Tirupati
-
ప్రధాన మంత్రి పంటల బీమా పరిస్థితి ఏంటి?
– లోక్ సభలో తిరుపతి ఎంపీ గురుమూర్తి తిరుపతి మంగళం : తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రధాన మంత్రి పంటల బీమా యోజన కింద సరిగా అమలు చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి మంగళవారం లోక్ సభలో ప్రశ్నించారు. ప్రధాన మంత్రి పంటల బీమా యోజన, మార్పు చేసిన వాతావరణ ఆధారిత పంట బీమా పథకం (ఆర్.డబ్లు.బి.సి.ఐ.ఎస్) కింద 2.63 లక్షల మంది రైతులు తమ పంటలకు బీమా నమోదు చేసుకున్నారని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామనాథ్ ఠాకూర్ సమాధానం ఇచ్చారు. ఈ పథకం కోసం 2022–23 సంవత్సరంలో 1,09,865 మంది రైతులు 1,16,895 హెక్టార్ల భూభాగానికి నమోదు చేసుకున్నారని తెలిపారు. అలాగే 2023–24లో 1,18,880 మంది రైతులు 1,42,695 హెక్టార్లకు, 2024–25లో 35,553 మంది, 45,507 హెక్టార్ల కు నమోదు చేసుకున్నారని తెలిపారు. ఈ పథకం కింద వరి, వేరుశనగ, సజ్జలు, పత్తి, పెసలు తదితర పంటలకు బీమా అందిస్తామని తెలిపారు. -
కారులో చెలరేగిన మంటలు
పాకాల: ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగిన ఘటన మండలంలోని పదిపుట్లబైలు వద్ద చోటుచేసుకుంది. మంగళవారం ఎస్ఎఫ్ఓ గుణశేఖర్రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. మదనపల్లి మండలం, రెడ్డివారిపల్లి గ్రామానికి చెందిన రాజేంద్ర ప్రసాద్ తిరుపతి నుంచి మదనపల్లికి కారులో పదిపుట్లబైలు క్రాస్ రోడ్డు వద్ద మహేంద్ర కారులో తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో ప్రయాణిస్తున్నాడు. ఇంతలో కారులో మంటలు చెలరేగాయి. చిత్తూరు కంట్రోల్ రూం నుంచి సమాచారం రావడంతో తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసినట్టు ఎస్ఎఫ్ఓ తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదని వివరించారు. అగ్నిమాపక సిబ్బంది మనోహర్‌రెడ్డి, సురేంద్రబాబు, బాలాజీ, నాగార్జున పాల్గొన్నారు. భారత్ ఆత్మగౌరవాన్ని అమెరికాకు తాకట్టు తిరుపతి కల్చరల్: బీజేపీ ప్రభుత్వం బ్లాక్ మెయిల్లో నెంబర్ ఒన్ అని, భారత్ ఆత్మగౌరవాన్ని అమెరికాకు తాకట్టుపెట్టే చర్యలు చేస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మండిపడ్డారు. తిరుపతిలోని సీపీఐ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో చంద్రబాబు, నితీష్ కుమారులు ఇద్దరకూ కలిసి సొంత ప్రయోజనాల కోసం మోదీని కాపాడారని విమర్శించారు. అధిక మంది పిల్లలను కందాం అనే దరిద్రమైన బీజేపీ స్లోగన్‌ను చంద్రబాబు బుజాన వేసుకున్నారని మండిపడ్డారు. -
రెండు కార్లు రికవరీ
బుచ్చినాయుడుకండ్రిగ : బాడుగకు తీసుకుని అమ్మేసిన రెండు కార్లను రికవరీ చేసి, ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు స్థానిక సీఐ తిమ్మయ్య, ఎస్ఐ విశ్వనాథనాయుడు తెలిపారు. మంగళవారం వారు స్థానిక పోలీసుస్టేషన్లో రికవరీ చేసి కార్లను, అరెస్టు చేసిన ఇద్దరు నిందితులను చూపారు. అనంతరం వారు మాట్లాడుతూ మండలంలోని ఆర్ అనంతపురం గ్రామానికి చెందిన మహేష్, తిమ్మభూపాలపురం గ్రామానికి చెందిన ఉమాశంకర్‌కు ఆమేజ్, ఎర్టీగా కార్లను నెల బాడుగకు ఇచ్చారు. అయితే ఉమాశంకర్ అనుచరులు దశరథన్, జాఫర్బాషాలతో కలసి పాకాలకు చెందిన వారికి వాహనాల రికార్డులను తారుమారు చేసి ఆమ్మేశారు. ఉమాశంకర్ కార్లు బాడుగ ఇవ్వకపోగా, కార్లను ఆమ్మేశాడని తెలియడంతో స్థానిక పోలీసుస్టేషన్లో మహేష్ ఫిర్యాదు చేశారు. దీంతో గాలించగా పాకాలలో ఉన్నట్లు సమాచారం అందడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. రెండు కార్ల విలువ రూ.25 లక్షలు ఉంటుందని తెలిపారు. ఉమశంకర్ పరారీలో ఉండడంతో దశరథన్, జాఫర్బాషాను అరెస్టు చేశారు. రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి రేణిగుంట: తిరుపతి–శ్రీకాళహస్తి మార్గం రాచగున్నేరి సమీపంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. ట్రాక్టర్ నడుపుతున్న డ్రైవర్‌కు రక్తగాయాలయ్యాయి. రూరల్ పోలీసుల కథనం.. శ్రీకాళహస్తి మండలం, రామలింగాపురానికి చెందిన ఆదినారయ్య(60 తన పొలంలోని వరి గడ్డిని డ్రైవర్ బత్తెయ్యతో కలిసి ట్రాక్టర్‌పై వేసుకుని బంగారుపాళెం సమీపంలో విక్రయించి తిరిగి ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో రాచగున్నేరి సమీపంలో ఓ గుర్తు తెలియని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ట్రాక్టర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్లో కూర్చున్న ఆదినారయ్య కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాక్టర్ నడుపుతున్న బత్తెయ్యకు రక్తగాయాలయ్యాయి. ఢీకొన్న బస్సు ఆగకుండా వెళ్లిపోవడంతో ప్రమాదానికి కారణమైన బస్సును కనుగునేందుకు పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
జిల్లాలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్య
● కానరాని నోటిఫికేషన్లు.. కనికరించని కూటమి నేతలు ● స్తంభించిన పారిశ్రామిక రంగం ● జాబ్ క్యాలెండర్ జాడలేక వెతలు ● వలసబాట పడుతున్న యువత ● జిల్లాలో 6 లక్షల 23వేల మంది నిరుద్యోగుల ఆర్తనాదాలు తిరుపతిలో ఇటీవల ఓ ప్రైవేటు సంస్థ నిర్వహించిన జాబ్ మేళాకు తరలివచ్చిన నిరుద్యోగులు నియోజకవర్గం యువత తిరుపతి 1,30,000చంద్రగిరి 85,000 శ్రీకాళహస్తి 93,000 సత్యవేడు 80,000 వెంకటగిరి 90,000 గూడూరు 75,000 సూళ్లూరుపేట 70,000● తిరుపతిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇటీవల ఓ సంస్థ జాబ్‌మేళా ఏర్పాటు చేసింది. సుమారు 80 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించగా 2 వేల మంది నిరుద్యోగులు హాజరయ్యారు. ఎస్ఎస్సీ అర్హతగల ఉద్యోగానికి సైతం పీజీలు పూర్తిచేసిన యువత హాజరుకావడంతో నిర్వాహకులు ముక్కున వేలువేసుకున్నారు. ● రేణిగుంటకు చెందిన వరప్రసాద్ ఎమ్మెస్సీ, పీహెచ్డీ పూర్తిచేశాడు. పేరొందిన కార్పొరేట్ కళాశాలలో ఫిజిక్స్ లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తూ జీవనం సాగించేవాడు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి డీఎస్సీ నోటిఫికేషన్‌పై తొలి సంతకం చేశారు. ఎంతో ఆశతో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే తపనతో వరప్రసాద్ ఉద్యోగాన్ని వదులుకుని లక్షలు అప్పుచేసి కోచింగ్ సెంటర్ బాటపడ్డారు. ఏడాది కావస్తున్నా అతీగతి లేదు. మళ్లీ జాబ్ వేటలో చైన్నెకి వెళ్లి ఓ హోటల్లో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు.. .. జిల్లాలో నిరుద్యోగ సమస్య పెరుగుతోందనడానికి ఇవి మచ్చుకు రెండు మాత్రమే. జిల్లాలో ప్రతి ఏటా నిరుద్యోగులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నారు. పీజీలు, పీహెచ్‌డీలు చేసిన వారు సైతం ఖాళీగా ఇంటి పట్టునే ఉండిపోతున్నారు. కూటమి ప్రభుత్వం జాబ్‌క్యాలెండర్ పూర్తిగా విస్మరించడం ఏంచేయాలో తెలియక తికమకపడుతున్నారు. ఇందులో ఎస్ఎస్సీ, ఇంటర్, ఐటీఐ, టీటీసీ, డిప్లొమో చేసినవారు 1,25,000 డిగ్రీ, బీటెక్, బీఈడీ పూర్తి చేసిన వారు 1,55,000 పీజీ, పీహెచ్డీ 85,000 వృత్తి విద్య, మెడకల్, టెక్నికల్ కోర్సులు పూర్తి చేసినవారు 2,58,000తిరుపతి సిటీ: ‘యువతకు 20 లక్షల ఉద్యోగాలు, జాబ్ వచ్చేంతవరకు నెలకు రూ.3వేలు భృతి’...ఇవీ ఎన్నికల సమయంలో సూపర్‌సిక్స్‌లో భాగంగా నిరుద్యోగ యువతకు చంద్రబాబు ఇచ్చిన వరాలు. కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాది కావస్తున్నా ఇంతవరకు నిరుద్యోగ భృతిపై నోరు మెదపడం లేదు. జాబ్ క్యాలెండ్ జాడలేకపోవడంతో జిల్లాలోని నిరుద్యోగ యువత పొట్ట చేతబట్టుకుని పక్క రాష్ట్రాలకు వలసబాట పడుతున్నారు. మూడుపూటలా కడుపునిండితే చాలు..చిరు ఉద్యోగమైనా చేస్తామంటూ పీజీలు, పీహెచ్‌డీలు చేసిన యువకులు ఎక్కడ జాబ్ మేళాలు ఏర్పాటు చేసినా వేల సంఖ్యలో ఎగబడుతున్నారు. 18 నుంచి 45 ఏళ్లలోపు నిరుద్యోగ యువత వివరాలు గత ఏడాది ఎన్నికల ముందు ఓ ప్రైవేటు ఎన్ఆర్ఐ సంస్థ ద్వారా తిరుపతి జిల్లాలో చేపట్టిన సర్వే ప్రకారం ఎస్ఎస్సీ నుంచి పీజీ, పీహెచ్డీ వరకు నియోజకవార్గాల వారీగా నిరుద్యోగ భృతికి అర్హులైన వారి జాబితా దాదాపుగా 6లక్షలా 23వేల మంది ఉన్నట్లు తేలింది. జిల్లాలో ఒక్కో నిరుద్యోగికి భృతి రూ.3వేల చొప్పున మొత్తం రూ.186.90కోట్లు నెలకు చెల్లించాల్సి ఉంది. పరిస్థితి దారుణం జిల్లాలో నిరుద్యోగం తాండిస్తోంది. నోటిఫికేషన్లు లేవు. నిరుద్యోగ భృతి లేదు. ప్రతి ఏడాదీ జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ప్రభుత్వ ఖాళీలు భర్తీ చేయడంలేదు. ప్రభుత్వ ఉద్యోగం వచ్చేంతవరకు భృతి ఇవ్వాల్సిందే. – బండి చలపతి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు, తిరుపతి జిల్లా ఎక్కడ జాబ్ మేళా జరుగుతున్నా.. ఉద్యోగ వేటలో ఏడాదిగా తిరిగి తిరిగి విసిగిపోయా. బీటెక్ సివిల్ పూర్తిచేశాను. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ ఊసేలేదు. ప్రైవేటు కంపెనీలు రావడం లేదు. దీంతో కొత్త ఉద్యోగాలు జాడ కనిపించడం లేదు. ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సిన పరిస్థితి. జిల్లాలో ఎక్కడ జాబ్ మేళా జరిగినా పడిగెడుతున్నా. –రమణారెడ్డి, బీటెక్, చంద్రగిరిఉద్యోగావకాశాల్లేవు నేను ఎంఏ పీహెచ్డీ చేశాను. వర్సిటీలో అధ్యాపక పోస్టులకు గత ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంతో శ్రమించి కోచింగ్ తీసుకున్నా. కానీ కూటమి సర్కార్ ఆ నోటిఫికేషన్‌ను తుంగలో తొక్కేసింది. గత ఏడాది ఒక్క ఉద్యోగం భర్తీ చేయలేదు. బెంగళూరులోని ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా పనిచేసేందుకు ఇంటర్వ్యూ పూర్తిచేశాను. వచ్చే నెల నుంచి అక్కడికి వెళ్లకతప్పడం లేదు. –పూజిత, ఎంఏ, పీహెచ్డీ, తిరుపతి -
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 13 కంపార్ట్మెంట్లు నిండాయి. గురువారం అర్ధరాత్రి వరకు 69,746 మంది స్వామివారిని దర్శించుకోగా 23,649 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.27 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం అవుతోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. శ్రీవారి సేవలో ప్రముఖులు తిరుమల శ్రీవారిని మంగళవారం ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు వేణు, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా.. టీటీడీ అధికారులు ఘనంగా లడ్డు ప్రసాదాలతో సత్కరించారు. -
స్పేస్ పోర్టు నిర్మాణానికి భూమిపూజ
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కులశేఖర్‌పట్నంలో ఎస్ఎస్ఎల్వీ లాంచ్కాంఫ్లెక్స్ (ఎస్ఎల్సీ) నిర్మాణానికి ఈనెల 5న భూమిపూజ చేసినట్టు ఇస్రో తన వెబ్సైట్లో మంగళవారం తెలిపింది. చిన్న ప్రయోగాలు, వాణిజ్యపరమైన ప్రయోగాలను ఎస్ఎస్ఎల్వీ లాంటి చిన్నతరహా రాకెట్ల ద్వారా చేయడానికి ఈ స్పేస్‌పోర్టు నిర్మాణాన్ని చేపట్టినట్టు వెల్లడించింది. ప్రయివేట్ సంస్థలకు చెందిన చిన్న చిన్న రాకెట్లకు కూడా మంచి డిమాండ్ ఉండడంతో కులశేఖరపట్నంలో రాకెట్ కేంద్రం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. -
రాజకీయ ప్రాధన్యత పెరగాలి
తిరుపతి సిటీ: మహిళలకు రాజకీయ ప్రాధాన్యత పెరినప్పుడే సమాజంలో సీ్త్రకి సమానత్వం నిర్మితమవుతుందని వీసీ సీహెచ్ అప్పారావు అభిప్రాయపడ్డారు. ఎస్వీయూ ఉమెన్ స్టడీస్ విభాగం ఆధ్వర్యంలో గత వారం రోజులుగా జరిగిన మహిళా దినోత్సవ వేడుకులు మంగళవారం ముగిశాయి. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. సాంకేతిక యుగంలోనూ మహిళలపై వివక్ష తగదన్నారు. సోషల్ మీడియాలో మహిళల పట్ల అభ్యంతరకర పోస్టులు పెడుతుండటం దారుణమన్నారు. అనంతరం చిత్ర లేఖనం, వక్తృత్వ పోటీలు, ఎగ్జిబిషన్, లింగ సమానత్వం, హింసలపై విద్యార్థులకు పలు రకాల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. విభాగాధిపతి డాక్టర్ సాయి సుజాత, డీఎస్పీ శ్రీలత, ప్రొఫెసర్ భాస్కర్‌రెడ్డి, డాక్టర్ రమణ, డాక్టర్ రాజేశ్వరి పాల్గొన్నారు. -
యువత పోరుకు తరలిరండి
తిరుపతి లీగల్: జిల్లాలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించనున్న ‘యువత పోరు’ను విజయవంతం చేయాలని ఆ పార్టీ లీగల్ సెల్ తిరుపతి అధ్యక్షుడు దొరబాబు (మునిబాల సుబ్రమణ్యం) ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఉద్యోగాల కల్పన లేకుండా, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా, ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెనల బకాయిలు చెల్లించకుండా, వైద్య విద్యను ప్రైవేటీకరిస్తూ విద్యార్థులను నిలువునా మోసగించిన కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి బకాయిలు చెల్లించేలా ‘యువత పోరు’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్ట పేర్కొన్నారు. ఇంటర్ పరీక్షకు 941 మంది గైర్హాజరు తిరుపతి ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా 86 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సర విద్యార్థులకు ఫిజిక్స్, ఎకనామిక్స్ సబ్జెక్టుల్లో పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు జనరల్‌లో 32,541మంది, ఒకేషనల్‌లో 1,357మంది మొత్తం 33,898 మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉంది. అయితే వీరిలో 941 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆర్ఐఓ జీవీ.ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఈ పరీక్షలో భాగంగా బుధవారం ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఫిజిక్స్, ఎకనామిక్స్ సబ్జెక్టుల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా 86 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పని ఒత్తిడి తగ్గించండి ఏర్పేడు(రేణిగుంట): తమకు సర్వేల పేరుతో పనిభారం మోపొద్దని ఏర్పేడు ఎంపీడీవో సౌభాగ్యంకు మంగళవారం మండలంలోని పంచాయతీ కార్యదర్శులు విన్నవించారు. కార్యదర్శుల సంఘం మండల అధ్యక్షుడు షఫీవుల్ల, కోశాధికారి లోకముని ఆధ్వర్యంలో ఎంపీడీవోకు వినతి పత్రం అందించారు. అన్ని శాఖల పనులు తమకే చెప్పి సర్వేలను పూర్తి చేయాలని ఒత్తిడి తెస్తున్నారని వాపోయారు. పిచ్చాటూరు అంగన్వాడీ కార్యకర్తకు బ్రెయిన్ స్ట్రోక్ – ధర్నా కోసం విజయవాడకు వెళ్లి కుప్పకూలిన వైనం నాగలాపురం: పిచ్చాటూరు అంగన్వాడీ కార్యకర్త బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆస్పత్రి పాలయ్యారు. రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు ఆమె తోటి అంగన్వాడీ కార్యకర్తలతో కలిసి ఆదివారం విజయవాడలో జరిగిన మహాధర్నాకు బయలుదేరి వెళ్లారు. సోమవారం ఉదయం ధర్నా చేపట్టడానికి తోటి కార్యకర్తలతో కలిసి అలంకార్ ప్రాంగణానికి వెళ్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆమెను విజయవాడలోని ఓ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు ఆమెకు చిన్నమెదడు చిట్లిపోయి రక్తం గడ్డకట్టినట్టు నిర్ధారించారు. కనీసం 24 గంటలు గడిస్తే గానీ ఆమె ఆరోగ్య పరిస్థితిని చెప్పలేమని వైద్యులు చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం వాణిశ్రీకి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. 15న జాబ్‌మేళా శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో ఈ నెల 15న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి లోకనాథం, ప్రిన్సిపల్ నాగరాజునాయుడు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్త, ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్, సీడాఫ్, డీఆర్డీఏ, జేకేసీ సంయుక్త ఆధ్వర్యంలో ఉదయం 9 నుంచి జాబ్‌మేళా నిర్వహించనున్నట్టు తెలిపారు. పలు బహుళ జాతీయ కంపెనీల్లో ఉద్యోగాల కోసం ఈ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. పదోవ తరగతి, ఇంటర్మీడియెట్, ఐఐటీ, డిప్లొమో, డిగ్రీ ఉత్తీర్ణత సాధించి యువతీయువకులు అర్హులని తెలిపారు. ఇంటర్‌ూయ్వలకు హాజరయ్యే వారు ఆధార్, విద్యార్హత సర్టిపికెట్స్ జిరాక్సులు, బయోడేటాతో పాటు సంబంధిత రిజిస్ట్రేషన్ లింక్‌లో నమోదు చేసుకున్ని అడ్మిట్ కార్డుతో జాబ్‌మేళాకు హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 7989509540, 8919889609 నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
జిల్లాలో మూడు ఇసుక పాయింట్లు
తిరుపతి అర్బన్: జిల్లాలో ఈనెల 15వ తేదీలోపు మూడు ఉచిత ఇసుక పాయింట్లు (స్వర్ణముఖినది ఆధారంగా)అందుబాటులోకి తీసుకొస్తామని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లో ఎస్పీ హర్షవర్ధన్‌రాజుతో కలసి అధికారులతో సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని కోట మండలం, గూడలి వద్ద ఒక ఇసుక పాయింట్, పెళ్లకూరు మండలం, పుల్లూరు సమీపంలో రెండు ఇసుక పాయింట్లు గుర్తించామని చెప్పారు. ఈ మూడు పాయింట్ల నుంచి 1,37,686 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఇసుక తోడుకోవాల్సి ఉంటుందన్నారు. అయితే డీసిల్టేషన్(ఇసుక పాయింట్ల) వద్ద ఇసుక తవ్వడానికి, రవాణా చేయడానికి ఏజెన్సీలను నియమించినట్టు వెల్లడించారు. ఆన్లైన్ ద్వారా ఇసుకను బుక్ చేసుకుని నేరుగా ఇసుక పాయింట్ల వద్దకు వెళ్లి రుసుం చెల్లించి ఇసుక తీసుకుపోవాలని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను ఇసుక పాయింట్ల వద్ద ఏర్పాటు చేస్తామన్నారు. ఎస్పీ మాట్లాడుతూ ఇసుక పారదర్శకంగా అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తడ, గాదంకి, సురుటుపల్లి చెక్స్పోస్టుల వద్ద ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. అడిషనల్ ఎస్పీ రవిమనోహరాచారి, నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు, గూడూరు సబ్‌కలెక్టర్ రాఘవేంద్ర మీనా, తిరుపతి, శ్రీకాళహస్తి ఆర్డీఓలు రామమోహన్, భానుప్రకాష్‌రెడ్డి, జిల్లా గనులశాఖ అధికారి బాలాజీ నాయక్, గూడూరు ఏడీ శ్రీనివాసరావు, ఇరిగేషన్ ఈఈ శ్రీనివాసరావు, గ్రౌండ్ వాటర్ టీడీ నాగమల్లేశ్వరరావు పాల్గొన్నారు.ఇసుక పై స్పష్టత ఏదీ? కూటమి సర్కార్ జూలై 8న ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చింది. గతంలో ఇసుక ఉచితం అని చెప్పినా జిల్లాలో ఏర్పాటు చేసిన నాలుగు పాయింట్ల వద్ద టన్నుల లెక్క విక్రయించారు. జూలై 8న జిల్లాలో నాలుగుచోట్ల ఏర్పాటు చేసిన ఉచిత ఇసుక పాయింట్లు మూతపడ్డాయి. ఆ తర్వాత ఆరు నెలలకు మళ్లీ ఉచిత ఇసుక గుర్తుకు వచ్చింది. ఇప్పుడు ఏర్పాటు చేస్తామన్న మూడు పాయింట్లను ఏజెన్సీకి ఇస్తున్నట్లు చెప్పారు. అయితే ఏజెన్సీకి ఏ పద్ధతిలో ఇస్తున్నారో క్లారిటీ లేదు. -
తిరుపతి: హోటల్లో కుప్పకూలిన పైకప్పు
సాక్షి, తిరుపతి: నగరంలోని బస్టాండ్ సమీపంలోని మినర్వా గ్రాండ్ హోటల్లో పైకప్పు కూలింది. రూమ్ నంబర్ 314లో ఒక్కసారిగా సీలింగ్ కుప్పకూలింది. దీంతో ఆ హోటల్లో ఉన్న భక్తులు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఇద్దరు భక్తులు గాయపడ్డారు. సంఘటన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హోటల్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రాష్ట్ర స్థాయి హాకీ పోటీల్లో జిల్లా జట్టు విజయం
తిరుపతి ఎడ్యుకేషన్ : గుంటూరు ఏఎన్‌యూలో ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి సీనియర్ మెన్ హాకీ పోటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా సోమవారం ప్రతిభ కనబరిచిన తిరుపతి, సత్యసాయి జిల్లా జట్లు ఫైనల్‌కు చేరాయి. హోరాహోరీగా తలపడ్డ ఫైనల్ పోటీల్లో సత్యసాయి జిల్లా జట్టుపై 6–2గోల్స్ తేడాతో తిరుపతి జిల్లా జట్టు విజయం సాధించినట్టు ఏపీ హాకీ సంఘం ప్రధాన కార్యదర్శి హర్షవర్ధన్, ఏపీ హాకీ డైరెక్టర్ నిరంజన్‌రెడ్డి చేతుల మీదుగా ట్రోఫీని అందుకుంది. ఈ పోటీల్లో తిరుపతి జిల్లా జట్టు బ్యాక్ క్రీడాకారుడు శ్రీనివాసులురెడ్డి(చంద్రగిరి), సెంటర్ హాఫ్ క్రీడాకారుడు సందీప్(గూడూరు) ఓవరాల్ ప్రతిభ కనబరిచి బెస్ట్ ప్లేయర్స్ అవార్డులను అందుకున్నారు. ప్రతిభ కనబరచిన జిల్లా జట్టు, క్రీడాకారులను జిల్లా హాకీ జట్టు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు స్పర్ధన్రాజు, బీ.ఆదిత్య, కోచ్‌లు దీపక్ ఆకాష్, అశోక్, రమేష్, జెర్సీ స్పాన్సర్లు వీఎన్ మొబైల్స్ అప్పు, వెంకట్ అభినందించారు. -
అరెస్ట్‌లు..నిరసనలు!
తిరుపతి అర్బన్: అంగన్వాడీ వర్కర్లతో కూటమి ప్రభుత్వం చెడుగుడు ఆడుతోంది. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా.. శాంతియుతంగా ధర్నా నిర్వహించేందుకు విజయవాడకు బయలుదేరిన వారిపై ఝులుం ప్రదర్శించింది. ఎక్కడికక్కడ అరెస్ట్‌లకు పూనుకుంది. ఇది చాలదన్నట్టు హౌస్ అరెస్ట్‌లూ చేసి నరకం చూపించింది. సెక్టార్ సమావేశాల్లోనే నిరసన జిల్లాలోని 11 ఐసీడీఎస్ సెంటర్లలో సోమవారం సెక్టార్ సమావేశాలు నిర్వహించారు. సాదారణంగా సెక్టార్ సమావేశం ప్రతి నెలా 25వ తేదీ పైన నిర్వహిస్తుంటారు. కానీ విజయవాడలో సోమవా రం జరిగిన మహాధర్నాకు వెళ్లకుండా కుయుక్తులు పన్నారు. సెక్టార్ సమావేశాన్ని సోమవారమే ఏర్పాటు చేశారు. జిల్లాలో 2,092 మంది అంగన్వాడీ వర్కర్లుండగా.. అందులో 500 మంది వరకు విజయవాడకు వెళ్లారు. మిగిలిన వారు సెక్టార్ సమావేశాల్లోనే నిరసన వ్యక్తం చేశారు. అండగా ఉంటామని! ప్రతిపక్షంలో ఉన్న సమయంలో చంద్రబాబునా యుడు, నారా లోకేష్ అంగన్వాడీలకు అండగా ఉంటామని హామీలిచ్చారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఇలా ఇబ్బందులకు గురిచేస్తున్నారని పలువురు అంగన్వాడీ వర్కర్లు వాపోయారు. -
అద్వితీయం!
ఎస్వీయూ చరిత్రలో మరో మైలురాయి ● జాతీయ యువజనోత్సవంలో ఎస్వీయూకు ద్వితీయ స్థానం ● అన్నిరంగాల్లో యువతను ప్రోత్సహించడమే వర్సిటీ లక్ష్యం ● మీడియాతో వీసీ, రిజిస్ట్రార్ తిరుపతి సిటీ: ఎస్వీయూ మరో మైలురాయిని దాటిందని వర్సిటీ వీసీ సీహెచ్ అప్పారావు ఆనందం వ్యక్తం చేశారు. జాతీయ యువజనోత్సవాల్లో విశేష ప్రతిభకనబరిచి వర్సిటీకి దేశంలోనే ద్వితీయ స్థానం సాధించిపెట్టిన విద్యార్థులను చూసి వర్సిటీ గర్వపడుతోందన్నారు. సోమవారం వీసీ చాంబర్లో ఆయన రిజిస్ట్రార్ భూపతినాయుడుతో కలసి మీడియాతో మాట్లాడారు. ఉత్తరప్రదేశ్‌లోని అమితి వర్సిటీ వేదికగా జాతీయ స్థాయిలో జరిగిన యువజనోత్సవాల్లో దేశ వ్యాప్తంగా సుమారు 148 యూనివర్సిటీల నుంచి 2,400 మంది విద్యార్థులు పోటీపడ్డారని తెలిపారు. ఎస్వీయూ నుంచి ఐదు విభాగాలలో పోటీపడి విద్యార్థులు సత్తా చాటారని తెలిపారు. ఫైనార్ట్స్ విభాగంలో ఓవరాల్ ద్వితీయ చాంపియన్‌గా వర్సిటీ నిలవడం గర్వంగా ఉందన్నారు. అకడమిక్ విద్యతో పాటు క్రీడలు, ఫైనార్ట్స్ వంటి అన్ని రంగాల్లోనూ వర్సిటీ విద్యార్థులను ప్రొత్సహిస్తోందని పేర్కొన్నారు. ఇంతటి విజయానికి కృషి చేసిన డాక్టర్ పత్తిపాటి వివేక్, ప్రొఫెసర్ మురళీధర్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో డాక్టర్ పాకనాటి హరికృష్ణ, శరత్‌బాబు, ప్రసన్న కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రథమ స్థానం సాధించడం గర్వంగా ఉంది టీటీడీ శిల్ప కళాశాలలో డిగ్రీ చదువుతున్నా. దేశ వ్యాప్తంగా 2,400 మంది విద్యార్థులు 148 వర్సిటీల నుంచి యువజనోత్సవాల్లో పాల్గొన్నారు. ఇందులో క్లై మోడలింగ్ విభాగంలో ప్రథమ స్థానం కై వసం చేసుకున్నాను. ఎంతో సంతోషంగా ఉంది. –కే.తేజ, విద్యార్థి, ఎస్వీయూ మెహందీలో ద్వితీయ స్థానం ఎస్పీడబ్ల్యూ కళాశాలలో డిగ్రీ చదువుతున్నా. జాతీ య స్థాయిలో జరిగిన పో టీలలో ఇన్స్టలేషన్ విభా గంలో ద్వితీయ స్థానంలో నిలిచా. మెహందీ విభాగంలో రెండవ స్థానం సాధించి ప్రశంసాపత్రం, ట్రోఫీ అందుకోవడం సంతోషంగా ఉంది. –దీప్తి, విద్యార్థిని, ఎస్వీయూ ఊహించలేదు వర్సిటీ పరిధిలోని విజ యం కళాశాలలో డిగ్రీ చదువుతున్నాను. మెహందీ, ఇన్స్టలేషన్ విభాగాలలో ప్రతిభ చూపి రెండవ స్థానంలో నిలవడం గర్వంగా ఉంది. ఇంతటి విజయం సాధిస్తానని అనుకోలేదు. – సంధ్య, విద్యార్థిని, ఎస్వీయూ వర్సిటీకి రుణపడి ఉంటా ఎస్వీ మ్యూజిక్ కళాశాలలో డిగ్రీ చేస్తున్నా. జాతీయ స్థాయి యువజనోత్సవాల్లో పాల్గొనే అవకాశం ఇచ్చిన ఎస్వీయూకు రుణపడి ఉంటా. జాతీయ స్థాయిలో రంగోళి విభాగంలో రెండవ స్థానం సాధించాను. – ఎం వీరాంజనేయులు, విద్యార్థి, ఎస్వీయూ గర్వంగా ఉంది టీటీడీ శిల్ప కళాశాలలో డిగ్రీ చేస్తున్నా. సౌత్‌జోన్ పోటీలలో విజయం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాను. కల్చలర్ కో–ఆర్డినేటర్స్ సహకారంతో ఈ స్థాయికి చేరుకోవడం గర్వంగా ఉంది. నేను ఇన్స్టలేషన్ విభాగంలో పాల్గొని రెండవ స్థానం సాధించా. –మౌనిక, ఎస్వీయూ రెండు విభాగాల్లో సత్తా చాటాను ఎస్వీయూ పరిధిలోని సీకాం కళాశాలలో డిగ్రీ చదువుతున్నా. వర్సిటీ ప్రోత్సాహంతో అత్యుత్తమ శిక్షణ అందించిన అధ్యాపకులు మురళీధర్, వివేక్ సహకారం మరువలేనిధి. ఇన్స్టలేషన్ విభాగంలో జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానం, పోస్టర్ మేకింగ్‌లో మూడవ స్థానం సాధించాను. – డీ.దేవా, విద్యార్థి, ఎస్వీయూ -
దుగరాజుపట్నం పోర్టు నిర్మాణం అంతేనా?
● పార్లమెంట్లో గళమెత్తిన ఎంపీ గురుమూర్తి తిరుపతి మంగళం : తిరుపతి పార్లమెంటు పరిధిలోని దుగరాజపట్నం పోర్టు నిర్మాణ పరిస్థితి ఏంటని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. సోమవారం లోక్ సభలో ఆయన మాట్లాడారు. 2014 పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న దుగరాజపట్నం నౌకాశ్రయ అభివృద్ధి ఇంకా ప్రారంభం కాలేదన్నారు. 2018 నాటికే మొదటి దశ నిర్మాణం పూర్తి కావాల్సి ఉందన్నారు. దీనిని తక్షణమే ప్రారంభించి, రాష్ట్ర సముద్ర వాణిజ్య అభివృద్ధిని వేగవంతం చేయాలని కోరారు. ఆధునిక సాంకేతికతను సద్వినియోగం చేసుకోకపోవడం లోపంగా కనిపిస్తోందన్నారు. ఈ–బిల్స్ ఆఫ్ లేడింగ్ అమలు చేయడం ద్వారా సముద్ర రవాణా మెరుగుపడుతుందని గుర్తుచేశారు. 2 నుంచి డీడీఈ పరీక్షలు నిర్వహించండి తిరుపతి సిటీ: ఎస్వీయూ డీడీఈ పరీక్షలను వచ్చే నెల 2వ తేదీ నుంచి నిర్వహించాలని వర్సిటీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే పలు మార్లు వాయిదా పడిన పరీక్షలను ఈ నెల 17వ తేదీ నుంచి నిర్వహించాలని కోర్టు గతంలో ఆదేశాలు జారీచేయగా, పదో తరగతుల నేపథ్యంలో పరీక్షలను నిర్వహించలేమని వర్సిటీ అధికారులు కోర్టుకు విన్నవించారు. అన్ని విషయాలను పరిశీలించిన ధర్మాసనం ఈ మేరకు షెడ్యూలు విడుదల చేయాలని అధికారులను ఆదేశించింది. రేపటి నుంచి ఏపీఈసెట్‌కు దరఖాస్తులు తిరుపతి సిటీ: ఏపీ ఈసెట్–2025 నోటిఫకేషన్ విడుదలైంది. బుధవారం నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. బీటెక్ కోర్సులో రెండవ ఏడాదిలో నేరుగా ప్రవేశం పొందేందుకు నిర్వహించే ఏపీఈసెట్‌కు వచ్చేనెల 7వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ప్రకటించారు. ఇంజీరింగ్ అండ్ టెక్నాలజీలో డిప్లొమో, బీఎస్సీ (గణితశాస్త్రం)లో డిగ్రీ ఫైనల్ ఇయిర్ చదువుతున్న, పూర్తి చేసిన అభ్యర్థులు ఏపీఈసెట్ పరీక్షకు అర్హులని తెలిపారు. ప్రవేశ పరీక్ష మే 6వ తేదీన నిర్వహించనున్నారు. ఈకేవైసీకి 18 వరకు గడువు తిరుపతి అర్బన్:ఈకేవైసీ చేయించుకోవడానికి రైతులకు ఈ నెల 18వ తేదీ వరకు గడువు ఉందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి ప్రసాద్‌రావు సోమవారం తెలిపారు. రబీ సీజన్‌కు సంబంధించి 2,03,860 ఎకరాలకు చెందిన 72,966 మంది రైతులకు ఈ పంట నమోదు చేశామని చెప్పారు. అలాగే 1,94,696 ఎకరాలకు సంబంధించి 69,166 మంది రైతులకు ఈకేవైసీ చేయాల్సి ఉందని వెల్లడించారు. 18వ తేదీ వరకు చేయించుకున్న వారి జాబితాను ఈనెల 22న ప్రకటిస్తామని తెలిపారు. కురుణామయుడా.. కనికరించు! తిరుపతి సిటీ: గౌరవవేతనం పెంచాలంటూ గత 36 రోజులుగా పశువైద్య విద్యార్థులు తరగతులు బహిష్కరించి వినూత్న రీతిలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం స్థానిక వెస్ట్ చర్చిలో వెటర్నరీ జూడాలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వారు మట్లాడుతూ నెల రోజులకు పైగా ఆకలి కేకలతో ధర్నాలు, నిర సనలు చేస్తున్నా అధికారులు, ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్‌పై స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారమయ్యే వరకు సమ్మె విరిమించేది లేదని హెచ్చరించారు. వేదవిజ్ఞానానికి ప్రత్యేక వెబ్సైట్ తిరుపతి సిటీ: వేద విజ్ఞానాన్ని డిజిటలైజేషన్ చేసి ప్రపంచానికి అందించేందుకు వేదం.ఓఆర్జీ పేరుతో ప్రత్యేక వెబ్‌సైటన్‌ను జాతీయ సంస్కృత వర్సిటీలో అధికారులు లాంఛనంగా ప్రారంభించారు. వర్సిటీలో ఖండనఖండఖాద్య గ్రంథాధ్యయనంపై పది రోజుల పాటు జరగనున్న అంతర్జాతీయ వర్కషాపులో భాగంగా ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. శ్రీసత్యసాయి వేదప్రతిష్ఠానం, న్యాసీ ప్రబంధకులు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కేఆర్ పరమహంస, వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి, డీన్ రజనీకాంత్ శుక్లా, ప్రొఫెసర్ గణపతిభట్, అధ్యాపకులు సతీష్, నాగరాజు భట్, మనోజ్‌షిండే, శివరామ దాయగుడే పాల్గొన్నారు. -
వాళ్లు ఉండరు..
సచివాలయాలు వెలవెల ● మహాత్మా గాంధీ కలలకు కూటమి నేతల తూట్లు ● చిన్న సమస్యలకూ కలెక్టరేట్‌కు పరుగులు ● క్షేత్ర స్థాయిలో ఎక్కడి సమస్యలు అక్కడే ● ఆపసోపాలు పడుతున్న ప్రజలు ‘క్షేత్ర స్థాయిలోనే సమస్యలు పరిష్కరించాలి. ఉద్యోగులు సైతం ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కారమవ్వాలి..’ అన్న లక్ష్యంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. ఇది ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారింది. కూటమి ప్రభుత్వం వచ్చాక మహాత్మాగాంధీ కలలకు తూట్లు పొడుస్తోంది. సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోంది. సర్వేల పేరుతో సిబ్బందిని ముప్పుతిప్పలు పెడుతోంది. చిన్న సమస్యకూ ప్రజలు సుదూర ప్రాంతంలోని కలెక్టరేట్‌కు పరుగులు పెట్టేలా చేస్తోంది. ఏం చేయాలో తెలియక.. తమ బాధలు ఎక్కడ చెప్పుకోవాలో అర్థంగాక జనం నలిగిపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. సిబ్బంది లేని చిట్టమూరు మండలంలోని ఆరూర్ సచివాలయం ఖాళీగా వరదయ్యపాళెంలోని సీఎల్‌ఎన్‌పల్లి గ్రామ సచివాలయం జిల్లా సమాచారం సచివాలయాలు 619 సచివాలయ ఉద్యోగులు 7,405 రూరల్‌లో సచివాలయాలు 495 సచివాలయ ఉద్యోగులు 5,445 అర్బన్ పరిధిలో సచివాలయాలు 196 సచివాలయ ఉద్యోగులు 1,960వికలాంగుల పింఛన్ కోసం వచ్చా నాది తిరుపతిలోని చింతలచేను. నా పేరు పీ.మంగమ్మ. నా భర్త పేరు వెంకటేష్. వికలాంగుల పింఛన్ కోసం కలెక్టరేట్‌కు వచ్చాం. సచివాలయంలో ఎవ్వరూ అందుబాటులో లేరు. మేము కటిక పేదవాళ్లం. దానికితోడు వికలాంగురాలుని. పింఛన్‌కు అర్హత ఉంది. న్యాయం చేయాలి. పింఛన్ ఇవ్వడంలేదయ్యా! నా పేరు కోనేటి రోసయ్య. మాది కేవీబీపురం మండలంలోని కోవనూరు ఎస్టీకాలనీ. వృద్ధాప్య పింఛన్ కోసం తిరుగుతున్నా. రెండు వారాలుగా కలెక్టరేట్‌కు వస్తున్నా. మా గ్రామం నుంచి కలెక్టరేట్‌కు రావాలంటే 70 కి.మీ. మా కష్టాన్ని గుర్తించాలి.తిరుపతి అర్బన్: సచివాలయ వ్యవస్థకు కూటమి నేతలు తూట్లు పొడుస్తున్నారు. సర్వేల పేరుతో సిబ్బందిని ప్రజలకు దూరం చేస్తున్నారు. ఇంటి వద్దే అందుతున్న సేవలను అందకుండా అడుగడుగునా అడ్డుపడుతున్నారు. ఫలితం చిన్న సమస్యకూ విధిలేని పరిస్థితుల్లో కలెక్టరేట్‌కు వెళ్లాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీరు, వీధిలైట్లు, దారి సమస్య, సర్టిఫికేట్స్, రేషన్‌కార్డులు, ఫించన్లు, పాఠశాలల్లో కొళాయిల మరమ్మతులు ఇలా.. అన్నింటికీ కలెక్టరేట్‌కు వెళ్తున్నారు. కూటమి ప్రభుత్వంలో 2024 డిసెంబర్ 2వ తేదీ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు 82 అర్జీలు వచ్చాయి. ప్రస్తుతం మార్చి 10వ తేదీ ఆ అర్జీల సంఖ్య 265కి చేరింది. మూడు రెట్లు అర్జీలు పెరిగాయి. రాబోవు రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పీఎంజేఏవై కార్డు కోసం తిరుగుతున్నా నా పేరు గూడూరు అయ్యప్ప. నా కుమారుడు గూడూరు దయాకర్ 5వ తరగతి చదువుతున్నాడు. పదేళ్ల వయస్సులోనే గుండె సమస్యతో బాధపడుతున్నాడు. ఆస్పత్రులకు వెళితే పెద్ద మొత్తంలో ఖర్చవుతుందని చెప్పారు. పీఎంజేఏవై కార్డు ఉంటే ఉచితంగా ఆపరేషన్ చేస్తామని చెప్పారు. గతంలో ఈ కార్డును సచివాలయ పరిధిలోనే ఇచ్చేవారు. ప్రస్తుతం వారు ఇవ్వడం మానుకున్నారు. దీంతో రెండు వారాలుగా పీఎంజేఏవై కార్డు కోసం కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నా. రేషన్ కార్డు కోసం వచ్చాం నా పేరు పీ.నాగయ్య. నా భార్యపేరు పీ.మురగమ్మ. మాది వడమాలపేట మండలంలోని బట్టికండ్రిగ గ్రామం. మాకు రేషన్‌కార్డు లేదు. సచివాలయానికి వెళితే అక్కడ ఎవ్వరూ ఉండడం లేదు. దీంతో మూడు వారాలుగా అన్ని పనులు వదులుకుని కలెక్టరేట్‌కు వస్తున్నాం. మేము చాలా పేదవాళ్లం. మాకు రేషన్ కార్డు ఇప్పించాలని కోరుతున్నాం. -
నీ శరణిదే జొచ్చితిని!
సంగీత తపస్వి గరిమెళ్ల ● అన్నమయ్య సంకీర్తనలే జీవితం ● రాగాలద్ది.. వైవిధ్యభరితంగా జనబాహుళ్యంలోకి ● భిన్నస్వరాలతో బాణీలు ● ఆయన లేని లోటు తీర్చలేనిదంటున్న సంగీత ప్రియులు తిరుపతి కల్చరల్: సంగీత తపస్వి గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్. ఆయన ఆధ్యాత్మికత సుపరిమళ గుబాళింపుగా ప్రాశస్తి చెందిన అన్నమయ్య సంకీర్తనలనే జీవితంగా మలుచుకున్నారు. తన స్వర కీర్తనలతో అలరారింపజేశారు. రాగాలనద్ది, వైవిధ్యభరితంగా బాణీలు కట్టారు. భిన్నమైన స్వర ప్రయోగాలతో సాహిత్య అభిమానులను సంగీత సాగరంలో ముంచెత్తారు. తుది శ్వాస వరకు.. గరిమెళ్ల భార్య రాధ. ఆయన కుమారులు అనిల్‌కుమార్, పవన్ కుమార్. నిత్య సంగీతార్చనతో తన ఆధ్యాత్మిక భక్తి పారవశాన్ని చాటుకున్నారు. తుది శ్వాస వరకు సంగీతోపాన్యాసం చేస్తూ నాద యోగిగా గుర్తింపు తెచ్చుకున్నారు. వైవిధ్య బాణీలు రాగమే ధ్యాసగా.. ఆధ్యాత్మిక సంగీతమే జీవితంగా పయనిస్తూ వెయ్యికి పైగా అన్నమాచార్య సంకీర్తనలను పండిత పామర జనరంజకంగా శాసీ్త్రయ లలిత, జానపద బాణీలలో స్వరపరిచారు. అన్నమయ్య కీర్తనల సాహిత్య పరిమళలాలను విస్తరింపజేశారు. బహుళ ప్రచారంలో మోహన, హంసధ్వని, శంకరాభరణం, తోడి, కల్యాణి, మాయామాళవగౌళ రాగాలను సరళమైన పద్ధతిలో స్వరపరిచారు. అన్నమాచార్య సంకీర్తనలను భావయుక్తంగా తన గళంలో పలికించేందుకు వీలుగా ఆయా సంకీర్తనలలోని సాహిత్యాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి దానికి తగిన రాగాలను స్వరబాణీలను సమకూర్చారు. అంతేగాక రతిపతిప్రియ, వరం, నటహిందోళం, శివరంజని, పాడి, మిశ్రవకుళాభరణం వంటి రాగాల్లో ఆయన స్వర పరిచన సంకీర్తనలు అలరింపజేశాయి. సుందరంజని, సుమశ్రీసుకామవర్థని, సుమగంధి, సునాదనంది, సత్యప్రియ, సంజీవి, సింధుప్రియ, శ్యామకాంభోజి ,వాణీప్రియ, చిత్రకల్యాణి, నిషాది, ప్రసూన, కోమలి వంటి సుమారు 20 అపూర్వ రాగాలను సృష్టించి అందులో కీర్తనలను రచించి పుస్తకాలుగా, ఆడియో రూపంలో తీసుకువచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా సప్తగిరి సంకీర్తనల గోష్టిగానాన్ని ప్రచారం చేసిన ఘనత గరిమెళ్లకే దక్కింది. స్వరం మాధుర్యం..ప్రతిభ అపారం సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి శిష్యరికంతో గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ మరింత రాటుతేలారు. శాసీ్త్రయ, ఆధ్యాత్మిక గాయకుడుగా గరిమెళ్ల 1978లో అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుడుగా ప్రవేశించారు. అపార ప్రతిభతో టీటీడీ ఆస్థాన విద్యాంసుడుగా ఎదిగారు. టీటీడీ ఆస్థాన పండితుడుగా అన్నమయ్య కీర్తనలను స్వపరపరిచి ఆలపించారు. తిరుమల శ్రీవేంకటేశ్వరునికి సంకీర్తన నైవైద్యాన్ని సమర్పించారు. రాజమండ్రిలో 1946 నవంబర్ 9వ తేదీన కృష్ణవేణి, నరసింహరావు దంపతులకు జన్మించారు. ఆయన తండ్రి నరసింహరావు విద్యాంసుడు. ప్రముఖ సినీ గాయని జానకి స్వయాన పిన్నమ్మ కావడంతో చిన్నప్పటి నుంచి ఆయన సంగీతం పట్ల ఆసక్తితో అంచెలంచెలుగా ఎదిగారు. చివరి దశలో తిరుపతిలో స్థిరపడ్డారు. కళా నీరాజనం గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్‌కు పలువురు ప్రముఖులు, కళాకారులు సోమవారం నివాళి అర్పించారు. ఇందులో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్, బ్రాహ్మణ సమాజం ప్రతినిధులు, రాయలసీమ రంగస్థలి కళాకారులు, టీటీడీ అన్నదానం డెప్యూటీ ఈవో రాజేంద్రకుమార్, డీపీపీ కార్యదర్శి, అన్నమయ్య వంశీయులు హరినారాయణదాస, ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకులు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఉన్నారు. విశేష పురస్కారాలు గరిమెళ్ల చేసిన సంగీత యజ్ఞ ప్రతిభకు విశేష పురస్కారాలు వరించాయి. అన్నమాచార్య సంకీర్తన మహతి, హరికీర్తనాచార్యులతో పాటు ప్రభుత్వ, ప్రయివేటు ఆధ్యాతిక సంస్థల పురస్కార సత్కారాలు అందుకున్నారు. శ్రీపద్మావతి మహిళా వర్సిటీ నుంచి డాక్టరేట్ డిగ్రీ అందుకున్నారు. శ్రీపొట్టి శ్రీరాముల తెలుగు వర్సిటీ నుంచి విశిష్ట పుస్కారంతో పాటు రాష్ట్రపతి చేతుల మీదుగా కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం అందుకున్నారు. -
పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక..
● విద్యార్థినుల మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు వెంకటగిరి రూరల్: పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక హాస్టల్ నుంచి పరారైన విద్యార్థినుల మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించిన ఘటన సోమవారం వెంకటగిరి పట్టణంలో చోటు చేసుకుంది. గూడూరు డీఎస్పీ గీతాకుమారి కథనం..స్థానిక బాలికోన్నత పాఠశాలలో చదువుతూ స్థానికంగా ఉన్న ఎస్సీ హాస్టల్‌కు చెందిన బాలికలు ముగ్గురు ఆదివారం హాస్టల్ నుంచి పారిపోయారు. విషయం తెలుసుకున్న వెంకటగిరి సీఐ ఏవీ రమణ నేతృత్వంలో వెంకటగిరి, బాలాయపల్లి, డక్కిలి ఎస్ఐలతో కూడిన మూడు మృందాలు సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ విక్రమ్, ఎస్డీపీ నాయుడుపేట పర్యవేక్షణలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. మొదటగా విద్యార్థినులు ఆర్టీసీ బస్సు ఎక్కి నాయుడుపేటకు చేరుకుని అక్కడి నుంచి తిరుపతికి వెళ్లినట్టు సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా ధ్రువీకరించారు. ఈ మేరకు సోమవారం తెల్లవారు జామన ఆ మగ్గురు విద్యార్థినులను తిరుపతిలో అదుపులోకి తీసుకున్నారు. పరీక్షల ఈనెల 17వ తేదీన జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఒత్తిడి కారణంగా వారు హాస్టల్ నుంచి పారిపోయినట్టు డీఎస్పీ తెలిపారు. సీఐ ఏవీ రమణ, ఎస్ఐలు సుబ్బారావు, భవాని, శివశంకర్, సీడీపీఓ శంషాద్‌బేగం పాల్గొన్నారు. -
సీసీ కెమెరాలతో నిఘా
నాయుడుపేట టౌన్: నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఎస్పీ హర్షవర్ధన్ రాజు సిబ్బందిని ఆదేశించారు. నాయుడుపేట పోలీస్ డివిజన్ కార్యాలయం, అర్బన్, రూరల్ పోలీస్ సర్కిల్ కార్యాలయాలను ఆయన సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ ఫిర్యాదుదారులతో గౌరవ ప్రదంగా వ్యవహరించాలన్నారు. మహిళలు వివిధ సమస్యలపై పోలీస్ స్టేషన్లకు వస్తే తక్షణం స్పందించాలని చెప్పారు. జిల్లాలో గంజాయి అక్రమ రవాణాలకు అడ్డుకట్ట వేసేలా ఈగల్ టీం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. డీఎస్పీ చెంచుబాబు, సీఐలు బాబి, సంగమేశ్వర రావు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
తడ: జాతీయ రనహదారిపై ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదంలో పూడి గ్రామానికి చెందిన ఇరుగళం వినోద్(24) మృతి చెందాడు. ఎస్ఐ కొండపనాయుడు కథనం.. పూడి గ్రామానికి చెందిన వెట్టి భాస్కర్, వినోద్ బైక్‌పై తడవైపు బయలు దేరారు. కొద్ది సేపటికే రోడ్డుపై వెళుతున్న మరో బైక్‌ను దాటే క్రమంలో అదుపు తప్పి ముందు వెళుతున్న బైక్‌ను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో వెనుక కూర్చుని ఉన్న వినోద్ తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై సోమవారం పోలీసులకు ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసి మృత దేహాన్ని సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది. నయా మోసం! ● క్యూఆర్ కోడ్‌పై నకిలీ స్టిక్కర్ అతికించిన వైనం తడ: నగదు స్కానింగ్ విషయంలో రోజుకో మోసం వెలుగులోకి వస్తోంది. తాజాగా తడలోని పలు దుకాణాల్లో కొత్త రకం మోసంతో వ్యాపారులు నష్టపోతున్నారు. ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. బాధితుల సమాచారం మేరకు.. టీ, మాంసం దుకాణాల్లో ఫోన్‌పే, గూగుల్ పే వంటి నగదు బదిలీల కోసం ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ స్టిక్కర్లు షాపులు బయట అతికించి ఉంటున్నారు. ఈ క్రమంలో సోమవారం ఓ చికెన్ దుకాణం వద్ద వినియోగదారుడు నగదు బదిలీ చేసినప్పటికీ సదరు నగదు దుకాణ దారునికి చేరలేదు. దీనిపై ఆరాతీయగా అసలు స్టిక్కరుపై ఉన్న క్యూఆర్ కోడ్ వరకు కొత్తగా మరో స్టిక్కర్ ఉండడాన్ని గుర్తించారు. దుకాణ దారుడు మిగిలిన వారిని కూడా విచారించగా విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నకిలీ క్యూర్ కోడ్ ఏ బ్యాంకుతో లింక్ అయిందో తెలుసుకునేందుకు పోలీసులు బ్యాంకులను సంప్రదిస్తున్నారు. ఇంటర్ పరీక్షకు 375 మంది గైర్హాజరు తిరుపతి ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా సోమవారం జిల్లా వ్యాప్తంగా 86 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ద్వితీయ సంవత్సర విద్యార్థులకు మ్యాథ్స్–2బీ, జువాలజీ, హిస్టరీ సబ్జెక్టుల్లో పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు జనరల్‌లో 25,107 మంది, ఒకేషనల్‌లో 1,037 మంది మొత్తం 26,144 మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉండగా.. 375 మంది గైర్హాజరైనట్టు ఆర్ఐఓ జీవీ.ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఈ పరీక్షలో భాగంగా మంగళవారం ప్రథమ సంవత్సర విద్యార్థులకు ఫిజిక్స్, ఎకనామిక్స్ సబ్జెక్టుల్లో జిల్లా వ్యాప్తంగా 86పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
ముగిసిన జాతీయ సదస్సు
తిరుపతి సిటీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)–2020పై జాతీయ సంస్కృత వర్సిటీ వేదికగా గత రెండు రోజులుగా జరిగిన జాతీయ సదస్సు సోమవారం ముగిసింది. ఈ కార్యక్రమానికి కేంద్ర సంస్కృత వర్సిటీ వీసీ శ్రీనివాస వర్కేడి, లాల్ బహుదూర్ శాస్త్రి సంస్కృత వర్సిటీ వీసీ మురళీమనోహర్ పాఠక్, ఎన్ఎస్యూ వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి ముఖ్యఅతిథులుగా పాల్గొని ప్రసంగించారు. అనంతరం వర్సిటీ అధికారులు అతిథులను జ్ఞాపికలతో సత్కరించారు. రాష్ట్రపతి సన్మానగ్రహీత, మాజీ అకడమిక్ డీన్ కొంపెల్ల రామసూర్యనారాయణ, వర్సీటీ వీసీ లక్ష్మీశ్రీనివాస్ పాండే, పలు వర్సిటీల మాజీ వీసీలు పరమేశ్వరనారాయణశాస్త్రి, అర్కనాథ చౌదరీ, సంస్కృత సంవర్థన ప్రతిష్టానం డైరెక్టర్ చాంద్ కిరణ్ సలూజా పాల్గొన్నారు. -
ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ సీజ్
చంద్రగిరి: ట్రాక్టర్ ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటనలో ఎట్టకేలకు పోలీసులు ట్రాక్టర్‌ను సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. రెండు రోజుల క్రితం చంద్రగిరి ఇందిరమ్మ కాలనీ సమీపంలో జరిగిన ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న చాణక్య అనే యువకుడు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ అధికార పార్టీ నేతకు చెందినది కావడంతో దాన్ని తప్పించేందుకు టీడీపీ నేతలు పోలీసులపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో ట్రాక్టర్‌ను సీజ్ చేయడంలో పోలీసులు వెనుకంజ వేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చేసేది లేక పోలీసులు ట్రాక్టర్‌ను సీజ్ చేసినట్టు సమాచారం. -
రాష్ట్ర స్థాయి హాకీ పోటీల్లో జిల్లా జట్టు విజయం
తిరుపతి ఎడ్యుకేషన్ : గుంటూరు ఏఎన్‌యూలో ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి సీనియర్ మెన్ హాకీ పోటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా సోమవారం ప్రతిభ కనబరిచిన తిరుపతి, సత్యసాయి జిల్లా జట్లు ఫైనల్‌కు చేరాయి. హోరాహోరీగా తలపడ్డ ఫైనల్ పోటీల్లో సత్యసాయి జిల్లా జట్టుపై 6–2గోల్స్ తేడాతో తిరుపతి జిల్లా జట్టు విజయం సాధించినట్టు ఏపీ హాకీ సంఘం ప్రధాన కార్యదర్శి హర్షవర్ధన్, ఏపీ హాకీ డైరెక్టర్ నిరంజన్‌రెడ్డి చేతుల మీదుగా ట్రోఫీని అందుకుంది. ఈ పోటీల్లో తిరుపతి జిల్లా జట్టు బ్యాక్ క్రీడాకారుడు శ్రీనివాసులురెడ్డి(చంద్రగిరి), సెంటర్ హాఫ్ క్రీడాకారుడు సందీప్(గూడూరు) ఓవరాల్ ప్రతిభ కనబరిచి బెస్ట్ ప్లేయర్స్ అవార్డులను అందుకున్నారు. ప్రతిభ కనబరచిన జిల్లా జట్టు, క్రీడాకారులను జిల్లా హాకీ జట్టు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు స్పర్ధన్రాజు, బీ.ఆదిత్య, కోచ్‌లు దీపక్ ఆకాష్, అశోక్, రమేష్, జెర్సీ స్పాన్సర్లు వీఎన్ మొబైల్స్ అప్పు, వెంకట్ అభినందించారు. -
కలెక్టరేట్‌కు పోటెత్తిన అర్జీదారులు
తిరుపతి అర్బన్: కలెక్టరేట్‌కు అర్జీదారులు పోటెత్తారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్‌కు కలెక్టర్ వెంకటేశ్వర్‌తోపాటు డీఆర్వో నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్రరెడ్డి, రోజ్మాండ్తో కలిసి అధికారులు అర్జీలు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి మొత్తం 265 అర్జీలు రాగా.. అందులో 172 అర్జీలు రెవెన్యూ సమస్యలపైనే వచ్చినట్టు అధికారులు పేర్కొన్నారు. సమస్యలే సమస్యలు ● గిరిజన యానాది కాలనీల్లో పలువురు పిల్లలతోపాటు పెద్దలకు ఆధార్‌కార్డులు లేవని ఏపీ యానాది సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ బీఎల్ శేఖర్, జిల్లా కన్వీనర్ శ్రీనివాసరావు కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. ● కేవీబీపురం మండలం, ఎస్‌ఎల్‌పురం గ్రామంలోని స్కూల్లో 3, 4, 5 తరగతుల విద్యార్థులను 2.5 కి.మీ దూరంలోని పాఠశాలకు వెళ్లాల్సి వస్తోందని, వారిని కళత్తూరు పాఠశాలకు మార్పు చేయాలని కోరారు. పలువురికి ఇంటి పట్టాలిచ్చినా స్థలాలు చూపించలేదన్నారు. ● బైరాగిపట్టిడిలోని మద్యం షాపును మరోచోటుకు మార్పు చేయాలని పలువురు కలెక్టర్‌కు వినతిపత్రాన్ని ఇచ్చారు. ● అవిలాల చెరువును రక్షించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మురళి కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందించారు. ● వరి ధాన్యానికి గిట్టుబాటు ధర పెంచాలని పలువురు రైతులు కోరారు. అలాగే సకాలంలో బిల్లులు ఇవ్వాలన్నారు. -
బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలి.. రాజ్యసభలో వైఎస్సార్సీపీ డిమాండ్
ఢిల్లీ: తిరుపతిలో కొత్తగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీ మేడ రఘునాథ్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. రాజ్యసభలో రైల్వే సవరణ బిల్లుపై చర్చ జరిగింది. వైఎస్సార్సీపీ తరఫున ఎంపీ మేడ రఘునాథ్ రెడ్డి చర్చలో పాల్గొన్నారు.రాజ్యసభలో చర్చ సందర్భంగా ఎంపీ మేడ రఘునాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. తిరుపతిలో కొత్తగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలి. చెన్నై, బెంగళూరుకు సమాన దూరంలో ఉన్న తిరుపతికి భారీ సంఖ్యలో ప్రయాణికులు వస్తుంటారు.భారీ సంఖ్యలో ప్రయాణికులను నేపథ్యంలో ఈ డివిజన్ ఫీజిబిలిటీ ఉంది. తిరుపతి రైల్వే స్టేషన్‌ను వరల్డ్ క్లాసు రైల్వే స్టేషన్‌గా తీర్చిదిద్దాలి. అన్నమయ్య జిల్లాలో నందలూరు రైల్వే స్టేషన్ వద్ద ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ స్థాపించాలి. అక్కడ 400 ఎకరాల భూమి, అవసరమైన నీరు అందుబాటులో ఉంది.వైజాగ్ రైల్వే జోన్లో వాల్తేరు జోనును సంపూర్ణంగా విలీనం చేయాలి.రైల్వే బోర్డులో ఏపీకి తగిన ప్రాతినిధ్యం కల్పించాలి. ప్రీమియం ట్రైన్లలో సామాన్య ప్రయాణికుల కోసం ఐదు కోచ్ లు అదనంగా ఏర్పాటు చేయాలి. రైల్వే ప్రమాదాల నేపథ్యంలో ఇండిపెండెంట్ సేఫ్టీ ఆడిట్ జరగాలి.అపరిశుభ్రమైన రైలు నాణ్యతలేని ఆహారం తదితరు అంశాలపై ప్రయాణికుల ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోవాలి.’అని కోరారు. -
వైఎస్సార్సీపీ బలోపేతమే లక్ష్యం
చిల్లకూరు : వైఎస్సార్సీపీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ మేధావుల ఫోరమ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ఎస్వీ సుబ్రమణ్యంరెడ్డి ఆదివారం తాడేపల్లె నివాసంలో వైఎస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత మాట్లాడుతూ వైఎస్సార్సీపీ పటిష్టతకు ఎప్పటికప్పుడు సలహాలు అందించాలని సూచించారు. ఉత్తమ అంగన్వాడీగా బుజ్జమ్మ రేణిగుంట : శ్రీకాళహస్తి మండలం జగ్గరాజుపల్లె అంగన్వాడీ కార్యకర్త ఎం.బుజ్జమ్మ జాతీయ స్థాయి అవార్డు అందుకున్నారు. శనివారం న్యూఢిల్లీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమెకు పురస్కారం ప్రదానం చేశారు. ఆదివారం ఈ మేరకు సీడీపీఓ శాంతిదు ర్గ, సూపర్వైజర్ మంజుల అభినందించారు. -
సేవలు..
సచివాలయ సిబ్బందిపై ప్రభుత్వం కక్షగట్టింది. వివిధ రకాల సర్వేల పేరుతో నిత్యం వేధింపులకు గురిచేస్తోంది. సెలవు రోజుల్లో సైతం శిక్షణ పేరుతో ముప్పతిప్పలు పెడుతోంది. అన్ని శాఖల పనులను వారి నెత్తిపైనే రుద్ది పొమ్మనలేక పొగబెడుతోంది. ఈ క్రమంలోనే ప్రజలకు సకాలంలో సేవలు అందకుండా అడ్డుపడుతోంది. ఉన్నత ఆశయంతో ఏర్పాటు చేసిన వ్యవస్థను నీరుగార్చేందుకు యత్నిస్తోంది. ఈ మేరకు సర్కారు నిర్వాకంతో జనం తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్.. మండల కార్యాలయాల వద్ద బారులు తీరుతున్నారు. సులభతరంగా అందుతున్న సేవలను దూరం చేశారని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికై నా పాలకుల వ్యవహారశైలి మారకుంటే గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నారు. జిల్లా సమాచారం మొత్తం సచివాలయాలు 691 ఉద్యోగులు 7,405 సచివాలయాల్లో పౌరసేవలు అందే సమయంలో కలెక్టరేట్ స్పందనకు వచ్చిన అర్జీలు 2023 డిసెంబర్ 554 2024 జనవరి 801 2024 ఫిబ్రవరి 802 కూటమి ప్రభుత్వంలో కలెక్టరేట్ గ్రీవెన్స్‌కు వచ్చిన అర్జీలు 2024 డిసెంబర్ 942 2025 జనవరి 660 (రెండు వారాలు గ్రీవెన్స్ జరగలేదు) 2025 ఫిబ్రవరి 948సాక్షి ప్రతినిధి, తిరుపతి : గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజా సేవకే పెద్దపీట వేసింది. అందులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో 35 శాఖలకు సంబంధించి సుమారు 500 సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రధానంగా పింఛన్, రేషన్ కార్డులు, ఇంటి పట్టాలు, సివిల్ పనులు, వైద్యం, ఆరోగ్యం, రెవెన్యూ సమస్యలు, భూముల సర్వే, శిశు సంక్షేమం, డెయిరీ, పౌల్ట్రీ వంటి అనేక అంశాలకు సంబంధించిన సేవలను ఆయా గ్రామాల్లోనే ప్రజలు వినియోగించుకునే వెసులుబాటు కల్పించింది. అర్జీ పెట్టుకున్న 72 గంటల్లోనే సమస్యను పరిష్కరించాలని స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సచివాలయ సిబ్బందికి తోడుగా వలంటీర్లను నియమించింది. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పనిచేసేలా దిశానిర్దేశం చేసింది. ఫలితం ఇదీ.. సర్వేల కారణంగా సిబ్బంది పౌరసేవలకు దూరంగా ఉండాల్సి రావటంతో పశు వైద్యం మూగబోయింది. మహిళా పోలీసులను కూడా సర్వేలకు వాడుకోవడంతో పల్లెల్లో సారా, గంజాయి విక్రయాలతోపాటు బెల్టు షాపులు జోరందుకున్నాయి. సచివాలయ సిబ్బంది సర్వేలకు పరిమితం కావడంతో గ్రామస్థాయి నుంచి పైస్థాయికి సమాచారం చేరడం లేదు. కీలకంగా పనిచేయాల్సిన డిజిటల్ అసిస్టెంట్లు కూడా గట్టిగా సీట్లో కూర్చులేకపోతున్నారు. వారికి సైతం అదనపు పనులు అప్పగించడంతో ప్రజా సేవలు కుంటుపడుతున్నాయి. అగ్రికల్చర్ అసిస్టెంట్లు కూడా పొలం బడిని వదిలేశారు. సచివాలయ సిబ్బందిని ప్రభుత్వం వివిధ శాఖలకు సర్ధుబాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. పని చేస్తున్నా.. తప్పని ఫిర్యాదులు మూలిగే నక్కపై తాటికాయపడ్డట్టుగా తయారైంది సచివాలయ సిబ్బంది పరిస్థితి. సర్వేలు, సొంత పనులు, సేవలు తలనొప్పిని తెచ్చిపెడుతుంటే.. మరో వైపు కూటమి నేతలు మరింతగా ఇబ్బందిపెడుతున్నారు. పని ఒత్తిడితో సతమతమవుతున్న ఉద్యోగులపై కావాలనే ప్రజాప్రతినిధులు, అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. తాము చెప్పినట్టు నడుచుకోవడం లేదని జులుం ప్రదర్శిస్తున్నారు. దీంతో ఎవరి మాట వినాలో తెలియక సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. కలెక్టరేట్‌కు వినతుల వెల్లువ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల కాలంలో కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 80 శాఖలకు సంబంధించి మొత్తం 3,208 అర్జీలు వచ్చాయి. ఇందులో 1,896 వినతులను పరిష్కరించారు. మిగిలిన 1,312 ఫిర్యాదులను పరిష్కరించాల్సి ఉంది. అయితే పలు అర్జీలకు కచ్చితమైన పరిష్కారం లభించక ప్రజలు మాత్రం కలెక్టరేట్ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూనే ఉన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆయా సచివాలయాల్లోనే సమస్యలు పరిష్కారమయ్యేవని అర్జీదారులు గుర్తుచేసుకుంటున్నారు. ప్రస్తుతం వాటిని నిర్వీర్యం చేయడంతోనే వివిధ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోందని మండిపడుతున్నారు.కత్తిగట్టిన కూటమి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సచివాలయ వ్యవస్థపై కత్తిగట్టింది. పల్లె పాలనను పూర్తిగా రద్దు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగా తొలుత వలంటీర్లను పక్కనపెట్టేసింది. సచివాలయ సిబ్బందిని పలు సర్వేల పేరుతో వేధిస్తోంది. గతంలోనూ సర్వేలు చేపట్టినప్పటికీ.. పౌరసేవలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకునేవారు. ప్రస్తుతం పౌరసేవలను పూర్తిగా పక్కనపెట్టి 36 రకాల సర్వేలను సిబ్బందికి అప్పగించి ఊరూరా తిప్పుతోంది. సెలవు రోజుల్లోనూ సర్వేలపై శిక్షణ అని పిలిపించుకుంటూ ఇబ్బంది పెడుతోంది. ఈ క్రమంలో అన్ని శాఖలకు సంబంధించిన పనులను తమపై రుద్దుతుండడంపై సచివాలయ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సచివాలయ సిబ్బందిని ముప్పతిప్పలు పెడుతున్న ప్రభుత్వం నాలుగు నెలలుగా 36 రకాల సర్వేలతో ప్రజా సేవకు దూరం సమస్యలు తీర్చేవారు లేక కలెక్టరేట్, మండల కార్యాలయాలకు జనం పెరిగిన ఒత్తిడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సచివాలయ సిబ్బందిపై ఒత్తిడి పెరిగింది. ముఖ్యంగా సర్వే అంటేనే భయపడే దుస్థితి దాపురించింది. తెల్లారితే సర్వే అని మొదలుపెడితే సాయంత్రానికి సర్వర్ డౌన్వుతోంది. రాత్రి ఇంటికి వెళ్లే సరికి సొమ్మసిల్లి పడిపోతున్నారు. ఆపై కూడా పంచాయతీ కార్యదర్శులు సర్వేలు చేయాలి. ఎంపీ, ఎమ్మెల్యే పర్యటనకు వస్తే వారి మీటింగ్‌ల నిర్వహణ చూసుకోవాలి. -
తిరుమలలో విస్తృత తనిఖీలు
తిరుమల : తిరుమలలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు, విజిలెన్స్ అధికారులు ఆదివారం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. నందకం, వకుళమాత, వరాహస్వామి అతిథిగృహాల వద్ద అనధికారికంగా వ్యాపారాలు సాగిస్తున్న 25 మంది నానల్ లోకల్, హ్యాకర్లను గుర్తించారు. నేర చరిత్ర ఏమైనా ఉందా తెలుసుకునేందుకు వేలిముద్రలు సేకరించారు. తిరుమలలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకే తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. అంబేడ్కర్ వర్సిటీని ఏర్పాటు చేయాలి తిరుపతి సిటీ: రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్సిటీని తక్షణం ఏర్పాటు చేయాలని అంబేడ్కర్ వర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఎస్వీ ఆర్ట్స్ కళాశాల ఎదుట పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. స్టడీసెంటర్ కో–ఆర్డినేటర్ డాక్టర్ వై మల్లికార్జున మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలు విడిపోయి 11ఏళ్లు పైబడినా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ ఏర్పాటు చేయకపోవడం విచారకరమన్నారు. అన్ని రాష్ట్రాల కంటే ఏపీ నుంచి ఎక్కువ మంది యూజీ, పీజీ, డిప్లొమో కోర్సులలో ప్రవేశాలు పొందుతున్నారని తెలిపారు. విద్యార్థుల సౌకర్యార్థం తక్షణం వర్సిటీని ఏపీలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ వేణుగోపాల్‌రెడ్డి, ఆర్ట్స్ కళాశాల అంబేడ్కర్ స్టడీసెంటర్ విద్యార్థులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
రోజురోజుకీ రొయ్య ధర పతనం
● తగ్గుతున్న ఎగుమతులు ● గగ్గోలు పెడుతున్న అన్నదాతలు హార్వెస్టింగ్ చేస్తున్న దృశ్యంజిల్లా సమాచారం రొయ్య సాగుచేసే మండలాల సంఖ్య 7 సాగులో ఉన్న విస్తీర్ణం 15 వేల హెక్టార్లు ఎకరా సాగుకు అవుతున్న ఖర్చు రూ.2 లక్షలు రైతులు 7 వేల మంది ఏటా దిగుబడి 1.5 లక్షల టన్నులు ఇందులో ఎగుమతి 90 శాతం వరకు వాకాడు: రొయ్య ధరలు రోజురోజుకీ పతనమవుతు న్నాయి. రోజుకి రూ.10 చొప్పున తగ్గిపోతుండడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఎగుమతి దారులు ప్రస్తుతం ఏ కారణం చెప్పకుండానే ధరలు తగ్గించేస్తున్నారు. దళారులు సిండికేట్‌గా ఏర్పడి మరింత పతనం చేస్తున్నారు. దీని వల్ల ఎకరాకు రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లుతోంది. గత నెల రొయ్యల ధరలతో లెక్కిస్తే రూ.4 వేల కోట్లు ఆదాయం రావాల్సి ఉంది. ఐతే ప్రస్తుత ధరలతో అది కాస్త రూ.3.5 వేల కోట్లకు పడిపోయింది. యూటర్న్ భారతదేశం నుంచి రొయ్య ఎగుమతులు ఎక్కువుగా యూరోపియన్ దేశాలకు వెళ్తుంటాయి. యూరప్‌లోని 10 దేశాల్లో ఆంధ్రా రొయ్యలకు మంచి డిమాండ్ ఉంది. ఐతే కొంతమంది రైతులు అత్యుత్సాహానికి వెళ్లి నిషేధిత యాంటీ బయోటిక్స్ సాగులో వాడడం వల్ల యూరోపియన్ ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కృష్ణపట్నం, విశాఖపట్నం, కాకినాడ నౌకాశ్రయాల ద్వారా ఎగుమతవుతున్న ప్రతి రెండు కంటైనర్‌లో ఒకదానికి శాంపిల్స్ తీస్తున్నారు. యాంటీ బయోటిక్స్ ఉన్నట్లు తేలితే ఎగుమతులు చేసే లైసెన్సులు రైతులు కోల్పోతున్నారు. ఐతే అమెరికా దేశానికి ఎగుమతయ్యే రొయ్య ఉత్పత్తును శాంపిల్స్ తక్కువుగా తీస్తుండడంతో ఎక్కువ మంది రైతులు ఆ దేశం వైపు మొగ్గు చూపుతున్నారు. నాసిరకం సీడ్, ఫీడ్ హేచరీలు అధిక ధరలతో నాసిరకం సీడ్ అంటగడుతున్నాయి. దీన్ని చెరువుల్లో పోసిన పది రోజులకే రొయ్య పిల్లలు విపరీతంగా చనిపోతున్నాయి. వాటిల్లో కొన్ని బతికి బయటపడ్డా అవి సమాన గ్రోత్ రావడం లేదు. వాటిని అమ్ముకుందామంటే రొయ్యల ప్రొసెస్ కంపెనీ వ్యాపారులు సిండికేట్లుగా ఏర్పడి అందినకాడకి దోసుకుపోతున్నారు. ప్రొసెస్ కంపెనీ వ్యాపారులదీ అదే పరిస్థితి. మామూళ్లమత్తులో అధికారులు నాణ్యమైన సీడ్ అందేలా చూడాల్సిన కోస్టల్ ఆక్వా అథారిటీ, మత్స్యశాఖ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. వాస్తవానికి మత్స్యశాఖ అధికారులు నెలకు రెండు సార్లు హేచరీలను పరిశీలించి ఆయా యజమానులకు నాణ్యమైన సీడ్ ఉత్పత్తులపై పలు చూచనలు, సలహాలను ఇవ్వాల్సి ఉంది. ఐతే గత ఆరు నెలలుగా అలా జరగడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఒకప్పుడు జిల్లా తీరం వెంబడి దాదాపు 45 వేల ఎక్టార్లలో ఆక్వాసాగు చేసేవారు. ప్రస్తుత 15 వేల ఎక్టార్లకు పడిపోయింది. ఆరు రోజుల్లో రూ.60 తగ్గిపోయింది రొయ్యల కొనుగోలుదారులు సిండికేట్లుగా ఏర్పడి ఆరు రోజుల నుంచి రోజుకి రూ.10 చొప్పున రూ. 60 తగ్గించేశారు. నెల కిందట 30 పైసలు ఉన్న రొయ్య పిల్ల ఇప్పుడు 55 పైసలకు పెంచారు. నాణ్యమైన సీడ్ దొరకడం లేదు. అంతా నకిలీల మయంగా మారింది. సాగులో తీవ్ర నష్టాలు వస్తున్నాయి. – ఎస్.మధురెడ్డి, ఆక్వా రైతు, ముట్టెంబాకఒడిదుడుకులు సహజం అన్ని వ్యాపార రంగాలలో ఒడిదుడుకులు సహజం. ఆక్వా రంగంలోనూ నేడు ధరల హెచ్చ తగ్గులు సర్వ సాధారణంగా జరుగుతున్నాయి. ఎక్కడా దళారీ వ్యవస్థ, సిండకేటు వ్యవస్థ కొనసాగడం లేదు. బార్డ్ ఫ్లూ ఉన్నందున రొయ్యల ధరలు పుంజుకునే అవకాశం ఉంది. – మత్స్యశాఖ జేడీ వివరణ ఎకరాకు రూ.1.5 లక్షల నష్టం ఓ పక్క ఆక్వా పెట్టుబడులు ఆమాంతంగా పెరిగి పోయాయి. లక్షలు పెట్టుబడులు పెట్టి 95 రోజులు కష్ట పడి పండించిన రొయ్యలకు ధరలు తగ్గించేశారు. ఎకరా సాగులో దాదాపు రూ.1.5 లక్షల వరకు నష్టం వస్తోంది. – చెంగయ్య ఆక్వా రైతు పల్లెపాళెంస్టోరేజీ సౌకర్యం లేకనే.. జిల్లా నుంచి ఏటా దాదాపు 1.5 లక్షల టన్నుల రొయ్యలను ఉత్పత్తి చేస్తుంటారు. ధరలు ఆశాజనకంగా లేనప్పుడు వాటిని నిల్వ చేసుకునేందుకు సరైన స్టోరేజీలు లేకపోవడంతో ఒకటికి సగానికి తెగనమ్ముతున్నారు. ఇక కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. జిల్లాలోని కౌలు రైతులకు ప్రాంతాన్ని బట్టి కౌలు నిర్ణయించారు. రూ. 50 వేల నుంచి రూ.లక్ష వరకు కౌలు ధర ఉంది. ప్రస్తుత ధరలతో పోల్చి చూస్తే కౌలు రైతుకు చివరకు మిగిలేది అప్పులే. రొయ్య ధరలు ఇలా కౌంట్ ఫిబ్రవరిలో మార్చిలో 40 రూ.415 రూ.350 50 రూ.375 రూ.335 60 రూ.345 రూ.315 70 రూ.310 రూ.285 80 రూ.290 రూ.255 90 రూ.270 రూ.235 100 రూ.260 రూ.225 -
గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ మృతిపై వైఎస్ జగన్ సంతాపం
సాక్షి,తాడేపల్లి : ప్రముఖ సంగీత విద్వాంసులు, శాస్త్రీయ సంగీత గాయకుడు, స్వరకర్త గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ మృతిపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. గరిమెళ్లకు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్ధానం ఆస్ధాన విద్వాంసుడిగా బాలకృష్ణ ప్రసాదు అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు వైఎస్ జగన్. సంగీత విద్వాంసుడిగానే కాకుండా ప్రముఖ సంకీర్తనాచార్యులు తాళ్లపాక అన్నమాచార్యుల వారి సంకీర్తలనకు స్వరకల్పన చేసి.. అన్నమాచార్యుల వారి సంగీత, సాహిత్యాలను ప్రజలకు చేరవేయడంలో ఆయన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు వైఎస్ జగన్. -
టీటీడీ ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూత
సాక్షి,తిరుపతి: టీటీడీ ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూశారు. 1978 నుండి 2006 వరకు టీటీడీలో ఆస్థాన గాయకుడిగా పనిచేసిన గరిమెళ్ళ 600లకు పైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేశారు. గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ భౌతిక దేహానికి టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి నివాళులర్పించారు. అంనతరం భూమన మాట్లాడుతూ.. ఆయనకు మరణం వేంకటేశ్వర స్వామి భక్తులకు తీరని లోటు. అన్నమయ్య కీర్తనలను గానం చేసి నేటి తరం భక్తులకు అందించిన మహనీయుడు గరిమెళ్ళ బాలకృష్ణ మరణించడం దురదృష్టకరమని అన్నారు. వినరో భాగ్యము విష్ణుకథ, జగడపు చనువుల జాజర,పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు వంటి సుప్రసిద్ధ కీర్తనలకు స్వరాలు సమకూర్చిన గరిమెళ్ళ సంప్రదాయ కర్ణాటక సంగీతంలో, లలిత సంగీతంలో, జానపద సంగీతంలోనూ పాటలు పాడారు. -
నిరుద్యోగులకు చంద్రబాబు సర్కార్ ద్రోహం: భూమన
సాక్షి, తిరుపతి జిల్లా: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు తీరును ఎండగట్టారు. కూటమి ప్రభుత్వ మోసాలపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసనలకు పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ‘యువత పోరు’ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధు సూదన్‌రెడ్డి, చంద్రగిరి సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, హర్షిత్ రెడ్డి, నగర పాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష పాల్గొన్నారు.ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ, నిరుద్యోగ భృతి ఇస్తామంటూ నిరుద్యోగులను చంద్రబాబు సర్కార్ ద్రోహం చేసిందని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్నికలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా యువతను, ప్రజలను అడ్డగోలుగా మోసగించారని ధ్వజమెత్తారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్ యువతకు, ప్రజలకు ప్రాధాన్యతనిచ్చి ఇచ్చిన ప్రతి హామిని నేరవేర్చారని భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. -
తిరుపతి: విరిగిన రైలు పట్టాలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
తిరుపతి జిల్లా: గూడూరు సమీపంలో రైలు పట్టాలు విరిగాయి. గొర్రెల కాపరి గమనించి ఎర్ర టవలు కట్టడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో విజయవాడ తిరుపతికి వెళ్లే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పట్టాలు ప్రమాదవశాత్తు విరిగిందా? లేక కుట్ర ఏమైనా దాగి ఉందా? అనే కోణంలో రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు. -
ఇంటర్ పరీక్షకు 651 మంది గైర్హాజరు
తిరుపతి ఎడ్యుకేషన్ : ఇంటర్ పబ్లిక్ పరీక్షలో భాగంగా శనివారం జిల్లా వ్యాప్తంగా 86 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సర విద్యార్థులకు మ్యాథ్స్–1బి, జువాలజీ, హిస్టరీ సబ్జెక్టుల్లో పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు జనరల్‌లో 28,981 మంది, ఒకేషనల్‌లో 1,357 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా జనరల్‌లో 552 మంది, ఒకేషనల్‌లో 99 మంది గైర్హాజరయ్యారని ఆర్ఐవో జీవీ.ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. సోమవారం ద్వితీయ సంవత్సర విద్యార్థులకు మ్యాథ్స్–2బి, జువాలజీ, హిస్టరీ సబ్జెక్టుల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 14న స్విమ్స్‌లో వాక్ ఇన్ ఇంటర్వ్యూ తిరుపతి తుడా: స్విమ్స్‌లో అడహక్ బేసిస్ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన 38 సీనియర్ రెసిడెన్స్ పోస్టులకు ఈనెల 14వ తేదీన వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ డాక్టర్ అపర్ణ ఆర్ బట్లా తెలిపారు. హిందూ మతానికి సంబంధిచిన వారు మాత్రమే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని సూచించారు. అర్హులైన అభ్యర్థులను రిజర్వేషన్, ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు స్విమ్ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. మెగా కార్పొరేట్ క్రీకెట్ లీగ్ ప్రారంభం తిరుపతి సిటీ: ఎస్వీయూ ఎన్టీఆర్ స్టేడియంలో మెగా కార్పొరేట్ క్రికెట్ లీగ్ టీ–20 టోర్నమెంట్‌ను శనివారం కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్‌రాజు ప్రారంభించారు. పది జట్లకు పైగా పాల్గొంటున్న ఈ టోర్నీలో తొలిరోజు కలెక్టర్ టీమ్, పోలీస్ టీమ్ తలపడ్డాయి. కలెక్టర్ మాట్లాడుతూ మానసిక, ఆరోగ్య సంరక్షణలో కీడ్రలు ఎంతో ఉపకరిస్తాయన్నారు. -
ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే!
ఓటేరు చెరువు కోసం శ్రీకాళహస్తి టీడీపీ నేతల మధ్య వార్ ● రూ.కోట్ల విలువచేసే చెరువును ఆక్రమించారని ఎమ్మెల్యే బొజ్జల ధ్వజం ● ఎమ్మెల్యేపై మండిపడిన మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు ● తిరుపతి సమీపంలోని చెరువు చుట్టూ కూటమి నేతల రాజకీయం సాక్షి ప్రతినిధి, తిరుపతి: చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్న ఓటేరు చెరువు విషయమై కూటమి ప్రభుత్వంలోని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు మధ్య వర్గపోరు తారస్థాయికి చేరింది. ఒకరిపై మరొకరు దుమ్మె త్తి పోసుకుంటున్నారు. చంద్రగిరి నియోజకవర్గం, తిరుపతి రూరల్ మండలం, అవిలాల గ్రామ సమీపంలో ఓటేరు చెరువు ఉంది. ఈ చెరువుపై వివాదం తలెత్తడంతో జలపరిరక్షణ సమితి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. 36.34 ఎకరాల విస్తీర్ణం ఓటేరు చెరువుదేనని 2006లో ప్రభుత్వం నిర్థారించినట్లు, 2013 అక్టోబర్‌లో ఏపీ హైకోర్టు సదరు భూమిని ప్రభుత్వ చెరువుగా ఉత్తర్వులు ఇచ్చినట్లు జలపరిరక్షణ సమితి వారు చెబుతున్నారు. ఇదే చెరువుపై గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ వివాదం తలెత్తింది. ఆ తరువాత ఓటేరు చెరువులోకి ఎవ్వరూ అడుగుపెట్టలేదు. తాజాగా మూడు రోజుల క్రితం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు భారీ వాహనాలతో మట్టి తీసుకొచ్చి చెరువుని పూడ్చివేసే ప్రయత్నాలు ప్రారంభించారు. విషయం తెలుసుకున్న స్థానికులు అడ్డుకున్నారు. సీపీఐ, సీపీఎం నేతలు ఆందోళనలకు దిగారు. శ్రీకాళహస్తి కూటమి నేతల మధ్య వార్ ఓటేరు చెరువు ఆక్రమణకు గురవుతోందని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి రెండు రోజుల క్రితం అసెంబ్లీలో ప్రస్తావించారు. దీనివెనుక శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు హస్తం ఉందని పరోక్షంగా ప్రస్తావించారు. దీనిపై మాజీ ఎమ్మె ల్యే స్పందించారు. విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే బొజ్జలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పనిలో పనిగా.. అవిలాల సర్వే నం.376లో 12.45 ఎకరాలు ఓటేరు చెరువు అని, సర్వే నం.370లో 6.70 ఎకరాలు కాలువ ఉందని, సర్వే నం.377లో 17.18 ఎకరాలు రైతుల భూమి ఉందని చెప్పుకొచ్చారు. మాజీ ఎమ్మెల్యే విమర్శలపై శ్రీకాళహస్తి టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి ఎస్సీవీ నాయుడుపై విమర్శలు చేయడం ప్రారంభించారు. ఆ చెరువుకి.. ఈ ఇద్దరికీ సంబంధం ఏంటి? ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు ఇద్దరిదీ శ్రీకాళహస్తి సొంత నియోజకవర్గం. చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్న ఓటేరు చెరువుకు వీరిద్దరికీ ఏమిటి సంబంధం అని జిల్లాలో చర్చ సాగుతోంది. ఓటేరు చెరువు అక్రమణల వెనుక ఎస్సీవీ నాయుడు ఉన్నారని పరోక్షంగా ప్రస్తావించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి.. చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన ముఖ్య టీడీపీ నేత హస్తం ఉందని సీపీఐ, సీపీఎం నేతలు ఆరోపిస్తున్నారు. ఎస్సీవీ నాయుడికి కూటమి ప్రభుత్వంలో ఎటువంటి ప్రయోజనం జరగకుండా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి అడ్డుపడుతున్నారని ఆయన వర్గీయులు అభిప్రాయపడుతున్నారు. ఎస్సీవీకి ప్రయోజనం చేకూరితే.. భవిష్యత్‌లో తనకు ఇబ్బందులు తప్పవని ఎమ్మెల్యే బొజ్జల లోచన చేస్తున్నట్టు ఆయన వర్గీయులు ఆరోపిస్తున్నారు. మొత్తంగా ఓటేరు చెరువు వివాదం శ్రీకాళహస్తి కూటమి నేతల మధ్య చిచ్చురేపింది. -
మహిళా పక్షపాతి జగనన్న
తిరుపతి మంగళం : మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి అని తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష, ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ మహిళా అధ్యక్షురాలు మాధవిరెడ్డి కొనియాడారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ కార్యాలయంలో శనివారం చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి, తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మహిళలకు పంచిపెట్టారు. మేయర్ శిరీష మాట్లాడుతూ గత ఐదేళ్ల పాలనలో పేదల సంక్షేమం, మహిళాభ్యున్నతి కోసం కృషి చేసిన ఏకై క నాయకుడు జగనన్న మాత్రమేనన్నారు. మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పించి అన్ని రంగాల్లో ఉన్నత స్థానాన్ని కల్పించారని కొనియాడారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాధవి మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగాలన్న ఆలోచనతో మహిళలకు అన్ని రకాలుగా తోడున్న నాయకుడు జగనన్న అన్నారు. కార్పొరేటర్ ఆరణి సంధ్య మాట్లాడుతూ జగనన్న పాలనలో మహిళలు మహారాణులుగా జీవించారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలు అణిచివేతకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అరాచకాలు, అత్యాచారాలు పెరిగిపోయాయని వాపోయారు. డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో మహిళా కార్పొరేటర్లు అని చూడకుండా తమపై దాడులకు తెగబడ్డారని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన సూపర్‌సిక్స్ పథకాల్లో ఏ ఒక్కటైనా నెరవేర్చారా? అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఆదిలక్ష్మి, పుణీత, శాలిని, శ్రావణి, ప్రముఖ రచయిత మస్తానమ్మ, మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు. ఆయన పాలనలోనే మహిళలకు సముచిత స్థానం కూటమి ప్రభుత్వంలో అరాచకాలు, అత్యాచారాలు మహిళా దినోత్సవంలో వక్తలు -
అంగన్వాడీల్లో అలజడి
అంగన్వాడీల్లో అలజడి మొదలైంది. అధికారులు, నేతలు బెదిరింపులకు దిగడం విమర్శలకు తావిస్తోంది.● ఆ శక్తి రూపమె! శ్రీసిటీలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. షార్ మహిళా శాస్త్రవేత్తలు, శ్రీసిటీ మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. శ్రీసిటీ బిజినెస్ సెంటర్లో నిర్వహించిన వేడుకలను మమతా సన్నారెడ్డి, తిరుపతి ఏఎస్పీ బీహెచ్ విమలకుమారి, సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం షార్ సీనియర్ సైంటిస్ట్ లత ప్రారంభించారు. అనంతరం మహిళలను సత్కరించారు. శ్రీసిటీ డైరెక్టర్ నిరీషా సన్నారెడ్డి పాల్గొని ప్రసంగించారు. – సత్యవేడు– 8లో -
రేపు ఐటీఐలో అప్రెంటిస్‌షిప్ మేళా
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుచానూరు రోడ్డు, పద్మావతీపురంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో సోమవారం ఉదయం 10 గంటలకు ప్రధాన మంత్రి జాతీయ అప్రెంటిస్‌షిప్ మేళా నిర్వహించనున్నారు. ఆ మేరకు ప్రిన్సిపాల్, కన్వీనర్ వి.శ్రీలక్ష్మీ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇందులో తిరుపతి జిల్లా వ్యాప్తంగా వున్న గుర్తింపు పొందిన పరిశ్రమల ప్రతినిధులు హాజరై అవగాహన కల్పిస్తారని తెలిపారు. అలాగే ఆయా కంపెనీల్లో అప్రెంటీస్ ఏర్పాటుచేయనున్నట్టు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలో ఉత్తీర్ణులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు అప్రెంటీస్‌షిప్ సలహాదారు సి.గంగాధరంను 94416 47174, 95337 17170 నంబర్లలో సంప్రదించాలని కోరారు. లక్ష్య సాధనకు నిబద్ధతతో పనిచేయాలి తిరుపతి సిటీ: మహిళలు ఉన్నత లక్ష్యసాధనకు నిబద్ధతతో అడుగు ముందుకు వేయాలని, అప్పుడే విజయం సొంతమవుతుందని మహిళా వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఉమ పేర్కొన్నారు. పద్మావతి మహిళా వర్సిటీ, మహిళా అధ్యయన కేంద్రం సంయుక్తంగా వే ఫౌండేషన్ సహకారంతో శనివారం సావేరి సెమినార్ హాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. మహిళా దినోత్సవం 2025 థీమ్ ఫర్ ఆల్ విమెన్ అండ్ గర్ల్స్ రైట్స్, ఈక్వాలిటీ, ఎంపవర్మెంట్ అనే అంశంపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. స్విమ్స్ కార్డియాలజిస్ట్ ప్రొఫెసర్ వి.వనజాక్షమ్మ మహిళల ఆరోగ్య సంరక్షణపై వివరించారు. కార్యక్రమంలో డీన్ కొలకలూరి మధుజ్యోతి, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, సుధారెడ్డి, మాజీ వైస్ వీసీ ప్రొఫెసర్ దుర్గా భవాని, ఇన్చార్జి రిజిస్ట్రార్ గీతావాణి, వే ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ పైడి అంకయ్య, మహిళా అధ్యయన శాఖ ఇన్చార్జి డాక్టర్ నీరజ తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 10 గంటలు తిరుమల: తిరుమలలో శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. క్యూకాంప్లెక్స్‌లో 9 కంపార్ట్మెంట్లు నిండాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 67,127 మంది స్వామివారిని దర్శించుకోగా 22, 910 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.47 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాన్ని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలో అనుమతించరని స్పష్టం చేసింది. -
మార్చి 31 వచ్చేస్తోంది?
–మీ టార్గెట్ పూర్తి చేశారా? తిరుపతి అర్బన్:‘మార్చి 31 వచ్చేస్తోంది.. మీ డిపో టార్గెట్ పూర్తి చేశారా..? అంటూ విజయవాడ, కడప ఈడీలు అప్పలరాజు, చంద్రశేఖర్ డిపోల వారీగా సమీక్షించారు. శనివారం తిరుపతి సెంట్రల్ బస్టాండ్‌ను పరిశీలించిన అనంతరం డీపీటీవో కార్యాలయంలో రాబడిపై డిపో అధికారులతో సమీక్షించారు. ఇప్పటి వరకు వచ్చిన రాబడి రూ.535 కోట్లు మాత్రమేనని గుర్తుచేశారు. డిప్యూటీ సీటీఎం విశ్వనాథం, డీఎంలు మునిచంద్ర, భాస్కర్, ప్రశాంతి, అసిస్టెంట్ డీఎంలు, మెకా నిక్ అసిస్టెంట్లు చాందిని, పుష్పలత పాల్గొన్నారు. -
అంగన్వాడీల్లో అలజడి
బెదిరింపులకు దిగుతున్న నేతలు, అధికారులు ● విజయవాడలో రేపు మహా ధర్నా ● ధర్నాకు వెళితే చర్యలు తప్పవంటూ హెచ్చరికలు ● ముందస్తు అరెస్ట్‌లకు సర్కార్ సిద్ధం తిరుపతి అర్బన్: అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లలో అలజడి రేగింది. సమస్యలపై ఈనెల 10వ తేదీన విజయవాడలో జరిగే ధర్నాకు వెళ్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఒత్తిడి చేస్తున్నారు. ధర్నాకు వెళ్లకుండా ముందస్తుగానే ఇంటివద్దే అరెస్ట్‌లు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఓ వైపు ఉన్నతాధికారుల నుంచి.. మరోవైపు పోలీసుల నుంచి అంగన్వాడీలకు ఒత్తిడి తప్పడం లేదు. దీంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. అయితే తమ న్యాయమైన కోర్కెల సాధన కోసం ఽవిజయవాడ ధర్నాకు వెళ్లి తీరుతామని స్పష్టం చేస్తున్నారు. ప్రతిపక్షంలో అలా....అధికారంలో ఇలా ప్రతిపక్షంలో ఉన్న సమయంలో చంద్రబాబునాయుడు అంగన్వాడీలకు చెందిన అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. అంతేకాదు అప్పట్లో నారా లోకేష్ సమస్యలపై ధర్నాలు చేసుకుంటే తాము అడ్డురామని చెప్పిన విషయాలను అంగన్వాడీ కార్యకర్తలు గుర్తుచేస్తున్నారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ధర్నాకు వెళ్లకుండా బెదిరింపులకు పాల్పడడంపై పలువురు మండిపడుతున్నారు. 11 ప్రాజెక్టుల్లోనూ బెదిరింపులు జిల్లాలో 11 అంగన్వాడీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ ప్రాజెక్టు అధికారుల నుంచి అంగన్వాడీ టీచర్లతోపాటు హెల్పర్లకు ఒత్తిడి తప్పడం లేదు. సాధారణంగా ప్రతి నెలా 25వ తేదీపైన సెక్టార్ మీటింగ్ నిర్వహిస్తుంటారు. అయితే విజయవాడలో రాష్ట్ర స్థాయి ధర్నాకు అంగన్వాడీలు పిలుపునివ్వడంతో మార్చి 10న సెక్టార్ మీటింగ్ ఉందంటూ ఆయా ప్రాజెక్టుల పరిధిలోని సీడీపీవోలు సమాచారం ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. 10వ తేదీ సెక్టార్ మీటింగ్ అంట! అంగన్వాడీ చరిత్రలో ఎప్పుడూ 10వ తేదీ సెక్టార్ మీటింగ్ నిర్వహించలేదు. ప్రతి నెలా 25వ తేదీ తర్వాతే నిర్వహించేవారు. విజయవాడలో 10వ తేదీ జరిగే ధర్నాకు వెళ్లకుండా అదే రోజు సెక్టార్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. న్యాయమైన కోర్కెల కోసం పోరాటం చేస్తే తప్పేముంది. –రాజేశ్వరి, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి (సీఐటీయూ అనుబంధం) బెదిరింపులకు దిగడం సరికాదు న్యాయమైన కోర్కెల సాధన కోసం ప్రశాంతంగా ధర్నా చేస్తామని ముందే అధికారులకు తెలియజేశాం. అయితే ధర్నాకు వెళ్లడం నేరంగా భావింతి ఒత్తిడి చేయడం సరైన పద్ధతి కాదు. అంగన్వాడీలకు పని ఒత్తిడి పెరిగింది. వేతనం రూ.26వేలు చెల్లించాలి.– పద్మలీలా, అంగన్వాడీ వర్కర్స్ జిల్లా అధ్యక్షురాలు(సీఐటీయూ) ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నెల 10వ తేదీన సెక్టార్ మీటింగ్ నిర్వహించనున్నాం. ధర్నాకు సంబంధించి అంగన్వాడీ నేతలు మాకు వినతిపత్రాన్ని అందించారు. బెదిరింపులు, ఒత్తిళ్లు లేవు. – వంసతబాయి, ఐసీడీఎస్, పీడీజిల్లా సమాచారం అంగన్వాడీ ప్రాజెక్టుల సంఖ్య 11 అంగన్వాడీ సెంటర్లు 2,492 అంగన్వాడీ మెయిన్ సెంటర్ల కార్యకర్తలు 2,092 అంగ్వాడీ మినీ సెంటర్ల కార్యకర్తలు 348 అంగన్వాడీ హెల్పర్లు 2,066పోరాటం తప్పదు అంగన్వాడీల న్యాయమైన కోర్కెల కోసం పోరాటం చేయాలని భావించాం. అందులో భాగంగా రాష్ట్ర స్థాయిలో ఈనెల 10వ తేదీన విజయవాడలో ధర్నా నిర్వహించనున్నాం. సెంటర్ల అద్దెలు, టీఏ, డీఏలు చెల్లించాలి. – సౌజన్య, శ్రీకాళహస్తి ఐసీడీఎస్ ప్రాజెక్టు అధ్యక్షురాలు -
వైఎస్సార్సీపీలో చేరిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు
తిరుపతి మంగళం : ప్రతి పేదవాడికి మెండుగా సంక్షేమ పథకాలను అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపిన గొప్ప నాయకుడు జగనన్న అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎంటెక్ బాబు అన్నారు. తిరుపతి పద్మావతిపురంలోని భూమన నివాసం వద్ద శనివారం సత్యవేడు నియోజకవర్గ సమన్వకర్త నూకతోట రాజేష్ ఆధ్వర్యంలో చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి, ఎంపీ మద్దిల గురుమూర్తి, మేయర్ శిరీష సమక్షంలో ఆయన వైఎస్సార్సీపీలో చేరారు. ఎంటెక్ బాబుకు కండువాను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. సత్యవేడులో రాజేష్ అన్న గెలుపుకోసం కృషి చేస్తానన్నారు. వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు బీరేంద్రవర్మ, పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు మాధవిరెడ్డి, సత్యవేడు నియోజకవర్గ మండల నాయకులు దయాకరరెడ్డి, భానుప్రకాష్‌రెడ్డి, గురునాథం, గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. -
గుర్తుతెలియని వ్యక్తి మృతి
తిరుపతి క్రైం: శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ రైల్వే గేట్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. ఎస్వీ యూనివర్సిటీ పోలీసుల కథనం.. సుమారు 45 నుంచి 50 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తి పద్మావతి డిగ్రీ కాలేజ్ సమీపంలో ఉన్న రైల్వే గేట్ వద్ద మృతిచెందాడు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో మృతదేహాన్ని ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. ట్రెక్కింగ్‌కు అనుమతుల్లేవ్!చంద్రగిరి: పనపాకం రేంజ్‌తో పాటు చంద్రగిరి పరిసర ప్రాంతాల్లో అటవీ ఏనుగులు సంచరిస్తున్నాయని, అనుమతులు లేకుండా ఎవరైనా అడవుల్లోకి ప్రవేశిస్తే చర్యలు తప్పవని పనపాకం రేంజ్ డీఆర్ఓ చిన్నబాబు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అడవుల్లో సంచరించడం, ట్రెక్కింగ్‌ను పూర్తిగా నిషేధించినట్లు ఆయన పేర్కొన్నారు. -
డివైడర్‌ను ఢీకొన్న కారు
పెళ్లకూరు: నాయుడుపేట–పూతలపట్టు జాతీయ రహదారి తాళ్వాయిపాడు గ్రామం వద్ద శనివారం తెల్లవారుజామున బెంగళూరు నుంచి గుడివాడ వెళుతున్న కారు ప్రమాదవశాత్తు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి సతీష్‌కుమార్(40) మృతి చెందాడు. స్థానిక ఎస్ఐ నాగరాజు కథనం మేరకు.. సతీష్‌కుమార్ తన స్నేహితురాలు శిరీషాతో కలిసి కారులో బెంగళూరు నుంచి గుడివాడకు వెళుతున్నారు. మార్గ మధ్యంలో తాళ్వాయిపాడు గ్రామం వద్ద ప్రమాద వశాత్తు కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సతీష్‌కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సతీష్‌కుమార్ మృతి చెందాడు. రక్త గాయాలైన శిరీషాను నెల్లూరు తరలించారు. మృతునికి భార్య రేణుక, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రావెల్ బస్సును ఢీకొట్టిన లారీ నాయుడుపేట–పూతలపట్టు జాతీయ రహదారి మార్గంలో పెన్నేపల్లి గ్రామ సమీపంలో ఉన్న అరబిందో అపార్ట్మెంట్ వద్ద శనివారం తెల్లవారు జామును ఆగి ఉన్న ట్రావెల్ బస్సును లారీ ఢీట్టింది. ఈ ఘటనలో పర్విన్ అనే మహిళకు గాయాలయ్యాయి. పోలీసుల కథనం.. బెంగళూరు నుంచి నెల్లూరుకు వెళుతున్న ఎన్వీడీటీ ట్రావెల్ బస్సు మార్గ మధ్యంలో పెన్నేపల్లి గ్రామ సమీపంలో అరబిందో అపార్ట్మెంట్ వద్ద ప్రయాణికుల కాలకృత్యాల నిమిత్తం రోడ్డు పక్కగా ఆగింది. అదే మార్గంలో వెళుతున్న లారీ ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న పర్విన్‌కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. గాయపడిన పర్విన్ను చికిత్సల నిమిత్తం నాయుడుపేటకు తరలించారు. సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి -
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
చంద్రగిరి: రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో మహిళలు రాణించాల్సిన ఆవశ్యకత ఉందని చిత్తూరు జిల్లా జెడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం మండలంలోని ఐతేపల్లి, అగరాల పంచాయతీ సర్పంచ్‌లు ఫాజిలా, అగరాల భాస్కర్ రెడ్డిల అధ్యక్షతన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీగా ఐతేపల్లి ఎంపిక కావడం శుభపరిణామమన్నారు. అనంతరం మహిళా డిజిటలైజేషన్, ఇన్నోవేషన్ టెక్నాలజీలో మహిళల పాత్ర గురించి వివరించారు. తర్వాత మహిళలను వారు ఘనంగా సత్కరించారు. డీపీఓ సుశీలాదేవి, ఎంపీడీఓ శేఖర్, ఎంఈఓ లలితకుమారి, ఈఓఆర్డీ వెంకటరత్నం, ఏపీఎం గంగయ్య, మెడికల్ అధికారిణి డాక్టర్ ప్రియాంక పాల్గొన్నారు. 15 నుంచి ఇంటర్ మూల్యాంకనం తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతిలోని ఎస్వీ జూనియర్ కళాశాలలో ఈ నెల 15వ తేదీ నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి స్పాట్ వాల్యుయేషన్ చేపట్టనున్నట్టు ఆర్ఐవో జీవీ.ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఇది వరకే సంస్కృతం సబ్జెక్టుకు సంబంధించి మూల్యాంకనం చేపట్టినట్లు తెలిపారు. 15వ తేదీ నుంచి సబ్జెక్టుల మూల్యాంకనానికి ఇంటర్ బోర్డు నుంచి అధ్యాపకులకు ఉత్తర్వులు రానున్నాయని తెలిపారు. ఉత్తర్వులు అందుకున్న ప్రతి అధ్యాపకుడు విధిగా స్పాట్ వాల్యుయేషన్‌కు హాజరుకావాలని కోరారు. -
గూడ్సు రైలు ఢీకొని వ్యక్తి మృతి
నాయుడుపేట టౌన్: నాయుడుపేట రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం రైలు పట్టాలు దాటుతున్న కాపులూరు మణేయ్య(48) అనే వ్యక్తిని గూడ్పు రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సూళ్లూరుపేట రైల్వే హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు కథనం.. కల్లిపేడు గ్రామానికి చెందిన ఎలక్ట్రీషియన్ కాపులూరు మణెయ్య, భార్య పిల్లలతో కలిసి మండల పరిధిలోని చిగురుపాడు గ్రామంలో నివాసం ఉంటున్నారు. శనివారం మణెయ్య రైల్వే స్టేపన్ చివరి ప్లాట్‌ఫారమ్ నుంచి నడుచుకుంటు వెళ్లి రైలు పట్టాలు దాటుతున్నాడు. చైన్నె వైపు వెళ్లే గూడ్సు రైలు అతనిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. కేసు దర్యాప్తులో ఉంది. -
‘అమ్మా..నాన్నా.. ఒక్కసారి మాట్లాడండి’
తిరుపతి: మండల కేంద్రమైన సైదాపురంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గురువారం సైదాపురం–తిప్పవరపాడు మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సైదాపురానికి చెందిన దొడ్డగా మునెయ్య, భార్య జ్యోతి అక్కడికక్కడే మృతిచెందారు. కుమార్తె వైష్ణవి రక్తగాయాలతో బయటపడింది. ఈ క్రమంలో శుక్రవారం సైదాపురంలో మృతదేహాలకు అంతిమ వీడ్కోలు పలికారు.కంటతడి పెట్టించిన కుమార్తెల మాటలుకళ్లెదుటే తల్లిదండ్రులు విగత జీవులుగా పడి ఉండడంతో ఆ పసి హృదయాలు తల్లడిల్లిపోయాయి. ‘అమ్మా..నాన్నా.. ఒక్కసారి మాట్లాడండి’ అంటూ వారిపై పడి గుండెలు బాదుకోవడం అక్కడి వారిని కలచివేసింది. గాయపడిన వైష్ణవి చివరగా తల్లిదండ్రుల అంతిమయాత్రలో టాటా చెప్పడం స్థానికులకు కన్నీళ్లు తెప్పించింది.గోకుల బృందావనంలో పుట్టి..మండల కేంద్రమైన సైదాపురం సమీపంలోనే ఉన్న గోకుల బృందావనం గ్రామంలో దొడ్డగ మునెయ్య జన్మించారు. ఆయనకు అన్నలు భాస్కర్, చంద్రయ్య ఉన్నారు. వారంతా గోకులబృందావనం గ్రామం వీడి సైదాపురానికి చేరుకుని అక్కడే స్థిరపడ్డారు. మునెయ్యకు పెళ్లి చేసి సైదాపురంలోనే ఇల్లు కటించి బాగోగులు చూసుకునే వారు. ఈ క్రమంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మునెయ్యతోపాటు భార్య జ్యోతి మరణించడంతో విషాదంలో మునిగిపోయారు. ముక్కుపచ్చలారని పసిబిడ్డలను వదిలివెళ్తున్నారా..! అంటూ కన్నీరుమున్నీరయ్యారు. మృతుని కుటుంబాన్ని వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మన్నారపు రవికుమార్ పరామర్శించారు. మృతుని కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.‘అమ్మా..నాన్నా మమ్మల్ని వదిలి వెళ్లిపోయారా..! -
TTD: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 9 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 67,127 మంది స్వామివారిని దర్శించుకోగా 22,910 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.47 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కె ట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 10 గంట ల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
బారికేడ్ల వితరణ
తిరుపతి కల్చరల్: నగరంలో ట్రాఫిక్ స్టేషన్‌కు శుక్రవారం భారతి సిమెంట్ కంపెనీ వారు 20 బారికేడ్లను వితరణగా అందజేశారు. ట్రాఫిక్ సీఐ సుబ్బారెడ్డి సమక్షంలో భారతి సిమెంట్ కంపెనీ మార్కెటింగ్ మేనేజర్ విజయవర్థన్రెడ్డి బారికేడ్లను అందజేశారు. ఆయన మాట్లాడుతూ సమాజ హితం కోసం అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. భారతి సిమెంట్ తిరుపతి డీలర్లు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 18 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. క్యూకాంప్లెక్స్‌లో 23 కంపార్టుమెంట్లు నిండాయి. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.80 కోట్లు సమర్పించారు. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
No Headline
శనివారం శ్రీ 8 శ్రీ మార్చి శ్రీ 2025సత్తా చాటితే! మాది మదనపల్లి. నా పేరు డాక్టర్ వీ.సుమతి. తిరుపతిలో ఏడీఆర్, ఆర్‌ఏఆర్‌ఎస్ పనిచేస్తున్నాను. మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి. మేము ముగ్గురం ఆడపిల్లలు, ఒక అబ్బాయి. పురుషులతో సమానంగా మా తల్లిదండ్రులు మమ్ముల్ని ఉన్నత చదువులు చదివించారు. 1984 వరకు ప్రభుత్వ పాఠశాలలోనే ఇంటర్ వరకు చదివాను. ఉన్నత విద్యను తిరుపతి అగ్రికల్చరల్ కళాశాలోనే పీజీ, పీహెచ్డీ పూర్తిచేశాను. 22 ఏళ్లు పాటు అధ్యాపకురాలిగా పనిచేశా. ఆరేళ్లపాటు రీసెర్చ్ విభాగంలో విధులు నిర్వహించా. ఇదే కళాశాలలో చదివి ఇక్కడే ఆర్‌ఏఆర్‌ఎస్‌కు ఏడీఆర్‌గా పనిచేయడం సంతోషంగా ఉంది. ‘కెరటం నాకు ఆదర్శం. లేచి పడుతున్నందుకు కాదు.. పడినా కూడా మళ్లీ లేస్తున్నందుకు’ అని అంటున్నారు ఈ మహిళా మణులు. ఆశయం కోసం శ్రమించారు. లక్ష్యాన్ని నిర్ధేశించుకుని అడుగులు వేశారు. జీవితమనే చుక్కానికి ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఎదురొడ్డి పోరాడారు. పురుషులకు సైతం చదువు అందని ద్రాక్షగా ఉన్న రోజుల్లోనే పీజీలు, పీహెచ్‌డీలు చేశారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో సమాజంలో తమకంటూ గుర్తింపు తెచ్చుకుని ముందుకు సాగుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జన్మించినా సమాజంలో ఉన్నతంగా రాణిస్తున్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా పలువురు మహిళా మణుల మనోగతం మీ కోసం .. – తిరుపతి సిటీ దృఢసంకల్పమే ఆయుధం నా పేరు వీ.ఉమ. శ్రీపద్మావతి మహిళా వర్సిటీ వీసీగా పనిచేస్తున్నాను. మాది తెనాలి. వ్యవసాయ కుటుంబం. నాన్న రైతు. అమ్మ గృహిణి. మేము ముగ్గరం ఆడపిల్లలం. ఒక తమ్ముడు. ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నా నాన్న తమ్ముడితో సమానంగా ఉన్నతంగా చదివించారు. ఆ రోజుల్లోనే పీజీ సోషల్ వర్క్ ముంబైలో పూర్తిచేశాను. మహిళా వర్సిటీకి 1981లో అధ్యాపకురాలుగా రూ.1,500 జీతంతో చేరాను. అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు. పలు అంతర్జాతీయ స్థాయి పరిశోధనలు చేశాను. విదేశీ సదస్సుల్లో పాల్గొని అవార్డులు, రివార్డులు సాధించాను. వర్సిటీ రెక్టారుగా, ఇన్చార్జి వీసీగా పనిచేశాను. జీవితాన్ని చాలెంజ్‌గా తీసుకోవాలి మాది భాకరాపేట దగ్గర చిన్న గ్రామం. సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చా. నాన్న రైతు. మేము నలుగురు ఆడపిల్లలం. ఆ రోజుల్లో ఆడపిల్లలు చదువుకోవడం తక్కువ. ఆ నాడే నలుగురి ఆడపిల్లలను నాన్న చదివించారు. పద్మావతి కళాశాలలోనే ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారు. పీజీ, పీహెచ్డీ ఎస్వీయూలో చేశా. అదే కలాశాలలో అధ్యాపకురాలిగా చేరా. సుమారు 33 ఏళ్లపాటు అధ్యాపకురాలకుగా పనిచేశా. ప్రస్తుతం అదే కళాశాలలో ప్రిన్సిపల్‌గా పనిచేయడం ఆనందంగా ఉంది. –డాక్టర్ టీ.నారాయణమ్మ, ప్రిన్సిపల్, ఎస్పీడబ్ల్యూ కళాశాల, తిరుపతి అద్భుతం..ఆదర్శం తిరుపతి రూరల్: మండలంలోని చెర్లోపల్లి సర్పంచ్ సుభాషిణి బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కఠోర శ్రమతో గ్రామరూపు రేఖలు మార్చేశారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతీ కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీలో అమలు చేస్తూ అభివృద్ధికి బాటలు వేశారు. ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చారు. పారిశుద్ధ్య కార్మికులతో పాటు పంచాయతీ కార్యదర్శిని కూడా పరుగులు పెట్టించారు. భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తిచేసి శభాష్ అనిపించుకున్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇచ్చారు. ప్రతి వీధిలో సిమెంటు రోడ్డు, వీధి దీపాలు, ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ, ప్రభుత్వ పాఠశాలలు, పంచాయతీ కార్యాలయాల వద్ద మొక్కలు నాటించడం, ఉద్యానవనాలు అభివృద్ధి తదితర చర్యలు చేపట్టారు. గ్రామ పంచాయతీ అభివృద్ధికి రూ.10 కోట్లకు పైగా నిధులు ఖర్చు చేశారు. ఆమె సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఉత్తమ సర్పంచ్ అవార్డుతో సత్కరించింది. కష్టే ఫలి మాది కృష్ణా జిల్లా పామర్రు, నాన్న వెటర్నరీ డాక్టర్‌గా రిటైర్డ్ అయ్యారు. తల్లి గృహిణి. మేము ఇద్దరం ఆడపిల్లలం. ప్రభుత్వ పాఠశాలలోనే విద్యాభ్యాసం సాగింది. ఉన్నత స్థాయికి ఎదగాలనే పట్టుదలతో శ్రమించాం. ప్రతి విద్యార్థినీ తమ సృజనాత్మక శక్తిని వెలికితీసి తాము ఎంపిక చేసుకున్న రంగంలో రాణించాలి. మనలో సత్తాలేకుంటే సమాజమేకాదు.. ఇంటిలోనూ, బంధుమిత్రుల దగ్గర గుర్తింపు ఉండదు. డాక్టర్ సీహెచ్ శ్రీలత, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, ఇన్చార్జి రిజిస్ట్రార్, ఎస్వీ వెటర్నరీ వర్సిటీ న్యూస్‌రీల్ -
కుటుంబ వ్యవస్థకు మూలం సీ్త్ర
తిరుపతి కల్చరల్: సమాజంలో కుటుంబ వ్యవస్థకు మూలం సీ్త్ర అని, మహిళల భాగస్వామ్యంతో సమాజంలో సంపదను సృష్లించవచ్చని టీటీడీ అదనపు ఈవో సీహెచ్.వెంకయ్యచౌదరి తెలిపారు. టీటీడీ ఆధ్వర్యంలో శుక్రవారం మహతి కళాక్షేత్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వమించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ విద్యతోనే మహిళా సాధికారత సాధ్యమన్నారు. టీటీడీ బోర్డు సభ్యురాళ్లు రంగశ్రీ, జానకీదేవి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో సత్తాచాటాలని పిలుపునిచ్చారు. ప్రముఖ వైద్యరాలు డాక్టర్ రేఖ మాట్లాడుతూ ఎవరి జీవితానికి వారే కర్త, కర్మ, క్రియలని చెప్పారు. ప్రముఖ వక్త రాజేశ్వరి మాట్లాడుతూ హైందవ సనాతన సంస్కృతిలో మహిళకు విశేషమైన స్థానం ఉందన్నారు. హైదరాబాద్ సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలాలత, అర్జున్ అవార్డు గ్రహీత జీవనజీదీప్తి మాట్లాడుతూ ఆశయం బలంగా ఉండాలని తెలిపారు. అనంతరం వివిధ రంగాల్లో విశేష సేవలంస్తున్న 12 మంది మహిళా ఉద్యోగులను సన్మానించి, 5 గ్రామలు వెండి డాలర్, శ్రీపద్మావతి అమ్మవారి జ్ఞాపిక అందజేశారు. అలాగే ఈ ఏడాదిలో ఉద్యోగ విరమణ చేయనున్న 63 మంది మహిళా ఉద్యోగులను సత్కరించారు. వివిధ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకులు, విద్యార్థుల బృందం ప్రదర్శించిన భరతనాట్యం, వీణ వాయిద్య కచేరి ఆకట్టుకుంది. డీఎల్ఓ వరప్రసాద్, సంక్షేమ విభాగం డెప్యూటీ ఈఓ ఆనందరాజు, బోర్డు సెల్ డెప్యూటీ ఈఓ ప్రశాంతి, పలువురు మహిళా డెప్యూటీ ఈఓలు పాల్గొన్నారు. -
భూ బకాసురులు!
సాక్షి టాస్క్‌ఫోర్స్: తిరుపతికి సమీపంలో కోట్ల రూపాయల విలువచేసే ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. గత టీడీపీ హయాంలో ఆక్రమణకు గురైన ఇదే భూమి కోసం ఇరువర్గాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన టీడీపీ కీలక నాయకుడు సహకారంతో ఈ భూమిని రాత్రికి రాత్రే ఆక్రమించేశారు. ముళ్ల చెట్లతో ఉన్న ప్రభుత్వ భూమిని రాత్రి సమయంలో జేసీబీలతో ఆఘమేఘాలపై చదునుచేసి మట్టితోలి చదును చేశారు. స్థానికుల కథనం మేరకు.. తిరుపతి రూరల్ మండలం, పేరూరు గ్రామ లెక్కదాఖలు సర్వే నంబర్ 529/4ఏలో సుమారు ఎకరం ప్రభుత్వ భూమి ఉంది. ప్రస్తుతం ఈ భూమి విలువ సుమారు రూ.20 కోట్లకుపైనే ఉంటుంది. గత టీడీపీ హయాంలో అప్పటి ఓ ఎంపీ ఆ భూమి తనదేనని అందులోకి ప్రవేశించారు. ఈ విషయం పలు వార్తా పత్రికల్లో ప్రచురితమైంది. ప్రభుత్వ భూమి విషయం తెలుసుకున్న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ ఎంపీని పిలిచి మందలించారు. అయితే ఆ ఎంపీ తన వద్ద ఉన్న పత్రాలతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అదేవిధంగా స్థానికంగా నివాసం ఉన్న ఓ వ్యక్తి కూడా ఈ భూమి తనదేనంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రెవెన్యూ అధికారులు సైతం ఈ భూమి ప్రభుత్వానిదేనని న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మొత్తం భూ వివాదం న్యాయస్థానంలో నడుస్తుండగానే.. గురువారం రాత్రి పక్క పంచాయతీలో నివాసం ఉంటున్న స్థానిక కీలక టీడీపీ నాయకుడి సమీప బంధువు తన జేసీబీలతో శుభ్రం చేసి, తన టిప్పర్లతో మట్టి తోలి చదును చేశారు. రాత్రికి రాత్రే గుట్టుచప్పుడు కాకుండా జరిగిన ఈ ఆక్రమణల విషయం స్థానికులకు తెలియడంతో సర్పంచ్ ఆధ్వర్యంలో కబ్జాదారుడిని నిలదీశారు. ఈ భూమి తనదేనని, న్యాయస్థానంలో కూడా తనకు అనుకూలంగా తీర్పు వచ్చిందని చెప్పారు. తీర్పు కాపీని చూపించమని స్థానికులు నిలదీయడంతో అక్కడి నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు ఆ భూమిలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు. రూ.20 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా! అర్ధరాత్రి చదును చేసి మట్టి తోలిన అక్రమార్కులు చంద్రగిరి టీడీపీ కీలక నాయకుడికి సమీప బంధువు దురాక్రమణ అది ప్రభుత్వ భూమి అది ప్రభుత్వ భూమి. ఆ భూమికి సంబంధించిన వ్యవహారం హైకోర్టులో నడుస్తోంది. అర్ధరాత్రి అక్రమణ జరిగినట్టు మా దృష్టికి వచ్చింది. వీఆర్వోను పంపించాం. ఆ భూమిలో హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేస్తాం. – రామాంజులు నాయక్, తహసీల్దార్, తిరుపతి రూరల్ -
తాగునీటి సమస్యపై దృష్టి
తిరుపతి అర్బన్: వేసవి నేపథ్యంలో తాగునీటి సమస్యలు లేకుండా ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో కలెక్టర్‌తోపాటు తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ నారపురెడ్డి మౌర్య, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్‌తో కలసి అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ టీటీడీ నిధులతో చేపట్టాల్సిన ఎండీ పుత్తూరు నుంచి మంగళం వరకు తాగునీటి పైపులైన్ పనులు వేగవంతం చేయాలన్నారు. పైప్‌లైన్ ఏర్పాటుకు చెందిన మ్యాప్‌ను అధికారులతో కలసి కలెక్టర్ పరిశీలించారు. సమీక్షలో శ్రీకాళహస్తి ఆర్డీవో భానుప్రకాష్‌రెడ్డి, ఏపీఐఐసీ తిరుపతి జోనల్ మేనేజర్ విజయ్‌భరత్‌రెడ్డి, డిప్యూటీ జోనల్ మేనేజర్ రాంబాబు, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎస్ఈ శ్యామ్‌సుందర్, ఈఈ తులసీకుమార్ పాల్గొన్నారు. ఇంటర్ పరీక్షకు 597 మంది గైర్హాజరు తిరుపతి ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా గురువారం జిల్లా వ్యాప్తంగా 86 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మ్యాథ్స్–2ఏ, బోటనీ–1, సివిక్స్–1 సబ్జెక్టుల్లో పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు జనరల్‌లో 28,639 మంది, ఒకేషనల్‌లో 1,059 మంది మొత్తం 29,698మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉంది. అయితే వీరిలో 597మంది విద్యార్థులు గైర్హాజరైనట్టు ఆర్ఐఓ జీవీ.ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. శనివారం ప్రథమ సంవత్సర విద్యార్థులకు మ్యాథ్స్–1బీ, జువాలజీ–1, హిస్టరీ–1 సబ్జెక్టుల్లో జిల్లా వ్యాప్తంగా 86 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు ఆర్ఐఓ పేర్కొన్నారు. ఓటేరు చెరువును రక్షించండి తిరుపతి అర్బన్: తిరుపతి రూరల్ మండలం, జాతీయ రహదారి సమీపంలోని ఓటేరు చెరువును ఆక్రమణల నుంచి రక్షించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. ఆయన నేతృత్వంలో శుక్రవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. పారదర్శకంగా ఉంటామని ఓ వైపు ముఖ్యమంత్రి చెబుతుంటే ఇలా చెరువులను ఆక్రమించడం ఏంటని మండిపడ్డారు. తప్పును తప్పుగానే తాము చూస్తామని వెల్లడించారు. చెరువులను కాపాడడం కోసం సీపీఐ, సీపీఎం పోరాటాలు చేస్తుంటే తమపై శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. మరోవైపు ఓటేరు సమీపంలోనే చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కార్యాలయం ఉందని, ఇప్పటి వరకు ఆయన స్పందించకపోవడం సరికాదన్నారు. క్రీడలతోనే క్రమశిక్షణ సాధ్యం తిరుపతి సిటీ: ఉద్యోగుల్లో టీమ్ వర్క్, క్రమశిక్షణ క్రీడలతోనే సాధ్యమని పోస్ట్ మాస్టర్ జనరల్ కే.ప్రకాష్, 2024 క్యారమ్స్ ప్రపంచ చాంపియన్ కొమరపల్లి శ్రీనివాస్ తెలిపారు. స్థానిక స్మార్ట్ సిటీ ఇండోర్ స్డేడియంలో జరిగిన 27వ ఆల్ ఇండియా పోస్టల్ క్యారమ్స్ టోర్నమెంట్ శుక్రవారం ముగిసింది. దేశంలోని 13 రాష్ట్రాల నుంచి 108పైగా ఉద్యోగులు క్యారమ్స్ పోటీలలో పాల్గొనడం అభినందనీయమన్నారు. పురుషుల ఓవరాల్ చాంపియన్స్‌గా తమిళనాడు జట్టు నిలవగా ద్వితీయ, తృతీయ స్థానాలను ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర దక్కించుకున్నాయి. మహిళల ఓవరాల్ చాంపియన్స్‌గా మహారాష్ట్ర ప్రథమ స్థానం, ద్వితీయ, తృతీయ స్థానాలలో వెస్ట్‌బెంగాల్, తెలంగాణ నిలిచాయి. ఉమెన్స్ సింగిల్స్, డబుల్స్, పురుషుల సింగిల్స్, డబుల్స్ విభాగాలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను సాధించిన ఉద్యోగులకు ట్రోఫీలు, బహుమతులు అందజేశారు. డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్విసెస్ ఏపీ సర్కిల్ సంతోష్నేతా, మంజుకుమార్, తిరుపతి డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ బీ.నరసప్ప, పోస్టల్ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు -
No Headline
ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీగా ఐతేపల్లి చంద్రగిరి: మండలంలోని ఐతేపల్లి సర్పంచ్ ఫాజిలా కృషికి విశిష్ట గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ ప్రాజెక్టు కింద ఐతేపల్లి పంచాయతీ ఎంపికై ంది. ఇప్పటికే పంచాయతీలో సుమారు రూ.కోటి వరకు వెచ్చించి రోడ్డు నిర్మాణం, ఆర్వో ప్లాంటు, రూ.7 లక్షలతో క్రీడా మైదానం సుందరీకరణ, పులిత్తివారిపల్లి జగనన్న కాలనీ, మామండూరు జగనన్న కాలనీ, ఎర్రగుట్టపల్లిలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టారు. పులిత్తివారిపల్లి శ్మశానానికి బీటీ రోడ్డును నిర్మించారు. ఐతేపల్లి జగనన్న కాలనీలో జల్‌జీవన్ మిషన్ పథకం ద్వారా ఇంటింటికీ కొళాయి కనెక్షన్, గత ప్రభుత్వంలో తుడా నిధుల కింద సమావేశ మందిరాలు, సచివాలయ నిర్మాణాలు, కాలువల నిర్మాణాలు చేపట్టారు. – ఫాజిలా, ఐతేపల్లి సర్పంచ్ వనిత... జాతీయ ఘనత రేణిగుంట : శ్రీకాళహస్తి మండలం, జగ్గరాజుపల్లికి చెందిన ముసలిపాటి బుజ్జమ్మ స్థానికంగా అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తోంది. ఆమె 18 ఏళ్ల కృషికి అరుదైన గౌరవం దక్కింది. జాతీయ స్థాయిలో కీర్తిని తెచ్చిపెట్టింది. చిట్టి మెదళ్లలో గట్టి పునాది వేసింది. ఆమె సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. జాతీయ స్థాయి ఉత్తమ అంగన్వాడీ కార్యకర్తగా అవార్డుకు ఎంపిక చేసింది. శనివారం దేశరాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా అవార్డును అందుకోనున్నారు. ఆమెకు ఆమె భర్త వీరరాఘవులు, కుమార్తె పూజిత, కుమారుడు రాఘవేంద్రకుమార్ ఉన్నారు. పూర్వపాఠశాల స్థాయి చిన్నారులతో మమేకమవుతూ వారిలో చదువుల జ్ఞానానికి సంబంధించి బలమైన పునాధి వేసింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘పోషణ్ వాటిక’ పథకం ద్వారా పాఠశాల ఆవరణలో ఆకుకూరలు, కూరగాయలు సేంద్రియ ఎరువులతో ఆరోగ్యకరమైన సమతుల పోషకాహారాన్ని అందిస్తోంది. నెలలో రెండుసార్లు విధిగా తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసి పిల్లల అభ్యసన పురోగతికి ప్రేరణ కలిగిస్తోంది. పాఠశాలలో 25 మంది పిల్లలు చదువుతున్నారు. జాతీయ స్థాయి ఉత్తమ అంగన్వాడీ కార్యకర్తగా అవార్డుకు బుజ్జమ్మ ఎంపికవడం తమకెంతో గర్వకారణమని శ్రీకాళహస్తి సీడీపీవో శాంతిదుర్గ, సూపర్వైజర్ మంజు తెలిపారు. -
జాతీయ స్థాయిలో ఎస్వీయూ విద్యార్థుల ప్రతిభ
తిరుపతి సిటీ: ఉత్తరప్రదేశ్ నోయిడాలోని అమిటీ యూనివర్సిటీ వేదికగా ఈనెల 3 నుంచి 7వ తేదీ వరకు నిర్వహించిన జాతీయ విశ్వవిద్యాలయాల సాంస్కృతిక పోటీలలో ఎస్వీయూ విద్యార్థులు ప్రతిభ చూపారు. ఫైన్ ఆర్ట్స్ విభాగంలో ఓవరాల్ ఛాంపియన్స్‌గా రెండో స్థానాన్ని కై వసం చేసుకున్నారు. వర్సిటీ కల్చరల్ కో–ఆర్డినేటర్ డాక్టర్ పత్తిపాటి వివేక్, ఆచార్య మురళీధర్ నాయకత్వంలోని వర్సిటీ విద్యార్థుల బృందంలోని ప్రతిభ చూపిన వారిలో మోడలింగ్ విభాగంలో కె.తేజ ప్రథమ స్థానం, ఇన్స్టలేషన్లో ఆర్.మౌనిక, డి.దేవా రెండో స్థానం, మెహందీలో ఎస్ సంధ్య, దీప్తి రెండో స్థానం, రంగోలిలో వీరాంజనేయులు రెండో స్థానం, పోస్టర్ మేకింగ్‌లో దేవా మూడో స్థానం సాధించారు. వీసీ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతినాయుడు, అధ్యాపకులు ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందించారు. సత్తాచాటిన మహిళా వర్సిటీ విద్యార్థినులు నోయిడా యువజనోత్సవాలలో పద్మావతి మహిళా వర్సిటీ విద్యార్థినులు ఫైనార్ట్స్ విభాగంలో మూడో స్థానాన్ని కై వసం చేసుకున్నారు. కల్చరల్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ శైలేశ్వరి ఆధ్వర్యంలో పోటీలలో పాల్గొన్న విద్యార్థుల బృందం పలు విభాగాలలో సత్తా చాటింది. ప్రధానంగా మైమ్స్ విభాగంలో ప్రత్యూష, మౌనిక, భాను, చంద్రజ్యోతి, మీనాభాను, శివాని, కీర్తి సత్తా చాటగా, స్కిట్ విభాగంలో నీలిమ, సత్య భార్గవి, సువర్ణేశ్వరి, సాత్విక, నిహారిక విజేతలుగా నిలిచారు. విద్యార్థినులను వీసీ ఉమ, రిజిస్ట్రార్ రజిని, అధ్యాపకులు అభినందించారు. -
రెవెన్యూ పని తీరుపై ఆర్డీఓ అసహనం
చంద్రగిరి: మండలంలో రెవెన్యూ అధికారుల పనితీరుపై ఆర్డీఓ రామ్మోహన్ అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం రెవెన్యూ సిబ్బందితో ప్రత్యేక సమావేశమయ్యారు. భూ సమస్యలు, రెవెన్యూ దర ఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మండలంలో జోరుగా ఇసుక అక్ర మ రవాణా, గ్రావెల్ దందా, ఇసుక డంపులు, ప్రభుత్వ భూముల కబ్జాలపై ఆయనకు ఫిర్యా దులు అందాయి. వాటికి సంబంధించి సిబ్బంది నుంచి వివరాలు కోసం ఆరాతీశారు. సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ఆయన మండిపడ్డారు. ఇంతలో ఓ వీఆర్ఓ తహసీల్దార్ అనుమతులు ఇచ్చారంటూ తెలపడంతో, ఆయనకు ఫోన్ చేసి వివరాలను కనుక్కోమని సిబ్బందిని ఆదేశించారు. తహసీల్దార్ స్పందిస్తూ అనుమతుల గడువు ముగిసినట్లు తెలపడంతో ‘మీరు ఏ మాత్రం పనిచేస్తున్నారో తెలుస్తోంది’ అంటూ ఆగ్రహించారు. నాగయ్యగారిపల్లిలో ఇసుకను తరలిస్తే వాహనాలను సీజ్ చేయాలని ఆదేశించారు. తాను ప్రతి వారం ఆకస్మిక తనిఖీ చేస్తానని, అధికారుల పనితీరులో అలసత్వం కనిపిస్తే ఉపేక్షించేంది లేదని ఆయన స్పష్టం చేశారు. -
అత్త దారుణ హత్య
తిరుపతి క్రైం : నగదు కోసం అత్తను దారుణంగా హత్య చేసిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. వెస్ట్ సీఐ మురళీమోహన్, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఎర్రావారిపాళెం మండలం, బండమీద కమ్మపల్లికి చెందిన ప్రమీలమ్మ(60) తన భర్త గోపాల్‌రెడ్డితో కలిసి గత 30 ఏళ్లుగా తిరుపతిలోని పలు ప్రాంతాల్లో నివాసం ఉండేది. ఈ మధ్య కాలంలో ప్రమీలమ్మ చింతకాయల వీధిలో పాచి పనులు చేసుకుంటూ అదే ప్రాంతంలో నివాసం ఉంటోంది. ఆమె భర్త మేస్త్రి పనిచేసుకుంటూ పీపీ చావడిలో నివాసముండేవాడు. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. శుక్రవారం ఉదయం డెంటల్ హాస్పిటల్లో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తున్న ఆమె చిన్న కూతురు రోజా వద్దకు వెళ్లింది. కుమార్తె డ్యూటీలో ఉండడంతో కోలా వీధిలోని చిన్న గుంటలో ఉన్న ఇంటి తాళాలను వారి అమ్మకి ఇచ్చి పంపించింది. దీంతో ఇంటికి వెళ్లిన ప్రమీల అక్కడ ఏమైందో ఏమో గానీ రోజా వచ్చి చూసే సరికి నోట్లో రక్తం వచ్చి కింద పడిపోయి ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. ఇదిలా ఉంటే చుట్టుపక్కల స్థానికులు మాత్రం రోజా రెండవ భర్త రవినాయక్(డ్రైవర్ గా పనిచేస్తున్నాడు) అత్త ప్రమీలతో నగదు కోసం గొడవపడి.. ఈ దారుణానికి పాల్పడ్డారని తెలిపారు. గొంతు నిలిమి చంపి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆమె వద్ద ఉన్న నగదు కోసమే హత్య చేసి ఉంటాడని చెబుతున్నారు. మందుబాబుల వీరంగం తడ: మధ్యం కోసం కలిసి వచ్చి, మత్తు ఎక్కాక ఓ మిత్రుడు మరో మిత్రుని తలపై బీరు బాటిల్‌తో దాడి చేసి గాయపరిచిన ఘటన తడలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు.. వరదయ్యపాళెం మండలం, పులివెల్లం గ్రామానికి చెందిన ముని సమీప గ్రామానికి చెందిన వినోద్‌తో కలిసి తడలో శ్రీకాళహస్తి మార్గంలో ఉన్న మద్యం దుకాణానికి వచ్చారు. అక్కడ మద్యం సేవించి మత్తులో ఉన్న వినోద్ సమీపంలో ఉన్న ఖాళీ బీరు బాటిల్‌తో ముని తలపై కొట్టాడు. భయపడ్డ వినోద్ అక్కడి నుంచి పారిపోయాడు. దీనిపై పోలీసులకు ఎలాంటి ిఫిర్యాదు అందలేదు. -
తిరుమల మొదటి ఘాట్‌లో ఏనుగుల గుంపు
తిరుమల: తిరుమల మొదటి ఘాట్ రోడ్లో శుక్రవారం రాత్రి ఏనుగుల గుంపు సంచరించింది. ఘాట్‌లోని ఏడో మైలు వద్ద రోడ్డు దాటుతూ భక్తులకు కనిపించింది. వెదురు చెట్లను ధ్వంసం చేశాయి. ఇదే ప్రాంతంలో గురువారం రాత్రి కూడా ఏనుగులు సంచరించినట్లు అటవీ అధికారులు తెలిపారు. ఏనుగుల గుంపును అటవీ ప్రాంతంలోకి మళ్లించేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. వేసవి ప్రారంభ దశ కావడంతో నీటి కోసం వస్తున్నాయా, వెదురు చెట్ల కోసం వస్తున్నాయా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఘాట్ రోడ్ లో ఏనుగుల సంచారం -
భారీగా ఎర్రచందనం స్వాధీనం
● ముగ్గురు స్మగ్లర్ల అరెస్ట్తిరుపతి మంగళం : కడప జిల్లా బద్వేలు అటవీ ప్రాంతంలో రూ.35 లక్షల విలువ చేసే 34 ఎరచ్రందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ముగ్గురు స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్టు టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు. వారి నుంచి రెండు మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. టాస్క్‌ఫోర్స్ హెడ్ ఎల్.సుబ్బారాయుడు, టాస్క్‌ఫోర్స్ ఎస్పీ పీ.శ్రీనివాస్ ఆదేశాల మేరకు డీఎస్పీ జీ.బాలిరెడ్డి ఆధ్వర్యంలో ఆర్ఐ చిరంజీవులుకు చెందిన ఆర్ఎస్ఐ పీ.నరేష్ టీమ్ శుక్రవారం బద్వేలు అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టింది. సి.రామాపురం సమీపంలో ఎద్దులబోడు వద్ద రెండు మోటారు సైకిళ్లపై ముగ్గురు వ్యక్తులు కనిపించారు. వీరు టాస్క్ ఫోర్స్ పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. దాంతో సిబ్బంది వెంబడించి వారిని పట్టుకున్నారు. ఆ చుట్టుపక్కల పరిశీలించగా 34 ఎరచ్రందనం దుంగలు లభించాయి. పట్టుబడిన వారిని కడప జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. వారి నుంచి మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం దుంగలతో సహా స్మగ్లర్లను తిరుపతి టాస్క్‌ఫోర్స్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. వీటి విలువ రూ.35 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రఫీ తెలిపారు. -
గందరగోళం.. దా‘రుణం’!
చంద్రగిరి: రాష్ట్ర ప్రభుత్వం కమ్మ, కాపు, రెడ్డి, క్షత్రియ, బీసీ, బ్రాహ్మణ, వైశ్య కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగులకు అందిస్తున్న రుణాల ఇంటర్వ్యూల్లో గందరగోళం నెలకొంది. శుక్రవారం ఉదయం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో లబ్ధిదారులకు అధికారులు, బ్యాంకర్లు సంయుక్తంగా ఇంటర్వ్యూలను నిర్వహించారు. మండలంలోని ఏడు బ్యాంకులకు 68 యూనిట్లను టార్గెట్‌గా ప్రభుత్వం కేటాయించింది. రుణాల కోసం వచ్చిన లబ్ధిదారులకు ఇంటర్వ్యూలకు సంబంధించిన వివరాలను నోటీసు బోర్డులో ఏర్పాటు చేయలేదు. ఇదిలావుండగా మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా చంద్రగిరి ఎస్బీఐ, ఎస్బీఐ(ఏడీబీ), బీఓఐ బ్యాంకుల అధికారులు హాజరు కాలేదు. 562 మంది దరఖాస్తుదారులకు గాను 450 మంది హాజరు కాగా, 112 మంది గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. మధ్యాహ్నానానికి ఇంటర్వ్యూలను మమ అనిపించారు. వెనక్కి ఇచ్చేసిన బ్యాంకర్లు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న కొంత మంది లబ్ధిదారుల దరఖాస్తు ఫారాలను తిరిగి ఇచ్చేయడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ దరఖాస్తులు తమ బ్యాంకుకు సంబంధం లేదంటూ సంబంధిత అధికారులు తేల్చిచెప్పారు. దీంతో చేసేది లేక లబ్ధిదారులు నిట్టూర్పులు వెళ్లగక్కుతూ ఇళ్లకు చేరారు. -
ఇసుక ట్రాక్టర్ ఢీకొని యువకుడి మృతి
చంద్రగిరి: ఇసుక ట్రాక్టర్ ఢీకొని ఓ యువకుడు మృతిచెందిన ఘటన మండలంలోని ఇందిరమ్మ కాలనీ సమీపంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ప్రమాదానికి కారణమై ట్రాక్టర్ అధికార పార్టీకి చెందిన ఓ యువ నాయకుడిది కావడం గమనార్హం. దీంతో సదరు ట్రాక్టర్‌ను పోలీసు శాఖలోని ఓ అధికారి తప్పించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానికులు, పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. తిరుపతి రూరల్ మండలం, మల్లవరం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ సురేష్ కుమారుడు చాణక్య(25) శుక్రవారం రాత్రి మల్లయ్యపల్లి నుంచి తన స్నేహితుడితో కలిసి ద్విచక్ర వాహనంపై వస్తున్నాడు. అదే సమయంలో చంద్రగిరి నుంచి మల్లయ్యపల్లి మార్గంలో ఇసుక ట్రాక్టర్ వేగంగా వస్తూ ఇందిమ్మ కాలనీ సమీపంలో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో చాణక్య అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన ఇసుక ట్రాక్టర్ చంద్రగిరి పట్టణానికి చెందని టీడీపీలోని ఓ యువనాయుకుడిదిగా గుర్తించారు. అధికార బలంతో ఆ యువ నాయకుడు ఘటనా స్థలం నుంచి ట్రాక్టర్‌ను తప్పించినట్లు తెలుస్తోంది. రాత్రి 10.30 గంటలైనా పోలీసులు ట్రాక్టర్‌ను స్టేషన్‌కు తరలించలేదు. ట్రాక్టర్‌ను తప్పించి, మరొక ట్రాక్టర్‌ను చూపించేందుకు అధికార పార్టీ నాయకుడు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. దీనిపై ఎస్ఐ అనితను వివరణ కోరేందుకు పలుమార్లు ఫోన్లో ప్రయత్నించగా ఆమె స్పందించ లేదు. అనంతరం సీఐ సుబ్బరామిరెడ్డిని వివరణ కోరగా.. చంద్రగిరికి చెందిన టీడీపీ నాయకుడి సోదరుడి ట్రాక్టర్‌గా గుర్తించామని, ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్‌ను స్టేషన్‌కు తరలించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసును దర్యాప్తు చేయనున్నట్లు ఆయన తెలిపారు. -
ఎస్సీవీ నాయుడు విమర్శలు విడ్డూరం
తిరుపతి కల్చరల్: ఓటేరు చెరువు కబ్జాను అడ్డుకున్న వావపక్ష నేతలపై మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు అనుచిత వ్యాఖ్యాలు చేయడం విడ్డూరమని వామపక్ష, ప్రజాసంఘా నేతలు ఽతెలిపారు. శుక్రవారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, సీపీఐ జిల్లా కార్యదర్శి పి.మురళి, ఆర్పీఐ దక్షిణాది అధ్యక్షుడు పి.అంజయ్య, రైతు సంఘ నేత మాంగాటి గోపాల్‌రెడ్డి, సీఐటీయూ జిల్లా నేత కందారపు మురళి మాట్లాడారు. ఓటేరు చెరువును కబ్జాను కమ్యూనిస్టు నేతలుగా తాము పరిశీలించి అడ్డుకోవడం జరిగిందన్నారు. కబ్జాదారులపై చర్యలు తీసుకొని చెరువును కాపాడాలని డిమాండ్ చేశామన్నారు. అయితే శ్రీకాళహస్తికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు ఆ భూమి తనదని, కమ్యూనిస్టులు తన చుట్టూ తిరిగారని అనుచిత వ్యాఖ్యాలు చేయడం తగదన్నారు. తక్షణం తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
మహిళ ఆత్మహత్యాయత్నం
సాక్షి, టాస్క్ పోర్సు: గూడూరు సబ్‌కలెక్టరేట్ ఆవరణలో ఓ మహిళ తనకు న్యాయం చేయాలని బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆస్పత్రిపాలైన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. కొడవలూరు మండలం, రావూరు గ్రామానికి చెందిన ఆమె చిల్లకూరు మండలం, ఏరూరు గ్రామంలో బంధువుల వద్ద మూడు ఎకరాల భూమిని పదేళ్ల క్రితం కొనుగోలు చేసింది. ఈ భూమిని తన పేరు మీద రికార్డుల్లో మార్చాలని రెవెన్యూ అధికారులకు విన్నవించింది. ఆ భూమి చుక్కల భూమిగా నమోదైందని చెప్పడంతో ఆమె మరొకరికి లీజుకు ఇచ్చింది. ఈ క్రమంలో ఇటీవల ప్రభుత్వం చుక్కల భూములను తొలగించడంతో ఆమె కొనుగోలు చేసిన భూమిని కూడా విడుదల చేశారు. ఆ సమయంలో రెవెన్యూ అధికారులు ఆ భూమిని మరొకరికి విక్రయించి రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో ఆమె తనకు న్యాయం చేయాలని అధికారులను వేడుకున్నా ఫలితం లేకపోవడంతో సబ్ కలెక్టరేట్ ఆవరణలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆమెను చికిత్స నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
● టాటా ఏసీ వాహనం ఢీకొని ఇద్దరు వలస కూలీల మృతి ● మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
దూసుకొచ్చిన మృత్యువు రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్)/ పెళ్లకూరు: పొట్ట కూటి కోసం వలస వచ్చిన కూలీల పైకి టాటా ఏసీ వాహనం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతి చెందింది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం.. రేణిగుంట మండలం, గాజులమండ్యం పోలీస్ స్టేషన్ సమీపంలోని నాయుడుపేట– పూతలపట్టు జాతీయ రహదారి, యోగానంద కాలేజీ నూతన ఫ్లైఓవర్ బ్రిడ్జి పై కూలీలు రమణమ్మ, తిరుపాల్, సరోజమ్మ, సక్కమ్మ, శైలజ పనిచేస్తున్నారు. అదే సమయంలో ఓ టాటా ఏసీ వాహనం వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రమణమ్మ(41), తిరుపాల్(50) మృతిచెందారు. మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. గాజులమండ్యం ఎస్ఐ సుధాకర్ ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ సుధాకర్ తెలిపారు. ట్రాక్టర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు –12 మంది గాయాలు పెళ్లకూరు: నాయుడుపేట–పూతలపట్టు జాతీయ రహదారి కొత్తూరు గ్రామ సమీపంలో ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 12 మందికి గాయాలయ్యాయి. పోలీసుల సమాచారం మేరకు.. రోడ్డు అభివృద్ధి పనుల చేసే కూలీలను తరలించే ట్రాక్టర్ కొత్తూరు గ్రామం వద్ద రోడ్డు పక్కన ఆపి ఉంచారు. తిరుపతి నుంచి కర్నూలు, శ్రీశైలం వెళ్లే గూడూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 12 మందికి గాయాలయ్యాయి. నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు, ఎస్ఐ నాగరాజు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను నాయుడుపేటకు తరలించారు. వీరిలో తీవ్ర గాయాలైన పెమ్మసాని పద్మ, సుబ్బరాజు, నాగరత్నమ్మను మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. పంబలేరు కాలువలో గుర్తుతెలియని మృతదేహం గూడూరు రూరల్: గూడూరు రూరల్ పరిధిలోని పురిటిపాళెం సమీపంలో ఉన్న పంబలేరు కాలువలో గుర్తు తెలియన వ్యక్తి మృత దేహాన్ని గుర్తించి రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ మనోజ్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి 30–35 సంవత్సరాలు ఉంటాయన్నారు. నల్ల ప్యాంటు, తెలుపు, పసుపు రంగలు షర్టు వేసుకున్నట్టు వెల్లడించారు. రెండు రోజుల క్రితం మృతిచెంది ఉండొచ్చని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. -
గంజాయి బ్యాచ్ అరెస్ట్
రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్): రేణిగుంటలో గంజాయి విక్రయిస్తున్న ఐదుగురు యువకులను అర్బన్ పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రేణిగుంట పోలీసుల కథనం మేరకు.. ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో శుక్రవారం అర్బన్ సీఐ శరత్ చంద్ర, ఎస్ఐ అరుణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వ బాలుర హైస్కూల్ పక్కన హిందూ శ్మశాన వాటిక వద్ద తనిఖీలు చేపట్టారు. అక్కడ గంజాయి విక్రయిస్తున్న వినాయక్ నగర్‌కు చెందిన కాజేరిరాజు(21), పాంచాలి నగర్‌కు చెందిన కాజేరి రాము(20), రాము మదన్ (21), అడపాల సాయిప్రసాద్ (27), ఏఎన్ఆర్ కాలనీకి చెందిన గురవయ్య(20)ను అదుపులోకి తీసుకున్నారు. ఆపై వారి వద్ద నుంచి కిలో గంజాయిని స్వాధీనం చేసుకన్నారు. వారిపై పలు కేసులు నమోదు చేసి తిరుపతి కోర్టులో హాజరు పరచగా.. జడ్జి రిమాండ్ విధించారు. -
‘అమ్మా..నాన్నా మమ్మల్ని వదిలి వెళ్లిపోయారా..!
విధి ఆడిన వింత నాటకంలో ఆ కుటుంబం చిన్నాభిన్నమైంది. భార్య, చిన్నకుమార్తెతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా మృత్యువు రూపంలో ఆటో దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో తన కళ్లెదుటే తల్లిదండ్రులు కన్నుమూయడం ఆ బాలిక మనసును కలచివేసింది. తన గాయాలు లెక్కచేయక అమ్మా..నాన్నా..! మాట్లాడండి నాన్నా..? అంటూ రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. మరో బాలిక ఆస్పత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న చెల్లిని, విగత జీవులుగా పడి ఉన్న తల్లిదండ్రులను చూసి గుండెలు బాదుకున్న తీరు అక్కడి వారిని కంటతడి పెట్టించింది.సైదాపురం/తిరుపతి: ‘అమ్మా..నాన్నా మమ్మల్ని వదిలి వెళ్లిపోయారా..! అంటూ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్న కుమార్తె, ఆమె అక్క రోదించడం స్థానికంగా కలచివేసింది. సైదాపురం – తిప్పవరపాడులో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు మృతి చెందగా.. చిన్న కుమార్తె తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలైన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. స్థానికులు, గూడూరు రూరల్ పోలీసుల వివరాల మేరకు.. శ్రీపొట్టిశ్రీరాముల నెల్లూరు జిల్లా, సైదాపురానికి చెందిన దొడ్డగ మునెయ్య బట్టల దుకాణం నడుపుకుంటున్నారు. భార్య జ్యోతి టైలరింగ్ చేస్తూ కుటుంబానికి ఆదరువుగా ఉండేది. ఈ క్రమంలో వారికి నిహారిక, వైష్ణవి ఇద్దరు ఆడ బిడ్డలు ఉన్నారు. వారు స్థానిక పాఠశాలల్లో 8, 7 తరగతులు చదువుకుంటున్నారు. మునెయ్య బంధువులు కోట మండలంలోని విద్యానగర్‌లో ఉండడంతో వారి వద్దకు వెళ్లేందుకు భార్య జ్యోతి, చిన్న కుమార్తె వైష్ణవిని తీసుకుని స్కూటీపై వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్నారు. ఈ క్రమంలో సైదాపురం నుంచి గూడూరు వైపు వస్తున్న ఆటో స్కూటీని ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మునెయ్య, జ్యోతిలిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. వైష్ణవికి తీవ్ర గాయాలు కావడంతో గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రులు కళ్లెదుటే దుర్మరణం చెందడంతో బాలిక్ షాక్‌కు గురైంది. అమ్మా..నాన్న వెళ్లిపోయారా..అంటూ కన్నీటిపర్యంతమవడం స్థానికులను కలచివేసింది. -
సైదాపురం–తిప్పవరపాడులో ఘోర ప్రమాదం
● స్కూటీని ఢీకొట్టిన బైక్ ● తల్లిదండ్రులు మృతి ● అనాథలైన ఇద్దరు కుమార్తెలు ● సైదాపురంలో విషాద ఛాయలు సైదాపురం/గూడూరు రూరల్: ‘అమ్మా..నాన్నా మమ్మల్ని వదిలి వెళ్లిపోయారా..! అంటూ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్న కుమార్తె, ఆమె అక్క రోదించడం స్థానికంగా కలచివేసింది. సైదాపురం – తిప్పవరపాడులో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు మృతి చెందగా.. చిన్న కుమార్తె తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలైన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. స్థానికులు, గూడూరు రూరల్ పోలీసుల వివరాల మేరకు.. శ్రీపొట్టిశ్రీరాముల నెల్లూరు జిల్లా, సైదాపురానికి చెందిన దొడ్డగ మునెయ్య బట్టల దుకాణం నడుపుకుంటున్నారు. భార్య జ్యోతి టైలరింగ్ చేస్తూ కుటుంబానికి ఆదరువుగా ఉండేది. ఈ క్రమంలో వారికి నిహారిక, వైష్ణవి ఇద్దరు ఆడ బిడ్డలు ఉన్నారు. వారు స్థానిక పాఠశాలల్లో 8, 7 తరగతులు చదువుకుంటున్నారు. మునెయ్య బంధువులు కోట మండలంలోని విద్యానగర్‌లో ఉండడంతో వారి వద్దకు వెళ్లేందుకు భార్య జ్యోతి, చిన్న కుమార్తె వైష్ణవిని తీసుకుని స్కూటీపై వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్నారు. ఈ క్రమంలో సైదాపురం నుంచి గూడూరు వైపు వస్తున్న ఆటో స్కూటీని ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మునెయ్య, జ్యోతిలిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. వైష్ణవికి తీవ్ర గాయాలు కావడంతో గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రులు కళ్లెదుటే దుర్మరణం చెందడంతో బాలిక్ షాక్‌కు గురైంది. అమ్మా..నాన్న వెళ్లిపోయారా..అంటూ కన్నీటిపర్యంతమవడం స్థానికులను కలచివేసింది. -
అభ్యంతరాలు తెలియజేయండి
చిల్లకూరు: క్రిస్ సిటీకి సేకరించిన భూములకు సంబంధించిన పరిహారం చెల్లింపుల్లో ఏవైనా అభ్యంతరాలు ఉంటే రాత పూర్వకంగా వారంలోగా అందజేయాలని భూములు కోల్పోయిన సాగుదారులకు గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీన సూచించారు. మండల తీర ప్రాంతంలోని తమ్మినపట్నం రెవెన్యూ పరిధిలో సుమారుగా 914 ఎకరాలను తొలి విడతలో క్రిస్ సిటీ కోసం సేకరించారు. ఈ భూములకు పరిహారం అందించడంలో పలు మార్లు నిర్వహించిన గ్రామ సభల్లో విషయం కొలిక్కి రాలేదు. దీంతో ఇటీవల ప్రభుత్వం పరిహారా న్ని రూ.8 లక్షలు చెల్లించేలా ప్రకటించడంతో సాగదారులు కూడా దీనికి అంగీకరించారు. ఈ క్రమంలో సాగుదారుల జాబితాను సిద్ధం చేసి దానిని ఆయా సచివాలయాల్లో ఉంచే క్రమంలో తీగపాళెం వద్ద సాగుదారులతో సమావేశం నిర్వహించారు. సబ్‌కలెక్టర్ మాట్లాడుతూ సేకరించిన 914 ఎకరాలలో 617 ఎకరాలలో సాగు ఉన్నట్లు తెలిపారు. మిగిలిన భూమి బీడు గా ఉందని, ఇందులో 617 ఎకరాలకు గాను ఎకరాకు రూ.8 లక్షల చొప్పున పరిహారం అందించేలా ఆదేశాలు అందాయ తెలిపారు. సమావేశంలో తహసీల్దార్ శ్రీనివాసులు, ఆర్ఐ పూర్ణ, తమ్మినపట్నం, లింగవరం సర్పంచ్‌లు నెల్లిపూడి సుబ్రహ్మణ్యం, నాశిన సుబ్రహ్మణ్యం, వరగలి ఎంపీటీసీ దారా కోటేశ్వరరావు, రూరల్ సీఐ కిశోర్‌బాబు, ఎస్ఐ సురేష్‌బాబు పాల్గొన్నారు. -
అమ్మానాన్నా.. వెళ్లిపోయారా?
విధి ఆడిన వింత నాటకంలో ఆ కుటుంబం చిన్నాభిన్నమైంది. భార్య, చిన్నకుమార్తెతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా మృత్యువు రూపంలో ఆటో దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో తన కళ్లెదుటే తల్లిదండ్రులు కన్నుమూయడం ఆ బాలిక మనసును కలచివేసింది. తన గాయాలు లెక్కచేయక అమ్మా..నాన్నా..! మాట్లాడండి నాన్నా..? అంటూ రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. మరో బాలిక ఆస్పత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న చెల్లిని, విగత జీవులుగా పడి ఉన్న తల్లిదండ్రులను చూసి గుండెలు బాదుకున్న తీరు అక్కడి వారిని కంటతడి పెట్టించింది. -
నేత..మేత
ఉపాధి నిధులతో ఇష్టారాజ్యంగా సిమెంట్ రోడ్లు ● అనుమతి ఒకచోట.. నిర్మాణం మరో చోట ● కూటమి నేతల ఇళ్ల దగ్గరే రోడ్ల నిర్మాణం ● అయోమయంలో పేద జనంచిల్లకూరు మండలం వివరాలు సచివాలయాలు 17 పంచాయతీలు 30 గ్రామాలు 64 పనుల సంఖ్య 54 ప్రస్తుతం చేసిన పనులు 30 మంజూరైన నిధులు రూ.2.73 కోట్లు ఖర్చు చేసింది రూ.1.5 కోట్లు మొత్తం సీసీ రోడ్లు మీటర్లలో 6,396 పూర్తి చేసింది 3,690 పాత రోడ్డుపైనే రోడ్డు నిర్మాణం 1 నేతల ఇళ్ల వద్దకు వేసుకున్న రోడ్లు 3 ఇష్టానుసారంగా చేసిన పనులు 6 పనులు దక్కించుకున్న కూటమి నేతలు 45 మంది చిల్లకూరు: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులు కూటమి నేతలకు కల్పతరువుగా మారాయి. పల్లె పండుగ పేరుతో గ్రామాలలో ఇష్టారాజ్యంగా సిమెంట్ రోడ్లు నిర్మించి నిధులు బొక్కేశారు. ఒక గ్రామంలో రెండు పార్టీలకు చెందిన నేతలు ఉంటే వారికి సమా నంగా అధికారులు పనులు అప్పగించారు. ఇంకా ముఖ్యమైన నేతలు ఉంటే అక్కడ నిధులు మరింతగా ఖర్చు చేసేలా పనులకు ఎస్టిమేషన్లు సిద్ధం చేశారు. అను‘మతి ఉందా’? చాలా గ్రామాలలో అనుమతులు ఒక చోట.. పనులు చేసేది మరో చోటగా మారింది. తమకు నచ్చిన చోట, తమ ఇళ్ల దగ్గరకు ఉండేలా కూటమి నేతలు సీసీ రోడ్లు నిర్మించారు. కొన్ని గ్రామాల్లో రెండు నెలలు పూర్తి కావస్తున్నా ఇప్పటి వరకు సగం పనులు కూడా పూర్తిచేయలేదు. దళిత, గిరిజన కాలనీల్లో ఇంకా పనులు మొదలు పెట్టలేదు. సీసీ రోడ్డు పనులు ఆరంభించిన సమయంలో స్థానిక ప్రజాప్రతినిధి ఫొటో ఉన్న శిలాఫలకాలను ఆవిష్కరించి చేతులు దులుపుకున్నారు. చిల్లకూరు మండలంలో పరిస్థితి ఇదీ ● మండలంలోని ఓడూరు గ్రామంలో గత 20 ఏళ్ల క్రితం నిర్మించిన సీసీ రోడ్డుపైనే మళ్లీ సిమెంట్ రోడ్డు నిర్మించారు. గతంలో వేసిన రోడ్డు ఎత్తు తగ్గి పోవడమే కాకుండా అక్కడక్కడా పగిలి పోయిందన్న సాకుతో సీసీ రోడ్డును కొంత భాగం తొలగించి దాని స్థానంలో కొత్త రోడ్డు వేశారు. దీనిపై ఉపాధి, పీఆర్ అధికారులు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. ● తీర ప్రాంతంలో ఉన్న తమ్మినపట్నం పంచాయతీలో మత్స్యకార కాలనీ అయిన కొత్తూరులో సీసీ రోడ్డు వేయాల్సి ఉండగా అక్కడ కాకుండా గ్రామంలో రోడ్డు వేస్తున్నట్లు ఎస్టిమేషన్లు మార్చి గ్రామంలోని నాయకుల ఇంటి ముందు సిమెంట్ రోడ్డు నిర్మించారు. నిబంధనలకు విరుద్ధంగా సీసీ రోడ్లు పూర్తిచేశారు. ● తీర ప్రాంతంలోని వేళ్లపాళెంలో సీసీ రోడ్ల నిర్మాణానికి స్థానిక ప్రజాప్రతినిధి శిలాఫలకం వేశారు. ఇక్కడ సీసీ రోడ్డు నిర్మాణంలో వాడాల్సిన ఇసుక బదులుగా ఈ ప్రాంతంలో లబించే సిలికాను వినియోగించారు. దీనిపై పీఆర్ ఏఈని వివరణ క్వారగా క్వాలిటీ కంట్రోల్ అధికారులు చూసుకుంటారని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ● తీర ప్రాంతంలోని మోమిడి గ్రామంలో రెండు సీసీ రోడ్లు నిర్మాణం చేపడితే ఇసుకకు ప్రత్యామ్నాయంగా అక్కడ దొరికే సిలికాను వాడారు. క్యూరింగ్ కూడా సక్రమంగా చేయలేదు. ● మండల తీర ప్రాంతలలోని తూర్పుకనుపూరు గ్రామంలో వేసిన సీసీ రోడ్లు ఒక వీధిలో వేయాల్సి ఉండగా తమకు అనుకూలమైన వారి ఇంటికి వెళ్లేలా అలైన్మెంట్ మార్చి రోడ్డు పనులు పూర్తి చేశారు. ఈ రోడ్డు వేసేందుకు స్థానిక నాయకులు ఆ ఇంటి యజమాని నుంచి కొంత మొత్తం వసూలు చేసుకున్నట్టు తెలుస్తోంది. ● దళిత, గిరిజనకాలనీల్లో ఇంకా సీసీరోడ్లు నిర్మించలేదు. నాణ్యతకు తిలోదకాలు తీర ప్రాంతంలోని పలు గ్రామాలలో ఇసుకకు బదులుగా సిలికాను వినియోగించారు. అధికారులు సూచించిన సిమెంటు కాకుండా మరో బ్రాండ్ సిమెంటును వినియోగించి పనులు పూర్తి చేశారు. కంకరలోనూ కక్కుర్తి పడి లోకల్లో దొరికే చిప్స్ వేసి రోడ్డు నిర్మాణం పూర్తిచేశారు. రోడ్డుకు అడుగు భాగంలో ప్లాస్టిక్ పట్ట వేయాలి. అలాగే రోడ్డు మద్యలో పది అడుగులకు ఒక చోట బెర్ములు అమర్చాలి. కానీ వాటిని ఎక్కడా చేపట్టలేదు. రోడ్డు నిర్మాణం చేపట్టే సమయంలో ఆయా సచివాలయాలయాల ఇంజినిరింగ్ అసిస్టెంట్లు దగ్గరుండి పనిచేయించాలి. ఒకేసారి రెండు మూడు చోట్ల పనులు జరుగుతుండడంతో పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయలేక పోయారు. -
కబ్జారాయుళ్లను అరెస్ట్ చేయాలి
తిరుపతి రూరల్ పరిధిలోని ఓటేరు చెరువు ఆక్రమణలను అడ్డుకోవాలంటూ సీపీఐ జిల్లా కార్యదర్శి పీ.మురళి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం తిరుపతి ఆర్డీవో కార్యాలయం ఎదుట తిరుపతి నగర సమితి ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. విలువైన ఓటేరు చెరువును కొంతమంది కబ్జారాయుళ్లు పూడ్చేసి ఆక్రమించుకుంటున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. దీనిపై కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ స్పందిస్తూ ఓటేరు చెరువును యథావిధిగా ఉంచుతామని హామీ ఇచ్చారు. ఆర్టీవో సైతం స్పందిస్తూ చెరువులను ఆక్రమించిన వారిపై చర్యలుంటాయని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య, కే రాధాకృష్ణ, నగర కార్యదర్శి జే.విశ్వనాథ్, ఉదయ్ కుమార్, నగర కార్యవర్గ సభ్యులు ఎన్డీ.రవి తదితరులు పాల్గొన్నారు. – తిరుపతి అర్బన్ -
వైఎస్సార్సీపీలో నియామకం
చిత్తూరు కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నియామకం చేపట్టారు. మొదలియార్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా చిత్తూరు సంతపేటకు చెందిన జ్ఞాన జగదీష్‌ను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. ఈ మేరకు గురువారం ఆయనకు ఉత్తర్వులు అందాయి. అంతర్జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్ పోటీలకు ఎంపిక చిట్టమూరు : స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్‌గా పని చేస్తున్న పిడుగు భరత్ మహీపతి ప్రపంచ స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్ పోటీలకు ఎంపికై నట్లు హెచ్ఎం మీనాకుమారి గురువారం తెలిపారు. ఈనెల 4 నుంచి బెంగళూరులోని కంఠీరవ అథ్లెటిక్ స్టేడియంలో జరిగిన 43వ జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్ పోటీలలో పాల్గొని హ్యామర్ త్రో విభాగంలో వెండి పథకం సాధించినట్టు వెల్లడించారు. అలాగే మేలో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరిగే ప్రపంచ స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్ పోటీలలో భారత దేశం తరఫున పాల్గొననున్నట్టు వివరించారు. భరత్ మహీపతిని ఉపాధ్యాయులు, ప్రజలు అభినంధించారు. జాతీయ సైన్స్ వారోత్సవాల్లో ప్రతిభ శ్రీకాళహస్తి: తిరుపతిలోని ఎస్వీయూ క్యాంపస్ పాఠశాలలో గురువారం జిల్లా స్థాయి, జాతీయ స్థాయి సైన్స్ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ముగింపు కార్యక్రమంలో శ్రీకాళహస్తి పట్టణంలోని కుమారస్వామి తిప్ప వద్దనున్న మునిసిపల్ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థిని షేక్ హుస్నా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ‘మీకు నచ్చిన శాస్త్రవేత్త’ అనే అంశంపై వ్యాసం రాసిన షేక్ హుస్నా, జిల్లా స్థాయిలో మొదటి బహుమతి గెలుపొందారు. ముఖ్యఅతిథులు గా విచ్చేసిన గాదంకిలోని యన్ఏఆర్యల్ డైరెక్టర్ పాత్రో, డీఈఓ కుమార్, ఏఎంఓ, జిల్లా సైన్స్ అధికారి భానుప్రసాద్‌లు విద్యార్థి ని అభినందించి ప్రశంసాపత్రాన్ని అందజేశారు. కుమారస్వామి తిప్ప పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు షేక్ నౌజియా పాల్గొన్నారు. -
డీవైఈఓ పరీక్షలను వాయిదా వేయండి
తిరుపతి ఎడ్యుకేషన్ : ఉప విద్యాశాఖాధికారి (డీవైఈఓ) పోస్టుల భర్తీకి ఈ నెల 26, 27 తేదీల్లో నిర్వహించనున్న ఏపీపీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని ఆపస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.బాలాజీ, జీ.వెంకటసత్యనారాయ డిమాండ్ చేశారు. ఆ మేరకు గురువారం విజయవాడలో ఏపీపీఎస్సీ చైర్పర్సన్ ఏఆర్.అనురాధను కలిసి వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ పదో తరగతి పబ్లిక్ పరీక్షలు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో డీవైఈఓ పరీక్షలను వాయిదా వేయాలని ఆమెకు విజ్ఞప్తి చేశారు. దీనికి ఆమె సానుకూలంగా స్పందించారు. క్షేత్ర స్థాయి పరిస్థి తులను సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని హా మీ ఇచ్చినట్లు వారు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 8 కంపార్ట్మెంట్లు నిండాయి. బుధవారం అర్ధరాత్రి వరకు 63,285 మంది స్వామివారిని దర్శించుకున్నారు. దర్శన టిక్కెట్లు లేని వారికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. -
ఐదు కిలోల గంజాయి స్వాధీనం
తిరుపతి క్రైమ్: నగరంలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి ఐదు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. ఈస్ట్ సీఐ రామకృష్ణ తెలిపిన వివరాల మేరకు.. తిరుపతి ఎస్టీవీ నగర్‌కు చెందిన అరవింద(22) గంజాయి అక్రమ రవాణా కేసులో ఇప్పటికే అన్నవరంలో ముద్దాయిగా ఉన్నాడు. ఇతనికి ఒడిశా రాష్ట్రం, చిత్రకొండ కు చెందిన గణేష్‌ను అన్నవరంలో పరిచయం చేసుకున్నాడు. ఇతని వద్ద లక్ష రూపాయలు ఇచ్చి ఐదుకిలోల గంజాయిని కొనుగోలు చేసి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌కి తీసుకొచ్చాడు. అయితే రాహస్య సమాచారం మేరకు అతన్ని అరెస్ట్ చేసి అతని వద్ద ఉన్న ఐదు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. గంజాయిని చిన్నచిన్న పొట్లాలుగా చేసుకొని ఒక్కొక్కటి రూ.300 చొప్పున విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ పేర్కొన్నారు. -
కల్తీ నెయ్యి కేసులో ముగిసిన కస్టడీ
తిరుపతి లీగల్: తిరుమలకు కల్తీ నెయ్యి తరలిస్తున్నారన్న అభియోగాల కింద నమోదైన కేసులో ఇద్దరికి మూడు రోజుల కస్టడీ గురువారంతో ముగిసింది. దీంతో కేసులో మూడవ నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న వైష్ణవి డెయిరీ డైరెక్టర్ విపిల్ జైన్, 5వ నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న వైష్ణవి డెయిరీ సీఈఓ అపూర్వ వినయకాంత్ చావడాలను మూడు రోజులపాటు పోలీసు కస్టడీకి ఇస్తూ తిరుపతి రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోటేశ్వరరావు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. దీంతో పోలీసులు వారిని జుడిషియల్ కస్టడీ నుంచి తమ కస్టడీకి తీసుకుని విచారించారు. గురువారంతో కస్టడీ కాలం ముగియడంతో పోలీసులు ఇద్దరినీ తిరిగి కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఇద్దరినీ తిరిగి జ్యుడీషియల్ కస్టడీకి తరలిస్తూ ఆదేశాలు జారీచేశారు. కేసులో నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న నలుగురు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లపై సోమవారం వాదనలు జరగనున్నట్లు తెలిసింది. ఉరేసుకుని వృద్ధురాలి మృతి రేణిగుంట(శ్రీకాళహస్తి రూరల్): మామిడి చెట్టుకు ఉరేసుకుని వృద్ధురాలు మృతిచెందిన ఘటన రేణిగుంట మండలం, వెదుళ్లచెరువు ఎస్టీ కాలనీలో గురువారం చోటు చేసుకుంది. కాలనీకి చెందిన గురవయ్య భార్య సరస్వతి(75) వెదుళ్లచెరువు ఎస్టీ కాలనీలోని తన చిన్నకుమార్తె యశోద ఇంటి వద్ద ఉంటోంది. ఆమెకు మానసిక పరిస్థితి సరిగా లేదు. అయితే గురువారం ఉదయం యశోద, ఆమె కుమారుడు ఆవుల దినకర్ కలసి గంగిరెడ్డిపల్లిలోని బంధువుల ఊళ్లో కర్మక్రియలకు వెళ్లారు. ఈ క్రమంలో 11గంటల సమయంలో ఎస్టీ కాలనీలోని వారు ఫోన్ చేసి సరస్వతి మామిడి చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందిందినట్టు సమాచారం అందించారు. ఎవరికీ భారం కాకూడదని భావించి మామిడి చెట్టు కొమ్మకి చీరతో ఉరి వేసుకొని మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. రేణిగుంట అర్బన్ ఎస్ఐ అరుణ్‌కుమార్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దళారీ అరెస్ట్ తిరుమల : టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఫొటోలను వాట్సాప్ డీపీగా పెట్టుకుని, చైర్మన్ పీఆర్వో అని నమ్మిస్తూ శ్రీవారి సేవా, దర్శన టికెట్లు ఇప్పిస్తామని మోసగిస్తున్న ఘరానా మోసగాడిని తిరుమల టూటౌన్ పీఎస్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. టూటౌన్ పీఎస్ సీఐ శ్రీరాముడు తెలిపిన వివరాల మేరకు.. చంద్రగిరికి చెందిన ఫరూక్ అలియాస్ ప్రసాద్(35) ప్రస్తుతం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కోవూరులో నివాసం ఉంటున్నాడు. ఇతను గత నాలుగు నెలల నుంచి ‘తిరుమల సమాచారం’ అనే వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేసి అందులో సుమారు 600 మందిని సభ్యులుగా చేర్చి తిరుమలలో శ్రీవారి దర్శనం కావాలంటే తనను సంప్రదించండి అని మేసేజ్‌లు రాసి పోస్ట్ చేసేవాడు. దాన్ని నమ్మిన గ్రూప్‌లోని భక్తులు అతన్ని వాట్సాప్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవుతారు. దీంతో నిందితుడు వారికి దర్శనం ఇప్పిస్తామని చెప్పి వారి వద్ద నుంచి ఫోన్ పే ద్వారా నగదు వేయించుకుని మోసగించేవాడు. ఈ విధంగా సుమారు రూ.80వేలు తీసుకుని మోసగించాడు. నిందితుడిపై చంద్రగిరి పోలీస్ స్టేషన్లో మూడు కేసులు ఉండగా ఇందులో మూడు నెలలు జైలు శిక్షను సైతం అనుభవించాడు. పోలీసులు చాకచక్యంగా ప్రసాద్‌ను అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి సెల్‌ఫోన్, ఆరు సిమ్ కార్డులు, బ్యాంక్ పాసు పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. దళారులను నమ్మి మోసపోకండి భక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ దళారులు నమ్మి మోసపోవద్దని సీఐ శ్రీరాముడు సూచించారు. ఎవరైనా దళారులను గుర్తిస్తే వారి వివరాలను తీసుకుని తిరుమల పోలీసులను 0877–2289027లో సంప్రదించాలని సూచించారు. -
చట్టాలపై అవగాహన ఉండాలి
తిరుపతి క్రైం : పోలీసు ఉద్యోగంలో విధులను సమర్థవంతంగా నిర్వహించాలని ప్రొఫెషనరీ సబ్ ఇన్స్పెక్టర్లకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు దిశానిర్దేశించారు. గురువారం పోలీస్ అతిథి గృహంలో 39 మంది ప్రొబిషనరీ సబ్ ఇన్స్పెక్టర్లతో ఆయన సమావేశమయ్యారు. సమాజంలో పోలీస్ పాత్ర చాలా విలువైనదని చెప్పారు. నిరంతరం పోలీసులను ప్రజలు గమనిస్తూనే ఉంటారని తెలిపారు. ప్రతి ఒక్కరూ చట్టాలపై పూర్తి స్థాయిలో అవగాహన తెచ్చుకోవాలన్నారు. కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ అధికారి హేమంత్పాల్గొన్నారు. రేపటి నుంచి తుడా టవర్స్‌కి వేలం తిరుపతి తుడా: తిరుపతి నగరంలోని అన్నమయ్య కూడలి వద్ద తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ నిర్మిస్తున్న తుడా టవర్స్ ప్లాట్లకు శనివారం నుంచి వేలం నిర్వహించనున్నట్టు ఉపాధ్యక్షులు ఎన్.మౌర్య తెలిపారు. నిర్మాణంలో ఉన్న తుడా టవర్స్‌ని గురువారం ఆమె ఇంజినీరింగ్ అధికారులతో పరిశీలించారు. వేలం నిర్వహణపై తుడా కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాయలచెరువు రోడ్డులో తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా 3.6 ఎకరాలలో తుడా టవర్స్‌ను నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఇందులో గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు 13 అంతస్తులలో తుడా టవర్స్ నిర్మాణం జరుగుతోందని, గ్రౌండ్, ఒకటవ అంతస్తుల్లో 27 దుకాణాలతో వాణిజ్య సముదాయాలు, రెండు, మూడు, నాలుగు అంతస్తుల్లో ఆఫీస్‌ల వినియోగానికి, మిగిలిన అంతస్తుల్లో నివాస యోగ్యంగా 2, 3, 4 బెడ్ రూమ్ ఫ్లాట్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. నివసించేందుకు 230 ప్లాట్లు ఉంటాయని, అందులో 46 డబుల్ బెడ్ రూమ్స్, 152 ట్రిబుల్ బెడ్ రూమ్స్, 32 నాలుగు బెడ్ రూమ్స్ ఫ్లాట్స్ ఉంటాయని చెప్పారు. శనివారం 2, 3 అంతస్తులకు, 9వ తేదీ 4,5, అంతస్తులకు, 10వ తేదీ 6, 7 అంతస్తులకు, 11న 8,9 అంతస్తులకు, 12న 10, 11 అంతస్తులకు ఉదయం 10 నుంచి 1 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వేలం నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో కార్యదర్శి వెంకటనారాయణ, సూపరింటెండెంట్ ఇంజినీర్ కృష్ణారెడ్డి, ఈఈ రవీంద్ర ఉన్నారు. -
ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ ఘటనలో ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ నరసింహమూర్తి విలేకరుల సమావేశం నిర్వహించారు. 1వ పట్టణ సీఐ గోపి, క్రైమ్ పార్టీ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేపట్టారన్నారు. వారం రోజుల్లోనే కేసును ఛేదించి ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసినట్టు వెల్లడించారు. తమిళనాడు మేలుమలైకి చెందిన మీనా(29), తిరుచ్చి జిల్లా సమయపురానికి చెందిన పొన్నుమణి అక్కచెల్లెళ్లు. వీరు సంతల్లో, బస్సుల్లో జనాలు రద్దీగా ఉన్న ప్రాంతాల్లో హ్యాండ్‌బ్యాగులు, పర్సులు దొంగలిస్తుంటారని తెలిపారు. వీరిపై తమిళనాడులో ఆరు కేసులు ఉన్నట్టు పేర్కొన్నారు. జైలు నుంచి బయలకు రాగా లాయరు ఖర్చు నిమిత్తం దొంగతనం చేసేందుకు శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలను ఎంచుకున్నట్టు తెలిపారు. రథోత్సవం రోజున భక్తులతో కలిసిపోయి తోపులాట జరిగినపుడు మహిళల మెడలో బంగారు గొలుసులను అపహరించినట్టు వెల్లడించారు. వీరు పట్టణంలోని నెహ్రూవీధిలోని సుదర్శన్ ల్యాబ్, తేరువీధిలోని కోమల రెసిడెన్సీ, నగరివీధిలోని వినాయకస్వామి ఆలయం, సునీల్ నగల దుకాణం ముందు, తేరువీధిలోని నంది హోటల్, పెండ్లి మండపం వద్ద మహిళల మెడల్లో నుంచి బంగారు గొలుసులను అప్పహరించినట్టు తెలిపారు. వీరిని గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు చెప్పారు. కేసును ఛేదించిన వారిని ఎస్పీ అభినందించి రివార్డులను ప్రకటించినట్టు పేర్కొన్నారు. సీఐ గోపి పాల్గొన్నారు. -
ఆత్మరక్షణకే సెల్ప్ డిఫెన్స్ శిక్షణ
తిరుపతి ఎడ్యుకేషన్ : బాలికల ఆత్మరక్షణ కోసమే పాఠశాలలో రాణీ లక్ష్మీబాయి ఆత్మరక్ష సెల్ప్ డిఫెన్స్ శిక్షణా కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటుచేసినట్లు డీఈఓ కేవీఎన్.కుమార్ తెలిపారు. తిరుపతిలోని డాక్టర్ ఎస్ఆర్కే నగరపాలక ఉన్నత పాఠశాలలో గురువారం ఈ కార్యక్రమాన్ని డీఈఓ ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ అనుమతితో విజయవాడకు చెందిన రూపేష్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లాలోని 475 ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 6 నుంచి 9వ తరగతి చదివే 33,618 మంది బాలికలకు సెల్ఫ్ డిఫెన్స్ తరగతులను నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీవైఈఓ కె.బాలాజీ, డాక్టర్ రూపేష్‌బాబు, హెచ్ఎం కృష్ణకుమార్ పాల్గొన్నారు. -
ఇంటర్ పరీక్షకు 943 మంది గైర్హాజరు
తిరుపతి ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా గురువారం జిల్లా వ్యాప్తంగా 86 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ప్రథమ సంవత్సర విద్యార్థులకు మ్యాథ్స్–1ఏ, బోటనీ–1, సివిక్స్–1 సబ్జెక్టుల్లో పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు జనరల్‌లో 32,830 మంది, ఒకేషనల్‌లో 1,341 మంది మొత్తం 34,171మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉంది. అయితే వీరిలో 943 మంది విద్యార్థులు గైర్హాజరైనట్టు ఆర్ఐఓ జీవీ.ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. కాగా శుక్రవారం ద్వితీయ సంవత్సర విద్యార్థులకు మ్యాథ్స్–2ఏ, బోటనీ–1, సివిక్స్–1 సబ్జెక్టుల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వర కు జిల్లా వ్యాప్తంగా 86 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
షార్‌లో ఘనంగా సైన్స్ దినోత్సవం
సూళ్లూరుపేట: సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) కేంద్రంలోని బ్రహ్మప్రకాష్ హాలులో గురువారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ముంబై ఐఐటీ ప్రొఫెసర్ కే సుబ్రమన్యన్ విచ్చేశారు. ముందుగా సర్ సీవీ రామన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజల్వన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన షార్ డైరెక్టర్ ఏ.రాజరాజన్ మాట్లాడుతూ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగిన తీరును వివరించారు. అనంతరం ప్రొఫెసర్ కే.రామసుబ్రమన్యన్ మాట్లాడుతూ ‘దిలాస్ట్ ట్రెజర్ ఆప్ ఇండియన్ సైన్స్’ అనే అంశం గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా షార్ ఇంజినీర్లుకు వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ సైన్స్ ప్రాజెక్టులకు సంబంధించి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. విద్యార్థులకు నిర్వహించిన పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. షార్ కంట్రోలర్ ఎం.శ్రీనివాసులురెడ్డి, షార్ ఉద్యోగస్తులు పాల్గొన్నారు. -
రూ.5 కోట్ల భూమి హాంఫట్!
● జాతీయ రహదారి పక్కనే మూడు ఎకరాలు కబ్జా ● చదును చేసిన కూటమి నేతలు ● పట్టించుకోని రెవెన్యూ అధికారులు సాక్షి, టాస్క్‌ఫోర్స్ : చిల్లకూరు మండలంలోని చైన్నె– కలకత్తా జాతీయ రహదారి(ఎన్‌హెచ్–16) పక్కనే ముత్యాలపాడు రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూములపై కూటమి నేతల కన్నుపడింది. తలచిందే తడువుగా రూ.5 కోట్ల భూమిని ఆక్రమించేశారు. ఆపై యథేచ్ఛగా చదును చేసి స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. అంతా గోప్యం ముత్యాలపాడు రెవెన్యూ పరిధిలోని రైటార సత్రంలోని ఓ హోటల్‌కు ఎదురుగా ఉన్న ప్రభుత్వ భూమిపై కన్నెసిన ప్రజాప్రతినిధి ఆ భూమిని దక్కించుకునేందుకు పావులు కదిపారు. రెవెన్యూ యంత్రాంగాన్ని తన గుప్పెట్లోకి తెచ్చుకుని అది పట్టాభూమి అని చెప్పించారు. అక్కడ ఉన్న ఒకే సర్వే నంబర్ ప్రకారం సుమారు 100 ఎకరాలకు పైగా భూములు ఉండగా.. ఇందులో ఎంత మేర సీలింగ్‌కు వదిలారు.. ఎంత మేర యజమానుల చేతిలో ఉన్నాయి అనే విషయాలను గోప్యంగా ఉంచారు. తనకు దగ్గరగా ఉండే ముత్యాలపాడుకు చెందిన నాయకుడిని సదరు ప్రజాప్రతినిధి రంగంలోకి దింపడంతో ఆయన రాత్రికి రాత్రే సుమారు వంద టిప్పర్ల మట్టిని తోలి చదును చేశారు. బీజేపీ నాయుకుడి ఫిర్యాదు జాతీయ రహదారి పక్కనే విలువైన భూములు అన్యాక్రాంతం కావడంపై తిరుపతి జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు బైరప్ప కేంద్ర రహదారుల శాఖా మంత్రికి లికిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అలాగే స్థానికంగా ఉండే సబ్ కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు అందించారు. అవి పట్టా భూములు ముత్యాలపాడు రెవెన్యూ పరిధిలో రైటార్ సత్రం వద్ద జాతీయ రహదారి పక్కనే ఉన్న సుమారు మూడు ఎకరాల భూమిలో మట్టి తోలి చదును చేస్తున్న వారు ఎవరు అనే విషయం తెలియదు. అయితే ఈ భూములు పట్టా భూమి కావడంతో వాటిపై దృష్టి పెట్టలేదు. అయినా వీఆర్ఓను పంపి విచారణ చేయిస్తా. – శ్రీనివాసులు, తహసీల్దార్, చిల్లకూరు మండలం ఆ మూడు ఎకరాలకు స్కెచ్ పాత మద్రాసు హైవే రోడ్డుకు 50 మీటర్ల దూరంలో 2000 సంవత్సరంలో నేడు ఉన్న జాతీయ రహదారిని పడమర వైపు నిర్మించారు. ఈ రెండు రోడ్లకు మధ్యలో సుమారు మూడు ఎకరాల భూమి ఉంది. రహదారి నిర్మాణంలో భాగంగా రెండు రోడ్లకు మధ్య లో ఉన్న భూమిలో కాలువలు ఉండేవి. వర్షం వచ్చినప్పుడు రోడ్డుపై ప్రవహించే నీరు ఈ కాలువల ద్వారా ముత్యాలపాడు చెరువుకు చేరేది. ఈ రెండు రోడ్లకు మధ్యలో ఉన్న మూడు ఎకరాల భూమికి కూటమి నేతలు స్కెచ్ వేశారు. రాత్రికిరాత్రే ఆ భూమిలోని కాలువలను పూడ్చి చదును చేశారు. -
50 రోజులుగా నత్తనడకన రీసర్వే
● తొలి దశలో పైలెట్ ప్రాజెక్టు కింద 33 గ్రామాలు ఎంపిక ● 4 నెలల గడువులో 20 వేల ఎకరాల లక్ష్యం ● ఇప్పటి వరకు అంతంతమాత్రంగానే ప్రక్రియ●సర్వే వేగవంతం చేయాలి కూటమి ప్రభుత్వం మళ్లీ రిసర్వే ప్రక్రియ మొదలుపెట్టింది. అయితే ఈ సర్వేని పారదర్శకంగా నిర్వహించాలి. వేగవంతంగా చేపట్టాలి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చేపట్టిన సర్వే గ్రామాలను మళ్లీ నిర్వహించడం మంచిది కాదు. – జగదీష్, రైతు మిట్టకండ్రిగ, వరదయ్యపాళ్యం మండలం ముందుగా 33 గ్రామాల్లోనే.. ఈ ఏడాది జనవరి20వ తేదీ నుంచి రీసర్వే మొద లు పెట్టాం. ముందుగా 33 గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద సర్వే చేస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకే సర్వే చేపడతాం. గతంలో సర్వే చేసిన గ్రామాల్లో తిరిగి సర్వే ఉండదని భావిస్తున్నాం. అప్పట్లో చేయని గ్రామాల్లో మాత్రమే సర్వే ఉంటుంది. గతంలో ఉపయోగించిన డ్రోన్లనే వాడుకుంటాం. అవసరాలకు తగ్గట్టు సర్వేయర్లు ఉన్నారు. – అరుణ్‌కుమార్, జిల్లా సర్వే విభాగం అధికారి తిరుపతి అర్బన్ : బ్రిటీష్ పాలన తర్వాత భూముల రీసర్వే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో శ్రీకారం చుట్టారు. గత ఏడాది ఫిబ్రవరి చివరి వరకు సర్వే కొనసాగించారు. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సర్వే ఆగిపోయింది. కూటమి సర్కార్‌లో మళ్లీ సర్వే ప్రారంభించారు. భూవివాదాలు అధికంగా ఉన్న గ్రామాలను ఎంపిక చేస్తే రీసర్వే తొలిదశలో గందగోళ పరిస్థితులు తలెత్తుతాయని అంచనా వేశారు. ఈ మేరకు ఎలాంటి వివాదాలు లేని పల్లెలను మాత్రమే పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. అందులో భాగంగా జిల్లాలోని 33 మండలాల్లోని 33 గ్రామాల పరిధిలో 20వేల ఎకరాల్లో రీసర్వేకు ఆదేశాలు జారీచేశారు. ప్రక్రియ పూర్తి చేసేందుకు నాలుగు నెలలు గడువు ఇచ్చారు. ఇప్పటికే సర్వే మొదలుపెట్టి 50 రోజులు గడుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఆయా గ్రామాల్లో రైతులకు సర్వే కోసం నోటీసులు మాత్రమే ఇచ్చారు. తర్వాత సర్వే చేయడంతోపాటు సరిహద్దురాళ్లు ఏర్పాటు చేయడం, భూహక్కు పత్రాలు ఇవ్వాల్సి ఉంది. అయితే ఇందుకు 70 రోజులు మాత్రమే గడువు ఉండడం గమనార్హం. -
జిల్లా సమాచారం
సర్వే గ్రామాలు 1,051 సర్వేయర్ల సంఖ్య 421 సర్వే చేయాల్సిన భూములు 15,40,351 ఎకరాలు సర్వే చేసిన భూములు 1,71,371 ఎకరాలు తొలి దశలో సర్వే పూర్తి చేసిన గ్రామాలు 74 రెండో దశలో 106 మూడో దశలో 140 నాల్గో దశలో సర్వేకి ఎంపికై న గ్రామాలు 731 -
12న వైఎస్సార్సీపీ ఫీజు పోరు
● వేలాది మందితో కలెక్టరేట్ల వద్ద ధర్నా ● విద్యార్థుల సమస్యలపై నిరంతర పోరాటం ● జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి పిలుపు తిరుపతి రూరల్: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఈనెల 12వ తేదీన జరిగే శ్రీవైఎస్సార్సీపీ ఫీజు పోరుశ్రీను విజయవంతం చేయాలని ఆ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి పిలుపు నిచ్చారు. గురువారం చిత్తూరు, తిరుపతి జిల్లాల నుంచి వైఎస్సార్సీపీ పార్టీ విద్యార్థి విభాగం నియోజకవర్గాల అధ్యక్షులతో తుమ్మలగుంటలోని చంద్రగిరి నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఆయన సమావేశమయ్యారు. ఫీజు పోరు కార్యక్రమానికి అన్ని ప్రయివేటు విద్యాసంస్థల యజమాన్యాలు కూడా సహకరించాలన్నారు. చిత్తూరు, తిరుపతి కలెక్టరేట్ల వద్ద నిరసన వైఎస్సార్సీపీ ఫీజుపోరును చిత్తూరు, తిరుపతి కలెక్టర్ కార్యాలయాల వద్ద విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన చేపట్టనున్నట్టు చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి తెలిపారు. చిత్తూరు కలెక్టర్ కార్యాలయం వద్ద కుప్పం, పలమనేరు, పుంగనూరు, పూతలపట్టు, జీడీ నెల్లూరు, చిత్తూరు నియోజకవర్గాల విద్యార్థులు, తిరుపతి కలెక్టరేట్ వద్ద సత్యవేడు, శ్రీకాళహస్తి, తిరుపతి, నగరి, చంద్రగిరి, వెంకటగిరి, సూళ్లూరుపేట నియోజకవర్గాల విద్యార్థులు నిరసన చేపట్టనున్న తెలిపారు. ఈ కార్యక్రమాలకు ఎంత మంది విద్యార్థులు రాగలరన్న సమాచారం ఈనెల 10వ తేదీకి సేకరించాలని సూచించారు. అనంతరం అన్ని నియోజకవర్గాల వైఎస్ఆర్ విద్యార్థి విభాగం నూతన అధ్యక్షులను శాలువలతో సత్కరించారు. రాష్ట్ర విద్యార్థి విభాగం నాయకులు ఓబుల్‌రెడ్డి,చిద్విలాసరెడ్డి, శశి, ఎన్వీ.సురేష్, పవన్‌కుమార్, డీ.లో కేష్, బీ.హరి, మహేష్, చెంగల్‌రెడ్డి, ప్రేమ్‌కుమార్, కుప్పిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వినోద్, యుగంధర్, రాజశేఖర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, హరికుమార్ పాల్గొన్నారు. -
ఓటేరు..ఆక్రమించేశారు!
తిరుపతి శివార్లలోని జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఓటేరు చెరువు మాయమవుతోంది. అధికారుల కళ్లెదుటే చెరువును పూడ్చివేస్తున్నా కనీసం అడ్డుకునే ప్రయత్నం కూడా చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. గురువారం సీపీఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు ఆధ్వర్యంలో నాయకులు చెరువును పరిశీలించారు. అనంతరం అక్కడే కొంతసేపు నిరసన చేపట్టారు. తన ఇంటి పక్కన చెరువును పూడ్చేస్తుంటే చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానికి తెలియ లేదా? అంటూ నిలదీశారు. ఆక్రమణలు ఆపకుంటే పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీపీఎం నాయకులు బాలసుబ్రమణ్యం, టీ.సుబ్రమణ్యం, ఎస్.జయచంద్ర, కే.వేణుగోపాల్, పీ.హేమలత, కే.సుమన్, ఎం.నరేంద్ర, పీ.బుజ్జి, మునిరాజు, శేఖర్ పాల్గొన్నారు. – తిరుపతి రూరల్ -
కబ్జారాయుళ్లను అరెస్ట్ చేయాలి
తిరుపతి రూరల్ పరిధిలోని ఓటేరు చెరువు ఆక్రమణలను అడ్డుకోవాలంటూ సీపీఐ జిల్లా కార్యదర్శి పీ.మురళి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం తిరుపతి ఆర్డీవో కార్యాలయం ఎదుట తిరుపతి నగర సమితి ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. విలువైన ఓటేరు చెరువును కొంతమంది కబ్జారాయుళ్లు పూడ్చేసి ఆక్రమించుకుంటున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. దీనిపై కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ స్పందిస్తూ ఓటేరు చెరువును యథావిధిగా ఉంచుతామని హామీ ఇచ్చారు. ఆర్టీవో సైతం స్పందిస్తూ చెరువులను ఆక్రమించిన వారిపై చర్యలుంటాయని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య, కే రాధాకృష్ణ, నగర కార్యదర్శి జే.విశ్వనాథ్, ఉదయ్ కుమార్, నగర కార్యవర్గ సభ్యులు ఎన్డీ.రవి తదితరులు పాల్గొన్నారు. – తిరుపతి అర్బన్ -
వెటర్నరీ జూడాలు.. తగ్గేదేలే!
సాక్షి, తిరుపతి సిటీ/చీపురుపల్లి/గన్నవరం: బ్యాచ్‌లర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ ఇంటర్న్‌షిప్ చేస్తున్న తాము కూడా మెడికోలతో సమానమేనని, వారికి ఇస్తున్నట్లుగానే తమకు రూ.25 వేలు స్టైఫండ్ ఇవ్వాలని కోరుతూ తిరుపతి సహా రాష్ట్ర వ్యాప్తంగా గరివిడి, ప్రొద్దుటూరు, గన్నవరంలలో ఫిబ్రవరి 3 నుంచి తరగతులు బహిష్కరించి నిరసన దీక్షలు చేపట్టిన బీవీఎస్ విద్యార్థులు, బుధవారం తమ ఆందోళనను మరింత తీవ్రతరం చేశారు. హాస్టళ్లను మూసివేయాలన్న అధికారుల నిర్ణయం వారి ఆగ్రహం మరింత కట్టలు తెంచుకునేలా చేసింది. హాస్టళ్లను మూసివేసి బయటకు గెంటి, ఆకలి బాధల్లోకి నెట్టినా తమ సమస్యల పరిష్కారం అయ్యే వరకూ పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు. వర్సిటీ దిగ్బంధం తిరుపతి ఎస్వీ వెటర్నరీ వర్సిటీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సర్క్యులర్‌కు అనుగుణంగా ఉదయం ఒక్కసారిగా విద్యార్థుల హాస్టళ్లను మూసివేసి బయటకు గెంటివేశారు. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు, వర్సిటీలోకి అధికారులను, అధ్యాపకులను, ఉద్యోగులను ప్రవేశించకుండా దిగ్బంధం చేశారు. దీంతో అధికారులు, ఉద్యోగులు విధులకు వెళ్లకుండా వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. కాగా బుధవారం రాత్రి తాజాగా వెటర్నరీ జూనియర్ డాక్టర్లతో అధికారులు, పోలీసులు జరిపిన సుదీర్ఘ చర్చలు ఎట్టకేలకు ఫలించాయి. విద్యార్థుల వసతి గృహాలను తిరిగి ప్రారంభించేందుకు అధికారులు సుముఖతను వ్యక్తం చేశారు. దీంతో వైద్య విద్యార్థులు వర్సిటీ దిగ్బంధ ఆందోళనను విరమించుకున్నారు. అయితే గౌరవ వేతనాన్ని పెంచేంతవరకూ సమ్మెను యథాతథంగా కొనసాగిస్తామని వెటర్నరీ జూడాలు తేల్చిచెప్పడం గమనార్హం. ఎక్కడ ఉండాలి.. ఏం తినాలి?కాగా, హాస్టల్ మూసివేస్తే తామంతా ఎక్కడ ఉండాలి.. ఏం తినాలి.. అంటూ విజయనగరం జిల్లా గరివిడి మండలంలోని శ్రీ వెంకటేశ్వర పశు విశ్వవిద్యాలయం విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం–పాలకొండ ప్రధాన రోడ్డులో ఉన్న యూనివర్సిటీ ప్రధాన గేటుకు అడ్డంగా బైఠాయించారు. యూనివర్సిటీలోకి అధ్యాపకులు, సిబ్బంది వెళ్లకుండా అడ్డుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వర్సిటీ అసోసియేట్ డీన్ ఎం.శ్రీనివాసరావు పలుమార్లు విద్యార్థులతో మాట్లాడగా 11 గంటలకు అధ్యాపకులు, సిబ్బందిని లోపలకు వెళ్లేందుకు అంగీకరించారు. ఖాళీ కంచాలు, గరిటెలతో వినూత్న నిరసన మరోవైపు కృష్ణాజిల్లా గన్నవరంలోని ఎన్టీఆర్ పశువైద్య కళాశాల విద్యార్థులు తమ ఆందోళనను తీవ్రతరం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా బుధవారం ఉదయం కళాశాల ప్రధాన గేట్లను మూసివేసి బోధన, బోధనేతర సిబ్బందిని లోపలికి రాకుండా అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న గన్నవరం సీఐ శివప్రసాద్ నేతృత్వంలో పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకుని విద్యార్థులతో చర్చలు జరిపినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ ఖాళీ కంచాలను గరిటెలతో మోగిస్తూ విద్యార్థులు వినూత్న నిరసనకు దిగారు. -
శ్రీలంక పర్యటనకు మహిళా వర్సిటీ అధ్యాపకులు
తిరుపతి సిటీ : పద్మావతి మహిళా వర్సిటీ అధ్యాపకులు ఈ నెల 8వ తేదీ నుంచి రెండు రోజులపాటు శ్రీలంకలో పర్యటించనున్నారు. స్టడీ ఇన్ ఇండియా ఎక్స్పో ఇన్ శ్రీలంక వారి ఆహ్వానం మేరకు కొలంబోలోని కింగ్స్‌బరి హోటల్లో నిర్వహించే ఎక్స్పో ప్రోగ్రామ్‌లో పాల్గొననున్నారు. బృందంలో రిజిస్ట్రార్ రజని, ప్రొఫెసర్ విజయలక్ష్మి, డీన్ ఉష ఉన్నారు. పర్యటనలో ప్రధానంగా విదేశీ విద్యార్థులకు మహిళా వర్సిటీలో అందుబాటులో ఉన్న కోర్సులు, ఆధునిక పరిశోధన సౌకర్యాలపై చర్చించనున్నారు. అలాగే శ్రీలంకలోని కెలినియా వర్సిటీతో పలు అంశాలపై ఎంఓయూ కుదుర్చుకోనున్నారు. సీఏ ఫలితాల్లో ఎమరాల్డ్స్ విజయ కేతనం తిరుపతి ఎడ్యుకేషన్ : సీఏ ఇంటర్, ఫౌండేషన్ ఫలితాల్లో తిరుపతిలోని ఎమరాల్డ్స్ విద్యాసంస్థ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి విజయకేతనం ఎగురవేసినట్లు ఆ సంస్థ డైరెక్టర్లు ఈ.గిరిధర్, కె.విశ్వనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. సీఏ ఇంటర్ కోర్సులో సాయిప్రమోద్ 321, మనోజ్ 320 మార్కులు సాధించారని, వీరితో పాటు 59.37శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి నట్లు పేర్కొన్నారు. అలాగే సీఏ ఫౌండేషన్ కోర్సు లో ఎస్ఐ.నందిని, డి.పల్లవి, డి.మీన, పి.చందనప్రియ, కె.రిషతతో పాటు 68.76 శాతం మంది ఉతీర్ణత సాధించినట్లు తెలిపారు. విద్యార్థులు, అధ్యాపక బృందాన్ని వారు అభినందించారు. 17 నుంచి దూరవిద్య పరీక్షలు? తిరుపతి సిటీ : ఎస్వీయూ పరిధిలో ఈ నెల 17 నుంచి దూరవిద్య పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు బుధవారం వర్సిటీకి ఆదేశాల అందినట్టు సమాచారం. దీంతో అప్రమత్తమైన అధికారులు పరీక్షలు నిర్వహణకు సంబంధించి షెడ్యూల్డ్ రూపకల్పనపై కసరత్తు ప్రారంభించినట్లు తెలిసింది. -
‘ఎకో సెన్సిటివ్ జోన్’గా నేలపట్టు
తిరుపతి అర్బన్ : దొరవారిసత్రం మండలం నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం పరిధిలోని రెండు కిలోమీటర్లను ఎకో సెన్సిటివ్ జోన్‌గా ప్రభుత్వం గుర్తించిందని జేసీ శుభం బన్సల్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో సూళ్లూరుపేట డివిజన్ డీఎఫ్ఓ, వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ అధికారి హారికతో కలిసి సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ సెన్సిటివ్ జోన్‌గా ఆ ప్రాంతంలో చేపట్టాల్సిన నిషేధిత అంశాలు, ప్రోత్సహించాల్సిన చర్యలపై మాస్టర్‌ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. ప్రధానంగా అక్కరపాకు, మైలంగం, ముచ్చల గుంట, నెలబల్లి, నెల్లూరుపల్లె, వెంగమాంబపురం, ఏకొల్లు, నేలపట్టు తదితర గ్రామాల పరిధిలో ఎకోజోన్ ఉందని స్పష్టం చేశారు. సమావేశంలో అడిషనల్ డీఎఫ్ఓ నాగభూషణ్, సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ రీజనల్ డైరెక్టర్ జయచంద్ర, సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ డైరెక్టర్ టీఆర్ వినోద్, ఎఫ్ఆర్ఓ సౌజన్య, డీఆర్డీఏ పీడీ శోభన్ బాబు, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి రవికుమార్, జిల్లా మత్స్య శాఖ అధికారి నాగరాజు, జిల్లా ఉద్యాన శాఖ అధికారి దశరథ రామి రెడ్డి, దొరవారి సత్రం తహసీల్దార్ శైలకుమార్ పాల్గొన్నారు. -
7 నుంచి డీడీఈ అడ్మిషన్లు
తిరుపతి సిటీ: ఈ నెల 7వ తేదీ నుంచి ఎస్వీయూ డీడీఈ పీజీ అడ్మిషన్లు ప్రారంభమవుతాయని దూర విద్యా కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ ఊక రమేష్‌బాబు పేర్కొన్నారు. ఎస్వీయూ దూరవిద్య కేంద్రంలో బుధవారం నూతన డైరెక్టర్‌గా ఆయన బాధ్యతలు చేపట్టిన చేపట్టారు. ఆయన మాట్లాడుతూ దూర విద్యా కేంద్రం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ నెల 7వ తేదీ నుంచి పీజీ అడ్మిషన్లు ప్రారంభించామని నోటిఫికేషన్ గురువారం విడుదల చేయనున్నట్టు తెలియజేశారు. డీడీఈ ఉద్యోగులు, సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా కామిరెడ్డి
పెళ్లకూరు : వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డిని నియమితులయ్యారు. బుధవారం ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు సత్యనారాయణరెడ్డిని రెండోసారి రాష్ట్ర కార్యదర్శిగా నియమించినట్లు పేర్కొంది. ఈ సందర్భంగా సత్యనారాయణరెడ్డికి ఎంపీపీ పోలంరెడ్డి శేఖర్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు నన్నం ప్రస్కిల్లా, పార్టీ మండల అధ్యక్షుడు ఒబ్బు వెంకటరత్నం తదితరులు అభినందనలు తెలిపారు. 8న జాతీయ లోక్ అదాలత్ తిరుపతి లీగల్ : తిరుపతి కోర్టు ఆవరణలో ఈనెల 8వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తిరుపతి మూడో అదనపు జిల్లా జడ్జి ఎం.గురునాథ్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ శనివారం ఉదయం 10.30 గంటలకు లోక్ అదాలత్ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. పెండింగ్‌లోని సివిల్, రాజీ కాదగిన క్రిమినల్ కేసులతో పాటు వివాహ, మోటారు వాహన ప్రమాదాలు, వ్యాజ్యం వేయని కేసులను పరిష్కరించనున్నట్లు వివరించారు. అదాలత్ కోసం కోర్టు ఆవరణలో 9 బెంచ్‌లు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. తనతోపాటు ఈ బెంచ్‌లకు అధ్యక్షులుగా తిరుపతి పదో అదనపు జిల్లా జడ్జి రామచంద్రుడు, అదనపు సీనియర్ సివిల్ జడ్జి సునీతారాణి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి వాణిశ్రీ, జూనియర్ జడ్జిలు కోటేశ్వరరావు, గ్రంధి శ్రీనివాస్, సత్యకాంత్ కుమార్, సంధ్యారాణి, సరిత వ్యవహరించనున్నట్లు వెల్లడించారు. మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సెలవు తిరుపతి అర్బన్ : ప్రపంచ మహిళా దినోత్సవా న్ని ఈ నెల 8వ తేదీన నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం తిరుపతి ఎస్వీ వైద్యకళాశాల మైదానంలో ఆటల పోటీలు చేపట్టనున్న నేపథ్యంలో మహిళా ఉద్యోగులకు కలెక్టర్ ప్రత్యేక సెలవు మంజూరు చేసినట్లు ఏపీ జేఏసీ తిరుపతి చైర్మన్ ఎస్. సురేష్‌బాబు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఆటల పోటీ ల్లో పాల్గొనే మహిళా ఉద్యోగులకు మాత్రమే ప్రత్యేక సెలవు వర్తిస్తుందని వెల్లడించారు. నేటి నుంచి అన్న ప్రసాదంలో మసాలా వడలు తిరుమల : తిరుమల శ్రీవారి భక్తులకు అన్నప్రసాద కేంద్రంలో గురువారం నుంచి మసాలా వడలను వడ్డించనున్నారు. గురువారం ఉదయం 10.30 గంటలకు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన భవనంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చేతులమీదుగా వడల వడ్డన ప్రారంభించనున్నారు. ‘క్వశ్చన్’ మార్క్! చిల్లకూరు : గూడూరు పట్టణంలో బుధవారం నిర్వహించిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లిష్ పరీక్ష ప్రశ్నపత్రంలో 13వ ప్రశ్న అస్పష్టంగా కనిపించింది. ప్రింటింగ్ సరిగా లేకపోవడంతో ప్రశ్నను గుర్తించేందుకు విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. సమాధానం రాయకపోతే 5 మార్కులు కోల్పోయే ప్రమాదముందని పలువురు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు తమ పరిస్థితి అర్థం చేసుకుని సక్రమంగి ప్రింట్ కాని ప్రశ్నకు సంబంధించి మార్కులు కలిపితే బాగుంటుందని కోరారు. అధికారులు సైతం జాగ్రత్తలు తీసుకుని ఇటువంటి తప్పిదాలు జరగకుండా చూడాలని తల్లిదండ్రులు సూచిస్తున్నారు. -
బదిలీల చట్టంపై సమావేశం
తిరుపతి కల్చరల్ : ఉపాధ్యాయుల బదిలీల చట్టంపై బుధవారం తిరుపతిలోని ఎస్టీయూ భవనంలో సమావేశం నిర్వహించారు. ఎస్టీయూ రాష్ట్ర నేత గాజుల నాగేశ్వరరావు మాట్లాడుతూ బదిలీల చట్టంలోని అసంబద్ధాలను తొలగించాలని డిమాండ్ చేశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు రమేష్‌బాబు మాట్లాడుతూ చట్టం కారణంగా ఎవరూ నష్టపోకుండా సీనియారిటీ, స్టేషన్, ప్రిఫరెన్షియల్ కేటగిరీలకు సంబంధించి అందరికీ న్యాయం జరిగేలా అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. 117 జీఓ రద్దు పేరుతో ప్రాథమిక విద్యారంగాన్ని నిర్వీర్యం చేయడం చేయడం తగదన్నారు. తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వ బడుల్లోని పిల్లలకు మాత్రమే పరిమితి చేయాలని సూచించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ.జగన్నాథం మాట్లాడుతూ బదిలీల్లో చట్టంలోని నిబంధనలపై కోర్టుకు వెళ్లకూడదనే అంశాన్ని తొలగించాలని కోరారు. అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నట్టే ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విధానం కొనసాగించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎస్టీయూ నేతలు గురుప్రసాద్, రేణుకాదేవి, రామాంజనేయులు, వాసు, సురేష్, దేవేంద్ర, శ్రీనివాసులు,మురళీకృష్ణ, మహేష్ పాల్గొన్నారు. -
దోపిడీ దొంగల అరెస్ట్
శ్రీవారి దర్శనానికి 8 గంటలుతిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్మెంట్లు ఖాళీగా ఉన్నాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 64,861 మంది స్వామివారిని దర్శించుకోగా 19,639 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.65 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలో అనుమతించరని స్పష్టం చేసింది. -
31వ రోజుకు చేరిన పశువైద్య విద్యార్థుల సమ్మె
● వెటర్నరీ వర్సిటీ ఎదుట బైఠాయించిన జూడాలు ● హాస్టళ్లను మూసివేయడంపై ఆందోళన ● ప్రధాన ద్వారానికి తాళం వేసి నిరసన ● పోలీసుల రంగప్రవేశంతో ఉద్రిక్తత బెదిరింపులు దారుణం న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ప్రశాంతంగా సమ్మె చేస్తున్నాం. అయితే వర్సిటీ అధికారలు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. మహిళా విద్యార్థుల హాస్టళ్లను సైతం మూసివేసి బెదిరింపులకు దిగడం దారుణం. ఇటువంటి అధికారులు దేశంలోని ఏ విశ్వవిద్యాలయంలో కూడా ఉండరు. అయినప్పటికీ గౌరవవేతనం పెంచే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదు. – మీడియాతో వెటర్నరీ విద్యార్థిని ప్రభుత్వానికి నివేదించాం విద్యార్థులు సమ్మె విరమించే వరకు హాస్టళ్లను తెరి చేది లేదు. ఇప్పటికే 31రోజుల పాటు సమ్మె చేయడంతో తరగతులు నిలిచిపోయాయి. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వాని నివేదించాం. సమ్మె విరమిస్తేనే అన్నీ పరిష్కారమవుతాయి. విద్యార్థులు ఇప్పటికే విలువైన సమయం వృథా చేసుకున్నారు. – జీవీ రమణ, ఇన్చార్జి వీసీ, ఎస్వీ వెటర్నరీ వర్సిటీ తిరుపతి సిటీ : రాష్ట్రంలో అన్ని విభాగాల వైద్య విద్యార్థులతో సమానంగా గౌరవేతనం అందించాలంటూ గత 31రోజులుగా సమ్మె చేస్తున్న విద్యార్థులపై వర్సిటీ అధికారులు బెదిరింపులకు దిగారు. అందులో భాగంగా హాస్టళ్లను మూసివేశారు. దీంతో ఆగ్రహించిన పశువైద్య విద్యార్థులు బుధవారం ఎస్వీ వెటర్నరీ వర్సిటీని దిగ్బంధం చేశారు. వర్సిటీలోకి అధికారులు, ఉద్యోగులను ప్రవేశించకుండా గేట్లకు తాళాలు వేసి నినాదాలతో హోరెత్తించారు. లగేజీలను గేటు ముందు పెట్టి నిరసన తెలిపారు. సమ్మె విరమిస్తే కానీ, హాస్టళ్లను తెరవమంటూ అధికారులు హెచ్చరించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై సర్వత్రా ఆగ్రహం వర్సిటీ అధికారులు వ్యవహారశైలిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. విద్యార్థులపై పోలీసులకు ఫిర్యాదు చేయడం సమంజసం కాదని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. వీసీ దురుసు ప్రవర్తనతోనే విద్యార్థులు సమ్మె బాట పట్టారని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ‘వసతి’కి సుముఖత విద్యార్థులు, వర్సిటీ అధికారులతో పోలీసులు సుదీ ర్ఘంగా చర్చించారు. ఈ క్రమంలో హాస్టళ్లను తెరిచేందుకు అధికారులు సుముఖత వ్యక్తం చేశారు. వర్సిటీ వద్ద పోలీసు బలగాలువర్సిటీ గేటుకు తాళం వేయడంతో బయట వేచి ఉన్న అధికారులు, ఉద్యోగులుచుట్టుముట్టిన పోలీసులు ఎస్వీ వెటర్నరీ వర్సిటీలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వర్సిటీ వీసీ, అధికారులు హాస్టల్స్‌ను మూసివేయడంతో విద్యార్థులు భగ్గుమన్నారు. ఈ క్రమంలో వర్సిటీ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. వర్సిటీ ప్రధాన గేటు పైనుంచి సమ్మె చేస్తున్న విద్యార్థుల వద్దకు పోలీసులు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఏం జరుగుతుందో అర్థంకాక మహిళా విద్యార్థులు వణికిపోయారు. విద్యార్థులను నెట్టుకుంటూ వర్సిటీలోకి పోలీసులు ప్రవేశించారు. దీంతో విద్యార్థులు గేటు వద్ద ధర్నా చేపట్టారు. -
ఉపాధికి ‘సంకల్ప’ం
తిరుపతి అర్బన్ : నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సంకల్ప పథకం కింద జిల్లావ్యాప్తంగా ఆరు చోట్ల 270 మందికి ఉచితంగా వివిధ కోర్సుల్లో శిక్షణ అందిస్తున్నారు. డీఆర్డీఏ పీడీ శోభనబాబు, డీపీఓ సుశీలాదేవి పర్యవేక్షిస్తున్నారు. బుధవారం ఈ మేరకు అసిస్టెంట్ బ్యూటీ థెరపిస్టు, ఫ్యాబ్రిక్ కట్టర్, జనరల్ డ్యూటీ నర్సింగ్ అసిస్టెంట్ కోర్సులకు సంబంధించి 90 మందికి నిర్వహిస్తున్న మూడు తరగతులను డీఆర్డీఏ పీడీ శోభనబాబు, లీడ్ బ్యాంక్ మేనేజర్ విశ్వనాఽథడ్డి, ఉపాధి కల్పనాధికారి వెంకటరమణ, నైపుణ్యాభివృద్ధి జిల్లా అధికారి లోకనాధం, డీఎస్‌టీఓ ఫర్జానా, డీఏ మురళి పరిశీలించారు. అలాగే నారావారిపల్లిలో వివిధ కోర్సుల్లో 100 మందికి చేపట్టిన శిక్షణ తరగతులను డీపీఓ సుశీలాదేవి సందర్శించారు. -
ఉత్తమ సర్పంచ్ సుభాషిణి
తిరుపతి రూరల్: తిరుపతి రూరల్ మండలం, చెర్లోపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ బీ.సుభాషిణి ఉత్తమ సర్పంచ్ అవార్డును స్వీకరించారు. దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం జరిగిన సురక్ష పంచాయతీ నేత్రీ అభయాన్ కార్యక్రమంలో భాగంగా ఆమె అవార్డును స్వీకరించారు. ఈ అవార్డును కేంద్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అందజేశారు. గత ప్రభుత్వం మద్దతుతో సర్పంచ్‌గా గెలిచిన సుభాషిణి, ఆమె భర్త బీ.శుభగిరినాయుడు పంచాయతీని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం వల్లనే ఉత్తమ సర్పంచ్ అవార్డుకు ఎంపికై నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. మహిళ మెడలో చైన్ చోరీ తిరుపతి క్రైమ్: ఓ మహిళ మెడలో చైన్ లాక్కెళ్లిన ఘటన మంగళవారం అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అలిపిరి ఎస్ఐ నాగార్జునరెడ్డి కథనం.. కాటన్ మిల్ ఎస్బీఐ కాలనీలో నివాసముంటున్న రమాదేవి చిన్నపాటి ప్రొవిజన్ షాప్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో గుర్తుతెలియని వ్యక్తి కొన్ని ప్రోవిజన్స్ కొనేందుకు అక్కడికి చేరుకున్నాడు. ఆపై కొనుగోలు చేసి బిల్లు వేసే సమయంలో ఆ మహిళ మెడలో ఉన్న చైన్ లాక్కొని స్కూటీలో పారిపోయాడు. అయితే మహిళ మాత్రం చైన్ లాగే సమయంలో గట్టిగా పట్టుకోవడంతో అర్ధం చైన్ ఆమె చేతిలోనే మిగిలిపోయింది. సుమారు 16 గ్రాములకు పైగా లాక్కెళ్లినట్టు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. కేసు దర్యాప్తులో ఉంది. -
అవకాశాలను అందిపుచ్చుకోవాలి
తిరుపతి సిటీ: విద్యార్థులకు క్రీడరంగంలో మంచి అవకాశాలు ఉన్నాయని, యువత అందిపుచ్చుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఏపీ క్యారమ్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అండ్ రెఫరీ పానెల్ కోచ్ ఎస్కే అబ్దుల్ జలీల్ పిలుపునిచ్చారు. ఏపీ ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్, ఆర్కే గ్రూప్ అఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆహ్వానం మేరకు మంగళవారం తిరుపతి తుడా సర్కిల్లోని స్మార్ట్‌సిటీ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న 27వ ఆల్ ఇండియా పోస్టల్ క్యారమ్స్ టోర్నమెంట్ రెండవ రోజు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్ క్రీడారంగానిదేనన్నారు. ఆర్కే గ్రూప్ అఫ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ తాతిరెడ్డి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ 27వ ఆల్ ఇండియా పోస్టల్ క్యారమ్స్ టోర్నమెంట్‌ను విద్యార్థులు వీక్షించి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అనగని రెడ్డెప్ప, రవిచంద్రబాబు పాల్గొన్నారు. రసవత్తరంగా క్యారమ్స్ పోటీలు పోస్టల్ ఉద్యోగులకు జాతీయ స్థాయిలో జరుగుతున్న క్యారమ్స్ పోటీలు రెండవ రోజు రసవత్తరంగా కొనసాగాయి. తమిళనాడు, ఢిల్లీ, తెలంగాణా, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, హర్యాణా జట్లు పోటాపోటీగా తలపడ్డారు. మహిళా ఉద్యోగుల క్యారమ్స్ పోటీలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. -
శ్రీవారి తెప్పోత్సవాలకు పటిష్ట భద్రత
తిరుమల: తిరుమలలో ఈనెల 9 నుంచి 13వ తేదీ వరకు జరగబోయే తిరుమల శ్రీవారి తెప్పోత్సవాలకు పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం తిరుమలలోని పోలీస్ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. దీనికి ముందు ఆయన తెప్పోత్సవాలు జరిగే ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రతి ఒక్కరూ స్వామి వారి దర్శనమయ్యేలా చూసుకోవాలన్నారు. అదేవిధంగా ప్రతి కెమెరాను కూడా తప్పనిసరిగా చెక్ చేయాలన్నారు. సోమవారం సాయంత్రం అదృశ్యమైన చిన్నారి దీక్షను గంటల వ్యవధిలోనే గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులను ఎస్పీ అభినందించారు. తిరుమల ఏఎస్పీ రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. -
నేటి నుంచి సమ్మె ఉధృతం
తిరుపతి సిటీ: గౌరవ వేతనం పెంచాలంటూ పశువైద్య విద్యార్థులు చేస్తున్న నిరవధిక సమ్మె 30వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా మంగళవారం చేతులు, కాళ్లకు స్వతహాగా బేడీలు వేసుకుని న్యాయదేవత ముందు తమగోడును వెళ్లబోసుకున్నారు. తమ ఆకలి కేకలు వర్సిటీ అధికారులు, ఇటు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో బుధవారం నుంచి సమ్మెను మరింత ఉధృతం చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు. హాస్టల్స్ బంద్ చేస్తాం వెటర్నరీ జూడాలు సమ్మెను విరమించని నేపథ్యంలో వర్సిటీలోని హాస్టల్స్‌ను మూసివేస్తామని మరో వైపు అధికారులు బెదిరిస్తున్నట్లు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులపై తల్లిదండ్రులకు ఫిర్యాదులు చేస్తామని సైతం అధికారులు హెచ్చరిస్తున్నట్లు సమాచారం. -
ఆగిన గూడ్స్ రైలు
రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్): శేషాచల అటవీ ప్రాంతం, మాముండూరు సమీపంలో ఇంజిన్ మొరాయించడంతో జేఎస్‌డబ్ల్యూ గూడ్స్ రైలు ఆగిపోయింది. దీంతో పలు రైళ్లు రెండు గంటలు ఆలస్యంగా నడిచాయి. చైన్నె నుంచి గుంతకల్లు మీదుగా కర్ణాటకకు ఐరన్ లోడ్‌తో వెళ్తున్న గూడ్స్ రైలు రేణిగుంట మండలం చైతన్యపురం సిగ్నల్ దాటగానే మిట్ట ప్రాంతం కావడంతో ఇంజిన్ నిలిచిపోయింది. రేణిగుంట రైల్వే అధికారులకు సమాచారం అందడంతో మరొక ఇంజిన్‌తో అతికష్టం మీద మాముండూరు రైల్వే స్టేషన్‌కు తరలించారు. దీని కారణంగా మంగళవారం రాత్రి రాయలసీమ ఎక్స్‌ప్రెస్, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, మరొక ట్రైను రెండు గంటలు ఆలస్యంగా నడిచాయి. -
రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
తిరుపతి క్రైమ్: శ్రీనివాస సేతుపై అధిక వేగంతో వాహనం నడుపుతూ ప్రమాదానికి గురై ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఈస్ట్ ఎస్ఐ బాలకృష్ణ కథనం.. మదనపల్లికి చెందిన రామానుజన్ నాయుడు కుమారుడు అభిరామ్ నాయుడు(20) మంగళం రోడ్‌లోని అన్నమయ్య ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. అదే కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్న సునీల్‌కుమార్‌తో కలిసి కాలేజీకి సమీపంలోనే ఓ రూమును అద్దెకి తీసుకొని నివసిస్తున్నారు. అయితే వీరు తిరుచానూరు ఫ్లై ఓవర్ దగ్గర నుంచి లక్ష్మీపురం వైపు వెళుతూ సర్కిల్లో ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో అభిరామ్ నాయుడు మృతిచెందాడు. అదేవిధంగా వెనుక కూర్చున్న సునీల్‌కుమార్ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. అత్యధిక వేగంతో వాహనం నడపడం వల్లే కంట్రోల్ చేయలేక ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం నుజ్జునుజ్జవగా.. అభిరాం నాయుడు ఫ్లైఓవర్ గోడపై వేలాడుతూ ఉండిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. -
ఆగిన గూడ్స్ రైలు
రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్): శేషాచల అటవీ ప్రాంతం, మాముండూరు సమీపంలో ఇంజిన్ మొరాయించడంతో జేఎస్‌డబ్ల్యూ గూడ్స్ రైలు ఆగిపోయింది. దీంతో పలు రైళ్లు రెండు గంటలు ఆలస్యంగా నడిచాయి. చైన్నె నుంచి గుంతకల్లు మీదుగా కర్ణాటకకు ఐరన్ లోడ్‌తో వెళ్తున్న గూడ్స్ రైలు రేణిగుంట మండలం చైతన్యపురం సిగ్నల్ దాటగానే మిట్ట ప్రాంతం కావడంతో ఇంజిన్ నిలిచిపోయింది. రేణిగుంట రైల్వే అధికారులకు సమాచారం అందడంతో మరొక ఇంజిన్‌తో అతికష్టం మీద మాముండూరు రైల్వే స్టేషన్‌కు తరలించారు. దీని కారణంగా మంగళవారం రాత్రి రాయలసీమ ఎక్స్‌ప్రెస్, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, మరొక ట్రైను రెండు గంటలు ఆలస్యంగా నడిచాయి. -
హాల్ టికెట్లు అందక పరీక్షకు దూరం
● కళాశాల ఎదుట తల్లిదండ్రులు, విద్యార్థుల ఆందోళన తిరుపతి ఎడ్యుకేషన్ : హాల్‌టిక్కెట్లు అందక తొమ్మిది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు దూరమైన ఘటన తిరుపతి బైరాగిపట్టెడలో చోటు చేసుకుంది. వరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా, జీడీనెల్లూరు నియోజకవర్గం, పెనుమూరులో గత కొన్నేళ్లుగా ఎస్వీ జూనియర్ కళాశాల పేరుతో ప్రైవేటు జూనియర్ కళాశాలను నిర్వహించారు. అయితే 2024–25 విద్యాసంవత్సరంలో ఈ కళాశాలను తిరుపతి సమీపం రాయలచెరువుకు సంబంధించిన ఓం ప్రకాష్ అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. అదే పేరుతో బైరాగిపట్టెడ వద్ద ఇంటర్ బోర్డు నిబంధనలకు విరుద్ధంగా, ఎటువంటి అనుమతులు తీసుకోకుండా కళాశాలను ఏర్పాటుచేసి అడ్మిషన్లు చేపట్టాడు. అనుమతులు లేకుండా తరగతులు నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో గతంలో ఆర్ఐఓ ఆ కళాశాలను సందర్శించి షోకాజు నోటీసులను అందించారు. దీంతో ఎస్వీ జూనియర్ కళాశాల అనే బోర్డును తీసేసి కోచింగ్ సెంటర్ అనే బోర్డును ఏర్పాటుచేసుకున్నాడు. కొన్నాళ్లకు ఓమ్ ఎస్వీవీ జూనియర్ కళాశాలగా బోర్డును ఏర్పాటు చేశాడు. దాదాపుగా 86 మంది మొదటి సంవత్సరం విద్యార్థులకు పెనుమూరు ఎస్వీ జూనియర్ కళాశాల పేరుతోనే పరీక్ష ఫీజులు కట్టారు. దీంతో ఈ విద్యార్థులందరూ చిత్తూరుకెళ్లి పరీక్షలు రాస్తున్నారు. అయితే వీరిలో 9 మంది విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వలేదు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కళాశాల ఎదుట మంగళవారం ఆందోళనకు దిగారు. పోలీసులు, ఆ కళాశాల యాజమాన్యం అక్కడికి చేరుకుని వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. జూన్‌లో ప్రైవేటుగా పరీక్ష రాసే వెసులుబాటు ఉందని, దీనివల్ల విద్యార్థులకు ఎటువంటి విద్యాసంవత్సరం నష్టం ఏర్పడదని వారికి సర్దిచెప్పడంతో ఆందోళనను విరమించారు. -
నిత్యం ఇలా.. ఆరోగ్యం ఎలా?
రేణిగుంట మేజర్ పంచాయతీలో 90 మందికి పైగా పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. వీరు ఉదయం 5 గంటల నుంచి పంచాయతీలోని పారిశుద్ధ్య పనుల్లో నిమగ్నమవుతుంటారు. ప్రజలు స్వచ్ఛమైన జీవనం సాగించాలంటే వీరు రోడ్లు, కాలవలు శుభ్రం చేయడం పరిపాటి. అలాంటి కార్మికుల పట్ల పంచాయతీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కార్మికులు ఎటువంటి మాస్క్‌లు, చేతికి గ్లౌజులు ఇవ్వకుండా వేధిస్తున్నారు. కొందరికి రబ్బర్ గ్లౌజులు ఇచ్చినా ఫలితం లేకుండా పోతోంది. అవి లూజుగా ఉండడంతో జారిపోతున్నాయి. దీంతో కార్మికులు వాటిని పక్కన పెట్టేశారు. కొందరైతే ప్లాస్టిక్ కవర్లను చేతికి కట్టుకొని పనులు చేస్తున్నారు. – రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్)వట్టి చేతులతోనే.. -
అలిగితివా సఖీ!
ఎండీఎం నిర్వాహకుల పొట్ట కొట్టొద్దు మధ్యాహ్న భోజన నిర్వాహకుల పొట్టకొట్టడం దారుణమని సీఐటీయూ నేతలు మండిపడ్డా రు. ఈ మేరకు నిరసన చేపట్టారు. శ్రీకాళహస్తీశ్వరాలయ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం పల్లకీసేవ నయనానందకరంగా సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో శ్రీకాళహస్తి పట్టణంలో సందడి నెలకొంది. పార్వతీదేవి అర్ధాంగిగా చేసుకుని అర్ధనారీశ్వరుడు అయ్యాడు శ్రీకాళహస్తీశ్వరస్వామి. కాగా గంగను శిరస్సుపై ఉంచడాన్ని సహించని పార్వతీదేవి ఆయనపై అలిగి పల్లకీలో ముందుగా వెళుతుండగా ఆమెను వెంబడిస్తూ సర్వేశ్వరుడు రావడం ఈ ఉత్సవం విశేషం. అలిగి వెళుతున్న అమ్మవారి ముందు దర్పణాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు అద్దంలో కనిపించే అమ్మవారి సుందరరూపాన్ని చూసి పునీతులయ్యారు. కాగా బుధవారం ఏకాంత సేవ జరగనుంది. – శ్రీకాళహస్తి పల్లకీ సేవకు పోటెత్తిన భక్తులు (ఇన్సెట్) దర్పణంలో అమ్మవారి ప్రతిబింబం– 8లో– 8లో -
ఇంటర్ పరీక్షకు 827మంది గైర్హాజరు
తిరుపతి ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా 86 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ప్రథమ సంవత్సర విద్యార్థులకు ఇంగ్లిష్ పేపర్–1 పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు జనరల్‌లో 31,900 మంది, ఒకేషనల్‌లో 1,394 మంది మొత్తం 33,294 మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉంది. అయితే వీరిలో 827మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆర్ఐఓ జీవీ.ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఈ పరీక్షలో భాగంగా బుధవారం జిల్లా వ్యాప్తంగా 86 పరీక్షా కేంద్రాల్లో ఇంగ్లిష్ పేపర్–2 సబ్జెక్టులో ద్వితీయ సంవత్సర విద్యార్థులకు పరీక్ష నిర్వహించనున్నట్లు ఆర్ఐఓ పేర్కొన్నారు. బస్సు పాస్ కేంద్రం మార్పు తిరుపతి అర్బన్: ఏడుకొండల బస్టాండ్‌లోని బస్సు పాస్ కేంద్రాన్ని శ్రీనివాస బస్టాండ్‌లోని 29వ ప్లాట్‌ఫాం వద్దకు మార్పు చేసినట్లు తిరుపతి డిపో అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ రామచంద్రనాయుడు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏడుకొండల బస్టాండ్‌లోని బస్సు పాస్ కేంద్రం మరమ్మతుల నేపథ్యంలో నాలుగు రోజుల పాటు శ్రీనివాస బస్టాండ్‌లో ప్రత్యామ్నాయ బస్సుపాస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మరమ్మత్తుల అనంతరం తిరిగి ఏడుకొండల బస్టాండ్‌కి బస్సు పాస్ కేంద్రాన్ని మార్పు చేస్తామని స్పష్టం చేశారు. చదువుతో పాటు నైపుణ్యం ఉండాలి తిరుపతి ఎడ్యుకేషన్: విద్యార్థులు చదువుతో పాటు కమ్యునికేషన్, లైఫ్ స్కిల్స్‌ను పెంపొందించుకోవాలని ఎడ్యుకేషనల్ అడ్వైజర్ కేవీఎస్.ప్రకాష్ తెలిపారు. తిరుపతి కేటీ రోడ్డులోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఫైనల్ ఇయర్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్ ఇంజినీరింగ్ విద్యార్థులకు మంగళవారం వ్యవస్థాపకత స్కిల్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా ఆయన పాల్గొని డిప్లొమో విద్యార్థులకు అవగాహన కల్పించారు. డిప్లొమో పూర్తయ్యాక ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో ఉద్యోగాలు పొందవచ్చని తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై.ద్వారకనాథరెడ్డి, విభాగాధిపతులు జీఎస్.రాధా, డాక్టర్ ఎస్వీ.గౌరీశంకర్ పాల్గొన్నారు. సెలవులో కలెక్టర్ తిరుపతి అర్బన్: జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ మూడు రోజులు సెలవుపై వెళ్లారు. సోమ, మంగళ, బుధవారాల్లో ఆయన అందుబాటులో ఉండరు. తిరిగి గురువారం (ఈనెల 6) నుంచి అందుబాటులోకి రానున్నారు. ఈ క్రమంలో జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ ఇన్చార్జి కలెక్టర్‌గా వ్యవహరించనున్నారు. ఆర్సీరెడ్డి డిగ్రీ కళాశాలలో రేపు జాబ్ మేళా తిరుపతి అర్బన్/తిరుపతి ఎడ్యుకేషన్: తిరుపతి రూరల్ పరిధిలోని ఆర్సీరెడ్డి డిగ్రీ కళాశాలలో గురువారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఆర్. లోకనాథం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి జాబ్ మేళాను నిర్వహిస్తామని వెల్లడించారు. పదోతరగతి నుంచి ఇంటర్, ఏదైనా డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా చదువుకున్న యువతీయువకులు అర్హులని తెలిపారు. ముందుగా ఇంటర్వ్యూలకు వచ్చే నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. అదనపు సమాచారం కోసం 807491 9939 నంబర్లో సంప్రదించాలని తెలిపారు. -
ఎండీఎం నిర్వాహకుల పొట్ట కొట్టొద్దు
శ్రీకాళహస్తి : ఏఎంపుత్తూరు నుంచి మధ్యాహ్న భోజనం పథకాన్ని నిర్వహిస్తున్న డ్వాక్రా మహిళల పొట్ట కొట్టొద్దని సీఐటీయూ నాయకులు సూచించారు. బాధిత డ్వాక్రా మహిళలతో కలిసి స్థానిక ఆర్డిఓ కార్యాలయం వద్ద మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి పెనగడం గురవయ్య మాట్లాడుతూ ఏఎంపుత్తూరు వేదికగా 20 మంది డ్వాక్రా మహిళలు పట్టణ వ్యాప్తంగా 14 ప్రభుత్వ, మున్సిపల్ పాఠశాలకు మధ్యాహ్న భోజనాన్ని సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. గత పదేళ్లుగా ఎలాంటి రాజీలేకుండా ఎండీఎం నిర్వహిస్తున్న డ్వాక్రా మహిళల పొట్ట కొట్టేందుకు శ్రీకాళహస్తి విద్యాశాఖలో పని చేస్తున్న ఎంఈవో స్థాయి వ్యక్తి కుట్ర చేస్తున్నాడంటూ ఆరోపించారు. డీఈవో స్పందించి ఆయనపై విచారణ జరపాలన్నారు. పోర్టుల నిర్మాణంలో మాదే పైచేయి – శాసన మండలిలో ఎమ్మెల్సీ మేరిగ చిల్లకూరు: శాసన మండలిలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ మంగళవారం తన గళం విప్పారు. అధికార పార్జీ బూజు దులిపారు. దుగ్గరాజపట్నం పోర్టు విషయంపై అధికార పార్టీ చేసిన విమర్శలను ఆయన దీటుగా తిప్పికొట్టారు. అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్–15 కేజీల గంజాయి స్వాధీనం రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్): రేణిగుంట మీదుగా ఇతర రాష్ట్రాలకు గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 15 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు రేణిగుంట జీఆర్పీ ఎస్ఐ రవి తెలిపారు. ఆయన కథనం మేరకు.. రేణిగుంట రైల్వే స్టేషన్‌లోని మూడో ప్లాట్ ఫారంపై సోమవారం రాత్రి అనుమానంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను తిరుపతి రైల్వే సబ్– డివిజినల్ పోలీస్ అధికారి ఎస్ఆర్ హర్షిత పర్యవేక్షణలో రైల్వే ఇన్స్పెక్టర్ పి.యతీంద్ర ఆదేశాలతో అదుపులోకి తీసుకొని పరిశీలించారు. వారి వద్ద 45 వేల విలువచేసే 15 కేజీల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మంగళవారం వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన మిల్టన్షేక్ (28), మదన్ మండల్ (39)ను అదుపులోకి తీసుకుని విచారించగా తమ బ్యాగుల్లో గంజాయి తీసుకువస్తున్నట్లు ఒప్పుకున్నారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసి, నెల్లూరు రైల్వే కోర్ట్ వారి ఎదుట హాజరు పరిచారు. ఐపీ ఎఫ్ సందీప్‌కుమార్, ఆర్పీఎఫ్ ఎస్ఐ రమేష్, ఆర్పీఎఫ్ ఏఎస్ఐ రమేష్, కానిస్టేబుల్ ధనంజయ దాడుల్లో పాల్గొన్నారు. -
ప్రజారోగ్యమే ధ్యేయం
చంద్రగిరి: ప్రజారోగ్యమే ధ్యేయంగా పనిచేసి, ఆరోగ్య సమస్యలు రాకుండా వైద్య సిబ్బంది చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓ డాక్టర్ బాలకృష్ణనాయక్ సూచించారు. మంగళవారం ఆయన అసిస్టెంట్ డీఎంహెచ్ఓ డాక్టర్ మురళీకృష్ణతో కలసి పట్టణంలోని సచివాలయం–2లోని హెల్త్ సెంటర్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హెల్త్ సెంటర్లో కనీస సౌకర్యాలు లేవని సిబ్బంది ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఆయన స్పందిస్తూ చంద్రగిరి సర్పంచ్ రూప రామ్మూర్తికి ఫోన్ చేసి సమస్యను వివరించారు. రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని సర్పంచ్ ఆయనకు తెలిపారు. అనంతరం హెల్త్ సెంటర్లో పలు రికార్డులను తనిఖీ చేశారు. -
నమ్మకద్రోహం కేసులో వెటర్నరీ ఉద్యోగికి జైలు
తిరుపతి లీగల్: నమ్మకద్రోహం కేసులు శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీకి చెందిన రీజనల్ అకౌంట్ ఆఫీస్ అసిస్టెంట్ కంట్రోలర్ వీ.రామమోహన్‌కు రెండేళ్ల జైలు శిక్ష, పదివేల రూపాయల జరిమానా విధిస్తూ తిరుపతి మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి సత్యకాంత్కుమార్ మంగళవారం తీర్పు చెప్పారు. కోర్టు ఏపీపీ జయశేఖర్, కోర్టు కానిస్టేబుల్ శేఖర్ తెలిపిన వివరాలు.. నిందితుడు రామమోహన్ శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ రాయలసీమ జోన్ రీజనల్ అకౌంట్ ఆఫీస్‌లో అసిస్టెంట్ కంట్రోలర్‌గా పనిచేసేవాడు. సీఎఫ్ఎంఎస్ ఉద్యోగులకు చెందిన బిల్లులను బయోమెట్రిక్ ద్వారా యూనివర్సిటీకి అందజేసేవాడు. 2018 నవంబర్ ఆరో తేదీ యూనివర్సిటీకి చెందిన 81 వేల 128 రూపాయలను తన బ్యాంక్ అకౌంట్‌కు అక్రమంగా బదిలీ చేసుకున్నాడు. 2019లో తన కుమార్తెకు తెలి యకుండా ఆమె పేరున అక్రమంగా ఓ తప్పుడు బ్యాంక్ అకౌంట్‌ను తయారుచేసి వివిధ తేదీలలో యూనివర్సిటీకి చెందిన రూ.9,71,620ను బదిలీ చేసుకున్నాడు. 2019 మే రెండో తేదీ యూనివర్సిటీ అకౌంటు సిబ్బంది యూనివర్సిటీకి చెందిన అకౌంట్లను పరిశీలిస్తుండగా మొత్తం 12 లక్షల 20వేల 671 రూపాయలు మాయమైనట్టు గుర్తించారు. దీనిపై వెటర్నరీ యూనివర్సిటీ అప్పటి రిజిస్టర్ డాక్టర్ డీ.శ్రీనివాసరావు ఎస్వీ యూనివర్సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేసి నిందితుడు రామ మోహన్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. -
గిరిజన కార్పొరేషనా.. మజాకా
● రుయాలో నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు ● జనసేన నేతల ఒత్తిడికి తలొగ్గిన అధికారులు ● లబోదిబోమంటున్న సమీప దుకాణదారులు తిరుపతి తుడా: తిరుపతి రుయాలో గిరిజన కో–ఆపరేటివ్ కార్పొరేషన్‌కి చెందిన ఉత్పత్తుల విక్రయాలకు అనుమతిచ్చారు. ఇప్పుడు ఈ దుకాణం రావడంతో రుయాలో టెండర్లు ద్వారా దక్కించుకున్న దుకాణదారులకు కంట్లో నలుసు పడ్డట్టయ్యింది. పక్కన ఉన్న ఐదు అడుగుల బంక్ నిర్వాహకుడు రుయాకు నెలకు రూ.1.3 లక్షలు అద్దె చెల్లిస్తుండగా గిరిజన కార్పొరేషన్ పేరుతో ఇతర ఉత్పత్తులు విక్రయిస్తున్న వ్యక్తి కేవలం రూ.20 వేల లోపేలోపు అద్దె చెల్లిస్తున్నారు. ఇంత భారీ వ్యత్యాసం ఉన్నప్పుడు గిరిజన కార్పొరేషన్ దుకాణాన్ని మరో ప్రాంతంలో ఏర్పాటు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఏకంగా హోటల్‌నే పెట్టేశారు గిరిజన కో–ఆపరేటివ్ కార్పొరేషన్ దుకాణంలో గిరిజన ఉత్పత్తులను మాత్రమే విక్రయించాలి. అయితే రుయాలో ఏర్పాటైన ఈ దుకాణంలో జంక్ ఫుడ్స్‌తో పాటు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం ఇతర అల్పాహారాలు, రాత్రి పూట టిఫిన్ విక్రయిస్తున్నారు. అలాగే కూల్ డ్రింక్స్ వంటివి విక్రయిస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు గిరిజన కార్పొరేషన్ దుకాణానికి నిబంధనలతో కూడిన అనుమతులు ఇచ్చాం. ఆ మేరకు విక్రయాలు జరపాలి. ఈ దుకాణాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించి నోటీసులు జారీచేస్తాం. అప్పటికీ స్పందించకుంటే తగిన చర్యలు తీసుకుంటాం. దుకాణంలో ఎమ్మార్పీకే విక్రయాలు జరపాలి. లేని పక్షంలో దుకాణాన్ని సీజ్ చేస్తాం. – డాక్టర్ రవిప్రభ, రుయా సూపరింటెండెంట్నేతల ఒత్తిడికి తలొగ్గిన అధికారులు రుయా ఆస్పత్రిలో గిరిజన కో ఆపరేటివ్ దుకాణం అనుమతులు మొదలు స్థలం కేటాయింపు, అద్దె ఖరారు, ఆపై విక్రయాల వరకు అంతా వివాదంగా మారింది. జనసేన నేతల ఒత్తిడికి అధికారులు లొంగిపోయారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్థలం మార్చే క్రమంలో జనసేన నేతలు అధికారులపై ఒత్తిడి తెచ్చి నెలకు రూ.20 వేల లోపే అద్దెను నిర్ణయించారు. గిరిజన ఉత్పత్తులను మాత్రమే విక్రయించాల్సి ఉండగా ఇతర ఉత్పత్తులతో పాటు ఏకంగా హోటల్ నిర్వహిస్తున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. -
అంగన్వాడీల డిమాండ్లు పరిష్కరించాలి
తిరుపతి కల్చరల్: అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి తొమ్మిది నెలలు కావస్తున్నా స్పందించకపోవడం దుర్మార్గమని ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ రాష్ల్ర గౌరవాధ్యక్షుడు రాయపనేని హరికృష్ణ ధ్వజమెత్తారు. ఐఎఫ్టీయూ కార్యాలయంలో మంగళవారం యూనియన్ జిల్లా నేతల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామని నమ్మించి వారి ఓట్లతో కూటమి ప్రభుత్వం అధికారం చేజిక్కించుకుందన్నారు. ఇప్పటి వరకు అంగన్వాడీలతో చర్చలు జరపకపోవడం విడ్డూరమన్నారు. అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, రాష్ట్రంలోని మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మార్చాలన్నారు. రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్లకు, మినీ వర్కర్లకు, హెల్పర్లకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ కక్ష సాధింపులు మానుకోవాలన్నారు. అన్ని డిమాండ్ల సాధన కోసం ఈనెల 10న విజయవాడలో చేపట్టే మహా ధర్నాకు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు తరలిరావాలని ఆయన పిలుపు నిచ్చారు. యూనియన్ జిల్లా అధ్యక్షురాలు జి.భారతి, ఐఎఫ్టీయూ నేతలు పి.వెంకటరత్నం, జిల్లాలోని అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ నాయకురాళ్లు పాల్గొన్నారు. -
వైభవంగా కల్యాణోత్సవం
నాగలాపురం: మండలంలోని భద్రావతి వీధిలో వెలసిన శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనారుషి స్వామివారి వార్షిక కల్యాణోత్సవాన్ని మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఈ మేరకు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీహరి వేకువజామునే స్వామివారిని సుందరంగా అలంకరించారు. ఉదయం 7 గంటలకు విఘ్నేశ్వర స్వామి పూజతో ప్రారంభించి, అనంతరం శ్రీ భావనారుషి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సాయంత్రం 7గంటలకు శ్రీ భావనారుషి స్వామివారి ఉత్సవమూర్తులను వివిధ రకాల పూలతో, ఆభరణాలతో సుందరంగా అలంకరించి ఉయ్యాల సేవ నిర్వహించారు. అనంతరం స్వామివారిని మంగళవాయిద్యాల నడుమ వైభవంగా పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు ఇంటింటా కర్పూర హారతులు పట్టి స్వామివారిని దర్శించుకున్నారు. ఉభయదారులు గజలీలమ్మ, చొప్పా కుమారస్వామి, వారి కుటుంభ సభ్యులు, నారాయణ శెట్టి, పద్మశాలి యువకులు, ఉభయదారులుగా వ్యవహరించారు. ఆలయ పర్యవేక్షకులు శ్యామల మధు, మునికృష్ణయ్య తదితరులు ఏర్పాట్లను పర్యావేక్షించారు. -
బీమా రంగ భవిష్యత్‌ను కాపాడండి
● తిరుపతి ఎంపీకి విన్నవించిన ఎల్ఐసీ ఏజెంట్లుతిరుపతి మంగళం: బీమా రంగ భవిష్యత్‌ను కాపాడాలని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి సూచించారు. ఎల్ఐసీ ఏజెంట్లు ఈ నెల 19వ తేదీన ఢిల్లీలోని రామలీలా మైదానంలో శాంతియుత ప్రదర్శన చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఎల్ఐసీ ఏజెంట్లు మంగళవారం తిరుపతి ఎంపీ కార్యాలయంలో ఎంపీని కలిసి వినతిపత్రం సమర్పించారు. శాంతియుత ప్రదర్శనకు మద్దతు తెలపాలని కోరారు. ఎల్ఐసీ, ఐఆర్డీఏఐ తీసుకొచ్చిన మార్పులు పాలసీదారులు, బీమా పరిశ్రమ దేశ వ్యాప్తంగా 30 లక్షల లైఫ్ ఇన్సూరెన్‌న్స్ ఏజెంట్ల జీవితాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్న నేపథ్యంలో భారత జీవిత బీమా ఏజెంట్ల సమాఖ్య ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 19న ఢిల్లీలో శాంతియుత ప్రదర్శన నిర్వహిస్తున్నట్టు ఎంపీకి వివరించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ గతంలో కూడా ఎల్ఐసీ ఏజెంట్ల సమస్యలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంటులో ప్రస్తావించిన విషయాన్ని వారికి గుర్తుచేశారు. ఢిల్లీలో నిర్వహించనున్న శాంతియుత ప్రదర్శనకు తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. -
శ్రీవారి తెప్పోత్సవాలకు పటిష్ట భద్రత
తిరుమల: తిరుమలలో ఈనెల 9 నుంచి 13వ తేదీ వరకు జరగబోయే తిరుమల శ్రీవారి తెప్పోత్సవాలకు పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం తిరుమలలోని పోలీస్ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. దీనికి ముందు ఆయన తెప్పోత్సవాలు జరిగే ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రతి ఒక్కరూ స్వామి వారి దర్శనమయ్యేలా చూసుకోవాలన్నారు. అదేవిధంగా ప్రతి కెమెరాను కూడా తప్పనిసరిగా చెక్ చేయాలన్నారు. సోమవారం సాయంత్రం అదృశ్యమైన చిన్నారి దీక్షను గంటల వ్యవధిలోనే గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులను ఎస్పీ అభినందించారు. తిరుమల ఏఎస్పీ రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. -
నేటి నుంచి సమ్మె ఉధృతం
తిరుపతి సిటీ: గౌరవ వేతనం పెంచాలంటూ పశువైద్య విద్యార్థులు చేస్తున్న నిరవధిక సమ్మె 30వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా మంగళవారం చేతులు, కాళ్లకు స్వతహాగా బేడీలు వేసుకుని న్యాయదేవత ముందు తమగోడును వెళ్లబోసుకున్నారు. తమ ఆకలి కేకలు వర్సిటీ అధికారులు, ఇటు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో బుధవారం నుంచి సమ్మెను మరింత ఉధృతం చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు. హాస్టల్స్ బంద్ చేస్తాం వెటర్నరీ జూడాలు సమ్మెను విరమించని నేపథ్యంలో వర్సిటీలోని హాస్టల్స్‌ను మూసివేస్తామని మరో వైపు అధికారులు బెదిరిస్తున్నట్లు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులపై తల్లిదండ్రులకు ఫిర్యాదులు చేస్తామని సైతం అధికారులు హెచ్చరిస్తున్నట్లు సమాచారం. -
పవన్‌కల్యాణ్ ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తున్నాయ్!
● రాజీకి రావాలని.. నేను వెళ్లకూడదని నిర్ణయించుకున్నా ● న్యాయం జరిగేవరకు కిరణ్‌రాయల్‌పై పోరాడుతూనే ఉంటా ● తిరుపతి ప్రెస్ క్లబ్లో జనసేన నేత కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మి సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘కాంప్రమైజ్ రావాలని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తున్నాయి. విజయవాడ వచ్చి కలవాలని చెబుతున్నారు. కానీ నా పిల్లల భవిష్యత్ కోసం నేను వెళ్లకూడదని అనుకుంటున్నాను’ అని తిరుపతి జనసేన ఇన్చార్జ్ కిరణ్‌రాయల్ బాధితురాలు లక్ష్మి వెల్లడించారు. డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమాని కిరణ్ రాయల్ తనను నమ్మించి ఆర్థికంగా, శారీరకంగా వాడుకుని మోసం చేశారంటూ తిరుపతికి చెందిన లక్ష్మి పలుమార్లు మీడియా ఎదుట తన ఆవేదనను వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తన వద్ద తీసుకున్న నగదు, బంగారు నగలను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆమె తన విషయం పది మందికి తెలిసేలా చేసిందనే కోపంతో జనసేన నేత కిరణ్ రాయల్ లక్ష్మికి ఫోన్‌చేసి తీవ్ర స్థాయిలో బెదిరింపులకు గురిచేసిన విషయాలను ఆడియో రూపంలో బయటపెట్టారు. ఆ తరువాత కిరణ్ రాయల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిరణ్ రాయల్‌కు సన్నిహితంగా మెలిగే ఓ సీఐ రంగంలోకి దిగి ఇద్దరి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. అందులో భాగంగా లక్ష్మి మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించి పలు విషయాలను వెల్లడించింది. రాజకీయంగా.. ఆటబొమ్మలా వాడుకున్నారు తనకు న్యాయం చేస్తానని కిరణ్ రాయల్ ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పిస్తానంటూ తిరుపతి జిల్లా జనసేన అధ్యక్షుడు ఏడాది కిత్రం తన వద్దకు వచ్చి వీడియోలు, ఆడియోలు తీసుకున్నాడని లక్ష్మి బయటపెట్టారు. ఆ తర్వాత అవన్నీ సోషల్ మీడియాలో ఎలా ప్రత్యక్షమయ్యాయో తనకు తెలియదన్నారు. తనను రాజకీయంగా ఆటబొమ్మలా వాడుకున్నారని ఆమె వాపోయారు. ప్రస్తుతం ఎస్వీయూ పోలీసు అధికారులు తన సమస్యను పరిష్కరించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారని చెప్పారు. ఇంతటితో సమస్యకు ముగింపు పలకాలనే ఉద్దేశంతో, తన కుమారుల సూచనల మేరకు మీడియా ముందుకు వచ్చి వివరణ ఇస్తున్నట్లు తెలిపారు. ఇకనైనా తనను రాజకీయంగా వాడుకోవద్దని జనసేన నేతలను వేడుకున్నారు. తన వెనుకాల ఏ రాజకీయ పార్టీ లేదని, అయితే జనసేన వాళ్ల మధ్య ఏముందో తనకు తెలియదన్నారు. తన వద్ద నుంచి జనసేన జిల్లా అధ్యక్షుడు ఆడియో, వీడియోలు తీసుకున్న వివరాల్ని పోలీసులకు తెలియజేసినట్లు వెల్లడించారు. తన వెనుక వైఎస్సార్సీపీ నేతలున్నారనే ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. లక్ష్మికి కిరణ్ రాయల్ ఇవ్వాల్సిన డబ్బును తిరిగి ఇస్తానని కుమారులకు హామీ ఇచ్చినట్లు సమాచారం. -
అవకాశాలను అందిపుచ్చుకోవాలి
తిరుపతి సిటీ: విద్యార్థులకు క్రీడరంగంలో మంచి అవకాశాలు ఉన్నాయని, యువత అందిపుచ్చుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఏపీ క్యారమ్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అండ్ రెఫరీ పానెల్ కోచ్ ఎస్కే అబ్దుల్ జలీల్ పిలుపునిచ్చారు. ఏపీ ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్, ఆర్కే గ్రూప్ అఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆహ్వానం మేరకు మంగళవారం తిరుపతి తుడా సర్కిల్లోని స్మార్ట్‌సిటీ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న 27వ ఆల్ ఇండియా పోస్టల్ క్యారమ్స్ టోర్నమెంట్ రెండవ రోజు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్ క్రీడారంగానిదేనన్నారు. ఆర్కే గ్రూప్ అఫ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ తాతిరెడ్డి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ 27వ ఆల్ ఇండియా పోస్టల్ క్యారమ్స్ టోర్నమెంట్‌ను విద్యార్థులు వీక్షించి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అనగని రెడ్డెప్ప, రవిచంద్రబాబు పాల్గొన్నారు. రసవత్తరంగా క్యారమ్స్ పోటీలు పోస్టల్ ఉద్యోగులకు జాతీయ స్థాయిలో జరుగుతున్న క్యారమ్స్ పోటీలు రెండవ రోజు రసవత్తరంగా కొనసాగాయి. తమిళనాడు, ఢిల్లీ, తెలంగాణా, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, హర్యాణా జట్లు పోటాపోటీగా తలపడ్డారు. మహిళా ఉద్యోగుల క్యారమ్స్ పోటీలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. -
టీచర్ల సీనియారిటీ జాబితాలో అన్నీ తప్పులే
● అవస్థల్లో చిత్తూరు, తిరుపతి జిల్లాల అయ్యోర్లు ● చిత్తూరు డీఈఓ కార్యాలయానికి పరుగులు ● ప్రభుత్వ పాఠశాలల్లో కుంటుపడుతున్న చదువులు ● కూటమి ప్రభుత్వం పై భగ్గుమంటున్న ఉపాధ్యాయులు చిత్తూరు కలెక్టరేట్: చిత్తూరు జిల్లాలో 2,436, తిరుపతి జిల్లాలో 2,444 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నాయి. చిత్తూరు జిల్లాలోని పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు 1,41,217, తిరుపతి జిల్లాలో 1,87,444 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వివిధ కేడర్లలో 24,836 మంది టీచర్లు విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు చిత్తూరు, తిరుపతి జిల్లాల పరిధిలోని ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా కసరత్తును గత రెండు నెలలుగా నిర్వహించారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీ, కార్పొరేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న టీచర్ల సీనియారిటీ జాబితాను ఉపాధ్యాయ సమాచార వ్యవస్థ (టిస్) ఆధారంగా సిద్ధం చేశారు. ఈ కసరత్తు పూర్తి చేశాక ఈ నెల 3వ తేదీన కేడర్ల వారీగా జాబితాను విద్యాశాఖ అధికారులు వెబ్సైట్లో నమోదు చేశారు. ఆ జాబితాను పరిశీలించుకున్న తర్వాత చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని టీచర్లు తమ వివరాలన్నీ తప్పుల తడకగా ఉన్నట్లు గగ్గోలు పెడుతున్నారు. అన్నీ తప్పులే అన్ని మేనేజ్మెంట్ల సీనియారిటీ జాబితాల్లో తప్పులే ఉన్నట్టు ఉపాధ్యాయులు వాపోతున్నారు. స్కూల్ అసిస్టెంట్ సీనియార్టీ జాబితాలను డీఎస్సీ, పుట్టిన తేదీల ఆధారంగా పొందుపరచడంతో సీనియర్, జూనియర్ అనే వ్యత్యాసం వచ్చినట్లు గగ్గోలు పెడుతున్నారు. ప్యానల్ సీనియారిటీ జాబితాలను పాటించకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు ఏర్పడినట్లు టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పుల సవరణకు టీచర్లు చిత్తూరు డీఈవో కార్యాలయానికి వచ్చి అభ్యంతరాలు తెలియజేయాలని చెప్పడం బాధాకరమని పలువురు మండిపడుతున్నారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల సమాచారం చిత్తూరు జిల్లాలోని పాఠశాలలు 2,436 తిరుపతి జిల్లాలోని పాఠశాలలు 2,444 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మంజూరు 8,435 విధులు నిర్వహిస్తున్న స్కూల్ అసిస్టెంట్లు 7,534 స్కూల్ అసిస్టెంట్ల ఖాళీలు 901 ఎస్జీటీ పోస్టులు 8,295 విధులు నిర్వహిస్తున్న ఎస్జీటీలు 6,443 ఎస్జీటీ ఖాళీ పోస్టులు 1,852 పనిచేస్తున్న హెచ్ఎంలు 408 తప్పులను తొలగించాలి విద్యాశాఖ అధికారులు విడుదల చేసిన సీనియారిటీ జాబితాలో దొర్లిన తప్పులను సవరించాలి. ఈ సీనియారిటీ జాబితాలో 90 శాతం తప్పులున్నాయి. ఇలాంటి జాబితాలు విడుదల చేయడం బాధాకరం. – జీవీరమణ, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎవరికి ఉపయోగం విద్యాశాఖ అధికారులు విడుదల చేసిన తప్పుల తడక సీనియారిటీ జాబితా ఎవరికి ఉపయోగమని ప్రశ్నిస్తున్నాం. ఇలాంటి జాబితాల వల్ల సమయం వృథా తప్ప ఒరిగేదేమి ఉండదు. సీనియర్ల స్థానంలో జూనియర్లు రావడం ఆందోళన కలిగిస్తోంది. – ముత్యాలరెడ్డి, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి, తిరుపతి జిల్లా సీనియారిటీకి తిలోదకాలు సీనియారిటీకి తిలోదకాలు ఇచ్చి జాబితాలను సిద్ధం చేశారు. రెండుమూడేళ్ల తర్వాత ఉద్యోగోన్నతి పొందిన వారు సీనియర్లు గా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. – రెడ్డిశేఖర్‌రెడ్డి, వైఎస్సార్‌టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ట్రెజరర్ ఇది కరెక్ట్ కాదు టీచర్లను ఇబ్బందులు పెట్టడం కరెక్టు కాదు. అధికారులు కసరత్తులో తప్పులు చేసి టీచర్లను వేధిస్తున్నారు. తప్పిదాలను తొలగించేందుకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 66 మండలాల టీచర్లను చిత్తూరుకు వచ్చి నేరుగా అభ్యంతరాలు ఇవ్వాలని చెప్పడం సబబుకాదు. – బాలాజీ, ఆపస్ రాష్ట్ర అధ్యక్షుడుసమస్యలు ఇలా.. ఉద్యోగోన్నతుల సందర్భంగా రెండు, మూడు రకాల తేదీలను పొందుపరచడంతో సీనియారిటీ జాబితాలో లోపాలు దొర్లాయి. 2002 అక్టోబర్ 31వ తేదీన ఉద్యోగోన్నతి పొందిన వారిలో వివిధ తేదీలను నమోదు చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. డీఎస్సీ 2000లో సెంకడరీ గ్రేడ్ టీచర్‌గా ఎంపికై , 2001 డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్‌గా ఎంపికై న వారి సీనియారిటీలో రెగ్యులర్ వారికంటే జాబితాలో ముందున్నారు. డీఎస్సీ 2018లో సోషియల్ (ఎస్ఏ) టీచర్లు వివిధ తేదీలలో జాయిన్ కావడంతో వారి సీనియారిటీ జాబితాలో వ్యత్యాసం కనిపిస్తోంది. 2002 ఆన్లైన్ టీచర్ల నియామక ప్రకారం ఆ కేడర్‌లో సీనియారిటీ పొందుపరచాలి. 2008 డీఎస్సీలో ఎంపికై న ఉపాధ్యాయుల సీనియారిటీ కొన్ని మండలాల్లో ఉత్తర్వుల ప్రకారం అమలు చేయకపోవడంతో అసమగ్రత ఏర్పడింది. -
ప్రజారోగ్యమే ధ్యేయం
చంద్రగిరి: ప్రజారోగ్యమే ధ్యేయంగా పనిచేసి, ఆరోగ్య సమస్యలు రాకుండా వైద్య సిబ్బంది చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓ డాక్టర్ బాలకృష్ణనాయక్ సూచించారు. మంగళవారం ఆయన అసిస్టెంట్ డీఎంహెచ్ఓ డాక్టర్ మురళీకృష్ణతో కలసి పట్టణంలోని సచివాలయం–2లోని హెల్త్ సెంటర్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హెల్త్ సెంటర్లో కనీస సౌకర్యాలు లేవని సిబ్బంది ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఆయన స్పందిస్తూ చంద్రగిరి సర్పంచ్ రూప రామ్మూర్తికి ఫోన్ చేసి సమస్యను వివరించారు. రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని సర్పంచ్ ఆయనకు తెలిపారు. అనంతరం హెల్త్ సెంటర్లో పలు రికార్డులను తనిఖీ చేశారు. -
పవన్ ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తున్నాయ్: లక్ష్మి
తిరుపతి, సాక్షి: జనసేన నేత కిరణ్ రాయల్(Kiran Royal) తనకు ఇవ్వాల్సిన నగదు మొత్తం ఇచ్చేదాకా పోరాడుతూనే ఉంటానని బాధితురాలు లక్ష్మి(Laxmi) అంటున్నారు. తనకు ఎలాంటి రాజకీయ పార్టీ మద్దతు లేదని స్పష్టం చేసిన ఆమె.. కాంప్రమైజ్‌కు రావాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తున్నాయని చెబుతున్నారామె. కిరణ్ రాయల్‌తో జరిగిన ఆర్థిక లావాదేవీలు అన్నింటికీ ఆధారాలు ఉన్నాయి. స్థానిక సీఐ నాకు సెటిల్మెంట్ చేయిస్తానని హామీ ఇచ్చారు. మొదటి నుంచి చెబుతున్నట్లు నాకు ఈ పోరాటంలో ఏ పార్టీ మద్దతు లేదు. నా ఆరోగ్యం బాగోలేకున్నా.. నా పిల్లలు వద్దని చెప్పినా.న్యాయ పోరాటం చేస్తున్నా. నన్ను రకాలుగా ట్రోల్ చేస్తున్నారు. అయినా నా పోరాటం ఆపను. నేను విడుదల చేసిన వీడియోలు,ఫోటోలు అన్ని వాస్తవాలు. వాటన్నింటిని ఏడాది క్రితమే జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తీసుకున్నారు. ఇంతకాలం సైలెంట్‌గా ఉండి ఇప్పుడేమో.. కాంప్రమైజ్ కోసం ప్రయత్నిస్తున్నారు. విజయవాడ వచ్చి కలవాలని పవన్ కల్యాణ్(Pawan Kalyan) పీఏ దగ్గరి నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి. కానీ, నా పిల్లల భవిష్యత్ కోసం నేను వెళ్లవద్దని అనుకుంటున్న అని లక్ష్మి చెబుతున్నారు. -
ఆల్ట్రాడీలక్స్ వద్దు బాబోయ్
విశాఖపట్నానికి శ్రీకాళహస్తి మెట్రో సర్వీసులు ● వాటి స్థానంలో ఆల్ట్రాడీలక్స్ సర్వీసులు ● వీటిల్లో టిక్కెట్ ధర రూ.70 ● లబోదిబో మంటున్న ప్రయాణికులు తిరుపతి అర్బన్: ఆల్ట్రాడీలక్స్ వద్దు.. మెట్రో సర్వీసులే ముద్దు అని ప్రయాణికులు చెబుతున్నారు. పదేళ్ల క్రితం శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపోకు 22 మెట్రో సర్వీసులను ఏర్పాటు చేశారు. అయితే ఆర్టీసీ పెద్దలు వీటిని దశల వారీగా విశాఖపట్నానికి తరలించేస్తున్నారు. అక్కడ వాటిని టౌన్ సర్వీసులుగా తిప్పేందుకు అనుకూలంగా ఉంటాయని భావిస్తున్నారు. ఇప్పటికే మొదటి విడతలో శ్రీకాళహస్తి డిపోకు చెందిన ఆరు మెట్రో సర్వీసులను విశాఖపట్నానికి పంపించేశారు. మిగిలిన వాటిని రెండు, మూడు దశల్లో తరలించేందుకు సిద్ధమయ్యారు. మెట్రో స్థానంలో ఆల్ట్రాడీలక్స్ సర్వీసులు మెట్రో స్థానంలో తిరుపతి డిపోలోని ఆల్ట్రా డీలక్స్‌లను శ్రీకాళహస్తి డిపోకు తరలిస్తున్నారు. ఇప్పటికే ఆరు సర్వీసులు తరలించారు. సాధారణంగా మెట్రో సర్వీసుల్లో టిక్కెట్ ధర రూ.55 ఉండగా.. అదే ఆల్ట్రాడీలక్స్లో రూ.70 వరకు వసూలు చేస్తున్నారు. తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి వెళ్లి రావడానికి రానుపోను రూ.140 వరకు వెచ్చించాల్సి వస్తోంది. అంటే ఒకసారి తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి పోయి రావాలంటే రూ.30 వరకు అదనంగా వెచ్చించాల్సి వస్తోంది. మెట్రో సర్వీసులే మేలు తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి వెళ్లడానికి మెట్రో సర్వీసులు ఎంతో సౌకర్యంగా ఉండేవి. వాటినే కొనసాగించాలని కోరుతున్నాం. ఆల్ట్రాడీలక్స్ల్లో డ్రైవర్లే టిక్కెట్లు కొడుతున్నారు. ఆయన దృష్టి డ్రైవింగ్‌పైనే కాకుండా టిక్కెట్లపై ఉంటోంది. ఇది చాలా ప్రమాదకరం. – రెడ్డెప్ప, ప్రయాణికుడు భారం తగ్గించాలి మెట్రో సర్వీసులను తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి రద్దు చేసి... ఆ స్థానంలో ఆల్ట్రాడీలక్స్ సర్వీసులను ఏర్పాటు చేయడం ద్వారా రానుపోను రూ.30 అదనంగా వెచ్చించాల్సి వస్తోంది. ప్రయాణికులపై భారం తగ్గించాల్సి ఉంది. – వినోద్‌రెడ్డి, ప్రయాణికుడు సౌకర్యవంతంగా ఆల్ట్రాడీలక్స్లు తిరుపతి–శ్రీకాళహస్తి మార్గంలో ఆల్ట్రాడీలక్స్ సర్వీ సులు ఎంతో సౌకర్యంగా ఉన్నాయ ని భావిస్తున్నాం. అందుకే ఆరు మెట్రో సర్వీసులను విశాఖపట్నానికి పంపించాం. ఆ స్థానంలో ఆల్ట్రాడీలక్స్లను ఏర్పాటు చేశాం. మెట్రోతో పోల్చుకుంటే టిక్కెట్ ధరపై రూ.15 మాత్రమే అదనం. – నరసింహులు, జిల్లా ప్రజారవాణా అధికారి -
నాణ్యత లోపం
డక్కిలి మండలంలో రూ.2.2 కోట్ల వరకు మంజూరు కాగా దాదాపు నిర్మాణాలు 90 శాతం పూర్తయ్యాయి. ఈ సిమెంట్ రోడ్ల నిర్మాణాల్లో కూటమికి చెందిన కాంట్రాక్టర్లు ఇషారాజ్యంగా వ్యవహరించారు. సిమెంట్, ఇసుక, కంకర సమపాళ్లలో వేయలేదన్న విమర్శలున్నాయి. వాస్తవానికి నాణ్యత కలిగిన ఇసుకను వినియోగించాలి. అయితే స్థానికంగా వాగులు, వంకల్లో లభించే ఇసుకను వినియోగించారు. సీసీ రోడ్డు నిర్మాణాల్లో సిమెంట్, ఇసుక, కంకర 1:2:4 నిష్పత్తిలో వినియోగించాలి. అయితే ఇందుకు భిన్నంగా సీసీ రోడ్ల నిర్మాణాలు జరిగినట్టు ఆరోపణలున్నాయి. అవినీతి బట్టబయలు డక్కిలి మండలంలో సీసీ రోడ్డు నిర్మాణాల్లో జరిగిన అవినీతి మొత్తం క్వాలిటీ కంట్రోల్ అధికారుల తనిఖీ అనంతరం బట్టబయలు అవుతోందని పలు గ్రామాల్లో చర్చ సాగుతోంది. వాస్తవానికి క్వాలిటీ కంట్రోల్ తనిఖీ అనంతరమే 30 శాతం బిల్లు కాంట్రాక్టర్‌కు వస్తుంది. ఈలోగా క్వాలిటీ కంట్రోల్ అధికారులు తనిఖీకి రాక ముందే 70 శాతం బిల్లులు పొందేందుకు కాంట్రాక్టర్లు తహతహలాడుతున్నారు. -
గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ప్రారంభం
రేణిగుంట: ఏర్పేడు మండలం, పాగాలి సమీపంలోని రాక్‌మ్యాన్ పరిశ్రమ ప్రాంగణంలో సోమవారం హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్ ప్లాంట్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఉండవల్లి నివాసం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ చేపట్టిన ఈ ప్రాజెక్ట్.. పారిశ్రామిక అవరసరాల కోసం పీఎన్జీ, ఎల్పీజీతో గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్‌కు సరికొత్త విధానాన్ని అనుసరిస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. లక్ష్యానికి తొలి అడుగు స్వర్ణాంధ్ర విజన్–2047 సాధనలో భాగంగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో ఏపీని ప్రపంచ కేంద్రంగా మార్చాలనే లకా్ష్య్నికి ఇది తొలిఅడుగు అవుతుందని సీఎం తెలిపారు. రాష్ట్ర ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద 160 గెగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని, క్లీన్ ఎనర్జీలో రూ.10 ట్రిలియన్ పెట్టుబడిని సాధిస్తామనే విశ్వాసం ఉందన్నారు. రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ద్వారా రెండు వేల మందికి ఉపాధి కలిగించడంతోపాటు ఏడాదికి 25 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తుందన్నారు. జేసీ శుభం బన్సల్, శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్‌రెడ్డి, హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ ఎండీ, చైర్మన్ రాహుల్ ముంజల్, హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ గ్లోబల్ సీఈవో శ్రీవాత్సన్ అయ్యర్, రాక్‌మాన్ ఇండస్ట్రీస్ ఎండీ ఉజ్వల్ ముంజల్, రాక్‌మాన్ ఇండస్ట్రీస్ సీఈవో కౌసిక్ మన్నా, ఓహ్మియం సీఈవో ఆర్నే బాలంటైన పాల్గొన్నారు. -
పారదర్శకంగా పది పరీక్షలు
మాట్లాడుతున్న ఆర్జేడీ శామ్యూల్తిరుపతి అర్బన్: పదో తరగతి పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలని కడప ఆర్జేడీ శామ్యూల్ తెలిపారు. సోమవారం తిరుపతిలోని కచ్చేపి స్టేడియంలో పది పరీక్షలపై ఆయన అధికారులతో సమీక్షించారు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు ప్రత్యేక నిఘా ఉండాలని ఆదేశించారు. కాపీయింగ్‌కు అవకాశం లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని చెప్పారు. మార్చి 17 నుంచి పరీక్షలు ప్రారంభమవుతున్న తరుణంలో ముందస్తు ప్రణాళిక ఉండాలని స్పష్టం చేశారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. జిల్లాలో 164 పరీక్షాకేంద్రాల్లో రెగ్యులర్, ఓపెన్ స్కూల్ విద్యార్థులు 28,656 మంది విద్యార్థులు హాజరుకానున్నట్టు వెల్లడించారు. మార్చి 5, 6 తేదీల్లో సెట్–1, సెట్–2 ప్రశ్నపత్రాలు జిల్లాకు చేరుకుంటాయన్నారు. హాల్ టిక్కెట్లు మంగళవారం నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. సీ గ్రేడ్ విద్యార్థులపై ప్రత్యేక ఫోకస్పెట్టాలన్నారు. డీఈఓ కేవీఎస్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
శ్రీవారి దర్శనానికి 6 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్మెంట్లు ఖాళీగా ఉన్నాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 68,592 మంది స్వామిని దర్శించుకున్నారు. 24,273 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.63 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని వారికి 6 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లున్న వారికి 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉండగా సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ముందుగా వెళితే లోనికి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. టీటీడీకి రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల వితరణ తిరుమల: టీటీడీకి సోమవారం తిరుపతిలోని ఏఎంఆర్‌డీ బిల్డర్స్ ఎండీలు మారుతి నాయుడు, దేవేంద్ర నాయుడు రూ.2.28 లక్షల విలువైన రెండు బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు వితరణ చేశారు. శ్రీవారి ఆలయం ఎదుట స్కూటర్లకు పూజలు చేసి డెప్యూటీ ఈవో లోకనాథంకు తాళాలు అందజేశారు. కార్యక్రమంలో తిరుమల డీఐ సుబ్రమణ్యం, ఇతర అధికారులు పాల్గొన్నారు. సీనియారిటీ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ చిత్తూరు కలెక్టరేట్ /తిరుపతి అర్బన్: ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని హెచ్ఎంలు, టీచర్ల సాధారణ సీనియారిటీ జాబితాలో అభ్యంతరాలుంటే తెలపాలని చిత్తూరు, తిరుపతి డీఈవోలు వరలక్ష్మి, కేవీఎస్ కుమార్ తెలిపారు. వారు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అన్ని యాజమాన్యాల కింద పనిచేస్తున్న టీచర్ల సీనియారిటీ జాబితాను ఉపాధ్యాయ సమాచార వ్యవస్థ ఆధారంగా రూపొందించినట్లు తెలిపారు. ఈ జాబితాలను www.chittoor deo.com వెబ్సైట్లో ఉంచినట్టు తెలిపారు. వాటిపై అభ్యంతరాలు ఉంటే డీడీవో సంతకంతో ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 7 గంటలలోపు చిత్తూరు డీఈవో కార్యాలయంలో అందజేయాలన్నారు. టీచర్ పూర్తి పేరు, కేడర్, సీనియారిటీ జాబితాలోని తప్పిదాన్ని స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. ఆధారాలతోపాటు సంబంధిత డాక్యుమెంట్స్ జతచేయాలన్నారు. గడువు తర్వాత అందే అభ్యంతరాలను స్వీకరించబోమని వెల్లడించారు. -
ఇంటర్ పరీక్షకు 572 మంది గైర్హాజరు
తిరుపతి ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా సోమవారం జిల్లా వ్యాప్తంగా 86 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ద్వితీయ సంవత్సర విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్–2 పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు జనరల్‌లో 28,322 మంది, ఒకేషనల్‌లో 1,033 మంది మొత్తం 29,335 మంది విహాజరవ్వాల్సి ఉంది. అయితే వీరిలో 572 మంది విద్యార్థులు గైర్హాజరైనట్టు ఆర్ఐఓ జీవీ.ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఇంగ్లిష్ పేపర్–1 ఉంటుందన్నారు. పకడ్బందీగా నేర నియంత్రణ తిరుపతి క్రైమ్: జిల్లాలో ఎన్ఫోర్స్మెంట్ విధులను పెంచి నేర నియంత్రణ కట్టడి చేసినట్లు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఫిబ్రవరిలో సాధించిన పురగతిని ఆయన వెల్లడించారు. రాత్రిపూట రోడ్లపై తిరుగుతున్న 1,484 మంది అనుమానిత వ్యక్తులను పోలీస్ స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపినట్టు పేర్కొన్నారు. అలాగే 94.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. రోడ్లను ఆక్రమించి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే 2,222 మంది చిరు వ్యాపారులపై టౌన్ న్యూసెన్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. -
సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలకు అటానమస్ హోదా
తిరుపతి రూరల్: తిరుపతి రూరల్ మండలం సి.గొల్లపల్లెలోని సిద్ధార్థ ఇంజినీరింగ్, ఎంబీఏ కళాశాలలకు యూజీసీ అటానమస్ హోదా (స్వయంప్రతిపత్తి) లభించిందని సిద్ధార్థ ఎడ్యుకేషనల్ అకాడమీ సెక్రటరీ వై.ఆనందరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 1985లో రాయలసీమ ప్రాంతంలో పేద విద్యార్థులకు నాణ్యమైన కార్పొరేట్ విద్యను అందించాలనే ఉద్దేశంతో వై.కొండారెడ్డి, యం.వెంకట్రామిరెడ్డి రాయలసీమ విద్యాసంస్థలను ప్రారంభించినట్టు వివరించారు. గత 40 ఏళ్లుగా విద్యాసంస్థల్లో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే కాకుండా కొత్త రకం కోర్సులను తెచ్చి విద్యార్థులను ఉన్నత స్థాయిలో స్థిరపడేలా చేయడం జరిగిందన్నారు. పేద విద్యార్థులకు టెక్నికల్ విద్యను కూడా చేరువ చేయాలన్న ఉద్దేశంతో 2009లో సిద్ధార్థ ఇంజినీరింగ్, ఎంబీఏ కళాశాలలను స్థాపించినట్టు తెలిపారు. విద్యార్థులకు అన్నిరకాలు శిక్షణ అందించి మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశం సంపాధించుకునేలా చేయడం జరిగిందన్నారు. ఈ విద్యాసంవత్సరంలో న్యాక్ గుర్తింపు పొంది స్వయంప్రతిపత్తి హోదాను సాధించినట్టు వివరించారు. కళాశాల చైర్మన్ వై.కొండారెడ్డి, వైస్ చైర్మన్ విజయ్‌రెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ రాజశేఖర్ పాల్గొన్నారు. ‘మెగా’ నిర్లక్ష్యంపై కార్మికుల కన్నెర్ర ● రెండు నెలలుగా అందని వేతనాలు ● మెగా సంస్థ కార్యాలయ గేట్లు మూసి నిరసనకు దిగిన కార్మికులు శ్రీకాళహస్తి : మదనపల్లె–నాయుడుపేట ఆరు లేన్ల జాతీయ రహదారి విస్తరణ పేరిట పనులు చేపట్టిన మెగా సంస్థ అడగడుగునా కార్మికుల పట్ల నిర్లక్ష్యం వహిస్తోంది. కార్మికుల భద్రతను గాలికొదిలేసిన ఆ సంస్థ వేతనాల విషయంలోనూ ఎగవేత ధోరణిని అవలంభిస్తోంది. మెగా సంస్థకు మ్యాన్ పవర్‌ను సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్‌కు గత రెండు నెలలుగా కార్మికులకు వేతనాలు చెల్లించడం లేదు. దీంతో కార్మికులు సోమవారం శ్రీకాళహస్తి సమీపంలో ఉన్న మెగా బేస్ క్యాంపు వద్ద గేట్లను మూసి నిరసన తెలియజేశారు. కనీసం సంక్రాంతికి కూడా తమకు వేతనాలు ఇవ్వకపోవడంతో పండుగను కుటుంబంతో కలిసి జరుపుకో లేకపోయామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు వెంటనే మంజూరయ్యేలా చొరవ చూపాలని డిమాండ్ చేశారు. లేకుంటే మెగా పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్మికుల ఆందోళనతో దిగొచ్చిన మెగా జీఎం మల్లికార్జున మంగళవారం సాయంత్రం లోపు జీతాలు చెల్లించే ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో కార్మికులు ఆందోళన విరమించారు. ఎంబీఏ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ తిరుపతి సిటీ : కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా బజాజ్ ఫైన్ సర్వీస్ సంస్థ స్థానిక కరకంబాడి రోడ్డులోని ఎస్వీసీఈ కళాశాల ఎంబీఏ విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌పై శిక్షణ ఇచ్చారు. కళాశాలలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో ముంబై వాల్చంద్ పీపుల్స్ ప్రాజెక్ట్ హెడ్ రష్మీ మన్చాని ఆన్లైన్ ద్వారా పాల్గొన్నారు. విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్, పారిశ్రామిక రంగంలో ఉద్యోగాల సాధనకు అవసరమైన నైపుణ్యం గురించి వివరించారు. ఉద్యోగాన్వేషణలో బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులు అడిని సందేహాలను నివృత్తి చేశారు. పలు సలహాలు, సూచనలు అందజేశారు. కార్యక్రమంలో ఎస్వీసీఈ ప్రిన్సిపల్ సుధాకర్‌రెడ్డి, హెడ్ ప్రొఫెసర్ నీరజ, బజాజ్ ఫైన్ సర్వీస్ ప్రోగ్రామ్ ఇన్చార్జి రామకృష్ణ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఆగమోక్తంగా ధ్వజావరోహణం
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సోమవారం రాత్రి ధ్వజావరోహణ కార్యక్రమాన్ని ఆగయోక్తంగా నిర్వహించారు. ఉదయం వసంతోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా నూతన వధూవరులైన శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞానప్రసూనాంబ అమ్మవార్ల ఉత్సవమూర్తులను వసంతోత్సవ మండపంలో కొలువుదీర్చి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులను పురవీధుల్లో ఊరేగించారు. మధ్యాహ్నం సూర్యపుష్కరణి వద్దకు త్రిశూలానికి అర్చకులు అభిషేకాలు నిర్వహించారు. నేడు పల్లకీ సేవ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం రాత్రి పల్లకీ సేవ నిర్వహించనున్నారు. ధ్వజావరోహణం సందర్భంగా విశేష పూజలు -
ధాన్యానికి ధరల్లేవు
● ప్రభుత్వ సాయమూ లేదు ● గోదాముల్లో నిల్వ ఉంచుకోవాలన్నా అద్దె చెల్లించాల్సిందే ● అష్టకష్టాలు పడుతున్న అన్నదాతలు ● పట్టించుకోని అధికారులు, నేతలు సూళ్లూరుపేట: జిల్లాలో రబీ సీజన్ ముగింపు దశకు చేరింది. వరి ఒబ్బిళ్లు జోరందకున్నాయి. కానీ ధాన్యానికి గిట్టుబాటు ధర లేకపోవడంతో కళ్లాల్లోనే రైతులు తెగనమ్మేస్తున్నారు. ధాన్యానికి గిట్టుబాటు ధర వచ్చేవరకు ఏఎంసీ గోదాముల్లో నిల్వ చేసుకుందామంటే బస్తాకు రూ.3 చొప్పున అద్దె చెల్లించాలని అధికారులు హుకుం జారీ చేశారు. దీంతో చేసేది లేక రైతులు ఒకటికి సగానికి విక్రయిస్తున్నారు. గతంలో రుణాలు..ఇప్పుడు ఒట్టి చేతులు గతంలో ఏఎంసీ గోదాముల్లో ధాన్యం నిల్వ చేసుకుంటే రుణాలిచ్చేవారు. ఒక లాట్‌కి 150 బస్తాలు ధాన్యా న్ని నిల్వ చేసుకుంటే ధాన్యం మద్దతు ధరపై 75 శాతం రుణం కింద ఇచ్చేవారు. దీనికి మూడు నెలలు దాకా బాడుగ కట్టనవసరం లేదు. ఆ తరువాత నెలకు బస్తాకి ఒక్క రూపాయి లెక్కన అద్దె చెల్లించాల్సి ఉండేది. తీసుకున్న రుణానికి కూడా చాలా తక్కువ వడ్డీ ఉండేది. కానీ ప్రస్తుతం ఈ పరిస్థితి లేదు. బస్తాకు రూ.3 లెక్కన అద్దె చెల్లించాల్సి వస్తోంది. అన్నీ కష్టాలే గతంలో ఏఎంసీ గోదాముల్లో ధాన్యం నిల్వ ఉంచుకుంటే రుణాలు ఇచ్చేవారు. ప్రభుత్వం రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించేవారు. సబ్సిడీ ఎరువులు, పురుగు మందులు, పరికరాలు అందజేసేవారు. కానీ ఇప్పుడు ఇవేవీ లేకుండా చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను నామమాత్రంగా ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. మిల్లర్లను రైతులపైకి వదిలి చోద్యం చూస్తున్నారు. నిల్వ చేసేదెక్కడ? తిరుపతి జిల్లా పరిధిలోని 34 మండలాలకుగాను 774 పంచాయతీల్లో 16 మార్కెటింగ్ కమిటీలున్నాయి. వీటి పరిధిలో 34,300 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని నిల్వ చేసుకునేందుకు 37 గోదాములున్నాయి. అయితే ఈ ఏడాది జిల్లాలో 2.07 లక్షల ఎకరాల్లో వరి సాగుచేశారు. ఎకరానికి సరాసరిన 30 బస్తాల దిగుబడి వచ్చినా 5 లక్షల టన్నుల ధాన్యం వస్తుంది. ఇందులో ఇప్పటిదాకా 60 శాతం ధాన్యాన్ని నిల్వ చేసుకున్నారు. మిగిలిన 40 శాతం ధాన్యాన్ని విక్రయించారు. ఈ నెలాఖరు దాకా కోతకు వచ్చే పంటలు కూడా ఉండడంతో మరికొంతమంది నిల్వ చేసుకునే అవకాశం ఉంది. రుణాలిచ్చే పరిిస్థితి లేదు ప్రస్తుతం ఏఎంసీ గోదాముల్లో ధాన్యం నిల్వ చేసుకునే రైతులకు రుణాలివ్వలేని పరిస్థితి ఉంది. రైతులే బస్తాకు మూడు రూపాయలు అద్దె చెల్లించి నిల్వ చేసుకోవాలి. గతంలో ఒక రైతుకు ఒక లాట్ మాత్రమే కేటాయించే వారం. ఇప్పుడు పట్టాదారు పాసుపుస్తకాలను బట్టి ధాన్యం నిల్వ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాము. – వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ కార్యదర్శి, సూళ్లూరుపేట గతంలో రుణాలిచ్చేవారు వ్యవసాయ మార్కెట్ కమి టీ గోదాములో ధ్యానం నిల్వ చేసుకుంటే గతంలో 75 శాతం రుణం ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ రైతుల బతుకు మాత్రం మారడం లేదు. చాలా బాధాకరం. – వాకాటి బాబురెడ్డి, గోపాల్రెడ్డిపాళెం -
వాహన యజమానులూ జాగ్రత్త
● మైనర్లు వాహనాలు నడిపితే రూ.5 వేల జరిమానా తిరుపతి క్రైం:వాహన యజమానులు ఇక జాగ్రత్త పడాల్సిందే. ఎందుకంటే రహదారి నిబంధ నలు కఠినంగా అమలు చేసేందుకు రవాణా, పోలీసు అధికారులు సిద్ధమయ్యారు. ‘హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనా లు నడపడం వల్లే ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నా యి. నిబంధనలను సరిగ్గా అమలు చేయడం లేదు’ అంటూ పోలీస్, రవాణాశాఖ అధికారులపై ఇటీవల హైకోర్టు ధర్మాసనం అక్షింతలు వేసింది. ఈ క్రమంలో నిబంధనలు పక్కాగా అమలు చేయాలని భావిస్తున్నారు. మైనర్లకు వాహనాలిస్తే భారీ జరిమానా గతంలో మైనర్లు వాహనాలు వాడితే పెద్ద వారికి శిక్ష పడేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. కొత్త చట్టం ప్రకారం మైనర్లు వాహనం నడిపితే రూ.5 వేలు జరిమానా విధిస్తారు. అలాగే మూడేళ్ల జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. ఫైన్లు ఇలా.. ● లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే గతంలో రూ.500 జరిమానా విధించే వారు. ఇప్పుడు దాన్ని రూ.5 వేలకు పెంచనున్నారు. ● హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే, వెనుక వైపు కూర్చున్నా కూడా రూ.1000 జరిమానా. ● రెడ్ లైట్స్ ఉల్లంఘించి వాహనాలను నడిపితే రూ.500 ● అతివేగంగా వాహనాన్ని నడిపితే రూ.1000 ● రాంగ్ రూట్లో వాహనాన్ని నడిపితే రూ.5000 ● డ్రంక్ అండ్ డ్రైవ్ గతంలో రూ.2 వేలుగా ఉన్న ఫైన్‌ను ఇప్పుడు ఏకంగా రూ.10 వేలకు పెంచారు. ● రేసింగ్, స్పీడ్ డ్రైవ్ చేస్తే రూ.5 వేలు ● హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనం, సీట్ బెల్టు ధరించకుండా కార్లు నడిపితే రూ. వెయ్యి కట్టాల్సిందే. దీనికి తోడు మూడు నెలలు లైసెన్స్ రద్దు చేస్తారు. ● అత్యవసర వాహనాలకు దారి ఇవ్వకుండా వెళితే రూ.10 వేలు ● ద్విచక్ర వాహనాల్లో త్రిబుల్ రైడింగ్ చేస్తూ పట్టు బడితే రూ.1000. మూడు నెలలు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు. ● ఇన్సూరెన్స్ లేకుండా వాహనాన్ని నడిపితే రూ.2 వేలు. నిబంధనలు పాటించాలి ట్రాఫిక్ నిబంధనలను పక్కాగా అమలు చేస్తాం. ప్రతి ఒక్కరూ విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. మైనర్లు వాహనాలు నడపడం వల్లే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వారి తల్లిదండ్రులకు జైలు శిక్ష తప్పదు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా నూతన రూల్స్‌ను పాటించాలి. – హర్షవర్ధన్‌రాజు, తిరుపతి జిల్లా ఎస్పీ -
అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యం
తిరుపతి అర్బన్: అర్జీలను తీసుకోవడమే కాదు వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని డీఆర్వో నరసింహులు తెలిపారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌కు 280 అర్జీలు వచ్చాయి. అందులో రెవెన్యూ సమస్యలపైనే 163 అర్జీలు ఉన్నాయి. సోమవారం కలెక్టరేట్లో క్యూ పద్ధతిని ఏర్పాటు చేశారు. రైతు సాధికారతి సమితి నేతృత్వంలో తాజా కూరగాయలను కలెక్టరేట్ వద్ద విక్రయించడానికి ఓ కౌంటర్‌ను ఏర్పాటు చేయడానికి అనుమతిచ్చారు. మాటనిలబెట్టుకుంటే మంచి ప్రభుత్వమే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మంచి ప్రభుత్వమేనని ఏఐటీయూసీ తిరుపతి నగర ప్రధాన కార్యదర్శి ఎన్డీ రవి పేర్కొన్నారు. అప్కాస్‌ను కొనసాగించాలని కలెక్టరేట్ వద్ద మున్సిపల్ కార్మికులు ధర్నా చేపట్టారు. వారికి మద్దతుగా ఏఐటీయూసీ నేతలు విచ్చేశారు. కనీస వేతనం రూ.32వేలు చేయాలని తెలిపారు. అప్కాస్ రద్దును విరమించుకోండి అప్కాస్ రద్దును విరమించుకోవాలని లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అప్కాస్ రాష్ట్ర అధ్యక్షుడు చిన్నబాబు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎస్.జయచంద్ర డిమాండ్ చేశారు. ఆ మేరకు గ్రీవెన్స్ సందర్భంగా కలెక్టరేట్లో డీఆర్వో నరసింహులకు వినతిపత్రాన్ని అందించారు. మెస్ చార్జీలు పెంచండి బీసీ హాస్టల్లో విద్యార్థులకు మెస్ చార్జీలు, కాస్మోటిక్ చార్జీలు పెంచాలని ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు యూ.నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆ మేరకు డీఆర్వోకు వినతిపత్రాన్ని అందించారు. రక్షణ కల్పించండి బస్టాండ్ సమీపంలోని జయశ్యామ్ సినిమా హాల్ వద్ద ఆటో స్టాండ్‌ను ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్న వారిపై కొందరు దౌర్జన్యాలు చేస్తున్నారని ఆటోవాలాలు ధర్నా చేపట్టారు. వారికి మద్దతుగా సీఐటీయూ నేతలు నిలిచారు. -
చోరీ సొత్తు స్వాధీనం
నారాయణవనం: మండలంలో రెండు వెర్వేరు దొంగతనాల కేసుల్లో నారాయణవనానికి చెందిన గోపి(26)ని అరెస్ట్ చేసి 44 గ్రాముల బంగారం, 120 గ్రాముల వెండితో పాటు రూ.80 వేలు రికవరీ చేసినట్లు పుత్తూరు డీఎస్పీ రవికుమార్ తెలిపారు. ఈ మేరకు పుత్తూరు డీఎస్పీ కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశంలో ముద్దాయిని, రికవీ సొత్తును, నగదును ప్రదర్శించారు. రవికుమార్ మాట్లాడుతూ మండలంలోని జగనన్న కాలనీలో తాళం వేసిన నవీన్ ప్రకాష్ ఇంట్లో ఫిబ్రవరి ఒకటవ తేదీన, నారాయణవనం తేరువీధిలో తాళం వేసిన అమవావతి ఇంట్లో ఫిబ్రవరి 17వ తేదీన దొంతనాలు జరిగినట్లు తెలిపారు. రూరల్ సీఐ రవీంద్ర, ఎస్ఐ రాజశేఖర్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారన్నారు. పక్కా సమాచారం రావడంతో సోమవారం మధ్యాహ్నం స్థానిక వైఎస్సార్ సర్కిల్ వద్ద దామును అదుపులో తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడిందన్నారు. స్వల్ప వ్యవధిలో కేసును ఛేదించిన సీఐ రవీంద్ర, ఎస్ఐ రాజశేఖర్, ఏఎస్ఐ జయరాం నాయక్, క్రైమ్ సిబ్బంది దాము, మోహన్, హెచ్‌సీ రాజేష్, కానిస్టేబుళ్లు భాస్కర్, శ్రీనాఽథ్ను ఈ సందర్భంగా డీఎస్పీ రవికుమార్ అభినందించి, రివార్డులను అందజేశారు. ఎస్వీయూ డీడీఈ డైరెక్టర్‌గా రమేష్‌బాబు తిరుపతి సిటీ: ఎస్వీ యూనివర్సిటీ దూరవిద్య విభాగం ఇన్చార్జి డైరెక్టర్‌గా ఆచార్య ఊకా రమేష్ బాబు నియమితులయ్యారు. ఆయన సోమవారం వీసీ ఆచార్య అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు నుంచి నియామక పత్రం అందుకున్నారు. రమేష్ బాబు మాట్లాడుతూ దూరవిద్య పరీక్షలను త్వరగా నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశించారని తెలిపారు. అదేవిధంగా 2024–25కు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ వచ్చేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. డీడీఈ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయనను అధ్యాపకులు పీసీ వెంకటేశ్వర్లు, ఎన్సీ రాయుడు, కిశోర్, ప్రయాగ, కోఆర్డినేటర్ హరికృష్ణ యాదవ్ అభినందించారు. -
వేదాల అధ్యయనంతో మానసిక ప్రశాంతత
తిరుపతి సిటీ: వేదాంత శాస్త్రాల అధ్యయనంతో ప్రశాంతత, జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలను సులభంగా అధిగమించవచ్చని శ్రీపరమాచార్య శాస్త్ర పరిరక్షణ కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ గణపతిభట్ అభిప్రాయపడ్డారు. సోమవారం జాతీయ సంస్కృత వర్సిటీ ఇండోర్ ఆడిటోరియంలో జరుగుతున్న అంతర్జాతీయ శక్తి విశిష్టాద్వైతం సదస్సు రెండో రోజు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.సంస్కృత భాషలోని ఔన్నత్యాన్ని అందరికీ తెలియజేయాలన్నారు. వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి, ద్వైతవేదాంత విభాగాధ్యక్షులు నారాయణ, అధ్యాపకులు నాగరాజభట్, శివరామదాయగుడే, మనోజ్‌షిండే పాల్గొన్నారు. -
రెడ్‌బుక్‌పై ఉన్న శ్రద్ధ.. మేనిఫెస్టోపై లేదా?
సత్యవేడు: రెడ్‌బుక్‌పై పెట్టిన శ్రద్ధ ఎల్లో మేనిఫెస్టోపై ఎందుకు పెట్టడం లేదని మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రశ్నించారు. సోమవారం సత్యవేడు సబ్‌జైలులో రిమాండ్‌లో ఉన్న నగిరి నియోజకవర్గ వైఎస్సార్సీసీ కార్యకర్తలను ఆమె పరామర్శించారు. అనంతరం మాజీ మంత్రి మాట్లాడుతూ ఎప్పుడో ఐదేళ్లకు ముందు మాట్లాడారని, ఇప్పుడు మనోభావాలు దెబ్బతినాయని 311 కేసు పెట్టి ఆరోగ్యం సరిలేని పోసాని మురళీకృష్ణని అరెస్టు చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. ప్రస్మీట్లో మట్లాడితే దేశద్రోహం అవుతుందా.. అన్ని ప్రశ్నించారు. గతంలో ప్రధాని మోదీ గురించి చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ ఎలా మాట్లాడారో అందరూ విన్నారని చెప్పారు. బీజేపీ నాయకులు, ప్రధాని మోదీ వీళ్లపై కేసు పెడితే వీళ్లు బయటికి వస్తారా..? అన్ని ప్రశ్నించారు. నగిరిలో టిడీపీ కార్యకర్తలు వైఎస్పార్సీపీకి చెందిన దళిత యువకులపై దాడిచేసి, వారి బైకులను తగలబెట్టి మళ్లీ వారిపైనే కేసు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. ఇక్కడి సీఐ, డీఎస్పీ వైఎస్సార్సీపీ దళిత నాయకులు, కార్యకర్తలను టార్గెట్ చేసి కేసులు పెట్టి వారిని రిమాండ్‌కు పంపడం దారుణమన్నారు. ఎవరూ ఎదురు మాట్లాడకూడదని చంద్రబాబునాయుడు అసెంబ్లీలో వైఎస్.జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా దొంగదారిన పబ్లిక్ అకౌంట్ చైర్మన్ ఇవ్వడం సిగ్గు చేటన్నారు. బయట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళు గట్టిగా మాట్లాడితే తప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతులకు చేస్తున్నారన్నారు. ఇదేగనుక జగన్మోహన్రెడ్డి చేసి ఉంటే ఒక్క టీడీపీ కార్యకర్త, జనసేక కార్యకర్త రాష్టంలో బతకగలిగే వారా..? అని ప్రశ్నించారు. మాజీ సింగిల్ విండో అధ్యక్షడు కేవీ.నిరంజన్‌రెడ్డి, మండల సచివాలయ కన్వీనర్ బొప్పన సోమశేఖర్, సర్పంచ్ రమేష్, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు మస్తాణి వైఎస్సార్సీపీ టీయూసీ చైర్మన్ గోవిందస్వామి, శ్రీనివాసులురెడ్డి, పళణి, రాబర్టు, సురేష్, నగరి నాయకులు రామ్‌ప్రసాద్ రెడ్డి, వైస్ ఎంపీపీ ఆర్ కన్నెప్ప, కౌన్సిలర్ బీడీ భాస్కర్, మాజీ ఎంపీటీసీ సంజీవరెడ్డి పాల్గొన్నారు. -
పోలీస్ గ్రీవెన్స్‌కు 110 అర్జీలు
తిరుపతి క్రైం: తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు 110 ఫిర్యాదులు అందినట్టు ఎస్పీ హర్షవర్ధన్‌న్‌రాజు తెలిపారు. ఇందులో దొంగతనాలు, ఆస్తి తగాదాలు, ఆర్థికపరమైన లావాదేవీలు ఉన్నాయన్నారు. వెంటనే సంబంధిత అర్జీలు పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. పుస్తకోత్సవం ప్రారంభం తిరుపతి సిటీ:ఎస్వీయూ కేంద్రీయ గ్రంథాలయం ఆధ్వర్యంలో పుస్తకోత్సవం పేరుతో పుస్తక ప్రదర్శన నిర్వహించారు. సోమవారం వర్సిటీ వీసీ అప్పారావు పుస్తక ప్రదర్శనను ప్రారంభించి మాట్లాడారు. పుస్తకం ఒక నేస్తం అని, ప్రస్తుతం పుస్తక పఠనం గణనీయంగా పడిపోవడం బాధాకరమైన అంశమన్నారు. కేంద్రీయ గ్రంథాలయాధిపతి ఆచార్య సురేష్‌బాబు మాట్లాడుతూ దేశవిదేశాలలో లభించే గ్రంథాలను ప్రదర్శనశాలలో అందుబాటులో ఉన్నాయన్నారు. డీన్ ఆచార్య ఎన్సీ రాయుడు, అధ్యాపకులు డాక్టర్ రంగనాథ్, కిషోర్‌కుమార్ పాల్గొన్నారు. విద్యుత్ అదనపు లోడ్ క్రమబద్ధీకరణపై రాయితీ చిత్తూరు కార్పొరేషన్ : విద్యుత్ అదనపు లోడ్ క్రమబద్ధీకరణపై గృహ వినియోగదారులకు 50 శాతం డిస్కౌంట్ ప్రభుత్వం ప్రకటించిందని ట్రాన్స్‌కో తిరుపతి, చిత్తూరు ఎస్ఈలు సురేంద్రనాయుడు, ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. తిరుపతి జిల్లాలో 7.95 లక్షల మంది, చిత్తూరు జిల్లాలో దాదాపు 4.37 లక్షల మంది కలిపి మొత్తం 12.32 లక్షల మంది సర్వీసులను క్రమబద్ధీకరించుకోవాలన్నారు. సాధారణ రోజుల్లో కిలో వాట్‌కు రూ.2 వేలు క్రమబద్ధీకరణ రుసుం చెల్లించాల్సి ఉండగా ప్రస్తుతం రూ.1000 చెల్లిస్తే చాలన్నారు. జూన్ 30 వరకు ఈ అవకాశం ఉంటుందని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వీటిని ఏపీఎస్పీడీసీఎల్ వెబ్సైట్ లేదా సంబంధిత విద్యుత్ బిల్లుల వసూళ్ల కేంద్రంలో చెల్లించవచ్చన్నారు. -
తిరుమలలో చిన్నారి అపహరణ
తిరుమల : తిరుమలలో చిన్నారిని గుర్తు తెలియని వృద్ధురాలు తీసుకెళ్లిన ఘటన సోమవారం రాత్రి వెలుగుచూసింది. తిరుమల టూటౌన్ పీఎస్ సీఐ శ్రీరాముడు తెలిపిన వివరాల మేరకు.. విజయవాడకు చెందిన నర్సింహులు అనే వ్యక్తి తిరుమలలో హ్యాకర్‌గా పనిచేస్తున్నాడు. ఇతను తన కుమార్తె దీక్షిత(4) షాపింగ్ కాంప్లెక్స్ వద్దకు తీసుకొచ్చి ఉంచుకుని తను వ్యాపారం చూసుకుంటూ ఉండిపోయాడు. ఇంతలో పాప ఆడుకుంటూ సాయంత్రం 5 గంటలకు భక్తురాలైన ఓ వృద్ధురాలి వద్దకు వెళ్లింది. సదరు వృద్ధురాలు పాపను తీసుకుని వెళ్లిపోయింది. దీనిపై తండ్రి తిరుమల టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా వృద్ధురాలు పాపను తీసుకుని ఆర్టీసీ బస్సులో తిరుపతికి వెళ్లిపోయినట్లు గుర్తించారు. వెంటనే ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటుచేసి పాపకోసం గాలింపు చేపట్టారు. ఎవరైనా గుర్తిస్తే తిరుమల టూటౌన్ పీఎస్ నెం. 9440796769, 9440796772కు సమాచారం అందించాలని కోరారు. -
మండలంలోని సీసీ రోడ్ల వివరాలు
పంచాయతీలు 27 గ్రామాలు 58మంజూరైన పనులు 59నిధులు రూ.2.8 కోట్లు ఇప్పటి వరకు పూర్తయిన పనులు 49చేపట్టాల్సిన పనులు 10ఇష్టానుసారంగా చేసిన పనులు 2రోడ్లపైనే రోడ్డు వేసిన సంఖ్య 2అనుమతి లేకుండా వేసిన రోడ్లు 2బిల్లులు చెల్లింపులు రూ.26 లక్షలు చెల్లించాల్సిన బిల్లులు రూ.75 లక్షలు పనులు దక్కించుకున్న కూటమి నేతల సంఖ్య 30 -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
చిట్టమూరు: నాయుడుపేట–మల్లాం రహదారి మార్గంలోని చిట్టమూరు మండం, బయ్యవారికండ్రిగ గ్రామ మలుపు రోడ్డు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఎస్ఐ చిన్నబలరామయ్య వివరాల మేరకు.. బురదగల్లి కొత్తపాళెం పంచాయతీ, కుమ్మరిపాళెం గ్రామానికి చెందిన కన్నెబోయిన మారెయ్య(38) సోమవారం మోటార్ సైకిల్‌పై కొత్తగుంటకు వెళ్లి మన్నెమాలకు బయలు దేరాడు. బయ్యవారికండ్రిగ గ్రామ మలుపు వద్ద ట్రాక్టర్ బయ్యవారికండ్రిగ రోడ్డు వైపు తిరుగుతుండగా అదుపుతప్పి మోటార్ సైకిల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మారెయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడ్ని నాయుడుపేట వైద్యశాలకు తరలించి చికిత్స చేయిస్తుండగా మృతి చెందాడు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. -
చంద్రబాబు మీది మంచి ప్రభుత్వం కాదు.. ముంచే ప్రభుత్వం
తిరుపతి జిల్లా: చంద్రబాబు రాష్ట్రానికి ముఖ్యమంత్రా? టీడీపీకి ముఖ్యమంత్రా? అని మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రశ్నించారు. సోమవారం సత్యవేడు సబ్ జైల్లో ఉన్న తడకుపేట దళితులను ఆమె పరామర్శించారు. అనంతరం, ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ఆరేళ్ల క్రితం మాట్లాడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతున్నాయని పోసాని కృష్ణ మురళిని అరెస్ట్ చేయడం దారుణం. అక్రమంగా 111 కేసు పెట్టి ,అక్రమంగా ఇరికించారు. ప్రధాని నరేంద్ర మోదీని చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ దారుణంగా మాట్లాడలేదా? వాళ్లపై ఇదే దేశద్రోహం సెక్షన్లు కింద కేసు నమోదు చేయగలరా? అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులకు ఎటువంటి సహాయం చేయొద్దని చంద్రబాబు చెప్పడం హేయమైన చర్య. వైఎస్సార్సీపీ శ్రేణులు కట్టే పన్నులను ప్రభుత్వం తీసుకోవడం లేదా? వైఎస్సార్సీపీకి ఓట్లు వేసిన వాళ్లపై అక్రమ కేసులు పెట్టి జైళ్లలో వేస్తున్నారు. చంద్రబాబుకు ఎదురు మాట్లాడినా, ఆయన చేసిన తప్పును ఎత్తి చూపినా సహించలేకపోతున్నారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదు. మంచి ప్రభుత్వమని స్టిక్కర్లేసుకోవడం తప్ప, మొన్న పెట్టిన బడ్జెట్‌తో ఇది మంచి ప్రభుత్వం కాదు.. ముంచే ప్రభుత్వమని రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. రెడ్‌బుక్ రాజ్యాంగంపై పెట్టిన శ్రద్ధ,మేనిఫెస్టో పైన ఎందుకు పెట్టడం లేదు? బటన్ నొక్కడానికి వైఎస్ జగన్ అవసరం లేదన్నారు. అదే బటన్‌ను చంద్రబాబు ఎందుకు నొక్కడం లేదు. చంద్రబాబు ఒక్క హామీని అమలు చేయలేదు. వైఎస్ జగన్ చేసిన ఏ ఒక్క హామీని ప్రజలకు చేరవేయడం లేదురెడ్బుక్ రాజ్యాంగంతో వైఎస్సార్సీపీ వాళ్లపై దాడులు చేయడం, అక్రమ కేసులతో రాష్ట్రాన్ని పాలిస్తామనుకుంటే రేపు అదే రిపీట్ అవుతుంది. వైఎస్ జగన్ వడ్డీతో సహా తిరిగిచ్చేస్తారు. వైఎస్సార్సీపీకి సహాయం చేయొద్దన్నారంటే ఆయన ఎంత దారుణమైన స్థితిలో ఉన్నారు అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రా? రాష్ట్రానికి ముఖ్యమంత్రా?చంద్రబాబుకు నొప్పి వస్తే పరిగెత్తే ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తుంటే నోరెందుకు మెదపలేదు. గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన వీడియోలు చూడండి. వైఎస్సార్సీపీ హాయంలో 30 వేల మహిళలు మాయమయ్యారన్న పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరినైనా తీసుకొచ్చారా? దానికోసం బడ్జెట్లో నిధులు కేటాయించి ఆ విధంగా ప్రయత్నం చేయొచ్చు కదా?’అని మాజీ మంత్రి ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. -
ఆ ఎమ్మెల్యే సతీమణికి రూ.50 లక్షలు ఇచ్చా..
సాక్షి, టాస్క్‌ఫోర్స్: సీఎం చంద్రబాబు ఇలాకా చంద్రగిరిలో ఓ అవినీతి చేప ఏసీబీకి చిక్కింది. పట్టుబడ్డ ఆ అధికారి, ఫిర్యాదుదారుడికి మధ్య ఫోన్ సంభాషణకు సంబంధించిన కీలక రికార్డులు ఏసీబీ చేతికి చిక్కినట్టు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ‘నేను ఆ సీటుకు రావడానికి ఎమ్మెల్యే సతీమణికి రూ.50 లక్షలు ఇచ్చాను.. మీలాంటి కాంట్రాక్టర్ల దగ్గర కూడా డబ్బు తీసుకోకుండా పని చేయాలంటే.. నేను ఎలా బతకాలి? నేను ఇచ్చిన డబ్బు ఎలా సంపాదించుకోవాలి? నా కుటుంబం రోడ్డున పడితే ఎవరికి చెప్పుకోవాలి?’ అంటూ ఇటీవల చంద్రగిరిలో ఏసీబీకి పట్టుబడ్డ పంచాయతీ ఈవో మహేశ్వరయ్య, కాంట్రాక్టర్ దినేష్‌ల మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఏసీబీ అధికారుల చేతికి చిక్కినట్టు తెలిసింది. చంద్రగిరిలో పంచాయతీ తరఫున రావాల్సిన బిల్లుల మంజూరుకు కాంట్రాక్టర్ దినేష్ నుంచి పంచాయతీ ఈవో మహేశ్వరయ్య రూ.50 వేలు డిమాండ్ చేయడంతో ఆయన ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు దినేష్‌కు ఓ రికార్డింగ్ చిప్ ఇచ్చి నాలుగు రోజుల పాటు వారిద్దరి మధ్య జరిగిన సంభాషణను రికార్డ్ చేసినట్టు తెలిసింది. అనంతరం శుక్రవారం పంచాయతీ ఈవోను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.కాగా, ఆ సంభాషణలో పంచాయతీ ఈవో మహేశ్వరయ్య.. ఎమ్మెల్యే సతీమణికి రూ.50 లక్షలు ఇచ్చి ఆ ఉద్యోగాన్ని తీసుకున్నట్టుగా చెప్పడం కూడా అందులో రికార్డ్ అయినట్టు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఉద్యోగుల బదిలీల సమయంలో.. చంద్రగిరిలో ఉద్యోగం చేయడానికి వచ్చిన ఉద్యోగుల నుంచి స్థానిక ప్రజా ప్రతినిధికి ఎవరెవ్వరు ఎంత ముడుపులు ఇచ్చారో కూడా వారి సంభాషణల్లో నిక్షిప్తమై ఉన్నట్టు తెలిసింది. -
గగనాన్ని జయించినా..
సూళ్లూరుపేట: భారత క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహ ప్రయోగాల్లో ఇస్రో బాలారిష్టాలను దాటలేకపోతోంది. ఇప్పటికే 7 ఉపగ్రహాలను ప్రయోగించినా అనుకోని సాంకేతిక అవాంతరాలతో సత్ఫలితాలను సాధించలేకపోతోంది. భారత క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహ (ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం) వ్యవస్థలో ఇంకా తప్పటడుగులు పడుతూనే ఉన్నాయి. ఈ ఏడు ఉపగ్రహాల సిరీస్‌లో ఐఆర్ఎన్ఎస్ఎస్–1 ఉపగ్రహం సాంకేతిక లోపంతో పని చేయడం లేదు.దీనిస్థానంలో 2017 ఆగస్ట్ 31న ఐఆర్ఎన్ఎస్ఎస్–1హెచ్ పేరుతో చేసిన ప్రయోగం విఫలమైంది. మళ్లీ ఐఆర్ఎన్ఎస్ఎస్–1ఐ ఉపగ్రహాన్ని ప్రయోగించి ఐఆర్ఎన్ఎస్ఎస్–1ఏ స్థానంలో ప్రవేశపెట్టినప్పటికీ సొంత నావిగేషన్ వ్యవస్థ అందుబాటులోకి రాలేదు. ఇదిలావుండగానే ఈ నావిగేషన్ వ్యవస్థలో సెకండ్ జనరేషన్ శాటిలైట్ వ్యవస్థ పేరుతో నావిక్–01 ఉపగ్రహాన్ని 2023లో ప్రయోగించారు. ఈ ఏడాది జనవరి 31న నావిక్–02 ఉపగ్రహాన్ని ప్రయోగించారు. నావిగేషన్ ఉపగ్రహాల శ్రేణిలో కొన్నింటికి కాలపరిమితి ముగియనుండటంతో వాటి స్థానంలో నావిక్ ఉపగ్రహాలను ప్రవేశపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. నావిక్–02 ఉపగ్రహం జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ నుంచి జియో ఆర్బిట్‌లోకి ఇంకా చేరలేదు. ఉపగ్రహంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అపోజి ఇంధనాన్ని మండించేందుకు ఆక్సిడైజర్ వాల్‌్వలు తెరుచుకోకపోవడం వల్ల కక్ష్య దూరాన్ని పెంచలేకపోతున్నారు. ఈ ఉపగ్రహం కూడా విఫలమైనట్టుగానే ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీంతో భారతదేశానికి సొంత నావిగేషన్ వ్యవస్థ ఎప్పటికి అందుబాటులోకి వస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది.7 ఉపగ్రహాల అవసరాన్ని గుర్తించి..భారతదేశానికి పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నావిగేషన్ సిస్టం తయారు చేసుకోవడానికి ఏడు ఉపగ్రహాల అవసరాన్ని 2006లో ఇస్రో గుర్తించింది. దీనికి రూ.3,425 కోట్ల వ్యయం అవుతుందని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. దీనికి కేంద్రం ఆమోద ముద్ర వేసి బడ్జెట్లో నిధులు కూడా కేటాయించింది. భారత క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థలో మొత్తం ఏడు ఉపగ్రహాలకు రూ.1,000 కోట్లు, రాకెట్లకు రూ.1,125 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ చేపట్టారు. ఈ ఉపగ్రహ వ్యవస్థకు ప్రత్యేకంగా బెంగళూరు సమీపంలోని బైలాలు అనే ప్రాంతంలో రూ.1,300 కోట్లతో గ్రౌండ్ స్టేషన్ నిర్మాణం కూడా చేశారు.సొంత నావిగేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి 2006లోనే ప్రణాళికలు సిద్ధం చేసుకుని 2013 జూన్ 1న ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం (ఐఆర్ఎన్ఎస్ఎస్–1ఏ) ఉపగ్రహ ప్రయోగంతో శ్రీకారం చుట్టారు. 2014 ఏప్రిల్ 4న ఐఆర్ఎన్ఎస్ఎస్–1బీ, అక్టోబర్ 16న ఐఆర్ఎన్ఎస్ఎస్–1సీ, 2015 మార్చి 28న ఐఆర్ఎన్ఎస్ఎస్–1డీ, 2016 జనవరి 20న ఐఆర్ఎన్ఎస్–1ఈ, మార్చి 10న ఐఆర్ఎన్ఎస్ఎస్–1ఎఫ్, ఏప్రిల్ 28న ఐఆర్ఎన్ఎస్ఎస్–1జీ ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.ఇందులో 1ఏ ఉపగ్రహంలో సాంకేతిక లోపం తలెత్తడంతో దీని స్థానంలో 2017 ఆగస్ట్ 31న ఐఆర్ఎన్ఎస్ఎస్–1హెచ్ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. అది విఫలమైంది. తిరిగి 2018 ఏప్రిల్ 12న ఐఆర్ఎన్ఎస్ఎస్–1ఐ ఉపగ్రహాన్ని 1ఏ ఉపగ్రహం స్థానంలో రీప్లేస్ చేశారు. ఇందులో కొన్ని ఉపగ్రహాలకు కాల పరిమితి కూడా ముగియనుండటంతో నావిగేషన్ వ్యవస్థను బలోపేతం చేయడానికి సెకండ్ జనరేషన్ పేరుతో నావిక్–01 సిరీస్‌లో ఐదు ప్రయోగాలకు శ్రీకారం చుట్టగా.. వీటిలో రెండు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇందులో ఒకటి ఉపగ్రహం కక్ష్యలోకి వెళ్లినప్పటికీ దాన్ని భూమికి 36 వేల కిలోమీటర్ల దూరంలోని జియో ఆర్బిట్‌లోకి పంపే ప్రక్రియ సాంకేతిక లోపంతో ఆగిపోయింది. చిన్నచిన్న అవాంతరాలతో తప్పని ఇబ్బందులునావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థలోని 7 ఉపగ్రహాల్లో 3 ఉపగ్రహాలు భూమికి 36 వేల కిలోమీటర్లు ఎత్తులోని భూస్థిర కక్ష్యలో 34 డిగ్రీలు, 83 డిగ్రీలు, 130.5 డిగ్రీ తూర్పు రేఖాంశాల వద్ద కక్ష్యలో ఉండి పనిచేస్తాయి. మిగతా నాలుగు ఉపగ్రహాలు భూమధ్య రేఖలను ఖండించే భూస్థిర కక్ష్యలోనే 55 డిగ్రీలు, 115 డిగ్రీల తూర్పు భూమధ్య రేఖాతలానికి 31 డిగ్రీల వాలుతో ఉండే కక్ష్యలో 12 ఏళ్లపాటు సేవలందిస్తాయి.భూస్థిర కక్ష్యలో వివిధ స్థానాల్లో ఉండి పనిచేయడం ప్రారంభించి స్వదేశీ దిక్సూచి వ్యవస్థను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాల్లో లోపాలు తలెత్తడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భూమి, జల, వాయు మార్గాల స్థితిగతులు దిక్కులు తెలియజేయడం, ఆపద సమయాల్లో భూగోళానికి సంబంధించిన సమాచారం, వాహన చోదకులకు దిశానిర్దేశం, ఇంటర్నెట్తో అనుసంధానం, భారత విమానయాన, నౌకాయాన మార్గాలకు, సైనిక అవసరాలకు కూడా ఈ ఉపగ్రహ వ్యవస్థ అందుబాటులోకి తెచ్చేందుకు నావిగేషన్ సిరీస్ ఉపగ్రహాలను ప్రయోగిస్తూనే ఉన్నప్పటికీ చిన్న చిన్న అవాంతరాల వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే భారతదేశం అంచునుంచి సుమారు 1,500 కిలోమీటర్ల పరిధి వరకు ఈ సేవలు విస్తరించి పనిచేస్తుంది. -
నేడు కలెక్టరేట్లో గ్రీవెన్స్
తిరుపతి అర్బన్: కలెక్టరేట్లో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు. దయాగుణంతో ‘దీక్ష’ తిరుపతి కల్చరల్ : నెలవంక దర్శనంతో ఆదివారం నుంచి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైందని, ముస్లింలు భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు పాటిస్తూ దయాగుణం చాటాలని ప్రభుత్వ ఖాజా సయ్యద్ షఫీ అహ్మద్ ఖాద్రి పిలుపునిచ్చారు. ఆదివారం కాద్రి పీఠంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రంజాన్ మాసంలో ప్రతి క్షణం దివ్యమని, ప్రతి ఒక్కరూ అల్లాహ్‌ను స్మరిస్తూ ప్రార్థన చేయాలని కోరారు. మార్చి 2 నుంచి నిరంతరం 30 రోజులపాటు ఉపవాస దీక్షలు ఆచరించాలని సూచించారు. సూర్యోదయానికి ముందే మేల్కొని ఉపవాస దీక్ష సంకల్పించి ప్రత్యేక ప్రార్థన(తాహజాత్) చేయడంతో పాటు సూర్యాస్తమయం తర్వాత ఉపవాస దీక్ష(ఇఫ్తార్)తో విరమించాలని తెలిపారు. ఏకాగ్రతతో ఖురాన్ గ్రంఽథం చదవాలని, లేదా వినాలని చెప్పారు. ఇస్లాం ధర్మంలో ఒక్కటైన ‘జకాత్’ చేపట్టాలని, సమాజ శ్రేయస్సు కోసం ముస్లింలు దాన ధర్మాలు చేయాలని తెలిపారు. రాత్రి వేళ ‘తరావీ’ నమాజు తప్పక చదవాలని కోరారు. దేశ సమైక్యత, ప్రపంచ శాంతి, భద్రత కోసం ప్రార్థనలు చేయాలని సూచించారు. 8 నుంచి తుడా టవర్స్ ఈ– వేలం తిరుపతి తుడా : తిరుపతి నగరంలోని అన్నమయ్య సర్కిల్ వద్ద నిర్మిస్తున్న తుడా టవర్స్‌లోని రెసిడెన్షియల్ ప్లాట్లను ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు ఆన్లైన్లో ఈ–వేలం వేయనున్నట్లు తుడా వైస్ చైర్మన్ మౌర్య తెలిపారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ రూ.345కోట్ల అంచనా వ్యయంతో జీప్లస్ 13 భవనం నిర్మిస్తున్నామన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఆరు అంతస్తుల నిర్మాణం పూర్తిచేసినట్లు చెప్పారు. 2026 ఏప్రిల్ నాటికి మొత్తం భవన నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. నివాస గృహాలకు సంబంధించి 2వ అంతస్తు నుంచి 13వ అంతస్తు వరకు డబుల్ బెడ్రూం ప్లాట్లు 46, త్రిబుల్బెడ్ రూమ్–152, నాలుగు బెడ్రూమ్ – 32 వెరసి మొత్తం 230 నిర్మిస్తున్నట్లు వివరించారు. అలాగేస్విమ్మింగ్ పూల్, జిమ్, షటిల్ కోర్టు, ల్యాండ్ స్కేపింగ్ పోడియం, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, రెస్టారెంట్ వంటి ఆధునిక సౌక్యరాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఆసక్తిగలవారు ఈ–వేలంలో పాల్గొనవచ్చని తెలిపారు. ఇతర వివరాలకు ్ట udaap.in.tudaotwerr.in వెబ్సైట్ సందర్శించాలని సూచించారు. -
కక్ష సాధింపు చర్యలు సిగ్గుచేటు
తిరుపతి మంగళం : ముఖ్యమంత్రిగా ఉండి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలకు ఏ విధమైన సాయం చేయకూడదని చంద్రబాబు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులకు చెప్పడం సిగ్గుచేటని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో మాత్రమే పార్టీల మధ్య పోటీ ఉండాలే తప్ప ఎన్నికల అనంతరం పార్టీలకు అతీతంగా పాలన సాగించాలన్నారు. కానీ చంద్రబాబునాయుడు కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. జగనన్న పాలనలో టీడీపీ నాయకులకే ఎక్కువ శాతం సంక్షేమ పథకాలు అందించారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతున్నా ఏ ఒక్క హామీనైనా నెరవేర్చావా? చంద్రబాబూ అని ప్రశ్నించారు. జగనన్న పాలనలో రూ.2.5లక్షల కోట్లు సంక్షేమ పథకాల రూపంలో పేదప్రజలకు అందించారని గుర్తుచేశారు. పేదలకు మంచి చేశారు కాబట్టే గత ఎన్నికల్లో 40 శాతం ఓట్లు జగనన్నకు వేశారని గుర్తుచేశారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చి సూపర్‌సిక్స్ హామీలు అమలు చేయకుండా సంపద సృష్టించలేకపోతున్నానంటూ మరోసారి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసగిస్తున్న ప్రజాద్రోహి చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు, లోకేష్‌లు రెడ్‌బుక్ పాలన సాగిస్తూ వైఎస్సార్సీపీ నాయకులు, సోషయల్ మీడియాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రజలంతా చంద్రబాబు అరాచకాలు, దౌర్జన్యాలను గ్రహిస్తున్నారని, త్వరలోనే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. గ్రీన్ చానల్ ద్వారా గుండె తరలింపు రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్): రేణిగుంట విమానాశ్రయానికి ఆదివారం సాయంత్రం విమానంలో చేరుకున్న గుండెను అంబులెన్‌న్స్‌లో గ్రీన్ చానల్ ద్వారా తిరుపతి పద్మావతి హృదయాలయానికి తరలించారు. ప్రధాన కూడళ్ల వద్ద పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ ఇక్కట్లు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. -
గంజాయి తరలిస్తున్న ముగ్గురి అరెస్ట్
తడ:చైన్నెకి గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఆదివారం శ్రీసిటీ జీరో పాయింట్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.లక్ష విలువైన 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సూళ్లూరుపేట పోలీస్‌స్టేషన్‌లో సీఐ మురళీకష్ణ వివరాలు వెల్లడించారు. తమిళనాడుకు చెందిన ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి బ్యాగులను తనిఖీ చేస్తే గంజాయి పట్టుబడినట్టు వివరించారు. దాడి లో ఎస్ఐ కొండపనాయుడు, సిబ్బంది ఉన్నారు. కడూరులో కార్గో ఎయిర్‌పోర్టు? తడ : శ్రీసిటీ పారిశ్రామికవాడ, మాంబట్టు, మేనకూరు ఏపీఐఐసీ సెజ్‌లతోపాటు షార్ అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి అందుబాటుగా వరదయ్యపాళెం మండలం కడూరు వద్ద కార్గో ఎయిర్‌పోర్టు నిర్మించనున్నట్లు తెలిసింది. ఈ మేరకు సుమారు 400 ఎకరాలను వరదయ్యపాళెం, సత్యవేడు, తడ మండలాల్లోని భూములను సేకరించేందుకు రెవెన్యూ అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే అటవీ భూములను విమానాశ్రయానికి కేటాయించేందుకు ఫారెస్ట్ శాఖ అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో తడ నుంచి శ్రీకాళహస్తి వెళ్లే రహదారి విస్తరణకు సైతం అధికారులు చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. -
పెత్తనం నీదా.. నాదా!
సైదాపురం మండలంలోని గనుల కోసం కూటమి నేతలు కొట్లాడుకుంటున్నారు. ప్రధానంగా శ్రీనివాసా పద్మావతి మైన్‌ను సొంత చేసుకునేందుకు ప్రచ్ఛన్న యుద్ధానికి తెరలేపారు. నెల్లూరుకు చెందిన ఓ ముఖ్యనేత ఆధిపత్యం సహించలేని స్థానిక ప్రజాప్రతినిధి మండిపడుతున్నారు. ఆదివారం ఈ క్రమంలోనే పోలీసు.. రెవెన్యూ అధికారులను రంగంలోకి దించారు. అయితే సదరు ముఖ్యనేత జోక్యం చేసుకోవడంతో చేసేదిలేక చేతులెత్తేశారు. తూతూమంత్రంగా చర్యలు తీసుకుని ముఖం చాటేశారు. సైదాపురం : మండలంలోని రామసాగరం, సైదాపురం గ్రామాలకు చెందిన ప్రభుత్వ భూమిని శ్రీనివాసాపద్మావతి గనికి గతంలో కేటాయించారు. 2019లోనే లీజు కాలపరిమితి తీరిపోవడంతో అది కాస్తా మూతపడింది. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిపై పలువురు నేతల కన్నుపడింది. ఎలాంటి అనుమతులు లేకుండా నెల్లూరుకు చెందిన టీడీపీ పెద్దల ఆధ్వర్యంలో మైనింగ్ ప్రారంభమైంది. ఈ క్రమలంలో ఆదివారం రామసాగరం గ్రామస్తులు కొందరు అక్రమ మైనింగ్‌ను అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన మైనింగ్ సిండికేట్‌కు చెందిన వ్యక్తులు తమకు అధికారపార్టీ ఎంపీ, మరో నాయకుడి మద్దతు ఉందని గ్రామస్తులను బెదిరించి తరిమేశారు. ప్రజాప్రతినిధి ఆగ్రహం మైనింగ్ సిండికేట్ దౌర్జన్యాలపై రామసాగరం గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు స్థానిక ప్రజాప్రతినిధి దృష్టికి విషయం తీసుకెళ్లారు. దీంతో ఆయన వెంటనే ఫోన్ చేసి మైనింగ్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఈ మేరకు మైన్ వద్దకు వచ్చిన పోలీసులు 8 మోటారుసైకిళ్లు, ఓ ఎస్యూవీ వాహనాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తదనంతరం ఏం జరిగిందో కానీ.. పోలీసులు సీజ్ చేసి వాహనాలు స్టేషన్ ఆవరణ నుంచి వెళ్లిపోయాయి. ఈ విషయం స్థానిక ప్రజాప్రతినిధికి తెలియడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వారి ఆదేశాల మేరకు వెంటనే తహసీల్దార్ రమాదేవి, ఎస్ఐ క్రాంతికుమార్ హుటాహుటిన శ్రీనివాసా పద్మావతి గని వద్దకు చేరుకున్నారు. అక్రమ మైనింగ్‌పై విచారణ చేపట్టారు. అనుమతులు ఎలా..? శ్రీనివాసా పద్మావతి గనిలో మైనింగ్ కోసం వచ్చిన దరఖాస్తును జనవరిలో తిరస్కరించారు. ఇంతలో ఏమైందో తెలియదు కానీ, నెల గడవక ముందే సదరు గనిలో 1.5లక్షల టన్నుల ఖనిజం తవ్వుకుని తరలించుకునేందుకు అనుమతులు మంజూరయ్యాయి. అది కూడా ఈ గనిపై కోర్టులో కేసు నడుస్తుండగానే అధికారులు పర్మిషన్ ఇవ్వడం గమనార్హం. గని వద్ద యంత్రం ఉన్న దృశ్యంగనిలో నీరు పంపింగ్ చేస్తున్న దృశ్యం శ్రీనివాసా పద్మావతి గని కోసం కూటమి నేతల ఘర్షణ సిండికేట్‌కు వ్యతిరేకంగా స్థానిక ప్రజాప్రతినిధి ఆదేశాలు ముఖ్య నేత జోక్యంతో తలలు పట్టుకుంటున్న అధికారులు మైనింగ్‌కు అనుమతి లేదు శ్రీనివాసా పద్మావతి గనిలో అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదులు వచ్చాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు గనిని పరిశీలించాం. ఇక్కడ కేవలం పంపింగ్ మాత్రమే చేస్తున్నారు. ఖనిజం తరలించేందుకే అనుమతి ఉంది. మైనింగ్‌కు లేదు. – రమాదేవి, తహసీల్దార్, సైదాపురం ఫిర్యాదు అందలేదు శ్రీనివాసా పద్మావతి గనిలో అక్రమ మైనింగ్‌పై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. ఇక్కడ వాహనాలను స్వాధీనం చేసుకోలేదు. ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. – క్రాంతికుమార్, ఎస్ఐ, సైదాపురం -
రెచ్చిపోయిన మట్టి మాఫియా
రామచంద్రాపురం: మండలంలోని కమ్మపల్లెలో ఆదివారం మట్టి మాఫియా రెచ్చిపోయింది. స్థానిక సిద్ధేశ్వర ఎస్టీ కాలనీవాసులపై దాడికి తెగబడింది. వివరాలు.. రావిళ్ల వారిపల్లెలోని సర్వే నంబరు 233లో ధనలక్ష్మీ స్టోన్ క్రషర్ నిర్వాహకుడు సురేష్ రెడ్డి 2017లో క్వారీ నిర్వహణకు అధికారికంగా అనుమతులు పొందారు. గడువు ముగిసిన తర్వాత సురేష్ రెడ్డి తన భార్య గౌరి పేరు మీద అదే సర్వే నంబరులో నకిలీ స్కెచ్లను తయారు చేసుకుని అధికారుల ఆమోదం తీసుకున్నారు. డమ్మీ స్కెచ్లను ఆధారంగా చేసుకుని గనుల శాఖ అధికారులతో కుమ్మకై ్క నకిలీ అనుమతులతో అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో మట్టి తరలించే లారీలను స్థానికులు అడ్డుకున్నారు. దీంతో అక్రమార్కులు వాగ్వాదానికి దిగారు. ప్రశ్నించిన వారిపై దాడి చేశారు. రామచంద్రాపురం పోలీసులు గ్రామానికి చేరుకుని మట్టి రవాణా చేస్తున్న టిప్పర్లను అక్కడ నుంచి పంపించేశారు. మట్టి తవ్వకాలు నిలుపుదల చేయాలని సురేష్ రెడ్డికి సూచించారు. దీంతో గ్రామస్తులు అక్కడ నుంచి వెనుదిరిగారు. -
రెచ్చిపోతున్న కూటమి నేతలు
● స్వర్ణముఖిలో యథేచ్ఛగా సై‘ఖతం’ ● యంత్రాలతో ఇష్టారాజ్యంగా తవ్వకం ● నదీమతల్లికి తప్పని గర్భశోకం ● రాత్రింబవళ్లు అక్రమంగా ఇసుక తరలింపు ● పట్టించుకోని పోలీసులు, రెవెన్యూ అధికారులు రేణిగుంట/శ్రీకాళహస్తి రూరల్ : శ్రీకాళహస్తి నియోజకవర్గంలో స్వర్ణముఖి నదిని ప్రదాన ఆదాయ వనరుగా కూటమి నేతలు మార్చేసుకున్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లో ఎక్కడ పడితే అక్కడ ఇసుకను తవ్వేస్తున్నారు. యథేచ్ఛగా రాష్ట్ర సరిహద్దులు దాటిస్తూ రూ.కోట్లు పోగేసుకుంటున్నారు. స్వర్ణముఖిలోకి నిత్యం జేసీబీలు, ట్రాక్టర్లు, లారీలు రాకపోకలు సాగిస్తున్నా అధికారులు అటు వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. దీంతో పచ్చ నేతలు మరింతగా రెచ్చిపోతున్నారు. నదిలో జేసీబీల సాయంతో ఇష్టారాజ్యంగా రాత్రింబవళ్లు తవ్వకాలు సాగిస్తున్నారు. నదీతీరంలో గ్రామాల్లో తిష్ట వేసి ఇసుక అక్రమ రవాణాను పర్యవేక్షిస్తున్నారు. కన్నెత్తి చూడని అధికారులు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోనే గతంలో ఇసుకాసురుల ధనదాహానికి ఎందరో అభాగ్యులు ప్రాణాలు కోల్పోయారు. ఆయా ఘటనలు రాష్ట్రస్థాయిలో సంచలనం రేపిన విషయం విధితమే. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఇసుకాసురులు ముఠాగా మారి స్వర్ణముఖిలో సహజ వనరులను తోడేస్తున్నా, అధికారులు మాత్రం కన్నెత్తి చూడడం లేదు. పోలీసులు మాత్రం అప్పుడప్పుడూ మొక్కుబడిగా ట్రాక్టర్లను స్వాధీనం చేసకుని చిన్నపాటి కేసులు పెట్టి వదిలేస్తున్నారు. రెవెన్యూ, మైనింగ్ అధికారుల మాత్రం టీడీపీ ముఖ్య నేతకు విధేయంగా నడుచుకుంటున్నారు. ఆయన అనుచరులకు వంత పాడుతూ మాకేం కనపడలేదు.. మాకేం వినపడలేదు.. అన్నట్టు వ్యవహరిస్తున్నారు. పైగా అక్రమ తవ్వకాలపై ఫిర్యాదు చేసిన వారి వివరాలను ఇసుకాసురులకు అందించేస్తున్నారు. దీంతో సామాన్యులు ఎవరైనా అధికారులకు ఫిర్యాదు చేసేందుకు సైతం వణికిపోతున్నారు.ఈ ప్రాంతాలే అడ్డా! రేణిగుంట మండలం కొట్రమంగళం, గాజులమండ్యం, తూకివాకం, జీపాళెం, పిల్లపాళెం సమీపంలోని స్వర్ణముఖి నది నుంచి నిత్యం ఇసుక తవ్వేసున్నారు. ఒక్కో చోటు నుంచి ప్రతి రోజూ సగటను 50 నుంచి 70 ట్రాక్టర్ల ఇసుకను తరలిస్తున్నారు. జీపాళెం సమీపంలో మూడు నెలలుగా టీడీపీ ముఖ్య నేత అనుచరుడినని చెప్పుకుంటూ ఓ వ్యక్తి ఇసుకను రాత్రింబవళ్లు తవ్వేసి సొమ్ము చేసుకుంటున్నాడు. ఒక ట్రాక్టర్ ఇసుక కావాలంటే ఆయనకు రూ.1,400 కప్పం కట్టాల్సి ఉంటుంది. సదరు ముఖ్యనేత అనుచరుడికి ముడుపు చెల్లిస్తే ఇక ట్రాక్టర్‌ను ఎవరూ ఆపరు. దీంతో రోజుకు 100 ట్రాక్టర్లకు పైగా ఇక్కడ నుంచి పగటి పూట తరలిస్తున్నారు. అదే రాత్రి వేళల్లో జేసీబీలు పెట్టి లారీలలో లోడ్ చేసి చైన్నె, బెంగళూరుకు అక్రమ రవాణా చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. కొట్రమంగళం నుంచి ఎక్కువగా తిరుపతికి, చుట్టుపక్కల గ్రామాలకు ఇసుక తరలిస్తున్నారు. నది వెంబడి ఉండే పంట పొలాలలో ఎలాంటి అనుమతులు లేకుండా 30 నుంచి 40 అడుగుల లోతు వరకు ఇసుకను తవ్వేసి అమ్మేస్తున్నారు. ఏర్పేడు మండలం పాపానాయుడుపేట, పెనుమల్లం, మునగలపాళెం, ఎండీ పుత్తూరు, కొత్తవీరాపురం గ్రామాల పరిధిలోని స్వర్ణముఖీ నది నుంచి యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. శ్రీకాళహస్తి మండలం రామాపురం, రామలింగాపురం, వేడాం, చుక్కలనిడిగల్లు గ్రామాల నుంచి విచ్చలవిడిగా ఇసుక తరలిపోతోంది. తొట్టంబేడు మండలం విరూపాక్షపురం, బసవయ్యపాళెం, కన్నలి, చోడవరం, కాసరంలో ఇసుకను ట్రాక్టర్ల ద్వారా అక్రమ రవాణా చేస్తున్నారు. -
భారతీయ జ్ఞానం.. విశ్వవ్యాప్తమే లక్ష్యం
తిరుపతి సిటీ: భారతీయ జ్ఞానం, సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయాలని శ్రీశైల పీఠం జగద్గురు డాక్టర్ చెన్నసిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామి పిలుపునిచ్చారు. జాతీయ సంస్కృత వర్సిటీ, బెంగళూరుకు చెందిన అఖిల భారత వీరశైవ శివాచార్య సంస్థాన్ సంయుక్తంగా వర్సిటీ ఇండోర్ స్టేడియంలో ఆదివారం శక్తి విశిష్టాద్వైతం అనే అంశంపై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు ప్రారంభించారు. ఇందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పీఠాధిపతులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ శక్తి విశిష్టాద్వైతం మహత్వాన్ని ఆధునిక దార్శనికులకు అందించడం శుభపరిణామమన్నారు. సంస్కృత భాష ఔన్నత్యాన్ని అంతర్జాతీయ స్థాయిలో తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం అధ్యాపకులు, విద్యార్థులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాశీపీఠం జ్ఞానసింహాసనధీశులు డాక్టర్ మల్లికార్జున విశ్వారాధ్య శివాచార్యులు మాట్లాడుతూ ఎన్‌ఎస్‌యూలో అద్వైత వేదాంత విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయి సదస్సు నిర్వహించి శక్తి విశిష్టాద్వైతం గొప్పతనాన్ని తెలియజేయడం అభినందనీయమన్నారు. ఇందులో సారాంశాన్ని గ్రహించి ఆధ్యాత్మిక తత్త్వ అన్వేషణలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ సదుస్సులో వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి, డీన్ రజనీకాంత్‌శుక్లా, ప్రొఫెసర్ గణపతిభట్, సతీష్, నాగరాజభట్, శివరామదాయగుడే, మనోజ్‌షిండే, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
వైభవం.. గిరి ప్రదక్షిణం
● ఘనంగా కొండచుట్టు మహోత్సవం – సమస్త దేవగణాలకు వీడ్కోలు పలికిన పార్వతీపరమేశ్వరులు ● ఎదురుసేవలో ఆదిదంపతులకు స్వాగతం పలికిన భక్తులు శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వరాలయ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం జ్ఞానప్రసూనానాంబ సమేత వాయులింగేశ్వరస్వామివారి కై లాస గిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా సాగింది. తమ కల్యాణానికి విచ్చేసిన సకల దేవతా గణాలు, రుషులకు పార్వతీ పరమేశ్వరులు ఘనంగా వీడ్కోలు పలికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తొలుత ఆలయంలోని యాగశాలలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చప్పరాలపై స్వామి అమ్మవార్లను అధిష్టింపజేసి గిరి ప్రదక్షిణకు తీసుకెళ్లారు. భేరివారి మండపం వద్ద భేరికులస్తులు ఇచ్చిన నాగవల్లిని అమ్మవారికి ధరింపజేశారు. అనంతరం జయరామారావువీధి, ఎన్టీఆర్ నగర్, తెలుగుగంగకాలనీ, కై లాసగిరికాలనీ, రాజీవ్‌నగర్‌కాలనీ మీదుగా గిరిప్రదక్షిణ సాగింది. అంజూరు మండపంలో ఆదిదంపతులు కాసేపు సేదతీరారు. అనంతరం వెయ్యిలింగాలకోన, వేడాం మీదుగా శుకబ్రహ్మాశ్రమం సమీపంలోని ఎదురుసేవ మండపానికి స్వామి అమ్మవార్లు సాయంత్రానికి చేరుకున్నారు. ఆలయ అధికారులు అర్చకులు, పెద్దసంఖ్యలో భక్తులు స్వాగతం పలికారు. రాత్రి ఆదిదంపతులను అశ్వ, సింహ వాహనాలపై కొలువుదీర్చి పురవీధుల్లో ఊరేగించారు. గిరిప్రదక్షిణ ఉభయకర్త, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ స్వామివారి ఉత్సవానికి ఉభయకర్తగా వ్యవహరించడం పూర్వజన్మ సుకృతమని తెలిపారు. కార్యక్రమంలో ఈఓ బాపిరెడ్డి, ఎమ్మెల్యే సతీమణి బొజ్జల రిషితారెడ్డి పాల్గొన్నారు.కూటమి నేతల కోరల్లో చిక్కి స్వర్ణమ్మ విలవిల్లాడుతోంది. ఇష్టారాజ్యంగా జేసీబీలతో ఇసుక తవ్వేస్తుంటే గర్భశోకంతో కన్నీరుపెడుతోంది. తమ్ముళ్ల ధన దాహం తీర్చలేక కొట్టుమిట్టాడుతోంది. పరిరక్షించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో మౌనంగా రోదిస్తోంది. సహజంగా ఏర్పడిన మేటలు మాయమవుతుంటే చేసేదిలేక దిగాలు పడుతోంది. నిలువెత్తు గుంతలను చూసుకుంటూ కుమిలిపోతోంది. అక్రమార్జనే లక్ష్యంగా రెచ్చిపోతున్న ఇసుకాసురుల వికటాట్టహాసంతో భయాందోళన చెందుతోంది. స్వర్ణముఖి నదిలో జరుగుతున్న ఇసుక తవ్వకాలు -
ప్రసన్న వెంకన్న కల్యాణోత్సవంలో గందరగోళం
● వేదికపైకి ఎక్కిన ఆలయ సిబ్బంది పరివారం ● సిబ్బందితో వాగ్వాదానికి దిగిన భక్తులు రేణిగుంట : శ్రీకాళహస్తి మండలం తొండమాన్‌పురంలో వెలసిన శ్రీదేవి, భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఆదివారం స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం నిర్వహణ లోపంతో గందరగోళానికి దారి తీసింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన కల్యాణ వేదికపై స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను వేంచేపు చేశారు. అనంతరం విశేషంగా అలంకరించి వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య కల్యాణోత్సవం జరిపారు. ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమం ప్రారంభం కాగానే ఆలయ సిబ్బంది, వారి బంధు పరివారం వేదికపైకి ఎక్కారు. దీంతో స్వామి వారి కల్యాణాన్ని తిలకించే అవకాశం భక్తులకు లేకుండా పోయింది. అసహనానికి గురైన భక్తులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. రాత్రి స్వామివారి గరుడసేవ ఘనంగా నిర్వహించారు. -
పవిత్రం.. రంజాన్ మాసం
నాయుడుపేటటౌన్ : రంజాన్ మాసంలో ముస్లింలు భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేపడుతున్నారు. వేకువజామున సహారీ చేసిన తర్వాత సాయంత్రం వరకు అన్నపానీయాలు స్వీకరించకుండా కఠిన నియమాలను పాటిస్తున్నారు. రంజాన్ మాసం సందర్భంగా మసీదుల వద్ద ప్రత్యేకంగా ఆష్ (గంజి) పంపిణీ చేస్తున్నారు. ఉపవాస దీక్ష చేపట్టిన వారికి ఇఫ్తార్ సమయంలో అందిస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు ముస్లింలు మసీదుకు వచ్చేప్పుడు ఇఫ్తార్ విందు కోసం ఖర్జూరాలు, అరటి పండ్లు, తదితర తినుబండారాలను తీసుకువస్తున్నారు. సామూహికంగా ఉపవాస దీక్షలున్నవారికి పంపిణీ చేస్తున్నారు. ముఖ్యంగా మసీదుల వద్ద అందించే ఆష్ కోసం పెద్దసంఖ్యలో జనం బారులు తీరుతున్నారు. ఆష్‌ను ఇంటికి తీసుకెళ్లి భక్తిశ్రద్ధలతో సేవిస్తున్నారు. హిందువులు సైతం మసీదు వద్దకు వచ్చి ఆష్ స్వీకరించడం మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. కొంతమంది మసీదుల వద్ద ఆష్ తయారు చేసేందుకు విరాళాలు సైతం అందిస్తున్నారు. ఈ క్రమంలోనే కఠిన ఉపవాస దీక్ష పాటిస్తూ చిత్తశుద్ధితో అల్లాహ్‌ను ప్రార్థిస్తే చక్కటి జీవిత గమనం పొందవచ్చని మౌలానాలు ప్రభోదిస్తున్నారు. ఈ మాసంలో ముస్లింలు వారి శక్తి మేరకు దానధర్మాలు చేస్తూ ఆధ్యాత్మిక చింతనతో గడుపుతున్నారు. భక్తిశ్రద్ధలతో ముస్లింల ఉపవాస దీక్షలు మసీదుల్లో నిత్యం ‘ఆష్’ పంపిణీ 200 ఏళ్లకు పైగా.. నాయుడుపేట పట్టణంలోని జామియా మసీదు (పెద్ద మసీదు)లో 200 ఏళ్లకు పైగా రంజాన్ మాసంలో క్రమం తప్పకుండా ఆష్ పంపిణీ జరుగుతోంది. వెంకటగిరి రాజాల పాలనలో అప్పటి సామంత రాజులుగా ఉన్న ఆర్కాట్ నవాబులు జామియా మసీదును నిర్మించారు. అప్పటి నుంచి ఈ మసీదులో ఉపవాస దీక్ష పాటిస్తున్న వారికి ఆష్ పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికీ ఆ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోంది. – హాజీ రంతుల్లా సాహెబ్, జామియా మసీదు ముతవల్లి ఆరోగ్యానికి మంచిది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉపవాస దీక్షలు ఉండేవారు ఆష్ సేవిస్తే ఆరోగ్యానికి చాలా మంచింది. ఉపవాస దీక్ష విరమణకు మొదటగా ఆష్‌ను తీసుకుంటే కోల్పోయిన శక్తిని పొందడమే కాకుండా జీర్ణవ్యవస్థ సక్రమంగా ఉంటుంది. తర్వాత ఎలాంటి ఆహారం తీసుకున్నా ఇబ్బంది ఉండదు. – పఠాన్ ఆరాఫత్ ఖాన్, నాయుడుపేట -
కారు ఢీకొని ఒకరి మృతి
– మరొకరికి గాయాలు గూడూరురూరల్ : మండలంలోని చెన్నూరు వద్ద ఆదివారం ఉదయం కారు ఢీకొని ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. గ్రామంలోని కాపువీధి చెందిన అల్లూరు మురళీరెడ్డి(58), శీకిరెడ్డి రామ్మోహన్‌రెడ్డి ప్రతిరోజూ ఉదయం వాకింగ్‌కు వెళుతుంటారు. ఈ క్రమంలోనే వ్యాహ్యాళికి వెళ్లి ఇంటికి తిరిగివస్తుండగా వెంకటగిరి నుంచి గూడూరు వైపునకు వస్తున్న కారు ఢీకొంది. దీంతో మురళీరెడ్డి అక్కడికక్కడే మరణించాడు. గాయపడిన రామ్మోహన్‌రెడ్డిని మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. ఎస్ఐ మనోజ్‌కుమార్ ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నార. మురళీరెడ్డి మృతితో చెన్నూరులో విషాదఛాయలు అలుముకున్నాయి. రోడ్డు ప్రమాదంలో మహిళకు గాయాలు రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్) : రేణిగుంట సమీపంలోని మర్రిగుంట సర్కిల్లో ఆదివారం జరిగిన ప్రమాదంలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. వివరాలు.. ప్రకాశం జిల్లా నుంచి వస్తున్న కారు అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొంది. దీంతో అందులో ప్రయాణిస్తున్న మహిళకు గాయాలయ్యాయి. క్షతగాత్రురాలిని 108లో ఆస్పత్రికి తరలించారు. దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని గాజులమండ్యం ఎస్ఐ సుధాకర్ తెలిపారు.