి కాల్చేసి పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. స్టేషన్‌కు వెళ్లాక బాబును సీఐ పి.ఈశ్వరరావు వివరాలు అడిగినా చెప్పలేకపోయాడు. దీంతో వెంటనే వెంటనే బాలుడి ఫొటోలు తీసి జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్, స్థానికంగా ఉన్న కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో వివరాలతో సహా పంపారు. తన కుమారుడి ఫొటో వాట్సాప్ గ్రూపులో కనిపించడంతో అది చూసిన వాంబేకాలనీకి చెందిన బమ్మిడి రూప సాయంత్రం 5 గంటలకు రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది. బాబు తన భర్త వెంట నడిచి వెళ్లాడని, ఆ విషయం తన భర్త గమనించకపోవడంతో ఇటువంటి పరిస్థితి ఎదురయ్యిందన్నారు. పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది. -
కోశాధికారిగా ఎంవీ రమణ
శ్రీకాకుళం న్యూకాలనీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పీడీ–పీఈటీ అసోసియేషన్ కోశాధికారిగా మొజ్జాడ వెంకటరమణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయవాడలో ఆదివారం జరిగిన రాష్ట్ర పీడీ–పీఈటీ సంఘ విస్తృతస్థాయి సమావేశంలో ఈ మేరకు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఇప్పటివరకు ఈయన రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా సేవలు అందించారు. అలాగే శ్రీకాకుళం జిల్లా పీడీ, పీఈటీ సంఘ అధ్యక్షుడిగా గత పదేళ్ల నుంచి విశేషమైన సేవలు అందిస్తున్నారు. ఈయన నియామకంపై ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ధర్మాన కృష్ణదాస్, ఎం.సాంబమూర్తి, చీఫ్ అడ్వైజర్ పి.సుందరరావు, ఎస్జీఎఫ్ సెక్రటరీ బీవీ రమణ, గ్రిగ్స్ సెక్రటరీ కె.మాధవరావు, గ్రిగ్స్ జోనల్, జిల్లా సంఘ ప్రతినిధులు, పీడీలు హర్షం వ్యక్తం చేశారు. ఎంవీ రమణ -
పట్టుబడిన గంజాయి ముఠా
కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరా చౌక్ వద్ద కాశీబుగ్గ పోలీసులకు గంజాయి ముఠా సోమవారం పట్టుబడింది. ఈ మేరకు కాశీబుగ్గ పట్టణ పోలీసుస్టేషన్లో డీఎస్పీ వెంకట అప్పారావు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రంలోని గజపతి జిల్లా హరుపదర్ గ్రామానికి చెందిన అన్నదమ్ములు వినయమిన్ మాఝీ, ఆయుభ మాఝీలు అన్నారు. వీరికి ఉదయగిరి బ్లాక్‌కు చెందిన మైఖేల్ బదరైతతో పరిచయం ఉంది. మైఖేల్ తమ గ్రామ పరిసర ప్రాంతాల్లో గంజాయి పండిస్తుంటాడు. దీంతో అతడు తన గ్రామానికే చెందిన జాన్, అన్నదమ్ములు వినయమిన్, ఆయుభలకు గంజాయి రవాణా చేస్తే డబ్బులు ఇస్తానని చెప్పాడు. పలాస రైల్వేస్టేషన్లో తాను చెప్పిన వ్యక్తికి గంజాయి అప్పగిస్తే కిలోకి రూ.1000లు చొప్పున ఇస్తానని తెలిపాడు. దీంతో వీరు ముగ్గురు ఒక ద్విచక్ర వాహనంపై గంజాయి తీసుకొస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. వీరి ముగ్గురినీ అరెస్టు చేశారు. కాశీబుగ్గ సీఐ సూర్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కన్నీరే మిగిలిందిక నేస్తం..!
నిత్యం పంటలతో తొణికిసలాడే ఉద్దానం విషాదాలకు నిలయంగా మారింది. ఏ ఇంటి తలుపుతట్టినా కన్నీటిచారలే కనిపిస్తున్నాయి. గుండెలను పిండేసే కిడ్నీ బాధలు అడుగడుగునా తారసపడుతున్నాయి. ఇంటికి పెద్ద దిక్కు కిడ్నీ వ్యాధితో మంచాన పడితే.. ఆ పెద్ద దిక్కును దక్కించుకోవడానికి ఉన్నదంతా అమ్మేసి రోడ్డున పడ్డ కుటుంబాల దర్శనమిస్తున్నాయి. ఎదిగొచ్చిన కన్న కొడుకు కిడ్నీ వ్యాధితో కళ్లేదుటే కూలిపోతుంటే భరించలేని ఆ తల్లిదండ్రులు, భారీగా అప్పులు చేసి ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు. ఆ కుటుంబాలను ఒకసారి పలకరిస్తే... – ఇచ్ఛాపురం రూరల్ ● ఉద్దానంలో కుటుంబాలకు మూత్ర గండాలు ● చితికిపోతున్న బతుకులు ● పట్టించుకోని ప్రభుత్వం -
ఆశలు గల్లంతు
● సముద్రంలో గల్లంతైన గ్రూప్–2 అభ్యర్థి ● రాజమ్మతల్లి జాతర స్నానాల్లో అపశృతి ● మరో నలుగురిని కాపాడిన మైరెన్ పోలీసులు గార: మండలంలోని చిన్న వత్సవలస రాజమ్మ తల్లి జాతర సముద్ర స్నానాల్లో అపశృతి చోటుచేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం జి.సిగడాం మండలం దేవరవలసకు చెందిన తండ్రీ కొడుకులు కొడమటి ఈశ్వరరావు, అశోక్(23) సముద్ర స్నానానికి వెళ్లగా అలల తాకిడి గల్లంతయ్యారు. తోటివారు కేకలు వేయడంతో మైరెన్ పోలీసులు స్పందించి తండ్రి ఈశ్వరరావును ఒడ్డుకు తీసుకురాగలిగారు. అశోక్ ఆచూకీ దొరకలేదు. అశోక్ ఎంఎస్సీ పూర్తి చేసి, ఇటీవలే గ్రూప్–2 పరీక్షలు రాశాడు. తండ్రి ఈశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గార ఎస్ఐ ఆర్.జనార్దన కేసు నమోదు చేశారు. కాగా, ఇదే ప్రాంతంలో చీపురుపల్లి మండలం కాపుశంభాం గ్రామానికి చెందిన చందక వంశీ, పిన్నింటి జయలక్ష్మీ, పిన్నింటి దిలీప్ సముద్ర స్నానానికి దిగి చిక్కుకుపోతున్న తరుణంలో మైరెన్ ఎస్ఐ హరికృష్ణ టీం సభ్యులు గమనించి రక్షించారు. లైఫ్ జాకెట్లు ఉపయోగించి నీటిలో ఇబ్బందులు పడుతున్న ముగ్గురినీ ఒడ్డుకు తీసుకొచ్చి సపర్యలు చేశారు. -
కన్నీళ్లకే.. కన్నీళ్లొచ్చే..!
నందిగాం : ఆడపిల్ల పుట్టిందని నాడు తండ్రి విడిచిపెట్టి వెళ్లిపోయాడు. జీవితాంతం తోడు ఉంటానని అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్త రెండేళ్లకే వదిలేశాడు. అయినా ధైర్యం కోల్పోక ముందుకు సాగుతున్న ఆమెకు కిడ్నీ భూతం కాటేయడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. విధి చేతిలో ఓడిపోయి నిస్సహాయ స్థితిలో సాయం కోసం ఎదురుచూస్తున్న కాంతమ్మ దీనస్థితి ఇది. వివరాల్లోకి వెళ్తే.. నందిగాం మండలం మర్లపాడుకు చెందిన కోనారి వెంకయ్య, నీలమ్మల కుమార్తె కాంతమ్మ. అయితే కాంతమ్మ పుట్టిన తర్వాత మగబిడ్డ పుట్టలేదని చెప్పి తండ్రి వెంకయ్య కోపంతో భార్య, కుమార్తెను విడిచిపెట్టి మరో మహిళతో వెళ్లిపోయాడు. దీంతో పేదరికంలో పెరిగిన కాంతమ్మ కూలి పనులు చేసుకుంటూ తల్లికి తోడుగా ఉండేది. పెళ్లి ఈడు వచ్చేసరికి గ్రామస్తులు సహకరించి సమీప ప్రతాపవిశ్వనాథపురం గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం చేశారు. అయితే తాగుడుకు బానిసైన ఆయన రెండేళ్లకే భార్యను విడిచిపెట్టడంతో కాంతమ్మ మరలా కన్నవారింటికి చేరింది.కూలి పనులతోనే జీవనంకూలీ పనులు, ఉపాధి పనులు చేసుకుంటూ తల్లి ఉంటున్న పూరి గుడిసెలో కాంతమ్మ జీవనం సాగిస్తుండేది. వదిలి వెళ్లిన తండ్రి ఐదేళ్ల క్రితం గ్రామ సమీప తోటలో శవంగా మరడంతో కుమారుడిలా అంత్యక్రియలు చేసి కన్నరుణం తీర్చుకుంది. విడిచిపెట్టిన భర్త కొద్దిరోజులకే చెరువులో పడి విగతజీవిగా మారాడు. తల్లి వృద్ధాప్యానికి చేరుకొని కంటి సమస్యతో కుమార్తె కాంతమ్మ మీద ఆధారపడింది. అయినప్పటికీ ధైర్యంగా కష్టాలను ఎదుర్కొని తల్లికి సపర్యలు చేసుకుంటూ జీవనం సాగించేది. అయితే రెండేళ్ల క్రితం కిడ్నీ భూతం కాంతమ్మకు సోకింది. మొదటిలో కూలీ చేసిన డబ్బులతో వైద్యం పొందేది. అయితే క్రమేపీ వ్యాధి తీవ్రత పెరిగి కూలీ చేసుకోలేని స్థితికి చేరుకుంది. దీంతో గ్రామంలోని కొంతమంది యువకులు ఆర్థిక సాయం చేస్తూ పలాసలో ఉన్న కిడ్నీ ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స అందిస్తున్నారు. అయితే ఇటీవల వ్యాధి తీవ్రత బాగా పెరగడంతో కాంతమ్మ మంచానికే పరిమితమైపోయింది. ఫలితంగా తల్లీకూతుళ్లు ఇద్దరూ ఇబ్బంది పడుతున్నారు. పూట గడవడమే కష్టంగా మారిన స్థితిలో డయాలసిస్ చేయించుకునే స్థోమత లేకుండా పోయింది. దీంతో జీవితంలో ఎన్నో కష్టాలను ధైర్యంగా ఎదుర్కొన్నా, ఎక్కడా చేయిచాచని కాంతమ్మ విధికి తలవంచి దాతల సాయం కోసం ఎదురుచూస్తోంది. మనసున్న మారాజులు ఎవరైనా ఆదుకోవాలని కోరుతోంది. తనకు సాయం చేయాలనుకునేవారు 9440487406 నంబర్‌ను సంప్రదించాలని కోరుతోంది. -
అన్నయ్యపై తమ్ముడి దాడి
టెక్కలి రూరల్: మండల కేంద్రం టెక్కలిలోని రెల్లివీధి సమీపంలో పరపటి వినోద్ అనే వ్యక్తి తీవ్ర గాయాలతో అంబేడ్కర్ జంక్షన్ నుంచి పోలీస్టేషన్ వైపుగా భార్యాపిల్లలతో కలిసి రోడ్డుపై వెళ్లడం ఆదివారం స్థానికంగా కలకలం రేపింది. తలపై రక్తాలు కారడంతో ఏమైందని అడిగినా స్పందించకపోవడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం గాయపడిన వ్యక్తిని టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై టెక్కలి సీఐ విజయ్‌కుమార్ వద్ద ప్రస్తావించగా అన్నదమ్ముల మధ్య గొడవ జరిగిందని, తమ్ముడు బాల అన్నయ్య వినోద్‌ను కర్రతో కొట్టి గాయపరిచాడని తెలిపారు. పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. అ‘పూర్వ’ సమ్మేళనం కొత్తూరు : కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1970–71 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు ఆదివారం అదే పాఠశాల ఆవరణలో అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. 55 ఏళ్ల తర్వాత ఒకరినొకరు కలిసి ఆనాటి జ్ఞాపకాలను ఒకరితో ఒకరు పంచుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ హెచ్ఎం ఎద్దు గోపాలదాసునాయుడుతో పాటు పలువురు ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. -
దివ్యాంగులపై అక్కసు!
ఉపాధ్యాయ బదిలీల్లో.. ● ఇటీవల విడుదల చేసిన ముసాయిదాపై తీవ్ర విమర్శలు ● 80 వరకు ప్రాధాన్యత పాయింట్ల పెంచడంపై అభ్యంతరం ● సవరణలు చేసి న్యాయం చేయాలని వేడుకోలు శ్రీకాకుళం న్యూకాలనీ: దివ్యాంగ ఉపాధ్యాయులపై కూటమి సర్కారు అక్కసు ప్రదర్శిస్తోంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉపాధ్యాయ బదిలీల నిబంధనల ముసాయిదా మార్గదర్శకాలు దివ్యాగుంలు, శారీరక వైకల్యం, అనారోగ్య రుగ్మతలతో బాధపడుతున్న వారికి తీరని నష్టం కలిగించేలా ఉన్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గ్రేడ్–2 హెచ్ఎంలు, ఉపాధ్యాయుల సీనియారిటీ, రోస్టర్ పాయింట్లను తుంగలొకి తొక్కిన కూటమి సర్కారు.. టీచర్ల వైకల్య శాతాన్ని అమాంతం పెంచేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా ఆర్థోపెడికల్, విజువల్లీ ఛాలెంజ్డ్ వంటి సమస్యలతో బాధపడుతున్నవారికి ఈ నిబంధనలతో తీవ్ర అన్యాయం జరిగి బదిలీల్లో సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని పలువురు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో పాఠశాల విద్య పరిధిలో దివ్యాంగులు, వివిధ తీవ్ర రుగ్మతలు కలిగినవారు 294 మంది వరకు ఉన్నట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. వైకల్య శాతాన్ని తీసుకొచ్చిందే చంద్రబాబు.. వాస్తవానికి వైకల్యశాతాన్ని బదిలీల్లోకి తీసుకొచ్చి 2017లో అన్యాయం చేసింది నాడు చంద్రబాబు సారధ్యంలోని టీడీపీ సర్కారేనని వారంతా గుర్తుచేస్తున్నారు. నాడు 40 శాతం వైకల్యం కలిగినవారికి ప్రాధాన్యత పాయింట్లను కేటాయించారు. 2023లో వైఎస్సార్సీపీ అధికారంలో వచ్చాక దానిని విభిన్నమైన రీతిలో వైకల్యాన్ని గుర్తించి మేలుచేసేలా చర్యలు చేపట్టింది. దీంతో ఎక్కువ వైకల్యం కలిగినవారికి బదిలీల్లో మరింత న్యాయం జరిగింది. వైకల్యశాతాన్ని బట్టి వారికి సమన్యాయం చేశారు. మరళా కూటమి సర్కారు 2025లో చేపట్టనున్న బదిలీల మార్గదర్శకాల్లో వైకల్యాన్ని 80 శాతం వరకు తీసుకెళ్లడాన్ని వాంతా తప్పుపడుతున్నారు. ప్రస్తుతం నడవలేని స్థితిలో ఉన్నవారికి వైకల్యశాతం 70 శాతం దాటి ఇవ్వడంలేదు. ఈ కోవకు చెందినవారు జిల్లాలో 50 మంది వరకు ఉన్నారు. దీనికితోడు ట్రాన్స్‌ఫర్స్‌కు మాన్యువల్ సర్టిఫికెట్ సరిపోదు. శ్రీకాకుళంలో రిమ్స్ మెడికల్ బోర్డులో డాక్టర్లు సర్టిఫై చేసిన సర్టిఫికెట్ మాత్రమే అనుమతిస్తారు. ఈ లెక్కన వారంతా తీవ్ర అన్యాయానికి గురవుతారని దిగులు చెందుతున్నారు. ప్రభుత్వ పెద్దలు, విద్యాశాఖ ఉన్నతాధికారులు తమకు న్యాయం చేయాలని వారంతా విజ్ఞప్తి చేస్తున్నారు. శారీరక వికలాంగులు అంటే.. ●దృశ్యపరమైన వారు/ఆర్థోపెడికల్ చాలెంజ్డ్ ఉద్యోగులకు 80 శాతం కంటే ఎక్కువ లేదా సమానం. ● దృశ్యపరమైన వారు/ ఆర్థోపెడికల్ చాలెంజ్డ్/ వినికిడి లోపం ఉన్న ఉద్యోగులకు 70 శాతం కంటే ఎక్కువ లేదా సమానం. ● క్యాన్సర్, ఓపెన్ హార్ట్ సర్జరీ/కర్ణిక సెప్టల్ లోపాన్ని సరిదిద్దడం/అవయవ మార్పిడి, మేజర్ న్యూరో సర్జరీ, బాంక్ టీబీ, కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్/డయాలసిస్, వెన్నెముక శస్త్రచికిత్స వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు. ●మానసిక దివ్యాంగులు/చికిత్స పొందుతున్న వారిపై ఆధారపడిన పిల్లలు, జీవిత భాగస్వామి కలిగినవారు ●జువైనెల్ డయాబెటీస్/ తలసేమియా వ్యాధి/హీమోఫిలియా వ్యాధి/మస్కులర్ డిసీజ్/కండర క్షీణతతో బాధపడుతున్న వారిపై ఆధారపడిన పిల్లలతో టీచర్లు. అలాగే చికిత్స కొనసాగుతున్న టీచర్లకు ప్రాధాన్యతా పరంగా పాయింట్లను కేటాయించనున్నారు. ●ప్రధానోపాధ్యాయులు గ్రేడ్–2/ఉపాధ్యాయులు పైన పేర్కొన్న కేటగిరీ కింద బదిలీ కోసం దరఖాస్తుచేసుకున్న వారు జిల్లా/రాష్ట్ర మెడికల్ బోర్డ్ ద్వారా ధ్రువీకరించబడిన అన్ని మెడికల్ రిపోర్టులు/సర్టిఫికెట్లను ఆన్లైన్ ద్వారా కొత్తగా సమర్పించాలి. పాత సర్టిఫికెట్లను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని మార్గదర్శకాల్లో ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. అభ్యంతరాల స్వీకరణ.. ఉపాధ్యాయ బదిలీ నిబంధనల ముసాదాయిదా మాత్రమే ప్రభుత్వం విడుదల చేసింది. విద్యాశాఖలో అన్ని వర్గాల అభిప్రాయాలను తీసుకుంటుంది. ఎలాంటి అభ్యంతరాలున్నా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. ప్రత్యేకంగా మాడ్యూల్‌ను కూడా ఆన్లైన్లో ఉంచింది. దివ్యాంగులు వారి సమస్యలు తెలియజేయవచ్చు. – డాక్టర్ ఎస్.తిరుమల చైతన్య, జిల్లా విద్యాశాఖాధికారి, శ్రీకాకుళం -
పొయ్యి వెలిగేనా..?
పొందూరు: స్థానిక ఇండేన్ గ్యాస్ లబ్ధిదారులు పడరాని పాట్లు పడుతున్నారు. అధికారులు ఇక్కడి ఇండేన్ గ్యాస్‌ను సీజ్ చేసి గ్యాస్ సరఫరా బాధ్యతలను తాత్కాలికంగా వేరొక ఏజెన్సీకి అప్పగించారు. మూడు రోజుల కిందట గోడౌన్ తాళాలు రణస్థలం ఏజెన్సీకి అందించారు. కానీ గ్యాస్ సరఫరా ఎలా జరుగుతుందనేది చూడలేదు. పొందూరు, జి.సిగడాం, లావేరు, సంతకవిటి, ఎచ్చెర్ల మండలాల్లో పలు పంచాయతీల్లో పొందూరు ఇండేన్ ఏజెన్సీ సేవలు అందుతున్నాయి. ఈ ఏజెన్సీకి తాళాలు పడడంతో సుమారు 60 పంచాయతీల్లో ప్రజలకు గ్యాస్ అందని పరిస్థితి నెలకొంది. ఆయా పంచాయతీల్లో దాదాపు 28వేల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఈ నెల ఒకటో తేదీకి సుమారు 700 మంది బుక్ చేసుకోగా, ఆదివారం నాటికి సుమారు 2 వేల ఒక వంద మంది వరకు బుక్ చేసుకొన్నారు. గ్యాస్ బుక్ చేసుకోవడం రాని వారు వేల మంది ఉన్నారు. వారంతా ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లతో పాటు గృహాలు, తోపుడు బళ్ల వారు సైతం ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఎదురు చూపులే.. వారం రోజులుగా గ్యాస్ కోసం పొందూరు వాసులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. గ్యాస్ గోడౌన్ వద్దకు వెళ్లినా కూడా సిలిండర్ దొరకడం లేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి గ్యాస్ సరఫరా జరిగేట్టు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరుతున్నారు. డెలివరీ బాయ్స్ చేసిన తప్పు గ్యాస్ డెలివరీ బాయ్స్ చేసిన తప్పులకు ఏజెన్సీని రద్దు చేశారు. ఇది సమంజసం కాదు. ఫలితంగా గ్యాస్ లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఏజెన్సీని రద్దు చేయడంపై దృష్టి సారించిన అధికారులు పంపిణీ చేయించడంపైనా శ్రద్ధ చూపాలి. – పొన్నాడ షణ్ముఖరావు, లబ్ధిదారుడు, పొందూరు అవస్థలు పడుతున్న పొందూరు, పరిసర ప్రాంత ప్రజలు సిలిండర్లు రాకపోవడంతో వంటకు ఇబ్బందులు తప్పెవరిది.. శిక్ష ఎవరికి? రాజకీయాలు చేస్తున్నారు.. గ్యాస్ బుక్ చేసి ఆరు రోజులైంది. ఇప్పటికే ఐదు సార్లు గ్యాస్ గోడౌన్‌కు వచ్చాను. గోడౌన్ మూసే ఉంటుంది. ఇంటి దగ్గర గ్యాస్ అయిపోయింది. ఇంటి వద్ద ఇబ్బందులు పడుతున్నాం. రాజకీయాలు చేసి ప్రజలకు ఇబ్బందులు పెడుతున్నారు. – గురుగుబెల్లి ప్రకాశరావు, లబ్ధిదారుడు, పిల్లలవలస -
స్నానానికి బావిలో దిగి..
● డిప్లమో విద్యార్థి మృతి ● గోపినాథపురంలో విషాదఛాయలు టెక్కలి రూరల్: మండలంలోని గోపినాథపురం గ్రామానికి చెందిన బెండి దీపక్ అలియాస్ కుమారస్వామి (17) ఆదివారం స్నేహితులతో కలసి గ్రామ సమీపంలో ఉన్న నేల బావిలో స్నానానికి దిగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే స్నేహితులు బయటకు తీసి టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే కుమారస్వామి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుమారస్వామి ఎచ్చెర్లలో పాలిటెక్నిక్ డిప్లమో చదువుతున్నాడు. చేతికందిన కుమారుడు మృత్యుఒడికి చేరడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తండ్రి ఆనంద్ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు సీఐ విజయ్‌కుమార్ తెలిపారు. -
ద్విచక్ర వాహనం దగ్ధం
వజ్రపుకొత్తూరు రూరల్: అక్కుపల్లి శివసాగర్ తీరంలో శనివారం రాత్రి ఓ ద్విచక్ర వాహనం దగ్ధమైంది. విషయం తెలుసుకున్న ఎస్సై నిహర్ ఆదివారం సంఘటన స్థలానికి వెళ్లి వాహనాన్ని పరిశీలించారు. నంబర్ ప్లేట్ ఆధారంగా ద్విచక్రవాహనం కొత్తూరు మండలానికి చెందిన వ్యక్తిదిగా గుర్తించామని చెప్పారు.రెండు రోజులు క్రితం షోరూమ్‌కు అప్పగించి కొత్త వాహనాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. అయితే ఇదే వాహనాన్ని ఇక్కడికి ఎవరు తీసుకువచ్చారు.. ఎందుకు నిప్పు పెట్టారో తెలియాల్సి ఉందన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
పలాసలో వైభవ్ జ్యూయలర్స్ ప్రారంభం
కాశీబుగ్గ: కోస్తా ఆంధ్రా, తెలంగాణలో తమకంటూ ప్రత్యేక ప్రస్థానాన్ని ఏర్పాటు చేసుకున్న వైభవ్ జ్యూయలర్స్ నూతన బ్రాంచిని పలాసలో గొప్పగా ప్రారంభించింది. పలాస–కాశీబుగ్గ కేటీ రోడ్డులో ఆదివారం వైభవ్ జ్యూయలర్స్ 19వ బ్రాంచిన పలాస నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త యార్లగడ్డ వెంకన్నచౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక సంస్థ 19 బ్రాంచ్‌లు ఏర్పాటు చేసిందంటే కొనుగోలుదారుల ఆదరణ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చన్నారు. వ్యాపారంతో పాటు సుమారు 1200 మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం అభినందనీయమన్నారు. వైభవ్ సంస్థల సీఎండీ భారత మల్లికా రత్నకుమారి గ్రంథి మాట్లాడుతూ ఇప్పటికే తమ సంస్థ విశాఖపట్నం, గాజువాక, గోపాలపట్నం, అనకాపల్లి, కాకినాడ, రాజమహేంద్రవరం, తుని, పార్వతీపురం, బొబ్బిలి, శ్రీకాకుళం, విజయనగరం, రాజాం, అనంతపురం, అమలాపురం, యలమంచిలి, దిల్సుఖ్నగర్, ఏఎస్‌రావ్‌నగర్, మంచిర్యాల తదితర చోట్ల బ్రాంచిలు ఏర్పాటు చేసిందన్నారు. వైభవ్ సంస్థ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ జె.రఘునాథ్ మాట్లాడుతూ అద్భుత శ్రేణి షాపింగ్ అనుభవంతో పాటు 916 హాల్‌మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ డైమండ్స్, వెండి వస్తువులు, వివాహ ఆభరణాలను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. మన పలాస గురించి తెలుసుకుందాం కాంటెస్ట్ డ్రాలో గెలుపొందిన ఏడుగురు విజేతలకు ఒక్కొక్కరికి 1 గ్రాములు 22 క్యారెట్ బంగారు కాయిన్లు అందజేస్తామన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో క్యాష్యూ ట్రేడర్ మళ్లా కాంతారావు, హోల్‌టైమ్ డైరెక్టర్ సాయి కీర్తన గ్రంధి, సీఓఓ గొంట్ల రాఖాల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సింధూరి వెంకటేష్, ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ వజ్జ బాబూరావు, పీసీఎంఏ అధ్యక్షుడు మల్లా శ్రీనివాస్, పలాస వైశ్య సంఘం అధ్యక్షుడు మల్లా కృష్ణరావు, టీడీపీ నాయకులు లొడగల కామేశ్వరరావు, చిన్ని, శాసనపురి మోహనరావు, విఠల్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళా పారిశ్రామికవేత్తల హబ్‌గా శ్రీకాకుళం
శ్రీకాకుళం అర్బన్: ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేసి శ్రీకాకుళాన్ని మహిళా పారిశ్రామికవేత్తల హబ్‌గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. శ్రీకాకుళంలోని 80 అడుగుల రోడ్డులోని ఓ ఫంక్షన్ హాల్లో సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ పీడీ బి.శాంతిశ్రీ ఆధ్వర్యంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు నిర్వహించారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మహిళా సాధికారతకు ప్రభుత్వం చేస్తున్న కృషిని మంత్రి వివరించారు. అనంతరం పలువురు మహిళలకు ప్రోత్సాహకాలు, పురస్కారాలు, చెక్‌లు, బాలికలకు ల్యాప్‌టాప్‌లు, మహిళా డ్రైవర్లకు ఆటోలు అందజేశారు. కార్యక్రమంలో ఆమదాలవలస, నరసన్నపేట, పలాస ఎమ్మెల్యేలు కూన రవికుమార్, బగ్గు రమణమూర్తి, గౌతు శిరీష ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ప్రత్యేక ఉప కలెక్టర్ పద్మావతి, శ్రీకాకుళం ఆర్డీవో సాయి ప్రత్యూష, సీపీవో ప్రసన్నలక్ష్మి, ఐసీడీఎస్ పీడీ శాంతిశ్రీ, వ్యవసాయ శాఖ అధికారి కోరాడ త్రినాథస్వామి, డీఆర్డీఏ పీడీ కిరణ్‌కుమార్, డీఎంహెచ్ఓ బాలకృష్ణ, బీసీ కార్పొరేషన్ ఈడీ గెడ్డమ్మ, లీడ్ బ్యాంకు మేనేజర్ సూర్య కిరణ్, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ కె.కవిత, వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి ఈ.అనురాధ, పలు విభాగాలకు చెందిన మహిళ ఉద్యోగులు, అంగన్వాడీలు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ పాలనలోనే మహిళా సాధికారత
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): మహిళలు రాజకీయ, సామాజిక ఎదుగుదలకు అత్యధిక ప్రాధాన్యమిచ్చినది మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అని వైఎస్సార్ సీపీజిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటి సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళంలో జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు ఉలాల భారతి ఆధ్వర్యంలో శనివారం మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి కుటుంబం వద్ద లక్షలాది రూపాయలు ఉండేవని, ప్రతి పథకాన్ని మహిళా ఖాతాల్లో వేసి కుటుంబ అభివృద్ధికి బాటలు వేశారని గుర్తు చేశారు. చంద్రబాబు అధికార దాహంతో మహిళలకు లేనిపోని హామీలన్నీ ఇచ్చి ఒక్కటి కూడా అమలుచేయకుండా మోసగించారని దుయ్యబట్టారు. వైఎస్సార్ సీపీ హయాంలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, చైర్మన్ పదవులన్నీ 70 శాతం మహిళలకే ఇచ్చారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంపై తొమ్మిది నెలల్లోనే మహిళలంతా మండిపడుతున్నారని చెప్పారు. జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయసాయిరాజ్ మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి మహిళలకు గుర్తించి పదవులిచ్చిన క్రమంలోనే తనకు జిల్లా పరిషత్ చైర్మన్ పదవి దక్కిందన్నారు. పార్టీలకు అతీతంగా పథకాలు వర్తింపజేసిన ఘనత జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో పార్టీ మహిళా నేతలు అంబటి నిర్మలా శ్రీనివాస్, మూకళ్ల సుగుణ, కోరాడ ఆశాలత, రాజాపు హైమావతి, చింతు అన్నపూర్ణ, జి.వెంకటరమణి, చల్ల సుగుణా, టి.కామేశ్వరి, గుంట జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
వృద్ధురాలిపై కన్నకొడుకు దాష్టీకం!
శ్రీకాకుళం క్రైమ్ : మహిళా దినోత్సవం నాడు ఆ మాతృమూర్తి రోధన వర్ణనాతీతం. కన్నకొడుకు చెక్కతో కొట్టి రోడ్డుపైకి అమాంతం నెట్టేసి 13 రోజులవుతున్నా పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో నేరుగా ఎస్పీ మహేశ్వరరెడ్డి వద్ద మొరపెట్టుకునేందుకు కుమార్తెతో సహా జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చింది. ఉదయం 11:30 గంటలకు వచ్చిన ఆమె సాయంత్రం 3:10 గంటల వరకు ఎదురు చూసి వెనుదిరిగింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. లావేరుకు చెందిన 60 ఏళ్ల వృద్ధురాలైన సౌభాగ్య భర్త అప్పారావు అంగవైకల్యంతో 11 ఏళ్ల క్రితమే మరణించడంతో లావేరు హైస్కూల్ ఎదురుగా పెంకుటిల్లులో నివసిస్తోంది. ఒక కుమారుడు విశాఖలో ఉండగా.. మరో కుమారుడు లావేరు హైస్కూల్ సమీపంలోనే టిఫిన్ కొట్టు నడుపుతున్నాడు. కుమార్తెకు మురపాకకు చెందిన వ్యక్తితో వివాహమైనా ఆమె భర్త కొన్నాళ్లకే చనిపోవడంతో పిల్లలతో కలిసి తల్లి వద్దకే వచ్చేసింది. కాగా, కుమారులు తల్లిని పట్టించుకోకపోవడంతో సౌభాగ్య పాన్‌షాప్ పెట్టుకుని జీవనం సాగిస్తోంది. ఇటీవల కాలువ పనుల్లో భాగంగా పాన్‌షాపు తీసేశారు. దీంతో భర్త పేరిట ఉన్న స్థలంలో దుకాణం పెట్టుకునేందుకు ఇటీవల సౌభాగ్య ప్రయత్నించగా చిన్న కుమారుడు లక్ష్మణరావు అడ్డుకున్నాడు. చెక్కతో గాయపరచడంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా రక్తపు గాయాలు కాలేదని, కేసు కట్టేది లేదని చెప్పారని, అందుకే ఎస్పీకి మొరపెట్టేందుకు వచ్చినట్లు వృద్ధురాలు వాపోయింది. సిబ్బంది సోమవారం రావాలని చెప్పడంతో వెనుదిరిగింది. -
ఉత్సాహంగా 3కే రన్
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా కేంద్రంలో శనివారం జీఎన్వీ జ్యూయలర్స్ ఆధ్వర్యంలో 3కే రన్, వాక్ ఉత్సాహభరితంగా సాగింది. జీఎన్వీ జ్యూలయర్స్ ఎండీ కిరణ్, పృథ్వీ అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని 80 అడుగుల రోడ్డులో మహిళలకు నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతిశంకర్ జెండా ఊపి ప్రారంభించారు. శ్రీకాకుళం మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పైడిశెట్టి జయంతి క్రీడాజ్యోతిని వెలిగించారు. 30 ఏళ్లలోపు, 30 నుంచి40 ఏళ్ల మధ్య విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎన్వీ ఎండీలు బోయిన నిర్మల, సంయుక్త, ఊన్న సుజాత తదితరులు మాట్లాడుతూ మహిళలకు ఓర్పు, సహనం, అణుకువ ఆభరణాలతో సమానమన్నారు. అనంతరం 3కే వాక్‌లో విజేతలకు బహుమతులు అందజేశారు. అంతకుముందు ప్రదర్శించిన నృత్యప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వందన షాపింగ్ మాల్, క్వాంటమ్ ఈ బైక్స్, హెచ్‌కే ఏజెన్సీ, గ్రాండ్ హోటల్ కార్యక్రమానికి సహకరించినందుకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్లు పైడి సింధూర, కింజరాపు షర్మిళ, పీఈటీలు సాంబమూర్తి, వెంకటరమణ, జెసీఐ మెయిన్ బెందాళం వరలక్ష్మి, తమ్మినేని ఉషారాణి, యోగా టీచర్ తంగి స్వాతి తదితరులు పాల్గొన్నారు. విజేతలు వీరే.. అండర్–30 విభాగంలో పైడి వసంత, ఎస్.శార్వాణి, మేరీ గ్రేస్ తొలి మూడు స్థానాల్లో నిలవగా సీహెచ్ భార్గవి, జి.దివ్య, హెచ్.కల్పన, వి.సంధ్యారాణి ఆ తర్వాత స్థానాల్లో నిలిచారు. 30 నుంచి 40 ఏళ్ల విభాగంలో వి.నాగమణి, అరుణకుమారి, బి.కృష్ణకుమారి తొలి మూడు స్థానాలు సాధించగా..పి.లక్ష్మీప్రసన్న, ఎం.రోజా, జి.సూర్యకుమారి, కె.అశ్విని ఆ తర్వాత స్థానాల్లో నిలిచి బహుమతులు అందుకున్నారు. -
హెల్త్‌సిటీలో రక్త రుగ్మతల కేంద్రం ప్రారంభం
ఆరిలోవ: హెల్త్‌సిటీ యునిక్ ఆస్పత్రిలో మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో రక్త రుగ్మతుల కేంద్రం అందుబాటులోకి వచ్చింది. ఈ కేంద్రాన్ని హెమటాలజీ పితామహుడు డాక్టర్ మామ్మెన్ చాందీ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో సికిల్ సెల్, తలసేమియాతో బాధపడుతున్న వారు ఎక్కువగా ఉన్నారన్నారు. అలాంటి వారికి ఈ కేంద్రం ఉపయోగపడుతుందన్నారు. పేదలకు వైద్యం అందుబాటులో ఉండే విధంగా ఈ కేంద్రాన్ని నిర్వహించాల ని నిర్వాహకులకు సూచించారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ కేంద్రం విశాఖలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఊన్న మురళీకృష్ణను అభినందించారు. నిమ్స్ మెడికల్ ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ సదాశివుడు మాట్లాడుతూ విశాఖలో రక్త రుగ్మతుల కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల ఆరోగ్య సంరక్షణలో కీలక ముందుడుగు పడిందన్నారు.దీర్ఘకాలిక వ్యాధులు ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయన్నారు. అలాంటి సమస్యల నివారణకు ఈ కేంద్రం అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. మేనేజింగ్ డైరెక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ ఏపీతోపాటు ఒడిశా, చత్తీస్‌గఢ్ లలో ఎక్కడా రక్త వ్యాధులను సమగ్రంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా హెమటాలజీ కేంద్రం లేదన్నారు. ఈ లోటును భర్తీ చేయడానికి ఇక్కడ సమగ్ర రక్త రుగ్మతల కేంద్రం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పలువురు ఆంకాలజీ విభాగం వైద్యులు పాల్గొన్నారు. -
శిక్ష ఎవరికి?
శ్రీకాకుళంఆదివారం శ్రీ 9 శ్రీ మార్చి శ్రీ 2025తప్పు ఎవరిది.. ● బాయ్స్ అదనపు వసూళ్లు చేశారని, గోడౌన్లో స్టాక్ తేడాలున్నాయని ఇండేన్ గ్యాస్ గోడౌన్ సీజ్ ● పొందూరు, ఎచ్చెర్ల, జి.సిగడాం, లావేరు, సంతకవిటి వినియోగదారులకు ఇక్కట్లు ● రణస్థలం ఏజెన్సీకి ఇక్కడి సరఫరా బాధ్యతలు అప్పగింత ● గ్యాస్ రాక ఇబ్బందులు పడుతున్న వినియోగదారులు ఆ ప్రజాప్రతినిధికి లైన్ క్లియర్.. రాజకీయ కక్షసాధింపుల్లో భాగంగా అక్కడి గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులను దెబ్బ కొట్టాలని గత కొన్నాళ్లుగా అదను కోసం ఓ ప్రజాప్రతినిధి ఎదురు చూస్తున్నారు. కరెక్ట్‌గా ఇదే సమయంలో ఏకంగా కలెక్టర్ పర్యటనలో అదనపు వసూళ్లు చేస్తున్నారని కొందరు చెప్పడం, వారిని డీఎస్ఓ, తహసీల్దార్ తదితర అధికారుల విచారణలో స్టేట్మెంట్ ఇవ్వడంతో కక్ష సాధింపు కోసం వేచి చూస్తున్న సదరు ప్రజాప్రతినిధికి లైన్ క్లియర్ అయింది. ఎలాగోలా ఆ ఏజెన్సీని తన చేతులోకి తెచ్చుకోవాలన్న కుట్ర తో పావులు కదుపుతున్న ప్రజాప్రతినిధికి ఇదొక మంచి అవకాశంగా దొరికింది. -
12న వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో యువత పోరు
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 12న ‘యువత పోరు’ కార్యక్రమం నిర్వహించనున్నామని, విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ పడక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, వారికి జరుగుతున్న అన్యాయాన్ని వివరించాలన్నారు. ఈ నెల 12న పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉన్నందున అన్ని నియోజకవర్గాల్లో పార్టీ జెండా ఎగురవేయాలన్నారు. సమావేశంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పిరియా విజయసాయిరాజ్, కళింగకుల రాష్ట్ర అధ్యక్షుడు దుంపల లక్ష్మణరావు, ఉత్తరాంధ్ర యువజన విభాగం అధ్యక్షులు ఎంవీ స్వరూప్, టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్, ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు ముంజేటి కృష్ణ, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు ఉలాల భారతి, అంబటి శ్రీనివాసరావు, గొండు రఘు, మూకళ్ళ తాతబాబు, పీస గోపి, చల్ల రవికుమార్ లతో పాటు అధిక సంఖ్యలో పార్టీముఖ్య నేతలు పాల్గొన్నారు. -
గంజాయి రవాణా గుట్టురట్టు
పాతపట్నం: గంజాయి తరలిస్తున్న తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు జిల్లా తిరుమల్లైయల్ గ్రామానికి చెందిన ధనుష్ ఏకాంబరంను శనివారం అరె స్టు చేశామని సీఐ వి.రామారావు తెలిపారు. పాతపట్నం అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు వైపు పర్లాకిమిడి (ఒడిశా) నుంచి నడుకుంటూ వస్తున్న ధనుష్ వద్ద 4.596 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఒడిశాలోని బల్లిగుడా వెళ్లి రాజు అలియాస్ దొరవద్ద రూ.10 వేలుకు గంజాయి కొ నుగొలు చేసి వస్తున్నట్లు గుర్తించామన్నారు. సమా వేశంలో ఎస్ఐ బి.లావణ్య, సిబ్బంది పాల్గొన్నారు. గంజాయి విక్రేతపై కేసు నమోదు ఆమదాలవలస: పట్టణ రైల్వేస్టేషన్ జంక్షన్లో కిళ్లీ కొట్టులో గంజాయి విక్రయిస్తున్న పొట్నూరు కృష్ణారావుపై శనివారం కేసు నమోదు చేసినట్లు ఆమదాలవలస ఎస్ఐ ఎస్.బాలరాజు తెలిపారు. 70 గ్రాములు గంజాయిని స్వాధీనం చేసుకుని, ఆమదాలవలస జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు తరలించినట్లు చెప్పారు. -
ఉపాధి కోర్సుల్లో మహిళలకు శిక్షణ
శ్రీకాకుళం రూరల్: ఎచ్చెర్లలోని ఎన్టీఆర్ మహిళా ప్రాంగణంలో మహిళలకు ఉపాధి కల్పించే దిశగా నూతన కోర్సులను నిర్వహించనున్నట్లు బొల్లినేని మెడిస్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బేబికేర్ టేకర్, వేర్‌హౌస్ అసోసియేట్, ఫార్మా స్టోర్ అసోసియేట్, జనరల్ డ్యూటీ అసిస్టెంట్, పేషెంట్ రిలేషన్స్ కోర్సులను ఈ నెల 17 నుంచి ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. ఐదు నుంచి పదో తరగతి, ఇంటర్, డిగ్రీ చదివిన 18 నుంచి 45 ఏళ్ల మహిళలు అర్హులని తెలిపారు. 45 రోజుల పాటు శిక్షణ ఉంటుందని, పూర్తి వివరాలకు 7680945357, 7995013422 నంబర్లను సంప్రందించాలని కోరారు. వేతనాలు పెంచాలని వినతి ఎచ్చెర్ల క్యాంపస్: ట్రిపుల్ ఐటీలో 2018 నుంచి పని చేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీకి వేతనాలు పెంచాలని కోరుతూ సిబ్బంది శనివారం ఎస్ఎంపురం ఆర్జీయూకేటీ క్యాంపస్‌లో వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఎం.విజయ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. రైలు ఢీకొని వృద్ధుడి మృతి టెక్కలి రూరల్ : ధర్మనీలాపురం గ్రామానికి చెందిన గురుబెల్లి కృష్ణారావు(65) శనివారం సాయంత్రం రైలు ఢీకొని మృతి చెందాడు. కృష్ణారావు రైలు పట్టాలు దాటుతుండగా గుర్తు తెలియని రైలు ఢీకొనడంతో ఈ ఘటన సంభవించింది. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికి మృతదేహం మాయమైనట్లు తెలుస్తోంది. డ్రోన్ టెక్నాలజీపై అవగాహన ఎచ్చెర్ల క్యాంపస్: రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ట్రిపుల్ ఐటీ) ఎస్ఎంపురం క్యాంపస్‌లో నిర్వహిస్తున్న జాతీయ టెక్నో మేనేజ్మెంట్ ఫెస్ట్ (టెక్నివర్స్ 2025) శనివారం కూడా కొనసాగింది. విద్యార్థులు డ్రోన్ టెక్నాలజీ, ప్రాజెక్టు ఎక్స్పో వంటివి నిర్వ హించారు. ఐఐటీ గువాహటి నుంచి రీసోర్సు పర్సన్‌గా హాజరైన ప్రొఫెసర్ విజయసారథి మిషన్ లెర్నింగ్ అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కన్వీనర్ గేదెల రవి, సహాయ కన్వీనర్ తేజ్‌కిరణ్ తదితరులు పాల్గొన్నారు. డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత ఆన్లైన్ శిక్షణ శ్రీకాకుళం పాతబస్టాండ్ : శ్రీకాకుళం బీసీ స్టడీ సర్కిల్ ద్వారా డీఎస్సీ అభ్యర్థులకు ఆన్లైన్ ద్వారా ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఏపీ బీసీ స్టడీ సర్కిల్ సంచాలకులు ఇ.అనురాధ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. టెట్ అర్హత సాధించి జిల్లాకు చెందిన బీసీ, ఈబీసీ కేటగిరీల అభ్యర్థులు అర్హులని, వివరాలకు శ్రీకాకుళం 80 అడుగుల రోడ్డులోని బీసీ స్టడీ సర్కిల్ వద్ద గా నీ, 7382975679, 9295653489 నంబర్లను గానీ సంప్రదించవచ్చని పేర్కొన్నారు. రాష్ట్ర ఇంటెలెక్చువల్ ఫోరం విభాగం నియామకం శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఇంటెలెక్చువల్ ఫోరం విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పిల్లల రామకృష్ణ, కార్యదర్శిగా సీపాన వెంకటరావు, సంయుక్త కార్యదర్శిగా ఎస్.భీమాచార్యులును నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర కమిటీ లో జిల్లా నుంచి వీరికి అవకాశం కల్పించారు. -
కిడ్నీ మందులకు కోత
● బాధితులపై తప్పని ఆర్థిక భారం ● బయటే కొనుగోలు చేసుకోవాల్సిన దుస్థితి ● నిర్లక్ష్యం వహిస్తున్న కూటమి సర్కారు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కిడ్నీ బాధితులకు డయాలసిస్ ఎంత ముఖ్యమో.. మందులూ అంతే కీలకం. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో కిడ్నీ రోగులకు ప్రభుత్వం అవసరమైన కీలక మందులను ఉచితంగా అందిస్తూ వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చాక బడ్జెట్ కొరతతో ప్రభుత్వాసుపత్రులకు పూర్తిగా మందులు సరఫరా చేయడం లేదు. కీలకమైన మందులకు కోత పెడుతోంది. అసలే కిడ్నీ రోగంతో చిదికిపోయిన కుటుంబాలకు రోగులను ఆసుపత్రులకు తీసుకెళ్లడం, రోజుల తరబడి డయాలసిస్ కోసం వేచి ఉండటం, దానికయ్యే ఖర్చులు భారంగా మారుతుంటే దానికి తోడు ప్రభుత్వం మందులు సరఫరా చేయకుండా చేతులేత్తేయడంతో వారి ఆర్థిక బాధలు రెట్టింపవుతున్నాయి. మందులు కొనుగోలు చేసుకోలేని పరిస్థితిలో రోగులు చనిపోతున్న సంఘటనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సోడియం బై కార్పొనెట్ వంటి కీలక మందులు ఇవ్వడం లేదు. పత్రికల్లో వస్తే అప్పటికప్పుడు ఒక్కో స్ట్రిప్ ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. వారానికి ఒకసారి రక్తం ఇంప్రూమెంట్ కోసం ఇంజక్షన్ వేస్తుంటారు. ఇవి కూడా అప్పుడప్పుడు ఇవ్వడం లేదు. స్టాక్ ఉంటే ఇస్తున్నారు. లేదంటే కొనుక్కోమంటున్నారు. వేలాది రూపాయల విలువైన ఐరన్ ఇంజక్షన్ పరిస్థితి కూడా అంతే. బయట కొనుగోలు చేసుకోమని చెబుతున్నారు. టెస్టుల కోసం భారీగా ఖర్చు.. కవిటి, సోంపేట, పలాస డయాలసిస్ సెంటర్లలో రోగులకు ఆర్థిక భారం తప్పడం లేదు. డయాలసిస్ చేసుకోవాలంటే చేతికి, మెడకు, గుండెకు, తొడలకు వేయాల్సిన ఎక్విప్మెంట్ను రూ.4 వేల నుంచి రూ.30 వేల వరకు బయట కొనుగోలు చేయాల్సి వస్తోంది. బ్లడ్ ఇన్ఫెక్షన్ కల్చర్ టెస్ట్ చేయించుకోవాలి. ప్రభుత్వాసుపత్రుల్లో చేయకపోవడంతో బయ ట రూ.1000 నుంచి రూ.2వేల వరకు వెచ్చించాల్సి న పరిస్థితి. యూరిన్ ఇన్ఫెక్షన్ కల్చర్ టెస్ట్ కోసం శ్రీకాకుళం, విశాఖపట్నం పంపించాల్సి వస్తోంది. ఇందుకు రూ.2వేలు వరకు ఖర్చవుతోంది. జీవనాధారంపై దెబ్బ.. కుటుంబంలో ఒకరికి డయాలసిస్ చేయించుకోవాల్సివస్తే ఆ కుటుంబంలో మరొకరికి జీవనాధారం కరువవుతోంది. రెండురోజులకు ఒకసారి రోగితో పాటు ఆస్పత్రికి వచ్చి నిరీక్షించాల్సిన పరిస్థితి. ఇచ్ఛాపురం నుంచి సోంపేటకు ఆటోలో వచ్చి డయాలసిస్ చేయించుకుంటున్న వారు టోకున రూ.1200 చెల్లించాల్సిన పరిస్థితి. గతంలో 108 ద్వారా రోగులను డయాలసిస్ సెంటర్‌కు తరలించేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. రోగులు సొంత ఖర్చులతో వెళ్లాల్సి వస్తోంది. మందులు బయటే.. ఏడాదిన్నర నుంచి కవిటి డయాలసిస్ కేంద్రంలో డయాలసిస్ చేయించుకుంటున్నాను. గతంలో డయాలసిస్ కేంద్రాల్లో పూర్తి స్థా యిలో మందులు ఇచ్చేవారు. ప్రస్తుతం చాలా వరకు బయటనే కొనుక్కోవాల్సి వస్తోంది. నెఫ్రాలజిస్ట్ డాక్టర్ లేకపోవడంతో ఇక్కడ డయాలసిస్ రోగులంతా నెలకు ఒకసారి విశాఖపట్నం వెళ్లి అక్కడ చూపించాల్సి వస్తోంది. – బినాయిక్ బిసాయి, కుసుంపురం, కవిటి మండలంప్రతిసారీ రూ.4వేలు ఖర్చు.. పదేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాను. కవిటి ప్రభుత్వ డయాలసిస్ సెంటర్‌కు వెళితే బెడ్లు ఖాళీ లేవన్నారు. దీంతో పలాసలో ఓ ప్రైవేట్ సెంటర్లో మూడుసార్లు వెళ్లా. ఒక్కసారికే రూ.4000 ఖర్చయింది. దీంతో శ్రీకాకుళంలోని జెమ్స్‌లో ప్రస్తుతం డయాలసిస్ ఆరోగ్యశ్రీలో చేయించుకుంటున్నాను. ఆస్పత్రి బస్‌కు కవిటి నుంచి తీసుకెళ్లి తీసుకొస్తున్నారు. బస్సు తప్పిపోతే ట్రైన్‌కు వెళ్లొస్తున్నాను. కవిటి ప్రభుత్వ ఆస్పత్రిలో డయాలసిస్ చేస్తేనే రూ.10,000 పెన్షన్ వస్తుందంటున్నారు. – కె.తిరుపతిరావు, మధ్యపుట్టుగ, కవిటి మండలం●ఇంజక్షన్లు సరఫరా చేయాలి కొండి పుట్టుగ గ్రామానికి చెందిన మా అమ్మ శాంతమ్మ సోంపేట డయాలసిస్ కేంద్రంలో డయాలసిస్ చేయించుకుంటుంది. ప్రస్తుతం ఐరన్ ఇంజక్షన్లు ప్రభుత్వం సరఫరా చేయడం లేదు. అవి కొనలేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రక్తశుద్ధి ఇంజక్షన్లు ఒక్కొక్క సారి కొరత వస్తోంది. – నర్తు దుర్యోధన, కొండిపుట్టుగ, కవిటి మండలంలక్షన్నర ఖర్చు.. మాది తీరప్రాంతం సీహెచ్ కపాసుకుద్ధి. కష్టపడే కుటుంబంలోనే పుట్టాను. ఎందుకో ఈ అంతుచిక్కని వ్యాధి సోకింది. రెండునెలలుగా డయాలసిస్ చేస్తున్నారు.ఆరోగ్యశ్రీలో భాగంగా శ్రీకాకుళం జెమ్స్ ఆస్పత్రిలో డయాలిసిస్‌లు అయ్యాయి. వైద్యం కోసం ఇప్పటి వరకు రూ.1.5 లక్షలు అప్పు చేయాల్సి వచ్చింది. కవిటిలో డయాలసిస్ అయితే మా కష్టాలు తీరుతాయి. – ఆర్.ముకుందరావు, సీహెచ్.కపాసుకుద్ధి, కవిటి మండలం -
No Headline
యార్లగడ్డ గీతాశ్రీకాంత్.. ఓవైపు పారిశ్రామిక వేత్తగా ఎదుగుతూ, మరోవైపు సామాజిక సేవల్లో ఒదుగుతున్నారు. పాతికేళ్లుగా ఆమె ఎన్నో రూపాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామీణ మహిలు ఎదిగేందుకు కృషి చేసి జాతీయ స్థాయిలో ఉత్తమ మహిళా పారిశ్రామిక వేత్తగా గుర్తింపు పొందారు. ట్రాక్టర్ల బిజినెస్ చేస్తూ తానూ ట్రాక్టర్ నడపడం నేర్చుకున్నారు. గిరిజన మహిళల జీవనంపై పరిశోధన చేసి డాక్టరేట్ సాధించారు. 100 యువ టూరిజం క్లబ్‌లను టూరిజం సహకారంతో ఏర్పాటు చేశారు. జల యోగా ప్రదర్శన ద్వారా 30 రకాల ఆసనాలు నీటిలో వేసి నేషనల్ అవార్డు పొందారు. -
బతుకు నిత్య నృత్యం..
స్వాతీ సోమనాథ్.. ఈ పేరు చెబితే చాలు.. మరీ ఎక్కువ పరిచయం అక్కర్లేదు. దూసి గ్రామంలో మొదలైన ఆమె ప్రస్థానం నేడు ఖండాంతరాలు దాటింది. కూచిపూడి నృత్య కళతో అంచెలంచెలుగా ఎదిగారు. ఆమె 1980లో అరంగ్రేటం చేశారు. దాదాపుగా వెయ్యి సోలో ప్రదర్శనలు ఇచ్చారు. ఎంఏ ఇంగ్లిష్, ఎంఫిల్ పూర్తి చేశారు. సెంట్రల్స్ యూనివర్సిటీలో ఆర్ట్స్‌లో మాస్టర్ పెర్ఫామెన్స్ చేశారు. దాదాపు 40 దేశాలు పర్యటించి ప్రదర్శనలు చేశారు. 13 బ్యాలేలు రూపొందించారు. శ్రీకాకుళంలో కూచిపూడి సంప్రదాయ గురుకులం నిర్వహిస్తూ కళకు కాపలా కాస్తున్నారు. ఇంతవరకు ఎవరూ చేయని కిన్నెరసాని పాటలకు 45 నిమిషాల పాటు బాలేను రూపొందించారు. త్వరలో అమెరికాలో జరిగే తానా సభలలో సంప్రదాయం చిన్నారులచే ప్రదర్శన కోసం కృషి చేస్తున్నారు. – శ్రీకాకుళం కల్చరల్ -
No Headline
యార్లగడ్డ గీతాశ్రీకాంత్.. ఓవైపు పారిశ్రామిక వేత్తగా ఎదుగుతూ, మరోవైపు సామాజిక సేవల్లో ఒదుగుతున్నారు. పాతికేళ్లుగా ఆమె ఎన్నో రూపాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామీణ మహిలు ఎదిగేందుకు కృషి చేసి జాతీయ స్థాయిలో ఉత్తమ మహిళా పారిశ్రామిక వేత్తగా గుర్తింపు పొందారు. ట్రాక్టర్ల బిజినెస్ చేస్తూ తానూ ట్రాక్టర్ నడపడం నేర్చుకున్నారు. గిరిజన మహిళల జీవనంపై పరిశోధన చేసి డాక్టరేట్ సాధించారు. 100 యువ టూరిజం క్లబ్‌లను టూరిజం సహకారంతో ఏర్పాటు చేశారు. జల యోగా ప్రదర్శన ద్వారా 30 రకాల ఆసనాలు నీటిలో వేసి నేషనల్ అవార్డు పొందారు. -
రంగమేదైనా.. కీర్తీ.. ఖ్యాతీ..
ఎచ్చెర్ల మండల పరిధిలోని కేశవరావుపేట గ్రామానికి చెందిన గురుగుబెల్లి దుర్గాప్రశాంతి సాఫ్ట్‌బాల్‌లో జాతీయస్థాయిలో మెరుస్తోంది. ఈమె తల్లిదండ్రులు లక్ష్మణరావు, కృష్ణవేణి వ్యవసాయం చేస్తుంటారు. అయినా ఏ మాత్రం బెరుకు లేకుండా బిడ్డను క్రీడల్లో ప్రోత్సహించారు. ఆమె 7వ తరగతిలో ఉన్నప్పుడు సాఫ్ట్‌బాల్‌లో రంగప్రవేశం చేసి ఇప్పుడు జాతీయ స్థాయికి ఎదిగింది. చక్కటి క్యాచర్‌గా ఆమెకు గుర్తింపు ఉంది. మొత్తం 9 రాష్ట్రస్థాయి, 5 జాతీయస్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహించింది. వీటిల్లో మూడు పతకాలు సాధించింది. ప్రస్తుతం విజయవాడలోని ఎన్ఆర్ఐ అకాడమీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. స్పోర్ట్స్ కోటా ద్వారా ప్రభుత్వం ఉద్యోగం సాధించడంతోపాటు శ్రీకాకుళం జిల్లాలో సాఫ్ట్‌బాల్ క్రీడ మరింత పురోగాభివృద్ధికి అవసరమైన సాయం చేస్తానని ‘సాక్షి’కి చెబుతోంది. –శ్రీకాకుళం న్యూకాలనీబీసీ బాలికల వసతి గృహ మేట్రిన్‌గా పైడి పద్మావతి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. 19 ఏళ్ల వయసులో సర్వీసులో చేరిన ఆమె వసతి గృహ మేట్రిన్‌గా 23 ఏళ్ల సర్వీసు పూర్తి చేశారు. ఎక్కడకు వెళ్లినా అక్కడి పిల్లలను కన్నబిడ్డల్లా చూసుకోవడం ఆమెకు ఇష్టం. పండగలు, పిల్లల పుట్టిన రోజులు ఇంట్లో కంటే హాస్టల్లోనే బాగా జరుగుతాయని పిల్లలే చెబుతుంటారు. పిల్లలకు ఒంట్లో బాగోలేకపోయినా ఆమె సొంత ఖర్చుతో వైద్యం చేయిస్తారు. పిల్లలు ఎక్కడెక్కడి నుంచో ఇక్కడకు వస్తారని, ఇక్కడ తల్లీతండ్రి తానే అయి చూసుకుంటానని చెబుతారు. సమాజంలో మహిళలకు తగిన గౌరవం, ప్రాధాన్యత లభించాలనేదే తన ఆలోచన అని అన్నారు – నరసన్నపేట -
బతుకు నిత్య నృత్యం..
స్వాతీ సోమనాథ్.. ఈ పేరు చెబితే చాలు.. మరీ ఎక్కువ పరిచయం అక్కర్లేదు. దూసి గ్రామంలో మొదలైన ఆమె ప్రస్థానం నేడు ఖండాంతరాలు దాటింది. కూచిపూడి నృత్య కళతో అంచెలంచెలుగా ఎదిగారు. ఆమె 1980లో అరంగ్రేటం చేశారు. దాదాపుగా వెయ్యి సోలో ప్రదర్శనలు ఇచ్చారు. ఎంఏ ఇంగ్లిష్, ఎంఫిల్ పూర్తి చేశారు. సెంట్రల్స్ యూనివర్సిటీలో ఆర్ట్స్‌లో మాస్టర్ పెర్ఫామెన్స్ చేశారు. దాదాపు 40 దేశాలు పర్యటించి ప్రదర్శనలు చేశారు. 13 బ్యాలేలు రూపొందించారు. శ్రీకాకుళంలో కూచిపూడి సంప్రదాయ గురుకులం నిర్వహిస్తూ కళకు కాపలా కాస్తున్నారు. ఇంతవరకు ఎవరూ చేయని కిన్నెరసాని పాటలకు 45 నిమిషాల పాటు బాలేను రూపొందించారు. త్వరలో అమెరికాలో జరిగే తానా సభలలో సంప్రదాయం చిన్నారులచే ప్రదర్శన కోసం కృషి చేస్తున్నారు. – శ్రీకాకుళం కల్చరల్ -
No Headline
టాక్‌షోలో శివానీ కళాశాల విద్యార్థినుల ఉత్సాహం చుట్టూ మృగాళ్లు, ఒక్క తప్పటడుగు పడినా అమాంతం లాగేసే క్రూర వేటగాళ్లు.. వీధి చివర, బస్టాండుల్లో, కూడళ్లలో వేధించే ఆకతాయిలు.. ఇవి చాలవన్నట్టు ఆన్‌లైన్‌లోనూ అనుక్షణం పీడించుకుని తినే సైబరాసురులు.. ఇందరి మధ్య ఓ అబల స్వేచ్ఛగా బతకడం నిత్య యుద్ధమే. మహిళా దినోత్సవం సందర్భంగా చిలకపాలెంలోని శ్రీ శివానీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ‘సాక్షి’ మహిళల భద్రత, సోషల్ మీడియా ప్రభావంపై చర్చా వేదిక నిర్వహించింది. ప్రిన్సిపాల్ డాక్టర్ కె.రాజ్‌కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అమ్మాయిలు, మహిళలు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం / ఎచ్చెర్ల క్యాంపస్ / టెక్కలి / పాత బస్టాండ్ / కాశీబుగ్గ/ శ్రీకాకుళం క్రైంనియంత్రించుకోవాలి.. వ్యక్తిగత జీవితాన్ని సోషల్ మీడియాలో పంచుకోకూడదు. చిన్న తప్పు చేసినా అదే మనల్ని వేధిస్తుంది. మన లిమిట్స్ లో మనం ఉండాలి. – పొన్నాడ దీపిక, విద్యార్థిని వస్త్రధారణా కీలకమే.. మహిళల వస్త్రధారణపై చాలా డిబేట్లు జరుగుతున్నాయి. మగవారిని ఆకర్షించే వస్త్రధారణ ఎప్పుడూ మంచిది కాదు. – బాలక రమ్యశ్రీ, విద్యార్థిని విలువలు ముఖ్యం చెడు స్నేహాలకు దూరంగా ఉంటే మేలు. ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు. విలువలు పాటించాలి. – ఆర్.స్వాతి, విద్యార్థిని ● -
No Headline
ముదితల్ నేర్వగ రాని విద్య గలదె.. అన్నారు చిలకమర్తి వారు. ఇప్పుడు ముదితల్ నడపగ లేని బండి గలదె.. అనాలేమో. ఔను మరి బైక్ మొదలుపెట్టి ట్రైన్ వరకు అన్నింటా అతివలు స్పీడు చూపిస్తున్నారు. అందుకు వీరే సాక్షి. స్వీయనియంత్రణ అవసరం మహిళలపై వేధింపులు ఆందోళన కలిగిస్తున్నాయి. కానీ స్వీయ నియంత్రణ ఉంటే సమస్యలను ఎదుర్కోగలం. ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా పోరాడాలి. – ఎన్.స్వాతి, అసిస్టెంట్ ప్రొఫెసర్ మానసిక బలం ప్రధానం మహిళలు మానసికంగా, శారీకంగా బలంగా ఉండాలి. బలహీనతలను ఎదుటివారు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. మనల్ని మనమే రక్షించుకోవాలి. – ఎం.సత్యవాణి, అసిస్టెంట్ ప్రొఫెసర్ అవసరం మేరకే వాడాలి.. సోషల్ మీడియా అవసరం మేరకే వాడాలి. ఫొటోలు, వీడియోలు షేర్ చేసుకోకపోవడమే ఉత్తమం. – జి.ఈక్షిత, అసిస్టెంట్ ప్రొఫెసర్బైక్ నడిపే అమ్మాయి కనిపిస్తేనే సమాజం కళ్లు ఇంతలు చేసుకుని చూస్తుంది. ఇప్పుడిప్పుడే ఆటోలు, బస్సులు నడిపే అతివలను చూడడం నేర్చుకుంటోంది. కానీ మరడ వాణి రెడ్డి రూటే సెపరేటు. బైక్‌లు, బస్సులు దాటి ఏకంగా ట్రైన్ నడిపే ఉద్యోగం సాధించి ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం పలాస రైల్వేస్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. ఆమె చత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌లో ఎలక్ట్రికల్ విభాగంలో ఇంజినీరింగ్ పూర్తిచేశారు. తల్లి ఎల్.రుక్మిణిరెడ్డి ప్రోత్సాహంతో ఈ రంగంలోకి అడుగు పెట్టారు. పలాస రైల్వేస్టేషన్ మీదుగా నడిచే వందేభారత్ రైలును నడుపుతున్నారు. రోజుకి 220 కిటోమీటర్లు దూరం ప్రయాణిస్తారు. తన కుటుంబం పరిసర ప్రాంతాల ప్రజలు తనను వింతగా చూస్తుంటారని, తాను కూడా ఇదే కోరుకున్నానని గర్వంగా ఆమె చెబుతుంటారు. ●● అపరిచిత వ్యక్తులతో ఆన్లైన్ చాటింగ్, వీడియో కాల్స్ చేయకూడదు. ● సైబర్ మోసానికి గురయ్యేవారు గోల్డెన్ అవర్‌లో 1930 నెంబర్‌కు డయల్ చేయాలి. లేదంటే డబ్లూడబ్ల్యూడబ్ల్యూ.సైబర్‌క్రైమ్.జీఓవీ.ఇన్ పోర్టల్‌లో ఆన్లైన్ ఫిర్యాదు ఇవ్వాలి. ● జిల్లా ప్రజలకు హెచ్‌టీటీపీఎస్: //శ్రీకాకుళంపోలీస్.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్ అందుబాటులో ఉంది.సాహ‘షి’ దేశ రక్షణ బాధ్యత నాది కూడా అంటోంది సాహ‘షి’. అనాదిగా మగాళ్ల రాజ్యంగా పేరొందిన రక్షణ శాఖలో ఇప్పుడు ఆడ సింహాలు కూడా గర్జిస్తున్నాయి. లో8శ్రీకాకుళంశనివారం శ్రీ 8 శ్రీ మార్చి శ్రీ 2025మెరుపులా.. ఈమె పేరు బి.మేఘన. ఇంజినీరింగ్ విద్యార్థిని. స్వస్థలం హైదరాబాద్. వాహనాన్ని మెరుపులా పరిగెత్తించడం ఈమెకు సరదా. విద్యుత్ శాఖలో లైన్మెన్గా పనిచేస్తున్న తండ్రి ఈమెకు ఆదర్శం. ప్రస్తుతం టెక్కలి ఆదిత్య కళాశాలలో జరుగుతున్న గోకార్టింగ్ రేసులో మెరుపులా దూసుకెళ్తోంది. తనకంటూ ప్రత్యేకత సాధించాలనే ఇలా రైడర్‌గా మారానని చెబుతోంది. ఈమె రూటే సెపరేటు అలెర్ట్ -
ఆమేయం.. అజేయం..
మహిళలే రథ సారధులు నేటి సమాజంలో మహిళలే కుటుంబాలకు రథ సారధులుగా ఉన్నారు. నా విద్యాభ్యాసం అంతా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలోనే పూర్తయ్యింది. అనేక సమస్యలు ఎదుర్కొని ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను. చిన్న సమస్యకు కుంగిపోకూడదు, విజయాలు వచ్చినప్పుడు పొంగిపోకూడదు దేనినైనా సవాలుగా తీసుకుని ముందుకు సాగాలి. శారీరక ధైర్యం అనేది శారీరక నొప్పిని ఎదుర్కొంటుంది, అయితే నైతిక ధైర్యం ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేలా తీర్చిదిద్దుతుంది. – బి.కరుణశ్రీ, ఈఈ, పొల్యుషన్ కంట్రోల్‌బోర్డు లక్ష్యం నిర్దేశించుకోండి ప్రతి బాలిక చదువుకునే సమయంలోనే లక్ష్యం నిర్దేశించుకోవాలి. కష్టపడి ఆ లక్ష్యాన్ని సాధించాలి. మనం పట్టుదలగా ఉంటే కుటుంబ సభ్యులు కూడా సహకరిస్తారు. – కె.సాయి ప్రత్యూష, ఆర్డీఓ, శ్రీకాకుళం సమానత్వం కీలకం మహిళలు తమ కర్తవ్యాన్ని గుర్తు చేసుకోవాల్సిన రోజు ఇది. సాధికారత, సమానత్వం రెండూ సాధించాలి. – ఇ.అనురాధ, డీబీసీ, శ్రీకాకుళం అన్ని రంగాల్లో ఎదగాలి.. పురుషులతో సమానంగా అన్నింటా ఎదగాలి. అప్పుడే నిజమైన మహిళా దినోత్సవం సాధ్యమవుతుంది. మహిళల సంరక్షణ ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవాలి. – కె.కవిత, సహాయ సంచాలకులు, వికలాంగుల సంక్షేమ శాఖ, శ్రీకాకుళం మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో మహిళలకు వివిధ సంక్షేమ పథకాలను అమలు చేశారు. కానీ కూటమి ప్రభుత్వ హయాంలో ఆ పరిస్థితి మచ్చుకై నా కనిపించడం లేదు. – పిరియా విజయ, జెడ్పీ చైర్పర్సన్, ఆత్మవిశ్వాసంతో ముందుకు.. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి. ఉన్నతమైన ఆలోచనలతో, ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలి. తల్లిదండ్రులు మహిళలను విద్యలో ప్రోత్సహించాలి. కుటుంబాన్ని, సమాజాన్ని మహిళలు ఆదర్శంగా తీర్చి దిద్దగలరు. – ప్రొఫెసర్ కేఆర్ రజిని, వైస్ చాన్స్‌లర్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ చదువే మూలధనం మహిళలు రాణించాలంటే చదువు చాలా ముఖ్యం. చక్కగా చదువుకుంటేనే ఉన్నత శిఖరాలు అధిరోహించగలం. కుటుంబ బాధ్యతలు కూడా మహిళలకు కీలకమే. – ప్రసన్న లక్ష్మి, జేడీ, సీపీఓ కార్యాలయం, వివక్ష లేని సమాజం కావాలి.. వివక్ష లేని, వేధింపులు లేని, సమసమాజం వచ్చిన నాడే ఈ కార్యక్రమాలకు, ఈ ఉ త్సవాలకు అర్థం ఉంటుంది. ఆ దిశగా మనమంతా కృషి చేయాలి. – ఆర్.గడ్డెమ్మ, ఈడీ, బీసీ కార్పొరేషన్ ● -
మహిళా పోలీసుల ఆనందహేల
శ్రీకాకుళం క్రైమ్: మహిళా దినోత్సవ ముందస్తు వేడుకల్లో భాగంగా శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో మహిళా పోలీసుల వేడుకలు సందడిగా జరిగాయి. డీఎస్పీ సీహెచ్ వివేకానంద ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. శ్రీకాకుళం రూరల్, రెండో పట్టణ, మహిళా పోలీస్ స్టేషన్లకు చెందిన మహిళా పోలీసులు, స్థానిక కాకినాడ ఆదిత్య కళాశాల విద్యార్థినులు సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలతో సందడి చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ తన ఎదుగుదలలో మహిళల నిర్ణయాలే ప్రధాన భూమిక పోషించాయని, బ్యాక్‌బెంచ్ ఇంజినీరింగ్ స్టూడెంట్ అయిన తాను ఐపీఎస్‌పై ఆసక్తి పెట్టడానికి ఐఏఎస్, ఐఆర్‌ఎస్‌లుగా ఉన్న దంపతులే కారణమని గుర్తు చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ కె.వి.రమణ, సీఐలు పైడపునాయు డు, ఈశ్వరరావు, ఇమ్మాన్యుయల్ రాజు, ఎస్ఐలు హరికృష్ణ, రాము, జనార్ధన, మహిళా పోలీసుస్టేషన్ సీఐ త్రినేత్రి, ఎస్ఐ లక్ష్మి, చంద్రకళ అధిక సంఖ్యలో మహిళా పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు. -
దేశ రక్షణలో సాహషి
●గర్వంగా ఉంది కఠోర సాధన చేసి మొదటి ప్రయత్నంలోనే ఎస్ఎస్సీ పరీక్షలో ప్రతిభ కనబర్చి నాలుగేళ్ల క్రితం బీఎస్ఎఫ్కు ఎంపికయ్యాను. దేశ రక్షణ కోసం సరిహద్దులలో విధులు నిర్వర్తించడం గర్వంగా ఉంది. – కె.స్రవంతి, సీతాపురం, బీఎస్ఎఫ్ జవాన్, వజ్రపుకొత్తూరు మండలం ●సమాజంలో గుర్తింపు గొర్రెల కాపరి కుటుంబంలో పుట్టిన నేను దేశ సైన్యంలో చేరాలన్న కోరికతో ప్రతి రోజు కఠోర సాధన చేశాను. మా కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో లక్ష్యం సాధించాను. ఇండియన్ నేవికి ఎంపికై ప్రస్తుతం ఒడిశాలో శిక్షణ పొందుతున్నాను. – బందాపు శ్రీనిధి, ఇండియన్ నేవి, వజ్రపుకొత్తూరు మండలం వజ్రపుకొత్తూరు రూరల్: తరతరాలుగా కుటుంబ బాధ్యతలకే పరిమితమైన ఆడపడుచులు నేడు దేశ సరిహద్దుల్లో ముష్కరులను మట్టికరిపిస్తున్నారు. బ్రిటీషర్లను తరిమికొట్టిన వీరనారుల వీరత్వాన్ని అందిపుచ్చుకొని సిక్కోలు యువతులు సివంగిలా మారి దేశ రక్షణకు సై అంటున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా నుంచి సుమారు 350 మంది వరకు యువతులు త్రివిధ దళాల్లో చేరినట్లు సైన్యాధికారులు చెప్తున్నారు. -
డయాలసిస్ బెడ్లు పెంచాలి
కవిటి: కిడ్నీ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం డయాలసిస్ బెడ్ల సంఖ్య పెంచాలని ఇచ్ఛాపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ నేత పిరియా సాయిరాజ్ డిమాండ్ చేశారు. శుక్రవారం కవిటిలో మండల కన్వీనర్ కడియాల ప్రకాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధానంగా కవిటి మండలంతో పాటు చాలా కేంద్రాల్లో డయాలసిస్ కోసం వేచి చూసే రోగులసంఖ్య అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం సానుకూల దృక్పథంతో డయాలసిస్ బెడ్ల సంఖ్య పెంపు దిశగా ఆలోచన చేయాలని కోరారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత పింఛన్లను రూ.10వేలకు పెంచాలని గుర్తు చేశారు. కవిటిలో పదిలోపు ఉన్న బెడ్ల సంఖ్యను 19కు పెంచిన విషయాన్ని తెలిపారు. ఇచ్ఛాపురంలో డయాలసిస్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారని, దాన్ని ప్రారంభించాలన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నేతలు కడియాల ప్రకాష్, జల్లు యుగంధర్, పి.చంద్రశేఖర్, ఎస్పీ నారాయణస్వామి, భద్రాచలం, వై.నీలయ్య, కొర్రాయి గోపాల్, దుద్ది ధర్మారావు పాల్గొన్నారు. సర్కారు సేవాలోపం ఉద్దానం విలాపం -
వారంతా వెనుకబాటుకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే శ్రీకాకుళం జిల్లాలో జన్మించినా అనుకున్న లక్ష్యం సాధించారు. ఈ క్రమంలో ఎన్ని అవాంతరాలు ఎదురైన మొక్కవోని దీక్షతో అధిగమించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ అత్యున్నత స్థానాలను అధిరోహిస్తూ నేటితరానికి స్ఫూర్తిగా నిలిచారు. మా
● అనుకున్న లక్ష్యం సాధిస్తాం ● ‘సాక్షి’ టాక్‌షోలో మనోగతం వెల్లడించిన టెక్కలి ప్రభుత్వం డిగ్రీ కళాశాల విద్యార్థినులు ●జిల్లా మహిళామణులే ఆదర్శం ●ఎన్ని అవాంతరాలు ఎదురైనా వెనుకడుగు వేయం ●లక్ష్యం సాధించాలి మహిళలు తమ గౌరవాన్ని మరింత పెంచుకునేలా లక్ష్యాలను సాధించుకోవాలి. విద్యార్థి దశ నుంచి ఉన్నతమైన ఆలోచనలతో విద్యనభ్యసిస్తే అనుకున్న లక్ష్యాన్ని సులువుగా చేరుకోవచ్చు. – వై.లీలాపద్మజ, తెలుగు అధ్యాపకురాలు, మహిళా సాధికారత విభాగం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, టెక్కలి ●జిల్లా విజేతలే ఆదర్శం... మన చుట్టూ ఉన్న ఎంతో మంది మహిళలు విభిన్నమైన రంగాల్లో గొప్ప స్థానాల్లో ఉన్నారు. అటువంటి వారిని ఆదర్శంగా తీసుకుని ఉన్నతమైన లక్ష్యంతో అడుగులు వేయాలి. మనం అనుకున్న ప్రతి ఆలోచలను సాకారం చేసుకోవాలి. – బి.ఝాన్సీరాణి, ఆంగ్ల అధ్యాపకురాలు, మహిళా సాధికారత విభాగం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, టెక్కలి -
ఆరో రోజు ఒకరు డిబార్
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా సాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 75 కేంద్రాల్లో జరుగుతున్న పరీక్షల్లో భాగంగా 6వ రోజు శుక్రవారం సెకండియర్ విద్యార్థులు సెట్–2 ప్రశ్న పత్రంతో మాథ్స్ 2ఎ, బోటనీ, సివిక్స్ పేపర్–2, ఇతర ఒకేషనల్ పేపర్లకు పరీక్ష రాశారు. జనరల్, ఒకేషనల్ రెండు విభాగాల్లో కలిపి 18763 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 385 మంది గైర్హాజరయ్యారు. 6వ రోజు జిల్లాలో ఒక మాల్‌ప్రాక్టీసు కేసు నమోదైంది. పొందూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెకెండియర్ మాథ్స్ 2ఏ పరీక్ష రాస్తున్న ఒక విద్యార్థి మాల్‌ప్రాక్టీసుకు పాల్పడుతూ పట్టుబడటంతో అధికారులు డీబార్ చేశారు. రెండు టన్నుల చింతపండు పట్టివేత సారవకోట: మండలంలోని వడ్డినవలస గ్రామ సమీపంలో శుక్రవారం ఒడిశా రాష్ట్రం గుణుపురం నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా తీసుకొస్తున్న చింతపండు వ్యాన్‌ను అటవీ శాఖ ఎస్ఎఫ్ఓ ఈశ్వరరావు పట్టుకున్నారు. సుమారు 2 టన్నుల చింతపండును గుణుపురం నుంచి నరసన్నపేటకు తీసుకొస్తున్నట్లు గుర్తించారు. అనుమతులు లేకపోవడంతో వ్యాన్‌ను అదుపులోకి తీసుకున్నారు.నరసన్నపేటకు చెందిన ఒక వ్యాపారి నిత్యం ఇదే మార్గంలో ఒడిశా నుంచి చింతపండు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. తెరుచుకోని గ్యాస్ గోదాంపొందూరు రూరల్: పొందూరులో గ్యాస్ ఇబ్బందులు తప్పడం లేదు. గత వారం రోజులుగా గ్యాస్ లభించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ బుక్ చేసినప్పటికీ ఇవ్వటం లేదు. గోదాం దగ్గరకు వచ్చి తీసుకుందామంటే తాళాలు వేసి ఉంటున్నాయి. గ్యాస్ గోదాం దగ్గరకు వచ్చిన లబ్ధిదారులు తమ గోడును వినిపించుకుంటున్నారు. శుక్రవారం రాపాక, పిల్లలవలస, ఎరుకులపేట, పొందూరుకు చెందిన పలువురు లబ్ధిదారులు గ్యాస్ గోడౌన్‌కు వచ్చి ఉసూరుమని తిరిగి వెనుకకు ఖాళీ సిలిండర్లతో వెళ్లిపోయారు. దుర్గమ్మ ఆలయంలో చోరీ వజ్రపుకొత్తూరు: మండలంలోని సుంకర జగన్నాథపురం దుర్గమ్మ తల్లి ఆలయంలో గురువారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు. తాళాలు పగలుగొట్టి వెండి, బంగారం నగలు ఎత్తుకెళ్లారు. శుక్రవారం ఉదయం దాసురాలమ్మ గాడి హైమావతి ఆలయం వద్దకు రాగా.. తాళం పగలుగొట్టి ఉండటంతో చోరీ జరిగినట్లు గుర్తించి గ్రామస్తులకు సమాచారం అందించారు. ఆభరణలు మాయం కావడంతో వజ్రపుకొత్తూరు పోలీసులకు సమాచారమిచ్చారు. చోరీలో రెండు కిలోల బరువు కలిగిన వెండి పల్లెం, అమ్మవారి విగ్రహం, కిరీటం, బల్లెం, గ్లాసు, రెండు తులాల బంగారం శతమానాలు, ముక్కు పుడకలు, కాసులను దొంగలు ఎత్తుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పూండి – నౌపడ ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న దేవాలయం కావడంతో దొంగలు రెక్కీ నిర్వహించి చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. వజ్రపుకొత్తూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
No Headline
టెక్కలి: ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల వేదికగా గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి గోకార్టింగ్ సీజన్–2 పోటీలు శుక్రవారం అట్టహాసంగా ముగిశాయి. ఈ పోటీల్లో పెట్రోల్ విభాగం (సీవీ) విశాఖపట్టణం రఘు ఇంజినీరింగ్ కళాశాల ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను కై వసం చేసుకుంది. అలాగే ఎలక్ట్రికల్ (ఈవీ) విభాగంలో హైదరాబాద్‌కు చెందిన బీవీఆర్ఐటీ కళాశాల విద్యార్థినులు చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్నారు. ముగింపు సందర్భంగా టెక్కలి ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, ఒడిశా, తమిళనాడు ప్రాంతాలకు చెందిన సుమారు 16 బృందాలు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. అంతకుమునుపు టెక్కలి మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ డి.సంజీవరావు, సీఐ ఎ.విజయ్‌కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను ప్రారంభించారు. కార్యక్రమం ఆద్యంతం యువత సందడి చేశారు. -
డీఆర్డీఏ పీడీపై నిరసన గళం
శ్రీకాకుళం పాతబస్టాండ్: వెలుగు వీఓఏలపై అనుచితంగా ప్రవర్తించిన డీఆర్డీఏ పీడీ పి.కిరణ్‌కుమార్‌ను సస్పెండ్ చేయాలని, ఆయన చేసిన వ్యాఖ్యలకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా వీఓఏలు గురువారం నిరసన తెలిపారు. ఏపీ వీఓఏ ఉద్యోగుల సంఘం, సీఐటీయూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. డీఆర్డీఏ పీడీ ధర్నా వద్దకు వచ్చి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సి.హెచ్.అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావులు మాట్లాడుతూ డీఆర్డీఏ పీడీ అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. వీఓఏ ఉద్యోగుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు అల్లు మహాలక్ష్మి, జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు వి.ధనలక్ష్మి, జి.అసిరినాయుడు మాట్లాడుతూ వీఓఏలుగా 95 శాతం మంది మహిళలే పనిచేస్తున్నారని, వారిని కించపరచడం బాధాకరమన్నారు. అనంతరం శ్రీకాకుళం పోలీసులు వచ్చి వారికి నచ్చజెప్పారు. కానీ మధ్యాహ్నం భోజనం కూడా చేయకుండా నిరసన తెలిపారు. తర్వాత పీడీ యూనియన్‌తో మాట్లాడడంతో ఆందోళన విరమించారు. -
ఐదో రోజు 815 మంది గైర్హాజరు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో ఇంటర్మీడియె ట్ పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా సాగుతున్నాయి. ఐదో రోజు గురువారం ఫస్టియర్ విద్యార్థులు సెట్–2 ప్రశ్న పత్రంతో మ్యాథ్స్ 1ఎ, బోటనీ, సివిక్స్ పేపర్–1, ఇతర ఒకేషనల్ పేపర్ల పరీక్ష రాశారు. జనరల్, ఒకేషనల్ రెండు విభాగాల్లో కలిపి 22,498 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 21,683 మంది పరీక్ష రాశారు. వివిధ కారణాలతో రికార్డుస్థాయిలో 815 మంది గైర్హాజరయ్యారు. ఎలాంటి మాల్ ప్రాక్టీసు కేసులు నమోదుకాలేదని ఆర్ఐఓ ప్రగడ దుర్గారావు ధ్రువీకరించారు. -
కరెంటే వాడలేదు బిల్లు మాత్రం రూ.290
కాశీబుగ్గ: పలాస మండలం బొడ్డపాడు పంచాయతీ కేంద్రంలో ఉన్న తెప్పల గారమ్మ ఒక్క యూనిట్ విద్యుత్ వాడకపోయినా రూ.290 బిల్లు వేశారు. గురువారం సాయంత్రం ఆమె ఇంటికి కరెంటు బిల్లు వచ్చింది. ఆమె అనారోగ్యం కారణంగా వేరే వారి ఇంటిలో ఉంటున్నారు. ఈ ఇంటిలో కనీసం ఒక్క రోజు కూడా కరెంటు వాడలేదు. ఒక్క యూనిట్ కరెంటు వాడకపోయినా చార్జీ రూ.237, షార్ట్ ఫాల్ బిల్, కస్టమ్ చార్జ్ రూ.25, ఫిక్స్డ్ చార్జ్ రూ.10, ఎఫ్‌పీపీసీఏ3 చార్జ్ పేరుతో రూ.9.5 అంటూ మొత్తం రూ.290.47 బిల్లు వచ్చింది. దీంతో ఆమె నిశ్చేష్టురాలయ్యారు. ధాన్యం కొనుగోలు చేయాలని ఆందోళన బూర్జ: మండలంలో గల లక్కుపురం గ్రామంలో ఖరీఫ్‌లో పండించిన ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు ధాన్యం బస్తాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. గురువారం రైతులు వి య్యపు భాగ్యారావు, వారాడ రామినాయుడు, వియ్యపు దుర్గారావు, వాకముడ్లు పెంటయ్య, శేషపు తవిటినాయుడు, పొదిలాపు ధర్మారావు తదితరులు పొలంలో ధాన్యం బస్తాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో 20 శాతం మాత్రమే ధాన్యం అమ్మకాలు జరిగాయని, ఇంకా గ్రా మంలో రైతుల వద్ద సుమారు 80 శాతం వరకు ధాన్యం నిల్వలు ఉన్నాయని వారు తెలియజేశారు. ఇదివరకు జేసీ హామీ ఇచ్చినా పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదని అన్నారు. తక్షణమే న్యాయం చేయాలని కోరారు. 8 నుంచి పి–4 సర్వే శ్రీకాకుళం పాతబస్టాండ్: పేదరికం లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్ట్నర్షిప్ (పి 4) సర్వేకు కార్యాచరణ రూపొందించిందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ సర్వే కోసం ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్‌ను ఉపయోగించి ఈ నెల 8వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా సర్వే ప్రా రంభించి 15వ తేదీ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. ఈ సర్వే పై మార్చి 6, 7 తేదీల్లో ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు తమ పరిధిలోని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. పేదల అవసరాలను గుర్తించి వారి సమగ్రాభివృద్ధికి అవసరమైన ప్రాజెక్టుల రూపకల్పనకు ఈ సర్వే దోహ దపడుతుందని, ప్రస్తుతం కుటుంబాలు అందుకుంటున్న పథకాలపై ఈ సర్వే ఎలాంటి ప్రభావం చూపబోదని, సర్వే ద్వారా సేకరించిన డేటా ఆధారంగా కుటుంబ అవసరాలకు అనుగుణంగా సమర్థమైన ప్రణాళికలు రూపొందించవచ్చన్నారు. -
నవోదయం 2.0 ప్రారంభిస్తాం
● ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ డి.శ్రీకాంత్రెడ్డిశ్రీకాకుళం క్రైమ్ : జిల్లాను సారా రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తామని, దానిలో భాగంగానే ప్రభుత్వం నవోదయం 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు జీఓ సైతం ఇచ్చిందని, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ దోసకాయల శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పూర్తిస్థాయి ప్రణాళికలతో కార్యాచరణ సిద్ధం చేస్తున్నారని డీసీ అన్నారు. గురువారం డీసీ సమక్షంలో జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ ఆడిటోరియంలో గీత, సొండి కులాల వారికి మద్యం షాపుల కేటాయింపు లాటరీ పద్ధతిలో జరిగిన విషయం విదితమే. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. సారాయి కేంద్రాలను ఎ, బి, సి క్యాటగిరీలుగా విభజించామని తెలిపారు. మన జిల్లాలో ఇప్పటికే ఆరు ఎకై ్సజ్ స్టేషన్ల పరిధిలో 110 పాయింట్లను ఎస్హెచ్ఓలు గుర్తించారన్నారు. సారాయిని కాసే గ్రామాల్లోని వ్యక్తులను గుర్తించడమే కాక ఆయా గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. ఇప్పటికే నల్లబెల్లం వ్యాపారులు, సారాయి క్రయ, విక్రయాలు, కాసేవారు, పాతముద్దాయిలను గుర్తించామన్నారు. జిల్లాలో వేయిమందికి పైగా ఇలాంటి కేసుల్లో అనుమానితులుగా ఉన్నారని, వీరిలో 700 మందికి పైగా (70 శాతం) బైండోవర్లు కట్టామన్నారు. ఇప్పటికై నా సన్మార్గంలో నడవాలని, లేదంటే గట్టి చర్యలుంటాయని ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్‌రెడ్డి హెచ్చరించారు. -
చీకటిలో ఇసుక దొంగలు
జలుమూరు: సురవరం పంచాయతీ దొంపాక వద్ద వంశధార నది నుంచి ఇసుక అక్రమంగా రాత్రి వేళలో తరలిస్తున్నారు. నిన్నటి వరకూ సైరిగాం పంచాయతీ పరిధి లింగంన్నాయుడుపేట నుంచి తవ్వకాలు జరిపిన నాయకులు తాజాగా దొంపాక గ్రామాన్ని ఎంచుకున్నారు. మండల కూటమి నాయకులతో కలిపి ఈ అక్రమ రవాణా చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాకు చెందిన మంత్రి అండదండలతో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. కొద్ది నెలల కిందట జిల్లా పోలీసు అధికారికి ఫిర్యా దు చేసి ఇసుక లారీలు పట్టించినా వాటిని నామమా త్ర చర్యలతో పోలీసులు విడిచిపెట్టేశారని విమర్శలు వచ్చాయి. అయితే దొంపాక ఇసుక రీచ్ నుంచి ఇసుకను పాత అనుభవం ఉన్నవారే మళ్లీ ఈ అక్రమ రవాణాకు తెర తీశారు. స్థానిక అధికారులకు ఫిర్యా దు చేస్తే సంబంధిత అధికారులే ఈ అక్రమ రవాణాదారులకు సమాచారం ఇచ్చి దాడులు చేసే సమయానికి కొమనాపల్లి వంతెన దాటిస్తున్నారు. పేరుకు దాడులు చేసినట్లుగా కలరింగ్ ఇచ్చి తూతూ మంత్ర చర్యలతో మమ అనిపిస్తున్నారు. ఈ మార్గంలో రవాణా.. కొమనాపల్లి జంక్షన్, వంశధార వంతెన వద్ద వాహనాలు నిలుపుదలకు అవకాశం ఉండడంతో అదే చో ట ఇసుకను తవ్వేందుకు యంత్రాలు సైతం సిద్ధంగా ఉంచుతున్నారు. రాత్రి తొమ్మిది గంటలు దాటిన తర్వాత సిద్ధం చేసిన యంత్రాలతో తవ్వకాలు జరిపి వాహనాలలో లోడింగ్ చేసి రవాణా చేస్తున్నారు. కొమనాపల్లి వంతెన నుంచి సరుబుజ్జిలి వైపు నుంచి ఈ వాహనాలు విశాఖకు తరలిస్తున్నారు. ఎంపీపీ వాన గోపితో వాగ్వాదం ఇసుక రాత్రి వేళలో అక్రమంగా రవాణా జరుగుతుందన్న సమాచారంతో ఎంపీపీ వాన గోపి, స్థానికులతో కలిసి గురువారం రాత్రి ఇసుక లారీలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇసుకాసురులు ప్రతిఘటించి వాగ్వాదానికి దిగారు. అనుమతులు ఉన్నాయని దబాయింపు చేస్తున్నారు. విచిత్రంగా రాత్రి వేళల్లో అనుమతు లు ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నా యి. దీనిపై తహసీల్దార్ జెన్ని రామారావు మాట్లాడుతూ నది నుంచి రాత్రి వేళలో తవ్వకాలకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. దొంపాక కేంద్రంగా రాత్రి వేళలో ఇసుక అక్రమ రవాణా యంత్రాలతో తవ్వకాలు చోద్యం చూస్తున్న అధికారులు -
ముగిసిన మద్యం షాపుల లాటరీ
ఆ తప్పులు దొర్లకుండా.. గతంలో 6వ నెంబరు టోకెన్‌ను ముందుగా సక్సెస్ అప్లికెంట్‌గా ప్రకటించిన కాసేపటికే 9వ నెంబరు టోకెన్ అభ్యర్థిని మళ్లీ ప్రకటించడంతో తీవ్ర వాగ్వాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఈసారి ఆ తప్పు దొర్లకుండా 6వ నెంబర్ టోకెన్‌కు కింది భాగాన బాణం గుర్తు పెట్టి డ్రా తీసే ముందు ప్రతీసారి దరఖాస్తుదారులకు చూపించారు. శ్రీకాకుళం ఎకై ్సజ్ స్టేషన్ పరిధి రెండు షాపులకు (మున్సిపల్ కార్పొరేషన్–31, రూరల్– 24) అత్యధికంగా 55 దరఖాస్తులు అందగా ఇచ్ఛాపురం రూరల్ పరిధి ఓ షాపునకు అత్యల్పంగా ఇద్దరే దరఖాస్తు వేయడం గమనార్హం. అనంతరం జేసీ మాట్లాడుతూ డ్రా ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని చెప్పారు. లైసెన్సుదారులకు ప్రొవిజనల్ లైసెన్సు ఇచ్చి అనంతరం రెగ్యులర్ లైసెన్సును ఎకై ్సజ్ విభాగం ద్వారా అందజేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి తిరుపతినాయుడు, సీఐ గోపాలకృష్ణ, ఎకై ్సజ్ స్టేషన్ల సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాకుళం క్రైమ్ : కొత్త మద్యం పాలసీ (2024–26)లో భాగంగా గీత, సొండి కులాలకు ప్రభుత్వం కేటాయించిన 18 మద్యం షాపులకు గురువారం లాటరీ పద్ధతిలో అభ్యర్థులను ఎంపిక చేశారు. గతేడాది అక్టోబరులో జనరల్ క్యాటగిరీలో జిల్లాలో 158 మద్యం షాపులకు డ్రా తీసిన సంగతి తెలిసిందే. అప్పట్లో 4671 దరఖాస్తులు రాగా ఇప్పడు 203 దరఖాస్తులొచ్చాయి. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశాల మేరకు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ విభాగం డిప్యూటీ కమిషనర్ దోసకాయల శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ డ్రా టోకెన్లను అభ్యర్థుల సమక్షంలో తీసి చూపించారు. ఎంపికై న రోజే కట్టేశారు.. గీత కుల ఉప కులాలైన సెగిడి (4), శ్రీశయన (10), యాత(1), గౌడ (1) కులాల వారికి కేటాయించిన 16 దుకాణాలకు, సొండి కులాలవారి రెండు దుకాణాలకు అభ్యర్థులను ఎంపిక చేయగా వెంటనే రిజిస్టర్లో సంతకాన్ని పెట్టి మొదటి వాయిదా సొమ్ము సుమారు రూ. 9 లక్షలు (ఒక్కొక్కరికి) కట్టేసి కుల, ఉపకుల ధృవీకరణపత్రాలను ఇచ్చేశారు. జనరల్ క్యాటగిరిలో రూ.65 లక్షలు సంవత్సర ఫీజు ఛలానాల రూపంలో కట్టగా.. వీరు రూ. 35 లక్షలను నాలుగు వాయిదాల్లో ప్రభుత్వానికి కట్టాల్సి ఉంది. ద్వితీయ శ్రేణి నాయకుల హడావిడి.. పేరుకు గీత, సొండి కులాల వారికే షాపులు కేటా యించడం జరిగినా అక్కడ టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకుల హడావిడే కనిపించింది. సిండికేట్‌గా ఏర్పాటయ్యేందుకు వారి కనుసన్నల్లో ముందుగానే మంత్రాంగం నడిచినట్లు సమాచారం. ప్రభుత్వం జనరల్ క్యాటగిరీలో మొదటిచ్చిన తొమ్మిదికి పైగా మార్జిన్‌తో రూ.లక్షల్లో నష్టాలను చవిచూసిన సిండికేట్ ఇటీవల 14కి పైగా మార్జిన్ పెంచడంతో వీరి కోటాలోనైనా (సగం ధరకే షాపులు దక్కడం) గుత్తాధిపత్యం చేసి సొమ్ములు చేసుకునే యోచనలో ఉన్నట్లు అక్కడక్కడా వినిపించింది. జేసీ సమక్షంలో గీత, సొండి కులాలకు 18 దుకాణాల కేటాయింపు హడావిడి చేసిన టీడీపీ నాయకులు -
లిఫ్ట్ ఇచ్చి.. పుస్తెలతాడు కొట్టేసి..
జి.సిగడాం: మండలంలోని మర్రివలస గ్రామంలో వృద్ధురాలి మెడలో పుస్తెలతాడును గుర్తు తెలియని వ్యక్తి తెంచుకుపోయిన ఘటన గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మర్రివలసకు చెందిన పలిశెట్టి కన్నమ్మ మానంపేట గ్రామానికి నడిచి వెళ్తుండగా అటువైపు బైక్‌పై వెళ్తున్న వ్యక్తికి లిఫ్ట్ అడిగింది. మానంపేట వద్ద దిగి నడుచుకుంటూ వెళ్తుండగా వెనకి నుంచి వచ్చి ముఖంపై కారంజల్లి మెడలో తులన్నర బంగారు పుస్తెలతాడును తెంచుకుని బైక్‌తో పరారయ్యాడు. ఈ ఘటనలో వృద్ధురాలికి స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ ఎం.అవతారం, ఎస్ఐ మధుసూదనరావు ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ● మానంపేట వద్ద చైన్‌స్నాచింగ్ ● వృద్ధురాలికి స్వల్ప గాయాలు -
వీఆర్ఓలపై ఇతర శాఖల పెత్తనం తగదు
శ్రీకాకుళం పాతబస్టాండ్: గ్రామ రెవెన్యూ అధికారులపై ఇతర శాఖల అధికారుల పెత్తనం చలాయిస్తున్నారని, వారు చేయాల్సిన పనులు తమపై నెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వెంటనే ఇటువంటి చర్యలకు అడ్టుకట్ట వేయాలని కోరుతూ వీఆర్ఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ సమీపంలోని డచ్భవన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా రెవెన్యూ అధికారి కె.వెంకటేశ్వరరావుకు అందజేశారు. ఈ సందర్భంగా అసోషియేషన్ జిల్లా అధ్యక్షుడు వీఎల్ఆర్ శాస్త్రి, గౌరవాధ్యక్షుడు వేణుగోపాల్ తదితరులు మాట్లాడుతూ పంచాయతీరాజ్, సర్వే ఉద్యోగుల విధులు కూడా తమతో చేయించడం దారుణమన్నారు. ఇప్పటికే పీజీఆర్ఎస్, రెవెన్యూ, భూ వివాదాలు, ఇతర అంశాలతో పని ఒత్తిడి ఎక్కువగా ఉందని, 24 గంటలు పనులు చేస్తున్నా పని భారం తగ్గడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ వార్డు సచివాలయాలు వచ్చాక తమకంటే తక్కువ స్థాయి కలిగిన వారు కూడా గ్రేడ్– 1 వీఆర్ఓలపై పెత్తనం చలాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సూపర్ విజన్ పేరుతో వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ ఫార్వర్డ్ చేస్తున్నారని చెప్పారు. నిరసన కార్యక్రమంలో వీఆర్వోల సంఘం ప్రతినిధులు అప్పలనాయుడు, విశ్వేశ్వరరావు, శ్రీనివాసరావు, తౌడు, తదితరులు పాల్గొన్నారు. -
సీనియారిటీ జాబితాలో తప్పులు సవరించాలి
శ్రీకాకుళం న్యూకాలనీ: విద్యాశాఖ అధికారిక వెబ్సైట్లో ఉంచిన ఉపాధ్యాయ సీనియారిటీ జాబితాలో తప్పులు దొర్లాయని.. వాటిని సవరించాలని జిల్లా ఎస్టీయూ నాయకులు ఎస్వీ రమణ, జి.రమణ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ తిరుమల చైతన్యకు వినతిపత్రం అందజేశారు. కొంతమందివి డీఎస్సీ సంవత్సరాల్లో తప్పులున్నాయని, కొంతమంది పేర్లే లేవని, మేనేజ్మెంట్లలో తప్పులు, దోషాలున్నాయని పేర్కొన్నారు. అప్పీల్ చేసుకునేందుకు గడువు పెంచాలని విన్నవించారు. సానుకూలంగా స్పందించిన డీఈఓ తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్టు చెప్పారు. కార్యక్రమంలో ఎస్టీయూ ప్రతినిధులు కె.శ్రీనివాసరావు, చింతల రామారావు, ఎస్.లక్ష్మణరావు, ఎం.తేజ, జి.శ్రీను, డీవీఎస్, హరి, సీహెచ్ జగన్ తదితరులు పాల్గొన్నారు. -
కేజీ గంజాయికి వెయ్యి కమీషన్
● గంజాయి అక్రమ రవాణా గుట్టురట్టు ● వివరాలు వెల్లడించిన కాశీబుగ్గ డీఎస్పీ వెంకట అప్పారావు వివరాలు వెల్లడిస్తున్న కాశీబుగ్గ డీఎస్పీ వెంకట అప్పారావు కవిటి: ఒడిశా సరిహద్దు నుంచి ఆంఽధ్రప్రదేశ్లోకి అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాలను ఎప్పటికప్పుడు పట్టుకుంటున్నామని కాశీబుగ్గ డీఎస్పీ వి.వెంకటఅప్పారావు తెలిపారు. కవిటి పోలీస్‌స్టేషన్‌లో గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తాజాగా పట్టుబడిన 10.250 కిలోల గంజాయికు సంబంధించి వివరాలు వెల్లడించారు. ఒడిషా రాష్ట్రం గంజాం జిల్లా లాఠీ గ్రామానికి చెందిన సురేష్ నాయక్ తన స్నేహితుడు, గంజాయి వ్యాపారం చేసే రాజేంద్ర బాడిత్య సహకారంతో అక్రమ రవాణా వ్యాపారానికి అలవాటుపడ్డాడు. గంజాయిని తీసుకొని బెంగళూరులో తాను చెప్పిన మనిషికి అప్పగిస్తే కేజీకి రూ.1000 కమీషన్‌గా ఇచ్చేవాడు. ఈ క్రమంలో సురేష్ గురువారం రాజేంద్ర బాడిత్య నుంచి 10 కేజీల 250 గ్రాముల గంజాయిని తీసుకొని బరంపురం నుంచి బస్సులొ బయలుదేరి కొజ్జీరియా టోల్‌గేటు ముందు ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద దిగాడు. అక్కడి నుంచి కంచిలి రైల్వే స్టేషనుకు వెళ్లేందుకు బస్సు కోసం నిరీక్షిస్తుండగా ముందస్తు సమాచారంతో కవిటి ఎస్ఐ వి.రవివర్మ తన సిబ్బందితో వెళ్లి సురేష్‌నాయక్‌ను అదుపులోకి తీసుకున్నారు. సమావేశంలో ఇచ్ఛాపురం సీఐ ఎం.చిన్నంనాయుడు, కవిటి ఎస్ఐ వి.రవివర్మ, సిబ్బంది పాల్గొన్నారు. కేజీన్నర గంజాయితో.. ఇచ్ఛాపురం: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీమ్‌పట్నం మండలం తుమ్మలపాలెం గ్రామానికి చెందిన కొర్లపాటి వంశీ అనే యువకుడు కేజీన్నర గంజాయితో పట్టుబడినట్లు కాశీబుగ్గ డీఎస్పీ వి.వెంకట అప్పారావు తెలిపారు. గురువారం ఇచ్ఛాపురం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. నిందితుడితో పాటు ఆదే గ్రామానికి స్నేహితులు కలపాటి తేజ, కుంచాల సూర్యలు గంజాయికి బానిసయ్యారు. అవసరమైనప్పుడలా ఒడిశా వచ్చి గంజాయిని కొనేవారు. ఈ క్రమంలో వంశీ గురువారం ఒడిశాలో కేజీ 540 గ్రాముల గంజాయిని కొనుగోలు చేసి బస్సులో ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్‌కి వస్తుండగా పట్టణ పోలీసులకు చిక్కాడు. నిందితుడి వద్ద గంజాయి, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో సీఐ మీసాల చిన్నంనాయుడు, పట్టణ ఎస్సై ముకుందరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. దుకాణాల్లో గంజాయి విక్రయం! ఆమదాలవలస: పట్టణంలో ఇటీవల పలు దుకాణాల్లో గంజాయి అమ్మకాలు జరుగుతున్నట్లు వచ్చిన సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణ ప్రధాన రహదారిపై ఉన్న ఒక దుకాణానికి మఫ్టీలో ఉన్న పోలీసు సిబ్బంది వెళ్లి గంజాయి కావాలని అడగ్గా.. పోలీసులని తెలియక నిర్వాహకురాలు గంజాయి ఇచ్చినట్లు తెలిసింది. దీంతో దుకాణం నిర్వహిస్తున్న దంపతులను పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై ఆమదాలవలస సీఐ సత్యనారాయణ వద్ద ప్రస్తావించగా దుకాణాలు తనిఖీలు చేస్తున్నామని, ఎవరైనా పట్టుపడితే విలేకరుల సమావేశంలో వెల్లడిస్తామని స్పష్టం చేశారు. -
వ్యక్తి అదృశ్యం
కాశీబుగ్గ: పలాస మండలం బ్రాహ్మణతర్లా గ్రామానికి చెందిన కుప్పిలి మల్లేశ్వరరావు (61) కనిపించడం లేదని కుమార్తె మామిడి గీతారాణి గురువారం కాశీబుగ్గ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఫిబ్రవరి 19న బయటకు వెళ్లి ఇంతవరకు రాలేదని, అన్నిచోట్లా వెతికినా ఆచూకీ తెలియలేదని పేర్కొన్నారు. వివరాలు తెలిస్తే 949475297 నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు. కాశీబుగ్గ పోలీ సులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాంకేతిక అంశాలపై పట్టు అవసరం ఎచ్చెర్ల క్యాంపస్: విద్యార్థుల్లో సాంకేతిక అంశాలపై పట్టు అవసరమని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఎం.విజయ్‌కుమార్ అన్నారు. ఎస్ఎంపురం క్యాంపస్‌లో మూడు రోజుల పాటు నిర్వహించనున్న టెక్నికల్ ఫెస్ట్ టెక్నివేర్ను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజ్ఞానం, వినోదం, సాంకేతిక అంశాల అవగాహన ఆధారంగా కార్యక్రమం జరుగుతుందని, 600 కళాశాలలను ఆహ్వానించామని చెప్పారు. కార్యక్రమంలో డైరెక్టర్ కొక్కిరాల వెంకటగోపాల ధన బాలాజీ, ఏవో ముని రామకృష్ణ, అకడమిక్ డీన్ కొర్ల మోహన్‌కృష్ణ చౌదరి, సెమినార్ కన్వీనర్ గేదెల రవి, సహాయ కన్వీనర్ తేజ్‌కిరణ్ పాల్గొన్నారు. -
ఇప్పుడు బాదుడా?
అప్పుడు వదిలేసి.. రూ.3వేలు అదనం.. గత ఏడాది రూ.1.02 లక్షలు అప్పు చూపిస్తే ఆ మొత్తానికి వడ్డీ జమ చేసి రెన్యూవల్ చేయించుకున్నాను. ఈ ఏడాది అప్ప ఖాతా రూ. 1.05 లక్షలకు పెంచిచూపించారు. ఆ మొత్తానికి వడ్డీ చెల్లించి రెన్యూవల్ చేసుకోవాలని సిబ్బంది చెబుతున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే కరోనా సమయంలో 2020లో బ్యాంకు సిబ్బంది వడ్డీ వసూలు చేసేందుకు రాలేదని, ఇప్పుడు ఆ మొత్తం కలిపేశామని చెబుతున్నారు. – తమ్మినేని శ్రీనివాసరావు, రైతు, కట్యాచార్యులపేట రసీదులు ఇవ్వడం లేదు.. అప్పు, వడ్డీ చెల్లింపులు చేస్తున్నప్పుడు రైతులకు ఎటువంటి రసీదులు ఇవ్వడంలేదు. ఖాళీ ఓచర్లపై సంతకాలు చేయించుకుంటున్నారు. అసలుకు ఎసరు పెడుతూ అధిక డబ్బులు వసూలు చేస్తున్నారు. లక్షల్లో అప్పులు వాడిన ప్రతి రైతుకు 4 శాతం మొత్తం రుణ ఖాతాకు కలిపారు. ఉన్నతాధికారులు పరిశీలించి రైతులకు న్యాయం చేయాలి. – పేడాడ భానూజీరావు, కొర్లకోట, ఆమదాలవలస మండలం ఆమదాలవలస: పట్టణంలోని కృష్ణాపురం వ్యవసాయ పరపతి సంఘం(పీఎసీఎస్) కార్యాలయంలో వ్యవసాయ రుణాలు తీసుకున్న రైతులు వడ్డీ బాదుడుపై లబోదిబోమంటున్నారు. గతంలో వాడిన అప్పు మొత్తాలకంటే ఎక్కువ చూపిస్తూ ఇప్పుడు వడ్డీలు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఒక్కో రైతుకు రూ.లక్షకు రూ. 3వేలు నుంచి రూ.4 వేలు వరకు అధికంగా కలిపిజాబితా చూపిస్తున్నారని ఆందోళన చెందుతున్నారు. ఇదేంటని సిబ్బందిని ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని వాపోతున్నారు. భారీగా తేడాలు.. కృష్ణాపురం పీఏసీఎస్ పరిధిలో ఆమదాలవలస మండలం, మున్సిపాలిటీకి సంబంధించి 2796 మంది రైతులు రుణాలు వాడారు. ఆయా రైతుల పేరిట రూ.15,77,7,642 అప్పు ఉన్నట్లు చూపిస్తున్నారు. ఇంతవరకు రెన్యూవల్స్ చేసి వడ్డీలు చెల్లించిన సుమారు 400 మంది రైతుల నుంచి రూ.1.50 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. 2019–20 సంవత్సరంలో కరోన సమయంలో రైతులు వడ్డీలు చెల్లించలేదని, దీంతో ఆ మొత్తాలు ఇప్పుడు ఖాతాలకు జమచేసినట్లు చెబుతున్నారు. నాలుగేళ్లు పాటు వదిలేసి ఈ ఏడాది మాత్రమే అదనంగా కలపడంపై రైతులు మండిపడుతున్నారు. మరోవైపు గతంలో రాష్ట్ర ప్రభుత్వం 4శాతం వడ్డీ రాయితీ, కేంద్ర ప్రభుత్వం 3 శాతం వడ్డీరాయితీ ఇవ్వకపోవడంతో ఆ మొత్తం కోపరేటివ్ బ్యాంకు ద్వారా రైతుల ఖాతాలకు జమచేసినట్లు సిబ్బంది చెబుతున్నారు. అదే విధంగా, కృష్ణాపురం పీఎసీఎస్ అప్పు మొత్తాలకు, కో ఆపరేటిట్ బ్యాంకుకు పీఏసీఎస్ చెల్లించాల్సిన మొత్లాకు సుమారు రూ.3 కోట్లు తేడా చూపిస్తున్నట్లు సమాచారం. ఈ మొత్తాలను కూడా ఎక్కడ తమకే విధిస్తారోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. పీఏసీఎస్ పరిధిలో వడ్డీలు, రుణాలు చెల్లిస్తున్న రైతులకు ఎటువంటి రసీసులు ఇవ్వకుండా ఖాళీ ఓచర్లపై సంతకాలు పెట్టిస్తూ పంపిస్తున్నారని, ఇలాంటి చర్యలు మోసగించడానికేనని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర దర్యాప్తు చేపట్టి న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. కృష్ణాపురం పీఏసీఎస్ పరిధిలో రైతుల ఖాతాల్లో అప్పు మొత్తాల పెంపు కరోనా సమయం నాటి వడ్డీ అంటూ పొంతనలేని సమాధానాలు ఆందోళనలో రైతులు బ్యాంకు జాబితా మేరకే.. బ్యాంకుల నుంచి మాకు వచ్చిన జాబితా ప్రకారం రైతుల నుంచి వడ్డీలు వసూలు చేస్తున్నాం. అప్పు మొత్తాలకు ప్రతి రైతు ఖాతాకు 4 శాతం మొత్తం చేసి లక్ష రూపాయలకు రూ.4000 చొప్పున కలిపి జాబితాలో వచ్చింది. 2020లో కరోనా సమయంలో ఇక్కడ సిబ్బంది వడ్డీలు వసూలు చేయలేదు. ఆ మొత్తాలను 2024లో రైతుల ఖాతాలకు కలిపినట్లు ఉన్నతాధికారులు రైతులకు చెప్పమన్నారు. –చిగురుపల్లి వెంకటరావు, కృష్ణాపురం పీఏసీఎస్ సీఈఓ -
నరసన్నపేటలో దొంగలు హల్చల్
నరసన్నపేట: మండల కేంద్రం నరసన్నపేటలో బుధవారం రాత్రి దొంగలు హల్చల్ సృష్టించారు. పట్టణ శివారులో జాతీయ రహదారి సర్వీసు రోడ్డుకు ఆనుకొని ఉన్న శ్రీనివాసనగర్‌లో రెండు ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డారు. తొలుత వీధిలో ఉన్న సీసీ కెమెరాల వైర్లు కట్ చేసి పట్నాల నాగేశ్వరరావు ఇంట్లో చొరబడ్డారు. నాగేశ్వరరావు కుటుంబం దైవ దర్శనాల టూర్లో ఉండటంతో ఇదే అదునుగా బీరువాను తెరిచి చిందరవందర చేశారు. ఇంటి ముందు సీసీ కెమెరాను ధ్వంసం చేశారు. ఇంట్లో ఏయే వస్తువులు చోరీకి గురయ్యాయో నాగేశ్వరరావు కుటుంబం తిరిగి వస్తే తప్ప స్పష్టత రాదు. ఈ ఇంటికి సమీపంలో ఉంటున్న పోలాకి మండలం రేవు అంప్లాం పంచాయతీ కార్యదర్శి టి.దుర్గాప్రసాద్ ఇంట్లో కూడా దుండగులు చోరీకి ప్రయత్నించారు. అక్కడ ఏమీ దొరక్కపోవడంతో గేటు విరగ్గొట్టి వెళ్లిపోయారు. గురువారం విషయం తెలుసుకున్న నరసన్నపేట ఎస్ఐ దుర్గాప్రసాద్ చోరీకి గురైన ఇళ్లను పరిశీలించారు. కాగా, దేవుడు బొమ్మలతో మూడు చక్రాల రథాలపై కొందరు వచ్చారని, చోరీ వీరి పనే అయి ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు. -
నదుల అనుసంధానానికి కేటాయింపులేవీ?
కవిటి: వంశధార, బాహుదా నదుల అనుసంధానానికి తాజా బడ్జెట్లో ఎటువంటి కేటాయింపులు చేయకపోవడం దారుణమని ఎమ్మెల్సీ నర్తు రామారావు అన్నారు. గురువారం శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే, నదులను అనుసంధానం చేసే కార్యక్రమాలు చేపడతామని ఎన్నికల ముందు అట్టహాసంగా ప్రకటనలు చేసిన చంద్రబాబు ఇప్పుడు ఆ విషయాన్నే విస్మరించడం సరికాదన్నారు. ముఖ్యంగా ఇచ్ఛాపురం నియోజకవర్గ ప్రజలకు, రైతాంగానికి ఎంతో అవసరమైన వంశధార నది జలాలను బాహుదాకు అనుసంధానం చేసేందుకు బడ్జెట్లో ఒక రూపాయి కూడా కేటాయింపులు చేపట్టకపోవడం అన్యాయమన్నారు. కేవలం వర్షాధారం మీదే వ్యవసాయ రంగం కొనసాగుతోందన్నారు. 10న అప్రెంటీస్ మేళా ఎచ్చెర్ల క్యాంపస్ : ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐలో ఈ నెల 10న ప్రధాన మంత్రి జాతీయ అప్రెంటీస్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ ఎల్.సుధాకరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఏడు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు ఈ మేళాకు హాజరవుతారని చెప్పారు. ఉదయం 9 గంటల నుంచి రిజస్ట్రేషన్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు ఆధార్, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని కోరారు. భక్తుడిపై దాసుడి దురుసు ప్రవర్తన సంతబొమ్మాళి: తక్కువ డబ్బులు పల్లెంలో పెట్టానని ఆగ్రహిస్తూ సంతబొమ్మాళి మండలం హనుమంతునాయుడుపేట పంచాయతీ పోతునాయుడుపేట గ్రామానికి చెందిన రెయ్యమ్మ దాసుడు (పరపటి రాము) తనపై దాడి చేశాడని టెక్కలి మండలం బొరిగిపేట గ్రామానికి చెందిన రోణంకి ధర్మారావు ఆవేదన వ్యక్తం చేశాడు. గురువారం దాసుడి వద్దకు వెళ్లి పళ్లెంలో పండ్లు, రూ.50 పెట్టగా.. ఇంత తక్కువ ఇస్తావా అంటూ ఆగ్రహిస్తూ పండ్లు, డబ్బులను బయటకు విసిరేశాడని, ఇదేంటని ప్రశ్నిస్తే దాడిచేసి సెల్‌ఫోన్ లాక్కున్నాడని వాపోయాడు. సెల్‌ఫోన్ తిరిగిచ్చేయాలని కోరితే అనుచరులు బయటకు గెంటేశారని, కొంతసేపటి తర్వాతే తిరిగిచ్చారని చెప్పాడు. కాగా, ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఆరా తీశారు. బార్ కౌన్సిల్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా కేంద్రంలోని జిల్లా న్యాయవాదుల బార్ కౌన్సిల్ ఎన్నికలకు నోటిఫికేషన్ గురువారం విడుదలైంది. ఏడాదికి ఒకసారి జరిగే ఈ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్‌ను ప్రస్తుత అధ్యక్ష, కార్యదర్శులు కె.ఈశ్వరరావు, వై.ప్రసన్నకుమార్ ప్రకటించారు. ఈ నెల 10న ఎన్నికల అధికారిని నియామకం, 17న నామినేషన్ల స్వీకరణ, 19న నామినేషన్లు పరిశీలన, 20న నామినేషన్ల ఉపసంహరణ, 21న పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా విడుదల చేస్తారు. 27న ఉదయం 10 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఫలితాలు విడుదల చేస్తారు. కార్యవర్గంలో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శి, మహిళా ప్రతినిధులు తదితర సభ్యులను ఎన్నుకుంటారు. మహిళాభ్యున్నతికి తోడ్పాటు శ్రీకాకుళం అర్బన్ : మహిళాభ్యున్నతికి నాబార్డు అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థిక శక్తిగా ఎదగాలని నాబార్డు డీడీఎం కె.రమేష్ అన్నారు. శ్రీకాకుళం పట్టణంలో నాబార్డు, ఐసీడీఎస్ సంయుక్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు గురువారం ఐసీడీఎస్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యం, స్వయం ఉపాధి అభివృద్ధి అంశాలపై మహిళలు ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ బి.శాంతిశ్రీ, డీఆర్డీఏ డీపీఎం ఏ.శ్రీగౌరి, సీఐ టి.త్రినేత్రి, కేవీకే శాస్త్రవేత్తలు డాక్టర్ అనూష, డాక్టర్ వి.సునీత, సీడీపీవో శోభారాణి, డీసీసీబీ మేనేజర్ సంధ్యారాణి, ఝాన్సీ, లలిత, ఎఫ్పీఓలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. -
కన్నుమూత
బండారు చిట్టిబాబు చిట్టిబాబు పార్థివదేహానికి నివాళులు అర్పిస్తున్న ప్రముఖ గాయకులు బి.ఎ.నారాయణ, మండపాక శారద శ్రీకాకుళం కల్చరల్: లలిత సంగీతానికి ఎనలేని సేవలు అందించిన ప్రముఖ సంగీత కళాకారుడు బండారు చిట్టిబాబు(89) బుధవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కన్నుమూశారు. హార్మోనియం కళాకారుడిగా, ఆర్కెస్ట్రా నిర్వాహకుడిగా సుమారు ఏడు దశాబ్దాల పాటు కళామతల్లి సేవలో తరిస్తూ ఎంతో మంది గాయకులను తీర్చిదిద్దారు. 1936లో బండారు సత్యనారాయణ, వరాలమ్మ దంపతులకు 5వ సంతానంగా జన్మించిన చిట్టిబాబు సంగీతంలో అసమాన ప్రతిభతో రాణించారు. 400కుపైగా లలిత గీతాలకు స్వరకల్పన చేశారు. ప్రముఖ సినీ నటులు రావి కొండలరావు, తిమ్మరాజు శివరావుల సహకారంతో 1955లో సుకుమార్ ఆర్కెస్ట్రాను నెలకొల్పారు. సినీ రచయితలు దేవులపల్లి, ఆరుద్ర, సినారె, జొన్నవిత్తుల, దూసి ధర్మారావు తదితరులు రచించిన లలిత గీతాలకు స్వరకల్పన చేస్తూ హార్మోనియంపై వాయిద్య సహకారం అందించారు. ‘అంటరాని వారు ఎవరంటే’, ‘ఏది హిందూ.. ఏది ముస్లిం’ వంటి పాటలను జాతీయ భాషల్లో కూడా స్వరపరిచారు. ప్రముఖ సినీ గాయకులు జి.ఆనంద్, బి.ఎ.నారాయణలతో కలిసి రథసప్తమి సందర్భంగా ఏకాంత సేవ నిర్వహించారు. 1974లో రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పతకం, 1983లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా కళాప్రవీణ బిరుదులు అందుకున్నారు. 1984లో రాష్ట్ర సంగీత నాటక అకాడమీ సభ్యునిగా ఎనలేని సేవలు అందించారు. ఈయన కుమారుడు బండారు రమణమూర్తి తబలా కళాకారుడిగా ఏ–గ్రేడ్ ఆర్టిస్టుగా పేరుగాంచారు. 70 ఏళ్లుగా సంగీత సేవ నివాళులర్పించిన ప్రముఖులు ప్రముఖుల సంతాపం.. చిట్టిబాబు మృతి సంగీతానికి తీరని లోటని గాయకులు నిక్కు అప్పన్న, రెడ్‌క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు, తరుణి కృష్ణ సంస్థ ప్రతినిధులు మండా శ్రీనివాసరావు, ఎం.వి.కామేశ్వరరావు, ఉపనిషన్మందిరం అధ్యక్షుడు గుమ్మా నగేష్, సుమిత్రా కళాసమితి అధ్యక్షుడు ఇప్పిలి శంకరశర్మ, రంగస్థల కళాకారుల సమాఖ్య గౌరవ అధ్యక్షుడు ఎల్.రామలింగస్వామి, చిట్టి వేంకటరావు, రామచంద్రదేవ్, పన్నాల నరసింహమూర్తి, ప్రముఖ గాయకులు బి.ఏ.నారాయణ, మండపాక శారద, కె.ఎల్.ఎన్ మూర్తి, కళ్యాణం రామ్మోహన్రావు, తదితరులు సంతాపం తెలియజేశారు. -
అక్రమ వసూళ్లపై విచారణ పూర్తి
అరసవల్లి: ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో కొందరు నిరుద్యోగులకు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు కల్పిస్తామంటూ అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ అసిస్టెంట్ కృష్ణమాచార్యులు వ్యవహారంపై విచారణ పూర్తయింది. దేవదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు విశాఖపట్నం కనకమహాలక్ష్మి ఆలయ డిప్యూటీ కమిషనర్ శోభారాణి విచారణాధికారిగా హాజరై బుధవారం పలువురు సిబ్బందిని విచారణ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెన్షన్‌లో ఉన్న కృష్ణమాచార్యులుపై వచ్చిన అభియోగాలపై స్టేట్మెంట్ రికార్డు చేశారు. అనంతరం కొందరు దినసరి వేతనదారులను పిలిపించి ఉద్యోగాల కోసం ఎవరికి డబ్బులు చెల్లించారో లిఖితపూర్వకంగా నమోదు చేశారు. ఈ వ్యవహారంలో గతంలో పనిచేసిన ఈవో చంద్రశేఖర్, రిటైర్డ్ ఈవో జగన్మోహనరావు తదితరుల సూచనల మేరకు తాము గతంలో కృష్ణమాచార్యులుపై తప్పుడు ఫిర్యాదు ఇచ్చామని కొందరు దినసరి వేతనదారులు అంగీకరించినట్లు తెలిసింది. అలాగే విచారణకు హాజరైన కృష్ణమాచార్యులు మాట్లాడుతూ తాను నేరుగా ఎవరిదగ్గరా డబ్బులు వసూలు చేయలేదని చెబుతూనే కొందరు రెగ్యులర్ ఉద్యోగుల పీఆర్సీ వ్యవహారాల్లో తాను అడ్డుగా ఉన్నందున తనపై తప్పుడు ఫిర్యాదులు చేయించి సస్పెన్షన్‌కు గురిచేయించినట్లు విచారణాధికారికి వెల్లడించారు. మెడికల్ రీయింబర్స్మెంట్ విషయంలో కూడా ఎలాంటి వసూళ్లు చేపట్టలేదని వాంగ్మూలం ఇచ్చారు. ఈ మేరకు బాధితుల నుంచి, అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తుల నుంచి వివరాలు సేకరించామని, తుది నివేదికను ప్రభుత్వానికి నివేదించనున్నట్లు శోభారాణి తెలిపారు. -
దివ్యాంగులపై దయ లేదాయె..!
● టెక్కలి ఆస్పత్రిలో దివ్యాంగుల అవస్థలు ● పింఛన్ల పునఃపరిశీలన పేరిట తిప్పిస్తున్నారని ఆవేదన టెక్కలి: టెక్కలి జిల్లా ఆసుపత్రిలో దివ్యాంగులు అవస్థలు పడ్డారు. ఆస్పత్రిలో కొద్ది రోజులుగా చేపడుతున్న పింఛన్ల పునఃపరిశీలన ప్రక్రియలో భాగంగా బుధవారం సంతబొమ్మాళి, పాతపట్నం మండలాల నుంచి సుమారు 50 మంది వరకు దివ్యాంగులు చేరుకున్నారు. అయితే పునఃపరిశీలన ప్రక్రియ ఆపివేశామంటూ అక్కడ సిబ్బంది చెప్పడంతో ఆందోళనకు గురయ్యారు. వారం రోజుల క్రితం అనేక ప్రయాసలతో పునఃపరిశీలన కోసం వస్తే 5వ తేదీన రావాలని చెప్పారని.. తీరా మండుటెండలో అవస్థలు పడుతూ వస్తే ఇప్పుడు తాత్కాలికంగా నమోదు ఆపివేశారని చెప్పడం భావ్యం కాదంటూ పింఛన్‌దారులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామాల నుంచి ఇక్కడకు రావాలంటే ఆటోల్లో అనేక ఇబ్బందులు పడాల్సిన దుస్థితి ఉందని వాపోయారు. తమకు ఎటువంటి సమాచారం లేకుండా ఇలా అకస్మాత్తుగా నమోదు ఆపివేయడం సరికాదని నిరాశగా వెనుదిరిగారు. కాగా, పింఛన్ల పునఃపరిశీలన తాత్కాలికంగా ఆపేసిన విషయం తెలియక దివ్యాంగులు అవస్థలు పడాల్సి వచ్చింది. ఆస్పత్రిలో త్వరలోనే పునఃపరిశీలన ప్రారంభించనున్నట్లు సమాచారం. -
గోకార్టింగ్ సీజన్–2 ప్రారంభం
టెక్కలి: ఆటో మొబైల్ రంగంలో నూతన సాంకేతిక ఆవిష్కరణల దిశగా విద్యార్థులు ఆలోచనలు చేయాలని హైదరాబాద్‌కు చెందిన డీప్‌లూప్ టెక్నాలజీ సీఈవో కుసుమంచి సూర్యప్రకాశ్ కోరారు. టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల వేదికగా జాతీయ స్థాయి గోకార్టింగ్ సీజన్–2 పోటీలను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆటో మొబైల్ రంగంలో నూతన సాంకేతిక ఆవిష్కరణలు చేసిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఎన్నో వ్యయ ప్రయాసలతో పోటీలు నిర్వహిస్తున్న ఆదిత్య కళాశాలకు అలాగే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, ఒడిశా ప్రాంతాల నుంచి విచ్చేసిన విద్యార్థులను అభినందించారు. కళాశాల కార్యదర్శి ఎల్.ఎల్.నాయుడు, కోశాధికారి టంకాల నాగరాజు, డైరెక్టర్ వి.వి.నాగేశ్వరరావులు మాట్లాడుతూ.. తమ కళాశాలలో జాతీయ స్థాయి గోకార్టింగ్ పోటీలు రెండోసారి నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. మొత్తం 16 బృందాలు పాల్గొంటున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో గోకార్టింగ్ కన్వీనర్ ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు, కో–కన్వీనర్లు డి.శ్రీరాములు, ఈసీఈ హెచ్‌వోడీ వి.అశోక్‌కుమార్, సీఎస్ఈ హెచ్‌వోడీ వై.రమేష్, ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్లు రఘువీర్, విద్యార్థి కన్వీనర్లు పి.ఉదయ్‌కుమార్, బి.సాయి సాకేత్ తదితరులు పాల్గొన్నారు. -
516 పెన్నులతో అలంకరణ
నరసన్నపేటలోని వేంకటేశ్వర ఆలయం సమీపంలో ఉన్న లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారికి బుధవారం 516 పెన్నులతో అర్చన చేశారు. అనంతరం వాటిని తోరణంగా అలంకరించారు. అర్చకులు భాస్కరబట్ల జగదీశ్వర శర్మ పూజా కార్యక్రమం పూర్తయ్యాక పదో తరగతి విద్యార్థులకు ఈ పెన్నులు పంపిణీ చేశారు. – నరసన్నపేట పీజీ మూడో సెమిస్టర్ ఫలితాలు విడుదల ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం, అనుబంధ కళాశాలల పోస్టు గ్రాడ్యుయేషన్ మూడో సెమిస్టర్ ఫలితాలను బుధవారం ఎగ్జామినేషన్స్ డీన్ ఎస్.ఉదయ్‌భాస్కర్ విడుదల చేశారు. ఫలితాలను వర్సిటీ వెబ్సైట్, జ్ఞానభూమి పోర్టల్‌లో అందుబాటులో ఉంచారు. రీవాల్యుయేషన్‌కు 15 రోజుల్లోగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎకనామిక్స్, ఇంగ్లీష్, రూరల్ డెవలప్మెంట్, తెలుగు, ఎంకాం, ఎంబీఏ, ఎంఈడీ, ఎంఎల్ఐసీ, జువాలజీ, ఎంజేఎంసీ, మైక్రోబయోలజీ కోర్సుల్లో శతశాతం ఉత్తీర్ణత నమోదైంది. కంప్యూటర్ సైన్స్‌లో 22 మందికి 18 మంది, అప్లయిడ్ మ్యాథ్స్‌లో 8 మందికి ఏడుగురు, ఎనలిటికల్ కెమిస్ట్రీలో 41 మందికి 40 మంది, బయోటెక్నాలజీలో 25 మందికి 24 మంది, ఫిజిక్స్‌లో 12 మందికి 8 మంది, ఆర్గానిక్ కెమిస్ట్రీలో 185 మందికి 118 మంది, గణితంలో 15 మందికి 14 మంది ఉత్తీర్ణత సాధించారు. నేడు మద్యం షాపుల లాటరీ శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా లో గీత, సొండి కులా లకు కేటాయించిన 18 మద్యం షాపులకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ చేతుల మీదుగా గురువారం ఉదయం 10 గంటలకు డ్రా తీయనున్నారు. ఈ మేరకు శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల సమీపంలోని అంబేడ్కర్ ఆడిటోరియానికి ఉదయం ఎనిమిది గంటలకల్లా దరఖాస్తుదారులు హాజరుకావాలని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి సీహెచ్.తిరుపతినాయుడు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నూతన మద్యం పాలసీ (2024–26)లో భాగంగా జిల్లాలో గీత, సొండి కులాల వారికి పదిశాతం మద్యం దుకాణాలు ప్రభుత్వం కేటాయించిన సంగతి తెలిసిందే. జిల్లాలో 18 షాపులకు 203 దరఖాస్తులు అందాయి. మొదటగా ఫిబ్రవరి 10న డ్రా తీయాలని నిర్ణయించినా ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా వేశారు. పీడీఎస్ బియ్యం పట్టివేత గార : మండల పరిధిలోని అంపోలు జంక్షన్ వద్ద విజిలెన్స్, ఎన్ఫోర్సుమెంట్ అధికారులు సంయుక్తంగా జరిపిన దాడుల్లో 54 బస్తాల పీడీఎస్ బియ్యం పట్టుకున్నారు. బుధవారం సాయంత్రం సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా అక్రమంగా బియ్యం రవాణా చేస్తూ వాహనం పట్టుబడిందని విజిలెన్సు అధికారులు యు.వెంకటేష్, ఎస్సై రామారావు తెలిపారు. నడగాం గ్రామానికి చెందిన పొట్నూరు శ్రీరామమూర్తి స్థానికంగా బియ్యం సేకరించి నడగాం పరిసర ప్రాంతాల్లోని కోళ్లఫారాలకు రవాణా చేస్తున్నట్టు గుర్తించామని చెప్పారు. విజిలెన్స్ ఎస్పీ బి.ప్రసాదరావు ఆదేశాల మేరకు పీడీఎస్ అక్రమ రవాణాదారులపై నిఘా ఉంచామని, పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 307 మంది గైర్హాజరు శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు సాఫీగా సాగుతున్నాయి. నాలుగో రోజు బుధవారం జనరల్, ఒకేషనల్ రెండు విభాగాల్లో కలిపి 18,709 మంది సెకెండియర్ విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 18,402 మంది పరీక్ష రాశారు. 307 మంది గైర్హాజరయ్యారు. ఎలాంటి మాల్ ప్రాక్టీసు కేసు లు నమోదుకాలేదని ఆర్ఐఓ ప్రగడ దుర్గారా వు, డీవీఈఓ ఎస్.తవిటినాయుడు తెలిపారు. -
ధాన్యం కొనేదెప్పుడు అధ్యక్షా?
● శాసన మండలి సమావేశాల్లో ఎమ్మెల్సీ నర్తు రామారావు కవిటి : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సొంత జిల్లా శ్రీకాకుళంలో నేటికీ రైతుల వద్ద లక్షన్నర టన్నులకు పైగా ధాన్యం నిల్వలు ఉండిపోయాయని, వాటిని ప్రభుత్వం ఎప్పుడు కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్సీ నర్తు రామారావు ప్రశ్నించారు. శాసనమండలి సమావేశాల సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందు ఎంతో ఆర్భాటంగా చివరి ధాన్యపు గింజ వరకు కూడా కొనుగోలు చేస్తామని ప్రచారాలు చేశారని, కానీ స్థానికంగా రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని చెప్పారు. రైతుల ఇళ్లు, కల్లాల వద్ద ధాన్యం నిల్వలు ఉండిపోయిన విషయమై గతంలో జిల్లా కలెక్టర్‌కు వివిధ మండలాల నుంచి రైతు సంఘాల నేతలు విన్నవించినా న్యాయం జరగలేదని పేర్కొన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి రైస్ మిల్లర్లకు టార్గెట్లు ఇచ్చి ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు. -
ధాన్యం దళారులు భోజ్యం
సర్కారు చోద్యం ధాన్యం అమ్మలేకపోతున్నాం.. ● కొనుగోలు లక్ష్యాలను తగ్గించి రైతులను ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం● ఒడిశా ధాన్యంతో టార్గెట్ పూర్తి చేశారంటున్న రైతులు● క్షేత్రస్థాయి పరిస్థితి గమనించని అధికారులు శ్రీకాకుళం పాతబస్టాండ్: అన్నదాత ఆరుగాలం కష్టించి పండించిన పంట దళారుల పాలవుతోంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో వరి కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. పంట దిగుబడిని గుర్తించడంలో లోపం, కొనుగోలు లక్ష్యాలు తక్కువగా పెట్టుకోవడం, ఆ లక్ష్యాలు నెరవేర్చేందుకు ఒడిశా ధాన్యం కొనడం వంటి తప్పిదాలు మన రైతుల పుట్టి ముంచాయి. ఎవరూ ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో చివరకు మిల్లర్లు, మధ్యవర్తులతోనే బేరం కుదుర్చుకోవాల్సిన దుస్థితి రైతన్నలకు ఎదురవుతోంది. లక్ష్యం నిర్ణయంలోనే కుట్ర జిల్లాలో ఈ ఏడాది 3,60,325 ఎకరాల్లో వరి పండించారు. అయితే ఈ ఏడాది పంటలు ఆలస్యంగా వేసినా, దిగుబడి చాలా వరకు అనుకూలంగానే వచ్చింది. సుమారుగా ఈ ఏడాది వరి 8 లక్షల మెట్రిక్ టన్నుల పైబడి దిగుబడి వచ్చింది. అయితే కోనుగోలు లక్ష్యాన్ని కేవలం 4.90 లక్షల మెట్రిక్ టన్నులుగానే నిర్ధారించారు. అంచనాలు కావాలనే తక్కువ వేసి, కొనుగోలు టార్గెట్లు తగ్గించారు. జిల్లాలో వరి పండించే రైతులు సుమారుగా 2.5 లక్షల మంది ఉన్నారు. అయితే ఇప్పటి వరకు కేవలం 99 వేల మంది రైతులు మాత్రమే పంటను విక్రయించారు. మిగిలిన వారు ధాన్యం విక్రయించే పరిస్థితి లేదు. గ్రామాల్లో దళారులు ధాన్యం కొనుగోలు టార్గెట్లు పూర్తయిపోయాయని అధికారులు చెబుతుండడంతో.. దళారులు ఈ పరిస్థితిని అలుసుగా తీసుకున్నారు. దళారుల్లో అధిక శాతం మంది అధికార పక్షానికి చెందిన వారే. వీరు మిల్లర్లతో మిలాఖత్ కావడం వల్ల ధాన్యం సగం ధర మాత్రమే పలుకుతోంది. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో దళారు లు నేరుగా రైతుల వద్దకు వెళ్లి సగం ధరకే ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. దీనికి తోడు పీపీసీ కేంద్రాలు టార్గెట్ పూర్తి చేసే నెపంతో ఒడిశా ధాన్యం తీసుకువచ్చినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. సివిల్ సప్లై అధికారులు కూడా సహకరించడంతో టార్గెట్లు సజావుగా పూర్తయిపోయాయని అంటున్నారు. రాష్ట్రంలో గత ఐదేళ్లు ఈ పరిస్థితి లేదు. పీపీసీ కేంద్రాలు, రైతు భరోసాకేంద్రాల ద్వారా నేరుగా ధాన్యంను కళ్లం వద్దకు వచ్చి తీసుకెళ్లేవారు. ఈ ఏడాది ఆర్బీకేలు, పీపీసీ కేంద్రాలు, సివిల్ సప్లై అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ధాన్యం కొన డం లేదు. టార్గెట్లు అయిపోయాయని అంటున్నారు. ఖరీఫ్‌లో పండించిన ధాన్యం అమ్మలేని పరిస్థితి. – బి.వెంకటరమణ, వాకలవలస, శ్రీకాకుళం మండలం అపరాలు పండేంత వరకు.. జిల్లాలోని పలు మండలాల్లో ఫిబ్రవరి నెలాఖరు వరకు వరి నూర్చే పరిస్థితి లేదు. వరి చివరి కాలంలో ఆ పొలాల్లో మినుగులు, పెసలు వంటి అపరాలు పంటలు వేస్తారు. అవి పండేంత వరకు అక్కడే వరి కుప్పలు పెడుతున్నారు. అపరాలు పంటలు మార్చిలో చేతికి వస్తాయి. అప్పుడు వరి, అపరాలు రెండింటినీ నూర్పు యంత్రాల సాయంతో నూర్చడానికి చాలా మంది ప్రణాళిక వేసుకున్నారు. ప్రధానంగా నాగావళి, వంశధార తీరంలో ఉన్న మండలాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. -
జమ్మూకాశ్మీర్‌లో సిక్కోలు జవాన్ మృతి
వజ్రపుకొత్తూరు: మండలంలోని అమలపాడు గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ నాయక్ బచ్చల తిరుపతిరావు(26) జమ్మూకాశ్మీర్‌లో మృతి చెందాడు. ఏకే–47 గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్తే.. అమలపాడుకు చెందిన బచ్చల వెంకటరావు, కామేశ్వరి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు గోవింద గ్రామంలోనే నివాసం ఉంటుండగా.. చిన్న కుమారుడు తిరుపతిరావు 2017లో ఆర్మీలో చేరాడు. తండ్రి వెంకటరావు సైతం బీఎస్ఎఫ్లో జవాన్‌గా విధులు నిర్వహించారు. తిరుపతిరావుకు ఇటీవలే గ్రామానికి చెందిన అమ్మాయితో పెళ్లి నిశ్చయమైంది. ముందుగా ఇల్లు నిర్మించాలని భావించి కొంతమేర అప్పులు చేశారు. తర్వాత వివిధ కారణాలతో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. ఈ క్రమంలో జమ్మూ కాశ్మీర్‌లోని 8 ఆర్ఆర్ మద్రాస్ రెజిమెంట్ తరఫున ఈ నెల 4న ఎల్ఓసీ వద్ద తిరుపతిరావు విధులు నిర్వహిండగా ఒక్కసారిగా గన్ పేలిన శబ్దం వినిపించింది. వెంటనే ఆర్మీ అధికారులు వెళ్లి పరిశీలించగా తిరుపతిరావు ఏకే–47తో కాల్చుకుని చనిపోయినట్లు గుర్తించారు. అయితే మృతికి గల కారణాలు నిర్ధారించలేదు. అప్పులు ఎక్కువైపోవడం, వచ్చిన జీతం మిగలకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్ బెట్టింగ్‌లు కూడా కారణం కావచ్చనని మరికొందరు చెబుతున్నారు. తిరుపతిరావు మృతదేహం గురువారం అమలపాడుకు రానుంది. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయని గ్రామస్తులు తెలిపారు. ఏకే–47తో కాల్చుకుని చనిపోయినట్లు అనుమానాలు స్వగ్రామం అమలపాడులో విషాదఛాయలు సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నేడు -
పనసతో విందు.. భలే పసందు
వజ్రపుకొత్తూరు: ఉద్దానం పనస ఉత్తరాదికి తరలి వెళుతోంది. హోలీ, ఉగాది పర్వదినాలు ముందుండడంతో ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి ఊపందుకుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో పనసతో చేసే విందులకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. పనస హల్వా, పొట్టు కూర, పకోడి, గింజల కూర, ఇడ్లీ పచ్చళ్లు, బూరెలు లాంటి వంటకాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక స్థానికంగా ఉద్దానం ప్రాంతంలోని పెళ్లిళ్లలో పనస ముక్కల బిర్యాని, గూన చారు, పొట్టు కూరకు మంచి పేరుంది. ఇటీవల శాస్త్ర పరిశోధనల్లో పనస గింజలు, పొట్టుతో తయారు చేసే పొడితో షుగర్ వ్యాధికి ఇన్సులిన్ అదుపులో ఉంచుకునేందుకు అవసరమైన ఫైబర్ ఎక్కువ ఉందని తేలడంతో పనస ఆధారిత వంటకాలకు ప్రాధాన్యత పెరిగింది. సహజ సిద్ధంగా కల్తీ లేకుండా పెరిగే పనస ప్రతీ వయసు వారు తినేందుకు అనుకూలమైన ఫలం కావడం విశేషం. 70 శాతం ఎగుమతి చేసే ఒక్క కాయలోనే కాదు. 30 శాతం ఫలాలుగా తినే పండులోనూ మంచి పోషకాలు ఉంటాయని న్యూట్రీషియన్లు చెబుతున్నారు. మిశ్రమ పంటగా.. శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం, గిరిజన ప్రాంతాల్లో ప్రధాన పంటగా కాకుండా 16వేల హెక్టార్లలో మిశ్రమ అంతర పంటగా దీన్ని రైతులు పండిస్తారు. సీతంపేటతో పాటు వజ్రపుకొత్తూరు, పలాస, మందస, కవిటి, సోంపేట, కంచిలి, ఇచ్ఛాపురం, నందిగాం మండలాల్లో ఏటా ఏప్రి ల్, మే నెలల్లో కాపునకు వచ్చే ఈ పంట ప్రస్తుతం ఫిబ్రవరి ప్రారంభంలోనే కాపునకు వచ్చింది. మే నెల వరకు వచ్చే కాపులో 70 శాతం మేర కాయలను ఉత్తరాది రాష్ట్రాలైన ఒడిశా, బీహార్ ఉత్తరప్రదేశ్, కోల్‌కతాలకు ఎగుమతి చేస్తున్నారు. పూండి, పలాస, హరిపురం, పాలకొండ కేంద్రాలుగా కిలో పనస కాయ రూ.25 ధరతో రోజుకు 55 టన్నుల వరకు ఎగుమతి చేస్తున్నారు. అంటే రోజుకు జిల్లా నుంచి రూ. 13.75 లక్షలు టర్నోవర్ జరుగుతోంది. దీంతో రైతులకు మే నెల వరకు మంచి ఆదాయం సమకూరుతుంది. అదనపు ఆదాయం పనస రైతులకు అదనపు ఆదాయ వనరు. జీడి, కొబ్బరి తోటల్లోని గట్లపై ఖాళీ స్థలాల్లో మిశ్రమ అంతర పంటగా సాగు చేస్తున్నారు. ఈ ఏడాది ఎలాంటి చీడ పీడ లు ఆశించకుండా పంట కాసింది. పంట ప్రారంభం కాబట్టి కిలో రూ.25ల వరకు ధర ఉంది. ఎకరాకి 4 నుంచి 10 చెట్లు వరకు గిరిజన, ఉద్దానం ప్రాంతాల్లో రైతులు పనసను పండిస్తున్నారు. ఏడాదికి రైతు రూ.20 వేలు వరకు ఆర్జిస్తున్నారు. – కె.సునీత, ఉద్యానవన శాఖ అధికారి, పలాసపనస ప..ద..ని..సవంటకాలు: హల్వా, పొట్టు కూర, పకోడి, గింజల కూర, ఇడ్లీ పచ్చళ్లు, బూరెలు ఉద్దానం ప్రాంతంలోని పెళ్లిళ్లలో పనస ముక్కల బిర్యాని, గూన చారు, పొట్టు కూర ఔషధ విలువలు: పనస గింజలు, పొట్టుతో తయారు చేసే పొడితో షుగర్ వ్యాధికి సంబంధించి ఇన్సులిన్ అదుపులో ఉంచుకునేందుకు అవసరమైన ఫైబర్ ఎక్కువ ఉందని శాస్త్ర పరిశోధనల్లో తేలింది. ఎగుమతి ఎక్కడికి: ఒడిశా, బీహార్ ఉత్తరప్రదేశ్, కోల్‌కతా -
● రంగంలోకి ‘అధికారిక’ దళారులు ● వారాంతంలో కీలక అధికారి చేతిలోకి వాటాలు! ● ప్రతి పనికీ రేటు విధానంపై విమర్శలు
జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి కార్యాలయం అరసవల్లి : జిల్లాలో అన్ని వర్గాల ప్రజలకు ఉచితంగా వైద్యసేవలు అందించాల్సిన వైద్య ఆరోగ్య శాఖలో.. వాటాల వ్యవహారం రచ్చరచ్చగా తయారైంది. వైద్య సేవలను పక్కనపెట్టి కేవలం పనులకు తగ్గట్టుగా ‘వసూళ్లు.. వాటాలే..’ ప్రధానమన్న రీతిలో కొందరు వ్యవహరించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ శాఖలో అవినీతి అక్రమాలు పెచ్చుమీరుతుండటం గమనార్హం. డెమో విభాగం, పరిపాలన విభాగం నుంచి చేస్తున్న కలెక్షన్లు అన్నీ కీలకాధికారికి పెద్ద వాటాగా వారాంతంలో జేబులోకి చేరేలా ఈ అధికారిక దళారులు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి పనికీ ఒక్కో రేటు..! జిల్లా వైద్యారోగ్య శాఖకు చెందిన అనేక అంశాలతో పాటు మార్కెట్లో ఎన్నో వ్యాపారాలకు ప్రత్యక్షంగా డీఎంహెచ్‌వో కార్యాలయం నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రైవేటు ఆస్పత్రుల రిజిస్ట్రేషన్లు, అనుమతులు పొడిగింపు, వివిధ రకాల వైద్య పరీక్షల ల్యాబ్‌ల ఏర్పాట్లు, స్కానింగ్ సెంటర్లు రిజిస్ట్రేషన్లు అనుమతులతో పాటు పౌల్ట్రీ ఫారం, గ్యాస్ గొడౌన్లు, పెట్రోల్ బంకుల ఏర్పాటుకు నో అబ్జక్షన్ సర్టిఫికెట్లు (ఎన్వోసి), ప్రైవేటు పాఠశాలకు శానిటేషన్ సర్టిఫికేట్లు, ఇలాంటి అనుమతులను డీఎంహెచ్ఓ కార్యాలయమే అనుమతి పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక విధుల్లో భాగంగా చేయాల్సిన సర్వీస్ రెగ్యులరైజేషన్లు, సర్వీస్ మేటర్లు, మెడికల్ లీవ్‌లు, మెటర్నటీ లీవ్స్, స్పెషల్ గ్రేడ్లు కేటాయింపు తదితర పరిపాలనాంశాలకు ఒక్కో రేటు ఫిక్స్ చేశారు. వీటికి గాను గరిష్టంగా రూ.50 వేల వరకు వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల పీహెచ్సీ వైద్యులకు అదే స్థాయిలో ఉండే ఓ మోనటరింగ్ విభాగ అధికారి జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసి కలెక్షన్లకు సిద్ధమవ్వాలంటూ హుకుం జారీ చేశారంటే పరిస్థితి ఎంతవరకు వచ్చిందో స్పష్టమవుతోంది. ఇక కీలకమైన మాస్ మీడియా సెక్షన్ పరిధిలో ఉన్న జిల్లాలో ఉన్న సుమారు 310 వరకు స్కానింగ్ సెంటర్లు, 3 వేలకు పైగా ఉన్న ల్యాబ్‌ల రెన్యువల్స్‌తో పాటు కొత్త రిజిస్ట్రేషన్లు, అనుమతిచ్చేందుకు గాను రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు వసూళ్లు మొదలుపెట్టేశారు. ఇందుకోసం కీలక అధికారి పేరిట మూడు వాటాలుగా కలెక్షన్లు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదంతా డీఎంహెచ్‌వోకు తెలిసే జరుగుతుందనే ప్రచారం బయటకురావడంతో జిల్లా వ్యాప్తంగా ఈ వాటాల వ్యవహారం చర్చనీయాంశమైంది. జిల్లాకు కొత్తగా వచ్చిన ఆయనకు స్థానిక జిల్లాకు చెందిన ఉద్యోగుల్లో ఎవరేంటో తెలియకపోవడంతోనే సమస్య వచ్చిపడిందంటూ ఉద్యోగుల్లోనే చర్చసాగుతోంది. ఇదిలావుంటే నిన్నమొన్నటివరకు డీఎంహెచ్‌వోగా పనిచేసిన ఓ అధికారిణి ప్రాక్టీస్ చేసిన ఆసుపత్రి నుంచి కూడా ఇప్పుడు కలెక్షన్లు రావాల్సిందే అని దళారీ అధికార బృందం పట్టుపట్టడం గమనార్హం. -
అదనపు వసూళ్లపై విచారణ
పొందూరు: మండల కేంద్రం పొందూరులో ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది సిలిండర్ల డెలివరీ సమయంలో అదనపు బిల్లులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదుపై ఐవోఎల్ అధికారులు మంగళవారం విచారణ జరిపారు. అదనపు వసూళ్లపై మూగోడువీధి మహిళలు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రతి ఇంటి వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు. అదనపు వసూళ్లు వాస్తవమేనని కొందరు మహిళలు తెలిపారు. ఇప్పటికే రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు మూగోడువీధిలో విచారణ జరిపి కలెక్టర్‌కు నివేదికలు అందించారు. ఆలయంలో చోరీ కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని కొండమ్మతల్లి ఆలయంలో సోమవారం రాత్రి దొంగలు పడ్డారు. హుండీని దొంగలు పగలుగొట్టి నగదు పట్టుకుపోయారు. అక్కడి వస్తువులన్నీ చిందరవందరగా పడేశారు. స్థానికులు మంగళవారం ఉదయం పూజలు నిమిత్తం ఆలయానికి చేరుకుని పరిశీలించగా చోరీ జరిగిందని గుర్తించారు. అనంతరం కాశీబుగ్గ పోలీసులకు సమాచారం అందించగా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కాశీబుగ్గ పోలీసులు తెలిపారు. -
గ్రామ సచివాలయ సర్వేయర్ల ధర్నా
శ్రీకాకుళం పాతబస్టాండ్: గ్రామ సచివాలయం సర్వేయర్లపై పనిభారం తగ్గించాలని డిమాండ్ చేస్తు గ్రామ సచివాలయం సర్వేయర్ల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయం సర్వేయర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బూరాడ మధుబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక సర్వేయర్లపై పనిభారం, ఒత్తిడి, వేధింపులు ఎక్కువయ్యాయని చెప్పారు. క్షేత్రస్థాయి సమస్యలు తెలుసుకోకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం సరికాదన్నారు. స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రోసీజర్ (ఎస్ఓపీ) ప్రకారం పనిచేయాలంటూ ఒత్తిడి తీసుకొస్తున్నారని, వీఆర్వోల పని కూడా తమతో చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా 28 మండలాల్లో రీ సర్వే జరుగుతోందని, ఆ పనులు పూర్తి కాకముందే మండలానికి రెండు గ్రామాలు వంతునా అదనంగా మరో 56 గ్రామాలు రీ–సర్వే చేయాలని ఉత్తర్వులు ఇవ్వడం దారుణమన్నారు. కొత్త పరికరాలు ఇవ్వకపోవడంతో సర్వే చేయడం కష్టంగా మారిందన్నారు. గతంలో క్షేత్రస్థాయిలో ఉన్నప్పుడు బయోమెట్రిక్ హాజరు వెసులుబాటు ఉండేదని, కొత్త ప్రభుత్వం వచ్చాక కచ్చితంగా కార్యాలయంలోనే హాజరువేయాలని నిబంధనలు విధించడం సరికాదన్నారు. సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధనకు ఈ నెల 9న విజయవాడలో పెద్ద ఎత్తున ర్యాలీ, నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు. అనంతరం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘ జిల్లా అధ్యక్షుడు జగదీష్, కార్యదర్శి లోకేష్, రాష్ట్ర కో–ఆర్డినేటర్ మజ్జి అయ్యప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
మెళియాపుట్టి: మండలంలోని పట్టుపురం గ్రామానికి చెందిన పతివాడ మురళి మంగళవారం జాడుపల్లి గ్రామానికి వ్యక్తిగత పని నిమిత్తం బైక్‌పై వెళ్లి తిరిగి వస్తుండగా బురద రామచంద్రాపురం వద్ద అదుపు తప్పి పడిపోయాడు. తీవ్రంగా గాయపడటంతో స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించారు. సిబ్బంది వెంటనే చేరుకుని టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తీసుకెళ్లారు. అంధత్వ నివారణే లక్ష్యం అరసవల్లి: జిల్లాలో అంధత్వ నివారణ లక్ష్యంగా ప్రతి ఒక్క కంటి వైద్యుడూ పనిచేయాలని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ బాలమురళీకృష్ణ సూచించారు. మంగళవారం తన చాంబర్లో కంటి వైద్యులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెలా నిర్వహిస్తున్న కాటరాక్ట్ శిబిరాలను సందర్శించి బాధితులను గుర్తించి జిల్లా కేంద్రానికి రిఫరల్ చేయాలన్నారు. ప్రతి నెలా అడ్వాన్స్డ్ టూర్ ప్రోగాం ప్రకారం ప్రతిరోజూ ఎఫ్ఆర్ఎస్ హాజరు నమోదు చేసుకోవాలని సూచించారు. అనంతరం బడిపిల్లలకు కళ్లద్దాలను సకాలంలో అందజేసినందుకు ఆప్తాలమిక్ అధికారులను అభినందించారు. సమావేశంలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రాం అధికారి డాక్టర్ త్రినాథరావు, డిప్యూటి పారా మెడికల్ అధికారి వాన సురేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. 8న పీఓడబ్ల్యూ సంస్థల విలీన సభ పలాస: ఒంగోలులో ఈ నెల 8న జరగనున్న పీఓడబ్ల్యూ(ప్రగతి శీల మహిళా సంఘం) సంస్థల విలీన సభను విజయవంతం చేయాలని సంఘం జిల్లా నాయకులు కోరారు. ఈ మేరకు పలాస మండలం మాకన్నపల్లిలో మంగళవారం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంస్థల జిల్లా అధ్యక్షులు ఎస్.కృష్ణవేణి, బి.ఈశ్వరమ్మలు మాట్లాడుతూ భావసారూప్యత కలిగిన అన్ని మహిళా సంఘాలు ఒకే వేదికపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా కార్యదర్శి పోతనపల్లి కుసుమ మాట్లాడుతూ మహిళా హక్కుల సాధనకు సంఘటిత పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘ నాయకులు కుత్తుం హేమక్క, బర్ల జానకి, సైని కళావతి, బత్తిన ఉమ, బత్తిన సాయమ్మ, వెంకటమ్మ, పూర్ణావతి, ధన లక్ష్మి, మోహిని తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల విజేతగా ‘జెస్సీ’ పలాస: మండలంలోని బొడ్డపాడు యువజన సంఘం 71వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో జెస్సీ(బొడ్డపాడు) జట్టు విజేతగా నిలిచింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 30 జట్లు పాల్గొన్న ఈ టోర్నీ మూడ రోజులుగా ఫ్లడ్‌లైట్ల వెలుగుల్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఉత్కంఠగా సాగిన ఫైనల్ పోటీల్లో బాహడపల్లి జట్టుపై జెస్సీ జట్టు విజయం సాధించింది. విజేత జట్టుకు రూ.40వేలు నగదు, షీల్డ్‌ను బొడ్డపాడు యువజన సంఘం అధ్యక్షుడు తామాడ క్రాంతి చేతుల మీదుగా అందజేశారు. రన్నరప్‌కు రూ.30వేలు, షీల్డు, తృతీయ స్థానంలో నిలిచిన వైజాగ్ వారియర్స్‌కు రూ.20వేలు నగదు, నాలుగో స్థానంలో నిలిచిన విజయనగరం జట్టుకు రూ.10వేలు చొప్పున నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జైభీమ్ యువజన సంఘం అధ్యక్షుడు కిక్కర ఢిల్లీరావు, కరగాన సుధా, కరగాన కుమార్, బొడ్డు జగన్, రెయ్యి మోహనరావు, బొడ్డు శ్రీనివాస్, రాజాం శ్రీనివాస్, గర్తం తులసీరావు, పోతనపల్లి గణపతి, బుడత బాలరాజు, కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రాపాక అప్పలస్వామి తదితరులు పాల్గొన్నారు. -
పాల వ్యాన్ ఢీకొని వ్యక్తి మృతి
మెళియాపుట్టి: నడుచుకుంటూ వెళున్న వ్యక్తిని వాహనం ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మెళియాపుట్టి మండలకేంద్రంలో మంగళవారం వేకువజామున చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా భిన్నాళ గ్రామానికి చెందిన మదన్ జెన్నా (52) ప్రతి రోజు మెళియాపుట్టి వచ్చి కూరలు అమ్ముతుంటాడు. ఎప్పటిలాగే మంగళవారం వేకువజామున 3 గంటల ప్రాంతంలో గ్రామానికి చెందిన బిసక్ ప్రధాన్‌తో కలిసి మెళియాపుట్టి బయలుదేరాడు. బిసక్ ప్రధాన్ వ్యక్తిగత పనిపై ఓ చోట ఆగిపోయారు. మదన్ జెన్నా నడుచుకుని వెళ్తుండగా మూడురోడ్ల కూడలి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని ఆపకుండా వెళ్లిపోయింది. తలకు బలమైన గాయం కావడంతో మదన్ అక్కడికక్కడే మృతిచెందాడు. కుటుంబసభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడి సీసీ కెమెరాలు పరిశీలించగా పాలవ్యాన్ ఈ ప్రమాదానికి కారణమని గుర్తించారు. అనంతరం డ్రైవర్ బొడ్డేపల్లి రోహిత్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. ఎస్సై రమేష్‌బాబు మృతదేహాన్ని పరిశీలించి పోస్ట్‌మార్టం నిమిత్తం పాతపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మదన్‌కు భార్య ఫుల్లో జెన్నా, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
నిర్మాణ పనుల్లో నాణ్యత తప్పనిసరి
● ఐటీడీఏ పీఓ యశ్వంత్‌కుమార్ రెడ్డి మెళియాపుట్టి : మల్టీపర్పజ్ సెంటర్ల నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలని సీతంపేట ఐటీడీఏ పీఓ యశ్వంత్‌కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం మెళియాపుట్టి మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. ఎర్రమానుగూడ, సవర చీడిపాలెం, నందల పాడు గ్రామాల్లో జరుగుతున్న మల్టీపర్పజ్ సెంటర్లను పరిశీలించి స్టీల్, సిమ్మెంట్, ఇటుకల నాణ్యతపై ఆరా తీశారు. పనుల్లో నాణ్యత పరిశీలించడానికి ప్రత్యేక బృందాలను పంపిస్తామన్నారు. భవనాలకు ఉన్న విద్యుత్ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని పీఓ చెప్పారు. అనంతరం భరణికోట గిరిజన బాలికల సంక్షేమ ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. మరుగుదొడ్లు, తరగతిగదులు, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. పదో తరగతి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం కరజాడ పీహెచ్‌సీని సందర్శించి ఓపీ పరిశీలించారు. ఆయనతో పాటు పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఫేక్ సర్టిఫికెట్లపై విచారణ..
జిల్లా వైద్యారోగ్య శాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈవో) పోస్టు ఇస్తున్నట్లుగా కొందరు నిరుద్యోగులకు ఫేక్ సర్టిఫికెట్లను జారీ చేసిన ఉదంతం నాలుగు నెలల క్రితమే బయటకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే బాధితుల ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారులు సైతం విచారణకు ఆదేశించడం..ఇటీవలే డీఎంహెచ్‌వో బాలమురళీకృష్ణ సమక్షంలోనే విచారణాధికారిగా విశాఖపట్నం డీఎంహెచ్‌వో జగదీశ్వరరావు స్వయంగా విచారణ ప్రక్రియ చేపట్టారు. ఈ వ్యవహారంలో బాధితులిచ్చిన ఫిర్యాదు ప్రకారం అనుమానితులుగా ఉన్న సూపరింటెండెంట్ భాస్కరకుమార్, కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్ జి.వి.నరసింహంలపై చర్యలకు దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులోనుంచి ఎలాగైనా శాఖాపరమైన చర్యల నుంచి తప్పించుకునేందుకు కొత్తగా దళారీ వ్యవస్థ రంగంలోకి దిగింది. వారిద్దరికీ సహకరించేలా స్థానికంగా శాఖకు చెందిన కీలక అధికారి జేబు నింపేందుకు దళారీ వ్యవహారం సిద్ధమైంది. దీంతో ఈ విచారణ పక్కదారి పట్టే అవకాశాలున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలావుంటే ఈ ఫేక్ సర్టిఫికెట్ల వ్యవహారంపై జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ పిరియా విజయ కూడా సమావేశంలో ఇటీవల ప్రస్తావించి.. అనుమానితులపై శాఖాపరంగా చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించిన సంగతి విదితమే. ఏదిఏమైనా వైద్యారోగ్యశాఖలో జరుగుతున్న వరుస అక్రమాలు, అక్రమ వసూళ్ల వ్యవహారం కూటమి ప్రభుత్వం వచ్చాక శృతిమించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
టీచర్లకు వెబ్ ఆధారిత బదిలీలు వద్దు
● మాన్యువల్‌గానే నిర్వహించాలి ● ఎస్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి గురుగుబెల్లి రమణ శ్రీకాకుళం న్యూకాలనీ: వెబ్ కౌన్సిలింగ్, వెబ్ ఆధారిత బదిలీల పట్ల తమకు నమ్మకం లేదని, మాన్యువల్ విధానంలోనే కౌన్సిలింగ్ నిర్వహించాలని ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గురుగుబెల్లి రమణ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని దాసరి క్రాంతిభవన్‌లో మంగళవారం ఉపాధ్యాయ బదిలీల చట్టం డ్రాఫ్ట్‌పై చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాన్యువల్ విధానమే కావాలంటూ రాష్ట్రంలో లక్షలాది మంది ఉపాధ్యాయులు గగ్గోలు పెడుతున్నా విద్యాశాఖ ఉన్నతాధికారులు తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకపోవడం సరికాదన్నారు. తాజాగా విడుదల చేసిన డ్రాఫ్ట్‌లో సైతం వెబ్ ఆధారిత కౌన్సిలింగ్ విధానమే ఉంటుందని ఉన్నతాధికారులు తెలియజేయడాన్ని ఎస్టీయూ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వెబ్ కౌన్సిలింగ్లో వేలాది ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుందని.. సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులైతే.. ఒక జిల్లాలో 3,500 నుంచి 5వేల సంఖ్య వరకు సీనియారిటీ లిస్టు ఉంటుందన్నారు. అందులో చివర ఉన్న వ్యక్తులు 4వేల వరకూ పాఠశాలకు ఆప్షన్స్ ఇవ్వడం దాదాపు అసాధ్యమని, ఇదెంతో తీవ్రమైన ఒత్తిడితో కూడిన అంశం కాదా ? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో దాదాపు 98 వేల మంది సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు వెబ్ కౌన్సలింగ్ వద్దని మొరపెట్టుకుంటున్నా వినిపించుకోకుండా విద్యాశాఖాధికారులు ఎవరి ప్రయోజనాలు కోసం వెబ్ కౌన్సలింగ్లో బదిలీలు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికై నా కూటమినేతలు, విద్యాశాఖ మంత్రి కలుగజేసుకొని ఉన్నతాధికారులు ఒంటెద్దు పోకడలను నిలువురించకపోతే భవిష్యత్తులో మూల్యం చెల్లించకతప్పదని స్పష్టం చేశారు. అనంతరం మండలాల నాయకులు, పలువురు ఉపాధ్యాయులు డ్రాఫ్ట్ చట్టంపై ఉన్న అభ్యంతరాలను ప్రొఫార్మాలో నింపి పాఠశాల విద్యాశాఖకు మెయిల్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు పి.రామకృష్ణ, కె.శ్రీనివాసరావు, జి.శ్రీను, ఎం.తేజ, చింతల రామారావు, చౌదరి జగన్ తదితరులు పాల్గొన్నారు. -
అందరికీ అందుబాటులో ఉంటా..
కలిసికట్టుగా పనిచేద్దాం.. పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్‌గా కురసాల కన్నబాబును నియమించడం సంతోషంగా ఉందన్నారు. పార్టీ శ్రేణులంతా కలిసి కట్టుగా పనిచేస్తే విప్లవాత్మకమైన మార్పులు వస్తాయన్నారు. వైఎస్సార్ హయాంలో 9 సీట్లు వచ్చాయని ఆయన మరణం రాష్ట్రానికి తీరని లోటన్నారు. ఆ తరువాత జగన్ కీలకంగా మారారని పోరాటం చేసి వైఎస్సార్సీపీని పటిష్టంగా నిలబెట్టారన్నారు. ఓటమిని అంగీకరించే తత్వం చంద్రబాబుకి లేదన్నారు. ● కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి ● వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు ● ఓటమిని అంగీకరించడం చంద్రబాబుకి చేతకాదు: ధర్మాన కృష్ణదాస్ ● పాలనంటే రెడ్‌బుక్ రాజ్యాంగమా : మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): వైఎస్సార్సీపీ శ్రేణులందరికీ తాను అన్ని వేళల్లో అందుబాటులో ఉంటానని, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాల్సిన అవసరం ఉందని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు అన్నారు. అర్ధరాత్రి ఫోన్ చేసి సమస్య ఉందని చెప్పినా స్పందిస్తానని భరోసానిచ్చారు. పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్‌గా బాధ్యతలు చేపట్టాక తొలిసారి మంగళవారం శ్రీకాకుళంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు, పార్టీశ్రేణులతో సమావేశం నిర్వహించారు. ముందుగా వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. తనను నోటికి వచ్చినట్టు తిట్టిన వారితోనే చంద్రబాబు జతకట్టి ఎన్నికల్లో గెలిచారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అప్పట్లో టీడీపీకి అభ్యర్థులే దొరకలేదని గుర్తు చేశారు. చంద్రబాబు, పవన్ పూటకో విషయం మాట్లాడతారని, 9 నెలలు తిరగకముందే ప్రభుత్వంపై జనం ఆగ్రహంగా ఉన్నారని అన్నారు. అక్రమంగా కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తే భయపడేది లేదని అన్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎన్నికల్లో కూటమి మద్దతిచ్చిన అభ్యర్థి రఘువర్మ ఓడిపోవడంతో ఆయన తమ పార్టీ అభ్యర్థి కాదనడం టీడీపీకి సిగ్గుచేటన్నారు. పొరపాట్లు జరిగితే సరిదిద్దుకునే దమ్మున్న వ్యక్తి జగన్ అని తెలిపారు. పార్టీని స్థాపించిన వారిని వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్న వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జగన్ గెలవడం ఖాయమన్నారు. ● ఈ సందర్భంగా విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వాన్ని నిలదీయాలని, కూటమి నేతలకు భయపడకుండా ఉండాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం పతనం ఉత్తరాంధ్ర తోనే స్టార్ట్ అయ్యిందన్నారు. ఓటమిని జీర్ణించుకోలేని పరిస్థితి ఈ జిల్లాలో టీడీపీ నాయకులకు ఉందన్నారు. ● జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పిరియా విజయసాయిరాజ్, పార్టీ ఎచ్చెర్ల నియోజకవర్గ సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్, పాతపట్నం నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి శాంతి, ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ మాట్లాడుతూ నెలకోసారి జిల్లా సమన్వయ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. జగనన్న ఉద్దానం ప్రాంతానికి తాగునీరందించి ఆదుకుంటే ఆ పథకాన్ని కూటమి కొనసాగించలేకపోవడం దౌర్భాగ్యమని అన్నారు. ● టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ మాట్లాడుతూ టెక్కలిలో అచ్చెన్నాయుడు మనుషులే అధికారులుగా ఉన్నారని దీంతో అధికార దుర్వినియోగం చాలా ఎక్కువవుతుందన్నారు. దీంతో వైఎస్సార్సీపీ సర్పంచులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ తూర్పుకాపు రాష్ట్ర అ ధ్యక్షుడు మామిడి శ్రీకాంత్, కళింగవైశ్య రాష్ట్ర అధ్యక్షుడు అంధవరపు సూరిబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కేవీజీ సత్యనారాయణ, యువజన విభాగం ఉత్తరాంధ్ర అధ్యక్షుడు ఎంవీ స్వరూప్, జిల్లా ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం, చింతాడ వరుణ్, అంబటి శ్రీనివాసరావు, ఎంవీ పద్మావతి, గొండు కృష్ణ, సాధు వైకుంఠరావు, ఎంఏ భేగ్, పొన్నాడ రుషి, రౌతు శంకరరావు, పీస గోపి, వైవీ శ్రీధర్, ఎన్ని ధనుంజయరావు, టి.కామేశ్వరి, గుంట జ్యోతి, బొడ్డేపల్లి పద్మజ, శాడి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, పాల వసంతరెడ్డి, మార్పు పృథ్వీ, బూర్లె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి, పార్టీ డాక్టర్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ సాధారణ వ్యక్తి రీజనల్ కో ఆర్డినేటర్ స్థాయికి ఎదగడం గర్వకారణమన్నారు. పయ్యావుల కేశవ్ బడ్జెట్ పెడుతూ జగన్ సమయంలో ఆర్థిక విధ్వంసం చేశారనడం హాస్యస్పదంగా ఉందన్నారు. జగన్ వల్ల దేశంలో అప్పు పుట్టడం లేదంటూనే 2024–25 ఆర్థిక సంవత్సరానికి లక్షానలభై వేల కోట్ల అప్పు ఎలా తెచ్చారని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు పడిన విషయాన్ని గమనించాలన్నారు. అమ్మఒడి రెండేళ్లు ఎగ్గొట్టడానికి చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. -
యువతి ఆత్మహత్య
కవిటి: మండలంలోని సీహెచ్ కపాసుకుద్ధి పంచాయతీ వడ్డిపుట్టుగకు చెందిన ఎలుసూరు సోనియా(25) అనే యువతి మంగళవారం సాయంత్రం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సోనియా మానసిక సమస్యలతో బాధపడుతోంది. కొన్నాళ్లుగా చికిత్సకూడా పొందుతోంది. ఇటీవలే ఆరోగ్యం కుదుటపడటంతో కుటుంబసభ్యులు పెళ్లి సంబంధం చూశారు. మే నెలలో వివాహానికి ముహూర్తం పెట్టుకున్నారు. ఇంతలో సోనియా ఆత్మహత్యకు పాల్పడడంతో విషాదఛాయలు అలముకున్నాయి. తండ్రి ఆనంద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కవిటి ఎస్ఐ వి.రవివర్మ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళా ఉద్యోగులకు చట్టాలపై అవగాహన
శ్రీకాకుళం అర్బన్: ప్రతి మహిళా ఉద్యోగి చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, వాటిని సామాన్య ప్రజలకు చేరువ చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు అన్నారు. జిల్లాకేంద్రంలోని ఐసీడీఎస్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగులకు ప్రస్తుతం జరుగుతున్న నేరాలు, వాటికి విధిస్తున్న శిక్షలు, చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సన్యాసినాయుడు మాట్లాడుతూ కొత్త చట్టాలను వివరించారు. ఐసీడీఎస్ పీవో బి.శాంతిశ్రీ మాట్లాడుతూ పలు చట్టాలను ఉదహరిస్తు వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సమాజ సేవకులు హారికా ప్రసాద్, పీఓఐసీ మెట్ట మల్లేశ్వరరావు, విభిన్న ప్రతిభావంతుల ప్రాజెక్ట్ అధికారి కవితా, ఐసీడీఎస్ నోడల్ అధికారి మణెమ్మ, మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ లక్ష్మి, పీఓఎన్‌ఐసీ లక్ష్మునాయుడు, పలువురు మహిళలు, బాలికలు పాల్గొన్నారు. -
నరకం
గంటల రాజాం పైపు నిలిచిపోయిన భారీ వాహనాలుపొందూరు పరీక్ష కేంద్రంలో పరీక్షలు రాసేందుకు నడిచి వెళ్తున్న విద్యార్థులు కూరుకుపోయిన భారీ లారీ ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటాం జి.సిగడాం: మండలంలోని దవళపేట గ్రామ సమీపంలో దారికి అడ్డంగా ఓ లారీ నిలిచిపోవడంతో ప్రయాణికులు నాలుగు గంటల పాటు నరకం చూశారు. రాజాం–శ్రీకాకుళం ప్రధాన రహదారి, దవళపేట గ్రామ సమీపంలో కల్వర్టు పనులు జరుగుతున్నాయి. వాహనాల రాకపోకల కోసం పక్క నుంచి డైవర్షన్ రహదారి ఏర్పాటు చేశారు. ఈ రహదారిలో మంగళవారం వేకువజామున 2 గంటల సమయంలో అధిక లోడుతో వెళ్తున్న ఓ సిమెంట్ లారీ కూరుకుపోయింది. దీంతో రాజాం–శ్రీకాకుళం వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉదయం 4 గంటల నుండి 8 గంటల వరకు వాహనాలన్నీ నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న రహదారులు భవనాల శాఖ ఏఈఈ పీటీ రాజు సంఘటన స్థలానికి చేరుకుని లారీని యంత్రాల సాయంతో బయటకు తీయించారు. దాదాపు నాలుగు గంటల పాటు శ్రమించారు. దవళపేట వద్ద ట్రాఫిక్ జామ్ డైవర్షన్ వద్ద మట్టిలో కూరుకుపోయిన భారీ లారీ అవస్థలు పడిన ప్రయాణికులు -
నాలుక మడతేసిన టీడీపీ
అవునా.. అచ్చెన్న మద్దతిచ్చారా. దానిపై నాకు అవగాహన లేదు. నేను రాజకీయాలకు అతీతంగా పోటీ చేసి గెలిచాను. ఎవరి ఫొటోలు పెట్టుకుని గెలవలేదు. ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో గెలిచా. నా గెలుపును రాజకీయాలతో ముడి పెట్టొద్దు. అవసరమైతే ప్రభుత్వంపై సామదానభేద దండోపాయాలకు సిద్ధంగా ఉన్నాను. – గెలిచాక ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు చేసిన వ్యాఖ్యలివి. ● ఎమ్మెల్సీ ఓటమి తర్వాత మాట మార్చిన వైనం ● పాకలపాటి రఘువర్మతో పాటు గాదెకు ఓటేయాలని చెప్పినట్టు బుకాయింపు ● రఘువర్మ కోసం ఎన్నికల్లో గట్టిగా పనిచేసిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ● పోలింగ్ రోజునైతే ఎక్కడికక్కడ శిబిరాలు ఏర్పాటు చేసి ప్రచారం ● ఎన్ని చేసినా ఓటమి పాలైన టీడీపీ బలపరిచిన అభ్యర్థి సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: టీడీపీ తనకు అలవాటైన ఆటను మరోసారి రక్తికట్టించింది. గెలిస్తే మనోడు.. ఓడిపోతే వేరే వాడు అన్నట్లు నిస్సిగ్గుగా వ్యవహరించింది. ఏపీటీఎఫ్ తరఫున పోటీ చేస్తున్న పాకలపాటి రఘువర్మను బలపరుస్తున్నామని టీడీపీ నాయకులు బహిరంగంగా ప్రకటించారు. ఎన్నికల ప్రచారం దగ్గర నుంచి పోలింగ్ వరకు అన్ని బాధ్యతలను భుజానికెత్తుకున్నారు. తీరా రఘువర్మ ఓడిపోయాక గెలిచిన అభ్యర్థి గాదె శ్రీనివాసులునాయుడు ‘మావోడే’ అని ప్రకటించుకోవడం చర్చనీయాంశంగా మారింది. కానీ గాదె శ్రీనివాసులు నాయుడు ఎక్కడా సానుకూలంగా స్పందించలేదు సరికదా.. అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు విని.. అవునా.. అచ్చెన్న మద్దతిచ్చారా.. నాకు తెలియదే అంటూ తిప్పికొట్టారు. దీంతో టీడీపీ అప్రతిష్ట పాలైంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారం ప్రారంభం కావడమే తరువాయి టీడీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలంతా రంగంలోకి దిగి, తాము బలపరిచిన పాకలపాటి రఘువర్మను గెలిపించాలని, టీడీపీ మద్దతు ఉన్న రఘువర్మకు టీడీపీ సానుభూతి పరులంతా సహకరించాలని వాడవాడలా ప్రచారం చేశారు. ప్రచారం చేసిన సమయంలో వారే తమ ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. ఇక, ఎన్నికల దగ్గర కొచ్చాక సీఎం చంద్రబాబునాయుడు పలు పర్యాయాలు టెలీ కాన్ఫరెన్స్‌లు పెట్టి పార్టీ మద్దతిచ్చిన రఘువర్మను ఎట్టి పరిస్థితుల్లో గెలిపించాలని, ఎమ్మెల్యే, మంత్రులు, ఎంపీలు బాధ్యత తీసుకోవాలని కూడా ఆదేశించారు. విశ్రమించకుండా పోలింగ్ వరకు పనిచేయాలని, ఆయన గెలుపును భుజాన వేసుకోవాలని సూచించారు. దానికి తగ్గట్టుగానే పోలింగ్‌కు మూడు రోజుల ముందునుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు మరింత స్పీడు పెంచారు. నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా సమావేశాలు పెట్టి, రఘువర్మకు ఓటు వేసేలా చూడాలని శ్రేణులను కూడా సమాయత్త పరిచారు. పోలింగ్‌కు ముందు రోజైతే కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కూటమి పార్టీల అగ్రనేతల ఫొటోలను పెట్టుకుని, మరోవైపు మద్దతిచ్చిన రఘువర్మ నిలువెత్తు ఫొటోను డిస్ ప్లే చేసి ప్రత్యేక వీడియో విడుద ల చేశారు. టీడీపీ, జనసేన బలపరిచిన పాకలపాటి రఘువర్మను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఇక పోలింగ్ రోజునైతే ఏపీటీఎఫ్ కంటే కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలే ఎక్కువగా పనిచేశారు. పోలింగ్ కేంద్రాల దగ్గరలో ఏర్పాటు చేసిన శిబిరాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు కూర్చొని పాకలపాటి రఘువర్మకు ఓటు వేయాలని కోరారు. నరసన్నపేట నియోజకవర్గంలో బగ్గు రమణమూర్తి, ఎచ్చెర్ల నియోజకవర్గంలో నడికుదిటి ఈశ్వరరావు, ఆమదాలవలస నియోజకవర్గంలో కూన రవికుమార్, పాతపట్నం నియోజకవర్గంలో మామిడి గోవిందరావు, శ్రీకాకుళంలో గొండు శంకర్, టెక్కలిలో పలువురు టీడీపీ నాయకులు, పలాస నియోజకవర్గంలో గౌతు శిరీష భర్త వెంకన్న చౌదరి, పొందూరులో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు నేరుగా పోలింగ్ కేంద్రాలకు సమీపంలో ఏర్పాటు చేసిన శిబిరాల్లో గంటల తరబడి ఉండి, ఓటు వేసేందుకు వచ్చిన ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు. టీడీపీ బాటలోనే జనసేన నాయకులు కూడా పెద్ద ఎత్తున ప్రచారంలోనూ, పోలింగ్ రోజున కష్టపడి పనిచేశారు. పోలింగ్ అనంతరం పాకలపాటి రఘువర్మ కోసం నిరంతరం కష్టపడి పనిచేసిన కూటమి నాయకులు, కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఫేస్‌బుక్‌ల్లోనూ, వాట్సాప్ గ్రూపుల్లోనూ పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు పోస్టులు కూడా పెట్టారు. ఏ సందర్భంలో కూడా రెండో ప్రాధాన్యత ఓటు గాదెకు వేయాలని ఒక్కసారీ విజ్ఞప్తి చేయలేదు. కనీసం ప్రకటన కూడా విడుదల చేయలేదు. కానీ రఘువర్మ ఓడిపోగానే.. రెండో ప్రాధాన్యత ఓటు గాదె శ్రీనివాసులునాయుడుకు వేయాలని తామే చెప్పామని, ఇద్దరు మన అభ్యర్థులే అని చెప్పుకోవడం విడ్డూరంగా మారింది. టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలతో గెలిచిన గాదె శ్రీనివాసులు నాయుడే కాదు ఓడిపోయిన పాకలపాటి రఘువర్మ కూడా బాధపడే ఉంటారు. -
ఈ ఓటమి.. అసమర్థ పాలనకు సాక్ష్యం
మంత్రి అచ్చెన్న వ్యాఖ్యలు సరికాదు●● ఉపాధ్యాయ ఉద్యమాన్ని అవమానించడం తగదు ● ఉపాధ్యాయ ఉద్యమంలో చీలికలు తెచ్చిందే కూటమి ప్రభుత్వం ● ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై పోరాటమే తమ లక్ష్యమని యూటీఎఫ్ నాయకుల వెల్లడి శ్రీకాకుళం న్యూకాలనీ: ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర మంత్రి కె.అచ్చెనాయుడు ఉపాధ్యాయ ఉద్యమాన్ని అవమానించేలా చేసిన వ్యాఖ్యలు ఎంతమాత్రం సరికాదని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.కిషోర్‌కుమార్, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎల్.బాబూరావు, బి.శ్రీరామమూర్తి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చౌదరి రవీంద్ర, కోశాధికారి బి.రవికుమార్, గౌరవాధ్యక్షులు కె.వైకుంఠరావు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. యూటీఎఫ్‌కు వైఎస్సార్ సీపీ ముసుగు వేస్తూ మంత్రి అచ్చెన్న వ్యాఖ్యలు చేయడాన్ని యూటీఎఫ్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వాస్తవానికి ఏపీటీఎఫ్, పీఆర్టీయూ అభ్యర్థులకు కూటమి ముసుగు వేయ డం ద్వారా అధికార పక్షమే ఉపాధ్యాయ ఉద్యమంలో చీలికలు తెచ్చిందని వారు విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైన పార్టీలు బహిరంగంగా మద్దతు పలికిన అభ్యర్థి ఓటమి చవిచూడటాన్ని చూస్తుంటే.. వారి అసమర్థ పరిపాలనకు, ఉద్యోగ, ఉపాధ్యాయ, అధ్యాపక, ఆచార్యుల ఆగ్రహానికి నిదర్శనమన్నారు. విద్యారంగంలో అనుసరిస్తున్న విధానాలకు చెంపపెట్టే కూటమి అభ్యర్థి ఓటమి అనే విషయాన్ని ఇప్పటికై నా అధికార పాలకులు గ్రహించాలని కోరారు. ఈ ఎన్నికల్లో పీడీఎఫ్ స్వతంత్రంగా పోటీ చేసిందని.. దానికి యూటీ యఫ్, ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయని వారు గుర్తుచేశారు. ఏ అధికార, ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా గానీ, వ్యతిరేకంగా గానీ యూటీఎఫ్ పనిచేయదని స్పష్టం చేశారు. ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల పట్ల తమ పోరాటాన్ని నిరంతరం కొనసాగిస్తూనే ఉంటామని కిషోర్‌కుమార్, బాబూరావు, శ్రీరామమూర్తి పేర్కొన్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే.. కూటమి ప్రభుత్వం ఆలోచనలు, నిర్ణయాలు అత్యంత ప్రమాదకారంగా ఉంటున్నాయని పేర్కొన్నారు. పీడీఎఫ్ అంటే సర్కారుకు భయం శ్రీకాకుళం: రాష్ట్ర ప్రభుత్వం ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ అంటే భయపడుతోందని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్ పేర్కొన్నా రు. తాజాగా జరిగిన శాసన మండలి ఎన్నికలు దీన్ని రుజువు చేశాయని తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాల్లో ఇద్దరేసి అభ్యర్థులను తమవారిగా చెప్పుకోవడం సిగ్గుచేటు అని అన్నారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పీడీఎఫ్ సభ్యులు బహిరంగ పోరాటాలు చేయడంతో పాటు మండలిలో ప్రభుత్వాలను నిలదీశారని గుర్తు చేశారు. ఎన్నికల్లో నైతిక విజయం విజయ గౌరీదే అని పేర్కొన్నారు. బుచ్చిపేటకు జ్వరమొచ్చింది..! నరసన్నపేట: మండలంలోని మడపాం పంచాయతీ బుచ్చిపేట మంచం పట్టింది. గ్రామంలో ప్రతి ఇంటా జ్వర పీడితులు కనిపిస్తున్నారు. జ్వరం తగ్గి కీళ్ల నొప్పులతో ఉన్నవారు కొందరైతే, జ్వరంతో మంచం పట్టిన వారు మరి కొందరు. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. జ్వరం తగ్గినట్టే తగ్గి మళ్లీ వస్తోందని అంటున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవా లని కోరుతున్నారు. జ్వరాల గురించి తెలుసుకున్న మాకివలస పీహెచ్సీ సిబ్బంది నీటిని పరీక్షలకు పంపినా ఎలాంటి కాలుష్యం కనిపించలే దు. దీంతో సీజనల్ జ్వరాలుగానే భావిస్తున్నారు. అధికారులు గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
పింఛన్లు ఆపేశారు మహాప్రభో
సంతబొమ్మాళి: సంతబొమ్మాళి పంచాయతీ నగిరిపెంట గ్రామానికి చెందిన పదిమంది తమ పింఛన్లు ఆపేశారంటూ ఎంపీడీఓ జయంతి ప్రసాద్ ముందు గోడు వెళ్లబోసుకున్నారు. అందరికీ ఈ నెల 1వ తేదీన పింఛన్లు ఇచ్చి తమవి ఎందుకు ఆపేశారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన వ్యక్తి తమపై ఫిర్యాదు చేశారని, ఆ తర్వాత తమ పింఛన్లు హోల్డ్‌లోకి వెళ్లిపోయాయని రకరకాల కారణాలు చెప్పి పింఛన్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశా రు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమకు పింఛన్లు ఇప్పించాలని లబ్ధిదారులు బి.సుజాత, అరంగి ప్రకాష్, ఎస్.లక్ష్మి, జి.లోకనాధం, అప్పారావు, రాజు తదితరులు కోరారు. ధాన్యం నిల్వలపై ఆరా బూర్జ: మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం నిల్వలపై జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆరా తీశారు. ఆయన మంగళవారం గుత్తావల్లి, లాభాం, పాలవలస, లక్కుపురం గ్రామాల్లో పర్యటించారు. కుప్పలతో ఉన్న ధాన్యం, కుప్పలు నూర్చిన తర్వాత కొనుగోలుకి సిద్ధంగా ఉన్న ధాన్యం నిల్వల గురించి అడిగి తెలు సుకున్నారు. మండలంలో గల మిల్లర్లు టార్గెట్ పూర్తయ్యిందని కొనుగోలు చేయడం లేదని రైతులు జేసీకి తెలిపారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి ఎన్.శ్రీనివాసరావు, సివిల్ సప్లై డీటీ మురళి మోహన్, వీఏఏలు వ్యవసాయ రైతులు పాల్గొన్నారు. నియోజకవర్గాల్లో అభివృద్ధి ప్రణాళికలు: కలెక్టర్ శ్రీకాకుళం పాతబస్టాండ్: నియోజకవర్గాల అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ జిల్లా అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి అధికారులతో సమీక్షించారు. ముందస్తు అనుమతి లేకుండా సెలవుపై వెళ్లిన సెక్రటేరియట్ సిబ్బంది సెలవులను సంబంధిత జిల్లా అధికారులు రెగ్యులరైజ్ చేయవద్దన్నారు. సచివాలయ సిబ్బంది హాజరు 90 శాతం కన్నా తగ్గకూడదని పేర్కొన్నారు. పీఎంఏవైకు దరఖాస్తు చేసుకున్న వారు 41,862 మంది ఉన్నట్లు హౌసింగ్ పథక సంచాలకులు నగేష్ తెలియజేశారు. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. ఎవరైనా రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని ఆర్ఎస్కే వారీగా లిస్ట్ ఇస్తే వారికి ధాన్యం సేకరణకు అనుమతి మంజూరు చేస్తామని జాయింట్ కలెక్టర్ తెలియజేశారు. మూడోరోజు 741 మంది గైర్హాజరుశ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. 75 కేంద్రాల్లో జరుగుతున్న పరీక్ష ల్లో భాగంగా మూడోరోజు ఫస్టియర్ విద్యార్థులు సెట్–1 ప్రశ్నాపత్రంతో ఇంగ్లీషు పేపర్‌కు పరీక్ష రాశారు. జనరల్, ఒకేషనల్ రెండు విభాగాల్లో కలిపి 21,966 మంది హాజరుకావాల్సి ఉండగా 741 మంది గైర్హాజరయ్యారు. ఎలాంటి మాల్ ప్రాక్టీసు కేసులు నమోదుకాలేదని అధికారులు ధ్రువీకరించారు. 4 -
శ్రీకాకుళం
బుధవారం శ్రీ 5 శ్రీ మార్చి శ్రీ 2025ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేం అభ్యర్థిని పెట్టలేదు. మేము ఓపెన్‌గా రఘువర్మకి, శ్రీనివాసులనాయుడికి ఓటు వేయాలని చెప్పాం. టెలీ కాన్ఫరెన్స్ పెట్టి మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత ఓట్లు రఘువర్మకి, గాదె శ్రీనివాసులునాయుడికి వేయమని చంద్రబాబు చెప్పారు. ఇద్దరూ మన అభ్యర్థులే, ఎవరు గెలిచినా మనవాళ్లే అన్నారు. – సోమవారం రాత్రి ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలివి న్యూస్‌రీల్ -
అటు సిండికేటు.. ఇటు అదనపు రేటు
మందు బాబులకు ఝలక్సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలో మద్యం దోపిడీకి అధికార పార్టీ నాయకులు తెర తీశారు. ఒకనేత అంతా తానై వ్యవహరించి, సిండికేట్‌కు నాయకత్వం వహించి, పలాస నియోజకవర్గంలో వసూళ్లకు శ్రీకారం చుట్టారు. కీలక నేతకు ముడుపులు ఇచ్చేందుకు ఒప్పందం జరగడంతో ఎమ్మార్పీకి మించి విక్రయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. క్వార్టర్ బాటిల్‌పై రూ.10 అదనంగా వేసి షాపుల్లో విక్రయిస్తున్నారు. 2014–19 పరిస్థితులు పునరావృతం ఎమ్మార్పీకి మించి మద్యం విక్రయాలు జరపడం కొత్తేమీ కాదు. 2014–19 టీడీపీ హయాంలో బరితెగించి విక్రయాలు చేపట్టారు. ఒక్కో బాటిల్‌పై రూ.20 నుంచి రూ.50 వరకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. అప్పట్లో ఎమ్మార్పీకి మించి చేపట్టిన విక్రయాలపై మద్యం బాబుల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇంట్లో డబ్బు అంతా మద్యానికి పోసేస్తున్నారని మహిళలు ఆందోళన చేశారు. అప్పట్లో లిక్కర్ వ్యాపారులు భారీగా సంపాదించారు. అందులో కొంత నేతలకు ముట్ట జెప్పారు. అది జిల్లా ప్రజలందరికీ తెలిసిన విషయమే. మళ్లీ ఇప్పుడా పరిస్థితులు పునరావృతమవుతున్నాయి. ఇప్పటికే బెల్ట్‌షాపులు విచ్చలవిడిగా వెలిశాయి. అదే తప్పు అని గగ్గోలు పెడుతుంటే, ఇప్పుడు ఎమ్మార్పీకి మించి విక్రయాలు మొదలయ్యాయి. పలాస నియోజకవర్గంలో తొలుత శ్రీకారం చుట్టారు. ఇప్పుడది జిల్లా అంతా పాకే పరిస్థితి కనబడుతోంది. చక్రం తిప్పిన నాయకుడు.. మద్యం షాపులను దక్కించుకున్న ఓ నాయకుడు కీలకంగా వ్యవహరించి, సిండికేట్‌ను ఏర్పాటు చేసి, అందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చారు. ఎవరికెంత ముడుపులు ఇవ్వాలో డిసైడ్ చేసి, తదనుగుణంగా కీలక నేతకు జరిగినదంతా చెప్పి, ఎమ్మార్పీకి మించి విక్రయాలకు తలుపులు తెరిచారు. ఏకంగా ఎకై ్సజ్ పరిధిలో నిర్ణయాన్ని అమలు పరిచారు. ప్రస్తుతానికి ఒక్కో క్వార్టర్ బాటిల్‌పై రూ.10 పెంచి విక్రయిస్తున్నారు. మున్ముందు ఈ పెంపు మరింత పెరగనుంది. జిల్లాలో తొలుత పలాస నియోజకవర్గం, సర్కిల్ పరిధిలోనే ప్రారంభించారు. కీలక నేత అండదండలతో ముందుకెళ్తున్నారు. మొదలైన మద్యం దోపిడీ ఒక్కో బాటిల్‌పై రూ.10 అదనపు వడ్డన పలాస నియోజకవర్గంలో శ్రీకారం సిండికేట్‌ను తయారు చేసిన ఓ నాయకుడు కీలక నేత అంగీకరించడంతో ఎమ్మార్పీకి మించి విక్రయాలకు గ్రీన్ సిగ్నల్ -
భారీగా ముడుపులు
ఎమ్మార్పీకి మించి విక్రయాలు జరుపుకోవడానికి గ్రీన్ సిగ్నల్ రావడంతో భారీగా ముడుపులు వెళ్తున్నాయి. స్థానిక, మండల, నియోజకవర్గ స్థాయి మేరకు అడ్డు తగలకుండా ఉండేందుకు కాసుల పంపకాలు చేశారు. ఈ నెలలో తొలి విడత ముడుపులు అందనున్నాయి. వ్యాపారం టర్నోవర్ చూసి ఈ ముడుపులు పెరిగే అవకాశం ఉంది. తక్కువ ధరలకు నాణ్యమైన మద్యం అందిస్తామనే హామీతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం దశల వారీగా తన కార్యాచరణ అమలు చేస్తోంది. ఇప్పటికే ఽఅధికారికంగా ధరలు పెంచి మద్యం బాబులకు వాత పెట్టింది. ఇప్పుడా అధికారిక ధరలకు రూ.10 పెంచి విక్రయిస్తూ మందు బాబులకు మరింత షాక్ ఇచ్చింది. -
వంశధారలో వినాశన కాండ
బోర్లు మొరాయిస్తున్నాయి.. ● వంశధారి నదిలో ఇసుక అక్రమార్కుల బరితెగింపు ● పెద్ద పెద్ద గొట్టాల ద్వారా నీరు మళ్లింపు ● మారిపోతున్న నదీ గమనం ● పరిమితికి మించి తవ్వకాలు జరపడంతో అడుగంటిపోతున్న భూగర్భ జలాలు బైరి పరిసర ప్రాంతంలో ఇసుక తవ్వకాలు చేయడంతో చాలా చోట్ల బోర్లు మొరాయిస్తున్నాయి. గ్రామంలోని వ్యవసాయ బోర్లు 70వరకు ఉన్నాయి. ఇటీవల మైనింగ్, రెవెన్యూ అధికారులు వచ్చి నదీ పరివాహక ప్రాంతాన్ని సందర్శించినప్పుడు గ్రామస్తులకు ఎలాంటి నష్టం లేకుండా చూస్తామన్నారు. కానీ ప్రస్తుతం అనుమతులకు మించి తవ్వకాలు చేయడంతో తాగునీటిని అందించే బోర్లు సైతం పనికి రాకుండా పోతున్నాయి. – మూల కృష్ణవేణి, బైరిసాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఇసుక అక్రమార్కులు ఏకంగా వంశధార నదికి తీరని అన్యాయం చేస్తున్నా రు. అధికారం చేతిలో ఉండడంతో అడ్డూఅదుపు లేకుండా రెచ్చిపోతున్నారు. యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘించి, ప్రకృతి వనరులను దోచుకుంటున్నారు. ఇష్టారీతిన నిర్వహిస్తున్న ఇసుక ర్యాంపుల్లో రూ.కోట్లు సంపాదిస్తున్నారు. వంశధార నదీ తీరంలో ఏర్పాటు చేసిన ఇసుక ర్యాంపుల్లో గుట్టల కొద్దీ ఇసుక తరలిపోతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు. బైరిలో విధ్వంసం.. శ్రీకాకుళం రూరల్ పరిధిలోని బైరి గ్రామంలో నడుస్తున్న ఇసుక ర్యాంపుల నుంచి నిత్యం రాత్రి, పగలు తేడా లేకుండా ఇసుక లారీల్లో తోడేస్తూ తరలిస్తు న్నారు. నదీగర్భంలోకి ఏకంగా అనధికారికంగా రహదారి వేసేశారు. నదిలో ఉన్న నీటిని పెద్ద పెద్ద గొట్టాల ద్వారా బయటకు మళ్లిస్తున్నారు. ఇసుక తవ్వకాలు జరిపే సమయంలో పాటించాల్సిన నిబంధనలు తుంగలో తొక్కేస్తున్నారు. ప్రభుత్వ అనుమతి ఉన్న ఇసుక ర్యాంపుల్లో మీటర్ లోతులో కేవలం మనుషులతోనే తవ్వకాలు చేపట్టాలి. కానీ ఇక్కడ యంత్రాలతో తోడేస్తున్నారు. ఐదు నుంచి 10 మీటర్ల లోతు వరకు తవ్వకాలు చేపడుతున్నారు. ఇసుక మేటలతో పాటు నదీ గర్భాన్ని తవ్వేసి, టన్నుల కొద్దీ ఇసుకను నదిలోనే పోగేసి ఉంచుతున్నారు. పెద్ద పెద్ద దిబ్బలుగా వేసి, అక్కడికే ఏకంగా లారీలను రప్పించి లోడింగ్ చేస్తున్నారు. నదీ గమనానికి, బోర్లకు ముప్పు నిబంధనలు అతిక్రమించి మీటర్ దాటి తవ్వితే నది సమతుల్యత దెబ్బతిని, ప్రవాహంలో మార్పు వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పటికే గ్రామానికి సమీపంలో ఉండే నీరు కిలోమీటర్ల దూరం వెళ్లిపోయింది. గ్రామంలో గల తాగునీరు, సాగునీటి బోర్లు 40 వరకు మూలకు చేరిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో బోర్లకు నీరు అందుతూ మధ్యలోనే ఆగిపోవడంతో మోటర్లు సైతం పాడవుతున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. నదిలో లోతుగా తవ్వకాలు జరపడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయి ఆ బోర్లన్నీ పనికి రాకుండా పోతున్నాయి. -
జిల్లాలో కురసాల కన్నబాబు పర్యటన నేడు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్‌గా నియమితులైన కురసాల కన్నబాబు మంగళవారం తొలిసారిగా జిల్లాలో పర్యటించనున్నారు. పార్టీ అధిష్టానం రీజనల్ బాధ్యతలు అప్పగించిన తర్వాత పార్టీ పటిష్టతపై ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే మంగళవారం శ్రీకాకుళం వస్తున్నారు. పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలు, సీనియర్ నాయకులు వివిధ హోదాల్లో ఉన్న నాయకులతో సమావేశం కానున్నారు. జిల్లాలోని పార్టీ అగ్రనేతలను ప్రత్యేకంగా కలిసి పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు. -
గట్టి పోటీ ఇచ్చిన యూటీఎఫ్ విజయగౌరి
పీడీఎఫ్ తరఫున పోటీ చేసిన యూటీఎఫ్ సంఘం నాయకురాలు విజయగౌరి ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చారు. వాస్తవంగా, యూటీఎఫ్‌లో ఎమ్మెల్సీ ఓటు ఉన్న ఉపాధ్యాయులు కాస్త తక్కువే అని చెప్పాలి. ప్రాథమిక పాఠశాల స్థాయిలో వారికి బలం ఎక్కువ ఉంది. హైస్కూ ల్ స్థాయి ఉపాధ్యాయుల బలం ఆశించినంత లేదు. కాకపోతే, విజయగౌరి వ్యక్తిత్వం, పోరాట తత్వం, పీడీఎఫ్కున్న నమ్మకం గెలిపిస్తాయ ని ఆశించారు. సంఘాలతో సంబంధం లేకుండా ఓటేస్తారని భావించారు. 100శాతం అనుకున్నంతగా కాకపోతే చాలా మేరకు విజయగౌరికి ఓటింగ్ పడిందని చెప్పుకోవాలి. తనకొచ్చిన మొదటి ప్రాధాన్యత ఓట్లును చూస్తే గట్టి పోటీ ఇచ్చారనే అనుకోవాలి. -
తిరుగుబాటు
శ్రీకాకుళంఅంతన్నారు.. ఇంతన్నారుడీఎస్సీపై డోలాయమానం కొనసాగుతోంది. అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారు. –8లోతొమ్మిది నెలల్లోనేమంగళవారం శ్రీ 4 శ్రీ మార్చి శ్రీ 2025సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కూటమి ప్రభుత్వానికి ఉపాధ్యాయులు షాకిచ్చారు. అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే టీడీపీ, జనసేనకు ఓటమి రుచి చూపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా తమ మనోభావాలకు భిన్నంగా ఎమ్మెల్సీ ఎన్నికను టీడీపీ నాయకులు భుజాన వేసుకోవడాన్ని ఉపాధ్యాయులు జీర్ణించుకోలేకపోయారు. ఇప్పుడు అవకాశం ఇస్తే తమకు ఎదురు లేదని నాయకులు విర్రవీగే అవకాశం ఉంటుందని అంచనా వేశారు. తామేంటో చూపిస్తామంటూ ఎన్నికల్లో ఓట్లేసి గట్టిగా దెబ్బ కొట్టారు. అంచనాలకు తగ్గట్టుగా ‘గాదె’ గెలుపు.. ప్రభుత్వ వ్యతిరేక పవనాల మధ్య ఉపాధ్యాయవ ర్గాల్లో మంచి పట్టు ఉన్న గాదె శ్రీనివాసులునాయు డు బరిలో దిగుతున్నట్టు ప్రకటించినప్పుడే దాదా పు విజయం ఖరారైపోయింది. గతంలో రెండు ఎమ్మెల్సీగా పనిచేసిన తీరు, పీఆర్టీయూ సంఘంలో ఐక్యత, సామాజిక వర్గం తదితర విషయాలు గాదెకు కలిసొచ్చాయి. దానికి తోడు ఎమ్మెల్సీ ఎన్ని కను టీడీపీ, జనసేన ప్రతిష్టాత్మకంగా తీసుకుని, గ్రామ స్థాయి నాయకుడి దగ్గరి నుంచి మంత్రులు వరకు సీరియస్‌గా పనిచేయడం మరింత ప్లస్ అ యింది. ఉపాధ్యాయులను రెచ్చ గొట్టేలా సాధారణ ఎన్నికల మాదిరిగా ప్రచారం చేయడం, తాము మ ద్దతు ఇచ్చిన అభ్యర్థికి ఓటు వేయాలని ఒత్తిడి చేయడం, పోలింగ్ ముందు రోజున ప్రలోభాలకు గురి చేయడం, పోలింగ్ రోజున టీడీపీ నాయకులే శిబిరాలు పెట్టి ప్రభావితం చేసేందుకు ప్రయత్నించడం వంటి అంశాలు గాదె గెలుపునకు దోహదపడ్డాయి. ఓటర్లుగా ఉన్న ఉపాధ్యాయులను ప్రలోభ పెట్టేందుకు టీడీపీ నేతలు ఎంత ప్రయత్నించినప్పటికీ వెనక్కి తలొగ్గలేదు. రఘువర్మ స్వయం కృతాపరాధం ఏపీటీఎఫ్ తరఫున పోటీ చేసిన పాకలపాటి రఘువర్మ ఓటమికి స్వయం కృతాపరాధమే కారణమని నిపుణులు అంటున్నారు. వాస్తవంగా ఏపీటీఎఫ్ బలమైన సంఘం. ఉత్తరాంధ్రలో ఓటర్లు ఎక్కువగానే ఉన్నారు. కానీ, టీడీపీ, జనసేన మద్దతుతో పోటీ చేయాలనుకోవడమే ఆయన కొంప ముంచిందనే వాదనవినిపిస్తోంది. వాస్తవంగా, రఘువర్మ సౌమ్యుడనే అభిప్రాయం ఉంది. పార్టీలతో సంబంధం లేకుండా ఏపీటీఎఫ్ తరఫునే పోటీ చేసి ఉంటే బాగుండేదని, కానీ, ఆయన టీడీపీతో కలవడంతో అప్రతిష్టను మూటగట్టుకున్నారని అంటున్నారు. వాస్తవంగా టీడీపీ మద్దతుతో పోటీ చేయాలన్న ఆసక్తి ఏపీటీఎఫ్ నాయకుల్లో చాలా మందికి లేదు. తొలుత కొందరు వ్యతిరేకించినట్టుగా కూడా తెలిసింది. అయితే అధికారంలో ఉన్న పార్టీలు తమ వెంట ఉన్నాయని, గెలుపు సాధ్యమవుతుందని హితబోధ చేయడంతో ఏపీటీఎఫ్ నాయకులు సైతం వెనక్కి తగ్గినట్టు తెలిసింది. కానీ ఈ నిర్ణయమే గెలుపు అవకాశాలను తీవ్రంగా దెబ్బ కొట్టింది. కూటమి నాయకులు పరోక్షంగా మద్దతు ఇస్తారనుకుంటే.. టీడీపీ, జనసేన నాయకులే మొత్తం ఎన్నిక ప్రక్రియను హైజాక్ చేసేశారు. తమ పార్టీ అభ్యర్థిలా రంగంలోకి దిగిపోయారు. గ్రామ స్థాయి నాయకుల దగ్గరి నుంచి మంత్రులు వరకు పాకలపాటి రఘువర్మ కోసం నడుంబిగించారు. దీంతో ఎన్నిక ఉపాధ్యాయ సంఘాల మధ్య కాకుండా టీడీపీతో జరిగిన ఎన్నికలా మారిపోయింది. చివరికి పోలింగ్ రోజున ఓటర్లను ప్రభావితం చేసేలా శిబిరాలు ఏర్పాటు చేయడం, వాటిలో ఉపాధ్యాయ సంఘ నాయకుల కంటే టీడీపీ నాయకులే ఎక్కువగా ఉండటంతో చర్చనీయాంశమైంది. ఇదే టీచర్లను ఆలోచించేలా చేసింది. ఎన్నికల్లో ప్రభావితం చేసిన అంశాలివే.. మంచి ఐఆర్ ఇస్తానని, రివర్స్ పీఆర్సీ కాకుండా మంచి పీఆర్సీ ఇస్తానని చంద్రబాబు చెప్పడంతో సాధారణ ఎన్నికల్లో ఉపాధ్యాయులు అనుకూలంగా వ్యవహరించారు. కానీ అధికారంలోకి వచ్చాక పీఆర్సీ మాట దేవుడెరుగు, ఆ వేతన సవరణ సంఘానికి కనీసం చైర్మన్‌ను నియమించలేదు. ఈ ప్రభుత్వం న్యూస్రీల్సర్కారుకు టీచర్ల బెత్తం దెబ్బ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన గాదె శ్రీనివాసులనాయుడు స్వయంకృతాపరాధంతో ఓటమిపాలైన పాకలపాటి రఘువర్మ ఎన్నికల్లో ప్రభావం చూపించిన టీడీపీ ప్రజా వ్యతిరేక విధానాలు ప్రభుత్వం హామీలను విస్మరించడంపై తీవ్ర అసంతృప్తిలో ఉపాధ్యాయులు స్వరం మార్చిన టీడీపీ.. పాకలపాటి రఘువర్మ ఎన్నికను భుజానికి ఎత్తుకున్న టీడీపీ తాజా ఓటమితో స్వరం మార్చింది. తాము ఇక్కడ పోటీ చేయలేదని.. చెప్పుకుంటూనే ఎదురైన ఓటమిని దూరం పెడుతోంది. గెలిస్తే మా వోడు.. ఓడితే కాని వాడు అని చెప్పుకునే ప్రయత్నంలో పడింది. సాక్షాత్తూ జిల్లా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఎమ్మెల్సీ ఎన్నికపై స్పందిస్తూ తాము పోటీ చేయలేదని.. పాకలపాటి రఘువర్మకు మొదటి ప్రాధాన్యత ఓటును గాదె శ్రీనివాసులు నాయుడుకు రెండో ప్రాధాన్యత ఓటును వేయా లని చెప్పామంటూ మాట మార్చారు. ఒక అభ్యర్థిని గెలిపించమంటూనే మరో అభ్యర్థిని కూడా గెలిపించండని అంతర్గంతగా చెప్పుకోవడాన్ని ఏమనుకోవాలో వారికే తెలియాలని... ఓటమిని స్వాగతించాలే తప్ప గెలుపు దరి చేరకపోవడంతో మాటమార్చడం సిగ్గుచేటని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి. -
అటు సిండికేటు.. ఇటు అదనపు రేటు
మందు బాబులకు ఝలక్సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలో మద్యం దోపిడీకి అధికార పార్టీ నాయకులు తెర తీశారు. ఒకనేత అంతా తానై వ్యవహరించి, సిండికేట్‌కు నాయకత్వం వహించి, పలాస నియోజకవర్గంలో వసూళ్లకు శ్రీకారం చుట్టారు. కీలక నేతకు ముడుపులు ఇచ్చేందుకు ఒప్పందం జరగడంతో ఎమ్మార్పీకి మించి విక్రయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. క్వార్టర్ బాటిల్‌పై రూ.10 అదనంగా వేసి షాపుల్లో విక్రయిస్తున్నారు. 2014–19 పరిస్థితులు పునరావృతం ఎమ్మార్పీకి మించి మద్యం విక్రయాలు జరపడం కొత్తేమీ కాదు. 2014–19 టీడీపీ హయాంలో బరితెగించి విక్రయాలు చేపట్టారు. ఒక్కో బాటిల్‌పై రూ.20 నుంచి రూ.50 వరకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. అప్పట్లో ఎమ్మార్పీకి మించి చేపట్టిన విక్రయాలపై మద్యం బాబుల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇంట్లో డబ్బు అంతా మద్యానికి పోసేస్తున్నారని మహిళలు ఆందోళన చేశారు. అప్పట్లో లిక్కర్ వ్యాపారులు భారీగా సంపాదించారు. అందులో కొంత నేతలకు ముట్ట జెప్పారు. అది జిల్లా ప్రజలందరికీ తెలిసిన విషయమే. మళ్లీ ఇప్పుడా పరిస్థితులు పునరావృతమవుతున్నాయి. ఇప్పటికే బెల్ట్‌షాపులు విచ్చలవిడిగా వెలిశాయి. అదే తప్పు అని గగ్గోలు పెడుతుంటే, ఇప్పుడు ఎమ్మార్పీకి మించి విక్రయాలు మొదలయ్యాయి. పలాస నియోజకవర్గంలో తొలుత శ్రీకారం చుట్టారు. ఇప్పుడది జిల్లా అంతా పాకే పరిస్థితి కనబడుతోంది. చక్రం తిప్పిన నాయకుడు.. మద్యం షాపులను దక్కించుకున్న ఓ నాయకుడు కీలకంగా వ్యవహరించి, సిండికేట్‌ను ఏర్పాటు చేసి, అందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చారు. ఎవరికెంత ముడుపులు ఇవ్వాలో డిసైడ్ చేసి, తదనుగుణంగా కీలక నేతకు జరిగినదంతా చెప్పి, ఎమ్మార్పీకి మించి విక్రయాలకు తలుపులు తెరిచారు. ఏకంగా ఎకై ్సజ్ పరిధిలో నిర్ణయాన్ని అమలు పరిచారు. ప్రస్తుతానికి ఒక్కో క్వార్టర్ బాటిల్‌పై రూ.10 పెంచి విక్రయిస్తున్నారు. మున్ముందు ఈ పెంపు మరింత పెరగనుంది. జిల్లాలో తొలుత పలాస నియోజకవర్గం, సర్కిల్ పరిధిలోనే ప్రారంభించారు. కీలక నేత అండదండలతో ముందుకెళ్తున్నారు. మొదలైన మద్యం దోపిడీ ఒక్కో బాటిల్‌పై రూ.10 అదనపు వడ్డన పలాస నియోజకవర్గంలో శ్రీకారం సిండికేట్‌ను తయారు చేసిన ఓ నాయకుడు కీలక నేత అంగీకరించడంతో ఎమ్మార్పీకి మించి విక్రయాలకు గ్రీన్ సిగ్నల్ -
భారీగా ముడుపులు
ఎమ్మార్పీకి మించి విక్రయాలు జరుపుకోవడానికి గ్రీన్ సిగ్నల్ రావడంతో భారీగా ముడుపులు వెళ్తున్నాయి. స్థానిక, మండల, నియోజకవర్గ స్థాయి మేరకు అడ్డు తగలకుండా ఉండేందుకు కాసుల పంపకాలు చేశారు. ఈ నెలలో తొలి విడత ముడుపులు అందనున్నాయి. వ్యాపారం టర్నోవర్ చూసి ఈ ముడుపులు పెరిగే అవకాశం ఉంది. తక్కువ ధరలకు నాణ్యమైన మద్యం అందిస్తామనే హామీతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం దశల వారీగా తన కార్యాచరణ అమలు చేస్తోంది. ఇప్పటికే ఽఅధికారికంగా ధరలు పెంచి మద్యం బాబులకు వాత పెట్టింది. ఇప్పుడా అధికారిక ధరలకు రూ.10 పెంచి విక్రయిస్తూ మందు బాబులకు మరింత షాక్ ఇచ్చింది. -
సునీల్‌కుమార్‌పై కక్ష సాధింపు సరికాదు
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌ను అకారణంగా రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేయడం సరికాదని అంబేడ్కర్ ఇండియా మిషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తైక్వాండో శ్రీను అన్నారు. అక్రమ సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరుతూ శ్రీకాకుళంలో ఎయిమ్, దళిత సంఘాల జేఏసీ నాయకులు సంయుక్తంగా సోమవారం శాంతియుత నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా శ్రీను మాట్లాడుతూ దళిత సీనియర్ ఐపీఎస్ అధికారిపై వేధింపులను ప్రభుత్వం ఆపాలని డిమాండ్ చేశారు. కక్ష సాధింపు చర్యలను మానుకోవాలని కోరారు. దళిత సంఘాల జేఏసీ కన్వీనర్ డాక్టర్ కంఠ వేణు మాట్లాడుతూ ముందస్తు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లారన్న కారణం చూపిస్తూ ఆయనను సస్పెండ్ చేయడం వెనుక కుట్రకోణం దాగి ఉందని ధ్వజమెత్తారు. చంద్రబాబు సీఎం అయిన నాటి నుంచి ఆయనను పథకం ప్రకారం పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టి, నెలల తరబడి వీఆర్ లోనే ఉంచుతూ వస్తున్నారని పేర్కొన్నారు. ఇదే పంథాలో కూటమి ప్రభుత్వం కొనసాగితే దళితజాతి ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో అంబేడ్కర్స్ ఇండియా మిషన్, దళిత సంఘాల జేఏసీ నాయకులు యజ్జల గురుమూర్తి, పురుషోత్తం, రాంబాబు, పెయ్యల చంటి, భూషణ్, అబ్బాస్, కొత్తూరు సత్యనారాయణ, సుంకు రమణ తదితరులు పాల్గొన్నారు. -
గంజాయితో నలుగురు అరెస్టు
కాశీబుగ్గ: పలాస రైల్వేస్టేషన్ సమీపంలో సోమవారం నలుగురు యువకులు వేర్వేరుగా 27 కేజీల గంజాయితో పట్టుబడ్డారు. కాశీబుగ్గ డీఎస్పీ వెంకట అప్పారావు, సీఐ సూర్యనారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశా రాష్ట్రం నుంచి వివిధ రాష్ట్రాలకు గంజాయిని తరలించేందుకు పలాస రైల్వేస్టేషన్‌ను కేంద్రంగా చేసుకున్నట్లు పోలీసులకు ముందస్తు సమాచారం వచ్చింది. దీంట్లో భాగంగా అనుమానితులను గుర్తించి పట్టుకున్నారు. వారిలో మహారాష్ట్రకు చెందిన ప్రకాశ్ నరేంద్ర బెహరా, కేరళకు చెందిన కన్ను మహీన్, షాజహాన్ హుస్సేన్, పితార్ బీరాల ఉన్నారు. వారి వద్ద 6 కేజీలు, 21 కేజీల గంజాయి వేర్వేరుగా స్వాధీనం చేసుకున్నారు. అలాగే ద్విచక్ర వాహనం, రెండు సెల్ఫోన్లు సీజ్ చేశారు. -
ఆదిత్యలో గోకార్టింగ్ చాంపియన్‌షిప్ పోటీలు
టెక్కలి: స్థానిక ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సృజనకు పదును పెట్టనుంది. కాలేజీలో మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు గోకార్టింగ్ చాంపియన్‌షిప్ సీజన్–2 పోటీలను నిర్వహించనున్నారు. ఈ మేరకు కళాశాల డైరెక్టర్ వీవీ నాగేశ్వరరావు సోమవారం వివరాలు వెల్లడించారు. దేశ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల నుంచి సుమారు 17 బృందాలుగా 500 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు వెల్లడించారు. ఎండ్యూరెన్స్, ఇన్నోవేషన్, బిజినెస్ ప్లాన్, స్కిడ్ప్యాడ్, ఆటోక్రాస్ విభాగాలపై ఏర్పాటు చేస్తున్న ఈ పోటీల్లో పెట్రో ఆధారితమైన 11, ఎలక్ట్రికల్ ఆధారితమైన 6 బృందాలు పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు రూ.4 లక్షల విలువైన నగదు బహుమతులు అందజేయనున్నట్లు వెల్లడించారు. ఆటోమొబైల్ రంగంలో నూతన ఆవిష్కరణలపై విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇలాంటి పోటీలు నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ నాగేశ్వరరావు పేర్కొన్నారు. -
337 మంది గైర్హాజరు
● సీనియర్ ఇంటర్ పరీక్షలు ప్రారంభం శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో సీనియర్ ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయి. ఈ నెల ఒకటో తేదీన ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం కాగా.. సోమవారం నుంచి ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రారంభమయ్యాయి. సెట్–1 ప్రశ్న పత్రంతో తెలుగు, సంస్కృతం, హిందీ, ఒరియా పేపర్లకు పరీక్ష రాశారు. జిల్లా వ్యాప్తంగా 75 పరీక్ష కేంద్రాల్లో జరుగుతున్న పరీక్షలకు రెండోరోజు మొత్తం 18,782 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 18,445 మంది పరీక్ష రాశారు. వివిధ కారణాలతో 337 మంది గైర్హాజరయ్యారు. తనిఖీలు ముమ్మరం జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియెట్ పరీక్ష కేంద్రాలను అధికారులు చుట్టుముడుతున్నారు. జిల్లా స్పెషల్ ఆఫీసర్, డీవీఈఓ శివ్వాల తవిటినాయుడు జిల్లాలోని పొందూరు మండల పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, సిస్టమ్ జూనియర్ కళాశాల, కింతలి ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. డీఈసీ కమిటీ సభ్యులతో కలిసి ఆర్ఐఓ ప్రగడ దుర్గారావు పరీక్షకు ముందు శ్రీకాకుళం నగరంలోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌ను సందర్శించారు. అలాగే నగరంలోని చైతన్య సహకార జూనియర్ కాలేజ్, శాంతినికేతన్ జూనియర్ కళాశాల కేంద్రాలను తనిఖీ చేశారు. రెండోరోజు పరీక్షల్లో ఎలాంటి మాల్‌ప్రాక్టీసు కేసులు నమోదుకాలేదు. -
ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించండి
ఎచ్చెర్ల క్యాంపస్: బీఆర్ఏయూలో తొలగించిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని లేబర్ కోర్టు తీర్పునిచ్చింది. ఈ మేరకు తీర్పు ప్రతిని ఫిర్యాదుదారులకు సోమవారం అప్పగించింది. వివరాల్లోకి వెళ్తే.. వర్సిటీలో 2024 జనవరి 1వ తేదీన 34 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను అప్పటి వీసీ నిమ్మ వెంకటరావు నియమించారు. అయితే ఏడాది పూర్తయిన నేప థ్యంలో డిసెంబర్ 31వ తేదీన వీరిని తొలగించారు. వారంతా తమను అన్యాయంగా తొలగించారని లేబర్ కోర్టులో ఫిర్యాదు చేశారు. దీంతో వర్సిటీ అధికారులు, తొలగించిన ఉద్యోగులు, ఏజీఎన్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలతో పలుమార్లు చర్చలు జరిపారు. దీనిపై జనవరి 8, 23, ఫిబ్రవరి 7, 15, 24, 25 తేదీల్లో కోర్టు విచారణ నిర్వహించి, అనంతరం సోమవారం ఉత్తర్వుల ప్రతిని ఫిర్యాదుదారులకు అందజేసింది. కక్షతో తొలగింపు..? బాధిత అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మాట్లాడుతూ.. తమకు నోటీసులు ఇవ్వకుండా తొలగించారని, కనీసం మూడేళ్లు కొనసాగించాలని కోరారు. వర్సిటీ అధికారులు కేవలం కక్షతో తొలగించారని, అనంతరం అనేక మందిని ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా నియమించుకున్నారని ఫిర్యాదు చేశారు. వర్సిటీ అధికారుల తరుపున కాంట్రాక్టు అధ్యాపకులు పద్మారావు, జూనియర్ అసిస్టెంట్ రాధిక హాజరయ్యారు. ప్రతిఏటా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెన్యూవల్ చేస్తారన్నారు. అయితే వారి సేవలు సంతృప్తిగా లేవని, నియామకాలు సక్రమంగా లేకపోవడంతో తొలగించామని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో తాము రాజీకి ప్రయత్నించామని లేబర్ కోర్టు తెలిపింది. చర్చల్లో వర్సిటీ అధికారులు కొనసాగింపునకు ముందుకు రాలేదని, ఉన్నత న్యాయస్థానానికి అపీల్ చేసుకోవాలని ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో తొలగించిన ఉద్యోగులు హైకోర్టులో నడుస్తున్న కేసులో ఈ తీర్పు ప్రతిని చేర్చనున్నట్లు చెప్పారు. కాగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించిన అధికారులు, గత కొన్ని నెలలగా తమకు నచ్చినవారిని ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా రాజకీయ సిఫార్సులు ఆధారంగా నియమించడం చర్చనీయాంశంగా మారింది. మరోపక్క ఒక ప్రజాప్రతినిధి ఇంటి వద్ద పనిచేస్తున్న ఇద్దరికి వర్సిటీ జీతాలు చెల్లిస్తుండడాన్ని పలువురు తప్పు పడుతున్నాయి. లేబర్ కోర్టు సూచన -
హైకోర్టు ఆదేశాలు బేఖాతరు
సంతబొమ్మాళి: హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ మూలపేట పోర్టు యాజమాన్యం ఉప్పు మడుల్లో దౌర్జన్యంగా రోడ్డు నిర్మాణం చేపట్టడం, అడ్డుకున్న ఉప్పు కార్మికులపై దాడి చేయడంతో స్థానికంగా కలకలం రేగింది. నౌపడ సాల్ట్రన్ 1956 ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గత 65 ఏళ్లుగా 375.64 ఎకరాల్లో ఉప్పు సాగును చేస్తున్నారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, నష్టపరిహారం చెల్లించకుండా ఉప్పుమడుల మీదుగా పోర్ట్ యాజమాన్యం రోడ్డు నిర్మాణం చేపడుతున్నారు. ఉప్పు తయారీ యాజమాన్యం, కార్మికులు పోర్టు రోడ్డు నిర్మాణ పనులు అడ్డుకున్నా ఫలితం లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు ఫిబ్రవరి 20వ తేదీన రోడ్డు పనులు ఆపాలని సూచించింది. హైకోర్టు ఆర్డర్ కాపీని జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, ఇతర ఉన్నతాధికారులకు మెయిల్ ద్వారా ఉప్పు కంపెనీ యాజమాన్య ప్రతినిధులు అందజేశారు. హైకోర్టు ఆదేశాలతో ఫిబ్రవరి 21వ తేదీన టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి ఉప్పుసాగు మడుల మీదుగా జరుగుతున్న రోడ్డు పనులను పరిశీలించి నిర్మాణ పనులు ఆపాలని పోర్టు యాజమాన్యానికి తెలియజేశారు. దీంతో వారం రోజుల పాటు రోడ్డు నిర్మాణ పనులను పోర్టు యాజమాన్యం నిలుపుదల చేసింది. కానీ ఫిబ్రవరి 28వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి నుంచి రోడ్డు నిర్మాణ పనులను పోర్టు యాజమాన్యం శరవేగంగా చేపట్టింది. దీంతో శనివారం రోడ్డు పనులను ఉప్పు కార్మికులు, కంపెనీ యాజమాన్య ప్రతినిధులు అడ్డుకున్నారు. దీంతో పోర్టు సిబ్బంది ఉప్పు కార్మికులపై దాడి చేసి వారి వద్ద ఉన్న సెల్ఫోన్లను తీసుకొని తిరిగి తమపైనే దాడి జరిగిందంటూ ఫిర్యాదు చేశారు. దీంతో ఆ రాత్రి ఉప్పు తయారీ యాజమాన్య సిబ్బందిని పోలీసుస్టేషన్‌కు తీసుకు వచ్చి కొన్ని గంటల తర్వాత విడిచి పెట్టారు. దీంతో వారు భయపడి సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. ఈ విషయాన్ని ఏ అధికారికి చెప్పినా పట్టించుకోవడం లేదని ఉప్పు తయారీ యాజమాన్యం వాపోతోంది. ఉప్పు మడుల్లో రోడ్డు వేయడం వల్ల ఉప్పు సాగు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. దౌర్జన్యంగా ఉప్పు మడుల్లో రోడ్డు నిర్మించిన పోర్టు యాజమాన్యం అడ్డుకున్న ఉప్పు కార్మికులపై దాడి -
కర్కశంగా..!
కమ్మల కోసం.. నరసన్నపేట: స్థానిక బొంతలవీధికి చెందిన కేవిటి గున్నమ్మ (85) సోమవారం వేకువజామున దారుణ హత్యకు గురైంది. స్థానికులు, వృద్ధురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. వీధిలో ఇళ్ల ముందు పూలు మొక్కల నుంచి పూలు సేకరించి స్థానిక సత్యనారాయణ గుడి వద్ద భక్తులకు అమ్ముతూ గున్నమ్మ జీవనం సాగించేది. గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఆమెకు ఈ పని నిత్యకృత్యమైంది. దీనిలో భాగంగా ఎప్పటిలాగే సోమవారం వేకువజామున పూలు సేకరించి ఇంటి వద్ద నుంచి సత్యనారాయణస్వామి ఆలయానికి వస్తుండగా, గుర్తు తెలియని వ్యక్తులు ముక్కు కమ్ముల చోరీకి ప్రయత్నించారు. ఈ సందర్భంగా కొంత పెనుగులాట జరిగినట్లు తెలుస్తోంది. గున్నమ్మ ఇంటి నుంచి ఆలయం వరకూ పూలు రోడ్డుపై పడి ఉన్నాయి. అలాగే ఆమె వస్త్రాలు ఆలయం ముందు పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి సుమారు మూడు వందల మీటర్ల దూరంలో మృతదేహం గుర్తించారు. చెడు వ్యసనాలే హత్యకు కారణం..? కాగా పలుచోట్ల ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలో కదలికల ఆధారంగా స్థానిక పురుషోత్తం నగర్‌కు చెందిన ఒక పాత నేరస్తుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చెడు వ్యసనాలకు బానిసైన ఒక 20 ఏళ్ల యువకుడు చేసిన పనిగా భావిస్తున్నారు. మద్యం మత్తులో ఈ చర్యలు పాల్పడినట్లు ఉంటాడని అభిప్రాయపడుతున్నారు. నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. వృద్ధురాలి హత్యపై ఆమె కుమారుడు కేవిటి సూర్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నరసన్నపేట సీఐ జె.శ్రీనివాసరావు కేసు నమోదు చేశారు. ఈడ్చుకెళ్లి హత్య..? ఆలయం వద్ద నుంచి వివస్త్ర ఉన్న వృద్ధురాలిని ఈడ్చుకెళ్లి కామేశ్వరి నగర్ వద్ద ఒక మారుమూల రోడ్డుపై వదిలేశారు. వీపు అంతా బాగా గాయాలై ఉన్నాయి. ఆలయం నుంచి మృతదేహం ఉన్న స్థలం వరకు పలుచోట్ల రక్తం మరకలను పోలీసులు గుర్తించారు. ఉదయం అటుగా వెళ్లినవారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మద్యం మత్తులో ఉన్న నిందుతుడు వృద్ధురాలిపై అత్యాచారం కూడా చేశాడనే అనుమానం వ్యక్తమవుతోంది. మృతదేహం ఉన్న స్థితిని చూసిన స్థానికులు ఈవిధంగా అనుమానిస్తున్నారు. దీంతో ఘటనా స్థలాన్ని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి స్వయంగా పరిశీలించారు. కేసును త్వరితగతిన దర్యాప్తు చేసి, నిందితులను పట్టుకోవాలని అధికారులను ఆదేశించారు. అంతకు ముందు జిల్లా అదనపు ఎస్పీ (క్రైమ్) శ్రీనివాసరావు, టెక్కలి డీఎస్పీ మూర్తిలు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. వృద్ధురాలి దారుణ హత్య గున్నమ్మ(ఫైల్) -
అంతన్నారు.. ఇంతన్నారు..!
● సీఎం తొలి సంతకంపై డోలాయమానం ● ప్రకటనలకే పరిమితమవుతున్న డీఎస్సీ ● ఎదురుచూస్తున్న అభ్యర్థులు పండిట్ పోస్టులు అప్‌గ్రేడ్ చేయడం, 117 జీవో రద్దు చేయడం వలన దాదాపు 32 వేల మంది మిగులు ఉపాధ్యాయులు ప్రస్తుతం ఉన్నట్లు తేలింది. శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తే 463 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇందులో 280కి పైగా స్కూల్ అసిస్టెంట్లు పోస్టులు, 175 ఎస్జీటీ పోస్టులు భర్తీ చేయనున్నట్లు చెప్పారు. అయితే జిల్లాలో 473 మంది స్కూల్ అసిస్టెంట్లు, 1000 మందికి పైగా ఎస్జీటీలు మిగులుగా ఉండగా, పండింట్ పోస్టులు అప్‌గ్రేడేషన్ తర్వాత 450 మంది వరకు పండింట్లు డీఈవో పూల్‌లో ఉన్నారు. వీరంతా మిగులుగా ఉన్నప్పుడు డీఎస్సీ పోస్టులు ఎలా భర్తీ చేస్తారనేది సందేహాస్పదం.శ్రీకాకుళం: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు తొలి సంతకం పెట్టిన డీఎస్సీపై డోలాయమానం కొనసాగుతోంది. అదిగో డీఎస్సీ అంటూ ఎప్పటికప్పుడూ ప్రభుత్వ పెద్దలు చెబుతున్నా, స్పష్టమైన ప్రకటన లేకపోవడంతో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలనుకునే నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది. 16,700 పోస్టులు భర్తీ చేస్తామని ఎప్పుడో ప్రకటించినా, ఇంకా విధివిధానాలు ఖరారవ్వకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గందరగోళం 117 జీవోను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వలన పాఠశాల విద్యలో గందరగోళం నెలకొంది. హైస్కూల్లో 3, 4 తరగతులు తీసివేయడం వలన స్కూల్ అసిస్టెంట్లు సర్‌ప్లస్‌గా ఉండిపోయారు. ప్రాథమికోన్నత పాఠశాల వ్యవస్థనే ఎత్తివేయాలి యోచిస్తూ ఉండడం వలన 1,360 మంది ఎస్జీటీలు సర్ప్లస్ కానున్నారు. కొందరు అధికారులు మాత్రం సర్‌ప్లస్‌గా ఉన్నవారిని మోడల్ ప్రాథమిక పాఠశాలల్లో నియమిస్తామని, అందువలన డీఎస్సీలో పోస్టులు యధాతథంగా భర్తీలు జరుగుతాయని చెబుతుండటం విశేషం. ఇప్పటికే ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో 60 మంది విద్యార్థులుంటే తరగతికి ఒకరు చొప్పున 5 గురు ఎస్జీటీలను, 120 మందికి పైగా విద్యార్థులుంటే ఐదుగురు ఎస్జీటీలతో పాటు ఒక ప్రధానోపాధ్యాయున్ని నియమిస్తామని ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే మోడల్ ప్రాథమిక పాఠశాలల్లో 60 మంది విద్యార్థులుండేందుకు సంయుక్త పాఠశాలల విలీనం కూడా ప్రభుత్వం నిర్ణయించింది. వీటన్నంటినీ బేరీజు వేసుకంటే 100 మంది వరకు స్కూల్ అసిస్టెంట్లు, 500 వరకు ఎస్జీటీలను మోడల్ స్కూళ్లకు తరలించినా, ఇంకా 370 మంది స్కూల్ అసిస్టెంట్లు, 800లకు పైగా ఎస్జీటీలు మిగులుగానే ఉంటారు. ఈ లెక్కన డీఎస్సీ నిర్వహణ ఎలా చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే ప్రభుత్వం మాత్రం వచ్చే విద్యా సంవత్సరంలోగా డీఎస్సీ నిర్వహిస్తామని ప్రకటిస్తోంది. విద్యార్థి, ఉపాధ్యాయుల నిష్పత్తి తగ్గించడం వలన మిగులు ఉపాధ్యాయిలను అక్కడికి తరలించవచ్చని, అటువంటప్పుడు డీఎస్సీ నిర్వహణకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెబుతోంది. నిష్పత్తి తగ్గించినా మిగులు ఉపాధ్యాయులతో ఆయా పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది గానీ, డీఎస్సీ ఎలా నిర్వహిస్తారో ప్రభుత్వ పెద్దలు, రాష్ట్ర అధికారులకు తెలియాలి. ఏది ఏమైనా నిరుద్యోగులు మాత్రం డీఎస్సీ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారనడంలో సందేహం లేదు. -
మానవ సేవే.. మాధవ సేవ
● త్రిదండి చినజీయర్ స్వామీజీ టెక్కలి: మానవ సేవే.. మాధవ సేవ అని త్రిదండి చినజీయర్ స్వామీజీ అన్నారు. వికాస తరంగిణి ఆధ్వర్యంలో టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో శ్రీరామ పాదుకా పట్టాభిషేకం ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భగవంతుడి సేవ దగ్గర ప్రతీ ఒక్కరూ ఒదిగి ఉండాలని సూచించారు. మనిషి ఆలోచనల్లో మార్పు తీసుకురావడానికి వికాస తరంగిణి అనేక ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తోందని వెల్లడించారు. ఇందులో భాగంగా మహిళల ఆరోగ్యానికి భద్రత కల్పించే దిశగా ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళల్లో వ్యాపించే క్యాన్సర్‌ను నిరోధించడానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇప్పటివరకు సుమారు 7 లక్షల మంది మహిళలకు వైద్యం చేయించామన్నారు. అనంతరం శ్రీరామ పాదుకా పట్టాభిషేకం విశిష్టత గూర్చి ప్రసంగించారు. కార్యక్రమంలో వికాస తరంగిణి ప్రతినిధి వర్మ, లమ్మత మధు, జి.చంద్రశేఖర్, జి.రమేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇద్దరు వ్యక్తులకు గాయాలు
మెళియాపుట్టి: మండలంలోని చాపర నుంచి మెళియాపుట్టికి వెళ్లే రహదారిలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఒడిశాలోని లావణ్యకోట గ్రామానికి చెందిన జగన్ అనే యువకుడు కుటుంబంతో సహా మెళియాపుట్టి వైపు ద్విచక్ర వాహనంపై ఒక శుభ కార్యానికి వెళ్తున్నాడు. అదే సమయంలో చాపర వైపు బైక్‌పై వెళ్తున్న యువకుడు వేగంగా వచ్చి ఢీకొనడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. అయితే జగన్ వెనుకన కూర్చున్నవారికి ఎటువంటి గాయాలవ్వకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఢీకొన్న యువకుడు ద్విచక్రవాహనం ఆపకుండా వెళ్లిపోయాడు. స్థానికులు 108 ద్వారా పీహెచ్‌సీకి తరలించారు. కుటుంబ సభ్యులు వచ్చి అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. స్థానిక పోలీసులకు దీనిపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని తెలుస్తోంది. -
సీనియార్టీ జాబితా సిద్ధం
● ఈనెల 10వ తేదీలోగా అభ్యంతరాల స్వీకరణ శ్రీకాకుళం న్యూకాలనీ: విద్యాశాఖ భవిష్యత్తులో నిర్వహించే బదిలీలు/పదోన్నతులకు సంబంధించి తొలి అడుగు పడింది. ఈ మేరకు సీనియార్టీ జాబితాను రూపొందించింది. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, తత్సామానమైన ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితా సిద్ధమైంది. ఈ జాబితాను విద్యాశాఖ అధికారిక వెబ్సైట్లో సిద్ధంగా ఉంచినట్టు డీఈవో డాక్టర్ ఎస్.తిరుమల చైతన్య పేర్కొన్నారు. ఉపాధ్యాయ సమాచార వ్యవస్థ (టీఐఎస్) ఆధారంగా రూపొందించిన సాధారణ సీనియార్టీ జాబితాలను శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ వెబ్‌సైట్‌తో పాటు డీఈవో కార్యాలయ నోటీసు బోర్డులో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. కాగా జాబితాపై అభ్యంతరాలను ఈనెల 10వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా లిఖిత పూర్వకంగా కార్యాలయంలో తెలియజేయాలని సూచించారు. అభ్యంతరం చేసే ఉపాధ్యాయుడి పూర్తి పేరు, పదవి, సంబంధిత వివరాలు, ఎంప్లాయి ఐడీ, జాబితాలో తప్పిదం ఎక్కడ ఉందో స్పష్టంగా పేర్కొనడంతో పాటు, అందుకు సంబంధించిన ఆధారాలు లేదా సాక్ష్యాలను జతచేయాలని స్పష్టం చేశారు. గడువు తేదీ తర్వాత వచ్చే అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవడం జరగదన్నారు. మరిన్ని వివరాలకు 90009 07101, 85558 20983, 81341 42450 నంబర్లను సంప్రదించాలన్నారు. హుండీ ఆదాయం రూ.8.58 లక్షలు జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగేశ్వరుని తాత్కాలిక హుండీ ఆదాయం రూ.8,58,795లు వచ్చిందని ఆలయ ఈవో పి.ప్రభాకరరావు సోమవారం తెలిపారు. ఆలయ అధికారులు, అర్చకులు, భక్తుల సమక్షంలో ఈ హుండీ ఆదాయం లెక్కించారు. ప్రత్యేక దర్శనం ద్వారా రూ.2,00,260లు, కేశఖండన ద్వారా రూ.1,560లు, స్థల పురాణం ద్వారా రూ.2,320లు, ఫొటోల అమ్మకం ద్వారా రూ.530లు, పులిహోర ద్వారా రూ.1,03,440లు, హుండీ కానుకల రూపంలో రూ.4,76,185లు, ఇతరుల ద్వారా రూ.74,500లు కలిపి మొత్తం రూ.8,58,795లు వచ్చిందన్నారు. కాగా గతేడాది రూ.7,55,558లు వచ్చాయి. కార్యక్రమంలో కొమనాపల్లి సత్యసాయి సేవా సంఘం అధ్యక్షుడు పైడిశెట్టి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. జాతీయ సెమినార్‌కు ఆహ్వానం హిరమండలం: మండలానికి చెందిన ఉపాధ్యాయుడు ముద్దాడ బాలరాజుకు అరుదైన గౌరవం దక్కింది. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ నిర్వహించే రెండు రోజుల జాతీయ సెమినార్‌కు ఆహ్వానం అందిందని దుర్భలాపురం గ్రామానికి చెందిన బాలరాజు సోమవారం తెలిపారు. తన సేవలను గుర్తించిన యూజీసీ ప్రత్యేకంగా ఆహ్వానించడం విశేషం. అలాగే గూనభద్ర గ్రామానికి చెందిన విద్యావేత్త అంపిలి ప్రశాంత్‌కుమార్‌కు సైతం ఆహ్వానం అందింది. ఈనెల 6, 7 తేదీల్లో గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈ సెమినార్ జరగనుంది. ఈ ఇద్దరూ ఆ సెమినార్‌ను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రణస్థలం ఏజెన్సీకి బాధ్యతలు పొందూరు: పట్టణంలో ఉన్న ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ బాధ్యతలను రణస్థలం గ్యాస్ ఏజెన్సీకి తహసీల్దార్ ఆర్.వెంకటేష్ రామానుజులు సోమవారం అప్పగించారు. గ్యాస్ బండపై బిల్లు కంటే అదనంగా వసూళ్లు చేస్తున్న విషయంపై పొందూరులో పలువురు మహిళలు కలెక్టర్‌కు ఇటీవల ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. డీఎస్వో జి.సూర్యప్రకాష్, తహశీల్దార్ ఆర్.వెంకటేష్ విచారణ జరిపారు. విచారణలో రూ.40 నుంచి రూ.50ల వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు నిరూపణ కావడంతో చర్యలు తీసుకున్నారు. గోడౌన్లో స్టాక్‌ను నమోదు చేసి రణస్థలం ఏజెన్సీకి అప్పగించారు. కార్యక్రమంలో వీఆర్వోలు ఈశ్వరరావు, శంకరరావులు పాల్గొన్నారు. -
రమ్య తిరుమలను సందర్శించిన చిన్నజీయర్ స్వామి
శ్రీకాకుళం కల్చరల్: అరసవల్లి రోడ్డులోని రమ్య తిరుమల ఆలయాన్ని త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా భక్తులకు అనుగ్రహ భాషణ చేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు కరి రంగనాథ వేణు మాధవాచార్యులు, గిరిజారాణి, దుర్గాప్రసాద్, మూర్తి తదితరులు పాల్గొన్నారు. 8, 9 తేదీల్లో రాయిపూర్లో తెలుగు మహాసభలు పలాస: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయిపూర్లో ఈ నెల 8, 9వ తేదీల్లో ద్వితీయ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నట్టు కమిటీ కన్వీనర్ లండ రుద్రమూర్తి చెప్పారు. ఈ మేరకు ఆదివారం అక్కడి ఆంధ్రా అసోసియేషన్ కార్యాలయంలో సమావేశం నిర్వహించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. సభలకు ఆంధ్రప్రదేశ్ నుంచి పలువురు ప్రముఖులు హాజరవుతున్నారని, తెలుగుదనం ఉట్టిపడేలా కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. తెలుగు మహాసభలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. క్రేన్ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు కంచిలి: జాతీయ రహదారి నుంచి కంచిలిలోకి ప్రవేశించే సర్వీస్ రోడ్డులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి కుడిచేయిని కోల్పోయాడు. బూరగాం గ్రామానికి చెందిన కార్పెంటర్ గుజ్జు కృష్ణారావు, స్నేహితుడు కాయ చలపతిరావు, అతని తల్లి కలిసి ఎన్.ఎం.పురం గ్రామానికి బంధువుల పరామర్శకు ఆదివారం వెళ్లారు. వారిద్దరూ అక్కడే ఉండిపోవడంతో కృష్ణారావు నడుచుకుంటూ కంచిలి వైపు వస్తుండగా, వెనుక నుంచి వచ్చిన క్రేన్ ఢీకొట్టింది. కృష్ణారావు కుడిచెయ్యి పైనుంచి టైరు వెళ్లడంతో నుజ్జునుజ్జయ్యింది. వెంటనే క్షతగాత్రుడిని హైవే అంబులెన్స్‌లో సోంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్చారు. చెయ్యి పూర్తిగా విరిగిపోవడంతో మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నానికి తరలించారు. కాగా, కృష్ణారావును ఢీకొట్టిన వాహనం ఆగకుండా వెళ్లిపోవడంతో హైవేలోని సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. క్రేన్ డ్రైవర్ సింగంశెట్టి శంకరరావు పలాస మండలం బంటుకొత్తూరు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించి కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్ఐ పి.పారినాయుడు తెలిపారు. ఏపీబీఏ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా అశోక్ శ్రీకాకుళం న్యూకాలనీ: బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా మెట్ట అశోక్‌కుమార్ ఎన్నికయ్యారు. విజయవాడలో జరిగిన సంఘ రాష్ట్ర సర్వసభ్య సమావేశంలో శ్రీకాకుళం జిల్లాకు పెద్దపీట వేశారు. జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా నాలుగేళ్ల నుంచి అశోక్‌కుమార్ విశేష సేవలు అందిస్తున్నారు. ఈయన హయాంలో శ్రీకాకుళం వేదికగా అండర్–19, అండర్–17 విభాగాల్లో రెండు రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ టోర్నీలను విజయవంతంగా నిర్వహించి ప్రసంశలు అందుకున్నారు. అశోక్ ఎన్నిక పట్ల జిల్లా బ్యాడ్మింటన్ సంఘ చైర్మన్ ఆర్.రాజేంద్రన్, చీఫ్ ప్యాట్రన్ డాక్టర్ గూడేన సోమేశ్వరరావు, అధ్యక్షుడు కె.సాగర్, సీఈఓ సంపతిరావు సూరిబాబు, శైలానీ, ప్రసాద్, రత్నాజీ హర్షం వ్యక్తంచేశారు. యువతి ఆత్మహత్య కేసులో యువకుడు అరెస్టు సోంపేట: మండలంలోని బారువ కొత్తూరు గ్రామానికి చెందిన వలిశెట్టి తులసి ఇటీవల ఆత్మహత్య చేసుకుంది. దీనికి కారణం తులసితో కలిసి బట్టిగల్లూరు ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఎం.ప్రదీప్ అని మృతురాలి తండ్రి హరికృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. బారువ ఎస్ఐ హరిబాబునాయుడు దర్యాప్తులో భాగంగా ఆదివారం రాత్రి ఎం.ప్రదీప్‌ను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. -
సంతానం కలగలేదన్న మనస్తాపంతో..
వజ్రపుకొత్తూరు రూరల్: మండలంలోని డోకులపాడు గ్రామానికి చెందిన వడ్డి రాజు(32) సంతానం కలగలేదన్న మనస్తాపంతో ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. రాజుకు 12 ఏళ్ల క్రితం రాజ్యంతో వివాహం జరిగింది. పిల్లలు లేకపోవడంతో మానసికంగా కుంగిపోతూ మద్యానికి బానిసయ్యాడు. శనివారం ఎప్పటిలాగే కూలి పనులు చేసుకుని ఇంటికి వచ్చాడు. రాత్రి భోజనం చేసి తన గదిలో పడుకునేందుకు వెళ్లాడు. కుటుంబ సభ్యులంతా నిద్రలో ఉండగా ఇంట్లో ఉన్న సూపర్ వాస్మిన్–33 నూనె తాగేశాడు. చావుబతుకులతో కొట్టుమిట్టాడుతున్న రాజును కుటుంబ సభ్యులు గమనించి వెంటనే పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి శవపంచనామ చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య రాజ్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నిహర్ తెలిపారు. యువకుడు బలవన్మరణం డోకులపాడులో విషాదం -
బీఈడీకి పూర్వ వైభవం!
మంచి నిర్ణయం.. డిగ్రీ ఫైనలియర్ 5వ సెమిస్టర్ పూర్తయ్యింది. ఇంటర్న్‌షిప్ అవుతోంది. వచ్చే విద్యా సంవత్సరంలో బీఈడీలో చేరుతా. మా బ్యాచ్‌తో ఏడాది కాలవ్యవధితో బీఈడీ కోర్సు మొదలైతే చాలా సంతోషమే. రెండేళ్లు క్యాలవ్యవధి అంటే సమయం ఎక్కువ. – టి.శృతి, డిగ్రీ విద్యార్థిని, శ్రీహరిపురం, ఆమదాలవలస రెండేళ్లపై నిరాసక్తత.. ప్రస్తుత పోటీప్రపంచంలో ఎక్కువ కాలవ్యవధితో కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపించడంలేదు. ఈ నేపథ్యంలో ఏడాది కాలవ్యవధితో బీఈడీ కోర్సు తీసుకొస్తే మంచిదే. బీఈడీ కాలేజీలు సైతం పూర్వవైభవం సంతరించుకుంటాయి. – డాక్టర్ కె.సూర్యచంద్రరావు, ప్రిన్సిపాల్, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల(అటానమస్) శ్రీకాకుళం ● దాదాపు దశాబ్దం తర్వాత ఏడాది కాలవ్యవధికి మార్పు! ● వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏడాది వ్యవధితో కోర్సు ● ఎన్సీఈటీ కీలక నిర్ణయం ● రెండేళ్ల బీఈడీ కోర్సులకు ఆదరణ కరువు శ్రీకాకుళం న్యూకాలనీ: దేశంలో, రాష్ట్రంలో టీచర్ ఉద్యోగాలకు కేరాఫ్ అడ్రస్‌గా భావించే శ్రీకాకుళం విద్యార్థులకు తీపికబురు. దశాబ్దకాలం నుంచి రెండేళ్ల వ్యవధితో కొనసాగుతున్న బీఈడీ కోర్సు ఇకపై ఏడాది వ్యవధితో అందుబాటులోకి వచ్చే అవకాశముంది. పూర్వ మాదిరిగానే ఏడాది వ్యవధితో ఈ కోర్సును అందించేందుకు నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ రంగం సిద్ధం చేసింది. అన్నీ అనుకూలిస్తే వచ్చే విద్యా సంవత్సరం(2025–26) నుంచే.. ఒకవేళ సాంకేతిక కారణాలతో జాప్యం జరిగితే 2026–27 నుంచి ఏడాది వ్యవధితో కూడిన బీఈడీ కోర్సును అందుబాటులో తీసుకువచ్చేందుకు కేంద్రప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. మరోపక్క ఏడాది కాలవ్యవధితో బీఈడీ కోర్సులు మొదలైతే సంతోషమేనని బీఈడీ కాలేజీ యాజమాన్యాల ప్రతినిధులు, విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ఎనలేని డిమాండ్.. రాష్ట్రంలో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఒకప్పుడు బీఈడీ కోర్సులకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. సీట్లు దొరక్క తిప్పలు పడేవారు. ప్రజాప్రతినిధుల నుంచి సిఫారసులు చేసినవారూ లేకపోలేదు. మేనేజ్మెంట్ కోటా కింద వేలాది రూపాయలు వెచ్చించి కోర్సులు పూర్తిచేశారు. అయితే 2015–16 నుంచి రెండేళ్ల కాలవ్యవధితో బీఈడీ కోర్సులను తీసుకురావడంతో క్రమేపీ ఆదరణ కరువైంది. దీనికితోడు ప్రస్తుతం సెమిస్టర్స్ విధానం తీసుకురావడం, విపరీతమైన ఫీజులు, ఫీజు రీయింబర్స్మెంట్ లేకపోవడం, టీచర్ ఉద్యోగాల భర్తీ చేయకపోవడం వంటి కారణాలతో బీఈడీ కనుమరుగైన పరిస్థితి దాపురిచింది. ప్రస్తుతం డాక్టర్ బీఆర్‌ఏయూ అనుబంధంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 14 బీఈడీ కాలేజీలు ఉండగా అందులో 880 మంది వరకు చదువుతున్నారు. ఎన్సీటీఈ కీలక నిర్ణయం.. దాదాపు దశాబ్ద కాలం తర్వాత ఏడాది బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) విధానాన్ని తిరిగి పునరుద్ధరించాలని నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్(ఎన్్సీటీఈ) నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల జరిగిన ఎన్సీటీఈ పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంది. అయితే నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) లేక రెండేళ్లు పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) పూర్తి చేసిన విద్యార్థులకు మాత్రమే ఏడాది వ్యవధి బీఈడీ వర్తించనుంది. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఒక ఏడాది బీఈడీ ప్రోగ్రామ్.. జనవరి 11న ఎన్సీటీఈ టీచర్స్ ఎడ్యుకేషన్ రెగ్యులేటర్ గవర్నింగ్ బాడీ సమావేశంలో టీచర్ ట్రైనింగ్ కోర్సులకు సంబంధించిన పలు నిర్ణయాలను ఆమోదించింది. ఇందులో బీఈడీ కోర్సు ఏడాది కాల పరిమితికి సంబంధించి నిర్ణయం చేసింది. ఒక ఏడాది బీఈడీ ప్రోగ్రామ్ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. బీఏ–బీఈడీ, బీకామ్–బీఈడీ, బీఎస్సీ–బీఈడీ కోర్సులను సైతం ఏడాది బీఈడీ ప్రోగ్రాంతో డిగ్రీ కోర్సులను డిజైన్ చేసేందుకు కూడా కసరత్తులు జరుగుతున్నాయి. -
● అలరించిన త్యాగరాజస్వామి కీర్తనలు
జిల్లా కేంద్రంలోని బాపూజీ కళామందిర్లో ఆనందోబ్రహ్మ, స్పిరిట్యువల్ టాబ్లెట్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం త్యాగరాజ స్వామి ధ్యాన ఆరాధన ఉత్సవం ఘనంగా నిర్వహించారు. శృతిలయ సంగీత శిక్షణాలయం, ఆనందో బ్రహ్మ బృందాల త్యాగరాజ కీర్తనలు, సుందరంపల్లి శ్రీనివాస్ శాక్సోపోన్ కచేరి, సుసరాపు లక్ష్మీగణపతి శర్మ బృందం త్యాగరాజ కృతుల గానం, దుంపల ఈశ్వరరావు బృందం త్యాగరాజ కీర్తనలు, పంచరత్న కీర్తనల గోష్టి అలరించాయి. కార్యక్రమంలో స్వాతి సోమనాథ్, శ్రీను, డాక్టర్ మాలతి, స్పిరిట్యువల్ పిరమిడ్ మెడిటేషన్ సీఈవో శ్రీదేవి, మావుడూరు శ్రీనివాస శర్మ, త్రివిక్రమదేవ్ తదితరులు పాల్గొన్నారు. – శ్రీకాకుళం కల్చరల్ -
రైలు ఢీకొని ట్రాక్టర్ డ్రైవర్ మృతి
పాతపట్నం: రైలు ఢీకొని ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పాతపట్నం మండలం రంకిణి పంచాయతీ బగంతర గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ జీబ బాలకృష్ణ(32)ను ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో పాతపట్నం మహేంద్రతనయా నది బ్రిడ్జి సమీపంలో పూరి నుంచి గుణుపూర్ వెళుతున్న రైలు ఢీకొట్టింది. వెంటనే రైలు నిలిపివేసి క్షతగాత్రుడి వద్దకు రైల్వే సిబ్బంది వెళ్లగా ప్రాణం ఉందని తెలుసుకుని, వెంటనే అదే రైలులో పర్లాకిమిడి (ఒడిశా) తీసుకెళ్లారు. స్టేషన్‌కు చేరుకోగానే బాలకృష్ణ మృతి చెందాడు. ఈ విషయాన్ని రైల్వే సిబ్బంది పలాస రైల్వే ఆర్పీఎఫ్కు సమాచారం అందించామని రైల్వే అధికారులు తెలిపారు. బాలకృష్ణ ట్రాక్టర్ డ్రైవర్‌గా జీవనం కొనసాగిస్తున్నాడు. ఇతనికి భార్య జీబ భవాణి, రెండేళ్ల బాబు వర్ధన్ ఉన్నారు. రైలు వస్తున్న సమయంలో ట్రాక్‌పైకి బాలకృష్ణ ఎందుకు వెళ్లాడో తెలియాల్సి ఉంది. పాతపద్ధతిలోనే ‘సాగు’తూ.. వజ్రపుకొత్తూరు రూరల్: సాంకేతిక రంగాన్ని అందిపుచ్చుకొని అన్నింటా యంత్రాలు, మోటార్లను వినియోగిస్తున్న ఈ రోజుల్లో కొంతమంది రైతులు వ్యవసాయంలో ఇప్పటికీ పాత పద్ధతులనే అవలంబిస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. వజ్రపుకొత్తూరు మండలం సీతాపురం గ్రామానికి చెందిన రైతు తమ్మినాన మల్లేశ్వరరావు ఇప్పటికీ పూర్వ పంథానే అనుసరిస్తూ పలు రకాల కూరగాయ పంటలను సాగు చేస్తున్నారు. కేవలం సేంద్రియ ఎరువులను వినియోగిస్తూ పంటకు నీరు పెట్టేందుకు యాతాన్ని ఏర్పాటు చేశారు. అతి తక్కువ పెట్టుబడితో సేంద్రియ వ్యవసాయం చేస్తూ లాభాలను అర్జిస్తున్నాడు. పంట సాగులో ఎలాంటి యంత్రాలు, మోటర్లు గానీ రసాయన ఎరువులను వినియోగించడం లేదు. -
డీఎస్ఓ కార్యాలయంలో వసూళ్ల పర్వం
శ్రీకాకుళం పాత బస్టాండ్: జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో ఇటీవల అవినీతి పెచ్చు మీరింది. ధాన్యం సేకరణ అదనపు లక్ష్యాల సమయంలో మిల్లర్ల నుంచి టార్గెట్లు, ఆర్బీకే నుంచి మిల్లులకు ట్యాగింగ్ పేరిట పెద్ద ఎత్తున వసూళ్లు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌కి సంబంధించి నిర్దేశించిన లక్ష్యాలు పూర్తి కావడంతో.. అదనపు కొనుగోళ్ల కోసం ప్రభుత్వానికి అనుమతులు కోరారు. ఈ మేరకు ప్రభుత్వం ఒక్కో మండలానికి 600 మెట్రిక్ టన్నుల వంతున జిల్లాకు 18,000 మెట్రిక్ టన్నులు అదనపు కొనుగోళ్లకు అనుమతి వచ్చింది. అయితే ఈ సమయంలో డీఎస్ఓ కార్యాలయం నుంచి ట్యాగింగ్ చేయాల్సి ఉంటుంది. రైతు భరోసా కేంద్రం నుంచి మిల్లర్లకు ట్యాగింగ్ చేయాలి. అందుకు గాను ఆ కార్యాలయంలో నరసన్నపేటకు చెందిన ఒక క్లర్క్ భారీగా మిల్లర్స్ నుంచి వసూలు చేస్తున్నట్టు సమాచారం. నేరుగా ఆయన మిల్లర్స్ నుంచి డబ్బులు వసూలు చేయకుండా ఆ ఉద్యోగి అన్నయ్య ఫోన్ పేకు అమౌంట్ వేసి, ఆ స్కీన్‌షాట్ పెట్టిన వారికి మాత్రమే ట్యాగింగ్ చేస్తున్నట్లు మిల్లర్లు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా కార్యాలయ ఖర్చు కోసం ఉన్నతాధికారులకు అందజేయాల్సి ఉంటుందని, ప్రతి మిల్లు నుంచి రూ. 40,000 నుంచి రూ.60 వేల వరకు వసూలు చేస్తున్నట్లు కూడా ఆరోపిస్తున్నారు. ఈ నగదును ప్రభుత్వంలో ఉన్న నాయకులకు, అధికారులకు ఇవ్వాల్సి ఉంటుందని వారు చెబుతుండడం విశేషం. కూటమి ప్రభుత్వానికి అనుకూల వర్గాల మిల్లులకు ఒక రేటు, అనుకూలంగా లేని మిల్లులకు ఒక రేటు తీసుకుని ఇబ్బందులు పెడుతున్నారు. టార్గెట్లు నిర్ణయాల్లో కూడా వివక్ష పాటిస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లాలో ఈ ఏడాది 260 రైస్ మిల్లుల నుంచి ధాన్యాన్ని సేకరిస్తున్నారు. సగటున ఒకరిద్దరు మిల్లర్ల నాయకుల మినహా అందరి నుంచి అధిక మొత్తంలో వసూలు చేసినట్టు మిల్లర్ల అసోసియేషన్ బాహటంగానే విమర్శిస్తోంది. ఈ వసూళ్లు ప్రధానంగా మిల్లర్లకు ఇచ్చే ధాన్యం ఏసీకే ఆధారంగా జరుగుతున్నాయని చెబుతున్నారు. డీఎస్ఓ కార్యాలయంలో నరసన్నపేటకు చెందిన ఆ కా ర్యాలయం కేంద్ర బిందువుగా ఈ వసూళ్లన్నీ చేస్తు న్నారని, ఆయనకు కూటమి ప్రభుత్వంలో ప్రధాన నాయకులతో బంధుత్వం ఉన్నందు వల్ల ఆగడాలు చెల్లుబాటు అవుతున్నాయని మిల్లర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యాలయంలో ఈ ఉద్యోగి అవినీతిపై ఇప్పటికే జాయింట్ కలెక్టర్ దృష్టికి కొంతమంది మిల్లర్లు తీసుకువెళ్లినట్టు తెలిసింది. అయితే ఆయన ఇంతవరకు చర్యలు తీసుకోలేదని మిల్లర్లు చెబుతున్నారు. -
వత్సవలసకు పోటెత్తిన భక్తులు
గార: మండలంలోని చిన్న వత్సవలసలో కొలువున్న రాజమ్మ తల్లి (రాజరాజేశ్వరి) దర్శనానికి మాఘ మాసం నాల్గో వారం ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. శనివారం రాత్రికి గ్రామానికి వచ్చిన భక్తులు సమీప తోటల్లోనూ, ఆరు బయట బస చేశారు. ఉదయం సమీప సముద్రంలో పవిత్ర స్నానాలు ఆచరించి ముందుగా భూలోకమ్మను, అనంతరం రాజరాజేశ్వరి (రాజమ్మతల్లి)ని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ వారం నాటుకోళ్లు, గొర్రెలు సమర్పించడంతో పాటు చిన్నారుల పుట్టుకొప్పులు భక్తులు మొక్కులు ద్వారా చెల్లించారు. ముఖ్యంగా తొలి సంతానాన్ని ఇక్కడికి తీసుకువచ్చి తొలికొప్పు (పుట్టుకొప్పు)ను తీయించి ప్రత్యేకంగా ముడుపులు చెల్లించుకున్నారు. ఈ వారం జాతరకు శ్రీకాకుళం పట్టణ సీఐ పైడపునాయుడు, ఎస్ఐ ఆర్.జనార్ధనరావు ఆధ్వర్యంలో 90 మంది పోలీసులు విధుల్లో పాల్గొన్నారు. శనివారం రాత్రి వేళ కూడా అదనపు భద్రతా చర్యలు చేపట్టగా 15 మద్యం సీసాలతో పట్టుబడినట్టు ఎస్ఐ తెలిపారు. కేసు నమోదు చేశామన్నారు. -
రోగులు, సహాయకులకు ట్రాన్స్‌పోర్టు పట్టించుకోరా..
రోజూ నా విభాగానికి 40 నుంచి 60 మంది వరకు రోగులు చికిత్స కోసం వస్తున్నారు. వీరికి సహాయకులు వస్తున్నారు. రోజువారీ చికి త్స కాబట్టి వీరి రాకపోకలకు వ్యయ ప్రయాసలు తప్పడం లేదు. అందుకే ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు రోగులు, సహాయకుల రాకపోకలకు వీలుగా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసి సహకరిస్తే బాగుంటుందనేది నా సూచన. యాక్సిడెంట్ కేసు లు రోజురోజుకీ పెరుగుతున్నాయి. నడుము నొప్పి, కీళ్ల నొప్పులు, కండరాలు, భుజాల నొప్పులతో బాధ పడేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. వీరందరి కోసమే తగిన బడ్జెట్ కేటాయించి సిబ్బందిని పెంచి.. పరికరాలను అందుబాటులోకి తెస్తారు కదూ. -
మిత్ర ద్రోహం!
కూటమి సర్కారు.. ● వైద్య మిత్రల ఉద్యోగ భద్రతపై నీలినీడలు ● ఆరోగ్యశ్రీని బీమా కంపెనీలకు అప్పగించే కుట్ర ● సర్వీసు పోతుందని సిబ్బంది ఆందోళన ● కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ వజ్రపుకొత్తూరు : కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్) పథకాన్ని బీమా పరిధిలోకి తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. వైద్య మిత్ర శ్రేయస్సు కోరి గత జగనన్న ప్రభుత్వం ఆప్కాస్ ఏర్పాటు చేస్తే దానిని రద్దు చేసే దిశగా ప్రస్తుత రాష్ట్ర సర్కారు అడుగులు వేస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి కొత్త విధానంలో ఎన్టీఆర్ వైద్య సేవ నిర్వహణ కొనసాగుతుందన్న వార్తలు వస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా పని చేస్తున్న 2600 మందికి పైగా వైద్య మిత్రలు, దాని పరిధిలో పని చేసే ఇతర ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగులు తమ మిత్రులని, అన్ని విధాలా అండగా ఉంటామని హామీలు ఇచ్చిన కూటమి నేతలు.. గద్దెనెక్కిన తరువాత తీసుకుంటున్న నిర్ణయాలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆప్కాస్ రద్దుకు కుట్ర: 2008లో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రారంభమైన ఆరోగ్యశ్రీ పథకంలో అప్పట్లో స్థానికతను బట్టి ఉద్యోగులను ఎంపిక చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ విభాగంలో పని చేసిన ఉద్యోగులను ఆప్కాస్( ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్సింగ్ సర్వీసెస్) కిందకు చేర్చారు. వారికి సీఎఫ్ఎంఎస్ ఐడీ ద్వారా ప్రతి నెలా 2న గానీ 5న గానీ జీతాలు ఇచ్చారు. ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కూడా కల్పించారు. సీఎఫ్ఎంఎస్లో వేతనం తీసుకోవడం వల్ల తమ ఉద్యోగాలకు భద్రత ఉంటుందన్న ఆశతో ఇన్నాళ్లూ ఉద్యోగాలు చేసుకుంటూ వచ్చారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవను ప్రైవేటు బీమా కంపెనీలకు అప్పగించే కుట్ర జరుగుతుండటంతో ఉద్యోగ భద్రతపై వైద్య మిత్రలు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో ఇదీ పరిస్థితి.. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 26 వైద్యశాలల్లో 120 మంది వైద్య మిత్రలు పని చేస్తున్నారు. వీరిలో 90 శాతం మంది 17 ఏళ్లుగా సేవలు అందిస్తున్నారు. ఎక్కువ మంది డిగ్రీతో పాటు పీజీలు చేసిన వారూ ఉన్నారు. వైద్యమిత్రలతో పాటు జిల్లాలో ముగ్గురు టీమ్ లీడర్లు, డీసీ ఒకరు, ఆఫీసు అసోసియేట్లు ఇద్దరు, కెమెరా మానిటరింగ్ సిబ్బంది ఇద్దరు పని చేస్తున్నారు. డీఎం పోస్టు మాత్రం ఖాళీగా ఉంది. తమను బీమా కంపెనీల పరిధిలోకి తీసుకొస్తే తమ భవిషత్ ప్రశ్నార్థకంగా మారుతుందని, సర్వీసు నష్టపోతామని వైద్యమిత్రలు వాపోతున్నారు. 17 ఏళ్లుగా సేవలు.. రోగులు వైద్యశాలల్లో చేరినప్పటి నుంచి తిరిగి క్షేమంగా ఇంటికి చేరుకునే వరకు వైద్య మిత్రలు పర్యవేక్షిస్తుంటారు. పేద రోగులకు అవసరమైన సమాచారాన్ని అందిస్తూ సేవలు అందిస్తుంటారు. వీరితో పాటు ఉద్యోగులు, జర్నలిస్ట్‌ల హెల్త్ కార్డులు, ఆరోగ్య రక్ష స్కీమ్‌కు సంబంధించి వివరాలు తెలియజేస్తుంటారు. ఇలా అన్ని విభాగాల్లో 17 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల వయసు కూడా చాలా మందికి 50 ఏళ్లు దాటింది. ఆరోగ్యశ్రీ ప్రైవేటు చేతుల్లోకి వెళితే ఎవరిని ఉంచుతారో..? ఎవరిని తొలగిస్తారో..? ఆందోళనగా ఉందని, ఈ వయసులో వేరే ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఆస్పత్రులు 26 పీహెచ్‌సీలు 76 సీహెచ్‌సీలు 13 ఏరియా ఆస్పత్రులు 2 జిల్లా వైద్యశాలలు 2 ప్రైవేటు, ఇతర వైద్యశాలలు 50 వైద్య మిత్రలు 120 టీమ్‌లీడర్లు 03 ఆఫీస్ అసోసియేట్లు 03 జిల్లాలో వైద్యసేవలిలా..డిగ్రీలు, పీజీలు చేసుకుని 17 ఏళ్లగా ఆరోగ్యమిత్రలుగా సేవ చేస్తున్నాం. ఆప్కాస్ రద్దు చేస్తే తమను ట్రస్ట్ పరిధిలో పని చేసే కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుర్తించి మినిమమ్ టైం స్కేల్ పద్ధతిలో కొనసాగించాలి. ఉద్యోగ భద్రత కల్పించి సమయానిక జీతాలు చెల్లించాలి. సంక్షేమ పథకాలకు అర్హులుగా గుర్తించాలి. చేసిన సర్వీసును సీనియారిటీగా గుర్తించాలి. ప్రభుత్వం తమ పట్ల సానుకూల నిర్ణయం తీసుకోవాలి. లేకుంటే రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు దశల వారీగా ఉద్యమం చేస్తాం. – ఎం.త్రినాథరావు, జిల్లా అధ్యక్షుడు, ఏపీ వైద్యమిత్ర కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ -
వాహనదారులకు జరిమానాల మోత
ఉల్లంఘన పాత కొత్త జరిమానా జరిమానా లైసెన్సు లేని వ్యక్తికి వాహనం ఇస్తే రూ.1000 రూ. 5,000 లైసెన్సు లేకుండా వాహనం నడిపితే రూ. 500 రూ. 5,000 మైనరు వాహనం నడిపితే రూ. 500 రూ.10,000 అతివేగం(చిన్నవి) రూ. 400 రూ. 1000 (పెద్దవి) రూ. 500 రూ. 2,000 సీటుబెల్టు ధరించకపోతే రూ. 100 రూ. 1000 హెల్మెట్ ధరించకపోతే రూ. 100 రూ. 1000 శ్రీకాకుళం క్రైమ్ : సవరించిన మోటారు వాహన చట్టం ప్రకారం కొత్త అపరాధ రుసుం యాప్ జిల్లాలో అప్డేట్ అయ్యింది. శ్రీకాకుళం నగర పరిధిలో ఆదివారం ఒక్కరోజే 100 ఫైన్లు విధించిన ట్రాఫిక్ పోలీసులు రూ. 50 వేలు వరకు అపరాధ రుసుం చలానాల రూపంలో వసూలు చేశారు. హెల్మెట్ ధరించని వారే టార్గెట్ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు ధరించకపోవడం వల్లనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు గుర్తించారు. అందులో భాగంగానే ఆది వారం 18మంది హెల్మెట్లు ధరించనివారిపై ఫైన్లు వేశామని ట్రాఫిక్ సీఐ వి.నాగరాజు పేర్కొన్నారు. ఇన్నాళ్లు హెల్మెట్ ధరించకపోతే రూ.100 లు యాప్‌లో అప్లోడ్ అయ్యేదని ఇప్పుడు రూ. 1000 అవ్వడంతో రూ. 18 వేలు వీరి నుంచి చలానాల రూపంలో అప్డేట్ అయ్యిందన్నారు. నగర పరిధిలో తిరిగే వాహనదారులు హెల్మెట్లు పెట్టనక్కరలేదని, సర్వోన్నత న్యాయస్థానం చెప్పిందని ఏవేవో చెప్పి వాదిస్తున్నారని, అలాంటిదేమీ లేదని తప్పనిసరిగా హెల్మెట్లు పెట్టాల్సిందేనని సీఐ స్పష్టం చేశారు. ఈ మేరకు ఏడురోడ్ల కూడలిలో ఆదివారం రాత్రి వాహనదారులకు అవగాహన కల్పించామన్నారు. కొత్త జరిమానాలు ఇవే.. మోటారు వాహనాల సవరణ చట్టం–2019 ప్రకారం ఈ నెల నుంచి నియమ నిబంధనలు అతిక్రమించిన వాహనదారులకు కొత్త జరిమానాలు పడనున్నాయి. ఈ మేరకు ఉత్తర్వులు కూడా విడుదలయ్యాయి. -
నేషనల్ కోచింగ్ శిబిరానికి ఇద్దరు ఎంపిక
శ్రీకాకుళం న్యూకాలనీ: జాతీయ స్థాయి పోటీలకు ముందు జరిగే శిక్షణా శిబిరాలకు జిల్లా నుంచి ఇద్దరు బాస్కెట్‌బాల్ క్రీడాకారులు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రాబబుల్స్ జట్లకు ఎంపికై నవారిలో వి.ప్రవీణ్, ఎస్.ప్రేమశ్రీ ఉన్నారు. ఈ పోటీలు మార్చి 3 నుంచి చిత్తూరు వేదికగా మొదలుకానున్నాయి. అనంతరం ఈ నెల 18 నుంచి 24 వరకు అసోం రాష్ట్రం గౌహతి వేదికగా జరగనున్న ఆలిండియా అండర్–23 బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీల్లో ఆంధ్రా జట్లు ప్రాతినిధ్యం వహించనున్నాయి. వీటికి వీరిద్దరి ఎంపిక లాంఛనమేనని జిల్లా సంఘ ప్రతినిధులు భావిస్తున్నారు. ఆదివారం పయనమైన క్రీడాకారులను బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జిల్లా చైర్మన్ ఎమ్మెస్సార్ కృష్ణమూర్తి తన నివాసంలో అభినందించారు. శిక్షణా శిబిరాలకు, జాతీయ పోటీలకు వెళ్లేందుకు అవసరమైన ఆర్థిక సాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో డీఎస్ఏ కోచ్, కార్యదర్శి గాలి అర్జున్‌రావురెడ్డి, సీనియర్ ప్లేయర్స్ పాల్గొన్నారు. -
ఉత్కంఠగా కబడ్డీ పోటీలు
పలాస: మండలంలోని బొడ్డపాడులో రెండో రోజు రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు హోరాహోరీగా సాగాయి. నరసన్నపేట జట్టుపై జిల్లుండ, ఎల్.కొత్తూరుపై గొల్లవూరు, మామిడిపల్లి జట్టుపై జెస్సీ టీం విజయం సాధించాయి. రాష్ట్ర స్థాయి పోటీలకు మొత్తం 30 జట్లు రాగా ఇంకా విశాఖపట్నం, అనకాపల్లి తదితరు జట్లు తమ ప్రతిభను చాటుకోనున్నాయి. ఫ్లడ్ లైట్ల మధ్య పోరు సాగుతుండటంతో స్థానికులు, క్రీడాభిమానులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. బొడ్డపాడు యువజన సంఘం 71వ వార్షికోత్సం సందర్భంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు యార్లగెడ్డ వెంకన్న చౌదరి, జిల్లా కార్యదర్శి చిరంజీవులు, ఉపాధ్యక్షులు రాపాక అప్పలస్వామి, బొడ్డపాడు యువజన సంఘం అధ్యక్షుడు తామాడ క్రాంతి, జైభీమ్ యువజన సంఘం అధ్యక్షుడు కిక్కర ఢిల్లీరావు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఈ అబ్బాయి పేరు మురళీ కృష్ణ..
14 ఏళ్ల ఈ బాలుడి స్వస్థలం చిలకపాలెం. కుప్పిలి మోడల్ స్కూల్లో చదువుకునేవాడు. గత ఏడాది మే 4న పొందూరు వైపు వెళుతున్న భారీ వాహనం ఈడ్చుకెళ్లడంతో మొత్తం రెండు కాళ్లకు సంబంధించిన మజిల్ పూర్తిగా పోయింది. ఎముకలు మాత్రం మిగిలాయి. శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రూ.13 లక్షలు ఖ ర్చు పెట్టి చికిత్స చేయించినా ఫలితం శూన్యం. విధిలేని పరిస్థితుల్లో విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళితే కాళ్లు తీసేయాలన్నారు. తల్లిదండ్రులు చేసేది లేక కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు బాలుడి తండ్రి తొడ నుంచి మజిల్ సేకరించి కాళ్లకు అమర్చారు. నెల రోజుల తరువాత బాలుడి మ జిల్‌తో మరో శస్త్ర చికిత్స చేశారు. మా ప్రయ త్నం మేం చేశాం.. ఇంకా మీరు రోజూ ఫిజియోథెరపీ చేయించుకుంటే ఫలితం ఉంటుందని అక్కడ డాక్టర్లు చెప్పేశారు. నడవలేని స్థితిలో మురళీ కృష్ణ నా విభాగానికి వచ్చాడు. నా సిబ్బంది ఉన్న పరికరాలతోనే రోజువారీ వ్యాయామాలను చేయిస్తూ తొమ్మిది నెలలుగా ఫిజియో చేయించుకుంటున్నాడు. చక్కగా నడుస్తూ సాధారణ జీవితంలోకి మెల్లమెల్లగా వస్తున్నాడు. నా విభాగంపై దృష్టి సారించే బడ్జెట్ కేటాయిస్తే అధునాతన పరికరాలు ఏర్పాటు చేస్తే రోగులు మరింత త్వరగా కోలుకునే అవకాశం ఉంది. -
డిగ్రీ ఆరో సెమిస్టర్ పరీక్షలకు షెడ్యూల్ విడుదల
ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ ఆరో సెమిస్టర్ పరీక్షల నిర్వహణకు అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. ఈ మేరకు వర్సిటీ వెబ్సైట్ లో అందుబాటులో ఉంచారు. ఈ నెల 13వ తేదీలోపు విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నెల 18వ తేదీ నుంచి 25 మధ్య పరీక్షలు నిర్వహించనున్నారు. డిగ్రీ నాలుగో సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ నాలుగో సెమిస్టర్ పరీక్షల నిర్వహణకు అధికారులు షెడ్యూల్ విడుదల చేసి, వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. పరీక్ష ఫీజును సోమవారం నుంచి 14వ తేదీ మధ్య చెల్లించాల్సి ఉంటుంది. పరీక్షలు ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభించనున్నారు. ఆదిత్యునికి ప్రత్యేక పూజలు అరసవల్లి: అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామికి ఆదివారం ఉదయం నుంచి విశేష పూజలను నిర్వహించారు. మాఘమాసం మూడో ఆదివారం సందర్భంగా స్వామి వారి మూలవిరాట్టును ప్రత్యేకంగా అలంకరించా రు. ప్రత్యేక ఆదివారం కావడంతో ఇతర ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చి ఆదిత్యునికి మొక్కులు చెల్లించుకున్నారు. ఎండ తీవ్రత కారణంగా మజ్జిగ పంచారు. ఒక్క రోజులో వివిధ దర్శనాల టిక్కెట్ల విక్రయాల ద్వారా రూ.3,77,100, విరాళాలు, ప్రత్యేక పూజల ద్వారా రూ.68,837, ప్రసాదాల వి క్రయాల ద్వారా రూ. 1.74 లక్షల వరకు ఆదాయం లభించినట్లుగా ఈఓ తెలిపారు. జామియా మసీదులో ఇఫ్తార్ విందు శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని జీటీ రోడ్డులో ఉన్న జామియా మసీదులో ఆదివారం ఇఫ్తార్ విందు నిర్వహించారు. రంజాన్ మాసం మొదటి రోజున అందరూ కలసి ముందుగా ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా జామియా మసీదులో మొదటిసారి తమ ఉపవాస దీక్షలు ప్రారంభించారు. కార్యక్రమంలో మసీదు అధ్యక్షుడు మహీబుల్లా ఖాన్, హాజీ భయ్యా, అమీరుల్లా బేగ్, ఉస్మాన్, షకూర్‌ఖాన్, కమిటీ సభ్యులు, ఫజర్ జమాత్ సభ్యులు పాల్గొన్నారు. అయ్యో.. రైతన్న కాశీబుగ్గ: పశువుల మేత కోసం మినప తొక్కును పట్టుకుని రోడ్డు దాటుతుండగా యాక్సిడెంట్ జరిగి ఓ రైతన్న రెండు కాళ్లను కోల్పోయాడు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ 10వ వార్డు పారసాంబ గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన రైతు కొల్లకోట రాము ఉదయం పశువుల మేతకు మినపతొక్కు పట్టుకుని రోడ్డు దాటుతుండగా టెక్కలి నుంచి కంచిలికి బైక్‌పై వెళ్తున్న మీనకేథన్ డొలై అనే వ్యక్తి రామును ఢీకొన్నాడు. ప్రమాదంలో రైతు రాముకు రెండు కాళ్లు విరిగిపోయాయి. వాహనదారులు చూసి వెంటనే రైతుకు సపర్య లు చేశారు. పలాస 108 అంబులెన్సు సిబ్బంది సత్యం, నాగేష్, ప్రథమ చికిత్స అందించి పలాస ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించారు. -
తొలిరోజు 685 మంది గైర్హాజరు
●ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షలుశ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు శనివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు రాశారు. తొలిరో జు సెట్–2 ప్రశ్న పత్రంతో తెలుగు, సంస్కృతం, హిందీ, ఒరియా పేపర్లకు విద్యార్థులు పరీక్ష రాశారు. పునర్విభజన శ్రీకాకుళం (30 మండలాలు)జిల్లా వ్యాప్తంగా 75 పరీక్ష కేంద్రాల్లో జరుగుతున్న పరీక్షలకు తొలిరోజు మొత్తం 21,127 మంది హాజరుకావాల్సి ఉండగా 20,442 మంది హాజరయ్యారు. వివిధ కారణాలతో 685 మంది గైర్హాజరయ్యారు. తొలిరోజు ఎలాంటి మాల్ ప్రాక్టీసు కేసులు నమోదుకాలేదని అధికారులు ధ్రువీకరించారు. సోమవారం నుంచి సీనియర్ ఇంట ర్ పరీక్షలు మొదలుకానున్నాయి. పరీక్ష కేంద్రాల పరిశీలన జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియెట్ పరీక్ష కేంద్రాలను పలువురు అధికారులు చుట్టుముట్టా రు. తొలిరోజే ఆకస్మిక తనిఖీలతో హోరెత్తించారు. సెల్ఫ్ సెంటర్లు, ఎంపిక చేసుకున్న సెంటర్లపై ఫోకస్ చేస్తున్నారు. డీఈసీ–2 పీవీఎల్ నారాయణతో కలిసి జిల్లా స్పెషల్ ఆఫీసర్, డీవీఈఓ శివ్వాల తవిటినాయుడు ఎచ్చెర్లలోని రెండు కేంద్రాలతోపాటు కొయ్యాం కళాశాలలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏర్పాట్లను గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆర్ఐఓ ప్రగడ దుర్గారావు, డిస్ట్రిక్ట్ బల్క్ అధికారి బి.శ్యామ్‌సుందర్, డీఈసీ–3 బి.సింహాచలంతో కూడిన బృందం శ్రీకాకుళంలోని పెద్దపాడు ఏపీ రెసిడెన్షియల్ గురుకుల విద్యాలయం, శ్రీచైతన్య జూనియర్ కళాశాల రెండు కేంద్రాలలో తనిఖీ లు చేశారు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష రాసేందుకు అనుమతి లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో విద్యార్థులు ఆపసోపాలు పడ్డారు. అలాగే కరెంట్ కోతలతో అటు విద్యార్థులు, ఇటు పరీక్షల నిర్వహణలో భాగస్వాములైన అధికారులు, సిబ్బంది అవస్థలు పడ్డారు. తొలిరోజు సెట్–2 ప్రశ్న పత్రంతో పరీక్ష రాసిన ఫస్టియర్ విద్యార్థులు నిమిషం నిబంధనతో అష్టకష్టాలు పడిన విద్యార్థులు -
‘గ్యాస్’ అదనపు వసూళ్లపై కలెక్టర్ ఆగ్రహం
పొందూరు: మండల కేంద్రంలో గ్యాస్ వినియోగదారుల నుంచి రూ. 40 నుంచి రూ. 50లు అదనంగా వసూలు చేయడంపై కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో శనివారం ఆయన పర్యటించారు. పలువురు మహిళలతో మాట్లాడారు. గ్యాస్ ధర తెలుసా అని ఆరా తీస్తే.. తెలియదని చెప్పడంతో సెల్‌ఫోనులో బిల్లుకు సంబంధించిన మెసేజ్ చూపించారు. రూ. 829లుగా మహిళలు తెలుసుకున్నారు. గ్యాస్ డెలివ రీ బాయ్స్ అదనపు వసూలు చేస్తున్నట్లు వారు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. మొత్తం కలిపి రూ.870 నుంచి రూ.880లు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. దీంతో డీఎస్‌ఓతో ఫోన్లో మాట్లాడారు. బిల్లు కంటే ఒక్క రూపాయి కూడా అదనంగా ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. అనంతరం డీఎస్ఓ జి.సూర్యప్రకాశ్ శనివారం తహశీల్దార్ కార్యాలయంలో గ్యాస్ ఏజె న్సీ సిబ్బందిని విచారించారు. తమకు 14 ఏళ్లుగా ఎలాంటి జీతాలు ఇవ్వడం లేదని, అదనపు వసూళ్లే తమకు ఆదాయమని డెలివరీ బాయ్స్ చెప్పారు. దీనిపై తహసీల్దార్ వెంకటేష్ మాట్లాడుతూ లేబర్ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. -
పనసతో విందు..
వజ్రపుకొత్తూరు: ఉద్దానం పనస ఉత్తరాదికి తరలి వెళుతోంది. హోలీ, ఉగాది పర్వదినాలు ముందుండడంతో ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి ఊపందుకుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో పనసతో చేసే విందులకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. పనస హల్వా, పొట్టు కూర, పకోడి, గింజల కూర, ఇడ్లీ పచ్చళ్లు, బూరెలు లాంటి వంటకాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక స్థానికంగా ఉద్దానం ప్రాంతంలోని పెళ్లిళ్లలో పనస ముక్కల బిర్యాని, గూన చారు, పొట్టు కూరకు మంచి పేరుంది. ఇటీవల శాస్త్ర పరిశోధనల్లో పనస గింజలు, పొట్టుతో తయారు చేసే పొడితో షుగర్ వ్యాధికి ఇన్సులిన్ అదుపులో ఉంచుకునేందుకు అవసరమైన ఫైబర్ ఎక్కువ ఉందని తేలడంతో పనస ఆధారిత వంటకాలకు ప్రాధాన్యత పెరిగింది. సహజ సిద్ధంగా కల్తీ లేకుండా పెరిగే పనస ప్రతీ వయసు వారు తినేందుకు అనుకూలమైన ఫలం కావడం విశేషం. 70 శాతం ఎగుమతి చేసే ఒక్క కాయలోనే కాదు. 30 శాతం ఫలాలుగా తినే పండులోనూ మంచి పోషకాలు ఉంటాయని న్యూట్రీషియన్లు చెబుతున్నారు. మిశ్రమ పంటగా.. జిల్లాలోని ఉద్దానం, గిరిజన ప్రాంతాల్లో ప్రధాన పంటగా కాకుండా 16వేల హెక్టార్లలో మిశ్రమ అంతర పంటగా దీన్ని రైతులు పండిస్తారు. సీతంపేటతో పాటు వజ్రపుకొత్తూరు, పలాస, మందస, కవిటి, సోంపేట, కంచిలి, ఇచ్ఛాపురం, నందిగాం మండలాల్లో ఏటా ఏప్రి ల్, మే నెలల్లో కాపునకు వచ్చే ఈ పంట ప్రస్తుతం ఫిబ్రవరి ప్రారంభంలోనే కాపునకు వచ్చింది. మే నెల వరకు వచ్చే కాపులో 70 శాతం మేర కాయలను ఉత్తరాది రాష్ట్రాలైన ఒడిశా, బీహార్ ఉత్తరప్రదేశ్, కోల్‌కతాలకు ఎగుమతి చేస్తున్నారు. పూండి, పలాస, హరిపురం, పాలకొండ కేంద్రాలుగా కిలో పనస కాయ రూ.25 ధరతో రోజుకు 55 టన్నుల వరకు ఎగుమతి చేస్తున్నారు. అంటే రోజుకు జిల్లా నుంచి రూ. 13.75 లక్షలు టర్నోవర్ జరుగుతోంది. దీంతో రైతులకు మే నెల వరకు మంచి ఆదాయం సమకూరుతుంది. పనస ప..ద..ని..స వంటకాలు: హల్వా, పొట్టు కూర, పకోడి, గింజల కూర, ఇడ్లీ పచ్చళ్లు, బూరెలు ●ఉద్దానం ప్రాంతంలోని పెళ్లిళ్లలో పనస ముక్కల బిర్యాని, గూన చారు, పొట్టు కూర ఔషధ విలువలు: పనస గింజలు, పొట్టుతో తయారు చేసే పొడితో షుగర్ వ్యాధికి సంబంధించి ఇన్సులిన్ అదుపులో ఉంచుకునేందుకు అవసరమైన ఫైబర్ ఎక్కువ ఉందని శాస్త్ర పరిశోధనల్లో తేలింది. ఎగుమతి ఎక్కడికి: ఒడిశా, బీహార్ ఉత్తరప్రదేశ్, కోల్‌కతా ●అదనపు ఆదాయం పనస రైతులకు అదనపు ఆదాయ వనరు. జీడి, కొబ్బరి తోటల్లోని గట్లపై ఖాళీ స్థలాల్లో మిశ్రమ అంతర పంటగా సాగు చేస్తున్నారు. ఈ ఏడాది ఎలాంటి చీడ పీడ లు ఆశించకుండా పంట కాసింది. పంట ప్రారంభం కాబట్టి కిలో రూ.25ల వరకు ధర ఉంది. ఎకరాకి 4 నుంచి 10 చెట్లు వరకు గిరిజన, ఉద్దానం ప్రాంతాల్లో రైతులు పనసను పండిస్తున్నారు. ఏడాదికి రైతు రూ.20 వేలు వరకు ఆర్జిస్తున్నారు. – కె.సునీత, ఉద్యానవన శాఖ అధికారి, పలాస రోజుకు 55 టన్నులు సరఫరా -
మహిళ అనుమానాస్పద మృతి
కాశీబుగ్గ : పలాస రైల్వేస్టేషన్లో శనివారం ఓ మహిళ అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పలాస మండలం మరదరాజపురం గ్రామానికి చెందిన జంగం రాధ(39)కు ఒడిషా రాష్ట్రం గజపతి జిల్లా పర్లాఖిమిడికి చెందిన శ్రీనివాస పండాతో వివాహం జరిగింది. పదేళ్ల కిందట భర్త మృతిచెందడంతో రాధ కన్నవారింటికి వచ్చేసింది. పలాస వ్యవసాయ మార్కెట్ యార్డులోని ఎఫ్‌సీ గోదాములో పనిచేస్తోంది. శనివారం సాయంత్రం విధులకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు ఆరా తీయగా పలాస రైల్వేస్టేషన్ వద్ద అనుమానాస్పద రీతిలో విగతజీవిగా కనిపించింది. ఈమెకు పాప, బాబు ఉన్నారు. మృతదేహాన్ని జీఆర్పీ ఏడీ మెట్ట సోమేశ్వరరావు పలాస ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేశారు. లారీ ఢీకొని యువకుడు దుర్మరణం కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని మొగిలిపాడు జాతీయ రహదారిపై సాహూ దాబా వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమా దంలో యువకుడు దుర్మరణం పాలయ్యాడు. లక్ష్మి పురం టోల్‌ప్లాజాలో సీసీ ఫుటేజీ విభాగంలో పనిచేస్తున్న మందస మండలం అంబుగాం గ్రామానికి చెందిన బల్ల పాపారావు (32) శనివారం మధ్యాహ్నం విందు భోజనానికి బైక్‌పై వెళ్తుండగా వెనుక నుంచి లారీ ఢీట్టింది. అనంతరం డ్రైవర్ పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన పాపారావును హైవే అంబులెన్సులో పలాస ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి, అక్కడి నుంచి శ్రీకాకుళం రిమ్స్‌కు తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో మరణించాడు. పాపారావుకు తల్లిదండ్రులు, ముగ్గురు అక్కచెల్లెల్లు ఉన్నారు. ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో తండ్రి మాధవరావు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాశీబుగ్గ ఎస్ఐ చంద్రరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దేవుడి భూములు కబ్జా!
● సింగుపురంలో అన్యాక్రాంతమవుతున్న హఠకేశ్వరుడి స్థలం ● రెండంతస్తుల్లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం ● కూటమి నేతల అండదండలతో ఇష్టారాజ్యం ● పట్టించుకోని దేవదాయశాఖ అధికారులు శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని సింగుపురంలో హఠకేశ్వర స్వామి ఆలయ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. సర్వే నంబర్ 260/14లో 84 సెంట్ల విస్తీర్ణంలో దేవుడి భూములు ఉన్నాయి. అయితే ప్రధాన రహదారిని అనుసరించి ఓ వ్యక్తి సుమారు 6 సెంట్ల విస్తీర్ణంలో రెండు అంతస్తుల్లో షాపింగ్ కాంప్లెక్స్ భవనాన్ని అడ్డగోలుగా నిర్మించేశాడు. వాస్తవంగా ఈ స్థలాన్ని పూర్వం నుంచి గ్రామస్తులు రాకపోకలకు వాడుకునేవారు. స్థానికుల ఇళ్ల నుంచి వాడుక నీరు వెళ్లేందుకు సైతం పిల్లకాలువలా ఉండేది. ప్రస్తుతం అక్రమ నిర్మాణం చేపట్టడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అనుమతులు లేకుండానే.. వాస్తవంగా ఏదైనా భవనం నిర్మాణం చేపట్టాలంటే పంచాయతీ నుంచి అన్ని అనుమతులు విధిగా తీసుకోవాలి. ఇక్కడ ఎలాంటి ప్లాన్ అప్రూవుల్ లేకుండానే రెండు అంతస్తుల భవనం నిర్మించడం గమనార్హం. కూటమి నేతల అండదండలు ఉండటంతోనే పనులు దర్జాగా జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. పట్టించుకోని అధికారులు.. సింగుపురంలోని దేవుడు మాన్యం భూములను పట్టించుకునే వారే కరువయ్యారు. ప్రధాన మార్గంలో భూములే కబ్జాలకు గురవుతున్నాయంటే ఇంకా లోపల ఉన్న భూములు పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన దేవదాయశాఖ అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై దేవదాయశాఖ అధికారి మాధవి వద్ద ప్రస్తావించగా తొలుత నోటీసులు అందించామని, తర్వాత తన దృష్టికి రాలేదని మాట దాటవేశారు. నోటీసులు అందించాం దేవుడు మాన్యం భూములు కబ్జాకు గువుతున్నాయని సమాచారం రావడంతో భవన నిర్మాణం చేపడుతున్న వ్యక్తికి సింగుపురం గ్రామ పంచాయతీ తరఫున నోటీసులు అందించాం. దేవుడి మాన్యం భూములు కాపాడుకోవాల్సిన బాధ్యత దేవాదాయశాఖదే. – రమేష్, పంచాయతీ సెక్రటరీ, సింగుపురం -
కార్పొరేటరీకరణకు వ్యతిరేకంగా పోరాటం
పలాస: బొడ్డపాడు యువజన సంఘం ఆశయాలను, ఆశలను ప్రతిబింబించాలంటే దేశంలో జరుగుతున్న కాషాయీకరణ, కార్పొరేటు వ్యవస్థల విధానాలకు వ్యతిరేకంగా యువతరం కదం తొక్కాలని హైదరాబాద్‌కు చెందిన వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్.వేణుగోపాల్ పిలుపునిచ్చారు. పలాస మండలం బొడ్డపాడులో బొడ్డపాడు యువజన సంఘం 71వ వార్షికోత్సవం శనివారం నిర్వహించారు. 1954లో అప్పటి కమ్యూనిస్టు పార్టీ నాయకులు సంఘం ఏర్పాటు చేశారు. తదనంతరం జరిగిన అనేక పోరాటాల్లో సంఘం నాయకులు పోలీసు ఎదురు కాల్పుల్లో మృతి చెందారు. అయినా వెనకడుగు వేయకుండా నేటికీ పోరాటం కొనసాగిస్తూ అమరుడు తామాడ గణపతి మనవడు తామాడ క్రాంతి అధ్యక్షతన శనివారం వార్షికోత్సవ సభ ఏర్పాటు చేశారు. ముందుగా కార్మిక పతాకాన్ని అమరుల బంధు మిత్రుల కమిటీ నాయకుడు జోగి కోదండరావు ఆవిష్కరించారు. అనంతరం బొడ్డపాడు యువజన సంఘం పతాకాన్ని క్రాంతి ఆవిష్కరించారు. ప్రజాకళామండలి కళాకారులు విప్లవ గీతాలను ఆలపించారు. కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కె.వి.జగన్నాథం, కె.ఎన్.పి.ఎస్.నాయకుడు బెలమల ప్రభాకర్, డి.టి.ఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షుడు కోత ధర్మారావు, పి.కె.ఎస్ జిల్లా అధ్యక్షుడు మద్దిల ధర్మారావు, ఎ.బి.ఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తామాడ త్రిలోచనావు, టెక్కలి డివిజన్ రైతాంగ కమిటీ మాజీ అధ్యక్షుడు దాసరి శ్రీరాములు, యువజన సంఘం సీనియర్ సభ్యుడు బచ్చల విప్లవకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నరకయాతన
గంటలురాజాం–శ్రీకాకుళం ప్రధాన రహదారిలో ప్రయాణికులు సుమారు ఆరుగంటల పాటు మండుటెండలో నరకయాతన అనుభవించారు. జి.సిగడాం మండలం ధవళపేట గ్రామ సమీపంలో ఇటీవల కల్వర్టు పనులు ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా ఏర్పాటు చేసిన డైవర్షన్ రోడ్డులో శనివారం ఉదయం 5 గంటల సమయంలో భారీ లోడుతో వస్తున్న ఓ లారీ కూరుకుపోయింది. ఉదయం 11 గంటల వరకు ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరడంతో వాహనచోదకులు అవస్థలు పడ్డారు. ఎస్ఐ వై.మధుసూదనరావు, రహదారులు, భవనాల శాఖ ఏఈఈ పి.టి.రాజు ఘటనా స్థలానికి చేరుకుని యంత్రాల ద్వారా లారీని బయటకు తీయడంతో రాకపోకలు పునరుద్ధరణ జరిగాయి. – జి.సిగడాం -
శ్రీకాకుళం
డ్రైవర్ గారూ.. తగ్గాలి జోరురాజాం–చిలకపాలెం రూట్లో బస్సులు యమస్పీడుగా వెళ్తున్నాయి. ప్రమాదాలకు కారణమవుతున్నాయి. –8లోఆలివ్ రిడ్లే.. ఆదివారం శ్రీ 2 శ్రీ మార్చి శ్రీ 2025సముద్రంలోకి వెళ్తున్న తాబేలు పిల్లలు 15 నుంచి ఒంటి పూట బడులు శ్రీకాకుళం: జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఈనెల 15వ తేదీ నుంచి ఒంటి పూట తరగతులు నిర్వహించేందుకు పాఠశాల విద్యా శాఖ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈనెల 15వ తేదీ నుంచి ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, మోడల్ స్కూల్స్, ఎయిడెడ్, ప్రైవే టు, గుర్తింపు పొందిన అన్ఎయిడెడ్ పాఠశాలల మెనేజ్మెంట్లో ఒంటి పూట తరగతులు పక్కాగా అమలు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారుల నుంచి ఎంఈఓలు, పాఠశాలల హెచ్ఎంలకు ఉత్తర్వులు వెళ్లాయి. అయితే ఇప్పటికే ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున మార్చి మొదటి వారం నుంచే ఒంటి పూట తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని, విద్యాశాఖ అధికారులను కోరుతున్నారు. పని వేళల్లో ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు తరగతులు నిర్వహించేలా ఉత్తర్వులు విడుదల చేయాలని ఉపాధ్యాయలు కోరుతున్నారు. మార్చి 17 నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో పరీక్ష కేంద్రం ఉన్న పాఠశాలల్లో సాయంత్రం ఒంటి పూట తరగతులు నిర్వహించాలని సూచించారు. సెమిస్టర్ ఫలితాలు విడుదల ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో బీటెక్ ఐదు, ఏడు, బీపీఈడీ మూడో సెమిస్టర్ ఫలితాలు శనివారం పీజీ ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఎస్.ఉదయ్‌భాస్కర్ శనివారం విడుదల చేశారు. ఐదో సెమిస్టర్లో సీఎస్ఈలో 63 మందికి 46, ఈసీఈలో 68 మందికి 49, మెకానికల్‌లో 60 మందికి 45, సివిల్‌లో 36 మందికి 29 మంది, ఏడో సెమి స్టర్లో సీఎస్ఈలో 71 మందికి 62, ఈసీఈలో 63 మందికి 57, మెకానికల్‌లో 59 మందికి 59 మంది ఉత్తీర్ణత సాధించారు. బీపీఈడీలో మూడో సెమిస్టర్లో 280 మందికి 274 మంది, డీపీఈడీలో 46 మందికి 6 మంది ఉత్తీర్ణత సాధించారు. 15 రోజుల్లోగా రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎస్ఐ చొరవ.. ఇంటర్ విద్యార్థులకు ఊరట జి.సిగడాం: రాజాం–శ్రీకాకుళం ప్రధాన రహదారి దవళపేట గ్రామం వద్ద చీకటిలో భారీ ఊక లారీ మట్టిలో కూరుకుపోవడంతో శనివారం ప్రజలు రాకపోకలు సాగించేందుకు ఇబ్బంది పడ్డారు. పొందూరు నుంచి రాజాం, రాజాం నుంచి పొందూరు ఇంటర్ పరీక్షలకు వెళ్లే విద్యార్థులు ఇందులో ఇరుక్కుపోయారు. దీంతో స్థానిక ఎస్ఐ వై.మధుసూధనరావు, ఆర్అండ్బీ ఏఈఈ పీటీ రాజుతోపాటు ప్రత్యేక పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఎస్ఐ మా ట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో ప్రత్యేక వాహనాల ద్వారా కేంద్రాలకు పంపించామని, మట్టిలో కూరుకుపోయిన లారీని యంత్రాల ద్వారా బయటకు తీసి ట్రాఫిక్‌ను పునరుద్ధరించామన్నారు. ●గుడ్లకు సంరక్షణ.. తీరంలో తాబేళ్లు గుడ్లు పెట్టి వెళ్లిపోయాక జిల్లాలో అటవీ శాఖ అధికారులు, ట్రీ ఫౌండేషన్ సౌజన్యంతో గుడ్లను సంరక్షణ కేంద్రాలకు తరలిస్తున్నారు. జిల్లాలో మొత్తం మూడు డివిజన్ల పరిధిలో 16 సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇచ్ఛాపురం నియోజక వర్గంలో 7 కేంద్రాలు ఏర్పాటు చేశారు. నియోజక వర్గంలోని సోంపేట మండలం బట్టిగళ్లూరు, బారువ పేట, ఇస్కలపాలేం, కవిటి మండలం కళింగపట్నం, బట్టివాని పాలేం, సీహెచ్ కపాసుకుద్ది, ఇచ్ఛాపురం మండలం డొంకూరులో సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. గత సంవత్సరం జిల్లాలో 1,59,403 గుడ్లు సేకరించి 1,44,981 పిల్లలుగా తయారు చేసి సముద్రంలోకి విడిచిపెట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది గత ఏడాది కంటే ఎక్కువ పిల్లలను తయారు చేసి సముద్రంలోకి విడిచి పెట్టడానికి చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఇప్పటి వరకు శ్రీకాకుళం, టెక్కలి, కాశీబుగ్గ డివిజన్ల పరిధిలో 452 నెట్లు ఏర్పాటు చేసి 53,400 గుడ్లు సేకరించారు. సుమారు 40 రోజుల పాటు రక్షణ వలయంలో ఉంచి గుడ్లు పొదిగి పిల్లలుగా మారిన తర్వాత వాటిని సురక్షితంగా సముద్రంలోకి విడిచిపెడతారు. సాగర గర్భంలో తల్లులు, ఎక్కడో దూరంగా తీరంలో పిల్లలు.. ఆ తల్లీపిల్లలు కలుసుకోవడానికి సవాలక్ష ఆటంకాలు. ప్రకృతి వైపరీత్యాలు, జంతువుల దాడులు, ఆకతాయిల వికృత చేష్టలు అన్నీ తట్టుకుని నిలబడితేనే ఆ పిల్లలు కడలి గర్భంలోకి వెళ్లగలవు. లేదంటే అండంలో ఉన్నప్పుడే ఆయుష్షు తీరిపోతుంది. ఇలాంటి ఆపత్కాలంలో ఉన్న ఆలివ్ రిడ్లే తాబేలు పిల్లల ఆయుష్షుకు అటవీ శాఖ, ట్రీ ఫౌండేషన్ ప్రతినిధులు అండగా నిలబడుతున్నారు. తీరంలో గుడ్లను సంరక్షించి అవి పొదిగి పిల్లలు బయటకు వచ్చే వరకు జాగ్రత్తగా చూసి.. బుల్లి బుల్లి తాబేలు పిల్లలు ఆనందంగా సముద్రంలోకి వెళ్లడాన్ని మురిపెంగా చూస్తున్నారు. ● తాబేళ్లకు రక్షణగా ట్రీ ఫౌండేషన్, అటవీశాఖ ● సాగర తీరంలో సంరక్షణ కేంద్రాలు ● తాబేలు గుడ్లకు రక్షణ ● పొదిగిన తర్వాత తీరంలోకి పిల్లలను వదిలిపెడుతున్న సభ్యులు సోంపేట: సముద్రంలో లక్షలాది జీవులు నివాసం ఉంటాయి. అందులో సముద్రానికి మేలు చేసే జాతుల్లో ఆలివ్‌రిడ్లే తాబేళ్లు ఒక జాతి. ఆ రకం తాబేళ్లు గుడ్లు పెట్టుకునేందుకు మన తీరాలను అనువుగా ఎంచుకున్నాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత సముద్ర తీరానికి వచ్చి తీరంలో గొయ్యి తవ్వి గుడ్లు పెడతాయి. అనంతరం వాటిని కప్పేసి సముద్రంలోకి వెళ్లిపోతాయి. తీరంలో గుడ్లు పెట్టడానికి అనువైన స్థలం చూసుకుని గుడ్లు పెడుతుంటాయి. అలా వచ్చినప్పుడు బోట్లు తగిలి కొన్ని తాబేళ్లు చనిపోతుంటాయి. ప్రస్తుతం ఆలివ్‌రిడ్లే తాబేళ్లు అంతరించి పోయే ప్రమాదంలో ఉండడంతో అటవీశాఖ పలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో తాబేళ్ల సంరక్షణకు నడుం బిగించింది. 50 నుంచి 150 గుడ్లు సాధారణంగా ఈ జాతి తాబేళ్లు 50 నుంచి 150 వరకు గుడ్లు పెడుతుంటాయి. అర్ధరాత్రి 2 గంటల నుంచి ఉదయం 5 గంటల లోపు తీరానికి చేరుకుని ఇసుకలో గోతులు తవ్వి వాటిలో గుడ్లు పెట్టి, తిరిగి వాటిపై ఇసుక కప్పి తల్లి తాబేళ్లు సముద్రంలోకి వెళ్లిపోతాయి. ప్రత్యేక జీవులు ఆలివ్ రిడ్లే తాబేళ్లు చాలా ప్రత్యేకమైనవి. వీటికి స్థిర నివాసం ఉండదు. రెండు అడుగుల పొడవు, సుమారు 150 కిలోలు పైన బరువు ఉండే తాబేళ్లు ఆహార అన్వేషణ, గుడ్లు పెట్టడం, సంతానోత్పత్తి కోసం సుమారు 20 వేల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. డిసెంబర్ నుంచి మార్చి రెండో వారం వరకు ఎక్కువగా గుడ్లు పెడుతుంటాయి. మత్స్యకారులు సహకరించాలి తాబేలు గుడ్లను సంరక్షించడానికి అటవీ శాఖా ధికారులు, ట్రీ ఫౌండేషన్ ప్రతినిధులకు మత్స్యకారులు సహకరించాలి. అంతరించే స్థితి లో ఉన్న ఆలివ్‌రిడ్లే తాబేళ్లను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. గుడ్లను సంరక్షించే బాధ్యత అటవీ శాఖ తీసుకుంటుంది. గత ఏడాది సుమారు లక్షా యాభై వేల పిల్లలను సముద్రంలోకి విడిచిపెట్టాం. ఈ ఏడాది అంతకన్నా ఎక్కువ పిల్లలను సముద్రంలోకి విడిచిపెట్టడానికి చర్యలు తీసుకుంటున్నారు. – నాగరాజు, జిల్లా అటవీ శాఖాధికారి గుడ్లను సంరక్షించడం ఆనందం గత కొన్నేళ్లుగా అటవీ శాఖాధికారుల సౌజన్యంతో ట్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆలివ్ రిడ్లే తాబేళ్ల గుడ్లు సేకరించి, వాటిని పిల్లలుగా తయారు చేసి సముద్రంలోకి విడిచి పెట్టడం ఆనందంగా ఉంది. జిల్లాలో మత్స్యకారులు సహాయ సహకారాలు అందించడంతో ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది. – కె.సోమేశ్వరరావు, ట్రీ ఫౌండేషన్ జిల్లా కోఆర్డినేటర్ న్యూస్‌రీల్ -
5న ఎంఎస్ఎంఈ రుణమేళా
శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళంలోని అంబేడ్కర్ ఆడిటోరియంలో ఈ నెల 5వ తేదీన ఎంఎస్ఎంఈ రుణాలకు సంబంధించి రుణమేళాను నిర్వహించనున్నట్టు యూనియన్ బ్యాంకు రీజనల్ హెడ్ ఎం.వెంకట్ తిలక్ తెలిపారు. శ్రీకాకుళంలోని వెంకటాపురంలో ఉన్న యూనియన్ బ్యాంకులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. శ్రీకాకుళం రీజియన్ పరిధిలో యూనియన్ బ్యాంక్‌కు సంబంధించి 59 బ్రాంచ్‌లు ఉన్నాయని, శ్రీకాకుళం జిల్లాలో 43 బ్రాంచ్‌లు, పార్వతీపురం జిల్లాలో 16 బ్రాంచ్‌లు ఉన్నాయని వివరించారు. వీటి పరిధిలో రూ.8వేల కోట్ల మేర బిజినెస్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. తమ బ్యాంకుల ద్వారా ఎంఎస్ఎంఈల రూపంలో గృహ, రిటైల్, విద్య, గోల్డ్, వ్యవసాయ తదితర రుణాలన్నీ అందజేస్తామని చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దేశ వ్యాప్తంగా ఈ నెల 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు దేశంలోని అన్ని బ్రాంచ్‌ల్లో ఎంఎస్ఎంఈ రుణమేళా నిర్వహిస్తున్నట్టు స్పష్టం చేశారు. అందులో భాగంగా ఈనెల 5న శ్రీకాకుళం నగరంలోని అంబేడ్కర్ ఆడిటోరియంలో రుణమేళా నిర్వహిస్తున్నామన్నారు. దీన్ని జిల్లా ప్రజలు, ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ మేళాకు ముంబైలోని యూనియన్ బ్యాంకు ప్రధాన కార్యాలయం నుంచి జీఎం పి.శ్రీనివాస్ హాజరవుతారన్నారు. రుణమేళాకు వచ్చి రుణాలు అవసరమైన వారికి ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి రుణాలు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. -
మండుటెండలో మత్స్యకారుల నిరసన
కవిటి: తరతరాలుగా ఇద్దివానిపాలెం పొగురు రేవులో బోట్లు, తెప్పలు నిలిపి అక్కడి నుంచే సముద్రంలో వేటకు వెళుతున్న తమను ఆ గ్రామస్తులు అడ్డుకుంటున్నారని పెద్దకర్రివానిపాలెం మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం కవిటి తహసీల్దార్ కార్యాలయం ఎదుట మండుటెండలో బైఠాయించి నిరసన తెలియజేశారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ బెహర మురళీమోహనరావు పెద్దకర్రివానిపాలెం గ్రామానికి చెందిన వైస్ ఎంపీపీ కర్రి గోపయ్య, మాజీ ఎంపీటీసీ కర్రి చంద్రశేఖర్లతో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీడీఓ కె.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రెండు గ్రామాల పెద్దలతో సమావేశం నిర్వహించి గతంలో మాదిరిగా సఖ్యతతో వేట సాగేలా చర్యలు తీసుకోవాలని, నిబంధనలు అతిక్రమించిన వారిపై బైండోవర్ కేసులు బనాయించాలని కవిటి ఎస్ఐ వి.రవివర్మకు సూచించారు. అనంతరం పెద్దకర్రివానిపాలెం మత్స్యకారులు మాట్లాడుతూ సమస్య పరిష్కరించకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు. -
పెండింగ్ కేసుల్లో దర్యాప్తు ముమ్మరం
శ్రీకాకుళం క్రైమ్ : ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలోనూ పెండింగ్ కేసులపై దర్యాప్తు ముమ్మరం చేయాలని జిల్లా అదనపు ఎస్పీలు కె.వి.రమణ, పి.శ్రీనివాసరావు సూచించారు. ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రేవ్ కేసుల దర్యాప్తు పూర్తిచేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలని, ఎస్సీ, ఎస్టీ, పోక్సో కేసుల్లో పారదర్శకంగా దర్యాప్తు సాగాలని చెప్పారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ముఖ్య కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాలని సూచించారు. ప్రమాదాల నివారణకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయాలని చెప్పారు. సమావేశంలో డీఎస్పీలు సీహెచ్ వివేకానంద, డీఎస్‌ఆర్‌వీఎస్‌ఎన్ మూర్తి, వి.వి.అప్పారావు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
తగ్గాలి జోరు!
డ్రైవర్ గారూ.. ● రాజాం–చిలకపాలెం రోడ్డులో విశాఖ వెళ్లే బస్సుల దూకుడు ● అసలే ఇరుకు రహదారి.. ఆపై మలుపులు ● తరచూ ప్రమాదాలతో ఆందోళన పొందూరు: పాలకొండ ఆర్టీసీ డిపో నుంచి పొందూరు, చిలకపాలెం కూడలి మీదుగా విశాఖపట్నం వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్, నాన్‌స్టాప్ బస్సు సర్వీసులు అతివేగంతో ప్రయాణిస్తుండటంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కొంతమంది డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రయాణికులు, ఆయా రూట్ల పరిధిలోని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా నాన్‌స్టాప్ సర్వీసు దూకుడుగా వెళ్తోందంటూ ఆ రూట్లలో ప్రయాణాలు సాగిస్తున్న వారు చెబుతున్నారు. అసలే పాలకొండ – చిలకపాలెం ప్రధాన రహదారి ఇరుకై నది. సుమారు 45 కిలోమీటర్లు మేర ఉన్న ఈ మార్గంలో రోడ్డుకు ఇరువైపులా చెట్లు ఉన్నాయి. దీనికి తోడు క్రషరీలు, క్వారీలు ఎక్కువగా ఉండటంతో ట్రాక్టర్లు, టారీలు దూసుకొస్తుంటాయి. ఆ వాహనాల కారణంగా ఇప్పటికే అనేక మంది ప్రమాదాలకు గురికాగా.. కొందరు మృత్యువాత కూడా పడ్డారు. అటువంటి ప్రమాదకర రోడ్డులో ఎంతో సురక్షితంగా ప్రయాణికులను తీసుకెళ్లాల్సిన ఆర్టీసీ బస్సులు సైతం మితిమీరిన వేగంతో ప్రయాణించడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల పాలకొండ నుంచి విశాఖపట్నం వెళ్లే నాన్‌స్టాప్ బస్సు పొందూరు మండలం రెడ్డిపేట వద్ద చెట్టుకు ఢీకొట్టి ఆగిపోయిన సంగతి తెలిసిందే. డ్రైవర్ రెప్పవాల్చటంతో ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. తొమ్మిది మంది ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఇప్పటికై నా ఆర్టీసీ ప్రయాణం సురక్షితం అనే భావన కొంతమంది డ్రైవర్ల తప్పిదాలు మూలంగా చెడిపోకూడదని పలువురు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. -
ఆకాశవాణిలో బద్రి ప్రసంగం
పలాస: మండలంలోని రంగోయి గ్రామానికి చెందిన గిడుగు రామ్మూర్తి కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు జానపద కళల పరిశోధకుడు బద్రి కూర్మారావు విశాఖపట్నం ఆకాశవాణి కేంద్రంలో శనివారం ఉత్తరాంధ్ర గిరిజన తెగలు–సంస్కృతి అనే అంశంపై ప్రసంగించారు. సవర, జాతాపు, గదభ, కొండదొర, మన్నెదొర, కొండ రెడ్లు, భగత వాల్మీకి తదితర 20 ఆదివాసీ తెగల ఆచారాలు, సంప్రదాయాలు, సంస్కృతి, పాటలు తదితర అంశాలను వివరించారు. ఆదివాసీ సంస్కృతి చాలా గొప్పదని, నాగరకత పెరుగుతున్న కొలదీ ఆదివాసీలు తమ భాషను, సంస్కృతిని మరిచిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాతృభాషను కాపాడుకోవాలని కోరారు. కాగా, ఈ నెల 8, 9, 10 తేదీల్లో తిరుపతిలో జరగనున్న భారత జనపద విజ్ఞాన సదస్సులో పాల్గొని ఉత్తరాంధ్ర జానపద కళలు, సాహిత్యంపై పత్రాలు సమర్పిస్తున్నట్టు బద్రి కూర్మారావు చెప్పారు. ప్రతిభకు ప్రశంసలు శ్రీకాకుళం క్రైమ్ : ప్రాపర్టీ, చైన్ స్నాచింగ్, దొంగతనాల వంటి కేసులు ఛేదించడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన పోలీసు అధికారులు, సిబ్బందిని అదనపు ఎస్పీలు కె.వి.రమణ, పి.శ్రీనివాసరావు ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమీక్షలో సీఐలు, ఎస్ఐలకు డీఎస్పీ సీహెచ్ వివేకానంద సమక్షంలో ప్రశంసాపత్రాలను అందించారు. గార మండలం శాలిహుండంలో 17 తులాల బంగారం కేసులో కీలక పాత్ర పోషించిన ఒకటో పట్టణ ఎస్ఐ ఎం.హరికృష్ణ వీరిలో ఉన్నారు. ‘శిష్టకరణ సంఘానికి ఎన్నికలు నిర్వహించలేదు’ శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): శిష్టకరణ రాష్ట్ర సంఘానికి ఎటువంటి ఎన్నికలు నిర్వహించలేదని సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పోలుమహంతి ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సంఘంలెపి 45 బ్రాంచీల అధ్యక్షులు ఎన్నికలకు ముందుకు వచ్చిన సందర్భంలో తేదీని ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులుగా, కార్యదర్శిగా పాత వర్గాన్ని కొనసాగించాలని అందరూ తీర్మానించిన సందర్భంలో ఎన్నికలు అవసరం లేదని నిర్ణయించినట్లు తెలిపారు. ఓబీసీ సాధన జరిగిన తర్వాత ఎన్నికల ప్రస్తావన తెరపైకి వచ్చే అవకాశం ఉందన్నారు. స్వలాభం కోసం నలుగురైదుగురు కలిసి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నిక అని ప్రకటించడం సరికాదన్నారు. తమ దృష్టికి తీసుకురాకుండా ఎవరైనా నిర్ణయాలు తీసుకుంటే, అటువంటి వారిని రాష్ట్ర కార్యవర్గం నుంచి తప్పిస్తూ క్రమశిక్షణ చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. జిల్లా క్రికెటర్లకు సత్కారం శ్రీకాకుళం న్యూకాలనీ: క్రీడాకారులు ముఖ్యంగా క్రికెట్లో అడుగుపెట్టినవారు నిర్దేశిత లక్ష్యాలను ఏర్పాటుచేసుకుని అకుంఠిత దీక్షతో వాటిని అందిపుచ్చుకోవాలని ఏఎస్పీ ఆర్.వెంకటరమణ అన్నారు. 2024–25 సీజన్లో వివిధ విభాగాల్లో ఏసీఏ అంతర్ జిల్లాల, అంతర్‌జోనల్, స్టేట్, అంతర్ రాష్ట్ర క్రికెట్ టోర్నీల్లో ప్రాతినిధ్యం వహించిన జిల్లా క్రీడాకారులను జిల్లా క్రికెట్ సంఘం ఘనంగా సత్కరించింది. శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు హోటల్లో శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఏసీఏ గేమ్స్ విభాగం జీఎం ఎంఎస్‌కుమార్ మాట్లాడుతూ జిల్లా నుంచి త్వరలో మరో ముగ్గురికి రంజీల్లో ప్రవేశం లభించే అవకాశముందన్నారు. ఇప్పటికే స్టార్ ఆల్‌రౌండర్ త్రిపురాణ విజయ్‌కు ఐపీఎల్లో ఎంట్రీ లభించడం శుభపరిణామమని పేర్కొన్నారు. అనంతరం జిల్లాలో 2021–22 తర్వాత జిల్లా క్రికెట్ సంఘం సాధించిన ప్రగతి, క్రికెట్ క్రీడాకారుల ఫలితాలను జెడ్‌సీఎస్ మెంటార్ ఇలియాస్ మహ్మద్ వివరించారు. నిరుపేద క్రీడాకారులకు షూ, బ్యాగ్‌లను అందజేశారు. కార్యక్రమంలో సీనియర్ క్రికెటర్ వండాన మురళీమోహన్, క్రీడాప్రోత్సాహకులు దుప్పల వెంకట్రావు, జెడ్‌సీఎస్ కోశాధికారి మదీనా శైలానీ, డాక్టర్ సువ్వారి రవికుమార్, గుంట పురుషోత్తమనాయుడు, రవికిరణ్, క్రీడాకారులు త్రిపురాన విజయ్, ఎస్డీఎన్వీ ప్రసాద్, ఎన్.హిమకర్, ఆర్.జున్నారావు, నంబళ్ల సుశాంత్, మొదలవలస పూర్ణచంద్ర, శిమ్మ సాత్విక్, సీహెచ్ యోజిత్, జోగేంద్ర, వివేక్నందా, న్రత కిరణ్, ఎస్వీ ప్రేరణ్, కె.హిమచంద్ర, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు. -
వేతనజీవుల ఊసులేని రాష్ట్ర బడ్జెట్
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): రాష్ట్ర బడ్జెట్ సందర్భంగా వేతనాలు పెరుగుతాయని ఎదురుచూసిన వేతన జీవుల ఆశలను రాష్ట్ర ప్రభుత్వం అడియాసలు చేసిందని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్.అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ ఆప్కాస్ రద్దు చేసి తిరిగి పాత కాంట్రాక్టు పద్ధతి పునరుద్ధరించడం వల్ల ఉద్యోగులు, కార్మికుల్ని అభద్రతాభావానికి గురవుతున్నారని చెప్పారు. గత ఏడాది ఆందోళన చేసిన అంగన్వాడీ, ఆశా, వెలుగు వీఓఏ, మధ్యాహ్న భోజన పథకం, సర్వ శిక్షా అభియాన్ ఉద్యోగులు, మున్సిపల్ వర్కర్లకు న్యాయం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తాజా బడ్జెట్లో జీతాల పెంపుపై ఎటువంటి ప్రస్తావన చేయకపోవడం దారుణమన్నారు. -
94.72%
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్శ్రీకాకుళం: ఉత్తరాంధ్ర జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో గురువారం జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. జిల్లాలో 5,035 మంది ఓటర్లు కాగా 4,769 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలో 94.72 శాతం పోలింగ్ జరిగింది. 5,035 మంది ఓటర్లలో 3,416 మంది పురుషులు కాగా వీరిలో 3,247 ఓటు హక్కు వినియోగించుకున్నారు. 1,619 మంది మహిళల్లో 1,522 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. శ్రీకాకుళం డివిజన్లో 2878 మంది ఓటర్లకు గాను 2700 మంది, టెక్కలి డివిజన్లో 1053 మందికి గాను 1008 మంది, పలాస డివిజన్లో 1104 మందికి గాను 1061 మంది ఓటు వేశారు. శ్రీకాకుళం డివిజన్లో 1838 మంది పురుషుల్లో 1734 మంది, 1040 మంది మహిళల్లో 966 మంది ఓటు వేశారు. టెక్కలి డివిజన్లో 780 మంది పురుషుల్లో 750 మంది, 273 మంది మహిళల్లో 258 మంది ఓటు వేశారు. పలాస డివిజన్లో 792 మంది పురుషుల్లో 763 మంది, 312 మంది మహిళల్లో 298 మంది ఓటు వేశారు. మండలాలు, మున్సిపాలిటీల్లో 31 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలీసు కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాల ను పరిశీలించారు. సిబ్బంది, ఓటర్లతో మాట్లాడి పోలింగ్ సరళి, సౌకర్యాలు కోసం తెలుసుకున్నారు. కూ టమి ప్రజా ప్రతినిధులు, నాయకులు అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద హడావుడి చేశారు. కొందరు ప్రజా ప్రతినిధులు గంటల తరబడి శిబిరాల్లో కాపు కాశా రు. ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియ ముగిసింది.ఓటు హక్కు వినియోగించుకుంటూ..ఓటు హక్కును వినియోగించుకుని వస్తున్న దివ్యాంగ టీచర్ 31 కేంద్రాల్లో ప్రశాంతంగా పోలింగ్ ఓటుహక్కును వినియోగించుకున్న 4,769మంది ఉపాధ్యాయులు -
తమ్ముడు కోసం తప్పుడు మార్గం
● జనవరిలో గంజాయి రవాణా చేస్తూ జైలుపాలైన యువకుడు ● అతడ్ని విడిపించేందుకు గంజాయినే నమ్ముకున్న సోదరుడు ● పట్టుకున్న ఇచ్ఛాపురం పట్టణ పోలీసులు ● 47.480 కేజీల గంజాయి సీజ్ ● మరో ఐదుగురు నిందితులూ అరెస్టు ఇచ్ఛాపురం: గంజాయి రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడిన తమ్ముడిని విడిపించేందుకు అన్న కూ డా గంజాయి బాటే పట్టాడు. ఈ క్రమంలో తోటి యువకులతో కలిసి ఇచ్ఛాపురం పోలీసులకు పట్టు బడ్డాడు. ఒడిశా నుంచి కేరళ రాష్ట్రంలోని ఖాయంకూలమ్ ప్రాంతానికి అక్రమంగా గంజాయి తరలిస్తుండగా ఈ ఆరుగురు ముఠా సభ్యులను ఇచ్ఛాపు రం పట్టణ పోలీసులు అరెస్టు చేసినట్లు కాశీబుగ్గ డీఎస్పీ వి.వెంకట అప్పారావు తెలిపారు. ఇచ్ఛాపు రం సీఐ కార్యాలయంలో గురువారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా మోహనబ్లాక్ గోవిందపూర్ గ్రామానికి చెంది న మైఖేల్ సబర్, సుమంతా సబర్, సుఖాంత్ సబ ర్, తౌతా గమాంగ, బబులా గమాంగ, చిమిడిహిల్ పంచాయతీ సింగిపూర్ గ్రామానికి చెందిన ప్రకాష్ గమంగలు మోహన బ్లాక్ సమీపంలోని కొండప్రాంతం వద్ద 47.480 కేజీల గంజాయిని కొనుగోలు చేశారు. ఆరు ప్యాకెట్లుగా విభజించి 5 లగేజ్ బ్యాగ్, ఒక ట్రావెలింగ్ సూట్‌కేస్‌లో పెట్టి బరంపురం వచ్చారు. అక్కడి నుంచి బుధవారం బస్సులో ఇచ్ఛాపురం చేరుకున్నారు. అనంతరం కేరళ రాష్ట్రం ఖాయంకూలమ్ ప్రాంతానికి తీసుకెళ్లేందుకు రైల్వేస్టేషన్‌కి వెళ్తుండగా ఇచ్ఛాపురం పట్టణ పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి గంజాయి, సెల్ఫో న్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి రిమాండ్‌కి తరలించారు. తమ్ముడిని విడిపించేందుకు.. నిందితులు గంజాయిని ఒడిశాలో కేజీ రూ.2వేలుకు కొనుగోలు చేసి కేరళలోని దుర్గకు అప్పగిస్తే అతను కేజీకి రూ.8వేలు చొప్పున అప్పగించేవాడు. ఈ క్రమంలో మైఖేల్ సబర్ తమ్ముడు సిమన్ సబర్ జనవరిలో గంజాయి అక్రమ రవాణా చేస్తుండగా పోలీసులకు పట్టుబడ్డాడు. అతడిని విడిపించడానికి డబ్బులు అవసరం కావడంతో మైఖేల్ కూడా గంజాయి రవాణా చేసేందుకు సిద్ధమైనట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. కార్యక్రమంలో సీఐ మీసాల చిన్నంనాయుడు, పట్టణ ఎస్సై ముకుందరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం ఆర్టీసీ రెండో డిపోలో ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో ఈ నెల 28 నుంచి ఆందోళనలు చేపడతామని ఎంప్లాయీస్ యూనియన్ డిపో అధ్యక్ష కార్యదర్శులు బి.ఎస్.బాబు, వై.దుర్గారావు డిమాండ్ చేశారు. డిపో కార్యాలయ ఆవరణలో గురువా రం వారు మాట్లాడుతూ స్పేర్ ఉన్న డ్రైవర్ కండక్టర్ల తో రిటైర్మెంట్ అయిన ఉద్యోగుల ఖాళీలను డ్యూటీ చార్ట్ భర్తీ చేయకపోవడం వల్ల డ్రైవర్, కండక్టర్లు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఈ విషయమై యాజమాన్యంతో మాట్లాడినా ఫలితం లేకపోయిందన్నారు. ఏడీసీ సఫలింగ్ చేయడం లేదని, అక్రమ చార్జిషీట్లు, అక్రమ పనిష్మెంట్లు ఇస్తున్నారని, 1/19 సర్కులర్ అమలు చేయట్లేదని, మహిళా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడం లేదని, అసిస్టెంట్ మేనేజర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, చార్టు వేయకుండా అడ్డుకుంటున్నారని చెప్పారు. వీటికి నిరసనగా శుక్రవారం ఎర్ర బ్యాడ్జీలతో ఉద్యోగులు విధులకు హాజరై నిరసన తెలియజేస్తామన్నారు. సమావేశంలో ఈయూ నాయకులు కె.బాబూరావు తదితరులు పాల్గొన్నారు. -
తమ్ముడు కోసం..ఓ వ్యక్తి తమ్ముడు కోసం తప్పుడు మార్గం ఎంచుకున్నాడు. పోలీసుల చేతికి చిక్కాడు. –8లో
● రెప్పపాటు ప్రమాదాలు.. శివరాత్రి మరునాడు జిల్లాలో రెండు రెప్పపాటు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. పాలకొండ నుంచి విశాఖపట్నం వెళ్తున్న బస్సు పొందూరు మండలంలోని రెడ్డిపేటకు చేరుకునే సరికి డ్రైవర్ కాస్త రెప్ప వాల్చడంతో చెట్టును ఢీకొట్టింది. బస్సు ముందు అద్దాలు పగిలిపోయాయి. తొమ్మిది మందికి గాయాలు కాగా..పెద్ద ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ మరో ప్రమాదంలో మాత్రం మృత్యుదేవత కరుణించలేదు. శ్రీకాకుళానికి చెందిన దంపతులు బైక్‌పై దైవ దర్శనాలకువెళ్లి వస్తుండగా ఎచ్చెర్ల బైపాస్ రోడ్డు వద్ద అంబులెన్స్ వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనకు కారణం కూడా అంబులెన్స్ డ్రైవర్ నిద్రమత్తేనని సమాచారం. ఈ బండి హైదరాబాద్ నుంచి పశ్చిమ బెంగాల్ వెళ్తోంది. – పొందూరు/ఎచ్చెర్ల క్యాంపస్ -
టెక్కలి సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్
టెక్కలి: టెక్కలి సబ్ రిజిస్ట్రార్ మత్స్య ఉమామహేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు గురువారం ఆదేశాలు జారీ చేశారు. గత ఏడాది సెప్టెంబర్ నెలలో మందస మండలం నుంచి టెక్కలి సబ్ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ లో భాగంగా ఉమా మహేశ్వరరావుపై అనేక అవినీతి ఆరోపణలు చోటు చేసుకున్నాయి. మందస మండలంలో పనిచేసిన కాలంలో అక్కడ దళారీలుగా వ్యవహరించిన కొంత మందితో టెక్కలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎనీవేర్ ప్రక్రియ చేపట్టడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ అడ్డగోలు వ్యవహారంపై ‘ఏం జరుగుతోంది’ అనే కథనం సాక్షిలో వెలువడింది. దీనిపై ఉన్నతాధికారులు దర్యాప్తు నిర్వహించారు. ఈ దర్యాప్తులో భాగంగా ఎనీవేర్ రిజిస్ట్రేషన్ వెసులుబాటుతో డబుల్ రిజిస్ట్రేషన్లు, అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు తేలడంతో సస్పెన్షన్‌కు గురయ్యారు. ఇదే ఎస్ఆర్ఓ గతంలోనూ ఒకసారి సస్పెన్షన్‌కు గురయ్యారు. వీధుల్లోకి ఆస్పత్రి మురుగునీరు నరసన్నపేట: స్థానిక వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రికి చెందిన మురుగు నీరు పక్కనే ఉన్న కోవెలవీధిలోకి వస్తోంది. దీంతో ఆ దుర్వాసనకు స్థానికులు తట్టుకోలేకపోతున్నారు. దీనిపై చాలాసార్లు ఆస్పత్రి సిబ్బందికి చెప్పినా పట్టించుకోవడం లేదని వారు తెలిపారు. ఆస్పత్రి వార్డుల్లో రోగులు, ఆస్పత్రి సిబ్బంది వినియోగిస్తున్న బాతురూమ్‌లు, టాయిలెట్ల నీరు ఇలా వీధి మధ్యలోకి వదిలేయడంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రి అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఎన్నికలు ప్రశాంతం: ఎస్పీ శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పేర్కొన్నారు. గురువారం ఉదయం 8 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు 31 పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. శ్రీకాకుళంలోని ఎన్టీఆర్ మున్సిపల్ కార్పోరేషన్ ఉన్నత పాఠశాలలో జరిగిన పోలింగ్ సరళి, భద్రతా ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌తో కలసి ఎస్పీ సందర్శించారు. అనంతరం ఎచ్చెర్లలో డాక్టర్ బీఆ ర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం కేంద్రాన్ని సందర్శించారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ బాక్సులను సురక్షితంగా విశాఖపట్నంలోని ఇంజినీరింగ్ కళాశాలలో భద్రపరిచేందుకు జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్‌ల ఎస్కార్ట్ సహాయంతో తరలించారు. ఎస్పీతో పాటు జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాల్లో డీఎస్పీలు ిసీహెచ్ వివేకానంద, డీవీవీఎస్‌ఎన్ మూర్తి, వెంకటఅప్పారావుల పర్యవేక్షణలో సీఐలు, ఎస్ఐలు విధులు నిర్వర్తించారు. -
పొజిషన్ మార్చుతుండాలి..
కంప్యూటర్, ల్యాప్‌టాప్‌పై పనిచేసేవారు ప్రతి 20 నిమిషాలకు ఒక సారి వారి పొజిషన్ మారుతూ రిలాక్స్ అవ్వాలి. మోకాళ్లు, పక్కటెముకలు కనీసంగా 90 డిగ్రీలు పొజిషన్లో ఉంచాలి. వెన్నెముక నిటారుగా ఉంచుతూ పనిచేయాలి. ఏదైనా సమస్య వస్తే తక్షణమే వైద్యులను సంప్రదించాలి. – డాక్టర్ ఎస్.వి.రాజేష్, ఆర్థోపెడిక్, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, టెక్కలి రాత్రిపూట మానుకోవాలి అదే పనిగా కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లో పనిచేసే వారికి ప్రధానంగా కళ్ల సమస్యలు అతి వేగంగా వస్తాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో పనిచేసి కళ్లకు ఒత్తిడి పెంచడం మంచిది కాదు. ప్రతి గంటకు ఒక సారి కళ్లకు విశ్రాంతి ఇవ్వాలి. అలాగే సమయానికి ఆహారం తీసుకోవాలి. కళ్లకు సంబందించి ఏమైనా సమస్యలు ఉంటే వైద్యుల సలహాలను తీసుకోవాలి. – డాక్టర్ ఎ.శ్రీరాములు, కంటి వైద్య నిపుణుడు, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, టెక్కలి●భంగిమను గమనిస్తుండాలి. ● సాధారణంగా తల బరువు నాలుగైదు కిలోలు ఉంటుంది. తలను మెడపై సరిగ్గా బ్యాలెన్స్ చేయగలిగితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాకాకుండా తరచూ ముందుకు, వెనక్కి వంచి ఉంచడం మెడ మీద అదనపు భారం పడుతుంది. దీనివల్ల క్రమంగా మెడనొప్పి, వెన్ను నొప్పి వంటి సమస్యలు వస్తాయి. ● అలాగే పడుకుని ఎత్తైన దిండు తలకింద పెట్టుకుని ల్యాప్‌టాప్, మొబైల్ చూస్తుంటారు. దీని వల్ల కూడా సమస్యలు తప్పవు. కళ్లకు నిటారుగా స్క్రీన్ ఉండేలా చూసుకుంటే మెడ పొజిషన్ ఆటోమేటిక్‌గా నిటారుగా ఉంటుంది. ● టైప్ చేయడం కోసం వేళ్లను ఎక్కువగా కదిలించాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు వేళ్లపై ఎక్కువ భారం పడకూడదంటే ప్రతి అరగంటకోసారి వేళ్లకు విశ్రాంతి ఇవ్వాలి. ● గంటల తరబడి వర్క్ చేసేటప్పుడు ఏదైనా అవయవంపై ఒత్తిడి పడినట్టు గమనిస్తే.. శరీరం పొజిషన్ తప్పుగా ఉందని అర్థం చేసుకోవాలి. అవయవాలు ఒత్తిడికి లోనవ్వకుండా, కళ్లు ఒత్తిడికి గురి కాకుండా పనిచేయడం అలవాటు చేసుకోవాలి. -
చక్రతీర్థ స్నానాలకు ముమ్మర ఏర్పాట్లు
జలుమూరు, ఎల్ఎన్ పేట: శ్రీముఖలింగం శివరాత్రి ఉత్సవాల్లో చివరి రోజు శుక్రవారం వంశధార నదిలో జరగనున్న స్వామివారి త్రిశూల్ చక్రతీర్థ స్నానాల పుణ్యక్రతువుకు పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని టెక్కలి డీఎస్పీ డీఎస్ఆర్విఎస్ఎన్ఆర్ మూర్తి గురువారం తెలిపారు. ప్రధాన ఆలయం నుంచి మధ్యాహ్నం 12 గంటల తర్వాత స్వామి ఉత్సవ మూర్తులను నదికి తీసుకెళ్లనున్నట్లు ఈఓ ప్రభాకరరావు తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు నదిలో రెండువైపులా బారికేడ్లు ఏర్పాటు చేసినట్లు రోడ్లు భవనాల శాఖ అధికారులు తెలిపారు. ఉత్సవమూర్తులను నదికి తీసుకెళ్లే సమయంలో 50 నుంచి 55 వరకూ రోప్ పా ర్టీ లు వినియోగిస్తున్నామని, అలాగే నదికి ఇటు 480 మంది అటు సరుబుజ్జిలి వైపు 450 మందితోపాటు అదనంగా 140 మందిని వినియోగించనున్నట్లు తెలిపారు. మిరాయపల్లి రేవులో పుణ్యస్నానాలు జరిగే సమయంలో భక్తుల రద్దీ, అల్లరిమూకల నిలుపుదల, శ్రీముఖలింగం గ్రామానికి రెండువైపులా ట్రాఫిక్ నియంత్రణ, పుణ్యస్నానాలు అనంతరం భక్తులు తిరిగి వారి స్వగ్రామాలకు చేర్చడం ప్రధానమని సీఐ శ్రీనివాసరావు తెలిపారు. నదిమార్గం కూడా ధూళి, దుమ్ము రేగకుండా ట్రాక్టరలతో నీరు చల్లేందుకు చర్యలు తీసుకున్నట్లు పంచాయతీ విస్తరణ అధికారి ఉమా మహేశ్వరరావు తెలిపారు. అలాగే వైద్య శిబిరం కూడా కొనసాగుతుందని అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తాడేల శ్రీకాంత్ తెలిపారు. -
చెరువు గట్టు తవ్వకం అక్రమమే
● కదిలిన అధికార గణం ● మళ్లీ కొబ్బరి మొక్కలను నాటించిన వైనం రణస్థలం: మండలంలోని కోష్ట పంచాయతీలో కృష్ణమ్మ చెరువు(కోనేరు)పై గట్టు తవ్వేసి కొబ్బరి మొక్కలు తొలగించడం అక్రమమేనని అధికారులు స్పష్టం చేశారు. ‘అంతా నా ఇష్టం’ పేరిట సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికార యంత్రాంగం గురువారం కదిలింది. కృష్ణమ్మ చెరువును పరిశీలించి మట్టి తొలగింపునకు గల కారణాలు అన్వేషించారు. మట్టి తరలింపునకు బాధ్యుడైన టీడీపీ నాయకుడు పిసిని జగన్నాథం సమక్షంలో అధికారులు చెరువును పరిశీలించారు. అతని పొలానికి మట్టి తరలించినట్లు గుర్తించి వివరాలు నమోదు చేసుకున్నారు. శ్మశాన వాటికకు రోడ్డు వేసేందుకు మట్టి తీసి తన పొలంలో వేసుకున్నానని జగన్నాథం చెప్పినట్లు అధికారులు వివరించారు. అయితే శ్మశాన వాటిక చెరువు నుంచి చాలా దూరంలో ఉంది. రోడ్డు వేయాలన్నా 15 మందికి పైగా జీరాయితీ రైతుల నుంచి భూమిని సేకరించాల్సి ఉంది. ఇలా పొంతన లేని సమాధానం చెప్పడంతో నివేదికను ఉన్నతాధికారులకు తెలియజేస్తామని అధికారులు చెప్పారు. అనంతరం ఎన్ఆర్జీఎస్ ఏపీవో ఎం.శ్రీనివాసనాయుడు ఆధ్వర్యంలో కొబ్బరి మొక్కలు తిరిగి నాటించారు. కార్యక్రమంలో గ్రామ రెవెన్యూ అధికారి లుకలాపు అప్పలనాయుడు, పంచాయతీ కార్యదర్శి ఆర్.శ్రీధర్, ఎన్ఆర్జీఎస్ ఏపీవో ఎం.శ్రీనివాసనాయుడు, జేఈ గౌరి కృష్ణ, టెక్నికల్ అసిస్టెంట్ రాజశేఖర్, పీల్డ్ అసిస్టెంట్ ఏ.సూర్యనారాయణ పాల్గొన్నారు.