West Godavari
-
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు
యువత పోరు విజయవంతం చేయాలి నరసాపురం: వైఎస్సార్సీపీ ఆవిర్భావ వేడుకను బుధవారం జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఘనంగా నిర్వహించాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రపసాదరాజు పార్టీ నేతలకు సూచించారు. ఉదయం నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ జెండాలు ఆవిష్కరించాలని చెప్పారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావం రాష్ట్రంలో ఓ చరిత్ర అన్నారు. నియోజకవర్గ కేంద్రాల్లో జెండా ఆవిష్కరణల అనంతరం భీమవరంలో జరిగే యువత పోరు అందోళనకు పార్టీ నేతలు, కార్యకర్తలు తరలి రావాలని సూచించారు. రాష్ట్రంలో యువత, విద్యార్థులకు మోసపూరిత హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దగా చేసిందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ అందక తల్లిదండ్రులు అప్పులు చేసి ఫీజులు కడుతున్నారని వాపోయారు. -
పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యమివ్వాలి
మున్సిపల్ ఆర్డీ నాగ నర్సింహారావు నరసాపురం : మున్సిపాలిటీల్లో పారిశుద్య నిర్వహణ పనుల్లో ఎలాంటి లోపాలు లేకుండా అధిక ప్రాధాన్యం ఇచ్చి పనిచేయాలని మున్సిపల్ రీజనల్ డైరెక్టర్(రాజమండ్రి) సీహెచ్ నాగ నర్సింహారావు జిల్లాలోని కమిషనర్లను ఆదేశించారు. మంగళవారం నరసాపురం మున్సిపల్ కౌన్సిల్ హాలులో జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీ మాట్లాడుతూ దాదాపు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల నుంచి పారిశుద్ధ్య పనుల్లో లోపాలపై ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. విధుల్లో అలసత్వం వహించే అధికారులు, ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. యాక్షన్ ప్లాన్ తయారీకి ఆదేశం కుళాయిల ద్వారా మంచినీటి సరఫరాపై జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు యాక్షన్ ప్లాన్స్ తయారు చేసి అమలు చేయడానికి సిద్ధంగా ఉండాలని ఆర్డీ ఆదేశించారు. వేసవిలో ఎక్కడా మంచినీటి ఎద్దడి రాకూడదన్నారు. నీటి వనరులను బట్టి వేసవిలో ఒకపూట కుళాయిల ద్వారా నీరు ఇవ్వాలా? రెండు పూటలా ఇవ్వాలా? అనే అంశంపై ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు ముందుగా తనకు నివేదిక అందజేయాలని, ప్రజలకు కూడా ముందుగా తెలియజేయాలన్నారు. ఆస్తి పన్నులు వేయాలని దరఖాస్తు పెట్టుకున్నా పన్నులు వేయకుండా నెలల తరబడి ఎందుకు తిప్పిస్తున్నారని నరసాపురం మున్సిపల్ కమిషనర్ ఎం.అంజయ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ ఫిర్యాదులు వస్తే రాతపూర్వకంగా ప్రభుత్వానికి తెలియజేస్తానని హెచ్చరించారు. -
విజువల్లీ చాలెంజ్డ్ ఎంప్లాయీస్ కార్యవర్గం ఎన్నిక
ఏలూరు (టూటౌన్): విజువల్లీ చాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికై ంది. అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గానికి ఏలూరులోని గిరిజన భవన్లో ఎన్నికల అధికారి బురహన్ అలీ మంగళవారం ఎన్నికలు నిర్వహించారు. 24 పోస్టులకు 24 నామినేషన్లు రావడంతో అందరూ ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ప్రకటించి వారితో ఎన్నికల అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా జి. రవీంద్రబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎ.జలంధర్ రెడ్డి, రాష్ట్ర కోశాధికారిగా సీహెచ్.జ్యోతి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా జి.రాధారాణి, రాష్ట్ర సహా అధ్యక్షుడిగా ఎన్.వెంకటేశ్వరరావు, రాష్ట్ర సంఘ సలహాదారుగా కె.గురుప్రసాద్, రాష్ట్ర మహిళా కార్యదర్శిగా పి.శైలజ, ఉపాధ్యక్షులుగా దేవేంద్రనాథ్, మధుబాబు, రామ్మోహన్ రావు, గోపి, శ్రీనివాస్, ఎరుకునాయుడు, భాస్కరరావు, సంయుక్త కార్యదర్శులుగా నాగార్జున, నరేష్, రాము, గోవిందరావు, దుర్గా ప్రసాద్, రాముడు, భార్గవ్, అర్చన, కృష్ణారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
22 వేలకుపైగా ఉద్యోగాల తొలగింపు
నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలు వస్తుందని లక్షలాది మంది యువత ఆశపడి భంగపాటుకు గురయ్యారు. ఏలూరు జిల్లాలో 10,589, పశ్చిమగోదావరిజిల్లాలో 9,547 మంది వలంటీర్లను అధికారంలోకి రాగానే తొలగించేశారు. ఎన్నికల ప్రచారంలో లోకేష్ మొదలుకొని బీజేపీ నేతల వరకు అందరూ వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, రూ. 10 వేలు జీతం ఇస్తామని పదే పదే చెప్పి అధికారంలోకి రాగానే వలంటీర్ల కడుపుకొట్టారు. ప్రభుత్వ వైన్‌షాపుల్లో పనిచేస్తున్న సూపర్వైజర్లు, ఇతర సిబ్బందిని కూడా ఒక్క సంతకంతో రోడ్డున పడేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో 893 మంది, ఏలూరు జిల్లాలో 485 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయారు. ఫీజు రియంబర్స్మెంట్ గత ప్రభుత్వం సమర్ధవంతంగా అమలు చేసింది. పశ్చిమగోదావరి జిల్లాలో జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా 2,04,681 మందికి రూ. 485.23 కోట్లు, జగనన్న వసతి దీవెన ద్వారా 1,76,142 మందికి రూ.163.41 కోట్లు అందించారు. ఏలూరు జిల్లాలో 1,46,007 మంది విద్యార్థులకు రూ.383.42 కోట్లు జగనన్న విద్యాదీవెనలో.. 1,42,996 మంది విద్యార్థులకు రూ.142.96 కోట్లు వసతి దీవెన ద్వారా అందచేశారు. ఈ ప్రభుత్వం 10 నెలలు గడిచినా మొదటి సంవత్సర రీయింబర్స్మెంట్ ఫీజులు ఇంత వరకు చెల్లించలేదు. -
జిల్లా ఆస్పత్రిని సందర్శించిన కేంద్ర బృందం
తణుకు అర్బన్: టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నోడల్ ఆఫీసర్లకు శిక్షణనిచ్చే సెంట్రల్ టీబీ డివిజన్ (సీటీడీ) బృందం మంగళవారం తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిని సందర్శించింది. ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్లో భాగంగా వార్డులు, ల్యాబ్‌లు, పర్యావరణ ప్రాంతాలను పరిశీలించి ఇన్ఫెక్షన్లు అరికట్టేలా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెలగల అరుణ ఆధ్వర్యంలో వైద్యవర్గాలకు సమావేశంలో తెలిపారు. గూడెం నేతలకు రాష్ట్ర పదవులు తాడేపల్లిగూడెం: గూడెం నియోజకవర్గ నేతలకు వైఎస్సార్సీపీలో పదవులు దక్కాయి. స్టేట్ ఇంటలెక్చువల్ ఫోరం సొసైటీ రాష్ట్ర కార్యదర్శిగా లాయర్ డాక్టర్ హరిదాసుల రవీంద్రకుమార్, జాయింట్ సెక్రటరీగా ఆలిండియా బ్యాంకు ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర నాయకుడు ఎస్.ఎస్.ప్రసాద్, స్టేట్ బీసీ సెల్ జనరల్ సెక్రటరీగా పెంటపాడు మండల జట్లపాలెం గ్రామానికి చెందిన కట్టుబోయిన కృష్ణ ప్రసాద్ ఎంపికయ్యారు. పార్టీ శ్రేణులు వీరికి అభినందనలు తెలిపాయి. ఇంటర్ పరీక్షకు 95.5 శాతం హాజరు భీమవరం : జిల్లా వ్యాప్తంగా 52 పరీక్షా కేంద్రాల్లో మంగళవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షకు 95.5 శాతం మంది హాజరయ్యారని డీఐఈవో ఎ.నాగేశ్వరరావు చెప్పారు. జనరల్ పరీక్షకు 18,753 మందికి 18,061 మంది, ఒకేషనల్ పరీక్షకు 2,191 మందికి 1,956 మంది హాజరయ్యారన్నారు. ఎక్కడా మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని తెలిపారు. రొయ్య రైతులను ఆదుకోవాలి నరసాపురం రూరల్: రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పించి రొయ్య రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.బలరాం డిమాండ్ చేశారు. మంగళవారం వేములదీవి పడమర గ్రామంలో ఆక్వా రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక ఆక్వా రైతులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ గతంలో 100 కౌంట్ ధర కిలో రూ.290 ఉంటే ప్రస్తుతం రూ.230కి పడిపోయిందన్నారు. ఆక్వా సాగుకు ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వాలని కోరారు. సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన తణుకు అర్బన్: ముఖ్యమంత్రి చంద్రబాబు తణుకులో స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ నెల 15న తణుకు రానున్న నేపథ్యంలో మంగళవారం కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఇతర అధికారులు తణుకులో పలు ప్రాంతాలను పరిశీలించారు. పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో హెలిపాడ్, ఆడిటోరియం, బాలికోన్నత పాఠశాలలో పార్కింగ్ ప్రదేశం, బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రజా వేదిక, స్టాల్స్ ప్రదర్శనకు ప్రాథమికంగా స్థలాల పరిశీలన చేశారు. సుమారు 300 మంది పార్టీ ప్రతినిధులతో నిర్వహించనున్న ముఖాముఖిలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారని, జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల సభా ప్రాంగణంలో 3 వేల మందితో ఏర్పాటు చేయనున్న పబ్లిక్ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారని చెప్పారు. -
సర్కారుమోసంపై యువతపోరు
8లోబుధవారం శ్రీ 12 శ్రీ మార్చి శ్రీ 2025సాక్షి ప్రతినిధి, ఏలూరు: వైద్య విద్యకు గ్రహణం పట్టించారు.. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా, వేల సంఖ్యలో ఉన్న ఉద్యోగాలు పీకేశారు.. నిరుద్యోగ భృతి హామీని గాలికొదిలేశారు. గత పది నెలల్లో ఉపాధి కల్పన జరగకపోగా ఉన్న ఉపాధికి చంద్రబాబు సర్కారు గండి కొట్టింది. అడుగడుగునా నిరుద్యోగులను, యువతను దగా చేస్తూ ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్నారు. పాలకొల్లు మెడికల్ కళాశాల పనులను అర్ధాంతరంగా నిలిపివేశారు. ఉమ్మడి పశ్చిమలో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌తో ముడిపడి ఉన్న ఫీజు రీయిబర్స్మెంట్ను అటకెక్కించి తల్లిదండ్రులను అప్పులపాలు చేశారు. వీటన్నింటిపై ప్రతిపక్ష వైఎస్సార్సీపీ పోరుబాట పట్టింది. బుధవారం ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో భారీ నిరసన ర్యాలీలు నిర్వహించి కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేపట్టనుంది. యువత పోరుకు ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు, నిరుద్యోగ యువత, వారి తల్లిదండ్రులు హాజరుకానున్నారు. రెండు జిల్లాల్లో పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రులు, పార్లమెంట్ ఇన్చార్జులు, నియోజకవర్గ ఇన్చార్జులు హాజరు కానున్నారు. దగ్గులూరు వైద్య కళాశాలకు గ్రహణం గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ఏలూరు నగరంలో, పాలకొల్లులోని దగ్గులూరులో మెడికల్ కళాశాల ఏర్పాటుకు కేంద్రం ద్వారా అనుమతులు మంజూరు చేయించారు. ఏలూరులో రూ.535 కోట్లు, పాలకొల్లులో రూ.475 కోట్ల ప్రాజెక్టు వ్యయంతో సుమారు 3 లక్షల చదరపు అడగుల విస్తీర్ణంలో కళాశాల భవనం, బాయ్స్, గర్ల్స్‌కు వేర్వురుగా 90 వేల చదరపు అడుగుల్లో హాస్టళ్లతో పాటు అన్ని రకాల సదుపాయాలు కల్పించేలా ప్రాజెక్టును రెండు జిల్లాలో ప్రారంభించారు. ఏలూరులోని ప్రభుత్వ వైద్యకళాశాలను గతేడాది నుంచి ప్రారంభించారు. 150 సీట్లతో ప్రారంభమైన కళాశాలలో ఈ ఏడాది రెండో బ్యాచ్ ప్రారంభమైంది. ఇక పాలకొల్లులోని దగ్గులూరులో 60 ఎకరాల విస్తీర్ణంలో పనులు మొదలుపెట్టారు. గత ప్రభుత్వ హయాంలో సుమారు రూ. 80 కోట్ల వ్యయంతో బేస్మెంట్, పిల్లర్లు, ఇతర నిర్మాణ పనులు పూర్తి చేశారు. ఈ ఏడాది నవంబరు నాటికి పూర్తి చేసుకుని వచ్చే విద్యా సంవత్సరానికి పాలకొల్లు వైద్యకళాశాలను ప్రారంభించాలనేది గత ప్రభుత్వ ఆలోచన. కూటమి సర్కారు కొలువుదీరడంతో పనులు నిలిచిపోయాయి. కళాశాల పూర్తయితే ఏటా 150 సీట్ల చొప్పున ఐదేళ్ళల్లో 750 సీట్లు పశ్చిమగోదావరిలో పేద విద్యార్థులకు దక్కే అవకాశం ఉంది. దీనికి చంద్రబాబు ప్రభుత్వం గ్రహణం పట్టించింది. ఊరిస్తున్న పొగాకు ధరలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ నెల 24 నుంచి పొగాకు వేలం ప్రారంభం కానుంది. గతేడాది కంటే ఎక్కువ ధర వస్తుందని ఆశిస్తున్నారు. 8లోన్యూస్రీల్ నేడు ఏలూరు, భీమవరంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ధర్నాలు నిరుద్యోగ భృతి హామీ గాలికే 21 వేల మంది వలంటీర్లను మోసగించిన ప్రభుత్వం 1,378 మంది మద్యం షాపుల సిబ్బందికి ఉద్వాసన పాలకొల్లులో వైద్య కళాశాల పనులు నిలిపివేత ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా, వసతి దీవెన నిధులపై మౌనం హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ నేడు పోరుబాట -
ప్రగతి పరవళ్లు
ఐదేళ్లునేడు ఆవిర్భావ దినోత్సవం పరుచుకున్న ప్రగతి ● పేదవర్గాల వారి సొంతింటి కలను సాకారం చేస్తూ జిల్లాలోని సుమారు 76,069 మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. ● ఆక్వా రంగాన్ని ప్రోత్సహిస్తూ నరసాపురంలో రూ.332 కోట్ల వ్యయంతో ఆక్వా వర్శిటీ మంజూరు చేశారు. ● పాలకొల్లు మండలం దగ్గులూరులో రూ.475 కోట్ల వ్యయంతో 61 ఎకరాల విస్తీర్ణంలో మెడికల్ కళాశాల పనులు చేపట్టారు. ● పాలకొల్లులో రూ.13.50 కోట్లతో 150 పడకల ఆసుపత్రి నిర్మించగా.. నరసాపురంలో 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అభివృద్ధి చేశారు. భీమవరంలో రూ.40 కోట్ల వ్యయంతో 100 పడకల ఆస్పత్రి నిర్మాణ పనులు చేపట్టారు. ● తాడేపల్లిగూడెంలో రూ.36 కోట్లతో కోడేరు–నల్లజర్ల (కేఎన్ రోడ్డు)ను నాలుగు లైన్లుగా విస్తరించారు. రూ.వందల కోట్లు వెచ్చించి జిల్లాలోని ఎన్నో రోడ్లను అభివృద్ధి చేశారు. ● దాదాపు రూ.540 కోట్ల వ్యయంతో గ్రామాల్లో సచివాలయలు, ఆర్బీకేలు, హెల్త్ క్లినిక్‌లు, బల్క్‌మిల్క్ యూనిట్లు, డిజిటల్ లైబ్రరీల నిర్మాణం చేపట్టారు. సాక్షి, భీమవరం : వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అక్కచెల్లెమ్మల అభ్యున్నతికి ‘చేయూత’నందించారు. వారి డ్వాక్రా రుణమాఫీకి ‘ఆసరా’ అయ్యారు.. అగ్రవర్ణాల పేద మహిళలకు శ్రీనేస్తంశ్రీగా నిలిచారు. పేదల చదువులకు ‘అమ్మఒడి’లా వారి ఉన్నతికి విద్య, వసతి దీవెనలు అందించారు. సాగులో రైతుకు, వేట విరామంలో మత్య్సకారులకు ‘భరోసా’గా ఉన్నారు. నేతన్నలకు ‘నేస్తం’ అయ్యారు. వలంటీర్, సచివాలయ వ్యవస్థలు తెచ్చి కులమత వర్గాలు, రాజకీయాలు చూడకుండా సంక్షేమ లబ్ధిని పేదల చెంతకు చేర్చారు. నేడు వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేడుకల నిర్వహణకు పార్టీ శ్రేణులు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. 2019 మే 30న సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన మరుక్షణం నుంచే నవరత్నాల అమలుకు అడుగులు వేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సచివాలయ, వలంటీర్ వ్యవస్థలు తెచ్చారు. పింఛన్ కోసం అవ్వాతాతలు పడిగాపులకు చెక్ పెట్టారు. 1వ తేదీ ఉదయాన్నే ఇంటికి వెళ్లి పింఛన్ సాయాన్ని చేతికందించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణాల్లోని పేదల అభ్యున్నతికి వైఎస్సార్ పెన్షన్ కానుక, అమ్మ ఒడి, వైఎస్సార్ చేయూత. కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, టైలర్లు, రజకులు, నాయి బ్రాహ్మణుల కోసం జగనన్న చేదోడు, డ్రైవర్ల కోసం వాహనమిత్ర, మత్య్సకారులకు మత్య్సకార భరోసా, చేనేత కార్మికుల కోసం నేతన్న నేస్తం తదితర ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా పేదలను ఆదుకున్నారు. డీబీటీ, నాన్ డీబీటీ రూపంలో ఉమ్మడి జిల్లాలోని పేదలకు సుమారు రూ.2,500 కోట్ల లబ్ధి చేకూరింది. ఉచిత పంటల బీమా, ఆర్బీకేల ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సరఫరా చేశారు. వైఎస్సార్ రైతు భరోసా ద్వారా పశ్చిమగోదావరి జిల్లాలోని రైతులకు రూ.796.49 కోట్ల సాయం అందించారు. జగనన్న సురక్ష శిబిరాల ద్వారా ఉమ్మడి జిల్లాలోని దాదాపు 11.82 లక్షల మంది లబ్ధిదారులకు ఏ విధమైన సర్వీస్ చార్జీ లేకుండానే కుల ధ్రువీకరణ, ఆదాయ, జనన, మరణ, మ్యారేజ్ రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ తదితర 12.04 లక్షల సర్టిఫికెట్లు అందజేశారు. ఆరోగ్యానికి ధీమా జగనన్న ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌లతో పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేశారు. స్పెషలిస్ట్ వైద్యులతో విలేజ్ క్లినిక్‌లు, పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో వైద్యశిబిరాలు ఏర్పాటుచేశారు. 14 రకాల వైద్య పరీక్షలతో పాటు 172 రకాల మందులను అందుబాటులో ఉంచి 15 లక్షల మందికి పైగా రోగులకు వైద్యసేవలందించారు. ఆరోగ్యశ్రీలో రూ. 5 లక్షల వరకు ఉన్న వ్యయ పరిమితిని రూ.25 లక్షలకు, 1,059గా ఉన్న చికిత్సల సంఖ్యను 3,257కు పెంచడం ద్వారా పేదల ఆరోగ్యానికి మరింత భద్రత కల్పించారు పేదలకు డిజిటల్ విద్య నాడు నేడు ద్వారా రూ.36,913 కోట్లతో పశ్చిమగోదావరి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు ధీటుగా అభివృద్ధి చేశారు. పేద విద్యార్థులు ప్రపంచంతో పోటీపడేలా డిజిటల్ విద్యాబోధన చేపట్టారు. 8వ తరగతి విద్యార్థులకు రూ.30 వేలు విలువ చేసే ట్యాబ్‌లు అందజేశారు. జగనన్న అమ్మ ఒడి పథకంలో 1,48,342 మంది తల్లులకు రూ.887.9 కోట్లు, పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం జగనన్న విద్యాదీవెన, వసతి దీవెనలుగా రూ.770 కోట్లు సాయం అందించారు. సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థతో గడప వద్దకే సంక్షేమ లబ్ధి పేదల వైద్యానికి పెద్దపీట నాడు–నేడుతో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ నవరత్నాలతో పేదల ఉన్నతికి బాటలు జగనన్న సురక్షతో ఉచితంగా సర్టిఫికెట్ల జారీ ఆక్వా వర్శిటీ, మెడికల్ కళాశాల మంజూరు నేడు వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవం సంక్షేమ పథకాలతో మహిళలకు బాసట గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళలకు అందించిన అనేక సంక్షేమ పథకాలు ఆర్థికంగా చేయూతనిచ్చాయి. అమ్మ ఒడి, చేయూత, ఆసరా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, పెళ్లికానుకతో సహా మహిళల ఖాతాలో వేశారు. నాటి ప్రభుత్వం అందించిన పథకాల ఆర్థిక సాయం మహిళలను ఆర్థికంగా ఎదిగేలా చేశాయి. నేడు పథకాల కోసం ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. – పూజారి వెంకటలక్ష్మి, భీమవరం యువతకు ఉద్యోగాల కల్పన వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సచివాలయ వ్యవస్థ, వలంటీరు వ్యవస్థ తీసుకొచ్చి లక్షల మంది యువతకు ఉపాధి కల్పించారు. సొంత ఊళ్లోనే ఉంటూ ఉద్యోగాలు చేసుకునే కలను సాకారం చేశారు. కూటమి ప్రభుత్వం అబద్ధపు హామీలకే పరిమితమైంది. అధికారంలోకి వచ్చి 9 నెలలైనా ఇంతవరకూ జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి ఊసే లేదు. – వి.దివ్య, వీరవల్లి పాలెంగ్రామాల అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గ్రామాలు ఎంతగానో అభివృద్ధి చెందాయి. గ్రామ సచివాలయాలు, హెల్త్ సెంటర్లు, ఆర్బీకేలు ఈ విధంగా గ్రామాలు ఎంతో అభివృద్ధిలోకి వచ్చాయి. అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రతి కుటుంబం కూడా అద్భుతంగా అభివృద్ధి చెందింది. వివిధ సామాజిక వర్గాలు కూడా అభివృద్ధిలో ముందజలో ఉన్నాయి. – గోగులమండ చిన్న కృష్ణమూర్తి, సర్పంచ్, యండగండి వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను బుధవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటలకు పార్టీ కార్యాలయాల వద్ద పార్టీ జెండా ఆవిష్కరణలు, కేక్ కటింగ్‌లు చేయనున్నారు. అనంతరం కూటమి ప్రభుత్వం దగాతో మోసపోయిన నిరుద్యోగులు, విద్యార్థుల పక్షాన జిల్లా కేంద్రాల్లో శ్రీయువత పోరుశ్రీ కార్యక్రమం నిర్వహించనున్నారు. -
నాణ్యమైన పొగాకును పండించాలి
బుట్టాయగూడెం: రైతులు నాణ్యమైన పొగాకును పండించి అధిక దిగుబడులు సాధించాలని జంగారెడ్డిగూడెం–1 వేలం కేంద్రం ఆక్షన్ సూపరింటెండెంట్ బి. శ్రీహరి సూచించారు. బుట్టాయగూడెంలో పొగాకు బోర్డు అధికారుల బృందం మంగళవారం పర్యటించింది. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన గద్దే శ్రీధర్ పొలంలో ప్రకృతి వ్యవసాయం, పొటాషియం, రిలీజింగ్ బ్యాక్టీరియా వాడకంపై క్షేత్ర దినోత్సవ సదస్సును నిర్వహించారు. పొగాకు సాగులో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించి భూసారాన్ని పెంపొందించుకోవాలన్నారు. పురుగు మందుల అవశేషాలు లేని నాణ్యమైన పొగాకును పండించాలని కోరారు. కార్యక్రమంలో ఐటీసీ మార్కెటింగ్ మేనేజర్ ప్రశాంత్ జోషి, ఐటీసీ కంపెనీ మేనేజర్ ఆదర్శ, కంపెనీ పీఎస్ఎస్ నాగేంద్ర, పొగాకు రైతు సంఘం నాయకులు కరాటం రెడ్డినాయుడు, గొట్టుముక్కల మల్లికార్జున రావు, రైతులు, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు విద్యార్థి ఎంపిక తణుకు అర్బన్: ఈనెల 14 నుంచి 16 తేదీ వరకు కడప జిల్లా పులివెందులలో జరిగే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు తణుకు మండలం మండపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థి సంగాడి సత్యనాగ గణేష్ ఎంపికై నట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆర్.మోహన్‌బాబు తెలిపారు. ఈనెల 9వ తేదీన తణుకులో నిర్వహించిన జిల్లా స్థాయి అండర్–16 కబడ్డీ పోటీల్లో గణేష్ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించాడన్నారు. క్రీడాకారుడు గణేష్‌తోపాటు, శిక్షణ ఇచ్చిన ఫిజికల్ డైరెక్టర్ సంకు సూర్యనారాయణను హెచ్ఎం మోహన్‌బాబుతోపాటు ఉపాధ్యాయులు అభినందించారు. -
నిట్‌లో క్రీడా సంబరాలు ప్రారంభం
తాడేపల్లిగూడెం: చదువుతో పాటు, క్రీడల్లోనూ విద్యార్థులు రాణిస్తే మంచి భవిష్యత్‌తో పాటు శారీరకంగా, మానసికంగా ఉత్తమ ఫలితాలు ఉంటాయని ఏపీ నిట్ రిజిస్ట్రార్ పి.దినేష్ శంకరరెడ్డి అన్నారు. మంగళవారం నిట్‌లో 2024–25 క్రీడా సంబరాలను ఆయన ప్రారంభించారు. నిట్ విద్యార్థులు విద్యతో పాటు జాతీయస్థాయిలో కబడ్డీ, పవర్ లిఫ్టింగ్, క్రికెట్, చదరంగం, వాలీబాల్ వంటి పోటీల్లో ప్రతిభ కనరబరుస్తుండడం అభినందనీయమన్నారు. డీన్లు డాక్టర్ కె.హిమబిందు, వీరేష్‌కుమార్, అసోసియేట్ డీన్ శ్రీనివాసన్, ఆచార్యులు డాక్టర్ తపస్, సుదర్శన్దీప, సాస్ అసిస్టెంటు సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. యానాం మద్యం విక్రేత అరెస్ట్ తణుకు అర్బన్: ఇరగవరంలో యానాంకు చెందిన మద్యం విక్రయిస్తున్న పత్తివాడ కరుణాకర్ అనే వ్యక్తిని మంగళవారం అరెస్ట్ చేసి అతని నుంచి 6 టిన్ల బీర్లు, ఒక మద్యం సీసాను స్వాధీనం చేసుకున్నట్లు తణుకు ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ సీఐ సత్తి మణికంఠరెడ్డి తెలిపారు. ఇతర రాష్ట్రాలకు చెందిన అక్రమ మద్య ం విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. పట్టెంపాలెంలో ఇసుక తవ్వకాలు తాడేపల్లిగూడెం రూరల్: పట్టెంపాలెం ఎర్ర కాలువలో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. దీనిపై ఫిర్యాదులు అందడంతో ఎర్ర కాలువ ఏఈ అనిల్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిఘా పెట్టిన అధికారులు జేసీబీ, లారీని పట్టుకుని సీజ్ చేశారు. అనంతరం వాటిని తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎవరైనా అక్రమంగా ఇసుక తరలిస్తే ఉపేక్షించేది లేదని ఎర్ర కాలువ ఏఈ అనిల్ హెచ్చరించారు. మామపై అల్లుడు కత్తితో దాడి కాళ్ల: భార్యను తనతో కాపురానికి పంపడం లేదని పిల్లనిచ్చిన మామయ్యపై చిన్న అల్లుడు కత్తితో దాడి చేసిన ఘటనపై కాళ్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్సై ఎన్.శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం వేంపాడు గ్రామానికి చెందిన యు.సత్యనారాయణ ఇంటికి అతని రెండో అల్లుడు అత్తిలి మండలం కె.ఎస్.గట్టు గ్రామానికి చెందిన కోనా కిషోర్ సోమవారం వచ్చాడు. తన భార్యని కాపురానికి పంపమని కిషోర్ తన మావయ్య సత్యనారాయణపై ఘర్షణకు దిగి కత్తితో దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన సత్యనారాయణను చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి నుంచి వచ్చిన సమాచారంతో కిషోర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
రైతు సంక్షేమంపై దృష్టి సారించాలి
ఉండి: రైతు సంక్షేమంపై శాస్త్రవేత్తలు దృష్టి సారించాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ విస్తరణ సంచాలకుడు డాక్టర్ జీ శివన్నారాయణ అన్నారు. మంగళవారం మండలంలోని ఎన్నార్పీ అగ్రహారం కృషీ విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన శాసీ్త్రయ సలహా సంఘ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దత్తత గ్రామాల్లో విస్తరణ కార్యక్రమాలు ఎక్కువగా కేంద్రీకృతం చేసి రైతుల అభివృద్ధికి శాస్త్రవేత్తలు దోహదపడాలని అన్నారు. రైతులకు పంట దిగుబడి, ఆదాయం పెంచడం, ఖర్చు తగ్గించడం, భూసారం పెంచడం వంటి అంశాలపై దృష్టి సారించాలన్నారు. మార్టేరు వరి పరిశోధనా స్థానం ఉప సంచాలకుడు డాక్టర్ టీ శ్రీనివాస్ మాట్లాడుతూ దాళ్వాలో వరిని నేరుగా విత్తడం, వేస్ట్ డీకంపోజ్, జింకులోప యాజమాన్యంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. రైతులకు డిజిటల్ మార్కెటింగ్‌పై శిక్షణ, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. జిల్లా వ్యవసాయాధికారి జెడ్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గుర్రపుడెక్కను కంపోస్టుగా మార్చడం, దానిని విలువ ఆధారిత ఉత్పత్తి అయిన ట్రేసంచులుగా తయారు చేయడం వల్ల కాలువల్లో కలుపు నివారించడమే కాకుండా ఆదాయ వనరుగా మార్చవచ్చునని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి దేవానంద్‌కుమార్, డిప్యూటీ వెటర్నరీ డైరెక్టర్ డాక్టర్ జావల్హుస్సేన్, జీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
మృత శిశువు జననం కేసులో వీడిన చిక్కుముడి
కై కలూరు: కై కలూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్‌సీ) బాత్రూం కమోడ్‌లో ఈ నెల 7న మృత శిశువు జననంపై చిక్కుముడి వీడింది. ప్రసవం తర్వాత మైనర్ బాలిక పరారైన ఘటన సంచలనం కలిగించింది. ఈ కేసులో సీఐ పి.కృష్ణ ఆధ్వర్యంలో టౌన్ ఎస్సై ఆర్.శ్రీనివాస్ పూర్తి స్థాయి దర్యాప్తు చేశారు. కేసు వివరాల్లోకి వెళితే రాచపట్నం గ్రామానికి చెందిన మైనర్ బాలికకు చిన్నతనంలో తండ్రి మరణించాడు. తల్లి సంరక్షణలో పెరుగుతున్న ఆమె పదో తరగతి పరీక్షలు తప్పగా ఇటీవల కై కలూరు కార్నర్‌స్టోన్ ఓకేషనల్ కాలేజీలో 6 నెలలు నర్సింగ్ చదివింది. ఏలూరులో నానమ్మ వద్ద బాలిక నివాసముంటుంది. పెదవేగి మండలం కొప్పాక గ్రామానికి చెందిన కార్ డ్రైవర్ ప్రత్తిపాటి వినీత్ (25)తో బాలికకు పరిచయం ఏర్పడింది. అతని బంధువులు కై కలూరు మండలం రామవరంలో ఉండటం, ఒకే సామాజికవర్గం కావడంతో బాలికకు మరింత దగ్గరయ్యాడు. వినీత్‌కు వివాహం కాగా భార్య ఇద్దరు సంతానం ఉన్నారు. అదే విధంగా రాచపట్నం గ్రామానికి చెందిన వరుసకు స్వయాన మేనమామ కొనాల గణేష్ (35) కూడా మైనర్ బాలికకు దగ్గరయ్యాడు. గణేష్‌కు వివాహం కాలేదు. వీరిద్దరూ అనేక పర్యాయాలు బాలికపై లైంగికదాడికి పాల్పడడంతో గర్భం దాల్చినట్లు మైనర్ బాలిక ఫిర్యాదులో పేర్కొంది. ప్రసవ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోపోవడంతో శిశువు మరణించినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. మైనర్ బాలిక గర్భం దాల్చడానికి కారకులైన ఇద్దరు నిందితులపై పోక్సో కేసుతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసును ఛేదించిన సీఐ, ఎస్సైలను ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్ అభినందించారు. మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఇద్దరి అరెస్ట్ -
ట్రిపుల్ ఐటీలో మెగా ఎక్స్పో నిర్వహణ
నూజివీడు: నూజివీడు ట్రిపుల్ ఐటీలో నిర్వహిస్తున్న సాంకేతిక సంబరం టెక్‌జైట్–25లో భాగంగా మంగళవారం మెగా ఎక్స్పో నిర్వహించారు. ఈ ఎక్స్‌పోలో 100 జట్లు పాల్గొని తమ ప్రాజెక్టులకు సంబంధించి ప్రజంటేషన్లను సమర్పించారు. 86 జట్లు తాము రూపొందించిన ప్రాజెక్టులను ప్రదర్శించగా వాటిలో 56 జట్లు అర్హత సాధించాయి. ఈ ఎక్స్‌పోలో ఏఐ, డ్రోన్, రోబోటిక్స్ అంశాలపై రూపొందించిన నమూనాలను విద్యార్థులు ప్రదర్శించి న్యాయనిర్ణేతలకు వివరించారు. ఈ ఎక్స్పోను డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్, ఆర్జీయూకేటీ డీన్ అకడమిక్స్ దువ్వూరు శ్రావణి ప్రారంభించారు. టెక్ జైట్ 2025 లో భాగంగా ఎన్విజన్ అకాడమి, బిస్ సంస్థ ట్రిపుల్ ఐటీతో ప్రతి ఇంజనీరింగ్ విభాగం నుంచి విద్యార్థులకు పరీక్ష పోటీలను నిర్వహించారు. యూపీఎస్సీ ఆశావాహులకు మాక్ టెస్ట్ పోటీని ఎన్విజన్ అకాడమి నిర్వహించగా, ఉత్పత్తుల వినియోగంపై అవగాహన పెంచుకోవాలి అనే ఉద్దేశంతో బిస్ సంస్థ పోటీలను నిర్వహించింది. ఈ పోటీల్లో పీయూసీ, ఇంజనీరింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఓ బీ లక్ష్మణరావు, డీన్ అకడమిక్స్ చిరంజీవి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఊరిస్తున్న పొగాకు ధరలు
బుట్టాయగూడెం: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం 1 –2 , కొయ్యలగూడెం, దేవరపల్లి, గోపాలపురం మండలాల్లో ఈ నెల 24వ తేదీ నుంచి పొగాకు వేలం ప్రారంభం కానుంది. వేలం కేంద్రాల్లో కొనుగోళ్లకు సంబంధించి బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పొగాకు కేజీ ధర గతేడాది రికార్డు స్థాయిలో రూ.411 పలకడంతో ఈసారి రైతులు పోటీపడి మరీ పొగాకు సాగు చేశారు. 2025 –2026 సీజన్‌కు సంబంధించి బోర్డు 58.94 మిలియన్ల కేజీల పొగాకు విక్రయానికి అనుమతి ఇవ్వగా 70 మిలియన్ల కేజీల వరకూ ఉత్పత్తి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా పొగాకు రైతులు పోటీపడి మరీ సాగు చేయడంతో సాగుఖర్చులు అమాంతం పెరిగిపోయాయి. భూమి, బ్యారన్ కౌలుతో పాటు కూలీల ఖర్చులు విపరీతంగా పెరిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో గతేడాది కంటే సరాసరి ధర ఎక్కువ వస్తేనే తాము గట్టెక్కుతామని రైతులు చెబుతున్నారు. కర్ణాటక మార్కెట్ సరాసరి రూ. 268 ఇటీవల కర్ణాటకలో జరుగుతున్న పొగాకు వేలంలో ధరలు ఆశాజనకంగానే ప్రారంభమైనట్లు అక్కడి రైతులు చెబుతున్నారు. హై గ్రేడ్ కేజీ పొగాకు ధర రూ. 337 వరకూ పలికింది. మొత్తం సరాసరి ధర చూస్తే రూ.268.25 వరకు వచ్చినట్లు అధికారులు చెప్తున్నారు. అయితే మంళవారం నాడు రూ.216, లో గ్రేడ్ రూ 130 ధర పలికినట్లు అధికారులు తెలిపారు. కాగా ఏపీలోని ఉమ్మడి ప్రకాశం జిలాల్లో ప్రారంభమైన పొగాకు కొనుగోళ్లలో మొదటి రోజు రూ.280కు వ్యాపారులు కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇక్కడ గతేడాది హై గ్రేడ్ కేజీ రూ.330 వరకూ పలికింది. ఈ ఏడాది ప్రారంభంలోనే పొగాకు కేజీ ధర రూ.280కు వ్యాపారులు కొనుగోలు చేయడంతో ఈ ధరలు క్రమంగా పెరిగే అవకాశం ఉందని ఇటు రైతులు, అటు అధికారులు భావిస్తున్నారు. గ్రేడింగ్‌లో జాగ్రత్తలు అవసరం ఈ ఏడాది పొగాకు పంట ఆశాజనకంగా ఉండడం రైతులకు ఊరటనిచ్చే అంశం. మొత్తం ఉత్పత్తుల్లో 50 శాతానికి మొదటి రకం అంటే హై గ్రేడ్ వచ్చాయని అధికారులు చెప్తున్నారు. మిగిలిన గ్రేడులు కూడా ఆశించిన స్థాయిలో నాణ్యతగా ఉన్నాయని చెప్తున్నారు. ఇది రైతులకు సానుకూలాశంగా మారనుంది. అయితే గ్రేడింగ్ విధానంలో రైతులు తగు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. గ్రేడ్లు వేరు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించి బేళ్లు కట్టాలని బోర్డు అధికారులు కోరుతున్నారు. 24 నుంచి ప్రారంభం కానున్న పొగాకు వేలం గతేడాది కంటే ఎక్కువ ధరపై ఆశపెట్టుకున్న రైతులు సరాసరి రూ.300 ఇవ్వాలని డిమాండ్ మొత్తం వేలం కేంద్రాలు – 5 పొగాకు రైతుల సంఖ్య – 12,487 సాగు విస్తీర్ణం – 28,719 హెక్టార్లు బోర్డు అనుమతించిన ఉత్పత్తి 58.94 మిలియన్ల కేజీల పంట ఉత్పత్తి అంచనా 70 మిలియన్ల కేజీలు అధికారుల సూచనలు పాటించాలి ఈ ఏడాది పొగాకు పంట ఆశాజనకంగా ఉంది. గత ఐదేళ్లలో ఈ విధంగా పండలేదు. రైతులు అవశేషాలు లేని హీట్, సాఫ్ లేకుండా గ్రేడుల ఆధారంగా పొగాకును సిద్ధం చేసుకోవాలి. ఈ ఏడాది హై గ్రేడ్ పొగాకు పండింది. అధికారులు సూచనలు పాటిస్తే మంచి ధర వచ్చే అవకాశం ఉంది. – బి.శ్రీహరి, ఆక్షన్ సూపరింటెండెంట్, జంగారెడ్డిగూడెం వేలం కేంద్రం –1 ధరపైనే ఆశలు పొగాకు పంటలకు సాగు ఖర్చులు భాగా పెరిగాయి. పొలం, బ్యారన్ కౌలు, కూలి రేట్లు రెట్టింపయ్యాయి. ఈ ఏడాది సీజన్ ప్రారంభంలో మంచి ధర వస్తుందనే ఆశతో ఎదురు చూస్తున్నాము. సరాసరి రూ.300 ధర వచ్చేలా బోర్డు అధికారులు కృషి చేస్తేనే రైతులు గట్టెక్కుతారు. – కలగర నాని, పొగాకు రైతు, కొమ్ముగూడెం, బుట్టాయగూడెం మండలం -
సాఫ్ట్వేర్ నుంచి పర్మాకల్చర్లోకి..!
పుట్టిన గడ్డపై ప్రజలు చిన్న వయసులోనే కేన్సర్, లివర్, గుండె జబ్బు వంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడి మృతి చెందటంతో కలవరపాటుకు గురైన ఆమె అమెరికాలో ఆరంకెల సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి ఏడేళ్ల క్రితం పుట్టింటికి తిరిగి వచ్చేశారు. తమ ఏడెకరాల్లో ఐదంచెల ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. యోగా, ప్లాస్టిక్ రహిత జీవన శైలిని తాను ఆచరిరిస్తూ 2017 నుంచి అనేక ఇతర స్వచ్ఛంద సంస్థలతో కలసి ప్రచారోద్యమం చేపట్టారు. ముఖ్యంగా పాఠశాల విద్యార్థుల్లో ఎకోఫ్రెండ్లీ లివింగ్పై శిక్షణ ఇస్తున్నారు. ఆమె పేరు అక్కిన భవానీ.పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం చినతాడేపల్లి భవాని స్వగ్రామం. అమెరికాలో పెద్ద జీతంతో కూడిన సాఫ్ట్వేర్ ఉద్యోగం 17 ఏళ్లకు పైగా చేశారు. తాను పుట్టిన గడ్డ మీద ఆహార, ఆరోగ్య, పర్యావరణ సంక్షోభాన్ని గుర్తించి, ఉద్యోగానికి రాజీనామా చేశారు. మితిమీరిన రసాయనాలతో ఆహారోత్పత్తి చేయటం, ప్లాస్టిక్ వాడకం, అపసవ్యమైన జీవన శైలి మూల కారణాలని గుర్తించారు. అమెరికాలో ఉండగానే ఆమె యోగా నేర్చుకున్నారు. ప్రకృతికి అనుగుణమైన సాధారణ జీవన శైలిని అలవర్చుకున్నారు. మనకు, భూమికి శాశ్వత ప్రయోజనాన్ని కలిగించే పర్మాకల్చర్ వ్యవసాయ పద్ధతిని నేర్చుకున్నారు. గత 50 ఏళ్లుగా పర్మాకల్చర్ను ఆచరిస్తున్న వాషింగ్టన్ (అమెరికా)కు చెందిన మైఖేల్ పిలార్సి్క వద్ద శిక్షణ పొందారు. అనేక దేశాలు పర్యటించి ప్రకృతి వనరుల పరిరక్షణ పద్ధతుల్ని భవాని అధ్యయనం చేయటం విశేషం. భూమి, నీరు, గాలి, అడవి, భూమిపైన జీవరాశిని పరిరక్షించుకోవటం ద్వారా మనిషి ఆరోగ్యంగా జీవించవచ్చని.. ప్లాస్టిక్, రసాయన రహిత ఆరోగ్యదాయకమైన జీవన శైలి, యోగా, ప్రకృతి సేద్యం ఇందుకు దోహదపడతాయని భవాని మనసా వాచా కర్మణా నమ్ముతున్నారు. రసాయనాల్లేని ఆహారోత్పత్తితో పాటు యోగా తదితర కార్యకలాపాల ద్వారా.. శారీరకంగా/ మానసికంగా/ఆధ్యాత్మికంగా ఆరోగ్యదాయకమైన జీవనశైలిని అనుసరించటం అవసరమని నమ్ముతున్నారు. ఈ భావాలను తమ గ్రామం కేంద్రంగా ప్రచారం చేయటమే జీవిత లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం వర్క్‌షాపులు, స్టడీ టూర్లు, ఫామ్ విజిట్లు నిర్వహించటంతో పాటు ‘నర్చర్5’ పేరుతో వెబ్‌సైట్‌ను, యూట్యూబ్ ఛానల్‌ను నిర్వహిస్తున్నారు.స్వగ్రామానికి తిరిగి వచ్చిన తర్వాత 2019లో పాలేకర్ పద్ధతిలో వరి సాగుతో ప్రకృతి సేద్యంప్రారంభించారు. తదనంతరం తమ కుటుంబానికి చెందిన 7 ఎకరాల భూమిలో ఫైవ్ లేయర్ మోడల్లో వక్క ప్రధాన పంటగా పండ్లు, కూరగాయలు, ఔషధ మొక్కలను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేపట్టారు. సేంద్రియ పెరటి తోటల సాగు ద్వారా పోషకాహార స్థాయిని పెంపొందించటం.. పండ్ల తొక్కలతో సేంద్రియ ద్రావణాలు తయారు చేసుకొని వినియోగించటం.. గుడ్డ సంచుల వాడకం.. వంటి అంశాలపై గుంటూరు తదితర ప్రాంత పాఠశాలల్లో విద్యార్థులు, టీచర్లకు శిక్షణ ఇస్తున్నారు. కరోనా సమయంలో జిల్లా అధికారులతో కలసి ఆరోగ్యదాయకమైన జీవన శైలి, యోగా తదితరాలపై ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆహారం, ఆదాయం, ఆరోగ్యం అనే ఫార్ములాతో భవానీ ప్రస్తుతం చినతాడేపల్లిలోని ఏడెకరాల ‘పొలంలో ప్రకృతి బడి’ని నిర్మించే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఆదాయం కోసం వక్క సాగు, ఆహారం కోసం వివిధ రకాల మంచి పండ్లు, ఆరోగ్యం కోసం ఔషధ మొక్కలు ఒకే చోట పెంచే ఫుడ్ ఫారెస్ట్‌ను పెంచుతున్నారు. వక్క ప్రధాన పంటగా నాటారు. మొదట అరటి, ఆ తర్వాత పసుపు అంతర పంటలుగా వేశారు. అక్కడక్కడా మామిడి, లిచీ, రాంభోళా వంటి పండ్ల మొక్కలను నాటారు. వక్క చెట్లపైకి పాకించడానికి రెండు రకాల మిరియం పాదులను పెంచుతున్నారు. ఒక మడిని ఔషధ మొక్కల కోసం కేటాయించారు. కుంకుడు, షికాకాయ్ మొక్కలు కూడా నాటారు. ఔషధ మొక్కలతో తల నూనె, పండ్ల పొడి, ఎండిన పూలతో టీ పొడి, పసుపు తదితర ఉత్పత్తులను స్వయంగా తయారు చేసి విక్రయిస్తున్నారు. క్షేత్రంలో మొక్కలన్నిటికీ డ్రిప్ పద్ధతిలో నీటిని అందిస్తున్నారు. పొలం చుట్టూ రక్షణ కోసం వెదురు, వాక్కాయ మొక్కలను నాటారు. మడినే బడిగా మార్చి బాలలు, యువతకు ప్రకృతి పాఠాలు బోధించాలన్నది ఆమె సంకల్పం. నవతరానికి స్ఫూర్తిని కలిగించే వర్కుషాపుల నిర్వాహణ ఆమెకు ఇష్టం. భవానీ కృషిని గుర్తించిన హైద్రాబాద్‌లోని ‘మేనేజ్’ సంస్థ గత ఏడాది ఉమెన్ అగ్రిప్రెన్యూర్ పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది. జీవితానుభవాలతో ‘జర్నీ ఆఫ్ మై మిస్టేక్స్’ అనే పుస్తకం రాస్తున్నానని ఆమె తెలిపారు. – యడ్లపల్లి మురళీకృష్ణ, తాడేపల్లిగూడెం, పశ్చిమగోదావరి జిల్లా -
భీమవరంలో ‘యూత్ పార్లమెంట్’
భీమవరం (ప్రకాశంచౌక్): పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల స్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్–2025 నిర్వహణకు నోడల్ కాలేజీగా భీమవరం డీఎన్నార్ కాలేజీ ఎంపికై ందని కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. సోమవారం కార్యక్రమ వాల్‌పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ రెండు జిల్లాల నుంచి 18 నుంచి 25 ఏళ్లలోపు యువత పాల్గొనవచ్చన్నారు. నమోదు చేసుకున్న వారిలో 150 మందిని స్క్రీనింగ్ చేసి పోటీలు నిర్వహిస్తామని, ప్రతిభ కనబర్చిన 10 మందిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తామని చెప్పారు. ఈనెల 16వ తేదీ రాత్రి 11.59 నిమిషాల వరకు పేర్ల నమోదుకు అవకాశం ఉందన్నారు. మరిన్ని వివరాలకు సెల్ 8179179899, 9441388058 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. డీఎన్నార్ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు ఎస్.అనిల్‌దేవ్, కె.సోమయ్య, ఈ.భరత్ రాజు, పీడీ ఆర్.సతీష్ పాల్గొన్నారు. -
సీనియర్లకు మరోసారీ
సాక్షి, భీమవరం: ఎమ్మెల్సీ పదవిపై గంపెడాసతో ఉన్న జిల్లాలోని కూటమి సీనియర్ నేతలకు చుక్కెదురైంది. ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో వీరికి అవకాశం దక్కలేదు. అధినేత మాటకు కట్టుబడి మిత్రపక్ష అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే తమకు గుర్తింపు లేకుండా పోయిందన్న ఆవేదనలో వారంతా ఉన్నారు. జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను కూటమి సీట్ల సర్దుబాటులో ఆచంట, తణుకు, పాలకొల్లు, ఉండి నియోజకవర్గాలు టీడీపీ, భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెంలలో జనసేన పోటీచేశాయి. దీంతో ఆయా నియోజకవర్గాల్లోని మిగిలిన రెండు పార్టీల నుంచి సీట్లు దక్కని ఆశావహులకు ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవులతో సముచిత స్థానం కల్పిస్తామని చంద్రబాబు, పవన్‌కల్యాణ్ భరోసా ఇచ్చారు. తాడేపల్లిగూడెంలో టీడీపీ నుంచి టికెట్ ఆశించిన వలవల బాబ్జి, నరసాపురంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు మా ధవనాయుడు, ఎన్ఆర్ఐ కొవ్వలి యతిరాజరామ్మోహననాయుడు, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పొ త్తూరి రామరాజు, భీమవరంలో టీడీపీ నేత తోట సీతారామలక్ష్మి, జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు, ఉండి నియోజకవర్గంలో జనసేన ఇన్చార్జి జుత్తుక నాగరాజు, పాలకొల్లులో జనసేన ఇన్చార్జి బోనం చినబాబు తదితర నేతలతో అప్పట్లో సంప్రదింపులు జరిపారు. వీరిలో వలవల బాబ్జి, బండారు మాధవనాయుడు, తోట సీతారామలక్ష్మికి ఎమ్మెల్సీ పదవులు ఇస్తారని అప్పట్లో చంద్రబాబు హామీ ఇచ్చినట్టు చర్చ జరిగింది. మదనపడుతూ.. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాల కోసం ఆయా పార్టీల్లో సీనియర్లు ఎదురుచూస్తున్నారు. అయితే వీ రికి నిరాశే ఎదురైంది. భీమవరానికి చెందిన బీజేపీ సీనియర్ నేత పాకా సత్యనారాయణ గతంలో ఎంపీ టికెట్ ఆశించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ రేసులో ఉన్నారన్న ప్రచారం జరిగింది. అయితే ఆయనకు పదవి రాకపోవడం వెనుక స్థానికంగా పలు శక్తులు పనిచేశాయన్న ప్రచారం జరుగుతోంది. కూటమి అధికారంలోకి వచ్చాక రెండు విడతల్లో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయగా వాటిలోనూ తమ పేర్లు ప్ర స్తావనకు రాకపోవడంతో పలువురు నేతలు అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రతిపక్షంగా ఐదేళ్ల పాటు పార్టీని నెట్టుకుని వస్తే అధికారంలోకి వచ్చాక పదవులను మరొకరు ఎంజాయ్ చేస్తున్నారని సీనియర్లు మదనపడుతున్నట్టు సమాచారం. ఎమ్మెల్యే సీటు త్యాగం చేసిన నేతలకు మొండిచేయి నామినేటెడ్ పోస్టుల భర్తీలోనూ దక్కని అవకాశం -
అంగన్వాడీలపై నిర్బంధం అమానుషం
నరసాపురం: సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజాస్వామ్యయుతంగా ఆందోళనకు వెళుతున్న అంగన్వాడీ కార్యకర్తలను అడ్డుకుని నిర్బంధించడం అమానుషమని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముచ్చర్త త్రిమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం విజయవాడలో మహా ధర్నాకు నరసాపురం నుంచి పెద్దెత్తున బయలుదేరగా ఉదయం 10 గంటలకు రైల్వేస్టేషన్‌కు చేరిన అంగన్వాడీలను పోలీసులు అడ్డగించి, వెనక్కి పంపించేయడం దారుణమన్నారు. దీనిపై ఆగ్రహించిన అంగన్వాడీలు నోటికి నల్లగంతలు కట్టుకుని పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టారు. పాలకొల్లులో.. పాలకొల్లు సెంట్రల్: అంగన్వాడీలను నిర్బంధించడం దారుణమని సీఐటీయూ నాయకుడు జవ్వాది శ్రీనివాసరావు అన్నారు. పాలకొల్లులో పలువురిని ఇళ్ల వద్దే కాకుండా, రైల్వేస్టేషన్ వద్ద సుమారు 100 మంది అంగన్వాడీలను నిర్బంధించడంపై మండిపడ్డారు. అంగన్వాడీలు రైల్వేస్టేషన్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వ చర్యలను ఎండగట్టారు. -
రేపు వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం
సాక్షి, భీమవరం: వైఎస్సార్సీపీ 14వ ఆవిర్భావ దినోత్స వం సందర్భంగా ఈనెల 12న జిల్లాలో ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు సోమవారం తెలిపారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం ఉదయం 9 గంటలకు జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ జెండా ఆవిష్కరణలు ఉంటాయన్నారు. అనంతరం కూటమి ప్రభుత్వ మోసంతో నష్టపోతున్న యువత, విద్యార్థులకు బాసటగా నిలిచేందుకు తలపెట్టిన ‘యువత పోరు’కు జిల్లా నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు భీమవరం చేరుకుంటారని తెలిపారు. ప్రభుత్వ తీరును ఎండగడుతూ భారీ ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకుని నిరసన కార్యక్రమంలో పాల్గొంటామన్నారు. పార్టీ శ్రేణులు ఆయా కార్యక్రమాలను విజయవంతం చేయాలని ప్రసాదరాజు కోరారు. నేడు మున్సిపల్ ఆర్డీ సమీక్ష నరసాపురం: జిల్లాలోని మున్సిపల్ కమిషన ర్లు, అధికారులతో మంగళవారం ఉదయం 10 గంటలకు నరసాపురం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ ఆర్డీ (రాజమండ్రి) సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. నరసాపురం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం, ఆకివీడు మున్సిపల్ అధికారులు పాల్గొంటారని నరసాపురం మున్సిపల్ కమిషనర్ ఎం.అంజయ్య తెలిపారు. ఇంటర్ పరీక్షలకు 96.9 శాతం హాజరు భీమవరం: జిల్లావ్యాప్తంగా సోమవారం 52 కేంద్రాల్లో నిర్వహించిన ఇంటర్మీడియెట్ సెకండియర్ పరీక్షలకు 96.9 శాతం విద్యార్థులు హాజరయ్యారు. జనరల్ పరీక్షలకు 13,598 మందికి 13,228 మంది, ఒకేషనల్ పరీక్షలకు 1,535 మందికి 1,441 మంది హాజరయ్యారని డీఐఈఓ ఎ.నాగేశ్వరరావు తెలిపారు. గోదావరి జిల్లాల్లో ఉప్పునీటి సమస్య సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్రాన్ని పలు ప్రశ్నలు అడగ్గా.. కేంద్ర మంత్రులు రాతపూర్వకంగా సమాధానాలు ఇ చ్చారు సముద్ర తీర ప్రాంతంలోని తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలు ఉప్పు సమస్యను ఎదుర్కొంటున్నట్టు కేంద్ర జల్‌శక్తి సహాయ మంత్రి రాజ్ భూషణ్చౌదరి తెలిపారు. గుజరాత్, ఆంధ్రప్రదేశ్‌లో సముద్ర తీర ప్రాంతాల్లో ఉప్పు చేరడం వలన అక్కడ పర్యావరణం దెబ్బతింటోందని, ఏయే ప్రాంతాలు ఉప్పు సమస్యను ఎదుర్కొంటున్నాయని వైఎస్సార్సీపీ ఎంపీ పరిమళ్ నత్వాని ప్రశ్నకు కేంద్ర మంత్రి రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. 2012–23 వరకు జాతీయ జలాశయ మ్యాపింగ్ అధ్యయనాల్లో ఏపీలో భూగర్భ జలాలపై అధ్యయనం చేసినట్లు తెలిపారు. ఇంటర్ పరీక్షలకు 12,485 మంది హాజరు ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : జిల్లాలోని 55 కేంద్రా ల్లో సోమవారం జరిగిన ఇంటర్ సెకండియర్ పరీక్షలకు 12,826 మందికి 12,485 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 11,022 మంది జనరల్ విద్యార్థులకు 10,809 మంది, 1,804 మంది ఒకేషనల్ విద్యార్థులకు 1,676 మంది హాజరయ్యారని ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.యోహాన్ తెలిపారు. ఓపెన్ పరీక్షలకు.. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) ఇంటర్ పరీక్షలకు సోమవారం 165 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. భౌతిక శాస్త్రం పరీక్షకు 317 మందికి 268 మంది , రాజనీతి శాస్త్రం పరీక్షకు 470 మందికి 354 మంది హాజరయ్యారని డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు. టెన్త్ విద్యార్థులకు ఉచిత ప్రయాణం ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని జిల్లా ప్రజా రవాణా అధికారి ఎన్వీఆర్ వరప్రసాద్ ప్రకటనలో తెలిపారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు డిపోల పరిధిలో ఈనెల 17 నుంచి వచ్చేనెల 1 వరకు విద్యార్థులు హాల్‌టికెట్ చూపించి ప్రయాణించవచ్చని, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో అనుమతిస్తారని పేర్కొన్నారు. -
యువత జీవితాలతో కూటమి చెలగాటం
తాడేపల్లిగూడెం అర్బన్: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయకపోవడంతో నిరుద్యోగులు, యువత, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. తాడేపల్లిగూడెంలో క్యాంపు కార్యాలయంలో ఈనెల 12న వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టనున్న యువత పోరు పోస్టర్లను సోమవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్, విద్యాదీవెన పథకాలకు ప్రభుత్వం రూ.4,600 కోట్లు విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి అమలు చేయాలని, నూతన మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ నిలిపివేయాలని కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రాలు అందిస్తామన్నారు. దివంగత సీఎం వైఎస్సార్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టగా మాజీ సీఎం జగన్ సమర్థవంతంగా అమలు చేశారన్నారు. 2024 డిసెంబరులో విద్యార్థులకు రూ.7,500 కోట్లు సిద్ధం చేయగా ఎన్నికల కోడ్ కారణంగా పంపిణీ చేయకుండా చంద్రబాబు అడ్డుకున్నారని విమర్శించారు. సూపర్‌సిక్స్‌లో భాగంగా నిరుద్యోగ భృతి కింద రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగులకు రూ.7,600 కోట్లు ఇవ్వాల్సి ఉండగా బడ్జెట్లో ఆ ఊసే లేదన్నారు. తల్లికి వందనం కింద రూ.12,500 కోట్లు అందించాల్సి ఉండగా బడ్జెట్లో రూ.8,500 కోట్లు కేటాయించడం సరికాదన్నారు. జగన్ ప్రభుత్వంలో 17 వైద్య కళాశాలలు ప్రారంభించేందుకు రూ.8 వేల కోట్లు కేటాయించారన్నారు. ఈ మేరకు రాష్ట్రానికి వచ్చిన 2,550 మెడికల్ సీట్ల కోటాను కూటమి ప్రభుత్వం అవసరం లేదని లేఖలు రాయడం స్వార్థ రాజకీయాలకు అద్దం పడుతుందన్నారు. నియోజకవర్గంలో అసాంఘిక కార్యక్రమాలు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ప్రస్తుత ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులు, బంధువులు ప్రభుత్వ అనుమతులు, లైసెన్సులు లేకుండా దాబాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. పలు ప్రాంతాల్లో పేకాట స్థావరాలు యథేచ్ఛగా సాగుతున్నాయన్నారు. పార్టీ నేతలు కర్రి భాస్కరరావు, బండారు నాగు, ముప్పిడి సంపత్‌కుమార్, చెన్నా జనార్దన్, భాస్కరరెడ్డి, జిడ్డు హరిబాబు, కళ్లేపల్లి కృష్ణంరాజు, వీరకుమార్, సూర్పని రామకృష్ణ, వెలిశెట్టి నరేంద్రకుమార్, అరిగెల అభి పాల్గొన్నారు. మాజీ మంత్రులు కారుమూరి, కొట్టు 12న వైఎస్సార్సీపీ యువత పోరుకు సిద్ధం కూటమివి వంచన మాటలు తణుకు అర్బన్: అబద్ధం, వంచన, మోసపూరిత మాటలతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం విద్యార్థులు, యువత, నిరుద్యోగుల భవిష్యత్తును ముళ్లబాటగా మారుస్తుందని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు విమర్శించారు. తణుకులోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయకుండా పేద విద్యార్థులకు చదువును దూరం చేస్తున్నారన్నారు. దివంగత వైఎస్సార్ స్ఫూర్తితో మాజీ సీఎం జగన్ పేదల చదువులకు పెద్దపీట వేశారన్నారు. అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతిదీవెన పథకాలతోపాటు నాడు–నేడుతో పాఠశాలల అభివృద్ధి చేశారని గుర్తుచేశారు. అయితే సీఎం చంద్రబాబు వీటన్నింటినీ తుంగలో తొక్కి పేదలకు విద్యను దూరం చేస్తున్నారని విమర్శించారు. నీకు రూ.15 వేలు.. నీకు రూ.15 వేలు అన్న మంత్రి నిమ్మల రామానాయుడు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. జగన్ ప్రభుత్వంలో తీసుకు వచ్చిన వైద్య కళాశాలలను ప్రైవేట్‌పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. యువత పోరుకు తరలిరండి ఈనెల 12న కలెక్టరేట్ల వద్ద తలపెట్టిన వైఎస్సార్ సీపీ యువత పోరు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కారుమూరి కోరారు. అనంతరం యువత పోరు పోస్టర్లు ఆవిష్కరించారు. పార్టీ లీగల్ సెల్ సభ్యుడు వెలగల సాయిబాబారెడ్డి, పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పొట్ల సురేష్, పట్టణ మహిళాధ్యక్షురాలు నూకల కనకదుర్గ పాల్గొన్నారు. -
ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలి
తాడేపల్లిగూడెం (టీఓసీ): ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన నిధులు తక్షణమే విడుదల చేయాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చీకటిమిల్లి మంగరాజు డిమాండ్ చేశారు. స్థానిక హౌసింగ్‌బోర్డు కాలనీలో సోమవారం జరిగిన సమావేశంలో మంగరాజు మట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారని ఇంతవరకూ ఇవ్వలేదన్నారు. 20 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడానికి తగు చర్యలు చేపట్టాలన్నారు. మోగా డీఎస్సీ తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 12న నిరుద్యోగుల కోసం, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం వైఎస్ఆర్సీపీ తలపెట్టిన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ధర్నాకు మాల మహానాడు పూర్తి మద్దతు ప్రకటిస్తుందని చెప్పారు. -
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల నమోదు
భీమవరం: భీమవరం టూటౌన్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిపై పోలీసులు కొరడా ఝులిపించారు. టూటౌన్ సీఐ జి.కాళీచరణ్ నేతృత్వంలో ఈ నెల 9న రాత్రి టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అంబేడ్కర్ సెంటర్, పద్మాలయ థియేటర్ ప్రాంతాల్లో మద్యం తాగి బైక్ నడుపుతున్న అయిదుగురిని అరెస్టు చేసి భీమవరం స్పెషల్ జ్యూడిషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ముందు హాజరు పర్చగా ఒక్కొక్కరికి రూ.10 వేల జరిమానా విధించారు. టూటౌన్ పరిధిలోని ఏడుగురిని న్యాయమూర్తి ముందు హాజరుపర్చగా వారికి జరిమానా విధించినట్లు సీఐ కాళీచరణ్ చెప్పారు. ఉండి పోలీసు స్టేషన్ పరిధిలో.. ఉండి: ఉండి పోలీస్‌స్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనం నడిపిన ఇద్దరికి రూ.20 వేల జరిమానా విధించారు. ఇటీవల ఎస్సై ఎండీ నసీరుల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమంలో పట్టుబడిన ఇద్దరు వాహనదారులపై కేసులు నమోదు చేసి భీమవరం స్పెషల్ కోర్టుకు హాజరుపర్చారు. రూ.10 వేల చొప్పున జరిమానా విధించారు. -
బాబు వచ్చే.. జాబు రాదే?
●జాబ్ క్యాలెండర్ ఊసే లేదు జనవరిలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని నారా లోకేష్ యువ గళం పాదయాత్రలో ఆర్భాటంగా ప్రకటించారు. ఎన్నికల్లో సైతం హామీలు ఇచ్చారు. అయితే ఇప్పటివరకూ జాబ్ క్యాలెండర్ ఊసే ఎత్తడం లేదు. నిరుద్యోగ భృతి సైతం మరిచిపోయారు. నిరుద్యోగులను కూటమి ప్రభుత్వం మోసం చేసింది. –సుంకర సీతారాం, కొడమంచిలి నిరుద్యోగ భృతి ఎప్పుడో? సూపర్ సిక్స్‌లో భాగంగా నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేలు ఇస్తామన్నారు. ఈ పథకాన్ని ఇప్పటివరకూ అమలు చేయలేదు. చదువులు చదివి ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్నాం. కుటుంబ భారం పెరుగుతోంది. కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి అందించి నిరుద్యోగులను ఆదుకోవాలి. ఆ దిశగా ప్రభుత్వం ముందు అడుగు వేయాలి. – ఎ.త్రినాథ్, నిరుద్యోగి, తాడేపల్లిగూడెం యువతకు మోసం చంద్రబాబు 2014 ఎన్నికల్లోనూ నిరుద్యోగ భృతి అంటూ మోసం చేశారు. మరలా గత ఎన్నికల్లోనూ ఈ హామీ ఇచ్చారు. సూపర్‌సిక్స్ హామీలతో అధికారం చేపట్టి తొమ్మిది నెలలు గడిచినా ఇప్పటివరకూ నిరుద్యోగ భృతి ప్రస్తావన లేదు. ఇలా మోసపూరిత వాగ్దానాలతో యువతను మోసం చేయడం సమంజసం కాదు. –పాలపర్తి సందీప్, ఏనుగువానిలంకసాక్షి, భీమవరం: జిల్లాలో దాదాపు ఎనిమిది ఇంజినీరింగ్ కళాశాలలు, 55 వరకు డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్, వృత్తివిద్యా కోర్సుల కళాశాలలు ఉన్నాయి. వేలాది మంది విద్యార్థులు వీటిలో చదువుకుంటున్నారు. ఇప్పటికే డిగ్రీ, ఇంజినీరింగ్ పూర్తిచేసి డీఎస్సీ, గ్రూపు పరీక్షలు, పోలీస్ రిక్రూట్మెంట్, ఏపీపీఎస్సీ తదితర కొలువుల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు వేలల్లో ఉన్నారు. తమ బిడ్డల భవిష్యత్తు కోసం అయినకాడికి అప్పులు చేసి కోచింగ్ సెంటర్లలో శిక్షణ ఇప్పిస్తున్న తల్లిదండ్రులు ఎందరో. ఉన్నత చదువులు చదివి కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అరకొర జీతంపై స్థానికంగా, ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి వ్యాపార, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. వీరిలో ఎంతోమంది తమ చదువుకు తగ్గ ఉద్యోగం కోసం చూస్తున్నారు. హామీల ఊసే లేదు కూటమి అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్, నిరుద్యోగభృతి హామీలను ప్రభుత్వం విస్మరించింది. ఈ పథకం అమలుకు వార్షిక బడ్జెట్లో కేటాయింపులు చేయకపోవడం గమనార్హం. 16 వేల పోస్టులతో డీఎస్సీ ప్రకటించినా షెడ్యూల్ విడుదల చేయకుండా విద్యాసంవత్సరం కాలయాపన చేసేశారు. 20 లక్షల ఉద్యోగాల ఊసే ఎత్తడం లేదు. రోడ్డున పడేసి.. ఉన్న జాబులు పీకేసి.. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న వాటిని తొలగించే పనిలో కూటమి ప్రభుత్వం ఉంది. వలంటీర్ల జీతం రూ.10 వేలు చేస్తామని చెప్పి వారిని విధుల్లోకి తీసుకోకుండా పక్కన పెట్టేయ్యడంతో జిల్లాలో 9,547 మంది వలంటీర్లు సేవలకు దూరమయ్యారు. ప్రైవేట్ మద్యం పాలసీతో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసిన 893 మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది రోడ్డున పడ్డారు. కక్ష సాధింపుల్లో భాగంగా పలువురు ఔట్ సోర్సింగ్ సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్లపై వేటు వేశారు. రూ.158.8 కోట్ల మేర బకాయిలు పాత బకాయిలు, ప్రస్తుత విద్యాసంవత్సరానికి గాను జిల్లాలోని 31,412 మంది విద్యార్థులకు సంబంధించి సుమారు రూ.158.8 కోట్ల మేర విద్య, వసతి దీవెన పథకాల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఆయా పథకాల పేర్లు మార్చిన ప్రభుత్వం నిధులివ్వక కళాశాలలకు ఫీజులు చెల్లించేందుకు తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో భరోసా గత వైఎస్సార్సీపీ నిరుద్యోగులు, విద్యార్థులకు అండగా నిలిచింది. అమ్మఒడి పథకం ద్వారా ఐదేళ్లలో జిల్లాలోని 1,48,342 మంది తల్లుల ఖాతాలకు రూ.887.9 కోట్లు జమ చేశారు. జిల్లాలోని 1,77,996 మంది విద్యార్థులకు జగనన్న విద్యాదీవెన పథకం కింద రూ.485.33 కోట్లు, వసతి దీవెన పథకం కింద 1,76,142 మందికి రూ.163.41 కోట్లు సాయం అందించింది. నిర్ణీత సమయంలో ప్రభుత్వం ఫీజులు అందించడంతో తల్లిదండ్రులు నిశ్చింతగా ఉండేవారు. కూటమి దగా జవవరి 1నే జాబ్ క్యాలెండర్ 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు హామీ పది నెలల్లో ఒక్క జాబూ ఇవ్వలేదంటున్న నిరుద్యోగులు ఉద్యోగాల కోసం వేలాది మంది ఎదురుచూపులు వలంటీర్లు, చిరుద్యోగుల పొట్టగొట్టిన కూటమి సర్కారు నిరుద్యోగులకు బాసటగా రేపు వైఎస్సార్సీపీ ‘యువత పోరు’ జాబు కావాలంటే బాబు రావాలన్నారు. ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. పరిశ్రమలు తెస్తామన్నారు. వర్క్ ఫ్రం హోం కోసం హైటెక్ టవర్లు కడతామన్నారు. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు నిరుద్యోగభృతి ఇస్తామంటూ చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లు ఎడాపెడా హామీలిచ్చేశారు. తల్లికి వందనం అన్నారు. పది నెలల పాలనలో కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న వాటిని తొలగిస్తున్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ యువత, విద్యార్థుల పక్షాన 12వ తేదీన వైఎస్సార్ సీపీ ‘యువత పోరు’ నిర్వహించనుంది. రేపు వైఎస్సార్సీపీ ‘యువత పోరు’ యువత, విద్యార్థులను కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ఎండగడుతూ వారి పక్షాన బుధవారం ‘యువత పోరు’ నిర్వహించేందుకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల హామీలను అమలుచేయాలని డిమాండ్ చేస్తూ యువత, విద్యార్థులతో కలిసి భీమవరంలోని కలెక్టరేట్‌కు పార్టీ శ్రేణులు భారీ ర్యాలీగా తరలివెళ్లి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయనున్నారు. నిరుద్యోగ భృతి ఎప్పుడుఉద్యోగాల మాటేంటి? -
పెద్దింట్లమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు
కై కలూరు: కొల్లేటికోట పెద్దింట్లమ్మ జాతరలో ప్రధాన ఘట్టమైన జలదుర్గా, గోకర్ణేశ్వరస్వామి కల్యాణోత్సవానికి సోమవారం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఈ నెల 1 నుంచి 13 వరకు జాతర నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి జరిగిన కల్యాణానికి దేవస్థానం తరఫున ఈవో కూచిపూడి శ్రీనివాసు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందించారు. ఆలయ ప్రధాన అర్చకుడు పేటేటి పరమేశ్వర శర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, పంచహారతులు అందించారు. పెద్దింట్లమ్మకు వస్త్ర, పుష్పాలంకరణ, ఉచిత ప్రసాద దాతలుగా భుజబలపట్నం గ్రామానికి చెందిన గొట్టుముక్కల ప్రసాదరాజు, ముదునూరి జానకీ సుబ్బరాజు, తాడిపూడికి చెందిన కూసంపూడి రామకృష్ణంరాజు, కై కలూరుకు చెందిన కలిదిండి సూర్యనారాయణవర్మ వ్యహరించారు. అమ్మవారికి భక్తులు వేడి నైవేద్యాలు, పాల పొంగళ్లు సమర్పించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. శక్తి వేషాలు, గరగ డప్పుల నృత్యాలు, కేరళ చండా మేళం, తీన్మార్ డప్పులు ఆకట్టుకున్నాయి. జాతరలో ఎలాంటి ఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఐ వి.రవికుమార్, రూరల్ ఎస్ఐ వి.రాంబాబుల ఆధ్వర్యంలో 120 మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వహించారు. పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాల సమర్పణ -
కోకోకు మద్దతు ధర ఇవ్వాలి
ఏలూరు (టూటౌన్): కోకో గింజల కొనుగోలు సమస్యను పరిష్కరించాలని, కిలో కోకో గింజలకు రూ.900 ధర కల్పించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో గుంటూరులోని రాష్ట్ర ఉద్యాన శాఖ కార్యాలయం ముందు కోకో రైతులు సోమవారం ధర్నా నిర్వహించారు. ఉద్యాన శాఖ రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ సీవీ హరినాథ్ రెడ్డికి రైతులు వినతిపత్రం అందజేశారు. రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె. శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం నాయకులు బొల్లు రామకృష్ణ, జె.కాశీ బాబు, కోనేరు సతీష్ బాబు, బోళ్ళ వెంకట సుబ్బారావు మాట్లాడుతూ.. కోకో గింజల కొనుగోలు సమస్యను వెంటనే పరిష్కరించకపోతే కోకో రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. కంపెనీలు విదేశాల నుంచి కోకో గింజలు దిగుమతి చేసుకున్నామని రైతులను బెదిరిస్తూ సిండికేట్‌గా మారి కోకో గింజల ధరను తగ్గించి వేస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేయడం తగదన్నారు. అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం కోకో గింజలకు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని కోరారు. కోకో గింజల కొనుగోలు కంపెనీలతో రైతుల సమక్షంలో చర్చలు జరిపి కిలో కోకో గింజలకు రూ. 900 ధర కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యపై ఉద్యాన శాఖ రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ కోకో గింజల కొనుగోలు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కోకో ప్రాసెసింగ్ యూనిట్స్ నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ పథకాలు అమలు చేస్తుందని వివరించారు. -
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
పాలకొల్లు సెంట్రల్: రొయ్యల చెరువుల వద్ద విద్యుత్ షాక్‌కు గురై వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. రూరల్ ఎస్సై బి.సురేంద్రకుమార్ తెలిపిన వివరాలు ప్రకారం మండలంలోని తిల్లపూడి గ్రామానికి చెందిన నడపన శ్రీనివాస్ (44) సోమవారం ఉదయం చెరువుల వద్దకు పనికి వెళ్లాడు. మోటర్‌కు ఉన్న విద్యుత్ వైర్లను గమనించకపోవడంతో ఆ వైర్లు తగిలి శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటుంబ పోషణకు అతనే ఆధారం. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేంద్ర తెలిపారు. -
పోలవరం నిర్వాసితుల ధర్నా
పోలవరం రూరల్: 18 ఏళ్లు నిండిన యువతకు, మహిళ వివాహితులకు కూడా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వర్తింప చేయాలని ఆదివాసి మహాసభ అధ్యక్షుడు మిడియం వెంకటస్వామి, అడ్వకేట్ బాబ్జీ డిమాండ్ చేశారు. సోమవారం పోలవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద మండలంలోని కోండ్రుకోట, కోరుటూరు, తూటిగుంట పంచాయతీలకు చెందిన మహిళలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మిడియం వెంకటస్వామి, అడ్వకేట్ బాబ్జీ మాట్లాడుతూ మండలంలో మొత్తం 29 గ్రామాలు పోలవరం ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్నాయన్నారు. ఎగువ ఏజెన్సీలో 19 గిరిజన గ్రామాల నిర్వాసితులు ప్యాకేజీలు ఇవ్వకపోయినప్పటికీ గోదావరి వరదలకు భయపడి 2022లో గ్రామాన్ని ఖాళీ చేసి పునరావాస గ్రామాలకు తరలి వెళ్లారన్నారు. కటాఫ్ డేట్ పేరుతో నిర్వాసితుల పేర్లు తొలగించి, అసలు నిర్వాసితులు కాని వారికి, నిర్వాసిత గ్రామాలతో సంబంధం లేని వారి పేర్లు నమోదు చేసి ఇష్టారాజ్యంగా ప్యాకేజీలను ధారాదత్తం చేశారని ఆరోపించారు. ఇప్పటికై నా అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వివాహం అయిన పురుషులకు ప్యాకేజీ ఇచ్చినట్లు సీ్త్రలకు ఇవ్వాలన్నారు. అనంతరం పోలవరం తహసిల్దార్ సాయిరాజుకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో తెలిపేటి మహేశ్వరి, పుట్టి సృజన, కొనుతుల మహేశ్వరి, అరగంటి అఖిల, తొర్లపాటి లక్ష్మి, మాడే అలేఖ్య, తెలిపేటి సందీప్ రెడ్డి, ఆకుల మౌనిక, నిర్వాసిత మహిళలు పాల్గొన్నారు. -
అర్జీలు నాణ్యతతో పరిష్కరించాలి
భీమవరం (ప్రకాశంచౌక్): ప్రజలు అందజేసిన అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఇతర అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీలను పెండింగ్ లేకుండా త్వరితగతిన పరిష్కరించాలని తహసీల్దార్లను ఆదేశించారు. ప్రతి అర్జీని పరిశీలించి ఎండార్స్మెంట్ ఇవ్వాలన్నారు. సంబంధిత ఆర్డీఓలు వారి పరిధిలోని మండలాలలో పర్యటించి ఎండార్స్మెంట్లను పరిశీలించాలని ఆదేశించారు. ఫిర్యాదుదారుల నుంచి 367 అర్జీలు స్వీకరించామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో డీఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, వార్డు సచివాలయం అధికారి వై.దోసి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సైబర్ మోసంపై కేసు నమోదు ఉంగుటూరు: నారాయణపురంలోని ఒక షాపులో యువకుడు ఫోన్ పే పేరుతో రూ. 98 వేలు తన ఖాతాలోకి మళ్లించుకున్న ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 2,800 బిల్లు చేసిన ఆ యువకుడు ఫోన్ పే చేస్తానని చెప్పి షాపు యజమాని ఫోను రూ.1 ఫోన్ పే చేయమన్నాడు. యజమాని రూపాయి ఫోన్ పే చేశాడు. ఆ యువకుడు ఇప్పుడే వస్తానని బయటకు వెళ్ళాడు. వెంటనే షాపు ఓనరు బ్యాంకు ఖాతా నుంచి రూ.98 వేలు డెబిట్ అయినట్లు ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. మోసపోయినట్లు గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చిన వెంకన్న సేవలో హైకోర్టు న్యాయమూర్తి ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.గోపాల కృష్ణారావు సోమవారం సందర్శించారు. సతీసమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు ముందుగా దేవస్థానం అధికారులు, అర్చకులు తూర్పురాజగోపురం వద్ద పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో న్యాయమూర్తికి అర్చకులు, పండితులు శ్రీవారి శేష వస్త్రాన్ని కప్పి, వేద ఆశీర్వచనాన్ని పలుకగా, ఆలయ డీఈఓ బాబురావు స్వామివారి మెమెంటో, ప్రసాదాలు అందజేశారు. రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి భీమవరం: భీమవరం ఒకటో పట్టణం విస్సాకోడేరు వంతెన సమీపంలో లారీ ఢీకొనడంతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న మహిళ మృతి చెందిందని పోలీసులు తెలిపారు. మృతురాలిని పాలకొల్లు వాసిగా గుర్తించామన్నారు. బంగారం, వెండి చోరీ ఆగిరిపల్లి: ఇంటి తాళం పగులగొట్టి దొంగలు బంగారం, వెండి, నగదు చోరీ చేశారు. ఆగిరిపల్లి గౌడ బజార్‌కు చెందిన పల్లగాని రాంబాబు కుటుంబ సభ్యులు సోమవారం ఉదయం బంధువుల ఇంటికి వెళ్లారు. మధ్యాహ్నం ఇంటికి తిరిగి రాగా తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న 40 తులాల వెండి, నాలుగు బంగారం ఉంగరాలు, రూ.3,500 నగదు చోరీ చేశారు. -
ప్రజా ఫిర్యాదులు తక్షణం పరిష్కరించాలి
భీమవరం: భీమవరం జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 16 మంది నుంచి వినతులు స్వీకరించారు. బాధితుల సమస్యలను నిశితంగా తెలుసుకుని వాటిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి చట్టపరిధిలో పరిష్కారం అందిస్తామని బాధితులకు భరోసా ఇచ్చారు. కుటుంబ తగాదాలు, సైబర్ మోసాలు, తల్లిదండ్రులు, అత్తారింటి వేధింపులు, ఆస్తి వివాదాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీలు, ఆన్లైన్ మోసం వంటి సమస్యలపై ఫిర్యాదు చేయగా సంబంధిత పోలీసు స్టేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడి ఫిర్యాదు అంశాలను పరిశీలించి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. -
సమగ్ర శిక్ష ఉద్యోగుల పోరుబాట
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): విద్యా రంగ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మొండిచేయి చూపుతోంది. రెగ్యులర్ ఉద్యోగుల కంటే అధిక సమయం విధులు నిర్వహిస్తున్న వారి సేవలను ప్రభుత్వం గుర్తించడం లేదని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత ప్రభుత్వ హయాంలో సమ్మె చేశారు. దీంతో అప్పటి ప్రభుత్వం వారి కోర్కెలను తీర్చడానికి ముందుకువచ్చింది. సమ్మె కాలంలో ఉద్యోగ సంఘాలతో ఒప్పందం చేసింది. సమ్మె ఒప్పందాలు విస్మరించిన ప్రభుత్వం సమగ్ర శిక్ష ఉద్యోగులు నిర్వహించిన సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం ఆ ఉద్యోగ సంఘంతో కొన్ని ఒప్పందాలు చేసింది. సమగ్ర శిక్షలోని 7 విభాగాల ఉద్యోగుల వేతనాన్ని 23 శాతానికి పెంచుతూ ఒప్పందం చేయడంతో పాటు అమలు కూడా ప్రారంభించింది. ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) అమలు చేయడానికి కార్యనిర్వాహక కమిటీ ఎదుట ప్రతిపాదనలు ఉంచింది. ఉద్యోగుల జాబ్ చార్ట్‌ల కోసం కమిటీ ఏర్పాటుకు ఒప్పందం, కారుణ్య నియామకాలు చేపట్టడానికి ఒప్పందం, ప్రతీ నెల 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి అంగీకారం వంటి ఒప్పందాలను చేశారు. గత ప్రభుత్వం చేసిన ఒప్పందాల్లో కొన్ని ఆ ప్రభుత్వ హయాంలోనే అమలు చేయగా మరికొన్ని ఒప్పందాలను అమలు చేయడానికి ఏర్పాటు చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సమగ్రశిక్ష ఉద్యోగులను పూర్తిగా విస్మరించింది. ఉమ్మడి పశ్చిమలో 1500 మంది ఉద్యోగులు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో సమగ్రశిక్షలో 7 విభాగాల ఉద్యోగులు దశాబ్దాలుగా పని చేస్తున్నారు. మొత్తం మీద సుమారు 1500 మంది ఉద్యోగులు ఆయా విభాగాల్లో కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో పాఠశాలల అభివృద్ధికి కావా ల్సిన నిధులు అంచనా వేసి ప్రతిపాదనలు సిద్ధం చేయడం, విద్యార్థుల యూనిఫారం, షూ కొలతలు సేకరించి అంచనాలు సిద్ధం చేయడం, స్కూల్ బ్యాగ్‌లు పంపిణీ, పార్ట్ టైమ్ శిక్షకులుగా పూర్తిస్థాయిలో విధులు నిర్వహించడం ఇలా జిల్లాలో విద్యారంగం అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఇచ్చిన హామీ ఏమైంది? తమతో చేసుకున్న అన్ని ఒప్పందాలను అమలు చేయాలని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అడిగి అడిగి వేసారి పోయారు. తాము పోరాడి సాధించుకున్న హక్కులను అమలు చేసుకోవడానికి మరోసారి ఉద్యమించాల్సిన పరిస్థితి రావడం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో తాము చేసిన పోరాటాల సమయంలో తమ శిబిరాలకు వచ్చి మరీ మద్దతుగా నిలిచి, అప్పటి ప్రభుత్వంపై విమర్శలు చేసిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చిన తరువాత పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల డిమాండ్లు సముచితమైనవేనని, తాము అధికారంలోకి వస్తే వారి డిమాండ్లు అన్నీ నెరవేర్చుతామని కూటమి నేతలు హామీలు ఇచ్చారు. ఇదంతా కేవలం అప్పటి ప్రభుత్వంపై బురద చల్లడానికి తమ శిబిరాలను వినియోగించుకోవడానికి మాత్రమేనని, తమపై ప్రేమతో కాదని ఇప్పుడు అర్థం అవుతోందని చెబుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని గెలిపించుకుని ఉండి ఉంటే తమకు ఈ తిప్పలు తప్పేవని ఆయా ఉద్యోగులు అభిప్రాయ పడుతున్నారు. సమ్మె ఒప్పందాలు అమలు చేయకపోవడంపై ఆగ్రహం నిరసన దీక్షకు తరలి రావాలి సమ్మె ఒప్పందాలను అమలు చేయాలనే డిమాండ్‌తో ఈ నెల 11న విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద నిర్వహిస్తున్న నిరసన దీక్షకు ఉద్యోగులంతా తరలిరావాలి. ప్రతీ నెలా 1వ తేదీనే జీతాలు విడుదల చేయాలి. మినిమం టైమ్‌స్కేల్ అమలు చేయాలి. పదవీ విరమణ వయసును 62 సంవత్సరాలకు పెంచాలి. సమగ్రశిక్ష ప్రాజెక్టు ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలి. వాసా శ్రీనివాసరావు, పార్ట్‌టైమ్ ఇన్స్ట్రక్టర్స్ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలి సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించే హెచ్ఆర్ పాలసీని ఒప్పందం మేరకు కచ్చితంగా అమలు చేయాలి. ప్రస్తుతం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించేందుకు మార్గం సుగమం చేస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన జీఓ నెంబర్ –2ను తక్షణమే ఉపసంహరించుకోవాలి. ఎన్నికల సందర్భంగా కూటమి పార్టీలు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలి. కే వినోద్ కుమార్, సమగ్ర శిక్ష ఉద్యోగుల జేఏసీ జిల్లా అధ్యక్షుడు -
లోక్ అదాలత్‌తో సత్వర పరిష్కారం
ఏలూరు (టూటౌన్): కేసుల సత్వర పరిష్కారానికి కక్షిదారులు లోక్ అదాలత్ సేవలు వినియోగించుకోవాలని హైకోర్టు జడ్జి, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ న్యాయమూర్తి జస్టిస్ కె.మన్మథ రావు అన్నారు. స్థానిక జిల్లా కోర్టు ఆవరణలోని జిల్లా న్యాయసేవా సదన్‌లో శనివారం జాతీయ లోక్ అదాలత్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్ అదాలత్‌పై కక్షిదారుల ఆలోచనా విధానంలో మార్పులు రావాలని, ఒకసారి పరిష్కారమైన కేసులను మరలా హైకోర్టులో ఫైల్ చేస్తున్నారన్నారు. లోక్ అదాలత్‌లపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా కోర్టుల్లో శాశ్వత లోక్‌అదాలత్‌లు నిర్వహిస్తున్నామని చెప్పారు. అనంతరం లోక్ అదాలత్‌లో పరిష్కారమైన కేసులో బీమా సంస్థ నుంచి రూ.26 లక్షల పరిహారం చె క్కును జస్టిస్ మన్మధరావు కక్షిదారులకు అందించా రు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి (ఎఫ్ఏసీ) ఎం.సునీల్‌కుమార్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్, రెండో అదనపు జిల్లా జడ్జి పి.మంగాకుమారి, పోక్సో స్పెషల్ జడ్జి ఎస్.ఉమా సునంద, ఐదో అదనపు జిల్లా జడ్జి జి.రాజేశ్వరి, 7వ అదనపు జిల్లా జడ్జి ఎం.రామకృష్ణంరాజు, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కేకేవీ బులికృష్ణ తదితరులు పాల్గొన్నారు. 5,368 కేసుల రాజీ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జరిగిన లోక్ అదాలత్‌లో 5,368 కేసులు రాజీ చేసినట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ తెలిపారు. 155 సివిల్, 132 వాహన ప్రమాద బీమా, 4,919 క్రిమినల్, 132 ఫ్రీ లిటిగేషన్ కేసులు ఉన్నాయన్నారు. -
ప్రగతి పథమే మహిళా శక్తికి నిదర్శనం
కలెక్టర్ నాగరాణి భీమవరం(ప్రకాశం చౌక్): అన్ని రంగాల్లో మహిళలు ప్రగతి పథంలో పయనించడమే మహిళా శక్తికి నిదర్శనమని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. శనివారం భీమవరం కాస్మోపాలిటిన్ క్లబ్ ఆడిటోరియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళ విద్యావంతురాలు అయితే ఆ కుటుంబంతో పాటు సమాజం, దేశం అభివృద్ధి చెందుతాయ న్నారు. ప్రతిఒక్కరి విజయం వెనుక సీ్త్ర శక్తి ఉంటుందన్నారు. మహిళా దినోత్సవాన్ని జిల్లాలో ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. భారతీయ విద్యాభవన్స్, విష్ణు కళాశాల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. డీఆర్డ్డీఏ, మెప్మా, ఐసీడీఎస్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ స్టాల్స్ ప్రదర్శనను కలెక్టర్ పరిశీలించి అభినందించారు. భీమవరం ఎమ్మెల్యే, పీఏసీ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, ఏఎస్సీపీసీ చైర్మన్ పీతల సుజాత, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు అరుణకుమారి, ట్రైనీ డీఎస్పీకె.మానస, డీఆర్వో మొగిలి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
నీటి కష్టాలకు చెక్
తాడేపల్లిగూడెం (టీఓసీ): తాడేపల్లిగూడెంలో తాగునీటి సమస్యపై ‘ప్రజల నీటి కష్టాలు!’ శీర్షికన శని వారం ‘సాక్షి’లో ప్ర చురించిన కథనానికి మున్సిపల్ అధికారులు స్పందించారు. కుళాయిలు వస్తున్న సమయంలో విద్యు త్ సరఫరా ఉండటంతో మోటార్ల ద్వారా కొందరు అక్రమంగా నీటిని తోడుతున్నారని, దీంతో పలు ప్రాంతాలకు కుళాయి నీరు రావడం లేదని మహిళలు ఆందోళన చెందుతున్నారు. ‘సాక్షి’ కథనంపై స్పందించిన మున్సిపల్ కమిషనర్, విద్యుత్ శాఖ అధికారులు కుళాయిలు వచ్చే సమయంలో ఉదయం, సాయంత్రం అరగంట సేపు విద్యుత్ సరఫరా నిలిపివేసేలా చర్యలు తీసుకున్నారు. దీంతో మూడు రోజులుగా తాగునీటి సమస్య ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో కుళాయిల ద్వారా నీరందింది. వైఎస్సార్సీపీ అనుబంధ కమిటీల్లో నియామకాలు భీమవరం(ప్రకాశం చౌక్): వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా నేతలను రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల్లో వివిధ హాదాల్లో నియమిస్తూ శనివారం పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర కమిటీలో వివిధ హోదాల వారీగా నియమితులైన వారు ఇలా.. మహిళా విభాగం జనరల్ సెక్రటరీగా కర్రా జయసరిత, మహిళా విభాగం సెక్రటరీగా పాలవెల్లి మంగ, బీసీ సెల్ జనరల్ సెక్రటరీగా దొంగ మురళీ కృష్ణ, బీసీ సెల్ జనరల్ సెక్రటరీగా కట్టుబోయిన ప్రసాద్, బీసీ సెల్ సెక్రటరీగా కర్రి ఏసుబాబు, బీసీ సెల్ సెక్రటరీగా సందక సత్తిబాబును ని యమించారు. అలాగే వాణిజ్య విభాగం జనరల్ సెక్రటరీగా సీరం దుర్గరాజు, వాణిజ్య వి భాగం సెక్రటరీగా ఎస్.లీలా భావనారాయణ, వాణిజ్య విభాగం సెక్రటరీగా పెనుగొండ ఆదిశేష వెంకట నాగేశ్వరరావు, ఇంటలెక్చువల్స్ ఫోరం సెక్రటరీగా చోడే గోపీకృష్ణ, ఇంటలెక్చువల్స్ ఫోరం సెక్రటరీగా హరిదాసు రవీంద్రకుమార్, ఇంటలెక్చువల్స్ ఫోరం జాయింట్ సెక్రటరీగా ఎస్ఎస్ ప్రసాద్ నియమితులయ్యారు.మహిళల స్థానం ప్రత్యేకం భీమవరం(ప్రకాశం చౌక్): మనదేశంలో మహిళలకు ఉన్న గౌరవం ప్రపంచంలో ఎక్కడా లేదని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రకాశం చౌక్ నుంచి మహిళా ర్యాలీని డిప్యూటీ స్పీకర్ కను మూరి రఘురామ కృష్ణరాజు, కలెక్టర్ చదలవా డ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, ఆ చంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తితో కలిసి బెలూన్లు వదిలి ఆయన ప్రారంభించారు. ర్యాలీలో మహిళలు, విద్యార్థినులు పాల్గొన్నారు. ర్యాలీ అల్లూరి సీతారామరాజు స్మృతి వనం వరకు సాగింది. జిల్లాలో మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్నామని ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి అన్నారు. ‘వైద్యసేవ’ ఉద్యోగులవిధుల బహిష్కరణ భీమవరం(ప్రకాశం చౌక్): డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులు సమస్యల పరిష్కారం కోసం ఈనెల 10, 17, 24 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా విధులు బహిష్కరిస్తున్నామని ఏపీ వైద్య సేవ ఎంప్లాయీస్ జేఏసీ సంఘ నాయకులు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని బీమా పరిధిలోకి తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం చేస్తోందని, ఆప్కాస్ రద్దు దిశగా ఇప్పటికే అడుగులేసిందన్నారు. ఈ పరిణామాలతో రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారన్నారు. విధుల బహిష్క రణతో పాటు జిల్లా సమన్వయకర్త అధికారి కా ర్యాలయం వద్ద నిరసన తెలుపుతామన్నారు. సమస్యలపై సైకిల్ యాత్ర భీమవరం(ప్రకాశం చౌక్): పేదల ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాల సమస్యల పరిష్కరించాలని, టిడ్కో కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలని జిల్లాలోని 20 మండలాలు, ఆరు పట్టణాల్లో సైకిల్ యాత్ర చేపట్టినట్టు సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్వీ గోపాలన్ తెలిపారు. భీమవరం టిడ్కో ఇళ్ల వద్ద గోపాలన్ ఆధ్వర్యంలో 15 మంది నాయకులతో చేపట్టిన యాత్రను రాష్ట్ర కమి టీ సభ్యుడు బి.బలరాం ప్రారంభించారు. బల రామ్ మాట్లాడుతూ యాత్ర 17 వరకు సాగుతుందని, పేదల ఇళ్ల సమస్యలు, కాలనీల్లో సౌకర్యాలను తెలుసుకుంటామన్నారు. కూట మి ప్రభుత్వం పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చి నిర్మాణాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. -
ఆస్పత్రిలో శిశువు మరణంపై వీడిన మిస్టరీ
కై కలూరు: కై కలూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ) బాత్రూంలో ఆడ శిశువు మరణంపై మిస్టరీ శనివారం వీడింది. మృత శిశువును వదలి శుక్రవారం రాత్రి పరారైన బాలిక (17)ను పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించారు. కై కలూరు మండలం రాచపట్నం గ్రామానికి చెందిన బాలికను లారీ డ్రైవర్ (33)గా పనిచేస్తున్న స్వయానా మేనమామ గర్భవతిని చేసినట్టు ప్రాథమికంగా గుర్తించారు. ఈ విషయం ఎవరికై నా చెబితే చంపేస్తానని బెదిరించడం వల్ల బాత్రూంలో బిడ్డను ప్రసవించిన తర్వాత భయంతో బయటకు వచ్చానని పోలీసుల ఎదుట సదరు బాలిక చెప్పినట్టు తెలిసింది. ప్రస్తుతం బాలికకు కై కలూరు సీహెచ్‌సీలో చికిత్స అందిస్తున్నారు. బాలిక నర్సింగ్ కోర్సు చేసింది. ఆమె తండ్రి 15 ఏళ్ల క్రితం మరణించాడు. తల్లి పనులకు వెళుతూ ఒక్కగానొక్క బిడ్డను పెంచుతోంది. ఈ క్రమంలోనే మేనమామ ఆమైపె లైంగిక దాడి చేసినట్టు తెలుస్తోంది. అతను పోలీసులు అదుపులో ఉన్నట్టు సమాచారం. ఏలూరు డీఎస్పీ ఆదేశాలతో కై కలూరు పట్టణ సీఐ పి.కృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. వైద్యాధికారుల విచారణ ఆడ మృత శిశువు మరణంపై కలెక్టర్ ఆదేశాలతో డీసీహెచ్ఎస్ పాల్ సతీష్‌కుమార్ కై కలూరు సీహెచ్‌సీలో శనివారం విచారణ చేపట్టారు. రాత్రి విధుల్లో ఉన్న సిబ్బందిని ఒక్కొక్కరిని విచారించారు. ఇంత ఘటన జరిగినా ఆస్పత్రి సూపరింటెండెంట్ అల్లాడి శ్రీనివాసరావు రాకపోవడంపై మీడియా సభ్యులు ప్రశ్నిస్తే అక్కడ సిబ్బంది సెలవులో ఉన్నారని సమాధానం చెప్పారు. ప్రత్యేక అధికారితో పూర్తిస్థాయి విచారణ చేయించి ఉన్నతాధికారులకు శిశువు మరణంపై నివేదిక అందిస్తామని డీసీహెచ్ఎస్ చెప్పారు. రాచపట్నానికి చెందిన బాలికగా గుర్తింపు జిల్లా వైద్యాధికారుల విచారణ -
గురువుల్లో గుబులు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల బదిలీలు చేపడతామని కూటమి ప్రభుత్వం తెలపడంతో ఆయా వర్గాల్లో హడావుడి మొదలైంది. ఈ మేరకు ప్రభుత్వం ముసాయిదా బిల్లు విడుదల చేసి ఈనెల 7 వరకు సలహాలు, సూచనలను కోరింది. ఉపాధ్యాయుల అభ్యర్థనల మేరకు అమలుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి గాని ప్రభుత్వం బదిలీలపై ఓ కొలిక్కి వచ్చే అవకాశం లేదు. ఇదిలా ఉండగా అప్పుడే బదిలీల ప్రక్రియ పూర్తిచేసినట్టు కూటమి ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. దీంతో త్వరలో చేపట్టనున్న బదిలీల్లో తమకు ఏ మేరకు న్యాయం జరుగుతుందో అనే చర్చ ఉపాధ్యాయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న ప్రధానోపాధ్యాయులు, ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న ఉపాధ్యాయులకు ఈసారి బదిలీల్లో స్థాన చలనం తప్పదు. విడుదల కాని జీఓ : మే నెలాఖరులోపు బదిలీల ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటికీ జీఓ విడుదల కాలేదు. మే నెలాఖరులోపు బదిలీల ప్రక్రియ పూర్తి చేయడం కష్టసాధ్యమని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన చేపట్టే బదిలీల కౌన్సెలింగ్ విద్యాశాఖాధికారులకు కత్తిమీద సాములాంటిది. ఇదిలా ఉండగా జిల్లా విద్యాశాఖాధికారులు ఇటీవల సీనియార్టీ జాబితాను విడుదల చేసి ఈనెల 9లోపు అభ్యంతరాలు తెలియజేయాలని కోరారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యాలయానికి వందల సంఖ్యలో అభ్యంతరాలు వచ్చినట్టు తెలుస్తోంది. 11,391 మంది ఉపాధ్యాయులు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 11,391 మంది స్కూల్ అసిస్టెంట్లు, సెకండ్ గ్రేడ్ టీచర్లు, హెచ్ఎంలు పనిచేస్తున్నారు. గతంలో జరిగిన పని సర్దుబాటులో కొందరు మిగులు ఉపాధ్యాయులు ఉన్నారు. అయితే అసలు జిల్లాలో ఖాళీ పోస్టులు ఎన్ని, మిగులు ఉపాధ్యాయ పోస్టులు ఎన్ని వంటి వివరాలు తెలియకుండా బదిలీల ప్రక్రియ ఎలా చేపడతారని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై స్పష్టత రావడానికి కాస్త సమయం పడుతుందని, ఇవన్నీ తేలే వరకూ బదిలీలకు అవకాశం ఉండదంటున్నారు. హైస్కూల్ ప్లస్‌లు రద్దు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన హైస్కూల్ ప్లస్‌లను రద్దు చేసింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా హైస్కూల్ ప్లస్‌లలో సుమారు 1,450 మంది ఉపాధ్యాయులు పీజీటీలుగా పనిచేస్తున్నారు. ప్రస్తుత సర్కారు వీటిని రద్దు చేయడంతో పీజీటీలను ఏం చేస్తారనే దానిపై స్పష్టత లేదు. వారికి బదిలీల్లో స్థానం కల్పిస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ‘ప్రాథమికోన్నత’ పరిస్థితి ఏంటో ? కూటమి ప్రభుత్వ విధానంలో భాగంగా ప్రాథమికోన్నత పాఠశాలలు మూతపడనున్నాయి. దీంతో ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ల పరిస్థితిపై గందరగోళం నెలకొంది. వారిని బేసిక్ ప్రాథమిక పాఠశాలలకు ప్రధానోపాధ్యాయులుగా నియమించే అవకాశం ఉందని జిల్లా విద్యాశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే జరిగితే ఉమ్మడి జిల్లాలో సుమారు 400 మంది స్కూల్ అసిస్టెంట్లు మిగులు ఉపాధ్యాయులుగా మారతారు. వారిలో కొత్త విధానంలో ఏర్పడే సుమారు 300 మంది మోడల్ ప్రైమరీ పాఠశాలలకు ప్రధానోపాధ్యాయులుగా నియామకాలు పొ ందినా మరో 100 మంది దాకా మిగిలిపోతారు. వారి పోస్టింగ్‌లపైనా స్పష్టత రావాల్సి ఉంది. బదిలీలపై గందరగోళం ప్రహసనంలా బదిలీల ప్రకటన ఇప్పటికీ విడుదల కాని జీఓ ఖాళీలు, మిగులు లెక్క తేలలేదు యూపీలో పనిచేసే ఎస్ఏల సంగతేంటో? 1,450 మంది పీజీటీల భవిష్యత్ ప్రశ్నార్థకం బదిలీలపై స్పష్టత ఇవ్వాలి ఉపాధ్యాయుల బదిలీలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. ఉపాధ్యాయుల నుంచి అందిన సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకుని వాటికి అనుగుణంగా నిబంధనలు మార్చాలి. విద్యాశాఖ అధికారులు వెబ్సైట్లో ఉంచిన సీనియార్టీ జాబితా తప్పుల తడకగా ఉంది. వెంటనే దానిని సరి చేసి పారదర్శకమైన జాబితాను ప్రకటించాలి. బదిలీల చట్టం ఎప్పటికప్పుడు సవరించేలా ఉండాలి. జీఓ 117ను రద్దు చేసి తీసుకురానున్న కొత్త జీఓలో పబ్లిక్, టీచర్ నిష్పత్తిని సవరించాలి. – గెడ్డం సుధీర్, వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హక్కులను కాలరాసేలా.. బదిలీల చట్టంలో ఉపాధ్యాయుల హక్కులను కాలరాసేలా ఉన్న 12,14 సెక్షన్లను వెంటనే రద్దు చేయాలి. బదిలీల నుంచి 70 శాతం డిజేబిలిటీ ఉన్న ఆర్థోపెడికల్లీ చాలెంజ్డ్ ఉపాధ్యాయులకు కూడా మినహాయింపు ఇవ్వాలి. ఉపాధ్యాయులు మొదటగా 3, 4 కేటగిరీల పాఠశాలలను మాత్రమే కోరుకోవాలి అనే సెక్షన్‌ను తొలగించాలి. సీనియార్టీ జాబితాలో ముందు వరుసలో ఉన్నవారికి ముందుగా 1, 2 కేటగిరీలు కోరుకునే అవకాశం కల్పించాలి. – మద్దుకూరి ఆదినారాయణ, డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి -
మహిళల విద్యతోనే దేశాభివృద్ధి
భీమవరం(ప్రకాశం చౌక్): మహిళలు చదువుకుంటేనే దేశాభివృద్ధి సాధ్యమని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు అన్నారు. భీమవరం అంకాల ఆర్ట్ అకాడమీలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు కోడే విజయమ్మ ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ మహిళా దినోత్సవానికి శనివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, మహిళలు బాగుంటేనే ఆ కుటుంబం బాగుంటుందని, కుటుంబాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుందన్నారు. ఎక్కడ సీ్త్రలను పూజిస్తారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని అన్నారు. జిల్లా అధ్యక్షురాలు విజయమ్మ మాట్లాడుతూ పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలు కల్పి స్తే అన్ని రంగాల్లో మరింత రాణిస్తారన్నారు. మనదేశంలో మహిళలకు ఉన్న గౌరవం ప్రపంచంలో ఏ దేశంలో లేదన్నారు. అనంతరం ఐదుగురు మహిళలను సత్కరించారు. పార్టీ నేతలు కోడే యుగంధర్, కామన నాగేశ్వరరావు, గాదిరాజు రామరాజు, ఏఎస్ రాజు, చిగురుపాటి సందీప్, విప్పర్తి సత్యవేణి, చవ్వాకుల సత్యనారాయణ, బొమ్మిడి శాంతి, ఇంటి సత్యనారాయణ, డీవీడీ ప్రసాద్, పాలా రాంబాబు, సూర్యకళ తదితరులు పాల్గొన్నారు. మండలి చైర్మన్ మోషేన్‌రాజు -
సూపర్ సిక్స్‌ను తుంగలో తొక్కిన కూటమి
వీరవాసరం: సూపర్ సిక్స్ హామీలను కూటమి ప్రభు త్వం తుంగలో తొక్కిందని ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ తీవ్రంగా ఆక్షేపించారు. నవుడూరు జంక్షన్లో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై తప్పుడు అప్పుల ప్రచారంతో చంద్రబాబు గద్దెనెక్కారని విమర్శించారు. ఇప్పుడు శాసనసభలో ఆర్థిక మంత్రి గత ప్రభుత్వం చేసిన అప్పుల చిట్టాను విప్పడంతో ప్రజలందరికీ చంద్రబాబు చేసిన గోబెల్స్ ప్రచారం అర్థమైందన్నారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటూ అధికారం అందుకున్న కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని, వీటిని ఎలా ఎగ్గొట్టాలనే ఆలోచన చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసిన పార్టీ ఒక్క వైఎస్సార్సీపీ మాత్రమే అని గుర్తు చేశారు. కుల, మత, వర్గాలు, పార్టీలకు అతీతంగా మాజీ సీఎం జగన్ అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించారన్నారు. గవర్నర్ ప్రసంగంలో సైతం రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి ఆలోచన చేయడం దారుణమని దుయ్యబట్టారు. సంపద పెంచే మంత్రదండం ఏమీ లేదని చంద్రబాబు మాట్లాడుతూ ప్రజలను మరోసారి తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్సీ కవురు మండిపడ్డారు. -
స్పౌజ్ పింఛన్లకు కొర్రీ
కొత్త పింఛన్లు మంజూరై 15 నెలలు ఆదివారం శ్రీ 9 శ్రీ మార్చి శ్రీ 2025సాక్షి, భీమవరం: సూపర్ సిక్స్ అమలుకు చేతులెత్తేసిన కూటమి ప్రభుత్వం పేదలకు ఆర్థిక భరోసా నిచ్చే పింఛన్లకు కొర్రీలు పెడుతోంది. పాలన చేపట్టిన పది నెలల కాలంలో కొత్త పింఛన్ల మంజూరు చేయకపోగా ముందెన్నడూ లేనివిధంగా స్పౌజ్ పింఛన్ల మంజూరుకు కటాఫ్ డేట్ పెట్టింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో లబ్ధిదారుడు మృతిచెందితే మరుసటి నెల నుంచే భార్యకు పింఛన్ అందిస్తే ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా తయారైంది. నవంబరు నుంచి మాత్రమే.. సాధారణంగా పింఛన్ లబ్ధిదారుడు మృతిచెందితే అతని భార్య (స్పౌజ్)కు పింఛన్ మంజూరు చేస్తారు. ఈ మేరకు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ యాప్‌లో ఆప్షన్ ఉంటుంది. కూటమి పాలన చేపట్టిన వెంటనే సంక్షేమ పథకా లు, పౌరసేవలకు సంబంధించిన వెబ్సైట్లను క్లోజ్ చేయడంతో స్పౌజ్ పింఛన్ల మంజూరు నిలిచిపోయింది. ఎట్టకేలకు నవంబరులో పెన్షన్ వెబ్సైట్లో కేవలం స్పౌజ్ ఆప్షన్ మాత్రమే ఓపెన్ చేసిన కూ టమి ప్రభుత్వం ఆ నెల నుంచి మృతి చెందిన వారి భార్యలకు మాత్రమే పింఛన్ మంజూరు అయ్యేలా మార్పులు చేసింది. దీంతో అంతకుముందు చనిపోయిన వారి కుటుంబాలకు ఈ పథకం వర్తించకుండా పోయింది. రెండు నెలల పాటు స్పౌజ్ పింఛన్లు మంజూరు చేయగా తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడంతో మళ్లీ ఆప్షన్‌ను క్లోజ్ చేసేసి తాజాగా మార్చి నెల నుంచి మళ్లీ ఓపెన్ చేసింది. స్పౌజ్ లబ్ధి కొందరికే.. నవంబరు నుంచి మాత్రమే స్పౌజ్ పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం కటాఫ్ డేట్ పెట్టడంతో అంతకు ముందు భర్తను కోల్పోయిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గతేడాది జనవరి నాటికి జిల్లాలో 2,36,928 మంది పింఛన్ లబ్ధిదారులు ఉండగా ప్రస్తుతం వారి సంఖ్య 2,27,086కు తగ్గింది. 9,842 మంది పింఛన్లను ప్రభుత్వం తొలగించింది. మృతిచెందిన వారి పింఛన్లు తొలగించినట్టుగా అధికారులు చెబుతున్నారు. వీరిలో 60 శాతం మంది పురుషులే ఉంటారని అంచనా. ఈ మేరకు సుమారు 5,900 మంది మృతులకు సంబంధించి వారి భార్యలకు (స్పౌజ్ కేటగిరీ) పింఛన్ మంజూరు చేయాల్సి ఉండగా కేవలం 607 మందికి మాత్రమే పింఛన్ సాయం అందిస్తుండటం గమనార్హం. మిగిలిన వారికి పింఛన్ సాయం పొందేందుకు అర్హత ఉన్నా కూటమి తీరుతో వారికి అందడం లేదు. న్యూస్రీల్మోగల్లుకు చెందిన 62 ఏళ్ల భాగ్యవతి భర్త గతేడాది ఆగస్టులో చనిపోయారు. అప్పటికే ఆయన పింఛన్ తీసుకుంటుండటంతో స్పౌజ్ కోటాలో మరుసటి నెల నుంచే ఆమెకు పింఛన్ అందజేయాలి. అయితే ఆమెకు పింఛన్ రాకపోవడంతో సచివాలయానికి పలుమార్లు వెళ్లి అడిగినా స్పౌజ్ ఆప్షన్ ఓపెన్ కావడం లేదని సిబ్బంది చెబుతున్నారు. కానీ నవంబరులో అదే గ్రామానికి చెందిన మరో పింఛన్ లబ్ధిదారుడు మృతిచెందగా ఆయన భార్యకు పింఛన్ మంజూరైంది. ఇదేంటని సచివాలయ సిబ్బందిని అడిగితే నవంబరు నుంచి చనిపోయిన వారికి మాత్రమే ప్రభుత్వం స్పౌజ్ ఆప్షన్ ఓపెన్ చేసినట్టు చెప్పారు. నవంబరు నుంచి మాత్రమే కొత్తవి మంజూరు అంతకు ముందు చనిపోయిన వారి భార్యలకు చేకూరని లబ్ధి పింఛన్ తీసుకుంటూ ఏడాదిలో చనిపోయిన వారు సుమారు 9,842 మంది కేవలం 607 మందికి మాత్రమే స్పౌజ్ కేటగిరీలో మంజూరు కొత్త పింఛన్ల కోసం పెండింగ్‌లో 20 వేలకు పైగా దరఖాస్తులు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏటా జనవరి, జూలైల్లో కొత్త పింఛన్లు మంజూరు చేసేవారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే రాజకీయాలు, కులమత వర్గాలకు అతీతంగా అర్హులను ఎంపిక చేసేవారు. 2023 జూలై నుంచి డిసెంబరు వరకు వచ్చిన దరఖాస్తుల మేరకు గతేడాది జనవరిలో జిల్లాలో 4,274 కొత్త పింఛన్లు మంజూరు చేశారు. మరలా జూలైలో కొత్త మంజూరు రావాల్సి ఉంది. జూన్‌లో కూటమి ప్రభు త్వం ఏర్పడగా ఇప్పటికీ పది నెలలు కావస్తున్నా కొత్త పింఛన్లు మంజూరు చేయలేదు. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ తదితర పింఛన్లు కోరుతూ దాదాపు 20 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నా యి. అర్హత ఉన్నా ప్రభుత్వ నిర్లక్ష్యంతో పింఛన్ లబ్ధి పొందలేకపోతున్నారు. పింఛన్ వస్తే తమ జీ వనానికి ఆసరా అవుతుందని, ప్రభుత్వం చొరవ చూపాలని పేదలు కోరుతున్నారు. -
విదేశీ కోకో దిగుమతులు ఆపాలి
పెదవేగి : విదేశీ కోకో గింజల దిగుమతులు వెంటనే నిలుపుదల చేయాలని, రైతులు వద్ద ఉన్న కోకో గింజలు వెంటనే కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం పెదవేగి మండలం విజయరాయి, గాంధీనగర్ షిరిడి సాయి కల్యాణ మండపంలో కోకో రైతుల ప్రాంతీయ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో కె.శ్రీనివాస్ మాట్లాడుతూ విదేశాల నుంచి కోకో గింజలు దిగుమతి చేసుకున్నామని, రైతులు వద్ద నుంచి తగినంతగా కోకో గింజలు కొనుగోలు చేయలేమని కొన్ని కంపెనీలు రైతులను బెదిరించడం తగదన్నారు. అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ధర ఇవ్వకుండా కంపెనీలు రైతులను మోసగిస్తూ ఇబ్బందులు గురి చేయడం అన్యాయమని విమర్శించారు. కిలో కోకోకు రూ.900 ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నెల 6న జరిగిన కోకో రైతుల చలో ఏలూరు కార్యక్రమం సందర్భంగా కోకో రైతుల సమస్యలను కలెక్టర్‌కు వివరించామని చెప్పారు. ఈ నెల 10న ఉద్యాన శాఖ కమిషనర్ దృష్టికి సమస్య తీసుకెళ్తున్నట్లు చెప్పారు. ఉద్యాన శాఖ కమిషనర్ కార్యాలయం వద్దకు కోకో రైతులు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కోకో రైతుల సంఘం నాయకులు బొల్లు రామకృష్ణ, ప్రాంతీయ కొబ్బరి రైతుల సంఘం ఉపాధ్యక్షుడు మున్నంగి సుబ్బారెడ్డి, కోనేరు సతీష్, గుడిబండి రమేష్ రెడ్డి, ఎ.అనిల్ కుమార్, కె.రామిరెడ్డి, కె.గోపాలరెడ్డి పాల్గొన్నారు. -
కౌలు రైతులకు చట్టం తేవాలి
చింతలపూడి : సమగ్ర కౌలు రైతుల చట్టం తేవాలని కోరుతూ మార్చి 17న కలెక్టరేట్ల వద్ద ఆందోళన కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య పిలుపునిచ్చారు. మండలంలోని సమ్మటివారిగూడెంలో శనివారం కౌలు రైతుల సంఘం సమావేశం సంకు సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన జమలయ్య మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం కౌలు రైతుల రక్షణ కోసం నూతన కౌలు రైతు చట్టం తెస్తామని హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చి 9 నెలలు పూర్తవుతున్నా ఇంతవరకు చట్టం ఆచరణలోకి తీసుకు రాలేకపోయారని విమర్శించారు. రైతు పండించిన పంటను కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకునే పరిస్థితి లేదని, కౌలు రైతులకు నూతన చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. కౌలు రైతుల సంక్షేమానికి బడ్జెట్ సమావేశాలు ముగిసే లోపు నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి దొంత కృష్ణ మాట్లాడుతూ వేసవిలో చెరువులలో కాలువలలో ఉన్న గురప్రు డెక్కను తొలగించి సమగ్ర పూడిక పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో కౌలు రైతులు సంకు వెంకటనారాయణ, వినుకొండ శ్రీను, వనమాల శాంతారావు, రైతు సంఘం నాయకులు తాడిగడప మాణిక్యాలరావు, తక్కలపాటి ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు. -
చినవెంకన్న క్షేత్రంలో పోటెత్తిన భక్తులు
ద్వారకాతిరుమల : చినవెంకన్న దివ్య క్షేత్రం శనివారం భక్తులతో పోటెత్తింది. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో వేలాది మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి తరలివచ్చారు. దాంతో క్షేత్ర పరిసరాలు సందడిగా మారాయి. ఎటుచూసినా భక్తులతో కళకళలాడాయి. ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతం, అనివేటి మండపం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, ప్రసాదం, టికెట్ కౌంటర్లు, కేశఖండనశాల తదితర విభాగాలు భక్తులతో రద్దీగా మారాయి. ఉచిత అన్నప్రసాదం కోసం వకుళమాత నిత్యాన్నదాన భవనం వద్ద భక్తులు బారులు తీరారు. పార్కింగ్ ప్రదేశాలు భక్తుల వాహనాలతో నిండిపోయాయి. శ్రీహరి కళాతోరణం ప్రాంతంలో పలువురు బాలలు ప్రదర్శించిన కోలాట నృత్యాలు చూపరులను అలరించాయి. సాయంకాలార్చన సమయంలో మార్పు శ్రీవారి ఆలయంలో ఈ నెల 14 నుంచి స్వామివారి సాయంకాలార్చన సమయాన్ని మార్పు చేస్తున్నట్టు ఆలయ ఈఓ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం సాయంత్రం 5 గంటల నుంచి 6.30 గంటల వరకు నిర్వహిస్తున్నారని.. ఈ నెల 14 నుంచి సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు నిర్వహిస్తారని ఈఓ తెలిపారు. అర్చన జరిగే సమయంలో స్వామి దర్శనం ఉండదని, అర్చన ముగిసన తరువాత రాత్రి 7 గంటల నుంచి తిరిగి శ్రీవారి దర్శన భాగ్యం భక్తులకు కలుగుతుందన్నారు. -
13 గంటల్లోనే తల్లిదండ్రుల చెంతకు బాలిక
భీమవరం(ప్రకాశం చౌక్): భీమవరం పట్టణంలో మైనర్ బాలిక అదృశ్యం కేసును టూటౌన్ పోలీసులు 13 గంటల్లో ఛేదించారు. టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ జయసూర్య శనివారం వివరాలు వెల్లడించారు. భీమవరం 36 వార్డు సత్యవతి నగర్‌కు చెందిన మజ్జి శ్రీను దంపతుల కుమార్తె ఈ నెల 6న మధ్యాహ్నం 3 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లి ఇంటికి రాలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని కేసును ఛేదించారు. భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ నుంచి బాలిక అదృశ్యం అయినట్లు గుర్తించారు. రైల్వే పోలీసుల సహకారంతో బాలిక విజయవాడ వెళ్లినట్లుగా గుర్తించి అక్కడ రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. బాలిక ఫొటోలు పంపించగా నిర్ధారణ చేసుకుని విజయవాడ హోంలో బాలికను ఉంచారు. ఆ తర్వాత బాలికను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. తల్లిదండ్రులు కోప్పడడంతో వెళ్లిపోయినట్లు విచారణలో తెలిందన్నారు. రూ.5 లక్షల యానాం మద్యం స్వాధీనం తణుకు అర్బన్: ఇతర రాష్ట్రాల మద్యం స్థానికంగా సరఫరా చేస్తున్న పాత నేరస్తుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 43.1 లీటర్ల మద్యం సీసాలు, కారును తణుకు ఎకై ్సజ్ శాఖ అధికారులు స్వాఽధీనం చేసుకున్నారు. ఇరగవరం మండలం కంతేరు గ్రామానికి చెందిన కొవ్వూరి వెంకట శ్రీనివాసరెడ్డి కదలికలపై నిఘా పెట్టిన అధికారులు శనివారం కంతేరులో కారులో ఉన్న యానాం మద్యం 209 సీసాలు, 10 టిన్ బీరులు స్వాధీనం చేసుకుని అతనిని అరెస్టుచేశారు. తణుకు ఎకై ్సజ్ స్టేషన్లో శనివారం జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారి ఆర్ఎస్ కుమరేశ్వరన్ వివరాలు వెల్లడిస్తూ... ముద్దాయి యానాం, గోవా ప్రాంతాల నుంచి మద్యం సీసాలను తీసుకొచ్చి స్థానికంగా డోర్ డెలివరీ చేసేవాడని చెప్పారు. గతంలో తాడేపల్లిగూడెం, భీమడోలు, దేవరపల్లి కేసుల్లో పరారీలో ఉన్నాడని తెలిపారు. సహ నిందితుడిగా కోనాల వెంకట సత్యనారాయణరెడ్డి అలియాస్ భరత్‌రెడ్డి, చిన్ని అనే వ్యక్తితోపాటు యానాంలో మద్యం సరఫరా చేస్తున్న బాదర్ల ప్రేమ్‌కుమార్‌ను గుర్తించామని త్వరలోనే వారిని కూడా అరెస్టు చేస్తామని చెప్పారు. స్వాధీనం చేసుకున్న మద్యం ధర సుమారుగా రూ. 5 లక్షలు ఉంటుందని చెప్పారు. -
వారసులకు పరిహారం పరిహాసమేనా?
కుక్కునూరు: పోలవరం నిర్వాసితులకు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చి న్యాయం చేయాల్సిన ప్రభుత్వం చట్ట ప్రకారం వచ్చే వాటిని కూడా రాకుండా చేయడం ఎంతవరకు న్యాయమని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ఆర్ అండ్ ఆర్ పరిహారం కోసం 2017లో నిర్వాసిత గ్రామాల్లో సర్వే నిర్వహించిన ప్రభుత్వం కుటుంబ వివరాలతో పాటు అన్ని ఆధారాలను తీసుకోని ఆర్ అండ్ ఆర్ పరిహారం చెల్లించేందుకు అర్హుల జాబితాను తయారు చేసింది. అర్హుల జాబితాను తయారు చేసిన వెంటనే పరిహారం చెల్లించకుండా 7 సంవత్సరాల తరువాత గత జనవరిలో ఆర్ అండ్ ఆర్ పరిహారాన్ని నిర్వాసితుల ఖాతాల్లో జమచేసింది. ఈ మధ్య కాలంలో కరోనా వైరస్ వంటి పెను విపత్తులతో దేశవ్యాప్తంగా చాలా మంది మృతి చెందారు. విలీన మండలాల్లో కూడా పలువురు అనేక కారణాలతో మృతి చెందారు. మృతి చెందిన వారికి మంజూరైన పరిహారాన్ని వారి కుటుంబసభ్యులకు ఇవ్వాల్సింది పోయి ఆ పరిహారాన్ని రీస్టోర్ టు గవర్నమెంట్ అంటూ ఇవ్వకుండా ఎగ్గొట్టేందుకు చూడడంపై నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ పక్క 2013 భూసేకరణ చట్టం ప్రకారం కుటుంబంలో అర్హులైన నిర్వాసితుడికి మంజూరైన పరిహారాన్ని అతడు మృతి చెందితే వారి వారసులకు ఇవ్వొచ్చని పలు రాజకీయ పార్టీల నాయకులు చెబుతుండగా.. ప్రభుత్వం అవేమీ పట్టించుకోకుండా రీస్టోర్ టు గవర్నమెంట్ అని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. అదే ప్రభుత్వం పరిహారాన్ని వెంటనే ఇచ్చుంటే నిర్వాసితులకు న్యాయం జరిగుండేదని ప్రభుత్వం చేసిన తప్పుకు నిర్వాసితులు బలి కావాలా అని పలువురు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మృతి చెందిన వారి పరిహారాన్ని వారసులకిచ్చి నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. పరిహారాన్ని ఎగ్గొట్టే ప్రయత్నం ఓ వ్యక్తి మృతి చెందితే అతనికి రావాల్సినవి వారసులకు ఇవ్వాలని చట్టం చెబుతోంది. అసైన్మెంట్ ల్యాండ్‌కు సంబంధించిన యజమాని మృతి చెందితే తదనంతరం అతని వారసులకు చెందుతుంది. నిర్వాసితుడు మృతి చెందాడని అతని పరిహారం గవర్నమెంట్‌కు రీస్టోర్ చేయడం పరిహారాన్ని ఎగ్గొట్టేందుకు చేసే యత్నంలో భాగమే. ఎ.రవి, సీపీఎం జిల్లా కార్యదర్శి, ఏలూరుకోర్టు ఆర్డర్‌ను పట్టించుకోవడం లేదు మా నాన్న సర్వే అనంతరం అర్హుల జాబితా ప్రకటించిన తరువాత మృతి చెందాడు. మృతి చెందిన వారికి పరిహారం ఇవ్వమని చెప్పడంతో మా నాన్న పరిహారాన్ని వారసురాలైన మా చెల్లికి ఇవ్వాలని కోరుతూ కోర్టుకు వెళ్లి కోర్టు ఆర్డర్ తీసుకొచ్చాను. అయినా అధికారులు కనీసం కోర్టు ఆర్డర్ కూడా పరిగణలోకి తీసుకోవడం లేదు. ఘంటసాల చంద్రం, నిర్వాసితుడు, కుక్కునూరు -
పాపికొండల్లో వన్యప్రాణుల సందడి
స్వేచ్ఛగా తిరుగుతున్న వన్య ప్రాణులు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో 2020 నాటికి పోలవరం మండలం పరిధిలోని 19 నిర్వాసిత గ్రామాలను అధికారులు ఖాళీ చేయించారు. ప్రస్తుతం ఆయా గ్రామాలు ఖాళీగా ఉండటంతో పాటు వ్యవసాయ భూముల్లో పశుగ్రాసం విపరీతంగా పెరిగింది. ఆ గ్రామాల పక్కన గోదావరి నది ఉండడంతో వన్యప్రాణుల సంచారం పెరిగింది. కొండ గొర్రెలు, నెమళ్లు, చిరుత పులులు, దుప్పులు, తదితర జంతువులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. ఇటీవల వైల్డ్‌లైఫ్ అధికారులు కొరుటూరు సమీపంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో పలు జంతువులు చిక్కాయి. వాటి సంరక్షణకు కూడా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అటువైపు వచ్చే పర్యాటకులకు, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ట్రాప్ కెమెరాకు చిక్కిన చిరుత బుట్టాయగూడెం: జీవ వైవిద్యానికి నిలయం పాపికొండల అభయారణ్యం. ఈ అభయారణ్యం పులులు, చిరుతలు, జింకలు, అడవి దున్నలతో కళకళలాడుతోంది. ఇటీవల కాలంలో అడవి జంతువుల సంఖ్య పెరగడం శుభపరిణామమని అటవీ అధికారులు చెబుతున్నారు. ఇటీవల వైల్డ్‌లైఫ్ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో అనేక జంతువులు స్వేచ్ఛగా తిరుగుతూ కెమెరాకు చిక్కాయి. వాటి సంరక్షణకు వైల్డ్‌లైఫ్, ఫారెస్ట్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. 1.12 లక్షల హెక్టార్లలో అభయారణ్యం 1,12,500 హెక్టార్లలో పాపికొండల అభయారణ్యం విస్తరించి ఉంది. పశ్చిమ ఏజెన్సీప్రాంతంలో పాపికొండల అభయారణ్యం పరిధిలో ఉన్న బుట్టాయగూడెం, పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని అటవీప్రాంతంలో వన్య ప్రాణుల కదలికలు ఎక్కువగా ఉన్నాయి. వైల్డ్‌లైఫ్ అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి జంతువుల కదలికలు గుర్తిస్తున్నారు. జంతువుల సంరక్షణ కోసం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. పాపికొండల అభయారణ్యంలో ఎలుగుబంట్లు, కొండ గొర్రెలు, జింకలు, కొండచిలువలు, అడవి పందులు, అడవి దున్నలు, ఆగలి, గెద్దలు, నెమళ్లు, చిరుతలు, కురుడు పందులు, చుక్కల దుప్పులు, సాంబాలు, ముళ్ల పందులు, నక్కలు, ముంగిసలు, అడవి దున్నలు వంటివి ఉన్నాయి. మూడేళ్ల క్రితం జంతు గణన 2018లో పాపికొండల అభయారణ్యంలో వైల్డ్ లైఫ్ అధికారులు జంతుగణన నిర్వహించి జంతువుల కదలికలను గుర్తించారు. 2022 జనవరిలో జంతుగణన కార్యక్రమాన్ని చేపట్టారు. పాపికొండల అభయారణ్యంలోని సుమారు 116 ప్రాంతాల్లో 232 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి సర్వే నిర్వహించారు. ఈ సర్వేల్లో ఏనుగులు, సింహాలు తప్ప అన్ని రకాల జంతువులు, పక్షులు, ఉభయచర జీవులను గుర్తించారు. జంతువుల సంరక్షణపై బేస్ క్యాంప్‌లు ఏర్పాటు చేసి వైల్డ్ లైఫ్ అధికారులు ప్రత్యేక గస్తీ నిర్వహించడంతోపాటు కట్టుదిట్టమైన నిఘా ఏర్పాట్లు చేశారు. పులి, చిరుతలు, జింకలు, దుప్పుల సంచారం పెరిగిన నెమళ్లు, అడవి పందుల సంఖ్య వేసవిలో దాహార్తి తీర్చేలా ఏర్పాట్లు -
జనరిక్ మందులపై రాయితీ
భీమవరం(ప్రకాశం చౌక్): ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్ర (జనరిక్ మందులు) దుకాణాల ద్వారా నాణ్యమైన మందులు రాయితీపై లభిస్తాయని షాపు) కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమలు సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. శుక్రవారం స్థానిక వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఎదుట జనరిక్ మందుల షాపును కలెక్టర్ చదలవాడ నాగరాణితో కలిసి ఆయన సందర్శించారు. జనరిక్ మందుల ద్వారా 80 శాతం ఖర్చులు ఆదా అవుతాయన్నారు. దేశవ్యాప్తంగా జనరిక్ షాపులు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగ యువత జనరిక్ మందుల షాపుల ద్వారా ఉపాధి పొందవచ్చన్నారు. డీఎంహెచ్ఓ బి.భానూనాయక్, జిల్లా డ్రగ్ కంట్రోల్ అధికారి షేక్ అభిత్ ఆలీ తదితరులు పాల్గొన్నారు. సర్వేలను వేగరిపర్చాలి : ఉపాధి హామీ కూలీలకు నూరు శాతం పని దినాలను కచ్చితంగా కల్పించాలని, ఎస్సీ, బీసీ సబ్సిడీ రుణాలపై సదస్సులు నిర్వహించాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి ఆమె ఉపాధి హామీ, రుణాలు, పీ–4 సర్వేపై సమీక్షించారు. జిల్లాలో పీ–4 సర్వేను పక్కాగా నిర్వహించాలని, తాను తనిఖీలు చేపడతానని అన్నారు. -
బుర్రకథ.. శ్రీదేవి ఘనత
తాడేపల్లిగూడెం: ఏడేళ్ల వయసులోనే తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన కళారూపంలో ఆమె ఖ్యాతి గడించారు. రాష్ట్రవ్యాప్తంగా వందలాది ప్రదర్శనలతో ప్రశంసలు అందుకుంటున్నారు తాడేపల్లిగూడేనికి చెందిన బుర్రకథ కళాకారిణి యడవల్లి శ్రీదేవి. బుర్రకథ కళాకారుడు పద్మశ్రీ మిరియాల అప్పారావు కళావారసురాలిగా చిరుప్రాయంలోనే బుర్రకథ ప్రదర్శనలు ఇచ్చారు. ఆరోహణ, అవరోహణ రాగాలను అవలీలగా ఆకళింపు చేసుకుని బుర్రకథను రక్తికట్టించడంలో ప్రేక్షకుల మన్ననలు పొందారు. 1992లో ఆకాశవాణిలో తొలిసారిగా బాలవిహార్ కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు కథను చెప్పారు. అప్పటినుంచి ఆమె ప్రస్తానం అప్రతిహతంగా సాగుతోంది. రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతగా నిలిచారు. ఉగాది పురస్కారం, తెలుగు బుక్ ఆఫ్ రికార్డు వారి మహిళా సాధికారత అవార్డు, రాష్ట్రస్థాయిలో ఉత్తమ కళాకారిణి అవార్డులు అందుకున్నారు. 2023లో హుబ్లీలో ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరిగిన యూత్ ఫెస్టివల్లో తన ప్రదర్శనతో మెప్పించి పురస్కారం అందుకున్నారు. రాష్ట్రంతో పాటు మలేషియా, కువైట్, సింగపూర్, దుబాయ్ దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చి భళా అనిపించుకున్నారు. మహిళా దినోత్సవం సందర్భగా శ్రీశ్రీ కళావేదిక తరపున నారీరత్న అవార్డును అందుకోనున్నారు. -
పరుగుల జ్యోతి
తణుకు అర్బన్: తణుకుకు చెందిన దండి జ్యోతికశ్రీ ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించి కీర్తి చాటింది. ఒలింపిక్స్ పోటీల్లో పరుగు విభాగంలో ఆమె పరుగెత్తిన రోజు దేశవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో ప్రముఖంగా నిలిచింది. తణుకుకు చెందిన అతి సామాన్యుడైన శ్రీనివాసరావు కుమార్తె జ్యోతిక శ్రీ చిన్ననాటి నుంచి తండ్రి సహకారంతో స్థానిక చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో వేసిన అడుగులు ఆమె ను ప్యారిస్ ఒలింపిక్స్‌కు చేర్చాయి. పరుగులో ఆటంకాలు, కష్టనష్టాలు, ఒడిదుడుకులు ఎదురైనా అలుపెరుగని దీక్షతో ముందుకు సాగుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది జ్యోతికశ్రీ. శ్రమ, పట్టుదలతో ఏస్థాయికి అయినా చేరవచ్చనడానికి నిదర్శనంగా నిలుస్తోంది ఈ తణుకు అమ్మాయి. -
మహిళల రక్షణకు ప్రాధాన్యం
భీమవరం(ప్రకాశం చౌక్): మహిళలు, చిన్నారుల రక్షణకు పోలీస్ శాఖ అధిక ప్రాధాన్యమిస్తోందని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అన్నారు. శుక్రవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో విద్యార్థినులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈనెల 1 నుంచి జిల్లాలో మహిళా సాధికారత వారోత్సవాలను చేపట్టామన్నారు. దీనిలో భాగంగా ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించి విద్యార్థినులకు పోలీసుశాఖ ఆయుధాలు, సాంకేతికత, కమ్యూనికేషన్, డ్రోన్స్, బీడీ టీమ్స్, బాడీవోర్న్ కెమెరాలు, పలు పరికరాలపై అవగాహన కల్పించామన్నారు. అలాగే డయల్ 100/112, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, ఉమెన్ హెల్ప్‌లైన్ 181, సైబరు క్రైం ఫిర్యాదు కోసం 1930 టోల్ ఫ్రీ నంబర్ల ప్రాధాన్యతను వివరించామన్నారు. శనివారం ముగింపు వేడుకలు నిర్వహించి, జిల్లావ్యాప్తంగా నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖనం పోటీల్లో విజేతలకు బహుమతులు అందిస్తామన్నారు. ఏఎస్పీ వి.భీమారావు, పోలీసు అధికారులు ఎంవీవీ సత్యనారాయణ, వి.పుల్లారావు, డి.వెంకటేశ్వరరావు, డి.సురేష్, కె.వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. -
విజిలెన్స్ తనిఖీలు
భీమవరం(ప్రకాశం చౌక్): భీమవరం పశుసంవర్ధకశాఖ ఏడీఏ కార్యాలయంలో శుక్రవారం విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. ఏడీఏ డాక్టర్ సుధీర్‌పై ఫిర్యాదులు అందడంతో విజిలెన్స్ సీఐ శివరామకృష్ణ ఆధ్వర్యంలో సోదాలు జరిపి రికార్డులు పరిశీలించారు. వైద్య సేవలు సరిగా అందడం లేదని, మందులు ఉచితంగా ఇవ్వడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. భీమవరం డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆలీ మందులను పరిశీలించారు. బయో ప్రింటింగ్‌పై విస్తృత పరిశోధనలు తాడేపల్లిగూడెం: జీవ కణాలు అభివృద్ధే 3డీ బయో ప్రింటింగ్ అని ఏపీ నిట్ రిజిస్ట్రార్ పి.దినేష్ శంకర్ రెడ్డి అన్నారు. ఏపీ నిట్‌లో ఇనిస్టిట్యూట్ ఇన్నోవేషన్ కౌన్సిల్, నెక్ట్స్ బిగ్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ సౌజన్యంతో నెక్స్‌జెన్ బైఫాబ్రికేషన్ ఇన్నోవేషన్స్ ఇన్ 3డీ బయో ప్రింటింగ్ అండ్ ఫంక్షనల్ బయో మెటీరియల్స్ అనే అంశంపై విద్యార్థులకు 5 రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా శంకర రెడ్డి మాట్లాడుతూ 3డీ బయో ప్రింటింగ్‌పై ప్రపంచవ్యాప్తంగా విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. బయో ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతులు సుందర్శన దీప, వినోత్ కుమార్‌రాజా మాట్లాడుతూ 3డీ బయో ప్రింటింగ్ ప్రాధాన్యత, వాటి రకాలు, ఉద్యోగ అవకాశాల గురించి వివరించారు. ఆచార్యులు శారదా ప్రసన్న మాలిక, వందన కుమారి కో–ఆర్డినేటర్లుగా వ్యవహరించారు. శిక్షణకు హాజరైన విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. నేడు జాతీయ లోక్ అదాలత్ ఏలూరు (టూటౌన్): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని కోర్టుల్లో శనివారం జాతీయ లోక్‌అదాలత్ నిర్వహించనున్నట్టు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి (ఎఫ్ఏసీ) ఎం.సునీల్‌కుమార్ ప్రకటనలో తెలిపారు. ఏలూరు జిల్లా కోర్టు ఆవరణలోని జిల్లా న్యాయ సేవాసదన్‌లో ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని, ముందుగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహిస్తామని పేర్కొన్నారు. హౌస్ కీపింగ్ పోస్టులకు సీల్డు టెండర్ల ఆహ్వానంఏలూరు (టూటౌన్): ఉమ్మడి పశ్చిమగోదావరి యూనిట్‌లోని కోర్టు కాంప్లెక్స్‌ల హౌస్ కీపింగ్ సర్వీస్ (క్లీనింగ్) కోసం వార్షిక నిర్వహణ కాంట్రాక్టును రెండేళ్ల కాలానికి ఇవ్వడానికి సీల్డ్ టెండర్లు ఆహ్వానిస్తున్నట్టు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి (ఎఫ్ఏసీ) ఎం.సునీల్‌కుమార్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఏలూరులోని కోర్టు కాంప్లెక్స్‌లకు ఇద్దరు సూపర్వైజర్లు, 54 మంది హౌస్‌మెన్ /హౌస్‌మెయిడ్‌లు అవసరమని, వీరిలో నలుగురికి ప్లంబింగ్, వడ్రంగి, విద్యుత్ పనుల్లో పరిజ్ఞానం కలిగి ఉండాలన్నారు. ఆసక్తి గలవారు తమ టెండర్ దరఖాస్తులను ఈనెల 17న సాయంత్రం 5 గంటలలోపు ఏలూరులోని జిల్లా కోర్ట్ కార్యాలయానికి అందేలా పంపాలని పేర్కొన్నారు. మహిళా దినోత్సవానికి జెస్సీరాజ్దెందులూరు: అమరావతిలో జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవాలకు అంతర్జాతీయ స్కేటర్, ప్రధానమంత్రి బాల పురస్కార్ అవార్డు గ్రహీత ఎం.జెస్సీరాజ్‌కు ఆహ్వా నం అందింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ రంగాల్లో ప్రముఖులు 9 మందిని ఎంపిక చేయగా వారిలో జెస్సీరాజ్ ఒకరు. -
డీఎస్సీకి ఉచిత శిక్షణ
ఏలూరు (టూటౌన్): డీఎస్సీ–2025 పరీక్షలకు టెట్‌లో అర్హత సాధించిన బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఆన్లైన్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నామని, ఈనెల 10 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు జిల్లా బీసీ సంక్షేమం, సాధికారత అధికారి ఆర్వీ నాగరాణి శుక్రవారం ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు విద్యార్హత, కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు, రెండు పాస్‌పోర్టు ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులను పోస్టు ద్వారా లేదా నేరుగా ఏలూరులోని బీసీ సంక్షేమ అధికారి కార్యాలయంలో అందజేయాలన్నారు. మరిన్ని వివరాలకు సెల్ 86861 80018లో సంప్రదించాలని కోరారు. -
ముమ్మరంగా వేట
నరసాపురం: నరసాపురం తీరం పొడవునా సముద్రంలో వేట ముమ్మరంగా సాగుతోంది. పలు జిల్లాలకు చెందిన మెకనైజ్డ్ బోట్లు వేట సాగిస్తున్నాయి. మచిలీపట్నం, కాకినాడ, నెల్లూరు, విశాఖ తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 70 వరకు బోట్లు ఇక్కడ నడుస్తున్నాయి. వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరుగుతుండటం, వేటకు అనుకూలంగా ఉండటం, చేపలు దొరికే సీజన్ కూడా కావడంతో మత్స్యకారులు బిజీగా ఉన్నారు. గతేడాది వేట కష్టనష్టాలతో సాగింది. వరుస విపత్తులు గంగపుత్రులను ఇబ్బంది పెట్టాయి. రాష్ట్రంలో గద్దెనెక్కిన కూటమి సర్కారు మత్స్యకారులను ఆదుకునేలా చర్యలు తీసుకోకపోవడం మరింత కుంగదీసింది. భరోసా లేక.. వేసవిలో వేట నిషేధ సమయంలో మత్స్యకారులను ఆదుకునేలా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మత్స్యకార భరోసా పథకాన్ని అమలు చేసింది. 2019–23 మధ్య ఐదేళ్లలో ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున రూ.7.87 కోట్ల సాయం అందించింది. అయితే గతేడాది అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు మత్స్యకార భరోసా కింద రూ.20 వేలు అందిస్తామని ప్రకటించినా అమలు చేయలేదు. గతేడాది సాయానికి ఎగనామం పెట్టడం, జూన్ నుంచి నవంబర్ వరకు విపత్తులతో మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వచ్చే నెల నుంచి నిషేధం : చేపల పునరుత్పత్తి సీజన్ కావడంతో ఏటా ఏప్రిల్ 14 నుంచి జూన్ 14 వరకు సముద్రంలో వేట నిషేధం అమలులోకి వస్తుంది. వేట నిషేధ గడువు దగ్గర పడటం, ప్రస్తుతం అనుకూల వాతావరణం ఉండటంతో సముద్రంలో వేట జోరుగా సాగుతోంది. రూ.200 కోట్ల మత్స్య సంపద ఎగుమతి నరసాపురం తీరంలో గత జూన్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరు వరకూ దాదాపు రూ.200 కోట్ల మత్స్యసంపద ఎగుమతులు జరిగినట్టు అంచనా. 2023–24లో రూ.300 కోట్ల వరకు ఎగుమతులు జరగ్గా.. ఈ ఏడాది రూ.100 కోట్ల మేర తగ్గాయి. వేట నిషేధం గడువు ఎత్తేసిన తర్వాత జూన్ నుంచి మత్స్యకారులు మరలా సముద్రంలో వేట ముమ్మరంగా సాగిస్తారు. గత జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌లో తుపానులు ఇబ్బంది పెట్టాయి. మరలా జనవరి నుంచి చేపలు పెద్ద సంఖ్యలో పడటంతో ఆశించిన ఆదాయం వస్తోందని మత్స్యకారులు అంటున్నారు. మత్స్యకారులు బిజీబిజీ ఈ ఏడాది వరుస విపత్తులతో సతమతం కూటమి సహకారం కరువు వచ్చేనెల 14 నుంచి వేట నిషేధం వారంలోనే ఒడ్డుకు.. సముద్రంలో ముమ్మరంగా వేట సాగుతోంది. సముద్రంలోకి వెళ్లిన బోటు వారం లోపునే సరుకుతో ఒడ్డుకు చేరుతోంది. బోటు యజమానులు పడిన సరుకును బట్టి మాకు డబ్బులు ఇస్తారు. దీంతో ఆనందంగా ఉంది. ఇప్పుడే నాలుగు డబ్బులు సంపాదించుకోవాలి. వచ్చేనెల నుంచి వేట నిషేధం అమలవుతోంది. – తిరుమాని గంగరాజు, బోటు కార్మికుడు తుపాన్లతో ఇబ్బంది కూటమి సర్కార్ తాము అధికారంలోకి వస్తే మత్స్యకార భరోసా రూ.20 వేలు పెంచి ఇస్తామన్నారు. ఈ ఏడాది ఒక్కపైసా కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టారు. రెండేళ్లకు కలిపి మత్స్యకారులకు రూ.40 వేలు ఇవ్వాలి. ఈ ఏడాది తుపాన్లు, అల్పపీడనాలతో వేట సవ్యంగా సాగలేదు. ఏడాదంతా అప్పులు చేసి ఈడ్చుకొచ్చాం. – బర్రి శంకరం, మత్స్యకార నేత -
ఆమే స్ఫూర్తి.. దీప్తి
రక్తదానాన్ని ప్రోత్సహిస్తూ.. సాక్షి, భీమవరం: రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా స్వచ్ఛంద రక్తదానంలో ప్రభుత్వ ఉద్యోగులను భాగస్వాముల్ని చేశారు పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. రెడ్‌క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో శిబిరాల నిర్వహణకు ఆదేశాలిచ్చారు. ఏ నెలలో ఏఏ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు రక్తదానం చేయాలో తెలుపుతూ షెడ్యూల్‌ను విడుదల చేశారు. గత డిసెంబరులో మొదలైన శిబిరాల నిర్వహణ విజయవంతంగా సాగుతోంది. ఇప్పటివరకూ దాదాపు 500 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఓ నెగెటివ్, బీ నెగెటివ్, ఏబీ నెగెటివ్ తదితర అరుదైన గ్రూప్స్ రక్తం అందుబాటులో ఉందని జిల్లా రెడ్‌క్రాస్ సంస్థ చైర్మన్ డా.ఎం.శివరామభద్రిరాజు తెలిపారు. ఆపదలో ఉన్న వారికి రక్తాన్ని అందిస్తున్నామన్నారు. వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటుతూ.. ఏలూరు రూరల్: ఆమెకు పేదరికం సవాల్ విసిరింది. ఉన్నత స్థానాలకు చేరుకోవాలనే సంకల్పాన్ని ఇచ్చింది. పట్టుదలతో సాధన ఖ్యాతి గడించాలని ఉసిగొల్పింది. ఫలితంగా రాష్ట్ర, జాతీయస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పతకాలు సాధించిపెట్టింది. ఏలూరుకు చెందని మొగలి దీపానయోమీ పాఠశాల స్థాయి నుంచి వె యిట్ లిఫ్టింగ్‌లో సాధన చేస్తోంది. పేదరికపు అడ్డంకులను దాటి వెయిట్ లిఫ్టింగ్‌లో పట్టు సాధించింది. ఐదేళ్ల క్రితం ఢిల్లీలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో సత్తాచాటింది. 2026లో జరిగే ఒలింపిక్స్ కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఉత్తమ క్రీడాకారుల క్యాంపునకు ఎంపికైంది. ఔరంగాబాద్‌లో నెలరోజుల పాటు శిక్షణ తీసుకుని గెలుపే లక్ష్యంగా సాధన చేస్తోంది. -
గిరిజన మహిళ.. ఉపాధి భళా
బుట్టాయగూడెం: చిరుధాన్యాలను ఆదాయ వనరుగా మార్చుకుని స్వయం ఉపాధి పొందుతూ భళా అనిపిస్తున్నారు గిరిజన మహిళలు. కేఆర్ పురం ఐటీడీఏ సహకారంతో పౌష్టికాహార బిస్కెట్లు, పౌడర్లు తయారు చేస్తూ ఆదాయం పొందుతున్నారు. ఓ కుగ్రామంలో ప్రారంభించిన వీరి వ్యాపారం ఇప్పుడు ఢిల్లీ వరకూ చేరింది. బుట్టాయగూడెం మండలం రాజానగరం, బండార్లగూడెంకు చెందిన గిరిజన మహిళలు 30 మంది 2016లో ఆహార ఉత్పత్తి సంఘాలు ఏర్పాటు చేసుకున్నారు. ప్రత్యేక శిక్షణ పొంది ఐటీడీఏ కార్యాలయం వద్దే 12 రకాల చిరుధాన్యాలతో మల్టీగ్రెయిన్ బిస్కెట్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేసుకుని ఉత్పత్తులు తయారీ చేసి విక్రయిస్తున్నారు. అమెజాన్ వంటి సంస్థల ద్వారా ఉత్పత్తులను అమ్ముతున్నారు. ఇటీవల టాటా కంపెనీ ఏర్పాటు చేసిన సమావేశం కోసం వీరికి ఆర్డర్ వచ్చింది. ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ వీరి ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. వీరి ఉత్ప త్తులకు ఆదరణ బాగుండటంతో ఆదాయం కూడా పెరిగింది. -
క్రికెట్లో మెలకువలు నేర్పుతూ..
ఏలూరు రూరల్: ఒకప్పుడు గల్లీ క్రికెట్ ఆడిన యువతి.. నేడు ఆంధ్ర క్రికెట్ మహిళా జట్టుకు కోచ్ అయ్యారు. గ్రామీణ బాలికలను క్రికెటర్లుగా తీర్చిదిద్దుతూ క్రికెట్‌కు సేవలందిస్తున్నారు భీమవరం మండలం రాయలం గ్రామానికి చెందిన సంపాద రమాదేవి. జిల్లా బాలికల క్రికెట్ జట్టు విజయాల్లో ప్రధాన భూమికి పోషిస్తున్నారు. ఆమె వద్ద శిక్షణ పొందిన బాలికలు జిల్లా, జోన్, రాష్ట్రస్థాయిలో ప్రతిభ చూపడంతో పాటు రాష్ట్ర జట్టులో సైతం చోటు సంపాదించారు. 2017లో అండర్–19 ఆల్ ఇండియా చాంపియన్‌షిప్ పోటీల్లో ఆంధ్ర జట్టును విజయపథంలో నడపటంలో కీలకంగా వ్యవహరించారు. జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఆంధ్ర మహిళల టీ–20 జట్టు కోచ్‌గా నియమితులమైన ఆమె ఏసీఏ లెవెల్–1 ఏగ్రేడ్, ఎన్సీఏ లెవెన్–1లో పాల్గొన్నారు. -
విద్యతో రాణించాలి
ప్రతి ఒక్క మహిళకూ వారి అమ్మే రోల్‌మోడల్. అలాగే నాకు మా అమ్మ లత ఇచ్చిన ప్రోత్సాహం మరువలేను. అమ్మ 8వ తరగతి వరకూ చదువుకున్నా నన్ను చదివించడంలో కీలక పాత్ర పోషించారు. కలెక్టర్ కావాలనే నా కోరికను నెరవేర్చుకోవడంలో ప్రధాన భూమిక పోషించారు. ప్రస్తుత సమాజంలో ప్రతి మహిళా విద్య, ఆర్థిక వనరులను ఆయుధాలుగా మార్చుకోవాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాలో మహిళలందరికీ శుభాకాంక్షలు. – కె.వెట్రిసెల్వి, కలెక్టర్, ఏలూరు సీ్త్ర వ్యక్తి కాదు శక్తి మహిళ కేవలం వ్యక్తి మాత్రమే కాదు. శక్తిగా అవతరిస్తూ నేడు అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉంటున్నారు. నన్ను కలెక్టర్ వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి విధి నిర్వహణలో ప్రోత్సహిస్తుంటే.. మా అమ్మ కనకదుర్గ బాధ్యత మరువలేనిది. ఆమె ఇప్పటికీ నాకు అన్నివిధాలా తోడుగా ఉంటూ మనోధైర్యాన్ని నింపుతున్నారు. మా అమ్మే నా రోల్‌మోడల్. డాక్టర్‌గా సేవలందించాలనుకున్నా, అయితే రైతులకు సేవలు అందించడం ఆనందంగా ఉంది. – వి.శ్రీలక్ష్మి, జిల్లా పౌరసరఫరాల మేనేజర్, ఏలూరు చాలెంజ్‌గా తీసుకోవాలి మహిళలు సవాళ్లను చాలెంజ్‌గా తీసుకోవాలి. జిల్లాస్థాయి ఉద్యోగంలో చేరేంత వరకూ ఎంతో నేర్చుకున్నాను. ఇప్పటికీ నేర్చుకుంటున్నాను. తల్లిదండ్రుల సహకారం, భర్త ప్రో త్సాహంతో బాధ్యతలు నిర్వహిస్తున్నాను. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ల సహకారంతో జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖను ముందుకు తీసుకు వెళుతున్నాను. మహిళలు అన్నిరంగాల్లో రాణించాలి. ఆ దిశగా అడుగులు వేయాలి. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు – పి.శారద, మహిళా శిశు సంక్షేమశాఖ ప్రాజెక్టు డైరెక్టర్, ఏలూరు ● -
తెల్లారిన బతుకులు
తెల్లవారకముందే.. వారి జీవితాలు తెల్లారిపోయాయి. కొద్ది గంటల్లోనే గమ్యస్థానాలకు చేరుకోవాల్సి ఉండగా మృత్యువు వారిని కబళించింది. అతివేగం, పొగమంచు కారణంతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ఘోర ప్రమాదం జరిగింది. బస్సు నుంచి కారిన రక్తధారలు భయభ్రాంతులకు గురిచేయగా.. క్షతగాత్రుల హాహాకారాలు మిన్నంటాయి. ఏలూరు జిల్లా ఏలూరులోని చొదిమెళ్ల వద్ద జాతీయరహదారి (ఎన్‌హెచ్–16)పై ఆగి ఉన్న లారీని ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా.. డ్రైవర్ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. బస్సులోని 21 మంది ప్రయాణికులు గాయాలపాలయ్యారు. ఘటనా స్థలిలో బస్సు దెబ్బతిన్న తీరు చూస్తే ప్రమాద తీవ్రత అర్థమవుతుంది. శురకవారం శ్రీ 7 శ్రీ మార్చి శ్రీ 2025జాతరకు వస్తూ.. మృతుడు బొంతు భీమేశ్వరరావు భీమడోలుకు చెందినవారు. పెయింటర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వృత్తిరీత్యా ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న ఆయన సొంతూరులో జరిగే జాతరకు హైదరాబాద్ నుంచి వస్తున్నారు. మరో 20 నిమిషాల్లో సొంతూరుకు చేరుకుంటారనుకున్న సమయంలో మృత్యువు కబళించింది. మృతునికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. వారి కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ భవాని మృతురాలు మొటపర్తి భవానిది కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రవారిపాలెం. ఆమె హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. కుటుంబసభ్యులను చూసేందుకు వచ్చి రోడ్డు ప్రమాదంలో మృత్యవాత పడ్డారు. భవానీ అకాల మరణం ఆ కుటుంబంలో తీరని శోకం నింపింది. బంధువుల ఇంటికి వెళ్లి వస్తూ.. మృతురాలు జుత్తిగ భవాని గృహిణి. ఆమెది డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కోలంక గ్రామం. బంధువుల ఇంటికి వెళ్లి వస్తున్న సమయంలో ఆమె ప్రమాదంలో కన్నుమూసింది. ఆమె కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. మృతుడు డ్రైవర్ మధు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గీత కార్మికులకు 18 మద్యం షాపులు భీమవరం(ప్రకాశం చౌక్): జిల్లాలో గీత కార్మికులకు మద్యం షాపుల కేటాయింపును లాటరీ పద్ధతి ద్వారా పూర్తిచేసినట్టు జేసీ టి.రాహుల్‌కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం కలెక్టరేట్లో 18 మద్యం షాపులకు సంబంధించి లాటరీ ప్రక్రియ నిర్వహించారు. మొత్తం 478 దరఖాస్తులు అందాయని, మొత్తం షాపులకు రెండు నెలల ఫీజు కింద రూ.95,83,333 రుసుం జమచేసి షాపులు కేటాయిస్తామన్నారు. కులా ల వారీగా శెట్టిబలిజ 10, గౌడ 5, గౌడ్ 2, శ్రీశయన 1 చొప్పున షాపులు కేటాయించామన్నారు. దరఖాస్తులకు నాన్ రిఫండబుల్ కింద రూ.9.56 కోట్ల ఆదాయం సమకూరిందన్నారు. స్టేషన్ల వారీగా భీమవరంలో 2, తణు కులో 5, తాడేపల్లిగూడెంలో 4, పాలకొల్లులో 2, నరసాపురంలో 3, ఆకివీడులో 2 దుకాణాలు ఏర్పాటుచేస్తున్నట్టు చెప్పారు. లాటరీ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించామన్నారు. ఎకై ్సజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కేవీ నాగప్రభుకుమార్, జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఆర్ఎస్ కుమారేశ్వరన్, సహాయ ఎకై ్సజ్ అధికారి ఆర్వీ ప్రసాద్‌రెడ్డి, ఎకై ్సజ్, పోలీసు అధికారులు పాల్గొన్నారు. 20 ఆటోలపై కేసులు భీమవరం (ప్రకాశంచౌక్): అధిక సంఖ్యలో పిల్లలను తరలించే ఆటోలపై చర్యలు తీసుకుంటామని జిల్లా రవాణా శాఖ అధికారి టి.ఉమామహేశ్వర రావు హెచ్చరించారు. భీమ వరంలోని పలు చోట్ల గురువారం స్కూల్ పిల్లలను తరలించే ఆటోలను తనిఖీలు చేశామన్నారు. 12 ఏళ్ల లోపు వయసున్న పిల్లలను ఆరుగురిని మాత్రమే ఎక్కించుకోవాలని, స్కూల్ బ్యాగులు, లంచ్ బాక్స్‌లు ఆటో బయటకు రాకుండా చూసుకోవాలన్నారు. డ్రైవర్‌కు ఇరువైపులా పిల్లలను కూర్చోపెట్టకూడదని, స్కూల్ ట్రిప్ బోర్డును ఎరుపు రంగులో ఆటో ముందు, వెనుక ప్రదర్శించాలని ఆదేశించారు. 20 ఆటోలపై కేసులు నమోదు చేసి, ఒక ఆటోను సీజ్ చేశామన్నారు. మొత్తంగా రూ.75,170 అపరాధ రుసుం వసూలు చేశామని చెప్పారు. నీటి ఎద్దడి తలెత్తకూడదు దెందులూరు/ఏలూరు (టూటౌన్): జిల్లాతో తాగు, సాగునీటి సమస్య లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. గురువారం దెందులూరు మార్కెట్ కమిటీ చెక్ పోస్టు సమీపంలో ఏలూరు నగరానికి సాగునీటి సరఫరా చేసే సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. దెందులూరు కాలిబాట వంతెన వద్ద ఏలూరు కాల్వలో తూడు తొలగింపు పనులనూ పరిశీలించారు. ఏలూరు కాలువ ద్వారా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌ను నీటితో నింపేందుకు పర్యవేక్షణ చేయాలన్నారు. చేపల చెరువులకు అక్ర మంగా నీటి మళ్లింపును అరికట్టేలా కాలువ గట్ల వెంబడి పటిష్ట నిఘా ఉంచాలన్నారు. అనంతరం వాటర్ పంప్ హౌప్ వద్ద కలెక్టర్ మొక్క నాటారు. ఏలూరు కాలువలో మూడున్నర అడుగుల మేర నీరు ఉందని ఇరిగేషన్ శాఖ ఎస్ఈ పి.నాగార్జునరావు తెలిపారు. ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్, కమిషనర్ భానుప్రతాప్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి హబీబ్ బాషా ఉన్నారు. ‘గురుకుల’ ప్రవేశాలకు ఆహ్వానం ఏలూరు (టూటౌన్): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి, ఇంటర్మీడియెట్ ఫస్టియర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా సమన్వయ అధికారి బి.ఉమాకుమారి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపికచేస్తామని, దరఖాస్తుల స్వీకరణకు గడువును ఈనెల 13 వరకు పొడిగింంచామని పే ర్కొన్నారు. వచ్చేనెల 6న ప్రవేశ పరీక్షలు నిర్వ హిస్తామని తెలిపారు. ఏలూరు జిల్లాలో బాలురుకు పెదవేగి, చింతలపూడి, బాలికలకు పో లసానిపల్లి, వట్లూరు, ద్వారకాతిరుమల, జంగారెడ్డిగూడెం, నూజివీడులో పాఠశాలలు ఉన్నాయన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో బా లురుకు ఆరుగొలను, న్యూ ఆరుగొలను, ఎల్ బీ చర్ల నరసాపురంలో, బాలికలకు పెనుగొండలో పాఠశాలలు ఉన్నాయన్నారు. కొనసాగిన ఇంటర్ పరీక్షలు ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు గురువారం గణితం–1ఏ, బోటనీ, సివిక్స్–1 పరీక్షలు జరిగాయి. జిల్లాలో 55 కేంద్రాల్లో 19,400 మంది విద్యార్థులకు 18,195 మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.యోహాన్ తెలిపారు. అలాగే ఇంటర్ సంస్కృతం జవాబుపత్రాల మూల్యాంకనం శుక్రవారం నుంచి ఏ లూరు కోటదిబ్బ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రారంభమవుతుందని చెప్పారు.డెడ్లీ జర్నీ ● ఏలూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ● వేకువజామున ఘటన ● లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు ● ఘటనా స్థలంలో ముగ్గురు, చికిత్స పొందుతూ మరొకరు మృతి ● 21 మందికి గాయాలు ఏలూరు రూరల్: ఏలూరులోని చొదిమెళ్ల వద్ద రత్నాస్ హోట ల్ సమీపంలో విజయవాడ నుంచి రాజమండ్రి వెళుతు న్న సిమెంట్ లారీ (ఏపీటీ 91ఏ 1769) మరమ్మతుల కారణంగా నిలిచిపోయింది. గురువారం వేకువజామున 5 గంటల సమయంలో రమ ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (ఎన్ఎల్ 01బీ 3092) హైదరాబాద్ నుంచి కాకినాడ వెళుతుండగా వేగంగా నడుపుతున్న బస్సు డ్రైవర్ రోడ్డు పక్కన ఆగి ఉన్న సిమెంట్ లారీని గుర్తించలేకపోయాడు. చివరి నిమిషంలో బస్సును తప్పించేందుకు ప్రయత్నించగా లారీ వెనుక భాగాన్ని ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. బస్సులో కండక్టర్ వైపు భాగం చీల్చుకుంటూ వెళ్లి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో బస్సులో నిద్రిస్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా కేకలు వేశారు. ప్రమాదంతో ఉలిక్కిపడిన స్థానికులు, ఇతర వాహనాల డ్రైవర్లు హుటాహుటిన వచ్చి ప్రయాణికులను రక్షించేందుకు ప్రయత్నించారు. హైవే పెట్రోలింగ్ పోలీసులు సైతం ఘటనా స్థలానికి చేరుకుని బస్సులో చిక్కుకుపోయిన వారిని బయటకు తీసుకువచ్చారు. క్షతగా త్రులను 108లో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనా స్థలం రక్తసిక్తం కాగా.. పరిసరాల్లో బస్సులోని విడి భాగాలు చెల్లాచెదురుగా పడ్డాయి. శకలాల మధ్య ఇరుక్కుపోయి.. బస్సులో కండక్టర్ సీటు వైపు కూర్చున్న మహిళలు మొటపర్తి భవాని, జుత్తిగ భవాని, పురుషుడు బొంతు భీమేశ్వరరావు శకలాల్లో చిక్కుకుపోయారు. లారీ డ్రైవర్ మధు సైతం స్టీరింగ్ వద్ద ఇరుక్కుపోయాడు. పోలీసులు క్రేన్ సాయంతో బస్సును లేపి పక్కకు చేర్చారు. శకలాలను తప్పించి ముగ్గురు ప్రయాణికులతో పాటు డ్రైవర్‌ను అంబులెన్స్ ద్వారా ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ప్రయాణికులు ముగ్గురు మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. డ్రైవర్ మధుకు అత్యవసర చికిత్స అందించగా నాలుగు గంటల పాటు మృత్యువుతో పోరాడి కన్నుమూశాడు. ఏలూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం చేయించారు. క్షత్రగాత్రులు వీరే.. ప్రమాదంలో గాయాలపాలైన వారిలో కోలా సురేఖ, కోలా రాజాబాబు, కోలా లిఖిత, వనమనీడి ఆదిలక్ష్మి, మద్దాల కీర్తి, మాచర్ల సుజాత, మండపాక బాలాజీ, మండపాక శ్రీదేవి, మండపాక హరిణి, మండపాక శశిరేఖ, ఆర్నాలకంటి శ్రీలక్ష్మి, కోట వేణి, పువ్వుల శ్యామ్‌కుమార్, శీలం ప్రకాష్, ఎం.ప్రతాప్, పి.అక్కమ్మ, పి.హేమలత, గోణజ విజయకుమార్, రామిశెట్టి సోమసత్యనారాయణ, టి.రవికుమార్, జి.మణికంఠ (క్లీనర్) ఉన్నారు. అధికారులు క్షతగాత్రులకు చికిత్స చేయించి వారి గమ్యస్థానాలకు పంపించారు. క్షతగాత్రులు పాలకొల్లు, రాజమండ్రి, కాకినాడప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు. న్యూస్రీల్నైట్ పెట్రోలింగ్ నామమాత్రం దెందులూరు: భీమడోలు నుంచి హనుమాన్ జంక్షన్ వరకు జాతీయ రహదారి (ఎన్‌హెచ్–16) మృత్యు మార్గంగా మారింది. ఈ ప్రాంతంలో తరచూ ప్ర మాదాలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కాగా నైట్ పెట్రోలింగ్ తూతూమంత్రంగా జరుగుతుండటం విమర్శలకు తావిస్తోంది. రాత్రి వేళ పెట్రోలింగ్‌కు సిబ్బంది, వాహనాలు ఉన్నా పూర్తిస్థాయిలో జరగడం లేదు. ఈ వాహనమైనా రాత్రి వేళ హైవేపై నిలిచిపోతే హైవే పోలీసులకు సమాచారం ఇచ్చే అవకాశం ఉండటం లేదు. అలాగే పెట్రోలింగ్ పోలీసులు నిత్యం పెట్రోలింగ్ చేయడం ద్వారా కొంతవరకు ప్రమాదాలను నివారించవచ్చని డ్రైవ ర్లు అంటున్నారు. వారంలో ఒక్కరోజైనా సీఐ స్థా యి నుంచి పై స్థాయి అధికారి రాత్రిళ్లు పెట్రోలింగ్‌పై తనిఖీలు చేయాలని అంటున్నారు. ప్రమాదాలు ఎక్కువగా రాత్రి 12.30 నుంచి వేకువజామున 5 గంటలలోపు జరుగుతున్నాయి. ప్రతిపాదనలకే షెల్టర్ పరిమితం లారీలు, భారీ వాహనాల నిలుపుదల, డ్రైవర్ల విశ్రాంతికి జాతీయరహదారిపై కలపర్రు నుంచి భీమడోలు వరకు ఎలాంటి సౌకర్యాలు, స్థలం లేవు. గతంలో స్థలం కోసం గుండుగొలను వద్ద కలెక్టర్ పరిశీలన చేశారు. అక్కడ షెల్టర్ నిర్మించాలని ప్రతిపాదనలు చేసినా ఒక్క అడుగూ ముందుకు పడలేదు. దెందులూరు నియోజకవర్గంలో డ్రైవర్ల విశ్రాంతి, వాహనాల నిలుపుదలకు కనీసం పది ఎకరాల్లో షెల్టర్ ఏర్పాటు చేయాలని చాలాకాలంగా డ్రైవర్లు కోరుతున్నారు. ఇక్కడ ప్రమాదాల నివారణకు షెల్టర్ దోహదపడుతుందని వాహనాల డ్రైవర్లు అంటున్నారు. బాలుడి మృతిపై విచారణకు డిమాండ్ ఏలూరు (టూటౌన్): చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులకు ప్రజల ప్రాణాలకు ముప్పుతెచ్చే హక్కులేదని, తప్పు చేసిన వారిని న్యాయస్థానం ముందు నిలబెట్టి శిక్షించాలని సీపీఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఎ.రవి అన్నారు. తమ బిడ్డను పోలీసులే చంపేశారంటూ ఏలూరులోని తంగేళ్లమూడిలో నివాసముంటున్న యశ్వంత్ అనే బాలుడు కుటుంబసభ్యులు ఏలూరులో ఆస్పత్రి వద్ద గురువారం ఆరోపణ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. యశ్వంత్ మృతికి పోలీసులే కారణమైతే బాధాకరమని, సమగ్ర విచారణ జరిపించాలని సీపీఎం కార్యదర్శి రవి డిమాండ్ చేశారు. అతి వేగం.. పొగ మంచు అతివేగం, పొగమంచు ప్రమాదానికి కారణమని స్థానికులు భావిస్తున్నారు. వేకువజామున పొగమంచు కురవడంతో బస్సు డ్రైవర్ ఆగి ఉన్న లారీని గుర్తించలేకపోయాడు. మరోపక్క లారీ డ్రైవర్ లారీని జాతీయరహదారి ప క్కన నిలపడం ప్రమాదానికి కారణంగా చెబుతున్నారు. ఘటనా స్థలానికి 30 మీటర్ల దూరంలో పార్కింగ్ రోడ్డు ఉందని, జాతీయరహదారిపై ఎక్కడిపడితే అక్కడ వాహనాలను నిలుపుదల చేయడం ప్రమాదాలకు కారణమవుతున్నాయని చెబుతున్నారు. డ్రైవర్లు వాహనాలను పార్కింగ్ స్థలాల్లోనే నిలిపేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
అబద్ధాలకు కేరాఫ్ చంద్రబాబు
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తణుకు అర్బన్: విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చామని, ఉచిత బస్సులు తిరుగుతున్నాయని జాతీయ మీడియాలో ముఖ్యమంత్రి చంద్రబాబు బాకా ఊదుతున్నారని, ఆయన మాదిరిగానే ఎమ్మెల్యేలంతా అబద్ధాలు చెబుతూ కాలం గడిపేస్తున్నారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు విమర్శించారు. తణుకులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సోషల్ మీడియాలో కూటమి బండారాన్ని ఉతికారేస్తున్నారని చెప్పారు. ‘బస్సులు మా ఇంటికి వచ్చి ఎక్కించుకుంటున్నాయని.. గ్యాస్ సిలిండర్లు బుక్ చేయకుండానే ఇంటికి ఉచితంగా వచ్చేస్తున్నాయని.. రూ.15 వేలు మా ఇంట్లో అందరికీ అందేశాయని..’ కూటమి ఘనకార్యాలను ప్రజలు గొప్పగా వెటకారాలు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో దారుణ పరిస్థితులు కనిపిస్తున్నాయని, మద్యం ఇంటికి సరఫరా చేసే పరిస్థితి నెలకొందని, కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం తణుకులో రాజమండ్రి మాజీ ఎంపీ భరత్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని శంకుస్థాపన చేశా రని గుర్తుచేశారు. ఈ ప్రభు త్వం వచ్చిన తరువాత అవి మూలనపడ్డాయని విమర్శించారు. 2019 నుంచి వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపామని, సన్న బియ్యం అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజలకు మేలు చేశామని తెలిపారు. తమ హయాంలో విజిలెన్స్ దాడుల్లో పట్టుబడిన బియ్యాన్ని అదే నెలలో ఎక్కువ ధరలకు విక్రయాలు చేసి ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చామని గుర్తుచేశారు. నేడు మరలా రేషన్ బియ్యం అక్రమ మార్గంలో తరలిస్తున్నారంటే అదంతా కూటమి ప్రభుత్వ దయేనని అన్నారు. రాష్ట్రంలో చెత్త కుప్పలు పేరుకున్న విష యాన్ని నేడు ఎల్లోమీడియా పత్రికలోనే వస్తుండటం చూస్తున్నామని గుర్తుచేశారు. చెత్త, మద్యం విక్రయాలపై ఎన్నికల హయాంలో తణుకు ఎమ్మెల్యే టిక్‌టాక్‌లు చేశారని, సంక్రాంతి వచ్చేప్పటికీ అన్ని రహదారులు వేస్తామని బింకాలు పోయారని, అయితే ప్యాచ్ వర్కులతో సరిపెట్టా రని కారుమూరి దుయ్యబట్టారు. -
పోలీసులే కొట్టి చంపారు..!
సాక్షి, టాస్క్‌ఫోర్స్: ‘బండి చోరీ కేసు అంటూ.. మూడు రోజుల క్రితం మా అబ్బాయిని పోలీసులు తీసుకువెళ్లారు.. నిన్న స్టేషన్‌కు వెళ్లాను.. ఒక్కసారైనా మా అబ్బాయి ముఖం చూపించండయ్యా అని పోలీసుల కాళ్లు పట్టుకుని బతిమిలాడాను.. ఏమీ లేదమ్మా.. రేపు ఇంటికి వచ్చేస్తాడు అన్నారు.. వన్‌టౌన్, టూటౌన్, త్రీటౌన్, హనుమాన్ జంక్షన్ పోలీస్స్టేషన్లల్లో ఉన్నాడని తలో మాట చెప్పారు.. ఈరోజు చూస్తే జీజీహెచ్‌లో శవమై కనిపించాడు’ అంటూ బాలుడి తల్లి వనిత బోరున విలపించింది. పదో తరగతి విద్యార్థి (16) ఒంటిపై, అరికాళ్లపై దెబ్బలతో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం ఏలూరులో తీవ్ర సంచలనంగా మారింది. అసలేం జరిగిందంటే.. ఏలూరులోని చేపలతూము ప్రాంతానికి చెందిన బంగారు శివ చింతలపూడిలోని విద్యాశాఖలో అ టెండర్‌గా పనిచేస్తున్నారు. శివ చిన్న కుమారుడు యశ్వంత్‌కుమార్ (16) ఏలూరులోని ప్రభుత్వ హై స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. మూడు రోజుల క్రితం ఏలూరు సీసీఎస్ పోలీసులు బండి చోరీ కేసులో రికవరీల కోసమని యశ్వంత్‌తో పాటు మరో ఆరుగురు పిల్లలను తీసుకువెళ్లారు. అయితే వారిని సీసీఎస్ స్టేషన్లో కాకుండా వేరే ప్రాంతంలో ఉంచి విచారించారు. ఈ నేపథ్యంలో తన కుమారు డి కోసం యశ్వంత్ తల్లి వనిత రెండు రోజులుగా పోలీస్స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోలేదు. ఈ క్రమంలో గురువారం వేకువజామున 5 గంటల సమయంలో పెదవేగి మండలం మొండూ రు ప్రాంతంలో గోదావరి కుడికాల్వ గట్టుపై య శ్వంత్ అపస్మారక స్థితిలో పడి ఉండగా.. గుర్తించి ఏలూరు జీజీహెచ్‌కు తరలించారు. అయితే బా లుడు అప్పటికే మృతి చెందడంతో మార్చురీలో పెట్టి కనీసం కుటుంబ సభ్యులకు కూడా పోలీసులు సమాచారం ఇవ్వలేదు. మార్చురీ వద్ద ఆందోళన మార్చురీ సిబ్బంది ద్వారా యశ్వంత్ మృతి వార్త తెలిసిన తల్లిదండ్రులు శివ, వనిత, సోదరుడు కృష్ణవర్ధన్ బంధువులతో కలిసి జీజీహెచ్‌కు వచ్చారు. యశ్వంత్ మృతదేహాన్ని చూసి బోరున విలపించా రు. అరికాళ్ల నుంచి చాతీ వరకూ తీవ్ర గాయాలయ్యేలా నిర్దాక్షిణ్యంగా పోలీసులే కొట్టి చంపేసి, శవాన్ని ఎక్కడో పడేశారంటూ విలపించారు. తమ కుమారుడి మృతికి న్యాయం చేయాలంటూ మార్చురీ వద్ద బైఠాయించి దీనిపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తామని ఆందోళనకు దిగారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చొదిమెళ్లలో జరిగిన బస్సు ప్రమాద బాధితులను పరామర్శించడానికి కలెక్టర్ వెట్రిసెల్వి జీజీహెచ్‌కు రాగా ఆమెను కలిసి యశ్వంత్ మృతిపై ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీతో మాట్లాడి విచారణకు ఆదేశించి న్యాయం చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. భిన్నంగా పెదవేగిలో ఫిర్యాదు ఇదిలా ఉండగా పెదవేగి పోలీస్‌స్టేషన్‌లో భిన్నంగా ఫిర్యాదు నమోదైంది. పోలీసులు, చోటా నేతల ఒత్తి ళ్లతో యశ్వంత్ సోదరుడు కృష్ణవర్ధన్‌తో పెదవేగి పో లీసులు ఫిర్యాదు తీసుకున్నారు. ఈనెల 5న తన సో దరుడు ఇంటి నుంచి బయటకు వెళ్లాడని, 6న మొండూరు కాల్వ గట్టుపై అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పెదవేగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలుడిని జీజీహెచ్‌కు తరలించగా అప్పటికే మృతిచెందాడని, మార్చురీకి తరలించి తమకు సమాచారం ఇచ్చారని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చోరీ కేసులో 16 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మూడు రోజుల తర్వాత విగతజీవిగా గుర్తింపు -
కోలుకుంటున్న కోడి
తణుకు అర్బన్ : బర్డ్‌ఫ్లూ వైరస్ కారణంగా సంక్షోభాన్ని చవిచూసిన పౌల్ట్రీ రంగం ఇప్పుడిప్పుడే మెల్లగా కోలుకుంటోంది. గతనెలలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి బాదంపూడి, తణుకు మండలం వేల్పూరు, పెరవలి మండలం కానూరు గ్రామాల్లో కోళ్ల ఫారాల్లో బర్డ్‌ఫ్లూ పాజిటివ్‌గా రావడంతో ఆయా ప్రాంతాలకు 10 కిలోమీటర్ల మేర చికెన్, కోడిగుడ్లు అమ్మకాలపై నిషేధాజ్ఞలు విధించారు. అయితే బర్డ్‌ఫ్లూ సోకిన దానికంటే కూడా భయంకరంగా జరిగిన ప్రచారం కారణంగా కోళ్లు కొనుగోలు చేసే వారు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కోళ్లకు మేత వేయలేక కొన్ని ప్రాంతాల్లో ఉచితంగా కూడా పంపిణీ చేసినట్లుగా పౌల్ట్రీ ఫెడరేషన్ ఆవేదన వ్యక్తం చేశారు. బర్డ్‌ఫ్లూ మహమ్మారి కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా రూ.100 కోట్లు నష్టపోయామని కేంద్ర పశుసంవర్థక శాఖ బృందానికి పౌల్ట్రీ ఫెడరేషన్ వినతిపత్రం అందజేసింది. తాజాగా బర్డ్‌ఫ్లూ వ్యవహారం తగ్గడంతో చికెన్ మేళాల నిర్వహణ తదితర కారణాలతో చికెన్ అమ్మకాలు కొద్దికొద్దిగా ఆశాజనకంగా మారుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. చికెన్ మేళాలకు ఆదరణ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పౌల్ట్రీ ఫెడరేషన్, జిల్లా కోళ్ల రైతుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇటీవల కొన్ని ప్రాంతాల్లో చికెన్, ఎగ్ మేళాలు నిర్వహించి ఉచితంగా చికెన్ వంటకాలను ప్రజలకు అందించారు. వీటిని భారీ ఎత్తున ప్రజలు ఆదరించారు. ముఖ్యంగా ఈనెల 5వ తేదీన పౌల్ట్రీ ఫెడరేషన్, పశ్చిమ గోదావరి జిల్లా కోళ్ల రైతుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తణుకు నెక్ కల్యాణ మండపంలో నిర్వహించిన చికెన్, ఎగ్ మేళాకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఇక్కడ 10 వేల మందికి చికెన్, బిర్యానీ వంటకాలను సిద్ధం చేయగా సుమారుగా 13 వేల మందికిపైగా హాజరయ్యారు. మేళాకు హాజరైన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సైతం చికెన్ వంటకాలను వడ్డించి ఆమె స్వయంగా చికెన్ తిన్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు పౌల్ట్రీ ఫెడరేషన్, కోళ్ల రైతుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తణుకు, వేల్పూరు, ఏలూరు, భీమవరం ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన చికెన్ మేళాలకు ప్రజలు భారీగానే తరలివచ్చారు. జిల్లాలో 300 కోళ్ల ఫారాలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో బాయిలర్ కోళ్లకు సంబంధించి 300 ఫారాలు ఉండగా నిత్యం 22 టన్నులు (22వేలు కిలోలు) బాయిలర్, 15 టన్నులు (15వేల కిలోలు) లేయర్ మాంసం విక్రయాలు జరగ్గా బర్డ్‌ఫ్లూ అనంతరం కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం విధించిన ఆంక్షలు, అపోహల కారణంగా 20 శాతానికి అమ్మకాలు పడిపోయాయి. ఈనెల 1 నుంచి అమ్మకాలపై ఆంక్షలు తొలగించడంతో చికెన్ తినేందుకు ప్రజానీకం భయపడే పరిస్థితుల్లో తాజాగా చికెన్ మేళాల అనంతరం 50 శాతానికి అమ్మకాలు పెరిగాయని ఉగాది పండుగ వచ్చేసరికి నూరు శాతం అమ్మకాలకు చేరుకోగలమని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కోడిగుడ్లకు సంబంధించి సుమారు 200కు పైగా ఉన్న ఫారాల ద్వారా నిత్యం కోటి ఇరవై లక్షలు కోడిగుడ్లు రోజుకు ఉత్పత్తి చేసే సామర్థ్యం జిల్లాలో ఉన్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా పౌల్ట్రీ రంగానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పెట్టింది పేరని రైతులు చెబుతున్నారు. పెరుగుతున్న చికెన్, కోడిగుడ్ల అమ్మకాలు జిల్లాలో సక్సెస్ అవుతున్న చికెన్ మేళాలు 20 నుంచి 50 శాతానికి పెరిగిన చికెన్ విక్రయాలు చికెన్ మేళా సక్సెస్ తణుకు నెక్ కల్యాణ మండపంలో నిర్వహించిన చికెన్, ఎగ్ మేళా కార్యక్రమాన్ని ప్రజలు విశేషంగా ఆదరించారు. తక్కువ ధరకు అధిక ప్రొటీన్ పోషకాలు అందించే చికెన్, ఎగ్‌లను ప్రజలు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. అపోహలు తొలగించేందుకే చికెన్ మేళాలు నిర్వహించాం. – కోమట్లపల్లి వెంకట సుబ్బారావు, ఆంధ్రప్రదేశ్ పౌల్ట్రీ ఫెడరేషన్ చైర్మన్పుంజుకున్న చికెన్ అమ్మకాలు వైరస్ ప్రభావం తొలగడంతో ఈనెల 1వ తేదీ నుంచి చికెన్, కోడిగుడ్లు అమ్మకాలపై ఆంక్షలు తొలగించారు. వైరస్ భయంతో 20 శాతానికి పడిపోయిన చికెన్ అమ్మకాలు నేడు తిరిగి పుంజుకుని 50 శాతానికి పెరిగాయి. రానున్న రోజుల్లో వంద శాతానికి పెరుగుతాయి. – డాక్టర్ కరణం శంకర్ భావనారాయణ, తణుకు మండల పశువైద్యాధికారి -
ముందుకు లాక్కొచ్చిన మృత్యువు
భీమడోలు: అప్పటి వరకు ప్రైవేటు బస్సులో వెనుక సీటులో కూర్చొన్న వ్యక్తి స్వగ్రామం దగ్గర పడుతుండడంతో ముందు సీటు ఖాళీ అవ్వగా అక్కడకు వచ్చి కూర్చున్నాడు. అంతలోనే హైటెక్ బస్సుకు జరిగిన ప్రమాదంలో అతడిని మృత్యువు కబళించింది. చోదిమెళ్ల వద్ద గురువారం తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని హైటెక్ బస్సు ఢీకొన్న ప్రమాదంలో భీమడోలు గ్రామానికి చెందిన బొంతు భీమేశ్వరరావు(43) మృతి చెందాడు. జీవనోపాధి నిమిత్తం రెండు నెలల క్రితం భీమేశ్వరరావు హైదరాబాద్ వెళ్లాడు. అక్కడ పెయింటింగ్ పనులు చేసుకుంటూ కుటుంబ పోషణ చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆతని భార్య, ఇద్దరు పిల్లలు భీమడోలులో నివాసముంటుంన్నారు. ఈ క్రమంలో ఈనెల 8, 9వ తేదీల్లో 12 ఏళ్ల కొకసారి వచ్చే భీమడోలు జాతర వేడుకల్లో పాల్గొనేందుకు భీమేశ్వరరావు బుధవారం రాత్రి హైదరాబాద్ నుంచి రావులపాలెం వెళ్లే ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఎక్కాడు. తెల్లవారితే తన కుటుంబ సభ్యులను కలుసుకుని సంతోషంతో గడపాలని భావించాడు. ట్రావెల్ బస్సులో అప్పటి వరకు వెనుక సీటులో కూర్చున్న భీమేశ్వరరావు హనుమాన్ జంక్షన్ వద్ద ముందు సీటు ఖాళీ అవ్వడంతో వెనుక ఉన్న ఆతను ముందు సీటులో కూర్చున్నాడు. చోదిమెళ్ల వద్దకు వచ్చేసరికి బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో భీమేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు మృతి చెందగా బస్సులోని 21 మంది గాయాలపాలయ్యారు. భీమేశ్వరరావు మృతితో భీమడోలులో విషాదఛాయలు అలుముకున్నాయి. చోదిమెళ్ల వద్ద హైటెక్ బస్సుకు జరిగిన ప్రమాదంలో వ్యక్తి మృతి భీమడోలులో విషాదఛాయలు -
చంద్రబాబువి చవకబారు రాజకీయాలు
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు జంగారెడ్డిగూడెం: వైఎస్సార్ సీపీ నేతలు, మద్దతుదారులకు ఎటువంటి పనులు చేయవద్దంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చవకబారు రాజకీయాలకు నిదర్శనమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు అన్నారు. జంగారెడ్డిగూడెంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో వైఎస్సార్ సీపీకి సుమారు 1.33 కోట్ల మంది మద్దతిచ్చారని, వారందరికీ సంక్షేమాన్ని ఆపేస్తారా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి వలంటీర్ వ్యవస్థ ద్వారా కుల, మత, వర్గ, రాజకీయాలకు అతీతంగా సమానంగా సంక్షేమాన్ని అందించి ప్రజలందరి మెప్ప పొందారన్నారు. ప్రస్తుతం చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తుంటే రాష్ట్రం 30 నుంచి 40 ఏళ్లు వెనక్కి పోయేలా ఉందన్నారు. ఫ్యాక్షన్ రాజకీయం తీసుకువచ్చి కులాలు, పార్టీల మధ్య చిచ్చుపెట్టవద్దని హితవు పలికారు. సూపర్ సిక్స్‌ను అమలు చేసి ఎన్నికల సమయంలో కూటమి నాయకులు చెప్పిన మాటలను నిజం చేసి, వారి మనోభావాలు కాపాడాలని సూచించారు. తాము సూపర్‌సిక్స్ గురించి మాత్రమే మాట్లాడతామని, అంతకు మించి తమకేమీ అక్కర్లేదని జెట్టి అన్నారు. -
జాతీయ లోక్‌అదాలత్‌కు విస్తృత ఏర్పాట్లు
ఏలూరు (టూటౌన్): ఈనెల 8వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌కు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి (ఎఫ్ఏసీ), ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎం.సునీల్ కుమార్ చెప్పారు. స్థానిక జిల్లా కోర్టు నందు గురువారం విలేకరులతో వారు మాట్లాడుతూ జాతీయ లోక్‌అదాలత్ నిర్వహణ కోసం జిల్లా కోర్ట్‌లో 6 బెంచ్‌లు ఏర్పాటు చేయగా, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని కోర్ట్లలో కలిసి 26 బెంచ్‌లు ఏర్పాటుచేసి కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకున్నామన్నారు. జాతీయ లోక్‌అదాలత్‌లో పరిశీలన కోసం 4,453 కేసులను గుర్తించగా వీటిలో 1,815 క్రిమినల్, 2,341 సివిల్ కేసులు, 297 ఎంవీఓపీ కేసులు ఉన్నాయన్నారు. వీటిలో 3,875 కేసులకు సంబంధించి నోటీస్‌లు కూడా జారీ చేశామన్నారు. ఈ జాతీయ లోక్ అదాలత్‌లో 2,500 కేసుల పరిష్కారాన్ని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. వివిధ కారణాల వాళ్ల కోర్టుకు రాలేనివారి కోసం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కక్షిదారుల నుంచి వివరాలు తీసుకుని, రాజీకి వారు సిద్ధపడితే కేసుల పరిష్కారం చేస్తామన్నారు. లోక్ అదాలత్‌లలో కేసుల పరిష్కార విధానంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వివిధ శాఖల సిబ్బందితో 69 సమావేశాలు నిర్వహించినట్లు చెప్పారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్న ప్రసాద్ మాట్లాడుతూ రాజీ కాదగిన కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకుని సమయాన్ని, డబ్బును ఆదా చేసుకోవాలన్నారు. జిల్లా కోర్ట్ ఆవరణలోని జిల్లా న్యాయ సేవాసదన్‌లో శాశ్వత లోక్ అదాలత్ ఏర్పాటు చేశామని, కోర్టుల పనిదినాల్లో కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏలూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోనే సీతారాం పాల్గొన్నారు. -
కదం తొక్కిన కోకో రైతులు
ఏలూరు (టూటౌన్) : కంపెనీలు సిండికేట్‌గా మారి కోకో గింజల ధర తగ్గిస్తున్నాయంటూ ఏలూరులో రైతులు కదం తొక్కారు. చలో ఏలూరు కార్యక్రమంలో భాగంగా రైతులు ర్యాలీ, మహాధర్నా చేపట్టారు. ముందుగా ఫైర్‌స్టేషన్ మీదుగా ఉద్యాన శాఖ డీడీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేసి కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ధర్నాను ఉద్దేశించి ఏపీ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ కోకో గింజలను అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం కిలోకు రూ.900 ధర ఇప్పించాలని, సిండికేట్‌గా మారిన కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కంపెనీలతో రైతుల సమక్షంలో చర్చలు జరపాలని లేకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నినాదాలు చేస్తుండగా ఏలూరు త్రీటౌన్ సీఐకి రైతు సంఘ నాయకులతో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. శాంతియుతంగా ధర్నా చేస్తున్న తమపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడం తగదని నాయకులు విమర్శించారు. వినతిపత్రం అందుకున్న కలెక్టర్ వెట్రిసెల్వి రైతులతో చర్చలు జరిపి వారి సమస్యలు తెలుసుకున్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామన్నారు. ఏపీ కోకో రైతు సంఘం నాయకులు బొల్లు రామకృష్ణ, ఎస్.గోపాలకృష్ణ, సంఘ నాయకులు ఏలూరుతో పాటు పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, ఎన్టీ ఆర్, కృష్ణా జిల్లాల రైతులు భారీగా తరలివచ్చారు. కలెక్టరేట్ వద్ద రైతుల మహాధర్నా కోకో గింజలకు కిలోకు రూ.900 ధర ఇప్పించాలని వినతి సిండికేట్‌గా మారిన కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ -
ప్రభుత్వ భూముల్లో అక్రమ తవ్వకాలు
ద్వారకాతిరుమల: మండలంలోని జి.కొత్తపల్లి గ్రామంలో పచ్చ ముఠా అక్రమ గ్రావెల్ మట్టి తవ్వకాలు దర్జాగా సాగిస్తోంది. గత కొద్దిరోజులుగా టీడీపీ పెద్దల అండదండలతో ప్రభుత్వ భూముల్లో ఈ అక్రమ మట్టి తవ్వకాల దందా జోరుగా సాగుతోంది. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు. అదే అదనుగా సదరు టీడీపీ నేతలు రెచ్చిపోయి మరీ రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఈ అక్రమాలకు పాల్పడుతున్నారు. జేసీబీ సహాయంతో తవ్వకాలు జరిపి, టిప్పర్ల ద్వారా మట్టిని కామవరపుకోట, జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లోని రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలిస్తున్నారు. రియాల్టర్ల నుంచి కాంట్రాక్టులు పొంది మరీ ఈ దందాను దర్జాగా సాగిస్తున్నారు. ఒక్కో టిప్పర్ మట్టిని రూ.5 వేలకు పైగా విక్రయిస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఎవరైనా ఈ అక్రమ తవ్వకాలపై అధికారులకు ఫిర్యాదు చేస్తే, వెంటనే మట్టి తవ్వకాలు ఆగిపోతున్నాయి. కొద్దిసేపటి తరువాత మళ్లీ దందా షరామామూలుగా సాగుతోంది. ప్రభుత్వ భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతుంటే కనీసం ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని స్థానికులు ధ్వజమెత్తుతున్నారు. కూటమి నేతల కనుసన్నల్లో అధికారులు పనిచేయడమే ఇందుకు కారణమని ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఈ అక్రమ మట్టి తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు. జి.కొత్తపల్లిలో దర్జాగా పచ్చ ముఠా దందా రియల్ ఎస్టేట్ వెంచర్లకు టిప్పర్ల ద్వారా తరలిపోతున్న మట్టి -
ప్రాణం తీసిన బెదిరింపు
ముదినేపల్లి రూరల్: తల్లిని భయపెట్టేందుకు చేసిన పని వికటించి ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన మండలంలోని వడాలిలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన బాలుడు (17) రొయ్యల చెరువులపై పనులకు వెళుతుంటాడు. ఈ క్రమంలో చెరువుగట్లపై తిరుగాడే పందికొక్కులను నిర్మూలించేందుకు స్థానికంగా ఉన్న చెరువుగట్లపై బిళ్లలు కొట్టడానికి వెళ్లి మిగిలిన బిళ్లలు వెంట తిరిగి తెచ్చుకున్నాడు. ఈ బాలుడు 10వ తరగతి చదువుతూ మధ్యలో మానివేశాడు. తండ్రి గతంలోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాలుడికి ఒక చెల్లెలు ఉంది. తండ్రి చనిపోవడంతో కుటుంబపోషణ తల్లితో పాటు బాలుడిపై పడింది. బాలుడు చెరువుపై పనులకు వెళుతున్నప్పటికీ కూలి తీసుకోకుండా మద్యానికి అలవాటు పడ్డాడు. దీంతో చెరువు పనులకు వెళ్లవద్దని, రంగులు వేసే పనికి వెళ్లి కుటుంబాన్ని పోషించేందుకు సహాయపడాలంటూ తల్లి బాలుడిని గట్టిగా మందలించింది. ఈ మందలింపును జీర్ణించుకోలేని బాలుడు తల్లిని బెదిరించేందుకు వెంట తెచ్చుకున్న మిగిలిన పందికొక్కు బిళ్లల్లో కొన్ని మింగి వెంటనే ఊసేశాడు. తల్లి వెంటనే ముదినేపల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే బాలుడు మరణించినట్లు స్థానికులు తెలిపారు. చేతికి అంది వచ్చిన కొడుకు ఇలా అకాల మరణం చెందడంతో ఆ తల్లి కన్నీరుమున్నీరై విలపించింది. కాగా స్థానిక కూటమి నాయకుల చెరువులపై అప్పుడప్పుడు చిన్నపాటి పనులు చేస్తుంటే కూలి ఇవ్వకుండా మద్యం ఇచ్చి సరిపెడుతుండడంతో ఈ పరిస్థితి తలెత్తిందని పలువురు చెబుతున్నారు. చెక్‌బౌన్స్ కేసులో న్యాయవాదికి జైలుశిక్ష,జరిమానా నూజివీడు: చెల్లని చెక్కు ఇచ్చిన నేరానికి ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటకు చెందిన న్యాయవాది పెరుమాళ్ల వెంకట సతీష్‌కు ఆరు నెలల జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా విధిస్తూ నూజివీడు స్పెషల్ మేజిస్ట్రేట్ వేల్పుల కృష్ణమూర్తి గురువారం తీర్పు వెలువరించారు. వివరాల ప్రకారం చాట్రాయి మండలం సీ గుడిపాడుకు చెందిన నక్కా శ్రీను 2021 ఏప్రిల్‌లో సతీష్‌కు రూ.5 లక్షలు అప్పుగా ఇచ్చారు. కొంతకాలం తరువాత తన అప్పు తీర్చమని శ్రీను కోరగా 2022 మే నెలలో సతీష్ రూ.2 లక్షలకు చెక్కు ఇచ్చాడు. సతీష్ ఖాతాలో నగదు లేకపోవడంతో బ్యాంకు నుంచి ఆచెక్కు వెనక్కు వచ్చింది. దీనిపై శ్రీను కోర్టులో కేసు వేయగా విచారణ అనంతరం సతీష్‌కు రూ.3 లక్షల జరిమానా, 6 నెలల జైలు శిక్ష విధిస్తూ మేజిస్ట్రేట్ తీర్పు చెప్పారు. సొమ్ముల మాయంపై ఖాతాదారుల ఆందోళన ముదినేపల్లి రూరల్: బ్యాంకు ఖాతాల్లో నిల్వ ఉన్న తమ సొమ్ములు తగ్గడంపై ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై బుధ, గురువారాల్లో స్థానిక స్టేట్ బ్యాంక్‌కు దాదాపు 100 మంది వరకు తరలివచ్చిన ఖాతాదారులు మేనేజర్‌ను ప్రశ్నించారు. ఒకరికి రూ.36 వేలు, మరొకరికి రూ.96 వేలు, పలువురికి రూ.వెయ్యి నుంచి రూ.30 వేల వరకు ఖాతాల్లో నిల్వలు తగ్గిపోయాయంటూ మేనేజర్‌కు తెలిపి కారణం చెప్పాలంటూ నిలదీశారు. దీనిపై బ్రాంచ్ మేనేజర్ బీఎస్ సూర్యనారాయణ వివరణ ఇస్తూ స్థానికంగా ఉన్న తమ శాఖ నుంచి ఖాతాల్లో నిల్వలు ఏమి తగ్గించలేదన్నారు. ఖాతాదారులు ఇతర బ్యాంకుల నుంచి రుణాలు పొంది తిరిగి చెల్లించకుంటే ఈ విధంగా జరిగే అవకాశం ఉండవచ్చని తెలిపారు. అయినప్పటికీ దీనిపై ఉన్నతాధికారులకు సమాచారమందించి తగిన కారణాలు తెలియజేస్తామన్నారు. -
లారీ ఢీకొని వ్యక్తి మృతి
ఆకివీడు: లారీ ఢీకొని మోటార్‌సైక్లిస్టు మృతి చెందిన ఘటన ఆకివీడులో చోటుచేసుకుంది. కై కలూరు నియోజకవర్గంలోని పెదకొట్టాడ గ్రామానికి చెందిన మద్దా మరియదాసు (38) ఆకివీడులో ఫిష్ప్యాకింగ్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి ఫిష్ప్యాంకింగ్ పనులు ముగించుకుని మోటారు సైకిల్‌పై తిరిగి ఇంటికి వెళుతుండగా స్థానిక ఎఫ్‌సీఐ గోడౌన్ సమీపంలో కై కలూరు నుంచి వేగంగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో మరియదాసు తలకు తీవ్ర గాయమవడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై హనుమంతు నాగరాజు చెప్పారు. దాసుకు భార్య, ముగ్గురు మగపిల్లలు ఉన్నారని, అతడి భార్య విదేశాల్లో ఉంటున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దాసు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించామన్నారు. ఏటీఎంలో చోరీకి యత్నం తాడేపల్లిగూడెం అర్బన్: తాడేపల్లిగూడెంలోని కరూర్ వైశ్యాబ్యాంక్ ఏటీఎంలో చోరీకి విఫలయత్నం చేసిన ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కరూర్ వైశ్యాబ్యాంక్కు చెందిన ఏటీఎంలో చోరీకి పాల్పడేందుకు యత్నించారు. ముందుగా ఏటీఎం గదిలోకి ప్రవేశించేందుకు అక్కడ ఉన్న సీసీ కెమెరాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించగా సాధ్యం కాకపోవడంతో అక్కడి నుంచి పరారయ్యారు. గురువారం ఉదయం బ్యాంకు సిబ్బంది వచ్చి పరిశీలించి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టణ సీఐ ఎ.సుబ్రహ్మణ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్య కేసులో నిందితుడి అరెస్టు అత్తిలి: దంతుపల్లిలో జరిగిన హత్యకేసులో నిందితుడు కడలి వెంకట నారాయణను తణుకు రూరల్ సీఐ బి కృష్ణకుమార్ అరెస్టు చేసి కోర్టుకు హాజరుపర్చారని ఎస్సై పి ప్రేమరాజు గురువారం తెలిపారు. దంతుపల్లి గ్రామంలో జుత్తిగ వీరాంజనేయులను రాయితో కొట్టి హత్యచేసిన వెంకట నారాయణను ఇంటివద్ద అరెస్ట్ చేసి తణుకు కోర్టులో హాజరుపర్చగా మేజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించారని ఎస్సై చెప్పారు. ఇంట్లోకి ప్రవేశించి.. కంట్లో కారం కొట్టి జంగారెడ్డిగూడెం: ఇంట్లోకి ప్రవేశించి, కంట్లో కారం కొట్టి, మహిళ మెడలో బంగారు గొలుసు లాక్కెళ్లిన ఘటన జంగారెడ్డిగూడెంలో చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జంగారెడ్డిగూడెంకు చెందిన భూమా భాస్కరరావు, రత్నావతి స్థానిక బెనర్జీగారి వీధిలోని దుర్గాభవానీ అపార్టుమెంటులో నివాసముంటున్నారు. గురువారం ఉదయం భాస్కరరావు పనిమీద బయటకు వెళ్లగా రత్నావతి ఇంటి వద్ద ఒంటరిగా ఉంది. ఇంట్లో ఆమె టీవీ చూస్తున్న సమయంలో వెనుక నుంచి ఓ అపరిచిత వ్యక్తి ఆమె మెడలో ని బంగారు గొలుసు, సూత్రాలను లాక్కుని పరారయ్యాడు. ముఖానికి మాస్కు పెట్టుకుని వచ్చిన దుండగుడు తన జుట్టు పట్టుకుని, తన కళ్లల్లో కారం కొట్టి కట్టర్ సహాయంతో సూత్రాలతో పాటు గొలుసును కత్తిరించుకుపోయాడని బాధితురాలు రత్నావతి కన్నీటిపర్యంతమైంది. విషయం తెలుసుకున్న ఎస్సై జబీర్ ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. -
పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలి
భీమవరం (ప్రకాశం చౌక్): నిర్థిష్ఠ ప్రణాళికతో పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లాలోని పోలీసు అధికారులతో గురువారం ఆయన నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దొంగతనాల కట్టడితో పాటు చోరీ సొత్తు రికవరీపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. దర్యాప్తులో వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటూ నేర నియంత్రణలో సాంకేతికతను అందిపుచ్చుకోవాలన్నారు. ఎన్ఫోర్స్మెంట్ ముమ్మరం చేసి చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాలు సేవించడం వల్ల కలిగే దుష్ప్రభావాలు, సైబర్ నేరాలు గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ల వారీగా పాత పెండింగ్ కేసుల వివరాలు, ప్రస్తుత కేసుల స్థితిగతులు, నమోదైన కేసుల్లో నేరస్తుల అరెస్టు, కేసు దర్యాప్తు తీరుతెన్నులపై సంబంధిత పోలీస్ అధికారులను ఆరా తీశారు. పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, రాత్రి సమయంలో రెగ్యులర్ బీట్లతో వాహనాల తనిఖీలు చేసి కట్టడి చేయాలని, నేర నియంత్రణకు విస్తృతంగా విజిబుల్ పోలీసింగ్ నిర్వహించాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వాహన తనిఖీలు చేపట్టి ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలు పాటించేలా చేయాలన్నారు. అలాగే జిల్లాలో గుర్తుతెలియని మృతదేహాలు, అనుమానాస్పద మృతి కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆయా కేసుల్లో అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి పూర్తిస్థాయిలో సాక్ష్యాధారాలు సేకరించాలన్నారు. గ్రామాల్లో ఎంట్రీ, ఎగ్జిట్ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా చూడాలన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని పాటించాలన్నారు. ఫిర్యాదుదారులతో స్నేహపూర్వకంగా మెలగాలని, జవాబుదారీగా ఉండాలని, మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో ఏఎస్పీ (అడ్మిన్) వి.భీమారావు, భీమవరం సబ్ డివిజన్ డీఎస్పీ రావూరి గణేష్ జయసూర్య, నరసాపురం డీఎస్పీ జి.శ్రీ వేద, తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ డీఎస్పీ డి.విశ్వనాథ్, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వి.పుల్లారావు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ డి.వెంకటేశ్వరరావు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ అద్నాన్ నయీం అస్మి -
ఏలూరు: ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సును ఢీకొన్న లారీ.. ముగ్గురి మృతి
సాక్షి, ఏలూరు జిల్లా: ఏలూరు సమీపంలోని చొదిమెళ్ల వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిమెంట్‌ను లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఏలూరు ఆసుపత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తుండగా ప్రమాదం జరిగింది.లారీ లోయలో పడి ముగ్గురి మృతిమరో ఘటనలో వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని మద్దిమడుగు ఘాట్ పైన బుధవారం మధ్యాహ్నం లారీ లోయలోకి పడిన ఘటనలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళితే.. చేపల మేత లోడుతో బెంగళూరు నుంచి ఏలూరుకు వెళ్తున్న లారీ మద్దిమడుగు ఘాట్ పైన నాలుగో మలుపు వద్దకు రాగానే బ్రేక్ ఫెయిల్ అయి అదుపుతప్పి 50 అడుగులున్న లోయలోకి పడిపోయింది.లారీలోని డ్రైవర్ సాంబయ్య, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందగా.. చక్రాయపేట మండలం కప్పకుంటపల్లెకు చెందిన కె.వివేకానందరెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రమాద తీవ్రత కారణంగా లారీ మూడు ముక్కలుగా విడిపోయి కేబిన్ నుజ్జునుజ్జు అయ్యింది. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న రక్షక్ సిబ్బంది అగ్ని మాపక సిబ్బందిని, 108 అంబులెన్స్‌ను పిలిపించి క్షతగాత్రులను కాపాడే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే లారీ డ్రైవర్, క్లీనర్ మృతి చెందారు. -
నారాయణపురంలో పంచాయతీ స్థలం స్వాహా
ఉంగుటూరు : ఆక్రమణకు కాదేది అనర్హం అన్న చందంగా తయారైంది కూటమి ప్రభుత్వంలో పరిస్థితి. కన్ను వేశారా అంతే హాంఫట్.. ఉంగుటూరు మండలం నారాయణపురంలో జాతీయరహదారిని ఆనుకుని గ్రామ పంచాయతీకి చెందిన ఆరు సెంట్ల స్థలాన్ని టీడీపీ తన పేరున ఏకంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. సర్వే నెంబరు–156/2లో ఉన్న ఈ స్థలాన్ని టీడీపీ నేత గంటా యువరాజు తన భార్య పేరున పంచాయతీ స్థలం సరిహద్దులతో 156/1 సర్వే నెంబరుతో ఇటీవల గిఫ్ట్ డీడ్ కింద రిజిస్ట్రేషన్ చేయించారు. పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తి అని, తండ్రి తనకు రాశారని రిజిస్ట్రేషన్ పత్రాల్లో పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న పంచాయతీ అధికారులు ఉలిక్కిపడ్డారు. పంచాయతీ కార్యదర్శి విజయ్ తాడేపల్లిగూడెం సబ్ రిజిస్ట్రార్న కార్యాలయానికి వెళ్లి రిజిస్ట్రేషన్ నకళ్లు తీసుకున్నారు. చేబ్రోలు పోలీసు స్టేషన్లో మంగళవారం పంచాయితీ కార్యదర్శి ఫిర్యాదు చేశారు. ఆ పంచాయితీ స్థలానికి సర్వే చేయించి హద్దులు నిర్ణయించి రాటలు పాతారు. ఫెన్సింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు.పంచాయతీకి చెందిన స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్న విషయంపై పోలీస్టేషన్లో కేసు పెట్టామని కార్యదర్శి తెలిపారు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఫిర్యాదు చేసి రద్దు చేయిస్తామని విజయ్ తెలిపారు. ఈ స్థలం మార్కెట్ విలువ రూ.కోటి ఉంటుందని అంచనా. గూడెం రిజిస్ట్రార్ కార్యాలయంలో గోల్మాల్ ఈ స్థలాన్ని తప్పడు సర్వే నెంబరుతో ఎలా రిజిస్ట్రేషన్ చేశారనేది ప్రశ్న. ఈ వ్యవహరంలో తాడేపల్లిగూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కొందరి హస్తం ఉండొచ్చంటున్నారు. రిజిస్ట్రేషన్ చేసిన 90 రోజుల వ్యవధిలో సర్వే నెంబరు తప్పుగా నమోదైందనే వంకతో ప్రభుత్వ భూమిని కాజేయలనేది ఆ నాయకుడు ఎత్తుగడ. ఈ భూమిని మరో వ్యక్తికి గత నెల 12న తనఖా రిజిస్ట్రేషన్ కూడా చేశారు. తన భార్య పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్న టీడీపీ నేత -
క్షయ ముక్తి భారత్‌గా బల్లిపాడు
పాలకొల్లు సెంట్రల్: టిబి ముక్తి భారత్ గ్రామంగా బల్లిపాడు గ్రామాన్ని ప్రకటిస్తున్నట్లు జిల్లా వైధ్యా ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ భాను నాయక్ తెలిపారు. బుధవారం మండలంలోని లంకలకోడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిదిలో ఉన్న బల్లిపాడు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా డాక్టర్ భాను నాయక్ మాట్లాడుతూ గత సంవత్సర కాలంలో ఈ గ్రామంలో క్షయ వ్యాధి పట్ల సర్వే నిర్వహించడం జరిగిందన్నారు. గ్రామంలో నిర్వహించిన పరీక్షల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అన్నారు. అందువల్ల బల్లిపాడు గ్రామాన్ని క్షయ వ్యాధి రహిత గ్రామంగా ప్రకటిస్తున్నామన్నారు. క్షయ వ్యాధి పట్ల ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రజలు బల్లిపాడు గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతీ గ్రామాన్ని క్షయ వ్యాధి రహిత గ్రామంగా తీర్చిదిద్దేలా తమవంతు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భూపతిరాజు ఇందిరాదేవి, కాగిత అశోక్, డాక్టర్ అడ్డాల ప్రతాప్ కుమార్, ఆరోగ్య విస్తరణాధికారి గుడాల హరిబాబు, జిల్లా టిబి ప్రోగ్రాం కోఆర్డినేటర్ బి విద్యానంద్ తదితరులు పాల్గొన్నారు. తీరంలో తాబేళ్లు మృతి నరసాపురం రూరల్: తాబేళ్ల రక్షణ కోసం అధికార యంత్రాంగం ఎన్ని చర్యలు తీసుకున్నా అవి నీటి మూటలే అవుతున్నాయి. ఇటీవల తాబేళ్లు పెద్ద సంఖ్యలో సముద్ర తీరం వెంబడి మృత్యువాత పడిన విషయం మరువక ముందే బుధవారం మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‌లో పలు తాబేళ్లు మృత్యువాత పడ్డాయి. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం కూడా వీటి మృత్యువాతకు ఒక కారణంగా భావిస్తున్నారు. తాబేళ్ల రక్షణలో అలసత్వం వహించే అధికారులు, సిబ్బందిపై తగు చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు. మహిళల ఆర్థిక సాధికారతే లక్ష్యం భీమవరం(ప్రకాశంచౌక్): మహిళల ఆర్థిక సాధికారిత, భద్రతా, రక్షణ చర్యలో లక్ష్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టరు చదలవాడ నాగరాణి తెలిపారు. బుధవారం అమరావతి నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల నిర్వహణపై రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎ.సూర్య కుమారి ఇతర అధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రేమ, ఆప్యాయత పంచాలి భీమవరం(ప్రకాశంచౌక్): కరోనాతో చనిపోయిన కుటుంబాల పిల్లలకు ప్రేమ ఆప్యాయతలను పంచి సమాజంలో ఉన్నత స్థానాలకు చేరేలా కృషి చేయాలని కలెక్టరు నాగరాణి పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేటు పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మిషన్ వాత్సల్య స్కీం కింద స్పాన్సర్షిప్ ప్రోగ్రాంలో కరోనా బాధిత పిల్లలతో కలెక్టరు ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. బాధిత చిన్నారులకు ధైర్యం చెప్పారు. -
మద్యం మత్తులో హత్య
అత్తిలి: పాత గొడవను పురస్కరించుకుని ఇద్దరు స్నేహితుల మధ్య మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి హత్య గురైన ఘటన అత్తిలి మండలం దంతుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు దంతుపల్లి గ్రామానికి చెందిన జుత్తిగ వీరాంజనేయులు (35) కొబ్బరికాయలు దింపుపనికి వెళుతుంటాడు. అదే గ్రామానికి చెందిన కడలి వెంకటేశ్వరరావు అలియాస్ వెంకట నారాయణ, జుత్తిగ వీరాంజనేయులు స్నేహితులు. వీరిద్దరూ కలిసి తరచూ మద్యం సేవిస్తూ ఉంటారు. ఆరు నెలల క్రితం వెంకటేశ్వరరావు కుడి చెవివద్ద వీరాంజనేయులు కత్తితో గాయం చేశాడు. అప్పటి నుంచి వెంకటేశ్వరరావు దీనిపై కక్ష్య పెంచుకున్నాడు. మంగళవారం మధ్యాహ్నం ఇద్దరూ కలిసి మహాంకాళమ్మ ఆలయం వద్ద బల్లపై కూర్చుని మద్యం సేవిస్తుండగా పాతగొడవను పురస్కరించుకుని ఇద్దరూ ఘర్షణ పడ్డారు. దీంతో కడలి వెంకటేశ్వరరావు రాయితో వీరాంజనేయులు తల, ముఖంపై కొట్టి పక్కనే ఉన్న పంట కాలువలో పడవేసి ఇంటికి వచ్చేశాడు. రాత్రి సమయానికి కూడా వీరాంజనేయులు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెంకటేశ్వరరావును నిలదీయగా తానే రాయితో కొట్టి హత్యచేసినట్లు ఒప్పుకున్నాడు. వెంటనే కుటుంబ సభ్యులు హత్యకు గురైన ప్రాంతానికి చేరుకుని కాలువలో పడి ఉన్న మృతదేహాన్ని బయటకు తీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా ప్రదేశానికి అత్తిలి ఎస్సై పి ప్రేమరాజు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా మృతునికి భార్య వెంకటలక్ష్మి, ఒక కుమార్తె ఉన్నారు. భార్యభర్తల గొడవలు కారణంగా భార్య రెండేళ్లక్రితం భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. మృతుని సోదరి మట్టపర్తి మంగాయమ్మ ఫిర్యాదు మేరకు హత్యకేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పి ప్రేమరాజు తెలిపారు. -
మట్టి మాఫియాతో సాగునీటికి అడ్డంకులు
పెంటపాడులో యంగం చెరువు ఆయకట్టు రైతుల ఆందోళన భూమి పూడికకు అనుమతి లేదు పట్టణంలో భీమవరం బైపాస్ రోడ్డులో జిరాయితీ భూమిని పూడుస్తున్నారు. ఈ భూమికి సంబంధించి భూ యజమానులు కన్వర్షన్ అనుమతి పొందలేదు. ఇలా చేయడం నేరం. మార్గదర్శకాల ప్రకారం పూడిక చేసుకుంటే జరిమానా చెల్లింపుతోపాటు, కన్వర్షన్ ఫీజు కూడా చెల్లించాల్సి ఉంది. ఇలాంటి చర్యలను నిబంధనల మేరకు అడ్డుకుంటాం. – సునీల్‌కుమార్, తహసీల్దార్, తాడేపల్లిగూడెం●తాడేపల్లిగూడెం: అధికారం ముసుగులో రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టి 500 ఎకరాలను ఎండగట్టేందుకు కొందరు నేతలు సిద్ధమయ్యారు. పెంటపాడులో యంగం చెరువు ఆయకట్టు కింద సుమారు 500 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ ప్రాంతంలో వ్యవసాయ క్షేత్రాన్ని ఆనుకొని వేసుకున్న గట్లు, ఉమ్మడి కళ్లాలు ఉన్నాయి. మిడ్ లెవల్ కాలువ నుంచి లో లెవల్ కాలువను అనుసంధానించడానికి ప్రధాన పంట బోదెలు పెంటపాడు నుంచి జట్లపాలెం వరకు ఉన్నాయి. ఈ ప్రధాన భూముల మీదుగా సాగు నీరు పంటబోదెల ద్వారా లో లెవల్ కాలువకు వెళ్తుంది. ఈ మార్గంలో సుమారు 500 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. కొందరు స్వార్థపరులు అధికారం ముసుగులో మట్టి తవ్వకాలకు తెగబడ్డారు. నియోజకవర్గ మట్టి మాఫియా లీడర్ బుల్డోజర్లు, పొక్లెయిన్లు యథేచ్ఛగా మట్టిని తవ్వి పెంటపాడు నుంచి గూడెం పట్టణానికి తరలించారు. దీంతో ఈ తవ్వకాలను రైతులు అడ్డుకున్నారు. తమ భూములకు సాగునీటి సరఫరాకు అడ్డంకులు ఏర్పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తర్వాత తెరపైకి వచ్చిన కూటమి నేత మట్టి తవ్వకాలను కొనసాగించాలని, యంత్రాలను సీజ్ చేయకుండా మంతనాలు సాగించినట్టు సమాచారం. సుమారు 500 ఎకరాలకు సాగునీరు అందించే పంట బోదెలు, సామూహిక కళ్లాలు, గట్లను విధ్వంసం చేసేలా సాగుతున్న మట్టి తవ్వకాల కారణంగా సాగునీరు అందకుండా పొలాలు బీడు వారే ప్రమాదం ఉంది. రెవిన్యూ అధికారులు తవ్వకాలను ఎందుకు ఎందుకు అడ్డుకోలేదు.. వాహన యజమానులపై ఎందుకు కేసు నమోదు చేయలేదన్నది ప్రశ్నార్థకం. ఈ వ్యవహారంపై పెంటపాడు సంగం మేడ వద్ద జరిగిన మంతనాలకు గూడెం జేఎస్పీ నేత వెళ్లారు. పెంటపాడు రెవెన్యూ అధికారి ఆరోగ్య పరమైన కారణాలతో సెలవు పెట్టి వెళ్లగా.. ఇన్చార్జిగా ఒక అధికారిని నియమించారు. దీని వెనుక పెద్ద తతంగా నడిచిందని సమాచారం. ఇన్చార్జి అధికారులు తూతూ మంత్రం చర్యలు చేపట్టి చేతులు దులుపుకున్నారు. -
నూరు శాతం పన్నులు వసూలు చేయాలి
భీమవరం(ప్రకాశంచౌక్): అన్ని పంచాయితీల్లో మార్చి నెలాఖరు నాటికి నూరు శాతం పన్నులు వసూలు చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. బుధవారం భీమవరం శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కళాశాలలో పంచాయతీ కార్యదర్శుల సమీక్షా సమావేశంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నూరు శాతం పన్నులు వసూలుతో పాటు పూర్తిగా ప్లాస్టిక్ నిషేధించడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఏప్రిల్ ఒకటి నుంచి రోడ్డు పక్కన చెత్త కనిపించకూడదన్నారు. తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి వర్మి కంపోస్ట్ చేయాలన్నారు. నూరు శాతం పన్నులు వసూలు చేసిన కోమటితిప్ప, మొగల్తూరు, పాలకోడేరు, కొత్త నవరసపురం, మైప, వేండ్ర అగ్రహారం, చింతపర్రు, జగన్నాధపురం, మినీమించిలిపాడు, తూర్పుపాలెం, పి.పోలవరం, అప్పన్న చెరువు, వద్దిపర్రు, తోకలపూడి, దరిసిపరు, అప్పారావుపేట, కృష్ణయ్యపాలెం గ్రామాల కార్యదర్శులకు మెమొంటోలు అందజేశారు. నేడు వైన్ షాపులకు లాటరీ భీమవరం(ప్రకాశం చౌక్): పశ్చిమగోదావరి జిల్లాలో గీత కులాలకు కేటాయించిన 18 రిజర్వేషన్ వైన్ షాపులకు గురువారం కలెక్టరేట్లో మధ్యాహ్నం 3 గంటలకు లాటరీ ద్వారా షాపులు కేటాయిస్తారని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్‌కు చేరుకోవాలని కోరారు. ప్రతి దరఖాస్తుదారుడు దరఖాస్తుతోపాటు ఎంట్రీ పాస్, కుల ధ్రువీకరణ సర్టిఫికేట్, ఆథరైజేషన్ లెటర్ తీసుకుని రావాలన్నారు. మద్యం షాపు దక్కించుకున్న వెంటనే లైసెన్స్ రుసుం చెల్లించాలన్నారు. -
తణుకులో చికెన్ మేళా
తణుకు అర్బన్ : తక్కువ ధరతో ఎక్కువ ప్రొటీన్ అందించే చికెన్, కోడిగుడ్లు తీసుకోవడంలో అపోహలు అవసరం లేదని కలెక్టరు చదలవాడ నాగరాణి అన్నారు. తణుకు నెక్ కల్యాణ మండపంలో బుధవారం పౌల్ట్రీ ఫెడరేషన్, జిల్లా కోళ్ల రైతుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన చికెన్, ఎగ్ మేళా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడారు. బర్డ్‌ఫ్లూ సంక్షోభం ఏర్పడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని నేడు ఆ పరిస్థితులు తొలగిపోయాయని ప్రజలు నిరభ్యంతరంగా చికెన్, కోడిగుడ్లు తీసుకోవచ్చని స్పష్టం చేశారు. చికెన్ తినడం వలన ఎటువంటి ఇబ్బందులు రావని చెప్పారు. బాగా ఉడికించి చికెన్ తింటే ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ కోళ్ల రైతుల రుణాలు రీషెడ్యూల్ చేయాలనే అభ్యర్థనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. చికెన్, ఎగ్ మేళాకు విశేష స్పందన వచ్చింది. పౌల్ట్రీ ఫెడరేషన్ చైర్మన్ కోమట్లపల్లి వెంకట సుబ్బారావు అధ్యక్షతన నిర్వహించిన సభలో నెక్ చైర్మన్ మల్లిన శ్రీనివాసరావు, ఆర్డీవో కౌసర్ బానో, పశుసంవర్ధకశాఖ అధికారి కె.మురళీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి పనుల కొనసాగింపులో జాప్యం
తణుకు అర్బన్: శాసన మండలిలో బుధవారం ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు సద్వినియోగం చేసుకోవడంలో పరిశ్రమల శాఖకు చెందిన ఆంధ్ర ప్రదేశ్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చరల్ కార్పొరేషన్ (ఏపీఐఐసీ) తీవ్ర జాప్యం చేస్తోందని, ఎంఎస్ఎంఈ నిధులతో మొదలుపెట్టిన అభివృద్ధి పనులు మధ్యలోనే ఆగిపోయాయని అన్నారు. తణుకు, నెల్లిమర్ల, గాజులమండ్యం పారిశ్రామిక వాడలో రూ. 36 కోట్ల అభివృద్ధి పనులు ఆగిపోయాయని వాటిని త్వరితగతిన పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. తాను లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి భరత్ సమాధానం ఇస్తూ కొంత జాప్యం జరిగిందని, ఇక నుంచి అవాంతరాలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పశ్చిమ గోదావరి డెల్టా పరిధిలోని మంచినీటి కాలువలలోకి పంచాయతీ వ్యర్థాలను వదులుతున్నారని, సిద్ధాంతం, పెనుగొండ, నర్సాపురం భీమవరం జీవీ కాలువల్లో వేస్ట్ వాటర్‌ను నేరుగా పైపుల ద్వారా కలిపేస్తున్నారని చర్యలు తీసుకోవాలని కోరినట్లు వివరించారు. -
ఈ హామీల మాటేంటి?
ఆరోగ్య ఆసరాకు ఎసరు ఆరోగ్యశ్రీలో శస్త్రచికిత్స చికిత్స చేయించుకున్న రోగి కోలుకునే వరకు భరోసాగా నిలిచే ఆరోగ్య ఆసరా పథకానికి బడ్జెట్లో కేటాయింపులు లేవు. సాధారణ డెలివరీ, సిజేరియిన్లకు రూ.5 వేల చొప్పున, రోడ్డు ప్రమాద బాధితుల్లోని ఎముకలకు సర్జరీ కేసులకు రూ.10 వేలు, కాళ్లకు ఇన్ఫెక్షన్ సంబంధించి సెల్యులైటీస్ కేసులు, కొన్ని కణుతుల చికిత్సలకు రూ.1,575, కొన్ని చెవి, గొంతు, ముక్కు సర్జరీలకు రూ.1,275, గుండె శస్త్రచికిత్సలకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు.. ఇలా చికిత్సలను బట్టి రోజుకు రూ.275లు చొప్పున సాయం లెక్కకట్టి అందించేవారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్య ఆసరా బిల్లులు చెల్లింపు నిలిపివేయడంతో ఆరోగశ్రీ లబ్ధిదారులకు భరోసా కరువైంది. ●సాక్షి, భీమవరం: ‘ఒడ్డు చేరేదాకా ఓడ మల్లన్న.. ఒడ్డు చేరాక బోడి మల్లన్న’ అన్నట్టుగా ఉంది కూటమి తీరు. అధికారమే పరమావధిగా ఎన్నికల్లో కూటమి నేతలు లెక్కలేనన్ని హామీలిచ్చారు. ప్రభుత్వం రావడమే తరువాయి అన్నింటినీ ఆచరణలో పెట్టేస్తామంటూ ఓటర్లను నమ్మించారు. ఈ తొమ్మిది నెలల్లో చేసిందేమీ లేకపోగా పేదలు గంపెడాసతో ఎదురుచూసిన 2025–26 వార్షిక బడ్జెట్లోనూ హామీల అమలుకు కేటాయింపులు చేయ కుండా మసిపూసి మారేడుకాయ చేశారు. 50 ఏళ్లకే పింఛన్‌పై వంచన : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్ ఇస్తామని చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లు జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచారాల్లో ఎడాపెడా ఊదరగొట్టేశారు. ఇప్పుడు వాటి ఊసెత్తకపోగా విచారణ పేరిట ఉన్న వాటికీ కొర్రీ పెట్టే పనిలో పడ్డారు. జిల్లాలో 50 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు దాదాపు 2.50 లక్షల మంది వరకు ఉండగా వారిలో అర్హులైన వారు 70 శాతం మంది ఉంటారని అంచనా. వార్షిక బడ్జెట్లో కేటాయింపులు లేకపోవడం వారిని నిరాశకు గురిచేస్తోంది. ప్రస్తుతం అమలులో ఉన్నవాటికీ అరకొర కేటాయింపులు అనుమానాలకు తావిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి గతేడాది జూన్‌లో జిల్లాలో పింఛన్ లబ్ధిదారులు 2,34,161 మంది ఉన్నారు. కొత్త మంజూరులు చేయకపోగా వివిధ కారణాలతో 7,075 మంది పింఛన్లను తొల గించారు. దీంతో ఈ సంఖ్య 2,27,086కు తగ్గింది. ‘వల’విల.. మత్స్యకారులు వెలవెల వేట విరామం సందర్భంగా మత్స్యకార భృతిని రూ.10 వేల నుంచి రూ. 20 వేల వరకు పెంచుతా మని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. గతేడాది మత్స్యకారభృతి అందించకపోగా బడ్జెట్లోనూ దీనిపై స్పష్టత లేదు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.4 వేలు ఉన్న మత్య్సకార భృతిని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.10 వేలలకు పెంచారు. ఐదేళ్ల పాటు ఏటా మే నెలలో ఈ సాయం అందిస్తూ వచ్చారు. గత టీడీపీ హయాంలో జిల్లాలో కేవలం 76 మంది మాత్రమే అర్హులు ఉండగా జగన్ హయాంలో 1,162 మందికి మేలు చేశారు. చేనేతపై చిన్నచూపు : కూటమి బడ్జెట్లో చేనేత రంగాన్ని ఆదుకునే దిశగా అడుగులు వేసిన దాఖలాలు లేవు. చీర–ధోవతి పథకాన్ని పునరుద్ధరిస్తానని, చేనేత ఉత్పత్తులపై 30 శాతం రిబేటు ఇస్తామంటూ హామీలు ఇచ్చినా బడ్జెట్లో వాటి ఊసెత్తలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సొంత మగ్గం ఉన్న నేత కార్మికుల కుటుంబాలకు నేతన్న నేస్తం పథకం కింద ఏడాదికి రూ.24 వేలు ఆర్థిక సాయం అందించారు. ఐదేళ్లలో జిల్లాలో 920 కుటుంబాలకు రూ.10.96 కోట్ల లబ్ధి చేకూర్చారు. కూటమి అధికారంలోకి వచ్చాక నేతన్న నేస్తాన్ని నిలిపివేసింది. నేతన్నల కోసం ప్రత్యేక కార్యాచరణ లేకపోవడంతో చేనేత రంగం కుదేలవుతోంది. పింఛన్ హామీ ఏమైంది? ఎస్సీ, బీసీలకు 50 ఏళ్లకే ఇస్తామన్న పింఛన్ హామీ ఏమైంది. ప్రజలను నమ్మించి కూటమి ప్రభుత్వం గద్దెనెక్కింది. యాభై ఏళ్లకే బీసీలకు ఫించన్ ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి మోసం చేసింది. ఇది నమ్మక ద్రోహం. – పోతురాజు డేవిడ్ సొమ్ములు ఎగ్గొట్టారు గత ప్రభుత్వం అందించిన మత్స్యకార భరోసా వేట నిషేధ సమయంలో మాకు ఎంతగానో ఉపయోగపడింది. కూటమి సర్కారు ఈ మొత్తాన్ని మరింత పెంచి ఇస్తామని చెప్పడంతో నమ్మి ఓట్లేశాం. గతేడాది సొమ్ములు ఎగ్గొట్టారు. ఈ ఏడాది కూడా వేస్తారనే నమ్మకం లేదు. ప్రభుత్వానికి గుణపాఠం చెబుతాం. – మైల వీరాస్వామి, చినమైనవానిలంక వంచించి.. విస్మరించి.. 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పింఛన్ మత్య్సకార భరోసా రూ.20 వేలకు పెంపు ఆక్వా రైతులకు యూనిట్ రూ.1.50లకే విద్యుత్ ఎన్నికల్లో హామీలను గుప్పించిన చంద్రబాబు, పవన్‌కల్యాణ్ బడ్జెట్ కేటాయింపుల్లో వాటి ప్రస్తావనే లేని వైనం ఆక్వాకు దగా జిల్లాలో ఆక్వా రంగానికి పెద్దపీట వేస్తామని కూటమి నాయకులు హామీ ఇచ్చారు. ఆక్వా రైతులు అందరికీ విద్యుత్ యూనిట్ రూ.1.50కే ఇచ్చి ఆదుకుంటామన్నారు. ఏరియేటర్స్ మీద సబ్సిడీ ఇప్పిస్తామని, అవసరమైన చోట్ల 500 టన్నుల సామర్థ్యం గల కోల్ట్ స్టోరేజీలు నిర్మిస్తామన్నారు. అయితే బడ్జెట్‌పై ఆయా హామీల అమలుపై స్పష్టత లేదు. జిల్లాలో 1.24 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు ఉంది. 16,019 ఆక్వా విద్యుత్ కనెక్షన్లు ఉండగా వీటిలో పది ఎకరాలకు పైబడిన కనెక్షన్లు 1,142, నాన్‌ఆక్వా జోన్ పరిధిలో 953 ఉన్నాయి. గతంలోనూ రూ.2లకే సబ్సిడీ విద్యుత్‌ను ఇస్తామని టీడీపీ దగా చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పదెకరాలలోపు రైతులందరనీ ఆక్వాజోన్ పరిధిలోకి తీసుకువచ్చి రూ.1.50లకే సబ్సిడీ విద్యుత్‌ను అందజేశారు. -
రుణాల మంజూరుకు జాబితాల రూపకల్పన
భీమవరం (ప్రకాశంచౌక్): ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాల మంజూరుకు లబ్ధిదారులను ఎంపిక చేసి జాబితాలను సిద్ధం చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఆయా కార్పొరేషన్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, బ్యాంకర్లు, సంబంధిత శాఖల అధికారులతో సమావేశమై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగ రాణి మాట్లాడుతూ రుణాలు మార్చి 31లోపు గ్రౌండింగ్ అయ్యేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు నెలకొల్పేందుకు రూ.25 కోట్లు మంజూరు కాగా, వీటిని మూడు నుంచి ఐదు మంది సభ్యులు కలిగిన గ్రూపులకు మంజూరు చేస్తామన్నారు. ఒక్కో యూనిట్‌కు రూ. 25 లక్షలు మంజూరు చేస్తామని, దీనిలో 40 శాతం సబ్సిడీ, 40 శాతం టర్మ్ లోన్, 20 శాతం లబ్ధిదారుడు చెల్లించాల్సి ఉంటుందన్నారు. రుణాల మంజూరుకు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు. ఎస్సీ, బీసీ కార్పొరేషన్ రుణాల మంజూరు నిధులలో సుమారు 40 నుంచి 60 శాతం నిధులను సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు అందజేసేందుకు కేటాయించి, లబ్ధిదారులను గుర్తించి రుణాల మంజూరుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో బీసీ కార్పొరేషన్ ఈడీ ఎన్.పుష్పలత, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ జయప్రకాష్, డీఆర్డీఏ పీడీ వేణుగోపాల్, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యు.మంగపతి రావు పాల్గొన్నారు. -
త్రీడి బయో ప్రింటింగ్ అద్భుతం
తాడేపల్లిగూడెం: శరీరంలో ఏ అవయవం దెబ్బతింటే ఆ అవయవాన్ని ప్రయోగశాలలో కృత్రిమంగా తయారుచేయడానికి త్రీడి బయో ప్రింటింగ్ ఉపయోగపడుతుందని, ఇది ఓ అద్భుతం మంగళవారం నిట్‌లో జరిగిన కార్యక్రమంలో ఐఐటీ బయో ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ అశోక్‌కుమార్ అన్నారు. వైద్య రంగంలో త్రీడి బయో ప్రింటింగ్ ఓ సంచలనంగా మారనుందన్నారు. ఆన్లైన్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిట్ రిజిస్ట్రార్ దినేష్ శంకర్‌రెడ్డి మాట్లాడుతూ త్రీడి ప్రింటింగ్ టెక్నాలజీ భవిష్యత్‌లో నూతన అధ్యాయానికి నాంది పలకనుందన్నారు. అత్యవసర పరిస్ధితుల్లో అవయవాలు దొరక్క ఇబ్బంది పడుతున్న కుటుంబాల్లో త్రీడి బయో ప్రింటింగ్ వెలుగులు నింపనుందన్నారు. కార్యక్రమంలో డీన్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ రవికిరణ్‌శాస్త్రి, సుదర్శన్ దీప తదితరులు పాల్గొన్నారు. -
మా ఇంటిపై దాడి.. చింతమనేని కుట్ర
బంగారు నగల దోపిడీ జంగారెడ్డిగూడెంలో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై ముగ్గురు దాడి చేసి బంగారు నగలు దోపిడీ చేశారు. దాదాపు 8 కాసులు దోచుకుపోయారు. 8లో u● చెరువుల లీజు విషయంలో నాకు సంబంధం లేదు ● మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి పెదవేగి: తన ఇంటిపై టీడీపీ శ్రేణుల దాడిని దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి తీవ్రంగా ఖండించారు. తోటలో పామాయిల్ గెలలు కోస్తుండగా, టీడీపీ శ్రేణులు అడ్డుకొని, అక్కడ పనిచేస్తున్నవారిని కొట్టారని, గొడవ జరగకుండా సముదాయించడానికి వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారని, ఇందులో పలువురికి గాయాలయ్యాయని ఆయన తెలిపారు. చేపల చెరువుల లీజు విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆ విషయం తాను ఎప్పుడో ప్రకటించినా.. అక్కడి గ్రామస్తులను బెదిరించి చింతమనేని కనుసన్నల్లో టీడీపీ నేతలు కొంతకాలంగా తన ఇంటి ముందు అక్రమ ఆందోళనలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రశాంత వాతావరణాన్ని భంగపరిచేందుకు కుట్ర చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే చింతమనేని దుర్మార్గ రాజకీయాలకు ఇది నిదర్శనమని తెలిపారు. రెడ్‌బుక్ రాజ్యాంగంపై ఉన్న శ్రద్ధను నియోజకవర్గ అభివృద్ధిపై పెట్టాలని హితవు పలికారు. వైఎసా్‌స్‌ర్‌సీపీ శ్రేణులు దాడులకు భయపడవని, వారికి అండగా ఉంటానని, అధికారం శాశ్వతం కాదని గుర్తించాలని అబ్బయ్య చౌదరి స్పష్టం చేశారు. -
తడబడిన పట్టభద్రులు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉభయగోదావరి జిల్లాల్లో పట్టభద్రులు తడబడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 19,789 మంది చెల్లని ఓట్లు వేశారు. వీటిలో 42 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా ఉండటం గమనార్హం. ప్రతి రౌండ్లో సగటున 2,400పైగా చెల్లని ఓట్లు నమోదయ్యాయి. ఓటుపై అధికారులు అనేక అవగాహన సదస్సులు నిర్వహించారు. అభ్యర్థులు ప్రచారంలో కూడా ఓటు ఎలా వేయాలనేది గ్రాడ్యుయేట్లకు వివరించారు. అయినప్పటికీ వేల సంఖ్యలో చెల్లని ఓట్లు నమోదయ్యాయి. మొదటి రౌండ్లో 2,416, 2వ రౌండ్లో 2607, 3వ రౌండ్లో 2632, 4వ రౌండ్లో 2109, 5వ రౌండ్లో 2329, 6వ రౌండ్లో 2725, 7వ రౌండ్లో 2760, 8వ రౌండ్లో 2211 మొత్తం కలుపుకుని 19,789 చెల్లని ఓట్లు పోలయ్యాయి. ఎన్నికల విధుల్లో సుమారు 2,700 మంది సిబ్బంది పాల్గొనగా కేవలం 243 మంది మాత్రమే పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారు. వీటిలో కూడా 42 చెల్లని ఓట్లు నమోదయ్యాయి. బ్యాలెట్ పేపర్లో ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయాలి. మొదటి ప్రాధాన్యత ఓటు అభ్యర్ధి పేరు ఎదురు ఉన్న గడిలో 1వ నెంబర్, ప్రాధాన్యతను బట్టి 2, 3, 4 నెంబర్లు ఇతర అభ్యర్థులకు వేయవచ్చు. ఒకే అంకెను ఇద్దరికి వేసినా, 1 వేయకుండా 2, 3, 4 వేసినా నెంబర్లు కాకుండా రోమన్ నెంబర్లు వేసినా, అక్షరాలు రాసినా ఓటు చెల్లదు. ఎక్కువ మంది గ్రాడ్యుయేట్లు ఓటు వేయాలనుకున్న అభ్యర్థు పేరు వద్ద టిక్ పెట్టడం, రౌండ్ చుట్టడం, వారి సొంత పెన్నులు వినియోగించడం వంటి కారణాలతో వేల సంఖ్యలో ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. మొదటి మూడు స్థానాల్లో ఉన్న వారిని మినహాయిస్తే.. మిగిలిన 32 మందికి కలిపి 11,082 ఓట్లు పోలయ్యాయి. వారందరి ఓట్ల కంటే చెల్లని ఓట్లే అధికంగా ఉండటం విశేషం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 19,789 చెల్లని ఓట్లు పోలైన ఓట్లలో 9 శాతం చెల్లనివే -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరాబత్తుల విజయం
సాక్షి ప్రతినిధి,ఏలూరు: ఉభయగోదావరి జిల్లాల్లో పట్టభద్రుల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగి సింది. ఎన్నికల బరిలో కూటమి అభ్యర్థి, పీడీఎఫ్ అభ్యర్థి మధ్య ప్రధాన పోటీ జరగ్గా.. మరో 33 మంది స్వతంత్రులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కూటమి పార్టీ బలపరిచిన టీడీపీ నేత పేరాబత్తుల రాజశేఖరం ఎమ్మెల్సీగా గెలుపొందారు. 1,24,702 ఓట్లు సాధించి సమీప ప్రత్యర్థి, పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీరరాఘవులపై 77,461 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు. మొదట ప్రాధాన్యత ఓటులోనే 50 శాతం పైచిలుకు సాధించడంతో విజేతగా ప్రకటించారు. సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ముగిసింది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బ్యాలెట్ బాక్సుల్లో ఓట్లను కట్టలు కట్టడానికే సమయం సరిపోయింది. రాత్రి 10 గంటలకు కౌంటింగ్ ప్రారంభించి మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ముగించారు. ఏలూరులోని సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ హాలులో 28 టేబుల్స్ ఏర్పాటు చేసి 17 రౌండ్లు నిర్వహించేలా కట్టలు కట్టారు. అనంతరం ప్రతి టేబుల్‌కు వెయ్యి చొప్పున సగటున ప్రతి రౌండ్లో 28 వేల ఓట్లను లెక్కించి 8 రౌండ్లల్లో ఎన్నికల ప్రక్రియను ముగించేశారు. మొత్తం 2,18,997 ఓట్లు పోల్ కాగా వాటిలో 19,789 ఓట్లు చెల్లనవిగా నిర్ధారించారు. మిగిలిన 1,99,208 ఓట్లను మిగిలిన 8 రౌండ్లల్లో లెక్కించారు. ఎన్నికల బరిలో టీడీపీ అభ్యర్థి, పీడీఎఫ్ అభ్యర్థితో పాటు 35 మంది పోటీ చేశారు. వీరిలో స్వతంత్ర అభ్యర్ధి, మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు జీవీ సుందర్ మాత్రమే సత్తా చాటగా, మిగిలిన వారందరూ నామామత్రంగా కూడా ఓట్లు దక్కించుకోలేదు. 30 గంటల పాటు కౌంటింగ్ ప్రక్రియ గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 30 గంటల పాటు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగింది. ప్రతి రౌండ్లోనూ కూటమి అభ్యర్థి ఆధిక్యం కొన సాగింది. పీడీఎఫ్ అభ్యర్ధి మొదటి రౌండ్ నుంచి వెనుకంజలో ఉన్నారు. మొదటి రౌండ్లో 28 వేల ఓట్లు లెక్కించగా టీడీపీ అభ్యర్ధికి 16,520, పీడీఎఫ్ అభ్యర్ధి 5,815 ఓట్లు దక్కాయి. 8 రౌండ్లు కలిపి టీడీపీ అభ్యర్థికి 1,24,702 మొదటి ప్రాధాన్యత ఓట్లు రాగా.. పీడీఎఫ్ అభ్యర్థి 47,241 ఓట్లు దక్కించుకున్నారు. సత్తా చాటిన జీవీ సుందర్ మాజీ ఎంపీ జీ.హర్షకుమార్ తనయుడు జీవీ సుందర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మెరుగ్గా ఓట్లు సాధించారు. 8 రౌండ్లు కలుపుకుని 16,183 ఓట్లు దక్కించుకున్నారు. స్వతంత్రులుగా పోటీ చేసిన వారిలో కాట్రు నాగబాబు 565, షేక్ హుస్సేన్ 394, కట్టా వేణుగోపాలకృష్ణ 1017, కాండ్రేగుల నర్సింహం 364, కుక్కల గోవిందరాజు 269, కునుకు హేమకుమారి 956, కై లా లావణ్య 365, కొల్లు గౌతమ్ బాబు 317, చిక్కాల దుర్గారావు 665, నోరి దత్తాత్రేయ 565, యళ్ళ దొరబాబు 303, పిప్పళ్ళ సుప్రజ 479, బొమ్మడి సన్నిరాజ్ 398, బండారు రామ్మోహనరావు 709, చిక్కా భీమేశ్వరరావు 254, వానపల్లి శివ గణేష్ 772, హాసేన్ షరీఫ్ 709 ఓట్లు దక్కించుకున్నారు. గెలుపొందిన టీడీపీ అభ్యర్థికి రిటర్నింగ్ అధికారి వెట్రిసెల్వి డిక్లరేషన్ అందించారు. 77,461 ఓట్ల మెజార్టీతో గెలుపు పీడీఎఫ్ అభ్యర్థికి 47,241 ఓట్లు 8 రౌండ్లలో ముగిసిన ఓట్ల లెక్కింపు -
శ్రీవారి సేవలో కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిశాంతి మంగళవారం రాత్రి సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన ఆమెకు ముందుగా దేవస్థానం అధికారులు మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె స్వామి, అమ్మవార్లను దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో అర్చకులు, పండితులు ఆమెకు వేద ఆశీర్వచనాన్ని పలుకగా, సూపరింటెండెంట్ రమణరాజు శ్రీవారి జ్ఞాపికను, ప్రసాదాలను అందజేశారు. కోళ్ల వ్యర్థాల వాహనాలు సీజ్ పెదపాడు: అక్రమ రవాణా చేస్తున్న కోళ్ల వ్యర్థాల వాహనాలను పెదపాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారు వివరాలు ప్రకారం పెదపాడు మండలంలోని వడ్డిగూడెం, తోటగూడేనికి కోళ్ల వ్యర్థాల వాహనాలు తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు వాహనాలను అడ్డుకుని వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సదరు వాహన డ్రైవర్ వాహన యజమాని చేపల చెరువు యజమానులపై కేసు నమోదు చేసి, కోళ్ల వ్యర్థాలను ధ్వంసం చేస్తామని ఎస్సై తెలిపారు. -
పెన్షన్ రావడం లేదు
నాకు దివ్యాంగులైన పిల్లలు ఉన్నారు. వారికి పెన్షన్ రావడం లేదు. మాకు ఏ రిజర్వేషన్ సర్టిఫికెట్ లేదు. దివ్యాంగులైన పిల్లలతో కుటుంబ పోషణకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. మాకు గతంలో మాదిరిగానే ఎస్సీ సర్టిఫికెట్ జారీ చేయాలి. – కె.కుమారి, పెర్కిపాలెం ఉద్యోగానికి అర్హత లేదు నాకు ఎస్సీ రిజర్వేషన్ లేక ఏ పని ఉంటే ఆ పని చేసుకుని జీవిస్తున్నాను. మాలో చదువుకున్న యువత ఎస్సీ సర్టిఫికెట్ లేకపోవడంతో ఉద్యోగ అవకాశాలు లేక కూలి పనులు, ఇతర పనులపై బతుకుతున్నారు. ఇప్పటికై నా కేంద్ర ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలి. – కె.దుర్గ, పెర్కిపాలెం గత ప్రభుత్వంలో తీర్మానం బేడ, బుడగ జంగం కులస్తుల ఇబ్బందులు చూసి జగన్మోహన్రెడ్డి వారి ఎస్సీలుగా గుర్తించాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. చిన పిల్లలు దగ్గర నుంచి వృద్ధుల వరకు రిజర్వేషన్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలు సరైన నిర్ణయం తీసుకోవాలి. – పెండ్ర వీరన్న, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ 16 ఏళ్లుగా పోరాటం 16 ఏళ్లుగా ఎస్సీ సర్టిఫికెట్ కోసం పోరాటం చేస్తున్నాం. గతంలో ఇచ్చిన ఎస్సీ రిజర్వేషన్‌ను న్యాయంగా అడుగుతున్నాం. సర్టిఫికెట్ లేకపోవడంతో పథకాలు, పదవులు అందడం లేదు. మా కులస్తుల ఆర్థికంగా, రాజకీయంగా చైతన్యంకావడం లేదు. – కె. శ్రీనివాస్, బేడ, బుడగ జంగం జిల్లా కోఆర్డినేటర్ ● -
అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు దారుణం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము బలపరిచిన అభ్యర్థి దారుణంగా ఓడిపోవడంతో కూటమి నాయకులు జీర్ణించుకోలేక విపరీత వ్యాఖ్యలు చేస్తున్నారని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు షేక్ ముస్తఫా అలీ, రవికుమార్ రుద్రాక్షి ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు యూటీఎఫ్‌కు వైఎస్సార్సీపీ ముసుగువేస్తూ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. వాస్తవానికి ఏపీటీఎఫ్, పీఆర్టీయూ అభ్యర్థులకు కూటమి ముసుగు వేయడం ద్వారా అధికార పక్షమే ఉపాధ్యాయ ఉద్యమంలో చీలికలు తెచ్చిందని విమర్శించారు. ఈ ఎన్నికల్లో పీడీఎఫ్ స్వతంత్రంగా పోటీ చేసిందని దానికి యూటీఎఫ్, ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయని గుర్తు చేశారు. పీడీఎఫ్ ఏ పక్షం వహించకుండా మండలిలో స్వతంత్రంగా వ్యవహరిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలతో పాటు ప్రజా సమస్యలపై గళం ఎత్తుతుందన్నారు. -
వృద్ధురాలిపై దాడి, బంగారు నగల దోపిడీ
జంగారెడ్డిగూడెం: ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై ముగ్గురు వ్యక్తులు దాడి చేసి బంగారు నగలు దోపిడీ చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక సాయి స్ఫూర్తి ఆసుపత్రి సమీపంలో ఒంటరిగా నివసిస్తున్న 70ఏళ్ల రిటైర్డ్ ఉర్దూ టీచర్ షేక్ ఫాతిమున్నీసా ఇంటికి గుర్తు తెలియని 40 నుంచి 45 వయసు కలిగిన ముగ్గురు వ్యక్తులు మధ్యాహ్నం సమయంలో వచ్చినట్లు ఫాతిమున్నీసా తెలిపారు. ఇల్లు అద్దెకు కావాలంటూ ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి ఫాతిమున్నీసాపై దాడి చేశారు. ఆమె అరవకుండా నోరు నోక్కేసి ఆమె చేతికి ఉన్న 5 కాసుల బంగారు గాజులు, మెడలో ఉన్న 3 కాసుల చంద్రహారం దోపిడీ చేసుకుని వెళ్లిపోయారు. ఈ ఘటనలో ఫాతిమున్నీసా చేతికి తీవ్ర గాయం కాగా, స్థానిక ఏరియా ఆసుపత్రిలో వైద్యులు సుమారు 8 కుట్లు వైద్యులు వేశారు. ఘటనపై ఆమె స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై షేక్ జబీర్ తెలిపారు. -
జిల్లా ఆస్పత్రిలో పారిశుద్ధ్య కార్మికుల సమ్మె
తణుకు అర్బన్: తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రి పారిశుద్ధ్య కార్మికులకు గత 5 నెలలుగా వేతనాలు అందకపోవడంతో మంగళవారం విధుల బహిష్కరించి ఆస్పత్రి ఆవరణలో సమ్మెకు దిగారు. దీంతో పారిశుద్ధ్య సేవలు నిలిచిపోవడంతో రోగులు, సహాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి వార్డులో ఏర్పాటుచేసిన డస్ట్బిన్లు నిండిపోయి దర్శనమిచ్చాయి. దీంతో విషయం తెలుసుకున్న జిల్లా ఆస్పత్రుల సమన్వయాధికారి డాక్టర్ పి.సూర్యనారాయణ ఆస్పత్రికి వచ్చి కార్మికులు, యూనియన్ నాయకులతో చర్చలు జరిపారు. 5 నెలలపాటు వేతనాలు ఇవ్వకపోతే ఇళ్లు ఎలా గడపాలని, ఏం తినాలని కార్మికులు ప్రశ్నించారు. పీఎఫ్ సొమ్ము కూడా ఇంతవరకు తమ ఖాతాలకు జమకాలేదని వివరించారు. దీంతో డీసీహెచ్ఎస్ మాట్లాడుతూ ఈనెల 10 వరకు వేచి చూడాలని ఈ లోపు వేతనాలు జమవుతాయని కోరారు. చర్చలు సఫలీకృతం కావడంతో మధ్యాహ్నం నుంచి కార్మికులు విధుల్లోకి వచ్చి పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఇంటర్ పరీక్షల్లో 96 శాతం హాజరు భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి ఎ.నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం మొదటి సంవత్సరం ఇంగ్లీష్ పేపర్–1 పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 52 పరీక్షా కేంద్రాల్లో జనరల్ కేటగిరీలో 18,315 మందికి 17724 మంది, ఒకేషనల్ కేటగిరీలో 2,226 మందికి 1,987 మంది పరీక్ష రాశారన్నారు. 96 శాతం హాజరు నమోదైందని తెలిపారు. ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని తెలిపారు. ఆటో కార్మికుల ధర్నా తాడేపల్లిగూడెం (టీఓసీ): మినీ ట్రక్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ సభ్యులు ఆధ్వర్యంలో మంగళవారం హౌసింగ్‌బోర్డు సెంటర్ వద్ద ఆటో కార్మికులు ధర్నా చేశారు. ఏఐటీయూసీ ఏరియా కార్యదర్శి మందలపర్తి హరీష్ మాట్లాడుతూ విచ్చలవిడి చలానాలతో డ్రైవర్లను వేధిస్తున్న జీఓ నెంబర్ 21, 31 రద్దు చేయాలన్నారు. వాహన మిత్ర రూ.15 వేలు ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నూతన మోటారు యాక్ట్ చట్టం రద్దు చేయా లని తదితర డిమాండ్ల కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ కార్యాలయంలో అందజేశారు. ఏఐటీయూసీ నాయకులు కె.లక్ష్మీనారాయణ, తాడికొండ వాసు, కళింగ లక్ష్మణరావు, పి.ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. యూత్ పార్లమెంట్ నిర్వహణకు డీఎన్నార్ ఎంపిక భీమవరం (ప్రకాశంచౌక్): వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్–2025 నిర్వహణకు నోడల్ కాలేజీగా డీఎన్నార్ కళాశాలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిందని కళాశాల ప్రిన్సిపాల్ జి.మోజెస్ తెలిపారు. పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల నుంచి కార్యక్రమంలో పాల్గొనే వారు తప్పనిసరిగా పోర్టల్‌లో తమ పేర్లను నమెదు చేసుకోవాలన్నారు. నమోదు చేయించుకున్న వారిలో 150 మందిని స్క్రీనింగ్ చేసి వారికి డీఎన్నార్ కళాశాలలో పోటీలు నిర్వహించి 10 మందిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారన్నారు. పోటీలలో పాల్గొనేందుకు చివరి తేదీ మార్చి 9వ తేదీ అని.. వివరాలకు 8179179899, 9441388058 నెంబర్లలో సంప్రదించాలన్నారు. ఎస్ఈ మోషేకు పదోన్నతి ఏలూరు(మెట్రో): ఏలూరు సర్కిల్ ఆర్అండ్బీ సూపరింటెండెంట్ ఇంజనీర్ జాన్ మోషేకు పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మోషేను అమరావతి సీఈగా పదోన్నతి కల్పించి తక్షణమే విధులకు హాజరుకావాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. మహారాష్ట్ర డైట్ బృందం పర్యటన ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): మహారాష్ట్రలోని నాగపూర్ జిల్లా డైట్ కాలేజీ లెక్చరర్లు ఏలూరు జిల్లాలో అధికారిక పర్యటనకు విచ్చేశారు. మంగళవారం ఉదయం స్థానిక సుబ్బమ్మ దేవి నగరపాలక ఉన్నత పాఠశాలలో టీచర్లతో పలు అంశాలను చర్చించి సంతృప్తి వ్యక్తం చేశారు. -
ఉద్యోగులకు మొండిచేయి
ఏలూరు(మెట్రో): ఎన్నికల సమయంలో ఉద్యోగులపై వరాలు కురిపించిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా కనికరం చూపడం లేదు. ఉద్యోగులకు అంత చేస్తాం, ఇంత చేస్తాం అని ప్రగల్భాలు పలికిన సర్కారు ఉద్యోగులను పట్టించుకోవడమే మానేసింది. ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో ఉద్యోగుల ప్రస్తావనే రాకుండా బడ్జెట్ సమావేశాన్ని ముగించింది. ప్రతి పథకం అమలు చేయడంలో, అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లడంలో ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకం. ఆ ఉద్యోగులను పట్టించుకోకపోవడంపై పెదవి విరుస్తున్నారు.రూ.200 కోట్ల మేర బకాయిలుఉద్యోగులకు ఇప్పటికే వారి వేతనాలకు అనుగుణంగా 2.5 నుంచి 5.5 శాతం వరకు డీఏలు ఇవ్వాలి. ఉద్యోగులకు 2 డీఏలు చెల్లించాల్సి ఉన్నప్పటికీ వీటిపై కూటమి సర్కారు నోరు మెదపడం లేదు. కేంద్ర ప్రభుత్వం మరో డీఏ ప్రకటిస్తే మూడు డీఏ బకాయిలు పేరుకుపోయే అవకాశం ఉంది. సరెండర్ లీవ్‌లు రెండు ఇవ్వాల్సి ఉండగా.. వాటి ఊసే బడ్జెట్లో ప్రస్తావించలేదు. సరెండర్ లీవ్‌ల నిమిత్తం రూ.180 నుంచి రూ.200 కోట్ల మేర బకాయిలు ఉద్యోగులకు చెల్లించాలి. ప్రతీ ఉద్యోగి సరెండర్ లీవుల కోసం ఎదురుచూస్తున్నారు. ఏపీ జీఎల్ఐ ఆధ్వర్యంలో లోన్ల ఫైనల్ క్లైమ్స్ పేరుకుపోయాయి. వీటిపై బడ్జెట్లో ప్రస్తావించలేదు. రిటైర్ అయిన ఉద్యోగులకు 300 రోజుల సంపాదిత సెలవు ప్రస్తావన రాకపోవడం శోచనీయం. గ్రాట్యుటీ విషయంలోనూ అదే నిర్లక్ష్యపు ధోరణిని కూటమి సర్కారు ప్రదర్శిస్తోంది. జిల్లా వ్యాప్తంగా గత 8 నుంచి 9 నెలల కాలంలో సుమారు 800 మంది ఉద్యోగులు రిటైర్ అయినా వీరికి గ్రాట్యుటీ, ఆర్జిత సెలవులకు సంబంధించిన వేతనం నేటికీ లభించలేదు.మెడికల్ రీయింబర్స్‌మెంట్‌కు రూ.50 కోట్ల బకాయిఉద్యోగులకు వైద్య ఖర్చులు నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన మెడికల్ రీయింబర్స్‌మెంట్‌కు జిల్లాలో రూ.50 కోట్లు చెల్లించాల్సి ఉన్నప్పటికీ ఎక్కడికక్కడ దస్త్రాలు నిలిచిపోయాయి. ఉద్యోగులకు రూ. కోట్లాది రూపాయల బకాయిలు చెల్లించడంలో కూటమి సర్కారు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 35 వేల మంది ఉద్యోగులు, టీచర్లు విధులు నిర్వహిస్తుండగా, మరో 35 వేల మంది పెన్షనర్లు ఉన్నారు. వివిధ స్కీంలలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు మరో 15వేల మంది ప్రభుత్వ విధులు నిర్వహిస్తున్నారు. వీరందరికీ కూటమి సర్కారు మొండి చేయి చూపింది.సప్లిమెంటరీ బడ్జెట్ ప్రవేశపెట్టాలిఉద్యోగులకు మెడికల్ రీయిబర్స్‌మెంట్, డీఏలు చెల్లించాల్సి ఉంది. పెన్షనర్లకు గ్రాట్యుటీ, ఆర్జిత సెలవులు ఇవాల్సి ఉంది. ఇటీవల బడ్జెట్లో ఉద్యోగులకు నిధుల కేటాయింపు లేదు. ఉద్యోగులకు సప్లిమెంటరీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టి బకాయిలు చెల్లిస్తే ఉద్యోగులు ఆనందిస్తారు.– చోడగిరి శ్రీనివాసరావు, ఉమ్మడి జిల్లా ఎన్జీవో అధ్యక్షుడుబకాయిల చెల్లింపులో నిర్లక్ష్యంఅధికారం చేపట్టి 9 నెలలు కావస్తున్నా ఉద్యోగులపై సర్కారు కనికరం చూపడం లేదు. పేరుకుపోయిన బకాయిలు చెల్లించడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. జిల్లాలో ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.కోట్లలో ఉన్నాయి. వాటిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలలి.– కె.రమేష్‌కుమార్, చైర్మన్, ఏపీ జేఏసీ, అమరావతి -
ఎస్సీ గుర్తింపు కోసం పోరాటం
భీమవరం(ప్రకాశం చౌక్): బేడ, బుడగ జంగం కులస్తులు ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రం కోసం ఏళ్ల తరబడి పోరాడుతూనే ఉన్నారు. గతంలో కొందరు కాంగ్రెస్ నేతలు బేడ బుడగ జంగం ఆంధ్రాలో లేరని కోర్టులో వేయడంతో వారికి ఎస్సీ రిజర్వేషన్ వర్తించకుండా నిలిపేశారు. ఇటీవల పశ్చిమగోదావరి జిల్లాలో బేడ, బుడగ జంగం కులస్తులు పలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కలెక్టరేట్‌కు తరలివచ్చి తమ గోడు చెప్పుకున్నారు. జిల్లాలో భీమవరం, వీరవాసరం, మొగల్తూరు, పాలకోడేరు, పాలకొల్లు మండలాల్లోని పలు గ్రామాల్లో బేడ, బుడగ జంగం కుటుంబాలు దాదాపు 700 వరకూ ఉన్నాయి. 4 వేల మంది జనాభా ఉన్నారు. రిజర్వేషన్ సర్టిఫికెట్ లేక విద్య, ఉద్యోగాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారికి అటు ఎస్సీ సర్టిఫికెట్ గానీ ఇటు బీసీ సర్టిఫికెట్ గానీ జారీ కావడం లేదు. దాంతో పిల్లల స్కూల్ అడ్మిషన్లకు ఇబ్బంది పడుతున్నారు. చదువుకున్న వారికి రిజర్వేషన్‌కు సంబంధించి నిర్ధారణ చేసే సర్టిఫికెట్ లేకపోవడంతో ప్రభుత్వ, కాంట్రాక్ట్ ఉద్యోగులు రావడం లేదు. మహిళలు కూలి పనులు, ఇంటింటికి తిరిగి వస్తువులు విక్రయించడం, మగవారు గ్యాస్ పొయ్యిలు రిపేర్, కూలి పనులు చేసుకుని బతుకుతున్నారు. చంద్రబాబు హామీ నిలబెట్టుకోవాలి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో బేడ, బుడగ జంగం కులస్తుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని వారికి సంక్షేమ పథకాలు అమలు చేసి అదుకున్నారు. వారికి ఎస్సీ రిజర్వేషన్ వర్తించేలా శాసన సభలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపారు. ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు. నేడు కేంద్ర మంత్రులు, ప్రజాప్రతినిధులుగా ఉన్నారు వారు ఈ కులస్తుల సమస్య పట్టించుకోవడం లేదు. గతంలో బేడ, బుడగ జంగం కులస్తుల సభలో చంద్రబాబు మాట్లాడుతూ వారి సమస్య పరిష్కరించి ఎస్సీ రిజర్వేషన్ కల్పించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న చంద్రబాబు.. ఇచ్చిన మాటకు కట్టుబడి రిజర్వేషన్ కల్పించాలని కోరుతున్నారు. బేడ, బుడగ జంగం కులస్తుల అగచాట్లు ఎస్సీలుగా గుర్తించాలని తీర్మానం కేంద్రానికి పంపిన గత సర్కారు -
వైభవంగా పెద్దింట్లమ్మ జాతర
కై కలూరు: పంచహారతుల మధ్య కొల్లేటికోట పెద్దింట్లమ్మతల్లి దేదీప్యమానంగా భక్తులకు దర్శినమిచ్చారు. పెద్దింట్లమ్మ జాతర మంగళవారానికి నాలుగో రోజుకు చేరింది. అమ్మవారికి పుష్పాలంకరణ, ధూపసేవ, బాలభోగం వంటి వైదిక కార్యక్రమాలు చేశారు. వస్త్ర, పుష్పాలంకరణ, ఉచిత ప్రసాదదాతులుగా ఆటపాకకు చెందిన వేగేశ్న ప్రసాదరాజు, గణపవరానికి చెందిన రుద్రరాజు పుల్లంరాజు అందించారు. ఆలయ ప్రధాన అర్చకులు పేటేటి పరమేశ్వరశర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా పెరికేగూడెంకు చెందిన శ్యామలాంబ కళానికేతన్ ఆధ్వర్యంలో త్రిరత్నాలు సాంఘిక ప్రదర్శన అహుతులను అలరించింది. ఆలయ ఈఓ కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఈ నెల 13 వరకు జాతర జరుగుతుందని, జలదుర్గాగేకర్ణేశ్వరస్వామి దివ్వ కల్యాణం ఈ నెల 10న నిర్వహిస్తామని స్పష్టం చేశారు. రేషన్ బియ్యం పట్టివేత జంగారెడ్డిగూడెం: అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై షేక్ జబీర్ తెలిపారు. రెండు వాహనాల్లోనూ 52 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పోలీసులు, రెవెన్యూ శాఖ సంయుక్తంగా జరిపిన దాడిలో మండలంలోని దేవులపల్లి నుంచి కాకినాడ జిల్లా పిఠాపురానికి ఒక వాహనంలో అక్రమంగా రవాణా చేస్తున్న 22 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసులో పిఠాపురం మండలం బి.పత్తిపాడుకు చెందిన కామిరెడ్డి వీరవెంకట్రావును అరెస్టు చేసినట్లు చెప్పారు. అలాగే జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట నుంచి మరొక వాహనంలో యర్రంపేట కు రవాణా అవుతున్న 30 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసులో యర్రంపేటకు చెందిన నల్లమోతు సూర్యప్రకాష్‌ను అరెస్టు చేశామన్నారు. ఈ దాడుల్లో ఎస్సై జబీర్తోపాటు సివిల్ సప్లయిస్ డీటీ జి.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
సాంకేతికతను రైతులకు అందించాలి
తాడేపల్లిగూడెం: కృషి విజ్ఞాన కేంద్రాల్లోని వ్యర్థాలను పునర్వియోగ సాంకేతికతను రైతుల దరికి చేర్చాలని ఉద్యానవర్సిటీ ఉపకులపతి డాక్టర్ కె.గోపాల్ కోరారు. వెంకట్రామన్నగూడెంలో మంగళవారం ఉద్యానవర్సిటీలో నిర్వహించిన శాసీ్త్రయ సాంకేతిక సలహామండలి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ రైతుల పొలాల్లో జీవనియంత్రణ కారకాలు లేకుండా ప్రోత్సహించాలన్నారు. సేంద్రియ వ్యవసాయంపై రైతులకు ఆసక్తి పెంచే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. రైతులకు క్షేత్రస్ధాయిలో శాస్త్ర సాంకేతిక పరిజానం అందించే దిశగా పనిచేయాలన్నారు. 2024–25లో సాధించిన ప్రగతి, 2025–26 సంవత్సరంలో చేపట్టాల్సిన కార్యాచరణ గురించి చర్చించారు. కార్యక్రమంలో పరిశోధనాసంచాలకులు ఎమ్.మాధవి, గేదెల పరిశోధనాస్ధానం హెడ్ కె.ఆనందరావు, జిల్లా ఉద్యాన అధికారి దేవా ఆనందకుమార్, జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకులు జడ్.వెంకటేశ్వరరావు, జిల్లా అభివృద్ది అఽధికారి అనిల్‌కాంత్, డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ నరసయ్య పాల్గొన్నారు. -
పేదింట నిత్యావసరాల మంట
సాక్షి, భీమవరం: పేదల్లో ఇళ్లల్లో నిత్యావసరాల మంట రాజుకుంటుంది. నిత్యావసరాల ధరలకు రెక్కలు రావడంతో పేదల ఇంట పప్పులు ఉడకనంటుంటే.. నూనెలు సలసలమంటున్నాయి. రేషన్ ద్వారా కందిపప్పు సరఫరాకు సర్కారు ఎగనామం పెట్టగా, ధరల నియంత్రణ కోసమంటూ గతంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లు మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలాయి. మార్కెట్లో పప్పుల ధరలు మండిపోతున్నాయి. కిలో కందిపప్పు రూ. 150 ఉంటే పెసరపప్పు రూ. 130, మినపప్పు రూ. 110 ఉంది. మరోవైపు పామాయిల్ ప్యాకెట్ రూ.140లు ఉండగా, సన్‌ఫ్లవర్ ఆయిల్ రూ.150 ఉంది. జనవరిలో రూ.120 ఉన్న పామాయిల్ ఫిబ్రవరిలో రూ. 20 పెరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు. అదేమాదిరి ఇతర నూనెల ధరలు పెరిగాయి. నిత్యావసరాలు లేనిదే రోజు గడవని పరిస్థితుల్లో పెరుగుతున్న ధరలు పేదలకు భారమవుతున్నాయి. ధరల నియంత్రణ దిశగా ప్రభుత్వం చొరవ చూపకపోవడం విమర్శలకు తావిస్తోంది. పత్తాలేని ప్రత్యేక కౌంటర్లు నిత్యావసరాల ధరల నియంత్రణ కోసం సివిల్ సప్లయిస్ శాఖ ఆధ్వర్యంలో నవంబరులో జిల్లాలోని భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు తదితర నియోజకవర్గ, మండల కేంద్రాల్లోని సూపర్ మార్కెట్లు, రైతు బజార్లు, ప్రైవేట్ దుకాణాల్లో 22 ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. హోల్‌సేల్ ధరలపై ఉల్లిపాయలు, పామాయిల్, టమాట, బియ్యం తదితర సరుకుల అమ్మకాలు చేపట్టారు. పామాయిల్ రూ. 110కు, ఇతర సరుకులను బయటి మార్కెట్లో కంటే కొంతమేర తగ్గింపు ధరలకు విక్రయాలు చేశారు. అయితే నిర్వహణ సరిగా లేక కొద్దిరోజులకే చాలా చోట్ల ఇవి మూతపడిపోయాయి. ప్రస్తుతం జిల్లాలో ఎక్కడా ఇవి వినియోగంలో ఉన్న దాఖలాలు లేవు. కందిపప్పు రాలేదు జిల్లాలో 5.68 లక్షల రేషన్‌కార్డులు ఉండగా 356 ఎండీయూ వాహనాల ద్వారా బియ్యం, పంచదార సరఫరా చేసేవారు. అక్టోబరు నుంచి కందిపప్పు పంపిణీ ప్రారంభించిన కూటమి ప్రభుత్వం ఐదు నెలలు తిరగకుండానే చేతులెత్తేసింది. జిల్లాలో 1,052 మంది రేషన్ డీలర్లు ఉండగా ప్రతినెలా 20వ తేదీలోపు సరుకుల కోసం అవసరమైన మొత్తానికి డీడీలు తీయాల్సి ఉంది. ఈ మేరకు నాలుగు నెలలు పాటు కార్డుదారులకు కిలో రూ. 67కు కందిపప్పు సరఫరా చేసింది. ఫిబ్రవరి నెలకు కందిపప్పు కోసం డీలర్లు డీడీలు తీయగా 568 టన్నులకు గాను కేవలం 110 టన్నులు మాత్రమే సరఫరా చేసింది. డీడీల్లోని మిగిలిన సొమ్ములను ఇతర సరుకులకు సర్దుబాటు చేశారు. అయితే మార్చి నుంచి ప్రభుత్వం పూర్తిగా కందిపప్పు సరఫరాను నిలిపివేసింది. ఈ నెలలో కందికప్పు కోసం డీడీలు తీయవద్దని సివిల్ సప్లయిస్ అధికారులు ముందుగానే డీలర్లకు సమాచారం ఇచ్చారు. గత నెలలో పూర్తిస్థాయిలో కందిపప్పు రాకపోవడంతో వచ్చిన సరుకును సరిగా పంపిణీ చేయకుండా కొందరు పక్కదారి పట్టించారన్న ఆరోపణలున్నాయి. కందిపప్పు కోసం ఎండీయూ వాహనాల ఆపరేటర్లను అడుగుతుంటే స్టాకు రాలేదని చెబుతున్నారని వినియోగదారులు వాపోతున్నారు. దీంతో కందిపప్పును బయటిమార్కెట్‌లో అధిక ధర వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. కాగా ఈ నెలకు సంబంధించి కందిపప్పు రాలేదని సివిల్ సప్లయిస్ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ ఆదేశాలు మేరకు సరఫరాపై చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. ఆకాశాన్ని అంటుతున్న పప్పుల ధరలు సలసలమంటున్న నూనెలు కందిపప్పు పంపిణీకి సర్కారు ఎగనామం కందిపప్పు కొనలేకున్నాం రేషన్ షాపుల ద్వారా కందిపప్పు సరఫరా చేయకపోవడంతో బహిరంగ మార్కెట్లో అధిక ధరలు పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తోంది. మార్కెట్లో కొన్న కందిపప్పు నాణ్యంగా ఉండడం లేదు. రేషన్ షాపు ద్వారా కందిపప్పు సరఫరాను పునరుద్ధరించాలి. – ఎ.సత్యవతీదేవి, ఆకివీడు నిత్యావసరాల ధరలు పెరిగాయి గత కొద్ది రోజులుగా నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు సరుకులు కొనుక్కోవాలంటే భారంగా ఉంటుంది. కందిపప్పు, మినప్పప్పు అలాగే ఆయిల్ రేట్లు పెరిగాయి. నిత్యావసరాల ధరలు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – బి చంద్రకుమారి, జున్నూరు పెద్దపేట -
ఆర్థిక ఇబ్బందులతో ఆక్వా రైతు ఆత్మహత్య
నిడమర్రు: ఆర్థిక ఇబ్బందులతో ఆక్వారైతు నిమ్మల శ్రీను (42) సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పెదనిండ్రకొలను గ్రామంలో సంచలనం కలిగించింది. వివరాల ప్రకారం పెదనిండ్రకొలను గ్రామానికి చెందిన నిమ్మల శ్రీను గుణపర్రు గ్రామంలో ఆక్వా చెరువులు లీజుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. సోమవారం సాయంత్రం ఆక్వా చెరువుల్లో గ్యాస్ (అల్యుమినియం ఫాస్సైండ్ 56 శాతం ) ట్యాబ్లెట్స్ను శ్రీను మింగేశాడు. అనంతరం సోదరుడు రామకృష్ణకు నేను ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నట్లు మృతుడు ఫోన్ చేశాడు. దీంతో కుటుంబ సభ్యులు మృతుని కోసం ఆరా తీయగా లీజుకు తీసుకున్న గుణపర్రు చెరువుల వద్ద ఉన్నట్లు తెలియడంతో అక్కడకు వెళ్లి గణపవరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వెళ్లగా ఆక్కడ డాక్టర్ల సూచనల మేరకు తాడేపల్లిగుడెం ఏరియా ఆసుపత్రికి తీసుకుని వెళ్లాడు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీను చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఇటీవల ఆశించిన స్థాయిలో ఆక్వా సాగు లేకపోవడం, ఇల్లు కట్టడంతో ఉన్న ఎకరం పొలం అమ్మేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఆర్థిక ఇబ్బందులు పెరగడంతో మానసికంగా ఆందోళనే ఆత్మహత్యకు కారణమని స్థానికులు చెపుతున్నారు. మృతుడు సోదరుడు నిమ్మల రామకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వీరప్రసాద్ తెలిపారు. మృతుడు శ్రీనుకి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
ఆక్వా రైతులకు సమాచారం ఇవ్వడం లేదని ఆగ్రహం
పాలకొల్లు సెంట్రల్: ప్రభుత్వం మారితే సమస్యలు పరిష్కారం అవుతాయనుకుంటే ప్రభుత్వాధికారులు కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదని ఆక్వా రైతులు మండిపడ్డారు. మంగళవారం పాలకొల్లు పట్టణంలోని జై భారత్ క్షీరా రామ ఆక్వా రైతు సంఘం సభ్యులు విలేకరు సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్బంగా సంఘ అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీభగవాన్‌రాజు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన అప్సడా సంఘాన్నే కొనసాగిస్తూ ఆనం రమణారెడ్డిని వైస్ చైర్మన్‌గా ఎంపిక చేశారని తెలిపారు. విజయవాడలో గత నెలలో ఏర్పాటుచేసిన ఆక్వా రైతుల సమావేశానికి మత్స్యశాఖ అధికారులు తమ సంఘానికి కనీస సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. వారికి తెలిసిన కొందరు రైతులకు సమాచారం ఇచ్చి చేతులు దులిపేసుకున్నారన్నారు. దీనిపై సంబంధిత స్థానిక మత్స్యశాఖ అధికారులను ప్రశ్నించగా అయ్యో మర్చిపోయానని చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ప్రాసెసింగ్ ప్లాంట్ సభ్యులు ఒక యూనియన్‌గా తయారై ధరలను తగ్గించేస్తున్నారని వాపోయారు. ఫీడ్ కంపెనీలు ముడి సరుకు ధరలు తగ్గినా ఫీడ్ ధరలు మాత్రం తగ్గించడంలేదని తెలిపారు. ప్రభుత్వం ఆక్వా రైతుల సమస్యలు పట్టించుకోకుండా ఇబ్బందులు పెడితే ఆక్వా సాగు పెరగడం కాదని ఉన్న సాగునే క్రాప్ హాలిడేగా ప్రకటించే పరిస్థితి ఎదురవుతుందని హెచ్చరించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆక్వా రైతుల సమస్యల పట్ల అప్సుడా ఆధ్వర్యంలో కాకినాడలో ప్రాసెసింగ్ యూనిట్స్, ఫీడ్, హెచరీ కంపనీల సభ్యులతో సమావేశం ఏర్పాటుచేసి రైతుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని సమస్య పరిష్కారం దిశగా పనిచేశారని రైతు సంఘం సభ్యులు గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో సంఘ సభ్యులు బోణం నరసయ్య, ఎం జాన్‌రాజు, మేకా ఫణీంద్ర ప్రసాద్, పెన్మెత్స వెంకట సత్యనారాయణరాజు, సజ్జా బుజ్జి తదితరులు పాల్గొన్నారు. -
12న వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మహాధర్నా
ఏలూరు (టూటౌన్): ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి రూ.12వేల నగదు, మూడు సెంట్ల స్థలం, ఇంటి నిర్మాణానికి రూ.6లక్షలు ఇఆ్వలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ.రవి అన్నారు. పేదల సమస్యలపై ఈ నెల 12న విజయవాడలో మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలియజేసారు. స్థానిక పవరుపేటలోని అన్నే భవన్లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో మహాధర్నాకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎం.జీవరత్నం, తానా ముత్యాలమ్మ, వై.నాగేంద్రరావు, ఎస్.మహాంకాళిరావు పాల్గొన్నారు.గాలాయగూడెంలో కోళ్ల మృత్యువాతదెందులూరు: మండలంలోని గాలయగూడెంలో కోళ్లు మృత్యువాతకు గురవుతున్నాయి. ఒక వైపు అన్ని ప్రాంతాల్లో వేల సంఖ్యలో కోళ్లు చనిపోవడం పశు వైద్యశాఖాధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించడం విధితమే. చనిపోయిన కోళ్లను గాలాయగూడెం విద్యుత్ సబ్‌స్టేషన్ పక్కన చెరువుగట్టు మీద ఉండటంతో కుక్కలు వచ్చి చనిపోయిన కోళ్లను పీక్కుతింటున్నాయి. దీంతో ఆ ప్రాంతమంతా దుర్వాసన వస్తోంది. పశు వైద్య శాఖ సిబ్బంది గ్రామాల్లో పర్యవేక్షణ చేయాలని చనిపోయిన కోళ్ల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.కట్నం కోసం వేధిస్తున్నారని భర్తపై భార్య ఫిర్యాదుఉండి: వివాహమైన ఆరేళ్ల తరువాత కట్నం కావాలంటూ వేధింపులకు గురి చేస్తున్నారని ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. వివరాల ప్రకారం ఉండి మండలం చెరుకువాడ గ్రామానికి చెందిన కంకిపాటి లక్ష్మీదుర్గకు, ఏలూరుకు చెందిన శ్రావణ్‌కుమార్‌తో 2019లో వివాహమైంది. ఈ నేపథ్యంలో భార్యను రూ.10 లక్షలు కట్నం తేవాలని వేధించేవాడు. అతనికి అత్తమామలు, ఆడపడుచులు సహకరిస్తూ శారీరక, మానసిక వేధింపులు చేసేవారు. గతేడాది డిసెంబర్ 12న లక్ష్మీదుర్గను ఇంటి నుంచి పంపేయడంతో చెరుకువాడలో తల్లిదండ్రులతో ఉంటుంది. ఈ మేరకు బాధితురాలు మంగళవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై ఎండీ నసీరుల్లా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అర్ధరాత్రి రోడ్డుపై ఆగిపోయిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
దెందులూరు: మండలంలోని ముప్పవరం సోమవారం అర్ధరాత్రి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రోడ్డుపై నిలిచిపోయింది. వివరాలను ప్రకారం వైజాగ్ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే నవదిశా ట్రావెల్స్‌కు సంబంధించిన బస్సు సోమవారం సాయంత్రం వైజాగ్‌లో 35 మంది ప్రయాణికులతో బయలుదేరింది. అయితే అర్ధరాత్రి వంటి గంట సమయానికి ముప్పవరం వద్ద రిపేర్ వచ్చి ఆగిపోయింది. దీంతో ఆ సంస్థకు ఫోన్ చేయగా యజమాని దుర్భాషడాలరని ప్రయాణికులు వాపోతున్నారు. విషయం తెలుసుకున్న ఏఎస్సై వెంటేశ్వరరావు బస్సు డ్రైవర్‌తో మాట్లాడి, యజమానికి విషయం తెలపడంతో మంగళవారం మీ సొమ్ములు చెల్లిస్తానని యజమాని చెప్పాడు. దీంతో ప్రయాణికులు రాత్రి సమయంలో వేరే బస్సుల్లో గమ్యస్థానాలకు చేరుకున్నారు. -
ట్రిపుల్ ఐటీలో క్లే, పెన్సిల్ ఆర్ట్ పోటీలు
నూజివీడు: స్థానిక ట్రిపుల్‌ఐటీలో మంగళవారం విద్యార్థులకు మట్టితో ప్రతిమలు తయారు చేయడం (క్లే ఆర్ట్), పెన్సిల్ ఆర్ట్ పోటీలను నిర్వహించారు. త్వరలో నిర్వహించనున్న వార్షికోత్సవం శ్రీసిగ్నస్శ్రీలో భాగంగా ఈ పోటీలను నిర్వహించారు. విద్యార్థుల సృజనాత్మకతను మెరుగుపరిచే ఉద్దేశంతో నిర్వహిస్తున్నట్లు ఈ పోటీలను ప్రారంభించిన ఆర్జీయూకెటి రిజిస్ట్రార్, నూజివీడు ట్రిపుల్ఐటీ డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కేవీడీజీ బాలాజీ అన్నారు. విద్యార్థుల్లోని కళాపోషణని బయటకి తీస్తూ, మన సంస్కృతిని తెలియజేయడమే ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. క్లే ఆర్ట్ పోటీలో విద్యార్థులు రూపొందించిన ప్రతి ప్రతిమ వెనుక ఒక కథను చెప్పేలా వారి కళాత్మకతను ప్రదర్శించారు. అలాగే పెన్సిల్ ఆర్ట్ పోటీల ద్వారా విద్యార్థులు సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా అద్భుతమైన చిత్రాలను చిత్రీకరించారు. కార్యక్రమంలో శ్రీకాకుళం ట్రిపుల్ఐటీ ఏఓలు బి.లక్ష్మణరావు, సతీష్, సిగ్నస్ కన్వీనర్ జె.సీతాపతి తదితరులు పాల్గొన్నారు. ట్రిపుల్ ఐటీలో పలు వర్క్‌షాపులు నూజివీడు: ట్రిపుల్‌ఐటీలో మంగళవారం పలు వర్క్‌షాపులు నిర్వహించారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు సంబంధించి ఎలక్ట్రిక్ వెహికల్ తయారీపైన, పియూసీ విద్యార్థులకు క్రియేటివ్ డిజైన్ మాస్టరీ వర్క్‌షాపులను నిర్వహించారు. టెక్‌జైట్–2025లో భాగంగా ఈ వర్క్‌షాపులను నిర్వహించామని నూజివీడు ట్రిపుల్ఐటీ ఏఓ బీ లక్ష్మణరావు పేర్కొన్నారు. పీయూసీ విద్యార్థులకు క్రియేటివ్ డిజైన్‌లో నిర్వహించిన వర్క్‌షాపులో సీనియర్ ప్రొడక్ట్ అండ్ గ్రాఫిక్ డిజైనర్ చోడిశెట్టి సూర్యత్రినాధ్ పాల్గొని డిజైన్ రంగంలో ఉన్న అవకాశాలు, మెరుగైన డిజైనింగ్ స్కిల్స్‌ను అభివృద్ధి చేసుకోవడం, మార్కెట్లో ఉన్న డిమాండ్ తదితర అంశాల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించారు. -
బంగారు హారాన్ని పోగొట్టుకున్న భక్తురాలు
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో ఒక భక్తురాలు మంగళవారం తన మెడలోని 5 కాసుల బంగారు హారాన్ని పోగొట్టుకుంది. బాధితురాలి కథనం ప్రకారం. పెదవేగి మండలం అంకన్నగూడెంకు చెందిన కోసూరి దుర్గా ప్రభావతి కుటుంబ సభ్యులతో కలసి స్వామి, అమ్మవార్లను దర్శించారు. అనంతరం శ్రీహరి కళాతోరణం వేదిక పక్కనున్న ప్రాంతంలో కొబ్బరికాయలు కొట్టి, తిరుగు ప్రయాణం అయ్యే క్రమంలో వాహనాల పార్కింగ్ ప్రాంతంలోకి వెళ్లారు. ఆ సమయంలో మెడలో బంగారు హారం లేకపోవడాన్ని ఆమె గమనించారు. కంగారు ఆమె తిరిగిన అన్ని ప్రాంతాల్లో వెతికినా ఫలితం దక్కలేదు. దాంతో దేవస్థానం అధికారులకు సమాచారం అందించగా, సిబ్బంది సీసీ ఫుటేజీలను పరిశీలించారు. అయితే కొబ్బరికాయలు కొట్టే ప్రాంతానికి కూతవేటు దూరంలో ఉన్న మంచినీటి కుళాయి వద్ద, కింద పడి ఉన్న బంగారు హారాన్ని ఒక మహిళ తీసుకుని వెళ్లిపోయినట్టు సీసీ ఫుటేజీలో కనిపించింది. వెంటనే బాధితురాలు స్థానిక పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసింది. లోక్‌అదాలత్‌లో బీఎస్ఎన్ఎల్ బిల్లుల కేసులను పరిష్కరించుకోవాలి ఏలూరు (టూటౌన్): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని బీఎస్ఎన్ఎల్ బిల్లుల బకాయిల కేసులను పరిష్కరించుకోవాలని ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ ఎల్ శ్రీను తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. వినియోగదారులు జిల్లా, మండల న్యాయ సేవాధికార కమిటీలతో ఏలూరు, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, తాడేపల్లిగూడెం, కొవ్వూరు, తణుకు, భీమవరం, నరసాపురం పరిధిలోని లోక్ అదాలత్ కోర్టుల్లో ఈ నెల 8వ ఉదయం 10 గంటల నుంచి నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ నందు పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. వినియోగదారులు తమ బకాయిలను ముందుగానే చెల్లించాలనుకుంటే వారు తమ దగ్గరలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. మరిన్ని వివరాల కోసం 94947 08898, 9490312777, 94404 33533 నంబర్లకు ఫోన్ చేయాలని కోరారు. తప్పిపోయిన పిల్లల అప్పగింత గణపవరం: తప్పిపోయిన ఇద్దరు బాలుర విషయమై గణపవరం పోలీసులు అత్యవసరంగా స్పందించడంతో వారిని గంటల వ్యవధిలోనే పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. గణపవరం మండలం పిప్పర గ్రామానికి చెందిన 13 సంవత్సరాల వయస్సు ఉన్న ఇద్దరు బాలురు ఈ నెల 3వ తేదీ రాత్రినుంచి కనిపించకుండా పోయారు. వారికోసం కుటుంబసభ్యులు స్నేహితులు, బంధువుల ఇళ్లు గాలించినా ఫలితం లేకపోవడంతో ఆ పిల్లల అమ్మమ్మ పూడి కాంతమ్మ అర్ధరాత్రి 3 గంటలకు 112 నెంబరు ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే గణపవరం సీఐ ఎంవి సుభాష్, ఎస్సై మణికుమార్‌లు స్పందించి హెడ్‌కానిస్టేబుల్ రత్నప్రసాద్, పీసీ పి.కాంతయ్య, హెచ్‌సీ ఎం.సతీష్‌తో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి గాలించడంతో పిప్పర పరిసర ప్రాంతాలలో పిల్లలను గుర్తించి మంగళవారం ఉదయం పట్టుకుని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
పట్టభద్రుల కౌంటింగ్ ప్రారంభం
సాక్షి ప్రతినిధి, ఏలూరు/ ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఓట్ల లెక్కింపు కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. ఏలూరులోని సర్ సీఆర్‌రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో కలెక్టర్, రిటర్నింగ్ అధికారి కె. వెట్రిసెల్వి నేతృత్వంలో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించారు. స్ట్రాంగ్‌రూమ్ కూడా ఇంజనీరింగ్ కళాశాలలోనే ఏర్పాటు చేయడంతో కౌంటింగ్ హాలుకు బ్యాలెట్ బాక్సులు తరలించారు. ఉభయగోదావరి జిల్లాల్లో 2,18,997 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా గతనెల 27న జరిగిన పోలింగ్‌లో 69.50 శాతం పోలింగ్ నమోదైంది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కూటమి బలపరిచిన టీడీపీ నేత పేరాబత్తుల రాజశేఖరం, పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీరరాఘవులతో పాటు మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు జీవీ సుందర్కుమార్తో పాటు 32 మంది స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేశారు. ఉదయం 6.30 గంటల నుంచి.. ఉదయం 6.30 గంటలకు పోలింగ్ కేంద్రంలో సిబ్బంది విధుల్లో నిమగ్నమయ్యారు. కలెక్టర్ పర్యవేక్షణలో స్ట్రాంగ్ రూమ్ నుంచి బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ హాలుకు తరలించారు. ఇంజనీరింగ్ కళాశాలలోని కౌంటింగ్ హాలులో 28 టేబుళ్లను ఏర్పాటు చేసి 17 రౌండ్లలో ఓట్లు లెక్కించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు బ్యాలెట్లు కట్టలు కట్టేందుకు సమయం ప ట్టింది. ఉభయగోదావరిలోని ఆరు జిల్లాల్లో 456 పోలింగ్ కేంద్రాల్లో 1,368 బ్యాలెట్ బాక్సులు విని యోగించారు. వీటన్నింటినీ అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో తెరిచి ఓట్లను కట్టలు కట్టి అనంతరం చెల్లిన, చెల్లని ఓట్లను గుర్తించి అలాగే మొదటి ప్రా ధాన్యత ఓట్లను కూడా గుర్తించేలా లెక్కించనున్నా రు. మొదటి 8 రౌండల్లో మొదటి ప్రాధాన్యతా ఓట్లను లెక్కిస్తారు. 700 మంది సిబ్బంది.. 24 గంటలూ విధులు ఆరు జిల్లాల నుంచి వచ్చిన అధికారులు, ఉద్యోగులు మూడు షిఫ్టుల్లో కౌంటింగ్ విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి షిఫ్టునకు సుమారు 240 మంది సిబ్బంది 8 గంటలపాటు పనిచేసేలా విధులు కేటాయించి ముందస్తుగానే కౌంటింగ్‌కు సంబంధించి శిక్షణా తరగతులు కూడా నిర్వహించారు. ఆరుగురు డీఎస్పీలు, ఆరుగురు సీఐలు, 22 మంది ఎస్సైలు, 38 మంది ఏఎస్సైలు, 92 మంది కానిస్టేబుళ్లు, 166 మంది హోంగార్డులు బందోబస్తు విధులు నిర్వర్తిస్తున్నారు. లెక్కింపు ఇలా.. సాధారణ కౌంటింగ్ ప్రక్రియ కంటే కొంత భిన్నంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. పోలైన ఓట్లల్లో చెల్లే ఓట్లను పరిగణనలోనికి తీసుకుంటారు. 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. ఉదాహరణకు 2,20,000 ఓట్లల్లో సుమారు 1,10,001 ఓట్లు 17 రౌండ్లకుగాను మొదటి 8 రౌండ్లల్లో మొదటి ప్రాధాన్యత ఓట్లు సాధించిన అభ్యర్థి విజేతగా నిలుస్తారు. రాత్రి 10 గంటలకు తొలి రౌండ్ ఓట్లు కట్టలు కట్టడం, చెల్లిన, చెల్లని ఓట్లు గుర్తింపు, మొదటి ప్రాధాన్యత ఓట్లు గుర్తింపు ప్రక్రియంతా పూర్తి చేసుకుని సుమారు రాత్రి 10 గంటల సమయంలో మొదటి రౌండ్ లెక్కింపు 28 టేబుళ్లల్లో ప్రారంభమైంది. మొదటి రౌండ్లో 10,783 ఓట్లను లెక్కిస్తున్నారు. ప్రహసనంలా ప్రక్రియ రాత్రి 10 గంటలకు మొదటి రౌండ్ లెక్కింపు 12 గంటలకు పైగా సాగిన బ్యాలెట్ కట్టల విభజన 28 టేబుళ్లలో 17 రౌండ్లలో లెక్కింపు తొలి 8 రౌండ్లలో మొదటి ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్ ఆరు జిల్లాల పరిధిలో పోలైన ఓట్లు 2,18,997 నిరంతరాయంగా సాగుతున్న ప్రక్రియ జిల్లాల వారీగా పోలైన ఓట్లు జిల్లా ఓట్లు పోలింగ్ శాతం ఏలూరు జిల్లా 29,651 70.13 పశ్చిమగోదావరి 48,893 69.80 అల్లూరి సీతారామరాజు 3,637 77.90 డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ 47,125 73.90 తూర్పుగోదావరి 42,446 67.41 కాకినాడ 47,150 68.84 -
పాలకొల్లులో మరో పసికందు గుర్తింపు
విజయవాడ స్పోర్ట్స్: నెలలు నిండని పసి కందులను విక్రయిస్తున్న విజయవాడ మహిళల ముఠా నుంచి మరో చంటి బిడ్డను ఎన్టీఆర్ జిల్లా పోలీసు యంత్రాంగం కాపాడింది. ఢిల్లీ, అహ్మదాబాద్ నుంచి చిన్నారులను తీసుకొచ్చి విజయవాడ పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్న విజయవాడ ముఠాను ఈనెల 1వ తేదీ శనివారం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ ముఠా ఇచ్చిన సమాచారంతో 2వ తేదీ ఆదివారం రాజమండ్రిలో ఓ చంటి బిడ్డను పోలీసులు స్వాధీనం చేసుకుని సీ్త్ర శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు. కేసు దర్యా ప్తులో భాగంగా మరో పసికందును పశ్చిమగోదా వరి జిల్లా పాలకొల్లులో పోలీసులు గుర్తించారు. టాస్క్‌ఫోర్స్ ఏసీపీ కె.లతాకుమారి, మహిళా పోలీసులు ఈ పాపను వారి చేతుల్లోకి తీసుకొని సీ్త్ర శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు. -
2,18,997 ఓట్లు.. 17 రౌండ్లు
ఆటో బోల్తా నూజివీడులోని రామాయమ్మరావుపేట వద్ద ఆటో బోల్తా పడిన సంఘటనలో నలుగురికి తీవ్రంగా, 14 మందికి స్వల్పంగా గాయాలయ్యాయి. 8లో uసాక్షి ప్రతినిధి, ఏలూరు: తూర్పు, పశ్చిమగోదావరి జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2,18,997 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఓట్లను లెక్కించేందుకు 17 రౌండ్లల్లో 28 టేబుళ్లు ఏర్పాటుచేశారు. మొదటి 8 రౌండ్లల్లో మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కించడం, అంతకు ముందే చెల్లిన, చెల్లని ఓట్లను వేరు చేసే పనిలో కౌంటింగ్ సిబ్బంది నిమగ్నమయ్యారు. ఏలూరులోని సీఆర్‌రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను సోమ వారం ఉదయం రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ కె.వెట్రిసెల్వి ప్రారంభించారు. జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి, ఏలూరు ఎస్పీ కె.ప్రతాప శివ కిషోర్‌లు కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించారు. కూటమి పార్టీల మద్దతుతో టీడీపీ నేత పేరాబత్తుల రాజశేఖరం, పీడీఎఫ్ అభ్యర్థిగా రిటైర్డ్ టీచర్ దిడ్ల వీరరాఘవులతో పాటు 33 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. టీడీపీ, పీడీఎఫ్ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ ఉంది. భారీ పోలీస్ బందోబస్తు కౌంటింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేశారు. ప్రాధాన్యతా క్రమంలో.. 28 టేబుళ్లకు సగటున 10 నుంచి 15 వేల ఓట్లను కేటాయించి వాటిలో చెల్లిన, చెల్లని ఓట్లను వేరు చేసి అలాగే మొదటి ప్రాధాన్యతా క్రమంలో ఓట్లను వేరు చేసి లెక్కింపు ప్రారంభించారు. మొదటి రౌండ్లో 10,783, రెండో రౌండ్లో 13,929, 3వ రౌండ్లో 11,870, 4వ రౌండ్లో 13,777, 5వ రౌండ్లో 13,168, 6వ రౌండ్లో 14,783, 7వ రౌండ్లో 12,841, 8వ రౌండ్లో 14,296, 9వ రౌండ్లో 14,162, 10వ రౌండ్లో 11,654, 11వ రౌండ్లో 13,674, 12వ రౌండ్లో 12,296, 13వ రౌండ్లో 12,523, 14వ రౌండ్లో 13,876, 15వ రౌండ్లో 14,668, 16వ రౌండ్లో 15,823, 17వ రౌండ్లో 4879 మొత్తం కలిపి 2,18,997 ఓట్లను లెక్కించనున్నారు. -
కృత్రిమ మేధ వినియోగం పెరిగింది
తాడేపల్లిగూడెం: కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, డ్రోన్ టెక్నాలజీ వినియోగం రోజురోజుకూ పెరుగుతోందని ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ డాక్టర్ జీవీవీ శర్మ అన్నారు. సోమవారం ఏపీ నిట్‌లో అన్‌మేన్డ్ ఏరియల్ వెహికల్స్ ఫర్ వైర్లెస్ కమ్యూనికేషన్ అండ్ రిమోట్ సెన్సింగ్ అంశంపై జరిగిన ిస్కిల్ డెవలప్మెంట్ వర్క్‌షాపులో ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడారు. రిమోట్ కంట్రోల్ సహాయంతో పనిచేసే సమర్థవంతమైన డ్రోన్లు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. ఆన్లైన్లో పాల్గొన్న మరో అతిథి ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ పి.రాజ్యలక్ష్మి మాట్లాడుతూ మానవరహిత వాహనాల్లో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. ఈ దిశగా పరిశోధనలు ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు. నిఘా నేత్రాలుగా డ్రోన్లు అద్భుత పాత్ర పోషిస్తున్నాయని నిట్ రిజిస్ట్రార్ దినేష్ రెడ్డి, డీన్ రవికిరణ్ శాస్త్రి అన్నారు. నై పుణ్యాల మెరుగుకు ఇలాంటి కార్యక్రమాలు దో హదపడతాయని ఈసీఈ విభాగాధిపతి భానావతు నర్సింహారావు అన్నారు. వి.సందీప్, గుర్రాల కిరణ్‌కుమార్, కార్తికేయశర్మ పాల్గొన్నారు. -
కట్టలు కట్టేందుకే 12 గంటలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రహసనంలా మారింది. రెండు జిల్లాల్లోని ఓట్లను కట్టలు కట్టడానికే 12 గంటలకు పైగా సమయం పట్టింది. ఏలూరు జిల్లా అధికార యంత్రాంగానికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ తొలిసారి కావడం, ఇతరత్రా కారణాలుగా కనిపిస్తున్నాయి. మూడు షిప్టుల్లో 700 మంది సిబ్బందిని నియమించినా కౌంటింగ్ ప్రక్రి య వేగంగా సాగడం లేదు. 456 పోలింగ్ కేంద్రాల్లో.. : గత నెల 27న ఆరు జిల్లాల పరిధిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ జరిగింది. ఏలూరు కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఎన్నికల రిట ర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. కౌంటింగ్‌కు ఏర్పాట్లు, స్ట్రాంగ్ రూమ్‌ను ఏలూరులోని సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటుచేశారు. మొ త్తంగా 456 పోలింగ్ కేంద్రాల్లో 3,14,984 మందికిగాను 2,18,997 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉద యం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. 6.30 గంటలకే దాదాపు 250 మంది సిబ్బంది విధుల్లో నిమగ్నమయ్యారు. మొత్తంగా 1,368 బ్యాలెట్ బాక్సులను 17 రౌండ్లుగా విభజించి కట్ట లు కట్టే ప్రక్రియ ప్రారంభించారు. ఈ ప్రక్రియ రాత్రి 8.30 గంటల వరకు సాగింది. 28 టేబుళ్లను ఏర్పాటు చేసి 17 రౌండ్లుగా విభజించి కట్టలు కట్టిన ఓట్ల లెక్కింపునకు సన్నద్ధం చేశారు. అనంతరం రాత్రి 9 గంటల నుంచి చెల్లిన, చెల్లని ఓట్లను వేరు చేసి లెక్కింపు మొదలుపెట్టారు. ఈ ప్రక్రియకు సు మారు 2 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో రాత్రి 11 గంటలకు మొదటి రౌండ్ లెక్కింపు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆరు జిల్లాల అధికారులున్నా ఆలస్యమే.. కౌంటింగ్ కేంద్రం వద్ద ఆరు జిల్లాల్లో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరించిన డీఆర్వో లు, ఇతర జిల్లా స్థాయి అధికారులతో పాటు తహ సీల్దార్లు, వివిధ విభాగాల అధికారులు విధుల్లో ఉన్నా లెక్కింపు ప్రారంభానికి తీవ్ర జాప్యం జరుగుతుంది. ఉదయం 6 గంటలకు విధుల్లోకి వచ్చిన వారు మధ్యాహ్నం 2 గంటలకు వెళ్లిపోతారు. మ ధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంట ల వరకు మూడు ఫిఫ్టుల్లో లెక్కింపు జరుగుతోంది. గుంటూరులో వేగంగా.. ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూ రు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ గుంటూరులో కొనసాగుతోంది. అక్కడ కూడా 700 మంది సిబ్బంది, మూడు షిప్టులు ఇదే పద్ధతి ఉన్నా సాయంత్రం 4 గంటలకే కట్టలు కట్టడం పూర్తి చేసి 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలుపెట్టారు. రాత్రి 8.30 గంటల సమయానికే మూడో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. గతంలో నాలుగు సార్లు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ గుంటూరులో నిర్వహించడం, ఇతర కారణాలతో అక్కడ కౌంటింగ్ వేగంగా సాగుతోంది. ఏలూరు జి ల్లాకు మొట్టమొదటిసారి కావడం, అధికారులకు అ నుభవం తక్కువగా ఉండటం, ఇతర కారణాలతో ఇక్కడ మాత్రం ఆలస్యమవుతోంది. ఎన్నికల కౌంటింగ్ సిబ్బంది మొత్తానికి భోజనాలతో సహా అన్ని ఏర్పాట్లు కౌంటింగ్ కేంద్రం వద్దే ఏర్పాటుచేశారు. ఉదయం 8 గంటల నుంచి ప్రధాన పార్టీలతో పా టు స్వతంత్ర అభ్యర్థుల ఏజెంట్లు మొదటి రౌండ్ కౌంటింగ్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం రాత్రి 8.30 గంటల వరకూ కట్టలు కట్టడంతోనే సరి ఉభయగోదావరిలో 456 పోలింగ్ కేంద్రాల్లో 1,368 బ్యాలెట్ బాక్సులు రాత్రి 9 గంటలకు ప్రారంభమైన చెల్లిన, చెల్లని ఓట్ల లెక్కింపు తొలిసారి ఏలూరు జిల్లాలో కౌంటింగ్ తంతు -
నేటి నుంచి పారిశుద్ధ్య సేవలు బంద్
తణుకు అర్బన్: తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రి కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ మంగళవారం నుంచి విధుల బహిష్కరణకు దిగుతున్నట్టు ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ సంఘ తణుకు శాఖ అధ్యక్షుడు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు చెప్పారు. సోమవారం తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రి ఆవరణలో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు ఐదు నెలలుగా వేతనాలు చెల్లించలేదని, 29 నెలలుగా పీఎఫ్ సొమ్ము కార్మికుల ఖాతాల్లో జమ చేయలేదన్నారు. ఏరియా ఆస్పత్రిని జిల్లా ఆస్పత్రిగా విస్తరించినా గతంలో ఉన్న 19 మంది కార్మికులతోనే పనులు చేయించడం శోచనీయమన్నారు. -
సర్వేలను సకాలంలో పూర్తి చేయాలి
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో చేపట్టిన పలు సర్వేలను సకాలంలో పూర్తిచేసి నివేదికలను సమర్పి ంచాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. సోమవారం క్యాంపు కార్యాలయం నుంచి ఆమె గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. పీ–4 సర్వే, వర్క్ ఫ్రం హోం సర్వే, తోలు కళాకారుల సర్వే, చైల్డ్ ఆధార్, బర్త్ సర్టిఫికెట్ వివరాల నమోదు, జియో ట్యాగింగ్ హౌస్ హోల్డ్ రివెరిఫికేషన్ డెత్ మార్క్, హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్, ఏపీ నాన్ రెసిడెంట్ మాడ్యూల్, ఎన్పీసీఐ లింకింగ్ తదితర అంశాలపై సమీక్షించారు. -
అంబేడ్కర్‌ను దూషించిన వారిపై ఫిర్యాదు
భీమవరం (ప్రకాశంచౌక్): విదేశాల్లో ఉంటూ కొందరు టిక్‌టాక్ ద్వారా అంబేడ్కర్‌ను దూషిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నన్నేటి పుష్పరాజ్ డిమాండ్ చేశారు. పట్టణంలోని కార్యాలయంలో సోమవారం జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మిని కలిసి వినతి పత్రం అందజేశారు. అంబేడ్కర్‌ను అవమానించేలా ఉన్న వీడియోలను సోషల్ మీడియా ద్వారా వైరల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. నేతల సాల్మన్ రాజు, చిగురుపాటి రాజేష్, పిట్టా వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ పరీక్షలకు 15,950 మంది హాజరు భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నా యని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి ఎ.నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం తెలుగు, హిందీ, సంస్కతృం, ఉర్దూ పరీక్షలను 52 కేంద్రాల్లో నిర్వహించామన్నారు. జనరల్ కేటగిరీలో 14,908 మందికి 14,499 మంది, ఒకేషనల్ కేటగిరీలో 1,544 మందికి 1,451 మంది హాజరయ్యారని తెలిపారు. ఎక్కడా మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదన్నారు. 89 శాతం మంది హాజరు ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) ఇంటర్ ఇంగ్లిష్ పరీక్షకు 89.33 హాజ రు నమోదైందని డీఈఓ నారాయణ తెలిపారు. 1,134 మందికి 121 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారన్నారు. ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాలేదని తెలిపారు. ఎంఎస్ఎంఈ సర్వే వేగిరపర్చాలి భీమవరం(ప్రకాశం చౌక్): ఎంఎస్ఎంఈ సర్వే త్వరగా పూర్తిచేయడానికి చిన్న, మధ్య తరహా పరిశ్రమల వ్యాపారులు అధికారులకు సహకరించాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్‌కుమార్ రెడ్డి అన్నారు. భీమవరం బస్టాండ్, 20 వార్డు మసీదు రోడ్డులో జరుగుతున్న ఎంఎస్ఎంఈ సర్వే తీరును సోమవారం ఆయన పరిశీలించారు. అధికారులు సర్వే త్వరగా పూర్తి చేయడానికి కృషి చేయాలని సూచించారు. జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యు.మంగపతి రావు, మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి ఉన్నారు. 8న మహిళా దినోత్సవ ర్యాలీ భీమవరం (ప్రకాశంచౌక్): పట్టణంలో ఈనెల 8న మహిళా దినోత్సవ ర్యాలీ ఏర్పాట్లకు చ ర్యలు తీసుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమీక్షించారు. ప్రకాశం చౌక్ నుంచి అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు సుమారు వెయ్యి మంది మహిళలు, విద్యార్థినులతో భారీ ర్యాలీ, సాంస్కృతిక కార్య క్రమాలకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఐసీడీఎస్ పీడీ బి.సుజాతరాణి, డీఆర్డీఏ పీడీ ఎంఎస్ఎస్ వేణుగోపాల్, డీఎంహెచ్ఓ బి.భాను నాయక్, మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. యువ పరిశోధకురాలికి అవార్డు తాడేపల్లిగూడెం: పట్టణంలోని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ టీచింగ్ స్టాఫ్ మెంబర్ డాక్టర్ ఎస్.ప్రశాంతికి సేంద్రియ రసాయన శాస్త్రంలో యువ మహిళా పరిశోధకురాలుగా అవార్డు వచ్చింది. ఆమెను సోమవారం వర్సిటీ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ టి.అశోక్ అభినందించారు. అంతర్జాతీయ ప్రచురణలు, పేటెంట్లు, రచించిన పుస్తకాలలో ఆమె ప్రతిభను గుర్తించి చైన్నెలోని వీనస్ ఇంటర్నేషన్ ఫౌండేషన్ అవార్డును ప్రదానం చేసింది. అలాగే అసోసియేషన్ ఆఫ్ కెమిస్ట్రీ టీచ ర్స్‌లో ఆమెకు జీవితకాల సభ్యత్వం ఇచ్చారని ప్రిన్సిపాల్ అశోక్ కొనియాడారు. -
గర్జించిన మున్సిపల్ కార్మికులు
భీమవరం (ప్రకాశంచౌక్): రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న పర్మినెంట్, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షులు నెక్కండి సుబ్బారావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.సోమ సుందర్ డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదురుగా జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లోని కార్మికులతో కలిసి ధర్నా చేశారు. అనంతరం డీఆర్వో ఎం.వెంకటేశ్వరరావుకు వినతిపత్రం సమర్పించారు. కార్మికుల వేతనాల చెల్లింపు, పనుల అప్పగింత, నిర్వహణ, సాంఘిక భద్రతపై మున్సిపల్ శాఖకే పూర్తి బాధ్యత ఉండాలన్నారు. వీటిని ప్రైవేట్ కంపెనీ, ఏజెన్సీలకు అప్పగించరాదన్నారు. భీమవరం పట్టణ అధ్యక్షుడు చెల్లబోయిన రంగారావు మాట్లాడుతూ రిటైర్మెంట్ అయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యుల్ని ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్ బకాయిలను వెంటనే అందించాలని కోరారు. వైవీ ఆనంద్, కె.మల్లేశ్వరరావు పాల్గొన్నారు. -
ఏపీలో మళ్లీ మొదలైన టైగర్ రొయ్య సాగు
సాక్షి, భీమవరం: రెండు దశాబ్దాల క్రితం ఆక్వా రంగంలో రారాజుగా వెలుగొందిన మోనోడాన్ (టైగర్ రొయ్య) మళ్లీ వచ్చేసింది. గత సీజన్లో ప్రయోగాత్మకంగా సాగు చేసిన మడగాస్కర్ సీడ్ మోనోడాన్ (Penaeus Monodon) రైతులకు కాసుల వర్షం కురిపించింది. దీంతో తీరం వెంబడి ఈ ఏడాది అధిక శాతం సాగు చేసేందుకు ఆక్వా రైతులు సన్నాహాలు చేస్తున్నారు. ఆక్వాలో 2002 సంవత్సరానికి పూర్వం టైగర్ రొయ్యదే హవా. ఈ రొయ్యకు లోకల్ మార్కెట్‌తోపాటు అంతర్జాతీయంగా ఎగుమతులకు బాగా డిమాండ్ ఉండేది. క్రమంగా టైగర్ రొయ్యపై వైట్‌స్పాట్ వైరస్ దాడి తీవ్రం కావడంతో ఆక్వా రైతులు నష్టాల్లో కూరుకుపోయారు. ఆ తర్వాత 2011లో వచ్చిన వనామీ (Vannamei Prawn) మూడేళ్లపాటు రైతులకు అధిక లాభాలు తెచ్చిపెట్టింది. ఫలితంగా చాలామంది రైతులు తమ పొలాలను ఆక్వా చెరువులుగా మార్చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సాగు విస్తీర్ణం 4.66 లక్షల ఎకరాలకు పెరగ్గా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే 2.5 లక్షల ఎకరాలు ఉంది. రాష్ట్రంలోని సముద్ర తీరం వెంబడి 1.05 లక్షల ఎకరాల్లో ఉప్పునీటి చెరువులు ఉన్నాయి. వనామీపైనా 2014 నుంచి వైట్ స్పాట్, విబ్రియో, వైట్‌గట్, ఈహెచ్‌పీ వైరస్ల దాడి మొదలైంది. రైతులు నష్టాలు చవిచూస్తున్నారు. ఆక్వా రైతులకు గత వైఎస్సార్సీపీ (YSRCP) ప్రభుత్వం అప్సడా ఏర్పాటుచేసి కొండంత అండగా నిలిచింది. తీరం వెంబడి మొదలైన సాగు చెన్నైకి చెందిన హేచరీలు మూడేళ్ల క్రితం మడగాస్కర్ ప్రాంతంలోని సముద్ర జలాల నుంచి నాణ్యమైన మేల్, ఫిమేల్ మోనోడాన్ బ్రూడర్స్‌ను సేకరించి సీడ్ ఉత్పత్తిని ప్రారంభించాయి. 2023లో కృష్ణా, పశ్చిమ గోదావరి, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, కాకినాడ జిల్లాల్లోని సముద్రతీరం వెంబడి 7,200 ఎకరాల్లో మోనోడాన్ సీడ్‌ను రైతులు సాగు చేశారు. వైరస్ బెడద లేకపోవడం, ఆరు నెలల పంట కాలానికి కేజీకి 20 కౌంట్‌తో రూ.1,050 వరకు ధర పలికి మంచి లాభాలు వచ్చాయి. దీంతో గత ఏడాది దాదాపు రెట్టింపు స్థాయిలో ఈ సీడ్‌ను సాగు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని బియ్యపుతిప్ప, చినమైనవానిలంక, దర్భరేవు తదితర ప్రాంతాల్లో 520 ఎకరాల్లో సాగు చేశారు.ఆరు నెలల్లో అధికంగా 20 కౌంట్ తీయగా, కొందరు ఎనిమిది నెలల కాలానికి 10.5 నుంచి 11 కౌంట్ కూడా తీశారు. సాగు పెట్టుబడులకు రెట్టింపు లాభాలు వస్తుండటంతో ఈ సీజన్లో ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఆరు వేల ఎకరాలకు పైగా సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. కాగా, చెన్నైతోపాటు మన రాష్ట్రంలోని ఐదారు హేచరీల్లో మాత్రమే మోనోడాన్ సీడ్ లభిస్తోంది. రొయ్య పిల్ల ధర రూపాయి వరకు ఉంది. ఈ సీడ్ కావాల్సిన రైతులు రెండు నెలల ముందే డబ్బులు చెల్లించి బుకింగ్ చేసుకుంటున్నారు. మోనోడాన్ 15 నుంచి 20 శాతం వరకు ఉప్పు సాంద్రత ఉన్న నీటిలో సాగుకు అనుకూలమని నిపుణులు చెబుతున్నారు. లాభాలు బాగున్నాయి గత ఏడాది 12.5 ఎకరాల్లో మడగాస్కర్ సీడ్ మోనోడాన్ సాగుచేసి 10.5 కౌంట్ తీశాను. పెట్టుబడులు పోను రెట్టింపు ఆదాయం వచ్చింది. ఈ ఏడాది మా ప్రాంతంలో చాలామంది రైతులు మోనోడాన్ సీడ్ సాగు చేసేందుకు అప్పుడే హేచరీలకు అడ్వాన్స్‌లు చెల్లించారు. – వాతాడి కృష్ణారావు, ఆక్వా రైతు, చినమైనవానిలంక, పశ్చిమ గోదావరి జిల్లా సాగు విస్తీర్ణం పెరుగుతోంది పశ్చిమ గోదావరి జిల్లాలోని తీర ప్రాంత గ్రామాల చెరువుల్లో రైతులు మోనోడాన్ సీడ్ సాగు చేసి లాభాలు ఆర్జిస్తున్నారు. లాభదాయకంగా ఉండటంతో మిగిలిన రైతులు ఈ సీడ్ సాగుపట్ల ఆకర్షితులవుతున్నారు. తీరప్రాంత గ్రామాల్లో ఈ ఏడాది మోనోడాన్ సాగు విస్తీర్ణం బాగా పెరుగుతుందని అంచనా వేస్తున్నాం. – ఎన్డీవీ ప్రసాద్, మత్స్యశాఖ అధికారి -
అగ్గి.. రాజుకుంటే బుగ్గే!
ఆలస్యంగా వాహనం.. రూ.10 లక్షల నష్టం సాక్షి, భీమవరం: ఈ ఏడాది వేసవిలో రికార్డు స్థాయి లో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఇప్పటికే వాతావరణశాఖ ప్రకటించింది. అందుకు తగ్గట్టు అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. 38 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలతో సూర్యుడు నిప్పులు చెరుగుతూ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాడు. మిగిలిన రో జులతో పోలిస్తే వేసవిలో అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. గత వారం రోజుల్లో జిల్లావ్యాప్తంగా పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అధి క శాతం గ్యాస్ లీకేజీ, విద్యుత్ వినియోగం పెరిగి షార్ట్ సర్క్యూట్ ఏర్పడటం, ఓల్టేజీలో హెచ్చుతగ్గులు, ఓవర్‌లోడ్ కారణంగా సింగిల్ ఫేజ్, త్రీఫేజ్ లైన్లు తరచూ ట్రిప్అయ్యి ఇళ్లల్లో ప్రమాదాలు సంభవిస్తుంటే, వరి కోతలు అనంతరం పొలాల్లోని గడ్డి కి నిప్పు పెట్టడం, చుట్టా, సిగరెట్లను ఆర్పకుండా నిర్లక్ష్యంగా పారేయడం తదితర కారణాలు బహిరంగ ప్రదేశాల్లో ప్రమాదాలకు హేతువులవుతున్నాయి. అగ్నిమాపకం.. సమస్యలు అనేకం జిల్లాలో ఏడు ఫైర్స్టేషన్లకు గాను జనావాసాలు ఎక్కువగా ఉన్న భీమవరం, పాలకొల్లులో డబుల్ యూనిట్ ఫైర్స్టేషన్లు ఉన్నాయి. మిగిలిన ఫైర్ స్టేషన్ల సిబ్బందితో పోలిస్తే రెట్టింపు ఉండేలా గతంలో వీటిని ఏర్పాటుచేశారు. భీమవరం, నరసాపురం ఫైర్ స్టేషన్లు శిథిలస్థితికి చేరుకున్నాయి. భీమవరం ఫైర్ స్టేషన్‌ను షెడ్డులో నిర్వహిస్తున్నారు. భీమవరంలో రూ.2 కోట్లు, నరసాపురంలో రూ.1.25 కోట్లతో నూతన భవన నిర్మాణాలకు పరిపాలన ఆమోదం లభించగా టెండర్ల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. సిబ్బందిపై పనిభారం ఫైర్స్టేషన్లకు సిబ్బంది కొరత సమస్యాత్మకంగా తయారైంది. ఏడు స్టేషన్ల పరిధిలో మంజూరైన పోస్టుల మేరకు అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్లు ఇద్దరు, స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు ఐదుగురు, లీడ్ ఫైర్మెన్లు 27 మంది, డ్రైవర్లు 25 మంది, ఫైర్మెన్లు 83 మంది, హోంగార్డులు 24 మంది కలిపి మొత్తంగా 166 మంది ఉండాలి. కాగా 117 మంది మాత్రమే ఉన్నారు. స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నుంచి పైస్థాయి వరకు కొరత లేనప్పటికీ ప్రమాద సమయంలో క్షేత్రస్థాయిలో కీలకంగా పనిచేసే ఫైర్‌మెన్, డ్రైవర్, హోంగార్డ్ పోస్టులు ఖాళీలు ఉండటం సమస్యాత్మకంగా తయారైంది. 49 ఖాళీ పోస్టుల్లో ఫైర్మెన్లు 35, డ్రైవర్లు తొమ్మిది, హోంగార్డులు ఐదు ఉన్నా యి. దీంతో ఉన్న కొద్దిమంది సిబ్బందిపై విపరీతమైన పనిభారం పడుతోంది. సకాలంలో చేరలేక.. మంటలు ఆర్పలేక.. భీమవరం, పాలకొల్లు ఫైర్స్టేషన్ల పరిధిలో చుట్టుపక్కల ఐదారు మండలాలు ఉండగా నరసాపురం పరిధిలో తీరప్రాంత గ్రామాలు ఉన్నాయి. పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ వైర్లు కిందకి ఉండటం, రోడ్ల పక్కన ఆక్రమణలు, ట్రాఫిక్ రద్దీ ఫైర్ ఇంజన్లు మారుమూల ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రతిబంధకమవుతున్నాయి. 20 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ప్రమాదం సంభవించినప్పుడు ఫైర్ ఇంజన్ వచ్చేసరికి సర్వం బూడిదైపోతోందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం (2024– 25)లో జిల్లాలో 428 అగ్నిప్రమాదాల్లో రూ.4.35 కోట్ల నష్టం వాటిల్లింది. జిల్లాలో అగ్నిప్రమాదాలు సంవత్సరం ప్రమాదాలు ఆస్తి రక్షించిన నష్టం ఆస్తి విలువ (రూ.కోట్లలో) (రూ.కోట్లలో) 2022–23 417 10.56 34.39 2023–24 449 4.98 12.67 2024–25 428 4.35 20.19 ప్రమాదాల్లో ప్రాణనష్టం సంవత్సరం ప్రాణనష్టం కాపాడిన వారి సంఖ్య 2022–23 6 10 2023–24 2 1 2024–25 1 1 జిల్లాలో ఫైర్ స్టేషన్లు ప్రాంతం ఫోన్ నంబర్ భీమవరం 08816–233299 పాలకొల్లు 08814–222299 తణుకు 08819–222101 తాడేపల్లిగూడెం 08818–221299 నరసాపురం 08814–275399 ఆకివీడు 08816–252099 అత్తిలి 08819–257977వీరవాసరం మండలం రాయకుదురులోని రెండు పోర్షన్ల తాటాకింటిలో రెండు కుటుంబాలు నివసిస్తున్నాయి. శుక్రవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇంటికి నిప్పంటుకుంది. వెంటనే స్థానికులు ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించగా పాలకొల్లుకు చెందిన ఫైర్ ఇంజన్ వచ్చింది. అప్పటికే తాటాకిల్లు పూర్తిగా దగ్ధమై ఇంటిలోని నగదు, వస్తువులు, దుస్తులు అన్నీ అగ్నికి ఆహుతైపోయాయి. చుట్టుపక్కల వారు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఈ ప్రమాదంలో రూ.10 లక్షల నష్టం వాటిల్లింది. ఫైర్ ఇంజన్ కొంత ముందుగా వచ్చి ఉంటే నష్టం తీవ్రత తగ్గి ఉండేదని స్థానికులు అంటున్నారు. డేంజర్ బెల్స్ మార్చిలోనే మండుతున్న ఎండలు అగ్నిమాపక కేంద్రాల్లో సమస్యల మంటలు వేధిస్తున్న సిబ్బంది కొరత ఫైర్‌మెన్ పోస్టులు 35, డ్రైవర్ పోస్టులు 9 ఖాళీ పోస్టుల భర్తీకి చొరవ చూపని కూటమి సర్కారు జిల్లాలో 428 అగ్నిప్రమాదాల్లో రూ.4.35 కోట్ల నష్టం అప్రమత్తంతో ప్రమాదాల నివారణ వేసవి దృష్ట్యా ఇప్పటికే జిల్లాలోని అన్ని ఫైర్ ఇంజన్లను సిద్ధం చేసి ఉంచాం. ప్రజలు అప్రమత్తంగా ఉండటం ద్వారా అగ్నిప్రమాదాలను నివారించవచ్చు. ప్రమాదాలను అరికట్టడంపై అవగాహన కార్యక్రమాల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నాం. ఖాళీ పోస్టుల భర్తీకి ఉన్నతాధికారులకు నివేదించాం. భీమవరం, నరసాపురంలో నూతన భవన నిర్మాణాలకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చింది. ఆచంటలో కొత్త ఫైర్‌స్టేషన్ ఏర్పాటు నిమిత్తం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. – జి.శ్రీనివాసరావు, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి -
నిజాయతీతో సేవలందించాలి
ఏలూరు టౌన్: సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు నిర్భయంగా, నిష్పక్షపాతంగా, నిజాయతీతో సేవలందించాలని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశో క్కుమార్ అన్నారు. అనంతపురం పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో శిక్షణ పూర్తిచేసుకున్న ప్రొబేషనరీ సబ్ ఇన్స్పెక్టర్లు ఆదివారం ఏలూరు రేంజ్ కార్యాలయంలో ఐజీని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రొబేషనరీ ఎస్సైలకు ఆయన నియామక ఉత్తర్వులు అందజేశారు. రేంజ్ పరిధిలో 100 మంది (68 మంది పురుషులు, 32 మంది మహిళలు) ఎస్సై శిక్షణ పూర్తిచేసుకోగా జిల్లాల వారీగా ఏలూరు 1, అల్లూరి సీతారామరాజు 4, కాకినాడ జిల్లా 2, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా 1, తూర్పుగోదావరి జిల్లా 15, పశ్చిమగోదావరి జిల్లా 1, కృష్ణా జిల్లా 20, ఎన్టీఆర్ జిల్లా 56 మంది ఉన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలీస్ శాఖ ప్రతిష్టను మరింత పెంచేలా అత్యుత్తమ సేవలు అందించాలన్నారు. బాధి తుల పక్షాన న్యాయం చేయటం, నిందితులకు చట్టా ల మేరకు శిక్షలు విధించేలా పారదర్శకత, జవాబుదారీతనంతో పనిచేయాలన్నారు. నేరస్తులకు భ యం, బాధితులకు అభయం అందించేలా పనిచేయాలన్నారు. పోలీస్ విధుల్లో పనిచేయటం అదృష్టంగా భావిస్తూ చట్టాలకు లోబడి సత్వర న్యాయం అందించేలా కృషి చేయాలని ఐజీ పిలుపునిచ్చారు. ఏలూరు రేంజ్ ఐజీ అశోక్‌కుమార్ 100 మంది ఎస్సైలకు నియామక పత్రాలు అందజేత -
భూకంపం..అప్రమత్తంచేద్దాం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: భూకంపాలపై దశాబ్దాలుగా పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే భూకంపం ఎలా వస్తుంది.. ఎప్పుడు వస్తుంది.. ఎందుకు వస్తుంది.. ఎంత తీవ్రతతో వస్తుంది.. అన్న ప్రశ్నలకు కచ్చితమైన సమాధానాలు లేవు. ఒక్కో దశను పూర్తి చేసుకుని ప్రస్తుతం ప్రపంచంలో అభివృద్ధి చెందిన అతి కొద్ది దేశాల్లో 30 నుంచి 40 సెకన్లు ముందుగా చెప్పే వ్యవస్థను మాత్రమే అందుబాటులోకి తెచ్చారు. మన దేశంలో అయితే అటువంటి వ్యవస్థ కూడా లేదు. తుపాను ప్రభావిత ప్రాంతాలను వాతావరణ శాఖ ముందుగా గుర్తించి ఎలా సమాచారం అందిస్తుందో అదే తరహాలో భూకంపాలను ముందుగా అంచనా వేసే టెక్నాలజీపై ఏలూరు నగరానికి చెందిన ఇంజనీర్ చేసిన పరిశోధనలు తుది అంకానికి చేరుకున్నాయి. 2004 నుంచి శోధన 19 ఏళ్ల పరిశోధనలు పలు అవాంతరాలు, అవరోధాలను దాటుకుని ఆరేళ్లుగా భూకంపాలకు సంబంధించిన సమగ్ర సమాచారంతో కూడిన డేటాను ముందస్తుగా అంటే కనీసం వారం నుంచి నెల రోజుల ముందు గుర్తించే సరికొత్త టెక్నాలజీని సిద్ధం చేశారు ఏలూరుకు చెందిన మరడాని శివ సీతారామ్. అన్ని ప్రయోగ దశలూ పూర్తి చేసుకుని తుది దశ పరీక్షల్లో ఉన్నారు. ఆయన మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఏడున్నరేళ్ల పాటు జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ నెట్‌వర్కింగ్‌పై పనిచేశారు. ప్రస్తుతం భూకంపాల రీసెర్చ్‌ని హైదరాబాద్ కేంద్రంగా కొనసాగిస్తున్నారు. 2004 నుంచి భూకంపా లు, సునామీలను గుర్తించడం ఎలా అనేదానిపై పరి శోధన ప్రారంభించి సరికొత్త విధానాన్ని రూపొందించారు. దాదాపుగా ఆరేళ్ల నుంచి ట్విట్టర్, www.seismo.in వెబ్సైట్లో ఫిలిప్పీన్స్, తైవాన్, జపాన్, ఇథియోపియా, ఆప్ఘనిస్తాన్, నేపాల్, టిబె ట్, ఇండియాలో భూకంపాలకు సంబంధించిన సమగ్ర డేటాను పొందుపరిచారు. 2004 నుంచి దాదాపుగా 300కు పైగా భూకంపాలకు సంబంధించి సమాచారాన్ని సేకరించి 2020 నుంచి మాత్రమే పూర్తి సమాచారాన్ని వెబ్సైట్లో పొందుపరిచారు. 20 రకాల పద్ధతులతో.. ప్రపంచవ్యాప్తంగా 20 రకాల పద్ధతుల్లో భూకంపా లను అంచనాలు వేస్తున్నారు. టెక్నాలజీలో అభివృద్ధి చెందిన జపాన్, తైవాన్, మెక్సికో, అమెరికా, ఉమేనియా, ఫ్రాన్స్, ఇటలీ లాంటి దేశాలు భూమిలో అమర్చిన సెన్సార్ ద్వారా 30 నుంచి 40 సెకన్ల ముందు పసిగట్టే వ్యవస్థను అందుబాటులో పెట్టారు. భూకంప కేంద్రం నుంచి మార్పులు గుర్తిస్తూ.. శివ సీతారామ్ పరిశోధనలు చేసిన ఫలితాన్ని తుది దశకు తీసుకువచ్చారు. సమయం, ప్రదేశం, తీవ్ర తను వారం నుంచి నెల రోజుల పాటు ముందస్తు గా అంచనా వేయగలుగుతున్నారు. అలా ముంద స్తు అంచనాలతో సిద్ధం చేసిన సమాచారాన్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. 7 మ్యాగ్నిట్యూడ్ కంటే ఎక్కువ తీవ్రత ఉండే భూకంపాలు రావడానికి ముందు సుమారు 3 నుంచి 6 నెలల పాటు భూమి లోపల పొరల్లో వివిధ రకాల సంకేతాలు అందుతుంటాయి. దాని ప్రభావం 300 కిలోమీటర్ల వరకు ఉంటుంది. దీనిని బట్టి ప్రదేశం, సమయం, తీవ్రత ఈ మూడు అంశాల్లో కచ్చిత త్వాన్ని అంచనా వేయగలిగితేనే ఆస్తి, ప్రాణనష్టాన్ని నివారించవచ్చు. దీనిపైనే శివ పరిశోధనలు చేసి సూక్ష్మస్థాయి మార్పులు భూకంప కేంద్రం నుంచి కొన్ని కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటాయని గుర్తించారు. వీటిని కొన్ని పద్ధతుల్లో నిర్విరామంగా పర్యవేక్షించి అంచనా వేస్తున్నారు. ఇలా 2025 జన వరిలో టిబెట్‌లో 7.1 మ్యాగ్నిట్యూడ్, 2024 జనవరిలో జపాన్‌లో 7.6 మ్యాగ్నిట్యూడ్, 2023 నవంబరులో నేపాల్‌లో 6.3 మ్యాగ్నిట్యూడ్ లాంటి భూకంపాల నమోదు డేటాతో పాటు సుమారు 20 చోట్ల జరిగిన నష్టం తీవ్రత పూర్తి వివరాలను వెబ్సైట్లో అందుబాటులో పెట్టారు. 19 ఏళ్లుగా భూకంపాలను పసిగట్టే పరిశోధనలు వారం నుంచి నెల రోజులు ముందుగా గుర్తించేలా ప్రయోగాలు తుది దశకు చేరిన అంకం ఆరేళ్లుగా వెబ్సైట్లో భూకంపాల డేటా ఏలూరుకు చెందిన ఇంజనీర్ శివ సీతారామ్ సరికొత్త ఆవిష్కరణ -
కౌంటింగ్‌కు సర్వం సిద్ధం
ఏలూరు(మెట్రో) : ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. ఏలూరులోని సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు సోమవారం ప్రారంభం కానుంది. ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆధ్వర్యంలో కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉభయగోదావరి జిల్లాల పరిధిలోని ఆరు జిల్లాల్లో 456 పోలింగ్ కేంద్రాల్లో గతనెల 27న పోలింగ్ జరిగింది. 69.50 శాతం పోలింగ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో 3,637, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 47,125, ఏలూరు జిల్లాలో 29,651, కాకినాడ జిల్లాలో 47,150, తూర్పుగోదావరి జిల్లాలో 42,446, పశ్చిమగోదా వరి జిల్లాలో 48,893 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 69.50 శాతం ఓటింగ్ నమోదు కాగా బ్యాలెట్ బాక్సులను ఏలూరులోని స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచారు. బరిలో 35 మంది.. ఎన్నికల బరిలో 35 మంది నిలిచారు. కౌంటింగ్ కేంద్రానికి సిబ్బంది ఉదయం 6.30 గంటలలోపు చేరుకోవాలని ఆదేశాలు జారీ చేయగా.. కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకు ప్రారంభం కానుంది. మూడు షిప్టుల్లో 700 మంది సిబ్బంది పాల్గొంటారు. 28 టేబుళ్లను ఏర్పాటుచేయగా 17 రౌండ్లలో కౌంటింగ్ జరుగనుంది. ప్రతి టేబుల్‌కూ కౌంటింగ్ సిబ్బంది, సూపర్వైజర్, రోల్ ఇన్చార్జి, షిప్ట్ ఇన్చార్జి, మైక్రో అబ్జర్వర్లు విధులు నిర్వహిస్తారు. తెలుగుదేశం బలపర్చిన అభ్యర్థి, పీడీఎఫ్ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. సిబ్బందికి సమగ్ర శిక్షణ ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : ఏలూరు సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. కౌంటింగ్ ఏర్పాట్లను ఆదివారం ఆమె పరిశీలించారు. కౌంటింగ్‌పై సిబ్బందికి సమగ్ర శిక్షణ ఇచ్చామన్నారు. ఉద యం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని, లెక్కింపు పూర్తికావడానికి రెండు, మూడు రోజుల సమయం పట్టవచ్చన్నారు. పూర్తి భద్రతా ఏర్పాట్ల మధ్య కౌంటింగ్ నిర్వహిస్తామన్నారు. కౌంటింగ్ సిబ్బందికి డ్యూటీ పాసులు, ఏజెంట్లకు ఐడీ కార్డులు జారీ చేశామన్నారు. పాస్ లేనిదే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. సెల్ఫోన్లు నిషేధమన్నారు. పోస్టల్ బ్యా లెట్ ప్రక్రియ రిటర్నింగ్ అధికారి టేబుల్ వద్ద నిర్వహిస్తామన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ ఎస్ఈ పి.సాల్మన్‌రాజును కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట జేసీ పి.ధాత్రిరెడ్డి, ఏఎస్పీ ఎన్.సూర్యచంద్రరావు, డీఆ ర్వో వి.విశ్వేశ్వరరావు, ఆర్డీఓ అచ్యుత అంబరీష్, డీఎస్పీ శ్రావణ్‌కుమార్, జెడ్పీ సీఈఓ కె.సుబ్బారావు తదితరులు ఉన్నారు. నేడు ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు 28 టేబుళ్లు.. 17 రౌండ్లు 2,18,902 ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం -
ట్రెజరీ సంఘ ఎన్నికలు ఏకగ్రీవం
భీమవరం (ప్రకాశంచౌక్) : భీమవరం ట్రెజరీ కార్యాలయంలో ఆదివారం ట్రెజరీస్, అకౌంట్స్ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గ ఎ న్నికలు నిర్వహించారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా జె.రామారావు, ఎం.సత్యనారాయ ణ, సహాధ్యక్షుడిగా కేఎంకే హనుమంతరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా వీఎస్ఎస్ శ్రీనివాస్, ఎన్.సీతారామయ్య, డి.పుష్పలత, ఎం.సత్యనారాయణ, ఆర్గనైజింగ్ సెక్రటరీగా బి.నరేంద్రరాజు, జాయింట్ సెక్రటరీలుగా డి.నాగభూషణం, జె.తిరుపతిరెడ్డి, వి.శారద దేవి, ట్రెజరర్‌గా పి.కొండలరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఎన్నికల అధికారి షేక్ అబ్దుల్ ఖాదర్ తెలిపారు. సంఘం సభ్యుల పురోభివృద్ధికి పాటుపడుతూ త్వరలోనే అన్ని జిల్లాల ఎన్నికలు పూర్తిచేసుకుని రాష్ట్ర సంఘ ఎన్నికలకు వెళతామని నాయకులు తెలిపారు. మత్స్యకారుల సమస్యలపై మంత్రికి వినతి భీమవరం(ప్రకాశంచౌక్) : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన ద్వారా మత్స్యకారుల సంక్షేమంతోపాటు మత్స్యరంగ సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ అధికారులను కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఆదేశించారు. పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రిని నూతనంగా ఎన్నికై న ఉమ్మడి జిల్లా మత్స్యకార సంఘం అధ్యక్షుడు మైల వసంతరావు, పాలకవర్గ సభ్యులు కలిశారు. జిల్లాలో మత్స్యకారుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మైరెన్ ప్రాంతంలోని ఫిష్ మార్కెట్లలో వసతుల కల్పన, పంచాయతీరాజ్ చెరువుల వేలంలో 10 శాతం పరిమితి దాటకుండా చర్యలు తీసుకోవాలని, వలలు, నావలకు ప్ర భుత్వం ఇచ్చే సబ్సిడీని 75 శాతం పెంచాలని, మత్స్యకార కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, మత్స్యకారుల వాహనాలకు ఇచ్చే రాయితీలు పెంచాలని పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. సంఘ వైస్ ప్రెసిడెంట్ రాజా బాలాజీ, డైరెక్టర్లు వూడిమూడి శ్రీనివా స్, బేరం శ్రీరామచంద్రమూర్తి, బెజవాడ నాగరాజు, తిరుమాణి సీతామాలక్ష్మి, మోకా ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ‘హోమియో’పై అవగాహన ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): హోమియో వైద్య విధానంపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు దేశవ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహించేందుకు నిర్ణయించామని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోమియోపతిక్ ఫిజీషియన్స్ (ఐఐహెచ్‌పీ) జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కేఎస్ఎస్ శివమూర్తి తెలిపారు. గత నెల 22,23 తేదీల్లో పూణేలో జరిగిన జాతీయ హోమియో వైద్యుల సదస్సులో ఏలూరుకు చెందిన డాక్టర్ శివమూర్తిని ఐఐహెచ్‌పీ జాతీ య అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆదివారం నగరంలో ఏర్పా టుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన పదవీ కాలం 2027 వరకు ఉంటుందని, హోమియో పట్టభద్రుల విజ్ఞాన సముపార్జన కోసం వైద్య సదస్సులు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ హోమియో వైద్యుల నియామకాలు, హోమియో వైద్య కళాశాలల్లో బోధనా సిబ్బందిని పెంచడం కోసం కృషి చేస్తామన్నారు. హోమియో వైద్యంలో ఎండీ కోర్సు లు, నూతన సబ్జెక్టుల ప్రారంభం, సూపర్ స్పెషాలిటీ కోర్సుల కోసం కృషి చేస్తామన్నారు. హోమియో మందుల ప్రామాణికతను పెంచడానికి, సమాజంలో వివిధ వైరస్ల నివారణకు ఉచిత వ్యాధి నిరోధక శిబిరాలు ఏర్పా టు చేయాలని నిర్ణయించామన్నారు. అనంతరం హోమియో వైద్య నిపుణులు ఆయన్ను సత్కరించారు. ఐఐహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు వీకే పంకజాక్షన్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పి.గోపీనాథ్, జిల్లా అధ్యక్షుడు కూరపాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
50కి పైగా దేశాల డేటాతో..
నా వద్ద ఉన్న తక్కువ స్థాయి సామర్థ్యం గల పరికరాలతో అంచనాలను రూపొందిస్తున్నా. భవిష్యత్‌లో మరింత పరిధి పెంచుకోవటానికి ప్రయత్నించి, మెరుగ్గా అంచనా విధానాన్ని సిద్ధం చేస్తున్నా. దీంతో 50కి పైగా దేశాల భూకంపాల రీసెర్చ్ డేటాను పరిశీలించి ఆయా దేశాలకు సమాచారం పంపే అవకాశం ఉంటుంది. దీనిని కొన్నేళ్లలో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి ఆవిష్కరిస్తాను. భారత వాతావరణ శాఖ 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ భూకంపాలను ముందుగా అంచనాలు వేసే వ్యవస్థను అభివృద్ధి చేయాలని సూచించారు. దానికనుగుణంగా నా ప్రాజెక్టు సాగుతుంది. – మరడాని శివ సీతారామ్, ఇంజనీర్, ఏలూరు -
వైభవంగా మరియ మాత ఉత్సవాలు
కై కలూరు: మరియ మాత మహోత్సవాలు కలిదిండి విచారణ చర్చి వద్ద ఆదివారం రెండో రోజు ఘనంగా కొనసాగాయి. సమీప జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు విచ్చేశారు. కలిదిండి విచారణ కర్త బంటుమిల్లి యోహాను సమష్టి దివ్య పూజా బలి నిర్వహించారు. సాయంత్రం మేత్రాసన ఇంగ్లీషు మీడియం స్కూల్స్ కో–ఆర్డినేటర్ పల్లె విజయ జోజిబాబు ఏసు సందేశాన్ని అందించారు. కోరుకొల్లు విచారణకర్త గూడపాటి ప్రతాప్ ఆధ్వర్యంలో భక్తి పాటలు ఆలపించారు. అనంతరం కొవ్వూరుకు చెందిన హార్ట్ బీట్స్, క్రిస్టియన్ అర్కెస్ట్రా ఆలపించిన మధుర గీతాలు ఆకట్టుకున్నాయి. భక్తులకు ఉచిత భోజన సౌకర్యం కల్పించారు. -
ఆటో బోల్తా పడి యువకుడి మృతి
ఆగిరిపల్లి: మండలంలోని అమ్మవారిగూడెం వద్ద ఆటో బోల్తా పడి యువకుడు మృతి చెందాడు. ఆగిరిపల్లి చెందిన కూరపాటి నాని (31)ఆటో డ్రైవర్‌గా జీవిస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం ఆగిరిపల్లి నుంచి బండారు గూడెంకు ఆటోలో గోనె సంచుల లోడుతో వెళ్తుండగా అమ్మవారిగూడెం వద్దకు రాగానే ప్రమాదవశాత్తు ఆటో అదుపుతప్పి రోడ్డు పక్కనే గోతిలో బోల్తా పడింది. ప్రమాదంలో నాని తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. యువకుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బధిర టీ 20 క్రికెట్ పోటీలకు ఎంపిక భీమవరం(ప్రకాశంచౌక్): 7వ జాతీయస్థాయి బధిర టీ–20 క్రికెట్ పోటీలకు 16 మంది ఎంపికయ్యారని జిల్లా బధిర క్రికెట్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు రంగసాయి, ఆర్గనైజింగ్ సెక్రటరీ సీహెచ్ తాతారావు తెలిపారు. జాతీయస్థాయికి ఎంపికై న 16 మంది క్రీడాకారులు ఏప్రిల్ 19 నుంచి 25 వరకు హరియాణాలో జరిగే టీ–20 పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఆదివారం భీమవరం వెంకట్రామ థియేటర్లో జరిగిన సమావేశంలో వివరాలను తెలిపి ఎంపికై న వారికి అభినందనలు తెలిపారు. ఇటీవల భీమవరం డీఎన్నార్ క్రీడా మైదానంలో జరిగిన రాష్ట్రస్థాయి టీ–20 క్రికెట్ పోటీల్లో ప్రతిభ చాటిన క్రీడాకారుల్లో 16 మంది జాతీయస్థాయి క్రికెట్ పోటీలకు అర్హత సాధించారని తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు జాతీయస్థాయిలో రాణించాలని కోరుకుంటున్నామన్నారు. -
యథేచ్ఛగా మట్టి అక్రమ తవ్వకాలు
పట్టించుకోని అధికారులు బుట్టాయగూడెం: జీలుగుమిల్లి మండలం చీమలవారిగూడెం సమీపంలో మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. పట్టపగలు ఎలాంటి అనుమతి లేకుండా చింతలపూడి గట్టును ఆనుకుని ఉన్న ఆర్ అండ్ ఆర్ భూమిలో మట్టిని జేసీబీతో తవ్వి టిప్పర్లలో తోలుకుపోతున్నారు. కనీసం అధికారులు పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వెంచర్లు, లేఅవుట్, రియల్ ఎస్టేట్లకు అక్రమంగా మట్టిని తోలుకుపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గత 5 రోజులుగా మట్టి అక్రమ తవ్వకాలు, రవాణా యథేచ్ఛగా జరుగుతున్నా అధికారులు కన్నెత్తి చూడకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల సహకారంతోనే యథేచ్ఛగా మట్టి రవాణా జరుగుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి అక్రమంగా తరలుతున్న మట్టి రవాణాకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు. -
రిటైర్డ్ జడ్జికి సత్కారం
ఉండి: రిటైర్డ్ జడ్జి పెరికల గంగయ్యను ఆదివారం వినియోగదారుల సంఘ నాయకుడు బొబ్బిలి బంగారయ్య, పలువురు భక్తులు సత్కరించారు. గ్రామంలో వెంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించడమే కాకుండా గుడి పోషణార్థం తనకున్న ఏడెకరాల భూమిని గుడికి దానం చేశారు. స్వామి కల్యాణ మహోత్సవాలను పురస్కరించుకొని నాయకులు, పలువురు భక్తులు సన్మానం చేశారు. కార్యక్రమంలో రిటైర్డ్ హెడ్ మాస్టర్ వేణుగోపాల్ దంపతులు, త్రిమూర్తులు, తదితరులు పాల్గొన్నారు. ప్రమాదంలో ఇద్దరికి గాయాలు కుక్కునూరు: కారు అదుపు తప్పి రోడ్డు పక్కన పొదళ్లోకి దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు పడ్డారు. శనివారం రాత్రి మండలంలోని కివ్వాక చెరువు కట్టపై ఈ ఘటన జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. కుక్కునూరు నుంచి కివ్వాక వైపు వెళ్తున్న కారు కివ్వాక చెరువు కట్ట మీదకు రాగానే రోడ్డు బాగోలేని కారణంగా అదుపు తప్పి పక్కనే ఉన్న పొదళ్లోకి దూసుకెళ్లింది. దీంతో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు గాయాలపాలయ్యారు. వారిలో ఒకరికి తీవ్రగాయాలు కావడంతో ఖమ్మం ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం. -
శ్రీవారి సేవలో ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ యాక్టింగ్ చైర్పర్సన్ విజయ భారతి సయాని ఆదివారం మధ్యాహ్నం సందర్శించారు. ఆమెకు ముందుగా దేవస్థానం అధికారులు, అర్చకులు మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో అర్చకులు, పండితులు ఆమెకు శ్రీవారి శేష వస్త్రాన్ని కప్పి, వేద ఆశీర్వచనాన్ని పలుకగా, ఆలయ ఈఓ ఎన్వీ సత్యనారాయణ మూర్తి స్వామి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. రాట్నాలమ్మ గుడికి పోటెత్తిన భక్తులు పెదవేగి: రాట్నాలమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఆదివారం ప్రీతికరమైన రోజు కావడంతో జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు దేవస్థానానికి విచ్చేసి, మొక్కుబడులు తీర్చుకున్నారు. ఈ వారం పూజా టిక్కెట్లపై రూ.38,240, విరాళాలుగా రూ.20,100, లడ్డూ ప్రసాదంపై రూ.19,725, ఫొటోల అమ్మకంపై రూ.2,000, ఆలయ నిర్మాణానికి రూ1,00,000 వచ్చిందని ఈవో ఎన్.సతీష్‌కుమార్ తెలిపారు. గుర్తు తెలియని మృతదేహం లభ్యం ఉండి: ఉండి గోరింతోట వద్ద పంట కాలువలో గుర్తు తెలియని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై ఎండీ నసీరుల్లా తెలిపిన వివరాల ప్రకారం మృతుడి ఒంటిపై లేత పసుపు రంగు టీషర్టు, బ్లూ జీన్స్ ఉన్నాయి. చేతిపై గౌరీ కే ఆదిలక్ష్మీ అని పచ్చబొట్టు ఉంది. మృతదేహాన్ని భీమవరం ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీకి తరలించినట్లు ఎస్సై తెలిపారు. వివరాలు తెలిసిన వారు 9440796648 నెంబర్లో సంప్రదించాలని ఎస్సై తెలిపారు. క్షీరారామలింగేశ్వరస్వామిని దర్శించుకున్న ఓంకార్ పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం క్షీరారామలింగేశ్వరస్వామిని టీవీ యాంకర్ ఓంకార్ ఆదివారం దర్శించుకున్నారు. ముందుగా గణపతి పూజ చేసి అనంతరం క్షీరారామలింగేశ్వరస్వామి, జనార్ధనస్వామి, లక్ష్మీపార్వతి అమ్మవార్లను దర్శించుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. స్వామి వారి చిత్రపటాన్ని అందజేసి స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. -
అడవిలో ఆధ్యాత్మిక శోభ
బుట్టాయగూడెం: అడవి తల్లి ఒడిలో కొలువుదీరిన గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం జాతరకు సిద్ధమవుతుంది. ఈ నెల 14 నుంచి 16వ వరకు మూడు రోజుల పాటు ఉత్సవాల నిర్వాహణకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆలయ పరిసరాలు అందంగా తీర్చిదిద్దుతున్నారు. పచ్చని చెట్లు, ఎత్తయిన కొండలు, గలగల పారే సెలయేర్ల మధ్య ఉన్న గుబ్బల మంగమ్మ తల్లి గుబ్బలు, గుబ్బలుగా ఉన్న గుహలో కొలువై ఉంది. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారమై భక్తుల పూజలందుకుంటోంది. గుబ్బల మంగమ్మ తల్లి దర్శనానికి దూరప్రాంతాల నుంచి అత్యధికంగా భక్తులు తరలి వస్తుంటారు. గిరిపుత్రులే ఆలయ పూజారులు ఆదివాసీ ఆరాధ్య దైవంగా కొలుస్తున్న గుబ్బల మంగమ్మ తల్లికి గిరిజన పూజారులే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అమ్మ వారికి గిరిపుత్రులు పూజలు చేసి నైవేద్యాలు సమర్పించడం ఆనవాయితీ. మంగమ్మ తల్లి సన్నిధిలో అనేక మంది ఉపాధి పొందుతున్నారు. అడవిలో లభించే అటవీ ఉత్పత్తులు, రోకళ్లు, వెదురుతో అల్లిన చేటలు తదితర వస్తువులు విక్రయిస్తుంటారు. ప్రయాణం ఆహ్లాద భరితం మంగమ్మ తల్లి దర్శనానికి వెళ్లే మార్గలో ప్రయాణం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. బుట్టాయగూడెం మండలం కామవరం దాటిన తర్వాత కొంత దూరం వెళ్లే సరికి దట్టమైన అడవి ఉంది. అక్కడ నుంచి కొద్ది దూరం తర్వాత గుబ్బల మంగమ్మ తల్లి దర్శనం కలుగుతుంది. ప్రయాణంలో ప్రకృతి రమణీయ దృశ్యాలు కనువిందు చేస్తాయి. దర్శనానికి మార్గం ఇలా గుబ్బల మంగమ్మ తల్లి గుడికి జంగారెడ్డిగూడెం నుంచి బుట్టాయగూడెం, దొరమామిడి, గాడిదబోరు, పందిరిమామిడిగూడెం మీదుగా వెళ్లొచ్చు. జంగారెడ్డిగూడెం నుంచి శ్రీనివాసపురం, పట్టినపాలెం మీదుగా రామారావుపేట సెంటర్, అంతర్వేదిగూడెం, పందిరిమామిడి మీదుగా కూడా వెళ్లొచ్చు. తెలంగాణ నుంచి వచ్చే భక్తులు అశ్వారావుపేట నుంచి రాచ్చన్నగూడెం, పూచికపాడు మీదుగా దర్శనానికి రావచ్చు. అశ్వారావుపేట నుంచి పూచికపాడు, రామచంద్రాపురం మీదుగా అటవీ మార్గంలో మంగమ్మ తల్లిని దర్శించుకోవచ్చు. గుబ్బల మంగమ్మ జాతరకు ఏర్పాట్లు ఈ నెల 14 నుంచి 16 వరకు జాతర ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు ఈ నెల 14 నుంచి 16 వరకు జాతర మహోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నాం. హోలి పౌర్ణమిని పురస్కరించుకుని అమ్మవారి ఆజ్ఞ మేరకు ఈ జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తాం. పాలాభిషేకాలు, గణపతి విశేష సర్వయంత్ర పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కోర్సా గంగరాజు, సర్పంచ్, కోర్సవారిగూడెం గిరిజన సంప్రదాయంలోనే పూజలు గిరిజన సంప్రదాయ పద్ధతిలో పూజా కార్యక్రమం నిర్వహిస్తాం. చీర, సారె కావిళ్లు అమ్మవారికి సమర్పించి మొక్కుబడులు చెల్లిస్తాం. కార్యక్రమానికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. గుజ్జా రామారావు, ఆలయ కమిటీ ప్రతినిధి, కామవరం -
కనుల పండువగా కోదండరాముడి విగ్రహ ప్రతిష్ఠ
ఉండి: మండలంలోని చిలుకూరులో వేంచేసియున్న కోదండ రామాలయంలో సీతారాముల విగ్రహ ప్రతిష్ఠాపన కనులపండువగా నిర్వహించారు. దాతల సహకారంతో ఆలయాన్ని పునః నిర్మించారు. సర్పంచ్ ముదునూరి వెంకట సోమరాజు, ఆలయ ధర్మకర్త వేగేశ్న వెంకట రమణరాజు, ఆలయ నిర్మాణక మిటీ చైర్మన్ వేగేశ్న సత్యనారాయణ రాజు, దాతలు భీమరాజు, మాజీ సర్పంచ్ బంగార్రాజు, సీతారామరాజు తదితరులు ఆలయ పునఃప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని పూజ నిర్వహించారు. గ్రామంలోని భక్తులతో పాటుగా మహదేవపట్నం, వెలివర్రు, ఉండి, ఎన్నార్పీ అగ్రహారం, గరగపర్రు, భీమవరం తదితర ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చారు. ముఖ్య అతిథులుగా కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవర్మ, మాజీ ఎమ్మెల్యే వెంకట శివరామరాజు పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. ఖండవిల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యుల ఆధ్వర్యంలో పునఃప్రతిష్ఠాపన, ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు.ఽ -
భక్తులతో కిటకిటలాడిన శ్రీవారి ఆలయం
ద్వారకాతిరుమల: చినవెంకన్న దివ్య క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సెలవు దినం కావడంతో దూర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తుల రాక మొదలవడంతో క్షేత్ర పరిసరాలు సందడిగా మారాయి. ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, అనివేటి మండపం, కల్యాణకట్ట ఇలా అన్ని విభాగాలు భక్తులతో పోటెత్తాయి. స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించేందుకు అధిక సంఖ్యలో భక్తులు అన్నదాన భవనం వద్ద బారులు తీరారు. భక్తుల వాహనాలతో పార్కింగ్ ప్రదేశాలు నిండిపోయాయి. -
పాము కాటుతో చిన్నారి మృతి
పెదవేగి: పాముకాటుతో చిన్నారి మృతి చెందింది. పెదవేగి ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం..పెదవేగి మండలం న్యాయంపల్లికి చెందిన మద్దాల సురేష్ భార్య గర్భిణి కావడంతో పుట్టింటికి వెళ్లింది. తల్లితో పాటే కుమార్తె సృజన అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. సృజన ఆదివారం ఉదయం అమ్మమ్మ ఇంటి దగ్గర ఆడుకుంటూ ఉండగా తాచుపాము చిన్నారిని కాటు వేసింది. గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు హుటాహుటిన చిన్నారిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తరలించారు. ఆదివారం రాత్రి చికిత్స పొందుతూ సృజన మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. -
పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం
దెందులూరు: పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. ఏలూరు జిల్లా దెందులూరు మండలం సత్యనారాయణపురం గుండేరు వాగు వద్ద శనివారం అర్థరాత్రి దాటాక ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉంటున్న ఊట్ల రామకృష్ణ కుటుంబసభ్యులు సొంత కారులో పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో వివాహానికి వెళ్లారు. అనంతరం శనివారం రాత్రి రాజమహేంద్రవరం బయలు దేరారు. రాత్రి రెండు గంటల సమయంలో ఏలూరు జిల్లా దెందులూరు మండలం సత్యనారాయణపురం గుండేరు వాగు వద్దకు వచ్చేసరికి లారీని దాటేందుకు ప్రయత్నించగా, కారు అదుపు తప్పి లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో కారు నడుపుతున్న ఊట్ల రామకృష్ణకు తలపై, ఆయన భార్య అరుణకు కాలిపై గాయాలయ్యాయి. రామకృష్ణ నాన్నమ్మ అనంతలక్ష్మి, అరుణ అమ్మమ్మ సామ్రాజ్యం, కుటుంబసభ్యుడు ఇరుసుమల్లి మణికంఠ గాయపడ్డారు. ఘటనపై సమాచారం అందుకున్న దెందులూరు ఏఎస్ఐ వెంకటేశ్వరరావు, హైవే పోలీసులు క్షతగాత్రులను 108 అంబులెన్‌న్సులో ఆశ్రం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై శివాజీ తెలిపారు. ఐదుగురికి గాయాలు -
పెద్దింట్లమ్మా.. పాహిమాం
కై కలూరు: అమ్మా.. పెద్దింట్లమ్మా.. నీ చల్లని దీవెనలు అందించమ్మా అంటూ భక్తులు అమ్మను ఆర్తితో వేడుకున్నారు. కొల్లేటికోట పెద్దింట్లమ్మ జాతర ఆదివారానికి రెండో రోజుకు చేరింది. సెలవుదినం కావడంతో సమీప జిల్లాల నుంచి పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు జల్లు స్నానాలు ఆచరించారు. తలనీలాల సమర్పణ వద్ద రద్దీ కనిపించింది. అమ్మకు వేడి నైవేద్యాలను సమర్పించారు. ఉదయం జలదుర్గా సమేత పెద్దింటమ్మకు సుగంధ ద్రవ్యాభిషేకం, ధూప సేవ, బాలభోగం, పంచహారతులు అందించారు. పెద్దింట్లమ్మకు వస్త్ర, పుష్పాలంకరణ, ఉచిత ప్రసాదానికి భుజబలపట్నం గ్రామానికి చెందిన సయ్యపురాజు గుర్రాజు, బుద్దరాజు సుబ్రహ్మణ్యరాజు దాతలుగా వ్యహరించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా మీగడ సత్యనారాయణ బృందం ప్రదర్శించిన మురళీ కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది. ఆదివారం ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, ఇతర సేవల వల్ల రూ.1,35,735 నగదు వచ్చినట్లు తెలిపారు. జలదుర్గాగోకర్ణేశ్వరస్వామి కల్యాణం ఈ నెల 10న జరుగుతుందని తెలిపారు. -
బడ్జెట్లో కౌలు రైతులకు అన్యాయం
మామిడిశెట్టి రామాంజనేయులు, కౌలు రైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భీమవరం (ప్రకాశంచౌక్): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆహార ధాన్యాలు పండిస్తున్న కౌలు రైతులను పూర్తిగా విస్మరించారని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా కమిటీ విమర్శించింది. ఈ సందర్భంగా కౌలురైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మామిడిశెట్టి రామాంజనేయులు మాట్లాడుతూ కౌలు రైతుల సంక్షేమం కోసం ప్రత్యేక కేటాయింపులేవీ చేయకుండా వ్యవసాయంలో వృద్ధి సాధించడం ఎలా సాధ్యమన్నారు. కొత్త కౌలు చట్టాన్ని ఎప్పుడు అమలు చేస్తారో స్పష్టంగా చెప్పలేదన్నారు. కౌలు రైతులకు ప్రత్యేకంగా బ్యాంకు రుణాల కేటాయింపు లేదన్నారు. పంటల బీమాకు కేవలం రూ.1,023 కోట్లు కేటాయించిన ప్రభుత్వం పంట నష్టం, విపత్తుల నిధి వంటివి పట్టించుకోలేదన్నారు. జిల్లాలో కాలువల ఆధునికీకరణకు అధికారులు సుమారు రూ.50 కోట్ల వరకు ప్రతిపాదనలు పంపారని, బడ్జెట్లో డెల్టా ఆధునికీకరణకు కేవలం రూ.11 కోట్లు కేటాయించారని తెలిపారు. తక్షణం కాలువల ఆధునికీకరణకు రూ.100 కోట్లు, కౌలు రైతుల పంట రుణాలకు రూ.500 కోట్లు కేటాయించాలన్నారు. -
పాడి పశువులకు టీకాలు వేయించాలి
తాడేపల్లిగూడెం రూరల్: జిల్లాలోని పశు పోషకులందరూ తమ పాడి పశువులకు టీకాలు వేయించాలని కలెక్టర్ సూచించారు. నవాబుపాలెంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకం కింద టీకాల కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 30 వరకు గాలికుంటు నిరోధక టీకాల పంపిణీ జరుగుతుందన్నారు. మూడో విడతగా 9,300 పెయ్యి దూడలకు బ్రూసెల్లోసిస్ వ్యాధి నిరోధక టీకాలను వేస్తారన్నారు. ఆర్డీవో కౌసర్ బానో, పశుసంవర్ధక అధికారి మురళీకృష్ణ, తాడేపల్లిగూడెం డీడీ డాక్టర్ ఎల్కే సుధాకర్, ఏడీ డాక్టర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు. పింఛన్లు అందజేసిన కలెక్టరు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో 2,26,044 మందికి రూ.96.61 కోట్ల నగదును పింఛన్లుగా పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ సి.నాగరాణి తెలిపారు. శనివారం మండలంలోని నవాబుపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. పంపిణీని వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. -
కూటమి బడ్జెట్‌తో విద్యా రంగం కుదేలు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌తో విద్యారంగం కుదేలైందని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గెడ్డం సుధీర్ ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్లో కేటాయించిన నిధులు విద్యారంగ అభివృద్ధికి అరకొరగా మాత్రమే పనికొస్తాయన్నారు. గత ప్రభుత్వం పాఠశాలల కోసం నాడు – నేడు పేరుతో కోట్లాది రూపాయలు వెచ్చించిందని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం బడ్జెట్లో పాఠశాలల అభివృద్ధి ఊసెత్తలేదన్నారు. ఉన్నత విద్యకు సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదన్నారు. ఉపాధ్యాయులను ఈ బడ్జెట్ తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. పీఆర్సీ గురించి ప్రకటన చేయకపోవడం దారుణమని, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కనీసం మధ్యంతర భృతి అయినా ప్రకటించిందని, ఈ ప్రభుత్వం మధ్యంతర భృతి కూడా ప్రకటించకుండా ఉపాధ్యాయులను దారుణంగా మోసం చేసిందన్నారు. -
ప్రశాంత వాతావరణంలో ఇంటర్ పరీక్షలు
తాడేపల్లిగూడెం (టీఓసీ): జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. శనివారం పట్టణంలోని శ్రీ వాసవి గ్రంధి మాణిక్యాలరావు జూనియర్ కళాశాలలోని పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ప్రతి క్లాస్ రూంకి వెళ్లి పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఎవరికై నా ఆరోగ్య సమస్య తలెత్తితే వెంటనే ఫస్ట్ ఎయిడ్‌కు సిద్ధంగా ఉండాలని వైద్య శాఖ సిబ్బందికి సూచించారు. ఇంటర్ మొదటి సంవత్సరం 19,708 మంది, రెండో సంవత్సరం 18,123 మంది విద్యార్థులు పరీక్షలకు హజరవుతున్నారని వెల్లడించారు. ప్రశ్నాపత్రాలు భద్రపరిచేందుకు జిల్లాలో 13 స్టోరేజ్ పాయింట్లు, మూడు ఫ్లెయింగ్ స్క్వాడ్లు, మూడు సిట్టింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరీక్షల నిర్వహణలో సమస్యలు వస్తే కంట్రోల్ రూమ్ నెంబర్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రశాంత వాతావరణంలో ఇంటర్ పరీక్షలను పూర్తి చేయడానికి అధికారులు కృషి చేయాలని తెలిపారు. పది పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలి భీమవరం (ప్రకాశంచౌక్): పదో తరగతి పరీక్షలు సజావుగా జరిగేలా పక్కా ప్రణాళికలు రూపొందించుకుని మంచి ఫలితాలు సాధించాలని కలెక్టరు చదలవాడ నాగరాణి తెలిపారు. శనివారం స్థానిక ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగు కాలేజీలో ఏర్పాటు చేసిన పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణ శిక్షణ తరగతుల్లో ముఖ్య అతిథిగా కలెక్టరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ జిల్లాలో 128 కేంద్రాల్లో 24,393 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. ఎలాంటి చిన్న సమస్య వచ్చినా ఉన్నతాధికారులు దృష్టికి తీసుకొచ్చి సమస్య పరిశీలించుకోవాలన్నారు. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని, రక్షిత తాగునీరు అందించాలన్నారు. కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి ఇ.నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
పెద్దింట్లమ్మ జాతర ప్రారంభం
కొల్లేటికోట పెద్దింట్లమ్మ జాతర ప్రారంభమైంది. ఈ నెల 13 వరకు జాతర జరగనుండగా.. 10న జలదుర్గాగోకర్ణేశ్వరస్వామి కల్యాణం నిర్వహిస్తారు. 8లో uఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు కలెక్టర్ వెట్రిసెల్వి ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): గ్రాడ్యుయేట్ ఓట్ల లెక్కింపుపై పూర్తి అవగాహనతో లెక్కింపు చేయాలని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వెట్రిసెల్వి సిబ్బందిని ఆదేశించారు. స్థానిక సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపుపై సిబ్బందికి శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కౌంటింగ్ 3న ఉదయం 8 గంటల నుంచి సీఆర్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలోని కౌంటింగ్ కేంద్రంలో ప్రారంభవుతుందన్నారు. ముందుగా బ్యాలెట్ బాక్సులకు ఉన్న సీళ్లను పరిశీలించాలన్నారు. ఓట్ల లెక్కింపునకు 28 టేబుల్స్ ఏర్పాటు చేశామని, 17 రౌండ్లలో లెక్కింపు చేస్తారన్నారు. లెక్కింపు డెమోను సిబ్బందికి స్వయంగా చేసి చూపించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పోలవరం ప్రాజెక్టు పరిశీలన
పోలవరం రూరల్: హైదరాబాద్‌లో అటవీ శాఖలో శిక్షణ పొందుతున్న అధికారులు శిక్షణలో భాగంగా పోలవరం ప్రాంతంలోని అటవీ ప్రాంతాన్ని, ప్రాజెక్టును శనివారం పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు తీరు, వివరాలు ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. ఆర్వో, ఏఆర్వోలకు శిక్షణ ఏలూరు(మెట్రో): ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు శనివారం కేంద్ర ఎన్నికల సంఘం ఆన్లైన్ శిక్షణ అందించింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి మార్చి 3న ఓట్ల లెక్కింపు కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ విషయంపై ఎన్నికల సంఘం నిర్వహించిన ఆన్లైన్ శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి పాల్గొన్నారు. జాతీయ సదస్సుకు మహదేవపట్నం సర్పంచ్ ఉండి: జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్క రించుకుని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో నిర్వ హించే వర్క్‌షాపునకు జిల్లా నుంచి ఉండి మండలం మహదేవపట్నం సర్పంచ్ వనిమా నాగ వెంకట సుబ్బల క్ష్మి ఎంపికయ్యారు. ఈ నెల 4, 5 తేదీల్లో నిర్వహించే ఈ సదస్సుకు ఆహ్వానించడం సంతోషంగా ఉందన్నారు. సాధికారితపై తన అభిప్రాయాలను ఢిల్లీ వేదికగా వినిపిస్తానన్నారు. రాష్ట్రం నుంచి ఈ కార్యక్రమానికి ఎంపికై న 12 మంది సర్పంచుల్లో తాను ఉన్నానని, ఈ గుర్తింపు లభించడం ఎంతో గౌరవంగా ఉందన్నారు. ఇదంతా మహదేవపట్నం ప్రజలు తనకు కల్పించిన కానుకని, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఆమె తెలిపారు. 3న ఢిల్లీకి ప్రయాణమవుతున్నామని ఆమె తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా క్రిమినల్ చట్టాలు భీమవరం (ప్రకాశంచౌక్): ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ జిల్లా సమావేశం భీమవరం అంబేడ్కర్ భవనంలో శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐఎల్ఏ రాష్ట్ర అధ్యక్షుడు జి.శాంతకుమార్ మాట్లాడుతూ నూతన క్రిమినల్ చట్టాలు రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టాలని చూస్తున్న అడ్వకేట్ అమెండ్మెంట్ యాక్ట్ న్యాయవాద హక్కులను కాలరాసేలా ఉందన్నారు. సమావేశంలో శీలం విజయ్‌కుమార్, ఇంజేటి జాన్ కెనడీ తదితరులు పాల్గొన్నారు. మహిళా సాధికారత వారోత్సవాలు భీమవరం (ప్రకాశంచౌక్): మార్చి 8న జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మహిళల భద్రత, రక్షణ కోసం మహిళా సాధికారత వారోత్సవాలు నిర్వహించనున్నట్లు ఎస్పీ అద్నాన్ నయీం అస్మి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో విద్యార్థినులు, మహిళలకు విధి నిర్వ హణలో పోలీసులు వినియోగించే పరికరాలు, ఆయుధాల ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులు అందిస్తామన్నారు. విద్యార్థినులకు వ్యాస రచన పోటీలు, వక్తృత్వ, చిత్ర లేఖనం పోటీలు నిర్వహిస్తామన్నారు. బ్లాక్‌లిస్టులో పని చేయని కాంట్రాక్టర్లు: కలెక్టర్ దెందులూరు: నిర్దేశించిన సమయంలోగా ఇరిగేషన్ కాలువలు, చెరువుల్లో గుర్రపు డెక్క, తూడు, పూడికతీత పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో ఉంచాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. దెందులూరు మండలం సత్యనారాయణపురం, శింగవరం, గుండుగొలను తదితర ప్రాంతాలలోని ఇరిగేషన్ కాలువలు, చెరువులను శనివారం కలెక్టర్ పరిశీలించారు. నిధుల కొరత లేదని, గురప్రు డెక్క, తూడు, పూడికతీత పనులు చేయని కారణంగా సాగు, తాగునీటి సమస్య తలెత్తిందన్న ఫిర్యాదు అందితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ ఎస్ఈ పీ నాగార్జునరావు, ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్ తదితరులు పాల్గొన్నారు. -
రైల్వే పార్శిళ్లలో దళారుల రాజ్యం
తణుకు అర్బన్: తణుకు రైల్వే స్టేషన్ పార్శిళ్ల రవాణాలో దళారుల దోపిడీ రాజ్యం నడుస్తోంది. పార్శిళ్లకు దళారులు చార్జీల మోత మోగిస్తున్నారు. ముఖ్యంగా రైళ్లలో ద్విచక్ర వాహనాల రవాణా చేసేందుకు భారీగా దోచుకుంటున్నారు. తణుకు రైల్వే స్టేషన్ నుంచి నిత్యం హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం తదితర దూరప్రాంతాలకు ద్విచక్ర వాహనాలు పార్శిళ్ల రూపంలో రైళ్లలో వెళ్తుంటాయి. ఇందుకోసం ముందుగా రైల్వే కౌంటర్లో దరఖాస్తు రాసి రుసుం చెల్లించాలి. ఇంతవరకూ బాగానే ఉన్నా పార్శిల్ విభాగంలో ఉన్న దళారులు వాహనం ప్యాకింగ్, ఇతర ఖర్చులంటూ డబ్బులు గుంజేస్తున్నారు. ఇటీవల బెంగళూరుకు వాహనం పంపించేందుకు పట్టణానికి చెందిన వ్యక్తి రైల్వే కౌంటర్లో రూ.1850 కట్టాడు. పార్శిల్ చేసే క్రమంలో దళారులకు మరో రూ.వెయ్యి కట్టాల్సి వచ్చింది. హైదరాబాద్‌కు వాహనం పంపించేందుకు మరో వ్యక్తి రైల్వే కౌంటర్లో రూ.935 చెల్లించి, పార్శిళ్ల విభాగంలో రూ.600 కట్టాడు. రైల్వే ట్రాన్స్‌పోర్టు తక్కువవుతుందని వస్తున్నామని, ఇక్కడ కూడా ప్రైవేటు ట్రాన్స్‌పోర్టులో తీసుకున్నట్లే దోచుకుంటున్నారని వాహనదారులు వాపోతున్నారు. తత్కాల్ టికెట్ల వ్యవహారంలో కూడా దళారులు కీలకపాత్ర పోషిస్తున్నారని, అధికారులకు కూడా వాటాలు ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉద్యోగులకు వాటా ఇస్తున్నాం : తాము తీసుకునే మొత్తంలో రైల్వే గార్డు నుంచి పైస్థాయి అధికారుల వరకు ఇవ్వాలని దళారులు చెబుతున్నారు. ప్రతి వాహనంలో వసూలు చేసే మొత్తంలో రైల్వే వర్గాలకు ఇచ్చిన తరువాత మిగిలింది తాము తీసుకుంటామని చెబుతున్నారు. ఈ విషయంపై తణుకు రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ నాగరాజును సాక్షి వివరణ కోరగా వాహనాల పార్శిళ్లకు సంబంధించి రుసుం వసూలు చేస్తున్న విషయం తమ దృష్టికి రాలేదని విచారణ చేయిస్తానని చెప్పారు. వాహనానికి రూ.600 నుంచి రూ.వెయ్యి వరకు అదనంగా వసూలు అధికారులకూ వాటా ఇస్తున్నామంటున్న దళారులు రూ.1000 వసూలు చేశారు బెంగళూరులో ఉంటున్న మా అబ్బాయికి గత నెల 12న ద్విచక్ర వాహనాన్ని తణుకు రైల్వే స్టేషన్ ద్వారా పంపించాను. రైల్వే బుకింగ్‌లో రూ.1850 కట్టించుకోగా పార్శిల్ విభాగంలో రూ.వెయ్యి కట్టించుకున్నారు. రైల్వే టికెట్‌కు కూడా అదనంగా రైల్వే కౌంటర్లోనే డబ్బులు కట్టాను. అడుగుదామంటే కొత్త బండి ఏ రకంగా పంపిస్తారో, ఏమైనా డ్యామేజ్ చేస్తారేమోనని వారు అడిగిన మొత్తం ఇచ్చేశాను. ప్రభుత్వ విభాగాల్లో కూడా దళారుల రూపంలో డబ్బులు దోచేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారో తెలియడంలేదు. –కె.రాము, తణుకు -
రాజబాబు మృతి పార్టీకి తీరని లోటు
ద్వారకాతిరుమల: చివరి నిమిషం వరకు పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెలికాని రాజబాబును పార్టీ శ్రేణులు ఆదర్శంగా తీసుకోవాలని ఆ పార్టీ మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ద్వారకాతిరుమల మండలం సీహెచ్ పోతేపల్లిలో శనివారం నిర్వహించిన రాజబాబు సంతాప సభలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర మాజీ హోం మంత్రి తానేటి వనిత, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, ఏలూరు మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్, పార్టీ కొవ్వూరు, ఉంగుటూరు, చింతలపూడి ఇన్చార్జిలు తలారి వెంకట్రావు, పుప్పాల వాసుబాబు, కంభంపాటి విజయరాజు, వైఎస్సార్ సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ మామిళ్లపల్లి జయప్రకాష్, విశాఖపట్నం స్మార్ట్ సిటీ మాజీ చైర్మన్ గన్నమని వెంకటేశ్వరరావు(జీవీ), పార్టీ జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, ఏలూరు మాజీ డిప్యూటీ మేయర్ నూకపెయ్యి సుధీర్‌బాబు, నగర బీసీ సెల్ అధ్యక్షుడు కిలాడి దుర్గారావు, చేనేత విభాగ మాజీ అధ్యక్షుడు కొల్లిపార సురేష్, గుడివాక మోహన్ తదితరులు రాజబాబు చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘన నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ పార్టీ కోసం రాజబాబు అహర్నిశలు శ్రమించారని, ఆయన లేని లోటు తీరనిదని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, ఎమ్మార్డీ బలరాం, ఏలూరు ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ కంచెన రామకృష్ణ, ఏలూరు డిప్యూటీ మేయర్ పప్పు ఉమ, మాజీ గ్రంథాలయ చైర్మన్ పాకలపాటి గాంధి, మాజీ జెడ్పీటీసీ డీవీఎస్ చౌదరి, నరహరిశెట్టి రాజా, వెల్లంకి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. -
తేనెటీగల పెంపకంతో అధిక ఆదాయం
ఉండి: తేనెటీగల పెంపకంతో పలు విధాలుగా అధిక ఆదాయం లభిస్తుందని అధికారులు, శాస్త్రవేత్తలు వివరించారు. మండలంలోని ఎన్నార్పీ అగ్రహారం కృషీ విజ్ఞాన కేంద్రంలో శాసీ్త్రయ పద్ధతిలో తేనెటీగల పెంపకంపై ఏడురోజుల శిక్షణ కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా మార్టేరు ప్రాంతీయ పరిశోధనా కేంద్రం సహ సంచాలకుడు డాక్టర్ టీ శ్రీనివాస్, జిల్లా వ్యవసాయాధికారి జడ్ వెంకటేశ్వర్లు, జిల్లా ఉద్యానశాఖ అధికారి ఆర్ దేవానంద్ హాజరై మాట్లాడారు. మానవజాతి మనుగడకు తేనెటీగలు ఎంతో ఉపయోకరమని అన్నారు. తేనెటీగలు లేకపోతే మొక్కల్లో సంపర్కం జరగక పూత రాలిపోయి కాయలు కాయవని అన్నారు. దీంతో పండు, కూరగాయల ఉత్పత్తి గణణీయంగా పడిపోతుందన్నారు. కాబట్టే ఔత్సాహికులు ఎక్కువ మంది తేనెటీగల పెంపకాన్ని చేపట్టాలన్నారు. కరోనా తరువాత తేనె ఉత్పత్తులకు డిమాండ్ గణనీయంగా పెరిగిందని, తేనెటీగల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తూ రూ.లక్ష వరకు సబ్సిడీ పథకాలు అందిస్తున్నారన్నారు. ఈ రంగంలో ఉన్న అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలని కోరారు. కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్ మల్లిఖార్జునరావు మాట్లాడుతూ తేనెటీగల పెంపకం ద్వారా తేనెతో పాటు మైనం, విషం, ప్రోపోలిన్, పుప్పొడి, రాయల్ జెల్లీ వంటి ఉప ఉత్పత్తుల ద్వారా అధిక ఆదాయాన్ని పొందవచ్చునన్నారు. కార్యక్రమంలో ఏడీఏలు కేఎస్ఎస్ శ్రీనివాస్,, సీహెచ్ శ్రీనివాస్, ప్రకృతి వ్యవసాయం జిల్లా సమన్వయకర్త ఎం అరుణకుమారి, కేవీకే శాస్త్రవేత్తలు డాక్టర్ ఎన్ దెబోరామెస్సియానా, డాక్టర్ ఏ శ్రీనివాస్, డాక్టర్ ఆర్ బిందుప్రవీణ, డాక్టర్ పీ వినయలక్ష్మి, ఔత్సాహికులు పాల్గొన్నారు. -
గురుకులం.. పేద విద్యారు్థలకు వరం
భీమడోలు: 2025–26 విద్యా సంవత్సరానికి బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో చేరేందుకు గురుకులాల సొసైటీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నెల 6 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. గురుకులాల్లో శారీరక, మానసిక ఉల్లాసం కోసం క్రీడలు, యోగా, ధాన్యం వంటి వాటిలో శిక్షణ అందిస్తారు. విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, యూనిఫాం ఇస్తారు. ఉపాధ్యాయులు నిరంతర పర్యవేక్షణలో నాణ్యమైన విద్యా బోధన అందిస్తారు. అన్ని రకాల పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తారు. ఐదో తరగతిలో చేరికకు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 2012 సెప్టెంబర్ 1 నుంచి 2016 ఆగస్టు 31 మధ్య జన్మించాలి. ఓసీ, బీసీ విద్యార్థులు 2014 సెప్టెంబర్ 1 నుంచి 2016 ఆగస్ట్ 31 మధ్య పుట్టి ఉండాలి. జూనియర్ ఇంటర్లో చేరికకు 2024–25 ఏడాదిలో పదో తరగతి పరీక్షకు హజరవుతున్న విద్యార్థులు అర్హులు. ఐదో తరగతి, ఇంటర్ ప్రవేశాలకు విద్యార్థి తల్లిదండ్రులకు ఏడాది ఆదాయం రూ.లక్షకు మించరాదు. ఒక్కో పాఠశాలలో ఐదో తరగతికి 80 సీట్లు, జూనియర్ ఇంటర్‌కు 80 సీట్లు ఉంటాయి. దరఖాస్తుకు ఇవి తప్పనిసరి : విద్యార్థి వివరాలు తప్పులు లేకుండా నమోదు చేసుకోవాలి. నమోదు సమయంలో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి ఆధార్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఫొటోలు, తెల్లరేషన్ కార్డు, పూర్వ తరగతికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు ఉండాలి. ఐదో తరగతి ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 6న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. ఇంటర్ ప్రవేశానికి అదే రోజు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు జరుగుతుంది. పాఠశాలలు ఎక్కడెక్కడ ఉన్నాయి ● ఏలూరు జిల్లాలో బాలురుకు పెదవేగి, చింతలపూడి, బాలికలకు పోలసానిపల్లి, వట్లూరు, ద్వారకాతిరుమల, జంగారెడ్డిగూడెం, నూజవీడులో పాఠశాలలున్నాయి. ● పశ్చిమగోదావరి జిల్లాలో బాలురకు ఆరు గొలను, న్యూ ఆరుగొలను, ఎల్బీ చర్ల(నరసాపురం), బాలికలకు పెనుగొండలో పాఠశాల ఉంది. కళాశాలలు ఎక్కడెక్కడ ఉన్నాయి ● ఏలూరు జిల్లాలో బాలురకు పెదవేగిలో, బాలికలకు పోలసానిపల్లి, వట్లూరు, ద్వారకాతిరుమల, జంగారెడ్డిగూడెం, నూజివీడులో కళాశాలలున్నాయి ఉన్నాయి. ● పశ్చిమగోదావరి జిల్లాలో బాలురకు ఆరుగొలను, ఎల్బీ చర్ల(నరసాపురం)లో కళాశాలలున్నాయి. జంగారెడ్డిగూడెం మినహా ఇతర కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీకి 40 సీట్ల చొప్పున 80 సీట్లు ఉన్నాయి. జంగారెడ్డిగూడెం బాలికల కళాశాలలో ఎంఈసీ, సీఈసీ గ్రూపులు ఉన్నాయి. ద్వారకాతిరుమల బాలికల కళాశాలలో ఈ ఏడాది నుంచి జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్, నీట్ పరీక్షకు తగిన శిక్షణ ఇస్తారు. దరఖాస్తులకు ఈ నెల 6 వరకు గడువు ప్రతిభ ఆధారంగా సీట్లు ఏటా ఐదో తరగతి, జూనియర్ ఇంటర్లో చేరేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం. బయట దరఖాస్తు చేయించుకుంటే డబ్బులు చెల్లించాలి. మీ సమీపంలోని ఎస్సీ గురుకుల పాఠశాలల్లో ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఐదో తరగతి ప్రవేశ పరీక్షకు నాలుగో తరగతి సిలబస్ వరకు చదువుకోవాలి. ఇంటర్ వారికి పదో తరగతి వరకు సిలబస్ చదవాలి. – బి.ఉమాకుమారి, డీసీవో, ఏలూరు -
సమష్టిగా.. సేవే లక్ష్యంగా..
స్ఫూర్తిదాయకంగా ఏబీఎఫ్ కార్యక్రమాలు తాడేపల్లిగూడెం: సమాజ సేవే లక్ష్యంగా సాగుతూ పలువురికి ఆదర్శప్రాయంగా నిలుస్తోంది తాడేపల్లిగూడేనికి చెందిన స్వచ్ఛంద సంస్థ ఆత్మబంధువులం సేవా సంఘం (ఏబీఎఫ్). తొలుత ఒక్కరితో మొదలుకాగా అనంతరం 30 మంది వరకు ఈ సంస్థలో చేరి మానవ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. పట్టణంలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో సైతం సేవలు అందిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఉషస్సు నుంచి ఉద్యమంలా... తాడేపల్లిగూడేనికి చెందిన ఫొటోగ్రాఫర్ శీతాలం ఉషాకిరణ్ 1999లో నిప్సీ ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్‌ను స్థాపించి నేత్ర వైద్య శిబిరం, పశు వైద్య శిబిరాలు, ఉచిత హోమియో వైద్యం అందించేవారు. ఇదే సేవా దృక్పథంతో మరో 29 మంది ఉషాకిరణ్‌కు తోడుకావడంతో కార్యక్రమాలు విస్తృతం చేశారు. కరోనా కాలంలో ఆన్లైన్ వైద్య సాయం, నిత్యావసర వస్తువులు అందజేశారు. అనంతరం కరోనా బాధితుల సేవార్థం 30 మందితో ‘ఒకరికొకరం.. అందరి కోసం మనం’ అనే నినాదంతో 2021లో ఎన్జీఓను ప్రారంభించారు. కరోనా బాధితులకు ఆక్సిజన్ ఫ్లో మీటర్లు, పల్స్ ఆక్సీ మీటర్లు అందించడం, విద్యార్థులకు సహాయ కార్యక్రమాలు, దివ్యాంగ పిల్లలకు పుస్తకాలు, స్టడీ మెటీరియల్, ఆట వస్తువులు అందించడం, గ్రేస్ క్యాన్సర్, తానా సౌజన్యంతో కేన్సర్ నిర్ధారణ పరీక్షల శిబిరాల నిర్వహణ, గూడెంలో నిట్ వద్ద బస్ షెల్టర్ నిర్మాణం, ఆరోగ్యం కోసం జిల్లాస్థాయి నడక పోటీలు, హార్ట్ ఎటాక్ వస్తే సత్వర ఉపశమనం కోసం సీపీఆర్ శిక్షణ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వరద బాధితులకు అండగా తెలంగాణ ప్రాజెక్టు పెద్దపల్లి వాగు రెండు గేట్లు కొట్టుకుపోవడంతో వేలేరుపాడు మండలంలో 11 గ్రామాలు కొట్టుకుపోయాయి. వారికి బాసటగా నిలవడానికి ఆ ప్రాంతంలో 20 రోజుల పాటు సహాయ కేంద్రం ఏర్పాటుచేసి సేవలను అందించారు. ప్రజల నుంచి సేకరించిన నిత్యావసరాలు, బియ్యం, సామగ్రిని ఆదివాసీ కుటుంబాలకు అందజేశారు. ఏబీఎఫ్ నిర్వాహకుల్లో ఒకరైన కె.పెదకృష్ణంరాజు సహకారంతో మూడు గ్రామాల్లో బోర్లు వేయించారు. కృష్ణా జిల్లా వరదల్లో మునిగిపోయిన కె.కొత్తపాలెం అనే లంక గ్రామ ప్రజలకు 300 మందికి చీరలు, దుప్పట్లు, నిత్యావసర సామగ్రితో పాటు వైద్య సేవలను అందించారు. వేలేరుపాడు ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ కింద లక్ష రూపాయల విరాళం అందజేశారు. ప్రస్తుతం ఈ సంస్థలో 130 మంది సభ్యులుగా ఉండి సేవలు అందిస్తున్నారు. సమష్టిగా సేవలందిస్తున్నాం ఏబీఎఫ్ స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించి సమాజానికి సేవ చేయడం సంతృప్తికరంగా ఉంది. సభ్యులు 130 మంది సహకారంతో పెద్దల అండదండలతో సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నాం. సేవా కార్యక్రమాలను సమష్టిగా నిర్వహిస్తున్నాం. విద్యార్థులకు, ఆపదలో ఉన్నవారికి అండగా నిలబడేందుకు, వైద్య రంగంపై అవగాహన కల్పించడానికి సంఘం తరపున కృషి చేస్తున్నాం. – శీతాల ఉషాకిరణ్, ఏబీఎఫ్ వ్యవస్థాపకుడు -
పెద్దింట్లమ్మ జాతర ప్రారంభం
కై కలూరు : రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన కొల్లేటికోట పెద్దింట్లమ్మ జాతర శనివారం ప్రారంభమయ్యింది. ఉదయం విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవాచన, పుష్పాలంకరణ, నూతన వస్త్రాలంకరణ, పంచామృతాభిషేకం, పంచహారతలు జరిగాయి. అమ్మవారికి మొదటి రోజు వస్త్ర, పుష్పాలంకరణ, ఉచిత ప్రసాద దాతలుగా భుజబలపట్నంకు చెందిన ముదునూరి రామలింగరాజు, కనుమూరి నాగ వెంకట సుబ్బరాజు, పేరిచర్ల హేమంత్ వర్మ దంపతులు వ్యహరించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఏలూరు సప్పా భారతి కళాకారిణి ప్రదర్శించిన పార్వతీ కల్యాణం హరికథా కాలక్షేపం ఆకట్టుకుంది. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ జాతర ఈ నెల 13 వరకు జరుగుతుందన్నారు. భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. జాతరలో ప్రధాన ఘట్టమైన జలదుర్గాగోకర్ణేశ్వరస్వామి కల్యాణం ఈ నెల 10న జరుగుతుందన్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు పేటేటి పరమేశ్వరశర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పటిష్ట బందోబస్తు అమ్మవారి జాతరలో పటిష్ట పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసినట్లు రూరల్ సర్కిల్ సీఐ వి.రవికుమార్ చెప్పారు. రూరల్ ఎస్సై వి.రాంబాబుతో కలసి దేవస్థాన ఆవరణలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ దేవస్థానం వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. జాతర జరిగే ప్రతి ఆదివారం భక్తులు తాకిడి అధికంగా ఉంటుందని, అందుకు తగ్గట్టుగా పోలీసు సిబ్బందిని నియమించామన్నారు. అమ్మవారికి శ్రీచక్రార్చన, పంచహారతులు ఈ నెల 13 వరకు జాతర -
ముగిసిన చెడుగుడు పోటీలు
వీరవాసరం : రాయకుదురు శివారు జగన్నాధ్రావుపురంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి చెడుగుడు పోటీలు ముగిశాయి. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేశారు. పోటీల్లో వీర్ల వెంకమ్మ యూత్ చీరాల టీం విజేతగా నిలిచి రూ.25 వేల నగదు బహుమతిని అందుకున్నట్లు మ్యాచ్ రిఫరీ గంగా మహేష్ శనివారం తెలిపారు. రెండో స్థానంలో బేతపూడి టీం, మూడో స్థానంలో బల్లిపాడు గరువు టీం, నాలుగో స్థానంలో శ్రీకాంత్ ఫ్రెండ్స్ చిత్తూరు, ఐదో స్థానంలో శ్రీను ఫ్రెండ్స్ నెల్లూరు టీం, ఆరో స్థానంలో మస్తానయ్య మెమోరియల్ టీం నిలిచాయి. వీరందరికీ నగదు బహుమతులు అందజేశారు. అత్యుత్తమ క్రీడా ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు బెస్ట్ డిఫెన్స్, బెస్ట్ ప్లేయర్ అవార్డులను అంజేశారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భక్తుల రద్దీ నామమాత్రం ద్వారకాతిరుమల : చినవెంకన్న క్షేత్రంలో శనివారం భక్తుల రద్దీ బాగా తగ్గింది. శ్రీవారికి ప్రీతికరమైనరోజు కావడంతో ప్రతి వారం వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించేవారు. అయితే ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రారంభం కావడంతో ఈ వారం క్షేత్రానికి నామమాత్రంగా భక్తులు విచ్చేశారు. దాంతో ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతం, అనివేటి మండపం, వైకుంఠం క్యూకాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, ప్రసాదం, టికెట్ కౌంటర్లు, కేశఖండనశాల ఇతర విభాగాల్లో భక్తుల సంఖ్య స్వల్పంగా కనిపించారు. 7న ఎలక్ట్రీషియన్, ఫిట్టర్లకు అప్రెంటీస్ మేళా ఉండి: ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ ట్రేడుల్లో ఐటీఐ పూర్తిచేసిన అభ్యర్థులకు తణుకులోని ఆంధ్రా షుగర్స్ క్యాంపస్ నందు ఈ నెల 7వ తేదీ ఉదయం 10 గంటల నుంచి అప్రెంటీస్ మేళా నిర్వహించనున్నట్లు ఐటీఐ జిల్లా కన్వీనర్ వీ శ్రీనివాసరాజు తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు సర్టిఫికెట్లతో నేరుగా హాజరుకాలవాన్నారు. వివరాలకు ఎన్నార్పీ అగ్రహారంలోని ఐటీఐ ప్రధానాధికారిని గానీ జూనియర్ అప్రెంటీస్ అడ్వెయిజర్ను 96760 99988, 88863 39666 నంబర్లలో సంప్రదించాలన్నారు. -
పోలింగ్ శాతంపై అనుమానాలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉభయగోదావరి జిల్లాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చివరి రెండు గంటల్లో అధిక శాతం పోలింగ్ నమోదుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నానికి కొంత పెరిగింది. చివరి రెండు గంటల్లో పోలింగ్ కేంద్రాల్లో భారీగా క్యూలైన్లు, వందల సంఖ్యలో ఓటర్లు బారులు తీరడం వంటివి లేకపోయినా.. పోలింగ్ మాత్రం 24.21 శాతం పెరగడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పీడీఎఫ్ ఏజెంట్లు, నాయకులపై ప్రభుత్వ సహకారంతో టీడీపీ ఝులం ప్రదర్శించి ఏకపక్షంగా ఎన్నిక జరిపించిందని పీడీఎఫ్ ఆరోపణలు గుప్పించింది. అధికార యంత్రాంగం దాడులు, దౌర్జన్యాలపై కనీసం స్పందించలేదు. 2007 నుంచి పరిశీలిస్తే ఈ సారి అత్యధిక పోలింగ్ నమోదు కావడం గమనార్హం. 2007లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ హయాంలో శాసన మండలిని పునరుద్ధరించారు. 2007లో జరిగిన మొదటి ఎన్నికల్లో 68 శాతం, 2013లో 53 శాతం పోలింగ్ నమోదైంది. 2019లో 65.40 శాతం పోలింగ్ నమోదైంది. 2024లో మాత్రమే 69.50 శాతం పోలింగ్ నమోదైంది. సాధారణంగా పట్టభద్రుల ఎన్నికల్లో సగటున 50 నుంచి 65 శాతం లోపు మాత్రమే పోలింగ్ నమోదవుతూ వచ్చింది. గ్రాడ్యుయేట్ ఎన్నికలు కావడంతో ప్రజల్లో కూడా ఆసక్తి తక్కువగా ఉండటం, ఎన్నికల సంఘం విస్తృత స్థాయి ప్రచారం చేయకపోవడం ఇలా అనేక కారణాలు పోలింగ్ శాతాన్ని ప్రభావితం చేస్తాయి. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులే 60 శాతానికి మించి పోలింగ్ జరగదని చెబుతుంటారు. ఈ సారి చివరి రెండు గంటల్లో 24.21 శాతం పోలింగ్ జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పోలింగ్ సమయంలో పీడీఎఫ్ ఏజెంట్లపై దాడులు చేసి చివరి రెండు గంటలు దొంగ ఓట్లు పోల్ చేశారని పీడీఎఫ్ ఆరోపించడంతో పాటు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనుంది. ఏజెంట్లపై దాడులు, బూత్‌ల వద్ద నగదు పంపిణీ ఉమ్మడి జిల్లాలో ప్రతి పోలింగ్ బూత్ సమీపంలో పది మంది టీడీపీ నాయకులు ప్రత్యేకంగా క్యాంపులు ఏర్పాటు చేసి ఓటర్ల జాబితా, ఓటు వేయడానికి వెళ్తున్న వారి వివరాలు నమోదు చేశారు. జిల్లాలో కనీసం 40 శాతం కూడా పీడీఎఫ్ నాయకులు ఈ తరహా క్యాంపులు నిర్వహించలేదు. అదే విధంగా పోలింగ్ బూత్‌ల్లోనూ పూర్తి స్థాయిలో టీడీపీ ఏజెంట్లు ఉన్నారు. కొన్ని చోట్ల స్వతంత్ర అభ్యర్థుల ఏజెంట్లను కూడా టీడీపీ నేతలు వినియోగించుకున్నారు. పీడీఎఫ్ అభ్యర్థికి అన్ని చోట్ల ఏజెంట్లను ఏర్పాటు చేసినప్పటికీ అధికార పార్టీ హవాతో లింగపాలెం మండలం శింగగూడెం, పెదవేగి, జంగారెడ్డిగూడెంల్లో ఏజెంట్లపై దౌర్జన్యాలు చేసి బయటకు పంపడంపై అనుమానాలున్నాయి. లింగపాలెం మండలం యడవల్లిలో సీ.చిన్నారావు కుటుంబంతో కలిసి ఓటు వేయడానికి 278 పోలింగ్‌బూత్‌కు వస్తే అప్పటికే అతని ఓటు వేసేశారు. గత ఎన్నికల్లో పోలింగ్ ఇలా 2007లో 68 శాతం పోలింగ్ నమోదై జార్జి విక్టర్ ఎమ్మెల్సీగా గెలుపొందారు. 2013లో 1,04,946 ఓట్లు పోలవగా 53 శాతం పోలింగ్ నమోదైంది. మొదటి ప్రాధాన్యత ఓటు 52,851 ఓట్లు దక్కించుకున్న స్వతంత్ర అభ్యర్థి కర్రి రామకృష్ణారెడ్డి గెలుపొందారు. 2019లో 1,78,172 ఓట్లు పోలవగా 64.40 పోలింగ్ శాతం నమోదైంది. స్వతంత్ర అభ్యర్థి ఇళ్ళ వెంకటేశ్వరరావు (ఐవీ) 98,193 మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలుపొందారు. చివరి రెండు గంటల్లోనే 24.21 శాతం నమోదు ఉభయ గోదావరి జిల్లాల్లో 69.50 శాతం పోలింగ్ 2007 నుంచి జరిగిన ఎన్నికల్లో ఇదే అత్యధికం టీడీపీ నేతలు దొంగ ఓట్లు వేయించారని ఆరోపణలు పీడీఎఫ్ ఏజెంట్లపై పలు చోట్ల దాడులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్న పీడీఎఫ్ -
ప్రయోగాత్మకంగా రీ–సర్వే
తాడేపల్లిగూడెం రూరల్: భూములకు కచ్చితమైన హద్దులు గుర్తించేలా ప్రయోగాత్మకంగా రీ–సర్వే జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. తాడేపల్లిగూడెంలో నవాబుపాలెంలో రీ–సర్వే గ్రౌండ్ ట్రూతినింగ్ పనులను, సరిహద్దుల మ్యాప్‌లను శనివారంఆమె పరిశీలించారు. రైతులు భూములకు ఖచ్చితమైన హద్దులు గుర్తించి ప్రయోగాత్మకంగా రీ–సర్వే నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. సర్వే నిర్వహించే ముందు భూ యజమానులకు సమాచారం అందించాలన్నారు. వారి సమక్షంలోనే సర్వే నిర్వహించాలని సూచించారు. రైతులు అభ్యంతరాలను ప్రామాణికంగా తీసుకొని వాటిని నివృత్తి చేయాలన్నారు. దస్తావేజులు తప్పులుంటే సరి చేయాలన్నారు. అనంతరం గ్రామంలోని ప్రభుత్వ లే అవుట్ కాలనీ లబ్ధిదారులతో మాట్లాడారు. దశల వారీగా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. మంచినీటి సదుపాయానికి ఆర్డబ్ల్యుఎఎస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇంటి నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. గర్భవతులు, చిన్నారుల్లో రక్తహీనత లేకుండా చూడాలన్నారు. వివిధ రకాల క్యాన్సర్లు గుర్తించడానికి చేస్తున్న సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. -
సివిల్ సర్వీసెస్ యోగా పోటీలకు ఎంపిక
జంగారెడ్డిగూడెం : జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రి నుంచి ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ యోగ చాంపియన్ షిప్ 2024–2025కు ఇరపా అమ్మాజీ ఎంపికై నట్లు జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ బేబీ కమల తెలిపారు. జాతీయ స్థాయి యోగాసన పోటీలు ఈ నెల 5వ తేదీ నుంచి చండీఘర్‌లో నిర్వహిస్తారన్నారు. ఈ పోటీలకు ఆంధ్రప్రదేశ్ నుంచి 32 మంది ఉద్యోగులు ఎంపిక కాగా, వారిలో జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నుంచి చీఫ్ ఫార్మసీ ఆఫీసర్ ఇరపా అమ్మాజీ (అమూల్య) ఎంపికై నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అమ్మాజీకి జిల్లా అధికారులు, మెడికల్ సూపరింటెండెంట్ డా. సీహెచ్ బేబీ కమలతో పాటు ఆసుపత్రి సిబ్బంది అభినందనలు తెలిపారు.బలివేలో శివరాత్రి ఉత్సవాల ఆదాయం రూ.40.40 లక్షలు బలివే(ముసునూరు): మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా బలివే రామలింగేశ్వర స్వామి ఆలయానికి రూ.40 లక్షల 40 వేల 674 ఆదాయం లభించినట్లు ఈఓ పామర్తి సీతారామయ్య తెలిపారు. శుక్ర, శనివారాల్లో ఆలయం వద్ద ఉత్సవాల అధికారి అనూరాధ పర్యవేక్షణలో హుండీలు, ఇతర ఆదాయాల లెక్కింపు నిర్వహించారు. ప్రత్యేక దర్శనాలు, శీఘ్ర దర్శనాలు, తొలి అభిషేకం, ప్రత్యేక అభిషేకాలు తదితర పూజాధికాల ద్వారా రూ.9,54,62, విరాళాల రూపంలో రూ.2,68,098, ఖాళీ స్థలాల్లో తాత్కాలిక దుకాణాల ఏర్పాటు ద్వారా రూ.13,10,000, కొబ్బరి చిప్పల విక్రయం ద్వారా రూ.1,30,000, శాశ్వత, తాత్కాలిక హుండీల ద్వారా రూ.13,77,951 ఆదాయం లభించినట్లు తెలిపారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది స్వామి వారికి సుమారు రూ.లక్ష మేర ఆదా యం తగ్గిందన్నారు. కార్యక్రమాల్లో సర్పంచ్ రావు ప్రవీణ, గ్రామస్తులు పాల్గొన్నారు. -
21 నుంచి దివ్య దక్షిణ యాత్ర
ఏలూరు (టూటౌన్): ఐఆర్టీసీ ఆధ్వర్యంలో ఈ నెల 21 నుంచి 29 వరకు జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర పేరుతో రైల్ టూర్ నిర్వహిస్తున్నట్లు విజయవాడ మార్కెటింగ్ మేనేజర్ ఎం.రాజా శనివారం ప్రకటనలో తెలియజేశారు. ఈ యాత్రలో అరుణాచలం – రామేశ్వరం – మధురై – కన్యాకుమారి – త్రివేండ్రమ్ – త్రిచీ – తంజావూరు సందర్శించే అవకాశం ఉంటుందన్నారు. ఈ నెల 21న మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరే రైలు విజయవాడ, తెనాలి, చీరాల,ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు స్టేషన్లలో ఆగుతుందన్నారు. టికెట్ వెల స్లీపర్ క్లాస్ రూ. 14,250. థర్డ్ ఏసీ రూ.21,880, సెకండ్ ఏసీ రూ.28,440గా ఉందన్నారు. వివరాలకు సెల్ నెం.92814 95848లో సంపద్రించాలన్నారు. -
ధార్మిక చింతనకు ప్రతీక.. రంజాన్
●దైవ భీతిని కలుగజేస్తుంది ఉపవాసం మనిషిలో దైవ భీతిని కలుగజేస్తుంది. అల్లాహ్‌కు వినమ్రంగా మారుస్తుంది. ఉపవాసం ఉండే మనిషికి మనసు మీద నియంత్రణ సులువు అవుతుంది. ఆరోగ్యంతో పాటు ఇతరుల పట్ల సోదర భావం పెరుగుతుంది. ఆకలితో ఉన్నవారు, అవసరాలతో ఉన్న వారి పట్ల దయా గుణం పెరుగుతుంది. త్యాగ నిరతిని పెంపొందించే ఉపవాస దీక్షలు ప్రతి ముస్లిం విధిగా చేయాలి. – మహమ్మద్ అబ్దుల్ వదూద్, జామియ మస్జిద్ ఇమామ్ దయాగుణం పెరుగుతుంది రంజాన్ ఉసవాసాల వల్ల పాపాలు తుడిచి పెడ్తాయి. ఆరోగ్యంతో పాటు ఇతరుల పట్ల సోదర భావం పెరుగుతుంది. ఆకలితో ఉన్నవారు, అవసరాలతో ఉన్న వారి పట్ల దయాగుణం పెరుగుతుంది. నెల రోజుల ఉపవాసాల వల్ల పుణ్యం కలుగుతుంది. – సయ్యద్ రహీం (బాబు),జామియ మస్జిద్ కమిటీ అధ్యక్షుడు చింతలపూడి: ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ నెల ఉపవాసాలు ఆదివారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. శనివారం నెల వంక దర్శనంతో రంజాన్ మాసం ప్రారంభమవుతుంది. పవిత్ర ఖురాన్ అవతరించిన మాసంగా ముస్లింలు విశ్వసించే ఈ నెలంతా ఉపవాసాలు, ప్రత్యేక ప్రార్థనలు, దాన ధర్మాలతో గడుపుతారు. రోజూ మొత్తం ఆరాధనలోనే ఎక్కువ సమయం గడుపుతారు. ఖురాన్ ప్రకారం రంజాన్ నెలలో విధిగా ఉపవాస వ్రతాన్ని పాటిస్తారు. రంజాన్ నెల ముస్లిం విశ్వాసుల పండుగ. అభిమానానికి, స్నేహానికి ప్రతీకగా దీనిని ఆచరిస్తారు. రంజాన్ నెలలో ముస్లింలు క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనతో అల్లాహ్‌ను ప్రార్థిస్తారు. జిల్లాలోని ఏలూరు, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, నూజివీడు, కై కలూరు, పట్టణాల్లో రంజాన్ పండుగను ముస్లింలు ఏటా ఘనంగా జరుపుకుంటారు. నిష్టతో ఉపవాసాలు రంజాన్ మాసం ప్రారంభమైన నాటినుంచి ముగిసేవరకు ముస్లింలు పగలు నిష్టగా (రోజా) ఉపవాస దీక్షలను పాటిస్తారు. కేవలం ఆహార పానీయాలను మానేయడం మాత్రమే కాకుండా నియమాలతో కూడుకున్న జీవన విధానాన్ని ఆచరిస్తారు. తెల్లవారుజామున ఆహారం తీసుకోవడాన్ని సహర్ అని, సాయంత్రం ఉపవాస దీక్ష విరమణలో తీసుకునే ఆహారాన్ని ఇఫ్తార్ అని అంటారు. ఇలా ప్రతి రోజు సుమారు 13 గంటలపాటు కఠిన ఉపవాస దీక్షను అవలంభిస్తారు. ఒకవేళ ఏదైనా అనారోగ్యంతో ఉపవాసం ఉండలేకపోతే అలాంటి వారు రంజాన్ తర్వాత వాటిని పూర్తి చేయాల్సి ఉంటుంది. షబ్–ఎ–ఖద్ర్ రంజాన్ నెల ప్రారంభమైన 27వ రోజు షబ్–ఎ–ఖద్ర్ ను ముస్లింలు జరుపుకుంటారు. ఈ రోజున దివ్య ఖురాన్ అవతరించిందని ముస్లింల విశ్వాసం. ఈ రోజున రాత్రంతా జాగరణ చేసి ప్రార్థనలతో గడుపుతారు. ఆ రాత్రి భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేసిన వారికి ఎన్నో సంవత్సరాల పాటు ప్రార్థనలు చేస్తే వచ్చే పుణ్యం దక్కుతుందని విశ్వాసం. జకాత్ ముస్లింలకు నమాజ్, రోజా ప్రకారమే జకాత్ కూడా నిర్ణయింపబడింది. దైవం కోసం, దైవ ప్రసన్నత పొందడానికి ఒక బాధ్యతగా సంపదలో కొంత మొత్తాన్ని పేదలకు అందించడమే జకాత్ ముఖ్య ఉద్దేశం. రంజాన్ నెలలోనే ముస్లింలు విధిగా జకాత్ చెల్లిస్తారు. పేద, ధనిక అంతరాలను రూపు మాపడానికి జకాత్ తోడ్పడుతుందని నమ్ముతారు. జకాత్ అంటే పరిశుధ్ధ పరిచేది అని అర్థం ఫిత్రా రంజాన్ నెల అంతా నమాజులు, ఉపవాసాలు, జకాత్ చెల్లించడంతో పాటు నెల ముగిసి పండుగ జరుపుకునే ముందు ఫిత్రా అంటే దానం. పేదలు కూడా పండుగ రోజు సంతోషంగా పాల్గొనాలని చేసిన ఏర్పాటు ఇది. కుటుంబంలో ఎంత మంది సభ్యులు ఉంటే అందరి తరుపున విధిగా ఫిత్రా చెల్లిస్తారు. ఒక్కో ఫిత్రా కింద రెండున్నర కిలోల ఆహార ధాన్యాలు, లేదా అందుకు సమానమైన నగదు చెల్లించాలి. హలీద ప్రతిదినం ఇఫ్తార్ సమయంలో సేవించే హలీద(జావ)కు కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. మసాలా దినుసులతో పాటు ప్రత్యేక ఆహార పదార్థాలతో దీన్ని తయారు చేస్తారు. బొంబాయి రవ్వ, బియ్యం రవ్వ, మేక మాంసం తదితర పదార్థాలను కలిపి జావ తయారు చేస్తారు. దీనిని మట్టి పాత్రలలో సేవిస్తారు. షవ్వాల్ ఉపవాస దీక్షలు నెలఅంతా కొనసాగిన అనంతరం నెలవంక ప్రత్యక్షమవగానే ఉపవాస దీక్షలను విరమిస్తారు. దీనినే షవ్వాల్ అంటారు. మరుసటి రోజున పండుగను అత్యంత భక్తి శ్రధ్ధలతో సంతోషాలతో జరుపుకుంటారు. ఉపవాస దీక్షలకు మసీదులను సిధ్ధం చేస్తున్నారు. నేటి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం ప్రత్యేక ప్రార్థనలు, ధార్మిక చింతనలో ముస్లింలు పది రోజులకో ప్రత్యేకత 30 రోజుల ఉపవాస దినాల్లో ప్రతి 10 రోజులకు ఓ ప్రత్యేకత ఉంది. మొదటి 10 రోజులు కారుణ్య దినాలుగా భావిస్తారు. అల్లాహ్ కారుణ్యం కోసం ఈ పది రోజులు ఉపవాసం ఉంటారు. 11 నుంచి 20వ రోజు వరకు క్షమాభిక్ష దినాలుగా పరిగణిస్తారు. తమ పాపాలను క్షమించమని అల్లాహ్‌ను వేడుకుంటూ ఉపవాసాలు ఉంటారు. చివరి పదిరోజులు నరకాగ్ని నుంచి కాపాడమని దువాలు చేస్తూ ఉపవాసాలు పాటిస్తారు. -
పైడిపర్రులో భారీ చోరీ
39 కాసుల బంగారం, రూ.40 వేల నగదు అపహరణతణుకు అర్బన్: ఇంట్లో ఉండగానే.. బీరువా తలు పులు తెరిచి చోరీ చేసిన ఘటన తణుకు శివారు పైడిపర్రులో జరిగింది. శుక్రవారం వేకువజామున 4 గంటల సమయంలో జరిగిన ఈ చోరీలో 39 కాసు ల బంగారు ఆభరణాలు, కిలో వెండి, రూ.40 వేల నగదు దొంగలు దోచుకున్నట్లు బాధితులు చెబుతున్నారు. తణుకు మండలం పైడిపర్రులో నివసిస్తున్న తాటికాయల వెంకటేశ్వరరావు శుక్రవారం వేకువజామున లేచి బాత్రూంలోకి వెళ్లారు. ఇంటి తలుపులు దగ్గరకు వేసి వెళ్లడంతో లోపలకు ప్రవేశించిన దొంగలు బీరువా తెరిచి బంగారు ఆభరణా లు, నగదు దోచుకెళ్లారు. బీరువా పక్కనే మంచంపై నిద్రిస్తున్న భార్య వీరవేణికి లైటు వెలుగు పడగానే మెలకువ వచ్చినా తన భర్త అనుకుని పక్కకు తిరిగి పడుకున్నారు. ఇదే అదనుగా దొంగ తన పని తాను చేసుకుని వెళ్లాడు. కొద్దిసేపటికి లోనికి వచ్చిన వెంకటేశ్వరరావు బీరువా తెరచి ఉండడాన్ని చూసి కేకలు వేశారు. ఇంటి ఆవరణలోని అరుగుపై తచ్చాడుతు న్న దొంగను చూసి బిగ్గరగా అరవడంతో పారిపోయిన దొంగ కొద్ది దూరంలో ద్విచక్రవాహనంపై వేచిఉన్న మరో వ్యక్తితో కలిసి ఉడాయించాడు. రోజూ ఉదయం 4 గంటలకు యజమాని నిద్రలేచి బయటకు వస్తారని తెలిసే దొంగలు వచ్చారని, ఈ ప్రాంతానికి చెందిన వారే అయిఉంటారని పోలీసు లు భావిస్తున్నారు. తాడేపల్లిగూడెం డీఎస్పీ డి.విశ్వనాథ్, సీఐలు బి.కృష్ణకుమార్, ఎన్.కొండయ్య, ఎస్సైలు చంద్రశేఖర్, ట్రాఫిక్ ఎస్సై డి.ఆదినారాయణ, పోలీసులు ఈ ప్రాంతానికి వచ్చి పరిశీలించారు. ఇటీ వల పైడిపర్రు ప్రాంతం వరుస దొంగతనాలతో అ ట్టుడుకుతోంది. ఈనెల 17న 6 ఇళ్లలో దొంగలు స్వై రవిహారం చేశారు. ఈ దొంగతనాలన్నీ తణుకు రూరల్ పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో జరగడం విశేషం. వరుస ఘటనలు జరుగుతున్నా పోలీసులు తగు చర్యలు తీసుకోవడం లేదని, రాత్రి బీట్లు సరిగా నిర్వహించడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. -
అదుపుతప్పి అంబులెన్స్ బోల్తా
ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న హృద్రోగి భీమడోలు: హృద్రోగిని విజయవాడ తరలిస్తున్న ప్రైవేట్ అంబులెన్స్ అతివేగంతో అదుపుతప్పి రోడ్డుపై డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ సంఘటన జాతీయ రహదారిపై సూరప్పగూడెం పంచాయతీ శివారు పాతూరు షుగర్స్ ఫ్యాక్టరీ వద్ద శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి తాడేపల్లిగూడెంలో గుండె వ్యాధితో బాధపడుతున్న పల్లి వీరాస్వామిని ప్రైవేట్ అంబులెన్స్‌లో విజయవాడ తరలిస్తున్నారు. వీరాస్వామితో పాటు ఆయన భార్య ఉదయకుమారి కూడా ఉన్నారు. మార్గమధ్యలో పాతూరు వద్ద ట్రాక్టర్ అకస్మాత్తుగా రోడ్డుపైకి రావడంతో తప్పించబోయి అంబులెన్స్ బోల్తా కొట్టింది. వీరాస్వామికి ఎటువంటి ప్రమాదం జరగకపోగా ఉదయకుమారి, డ్రైవర్ కృష్ణారెడ్డి, టెక్నీషియన్ గంగరాజుకు గాయాలయ్యా యి. రోగితో పాటు ఆమె భార్యను మరో అంబులె న్స్లో విజయవాడ తరలించారు. డ్రైవర్, టెక్నీషియన్‌ను 108లో తాడేపల్లిగూడెంలో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. భీమడోలు ఎస్సై వై.సుధాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇన్‌కం ట్యాక్స్‌లో మార్పులపై అవగాహన అవసరం
ఏలూరు (టూటౌన్): ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఇన్‌కం ట్యాక్స్‌లో చాలా మార్పులు వస్తున్నాయని, దీనిపై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని విశాఖపట్నం ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ ఇన్‌కం ట్యాక్స్ బి.శ్రీనివాస్ అన్నారు. ఏలూరు డివిజన్ ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో స్థానిక అతిథి హోటల్లో శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన హాజరై మాట్లాడారు. ఇంట్లో నుంచే రిటర్న్స్ దాఖలు చేసే అవకాశం ఏర్పడిందన్నారు. మార్చి 15 లోపు అడ్వాన్స్ ట్యాక్స్‌లు చెల్లించాలని గుర్తుచేశారు. ఆదాయ పన్ను సక్రమంగా చెల్లించినవారికి తమ శాఖ నుంచి ఎలాంటి ఇబ్బందులూ ఉండవన్నారు. సదస్సులో రాజమహేంద్రవరం అడిషనల్ కమిషనర్ డి.హేమ భూపాల్ తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్సీ స్థానానికి రీ పోలింగ్‌కు డిమాండ్
బీఎస్ఎఫ్ అధ్యక్షుడు శ్రీనివాస్సాక్షి, న్యూఢిల్లీ: ఉభయ తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి రీ పోలింగ్ నిర్వహించాలని బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడు కొండపల్లి శ్రీనివాస్ కేంద్ర ఎన్నికల సంఘానికి డిమాండ్ చేశారు. ఎన్డీఏ (టీడీపీ) కూటమి అభ్యర్థికి గట్టి పోటీ ఇస్తాననే ఉద్దేశంతో అధికార పార్టీకి చెందిన నాయకులతో ఎన్నికల అధికారులు కుమ్మకై ్క తన నామినేషన్‌ను కుట్రపూరితంగా రిజెక్ట్ చేసి పోటీలో లేకుండా తప్పించారని ఆరోపించారు. శుక్రవారం ఢిల్లీలో శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడారు. తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేశానన్నారు. తనకు జరిగిన అన్యాయంపై రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఈనెల 12 ఫిర్యాదు చేశానని.. అయితే అక్కడ న్యాయం జరగకపోవడంతో 25న కేంద్ర ఎన్నికల సంఘానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. విచారణ జరిపి తన నామినేషన్‌ను పునరుద్ధరించాలని, రీ పోలింగ్ నిర్వహించాలని కోరారు. -
కూటమి.. సూపర్ దగా
నేటి నుంచి కొల్లేటికోటలో జాతర కై కలూరు: కొల్లేటికోట పెద్దింట్లమ్మ జాతర, కలిదిండి మరియమాత మహోత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. సీఐ వి.రవికుమార్ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. శనివారం శ్రీ 1 శ్రీ మార్చి శ్రీ 2025రాష్ట్ర బడ్జెట్లో సూపర్ సిక్స్ హామీల అమలుకోసం గంపెడాశతో ఎదురుచూస్తున్న పేదవర్గాల వారికి కూటమి ప్రభుత్వం మళ్లీ మొండిచేయి చూపింది. మూడు ప్రధాన హామీల ప్రస్తావనే లేకపోగా, మరో మూడింటికి భారీగా కోత పెడుతూ అరకొర కేటాయింపులు చేసింది. డ్వాక్రా మహిళలకు టోకరా వేసింది. కూటమి వంచనపై పేదలు పెదవి విరుస్తున్నారు. నిరుద్యోగులకు అందని భృతి ● జిల్లాలో కుటుంబాలు 5.17 లక్షలు ● రూ.3 వేల ఆర్థిక సాయం కోసం ఎదురుచూపు సంక్షేమం విడిచి.. హామీలు విస్మరించి.. ● బడ్జెట్లో ఎన్నికల హామీలను గాలికొదిలేసిన సర్కారు ● ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, ఉచిత బస్సుకు కేటాయింపులు నిల్ ● దీపం, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనంకు అరకొరగానే.. ● డ్వాక్రా మహిళలకు మొండిచేయి ● కూటమి బడ్జెట్‌పై పేదల పెదవి విరుపుఅన్నదాతకు లేదు భరోసా ● జిల్లాలో సాగు భూమి 2.3 లక్షల ఎకరాలు ● రైతులు 1,24,645 మంది ● అన్నదాత సుఖీభవ అందక రైతులు నష్టపోయిన సాయం రూ.249.29 కోట్లుసాక్షి, భీమవరం: ఎన్నికల ప్రచారంలో భాగంగా గతేడాది ఏప్రిల్ 5న నరసాపురం, పాలకొల్లు, ఏప్రిల్ 10న తణుకు, ఏప్రిల్ 21న నరసాపురం, భీమవరం, ఏప్రిల్ 29న తాడేపల్లిగూడెం, మే 10న ఉండి బహిరంగ సభల్లో పాల్గొన్న చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లు సూపర్ సిక్స్ హామీలను ఊదరగొట్టారు. పాలనలోకి వచ్చిన మొదటి నెల నుంచే హామీలను అమలు చేస్తామన్నారు. తల్లికి వందనంగా ఒక్కో విద్యార్థికి రూ.15 వేలు ఎందరుంటే అంతమందికి ఇస్తామన్నారు. రైతులకు ఏటా రూ.20 వేలు పెట్టుబడి సాయం చేస్తామన్నారు. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి, ఆడబిడ్డ నిధిగా 18 నుంచి 60 ఏళ్లలోపు మహిళలకు నెలకు రూ.1,500లు ఇస్తామన్నారు. ప్రతి ఇంటికీ ఏడాదికి మూడు గ్యాస్ సిలెండర్లు ఉచితమన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. అయితే అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలైనా ఒక్క హామీని అమలుచేయలేదు. పాలన చేపట్టాకా రూ.1.45 లక్షల కోట్ల వరకు అప్పులు తెచ్చిన కూటమి ప్రభుత్వం ఒక్క రూపాయినీ ఆయా సంక్షేమ కార్యక్రమాలకు వెచ్చించలేదు. కేటాయింపులు నిల్ శుక్రవారం శాసనసభలో చంద్రబాబు సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆడబిడ్డ నిధి, నిరుద్యోగభృతి, ఉచిత బస్సు హామీల ప్రస్తావనే లేదు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం పథకాలకు అరకొర కేటాయింపులు చేశారు. గతంలోనూ తల్లికి వందనంకు కేటాయింపులు చేసినా అమలుచేయలేదు. ఎన్నికల్లో డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇస్తామని చెప్పినా బడ్జెట్లో ఊసే లేదు. ఉద్యోగులకు నిరాశ భీమవరం (ప్రకాశంచౌక్): రాష్ట్ర బడ్జెట్లో 12వ పీఆర్సీకి నిధులు కేటాయిస్తారని ఆశతో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయులు నిరాశకు గురయ్యారని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి జి.ప్రకాశం, బీవీ నారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు కావస్తున్నా పీఆర్సీకి నిధులు కేటాయించకపోవడం, ఉద్యోగ, ఉపాధ్యాయులకు బకాయి పడ్డ రూ.25 వేల కోట్ల ప్రస్తావన బడ్జెట్లో లేకపోవడం దారుణమని విమర్శించారు. హుండీ ఆదాయం లెక్కింపు కై కలూరు: కలిదిండి పార్వతీ సమేత పాతాళ భోగేశ్వరస్వామి ఆలయానికి శివరాత్రి ఉత్సవాల్లో హుండీల ఆదాయం, చదివింపుల రూపంలో రూ.27,44,437 సమకూరింది. తల్లికి ఎగనామం జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, ఇంటర్ విద్యార్థులు : 2,49,662 అర్హులైన విద్యార్థులు (70 శాతం) సుమారు 1,74,763 తల్లికి వందనంగా ఈ విద్యా సంవత్సరంలో తల్లులు నష్టపోయిన మొత్తం రూ.262.14 కోట్లు న్యూస్రీల్ఒక్కటే సిలిండర్ మొత్తం రేషన్‌కార్డులు 5,67,651 ఒక్కో కార్డుపై ఏడాదికి మూడు చొప్పున ఇవ్వాల్సిన సిలెండర్లు 17,02,953 ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇస్తున్న సిలెండర్లు 5,67,651 లబ్ధిదారులు కోల్పోయిన సిలెండర్లు 11,35,302 పేదలు నష్టపోయిన మొత్తం రూ.93.94 కోట్లు ఆడబిడ్డకు అన్యాయం మహిళలకు ప్రతి నెలా రూ.1,500 జిల్లాలో 18 ఏళ్లు నిండిన మహిళలు 7,51,313 సామాజిక పింఛన్లు పొందుతున్న మహిళలు 1.55 లక్షలు రూ.1,500 పొందేందుకు అర్హులు 5,96,313 ఆడబిడ్డ నిధి కింద ప్రతినెలా మహిళలు నష్టపోతున్న మొత్తం రూ.89.45 కోట్లు ఉచిత బస్సు.. తుస్సు జిల్లాలో జనాభా : 19,00,228 పురుషులు : 9,48,461 మహిళలు: 9,51,766 ఎన్నికల హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాల్సి ఉంది -
కనుల పండువగా రథోత్సవం
ముగిసిన బలివే శివరాత్రి ఉత్సవాలు బలివే(ముసునూరు): బలివేలోని రామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద మహాశివరాత్రి ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయి. బలివే క్షేత్రానికి గురు, శుక్రవారాల్లో వేలాదిగా భక్తులు తరలి వచ్చి, తమ్మిలేరు, జల్లు స్నానాల వద్ద అమావాస్య స్నానా లాచరించి స్వామిని దర్శించుకున్నారు. పితృదేవతలకు ముక్తి కలగాలని బ్రాహ్మణులకు, పేదలకు దా నాలు చేశారు. గురువారం రాత్రి స్వామికి బలివే గ్రామ వీధుల్లో వైభవంగా రథోత్సవం నిర్వహించారు. భక్తులు రాజరాజేశ్వరీ సమేత రామలింగేశ్వరస్వామి ఉత్సవమూర్తులను దర్శించుకున్నారు. సీఐ రామకృష్ణ, ఎస్సై ఎం.చిరంజీవి బందోబస్తు నిర్వహించారు. శుక్రవారం ఉదయం బిందె తీర్థం, బలిహరణ, వసంతోత్సవం, అవభృతం, సాయంత్ర హోమం, బలిహరణాదులు, పూర్ణాహుతి, ద్వాదశ ప్రదక్షిణాలు నిర్వహించారు. రాత్రి ధ్వజావరోహణం చేసి భక్తి శ్రద్ధలతో పవళింపు సేవ నిర్వహించారు. దీంతో శివరాత్రి ఉత్సవాలు ముగిసినట్లు అధికారులు తెలిపారు. హుండీల ఆదాయం రూ.13.77 లక్షలు మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా బలివే రామలింగేశ్వర స్వామి ఆలయానికి హుండీల ద్వారా రూ.13.77 లక్షల ఆదాయం లభించినట్లు ఈఓ పామర్తి సీతారామయ్య తెలిపారు. శుక్రవారం ఆలయం వద్ద ఉత్సవాల అధికారి కె.అనూరాధ పర్యవేక్షణలో హుండీల లెక్కింపు నిర్వహించారు. అనంతరం ఆదాయ వివరాలను వెల్లడించారు. శా శ్వత, తాత్కాలిక హుండీల ద్వారా రూ. 13,77,951 ఆదాయం లభించగా, పూజా టికెట్లు, విరాళాల ద్వారా స్వామికి సుమారు రూ.12 లక్షల ఆదాయం లభించిందన్నారు. కార్యక్రమాల్లో సర్పంచ్ రావు ప్రవీణ, భక్తులు పాల్గొన్నారు. -
సూపర్ సిక్స్ బూటకం
సందప సృష్టిస్తానని మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసిన ఘనుడు చంద్రబాబు. బడ్జెట్లో పేదలకు ఒరిగిందేమీ లేదు. సూపర్ సిక్స్ హామీలు బూటకమని మరోసారి నిరూపితమైంది. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, ఉచిత బస్సు ప్రయాణం, డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు, బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ మాటేంటి. బడ్జెట్లో అంకెల గారడీ తప్ప కేటాయింపుల్లో కోతలు ఎక్కువగా ఉన్నాయి. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలకు భారీగా కోతలు పెట్టారు. కాపు సంక్షేమానికి రూ.15 వేల కోట్ల కేటాయింపులు లేవు. చంద్రన్న బీమాకు నిధులు ప్రకటించలేదు. – కారుమూరి వెంకట నాగేశ్వరరావు, మాజీ మంత్రి -
చెత్త తొలగింపునకు చర్యలు
కాళ్ల: ‘లక్షల్లో వ్యయం.. నెరవేరని లక్ష్యం’ శీర్షికన ‘సాక్షి’లో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. కాళ్ల మండలంలోని బొండాడపేట గ్రామంలో పొలాలకు వెళ్లే రోడ్డు మార్జిన్లో చెత్త తొలగింపునకు పంచాయతీ అధికారులు చర్యలు తీసుకున్నారు. అలాగే ఇక్కడ ఎవరూ చెత్త వేయకుండా బోర్డును ఏర్పాటుచేసినట్టు సచివాలయ సెక్రటరీ మణికంఠ తెలిపారు. మండలంలో డంపింగ్ యార్డ్‌లను ఉపయోగంలోకి తీసుకొస్తామని అధికారులు తెలిపారు. రెడ్‌జోన్‌లో మినహా చికెన్ తినొచ్చు భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలోని వేల్పూరు గ్రామంలోని కృష్ణానందం కోళ్ల ఫారం నుంచి కిలోమీటర్ పరిధిలో, పెదతాడేపల్లిలోని రామలక్ష్మి కోళ్ల ఫారం నుంచి కిలోమీటర్ మినహా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో గుడ్లు, చికెన్ విక్రయాలపై ఎలాంటి ఆంక్షలు లేవని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ప్రజలు అపోహలు వీడి ఉడికించిన గుడ్లు, కోడి మాంసం ఆహారంగా తీసుకోవచ్చని పేర్కొన్నారు. చికెన్, గుడ్లు షాపులు, రెస్టారెంట్ యజమానులు వ్యాపారాలు కొనసాగించవచ్చని స్పష్టం చేశారు. ప్రగతికి పరిశోధనలు కీలకం తాడేపల్లిగూడెం: దేశ ప్రగతికి సైన్స్ పరిశోధనలు కీలకమని వరంగల్ నిట్ గణిత విభాగం ఆచార్యులు జేవీ రమణమూర్తి అన్నారు. శుక్ర వారం ఏపీ నిట్‌లో జరిగిన జాతీయ సైన్సు దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశం గర్వించదగ్గ మేధావి సీవీ రామన్ అని అన్నారు. నిట్ రిజిస్ట్రార్ దినేష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు సృజనాత్మకమైన ఆలోచనలతో ఆధునిక సాంకేతికతను జోడించి నూతన ఆవిష్కరణలను చేయాలన్నారు. డీన్లు హిమబిందు, జయరామ్, సందీప్, స్కూల్ ఆఫ్ సైన్సెస్ విభాగాధిపతి ఎం.అమరేంద్రరెడ్డి పాల్గొన్నారు. నేటి నుంచి ఇంటర్ పరీక్షలు భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లావ్యాప్తంగా శనివారం నుంచి జరిగే ఇంటర్మీడియెట్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారి ఎ.నాగేశ్వరరావు శుక్ర వారం తెలిపారు. జిల్లాలో 52 పరీక్షా కేంద్రాలు సీసీ కెమెరాలు పర్యవేక్షణలో ఉంటాయన్నారు. పరీక్షా కేంద్రానికి విద్యార్థులకు ఉదయం 8 గంటలకల్లా చేరుకోవాలని సూచించారు. కేజీఆర్ఎల్ జూనియర్ కళాశాలలో కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేశామని, సమస్యలుంటే సెల్లో 94917 22692 సంప్రదించాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించామని స్పష్టం చేశారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు అన్ని వసతులు కల్పించామని వివరించారు. రేపు ట్రెజరీ సంఘ ఎన్నికలు భీమవరం (ప్రకాశంచౌక్): ఆంధ్రప్రదేశ్ ట్రెజరీస్, అకౌంట్స్ సర్వీసెస్ జిల్లా సంఘ ఎన్నికలు ఆదివారం నిర్వహించనున్నట్టు ఉప ఖజానా అధికారి జె.రామారావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. భీమవరంలోని జిల్లా ఖజానా, లెక్కల కార్యాలయ ప్రాంగణంలో ఎన్నికలు నిర్వహిస్తారని, ఎన్నికల అధికారులుగా రాష్ట్ర కార్యదర్శి షేక్ అబ్దుల్ ఖాదర్, జి.నరేంద్ర కుమార్, ఎన్నికల పరిశీలకులుగా ఎ.ఆంజనేయులు వ్యవహరిస్తారని తెలిపారు. సమస్యాత్మక కేంద్రాలపై దృష్టి పెట్టాలి ఏలూరు (టూటౌన్): ఏలూరు, పశ్చిమగోదా వరి జిల్లాలో ఇంటర్మీడియెట్ పరీక్షల్లో సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యుడు డాక్టర్ జె.రాజేంద్రప్రసాద్ కోరారు. స్థానిక విద్యానగర్‌లో శుక్రవారం మాట్లాడుతూ ఇంటర్ పరీక్షల్లో ఎటువంటి వివాదాలు రాకుండా నిర్వహించాలన్నారు. ఫీజు చెల్లించని కారణంగా విద్యార్థులను యాజమాన్యాలు హల్‌టికెట్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అధికారులు దృష్టి సారించాలని కోరారు. -
నేత్రపర్వం.. త్రిశూల స్నానం
ద్వారకాతిరుమల: క్షేత్రపాలకుడిగా విరాజిల్లుతోన్న భ్రమరాంబ మల్లేశ్వరస్వామి ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నా యి. శుక్రవారం ఆలయంలో విశేష కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం ఆలయ అర్చకులు తీర్ధపు బిందె, నిత్యహోమం, బలిహరణ, గణపతిపూజ అనంతరం స్వామివారికి అభిషేకం, అమ్మవార్లకు కుంకుమార్చన నిర్వహించారు. ఆ తరువాత ఆల య ఆవరణలో శివయ్యకు త్రిశూల స్నానాన్ని అట్టహాసంగా జరిపారు. అనంతరం గంగా, పార్వతీ సమేత శివదేవుని గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. వసంతోత్సవాన్ని కన్నుల పండువగా జరిపారు. రాత్రి ఆలయంలో స్వామివారికి 21 చుట్లు పల్లకి సేవ నిర్వహించారు.