YSR
-
హోంగార్డుల సేవలు అభినందనీయం
కడప అర్బన్ : పోలీసులతో సమానంగా విధులు నిర్వర్తిస్తూ అందరి మన్ననలు చూరగొంటున్న హోంగార్డుల సేవలు అభినందనీయమని జిల్లా ఎస్పీ ఈ.జి. అశోక్ కుమార్ కొనియాడారు. జిల్లాలోని హోంగార్డ్స్ సిబ్బందికి వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు రెండు వారాలపాటు నిర్వహించిన మొబిలైజేషన్ కార్యక్రమం ముగింపు సందర్భంగా మంగళవారం డీ–మొబిలైజేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ హోంగార్డ్స్ పెరేడ్ (కవాతు)ను పరిశీలించి గౌరవ వందనాన్ని స్వీకరించారు. పెరేడ్‌ను ప్రతిభావంతంగా, క్రమశిక్షణతో చేశారని జిల్లా ఎస్పీ హోంగార్డులను అభినందించారు. ఆయన మాట్లాడుతూ శిక్షణా కాలం అనేది కీలకమని, విద్య నేర్చుకున్న అనంతరం సమాజానికి ఉపయోగపడకపోతే ఆ విద్యకు విలువ ఉండదన్నారు. అలాగే ఈ శిక్షణలో హోంగార్డులు నేర్చుకున్న అంశాలను దైనందిన విధుల్లో ప్రతిబింబించేలా చూడాలన్నారు. దేశ అంతర్గత భద్రతను పరిరక్షించడంలో హోంగార్డ్స్ సిబ్బంది కీలకపాత్ర పోషిస్తున్నారన్నారు. పోలీస్ శాఖతో పాటు అగ్నిమాపక, ఆర్.టి.ఓ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, జైళ్లశాఖ తదితర వాటిలో కీలకవిధులు నిర్వర్తిస్తూ ఆయా శాఖలకు వెన్నెముకగా నిలిచారని ఎస్పీ పేర్కొన్నారు. హోంగార్డుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలనీ, పరిశీలించి పరిష్కరిస్తాని జిల్లా ఎస్పీ భరోసా ఇచ్చారు. బ్యాండ్ పార్టీ ఏ.ఆర్. హెడ్‌కానిస్టేబుల్ పి.బాబు, బృందాన్ని పెరేడ్ సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన హోంగార్డ్‌లకు బహుమతులు అందజేశారు. ఏ.ఆర్ అదనపు ఎస్పీ బి. రమణయ్య మాట్లాడుతూ రాయలసీమలోనే మొట్టమొదటిసారిగా హోంగార్డ్స్ సిబ్బందికి మొబిలైజేషన్ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ఈ.జీ. అశోక్‌కుమార్ ఏర్పాటు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఏ.ఆర్. డీఎస్పీ కె. శ్రీనివాసరావు, ఆర్ఐలు శ్రీశైలరెడ్డి, ఆనంద్, టైటస్, వీరేష్, శివరాముడు, ఆర్.ఎస్.ఐలు, పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పు శంకర్, హోంగార్డుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. హోంగార్డుల డీ మొబిలైజేషన్ పెరేడ్ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఈ.జి. అశోక్‌కుమార్ -
పర్యాటక సర్క్యూట్‌గా అభివృద్ధి చేస్తాం
కడప సెవెన్‌రోడ్స్ : జిల్లా సంస్కృతి సంప్రదాయాలకు నిలయమని, వాటి విలువలు అందరికీ తెలిపే విధంగా ప్రసిద్ధ ప్రదేశాలు ఆలయాలను కలుపుతూ పర్యాటక సర్క్యూట్ గా అభివృద్ధి చేస్తామని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్నారు. మంగళవారం భారత జాతీయ కళా సంస్కతి వారసత్వ పరిరక్షణ సంస్థ (ఇంటాక్) జిల్లా చాఫ్టర్ కన్వీనర్ లయన్ కె.చిన్నపరెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధ్యక్షతన ఇంటాక్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉన్న పురాతన కట్టడాలు, కళలు, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక అంశాలపై జిల్లా సంస్కృతి గొప్పదనాన్ని తెలిపే విధంగా ఏడాదిలో నాలుగు రకాల ఉత్సవాలను జరిపే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు. ఇందులో కడపోత్సవాలు, గండికోట ఉత్సవాలు, పురాతన వారసత్వ ఉత్సవాలు , గుడి సంబరాలు వంటివి ఉండాలని సూచించారు. జిల్లాలో ఉన్న టెంపుల్ టూరిజాన్ని అభివృద్ధి చేసే విధంగా టూరిజం సర్క్యూట్ ను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో ఉన్న జానపదాలు, సాహిత్యాలు, కళలు, ఫోక్ డాన్సులు వంటి వాటిపై విద్యార్థుల్లో అవగాహన పెంచాలన్నారు. ఇంటాక్ కన్వీనర్ చిన్నపరెడ్డి మాట్లాడుతూ గండికోట వరల్డ్ హెరిటేజ్ గా యునెస్కో గుర్తింపుకోసం కృషి చేస్తున్నామని.. ఇందుకు జిల్లా యంత్రాంగ సహాయ సహకారాలు అందించాలని కోరారు. జిల్లా పర్యాటక శాఖ ఇంచార్జీ అధికారి సురేష్ కుమార్, టూరిజం మేనేజర్ రామ్ కుమార్,ఇంటాక్ సభ్యులు పాల్గొన్నారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించే గ్యాస్ ఏజెన్సీలపై చర్యలు ప్రభుత్వ నిబంధనలకు లోబడే గ్యాస్ సిలిండర్లను వినియోగదారులకు సరఫరా చేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులకు హెచ్చరికలు జారీచేశారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్లో హాలులో జిల్లాలోని గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులతో జేసీ అదితిసింగ్‌తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గ్యాస్ సరఫరాపై ప్రభుత్వానికి వినియోగదారుల నుంచి అసంతృప్తికరమైన సందేశాలు అందాయన్నారు. గ్యాస్ ఏజెన్సీలు సిలిండర్లను ఇంటికి సరఫరా చేసే సమయంలో డెలివరీ బాయ్స్ అదనపు చార్జీలను వినియోగదారుల నుండి వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు అందడంపై ప్రభుత్వం సీరియస్ గా పరిగణించిందన్నారు. జిల్లాలో అదనపు చార్జీల వసూళ్లకు పాల్పడుతున్న 15 ఏజెన్సీలకు ఇప్పటికే నోటీసులు ఇచ్చామని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించే గ్యాస్ ఏజెన్సీలపై కఠినంగా వ్యవహరిస్తామని కలెక్టర్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి డీఎస్ఓ రెడ్డి చంద్రిక, గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు, పాల్గొన్నారు. కలెక్టర్ శ్రీధర్ -
ఈనెల 13న జ్యోతి క్షేత్రానికి ఎంపీ అవినాష్‌రెడ్డి రాక
పోరుమామిళ్ల : ఈనెల 13న గురువారం ఉదయం 8–30 గంటలకు కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డి జ్యోతి క్షేత్రం కాశినాయన క్షేత్రాన్ని సందర్శిస్తారని వైఎస్సార్సీపీ నియోజకవర్గ బూత్ కన్వీనర్ల సమన్వయకర్త కె. రమణారెడ్డి తెలిపారు. మూడు దశాబ్ధాలుగా అక్కడ జరుగుతున్న అభివృద్ధి, నిత్యాన్నదానం, కాశినాయన సమాధిని సందర్శించుకుంటున్న వేలాదిమంది భక్తుల విశ్వాసం విస్మరించి, అక్కడ అధికారులు కట్టడాలు కూలగొట్టడంపై స్వయంగా తెలుసుకొనేందుకు ఎంపీ వస్తున్నారన్నారు. ఆయనతో పాటు బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సుధ, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, జిల్లా నాయకులు పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొనాలని కోరారు. రోడ్డు ప్రమాదంలో విశ్రాంత ఉపాధ్యాయుడి మృతి జమ్మలమడుగు రూరల్ : రోడ్డు పక్కన నిలబడి నీళ్లు తాగుతుండగా వేగంగా వచ్చిన బొలేరో వాహనం ఢీకొని ప్రొద్దుటూరుకు చెందిన నగళ్లపాటి సుబ్బరాయుడు (63) అనే విశ్రాంత ఉపాధ్యాయుడు మృతి చెందాడు. జమ్మలమడుగు మండలంలో మంగళవారం రాత్రి 9.30 గంటలకు జరిగిన ప్రమాద సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన నగళ్లపాటి సుబ్బరాయుడు సొంత పనుల నిమిత్తం స్వగ్రామం అయిన మైలవరం మండలం వేపరాల గ్రామానికి భార్య కృష్ణవేణితో కలిసి వచ్చాడు. పనులు ముగింకునిని స్కూటీలో తిరిగి ప్రొద్దుటూరు వెళుతుండగా మార్గమాధ్యంలోని ధర్మాపురం గ్రామం వద్దకు వెళ్లగానే దాహం వేసింది. దీంతో స్కూటీని ఆపి నీళ్లు తాగుతుండగా ప్రొద్దుటూరు వైపు వెళుతున్న బొలెరో క్యాంపర్ వాహనం ఢీకొంది. ఈ సంఘటనలో నగళ్లపాటి సుబ్బరాయుడు అక్కడికక్కడే మృతి చెందగా భార్య కృష్ణవేణికి గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108 వాహనంలో బాధితురాలిని ప్రొద్దుటూరుకు తరలించారు. విషయం తెలిసిన వెంటనే పట్టణ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. -
ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలి
జేసీ అదితి సింగ్వల్లూరు : ఈ నెల 17వ తేదీ నుంచి జరగనున్న పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ తెలిపారు. మంగళవారం మండల కేంద్రమైన వల్లూరులోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల రికార్డులను, విద్యార్థుల రిజిష్టర్లను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు. మెనూ ప్రకారం భోజనం అందుతోందా? కాస్మొటిక్ చార్జీలు నెలవారీ అందుతున్నాయా? వసతులు ఎలా ఉన్నాయి? తదితర వివరాలను విద్యార్థులతో అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. ప్రతి రోజు మెనూ ప్రకారమే భోజనం వడ్డించాలని, నాణ్యత విషయంలో ఏ మాత్రం రాజీ పడవద్దని సిబ్బందికి సూచించారు. అనంతరం ఉపాధ్యాయ సిబ్బందితో మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీ నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని, 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. పరీక్షల్లో ఎలాంటి భయం లేకుండా బాగా పరీక్షలు రాసే విధంగా విద్యార్థులకు ధైర్యం చెప్పాలన్నారు. అలాగే విద్యార్థులకు మంచి విద్యా బోధనతో పాటు మంచి క్రమశిక్షణ కూడా నేర్పించాలన్నారు. పాఠశాలలో చేయాల్సిన అభివృద్ధి పనులు ఏవైనా ఉంటే తన దృష్టికి తీసుకు రావాలని, వాటిని పరిశీలించి పూర్తి చేసేందుకు కృషి చేస్తానని ప్రిన్సిపల్‌కు సూచించారు. కడప ఆర్డీఓ జాన్ ఎర్విన్, జిల్లా అధికారులు ఆమె వెంట ఉన్నారు. -
అక్రమంగా ముగ్గురాయి తవ్వకాలకు యత్నం
– భూ యజమానిపై టీడీపీ నాయకుల దౌర్జన్యం లింగాల : తన పొలంలో టీడీపీ నాయకులు అక్రమంగా ముగ్గురాయి తవ్వకాలు నిర్వహిస్తున్నట్లు లింగాల మండలం ఇప్పట్ల గ్రామానికి చెందిన టి. విజయమోహన్‌రెడ్డి తెలిపారు. ఓబుళరెడ్డి, మనోహర్‌రెడ్డిలు ముగ్గురాయి తవ్వకాలు చేపట్టారని, దీనిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా తనపై దాడి చేసేందుకు యత్నించారన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్, ఎస్పీలకు, లింగాల పోలీసులకు, తహసీల్దార్లకు ఫిర్యాదు చేశానన్నారు. తనకు సంబంధించిన సర్వే నంబర్ 435/1, 435/2, 434 సర్వే నంబరు నందుగల 7ఎకరాల 75సెంట్లు విస్తీర్ణం గల వ్యవసాయ భూమి ఉందన్నారు. ఈ సర్వే నంబర్లకు తనకు మైనింగ్ లీజ్ ఉందన్నారు. తన భూమిపై వీరికి ఎలాంటి హక్కు లేదన్నారు. విద్యార్థిని ఆత్మహత్యాయత్నం కలసపాడు : కలసపాడు మండలంలోని పెండ్లిమర్రి వద్ద ఉన్న కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో పదో తరగతి చదువుతున్న భార్గవి సోమవారం రాత్రి పాఠశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. తీవ్రంగా గాయపడిన ఆ బాలికను చికిత్స నిమిత్తం సిబ్బంది పోరుమామిళ్లలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం నిమిత్తం అక్కడి నుంచి కడప రిమ్స్‌కు, ఆ తర్వాత వైద్యుల సూచన మేరకు తిరుపతి స్విమ్స్‌కు తరలించారు. ఈ విషయమై పాఠశాల ప్రిన్సిపల్ రెడ్డిజ్యోతిని వివరణ కోరగా విద్యార్థిని ప్రమాదవశాత్తు మెట్లపై నుంచి కింద పడిందని, వెంటనే అక్కడ ఉన్న సిబ్బందికి తెలియజేసి పోరుమామిళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించామని తెలిపారు. విచారణ జరపాలి.. కడప ఎడ్యుకేషన్: విద్యార్థిని భార్గవి ఆత్మహత్యాయత్నానికి గల కారణాలపై విచారణ జరపాలని అఖిల భారత విద్యార్థి బ్లాక్ (ఏ.ఐ.ఎస్.బి) జిల్లా కన్వీనర్ సగిలి రాజేంద్ర ప్రసాద్, రివల్యూషనరి స్టూడెంట్ యూనియన్ (ఆర్.ఎస్.యూ) జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్ డిమాండ్ చేశారు. ఇందుకు ఉపాధ్యాయుల వేధింపులే కారణమన్నారు. కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థిని భార్గవిని మంగళవారం వారు పరామర్శించారు.పాఠశాలలో జరిగిన ఘటనపై తప్పుడు సమాచారం ఇచ్చిన ఎస్.ఓపై, విద్యార్థినిని వేధించిన ఉపాధ్యాయులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. దాడి ఘటనలో కేసు నమోదు కడప అర్బన్ : కడప నగరం తాలూకా పోలీస్‌స్టేషన్ పరిధిలో పులివెందుల రోడ్డు సాక్షి సర్కిల్ సమీపంలో ఈనెల 10వ తేదీన పాతసామాన్ల అంగడిని నిర్వహిస్తున్న విక్రమ్ వద్దకు మాట్లాడేందుకు మల్లికార్జున అనే వ్యక్తి వెళ్లాడు. ఆ సమయంలో అక్కడున్న కిషోర్, ప్రకాష్, ఇంకా ముగ్గురు మల్లికార్జునను ఎగతాళి చేశారు. దీంతో ఈ విషయాన్ని మల్లికార్జున తన సోదరుడు, సీపీఐ జిల్లా సహాయకార్యదర్శి మద్దిలేటికి తెలియజేశాడు. మద్దిలేటి వారిని అడిగేందుకు సంఘటన స్థలానికి వెళ్లగా వారు మద్దిలేటి, అతని సోదరుడు మల్లికార్జునపై దాడి చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
ప్రైవేట్ హాస్పిటల్ సీజ్
ప్రొద్దుటూరు క్రైం : స్థానిక విజయనగరం వీధిలోని ఫ్లోరెన్స్ హాస్పిటల్‌ను వైద్యాధికారులు సీజ్ చేశారు. జనరల్ ఫిజీషియన్కు మాత్రమే ఈ హాస్పిటల్‌కు ప్రభుత్వ అనుమతి ఉంది. అయితే ఇటీవల ఇక్కడ కాన్పులు, సిజేరియన్లు నిర్వహిస్తున్నారని ఫిర్యాదులు వెళ్లడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ శివప్రసాద్‌రెడ్డి సిబ్బందితో కలిసి ఫ్లోరెన్స్ హాస్పిటల్‌కు వెళ్లారు. హాస్పిటల్‌లోని డాక్టర్ సాయిప్రసాద్‌తో మాట్లాడారు. అయితే ఇక్కడ జరిగే ప్రసవాల గురించి తనకు తెలియదని ఆయన వైద్యాధికారులకు తెలిపారు. హాస్పిటల్‌లోని సిబ్బందితో కూడా మాట్లాడారు. గైనకాలజీకి అనుమతి లేకున్నా ఎలా ప్రసవాలు చేస్తారని ప్రశ్నించారు. పూర్తి నివేదికను కలెక్టర్, డీఎంహెచ్ఓలకు పంపిస్తామని డిప్యూటీ డీఎంహెచ్ఓ తెలిపారు. తర్వాత సిబ్బంది అందరిని బయటికి పంపించి హాస్పిటల్‌ను సీజ్ చేశారు. విషయం తెలుసుకున్న జమ్మలమడుగు ఆర్డీఓ సాయిశ్రీ ఫ్లోరెన్స్ హాస్పిటల్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డెమో భారతి, దేవాంగపేట మెడికల్ ఆఫీసర్ ఆలిమ్, హెల్త్ ఎడ్యుకేటర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. వారాహి హాస్పిటల్‌ను పరిశీలించిన ఆర్డీఓ సాయిశ్రీ జమ్మలమడుగు ఆర్డీఓ సాయిశ్రీ మంగళవారం ప్రొద్దుటూరులోని వారాహి హాస్పిటల్‌ను పరిశీలించారు. ఇటీవల ఈ హాస్పిటల్లో చికిత్స పొందుతూ పసికందు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే హాస్పిటల్ వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా తమ బిడ్డ మృతి చెందాడని దంపతులు ఆరోపించిన నేపథ్యంలో పలు పత్రికల్లో కథనాలు వచ్చాయి. దీంతో ఆర్డీఓ హాస్పిటల్‌కు వచ్చారు. అయితే ఆ సమయంలో హాస్పిటల్ వైద్యులు అందుబాటులో లేరు. పసికందు మృతి, హాస్పిటల్ అనుమతుల గురించి డిప్యూటీ డీఎంహెచ్ఓ శివప్రసాద్‌రెడ్డిని అడిగారు. పసికందుకు అందించిన చికత్సపై విచారణ చేస్తామని ఆయన ఆర్డీఓతో అన్నారు. తర్వాత బాధిత పసికందు తల్లిదండ్రులతో మాట్లాడారు. అనుమతి లేకుండా కాన్పులు చేస్తున్నారని ఫిర్యాదు -
సనాతన ధర్మం అంటూ కూల్చివేయడం తగదు
కాశినాయన : సనాతన ధర్మం అంటూ ఆశ్రమాల్లో కూల్చివేతలు తగదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఆరే శ్యామల పేర్కొన్నారు. కాశినాయన మండలం జ్యోతిక్షేత్రంలోని కాశినాయన ఆశ్రమంలో కూల్చివేసిన కట్టడాలను ఆమె మంగళవారం పరిశీలించారు. అటవీశాఖ అధికారులు కూల్చివేసిన సాన్నపు గదులు, విశ్రాంతి గదులు, గోశాల, క్షౌ రశాలను ఆమె పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎంతో మంది అనాథలకు, నిరాశ్రయులకు అన్నం పెట్టే కాశినాయన ఆశ్రమాన్ని కూల్చివేయడం బాధాకరమన్నారు. సనాతన ధర్మం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ హనుమంతరెడ్డి, జిల్లా సెక్రటరీ యాక్టివ్ కన్వీనర్ ప్రభాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి పోలిరెడ్డి, యూత్ నాయకుడు ప్రతాప్‌రెడ్డి, గొంటువారిపల్లె సర్పంచ్ పిచ్చిరెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, రఘురామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి శ్యామల -
ప్రజల గుండెల్లో వైఎస్సార్సీపీ జెండా!
విలువలు, విశ్వసనీయతే ఆ పార్టీ మూల స్తంభాలు... సంక్షేమం.. అభివృద్ధి ఆ పార్టీ సిద్ధాంతాలు.. ప్రజా పక్షమై పోరాటాలు చేయాలన్నా.... ప్రజా సంక్షేమానికి పట్టం కట్టాలన్నా ఆ పార్టీతోనే సాధ్యం. ఆంక్షల కంచెల్ని చీల్చుకుంటూ.. ప్రజా ఆకాంక్షల మేరకు ఆవిర్భవించిందా పార్టీ. అదే వైఎస్సార్ సీపీ. ఈ పేరే ఒక సంచలనం.. పార్టీ ఆవిర్భావమే ఓ సంచలనం.. కష్టాలను తట్టుకుంటూ.... కన్నీళ్లను దిగమింగుకుంటూ ఉదయించిన ప్రజా నాయకుడతడు.. కేంద్రంలోని పెద్దల వంచనను నిలదీస్తూ.. పార్టీలన్నీ ఒక్కటై పన్నిన కుట్రలను పటాపంచలు చేస్తూ... ఎదిరించి గెలిచిన విజేతతడు. అతడే.. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్జగన్ మోహన్ రెడ్డి. సరిగ్గా 14 ఏళ్ల క్రితం వైఎస్సార్ ఘాట్ వద్ద రెపరెపలాడుకుంటూ నింగికెగిరిన పార్టీ జెండా.. నేడు ప్రజల గుండెల్లో నిలిచి పోయింది. సాక్షి కడప: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా... కుటిల రాజకీయాలను తరిమికొట్టడమే ధ్యేయంగా వైఎస్సార్సీపీ ఆవిర్భవించింది. ‘పార్టీ అంటే సామాన్య విషయం కాదు...ఎన్ని రోజులు నడుపుతారో చూస్తా’మంటూ ప్రగల్భాలు పలికిన నేతలు కాలగర్భంలో కలిసిపోగా ప్రజల పక్షాన నిలిచిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో తిరుగులేని విజయాలు సాధించింది. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ పెద్దలు ఏకమై వచ్చినా ఎదురొడ్డి చరిత్ర తిరగరాసే విజయాలు సాధించి యావత్ భారతదేశంలోనే పేరు గాంచింది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ విలువలు కలిగిన రాజకీయాలు చేస్తూ ప్రజల మనస్సులో సుస్థిరస్థానం సంపాదించుకున్నారు. నిత్యం ప్రజా పక్షమై పోరాడుతూ ప్రజా నాయకుడిగా నిలిచిపోయారు. తాజాగా కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలపై.. అరాచకాలపై మరో పోరుబాటకు పిలుపునిచ్చారు. చరిత్ర తిరగరాసిన ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బయటికి వచ్చిన అప్పటి ఎంపీ, ప్రస్తుత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, అప్పటి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో భారీ విజయాన్ని దక్కించుకున్నారు. వారు అందుకున్న విజయం చరిత్ర నివ్వెరపోయేలా పులివెందుల, కడప పార్లమెంటు ప్రజలు తీర్పునిచ్చారు. 2011 మే నెలలో జరిగిన ఉప ఎన్నికలు దేశ స్థాయిలో చర్చ జరిగేలా చేశాయి. ఆ ఉప ఎన్నికల్లో కడప ఎంపీ స్థానానికి సంబంధించి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున 5.44 లక్షలకు పైగా మెజార్టీతో అఖండ విజయం సాధించి పార్లమెంటు స్థాయిలో రికార్డు సృష్టించారు. అనునిత్యం ప్రజల్లో.....అందుకే పట్టం! 2011 నుంచి ఇప్పటివరకు ప్రజానేతగా, ప్రతిపక్ష నేతగా, ప్రజల ముఖ్యమంత్రిగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల కోసం అనునిత్యం వారి మధ్యే గడుపుతున్నారు. హోదా ఏదైనా ప్రజల కష్టసుఖాల్లో తోడుగా ఉంటూ వారి మధ్యే గడుపుతూ ప్రజా హృదయనేతగా గుర్తింపు పొందారు. ప్రజా సంకల్పం పేరుతో ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం దాకా పాదయాత్ర చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలతోపాటు 22 లోక్‌సభ స్థానాల్లో విజయఢంకా మోగించారు. సంక్షేమ ముద్ర రాష్ట్ర ప్రజల గుండెల్లో 2019–24 చరిత్రలో లిఖింపదగ్గ అధ్యాయంగా గుర్తింపు పొందింది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పేద ప్రజలఅభ్యున్నతికి కృషి చేశారు. తన హయాంలో పేద ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందేలా పథక రచన చేసి సఫలీకృతులయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి నేటికి సరిగ్గా 14 ఏళ్లు పూర్తి చేసుకుని 15వ వసంతంలోకి అడుగు పెడుతోంది. ఈ సందర్బంగా పార్టీ తరఫున పలు కార్యక్రమాలు చేపట్టాలని సంకల్పించారు. పార్టీ కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణలతోపాటు దివంగత వైఎస్సార్ విగ్రహాలకు పాలాభిషేకాలు, పూలమాలలతో ఘనంగా నివాళులర్పించనున్నారు. అందుకు సంబంధించి ఇప్పటికే పార్టీ అధిష్టానం నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చింది. వైఎస్సార్ ఘాట్ నుంచే శ్రీకారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం మొదలుకొని ప్రతి కార్యక్రమం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడి సమాధి ఘాట్ వద్ద నుంచే ప్రారంభిస్తూ వచ్చారు. వైఎస్సార్ సీపీ అధినేతగా ఇడుపులపాయ నుంచే పాదయాత్ర చేశారు. అలాగే పార్టీ ఆవిర్బావం...జెండా ఆవిష్కరణ....అభ్యర్థుల ప్రకటనలు....నామినేషన్ పత్రాలు...మొదటి ప్లీనరీ... ఇలా ఎలాంటి కార్య క్రమం తలపెట్టినా వైఎస్సార్ ఘాట్ వద్దకు వచ్చి ఆశీస్సులు తీసుకున్న తర్వాతనే ముందుకు కదిలేవారు. 15 వసంతంలోకి వైఎస్సార్ సీపీ 2011 మార్చి 12న వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం వైఎస్సార్ సమాధి ఘాట్ వద్ద పార్టీ పేరు, జెండా ఆవిష్కరణ పార్టీ ఆవిర్భావమే ఓ సంచలనం! -
865 మంది గైర్హాజరు
కడప ఎడ్యుకేషన్: ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో బాగంగా మంగళవారం 64 పరీక్షా కేంద్రాలలో నిర్వహించిన ఇంటర్ ప్రథమ ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలకు 865 మంది గైర్హాజరయినట్లు ఇంటర్ ఆర్ఐఓ బండి వెంకటసుబ్బయ్య తెలిపారు. ఇందులో జనరల్‌కు సంబంధించి 17195 మందికిగాను 747 మంది, ఒకేషనల్‌కు సంబందించి 1467 మందికిగాను 118 మంది గైర్హాజరయ్యారని వివరించారు. నేడు ఖోఖో సీనియర్స్ ఎంపికలు కడప ఎడ్యుకేషన్: చింతకొమ్మదిన్నె మండలం బయనపల్లి శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఈనెల బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల స్థాయి ఖోఖో పురుషులు, మహిళలు ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా ఖోఖో సంఘం అధ్యక్షుడు డాక్టర్ కె. రామసుబ్బారెడ్డి , కార్యదర్శి జె.నరేంద్ర తెలిపారు జిల్లా నుంచి ఎనిమిది మంది ఎంపిక చేసి ఈనెల 14, 15 తేదీల్లో పురుషులకు 16న మహిళలకు బాపట్ల జిల్లా జె.పంగులూరు ఎస్ఆర్ఆర్ ఖోఖో క్రీడా మైదానంలో డైరెక్ట్ నేషనల్ ఎంపికలు జరుగుతాయని వివరించారు. రూటే..సప‘రేటు’ కథనానికి స్పందన కడప రూరల్: జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో జరిగిన అవకతవకలపై గత శుక్ర వారం ‘సాక్షి’లో రూటే..సప‘రేటు’అనే కథనం ప్రచురితమైంది. దీనిపై కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి స్పందించారు. సోమవారం సాయంత్రం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను పిలిపించి, సమగ్రంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. జరిగిన అంశాలపై సీరియస్ అయ్యారు. ఇలాంటి సంఘటనలు జరిగితే ఉపేక్షించేది లేదని చెప్పినట్లుగా సమాచారం. ఈ అంశంపై ఎలాంటి పరిణామాలు ఉంటాయో అని ఆ శాఖలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. మాలెపాడు సర్పంచ్ చెక్ పవర్ రద్దు ఎర్రగుంట్ల: మండల పరిధిలోని మాలెపాడు గ్రామానికి చెందిన గ్రామ సర్పంచ్ శకుంతలమ్మ చెక్ పవర్ రద్దు అయినట్లు ఈఓపీఆర్డీ రంతులయ్య మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు గ్రామంలో ఆర్టీపీపీ సీఎస్ఆర్ నిధులు, ఎంపీ నిధుల కింద రెండు వాటర్ ప్లాంట్లను నిర్మించారు. వీటి మెయింటైన్స్ కోసం ఆర్టీపీపీ సీఎస్ఆర్ కింద రూ.23,21,101 నిధులను ఇచ్చిందన్నారు. ఈ నిధులను గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా దుర్వినియోగం చేశారని తేలడంతో సర్పంచ్ చెక్ పవర్‌ను రద్దు చేస్తూ డీపీఓ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. చెక్ పవర్‌ను ఈఓపీఆర్డీకి ఇచ్చినట్లు పేర్కొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం కడప కల్చరల్: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ కడప జిల్లా శాఖలో అకౌంటెంట్ పోస్టుకు ఆసక్తి గల వారి నుంచి దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా సెక్రెటరీ సురేష్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి అర్హత గలవారు పూర్తిచేసిన దరఖాస్తు ఫారాలను ఈనెల 25వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోగా నగరంలోని మట్టి పెద్దపులివద్ద ఉన్న రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయంలో నేరుగా అందజేయాలన్నారు. పూర్తి వివరాలకు 08562 272829 లేదా 9441513490 నెంబరులో సంప్రదించాలన్నారు. ఎంపికై న అభ్యర్థికి రూ.11,700 గౌరవ వేతనం ఉంటుందని, జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగే సమావేశంలో ఈ పోస్ట్ కు తగిన అభ్యర్థిని ఎంపిక చేస్తారని తెలిపారు. కనీసం రెండేళ్ల అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుందని వివరించారు. రేపు పులివెందులలో జాబ్‌మేళా కడప కోటిరెడ్డిసర్కిల్: ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, డిపార్టుమెంటు ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో ఈనెల 13వ తేది ఉదయం 9.30 గంటగలకు పులివెందులలో జాబ్‌మేళా నిర్వహించనున్నామని నిర్వాహకులు దివాకర్, చంద్రబాబులు తెలిపారు. పులివెందులలోని ఔటర్ రింగ్‌రోడ్డు సమీపంలోని నగిరిగుట్టలోని న్యాక్ సెంటర్లో ఈ జాబ్‌మేళా ఉంటుందని పేర్కొన్నారు. నవత ట్రాన్స్‌పోర్టు సంస్థలో క్లర్క్, డ్రైవర్లు, క్లీనర్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. అభ్యర్థులు 5వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివి ఉండాలన్నారు. కొప్పర్తిలోని అల్ డిక్సన్ (కిరణ్ సర్వీసెస్) సంస్థలో అసెంబ్లింగ్ ఆపరేటర్స్ అండ్ క్వాలిటీ ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్, డిగ్రీ చదివిన వారు అర్హులని వివరించారు. ఎంపికై న వారికి రూ. 12 వేల నుంచి రూ. 18 వేల వరకు వేతనాలు, ఇతర ప్రయోజనాలు ఉంటాయన్నారు. 30 ఖాళీలు ఉన్నాయని, అభ్యర్థులు 19–28 ఏళ్లలోపు కలిగి ఉండాలన్నారు. ఇతర వివరాలకు 96400 15507, 83744 91240 నెంబరులో సంప్రదించాలని సూచించారు. -
● మంజూరైనా.. వద్దన్నారు
సాక్షి ప్రతినిధి, కడప: విద్యార్థుల చదువులపై బాధ్యత లేదు. యువత ఉపాధి, భవిష్యత్‌పై అస్సలు చొరవ లేదు. కార్మికులు, కర్షకులపై చిత్తశుద్ధే లేదు. మహిళాభివృద్ధి ఉన్నతి కోసం కృషి చేసిన దాఖలాల్లేవు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ నిర్లక్ష్యపు తీరిది. ఇక జిల్లాలోని మెడికల్ కళాశాల కళాశాల నిర్వహణపై విముఖత చూపింది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ మంజూరు చేసిన ఎంబీబీఎస్ సీట్లు వద్దని తెగేసి చెప్పడం బాబు వివక్ష పాలనకు దర్పణం పట్టింది.ఈ నేపథ్యంలో విద్యార్థులు, యువత పోరుబాట పట్టారు. బుధవారం జిల్లా కేంద్రంలో వైఎస్సార్సీపీ నేతృత్వంలో ‘యువత పోరు’ కార్యక్రమం చేపట్టేందుకు సంసిద్ధులయ్యారు. జిల్లా కేంద్రంలో వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకూ భారీ ర్యాలీ చేపట్టనున్నారు. ● రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థపై చిన్నచూపు ప్రదర్శిస్తోంది. గత ఐదేళ్లలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్ గ్రామాల్లో సైతం కార్పొరేట్ విద్యకు ధీటుగా ప్రభుత్వ చదువులుండాలనే సంకల్పాన్ని ఆచరణలో చూపెట్టారు. నాడు–నేడుతో ప్రభుత్వ పాఠశాలను అద్భుతంగా తీర్చిదిద్దారు. విద్యార్థులను ప్రోత్సహించారు. ఉన్నత చదువులపై చిత్తశుద్ధి ప్రదర్శించారు. ఎప్పటికప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ క్లియర్ చేస్తూ వచ్చారు. చంద్రబాబు సర్కార్‌లో ఇప్పటి వరకూ ఫీజు రీయింబర్స్‌మెంటు పూర్తి స్థాయిలో చెల్లింపుల్లేవు. జిల్లాలో 44,876 మంది విద్యార్థులకు దాదాపు రూ.155కోట్లు పైబడి రావాల్సి ఉండగా కేవలం రూ.34.52కోట్లు చెల్లించారు. ప్రతి మూడు నెలలకు ఓమారు విద్యా దీవెన నిధులు ఇవ్వాల్సి ఉండగా, ఒక్కమారు మాత్రమే చెల్లించారు. వసతి దీవెన నిధులు అస్సలు మంజూరు చేయలేదు. పెండింగ్ బకాయిలు చెల్లింపులు లేవు, దీంతోసామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు వేదనకు గురవుతున్నారు. ఉపాధి లేదు... నిరుద్యోగ భృతి అసలే లేదు... వైఎస్సార్సీపీ సర్కార్‌లో కొప్పర్తి పారిశ్రామికవాడలో ఆల్‌డిక్సన్, సెంచురీఫ్లై బోర్డ్స్ సంస్థల ద్వారా వేలాది మందికి ప్రత్యక్ష ఉద్యోగ ఉపాధి లభించింది. స్థానికులకే అవకాశం కల్పించాలన్న నిబంధనలతో బద్వేల్ పరిసర ప్రాంతాలకు చెందిన దాదాపు 2వేలు మందికి ఉద్యోగాలు లభించాయి. కొప్పర్తి పరిసర ప్రాంతంలో మరో 3వేల మందికి ఉద్యోగాలు దక్కాయి. కూటమి ప్రభుత్వంలో జిల్లాకు కొత్తగా వచ్చిన పరిశ్రమలు లేవు. వస్తాయన్న నమ్మకాలు సన్నగిల్లాయి. ప్రత్యక్ష ఉపాధి మార్గాలకు అవకాశం కన్పించలేదు. ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3వేలు అందిస్తామని చంద్రబాబు ఎన్నికల హామీ ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా 2.80లక్షల మంది యువనేస్తం పథకానికి అర్హులుగా ఉన్నారు. వీరికి నెలకు రూ.84కోట్లు చెల్లించాల్సి ఉంది. యువత, విద్యార్థులపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న కూటమి సర్కార్ కొత్త పరిశ్రమల్లేవు..నూతన ఉద్యోగాల్లేవు..భృతి ఊసే లేదు ప్రభుత్వంలో తాండవిస్తున్న నిర్లక్ష్యం..విలవిలలాడుతోన్న సామాన్యులు ఫీజు రీయింబర్స్మెంట్ సక్రమంగా లేక ఆవేదనలో లక్షల మంది విద్యార్థులు నిరుపేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో ఉండాలనే తపనను వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రదర్శించారు. పులివెందులలో రూ.530కోట్లతో ప్రభుత్వ మెడికల్ కళాశాలను నిర్మించారు. 50 ఎకరాల విస్తీర్ణంలో 627 పడకలు వసతి గల ఆస్పత్రి నెలకొల్పారు. ఏడాదికి 150 మెడికల్ సీట్లు, 60 నర్సింగ్ సీట్లలో విద్యను అభ్యసించేలా వసతులు సమకూర్చారు. 50సీట్లు కేటాయిస్తూ ఎన్ఎంసీ ఆగస్టు 5న ఉత్తర్వులు జారీ చేసింది. మంజూరైన ఎంబీబీఎస్ సీట్లు వద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయడం గమనార్హం. పైగా ఆయా మెడికల్ కళాశాలను ప్రవేటు పరం చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుండం వింతగా పలువురు వాపోతున్నారు. -
నేటి ‘యువత పోరు’ను విజయవంతం చేయాలి
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు బుధవారం నిర్వహించనున్న ‘యువత పోరు’ కార్యక్రమాన్ని విజయవంతం చేయా లని మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక తన కార్యాలయంలో మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డిలతో కలిసి వైఎస్సార్సీపీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్పొరేటర్లు, డివిజన్ ఇన్చార్జులతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలకు ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. ఇటీవల పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా ఈ హామీలపై స్పష్టత ఇవ్వకపోవడం దారుణమన్నారు. విద్యార్థులకు రూ.3900కోట్ల ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు ఇంకా విడుదల చేయలేదని, దీనివల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై కళాశాలల యాజమాన్యాలు తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయన్నారు. రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులను ఈ ప్రభుత్వం మోసం చేసిందని, బుధవారం నిర్వహించే ‘యువత పోరు’లో వారంతా భాగస్వాములై ఈ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని పిలుపునిచ్చా రు. ఉదయం 10 గంటలకు వైఎస్సార్సీపీ జిల్లా కా ర్యాలయంలో జెండా ఆవిష్కరణ అనంతరం ర్యాలీ ప్రారంభమవుతుందని, మహావీర్ సర్కిల్ మీదుగా ఈ ర్యాలీ కలెక్టరేట్‌కు చేరుకుంటుందని, ఆ తర్వాత కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తారని తెలిపారు. -
జమాలయ్యా.. సలామయ్యా !
కడప సెవెన్‌రోడ్స్/దువ్వూరు : ఆ దర్గా ధర్మకర్తలు హిందువులు. ఉరుసు నిర్వహణలో ప్రధాన భూమిక వారిదే. మహోత్సవంలో పాల్గొనేందుకు విశేషంగా తరలివచ్చేదే వారే. హిందూ–ముస్లిం సఖ్యత, సామరస్యాలకు నిలువెత్తు ప్రతిరూపంగా భాసిల్లుతున్న దాని పేరు కృష్ణంపల్లె జమాలయ్య దర్గా. మైదుకూరు–ఆళ్లగడ్డ రహదారిలో కానగూడూరు గ్రామం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో తూర్పున ఉంది. సుదూర ప్రాంతాల నుంచి సైతం కులమతాలకు అతీతంగా భక్తులు నిత్యం ఈ దర్గాను దర్శించి తరిస్తుంటారు. శుక్రవారాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. కోర్కెలు తీర్చే కల్పవృక్షంగా జమాలయ్యాను భక్తులు విశ్వసిస్తుంటారు. కరువును పారదోలి.. అది 1876 నాటి తెలుగు ధాతనామ సంవత్సరం. చరిత్రలో పెను విషాదాన్ని మిగిల్చిన సంవత్సరం. వర్షాలు లేక భయంకర కరువు వచ్చింది. బ్రిటీషు పాలనలో సంభవించిన 31 కరువుల్లో ఇది ఎక్కువ నష్టం కలిగించింది. ఎక్కడా పంటలు సాగు కాలేదు. బావులు, చెరువులు, నదులు ఎండిపోయి మనుషులు, పశువులు తాగునీటికి విలవిల్లాడిపోయారు. మద్రాస్ శానిటరీ కమిషనర్ రాబర్ట్ కార్నిష్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికల ప్రకారం తినడానికి తిండిలేక ఆకలి బాధతో జిల్లాలో వేలాది మంది మరణించారు. కలరా, మసూచి జ్వరాలు, పేగు సంబంధిత సమస్యల వల్ల మృత్యువాత పడ్డారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయ శిబిరాల్లో, ఉపాధి పనుల ప్రదేశాల్లో సైతం జనం పిట్టల్లా రాలిపోయారు. పశు సంపదకు లెక్కేలేదు. మానవ ప్రయత్నాలన్నీ విఫలమైనప్పుడు దేవునివైపు చూడడం సహజం. పుష్పగిరి లాంటి ప్రముఖ ఆలయాల్లో ప్రభుత్వమే వరుణ యాగాలు చేయించింది. ఈ పరిస్థితుల్లో నంద్యాలకు చెందిన జమాల్‌వలీ సాహెబ్ రాజుపాలెం మండలంలోని వెలవలి గ్రామానికి వచ్చారు. దువ్వూరు మండలం కృష్ణంపల్లెకు చెందిన నాగిరెడ్డి ఓసారి ఏదో పనిమీద వెలవలి గ్రామానికి వెళ్లగా జమాల్‌వలీ సాహెబ్ ఆయన వెంట వచ్చేశారు. కరువు కాలంలో ప్రజల దయనీయ పరిస్థితిని చూసి చలించిపోయారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో దేశం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఆయన సమీపంలోని యేటిలో కూర్చొని కఠోర తపోదీక్ష చేపట్టారు. ఎట్టకేలకు జమాలయ్య సాహెబ్ తపము ఫలించి ప్రకృతి కరుణించడంతో భారీ వర్షాలు కురిశాయి. నదులు, చెరువులు, బావులు, కుంటలు పొంగి పొర్లడంతో ప్రజలు ఆనంద పరవశులయ్యారు. అప్పటి నుంచి జమాలయ్య జిల్లా ప్రజలకు ఆరాధ్యుడయ్యారు. 1883లో ఆయన తనువు చాలించారు. వెన్నపూస ఎరికలరెడ్డి, నాగిరెడ్డి సోదరులకు చెందిన పొలంలో జమాలయ్య దర్గా నిర్మాణం జరిగింది. నేటికీ ఆ వంశీయులే ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు. 142వ ఉరుసు మహోత్సవం ప్రతియేటా ఫాల్గుణ పౌర్ణమి రోజున గంధం, పాడ్యమి రోజు ఉరుసు మహోత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈనెల 14వ తేదీ శుక్రవారం రాత్రి గంధం, 15న శనివారం ఉరుసు మహోత్సవాలు జరగనున్నాయి. 142వ ఉరుసు నిర్వహణ కోసం దర్గాను ముస్తాబు చేస్తున్నారు. ఇప్పటికే దర్గాకు రంగులుఅద్ది విద్యుద్దీపాలు, చలువ పందిళ్లు వంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిరంతరాయ విద్యుత్ సరఫరా, తాగునీరు, వైద్య శిబిరం, 108, పటిష్ట పోలీసు బందోబస్తు లాంటి ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమై ఉన్నారు. శుక్రవారం సాయంత్రానికి ప్రొద్దుటూరుకు చెందిన ముస్లింలు గంధం తీసుకొస్తారు. ధర్మకర్తల ఇంటి నుంచి మేళతాళాలు, బాణాసంచా పేలుళ్ల వంటి కార్యక్రమాల మధ్య గ్రామంలో చాందినీలో గంధం ఊరేగింపు నిర్వహిస్తారు. ఉరుసు రోజు రాత్రి జెండా ఊరేగింపు ఉంటుంది. ఇతర జిల్లాల నుంచి సైతం భక్తులు వస్తారు గనుక ఎవరికీ ఇబ్బందులు తలెత్తకుండా గ్రామానికి చెందిన దాతలు అన్నదానం, మరుగుదొడ్ల సౌకర్యం, తాగునీరు వంటి ఏర్పాట్లు చేస్తున్నారు. 15న బండలాగుడు పోటీలు ఉరుసు ఉత్సవాల్లో భాగంగా ఈనెల 15న ధర్మకర్తల ఆధ్వర్యంలో బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఉదయం 6.30 గంటలకు ధర్మకర్త పుల్తారెడ్డి ఇంటి వద్ద చీటీలు పంపిణీ చేస్తారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారిలో ప్రథమ బహుమతిగా రూ. 30,116లను వెన్నపూస పెద్ద పుల్లారెడ్డి, ద్వితీయ బహుమతిగా రూ. వెన్నపూస చిన్న పుల్లారెడ్డి రూ. 20,116, తృతీయ బహుమతిగా వెన్నపూస సాయినాథరెడ్డి రూ. 10,116, నాల్గవ బహుమహతిగా వెన్నపూస రమ్యశ్రీ రూ. 5,116 అందజేస్తారు. అదేరోజు రాత్రి కృష్ణంపల్లె కళాకారులు సత్యహరిశ్చంద్ర నాటకం ప్రదర్శించనున్నారు. కరువును పారదోలిన తాపసిగా గుర్తింపు 14, 15న కృష్ణంపల్లె ఉరుసు మహోత్సవం విశేష సంఖ్యలో తరలిరానున్న భక్తులు ఏర్పాట్లలో నిమగ్నమైన నిర్వాహకులు కోర్కెలు తీర్చే కల్పతరువు భక్తుల కోర్కెలు తీర్చే కల్పతరువుగా జమాలయ్య స్వామి ప్రసిద్ధుడు. సంతానం పొందిన భక్తులు ముస్లింలైతే తమ పిల్లలకు జమాల్‌వలీ, జమాల్‌బాషా, హిందువులైతే జమాల్‌రెడ్డి, జమాలయ్యా అనే పేర్లు పెట్టుకోవడం జిల్లాలో సర్వసాధారణం. ఉరుసు ఉత్సవాల్లో ప్రొద్దుటూరు నుంచి ముస్లింలు గంధం తీసుకొస్తే, మా ఇంటి నుంచి మేము జెండా మెరవణి చేపడతాము. ఉరుసు మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు దాదాపు పూర్తి కావచ్చాయి. – వెన్నపూస పుల్లారెడ్డి, ధర్మకర్త ఘనంగా ఉరుసు మహోత్సవం రెండు రోజులపాటు గంధం, ఉరుసు మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మూడవరోజు జియారత్ కార్యక్రమం ఉంటుంది. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, కోవెలకుంట్ల, ఆళ్లగడ్డ, నంద్యాల నుంచే కాకుండా గుంటూరు, తెనాలి ప్రాంతాల నుంచి కూడా భక్తులు ప్రత్యేక బస్సుల్లో వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. భక్తుల సౌకర్యం కోసం ఇక్కడ అన్నదాన సత్రం ఉంది. ఎప్పటిలాగా భక్తులు తరలివచ్చి ఉత్సవాలు విజయవంతం చేయాలి. – సయ్యద్ జమాల్‌బాషా, ముజావర్, జమాలయ్య దర్గా -
సాగు భళా..దిగుబడి డీలా!
రైతు మరోసారి నష్టపోయాడు. ‘కాలం’ కలిసిరాక అప్పుల గాళానికి చిక్కి అల్లాడిపోయాడు. ఇంటిల్లిపాది కలిసికట్టుగా పని చేసినా పెట్టుబడి కూడా రాని దుస్థితి నెలకొంది. ఇక ప్రభుత్వం నుంచి ‘సుఖీభవ’ లేక... రైతన్నకు దుఃఖమే మిగిలింది. చివరిగా గిట్టుబాబు ధర కోసం శ్రమించాల్సి వస్తోంది. జిల్లాలో రబీలో పంట సాగు వివరాలు హెక్టార్లలో... పంట సాగైన విస్తీర్ణం శనగ 77653 మినుము 21712 నువ్వులు 4129 జొన్న 6405 వేరుశనగ 2826 వరి 6162 పెసర 1529 ఉలవలు 1586 సజ్జలు 1747 మొక్కజొన్న 2382 కుసుమ 148 కంది 224 కొర్ర 156 కడప అగ్రికల్చర్: ఈ ఏడాది రబీ సీజన్లో పంటలు ఆశాజనకంగా సాగైనా.. దిగుబడి రాక రైతులు దిగాలు పడ్డారు. రబీ ప్రారంభంలోనే వర్షాలు కురవడంతో రైతులు ఉత్సాహంగా పంటలను సాగు చేశారు. దిగుబడి చేతి కొచ్చే సమయానికి అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలకు దిగుబడి భారీగా తగ్గింది. కొన్ని ప్రాంతాల్లో పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొంది. దీనికితోడు ప్రభుత్వ ప్రోత్సాహం కూడా కరువైంది. పంటలసాగు కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకు ఇస్తామన్న రూ. 20 వేల రైతు భరోసాను కూడా ఇవ్వకుండా మెండి చేయి చూపింది. దీనికితోడు ఇటు పంటలసాగులో దిగుబడి రాక... అటు ప్రభు త్వం ఆదుకోక అన్నదాతలు అప్పుల ఊబిలో చిక్కుకుపోయారు. అరకొరగా వచ్చిన దిగుబడులకై నా గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వమే కొను గోలు చేసి ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. పెరిగిన సాగు.. ఈ ఏడాది జిల్లాలో వర్షాలు బాగా కురవడంతో రబీ పంటసాగు పెరిగింది. జిల్లావ్యాప్తంగా సాధారణసాగు 1,42,988 హెక్టార్లుకాగా మార్చి 1వ తేదీ రబీ సీజన్ ముగిసే నాటికి 1,27,465 హెక్టార్లలో విఽవిధ పంటలు సాగయ్యాయి. ఇందులో ఉలవ సాధారణసాగు 428 హెక్టార్లుకాగా 1586 హెక్టార్లలో సాగై 370.57 శాతం మేర సాగు కాగా పొగాకు సాధారణసాగు 59 హెక్టార్లుకాగా 182 హెక్టార్లలోసాగై 308.47 శాతం మేర నమోదైంది. ఇక మొక్కజొన్న 165.43 శాతం, మినుము 147.39 శాతం, కంది 110.77 శాతం, శనగపంట 94.40 శాతం మేర సాగయ్యాయి. ఆరుతడి పంటలు ఆశాజనకంగా సాగైనా దిగుబడి చేతి కొచ్చే సమయానికి దిగుబడులు తగ్గి రైతన్నలకు నష్టాలే మిగిలాయి. అంతంత మాత్రంగానే సేవలు..... గత ప్రభుత్వం రైతులకు సేవలు అందించడానికి భరోసా కల్పిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో రైతు భరోసా కేంద్రాలను అందుబాటులోకి తెచ్చింది. జిల్లావ్యాప్తంగా 420 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి పరిధిలో వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థశాఖ ఉద్యోగాలను నియమించి సేవలను అందుబాటులోకి తెచ్చారు. విత్తనం మొదలుకుని పంట అమ్ముకునే వరకు ఎరువులు, క్రిమి సంహారక మందులు, విత్తన పరీక్షలు, ఈ క్రాపు బుకింగ్, ఇన్పుట్ సబ్సిడీ, పెట్టుబడి సాయం అందించేవారు. వీటితోపాటు రైతులకు భూసార పరీక్షలను చేయడంతోపాటు రైతులకు నకిలీ ఎరువులు, పురుగు మందులను అందించేందుకు వీలు లేకుండా అగ్రిల్యాబ్‌లను ఏర్పాటు చేసి సేవలను అందించేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతు భరోసా కేంద్రాలను (ప్రస్తుతం రైతు సేవా కేంద్రాలు) నిర్లక్ష్యం చేస్తోంది. రైతులకు కావాల్సిన సేలలను సరిగా అందించడం లేదని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. ముగిసిన రబీ సీజన్ జిల్లావ్యాప్తంగా 1,27,465 హెక్టార్లలో సాగైన పంటలు వందశాతం మించి సాగైనమొక్కజొన్న, మినుము, కంది పంటలు జిల్లాలో 89.14 శాతంమేరసాగైన పంటలు రైతులను ఆదుకోవాలి రబీలో సాగు చేసిన ఆరుతడి పంటలు ప్రకృతి వైపరీత్యాలతో బాగా దెబ్బతిని దిగుబడి తగ్గింది. దీంతో చాలా మంది రైతులకు ఖర్చులు కూడా రాలేదు. ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలి. – దస్తగిరిరెడ్డి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి. నష్టమే.. నా పేరు సానేపల్లి సాంబశివారెడ్డి. మాది కమ లాపురం మండలం కంచెన్నగారిపల్లె. నేను 3 ఎకరాల 20 సెంట్లలో శనగపంటను సాగు చేశాను. దిగుబడి చూస్తే ఎకరాకు రూ. 26 వేలు చొప్పున వచ్చింది. ఖర్చేమో 26 వేలు దాటింది. – సాంబశివారెడ్డి, కంచెన్నగారిపల్లె. కమలాపురం మండలం -
పదిలో అగ్రస్థానమే లక్ష్యం
? జిల్లాలో ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను ఎంతమంది విద్యార్థులు రాస్తున్నారు డీఈఓ : జిల్లావ్యాప్తంగా 593 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి 27,800 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలను రాస్తున్నారు. ఇందులో 14,330 మంది బాలురు, 13,470 మంది బాలికలున్నారు. ? ఎన్ని పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.నిర్వహణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు డీఈఓ : ఈనెల 17 నుంచి జిల్లా వ్యాప్తంగా 161 పరీక్షా కేంద్రాల్లో పదోతరగతి పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాం. ఇందుకోసం ఇప్పటికే పలుమార్లు అధికారులతో సమావేశం నిర్వహించి నిర్వహణపై సూచనలు, సలహాలను ఇచ్చాం. ? ఎలాంటి ఫలితాలను అంచానా వేస్తున్నారు డీఈఓ : పదోతరగతి ఫలితాల్లో వైఎస్ఆర్ జిల్లాకు చక్కటి రికార్డు ఉంది. గతంలో పలుమార్లు రాష్ట్రంలోనే నంబర్ 1 స్థానంలో నిలిచింది. ఈ యేడాది కూడా నంబర్‌వన్‌గా నిలిచేందుకు కృషి చేస్తున్నాం. ? ఫలితాల మెరుగునకు ఎలాంటి చర్యలు చేపట్టారు డీఈఓ : పదో తరగతి ఫలితాలు మెరుగు పరిచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. ప్రతిరోజూ విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణతో పాటు సిలబస్ సకాలంలో పూర్తి చేయడం, ప్రీఫైనల్ పరీక్షల ఫలితాల ఆధారంగా పాఠశాల విద్యార్థుల స్థాయిని అంచనా వేసి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించేలా మార్గనిర్దేశం చేశాం. విద్యార్థులు ఎలా చదువుతున్నారో నిత్యం ఉపాధ్యాయుల ద్వారా ఫీడ్బాక్ తీసుకుంటున్నాం. ? కేంద్రాల్లో సౌకర్యాల గురించి.. డీఈఓ : ఇప్పటికే పరీక్షా కేంద్రాలను గుర్తించి, కేంద్రంలో విద్యార్థులకు సౌకర్యాలు ఏర్పాటు చేశాం. మాస్‌కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టాం. ? గ్రామీణ ప్రాంత విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు డీఈఓ : గ్రామీణ, దూర ప్రాంత విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు వీలుగా అధికారులు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించారు. పరీక్ష రాసే విద్యార్థులు తమ హాల్‌టికెట్ చూపించి బస్సులో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ? జిల్లాలో ఎన్ని సమస్యాత్మక కేంద్రాలను గుర్తించాం డీఈఓ : జిల్లావ్యాప్తంగా ఆరు పరీక్షా కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించాం. ఇందులో కమలాపురం, బి.మఠం, బి.కోడూరు, కొండాపురం, వేంపల్లి, సింహాద్రిపురం జిల్లా పరిషత్తు హైస్కూల్స్‌ను గుర్తించాము. వీటిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాం ? పరీక్షల విధుల్లో ఎంతమంది స్క్వాడ్ బృందాలు, ఉపాధ్యాయులు పాల్గొంటున్నారు డీఈఓ : జిల్లా వ్యాప్తంగా 161 పరీక్షా కేంద్రాల్లో 1300 మంది ఉపాధ్యాయులు ఇన్విజిలేటర్లుగా బాధ్యతలు నిర్వహించనున్నారు. వీరితో పాటు 161 మంది ఛీప్ సూపరింటెండెంట్లు, 161 మంది డిపార్టుమెంట్ ఆఫీసర్లను నియమించాం. పదోతరగతి ఫలితాల్లో మన జిల్లా అగ్రస్థానం సాధించడమే లక్ష్యంగా జిల్లా విద్యాశాఖ కసరత్తు ప్రారంభించిందని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ షంషుద్దీన్ స్పష్టం చేశారు.వ ఇందుకోసం విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడంతో పాటు ప్రత్యేక ప్రణాళికతో ముందుకువెళ్తున్నట్లు అయన తెలిపారు. ఇటీవల ప్రీఫైనల్ పరీక్షలను పూర్తి చేశామని, అందులో వెనుకబడిన వారిపై ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు అయన తెలిపారు. పది ఫలితాలపై ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను పంచుకున్నారు. – కడప ఎడ్యుకేషన్ సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పది విద్యార్థులకు ప్రత్యేక తరగతులు డీఈఓ డాక్టర్ షేక్ షంషుద్దీన్ -
అల్లాహ్ ప్రార్థనకు పిలుపు.. అజాన్
కడప కల్చరల్ : తెల్లవారుజాము సమయం. చిరు చీకట్లను తరిమివేస్తూ వెలుగు రేఖలు విచ్చుకుంటున్న వేళ. ఆ ప్రశాంత సమయంలో ‘అల్లాహు అక్బర్’ అంటూ గంభీరమైన స్వరం. అల్లాహ్‌ను ప్రార్థించేందుకు రమ్మంటూ ఇస్తున్న పిలుపు హృదయాన్ని తాకుతున్న ఆ ఆహ్వానాన్ని అందుకుని మనసారా దైవ ప్రార్థనలు చేసేందుకు సిద్ధమవుతున్న ముస్లింలు. మసీదులలో దైవ ప్రార్థనలకు రావాలంటూ తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు ఐదుమార్లు ఇలా అజాన్ పిలుపు వినిపించడం అందరికీ తెలిసిందే. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలు ప్రతిరోజు ఐదుసార్లు నమాజ్‌ను అధిక సంఖ్యలో మసీదులకు తరలివచ్చి ఆచరిస్తారు. ఇందులో భాగంగా ఆజాన్ గురించి కడప నగరానికి చెందిన ధర్మ పరిచయ కమిటీ ప్రతినిధి హజరత్ సయ్యద్ అహ్మద్ (బాబుభాయ్) ఇలా వివరిస్తున్నారు. ప్రపచంలోని ముస్లింలందరికీ ఈ పవిత్ర రంజాన్ మాసం ప్రాణప్రదమైనదిగా భావిస్తారు. ఈ జన్మకు ముక్తిని ప్రసాదించే దివ్య వరంగా భావించి ఈ సందర్భంగా దైవం సూచించిన మార్గాలలో తప్పక అనుసరిస్తారు. సాధారణ రోజుల్లో ఆచరించే ప్రార్థనలతోపాటు ప్రతిరోజు తరావీ ప్రార్థనలు చేయడం ఈ మాసం ప్రత్యేకతగా చెప్పవచ్చు. కేవలం రంజాన్ మాసంలోనే గాక మిగతా రోజుల్లో కూడా ముస్లింలు రోజూ ఐదు మార్లు ప్రార్థనలు చేస్తారు. రోజువారి పనుల్లో నిమగ్నమైన వారికి ప్రార్థనా సమయం ఆసన్నమైందని తెలుపుతూ మసీదుల్లోని మౌజన్లు ‘అల్లాహు అక్బర్’ అంటూ పిలుపునిస్తారు. అజాన్ విన్న వెంటనే వీలైనంత త్వరగా మసీదులకు చేరుకుని ప్రార్థనలు చేస్తారు. ఆజాన్లో వచ్చే వాక్యాలు అరబ్బీ భాషలో ఉన్నాయి. ఐదు పూటల నమాజుకు ముందు సమీపంలోని ముస్లింలందరికీ ప్రార్థనలకు వేళ అయిందని సూచిస్తూ ఇచ్చే ఈ పిలుపు ముస్లింల రోజువారి జీవితంలో ఒక భాగమైంది. ఈ పిలుపు వినగానే అసంకల్పితంగా ముస్లింలు మసీదు వైపు వెళతారు. అజాన్ అర్థం తెలిసిన వారు మాత్రమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అజాన్ వెనుక కథ ఏకేశ్వరుడైన అల్లాహ్‌ను సామూహికంగా ఆరాధించేందుకు ప్రజలందరికీ ఎలా సమీకరించాలన్న విషయంపై ప్రవక్త తన అనుచరులతో సంప్రదింపులు జరిపారు. ‘బూర’ ఊది గుర్తించాలని కొందరు, డోలు మోగిస్తే బాగుంటుందని మరికొందరు, జెండా ఊపితే మంచిదని మరికొందరు ఇలా రకరకాల సలహాలు ఇచ్చారు. ఈ విషయంగా అబ్దుల్లా బిన్ జైద్ ర.జి. దీర్ఘంగా ఆలోచించడం ప్రారంభించారు. ఒక రాత్రి కలలో ఇప్పుడు మనం వింటున్న అజాన్ పిలుపులోని మాటలను ఆయన అనుభూతించారు. ఈ విషయాన్ని మహా ప్రవక్తకు తెలిపారు. హజరత్ ఉమర్ ర.జి.లు కూడా ఇదే కలగన్నారు. విషయం తెలుసుకున్న ప్రవక్త మహనీయుడైన ఉమర్‌ను పిలిచి వచ్చిన కల గురించి అడిగారు. తనకంటే ముందు అబ్దుల్లా బిన్ జైద్ ఈ కలగన్నారని, కనుక ఆయన ద్వారానే వివరాలు వినడం మంచిదని భావిస్తున్నామని ఉమర్ తెలిపారు. ప్రవక్త తన ప్రియ సహచరుడు హజరత్ బిలాల్ ర.జి.ని పిలిచి అబ్దుల్ బిన్ జైద్ ఏ వాక్యాలు పలుకుతారో వాటిని మీరు గొంతెత్తి గట్టిగా పలకాలని ఆదేశించారు. ఆ వాక్యాలకు అజాన్ అనే పేరు ఖరారైంది. మసీదుల్లో అజాన్ పిలుపునిచ్చే వ్యక్తిని మౌజన్ అంటారు. ఈ పిలుపు ద్వారా ‘ఓ మానవులారా అల్లాహ్ సర్వోన్నతుడు.. గుణ విశేషణాలలో అద్వితీయుడు.. స్వయం ప్రభువు, ఆది మధ్యాంత రహితుడు, అనంతుడు, పోలిక లేనివాడు, నిర్వికారుడు, సమస్త సృష్టికి నిర్దేశకుడు, సర్వశక్తివంతుడు, అంతర్యామి, సృష్టికర్త’ అని వివరిస్తాడు.రంజాన్ ఉపవాసాల నేపథ్యంలో కథనంఅజాన్.. దాని అర్థం ఇలా ఉంది అల్లాహు అక్బర్...అల్లాహు అక్బర్... అల్లాహు అక్బర్....అల్లాహు అక్బర్... (అల్లాహ్ సర్వోన్నతుడు) అష్హదు అన్ లాయిలాహ ఇల్లల్లాహ్ అష్హదు అన్ లాయిలాహ ఇల్లల్లాహ్ (అల్లాహ్ తప్ప మరెవరూ ఆరాధనకు అర్హులు కాదని నేను సాక్ష్యం ఇస్తున్నాను) అష్హదు అన్న మహమ్మదర్రసూలుల్లాహ్ అష్హదు అన్న మహమ్మదర్రసూలుల్లాహ్ (మహమ్మద్(సొ.అ.వ) అల్లాహ్ సందేశ హరులు అని నేను సాక్ష్యం పలుకుతున్నాను) హయ్య అలస్సలాహ్....హయ్య అలస్సలాహ్ (రండి నమాజ్ వైపునకు రండి) హయ్య అలల్‌ఫలాహ్...హయ్య అలల్‌ఫలాహ్ (రండి సాఫల్యం వైపునకు) అస్సలాతు ఖైరుమ్ మిన్నన్నౌమ్ అస్సలాతు ఖైరుమ్ మిన్నన్నౌమ్ (నిద్రకన్నా నమాజ్ ఉత్తమమైనది) అల్లాహు అక్బర్....అల్లాహు అక్బర్ (అల్లాహ్ సర్వోన్నతుడు) లా ఇలాహ ఇల్లల్లాహ్ (అల్లాహ్ తప్ప మరెవ్వరూ ఆరాధ్యులు లేరు) ‘అస్సలాతు ఖైరుమ్ మిన్నన్నౌమ్’– ఈ వాక్యాలను తెల్లవారుజామున ఇచ్చే అజాన్‌లో మాత్రమే పలుకుతారు. -
36వ రోజుకు చేరిన సమ్మె
ప్రొద్దుటూరు రూరల్ : మండలంలోని గోపవరం గ్రామ పంచాయతీ సమీపంలోని పశువైద్య కళాశాల విద్యార్థులు తమకు స్టైఫండ్ పెంచాలని చేస్తున్న సమ్మె సోమవారం 36వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా పశువైద్య విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఎంబీబీఎస్ విద్యార్థులతో సమానంగా స్టైఫండ్ పెంచే వరకు సమ్మెను విరమించమని తేల్చి చెప్పారు. పరీక్షా ఫలితాలు విడుదల కడప ఎడ్యుకేషన్ : యోగి వేమన విశ్వవిద్యాలయం ఎమ్మెస్సీ మొదటి సెమిస్టర్ పరీక్షా ఫలితాలను సోమవారం వైవీయూలో ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎస్.రఘునాథరెడ్డి, కులసచివులు ఆచార్య పి.పద్మ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆచార్య కెఎస్వీ కృష్ణారావు, డీన్ ఆచార్య ఎ.జి.దాముతో కలసి విడుదల చేశారు. ఈ సందర్బంగా ప్రిన్సిపల్ ఆచార్య రఘునాథ రెడ్డి మాట్లాడుతూ బోటని, బయోకెమిస్ట్రీ, జియాలజి, మైక్రోబయాలజి, ఫిజిక్స్ ఎన్విరాన్మెంటల్ సైన్సు, జెనెటిక్స్ అండ్ జీనోమిక్స్ కాంపుటేషనల్ డేటా సైన్స్ కోర్సులలో వందశాతం ఉత్తీర్ణత లభించిందన్నారు. మ్యాథమ్యాటిక్స్ 75శాతం, పుడ్ టెక్నాలజి 95 శాతం, జువాలజి 96.43 శాతం, కంప్యూటర్ సైన్స్ 68 శాతం, బయోటెక్నాలజి 97.62 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని వారు అభినందించారు. విద్యార్థులు ఫలితాల కోసం https:www.yvuexam s.in/results.aspx వెబ్‌సైట్‌ను సందర్శించాలని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కేఎస్వీ కృష్ణారావు విద్యార్థులకు సూచించారు. ప్రశాంతంగా ఇంటర్ పరీక్ష కడప ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా సోమవారం ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు మ్యాథ్స్–2బి, జువాలజీ, హిస్టరీ పరీక్ష జరిగింది. జిల్లావ్యాప్తంగా 12,751 మంది విద్యార్థులకు 12,348 మంది విద్యార్థులు హాజరుకాగా 403 మంది గైర్హాజరయినట్లు ఆర్ఐవో బండి వెంకటసుబ్బయ్య తెలిపారు. ఇందులో జనరల్‌కు సంబంధించి 11,662 మంది విద్యార్థులకు 11,317 మంది హాజరుకాగా 345 మంది గైర్హాజరయ్యారు. అలాగే ఒకేషనల్‌కు సంబంధించి 1089 మంది విద్యార్థులకు 1031 మంది హాజరుకాగా 58 మంది గైర్హాజయ్యారని తెలిపారు. -
ఎన్టీఆర్ వైద్యసేవకు..గడ్డుకాలం !
కడప రూరల్ : అనారోగ్యంతో ఉన్న పేదల జీవితాల్లో ఆరోగ్య వెలుగులు నింపే బృహత్తర పథకం ‘డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ’కు గడ్డుకాలం వచ్చింది. నాడు ‘డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ’ ద్వారా పథకం పటిష్టవంతంగా మారింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ‘డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ’గా మార్పు చేసింది. పేరు మార్పుతో పాటే పథకం అమలు అస్తవ్యస్తంగా సాగుతోంది. ఏకంగా అందులో పనిచేసే సిబ్బంది తమ ఉద్యోగ భద్రత కోసం ఆందోళన బాట పట్టడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం అదుపుతప్పింది. అటు సిబ్బందికి అభద్రతాభావం ఏర్పడింది. ఇటు పేదలకు దీని అమలుపై అనుమానపు నీడలు కమ్మాయి. ఈ నేపథ్యంలో వైద్య సిబ్బంది మరో మారు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనకు సిద్ధం అయ్యారు. పథకం విచ్ఛిన్నానికి పన్నాగాలు sîæyîlï³ MýS*rÑ$ {糿¶æ$™èlÓ… Æ>Ð]lyýl…™ø¯ól yéMýStÆŠ‡ OÐðlGÝëÞÆŠ‡ BÆøVýSÅ} ç³£ýlM>°² yéMýStÆŠ‡ G±-t-BÆŠ‡ OÐðl§ýlÅ õÜÐ]lV> õ³Æý‡$ Ð]l*Æý‡ayýl… A…§ýl-ÇMîS ™ðlÍ-íÜ…§ól. M>V> õ³Æý‡$ Ð]l*Æý‡$µ-™ø-´ër$ C…§ýl$ÌZ MýS*yé A¯]l*çßæÅOÐðl$¯]l Ð]l*Æý‡$µ-ÌS¯]l$ ¡çÜ$MýS$ B…§øâýæ¯]l MýSÍW-Ýù¢…-¨. A…§ýl$ÌZ ¿êVýS…V> Mö°² Æ>[ÚëtÌZÏ AÐ]l$ÌZÏ E¯]l² BĶæ¬-ÚëïŒS ¿êÆý‡™Œæ ç³£ýl-M>°² Æ>çÙ‰…ÌZ MýS*yé ¡çÜ$-Mö_a §é°MìS ½Ð]l*¯]l$ A¯]l$-çÜ…-«§é¯]l… ^ólĶæ$-yé°MìS {糿¶æ$™èlÓ… ^èlÆý‡ÅË$ ^ólç³rtyýl… Ððl¬§ýlË$ ò³sìæt…-¨. ©…™ø HâýæÏ ™èlÆý‡-ºyìl BÆøVýSÅ-}° ¯]lÐ]l¬ÃMýS$° ç³°^ól-çÜ$¢¯]l² BÆø-VýSÅ-Ñ$-{™èlÌZÏ (¯ólyýl$ OÐðl§ýlÅ Ñ${™èlË$) B…§øâýæ¯]l Ððl¬§ýl-OÌñæ…-¨. BÆøVýSÅ} C¯ŒS-{çÜ*-ె¯ŒSÞ ç³Ç-«¨-ÌZMìS Ððlã™ól B çÜ…çܦMýS$ ^ðl…¨¯]l ÐéÆý‡$ ™èlÐ]l$¯]l$ ¡íÜ-ÐólíÜ Ð]l$Æö-MýS-Ç° °Ä¶æ$-Ñ$-Ýë¢Æý‡¯ól Ðé§ýl¯]l ºÌS…V> Ñ°-í³-Ýù¢…-¨. ÐéçÜ¢-Ðé-°MìS fÇVóS¨ MýS*yé A§ól M>Ð]l-yýl…™ø ç³°-^ólçÜ$¢¯]l² E§øÅVýS$ÌZÏ A¿ýæ-{§ýl™èl ¯ðlÌS-Mö…¨. ©°MìS-™øyýl$ D OÐðl§ýlÅ õÜÐ]lË$ ½Ð]l* ç³Ç«¨-ÌZMìS Ððlã™ól ÐéÅ«§ýl$ÌS çÜ…QÅ-™ø-´ësôæ ´ëÅMóSi VýS×æ-±-Ķæ$…V> ™èlVýSY-¯]l$…-¨. ©…™ø BÆø-VýSÅ-}ÌZ E…yól {ç³Äñæ*-f¯éË$, ½Ð]l* Ð]lÌSÏ Ð]l^óla Eç³-Äñæ*-V>Ë$ HÐ]l*{™èl… E…yýl-Ð]l¯]l²¨ çܵçÙt…V> AÆý‡¦-Ð]l$-Ð]l#-™ø…-¨. కొలిక్కిరాని చర్చలు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలో పనిచేస్తున్న వైద్య మిత్రలు టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తమ ఉద్యోగ భద్రత, వేతనాల పెంపుకోసం ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. నిరవధికంగా సమ్మెకు వెళ్లడానికి సన్నద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. దీంతో 2024 నవంబరు 13వ తేదీన ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు సీఈఓ డాక్టర్ డి.లక్ష్మిషాతో చర్చలు జరిపారు. అయితే ఈ చర్చలు కొలిక్కి రాలేదు. ఈ సందర్బంగా సీఈఓ లక్ష్మిషా కొద్దిరోజులు ఆగమని చెప్పడంతో ఎన్టీఆర్ వైద్య సేవ సిబ్బంది ఓపిక పట్టారు. నెలలు గడుస్తున్నా తమ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో మళ్లీ ఆందోళన బాట పట్టడానికి శ్రీకారం చుట్టారు. వైస్సార్ సీపీ పాలనలో ఉద్యోగ భద్రతకు చర్యలు వైఎస్సార్ సీపీ పాలనలో ఆరోగ్యశ్రీలో పనిచేసే సిబ్బంది ఉద్యోగ భద్రతకు, వేతనాల పెంపునకు చర్యలు చేపట్టారు. ఆ మేరకు టీం లీడర్లను సీనియర్ అసిస్టెంట్లుగా, ఆరోగ్యమిత్రలను జూనియర్ అసిస్టెంట్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పరిగణించడంతోపాటు అందుకు తగిన వేతనాలు మంజూరు చేయాలని సంకల్పించింది. తద్వారా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే ఆరోగ్యశ్రీలో పనిచేసే సిబ్బందికి కూడా ఉద్యోగ భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకుంది. ఆ ప్రకారం ఫైల్ నంబరు 1334631 సిద్ధమైంది. ఇందుకు నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోదం తెలిపారు. దీంతో ఆరోగ్యమిత్రల్లో సంతోషం నెలకొంది. అంతలోనే ఎన్నికల కోడ్ రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. తర్వాత వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ ఫైలును పూర్తిగా ప్రక్కన పడేసిందని సిబ్బంది వాపోతున్నారు. జిల్లాలో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ వివరాలు 2007లో ‘ఆరోగ్య శ్రీ’కి శ్రీకారం.. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా 2007–08లో పేదలకు ఉచిత వైద్యానికి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. తద్వారా నిరుపేదలు ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో సునాయాసనంగా ఉచిత వైద్య సేవల ద్వారా పునర్జన్మను పొందారు. అనంతరం వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టాక ఆరోగ్యశ్రీని మరింత బలోపేతం చేశారు. నిరుపేదలకు ఏ అనారోగ్య సమస్య వచ్చినా చీకు చింత లేకుండా ఒక్కపైసా ఖర్చు లేకుండా ఉచితంగా వైద్యసేవలు పొందడం ద్వారా నిశ్చితంగా జీవనం సాగిస్తున్నారు. అలాంటి గొప్ప పథకానికి టీడీపీ కూటమి ప్రభుత్వం రాకతో బీటలు పడడం ప్రారంభమైంది. ఊగిసలాటలో ఉచిత ‘వైద్య సేవ’ సమస్యల పరిష్కారానికి సిబ్బంది ఆందోళన 12న ‘ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్’సీఈఓతో చర్చలు అనంతరం కార్యాచరణకు సన్నద్ధం వైద్య మిత్రులు, ఇతర సిబ్బంది 115 నెట్వర్క్ ఆస్పత్రులు 108 ఆరోగ్యశ్రీ కార్డులు 5.10 లక్షలకు పైగా వ్యాధుల సంఖ్య పెంపు వివరాలు 2007 (మొదటి విడత) 542 2008 (రెండో విడత) 1,040 2021 2434 2022 3255 విధుల బహిష్కరణను తాత్కాలికంగా వాయిదా వేశాం... ఉద్యోగ భద్రత, వేతనాల పెంపు తదితర సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 10, 17, 24 తేదీల్లో విధులను బహిష్కరించాలని పిలుపునిచ్చాం. ప్రతి సోమవారం రోజున విధులను బహిష్కరించి ఆందోళన చేపట్టాలని నిర్ణయించాం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చర్చలకు ఆహ్వనించింది. ఆ మేరకు ఈ నెల 12వ తేదీన డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈఓ పీ రవిసుభాష్‌తో చర్చలు ఉన్నాయి. అందువల్ల ఆందోళనను తాత్కాలికంగా వాయిదా వేశాం. చర్చల అనంతరం తమ నిర్ణయాన్ని ప్రకటిస్తాం. – విజయ్, జిల్లా అధ్యక్షుడు, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, వైద్యమిత్రల సంఘం -
కాలుష్యం నుంచి కాపాడండి
జమ్మలమడుగు : దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని అయితే అందులో నుంచి వస్తున్న బూడద వల్ల తమ పంట పొలాలకు తీవ్ర నష్టం కలుగుతోందని మైలవరం మండలం దుగ్గనపల్లి గ్రామానికి చెందిన రైతులు, మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం వారు ఆర్డీఓ సాయిశ్రీని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ దాల్మియా ఫ్యాక్టరీని వంకకు అడ్డంగా నిర్మించారన్నారు. ప్రహరీ నిర్మాణం వల్ల ఆలుగోకు వంక ఏటా వచ్చి తమ పంటలను నాశనం చేయడంతోపాటు రోజుల తరబడి నీరు పొలాల్లో నిల్వ ఉంటోందన్నారు. ఈ కారణంగా వేసిన పంటలు కుళ్లిపోయి తీవ్ర నష్టం వస్తోందని వారు వాపోయారు. విస్తరణ పనుల కోసం ఈనెల 27వతేదీన చేపట్టనున్న ప్రజాభిప్రాయ సేకరణను వెంటనే అధికారులు నిలుపుదల చేయాలని కోరారు. క్రిమినల్ కేసులు పెట్టాలి సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న కాలుష్యం కారణంగా చీపాటి మోషే అనే రైతు సాగు చేసిన మిర్చి పంట నాణ్యత లేకుండా పోయిందన్నారు. ఈ పంటను గుంటూరు మార్కెట్ యార్డులో విక్రయించేందుకు వెళితే అక్కడి వ్యాపారులు నాణ్యత లేని కారణంగా తక్కువ ధరకు అమ్మాలని కోరడంతో మిర్చిని మార్కెట్ యార్డులోనే వదిలేసి వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. పంట నష్టపోవడానికి, రైతు ఆత్మహత్యకు కారణమైన దాల్మియా యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని రైతులు డీఎస్పీ వెంకటేశ్వర్లుకు విజ్ఞప్తి చేశారు. సమస్యలపై ఆర్డీఓ ఆరామైలవరం : మండల పరిధిలోని నవాబుపేట గ్రామంలో గత కొద్దిరోజులుగా దాల్మియా సిమెంటు ఫ్యాక్టరీ వల ఎదురవుతున్న సమస్యలపై ఆర్టీఓ సాయిశ్రీ ఆరా తీశారు. సోమవారం ఆమె గ్రామంలో పర్యటించారు. దాల్మియా కంపెనీ బ్లాస్టింగ్ చేయడం వల్ల గ్రామంలోని ఇళ్లు పూర్తిగా దెబ్బతింటున్నాయని, వంకకు అడ్డంగా గోడ కట్టడం వల్ల పొలంలో నీరు నిల్వ ఉండి పంట పొలాలు దెబ్బతింటున్నాయని గ్రామస్తులు ఆమె దృష్టికి తెచ్చారు. -
తెలుగు సంస్కృతి అకాడమి ఏర్పాటు చేయాలి
కడప కల్చరల్ : కడప నగరంలో తొలి తెలుగు రామాయణ రచయిత్రి మొల్లమాంబ పేరిట తెలుగు సంస్కృతి అకాడమిని ఏర్పాటు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా వికాస ఉద్యమం, మొల్ల సాహితీ పీఠం అధ్యక్ష కార్యదర్శులు విద్వాన్ గానుగపెంట హనుమంతరావు, మనోజ్ కుమార్ల ఆధ్వర్యంలో సోమవారం స్థానిక విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల సంఘ కార్యాలయంలో సాహితీ సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన విశ్వేశ్వరనాయుడు మాట్లాడుతూ మొల్లమాంబ మన ఆడబిడ్డ కావడం తెలుగుజాతి చేసుకున్న అదృష్టమన్నారు. వైవీయూ రిజిస్ట్రార్ ఆచార్య పుత్తా పద్మ మాట్లాడుతూ మొల్లమాంబ స్ఫూర్తితో మహిళలు తమలోని ప్రతిభను చాటుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ జిల్లా రచయితల సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి, జింకా సుబ్రమణ్యం, విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్.రామ్మూర్తి నాయుడు, ఉపాధ్యక్షుడు తుపాకుల నారాయణ, కోశాధికారి నూనె నాగేష్ తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన పార్వతి, అపూర్వ సుందరి, కమాల్ బీలకు మహిళా సేవారత్న పురస్కారాలను అతిథులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి, సాహిత్య పీఠం ఉపాధ్యక్షుడు పెండ్లిమర్రి మల్లయ్య, పార్వతమ్మ, పెన్షనర్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ నాగముని రెడ్డి, మహిళా కార్యదర్శి కొండూరు స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. -
జ్యోతి క్షేత్రాన్ని పరిరక్షించుకుంటాం
కలసపాడు : శ్రీ అవధూత కాశినాయన జ్యోతిక్షేత్రాన్ని పరిరక్షించుకుంటామని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాఽథ్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధలతో కలిసి జ్యోతిక్షేత్రాన్ని సందర్శించారు. ఇటీవల జ్యోతిక్షేత్రంలో మహిళల స్నానపుగదులు, క్షౌ రశాల, గోశాల, విశ్రాంతి గదులను అటవీశాఖ అధికారులు కూల్చివేసిన ప్రదేశాలను పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేదల ఆకలి తీర్చేందుకు దేవాలయాల వద్ద నిత్యాన్నదాన సత్రాలు ఏర్పాటు చేసి కాశినాయన అన్నదానం కొనసాగించారన్నారు. జ్యోతిక్షేత్రంలో ఆయన పరిత్యాగం చెందారని, ఆయన ఆలయాన్ని నిర్మించేందుకు అటవీశాఖ ఇబ్బందులు సృష్టించడం దురదృష్టకరమన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, గోవిందరెడ్డి సహకారంతో జ్యోతిక్షేత్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. 2019 నుంచి అటవీశాఖ అనుమతి కోసం కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డిలు తీవ్రంగా కృషి చేశారన్నారు. కూటమి ప్రభుత్వంలో అటవీశాఖ మంత్రిగా ఉన్న పవన్‌కళ్యాణ్ సనాతన ధర్మవాదియై జ్యోతిక్షేత్రంలో కూల్చివేతలపై స్పందించకపోవడం విచారకరమన్నారు. ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధ మాట్లాడుతూ కాశిరెడ్డినాయన భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా అటవీశాఖ అధికారులు వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో కడప డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, పీఆర్ఆర్డీ మాజీ ప్రభుత్వ సలహాదారు నాగార్జునరెడ్డి, సోషల్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్మన్ పులి సునీల్‌కుమార్, నియోజకవర్గ బూత్ కన్వీనర్ల సమన్వయకర్త కె.రమణారెడ్డి, ఆప్కాస్ మాజీ డైరెక్టర్ డాక్టర్ కళ్యాణ్‌చక్రవర్తి, వైఎస్సార్సీపీ నాయకులు సూదా రామకృష్ణారెడ్డి, సుదర్శన్, నారాయణ యాదవ్, చిత్తా రాజశేఖర్‌రెడ్డి, పులి వీరారెడ్డి, దేవసాని శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి -
పొలంలో దారి విషయమై ఘర్షణ
పెండ్లిమర్రి : మండలంలోని నందిమండలం గ్రామానికి చెందిన మనోహర్‌రెడ్డి, గంగిరెడ్డి, జనార్దన్‌రెడ్డిలు సోమవారం పొలం వద్ద దారి విషయమై గొడవ పడ్డారు. పోలీసుల కథనం మేరకు...మనోహర్‌రెడ్డికి చెందిన అరటి చెట్లు, నిమ్మ, వేపచెట్లను అన్నదమ్ములైన గంగిరెడ్డి, జనార్దన్‌రెడ్డిలు జేసీబీతో పీకివేయించారు. మనోహర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇద్దరు అన్నదమ్ములపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. నిర్బంధాలతో ఉద్యమాన్ని ఆపలేరుకడప కోటిరెడ్డి సర్కిల్ : రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని తలపెట్టిన ఆందోళన సందర్భంగా జిల్లాలో అంగన్వాడీ వర్కర్లను అరెస్టు చేయడం, నిర్బంధించడం సరైంది కాదని సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకులు బి.మనోహర్, నాగసుబ్బారెడ్డి పేర్కొన్నారు. సోమవారం కడప ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీలకు రూ.26వేలకు జీతం పెంచితే ఇలాంటి ఆందోళనలు చేయాల్సిన అవసరం ఉండదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేయడం మానుకొని అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి సత్యనారాయణాచారి, జిల్లా నాయకుడు ఎ.రామ్మోహన్, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి దస్తగిరిరెడ్డి, సీఐటీయూ నాయకులు నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. రాయచోటి ఘటనపై నిరసన ప్రదర్శనకడప సెవెన్‌రోడ్స్ : అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి శ్రీ వీరభద్రస్వామి ఆలయ పారువేట ఉత్సవం సందర్భంగా ఈనెల 4వ తేదీ చోటుచేసుకున్న ఘటనలకు నిరసనగా విశ్వహిందూ పరిషత్ నాయకులు వైఎస్సార్ జిల్లా కేంద్రమైన కడప నగరంలో ప్రదర్శన నిర్వహించారు. మృత్యుంజయకుంట శివాలయం నుంచి ఆర్టీసీ బస్టాండు మీదుగా కలెక్టరేట్ వరకు ఈ ప్రదర్శన సాగింది. ఈ సందర్భంగా వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు నందారపు చెన్నకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రశాంతంగా పారువేట ఉత్సవాన్ని నిర్వహిస్తున్నవారిపై మరో వర్గంవారు దాడి చేశారని ఆరోపించారు. వారిని అదుపు చేయడంలో పోలీసులు విఫలమయ్యారని విమర్శించారు. అక్రమ కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం జేసీ అదితిసింగ్‌కు వినతిపత్రం సమర్పించారు. -
ఆర్టీసీ బస్సులో 7 తులాల బంగారు నగలు చోరీ
ముద్దనూరు : ముద్దనూరు నుంచి పులివెందులకు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళకు చెందిన సుమారు 7 తులాల బంగారు నగలు చోరీకి గురయ్యాయి. బాధితురాలి కథనం మేరకు.. జమ్మలమడుగు నుంచి సౌజన్య అనే మహిళ ఈనెల 8వతేదీన శనివారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో పులివెందుల వెళ్లేందుకు ముద్దనూరులో బస్సు ఎక్కింది. ఆమె భర్త సౌజన్యను బస్సులోకి ఎక్కించి బ్యాగును అందజేసి వెళ్లిపోయాడు. గంట తర్వాత ఆమె పులివెందులలో దిగి బ్యాగు తీసుకుని చూసుకుంది. ఆమె బ్యాగు లోపల చిన్న కవర్లలో పెట్టి ఉన్న 3 రకాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించింది. ముద్దనూరు నుంచి పులివెందుల ప్రయాణ సమయంలో ఆమె బ్యాగులో దాచిన బంగారు నగలను ఎవరో దొంగిలించారని, బంగారు నగలు దాచిన బ్యాగును తన సీటు కిందనే ఉంచుకున్నట్లు బాధితురాలు తెలిపారు. ఫిర్యాదులపై సత్వరం స్పందించి న్యాయం చేయాలి కడప అర్బన్ : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్)లో ప్రజలు ఇచ్చే ఫిర్యాదుల పట్ల సత్వరం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఈ.జి అశోక్‌కుమార్ పోలీసు అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలోని ‘పెన్నార్’ పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్) కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన ఫిర్యాదుదారులతో ఎస్పీ స్వయంగా మాట్లాడి వారి సమస్యను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేసి, వారి సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీటీసీ డీఎస్పీ అబ్దుల్ కరీం, మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ రమాకాంత్, సిబ్బంది పాల్గొన్నారు. -
గ్రహణ మొర్రి నిర్ధారణ పరీక్షల శిబిరం
కడప ఎడ్యుకేషన్ : బసవతారకం, ఇండో అమెరికల్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారి సహకారంతో సోమవారం కడప సమగ్రశిక్ష కార్యాలయంలో గ్రహణ మొర్రి నిర్ధారణ పరీక్షల శిబిరం నిర్వహించారు.ఈ వైద్య శిబిరాన్ని సమగ్రశిక్ష స్ట్రేట్ ట్రైనింగ్ అండ్ ప్రోగ్రాం ఆఫీసర్ కల్పన శైల ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బసవతారకం హాస్పిటల్ వైద్యుడు డాక్టర్ ముకుందరెడ్డి వైద్యసేవలందించారు. 11 మంది బాధితులు హాజరై పరీక్షించుకున్నారు. ఈ కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారులు, ఐఈఆర్టీలు పాల్గొన్నారు. ఆత్మహత్యకు యత్నించిన మహిళ మృతిచింతకొమ్మదిన్నె : ఆత్మహత్యకు యత్నించిన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందినట్లుచింతకొమ్మదిన్నె ఏఎస్ఐ కొండారెడ్డి తెలిపారు. గోపాలపురం గ్రామానికి చెందిన నారాయణరెడ్డి భార్య గజ్జల యశోద కిందపడి వెన్నెముక ఆపరేషన్ చేయించుకుంది. ఆ నొప్పి భరించలేక 8వ తేదీ విష ద్రావణం తాగింది. కర్నూలులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మరణించినట్లు, మృతురాలి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
అర్జీదారులకు నాణ్యమైన పరిష్కారం చూపాలి
– జేసీ అదితిసింగ్ కడప సెవెన్‌రోడ్స్ : ప్రజాసమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం సభాభవన్‌లో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)లో జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయికి స్వయంగా వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి, అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. కింది స్థాయి అధికారులను పంపకుండా స్వయంగా అధికారినే వెళ్లాలన్నారు. తొలుత జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ పీజీఆర్ఎస్ దరఖాస్తులపై ఆయా జిల్లా అధికారులతో సమీక్షించారు. ● తనకు ఎన్టీఆర్ వితంతు పెన్షన్ మంజూరు చేయాలని ఖాజీపేట నందిపాడుకు చెందిన లింగారెడ్డి రవణమ్మ కోరారు. ● తన భర్త ఏపీఎస్ ఆర్టీసీలో పని చేస్తూ 1999లో మరణించారని, కారుణ్య నియామకం కింద పిల్లలకు ఉద్యోగం మంజూరు చేయాలని చింతకొమ్మదిన్నె మండలం అంగడి వీధికి చెందిన వీఆర్ శుభాషణమ్మ విన్నవించారు. ● కాశినాయన మండలం వరికుంట్ల గ్రామానికి చెందిన పి.నాగమ్మ సర్వే నెం.140లో 0.40 సెంట్లు స్థలం కలదని, అందులో తన ఇంటి స్థలానికి సర్వే చేయించి హద్దులు చూపే వరకు పక్కవారు నిర్మా ణం నిలుపుదల చేయించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు, డీఆర్డీఏ, మెప్మా పీడీలు ఆనంద్ నాయక్, కిరణ్ కుమార్, ఎస్డీసీ వెంకటపతి, శ్రీనివాసులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
జర్నలిస్టును బెదిరించిన వారిపై చర్యలు తీసుకోవాలి
కడప కార్పొరేషన్ : జర్నలిస్టు శ్రీనాథ్‌రెడ్డిని బెదిరించిన వేంపల్లి మాజీ ఎంపీటీసీ, టీడీపీ నాయకుడు జీవీ రమణపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీయూడబ్ల్యూజే నాయకులు కోరారు. ఆదివారం వారు జిల్లా ఎస్పీ ఈజీ అశోక్‌కుమార్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి పి.రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో జరిగిన పరిణామాలపై వార్తలు రాయడం వల్ల కక్షగట్టిన మాజీ ఎంపీటీసీ రమణ.. వాట్సాప్ గ్రూప్‌లో చేసిన మెసేజ్‌ను సాకుగా చూపి బెదిరించడం తగదన్నారు. విలేకరి తప్పు చేస్తే వారి యాజమాన్యానికి ఫిర్యాదు చేయాలే తప్ప బెదిరించడం సరికాదన్నారు. శ్రీనాథ్‌రెడ్డిని చంపుతానని బెదిరిచండం దారుణమన్నారు. మిగిలిన జర్నలిస్టులు తమపై వార్తలు రాయకుండా ఉంటారనే ఆలోచనతోనే ఇలా చేశారన్నారు. ప్రభుత్వం తప్పు చేస్తే ప్రశ్నించాలని స్వయంగా ముఖ్యమంత్రి చెబుతుంటే.. కింది స్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, జిల్లా ఉపాధ్యక్షుడు ఆంజనేయులు, సుబ్బారెడ్డి, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు శ్రీనాథ్‌రెడ్డి, శివ పాల్గొన్నారు. టీడీపీ నేతలపై కేసు నమోదు వేంపల్లె : స్థానిక సాయినగర్ వీధిలో ఉన్న భూమిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి ఇంటిపైకి దాడి చేయడానికి వచ్చాడని చేసిన ఫిర్యాదు మేరకు టీడీపీ నేతలపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రంగారావు తెలిపారు. ఆదివారం శ్రీనాథ్‌రెడ్డి సతీమణి విజయ భారతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తన భర్త శ్రీనాథ్‌రెడ్డి ఇంటిలో లేని సమయంలో టీడీపీ నేతలు గొడవ పడడానికి ఇంటిపైకి వచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఐదుగురితోపాటు మరికొందరి టీడీపీ నేతల కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
ప్రొద్దుటూరులో భారీ చోరీ
ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరులోని మైదుకూరు రోడ్డులో ఉన్న లక్ష్మీనగర్‌లో భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని పసిగట్టిన దొంగలు.. బీరువాల్లో ఉన్న బంగారు, వెండి, నగదును ఊడ్చికొని వెళ్లారు. పెద్ద మొత్తంలో బంగారు చోరీకి గురి కావడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. రూరల్ పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వల్లంకొండు రఘువంశీ లక్ష్మీనగర్‌లోని 19వ ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నాడు. రఘువంశీ భార్యా, పిల్లలతోపాటు తల్లిదండ్రులు కూడా అదే ఇంట్లో ఉంటున్నారు. వీరు కొన్నేళ్లుగా వస్త్రభారతిలో బట్టల దుకాణం నిర్వహిస్తున్నారు. రఘవంశీ అన్న రవిచంద్ర బెంగళూరులో ఉంటున్నాడు. తల్లి కన్యాకుమారికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో.. వారం రోజుల క్రితం బెంగళూరులో ఉంటున్న కొడుకు వద్దకు వెళ్లింది. ఆమెను చూసేందుకు ఇంటికి తాళం వేసి రఘువంశీ, భార్యా పిల్లలు, తండ్రి సత్యంతో కలిసి శుక్రవారం మధ్యాహ్నం బెంగళూరుకు వెళ్లాడు. రఘవంశీ ఇంటి పక్కనే వాళ్ల చిన్నాన్న అయిన మల్లికార్జున నివాసం ఉంటున్నాడు. శనివారం ఉదయం ఆయన అటుగా వెళ్తూ చూడగా ఇంటి తలుపులు తెరచి ఉన్నాయి. దీంతో అతను దగ్గరికి వెళ్లి పరిశీలించగా తాళం పగులగొట్టబడి ఉన్నట్లు గుర్తించాడు. దీంతో చోరీ జరిగిందని భావించిన అతను వెంటనే రూరల్ పోలీసులకు సమాచారం అందించాడు. అదే సమయంలో విషయాన్ని రఘువంశీకి తెలిపాడు. రూరల్ సీఐ బాలమద్దిలేటి, ఎస్ఐ మహమ్మద్రపీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తమ ఇంట్లో చోరీ జరిగిందనే విషయం తెలియడంతో రఘువంశీ కుటుంబ సభ్యులు బెంగళూరు నుంచి హుటాహుటీనా ప్రొద్దుటూరుకు చేరుకున్నారు. చెక్కను తొలగించి లాకర్‌ను విరిచేసిన దొంగలు దొంగలు ఇంటి ప్రధాన ద్వారం గుండానే లోపలికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ప్రధాన తలుపునకు ఉన్న చెక్కను ఇనుప రాడ్డుతో తొలగించి లాకర్‌ను విరిచేశారు. రఘువంశీ కుటుంబ సభ్యులు ఇంట్లోకి వెళ్లగానే బీరువాలు, అల్మార్లలోని వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉండటంతో.. వారు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. తర్వాత పరిశీలించగా బీరువాలు, అల్మార్లలో ఉన్న బంగారు నగలు, నగదు, వెండి వస్తువులు కనిపించలేదు. బీరువా, అల్మార్లలోని రాళ్ల గాజులు, నల్ల పూసల దండ, నల్లపూసల గాజులు, 5 ముత్యాల హారాలు, 5 ఫ్యాన్సీ చైన్లు, నవరత్నాల హారం, అమెరికన్ డైమండ్ హారం, డైమండ్ కమ్మలు, కెంపుల హారం, కమ్మలు తదతర బంగారు ఆభరణాలు తదితర సుమారు 850 గ్రాముల బంగారు, 670 గ్రాముల వెండి వస్తువులు, రూ.7.70 లక్షలు నగదు చోరీ అయినట్లు పోలీసులకు తెలిపారు. డీఎస్పీ భావన, సీఐ బాలమద్దిలేటి, ఎస్ఐ మహమ్మద్ రఫిలు చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. క్లూస్ టీం సిబ్బంది ఘటనా స్థలంలో వేలిముద్రలను సేకరించారు. రఘువంశీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విలాసవంతమైన కాలనీ.. 24 గంటల సెక్యూరిటీ ఉన్నా.. లక్ష్మీనగర్ విలాసవంతమైన కాలనీ. ఇక్కడ వ్యాపారులు, ఉద్యోగులు నివాసం ఉంటున్నారు. సెక్యూరిటీ వ్యవస్థ కూడా బాగానే ఏర్పాటు చేసుకున్నారు. కాలనీలో రెండు వీధులు ఉన్నాయి. రెండు వీధులకు రెండు ప్రధాన ద్వారాలు ఉన్నాయి. అయితే ఎప్పుడూ ఒక ప్రధాన ద్వారం మాత్రమే తెరచి ఉంటుంది. 15 రోజులు ఒక గేట్, 15 రోజుల తర్వాత మరో గేటును తెరుస్తారు. రెండు గేట్ల వద్ద ఇద్దరేసి చొప్పున సెక్యూరిటీ గార్డులు ఉంటారు. 24 గంటల పాటు సెక్యూరిటీ సిబ్బంది కాపలా ఉంటారని కాలనీ వాసులు చెబుతున్నారు. చోరీ జరిగిన రఘువంశీ ఇంటికి సీసీ కెమెరాలు లేవని పోలీసులు చెబుతున్నారు. అలాగే అతని ఇంటి ఎదురుగా కూడా కెమెరాలు లేవని తెలుస్తోంది. కాలనీకి ప్రధాన ద్వారాల వద్ద మాత్రమే ఈ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే పోలీసులు మెయిన్ గేట్ వద్ద ఉన్న సీసీ ఫుటేజీని పరిశీలించినట్లు సమాచారం. అయితే అందులో దొంగల జాడ కనిపించలేదని తెలుస్తోంది. దీన్నిబట్టి దొంగలు ప్రధాన ద్వారం ద్వారా కాకుండా మరెక్కడి నుంచి వచ్చి ఉంటారనేది పోలీసులు ఆరా తీస్తున్నారు. వివిధ రకాల పనులు చేస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన కొందరు వ్యక్తులు లక్ష్మీనగర్‌లో బాడుగకు ఉన్నట్లు అక్కడి ప్రజలు చెబుతున్నారు. వీరిని కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. లక్ష్మీనగర్ చుట్టూ ప్రహరీతో పాటు ముళ్ల కంచెను ఏర్పాటు చేశారు. వెనుక వైపు నుంచి దొంగలు కాలనీలోకి ప్రవేశించి ఉంటారనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దొంగల కోసం రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బాలమద్దిలేటి తెలిపారు. 850 గ్రాముల బంగారు, రూ.7.70 లక్షల నగదు అపహరణ ఇంట్లో ఎవరూ లేని సమయంలో చొరబడిన దొంగలు విలాసవంతమైన లక్ష్మీనగర్‌లో ఘటన -
నూతన కార్యవర్గం ఎన్నిక
కడప వైఎస్ఆర్ సర్కిల్ : రవాణాశాఖలో రాయలసీమ స్థాయిలో నాన్ టెక్నికల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏపీటీడీ ఎన్టీఈఏ)కు సంబంధించి సీమ అధ్యక్షుడిగా పెద్దిరెడ్డి లక్ష్మికర్రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈయన మూడోసారి ఎన్నిక కావడం విశేషం. ప్రొద్దుటూరులో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. ఎన్నికకు సంబందించి ఫిబ్రవరి 22న నోటిఫికేషన్, 9న నామినేషన్ ప్రక్రియను ఎన్నికల అధికారి ఎం.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. అయితే అందరూ ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయం మేరకు లక్ష్మీకర్రెడ్డిరి అధ్యక్షునిగా ఎంపిక చేశారు. జోన్ అసోసియేట్ ప్రెసిడెంట్‌గా ఈవై ప్రకాశ్ (అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, కడప), జోన్ వైస్ ప్రెసిడెంట్–1గా కె.సువర్ణకుమారి (అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్, అనంతపురం), జోన్ వైస్ ప్రెసిడెంట్–2గా టీఎన్ పురుషోత్తంరెడ్డి (సీనియర్ అసిస్టెంట్, చిత్తూరు), జోన్ వైస్‌ప్రెసిడెంట్–3గా ఎస్.మనోహర్‌బాబు (జూనియర్ అసిస్టెంట్, ఆదోని), జోన్సెక్రటరీగా టి.విజయ్‌కుమార్ (అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, మదనపల్లె), జోన్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఓ.యువ కిశోర్ (సీనియర్ అసిస్టెంట్, తిరుపతి), జోన్ జాయింట్ సెక్రటరీ–1గా డి.నసీరుద్దీన్ (సీనియర్ అసిస్టెంట్, కర్నూలు), జోన్ జాయింట్ సెక్రటరీ–2 ఓ.నాగరాజ (సీనియర్ అసిస్టెంట్, మదనపల్లె), జోన్ జాయింట్ సెక్రటరీ–3 పి.చక్రపాణి (అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, చిత్తూరు), జోన్ ట్రెజరర్‌గా ఎన్.రవిప్రకాశ్ (సీనియర్ అసిస్టెంట్, హిందూపురం)లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వారిని రవాణాశాఖలో పని చేసే ఉద్యోగులు, టెక్నికల్ సిబ్బంది ఘనంగా సత్కరించారు.కడపలోని రవాణా శాఖ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆటోను ఢీకొన్న లారీ పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణ పరిధిలోని ఫుడ్ అండ్ సైనన్స్ కళాశాల సమీపంలో ఆదివారం ఆటోను లారీ ఢీకొంది. ఈ సంఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న 8 మందికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని రింగ్ రోడ్డు సమీపంలో ఉన్న వైఎస్సార్ కాలనీ, రాజీవ్ కాలనీ నుంచి కూలీ పనులు చేసేందుకు భవాని, చిన్న లక్ష్మిదేవి, నాగేశ్వరి, రాజేశ్వరి, మంజుల, వెంగమ్మతోపాటు మరో నలుగురు ఆటోలో ఇప్పట్ల గ్రామానికి వెళుతుండగా ఫుడ్ అండ్ సైన్‌న్స్ కళాశాల వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ సంఘటనలో ఆటోలో ఉన్న 8 మంది మహిళలకు గాయాలయ్యాయి. వీరిని పులివెందుల పట్టణ పరిధిలోని కడప రోడ్డులో ఉన్న వైఎస్సార్ సర్వజన ఆస్పత్రికి తరలించారు. ట్రాఫిక్ సీఐ హాజీవలి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు హాలు గంగాధరరెడ్డి ప్రభుత్వాసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ కోడి రమణ, అంకాలమ్మ ఆలయ చైర్మన్ బ్యాటరీ ప్రసాద్ ఉన్నారు.సీమ రవాణాశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా లక్ష్మికర్రెడ్డి -
సొంతగూటికి వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు
ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో టీడీపీకి గట్టి షాక్ తగిలింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరిన ముగ్గురు కౌన్సిలర్లు ఆదివారం మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి సమక్షంలో తిరిగి వైఎస్సార్సీపీలో చేరారు. దీంతో టీడీపీకి గట్టి షాక్ తగిలినట్లయింది. వాస్తవానికి మున్సిపాలిటీలో 41 కౌన్సిలర్ల స్థానాలకు గడిచిన ఎన్నికల్లో 40 మంది వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోపాటు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డిని విభేదించి గత ఎన్నికల కంటే ముందే కొందరు కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక మున్సిపాలిటీపై టీడీపీ దొడ్డిదారిన పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోంది. వివిధ రకాలుగా ప్రయత్నించి పది మందికిపైగా వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను టీడీపీలో చేర్చుకున్నారు. దీంతో ఎన్డీఏ కూటమి కౌన్సిలర్ల సంఖ్య దాదాపుగా 20కి చేరింది. ఇదిలా ఉంటే అక్కడ తమకు సముచిత స్థానం కల్పించడం లేదని, తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని ముగ్గురు కౌన్సిలర్లు తిరిగి వైఎస్సార్సీపీలో చేరారు. వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ సొంత ఇంటికి వచ్చినట్లు సంతోషంగా ఉందని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పార్టీ కండువా కప్పి వీరిని ఆహ్వానించారు. 8వ వార్డు కౌన్సిలర్ రాగుల శాంతి, 39వ వార్డు కౌన్సిలర్ చింపిరి అనిల్‌కుమార్, 40వ వార్డు కౌన్సిలర్ రావులకొల్లు అరుణ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిన కౌన్సిలర్లు తిరిగి రావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నట్లు రాచమల్లు తెలిపారు. మరికొందరి కౌన్సిలర్లును పార్టీలోకి రావాలని టీడీపీ నేతలు ఒత్తిడి చేస్తున్నారని పేర్కొన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి, వైఎస్ చైర్మన్లు ఆయిల్‌మిల్ ఖాజా, పాతకోట బంగారు మునిరెడ్డి, కౌన్సిలర్లు వరికూటి ఓబుళరెడ్డి, గరిశపాటి లక్ష్మీదేవి, బలిమిడి వెంకటలక్ష్మి, జయంతి, నూకా నాగేంద్రారెడ్డి, వంశీధర్‌రెడ్డి, ముదిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, లావణ్య, వైఎస్సార్సీపీ నియోజవర్గ యూత్ ఇన్చార్జి ద్వార్శల గురునాథ్‌రెడ్డి, ఎంపీపీ శేఖర్ యాదవ్, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మార్తల ఓబుళరెడ్డి పాల్గొన్నారు. -
సిరి ధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం
కడప కల్చరల్ : సిరి ధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని మిల్లెట్ల బుల్లెట్‌గా పేరుగాంచిన ప్రముఖ ఆహార ఆరోగ్య శాస్త్రవేత్త పద్మశ్రీ డాక్టర్ ఖాదర్‌వలీ తెలిపారు. ఆదివారం కడప నగరంలోని ప్రభుత్వ పురుషుల కళాశాలలో ఇంటాక్, ఆర్ట్స్ కళాశాల, ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాల, లయన్స్ క్లబ్ ఆఫ్ కడప అన్నమయ్యల సంయుక్తాధ్వర్యంలో ‘సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం’ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా వచ్చిన డాక్టర్ ఖాదర్‌వలీ మాట్లాడారు. ప్రస్తుతం మనం తీసుకుంటున్న ఆహారం వల్ల ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు, ఆహార విషయంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. దేశంలోనే మన రాయలసీమ ప్రజలు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారని, ఇందుకు కారణం...ఆది నుంచి ఇక్కడ రాగి, సజ్జ, జొన్న, కొర్రలు లాంటి ఆహారమేనని తెలిపారు. ముందుతరంలో సీమలో 170 రకాల తృణ ధాన్యాలు పండేవని, ప్రజలు ఆరోగ్యంగా ఉండేవారని, ఇప్పుడు పది శాతానికి తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తున్న విషయమన్నారు. సిరిధాన్యాలు వాడితే రక్తం పలచబడుతుందని, గుండె సంబంధిత వ్యాదులు రావని తెలిపారు. పురాణాల్లో కూడా చిరుధాన్యాల ప్రాధాన్యత పేర్కొన్నారని వివరించారు. కార్యక్రమంలో కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి, కార్యక్రమ నిర్వాహకులు లయన్ కె.చిన్నపరెడ్డి, టీడీపీ నేత శ్రీనివాసులురెడ్డి, క్యాంపు చైర్మన్, ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ వీర సుదర్శన్‌రెడ్డి, ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.రవీంద్రనాథ్, లయన్స్ క్లబ్ ఆఫ్ కడప అన్నమయ్య అధ్యక్షులు ఎ.వెంకటసుబ్బయ్య, కోటిరెడ్డి మహిళా కళాశాల ప్రొఫెసర్ ఎం.గురుమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య భారతావనిగా తీర్చిదిద్దాలి పులివెందుల టౌన్ : సిరి ధాన్యాలను ప్రోత్సహించి ఆరోగ్య భారతావనిగా తీర్చిదిద్దాలని పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రఖ్యాత స్వతంత్ర ఆహార ఆరోగ్య శాస్త్రవేత్త, ది మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా, కృషిరత్న డాక్టర్ ఖాదర్‌వలి తెలిపారు. స్థానిక రాణితోపు పార్కు ఈట్ స్ట్రీట్‌లోని సిరి సంజీవని ది మిల్లెట్ కేఫ్ అధినేత వరద ప్రకాష్‌రెడ్డి, ప్రమీల ఆధ్వర్యంలో ఆరోగ్య సిరి అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఖాదర్‌వలి మాట్లాడారు. సిరి ధాన్యాలు వాడటం వల్ల బీపీ, షుగర్, నరాల బలహీనత, తదితర రుగ్మతలు నయమవుతాయన్నారు. అనంతరం వివిధ సమస్యలతో వచ్చిన వారికి సిరి ధాన్యాలు ఎలా వాడాలో, వాటి ఉపయోగం, ఏ సమయంలో ఎలా తీసుకోవాలి తదితర వాటి గురించి క్లుప్తంగా వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, వైఎస్సార్సీపీ పట్టణ కన్వీనర్ హాలు గంగాధరరెడ్డి, కౌన్సిలర్ కోడి రమణ, పుర ప్రముఖులు పాల్గొన్నారు. -
సంతోషం.. క్షణాల్లో బుగ్గి..
చింతామణి(కర్ణాటక) : చిక్కబళ్లాపురం జిల్లా చింతామణి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సొంతూరులో బంధువులను పలకరించి సంతోషంగా బెంగళూరుకు వస్తున్న కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. తల్లీ కుమారుడు సజీవ దహనమయ్యారు. చింతామణి సమీపంలోని కంచార్లపల్లి పోలీసుస్టేషన్ పరిధిలోని మదనపల్లి రోడ్డులో జోగ్యానహళ్లి–గోపల్లి మధ్య ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో దుర్ఘటన జరిగింది. వారు ప్రయాణిస్తున్న బ్యాలెనో కారును ప్రైవేటు బస్సు ఢీకొనడంతో కారు మంటల్లో కాలిపోయింది. బంధువుకు కొడుకు పుట్టాడని.. ధనుంజయరెడ్డి (30), ఆయన తల్లి కళావతి (52), ధనుంజయరెడ్డి భార్య శోభారాణి, కొడుకు మాన్విత్రెడ్డి (3), శోభారాణి తల్లి మహాలక్ష్మీ కారులో బెంగళూరుకు బయల్దేరారు. ధనుంజయరెడ్డి కారు నడుపుతున్నారు. ఆయన తండ్రి గోపాల్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో కడప నగరంలోని రాఘవేంద్ర టౌన్షిప్లో నివాసముంటూ ఆకాశవాణిలో ఉద్యోగం చేస్తున్నారు. ధనుంజయరెడ్డి, భార్య ఐటీ ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తూ మహదేవపురలో నివాసముంటున్నారు. కడపలో శోభారాణి అన్న సుబ్బారెడ్డికి కొడుకు పుట్టడంతో శనివారం అందరూ వెళ్లి చిన్నారిని చూసి సంతోషంగా గడిపారు. బెంగళూరుకు తిరిగి వస్తుండగా చింతామణి దగ్గర ఎదురుగా బెంగళూరు నుంచి తిరుపతికి వెళుతున్న శ్రీ భారతి ప్రైవేటు బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది. కారు రోడ్డు పక్కన పడి మంటల్లో చిక్కకుంది. అప్పటికే కారులోని వారు బయటకు ఎగిరిపడ్డారు. ధనుంజయరెడ్డి, తల్లి కళావతికి మంటలు అంటుకుని సజీవ దహనమయ్యారు. మిగతా ముగ్గురికి గాయాలయ్యాయి. బస్సు కూడా బోల్తా పడింది. అందులోని కొందరికి చిన్న చిన్న గాయాలు అయ్యాయి. కారు పూర్తిగా దగ్ధం స్థానికులు చేరుకుని క్షతగాత్రులకు సాయం చేశారు. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేసేటప్పటికి కారు పూర్తిగా దహనమైంది. జిల్లా ఎస్పీ కుశాల్ చౌక్సి, డీఎస్పీ మురళీధర్, సీఐ వెంకటరమణప్ప తదితరులు పరిశీలించారు. మృతదేహాలకు చింతామణి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. శోభారాణి, కొడుకు మాన్విత్, మహాలక్ష్మీలకు ప్రథమ చికిత్స నిర్వహించి బెంగళూరు ఆస్పత్రికి తరలించారు. ఆస్పతి దగ్గర బంధువుల రోదనలు మిన్నంటాయి. కర్ణాటకలో కడపవాసుల కారుకు ప్రమాదం తల్లీ కుమారుడు సజీవ దహనం భార్య, కొడుకు, అత్తకు గాయాలు -
భూమి ఒకరిది.. కట్టబెట్టింది మరొకరికి..
సాక్షి ప్రతినిధి, కడప : రైలు బండిని నడిపేదీ పచ్చా జెండాలే.. బతుకు బండిని నడిపేది పచ్చనోటే లే.. అన్నాడు ఓ సినీ గేయ రచయిత. ఆ గీతాన్ని ఆదర్శంగా తీసుకున్న కొంత మంది అధికారులు జీతం కంటే, గీతమే ముఖ్యమని మురిసిపోతున్నారు. ఈ తంతు రెవెన్యూశాఖలో మరింత అధికంగా ఉంది. డబ్బుంటే కానిదీ లేదని కొందరు అధికారులు రుజువు చేస్తున్నారు. హక్కులను సైతం కాలరాస్తున్నారు. డబ్బులిస్తే హక్కుదారులను కాదని, అదే భూమి వైరిపక్షానికి చెందినదిగా ధ్రువీకరణ చేస్తున్నారు. ఇలాంటి ఉదంతం తాజాగా ఖాజీపేట మండలంలో వెలుగు చూసింది. 60 ఏళ్ల నుంచి ఉన్న హక్కుల ఆధారంగా ఆన్లైన్ చేయాలని అభ్యర్థిస్తే తహసీల్దార్ చేయకపోగా, మిగులు భూమిగా ఆన్లైన్లో చూపుతున్న ఆ భూమి ఇళ్ల స్థలాలకు చెందినదంటూ ధ్రువీకరించారు. ధ్రువీకరణ ఆధారంగా ఘనత వహించిన రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏకంగా ఏడుగురి పేరుతో 9.5 సెంట్ల చొప్పున రిజిస్ట్రేషన్ సైతం చేయించారు. పక్కా రికార్డులున్నా.. ఖాజీపేట మండలం చెముళ్లపల్లె పొలంలో సర్వే నంబర్ 393/1, 393/3, 394/1ఏ పరిధిలో 2 ఎకరాల పొలాన్ని కల్లూరు తిరుపతిరెడ్డి, పిచ్చిరెడ్డి అనే సోదరుల నుంచి ములపాకు లక్ష్ముమ్మ కొనుగోలు చేసింది. ఆ మేరకు డాక్యుమెంట్ నంబర్ 4239/ 1965 ద్వారా 1965 ఫిబ్రవరి 5లో రిజిస్ట్రేషన్ అయింది. అప్పటి నుంచి ఆ భూమి ములపాకు లక్ష్ముమ్మ ఆధీనంలోనే ఉంది. 1994 ఫిబ్రవరి 10న మనువరాలైన ములపాకు సుశీలమ్మకు రిజిస్టర్డ్ వీలునామా రాయించింది. నేషనల్ హైవే రహదారి విస్తరణకు పోనూ 1.18 ఎకరాలు మాత్రమే మిగిలింది. ఆ భూమిపై తనకు హక్కులున్నాయంటూ అదే గ్రామానికి చెందిన పత్తి బయపురెడ్డి 2010లో మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. 2019లో కోర్టు సుశీలమ్మకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తీర్పుపై బయపురెడ్డి జిల్లా కోర్టుకు అప్పీలుకు వెళ్లారు. జిల్లా కోర్టు సైతం ఏఎస్ 9/2019 డీఫాల్ట్ 2025 ఫిబ్రవరిలో కొట్టి వేసింది. ఇవన్నీ పక్కా రికార్డులున్నా, సుశీలమ్మ తరుఫు హక్కుదారులకు ఆన్లైన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు సమ్మతించలేదు. సిబ్బందిని సెలవులో పంపి సర్టిఫికెట్ జారీ వీలునామా రిజిస్ట్రేషన్ కల్గి ఉన్న సుశీలమ్మ నుంచి కొత్తపేటకు చెందిన గోపాల్‌రెడ్డి ఆ భూమి కొనుగోలు చేశారు. ఆమేరకు డాక్యుమెంటు నంబర్ 5779/2022 ద్వారా రిజిస్ట్రేషన్ అయింది. కాగా జిల్లా కోర్టులో బయపురెడ్డి అప్పీల్ కొట్టి వేసిన తర్వాత ఫిబ్రవరి 18న అన్నీ ఆధారాలు అందజేసి గోపాల్‌రెడ్డి ఆన్లైన్ చేయాల్సిందిగా తహసీల్దార్‌ను అభ్యర్థించారు. పక్షం రోజుల తర్వాత మార్చి 4న రిజిస్ట్రేషన్ ద్వారా సంక్రమించి, స్వాధీన అనుభవంలో ఉన్న భూమి డాక్యుమెంట్లు హక్కుపత్రాలు అందించి మ్యూటేషన్ చేయాల్సిందిగా కోరారు. తహసీల్దార్ వారి అభ్యర్థన పెడచెవిన పెట్టడమే కాకుండా, అదే రోజు ఆ భూమిని బయపురెడ్డి హక్కుదారుడిగా సర్టిఫికెట్ జారీ చేశారు. మామిడి చెట్లు, పశువుల షెడ్డు ఉన్న ఆ స్థలం బయపురెడ్డికి చెందిన ఇళ్ల స్థలాలుగా ధ్రువీకరించారు. స్థానికంగా వీఆర్వో, సర్వేయర్ సంతకాలతో నిమిత్తం లేకుండా ఆర్ఐ, డీటీలతో బలవంతంగా సంతకాలు చేయించినట్లు సమాచారం. వంతపాడిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం డబ్బులిస్తే ‘నందిని పంది, పందిని నంది’ చేయగల సమర్థత కడప రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాయానికి ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. చెముళ్లపల్లె వ్యవహారంలో కూడా ఆ విషయం తేటతెల్లమైంది. సర్వే నంబర్ 394/1ఏలో మిగులు భూమిగా ఆన్లైన్లో చూపుతోంది. అయినా రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం మార్చి 5న ఏడుగురి పేర్లుతో రిజిస్ట్రేషన్ చేసింది. ఒక్కొక్కరికి 9.5 సెంట్ల చొప్పున డాక్యుమెంట్ల నంబర్లు 1813/2025, 1814, 1817, 1819, 1820, 1821, 1822/2025తో రిజిస్ట్రేషన్లు చేసింది. సామాన్యులు రిజిస్ట్రేషన్‌కు వెళితే ఆన్లైన్ లేదని యక్షప్రశ్నలతో ముప్పు తిప్పలు పెట్టే యంత్రాంగం.. ముందు రోజు తహసీల్దార్‌తో సర్టిఫికెట్ పొందడం, వెంటనే రికార్డులు పరిశీలించకుండా రిజిస్ట్రేషన్లు చేయడం వెనుక పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారినట్లు బాధితుడు గోపాల్‌రెడ్డి వాపోతున్నారు. అటు రెవెన్యూ, ఇటు రిజిస్ట్రేషన్‌శాఖ అధికారులు ముప్పు తిప్పలు పెడుతున్నారని తెలిపారు. మామిడి చెట్లు, షెడ్డు ఉన్న పొలాన్ని ప్లాట్లుగా రిజిస్ట్రేషన్ చేయడం వెనుక ఒక్క రోజులోనే లక్షలు చేతులు మారడంతోనే ఇలా చేశారని ఆరోపిస్తుండడం గమనారహం. రెవెన్యూ శాఖలో అడ్డగోలు ఆర్డర్లు ఖాజీపేట మండలంలో హక్కుదారులను విస్మరిస్తున్న తహసీల్దార్ కోర్టు ఉత్తర్వులను పెడచెవిన పెట్టిన అధికారి హక్కులున్నా ఆన్లైన్ చేయని వైనం ప్రత్యర్థులకు అదే భూమికి సర్టిఫికెట్ జారీ -
సెహరి..ఇఫ్తార్
ఐక్యతకు.. ధార్మికతకు ప్రతిరూపం శక్తికొద్దీ సేవలు ఆధ్యాత్మికతకే కాకుండా సేవా భావానికి కూడా ప్రతీక రంజాన్ మాసం. ఇటీవల ఈ మాసం సందర్భంగా యువత కలిసికట్టుగా ఉపవాస దీక్షల కోసం సెహరీకి ఏర్పాట్లు చేస్తున్నారు. కొందరు యువకులు కమిటీలుగా ఏర్పడి తమ సమీపంలోని మసీదుల్లో ఈ మాసమంతా సెహరీని ఏర్పాటు చేస్తున్నారు. నెలరోజులపాటు దాతల సహకారంతో తమ సేవా భావాన్ని ప్రదర్శిస్తూ రోజేదార్ల సేవలో తరిస్తున్నారు. పలు హోటళ్లలో ఇటీవల సెహరీ ప్యాకేజీలను అందిస్తున్నారు. రంజాన్ మాసంలో సెహరీ తయారీ కోసం ప్రత్యేక వంటకాల తయారీ కోసం ప్రత్యేకంగా నిపుణులను రప్పిస్తున్నారు. వాటి తయారీలో ఎంతో అనుభవం గల వారు హైదరాబాదు, ముంబయి తదితర ప్రాంతాల రంజాన్ వంటకాల రుచులను మన ప్రజలకు అందిస్తున్నారు. నగరంలోని కృష్ణా సర్కిల్ వద్దగల షాహీదర్బార్ హోటల్లో పదిహేనేళ్లుగా రోజేదార్ల కోసం సెహరీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ హోటల్లో ప్రత్యే కంగా లక్కీ డ్రాపెట్టి విజేతలకు ఉమ్రా యాత్ర అదృష్టాన్ని కల్పిస్తుండడం విశేషం. ఇలాంటి ప్రత్యేకమైన ఆఫర్లను ఇతర హోటళ్లలో కూడా నిర్వహిస్తున్నారు. -
12న ‘యువత పోరును’ను జయప్రదం చేయాలి
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు ఈనెల 12వ తేదీ తలపెట్టిన ‘యువత పోరు’ను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం ‘యువత పోరు’కు సంబంధించిన పోస్టర్లను బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషాలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి కూపాలు కదిలే రీతిలో యువత పోరును విజయవంతం చేయాలని కోరారు. విద్యార్థుల ఫీజు బకాయిలను చెల్లించకుండా వారిని చదువుకు దూరం చేయాలని చూస్తున్న ప్రభుత్వం తక్షణమే కపట నాటకాలు కట్టిపెట్టాలని సూచించారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు రూ.3900కోట్ల బకాయిలను ప్రభుత్వం విడుదల చేయలేదన్నారు. దీనివల్ల వారు చదువులు ఆపాల్సి వస్తోందన్నారు. సామాన్య, మధ్య తరగతి కుటుంబాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. పిల్లల ఫీజులకు అవసరమైన డబ్బులు లేక తల్లిదండ్రులు అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 2018–19లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం బకాయి పెట్టి పోయిన రూ.1800కోట్లను వైఎస్సార్సీపీ ప్రభుత్వం చెల్లించిందన్నారు. అలాగే 2023–24లో ఎన్నికల కోడ్ కారణంగా ఏర్పడిన బకాయిలు చెల్లించాల్సిన కూటమి ప్రభుత్వం పక్కకు తప్పుకోవడం సమంజసం కాదన్నారు. బకాయిలతో కలిపి ఇప్పటి వరకూ రూ.3900కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన డబ్బులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేవారు. లేనిపక్షంలో విద్యార్థులు తిరగబడటం ద్వారా తలెత్తే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హె చ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ సోషల్ వెల్ఫేర్ బోర్డు మాజీ ఛైర్మెన్ పులి సునీల్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సాయిదత్త, నగర అధ్యక్షుడు శివారెడ్డి పాల్గొన్నారు. -
రెవెన్యూ శాఖలో అత్యధికం
కడప సెవెన్‌రోడ్స్: వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం గత ప్రభుత్వం ప్రతి సోమవారం ‘స్పందన’ పేరిట మండల, డివిజన్, జిల్లా స్థాయిల్లో క్రమం తప్పకుండా ఓ కార్యక్రమం నిర్వహించేది. అర్జీల స్వీకరణ, పరిష్కారం జరిగేది. ఈ కార్యక్రమానికి నాటి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ప్రజలు సమర్పించే అర్జీలు మరింత నాణ్యంగా, వేగంగా పరిష్కారం కావాలన్న ఉద్దేశ్యంతో ‘జగనన్నకు చెబుదాం’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయమే ఈ కార్యక్రమాలను పర్యవేక్షించిందంటే అర్జీల పరిష్కారానికి గత ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇచ్చేదో అర్థమవుతుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ‘స్పందన’ పేరు తొలగించి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)గా మార్పు చేసింది. పేరు మార్పుపై ఉన్న శ్రద్ధ అర్జీల పరిష్కారంపై మాత్రం కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు వాట్సాప్ గవర్నెన్స్ పేరుతో కొత్త నాటకానికి తెర తీసింది. ● గ్రీవెన్‌సెల్‌లో అర్జీలను పరిశీలిస్తే అత్యధికంగా రెవెన్యూ, సర్వే విభాగాల్లోనే ఉన్నాయి. రెవెన్యూలో 18,363 ఫిర్యాదులు అందాయి. ఇందులో రికార్డు ఆఫ్ రైట్స్‌కు సంబంధించి మ్యూటేషన్స్ ఫిర్యాదులు 5074 రాగా, 4724 పరిష్కారం కాగా, 350 పెండింగ్‌లో ఉన్నాయి. ● రెవెన్యూ రికార్డులలో పేర్లు, రిలేషన్, ఆధార్, మొబైల్ నంబరు తదితర ఎంట్రీస్లో సవరణ కోసం వచ్చిన ఫిర్యాదులు 4623 కాగా, 4141 పరిష్కారం అయ్యాయి. ● సర్వే సెటిల్మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్‌కు సంబంధించి రీ సర్వేలో 3694 ఫిర్యాదులు రాగా, 2797 పరిష్కారం కాగా, 897 పెండింగ్‌లో ఉన్నాయి. ● రీ సర్వేలో భూమి విస్తీర్ణాలలో వచ్చిన తేడాలు సరిదిద్దడం కోసం 2381 ఫిర్యాదులు రాగా, 1712 పరిష్కారం కాగా, 669 పెండింగ్‌లో ఉన్నాయి. ● ఆస్తుల వివాదాలు, క్రిమినల్ ట్రెస్పాస్, సివిల్ వివాదాలు, మనీ మ్యాటర్స్‌కు సంబంధించి 1308 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో 1194 పరిష్కారం కాగా, 114 పెండింగ్‌లో ఉన్నాయి. ● ఆర్ఓఆర్ డేటాలో సవరణలపై 1038 అర్జీలు వచ్చాయి. ఇందులో 975 పరిష్కరించగా, 63 పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వ భూముల ఆక్రమణలకు సంబంధించిన క్రమబద్ధీకరణ కోసం 1011 అర్జీలు వచ్చాయి. ఇందులో 846 పరిష్కారం కాగా, 165 పెండింగ్‌లో ఉన్నాయి. ● పట్టాదారు పాసుపుస్తకాల జారీ కోసం 809 అర్జీలు వచ్చాయి. ఇందులో 723 పరిష్కారం కాగా, 86 పెండింగ్‌లో ఉన్నాయి. ● ఎఫ్ లైన్స్ (బౌండరీ డిమార్కేషన్)కు సంబంధించి 778 ఫిర్యాదులు రాగా, ఇందులో 678 పరిష్కరించగా, 100 పెండింగ్‌లో ఉన్నాయి. ఇలా రెవెన్యూకు సంబంధించి 15,620 అర్జీలు పరిష్కారమయ్యాయి. ఇంకా 2743 పెండింగ్‌లో ఉన్నాయి. ● సర్వే సెటిల్మెంట్ అండ్‌ల్యాండ్ రికార్డ్స్ విభాగంలో 9301 అర్జీలకు 7096 పరిష్కారమై, 2205 పెండింగ్‌లో ఉన్నాయి. ● పోలీసుశాఖకు సంబంధించి 3267 ఫిర్యాదులు రాగా, 270 పెండింగ్‌లో ఉన్నాయి. ● మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌లో 1127 అర్జీలు రాగా, 59 పెండింగ్‌లో ఉన్నాయి. ● పంచాయతీరాజ్ శాఖలో 385 అర్జీలు రాగా, 39 పెండింగ్, ఏపీఎస్పీడీసీఎల్కు సంబంధించి 263 అర్జీలు రాగా, 25 పెండింగ్‌లో ఉన్నాయి. ● పౌరసరఫరాల శాఖలో 244 అర్జీలు రాగా, 19 పెండింగ్‌లో ఉన్నాయి. ● రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్‌లో 233 అర్జీలు రాగా, 15 పెండింగ్‌లో ఉన్నాయి. ● గృహ నిర్మాణశాఖలో 189 అర్జీలు రాగా, 4 పెండింగ్‌లో ఉన్నాయి. ● పాఠశాల విద్యకు సంబంధించి 130 అర్జీలు రాగా, 9 పెండింగ్‌లో ఉన్నాయి. ● ఇక మిగతా అన్ని డిపార్టుమెంట్లలో మొత్తం 1495 అర్జీలు వచ్చాయి. ఇందులో 1360 పరిష్కారం కాగా, 135 పెండింగ్‌లో ఉన్నాయి. ప్రజా సమస్యల పరిష్కార వేదికగా మారిన ‘స్పందన’ గ్రీవెన్స్‌సెల్ ఫిర్యాదులువేలాదిగా పెండింగ్ కూటమి పాలనలో వచ్చినవి 34,997 టాప్ టెన్ శాఖల్లోనివి 33,502 రెవెన్యూలో అత్యధికంగా 27,664 పరిష్కరించినవి 29,474 పెండింగ్ ఫిర్యాదులు 5,523 -
వైభవంగా మహా సంప్రోక్షణ
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఆదివారం ఉదయం మహా సంప్రోక్షణ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు దంపతులు పొల్గొని పంచసూక్త పవమాన హోమాలు నిర్వహించారు. ఉదయం 9.30 గంటలకు మహాపూర్ణాహుతి, 10.15 నుంచి 11.30 గంటల వరకు వృషభలగ్నంలో మహా సంప్రోక్షణ, మహా కుంభాభిషేకం, స్వర్ణపుష్పార్చన జరిగపారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతించారు. కార్యక్రమంలో అర్చకులు, డిప్యూటీ ఈఓలు నటేష్ బాబు, గోవిందరాజన్, సెల్వం, ప్రశాంతి, ఎస్ఈలు వెంకటేశ్వర్లు, మనోహర్, వీజీఓ సదాలక్ష్మీ, ప్రెస్ అండ్ సేల్స్ వింగ్ ప్రత్యేక అధికారి రామరాజు పాల్గొన్నారు. నేడు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కడప సెవెన్‌రోడ్స్: ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్లో నిర్వహిస్తున్నట్లు డీఆర్వో విశ్వేశ్వర నాయుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ’లో అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు మండల, మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తామన్నారు. డయల్ యువర్ కలెక్టర్: ‘డయల్ యువర్ కలెక్టర్’ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 9.30 నుంచి 10.00 గంటల వరకు జరుగుతుందని డీఆర్వో తెలియజేశారు. ప్రజలు 08562– 244437 ల్యాండ్‌లైన్ నంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలను విన్నవించుకోవచ్చునన్నారు. ఏకగ్రీవ ఎన్నిక కడప ఎడ్యుకేషన్: ఏపీ పీఈటీ అండ్ ఎస్పీఈ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కడపకు చెందిన మిద్దె ప్రవీణ్ కిరణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కడప మండల పరిధిలోని నరసరాంపల్లె ఈయన స్వస్థలం. ఆదివారం విజయవాడలో నిర్వహించిన సమావేశంలో ప్రవీణ్ కిరణ్‌ను ఎన్నుకున్నారు. ఈయన కడప నగరం చెమ్ముమియాపేటలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జాతీయ లోక్ అదాలత్‌లో 7546 కేసులు పరిష్కారం కడప అర్బన్: జిల్లా న్యాయసేవాధికార సంస్థ కడప వారి ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. వైఎస్ఆర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 16 బెంచీలు ఏర్పాటు చేశారు. ఇందులో క్రిమినల్ కేసులు 7231, 197 సివిల్ కేసులు, 118 ప్రీ లిటిగేషన్ కేసులు పరిష్కారమయ్యాయి. ఈ సందర్బంగా రూ.26,13,95,784 కక్షిదారులకు చెల్లించారు. కడపలో 2109 కేసులు, పొద్దుటూరు 2082, రాజంపేట 933, రాయ చోటి 240, బద్వేల్ 283, జమ్మలమడుగు 1005, సిద్ధవటం 137, రైల్వేకోడూరు 157, పులివెందుల 365, నందలూరు 80, లక్కిరెడ్డిపల్లి 26, కమలాపురంలో 129 కేసులు జాతీయ లోక్ అదాలత్‌లో పరిష్కరించారు. ఈ కేసుల పరిష్కారానికి తోడ్పడిన వివిశాఖల అధికారులకు జిల్లా ప్రధాన న్యాయ మూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, చైర్మన్ జి.శ్రీదేవి , సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ ఎస్ బాబా ఫక్రుద్దీన్లు కృతజ్ఞతలు తెలియజేశారు. అన్నదాన సదనానికి రూ.లక్ష వేముల: బ్రహ్మంగారిమఠంలో నిర్మిస్తున్న పట్రానాయుళ్ల అన్నదాన సదనానికి వేముల మండలం ఎంపీపీ చల్లా గంగాదేవి, చల్లా వెంకటనారాయణలు ఆదివారం లక్ష రూపాయలు విరాళంగా అందించారు. చల్లా వెంకటనారాయణ తండ్రి, మాజీ సర్పంచ్ దివంగత చల్లా పెద్ద వెంకటయ్య, తల్లి రామసుబ్బమ్మ జ్ఞాపకార్థం వారు ఈ విరాళాన్ని అందజేశారు. పట్ర సంక్షేమ సంఘ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చల్లా సునీల్ కుమార్, పట్రా సంక్షేమ సంఘ గౌరవాధ్యక్షుడు ఆంజనేయులు,అధ్యక్షుడుహనుమంతునాయు డు,సత్యసాయి జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు,ప్రధాన కార్యదర్శి రెడ్డప్ప పాల్గొన్నారు. -
తెల్లవారుజాము 3.00 గంటల సమయం. ఆ ప్రాంతమంతా నిద్ర మేల్కొంది. పెద్దపెద్ద బట్టీ పొయ్యిలు పొగలు కక్కుతున్నాయి. టీ హోటళ్లలో చాయ్ వాసన గుబాళిస్తోంది. పక్కనే ఉన్న మసీదు మినార్లు విద్యుద్దీపాల వెలుగులో ధగధగలాడుతున్నాయి. అస్సాలాము అలైకుమ్ భాయ్‌సాబ్.. అంటూ పలకరి
ఉదయం సెహరీ సందర్భంగా ఇంట్లో ఆహారం స్వీకరించినా ఇఫ్తార్ సమయంలో రోజేదార్లు అందరూ ఒకేచోట కలుసుకుంటాం. రంజాన్ శుభవేళలో ఇలా అందరం ఒకచోట కలిసి ప్రార్థనా సమయపు ఆహారమైన ఇఫ్తార్ స్వీకరించడం అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. – షేక్ మమ్మద్గౌస్, రవీంద్రనగర్, కడప రంజాన్ మాసంలో రోజేదార్లకు సెహరీ అవకాశం కల్పించే భాగ్యం దక్కడం దైవం ఇచ్చిన వరంగా భావిస్తున్నా. నెలంతా రాత్రింబవళ్లు పని చేసే కార్మికుల వల్లే సాధ్యమవుతోంది. సెహరీ, హలీం తయారు చేసే వాళ్లను హైదరాబాద్ నుంచి పిలిపించాం. ఉడతాభక్తిగా ఈసారి మా తరఫున ఒకరికి ఉమ్రా యాత్ర చేసే అవకాశం కల్పించాం. –ఎస్.ఎండీ ఆజం, హోటల్ యజమాని, షాహీ దర్బార్ జిల్లాలో హలీం వ్యాపారం ఉభయ వైఎస్సార్ జిల్లాలో రంజాన్ మాసం సందర్భంగా రంజాన్ ప్రత్యేక సంప్రదాయ వంటకమైన హలీం వ్యాపారం బాగా సాగుతోంది. పుష్టికరమైన ఈ వంటకంపై రోజేదార్లతో పాటు సాధారణ ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు.దైవం ఇచ్చిన వరం.. అద్భుతమైన అనుభూతి -
విజయవంతం చేద్దాం
‘యువత పోరు’ను ● 12నే పార్టీ ఆవిర్భావ వేడుకలు...భారీ ర్యాలీ ● ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పక్షపాతం చూపడం దారుణం కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు ఈనెల 12వ తేది నిర్వహించ తలపెట్టిన ‘యువత పోరు’కు విద్యార్థులు, యువత తరలిరావాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషాలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈనెల 12వ తేది ఉదయం 10.30 గంటలకు వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంలో జెండా ఎగురవేసిన అనంతరం కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టర్‌కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేస్తామని వివరించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు మెగా డీఎస్సీ నిర్వహిస్తామని, ఏడాదికి 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, నిరుద్యోగులకు నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయడం లేదన్నారు. వలంటీర్లకు పదివేలు ఇస్తామని హామీ ఇచ్చి, వారి ఉద్యోగాలనే ఊడబెరికారన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పింఛన్లు తప్పా మరేమీ ఇవ్వడం లేదని, అందులో కూడా వివిధ సర్వేల ద్వారా 3లక్షల పింఛన్లు తొలగించారని ధ్వజమెత్తారు. 2019లో చంద్రబాబు బకాయి పెట్టిన రూ.1800కోట్ల బకాయిలను వైఎస్ జగన్ ప్రభుత్వం తీర్చిందని, చంద్రబాబు మాత్రం గత ప్రభుత్వం దిగిపోయే నాటికి ఉన్న రూ.3900కోట్ల బకాయిలను చెల్లించడం లేదన్నారు.ఈ ప్రభుత్వం వచ్చాక సీ్త్ర నిధి నుంచి కళ్యాణ లక్ష్మి పథకానికి నిధులు వాడుకోవాలని యోచించడం దారుణమన్నారు. టీడీపీ కార్యకర్తల సంపాదన కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించారు. రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తానని ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చంద్రబాబు... టీడీపీ వారికే పనులు చేయండి, వైఎస్సార్సీపీ వారి కి చిన్న పని కూడా చేయొద్దు అని చెప్పడం దారుణమన్నారు. టీడీపీ కార్యకర్తలే మీకు ఓట్లు వేశారా...ప్రజలెవరూ వేయలేదా ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడవచ్చా...అని ప్రశ్నించారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కాకుండా మరే ప్రభుత్వం ఉన్నా ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసేదన్నారు. ● వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి జయచంద్రారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు దాసరి శివప్రసాద్, బంగారు నాగయ్య, ఎస్సీ సెల్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్య, వైఎస్సార్‌ఎస్‌యూ అధ్యక్షుడు దత్తసాయి పాల్గొన్నారు. వెన్నుపోటు చంద్రబాబు నైజం: మాజీ డిప్యూటీ సీఎం అంజద్ వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నైజమని మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా విమర్శించా రు. వైఎస్ జగన్ దిశ చట్టం, నామినేటెడ్ పనుల్లో, పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తే...కూటమి ప్రభుత్వం 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని, ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి మోసం చేసిందన్నారు. ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడు దల చేస్తామని చేయలేదన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట బకాయిలు ఇవ్వకుండా విద్యా వ్యవస్థను నాఽశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘యువత పోరు’కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. -
మహిళా సాధికారతే ధ్యేయం
కడప సెవెన్‌రోడ్స్: మహిళా సాధికారతే ప్రభుత్వ ధ్యేయమని ఇన్‌ఛార్జి మంత్రి ఎస్.సవిత అన్నా రు. శనివారం కడపలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో 33.33 శాతం రిజర్వేషన్లు చేస్తోందని పేర్కొన్నారు. సంపద సృష్టిలో మహిళలు భాగస్వాములు కావాలన్నారు. ఈ ఏడాది లక్ష మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలన్నది లక్ష్యమని తెలిపారు. కలెక్టర్ డాక్టర శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ అన్ని కార్పొరేషన్ల ద్వారా మహిళలకు రుణాలు అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం బ్యాంకుల ద్వారా రూ. 1500 కోట్లు రుణాలు అందిస్తున్నామని తెలిపా రు. ఆడబిడ్డల చదువును ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఎస్పీ ఈజీ అశోక్‌కుమార్ మాట్లాడుతూ మహిళలకు అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారని తెలిపారు. ప్రభుత్వం మహిళల రక్షణకు అనేక చర్యలు తీసుకుంటోందని వివరించారు. జేసీ అదితిసింగ్ మాట్లాడుతూ మహిళలు స్వావలంబన దిశగా అడుగులు వేయాలన్నారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారతకు కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్, డీఆర్డీఏ, మెప్మా పీడీలు శ్రీలక్ష్మి, ఆనంద్‌నాయక్, కిరణ్‌కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రాజ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, టీడీపీ నేత శ్రీనివాసుల రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రుణాల పంపిణీ: జిల్లాలోని 983 స్వయం సహాయక సంఘాల్లోని 9830 మంది సభ్యులకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ. 105,59,00,000 మంత్రి చెక్కుల రూపంలో పంపిణీ చేశారు. అలాగే 69 మంది ఎస్సీ వర్గాలకు చెందిన ఎస్‌హెచ్‌జీ లబ్ధిదారులకు సబ్సిడీతో కూడిన వడ్డీ లేని రుణాలు రూ. 1,08,50,000, పీఎం విశ్వకర్మ యోజన కింద 542 మంది మహిళా చేతి వృత్తుల వారికి రూ. 3,07,00,000, నలుగురు ఉత్తమ మహిళా పారిశ్రామికవేత్తలు ప్రేరణ సఖి కింద ఒక్కొక్కరికి రూ. 50 వేలు చొప్పున ప్రోత్సాహక బహుమతి చెక్కులను మంత్రి అందజేశారు. ●బీసీ వర్గాల అభ్యున్నతికి ప్రాధాన్యతకడప సెవెన్‌రోడ్స్: వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సవిత అన్నారు. శనివారం ఆర్అండ్బీ అతిథి గృహంలో వివిధ శాఖల అధికారులతో ఆమె పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ రుణాలు తీసుకున్న లబ్ధ్దిదారులు యూనిట్ల స్థాపనకు చర్యలు చేపట్టాలన్నారు. ఎస్‌హెచ్‌జీ పథకాల యూనిట్ల స్థాపనకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యేలకు సమాచారం అందించాలన్నారు. ఆప్కో వస్త్రాలయాల్లో అమ్మకాలను మరింత పెంచేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని హాస్టళ్లలో సన్నబియ్యంతో వండిన భోజనాన్ని విద్యార్థులకు అందించాలన్నారు. ఇన్‌ఛార్జి మంత్రి సవిత -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
చింతకొమ్మదిన్నె : స్థానిక ఉటుకూరు వద్ద జాతీయరహదారిపై బైక్ అదుపుతప్పి గంప. వెంకటసుబ్బయ్య(70) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం మేరకు.. శనివారం ఉదయం 8.30 గంటలకు కడప సిటీ, నడింపల్లె నివాసి గంప వెంకట సుబ్బయ్య వృతి రీత్యా బెల్దారి మేస్త్రి. కడప నుంచి రాయచోటి(జమాల్‌పల్లె) వైపునకు 39ఎస్బీ 2260 నెంబర్ గల మోటార్ సైకిల్‌పై వెళ్తుండగా ఉటుకూరు వద్ద ఉన్న రైల్వే బ్రిడ్జి సమీపంలోని శుభమ్ ఫంక్షన్ హాల్ ఎదురుగా రోడ్డుపై కుక్కను తప్పించబోయి వాహనం స్పీడ్ కంట్రోల్ చేయలేక రోడ్డు పక్కన ఉన్న విద్యుత్తు స్తంభాన్ని ఢీకొన్నాడు. తీవ్ర గాయాలై సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మృతుడి భార్య గంప చిన్నక్క ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 600 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం బద్వేలు అర్బన్ : బద్వేలు – మైదుకూరు రహదారిలోని చెన్నంపల్లె సమీపంలో 600 బస్తాల రేషన్ బియ్యం లోడుతో వెళుతున్న లారీని అర్బన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం తెల్లవారుజామున చెన్నంపల్లె సమీపంలో వాహనాల తనిఖీ చేస్తుండగా జమ్మలమడుగులోని ఓ రైస్‌మిల్ నుండి చైన్నెకి బియ్యం లోడుతో వెళుతున్న లారీని స్వాధీనం చేసుకున్నారు. బియ్యం లారీని స్టేషన్‌కు తరలించి పట్టుబడిన బియ్యం శాంపిల్స్ తీసి రెవెన్యూ అధికారులకు పరీక్ష నిమిత్తం పంపనున్నట్లు సీఐ రాజగోపాల్ తెలిపారు. ఈ దాడుల్లో అర్బన్ ఎస్ఐ సత్యనారాయణ, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. -
మహిళా దినోత్సవంలో న్యాయ విజ్ఞాన సదస్సు
కడప అర్బన్: జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. శ్రీదేవి ఆధ్వర్యంలో శనివారం జిల్లా కోర్టుల ఆవరణంలోని న్యాయసేవాసదన్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా న్యాయవిజ్ఞాన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. శ్రీదేవి మాట్లాడుతూ 1975లో ఐక్యరాజ్యసమితి మహిళా దినోత్సవాన్ని గుర్తించిందన్నారు. మహిళల హక్కులు, లింగ సమానత్వం గురించి ఆవగాహన పెంచడం, వివిధ రంగాలలో మహిళల విజయాలు మహిళా దినోత్సవ ప్రాముఖ్యతను తెలియజేశారు. కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎల్. వెంకటేశ్వరరావ, నాలుగవ అదనపు జిల్లా న్యాయమూర్తి జి.దీనబాబు, జిల్లా న్యాయసేవాధికారసంస్థ సెక్రటరీ, జడ్జి ఎస్. బాబా ఫకృద్దీన్, సీనియర్ సివిల్ జడ్జి కె. ప్రత్యూషకుమారి, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి జీసీ ఆసిఫా సుల్తానా, ఎకై ్సజ్కోర్టు మెజిస్ట్రేట్ జె.హేమస్రవంతి, మొబైల్‌కోర్టు మెజిస్ట్రేట్ ఎం. ఆశాప్రియ, కడప న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జి. గుర్రప్ప, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, మహిళలు, పారా లీగల్ వాలంటీర్లు, ప్యానెల్ న్యాయవాదులు, ప్రజలు తదితరులు ప -
రహదారుల నాణ్యతలో రాజీకి తావులేదు
కడప సెవెన్‌రోడ్స్ : రహదారులను అభివృద్ధి చేయడంలో నాణ్యతా ప్రమాణాల రాజీకి తావులేదని, అధికారులు చిత్తశుద్ధితో సకాలంలో పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. శనివారం అన్నమయ్య జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన కడప ఆర్అండ్బీ అతిథి గృహంలో ఆ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడారు. గుంతల రోడ్ల మురమ్మతు పనులపై అధికారులను ఆరా తీశారు. జిల్లాలో 219 పనులకుగాను రూ. 35 కోట్లు కేటాయించగా, 97 శాతం పనులు ఇప్పటికి పూర్తి చేశామని అఽధికారులు తెలిపారు. కడప బైపాస్కు 14 కిలోమీటర్లు గుంతలు పూడ్చడానికి ఒప్పందం పూర్తయిందని, త్వరలో పనులు చేపట్టి పది రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. ఇర్కాన్ సర్కిల్ నుంచి ఊటుకూరు వరకు ఐదు కిలోమీటర్లు గుంతలు పూడ్చే పనులు ప్రారంభించామన్నారు. ఈ సందర్బంగా అధికారులు మంత్రిని ఘనంగా సత్కరించారు. మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి -
చౌకబారు రాజకీయాలతో కాలయాపన
వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వి.సతీష్ కుమార్ రెడ్డి వేంపల్లె : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో చౌకబారు రాజకీయాలతో కాలయాపన చేస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వి.సతీష్ కుమార్ రెడ్డి ఆరోపించారు. శనివారం వైఎస్సార్ జిల్లా వేంపల్లెలో ఆయన స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తిని కూడా చిల్లర రాజకీయం కోసం 45 నిమిషాలపాటు కేబినెట్ సమావేశంలో మాట్లాడావంటే నీ స్థాయి ఎటువంటిదో ప్రజలందరికీ అర్థమవుతుందన్నారు. చంద్రబాబు నాయుడు ఒక గొప్ప మిషనరీగా ప్రాజెక్టు చేయబడ్డావని దేశమంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి రోజులు ఉన్నాయని చెప్పి అందరూ చెప్పుకునేవాళ్లు.. అయితే ఎక్కడికి పోయింది నీ పరిపాలన దక్షత అని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ఎటువంటి అవినీతి జరగకుండా సామాన్య ప్రజలకు సంక్షేమ పథకాలు డైరెక్ట్‌గా అందజేసినటువంటి గొప్ప నాయకుడు అన్నారు. దళారీ వ్యవస్థ లేకుండా రూ.2.80వేల కోట్లు ప్రజల ఖాతాలో జమ చేసినట్లు చెప్పారు. రాష్ట్రానికి 750 మెడికల్ కాలేజీ సీట్లు తీసుకొని వస్తే వాటిని వద్దని వెనక్కి రాసి ఇచ్చిన దౌర్భాగ్య ప్రభుత్వం కాదా మీది అన్నారు. అలాగే మెడికల్ కళాశాలలు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి వ్యాపారం చేయడం ఇంత కన్నా దౌర్భాగ్యం ఉంటుందా అని విమర్శించారు. సామాన్య విద్యార్థులకు ఉన్నత విద్యనభ్యసించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ కళాశాలను మంజూరు చేస్తే వాటికి నిధులు ఇచ్చుకోలేక పేద విద్యార్థులపైనే ఆర్థిక భారం పెట్టడం ఎంత వరకు సమంజసమన్నారు. ప్రతి కార్యక్రమంలోనూ కమీషన్లు వచ్చేది వాస్తవం కాదా అని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 9 నెలల నుంచి సామాన్య ప్రజలు ఏమి కొనుగోలు చేయాలన్నా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే వ్యాపారవృద్ధి పరంగా 30 శాతం వ్యాపారాలు కూడా జరగలేని పరిస్థితి ఉందన్నారు. ఏదో సంపద సృష్టితారని గొప్పలు చెప్పుకున్న సీఎం చంద్రబాబు అన్ని రంగాల్లో ఘోర వైఫల్యం చెందారని తెలిపారు. మీ పత్రికలు, చానళ్లు దుష్ప్రచారం చేస్తే సహించేది లేదన్నారు. వివేకా హత్య కేసులో జగన్ సతీమణి భారతి, నారాయణ యాదవ్‌తోపాటు చనిపోయిన ఇసి గంగిరెడ్డి, అభిషేక్ రెడ్డి పేర్లను చేర్చిన విషసంస్కృతి చంద్రబాబుది అని అన్నారు. షర్మిలమ్మ కూడా చంద్రబాబు ట్రాప్‌లో పడి జగన్‌పై విమర్శలు చేయడం శోచనీయమన్నారు. -
అవినీతికి పాల్పడి ఉంటే ఈ రోజు అప్పులుండేవి కాదు
ప్రొద్దుటూరు : ప్రజా సంక్షేమం కోసం దూరదృష్టితో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవినీతిని ప్రోత్సహించకుండా చేశారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. విచ్చలవిడిగా అవినీతిని అప్పట్లో ప్రోత్సహించి ఉంటే ఈ రోజు తనకు అప్పులు ఉండేవి కాదన్నారు. ఏదో విధంగా అవినీతిపరుడనే ముద్ర వేసి తనను జైలుకు పంపడమే లక్ష్యంగా ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఆరోపణలు చేస్తున్నారన్నారు. దొరసానిపల్లెలోని తన స్వగృహంలో రాచమల్లు శివప్రసాదరెడ్డి శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం ఎమ్మెల్యే వరద తనపై వ్యక్తిగత కక్షతోనే విమర్శలు చేస్తున్నారన్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గ అభివృద్ధి గురించో, పాల కేంద్రం గురించో, ఆగిన డ్రైనేజీ కాలువల నిర్మాణాల గురించో అసెంబ్లీలో ఎమ్మెల్యే మాట్లాడి ఉంటే అందరు సంతోషించేవారన్నారు. అలా కాకుండా కేవలం తనను అవినీతి పరుడని చెప్పేందుకు అసెంబ్లీని వేదికగా చేసుకున్నారన్నారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మొత్తం 200 మంది రైతుల నుంచి భూమిని సేకరించినట్లు తెలిపారు. ఆ పరిహారం మొత్తం రైతుల బ్యాంకుల ఖాతాల్లో అధికారులు జమ చేశారన్నారు. ఒక్క రైతునైనా చూపించండి ఎమ్మెల్యే వరద ఉద్దేశ్య పూర్వంగా తాను ఎకర భూమిని రూ.20 లక్షలకు కొని రూ.40 లక్షలకు అమ్మినట్లు ఆరోపణలు చేశారని రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. ప్రభుత్వానికి భూములు అమ్మక ముందు భూముల రిజిస్ట్రేషన్ జరిగిందేమో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చెక్ చేసుకోవాలని సూచించారు. సోములవారిపల్లెలో మీ వర్గీయుడైన మాజీ సర్పంచ్ సాంబశివుడు, రామేశ్వరంలో బిజినేపల్లి సుధాకర్, మీనాపురంలో లక్ష్మిరెడ్డి భూములను ప్రభుత్వం సేకరించిందన్నారు. వారి నుంచి తాను భూములు కొనుగోలు చేసి ప్రభుత్వానికి అమ్మినట్లు నిరూపించాలని కోరారు. తన బావమరిది మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డితోపాటు తాను కూడా పలు మార్లు ఈ విషయంపై ప్రెస్మీట్లు పెట్టామన్నారు. తాము వేల కోట్ల అవినీతికి పాల్పడినట్లు ఎన్నికల ముందు ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే అధికారంలోకి వచ్చాక ఎందుకు నిరూపించలేకపోతున్నారన్నారు. సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ జేష్టాది శారద, మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి, వైస్ చైర్మన్లు ఆయిల్ మిల్ ఖాజా, పాతకోట బంగారు మునిరెడ్డి, ఎంపీపీ శేఖర్ యాదవ్, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పోరెడ్డి నరసింహారెడ్డి, పట్టణాధ్యక్షుడు భూమిరెడ్డి వంశీధర్‌రెడ్డి, కౌన్సిలర్లు నూకా నాగేంద్రారెడ్డి, ముదిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, సత్యం, లావణ్య, జయంతి, డీలర్ అంజి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మార్తల ఓబుళరెడ్డి, వెంకటేష్, రామ్మోహన్‌రెడ్డి, ఖాజాపీర్ పాల్గొన్నారు. ఏదో రకంగా జైలుకు పంపాలనే ఎమ్మెల్యే వరద అసెంబ్లీలో ఆరోపణలు రూ.162 కోట్లకు భూములు కొంటే రూ.800 కోట్లు అవినీతి సాధ్యమా? విజిలెన్స్ నివేదిక ఇచ్చినా వరద రెడ్ బుక్ రాజ్యాంగం కావాలంటున్నారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి -
మహిళలు ఆదిపరాశక్తి స్వరూపం
కడప కార్పొరేషన్ : మహిళలు ఆదిపరాశక్తి స్వరూపమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు పి. రవీంద్రనాథ్‌రెడ్డి సతీమణి డా. పోచిమరెడ్డి అరుణమ్మ అన్నారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు టీపీ వెంకట సుబ్బమ్మ, కడప నియోజకవర్గ అధ్యక్షురాలు బండి దీప్తి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మొదట వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి మహిళలకు తినిపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజం మహిళలకు ఉన్నత స్థానం కల్పించిందన్నారు. ఆ ఉన్నతిని కాపాడుకునేందుకు పోరాటం చేయాలన్నారు. భవిష్యత్‌లో మహిళలకు అన్ని రంగాల్లో మంచి అవకాశాలు రావాలని ఆకాంక్షించారు. అంతకుముందు మహిళలకు వివిధ రకాల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. మహిళలందరికీ వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు పి. రవీంద్రనాథ్‌రెడ్డి, మేయర్ సురేష్ బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మహిళా నేతలంతా అరుణమ్మను, డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగంను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం నేతలు పత్తిరాజేశ్వరి, రత్నకుమారి,ఉమామహేశ్వరి, క్రిష్ణవేణి, తులశమ్మ, హైమవతి, మల్లీశ్వరి, నారాయణమ్మ, జ్యోతి, పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి సతీమణి అరుణమ్మ వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవం -
జాతీయ లోక్ అదాలత్‌తో 6053 కేసులు పరిష్కారం
కడప అర్బన్ : జిల్లా న్యాయసేవాధికార సంస్థ వారి ఆధ్వర్యంలో శనివారం జిల్లా వ్యాప్తంగా జాతీయలోక్ అదాలత్ నిర్వహించి 6053 కేసులు పరిష్కరించారు. జిల్లావ్యాప్తంగా 16 బెంచీలు ఏర్పాటు చేశారు. కడపలో 5, ప్రొద్దుటూరు 3, రాజంపేటలో 3, రాయచోటిలో 2, బద్వేల్లో 2, జమ్మలమడుగు ఒక బెంచీని ఏర్పాటు చేశారు. జిల్లా కోర్టు ఆవరణంలో శనివారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. శ్రీదేవి ఆధ్వర్యంలో సెక్రటరీ, జడ్జి ఎస్. బాబా ఫకృద్దీన్లు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎల్. వెంకటేశ్వరరావు, నాల్గవ అదనపు జిల్లా న్యాయమూర్తి జి దీనబాబు, జిల్లా న్యాయసేవాధికారసంస్థ సెక్రటరీ, జడ్జి ఎస్. బాబా ఫకృద్దీన్, సివిల్ జడ్జి కం చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కె. ప్రత్యూషకుమారి, సివిల్ జిసి ఆసిఫా సుల్తానా, ఎకై ్సజ్ కోర్టు జె హేమస్రవంతి, మొబైల్‌కోర్టు మెజిస్ట్రేట్ ఎం. ఆశాప్రియ, కడప బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జి.. గుర్రప్ప, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, కక్షిదారులు, బ్యాంక్ అధికారులు, ఇన్సూరెన్స్ అధికారులు పాల్గొన్నారు. ● జాతీయ లోక్ అదాలత్‌లో జిల్లా వ్యాప్తంగా 6053 కేసులను పరిష్కరించారు. ఈ కేసుల పరిష్కారంతో రూ.15,58,91,342 (రూ.15 కోట్లు 58 లక్షలు,91 వేలు, 342) కక్షిదారులకు నష్టపరిహారంగా లభించింది. ● మొదటి అదనపు జిల్లా ప్రధాన న్యాయమూర్తి కోర్టులో వున్న ఎంవిఓపి నెంబర్: 98/2017 కేసులో రూ. 23 లక్షలు మొత్తాన్ని వాది అయిన సయ్యద్ నీలోఫర్, ఇతరులు, ప్రతివాది అయిన హెచ్డిఎఫ్సీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వారు జాతీయ లోక్ అదాలత్‌లో రాజీ అయ్యారు.. ఈ కేసులో వాది తరపున న్యాయవాది వై.. ప్రసాద్, ప్రతి వాది తరపున న్యాయవాది డి. రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. జాతీయ లోక్ అదాలత్‌లో న్యాయమూర్తులు, లోక్ అదాలత్ సభ్యులు, కక్షిదారులు వారి న్యాయవాదులతో సంప్రదింపులు జరిపి వారి వారి కేసులను పరిష్కరించుకున్నారు. లోక్ అదాలత్‌లో ఒకటైన భార్యభర్తలు ప్రొద్దుటూరు క్రైం : మనస్పర్థలతో ఏడాది నుంచి విడిగా ఉన్న భార్యభర్తలు జడ్జి సత్యకుమారి సూచనతో లోక్ అదాలత్‌లో ఒకటయ్యారు. వివరాల్లోకి వెళితే.. ప్రొద్దుటూరుకు చెందిన సాంబశివారెడ్డి, వీణ అనే దంపతులు మనస్పర్థలతో ఏడాదిగా విడిగా ఉంటున్నారు. ఇరువురి కులాలు వేరైనా ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఇరువురు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే వీరి సంసారంలో చిన్నపాటి వివాదాలు తలెత్తాయి. భర్త దూరం కావడంతో భార్య శనివారం ప్రొద్దుటూరులోని కోర్టు హాల్లో నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్‌ను ఆశ్రయించారు. రెండవ జిల్లా అదనపు న్యాయమూర్తి సత్యకుమారి ఇరువురిని పిలిపించారు. తల్లిదండ్రులు విడిగా ఉండటం వల్ల ఏడాది వయసున్న చిన్నారిపై భవిష్యత్తులో ఎంతో ప్రభావం చూపుతుందన్నారు. ప్రేమించుకున్నప్పుడు కులాలు లేవని ప్రస్తుతం వాటిని అధికమించి అన్యోన్యంగా జీవించాలని ఇరువురిని కోరారు. న్యాయమూర్తి సూచనతో సాంబశివారెడ్డి తన సతీమణితో కలిసి జీవిస్తానని అంగీకరించారు. భార్యభర్తలు ఇరువురు కలుసుకోవడంతో జడ్జితోపాటు ఇతర లోక్ అదాలత్ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సెషన్స్ కర్టు అదనపు ప్రభుత్వ న్యాయవాది బందెల ఓబులేసు, లోక్ అదాలత్ సభ్యుడు శ్రీనివాసులు, న్యాయవాదులు విజయలక్ష్మి, పద్మజ, లక్ష్మీప్రసన్న తదితరులు పాల్గొన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, ప్రధాన న్యాయమూర్తి జి. శ్రీదేవి -
తృటిలో తప్పిన ప్రమాదం
– ఫ్రూట్ జ్యూస్ దుకాణంపై దూసుకెళ్లిన లారీ ఎర్రగుంట్ల : పట్టణంలోని ముద్దనూరు రోడ్డులోని ఏపీజీబీ బ్యాంకు సమీపంలో తృటిలో ప్రమాదం తప్పింది. ఓ ఫ్లైయాస్ లారీ పక్కనే ఉన్న ఫ్రూట్ జ్యూస్ బండిపై దూసుకెళ్లింది. ఈ సంఘటన శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు . పట్టణంలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు సమీపంలోనే ఓ బ్రాందీ షాపు ఉంది. ఇక్కడ రోడ్డు పక్కనే కొందరు మద్యం సేవిస్తూంటారు. బ్యాంకుకు, ఇక్కడ ఉన్న మూడు ఏటీఎం సెంటర్లకు ఖాతదారులు వస్తుంటారు. మద్యం ప్రియుళ్లుతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే మద్యం దుకాణం కిందనే ఓ ఫ్రూట్ జ్యూస్ బండి కూడా ఉంది. శనివారం ముద్దనూరు రోడ్డులో స్కూటీలో ఓ మహిళ వస్తుండుగా ఆటో ఢీకొంది. ఆ మహిళ కింద పడింది. వెనుక నుంచి ఫ్లైయాస్ లారీ వస్తున్న సమయంలో డ్రైవర్ గమనించి తప్పించ బోవడంతో పక్కనే ఉన్న ఫ్రూట్ జ్యూస్ దుకాణంపై దూసుకెళ్లింది. ప్రమాదంలో ఎవరికి ఎలాంటీ ప్రమాదం జరగలేదు. ఇప్పటికై న మద్యం ప్రియుళ్లును ఇక్కడ నుంచి నివారించాలని స్థానికులు కోరుతున్నారు. కడప ఆర్సీఎం డయాసిస్‌కు నూతన బిషప్ – రెవరెండ్ సగినాల పాల్ ప్రకాశ్‌ను నియమిస్తూ పోప్ ప్రకటన కడప కల్చరల్ : కడప రోమన్ క్యాథలిక్ డయాసిస్ బిషప్‌గా రెవరెండ్ సగినాల పాల్ ప్రకాశ్‌ను నియమించారు. ఈ మేరకు పోప్ ఫ్రాన్సిస్ రోమ్‌లో ప్రకటన చేశారు. శనివారం నగరంలోని మరియాపురంలోని క్యాథడ్రల్ చర్చిలో ఇంతవరకు ఈ ప్రాంత బిషప్‌గా వ్యవహారించిన మోస్ట్ రెవరెండ్ డాక్టర్ గాలి బాలి నూతన బిషప్ సమక్షంలో పోప్ ఆదేశాల మేరకు ఆయన పేరు ప్రకటించారు. త్వరలో ఆయన ప్రమాణ స్వీకారం కూడా నిర్వహించనున్నారు. నూతన బిషప్ వివరాలు : నూతన బిషప్ రెవరెండ్ పాల్ ప్రకాశ్ సగినాల ప్రస్తుతం హైదరాబాదు సెయింట్ జాన్స్ రీజినల్ సెమినరీలో బైబిల్ స్టడీస్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. ఆయన 1961 జూన్ 12న వైఎస్సార్ జిల్లాలోని పలుగురాళ్లపల్లెలో జన్మించారు. హైదరాబాదు ఉస్మానియా నుంచి బీఏ డిగ్రీ, అనంతపురం శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంనుంచి తెలుగు మాస్టర్స్ డిగ్రీ, డిల్లీ యూనివర్శిటీ నుంచి జర్నలిజం పీజీ డిప్లొమా, రోమ్‌లోని అర్బానియా వర్శిటీ నుంచి బైబిల్ థియాలజీలో పీహెచ్డీ చేశారు. కడపలోని ఆరోగ్యమాత క్షేత్రం డైరెక్టర్‌గా కూడా సేవలు అందించారు. శనివారం సాయంత్రం క్యాథడ్రల్ చర్చిలో నూతన బిషప్‌గా ఆయన పేరును వెల్లడించిన బిషప్ గాలి బాలి ఆయనకు దేవుని ఆశీస్సులు సంవృద్దిగా ఉండాలని కోరుతూ హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కడప కథోలిక మేత్రాసన వికర్ జనరల్ రెవరెండ్ ఫాదర్ తలారి బాలరాజు, కోశాధికారి రెవరెండ్ ఫాదర్ సంబటూరు సురేష్ పాల్గొన్నారు. -
సహజ మరణాలపై సిట్ కుట్ర: వైఎస్ మదన్‌మోహన్‌రెడ్డి
పులివెందుల: వైఎస్సార్సీపీ డాక్టర్స్ విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వైఎస్ అభిషేక్‌రెడ్డి అనారోగ్యంతో మృతి చెందితే, దానిపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని, దానికి ప్రభుత్వ పెద్దలు కూడా వంతపాడుతున్నారని అభిషేక్ రెడ్డి తండ్రి, వైఎస్సార్సీపీ నేత వైఎస్ మదన్మోహన్ రెడ్డి అన్నారు. ఆయన శనివారం వైఎస్సార్ జిల్లా పులివెందులలో మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షులంతా ఒక్కొక్కరుగా చనిపోతున్నారంటూ ఎల్లో మీడియా విషపూరిత కథనాలు ప్రచురించడాన్ని ఖండించారు.తమ కుమారుడు అభిషేక్ రెడ్డి అనారోగ్యంతో చనిపోయారని చెప్పారు. తమ కుమారుడి ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు శక్తివంచన లేకుండా ప్రయత్నించారని, కోమా నుంచి బయటపడతాడని ఆశించామని, దేవుడు చిన్న చూపు చూడటంతో మృతి చెందాడని తెలిపారు. ఎంతో భవిష్యత్ ఉన్న అభిషేక్‌రెడ్డి చిన్న వయస్సులో చనిపోవడం ఈ ప్రాంతంలో అందరినీ కలచివేసిందని చెప్పారు. అభిషేక్‌రెడ్డి పిల్లలను చూస్తే కడపు తరుక్కుపోతోందని ఆవేదన వ్యక్తంచేశారు.అభిషేక్ మృతి తమకు తీరని లోటని, ఆ బాధ నుంచి కోలుకోలేకపోతున్నామని తెలిపారు. ఇలాంటి తీవ్ర విషాద పరిస్థితుల్లో తాముంటే.. చిన్నాన్న వైఎస్ వివేకా నందరెడ్డి హత్య కేసులో సాక్షులు ఒక్కొక్కరుగా చనిపోతున్నారని, అందులో కుట్ర ఉందంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి పెడర్థాలు తీయడం, ప్రభుత్వ పెద్దలూ ఇదే విధంగా మాట్లాడటం దారుణమని అన్నారు. మామ డాక్టర్ ఈసీ గంగిరెడ్డి కరోనా వైరస్, అనారోగ్యంతో దీర్ఘ కాలం చికిత్స పొందుతూ చనిపోయారని తెలిపారు.మొన్న వాచ్‌మేన్ రంగన్న కూడా అనారోగ్యంతో చనిపోయాడని చెప్పారు. రంగన్నకు ఆయాసం ఉందని ఆయన కుటుంబ సభ్యులు కూడా చెబుతున్నారని, అతని అనారోగ్యం ఇక్కడి అందరికీ తెలుసునని చెప్పారు. వీరందరి సహజ మరణాలను అసహజ మరణాలుగా చిత్రీకరించేందుకు ఒక పథకం ప్రకారం ఎల్లో మీడియా పనిచేస్తోందని అన్నారు. బయటి ప్రపంచానికి పులివెందులలో దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని తెలియజెప్పేందుకు ఎల్లో మీడియా విశ్వప్రయత్నం చేస్తోందని, ప్రభుత్వ పెద్దల చర్యలూ ఇదే విధంగా ఉన్నాయని ధ్వజమెత్తారు.సిట్ కాదు.. జ్యుడీషియల్ విచారణ జరిపించండిచిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షులుగా ఉన్న వారు మృతి చెందిన వ్యవహారంపై ప్రభుత్వ సిట్ దర్యాప్తు అంటేనే ఏదో కుట్ర దాగి ఉందన్న అనుమానం వస్తోందని వైఎస్ మదన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సిట్ కాకుండా జ్యుడిషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అనేక మందిపై పెడుతున్న అడ్డగోలు కేసులు, చేపడుతున్న ఏకపక్ష విచారణ అందరమూ కళ్లారా చూస్తున్నామని, అందువల్లే సిట్‌పై నమ్మకం లేదని చెప్పారు. -
● మూగ జీవాలకు సేవ చేయాలనే లక్ష్యంతో..
కడప అగ్రికల్చర్: మాది వ్యవసాయ కుటుంబం. మా తల్లితండ్రులు కూడా వ్యవసాయంతోపాటు పాడి పశువులను పెంచేవారు. పాడి పశువులపై వారికి ఉన్న ప్రేమ చూసినేను కూడా బ్యాచురల్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ పూర్తి చేశా.పశుసంవర్ధకశాఖలో ఉద్యోగాన్ని సంపాదించి వేల మూగజీవాలకు సేవలందిస్తున్నానని జిల్లా పశుసంవర్థశాఖ అధికారి డాక్టర్ చెముడూరి శారదమ్మ చెబుతున్నారు. వివరాలు ఆమె మాటల్లో..మాది కలపాడు మండలం కలసపాడు గ్రామం. నేను 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఎగువ రామాపురంలో, 6,7,8 తరగతులను కలసపాడులో, 9, 10 తరగతులు పోరుమామిళ్లలో చదివాను. ఇంటర్‌ను కడపలోని బాలికల జూనియర్ కళాశాలలో, డిగ్రీ తిరుపతిలో పూర్తి చేశా.తర్వాత బ్యాచులర్ ఆఫ్ వెటర్నీరీ సైన్స్ తిరుపతిలో పూర్తి చేశాను. ● 1993లో చాపాడు మండలం వెదురూరులో తొలిసారిగా పశువైద్యాధికారిగా ఉద్యోగంలో చేరా. మూగ జీవాలకు వైద్యసేవలందిస్తూ..రైతు సంక్షేమం, అభివృద్ధి ద్యేయంగా పనిచేశాను. 2005 అసిస్టెంట్ డైరెక్టర్‌గా పదోన్నతి పొంది జమ్మలమడుగు ప్రాంతంలో పలు మండలాల్లో పనిచేశా. 2014లో డిప్యూటీ డైరెక్టర్‌గా పదోన్నతి పొంది కడపకు వచ్చా. ఇక్కడే పనిచేస్తూ 2021లో జిల్లా పశువైద్యాధికారిగా పదోన్నతి పొంది సేవలందిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా వైద్యులకు సూచనలు, సలహాలను అందిస్తూ రైతు అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నారు. తల్లితండ్రుల ఆశయాన్ని నేరవేరుస్తున్నందుకు ఆనందంగా ఉందని చెబుతున్నారు డాక్టర్ శారదమ్మ. -
● బాల్య వివాహాల నిర్మూలనకు కృషి
కడప కోటిరెడ్డిసర్కిల్: బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేశారు. 12 మంది పిల్లలను అధికారికంగా దత్తత ఇవ్వడంలో ప్రధాన పాత్ర పోషించారు. వన్‌స్టాఫ్ వచ్చే కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి స్కీములను ప్రజలకు చేరువయ్యేలా కృషి చేశారు. గర్భిణులు, రక్తహీనతతో బాధపడుతున్న చిన్నారులకు మంచి పౌష్టికాహారం అందేలా చూశారు. అమె ఎవరో కాదు జిల్లాలోని మహిళా శిశుసంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ దేవిరెడ్డి శ్రీలక్ష్మి. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఈమె ఎమ్మెస్సీ ఎంఈడీ చదివారు. బీఈడీ ఎంఈడీ తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు.మెదట సెకండరీ గ్రేడ్ టీచర్‌గా, తర్వాత స్కూల్ అసిస్టెంట్‌గా, జూనియర్ కళాశాల లెక్చరర్‌గా పనిచేశారు. 2007లో గ్రూప్–1కు సెలెక్ట్ అయ్యారు. డిప్యూటీ రిజిస్టర్ డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్‌గా రాజంపేటలో విధులు నిర్వహించారు. డిప్యూటీ కమిషనర్ ఇన్ కడప మున్సిపల్ కార్పొరేషన్, తర్వాత తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో పని చేశారు. తర్వాత శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్‌గా విధులు నిర్వహించారు.కడపలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా పని చేశారు.కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సెక్రటరీగా, వైస్ చైర్మన్‌గా పని చేశారు. ప్రస్తుతం మహిళా శిశు సంక్షేమశాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.బెస్ట్ మున్సిపల్ కమిషనర్ అవార్డు చిత్తూరు కలెక్టర్ నుంచి అందుకున్నారు. కడప కలెక్టర్ చేతుల మీదుగా ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా మెరిటేరియస్ అవార్డు అందుకున్నారు. ఇన్ని సాధించడం వెనక తల్లిదండ్రులు, అత్తమామ, భర్త గురుమోహన్‌రెడ్డి ప్రోత్సాహం ఉందని ఆమె చెబుతోంది.కష్టపడితే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని అంటున్నారామె. -
No Headline
పీలేరు: పీలేరు పట్టణానికి చెందిన మాజీ సైనికుడు టి. ప్రభాకర్‌రెడ్డి కుమార్తె టి. హోత్రిశ్రీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. చిన్నతనం నుంచే బ్మాడింటన్పై పట్టు సాధించి అనేక విజయాలు సొంతం చేసుకుంది. తండ్రి ప్రోత్సాహంతో గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి క్రీడాకారిణిగా గుర్తింపు పొందుతోంది. ఆమె తండ్రి ప్రభాకర్‌రెడ్డి జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. తన ఆరవ ఏటలోనే బ్యాడ్మింటన్‌లో అడుగుపెట్టిన హోత్రిశ్రీ 2017లో గోపిచంద్ అకాడమీలో జరిగిన జాతీయ స్థాయి సబ్ జూనియర్ పోటీల్లో పతకం గెలుపొందింది. రాజమండ్రిలో అండర్–15 విభాగంలో రాష్ట్ర చాంపియన్‌గా నిలిచింది. 2018లో నెల్లూరులో అండర్–14 విభాగంలో మినీ బ్యాడ్మింటన్ చాంపియన్‌గా నిలిచింది.2019లో ప్రొద్దుటూరు, బెంగళూరులో సౌత్‌జోన్ పోటీల్లో పాల్గొని ప్రశంసాపత్రాలను అందుకుంది. 2019లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అబ్దుల్ కలాం పురస్కారాన్ని స్వీకరించింది.2021లో బెంగళూరులో జరిగిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ చాంపియన్‌షిప్ పోటీల్లో విజేతగా నిలిచింది. ● 2024 సెప్టెంబరులో కడప జేఎన్టీయూ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో మెరుగైన ప్రదర్శన కనబరచి చైన్నెలో జరిగే సౌత్‌జోన్ పోటీలకు ఎంపికై నంది. ప్రస్తుతం కేఎంఎం ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండవ సంవత్సరం చదువుతోంది. అంతర్జాతీయ స్థాయి బ్మాడ్మింటన్ క్రీడాకారిణిగా రాణించాలన్నదే తన లక్ష్యమని హోత్రిశ్రీ చెబుతోంది. బ్యాడ్మింటన్ రాకెట్.. హోత్రిశ్రీ -
● ఆటాడించి...అగ్రస్థానంలో నిలిచి
విద్యార్థులకు ఆటపాటలు అక్కర్లేదని, అవి అన్నం పెట్టవని, పైగా చదువు పాడవుతుందని తల్లిదండ్రులు తేలిగ్గా చూస్తున్నారు. ఇలాంటి దశలో క్రీడారంగంలో తనదైన పట్టు సాధించి ఆణిముత్యాల్లాంటి విద్యార్థులను గుర్తించి వారి ప్రతిభను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళుతోంది ఆమె. తాను పనిచేస్తున్న పాఠశాల గౌరవాన్ని రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిపిన డ్యాషింగ్ లేడీ, కడప నగర పాలక సంస్థ (మెయిన్) స్కూలు ఫిజికల్ డైరెక్టర్ ఎల్.వెంకట లక్ష్మిదేవి. 2012లో ఆమె బదిలీపై మున్సిపల్ మెయిన్హైస్కూలుకు వచ్చారు. మైదానంలో దిగారు. అంతవరకు స్తబ్దుగా ఉన్న క్రీడాపరికరాలకు చలనం వచ్చింది. ఫలితంగా ఆ స్కూలు రాష్ట్ర స్థాయిలో రెండుసార్లు ద్వితీయ స్థానం దక్కించుకుంది. ఆ తర్వాత ఏకంగా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచి కడప పతాకాన్ని రెపరెపలాడించింది. దీంతో మన్సిపల్ హైస్కూలు మెయిన్ పాఠశాలను ప్రజలు క్రీడా పాఠశాలగా వ్యవహరిస్తున్నారు. మా వాడికి ఆటలు వద్దు అంటూ వెనక్కి తీసుకెళ్లిన బాలలను పదో తరగతిలో టాపర్లుగా నిలిపి వాళ్ల అభిప్రాయం తప్పని నిరూపించారు. తన శ్రమతో పలువురు విద్యార్థులను అంతర్జాతీయ స్థాయిలో క్రీడా బహుమతులు సాధించేలా చేసింది. ఫిజికల్ డైరెక్టర్‌గా ఎల్.వెంకటలక్ష్మి తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. ఇప్పుడామె వైఎస్సార్ జిల్లాలో క్రీడా శిక్షణకు ఐకాన్‌గా నిలిచారు. -
No Headline
కమలాపురం: ప్రస్తుత సమాజంలో రక్త సంబంధీకుల మృతదేహాలను చూసేందుకు జంకుతున్న తరుణంలో నేను సైతం అంటూ అనాథ మృత దేహాలకు అంత్య క్రియలు చేసేందుకు ముందుకు వస్తున్నారు కమలాపురం పట్టణం, కె. అప్పాయపల్లెకు చెందిన పాల మేరీ సునీత... కరోనా సమయంలో ఎవరైనా మృతి చెందితే సొంత కుటుంబ సభ్యులే చూసేందుకు ముందుకు రాని సందర్భాల్లో సునీత తన భర్త భూపాళం వెంకట లక్ష్మణ్ కుమార్ ప్రోత్సాహంతో అభి ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ విజయ్ బాబు సహకారంతో మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు ధైర్యంగా ముందుకు వచ్చారు. కరోనా కష్టకాలంలో 8 మంది మహిళల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. విజయ్ బాబు స్థాపించిన ట్రస్ట్‌లో 2021లో సభ్యురాలిగా చేరారు. ఎక్కడైనా అనాథమృత దేహాలు ఉన్నాయనే సమాచారం వస్తే సునీత తన భర్త లక్ష్మణ్, సోదరుడు కరుణాకర్, ట్రస్ట్ చైర్మన్ విజయ్‌బాబుతో కలసి అక్కడికి చేరుకుని మృతి చెందిన వారి మతాను సారం అంత్యక్రియలు నిర్వహిస్తూ, మానవత్వం చాటుతూ ముందుకు సాగుతున్నారు. ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఇప్పటి వరకు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మృతి చెందిన 42 మంది పేద, అనాధ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. ఎక్కడైనా అనాథ మృతదేహాలు ఉంటే తమకు సమాచారం ఇస్తే వచ్చి ఉచితంగా అంత్యక్రియలు నిర్వహిస్తామని చెబతోంది పాల మేరీ సునీత. మేరీ.. సేవా నారీ -
No Headline
వైఎస్సార్ జిల్లా చింతపూతాయపల్లె గ్రామానికి చెందిన చల్లగాలి మంజులారాణి కష్టతరమైన భావాలను గీతల్లో పలకించే విలక్షణ చిత్రకారిణి. భర్త గొల్లపల్లి జయన్న రాష్ట్ర ప్రభుత్వ హంస అవార్డు పొందిన చిత్ర, శిల్పకారుడు కావడంతో ఆమె తన ప్రతిభకు మెరుగులు దిద్దుకుంది. ప్రత్యేక శైలిగల చిత్రకారాణిగా ఆమె ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉనికిని చాటుకున్నారు. మహిళా సమస్యలను ప్రతిబింబించేలా ప్రతీకాత్మక చిత్రాలను గీయడం మంజులారాణికి రంగులతో పెట్టిన విద్య, మరీ ముఖ్యంగా మాతృత్వం తొణికిసలాడే అమ్మ చిత్రాలు, మురిపాలు ఆస్వాదిస్తూ తన్మయత్వంలో మునిగిన చిన్నారుల చిత్రాలు ఆమె చిత్రాలకు సంతకాలుగా నిలుస్తున్నాయి. ఆమె పలు జాతీయ, అంతర్జాతీయ చిత్ర కళా ప్రదర్శనల్లో పాల్గొని బహుమతులను సాధించారు.యువ చిత్రకారులను ప్రోత్సహిస్తున్నారు. ఆమె చిత్రం అపురూపం -
● బాలలు, మహిళల హక్కులే లక్ష్యం
మదనపల్లె సిటీ: సాయం చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు లలితమ్మ. మదనపల్లె పట్టణానికి చెందిన ఈమె లింగవిక్షకు గురైన బాధితురాలే. పెద్ద చదువులకు వెళ్లాలనుకున్నా పదో తరగతిలోనే చదువును ఆపాల్సి వచ్చింది. గాంధీ గ్రామీణాభివృద్ధ్ది సంస్థలో బాల్వాడీ టీచర్‌గా పని చేసేందుకు 1990లో ములకలచెరువు వెళ్లారు 1992 తంబళ్లపల్లె చేరుకుని అక్కడే పీపుల్స్ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్(ఫోర్డు) స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. బాల్యవివాహాలను రూపుమాపడమే కాకుండా బడిమానేసిన వారికి తిరిగి పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ, వాటర్ ఎయిడ్ ఇండియా, అమెరికాకు చెందిన చైల్డ్ రైట్స్ యు (క్రై) సంస్థలు ఆర్థిక చేయూత ఇవ్వడంతో బాలలు, మహిళల హక్కుల కోసం అనేక కార్యక్రమాలను చేపడుతున్నారు. -
No Headline
మదనపల్లెకు చెందిన ఆయిషా ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలోనే సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించింది. లక్షల్లో జీతం అయినా తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సా హంతో అనుకున్న లక్ష్యాన్ని సాధించి గ్రూప్–1కు సన్నద్ధమయ్యారు. తొలి ప్రయత్నం విఫలమైనా నిరాశ చెందలేదు. మళ్లీ పట్టుదలతో ప్రయత్నించి గ్రూప్–1 విజేతగా నిలిచింది. సాధారణ కుటుంబంలో పుట్టిన ఆమె అనకాపల్లి ఆర్డీవోగా విధులు నిర్వహిస్తున్నారు. మదనపల్లెకు చెందిన అహ్మద్‌బాషా చిరువ్యాపారి. తల్లి సాధారణ గృహిణి. క్యాంపస్ ఇంటర్వ్యూలో సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చినా తాను సివిల్స్ రాయాలని ఉందని తల్లిదండ్రులకు చెప్పడంతో వారి ప్రోత్సాహంతో పోటీ పరీక్షలు రాసి విజేతగా నిలిచారు. ఓటమే విజయానికి నాంది -
● తండ్రి స్ఫూర్తితో.. ఆయన అడుగుజాడల్లోనే...
కడప ఎడ్యుకేషన్: మేము చిన్నతనం నుంచే తండ్రి స్పూర్థితో తీసుకుని బాగా చదువుకుని నేడు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఎంతో మంది పిల్లలకు సేవలందిస్తున్నామని యోగివేమన విశ్వ విద్యాలయ రిజిస్ట్రార్ పుత్తా పద్మ పేర్కొన్నారు. వివరాలు అమె మాటల్లోనే.. ‘నా పేరు పుత్తా పద్మ. చెన్నూరు మండలం చిన్నమాచుపల్లి. తండ్రి నాగమునిరెడ్డి, తల్లి నీరజ. మా నాన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్‌గా పనిచేస్తూ చివరిగా కడప ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పదవీ విరమణ పొందారు. ఆయన లెక్చరర్‌గా పనిచేస్తూ ఎంతో మంది విద్యార్థులకు బోధనలందించి ప్రయోజకులను చేశారు. ఆయన స్ఫూర్తితో నేను కూడా బాగా చదువుకుని నేడు ఎంతో మంది విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నా. నేను ఎల్కేజీ నుంచి పదవ తరగతి వరకు కడపలోని విద్యామందిర్ స్కూల్లో చదువుకున్నాను. ఇంటర్‌ను అనంతపురంలోని నేషనల్ సాయిబాబా ఎయిడెడ్ కళాశాలలో, డిగ్రీ తిరుపతిలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో చదివాను. ఎంఏ, ఎంఫిల్ అనంతపురంలోని ఎస్కే యూనివర్సిటీలో, పీహెచ్డీ తిరుపతి మహిళా యూనివర్సిటీలో పూర్తి చేశాను. 1998లో నేను కడపలోని సుబ్బిరెడ్డి ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలో లెక్చరర్‌గా చేరాను. 2006లో ఎస్కేఆర్ అండ్ ఎస్కేఆర్ ప్రభుత్వ మహిళా కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తూ 2007లో కడపలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలకు బదిలీపై వెళ్లాను.2007 చివరిలో కడప యోగివేమన యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా చేరా. 2013లో ప్రొఫెసర్‌గా అక్కడే పదోన్నతి పొందా. అక్కడ సీనియర్ ఫ్యాకల్టీగా, చీఫ్ ఎగ్జామినర్‌గా, ఉమెన్ కన్వీనర్‌గా, హెచ్ఓడిగా, డీన్‌గా పలు హోదాల్లో పనిచేశా. ప్రస్తుతం ఎస్కే యూనివర్సిటీకి కూడా బోర్డ్ ఆప్ స్టడీస్ చైర్మన్‌గా, పులివెందుల జేఎన్టీయూకు బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్‌గా పనిచేస్తున్నా.’ కోవిడ్ సమయంలో వైవీయూలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌గా పనిచే సిన ఈమె జిల్లాలోని అన్ని కళాశాలల్లో కట్టదిట్టంగా పరీక్షలను నిర్వహించి మంచిపేరు తెచ్చుకున్నారు. -
● ’అభ్యాగుల పాలిట ‘స్వాతి’కిరణం
మదనపల్లె సిటీ: తనకు మాత్రమే ఎందుకు కష్టం వచ్చింది? అని ఆలోచించే బదులు నాలా మరెంత మందికి ఈ కష్టం వచ్చిందో.. వాళ్ల పరిస్థితి ఏమిటి అని ఆలోచించే మనస్తతత్వం అతి కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. అలాంటి రెండో కోవకు చెందుతుంది డాక్టర్ శంఖారపు స్వాతి. ఉద్యోగ,ఉపాధి కోసం తిరగని చోటంటూ లేదు. దీంతో తీవ్ర నిరాశ నిస్పహులకు లోనైనా నేడు ఆమె వేలాది మందికి నైపుణ్యాలను అందించి వారికి దారి చూపిస్తోంది. మదనపల్లె పట్టణానికి చెందిన డాక్టర్ స్వాతి తెలుగుభాషలో పీహెచ్డీ పూర్తి చేసిన తర్వాత పెద్దలు నిశ్చయించిన వారితో పెళ్లి చేసుకుని బెంగళూరులో అడుగుపెట్టింది. అంతా బాగానే ఉందనుకునే సమయానికి భర్తకు వ్యాపారంలో తీవ్రమైన నష్టాలు వచ్చాయి. దీంతో మరోదారి లేక డిగ్రీ పట్టా చేతపట్టి ఉద్యోగ వేటలో పడిన ఆమెకు ఎక్కడకెళ్లినా నిరాశే ఎదురయ్యేది. దీంతో మదనపల్లె పట్టణానికి చేరుకున్నారు. డబ్బు చెల్లించి కోర్సులు నేర్చుకునే స్థోమత లేక టైలరింగ్,కుట్లు, అల్లికలు, శారీరోలింగ్, ఫ్రాబిక్ పెయింటింగ్,ఎంబ్రాడయిరీ వంటి వాటిని ఆన్లైన్ ద్వారా సొంతంగా నేర్చుకుంటూ ప్రతిభను పెంచుకున్నారు.ఆకట్టుకునే డిజైన్లతో వస్త్రాలను కుట్టించేది. వచ్చిన డబ్బుతో బోటిక్, టైలరింగ్ షాపులను ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఒంటరి మహిళలు, వితంతువులు,సమాజంలో పడే కష్టాలను గమనించింది. అలాంటి వారికి చేయూత ఇవ్వాలన్న లక్ష్యంతో ధాత్రి ఫౌండేషన్ ప్రారంభించింది. తొమ్మిది మందితో ప్రారంభమై నేడు వెయ్యి మందికిపైగా మహిళలు ఇందులో సభ్యులుగా ఉన్నారు. రోగులకు, రైతులకు, విద్యార్థులకు, మహిళలకు చేయూతనిచ్చి వారికి నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ కల్పించి సూక్ష్మ రుణాల ద్వారా ఉపాధి కల్పించి వారి వికాసానికి తోడ్పతున్నారు. -
No Headline
కడపకు చెందిన శ్వేత మహిళా డిగ్రీ కళాశాలలో చదువుతున్నప్పుడు ఆసక్తిగల వారు ఫొటోగ్రఫీ సర్టిఫికెట్ కోర్సులో చేరవచ్చని ఆ విభాగం ట్రైనర్ ప్రొఫెసర్ ఎం.గురుమోహన్‌రెడ్డి ప్రకటించారు. శ్వేత ఆ కోర్సులో చేరింది. మిగతా వారి కంటే శ్రద్ధగా ఫొటోగ్రఫీలో టెక్నిక్స్ నేర్చుకుంది. చక్కటి యాంగిల్స్‌లో ఫొటోలు తీస్తుండడంతో ఆమెకు పలు ప్రాజెక్టుల్లో ఫొటోలు తీసే అవకాశం లభించింది. ప్రస్తుతం శ్వేత ఔట్‌డోర్ ఫొటోగ్రఫీలో కూడా ప్రతిభ చాటుతోంది. ఇటీవల టెంపుల్ ఫొటోగ్రఫీ విభాగంలో ఆమె తీసిన పుష్పగిరి దేవాలయాల ఫొటోలను చూసిన నాటి జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి అభినందించి ప్రశంసాపత్రాన్ని అందజేశారు. ‘క్లిక్’ అయ్యింది -
ప్రశాంతంగా ఇంటర్ పరీక్ష
కడప ఎడ్యుకేషన్: ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్ష శుక్రవారం ప్రశాంతంగా జరిగింది. మ్యాథ్స్–2ఎ, బాటనీ, సివిక్స్ పరీక్షలకు సంబంధించి 600 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆర్ఐవో బండి వెంకటసుబ్బయ్య తెలిపారు. జిల్లావ్యాప్తంగా 64 పరీక్షా కేంద్రాల్లో జనరల్, ఒకేషన్కు 15061 మందికి 14461 మంది హాజరయ్యారని చెప్పారు. టెన్త్ పరీక్షలకు ఉచిత ప్రయాణంకడప కోటిరెడ్డిసర్కిల్: ఈనెల 17వ తేదీ నుంచి ప్రారంభమయ్యే టెన్త్ పరీక్షలు రాయనున్న విద్యార్థులకు ఏపీఎస్ ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనుందని జిల్లా ప్రజా రవాణాధికారి పొలిమేర గోపాల్‌రెడ్డి తెలిపారు. విద్యార్థులు హాల్ టికెట్ ఆధారంగా ఏ విధమైన బస్సు పాస్ లేకపోయినా కూడా పల్లె వెలుగు/ అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో ఉచిత ప్రయాణించవచ్చన్నారు. పరీక్షలున్న రోజుల్లో విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. నిధుల అవకతవకలు: ఇద్దరిపై చర్యలు కడప సెవెన్‌రోడ్స్: గ్రామ పంచాయతీ నిధుల్లో అవకతవకలకు పాల్పడిన ఇద్దరిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటూ కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ప్రొసీడింగ్స్ జారీ చేశారు. రాజుపాలెం మండలం ఏరువపాలెం గ్రామ పంచాయతీ గ్రేడ్–3 సెక్రటరీగా పనిచేసి ప్రస్తుతం జిల్లా పరిషత్ రీసోర్స్ పర్సన్‌గా విధులు నిర్వర్తిస్తున్న బి.పుల్లారెడ్డి రూ. 4,25,986లను వ్యక్తిగతంగా డ్రా చేసుకుని స్వంత అకౌంట్లో జమ చేసుకున్నారని ఆరోపణలు రుజువు కావడంతో ఆయనను సస్పెండ్ చేశారు. అలాగే చాపాడు మండలం బద్రిపల్లె గ్రామ పంచాయతీకి చెందిన రూ. 2,56,325 దుర్వినియోగం చేసిన ఆరోపణలు రుజువు కావడంతో మండల స్థాయి కంప్యూటర్ ఆపరేటర్ షేక్ హనీఫ్బాషాను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 9న రాయలసీమ సమగ్ర అభివృద్ధిపై చర్చా వేదిక ప్రొద్దుటూరు: పట్టణంలో ఈనెల 9న రాయలసీమ సమగ్ర అభివృద్ధిపై ఉమ్మడి కడప జిల్లా స్థాయి చర్చావేదిక నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి వేదిక రాష్ట్ర కన్వీనర్ నాగరాజు తెలిపారు. శుక్రవారం ప్రొద్దుటూరు ఉపవిద్యాశాఖ కార్యాలయం వద్ద చర్చావేదిక కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన నేపథ్యంలో రాయలసీమ ప్రాంత ప్రజలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని తెలిపారు. కరువు ప్రాంతమైన రాయలసీమలో యువత ఉపాధి లేక వలస పోతున్నారన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక ఆర్థికంగా చితికిపోతున్నారన్నారు. ఈ చర్చా వేదికలో ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో రైతు సేవా సంఘం నాయకుడు ఏవీ రమణ, వీరనారాయణరెడ్డి, ఎర్ర వెంకటేష్, నాగిశెట్టి ప్రసాద్, మాధవరెడ్డి, భీమరాజు పాల్గొన్నారు. జాతీయ రహదారి భూసేకరణ పనులు పూర్తి చేయాలి కడప సెవెన్‌రోడ్స్: జిల్లాలో జాతీయ రహదారులకు సంబంధించి భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాల్లో జాతీయ రహదారి భూసేకరణ పురోగతి పనులపై రెవెన్యూ, జాతీయ రహదారి అధికారులతో జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ తో కలసి కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారి భూసేకరణకు సంబంధించి జిల్లాల్లో పెండింగ్ లో ఉన్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. టైటిల్ వివాదాలు,రెవిన్యూ భూ వివాదాలకు సంబంధించి ఓపెన్ ఫోరం ఏర్పాటు చేసి గ్రామాల వారీగా ప్రజలతో మాట్లాడి భూ సమస్యలను పరిష్కరించాలన్నారు. తొలుత జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ జాతీయ రహదారి భూసేకరణ పనుల పురోగతి పై ఆయా పనుల వారిగా అధికారులతో సమీక్షించారు. -
గంజాయి రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు
ప్రొద్దుటూరు క్రైం : గంజాయి అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా నార్కోటిక్ కంట్రోల్ సెల్, ప్రొద్దుటూరు పోలీసు అధికారులు హెచ్చరించారు. పట్టణంలోని ట్రాన్స్‌పోర్టు కార్యాలయాలు, గోడౌన్లలో శుక్రవారం డీఎన్సీసీ, పోలీసు అధికారులు తనిఖీలు నిర్వహించారు. జిల్లాలో గంజాయిని పూర్తిగా కట్టడి చేసే క్రమంలో వివిధ ప్రాంతాల నుంచి జిల్లాకు గంజాయి రవాణా జరగకుండా జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ ప్రత్యేక చర్యలు చేపట్టారని డీఎన్సీసీ సీఐ రమణారెడ్డి, టూ టౌన్ సీఐ యుగంధర్‌లు తెలిపారు. ఇందులో భాగంగా ప్రొద్దుటూరు పట్టణంలో ట్రాన్స్‌పోర్టు కార్యాలయాలు, గోడౌన్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించామన్నారు. వస్తు రవాణా వాహనాల్లో గంజాయి రవాణా జరిగితే ట్రాన్స్‌పోర్టు యాజమాన్యాలను కూడా బాధ్యులను చేస్తామని హెచ్చరించారు. అంగన్వాడీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం కాశినాయన : మండలంలోని కోడిగుడ్లపాడు మెయిన్ అంగన్వాడీ కేంద్రం కార్యకర్త టి.గురుదేవి శుక్రవారం వాస్మోల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పండింది. వెంటనే వారి బంధువులు గమనించి పోరుమామిళ్ళ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్ళారు. అక్కడ వైద్యులు ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే కోడిగుడ్లపాడు అంగన్వాడీ కేంద్రానికి నాడు–నేడు పనుల కింద రూ.14 లక్షలు నిధులు మంజూరయ్యాయి. కార్యకర్తే భవనాన్ని నిర్మించుకున్నారు. అయితే పోరుమామిళ్ల ఐసీడీఎస్ ఇన్చార్జి సీడీపీఓ లక్ష్మిదేవి రూ.22 వేలు డబ్బులివ్వాలని వేధించడం వలన కార్యకర్త గురుదేవి ఒకసారి రూ.10 వేలు, ఒకసారి రూ.12 వేలు ఇచ్చినట్లు గురుదేవి తెలిపారు. అంగన్వాడీ కేంద్రం కోడ్ మార్చేందుకు రూ.20 వేలు సీడీపీఓ అడిగిందని వాపోయింది. వేధింపులు తాళలేక వాస్మోల్ సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని బంధువులు తెలిపారు. ఈ విషయమై ఇన్చార్జి సీడీపీఓ లక్ష్మిదేవిని వివరణ కోరగా నాడు–నేడు పనులకు మాకు ఎటువంటి సంబంధం లేదని, అది ఇంజినీర్లు చూసుకుంటారని, నేను ఆమె వద్ద డబ్బులు తీసుకోలేదని తెలిపారు. ఉద్యోగ భద్రత కల్పించాలని ఆర్టీసీ ఎండీకి వినతి కడప కోటిరెడ్డిసర్కిల్ : రాష్ట్రంలో ఆర్టీసీలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 8 వేల ఔట్సోర్సింగ్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ముత్యాలరావు, కుమారనాయక్ కోరారు. శుక్రవారం విజయవాడలోని ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావును కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీలో కాంట్రాక్టు వ్యవస్థల వల్ల రోజురోజుకు కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కాంట్రాక్టర్ మారే ప్రతిసారి కార్మికులను ఉద్యోగం నుంచి తొలగిస్తూ కొత్త వారిని తీసుకుంటామని బెదిరింపులకు గురి చేస్తున్నారన్నారు. నేడే జాతీయ లోక్ అదాలత్ కడప అర్బన్: జిల్లా న్యాయసేవాధికారసంస్థ, కడప వారి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో ఈనెల 8న ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జాతీయలోక్ అదాలత్ నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 16 బెంచీలను ఏర్పాటు చేశారు. -
నాటుసారా నిర్మూలనే లక్ష్యం
కడప వైఎస్ఆర్ సర్కిల్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యక్రమమైన నవోదయం 2.0 పథకం అమలులో భాగంగా రాష్ట్రంలో నాటుసారా నిర్మూలనే లక్ష్యమని జిల్లా ప్రొహిబిషన్అండ్ ఎకై ్సజ్ ఆసిస్టెంట్ సూపరింటెంటెండ్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని కడప ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ స్టేషన్లో బెల్లం వ్యాపారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బెల్లం వ్యాపారులు తమ వద్ద ఉన్న స్టాక్, అమ్మకాలు తదితర వివరాలను ప్రతి 15 రోజులకు ఒకసారి ఎకై ్సజ్ స్టేషన్‌కి నివేదించాలన్నారు. అలాగే, బెల్లం అమ్మకాలు నాటుసారా తయారీదారులకు జరపరాదన్నారు. నాటుసారా తయారీకి బెల్లాన్ని సరఫరా చేసినట్టు తేలినట్లయితే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ బి.కృష్ణకుమార్ సబ్ ఇన్స్పెక్టర్ కె. నరసింహారావు సిబ్బంది పాల్గొన్నారు. 34 ఎర్రచందనం దుంగలు స్వాధీనం బద్వేలు అర్బన్ : బద్వేలు ఫారెస్టు రేంజ్ పరిధిలోని బ్రాహ్మణపల్లె సెక్షన్ సి.రామాపురం బీట్‌లోని అటవీప్రాంతంలో అక్రమంగా తరలిచేందుకు సిద్ధంగా ఉన్న 34 ఎర్రచందనం దుంగలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేయడంతో రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి టాస్క్‌ఫోర్స్ పోలీసులు పేర్కొన్నారు. స్థానిక సిద్దవటం రోడ్డులోని ఫారెస్టు బంగ్లా ఆవరణలో శుక్రవారం ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. బ్రాహ్మణపల్లె సెక్షన్ రామాపురం అటవీప్రాంతంలో గల ఎద్దులబోడు ప్రాంతంలో ఎర్రచందనం దుంగలు అక్రమ రవాణా చేసేందుకు సిద్ధంగా ఉంచారని టాస్క్‌ఫోర్స్ ఉన్నతాధికారులకు రాబడిన సమాచారం మేరకు ఆర్ఐ చిరంజీవులుకు చెందిన ఆర్ఎస్ఐ నరేష్ బృందం గురువారం నుండి అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో అటవీ ప్రాంతంలో అనుమానాస్పదంగా రెండు ద్విచక్ర వాహనాలు, ముగ్గురు వ్యక్తులు తారసపడ్డారు. వారు టాస్క్‌ఫోర్స్ పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నం చేయగా టాస్క్‌ఫోర్స్ సిబ్బంది వెంబడించి పట్టుకున్నారు. వారిని విచారించగా సమీప అటవీ ప్రాంతంలో దాచి ఉంచిన 34 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామని, దుంగల విలువ సుమారు రూ.32 లక్షలు ఉంటుందని వారు తెలిపారు. దుంగలతో సహా స్మగ్లర్లను తిరుపతి టాస్క్‌ఫోర్స్ పోలీసుస్టేషన్‌కు తరలించారని, ఎస్ఐ రఫీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని వారు తెలిపారు. ‘బేసిక్ ప్రైమరీ పాఠశాలలను రద్దు చేస్తే ఉద్యమిస్తాం’ కడప ఎడ్యుకేషన్: అసంబద్ధంగా తరగతుల విలీనాన్ని చేస్తూ బేసిక్ ప్రైమరీ పాఠశాలలను రద్దు చేయాలని చూస్తే ఉద్యమిస్తామని ఎస్టీయూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఇలియాస్ బాషా నర్రెడ్డి సంగమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వారు కడపలో విలేకరులతో మాట్లాడుతూ 117 జీవో రద్దు పేరుతో పాఠశాలల పునర్విజన ప్రక్రియలో భాగంగా మోడల్ ప్రైమరీ పాఠశాలలను ఏర్పరుస్తున్నామని చెబుతూ బేసిక్ ప్రైమరీ పాఠశాలలలోని 3,4,5 తరగతుల విద్యార్థులను ఐదు కిలోమీటర్ల పరిధిలోని మోడల్ ప్రైమరీలకు విలీనం చేస్తూ మండల స్థాయి అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారన్నారు. అలాగే మూడో తరగతి విద్యార్థి తన గ్రామంలో ఉన్న బడిని కాదని ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మరొక ప్రాథమిక పాఠశాలకు ఎలా వెళ్లగలరని ప్రశ్నించారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు ఆలోచించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కోరారు. ఈ విధానం ప్రాథమిక విద్యావ్యవస్థకు పెను ప్రమాదమని, తక్షణం గ్రామాల్లో బేసిక్ ప్రైమరీ పాఠశాలలను కాపాడుకోవడానికి చైతన్యం తీసుకురావాలన్నారు. -
కేసీ కెనాల్‌కు ఏప్రిల్ 15 వరకు నీరివ్వాలని వినతి
కడప సెవెన్‌రోడ్స్ : కేసీ కెనాల్‌కు ఏప్రిల్ 15 వరకు సాగునీరు అందించి పంటలను ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ నాయకుడు రెడ్యం వెంకట సుబ్బారెడ్డి శుక్రవారం కలెక్టర్ శ్రీధర్ చెరుకూరికి విన్నవించారు. కెనాల్‌కు నీరు రాకపోవడంతో మిరప, మినుము, వరి, పెసర, పసుపు పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీశైలం జలాశయంలో 846.7 అడుగుల నీరు మాత్రమే ఉందన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా 841 అడుగులు చేరే వరకు నీరు డ్రా చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద 15 రోజుల క్రితమే నీరు నిలిపి వేశారన్నారు. ముచ్చుమర్రి లిఫ్ట్ వద్ద నుంచి కేసీ కెనాల్‌కు 805 అడుగుల వరకు నీటిని తీసుకునే వీలుందన్నారు. ఈ పరిస్థితుల్లో పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి ద్వారా నీటిని వదిలి కేసీ కెనాల్ ఆయకట్టు పైర్లను కాపాడాలన్నారు. కనీసం మార్చి చివరి వరకై నానీరు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న వేసవిలో బోరు బావుల్లో భూగర్బ జలాలు పెరిగేలా చర్యలు చేపట్టి తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. రాజోలి జలాశయాన్ని 2.95 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తే కేసీ కెనాల్ కింద రెండు పైర్లు సాగు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. -
నిత్యపూజకోనకు ఆర్టీసీ బస్సు
కడప కోటిరెడ్డిసర్కిల్ : ప్రముఖ శైవ క్షేత్రమైన నిత్యపూజకోనకు భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సు సర్వీసును నడుపున్నామని ఆర్టీసీ కడప డిపో మేనేజర్ డిల్లీశ్వర్రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బస్సు కడప ఆర్టీసీ బస్టాండు, పాత బస్టాండ్, కృష్ణ సర్కిల్, శంకరాపురం, అప్సర సర్కిల్, చిన్న చౌక్, రామాంజనేయ పురం, భాకరాపేట ,సిద్ధవటం, ఎస్. రాజంపేట, వంతాటిపల్లె, ఆవులసత్రం మీదుగా నిత్యపూజకోనకు వెళుతుందన్నారు. ఈనెల 10వ తేదీన ఉదయం 07:00 గంటలకు కడప నుంచి బయలుదేరుతుదని, తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2:30 –3.00 గంటల మధ్య (భక్తుల రద్దీ అధారంగా )పంచలింగాల నుంచి బయలుదేరి కడపకు చేరుతుందన్నారు. చార్జి రూ. 40గా నిర్ణయించామని తెలిపారు. పొలంలో కేబుల్ వైర్ల చోరీ ఖాజీపేట : రైతుల పొలాల్లో కేబుల్ వైర్ల చోరీ చేసే దొంగలు మళ్లీ తమ చేతి ప్రతాపం చూపిస్తున్నారు. శుక్రవారం కన్నెలవాగు చెరువుకు వెళ్లే మార్గ మధ్యలోని ఇద్దరు రైతుల పొలాల్లో కేబుల్ కట్‌చేసి కాపర్ వైర్‌ను చోరీ చేశారు. అంతెం సుబ్బరాయుడు (కాటయ్య) అరటితోట సాగు చేస్తున్నాడు. తన పొలంలో ఉన్న కేబుల్ వైర్ 14 మీటర్లను దొంగలు కట్‌చేసి వెళ్లిపోయారు. పక్కపొలంలోని ములపాక ఈశ్వర్‌రెడ్డి మూడు ఎకరాల్లో అరటి సాగు చేస్తున్నాడు. మోటారు దగ్గర ఉన్న 25 మీటర్ల కేబుల్ వైర్‌ను కట్‌చేసి దొంగలు ఎత్తుకెళ్లారు. కేబుల్ వైర్ల చోరీ మండలంలో తరచూ జరుగుతూనే ఉన్నాయి. చోరీలపై పోలీసులకు రైతులు ఫిర్యాదు చేశారు. హత్య కేసులో నిందితుడి అరెస్టు పెండ్లిమర్రి : మండలంలోని గంగనపల్లె హరిజనవాడలో ఈనెల 2వ తేదీ రాత్రి భార్యను హత్య చేసి పరారైన నిందితుడిని అరెస్టు చేసినట్లు కడప రూరల్ సీఐ చల్లని దొర తెలిపారు. శుక్రవారం పెండ్లిమర్రిలో ఆయన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదనే కోపంతో భార్య లూర్థు మేరీని భర్త సుబ్బరాయుడు విచక్షణ రహితంగా కొట్టడంతో తీవ్ర గాయాలై మృతి చెందింది. మృతురాలి కుమారై నాగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేయగా భర్త సుబ్బరాయుడు హత్య చేసినట్లు తెలిసిందన్నారు. పరారీలో ఉన్న నిందితుడు రెవెన్యూ అధికారుల ద్వారా పోలీసు స్టేషన్‌కు హాజరై నేరాన్ని అంగీకరించారన్నారు. నిందితుడిని రిమాండ్ నిమిత్తం జూడిషియల్ మేజిస్టేట్ వద్దకు పంపామన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ మధుసూదన్‌రెడ్డి, పోలీసులు పాల్గొన్నారు. -
జ్యోతి క్షేత్రంపై కూటమి ప్రభుత్వం కక్ష
పోరుమామిళ్ల : జ్యోతి క్షేత్రంపై కూటమి ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నట్లు ఉంది. లక్షలాదిమంది భక్తులకు ఆరాధనీయుడైన కాశినాయన జ్యోతిక్షేత్రంలో నిర్మాణాలు కూల్చి వేయడం సరికాదని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం జ్యోతిక్షేత్రంలో మూడు కట్టడాలు కూలగొట్టడంపై ఎమ్మెల్సీ స్పందించారు. సాయంత్రం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కడప, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కాశినాయన భక్తులు ఉన్నారని, ఆయన పేరుతో ఎన్నో ఆశ్రమాలు, ఆలయాలు వెలశాయన్నారు. జ్యోతిక్షేత్రంలో సంవత్సరానికి ఒకసారి జరిగే ఆరాధనకు లక్షల మంది భక్తులు వస్తున్నారన్నారు. గత మూడు దశాబ్దాలుగా ప్రతిరోజూ ఇక్కడికి భక్తులు వస్తున్నారని, నిత్య అన్నదానం సజావుగా కొనసాగుతోందన్నారు. ఫారెస్టు అధికారులు అక్కడ కట్టడాలు కూలగొట్టడం అన్యాయమన్నారు. రెండు నెలలకిందటే అటవీశాఖ మంత్రి పవన్‌కళ్యాణ్‌కు వినతిపత్రం ఇవ్వడం జరిగిందని, అయినా ఇపుడు దుర్మార్గంగా కూలగొట్టడం కూటమి ప్రభుత్వం కక్షతో చేస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. అడవుల్లోనే దేవస్థానాలు ఉన్నాయని, తిరుపతి, శ్రీశైలం తదితర వేలాది దేవస్థానాలు అడవుల్లో ఉన్నాయని, ఇక్కడ జ్యోతి నరసింహస్వామి దేవస్థానం ఎన్నో శతాబ్దాలుగా ఉందన్నారు. అక్కడే కాశినాయన దేహపరిత్యాగం చేయడంవల్ల ఆయన ఆలయం నిర్మించారన్నారు. ఎంతో ప్రసిద్ధి పొందిన కాశినాయన ఆశ్రమం కూలగొట్టేందుకు జరుగుతున్న ప్రయత్నం మంచిది కాదన్నారు. ప్రజల మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నం విరమించుకొని ప్రభుత్వం భక్తులు ఆందోళన చెందకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో ఎంపీ నిధులతో, ప్రభుత్వ నిధులతో అక్కడ అభివృద్ధి పనులు చేయడం జరిగిందని, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎందుకు ఇలాంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారో తెలియడం లేదన్నారు. ప్రభుత్వం, అటవీశాఖ మంత్రి స్పందించి భక్తుల ఆశలను కాపాడాలన్నారు. భక్తుల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే నిర్మాణాలు కూలగొట్టడం సరికాదు ఎమ్మెల్సీ గోవిందరెడ్డి -
సమస్య పరిష్కారం కానిదే ప్రజాభిప్రాయ సేకరణ వద్దు
మైలవరం : దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీతో ఇబ్బందులు పడుతున్న గ్రామస్థుల సమస్యలను పరిష్కారం చేయకుండానే యాజమాన్యం విస్తరణ పనులకు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం సరైంది కాదని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని దుగ్గన పల్లి గ్రామంలో మిర్చి రైతు ఛీపాటి మోషే ఆత్మహత్య చేసుకోవడంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు మృతదేహానికి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా గ్రామస్థులందరూ మోషే మరణానికి పంట దిగుబడే కాకుండా తమ గ్రామాలకు పక్కనే ఉన్న దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న ధూమ్ము ధూళీతోపాటు బూడిద పంటలపై పడటం, కాంపౌండ్ ప్రహరీ నిర్మాణం వల్ల వర్షకాలంలో పొలాల్లో నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండటం వల్ల పంటలు దెబ్బతింటున్నాయని ఎమ్మెల్సీ ముందు వివరించారు. అనంతరం ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ సమస్యలున్న గ్రామాలల్లో వాటి పరిష్కారానికి ప్రయత్నం చేయకుండా ఆగమేఘాలపై ప్రజాభిప్రాయ సేకరణ నోటిఫికేషన్ ఇవ్వడం ఎమిటని ప్రశ్నించారు. 4.6 మెట్రిక్ టన్నుల నుంచి 12.6 మెట్రిక్ టన్నులకు ఉత్పత్తి పెరిగితే ప్రస్తుతం వస్తున్న నష్టాలు మరింతగా పెరిగే అవకాశం ఉందన్నారు. వర్షపు నీరు వంకల్లో ప్రవహించకుండా దాల్మియా యాజమాన్యం వంకలను పూర్తిగా ఆక్రమించి ప్రహరీ నిర్మాణం చేశారు. నేను కూడా సివిల్ ఇంజినీర్నేనని, నీటి ప్రవాహం ఏ మేరక ప్రవహిస్తుందో ఆర్థం చేసుకోగలనన్నారు. కొంత మంది అధికారులు తప్పుడు రిపోర్టులతో పరిసర గ్రామస్థులను మరింత నష్టపరిచేలా చేస్తున్నారన్నారు. జిల్లా కలెక్టర్ చోరవ తీసుకుని గ్రామాలల్లో పర్యటించి సమస్యను పరిష్కరం చేయాలన్నారు. కార్యక్రమంలో పొన్నపురెడ్డి గిరిధర్‌రెడ్డి జిల్లా అధికార ప్రతినిధి మోహన్‌రెడ్డి, మండల కన్వీనర్ మహేశ్వరరెడ్డి, శివగుర్విరెడ్డి, ఆంజనేయులు, వినయ్‌రెడ్డి, మున్సిపల్ జిల్లా అధ్యక్షుడు హృషికేశవరెడ్డి,పోరెడ్డి మహేశ్వరరెడ్డి విశ్వనాథ్‌రెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి -
యథేచ్ఛగా అక్రమ కట్టడాలు
సాక్షి ప్రతినిధి, కడప : అది గ్రామ కంఠం స్థలం. సెంటు లక్షలాది రూపాయాలు పలుకుతున్న విలువైన భూమి. ఆ భూమిలో యథేచ్ఛగా అక్రమ కట్టడాలు వెలుస్తున్నాయి. రెవెన్యూ అధికారులు అటు వైపు కన్నెత్తి చూడడం లేదు. తెలియదని భావిస్తే తప్పులో కాలేసినట్లే. ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమవుతోందని ఫిర్యాదులున్నాయి. అయినా కూడా కట్టడి చేసేందుకు ప్రయత్నమే చేయలేదు. అక్రమ కట్టడాలు మేడలుగా వెలుస్తున్నాయి. దువ్వూరు మండలం మారుమూల గ్రామంలో ఓ కుటుంబం 2009లో డీ ఫారమ్ పొందారు. 1935 నుంచి అక్కడే నివాసం ఉంటుండడంతో అప్పటి రెవెన్యూ అధికారులు మంజూరు చేశారు. ఆ స్థలంలో నివాసంతోపాటు డాబా కూడా నిర్వహిస్తూ జీవనోపాధి పొందుతోంది. ఇంటి పన్నులు, కరెంటు బిల్లులు చెల్లింపులు కూడా ఉన్నాయి. అయితే డాబా కేసీ కెనాల్ పొరంబోకు స్థలంలో ఉందని కూల్చేందుకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ పరస్పర విరుద్ధ వైఖరికి దువ్వూరు రెవెన్యూ యంత్రాంగం తెరలేపింది. మండల కేంద్రమైన దువ్వూరులో సర్వే నంబర్లు 387/27లో 1.84 ఎకరాలు, 371/25లో 1 ఎకరం, 371/24లో 1.24 ఎకరాలు, 1430లో 50 సెంట్లు, 371/3లో 82 సెంట్ల ప్రభుత్వ భూమి ఉంది. రెవెన్యూ రికార్డుల్లో సైతం గ్రామకంఠంగా ఉంది. ఆయా భూముల్లో గ్రామ సచివాలం, సీ్త్ర శక్తి భవనం, వ్యవసాయ, హౌసింగ్ కార్యాలయాలు సైతం వెలిశాయి. ఆ ప్రాంతంలో సెంటు లక్ష రూపాయాలు పైబడి ధర పలుకుతోంది. ఈ పరిస్థితుల్లో గ్రామ కంఠం భూమి అన్యాక్రాంతమవుతోంది. అక్రమ కట్టడాలు యథేచ్ఛగా వెలుస్తున్నాయి. కట్టడి చేయాలని గ్రామస్థులు, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి సైతం జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. రెవిన్యూశాఖ నుంచి ఆశించిన ఫలితం కనిపించలేదు. పునాదులు పెద్ద పెద్ద భవంతులుగా వెలుస్తున్నా, అటువైపు రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడడం కూడా చేయలేదు. అధికార పార్టీ మద్దతుదారులు ఆక్రమణదారులుగా అవతరించడమే అసలు కారణం. ఇడమడకలో శరవేగంగా పావులు.... దువ్వూరు మండలం ఇడమడక గ్రామంలో నగిరి సుబ్బమ్మ, నగిరి సుభాషిణిలకు 2009లో రెవెన్యూ అధికారులు డీఫారమ్తోపాటు అనుబంధ ఫారమ్ (నివేశస్థల స్వాధీన ధ్రువీకరణ పత్రం) ఇచ్చారు. వారి కుటుంబం అదే స్థలంలో1935 నుంచి జీవిస్తున్నారు. అక్కడే ఇళ్లు, పక్కనే డాబా పెట్టుకొని జీవనం గడుపుతున్నారు. ఇంటిపన్నులు, విద్యుత్ బిల్లులు అన్నీ ఉన్నాయి. దాదాపు 90 ఏళ్లుగా మూడు తరాలకు చెందిన ఆ కుటుంబ సభ్యులు అక్కడ జీవిస్తున్నారు. కాగా రెవెన్యూ అధికారులు కేసీ కెనాల్ స్థలమంటూ కూల్చేందుకు నోటీసులు జారీ చేశారు. ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదు మేరకే... ఇడమడక గ్రామంలో శ్రీకాంత్ కుటుంబం కేసీ కెనాల్ స్థలాన్ని ఆక్రమించుకున్నారని ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు తహాసీల్దార్ కోర్టులో విచారణ చేపట్టాం. శ్రీకాంత్ కుటుంబానికి మంజూరైన డీఫారమ్ సర్వే నంబర్లు వేరుగా ఉన్నాయి. విచారణలో ఆ విషయం తేటతెల్లమైంది. తీర్పు వెలువడిన తర్వాత ఆర్డీఓ కోర్టుకు కూడా వెళ్లారు. అక్కడ కూడా కేసీ కెనాల్ స్థలమేనని తీర్పు లభించింది. ఆ మేరకే నోటీసులు జారీ చేశామని దువ్వూరు తహాసీల్దార్ అక్బల్‌బాషా తెలిపారు. కక్ష్య సాధింపు చర్యలకు అండగా.... ఇడమడక గ్రామంలో ఎన్నికలకు ముందు నగిరి సుభాషిణి భర్త శ్రీకాంత్ మద్దతును తెలుగుదేశం పార్టీ నాయకులు కోరారు. అప్పట్లో రాజకీయాలతో నిమిత్తం లేకుండా తన పని చేసుకున్న శ్రీకాంత్‌కు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో ఇబ్బందులు తలెత్తాయి. ఎలాగైనా సరే శ్రీకాంత్ కుటుంబం పొట్ట కొట్టాలనే తలంపుతో అధికార పార్టీ నేతలు ఉన్నారు. వారి సిఫార్సులకు అనుగుణంగా రెవెన్యూ అధికారులు చర్యలున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. మరోవైపు తెలుగుదేశం నేతలను ప్రసన్నం చేసుకోవాలని దువ్వూరు రెవెన్యూ అధికారులు ఉచిత సలహా కూడా ఇస్తున్నట్లు సమాచారం. దీనిని బట్టి టీడీపీ నేతల కళ్లల్లో ఆనందం చూసేందుకోసమే రెవెన్యూ యంత్రాంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. గ్రామ కంఠం భూములపై ఫిర్యాదు చేసినా పట్టించుకోని రెవెన్యూ యంత్రాంగం డీ ఫారమ్ పొందిన స్థలాల్లో కట్టడాలు కూల్చేందుకు సన్నద్ధం వింత వైఖరిలో దువ్వూరు రెవెన్యూ అధికారులు -
No Headline
మహిళలు సున్నితమైన వారు.కష్టమైన పనులు చేయలేరు...అన్నది ఇంతవరకు ప్రజల్లో ఉన్న నమ్మకం. కానీ ఇటీవలి కాలంలో ఆ అభిప్రాయం చెల్లాచెదురై పోయింది. ఇంటి నుంచి మింటి వరకు అవకాశాలను అందిపుచ్చుకుంటూ అన్నింటా తానై దూసుకుపోతోంది మగువ. అబ్బురపరిచే విజయాలతో అందరి అభినందనలు అందుకుంటోంది వనిత. అనిర్వచనీయ పాత్రలో అంతులేని ఆత్మవిశ్వాసంతో తనకు తానే సాటిగా..పోటీగా మందుకు సాగుతోంది నేటి మహిళ. భూమిని చీల్చి పంటలు పండించడం నుంచి ఆకాశంలో రివ్వుమని విమానాలు నడపడంలో కూడా ప్రతిభ చూపుతున్నారు. కొలిమి పనులు, ఖాకీ దుస్తుల ఉద్యోగాల నుంచి రైలు పైలెట్లుగా, ఆర్టీసీ కండక్టర్లుగా రాణిస్తున్నారు. కొన్నిచోట్ల తమకు మాత్రమే గల సున్నితత్వాన్ని ప్రదర్శిస్తూ ప్రత్యేకతలు చాటుకుంటున్నారు. దేంట్లో అయినా తగ్గేదేలా అంటున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం. –కడప కల్చరల్ -
అసెంబ్లీలోనూ అబద్ధాలా..?
ప్రొద్దుటూరు : వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలోని ఇళ్ల నిర్మాణానికి మొత్తం 476.06 ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు భూమిని అధికారులు సేకరించారు. ఇందు కోసం ప్రైవేట్ వ్యక్తుల భూమి కొనుగోలుకు సంబంధించి రూ.162,53,46,033.60 చెల్లించారు. పలు మార్లు అప్పటి రెవెన్యూ అధికారులు రైతులతో సమావేశాలు నిర్వహించి భూమిని కొనుగోలు చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భూముల కొనుగోలుకు సంబంధించిన మొత్తాన్ని రైతుల బ్యాంకుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. కాగా ఈ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి రూ.700–800 కోట్ల అవినీతి జరిగిందని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి గురువారం అసెంబ్లీలో మాట్లాడటం చర్చాంశనీయంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోపూర్వం ప్రతి ఏటా పే దలకు 500 లోపుగానే ఇళ్లు మంజూరు చేసే పరిస్థితి ఉండేది. 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ నియోజకవర్గానికి సంబంధించి ఒక్క ఇంటి నిర్మాణానికి కూడా భూ సేకరణ జరగలేదు. త ద్వారా పేదలు తీవ్రంగా నష్టపోయారు. టిడ్కో ఇళ్ల ని ర్మాణం మధ్యలో ఆగిపోయిన విషయం తెలిసిందే. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాలు – పేదలందరికి ఇళ్లు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. విడతల వారిగా కాకుండా ఎంత మందికి అర్హత ఉంటే అంత మందికి ఇళ్లు మంజూరు చేయాలని నిర్ణయించారు. సచివాలయాల ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో.. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదల ఇళ్ల కోసం ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన 476.06 ఎకరాల భూమిని సేకరించారు. ఇందులో రా మేశ్వరం జగనన్న కాలనీకి సంబంధించి ఎకరా రూ. 27,63,750 ప్రకారం 70.34 ఎకరాలకు రూ.34,73, 20,462.50 చెల్లించారు. బొల్లవరం జగనన్న కాలనీకి సంబంధించి ఎకరా రూ.40,26,667 ప్రకారం 213.30 ఎకరాలకు రూ.85,88,88,071.10 చెల్లించారు. మీనాపురం జగనన్న కాలనీకి సంబంధించి ఎక రా రూ.40లక్షల ప్రకారం 104.73 ఎకరాలు భూమికి రూ.41,89,00,000 చెల్లించారు. ఇవి కాక గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ భూమిని సేకరించి 894 ఇళ్లను మంజూరు చేయడం జరిగింది. ప్రొద్దుటూరు మండలంలోని మూడు జగనన్న కాలనీలకు సంబంధించి మున్సిపాలిటీ పరిధిలోని 41 వార్డులతోపాటు కొత్తప ల్లె, గోపవరం, బొల్లవరం సోములవారిపల్లె, దొరసానిపల్లె, చౌటపల్లె గ్రామాలను కలపడం జరిగింది. ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి సంబంధించి 15,825, గ్రామాలకు సంబంధించి 5,763 కలిపి మొత్తం 21,588 ఇళ్ల పట్టాలను తొలి విడతగా మంజూరు చేశారు. వచ్చిన దరఖాస్తులను బట్టి జగనన్న కాలనీల్లో అదనంగా ఇంటి పట్టాలు మంజూరు చేశారు. నిర్మాణంలో ఆలస్యం చాలా కాలం తర్వాత ఒకే మారు ప్రభుత్వం ఇళ్ల స్థలాలకు దరఖాస్తులు స్వీకరించడంతో పెద్ద ఎత్తున ప్రజలు దరఖాస్తు చేసుకున్నారు. వేల సంఖ్యలో ఇళ్ల నిర్మాణాలు మంజూరయ్యాయి. ఎలాగైనా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని అప్పటి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పలు మార్లు సమీక్షలు నిర్వహించి అధికారులపై ఒత్తిడి చేశారు. ఇప్పటికీ చాలా మంది కాంట్రాక్టర్లకు ప్రభుత్వం నుంచి బిల్లులు రావాల్సి ఉంది. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే ఇందులో రూ.కోట్ల అవినీతి జరిగిందని అసెంబ్లీలో ఎమ్మెల్యే వరద మాట్లాడటం హాస్యాస్పందంగా ఉంది. విజిలెన్స్ విచారణఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఇళ్ల నిర్మాణంపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని సీఎంకు ఫిర్యాదు చేశారు. పలు మార్లువిజిలెన్స్ అధికారులు విచారణ జరిపారు. విచారణ తమకు అనుకూలంగా జరగలేదని ఎమ్మెల్యే ఈ సందర్భంగా వారిని కూడా విమర్శించారు. జగనన్న కాలనీల నిర్మాణాలపై రూ.700–800 కోట్ల అవినీతా? ప్రభుత్వం కొనుగోలు చేసిన భూమి విలువ రూ.162.53 కోట్లు మాత్రమే రైతుల పేర్లతోనే బ్యాంకుల్లో డబ్బు జమ -
● సేవా పథంలో పయనం
కడప నగరానికి చెందిన నెమలిదిన్నె నాగవేణి పరిచయం అవసరం లేని సామాజిక సేవా కార్యకర్తగా గుర్తింపు సాధించుకున్నారు. నిజానికి ఆమె నిరుపేద కుటుంబానికి చెందిన యువతి. అయినా నగర పరిధిలోని అనాథ, వృద్ధులు, మహిళల ఆశ్రమాల్లో దుప్పట్లు, నూతన వస్త్రాలు, అన్నదానాలు చేస్తూ వారి అభిమానాన్ని సాధించుకున్నారు. రక్త సేకరణ శిబిరాలు, గుండె సంబంధిత వైద్య శిబిరాలు నిర్వహిస్తుంటారు. దీపావళికి జువైనల్ హోంలోని బాలలందరికీ నూతన వస్త్రాలు, విందు భోజనం అందిస్తారు. వారితో కలిసి టపాసులు కాల్చి ఆనందిస్తారు. అధికారుల చుట్టూ తిరుగుతూ సేవా కార్యక్రమాల్లో వారు కూడా భాగస్వాములు అయ్యేలా చూస్తారు. ప్రైవేటుగా పీజీ చేస్తున్న ఆమె ప్రస్తుతం కడప నగరంలో పర్యాటక శాఖలో చిరుద్యోగిగా సేవలు అందిస్తున్నారు. ఇంతవరకు ఒక్క అన్నం పొట్లం కూడా ఇంటికి తీసుకెళ్లని ఆమెను విశ్వసించిన పలువురు మానవతా వాదులైన దాతలు ఆమె ద్వారా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తనపై ఉన్న నమ్మకాన్ని చిరకాలం నిలబెట్టుకునేందుకే ప్రయత్నిస్తానని, తనను చూసిన వెంటనే ఆర్తుల ముఖాల్లో కనిపించే వెలుగును చూస్తే తన హృదయం ఆనందంతో నిండిపోతుందనంటారు నాగవేణి. అందుకు ఆమెను జిల్లా స్థాయి అధికారులు సైతం అభిమానిస్తారు. -
ఎంఎస్ఎంఈలతో అభివృద్ధి సాధ్యం
కడప కోటిరెడ్డిసర్కిల్ : సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈల) సాధికారతతో దేశ సామాజిక, ఆర్థిక పరిపుష్టి సాధ్యం అవుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. గురువారం కడప–పులివెందుల రోడ్డులోని మహాలక్ష్మి ఫంక్షన్ హాలులో యూనియన్ బ్యాంకు వారు ఏర్పాటు చేసిన ‘మెగా ఎంఎస్ఎంఈ ఔట్ రీచ్ క్యాంపు’ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యూనియన్ బ్యాంకు ఎంఎస్ఎంఈ జీఎం జి.కె.సుధాకర్, కడప రీజినల్ మేనేజర్ లక్ష్మీతులసి అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కడప యూనియన్ బ్యాంకు సంస్థ ఎంఎస్ఎంఈల కోసం ప్రత్యేక ఔట్ రీచ్ కార్యక్రమం ద్వారా ప్రజల్లో వ్యాపార, పెట్టుబడి ధోరణిలో పారిశ్రామిక రంగం వైపు అవగాహన పెంచడం అభినందనీయం అన్నారు. పరిశ్రమలలో ఒక భాగంగా ఉన్న ఎంఎస్ఎంఈ విభాగాన్ని ఒక ప్రత్యేక పారిశ్రామిక రంగంగా ఒక పాలసీని తీసుకురావడం, అందుకు సంబంధించి ‘ఉద్యం’ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతోందన్నారు. ఒక వ్యాపారాన్ని ప్రారంభించే ప్రతి ఒక్కరూ ఉద్యం పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రభుత్వం నుంచి అందే అన్ని రకాల రాయితీలను పొందాలని పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు ప్రభుత్వ సహాయ సహకారాలు అందిపుచ్చుకుని పారిశ్రామికవేత్తగా రాణించాలన్నారు. ఎంఎస్ఎంఈ జీఎం జి.కె.సుధాకర్ మాట్లాడుతూ... ఎంఎస్ఎంఈ లబ్ధిదారులకు సెక్యూరిటీ లేకుండా సుమారు ఐదు కోట్ల రుణాలను యూనియన్ బ్యాంకు సంస్థ అందిస్తోందన్నారు. యూనియన్ బ్యాంకు కడప రీజినల్ మేనేజర్ లక్ష్మి తులసి మాట్లాడుతూ కడప రీజియన్ పరిధిలో 600 కోట్లతో ఎంఎస్ఎంఈలకు రుణాలను అందివ్వడం గర్వించదగ్గ విషయమన్నారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో 400 మంది ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు మంజూరైన రూ.20 కోట్లు, పట్టణ ప్రాంతాల్లో 200 గ్రూపులకు చెందిన రూ.12 కోట్ల రుణాలకు సంబంధించి మెగా చెక్కులను మహిళా సంఘాలకు, చేనేత సంఘాలకు మంజూరు చేసిన కోటి రూపాయలు, బీసీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన రూ.6.12 కోట్లను లబ్ధిదారులకు కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. అలాగే ఉమెన్ ఎంపర్మెంట్ కింద ఎంపికై న పలువురు మహిళలకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ కార్యకక్రమంలో డీఆర్డీఏ, మెప్మా, ఐసీడీఎస్ పీడీలు ఆనంద్‌నాయక్, కిరణ్‌కుమార్, శ్రీలక్ష్మి, చేనేత జౌళిశాఖ ఏడీ పిచ్చయేశ్వరరావు, బీసీ కార్పొరేషన్ ఈడీ జయసింహా, యూనియన్ బ్యాంకు అన్నిశాఖలు బీఎంలు, బ్యాంకు ప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి -
రూటే.. సప‘రేటు’..!
ఏ పనైనా సరే చేయాలంటే అందుకు నిబంధనలు ఉంటాయి. అయితే ఇక్కడ ప్రభుత్వ నిబంధనలకు తిలోదకాలిచ్చారు. ‘పరిపాలనకు’ పాతర వేశారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు ‘అవినీతి జాడ్యం’ పట్టుకుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి టాస్స్‌ఫోర్స్ : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ శాఖలో తవ్వే కొద్దీ అవినీతి, అక్రమాలు బయటపడుతున్నాయి. ఇటీవల కాలంలో అవకతవకలపై విచారణలు జరుగుతున్నాయి. తాజాగా మరికొన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ శాఖలో పరిపాలన అదుపు తప్పిందనే వాదన ఉద్యోగుల నుంచి వినిపిస్తోంది. ఇందుకు సంబంధించిన కొన్ని ఉదాహరణలు.. ‘బ్యాన్’ ఉన్న వేళ బదిలీ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం ‘బ్యాన్’ విధించింది. అంటే బ్యాన్‌ను తొలగించే వరకు ఎలాంటి బదిలీలు చేపట్టకూడదు. అయితే ఈ శాఖలో నిబంధనలు ధిక్కరించి బదిలీ చేయడం గమనార్హం. ఉమ్మడి జిల్లాకు సంబంధించి పుల్లంపేట పీహెచ్సీలో పని చేస్తున్న ఒక ఉద్యోగి ఆరు నెలలు మెడికల్ లీవ్ పెట్టారు. మెడికల్ లీవ్ అనంతరం ఆ ఉద్యోగికి రీపోస్టింగ్ ఇవ్వాలి. ప్రస్తుత జీఓ ప్రకారం తిరిగి పుల్లంపేటకే పోస్టింగ్ ఇవ్వాలి. అయితే అందుకు విరుద్ధంగా మాధవరం పీహెచ్‌సీకి పోస్టింగ్ ఇచ్చారు. అంటే ఆ ఉద్యోగిని పుల్లంపేట నుంచి మాధవరానికి బదిలీ చేశారు. ‘బ్యాన్’ ఉన్న సమయంలో ఈ బదిలీని ఏ ప్రాతిపదికన చేపట్టారో.. ఆ శాఖ వారికే ఎరుక. ఇందుకు గాను ఆ ఉద్యోగి నుంచి రూ.50 వేల నుంచి రూ. లక్ష వరకు లంచం తీసుకున్నట్లు సమాచారం. అలాగే ఆ ఉద్యోగి ఆరు నెలల మెడికల్ బిల్లు రూ.1,75,000 మంజూరు చేయడానికి మరో రూ.20 వేలు వసూలు చేసినట్లు తెలిసింది. ఉద్యోగులు సతమతం అలాగే సొంత శాఖలో జిల్లా వ్యాప్తంగా పని చేసే సిబ్బందిని కూడా వదలడం లేదు. డ్రాయింగ్ అండ్ డిస్పర్సమెంట్ పరిధి కారణంగా 90 పీహెచ్‌సీలు వస్తాయి. మెడికల్ ఆఫీసర్ మొదలుకొని క్షేత్ర స్థాయి సిబ్బంది వరకు సర్వీసుకు సంబంధించిన అంశాలు ఉంటాయి. ఇక్కడ కూడా చేతివాటం ప్రదర్శిస్తున్నారు. మెడికల్ లీవ్‌కు రూ 5.వేలు, ఎర్న్ లీవుకు రూ.3 వేలు, ఇంక్రిమెంట్ మంజూరుకు డాక్టర్‌కు అయితే రూ.3 వేలు, ఫీల్డ్ స్థాయి సిబ్బందికి రూ.2 వేలు, ఏదైనా దరఖాస్తును డైరెక్టర్ ఆఫ్ హెల్త్‌కు ఫార్వర్డ్ చేయాలంటే రూ.5 వేలు, గర్భిణుల మెడికల్ బిల్లుకు రూ.5 వేలకు పైగా ఇలా ప్రతి పనికి ఒక రేటును ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నారు. ఇందుకు కొంత మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఈ శాఖలో వేలాది మంది ఉద్యోగులు ఉన్నారు. ఏవైనా కార్యాలయ పనులు పడినప్పుడు అడిగినంత ఇచ్చుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. లేదంటే ఫైళ్లు ముందుకు కదలవు.. పనులు జరగవు. దీంతో ఈ శాఖలో పూర్తి స్థాయిలో ‘పరిపాలన’కు పాతర పడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉద్యోగులు ఉద్యోగ భద్రతా కారణాల వల్ల తమ సమస్యలను బహిర్గతంగా చెప్పుకోలేరు. కారణాలు ఏవైనప్పటికీ సమగ్ర విచారణ చేపట్టి ప్రభుత్వ నిబంధనలు అమలయ్యేలా చూడాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. వైద్య ఆరోగ్య శాఖలో ‘కాసుల వేట’ ప్రతి పనికీ ఓ లెక్క నిబంధనలకు విరుద్ధంగా బదిలీ -
ఉద్యాన పంటలపై అవగాహన పెంచాలి
కడప అగ్రికల్చర్ : ఉద్యాన పంటల సాగుపై రైతులకు అవగాహన పెంచాలని జిల్లా ఉద్యానశాఖ అధికారి సుభాషిణి సూచించారు. గురువారం కడప కలెక్టరేట్లోని జిల్లా వ్యవసాయశాఖ మీటింగ్ హాల్లో గ్రామ ఉద్యాన సహాయకులకు ఉద్యాన పంటలు, స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజన్ ప్లాన్సై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి ఊటుకూరు కేవీకే శాస్త్రవేత్త మానస, ఏపీ ఎంఐపీ పీడీ వెంకటేశ్వరరెడ్డి, ఉద్యానశాఖ అధికారులు, డిజిటల్గ్రీన్ సిబ్బంది, గ్రామ ఉద్యాన డిజిటల్ గ్రీన్స్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఉద్యాన శాఖ అధికారి సుభాషిణి మాట్లాడుతూ ఉద్యాన పథకాలు అమలు చేసే విధానాన్ని ప్రతి రైతుకు చేరవేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంకేతిక ఉద్యానశాఖ అధికారి జ్యోతిర్మయి, ఉద్యానశాఖ అధికారి జయభరత్‌రెడ్డి, డిజిటల్ గ్రీన్ సిబ్బంది వెంకటగౌడ్, సహాయకులు ప్రవీణ్, గ్రామ ఉద్యాన సహాయకులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
అభివృద్ధిలో జిల్లాను అగ్రగామిగా నిలుపుదాం
కడప సెవెన్‌రోడ్స్ : ఆకాంక్ష జిల్లాల (ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్) ఆశయాలకు అనుగుణంగా జిల్లాను అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుదామని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులకు సూచించారు. గురువారం స్థానిక కలెక్టరేట్ బోర్డు రూమ్ హాలు నుంచి ‘ఆకాంక్ష జిల్లాల ఆశయ సాధన కార్యాచరణ ప్రగతి’పై జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ తో కలసి కలెక్టర్ సంబంధిత శాఖల జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం నుంచి డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ డాక్టర్ సచిన్ మిట్టల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ ‘నీతి ఆయోగ్’ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా కొన్ని ఆకాంక్ష జిల్లాలను ఎంపిక చేసిందన్నారు. అందులో వైఎస్ఆర్ జిల్లా విజయనగరం, విశాఖపట్నం జిల్లాలను ఎంపిక చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా ఆయా జిల్లాల్లో సామాజిక స్థాయిని(అభివృద్ధి) ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకురావడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు. అనంతరం జిల్లాలో చేపడుతున్న ప్రగతిపై పీపీటీ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్.. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ జనరల్‌కు వివరించారు. జిల్లా అధికారులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. సంతృప్త స్థాయిలో నిర్దేశిత లక్ష్యం మేరకు సాధించిన ప్రగతి ఆధారంగా ప్రోత్సాహకాలను కూడా భారీ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఈ సమావేశంలో డీఆర్డీఏ పీడీ ఆనంద్ నాయక్, మెప్మా పీడీ కిరణ్ కుమార్, సీపీఓ హజ్రతయ్య, పరిశ్రమల శాఖ జీఎం చాంద్‌బాషా, ఐసీడీఎస్ అధికారిణి శ్రీలక్ష్మి, హార్టికల్చర్ డీడీ సుభాషిణి, పశుసంవర్ధక శాఖ జేడీ శారదమ్మ, లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజరు జనార్ధన్, పోస్టల్ అధికారులు ఎన్ఆర్ బాషా తదితర అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఆకట్టుకున్న ఆయుధాల ప్రదర్శన
కడప అర్బన్ : విద్యార్థులను పోలీస్ ఆయుధాల ప్రదర్శన ఆకట్టుకుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో మహిళా సాధికారత వారోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలోని పరేడ్ మైదానంలో ఓపెన్ హౌస్ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను జిల్లా ఎస్పీ ఈజీ అశోక్‌కుమార్ గురువారం పాఠశాల విద్యార్థుల చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసులు విధి నిర్వహణలో భాగంగా వినియోగించే ఆయుధాలు, దుస్తులు, పనిముట్లు, నేరదర్యాప్తు విధానం తదితర విషయాలను విద్యార్థులకు తెలియజేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బాంబు డిస్పోజబుల్ టీం, ఫింగర్‌ప్రింట్, పోలీస్ కంట్రోల్ రూమ్, కమ్యూనికేషన్స్, ఆయుధాల విడి భాగాల సమాచారం(ఏకె–47, విల్ పిస్టల్, గ్లో17, కార్బన్, ఇన్సాఫ్ రైఫిల్, గ్యాస్గన్, గ్రేనేడ్, ఫోరెన్సిక్, ఆర్ఎఫ్ఎస్ఎల్) తదితర విషయాలపై వివరించారు. బాడీవోర్న్ కెమెరాలు, డ్రోన్ కెమెరా, వీహెచ్ఎఫ్ సెట్, రోబో డ్రెస్, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్, బాంబు డిస్పోజల్ టీం, వినియోగించే డీఫ్ సెర్చ్ మెటల్ డిటెక్టర్ (డీఎస్ఎండీ), టెలిస్కోప్ మ్యానిపులేటర్, రిమోట్ వైర్ కట్టర్లను ప్రదర్శనలో ఉంచారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) కె.ప్రకాష్‌బాబు, ఏ.ఆర్. అదనపు ఎస్పీ బి.రమణయ్య, ఏఆర్ డీఎస్పీ కె.శ్రీనివాసరావు, ఆర్ఐ ఆనంద్, కడప నగరంలోని పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
కడప ఎడ్యుకేషన్ : జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. 64 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన మాథ్స్–1ఎ, బాటనీ, సివిక్స్ పరీక్షలకు 878 మంది విద్యార్థులు గైర్హాజరయినట్లు ఆర్ఐవో బండి వెంకటసుబ్బయ్య తెలిపారు. జనరల్, ఒకేషనల్‌కు 19180 మంది విద్యార్థులకు గాను 18302 మంది హాజరు కాగా 878 మంది గైర్హాజరయ్యారు. ఇందులో జనరల్‌కు 17655 మందికి గాను 16906 మంది హాజరు కాగా 749 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌కు 1525 మందికి గాను 1396 హాజరు కాగా 129 మంది గైర్హాజరయ్యారు. పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్ – కాంట్రాక్టు వర్కర్ల తొలగింపు కడప సెవెన్‌రోడ్స్ : నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు విచారణలో తేలడంతో వేంపల్లె గ్రేడ్–1 పంచాయతీ సెక్రటరీ ఎన్వీ సుబ్బారెడ్డిని సస్పెండ్ చేస్తూ జిల్లా పంచాయతీ అధికారి జి.రాజ్యలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన రూ.1,88,70,213 గ్రామ పంచాయతీ నిధులను దుర్వినియోగం చేశారు. ఈ నేపథ్యంలో చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం పోరుమామిళ్ల గ్రామ పంచాయతీ గ్రేడ్–2 పంచాయతీ సెక్రటరీగా పని చేస్తున్న పి.రవిశంకర్‌రెడ్డి రూ.51,01,015, వేంపల్లె ఈఓపీఆర్డీగా పని చేస్తున్న బీవీఎస్ మల్లికార్జునరెడ్డి రూ.15,67,706 తమ వద్దనే ఉంచుకోవడం వల్ల వారిపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించాలని నిర్ణయించారు. ఇక వేంపల్లె పంచాయతీలో కాంట్రాక్టు వర్కర్లుగా పని చేస్తున్న వంశీ, ఖాజా లక్షలాది రూపాయల నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు జమ్మలమడుగు డివిజనల్ పంచాయతీ అధికారి విచారణలో వెల్లడి కావడంతో వారిని తొలగించారు. వేంపల్లె ఇన్చార్జి సర్పంచ్ రాచినేని శ్రీనివాసులు నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు తెలిసింది. దీంతో ఎందుకు ఆయన చెక్ పవర్ రద్దు చేయరాదో వివరణ ఇవ్వాలని నోటీసు జారీ చేశారు. వైవీయూ వీసీ బదిలీ కడప ఎడ్యుకేషన్ : యోగివేమన విశ్వవిద్యాలయం (వైవీయూ) వైస్ చాన్స్‌లర్‌గా పని చేస్తున్న పణితి ప్రకా్‌ష్‌బాబు పుదుచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా బదిలీ అయ్యారు. ఈ మేరకు భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వశాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈయన వైవీయూ వీసీగా గత నెల 24న బాధ్యతలు చేపట్టారు. పది రోజుల్లోనే బదిలీ కావడంపై వైవీయూలో కొంత నిరాసక్తి నెలకొంది. బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే వైవీయూలోని పలు అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించారు. వైవీయూలో చాలా నెలల పాటు ఇన్చార్జి వీసీ పాలన సాగింది. రెగ్యులర్ వీసీ వచ్చారని, అభివృద్ధి జరుగుతుందని ఆశించిన అనతి కాలంలోనే బదిలీ కావడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. మళ్లీ త్వరగా రెగ్యులర్ వీసీని నియమిస్తారా లేక గతంలో మాదిరిగానే ఇన్చార్జి వీసీని కొనసాగిస్తారా అనే దానిపై సర్వత్రా చర్చ సాగుతోంది. 10న అప్రెంటిస్ మేళా కడప ఎడ్యుకేషన్ : కడపలోని కాగితాలపెంట ప్రభుత్వ డీఎల్టీసీ ఐటీఐలో ఈ నెల 10న ఉదయం 10 గంటలకు అప్రెంటిస్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కన్వీనర్, ప్రిన్సిపాల్ జ్ఞానకుమార్ తెలిపారు. అర్హత గల ఐటీఐ అభ్యర్థులు తమ పదో తరగతి, ఐటీఐ మార్కుల జాబితా, ఎన్టీసీ సర్టిఫికెట్‌తోపాటు ఆధార్‌కార్డు, కులధ్రువీకరణ పత్రం. బ్యాంకు అకౌంట్ పుస్తకం, ఒక సెట్ జిరాక్స్ కాపీలు, రెండు పాస్ పోర్టు సైజ్ ఫొటోలు తీసుకుని హాజరు కావాలని ఆయన పేర్కొన్నారు. అప్రెంటిస్ శిక్షణలో భాగంగా నెలకు రూ.7,700 నుంచి రూ.10 వేల వరకు స్టైఫండ్‌గా కంపెనీ వారు చెల్లిస్తారని వివరించారు. కావున విద్యార్థిని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలు తెలపాలి కడప ఎడ్యుకేషన్ : జిల్లాలో పని చేస్తున్న ఉపాధ్యాయులు సీనియారిటీ జాబితాలకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే.. 8, 9 తేదీలలో జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో తెలియజేయాలని డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. శని, ఆదివారాలు సెలవు దినాలు అయినప్పటికీ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 7 గంటల వరకు అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఒంటిమిట్టలో మహా సంప్రోక్షణ ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో మహా సంప్రోక్షణ మహోత్సవాన్ని గురువారం ప్రారంభించారు. ఉదయం 7.30 గంటల నుంచి టీటీడీ పాంచరాత్ర ఆగమన సలహాదారు రాజేష్ కుమార్, వేదపండితులు భగవత్పుణ్యాహం, అగ్ని మదనం, ప్రధానమూర్తి హోమాలు నిర్వహించారు. సాయంత్రం 5.30 గంటల నుంచి చతుస్థానార్చనం, సహస్ర కలశాధివాసం, శాత్తుమొర చేపట్టారు. -
కువైట్‌లో అడుసువారిపల్లె వాసి మృతి
గోపవరం : మండలంలోని బ్రాహ్మణపల్లె పంచాయతీ అడుసువారిపల్లె గ్రామానికి చెందిన వంతెరపల్లె రమణారెడ్డి (54) కువైట్‌లో మృతి చెందాడు. ఇతను బతుకుదెరువు కోసం గత కొన్నేళ్లుగా కువైట్‌లో ఉన్నాడు. రోజువారి కూలి పనులు చేసుకుంటుండగా మూడు నెలల క్రితం ప్రమాదవశాత్తు ఇనుపరాడ్లు మీద పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. కువైట్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 3వ తేదీన మృతి చెందాడు. కుటుంబ పెద్ద మృతి చెందడంతో ఆ కుటుంబం ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. కువైట్ నుంచి మృతదేహం గురువారం ఉదయం స్వగ్రామం చేరుకుంది. అంత్యక్రియలు నిర్వహించారు. మృతునికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు.అతిగా మద్యం తాగి యువకుడు..ముద్దనూరు : మద్యానికి బానిసగా మారిన బుల్లి అశోక్ (32) అనే యువకుడు గురువారం మండలంలోని కొత్తపల్లె గ్రామ శివారులో సున్నపురాళ్లపల్లె బస్‌స్టాప్ వద్ద మృతి చెందాడు. సీఐ దస్తగిరి సమాచారం మేరకు అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం భద్రంపల్లె గ్రామానికి చెందిన అశోక్‌కు పదేళ్ల క్రితం కర్నూలు జిల్లా ఆలూరు గ్రామానికి చెందిన సునీత అనే మహిళతో వివాహమైంది. మూడేళ్ల క్రితం అతని భార్య ఇంటినుంచి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపం చెందిన అశోక్ మద్యానికి బానిస అయ్యాడు. ఈనెల 5వతేదీన తన భార్య వద్దకు వెళ్లి వస్తానని చెప్పి అశోక్ ఇంటినుంచి బయలుదేరాడు. అయితే గురువారం సున్నపురాళ్లపల్లె వద్ద పడిపోయి ఉండడంతో పోలీసులు గుర్తించారు. అతిగా మద్యం తాగడం వల్లగానీ, మరే ఇతర కారణంతోనైనా అశోక్ మరణించి ఉండవచ్చని వారు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. వాసాలు అక్రమ నిల్వపై రూ.52 వేలు జరిమానాముద్దనూరు : జమ్మలమడుగులోని రామిరెడ్డిపల్లె రహదారిలో బుధవారం పోలీసులు గృహ నిర్మాణానికి వినియోగించే వాసాలను స్వాధీనం చేసుకుని అటవీశాఖకు అప్పగించారు. 38 వాసాలు అక్రమంగా కలిగి ఉండటంతో రూ. 52 వేలు జరిమానా విధించినట్లు ముద్దనూరు ఫారెస్టు రేంజి అధికారి అశోక్‌కుమార్ గురువారం తెలిపారు. ఆటో బోల్తా మదనపల్లె : ఆటో బోల్తా పడి డ్రైవర్ గాయపడిన సంఘటన గురువారం కురబలకోట మండలంలో జరిగింది. ఎర్రమద్దివారిపల్లెకు చెందిన సుబ్బయ్య కుమారుడు రమేష్(26) సొంతంగా ఆటో నడపడమే కాకుండా స్థానికంగా ఓ మామిడి తోట వద్ద కాపలాగా ఉన్నాడు. గురువారం వ్యక్తిగత పనులపై ఆటోలో అంగళ్లుకు బయలుదేరాడు. మార్గమధ్యంలో ఓ మలుపు వద్ద ఆటో వేగాన్ని అదుపుచేయలేకపోవడంతో బోల్తా పడింది. ప్రమాదంలో రమేష్ గాయపడగా, స్థానికులు మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. సంబంధిత పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
●మనోడైతే ఎలాంటి ఆరోపణలున్నా సరే..
సాక్షి ప్రతినిధి, కడప : ఆయనది మండల మేజిస్ట్రేట్ హోదా. అదే మండలంలో ఆయనపై ఐపీసీ 420, 409, 120 సెక్షన్లతో గతంలో కేసు నమోదు అయింది. ఆ కేసులో రెండవ నిందితుడు. ఈ కేసు ఏప్రిల్ 25న విచారణకు రానుంది. మండల మేజిస్ట్రేట్ హోదాలో ఉన్న వ్యక్తి.. అదే మండలంలో నిందితుడిగా కోర్టు మెట్లు ఎక్కనున్నారు. మరోవైపు తహసీల్దార్ హోదాలో నిందుతుడిగా కోర్టులో ఉంటే, ప్రత్యక్ష సాక్షులుగా కింది స్థాయి సిబ్బంది సాక్ష్యం ఇవ్వాల్సి ఉంది. రెవెన్యూ శాఖ వింత వైఖరితో.. విజిలెన్సు ఎన్ఫోర్స్మెంట్ విభాగం వల పన్ని పట్టుకున్న ఓ కేసు నీరుగారిపోయే అవకాశం లేకపోలేదు. వివరాలు ఇలా ఉన్నాయి. ప్రస్తుత మైదుకూరు తహసీల్దార్ రాజసింహ నరేంద్ర గతంలో డిప్యూటీ తహసీల్దార్ హోదాలో ప్రభుత్వ గోడౌన్ ఇన్‌చార్జీగా ప్రొద్దుటూరులో విధులు నిర్వర్తిస్తుండే వారు. అప్పట్లో ప్రభుత్వ గోడౌన్ నుంచి 19 బస్తాల సబ్సిడీ రాగులు ప్రొద్దుటూరు నుంచి మైదుకూరు బాక్ల్మార్కెట్కు తరలిస్తుండగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం పట్టుకుంది. ఆమేరకు మైదుకూరు పోలీసుస్టేషన్లో క్రైమ్ నంబర్ 469/2019 అండర్ సెక్షన్ 409, 420, 120–బి రెడ్‌విత్ 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. ప్రధాన నిందితుడిగా ఆటోడ్రైవర్ నిట్టూరు పెద్ద మస్తాన్ కాగా, ఏ–2గా వేల్పుల రాజసింహ నరేంద్ర (ప్రస్తుత మైదుకూరు తహసీల్దార్), ఏ–3గా లక్ష్మిపేట ఎఫ్పీ షాపు డీలర్ సుదర్శన్‌రెడ్డి ఉన్నారు. ఏ–4, ఏ–5లుగా మైదుకూరుకు చెందిన వ్యాపారులు లక్ష్మినారాయణ, రామకృష్ణపై పోలీసులు కోర్టుకు చార్జీషీట్ దాఖలు చేశారు. కాగా ఈ కేసుపై ఏప్రిల్ 25న మైదుకూరు కోర్టులో వాయిదా ఉంది. నిందితులు అంతా హాజరైతే కేసు విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. పై అధికారిపై సాక్ష్యం సాధ్యమేనా.. బాస్‌పై కింది స్థాయి సిబ్బంది సాక్ష్యం చెప్పడం సాధ్యమేనా... అంటే ఉన్నది ఉన్నట్లు సాక్ష్యం చెప్పడం అసాధ్యమని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి మైదుకూరు మండల మేజిస్ట్రేట్ హోదాలో ఉన్నారు. సాక్ష్యం చెప్పాల్సిన వారిలో తన కింద పని చేస్తున్న వీఆర్ఏ ప్రసాద్‌కుమార్ ఉన్నారు. దువ్వూరు మండలంలో ఎంఆర్‌ఐగా పని చేస్తున్న ఆవుల జాన్సన్, వీఆర్వోగా పని చేస్తున్న షేక్ ఫజల్ ఆలీ ప్రత్యక్ష సాక్షులు. అప్పట్లో మైదుకూరులో పని చేస్తున్న ఆ ఇరువురు బదిలీపై దువ్వూరు మండలంలో విధులు కొనసాగిస్తున్నారు. వీరంతా స్థానికంగా ఉన్న తహసీల్దార్‌పై సాక్ష్యం సవ్యంగా చెప్పగలరా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇదే విషయమై విజిలెన్సు ఎన్ఫోర్స్మెంట్ విభాగం సైతం ఆవేదన వ్యక్తం చేస్తోంది. అక్రమార్కులను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తే.. ఆయా ప్రభుత్వ శాఖల సహకారం లేకపోతే కేసులు నీరుగారే అవకాశం ఉందని సీనియర్ అధికారులు వాపోతున్నారు. కంచె చేను మేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని.. అదే మండలంలో రెవెన్యూ బాస్‌గా నియమించడం ఏమిటని పలువురు నిలదీస్తున్నారు. 420, 409, 120 ఐపీసీ సెక్షన్ల ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజసింహనరేంద్ర అదే మండలానికి తహసీల్దార్‌గా నియామకం వెనుక ప్రధానంగా ఈ కేసు నుంచి గట్టేక్కాలనే దృఢ సంకల్పం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు రెవెన్యూ శాఖ సైతం సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లు సమాచారం. మైదుకూరు తహసీల్దార్ రాజసింహనరేంద్రపై 420 కేసు ఏప్రిల్ 25న విచారణకు రానున్న వైనం ఆర్ఐ, వీఆర్వో, వీఆర్ఏ ప్రత్యక్ష సాక్షులు కింది స్థాయి సిబ్బంది వ్యతిరేకంగా సాక్షం చెప్పడం సాధ్యమా? రెవెన్యూ శాఖలో వింత వైఖరిపై విస్తుపోతున్న జనంసాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వైఎస్సార్సీపీ పక్షం వారికి పనులు చేయరాదంటూ బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ తరుణంలో ఎలాంటి ఆరోపణలున్నా సరే.. అధికార పార్టీ నేతల సహకారం ఉంటే అధికారులకు పోస్టింగ్ ఇస్తున్నారు. అందులో భాగంగానే మైదుకూరు తహసీల్దార్ రాజసింహ నరేంద్రకు సైతం మైదుకూరులో పోస్టింగ్ దక్కిందని పలువురు వెల్లడిస్తున్నారు. కలెక్టర్ నిష్పక్షపాతంగా అధికారం ప్రయోగిస్తే కేసులో నిందితుడుగా ఉన్న వ్యక్తికి.. అదే ప్రాంతానికి మండల మేజిస్ట్రేట్ హోదాలో కూర్చోబెట్టే అవకాశం లేదని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. కేసు విచారణ పూర్తి అయ్యేంత వరకూ మైదుకూరు తహసీల్దార్ రాజసింహనరేంద్రను అక్కడి నుంచి తప్పించాలని పలువురు డిమాండ్ చేస్తుండటం గమనార్హం. -
కూలిన బతుకులు
రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు వారివి. రోజూ కూలి పనికి వెళ్తేనే.. నాలుగు వేళ్లూ నోట్లోకి వెళతాయి. వారి కుటుంబ జీవనం గడుస్తుంది. అలాంటి వారిపై విధి చిన్న చూపు చూసింది. రోడ్డు ప్రమాదం రూపంలో ఇద్దరిని బలి తీసుకుంది. ఏడుగురిని ఆస్పత్రి పాలు చేసింది. వారిని నమ్ముకున్న కుటుంబాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ‘ఎంత పని చేశావు దేవుడా’ అంటూ వారు గుండెలవిసేలా రోదించారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయామంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇక తాము కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలంటూ.. శోకసంద్రంలో మునిగిపోయారు. ఎర్రగుంట్ల : మండల పరిధిలోని చిలంకూరు గ్రామ సమీపంలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాపరాయి గని పనులకు కూలీలను తీసుకెళ్తున్న ట్రాక్టర్‌ను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు. వెంటనే స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఎర్రగుంట్ల సీఐ నరేష్‌బాబు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చిలంకూరు గ్రామంలోని కొందరు కూలీలు.. నిడుజివ్వి గ్రామ పరిధిలోని నాపరాయి గనిలోకి పనికి వెళ్తుంటారు. అందులో భాగంగా గురువారం తెల్లవారుజామున చిలంకూరు నుంచి నిడుజివ్వి గ్రామానికి ట్రాక్టర్లో తొమ్మిది మంది కూలీలు బయలుదేరారు. ట్రాక్టర్ గ్రామం దాటింది అంతే.. పూణే నుంచి మద్రాసు వెళ్లే లారీ అతి వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్లో ఉన్న తొమ్మిది కూలీలకు తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన స్థానికులు గ్రామ సమీపంలోనే ప్రమాదం జరగడంతో.. వెంటనే స్థానికులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితులను ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ముత్తరాసుగారి లక్షుమ్మ (56), నత్తి గంగులరాగారి వెంకటాంజనేయులు (52) ఆసుపత్రికి చేరుకున్న వెంటనే మృతి చెందారు. మల్లేల రోశయ్య, ఎట్టిచిన్న ఓబన్న, పోలుగారి గురప్ప, పొన్నా వెంకటసుబ్బయ్య, గంగాదాం పల్లి హరినాఽథ్, కేజీ ఓబయ్య, మాలపాటి బాలస్వామి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృత దేహాలకు పోస్టుమార్టం నిర్వహింపజేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. బాఽధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే సంఘటన విషయం తెలుసుకున్న వెంటనే మాజీ ఎమ్మెల్యే డాక్టరు ఎం.సుధీర్‌రెడ్డి ప్రొద్దుటూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఈ సంఘటన దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. చిలంకూరులో ఘోర రోడ్డు ప్రమాదం ట్రాక్టర్‌ను ఢీకొన్న లారీ ఇద్దరు మృతి ఏడుగురికి గాయాలు బాధితులంతా కూలీలే -
తండ్రిపై కొడుకు బండరాయితో దాడి
సిద్దవటం : కన్న తండ్రిపైనే కొడుకు బండరాయితో దాడి చేయడంతో తండ్రి ఖాదర్‌హుస్సేన్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల కథనం మేరకు.. సిద్దవటం మండలం ఉప్పరపల్లె గ్రామానికి చెందిన ఖాదర్‌హుస్సేన్ తన సొంత గృహాన్ని అద్దెకు ఇచ్చేందుకు బోర్డును ఏర్పాటు చేశాడు. అతని కుమారుడు బాబా ఫకృద్దీన్ ఆ బోర్డును తొలగించి తండ్రిపై బుధవారం సాయంత్రం ఇంటి వద్ద ఉన్న బండరాయితో తలపై కొటడ్డంతో తీవ్ర గాయాలతో కుప్ప కూలిపోయాడు. స్థానికులు, బంధువులు ఖాదర్హుసేన్స్ను ఒంటిమిట్ట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు సిఫార్సు చేశారు. ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ ఆస్తి కోసం కన్న తండ్రిపైనే కొడుకు దాడి చేయడం అన్యాయమన్నారు. సిద్దవటం ఇన్చార్జి ఎస్ఐ శివప్రసాద్ జరిగిన ఘటనపై విచారిస్తున్నట్లు తెలిపారు. -
భార్యపై భర్త మచ్చుకత్తితో దాడి
చాపాడు : అనుమానం పెనుభూతమై కట్టుకున్న భర్త భార్యను కడతేర్చేందుకు మచ్చుకత్తితో విచక్షణా రహితంగా దాడి చేసిన ఘటన మండలంలోని నక్కలదిన్నె పంచాయతీ కొట్టాల గ్రామంలో జరిగింది. కొట్టాల(బీసీ కాలనీ) గ్రామంలో గురువారం మధ్యాహ్నం ఎర్రిబోయిన భాస్కర్(48) అనే వ్యక్తి తన భార్య కళావతి(40)పై మచ్చుకత్తితో దాడి చేసి విచక్షణారహితంగా నరికాడు. ఈ ఘటనలో కళావతి తల, చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు బాధితురాలిని 108లో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ట్రైనీ డీఎస్పీ భవానీ సిబ్బందితో కలసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. గత కొన్ని నెలలుగా భర్త భాస్కర్ తన భార్య కళావతిపై అనుమానం పెంచుకుని దాడికి పాల్పడినట్లు బాధితురాలి కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ట్రైనీ డీఎస్పీ భవానీ తెలిపారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
హలీమ్‌కు సలాం
రాజంపేట టౌన్ : రంజాన్ మాసంలో చేపట్టే వంటకాల్లో హలీం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. ఒకప్పుడు హైదరాబాద్‌లోనే దొరికే హలీం ఇప్పుడు ప్రధాన పట్టణాల్లోని ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. రంజాన్ మాసం సందర్భంగా ఉపవాసం ఉండే ముస్లీంలే కాక ఇతర మతాల వారు హలీం రుచిని ఎంతో ప్రీతిగా ఆస్వాదిస్తారు. అందువల్ల ఇప్పుడు సాయంత్రం ఆరు గంటలు అయితే చాలు అనేక మంది ప్రజలు హలీం విక్రయించే చోట వాలిపోతున్నారు. హలీం అరబ్ దేశానికి చెందిన వంటకం హలీం అరబ్ దేశానికి చెందిన వంటకమని ముస్లీంలు చెబుతున్నారు. ఆరో నిజాం నవాబు మహబూబ్ అలీఖాన్ హయాంలో అరబ్ దేశమైన పర్షియా నుంచి హలీం తెలుగు రాష్ట్రమైన హైదరాబాద్‌కు చేరుకొని ఎంతో ప్రసిద్ధిగాంచింది. మహబూబ్ అలీఖాన్ తన సంస్థానంలో పోలీసు వ్యవస్థను బలోపేతం చేసేందుకు కీలకమైన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పర్షియా నుంచి ప్రత్యేక ఆహ్వానితులు వచ్చారు. ఆ సమయంలో రంజాన్ ఉపవాస దీక్షల్లో ఇఫ్తార్‌కు తయారు చేసే ప్రత్యేక వంటకమైన హలీం గురించి ప్రస్తావించారు. వెంటనే నవాబు తన సిబ్బందిని పిలిపించి హలీంను తయారు చేయించారు. ఆ విధంగా హలీం తొలుత హైదరాబాద్‌కు పరిచయమై ఇప్పుడు అన్ని పట్టణాలకు చేరుకుని ప్రజలతో లొట్టలేయిస్తోంది. తయారీ కూడా ప్రత్యేకమే సాంప్రదాయ వంటలతో పోలిస్తే హలీం తయారీ చాలా ప్రత్యేకమైనది. హలీం తయారీకి కనీసం తొమ్మిది గంటల సమయం పడుతుంది. ఇందులో మటన్ లేదా చికెన్, గోధుములు, అన్ని పప్పుదినుసులు, బాస్మతిబియ్యం, నెయ్యి, అల్లంవెల్లుల్లి పేస్ట్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, యాలకలు, దాల్చిన చెక్క, మిరియాలు, కొత్తిమీర, నూనె, డ్రైఫ్రూట్స్ తదితర వస్తువులను వినియోగించి తయారు చేసి ఇఫ్తార్ సమయానికి సిద్ధం చేస్తారు. ఉపవాసం ముగించుకున్న ముస్లీంలతో పాటు ఇతర మతాలకు చెందిన వారు సైతం హలీంను ఆరగించేందుకు ఇష్టపడతారు. అక్కడే తినేవారికి పింగాణి కప్పులలో వేయిస్తుండగా పార్శిల్ తీసుకెళ్లే వారికి బాక్సులలో వేయిస్తున్నారు. ఒక్కో బాక్సు రూ.150, రూ.250, రూ.500కు విక్రయిస్తున్నారు. రంజాన్ ప్రత్యేక వంటకంగా గుర్తింపు రుచికి ఫిదా అవుతున్న జనం -
రంజాన్ వేళ.. రూపుదిద్దుకుంది ఇలా..!
రాజంపేట టౌన్ : ముస్లింలు రంజాన్ మాసాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ మాసంలో ముస్లింలు నియమ, నిష్టలతో ఉపవాసాలు ఉంటారు. ఉపవాసం చేపట్టే, విరమించే సమయాన్ని విధిగా పాటిస్తారు. ఎందుకంటే సహర్, ఇఫ్తార్ల సమయం కంటే ముందుగాని, ఆలస్యంగా గాని ఉపవాసం చేపట్టడం, విరమించడం చేస్తే ఆ రోజు చేపట్టే ఉపవాస దీక్షకు సార్థకత ఉండదని ముస్లిం మతపెద్దలు చెబుతున్నారు. అందువల్ల సహర్, ఇఫ్తార్లు సరైన సమయంలోనే పూర్తి చేయాలి. పూర్వం ఎలా చేసేవారంటే... ప్రస్తుతం సహర్, ఇఫ్తార్లు ఏ సమయంలో చేపట్టాలో తెలియజేసేందుకు కాలపట్టిక అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ కాలపట్టిక అందుబాటులోకి రాని సమయంలో సహర్, ఇఫ్తార్ వేళలను తెలియజేసేందుకు తూటాలు పేల్చేవారు. టపాసులు అందుబాటులోకి వచ్చాక టపాసులను పేల్చి తెలియజేసేవారు. కాలక్రమంలో మైకులు అందుబాటులోకి వచ్చాక మసీదుల్లో మౌజన్లు ఉపవాసం ప్రారంభానికి ఓ అరగంట ముందు రోజేదారో ఉఠో..ఉఠో (ఉపవాసం ఉండేవారు లేవండి) అంటూ నిద్రలేపేవారు. ఇక ఇఫ్తార్ సమయాన్ని అదే సమయంలో తెలియజేసేవారు. ప్రస్తుతం కాలం పూర్తిగా మారిపోయినందున సహర్, ఇఫ్తార్ వేళలను కార్డుల్లో ముద్రిస్తున్నారు. ఈ కార్డులను వ్యాపార సంస్థలు, ఆర్థిక పరిపుష్టి కలిగిన ముస్లింలు ముద్రించి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. సమయ నిర్ధారణ పట్టిక ఎలా తయారైందంటే.. పూర్వం ముస్లింలు ఉపవాసం ప్రారంభం, విరమణ సమయాల విషయంలో ఇబ్బందులు పడేవారు. ఈ ఇబ్బందులను గమనించిన ముఫ్తీ మహమ్మద్ రహీముద్దీన్ అబ్దుల్‌వాసే ఉపవాస ప్రారంభ, విరమణ సమయ నిర్ధారణ పట్టిక తయారు చేయాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా కొన్ని రోజులు శ్రమించి ముస్లింలు దీక్ష చేపట్టే సమయ పట్టికను 290 పేజీల పస్తకం ‘మియారుల్ ఔకాత్’లో పొందుపరిచారు. ఇప్పటికీ ఈ పుస్తకం ఆధారంగానే ఉపవాస సమయ పట్టికను నిర్ధారిస్తున్నారు. ఈ పుస్తకం ఆధారంగా 1968వ సంవత్సరంలో తొలిసారిగా ఉపవాస సమయ పట్టికను తయారు చేశారు. ఎగువ ప్రాంతం నుంచి దిగువ ప్రాంతానికి వచ్చే సరికి సహర్, ఇఫ్తార్ వేళల్లో కొన్ని నిమిషాల తేడాతో సమయ పట్టిక రూపొందించారు. అందువల్ల ఒక పట్టణానికి, మరొక పట్టణానికి రెండు లేక మూడు నిమిషాల తేడాతో సహర్, ఇఫ్తార్లు ప్రారంభమవుతాయి. ఈ సమయ పట్టికకు ఉపవాస సమయ పట్టిక అని నామకరణం చేశారు. ఉపవాస సమయ పట్టిక తయారై దాదాపు 56 సంవత్సరాలకు పైగా అయింది. చిన్నపాటి కార్డులో సహర్, ఇఫ్తార్ వేళలు తెలియజేసే పట్టిక -
ఆర్టీపీపీలో కాంట్రాక్టు కార్మికుడి మృతి
మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని కార్మికుల ధర్నా ఎర్రగుంట్ల : డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుడు శనగలగూడూరు నాగరాజు(48) విధి నిర్వహణలో మృతి చెందాడు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మృతదేహంతో ఽకార్మికులు ధర్నా చేపట్టారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు..అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం రాగితోటపాలెం గ్రామానికి చెందిన నాగరాజు 2011లో ఆర్టీపీపీలో కాంట్రాక్ట్ కార్మికుడుగా చేరారు. అప్పటి నుంచి ప్రతి రోజు స్వగ్రామం నుంచి ఆర్టీపీపీకి వచ్చి విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆర్టీపీపీలోని సీహెచ్ీపీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య నిర్మలతో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రోజు మాదిరిగానే గురువారం కూడా డ్యూటీకి వచ్చాడు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత డ్యూటీలో ఉండగానే ఫిట్స్ రావడంతో అక్కడే ఉన్న తోతి కార్మికులు ప్రాజెక్టు ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆర్టీపీపీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా కార్మికుడు మృతి చెందాడంటూ మృతుడి కుటుంబ సభ్యులతో కలసి మృతదేహంతో ధర్నా చేపట్టారు. దీంతో ఆర్టీపీపీ యాజమాన్యం కార్మిక సంఘాల నాయకులతో చర్చించింది. మృతుడి కుటుంబానికి రూ.4 లక్షల నష్టపరిహారంతో పాటు మృతుడి కుటుంబానికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో ధర్నా విరమించారు. -
ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం
వేంపల్లె : ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం చేస్తున్నట్లు వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.వి.సతీష్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన స్వగృహంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన భారీ కేకును కట్ చేసి నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా సతీష్‌రెడ్డి మాట్లాడుతూ త్వరలో మనకు మంచి రోజులు రానున్నాయని, కార్యకర్తలు అధైర్యపడకుండా ధైర్యంగా ముందుకు సాగాలని కోరారు. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని మనందరం సమష్టిగా కృషి చేస్తేనే వైఎస్ జగన్మోహన్రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకునే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగుతోందని, ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, త్వరలోనే తగిన బుద్ధి చెబుతారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ చంద్ర ఓబుళరెడ్డి, మండల ఉపాధ్యక్షుడు మునీర్ బాషా, సర్పంచ్ ఆర్.శ్రీనివాసులు, వైఎస్సార్సీపీ నాయకులు రామచంద్రారెడ్డి, హేమాద్రిరెడ్డి, కొత్తూరు రెడ్డయ్య, బంక సోమేశ్వర్ రెడ్డి, పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, వైస్ చైర్మన్ హఫీజ్, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు హాలు గంగాధరరెడ్డి, కౌన్సిలర్లు ఖాదర్ బాషా, రాజశేఖరరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు రసూల్, సర్వోత్తమరెడ్డి, చంద్రమౌళి, సోషల్ మీడియా అధ్యక్షుడు జహీర్, జిల్లా మైనార్టీ నాయకుడు మహమ్మద్ బాషా, వైఎస్సార్సీపీ నాయకులు సంపత్, రాజు, ప్రశాంత్, ఆర్సీడీఎస్ సంస్థ అధ్యక్షుడు సురేంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి -
ఆత్మహత్యకు యత్నించిన మహిళ మృతి
చాపాడు : మండల పరిధిలోని అయ్యవారిపల్లెకు చెందిన పాలూరు లక్ష్మీ(35) కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. ఎస్ఐ చిన్న పెద్దయ్య తెలిపిన వివరాల మేరకు.. ఈ నెల 2న పాలూరు లక్ష్మీతో ఆమె ఆడ బిడ్డ దేవి గొడవ పడింది. దీంతో మనస్తాపం చెందిన లక్ష్మీ విషపు గుళికలను మింగి ఆత్మాహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లక్ష్మీ పరిస్థితి విషమించి గురువారం మృతి చెందింది. ఈ ఘటనకు కారకురాలైన దేవిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతిపై కేసు నమోదుచింతకొమ్మదిన్నె : చింతకొమ్మదిన్నె మండలం, గువ్వలచెరువు ఘాట్ నాల్గవ మలుపు వద్ద లారీ లోయలో పడి ముగ్గురు మృతి చెందిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.బెంగళూరు నుంచి ఏలూరుకు చేపల ఫీడ్ లోడుతో కడప వైపు వస్తున్న ఏపీ 35 డబ్ల్యు 2989 నెంబరుగల లారీ వేగాన్ని అదుపు చేసుకోలేక లైనింగ్ వాల్‌ను ఢీకొట్టి లోయలో పడిపోయిన విషయం విదితమే. లారీ డ్రైవర్ తన్నేరు సాంబయ్య(30), క్లీనర్ తన్నీరు నాగరాజు(24) లారీ కాబిన్లో ఇరుక్కుపోయి మృతి చెందారు. అదే లారీలో గువ్వలచెరువు వద్ద ఎక్కి ప్రయాణిస్తున్న చక్రాయపేట మండలం కుప్పగుట్టపల్లె నివాసి కొవ్వూరు వివేకానందరెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో కడప రిమ్స్‌కు తరలించగా అదే రోజు సాయంత్రం 6.30 గంటలకు చనిపోయాడు. ఈ ప్రమాదంపై చింతకొమ్మదిన్నె పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేశారు. గురువారం మృతదేహాను వారి బంధువులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. -
పోలీసు జాగిలాల సేవలు అభినందనీయం
కడప అర్బన్ : పోలీస్ జాగిలాలు ‘వాఘా’, ‘ఝాన్సీ’ అనే జాగిలాలు 11 సంవత్సరాల పాటు విశిష్ట సేవలను అందించి, పలు కీలక విధులను సమర్థవంతంగా నిర్వర్తించడం అభినందనీయమని జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) కె. ప్రకాష్‌బాబు పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ ఈ.జీ అశోక్‌కుమార్ ఆదేశాల మేరకు గురువారం సాయంత్రం స్థానిక ‘పెన్నార్’ పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో ‘వాఘా’, ఝాన్సీ’ జాగిలాల పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పేలుడు పదార్థాలను గుర్తించడంలో నేర్పరులుగా పేరుగాంచిన లాబ్రడార్, రీట్రీవర్ జాతికి చెందిన జాగిలాలు ‘వాఘా’, ఝూన్సీలను అదనపు ఎస్పీ (అడ్మిన్) కె. ప్రకాష్‌బాబు, అదనపు ఎస్పీ (ఏఆర్) బి. రమణయ్య శాలువాలను కప్పి ఘనంగా సన్మానించారు. సుదీర్ఘకాలంపాటు పోలీసుశాఖలో విధులను నిర్వర్తించి, పదవీ విరమణ సందర్భంలో కూడా సంపూర్ణ ఆరోగ్యంతో, చురుగ్గా వుండేలా కంటికి రెప్పలా చూసుకున్న హ్యాండ్లర్లు డి. పీరయ్య (ఏఆర్పీసీ 2342), బి.వి కృష్ణయ్య (ఏఆర్పీసీ 3093)లను, బి.వి కృష్ణయ్య (ఏ.ఆర్ పీసీ 3093)లను అదనపు ఎస్పీ ప్రత్యేకంగా శాలువా కప్పి అభినందించారు. అదనపు ఎస్పీ (ఏఆర్) బి. రమణయ్య మాట్లాడుతూ 2013 డిసెంబర్ 1న జన్మించిన ‘వాఘా’, 2014 సెప్టెంబర్ 9న జన్మించిన ఝాన్సీ ఏడాదిపాటు శిక్షణ పొందిన తరువాత జిల్లా పోలీసు శాఖలో సేవలను ప్రారంభించాయన్నారు. ‘వాఘా’; ‘ఝాన్సీ’లను మేళతాళాలతో బాణసంచా కాల్చుతూ వాటి విడిది గృహాల వద్దకు చేరి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో ఏ.ఆర్. డీఎస్పీ కె. శ్రీనివాసరావు, ఆర్ఐలు శివరాముడు, వీరేష్, శ్రీశైల రెడ్డి, టైటస్, ఆర్ఎస్ఐలు, బాంబు డిస్పోజబుల్ స్క్వాడ్ టీం, పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పు శంకర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.‘వాఘా’, ‘ఝాన్సీ’లకు ఘనంగా వీడ్కోలు -
బద్వేలు సమీపంలో పట్టపగలే చోరీ
బద్వేలు అర్బన్ : బద్వేలుకు సమీపంలోని మడకలవారిపల్లె గ్రామంలో దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలే ఓ ఇంట్లో చొరబడి 17 తులాలు బంగారు నగలు, రూ.4 లక్షలు నగదు దోచుకెళ్లారు. గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. మున్సిపాలిటీ పరిధిలోని మడకలవారిపల్లె గ్రామంలో జాతీయ రహదారి పక్కనే చీర్ల శ్రీనివాసులు, శివకుమారి దంపతులు నివసిస్తున్నారు. వీరి కుమారుడైన సుబ్రమణ్యంకు ఆరు నెలల కిందట వివాహమైంది. అయితే గురువారం ఉదయం శ్రీనివాసులు పొలం వద్దకు వెళ్లగా.. కోడలికి జ్వరం వస్తుండటంతో తల్లికొడుకులు ఆమెను బద్వేలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ సమయంలో ఇంటికి తాళం వేసినట్లు గుర్తించిన దుండుగులు తాళం పగులకొట్టి ఇంట్లోకి ప్రవేశించి రెండు బీరువాలను పగులకొట్టి అందులోని 17 తులాల బంగారు నగలు, రూ.4 లక్షలు నగదును దోచుకెళ్లారు. పొలం వద్ద పనులు ముగించుకుని ఇంటికి వచ్చిన శ్రీనివాసులు ఇంటి ప్రధాన ద్వారానికి వేసిన తాళం పగులకొట్టి ఉండటంతో అనుమానం వచ్చి భార్యకు ఫోన్ చేయగా తాము బద్వేలుకు వచ్చామని సమాధానమిచ్చారు. దీంతో ఇంట్లో చోరీ జరిగినట్లు భావించి కుమారుడైన సుబ్రమణ్యంకు ఫోన్ చేసి విషయం తెలిపారు. సుబ్రమణ్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని రూరల్ సీఐ ఎం.నాగభూషణ్, సీసీఎస్ సీఐ భాస్కర్‌రెడ్డిలతో పాటు క్లూస్ టీం, డాగ్‌స్క్వాడ్ సిబ్బంది పరిశీలించారు.17 తులాలు బంగారు, రూ.4 లక్షలు నగదు అపహరణ -
అదనపు లోడు క్రమబద్ధీకరణలో 50 శాతం రాయితీ
కడప కార్పొరేషన్ : విద్యుత్ వినియోగదారులకు అదనపు లోడు క్రమబద్ధీకరణలో 50 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు విద్యుత్ శాఖ కడప ఆపరేషన్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ హరిసేవ్యా నాయక్ తెలిపారు. గురువారం డివిజన్ కార్యాలయంలోని ఆయన ఛాంబర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గృహ వినియోగదారులు విద్యుత్ కనెక్షన్ పొందే సమయంలో తీసుకున్న లోడ్(కాంట్రాక్టెడ్ లోడ్), ప్రస్తుతం వినియోగిస్తున్న లోడ్(రికార్డెడ్ ఎం.డీ)కు వ్యత్యాసం ఉంటే స్వచ్ఛంద అదనపు లోడు క్రమబద్ధీకరణ చేసుకోవచ్చన్నారు. ఉదాహరణకు ఒక వ్యక్తి గృహావసరాలకు విద్యుత్ కనెక్షన్ పొందేటప్పుడు అతను వాడే బల్బులు, ఫ్యాన్లు, గృహోపకరాణాల వినియోగాన్ని బట్టి 2 కిలోవాట్లకు డెవలప్మెంట్ చార్జీలు సెక్యురిటీ డిపాజిట్ చెల్లించి ఉంటారనుకుంటే, ఇప్పుడు ఏసీలు, రిఫ్రిజిరేటర్లు ఇతరత్రా విద్యుత్ గృహోపకరణాల వల్ల లోడ్ పెరిగి 3 లేదా 4 కిలోవాట్ల వరకూ విద్యుత్ ఉపయోగిస్తుంటే వారు అదనపు లోడ్ పొందాల్సి ఉంటుందన్నారు. వినియోగదారులే స్వచ్ఛందంగా తమకు కావాల్సినంత అదనపు లోడ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని, అందులో విద్యుత్ నియంత్రణ మండలి 50 శాతం రాయితీ లభిస్తుందన్నారు. మార్చి 1వ తేది నుంచి జూన్ 30వ తేదీ వరకూ మాత్రమే ఈ అవకాశం ఉందన్నారు. వివరాలకు విద్యుత్ ఉపకేంద్రంలోని అధికారులను సంప్రదించవచ్చన్నారు. ఈ సమావేశంలో డీఈఈలు రామచంద్రారెడ్డి, సుబ్రమణ్యం పాల్గొన్నారు.విద్యుత్ శాఖ కడప ఆపరేషన్ డివిజన్ ఈఈ హరిసేవ్యా నాయక్ -
వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షుల వరుస మరణాలపై ప్రత్యేక విచారణ
కడప అర్బన్ : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ప్రధాన సాక్షి పులివెందులకు చెందిన రంగన్న బుధవారం సాయంత్రం 6.43 గంటలకు కడప రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందా డ ని జిల్లా ఎస్పీ ఈజీ అశోక్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. మృతుడు రంగన్న భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తామన్నారు.. గురువారం రంగన్న మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారన్నారు. రంగన్న కేసులో ప్రధానమైన అంశం ఏమిటంటే ఈ మృతిని అనుమానాస్పద మరణంగా భావిస్తున్నామన్నారు. రంగన్నది సామాన్య మరణమా? లేక ఏవైనా కారణాలు దాగి ఉన్నాయా అనేదానిపై దర్యాప్తు జరుపుతామన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షులు ఒక్కొక్కరుగా మరణిస్తున్నారని తెలిపారు. ఇప్పటివరకు రంగన్నతోపాటు నలుగురు ప్రధాన సాక్షులు విడతల వారీగా మరణించారన్నారు. అందులో శ్రీనివాసరెడ్డి 2019లో, గంగాధర్‌రెడ్డి 2022లో, అభిషేక్‌రెడ్డి 2024 సెప్టెంబరులో, రంగన్న తాజాగా మార్చి 5వ తేదీన మరణించారన్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో ప్రధాన సాక్షులు ఒక్కొక్కరుగా మరణించడంపై ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. వివేకా హత్య కేసులో నిందితులుగా ఉన్న వారి పాత్ర, ప్రభావంపై కూడా దర్యాప్తు చేస్తామన్నారు. సాంకేతికంగా కూడా ఆధారాలు సేకరిస్తామన్నారు. ప్రతి సాక్షి మరణించిన సమయంలో పోలీసులు, సీబీఐ పాత్ర ఉందని ఎవరు ప్రచారం చేస్తున్నారో, ఆ ప్రచారం వెనుక ఎవరున్నారో కనిపెడతామన్నారు. -
వాచ్మెన్ రంగయ్య భార్య సంచలన వ్యాఖ్యలు
వైఎస్సార్ జిల్లా, సాక్షి: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సాక్షిగా ఉన్న వాచ్‌మన్ రంగయ్య .. కడప రిమ్స్ ఆస్పత్రిలో బుధవారం రాత్రి మృతి చెందాడు. అయితే ఆయన మృతిపై తనకు అనుమానాలు ఉన్నాయంటూ సుశీలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘‘నా భర్తను 2024 వరకూ పోలీసులు బాగానే చూసుకున్నారు. ఆ తర్వాత నా భర్తను హింసించారు. ఆయన కీళ్లు విరగొట్టారు. కొట్టి కొట్టి ఇలా చనిపోయేలా చేశారు. గత మూడు నెలలుగా ఆయన ఆరోగ్యం బాగాలేకపోయినా పట్టించుకోలేదు. ఢిల్లీ నుంచి అన్నీ ప్రాంతాలు తిప్పారు. ఇప్పుడు మాకేం సంబంధం అంటున్నారు. రంగయ్య మృతికి సీబీఐ, పోలీసులే కారణం’’ అని ఆరోపించారామె. సుశీలమ్మ ఆరోపణలపై సీఐ ఉలసయ్య స్పందించారు. ‘‘రంగన్న మృతిపై ఆయన భార్య సుశీలమ్మ పిర్యాదు చేసింది. అనుమానాస్పద కేసు నమోదు చేసి విచారిస్తున్నాం. మృతికి కారణం ఏమిటో పోస్ట్ మార్టం నివేదికలో తెలుస్తుంది’’ అని తెలిపారు. రంగయ్య మృతదేహానికి ఇవాళే పోస్టుమార్టం జరిగే అవకాశం ఉంది. -
యువతకు ‘ఉపన్యాస పోటీలు’
కడప ఎడ్యుకేషన్ : వికసిత్ భారత్ నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ –2025 అనే కార్యక్రమంలో భాగంగా పార్లమెంట్లో ప్రసంగించే అవకాశం కోసం ఉపన్యాస పోటీలు నిర్వహిస్తున్నట్లు నెహ్రు యువ కేంద్ర జిల్లా యువ అధికారి కె.మణికంఠ ఒక ప్రకటనలో తెలిపారు. కడప, అన్నమయ్య జిల్లాలలో 18 –25 ఏళ్లలోపు గల యువత ఈ పోటీలలో పాల్గొనవచ్చని తెలిపారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే అంశం పై ఈ ఉపన్యాస పోటీలు ఉంటాయని చెప్పారు. జిల్లాలో గెలుపొందిన విజేతలకు రాష్ట్ర, దేశ స్థాయిలలో పోటీలు ఉంటాయని చెప్పారు. రాష్ట్ర, దేశ స్థాయిలో గెలిచిన విజేతలకు నగదు బహుమతులు ఉంటాయన్నారు. జిల్లా స్థాయి పోటీలు ఈ నెల 15 వ తేదీన కడపలోని కేఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కళాశాలలో ఫిజికల్ మోడ్‌లో జరుగుతుందని వివరించారు. ఈ ఉపన్యాస పోటీలలో పాల్గొనదలచిన వారు ముందుగా మై భారత్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకొని ఒక నిమిషం వీడియో అప్లోడ్ చేయాలని సూచించారు. పూర్తి వివరాలకు 9177616677 నెంబర్‌తో పాటు కేఎస్ఆర్ఎం కళాశాల ఎన్ఎస్ఎస్ స్ ప్రోగ్రాం ఆఫీసర్ లక్షుమయ్యను సంప్రదించాలని ఆయన సూచించారు. నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువ అధికారి మణికంఠ -
రిమ్స్ వైద్య విద్యార్థుల ప్రతిభ
కడప అర్బన్ : ఇటీవల జరిగిన యూనివర్సిటీ పీజీ ఫైనల్ పరీక్షలో వివిధ విభాగాలలో రిమ్స్ వైద్య విద్యార్థులు విశేష ప్రతిభ చాటారు. మెడిసిన్‌లో 11 మంది, జనరల్ సర్జరీ ముగ్గురు, గైనకాలజీలో ఐదుగురు, ఆర్థోపెడిక్స్‌లో ముగ్గురు, ఈఎన్టీ ముగ్గురు, ఆప్తాలమాలజీ ముగ్గురు, పీడియాట్రిక్స్ ముగ్గురు, అనస్థీషియాలజీలో ఐదుగురు, డెర్మటాలజీలో ఇద్దరు కలిపి మొత్తం 38 మంది విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు. గైనకాలజీ విభాగంలో డాక్టర్ లావణ్య 76 శాతం మార్కులు సాధించారు. డాక్టర్ విరాజిత జనరల్ మెడిసిన్ విభాగంలో గోల్డ్ మెడల్స్ సాధించడం విశేషం. జనరల్ మెడిసిన్‌లో గోల్డ్ మెడల్ ఇటీవల జరిగిన పీజీ డిగ్రీ పరీక్షలలో రాష్ట్రస్థాయిలో 609 అత్యధిక మార్కులు సాధించిన డాక్టర్ పందల విరాజిత ఎన్టీఆర్ వైద్య యూనివర్సిటీ టాపర్‌గా నిలిచింది. అడిషనల్ డీఎంఈ రిమ్స్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సురేఖ గోల్డ్ మెడలిస్ట్ పీజీ డాక్టర్ విరాజిత ను పుష్పగుచ్చం ఇచ్చి అభినందించారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీ విద్యార్థులు ఈ స్ఫూర్తితో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అకాడమిక్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి, జనరల్ మెడిసిన్ ఆచార్యులు, విభాగాధిపతి డాక్టర్ కె బి యాదవేంద్ర రెడ్డిగారు, సహాయక ఆచార్యులు కిషోర్ కుమార్ , లీలా ప్రసాద్ బాబు, విజయసింహారెడ్డి అర్జున్ అవ్వారు , మనోహర్ పాల్గొన్నారు. యూనివర్సిటీ టాపర్ గా జనరల్ మెడిసిన్ పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ విరాజిత -
సచివాలయ ఉద్యోగి సస్పెన్షన్
బద్వేలు అర్బన్ : మున్సిపాలిటీ పరిధిలోని రామాంజనేయనగర్ సచివాలయం వార్డు పరిపాలన కార్యదర్శి కోనగిరిబాబును సస్పెండ్ చేస్తూ బుధవారం మున్సిపల్ కమిషనర్ వి.వి.నరసింహారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. విధుల్లో అలసత్వం వహించడంతో పాటు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరై ఫోన్లో కూడా అందుబాటులోకి రాకపోవడంతో సస్పెండ్ చేసినట్లు కమిషనర్ తెలిపారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు. 529 మంది గైర్హాజరు కడప ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా బుధవారం నిర్వహించిన ఇంటర్ ద్వితీయ సంవత్సర ఇంగ్లీష్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జిల్లావ్యాప్తంగా 64 పరీక్షా కేంద్రాల్లో జరిగిన పరీక్షలకు 14592 మంది విద్యార్థులకుగాను 14063 మంది హాజరుకాగా 529 మంది గైర్హాజరయ్యారని ఆర్ఐవో తెలిపారు. నేడు వైవీయూలో క్యాంపస్ డ్రైవ్ కడప ఎడ్యుకేషన్ : యోగి వేమన విశ్వవిద్యాలయ ప్లేస్ మెంట్ సెల్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం 10 గంటలకు రిక్రూట్మెంట్ డ్రైవ్‌ను నిర్వహిస్తున్నట్లు వైవీయూ ప్రజాసంబంధాల విభాగ సంచాలకులు డాక్టర్ పి.సరిత తెలిపారు. దివీస్ లాబొరేటరీస్ లిమిటెడ్, శ్రీ చైతన్య స్కూల్స్ ప్రతినిధులు క్యాంపస్ ఎంపికలకు రానున్నారని వివరించారు. డిగ్రీ, పీజీ అర్హతలు కలిగిన విద్యార్థులు ఉద్యోగ ఎంపికలకు హాజరుకావాలని సూచించారు. కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, కంప్యూటర్స్, సోష ల్ స్టడీస్ స్పెషలైజేషన్లను కలిగిన విద్యార్థులు విశ్వవిద్యాలయ నూతన పరిపాలన భవనంలోని ప్లేస్మెంట్ సెల్లో హాజరై ప్రయోజనం పొందాలని సూచించారు. మహిళలు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి కడప కోటిరెడ్డిసర్కిల్ : సమాజంలో మహిళలు వివిధ అంశాల్లో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని ఐసీడీఎస్ పీడీ దేవిరెడ్డి శ్రీలక్ష్మి పిలుపునిచ్చారు. బుధవారం నగర శివార్లలోని రిమ్స్ నర్సింగ్ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా కౌమార బాలికలకు వృత్తి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నర్సింగ్ వృత్తి చాలా ప్రాముఖ్యమైనదని తెలిపారు. ప్రిన్సిపాల్ హిమగిరి కుమారి మాట్లాడుతూ నర్సింగ్ వృత్తిని స్వీకరించిన వారు సేవాభావంతో పని చేయాలని సూచించారు. కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థినిపై గెస్ట్ ఫ్యాకల్టీ లైంగిక వేధింపులు వేంపల్లె : ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ విద్యార్థినిపై ఒంగోలు ట్రిపుల్ ఐటీ గెస్ట్ ఫ్యాకల్టీ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆర్కే వ్యాలీ ఇన్‌ఛార్జి ఎస్ఐ తిరుపాల్ నాయక్ తెలిపారు. బుధవారం విద్యార్థిని ఫిర్యాదు మేరకు ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఎస్ఐ తెలిపిన వివరాల మేరకు... ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని పై ఒంగోలు ట్రిపుల్ ఐటీలో ఫిజిక్స్ గెస్ట్ అధ్యాపకుడిగా పనిచేస్తున్న తిరుపతిరావు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు విద్యార్థిని ఆరోపించింది. మంగళవారం మధ్యాహ్నం విద్యార్థినిని అసభ్యకర పదజాలంతో మాట్లాడటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేధింపులకు పాల్పడిన అధ్యాపకుని ట్రిపుల్ ఐటీ నుంచి వెంటనే తొలగించాలని విద్యార్థిని డిమాండ్ చేసింది. కమిటీని వేసి విచారణ అనంతరం నిర్ణయం తీసుకుంటామని ఉన్నతాధికారులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
గుణాత్మక విద్యనందించడమే లక్ష్యం
కడప సెవెన్‌రోడ్స్ : రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన గుణాత్మక విద్య అందించడమే కాకుండా వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయనుందని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో జీవో 117 ఉపసంహరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే సన్నాహక మార్గదర్శకాలపై క్షేత్రస్థాయిలో అభిప్రాయ సేకరణ, నివేధికల సమర్పణ తదితర అంశాలపై సంబంధిత విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జీవో 117ను ఉపసంహరించిన తర్వాత అందుకు ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చేందుకు అవసరమైన ప్రక్రియను పాఠశాల విద్యాశాఖ ప్రారంభించిందన్నారు. రెండు నెలల పాటు క్షేత్రస్థాయిలో సంబంధిత శాఖల అధికారులు, పాఠశాలల అభివృద్ధి కమిటీ ప్రతినిధులు, పలువురు మేధావులతో అధ్యయనం జరిగిందన్నారు. కొత్త విధానంలో ఐదు రకాల పాఠశాలలను ప్రతిపాదించారు. జిల్లాలోని ప్రాథమికోన్నత పాఠశాలల స్థానంలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు నిర్వహణలోకి వస్తాయని.. ప్రాథమిక పాఠశాలల తరగతులు మారుతాయే తప్ప ఆ పాఠశాలలను మూసివేసే ప్రసక్తే ఉండదన్నారు. ఈ అంశాన్ని గుర్తుంచుకొని విద్యార్థుల తల్లిదండ్రులకు పూర్తిస్థాయి వివరణలు ఇవ్వాలన్నారు. పాఠశాల అభివృద్ధి కమిటీలు, మండల సమాఖ్య సభ్యులతో కూలంకుశంగా మాట్లాడితేనే సరైన నిర్ణయాలు బయటకు వస్తాయన్నారు. విలువలతో కూడిన గుణాత్మక విద్యను అందేంచే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోను ఉపసంహరించే యోచనలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి షంషుద్దీన్, మండల విద్యాశాఖ అధికారులు, మండల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు. సంతృప్త స్థాయిలో ఆరోగ్య సేవలు అందించండిగ్రామ,పట్టణ స్థాయిలో వైద్యారోగ్య శాఖలో వైద్యాధికారులు,అనుబంధ శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు సంతృప్త స్థాయిలో ఆరోగ్య సేవలు అందించాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సూచించారు. బుధవారం కలెక్టరేటో ఆరోగ్యశ్రీ, అనుబంధ ఆస్పత్రులు, పట్టణ, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల వైద్యులతో ఆరోగ్య సూచికలు, వైద్య శాఖ కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి వైద్యాధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ వైద్య వృత్తి ఎంతో గౌరవప్రదమైనదని వైద్యులు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలన్నారు. వేసవి కాలం దృష్ట్యా అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని వైద్య అధికారులకు సూచించారు. మలేరియా, డెంగీ, చికెన్ గున్యా వ్యాధులు విజృంభించకుండా ఉండాలంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనిదీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఓపీ, ఐపీ,ల్యాబ్ టెస్ట్‌లు, డెలివరీ వంటి ఆరోగ్య సేవలలో అ గ్రేడ్ సాధించి.. రాష్ట్రస్థాయిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ర్యాంకింగ్ లో జిల్లా రెండో స్థానంలో నిలిచిందని వెల్లడించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పర్ఫామెన్స్ ఇండికేటర్స్ లో మంచి ప్రతిభ చూపిన వైద్యాధికారులను జిల్లా కలెక్టర్ అభినందించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.నాగరాజు, ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్ బాలంజనేయులు,డీసీహెచ్ఎస్ ఇన్చార్జి కరిముల్ల , కడప డిప్యూటీ డీఎంహెచ్ఓ ఉమా మహేశ్వర రావు, బద్వేల్ డిప్యూటీ డిఎంహెచ్ఓ మల్లేష్,పులివెందుల డిప్యూటీ ఖాజా మొయినుద్దీన్, జమ్మలమడుగు డిప్యూటీ డీఎంహెచ్ఓ శివ ప్రసాద్ రెడ్డి, ప్రోగ్రాం ఆఫీసర్స్, పట్టణ, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల వైద్యులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి -
‘బ్రౌన్’ అదనపు భవన నిర్మాణాలను చేపట్టాలి
శాసనసభలో ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి డిమాండ్ కడప కల్చరల్ : కడప నగరంలోని సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రానికి అదనపు భవనాలను వెంటనే నిర్మించేందుకు తగిన చర్యలు చేపట్టాలని శాసనమండలి సభ్యులు ఎంవీ రామచంద్రారెడ్డి బుధవారం రాష్ట్ర శాసనమండలిలో డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మండలి స్పీకర్‌కు ఈ విషయాన్ని విన్నవించారు. కడప నగరంలోని బ్రౌన్ గ్రంథాలయం, భాషా పరిశోధన కేంద్రానికి ప్రతిరోజు వందలాది మంది పాఠకులు వస్తుంటారని, ముఖ్యంగా ఉద్యోగార్థులు తమ విజ్ఞానాన్ని పెంచుకునేందుకు, పోటీ పరీక్షలను ఎదుర్కొనేందుకు గ్రంథాలయంలోని పుస్తకాలను పరిశీలిస్తుంటారని తెలిపారు. ఈ గ్రంథాలయం భవనాలను మరింతగా విస్తరించేందుకు అవసరమైన స్థల సేకరణ, భవన నిర్మాణాల కోసం గత ప్రభుత్వం రూ. 6.80 కోట్లు మంజూరు చేసిందని, కానీ ఇంతవరకు నిర్మాణ పనులను సంబంధిత అధికారులు చేపట్టడం లేదని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుని నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించేలా చూడాలని కోరారు. -
పశువైద్య కళాశాలలో ఉద్రిక్తత
ప్రొద్దుటూరు రూరల్ : మండలంలోని గోపవరం సమీపంలో ఉన్న పశువైద్య కళాశాలలో బుధవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. తిరుపతి పశువైద్య విశ్వ విద్యాలయం వీసీ ఉత్తర్వుల మేరకు ఉదయం 7 గంటలకు కళాశాలలోని విద్యార్థుల హాస్టల్‌ను మూసివేశారు. ఉదయం అల్పాహారం హాస్టల్లో తయారు చేయకపోవడంతో పశువైద్య విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల ప్రధాన గేట్ వద్ద బైఠాయించి టీచింగ్, నాన్ టీచింగ్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ఎవరిని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న రూరల్ ఎస్ఐ మహ్మద్ రఫి తన సిబ్బందితో అక్కడికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగిస్తున్నారని, క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సి వస్తుందని విద్యార్థులను ఎస్ఐ హెచ్చరించారు. దీంతో విద్యార్థులు మెయిన్ గేట్‌ను ఓపెన్ చేశారు. అనంతరం కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ సీహెచ్ శ్రీనివాసప్రసాద్‌ను పశువైద్య విద్యార్థులు కలిసి వినతి పత్రం సమర్పించారు. కళాశాల హాస్టల్‌ను తెరవాలని కోరారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రొద్దుటూరు నుంచి క్యాటరింగ్ ద్వారా విద్యార్థులంతా భోజనాలు తెప్పించుకుని అక్కడే తిన్నారు. అనంతరం శిబిరంలో కూర్చొని యథావిధిగా సమ్మె చేశారు. తమ ఉద్యమాన్ని అణచివేసేందుకే పశువైద్య కళాశాలల్లో హాస్టల్‌ను మూసివేసి అధికారులు బెదిరిస్తున్నారని వారు ఆరోపించారు. కళాశాలలో హాస్టల్ మూసివేత బైఠాయించి నిరసన తెలిపిన విద్యార్థులు -
రోడ్డు ప్రమాదంలో తాత, మనవడు దుర్మరణం
దువ్వూరు : దువ్వూరు వద్ద ఉన్న కడప – కర్నూలు జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తాతా మనవళ్లు దుర్మరణం చెందారు. బంధువుల కథనం మేరకు.. మండలంలోని పెద్దజొన్నవరం గ్రామానికి చెందిన వెంకటసుబ్బయ్య (60), చాపాడు మండలం చీపాడుకు చెందిన నరసింహులు (36) తాత, మనవడు. వీరు దువ్వూరుకు పనిమీద బైక్‌పై బయల్దేరారు. దువ్వూరు సమీపంలోని ఆనకట్ట వద్ద కడప– కర్నూలు జాతీయ రహదారిపై వీరి బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో అక్కడికక్కడే ఇరువురు దుర్మరణం చెందారు. ఇద్దరు ఒకే కుటుంబ సభ్యులు కావడంతో బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. విషయం తెలుసుకున్న దువ్వూరు ఎస్ఐ వినోద్‌కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
గండికోటలో రోప్‌వే పనులు ప్రారంభం
కడప కల్చరల్ : ప్రముఖ పర్యాటకప్రాంతం, ఇండియన్ గ్రాండ్ క్యానియన్ గండికోటలో రోప్‌వే పనులకు చలనం లభించింది. 2019లో రోప్ వే పనులు ప్రారంభిస్తున్నామంటూ కొద్దిగా సామగ్రిని సిద్ధం చేసినా పనులు సాగలేదు. ఈ దశలో ఫిబ్రవరి 16న సాక్షి జిల్లా టాబ్లాయిడ్లో గండికొడతారా...కోట కడతారా పేరిట ఈ అంశంపై ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీంతో గండికోటలో అధికారుల హడావుడి మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ ఇటీవల గండికోటను సందర్శించి రోప్‌వే పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. మళ్లీ హడావుడి దీంతోపాటు ఆయన గండికోటలో ఓబెరాయ్ ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణానికి అవసరమైన స్థల సేకరణ కోసం ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. వీలైనంత త్వర గా నిర్మాణానికి సంబంధించిన అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. శని, ఆదివారాల్లో పర్యాటకులు గండికోటకు ఎక్కువ సంఖ్యలో వస్తుండడంతో వారి వసతికి అక్కడి పర్యాటక హరిత హోటల్ సరిపోవడం లేదు. రోప్‌వే పనులు ప్రారంభమైతే పర్యాటకుల సంఖ్య బాగా పెరిగే అవకాశం ఉంది. కేవలం ప్రారంభాలంటూ ఎప్పటిలా హడావుడి చేయడంతోనే సరిపెట్టకుండా పనులను త్వరగా పూర్తి చేయాలని స్థానిక పర్యాటకాభిమానులు కోరుతున్నారు. పెద్దదర్గా అభివృద్ధి ఏదీ? ఇటీవల జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి కడపలోని పెద్దదర్గా, సోమశిలలను అభివృద్ధి చేస్తామ ని ప్రకటించారు. ఆ తర్వాత దాని అభివృద్ధికి బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడంపై జిల్లా వాసుల్లో ముఖ్యంగా దర్గా అభిమానుల్లో ఒకింత అసంతృప్తి నెలకొంటోంది. ఎకో టూరిజానికి ఎంతో అనువుగా ఉండే సోమశిల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని పర్యాటకాభిమానులు కోరుతున్నారు. సాక్షి కథనానికి స్పందన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ పర్యటన రోప్ వే పనుల కోసం అధికారులకు ఆదేశం -
రైతుల్లో ఐకమత్యంతో ఆర్థికాభివృద్ధి
కడప అగ్రికల్చర్ : రైతులు గ్రూపులుగా ఏర్పడి ఐకమత్యంగా ఉంటే ఆర్థికాభివృద్ధిని సాధించవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి అయితా నాగేశ్వర్ రావు పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లోని వ్యవసాయశాఖ సమావేశ మందిరంలో ఉద్యానశాఖ ఆధ్వర్యంలో రైతు ఉత్పత్తుదారుల సంఘాలకు మౌలిక సదుపాయాలు, మార్కెటింగ్ అనుసంధానాల గురించి అవగాహ సదస్సు జరిగింది. జిల్లా సాంకేతిక ఉద్యానశాఖ అధికారి జ్యోతిర్మయి ఆధ్వర్యంలో జిల్లా ఉద్యానశాఖ అధికారి సుభాషిణి సదస్సుకు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డీఏఓ అయితా నాగేశ్వరావు మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో కీలక పాత్ర పోషించే రైతు ఉత్పత్తిదారులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం ద్వారా మరింత శక్తివంతంగా చేయవచ్చన్నారు. లీడ్ బ్యాంకు మేనేజర్ జనార్థన్ రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఎదుర్కొంటున్న బ్యాంకు రుణాల సమస్య గురించి చర్చించారు. నాబార్డు డీడీఎం విజయవిహారి మాట్లాడుతూ రైతులు ఉత్పత్తిదారుల సంఘాల అభివృద్ధికి నాబార్డు అన్ని విధాలుగా సహాయపడుతుందన్నారు. జిల్లా ఉద్యానశాఖ అధికారి సుబాషిణి మాట్లాడుతూ రైతులు సంఘాలుగా ఏర్పడితే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల్లో 75 శాతం రాయితీ పొందవచ్చన్నారు. ఎఫ్బీఓను విజయవంతంగా నిర్వహించిన పీలేరు వాసి, జయబ్బనాయుడు తమ అనుభవాలను రైతు ఉత్పత్తిదారులతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, రైతు సంఘాల ఉత్పత్తిదారులు పాల్గొన్నారు. రైతు ఉత్పత్తిదారుల సమావేశంలో డీఏఓ అయితా నాగేశ్వరావు -
మంత్రి అనుచరుల దందా!
చేతికందినంత...ప్రొద్దుటూరు: శ్రీసత్యసాయి జిల్లా పరిధిలోని మహిళా మంత్రి అనుచరులు రైతుల ముసుగులో దోపిడీకి దిగారు. నాసిరకం కందులు తీసుకొస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు. తాజాగా ప్రొద్దుటూరు వైఎంఆర్ కాలనీ పరిధిలోని స్టేట్ వేర్ హౌసింగ్ గోడౌన్‌కు వచ్చిన 600 కందుల బస్తాలకు గాను 386 బస్తాలను నాఫెడ్ అధికారులు నాసిరకంగా ఉన్నాయని తిరస్కరించారు. మరో లారీలో 607 బస్తాలకు గాను 180 బస్తాలను వెనక్కి పంపారు. ఇలా ప్రతి లారీలో పెద్ద సంఖ్యలో నాసిరకం కందులు తీసుకొస్తూ రూ.కోట్లు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్, రాష్ట్ర ప్రభుత్వ సంస్థ మార్క్‌ఫెడ్ ద్వారా ఈ ఏడాది మద్దతు ధర చెల్లించి రైతులతో కందులను కొనుగోలు చేస్తున్నారు. ఇందుకుగాను క్వింటాల్ కందులకు రూ.7,550 చెల్లిస్తున్నారు. కొనుగోలుకు సంబంధించి నాఫెడ్ పలు నిబంధనలు ఉన్నా అధికార పార్టీ నేతలు వీటిని ఖాతరు చేయలేదు. వెనక్కి పంపుతున్న అధికారులు రొద్దం ప్రాంతం నుంచి నిత్యం పెద్ద సంఖ్యలో కందుల లోడ్ లారీలు ఇక్కడికి వస్తున్నాయి. పరిస్థితిని గమనించిన అధికారులు ప్రతి లారీకి సంబంధించి ప్రతి బస్తాను తనిఖీ చేస్తున్నారు. సగానికి సగం పుచ్చుపట్టిన కందులు రావడంతో వెనక్కి పంపుతున్నారు. విషయం తెలుసుకున్న సదరు వ్యాపారులు అక్కడి అధికార పార్టీ నేతలతో అధికారులకు ఫోన్ చేసి ఒత్తిడి చేస్తున్నారు. ఇలా చెడిపోయిన కందులను దించుకుంటే మున్ముందు తమ ఉద్యోగాలకు ముప్పు వాటిళ్లుతుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో సోమవారం లారీలోని సరుకును దించాలని వ్యాపారులు ఒత్తిడి చేయడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. తమ లారీలు అన్లోడ్ చేయడం లేదని లారీ డ్రైవర్లు పోలీస్ స్టేషన్లోనే హల్ చల్ చేశారు. అధికారుల తనిఖీ విషయం తెలుసుకున్న తహసీల్దార్ గంగయ్య, ఆర్డీఓ ఎ.సాయిశ్రీతోపాటు త్రీటౌన్ సీఐ గోవిందరెడ్డి వేర్‌హౌస్ గోడౌన్‌కు వచ్చి కందులను తనిఖీ చేశారు. పరిస్థితిని గమనించి సత్య సాయి జిల్లా మార్క్‌ఫెడ్ డీఎం గీత, వైఎస్సార్ జిల్లా మార్క్‌ఫెడ్ డీఎం పరమల జ్యోతి వేర్ హౌసింగ్ గోడౌన్ వద్ద మకాం వేశారు. ఈ విషయంపై సత్యసాయి జిల్లా డీఎం విలేకరులతో మాట్లాడుతూ 1402 మంది రైతుల నుంచి కందులను సేకరించగా, ఇందులో 800 మందికి రూ.8కోట్ల 48 లక్షల 67వేల 425 చెల్లించామన్నారు. నాశిరకం కందులు వస్తున్న మాట వాస్తవమేనని, వీటిని రీ ప్రాసెస్ చేసుకుని తీసుకురావాలని వెనక్కి పంపుతున్నామన్నారు. తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు అమ్ముతున్నారు మంత్రి అనుచరులు రైతుల వద్ద నుంచి తక్కువ ధరకు పుచ్చు పట్టిన కందులను కొనుగోలు చేసి ఎక్కువ ధరకు ప్రభుత్వానికి అమ్ముతున్నారని సమాచారం. ఫిబ్రవరి నెల నుంచి ఇప్పటికే లారీల కొద్ది కందులను కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన కందులను స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు ప్రొద్దుటూరు వైఎంఆర్ కాలనీలోని గోడౌన్లో నిల్వ ఉంచుతున్నారు. నేరుగా రైతుల నుంచే ఈ కందులు కొనుగోలు చేశారా, ఎక్కడైనా గోడౌన్లలో నిల్వ ఉంచిన పాత కందులను తీసుకొస్తున్నారా అనే విషయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వెనక్కి పంపుతున్నాం గోడౌన్‌కు వస్తున్న కందుల బస్తాల్లో ఎక్కువగా నాసిరకం ఉన్నాయి. ప్రతి బస్తాను చెక్ చేస్తు న్నాం. కొంత కాలం గోడౌన్లో నిల్వ ఉంచి తర్వాత ప్రభుత్వం ప్రజలకు సరఫరా చేస్తుంది. అప్పుడు కందులు సరిగా లేకుంటే మేంబాధ్యత వహించాల్సి వస్తుంది. – వెంకటస్వామి, వేర్ హౌస్ గోడౌన్ మేనేజర్, ప్రొద్దుటూరు -
మహిళలు యోగాసనాలు అభ్యసించాలి
కడప కోటిరెడ్డిసర్కిల్: మహిళలు మానసికంగా, శారీరకంగా ధృడంగా ఎదిగేందుకు యోగా చాలా ఉపయోగపడుతుందని ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీలక్ష్మి, స్టెప్ సీఈఓ సాయిగ్రేస్ తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం నగరంలోని నబీకోటలో ఉన్న మహిళా శక్తికేంద్రంలో అంగన్వాడీ వర్కర్లు, మెప్మా పరిధిలోని మహిళా సంఘాలకు యోగ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల్లో ఒత్తిడిని నివారించాలంటే యోగా ఉపయోగపడుతుందన్నారు. యోగా నిపుణులు డాక్టర్ ఆర్.రంగనాథరెడ్డి పలు సూచనలు చేశారు. అనంతరం మహిళలచేత యోగాసనాలు చేయిస్తూ వాటి ప్రయోజనాలు, శాసీ్త్రయ దృక్పథాన్ని వివరించారు. -
రోడ్డు భద్రతా ఆంక్షలు కఠినతరం
కడప సెవెన్‌రోడ్స్: జిల్లాలో రోడ్డు భద్రత చర్యల ఆంక్షలను మరింత కఠినతరం చేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో జిల్లా రవాణాశాఖ ఆధ్వర్యంలో జిల్లా రహదారుల భద్రతా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కలెక్టర్, కమిటీ చైర్మన్ శ్రీధర్ చెరుకూరితోపాటు ఎస్పీ ఈజీ అశోక్ కుమార్, కమిటీ మెంబర్ కన్వీనర్ ఇంచార్జి డీటీసీ కె. ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధాన రహదారుల్లో డివైడర్లను బ్రేక్ చేసి వాహన ప్రమాదాలకు అవకాశం కల్పిస్తున్న వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేయాలన్నారు. రియల్టర్లు, రాజకీయ ప్రమేయాలకు స్పందించకుండా రోడ్డు భద్రతా ఆంక్షలను కఠినతరం చేయాలన్నారు. ఇంజనీరింగ్ శాఖల వారీ గా వారి సంబంధిత రహదారులపై తాజాగా జరిగిన ప్రమాదాలను విశ్లేషించి, వాటి నివారణకు తీసుకోవలసిన చర్యలను వివరించారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయాల్లో.. 108 వాహన సేవలు సకాలంలో అందేలా సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా విద్యా సంస్థల వద్ద స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు, అలాగే ప్రతి పెట్రోల్ బ్యాంకులు, కమర్షియల్ కాంప్లెక్స్ ల వద్ద సీసీ కెమేరా లను ఏర్పాటు చర్యలు తీసుకోవాలన్నారు. అతివేగం, డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ లేకుండా వాహనం నడపడం, పరిమితికి మించి ఆటోలు నడపడం, బస్సులు ఇతర వాహనాలలో అధిక లోడుతో సరుకు, ఇతర సామగ్రి రవాణా చేసే వారిపై.. కఠిన చర్యలు తీసుకోవలసిందిగా రవాణ శాఖ అధికారులను ఆదేశించారు. అంతర్ జిల్లా సరిహద్దుల చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై ప్రత్యేక దష్టి సారించి కేసులు ఫైల్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ కె. ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ మనోజ్ రెడ్డి, పీఆర్ ఎస్ఈ శ్రీనివాసులు రెడ్డి, డీఎంహెచ్ఓ నాగరాజు, ఆర్అండ్బీ శాఖ అధికారులు, కమిటీ సభ్యులైన రోడ్ సేఫ్టీ ఎన్జీవో, విద్యుత్ శాఖల ఎస్.ఈ.లు, మున్సిపల్ కమిషనర్లు, నేషనల్ హైవేస్ అథారిటీ అధికారులు, ట్రాఫిక్, పోలీసు, రవాణా శాఖ అధికారులు, రోడ్డు భద్రత ఎన్జీఓల ప్రతినిధులు, కమీటీ సభ్యులు పాల్గొన్నారు. మాదకద్రవ్యాల నిరోధానికి పటిష్ట చర్యలు మత్తుపదార్థాల వినియోగం, విక్రయాలు, రవా ణాను అరికట్టడానికి జిల్లాలో పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని వీసీ హాలులో జిల్లాలో మత్తు పదా ర్థాల నివారణ, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నిరోధంపై ఎస్పీ అశోక్ కుమార్, జేసీ అదితి సింగ్ లతో కలిసి కలెక్టర్ జిల్లా స్థాయి యాక్షన్ కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాల మూల సరఫరా రవాణాను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి -
నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ
కడప కోటిరెడ్డిసర్కిల్: కెనరా బ్యాంకు గ్రామీణ స్వయం శిక్షణ ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో ఫొటో, వీడియోగ్రఫీ, సెల్‌ఫోన్ రిపేరింగ్, సర్వీసింగ్, కొవ్వొత్తుల తయారీలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ ఆరీఫ్ ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువతకు శిక్షణలో ప్రాధాన్యతనిస్తామన్నారు. అభ్యర్థులు 18–45 ఏళ్లలోపుకలిగి ఉండాలని, ఈనెల 8వ తేదిలోగా తమను సంప్రదించాలని పేర్కొన్నారు. వివరాలకు 94409 05478, 99856 06866 నెంబరల్లో సంప్రదించాలని సూచించారు. 10న జోన్–4 సమావేశం కడప కోటిరెడ్డిసర్కిల్: ఏపీ పీటీడీ జై భీమ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 10న కడప జోన్–4 సమావేశాన్ని నిర్వహిస్తున్నామని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పత్తిపాటి కిరణ్, బుజ్జి వెల్లడించారు. మంగళవారం కడప నగరంలోని ఏపీఎస్ ఆర్టీసీ ఈడీ పైడి చంద్రశేఖర్‌రావును కలిసి ఈ మేరకు వినతిపత్రమిచ్చారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కడప నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని, సమావేశానికి ఈడీని, డీపీటీఓను, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను ఆహ్వానించామన్నారు. ఈడీని కలిసిన వారిలో సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి సుధాకర్, వివిధ జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు ఉన్నారు. రేపు కడపలో జాబ్‌మేళా కడప కోటిరెడ్డిసర్కిల్: జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయం, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గురువారం ఉదయం 10 గంటలకు తమ కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి ఇన్‌ఛార్జి డోనప్ప తెలిపారు. కలెక్టరేట్లోని ఓ బ్లాక్‌లో ఉన్న జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో నిర్వహించే ఇంటర్వ్యూలకు టెక్నో డోమ్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, ఛానల్ ప్లే లిమిటెడ్ సంస్థలు హాజరవుతాయని పేర్కొన్నారు. ఆయా కంపెనీలో అసెంబ్లీ లైన్ ఆపరేటర్, సేల్స్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్ తదితర ఉద్యోగాలకు 5వ తరగతి, టెన్త్, ఐటీఐ, డిగ్రీ, పీజీ చదివినవారు అర్హులన్నారు. ఎంపికై న వారికి రూ. 10–32 వేల వరకు వేతనం ఉంటుందన్నారు. అభ్యర్థులు తమ విద్యార్హతల ధృవపత్రాలు, ఫొటోలతో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు. లైన్మెన్ల సేవలు ఎనలేనివి పులివెందుల రూరల్: విధి నిర్వహణలో లైన్మెన్ల సేవలు మరువలేనివని విద్యుత్ శాఖ ఎస్ఈ రమణ పేర్కొన్నారు. జాతీయ లైన్మెన్ దినోత్సవం సందర్భంగా మంగళవారం పట్టణంలోని స్థానిక విద్యుత్ డివిజన్ శాఖ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అనంతరం విధి నిర్వహణలో ఉన్న విద్యుత్ సంస్థకు అత్యున్నత సేవలు అందించిన పులివెందుల వెస్ట్, టౌన్లో పనిచేస్తున్న లైన్ ఇన్స్పెక్టర్ సుధాకర్‌రెడ్డి, లైన్మెన్ అంజిలకు ఉత్తమ ప్రతిభా అవార్డులను అందజేశారు.డివిజన్ ఇంజనీర్ ప్రసాద్‌రెడ్డి, ఏడీఈలు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం లింగాల: లింగాల మండలం ఇప్పట్ల గ్రామ సమీపంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి 5వ తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరం (ఇంగ్లిష్ మీడియం)లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని కళాశాల ప్రిన్సిపల్ సత్యవతమ్మ తెలిపారు. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈ విద్యాలయాల్లో ప్రత్యేకంగా పేద, నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు గొప్ప అవకాశమన్నారు. ఈ అవకాశాన్ని అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకుని తమ పిల్లలను తమ విద్యాలయంలో చేర్పించాలన్నారు. ఇతర వివరాలకు దగ్గరలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో సంప్రదించాలని సూచించారు. ఏపీ గురుకుల మైనార్టీ బాలుర పాఠశాలలో... కడప ఎడ్యుకేషన్: కడపలోని ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల (మైనార్టీ బాలుర)లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సి పాల్ పేతకంశెట్టి సోమ సత్యశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. 5వ తరగతిలో 80 సీట్లు, 6,7,8 తరగతుల్లో మిగిలిన సీట్లకు దరఖాస్తు చేసుకో వాలని తెలిపారు. ప్రవేశ పరీక్ష ద్వారా సెలెక్ట్ అయిన తర్వాత ప్రవేశం పొందవచ్చని తెలిపారు. మైనార్టీ బాలురతోపాటు ఎస్సీ, ఎస్టీ బాలురు కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ నెల 31లోగా https://aprs.apcffss.inద్వారా దరఖా స్తు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 25వ తేదీ ప్రవేశ పరీక్ష ఉంటుందని వివరించారు. వివరాలకు 7780179446, 9059500193 నెంబర్లలో సంప్రదించాలని ప్రిన్సిపాల్ తెలిపారు. -
ఇంగ్లిష్ పరీక్షలకు 743 మంది గైర్హాజరు
కడప ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ పరీక్షల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన ప్రథమ సంవత్సరం ఇంగ్లిష్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. 18267 మంది విద్యార్థులకుగాను 17524 మంది హాజరుకాగా 743 మంది గైర్హాజరైనట్లు ఆర్ఐవో బండి వెంకటసుబ్బయ్య తెలిపారు. ఇందులో జనరల్‌కు సంబంధించి 626 మంది, ఒకేషనల్‌కు సంబంధించి 117 మంది గైర్హాజరయ్యారు. ఆర్టీపీపీలో జాతీయ భద్రత ర్యాలీ ఎర్రగుంట్ల: జాతీయ భద్రత దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం డాక్టరు ఎంవీఆర్ ఆర్టీపీపీలో ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని ఆర్టీపీపీ సీఈ గౌరీపతి జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ ఆర్టీపీపీలోని అగ్నిమాపక కేంద్రం నుంచి పరిపాలన విభాగం భవనం నుంచి నినాదాలతో సాగింది. ఈ సందర్భంగా ఆర్టీపీపీ సీఈ గౌరీపతి మాట్లాడుతు ఆర్టీపీపీ ఉద్యోగులు భద్రత, ఆరోగ్యం వాతావరణ తదితరం అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్మికులు పనులలో కచ్చితంగా హెల్మెంట్ ధరించాలన్నా రు. ఎస్ఈలు, ఈఈలు, ఫ్యాక్టరీ మేనేజర్ సిద్ధయ్య, అసిస్టెంట్ సెక్రటరీ బాష, అసిస్టెండ్ కమాండ్ కృష్ణయ్య, ఆర్ఐ రమేష్, విజిలెన్స్ సీఐ నారాయణ యాదవ్, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. -
ఉగాది పురస్కారం పోస్టర్ ఆవిష్కరణ
కడప కార్పొరేషన్: శ్రీ నవ్య కళానికేతన్ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా ఉగాది పురస్కారం అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా పిలుపునిచ్చారు. మంగళవారం తన కార్యాలయంలో వైఎస్సార్సీపీ సాంస్కృతిక విభాగం నగర అధ్యక్షుడు సాయి హుస్సేన్ ఆధ్వర్యంలో ఈ అవార్డుల ప్రదానోత్సవం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన వారికి ఉగాది పురస్కారాలు అందించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దాసరి శివప్రసాద్, కో ఆప్షన్ సభ్యులు జహీర్, సౌత్ జోన్ అధ్యక్షులు పెద్దిరెడ్డి రామ్మోహన్ రెడ్డి, కె. మాధవరెడ్డి, శివారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
● బ్రహ్మంసాగర్
కడప సెవెన్‌రోడ్స్: గ్రామీణ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం సమకూర్చే నిధులతో వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలోని ఐదు ప్రధాన జలాశయాల నుంచి తాగునీటిని శుద్ధి చేసి పైపులైన్ల ద్వారా గ్రామాలకు సరఫరా చేస్తారు. ఈ మల్టీ విలేజెస్ స్కీమ్‌కు సంబంధించి సవరించిన డిటైల్డ్ ప్రొజెక్టు రిపోర్టును ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. జల జీవన్ మిషన్ కింద గ్రాంటు మంజూరై పనులు పూర్తయితే గ్రామీణ తాగునీటి కష్టాలు తప్పినట్లేనని అధికారులు భావిస్తున్నారు. ● ఏటా వేసవిలో గ్రామీణ ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. సీపీడబ్ల్యూఎస్ లాంటి పలు పథకాలు ఉన్నప్పటికీ అవి పూర్తి స్థాయిలో ప్రజల అవసరాలను తీర్చలేకపోతున్నాయి. సాధారణ రోజుల్లోనే సమస్యలు తప్పడం లేదు. ఇక వర్షాలు లేక తీవ్ర కరువులు జిల్లాను చుట్టుముట్టిన సందర్భాల్లో పరిస్థితి చెప్పాల్సిన పని లేదు. తాగేందుకు గుక్కెడు నీరు లేక ప్రజలు,పశువులు అలమటించాల్సిన పరిస్థితులు జిల్లాలో ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వం ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయడం, బోర్ల డీపెనింగ్, మరమ్మతులు, వ్యవసాయ బోరు బావులు అద్దెకు తీసుకోవడం వంటి చర్యలు చేపట్టడం సర్వసాధారణంగా ఉంటోంది. మండల, జిల్లా పరిషత్, జిల్లా సమీక్షా కమిటీ సమావేశాల్లో ప్రజాప్రతినిధులు పలుమార్లు ఈ విషయాన్ని ప్రస్తావించిన సందర్భాలు లేకపోలేదు. వైఎస్ జగన్ హయాంలోనే.. కేంద్ర ప్రభుత్వ జలజీవన్ మిషన్ ద్వారా వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయాలని వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భావించారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. అటకెక్కిన వాటర్ గ్రిడ్ దుమ్ముదులిపి గ్రామీణ ప్రజలకు శుద్ధి జలం అందించాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రణాళికలు రూపొందించారు. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో సైతం ఆయన సమావేశమై నిధుల సమీకరణకు కృషి చేశారు. తాజాగా ఆ పథకం కార్యరూపం దాల్చనుంది. ఈ పథకం పూర్తిగా విజయవంతమైతే జిల్లాలో గ్రామీణ తాగునీటి సమస్య దాదాపు పరిష్కారమైనట్లేనని అధికారులు భావిస్తున్నారు. నిధుల మంజూరుకు ప్రతిపాదనలు.. జిల్లాలోని 1587 గ్రామాల్లో ఉన్న 10,27,048 మంది జనాభాకు 0.9453 టీఎంసీల తాగునీటిని సరఫరా చేసేందుకు 2785 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. సస్టైనబుల్ సోర్సెస్ ద్వారా ఈ మల్టీ విలేజ్ స్కీమ్ కోసం కేంద్ర ప్రభుత్వం జల జీవన్ మిషన్ కింద గ్రాంటు విడుదల చేయాలని అధికార యంత్రాంగం తమ ప్రతిపాదనల్లో కోరింది. ● మండలాలు: కాశినాయన, బి.కోడూరు, పోరుమామిళ్ల, కలసపాడు, ఖాజీపేట, బ్రహ్మంగారిమఠం, మైదుకూరు, ● గ్రామాలు: 470● ప్రజలు: 2,60,076 మంది ● గ్రాస్ కెపాసిటీ: 17.74 టీఎంసీ ● సరఫరా చేయాల్సింది: 0.2961 టీఎంసీ ● నిధులు: రూ.661 కోట్లు● సోమశిల● మైలవరం● మండలాలు: పెద్దముడియం, జమ్మలమడుగు, మైలవరం, ప్రొద్దుటూరు, రాజుపాలెం ● గ్రామాలు: 173● ప్రజలు: 2,42,438 మంది ● గ్రాస్ కెపాసిటీ: 9.98 టీఎంసీ ● సరఫరా చేయాల్సింది: 0.1756 టీఎంసీ ● నిధులు: రూ.381 కోట్లు● మండలాలు: గోపవరం, బద్వేలు, అట్లూరు, సిద్దవటం, ఒంటిమిట్ట ● గ్రామాలు: 347● ప్రజలు: 1,20,330 మంది ● గ్రాస్ కెపాసిటీ: 78 టీఎంసీ ● సరఫరా చేయాల్సింది: 0.0761 టీఎంసీ ● నిధులు: రూ.755 కోట్లు● మండలాలు: దువ్వూరు, చాపాడు, ప్రొద్దుటూరు, రాజుపాలెం ● గ్రామాలు: 107● ప్రజలు: 95,300 మంది ● గ్రాస్ కెపాసిటీ: 2.13 టీఎంసీ ● సరఫరా చేయాల్సింది: 0.0892 టీఎంసీ ● నిధులు: రూ.245 కోట్లు గండికోట రిజర్వాయర్ టీజీ సబ్సిడరీ రిజర్వాయర్వాటర్గ్రిడ్తో నీటి కష్టాలకు చెక్ ప్రధాన జలాశయాల ద్వారా నీటి సరఫరా 1587 గ్రామాలకు రక్షిత నీరు జేజేఎం గ్రాంటు కింద రూ. 2785 కోట్ల మంజూరుకు ప్రతిపాదనలు -
కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రవేశ పరీక్షతో ఉజ్వల భవిష్యత్తు
కడప ఎడ్యుకేషన్ : దేశవ్యాప్తంగా జరిపే సెంట్రల్ యూనివర్సిటీ అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశ పరీక్ష– 2025 (సీయూఈటీ అండర్ గ్రాడ్యుయేట్ 2025)తో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కడప ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి. రవీంద్రనాథ్ పేర్కొన్నారు. దేశంలోని 190కి పైగా సెంట్రల్ యూనివర్సిటీలు, స్టేట్ యూనివర్సిటీలు, ప్రైవేటు డీమ్డ్ టు బీ యూనివర్సిటీలలో, ఐకార్ అనుబంధ వ్యవసాయ కళాశాలలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో ప్రవేశం కోసం జరిపే ఈ పరీక్ష ద్వారా విద్యార్థులకు ఉన్నతమైన భవిష్యత్తు ఉంటుందన్నారు. మంగళవారం కడప ఆర్ట్స్ కళాశాలో సర్ సీవీ రామన్ సైన్స్ క్లబ్, విద్యా భారతి ఆధ్వర్యంలో ఇందుకు సంబంధించిన పోస్టర్లను అధ్యాపకులతో కలిసి ప్రిన్సిపాల్ ఆవిష్కరించారు. ఈ ప్రవేశ పరీక్షకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ప్రారంభమైందన్నారు. మార్చి 22వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ కొనసాగుతుందన్నారు. ఈ నెల 9వ తేదీ సాయంత్రం 7 గంటలకు ఆన్లైన్లో వెబ్‌నార్ ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాభారతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పత్తి వెంకట కృష్ణారెడ్డి, సైన్సు క్లబ్ గౌరవాధ్యక్షుడు గునిశెట్టి శ్రీనివాసులు, గౌరవ సలహాదారు డాక్టర్ బి.రామచంద్ర, అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసులరెడ్డి, కార్యదర్శి విజయప్రసాద్, ఆర్ట్స్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రమేష్, అధ్యాపకులు డాక్టర్ సావిత్రి, డాక్టర్ రవి, డాక్టర్ నీలయ్య, డాక్టర్ విజయ్ కుమార్, డాక్టర్ వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఇది మోసకారి బడ్జెట్
కడప వైఎస్ఆర్ సర్కిల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాయలసీమ ప్రాంతానికి తీరని అన్యాయం చేసిందని, జనాభా ప్రాతిపదికన కానీ వైశాల్య ప్రాతిపదికన కానీ 42 శాతం కేటాయించాల్సిన బడ్జెట్లో 6 శాతం కేటాయించడం అంటే ఇది మోసకారి బడ్జెట్ అని వక్తలు విమర్శించారు. రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో రాష్ట్ర బడ్జెట్ – రాయలసీమ ఆకాంక్షలు అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అప్పుల బాహుబలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందన్నారు. గత బడ్జెట్‌తో పోల్చుకుంటే ఇది తక్కువేనన్నారు. ఈ రకమైన అర కొర బడ్జెట్ ద్వారా మరో 50 ఏళ్లు అయినా కూడా రాయలసీమలో ఏ ఒక్క ప్రాజెక్టు, ఏ ఒక్క పరిశ్రమ పూర్తి కాదన్నారు. రాయలసీమ వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలంటే కనీసం రూ. 40 వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయన్నారు. అలాంటిది కేవలం రూ. 11 వేల కోట్లు రాష్ట్రమంతా కేటాయించడం ఎంతవరకు సమంజసమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి వారు చెప్పిన సూపర్ సిక్స్ హామీలే ప్రధాన కారణమని, అలాంటి హామీలను ఈరోజు విస్మరిస్తున్నారన్నారు. నిరుద్యోగ భృతికి ఈ బడ్జెట్లో తావు లేకుండా చేసి వారిని నిలువునా మోసం చేశారన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఈ బడ్జెట్లో ఏ మాత్రం నిధులు కేటాయించలేదన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను ఈ బడ్జెట్ నిలువునా మోసం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్సీపీ తదితర పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. సదస్సులో వక్తలు -
ప్యాసింజర్ రైలు పొడిగింపు
కడప కోటిరెడ్డిసర్కిల్ : ఈనెల 8వ తేదీ వరకు కుంభమేళాకు నడవాల్సి ఉన్న తిరుపతి–హుబ్లి–తిరుపతి (57401/57402) ప్యాసింజర్ రైలును ఈనెల 15వరకు పొడిగించినట్లు కడప రైల్వే కమర్షియల్ ఇన్స్పెక్టర్ జనార్దన్ తెలిపారు. తిరుపతి–హుబ్లి మధ్య 8 నుంచి 15వ తేదీ వరకు, హుబ్లీ–తిరుపతి మధ్య 9వ తేదీనుంచి 16వ తేదీ వరకు ఈ రైళ్లను రద్దు చేశారన్నారు. తిరిగి 15, 16 తేదీలనుంచి ఈ రైళ్లు యథావిధిగా నడుస్తాయని ఆయన వివరించారు. ఫార్మసిస్ట్‌లకు ఉద్యోగ భద్రత కల్పించాలి కడప కార్పొరేషన్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫార్మసిస్ట్‌లకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఏపీ ఫార్మసిస్ట్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మద్దెల సురేష్ బాబు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రతి మెడికల్ స్టోర్‌లో ఫార్మసిస్ట్ తప్పనిసరిగా ఉండాలన్నారు. కానీ మెడికల్ స్టోర్‌లో అర్హత లేని సిబ్బందితో మందులు ఇప్పిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పలుమార్లు ఈ విషయమై సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ఇప్పటికై నా క్వాలిఫైడ్ ఫార్మసిస్ట్ ప్రతి మెడికల్ స్టోర్‌లో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అప్పడే డ్రగ్ మాఫియాను అరికట్టవచ్చన్నారు. కారుబోల్తా ముద్దనూరు : ముద్దనూరు–కడప జాతీయ రహదారిలో తిమ్మాపురం సమీపంలో ప్రమాదవశాత్తు కారు బోల్తాపడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇరువురికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు తాడిపత్రి నుంచి ప్రయాణిస్తు కారు టైరు పగిలి అదుపుకాలేక రహదారి పక్కకు వెళ్లి బోల్తాపడింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బాధితులకు సహాయం అందించారు. -
ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించాలి
కడప కోటిరెడ్డిసర్కిల్ : రోజువారి కష్టార్జితంపై ఆధారపడి జీవిస్తున్న ఆటో కార్మికుల సమస్యలను సత్వరమే పరిష్కరించేలా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని ఏఐటీయూసీ నాయకుడు నాగసుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఏఐటీయూసీ అనుబంధ ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆటో కార్మికులు స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగసుబ్బారెడ్డి మాట్లాడుతూ అధిక వడ్డీలకు తెచ్చుకుని ఆటోలు నడుపుతున్న పేద వర్గాల పట్ల పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. ఆటో కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాకారుల సంఘం జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు, ఏఐటీయూసీ నగర అధ్యక్షుడు పి.సుబ్బరాయుడు, ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ కడప నగర అధ్యక్ష, కార్యదర్శులు పుల్లయ్య, నారాయణ, నగర నాయకులు సుబ్బరాయుడు, నాగిరెడ్డి, అంకుశం, రెడ్డెయ్య తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ శాఖ పురోభివృద్ధిలో లైన్మెన్ల పాత్ర కీలకం
– కడప ఆపరేషన్ ఈఈ హరిసేవ్యా నాయక్ కడప కార్పొరేషన్ : విద్యుత్ శాఖ పురోభివృద్ధిలో లైన్మెన్ల పాత్ర ఎంతో కీలకమని కడప ఆపరేషన్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ హరిసేవ్యా నాయక్ అన్నారు. మంగళవారం లైన్మెన్ దివస్ సందర్భంగా కడప డివిజన్ కార్యాలయంలో ఓ అండ్ ఎం స్టాఫ్ యూనియన్ ఆధ్వర్యంలో జెండా ఎగురవేసి, కేక్ కత్తిరించి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా హరిసేవ్యా నాయక్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఽఆధ్వర్యంలోని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆఫ్ ఇండియా లైన్మెన్లను ఫ్రంట్ లైన్ వర్కర్లుగా గుర్తించి 2021 సంవత్సరం నుంచి ప్రతిభ చూపిన లైన్మెన్లకు అవార్డులు ఇస్తోందన్నారు. జిల్లాలో ఉన్న లైన్మెన్లు కూడా ఈ అవార్డులు తీసుకునేందుకు పోటీ పడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న యూనియన్ సభ్యులు, భారీ సంఖ్యలో ఎనర్జీ అసిస్టెంట్లు, జేఎల్ఎంలు, లైన్మెన్లు పాల్గొన్నారు. ఒంటిమిట్ట ఆలయంలో పనులకు పురావస్తు శాఖ కొర్రీ ఒంటిమిట్ట : ఒంటిమిట్ట కోదండరామాలయంలో ధ్వజస్తంభం, బలిపీఠం, ఇత్తడి రేకు తొడుగు మార్పు పనులపై కేంద్ర పురావస్తుశాఖ అధికారులు నేటికీ అనుమతులు ఇవ్వలేదు. బుధవారం నుంచి మహా సంప్రోక్షణ ఉత్సవాలు జరగనుండగా పురావస్తు శాఖ జీర్ణోద్ధరణ పనులు పూర్తి చేసింది. అయితే ఒంటిమిట్ట రామాలయంలో ధ్వజస్తంభం, బలిపీఠం, స్వర్ణ రంగు పొయ్యి అంద వికారంగా దర్శనమిస్తున్నాయి. దీంతో వాటిని అందంగా స్వర్ణ రంగుతో తీర్చిదిద్దేందుకు పురావస్తు శాఖ అనుమతులు వస్తాయనుకున్న టీటీడీ అధికారులు ధ్వజ స్తంభం చుట్టూ ఇనుప పైపులతో సారవ కట్టించారు. కానీ పురావస్తు శాఖ అనుమతులు రాలేదు. -
వ్యక్తిత్వ వికాసానికి మార్గం.. రంజాన్ మాసం
కడప కల్చరల్ : దాదాపు అన్ని మత గ్రంథాలు వ్యక్తిని ఉన్నతుడిగా తీర్చిదిద్దేందుకు ఎన్నో మార్గాలను సూచిస్తున్నాయి. ప్రతి మతం సాటి మనిషి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పేర్కొంటున్నాయి. ముందు వ్యక్తిగా తాను స్వచ్ఛంగా, బలంగా నిలదొక్కుకోవాలని, తర్వాత ఆపన్నులను ఆదుకోవాలని చెబుతున్నాయి. పవిత్ర ఖురాన్‌లోని కొన్ని మాటలు, ప్రవక్త జీవితంలోని కొన్ని సంఘటనలు మానవ వ్యక్తిత్వ వికాసానికి ఎంతగానో తోడ్పడేలా ఉన్నాయి. కడప నగరానికి చెందిన ఇస్లాం ఆధ్యాత్మిక వేత్త హజరత్ హుసేనీబాషా షహమీరి సాహెబ్ ఇలాంటి కొన్ని విశేషాలను అందజేస్తున్నారు. పవిత్ర రంజాన్ మాసంలోని రోజాలు, దానికి సంబంధించిన ఆహార నియమాలు ఆరోగ్యపరంగానూ, మనసును అదుపు చేసుకునే విషయంలోనూ ఎంతో తోడ్పడతాయి. పొరుగువారి ఆకలి తెలుసుకునేలా చేసి సాటి మనిషికి సాయపడే గుణాన్ని అలవాటు చేస్తాయి. ఇవ్వడంలో ఉన్న తృప్తి ఏమిటో తెలియజేస్తాయి. తద్వారా అల్లాహ్‌కు దగ్గర చేస్తాయి. జిహ్వ చాపల్యమేగాక జిహ్వ చాంచల్యం కూడా మనిషిని ఇబ్బందులకు గురి చేస్తోందని పరోక్షంగా ఈ పండుగ సంప్రదాయాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా పరసీ్త్ర వ్యామోహాన్ని సమూలంగా నిర్మూలించేందుకు తగిన ఆత్మ నిగ్రహాన్ని అందజేస్తున్నాయి. దాన ధర్మాలు ఈ పవిత్ర మాసంలో జకాత్, ఫిత్రాల పేరిట పేదలకు దానం చేసే సంప్రదాయం ఉంది. తమ సంవత్సర ఆదాయంలో సూచించిన మేరకు ధనాన్ని బంధుమిత్రుల్లోని పేదలకు ఇవ్వాల్సి ఉంటుంది. వారు ఆకలితో ఉంటూ పండుగను ఆస్వాదించలేరని, ఆకలి కడుపునకు భక్తి పట్టదని, అందుకే కనీసం పండుగ రోజైనా నిరుపేదలు కడుపునిండా తినేందుకు జకాత్ ఇవ్వాలని పవిత్ర గ్రంథం ఖురాన్ సూచిస్తోంది. ఉన్నా లేకున్నా ఉన్నంతలో పండుగ సందర్భంగా జరిగే ప్రార్థనలకు ముందు ఫిత్రా పేదలకు అందజేయాలి. అనుబంధాలు రంజాన్ పండుగ అనుబంధాలను పెంచుతుంది. ఈ మాసంలో రోజా (ఉపవాసాలు) సందర్భంగా ఒకరికొకరు ఇఫ్తార్‌ను ఏర్పాటు చేసుకోవడం, ఒకరినొకరు తినిపించుకోవడం, ఆహార పదార్థాలను పంచుకోవడం, బంధుమిత్రులతో కలిసి ఉపవాస విరమణ దీక్షలు, ప్రార్థనలు చేయడం, వారితో అనుబంధాన్ని మరింతగా పెంచుతుంది. మునుపు కోల్పోయిన బంధాలను కూడా ఇలాంటి కార్యక్రమాల ద్వారా పునరుద్ధరించుకోవచ్చు. పండుగరోజు కూడా తాము చేసుకున్న ముఖ్యమైన ఆహార పదార్థాలను కొద్దిగానైనా బంధుమిత్రులకు అందజేసి వారితో మానసిక బంధాన్ని పెంచుకునే అవకాశం పవిత్ర రంజాన్ కల్పిస్తుంది. ముందు రోజులు, పండుగ రోజుల్లో తమ ప్రవర్తనను తాము తరిచి చూసుకుని ఆత్మ పరిశీలన చేసుకునేందుకు రంజాన్ మాసం ఉత్తమమైనదిగా పెద్దలు పేర్కొంటున్నారు. మనం ఇతరులు ఎలా ఉండాలని ఆశిస్తామో...ఇతరులు కూడా మన నుంచి అలాగే ఆశిస్తారని తెలుసుకునేందుకు ఈ పండుగ అవకాశం కల్పిస్తుంది. -
వేలం పాట ద్వారా రూ.18.95 లక్షల ఆదాయం
బ్రహ్మంగారిమఠం : ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ పో తులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంలో సో మవారం నిర్వహించిన బహిరంగ వేలం పాటల ద్వారా రూ 18.95 లక్షలు మఠానికి ఆదాయం వచ్చినట్లు మఠం మేనేజర్ ఈశ్వరాచా రి తెలిపారు. పోలేరమ్మగుడి దగ్గర కొబ్బరికాయలు వి క్రయించుకునేందుకు రూ. 3,62,000, కొబ్బరి చిప్పలు వసూలు చేసుకునేందుకు రూ.1,90, 000, టీటీడీ వసతి గృహాల దగ్గర ఉన్న మరుగు దొడ్లు శుభ్రపరిచేందుకు రూ.5,06,000, పార్కు ఎదురుగా ఉన్న కామన్ మరుగుదొడ్ల నిర్వహణకు రూ.2,40,000, గోవిందమాంబ, వీరబ్రహ్మేంద్ర సదనం దగ్గర ఉన్న మ రుగు దొడ్ల నిర్వహణకు రూ.2,40,000, భక్తుల పాదరక్షలు భద్రపరుచుకునేందుకు రూ.1,77,000, డార్మిటరీ నిర్వహణ కోసం రూ. 1, 80,000 వేలం పాట ద్వారా ఆదాయం వచ్చినట్లు వివరించారు. మహిళ ఆత్మహత్య చక్రాయపేట : మండలంలో ని సురభి దళితవాడలో పెద్దపాగ స్వాతి (23) అనే వివాహిత మంగళవారం మనస్థాపానికి గురై ఉరివేసుకుని ఆ త్మహత్య చేసుకున్నట్లు ఎస్ ఐ కృష్ణయ్య తెలిపారు. మృతురాలి పిన్నమ్మ అంజన మ్మ ఫిర్యాదు మేరకు ఆయ న తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మృతురాలి భర్త శ్రీధర్ జీవనోపాధి నిమిత్తం కువైట్ దేశానికి వెళ్లేందుకు నిర్ణయించుకోగా, ఇది ఇష్టంలేక స్వాతి మనస్థాపం చెంది ఉరి వేసుకుంది. మృతురాలికి నలుగురు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.గుర్తు తెలియని వ్యక్తి..ప్రొద్దుటూరు క్రైం : మండల పరిధిలోని ఎర్రగుంట్ల రోడ్డులో ఉన్న ఏకోపార్కు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పార్కు ఎదురుగా ఉన్న అటవీశాఖ స్థలంలో ఒక చెట్టుకు లుంగీని చుట్టుకొని అతను ఉరేసుకున్నాడు. స్థానికులు చూసి మంగళవారం పోలీసులకు సమాచారం అందించారు. రూరల్ ఎస్ఐలు మహమ్మద్‌రఫి, వెంకటసురేష్లు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడికి సుమారు 40 ఏళ్లు ఉంటాయని ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. సైకియాట్రీ కాన్ఫరెన్స్‌కు డాక్టర్ లాజర్ వేపరాల కడప ఎడ్యుకేషన్ : థాయ్‌లాండ్‌లోని బ్యాంకాగ్‌లో ఎపిసిరస్ సైంటిఫికా సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 8,9 తేదీల్లో జరగనున్న వరల్డ్ న్యూరోసైన్స్ అండ్ సైకియాట్రి కాన్ఫరెన్స్–2025కు యోగివేమన విశ్వవిద్యాలయం సైకాలజీ శాఖ సహ ఆచార్యులు డాక్టర్ వేపరాల లాజర్‌కు సంస్థ ఆర్గనైజింగ్ సెక్రటరీ నుంచి ఆహ్వానం అందింది. రెండు రోజుల సదస్సులో డాక్టర్ లాజర్ శ్రీడెమోగ్రాఫిక్ వేరియబుల్స్‌కు సంబంధించి కోవిడ్–19కు గురై కోలుకున్న వ్యక్తుల క్షేమ, మానసిక ఆందోళన్ఙ అనే అంశంపై పరిశోధన పత్రం సమర్పిస్తారు. అంతర్జాతీయ సదస్సుకు వెళుతున్న డాక్టర్ లాజర్‌ను విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఫణితి ప్రకాష్ బాబు, ప్రిన్సిపల్ ఆచార్య ఎస్. రఘునాథరెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య పుత్తా పద్మ అభినందించారు. -
మాసూమ్ రోజేదార్.!
మదనపల్లె సిటీ : రంజాన్ మాసం ముస్లింలకు పరమ పవిత్ర మాసం. ఇస్లాం కాలమానంలోని 9వ నెల రంజాన్. ఈ మాసంలో ముస్లింలు 30 రోజుల పాటు ఎంతో నిష్టతో ఉపవాసదీక్షలు చేపడతారు. ఇందులో భాగంగా వేకువ జామున 4 గంటల సమయంలో అల్పాహారాన్ని స్వీకరిస్తారు. దీనిని ‘సహరీ’ అంటారు. అప్పటి నుంచి సాయంత్రం 6.30 వరకు ఎలాంటి ఆహార పానీయాలు సేవించకుండా ఉపవాసదీక్షను చేపడతారు. సాయంత్రం 6.30 గంటలకు ఖర్జూరంతో ఉపవాసదీక్షలు విరమిస్తారు. దీనిని ఇఫ్తార్ అంటారు. పెద్దలపై మాత్రమే ఉపవాసదీక్షలు విధిగా ఉండాలన్న నిబంధన ఉంది. మదనపల్లె పట్టణంలో 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలలోపు చిన్నారులు కూడా ఉపవాసదీక్షను చేపడుతున్నారు. వారిని చూసిన ప్రతి ఒక్కరూ వారి దైవభక్తిని మెచ్చుకొని ‘మాసూమ్ రోజేదార్’(ఉపవాసం ఉన్న అమాయక బాలలు) అని అంటున్నారు. ఇలాంటి పలువురు చిన్నారులు ‘సాక్షి’కి కనిపించారు. వారిని పలకరిస్తే ఉపవాసదీక్షలను పాటించడం తమకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఉపవాసదీక్ష చేపడుతున్న చిన్నారులు -
పింఛన్ పేరుతో వృద్ధురాలికి మోసం
కడప అర్బన్ : కూటమి ప్రభుత్వం వచ్చింది. నీకు చెవుడుకు సంబంధించిన సర్టిఫికెట్తో పాటు పింఛన్ ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి ఏకంగా వృద్ధురాలి ఆస్తిని కాజేసేందుకు కుట్ర పన్నిన టీడీపీ కార్యకర్త ఉదంతమిది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు టీడీపీ కార్యకర్తపై చీటింగ్ కేసు నమోదు చేశారు. తనపై కేసు నమోదు చేశారంటూ టీడీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. బాధితురాలు షేక్ రహమత్బీ (62) తన సోదరుడు నబీరసూల్‌తో కలిసి కడప తాలూకా పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. కడప నగరంలోని నబీకోట మరాఠీవీధిలో షేక్ రహమత్బీ (62) నాలుగున్నర సెంట్ల స్థలంలో మూడు సెంట్ల మేరకు ఉన్న ఇంటిలో నివాసం ఉంటోంది. మిగిలిన ఒకటిన్నర సెంట్ల స్థలం ఖాళీగానే ఉంది. ఆమెకు చెవుడు ఉండటంతో చిలకలబావి మంచాలరామయ్య వీధికి చెందిన షేక్ సుల్తాన్ ఇమ్రానుద్దీన్ అనే టీడీపీ కార్యకర్త ఇంటిని, ఖాళీ స్థలాన్ని కాజేయాలని పథకం రచించాడు. అనుకున్నట్లుగానే రహమత్బీకి చవుడు ఉన్నట్లు మెడికల్ సర్టిఫికెట్ ఇప్పిస్తానని గత ఏడాది జూన్ 12వ తేదీన రిమ్స్ ఆసుపత్రికి తీసుకుని వెళ్లాడు. అక్కడి నుంచి నేరుగా జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి తీసుకెళ్లి ఇల్లు, ఖాళీ స్థలం ఉన్న మొత్తం నాలుగున్నర సెంట్లను తన పేరుతో జీపీ (జనరల్ పవర్ అటార్నీ) చేయించుకున్నాడు. రెండవ సారి షేక్ రహమత్బీని వేలిముద్ర వేసి రావాలని రిజిస్ట్రేషన్ ఆఫీసుకు తీసుకుని వెళ్లాడు. తన తల్లి గులాబ్జాన్కు, రహమత్బీ ఒకటిన్నర సెంట్ల స్థలాన్ని విక్రయించినట్లుగా ఏకంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఈ ఏడాది జనవరిలో తన ఇంటి ముందు ఖాళీ స్థలాన్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కొతలు వేస్తుండటంతో అనుమానం వచ్చిన రహమత్బీ ఎందుకు కొలుస్తున్నారని ప్రశ్నించింది. తరువాత ప్రొద్దుటూరులో ఉంటున్న రహమత్బీ సోదరుడు నబీరసూల్, తన బంధువులతో కలిసి వచ్చి విచారించారు. రహమత్బీ భర్త షేక్ జమాల్‌కు తాను అన్న కుమారుడినని సదరు టీడీపీ కార్యకర్త జీపీ లో పొందుపరిచినట్లు తెలిసింది. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరి 5న షేక్ ఇమ్రానుద్దీన్ పేరుమీద ఉన్న జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జీ.పీ)ని రహమత్బీ, తన సోదరులతో కలిసి వెళ్లి రద్దు చేయించింది. కానీ ఒకటిన్నర సెంటు స్థలం మాత్రం టీడీపీ కార్యకర్త ఇమ్రానుద్దీన్ తన తల్లి గులాబ్జాన్ పేరుమీద రిజిస్ట్రేషన్ చేయించుకుని ఉండటంతో రహమత్బీ తనకు న్యాయం చేయాలని ఫిబ్రవరి 24న ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’లో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కడప తాలూకా సీఐ వెంకటేశ్వర్లు తమ సిబ్బందితో ఇమ్రానుద్దీన్ను పోలీస్ స్టేషన్‌కు రావాలని ఫోన్ చేసి పిలిచారు. పలుమార్లు పిలిచినా రాకపోవడంతో కడప తాలూకా పోలీస్ స్టేషన్లో ఇమ్రానుద్దీన్‌పై చీటింగ్ కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఇమ్రానుద్దీన్ విష ద్రావణం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే రిమ్స్‌కు తరలించారు. వృద్ధురాలికి మాయమాటలు చెప్పి ఆమె స్థలాన్ని తన తల్లి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకుందని కాదని సివిల్ తగాదాలో పోలీసులు ఎలా జోక్యం చేసుకుంటారని రిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఇమ్రానుద్దీన్ విలేకరుల ఎదుట ప్రశ్నించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ సంఘటనపై కడప తాలూకా సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. విచారించేందుకు పోలీస్ స్టేషన్‌కు రమ్మని పిలిస్తే అతను రాకుండా ఈ చర్యకు పాల్పడ్డాడని తెలిపారు. ఏకంగా ఆమె ఇంటిని, స్థలాన్ని కాజేసేందుకు యత్నించిన టీడీపీ కార్యకర్త చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు కేసు నమోదు చేశారంటూ టీడీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం -
సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్
జమ్మలమడుగు : ఆర్టీసీ బస్సులో సురక్షిత ప్రయాణం అంటూ ఇటీవల భద్రతావారోత్సవాలను పూర్తి చేశారు. అయితే ఈ సూత్రం ఆర్టీసీలో అమలు కావడం లేదనేందుకు ఈ సంఘటనే ఉదాహరణ. జమ్మలమడుగు డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ సెల్ఫోన్లో మాట్లాడుతూ వేగంగా వాహనం నడిపి కొలిమిగుండ్ల మండలం కల్వటాల గ్రామ సమీపంలో స్పీడ్ బ్రేకర్‌ను ఎగిరించి కల్వర్టును గుద్దాడు. దీంతో బస్సు పొలాల్లోకి వెళ్లి బోల్తా కొట్టింది. ఇందులో ప్రయాణం చేస్తున్న 15 మంది ప్రయాణికులతో పాటు ఆర్టీసీ కండక్టర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రయాణికుల కథనం మేరకు.. కొలిమిగుండ్ల మండలం హనుమంతగుండం వద్ద నుంచి డ్రైవర్ ఫోన్లో మాట్లాడుతూ వాహనాన్ని వేగంగా నడుపుతూ వెళ్లాడు. ఫోనులో మాట్లాడుతూ బస్సు నడపొద్దంటూ ప్రయాణికులు చెబుతున్నా ఏమాత్రం పట్టించుకోకుండా డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడిపాడు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. కొలిమిగుండ్ల మండలంలో జమ్మలమడుగు బస్సు బోల్తా కండక్టర్ సహా 15 మందికి గాయాలు -
రెడ్డెమ్మ మాటల వెనక మత్తులబు ఏమిటో !
సాక్షి ప్రతినిధి, కడప: కూటమి సర్కార్‌లో గంజాయితో పాటు మత్తు డ్రగ్స్ విక్రయాలు జోరుగా సాగుతున్నాయని అసెంబ్లీ వేదికగా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కడపలో పానీయాలల్లో మత్తు కలిపి అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారని హాట్ కామెంట్ చేశారు. యువకులు మత్తు డ్రగ్ ఇంజక్షన్లు వేసుకుంటున్నారంటూనే మెడికల్ స్టోర్స్‌లో మత్తు డ్రగ్స్ విక్రయాలు కట్టడి చేయాలన్నారు. గంజాయి తగ్గుము ఖం అంటూనే ఆ స్థానంలో మత్తు డ్రగ్స్ వచ్చి చేరినట్లు ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ ఏర్పడి 9నెలలు కావస్తోంది. గంజాయి కట్టడి చేస్తున్నామని చెప్పుకోవడం మినహా ఆశించిన స్థాయిలో కంట్రోల్ కాలేదని అధికార పార్టీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్పష్టం చేశారు. గంజాయి స్థానంలోకి డ్రగ్స్ వచ్చి చేరినట్లు చెప్పుకొచ్చారు. వాస్తవంలో పరిశీలిస్తే గంజాయి కట్టడికి ప్రత్యేక విభాగం ఏర్పాటైంది. కౌన్సెలింగ్ ఇస్తూనే డీ ఆడిక్షన్ సెంటర్ సెంటర్‌కు పంపుతున్నారు. మరోవైపు డ్రగ్స్‌లాగా ఉపయోగించే ఓపీ యార్డ్స్ మాత్రలు, ఇంజక్షన్లు విక్రయాలు చేస్తున్నట్లు తెరపైకి వచ్చింది. ఆ మేరకు జిల్లాలో రెండు మెడికల్స్టోర్స్పై ఆరోపణలు రావడంతో సీజ్ కూడా చేసినట్లు తెలుస్తోంది. మత్తు మందుల విక్రయాలు చేపట్టరాదని డ్రగ్స్ డీలర్లు, ఏజెంట్లకు స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ అయినట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో గళమెత్తిన ఎమ్మెల్యే... ఇదివరకూ జిల్లా కేంద్రంలో గంజాయి విచ్చలవిడిగా లభిస్తోందని, కట్టడి చేయాల్సిందిగా అప్పటి ఎస్పీ హర్షవర్ధనరాజుకు ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఫిర్యాదు చేశారు. తాజాగా అసెంబ్లీ వేదికగా గంజాయితోపాటు మత్తు డ్రగ్స్ వల్ల ఇలాంటి వైపరీత్యాలు అధికమయ్యాయని సోమవాళం గళం విప్పారు. పానీయాల్లో మత్తు డ్రగ్స్ కలుపుతూ అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారని కూడా ఆరోపించారు. ఇలాంటి కేసులు ఇప్పటి వరకూ అధికారికంగా నమోదు కాకపోయినా, అధికారపార్టీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. నిజంగా ఉందా.. ప్రచార ఆర్భాటమా! కడపలో నిజంగా అలాంటి పరిస్థితి ఉంటే స్థానికంగా సమీక్షలు చేపట్టి కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. బాధ్యతయుతమైన ప్రజాప్రతినిధిగా మత్తు మందులు విక్రయించేవారిని కట్టడి చేయాల్సి ఉంది. కానీ ఇంతవరకు అధికారికంగా ఒక్క కేసు నమోదు కాలేదు.పైగా వీటి నివారణకు అలాంటి చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. క్షేత్రస్థాయిలో కట్టడి చేసే చర్యలు చేపట్టకపోగా, ప్రచార ఆర్భాటాలకే ఎమ్మెల్యే పరిమితం అవుతున్నారనే ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి. మత్తు డ్రగ్స్, గంజాయి విక్రయాలు కట్టడిలో కూటమి సర్కార్ విఫలమైందని ఆమె మాటలు స్పష్టం చేస్తున్నాయి. పైగా ఇప్పటికీ గంజాయి లభ్యమౌతోందని, దానికి తోడుగా అదనంగా మత్తు డ్రగ్స్ విక్రయాలు ఉన్నాయని ఎమ్మెల్యే మాధవీరెడ్డి స్పష్టం చేశారు. దీనిని కట్టడి చేసేందుకు హోంమంత్రి ఎలాంటి చర్యలు చేపడతారో ఆలోచించాలని కూడా కోరడం విశేషం. అమ్మాయిలను టార్గెట్ చేస్తూ మత్తు పానీయాలు కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి హాట్ కామెంట్ -
అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలి
కడప సెవెన్‌రోడ్స్ : ప్రజాసమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం సభా భవన్‌న్‌లో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)లో కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ● గాలేగరు–నగరి కాలువ తవ్వకం వల్ల తమ గ్రామాల రైతులు పొలాల్లోకి వెళ్లేందుకు రహదారి సౌకర్యం లేకుండా పోయిందని ముద్దనూరు మండలం చింతకుంట గ్రామాలకు చెందిన రైతులు కలెక్టర్‌కు విన్నవించారు. పాత రహదారి వద్దే బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ● కమలాపురం పాలిటెక్నిక్ కాలేజీలో ఔట్ సోర్సింగ్ కింద తనకు జూనియర్ అసిస్టెంట్ పోస్టులో నియామకం చేయాలని చింతకొమ్మదిన్నె మండలానికి చెందిన పి. రాబియా కోరారు. ● తనకు వితంతు పెన్షన్ ఇప్పించాలని ముద్దనూరు మండలం, పెనికేలపాడు గ్రామానికి చెందిన అంగల్లగుత్తి గంగులమ్మ అభ్యర్థించారు. బ్యాంకుల భాగస్వామ్యం అవసరం వ్యవసాయంలో అధునాతన సాంకేతికతను అవసరమైన పెట్టుబడుల కోసం రైతులకు రుణ సహకారం అందించాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి బ్యాంకు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో కలెక్టర్ శ్రీధర్ అధ్యక్షతన డిస్ట్రిక్ట్ కన్సల్టెటివ్ కమిటీ (డీసీసీ), డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీ (డీఎల్ఆర్సీ) బ్యాంకర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలోని అన్ని బ్యాంకులకు నిర్దేశించిన పలురకాల రుణ లక్ష్యాలు, సాధించిన ప్రగతిని ఆయా బ్యాంకుల ప్రతినిధులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రుణాలు అందించడంలో సెప్టెంబర్ మాసాంతానికి గాను వైఎస్ఆర్ జిల్లా పురోగమనంలో కొనసాగుతున్నందుకు బ్యాంకర్లను అభినందించారు. జిల్లాలో డీఆర్డీఏ, మెప్మా పరిధిలోని అన్ని స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసి.. జిల్లా ఆర్థిక అభివద్ధిలో మహిళా సంఘాలను భాగస్వామ్యం చేయాలన్నారు. జిల్లా లీడ్ బ్యాంకు చీఫ్ మేనేజర్ జనార్దనం, డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశానికి సంబంధించిన అజెండా, వివరాలను వివరించారు. ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి -
ప్రారంభమైన ఇంటర్ సెకండియర్ పరీక్షలు
కడప ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర థియరీ పరీక్షలు సోమవారం జిల్లావ్యాప్తంగా ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యా శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లను కల్పించారు. తొలి రోజు తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ పరీక్షలకు సంబంధించి 14690 మంది విద్యార్థులకుగాను 14142 మంది హాజరుకాగా 548 మంది గైర్హాజరయారు. పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన ఆర్ఐఓ.. కడప నగరంలోని నారాయణ, చైతన్య, సాయిరాం, గాయత్రి తదితర కళాశాలలను ఆర్ఐవో బండి వెంకటసుబ్బయ్య తనిఖీ చేశారు. అలాగే స్క్వాడ్, డీఈసీ సభ్యులు జిల్లాలోని బద్వేల్, పోరుమామిళ్ల, మైదుకూరు, ఖాజీపేట, దువ్వూరు, పులివెందుల, జమ్మలమడుగు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. జిల్లాలో ఎక్కడ మాల్ ప్రాక్టీస్, డీబార్ కేసులుకానీ నమోదు కాలేదని ఆర్ఐవో తెలిపారు. -
సర్వేత్రా ఆందోళన !
కడప కార్పొరేషన్: కూటమి ప్రభుత్వం రోజుకో సర్వేతో ప్రజల్లో ఆందోళనకు గురి చేస్తోంది. ప్రజలనుంచి పూటకో వివరాలను రాబట్టమని సచివాలయ సిబ్బందితో ఆడుకుంటోంది. గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తెచ్చింది. 50 ఇళ్లకు ఒక వలంటీర్, 2000 ఇళ్లకు ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసింది. వలంటీర్లు, సచివాలయ సిబ్బంది ప్రజలకు, ప్రభుత్వానికి వారధిలా పనిచేస్తూ ప్రభుత్వ సేవలను, సంక్షేమ పథకాలను ఇంటింటికీ చేరవేసేవారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వలంటీర్లను తొలగించారు. గత ప్రభుత్వంలో నెలలో కనీసం రెండు, మూడు సంక్షేమ పథకాలైన అమలవుతూ వాటిని చేరవేయాల్సిన బాధ్యత సచివాలయ సిబ్బందిపై ఉండేది. కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 9 మాసాల్లో పింఛన్లు మినహా మరే సంక్షేమ పథకమూ అమలు చేయలేదు. దీంతో ప్రభుత్వం వారిని ఖాళీగా ఉంచడం ఇష్టం లేక నానా రకాల సర్వేలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఎనర్జీ అసిస్టెంట్లు మినహా మిగిలిన సెక్రటరీలందరితో ఈ సర్వేలు చేయిస్తున్నారు. పీ–4 సర్వే, వర్క్ ఫ్రం హోం సర్వే, ఎంఎస్ఎంఈ సర్వే, చిల్డ్రన్ బర్త్ సర్వే, నాన్ రెసిడెంట్స్ సర్వేలు ఒకేసారి చేయిస్తున్నారు. పీ–4 సర్వేలో ఎంపిక చేసిన వారి ఇంటికి వెళ్లి వారికి కారు, ఏసీ వంటివి ఉన్నాయా..., ఎన్ని ద్విచక్ర వాహనాలు ఉన్నాయి, ఆదాయ పన్ను చెల్లిస్తున్నారా... వంటి వివరాలు అడుగుతున్నారు. పూర్తి వివరాలు నమోదు చేసిన తర్వాత సెల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని సచివాలయ సెక్రటరీకి చెప్పాల్సి ఉంటుంది. అలాగే వర్క్ ఫ్రం హోం సర్వేలో ఎవరి ఇంట్లోనైనా ఐటీ సిబ్బంది, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారా...వారి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. అలాగే ఎంఎస్ఎంఈ సర్వేలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఎన్ని ఉన్నాయి, వాటి యజమానులు ఎవరు, ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు, రుణం ఏమైనా అవసరమా వంటి వివరాలు అడుగుతున్నారు. చిల్డ్రన్ బర్త్ సర్వేలో పుట్టిన బిడ్డకు బర్త్ సర్టిఫికెట్ తీసుకున్నారా, ఆధార్ కార్డు చేయించారా, ఎందుకు చేయించలేదని వివరాలు కనుక్కుంటున్నారు. ఇక నాన్ రెసిడెంట్స్ సర్వేలో ఎవరి ఇంట్లోనైనా సభ్యులు విదేశాలకు వెళ్లారా...ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్నారా వంటి వివరాలు రాబడుతున్నారు. పింఛన్లు కొందరికే.. గత ప్రభుత్వంలో భార్య లేదా భర్త పింఛన్ పొందుతూ చనిపోతే బతికున్న భార్య లేదా భర్తకు ఆ పింఛన్ అందజేసేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మార్చిలో చనిపోయిన వారి భర్త లేదా భార్యలకే పింఛన్లు ఇస్తున్నారే తప్పా ఇదివరకు 9 మాసాలలో చనిపోయిన వారి కుటుంబాలకు పింఛన్ వర్తింపజేయడం లేదు. దీంతో చాలామంది పింఛన్లు పొందకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. ఉన్న పింఛన్లే తొలగిస్తున్న తరుణంలో ఇక కొత్త పింఛన్లు ఇవ్వడం ఉత్తమాటేనని ప్రజలు అనుమానిస్తున్నారు. ఈ సర్వేల వెనక మతలబు ఇదేనని పలువురు ఆందోళన చెందుతున్నారు. సచివాలయ సిబ్బందికి ఎన్ని తిప్పలో! ఈ అన్ని సర్వేల్లో కేవలం ఇంటిపేరు, పేరు మాత్రమే చెప్పి సర్వే చేయమనడం వల్ల వారు ఎక్కడ నివసిస్తున్నారో, వారి డోర్ నంబర్ ఏమిటో తెలియక సచివాలయ సిబ్బంది నానా అవస్థలు పడుతున్నారు. పైగా ఎవరెవరు ఎంతమందిని సర్వే చేశారని ఉన్నతాధికారులు ప్రతిరోజూ టెలీ కాన్ఫరెన్స్‌లో ఒత్తిడి తెస్తున్నారు. ఇంటిపేరు, పేరు ఆధారంగా వారిని ఎలాగోలా కనుక్కున్నప్పటికీ చాలామంది సర్వేలకు సహకరించడం లేదని, ఓటీపీలు చెప్పడం లేదని తెలుస్తోంది. అత్యధిక మంది ఇంటిలోపలికే సచివాలయ సిబ్బందిని అనుమతించడం లేదని సమాచారం. దీంతో కరవమంటే కప్పకు కోపం... విడవమంటే పాముకు కోపం... అన్నచందంగా సచివాలయ సెక్రటరీల పరిస్థితి తయారైంది. రెండు, మూడు నెలల కిందటే వికలాంగుల పింఛన్లపై వెరిఫికేషన్ పూర్తయ్యింది. ఇప్పుడు ఏకంగా 5 సర్వేలు ఒకేసారి చేయిస్తున్నారు. త్వరలో స్వర్ణాంధ్ర సర్వే కూడా చేపట్టనున్నట్లు వార్తలొస్తున్నాయి. దీంతో ఇంకా ఎన్ని సర్వేలు చేయాలోనని సచివాలయ సెక్రటరీలు లోలోపలే మథనపడుతున్నారు. రోజుకో సర్వే చేస్తున్న కూటమి ప్రభుత్వం అన్నింటికీ సచివాలయ సెక్రటరీలే ఆధారం సంక్షేమ పథకాల్లో కోత పెట్టడానికేనని ప్రజల్లో అనుమానాలు ! -
ఢిల్లీ సంస్కృత విద్యాలయ శిక్షణకు మునికుమార్
కడప కల్చరల్ : ఢిల్లీలోని కేంద్రీయ సంస్కృత విద్యాలయం, చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్, సౌద సంస్థాన్ (ఎర్నాకులం) సంయుక్తంగా నిర్వహించే పది రోజుల శిక్షణకు కడపకు చెందిన నాగదాసరి మునికుమార్ ఎంపికయ్యారు. ఈ మేరకు చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నుంచి ఆయనకు ఆహ్వానం అందింది. ఈనెల 12 నుంచి 21వ తేది వరకు నిర్వహించనున్న ప్రత్యేక శిక్షణా కార్యక్రమంలో తాళపత్ర అధ్యయనం, గ్రంథలిపి, శారద లిపి అధ్యయనాలలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇంకా తాళపత్ర గ్రంథాల ఎడిటింగ్‌లో కూడా శిక్షణ ఇస్తారన్నారు. కేరళ ఎర్నాకులంలోని వెలియనాడ్ ఆదిశంకర నిలయంలో ఈ శిక్షణ ఉంటుందని తెలియజేశారు. మునికుమార్ యోగి వేమన విశ్వవిద్యాలయంలో తెలుగు ఎంఏ చేసి ప్రొద్దుటూరు మళయాళ స్వామి కళాశాలలో విద్వాన్ పూర్తి చేశారు. 14 నుంచి కబడ్డీ పోటీలకు ఎంపికలు కడప వైఎస్ఆర్ సర్కిల్ : పులివెందులలో ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు అంతర్ జిల్లాల కబడ్డీ పోటీలకు ఎంపికలు జరుగుతాయని జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఓ రవీంద్రారెడ్డి సెక్రటరీ ఆర్ వెంకటసుబ్బయ్య వైస్ ప్రెసిడెంట్ జి.గురుశేఖర్ తెలిపారు. సోమవారం వారు విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 2వ తేదీ డీఎస్ఎస్ స్టేడియంలో 34వ సబ్ జూనియర్స్ బాల బాలికల ఉమ్మడి జిల్లా కబడ్డీ సెలక్షన్స్ జరిగాయని వివరించారు. ఇక్కడ సెలెక్ట్ అయిన క్రీడాకారులు పులివెందులలో జరిగే అంతర్ జిల్లాల కబడ్డీ పోటీలలో పాల్గొంటారని వివరించారు. ఈ ఎంపికలకు పీడీ నిత్య ప్రభాకర్, జిలాని బాష ,పిడి వర్కింగ్ సెక్రటరీ టి శ్రీవాణి, ట్రెజరర్ కొండయ్య, వైస్ ప్రెసిడెంట్లు అరుణ సుహాసిని లీల సుమలత నరేష్ లోకేష్ తదితరులు సహకరించారన్నారు. -
లింగ నిర్ధారణ ప్రకటనలు చేస్తే చర్యలు
కడప రూరల్ : సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు లింగ నిర్ధారణపై ప్రకటనలు ఇస్తే చట్టరీత్యా కఠిన చర్యలు చేపడతామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ నాగరాజు హెచ్చరించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు పీసీ అండ్ పీఎన్డీటీ యాక్టును ఆస్పత్రులు పటిష్టంగా అమలు చేయాలన్నారు. అలాగే తప్పనిసరిగా జిల్లా అప్రప్రియేట్ అథారిటీలో నమోదై చట్టంలోని సూచనలు ఖచ్చితంగా పాటించాలన్నారు. లేకుంటే నిర్వాహకులకు రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు జరిమానాతోపాటు మూడు నుంచి ఐదేళ్ల జైలు శిక్ష ఉంటుందన్నారు. నేడు ఆర్సీపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం కడప వైఎస్ఆర్ సర్కిల్ : రాయలసీమ వ్యాప్తంగా ఉన్న ఆర్సీపీ ప్రతినిధులతో రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం మంగళవారం నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో నిర్వహించనున్నట్లు ఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శి సిద్ధిరామయ్య, ఆర్సీపీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు మడగలం ప్రసాద్ తెలిపారు.సోమవారం నగరంలోని ఆర్సీపీ కార్యాలయంలో వారు మా ట్లాడారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం పక్కన పెడితే ఉన్న పరిశ్రమలను తరలించడం అధికమైందన్నారు. రాయలసీమ వ్యాప్తంగా ఉన్న సమస్యలను క్షుణ్ణంగా అధ్యయనం చేయడానికి, వాటిపై భవిష్యత్తు రోజు ల్లో ఉద్యమాలు నిర్వహించడానికి, ఈ సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇన్చార్జి ఈఓపీఆర్డీగా సురేష్‌బాబు బ్రహ్మంగారిమఠం : మండలంలోని రేకులకుంట గ్రేడ్ 3 గ్రామ పంచాయతీ కార్యదర్శి సురేష్‌బాబును బి.మఠం ఇన్చార్జ్ ఈఓపీఆర్డీగా అదనపు బాద్యతలు అప్పగించామని ఎంిపీడీఓ వెంగమునిరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం ఇక్కడ ఈఓపీఆర్డీగా పనిచేస్తున్న కుమార రంగయ్య ఒంటిమిట్ట ఇన్చార్జీ ఎంపిడీఓ గా అదపు బాద్యతలు నిర్వహిస్తునప్పుడు నిధుల గోల్మాల్ జరిగినట్లు అధికారుల విచారణలో తేలడంతో జిల్లా అధికారులు ఆయనను సస్పెండ్ చేశారని వెల్లడించారు. 19న మహాధర్నా కడప వైఎస్ఆర్ సర్కిల్: రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకం కింద రూ.3వేల గౌరవ వేతనంతో పని చేస్తున్న కార్మికుల వేతనాలు తక్షణమే పెంచాలని డిమాండ్‌తో ఈ నెల 19న విజయవాడలో మహాధర్నా చేపట్టనున్నట్లు ఏఐటియూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగసుబ్బారెడ్డి పేర్కొన్నారు. సోమవారం నగరంలోని సీపీఐ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న 86 వేల మంది పేద మహిళా కార్మికులు అతి తక్కువ వేతనం తీసు కుంటున్న కార్మికులుగా మిగిలిపోయారన్నారు. ఉద్యోగ భద్రత, ప్రమాద బీమా, హెల్త్ కార్డు కూడా లేదని తెలిపారు. పెరిగిన నిత్యవసరాల ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై విద్యాశాఖ మంత్రి లోకేశ్‌కు అనేకసార్లు విన్నవించినా ఫలితం లేదన్నారు. బడ్జెట్ సమావేశాల్లో కార్మికుల వేతనాల పెంపుదలపై ప్రకటన చేయాలన్నారు. ఏపీ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధం కడప జిల్లా నాయకులు మేరీ, కామాక్షి పాల్గొన్నారు. 7న రాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీలు కడప వైఎస్ఆర్ సర్కిల్ : నగర శివార్లలోని కేఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కళాశాల సమీపంలోని చిన్నపల్లె యోగి శ్రీ నరసింహ్మ స్వామి 217వ ఆరాధన సందర్భంగా రాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీలను నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త గోసుల మునిరెడ్డి తెలిపారు. ఇందులో మొదటి బహుమతిగా రూ.70,016, రెండవ బహుమతిగా రూ. 50,016, మూడవ బహు మతి రూ.30.016, నాల్గవ బహుమతి రూ. 20,016, ఐదో బహుమతి రూ. 15,016, ఆరో బహుమతి రూ.10,016 ఉంటాయని వివరించారు. -
ట్రిపుల్ ఐటీలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగుల ధర్నా
వేంపల్లె : ఆర్జీయూకేటీ పరిధిలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో పనిచేస్తున్న కాంట్రాక్టు గెస్ట్ ఫ్యాకల్టీలకు మినిమం టైం పే స్కేల్ అమలు చేయాలంటూ నినాదాలు చేస్తూ గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. సోమవారం కాంట్రాక్టు గెస్ట్ ఫ్యాకల్టీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలోని అకడమిక్ బ్లాక్ వద్ద గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగులు ధర్నా చేశారు. ఎస్ఐ తిరుపాల్ నాయక్ ధర్నా జరిగే ప్రాంతానికి చేరుకుని ధర్నా విరమించాలని ఉద్యోగులను కోరారు. అలాగే ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కుమార స్వామి గుప్తా, పరిపాలన అధికారి డాక్టర్ రవికుమార్‌లు కూడా అకడమిక్ బ్లాక్ వద్దకు చేరుకుని ధర్నా చేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినకుండా భీష్మించుకుని కూర్చున్నారు. ఈ సందర్భంగా గెస్ట్ ఫ్యాకల్టీ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ జీఓ నెంబర్ 110 ని ఆర్జీయూకేటీ అధికారులు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా గౌరవించకుండా గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగులకు ఆర్జీయూకేటీ అధికారులు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. 2018లో కాంట్రాక్టు గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగులుగా ఆర్జీయూకేటీ పరిధిలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో 44 మంది పని చేస్తున్నారని, ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఒక రూపాయి కూడా జీతం పెంచలేదన్నారు. తప్పుడు సమాచారం తీసుకుని తమ వెనుక వచ్చిన ఉద్యోగులకు జీతాలు పెంచారన్నారు. అనంతరం ఆర్కే వ్యాలీ డైరెక్టర్ కుమారస్వామి గుప్తాకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో గెస్ట్ ఫ్యాకల్టీ అసోసియేషన్ అధ్యక్షు డు నజీర్ బాషా, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
ప్రజలను బురిడీ కొట్టించిన బడ్జెట్
కమలాపురం : ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టిన 2025–26 బడ్జెట్ అంతా అంకెల గారడీ అని, బడ్జెట్లో గారడీలు, పేరడీలు చేసి ప్రజలను బురిడీ కొట్టించారని వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి నరేన్ రామాంజులరెడ్డి విమర్శించారు. సోమవారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్రం దివాళా తీసిందంటారు? ఇప్పటికే రూ.లక్ష కోట్లు అప్పు చేశారు, ఇది ఎలా సాధ్యం అని ఆయన ప్రశ్నించారు. రూ.3.22 లక్షల కోట్ల బడ్జెట్లో 25 శాతం ద్రవ్యలోటు అంటే 80వేల కోట్లు లోటు బడ్జెట్ ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో రూ.14వేల కోట్లు ప్రజలపై భారం మోపుతామని అసెంబ్లీలోనే మంత్రి చెప్పారని, దీంతో ప్రజలకు వాతలు తప్పవన్నారు. మరో రూ.12వేల కోట్లు ప్రభుత్వ స్థలాల ద్వారా అప్పు తెస్తారంటా? ఇది ఎలా చేస్తారో మరి? అని అన్నారు. మిగిలిన రూ. 54వేల కోట్లు కేంద్రం నుంచి తెస్తామంటున్నారని, కేంద్ర బడ్జెట్ ఎప్పుడో పూర్తి అయిందని, ఆ బడ్జెట్లో ఏపీకి కేటాయింపులే లేవన్నారు. ఇదంతా చూస్తుంటే ఈ బడ్జెట్ చాలీ చాలనీ బడ్జెట్ అని, అసంపూర్తి బడ్జెట్ అని, ప్రజలను మోసం చేసేదానికే ఈ బడ్జెట్ అని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో ఉచిత బస్సు ప్రయాణం, 18ఏళ్లు నిండిన వారికి నెలకు రూ.1500 అన్నారు. ఒక్క పథకానికి కూడా బడ్జెట్లో నిధులు కేటాయించలేదన్నారు. జగనన్న సంక్షేమాన్ని ఇంట్లో బంధించాడు.. అభివృద్ధిని గుమ్మం బైట ఉంచాడన్నారు. మరి చంద్రబాబు అధికారంలో ఉన్నంత వరకు రాష్ట్ర ప్రజల సంక్షేమం అంధకారమే అన్నారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రజలే తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు ఉత్తమారెడ్డి, రాజుపాళెం సుబ్బారెడ్డి, సంబటూరు ప్రసాద్‌రెడ్డి, గంగాధర్ రెడ్డి, సుమిత్రా రాజశేఖర్‌రెడ్డి, మహ్మద్ సాదిక్, ఇస్మాయిల్, చెన్నకేశవరెడ్డి, మోహన్‌రెడ్డి, కొండారెడ్డి,జగన్మోహన్రెడ్డి, జనార్దన్‌రెడ్డి,మోనార్క్,మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి నరేన్ రామాంజులరెడ్డి -
ఉద్యోగాల పేరుతో మోసం
కడప సెవెన్‌రోడ్స్ : కేంద్ర ప్రభుత్వ సంస్థ పేరుతో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేసిన కడపకు చెందిన ఆది రవికుమార్‌పై చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్ కోరారు. సోమవారం బాధితులతో కలిసి జాయింట్ కలెక్టర్ అదితిసింగ్‌కు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కెరీర్ కౌన్సిల్ డెవలప్మెంట్ కో ఆర్డినేటర్ ఉద్యోగం పేరుతో జిల్లాలో చాలామంది వద్ద రూ. 4–6 లక్షలు చొప్పున వసూలు చేశాడని తెలిపారు. ఉద్యోగాలకు సంబంధించిన అపాయింట్మెంట్ లెటర్స్ అంటూ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్స్‌కు, ఆర్జేడీ, డీఈఓలకు సైతం ఫేక్ మెయిల్స్ పంపి వారిని సైతం మోసగించాడని తెలిపారు. ఈ విషయం వెల్లడి కావడంతో నిరుద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగించారన్నారు. బాధితులంతా రవికుమార్ వద్దకు వెళ్లి తమ డబ్బులు తమకు చెల్లించాలని కోరగా, ఆయన స్పందించడం లేదన్నారు. అధికారులు కూడా ఉద్యోగాల్లో చేర్చుకునే ముందు అపాయింట్మెంట్ లెటర్లు నకిలీవా? నిజమైనవా? అంటూ నిర్ధారించుకోకుండా ఉద్యోగాలు ఇచ్చారన్నారు. నిందితుడిపై చర్యలు తీసుకుని బాధితులకు డబ్బులు ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ నగర కార్యదర్శి విజయ్, సహాయ కార్యదర్శి శ్రీకాంత్, వంశీ తదితరులు పాల్గొన్నారు. -
ఫిర్యాదులపై సత్వరం స్పందించి న్యాయం చేయాలి
కడప అర్బన్ : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్)లో ప్రజలు ఇచ్చే ఫిర్యాదుల పట్ల సత్వరం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఈ.జి అశోక్‌కుమార్ పోలీసు అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలోని ‘పెన్నార్’ పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్) కార్యక్రమంలో ఫిర్యాదుదారులతో ఎస్పీ స్వయంగా మాట్లాడి వారి సమస్యను విన్నారు. పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) కె. ప్రకాష్‌బాబు, డి.టి.సి డీఎస్పీ అబ్దుల్ కరీం, మహిళా పి.ఎస్. డీఎస్పీ రమాకాంత్, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ ఈ.జి. అశోక్‌కుమార్ -
బాల్య వివాహ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం
కడప సెవెన్‌రోడ్స్ : బాల్య వివాహాలు ఒక సాంఘిక దురాచారం, నేరమని, బాలికల విద్య, రక్షణ, ఆరోగ్యం, అభివృద్ధికి ఆటంకమే కాకుండా వారి కలలను సాకారం చేసుకునే అవకాశం దూరం చేస్తాయని జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని సభాభవన్‌లో మహిళా సీ్త్ర శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ మాట్లాడారు. అనంతరం జేసీ బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ సాకారానికి మద్దతు ఇస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ విశ్వేశ్వర నాయుడు, మహిళా సీ్త్ర శిశు సంక్షేమ శాఖ పీడీ శ్రీలక్ష్మి, జెడ్పీ సీఈఓ ఓబులమ్మ, డీఆర్డీఏ పీడీ ఆనంద్ నాయక్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ -
మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని ధర్నా
కడప సెవెన్‌రోడ్స్ : మున్సిపాలిటీలోని అప్కాస్ కార్మికులను పర్మినెంట్‌చేయాలని ఏఐటీయూసీ అనుబంధ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా జరిగింది. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వేణుగోపాల్, నాగసుబ్బారెడ్డి, యూనియన్ గౌరవాధ్యక్షులు బాదుల్లా, నగర అధ్యక్ష కార్యదర్శులు నరసింహులు, తారక రామారావులు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఆప్కాస్‌ను రద్దు చేస్తామని మంత్రివర్గ సమావేశంలో తీర్మానించడం అన్యాయమన్నారు. ఆప్కాస్ రద్దును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతినెల ఒకశాతం కమీషన్‌తో వేతనాలు, సేవలు అందించే ఆప్కాస్‌ను రద్దు చేసి నాలుగు శాతం కమీషన్ తీసుకునే కాంట్రాక్టర్ల చేతికి లక్షా 20 వేల మంది ఉద్యోగుల భవిష్యత్తును అప్పగించడం దారుణమని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కుంచుపాటి జాన్, ఈశ్వరయ్య, వెంకటాద్రి పాల్గొన్నారు. -
ఓపెన్ ఇంటర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్
కడప వైఎస్ఆర్ సర్కిల్ : జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభమైన ఓపెన్ ఇంటర్ పరీక్షల్లో విచ్చలవిడిగా మాస్ కాపీయింగ్ జరుగుతోందని డీవైఎఫ్ఐ నగర కార్యదర్శి విజయ్ ఆరోపించారు. సోమవారం నగరంలోని డీవైఎఫ్ఐ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఒకవైపు డీఈ పకడ్బందీగా ఓపెన్ ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటిస్తుంటే మరోవైపు జిల్లా కో–ఆర్డినేటర్ మాత్రం మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తున్నారన్నారు. జిల్లా అధికార యంత్రాంగం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో నగర సహాయ కార్యదర్శి శ్రీకాంత్ సభ్యుడు ఉదయ్ పాల్గొన్నారు. పీజీ కామన్ సెట్ విధానాన్ని రద్దు చేయాలి కడప వైఎస్ఆర్ సర్కిల్ : రాష్ట్ర ప్రభుత్వం పీజీ కామన్ సెట్ విధానాన్ని రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి బత్తల అరుణ్ కోరారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వం పీజీ కామన్ సెట్ విధానాన్ని, జీఓ 77ను రద్దు చేయాలని కోరుతూ నగరంలోని ఆర్ట్స్ కళాశాల ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీఓ 77 తీసుకురావడం వళ్ల 10 లక్షల మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యారన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఈ జీఓను రద్దు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నగర నాయకులు ఈశ్వరరెడ్డి, నాగార్జున, గణేష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. సీనియారిటీ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ కడప ఎడ్యుకేషన్ : పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సాధారణ సీనియారిటీ జాబితాను ఉపాధ్యాయ సమాచార వ్యవస్థ ఆధారంగా రూపొందించామని పాఠశాల విద్య ఆర్జేడీ శామ్యూల్ తెలిపారు. ఈ జాబితాను జిల్లా విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌తోపాటు నోటీసు బోర్డులో ఉంచినట్లు ఆయన తెలిపారు. ఈ జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 10వ తేదీలోపు డీఈఓ కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. -
పీరయ్య అంత్యక్రియలకు హాజరైన నందమూరి రామకృష్ణ
కడప రూరల్ : నందమూరి అభిమానుల సంఘం జిల్లా అధ్యక్షుడు, టీడీపీ నాయకుడు పోతుగంటి పీరయ్య ఇటీవల అనారోగ్యంతో హైదరాబాదులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈయన అంత్యక్రియలు సోమవారం సాయంత్రం స్థానిక కృష్ణా సర్కిల్వద్దగల యాకుబ్ సాహెబ్ మసీదు స్మశాన వాటికలో నిర్వహించారు. ఈ అంత్యక్రియలకు నందమూరి రామకృష్ణ హాజరయ్యారు. ఆయన వెంట గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తితోపాటు స్థానిక టీడీపీ నాయకులు గోవర్దన్‌రెడ్డి, జిలానీబాషా, హరిప్రసాద్, వైఎస్సార్సీపీ నాయకులు సుభాన్‌బాషా, కరీముల్లా, నగరానికి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. -
పసికందు మృతిపై ఆస్పత్రి వద్ద ఆందోళన
ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పసికందు మృతి చెందడంతో బాలుడి కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. గండికోట గ్రామానికి చెందిన గురుమోహన్ భార్య నాగేశ్వరి మగబిడ్డను ప్రసవించింది. పుట్టిన వెంటనే పసికందు ఏడ్వకపోవడంతో 21న ప్రొద్దుటూరులోని పోసినా కాంపౌండ్‌లో ఉన్న వారాహి సూపర్ స్పెషాలిటి చిన్న పిల్లల హాస్పిటల్లో చేర్పించారు. పరిశీలించిన వైద్యుడు చికిత్సకు రూ. 25 వేలు అవుతుందని చెప్పడంతో గురుమోహన్ దంపతులు సరేనని చెప్పారు. ఐసీయూలో ఉంచి పసికందుకు చికిత్స ప్రారంభించారు. ఈ క్రమంలో రెండు, మూడు రోజులు గడిచిన తర్వాత బాలుడి ఆరోగ్యం కుదుట పడిందని, రెండు రోజులయ్యాక డిశ్చార్జి చేస్తానని వైద్యుడు చెప్పినట్లు గురుమోహన్ తెలిపారు. అయితే తర్వాత శిశువు ఆరోగ్య పరిస్థితి ఆందోళన కరంగా ఉందని వైద్యుడు చెప్పారన్నారు. బయటికి వెళ్లడానికి కూడా సమయం లేదని చెప్పడంతో ఇక్కడే ప్రయత్నం చేయాలని గురుమోహన్ కుటుంబ సభ్యులు చెప్పారన్నారు. అందుకు కొంత డబ్బు ఖర్చు అవుతుందని వైద్యుడు చెప్పగా అందుకు అంగీకరించామన్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి శిశువు మృతి చెందాడు. ఈ విషయం తెలియడంతో సోమవారం ఉదయం తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. రూ. లక్షలు డబ్బు ఖర్చు చేసినా పసికందు తమకు దక్కలేదని రోదించసాగారు. చేరినప్పటి నుంచి బాలుడిది సీరియస్ కండీషనే హాస్పిటల్లో చేరినప్పటి నుంచి శిశువు సీరియస్ కండీషన్లోనే ఉన్నట్లు ఆస్పత్రి వైద్యుడు లోకేష్‌కుమార్ తెలిపారు. గుండె వేగంగా కొట్టుకోవడంతో పాటు ఇన్ఫెక్షన్ కూడా ఎక్కువగా ఉందన్నారు. వచ్చిన వెంటనే ఫిట్స్ కూడా వచ్చాయన్నారు, ఈ పరిస్థితుల్లో ఎక్కడికై నా వెళ్లమని చెప్పామన్నారు. ముందుగా వెళ్తామని చెప్పిన గురుమోహన్ దంపతులు ఇక్కడే ఉంటామని చెప్పినట్లు డాక్టర్ చెప్పారు. ట్రీట్మెంట్ ప్రారంభించిన తర్వాత బాబు ఆరోగ్యం మెరుగుపడిందని, తల్లి పాలు తాగుతున్నాడని తెలిపారు. రాత్రి సమయాల్లో ఐసీయూలో, పగలు తల్లి వద్ద ఉంచామన్నారు. తల్లివద్ద ఉంటే వెచ్చదనం తగిలి బాలుడు త్వరగా కోలుకుంటాడని ఉద్దేశంతో చెప్పామన్నారు. అయితే తల్లి బాలుడిని సరిగా చూసుకోలేదని తెలిపారు. బాలుడిని ఫ్యాన్ కింద పడుకోబెట్టడంతో పూర్తిగా చల్లబడిపోయాడని, వెంటనే ఐసీయూలోకి తరలించామన్నారు. ఈ క్రమంలో బాలుడు మృతి చెందినట్లు డాక్టర్ లోకేష్‌కుమార్ తెలిపారు. బాలుడికి పూర్తి స్థాయిలో చికిత్స చేశామని, తమ చికిత్సలో ఎలాంటి తప్పులు దొర్లలేదన్నారు. -
అదృశ్యమైన వ్యక్తి శవమయ్యాడు
కడప అర్బన్ : ఓ వ్యక్తి కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఇన్‌పేషెంట్‌గా చేరి, అక్కడి నుంచి పరారైన రెండు నెలలకు శవమై కనిపించాడు. ఈ సంఘటనపై కడప రిమ్స్ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ప్రొద్దుటూరులో నివాసం ఉంటూ కలమల్లలోని ఆర్టీపీపీలో ఉద్యోగం చేస్తున్న బాలాంజనేయులు (54) తీవ్రంగా అనారోగ్యం పాలయ్యాడు. అతన్ని కుమారుడు రాజశేఖర్, తన కుటుంబ సభ్యులతో కలిసి కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఈ ఏడాది జనవరిలో చేర్పించారు. ఆయన చికిత్స పొందుతూ జనవరి 6న భోజనానికి వెళ్లి వస్తానని చెప్పి పరాయ్యాడు. అన్ని చోట్ల వెతికిన కుమారుడు, కుటుంబ సభ్యులు ఫిబ్రవరి 19న రిమ్స్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు. జ్యోతి కెమికల్స్ సమీపంలోని ఓ గుంతలో గుర్తు తెలియని శవం ఉందని స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాలాంజనేయులు ధరించిన దుస్తులను గమనించి ఆయన తన తండ్రేనని కుమారుడు రాజశేఖర్ పోలీసులకు తెలిపాడు. కేసు నమోదు చేసి పోలీసులు విచారిస్తున్నారు. మంగళవారం సంఘటన స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించి, బంధువులకు అప్పగించనున్నారు. రిటర్న్ మస్టర్ ఎత్తివేయాలి కడప కార్పొరేషన్ : కడప నగరపాలక సంస్థలో మున్సిపల్ కార్మికులకు అమలు చేస్తున్న రిటర్న్ మస్టర్ విధానాన్ని ఎత్తివేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ) నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో జిల్లా ఉపాధ్యక్షుడు కె. తిరుపాల్ మాట్లడుతూ కడప నగరంలో మున్సిపల్ కార్మికులు ఉదయం 5గంటలకే మస్టర్‌కు రావాలనే నిబంధన విధించారన్నారు. దూర ప్రాంతం నుంచి వచ్చే కార్మికులు తెల్లవారుజామున 3గంటలకు నిద్రలేచి రావడం ఇబ్బందికరంగా ఉందన్నారు. మహిళలు కాలువలో తీసిన పూడిక తడిగా ఉన్నప్పుడే ఎత్తాలంటే సాధ్యం కావడం లేదన్నారు. రిటర్న్ మస్టర్ విధానం రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలోగానీ, కార్పొరేషన్లలోగానీ లేదన్నారు. ఈమేరకు వారు కమిషనర్ మనోజ్‌రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ కె. శ్రీరామ్, నగర సహాయ కార్యదర్శి ఇ. ప్రకాష్ , డ్రైవర్ల కమిటీ కార్యదర్శి ఎస్. కిరణ్, నాగరాజు, పెంచలమ్మ ఆరోగ్యమ్మ, హేమలత, రమాదేవి, ఆదాము పాల్గొన్నారు. వక్ఫ్ బిల్లును అసెంబ్లీలో వ్యతిరేకించాలి కడప వైఎస్ఆర్ సర్కిల్ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 2024 వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలని డీసీసీ అధ్యక్షురాలు విజయజ్యోతి, ఆప్కీ వాజ్ రాష్ట్ర కార్యదర్శి మగ్బూల్ బాషా డిమాండ్ చేశారు. సోమవారం నగరంలోని ఇందిరమ్మ సర్కిల్లో వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ మైనార్టీ నాయకుడు సయ్యద్ గౌస్ పీర్ చేపట్టిన 36 గంటల దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పక్క రాష్ట్రాలు ఈ బిల్లును వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానాలు చేశాయని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలన్నారు. వక్ఫ్ ఆస్తులను ఉపయోగిస్తున్న వారి విషయంలో జోక్యం చేసుకోకూడదనడం ఆక్రమణదారులకు రక్షణ కల్పించడమే తప్ప మరొకటి కాదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, వామపక్ష నాయకులు పాల్గొన్నారు. -
గిట్టుబాటు ధరతో కొనుగోలు చేయాలి
కడప వైఎస్ఆర్ సర్కిల్ : మిరప, పప్పుశనగ, కందులను గిట్టుబాటు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఏపీ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పోతిరెడ్డి భాస్కర్ కోరారు. సోమవారం నగరంలోని హోచిమన్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎండుమిరప, పప్పు శనగ, కందులు పండించిన రైతులు కల్తీ, నకిలీ విత్తనాల వలన, చీడ, పీడల వలన సరైన దిగుబడులు రాక, చేతికొచ్చిన అరకొర పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం వలన తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. మిరప క్వింటాల్ రూ. 11వేలకు మించి వ్యాపారులు కొనుగోలు చేయడం లేదని, దిగుబడులు తగ్గిపోవడం వలన క్వింటాల్ రూ. 20వేలకు తక్కువ కాకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు టి. రామ్మోహన్ రెడ్డి, నాయకుడు పకీరప్ప పాల్గొన్నారు. -
ట్రాప్ కెమెరాల్లో కనిపించని చిరుత జాడలు
పులివెందుల రూరల్ : పులివెందుల నియోజకవర్గంలోని పలు గ్రామాలలో ఫిబ్రవరి నెలలో చిరుతల అడుగు జాడలు, చిరుతల పిల్లలు కనిపించాయని ప్రజలు భయాందోళన వ్యక్తం చేసిన విదితమే. ఈ నేపథ్యంలో జిల్లా అటవీ శాఖ అధికారుల ఆదేశాల మేరకు గతనెల 15వ తేదీ నుంచి నల్లపురెడ్డిపల్లె, కొత్తపల్లె, బ్రాహ్మణపల్లె, లింగాల మండలం ఇప్పట్ల, కామసముద్రం, రామాపురం గ్రామాల్లో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు గోపాలకృష్ణ, శ్రీనివాస నాయుడు, మహబూబ్ బాషాల ఆధ్వర్యంలో ప్రతిరోజు ట్రాప్ కెమెరాలలో చిరుత అడుగు జాడలు, చిరుత పిల్లలు ఏవైనా కనిపించాయా అని పర్యవేక్షిస్తున్నారు. గ్రామాలలో ఎక్కడే గాని చిరుతలు, వాటి పిల్లల అడుగులు కనిపించడం లేదన్నారు. ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల చిరుతలు చల్లగా ఉండే ప్రాంతాలకు వెళ్లిపోయి ఉండవచ్చంటున్నారు. -
పోసానిపై కేసు.. బయటపడ్డ మరో కుట్ర
అన్నమయ్య జిల్లా, సాక్షి: ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి(Posani KrishnaMurali)పై కూటమి కుట్ర ఎఫ్ఐఆర్ సాక్షిగా బయటపడింది. పల్నాడు జిల్లా నరసరావుపేట(Narasaraopeta) టూటౌన్ పోలీసులు.. ఈ ఉదయం రాజంపేట సబ్ జైలు నుంచి ఆయన్ని తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఆయనపై అక్కడ నమోదైన ఎఫ్ఐఆర్లో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. టీడీపీ ప్రధాన కార్యదర్శి కొట్టు కిరణ్ ఈ ఫిర్యాదు చేశారు. 2022లో తమ నేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్(అప్పటికీ ఇంకా పొత్తులో లేరు), నారా లోకేష్‌లపై పోసాని అసభ్యపదజాలంతో పోస్టులు పెట్టారని, అవహేళనగా మాట్లాడారని.. కాబట్టి చర్యలు తీసుకోవాలని కిరణ్ కోరారు. అయితే.. 2024 నవంబర్ 13వ తేదీనే ఆయన ఫిర్యాదు చేయగా.. ఆ మరుసటిరోజే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అదీ బీఎన్ఎస్ సెక్షన్ల మీద కాకుండా.. ఐపీసీ సెక్షన్ల కింద. ఇక.. అరెస్ట్ మాత్రం రెండు నెలల తర్వాతే చేశారు. అదీ మరో కేసులో అరెస్టైన టైం చూసుకుని మరీ. మరోపక్క.. కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా పోసానిపై 30 ఫిర్యాదులకుగానూ.. 16 కేసులు నమోదయ్యాయి. అన్నమయ్య జిల్లా జనసేన నేత మణి ఫిర్యాదు మేరకు ఓబులవారీ పోలీసులు కేసు నమోదు చేసుకుని మరీ ఆయన్ని హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్న పోసాని విషయంలో కూటమి పెద్దలు ఇంత కక్ష పూరితంగా వ్యవహరిస్తారని ఎవరూ ఊహించలేరు. గుండె సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలున్న ఆయన్ని కావాలనే పీఎస్‌లకు తిప్పుతున్నారనే వాదన వినిపిస్తోంది. అదే టైంలో.. మిగతా చోట్ల పోలీసులు వారెంట్లను సిద్ధం చేస్తున్నారు. ఇది ఉద్దేశపూర్వక చర్య కాకుంటే మరేమిటి? అని ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు. ఇవాళ పోసాని బెయిల్ పిటిషన్ అంశం చర్చకు రావడం.. మరోవైపు వైఎస్సార్సీపీ నేతలు ములాఖత్‌కు దరఖాస్తు చేసుకున్నందునే ఇలా మరో కేసుతో ఆయన్ని జిల్లా తరలించారనే చర్చ నడుస్తోందక్కడ. మార్చి 5వ తేదీకి కడప కోర్టు ఆయన బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా వేసింది. ఈలోపు ఆయన్ని మరింత ఇబ్బంది పెట్టడమే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.పోలీసుల పోటీ.. అవసరమా?నరసరావుపేటకు పోసానిని తరలించే ముందు రాజంపేట సబ్ జైలులో పోలీసుల హైడ్రామా నడిచింది. నరసరావుపేటతో పాటు అల్లూరి జిల్లా, అనంతపురం రూరల్ పోలీసులు ఒకేసారి జైలు వద్దకు చేరుకున్నారు. పోసానిపై నమోదైన కేసులకు సంబంధించి పీటీ వారెంట్లు జైలు అధికారులకు సమర్పించారు. ‘మేం కోర్టు అనుమతి తీసుకున్నాం.. ముందుగా మాకే పోసానిని అప్పగించాలి..’ అని కోరారు. దీంతో ఉన్నతాధికారులతో మాట్లాడిన అనంతరం నరసరావుపేట పోలీసులకు అనుమతి ఇచ్చారు. తనకు ఛాతీలో నొప్పిగా ఉందంటూ పోసాని చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ మరోసారి ప్రభుత్వ వైద్యులతో పరీక్షలు చేయించారు. 👉పోసానిపై అక్రమ కేసులు బనాయిస్తూ కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్సీపీ మొదటి నుంచి మండిపడుతున్న సంగతి తెలిసిందే. అనారోగ్యం గురించి పట్టించుకోగా.. పోసానిని అపహాస్యం చేసేలా మీడియా ముందు మాట్లాడుతున్నారు. అయితే కూటమి ప్రభుత్వ పెద్దల(Kutami Peddalu) డైరెక్షన్లోనే ఇలా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఇటు వైఎస్సార్సీపీ నేతలు, అటు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. -
డ్రోన్ లేడీ!
ఆసక్తి ఉంటే అవకాశాలను అందిపుచ్చుకుని ఆర్థికంగా ఎదగవచ్చని... ప్రత్యేక గుర్తింపు పొందవచ్చని నిరూపించారు వైఎస్సార్ జిల్లా కమలాపురం మున్సిపాలిటీలోని కె.అప్పాయపల్లె గడ్డ వీధికి చెందిన నామాల జ్యోత్స్న. పొదుపు సంఘంలో క్రియాశీలకంగా ఉన్న ఆమె డ్రోన్ పైలట్‌గా ఎదిగారు. తొమ్మిది మండలాల్లోని పొలాలకు డ్రోన్ ద్వారా పురుగుమందులు పిచికారి చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. స్థానికంగా డ్రోన్ మహిళగా గుర్తింపు పొందారు. –కమలాపురంరూ.3లక్షల వరకు వచ్చాయినేను కలలో కూడా డ్రోన్ పైలట్ అవుతానని అనుకోలేదు. ఇప్పటి వరకు కమలాపురం, చెన్నూరు, వల్లూరు, సీకే దిన్నె, కడప, వేముల, సిద్ధవటం, మైదుకూరు, ఖాజీపేట మండలాల్లో డ్రోన్ ద్వారా పురుగుమందులు పిచికారి చేశాను. ఎకరాకు రూ.400 తీసుకుంటున్నా. తొమ్మిది మండలాల్లో 58 రోజుల్లో దాదాపు 700 ఎకరాల్లో పురుగుమందులు పిచికారి చేశా. రూ.3లక్షల వరకు ఆదాయం వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. – నామాల జ్యోత్స్న, కె.అప్పాయపల్లె, కమలాపురం, వైఎస్సార్ జిల్లాపొదుపు సంఘం నుంచి ఢిల్లీ వరకుదేశవ్యాప్తంగా 100 జిల్లాల్లోని పంట పొలాల్లో డ్రోన్ల ద్వారా పురుగుమందులు పిచికారి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాటిలో వైఎస్సార్ జిల్లా ఒకటి. వైఎస్సార్ జిల్లా నుంచి కమలాపురానికి చెందిన జ్యోత్స్నను డ్రోన్ పైలట్‌గా ఎంపిక చేశారు. ఆమె కమలాపురంలోని ‘నికితా’ పొదుపు సంఘం లీడర్‌గా ఉన్నారు. గ్రూప్ లీడర్‌గా బాగా పనిచేస్తున్న జ్యోత్స్నను డీఆర్డీఏ అధికారులు గుర్తించి కరోనా కాలంలో క్రిషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) ద్వారా కమలాపురంలో మినీ నర్సరీని ఏర్పాటు చేయించారు. ఆమె బంతి, నిమ్మ, గుమ్మడి, వంగ, మిర్చి, వరి నారు పెంచి రైతులకు విక్రయిస్తున్నారు.ప్రకృతి వ్యవసాయం ద్వారా తన పొలంలో పంటలు పండించి ఆదాయం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మహిళలను డ్రోన్ పైలట్లుగా తయారు చేసేందుకు ప్రవేశ పెట్టిన ‘లక్పతి దీదీ’ పథకానికి కూడా జ్యోత్స్నను అధికారులు ఎంపిక చేశారు. ఆమె 2023 డిసెంబర్ 11 నుంచి 22 వరకు హైదరాబాద్‌లో శిక్షణ పొందారు. లక్పతి దీదీ పథకాన్ని 2024 మార్చిలో ప్రధాని మోదీ ప్రారంభించారు. గుంటూరులో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో ఆమెకు సర్టిఫికెట్‌తోపాటు డ్రోన్ అందజేశారు. మార్చి 27న అధికారికంగా ఆమె ఇంటికి డ్రోన్ వచ్చింది. ఇప్పటి వరకు ఆమె 58 రోజులపాటు డ్రోన్ ఉపయోగించి పురుగుమందులు పిచికారి చేసి రూ.3లక్షల వరకు ఆదాయం పొందారు.స్వాతంత్య్ర దిన వేడుకలకు హాజరు..ఢిల్లీలో 2024 ఆగస్టు 15న జరిగిన స్వాతంత్య్ర దిన వేడుకలను తిలకించేందుకు డ్రోన్ పైలట్లకు కేంద్రం ప్రత్యేక ఆహ్వానం పంపింది. వైఎస్సార్ జిల్లా నుంచి జ్యోత్స్న వెళ్లి స్వాతంత్య్ర దిన వేడుకలను తిలకించారు. ఇది తన జీవితంలో మరపురాని ఘట్టమని ఆమె తెలిపారు. కడపలో 2024, జనవరి 26న జరిగిన రిపబ్లిక్ డే ఉత్సవాల్లో డీఆర్డీఏ తరఫున ఆమె డ్రోన్ ఎగురవేసి రూ.25వేలు నగదు బహుమతి పొందారు. -
విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
బ్రహ్మంగారిమఠం : మండలంలోని కొత్తబస్వాపురంలో తొర్రివేముల నాగరాజు (34) ఆదివారం సాయంత్రం వ్యవసాయ పొలం దగ్గర విద్యుత్ షాక్ తగిలి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నాగరాజు చేపల వేట చేస్తుంటాడు, వ్యవసాయ పొలం వద్ద పందుల నివారణ కోసం విద్యుత్ ఏర్పాటు చేయడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. బి.మఠం పోలీసులు కేసు నమోదు చేశారు. మోరీని ఢీకొన్న వాహనాలు వల్లూరు (చెన్నూరు) : చెన్నూరు సమీపంలోని జాతీయ రహదారిపై సబ్ స్టేషన్ ఎదురుగా కడపకు వెళ్లే దారిలో రెండు ద్విచక్ర వాహనాలు మోరీని ఢీకొనడంతో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. వివరాలు ఇలా.. ప్రొద్దుటూరుకు చెందిన మనోహర్, ప్రభావతి దంపతులతో పాటు వీర కుమార్ విజయలక్ష్మిలు కడప నగరంలో ఓ శుభకార్యానికి బయలుదేరారు. వీరి వెనుక అతివేగంగా వచ్చే వాహనాలకు భయపడి తమ ద్విచక్ర వాహనాలను కొంచెం పక్కకు తిప్పుకునే క్రమంలో మోరీని ఢీకొన్నారు. దీంతో మనోహర్ ప్రభావతి కిందపడటంతో స్వల్ప గాయాలయ్యాయి. కాగా, వీరి వెనుకే వస్తున్న వీరకుమార్, విజయలక్ష్మి కూడా ఇదే మోరీని ఢీకొన్నారు. వారికి స్వల్ప గాయాలయ్యాయి. కాగా అదే సమయంలో వెనుక నుంచి పలు వాహనాలు వేగంగా వీరి పక్కనే వెళ్లాయి. అదష్టవశాత్తు ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. మోరీని రోడ్డుపైన కట్టడమే ప్రమాదానికి కారణమని, గతంలో కూడా పలు ప్రమాదాలు జరిగాయని స్థానికులు తెలిపారు. ఆర్టీసీ బస్సు ఢీకొని గాయాలుకడప అర్బన్ : కడప నగరం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో మలుపు వద్ద బైకుపై వెళుతున్న దినేష్ (35)అనే వ్యక్తిని ఆదివారం ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో అతను తీవ్రంగా గాయ పడ్డాడు. స్థానికుల సహకారంతో ఆసుపత్రిలో చేరారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గ్యాస్ లీకై వ్యక్తి మృతిబి.కొత్తకోట : గ్యాస్ లీకై న సంఘటనలో తీవ్రంగా గాయపడిన స్థానిక ఖాజాఖాన్ వీధికి చెందిన లబ్బి అబ్దుల్ కరీం (65) బెంగళూరు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆదివారం మృతి చెందాడు. శుక్రవారం ఉదయం ఇంట్లో స్నానానికి వెళ్లగా గ్యాస్ లీకై మంటలు వ్యాపించాయి. స్నానాల గది నుంచి బయటకు రాగానే కుటుంబీకులు మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అప్పటికే శరీరం కాలిపోవడంతో వైద్యం కోసం కుటుంబీకులు బెంగళూరు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
ఆటోలో పోగొట్టుకున్న ల్యాప్‌టాప్ అప్పగింత
కడప అర్బన్ : ఆటోలో ల్యాప్‌టాప్ ఇతర విలువైన వస్తువులను మరిచిపోయి దిగిన బాధితునికి పోలీసులు తిరిగి వాటిని అందజేశారు. వివరాలిలా.. గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ మురళి తన సొంత పనిమీద కడపకు వచ్చాడు. అప్సర సర్కిల్ వద్ద ఆటో దిగే సమయంలో తన ల్యాప్‌టాప్ ఇతర విలువైన వస్తువులు ఉన్న బ్యాగ్‌ను ఆటోలో మరిచిపోయి దిగి వెళ్లిపోయాడు. తర్వాత ఆ విషయాన్ని గుర్తించి చిన్న చౌక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆటో వచ్చిన మార్గంలోని వివిధ చోట్ల ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్‌లను కానిస్టేబుళ్లు శ్రీనివాస్, ఖాదర్ లు పరిశీలించి ఆటోను గుర్తించాడు. బాధితుడు కోల్పోయిన బ్యాగు, ల్యాప్‌టాప్, వాచ్ ఇతర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకుని బాధితుడికి అందించారు. పోలీసులకు బాధితుడు కృతజ్ఞతలు తెలిపాడు. అధికారుల ఆదేశాలతో తక్షణం స్పందించిన కానిస్టేబుళ్లను చిన్నచౌకు పోలీస్ స్టేషన్ సీఐ ఓబులేసు, ఎస్ఐలు రాజరాజేశ్వర రెడ్డి, రవి కుమార్, సిబ్బంది ప్రశంసించారు. -
ద్విచక్ర వాహనానికి నిప్పు
ప్రొద్దుటూరు క్రైం : స్థానిక ఈశ్వరరెడ్డినగర్‌లో ఫైనాన్స్ వ్యాపారికి చెందిన ద్విచక్ర వాహనానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఈశ్వరరెడ్డినగర్‌లో నివాసం ఉంటున్న శ్రీనివాసులు ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. ప్రతి రోజు అతని బైక్‌ను ఇంటి ముందు పార్కింగ్ చేసేవాడు. శనివారం రాత్రి బైక్‌ను ఎప్పటిలాగే ఇంటి బయట నిలిపాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో వాహనం పూర్తిగా కాలిపోయింది. శ్రీనివాసులు శనివారం మండల కేంద్రమైన దువ్వూరులో పలువురితో గొడవ పడ్డాడు. గొడవ పడిన వ్యక్తులే బైక్‌కు నిప్పు పెట్టి ఉంటారని అతను భావిస్తున్నాడు. శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. -
వైఎస్సార్సీపీ క్యాడర్‌ను భయపెట్టే చర్యలు
కడప కార్పొరేషన్ : డైవర్షన్ పాలిటిక్స్‌తోపాటు వైఎస్సార్సీపీ క్యాడర్‌ను భయాందోళనకు గురిచేసేందుకే పోసాని కృష్ణ మురళిని అరెస్ట్ చేశారని వైఎస్సార్ సీపీ నాయకుడు, వల్లూరు మాజీ సర్పంచ్ బూసిపాటి కిషోర్ విమర్శించారు. ఆదివారం కడపలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోసాని కృష్ణ మురళి గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు కేసులు పెట్టడం, అరెస్టులు చూస్తుంటే రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీకి సంబంధించిన కార్యకర్తలను, క్యాడర్‌ను భయాందోళనకు గురిచేసే ప్రణాళిక జరుగుతోందని అర్థమవుతోందన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం వల్లే తాను చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ పై మాట్లాడినట్లు పోసాని నేరాంగీకార పత్రంలో పేర్కొన్నట్లు చెబుతున్న తీరును చూస్తే పోలీసు వ్యవస్థను కూటమి ప్రభుత్వం ఎంతగా వాడుకుంటుందో అర్థమవుతోందన్నారు. ఇదంతా జనసేన క్యాడర్‌ను అడ్డుపెట్టుకుని టీడీపీ ఆడుతున్న నాటకాలన్నారు.ఇలాంటి సంఘటనలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భయపడే ప్రసక్తే లేదన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకుడు శ్రీరాములు పాల్గొన్నారు. -
యువకునిపై దాడి
పులివెందుల రూరల్ : పులివెందుల మండల పరిధిలోని నల్లగొండువారిపల్లె గ్రామ సమీపంలోని తోటల వద్ద మట్టిని తోల కూడదని చెప్పినందుకు మణికంఠ అనే యువకునిపై దాడి చేసి గాయ పరిచారు. బాధితుని ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మట్టిని అక్రమంగా తరలిస్తుంటే తరలించ వద్దని చెప్పినందుకు సాదావలీ, అక్బరమ్మలు అరటి కాయలు కోసే కొడవలితో దాడి చేశారు. దీంతో వీపుపై తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం పులివెందుల ఆసుపత్రికి తరలించారు. నలుగురు మట్కా నిర్వాహకుల అరెస్టుప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని దస్తగిరి పేటలో మట్కా నిర్వహిస్తున్న నలుగురిని టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. మట్కా నిర్వహిస్తున్నారని సమాచారం రావడంతో టూటౌన్ సీఐ యుగంధర్ సిబ్బందితో కలిసి ఆదివారం సాయంత్రం దాడులు నిర్వహించారు. దాడిలో దస్తగిరిపేటకు చెందిన షేక్ నూరుద్దీన్తోపాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.70,250 నగదు, మట్కా పట్టీలను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
గన్నే నీకు ఇది తగునా..!
రాజంపేట టౌన్ : తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు గన్నే సుబ్బనరసయ్యనాయుడు తమకు చెందిన భూముల్లో సాగుచేసుకుంటున్న పంట పొలాల్లోకి రానివ్వకుండా ఇతరుల ద్వారా బెదిరిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని కొల్లావారిపల్లె మిట్టదళితవాడకు చెందిన దళితులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత దళితులు, ఎమ్మార్పీఎస్ నాయకులు ఆదివారం వారి పంట పొలాల వద్ద గన్నే సుబ్బనరసయ్యనాయుడుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అసైన్మెంట్ కమిటీ ద్వారా భూ లబ్ధిపొందిన వారి కుటుంబాలకు చెందిన జయరామయ్య, సుబ్బరాయుడు, ఈశ్వరయ్య విలేకరులతో మాట్లాడారు. రాజంపేట మండలం గోపమాంబపురం రెవెన్యూ పొలంలోని సర్వే నంబర్ 20/24లో 1.50 ఎకరాల భూమిని 2023వ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం మన్నెం లక్షుమ్మకు అసైన్మెంట్ కమిటీ ద్వారా ఇచ్చిందన్నారు. ఈభూమి గతంలో లక్షుమ్మ అవ్వ గంగమ్మ పేరిట ఉండేదన్నారు. అలాగే 20/25 సర్వే నంబర్లోని 1.50 ఎకరాల భూమి కొట్టం దుర్గాకు, 20/26 సర్వే నంబర్లోని 50 సెంట్ల భూమిని మన్నెం పద్మకు ప్రభుత్వం అసైన్మెంట్ కమిటీ ద్వారా ఇచ్చిందని తెలిపారు. దీంతో తమ భార్యల పేరిట ఉన్న ఈ భూముల్లో తాము పంటలు పెట్టి సాగుచేసుకుంటుండగా గన్నే సుబ్బనరసయ్యనాయుడు అండతో చవన పీరయ్యనాయుడు తమ భూములను దౌర్జన్యంగా ఆక్రమించుకొని తమను భూముల్లోకి రానివ్వడం లేదని వారు ఆరోపించారు. 2023వ సంవత్సరంలో అసైన్మెంట్ కమిటీ ద్వారా తమకు కేటాయించిన భూములకు విద్యుత్‌శాఖ అధికారులు పీరయ్యనాయుడు పేరుతో విద్యుత్ కనెక్షన్‌ను ఇచ్చారని, ఈవిషయాన్ని తాము గతంలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా అఽధికారులు పీరయ్యనాయుడు పేరిట ఉన్న కనెక్షన్‌ను తొలగించారని తెలిపారు. అయితే మళ్లీ అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకుల వత్తిళ్లకు తలొగ్గి పీరయ్యనాయుడుకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చారన్నారు. దీంతో గన్నే సుబ్బనరసయ్యనాయుడు, పీరయ్యనాయుడులు తాము సాగుచేసుకుంటున్న పంట పొలాల్లోకి అడుగు కూడా పెట్టనివ్వకుండా భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. తాము తమ భూముల్లోకి వెళితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, అలాగే తనపై ఆరోపణలు చేస్తే భారీ మూల్యం కూడా చెల్లించుకోవాల్సి ఉంటుందని గన్నే సుబ్బనరసయ్యనాయుడు ఇతరుల ద్వారా తమకు హెచ్చరికలు పంపుతున్నట్లు వారు తెలిపారు. సుబ్బనరసయ్యనాయుడు మేకవారిపల్లెలోని వంకపోరంబోకును ఆక్రమించుకొని షెడ్డు నిర్మించుకున్నాడని, అలాగే మిట్టమీదపల్లె మిట్టహరిజనవాడకు చెందిన గుడిసె సుబ్బరాయుడు, శెట్టిపల్లె నరసింహులు, కొండయ్య, మిట్టమీదపల్లెలోని సోమిగారి కుటుంబానికి చెందిన ఐదు ఎకరాల ఉరవడి చేనుకు గన్నే సుబ్బనరసయ్యనాయుడు దొంగపట్టాలు సృష్టించి ఆక్రమించుకున్నట్లు వారు ఆరోపించారు. గన్నే సుబ్బనరసయ్యనాయుడు రాజంపేట మండలంలో అనేకచోట్ల భూ ఆక్రమణలకు పాల్పడ్డాడని, వాటన్నింటిని కూడా తాము సర్వే నెంబర్లతో సహా వె వెలుగులోకి తీసుకురానున్నట్లు వారు తెలిపారు. దళితులను భయబ్రాంతులకు గురిచేస్తున్న టీడీపీ మండల అధ్యక్షుడు సాగుచేసుకుంటున్న భూముల్లోకి రానివ్వకుండా బెదిరింపులు గన్నే సుబ్బనరసయ్యనాయుడు దౌర్జన్యాలపై దళితుల నిరసన మద్దతు తెలిపిన ఎమ్మార్పీఎస్ నాయకులు -
గంగ జాతరలో ఏరులై పారిన మద్యం
లక్కిరెడ్డిపల్లి : గంగమ్మ జాతరలో మద్యం దుకాణాలు వెలిశాయి. బాటిల్‌పై రూ. 50 నుంచి రూ. 100 అదనంగా వసూలు చేసి మద్యం దుకాణదారులు లక్షల రూపాయలు సొమ్ము చేసుకున్నారు. ఇదంతా జరుగుతున్నా ఎకై ్సజ్ పోలీసులు పట్టించుకున్న పాపాన పోలేదు. మద్యం దుకాణాలకు ఎలాంటి అనుమతులు లేకపోయినా ఇష్టానుసారంగా జాతరలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి భక్తులను దండుకున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే పేకాట క్లబ్బులు, స్లో బాల్ ఆటలను ఏర్పాటు చేసుకొని భక్తుల జేబులకు చిల్లులు వేశారు. ఇదంతా జాతర బయట జరగలేదు. జాతర మధ్యలో సందడిగా ఉన్న ప్రాంతంలో పేకాట క్లబ్బులు జరిగాయి. లక్షలాది రూపాయలు భక్తుల నుంచి దోచుకున్నారు. అడిగే నాథుడే లేకపోవడంతో రంగులరాట్నం, మిఠాయి దుకాణాలు మొదలుకొని చెరుకుల గడల వరకు దోచుకున్న వారికి దోచుకున్నంత అన్న చందంగా అధికంగా వసూలు చేసుకొని వ్యాపాలు కొనసాగించారు. పట్టించుకోవాల్సిన అధికారులు తమకు ఏమీ తెలియనట్లు వ్యవహరించారు. విచ్చలవిడిగా పేకాట క్లబ్బులు భక్తుల జేబులకు చిల్లులు పట్టించుకోని అధికారులు -
● ఖరీదైన వ్యాధికి ఆరోగ్యశ్రీలో రూ.80 వేలే
ఇది ఖరీదైన వ్యాధి. ఈ వ్యాధి సోకిన వారికి గ్లోబులిన్ ఇంజెక్షన్లు మోతాదు ప్రకారం వాడాలి. ఒక గ్రాము ధర రూ.12 వేల వరకు ఉంటుంది. ఒక రోజుకు 4–5 గ్రాముల ఇంజెక్షన్ ఇవ్వా ల్సి వుంటుంది. అత్యవసరమైన వారికి ప్లాస్మాపెరోసిస్ చికిత్సను అందించాలి. ఈ చికిత్సకు రూ.లక్షల్లో ఖర్చు అవుతుంది. కాగా ఆరోగ్యశ్రీలో మాత్రం ఈ వ్యాధికి రూ.80 వేల వరకు మాత్రమే ప్యాకేజీ ఉంది. పేదలు ఆరోగ్యశ్రీ ద్వారా ఈ వ్యాధికి చికిత్స పొందాలంటే కష్టతరం అవుతుంది. గత పాలనలో కరోనాను ఆరోగ్యశ్రీ కిందికి చేర్చి ఉచితంగా వైద్య చికిత్సను అందించా రు. తాజాగా ఈ ‘జీబీఎస్’ వ్యాధికి ఆరో గ్యశ్రీ కింద ప్యాకేజీని పెంచాల్సిన అవ సరం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. -
కొనసాగుతున్న పశువైద్య విద్యార్థుల నిరసన
ప్రొద్దుటూరు రూరల్ : మండల పరిధి గోపవరం గ్రామ సమీపంలోని పశువైద్య కళాశాల విద్యార్థులు చేస్తున్న నిరసన దీక్షలు 28 రోజుకు చేరాయి. వారు ఆదివారం మోకాళ్లపై నిలుచొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు స్టైఫండ్ పెంచాలని పోరాటం చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. ప్రభుత్వం స్పందించే వరకు దీక్షలను ఆపేది లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వం తమకు ఇస్తున్న రూ.7 వేల స్టైఫండ్ ప్రస్తుతం పెరిగిన ధరలకు ఏమాత్రం సరిపోవడం లేదని తెలిపారు. ఎంబీబీఎస్ విద్యార్థులతో సమానంగా తమకు స్టైఫండ్ పెంచాలని కోరారు. -
జజ్జనకర.. జాతర
లక్కిరెడ్డిపల్లి: అనంతపురం గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా ముగిసింది. మూడు రోజుల పాటు కమనీయంగా జరిగిన వేడుకలు ఆదివారం ముగిశాయి. లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో ఉత్సవ ప్రాంగణం కిక్కిరిసింది. అశ్వ వాహనంపై అమ్మవారి ఊరేగింపు ఉత్సాహ భరితంగా జరిగింది. వివిధ రంగులతో కూడిన చాందినీ బండ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జబర్దస్త్ ఆర్కెస్ట్రా కార్యక్రమం అలరించింది. లక్కిరెడ్డిపల్లి జర్నలిస్టులు, మానవతా స్వచ్ఛంద సంస్థ, రాయచోటి మురళీ నవోదయ కోచింగ్ సెంటర్, ప్రవీణ్ కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ, నీళ్ల ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడంతో.. తాగునీటి దాహార్తి నుంచి ఉపశమనం కల్గింది. గంగ జాతర అంటే చెరుకులను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఉత్సవానికి వచ్చిన భక్తులు చెరుకులు లేనిదే తిరుగు ప్రయాణం చేయరు. మిఠాయి దుకాణాలు, శీతల పానీయాలు దుకాణాల వ్యాపారులు అధిక రేట్లు వసూలు చేసి సొమ్ము చేసుకున్నారు. బాణసంచా పేలుళ్లు చూపరులను ఆకట్టుకున్నాయి. భక్తుల రద్దీ భారీగా ఉండటంతో క్యూలైన్లు కిక్కిరిశాయి. అమ్మవారి దర్శనం కోసం రూ.10, రూ.100, రూ.300 టికెట్లతోపాటు వీఐపీ దర్శనం ఏర్పాటు చేసినా.. గంటలకొద్దీ వేచి చూడాల్సి వచ్చిందని భక్తులు తెలిపారు. జిల్లాతోపాటు పొరుగు ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఆదివారం కావడంతో అధిక సంఖ్యలో వచ్చారు. అమ్మవారికి మొక్కులు ఉన్న వారు బోనాలు సమర్పించి తలనీలాలు అర్పించారు. పలువురు ప్రముఖులు గంగమ్మ దేవతను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక అధికారి శ్రీనివాసులు, పూజారులు చెల్లు గంగరాజు, దినేష్ కుమార్, వెంకటేష్, గురుస్వామి, చంద్ర, రెడ్డి శేఖర్, బోస్ తదితరులు పాల్గొన్నారు. ముగిసిన గంగమ్మ ఉత్సవం అశ్వవాహనంపై అమ్మవారి ఊరేగింపు భక్తజన సంద్రమైన అనంతపురం -
‘గులియన్ బ్యారో సిండ్రోమ్’ (జీబీఎస్) అరుదైన ఈ వ్యాధి గుబులు రేపుతోంది. ఇటీవల కాలంలో ఈ కేసులు వెలుగు చూడటం కలవరం కలిగిస్తోంది. పొరుగున ఉన్న నెల్లూరుతోపాటు గుంటూరు తదితర జిల్లాల్లో ఈ వ్యాధి చాపకింద నీరులా పాకుతోంది. తాజాగా కర్నూలు జిల్లాలో బయటపడింది. నాడ
కడప రూరల్: జిల్లా వ్యాప్తంగా జ్వరం.. జలుబు.. దగ్గు.. ఒళ్లు నొప్పులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో ‘జీబీఎస్’ వ్యాధి కలవరం రేపుతోంది. ఎందుకంటే విరేచనాలు, జ్వరం తదితర జబ్బులు వచ్చి వెళ్లిన తరువాతనే.. ఒళ్లు నొప్పులతో ప్రధానంగా కాళ్ల నొప్పులతో ఈ ‘జీబీఎస్’ వ్యాధి ప్రారంభమవుతుంది. ఈ లక్షణాలను ముందస్తుగానే తెలుసుకొని చికిత్స పొందితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. పొరపాటున అప్రమత్తంగా లేకుంటే మాత్రం పెద్ద ప్రమాదాన్నే ఎదుర్కోవాల్సి ఉంటుంది. జాగ్రత్తలతోనే అడ్డుకట్ట ఈ వ్యాధి అంటు వ్యాధి కాకపోవడం శుభపరిణామం. కాగా ముందస్తు జాగ్రత్తలతోనే ఈ అరుదైన వ్యాధికి అడ్డుకట్ట వేయవచ్చు. అంటే ఇతరుల నుంచి సంక్రమించే డయేరియా, జ్వరం, దగ్గు తదితర వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను పాటించాలి. ప్రధానంగా ఈ వ్యాధి ఎందుకొస్తుందో తెలుసుకోవాలి.. అవగాహన పెంచుకోవాలి. ఏదైనా జబ్బు వచ్చి వెళ్లిన తరువాత శరీరంలో ఏదైనా మార్పు వచ్చినా.. ప్రధానంగా నరాలు, కండరాలకు సంబంధించిన సమస్యలను గుర్తిస్తే తక్షణం వైద్యులను సంప్రదించాలని వైద్యులు సూచిస్తున్నారు. పూణెలో నిర్ధారణ పరీక్షలు ప్రస్తుతం ఈ వ్యాధి రాష్ట్రంతోపాటు దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. కాగా జిల్లాకు సంబంధించి ఏ పెద్ద జబ్బొచ్చినా పెద్దాసుపత్రి (కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి)కి వెళ్లాల్సిందే. గత ప్రభుత్వ పాలనలో కరోనా వచ్చినప్పుడు యుద్ధ ప్రాతిపదికన అందుకు అవసరమైన వైద్య పరికరాలు, మందులు, సిబ్బందిని సిద్ధం చేశారు. ఫలితంగా కరోనాపై విజయం సాధించాం. తాజాగా ‘జీబీఎస్’ వ్యాధి సవాల్ విసురుతోంది. అయితే ఇక్కడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో మాత్రం ఈ వ్యాధి నిర్ధారణకు ఎలాంటి పరికరాలు అందుబాటులో లేవు. అనుమానిత కేసులు ఏవైనా ఉంటే పూణేలోని ల్యాబొరేటరీకి పంపి వ్యాధిని నిర్ధారిస్తారని వైద్యులు చెబుతున్నారు. ఈఎన్ఎంజీ, ఎన్సీఎస్ పరీక్షల ద్వారా వ్యాధిని నిర్ధారించాల్సి వుంది. ఈ పరీక్షలకు సంబంధించి కడప పెద్దాసుపత్రిలో ప్రత్యేకంగా నిధులను కేటాయించి పరికరాలను సిద్ధం చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అవగాహన అవసరంఈ వ్యాధి మనకు లేదని, అజాగ్రత్తగా ఉండటం కంటే ముందస్తుగా వ్యాధి నిర్ధారణ పరీక్షల పరికరాలను ఏర్పాటు చేయడం, ఆరోగ్యశ్రీలో ప్యాకేజీని పెంచడం, జబ్బుపై ప్రజల్లో అవగాహన కల్పించడం మంచిది. అలాగే ఈ వ్యాధికి వాడే ఇంజెక్షన్లు ఇతర జిల్లాల్లో లేవని తెలుస్తోంది. ఇక్కడ మాత్రం ఉన్నాయనే సమాధానం వస్తోంది. అదే నిజమైతే మంచిదే. ఆపద సమీపంలో ఉన్నప్పుడు జాగ్రత్తలు పాటించడంలో తప్పులేదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. నాడీ వ్యవస్థను దెబ్బతీసే వ్యాధి ఏదైనా జబ్బు వచ్చి వెళ్లిన తరువాత.. బయటపడుతున్న లక్షణాలు అప్రమత్తంగా లేకుంటేఆపదలో పడినట్లే ఈ కేసులు జిల్లాలో ఎక్కడా లేవంటున్న వైద్య ఆరోగ్య శాఖ -
ప్రజలను బలి చేసిన బడ్జెట్ ఇది
కడప కార్పొరేషన్ : కూటమి ప్రభుత్వం రూ.3.24 లక్షల కోట్లతో ప్రవేశపెట్టింది బాహుబలి బడ్జెట్ కాదని...ప్రజలను బలిచేసేలా బడ్జెట్ ప్రవేశపెట్టారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అబద్ధాలు, మోసాలకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని మరోసారి నిరూపితం అయిందన్నారు. సూపర్ సిక్స్ హామీలతోపాటు 143 హామీలు మేనిఫెస్టోలో చెప్పి ప్రజల్ని మోసం చేశాడన్నారు. సంపద సృష్టిస్తానని చెప్పాడని, ఎక్కడ సృష్టించాడో, ఏ విధంగా సృష్టించాడో తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. టీడీపీ నేతలకు మాత్రమే సంపద సృష్టి జరిగిందని, కింది స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకూ వారి స్వలాభానికే సంపద సృష్టి జరిగిందన్నారు. గత నవంబర్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో పింఛన్లతో మమ అనిపించాడని, ఈ ఏడాది బడ్జెట్లో ఆ పింఛన్లలో కూడా కోత విధించేలా ఉన్నారన్నారు. పింఛన్లకు రూ.4వేల కోట్లు తక్కువగా కేటాయింపులు చేశారని, సుమారు 10 లక్షల పింఛన్లు కోత కోసేందుకు సర్వేలు వాయు వేగంతో చేస్తున్నారన్నారు. ఆడబిడ్డ నిధి అని 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని గొప్పలు చెప్పారని, నిరుద్యోగ భృతి, ఉచిత బస్సు ప్రయాణం ఊసే లేకుండా చేశారన్నారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి 80 లక్షల మంది పిల్లలకు 12వేల కోట్లు కావాల్సి ఉంటే...9వేల కోట్లే బడ్జెట్లో కేటాయించారన్నారు. ఆ రూ. 9వేల కోట్లయినా సరైన విధంగా ఇస్తాడా... అనే అనుమానం ఉందన్నారు. అన్నదాత సుఖీభవకు కేంద్రం ఇచ్చే రూ.6వేలు కాకుండా అదనంగా రూ. 20 వేలు ఇస్తానని ఇప్పుడు మార్చారన్నారు. చంద్రబాబు చేష్టలకు ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందన్నారు. 2024 నవంబర్ బడ్జెట్లో వ్యాల్యూమ్–6లో రూ.6.46 కోట్ల అప్పులు చూపారని, వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగిపోయే నాటికి రూ.3.1 6లక్షల కోట్లు అప్పు ఉండేదన్నారు. ప్రస్తుత బడ్జెట్లో వ్యాల్యూమ్–6 కాలమ్‌నే తొలగించారని ఎత్తిచూపారు. ఈ 9 మాసాలకే రూ. 1.30 లక్షల కోట్ల అప్పు చేశాడని, వచ్చే ఏడాది మరో లక్ష కోట్ల అప్పు చేస్తారని బడ్జెట్ ద్వారా అర్థమవుతోందన్నారు. రాయలసీమలో ఉక్కు పరిశ్రమకుగానీ, గాలేరు నగరి, హంద్రీనీవా, అన్నమయ్య ప్రాజెక్టులకు ఎలాంటి కేటాయింపులు చేయకుండా అన్యాయం చేశారన్నారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ ముగ్గరూ కలిసి ఇవే హామీలను ప్రజలకు చెప్పారన్నారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన రూ. 30వేల కోట్ల బకాయిలను పట్టించుకోలేదని, పీఆర్సీ గురించి చర్చే లేదన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అభివృద్ధి, సంక్షేమం కోసం అప్పులు చేశారని, ఈ ప్రభుత్వం అవేమీ చేయకుండానే రూ.1.30 లక్షల కోట్లు అప్పులు చేసిందన్నారు. వైఎస్సార్సీపీ వారికి చిన్న పని చేసినా ఊరుకోను అంటూ ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడటం దారుణమన్నారు. తమ నాయకుడు వైఎస్ జగన్ కులం, మతం, వర్గం లేదు..పార్టీ అంతకన్నా లేదని అందరికీ సంక్షేమాన్ని అందించారన్నారు. చివరికి ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా వైఎస్సార్ ఆసరా, చేయూత పథకాల ద్వారా రూ.8వేల కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ము జమ చేశారన్నారు. పోసాని కృష్ణమురళి ఎప్పుడో 2021లో మాట్లాడితే.. ఇప్పుడు తప్పుడు కేసు పెట్టి వేధిస్తున్నారని, అంతకు ముందు టీడీపీ నేతలు ఎన్ని బండ బూతులు తిట్టారో మేము చూపిస్తామన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, వీళ్లను చొక్కాపట్టుకొని నిలదీసే రోజు త్వరలోనే వస్తుందని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ నేతలు పులి సునీల్ కుమార్, నాగేంద్రారెడ్డి, ఎస్ఎండీ షఫీ, శ్రీరంజన్‌రెడ్డి, సాయి, సాయిదత్త పాల్గొన్నారు. అబద్ధాలు, మోసాలకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ వైఎస్సార్సీపీ వారికి ఏ పనులు చేయవద్దని సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి అనడం దారుణం వీళ్లను చొక్కాపట్టుకొని నిలదీసే రోజు వస్తుంది వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి ధ్వజం -
అపురూప ఘట్టం.. మహానైవేద్యం
● వేలాదిగా తరలివచ్చిన భక్తులు ● వీరభద్రస్వామికి బంగారు కిరీటం, మూడో కన్ను ధరింప చేసిన వేదపండితులు రాయచోటిటౌన్: రాయచోటిలోని శ్రీ వీరభధ్రస్వామి బ్రహ్మోత్సవాల్లో అపురూప ఘట్టమైన మహానైవేద్యాన్ని వేదపండితులు ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఇదీ ప్రత్యేకత.. స్వామి వారికి రోజూ నైవేద్యం సమర్పిస్తారు. ఏడాదికి ఒకరోజు మహానైవేద్యం సమర్పిస్తారు. దీనికోసం స్వామికి రోజు వారి భత్యంలో భాగంగా ఒక సేరు బియ్యం చొప్పున 365 రోజులకు 365 సేర్లతో వండిన భోజనం, నెలకు ఒక సేరు బియ్యం ప్రకారం 12 నెలలకు 12 సేర్ల బియ్యంతో వండిన అత్తిరసాలు (నిప్పట్లు), వివిధ రకాల కూరగాయలతో వండిన వంటకాలతోపాటు పలు రకాల దుంపలు, గుమ్మడి కాయలు వండి రాశిగా పోస్తారు. ఈ వంటకాలను తెల్లవారుజామున మూడు గంటల నుంచే సుండుపల్లె మండలం శ్రీరామాపురానికి చెందిన భాస్కర్ కుటుంబ సభ్యులు తడిబట్టలతో మడికట్టుతో వండి సిద్ధం చేయడం పూర్వం నుంచి వస్తున్న ఆనవాయితీ. వేదపండితులు ప్రణవానందగిరి స్వామి (నర్రా వెంకట భాస్కర్ సిద్ధాంతి) శిష్యుడు శ్రీ మఠం ఓంకార్‌స్వామి ఆధ్వర్యంలో అన్నానికి పూజలు నిర్వహించాక తీసుకొచ్చి శ్రీ వీరభద్రస్వామి ఆలయం మధ్యలో రాశి పోశారు. అనంతరం వీరశైవులు, కన్నడ భక్తులు సిద్ధాంతి (వేదపండితుల) నుంచి అనుమతి తీసుకున్నాక కత్తులతో విన్యాసాలు చేస్తూ రాశిని కొల్లగొట్టారు. అనంతరం మట్లి వడియరాజులు రాశిలోకి దూసుకెళ్లి రెండు చేతులతో అందినంత తీసుకెళ్లారు. అనంతరం ప్రధాన అర్చకులు వేదపండితల సహాయంతో స్వామివారికి బంగారు కిరీట ధారణ చేసి తినేత్రం(మూడోకన్ను) ధరింపచేశారు. స్వామివారి త్రినేత్రం అన్నం రాశిపై పడుతుందని, అప్పుడు ఒక్క క్షణంపాటు ప్రకంపనలు వస్తాయని భక్తుల నమ్మకం. ఆ సమయంలో స్వామి వారికి ఎదురుగా ఎవరూ ఉండకుండా జాగ్రత్త వహిస్తారు. ఆలయ సిబ్బంది పోలీసు అధికారుల సహకారంతో మహానైవేద్యాన్ని స్వామి వారి దర్శనం చేసుకొని వెళ్లే వారికి విస్తర్లలో పంచిపెడతారు. ● మహానైవేద్యం కొల్లగొట్టాక మిగిలిన ప్రసాదాన్ని కన్నడ భక్తులు తీసుకొచ్చి ఆలయం వెలుపల విస్తర్లలో ఎండపెట్టుకున్నారు. ఎండిన తర్వాత వడియాలుగా మార్చుకొని తీసుకెళతారు. ఉపవాసాలు ఉన్న రోజుల్లో వండిన ప్రసాదంలో కలుపుకొని తింటామని వారు చెప్పడం విశేషం. ఆదివారం తెల్లవారుజామున 4–30కు అగ్నిగుండ ప్రవేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో డీవీ రమణారెడ్డి, అర్చకులు శంకరయ్యస్వామి, కృష్ణయ్య స్వామి, శేఖర్‌స్వామి తదితరులు పాల్గొన్నారు. వైభవం.. రథోత్సవం శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం స్వామి వారి రథోత్స వం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా డప్పువాయిద్యాలు, కోలాటాలు, కర్ణాటక భక్తుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. వీధు లన్నీ శ్రీ వీరభద్రుడి నామస్మరణతో మార్మోగాయి. -
అధికారం అండతో ప్రభుత్వ స్థలం కబ్జా
కడప సెవెన్‌రోడ్స్ : అధికార తెలుగుదేశం పార్టీ నేతల అండతో కడప నగరంలో కబ్జాదారులు పెట్రేగిపోతున్నారు. కుంట, వాగు, వంక, నీటిమునక ఇలా ప్రభుత్వ భూములన్నీ కబ్జాదారుల కబంధ హస్తాల్లోకి వెళ్లిపోతున్నాయి. కోట్లాది రూపాయలు విలువజేసే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైపోతున్నా నాయకుల ఒత్తిళ్లతో రెవెన్యూ అధికారులు మిన్నకుండిపోతున్నారు. కానాల జయలత అనే మహిళ చిన్నచౌకు గ్రామ సర్వే నెంబరు 955లోని 10 సెంట్ల ప్రభుత్వ స్థలం తమదేనంటూ ఏకంగా బోర్డు నాటినా ఇంతవరకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడమే ఇందుకు నిదర్శనం. కడప కార్పొరేషన్ 43వ డివిజన్ నిరంజన్‌నగర్ పరిధిలో సర్వే నెంబరు 955లోని 23 సెంట్లు ప్రభుత్వ నీటి మునక భూమి ఉంది. మీ భూమి వెబ్సైట్లో ఈ వివరాలు స్పష్టంగా ఉన్నాయి. ఇక్కడ ఒక సెంటు స్థలం రూ. 40 లక్షలు పలుకుతున్నట్లు తెలుస్తోంది. ఎంతో విలువైన స్థలం కావడంతో ఎలాగైనా కబ్జా చేసేందుకు ఎత్తులు వేశారు. ఇందులో భాగంగా నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. కడప నగరం కుమ్మరకుంటకు చెందిన దాసరి సాల్మోన్‌కు 1953లో ప్రభుత్వం సదరు సర్వే నెంబరులోని 23 సెంట్ల పైకి 10 సెంట్లు పట్టాగా ఇచ్చారని డాక్యుమెంట్లలో పేర్కొన్నారు. వారసత్వరీత్యా ఆయన కోడలు దాసరి మేరమ్మకు ఆ స్థలం సంక్రమించినట్లు చూపారు. ఆమె తన అవసరాల నిమిత్తం మృత్యుంజయకుంటకు చెందిన కానాల జయలతకు రూ. 29,04,000లకు విక్రయించినట్లు చెబుతూ 2018 ఏప్రిల్ 4వ తే ఛీఠీ సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దీంతో ఆ స్థలాన్ని తాము కొనుగోలు చేిసినట్లు, దానిపై తమకు సంపూర్ణ హక్కులు ఉన్నట్లు చెబుతూ కె.జయలత బోర్డు పాతారు. బోర్డు స్టాడింగ్ ఆర్డర్స్–15–అండర్ సెక్షన్ 11 పేరా 2 ప్రకారం వాటర్ బాడీలు, వాటర్ కోర్సులు, కుంట పోరంబోకులను ఎవరికీ అసైన్మెంట్ లేదా అలియనేషన్ కింద దఖలు పరచరాదు. సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. నీటి మునక, కుంట తదితర ప్రభుత్వ భూములను రెవెన్యూ అధికారులు అసైన్మెంట్ ఇచ్చేందుకు, రీ క్లాసిఫికేషన్ చేసేందుకు అధికారం లేదని రాష్ట్ర హైకోర్టు కూడా గతంలో స్పష్టం చేసింది. 2012 సెప్టెంబరు 14వ తేదీన రెవెన్యూశాఖ ద్వారా జీఓ ఎంఎస్ నెంబరు 571 సైతం ప్రభుత్వం జారీ చేసింది. నీటి పోరంబోకు భూముల కన్వర్షన్, కేటాయింపుల విషయంలో తమ మార్గదర్శకాలు కచ్చితంగా అమలు చేయాలంటూ సీసీఎల్ఏ కలెక్టర్లకు ఇచ్చిన ఆదేశాలు కూడా ఉన్నాయి. అయినా కూడా కె.జయలత 2018లో హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేశారు. అప్పటి కడప తహసీల్దార్ తరుపున కౌంటర్ అఫిడవిట్ దాఖలైంది. అది నీటి మునక ప్రాంతమని, దాన్ని రెవెన్యూ అధికారులు ఎవరికీ అసైన్ చేయలేదని కౌంటర్ అఫిడవిట్లో స్పష్టం చేశారు. సదరు వ్యక్తులు ఆ స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని తెలిపారు. వీఆర్ఓ ఇచ్చిన నివేదిక మేరకు చిన్నచౌకు సీఐ 2017 అక్టోబరు 1వ తేదీన దాసరి కొండయ్య, దాసరి చంద్రశేఖర్ అలియాస్ చందు, మరికొందరిపై ఎఫ్ఐఆర్ నెం. 262 నమోదు చేశారని రెవెన్యూ అధికారులు పేర్కొన్నారు. దీనిపై విచారించిన ఉన్నత న్యాయస్థానం కె.జయలత కౌంటర్ దాఖలు చేసుకోవచ్చని మాత్రమే చెప్పింది. అయినా ఆమె ఆ స్థలంలో ఓమారు బోర్డు పాతగా, రెవెన్యూ అధికారులు తొలగించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టీడీపీ నేతల అండ చూసుకుని ప్రభుత్వ బోర్డును తొలగించి ఆమె తన పేరిట ఒక బోర్డు పాతడం చర్చనీయాంశంగా మారింది. రిజిస్ట్రేషన్ రద్దుకు ప్రతిపాదనలు – కడప తహసీల్దార్ ఈ అంశంపై కడప తహసీల్దార్ నారాయణరెడ్డిని సాక్షి వివరణ కోరగా.. చిన్నచౌకు పొలం సర్వే నెంబరు 955లోని 23 సెంట్ల భూమి ప్రభుత్వ నీటి మునక ప్రాంతం కింద ఉందని స్పష్టం చేశారు. గతంలో ఓమారు ఆమె బోర్డును పాతగా తొలగించామన్నారు. మళ్లీ ఇప్పుడు బోర్డు ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఆమె చేసుకున్న రిజిస్ట్రేషన్ చెల్లదని స్పష్టం చేశారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి వివరాలు సేకరించామన్నారు. ఆమె చేసుకున్న రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని కోరుతూ కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించామన్నారు. అప్పీలు చేసుకోవాలంటూ మాత్రమే వారికి కోర్టు సూచించింది తప్ప వారికి అనుకూలంగా ఎలాంటి తీర్పు ఇవ్వలేదన్నారు. బోర్డును తొలగించి రిజిస్ట్రేషన్ రద్దు చేయించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రెవెన్యూ రికార్డుల్లో నీటి మునకగా స్పష్టం దొంగ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ స్థలం తమదేనంటూ బోర్డు సైతం నాటిన వైనం చేష్టలుడిగి చూస్తున్న అధికారగణం