ప్రధాన వార్తలు

స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:22 సమయానికి నిఫ్టీ(Nifty) 10 పాయింట్లు ఎగబాకి 22,5001కు చేరింది. సెన్సెక్స్(Sensex) 82 పాయింట్లు పెరిగి 74,183 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 103.55 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 70.04 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.27 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.75 శాతం దిగజారింది. నాస్‌డాక్ 0.18 శాతం నష్టపోయింది.ఇదీ చదవండి: ఎస్‌బీఐ యూపీఐ సేవల్లో అంతరాయంయూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల విధింపు చర్యలపై వివిధ దేశాలు ప్రతికార సుంకాలు అమలు చేస్తున్నట్లు ప్రకటిస్తున్నాయి. దాంతో యూఎస్ మార్కెట్లు ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. ఆసియా మార్కెట్లు లాభాల్లో ట్రేడవడం, అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగియడం సహా ప్రపంచ మార్కెట్ల మిశ్రమ సంకేతాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు కీలకంగా మారుతున్నాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) అమ్మకాలు కొనసాగుతుండటం భారతీయ ఈక్విటీలపై ఒత్తిడి పెంచుతోంది. ఫిబ్రవరి నెలకు భారత వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ద్రవ్యోల్బణ డేటాను ఇన్వెస్టర్లు పరిశీలించనున్నారు. ఈ నెల 14వ తేదీన హోలీ పండుగ సందర్భంగా మార్కెట్లకు సెలవు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

ఎస్‌బీఐ యూపీఐ సేవల్లో అంతరాయం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కస్టమర్లు యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్ సేవలను పొందడంలో మంగళవారం నాలుగు గంటలకు పైగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ సమస్య తలెత్తింది. సమస్యను పూర్తిగా పరిష్కరించామని బ్యాంక్ ప్రకటించింది. మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి ఈ సమస్య ఉత్పన్నమైంది. దీంతో వినియోగదార్లు చాలా మంది తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు. ‘ఎస్‌బీఐ యూపీఐ యాప్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యలు పరిష్కరించాం. సాయంత్రం 5 గంటల నుండి ఆటంకం లేకుండా పనిచేస్తోంది’ అని బ్యాంక్ వివరించింది.రికార్డు స్థాయిలో యూపీఐ చెల్లింపులుయూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ఆధారిత డిజిటల్ చెల్లింపులు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి. లావాదేవీల విలువ, పరిమాణం విషయంలో 2025 ఫిబ్రవరి 1 సరికొత్త రికార్డు సృష్టించింది. ఏకంగా ఆ ఒక్కరోజే రూ.99,835 కోట్ల విలువైన లావాదేవీలు నమోదయ్యాయి. లావాదేవీల సంఖ్య 60 కోట్లు దాటింది. యూపీఐ వ్యవస్థలో ఇదే రికార్డు. గత రికార్డులు చూస్తే లావాదేవీల విలువ 2025 జనవరి 2న అత్యధికంగా రూ.94,429 కోట్లు, లావాదేవీల సంఖ్య జనవరి 10న 57.8 కోట్లు నమోదైంది. ఫిబ్రవరి 1–25 మధ్య రూ.19,60,263 కోట్ల విలువైన 1439.8 కోట్ల లావాదేవీలు జరిగాయి.ఇదీ చదవండి: టాటా గ్రూప్ నుంచి మరో ఐపీవోఅగ్రస్థానంలో ఫోన్‌పేయూపీఐ విభాగంలో ఫోన్‌పే తొలి స్థానంలో దూసుకుపోతోంది. 2025 జనవరిలో రూ.11,91,304 కోట్ల విలువైన 810 కోట్ల లావాదేవీలను సాధించింది. గూగుల్‌పే రూ.8,26,845 కోట్ల విలువైన 618 కోట్ల లావాదేవీలతో రెండవ స్థానంలో కొనసాగుతోంది. రూ.1,26,313 కోట్ల విలువైన 115 కోట్ల లావాదేవీలతో పేటీఎం మూడవ స్థానంలో నిలిచింది. లావాదేవీల విలువ పరంగా క్రెడ్, ఐసీఐసీఐ బ్యాంక్ యాప్స్, నవీ, గ్రో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ యాప్స్, అమెజాన్ పే, భీమ్ యాప్స్ తర్వాతి స్థానాల్లో పోటీపడుతున్నాయి.

టాటా గ్రూప్ నుంచి మరో ఐపీవో
టాటా గ్రూప్ ఫైనాన్షియల్ సర్వీసుల సంస్థ టాటా క్యాపిటల్ త్వరలో పబ్లిక్ ఇష్యూకి రానుంది. అయితే ఇందుకు కంపెనీతో టాటా మోటార్స్ ఫైనాన్స్ విలీనానికి జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ) అనుమతించవలసి ఉంది. తదుపరి సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసేందుకు వీలుంటుంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ఈ నెల(మార్చి) చివరికల్లా విలీనానికి ఎన్‌సీఎల్‌టీ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనున్నట్లు అంచనా. దీంతో 2 బిలియన్ డాలర్ల(రూ.17,000 కోట్లు) విలువైన ఐపీవోకు శ్రీకారం చుట్టనుంది. తద్వారా 11 బిలియన్ డాలర్ల విలువైన కంపెనీగా నిలవనున్నట్లు అంచనా. ఆర్‌బీఐ వద్ద అప్పర్‌లేయర్ ఎన్‌బీఎఫ్‌సీగా గుర్తింపు పొందిన టాటా క్యాపిటల్ పబ్లిక్ ఇష్యూకి ఇప్పటికే సంస్థ బోర్డు అనుమతించింది. ఐపీవోలో భాగంగా 2.3 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా ప్రస్తుత వాటాదారులు సైతం కొంతమేర ఈక్విటీని ఆఫర్ చేయనున్నారు.ఏప్రిల్‌లో ఏథర్ ఎనర్జీ ఐపీవోఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన కంపెనీ ఏథర్ ఎనర్జీ ఏప్రిల్‌లో పబ్లిక్ ఇష్యూకి వచ్చే సన్నాహాలు చేపట్టింది. ఇందుకు వీలుగా కంపెనీ తప్పనిసరిగా మార్పిడికిలోనయ్యే ఫ్రిఫరెన్స్ షేర్ల(సీసీపీఎస్)ను ఈక్విటీగా మార్పు చేస్తోంది. కంపెనీల రిజిస్టర్ (ఆర్‌వోసీ) సమాచార ప్రకారం 1.73 సీసీపీఎస్‌ను 24.04 కోట్ల ఈక్విటీ షేర్లుగా మార్పిడి చేసేందుకు ఏథర్ బోర్డు తాజాగా అనుమతించింది. సెబీ నిబంధనల ప్రకారం ప్రధాన ప్రాస్పెక్టస్ దాఖలు చేసే ముందుగానే సీసీపీఎస్‌ను ఈక్విటీగా మార్పిడి చేయవలసి ఉంటుంది. వెరసి 2025–26లో పబ్లిక్ ఇష్యూకి వచ్చిన తొలి కంపెనీగా ఏథర్ ఎనర్జీ నిలిచే వీలున్నట్లు మర్చంట్ బ్యాంకింగ్ వర్గాలు పేర్కొన్నాయి.ఇదీ చదవండి: పాక్ రైల్వే విస్తీర్ణం ఎంతో తెలుసా..?గతేడాది సెప్టెంబర్‌లో ఏథర్ సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. మహారాష్ట్రలో ఈవీ ద్విచక్ర వాహన తయారీ ప్లాంటు ఏర్పాటు, రుణ చెల్లింపులకుగాను నిధుల సమీకరణ చేపట్టనున్నట్లు పత్రాలలో పేర్కొంది. ఐపీవోలో భాగంగా రూ. 3,100 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 2.2 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు విక్రయానికి ఉంచనున్నారు. దీంతో ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ తదుపరి రెండో ద్విచక్ర ఈవీ కంపెనీగా స్టాక్ ఎక్ఛ్సేంజీల్లో లిస్ట్‌కానుంది.

మహిళా వ్యాపారులకు షీట్రేడ్స్ ఇండియా హబ్
న్యూఢిల్లీ: ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తలకు సాధికారత కల్పించేందుకు, ఎగుమతుల వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్‌ఐఈవో మంగళవారం షీట్రేడ్స్ ఇండియా హబ్‌ను ఆవిష్కరించింది. ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ (ఐటీసీ) భాగస్వామ్యంతో ఏర్పాటైన ఈ కేంద్రానికి బ్రిటన్ ప్రభుత్వానికి చెందిన షీట్రేడ్స్ కామన్వెల్త్‌ప్లస్ ప్రోగ్రాం కింద నిధులు అందుతాయి.ఇదీ చదవండి: ఫ్రెంచ్ కంపెనీపై జైడస్ లైఫ్ కన్నుఇది మహిళల సారథ్యంలో ఎగుమతుల వృద్ధికి దోహదపడుతుందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిస్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) సంతోష్ కుమార్ సారంగి తెలిపారు. ఇందులో 3 లక్షల మంది మహిళా ఎంట్రప్రెన్యూర్లను ఎన్‌రోల్ చేయడంపై ఎఫ్‌ఐఈవో, ఐటీసీ దృష్టి పెట్టాలని సూచించారు. దేశవ్యాప్తంగా మహిళల ఆధ్వర్యంలోని వ్యాపారాలకు వనరులను సమకూర్చే సమగ్ర కేంద్రంగా షీట్రేడ్స్ ఇండియా హబ్ ఉంటుంది. ఇందులో సామర్థ్యాలను పెంచుకునేందుకు ఉపయోగపడే వర్క్‌షాప్‌లు, మెంటారింగ్ సెషన్లు మొదలైనవి నిర్వహిస్తారు. భారత్ ఏటా 80,000 కోట్ల డాలర్ల ఉత్పత్తులు, సర్వీసులు ఎగుమతి చేస్తోందని, వచ్చే కొన్నేళ్లలో దీన్ని 2 లక్షల కోట్ల డాలర్లకు చేర్చుకోవాలనేది లక్ష్యంగా నిర్దేశించుకుందని సారంగి చెప్పారు.

ఫ్రెంచ్ కంపెనీపై జైడస్ లైఫ్ కన్ను
న్యూఢిల్లీ: మెడ్‌టెక్ ఫ్రెంచ్ కంపెనీ యాంప్లిట్యూడ్ సర్జికల్‌లో మెజారిటీ వాటా కొనుగోలు చేసేందుకు ప్రత్యేక చర్చలు నిర్వహిస్తున్నట్లు దేశీ హెల్త్‌కేర్ సంస్థ జైడస్ లైఫ్‌సైన్సెస్ పేర్కొంది. మెజారిటీ వాటా సొంతం చేసుకునేందుకు కంపెనీ యాజమాన్యం పీఏఐ పార్ట్‌నర్స్‌సహా రెండు మైనారిటీ వాటాదారు సంస్థలతో డీల్ కుదుర్చుకోనున్నట్లు తెలియజేసింది. వెరసి వోటింగ్ హక్కులతో 85.6% వాటా కొనుగోలుకి 25.68 కోట్ల యూరోలు (రూ.2,444 కోట్లు) వెచ్చించనున్నట్లు వెల్లడించింది. అత్యంత నాణ్యమైన లోయర్‌లింబ్ ఆర్థోపెడిక్ టెక్నాలజీలలో యాంప్లిట్యూడ్‌కు పట్టున్నట్లు పేర్కొంది. వీటిలో సమస్యాత్మకంగా మారిన జాయింట్ల రీప్లేస్‌మెంట్‌లో విని యోగించే మెడికల్ ప్రొడక్టుల డిజైన్, డెవలప్‌మెంట్ తదితర కార్యకలాపాలున్నట్లు తెలియజేసింది.ఇదీ చదవండి: సిబిల్ స్కోర్ అప్‌డేట్.. ఆర్‌బీఐ ఆరు నిబంధనలునిఫ్టీ కెమికల్ ఇండెక్స్ షురూకెమికల్ రంగానికీ ఎన్‌ఎస్‌ఈ ప్రాధాన్యతన్యూఢిల్లీ: స్టాక్ ఎక్ఛ్సేంజీ దిగ్గజం ఎన్‌ఎస్‌ఈ తాజాగా కెమికల్ రంగానికి ఇండెక్స్‌ను ప్రవేశపెట్టింది. నిఫ్టీ కెమికల్స్ పేరుతో ఆవిష్కరించింది. నిఫ్టీ 500 నుంచి కెమికల్ రంగ షేర్ల పనితీరును ఇండెక్స్ ప్రతిఫలించనుంది. అనుబంధ సంస్థ ఎన్‌ఎస్‌ఈ ఇండిసెస్ ద్వారా కొత్త ఇండెక్సునకు తెరతీసింది. తాజా ఇండెక్స్ అసెట్ మేనేజర్లకు ప్రామాణికంగా నిలిచే వీలున్నట్లు ఎన్‌ఎస్‌ఈ అంచనా వేస్తోంది. ఈటీఎఫ్‌ల రూపంలో ప్యాసివ్ ఫండ్స్ ట్రాక్ చేసే రిఫరెన్స్ ఇండెక్స్‌గా ఉపయోగపడనున్నట్లు అభిప్రాయపడింది. ఆరు నెలల సగటు ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా 20 స్టాక్స్‌ను ఎంపిక చేసినట్లు పేర్కొంది. ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్స్ విభాగంలో ట్రేడింగ్‌కు అందుబాటులో ఉన్న షేర్లను పరిగణించింది. ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ విలువ ఆధారంగా ఒక్కో షేరుకి వెయిట్ ఉంటుందని, 33 శాతానికి మించదని ఎక్ఛ్సేంజీ వెల్లడించింది.

హైదరాబాద్‌లో తగ్గిన ఇళ్ల విక్రయాలు.. విలువ ఎంతంటే..
న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో గతేడాది ఇళ్ల అమ్మకాల విలువ చెప్పుకోతగ్గ స్థాయిలో పడిపోయింది. 2023తో పోల్చి చూస్తే 18 శాతం తక్కువగా రూ.1.05 లక్షల కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. 2023లో విక్రయాల విలువ రూ.1.28 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. కానీ, దేశవ్యాప్తంగా టాప్ 9 ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాల విలువ 2024లో నికరంగా 12 శాతం పెరిగి రూ.6,73,000 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. రియల్ ఎస్టేట్ డేటా అనలైటిక్స్ సంస్థ ‘ప్రాప్‌ఈక్విటీ’ ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. 2023లో రూ.6,00,143 కోట్ల విలువైన ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి. ఢిల్లీలో సానుకూల పరిస్థితులు ‘‘ఢిల్లీ–ఎన్‌సీఆర్ మార్కెట్లో సగటు విక్రయ ధర చదరపు అడుగుకి (ఎస్‌ఎఫ్‌టీ) రూ.12,469గా ఉంది. మౌలిక వసతుల అభివృద్ధి మెరుగ్గా ఉండడం, కార్పొరేట్ కంపెనీల ప్రాతినిధ్యం పెరుగుతుండడం, విస్తృత ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రావడంతో డిమాండ్ పెరుగుతోంది’’అని ప్రాప్ ఈక్విటీ వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ జసూజ తెలిపారు. నగరాల వారీగా అమ్మకాలు.. ⇒ గురుగ్రామ్‌లో 2023లో రూ.64,314 కోట్ల ఇళ్ల విక్రయాలు జరిగితే, 2024లో రూ.1,06,739 కోట్లకు పెరిగాయి. ⇒ ఢిల్లీ–ఎన్‌సీఆర్ ప్రాంతంలో గతేడాది ఇళ్ల అమ్మకాలు 63 శాతం పెరిగి రూ.1,53,000 కోట్లకు చేరాయి. 2023లో అమ్మకాల విలువ రూ.94,143 కోట్లుగానే ఉంది. ⇒ ముంబై మార్కెట్లో అమ్మకాల విలువ 13 శాతం పెరిగి రూ.1.38 లక్షల కోట్లకు చేరింది. ⇒ నవీ ముంబైలోనూ 32 శాతం వృద్ధితో ఇళ్ల అమ్మకాలు రూ.25,000 కోట్లకు చేరాయి. ⇒ థానేలో 6 శాతం అధికంగా రూ.56,000 కోట్ల అమ్మకాలు 2024లో జరిగాయి. ⇒ బెంగళూరు మార్కెట్లో రూ.85,000 కోట్ల విలువైన ఇళ్ల విక్రయాలు గతేడాది జరిగాయి. అంతకుముందు ఏడాది విక్రయాలు రూ.75వేల కోట్లతో పోల్చి చూస్తే 13 శాతం పెరిగాయి. ⇒ చెన్నై మార్కెట్లో 5 శాతం వృద్ధితో ఇళ్ల విక్రయాలు రూ.20,000 కోట్లుగా ఉన్నాయి. ⇒ కోల్‌కతాలో రూ.15,000 కోట్ల అమ్మకాలు చోటుచేసుకున్నాయి. 2023లో విక్రయాలు రూ.13,000 కోట్లతో పోల్చి చూస్తే 15 శాతం వృద్ధి నమోదైంది. ⇒పుణెలో అమ్మకాల విలువ కేవలం ఒక శాతం క్షీణించి రూ.76,000 కోట్లుగా ఉంది. 2023లో ఇక్కడ రూ.77,000 కోట్ల విక్రయాలు జరిగాయి.

పెరుగుతున్న ఫ్లైట్లు, హోటళ్ల బుకింగ్స్.. కారణం..
సాక్షి, బిజినెస్ డెస్క్ : మహా కుంభ మేళా హడావిడి ముగిసిన తర్వాత పర్యాటకానికి హోలీ పండుగ రూపంలో మరో కొత్త దన్ను దొరికింది. శుక్రవారం నాడు హోలీ కావడంతో సుదీర్ఘ వారాంతపు సెలవులొస్తున్న నేపథ్యంలో టూరిజానికి డిమాండ్ పెరిగింది. వివిధ ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెన్సీల డేటా ప్రకారం గత సీజన్‌తో పోలిస్తే ఫ్లయిట్ బుకింగ్స్ 25–30 శాతం ఎగిశాయి. అలాగే హోటల్ బుకింగ్స్ కూడా 20–30 శాతం పెరిగాయి.ఇక వీటితో పాటు ప్రయాణికులను ఆకట్టుకునేందుకు విమానయాన సంస్థ డిస్కౌంట్లు, ప్రమోషనల్ ఆఫర్లు ఇస్తున్నప్పటికీ చార్జీలు సైతం పెరిగాయి. దేశీ ప్రయాణాలకు సంబంధించి చార్జీలు సగటున 12–18 శాతం, అంతర్జాతీయ రూట్లలో చార్జీలు 8–14 శాతం పెరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి సందర్భాల్లో వీలైనంత ముందుగా ట్రావెల్ ప్రణాళికలు వేసుకోవాలంటూ కస్టమర్లకు సూచిస్తున్నట్లు వివరించాయి. లగ్జరీ హోటళ్లలో టారిఫ్‌లు జూమ్.. ఇక హోటళ్ల విషయం తీసుకుంటే, సాధారణ వీకెండ్ బుకింగ్స్‌తో పోల్చినప్పుడు లగ్జరీ, ప్రీమియం ప్రాపర్టీల్లో గదుల రేట్లు 30–40 శాతం పెరిగినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. అదే స్టాండర్డ్ హోటళ్లలో చూస్తే ధరల పెరుగుదల 15–20 శాతం మేర ఉన్నట్లు వివరించాయి. జైపూర్, ఉదయ్‌పూర్, వారణాసి, గోవా, అలీబాగ్, లోనావాలా, రిషికేష్, కూర్గ్, కేరళ వంటి డెస్టినేషన్లలో హోటల్ గదుల బుకింగ్స్ 25–30 శాతం పెరిగాయి.కుటుంబాలు, ఫ్రెండ్స్ బృందాలు ఎక్కువగా ప్రైవేట్ విల్లాలు, లగ్జరీ హోటళ్లు, ప్రీమియం రిసార్టులవైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో లగ్జరీ ప్రాపర్టీలు, ప్రైవేట్ విల్లాల బుకింగ్స్ సాధారణ వీకెండ్స్‌తో పోలిస్తే 40–50 శాతం పెరిగాయి. రాజస్థాన్, గోవాతో పాటు ప్రధాన మెట్రోలకు సమీపంలో ఉన్న హిల్ స్టేషన్లలో చాలా మటుకు ప్రీమియం, లగ్జరీ హోటల్స్ ఇప్పటికే 70–80 శాతం బుక్ అయిపోయాయి.కొన్ని రిసార్టుల్లో ఇప్పటికే ఆక్యుపెన్సీ పూర్తి స్థాయికి చేరినట్లు జోస్టెల్ సంస్థ వివరించింది. కాక్స్ అండ్ కింగ్స్ ప్రకారం జైపూర్, వారణాసి, రిషికేష్, గోవాలాంటి ప్రాంతాలకు టూర్ ప్యాకేజీలు, హోటల్ బుకింగ్స్‌కి భారీ డిమాండ్ నెలకొంది. ఇక అంతర్జాతీయంగా చూస్తే దుబాయ్, సింగపూర్, బ్యాంకాక్‌లాంటివి ఫేవరెట్ డెస్టినేషన్లుగా ఉంటున్నాయి. ఎయిర్‌లైన్స్ ప్రత్యేక ఆఫర్లు..హోలీ అనంతరం కూడా ప్రయాణాలకు డిమాండ్ భారీగా పడిపోకుండా విమానయాన సంస్థలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆకాశ ఎయిర్, ఇండిగో తదితర సంస్థలు పరిమిత కాలం పాటు డిస్కౌంట్లు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. పౌర విమానయాన శాఖ డేటా ప్రకారం ఫిబ్రవరి ఆఖరు వారంలో నమోదైన 5.2 లక్షల మంది రోజువారీ విమాన ప్రయాణికుల సంఖ్య మార్చి తొలి రెండు వారాల్లో సుమారు 4.8 లక్షల ప్యాసింజర్లకు పడిపోయినప్పటికీ.. వార్షికంగా చూస్తే మాత్రం మెరుగ్గానే ఉన్నట్లు తెలుస్తోంది.

దేశంలో టెలికాం యూజర్ల సంఖ్య ఎంతో తెలుసా..
న్యూఢిల్లీ: దేశీయంగా డిసెంబర్‌లో మొత్తం టెలిఫోన్ సబ్‌స్క్రయిబర్స్ సంఖ్య గతంలో కంటే స్వల్పంగా పెరిగి 118.99 కోట్లకు చేరింది. నవంబర్‌లో ఇది 118.71 కోట్లుగా నమోదైంది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ఇటు మొబైల్, అటు ఫిక్స్‌డ్ లైన్ విభాగాల్లో జియో పెద్ద సంఖ్యలో కొత్త యూజర్లను దక్కించుకుంది. వైర్‌లెస్ యూజర్ల విభాగంలో, రిలయన్స్ జియోకి నికరంగా 39.06 లక్షలు, భారతి ఎయిర్‌టెల్‌కు 10.33 లక్షల మంది కొత్తగా జత కాగా వొడాఫోన్ 17.15 లక్షల మందిని కోల్పోయింది. బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్ వరుసగా 3.16 లక్షలు, 8.96 లక్షల మంది సబ్ర్‌స్కయిబర్స్‌ను కోల్పోయాయి. ఈ విభాగంలో ప్రైవేట్ సంస్థల మార్కెట్ వాటా 91.92 శాతంగా ఉండగా, ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్ వాటా కేవలం 8.08 శాతంగా ఉంది.మరోవైపు, వైర్‌లైన్ యూజర్ల సంఖ్య నవంబర్‌లో 3.85 కోట్ల నుంచి డిసెంబర్‌లో 3.92 కోట్లకు చేరింది. జియోకి 6.56 లక్షల మంది, భారతి ఎయిర్‌టెల్‌కు 1.62 లక్షలు, టాటా టెలీకి 9,278 మంది యూజర్లు జతయ్యారు. బీఎస్‌ఎన్‌ఎల్ ఏకంగా 33,306 యూజర్లను, ఎంటీఎన్‌ఎల్ 14,054 మంది సబ్‌్రస్కయిబర్స్‌ను కోల్పోయాయి. బ్రాడ్‌బ్యాండ్ యూజర్లు 94.49 కోట్లు.. మొత్తం బ్రాడ్‌బ్యాండ్ యూజర్లు నవంబర్‌లో 94.47 కోట్లుగా ఉండగా, డిసెంబర్‌లో 94.49 కోట్లకు చేరింది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ సబ్‌స్క్రయిబర్స్ 47.65 కోట్లుగా, భారతి ఎయిర్‌టెల్ యూజర్లు 28.93 కోట్లు, వొడాఫోన్ ఐడియా 12.63 కోట్లు, భారత్ సంచార్ నిగమ్ 3.53 కోట్లు, ఎట్రియా కన్వర్జెన్స్ టెక్నాలజీస్ యూజర్లు 22.7 లక్షల మంది ఉన్నారు. బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్లో 50.43 శాతం వాటాతో జియో అగ్రస్థానంలో ఉండగా, భారతి ఎయిర్‌టెల్ (30.61 శాతం), వొడాఫోన్ ఐడియా (13.37 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి.

సిబిల్ స్కోర్ అప్‌డేట్.. ఆర్‌బీఐ ఆరు నిబంధనలు
ఆర్థిక అవసరాలు నిత్యం పెరుగుతున్నాయి. వాటిని తీర్చుకునేందుకు చాలామంది రుణాలు తీసుకుంటున్నారు. ఆర్థిక సంస్థలు రుణాలపై విధించే వడ్డీరేట్లు కూడా భారీగా ఉన్నాయి. మంచి క్రెడిట్ స్కోరు సొంతం చేసుకుంటే తక్కువ వడ్డీకే రుణాలు పొందే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల ఆర్‌బీఐ కస్టమర్ల రుణ ప్రక్రియను సులభతరం చేయడానికి కొన్ని నిబంధనలు జారీ చేసింది. ఆర్‌బీఐ విడుదల చేసిన ఈ ఆరు నిబంధనలు వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉండనున్నాయి.సిబిల్ స్కోర్ అప్‌డేషన్‌లో మార్పులుఆర్‌బీఐ జారీ చేసిన నిబంధనల ప్రకారం క్రెడిట్ స్కోర్ 30 రోజులకు బదులుగా ప్రతి 15 రోజులకు అప్‌డేట్ అవుతుంది. ఈ నిబంధనలు 2025 జనవరి 1 నుంచే అమల్లోకి వచ్చాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ క్రెడిట్ స్కోర్‌ను వీలైనంత త్వరగా అప్‌డేట్ చేసుకోవాలని ఆర్‌బీఐ బ్యాంకులకు సూచించింది. దీనితో పాటు క్రెడిట్ సంస్థలు ప్రతి నెలా కస్టమర్ క్రెడిట్ సమాచారాన్ని సీఐసీ(చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్)కి తెలియజేయాలి.తనిఖీ చేస్తే సమాచారంబ్యాంకు లేదా ఎన్‌బీఎఫ్‌సీ ఖాతాదారుల క్రెడిట్ రిపోర్టును తనిఖీ చేసినప్పుడల్లా ఆయా సమాచారాన్ని కస్టమర్లకు పంపాలని ఆర్‌బీఐ అన్ని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు తెలిపింది. నిబంధనల ప్రకారం ఈ సమాచారాన్ని కస్టమర్లకు పంపడానికి ఎస్ఎంఎస్ లేదా ఇమెయిల్ ఉపయోగించవచ్చు.అభ్యర్థన తిరస్కరణకు కారణాన్ని తెలిపేలా..ఖాతాదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కస్టమర్ అభ్యర్థనలను బ్యాంకులు తిరస్కరించినట్లయితే దానికిగల కారణాన్ని వారికి చెప్పాలి. తద్వారా వినియోగదారులు వారి అభ్యర్థన ఎందుకు తిరస్కరించబడిందో తెలుసుకోవచ్చని, వారు దాన్ని సకాలంలో మెరుగుపరచవచ్చని ఆర్బీఐ తెలిపింది.ఉచిత క్రెడిట్ రిపోర్టులునిబంధనల ప్రకారం కస్టమర్లు తమ క్రెడిట్ హిస్టరీని సరిగ్గా తెలుసుకునేందుకు వీలుగా ఏడాదికి ఒకసారి క్రెడిట్ కంపెనీలకు ఉచితంగా పూర్తి క్రెడిట్ స్కోర్లను అందించాలి. ఇందుకోసం క్రెడిట్ కంపెనీలు తమ వెబ్‌సైట్‌లో ప్రత్యేకంగా లింక్‌ను డిస్‌ప్లే చేయాలి.నోడల్ అధికారి నియామకంఏదైనా బ్యాంక్ కస్టమర్‌ను డిఫాల్ట్‌గా ప్రకటించబోతున్నట్లయితే అంతకుముందు ఆర్థిక సంస్థలు ఆ విషయాన్ని సదరు వ్యక్తికి సమాచారం అందించాలి. ఇందుకోసం రుణాలు ఇచ్చిన సంస్థలు ఎస్ఎంఎస్/ ఈ-మెయిల్ ద్వారా ఖాతాదారులకు సమాచారాన్ని చేరవేయాలి. దీనితో పాటు బ్యాంకు లేదా రుణం ఇచ్చిన సంస్థలు నోడల్ అధికారిని (నోడల్ ఆఫీసర్) నియమించాలి. ఖాతాదారుల క్రెడిట్ స్కోర్‌కు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ఈ నోడల్ అధికారి పనిచేస్తారు.ఇదీ చదవండి: పాక్ రైల్వే విస్తీర్ణం ఎంతో తెలుసా..?త్వరితగతిన ఫిర్యాదుల పరిష్కారంఖాతాదారులకు ఏవైనా సమస్యలు ఉంటే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీకి ఫిర్యాదు చేయవచ్చు. ఈ కంపెనీలు 30 రోజుల్లోగా వినియోగదారుల సమస్యలను పరిష్కరించకపోతే రోజుకు రూ.100 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

పాక్ రైల్వే విస్తీర్ణం ఎంతో తెలుసా..?
భారత్‌కు దాయాది దేశంగా ఉన్న పాకిస్థాన్‌లో బెలూచిస్థాన్ వేర్పాటు వాదులు తాజాగా తీవ్ర కార్యకలాపాలకు పాల్పడ్డారు. పాకిస్థాన్‌కు చెందిన పాక్ జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను (Jaffar Express) తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సుమారు 100కి పైగా ప్రయాణికులను బంధించారు. ఈ చర్యలను ప్రతిఘటించిన ఆరుగురు పాకిస్థాన్ జవాన్లను హతమార్చారు. పాకిస్తాన్ రైల్వే దేశవ్యాప్తంగా ముఖ్యమైన రవాణా సాధనంగా పనిచేస్తోంది. దీని విస్తృతమైన నెట్‌వర్క్ మారుమూల ప్రాంతాలను అనుసంధానించడంలో, వాణిజ్యాన్ని సులభతరం చేయడంలో, పర్యాటకానికి మద్దతుగా నిలవడంతో తోడ్పడుతుంది. అసలే అంతంతమాత్రంగా ఉన్న పాకిస్థాన్ ఎకనామీకి ఇలాంటి ఘటనలు కోలుకోలేని దెబ్బగా మారే ప్రమాదముందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.భారత్‌తో పోలిస్తే చాలా తక్కువ..పాకిస్థాన్‌లో 1861లో కరాచీ నుంచి కోత్రి మధ్య మొదటి రైల్వే లైన్ ప్రారంభమైంది. బ్రిటిష్ వలసరాజ్య కాలంలో నార్త్ వెస్ట్రన్ స్టేట్ రైల్వేగా స్థాపించిన ఈ రైల్వే 1947లో భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత పాకిస్థాన్ రైల్వేగా మారింది. కాలక్రమేణా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలు, పట్టణాలను కలుపుతూ నెట్‌వర్క్‌ను విస్తరించింది. ప్రస్తుతం పాకిస్థాన్ రైల్వే సుమారు 7,789 కిలోమీటర్ల మేరకు విస్తరించింది. ఇది భారతరైల్వే విస్తరించిన సుమారు 68,000 కిలోమీటర్ల ట్రాక్‌తో పోలిస్తే చాలా తక్కువ. పాక్ రైల్వే కేవలం 479 స్టేషన్లను కవర్ చేస్తుంది. ఈ నెట్‌వర్క్ ప్యాసింజర్, సరుకు రవాణా సేవలకు కీలకంగా మారింది.చైనా-పాక్ మధ్య ఎంఎల్-1 ప్రాజెక్ట్‌ఇటీవలి కాలంలో పాకిస్థాన్ రైల్వే సేవలను పెంచడానికి ఆధునీకరణ కార్యక్రమాలను ప్రారంభించింది. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా మెయిన్ లైన్ 1 (ఎంఎల్-1) వంటి ప్రధాన రైల్వే మార్గాలు ఏర్పాటు చేస్తుంది. ఇది కరాచీ, లాహోర్, పెషావర్ వంటి పట్టణ కేంద్రాలను కలుపుతుంది. ఎంఎల్-1 అప్‌గ్రేడేషన్ వంటి ప్రాజెక్టులు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, రైలు వేగాన్ని పెంచడం, రైల్వే సామర్థ్యాన్ని విస్తరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా కరాచీ నుంచి చైనాలోని పెషావర్ వరకు 1,726 కిలోమీటర్ల రైల్వే లైన్‌ను ఏర్పాటు చేయనున్నారు. క్రమంగా భవిష్యత్తులో ట్రాక్‌ను రెట్టింపు చేయడం, రైలు వేగాన్ని గంటకు 160 కిలోమీటర్లకు పెంచడం వంటివి ప్రాజెక్ట్ లక్ష్యాల్లో కీలకంగా ఉన్నాయి.ఈ ప్రాజెక్ట్ ఎందుకోసం అంటే..సరుకులు, ప్రయాణీకుల రవాణాను సులభతరం చేయడం ద్వారా ఈ ప్రాజెక్ట్ వాణిజ్యాన్ని పెంచుతుందని నమ్ముతున్నారు. ఇతర దేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షిస్తుందని, నిర్మాణ సమయంలో, తర్వాత కాలంలో కూడా వందలాది ఉద్యోగాలను సృష్టిస్తుందని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థలు, డబుల్ ట్రాక్‌లు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇవి ఆపరేషనల్ భద్రతను మెరుగుపరుస్తాయని, ప్రమాదాలను తగ్గిస్తాయని అంచనా వేస్తున్నారు. రోడ్డు రవాణా కంటే రైలు మార్గాలను ప్రోత్సహించడం ద్వారా ఈ ప్రాజెక్ట్ ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తూ, కర్బన ఉద్గారాలను నియంత్రిస్తుందని చెబుతున్నారు.ఇదీ చదవండి: ‘పెట్టుబడుల కంటే ప్రధానమైనవి ఇవే..’సవాళ్లు ఇవే..ఈ ప్రాజెక్ట్‌కు ప్రాముఖ్యత ఉన్నప్పటికీ పాకిస్థాన్ రైల్వే కాలం చెల్లిన మౌలిక సదుపాయాలతో నెట్టుకొస్తోంది. దేశంలో సరైన భద్రత లేకపోవడంతో తాజాగా జరిగిన ట్రెయిన్ హైజాక్ వంటి ఘటనలు పునరావృత్తమైతే ఆర్థిక వ్యవస్థపై, దేశ సమగ్రతపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇప్పటికే బెలుచిస్థాన్‌లో వేర్పాటు వాదులు పాకిస్థాన్‌కు పక్కలో బళ్లెంలాగా పరిణమిస్తున్నారు. దేశంలో ఇప్పటికే ఆర్థిక పరిస్థితి తీవ్రరూపం దాల్చినట్లు నివేదికలు వెల్లడవుతున్నాయి. చైనా-భారత్ మధ్య చెలరేగుతున్న భౌగోళిక అనిశ్చితుల నేపథ్యంలో భారత్‌కు శత్రు దేశమైన పాకిస్థాన్‌తో చెలిమి చేస్తే భవిష్యత్తులో ఆసరాగా ఉంటుందని చైనా నమ్ముతుంది. దాంతో పాక్ ప్రాజెక్ట్‌ల్లో చైనా పెట్టుబడి పెడుతోంది. పాక్ పెద్దలు ఈ విషయాన్ని గ్రహించినా అక్కడి ఆర్థిక పరిమితులకు లోబడి చైనాతో చెలిమి చేయక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.‘కేసీఆర్’ ప్రాజెక్టుభారత్‌లో ఐఆర్‌సీటీసీ మాదిరిగానే పాకిస్థాన్‌లో ఆన్‌లైన్ టికెట్ బుకింగ్, లైవ్ ట్రైన్ ట్రాకింగ్, డిజిటల్ పేమెంట్స్, రియల్ టైమ్ అప్‌డేట్స్ అందించే ‘రబితా అప్లికేషన్’ను అక్కడి రైల్వే ప్రవేశపెట్టింది. కరాచీలోని పట్టణ రవాణా వ్యవస్థను పునరుద్ధరించడానికి, ఆధునీకరించడానికి కరాచీ సర్క్యులర్ రైల్వే (కేసీఆర్) ప్రాజెక్టును ప్రారంభించారు. ఇది ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, నగరవాసులకు రైలు సేవలను చేరువ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
బిజినెస్ పోల్
కార్పొరేట్

మహిళా వ్యాపారులకు షీట్రేడ్స్ ఇండియా హబ్

ఫ్రెంచ్ కంపెనీపై జైడస్ లైఫ్ కన్ను

పెరుగుతున్న ఫ్లైట్లు, హోటళ్ల బుకింగ్స్.. కారణం..

పాక్ రైల్వే విస్తీర్ణం ఎంతో తెలుసా..?

భారత్‌లో స్టార్‌లింక్.. ఎలాన్ మస్క్‌తో ఎయిర్‌టెల్ డీల్

15 నిమిషాల్లో అంబులెన్స్: జెంజో సంస్థ కీలక నిర్ణయం

పోర్ట్‌ఫోలియోలో వైవిధ్యానికి మొమెంటం ఇన్వెస్టింగ్

మస్క్ పతనం మొదలైందా?: లక్షల కోట్లు ఆవిరి

జీవ్ మే శివ్ హై.. వంతారా కృషిపై ఆధ్యాత్మిక గురువు స్పందన

హోలీ గేట్‌వే సేల్.. రూ.1,199కే విమాన ప్రయాణం!

అమెరికా సుంకాలు: ఆ రంగంపైనే అధిక ప్రభావం..
న్యూఢిల్లీ: అమెరికా ప్రతికార సుంకాలు విధిస్తే.. అప...

ఐపీఓల జోరుకు బ్రేక్!!
న్యూఢిల్లీ: గతేడాదంతా జోరుగా దూసుకెళ్లిన ఐపీఓల మార...

ఎస్ఎంఈ ఐపీఓలు అంత ఈజీ కాదు
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సె...

అమెరికా మార్కెట్లు క్రాష్: కారణం ఇదే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెరతీసిన టారి...

నేటి నుంచి యూఎస్‌పై చైనా సుంకాలు.. వ్యూహాత్మక ప్రతీకారం
ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు అమెరిక...

జీఎస్టీ రేట్ల తగ్గింపుపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన
జీఎస్టీ రేట్లు మరింత తగ్గుతాయని, పన్ను రేట్లు &am...

2025 ఆర్థిక సంవత్సరంలో గోధుమల దిగుమతి ఎంతంటే..
ఆహార ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించేందుకు భారత ప్రభు...

100 గిగావాట్ల అణువిద్యుత్‌కు రోడ్ మ్యాప్
భారత్ 100 గిగావాట్ల అణువిద్యుత్ సామర్థ్యం లక్ష్యా...
ఆటోమొబైల్
మనీ మంత్ర

స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు

తీవ్ర ఒడిదొడుకులు.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు

క్రమంగా పెరుగుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు

ఆధార్ ధ్రువీకరణ లావాదేవీలు 225 కోట్లు

బుల్ జోష్.. లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు

లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు

ఫండ్స్‌లో ‘సిప్’ చేస్తున్నారా..?

‘బేర్’మంటున్న స్టాక్ మార్కెట్ సూచీలు

స్థిరంగా కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు

నష్టాలకు బ్రేక్.. లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
టెక్నాలజీ

ఎక్స్ డౌన్: గగ్గోలు పెడుతున్న యూజర్లు
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నాయకత్వంలో నడుస్తున్న ఎక్స్ (ట్విటర్)లో అంతరాయం ఏర్పడింది. లక్షలాది మంది వినియోగదారులు ఈ సోషల్ మీడియా యాప్‌ను యాక్సెస్ చేయలేకపోయినట్లు వెల్లడించారు.ఆన్‌లైన్ అంతరాయాలను ట్రాక్ చేసే ప్లాట్‌ఫామ్ డౌన్‌డెటెక్టర్ నివేదికల ప్రకారం.. భారతదేశం నుంచి దాదాపు 2000 మంది, యునైటెడ్ స్టేట్స్ నుంచి 18,000 మంది, యునైటెడ్ కింగ్డమ్ నుంచి 10,000 మంది ఎక్స్ యాప్‌ను యాక్సెస్ చేయలేకపోయినట్లు స్పష్టం చేసింది. అయితే ఈ అంతరాయంపై కంపెనీ స్పందించలేదు.X Twitter Down, Users Face Outage: Social media platform X has started showing troubles as several users reported it was not working in India which could be because of a technical glitch. pic.twitter.com/mmhRrJP6Oa— Divya 🦋 (@Hiraeth85) March 10, 2025యాప్‌ను ఓపెన్ చేయడానికి ప్రయత్నించినప్పుడు.. చాలా మంది వినియోగదారులకు "ఏదో తప్పు జరిగింది, మళ్లీ లోడ్ చేయడానికి ప్రయత్నించండి" అనే సందేశం వచ్చింది.డౌన్‌డెటెక్టర్ డేటా ప్రకారం 57% మంది వినియోగదారులు X యాప్‌తో సమస్యలను ఎదుర్కొంటున్నారని, 34% మంది వెబ్‌సైట్‌లో సమస్యలు ఉన్నాయని, 9% మంది సర్వర్ సమస్యలను నివేదించారని తేలింది. UKలో, 61% మంది వినియోగదారులు అప్లికేషన్ గురించి, 34% మంది వెబ్సైట్ గురించి, 5% మంది సర్వర్ సమస్యలను ఎదుర్కొన్నారు.𝕏 is down / having connection issues. @grok is also down and unable to complete requests.— Nicky 🇬🇧 (@NickyThomas) March 10, 2025

శాంసంగ్ ప్రీమియమ్ ఫోన్‌పై భారీ తగ్గింపు
మంచి కెమెరా, డిస్‌ప్లే, పనితీరు, క్లీన్ యూజర్ ఎక్స్‌పీరియన్స్‌తో గతేడాది అత్యధికంగా అమ్ముడైన ఫోన్లలో ఒకటిగా నిలిచిన శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా (Samsung Galaxy S24 Ultra) ఫోన్ ఇప్పుడు భారీ తగ్గింపుతో లభిస్తోంది. అప్పట్లో అధిక ధర కారణంగా ఈ ప్రీమియమ్ ఫోన్‌ను కొనలేకపోయినవారు ఇప్పుడు కొనవచ్చు.శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా ఫోన్ ఇప్పుడు తగ్గింపు, బ్యాంక్ డిస్కౌంట్ల తరువాత రూ .93,000 కంటే తక్కువకు లభిస్తుంది. మార్కెట్లోకి శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా వచ్చినప్పటికీ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రాకు క్రేజ్ అలాగే ఉంది. కాబట్టి మంచి కెమెరా, ఏఐ ఫీచర్లతో సరైన ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ల కోసం చూస్తున్నట్లయితే అమెజాన్‌కి వెళ్లి ఈ డీల్ చూడవచ్చు.తగ్గింపు అలర్ట్శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర ప్రస్తుతం అమెజాన్‌లో రూ.98,499గా ఉంది. లాంచ్ అయినప్పుడు దీని ధర రూ.1,29,999. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డును ఉపయోగిస్తే రూ.2,955 తగ్గింపు లభిస్తుంది. అలాగే కస్టమర్లు నో కాస్ట్ ఈఎంఐ (వడ్డీ ఆదా కోసం), రూ .4,775 నుండి ప్రారంభమయ్యే స్టాండర్డ్ ఈఎంఐ ప్లాన్లను ఎంచుకోవచ్చు. ఇక ఈ ఫోన్ కొనుగోలు కోసం మీరు మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేయవచ్చు. దీనికి ఆ ఫోన్ మోడల్, వర్కింగ్ కండీషన్, బ్రాండ్‌ను బట్టి రూ.22,800 వరకు పొందవచ్చు. యాడ్-ఆన్‌లుగా వినియోగదారులు రూ .6,999 టోటల్ ప్రొటెక్షన్ ప్లాన్‌ను కూడా ఎంచుకోవచ్చు.శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా స్పెసిఫికేషన్లు120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో 6.8 అంగుళాల క్యూహెచ్ డీ+ అమోఎల్ఈడీ ప్యానెల్ ను ఇందులో అందించారు. ఈ డివైజ్ 2,600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ సెట్‌పై నడుస్తుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ 45వాట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ డివైజ్ ఇప్పటికే లైవ్ ట్రాన్స్‌లేట్, సర్కిల్ టు సెర్చ్, నోట్ అసిస్ట్ వంటి గెలాక్సీ ఏఐ ఫీచర్లను అందిస్తోంది. రాబోయే ఆండ్రాయిడ్ 15 ఆధారిత వన్ యూఐ 7 అప్డేట్తో ఇది మరిన్ని ఏఐ ఫీచర్లను పొందుతుంది.కెమెరా విషయానికొస్తే.. 200 మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ విత్ 5ఎక్స్ ఆప్టికల్ జూమ్, 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. 3ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో పాటు అదనంగా 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ లభిస్తుంది. ముందువైపు 12 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

సన్‌స్క్రీన్ టెస్టర్ - స్మార్ట్ వాటర్ బాటిల్
వేసవిలో మీ చర్మానికి రక్షణ ఉందా? లేదా? అని ఈ బుల్లి సన్‌స్క్రీన్ టెస్టర్ ద్వారా ఇట్టే తెలుసుకోవచ్చు. చిన్న పెన్‌డ్రైవ్‌లా కనిపించే ఈ పరికరం, నిజానికి ఒక ప్రత్యేకమైన కెమెరా.వేసవిలో ఒళ్లంతా చెమటలు పట్టిన తర్వాత, ఈత కొట్టినప్పుడు, రుమాలుతో ముఖం తుడుచుకున్నప్పుడు, రాసుకున్న క్రీమ్స్ చర్మంపై అక్కడక్కడ మిస్ అవుతుంటుంది. అలాంటప్పుడు ఈ చిన్న కెమెరాలో నుంచి చూసినట్లయితే, సన్‌స్క్రీన్ క్రీమ్ రక్షణ తొలగిపోయిన ప్రదేశాలను డార్క్‌గా చూపిస్తుంది. ఇది పూర్తిగా వాటర్ ప్రూఫ్, అల్ట్రా పోర్టబుల్. దీని ధర రూ.10,311 మాత్రమే!స్మార్ట్ వాటర్ బాటిల్వేసవిలో హైడ్రేటెడ్‌గా ఉండటం తప్పనిసరి. పని ఒత్తిడిలో పడి చాలామంది తరచుగా నీళ్లు తాగటం మరచిపోతుంటారు. ఈ స్మార్ట్ వాటర్ బాటిల్‌తో మీరు హైడ్రేటెడ్‌గా ఉండొచ్చు.ఈ బాటిల్ మీరు నీటిని తీసుకోవడాన్ని ట్రాక్ చేస్తుంది. అంతే కాకుండా, అవసరమైనప్పుడల్లా మిమ్మల్ని చల్లబరచడానికి మంచి కూలింగ్ వాటర్‌ను అందిస్తుంది. అలాగే వ్యాయామాలు, హైకింగ్లు, బీచ్ డేస్‌కి తీసుకెళ్లడానికి ఈ వాటర్ బాటిల్ చాలా అనువుగా ఉంటుంది. ఇలాంటి బాటిల్స్ మార్కెట్లో చాలానే దొరుకుతున్నాయి. రివ్యూలను చూసి తీసుకోవటం మంచిది.

కొత్త రకం ఫ్యాన్లు: వీటి గురించి తెలుసా?
వేసవిలో చాలామంది ఉపయోగించే క్యాప్స్ కూడా స్మార్ట్‌గా మారాయి. ఈ క్యాప్స్‌కు అటాచబుల్ మిని ఫ్యాన్ వస్తుంది. ముఖానికి కప్పుకొనే చోట ఈ ఫ్యాన్ ఉంటుంది. దీనికి సోలార్ ప్యానెల్స్ సహాయంతో పవర్ సరఫరా అవుతుంది. క్యాప్ ఎండకు ఎక్స్పోజ్ కాగానే ఆటోమేటిక్‌గా ఈ ఫ్యాన్స్ పనిచేస్తాయి. వీటిల్లో కొన్ని చార్జబుల్ స్టయిల్ మోడల్స్‌లోనూ లభిస్తున్నాయి. కంపెనీల్లో క్వాలిటీ బట్టి ధరల్లో తేడా ఉండొచ్చు. రివ్యూలను పరిశీలించి, కొనుగోలు చేసుకోవచ్చు.చేతిలోనే ఫ్యాన్స్విసనకర్రలను ఎక్కడికైనా తేలికగా తీసుకుపోగలిగినట్లే, ఈ మినీ ఫ్యాన్స్‌ను కూడా ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లవచ్చు. స్మార్ట్‌ఫోన్, పవర్ బ్యాంకు మాదిరిగానే ఈ మినీ ఫ్యాన్స్‌ను కూడా పాకెట్లో లేదా హ్యాండ్‌బ్యాగులో పెట్టుకోవచ్చు. మండుటెండల్లో ఇవి ఎంతగానో ఉపశమనాన్ని కలిగిస్తాయి. మల్టిపుల్ ఫ్యాన్ స్పీడ్స్కు తోడు రీచార్జబుల్ బ్యాటరీలు వీటిలో ఉంటాయి. వీటిలో కొన్ని యూఎస్బీ పవర్ సోర్స్‌కు కనెక్ట్ చేసుకుని కూడా వాడుకోవచ్చు. ఇలాంటి మినీ ఫ్యాన్స్‌లోనూ వివిధ రకాలు, స్టయిల్స్ ఉంటాయి. కొనుగోలు చేసే ముందు కాస్త నాణ్యత ప్రమాణాలను పరిశీలించడం మంచిది.
పర్సనల్ ఫైనాన్స్

మహిళలకూ కావాలి సమగ్ర బీమా
సంరక్షకులుగా, కుమార్తెలుగా, మాతృమూర్తులుగా తమ కుటుంబాల సంక్షేమం కోసం మహిళలు సమాజంలో ఎంతో కీలకమైన, వైవిధ్యమైన పాత్రలు పోషిస్తుంటారు. అయితే ఈ బాధ్యతలను నిర్వర్తించడంలో వారు సాధారణంగానే తమ సొంత ఆర్థిక, వైద్య భద్రత విషయాలను అంతగా పట్టించుకోరు. అందుకే చాలా మంది మహిళలకు తగినంత బీమా భద్రత లేకపోవడమో లేదా పూర్తిగా తమ జీవిత భాగస్వామి లేదా బంధువు బీమాపైనో ఆధారపడాల్సిన పరిస్థితి ఉంటోంది. జీవిత కాలం ఎక్కువగా ఉండటం, కెరియర్లో అంతరాయాలు, భారీ ఆరోగ్య సంరక్షణ ఖర్చుల్లాంటి ప్రత్యేక ఆరోగ్య, ఆర్థిక సవాళ్లెన్నో మహిళలకు ఉంటాయి. అందుకే వారి స్వాతంత్య్రానికి, స్థిరత్వానికి తగినంత బీమా రక్షణ ఉండటం ఎంతో అవసరం.కీలకంగా బీమా ..సాధారణంగా పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువ కాలం జీవించినప్పటికీ, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక పరిమితుల కారణంగా సుదీర్ఘ కాలం పాటు మెరుగైన జీవితాన్ని గడిపే అవకాశం ఉండకపోవచ్చు. సమగ్రమైన బీమా కవరేజీ ఉంటే సముచితమైన ఆరోగ్య సంరక్షణ పొందడానికి అవకాశాలు గణనీయంగా మెరుగుపడగలవు. 2023, 2024 మధ్య కాలంలో చూస్తే 15 నుంచి 49 ఏళ్ల వరకు వయస్సున్న మహిళల్లో 30 శాతం మందికి ఎటువంటి ఆరోగ్య బీమా గానీ ఆర్థిక రక్షణ కవచం గానీ లేదని వెల్లడైంది. ఇలా చాలా మంది మహిళలు తమ సొంత అవసరాలను పక్కన పెట్టి కుటుంబ అవసరాలకే ప్రాధాన్యమిస్తుంటారు. ఆర్థిక పరిమితుల వల్ల నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను పొందలేకపోతుంటారు.మెటర్నిటీ, కుటుంబ భద్రతప్రసవానికి పూర్వ పరీక్షలు, ప్రసవ వ్యయాలు, ప్రసవానంతర సంరక్షణ, నవజాత శిశువుల వైద్య అవసరాలకు అవసరమైన కీలక ఆర్థిక సహాయాన్ని మెటర్నిటీ ఇన్సూరెన్స్ అందిస్తుంది. పిల్లల కోసం సన్నద్ధమవుతున్న యువ జంటలకు ఇలాంటి పాలసీలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. శిశుజననం, సంబంధిత ఖర్చుల విషయంలో ఆర్థికంగా సన్నద్ధంగా ఉండేందుకు ఇవి సహాయకరంగా ఉంటాయి. చాలా మంది మహిళలు సాధారణంగా ఉద్యోగాలు చేసే సంస్థ ఇచ్చే బీమాపైనో లేదా జీవిత భాగస్వామి బీమాపైనో ఆధారపడుతుంటారు. కానీ సొంతంగా పాలసీ ఉంటే మరింత ఆర్థిక భద్రత ఉంటుంది. కెరియర్ మార్పుల వల్ల లేదా జీవితంలో మార్పుల వల్ల కవరేజీపై ప్రభావం పడే పరిస్థితుల్లో ఇదెంతో అండగా ఉంటుంది.రిటైర్మెంట్, దీర్ఘకాలిక సంరక్షణ ప్రణాళికమహిళలు సాధారణంగా పెద్ద వయస్సులోని బంధువుల బాగోగులను చూసుకునే సంరక్షకుల పాత్రను కూడా పోషిస్తూ ఉంటారు. ఇది భావోద్వేగాలపరంగా, ఆర్థికంగా భారంగా ఉండొచ్చు. దీర్ఘకాలిక సంరక్షణ బీమా అనేది వైద్య వ్యయాలను, ఆర్థిక ఒత్తిళ్లను అధిగమించేందుకు ఉపయోగపడుతుంది. సంరక్షకులు అలాగే వారిపై ఆధారపడిన వారికి కూడా మెరుగైన సహాయం లభించేలా తోడ్పడుతుంది. అంతేగాకుండా, జీవిత కాలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రిటైర్మెంట్ త ర్వాత కూడా స్థిరమైన, మెరుగైన జీవితాన్ని సాగించేలా మహిళలు పెన్షన్ ప్లాన్లు లేదా యాన్యుటీ ఆధారిత బీమా పాలసీలను తప్పక పరిశీలించాలి.వైకల్యం, ఆదాయ భద్రతపిల్లల సంరక్షణ కోసం కావచ్చు లేదా వయస్సు పైబడుతున్న తల్లిదండ్రుల సంరక్షణ కోసం కావచ్చు చాలా మంది మహిళలకు కెరియర్లో అంతరాయాలు ఏర్పడుతుంటాయి. దీనితో వారు పని చేసే కంపెనీల నుంచి బీమా ప్రయోజనాలు పరిమితంగానే ఉండొచ్చు. అలాగే దీర్ఘకాలిక పొదుపు కూడా తగ్గుతుంది. అనారోగ్యం లేదా ప్రమాదం బారిన పడి పని చేసే పరిస్థితి లేనప్పుడు కూడా స్థిరమైన ఆదాయం లభించేలా డిజేబిలిటీ ఇన్సూరెన్స్ అనేది ఆర్థిక భద్రతను అందిస్తుంది. జీవితపు అనిశ్చితుల్లోనూ ఆర్థిక భద్రత ఉండేందుకు ఈ రక్షణ ఉపయోగపడుతుంది.స్థిరమైన భవిష్యత్తుకు రక్షణ కవచంమహిళలు తమ ఆర్థిక స్వతంత్రత, ఆరోగ్య సంరక్షణ భద్రతకు తప్పక ప్రాధాన్యమివ్వాలి. వీలైనంత ముందుగా సమగ్ర బీమా పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల, అనూహ్య ఆర్థిక కష్టాల నుంచి రక్షణను, దీర్ఘకాలికంగా స్థిరత్వాన్ని పొందేందుకు వీలవుతుంది. క్రియాశీలకమైన చర్యలు తీసుకోవడం ద్వారా అనుకోని సవాళ్ల నుంచి మహిళలు తమను, తమ కుటుంబాలను రక్షించుకోవచ్చు.స్వతంత్రంగా నిర్ణయాలుతొలినాళ్లలోనే బీమా పాలసీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మహిళలు ఆర్థిక ప్రణాళికల విషయంలో క్రియాశీలకంగా వ్యవహరించాలి. చిన్న వయస్సులోనే బీమా తీసుకోవడం వల్ల ప్రీమియంల భారం తక్కువగా ఉంటుంది. అలాగే ప్రీ–ఎగ్జిస్టింగ్ కండీషన్స్‌కి సంబంధించిన ఎక్స్‌క్లూజన్స్ కూడా తగ్గుతాయి. యుక్తవయస్సులోని చాలా యువతులకు తమ తల్లిదండ్రుల హెల్త్ ఇన్సూరెన్స్‌తో కవరేజీ లభిస్తుంది. అయితే, స్వతంత్ర పాలసీకి మారడం వల్ల, డిపెండెంట్ కవరేజీ వయో పరిమితిని దాటిన తర్వాత కూడా నిరంతరాయ కవరేజీ, అదనపు ప్రయోజనాలను పొందవచ్చు.ఇదీ చదవండి: ఈటీఎఫ్‌లు–ఇండెక్స్ ఫండ్స్ మధ్య వ్యత్యాసం?స్మార్ట్ ఆర్థిక ప్రణాళికఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ, 80డీ కింద జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీలకు పన్ను ప్రయోజనాలు ఉంటాయి. ఆ రకంగా చూస్తే ఇవి ఆర్థికంగా స్మార్ట్ పెట్టుబడి సాధనాలుగా కూడా ఉంటాయి. వీలైనంత ముందుగా ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టిన మహిళలకు తక్కువ ప్రీమియంలతో ఎక్కువ కవరేజీ, తద్వారా దీర్ఘకాలం పాటు ఆర్థిక భద్రత ప్రయోజనాలు లభిస్తాయి. మెటర్నిటీ కేర్, డెలివరీ, ఫెర్టిలిటీ చికిత్సలు సహా మహిళలకు సంబంధించిన ప్రత్యేకమైన ఆరోగ్యసంరక్షణ అవసరాలను తీర్చే విధంగా బీమా పాలసీలు ఉంటాయి. మూడేళ్ల పాటు లైఫ్ కవరేజీ సహా సరోగేట్ తల్లులకు పూర్తి కవరేజీ ఉండాలని బీమా రంగ నియంత్రణ మరియు అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) నిర్దేశిస్తోంది.-అమితాబ్ జైన్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్

మీ బ్యాంక్ డిపాజిట్ ఎంత భద్రం?
ముంబైకి చెందిన ధన్‌రాజ్ (50) ఉదయం నిద్రలేచి, పేపర్ చూడగానే ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యాడు. న్యూ ఇండియా సహకార బ్యాంక్‌లో స్కామ్ జరిగిందనేది ఆ వార్త సారాంశం. చిరుద్యోగి అయిన ధన్‌రాజ్ తన కుమార్తె వివాహం కోసమని రూ.4 లక్షలను అదే బ్యాంక్‌లో కొన్నాళ్ల క్రితం డిపాజిట్ చేశాడు. కంగారుగా బ్యాంక్ శాఖకు చేరుకుని విచారించగా, డిపాజిట్లకు ఢోకా లేదన్న సమాచారం విని కాస్తంత కుదుటపడ్డాడు. రూ.5 లక్షల వరకు డిపాజిట్లపై బీమా సదుపాయం ఉంటుందని కస్టమర్లు చెప్పుకుంటుండగా విని.. హమ్మయ్య అని ఊపిరిపీల్చుకున్నాడు. బ్యాంక్ డిపాజిట్.. దేశంలో చాలా మందికి తెలిసిన, ఇష్టమైన పెట్టుబడి సాధనం. చాలా మంది తమ పొదుపు సొమ్మును డిపాజిట్ రూపంలో మదుపు చేయడం కూడా చూస్తుంటాం. కానీ, ఇందులో ఉండే రిస్క్ ల గురించి అవగాహన ఉండదు. డిపాజిటర్లు అందరూ దీనిపై ఓసారి దృష్టి సారించాల్సిన అవసరాన్ని న్యూ ఇండియా కో ఆపరేటివ్ బ్యాంక్ ఉదంతం గుర్తు చేస్తోంది. ఒకప్పుడు ప్రతి కుటుంబ ఆర్థిక సాధనాల్లో బ్యాంక్ డిపాజట్ (ఎఫ్డీ) తప్పకుండా ఉండేది. కాలక్రమంలో ఇతర సాధనాల పట్ల ఆసక్తి పెరుగుతూ వస్తోంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ ఈటీఎఫ్‌లు తదితర వాటిల్లో పెట్టుబడులు పెరుగుతూ, డిపాజిట్లు తగ్గుతున్నాయి. ఇప్పటికీ 15 శాతం గృహ పొదుపులు బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లలోకే (ఎఫ్డీలు/టర్మ్ డిపాజిట్లు) వెళుతున్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఎఫ్డీలు ఎంతో మందికి నమ్మకమైన, మెరుగైన సాధనం. దీర్ఘకాలంలో గొప్ప రాబడి రాకపోయినా సరే, అత్యవసరంలో వేగంగా వెనక్కి తీసుకునేందుకు అనుకూలంగా ఉండడం చాలా మందికి నచ్చే అంశం. పైగా డిపాజిట్ అంటే ఏ మాత్రం రిస్క్ ఉండదని చాలా మంది అభిప్రాయపడుతుంటారు. ప్రభుత్వ గ్యారంటీ (సావరీన్) ఉంటే తప్పించి, బ్యాంక్ ఎఫ్డీ అయినా, ఏ ఇతర పెట్టుబడి సాధనంలో అయినా ఎంతో కొంత రిస్క్ ఉంటుంది. దీనిపట్ల ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరం. మెరుగైన నియంత్రణలు ఎఫ్డీ ఎంతో ప్రాచుర్యానికి నోచుకోవడం వెనుక అందులోని సరళత్వం, భద్రత కీలకమని చెప్పుకోవాలి. ఏవో కొన్ని బ్యాంకు వైఫల్యాలను పక్కన పెడితే, మన దేశంలో బ్యాంకింగ్ రంగం పటిష్ట నియంత్రణల మధ్య కొనసాగుతుంటుంది. ప్రజల్లో నమ్మకం ఏర్పడడానికి ఇది కూడా ఒక కారణం. బ్యాంక్ యాజమన్యాలు/ఉద్యోగుల మోసపూరిత వ్యవహారం, రుణ వ్యాపారంలో దూకుడైన తీరు కొన్ని సందర్భాల్లో సమస్యలు, సంక్షోభాలకు దారితీయవచ్చు. ఎంత కట్టుదిట్టమైన నియంత్రణలు ఉన్నా కానీ, 2019లో పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంక్, 2020లో యస్ బ్యాంక్, ఇప్పుడు న్యూ ఇండియా కోపరేటివ్ బ్యాంక్ సంక్షోభాలు చోటుచేసుకున్నాయి. అంతకుముందు గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ కరాడ్ ఉదంతాలూ గుర్తుండే ఉంటాయి. కనుక బ్యాంక్ డిపాజిట్లలోనూ రిస్క్ ఉంటుందని అర్థం చేసుకోవాలి. కాకపోతే మనదగ్గర ఆర్బీఐ పటిష్ట నియంత్రణల కారణంగా ఈ తరహా సంక్షోభాలు చాలా తక్కువగా కనిపిస్తుంటాయి.డిపాజిట్‌పై బీమా ఆర్బీఐ నియంత్రణ పరిధిలోని అన్ని బ్యాంకుల్లోనూ రూ.5 లక్షల వరకు డిపాజిట్‌కు బీమా రక్షణ ఉంటుంది. అసలు లేదా అసలుతోపాటు వడ్డీ కలుపుకుని రూ.5 లక్షలకు మించి ఉన్నప్పటికీ బీమా రూ.5 లక్షలకే పరిమితం. బ్యాంక్ ఏదైనా సంక్షోభం పాలైతే అప్పుడు ఒక్కో డిపాజిట్ దారుడికి గరిష్టంగా రూ.5 లక్షలు వెనక్కి వస్తాయి. సేవింగ్స్, ఫిక్స్‌డ్, కరెంట్, రికరింగ్ ఇలా అన్ని డిపాజిట్లకూ ఈ రక్షణ వర్తిస్తుంది. ఈ వ్యవహారం అంతా చూసేది ఆర్బీఐ అనుబంధ సంస్థ అయిన ‘డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’ (డీఐసీజీసీ). ప్రతి రూ.100 డిపాజిట్‌పై రూ.12 పైసలు చొప్పున ప్రీమియం కింద బ్యాంక్‌లు డీఐసీజీసీకి చెల్లించాల్సి ఉంటుంది. ఒక బ్యాంక్‌కు చెందిన ఒకటికి మించిన శాఖలో డిపాజిట్లు ఉన్నప్పటికీ.. ఒక్కో ఖాతాదారుని పేరు మీద గరిష్ట బీమా రూ.5 లక్షలుగానే ఉంటుంది. కనుక ఒక బ్యాంక్‌లో రూ.5 లక్షలకు మించి చేసే డిపాజిట్‌పై కచ్చితంగా రిస్క్ ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఒక వ్యక్తి వేర్వేరు బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తే.. అప్పుడు విడిగా ఒక్కో బ్యాంక్ పరిధిలో సంబంధిత వ్యక్తికి గరిష్టంగా రూ.5 లక్షల డిపాజిట్‌కు బీమా రక్షణ వర్తిస్తుంది.బ్యాంక్ కుదుటపడితే.. బ్యాంకులో మోసం కావచ్చు. లేదా లిక్విడిటీ సంక్షోభం తలెత్తవచ్చు. రుణ ఎగవేతలతో క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్లిపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఆర్బీఐ తప్పకుండా జోక్యం చేసుకుంటుంది. తాత్కాలిక నిర్వహణ బాధ్యతల కోసం బోర్డ్‌ను ఏర్పాటు చేస్తుంది. బ్యాంక్ వ్యవహారాలను లోతుగా పరిశీలించి, చక్కదిద్దే వరకు డిపాజిట్ల ఉపసంహరణపై పూర్తిగా లేదా పాక్షికంగా ఆంక్షలు విధిస్తుంది. పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంక్‌లో రుణ అవకతవకలు సంక్షోభానికి దారితీయగా, ఆర్బీఐ దాన్ని చక్కదిద్దింది. అది ఇప్పుడు యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో భాగం అయింది. యస్ బ్యాంక్‌లోనూ రుణ మోసాలు బయటపడగా, కొత్త బోర్డ్‌ను ఏర్పాటు చేసి గాడిన పెట్టింది. రూ.5 లక్షలకు పైగా డిపాజిట్లు కలిగిన వారు.., రూ.5 లక్షలకు పైబడిన మొత్తాన్ని తిరిగి పొందడం కోసం బ్యాంక్ గాడిన పడే వరకు వేచి చూడాల్సిందే. అప్పటికీ పూర్తి మొత్తం వెనక్కి వస్తుందన్న గ్యారంటీ ఉండదు. ఎంత కోత పడుతుందన్నది బ్యాంక్ ఆర్థిక పద్దుల ఆరోగ్యంపైనే ఆధారపడి ఉంటుంది.బ్యాంకు నుంచే చెల్లింపులు బ్యాంక్‌లో సమస్య తలెత్తినప్పుడు డిపాజిట్‌దారులు డీఐసీజీసీని సంప్రదించాల్సిన అవసరం ఉండదు. బ్యాంక్ నిర్వహణ బాధ్యతలు చూసే బోర్డ్.. డిపాజిట్‌దారుల వివరాలతో జాబితాను డీఐసీజీసీకి పంపిస్తుంది. ఆ వివరాల వాస్తవికతను 30 రోజుల్లోపు డీఐసీజీసీ తేల్చాలి. అక్కడి నుంచి 15 రోజుల్లోపు డిపాజిట్‌దారులకు చెల్లించాల్సిన బీమా మొత్తాన్ని బ్యాంక్‌కు డీఐసీజీసీ బదిలీ చేస్తుంది. అప్పుడు ఖాతాదారులకు బ్యాంక్ సిబ్బంది చెల్లింపులు చేస్తారు. బ్యాంక్‌పై ఆంక్షలు విధించిన నాటి నుంచి 90 రోజుల్లో డిపాజిట్‌దారులకు బీమా మొత్తం వెనక్కి చెల్లించాలని నిబంధనలు చెబుతున్నాయి. విచారించుకున్న తర్వాతే.. ఆర్బీఐ పరిధిలోని అన్ని బ్యాంక్‌లు తప్పనిసరిగా డీఐసీజీసీ పరిధిలోకి వస్తాయి. అవి డిపాజిట్లపై బీమా ప్రీమియం కచ్చితంగా చెల్లించాల్సిందే. సందేహం ఉంటే డిపాజిట్ చేసే ముందు బ్యాంక్ అధికారిని అడిగి బీమా ఉందా? అని నిర్ధారించుకోవచ్చు. అన్ని ప్రభుత్వరంగ బ్యాంక్‌లు, ప్రైవేటు షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంక్‌లు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లు, భారత్‌లో కార్యకలాపాలు నిర్వహించే విదేశీ బ్యాంక్‌లు, కో ఆపరేటివ్ బ్యాంక్‌లు, లోకల్ ఏరియా బ్యాంక్‌లు, రీజినల్ రూరల్ బ్యాంక్‌లు, పేమెంట్స్ బ్యాంక్‌లు, స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్‌లు, అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్‌లు డీఐసీజీసీ పరిధిలోకి వస్తాయి. ప్రైమరీ కో ఆపరేటివ్ సొసైటీలు మాత్రం దీని కిందికి రావు.అధిక వడ్డీ రేట్లు.. అన్నీ చూసాకే ప్రభుత్వరంగ బ్యాంక్‌లు, ప్రైవేటు యూనివర్సల్ బ్యాంకులతో పోల్చితే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు డిపాజిట్లపై అధిక వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తుంటాయి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు రుణాలపై అధిక రేట్లను చార్జ్ చేస్తుంటాయి. కనుక అవి డిపాజిట్లను ఆకర్షించేందుకు ఎక్కువ రేట్లను ఇస్తుంటాయి. ఏ బ్యాంక్ అయినా సరే అధిక వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తుంటే, అందులో ఇన్వెస్ట్ చేసే ముందు ఈ రేషియోలను ఒక్కసారి పరిశీలించడం మంచిది. సీఆర్ఏఆర్: క్యాపిటల్ టు రిస్క్ అస్సెట్ రేషియో అని, దీన్నే క్యాపిటల్ అడెక్వెసీ రేషియో అని కూడా అంటారు. ప్రభుత్వరంగ బ్యాంక్‌లకు ఇది కనీసం 12 శాతంగా, ప్రైవేటు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్‌లకు 9 శాతం మేర ఉండాలి. అదే స్మాల్ ఫైనాన్స్‌బ్యాంక్‌లకు 15 శాతం ఉండాలి. బ్యాంక్ తనకు ఎదురయ్యే చెల్లింపుల బాధ్యతలను ఎంత సమర్థంగా ఎదుర్కోగలదన్నది ఇది తెలియజేస్తుంది. ఎల్‌సీఆర్: లిక్విడిటీ కవరేజీ రేషియో 100 శాతం ఉండాలి. 30 రోజుల అవసరాలకు సరిపడా నిధులు బ్యాంకుల వద్ద ఉంచడం కోసం ఈ నిబంధన. దీనివల్ల లిక్విడిటీ షాక్‌లను బ్యాంక్‌లు సమర్థంగా ఎదుర్కోగలవు. అసలు రాబడి ఎంత? అత్యవసర నిధిని అట్టి పెట్టుకునేందుకు, స్వల్పకాలిక అవసరాలకు ఉద్దేశించిన నిధులను బ్యాంక్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేసుకుంటానంటే ఫర్వాలేదు. కానీ, దీర్ఘకాల లక్ష్యాల కోసం నిధిని సమకూర్చుకునేందుకు, సంపద సృష్టికి బ్యాంక్ డిపాజిట్ మెరుగైన సాధనం కాబోదు. ఈక్విటీలపై దీర్ఘకాలంలో 12 శాతం, బంగారంలో 8 శాతం మేర సగటు రాబడి ఉంటోంది. ఈక్విటీ, బంగారంలో పెట్టుబడిని విక్రయించినప్పుడే లాభాలపై పన్ను చెల్లిస్తే సరిపోతుంది. బ్యాంక్ డిపాజిట్లపై అలా కాదు. ప్రతి ఏటా ఆర్జించే వడ్డీ రాబడి అదే ఏడాది ఇన్వెస్టర్ వార్షిక ఆదాయానికి కలిపి చూపించాలి. అవసరమైతే పన్ను చెల్లించాలి. ఎఫ్డీ రాబడిపై పన్ను చెల్లించగా, మిగిలే నికర రాబడి ద్రవ్యోల్బణ స్థాయిలోనే ఉంటుంది. కనుక డిపాజిట్లలో కాంపౌండింగ్ ప్రయోజనం పెద్దగా ఉండదు.బీమా మరింత పెంచేనా..? 2019లో పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంక్‌లో సంక్షోభం తలెత్తిన తర్వాతే.. డిపాజిట్లపై రూ.లక్షగా ఉన్న బీమా పరిమితిని 2020 ఫిబ్రవరిలో రూ.5 లక్షలకు పెంచారు. ఈ బీమా రక్షణను మరింత పెంచాలన్న ప్రతిపాదన పరిశీలనలో ఉందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఎం.నాగరాజు ఇటీవల చేసిన ప్రకటన ఈ దిశగా డిపాజిటర్లలో అంచనాలను పెంచింది. ఇప్పటికిప్పుడు దీన్ని పెంచకపోయినా, భవిష్యత్తులో ఇందుకు తప్పక అవకాశం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఎన్‌బీఎఫ్‌సీ డిపాజిట్ల సంగతేంటి? బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ తదితర డిపాజిట్లు స్వీకరించే ఆర్బీఐ అనుమతి కలిగిన ఎన్బీఎఫ్సీలు (ఎన్‌బీఎఫ్‌సీ–డీ) దేశంలో 25 ఉన్నాయి. వీటి పరిధిలో 2024 మార్చి నాటికి రూ.1,02,994 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. మరి ఉన్నట్టుండి వీటిల్లో ఏదైనా ఎన్బీఎఫ్సీకి నిధుల సమస్య తలెత్తితే పరిస్థితి ఏంటి? బ్యాంకుల్లో మాదిరి వీటిల్లో డిపాజిట్లకు డీఐసీజీసీ కింద ఎలాంటి బీమా రక్షణ లేదు. ఇవన్నీ ప్రజల డిపాజిట్లే కనుక వీటిని సైతం డీఐసీజీసీ కిందకు తీసుకురావాలన్న డిమాండ్లు ఉన్నాయి. వీటిల్లో డిపాజిట్ చేసే ముందు ఇన్వెస్టర్లు రిస్క్ లను అర్థం చేసుకోవాలి. బ్యాంకులకూ రేటింగ్ ఉండాలి.. ఎన్బీఎఫ్సీలు తమ నిధుల అవసరాల కోసం బాండ్లు, ఎన్సీడీలను జారీ చేస్తుంటాయి. సంబంధిత ఎన్‌బీఎఫ్‌సీ ఆర్థిక ఆరోగ్యం ఆధారంగా రేటింగ్ ఏజెన్సీలు క్రెడిట్ రేటింగ్‌ను ప్రకటిస్తాయి. నిబంధనల ప్రకారం రేటింగ్ తప్పనిసరి. బ్యాంక్‌లు సైతం బాండ్లను జారీ చేయాలంటే రేటింగ్ తీసుకోవాల్సిందే. కానీ బ్యాంక్ డిపాజిట్లకు వచ్చే సరికి ఈ తరహా రేటింగ్ విధానం లేకపోవడాన్ని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. బ్యాంక్ డిపాజిట్లకు సైతం రేటింగ్‌ను తప్పనిసరి చేయడం వల్ల పాలన మెరుగుపడుతుందని ఎన్ఎస్జీ అండ్ పార్ట్నర్స్ పార్ట్నర్ రవి భడానీ అభిప్రాయపడ్డారు. దీనివల్ల డిపాజిట్ చేసే సమయంలో ఆయా బ్యాంక్‌లకు సంబంధించి రిస్క్ ను ఇన్వెస్టర్లు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అలా చేస్తే అప్పుడు బలహీన బ్యాంక్‌ల నుంచి అధిక రేటింగ్ ఉన్న బ్యాంకుల్లోకి డిపాజిట్లు తరలిపోయే రిస్క్ ఏర్పడుతుందని ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ డైరెక్టర్ సతీష్ మరాటే పేర్కొన్నారు. దీనికి బదులు మెరుగైన రేటింగ్ ఉన్న బ్యాంకులకు డిపాజిట్లపై బీమా ప్రీమియం తక్కువ వసూలు చేసే విధానం ఫలితమిస్తుందన్నారు. – సాక్షి, బిజినెస్ డెస్క్

క్రెడిట్ కార్డు రూల్స్‌లో కీలక మార్పులు
ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్‌బీఐ, ప్రయివేట్ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకులు తమ క్రెడిట్ కార్డు పాలసీల్లో కీలక మార్పులు చేస్తున్నాయి. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ మైల్స్టోన్ టికెట్ వోచర్లతో సహా అనేక ప్రయోజనాలను నిలిపివేయనుండగా, ఎస్‌బీఐ తన క్లబ్ విస్తారా ఎస్‌బీఐ, క్లబ్ విస్తారా ఎస్‌బీఐ ప్రైమ్ క్రెడిట్ కార్డుల నిబంధనలను సవరించింది. 2025 ఏప్రిల్ 1 నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి.ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డు మార్పులుఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ 2025 మార్చి 31 నుండి మైల్స్టోన్ టికెట్ వోచర్లు, పునరుద్ధరణ ప్రయోజనాలు, ఇతర ఫీచర్లను అందించడాన్ని నిలిపివేయనుంది. అయితే 2026 మార్చి 31 వరకు మహారాజా పాయింట్లు కొనసాగుతాయి. ఆ తర్వాత కార్డు పూర్తిగా నిలిచిపోతుంది. బ్యాంక్ ప్రకటన ప్రకారం కీలక మార్పులు ఇవే..క్లబ్ విస్తారా సిల్వర్ మెంబర్ షిప్ ఇకపై అందుబాటులో ఉండదు.వన్ ప్రీమియం ఎకానమీ టికెట్, వన్ క్లాస్ అప్ గ్రేడ్ వోచర్ తో సహా కాంప్లిమెంటరీ వోచర్లు నిలిచిపోతాయి.ప్రీమియం ఎకానమీ టికెట్లకు మైల్ స్టోన్ వోచర్లు ఇకపై జారీ కావు.2025 మార్చి 31 తర్వాత కార్డులను రెన్యువల్ చేసుకునే కస్టమర్ల వార్షిక రుసుమును ఏడాది పాటు రద్దు చేస్తారు.ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు పాలసీల్లో మార్పులుక్లబ్ విస్తారా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుదారులకు ఎకానమీ టికెట్ వోచర్లు ఇకపై ఉండవు.రూ.1.25 లక్షలు, రూ.2.5 లక్షలు, రూ.5 లక్షల వార్షిక ఖర్చులకు మైల్ స్టోన్ బెనిఫిట్స్ నిలిపివేయనున్నారు.క్లబ్ విస్తారా ఎస్‌బీఐ ప్రైమ్ క్రెడిట్ కార్డు ఇకపై ప్రీమియం ఎకానమీ టికెట్ వోచర్లను అందించదు.బేస్ కార్డు రెన్యువల్ ఫీజు రూ.1,499, పీఎం కార్డు రెన్యువల్ ఫీజు రూ.2,999.వినియోగదారులకు ఫీజు మాఫీకి ఇంకా అవకాశం ఉంటుంది.మార్పుల వెనుక కారణంగత ఏడాది నవంబర్‌లో విస్తారా-ఎయిరిండియా విలీనం తర్వాత ఈ మార్పులు జరిగాయి. ఇది ఎయిరిండియా మహారాజా క్లబ్ లాయల్టీ కార్యక్రమంలో సర్దుబాట్లకు దారితీసింది. ఎస్‌బీఐ, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ తమ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలను సవరించగా, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ ఇంకా ఎటువంటి మార్పులను ప్రకటించలేదు.

క్రిప్టో మార్కెట్ వైపు అతివల అడుగులు: కారణం ఇదే..
క్రిప్టో కరెన్సీ విలువ రోజురోజుకి వృద్ధి చెందుతున్న తరుణంలో.. చాలామంది చూపు దీనిపై పడింది. అయితే క్రిప్టో కరెన్సీలో పెట్టుబడిపెడుతున్న వారిలో పురుషులే అధికంగా ఉన్నప్పటికీ.. స్త్రీల సంఖ్య కూడా కొంత పెరిగిందని, దేశంలోని ప్రముఖ క్రిప్టో ఎక్స్ఛేంజ్ 'జియోటస్' వెల్లడించింది.మహిళా పెట్టుబడిదారులు భారత క్రిప్టో మార్కెట్లోకి మునుపటి కంటే ఎక్కువగా ప్రవేశిస్తున్నారు. ఈ సంఖ్య 20 శాతం పెరిగిందని జియోటస్ స్పష్టం చేసింది. మహిళా పెట్టుబడిదారులు దీర్ఘకాలిక పెట్టుబడులలో మాత్రమే కాకుండా.. బిట్‌కాయిన్, ఎథెరియం వంటి వాటిలోకి ప్రవేశిస్తున్నారు.మహిళలు క్రిప్టో కరెన్సీవైపు ఎక్కువ ఆసక్తి చూపించడానికి ప్రధాన కారణం.. చదువుకున్న వారికి డిజిటల్ అవగాహన, పెట్టుబడికి సంబంధించిన అవగాహన పెరగడం అని తెలుస్తోంది. యువత ఎక్కువగా క్రిప్టోలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్నట్లు ఆర్ధిక నిపుణులు కూడా చెబుతున్నారు.ఇదీ చదవండి: శివ్ నాడార్ కీలక నిర్ణయం.. కుమార్తెకు భారీ గిఫ్ట్ఇప్పుడు పెద్ద పెద్ద పట్టణాల్లో ఉన్న మహిళలు మాత్రమే కాకుండా. టైర్ 2, టైర్ 3 నగరాల్లోని మహిళలు కూడా వివిధ రంగాలలో పెట్టుబడులు పెడుతున్నారు. ఇందులో క్రిప్టో కరెన్సీ కూడా ఉంది. రాబోయే రోజుల్లో మహిళా పెట్టుబడిదారుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉందని జియోటస్ అంచనా వేస్తోంది.
రియల్టీ
Business exchange section
Currency Conversion Rate
Commodities
Name | Rate | Change | Change% |
---|---|---|---|
Silver 1 Kg | 108000.00 | 100.00 | 0.00 |
Gold 22K 10gm | 80500.00 | 100.00 | 0.01 |
Gold 24k 10 gm | 87820.00 | 110.00 | 0.01 |
Egg & Chicken Price
Title | Price | Quantity |
---|---|---|
Chicken (1 Kg skin less) | 140.00 | 1.00 |
Eggs | 60.00 | 12.00 |