Automobile
-
ఒకే వాహనం.. 14 కెమెరాలు, 9 రాడార్లు, 6 సెన్సార్లు
ప్రపంచం ఆటోమేషన్ వైపు వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రధానంగా ఆటోమోటివ్ విభాగంలో ఈ ఆటోమేషన్ పాత్ర కీలకంగా మారింది. ప్రస్తుతం స్వయంచాలిత డ్రైవింగ్‌కు ఆదరణ పెరుగుతోంది. దాంతో చాలా కంపెనీలు ఈ మేరకు కొత్త సాంకేతికతను వినియోగిస్తూ వాటిని పరీక్షిస్తున్నాయి. అందులో భాగంగా సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల విభాగంలో జపాన్ ఆటోమోటివ్ దిగ్గజం నిస్సాన్ సంస్థ దూసుకుపోతోంది. ఇటీవల జపాన్‌లోని యోకోహమాలోని రద్దీగా ఉన్న వీధుల్లో అత్యాధునిక అటానమస్ వ్యవస్థ కలిగిన సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను పరీక్షించింది.అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన సెరెనా మినీవ్యాన్‌ను యోకోహమా వీధుల్లో పరుగు పెట్టించింది. ఈ వాహనంలో 14 కెమెరాలు, 9 రాడార్లు, 6 లైడార్ సెన్సార్లను వాడారు. ఇవి అధిక రద్దీ ఉంటే రోడ్లపై సులువుగా ప్రయాణించేందుకు దోహదం చేస్తాయని నిర్వాహకులు తెలిపారు. మెరుగైన అటానమస్ వ్యవస్థ ఉండడంతో స్వయంగా వేగ పరిమితులను నిర్ధారించుకుంటుందని చెప్పారు. ట్రాఫిక్‌ను, అడ్డంకులను తప్పించుకుంటు ముందుకు సాగుతాయని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఒకేరోజు 27 శాతం కుప్పకూలిన బ్యాంకు స్టాక్..జపాన్‌లో వృద్ధుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ కార్లు భవిష్యత్తులో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. రానున్న రోజుల్లో డ్రైవర్ల కొరత అధికమవుతుందని, అలాంటి వారికి కంపెనీ చేస్తున్న ఇలాంటి ఆవిష్కరణలు ఎంతో దోహదం చేస్తాయని చెప్పారు. సెరెనా ప్రస్తుతం లెవల్ 2 స్వయంప్రతిపత్తితో(అటానమీ వ్యవస్థ-పాక్షికంగా ఆపరేట్ చేయడానికి మానవుల అవసరం ఉండడం) పనిచేస్తుండగా.. 2029 నాటికి లెవల్ 4 స్వయంప్రతిపత్తి(మానవ ప్రయేయంలేని)ని సాధించాలని నిస్సాన్ లక్ష్యంగా పెట్టుకుంది. -
మూడేళ్ళలో.. రెండు లక్షల మంది కొన్న కారు ఇది
అతి తక్కువ కాలంలోనే అధిక ప్రజాదరణ పొందిన కియా కారెన్స్ (Kia Carens) అమ్మకాల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది. దాని విభాగంలో అత్యంత వేగంగా అమ్ముడవుతున్న వాహనాలలో ఒకటిగా అవతరించిన ఈ కారు.. ప్రీమియం ఫీచర్స్, కొత్త డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది.కియా ఇండియా.. కారెన్స్ కారును లాంచ్ చేసినప్పటి నుంచి, అంటే 36 నెలల్లో ఏకంగా 2,00,000 అమ్మకాల మైలురాయిని దాటేసింది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. దేశీయ మార్కెట్లో మాత్రమే కాకుండా.. కంపెనీ 70 కంటే ఎక్కువ దేశాల్లో 24064 యూనిట్ల కారెన్స్ కార్లను విక్రయించిందని స్పష్టం చేసింది.మొత్తం అమ్మకాలలో కారెన్స్ పెట్రోల్ వేరియంట్లు 58 శాతం వాటాను కలిగి ఉండగా, 42 శాతం కస్టమర్లు డీజిల్ వెర్షన్‌ను ఎంచుకున్నారు. 32% కొనుగోలుదారులు ఆటోమేటిక్, iMT ట్రాన్స్మిషన్లను ఎంచుకుంటున్నారు. 28 శాతం మంది కస్టమర్లు సన్‌రూఫ్‌తో కూడిన వేరియంట్లను ఎంచుకున్నారు.ఇదీ చదవండి: 48 గంటల్లో 20000 బుకింగ్స్.. మొదటి 50వేల మందికి..కియా కారెన్స్ ధరలు ఇండియన్ మార్కెట్లో రూ. 12.92 లక్షల నుంచి రూ. 19.95 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ఈ కారు మల్టిపుల్ వేరియంట్లలో, వివిధ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. కాబట్టి ఎక్కువమంది దీనిని కొనుగోలు చేయడానికి ఎగబడుతుంటారు.నెలవారీ (ఫిబ్రవరి) అమ్మకాల్లో సోనెట్ (7,598 యూనిట్లు), సెల్టోస్ (6,446 యూనిట్లు) మంచి వృద్ధిని సాధించాయి. కారెన్స్ గత నెలలో 5318 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. కంపెనీ మొత్తం సేల్స్.. 2024 ఫిబ్రవరి కంటే 23.8 శాతం ఎక్కువ. దీన్నిబట్టి చూస్తుంటే.. కియా కార్లకు ఇండియన్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని స్పష్టమవుతోంది. -
48 గంటల్లో 20000 బుకింగ్స్
మార్చి 5న అల్ట్రావయొలెట్ కంపెనీ తన టెస్సెరాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. సంస్థ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించిన 48 గంటల్లో రికార్డ్ స్థాయిలో బుకింగ్స్ స్వీకరించింది.అల్ట్రావయొలెట్ టెస్సెరాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ 48 గంటల్లో 20,000 కంటే ఎక్కువ ప్రీ-బుకింగ్‌లను పొందింది. ఈ విషయాన్ని సంస్థ అధికారికంగా ప్రకటించింది. అయితే ప్రారంభ పరిచయ ధరను (రూ. 1.20 లక్షలు) 10000 నుంచి 50000 యూనిట్లకు పెంచింది. అంటే మొదటి 50వేలమందికి మాత్రమే ఆ ధర వర్తిస్తుంది. ఆ తరువాత దీని ధర రూ. 1.45 లక్షలకు (ఎక్స్ షోరూమ్) చేరుకుంటుంది.అల్ట్రావయొలెట్ టెస్సెరాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు 2026 మొదటి త్రైమాసికంలో ప్రారంభమవుతాయి. దీనిని రూ. 999 కు ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు. ఇది ఒక ఫుల్ ఛార్జితో 261 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది. కేవలం 100 రూపాయలతో రెండుసార్లు ఛార్జ్ చేయడం ద్వారా 500 కిలోమీటర్ల పరిధిని సాధించగలదని అల్ట్రావయోలెట్ పేర్కొంది.ఇదీ చదవండి: ఎక్కువమంది కొంటున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదంటే?టెస్సెరాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఆన్‌బోర్డ్ నావిగేషన్‌తో కూడిన 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, రెండు డాష్‌క్యామ్‌లు (ముందు, వెనుక), వైర్లెస్ ఛార్జింగ్, హ్యాండిల్‌బార్ కోసం హాప్టిక్ ఫీడ్‌బ్యాక్, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, డ్యూయల్ డిస్క్‌లు, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటివి పొందుతుంది.టెస్సెరాక్ట్ అనేది రాడార్ బేస్డ్ ADAS టెక్నాలజీతో కూడిన భారతదేశపు మొట్టమొదటి స్కూటర్. ఇది బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, ఓవర్టేక్ అలర్ట్, కొలిజన్ అలర్ట్, లేన్ చేంజ్ అసిస్ట్ వంటి ఫీచర్స్ పొందుతుంది. ఈ స్కూటర్ ఫ్లోటింగ్ డీఆర్ఎల్, ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్‌లతో కూడిన డ్యూయల్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ ల్యాంప్ పొందుతుంది. దీని అండర్ సీట్ స్టోరేజ్ 34 లీటర్లు. -
దేశీయ విఫణిలో వోల్వో ఎక్స్‌సీ90 ఫేస్‌లిఫ్ట్ లాంచ్: పూర్తి వివరాలు
వోల్వో ఎక్స్‌సీ90 (Volvo XC90) ఫేస్‌లిఫ్ట్ భారతదేశంలో రూ. 1.02 కోట్ల (ఎక్స్-షోరూమ్) ధరతో లాంచ్ అయింది. ఇది దాని మునుపటి మోడల్ కంటే ఎక్కువ అప్డేట్స్ పొందింది. అయితే ఇది కేవలం ఒక వేరియంట్లో.. పెట్రోల్ పవర్‌తో మాత్రమే లభిస్తుంది. డెలివరీలు ఈ నెలలోనే ప్రారంభమవుతాయి.కొత్త వోల్వో ఎక్స్‌సీ90 ఫేస్‌లిఫ్ట్.. ఆరు రంగులలో, కొత్త అల్లాయ్ వీల్స్ పొందుతుంది. 11.3 ఇంచెస్ పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇందులో ఉంది. మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, డ్రైవర్ అసిస్ట్ సిస్టమ్స్, పవర్డ్ సీట్లు, పవర్డ్ టెయిల్ గేట్, ఫుల్ ఎల్ఈడీ లైటింగ్ వంటి ఫీచర్స్ కూడా పొందుతుంది.వోల్వో XC90 ఫేస్‌లిఫ్ట్ 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ద్వారా.. 250 Bhp పవర్, 360 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 48వీ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ కూడా పొందుతుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికను పొందుతుంది. ఇది కేవలం 7.7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ కారు ఆడి క్యూ7, బీఎండబ్ల్యూ ఎక్స్5, మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ, జీప్ గ్రాండ్ చెరోకీ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.ఇదీ చదవండి: అందరికీ గూగుల్ జాబే కావాలి.. ఎందుకో వీడియో చూసేయండి -
భారత్‌లో ఖరీదైన స్కూటర్ లాంచ్: రేటు ఎంతంటే?
బీఎండబ్ల్యూ మోటొరాడ్ (BMW Motorrad) ఇండియన్ మార్కెట్లో.. 'సీ 400 జీటీ' స్కూటర్ లేటెస్ట్ వెర్షన్ లాంచ్ చేసింది. రూ. 11.50 లక్షల (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధర వద్ద లభించే ఈ స్కూటర్, దాని మునుపటి మోడల్ కంటే అప్డేట్స్ పొందుతుంది. కాబట్టి దీని ధర స్టాండర్డ్ మోడల్ కంటే రూ. 25000 ఎక్కువ. దీంతో ఇండియన్ మార్కెట్లో లభిస్తున్న స్కూటర్లలో ఇది ఒకటిగా చేరింది.బీఎండబ్ల్యూ సీ 400 జీటీ స్కూటర్.. సాధారణ ప్రయాణానికి మాత్రమే కాకుండా, దూర ప్రయాణాలకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇందులోని 350 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 7500 rpm వద్ద 34 Bhp పవర్, 5750 rpm వద్ద 35 Nm టార్క్ అందిస్తుంది. ఈ స్కూటర్ లీన్-సెన్సిటివ్ బ్రేకింగ్ అసిస్ట్, డైనమిక్ బ్రేక్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్‌తో కూడిన ఏబీఎస్ వంటి రైడర్ అసిస్ట్ ఫీచర్లను పొందుతుంది.సీ 400 జీటీ స్కూటర్.. పెద్ద విండ్‌షీల్డ్ పొందుతుంది. ఇది బ్లాక్‌స్టార్మ్ మెటాలిక్, డైమండ్ వైట్ మెటాలిక్ పెయింట్ స్కీమ్‌లలో లభిస్తుంది. ఇందులో 10.25 ఇంచెస్ TFT డిస్ప్లే ఉంది. ఇది హై రిజల్యూషన్ ఇంటర్ఫేస్తో నావిగేషన్, మీడియా అండ్ స్మార్ట్‌ఫోన్ ఇంటిగ్రేషన్ వంటి వాటిని మెరుగుపరుస్తుంది. అండర్ సీట్ కంపార్ట్మెంట్ 37.6 లీటర్లు. కాబట్టి ఇది అన్ని విధాలా రైడర్లకు చాలా అనుకూలంగా ఉంటుంది. -
బెస్ట్ సీఎన్జీ కార్లు: ధర రూ.10 లక్షల కంటే తక్కువే..
పెట్రోల్ ధరలు పెరగడం, సీఎన్జీ రీఫ్యూయలింగ్ స్టేషన్లు అందుబాటులోకి రావడం అన్నీ జరుగుతున్నాయి. ఈ తరుణంలో చాలామంది పెట్రోల్ కార్ల స్థానంలో సీఎన్జీ కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ కథనంలో రూ. 10 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే ఉత్తమ సిఎన్జీ కార్లను గురించి తెలుసుకుందాం.మారుతి సుజుకి ఆల్టో కే10 సీఎన్జీప్రస్తుతం భారతదేశంలో అందుబాటులో ఉన్న అత్యంత సరసమైన సీఎన్జీ కార్లలో ఒకటి 'మారుతి సుజుకి ఆల్టో కే10'. ఎల్ఎక్స్ఐ (ఓ), వీఎక్స్ఐ (ఓ) వేరియంట్లలో అందుబాటులో ఉన్న ఈ కారు ధరలు రూ. 5.8 లక్షలు, రూ. 6.04 లక్షలు. ఇందులోని 998 సీసీ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 5300 rpm వద్ద 56 Bhp పవర్, 3400 rpm వద్ద 82.1 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ పొందుతుంది. ఈ కారు 33.85 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుందని సమాచారం.మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో సీఎన్జీఇది కూడా ఎల్ఎక్స్ఐ (ఓ), వీఎక్స్ఐ (ఓ) అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. దీని ధరలు వరుసగా రూ. 5.91 లక్షలు, రూ. 6.11 లక్షలు. ఈ కారులో 998 సీసీ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 56 Bhp పవర్, 82.1 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఇది 32.73 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుంది.టాటా టియాగో సీఎన్జీటాటా టియాగో సీఎన్జీ ధరలు రూ. 6 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. ఇందులో ట్విన్ సిలిండర్ CNG ట్యాంక్ ఉంటుంది. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులో ఉన్న అత్యంత సరసమైన సీఎన్జీ కారుగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ కారు ఐదు మాన్యువల్, మూడు ఆటోమాటిక్ వేరియంట్లలో లభిస్తుంది. మాన్యువల్ ధరలు రూ. 5.99 లక్షల నుంచి రూ. 8.19 లక్షల మధ్య ఉన్నాయి. ఆటోమాటిక్ ధరలు రూ. 7.84 లక్షల నుంచి రూ. 8.74 లక్షల మధ్య ఉన్నాయి.మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ సీఎన్‌జీమారుతి సుజుకి వ్యాగన్ ఆర్ సీఎన్జీ.. ఎల్ఎక్స్ఐ (ఓ), విఎక్స్ఐ (ఓ) అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 6.54 లక్షల నుంచి రూ. 6.99 లక్షల వరకు ఉంటాయి. ఇది 998 సీసీ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ ద్వారా 5300 ఆర్పీఎమ్ వద్ద 56 బిహెచ్పీ పవర్ఉ.. 3400 ఆర్పీఎమ్ వద్ద 82.1 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. దీని మైలేజ్ 33.47 కిమీ/కేజీ వరకు ఉంది.ఇదీ చదవండి: అమ్మకాల్లో టాప్ కంపెనీలు.. ఎక్కువమంది కొంటున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే!మారుతి సుజుకి సెలెరియో సీఎన్‌జీమారుతి సుజుకి సెలెరియో సీఎన్జీ.. భారతదేశంలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే సీఎన్జీ కార్లలో ఒకటి. దీని ధర రూ. 6.90 లక్షలు. ఇది 34 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుంది. ఈ కారులోని 998 సీసీ ఇంజిన్ 5300 rpm వద్ద, 55.92 Bhp పవర్ & 3400 rpm వద్ద 82.1 Nm టార్క్ అందిస్తుంది. -
ఓలా ఎలక్ట్రిక్.. 95% షోరూమ్‌లకు ట్రేడ్ సర్టిఫికేట్లు లేవు!
ఓలా ఎలక్ట్రిక్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కంపెనీకి చెందిన 95 శాతం షోరూమ్‌లకు ట్రేడ్ సర్టిఫికేట్లు లేవని బ్లూమ్‌బర్గ్ న్యూస్ వార్తలు ప్రచురించింది. అందులోని వివరాల ప్రకారం మొత్తం 4,000 షోరూమ్‌ల్లో 3,400లకు సంబంధించిన డేటా అందుబాటులో ఉండగా వాటిలో కేవలం 100 షోరూమ్‌లకు మాత్రమే భారత మోటారు వాహనాల చట్టం ప్రకారం ట్రేడ్ సర్టిఫికేట్లు ఉన్నట్లు గుర్తించారు. దీని అర్థం ఓలా ఎలక్ట్రిక్ 95 శాతం స్టోర్లలో నమోదుకాని ద్విచక్ర వాహనాలను ప్రదర్శించడానికి, విక్రయించడానికి, టెస్ట్ రైడ్లను అందించడానికి లేదా రవాణా చేయడానికి అవసరమైన ధృవీకరణ లేదు. ఈ సర్టిఫికేట్లు లేకపోవడం రెగ్యులేటరీ నిబంధనలకు కంపెనీ కట్టుబడి ఉందా అనే ప్రశ్నలు వస్తున్నాయి.2022 నుంచి ఓలా ఎలక్ట్రిక్ తన షోరూమ్‌లను విస్తరించడంలో గణనీయమైన పురోగతిని సాధించింది. డిజిటల్-ఓన్లీ సేల్స్ మోడల్(భౌతికంగా షోరూమ్ ఉండకుండా కేవలం డిజిటల్ ద్వారానే ఉత్పత్తులను విక్రయించడం) నుంచి బ్రిక్-అండ్-మోర్టార్(షోరూమ్‌లను ఏర్పాటు చేయడం) వంటి విధానానికి మారింది. ఈ మార్పువల్ల కస్టమర్ అనుభవాన్ని పెంచడం, సేవా సంబంధిత సమస్యలను పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దాంతో భారతదేశం అంతటా సుమారు 4,000 ప్రదేశాలకు విస్తరించింది.రెగ్యులేటరీ చర్యలుఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లోని రవాణా అధికారులు చర్యలు చేపట్టారు. సంబంధిత రాష్ట్రాల్లోని కంపెనీ షోరూమ్‌ల్లో దాడులు నిర్వహించి, వాటిని మూసివేసి, వాహనాలను సీజ్ చేసినట్లు బ్లూమ్‌బర్గ్ తెలిపింది. అదనంగా ఇప్పటికే ఓలా ఎలక్ట్రిక్ రాష్ట్ర స్థాయి రవాణా అధికారుల నుంచి షోకాజ్ నోటీసులను అందుకుంది.ఇదీ చదవండి: రూ.115-125 లక్షల కోట్ల రుణ సమీకరణ.. ఎందుకంటే..ఓలా ఎలక్ట్రిక్ స్పందన..ఓలా ఎలక్ట్రిక్ దర్యాప్తు ఫలితాలను ఖండించింది. కంపెనీ కార్యకలాపాలపై మార్కెట్లో వస్తున్న వార్తలు పూర్తిగా తప్పు అని, పక్షపాతంతోనే ఇలాంటి వార్తలను వైరల్ చేస్తున్నారని తేల్చి చెప్పింది. కంపెనీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, గోదాములు మోటారు వాహనాల చట్టం మార్గదర్శకాలకు అనుగుణంగానే ఉన్నాయని స్పష్టం చేసింది. అయితే షోరూమ్‌ల్లో అవసరమైన ట్రేడ్ సర్టిఫికేట్లు ఉన్నాయో లేదో మాత్రం నేరుగా ప్రస్తావించలేదు. -
ఎక్కువమంది కొంటున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే!
ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ కరంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది తక్కువ సమయంలో ఎక్కువ అమ్మకాలు కంపెనీల జాబితాలో బజాజ్ ఆటో అగ్రస్థానంలో నిలిచింది. ప్రభుత్వ వాహన్ పోర్టల్‌లో (మార్చి 1, ఉదయం 7 గంటల నాటికి) అందుబాటులో ఉన్న సేల్స్ డేటా ప్రకారం.. 21,335 యూనిట్ల రిటైల్ అమ్మకాలతో, 'బజాజ్ చేతక్' 81 శాతం బలమైన వృద్ధిని నమోదు చేసింది.ఏప్రిల్ 2024 నుంచి ఫిబ్రవరి 2025 మధ్య 10,18,300 ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‌లు, మోపెడ్ల మొత్తం రిటైల్ అమ్మకాలతో ఎలక్ట్రిక్ టూ వీలర్ విభాగం ఒక ఆర్ధిక సంవత్సరంలో మొదటిసారి.. 10 లక్షల యూనిట్ల అమ్మకాలను దాటేసింది. ఈ అమ్మకాలు అంతకుముందు ఆర్ధిక సంవత్సరం కంటే 7 శాతం ఎక్కువ. ఎక్కువ అమ్మకాలు పొందిన కంపెనీల జాబితాలో.. బజాజ్, టీవీఎస్, ఏథర్ ఎనర్జీ, మొదలైనవి ఉన్నాయి.ఎక్కువ అమ్మకాలు పొందిన కంపెనీలు➤బజాజ్ ఆటో: 21,335 యూనిట్లు➤టీవీఎస్ మోటార్ : 18,746 యూనిట్లు➤ఏథర్ ఎనర్జీ: 11,788 యూనిట్లు➤ఓలా ఎలక్ట్రిక్: 8,647 యూనిట్లు➤గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ: 3,700 యూనిట్లు➤విడా (హీరో మోటోకార్ప్): 2,677 యూనిట్లుఇదీ చదవండి: ఆ నగరం భారతదేశ బాహుబలి: ఆనంద్ మహీంద్రా -
వాహనాలకు డిమాండ్ డౌన్
న్యూఢిల్లీ: వాహనాలకు డిమాండ్ తగ్గిన నేపథ్యంలో ఫిబ్రవరిలో ప్యాసింజర్ వాహనాలు, టూ వీలర్లు సహా ఆటోమొబైల్ రిటైల్ అమ్మకాలు 7 శాతం క్షీణించినట్లు ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య ఫాడా వెల్లడించింది. గతేడాది ఫిబ్రవరిలో 20,46,328 వాహన విక్రయాలు నమోదు కాగా తాజాగా గత నెల 18,99,196 యూనిట్లకు తగ్గాయి. ప్యాసింజర్ వాహనాల రిటైల్ విక్రయాలు 10 శాతం క్షీణించి 3,03,398 యూనిట్లకు పరిమితమయ్యాయి. టూ వీలర్ల విక్రయాలు 6 శాతం క్షీణించి 14,44,674 నుంచి 13,53,280 యూనిట్లకు తగ్గాయి. వాణిజ్య వాహనాలు 9 శాతం క్షీణించి 82,763 యూనిట్లకు, ట్రాక్టర్ల విక్రయాలు 14 శాతం తగ్గి 65,574 యూనిట్లకు పడిపోయాయి. నిల్వలపరంగా సమతౌల్యత లేకపోవడం, ధరలపరంగా మార్పులు, వినియోగదారుల్లో బలహీన సెంటిమెంట్, ఎంక్వైరీలు తగ్గిపోవడం, రుణ లభ్యత పరిమిత స్థాయిలోనే ఉండటం తదితర అంశాలు అమ్మకాల క్షీణతకు కారణమైనట్లు ఫాడా పేర్కొంది. ఎంట్రీ లెవెల్ కేటగిరీలో మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగా ఉండటం, కొనుక్కోవాలనుకునే ఆలోచన కొనుగోలు రూపం దాల్చడంలో జాప్యం జరుగుతుండటం, అలవికాని లక్ష్యాలు డీలర్లకు సమస్యాత్మకంగా ఉంటున్నాయని ఫాడా ప్రెసిడెంట్ సీఎస్ విఘ్నేశ్వర్ తెలిపారు. ఇదే విషయాన్ని తయారీ సంస్థలకు తెలియజేశారని, తమపై భారీ నిల్వల భారం మోపడాన్ని నివారించాలని కోరారని వివరించారు. మార్చిలో అమ్మకాలపై ఆశావహంగా ఉన్నప్పటికీ డీలర్లు కాస్త ఆచి తూచి వ్యవహరిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం 50–52 రోజులకు సరిపడే నిల్వలు ఉంటున్నాయని పేర్కొన్నారు. -
ఓలా ఎలక్ట్రిక్‌కి పీఎల్ఐ ప్రోత్సాహకాలు
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ సంస్థలకు సంబంధించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం (పీఎల్ఐ–ఆటో స్కీమ్) కింద రూ. 73.74 కోట్లు లభించినట్లు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ వెల్లడించింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలపై ఈ మొత్తం మంజూరు అయినట్లు వివరించింది. దీంతో ఈ స్కీము కింద ప్రోత్సాహకాలు అందుకున్న తొలి టూ వీలర్ ఈవీగా నిల్చినట్లు ఓలా ఎలక్ట్రిక్ వివరించింది.ఓలా ప్రస్తుతం ఎలక్ట్రిక్ టూ వీలర్ సెగ్మెంట్లో 28 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో ఉంది. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకునే క్రమంలో దేశీయంగా ఆటోమోటివ్ రంగంలో తయారీని, పర్యావరణ అనుకూల మొబిలిటీ సొల్యూషన్స్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం 2021లో పీఎల్ఐ–ఆటో స్కీమ్‌ను ప్రకటించింది. అయిదేళ్ల వ్యవధి కోసం దీనికి రూ. 25,938 కోట్లు కేటాయించింది. -
భారత్‌లో టెస్లాకు అంత ఈజీ కాదు
న్యూఢిల్లీ: భారత్‌లో తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లాకు ఇక్కడి మార్కెట్‌పై పట్టు సాధించడం అంత సులువు కాదని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ వ్యాఖ్యానించారు. టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రాలాంటి దేశీ దిగ్గజాల తరహాలో అది రాణించలేకపోవచ్చని తెలిపారు. ఎర్న్స్ట్ అండ్ యంగ్ ‘ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. ‘‘మస్క్ చాలా స్మార్ట్. అందులో సందేహం లేదు. ఆయన చాలా గొప్ప పనులు చేస్తున్నారు. కానీ ఆయన ఉన్నది అమెరికాలో, భారత్‌లో కాదు. ఇక్కడ విజయం సాధించాలంటే అంత సులభం కాదు. మహీంద్రా, టాటాల్లాగా ఆయన రాణించలేరు’’ అని జిందాల్ పేర్కొన్నారు. ఈవీల దిగుమతులపై టారిఫ్‌ల తగ్గింపు అవకాశాలతో భారత మార్కెట్లో ప్రవేశించేందుకు టెస్లా సన్నాహాలు చేసుకుంటున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ కూడా ఈవీ సెగ్మెంట్లో అవకాశాలను అందిపుచ్చుకునే ప్రయత్నాల్లో ఉంది. చైనాకు చెందిన ఎస్ఏఐసీ కార్పొరేషన్‌తో ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ సంస్థ జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటర్ ఇండియా ఇటీవలే ఎలక్ట్రిక్, ప్లగ్–ఇన్ హైబ్రిడ్స్ మొదలైన పలు వాహనాలను ప్రదర్శించింది. -
ఖరీదైన కారు కోసం బుకింగ్స్ షురూ..
లెక్సస్ కంపెనీ తన 'ఎల్ఎక్స్ 500డీ' కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండే ఈ కారు ప్రారంభ ధరలు రూ. 3 కోట్లు (ఎక్స్ షోరూమ్, ఇండియా).కొత్త లెక్సస్ ఎల్ఎక్స్ 500డీ గంభీరమైన డిజైన్ పొందుతుంది. ఈ కారు ముందు భాగంలోని స్పిండిల్ గ్రిల్ ఎల్ షేప్ ఎల్ఈడీ సిగ్నేచర్లతో పెద్ద, యాంగ్యులర్ హెడ్లైట్లను పొందుతుంది. 22 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కలిగిన ఈ కారు వెనుక భాగంలో కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్‌లు, చంకీ క్లాడింగ్ వంటివి ఉన్నాయి.లెక్సస్ ఎల్ఎక్స్ 500డీ.. 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, 7 ఇంచెస్ డ్రైవ్ మోడ్ డిస్ప్లే, త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్, హెడ్స్-అప్ డిస్ప్లే, ఫ్రంట్ సీట్ మసాజ్ ఫంక్షన్స్, హీటెడ్ అండ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ & రియర్ సీట్లు, 4 జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్లెస్ ఆపిల్ కార్ప్లే, వైర్డు ఆండ్రాయిడ్ ఆటో, వెనుక ప్రయాణీకుల కోసం రెండు 11.6 ఇంచెస్ ఎంటర్టైన్మెంట్ డిస్ప్లేలు, సింగిల్ పేన్ సన్‌రూఫ్, 25 స్పీకర్ 3డీ మార్క్ లెవిన్సన్ సౌండ్ సిస్టమ్ మొదలైనవన్నీ ఉన్నాయి.బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, ప్రీ-కొలిషన్ సిస్టమ్, లేన్ డిపార్చర్, ట్రేస్ అసిస్ట్, సేఫ్ ఎగ్జిట్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, అడాప్టివ్ హై బీమ్స్, 10 ఎయిర్‌బ్యాగ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ అసిస్ట్ కంట్రోల్, ట్రైలర్ స్వే కంట్రోల్ మొదలైన సేఫ్టీ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.ఇదీ చదవండి: నెలకు 10 రోజులు: టెక్ కంపెనీ కొత్త రూల్!లెక్సస్ ఎల్ఎక్స్ 500డీ 3.3 లీటర్ ట్విన్-టర్బో డీజిల్ వీ6 ఇంజిన్ పొందుతుంది. 304 హార్స్ పవర్, 700 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 10 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పొందుతుంది. ఇది ఆల్-వీల్ డ్రైవ్, యాక్టివ్ హైట్ కంట్రోల్, స్టాండర్డ్ సెంటర్ డిఫరెన్షియల్ లాక్ మరియు అడాప్టివ్ సస్పెన్షన్‌ను పొందుతుంది. -
రెండు లక్షలమంది కొన్న కారు: ఇప్పుడు కొత్త ఎడిషన్‌లో..
భారతదేశంలో అతి తక్కువ కాలంలోనే అధిక ప్రజాదరణ పొందిన.. మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) కంపెనీకి చెందిన ''స్కార్పియో ఎన్'' అమ్మకాల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది. కంపెనీ 2,00,000 యూనిట్ల అమ్మకాలను సాధించింది. బిగ్ డాడీ ఆఫ్ ఎస్‌యూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సందర్భంగా సంస్థ స్కార్పియో-N కార్బన్ ఎడిషన్ లాంచ్ చేసింది. దీని ధరలు రూ. 19.19 లక్షల నుంచి రూ. 24.89 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి.మహీంద్రా స్కార్పియో ఎన్ కార్బన్ ఎడిషన్ పటిష్టమైన డిజైన్.. అప్డేటెడ్ ఫీచర్స్ కలిగిన మహీంద్రా స్కార్పియో ఎన్ ప్రీమియం లెథరెట్ సీట్లు, కాంట్రాస్ట్ డెకో-స్టిచింగ్‌తో.. స్మోక్డ్ క్రోమ్ ఫినిషింగ్ పొందుతుంది. డార్క్ ట్రీట్మెంట్, స్మోక్డ్ క్రోమ్ యాక్సెంట్లు, బ్లాక్ అల్లాయ్ వీల్స్, డార్క్ గాల్వానో ఫినిష్డ్ రూఫ్ రెయిల్స్ వంటివి దీనిని మరింత ఆకర్షణీయంగా చేస్తాయి. ఈ కొత్త ఎడిషన్ Z8, Z8L సెవెన్-సీటర్ వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది.స్కార్పియోదశాబ్దాల చరిత్ర కలిగిన మహీంద్రా స్కార్పియో.. ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందుతూనే ఉంది. ఇందులో భాగంగానే స్కార్పియో ఎన్ లాంచ్ అయింది. ఇప్పుడు స్కార్పియో ఎన్ కార్బన్ వేరియంట్ లాంచ్ అయింది.ఇదీ చదవండి: తగ్గిన బెంచ్ టైమ్.. ఐటీ ఉద్యోగులకు ఊరట!స్కార్పియో ఎన్ సేఫ్టీ విషయంలో 5 స్టార్ రేటింగ్ సాధించింది. మంచి డిజైన్, కొత్త ఫీచర్స్, లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల.. ఈ కారును చాలామంది కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఇప్పటికే రెండు లక్షల మంది ఈ కారును కొనుగోలు చేసారంటే.. దీనికున్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
భారత్‌లో టెస్లా తొలి షోరూమ్.. ఎక్కడంటే..
ఎలక్ట్రిక్ కార్ల యూఎస్ దిగ్గజం టెస్లా(Tesla) భారత్‌లో తొలి షోరూమ్‌ను ముంబైలో ఏర్పాటు చేయనుంది. ఇందుకు వీలుగా బాంద్రా కుర్లా కాంప్లెక్స్(బీకేసీ) బిజినెస్ డిస్ట్రిక్ట్‌లో 4,000 చదరపు అడుగుల స్పేస్‌ను లీజుకి తీసుకుంది. సీఆర్ఈ మ్యాట్రిక్స్ వివరాల ప్రకారం పార్కింగ్ సౌకర్యాలుగల షోరూమ్ స్పేస్‌కుగాను కంపెనీ ప్రమోటర్, బిలియనీర్ ఎలాన్ మస్క్ నెలకు రూ.35 లక్షల అద్దె చెల్లించనున్నారు. అద్దె ఏడాదికి 5 శాతం పెంపు ప్రాతిపదికన ఐదేళ్ల కాలానికి యూనివ్‌కో ప్రాపర్టీస్ నుంచి లీజుకి తీసుకుంది. ఈ ప్రాపర్టీ గ్రౌండ్ ఫ్లోర్ దేశీయంగా ఏర్పాటైన తొలి యాపిల్ స్టోర్‌కు దగ్గరగా ఉంటుంది. రెంటల్ అగ్రిమెంట్ ఫిబ్రవరి 27న రిజిస్టరైంది. రూ.2.11 కోట్లు సెక్యూరిటీ డిపాజిట్‌గా టెస్లా జమ చేసింది.ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) భారతదేశానికి టెస్లా కార్లను తీసుకురానున్నట్లు గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. టెస్లా (Tesla) కార్లు దేశీయ విపణిలో అడుగుపెడితే.. వాటి ధరలు ఎలా ఉంటాయనే వివరాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే విదేశీ కంపెనీలపై దిగుమతి సుంకాలను విధించడం సర్వసాధారణం. ప్రస్తుత అనిశ్చితుల కారణంగా టెస్లా కంపెనీపై దిగుమతి సుంకాన్ని 20 శాతం తగ్గిస్తే కార్ల ధరలు తగ్గుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ధరలు తగ్గిన తరువాత కూడా టెస్లా కారు ధర రూ.35 లక్షల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుందని ఇటీవల గ్లోబల్ క్యాపిటల్ మార్కెట్ కంపెనీ సీఎల్ఎస్ఏ తన నివేదికలో వెల్లడించింది.ఇదీ చదవండి: ఈ ఏడాదే భారత్‌లోకి చిన్న ఎలక్ట్రిక్ ఎస్యూవీప్రస్తుతం అమెరికాలో టెస్లా చౌకైన కారు ‘మోడల్ 3’ ధర ఫ్యాక్టరీ స్థాయిలో దాదాపు 35,000 డాలర్లు (సుమారు రూ.30.4 లక్షలు). భారతదేశంలో దిగుమతి సుంకాలను 15-20 శాతానికి తగ్గించడంతో పాటు, రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ వంటి అదనపు ఖర్చులతో, ఆన్-రోడ్ ధర 40,000 డాలర్లు లేదా దాదాపు రూ.35-40 లక్షలుగా ఉంటుందని అంచనా. మహీంద్రా XEV 9e, హ్యుందాయ్ ఈ-క్రెటా, మారుతి సుజుకి ఈ-విటారా వంటి దేశీయ ఎలక్ట్రిక్ వెహికల్స్ కంటే టెస్లా మోడల్ 3 ధర 20-50 శాతం ఎక్కువగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ ధరపై ఇంకా కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు. -
ఈ ఏడాదే భారత్‌లోకి చిన్న ఎలక్ట్రిక్ ఎస్యూవీ
స్వీడిష్ లగ్జరీ కార్ల దిగ్గజం వోల్వో తమ చిన్న ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఈఎక్స్30ని ఈ ఏడాదే భారత మార్కెట్లో ప్రవేశపెట్టే యోచనలో ఉంది. దేశీయంగా ఏటా ఒక ఎలక్ట్రిక్ కారును ప్రవేశపెట్టాలనే వ్యూహానికి అనుగుణంగా దీన్ని తీసుకురానున్నట్లు సంస్థ ఎండీ జ్యోతి మల్హోత్రా తెలిపారు. మిగతా కార్లలాగానే ఈ వాహనాన్ని బెంగళూరు ప్లాంటులో అసెంబుల్ చేసి విక్రయించాలని భావిస్తున్నామని, ప్రస్తుతం సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు.ఓ కొత్త సెగ్మెంట్ సృష్టించడం ద్వారా ఇది దేశీయంగా ఈవీల వినియోగం మరింతగా పెరిగేందుకు ఉపయోగపడగలదని మల్హోత్రా చెప్పారు. గతేడాది తాము భారత్‌లో విక్రయించిన ప్రతి నాలుగు కార్లలో ఒకటి ఎలక్ట్రిక్దని ఆయన వివరించారు. ఈ విభాగంలో ఎక్స్‌సీ40, సీ40 అని తమకు రెండే కార్లు ఉన్నప్పటికీ వీటి అమ్మకాలు తమ మొత్తం కార్ల విక్రయాల్లో దాదాపు పాతిక శాతానికి చేరినట్లు మల్హోత్రా చెప్పారు. ప్రస్తుతం మాస్ మార్కెట్ విభాగంలో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం రెండు శాతంగానే ఉన్నప్పటికీ లగ్జరీ సెగ్మెంట్లో 6–7 శాతంగా ఉన్నట్లు వివరించారు. 2030 నాటికి అంతర్జాతీయంగా 90–100 శాతం ఆదాయాలను ఎలక్ట్రిక్ కార్ల నుంచే ఆర్జించాలనే లక్ష్యం దిశగా ముందుకు సాగుతున్నట్లు వివరించారు.ఇదీ చదవండి: ఇంజినీరింగ్ ఎగుమతుల జోరుకంపెనీ తెలిపిన వివరాల ప్రకారం..ఇది 427 హెచ్‌పీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కేవలం 3.6 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. EX30 రెండు బ్యాటరీ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. 51 కిలోవాట్ల లిథియం-ఐరన్-ఫాస్ఫేట్ (ఎల్ఎఫ్పీ) బ్యాటరీ, 69 కిలోవాట్ల నికెల్-మాంగనీస్-కోబాల్ట్ (ఎన్ఎంసీ) బ్యాటరీలో వస్తుంది. గరిష్టంగా అధిక సామర్థ్యం ఉన్న బ్యాటరీ వేరియంట్ ఒకసారి ఛార్జ్ చేస్తే 474 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. -
అల్ట్రావయొలెట్ తొలి స్కూటర్ వచ్చేసింది..
ఎలక్ట్రిక్ బైక్‌లు తయారు చేసే అల్ట్రావయొలెట్ ఆటోమోటివ్ తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్సెరాక్ట్ (Ultraviolette Tesseract) విడుదలతో ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్లోకి బోల్డ్ ఎంట్రీ ఇచ్చింది. బెంగళూరులో జరిగిన కంపెనీ "ఫాస్ట్ ఫార్వర్డ్ ఇండియా" కార్యక్రమంలో తమ తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌తోపాటు అడ్వెంచర్-ఫోకస్డ్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ‘షాక్ వేవ్’ను ఆవిష్కరించింది.ఫ్యూచరిస్టిక్ ఎలక్ట్రిక్ స్కూటర్అల్ట్రావయోలెట్ టెస్సెరాక్ట్ ఫ్యూచరిస్టిక్ ఎలక్ట్రిక్ స్కూటర్. మొదటి 10,000 కొనుగోలుదారులకు మాత్రమే రూ .1.20 లక్షలకు (ప్రారంభ ధర) లభిస్తుంది. ఆ తర్వాత రూ .1.45 లక్షలు పెట్టి కొనాల్సి ఉంటుంది. టెస్సరాక్ట్ అత్యాధునిక ఫీచర్లు, ఆకట్టుకునే పనితీరును కలిగి ఉంటుందని కంపెనీ చెబుతోంది. 20.1 బీహెచ్నీ పవర్ మోటార్ తో నడిచే ఈ స్కూటర్ గరిష్టంగా గంటకు 125 కిలోమీటర్ల వేగాన్ని అందిస్తుంది. కేవలం 2.9 సెకన్లలో 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 261 కి.మీ.ల రేంజ్ అందిస్తుంది.7 అంగుళాల టీఎఫ్టీ టచ్ స్క్రీన్ డిస్ప్లే, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి అధునాతన ఫీచర్లను టెస్సెక్ట్ కలిగి ఉంది. రాడార్ అసిస్టెడ్ కొలిషన్ అలర్ట్స్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, ఓవర్ టేక్ అలర్ట్స్ వంటి సెగ్మెంట్ ఫస్ట్ టెక్నాలజీలను ఇందులో పొందుపరిచారు. ఈ స్కూటర్లో విశాలమైన 34-లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్ ఇచ్చారు. యుద్ధ హెలికాప్టర్ల ప్రేరణతో దీని సొగసైన డిజైన్‌ను రూపొందించారు.షాక్వేవ్.. తొలి ఎలక్ట్రిక్ ఎండ్యూరో బైక్టెస్సెరాక్ట్ తో పాటు అల్ట్రావయోలెట్ భారతదేశపు మొట్టమొదటి రోడ్-లీగల్ ఎలక్ట్రిక్ ఎండ్యూరో మోటార్ సైకిల్ అయిన షాక్ వేవ్ (Ultraviolette Tesseract) ను కూడా లాంచ్ చేసింది. మొదటి 1,000 కొనుగోలుదారులు రూ .1.50 లక్షలకు (ఆ తర్వాత రూ .1.75 లక్షలు) దీన్ని సొంతం చేసుకోవచ్చు. అడ్వెంచర్ ఔత్సాహికుల కోసం ఈ బైక్‌ను రూపొందించారు. 4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉన్న ఈ బైక్ 165 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. గంటకు గరిష్టంగా 120 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లవచ్చు. ఈ బైక్ 2.9 సెకన్లలోనే 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.షాక్వేవ్ కఠినమైన డిజైన్ లాంగ్-ట్రావెల్ సస్పెన్షన్, వైర్-స్పోక్ వీల్స్, డ్యూయల్-పర్పస్ టైర్లను కలిగి ఉంది. ఆఫ్-రోడ్‌తోపాటు పట్టణ భూభాగాలకు అనుకూలంగా ఉంటుంది. స్విచబుల్ డ్యూయల్-ఛానల్ ఏబీఎస్, నాలుగు ట్రాక్షన్ కంట్రోల్ మోడ్లు, ఆరు లెవల్స్ రీజనరేటివ్ బ్రేకింగ్ వంటి అధునాతన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. -
టీవీఎస్ జూపిటర్ కొత్త బండి లాంచ్
టీవీఎస్ మోటార్ కంపెనీ 2025 టీవీఎస్ జూపిటర్ 110 స్కూటర్‌ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ తాజా ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది. అధునాతన ఎమిషన్ టెక్నాలజీలను ఇందులో టీవీఎస్ వినియోగించింది. కొత్త టీవీఎస్ జూపిటర్ 110 బేస్ డ్రమ్ వేరియంట్ ప్రారంభ ధరను రూ .76,691గా (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ) కంపెనీ నిర్ణయించింది.వేరియంట్లు.. ధరలు2025 టీవీఎస్ జూపిటర్ 110 విభిన్న కస్టమర్ ప్రాధాన్యతలను తీర్చడానికి నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. ప్రారంభ డ్రమ్ వేరియంట్ ధర రూ.76,691. ఇది అన్నింటిలో కాస్త తక్కువ ఖరీదు మోడల్. డ్రమ్ అల్లాయ్ వేరియంట్ ధర రూ.82,441. ఇది మెరుగైన లుక్, మన్నిక కోసం అల్లాయ్ వీల్స్ ను అందిస్తుంది. డ్రమ్ ఎస్ఎక్స్సీ వేరియంట్ ధర రూ.85,991. ఇందులో అదనపు స్టైలింగ్, కన్వీనియన్స్ ఫీచర్లు ఉన్నాయి. డిస్క్ ఎస్‌ఎక్స్‌సి వేరియంట్ రూ .89,791 ధరతో మెరుగైన బ్రేకింగ్ పనితీరు కోసం ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌తో వస్తుంది.OBD-2B ప్రయోజనాలుOBD-2B (ఆన్-బోర్డ్ డయాగ్నస్టిక్స్) టెక్నాలజీ అనేది సరికొత్త అప్ గ్రేడ్. ఇది క్లిష్టమైన ఇంజిన్ ఉద్గార పారామీటర్ల రియల్ టైమ్ మానిటరింగ్ చేస్తుంది. అధునాతన సెన్సార్లతో కూడిన టీవీఎస్ జూపిటర్ 110 థ్రోటిల్ రెస్పాన్స్, ఎయిర్-ఫ్యూయల్ రేషియో, ఇంజిన్ టెంపరేచర్, ఫ్యూయల్ క్వాంటిటీ, ఇంజిన్ వేగాన్ని ట్రాక్ చేయగలదు. ఇంజిన్ కంట్రోల్ యూనిట్ (ECU) సరైన పనితీరు, మెరుగైన మన్నిక, తక్కువ ఉద్గారాలను ధృవీకరించడానికి ఈ డేటాను రియల్ టైమ్ లో ప్రాసెస్ చేస్తుంది. ఇది స్కూటర్ ను దాని జీవితచక్రం అంతటా క్లీనర్‌గా, మరింత పర్యావరణ అనుకూలమైనదిగా చేస్తుంది.ఇంజిన్, పనితీరుకొత్త టీవీఎస్ జూపిటర్ 110 స్కూటర్లో 113.3సీసీ, సింగిల్ సిలిండర్, 4-స్ట్రోక్ ఇంజన్ ఇచ్చారు. ఇది 6,500 ఆర్పీఎం వద్ద 5.9 కిలోవాట్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ అసిస్ట్ తో 5,000 ఆర్పీఎం వద్ద 9.8 ఎన్ఎం టార్క్, 5,000 ఆర్పీఎం వద్ద 9.2 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది స్మూత్ యాక్సిలరేషన్, ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది. సౌకర్యవంతమైన, స్థిరమైన రైడ్ కోసం రూపొందించిన ఈ స్కూటర్లో 1,275 మిమీ వీల్ బేస్, 163 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది.ఇదీ చదవండి: నిస్సాన్ మాగ్నైట్ సరికొత్త మైలురాయిడిజైన్, ఫీచర్లుటీవీఎస్ జూపిటర్ 110లో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, డీఆర్ఎల్లతో కూడిన ఎల్ఈడీ హెడ్లైట్లు, కాల్ అండ్ ఎస్ఎంఎస్ అలర్ట్స్, నావిగేషన్, ఐగో అసిస్ట్, హజార్డ్ ల్యాంప్స్, వాయిస్ అసిస్టెన్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది రెండు వైపులా 12-అంగుళాల వీల్స్ ఉంటాయి. ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు , వెనుక భాగంలో మోనో-షాక్ ను కలిగి ఉంది. రెండు వీల్స్‌కు డ్రమ్ బ్రేక్స్ ఇచ్చారు. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ లు అధిక ట్రిమ్ లలో లభిస్తాయి. -
నిస్సాన్ మాగ్నైట్ సరికొత్త మైలురాయి
నిస్సాన్ మోటార్ ఇండియా తన పాపులర్ కాంపాక్ట్ ఎస్యూవీ నిస్సాన్ మాగ్నైట్‌లో ఒక ముఖ్యమైన మైలురాయిని ప్రకటించింది. స్వచ్ఛమైన, మరింత స్థిరమైన ఇంధన ఎంపికల కోసం భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి అనుగుణంగా ఈ వాహనం ఇప్పుడు పూర్తిగా ఈ20 అనుకూలమైనదిగా మారింది. అదేకాకుండా మాగ్నైట్ అద్భుతమైన ఎగుమతి మైలురాయిని సాధించింది, 2020 లో లాంచ్ అయినప్పటి నుండి 50,000 యూనిట్లను దాటింది.ఈ20 కంపాటబిలిటీనిస్సాన్ మాగ్నైట్ 1.0-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ బీఆర్ 10 పెట్రోల్ ఇంజన్ ను ఈ20 కంప్లైంట్ గా అప్ గ్రేడ్ చేశారు. ఇది ఇప్పటికే ఈ20 కంపాటబుల్ గా ఉన్న 1.0-లీటర్ టర్బోఛార్జ్ డ్ పెట్రోల్ ఇంజిన్ కు జతయింది. 20% ఇథనాల్, 80% గ్యాసోలిన్ కలిగి ఉన్న ఈ20 ఇంధనం.. కర్బన ఉద్గారాలు, శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి భారత్ విస్తృత వ్యూహంలో భాగం. న్యాచురల్ ఆస్పిరేటెడ్ ఇంజన్ 71బీహెచ్పీ పవర్, 96ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. టర్బోఛార్జ్ డ్ ఇంజన్ 98బీహెచ్పీ పవర్, 160ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. నేచురల్ ఆస్పిరేటెడ్ ఇంజిన్ కోసం ట్రాన్స్మిషన్ ఎంపికలలో 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, 5-స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ (ఏఎంటీ) ఉన్నాయి. టర్బోఛార్జ్డ్ ఇంజన్ ఐదు-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా కంటిన్యూయస్ వేరియబుల్ ట్రాన్స్మిషన్ (సీవీటీ) తో లభిస్తుంది.ఎగుమతి మైలురాయిమాగ్నైట్ విడుదల చేసినప్పటి నుండి 50,000 యూనిట్ల ఎగుమతి మార్కును అధిగమించిందని నిస్సాన్ మోటార్ ఇండియా నివేదించింది. జనవరిలో మాగ్నైట్ లెఫ్ట్-హ్యాండ్ డ్రైవ్ వేరియంట్‌ను ఎగుమతి చేయడం ప్రారంభించింది. చెన్నైలోని కామరాజర్ పోర్ట్ నుండి లాటిన్ అమెరికన్ మార్కెట్లకు దాదాపు 2,900 యూనిట్లను రవాణా చేసింది. ఫిబ్రవరి నాటికి, లాటిన్ అమెరికా, మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా, ఆసియా పసిఫిక్ ప్రాంతాలలోని మార్కెట్లకు 10,000 యూనిట్లకు పైగా మాగ్నైట్ ఎగుమతి అయింది. -
పెరుగుతున్న నష్టాలు.. ముప్పులో 1,000 ఉద్యోగాలు
దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులలో ఒకటైన ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (Ola Electric) నష్టాలతో సతమతమవుతోంది. పెరుగుతున్న నష్టాలను తగ్గించుకునే ప్రయత్నాలలో భాగంగా 1,000 మందికి పైగా ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులను తొలగించాలని (Lay off) యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పెరిగిన పోటీ, నియంత్రణ పరిశీలన, నిర్వహణ వ్యయాలతో కంపెనీకి సవాలుతో కూడిన ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటోంది.ఇదీ నేపథ్యం..ప్రొక్యూర్మెంట్, ఫుల్ ఫిల్ మెంట్, కస్టమర్ రిలేషన్స్, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సహా పలు విభాగాలపై ఈ ఉద్యోగ కోతలు ప్రభావం చూపే అవకాశం ఉంది. 2023 నవంబర్‌లో ఓలా ఎలక్ట్రిక్ ఇప్పటికే 500 మంది ఉద్యోగులను తొలగించింది. 2024 మార్చి నాటికి ఓలా ఎలక్ట్రిక్ మొత్తం 4,000 మంది ఉద్యోగులు ఉండగా ఇందులో నాలుగో వంతుకు పైగా తాజా తొలగింపుల ప్రభావానికి గురికానున్నారు. అయితే కంపెనీ బహిరంగ వెల్లడిలో భాగం కాని కాంట్రాక్ట్ కార్మికులను చేర్చడం వల్ల ఖచ్చితమైన ప్రభావం అస్పష్టంగా ఉంది.ఆర్థిక ఇబ్బందులుఓలా ఎలక్ట్రిక్ గణనీయమైన ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది. డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ నష్టాలు 50% పెరిగాయి. ఆగస్టు 2023 లో బలమైన ఐపీఓ అరంగేట్రం తరువాత కంపెనీ స్టాక్ గరిష్ట స్థాయి నుండి 60 శాతానికి పైగా పడిపోయింది. ఉద్యోగుల తొలగింపు వార్తలు కంపెనీ షేరును మరింత ప్రభావితం చేశాయి. ఇది 5% పడిపోయి 52 వారాల కనిష్టాన్ని తాకింది.ఇదీ చదవండి: గూగుల్ ఉద్యోగులూ.. 60 గంటలు కష్టపడితేనే.. కోఫౌండర్ పిలుపువ్యూహాత్మక పునర్నిర్మాణంపునర్నిర్మాణ ప్రయత్నాలలో భాగంగా ఓలా ఎలక్ట్రిక్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, ఖర్చులను తగ్గించడానికి కస్టమర్ అనుభవాన్ని పెంచడానికి తన కస్టమర్ సర్వీస్ కార్యకలాపాలలో కొన్ని విభాగాలను ఆటోమేట్ చేస్తోంది. ఖర్చులను తగ్గించుకోవడానికి కంపెనీ తన లాజిస్టిక్స్, డెలివరీ వ్యూహాలను పునరుద్ధరిస్తోంది. ఓలా షోరూమ్‌లు, సర్వీస్ సెంటర్లలో ఫ్రంట్ ఎండ్ సేల్స్, సర్వీస్, వేర్‌హౌస్ సిబ్బంది తొలగింపుతో ప్రభావితమయ్యారు.మార్కెట్ స్థానం.. పోటీఒకప్పుడు భారతదేశంలో అగ్రగామి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థగా ఉన్న ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు ప్రత్యర్థుల చేతిలో పరాజయం పాలవుతోంది. డిసెంబర్ లో బజాజ్ ఆటో లిమిటెడ్ ఓలా ఎలక్ట్రిక్ ను అధిగమించి అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్ గా టీవీఎస్ మోటార్ కంపెనీ తరువాత మూడవ స్థానానికి చేరుకుంది. వాహన రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వ డేటా ప్రకారం 2023 చివరి నాటికి దేశంలోని టాప్ 10 ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లలో తొమ్మిదింటిలో ఓలా ఎలక్ట్రిక్ తన నాయకత్వ స్థానాన్ని కోల్పోయింది.భవిష్యత్తు కోసం ప్రయత్నాలుసవాళ్లు ఉన్నప్పటికీ, ఓలా ఎలక్ట్రిక్ తన మార్కెట్ ఉనికిని బలోపేతం చేసుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. తన పరిధిని విస్తరించడానికి, సర్వీస్ నాణ్యత గురించి వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించడానికి కంపెనీ ఇటీవల 2023 డిసెంబర్లో 3,200 కొత్త అవుట్లెట్లను ప్రారంభించింది. ఏదేమైనా అధిక మొత్తంలో కస్టమర్ ఫిర్యాదులు, ఎబిటాను చేరుకోవడానికి దాని అమ్మకాల లక్ష్యాలను సాధించాల్సిన అవసరంతో సహా కంపెనీ గట్టి అడ్డంకులను ఎదుర్కొంటోంది. -
కొత్త బండి కొంటున్నారా.. హ్యాండ్లింగ్ చార్జీలతో జాగ్రత్త
సాక్షి, హైదరాబాద్: కొత్త వాహనాల అమ్మకాలపై రకరకాల చార్జీలు, ఫీజుల రూపంలో వాహనదారులను నిలువునా దోచుకొనే వాహన షోరూమ్లపైన చట్టపరమైన చర్యలు తీసుకొనేందుకు తెలంగాణ రవాణాశాఖ సన్నద్ధమైంది. ద్విచక్ర వాహనాలు, కార్లు, తదితర వాహనాల అమ్మకాలపైన హ్యాండ్లింగ్ చార్జీలు (handling charges), ఆర్టీఏ చార్జీల పేరిట రూ.5000 నుంచి రూ.10,000 వరకు అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు. గోడౌన్లలో ఉన్న వాహనాలను షోరూమ్ వరకు తరలించి వినియోగదారుడికి విక్రయించేందుకు హ్యాండ్లింగ్ పేరిట వసూళ్లకు పాల్పడుతున్నారు.అలాగే వాహనాల రిజిస్ట్రేషన్లపైన సుమారు రూ.2000 వరకు వసూలు చేస్తున్నారు. ఇలా నిబంధనలకు విరుద్ధంగా వాహన వినియోగదారులపైన నిలువు దోపిడీకి పాల్పడే ఆటోమొబైల్ డీలర్లపైన కఠిన చర్యలను తీసుకోనున్నట్లు రవాణాశాఖ విజిలెన్స్ జాయింట్ కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్ హెచ్చరించారు. తాత్కాలిక రిజిస్ట్రేషన్ అథరైజేషన్‌ను సస్పెండ్ చేయనున్నట్లు ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ తెలిపారు. ఈ మేరకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే జీవిత కాలపు పన్ను (life time tax) చెల్లింపుల్లో, వాహనదారుడు రెండవ వాహనం కొనుగోలు చేసే సమయంలో విధించాల్సిన అదనపు జీవిత కాలపు పన్నుపైన కచ్చితమైన నిబంధనలు పాటించవలసిందేనన్నారు.పన్ను చెల్లింపుల్లో కొందరు డీలర్లు నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయన్నారు. వాహనదారులు తాము బండి కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, ఎలాంటి అదనపు చార్జీల వసూళ్లకు పాల్పడినా రవాణాశాఖ అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. షోరూమ్‌లలో హ్యాండ్లింగ్ చార్జీల కోసం డిమాండ్ చేస్తే నేరుగా రవాణా కమిషనర్ కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేయవచ్చునన్నారు. అలాంటి డీలర్లను, షోరూమ్‌లను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, సమగ్రమైన విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చంద్రశేఖర్‌గౌడ్ స్పష్టం చేశారు.మెడికల్ సీటు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసిన సంస్థపై కేసు బంజారాహిల్స్: ప్రఖ్యాత వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తామని నమ్మించి మోసగించిన సంస్థ యజమానితో పాటు ఇద్దరు ఉద్యోగులు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మేనేజర్‌పై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే..చత్తీస్ఘడ్ రాష్ట్రం రాయ్‌పూర్ నగరానికి చెందిన సురేంద్రకుమార్ చంద్రాకర్ తన కుమారుడు ఆకర్ష్ చంద్రాకర్‌కు ఎంబీబీఎస్ సీటు కోసం బంజారాహిల్స్ రోడ్డునెంబర్–2లోని సైబర్ హైట్స్‌లో ఉన్న శ్రీబాలాజీ కెరీర్ గైడెన్స్‌ను సంప్రదించాడు. ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగి రాకేష్ శైనీ మెడికల్ సీటు ఇప్పిస్తానంటూ సురేంద్రకుమార్‌ను నమ్మించి గత ఏడాది సెపె్టంబర్ 6వ తేదీన ఒప్పందం కుదుర్చుకున్నాడు.శ్రీబాలాజీ కెరీర్ గైడెన్స్ అధినేత రాఘవేంద్రశర్మతో ఈ మేరకు అగ్రిమెంట్ కూడా కుదుర్చుకున్నారు. చత్తీస్ఘడ్ బిలాయ్‌లో ఉన్న శంకరాచార్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్‌లో ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తామని ఈ సంస్థ అధినేత రాఘవేంద్రశర్మ, ఉద్యోగులు రాకేష్ శైనీ, గిరీష్ రూపానీలు నమ్మబలికి రూ.10,74,167 డీడీ కూడా తీసుకున్నారు. బిలాయ్‌లోని శంకరాచార్య మెడికల్ కాలేజీలో సీటు వచ్చినట్లుగా కూడా వెల్లడించారు. అయితే సురేంద్రకుమార్ కుమారుడు ఆకర్ష్‌కు నీట్ పరీక్షలో భాగంగా విశాఖపట్టణంలో మెడికల్ సీటు వచ్చింది. దీంతో తాను ఇచ్చిన రూ.10.74 లక్షల డీడీని తిరిగి ఇవ్వాలని సురేంద్రకుమార్ కోరారు. దీంతో ఈ సంస్థ అధినేతతో పాటు మిగతా ఉద్యోగులు స్పందించలేదు.చదవండి: 9999 @ రూ.9.37 లక్షలుతాను ఇచ్చిన డీడీని టోలిచౌకి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank) నుంచి డ్రా చేసుకున్నారని బాధితుడు బంజారాహిల్స్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. శంకరాచార్య మెడికల్ కాలేజీ పేరుతో డూప్లికేట్ అకౌంట్ తెరిచి తాను ఇచ్చిన డీడీని ఈ సంస్థ తన ఖాతాలో వేసుకుందని ఆరోపించారు. ఇదిలా ఉండగా శ్రీబాలాజీ కెరీర్ గైడెన్స్ సంస్థ కార్యాలయం గత ఏడాది అక్టోబర్ 29 నుంచి మూతపడి ఉండగా, దీని అధినేత రాఘవేంద్రశర్మ పరారీలో ఉన్నాడు. ఈ విషయంలో బాధితుడు చత్తీస్‌ఘడ్‌లో కూడా వీరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మేనేజర్‌తో పాటు శ్రీబాలాజీ కెరీర్ గైడెన్స్ సంస్థ, దీని అధినేత రాఘవేంద్రశర్మ, ఉద్యోగులు రాకేష్శైనీ, గిరీష్ రూపానీలపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎక్కువమంది ఆ బ్రాండ్ కార్లనే కొనేస్తున్నారు
ముంబై: వాహన కంపెనీల విక్రయాలు ఎగుమతులతో కలుపుకుని ఫిబ్రవరిలో ఆశాజనకంగా నమోదయ్యాయి. ప్యాసింజర్స్ వెహికిల్స్ తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ స్వల్ప వృద్ధితో సరిపెట్టుకుంది. డిమాండ్ స్తబ్ధుగా ఉండడంతో హ్యుందాయ్, టాటా మోటార్స్ వాహన అమ్మకాలు నెమ్మదించాయి. ఎస్‌యూవీలు, ఎంపీవీ మోడళ్లకు గిరాకీ లభించడంతో మహీంద్రా అండ్ మహీంద్రా, టయోటా కిర్లోస్కర్ మోటార్ వాహన విక్రయాలు గత నెలలో రెండంకెల వృద్ధి సాధించాయి.మారుతీ సుజుకీ దేశీయంగా గత నెలలో 1,60,791 యూనిట్ల వాహనాలు విక్రయించింది. గత ఏడాది ఫిబ్రవరిలో ఈ సంఖ్య 1,60,271 యూనిట్లు. చిన్న కార్ల విభాగంలో ఆల్టో, ఎస్-ప్రెస్సో విక్రయాలు 14,782 నుంచి 10,226 యూనిట్లకు తగ్గాయి. కాంపాక్ట్ కార్ల విభాగంలో బాలెనో, సెలెరియో, డిజైర్, ఇగ్నిస్, స్విఫ్ట్, వేగన్–ఆర్ అమ్మకాలు 71,627 నుంచి 72,942 యూనిట్లకు పెరిగాయి. యుటిలిటీ వాహన విభాగంలోని బ్రెజ్జా, గ్రాండ్ విటారా, ఎర్టిగా, ఎక్స్ఎల్6 విక్రయాలు 61,234 నుంచి 65,033 యూనిట్లకు చేరాయి. ఎగుమతులు కలుపుకొని ఈ ఫిబ్రవరిలో కంపెనీ 1,99,400 యూనిట్ల వాహనాలు విక్రయించింది.➤హ్యుండై మోటార్ ఇండియా మొత్తం వాహన విక్రయాలు 3% క్షీణించి 58,727 యూనిట్లకు వచ్చి చేరాయి. దేశీయంగా భౌగోళిక రాజకీయ సవాళ్లు ఉన్నప్పటికీ.. కేంద్ర బడ్జెట్ 2025లో ప్రతిపాదిత పన్ను సంస్కరణలు, మెరుగైన ద్రవ్య లభ్యత మార్కెట్‌కు అవసరమైన డిమాండ్‌ను అందిస్తాయని ఆశావాదంగా ఉన్నాం’ అని కంపెనీ సీఈవో తరుణ్ గర్గ్ అన్నారు.➤టాటా మోటార్స్ మొత్తం వాహన విక్రయాలు 8% తగ్గి 77,232 యూనిట్లకు పరిమితమయ్యాయి.➤ఎస్‌యూవీలకు డిమాండ్ లభించడంతో ఎంఅండ్ఎం మొత్తం అమ్మకాల్లో 15% వృద్ధి నమోదై 83,072 యూనిట్లకు చేరుకున్నాయి. -
సింగిల్ ఛార్జ్‌తో 800 కిమీ రేంజ్: ఈ కారు ధర ఎంతంటే..
చైనా ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ 'షియోమీ' (Xiaomi) గురువారం తన లగ్జరీ ఎలక్ట్రిక్ సెడాన్ 'ఎస్‌యూ7' (SU7) అల్ట్రా ధరలను ప్రకటించింది. ఈ కారు కోసం బుకింగ్స్ అక్టోబర్ చివరి నాటికి ప్రారంభమవుతాయని వెల్లడించింది.కంపెనీ తన షియోమీ ఎస్‌యూ7 అల్ట్రా ధరలను 529900 యువాన్స్ (సుమారు రూ. 63 లక్షల కంటే ఎక్కువ)గా ప్రకరించింది. సంస్థ ఇప్పటికే మార్చి నెలలో.. చైనాలో ఈ కారు డెలివరీలను ప్రారంభించింది. దీనికి అక్కడ మంచి ఆదరణ కూడా లభించిందని సంస్థ వెల్లడించింది.షియోమీ ఎస్‌యూ7 ఎలక్ట్రిక్ కారు రెండు వేరియంట్లలో లభిస్తుంది. బేస్ వేరియంట్ ఒక ఛార్జ్‌పై 668 కిమీ రేంజ్ అందిస్తే.. టాప్ వేరియంట్ 800 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుంది. ఈ కారు సూపర్ ఎలక్ట్రిక్ మోటార్ టెక్నాలజీని పొందుతుంది. కాబట్టి అత్యుత్తమ పనితీరును అందిస్తుంది.చూడటానికి బీవైడీ సీల్ మాదిరిగా ఉండే ఈ కారు.. ఏరోడైనమిక్ డిజైన్ పొందుతుంది. కాబట్టి ఇది మినిమలిస్టిక్ లేఅవుట్‌తో ఒక పెద్ద టచ్‌స్క్రీన్ సెంటర్ స్టేజ్, ఒక డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, పెద్ద హెడ్స్-అప్ డిస్ప్లే, పనోరమిక్ రూఫ్ వంటివి పొందుతుంది. గత ఏడాది గ్లోబల్ మార్కెట్లో అరంగేట్రం చేసిన కొత్త ఎస్‌యూ7 ఎలక్ట్రిక్ సెడాన్‌ను.. షియోమీ భారతదేశంలో తన 10వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ప్రదర్శించింది. -
ఎక్కువమంది కొనేస్తున్న వెహికల్స్ ఇవే..
న్యూఢిల్లీ: ప్యాసింజర్ వెహికిల్స్ (పీవీ) విక్రయాల్లో దేశవ్యాప్తంగా 2025–26 ఆర్థిక సంవత్సరంలో 4 - 7 శాతం వృద్ధి అంచనా వేస్తున్నట్టు రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. డిమాండ్‌ను నడిపించే విభాగాలు తటస్థంగా లేదా అనుకూలంగా ఉంటాయని వివరించింది. ‘ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 2023-24లో 42 లక్షల యూనిట్ల ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆటోమొబైల్ తయారీదారుల స్థిర ఉత్పత్తి కారణంగా హోల్‌సేల్స్ స్థిరంగా ఉన్నాయి. అయితే తగ్గుతున్న రీప్లేస్మెంట్ డిమాండ్, అధిక ఇన్వెంటరీ స్థాయిల నేపథ్యంలో పరిశ్రమ పరిమాణ వృద్ధి దాదాపు 2 శాతం వద్ద నిరాడంబరంగా ఉంది. ద్విచక్ర వాహనాల విభాగంలో 2024-25లో 11-14 శాతం వృద్ధి నమోదు కావొచ్చు. ఇది వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6–9 శాతం ఉండొచ్చు. మెరుగైన వర్షపాతం కారణంగా కొన్ని నెలలుగా గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమకు మంచి మద్దతు లభిస్తోంది.రబీ సాగు ఇప్పటివరకు ఆరోగ్యంగా ఉండటంతో గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ బాగా పెరుగుతుందని అంచనా. దేశీయ వాణిజ్య వాహన పరిశ్రమ 2025–26లో స్వల్ప వృద్ధి నమోదు చేస్తుంది. ప్రభుత్వ పాత వాహనాలను తప్పనిసరిగా తుక్కుగా చేయడం, రీప్లేస్మెంట్ డిమాండ్ బస్‌ల విక్రయాల్లో వృద్ధిని పెంచుతాయి. ఎలక్ట్రిక్ త్రీవీలర్ల జోరు, ఈ–కామర్స్‌లో మందగమనంతో తేలికపాటి వాణిజ్య వాహనాల వృద్ధి తక్కువగా ఉంటుంది. మధ్య, భారీ వాణిజ్య వాహనాలు; తేలికపాటి వాణిజ్య వాహనాలు, బస్‌లు 2025–26లో వరుసగా 0–3 శాతం, 3–5, 8–10 శాతం దూసుకెళ్తాయని అంచనా’ అని ఇక్రా తెలిపింది. -
ఈవీ ఆఫర్.. రూ.40,000 క్యాష్‌బ్యాక్!
దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ మేకర్లలో ఒకటైన ప్యూర్ ఈవీ (PURE EV) తమ ఉత్పత్తుల అమ్మకాలను మరింత పెంచుకునేందుకు సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. రాబోయే పండుగ సీజన్లో కస్టమర్లను ఆకట్టుకునేందుకు 'ప్యూర్ పర్ఫెక్ట్ 10' (PURE Perfect 10) రిఫరల్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించినట్లు కంపెనీ వెల్లడించింది.ప్రోగ్రామ్ వివరాలుప్యూర్ పర్ఫెక్ట్ 10 రిఫరల్ ప్రోగ్రామ్ ఇప్పటికే ఉన్న ప్యూర్ ఈవీ కస్టమర్లందరితోపాటు మార్చి 31 నాటికి లేదా సంబంధిత అవుట్లెట్లలో స్టాక్స్ ఉన్నంత వరకూ ప్యూర్ ఈవీ వాహనాన్ని కొనుగోలు చేసే కొత్త కస్టమర్లకు కూడా అందుబాటులో ఉంటుంది. ఈ స్కీమ్ కింద కస్టమర్లు ఈవీ వాహనాన్ని కొనుగోలు చేసే తమ స్నేహితులు, కుటుంబ సభ్యులకు రెఫర్ చేయడం ద్వారా రూ.40,000 వరకు క్యాష్ బ్యాక్ రివార్డులను పొందవచ్చు.ఇది ఎలా పనిచేస్తుందంటే..ఇప్పటికే ఉన్న కొత్త ప్యూర్ ఈవీ వినియోగదారులతోపాటు కొత్త కస్టమర్లకు వారి రిజిస్టర్డ్ వాట్సాప్ నంబర్ ద్వారా 10 ప్రత్యేక రిఫరల్ కోడ్లు అందుతాయి. రిఫరర్ కొనుగోలుకు దారితీసే ప్రతి విజయవంతమైన రిఫరెన్స్ కు రూ.4,000 చొప్పున క్యాష్ బ్యాక్ వోచర్లను అందుకుంటారు. ఇలా గరిష్టంగా పది మందికి రెఫర్ చేసి వారు వాహనాన్ని కొనుగోలు చేస్తే రూ.40,000 వరకూ క్యాష్ బ్యాక్ వోచర్లు లభిస్తాయి.రిఫరల్స్ ద్వారా సంపాదించిన క్యాష్ బ్యాక్ వోచర్లను భవిష్యత్ సర్వీస్, స్పేర్ పార్ట్స్ అవసరాల కోసం ఉపయోగించవచ్చు. అలాగే వాహన అప్గ్రేడ్లు, ఎక్చ్సేంజ్, బ్యాటరీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ల కోసం కూడా వీటిని వినియోగించుకోవచ్చు. లేదా తమవారెవరైనా ప్యూర్ ఈవీ వాహనం కొనుగోలు చేసినప్పుడు ప్రత్యక్ష నగదు డిస్కౌంట్లను పొందవచ్చు."మా ప్రతి ప్రయత్నంలోనూ కస్టమర్లు మా హృదయంలో ఉంటారు. ఈ ప్రత్యేక రిఫరల్ కార్యక్రమంతో వారి పండుగ వేడుకలకు మరింత ఆనందాన్ని జోడించాలనుకుంటున్నాము. ఈ చొరవ మా కస్టమర్ల విశ్వాసం, విశ్వసనీయతకు ప్రతిఫలం ఇవ్వడమే కాకుండా ప్యూర్ ఈవీ అనుభవాన్ని వారి ప్రియమైనవారితో పంచుకోవడానికి వీలు కల్పిస్తుంది" అని ప్యూర్ ఈవీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో రోహిత్ వడేరా పేర్కొన్నారు. -
గాల్లో ఎగిరే కారు వచ్చేసింది..! ధర ఎంతంటే..
రోజువారీ ట్రాఫిక్ రద్దీతో ఇబ్బంది పడుతున్నారా..? ఇకపై మీ సమస్యకు చెక్ పెట్టేలా గాల్లో ఎగిరే కార్లు వస్తున్నాయి. అలెఫ్ ఏరోనాటిక్స్ సంస్థ సినిమాల్లో మాదిరి గాల్లో ఎగిరే కారును తయారు చేసింది. కాలిఫోర్నియాకు చెందిన ఈ స్టార్టప్ తన ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కారు ‘మోడల్ ఏ’ను విజయవంతంగా ప్రదర్శించింది. ఈ వినూత్న వాహనాన్ని రోడ్లపై కూడా డ్రైవ్ చేసేలా తయారు చేసినట్లు సంస్థ పేర్కొంది. ఇది గాల్లో నిలువుగా టేకాఫ్ అవుతుందని కంపెనీ స్పష్టం చేసింది.సాధారణంగా ఎగిరే కార్లంటే డ్రోన్ల మాదిరి బయటకు కనిపించేలా బారీ ప్రొపెల్లర్లును కలిగి ఉండే అవకాశం ఉంది. కానీ ఈ ‘మోడల్ ఏ’ కారు ఇన్‌బిల్ట్‌గా ఉన్న రోటర్ బ్లేడ్లతో సాంప్రదాయ ఆటోమోటివ్ డిజైన్‌ను కలిగి ఉంది. ఆ డిజైన్‌తోనే నేలపై నుంచి ఎగిరే సామర్థ్యం దీని సొంతం. ఇది పూర్తి ఎలక్ట్రిక్ వాహనం. ఒకసారి ఛార్జ్ చేస్తే రోడ్లపై 320 కిలోమీటర్ల డ్రైవింగ్ పరిధిని, గాల్లో 160 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ పేర్కొంది.Flying Cars Are Here!Back to the Future predicted them for 2015. It didn't happen. But now we're getting closer.The dream of flying above traffic is becoming real. Alef Aeronautics is making this happen with their Model A. pic.twitter.com/NeKgH4lREf— Alex / AI Experiments (@byalexai) February 24, 2025ఇదీ చదవండి: ఎన్బీఎఫ్సీ, సూక్ష్మ రుణాలకు మరింత మద్దతు!అలెఫ్ ఏరోనాటిక్స్ ఫ్లైయింగ్ కారుతో ట్రాఫిక్ రద్దీ సమస్యలను పరిష్కరించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ వాహనం నిలువుగా టేకాఫ్, ల్యాండింగ్ సామర్థ్యాలు కలిగి ఉండడంతో రన్‌వేల అవసరం ఉండదు. ఇది పట్టణ వాతావరణానికి సరిగ్గా సరిపోతుందని చెబుతున్నారు. కంపెనీ ‘మోడల్ ఏ’ కోసం 3,300 కంటే ఎక్కువ ప్రీఆర్డర్లను అందుకున్నట్లు పేర్కొంది. ఇది సుమారు 3,00,000 డాలర్ల (రూ.2.5 కోట్లు) ధర ఉండే అవకాశం ఉంది. ఈ సంవత్సరం చివరిలో దీన్ని మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు సంస్థ చెప్పింది. -
రూ.21.78 లక్షల కొత్త డుకాటి బైక్ ఇదే..
డుకాటి భారతదేశంలో 'డెజర్ట్ఎక్స్ డిస్కవరీ'ని లాంచ్ చేసింది. దీని ధర రూ. 21.78 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది దాని మునుపటి అన్ని మోడల్స్ కంటే కూడా భిన్నంగా ఉంది. అయితే అడ్వెంచర్ చేయడానికి మాత్రం అద్భుతంగా ఉంది.ఈ బైక్ స్టాండర్డ్, ర్యాలీ వేరియంట్లలో కూడా అందుబాటులో ఉంది. స్టాండర్డ్ డెజర్ట్ఎక్స్ ధర రూ. 18.33 లక్షలు కాగా, డెజర్ట్ఎక్స్ ర్యాలీ ధర రూ. 23.70 లక్షలు. డెజర్ట్ఎక్స్ డిస్కవరీ.. పెద్ద విండ్‌షీల్డ్, ప్యానియర్‌లు, ఇంజిన్, బాడీవర్క్ ప్రొటెక్షన్, సమ్ గార్డ్, రేడియేటర్ గ్రిల్ పొందుతుంది. అంతే కాకుండా ఈ బైక్ హీటెడ్ గ్రిప్‌లు, సెంటర్ స్టాండ్ వంటివి కూడా పొందుతుంది.డుకాటి డెజర్ట్ఎక్స్ డిస్కవరీ.. 937 సీసీ ఎల్-ట్విన్ ఇంజిన్ పొందుతుంది. ఇది 9250 rpm వద్ద, 108 Bhp పవర్, 6500 rpm వద్ద 92 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి.. మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. ఈ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 21 లీటర్లు. కంపెనీ ఈ బైక్ కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది.ఇదీ చదవండి: తక్కువ ధర.. ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్: ఇదిగో బెస్ట్ కార్లు -
తక్కువ ధర.. ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్: ఇదిగో బెస్ట్ కార్లు
తక్కువ ధరలో.. ఎక్కువ ఫీచర్స్, మంచి డిజైన్ కలిగిన కార్లను కొనుగోలు చేయాలనుకునే వారు.. భద్రతకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో భాగంగానే దాదాపు ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్ ఉన్న కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ కథనంలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు కలిగిన బెస్ట్ కార్ల గురించి తెలుసుకుందాం.మారుతి సుజుకి సెలెరియోప్రారంభంలో సెలెరియో కారులో మారుతి సుజుకి కేవలం రెండు ఎయిర్‌బ్యాగ్‌లను మాత్రమే అందించింది. ఆ తరువాత కాలంలో ఈ హ్యాచ్‌బ్యాక్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు అందించడం మొదలు పెట్టింది. అయితే ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్న కారు ధర.. స్టాండర్డ్ వేరియంట్ ధర కంటే కొంత ఎక్కువ. ఈ కారు ధరలు రూ. 5.64 లక్షల నుంచి రూ. 7.37 లక్షల మధ్య ఉన్నాయి.హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కారులో కూడా కంపెనీ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను అందిస్తోంది. ఎయిర్‌బ్యాగ్‌లు మాత్రమే కాకుండా.. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, రియర్ పార్కింగ్ కెమెరా, హిల్ అసిస్ట్ కంట్రోల్ వంటి ఫీచర్స్ కూడా ఉందులో ఉన్నాయి. ఈ కారు ధరలు రూ. 5.98 లక్షల నుంచి రూ. 8.38 లక్షలు. ఇది 1.2 లీటర్ గ్యాసోలిన్ ఇంజిన్ ద్వారా 82 హార్స్ పవర్, 113.8 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.నిస్సాన్ మాగ్నైట్మార్కెట్లో ఎక్కువ అమ్ముడవుతున్న కార్ల జాబితాలో నిస్సాన్ మాగ్నైట్ ఒకటి. రూ. 6.12 లక్షల నుంచి రూ. 11.72 లక్షల మధ్య ధరలో అందుబాటులో ఉన్న ఈ కారు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు.. 360 డిగ్రీ కెమెరా, హిల్ స్టార్ట్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఏబీఎస్ విత్ ఈబీడీ, త్రీ పాయింట్ సీట్ బెల్ట్ వంటివి కూడా ఉన్నాయి.హ్యుందాయ్ ఎక్స్టర్2023లో అత్యధిక అమ్మకాలు పొందిన హ్యుందాయ్ ఎక్స్టర్.. ఆరు ఎయిర్‌బ్యాగులు, రియర్ పార్కింగ్ కెమెరా, ఐసోఫిక్స్ సీట్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ మొదలైనవి పొందుతుంది. దీని ధరలు రూ. 6 లక్షల నుంచి రూ. 9.48 లక్షల మధ్య ఉన్నాయి.మారుతి సుజుకి స్విఫ్ట్ఆరు ఎయిర్‌బ్యాగులు, హిల్ హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, రియర్ పార్కింగ్ కెమెరా, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఐసోఫిక్స్ సీట్లు వంటి సేఫ్టీ ఫీచర్స్ కలిగిన మారుతి స్విఫ్ట్ ధర రూ. 6.49 లక్షల నుంచి రూ. 9.50 లక్షల మధ్య ఉంది. ఇది పెట్రోల్, CNG రూపంలో అమ్మకానికి అందుబాటులో ఉంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది.ఇదీ చదవండి: భారత్‌లోని బెస్ట్ అడ్వెంచర్ బైకులు ఇవే!.. ధరలు ఎలా ఉన్నాయంటే?సిట్రోయెన్ సీ3ఫ్రెచ్ వాహన తయారీ సంస్థ అయిన.. సిట్రోయెన్ తన సీ3 కారులో కూడా ఆరు ఎయిర్‌బ్యాగ్స్ అందిస్తోంది. రూ. 6.16 లక్షల ప్రారంభ ధర వద్ద లభించే ఈ కారు.. ఏబీఎస్ విత్ ఈబీడీ, హిల్ హోల్డ్ అసిస్ట్, డే - నైట్ ఐఆర్వీఎమ్ వంటి వాటిని పొందుతుంది. తక్కువ ధరలో.. మంచి సేఫ్టీ ఫీచర్స్ కలిగిన కార్ల జాబితాలో సిట్రోయెన్ సీ3 ఒకటి. -
యూజ్డ్ కారు.. యమా జోరు
సాక్షి, బిజినెస్ డెస్క్: ఆన్లైన్ కొనుగోళ్లపై నమ్మకం పెరుగుతుండటం, వినియోగదారుల అభిరుచులు మారుతుండటం తదితర పరిణామాలతో పాత కార్ల వైపు మొగ్గు చూపే వారి సంఖ్య పెరుగుతోంది. కొత్త వాటితో పోలిస్తే పాత కార్లు చాలా తక్కువ ధరకే లభిస్తుండటం కూడా ఇందుకు కారణం. తెలంగాణలో ఇటీవలి కాలంలో ఇలా యూజ్డ్ కార్ల వైపు మళ్ళే ధోరణి గణనీయంగా కనిపిస్తోందని యూజ్డ్ కార్ల ప్లాట్‌ఫాం స్పినీ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. దీని ప్రకారం, వాళ్ల ప్లాట్‌ఫాంకి సంబంధించి హైదరాబాద్ మార్కెట్ వార్షికంగా 30 శాతం వృద్ధి చెందింది. కొనుగోలుదారుల్లో మహిళలు వాటా 2022లో కేవలం 9 శాతంగా ఉండగా గతేడాది 17 శాతానికి పెరిగింది. ఇందులో 20 శాతం కొనుగోళ్లు హైదరాబాద్‌కి దూరంగా అంటే దాదాపు 300 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాల నుంచి కూడా ఉంటున్నాయి. గతంలో ఫేవరెట్లుగా ఉన్న ఎలీట్ ఐ20 లాంటి కార్ల స్థానంలో ఈసారి కొత్తవి వచ్చి చేరాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా కార్లకు ఆదరణ ఉన్నప్పటికీ క్విడ్లాంటి కొత్త మోడల్స్‌ను కూడా ఎంచుకుంటున్నారు. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్కి ఓటు.. ఇక సౌకర్యవంతమైన డ్రైవింగ్ విధానాన్ని ఇష్టపడుతుండటంతో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కార్లకు డిమాండ్ 19 శాతం (2022) నుంచి గతేడాది 25 శాతానికి పెరిగింది. 2023లో కాస్త తగ్గిన హోమ్ డెలివరీలు 2024లో 35 శాతం పెరిగాయి. అంతే కాదు.. 2022–23లో అంతగా లేని విలాసవంతమైన కార్ల సెగ్మెంట్ కూడా ఊపందుకుంటోంది. లగ్జరీని కోరుకునే ధోరణులు పెరుగుతుండటాన్ని సూచిస్తూ కంపాస్, జీఎల్ఏ, ఎక్స్1 వంటి మోడల్స్‌కి డిమాండ్ ఏర‡్పడింది. హైదరాబాద్ యూజ్డ్ కార్ల మార్కెట్‌కు విజయవాడ, వరంగల్ వంటి నగరాలకు వాహనాలను సరఫరా చేసే ఫీడర్ సిటీలుగా ఉంటున్నాయి. పాపులర్ కార్లు ఇవీ.. → మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా → క్విడ్ లాంటి కొత్త మోడల్స్‌కి ఆదరణ → లగ్జరీ సెగ్మెంట్లో కంపాస్, జీఎల్ఏకి డిమాండ్ -
బీఎండబ్ల్యూ స్టైలిష్ బైక్.. లాంచ్ ఎప్పుడంటే?
ప్రముఖ బైక్స్ తయారీ సంస్థ.. 'బీఎండబ్ల్యూ మోటోరాడ్' కంపెనీ దేశీయ మార్కెట్లో 'ఎఫ్ 450 జీఎస్'ను లాంచ్ చేయడానికి సిద్ధమైంది. 2024 ఈఐసీఎమ్ఏ ఎడిషన్‌లో కనిపించిన ఈ బైక్ 2025 చివరి నాటికి రోడ్డు మీదకి రానుంది.బీఎండబ్ల్యూ ఎఫ్ 450 జీఎస్.. బైక్ 450 సీసీ ట్విన్ సిలిండర్ ఇంజిన్ కలిగి ఉంటుంది. కాబట్టి ఇది మంచి పనితీరును అందిస్తుందని తెలుస్తోంది. ఈ బైక్ ముందు భాగంలో ఫుల్లీ అడ్జస్టబుల్ అప్‌సైడ్-డౌన్ ఫోర్క్, వెనుక భాగంలో మోనో-షాక్ అబ్జార్బర్ వంటివి ఉన్నాయి. రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి.సింగిల్ పీస్ సీటు కలిగిన ఈ బైక్.. డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్ సెటప్ కలిగి ఉండి, మధ్యలో GS బ్యాడ్జింగ్ పొందుతుంది. 6.5 ఇంచెస్ TFT డిస్ప్లే, క్రాస్-స్పోక్ వీల్స్ కూడా ఇందులో ఉన్నాయి. 175 కేజీల బరువున్న బీఎండబ్ల్యూ ఎఫ్ 450 జీఎస్ ఆఫ్ రోడింగ్ చేయడానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.ఇదీ చదవండి: రోజుకు రూ.27 కోట్లు విరాళం ఇచ్చిన వ్యక్తి.. ఈయన గురించి తెలుసా? -
ఈవీ చార్జ్!
ఛార్జింగ్‌కు ఎక్కువ సమయం పట్టడం, ఒకసారి చార్జింగ్ చేస్తే ఎంత దూరం ప్రయాణిస్తుందోనన్న ఆందోళన, మౌలిక సదుపాయాలు పరిమితంగా ఉండడం, వినియోగదారులకు భరోసా లేకపోవడం.. ఈ అంశాలే ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ) వృద్ధి వేగానికి ప్రధాన అడ్డంకులు. ఇదంతా నాణేనికి ఒకవైపు. మరోవైపు బ్యాటరీల సామర్థ్యం పెంచడానికి, వేగంగా చార్జింగ్ పూర్తి కావడానికి తయారీ సంస్థలు నూతన సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నాయి. చార్జింగ్ మౌలిక వసతులు క్రమంగా విస్తరిస్తున్నాయి. దీంతో వినియోగదార్లలో ఈవీల పట్ల ఆమోదం క్రమంగా పెరుగుతోంది. ఇందుకు అమ్ముడవుతున్న ఈవీలే నిదర్శనం. దేశవ్యాప్తంగా అన్ని విభాగాల్లో కలిపి 2024లో 2,61,07,679 యూనిట్ల వాహనాలు రోడ్డెక్కితే.. ఇందులో ఈవీలు 7.46 శాతం వాటాతో 19,49,114 యూనిట్లు కైవసం చేసుకున్నాయి. ఆసక్తికర అంశం ఏమంటే మొత్తం వాహన పరిశ్రమ గత ఏడాది 9.11 శాతం వృద్ధి చెందితే.. ఎలక్ట్రిక్ వాహన విభాగం ఏకంగా 27 శాతం దూసుకెళ్లడమే. రికార్డుల దిశగా..భారత్‌లో ఈవీ పరిశ్రమ 2024లో గరిష్ట విక్రయాలతో సరికొత్త రికార్డు సృష్టించింది. నిముషానికి 3.7 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2015–2024 కాలంలో 54 లక్షల యూనిట్ల ఈవీలు రోడ్డెక్కాయి. ప్రస్తుత వృద్ధి వేగాన్నిబట్టి ఈవీ రంగంలో 2029–30 నాటికి ప్యాసింజర్ కార్స్ విక్రయాలు 9.60 లక్షల యూనిట్లకు చేరవచ్చని పరిశ్రమ అంచనా వేస్తోంది. అలాగే టూవీలర్స్ 1.37 కోట్ల యూనిట్లు, త్రీవీలర్స్ 12.8 లక్షల యూనిట్లను తాకుతాయని ఈవీ రంగం భావిస్తోంది. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, నూతన సాంకేతికత, కంపెనీల దూకుడు.. వెరసి చార్జింగ్ స్టేషన్స్ సంఖ్య 13.2 లక్షలకు చేరవచ్చని నివేదికలు చెబుతున్నాయి. దేశంలో 2024 డిసెంబర్ 20 నాటికి 25,202 చార్జింగ్ స్టేషన్స్ వినియోగంలో ఉన్నాయి. మొత్తం త్రిచక్ర వాహన అమ్మకాల్లో ఈ–త్రీవీలర్స్ వాటా ఏకంగా 56 శాతం ఉంది. 210 కంపెనీలు ఈ–టూవీలర్స్ విభాగంలో పోటీపడుతున్నాయి. డిసెంబర్ నెల అమ్మకాల్లో టూవీలర్స్ సెగ్మెంట్లో బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్ కో టాప్–2లో ఉన్నాయి. త్రీవీలర్స్‌లో మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ, బజాజ్ ఆటో, ప్యాసింజర్ వెహికిల్స్ విభాగంలో టాటా మోటార్స్, జేఎస్‌డబ్లు్య ఎంజీ మోటార్ ఇండియా తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. ఐసీఈ విభాగాన్ని ఏలుతున్న దిగ్గజ కంపెనీలే ఈవీల్లోనూ పాగా వేస్తున్నాయి.వ్యయాలు తగ్గినప్పటికీ..ఐసీఈ ఇంజన్ కలిగిన వాహనాలతో పోలిస్తే ఈవీకి అయ్యే రోజువారీ వ్యయాలు తక్కువ. అయితే ప్రతిరోజు తక్కువ దూరం ప్రయాణించే వారికి ఈవీ చక్కని ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. అవసరం నిమిత్తం సుదూర ప్రయాణం చేయాల్సి వస్తే మాత్రం మరో మార్గం వెతుక్కోవాల్సిందే. ఐసీఈ వాహనాల మాదిరిగా దారిలో పెట్రోల్, డీజిల్ పోయించుకుని గమ్యం చేరినట్టు ఈవీలకు వీలు కాదు. ఒకవేళ ఈవీతో దూర ప్రయాణం చేయాల్సి వస్తే.. చార్జింగ్ కేంద్రాల వద్ద బ్యాటరీ చార్జింగ్ పూర్తి అయ్యే వరకు నిరీక్షించాల్సిందే. ఈ అంశమే ఈవీల వృద్ధి వేగానికి స్పీడ్ బ్రేకర్‌గా నిలిచింది. చార్జింగ్‌నుబట్టి ప్రయాణాలు ఆధారపడతున్నాయని కస్టమర్లు అంటున్నారు. ఈ–కామర్స్ కంపెనీలతో..ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల వృద్ధికి ఈ–కామర్స్ కంపెనీల దూకుడు కూడా తోడవుతోంది. కర్బన ఉద్గారాలను తగ్గించే దిశగా ఈ కంపెనీలు నడుం బిగించడం ఇందుకు కారణం. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ–కామర్స్ సంస్థలు, ఊబర్, ఓలా, రాపిడో వంటి అగ్రిగేటర్లూ, స్విగ్గీ, జొమాటో తదితర ఫుడ్ డెలివరీ యాప్స్, బిగ్‌బాస్కెట్, జెప్టో, బ్లింకిట్, డంజో వంటి క్విక్ కామర్స్ సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం విషయంలో డెలివరీ పార్ట్నర్స్, డ్రైవర్ పార్ట్నర్స్ను ప్రోత్సహిస్తున్నాయి. సులభ వాయిదాల్లో ఈవీల కొనుగోలు, బ్యాటరీల స్వాపింగ్ సౌకర్యాలు, చార్జింగ్ మౌలిక వసతులను కల్పించేందుకు ముందుకు వస్తున్నాయి. వెన్నుదన్నుగా ప్రభుత్వం..ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ (ఐసీఈ) నుంచి కొత్తతరం ఈవీ, ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాహనాలు, వాహన విడిభాగాల పరిశ్రమకు రూ.25,938 కోట్ల ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలను ప్రకటించింది. అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీ స్టోరేజ్ విభాగానికి రూ.18,100 కోట్లు, పీఎం ఈ–డ్రైవ్ పథకానికి రూ.10,900 కోట్ల విలువైన ఇన్సెంటివ్స్ అందిస్తోంది. ఎలక్ట్రిక్ వెహికిల్స్ రంగంలో విదేశీ కంపెనీలను ఆకర్షించేందుకు ఆటోమేటిక్ రూట్లో 100 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతిస్తోంది. కనీసం 50 కోట్ల డాలర్ల పెట్టుబడితో ప్లాంట్లు స్థాపించే సంస్థలు పూర్తిగా తయారైన ఈవీలను దిగుమతి చేస్తే పన్ను 70–100 శాతం నుంచి కొత్త ఈవీ పాలసీలో 15 శాతానికి తగ్గించారు. లిథియం అయాన్ బ్యాటరీలపై పన్నును 21 నుంచి 13 శాతానికి చేర్చారు. ఈవీ, చార్జింగ్ మౌలిక వసతులు, బ్యాటరీస్ రంగంలో 2030 నాటికి 200 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వెల్లువెత్తుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈవీ మార్కెట్ ఆరేళ్లలో ప్రపంచంలో తొలి స్థానాన్ని కైవసం చేసుకుంటుందని భారత ప్రభుత్వం ధీమాగా ఉంది. కొత్తగా అమ్ముడయ్యే వాహనాల్లో ఈవీల వాటా 2030 నాటికి 30 శాతం ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యం.రీసేల్ వాల్యూ సవాల్..ఐసీఈ వాహనాల స్థాయిలో సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఈవీలకు డిమాండ్ లేకపోవడం కస్టమర్లను నిరాశకు గురిచేస్తోంది. రీసేల్ వాల్యూ పట్ల ప్రజల్లో ఉన్న ఆందోళన డిమాండ్‌ను పరిమితం చేస్తోందని కియా ఇండియా సేల్స్, మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, నేషనల్ హెడ్ హర్దీప్ సింగ్ బ్రార్ అన్నారు. జీఎస్టీ, రహదారి పన్ను ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. ఖరీదైన బ్యాటరీ కారణంగా ఐసీఈ వాహనంతో పోలిస్తే ఈవీ ధర ఎక్కువగా ఉంటోంది. ఈ అంశం కూడా ఈవీ స్వీకరణను పరిమితం చేస్తూనే ఉంది. ఈవీలు మరింత చవకగా మారితేనే డిమాండ్ ఊపందుకుంటుందన్నది కస్టమర్ల మాట. ఐసీఈ కార్ల కంటే ఎలక్ట్రిక్ కార్ల ధర 30–50% ఎక్కువ. అలాగే ద్విచక్ర వాహనాల ధర 20–30% అధికంగా ఉంటోంది. – సాక్షి, బిజినెస్ బ్యూరో. -
ఈవీ బ్యాటరీ తయారీలోకి కైనెటిక్
ఆటోమోటివ్ విడిభాగాల రంగంలో ఉన్న కైనెటిక్ గ్రూప్ ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ తయారీ రంగంలోకి ప్రవేశించింది. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో రూ.50 కోట్ల పెట్టుబడితో ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఫెసిలిటీలో ద్విచక్ర, త్రిచక్ర ఎలక్ట్రిక్ వాహనాల కోసం 60,000 రేంజ్–ఎక్స్ బ్రాండ్ బ్యాటరీలను తయారు చేస్తారు. లిథియం–అయాన్ ఫాస్ఫేట్ (ఎల్ఎఫ్పీ), నికెల్ మాంగనీస్, కోబాల్ట్ (ఎన్ఎంసీ) రకం బ్యాటరీలు కూడా ఉత్పత్తి అవుతాయని కంపెనీ తెలిపింది.వాహన తయారీ సంస్థలకు సైతం వీటిని సరఫరా చేయనున్నట్టు కంపెనీ వెల్లడించింది. త్రీవీలర్స్ కోసం ప్రిస్మాటిక్ సెల్స్ అభివృద్ధి చేస్తున్నట్టు కైనెటిక్ గ్రూప్ వివరించింది. కైనెటిక్ గ్రూప్‌నకు చెందిన ప్రధాన సంస్థ అయిన కైనెటిక్ ఇంజనీరింగ్ లిమిటెడ్ ఐదు దశాబ్దాలకు పైగా ఆటోమోటివ్ రంగంలో నిమగ్నమైంది. అహ్మద్‌నగర్ తయారీ కేంద్రంలో కంపెనీ 32 తయారీ షెడ్స్‌లో సుమారు 1,000 మందిని నియమించింది. 400లపైచిలుకు యంత్రాలను ఏర్పాటు చేశారు. రెనో, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, అశోక్ లేలాండ్ వంటి ప్రధాన ఆటోమోటివ్ తయారీ సంస్థలు కైనెటిక్ గ్రూప్ క్లయింట్లుగా ఉన్నాయి. ఇదీ చదవండి: రూ.30,000 కోట్ల పెట్టుబడులకు ప్రణాళికలురెలిగేర్ షేరుకి డాబర్ జోష్బర్మన్ కుటుంబం చేతికి నియంత్రణసాధారణ వాటాదారులకు ఓపెన్ ఆఫర్ తదుపరి బర్మన్ కుటుంబం ప్రమోటర్లుగా అవతరించడంతో రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ కౌంటర్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఓపెన్ ఆఫర్ తదుపరి రెలిగేర్‌లో దేశీ ఎఫ్ఎంసీజీ దిగ్గజం డాబర్ ఇండియా ప్రమోటర్ల వాటా 25.16 శాతానికి బలపడింది. అంతకుముందు 21.10 శాతం వాటా కలిగి ఉంది. వెరసి రెలిగేర్‌లో అతిపెద్ద వాటాదారుకావడంతోపాటు ప్రమోటర్‌గా నిలిచింది. రెలిగేర్ యాజమాన్యం, బోర్డుతో కలసి పనిచేస్తామని, వ్యూహాత్మక మార్గదర్శకత్వం వహిస్తామని బర్మన్ గ్రూప్ ప్రతినిధి ఒకరు ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
ఆ కార్లలో సాఫ్ట్వేర్ సమస్య.. కంపెనీ కీలక నిర్ణయం
కొరియన్ కంపెనీ కియా మోటార్స్.. ఈవీ 6 కార్లకు రీకాల్ ప్రకటించిన తరువాత, జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ (Mercedes Benz).. సీ-క్లాస్, ఈ-క్లాస్ కార్లకు రీకాల్ ప్రకటించింది.రీకాల్ ప్రకటించిన కార్ల జాబితాలో.. 2022 ఏప్రిల్ 29 నుంచి 2024 ఆగస్టు 20 మధ్య తయారైన 2,543 యూనిట్ల E-క్లాస్ కార్లు & 2021 ఆగస్టు 31 నుంచి 2021 అక్టోబర్ 31 మధ్య తయారైన 3 యూనిట్ల సీ-క్లాస్ కార్లు ఉన్నాయి. ఈ కార్లలో ఇంజిన్ కంట్రోల్ యూనిట్ (ECU) సాఫ్ట్వేర్ సమస్యను పరిష్కరించడానికి కంపెనీ ఈ రీకాల్ ప్రకటించింది.ఈసీయూ సాఫ్ట్వేర్ సమస్య కారణంగా.. ఎటువంటి హెచ్చరిక లేకుండా కారు ప్రొపల్షన్ కోల్పోయే అవకాశం ఉంది. అప్పుడు ప్రమాదాలు జరుగుతాయి. పెట్రోల్ వేరియంట్లలో మాత్రమే ఈ సమస్య ఉన్నట్లు కంపెనీ ధ్రువీకరించింది. కాబట్టి దీనిని సంస్థ ఉచితంగానే పరిష్కరిస్తుంది. -
కియా రీకాల్.. వందలాది ఈవీ6 కార్లు వెనక్కి
ప్రముఖ వాహన తయారీ సంస్థ.. కియా మోటార్స్ (Kia Motors) తన 'ఈవీ6' (EV6) కోసం స్వచ్చందంగా రీకాల్ ప్రకటించింది. 2022 మార్చి 3 నుంచి 2023 ఏప్రిల్ 14 మధ్య తయారైన మొత్తం 1,380 యూనిట్లలో సమస్య ఉన్నట్లు గుర్తించి ఈ రీకాల్ ప్రకటించడం జరిగింది.కియా ఈవీ6 ఎలక్ట్రిక్ కార్లలో.. ఇంటిగ్రేటెడ్ ఛార్జింగ్ కంట్రోల్ యూనిట్ (ICCU)లో 12వీ బ్యాటరీ పనితీరును ప్రభావితం చేసే లోపం కారణంగా రీకాల్ పరకటించింది. ఈ సమస్య కారణంగా.. 2024లో కూడా కంపెనీ 1138 యూనిట్లకు రీకాల్ ప్రకటించింది. ఇప్పుడు మరోమారు రీకాల్ జారీచేసింది.ఇంటిగ్రేటెడ్ ఛార్జింగ్ కంట్రోల్ యూనిట్ (ICCU)లోని సాఫ్ట్వేర్ అప్డేట్ 12వీ బ్యాటరీ ఛార్జింగ్.. పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది కారులోని లైట్స్, వైపర్లు, మ్యూజిక్ సిస్టమ్ వంటి వాటికి శక్తిని ఇస్తుంది. కార్లలో ఈ లోపాన్ని కంపెనీ ఉచితంగానే పరిష్కరిస్తుంది. అయితే సంబంధిత వాహనాల యజమానులను నేరుగా సంప్రదించి వాటిని అప్డేట్ చేస్తామని కంపెనీ పేర్కొంది.ఇదీ చదవండి: భారత్‌లోని బెస్ట్ అడ్వెంచర్ బైకులు ఇవే!.. ధరలు ఎలా ఉన్నాయంటే?ప్రభావిత వాహనాల కస్టమర్లు అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసుకోవడానికి.. సంబంధిత కియా డీలర్‌షిప్‌లను సంప్రదించవచ్చు, లేదా ఇతర వివరాల కోసం టోల్ ఫ్రీ నెంబర్‌కి కాల్ చేయవచ్చు. కియా రీకాల్ గురించి రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) కు కూడా సమాచారం అందించింది. -
భారత్‌లోని బెస్ట్ అడ్వెంచర్ బైకులు ఇవే!.. ధరలు ఎలా ఉన్నాయంటే?
ఇండియన్ మార్కెట్లో రోజువారీ వినియోగానికి ఉపయోగపడే బైకులకు మాత్రమే కాకుండా.. అడ్వెంచర్ బైకులకు కూడా మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు సంస్థలు దేశీయ విఫణిలో సరికొత్త అలాంటి బైకులను లాంచ్ చేస్తున్నాయి. ఈ కథనంలో రూ. 3 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే ఐదు బెస్ట్ అడ్వెంచర్ మోటార్ సైకిళ్ళ గురించి తెలుసుకుందాం.సుజుకి వీ-స్ట్రోమ్ ఎస్ఎక్స్ (Suzuki V-Strom SX)సుజుకి వీ-స్ట్రోమ్ ఎస్ఎక్స్ దేశీయ విఫణిలో ఎక్కువ మందిని ఆకర్శించిన బైక్. దీని ధర రూ. 2.16 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ కొనుగోలుపై కంపెనీ ఇప్పుడు (ఫిబ్రవరి) రూ. 15,000 తగ్గింపును అందిస్తోంది. ఈ బైక్ 249 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ద్వారా 9300 rpm వద్ద, 26.1 Bhp పవర్, 7300 rpm వద్ద 22.2 Nm టార్క్ అందిస్తుంది. ఈ బైక్ పొడవైన విండ్‌స్క్రీన్, బీక్ స్టైల్ ఫ్రంట్ ఫెండర్, మస్క్యులర్ ఫ్యూయెల్ ట్యాంక్‌తో మంచి డిజైన్ పొందుతుంది. ఇందులో ఎల్ఈడీ హెడ్‌లైట్, బ్లూటూత్ ఎనేబుల్డ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, USB ఛార్జింగ్ స్లాట్ వంటివన్నీ ఉన్నాయి.హీరో ఎక్స్‌పల్స్ 210 (Hero XPulse 210)ఈఐసీఎంఏ 2024లో కనిపించిన హీరో ఎక్స్‌పల్స్ 210 అనేది.. అడ్వెంచర్ లైనప్‌లో తాజా వెర్షన్. ఇది ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీలో జరిగిన భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో లాంచ్ అయింది. దీని ధర రూ. 1.75 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైకులోని 210 సీసీ ఇంజిన్ 9250 rpm వద్ద, 24.2 Bhp పవర్, 7250 rpm వద్ద 20.7 Nm టార్క్ అందిస్తుంది. కొత్త డిజైన్ కలిగిన ఈ బైక్.. మంచి ఆఫ్ రోడ్ అనుభూతిని కూడా అందిస్తుంది.కేటీఎమ్ 250 అడ్వెంచర్ (KTM 250 Adventure)అడ్వెంచర్ బైక్ అంటే.. అందరికీ ముందుగా గుర్తొచ్చేది కేటీఎమ్ బైకులే. కాబట్టి రూ. 3 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే బైకుల జాబితాలో 'కేటీఎమ్ 250 అడ్వెంచర్' ఉంది. దీని ధర రూ. 2.59 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). ఇందులోని 249 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్.. 9250 rpm వద్ద 30.5 Bhp పవర్, 7250 rpm వద్ద 24 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.యెజ్డీ అడ్వెంచర్ (Yezdi Adventure)రూ. 2.09 లక్షల ప్రారంభ ధర వద్ద లభించే.. యెజ్డీ అడ్వెంచర్ కూడా మన జాబితాలో చెప్పుకోదగ్గ బైక్. ఇది 334 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ద్వారా 8000 rpm వద్ద 29.1 Bhp పవర్, 6500 rpm వద్ద 29.8 Nm టార్క్ అందిస్తుంది. ఇది రౌండ్ ఎల్ఈడీ హెడ్‌లైట్, పొడవైన విండ్‌స్క్రీన్, స్ప్లిట్ సీట్లు, వైర్-స్పోక్ వీల్స్ వంటివి పొందుతుంది. కాబట్టి మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.ఇదీ చదవండి: ఫాస్ట్‌ట్యాగ్ కొత్త రూల్స్: ఆ టోల్ ప్లాజాలకు వర్తించదురాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ (Royal Enfield Himalayan)అడ్వెంచర్ చేసేవారికి ఇష్టమైన బైకులలో చెప్పుకోదగ్గ మోడల్ ''రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్''. ఇది 452 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ద్వారా.. 8000 rpm వద్ద 39.4 Bhp పవర్, 5500 rpm వద్ద 40 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైకులో రౌండ్ TFT డిస్ప్లే, ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్, రైడ్-బై-వైర్, మల్టిపుల్ రైడింగ్ మోడ్లు, లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. దీని ధర రూ. 2.85 లక్షలు (ఎక్స్ షోరూమ్). -
హ్యుందాయ్ తయారీ కేంద్రంగా భారత్
పొరుగు దేశాలతో పాటు ఆఫ్రికా తదితర వర్ధమాన మార్కెట్లకు ఎగుమతులు చేసేందుకు భారత్‌ను తయారీ హబ్‌గా మార్చుకోనున్నట్లు ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ (Hyundai) మోటర్ ఇండియా ఎండీ అన్సూ కిమ్ తెలిపారు. దేశీయంగా కార్యకలాపాలను విస్తరించనున్నట్లు వివరించారు.ఆఫ్రికా, మెక్సికో, లాటిన్ అమెరికా మార్కెట్లన్నింటిలోనూ అమ్మకాలు పెరుగుతున్నాయని వివరించారు. రిస్కులను తగ్గించుకునేందుకు ఇతర మార్కెట్లపై కూడా దృష్టి పెట్టనున్నట్లు వివరించారు. నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక లాంటి పొరుగు దేశాలకు కూడా ఎగుమతులు పెంచుకోనున్నట్లు పేర్కొన్నారు.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో హ్యుందాయ్ వాహన ఎగుమతులు 43,650 యూనిట్ల నుంచి 40,386 యూనిట్లకు తగ్గాయి. 2024 క్యాలెండర్ సంవత్సరంలో హ్యుందాయ్ మొత్తం 1,58,686 యూనిట్లను ఎగుమతి చేసింది. గతేడాది సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, మెక్సికో, చిలీ, పెరూ అతి పెద్ద ఎగుమతి మార్కెట్లుగా నిలిచాయి.పేద విద్యార్థులకు సాయంహ్యుందాయ్ మోటార్ ఇండియా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు అండగా నిలుస్తోంది. హ్యుందాయ్ హోప్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ పేరిట స్కాలర్షిప్లను ఇస్తోంది. తాజాగా ఆ కంపెనీ మొత్తం రూ.3.38 కోట్ల స్కాలర్షిప్ను అందించింది. దేశంలని 23 రాష్ట్రాల నుండి దరఖాస్తులు వచ్చాయి. 783 మంది ప్రతిభావంత విద్యార్థులు ఈ స్కాలర్షిప్లు అందుకున్నారు. వీరిలో 440 మంది విద్యార్థులు సివిల్ సర్వీసెస్ పరీక్ష, క్టాట్‌కి సిద్ధమవుతున్నారు. 343 మంది విద్యార్థులు ఐఐటీల నుండి వచ్చారు. హ్యుందాయ్ ఈ కార్యక్రమాన్ని 2024 ఆగస్టులో ప్రారంభించింది. -
మస్క్ వైఖరి ‘చాలా అన్యాయం’
భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటన ముగిసిన తర్వాత టెస్లా ఇండియాలో ప్రవేశించేందుకు లైన్ క్లియర్ అయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే భారత్‌లో తన కార్యకలాపాలు సాగించేందుకు టెస్లా చర్యలకు పూనుకుంది. ఈ వ్యవహారంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ఫ్యాక్టరీ ఏర్పాటుచేయాలన్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) నిర్ణయం ‘చాలా అన్యాయం’ అని తెలిపారు. మస్క్ సమక్షంలోనే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.భారీగా టారిఫ్లుప్రతి దేశం అమెరికా వస్తువులపై భారీగా దిగుమతి సుంకాలను విధిస్తూ యూఎస్‌ను బాగా ఉపయోగించుకుంటోందని తెలిపారు. భారత్ అందుకు మంచి ఉదాహరణ అని అన్నారు. ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలపై దిగుమతి సుంకం 100 శాతంగా ఉందని, దేశంలో కార్లను విక్రయించడం టెస్లాకు దాదాపు అసాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. మస్క్ భారత్‌లో ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని చెప్పారు. కానీ, అమెరికా పరంగా అది చాలా అన్యాయమన్నారు. భారత్‌లోని సుంకాలను ఉద్దేశించి సమన్యాయం, న్యాయమైన వాణిజ్య పద్ధతుల ఆవశ్యకతను ట్రంప్ నొక్కిచెప్పారు. ఇదీ చదవండి: యాక్టివ్‌గా ఉన్న కంపెనీలు 65 శాతమేసుంకాలు తగ్గింపుమోదీ అమెరికా పర్యటన సందర్భంగా మస్క్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరిగిన సమావేశం అనంతరం ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సుంకాలపై విమర్శలు ఉన్నప్పటికీ భారతదేశం ఇటీవల హైఎండ్ కార్లపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని 110 శాతం నుంచి 70 శాతానికి తగ్గించింది. ఇది భారత మార్కెట్లోకి టెస్లా ప్రవేశానికి మార్గం సుగమం చేస్తుంది. టెస్లా ఇప్పటికే న్యూఢిల్లీ, ముంబైల్లో షోరూమ్‌ల కోసం స్థలాలను గుర్తించినట్లు ప్రకటించింది. భారతదేశంలో పని చేసేందుకు మిడ్ లెవల్ పొజిషన్లను భర్తీ చేసేందుకు ప్రకటన జారీ చేసింది. అధిక టారిఫ్‌లు ఉన్నప్పటికీ భారత మార్కెట్లో టెస్లా తన ఉనికిని చాటేందుకు చర్యలు చేపట్టింది. -
జియో థింగ్స్‌తో ప్యూర్ ఈవీ ఒప్పందం
ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారు ప్యూర్ ఈవీ(PURE EV) తన ఉత్పత్తుల్లో స్మార్ట్ డిజిటల్ క్లస్టర్లను ఏకీకృతం చేయడానికి జియో ప్లాట్‌ఫామ్ లిమిటెడ్ అనుబంధ సంస్థ జియో థింగ్స్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం వల్ల అధునాతన ఐఓటీ(ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) పరిష్కారాలు, అంతరాయం లేని కనెక్టివిటీ, పూర్తి డిజిటల్ ఇంటిగ్రేషన్‌ను అందించేందుకు తోడ్పడుతుందని కంపెనీ తెలిపింది.జియోథింగ్స్ ఇంటిగ్రేషన్ సాయంతో ద్విచక్రవాహనంలో ఎంటర్టైన్మెంట్, నావిగేషన్ సేవలు వంటివాటిని వాయిస్ ద్వారా నియంత్రించవచ్చని సంస్థ పేర్కొంది. వాహనదారులు వారి ప్రాధాన్యతలకు అనుగుణంగా వాహనంలోని టెక్నాలజీ ఇంటర్ఫేస్ను మార్చుకోవచ్చు. అందుకోసం వాయిస్ కమాండ్లను ఉపయోగించవచ్చు. దాంతో మెరుగైన రైడింగ్ అనుభూతిని పొందవచ్చని కంపెనీ స్పష్టం చేసింది.ప్యూర్ ఈవీ జియోథింగ్స్ స్మార్ట్ డిజిటల్ క్లస్టర్ల సాయంతో ఎండ్-టు-ఎండ్ ఐఓటీ పరిష్కారాలు అందించేందుకు ప్రయత్నిస్తుంది. వాహనాల పనితీరును ట్రాక్ చేయడానికి 4G కనెక్టివిటీ ఎనేబుల్ చేసిన టెలిమాటిక్స్ ద్వారా రియల్ టైమ్‌లో వాహనం కండిషన్‌ను పర్యవేక్షించవచ్చు. ఇందుకోసం జియోథింగ్స్ 4జీ స్మార్ట్ డిజిటల్ క్లస్టర్ ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ (ఏఓఎస్‌పీ) ‘అవ్ని ఓఎస్’ను ఉపయోగిస్తుంది. ఇది రియల్ టైమ్ డేటా అనలిటిక్స్, టూ వీలర్ ఇంటర్ఫేస్ కస్టమైజేషన్, ఫుల్ హెచ్డీ టచ్‌స్క్రీన్ డిస్ప్లే కంపాటబిలిటీని అందిస్తుంది. జియోస్టోర్, మ్యూజిక్ స్ట్రీమింగ్, వెబ్ బ్రౌజింగ్, హ్యాండ్స్ ఫ్రీ వాయిస్ అసిస్టెన్స్, నావిగేషన్, గేమింగ్‌తోపాటు మరెన్నో సదుపాయాలను అందిస్తున్నారు.ఇదీ చదవండి: రూ.80 వేలు ఇన్వెస్ట్ చేస్తే రూ.1.15 లక్షలు గ్యారెంటీ!జియో థింగ్స్ ఐఓటీ టెక్నాలజీ సాయంతో ప్యూర్ ఈవీ ఉత్పత్తులను పరిశ్రమ అత్యున్నత ప్రమాణాలకు తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సంస్థ వ్యవస్థాపకులు, ఎండీ డాక్టర్ నిశాంత్ డోంగారి అన్నారు. వాహనాల సామర్థ్యం, ఎలక్ట్రిక్ మొబిలిటీని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. సంస్థ వినియోగదారులకు సాంకేతికత సాయంతో మెరుగైన కనెక్టివిటీ, ఫంక్షనాలిటీని అందించనున్నట్లు చెప్పారు. జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ ప్రెసిడెంట్ ఆశిష్ లోధా మాట్లాడుతూ.. ‘ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగంలో సృజనాత్మకతను పెంచుకోవాలనుకునే ప్యూర్ ఈవీ వంటి సంస్థతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. మా అధునాతన ఐఓటీ పరిష్కారాలను ఏకీకృతం చేయడం ద్వారా వినియోగదారులకు అత్యుత్తమ అనుభవాన్ని అందించేందుకు కృషి చేస్తున్నాం’ అన్నారు. -
భారత్‌లో ప్రవేశించేందుకు సిద్ధమవుతున్న టెస్లా
ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ), పునరుత్పాదక ఇంధన రంగాల్లో గ్లోబల్ లీడర్‌గా ఉన్న టెస్లా ఇంక్ భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌ల మధ్య సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలో కొన్ని వాణిజ్య అంశాలపై చర్చించారు. అందులో భాగంగా టెస్లా భారత్‌లో ప్రవేశానికి సంబంధించిన అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. దాంతో త్వరలో దీనిపై నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈ అనుమానాలకు ఊతమిచ్చేలా ముంబై, ఢిల్లీలో కస్టమర్ ఫేసింగ్, బ్యాకెండ్ పొజిషన్లలో పని చేసేందుకు 13 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు టెస్లా ప్రకటించింది. దాంతో టెస్టా భారత్‌లో ప్రవేశించేందుకు అడ్డంకులు తొలిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.వ్యూహాత్మక ఎత్తుగడ..టెస్లా భారతదేశంలో నియామకాలు చేపట్టాలని తీసుకున్న నిర్ణయం దేశంలో తన ఉనికిని స్థాపించే దిశగా ఒక కీలక అడుగుగా భావిస్తున్నారు. సర్వీస్ టెక్నీషియన్, టెస్లా అడ్వైజర్, ఇన్సైడ్ సేల్స్ అడ్వైజర్, స్టోర్ మేనేజర్, బిజినెస్ ఆపరేషన్స్ అనలిస్ట్ వంటి పోస్టులను ఈ మేరకు భర్తీ చేయనున్నారు. హైఎండ్ కార్లపై దిగుమతి సుంకాన్ని భారతదేశం ఇటీవల 110% నుంచి 70%కు తగ్గించిన తరువాత ఇలా నియామకాలు చేపడుతున్నట్లు ప్రకటించారు. టెస్లా వంటి లగ్జరీ కార్ల తయారీదారులు మార్కెట్లోకి ప్రవేశించడం ఆర్థికంగా మరింత లాభదాయకంగా మారనుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.భారత మార్కెట్లో అవకాశాలుచైనా వంటి దేశాలతో పోలిస్తే భారత ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ ఇంకా తక్కువగానే ఉంది. 2024లో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు 1,00,000 యూనిట్లకు దగ్గరగా ఉన్నందున భారత ప్రభుత్వం ఈ రంగంలో మరింత వృద్ధి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. అందుకోసం ఎలక్ట్రిక్ వాహన తయారీదారులకు ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఈ వ్యవహారం టెస్లాకు గణనీయమైన అవకాశాన్ని అందించనుంది. 2070 నాటికి నికర సున్నా ఉద్గారాలను సాధించడానికి దేశం కట్టుబడి ఉంది. అందుకోసం సుస్థిర ఇంధన పరిష్కారాలను ప్రోత్సహించడంలో భాగంగా టెస్లా వంటి కంపెనీలకు కేంద్రం ఆమోదముద్ర వేసే అవకాశాలు కనిపిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: పరుగు ఆపని పసిడి! తులం ఎంతంటే..స్టార్ లింక్‌కు గ్రీన్ సిగ్నల్..?ఇటీవల మస్క్-మోదీల మధ్య జరిగిన సమావేశం అనంతరం మస్క్‌కు చెందిన శాటిలైట్ బ్రాడ్ బ్యాండ్ సర్వీస్ స్టార్ లింక్ భారత మార్కెట్లోకి ప్రవేశించడంపై కూడా చర్చ జరుగుతుంది. ట్రాయ్ ఆంక్షల కారణంగా స్టార్ లింక్ భారత్‌లోకి ప్రవేశించడం ఆలస్యం అవుతుంది. అయితే మోదీ, మస్క్ ఇద్దరూ ఈ సమస్యలను పరిష్కరించడానికి ఆసక్తిని వ్యక్తం చేసినట్లు తెలిసింది. స్టార్ లింక్ లైసెన్సింగ్ సవాళ్ల పరిష్కారానికి భారత ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ఇది రెండు దేశాల మధ్య సాంకేతిక సహకారాన్ని పెంపొందించడానికి మార్గం సుగమం చేస్తుందని కొందరు అధికారులు తెలియజేస్తున్నారు. -
ఎంజీ సెలెక్ట్ డీలర్‌గా ఐకానిక్ ఆటోమొబైల్స్
ముంబై: జేఎస్‌డబ్ల్యూ ఎంజీ లగ్జరీ బ్రాండ్ ‘ఎంజీ సెలెక్ట్’ డీలర్‌గా ‘ఐకానిక్ ఆటోమొబైల్స్’ ఎన్నికైంది. బెంగళూరు కేంద్రంగా కొత్త తరం కొనుగోలుదారులకు నాణ్యమైన సేవలు అందించనుంది. ఎంజీ సెలెక్ట్ బ్రాండ్‌లో భాగంగా వస్తున్న తొలి విద్యుత్ స్పోర్ట్స్ కారు ‘సైబర్‌స్టర్’, ఎంజీ ఎం9 మోడళ్లను కస్టమర్లకు మరింత చేరువ చేస్తుందని ఎంజీ సెలెక్ట్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ మిలింద్ అన్నారు. ఐకానిక్ ఆటోమొబైల్స్తో మొత్తం 12 డీలర్లను ఎంజీ సెలెక్ట్ ఎంపిక చేసుకుంది. ఈ డీలర్íÙప్ భాగస్వాములు దేశవ్యాప్తంగా 13 నగరాల్లో నెలకొల్పిన 14 ఎంజీ సెలెక్ట్ టచ్ పాయింట్ల ద్వారా సేవలు అందించనున్నాయి. -
ఎన్ఎక్స్200 vs ఎక్స్‌పల్స్ 200 4వీ: ఏది బెస్ట్ బైక్?
భారతదేశంలో ప్రముఖ టూ-వీలర్ తయారీ సంస్థ అయిన.. హోండా మోటార్‌సైకిల్ (Honda Motorcycle) తన సీబీ200ఎక్స్ స్థానంలో 'ఎన్ఎక్స్200'ను లాంచ్ చేసింది. కంపెనీ దీనిని అడ్వెంచర్ టూరర్ అని పిలిచింది. ఈ బైక్ టూరింగ్ కోసం ఎక్కువమంది కొనుగోలు చేస్తున్నప్పటికీ.. ఇది హీరో ఎక్స్‌పల్స్ 200 4Vకి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ రెండు బైకుల మధ్య వ్యత్యాసం ఏంటో ఇక్కడ చూద్దాం.ధర: హోండా ఎన్ఎక్స్200 ఒక వేరియంట్లో మాత్రమే రూ. 1.68 లక్షలకు అందుబాటులో ఉంది. కాగా హీరో ఎక్స్‌పల్స్ 200 4వీ స్టాండర్డ్, ప్రో, ప్రో డాకర్ ఎడిషన్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు రూ. 1.51 లక్షల నుంచి రూ. 1.67 లక్షల (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.ఫీచర్స్: హోండా ఎన్ఎక్స్200.. హీరో ఎక్స్‌పల్స్ 200 4వీ రెండూ కూడా బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, ఎల్ఈడీ హెడ్‌లైట్, టెయిల్‌లైట్, టర్న్ ఇండికేటర్లు, USB ఛార్జింగ్ పోర్ట్ వంటి వాటిని పొందుతాయి. ఎక్స్‌పల్స్ 200 4వీ టర్న్-బై-టర్న్ నావిగేషన్ పొందుతుంది, ఎన్ఎక్స్200 ట్రాక్షన్ కంట్రోల్ పొందుతుంది.ఇదీ చదవండి: బీవైడీ సీలియన్ 7 వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?హీరో ఎక్స్‌పల్స్ 200 4వీ, హోండా ఎన్ఎక్స్200 కంటే ఎత్తుగా, పొడవుగా, వెడల్పుగా ఉంటుంది. డిజైన్ కూడా భిన్నంగా ఉంటుంది. హోండా ముందు భాగంలో అప్సైడ్డౌన్ ఫోర్కే పొందుతుంది. కానీ హీరో దాని సస్పెన్షన్ సెటప్ కోసం ఫుల్లీ అడ్జస్టబుల్ పొందుతుంది.పవర్‌ట్రెయిన్: హీరో ఎక్స్‌పల్స్ 200 4వీ.. 199.6 సీసీ సింగిల్ సిలిండర్, ఆయిల్ - కూల్డ్ ఇంజిన్ కలిగి 8,500 rpm వద్ద 18.9 Bhp & 6,500 rpm వద్ద 17.35 Nm టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఇక హోండా ఎన్ఎక్స్200 బైక్ 184.4 సీసీ సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ద్వారా 17.03 bhp పవర్, 15.9 Nm టార్క్ అందిస్తుంది. ఇందులో కూడా 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంటుంది. రెండూ కూడా ఉత్తమ పనితీరును అందిస్తాయి. -
బీవైడీ సీలియన్ 7 వచ్చేసింది: ధర ఎంతో తెలుసా?
బీవైడీ కంపెనీ తన 'సీలియన్ 7' (Sealion 7) ఎలక్ట్రిక్ కారును ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కారు రెండు వేరియంట్లలో.. నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. సరికొత్త బీవైడీ ఎలక్ట్రిక్ కారు గురించి మరిన్ని వివరాలు వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.దేశీయ విఫణిలో లాంచ్ అయిన కొత్త బీవైడీ సీలియన్ 7 కారు ప్రీమియం, పెర్ఫార్మెన్స్ అనే వేరియంట్లలో లభిస్తుంది. వాటి ధరలు వరుసగా.. రూ. 48.9 లక్షలు, రూ. 54.9 లక్షలు (ఎక్స్ షోరూమ్). జనవరి ప్రారంభంలోనే కంపెనీ ఆ కారు కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు మార్చి 7 నుంచి ప్రారంభమవుతాయి.కొత్త డిజైన్ కలిగిన బీవైడీ సీలియన్.. క్రాస్ఓవర్ మాదిరిగా ఉంటుంది. ఇది వాలుగా ఉండే రూఫ్‌లైన్, అప్డేటెడ్ ఫ్రంట్ బంపర్ పొందుతుంది. హెడ్‌లైట్స్, టెయిల్ ల్యాంప్ వంటివన్నీ 'బీవైడీ సీల్'ను పోలి ఉంటుంది. ప్రీమియం వేరియంట్ 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, పెర్ఫార్మెన్స్ వేరియంట్ 20 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది.ఇదీ చదవండి: ఫాస్ట్‌ట్యాగ్ కొత్త రూల్స్: ఈ రోజు నుంచే..ఫీచర్స్ విషయానికి వస్తే.. బీవైడీ సీలియన్ ఈవీ 15.6 ఇంచెస్ రొటేటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ పొందుతుంది. ఇది కారు గురించి చాలా సమాచారం అందిస్తుంది. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, కనెక్టెడ్ కార్ టెక్, మెమరీ ఫంక్షన్‌తో ఎలక్ట్రికల్‌గా అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, ఫ్లోటింగ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, సన్‌షేడ్‌తో పనోరమిక్ గ్లాస్ రూఫ్, వైర్లెస్ ఫోన్ ఛార్జర్ వంటి ఫీచర్స్ కూడా ఈ కారులో ఉన్నాయి.బీవైడీ సీలియన్ 7 ఈవీ 82.56 కిలోవాట్ బ్యాటరీ పొందుతుంది. ప్రీమియం వేరియంట్ ఒక సింగిల్ ఛార్జితో 482 కిమీ రేంజ్ అందిస్తే.. పెర్ఫార్మెన్స్ వేరియంట్ 456 కిమీ రేంజ్ అందిస్తుంది. మొత్తం మీద ఈ రెండు కార్లు అత్యుత్తమ పనితీరును అందిస్తాయి. ఈ కారు 'వోల్వో సీ40 రీఛార్జ్'కు ప్రత్యర్థిగా ఉంటుంది. -
ఫాస్ట్‌ట్యాగ్ కొత్త రూల్స్: ఈ రోజు నుంచే..
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ 'ఫాస్ట్‌ట్యాగ్' (FASTag)లో రెండు కొత్త మార్పులను జారీ చేశాయి. టోల్ చెల్లింపులను క్రమబద్ధీకరించడం, వివాదాలను తగ్గించడం లక్ష్యంగా లావాదేవీలు ఈ రూల్స్ ప్రవేశపెట్టారు. కొత్త నియమాలు ఈ రోజు (ఫిబ్రవరి 17) నుంచి అమలులోకి వస్తాయి.తక్కువ బ్యాలెన్స్, చెల్లింపులలో ఆలస్యం లేదా బ్లాక్‌లిస్ట్ ఫాస్ట్‌ట్యాగ్‌లు కలిగిన వాహనదారులు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ జరిమానాలు చెల్లించకుండా.. ఉండాలంటే, ఫాస్ట్‌ట్యాగ్‌లో తగినంత బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి. అవి బ్లాక్‌లిస్ట్‌లో ఉన్నాయా.. లేదా.. అనే విషయాన్ని కూడా చెక్ చేసుకోవాలి.ఫాస్ట్‌ట్యాగ్‌లో తగిన బ్యాలెన్స్ లేకపోతే.. అది బ్లాక్‌లిస్ట్‌లోకి వెళ్తుంది. టోల్‌ప్లాజా రీడర్ వద్దకు చేరుకునే సమయానికి ఒక గంట లేదా 60 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఫాస్ట్‌ట్యాగ్ ఇన్‌యాక్టివ్‌లోనే ఉంటే కోడ్ 176 ఎర్రర్‌ను చూపి లావాదేవీలు క్యాన్సిల్ అవుతాయి. అంతే కాకుండా మీరు స్కాన్ చేసిన 10 నిమిషాల తరువాత ఇన్‌యాక్టివ్‌లోకి వెళ్లినా.. మళ్ళీ లావాదేవీలు రిజెక్ట్ అవుతాయి. ఇలా లావాదేవీలు క్యాన్సిల్ అయినప్పుడు.. వాహనదారుడు ఫెనాల్టీ కింద రెట్టింపు టోల్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: జీతాల పెంపుపై టీసీఎస్ ప్రకటన: ఈ సారి ఎంతంటే..ఇక బ్లాక్‌లిస్ట్ నుంచి బయటపడాలంటే, తగినంత బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవడం మాత్రమే కాకుండా.. ఎప్పటికప్పుడు కేవైసీ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి దూర ప్రయాణాలు ప్రారంభించే ముందు ఖాతాల్లో తగినంత బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి. టోల్ ప్లాజాలను చేరుకునే ముందు FASTag బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి.ఫాస్ట్‌ట్యాగ్ లావాదేవీలు: నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకారం.. గత సంవత్సరం నవంబర్‌లో రూ.6,070 కోట్ల ఫాస్ట్‌ట్యాగ్ లావాదేవీలు జరిగాయి. డిసెంబర్ నాటికి లావాదేవీలు రూ.6,642 కోట్లకు చేరింది. ఈ సంఖ్య ఈ ఏడాది మళ్ళీ పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. -
హ్యుండై ఎగుమతులు 37 లక్షల యూనిట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హ్యుండై మోటార్ ఇండియా 37 లక్షల యూనిట్ల ప్యాసింజర్ వాహనాలను భారత్ నుంచి ఎగుమతి చేసి సరికొత్త మైలురాయిని అధిగమించింది. దేశం నుంచి 1999లో కంపెనీ ఎగుమతులు ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతం 60 దేశాలకు వివిధ మోడళ్ల కార్లను సరఫరా చేస్తోంది. 2024లో సంస్థకు సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, మెక్సికో, చిలీ, పెరూ అతిపెద్ద ఎగుమతి మార్కెట్లుగా అవతరించాయి. గత ఏడాది హ్యుండై 1,58,686 యూనిట్లు ఎగుమతి చేసి భారత్‌లో ప్యాసింజర్ వెహికిల్స్‌కు అతిపెద్ద ఎగుమతిదారుగా నిలిచింది. ఇక మన దేశం నుంచి హ్యుండై కార్లకు అతిపెద్ద దిగుమతిదారుగా ఆఫ్రికా తొలి స్థానంలో ఉంది. ఇప్పటి వరకు మొత్తం 10 లక్షలకుపైగా వాహనాలను ఆఫ్రికా అందుకుంది. తొలి స్థానంలో ఐ10..గడిచిన 25 ఏళ్లలో భారత్ నుంచి 150కిపైగా దేశాలకు వాహనాలను సరఫరా చేసినట్టు హ్యుండై తెలిపింది. తమిళనాడులో కంపెనీకి తయారీ కేంద్రాలు ఉన్నాయి. మొత్తం ఎగుమతుల్లో ఐ10 మోడల్ ఫ్యామిలీ 15 లక్షల యూనిట్లను దాటి టాప్–1లో నిలిచింది. వెర్నా సిరీస్‌లో 5,00,000 యూనిట్లు నమోదయ్యాయి. దక్షిణ కొరియా వెలుపల హ్యుండై అతిపెద్ద ఎగుమతి కేంద్రంగా భారత్‌ను నిలపాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందని హ్యుండై మోటార్ ఇండియా ఎండీ ఉన్సూ కిమ్ వెల్లడించారు. ఇటీవల దక్షిణాఫ్రికాకు ఎక్స్టర్ మోడల్‌ను ఎగుమతి చేయడం ప్రారంభించామని, అక్కడి మార్కెట్లో భారత్‌లో తయారు చేసిన ఎనిమిదవ వాహనంగా ఈ మోడల్ గుర్తింపు పొందిందని చెప్పారు. -
మహీంద్రా ఈవీల రికార్డు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మహీంద్రా తయారీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు ఎక్స్ఈవీ–9ఈ, బీఈ–6 సరికొత్త రికార్డు సృష్టించాయి. తొలి రోజు 30,179 యూనిట్ల బుకింగ్స్‌తో ఈవీ రైడ్‌కు సిద్ధం అయ్యాయి. ఎక్స్‌షోరూం ధర వద్ద వీటి విలువ రూ.8,472 కోట్లు. బుకింగ్స్‌లో ఎక్స్ఈవీ–9ఈ వాటా 56 శాతం నమోదైంది. ఈ రెండు మోడళ్లలో కలిపి అధిక సామర్థ్యం ఉన్న వేరియంట్స్‌కు వినియోగదార్లు మొగ్గుచూపారు. 79 కిలోవాట్ అవర్ బ్యాటరీ పొందుపరిచిన ప్యాక్–3ని 73 శాతం కస్టమర్లు ఎంచుకున్నారు. ప్రీమియం ఎలక్ట్రిక్ వాహనాల వైపు మార్కెట్ మళ్లుతోందనడానికి ఈ బుకింగ్స్ నిదర్శనంగా నిలిచాయి. 2024లో దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 99,068 యూనిట్లు మాత్రమే. ఈ నేపథ్యంలో మహీంద్రా కొత్త ఈవీల రికార్డు స్థాయి బుకింగ్స్ ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఎక్స్ఈవీ–9ఈ, బీఈ–6 డెలివరీలు మార్చి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ రెండు మోడళ్లూ 59 కిలోవాట్ అవర్, 79 కిలోవాట్ అవర్ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ ఆప్షన్స్‌తో తయారయ్యాయి. ఒకసారి చార్జ్ చేస్తే వేరియంట్‌ను బట్టి 535–682 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. -
కొనాలన్నా.. ఈ రెండు కార్లు దొరకవు!
ఇండియన్ మార్కెట్లో అధిక ప్రజాదరణ పొందిన.. ఆడి (Audi) కంపెనీ రెండు కార్లను వెబ్సైట్ నుంచి తొలగించింది. ఇందులో ఏ8ఎల్, ఆర్ఎస్ 5 స్పోర్ట్‌బ్యాక్ ఉన్నాయి. ఈ రెండు కార్లు భారతదేశానికి సీబీయూ (కంప్లీట్ బిల్డ్ యూనిట్) మార్గం ద్వారానే వచ్చాయి. ఆడి ఏ8 ఎల్ భారతదేశంలో 2020లో లాంచ్ అయింది, ఆర్ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ 2021 నుంచి అమ్మకానికి ఉంది. వీటి ధరలు వరుసగా రూ. 1.63 కోట్లు, రూ. 1.13 కోట్లు (ఎక్స్ షోరూమ్, ఇండియా).నాల్గవ తరం ఆడి ఏ8 ఎల్ 2017 నుంచి గ్లోబల్ మార్కెట్లో అందుబాటులో ఉంది. అయితే 2020లో భారతదేశానికి వచ్చింది. ఆ తరువాత 2022లో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ రూపంలో లాంచ్ అయింది. ఏ8 ఎల్ నాలుగు, ఐదు సీట్ల కాన్ఫిగరేషన్లలో.. సౌకర్యవంతమైన రియర్ సీటు పొందుతుంది. ఇందులోని 3.0 లీటర్ TFSI వీ6 టర్బో పెట్రోల్ ఇంజిన్.. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది.ఇక ఆడి ఆర్ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ విషయానికి వస్తే.. ఇది ఆగస్టు 2021లో ఇండియన్ మార్కెట్లో ప్రారంభమైంది. ఇందులోని 2.9 లీటర్ ట్విన్ టర్బో వీ6 ఇంజిన్ 450 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఏ8 మాదిరిగానే ఇది కూడా వెబ్సైట్ నుంచి కనుమరుగైంది. కాగా కంపెనీ ఫిబ్రవరి 17న భారతదేశంలో RS Q8 ఫేస్‌లిఫ్ట్ లాంచ్ చేసే అవకాశం ఉంది.ఇదీ చదవండి: బుకింగ్స్‌లో కనీవినీ ఎరుగని రికార్డ్!: ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే? -
బుకింగ్స్‌లో కనీవినీ ఎరుగని రికార్డ్!: ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే?
మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ తన 'బీఈ 6', 'ఎక్స్ఈవీ 9ఈ' ఎలక్ట్రిక్ కార్ల కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించిన తరువాత 30,179 బుకింగ్‌లను స్వీకరించింది. ఈ విషయాన్ని ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ (Twitter) ఖాతాలో వెల్లడించారు.ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో.. మహీంద్రా కార్లు సరికొత్త రికార్డును సృష్టించాయి. మొదటి రోజు 30,179 బుకింగ్‌లు సాధించాయి. ఇంకో రెండు బుకింగ్స్ కావలి అని ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) పేర్కొంటూ.. ధన్యవాదాలు తెలిపారు. ఈ బుకింగ్ విలువ ఏకంగా రూ. 8472 కోట్లు (ఎక్స్ షోరూమ్).శుక్రవారం ప్రారంభమైన మహీంద్రా ఎలక్ట్రిక్ కార్ల బుకింగ్‌లలో XEV 9e 56 శాతం బుకింగ్స్ సాధించింది. BE 6 44 శాతం బుకింగ్స్ పొందింది. ఎక్కువమంది 79 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగిన ప్యాక్ త్రీ టాప్ మోడల్స్ బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది.మహీంద్రా BE 6 ఐదు వేరియంట్లలో లభిస్తుంది. దీని ధర రూ. 18.90 లక్షల నుంచి రూ. 26.90 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. మహీంద్రా XEV 9e నాలుగు వేరియంట్లలో ఉంటుంది. దీని ధర రూ. 21.90 లక్షల నుంచి రూ. 30.50 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.Mahindra Electric Origin SUVs create a new record in EV category by clocking 30,179 Bookings on Day 1 with booking value of ₹8,472 Crore (at ex-showroom price).There are only two more words needed:THANK YOU! pic.twitter.com/X2Ftj9CMED— anand mahindra (@anandmahindra) February 14, 2025 -
రూ.12.90 లక్షల కవాసకి కొత్త బైక్ ఇదే..
కవాసకి కంపెనీ.. దేశీయ విఫణిలో కొత్త 'నింజా 1100ఎస్ఎక్స్' బైక్ లాంచ్ చేసిన.. దాదాపు రెండు నెలల తర్వాత, 'వెర్సిస్ 1100' (Kawasaki Ninja Versys 1100)ను రూ. 12.90 లక్షల (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లాంచ్ చేసింది. చూడటానికి వెర్సిస్ 1000 మాదిరిగే ఉండే.. ఈ బైక్ ఇప్పుడు శక్తివంతమైన ఇంజిన్ పొందుతుంది.ఒకే వేరియంట్లో మాత్రమే అందుబాటులోకి వచ్చిన కవాసకి వెర్సిస్ 1100.. డ్యూయల్ టోన్ (మెటాలిక్ మాట్టే గ్రాఫేన్ స్టీల్ గ్రే / మెటాలిక్ డయాబ్లో బ్లాక్) ఫినిషింగ్ పొందుతుంది. ఈ బైక్ డెలివరీలు ఈ నెల (ఫిబ్రవరి 2025) చివరిలో ప్రారంభమవుతాయి.కవాసకి వెర్సిస్ 1100లో ఉన్న అతిపెద్ద అప్డేట్ ఏమిటంటే.. 1099 సీసీ ఇంజిన్. ఇది 9000 rpm వద్ద 133 Bhp పవర్, 7600 rpm వద్ద 112 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్ పొందుతుంది. ఇందులో క్విక్ షిఫ్టర్ కూడా అందుబాటులో ఉంది.కవాసకి వెర్సిస్ 1100 సస్పెన్షన్.. అవుట్గోయింగ్ మోడల్ 1000 మాదిరిగానే ఉంటుంది. ముందు భాగంలో ప్రీ-లోడ్ అడ్జస్టబుల్ 43 mm USD ఫోర్క్, వెనుక భాగంలో ప్రీ-లోడ్ మరియు రీబౌండ్ సర్దుబాటుతో గ్యాస్-ఛార్జ్డ్ మోనోషాక్ఫీచర్ల విషయానికొస్తే.. వెర్సిస్ 1100లో మల్టిపుల్ రైడింగ్ మోడ్లు, కార్నరింగ్ మేనేజ్మెంట్ ఫంక్షన్, కవాసకి ఇంటెలిజెంట్ ఏబీఎస్, సెలక్టబుల్ ట్రాక్షన్ కంట్రోల్, USB టైప్ సీ ఛార్జింగ్ పోర్ట్, అడ్జస్టబుల్ విండ్‌షీల్డ్ మొదలైనవన్నీ ఉన్నాయి. ఈ బైక్ కొనుగోలుదారులకు అదనపు పరికలు లేదా యాక్ససరీస్ కావాలంటే కొనుగోలు చేయవచ్చు. బైకును మరింత అందంగా డిజైన్ చేసుకోవచ్చు. -
మొదటి రోజే రూ.8,472 కోట్ల బుకింగ్‌లు
మహీంద్రా అండ్ మహీంద్రా కొత్త కార్ల కొనుగోలు కోసం వినియోగదారులు ఆసక్తి కనబరిచారు. కంపెనీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలకు రికార్డు స్థాయి బుకింగ్‌లు అందినట్లు పేర్కొంది. సంస్థ ఇటీవల ఆవిష్కరించిన ఎక్స్ఈవీ 9ఈ, బీఈ6ల మొదటి రోజు బుకింగ్ విలువ రూ.8,472 కోట్లుగా నమోదైంది. సుస్థిర, పర్యావరణ అనుకూల ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) కోసం పెరుగుతున్న డిమాండ్‌ను ఈ బుకింగ్‌లు హైలైట్ చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో మహీంద్రా సంస్థ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: ముంచుకొస్తున్న జనాభా సంక్షోభంమహీంద్రా ఎలక్ట్రిక్ వాహనాలను విస్తృత శ్రేణి వినియోగదారులు ఆదరిస్తున్నారని మొదటి రోజు బుకింగ్ డేటా సూచిస్తుంది. మొత్తం బుకింగ్స్‌లో ఎక్స్ ఈవీ 9ఈ 56 శాతం, బీఈ 6 44 శాతం వాటాను దక్కించుకున్నాయి. రెండు మోడళ్లు విభిన్న కస్టమర్ అవసరాలను ఆకట్టుకునే ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ, అధునాతన ఫీచర్లు, లగ్జరీల సదుపాయాలను కలిగి ఉన్నట్లు అధికారులు తెలిపారు. బుకింగ్‌లను పరిశీలిస్తే 79 కిలోవాట్ల బ్యాటరీని కలిగి ఉన్న టాప్ ఎండ్ వేరియంట్ ప్యాక్ త్రీకి డిమాండ్ అధికంగా ఉన్నట్లు తెలిసింది. మొత్తం బుకింగ్‌లలో ప్యాక్ త్రీ వేరియంట్ 73% వాటాను కలిగి ఉంది. ఇది లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ సామర్థ్యాన్ని అందించే వాహనం అని కంపెనీ పేర్కొంది. -
హోండా కొత్త బైక్.. మార్కెట్లోకి ఎన్ఎక్స్200
దేశంలో అడ్వెంచర్ టూరర్ మార్కెట్ వృద్ధి చెందుతోంది. హై సెట్ బైక్‌లకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా కంపెనీలు సరికొత్త లాంచ్‌లతో ముందుకువస్తున్నాయి. ఈ క్రమంలోనే హోండా కొత్త ఎన్ఎక్స్ 200 (Honda Nx200)ను మార్కెట్లో లాంచ్ చేసింది. దీని ధర రూ. 1.68 లక్షలుగా (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) కంపెనీ నిర్ణయించింది. ఎన్ఎక్స్ 200 అనేది రీబ్రాండెడ్ సీబీ200ఎక్స్.ఈ కొత్త చేరికతో హోండా భారత్‌లో విక్రయించే ఎన్ఎక్స్ శ్రేణి బైక్‌లు రెండుకు చేరతాయి. ఈ రేంజ్లో ఎన్ఎక్స్500ను ఇప్పటికే హోండా ఇక్కడ విక్రయిస్తోంది. భారత్‌లో ఎన్ఎక్స్కు మెరుగైన బ్రాండ్ రీకాల్, విలువ ఉన్న నేపథ్యంలో సీబీ200ఎక్స్‌ను ఎన్ఎక్స్200గా రీబ్రాండ్ చేయాలని హోండా నిర్ణయించినట్లు కనిపిస్తోంది.స్టైలింగ్ పరంగా ఎన్ఎక్స్200 కొన్ని చిన్న డిజైన్ జోడింపులు చేశారు. అయితే మొత్తంగా స్టైలింగ్‌లో పెద్దగా మార్పులు లేవు. కానీ మోటార్‌సైకిల్‌పై కొన్ని ప్రధాన ఫీచర్ అప్గ్రేడ్లు కనిపిస్తున్నాయి. అందులో డ్యూయల్-ఛానల్ ఏబీఎస్, బ్లూటూత్ ఇంటిగ్రేషన్‌తో టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ప్రధానంగా ఉన్నాయి.ఎన్ఎక్స్200 అదే 184సీసీ సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో వచ్చింది. కానీ ఇప్పుడు ఓబీడీ2బీ కాంప్లియన్స్తో వచ్చింది. ఇది 17 ps శక్తిని, 16.1 nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కాకుండా స్లిప్పర్ క్లచ్‌తో 5 స్పీడ్ గేర్‌బాక్స్‌ను ఈ బైక్‌లో జత చేశారు. హోండా ఎన్ఎక్స్200ను కంపెనీ ప్రీమియం డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయిస్తారు. ఇది మూడు రంగుల్లో లభిస్తుంది. బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మార్చి నుండి డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. -
వాహన జోరుకు యూవీల తోడు
తయారీ కంపెనీల నుంచి డీలర్లకు చేరిన ప్యాసింజర్ వాహనాల సంఖ్య దేశవ్యాప్తంగా జనవరిలో 1.6 శాతం పెరిగి 3,99,386 యూనిట్లకు చేరుకున్నాయి. జనవరి నెలలో ఇప్పటి వరకు ఇదే అత్యధికం. యుటిలిటీ వాహనాలకు బలమైన డిమాండ్ ఈ వృద్ధికి కారణం అని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) తెలిపింది.‘2024 జనవరితో పోలిస్తే హోల్‌సేల్‌గా యూవీ(యుటిలిటీ వాహనాలు)ల విక్రయాలు గత నెలలో 6 శాతం అధికమై 2,12,995 యూనిట్లుగా ఉంది. ప్యాసింజర్ కార్స్ అమ్మకాలు స్థిరంగా 1,27,065 యూనిట్లు నమోదయ్యాయి. వ్యాన్స్ 6.4 శాతం క్షీణించి 11,250 యూనిట్లకు పడిపోయాయి. మారుతీ సుజుకీ 4 శాతం వృద్ధితో 1,73,599 యూనిట్లు, హ్యుండై మోటార్ 5 శాతం తగ్గి 54,003, మహీంద్రా 17.6 శాతం దూసుకెళ్లి 50,659 యూనిట్లు దక్కించుకున్నాయి. ద్విచక్ర వాహనాల హోల్‌సేల్ అమ్మకాలు 2.1 శాతం పెరిగి 15,26,218 యూనిట్లుగా ఉంది. మోటార్‌సైకిళ్లు 3.1 శాతం తగ్గి 9,36,145, స్కూటర్స్ 12.4 శాతం పెరిగి 5,48,201, మోపెడ్స్ స్వల్పంగా తగ్గి 41,872 యూనిట్లకు చేరుకున్నాయి. త్రిచక్ర వాహనాలు 7.7 శాతం ఎగిసి 58,167 యూనిట్లను తాకాయి’ అని వివరించింది. ఇదీ చదవండి: శ్రీలంక పవర్ ప్రాజెక్టుల నుంచి అదానీ బైటికిటీవీఎస్ సప్లై చైన్‌లో మరింత వాటాద్విచక్ర వాహన దిగ్గజం టీవీఎస్ మోటార్ కంపెనీ తాజాగా టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్స్‌లో అదనపు వాటా కొనుగోలు చేసింది. బీఎస్ఈ బల్క్ డీల్ గణాంకాల ప్రకారం 1.52 శాతం వాటాకు సమానమైన 67.10 లక్షల షేర్లను సొంతం చేసుకుంది. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా ఇందుకు రూ. 107 కోట్లు వెచి్చంచింది. ఒక్కో షేరుకీ రూ. 159.42 సగటు ధరలో వీటిని కొనుగోలు చేసింది. ఈ లావాదేవీ తదుపరి టీవీఎస్ సప్లై చైన్‌లో టీవీఎస్ మోటార్ వాటా 2.39 శాతం నుంచి 3.91 శాతానికి బలపడింది. -
హోండా, నిస్సాన్ పొత్తు లేనట్టే!
టోక్యో: వ్యాపార ఏకీకరణపై చర్చలను ముగించినట్లు వాహన తయారీలో ఉన్న జపాన్ సంస్థలు హోండా, నిస్సాన్, మిత్సుబిషి గురువారం తెలిపాయి. అయితే ఎలక్ట్రిక్ వాహనాలు, అటానమస్ డ్రైవింగ్ వంటి స్మార్ట్ కార్ల అభివృద్ధిపై కలిసి పనిచేయడం కొనసాగిస్తామని ఈ మూడు సంస్థలు వెల్లడించాయి. ‘చర్చలు జాయింట్ హోల్డింగ్ కంపెనీని ఏర్పాటు చేయాలన్న అంశంపై జరగాలి. కానీ హోండా అనుబంధ సంస్థగా నిస్సాన్‌ను మార్చాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ప్రపంచ పోటీలో గెలవడానికి కంపెనీలను కలపాలి. కానీ నిస్సాన్ సామర్థ్యాన్ని గుర్తించడం లేదు. కాబట్టి నేను వారి ప్రతిపాదనను అంగీకరించలేను. హోండా లేకుండా నిస్సాన్ ఆర్థిక పునరుద్ధరణ లక్ష్యంగా పెట్టుకోబోతోంది’ అని నిస్సాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మకొటొ ఉషీడా మీడియాకు వెల్లడించారు.నిర్ణయం తీసుకోవడాన్ని వేగవంతం చేయడానికి హోండా స్టాక్ స్వాప్‌ను సూచించిందని హోండా చీఫ్ ఎగ్జిక్యూటివ్ తోషిహిరో మీబ్ అన్నారు. ‘నేను నిజంగా నిరాశ చెందాను. వ్యాపార అవకాశం గొప్పదని భావించాను. కానీ అది కార్యరూపం దాల్చాలంటే బాధ కలిగించే చర్యలు అవసరమని కూడా నాకు తెలుసు’ అని వివరించారు. నిస్సాన్‌లో ఫాక్స్‌కాన్‌కు వాటా?హోండా మోటార్ కంపెనీ, నిస్సాన్ మోటార్ కార్పొరేషన్ సంయుక్త హోల్డింగ్ కంపెనీని ఏర్పాటు చేయడానికి చర్చలు జరపబోతున్నట్లు 2024 డిసెంబర్లో ప్రకటించాయి. ఆ గ్రూప్‌లో చేరడాన్ని పరిశీలిస్తున్నట్లు మిత్సుబిషి మోటార్స్ కార్పొరేషన్ వెల్లడించింది. 2025 జూన్ నాటికి ఒప్పందాన్ని ఖరారు చేసి.. ఆగస్టు కల్లా హోల్డింగ్ కంపెనీని ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నట్లు హోండా, నిస్సాన్ మొదట్లో తెలిపాయి. ఇదిలావుంటే హోండా, నిస్సాన్ మధ్య చర్చలు విఫలమయ్యాయని జపాన్ మీడియా ఇటీవలి కాలంలో కథనాలు ప్రచురించింది. హోండాతో భాగస్వామ్యంలో ఒక చిన్న భాగస్వామిగా మారడానికి నిస్సాన్ నిరాకరించిందన్నది వార్తా కథనాల సారాంశం. నిస్సాన్‌లో వాటా తీసుకోవడాన్ని తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ పరిశీలిస్తోందన్న మీడియా ఊహాగానాల గురించి తనకు తెలియదని మీబ్ అన్నారు.ఇదీ చదవండి: స్పోర్ట్స్ టెక్నాలజీ మార్కెట్ @ రూ. 49,500 కోట్లు ఆర్థికంగా మెరుగ్గా హోండా..హోండా ఆర్థికంగా చాలా మెరుగ్గా ఉంది. అలాగే ఉమ్మడి కార్యనిర్వాహక బృందంలో ముందంజలో ఉంది. 2024 ఏప్రిల్–డిసెంబర్ లాభాలు 7 శాతం తగ్గి 5 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు హోండా నివేదించింది. మరోవైపు వాహన అమ్మకాలు పడిపోవడంతో జులై–సెప్టెంబర్ త్రైమాసికంలో నిస్సాన్ నష్టాలను ప్రకటించింది. దీని ఫలితంగా 9,000 మంది ఉద్యోగులను తొలగించాల్సి వచ్చింది. ఆ సమయంలో ఫలితాలకు బాధ్యత వహిస్తూ ఉషీడా తన వేతనంలో 50 శాతం కోత విధించుకున్నారు. -
ఎక్కువ స్టోరేజ్.. ఉత్తమ ఫీచర్స్: బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..
ఇండియన్ మార్కెట్లో.. తక్కువ ధర, ఎక్కువ రేంజ్, మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ ఉన్న స్కూటర్లను మాత్రమే కాకుండా, అండర్ సీట్ స్టోరేజ్ ఎక్కువ ఉన్న స్కూటర్లను కొనుగోలు చేయడానికి కూడా ఆసక్తి చూపుతున్నారు. ఈ కథనంలో ఎక్కువ స్టోరేజ్ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి తెలుసుకుందాం.ఏథర్ రిజ్టా (Ather Rizta)ఎక్కువ అండర్ సీట్ స్టోరేజ్ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ల జాబితాలో ఏథర్ రిజ్టా ఒకటి. దీని ధర రూ. 1.11 లక్షల నుంచి రూ. 1.47 లక్షల మధ్య ఉంది. ఈ స్కూటర్ అండర్ సీట్ స్టోరేజ్ 34 లీటర్లు. ఇందులో ఒక ఫుల్ హెల్మెట్, ఇతర వస్తువులను ఉంచవచ్చు. మంచి డిజైన్ కలిగిన ఈ స్కూటర్.. మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది.రివర్ ఇండీ (River Indie)ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఇతర స్కూటర్ల కంటే ఇది చాలా భిన్నంగా ఉంటుంది. ఈ స్కూటర్ అండర్ సీట్ స్టోరేజ్ ఏకంగా 43 లీటర్లు. కాబట్టి రెండు హెల్మెట్స్ సులభంగా ఉంచవచ్చు. ఇది కాకుండా అదనపు బాక్సులను అటాచ్ చేయడానికి రెండు వైపులా అల్లాయ్ పన్నీర్ మౌంట్లు ఇందులో ఉన్నాయి. దీని ధర రూ. 1.43 లక్షలు.బజాజ్ చేతక్ (Bajaj Chetak)35 లీటర్ల అండర్ సీట్ కలిగిన ఈ బజాజ్ చేతక్ కూడా.. ఎక్కువ అండర్ సీట్ స్టోరేజ్ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటి. ఎక్కువ స్టోరేజ్ కోసం కంపెనీ బ్యాటరీని ఫ్లోర్‌బోర్డ్‌లో ఫిక్స్ చేసింది. సరికొత్త డిజైన్ కలిగిన ఈ స్కూటర్.. ఉత్తమ ఫీచర్స్ పొందుతుంది. దీని ధర రూ. 1.20 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.ఓలా ఎస్1 ప్రో ప్లస్ జెన్ 3 (Ola S1 Pro Plus Gen 3)ఓలా ఎస్1 ప్రో ప్లస్ జెన్ 3 ఎలక్ట్రిక్ స్కూటర్ 34 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ పొందుతుంది. చూడటానికి స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. స్టోరేజ్ కెపాసిటీ ఇతర ఓలా స్కూటర్ల కంటే ఎక్కువ అందిస్తుంది. దీని ధర రూ. 1.55 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది ఒక సింగిల్ ఛార్జితో 300 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుంది.టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube)మార్కెట్లో అత్యధిక అమ్మకాలు పొందుతున్న ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ 32 లీటర్ అండర్ సీట్ స్టోరేజ్ పొందుతుంది. ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ. 1.26 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది ఒక సింగిల్ ఛార్జితో గరిష్టంగా 150 కిమీ రేంజ్ అందిస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది. -
బాలెనో ధరల పెంపు
పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల మధ్య మారుతీ సుజుకి(Maruti Suzuki) తన కార్లపై ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. కంపెనీ పాపులర్ మోడల్ అయిన బాలెనో(Baleno) ధరను పెంచుతున్నట్లు మారుతీ సుజుకి నిర్ణయం తీసుకుంది. వేరియంట్‌ను అనుసరించి రూ.9,000 ధరలో పెరుగుదల ఉంటుందని స్పష్టం చేసింది. సవరించిన ధరలతో బాలెనో రూ.6.70 లక్షల నుంచి ప్రారంభమై రూ.9.92 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.ఇదీ చదవండి: బంగారం ధర త్వరలో ‘లకారం’! తులం ఎంతంటే..బాలెనో సిగ్మా, డెల్టా, జీటా, ఆల్ఫా అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. వీటిలో పెట్రోల్, సీఎన్జీ మోడళ్లు కూడా ఉన్నాయి. ఈ కారు 88 హెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుందని కంపెనీ తెలిపింది. 113 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ (ఎంటీ) లేదా 5-స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ (ఏఎంటీ)తో వస్తుంది. ఎంటీ కలిగిన పెట్రోల్ వేరియంట్లు లీటరుకు 22.35 కిలోమీటర్లు, ఏఎంటీతో ఉన్న కార్లు 22.94 కిలోమీటర్ల మైలేజీని అందిస్తాయని కంపెనీ పేర్కొంది. సీఎన్జీ ఆధారిత వర్షన్ కిలోకు 30.61 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని చెప్పింది. ధరల పెరుగుదల డెల్టా ఏజీస్, జీటా ఏజీఎస్, ఆల్ఫా ఏజీఎస్ వేరియంట్లపై ఎక్కువగా ప్రభావం చూపుతుందని మోటార్ నిపుణులు అంటున్నారు. -
అమ్మకాల్లో తగ్గేదేలే.. మార్కెట్లో విండ్సర్ హవా!
భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని 'ఎంజీ మోటార్' (MG Motor) కొత్త 'విండ్సర్' (Windsor) లాంచ్ చేసింది. కంపెనీ ఈ కారును మార్కెట్లో లాంచ్ చేసినప్పటి నుంచి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. 2024 అక్టోబర్ నుంచి 3000 యూనిట్లకు తగ్గకుండా కంపెనీ విండ్సర్ కార్లను విక్రయిస్తోంది.ఎంజీ మోటార్ ఇండియా.. జనవరి 2025లో 3,277 యూనిట్ల విండ్సర్లను విక్రయించింది. డిసెంబర్ 2024లో 3,785 యూనిట్లు, నవంబర్ 2024లో 3,144 యూనిట్లు, అక్టోబర్ 2024లో 3,116 యూనిట్ల అమ్మకాలు సాధించినట్లు వెల్లడించింది. ఈ కారు ఎక్సైట్, ఎక్స్‌క్లూజివ్, ఎసెన్స్ అనే వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 13.99 లక్షలు, రూ. 14.99 లక్షలు, రూ. 15.99 లక్షలు (ఎక్స్ షోరూమ్).ఎంజీ విండ్సర్ కారును బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) కింద కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ విధంగా కొనుగోలు చేస్తే.. ధరలు చాలా తగ్గుతాయి. ఈ ఎలక్ట్రిక్ కారు 38kWh లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీతో కూడిన మాగ్నెట్ సింక్రోనస్ మోటారును పొందుతుంది. ఒక ఫుల్ ఛార్జిపై ఇది 332 కిమీ రేంజ్ అందిస్తుంది.ఎంజీ విండ్సర్ ప్రకాశవంతమైన లోగో, ఎల్ఈడీ లైట్లు, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, ఏరో లాంజ్ సీట్లు, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్ప్లేతో 15.6 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పవర్డ్ టెయిల్‌గేట్, పనోరమిక్ సన్‌రూఫ్ వంగతి ఫీచర్స్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులో 36 కంటే ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్, 80 కంటే ఎక్కువ కనెక్టెడ్ కార్ ఫీచర్స్ ఉన్నాయి. -
బజాజ్ ఆటో నుంచి త్వరలోనే ఈ-రిక్షా
బజాజ్ ఆటో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికి (మార్చి) ఈ–రిక్షా విభాగంలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటి వరకు అసంఘటితంగా ఉన్న ఈ విభాగంలో గణనీయమైన వాటాపై దృష్టి సారించింది. ప్రస్తుత త్రైమాసికం చివరికి అనుమతులు రావచ్చని, నెలవారీ రూ.45,000 యూనిట్ల విక్రయ అంచనాతో ఉన్నట్టు బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేశ్ శర్మ తెలిపారు.‘‘ఆధునిక ‘ఈ–రిక్’ను ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఆవిష్కరించే ఉద్దేశ్యంతో ఉన్నాం. ఈ విభాగంలో ఇది కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తుంది. అటు యజమానులు, ఇటు ప్రయాణికులకు సంతోషాన్నిచ్చే విధంగా ఉత్పత్తి ఉంటుంది’’అని రాకేశ్ శర్మ వివరించారు. ఆటో విభాగం స్థాయిలోనే ఈ–రిక్ విభాగం కూడాఉంటుందని చెప్పారు.కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్ గురించి మాట్లాడుతూ.. బజాజ్ ఆటో కొత్తగా ప్రవేశపెట్టిన అధిక రేంజ్, అధునాతన డిస్ప్లేలు, వేగవంతమైన ఛార్జింగ్, అత్యుత్తమ బూట్ స్పేస్ అందించే బజాజ్ చేతక్ 35 సిరీస్ ద్వారా ఎలక్ట్రిక్ టూ వీలర్ సెగ్మెంట్లో మార్కెట్ వాటాను పెంచుకోవాలనుకుంటున్నట్లు రాకేశ్ శర్మ పేర్కొన్నారు."ఇప్పటికే ప్రవేశపెట్టిన రెండు వేరియంట్లు ఈ ఈవీ విభాగంలో అధిక మార్కెట్ వాటా కోసం బలమైన పాత్ర పోషిస్తున్నాయి. కొత్త సిరీస్ కూడా దిగువ శ్రేణిపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది" అని రాకేశ్ శర్మ ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఈ స్కూటర్‌ను 18 లక్షల మంది కొనేశారు
టీవీఎస్ ఎన్‌టార్క్ 125 (TVS Ntorq 125) అమ్మకాల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది. 2024 డిసెంబర్ చివరి నాటికి కంపెనీ 18,88,715 యూనిట్లను విక్రయించింది. దీంతో హోండా యాక్టివా, టీవీఎస్ జుపిటర్, సుజుకి యాక్సెస్ తరువాత.. ఎన్‌టార్క్ 125 అత్యధికంగా అమ్ముడైన నాల్గవ స్కూటర్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది.టీవీఎస్ మోటార్ 2018 ప్రారంభంలో ఎన్టార్క్ను ప్రవేశపెట్టింది. ఆ సమయంలో భారతదేశంలో 125సీసీ స్కూటర్లకు మంచి డిమాండ్ ఉండేది. అప్పటి నుంచి కంపెనీ దీనిని అప్డేట్ చేస్తూ.. కొత్త వేరియంట్లను ప్రవేశపెడుతూనే ఉంది. కంపెనీ అమ్మకాలు పెరగడానికి కూడా ఈ స్కూటర్ దోహదపడింది.ఎన్‌టార్క్ స్కూటర్ బేస్ (డ్రమ్/డిస్క్), రేస్ ఎడిషన్, సూపర్ స్క్వాడ్ ఎడిషన్, రేస్ XP, రేస్ XT అనే ఆరు వేరియంట్లలో లభిస్తుంది. దీని ధరలు రూ. 84,600 నుంచి రూ. 1,04,600 (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. రేస్ XP ఎడిషన్ 10.2 హార్స్ పవర్, 10.8 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తే.. మిగిలిన వేరియంట్స్ 9.4 హార్స్ పవర్, 10.5 ఎన్ఎమ్ టార్క్ అందిస్తాయి.ఇదీ చదవండి: సరికొత్త ఫీచర్లతో.. వచ్చేస్తోంది యాక్టివా 7జీఇండియన్ మార్కెట్లో మాత్రమే కాకుండా.. విదేశాల్లో కూడా 'ఎన్‌టార్క్'కు మంచి డిమాండ్ ఉంది. ఈ కారణంగానే కంపెనీ 2024 ఏప్రిల్ - డిసెంబర్ మధ్య 50640 ఎన్‌టార్క్ స్కూటర్లను ఎగుమతి చేసింది. ఇవి అంతకు ముందు ఏడాది కంటే 16 శాతం ఎక్కువ. దీన్ని బట్టి చూస్తే దీనికి గ్లోబల్ మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. -
ఈ లంబోర్ఘిని కార్లకు ఏమైంది? రేమండ్ ఎండీ ఆందోళన
ప్రముఖ లగ్జరీ కార్ మేకర్ లంబోర్ఘినికి (Lamborghini) చెందిన కార్ల భద్రతా ప్రమాణాల గురించి రేమండ్ (Raymond) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ సింఘానియా (Gautam Singhania) ఆందోళన వ్యక్తం చేశారు. లంబోర్ఘిని కారు మంటల్లో చిక్కుకున్నట్లు ఇన్స్టాగ్రామ్ వచ్చిన ఓ పోస్ట్‌కు ఆయన స్పందించారు. లగ్జరీ ఆటోమేకర్ విశ్వసనీయత, పారదర్శకతను ప్రశ్నించిన సింఘానియా జాగ్రత్తగా ఉండాలని కస్టమర్లకు సూచించారు."లంబోర్ఘిని కి ఏమైంది? వారు ఏం చేయలేకతున్నారా? ఎందుకు ఇన్ని కార్లు మంటల్లో చిక్కుకుంటున్నాయి? కంపెనీ నుండి ఎందుకు వివరణ లేదు? కొనుగోలుదారులు జాగ్రత్త!" అంటూ సింఘానియా ‘ఎక్స్’ (ట్విటర్)లో ఒక పోస్ట్‌లో రాశారు. లంబోర్ఘిని కార్లు మంటల్లో చిక్కుకున్న వరుస సంఘటనల నేపథ్యంలో సింఘానియా ఈ విధంగా స్పందించారు. గతేడాది డిసెంబర్లో ముంబైలోని కోస్టల్ రోడ్లో కదులుతున్న లంబోర్ఘిని లోపల మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదు. 45 నిమిషాల్లో మంటలు అదుపులోకి వచ్చాయి. "ఇలాంటి సంఘటనలు లంబోర్ఘిని విశ్వసనీయత, భద్రతా ప్రమాణాల గురించి తీవ్రమైన ఆందోళనలను లేవనెత్తుతున్నాయి. ధర, ఖ్యాతి దృష్ట్యా, రాజీపడని నాణ్యతను ఆశించవచ్చు. సంభావ్య ప్రమాదాలను కాదు" అని ఆయన అప్పుడు ట్వీట్ చేశారు.ఇక 2024 అక్టోబర్‌లో న్యూయార్క్‌లోని ఒక హైవేపై డ్రైవింగ్ చేస్తున్నప్పుడు లంబోర్ఘిని రెవెల్టో మంటల్లో చిక్కుకుంది. ఎవరూ గాయపడనప్పటికీ, బ్రాండ్-న్యూ హైబ్రిడ్ సూపర్‌కార్ పూర్తిగా దగ్ధమైంది. 2023 మార్చిలో లాంచ్ అయిన లంబోర్ఘిని రెవెల్టో 1,001 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేసే 6.5-లీటర్ V12 హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో విశేష దృష్టిని ఆకర్షించింది. -
స్కోడా ఈవీ వస్తోంది.. అదిరిపోయే రేంజ్!
వాహన తయారీ సంస్థ స్కోడా ఇండియా (Skoda) నుంచి తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఈ ఏడాదే వస్తోంది. సెప్టెంబర్ కల్లా భారతీయ రోడ్లపై స్కోడా ఎన్యాక్ (Skoda Enyaq) పరుగు తీయనుంది. తొలుత పూర్తిగా తయారైన కారును భారత్‌కు దిగుమతి చేస్తారు. 63, 82 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్స్‌తో రూపుదిద్దుకుంది.పర్ఫార్మెన్స్, రేంజ్ఎన్యాక్ అధునాతన ఎలక్ట్రిక్ మోటార్లతో థ్రిల్లింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాలు తక్షణ టార్క్‌ను అందిస్తాయి. ఎన్యాక్ ఆకట్టుకునే రేంజ్ కలిగి ఉంది. ఒకసారి చార్జింగ్‌తో బ్యాటరీని బట్టి 439–597 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. టాప్ స్పీడ్ గంటకు 180 కిలోమీటర్లు. గంటకు 100 కి.మీ. వేగాన్ని 6.7 సెకన్లలో అందుకుంటుంది. 30 ని. చార్జింగ్ 10 నుంచి 80 శాతానికి చేరుతుంది.డిజైన్, స్టైల్ఎన్యాక్ దృఢమైన లైన్లు, ఉల్లాసమైన ఆకారాలను కలిగి ఉంటుంది. సిగ్నేచర్ స్కోడా గ్రిల్, ఎలక్ట్రిక్ ఓరియెంటెడ్ రీమేక్ అయినప్పటికీ, ఇప్పటికీ దాని ఐకానిక్ ఫీచర్‌ను కలిగి ఉంది. సొగసైన ఎల్ఈడీ హెడ్లైట్లు, వంపులు ఆధునిక లుక్ అందిస్తాయి. -
సరికొత్త ఫీచర్లతో.. వచ్చేస్తోంది యాక్టివా 7జీ
భారతదేశంలో అధిక ప్రజాదరణ పొందిన 'హోండా యాక్టివా' స్కూటర్.. '7జీ' వెర్షన్లో లాంచ్ కావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే 6జీ వెర్షన్లో అమ్మకానికి ఉన్న ఈ స్కూటర్.. త్వరలోనే మరిన్ని ఆధునిక హంగులతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది కూడా గొప్ప సేల్స్ పొందే అవకాశం ఉందని సమాచారం.కస్టమర్ల ఊహలకు లేదా అంచనాలను 7జీ యాక్టివా దగ్గరగా ఉంటుందని సమాచారం. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉండే అవకాశం ఉంటుంది. ఇది రైడర్ల అవసరమైన సమాచారాన్ని వీక్షించడానికి మాత్రమే కాకుండా.. స్మార్ట్‌ఫోన్‌ను యాక్సెస్ చేయడానికి కూడా అనుమతిస్తుంది. దీని ద్వారా నావిగేషన్, కాల్ అలర్ట్‌లు, మ్యూజిక్ కంట్రోల్స్ వంటి మెరుగైన ఫీచర్లు డాష్‌బోర్డ్‌లో కనిపిస్తాయి.కంపెనీ 7జీ యాక్టివాకు సంబంధించిన చాలా వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. కానీ ఇది 109.51 సీసీ సింగిల్ సిలిండర్ బీఎస్6 ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజిన్ పొందుతుందని సమాచారం. ఇది 7.79 పీఎస్ పవర్, 8.84 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ స్కూటర్ 68 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది.హోండా యాక్టివా 7జీ స్కూటర్.. కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్స్ (CBS) లేదా యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్స్ (ABS) వంటి సేఫ్టీ ఫీచర్లతో పాటు.. స్టాండర్డ్ లేదా ఆప్షనల్ అప్‌గ్రేడ్స్ పొందే అవకాశం ఉందని సమాచారం. వీటితోపాటు ఇందులో జియో-ఫెన్సింగ్ ఫీచర్ వంటి లేటెస్ట్ టెక్నాలజీ కూడా ఉండే అవకాశం ఉంది. ఈ స్కూటర్ ఎప్పుడు లాంచ్ అవుతుంది? ధర ఎంత ఉంటుందనే వివరాలను కూడా కంపెనీ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. -
ఆటోకి మూడు చక్రాలే ఎందుకు?.. కారణం తెలుసా!
దశాబ్దాల చరిత్ర ఉన్న.. ఆటో రిక్షా ఎన్ని అప్డేట్స్ పొందినా మూడు చక్రాలతోనే వస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే కాకుండా.. పట్టణ ప్రాంతాల్లో కూడా విరివిగా అందుబాటులో ఉన్న ఆటోలకు ఇతర వాహనాలకు మాదిరిగా ఎందుకు నాలుగు చక్రాలు ఉండవు?, మూడు చక్రాలు ఉండటానికి కారణం ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.బ్యాలెన్స్ చేయడం సులభంనాలుగు చక్రాల వాహనాల కంటే.. మూడు చక్రాల వాహనాలను బ్యాలెన్స్ చేయడం కొంత సులభం అని ఓ ఐఐటీ ప్రొఫెసర్ వివరించారు. అంతే కాకుండా.. దీనిని రూపొందించడానికి అయ్యే ఖర్చు కూడా తక్కువని అన్నారు.ఖర్చు మాత్రమే కాకుండా.. ఇంజినీరింగ్ వర్క్ కూడా తక్కువే. నాలుగు చక్రాల వాహనం కన్నా మూడు చక్రాల వాహనం చిన్నదిగా రూపొందుతుంది. అలాంటప్పుడు ఎటువంటి ఇరుకు ప్రాంతంలో ప్రయాణించడానికైనా, కొద్దిపాటి ప్రాంతంలో పార్క్ చేయడానికైనా అనువుగా ఉంటుంది. ఎప్పుడూ రద్దీగా ఉండే పట్టణాల్లో ఆటోలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.మూడు చక్రాల వాహనం వలన ఇంధన వినియోగం కూడా భారీగా అవదు. ఆటోను నడిపించేందుకు ఇంజనుకు తక్కువ శక్తి సరిపోతుంది. కాబట్టి ఆటోలను నడిపేవారు కూడా దీని నిర్వహణకు ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మొత్తం మీద ఈ కారణాల వల్లనే ఆటో మూడు చక్రాలను మాత్రమే కలిగి ఉంటుంది. -
ఓలా ఎలక్ట్రిక్ 'నష్ట' కష్టాలు..
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన(ఈ2డబ్ల్యూ) కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ (Ola Electric) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(Q3)లో నికర నష్టం భారీగా పెరిగి రూ. 564 కోట్లకు చేరింది. ఆదాయం నీరసించడం, తీవ్రతర పోటీ, సర్వీస్ సవాళ్లతో పెరిగిన వ్యయాలు ప్రభావం చూపాయి.గతేడాది(2023–24) ఇదే కాలంలో కేవలం రూ. 376 కోట్ల నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం సైతం రూ. 1,296 కోట్ల నుంచి రూ. 1,045 కోట్లకు క్షీణించింది. మొత్తం వ్యయాలు రూ. 1,597 కోట్ల నుంచి రూ. 1,505 కోట్లకు తగ్గాయి. ఈ కాలంలో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 3.33 లక్షల యూనిట్ల ఈ2డబ్ల్యూ రిజిస్ట్రేషన్లు నమోదైనట్లు ఓలా వెల్లడించింది. గతేడాది క్యూ3తో పోలిస్తే ఇవి 37 శాతంపైగా అధికమని తెలియజేసింది. సర్వీసింగ్ సమస్యల పరిష్కారానికి రూ. 110 కోట్లు వెచ్చించినట్లు పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో ఓలా షేరు ఎన్ఎస్ఈలో 2.4 శాతం నీరసించి రూ. 70 వద్ద ముగిసింది.ఎంఅండ్ఎం లాభం స్పీడ్ఆటో రంగ దేశీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 20 శాతం జంప్‌చేసి రూ. 3,181 కోట్లకు చేరింది. గతేడాది ఇదే కాలంలో రూ. 2,658 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 17 శాతం ఎగసి రూ. 41,470 కోట్లను తాకింది. గత క్యూ3లో రూ. 35,299 కోట్ల టర్నోవర్ నమోదైంది.ఆటో విభాగంలో అమ్మకాలు 16 శాతం పుంజుకుని 2,45,000కు చేరగా.. యూవీ విక్రయాలు 1,42,000 యూనిట్లను తాకాయి. ఈ విభాగం ఆదాయం 21 శాతం జంప్‌చేసి రూ. 23,391 కోట్లకు చేరింది. నికర లాభం 20 శాతం బలపడి రూ. 1,438 కోట్లయ్యింది. వ్యవసాయ పరికరాల విభాగం నికర లాభం 11 శాతం పుంజుకుని రూ. 996 కోట్లను తాకింది. ఫలితాల నేపథ్యంలో ఎంఅండ్ఎం షేరు ఎన్ఎస్ఈలో 1.7 శాతం లాభంతో రూ. 3,193 వద్ద ముగిసింది. -
రూ.8.95 కోట్ల కొత్త రోల్స్ రాయిస్ కారు ఇదే.. చూశారా?
రోల్స్ రాయిస్ (Rolls Royce) కంపెనీ.. ఇప్పుడు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఘోస్ట్ సిరీస్ II' (Ghost Series II)ను భారతదేశంలో లాంచ్ చేసింది. ఈ కొత్త వెర్షన్ దాని మునుపటి మోడల్లో అందుబాటులో లేని కొత్త ఇంటీరియర్ ఫినిషింగ్‌లు, ఫీచర్లను పొందిందని సంస్థ వెల్లడించింది.రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్‌లో.. మూడు వెర్షన్స్ ఉన్నాయి. అవి ఘోస్ట్ సిరీస్ II, ఘోస్ట్ ఎక్స్టెండెడ్ సిరీస్ II, బ్లాక్ బ్యాడ్జ్ ఘోస్ట్ సిరీస్ II. వీటి ధరలు వరుసగా రూ. 8.95 కోట్లు, 10.19 కోట్లు,10.52 కోట్ల ఎక్స్-షోరూమ్ ధరలకు అందుబాటులో ఉన్నాయి. ఈ కారు కోసం చెన్నై, న్యూఢిల్లీ షోరూమ్‌లలో బుక్ చేసుకోవచ్చు.రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ II కారు 6.75 లీటర్, ట్విన్ టర్బోచార్జ్డ్ వీ12 ఇంజిన్‌ను పొందుతుంది, ఇది వరుసగా 600 హార్స్ పవర్, 900 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 8 స్పీడ్ గేర్‌బాక్స్ ద్వారా అత్యద్భుతమైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.ఘోస్ట్ సిరీస్ II మెరుగైన రైడ్ స్టెబిలిటీ కోసం ప్లానార్ సస్పెన్షన్ సిస్టమ్, రోడ్డు పరిస్థితికి అనుగుణంగా సస్పెన్షన్లను అడ్జెస్ట్ చేయడానికి కెమెరాల సహాయంతో ఫ్లాగ్ బేరర్ సిస్టమ్ వంటి టెక్నాలజీ అప్గ్రేడ్లను పొందుతుంది. ఇది మెరుగైన ఆడియో సిస్టమ్, ఇంటర్నెట్ కనెక్టివిటీ, వీడియో స్ట్రీమింగ్ ఫంక్షన్లను కూడా పొందుతుంది. -
హైవేపై అన్లిమిటెడ్ టోల్ పాస్‌లు: ధరలు ఇవే..
భారత్ ఇప్పుడు అభివృద్ధి వైపు వేగంగా దూసుకెళ్తోంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రోడ్ నెట్వర్క్ కలిగిన ఇండియాలో జాతీయ రహదారుల నిర్మాణం శరవేగంగా ఉంది. అయితే గత పదేళ్లలో జాతీయ రహదారులపైన టోల్ ప్లాజాలు పెరిగాయి, టోల్ ఫీజులు కూడా పెరిగాయి. దీనిపై వాహనదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కేంద్రం కూడా కొత్త చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు టోల్ ఫీజుల భారాన్ని తగ్గించడానికి వార్షిక టోల్ పాస్‌లు & జీవితకాల టోల్ పాస్‌లను అందించాలని యోచిస్తోంది.వాహనదారులకు ఉపశమనం కలిగించడానికి.. టోల్ వసూల్లలో సరళీకరణను సాధించడానికి కేంద్రం టోల్ పాస్‌ల జారీలో కొత్త విధానం తీసుకురానుంది. ఇందులో వార్షిక టోల్ పాస్‌లు, లైఫ్ టైం టోల్ పాస్‌లు జారీ చేయడానికి సంకల్పించింది.వార్షిక ప్లాన్ కింద ఏడాది 3000 రూపాయలు, లైఫ్ టైం టోల్ పాస్ (15 సంవత్సరాలు) కోసం రూ. 30,000 చెల్లించాల్సి ఉంటుందని రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం 340 రూపాయలకు నెలవారీ టోల్ పాస్ అందుబాటులో ఉంది. ఈ లెక్కన తీసుకుంటే ఏడాదికి రూ. 4080 చెల్లించాలి. కానీ ఏడాదికి టోల్ పాస్ తీసుకుంటే.. 1080 రూపాయలు ఆదా చేయవచ్చు.వార్షిక, లైఫ్ టైం పాస్‌లు ప్రస్తుత FASTag వ్యవస్థలో చేర్చనున్నారు. కాబట్టి దీనికోసం ప్రత్యేకించి డాక్యుమెంటేషన్ అవసరం లేదు. ఈ టోల్ పాస్ వ్యవస్థను త్వరలోనే తీసుకురానున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. వార్షిక టోల్ పాస్ లేదా జీవిత కాల టోల్ పాస్ అనేది ఒక టోల్ గేటుకు మాత్రమే వర్తిస్తుందా? లేక అన్ని చోట్లా పనిచేస్తుందా? అనే వివరాలు తెలియాల్సి ఉంది.ఏకరీతి టోల్ విధానంవినియోగదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఏకరీతి టోల్ విధానంపై కసరత్తు చేస్తోందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవలే తెలిపారు. ఇప్పుడు మనదేశంలోని రోడ్లు.. అమెరికాలోని రోడ్లకు సమానంగా ఉన్నాయని ఆయన అన్నారు.కొన్ని ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో రోడ్లు లేకపోవడం, అధిక టోల్ చార్జీల వసూలు వంటివి వాహనదారులలో అసంతృప్తిని నెలకొల్పాయి. కాబట్టి ఏకరీతి టోల్ ప్రవేశపెడితే.. ఇది అందరికి ప్రయోజనకారిగా ఉంటుందని నితిన్ గడ్కరీ అన్నారు. అయితే దీనికి సంబంధించిన చాలా వివరాలను ఆయన అధికారికంగా వెల్లడించలేదు. అంతకంటే ముందు GSS (గ్లోబల్ న్యావిగేషన్ శాటిలైట్ సిస్టం) ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు.ఇదీ చదవండి: 2030 నాటికి ఈ రంగంలో 2.5 కోట్ల ఉద్యోగులు: నితిన్ గడ్కరీజాతీయ రహదారులపై గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (జీఎన్ఎస్ఎస్) ఆధారిత టోల్ వసూలు విధానం అమలు చేయడం ద్వారా ప్రయాణానికి ఎలాంటి అవరోధం ఉండదని ఆయన అన్నారు. అంతే కాకుండా.. సోషల్ మీడియాలో ప్రయాణికులు చేసే ఫిర్యాదులను చాలా సీరియస్‌గా తీసుకున్నామని.. దీనికి కారణమైన కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని గడ్కరీ చెప్పారు. -
ఎక్కువ మైలేజ్ కోసం.. ఇవిగో బెస్ట్ సీఎన్జీ కార్లు
ఇండియన్ మార్కెట్లో పెట్రోల్, ఎలక్ట్రిక్ కార్లకు మాత్రమే కాకుండా CNG కార్లకు కూడా డిమాండ్ పెరుగుతోంది. ఎందుకంటే సాధారణ పెట్రోల్ కారు కంటే సీఎన్జీ కారు కొంత ఎక్కువ మైలేజ్ అందిస్తుంది. ఈ కారణంగానే చాలామంది వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీలు.. తమ వాహనాలను సీఎన్జీ రూపంలో లాంచ్ చేస్తున్నాయి. ఈ కథనంలో రూ. 9 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే సీఎన్జీ కార్లను గురించి తెలుసుకుందాం.మారుతి సుజుకి ఫ్రాంక్స్ సీఎన్జీ (Maruti Suzuki Fronx CNG)మార్కెట్లో లాంచ్ అయిన అతి తక్కువ కాలంలోనే.. కంపెనీ తన ఫ్రాంక్స్ కారును సీఎన్జీ రూపంలో లాంచ్ చేసింది. చూడటానికి సాధారణ కారు మాదిరిగా ఉన్నప్పటికీ.. ఇందులో కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ కనిపిస్తాయి. ఈ కారు ధర రూ. 8.46 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇందులో 1197 సీసీ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. ఇది 28.51 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుంది.టాటా పంచ్ సీఎన్జీ (Tata Punch CNG)భారతదేశంలో అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటి, ఎక్కువ అమ్ముడైన మైక్రో ఎస్యూవీ టాటా పంచ్. ఇది మార్కెట్లో పెట్రోల్, ఎలక్ట్రిక్, సీఎన్జీ రూపాల్లో అందుబాటులో ఉంది. సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ సాధించిన ఈ టాటా పంచ్ సీఎన్జీ 26.99 కిమీ / కేజీ మైలేజ్ అందిస్తుంది. దీని ధర రూ. 7.23 లక్షలు (ఎక్స్-షోరూమ్). ధర అనేది ఎంచుకునే వేరియంట్ మీద ఆధారపడి ఉంటుంది.హ్యుందాయ్ ఎక్స్టర్ ఎస్ సీఎన్జీ (Hyundai Exter S CNG)రూ. 9 లక్షల కంటే తక్కువ ధరలో లభించే బెస్ట్ సీఎన్జీ కార్లలో.. హ్యుందాయ్ ఎక్స్టర్ ఎస్ సీఎన్జీ కూడా ఉంది. దీని ధర రూ. 8.43 లక్షలు. ఇది 27.1 కిమీ / కేజీ మైలేజ్ అందిస్తుంది. మార్కెట్లో ఈ కారు మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళ్తోంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఇది దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. మైలేజ్ సాధారణ మోడల్ కంటే కొంత ఎక్కువ. -
మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ, బీఈ6: బుకింగ్స్.. డెలివరీ వివరాలు
దేశీయ వాహన తయారీ సంస్థ 'మహీంద్రా & మహీంద్రా' (M&M) దేశీయ విఫణిలో లాంచ్ చేసిన ఎక్స్ఈవీ 9ఈ (XEV 9e), బీఈ 6 (BE 6) ఎలక్ట్రిక్ కార్ల కోసం బుకింగ్స్ స్వీకరించడానికి సన్నద్దమైంది. కంపెనీ ఫిబ్రవరి 14 నుంచి బుకింగ్స్ ప్రారంభించనుంది. డెలివరీకి సంబంధించిన వివరాలను కూడా సంస్థ వెల్లడించింది.ఫిబ్రవరి 14న మహీంద్రా కంపెనీ బుకింగ్‌లను స్వీకరిస్తే డెలివరీలు 2025 ఆగష్టు నాటికి పూర్తవుతాయి. సంస్థ అన్ని వేరియంట్లకు బుకింగ్స్ స్వీకరించనుంది.మహీంద్రా BE 6 ఐదు వేరియంట్లలో లభిస్తుంది. దీని ధర రూ. 18.90 లక్షల నుంచి రూ. 26.90 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. మహీంద్రా XEV 9e నాలుగు వేరియంట్లలో ఉంటుంది. దీని ధర రూ. 21.90 లక్షల నుంచి రూ. 30.50 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.మహీంద్రా BE 6 ఎక్స్-షోరూమ్ ధరలుప్యాక్ వన్ (59 kWh): రూ. 18.90 లక్షలుప్యాక్ వన్ అబోవ్ (59 kWh): రూ. 20.50 లక్షలుప్యాక్ టూ (59 kWh): రూ. 21.90 లక్షలుప్యాక్ త్రీ సెలెక్ట్ (59 kWh): రూ. 24.50 లక్షలుప్యాక్ త్రీ (79 kWh): రూ. 26.90 లక్షలుమహీంద్రా XEV 9e ఎక్స్-షోరూమ్ ధరలుప్యాక్ వన్ (59 kWh): రూ. 21.90 లక్షలుప్యాక్ వన్ ఎబౌ (59 kWh): NAప్యాక్ టూ (59 kWh): రూ. 24.90 లక్షలుప్యాక్ త్రీ సెలెక్ట్ (59 kWh): రూ. 27.90 లక్షలుప్యాక్ త్రీ (79 kWh): రూ. 30.50 లక్షలు -
ఓలా ఈ–బైక్ 501 కిలోమీటర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఓలా ఎలక్ట్రిక్ తాజాగా రోడ్‌స్టర్ ఎక్స్ సిరీస్‌తో మోటార్‌సైకిల్స్ విభాగంలోకి ప్రవేశించింది. రోడ్‌స్టర్ ఎక్స్, రోడ్‌స్టర్ ఎక్స్ ప్లస్ మోడళ్లను ఆవిష్కరించింది. ధర రూ.74,999 నుంచి ప్రారంభమై రూ.1,54,999 వరకు ఉంది. వాహనం పరుగెడుతున్నప్పుడు కూడా చార్జింగ్ అవుతుంది. ఐపీ67 రేటెడ్ బ్యాటరీ, స్మార్ట్ కనెక్టివిటీతో 4.3 అంగుళాల ఎల్సీడీ, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, రివర్స్ మోడ్ వంటి ఏర్పాటు ఉంది. గరిష్ట పవర్ 7–11 కిలోవాట్ ఉంది. నిర్వహణ వ్యయం రూ.500.. రోడ్‌స్టర్ ఎక్స్ సిరీస్‌లో వేరియంట్‌నుబట్టి 2.5–4.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ పొందుపరిచారు. ఒకసారి చార్జింగ్‌తో 140–252 కిలోమీటర్లు పరిగెడుతుంది. గరిష్ట వేగం గంటకు 105–118 కిలోమీటర్లు. రోడ్‌స్టర్ ఎక్స్ ప్లస్ సిరీస్‌లో 4.5–9.1 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. ఒకసారి చార్జింగ్‌తో 252–501 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. గరిష్ట వేగం గంటకు 125 కిలోమీటర్లు. నెలవారీ నిర్వహణ వ్యయం పెట్రోల్ బైక్‌కు రూ.4,000 అయితే రోడ్‌స్టర్ ఎక్స్‌తో రూ.500 మాత్రమేనని ఓలా తెలిపింది. మార్చిలో డెలివరీలు ఉంటాయి. మరో రెండు మోడల్స్.. రోడ్‌స్టర్, రోడ్‌స్టర్ ప్రో మోడల్స్‌లో సైతం కంపెనీ పలు వేరియంట్లను రూపొందిస్తోంది. రోడ్‌స్టర్‌లో 3.5–6 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఉంది. ఒకసారి చార్జింగ్‌తో 151–248 కి.మీ. ప్రయాణిస్తాయి. గరిష్ట వేగం గంటకు 116–126 కిలోమీటర్లు. ధర రూ.1,04,999 నుంచి రూ.1,39,999 వరకు ఉంది. అలాగే రోడ్‌స్టర్ ప్రో సిరీస్‌లో 8–16 కిలోవాట్ అవర్ బ్యాటరీ పొందుపరిచారు. ఒకసారి చార్జింగ్‌తో 316–579 కిలోమీటర్లు పరుగు తీస్తాయి. గరిష్ట వేగం గంటకు 154–194 కిలోమీటర్లు. ధర రూ.1,99,999 నుంచి రూ.2,49,999 వరకు ఉంది. డెలివరీలు 2026 జనవరి నుంచి మొదలవుతాయి. -
త్వరలో కొత్త టోల్ పాసులు.. హైవేలపై నో టెన్షన్!
జాతీయ రహదారులపై తరచుగా ప్రయాణించే కార్ల యజమానులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పబోతోంది. టోల్ గేట్ల అపరిమిత వినియోగం కోసం ఏడాది, జీవిత కాలపు టోల్ పాస్‌లు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఏడాది టోల్ పాల్ కోసం రూ. 3 వేలు, జీవిత కాలపు టోల్ పాస్ కోసం రూ.30,000 నిర్ణయించినట్లు తెలుస్తోంది.అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏదైనా వాహనం జీవిత కాలం 15 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఈ కాలానికే జీవిత కాలపు పాస్ వర్తిస్తుంది. రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ వద్ద ప్రస్తుతం ఈ ప్రతిపాదన తుది దశలో ఉన్నట్లు సమాచారం. ఇదే కాకుండా వాహనదారులకు మరింత ఊరట కలిగించేందుకు బేస్ టోల్ రేటును కూడా తగ్గించే యోచనలో రోడ్డు రవాణా శాఖ ఉన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది.ఇప్పటి వరకు ఒకే టోల్ ప్లాజా పరిధిలో తరచుగా ప్రయాణించే వారి కోసం నెలవారీ పాస్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటిని పొందాలంటే వినియోగదారులు వారి అడ్రెస్ ప్రూఫ్ సహా మరిన్ని వివరాలను అందింస్తూ.. నెలకు రూ.340 చెల్లంచాల్సి ఉంది. అలాగే ఈ పాస్‌ను ఏడాది పాటు వాడుకుంటూ పోతే మొత్తంగా రూ.4,080 చెల్లించాల్సి వస్తుంది.కానీ ఇప్పుడు తీసుకురానున్న కొత్త ఏడాది పాస్ ధర కేవలం రూ. 3 వేలు మాత్రమే. అది కూడా దేశవ్యాప్తంగా ఏడాది పాటు ఏ టోల్ గేట్నైనా ఈ పాస్‌తో దాటొచ్చు. దీంతో వాహనదారులకు పెద్ద మొత్తంలో డబ్బు ఆదా కానుంది. కాగా ఈ ప్రతిపాదన గురించి కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గతంలోనే సంకేతాలిచ్చారు. కార్ల యజమానులకు పాస్‌లు అందించే ప్రణాళికపై పని చేస్తున్నట్లు ఇటీవల వెల్లడించారు. -
70 ఏళ్ల నాటి కారు: ధర రూ. 458 కోట్లు
1954 నాటి మెర్సిడెస్ బెంజ్ కారు (Mercedes-Benz W196 R Stromlinienwagen) ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కార్లలో ఒకటిగా.. సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. ఈ కారు ఫిబ్రవరి 1, 2025న జర్మనీలోని స్టుట్గార్ట్లోని మెర్సిడెస్ బెంజ్ మ్యూజియంలో ఆర్ఎమ్ సోథెబీ నిర్వహించిన వేలంలో 51 మిలియన్ యూరోలకు లేదా సుమారు 458 కోట్లకు అమ్ముడైంది. దీంతో ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫార్ములా 1 కారుగా నిలిచింది.బెంజ్ డబ్ల్యు196 ఆర్ అనేది ఫ్యాక్టరీ నిర్మిత స్ట్రీమ్లైన్డ్ బాడీవర్క్‌తో కలిగిన నాలుగు మోడల్‌లలో ఒకటి. అయితే ఈ కారును ఎవరు కొనుగోలు చేసారు అనేదానికి సంబంధించిన వివరాలు ప్రస్తుతానికి వెల్లడికాలేదు. అయితే ఈ కారు 1955 మెర్సిడెస్ 300 ఎస్ఎల్ఆర్ ఉహ్లెన్‌హాట్ కూపే తర్వాత ప్రపంచంలోనే రెండవ అత్యంత విలువైన కారు. ఇది (ఉహ్లెన్‌హాట్ కూపే) 2022లో సుమారు రూ. 1,266 కోట్లకు వేలం అమ్ముడైంది.సర్ స్టిర్లింగ్ మోస్ 1955 ఇటాలియన్ గ్రాన్ ప్రిక్స్‌లో W196 Rతో అత్యంత వేగవంతమైన ల్యాప్‌ను రికార్డ్ చేశాడు. ఇది డైరెక్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్‌తో 2.5-లీటర్ స్ట్రెయిట్ ఎయిట్ ఇంజన్‌ను కలిగి.. 290 హార్స్ పవర్ ఉత్పత్తి చేస్తుంది. దీనిని ఇండియానాపోలిస్ మోటార్ స్పీడ్వే మ్యూజియమ్‌కు 1965లో విరాళంగా ఇచ్చింది. అప్పటి నుంచి ఆ కారు బెంజ్ మ్యూజియంలోనే ఉంది. -
కొత్త ఏడాది.. మంచి బోణీ మారుతీ సుజుకీదే..
మారుతీ సుజుకీ (Maruti Suzuki) కొత్త ఏడాది జనవరిలో మొత్తం 2,12,251 వాహనాలు విక్రయించింది. గడిచిన ఏడాది ఇదే జనవరి అమ్మకాలు 1,99,364 యూనిట్లతో పోలిస్తే ఇవి 6% అధికం. ఇందులో దేశీయ ప్రయాణికుల వాహన అమ్మకాలు క్రితం ఏడాదితో పోలిస్తే 1,66,802 యూనిట్ల నుంచి 1,73,599 యూనిట్లకు చేరాయి.విదేశాలకు ఎగుమతులు 23,921 యూనిట్లకు 27,100 యూనిట్లకు ఎగిశాయి. హ్యుందాయ్ మోటార్ ఇండియా వాహన విక్రయాలు 3% తగ్గి 57,115 వాహనాలకు చేరాయి. ఇందులో దేశీయంగా 54,003 వాహన అమ్మకాలు జరగ్గా.., విదేశాలకు ఎగుమతులు 11,600 యూనిట్లుగా ఉన్నాయి. కాగా 2024 జనవరిలో 67,615 యూనిట్ల విక్రయాలు అమ్ముడయ్యాయి.టాటా మోటార్స్ అమ్మకాలు 86,125 యూనిట్ల నుంచి 80,304 యూనిట్లకు పరిమితమయ్యాయి. టయోటా కిర్లోస్కర్ మోటార్ అమ్మకాలు 24,609 నుంచి 19% పెరిగి 29,371కు చేరాయి. మహీంద్రాఅండ్‌మహీంద్రా విక్రయాలు 16% పెరిగి 85,432 యూనిట్లకు చేరాయి. -
చౌకగా ప్రీమియం మోటార్ సైకిళ్లు
అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో భారత ప్రభుత్వం దిగుమతి చేసుకునే మోటార్ సైకిళ్లపై బేసిక్ కస్టమ్స్ సుంకాలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కేంద్ర బడ్జెట్ 2025లో భాగంగా హార్లే డేవిడ్సన్, ట్రయంఫ్, సుజుకీ వంటి బ్రాండ్ల ప్రీమియం మోటార్ సైకిళ్లపై సుంకాలను 5-20 శాతం తగ్గిస్తున్నట్లు తెలిపారు.దిగుమతి సుంకాల తగ్గింపు అమెరికా నుంచి వస్తున్న వస్తువులపై డిమాండ్ స్థిరంగా కొనసాగించేదిగా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశ టారిఫ్ విధానాలను, హార్లే డేవిడ్సన్ దిగుమతులకు సంబంధించి విమర్శించారు. భారత్‌ను ‘టారిఫ్ కింగ్’గా అభివర్ణించిన ట్రంప్.. అమెరికా వస్తువులపై సుంకాలు తగ్గించాలని పదేపదే పిలుపునిచ్చారు.కొత్త విధానం ప్రకారం 1600 సీసీ వరకు ఇంజిన్ సామర్థ్యం ఉన్న మోటార్ సైకిళ్లపై గతంలో ఉన్న 50 శాతం నుంచి 40 శాతానికి కస్టమ్స్ డ్యూటీని తగ్గించారు. 1600 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న మోటార్ సైకిళ్లపై సుంకాన్ని 50 శాతం నుంచి 30 శాతానికి తగ్గించారు. దీంతోపాటు సెమీ నాక్ డౌన్ (ఎస్కేడీ-తయారీదారు ప్లాంట్‌లో పాక్షికంగా అసెంబుల్ చేసిన వాహనం(లైట్ మోటార్ సైకిళ్లు లేదా కార్లు)), పూర్తిగా నాక్ డౌన్ (సీకేడీ-తయారీదారు ప్లాంట్ వద్దే పూర్తిగా విడి భాగాలుగా చేయడం) యూనిట్లపై సుంకాలను కూడా తగ్గించారు.ఇదీ చదవండి: రూ.13 లక్షలు ఆదాయం ఉంటే ట్యాక్స్ ఇలా..ఈ చర్య భారతీయ వినియోగదారులకు ప్రీమియం మోటార్ సైకిళ్లను మరింత చౌకగా మారుస్తుందని, ఈ హై-ఎండ్ బ్రాండ్ల అమ్మకాలను పెంచుతుందని భావిస్తున్నారు. అమెరికా లేవనెత్తిన వాణిజ్య ఫిర్యాదులను పరిష్కరించడానికి, ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను మెరుగుపరచడానికి భారతదేశం సుముఖంగా ఉందని ఈ నిర్ణయం సూచిస్తుంది. కస్టమ్స్ సుంకాల తగ్గింపు దేశీయ తయారీని ప్రోత్సహించడానికి, విదేశీ ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాన్ని పెంచే విస్తృత వ్యూహంలో భాగం. -
తక్కువ ధరకే ఎలక్ట్రిక్ వెహికల్స్!
యూనియన్ బడ్జెట్ 2025-26 లిథియం బ్యాటరీలు.. సంబంధిత రంగాల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి గణనీయమైన పన్ను మినహాయింపులను ప్రకటించింది. స్థానిక తయారీని మెరుగుపరచడం మాత్రమే కాకుండా.. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం పన్నులు తగ్గించింది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్ ధరలు తగ్గుముఖం పడతాయి.కోబాల్ట్, లిథియం అయాన్ బ్యాటరీ స్క్రాప్, సీసం, జింక్, 12 ఇతర కీలకమైన ఖనిజాల వంటి అవసరమైన పదార్థాలపై కూడా కేంద్రం ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని (BCD) తొలగించింది. బ్యాటరీలు, సెమీకండక్టర్లు, పునరుత్పాదక శక్తి పరికరాల తయారీకి ఈ పదార్థాలు చాలా ముఖ్యమైనవి. కాబట్టి ఎలక్ట్రిక్ వాహనాలకు, క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ తయారీలో ఈ పదార్థాలపై ఆధారపడే పరిశ్రమలకు ఖర్చులను తగ్గిస్తుంది.ఈవీ బ్యాటరీ ఉత్పత్తిలో ఉపయోగించే 35 అదనపు వస్తువులు, మొబైల్ ఫోన్ బ్యాటరీ తయారీకి 28 వస్తువులపై ట్యాక్స్ తగ్గించడం వల్ల.. కంపెనీలు అదనపు పన్నులు లేకుండా బ్యాటరీ ఉత్పత్తికి అవసరమైన యంత్రాలను, సాధనాలను దిగుమతి చేసుకోవచ్చు. టాటా, ఓలా ఎలక్ట్రిక్, రిలయన్స్ వంటి కంపెనీలను భారతదేశంలో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రోత్సహించడం లక్ష్యంగా దీనిని ప్రవేశపెట్టడం జరిగింది.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025 హైలైట్స్కేంద్రప్రభుత్వ చర్య వల్ల.. ఈవీ బ్యాటరీలు కొంత తక్కువ ధరకే లభిస్తాయి. ఇది ఉత్పత్తి ఖర్చులను తగ్గించి.. దేశీయ తయారీని పెంచుతుంది. ఇది చైనా, ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. ఇవన్నీ క్లీన్ ఎనర్జీ వృద్ధికి.. భారతదేశ పునరుత్పాదక ఇంధన లక్ష్యాలకు సహాయపడుతుంది. -
ఓలా కొత్త స్కూటర్లు.. 320 కి.మీ.రేంజ్!
ప్రముఖ విద్యుత్ ద్విచక్రవాహన సంస్థ ఓలా (Ola) తమ మూడో తరం ఎలక్ట్రిక్ స్కూటర్ శ్రేణిని భారత్ మార్కెట్లో తాజాగా విడుదల చేసింది. వీటిలో ఎంట్రీ-లెవల్ మోడల్ ధర రూ.79,999 (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమై అగ్రశ్రేణి వేరియంట్ ధర రూ.1,69,999 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఈ శ్రేణిలో ఎస్1 ప్రో (S1 Pro), ఎస్1 ప్రో+ (S1 Pro+), ఎస్1 ఎక్స్ (S1 X), ఎస్1 ఎక్స్+ (S1 X+) ఉన్నాయి.పేటెంట్ పొందిన 'బ్రేక్ బై వైర్' సాంకేతికతను ఓలా Gen 3 లైనప్‌కు జోడించింది. ఈ సిస్టమ్ బ్రేక్ ప్యాడ్, మోటర్ నిరోధకతను సమతుల్యం చేయడానికి బ్రేక్ లివర్‌పై సెన్సార్లను ఉపయోగిస్తుంది. ఇది రేంజ్‌ను 15% పెంచడమే కాకుండా బ్రేక్ ప్యాడ్ మన్నికను రెట్టింపు చేస్తుంది. ఇక మెరుగైన భద్రత కోసం ప్రతి స్కూటర్లోనూ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) అమర్చారు.బ్యాటరీ ఆప్షన్స్.. రేంజ్ఓలా మూడో తరం స్కాటర్లలో వివిధ బ్యాటరీ ఎంపికలు ఉన్నాయి. ఎస్1 ప్రో మోడల్ 3kWh, 4kWh బ్యాటరీలను కలిగి ఉంటుంది. ప్రో+ వేరియంట్ 4kWh, 5.3kWh బ్యాటరీ ప్యాక్‌లను అందిస్తుంది. ఇక ఎంట్రీ-లెవల్ ఎస్1 ఎక్స్ 2kWh, 3kWh, 4kWh బ్యాటరీ ఎంపికలతో అందుబాటులో ఉంది. అయితే ఎస్1 ఎక్స్+ మాత్రం ప్రత్యేకంగా 4kWh బ్యాటరీతో వస్తుంది. ఫ్లాగ్షిప్ ఎస్1 ప్రో+ మోడల్ 320 కిమీ రేంజ్‌ని, 141 కి.మీ.గరిష్ట వేగాన్ని అందిస్తుందని కంపెనీ పేర్కొంది.ధరలుమోడల్బ్యాటరీ కెపాసిటీధరఓలా ఎస్1 ఎక్స్2 kWh రూ.79,999ఓలా ఎస్1 ఎక్స్ 3 kWh రూ.89,999ఓలా ఎస్1 ఎక్స్ 4 kWh రూ.99,999ఓలా ఎస్1 ఎక్స్+ 4 kWh రూ.1,07,999ఓలా ఎస్1 ప్రో 3 kWh రూ.1,14,999ఓలా ఎస్1 ప్రో 4 kWh రూ.1,34,999ఓలా ఎస్1 ప్రో+ 4 kWh రూ.1,54,999ఓలా ఎస్1 ప్రో+ 5.3 kWh రూ.1,69,999 -
జపాన్‌కు మేడ్ ఇన్ ఇండియా కారు
భారతదేశంలో తయారవుతున్న వాహనాలకు.. విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికే పలు వాహనాలు మన దేశం నుంచి ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఇప్పుడు తాజాగా 'మారుతి సుజుకి' (Maruti Suzuki) కంపెనీకి చెందిన 'జిమ్నీ' (Jimny) జపాన్‌కు చేరింది. దీన్నిబట్టి చూస్తే.. ఈ కారుకు జపాన్‌లో కూడా అభిమానులు ఉన్నట్లు తెలుస్తోంది.2023లో జరిగిన ఆటో ఎక్స్‌పోలో కనిపించిన మారుతి జిమ్నీ.. ప్రస్తుతం 5 డోర్ వెర్షన్ రూపంలో కూడా అమ్మకానికి ఉంది. ఇదే ఇప్పుడు జపాన్‌లో విక్రయానికి సిద్ధమైంది. అంతే కాకుండా 2024-25 ఆర్థిక సంవత్సరంలో మారుతి సుజుకి అత్యధికంగా ఎగుమతి చేసిన వాహనాల్లో ఇది రెండో మోడల్ అని తెలుస్తోంది.జిమ్నీ 5 డోర్ కారు హర్యానాలోని గురుగ్రామ్‌లో.. మారుతి సుజుకి తయారీ కేంద్రంలో ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఇది గ్లోబల్ ఆఫ్ రోడర్‌గా ప్రసిద్ధి చెందింది. ఇప్పటికే ఈ కారును కంపెనీ దాదాపు 100 దేశాలకు ఎగుమతి చేస్తోంది. ఇప్పుడు జపాన్‌కు కూడా తరలించింది. మొత్తం మీద కంపెనీ ఇప్పటి వరకు 3.5 లక్షల కంటే ఎక్కువ జిమ్నీ కార్లు గ్లోబల్ మార్కెట్లో అమ్ముడయ్యాయి.జిమ్నీ 5 డోర్ మోడల్ జపాన్‌లో ప్రారంభమైన సందర్భంగా మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ హిసాషి టకేయుచి (Hisashi Takeuchi) మాట్లాడుతూ.. జపాన్‌లో 'మేడ్ ఇన్ ఇండియా' జిమ్నీ 5-డోర్‌ను ప్రవేశపెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఆగష్టు 2004లో కంపెనీ అత్యధికంగా ఎగుమతిచేసిన కార్లలో 'ఫ్రాంక్స్' తరువాత.. జిమ్నీ ఉంది. మెక్సికో, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి మార్కెట్లలో అమ్మకాల పరంగా ఇది గొప్ప విజయం సాధించిందని అన్నారు.జిమ్నీ 5 డోర్రూ. 12.47 లక్షల ప్రారంభ ధర వద్ద మార్కెట్లో లాంచ్ అయిన మారుతి జిమ్నీ.. ప్రత్యేకంగా ఆఫ్ రోడింగ్ విభాగంలో ఓ పాపులర్ మోడల్. కొత్త డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన జిమ్నీ 5 డోర్ మోడల్ 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 105 హార్స్ పవర్, 134 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా 4 స్పీడ్ టార్క్ కన్వర్టర్ వంటివి పొందుతుంది. -
ఆటోమొబైల్‌కు ఇంధనం కావాలి
అమ్మకాల వృద్ధి బలహీనతను, ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్న ఆటోమొబైల్ రంగంలో జోష్ నింపేందుకు బడ్జెట్లో పలు రకాల ప్రోత్సాహక చర్యలకు చోటు కల్పించాలని పరిశ్రమ గట్టిగా డిమాండ్ చేస్తోంది. 2025 బడ్జెట్‌పై ఆటోమొబైల్ పరిశ్రమ ఎన్నో అంచనాలతో ఉంది. వినియోగదారుల చేతుల్లో ఆదాయం మిగులు దిశగా చర్యలు చేపట్టాలని, ఇది వాహన విక్రయాల వృద్ధికి ఊతం ఇస్తుందని భావిస్తున్నాయి.ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) కొనుగోలుకు వినియోగదారులు ఆసక్తి చూపిస్తుండడంతో చార్జింగ్ వసతులు సహా, ఈవీ ఎకోసిస్టమ్ బలోపేతానికి మరిన్ని చర్యలు అవసరమని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. అదే సమయంలో పర్యావరణ అనుకూల గ్రీన్ టెక్నాలజీలకు, ప్రత్యామ్నాయ ఇంధనాలకు విధానపరమైన మద్దతు అవసరమని పేర్కొన్నాయి. ⇒ పాత వాహనాల తుక్కు విధానానికి బడ్జెట్లో మరిన్ని ప్రోత్సాహకాలు కల్పించాలి. దీనివల్ల కొత్త తరం వాహనాల డిమాండ్ పెరుగుతుంది. ⇒ ఈవీల తయారీకి ప్రోత్సాహకాల పరంగా బలమైన మద్దతు అవసరం. కేవలం వినియోగదారులకే కాకుండా, పర్యావరణ అనుకూల పరిష్కారాలను అనుసరించే వ్యాపార సంస్థలకూ ప్రోత్సాహకాలు ప్రకటించాలి. ⇒ ఆవిష్కరణలకు, టెక్నాలజీకి ఊతమిచ్చేలా పీఎల్ఐ పథకాలను మరింతగా అందుబాటులోకి తీసుకురావాలి. ⇒ఈవీ కొనుగోలు, ఈవీ సదుపాయాలకు సంబంధించి రుణాలపై అధిక వడ్డీ రేట్లు సవాలుగా మారాయి. వీటిని అందుబాటులోకి తీసుకురావాలి. రుణ వితరణ పరిస్థితులను సులభతరంగా మార్చాలి. ⇒ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు, సురక్షిత రహదారుల కోసం బడ్జెట్లో మరిన్ని నిధులు కేటాయించాలి. – సాక్షి, బిజినెస్ డెస్క్పూర్తిస్థాయి గ్రీన్ టెక్నాలజీలకు, ప్రత్యామ్నాయ ఇంధనాలకు ప్రాచుర్యం కల్పించేందుకు ఫలితాన్నిచ్చే విధానాలను ప్రభుత్వం తీసుకురావాలి. దీనివల్ల ఒకటికి మించిన మొబిలిటీ పరిష్కారాలను పెద్ద ఎత్తున వినియోగంలోకి తీసుకురావచ్చు. – విక్రమ్ గులాటీ, టయోటా కిర్లోస్కర్ మోటార్ కంట్రీ హెడ్భిన్నమైన ఆటోమోటివ్ టెక్నాలజీలకు సానుకూలమైన పన్నుల విధానంపై దీర్ఘకాలిక దృష్టి అవసరం. వివిధ రకాల వాహనాలకు, విడి భాగాలకు సులభతర జీఎస్టీ రేట్లను ప్రకటించాలి. ఉత్పత్తుల అభివృద్ధికి సుదీర్ఘకాలం పడుతుంది. ఇందుకు గణనీయమైన పెట్టుబడులు అవసరం అవుతాయి. ఈ అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి. – పియూష్ ఆరోరా, ఫోక్స్‌వ్యాగన్ ఇండియా సీఈవోవినియోగదారుల వ్యయాలను ప్రోత్సహించే దిశగా బడ్జెట్లో చర్యలు ఉంటాయని ఆశిస్తున్నాం. అలాగే, ఈవీల వినియోగాన్ని పెంచేందుకు తగిన ప్రోత్సాహకాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పరిశ్రమ అవసరాలను తీర్చే దిశగా నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలపై పెట్టుబడులు పెట్టాలి. – జ్యోతి మల్హోత్రా, వోల్వో కార్ ఇండియా ఎండీ -
ఎలక్ట్రిక్ కార్గో విభాగంలోకి టీవీఎస్!
కోల్‌కతా: వాహన తయారీ దిగ్గజం 'టీవీఎస్ మోటార్' (TVS Motor) కంపెనీ ఎలక్ట్రిక్ కార్గో విభాగంలోకి ప్రవేశించాలని నిర్ణయించింది. కంపెనీ తాజాగా ఎలక్ట్రిక్ త్రీవీలర్‌ను కోల్‌కతా, యూపీ, బీహార్, జమ్ము, కాశ్మీర్‌తోపాటు ఢిల్లీలో విడుదల చేసింది.డిసెంబర్ నాటికి ఎలక్ట్రిక్ కార్గో రోడ్డెక్కనుందని టీవీఎస్ మోటార్ కమర్షియల్ మొబిలిటీ బిజినెస్ హెడ్ 'రజత్ గుప్తా' వెల్లడించారు. ప్రస్తుతం ప్రత్యామ్నాయ ఇంధన (సీఎన్జీ, ఎల్పీజీ, ఎలక్ట్రిక్) విభాగంలో కంపెనీ వాటా 10 శాతం ఉందని అన్నారు. తమిళనాడులోని హోసూర్ ప్లాంట్‌కు నెలకు 5,000 యూనిట్ల త్రిచక్ర వాహనాలను తయారు చేసే సామర్థ్యం ఉందని తెలిపారు. ఈ కేంద్రాన్ని మరింత విస్తరించవచ్చని వివరించారు. కొరియా నుంచి బ్యాటరీ సెల్స్‌ను దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు. వీటిని భారతీయ భాగస్వామి తయారు చేస్తోందని తెలిపారు. -
యూజ్డ్ కార్లు @ కోటి.. పాత కారు టాప్ గేరు!
న్యూఢిల్లీ: పాత కార్ల అమ్మకాలు 2023లో దేశవ్యాప్తంగా 46 లక్షల యూనిట్లు దాటాయి. 2030 నాటికి ఈ సంఖ్య ఏటా 1 కోటి యూనిట్లను దాటుతుందని కార్స్24 తాజా నివేదిక వెల్లడించింది. పాత కార్ల క్రయవిక్రయాల్లో ఉన్న ఈ సంస్థ రూపొందించిన నివేదిక ప్రకారం.. 2030 నాటికి యూజ్డ్ కార్ల విభాగం సగటు వార్షిక వృద్ధి ఏటా 13% నమోదు కానుంది. ఈ లెక్కన వార్షిక అమ్మకాలు ఆ సమయానికి 1.08 కోట్ల యూని ట్లకు చేరుకుంటాయి. పాత కార్లకు డి మాండ్ నగరాలు, పట్టణాల్లో దూసుకెళ్లనుంది. మహా రా ష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ఈ జోరును నడిపిస్తున్నా యి. మరింత చవక, ఆధారపడదగిన ఎంపికల కోసం వినియోగదార్ల ప్రాధాన్యతలు మారుతు న్నందున కొత్త కార్ల మార్కెట్‌తో పోలిస్తే యూజ్డ్ కార్ల మార్కెట్ పురోగమిస్తోంది. పాత కార్ల విపణిలో 2024లో 16.7 శాతం వాటాతో ఎస్‌యూవీలు ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. ఎస్‌యూవీల డిజైన్, సామర్థ్యం, ప్రీమియం ఆకర్షణలు పట్టణ, గ్రామీణ కస్టమర్లకు ఇష్టమైనవిగా మారాయి. వ్యక్తిగత వాహనాలకు.. కోవిడ్ అనంతర కాలంలో వినియోగదారుల ప్రాధాన్యతలలో గణనీయ మార్పు కనిపించింది. షేర్డ్ మొబిలిటీ కంటే సౌలభ్యం, భద్రత కోసం 12 శాతం మంది కార్ల కొనుగోలుదారులు వ్యక్తిగత వాహనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మెట్రో, నాన్–మెట్రో నగరాల్లో అత్యంత డిమాండ్ ఉన్న మోడల్‌గా మారుతీ సుజుకీ స్విఫ్ట్ అవతరించింది. అలాగే హ్యుండై శాంట్రో, టాటా టియాగో ఎన్ఆర్జి, మారుతీ సుజుకీ వ్యాగన్–ఆర్ వంటి మోడళ్లు అసాధారణ రీసేల్ విలువను స్థిరంగా అందించాయి. బడ్జెట్ స్పృహ, విలువను చూసే కొనుగోలుదారులలో ఈ మోడళ్లకు ప్రజాదరణ పటిష్టంగా ఉంది. కొత్త కార్ల ఫైనాన్సింగ్ గణనీయమైన వృద్ధి నమోదు చేసింది. ఫైనాన్సింగ్ వాటా 2010లో 60 శాతం నుండి 2024లో 84 శాతానికి చేరింది అని నివేదిక వివరించింది. నూతన వాహనాల కోసం రుణాలపై వినియోగదారులు ఆధారపడుతున్నారని చెప్పేందుకు ఈ గణాంకాలు నిదర్శనమని కార్స్24 కో–ఫౌండర్ గజేంద్ర జంగిద్ తెలిపారు.→ 2023లో అమ్ముడైన పాత కార్లు 46 లక్షల యూనిట్లు → 2030 నాటికి ఏటా ఒక కోటి యూనిట్లకు విక్రయాలు → యూజ్డ్ కార్ల విపణి సగటు వార్షిక వృద్ధి ఏటా 13% → ఎస్‌యూవీలదే హవా. వీటి వాటా 2024లో 16.7 శాతం → కొత్త కార్ల ఫైనాన్సింగ్ వాటా 2010లో 60 శాతం. 2024లో 84 శాతానికి చేరిక. → వ్యక్తిగత వాహనాలకే 12 % మంది మొగ్గు → అత్యంత డిమాండ్ ఉన్న మోడల్ మారుతీ సుజుకీ స్విఫ్ట్ -
కొత్త కారు కొంటున్నారా?: ఇలా చేస్తే.. ట్యాక్స్‌లో 50 శాతం తగ్గింపు
వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించాలంటే.. కాలుష్య కారకాలను తగ్గించాలి. దీనిని దృష్టిలో ఉంచుకుని రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) ఓ కీలక ప్రకటన చేసింది. పాత వాహనాలను స్క్రాప్ చేసి, కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తే ట్యాక్స్‌లో గరిష్టంగా 50 శాతం తగ్గింపు లభించనున్నట్లు వెల్లడించింది.ప్రస్తుతం పాత వాహనాలను రద్దు (స్క్రాపేజ్) చేసి కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తే.. వాహన పన్నులో 25 శాతం తగ్గింపు, వాణిజ్య వాహనాల విషయంలో 15 శాతం తగ్గింపు ఉంది. కానీ దీనిని 50 శాతానికి పెంచుతూ.. జనవరి 24న విడుదల చేసిన ముసాయిదా నోటిఫికేషన్లో మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.బిఎస్ 4 వాహనాల విక్రయాలు ఎప్పుడో ఆగిపోయాయి. ప్రస్తుతం బిఎస్ 6 వాహనాలు అందుబాటులో ఉన్నాయి. అయితే 2000లో వాహనాలకు బిఎస్ 1 ఉద్గార ప్రమాణాలు తప్పనిసరి. ఆ తరువాత బిఎస్ 2 ప్రమాణాలు 2002లో అమలులోకి వచ్చాయి.దేశంలో పాత వాహనాల సంఖ్య ఎక్కువ కావడం వల్ల కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని రవాణా మంత్రిత్వ శాఖ వాలంటరీ వెహికల్ మోడరనైజేషన్ ప్రోగ్రామ్ లేదా వెహికల్ స్క్రాపింగ్ పాలసీని ప్రారంభించింది. అంతే కాకుండా వెహికల్స్ స్క్రాపేజ్ కోసం వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీలను, ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లకు అనుమతిచ్చింది.ఇదీ చదవండి: అదే జరిగితే.. బంగారం రేటు మరింత పైకి!ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాల్లో స్కాపేజ్ స్టేషన్స్ ఉన్నాయి. వీటి ద్వారా మీ వాహనాన్ని స్కాపేజ్ చేసి, సర్టిఫికెట్ తీసుకుంటే.. కొత్త కారు కొనుగోలుపై పలు రాయితీలను పొందవచ్చు. ఇది కొత్త కారు కొనుగోలు చేయడానికి కొంత ఆర్థికంగా కూడా ఉపయోగపడుతుంది. -
80వేల కియా కార్లకు రీకాల్: కారణం ఇదే..
ప్రముఖ వాహన తయారీ సంస్థ కియా మోటార్స్.. యూఎస్ఏలో ఏకంగా 80,000 కంటే ఎక్కువ వాహనాలకు రీకాల్ ప్రకటించింది. ముందు ప్రయాణీకుల సీటు కింద వైరింగ్ దెబ్బతినడం వల్ల.. ఎయిర్‌బ్యాగ్‌లు, సీట్ బెల్ట్‌లు సరిగ్గా పనిచేయకపోవచ్చు. ఈ కారణంగానే కియా అమెరికా రీకాల్ ప్రకటించింది.సీటు కింద వైరింగ్ దెబ్బతినడం వల్ల అనుకోకుండా ఎయిర్‌బ్యాగ్‌లు ఓపెన్ అయ్యే అవకాశం ఉందని.. నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్‌కి దాఖలు చేసిన పత్రాలలో కియా అమెరికా స్పష్టం చేసింది. కంపెనీ రీకాల్ ప్రకటించిన కార్ల జాబితాలో 2023 నుంచి 2025 మధ్య తయారైన నీరో ఈవీ, ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కార్లు ఉన్నట్లు తెలుస్తోంది.కంపెనీ మొత్తం 80,225 కార్లకు రీకాల్ ప్రకటించింది. కార్లలోని సమస్యను గుర్తించి.. వాటిని ఉచితంగానే పరిష్కరించనున్నట్లు కియా అమెరికా వెల్లడించింది. అంతే కాకుండా వైరింగ్ కవర్లను కూడా ఉచితంగానే భర్తీ చేయనున్నట్లు సంస్థ పేర్కొంది. కాగా కార్ల యజమానులకు మార్చిలో ఈ మెయిల్ ద్వారా తెలియజేయనుంది.ఈ రీకాల్ అనేది అమెరికాలోని కియా కార్లకు మాత్రమే పరిమితం. కాబట్టి ఈ రీకాల్ ప్రభావం భారతదేశంలోని కియా కార్లపై ఎటువంటి ప్రభావం చూపదు. కాబట్టి దేశంలోకి కియా కార్ల యజమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.ఇదీ చదవండి: ఇల్లుగా మారిన ఇన్నోవా.. ఇదో డబుల్ డెక్కర్!: వైరల్ వీడియో -
ఒసాము సుజుకికి పద్మవిభూషణ్
దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఏడుగురికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులను కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఈ ఏడాది మార్చి-ఏప్రిల్‌లో రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమాలలో భారత రాష్ట్రపతి ఈ అవార్డులను ప్రదానం చేస్తారు.భారత ఆటోమొబైల్ పరిశ్రమ ముఖచిత్రాన్ని మార్చేసిన జపనీస్ వ్యాపారవేత్త 'ఒసాము సుజుకీ' (Osamu Suzuki)కి భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మ విభూషణ్ (Padma Vibhushan) పురస్కారాన్ని ప్రకటించింది. చిన్న-కార్ల స్పెషలిస్ట్ సుజుకి మోటార్‌ను అంతర్జాతీయ బ్రాండ్‌గా అభివృద్ధి చేసిన ఒసాము సుజుకికి మరణానంతరం ఈ అవార్డ్ ప్రకటించడం గమనార్హం. అసాధారణమైన, విశిష్ట సేవలు అందించిన వ్యక్తులకు పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. అలాగే ఎస్బీఐ మాజీ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్యకు (Arundhati Bhattacharya) పద్మశ్రీ అవార్డ్ లభించింది.ఒసాము సుజుకీ గత డిసెంబర్లో 94 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. భారత్‌లో ఆటోమొబైల్ కంపెనీ ఏర్పాటుకు ఏ ఒక్క విదేశీ సంస్థ ముందుకురాని రోజుల్లో.. ఆర్థిక వ్యవస్థను గ్లోబలైజేషన్‌కు ద్వారాలు తెరవక ముందే, లైసెన్స్ రాజ్ కాలంలో ఒసాము సుజుకీ తీసుకున్న నిర్ణయం దేశ పారిశ్రామిక రంగంలో చిరస్థాయిలో నిలిచిపోతుంది.జపాన్‌కు చెందిన సుజుకీ మోటార్ కార్పొరేషన్ 1981లో భారత ప్రభుత్వ భాగస్వామ్యంతో (జాయింట్ వెంచర్) మారుతి ఉద్యోగ్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేయడంలో కీలకంగా వ్యవహరించింది ఆయనే. 2007లో కేంద్ర ప్రభుత్వం తన పెట్టుబడులను ఉపసంహరించుకోవడంతో కంపెనీ పేరు మారుతి సుజుకీగా మారింది.ఆ తర్వాత మెజారిటీ వాటాతో సుజుకీ మోటార్ కార్పొరేషన్ ఏకైక ప్రమోటర్‌గా అవతరించింది. తుదిశ్వాస విడిచే వరకు మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్‌కు డైరెక్టర్‌గా ఒసాము సేవలు అందించారు. మాలిగ్నెంట్ లింఫోమా (కేన్సర్‌లో ఒక రకం) కారణంగా ఈ నెల 25న ఒసాము సుజుకీ మరణించినట్టు సుజుకీ మోటార్ కార్పొరేషన్ శుక్రవారం ప్రకటించింది. ‘‘ఆయన దూరదృష్టి, భవిష్యత్‌పై సానుకూల దృక్పథం, రిస్క్ తీసుకునే తత్వం, భారత్ పట్ల ప్రగాఢమైన ప్రేమ అనేవి లేకుంటే, భారత ఆటోమొబైల్ పరిశ్రమ నేడు ఇంత శక్తివంతంగా మారి ఉండేది కాదు’’అని మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్ (ఎంఎస్ఐఎల్) చైర్మన్ ఆర్సీ భార్గవ వ్యాఖ్యానించారు.నేడు భారత్‌లో లక్షలాది మంది మెరుగైన జీవనం వెనుక ఆయన కృషి ఉందన్నారు. ఆటోమొబైల్ రంగం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు ఒసాము అందించిన విశేష సేవలను గుర్తించిన కేంద్ర సర్కారు.. 2007లో పద్మభూషణ్ అవార్డుతో ఆయన్ను సత్కరించింది. 1958లో సుజుకీలో చేరిక..1930 జనవరి 30న జన్మించిన ఒసాము సుజుకి, చువో యూనివర్సిటీ, ఫాకుల్టీ ఆఫ్ లా నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు. 1958లో సుజుకీ మోటార్ కంపెనీలోనే చేరారు. 1963లో డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 1967లో మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలు చేపట్టారు. 1978లో ప్రెసిడెంట్; సీఈవోగా, 2000 జూన్‌లో సుజుకీ మోటార్ కార్పొరేషన్‌కు చైర్మన్, సీఈవోగా నియమితులయ్యారు. ‘‘మారుతి సుజుకీ రూపంలో ఆయన అందించిన అసాధారణ సేవలు భారత ఆటోమొబైల్ ముఖచిత్రాన్ని విప్లవాత్మకంగా మార్చడమే కాదు, భారత్–జపాన్ మధ్య బంధాన్ని బలోపేతం చేశాయి. -
2024లో లంబోర్ఘిని కార్లను ఇంతమంది కొన్నారా?
ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థ 'లంబోర్ఘిని' (Lamborghini) భారతదేశంలో గణనీయమైన విక్రయాలను పొందుతోంది. 2024లో కంపెనీ 113 కార్లను సేల్ చేసింది. దీంతో సంస్థ విక్రయాల్లో సరికొత్త రికార్డును నమోదు చేసింది.2023తో పోలిస్తే 2024లో లంబోర్ఘిని విక్రయాలు 10 శాతం పెరిగాయి. కాగా ప్రపంచ వ్యాప్తంగా కంపెనీ 10,687 కార్లను విక్రయించింది. ఇందులో అధిక భాగం రెవెల్టో హైబ్రిడ్ స్పోర్ట్స్ కారు ఉంది. అంతకు ముందు ఏడాదిలో హురాకాన్ మంచి అమ్మకాలను పొందింది. ఈ ఏడాది కంపెనీ ఉరుస్ ఎస్ఈ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కారును లాంచ్ చేసే అవకాశం ఉంది.గత ఏడాది అన్ని ప్రధాన మార్కెట్లలో కంపెనీ మంచి వృద్ధిని సాధించింది. లంబోర్ఘిని.. యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాలలో 4,227 కార్లను విక్రయించింది. అమెరికాలో 3,712 యూనిట్లు, ఆసియా - పసిఫిక్ ప్రాంతంలో 2,748 యూనిట్లను విక్రయించింది. ఈ ఏడాది కూడా కంపెనీ మంచి అమ్మకాలను పొందే అవకాశం ఉంటుంది. -
ఇల్లుగా మారిన ఇన్నోవా.. ఇదో డబుల్ డెక్కర్!: వైరల్ వీడియో
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ.. ఎన్నో ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసే 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) తాజాగా తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఓ వీడియో షేర్ చేసారు. ఇది నెట్టింట్లో వైరల్ అవుతోంది.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో.. ఓ కస్టమైజ్డ్ కారు కనిపిస్తుంది. అయితే ఇది సాధారణ కారు మాదిరిగా కాకుండా డబుల్ డెక్కర్ మాదిరిగా ఉంటుంది. దీనిని కర్ణాటకకు చెందిన దంపతులు.. తమ మహా కుంభమేళా యాత్ర కోసం ప్రత్యేకంగా రూపొందించుకున్నారు.కర్ణాటకకు చెందిన దంపతులు కష్టమైజ్ చేసుకున్న కారు 'టయోటా ఇన్నోవా' (Toyota Innova). దీని కోసం వారు రూ.2 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం. ఇందులో రూఫ్ టాప్ కోసం రూ. 1 లక్ష, వెనుక భాగంలో కిచెన్ వంటి సదుపాయం, సోలార్ ప్యానల్ మొదలైన వాటి కోసం మరో లక్ష రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: తక్కువ ధర.. మంచి మైలేజ్: ఇదిగో టాప్ 5 స్కూటర్స్ఎక్కువ రోజులు కుంభమేళాలో ఉండాలని, ఆ తరువాత మరో ఆరు నెలలు రోడ్ ట్రిప్ ప్రారంభించాలనే లక్ష్యంతోనే.. ఈ కారును కస్టమైజ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా వీరి క్రియేటివిటీకి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆనంద్ మహీంద్రా సైతం దీనికి ఎంతగానో ఆకర్షితుడైనట్లు పేర్కొన్నారు.Haan, yah bilkul sach hai ki main aise sanshodhanon aur aavishkaaron se mohit hoon. lekin mujhe yah sveekaar karana hoga ki jab ve mahindra vaahan par aadhaarit hote hain to main aur bhee adhik mohit ho jaata hoon!! 🙂 pic.twitter.com/rftq2jf2UN— anand mahindra (@anandmahindra) January 23, 2025 -
అంబానీ కొత్త కారు.. తొలి బుల్లెట్ ప్రూఫ్ రోల్స్ రాయిస్!
ఆసియాలోనే అపర కుబేరుడు ముఖేష్ అంబానీ (Mukesh Ambani). అత్యంత సంపన్నులుగా ఐశ్వర్యానికి, హోదాకు పేరుగాంచిన అంబానీ కుటుంబం (Ambani family) దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ కార్ల సేకరణను కూడా కలిగి ఉంది. జియో గ్యారేజ్‌లో ఉన కార్ల ఖచ్చితమైన లెక్క తెలియదు కానీ దేశంలోనే అత్యధిక సంఖ్యలో రోల్స్-రాయిస్ కల్లినన్ ఎస్‌యూవీలు (Rolls-Royce Cullinan) వీరి వద్దే ఉన్నాయి. ఇలాంటి కార్లు వీరి వద్ద కనీసం పది ఉంటాయని చెబుతారు. ఇప్పుడు మరో కొత్త రోల్స్ రాయిస్ కారు చేరింది. ఇది సాధారణ కుల్లినన్ కారు కాదు. ఇది భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ ప్రూఫ్ రోల్స్ రాయిస్ కల్లినన్.జియో గ్యారేజ్‌కి ప్రత్యేక అతిథిఅంబానీ ఫ్యామిలీ కొత్త కారు అంటూ ఈ ప్రత్యేకమైన రోల్స్ రాయిస్ కల్లినన్ ఫొటోలు ఆన్లైన్లో కనిపించాయి. ఆటోమొబిలి ఆర్డెంట్ ఇండియా వారి ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా ఇవి షేర్ అయ్యాయి. బుల్లెట్‌ఫ్రూఫింగ్ కార్లలో ప్రత్యేకత కలిగిన చండీగఢ్ వర్క్‌షాప్‌లో అద్భుతమైన సిల్వర్ ఎస్యూవీ కనిపించింది. ‘తమ వద్ద ఉన్న కుల్లినన్లతోపాటు అంబానీ కుటుంబం బుల్లెట్‌ప్రూఫ్‌ను కలిగి ఉండాల్సిన సమయం ఆసన్నమైందని నిర్ణయించుకున్నారు. అంబానీ ఫ్లీట్ నుండి అందమైన సిల్వర్ రోల్స్ రాయిస్ కల్లినన్ ఇదే’ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.ఫొటోల్లో కల్లినన్ సిరీస్ I మోడల్‌గా కనిపిస్తోంది. ఇది ఇప్పటికే అంబానీ ఫ్యామిలీ కార్ల కలెక్షన్లో భాగమై ఉండవచ్చు. దాన్నే బుల్లెట్‌ప్రూఫ్ చేయిస్తుండవచ్చు. ముఖేష్ అంబానీ సాధారణంగా భారీ భద్రత కలిగిన మెర్సిడెస్ బెంజ్ ఎస్ 680 (Mercedes-Benz S 680) గార్డ్ సెడాన్లలో ప్రయాణిస్తూ కనిపిస్తారు. అయితే భారతదేశంలో ఎస్‌యూవీలకు పెరుగుతున్న ప్రాధాన్యత కారణంగా బుల్లెట్ ప్రూఫ్ కల్లినన్ తమ అవసరాలకు బాగా సరిపోతుందని కుటుంబం భావించి ఉండవచ్చు.అల్ట్రా లగ్జరీ ఎస్యూవీరోల్స్ రాయిస్ కల్లినన్ అత్యంత లగ్జరీ కారు. 6.75-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ V12 ఇంజన్ 563 Bhp, 850 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. విస్తృతమైన కస్టమైజేషన్ ఆప్షన్స్‌కు ఇది ప్రసిద్ధి చెందింది. బెస్పోక్ ఫీచర్ల ఆధారంగా కుల్లినన్ ధర ఉంటుంది. ఇప్పుడు ఆర్మ్డ్ బాడీవర్క్ కోసం వర్క్‌షాప్‌కు పంపిన నేపథ్యంలో దీని తుది ధరను అంచనా వేయడం సవాలుగా మారింది.అంబానీ రోల్స్ రాయిస్ కలెక్షన్రాయిస్ కలెక్షన్ కల్లినన్ కార్లతో అంబానీ ఫ్యామిలీ అనుబంధం 2019 నాటిది. భారతదేశంలో మొట్ట మొదటగా ఈ మోడల్‌ను కొనుగోలు చేసింది అంబానీ కుటుంబమే. రిచ్ బ్రౌన్ షేడ్ వాహనం మొదటి కల్లినన్ కాగా ఆ తర్వాత 2021లో ఆర్కిటిక్ వైట్ కలర్ కార్ వచ్చింది.మూడవ కల్లినన్‌ను వారి కుమార్తె ఇషా అంబానీ ఉపయోగించారు. దాదాపు రూ. 1 కోటి విలువైన టస్కాన్ సన్ కల్లినన్ కూడా ఈ కలెక్షన్లో ఉంది. దీపావళి సందర్భంగా నీతా అంబానీకి బహుమతిగా ఇచ్చిన ప్రీమియం మోడల్ బ్లాక్ బ్యాడ్జ్ కల్లినన్. పెబుల్ ప్యారడిసో బ్లాక్ బ్యాడ్జ్ కల్లినన్‌ను అనంత్ అంబానీ పెళ్లికి ముందు కొనుగోలు చేశారు. సిరీస్ II కల్లినన్ తాజాగా ఫ్లీట్‌లో చేరింది. వీటితో పాటు విదేశాల్లోనూ కులినన్ వాహనాలు అంబానీ ఫ్యామిలీకి ఉన్నాయి. -
తక్కువ ధర.. మంచి మైలేజ్: ఇదిగో టాప్ 5 స్కూటర్స్
చాలామంది తక్కువ ధర వద్ద ఎక్కువ మైలేజ్ ఇచ్చే వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీలు ఈ తరహా వాహనాలను మార్కెట్లో లాంచ్ చేశాయి. ఈ కథనాల్లో రూ. 1 లక్ష కంటే తక్కువ ధర వద్ద లభించే.. మంచి మైలేజ్ ఇచ్చే స్కూటర్లను గురించి తెలుసుకుందాం.యమహా రే జెడ్ఆర్ 125 (Yamaha Ray ZR 125)యమహా కంపెనీ మార్కెట్లో లాంచ్ చేసిన 'రే జెడ్ఆర్ 125' రూ.1 లక్ష కంటే తక్కువ ధర వద్ద లభించే స్కూటర్లలో ఒకటి. దీని ప్రారంభ ధర రూ. 87,800 (ఎక్స్ షోరూమ్). 52 కిమీ / లీ మైలేజ్ ఇచ్చే ఈ స్కూటర్ 125 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ద్వారా 8.2 పీఎస్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. 5.2 లీటర్ కెపాసిటీ కలిగిన ఫ్యూయెల్ ట్యాంక్ ఇందులో ఉంటుంది.సుజుకి బర్గ్‌మన్ స్ట్రీట్ 125 (Suzuki Burgman Street 125)రూ. 96,800 ప్రారంభ ధర వద్ద అందుబాటులో ఉన్న.. సుజుకి బర్గ్‌మన్ స్ట్రీట్ 125 ఒక లీటరుకు 50 కిమీ మైలేజ్ అందిస్తుంది. ఇందులో 124 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ 8.7 పీఎస్ పవర్ అందిస్తుంది. మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉన్న బర్గ్‌మన్ స్ట్రీట్ 125 ఏకంగా 5.5 లీటర్ కెపాసిటీ కలిగిన ఫ్యూయెల్ ట్యాంక్ పొందుతుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఇది మార్కెట్లోని ఇతర స్కూటర్ల కంటే భిన్నంగా ఉంటుంది.యమహా ఫాసినో 125 (Yamaha Fascino 125)యమహా ఫాసినో 125 ధర రూ. 83000 నుంచి రూ. 97500 (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ఆరు వేరియంట్లలో లభించే ఈ స్కూటర్ 49 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. ఇందులోని 125 సీసీ ఇంజిన్ 6500 rpm వద్ద 8.2 పీఎస్ పవర్ అందిస్తుంది. రోజువారీ వినియోగానికి ఉపయోగపడే స్కూటర్లలో ఇది కూడా ఒకటి.హీరో ప్లెజర్ ప్లస్ (Hero Pleasure Plus)హీరో ప్లెజర్ ప్లస్ ధర రూ. 70,500 నుంచి రూ. 74,000 (ఎక్స్ షోరూమ్) వరకు ఉంటుంది. 50 కిమీ / లీ మైలేజ్ అందించే ఈ స్కూటర్ 4.8 లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్ పొందుతుంది. 110 సీసీ ఇంజిన్ ద్వారా ఇది 8.15 పీఎస్ పవర్ అందిస్తుంది. సింపుల్ డిజైన్ కలిగిన ఈ స్కూటర్.. రైడర్లకు కావలసిన ఫీచర్స్ కలిగి ఉంటుంది.సుజుకి అవెనిస్ 125 (Suzuki Avenis 125)మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్లలో సుజుకి అవెనిస్ 125 ఒకటి. ఇది 49.6 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది. దీని ధర రూ. 94,500 నుంచి రూ. 95,300 (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ఈ స్కూటర్ 124 సీసీ ఇంజిన్ కలిగి 8.7 పీఎస్ పవర్ అందిస్తుంది. కాబట్టి ఇది ఉత్తమ పనితీరును అందిస్తుంది. -
ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్: బజాజ్ ప్లాటినా 100 vs హోండా షైన్
రోజువారీ వినియోగానికి లేదా ఎక్కువ మైలేజ్ కావాలని కోరుకునేవారు బజాజ్ ప్లాటినా 100, హోండా షైన్ వంటి బైకులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఇవి రెండూ.. సింపుల్ డిజైన్, ఫీచర్స్ కలిగి ఉండటం మాత్రమే కాకుండా మంచి రైడింగ్ అనుభూతిని కూడా అందిస్తాయి. ఈ కథనంలో ఈ రెండు బైకుల గురించి వివరంగా తెలుసుకుందాం.బజాజ్ ఆటో లాంచ్ చేసే బైకులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇందులో ప్లాటినా 100 కూడా ఉంది. ఇందులో 102 సీసీ ఫోర్ స్ట్రోక్ డీటీఎస్-ఐ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 7.9 పీఎస్ పవర్, 8.3 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 90 కిమీ/లీ మైలేజ్ ఇస్తుందని సమాచారం.హోండా షైన్ విషయానికి వస్తే.. ఇది 123.94 సీసీ ఇంజిన్ పొందుతుంది. ఇది 10.74 పీఎస్ పవర్, 11 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 75 కిమీ/లీ మైలేజ్ అందించే ఈ బైక్.. సైడ్-స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ వంటి ఫీచర్స్ కూడా పొందుతుంది.ఇదీ చదవండి: హోండా యాక్టివా ఈ vs సుజుకి ఈ యాక్సెస్: ఏది బెస్ట్?డిజైన్, ఫీచర్స్ పరంగా బజాజ్ ప్లాటినా 100, హోండా షైన్.. రెండూ చాలా అనుకూలంగా ఉంటాయి. ఇతర బైకులతో పోలిస్తే.. ఈ రెండు బైకులు మంచి మైలేజ్ అందించడం వల్ల, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు కూడా వీటిని ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. బజాజ్ ప్లాటినా 100 ప్రారంభ ధరలు రూ. 68,685 కాగా.. హోండా షైన్ ధర రూ. 84151 (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ఇండియా). -
కార్ కొనేవారికి అలర్ట్.. మారుతి సుజుకి ధరల పెంపు
ప్రముఖ దేశీయ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (Maruti Suzuki) ధరలను పెంచింది. పెరుగుతున్న ముడి సరుకుల ధరలు, నిర్వహణ ఖర్చుల కారణంగా పలు మోడళ్లలో ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. ధరల (Car Prices) పెరుగుదల ఫిబ్రవరి 1 నుండి అమలులోకి వస్తుంది. ఈ పెంపు సెలెరియో మోడల్‌పై ఎక్కువ ప్రభావం చూపుతుంది. దీని ధర రూ. 32,500 వరకు పెరుగుతుందని ఎక్స్ఛేంజీలకు మారుతి సుజుకి ఒక ప్రకటనలో తెలిపింది. అధిక ఇన్పుట్ ఖర్చులు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల ప్రభావం వల్ల ధరలు పెరిగాయని మారుతి సుజుకి వివరించింది. ఖర్చులను ఆప్టిమైజ్ చేయడానికి, వినియోగదారులపై ప్రభావాన్ని తగ్గించడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ కొన్ని మోడళ్లపై ధరలు పెంచక తప్పలేదని పేర్కొంది.ముడిసరుకు, లాజిస్టిక్స్, ఉత్పత్తి ఖర్చులు పెరగడం వల్ల వాహన తయారీదారులు అధిక ఇన్పుట్ ఖర్చులను ఎదుర్కొంటున్నారు. గ్లోబల్ సప్లయి చైన్‌లో అంతరాయాలు, పెరుగుతున్న డిమాండ్లే ముడిసరుకు ధరల పెరుగుదల కారణమని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఎస్&పీ గ్లోబల్ అభిప్రాయపడింది. యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలో కొత్త సుంకాల అవకాశం కూడా అనిశ్చితిని జోడించింది. ఇది పరిశ్రమలో ఖర్చు ఒత్తిడిని మరింత పెంచుతుంది.ఏ కారు ఎంతెంత పెరుగుతాయి?సెలెరియో అత్యధికంగా రూ. 32,500 వరకు, ఇన్విక్టో రూ. 30,000 వరకు, గ్రాండ్ విటారా రూ. 25,000 వరకు పెరుగుతాయి. ఇక బాలెనో ధర పెంపు రూ. 20,500 వరకు ఉంటుంది. ఆల్టో కె10 ధర రూ. 19,500 వరకు పెరుగుతుంది. ఎర్టిగా ధర రూ.15,000 వరకు, ఎస్-క్రాస్ ధర రూ.12,500 వరకు, ఎక్స్ఎల్6 ధర రూ.11,000 వరకు పెరగనుంది.డిజైర్ రూ. 10,550 వరకు, సూపర్ క్యారీ రూ. 10,000 వరకు, బ్రెజ్జా రూ. 9,000 వరకు, వ్యాగన్-ఆర్ రూ. 8,000 వరకు పెరగనున్నాయి.అదే సమయంలో, ఇగ్నిస్ రూ. 6,000 వరకు, ఫ్రాంక్స్ రూ. 5,500 వరకు, స్విఫ్ట్, ఎస్-ప్రెస్సో రెండూ రూ. 5,000 వరకు పెరగనున్నాయి. సియాజ్, జిమ్నీ స్వల్పంగా రూ. 1,500 వరకు పెరుగుతాయని కంపెనీ పేర్కొంది. -
హోండా యాక్టివా ఈ vs సుజుకి ఈ యాక్సెస్: ఏది బెస్ట్?
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 వేదికగా హోండా మోటార్‌సైకిల్ కంపెనీ తన 'యాక్టివా ఈ' స్కూటర్ లాంచ్ చేసింది. సుజుకి మోటార్‌సైకిల్ కంపెనీ ఈ-యాక్సెస్ పేరుతో ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆవిష్కరించింది. ఇది త్వరలోనే దేశీయ మార్కెట్లో లాంచ్ కానుంది. అయితే ఈ రెండు స్కూటర్ల మధ్య తేడా ఏంటి?.. రేంజ్ ఎంత, బ్యాటరీ కెపాసిటీ ఏమిటనే వివరాలను వివరంగా తెలుసుకుందాం.ఫీచర్స్హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎల్ఈడీ లైటింగ్ సెటప్, రివర్స్ మోడ్, ఆటో బ్రైట్నెస్ అడ్జస్టేబుల్, సైడ్ స్టాండ్ ఇండికేటర్, స్మార్ట్ కీ సిస్టమ్ వంటి ఫీచర్స్ పొందుతుంది. యాక్టివా ఈ స్కూటర్ టచ్‌స్క్రీన్ కూడా పొందుతుంది. దీని ద్వారా రైడర్ బ్యాటరీ స్టేటస్, టైమ్ మొదలైనవన్నీ తెలుసుకోవచ్చు.సుజుకి ఈ యాక్సెస్ బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన TFT క్లస్టర్ పొందుతుంది. దీని ద్వారా టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్, మెసేజ్ నోటిఫికేషన్స్ పొందవచ్చు. USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. సైడ్ స్టాండ్ అలర్ట్ సిస్టమ్‌తో కూడిన స్మార్ట్ కీ కూడా లభిస్తుంది.బ్యాటరీ, రేంజ్ & పర్ఫామెన్స్హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ 1.5 కిలోవాట్ కెపాసిటీ కలిగిన రెండు రిమూవబుల్ బ్యాటరీలు పొందుతుంది. ఇది ఒక సింగిల్ ఛార్జ్‌పై 102 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ-యాక్సెస్ స్కూటర్ 3.07 కిలోవాట్ లిథియం ఐరన్ బ్యాటరీ ద్వారా.. 95 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం.పర్ఫమెన్స్ విషయానికి వస్తే.. యాక్టివా ఈ స్కూటర్ 6 kW పవర్, 22 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 80 కిమీ. కాగా .. ఇది ఎకాన్, స్టాండర్డ్, స్పోర్ట్ అనే మూడు రైడింగ్ మోడ్స్ పొందుతుంది. ఈ-యాక్సెస్ స్కూటర్ 4.1 kW పవర్, 15 Nm టార్క్ అందిస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 71 కిమీ. ఇది కూడా మూడు రైడింగ్ మోడ్స్ పొందుతుంది. -
భారత్‌కు చెందిన మొదటి సోలార్ ఈవీ
పుణెకు చెందిన వైవ్ మొబిలిటీ భారతదేశపు మొట్టమొదటి సౌరశక్తితో నడిచే ఎలక్ట్రిక్ వాహనం (ఈవీ) వైవే ఈవాను భారత్ మొబిలిటీ ఎక్స్పో 2025లో ఆవిష్కరించింది. రూ.3.25 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర కలిగిన వైవే ఈవా సోలార్ టెక్నాలజీతో ఈవీ మార్కెట్లో విప్లవాత్మక మార్పులు తీసుకురానుందని కంపెనీ వర్గాలు తెలిపాయి.ఫీచర్లు, స్పెసిఫికేషన్లువైవే ఈవా పైకప్పుపై సోలార్ ప్యానెల్స్ అమర్చారు. ఇది రోజుకు 10 కిలోమీటర్ల పరిధిని పెంచుతుంది. ఈ ఫీచర్ సాంప్రదాయ ఛార్జింగ్ అవసరాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఈ వాహనం ప్రత్యేకమైన బ్యాటరీ రెంటల్ ప్లాన్‌ను అందిస్తుంది. ఇందుకోసం కిలోమీటరుకు రూ.2 సబ్ స్క్రిప్షన్ ఖర్చు అవుతుంది. ఇది మూడు వేరియంట్లలో లభిస్తుంది. నోవా (9 కిలోవాట్ బ్యాటరీ), స్టెల్లా (12 కిలోవాట్ బ్యాటరీ), వెగా (18 కిలోవాట్ బ్యాటరీ) వేరియంట్లు ఉన్నాయి. ఎంచుకున్న బ్యాటరీ ప్యాక్‌ను బట్టి ధరలు రూ.3.25 లక్షల నుంచి రూ.5.99 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉంటాయి. వైవే ఈవా గరిష్టంగా గంటకు 70 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. కేవలం 5 సెకన్లలో 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని చేరుతుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది.ఇదీ చదవండి: రూ.1,275 లక్షల కోట్లకు ప్రపంచ కుబేరుల సంపదవైవే ఎవా డెలివరీలు 2026 ద్వితీయార్ధంలో ప్రారంభమవుతాయని వైవ్ మొబిలిటీ ప్రకటించింది. మొదటి 25,000 మంది కస్టమర్లకు పొడిగించిన బ్యాటరీ వారంటీ, మూడు సంవత్సరాల కాంప్లిమెంటరీ వెహికల్ కనెక్టివిటీతో సహా అదనపు ప్రయోజనాలను కూడా కంపెనీ అందిస్తున్నట్లు ప్రకటించింది. -
ఈ–త్రీవీలర్స్‌లోకి టీవీఎస్..
టీవీఎస్ మోటార్ కంపెనీ ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాల రంగంలోకి ప్రవేశించింది. ఎక్స్‌పోలో భాగంగా కింగ్ ఈవీ మ్యాక్స్‌ను పరిచయం చేసింది. ఇది భారత్‌లో బ్లూటూత్‌తో అనుసంధానించిన తొలి ఎలక్ట్రిక్ త్రీ–వీలర్. స్థిర సాంకేతికతతో పట్టణ మొబిలిటీని పెంచే లక్ష్యంతో దీనిని రూపొందించినట్టు కంపెనీ తెలిపింది. టీవీఎస్ స్మార్ట్‌కనెక్ట్‌తో తయారైంది. ఇది స్మార్ట్‌ఫోన్ ఇంటిగ్రేషన్ ద్వారా రియల్ టైమ్ నావిగేషన్, అలర్ట్స్, వాహన స్థితిగతులను తెలియజేస్తుంది. ఒకసారి చార్జింగ్‌తో 179 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని టీవీఎస్ తెలిపింది. 3 గంటల 30 నిమిషాల్లో 100 శాతం చార్జింగ్ పూర్తి అవుతుంది. 51.2 వోల్ట్ ఎల్ఎఫ్పీ బ్యాటరీ పొందుపరిచారు. గంటకు గరిష్ట వేగం 60 కిలోమీటర్లు. ఎక్స్ షోరూం ధర రూ.2.95 లక్షలు.ఇదీ చదవండి: టిక్‌టాక్ పునరుద్ధరణ.. ట్రంప్ పుణ్యమే..! మళ్లీ స్కోడా డీజిల్ కార్లువాహన తయారీలో ఉన్న ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ కంపెనీ స్కోడా అయిదేళ్ల తర్వాత భారత్‌లో డీజిల్ ఇంజన్స్‌ను మళ్లీ ప్రవేశపెడుతోంది. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో వేదికగా సూపర్బ్ డీజిల్ కారును ప్రదర్శించింది. కొడియాక్ డీజిల్ సైతం త్వరలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. భారతీయ కస్టమర్లు ఇప్పటికీ డీజిల్ కార్లను డిమాండ్ చేస్తున్నారని స్కోడా ఇండియా హెడ్ పీటర్ యానిబా తెలిపారు. ‘స్కోడా కార్ల విక్రయాల్లో గతంలో 80 శాతం యూనిట్లు డీజిల్ విభాగం కైవసం చేసుకుంది. హ్యుందాయ్, కియా, టాటా, మహీంద్రా అమ్మకాల్లో గణనీయ భాగం డీజిల్ వాహనాలు సమకూరుస్తున్నాయి. లగ్జరీ కార్ల తయారీ సంస్థలైన మెర్సిడెస్, బీఎండబ్ల్యూలకు కూడా అంతే. కాబట్టి లగ్జరీ, ఎగ్జిక్యూటివ్ సెగ్మెంట్ల మధ్యలో ఉన్న స్కోడా ఈ మార్పు నుండి గణనీయంగా ప్రయోజనం పొందుతుంది. మేము కచి్చతంగా డిమాండ్‌ను నెరవేర్చడానికి చూస్తున్నాం’ అని వివరించారు. -
ఏటా పెట్టుబడి.. 2,000 కోట్లు
న్యూఢిల్లీ: కొత్త వాణిజ్య వాహనాలు, యంత్ర పరికరాల అభివృద్ధిపై ఏటా దాదాపు రూ.2,000 కోట్ల పెట్టుబడిని కొనసాగిస్తామని టాటా మోటార్స్ ఈడీ గిరీశ్ వాఘ్ వెల్లడించారు. ఇందులో ఎలక్ట్రిఫికేషన్, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్, కనెక్టెడ్ వెహికిల్ ప్లాట్‌ఫామ్ వంటి నూతన సాంకేతికతలపై 40 శాతంపైగా వెచి్చస్తామన్నారు. సంస్థకు చెందిన వాణిజ్య వాహన విభాగం ప్రత్యామ్నాయ ఇంధనాలు, ఉద్గారాలను వెదజల్లని బ్యాటరీ ఎలక్ట్రిక్, ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్, హైడ్రోజన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ వంటి వివిధ సాంకేతికతలపై పని చేస్తోందని చెప్పారు. సున్నా ఉద్గారాల దిశగా పరివర్తన వెంటనే జరగదు కాబట్టి అన్ని ప్రత్యామ్నాయ ఇంధనాలపై పని చేస్తున్నామని అన్నారు. ‘నగరాలు, సమీప దూరాలకు బ్యాటరీ వాహనాలు పనిచేస్తాయి. సుదూర ప్రాంతాలకు, అధిక సామర్థ్యానికి హైడ్రోజన్ వంటి సాంకేతికత అవసరం. ఇటువంటి అవసరాలన్నింటినీ పరిష్కరించే సాంకేతికతలలో పెట్టుబడి పెట్టాం’ అని వివరించారు. హైడ్రోజన్ ట్రక్స్.. హైడ్రోజన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ కలిగిన ట్రక్స్‌ను మార్చిలోగా పైలట్ ప్రాతిపదికన వినియోగిస్తామని గిరీశ్ వాఘ్ వెల్లడించారు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌లో భాగంగా ఐవోసీఎల్‌తో కలిసి కంపెనీ 18 నెలల పాటు మూడు రూట్లలో ఈ ట్రక్కులను నడుపనుంది. ఫలితాలను బట్టి వాహనాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను పరిచయం చేసేందుకు రెడీ అవుతున్నట్టు వాఘ్ పేర్కొన్నారు. కంపెనీ తయారు చేసిన 15 ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ బస్‌లు ఐవోసీఎల్ 10 నెలలుగా వినియోగిస్తోందని వివరించారు. ఒకట్రెండేళ్లలో హైడ్రోజన్ ఫ్యూయల్ వాహనాలను వాణిజ్యపరంగా ప్రవేశపెడతామని చెప్పారు. -
ప్రపంచంలోనే.. మొట్ట మొదటి సీఎన్జీ స్కూటర్ ఇదే
బజాజ్ ఆటో ప్రపంచంలోనే మొట్ట మొదటి సీఎన్జీ బైక్ (ఫ్రీడమ్ 125) లాంచ్ చేస్తే.. టీవీఎస్ మోటార్ (TVS Motor) కంపెనీ మొదటి సీఎన్జీ స్కూటర్(జూపిటర్)ను భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో ఆవిష్కరించింది. ఇది ఫ్రీడమ్ 125 మాదిరిగానే పెట్రోల్, సీఎన్‌జీలతో నడుస్తుంది.టీవీఎస్ జూపిటర్ సీఎన్జీ (TVS Jupiter CNG) స్కూటర్ చూడటానికి జుపీటర్ 125 మాదిరిగా ఉన్నప్పటికీ.. ముందుభాగంలో కనిపించే CNG స్టిక్కర్ దానిని సీఎన్జీ స్కూటర్‌గా గుర్తించడానికి సహాయపడుతుంది. 1.4 కేజీ కెపాసిటీ కలిగిన సీఎన్జీ ట్యాంక్.. స్కూటర్ సీటు కింద ఉంటుంది. కాగా ఇందులోని 124.8 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 6000 rpm వద్ద 7.2 హార్స్ పవర్, 5500 rpm వద్ద 9.4 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.టీవీఎస్ జూపిటర్ సీఎన్జీ స్కూటర్ 226 కిమీ మైలేజ్ (సీఎన్జీ + పెట్రోల్) ఇస్తుందని సమాచారం. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 80.5 కిమీ కావడం గమనార్హం. స్టాండర్డ్ జూపిటర్ మాదిరిగానే.. సీఎన్జీ స్కూటర్ కూడా డిజిటల్ అనలాగ్ డిస్ప్లే, యూఎస్బీ ఛార్జర్, స్టార్ట్ / స్టాప్ టెక్ వంటివన్నీ పొందుతుంది. కంపెనీ తన సీఎన్జీ స్కూటర్ ధరలను ఇంకా ప్రకటించలేదు. అయితే ఇది సాధారణ జూపిటర్ ధర కంటే కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. -
భారత్‌లో మొదటి ఎయిర్ ట్యాక్సీ 'శూన్య': దీని గురించి తెలుసా?
బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ 'సరళా ఏవియేషన్' భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో2025లో తన ప్రోటోటైప్ ఎయిర్ ట్యాక్సీ 'శూన్య'ను ఆవిష్కరించింది. కంపెనీ దీనిని 2028 నాటికి ప్రారంభించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.శూన్యా ఎయిర్ ట్యాక్సీ.. 20 కిమీ నుంచి 30 కిమీ దూరాల ప్రయాణాలు కోసం ప్రత్యేకంగా రూపుదిద్దుకుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 250 కిమీ. 680 కేజీలు బరువు మోయగల ఈ ఎయిర్ టాక్సీలో ఆరుగురు ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. దీన్నిబట్టి చూస్తే.. మార్కెట్లో అత్యధిక పేలోడ్ మోయగల కెపాసిటీ ఉన్న ఎయిర్ టాక్సీగా రికార్డ్ క్రియేట్ చేయనుంది. అయితే కంపెనీ దీనికి సంబంధించిన ధరలను అధికారికంగా వెల్లడించలేదు.శూన్య ఎయిర్ ట్యాక్సీ.. రద్దీగా ఉన్న ప్రాంతాల్లో కూడా గమ్యాన్ని వేగంగా చేరుకోవడానికి ఉపయోగపడుతుంది. ట్రాఫిక్ రద్దీ నుంచి ప్రయాణికులను వేగంగా గమ్యస్థానానికి చేర్చడానికి మాత్రమే కాకుండా.. కాలుష్యం వంటి సవాళ్లను పరిష్కరించడానికి కూడా సహరిస్తుందని సరళ ఏవియేషన్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ 'అడ్రియన్ ష్మిత్' పేర్కొన్నారు.సరళ ఏవియేషన్‌ను.. అడ్రియన్ ష్మిత్, రాకేష్ గాంకర్, శివమ్ చౌహాన్ అనే ముగ్గురు అక్టోబర్ 2023లో స్థాపించారు. ఈ స్టార్టప్ ఇటీవలే ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సల్, జెరోధా కో ఫౌండర్ నిఖిల్ కామత్ భాగస్వామ్యంతో Accel నేతృత్వంలోని సిరీస్ A ఫండింగ్‌లో 10 మిలియన్లను సేకరించింది. కాబట్టి ఈ కంపెనీ త్వరలోనే తన సేవలను ప్రారంభించే అవకాశం ఉంది.సరళ ఏవియేషన్‌ను కంపెనీ తన ఎయిర్ ట్యాక్సీ సర్వీసులను.. బెంగళూరులో ప్రారంభించిన తర్వాత ముంబై, ఢిల్లీ, పూణె సహా ఇతర నగరాలకు విస్తరించే అవకాశం ఉంది. ప్రయాణీకుల రవాణాతో పాటు, పట్టణ ప్రాంతాల్లో అత్యవసర వైద్య అవసరాలను తీర్చడానికి ఉచిత ఎయిర్ అంబులెన్స్ సేవను ప్రారంభించాలని సరళ ఏవియేషన్ యోచిస్తున్నట్లు సమాచారం.ఎయిర్ ట్యాక్సీల అభివృద్ధికి కేంద్రంనగరాలు అభివృద్ధి చెందుతున్నాయి, ట్రాఫిక్ పెద్ద సమస్యగా మారిపోయింది. రోజువారీ ట్రాఫిక్ ఎలా ఉన్నా.. వర్షాకాలంలో మాత్రం ట్రాఫిక్‌లో చిక్కుకుంటే నరకం కనిపిస్తుంది. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి కొన్ని కంపెనీలు గత కొంత కాలంగా ఎయిర్ టాక్సీలను ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి. దీనికి సంబంధించి కేంద్ర మంత్రిత్వ శాఖ కూడా రోడ్‌మ్యాప్ సిద్ధం చేస్తోంది.ఇదీ చదవండి: అంబానీని మించిన దానగుణం: ఒక్క రోజులో రూ. 46వేలకోట్ల నష్టంభారతదేశంలో ఎయిర్ ట్యాక్సీలను ప్రవేశపెట్టడానికి, రోడ్‌మ్యాప్‌ను రూపొందించడానికి.. ఇండియా ఏవియేషన్ రెగ్యులేటర్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) అనేక సాంకేతిక కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్ట్ 2026 నాటికి ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, బెంగుళూరు వంటి ప్రధాన పట్టణ కేంద్రాలలో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత చెన్నై, హైదరాబాద్ వంటి ఇతర నగరాలకు విస్తరించనున్నట్లు సమాచారం.ప్రయాణ ఖర్చు తక్కువే..ఇండిగో పేరెంట్ ఇంటర్‌గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ (IGE) అమెరికన్ ఎయిర్ టాక్సీ తయారీదారు 'ఆర్చర్ ఏవియేషన్'తో అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసే పనిని ప్రారంభించింది. ఎయిర్ టాక్సీ అందుబాటులో వచ్చిన తరువాత.. ఇందులో ప్రయాణించడానికి ప్రయాణికుడికి అయ్యే ఖర్చు ఉబర్ కంటే కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని సమాచారం. -
ఆటో ఎక్స్పో.. స్పందన అదరహో
దేశ రాజధానిలోని భారత్ మండపంలో నిర్వహిస్తున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో తమ ఫేవరెట్ కొత్త కార్లు, బైక్‌లను చూసేందుకు వాహన ప్రియులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఆదివారం నుంచి సాధారణ ప్రజానీకాన్ని కూడా అనుమతిస్తుండటంతో ఎంట్రీ పాయింట్లు, సెక్యురిటీ చెక్ పాయింట్ల దగ్గర ప్రజలు బారులు తీరారు. సమీప ప్రాంతాల నుంచి కూడా వాహన ప్రియులు పెద్ద సంఖ్యలో వస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. భారీ జన సందోహాన్ని ఊహించిన కంపెనీలు కూడా డిస్ప్లే ఏరియాల్లో మరింత మంది సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నాయి. పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు వాహనాల తయారీ సంస్థల సమాఖ్య డైరెక్టర్ జనరల్ రాజేశ్ మీనన్ తెలిపారు.అత్యవసర పరిస్థితుల్లో సత్వరం స్పందించేందుకు పెద్ద ఎత్తున ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌లు, వైద్య సదుపాయాలు మొదలైనవి ఏర్పాటు చేసినట్లు వివరించారు. జనవరి 17 నుంచి 22 వరకు జరిగే ఆటో ఎక్స్‌పోలో తొలి రెండు రోజులు మీడియా, వ్యాపార వర్గాలకు కేటాయించగా.. మిగతా రోజుల్లో సందర్శకులను అనుమతిస్తున్నారు. ఆటోమొబైల్ కంపెనీలు తొలి రెండు రోజుల్లో 90 పైచిలుకు కొత్త వాహనాలను ఆవిష్కరించాయి. పలు కాన్సెప్ట్‌లు, సరికొత్త ఆటోమోటివ్ టెక్నాలజీల మొదలైన వాటిని కూడా ప్రదర్శిస్తున్నాయి.ఇదీ చదవండి: స్మాల్‌క్యాప్ ఫండ్ పరిమాణం పెరిగితే..?భారత్‌లో తయారీకి సిద్ధం: బీవైడీఅన్నీ కలిసి వస్తే భారత్‌లో తయారీ కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చైనాకి చెందిన బీవైడీ ఇండియా ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల విభాగం హెడ్ రాజీవ్ చౌహాన్ తెలిపారు. ప్రణాళికలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని వివరించారు. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో తమ ప్రీమియం ఎలక్ట్రికి ఎస్యూవీ సీలయన్7ను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. భారత్‌లో తమకు ప్రస్తుతం ఏ కంపెనీతోనూ తయారీ కాంట్రాక్టులు లేవని ఆయన చెప్పారు. దేశీయంగా కంపెనీ కార్యకలాపాలు సాగించడానికి సంబంధించి చైనీయులపై భారత్ వీసా ఆంక్షల ప్రభావమేదేనా ఉందా అనే ప్రశ్నకు స్పందిస్తూ.. అలాంటిదేమీ లేదని చౌహన్ చెప్పారు. -
60 కిమీ మైలేజ్: రూ. లక్ష కంటే తక్కువే..
భారతదేశంలో ఇంధన ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ తరుణంలో చాలామంది ఎక్కువ మైలేజ్ ఇచ్చే వాహనాలను ఉపయోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ కథనంలో లక్ష రూపాయల కంటే తక్కువ ధరలో లభించే.. అధిక మైలేజ్ ఇచ్చే స్కూటర్లను గురించి తెలుసుకుందాం.టీవీఎస్ జుపీటర్ 125 (TVS Jupiter 125)మార్కెట్లో అధిక అమ్మకాలను పొందుతూ.. ఎందోమందిని ఆకర్షిస్తున్న టీవీఎస్ జుపీటర్ 125 ఎక్కువ మైలేజ్ ఇచ్చే స్కూటర్ల జాబితాలో ఒకటి. దీని ప్రారంభ ధర రూ. 96000 (ఎక్స్ షోరూమ్). ఇది 60 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ 124.8 సీసీ ఇంజిన్ ద్వారా 8.15 Bhp పవర్, 10.5 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇందులో స్టోరేజ్ స్పేస్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది ప్రత్యేకించి రోజువారీ వినియోగానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.యమహా ఫాసినో 125 (Yamaha Fascino 125)రూ.79990 ప్రారంభ ధర వద్ద లభించే యమహా ఫాసినో 125 సీసీ ఇంజన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంది. కాబట్టి ఇది పెట్రోల్, విద్యుత్ రెండింటిలోనూ నడుస్తుంది. ఇది 66 కిమీ / లీ మైలేజ్ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఇది మంచి డిజైన్, రైడర్లకు కావలసిన ఫీచర్స్ పొందుతుంది.ఇదీ చదవండి: రూ. 22.95 లక్షల బీఎండబ్ల్యూ బైక్హోండా యాక్టివా 6జీ (Honda Activa 6G)భారతదేశంలో యాక్టివా 6జీ అనేది హోండా మోటార్‌సైకిల్ బెస్ట్ సెల్లింగ్ స్కూటర్లలో ఒకటిగా ఉంది. ఇది 109.51 సీసీ ఇంజిన్ ద్వారా 7.73 Bhp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ స్కూటర్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 5.3 లీటర్లు. దీని టాప్ స్పీడ్ గంటకు 85 కిమీ. 106 కేజీల బరువున్న ఈ స్కూటర్ 60 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ ధర రూ. 78000 నుంచి రూ. 84000 (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. -
రూ. 22.95 లక్షల బీఎండబ్ల్యూ బైక్ ఇదే
ఖరీదైన బైకులను తయారు చేసే బీఎండబ్ల్యూ మోటోరాడ్ (BMW Motorrad) భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో తన 'ఆర్ 1300 జీఎస్ఏ' (R 1300 GSA) లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 22.95 లక్షలు. ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా 12 కేజీలు తక్కువ బరువును కలిగి ఉంది.సుమారు 30 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కలిగిన బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ఏ 1300 సీసీ ఇంజిన్ పొందుతుంది. ఇది 7750 rpm వద్ద 145 హార్స్ పవర్, 6500 rpm వద్ద 149 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఆటోమేటెడ్ షిఫ్ట్ అసిస్టెంట్ కలిగిన ఈ బైక్ క్రూయిజ్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ వంటి ఫీచర్స్ కూడా పొందుతుంది.ఇదీ చదవండి: సరికొత్త బెంజ్ కారు లాంచ్.. ధర ఎంతంటే?బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ఏ బైక్.. ట్రిపుల్ బ్లాక్, జీఎస్ ట్రోఫీ, ఆప్షన్ 719 కారాకోరం అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. కంపెనీ ఇందులోనే మరో కొత్త వేరియంట్‌ను కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది.Unleash your potential with the all-new BMW R 1300 GS Adventure.Starting at an introductory ex-showroom price of INR 22.95 Lakhs*.To know more, head over to the link below 👇 https://t.co/gsXc9UFriJ#BMWR1300GSAdventure #BMWMotorradIndia #R1300GSAdventure #PriceLaunch pic.twitter.com/oU0WWBuRNF— BMWMotorrad_IN (@BMWMotorrad_IN) January 18, 2025 -
బ్లేడ్ బ్యాటరీ బస్సు.. బుల్లి కారు..
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో (Bharat mobility expo 2025)వివిధ కంపెనీల నుంచి నూతన ఎలక్ట్రిక్ వాహనాలు కొలువుదీరాయి. వియత్నాంకు చెందిన విన్‌ఫాస్ట్ ఆటో భారత్‌కు ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటించింది. వీఎఫ్–7, వీఎఫ్–6 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను ఆవిష్కరించింది. ఈ ఏడాది చివరినాటికి వీటిని మార్కెట్లోకి తేనున్నట్టు తెలిపింది. తమిళనాడులోని ట్యూటికోరిన్ వద్ద 500 మిలియన్ డాలర్ల పెట్టుబడితో తయారీ కేంద్రం స్థాపించనున్నట్టు వెల్లడించింది. ఈ ఏడాది రెండవ అర్ద భాగంలో ఈ ప్లాంటు రెడీ అవుతుందని విన్‌ఫాస్ట్ ఆసియా సీఈవో పామ్ సాన్ ఛావ్ తెలిపారు.హ్యుండై టీవీఎస్ జోడీహ్యుండై మోటార్ కంపెనీ, టీవీఎస్ మోటార్ కంపెనీ చేతులు కలిపాయి. అధునాతన ఎలక్ట్రిక్ త్రీ–వీలర్లు, చిన్న ఫోర్–వీలర్లను అభివృద్ధి చేసే లక్ష్యంతో భాగస్వామ్యాన్ని అన్వేషించనున్నట్లు ప్రకటించాయి. ఈ సందర్భంగా హ్యుండై తన మైక్రో మొబిలిటీ కాన్సెప్ట్ ఈవీలను ఆవిష్కరించింది. ఈ భాగస్వామ్యం కార్యరూపం దాలిస్తే డిజైన్, ఇంజనీరింగ్, సాంకేతిక నైపుణ్యాన్ని అందించాలని హ్యుండై యోచిస్తోంది. అయితే భారత్‌లో ఈ వాహనాల తయారీ, మార్కెటింగ్‌పై టీవీఎస్ దృష్టి పెడుతుంది.కొలువుదీరిన ఎంజీ మోడళ్లుజేఎస్డబ్లు్య ఎంజీ మోటార్ ఇండియా మజెస్టర్ పేరుతో మధ్యస్థాయి ఎస్‌యూవీని ఆవిష్కరించింది. కాంపాక్ట్ కార్స్ కంటే పెద్దగా, పూర్తి స్థాయి కార్స్ కంటే చిన్నగా ఉంటుందని కంపెనీ తెలిపింది. అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న ఐఎం5, ఐఎం6, ఎంజీ హెచ్ఎస్, ఎంజీ7 ట్రోఫీ ఎడిషన్ మోడళ్లను సైతం కంపెనీ ప్రదర్శించింది. మోంట్రా ఎలక్ట్రిక్ కొత్త మోడళ్లుమురుగప్ప గ్రూప్ కంపెనీ మోంట్రా ఎలక్ట్రిక్ రెండు కొత్త వాహనాలను లాంచ్ చేసింది. ఈవియేటర్ పేరుతో చిన్న తరహా వాణిజ్య వాహనాన్ని, సూపర్ కార్గో పేరుతో త్రీవీలర్‌ను ఆవిష్కరించింది. ఒకసారి చార్జింగ్‌తో ఈవియేటర్ 245 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఢిల్లీ ఎక్స్‌షోరూంలో ధర రూ.15.99 లక్షలు. సూపర్ కార్గో ఈ–త్రీవీలర్ 200 కిలోమీటర్లపైగా పరుగెడుతుంది. పూర్తి ఛార్జింగ్ కోసం 15 నిమిషాలు సమయం తీసుకుంటుంది. ఢిల్లీ ఎక్స్‌షోరూంలో ధర రూ.4.37 లక్షలు. కంపెనీ 55 టన్నుల హెవీ కమర్షియల్ ఎలక్ట్రిక్ ట్రక్ రైనో సైతం ప్రదర్శించింది. బీవైడీ సీలయన్–7..చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం బీవైడీ భారత్‌లో సీలయన్–7 కూపే–ఎస్యూవీ ఆవిష్కరించింది. కంపెనీ నుంచి ఇది భారత మార్కెట్లో నాల్గవ మోడల్‌గా నిలవనుంది. 82.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ పొందుపరిచారు. ఒకసారి చార్జింగ్ చేస్తే వేరియంట్‌నుబట్టి 542–567 కిలోమీటర్లు పరుగెడుతుంది. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని పర్ఫామెన్స్ వేరియంట్ 4.5 సెకన్లలో, ప్రీమియం వేరియంట్ 6.7 సెకన్లలో అందుకుంటుంది.ఒలెక్ట్రా బ్లేడ్ బ్యాటరీ ఛాసీ..హైదరాబాద్ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో వేదికగా 12 మీటర్ల పొడవున్న బ్లేడ్ బ్యాటరీ ఛాసీని ఆవిష్కరించింది. 9 మీటర్ల పొడవున్న సిటీ బస్, 12 మీటర్ల పొడవుతో కోచ్ బస్ సైతం ప్రదర్శించింది. బ్లేడ్ బ్యాటరీ ఒకసారి చార్జింగ్‌తో 500 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. 2024 సెప్టెంబర్ 30 నాటికి 2,200లకుపైగా యూనిట్ల ఎలక్ట్రిక్ బస్‌లను సరఫరా చేసి ప్రజా రవాణా రూపు రేఖలను మార్చినట్టు ఒలెక్ట్రా సీఎండీ కె.వి.ప్రదీప్ తెలిపారు. అశోక్ లేలాండ్ సాథీవాణిజ్య వాహనాలు, బస్‌ల తయారీ దిగ్గజం అశోక్ లేలాండ్ సాథి పేరుతో తేలికపాటి చిన్న వాణిజ్య వాహనాన్ని ఆవిష్కరించింది. అత్యాధునిక ఎల్ఎన్టీ సాంకేతికతతో తయారైంది. 45 హెచ్‌పీ పవర్, 110 ఎన్ఎం టార్క్ అందిస్తుంది. 1,120 కిలోల బరువు మోయగలదు. ధర రూ.6.49 లక్షలు. అలాగే మల్టీ యాక్సెల్, ఫ్రంట్ ఇంజన్, 15 మీటర్ల పొడవున్న గరుడ్–15 ప్రీమియం బస్ సైతం కొలువుదీరింది. 42 స్లీపర్ బెర్తులను ఈ బస్‌లో ఏర్పాటు చేశారు. కాగా, ఈ–టిరాన్ పేరుతో ఎలక్ట్రిక్ పోర్ట్ టెర్మినల్ ట్రాక్టర్‌ను సైతం కంపెనీ ఆవిష్కరించింది. మైక్రో మొబిలిటీతో బజాజ్?స్విట్జర్లాండ్‌కు చెందిన మైక్రో మొబిలిటీ సిస్టమ్స్‌లో వాటాను కొనుగోలు చేయడంతో సహా ఎలక్ట్రిక్ క్వాడ్రిసైకిళ్లను ఉత్పత్తి, ఎగుమతి చేయడానికి వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం బజాజ్ ఆటో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. మైక్రోలీనో పేరుతో రెండు సీట్ల ఎలక్ట్రిక్ క్వాడ్రిసైకిల్‌ను, అలాగే మైక్రోలెటా పేరుతో మూడు చక్రాల ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మైక్రో మొబిలిటీ తయారు చేస్తోంది. నగరాల్లో తక్కువ దూరం ప్రయాణానికి అనువైన వాహనాల తయారీలో మైక్రో మొబిలిటీ సిస్టమ్స్‌కు పేరుంది.జేబీఎం ఎలక్ట్రిక్ కొత్త వాహనాలుజేబీఎం ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఎక్స్పో వేదికగా గెలాక్సీ లగ్జరీ కోచ్, ఎక్స్‌ప్రెస్ ఇంటర్సిటీ బస్, లో ఫ్లోర్ మెడికల్ మొబైల్ యూనిట్ ఈ–మెడిలైఫ్, దేశంలో తొలిసారిగా 9 మీటర్ల పొడవున్న టార్మాక్ కోచ్ ఈ–స్కైలైఫ్ను విడుదల చేసింది. లిథియం–అయాన్ బ్యాటరీలు కలిగిన ఈ వాహనాలకు ఆల్ట్రా ఫాస్ట్ చార్జింగ్ సదుపాయం ఉంది. ఇప్పటికే కంపెనీ భారత్‌తోపాటు యూరప్, పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాల్లో 1,800 ఎలక్ట్రిక్ బస్‌లను విక్రయించింది. 10,000 పైచిలుకు ఈ–బస్‌లకు ఆర్డర్ బుక్ ఉందని జేబీఎం గ్రూప్ వైస్ చైర్మన్ నిశాంత్ ఆర్య తెలిపారు. -
సరికొత్త బెంజ్ కారు లాంచ్.. ధర ఎంతంటే?
బీఎండబ్ల్యూ ఇండియా (BMW India) తన నాల్గవ తరం ఎక్స్3 (X3)ని ఆటో ఎక్స్పో 2025లో లాంచ్ చేసింది. ఇది పెట్రోల్, డీజిల్ వేరియంట్ల రూపంలో మార్కెట్లో అందుబాటులో ఉంది. వీటి ధరలు వరుసగా రూ. 75.80 లక్షలు, రూ. 77.80 లక్షలు (ఎక్స్ షోరూమ్). కంపెనీ ఈ మోడల్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు ఏప్రిల్‌లో ప్రారంభమవుతాయి.2025 బీఎండబ్ల్యూ ఎక్స్3 రెండు మోడల్స్ 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతాయి. పెట్రోల్ మోడల్ 190 హార్స్ పవర్, 310 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. డీజిల్ వెర్షన్ 197 హార్స్ పవర్, 400 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.లేటెస్ట్ డిజైన్ కలిగిన బీఎండబ్ల్యూ ఎక్స్3 కారు.. స్లిమ్ హెడ్‌లైట్స్, కిడ్నీ గ్రిల్, కొత్త అల్లాయ్ వీల్స్ పొందుతుంది. ఇందులో 12.3 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ టచ్‌స్క్రీన్, 14.9 ఇంచెస్ డ్రైవర్ డిస్ప్లే వంటివి ఉంటాయి. హీటెడ్ స్పోర్ట్స్ సీట్లు, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, పార్క్ అసిస్ట్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేషన్ ఫంక్షన్‌తో కూడిన పవర్డ్ ఫ్రంట్ సీట్లు, ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్, రిక్లైనింగ్ రియర్ బెంచ్ వంటి ఫీచర్స్ ఇందులో ఉంటాయి. -
కళ్లుచెదిరే కొత్త కార్లు.. భళా నయా బైక్‌లు..
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో (Bharat Mobility Global Expo 2025) కనులపండువగా సాగుతోంది. ఢిల్లీలోని భారత్ మండపంలో ఏర్పాటు చేసిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025(రెండో ఎడిషన్)ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ ఆటోమొబైల్ ఎక్స్ పో వేదికగా పలు కార్లు, టూవీలర్ కంపెనీలు తమ నూతన ఉత్పత్తులను ఆవిష్కరిస్తున్నాయి.హీరో మోటోకార్ప్ నాలుగు కొత్త మోడళ్లు హీరో మోటోకార్ప్ (Hero Motocorp) భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో వేదికగా నాలుగు ద్విచక్ర వాహన మోడళ్లను ఆవిష్కరించింది. ఎక్స్ట్రీమ్ 250ఆర్, ఎక్స్‌ప్లస్ 210 పేరుతో రెండు మోటార్స్ బైకులు లాంచ్ చేసింది. స్కూటర్ల పోర్ట్‌ఫోలియోలో ఎక్స్మ్ 125, ఎక్స్మ్ 160 రెండు సరికొత్త వేరియంట్లను అందుబాటులోకి తెచ్చింది. కొత్త ఆవిష్కరణలతో ప్రీమియం బ్రాండ్లు ఎక్స్ట్రీం, ఎక్స్ప్లస్లు మరింత బలోపేతమయ్యాయని కంపెనీ సీఈఓ నిరంజన్ తెలిపారు. వీటి బుకింగ్స్ ఫిబ్రవరిలో ప్రారంభమవుతాయి. మార్చి నుంచి డెలీవరి ఉంటుంది. యమహాయమహా (Yamaha) తమ పెవిలియన్‌లో RX- 100, RD-350 వంటి లెజెండరీ మోటార్‌సైకిళ్లతోపాటు ప్రీమియం శ్రేణి మొదటి తరం మోడళ్లను ప్రదర్శించింది. ఇందులో ప్రముఖ YZF-R15, మస్కులర్ FZ సిరీస్‌లు ఉన్నాయి.హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ హ్యుండై మోటార్ ఇండియా క్రెటా ఎలక్ట్రిక్‌ను (Hyundai CRETA Electric) విడుదల చేసింది. పరిచయ ఆఫర్లో ధర రూ.17.99 లక్షలు ఉంది. ఆరు వేరియంట్లలో లభిస్తుంది. ఒకసారి చార్జింగ్‌తో 42 కిలోవాట్ అవర్ బ్యాటరీతో 390 కిలోమీటర్లు, 51.4 కిలోవాట్ అవర్ బ్యాటరీతో 473 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. కియా ఈవీ6 అప్‌గ్రేడెడ్ వర్షన్ దక్షిణ కొరియాకు చెందిన వాహన తయారీ సంస్థ కియా తాజాగా ఈవీ6 అప్‌గ్రేడెడ్ వర్షన్‌ను (Kia EV6) పరిచయం చేసింది. 84 కిలోవాట్ అవర్ బ్యాటరీ పొందుపరిచారు. ఒకసారి చార్జింగ్‌తో 650 కిలోమీటర్లకుపైగా పరుగెడుతుందని కంపెనీ ప్రకటించింది. 350 కిలోవాట్ ఫాస్ట్ చార్జర్‌తో 10 నుంచి 80 శాతం చార్జింగ్ 18 నిముషాల్లో అవుతుంది. ఇప్పటి వరకు ఈ మోడల్‌కు 77.4 కిలోవాట్ అవర్ బ్యాటరీ వాడారు. బీఎండబ్ల్యూ మేడిన్ ఇండియా ఈవీ జర్మనీ లగ్జరీ కార్ల తయారీలో ఉన్న బీఎండబ్ల్యూ (BMW) భారత్‌లో తయారైన ఎలక్ట్రిక్ వెహికిల్ ఐఎక్స్1 లాంగ్ వీల్‌బేస్ ఆల్ ఎలక్ట్రిక్‌ను విడుదల చేసింది. ధర రూ.49 లక్షలు. 66.4 కిలోవాట్ అవర్ బ్యాటరీ పొందుపరిచారు. ఒకసారి చార్జింగ్‌తో 531 కిలోమీటర్లు పరుగెడుతుంది.మైబహ్ కొత్త ఈవీ మెర్సిడెస్ బెంజ్ భారత్‌లో లగ్జరీ ఎలక్ట్రిక్ ఈక్యూఎస్ మైబహ్ ఎస్యూవీ (Mercedes-Benz Maybach EQS SUV) 680 నైట్ సిరీస్‌ను విడుదల చేసింది. ధర రూ.2.63 కోట్లు. గరిష్ట వేగం 210 కిలోమీటర్లు. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 4.4 సెకన్లలో చేరుకుంటుంది. మైబహ్ జీఎల్ఎస్ 600 నైట్ సిరీస్‌లో కొత్త వేరియంట్‌ను రూ.3.71 కోట్ల ధరతో ప్రవేశపెట్టింది. అలాగే సీఎల్ఏ క్లాస్ ఎలక్ట్రిక్ కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది.టాటా మోటార్స్భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో టాటా మోటార్స్ పలు కొత్త మోడళ్లను ప్రదర్శించింది. వీటిలో హ్యారియర్ ఈవీ, అవిన్యా ఎక్స్ కాన్సెప్ట్, టాటా సియర్రా ఎస్వీ, టాటా ఇంట్రా వాహనాలున్నాయి.టయోటా టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) తమ అద్భుతమైన ఉత్పత్తులను, అధునాతన సాంకేతికతలను ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది. -
ఈవీ రంగం @ 8 రెట్లు..!
న్యూఢిల్లీ: ఈ దశాబ్దం చివరినాటికి ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ) పరిశ్రమ దేశంలో ఎనిమిది రెట్లు దూసుకెళ్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దశాబ్ద కాలంలో ఈవీల విక్రయాలు 640 రెట్లు పెరిగాయని అన్నారు. 10 ఏళ్ల క్రితం ఏటా 2,600 యూనిట్ల ఈవీలు అమ్ముడయ్యాయని, గత ఏడాది ఈ సంఖ్య 16.8 లక్షల యూనిట్లు దాటిందని వివరించారు. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో–2025ను ప్రారంభించిన సందర్భంగా శుక్రవారం ఆయన ప్రసంగించారు. ఏడాదికి 2.5 కోట్ల వాహనాల అపూర్వ అమ్మకాలను చూసిందని, కేవలం నాలుగు సంవత్సరాలలో ఈ పరిశ్రమ 36 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించిందని వెల్లడించారు. పర్యావరణ అనుకూల సాంకేతికత, ఎలక్ట్రిక్ వాహనాలు, హైడ్రోజన్ ఇంధనం, జీవ ఇంధనాల అభివృద్ధిపై భారత్ దృష్టి సారిస్తోందని మోదీ అన్నారు. మేక్ ఇన్ ఇండియా చొరవతో.. మొబిలిటీ రంగంలో భవిష్యత్తును రూపొందించుకోవాలని చూస్తున్న ప్రతి పెట్టుబడిదారుడికి అత్యుత్తమ గమ్యస్థానంగా భారత్ నిలుస్తుందని ప్రధాని తెలిపారు. పెట్టుబడిదారులకు ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థలో పెట్టుబడులకు ఇదే సరైన సమయమని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా చొరవ దేశ ఆటో పరిశ్రమ వృద్ధి అవకాశాలకు ఆజ్యం పోస్తోందని, ఈ రంగం అభివృద్ధిలో భారీ పాత్ర పోషించిందని గుర్తు చేశారు. ఆర్థిక వ్యవస్థకు, పర్యావరణానికి తోడ్పడే మొబిలిటీ వ్యవస్థ కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. భారతీయ ఆటో రంగం వృద్ధికి, మధ్యతరగతి కుటుంబాల కలలను నెరవేర్చడంలో రతన్ టాటా, ఒసాము సుజుకీ సహకారం ఎంతో ఉందని మోదీ అన్నారు.టాటా.. 32 కొత్త వాహనాలు టాటా మోటార్స్ ఆటో ఎక్స్పో వేదికగా ప్యాసింజర్, కమర్షి యల్ విభాగంలో 32 కొత్త వాహనాలతోపాటు వివిధ ఇంటెలిజెంట్ సొల్యూషన్స్‌ను ఆవిష్కరించింది. వీటిలో ఆరు ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి. టాటా సియర్రా ఎస్యూవీ, హ్యారియర్ ఈవీతోపాటు అవిన్యా కాన్సెప్ట్ ఈవీ సైతం కొలువుదీరింది. అవిన్యా శ్రేణిలో తొలి మోడల్ 2026లో రంగ ప్రవేశం చేసే అవకాశం ఉంది.సుజుకీ ఈ–యాక్సెస్ 95 కిలోమీటర్లు సుజుకీ తాజాగా భారత్ వేదికగా అంతర్జాతీయ మార్కెట్లో యాక్సెస్ ఎలక్ట్రిక్ వర్షన్‌ను ఆవిష్కరించింది. ఒకసారి చార్జింగ్ చేస్తే 95 కిలోమీటర్లు ప్రయాణించడం ఈ–యాక్సెస్ ప్రత్యేకత. 3.07 కిలోవాట్ అవర్ ఎల్ఎఫ్పీ బ్యాటరీ ప్యాక్‌ను పొందుపరిచారు. గరిష్ట వేగం గంటకు 71 కిలోమీటర్లు. చార్జింగ్ పూర్తి కావడానికి 240 వాట్ పోర్టబుల్ చార్జర్‌తో 6 గంటల 42 నిముషాలు, ఫాస్ట్ చార్జర్‌తో 2 గంటల 12 నిమిషాలు పడుతుంది. పండుగ సీజన్ మార్కెట్లోకి రానుంది. కాగా, యాక్సెస్ 125 అప్‌గ్రేడెడ్ వెర్షన్‌తోపాటు జిక్సర్ ఎస్ఎఫ్ 250 ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడళ్లను పరిచయం చేసింది.ఇక జేఎస్‌డబ్ల్యూ బ్రాండ్ వాహనాలు విభిన్న రంగాల్లో ఉన్న జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ సొంత బ్రాండ్‌లో కార్స్, ట్రక్స్, బస్‌ల తయారీలోకి ప్రవేశించనున్నట్టు ప్రకటించింది. ఇందుకోసం ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడులు చేయనున్నట్టు జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా డైరెక్టర్ పార్థ్ జిందాల్ వెల్లడించారు. సాంకేతిక భాగస్వామ్యం కోసం వివిధ కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్టు జిందాల్ చెప్పారు. జేఎస్‌డబ్ల్యూ బ్రాండ్ తొలి వాహనం 2027–2028లో రోడ్లపైకి వస్తుందన్నారు.మారుతీ ఈ–విటారా రేంజ్ 500 కి.మీమారుతీ సుజుకీ ఇండియా నుంచి ఎట్టకేలకు తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఈ–విటారా కొలువుదీరింది. 49, 61 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఆప్షన్స్‌లో ఇది లభిస్తుంది. 61 కిలోవాట్ అవర్ బ్యాటరీ వేరియంట్ ఒకసారి చార్జింగ్ చేస్తే 500 కిలోమీటర్లకుపైగా పరుగుతీయనుందని కంపెనీ వెల్లడించింది. ఫ్లోటింగ్ డ్యూయల్ స్క్రీన్స్, లెవెల్–2 అడాస్, ఏడు ఎయిర్‌బ్యాగ్స్ పొందుపరిచారు. 300 ఎన్ఎం టార్క్ అందించే ఆల్ వీల్ డ్రైవ్ వర్షన్ సైతం ఉంది. ప్రపంచ మార్కెట్‌కు ఈ–విటారా కార్లను మారుతీ సుజుకీ వచ్చే 10 ఏళ్లపాటు ప్రత్యేకంగా సరఫరా చేయనుండడం విశేషం. ఈ–విటారా తయారీ, ప్రత్యేకంగా ఈవీ ప్రొడక్షన్ లైన్ కోసం రూ.2,100 కోట్లకుపైగా పెట్టుబడి చేసినట్టు మారుతీ సుజుకీ ఇండియా ఎండీ హిసాటీ టాకేయూచీ వెల్లడించారు. కాగా, ‘ఈ ఫర్ మీ’ పేరుతో పూర్థిస్థాయిలో ఈవీ వ్యవస్థ ఏర్పాటుకు మారుతీ శ్రీకారం చుట్టింది. టాప్–100 నగరాల్లోని డీలర్షిప్స్ వద్ద ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి తెస్తారు. ప్రతి 5–10 కిలోమీటర్లకు ఒక చార్జింగ్ స్టేషన్ ఉండాలన్నది కంపెనీ లక్ష్యం. అలాగే 1,000కిపైగా నగరాల్లో ఈవీల కోసం ప్రత్యేకంగా 1,500ల పైచిలుకు సరీ్వస్ సెంటర్లను నెలకొల్పుతారు. కొత్తగా 1.5 లక్షల మందికి.. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ) పథకం వెన్నుదన్నుగా నిలిచిందని, తద్వారా పరిశ్రమకు అదనంగా రూ.2.25 లక్షల కోట్ల అమ్మకాలు తోడయ్యాయని నరేంద్ర మోదీ అన్నారు. వాహన రంగంలో కొత్తగా 1.5 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలను ఈ పథకం తెచి్చపెట్టిందని వెల్లడించారు. శిలాజ ఇంధనాల దిగుమతిపై దేశ వ్యయాలను తగ్గించే వ్యవస్థను రూపొందిస్తున్నట్టు తెలిపారు. ప్రయాణ సౌలభ్యం భారత్‌కు అతిపెద్ద ప్రాధాన్యతగా ఉందని, గత బడ్జెట్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.11 లక్షల కోట్లకు పైగా నిధులు కేటాయించామన్నారు. భారత ఆటోమొబైల్ రంగం గత ఏడాది 12% వృద్ధి చెందిందని వివరించారు. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో జనవరి 22 వరకు కొనసాగనుంది. ఆటోమొబైల్, విడిభాగాలు, సాంకేతికతల్లో 100కుపైగా నూతన ఆవిష్కరణలకు ఎక్స్పో వేదిక కానుంది. -
ప్రైవేట్ వాహనాలకు పాస్‌లు!: నితిన్ గడ్కరీ
జాతీయ రహదారులపై ఉన్న టోల్ గేట్స్ వద్ద రద్దీని తగ్గించడానికి కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ప్రైవేట్ వాహనదారులకు నెలవారీ, వార్షిక టోల్ పాస్‌లను మంజూరు చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇది వాహనదారులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. టోల్ వసూళ్లు అత్యధికంగా కమర్షియల్ వాహనాల నుంచి (74 శాతం) వస్తోంది. అయితే మిగిలిన 26 శాతం మాత్రమే ప్రైవేట్ వాహనాల నుంచి వస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ 2025 జనవరి 16న ఈ నిర్ణయం తీసుకున్నారు.ప్రతిపాదనలో ముఖ్య ముఖ్యాంశాలునెలవారీ & వార్షిక పాస్‌లు: జాతీయ రహదారులపై ప్రయాణించే ప్రైవేట్ కార్ల యజమానులు నెలవారీ లేదా సంవత్సరానికి పాస్‌లు తీసుకోవచ్చు. ఇది ఖర్చును కొంత తగ్గించడం మాత్రమే కాకుండా.. సమయాన్ని కూడా అదా చేస్తుంది.అవరోధం లేని టోల్ సేకరణ: పాస్ సిస్టమ్‌తో పాటు గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (జీఎన్ఎస్ఎస్) ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్‌ను కూడా ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. లేటెస్ట్ టెక్నాలజీతో టోల్‌ల చెల్లింపుకు ఇది సరైన మార్గం. ఈ శాటిలైట్ సిస్టం అమలులోకి వచ్చిన తరువాత ప్రత్యేకంగా టోల్ గేట్స్ అవకాశం ఉండదు.గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్మారుతున్న కాలంతో పాటు టెక్నాలజీ మారుతోంది. ఈ టెక్నాలజీని ఉపయోగించి హైవేల మీద టోల్ గేట్స్ లేకుండా చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. టోల్ గేట్స్ మొత్తం తొలగించి.. శాటిలైట్ విధానం ద్వారా టోల్ ఫీజు వసూలు చేయనున్నట్లు సమాచారం. ఇదే జరిగితే వాహనదారులు హైవే మీద ఎక్కడా ఆగాల్సిన పనిలేదు.గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (GNSS) ద్వారా టోల్ కలెక్షన్ చాలా సులభం. ఈ విధానాన్ని కర్ణాటకలోని బెంగళూరు-మైసూర్ నేషనల్ హైవే275 & హర్యానాలోని పానిపట్-హిసార్ నేషనల్ హైవే709 మధ్యలో శాటిలైట్ విధానం ద్వారా టోల్ వసూలు చేయడానికి సంబంధించిన ట్రైల్ కూడా విజయవంతంగా పూర్తయిందని గడ్కరీ పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఐస్‌క్రీమ్ బాలేదు.. రూ.1200 నాకిచ్చేయండి: స్విగ్గీపై ఎంపీ ఫైర్ఇప్పటికే ప్రయోగాత్మకంగా నిర్వహించిన శాటిలైట్ టోల్ కలెక్షన్ విజయవంతమవ్వడంతో.. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా త్వరలోనే ఈ సిస్టమ్ అమలులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ విధానం గురించి వాహన వినియోగదారులలో అవగాహన కల్పించడానికి ఓ వర్క్‌షాప్ కూడా ఏర్పాటు చేసినట్లు గడ్కరీ పేర్కొన్నారు. మొత్తం మీద దేశంలో టోల్ గేట్స్ త్వరలోనే కనుమరుగయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.శాటిలైట్ విధానం ద్వారా టోల్ కలెక్షన్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అమలులోకి వచ్చిన తరువాత టోల్ ఫీజు చెల్లించడానికి ప్రత్యేకంగా.. వాహనాలను ఆపాల్సిన అవసరం లేదు. వాహనం ప్రయాణించిన దూరాన్ని శాటిలైట్ లెక్కగట్టి వ్యాలెట్ నుంచి అమౌట్ కట్ చేసుకుంటుంది. అయితే ఈ సిస్టమ్ కోసం వాహనదారులు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) చిప్ కల్గిన ఫాస్ట్‌ట్యాగ్‌ను వాహనానికి అతికించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ప్రయాణించిన దూరానికి అయ్యే మొత్తాన్ని ఆటోమాటిక్‌గా చెల్లించడానికి సాధ్యమవుతుంది.. -
ఆటో ఎక్స్పో 2025: ఆకట్టుకున్న ఈ విటారా
మారుతి సుజుకి (Maruti Suzuki) భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో తన మొట్ట మొదటి ఎలక్ట్రిక్ వెహికల్ ఈ విటారా (e Vitara)ను లాంచ్ చేసింది. Heartect-e ప్లాట్‌ఫామ్ ఆధారంగా నిర్మితమైన ఈ కారు.. విశాలమైన క్యాబిన్, దృఢమైన నిర్మాణం కలిగి ఉంటుంది. దీని ఉత్పత్తిని కంపెనీ గుజరాత్ ప్లాంట్‌లో త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉంది.సరికొత్త మారుతి సుజుకి ఈ విటారా ట్విన్ డెక్ ఫ్లోటింగ్ కన్సోల్‌తో కూడిన డిజిటల్ కాక్‌పిట్, కొత్త స్టీరింగ్ వీల్, ఫిక్స్డ్ గ్లాస్ సన్‌రూఫ్, మల్టీ కలర్ యాంబియంట్ లైటింగ్‌తో కూడిన సాఫ్ట్ టచ్ డ్యూయల్ టోన్ మెటీరియల్స్ వంటివి పొందుతుంది. వీటితో పాటు ఈ కారులో 10.1 ఇంచెస్ డిజిటల్ డిస్ప్లే, 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 10-వే పవర్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, వెనుక సీటులోని ప్రయాణికుల కోసం 40:20:40 స్ప్లిట్ కాన్ఫిగరేషన్, రిక్లైనింగ్ అండ్ స్లైడింగ్ ఫంక్షనాలిటీ మొదలైనవన్నీ ఉన్నాయి.ఇదీ చదవండి: Auto Expo 2025: ఒక్క వేదికపై లెక్కలేనన్ని వెహికల్స్ఈ విటారా రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ పొందనుంది. అవి 49 కిలోవాట్, 61 కిలోవాట్ బ్యాటరీ. పెద్ద బ్యాటరీ ఆల్-వీల్-డ్రైవ్ (AWD) సిస్టమ్‌తో కూడా అందుబాటులో ఉంది. మారుతి ఖచ్చితమైన రేంజ్ వివరాలను అధికారికంగా వెల్లడించనప్పటికీ, పెద్ద బ్యాటరీ ప్యాక్ 500కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుందని సమాచారం. ధరలు కూడా కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. అయితే దీని ప్రారంభ ధర రూ. 17 లక్షలు ఉండే అవకాశం ఉంది.Get Ready to witness your dream car Maruti Suzuki’s Electric SUV e VITARA https://t.co/WNFuX1hGsM— Maruti Suzuki (@Maruti_Corp) January 17, 2025 -
Auto Expo 2025: ఒక్క వేదిక.. ఎన్నో వెహికల్స్
రెండేళ్లకు ఒకసారి జరిగే 'ఆటో ఎక్స్పో 2025' (Auto Expo 2025) కార్యక్రమాన్ని దేశ ప్రధానమంత్రి 'నరేంద్ర మోదీ' (Narendra Modi) ప్రారంభించారు. ఈ ఈవెంట్‌కు దిగ్గజ వాహన తయారీ సంస్థలు హాజరవుతాయి. ఇది ఈ రోజు (జనవరి 17) నుంచి 22వ తేదీ వరకు జరుగుతాయి. కాగా ఆటో ఎక్స్పో మొదటిరోజు లాంచ్ అయిన టూ వీలర్స్ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.హోండా యాక్టివా ఈ (Honda Activa e)హోండా మోటార్‌సైకిల్ కంపెనీ గత ఏడాది మార్కెట్లో ఆవిష్కరించిన కొత్త 'యాక్టివా ఈ' (Activa e) ధరలను 'భారత్ మొబిలిటీ ఆటో ఎక్స్పో 2025' వేదికపై ప్రకటించింది. ఈ స్కూటర్ 1.17 లక్షల నుంచి రూ. 1.52 లక్షల మధ్య ఉంది. ఈ స్కూటర్ 1.5 కిలోవాట్ స్వాపబుల్ బ్యాటరీ పొందుతుంది. ఇది ఒక సింగిల్ ఛార్జితో 102 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. దీని టాప్ స్పీడ్ 80 కిమీ/గం. కాగా ఇది 7.3 సెకన్లలో 0 నుంచి 60 కిమీ వరకు వేగవంతం అవుతుంది.హోండా క్యూసీ1 (Honda QC1)ఆటో ఎక్స్‌పోలో కనిపించిన టూ వీలర్లలో హోండా క్యూసీ1 కూడా ఒకటి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 90,000. ఇందులో 1.5 కిలోవాట్ బ్యాటరీ 80 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ 50 కిమీ/గం. ఈ స్కూటర్ 330 వాట్స్ ఛార్జర్ ద్వారా ఫుల్ ఛార్జ్ కావడానికి పట్టే సమయం 6:50 గంటలు. ఇది 9.7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.టీవీఎస్ అపాచీ ఆర్టీఎక్స్ 300 (TVS RTX 300)టీవీఎస్ కంపెనీ కూడా భారత్ మొబిలిటీ ఆటో ఎక్స్పో 2025లో ఆర్టీఎక్స్ 30 బైకును ఆవిష్కరించింది. పలుమార్లు ఈ బైకును టెస్ట్ చేసిన తరువాత ఈ రోజు (జనవరి 17) అధికారికంగా ప్రదర్శించింది. ఇది బ్రాండ్ మొట్టమొదటి అడ్వెంచర్ బైక్. ఇందులోని 299 సీసీ ఇంజిన్ 35 హార్స్ పవర్, 27 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. కాబట్టి పనితీరు పరంగా ఇది చాలా ఉత్తమంగా ఉంటుందని సమాచారం.ఇదీ చదవండి: ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారత్ పయనంటీవీఎస్ జుపీటర్ సీఎన్జీ (Bajaj Jupiter CNG)టీవీఎస్ కంపెనీ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో తన జుపీటర్ సీఎన్జీ ప్రదర్శించింది. ఈ స్కూటర్ ఫ్రీడమ్ 125 బైక్ మాదిరిగానే పెట్రోల్, సీఎన్జీతో పనిచేస్తుంది. కాబట్టి మంచి పనితీరును అందించడమే కాకుండా.. ఎక్కువ మైలేజ్ కూడా అందిస్తుందని సమాచారం. డిజైన్, ఫీచర్స్ పరంగా ఇది దాదాపు స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. దీని ధర రూ. 1 లక్ష నుంచి రూ. 1.10 లక్షల మధ్య ఉంటుందని సమాచారం.టీవీఎస్, బజాజ్ బ్రాండ్ వెహికల్స్ మాత్రమే కాకుండా.. ఓలా ఎలక్ట్రిక్, ఏథర్ ఎనర్జీ, హీరో మోటోకార్ప్, రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీలు కూడా ఈ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో తమ కొత్త వాహనాలను, రాబోయే వాహనాలను ప్రదర్శించే అవకాశం ఉందని తెలుస్తోంది. -
ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారత్ పయనం
ఆటోమోటివ్ పరిశ్రమలో ప్రపంచానికి భారత్ నాయకత్వం వహించే దిశగా పయనిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ప్రశంసించారు. భవిష్యత్తులో ఈ పరిశ్రమ వృద్ధి చెందేందుకు ఎంతో అవకాశం ఉందన్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో ఏర్పాటు చేసిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025(రెండో ఎడిషన్-Bharat Mobility Global Expo 2025)ను ప్రధాని మోదీ శుక్రవారం ప్రారంభించారు. జనవరి 17 నుంచి 22 వరకు జరిగే ఈ ఎక్స్పో భారత్ మండపం, ద్వారకాలోని యశోభూమి, గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పో సెంటర్ అండ్ మార్ట్ అనే మూడు వేదికల్లో జరగనుంది. 5,100 మందికి పైగా అంతర్జాతీయ ఆవిష్కర్తలు, 5 లక్షలకుపైగా సందర్శకులు, ఔత్సాహికులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అంచనా.ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ..‘భారతదేశ ఆటోమోటివ్ పరిశ్రమ(automotive industry) అద్భుతమైంది. భవిష్యత్తులో ఈ పరిశ్రమ ఎదిగేందుకు ఎన్నో అవకాశాలున్నాయి. దేశంలోని తయారీదారులు స్థానిక డిమాండ్‌ను తీర్చడమే కాకుండా ప్రపంచ వేదికలపై తమదైన ముద్ర వేస్తున్నారు. సుస్థిర పద్ధతులను అవలంబించడంలో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమ్మిళితం చేయడంలో ఈ రంగం చాలా కృషి చేస్తోంది. దేశీయ తయారీదారులు అనుసరిస్తున్న విధానాలు ప్రపంచ ఆటోమోటివ్ రంగంలో భారతదేశాన్ని కీలకంగా మార్చనున్నాయి. ఈ రంగంలో ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారత్ పయనిస్తుంది. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ)కు మరింత డిమాండ్ పెరుగుతుంది. విధానపరమైన కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల పర్యావరణ వ్యవస్థకు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అన్నారు.ఇదీ చదవండి: బాసులు లేని వర్క్ కల్చర్భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 ‘బియాండ్ బోర్డర్స్: కో-క్రియేటింగ్ ఫ్యూచర్ ఆటోమోటివ్ వాల్యూ చైన్’ అనే థీమ్‌తో ప్రారంభమైంది. ఆటోమోటివ్, మొబిలిటీ రంగాల్లో సహకారం, సృజనాత్మకతను పెంపొందించడం ఈ కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఈవెంట్ లో ఆటోమొబైల్స్, కాంపోనెంట్ ప్రొడక్ట్స్, అడ్వాన్స్డ్ మొబిలిటీ టెక్నాలజీలతో సహా 100కు పైగా కొత్త లాంచ్‌లు ఉండబోతున్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
మారుతీ సుజుకీ నుంచి చిన్న ఈవీ!
న్యూఢిల్లీ: పరిమాణం, మార్కెట్ వాటాలో భారత్‌లో అతిపెద్ద కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ) విభాగంపై దృష్టి సారిస్తోంది. దేశీయ ఈవీ మార్కెట్లో కంపెనీ ఎంట్రీ కాస్త ఆలస్యం అయిన సంగతి తెలిసిందే. ‘ఈవీ మార్కెట్‌ను అధ్యయనం చేస్తున్నాం. మా పోటీదారుల ఉత్పత్తులు ఎలా పనిచేశాయో చూశాం. భారతీయ మార్కెట్‌కు ఏమి అవసరమో మాకు తెలుసు. అంతర్జాతీయంగా సుజుకీ కార్పొరేషన్‌కు ఎలక్ట్రిక్ వెహికిల్స్‌తోపాటు ఇతర అన్ని మోడళ్లకు ఉత్పత్తి కేంద్రంగా భారత్ ఉంటుంది. ఉత్పత్తిలో దాదాపు 50 శాతం జపాన్, యూరప్‌కు ఎగుమతి చేస్తాం’ అని సుజుకీ మోటార్ కార్పొరేషన్ ప్రెసిడెంట్, రిప్రజెంటేటివ్ డైరెక్టర్ తొషిహిరో సుజుకీ గురువారం వెల్లడించారు. భారత్ మొబిలిటీ ఎక్స్పో నేటి (జనవరి 17) నుంచి ప్రారంభం అవుతున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. చిన్న ఎలక్ట్రిక్ కార్లు.. ఎస్‌యూవీలపై ప్రధానంగా దృష్టి సారిస్తూ భారత ప్యాసింజర్ వాహన మార్కెట్లో 50 శాతం మార్కెట్ వాటాను.. అలాగే ఈవీ విపణిలో అగ్రశ్రేణి వాటాను పొందాలని చూస్తున్నట్లు తొషిహిరో సుజుకీ వెల్లడించారు. ఎస్‌యూవీలను కస్టమర్లు డిమాండ్ చేస్తున్నందున భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఈ–విటారాతో ఈవీ ప్రయాణం ప్రారంభం అవుతుందని ఆయన చెప్పారు. వినియోగానికి కాంపాక్ట్ ఈవీలు ఉత్తమంగా సరిపోతాయని సుజుకీ అన్నారు. ఈవీ విభాగంలో కంపెనీ నుంచి తదుపరి మోడల్ చిన్న కారు వచ్చే అవకాశం ఉందని ఆయన మాటలనుబట్టి సుస్పష్టం అవుతోంది. కస్టమర్ అవసరాలను అధ్యయనం చేస్తున్నామని, ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ కార్లు ట్యాంక్ ఇంధనంతో దాదాపు 500 కిలోమీటర్ల పరిధిని ఇస్తాయని సుజుకీ తెలిపారు. ఈ దూరాన్ని ఆచరణ సాధ్యం చేయడానికి ఈ–విటారాను సన్నద్ధం చేస్తున్నట్టు చెప్పారు. భారత్ మండపం వేదికగా ఈ–విటారాను కంపెనీ శుక్రవారం (నేడు) ఆవిష్కరిస్తోంది. టాటా నెక్సాన్ ఈవీతో పాటు హ్యుండై క్రెటా ఎలక్ట్రిక్, ఎంజీ జడ్ఎస్ ఈవీలకు ఈ–విటారా పోటీ ఇవ్వనుంది. ఇంకా డిమాండ్ ఉంది.. అమ్మకాలు క్షీణిస్తున్నప్పటికీ భారత్‌లో చిన్న కార్లు నిలిచిపోవని సుజుకీ అన్నారు. ‘సుజుకీ కార్పొరేషన్ అనుబంధ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా భారత్‌లో మార్కెట్ లీడర్‌గా ఉంది. ద్విచక్ర వాహనాల నుండి నాలుగు చక్రాల వాహనాలకు అప్‌గ్రేడ్ అయ్యే అవకాశం ఉన్న 100 కోట్ల మంది ప్రజలకు భవిష్యత్తులో ఇంకా సరసమైన చిన్న కార్లు అవసరం అని విశ్వసిస్తున్నాం. ఈ–విటారా పట్ల కస్టమర్ల నుండి అభిప్రాయాన్ని, ప్రతిస్పందనను అర్థం చేసుకుంటాం. ఆ తర్వాతే చిన్న ఎలక్ట్రిక్ కార్ల ప్రణాళికలతో ముందుకు సాగుతాం’ అని వివరించారు. కాగా, మారుతీ సుజుకీ ఇండియా 2024లో 3.24 లక్షల యూనిట్లను ఎగుమతి చేసింది. ఇప్పటి వరకు ఇదే అత్యధికం. ఎలక్ట్రిక్ యాక్సెస్ సైతం.. సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ–యాక్సెస్‌ను భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో సందర్భంగా ఆవిష్కరిస్తోంది. సుజుకీ ఇప్పటికే భారత్‌లో పెట్రోల్ వర్షన్ యాక్సెస్–125 విక్రయిస్తోంది. భారతీయుడు కూడా సుజుకీ మోటార్ ప్రెసిడెంట్ కావచ్చు..మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈవో ఎవరైనా కావొచ్చని, ఇక్కడ జాతీయత ఒక అంశం కాదని తొషిహిరో సుజుకీ అన్నారు. భారతీయుడు కూడా సుజుకీ మోటార్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ పదవి చేపట్టవచ్చని స్పష్టం చేశారు. తన తండ్రి దివంగత ఒసాము సుజుకీ 40 సంవత్సరాల క్రితం భారత్ వచ్చారని, ఈ మార్కెట్ యొక్క అసలైన సామర్థ్యాన్ని ఎవరూ ఊహించలేదని వివరించారు. అయినప్పటికీ భారతదేశం మరియు ఇక్కడి ప్రజలపై ఆయనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. నేడు భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమ ప్రపంచంలో మూడవ అతిపెద్ద మార్కెట్‌గా అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. 2003లో లిస్టింగ్ అయినప్పటి నుండి మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ అలాగే ఎండీ, సీఈవో పదవులను భారతీయ, జపాన్ ఎగ్జిక్యూటివ్‌లు అలంకరిస్తున్నారు. -
మార్కెట్లోకి హీరో కొత్త స్కూటర్
ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్రవాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ (Hero MotoCorp).. న్యూ డెస్టినీ 125 (New Destini 125) స్కూటర్‌ను విడుదల చేసింది. దీంతో 125సీసీ స్కూటర్ మార్కెట్లో విస్తృత మార్పులకు శ్రీకారం చుట్టింది. అత్యాధునిక సాంకేతికత, అసాధారణమైన మైలేజ్, టైమ్‌లెస్ డిజైన్‌ను మిళితం చేస్తూ పట్టణ వాహనదారుల కోసం దీన్ని రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది.హీరో న్యూ డెస్టినీ 125 స్కూటర్.. డెస్టిని 125 వీఎక్స్, డెస్టిని 125 జెడ్ఎక్స్, డెస్టిని 125 జెడ్ఎక్స్ ప్లస్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ప్రారంభ ధరలు (ఢిల్లీ ఎక్స్-షోరూమ్) వరుసగా రూ.80,450, రూ.89,300, రూ.90,300.ప్రత్యేకంగా పట్టణ వాహనదారుల అవసరాలను తీర్చడానికి రూపొందించిన న్యూ డెస్టినీ 125.. వాహనదారుల భద్రత, సౌలభ్యం కోసం 30 పేటెంట్ అప్లికేషన్లతోపాటు ఇల్యూమినేటెడ్ స్టార్ట్ స్విచ్‌లు, ఆటో-కాన్సల్ వింకర్ల వంటి సరికొత్త ఫీచర్లతో వచ్చింది.‘హీరో డెస్టిని 125 అనేది మా ఆవిష్కరణ-ఆధారిత విధానానికి, పర్యావరణ అనుకూల చైతన్యాన్ని అందించడంలో మా నిబద్ధతకు నిదర్శనం. 59 కి.మీ మైలేజ్, అధునాతన ఫీచర్లతో ఈ స్కూటర్ ఆధునిక రైడర్లకు గేమ్-ఛేంజర్’ హీరో మోటోకార్ప్ ఇండియా బిజినెస్ యూనిట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రంజీవ్‌జిత్ సింగ్ పేర్కొన్నారు. -
రెండేళ్లలో ఈవీల వినియోగం వేగవంతం..
చెన్నై: దేశీయంగా ఈ రెండేళ్లలో (2025, 2026) విద్యుత్ ప్యాసింజర్ వాహనాల వినియోగం మరింత వేగవంతమవుతుందని హ్యుందాయ్ మోటర్ ఇండియా (హెచ్ఎంఐఎల్) సీవోవో తరుణ్ గార్గ్ తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో విద్యుత్ వాహనాల వినియోగం ప్రారంభ స్థాయిలో 2.4 శాతం స్థాయిలో ఉందని, 2030 నాటికి ఇది 17 శాతానికి చేరవచ్చనే అంచనాలు ఉన్నాయని ఆయన చెప్పారు. పెద్ద బ్రాండ్లు మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టనుండటం ఇందుకు దోహదపడగలదని తెలిపారు. విద్యుత్ వాహనాల వినియోగ వృద్ధికి తమ క్రెటా ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా తోడ్పడగలదన్నారు. హ్యుందాయ్ సంస్థ భవిష్యత్తులో నాలుగు ఈవీలను కూడా ప్రవేశపెట్టే యోచనలో ఉంది. దీని ధర రూ. 15–25 లక్షల శ్రేణిలో ఉండొచ్చని అంచనా. అటు మారుతీ సుజుకీ ఇండియా తమ తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ’ఈ–విటారా’ను ఆవిష్కరించనుంది. మరోవైపు, చార్జింగ్ సదుపాయాలకు సంబంధించి 10,000 చార్జింగ్ పాయింట్ల వివరాలతో ప్రత్యేక యాప్‌ను రూపొందించామని, దీన్ని ఇతర వాహనదారులు కూడా వినియోగించుకోవచ్చని గార్గ్ చెప్పారు. వీటిలో 7,500 పాయింట్లలో యాప్ ద్వారా నేరుగా చెల్లింపులు జరిపే సదుపాయం ఉందన్నారు. ఫాస్ట్ చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. హైదరాబాద్–విజయవాడ, ముంబై–పుణె తదితర హైవేల్లోని 30 చార్జింగ్ స్టేషన్లలో 80 ఫాస్ట్ చార్జర్లను ఇన్స్టాల్ చేసినట్లు గార్గ్ వివరించారు. -
నాలుగేళ్లలో 5 లక్షలమంది కొన్న కారు ఇదే
భారతీయ మార్కెట్లో అత్యంత సురక్షితమైన కారు.. 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన వాహనాల జాబితాలో ఒకటైన 'టాటా పంచ్' (Tata Punch) తాజాగా.. అమ్మకాల్లో అరుదైన రికార్డ్ కైవసం చేసుకుంది. కేవలం 4 సంవత్సరాల్లో ఏకంగా 5 లక్షల సేల్స్ (Sales) మైలురాయిని దాటేసింది.టాటా పంచ్ 2021 అక్టోబర్‌లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 5,04,679 మంది దీనిని కొనుగోలు చేసినట్లు సమాచారం. 2021లో 22,571 యూనిట్లు, 2022లో 1,29,895 యూనిట్లు, 2023లో 1,50,182 యూనిట్లు, 2024లో 2,02,031 యూనిట్ల సేల్స్ జరిగాయి. అంతే కాకుండా గత ఏడాది ఎక్కువమంది కొనుగోలు చేసిన కారుగా కూడా ఓ హిస్టరీ క్రియేట్ చేసింది.సింపుల్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ కారు కావలసినన్ని సేఫ్టీ ఫీచర్స్ పొందింది. ఇది ప్రస్తుతం పెట్రోల్, CNG, ఎలక్ట్రిక్ రూపాల్లో అమ్మకానికి ఉంది. ఈ కారు ధరలు రూ. 6.19 లక్షల నుంచి రూ. 14.44 లక్షల మధ్య ఉన్నాయి. అయితే ఈ అన్ని మోడల్స్.. ఉత్తమ సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉన్నాయి. -
మరింత పెరిగిన ఎప్రిలియా ఆర్ఎస్ 457 ధర
ఎప్రిలియా భారతదేశంలోని తన ఆర్ఎస్ 457 బైక్ ధరను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు రూ. 4.10 లక్షల ధర వద్ద లభించే ఈ మోటార్‌సైకిల్ ధర రూ. 4.20 లక్షలు (ఎక్స్ షోరూమ్) చేరింది. దీన్నిబట్టి చూస్తే దీని ధర మునుపటికంటే రూ.10,000 ఎక్కువని తెలుస్తోంది.డిసెంబర్ 2023లో ప్రారంభమైన ఆర్ఎస్ 457 బైక్ భారతదేశంలో ఉత్పత్తి అయినా మొదటి ఎప్రిలియా మోటార్‌సైకిల్. ఇది మహారాష్ట్రలోని బారామతిలో పియాజియో గ్రూప్ ఫెసిలిటీలో తయారైంది. చూడటానికి అద్భుతంగా కనిపించే ఈ బైక్ మూడు రైడింగ్ మోడ్లు, త్రీ లెవెల్ స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ పొందుతుంది.ఏప్రిలియా ఆర్ఎస్ 457 బైక్ 457 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజన్ పొందుతుంది. ఇది 47 బిహెచ్పి పవర్ అవుట్‌పుట్, 48 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఈ బైక్ మంచి పనితీరును అందిస్తుంది. కాబట్టి దీనికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.ఏప్రిలియా ట్యూనో 457ఏప్రిలియా ఇప్పుడు ఆర్ఎస్ 457 నేక్డ్ కౌంటర్పార్ట్.. ట్యూనో 457ని లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. ఈ స్ట్రీట్‌ఫైటర్ EICMA 2024లో వెల్లడైంది. అయితే కంపెనీ బైక్‌కి సంబంధించిన ధరలు రాబోయే నెలల్లో ప్రకటించే అవకాశం ఉంది. ఈ బైక్ కూడా ఆర్ఎస్ 457 వలె అదే ఇంజిన్ పొందుతుంది. కాబట్టి అదే పర్ఫామెన్స్ అందిస్తుందని సమాచారం. -
మస్క్‌కు ప్రభుత్వం ఆహ్వానం
టెస్లా(Tesla) సీఈఓ ఎలాన్ మస్క్‌తోపాటు ఇతర ప్రధాన ఎలక్ట్రిక్ వెహికల్ (EV) తయారీ సంస్థల ఉన్నతాధికారులకు దేశంలోని భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆహ్వానం పంపింది. ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్ల తయారీని ప్రోత్సహించే పథకం (SPMEPCI)కు సంబంధించిన మార్గదర్శకాలను ఖరారు చేసేందుకు వారికి ఆహ్వానం పంపినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. మంగళవారం ఈమేరకు చర్చసాగనుంది.మార్చి 2024లో కొత్త ఈవీ పాలసీని ప్రతిపాదించారు. ప్రపంచ వాహన తయారీదారులను ఆకర్షించడానికి, దేశీయ తయారీ సామర్థ్యాలను పెంచడానికి దీన్ని రూపొందించినట్లు ప్రభుత్వం గతంలో తెలిపింది. స్థానిక తయారీ, సరఫరాను తప్పనిసరి చేస్తూ దేశంలో ఉత్పత్తి సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులకు ఈ పథకం ప్రోత్సాహకాలను అందిస్తుంది. ప్రతిపాదిత మార్గదర్శకాల ప్రకారం ఆటోమొబైల్స్, ఆటో కాంపోనెంట్స్ (పీఎల్ఐ-ఆటో) కోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకానికి అనుగుణంగా దేశీయ విలువ జోడింపు (DVA)ను లెక్కిస్తారు.ఈవీ పాలసీ నిబంధనలు ఇవే..భారతదేశంలో కనీసం 500 మిలియన్ డాలర్లు (సుమారు రూ.4,150 కోట్లు) పెట్టుబడి పెట్టడానికి కట్టుబడి ఉన్న వాహన తయారీదారులకు దిగుమతి సుంకాలను తగ్గించాలనే నిబంధనలున్నాయి. ఏదైనా కంపెనీ స్థానికంగా కార్యకలాపాలు ప్రారంభించిన మూడేళ్లలో 25% డీవీఏ(DVA), ఐదో సంవత్సరం నాటికి 50% డీవీఏ సాధించాల్సి ఉంటుంది. అర్హత కలిగిన తయారీదారులకు చెందిన ఉత్పత్తులు 35,000 డాలర్లు(రూ.30 లక్షలు) కంటే ఎక్కువ ధర ఉంటే దిగుమతి పన్ను సుమారు 70%గా విధిస్తారు.విభిన్న వాదనలుప్రతిపాదిత పథకానికి మిశ్రమ స్పందనలు వచ్చాయి. ఈ పథకం ద్వారా గణనీయమైన ప్రోత్సాహకాలను అందిస్తున్నప్పటికీ టెస్లా, విన్‌ఫాస్ట్ వంటి వాహన తయారీదారులు కొన్ని నిబంధనలపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఏప్రిల్ 2024లో పాలసీపై ఇరు కంపెనీల నుంచి భిన్న వాదనలు వినిపించాయి. డీవీఏ లెక్కింపు పద్ధతి, అర్హత ప్రమాణాలపై ఆందోళన చెందాయి. నిర్ణీత గడువులోగా డీవీఏ లక్ష్యాలను చేరుకోవడంపై టెస్లా తన సలహాదారు ‘ది ఆసియా గ్రూప్ (TAG) ఇండియా’ ద్వారా అభ్యంతరాలు వ్యక్తం చేసింది.ఇప్పటికే విన్‌ఫాస్ట్ పెట్టుబడులు500 మిలియన్ డాలర్ల ప్రారంభ పెట్టుబడితో తమిళనాడులో ఎలక్ట్రిక్ వాహనాల ప్లాంటును నిర్మిస్తున్న వియత్నాంకు చెందిన విన్ ఫాస్ట్, ముందుగా కంపెనీలు చేస్తున్న ఖర్చులకు కూడా ప్రోత్సాహకాలు అందించాలని కోరుతోంది. ఈ రెండు కంపెనీలే కాకుండా ఇతర కంపెనీల ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని పాలసీ మార్గదర్శకాలను సవరించడానికి ప్రభుత్వం యోచిస్తుందేమో చూడాల్సి ఉంది. రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్(ఆర్ అండ్ డీ), ఛార్జింగ్ మౌలిక సదుపాయాల అభివృద్ధిని ఈ పథకంలో చేర్చాలని కొన్ని వర్గాలు సూచిస్తున్నాయి.ఇదీ చదవండి: గోవాలో హై డిమాండ్ వేటికంటే..గతంలో మస్క్ పర్యటన రద్దు2024లో మస్క్ ఇండియా పర్యటన కొన్ని కారణాల వల్ల రద్దు అయింది. అప్పటి నుంచి భారత్‌లో కంపెనీ పెట్టుబడి ప్రణాళికలు ప్రశ్నార్థకంగా మారాయి. తాజా పరిణామాల వల్ల ఈమేరకు తిరిగి చర్చసాగే అవకాశం ఉంటుదేమోనని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అమెరికాలో రాబోయే ట్రంప్ ప్రభుత్వంలో మస్క్ కూడా కీలక పాత్ర పోషించనున్నారు. దాంతో త్వరలో జరగబోయే ఈ సంప్రదింపులకు ప్రాముఖ్యత సంతరించుకుంది. టెస్లా, హ్యుందాయ్, బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, కియా, టయోటాతో సహా టాటా మోటార్స్, మహీంద్రా, హీరో మోటోకార్ప్ వంటి భారతీయ కంపెనీలు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నాయి. -
కొత్త లుక్‌లో ఎలివేట్ బ్లాక్ ఎడిషన్: రేటెంతో తెలుసా?
హోండా కంపెనీ.. ఎలివేట్ బ్లాక్ ఎడిషన్ లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 15.51 లక్షలు. కాగా ఎలివేట్ సిగ్నేచర్ బ్లాక్ ఎడిషన్ ధరలు రూ. 15.71 లక్షలు (ఎక్స్ షోరూమ్). బ్లాక్ ఎడిషన్ ఎలివేట్ టాప్-ఆఫ్-ది-లైన్ ZX గ్రేడ్ ఆధారంగా తయారైంది. ఇది మాన్యువల్, సీవీటీ గేర్‌బాక్స్ రెండింటిలోనూ అందుబాటులో ఉంది.బ్లాక్ ఎడిషన్ కొత్త క్రిస్టల్ బ్లాక్ పెర్ల్ కలర్ పొందింది. ఇది బ్లాక్ అల్లాయ్ వీల్స్ & నట్లను పొందుతుంది. ఎలివేట్ బ్లాక్ ఎడిషన్ ఎగువ గ్రిల్, సిల్వర్ ఫినిషింగ్ ఫ్రంట్ అండ్ రియర్ స్కిడ్ గార్నిష్‌లు, లోయర్ డోర్ గార్నిష్.. రూఫ్ రైల్స్‌పై క్రోమ్ యాక్సెంట్లను కలిగి ఉంది. వెనుకవైపు ప్రత్యేక 'బ్లాక్ ఎడిషన్' చిహ్నం ఉండటం చూడవచ్చు.సిగ్నేచర్ ఎడిషన్‌లో ఫ్రంట్ అప్పర్ గ్రిల్, ఫ్రంట్ అండ్ రియర్ స్కిడ్ గార్నిష్‌లు, రూఫ్ రెయిల్‌లు, డోర్ లోయర్ గార్నిష్ నలుపు రంగులో పూర్తయ్యాయి. ఇది ఫ్రంట్ ఫెండర్‌పై 'సిగ్నేచర్ ఎడిషన్' చిహ్నం ఉంది.రెండు ఎడిషన్లు ఆల్ బ్లాక్ ఇంటీరియర్ థీమ్‌ను కలిగి ఉన్నాయి. బ్లాక్ ఎడిషన్‌లో బ్లాక్ స్టిచింగ్‌తో బ్లాక్ లెథెరెట్ సీట్లు, బ్లాక్ డోర్ ప్యాడ్లు, ఆర్మ్‌రెస్ట్‌లు పీవీసీ, ఆల్ బ్లాక్ డ్యాష్‌బోర్డ్‌తో చుట్టి ఉంటాయి. సిగ్నేచర్ బ్లాక్ ఎడిషన్ అదనంగా రిథమిక్ 7 కలర్ యాంబియంట్ లైటింగ్‌ను పొందుతుంది.ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, లెథెరెట్ సీటింగ్, సింగిల్ పేన్ సన్‌రూఫ్, కెమెరా బేస్డ్ ఏడీఏఎస్, ఆటో హెడ్లైట్లు, వైపర్లు, సెమీ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్,7.0 ఇంచెస్ TFT డిస్ప్లే మాత్రమే కాకుండా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి.హోండా ఎలివేట్ బ్లాక్ ఎడిషన్ కూడా అదే 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ద్వారా 121 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది మాన్యువల్ లేదా CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. భారతదేశంలోని హోండా డీలర్‌షిప్‌లలో ఈ కారు బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. సీవీటీ వేరియంట్ డెలివరీలు జనవరి నుంచి ప్రారంభమవుతాయి. మాన్యువల్ ట్రాన్స్మిషన్ వేరియంట్ డెలివరీలు ఫిబ్రవరి నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.ఇదీ చదవండి: భారత్‌లోని బెస్ట్ క్రూయిజర్ బైకులు ఇవే!హోండా ఎలివేట్ బ్లాక్ ఎడిషన్ ఇండియన్ మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్, ఎంజీ ఆస్టర్ బ్లాక్‌స్టార్మ్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా బ్లాక్ ఎడిషన్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. అంతే కాకుండా ఇది హోండా ఎలివేట్ క్రెటా, సెల్టోస్, గ్రాండ్ విటారా, హైరిడర్, కుషాక్, టైగన్ వంటి వాటికి అమ్మకాల పరంగా పోటీ ఇస్తుంది.హోండా, నిస్సాన్ విలీనంజపాన్ ఆటోమొబైల్ దిగ్గజాలు హోండా, నిస్సాన్ విలీనం కానున్నట్లు ప్రకటించాయి. ఇందుకు సంబంధించి ఇరు సంస్థలు ఒక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. నిస్సాన్‌కు వాటాలున్న మిత్సుబిషి మోటార్స్ కూడా తన వ్యాపారాన్ని విలీనం చేసే చర్చల్లో భాగమయ్యేందుకు అంగీకరించినట్లు కంపెనీలు వెల్లడించాయి. ఈ డీల్‌తో విలీన సంస్థ.. అమ్మకాలపరంగా ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆటోమొబైల్ కంపెనీగా ఆవిర్భవించనుంది. -
ఇలా అయితే డ్రైవింగ్ లైసెన్స్ కష్టమే!
డ్రైవింగ్ లైసెన్స్ (Driving License) పొందడం మరింత కష్టతరంగా మారుతోంది. ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి వచ్చే దరఖాస్తుదారులు సిమ్యులేటర్, 108 కెమెరాల పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జనవరి 16 నుంచి ప్రారంభం కానున్న డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్ (DTC) డ్రైవింగ్ పరీక్షను మరింత కష్టతరం చేయనుంది. ఈ అత్యాధునిక వ్యవస్థ మోసాలను అరికట్టడంతో పాటు రోడ్డు ప్రమాదాలను తగ్గిస్తుంది.ఇప్పటి వరకు ఇలా..ఇప్పటి వరకు డివిజనల్ రవాణాశాఖ కార్యాలయంలో మాన్యువల్‌గా డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించేవారు. ఏదో ఫార్మాలిటీగా మాత్రమే ఈ పరీక్ష ఉండేది. దీంతో డ్రైవింగ్ తెలియని వారు కూడా పరీక్ష రాసేవారు. ఇలా డ్రైవింగ్ లైసెన్స్ పొందినవారు వాహనాలు నడుపుతుండటంతో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి.‘జనవరి 16 నుంచి డ్రైవింగ్ శిక్షణ కేంద్రం ప్రారంభం కానుంది. ఇందులో కెమెరాలు, సిమ్యులేటర్లు ఉంటాయి. ఇది ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. అందులో మోసానికి ఆస్కారం ఉండదు. డ్రైవింగ్ తెలిసిన వారు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన ఉన్నవారు మాత్రమే పరీక్షలో ఉత్తీర్ణులవుతారు’ అని ప్రాంతీయ రవాణా అధికారి ప్రమోద్ కుమార్ సింగ్ చెబుతున్నారు.ఘజియాబాద్‌లో ప్రతిరోజూ సగటున 225 మంది మాన్యువల్ డ్రైవింగ్ పరీక్షకు హాజరవుతున్నారు. అత్యాధునిక డ్రైవింగ్ టెస్ట్ కోసం డిపార్ట్మెంట్ డీటీసీని ఏర్పాటు చేసింది. డీటీసీ పనులు పూర్తయ్యాయి. డీటీసీలో 108 కెమెరాలను ఏర్పాటు చేశారు. కేంద్రం నిర్వహణ బాధ్యతను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించారు.డ్రైవర్ పరీక్ష ఏజెన్సీ పర్యవేక్షణలో జరుగుతుంది. అయితే పరీక్షలో అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారా లేదా విఫలమయ్యారా అనేది అధికారులు నిర్ణయిస్తాయి. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అభ్యర్థుల ప్రతి కదలికనూ వీడియో రికార్డింగ్ చేస్తారు.దరఖాస్తుదారు డ్రైవింగ్‌తో పాటు ట్రాఫిక్ నియమాలన్నింటినీ తెలుసుకోవాలి. డ్రైవింగ్‌తో పాటు ప్రతి నియమం తెలిస్తేనే పరీక్షలో ఉత్తీర్ణులవుతారు. దీంతో టెస్టింగ్‌లో మోసాలు పూర్తిగా నిలిచిపోతాయి. 108 కెమెరాల వీడియో రికార్డును కేంద్రంలో భద్రంగా ఉంచుతారు. ఇది భవిష్యత్తులో ఎప్పుడైనా తనిఖీ చేయవచ్చు.సిమ్యులేటర్ అంటే ఏమిటి?సిమ్యులేటర్ అనేది నిజమైన కారుకు ప్రతిరూపం. ఇందులో స్టీరింగ్ వీల్, గేర్లు, బ్రేక్‌లు, పెడల్స్, సూచికలు, స్విచ్‌లు, స్పీడ్ కంట్రోల్ అన్నీ ఉంటాయి. హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ ద్వారా ఈ సిమ్యులేటర్ నడుస్తుంది. డ్రైవింగ్ ప్రవర్తనను అధ్యయనం చేయడానికి దీనిని ప్రయోగశాలగా కూడా వ్యవహరిస్తారు. దీని ద్వారా ఎకో డ్రైవింగ్ శిక్షణ కూడా అందించవచ్చు. -
టీవీఎస్ జూపిటర్.. 70 లక్షల స్కూటర్లు
టీవీఎస్ మోటార్ కంపెనీ మరో ఘనతను సాధించింది. కంపెనీ తయారీ జూపిటర్ స్కూటర్ (TVS Jupiter) 70 లక్షల యూనిట్ల మార్కును చేరుకుంది. హోల్‌సేల్‌గా కంపెనీ 2024 నవంబర్ నాటికి 71,40,927 యూనిట్లను విక్రయించింది. 2013 సెప్టెంబర్ నుంచి సంస్థ మొత్తం 1.14 కోట్ల స్కూటర్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇందులో జూపిటర్ వాటా ఏకంగా 62 శాతం ఉంది.స్కూటర్స్ విభాగంలో సెగ్మెంట్లో దేశంలో రెండవ స్థానంలో ఉన్న జూపిటర్ 110, 125 సీసీ ఇంజన్ సామర్థ్యంలో లభిస్తోంది. 2024 మార్చి నాటికి 80,000 జూపిటర్ స్కూటర్లను కంపెనీ ఎగుమతి చేసింది. 2016 జూన్ నాటికి 10 లక్షల యూనిట్ల మార్కును సాధించింది. 2017 సెప్టెంబర్ నాటికి 20 లక్షల యూనిట్ల అమ్మకాలను సాధించింది. 2022 సెప్టెంబర్ నాటికి 50 లక్షల యూనిట్లను తాకింది.మరో 10 లక్షల యూనిట్లకు ఏడాది, ఆ తర్వాతి 10 లక్షలకు 14 నెలల సమయం తీసుకుంది. భారత స్కూటర్స్ పరిశ్రమలో రెండవ స్థానం దక్కించుకున్న టీవీఎస్‌కు 25 శాతం వాటా ఉంది. 2023–24లో 8,44,863 జూపిటర్ స్కూటర్స్ రోడ్డెక్కగా.. 2024–25 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–నవంబర్‌లో ఈ సంఖ్య 7,01,360 యూనిట్లు ఉంది. ప్రస్తుతం 110 సీసీలో నాలుగు, 125 సీసీలో మూడు వేరియంట్లలో జూపిటర్ లభిస్తోంది.సుజుకీ యాక్సెస్ 60 లక్షలు ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా కూడా ఇటీవల సరికొత్త రికార్డు సాధించింది. సుజుకీ యాక్సెస్ 125 (suzuki access 125) మోడల్లో కంపెనీ 60 లక్షల స్కూటర్ల తయారీ మార్కును దాటింది. ఈ ఘనతను సాధించడానికి సంస్థకు 18 ఏళ్లు పట్టింది. సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా నుంచి అత్యధికంగా అమ్ముడు అవుతున్న మోడల్ కూడా ఇదే.దీర్ఘకాలిక మన్నిక, మెరుగైన పనితీరు, మైలేజీ, నిర్వహణ వ్యయాలు తక్కువగా ఉండడంతో యాక్సెస్ 125 స్కూటర్‌కు కస్టమర్ల నుంచి దేశ విదేశాల్లో మంచి స్పందన ఉంది. భారత్‌తోపాటు అంతర్జాతీయంగా కస్టమర్ల నమ్మకానికి ఈ గణాంకాలే నిదర్శనమని కంపెనీ ఎండీ కెనిచి ఉమేద తెలిపారు. యాక్సెస్ 125 తొలిసారిగా భారత్‌లో 2006లో అడుగుపెట్టింది. భారత రోడ్లపై 125 సీసీ ఇంజన్ సామర్థ్యంతో పరుగెత్తిన తొలి స్కూటర్ కూడా ఇదే కావడం విశేషం.మూడవ స్థానంలో కంపెనీ..దేశవ్యాప్తంగా 2024 ఏప్రిల్–నవంబర్ మధ్య వివిధ కంపెనీలకు చెందిన 47,87,080 స్కూటర్లు రోడ్డెక్కాయి. ఇందులో సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా 14 శాతం వాటాతో మూడవ స్థానంలో ఉంది. గతేడాదితో పోలిస్తే 2024 ఏప్రిల్–నవంబర్‌లో కంపెనీ 18 శాతం దూసుకెళ్లి 6,84,898 యూనిట్ల స్కూటర్ల అమ్మకాలను సాధించింది. సుజుకీ ఎకో పెర్ఫార్మెన్స్ టెక్నాలజీతో 125 సీసీ ఎయిర్‌కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో ఇది రూపుదిద్దుకుంది.5,500 ఆర్పీఎం వద్ద 10 ఎన్ఎం గరిష్ట టార్క్ అందిస్తుంది. బ్లూటూత్ ఆధారిత డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఏర్పాటు చేశారు. కాల్స్, ఎస్ఎంఎస్, వాట్సాప్ అలర్ట్స్, మిస్డ్ కాల్ అలర్ట్స్ అందుకోవచ్చు. స్పీడ్ వార్నింగ్, ఫోన్ బ్యాటరీ లెవెల్ డిస్ప్లే, గమ్యస్థానానికి చేరుకునే సమయం వంటివి తెలుసుకోవచ్చు. 22.3 లీటర్ల స్టోరేజ్, ఈజీ స్టార్ట్ కీ సిస్టమ్, పొడవైన సీటు వంటివి అదనపు హంగులు. -
భారత్‌లోని బెస్ట్ క్రూయిజర్ బైకులు ఇవే!
మార్కెట్లో సాధారణ బైకులకు మాత్రమే కాకుండా.. క్రూయిజర్ మోటార్‌సైకిళ్లకు కూడా జనాదరణ లభిస్తోంది. దీంతో చాలామంది ఈ బైకులను కొనొగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ కథనంలో భారతదేశంలో అమ్మకానికి ఉన్న టాప్ 5 బెస్ట్ క్రూయిజర్ బైకుల గురించి వివరంగా తెలుసుకుందాం.కవాసకి డబ్ల్యు175 (Kawasaki W175)భారతదేశంలో అత్యంత సరసమైన క్రూయిజర్ బైకులలో కవాసకి డబ్ల్యు175 ఒకటి. దీని ప్రారంభ ధర రూ. 1.22 లక్షలు. ఈ బైకులోని 177 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 12.8 హార్స్ పవర్, 12.2 ఏంఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 45 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది. మంచి డిజైన్, స్పోక్డ్ రిమ్స్.. అల్లాయ్ వీల్స్ కలిగిన ఈ బైక్ సస్పెన్షన్, బ్రేకింగ్ సిస్టమ్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి.టీవీఎస్ రోనిన్ (TVS Ronin)చూడగానే ఆకర్శించే డిజైన్ కలిగిన టీవీఎస్ రోనిన్ ధరలు రూ. 1.35 లక్షల నుంచి రూ. 1.72 లక్షల మధ్య ఉన్నాయి. ఇందులోని 225.9 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 20.1 హార్స్ పవర్, 19.93 Nm టార్క్ అందిస్తుంది. ఇది 42.95 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది. ఈ బైకులో లేటెస్ట్ ఫీచర్స్.. సస్పెన్షన్ సిస్టమ్ వంటివన్నీ ఉన్నాయి. ఇది నగరంలో, హైవేపై రైడింగ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.బజాజ్ అవెంజర్ 220 (Bajaj Avenger 220)మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ క్రూయిజర్ బైకులలో బజాజ్ అవెంజర్ 220 కూడా ఒకటి. దీని ధర రూ. 1.45 లక్షలు. ఇందులో 18.76 హార్స్ పవర్, 17.55 న్యూటన్ మీటర్ టార్క్ అందించే 220 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. 40 కిమీ / లీ మైలేజ్ అందించే ఈ బైక్ రెట్రో డిజైన్ కలిగి ట్విన్ షాక్ రియర్ సస్పెన్షన్ సెటప్ పొందుతుంది. కాబట్టి ఇది లాంగ్ రైడ్ చేయడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.క్యూజే ఎస్ఆర్సీ 250 (QJ SRC 250)మార్కెట్లో అందుబాటులో ఉన్న క్యూజే ఎస్ఆర్సీ 250 బైక్ ప్రారంభ ధర రూ. 1.49 లక్షలు. 50 కిమీ / లీ మైలేజ్ అందించే ఈ బైక్ 249 సీసీ ట్విన్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 17.4 హార్స్ పవర్, 17 Nm టార్క్ అందిస్తుంది. ఈ బైక్ రోజు వారీ వినియోగానికి మాత్రమే కాకుండా లాంగ్ రైడ్ చేయడానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.ఇదీ చదవండి: ఆరు నెలల్లో 40000 మంది కొన్న బైక్ ఇదిరాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 (Royal Enfield Hunter 350)రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీకి చెందిన సరసమైన బైక్ ఈ హంటర్ 350. దీని ప్రారంభ ధర రూ. 1.49 లక్షలు. ఇందులో 349 సీసీ సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ 20.2 హార్స్ పవర్, 27 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 36 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది. అత్యంత ఆకర్షణీయమైన క్రూయిజర్ బైకులలో ఒకటైన హంటర్ 350 మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. -
ఎలక్ట్రిక్ కిసిక్!
కొత్త ఏడాదిలో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు దుమ్మురేపేందుకు ఫుల్ చార్జ్ అవుతున్నాయి. దేశీ కంపెనీలతో పాటు విదేశీ దిగ్గజాలు సైతం భారత్ మార్కెట్లోకి పలు కొంగొత్త మోడళ్లను విడుదల చేసే సన్నాహాల్లో ఉన్నాయి. ముఖ్యంగా దేశీ కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ తన ఎలక్ట్రిక్ జర్నీ షురూ చేస్తోంది. ఎలాన్ మస్క్ టెస్లా కూడా ఈ ఏడాదే మన ఈవీ మార్కెట్ రేసుకు సిద్ధమవుతోంది. ఈ నెలలో జరగనున్న అతిపెద్ద భారత్ మొబిలిటీ ఆటో షోలో అనేక కంపెనీలు ‘ఎలక్ట్రిక్’ ఆవిష్కరణలతో ఫాస్ట్ ట్రాక్‌లో దూసుకెళ్లనున్నాయి.గతేడాది రికార్డు ఈవీ అమ్మకాలతో జోష్ మీదున్న వాహన దిగ్గజాలు... 2025లో రెట్టించిన ఉత్సాహంతో గ్రీన్ కార్ల కుంభమేళాకు సై అంటున్నాయి. ఈ ఏడాది కొత్తగా రోడ్డెక్కనున్న ఈవీల్లో అత్యధికంగా ఎస్‌యూవీలే కావడం విశేషం! కాలుష్యానికి చెక్ చెప్పడం, క్రూడ్ దిగుమతుల భారాన్ని తగ్గించుకునే చర్యల్లో భాగంగా పర్యావరణానుకూల వాహనాలను ప్రభుత్వం మరింత ప్రోత్సహిస్తోంది. దీంతో దాదాపు దేశంలోని అన్ని కార్ల కంపెనీలూ ఎలక్ట్రిక్ మార్కెట్లో వాటా కొల్లగొట్టేందుకు పోటీ పడుతున్నాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దేశీ కార్ల అగ్రగామి మారుతీ. సంప్రదాయ పెట్రోల్, డీజిల్ వాహన రంగంలో ఎదురులేని రారాజుగా ఉన్న మారుతీ తొలిసారి ఈవీ అరంగేట్రం చేస్తోంది. హ్యుందాయ్తో పాటు లగ్జరీ దిగ్గజాలు మెర్సిడెస్, ఆడి, స్కోడా కూడా తగ్గేదేలే అంటున్నాయి. ఇక ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో టాప్‌గేర్‌లో దూసుకుపోతున్న టాటా మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్, మహీంద్రాతో సహా చైనా దిగ్గజం బీవైడీ ఈవీ డ్రైవ్‌తో పోటీ మరింత హీటెక్కనుంది. వీటి ప్రారంభ ధరలు రూ. 16 లక్షల నుంచి రూ. 80 లక్షల రేంజ్లో ఉండొచ్చని అంచనా. ఆటో ఎక్స్పో వేదికగా... అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భారత్ మొబిలిటీ మెగా ఆటో షో (జనవరి 17–22 వరకు)లో 16 కార్ల కంపెనీలు కొలువుదీరనున్నాయి. ఇందులో పెట్రోలు, డీజిల్, హైబ్రిడ్ వాహనాలు ఉన్నప్పటికీ ఈసారి ఆధిపత్యం ఈవీలదే. అయితే అందరి కళ్లూ మారుతీ తొలి పూర్తి బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనం (బీఈవీ) ఈ–విటారా పైనే ఉన్నాయి. దీని రేంజ్ 500 కిలోమీటర్లకు మించి ఉంటుందని, ధర రూ.15 లక్షలతో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. హ్యుందాయ్ క్రెటా ఈవీ కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇక గతేడాది మార్కెట్ వాటాను కొద్దిగా పెంచుకున్న మహీంద్రా ఈ ఏడాది ఎలక్ట్రిక్ గేర్ మారుస్తోంది. రెండు ఈవీ ఎస్‌యూవీలను రోడ్డెక్కించనుంది. జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఎలక్ట్రిక్ వాటా 2024లో ఏకంగా రెట్టింపై 21 శాతానికి ఎగబాకింది. విండ్సర్తో భారత్ ఈవీ మార్కెట్లో సంచలనానికి తెరతీసింది. గడిచిన 3 నెలల్లో 10 వేలకు పైగా విక్రయాలతో అదరగొట్టింది. బ్యాటరీ రెంటల్ సర్వీస్ (బీఏఏఎస్)ను అందించడం వల్ల కారు ధర కస్టమర్లకు మరింత అందుబాటులోకి వచ్చినట్లయింది. హ్యుందాయ్ వెన్యూ, కియా కారెన్ ్స ఈవీలు కూడా క్యూలో ఉన్నాయి. అన్ని కంపెనీలూ ఎలక్ట్రిక్ బాట పడుతుండటంతో టాటా మోటార్స్ వాటా గతేడాది 62%కి (2023లో 73%) తగ్గింది. అయితే, సియరా, సఫారీ, హ్యారియర్ ఎస్యూవీ ఈవీలతో మార్కెట్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతోంది.టెస్లా వచ్చేస్తోంది... భారత్‌లో ఎంట్రీ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్న ఎలక్ట్రిక్ కార్ కింగ్ టెస్లా ఈ ఏడాది ముహూర్తం ఖారారు చేసింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఘన విజయం, ప్రభుత్వంలో ఎలాన్ మస్క్ కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో దిగుమతి సుంకం విషయంలో త్వరలోనే భారత్ సర్కారుతో సయోధ్య కుదిరే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం. దేశంలో టెస్లా ప్లాంట్ ఏర్పాటు చేయాలని మోదీ సర్కారు పట్టుబడుతుండగా.. ముందుగా దిగుమతి రూట్లో వచ్చేందుకు మస్క్ మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే బెంగళూరు ఆర్‌ఓసీలో టెస్లా ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ పేరుతో కంపెనీ రిజిస్టర్ కూడా చేసుకుంది. పలు నగరాల్లో రిటైల్ షోరూమ్స్ ఏర్పాటు కోసం కంపెనీ లొకేషన్లను అన్వేషిస్తోంది. తొలుత కొన్ని మోడళ్లను (మోడల్ ఎస్, మోడల్ 3) పూర్తిగా దిగుమతి చేసుకుని ఇక్కడ విక్రయించనుంది. వీటి ప్రారంభ రూ. 70 లక్షలు ఉంటుందని పరిశ్రమ వర్గాలు లెక్కలేస్తున్నాయి.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఆరు నెలల్లో 40000 మంది కొన్న బైక్ ఇది
ప్రపంచంలోనే మొట్ట మొదటి సీఎన్జీ (CNG) బైక్ లాంచ్ చేసిన బజాజ్ ఆటో (Bajaj Auto) ఉత్తమ అమ్మకాలను పొందుతోంది. 'ఫ్రీడమ్ 125' బైకును ఆరు నెలల్లో.. 40,000 కంటే ఎక్కువ మంది కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ వెల్లడించారు.బజాజ్ సీఎన్జీ బైక్.. అతి తక్కువ కాలంలోనే ఎక్కువమంది వాహన వినియోగదారులకు ఆకర్శించింది. మేము దాదాపు 40,000 బైక్‌లను రిటైల్ చేసాము. ఇది 300 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుండంతో.. రోజువారీ వినియోగానికి కూడా దీనిని ఎక్కువమంది కొనుగోలు చేస్తున్నారని రాకేష్ శర్మ (Rakesh Sharma) పేర్కొన్నారు.బజాజ్ సీఎన్జీ బైకును ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశ్యంతో.. ఇప్పటికి సుమారు 350 పట్టణాలకు విస్తరించినట్లు రాకేష్ శర్మ వెల్లడించారు. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రధాన నగరాలలో ఈ బైకును ప్రదర్శించడానికి, అక్కడ విక్రయాలను కొనసాగించడానికి కావలసిన ఏర్పాట్లను చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.బజాజ్ ఫ్రీడమ్ 125బజాజ్ ఫ్రీడమ్ 125 పేరుతో మార్కెట్లో లాంచ్ అయిన సీఎన్జీ బైక్ ధర రూ. 95000 (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ మూడు వేరియంట్లలో లభిస్థుంది. ఇది చూడటానికి సింపుల్ డిజైన్ కలిగి ఉన్నప్పటికీ.. రైడర్లకు మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.బజాజ్ ఫ్రీడమ్ 125 బైకులో 2 కేజీల కెపాసిటీ కలిగిన సీఎన్జీ ట్యాంక్, అదే పరిమాణంలో పెట్రోల్ ట్యాంక్ ఉంటారు. పెట్రోల్, సీఎన్జీ సామర్థ్యాలను పరిగణలోకి తీసుకుంటే బైక్ మైలేజ్ 330 కిమీ వరకు ఉంటుంది. ఈ బైకులోని 125 సీసీ ఇంజిన్ 8000 rpm వద్ద 9.5 Bhp పవర్, 6000 rpm వద్ద 9.7 Nm టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది.ఫ్రీడమ్ 125 బైక్ డిజైన్.. మార్కెట్లోని ఇతర కమ్యూటర్ మోటార్‌సైకిళ్ల కంటే భిన్నంగా ఉంటుంది. ఇందులో ఎల్ఈడీ హెడ్‌లైట్, డర్ట్ బైక్ స్టైల్ ఫ్యూయల్ ట్యాంక్, పొడవైన సింగిల్ పీస్ సీటు వంటివి ఉన్నాయి. బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి అప్డేటెడ్ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. -
ఈవీ వాహనాల్లో గేమ్‌ఛేంజర్.. నానో పీసీఎం
రవాణా రంగంలో విద్యుత్తు వాహనాలు ఒక సంచలనం...పర్యావరణ హితమైనవి. ఖర్చు తక్కువ. లాభమెక్కువ!ఈ కారణంగానే ఇటీవలి కాలంలో స్కూటర్లు మొదలుకొని..ఆటోలు, మోటార్‌బైకులు, కార్లు అనేకం విద్యుత్తుతోనే నడుస్తున్నాయి!అయితే... వీటిల్లో సమస్యలూ లేకపోలేదు.కొన్ని స్కూటర్లు రోడ్లపైనే కాలి బూడిదవుతూంటే..ఇంకొన్నింటి బ్యాటరీలు టపాసుల్లా పేలిపోతున్నాయి!ఈ సమస్యలకు కారణాలేమిటి? పరిష్కారం ఉందా?విద్యుత్తు వాహనాల్లో ఇప్పుడు వాడుతున్న...లిథియం అయాన్ బ్యాటరీలకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయా?ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన ప్రశ్నలకు జవాబు తెలుసుకునే ప్రయత్నం చేసింది.. ‘సాక్షి.కాం’డాక్టర్ నిశాంత్ దొంగరి.. (Nishanth Dongari) విద్యుత్తు వాహన రంగంలో చిరపరిచితమైన పేరిది. హైదరాబాద్‌లోని ఐఐటీలో అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేస్తూనే.. ఇక్కడ మొట్టమొదటి విద్యుత్తు వాహన స్టార్టప్ కంపెనీని ప్రారంభించిన వ్యక్తి ఈయన. ప్యూర్ ఈవీ (Pure EV) పేరుతో మార్కెట్లో లభ్యమవుతున్న విద్యుత్తు స్కూటర్లు డాక్టర్ నిశాంత్ సృష్టే. ఇటీవలి కాలంలో విద్యుత్తు ద్విచక్ర వాహనాలు అనేక సమస్యలు వాటి పరిష్కార మార్గాల గురించి తెలుసుకునేందుకు ‘సాక్షి.కాం’ ఆయన్ను సంప్రదించింది. ఆ వివరాలు..బ్యాటరీలు ఎందుకు కాలిపోతున్నాయి?ఛార్జ్ చేసేటప్పుడు.. వినియోగించే సమయంలోనూ అన్ని బ్యాటరీలూ వేడెక్కుతూంటాయి. ఇది సహజం. అయితే సక్రమంగా నియంత్రించకపోతే ఈ వేడి కాస్తా ప్రమాదాలకు దారితీస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న విద్యుత్తు వాహనాల బ్యాటరీలు అన్నింటిలోనూ వేడిని పసికట్టేందుకు సాధ్యమైనంత వరకూ తొలగించేందుకు ఎన్నో ఏర్పాట్లు ఉన్నాయి.‘‘ప్యూర్ -ఈవీలో మేము ఇంకో అడుగు ముందుకేశాము. బ్యాటరీల్లో వేడిని ఎప్పటికప్పుడు తగ్గించేందుకు దేశంలోనే మొట్టమొదటి సారి ఫేజ్ ఛేంజ్ మెటీరియల్ (PCM)ను ఉపయోగించాం. వేడి ఎక్కువైనప్పుడు ఈ పదార్థం ద్రవరూపంలోకి మారిపోతుంది. వేడిని బ్యాటరీల నుంచి దూరంగా తీసుకెళుతుంది. తరువాతి కాలంలో ఈ టెక్నాలజీని మరింత అభివృద్ధి చేశాము. నానోస్థాయి పదార్థాన్ని చేర్చడం ద్వారా బ్యాటరీల్లోని వేడి మరింత సమర్థంగా తగ్గించగలిగాం. ఈ నానోపీసీఎం కారణంగా ప్యూర్-ఈవీ బ్యాటరీలు ఎట్టి పరిస్థితుల్లోనూ కాలిపోవు అని గ్యారెంటీగా చెప్పగలం.’’విద్యుత్తు వాహనాల్లో ఏఐ వాడకం ఎలా ఉండబోతోంది?వాహనాల్లో కృత్రిమ మేధ వాడకం గత ఐదేళ్లలో బాగా పెరిగింది. విద్యుత్తు వాహనాల్లో కూడా. ప్రస్తుతం ప్యూర్-ఈవీలో బ్యాటరీ ప్యాక్‌లలోని ఒక్కో సెల్‌ను పరిశీలించేందుకు మేము కృత్రిమ మేధను వాడుతున్నాం. భవిష్యత్తులో విద్యుత్తు వాహనాలు ఎదుర్కొనే చిన్న చిన్న సమస్యలను గుర్తించేందుకు, వినియోగదారులకు పరిష్కార మార్గాలు సూచించేందుకూ జనరేటివ్ ఏఐను వాడే ఆలోచనలో ఉన్నాం. ఉదాహరణకు.. మీ వాహనం అకస్మాత్తుగా రోడ్డుపై ఆగిపోయిందనుకుందాం. స్మార్ట్‌ఫోన్‌లోని అప్లికేషన్లో మీ సమస్య వివరాలు ఎంటర్ చేస్తే జనరేటివ్ ఏఐ ‘‘స్విచ్ ఆన్/ఆఫ్ చేసి చూడండి’’ లేదా ఇంకో పరిష్కార మార్గం సూచిస్తుంది.లిథియం అయాన్ బ్యాటరీలు ఇంకెంత కాలం?విద్యుత్తు వాహనాలతోపాటు అనేక ఇతర రంగాల్లోనూ లిథియం అయాన్ బ్యాటరీలే అధికం. రానున్న 30 - 50 ఏళ్ల వరకూ ఇదే పంథా కొనసాగనుంది. ఈ టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా పరిచయమైంది 20 - 25 ఏళ్ల ముందు మాత్రమే. కాథోడ్, ఆనోడ్, ఎలక్ట్రొలైట్, సెపరేటర్ వంటి అనేక అంశాల్లో మెరుగుదలకు చాలా అవకాశాలున్నాయి. నిల్వ చేయగల విద్యుత్తు, భద్రత అంశాలు కూడా బాగా మెరుగు అవుతాయి. సైద్ధాంతికంగా ప్రస్తుతం ఉపయోగిస్తున్న ద్రవ ఎలక్ట్రోలైట్ బ్యాటరీల్లో 220 వాట్ల విద్యుత్తు నిల్వ చేయగలిగితే సాలిడ్ స్టేట్ బ్యాటరీల్లో ఇది 800 వాట్లకు చేరుకోగలదు. రానున్న ఐదేళ్లలో మరింత వేగంగా ఛార్జ్ చేసుకోవడంతోపాటు అవసరమైనప్పుడు అవసరమైనంత వేగాన్ని ఇచ్చే టెక్నాలజీలు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.భారత్ లాంటి దేశాలు లిథియంపై మౌలిక రంగ పరిశోధనలు మరిన్ని ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది. ముడి ఖనిజం నుంచి లిథియం అయాన్‌ను మరింత సమర్థంగా వెలికితీయగలిగితే, వాడేసిన బ్యాటరీల నుంచి మెరుగ్గా రీసైకిల్ చేయగలిగితే బ్యాటరీల ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. భారత్ ఈ విషయాల్లో చొరవ చూపాలి. ముడి ఖనిజం ద్వారా వెలికితీసే లిథియంకు ఇది సరైన ప్రత్యామ్నాయం కాగలదు. లిథియం అయాన్ బ్యాటరీల్లో మరింత ఎక్కువ విద్యుత్తును నిల్వ చేసేందుకు కూడా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. వీటి ద్వారా ఒకసారి ఛార్జ్ చేస్తే ప్రయాణించే దూరం (మైలేజీ) మరింత పెరుగుతుంది. కాబట్టి.. సమీప భవిష్యత్తులో లిథియం అయాన్ బ్యాటరీలకు ప్రత్యామ్నాయం ఏదీ లేదనే చెప్పాలి.హోండా లాంటి కంపెనీలు హైడ్రోజన్‌పై దృష్టి పెడుతున్నాయి కదా?నిజమే. కానీ హైడ్రోజన్‌తో వ్యక్తిగత వాహనాలు నడుస్తాయని నేను భావించడం లేదు. లారీలు, ట్రక్కులు, రైళ్లు, చిన్న నౌకల వంటి భారీ వాహనాలకు హైడ్రజన్ ఎంతో ఉపయోగపడుతుంది. భారత్ కూడా ఇటీవలి కాలంలో హైడ్రోజన్‌ను ఇంధనంగా వాడుకునే విషయంలో చొరవ చూపుతోంది. పరిశోధనలపై దృష్టి పెడుతోంది. భవిష్యత్తులో రవాణా రంగంలో హైడ్రోజన్ కీలకం కాగలదు. చిన్న వాహనాల విషయానికి వస్తే హైడ్రోజన్‌ను నిల్వ చేయడం, రవాణా చేయడం చాలా రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. -
ఈ ఏడాది బెంజ్ ఎనిమిది కొత్త మోడళ్లు
లగ్జరీ కార్ల తయారీలో ఉన్న మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఈ ఏడాది కొత్తగా ఎనిమిది మోడళ్లను ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించింది. వీటిలో బ్యాటరీ మోడళ్లు కూడా ఉంటాయని తెలిపింది. గతేడాది 14 మోడళ్లను పరిచయం చేసినట్టు మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ తెలిపారు. 2,000 యూనిట్లకుపైగా ఆర్డర్ బుక్‌తో నూతన సంవత్సరం ప్రారంభం అయిందని, ఇది కంపెనీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పారు. సంస్థ మొత్తం విక్రయాల్లో 50 శాతం యూనిట్లకు మెర్సిడెస్ బెంజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రుణం సమకూర్చిందని చెప్పారు. ఇప్పటి వరకు కస్టమర్లకు రూ.10,000 కోట్ల పైచిలుకు రుణాలు మంజూరు చేసినట్టు పేర్కొన్నారు. రెండు కొత్త మోడళ్లు..మెర్సిడెస్ భారత మార్కెట్లో గురువారం రెండు బ్యాటరీ మోడళ్లను విడుదల చేసింది. ఇందులో ఈక్యూ టెక్నాలజీతో జీ580, అలాగే అయిదు సీట్లతో కూడిన ఈక్యూఎస్ ఎస్యూవీ 450 ఉన్నాయి. ఎక్స్‌షోరూంలో జీ580 ధర రూ.3 కోట్ల నుంచి ప్రారంభం. ఒకసారి చార్జింగ్‌తో 473 కిలోమీటర్లు పరుగెడుతుంది. ఈక్యూఎస్ ఎస్యూవీ 450 ధర రూ.1.28 కోట్లు ఉంది. భారత్ మొబిలిటీ షో వేదికగా మెర్సిడెస్ మైబహ్ ఈక్యూఎస్ ఎస్యూవీ నైట్ సిరీస్ తళుక్కుమనేందుకు రెడీ అవుతోంది.ఇదీ చదవండి: అపోహలు వీడితేనే మంచి స్కోరురెండింతలైన ఈవీలు..2024లో సంస్థ దేశవ్యాప్తంగా 19,565 యూనిట్లను విక్రయించింది. 2023తో పోలిస్తే గతేడాది కంపెనీ అమ్మకాల్లో 12.4 శాతం వృద్ధి నమోదైంది. బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికిల్స్ విక్రయాలు దాదాపు రెట్టింపు అయ్యాయని సంతోష్ అయ్యర్ తెలిపారు. ‘మొత్తం అమ్మకాల్లో ఈవీల వాటా ఏడాదిలో 2.5 నుంచి 2024లో 6 శాతానికి ఎగసింది. ఇక మొత్తం అమ్మకాల్లో రూ.1.5 కోట్లకుపైగా విలువ చేసే టాప్ ఎండ్ కార్ల వాటా 25 శాతం ఉంది. వీటి సేల్స్ 30 శాతం దూసుకెళ్లాయి. ప్రస్తుతం సంస్థకు 50 నగరాల్లో 125 ఔట్లెట్స్ ఉన్నాయి. ఈ ఏడాది మరో 20 లగ్జరీ కేంద్రాలు తోడవనున్నాయి. ఫ్రాంచైజ్ భాగస్వాములు మూడేళ్లలో రూ. 450 కోట్లకుపైగా పెట్టుబడులకు కట్టుబడి ఉన్నారు’ అని అయ్యర్ వెల్లడించారు. భారత్‌లో ఎంట్రీ ఇచి్చన తొలి రెండు దశాబ్దాల్లో 50,000 పైచిలుకు మెర్సిడెస్ కార్లు రోడ్డెక్కాయి. గత 10 ఏళ్లలో కస్టమర్ల చేతుల్లోకి వెళ్లిన కార్ల సంఖ్య 1.5 లక్షల యూనిట్లు. ఇదీ భారత మార్కెట్ ప్రస్థానం అని ఆయన వివరించారు. -
బెంగళూరులో 23 నుండి ఐఎంటీఈఎక్స్ 2025
న్యూఢిల్లీ: మెషిన్ టూల్ పరిశ్రమకు సంబంధించి జనవరి 23 నుండి 29 వరకు బెంగళూరులో ఐఎంటీఈఎక్స్ 2025 ఎగ్జిబిషన్ జరగనుంది. ఇందులో అమెరికా, జర్మనీ, ఇటలీ, జపాన్ తదితర 23 దేశాల నుండి 1,100కు పైగా ఎగ్జిబిటర్లు పాల్గోనున్నారు. సుమారు 90,000 చ.మీ. విస్తీర్ణంలో నిర్వహించే ఎగ్జిబిషన్లో టూల్‌టెక్, డిజిటల్ మాన్యుఫాక్చరింగ్ మొదలైన కార్యక్రమాల్లో భారత తయారీ సాంకేతికత సామర్థ్యాలను ప్రతిబింబించే పలు ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. మెషిన్ టూల్ రంగ సంస్థలు కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఇది ఉపయోగపడగలదని ఐఎంటీఎంఏ ప్రెసిడెంట్ రాజేంద్ర ఎస్ రాజమాణె తెలిపారు. -
మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 450 లాంచ్: ధర ఎంతంటే?
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'మెర్సిడెస్ బెంజ్' (Mercedes Benz) మార్కెట్లో 'ఈక్యూఎస్ 450' (EQS 450) లాంచ్ చేసింది. దీని ధర ఇప్పటికే అమ్మకానికి అందుబాటులో ఉన్న ఈక్యూఎస్ కంటే తక్కువ. ఇది 5 సీటర్ మోడల్.. కేవలం సింగిల్ మోటార్ సెటప్‌తో వస్తుంది. ఈ కారు డెలివరీలు ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.రూ. 1.28 కోట్ల ధర వద్ద లాంచ్ అయిన కొత్త మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 450 చూడటానికి దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే కనిపిస్తుంది. కానీ ఇందులో కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ గమనించవచ్చు. ఈ కారు రేంజ్ కూడా దాని 580 మోడల్ కంటే 11 కిమీ కంటే ఎక్కువ. రేంజ్ కొంత ఎక్కువ ఉంది కాబట్టి మంచి అమ్మకాలు పొందే అవకాశం ఉందని తెలుస్తోంది.కొత్త మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 450 ఎలక్ట్రిక్ కారు.. ముందు బంపర్, అల్లాయ్ వీల్స్ వంటి వాటిలో కొన్ని చిన్న మార్పులు చూడవచ్చు. ఇంటీరియర్ కూడా కొంత అప్డేట్స్ పొందుతుంది. ఇందులో MBUX హైపర్‌స్క్రీన్ చూడవచ్చు. లోపల గమనించాల్సిన అతిపెద్ద మార్పు మూడో వరుస సీట్లు లేకపోవడం. అయితే రెండవ వరుస సీట్లు పవర్ అడ్జస్టబుల్గా కొనసాగుతాయి. ఎక్కువ సౌలభ్యం కోసం స్లైడ్ అండ్ రిక్లైన్ రెండూ చేయవచ్చు.ఈ కొత్త లగ్జరీ కారులో 360 డిగ్రీ కెమెరా, ఎయిర్ వెంట్స్, 4 జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సాఫ్ట్ క్లోజ్ డోర్లు, పుడ్ ల్యాంప్స్, ఇల్యూమినేటెడ్ రన్నింగ్ బోర్డ్‌లతో పాటు లెవల్ 2 ఏడీఏఎస్, తొమ్మిది ఎయిర్‌బ్యాగ్‌లు మొదలైనవి ఉన్నాయి.బెంజ్ ఈక్యూఎస్ 450 ఎలక్ట్రిక్ కారు వెనుక యాక్సిల్‌పై సింగిల్ మోటార్ సెటప్ ఉంటుంది. ఇది 355 Bhp పవర్, 800 Nm టార్క్ అందిస్తుంది. ఈ కారు 6.7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేహవంతం అవుతుంది. ఇందులోని 122 కిలోవాట్ బ్యాటరీ.. సింగిల్ ఛార్జీతో 671 కిమీ రేంజ్ అందిస్తుంది.ఇదీ చదవండి: భారత్‌లోని బెస్ట్ డీజిల్ కార్లు.. ధర కూడా తక్కువే!ఈక్యూఎస్ 450 ఎలక్ట్రిక్ కారు 200 కేడబ్ల్యు డీసీ ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 10 నుంచి 80 శాతం ఛార్జ్ చేయడానికి 31 నిమిషాల సమయం పడుతుంది. అయితే 22 కేడబ్ల్యు వాల్ ఛార్జర్ ద్వారా 0 నుంచి 100 శాతం ఛార్జ్ కావడానికి పట్టే సమయం 6.25 గంటలు. ఈ కారు డెలివరీలు కూడా ఫిబ్రవరిలోనే జరుగుతాయి.ఇండియన్ మార్కెట్లో బెంజ్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ.. ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ లాంచ్ చేస్తోంది. ఇందులో భాగంగానే మెర్సిడెస్ బెంజ్ జీ క్లాస్ ఎలక్ట్రిక్ కారును కూడా లాంచ్ చేసింది. దీని ధర రూ. 3 కోట్ల కంటే ఎక్కువ. ఇది ఒక సింగిల్ చార్జితో 473 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. -
2025లో బెస్ట్ డీజిల్ కార్లు.. ధర కూడా తక్కువే!
భారతదేశంలో డీజిల్ కార్ల ఉత్పత్తి, వినియోగం బాగా తగ్గిపోయింది. దీనికి కారణం కఠినమైన ఉద్గార నిబంధనలు. అయితే కొంతమంది ఇప్పటికి కూడా డీజిల్ కార్లను ఉపయోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. కాబట్టి ఈ కథనంలో రూ. 10 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే బెస్ట్ మోడల్స్ గురించి తెలుసుకుందాం.టాటా ఆల్ట్రోజ్ (Tata Altroz)దేశీయ వాహన తయారీ సంస్థ 'టాటా మోటార్స్'కు చెందిన 'ఆల్ట్రోజ్' ప్రస్తుతం భారతదేశంలో అందుబాటులో ఉన్న చౌకైన డీజిల్ వెహికల్. దీని ప్రారంభ ధర రూ. 8.69 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇందులో 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 90 హార్స్ పవర్, 200 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది.మహీంద్రా బొలెరో (Mahindra Bolero)మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి చెందిన 'బొలెరో' గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువమందికి ఇష్టమైన కారు. ఇది 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ కలిగి.. 76 హార్స్ పవర్, 210 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఎంపికలో లభిస్తుంది. బీఎస్ 4 బొలెరో డీజిల్ వెర్షన్ ప్రారంభ ధర రూ. 9.79 లక్షలు (ఎక్స్ షోరూమ్).కియా సోనెట్ (Kia Sonet)కియా సోనెట్ అనేది కూడా 10 లక్షల లోపు ధర వద్ద లభించే బెస్ట్ డీజిల్ కారు. ఇందులోని 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ పొందుతుంది. ఇది 115 హార్స్ పవర్, 253 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సోనెట్ డీజిల్ వెర్షన్ ప్రారంభ ధర రూ. 9.99 లక్షలు (ఎక్స్ షోరూమ్).మహీంద్రా బొలెరో నియో (Mahindra Bolero Neo)మహీంద్రా బొలెరో నియో 100 హార్స్పవర్ & 210 ఎన్ఎమ్ టార్క్ అందించే 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ పొందుతుంది. ఇంజన్ 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ద్వారా ఉత్తమ పనితీరును అందిస్తుంది. మహీంద్రా బొలెరో నియో ప్రారంభ ధర రూ. 9.94 లక్షలు (ఎక్స్ షోరూమ్).మహీంద్రా XUV 3ఎక్స్ఓXUV 3XO కూడా మన జాబితాలో చెప్పుకోదగ్గ డీజిల్ వెర్షన్. రూ. 9.98 లక్షల (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధర వద్ద లభించే ఈ కారు 115 హార్స్ పవర్, 300 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ లేదా మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. కాబట్టి ఇది మంచి పనితీరును అందిస్తుంది.ఇదీ చదవండి: అప్పుడు కల కనింది: ఇప్పుడు కొనేసింది.. వీడియో చూశారా?డీజిల్ కార్లకు తగ్గిన డిమాండ్కఠినమైన ఉద్గార ప్రమాణాలు అమలులోకి వచ్చిన తరువాత డీజిల్ కార్లకు డిమాండ్ క్రమంగా తగ్గింది. అంతే కాకుండా కాలుష్య నివారణను దృష్టిలో ఉంచుకుని కూడా ప్రభుత్వం డీజిల్ కార్ల వినియోగాన్ని నిషేధిస్తోంది. ఇవి మాత్రమే కాకుండా.. పెట్రోల్ కార్ల ధరల కంటే కూడా డీజిల్ కార్ల ధరలు కొంత ఎక్కువగా ఉండటం కూడా ఈ కార్ల డిమాండ్ తగ్గిపోవడానికి కారణమైంది. -
నెలకు 5,000 వాహన అమ్మకాలు లక్ష్యం
వాహన తయారీ దిగ్గజం మహీంద్రా(Mahindra) అండ్ మహీంద్రా బీఈ–6, ఎక్స్ఈవీ 9ఈ టాప్ వేరియంట్ల ధరలను ప్రకటించింది. రెండు మోడళ్లూ మూడు వేరియంట్లలో లభిస్తాయి. ఎక్స్‌షోరూంలో టాప్ వేరియంట్స్ అయిన బీఈ–6 ప్యాక్–3 ధర రూ.26.90 లక్షలు కాగా ఎక్స్ఈవీ 9ఈ ప్యాక్–3 రూ.30.5 లక్షలు ఉంది. 2024 నవంబర్‌లో కంపెనీ రెండు మోడళ్లను ఆవిష్కరించి ఎలక్ట్రిక్ విభాగంలోకి ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈవీల ప్రారంభ ధర రూ.18.9 లక్షలు ఉంటుందని వెల్లడించింది. వేరియంట్‌నుబట్టి బీఈ–6 గరిష్టంగా ఒకసారి చార్జింగ్ చేస్తే 682 కిలోమీటర్లు, ఎక్స్ఈవీ 9ఈ 656 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. కాగా, నెలకు 5,000 యూనిట్లు విక్రయించాలని మహీంద్రా లక్ష్యంగా చేసుకుంది. చకన్ ప్లాంటు సామర్థ్యాన్ని నెలకు 90,000 స్థాయికి తీర్చిదిద్దుతోంది. దీనిని 1.2 లక్షల యూనిట్లకు పెంచే అవకాశమూ ఉంది. 2021–27 మధ్య ఎలక్ట్రిక్ వాహనాల వ్యాపారం కోసం రూ.16,000 కోట్లు పెట్టుబడి చేస్తున్నట్టు మహీంద్రా ఇప్పటికే వెల్లడించింది. ఫిక్స్డ్ డిపాజిట్లకు ఒకే ప్లాట్ఫామ్ఒకే ప్లాట్‌ఫామ్ ద్వారా రిటైల్(Retail) ఇన్వెస్టర్లు వివిధ బ్యాంకులు లేదా ఎన్బీఎఫ్సీలలో ఫిక్స్డ్ డిపాజిట్లు(FD) చేసేందుకు టాటా డిజిటల్ తెరతీసింది. సూపర్‌యాప్ ‘టాటా న్యూ’ ద్వారా ఇందుకు వీలు కల్పిస్తోంది. కస్టమర్లు పొదుపు ఖాతా లేకుండానే తమ సొమ్మును వివిధ ఫైనాన్షియల్ సంస్థలలో ఫిక్స్డ్ డిపాజిట్లకు మళ్లించుకోవచ్చునని టాటా డిజిటల్ తెలియజేసింది. గరిష్టంగా 9.1 శాతం వరకూ వడ్డీని ఫైనాన్షియల్ సంస్థలు ఆఫర్ చేస్తున్నట్లు పేర్కొంది. పోటీతత్వంతో కూడిన వడ్డీ రేట్లతో సులభంగా, భద్రంగా సొమ్మును ఎంపిక చేసుకున్న ఫైనాన్షియల్ సంస్థలలో దాచుకునేందుకు తమ ప్లాట్‌ఫామ్ ఉపయోగపడుతుందని వివరించింది. రూ. 1,000 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చని, బ్యాంకులో పెట్టుబడులకు డీఐసీజీసీ(DICGC) ద్వారా రూ. 5 లక్షల వరకూ డిపాజిట్ బీమా ఉంటుందని తెలియజేసింది. ఎన్బీఎఫ్సీలలో బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ తదితరాలున్నట్లు పేర్కొంది. -
వాహన రిటైల్ విక్రయాల్లో 9 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 2024లో ఆటోమొబైల్ రిటైల్ అమ్మకాలు 2,61,07,679 యూనిట్లు నమోదైంది. 2023తో పోలిస్తే విక్రయాలు గతేడాది 9 శాతం పెరిగాయని డీలర్ల సంఘం ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) మంగళవారం తెలిపింది. సవాళ్లతో కూడిన వ్యాపార వాతావరణం మధ్య ద్విచక్ర, ప్యాసింజర్ వాహనాలకు బలమైన డిమాండ్ నేపథ్యంలో ఈ వృద్ధి నమోదైందని ఫెడరేషన్ వెల్లడించింది. ప్యాసింజర్ వెహికిల్స్ అమ్మకాలు 2023తో పోలిస్తే 5 శాతం వృద్ధితో గతేడాది 40,73,843 యూనిట్లుగా ఉన్నాయి. ద్విచక్ర వాహనాల విక్రయాలు 11 శాతం దూసుకెళ్లి 1,89,12,959 యూనిట్లకు చేరుకున్నాయి. త్రీవీలర్స్ రిజిస్ట్రేషన్లు 11 శాతం ఎగసి 12,21,909 యూనిట్లను తాకాయి. ట్రాక్టర్ల అమ్మకాలు 3 శాతం వృద్ధితో 8,94,112 యూనిట్లకు చేరాయి. వాణిజ్య వాహనాల విక్రయాలు 10,04,856 యూనిట్ల వద్ద స్థిరంగా ఉన్నాయి. నిలకడగా పరిశ్రమ.. వేడిగాలులు, కేంద్రం, రాష్ట్ర స్థాయిలలో ఎన్నికలు, అసమాన రుతుపవనాలతో సహా పలు ఎదురుగాలులు ఉన్నప్పటికీ వాహన రిటైల్ పరిశ్రమ 2024లో నిలకడగా ఉందని ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ సి.ఎస్.విఘ్నేశ్వర్ తెలిపారు. ‘మెరుగైన సరఫరా, తాజా మోడళ్లు, బలమైన గ్రామీణ డిమాండ్ ద్విచక్ర వాహన విభాగంలో వృద్ధిని పెంచాయి. అయినప్పటికీ ఆర్థిక పరిమితులు, ఎలక్ట్రిక్ విభాగం నుంచి పెరుగుతున్న పోటీ సవాళ్లను కలిగిస్తూనే ఉన్నాయి. ప్యాసింజర్ వెహికల్ (పీవీ) విభాగం బలమైన నెట్వర్క్ విస్తరణ, ఉత్పత్తి లాంచ్‌ల నుండి ప్రయోజనం పొందింది. అధిక ఇన్వెంటరీ కారణంగా లాభాలపై ఒత్తిళ్లు ఏర్పడి ద్వితీయార్థంలో డిస్కౌంట్ల యుద్ధానికి దారితీసింది. ఎన్నికల ఆధారిత అనిశ్చితి, తగ్గిన మౌలిక సదుపాయాల మధ్య వాణిజ్య వాహనాల విభాగం పనితీరు స్తబ్ధుగా ఉంది’ అని వివరించారు. -
మారుతి సుజుకి 'ఈ ఫర్ మీ' స్ట్రాటజీ: ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు అదే
భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీదారు 'మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్' (MSIL) తన ఎలక్ట్రిక్ మొబిలిటీ స్ట్రాటజీ 'ఈ ఫర్ మీ' (e For Me) ప్రకటించింది. దీని ద్వారా కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే కాకుండా.. ఛార్జింగ్ స్టేషన్స్ వంటివి కూడా తీసుకురానుంది. ఇందులో భాగంగానే సంస్థ మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఈ విటారా (e Vitara) ప్రారంభించనుంది.కంపెనీ లాంచ్ చేయనున్న మారుతి గ్రాండ్ ఈ విటారా.. 'భారత్ మొబిలిటీ గ్లోబల్ ఆటో షో 2025' ((Bharat Mobility Global Auto Show 2025)) లో కనిపించనుంది. ఇది భారతీయ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించినట్లు సమాచారం. దీని ఉత్పత్తిని సంస్థ తన గుజరాత్ ప్లాంట్‌లో 2025 మార్చి నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. ఈ ఏడాది తరువాత మారుతి సుజుకి.. తన ఎలక్ట్రిక్ విటారాను యూరప్, జపాన్లలో కూడా ఉత్పత్తి చేయనున్నట్లు తెలుస్తోంది.ఇ ఫర్ మీ అనేది భారతదేశ ఎలక్ట్రిక్ మొబిలిటీ పరివర్తనలో ఒక గొప్ప క్షణాన్ని సూచిస్తుంది. మారుతి సుజుకి నాలుగు దశాబ్దాలకు పైగా భారతదేశానికి విశ్వసనీయ మొబిలిటీ భాగస్వామిగా ఉన్నప్పటికీ, నేడు.. కస్టమర్ల కోసం ఎలక్ట్రిక్ మొబిలిటీకి విప్లవాత్మక విధానాన్ని పరిచయం చేస్తున్నామని మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ & సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ అన్నారు.మారుతి ఈ విటారాప్యాసింజర్ కార్ల తయారీలో అగ్రగామిగా ఉన్నప్పటికీ.. మారుతి సుజుకి ఎలక్ట్రిక్ విభాగంలో ఇప్పటి వరకు కార్లను లాంచ్ చేయలేదు. అయితే ఇప్పుడు మొదటిసారి.. గ్రాండ్ విటారాను ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఈ కారు చూడటానికి స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉంటుంది. కానీ ఇందులో కొన్ని అప్డేటెడ్ ఫీచర్స్ గమనించవచ్చు.ఇదీ చదవండి: అప్పుడు కల కనింది: ఇప్పుడు కొనేసింది.. వీడియో చూశారా?ఈ విటారా భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో భారత్‌లోకి అరంగేట్రం చేస్తుందని, కొంతకాలం తర్వాత దాని లాంచ్ అవుతుందని సమాచారం. కాజీ ఈ కారు 49 కిలోవాట్, 61 కిలోవాట్ అనే రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో లభించనుంది. ఈ కార్ల ఉత్పత్తి భారతదేశంలో జరిగినప్పటికీ.. ఎగుమతులు కూడా ఇక్కడ నుంచే జరుగుతాయి.భారత్ మొబిలిటీ గ్లోబల్ ఆటో షో 2025భారత్ మొబిలిటీ గ్లోబల్ ఆటో షో 2025 జనవరి 17 నుంచి 22 వరకు జరుగుతాయి. మారుతి సుజుకి న్యూఢిల్లీలోని భారత్ మండపం, హాల్ నంబర్ 5 వద్ద తన ఉత్పత్తులను ప్రదర్శిస్తుంది. ఇది మాత్రమే కాకుండా.. సంస్థ డిజైర్, స్విఫ్ట్, ఇన్విక్టో, జిమ్నీ, ఫ్రాంక్స్, బ్రెజ్జా వంటి లేటెస్ట్ మోడల్స్ కూడా ప్రదర్శించనుంది. రెండేళ్లకో సారి జరిగే ఈ ఆటో షోలో.. దేశీయ కంపెనీలు మాత్రమే కాకుండా విదేశీ కంపెనీలు కూడా తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి. ఇందులో బీవైడీ వంటి చైనా కంపెనీలు, జపాన్, జర్మనీ కంపెనీలు.. భారతీయ కంపెనీలైన టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా మొదలైన కంపెనీలన్నీ కనిపించనున్నాయి. వాహన ప్రేమికులను ఆకర్శించనున్నాయి. -
అప్పుడు కల కనింది: ఇప్పుడు కొనేసింది
బెంజ్, ఆడి, పోర్స్చే, లంబోర్ఘిని కార్లు అందుబాటులోకి వచ్చిన తరువాత వింటేజ్ కార్లు కనుమరుగైపోయాయి. దీనికి కారణం.. ఆ కార్లను కంపెనీలు తయారు చేయడం ఆపేయడం, కొత్త ఉద్గార ప్రమాణాలు అమలులోకి రావడం. అయితే కొందరు మాత్రం ఇప్పటికీ వింటేజ్ కార్లు (Vintage Cars) లేదా పాతకాలం కార్లను కొనుగోలు చేయడానికి.. ఉపయోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. కొందరు అలాంటి కార్లను కొనుగోలు చేయడం ఓ కలగా పెట్టుకుంటారు. ఇటీవల బెంగళూరు(Bengaluru)కు చెందిన మహిళ ఓ పాతకాలం కారును కొనుగోలు చేసి.. కల నెరవేరిందని సంబరపడిపోయింది.బెంగళూరుకు చెందిన 'రచన మహదిమనే' అనే మహిళ.. 'ప్రీమియర్ పద్మిని' (Premier Padmini) కారును కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. చిన్నప్పటి నుంచి ఈ కారుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ మహిళ.. ఇటీవలే తన పుట్టిన రోజు సందర్భంగా ఈ అరుదైన కారును కొనుగోలు చేసింది.బెంగళూరు మహిళ కొనుగోలు చేసిన ప్రీమియం పద్మిని కారు చూడటానికి కొత్త కారు మాదిరిగానే ఉంది. దీని కోసం ఈమె ప్రత్యేకంగా కారుకు మరమ్మతులు చేయించింది. ఈ కారణంగానే ఆ కారు కొత్తదాని మాదిరిగా కనిపిస్తోంది. నా పుట్టినరోజు సందర్భంగా.. నేను కారు కొన్నాను. ఇది నా కలల కారు, నేను చిన్నప్పటి నుంచి ఈ కారు గురించి కలలు కన్నాను అని ఆమె వీడియోలో వెల్లడించారు.గతంలో మన చుట్టూ ఉన్న ప్రీమియర్ పద్మిని కార్లు చాలా ఉండేవి. అయితే ఇప్పుడు నేను దీనిని డ్రైవింగ్ చేయడం చాలా ఆనందంగా ఉందని మహదిమనే పేర్కొంది. పాతకాలపు కార్లను ఉపయోగించాలని అందరికీ ఉంటుంది. కానీ బహుశా అది అందరికీ సాధ్యం కాదు. అయితే పాతకాలపు కారును ఎంతో ఇష్టంగా మళ్ళీ పునరుద్ధరించి, డ్రైవ్ చేయడాన్ని చూసి పలువురు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. పలువురు వినియోగదారులు ఈ ఐకానిక్ వాహనం గురించి తమ మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు.ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూ.. ఫ్యాన్సీ లగ్జరీ కార్ ఛేజింగ్ ప్రపంచంలో ప్రీమియర్ పద్మిని చెప్పుకోదగ్గ మోడల్ అని ఒకరు పేర్కొన్నారు. మా తాత అంబాసిడర్లో పని చేసేవారు. అంతే కాకుండా పద్మిని పేరు పెట్టడానికి ఆయన కూడా బాద్యుడు. నేను పద్మినిలో డ్రైవింగ్ నేర్చుకున్నాను అని మరొకరు వ్యాఖ్యానించారు. View this post on Instagram A post shared by Rachana Mahadimane (@rachanamahadimane)ప్రీమియర్ పద్మినిప్రీమియర్ పద్మిని కార్లను.. ఇటాలియన్ కంపెనీ 'ఫియట్' లైసెన్స్‌తో ప్రీమియర్ ఆటోమొబైల్స్ లిమిటెడ్ (PAL) తయారు చేసింది. ఇది ఫియట్ 1100 సిరీస్ ఆధారంగా తయారైంది. 1964లో మొదటిసారిగా మార్కెట్లో అడుగుపెట్టిన ఈ కారుని మొదట ఫియట్ 1100 డిలైట్ అని పిలిచేవారు. ఆ తరువాత దీనిని 1970లలో 'ప్రీమియర్ పద్మిని' పేరుతో పిలిచారు.ప్రీమియర్ పద్మిని కారు.. గుండ్రని అంచులు, క్రోమ్ గ్రిల్ వంటి వాటితో బాక్సీ డిజైన్‌ను కలిగి ఉంది. ఇందులో పెద్ద స్టీరింగ్ వీల్, బేసిక్ ఇన్స్ట్రుమెంటేషన్, ఐదుగురు ప్రయాణీకులకు సౌకర్యవంతమైన సీటింగ్‌తో కూడిన ఇంటీరియర్లు అన్నీ ఉన్నాయి. రోజువారీ వినియోగానికి ఈ కారును ఒకప్పుడు విరివిగా ఉపయోగించారు.ఇదీ చదవండి: 'క్రెటా ఈవీ' రేంజ్ ఎంతో తెలిసిపోయింది: సింగిల్ ఛార్జ్‌తో..1970, 1980లలో సినిమాల్లో ఈ కార్లను విరివిగా ఉపయోగించారు. ఆ తరువాత కాలంలో మారుతి 800 భారతదేశంలో అడుగుపెట్టాక.. ప్రీమియర్ పద్మిని కార్లకు ఉన్న డిమాండ్ తగ్గిపోయింది. దీంతో కంపెనీ ఈ కార్ల ఉత్పత్తిని 2000వ సంవత్సరంలో నిలిపివేసింది. అయితే ఇప్పటికి కూడా కొంతమంది సినీతారలు తమ గ్యారేజిలలో ఈ కార్లను కలిగి ఉన్నారు. ఈ జాబితాలో రజనీ కాంత్, మమ్ముట్టి వంటివారు ఉన్నారు. -
ఏథర్ కొత్త మోడళ్లు.. ధర ఎంతంటే..
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ 2025లో కొత్త మోడల్‌ను విడుదల చేసింది. ఇందులో విభిన్న వేరియంట్లను ప్రవేశపెట్టినట్లు కంపెనీ తెలిపింది. స్కూటర్ బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి ధర నిర్ణయించినట్లు పేర్కొంది. ప్రతి వేరియంట్ ఒకసారి ఛార్జ్ చేస్తే ప్రయాణించే దూరాల్లో మార్పు ఉంటుందని తెలిపింది.కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం మోడల్‌ను అనుసరించి ఎక్స్‌షోరూమ్ ధర కింది విధంగా ఉంది.ఏథర్ 450ఎస్ధర రూ.1,29,999 (ఎక్స్-షోరూమ్), ఐడీసీ రేంజ్ 122 కిమీ.ఏథర్ 450ఎక్స్ 2.9 కిలోవాట్2.9 కిలోవాట్ బ్యాటరీ సామర్థ్యం, ధర రూ.1,46,999(ఎక్స్-షోరూమ్), ఐడీసీ రేంజ్ 126 కిమీ.ఏథర్ 450ఎక్స్ 3.7 కిలోవాట్ 3.7 కిలోవాట్ బ్యాటరీ సామర్థ్యం, ఐడీసీ(ఇండియన్ డ్రైవింగ్ సైకిల్) రేంజ్ 161 కి.మీ, ధర రూ.1,56,999(ఎక్స్-షోరూమ్).ఏథర్ 450 అపెక్స్ధర రూ.1,99,999 (ఎక్స్-షోరూమ్), ఐడీసీ రేంజ్ 157 కి.మీ.ఇదీ చదవండి: మస్క్ మంచి మనసు.. భారీ విరాళంఏథర్ 450 ఎక్స్, 450 అపెక్స్ మోడళ్లు మల్టీ మోడ్ ట్రాక్షన్ కంట్రోల్‌ను కలిగి ఉన్నాయి. ఇది స్మూత్ సర్ఫేస్(తక్కువ ఘర్షణ కలిగిన ఉపరితలాలు)పై స్కూటర్ జారిపోకుండా నిరోధిస్తుంది. దాంతో రైడర్ భద్రతను పెంచినట్లు కంపెనీ తెలిపింది. రైడర్లు బైక్ నడుపుతున్న సమయంలో రెయిన్ మోడ్, రోడ్ మోడ్, ర్యాలీ మోడ్ అనే మూడు విభిన్న మోడ్‌లను ఎంచుకోవచ్చని పేర్కొంది. -
ఈ టూవీలర్స్ అమ్మకాలు.. వీటిదే ఆధిపత్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలో డిసెంబర్ నెలలో 'బజాజ్ చేతక్' (Bajaj Chetak) తొలి స్థానంలోకి దూసుకొచ్చింది. గత నెలలో 18,276 యూనిట్లతో బజాజ్ ఆటో 25 శాతం మార్కెట్ వాటాను దక్కించుకుంది. 2020 జనవరిలో ఎలక్ట్రిక్ చేతక్ ద్వారా స్కూటర్స్ రంగంలోకి బజాజ్ రీ-ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. ఈ-టూ వీలర్స్ విభాగంలో దేశంలో ఒక నెల అమ్మకాల్లో తొలి స్థానాన్ని కైవసం చేసుకోవడం సంస్థకు ఇదే తొలిసారి. డిసెంబర్ నెలలో 17,212 యూనిట్లతో టీవీఎస్ మోటార్ కంపెనీ రెండవ స్థానంలో నిలిచింది.నవంబర్ వరకు తొలి స్థానంలో కొనసాగిన ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) గత నెలలో అతి తక్కువగా 13,769 యూనిట్లతో 19 శాతం వాటాతో మూడవ స్థానానికి పరిమితమైంది. 2024లో కంపెనీకి అతి తక్కువ విక్రయాలు నమోదైంది డిసెంబర్ నెలలోనే కావడం గమనార్హం. అక్టోబర్‌లో 41,817 యూనిట్ల అమ్మకాలు సాధించిన ఓలా ఎలక్ట్రిక్ నవంబర్‌లో 29,252 యూనిట్లను నమోదు చేసింది.హోండా ఎలక్ట్రిక్ (Honda Electric) టూ వీలర్లు రోడ్డెక్కితే ఈ ఏడాది మార్కెట్ మరింత రసవత్తరంగా మారడం ఖాయంగా కనపడుతోంది. సంప్రదాయ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ (ఐసీఈ) ఆధారత టూవీలర్ రంగాన్ని ఏలుతున్న దిగ్గజాలే ఎలక్ట్రిక్ విభాగాన్ని శాసిస్తాయనడంలో అతిశయోక్తి లేదు. ప్రతి నెల నమోదవుతున్న అమ్మకాలే ఇందుకు నిదర్శనం.రెండింటిలో ఒకటి ఈవీ..భారత త్రిచక్ర వాహన రంగంలో ఎలక్ట్రిక్ త్రీవీలర్లు దూకుడుమీదున్నాయి. భారత ఈవీ రంగంలో టూవీలర్ల తర్వాత త్రీవీలర్లు రెండవ స్థానంలో నిలిచాయి. 2024లో దేశవ్యాప్తంగా మొత్తం 6,91,011 యూనిట్ల ఈ-త్రీవీలర్స్ రోడ్డెక్కాయి. భారత్‌లో గతేడాది ఎలక్ట్రిక్, ఐసీఈ, సీఎన్జీ, ఎల్పీజీ విభాగాల్లో కలిపి మొత్తం 12,20,925 యూనిట్ల త్రిచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. ఇందులో ఎలక్ట్రిక్ వాటా ఏకంగా 56 శాతం ఉంది. అంటే అమ్ముడవుతున్న ప్రతి రెండింటిలో ఒకటి ఎలక్ట్రిక్ కావడం విశేషం.ఎలక్ట్రిక్ త్రీవీలర్స్‌లో నాయకత్వ స్థానాన్ని కొనసాగిస్తున్న మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ 10 శాతం వాటా సాధించింది. వేగంగా దూసుకొచ్చిన బజాజ్ ఆటో 6 శాతం వాటాతో మూడవ స్థానాన్ని కైవసం చేసుకుంది. 2023లో అమ్ముడైన 5,83,697 యూనిట్ల ఎలక్ట్రిక్ త్రీవీలర్లతో పోలిస్తే 2024 విక్రయాల్లో 18 శాతం వృద్ధి నమోదైంది.2023లో సగటున ఒక నెలలో 48,633 యూనిట్లు కస్టమర్ల చేతుల్లోకి వెళితే గతేడాది ఈ సంఖ్య నెలకు 57,584 యూనిట్లకు ఎగసింది. ఐసీఈ, సీఎన్జీ, ఎల్పీజీ ఆప్షన్స్‌తో పోలిస్తే నిర్వహణ వ్యయాలు తక్కువగా ఉండడం వల్లే ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లకు డిమాండ్ పెరుగుతోంది. మెరుగైన రుణ లభ్యత, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, అందుబాటులోకి విభిన్న మోడళ్లు, సరుకు రవాణాకై లాజిస్టిక్స్ కంపెనీల నుంచి డిమాండ్ ఇందుకు మరింత ఆజ్యం పోస్తోంది. త్రీవీలర్స్‌లో సీఎన్జీ విభాగానికి 28 శాతం వాటా కాగా, డీజిల్‌కు 11, ఎల్పీజీ 3, పెట్రోల్‌కు ఒక శాతం వాటా ఉంది.పోటీలో నువ్వా నేనా..రెండవ స్థానంలో ఉన్న టీవీఎస్ మోటార్ కంపెనీతో నువ్వా నేనా అన్నట్టు పోటీపడుతూ.. 2024 సెప్టెంబర్‌లో 19,213 యూనిట్లతో తొలిసారిగా బజాజ్ ఆటో రెండవ స్థానాన్ని పొంది టీవీఎస్‌ను మూడవ స్థానానిని నెట్టింది. అక్టోబర్, నవంబర్‌లో టీవీఎస్‌కు గట్టి పోటీ ఇచ్చిన బజాజ్ ఆటో మూడవ స్థానానికి పరిమితమైంది.ఇక 2020 జనవరి నుంచి 2023 నవంబర్ వరకు బజాజ్ ఆటో మొత్తం 1,04,200 యూనిట్ల అమ్మకాలను సాధించింది. తొలి లక్ష యూనిట్లకు కంపెనీకి 47 నెలల సమయం పట్టింది. 2024లో ఏకంగా 2 లక్షల యూనిట్ల విక్రయాలకు చేరువైంది. గతేడాది సంస్థ మొత్తం 1,93,439 యూనిట్ల అమ్మకాలతో భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలో మూడవ స్థానంలో ఉంది. ఓలా ఎలక్ట్రిక్ 4,07,547 యూనిట్లతో మొదటి, టీవీఎస్ మోటార్ కో 2,20,472 యూనిట్లతో రెండవ స్థానంలో నిలిచాయి. -
ఓలాకు బజాజ్ గట్టి దెబ్బ
ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్న ఓలా ఎలక్ట్రిక్‌కు (Ola Electric) బజాజ్ (Bajaj Auto) గట్టి దెబ్బ కొట్టింది. 2024 డిసెంబర్లో ఓలా ఎలక్ట్రిక్‌ని అధిగమించి ఎలక్ట్రిక్ టూ-వీలర్ (Electric Two-Wheeler) మార్కెట్లో కొత్త లీడర్‌గా అవతరించింది. వాహన్ పోర్టల్‌లోని రిటైల్ సేల్స్ డేటా ప్రకారం.. బజాజ్ ఇప్పుడు 25% మార్కెట్ వాటాను కలిగి ఉంది. మునుపటి నెల కంటే 3 శాతం వాటాను పెంచుకుంది.మరోవైపు తీవ్రమైన పోటీలో ఓలా ఎలక్ట్రిక్ వెనుకబడిపోయింది. 2024 డిసెంబర్లో కంపెనీ మార్కెట్ వాటా 19%కి పడిపోయింది. అంతకుముందు నెలతో పోల్చితే ఇది 5% క్షీణించింది. దీంతో మూడో స్థానానికి పరిమితమైంది. ఇక టీవీఎస్ (TVS) మోటార్స్ 23% మార్కెట్ వాటాతో రెండవ అతిపెద్ద ప్లేయర్‌గా తన స్థానాన్ని నిలుపుకొంది.బజాజ్ విజయానికి కారణాలుబజాజ్ ఆటో వృద్ధికి దాని చేతక్ 35 సిరీస్ వ్యూహాత్మక లాంచ్ కారణమని చెప్పవచ్చు. ఫీచర్-రిచ్ స్కూటర్లను తక్కువ ఉత్పత్తి ఖర్చుతో దాని మునుపటి మోడళ్ల కంటే 45% తక్కువకే టీవీఎస్ అందిస్తోంది. ఇది తక్కువ ధరలో ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్లను కోరుకునే వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంది.తీవ్ర పోటీఎలక్ట్రిక్ టూవీలర్లకు ఆదరణ పెరుగుతుండటంతో ఈ మార్కెట్లో ప్రస్తుతం పోటీ తీవ్రంగా మారింది. భిన్న వ్యూహాలతో కంపెనీలు వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. టీవీఎస్ వివిధ బ్యాటరీ సామర్థ్యాలతో (2-4 kWh) స్కూటర్లను అందించడం ద్వారా తన పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. ముఖ్యంగా కంపెనీ ఫ్లాగ్షిప్ ఐ-క్యూబ్ (I-Qub) 250 ప్రత్యేక ఈవీ అవుట్లెట్లతో సహా దాదాపు 4,000 స్టోర్లలో అందుబాటులో ఉంది.మరో కంపెనీ ఏథర్ ఎనర్జీ తన ఫ్యామిలీ-ఓరియెంటెడ్ రిజ్టా స్కూటర్‌ను విడుదలతో ముఖ్యంగా గుజరాత్, మహారాష్ట్ర వంటి బలమైన ఈవీ మార్కెట్లను ఆకట్టుకుంది. అంతేకాకుండా ఉత్తర భారతదేశమంతటా తన ఉనికిని విస్తరించడంపై కూడా కంపెనీ దృష్టి సారిస్తోంది.ఓలాకు సవాళ్లుఒకప్పుడు ఈవీ మార్కెట్లో ఆధిపత్యం చెలాయించిన ఓలా ఎలక్ట్రిక్.. ఇప్పుడు పెరిగిన పోటీ, ధరల సవాళ్ల కారణంగా మార్కెట్ వాటాలో తిరోగమనాన్ని చవిచూసింది. ఎస్1 (Ola S1) స్కూటర్ స్వాపింగ్ బ్యాటరీ వెర్షన్‌ను రూ.59,999కే ప్రారంభించడం, తమ నెట్‌వర్క్‌ను 800 నుండి 4,000 స్టోర్లకు విస్తరించడం వంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కంపెనీ తన ఆధిక్యాన్ని కొనసాగించలేకపోయింది. -
'క్రెటా ఈవీ' రేంజ్ ఎంతో తెలిసిపోయింది: సింగిల్ ఛార్జ్‌తో..
ప్రముఖ వాహన తయారీ సంస్థ 'హ్యుందాయ్ మోటార్' (Hyundai Motor) దేశీయ మార్కెట్లో 'క్రెటా' (Creta) కారును ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. దీనిని కంపెనీ త్వరలో జరగనున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో ఆవిష్కరించనుంది. కాగా అంతకంటే ముందే సంస్థ దీని రేంజ్ వివరాలను వెల్లడించింది.మార్కెట్లో అడుగుపెట్టనున్న కొత్త 'హ్యుందాయ్ క్రెటా ఈవీ' (Hyundai Creta EV) 51.4 కిలోవాట్, 42 కిలోవాట్ బ్యాటరీ ఫ్యాక్స్ పొందనుంది. 51.4 కిలోవాట్ బ్యాటరీ ఒక సింగిల్ ఛార్జితో 473 కిమీ రేంజ్ అందించగా.. 42 కిలోవాట్ బ్యాటరీ 390 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఈ కారు 7.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.హ్యుందాయ్ క్రెటా ఈవీ మార్కెట్లో లాంచ్ అయిన తరువాత.. మారుతి సుజుకి ఈ విటారా, మహీంద్రా బిఈ 6, టాటా కర్వ్ ఈవీ, ఎంజీ జెడ్ఎస్ ఈవీ, టయోటా అర్బన్ క్రూయిజర్ ఈవీ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. అయితే ఈ కారు ధర ఎంత వుంటుందనేది అధికారికంగా వెల్లడి కాలేదు. అయితే దీని ప్రారంభ ధర రూ.22 లక్షలు ఉండొచ్చని అంచనా.చూడటానికి కొంత స్టాండర్డ్ మోడల్ మాదిరిగా అనిపించినప్పటికీ.. హ్యుందాయ్ క్రెటా ఈవీ అప్డేటెడ్ డిజైన్ పొందుతుంది. బ్రాండ్ లోగో వద్ద ఛార్జింగ్ పోర్ట్, కొత్త సైడ్ ప్రొఫైల్, అప్డేటెడ్ రియర్ ఎండ్ వంటివన్నీ ఇందులో గమనించవచ్చు. మొత్తం మీద ఇది మార్కెట్లో దాని ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వనుంది. -
2024లో కార్ల అమ్మకాలు ఎలా ఉన్నాయంటే..
న్యూఢిల్లీ: 2024 సంవత్సరంలో దేశీయంగా ప్యాసింజర్ వాహన విక్రయాలు(Vehicle sales) రికార్డు స్థాయిలో 43 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. అంతకు ముందు 2023 ఏడాదిలో విక్రయించిన 41.09 లక్షల వాహనాలతో పోలిస్తే ఈ సంఖ్య 4.64% అధికంగా ఉంది. ఎస్యూవీ(స్పోర్ట్ యుటిలిటీ వెహికల్స్)లకు అధిక గిరాకీ, గ్రామీణ మార్కెట్ల నుంచి డిమాండ్(Demand) బలంగా ఉండడం కలిసొచ్చింది. దిగ్గజ ఆటో కంపెనీలైన మారుతీ సుజుకీ(Maruti Suzuki), హ్యుందాయ్, టాటా మోటార్స్(Tata Motors), టయోటా కిర్లోస్కర్ మోటార్, కియా ఇండియాలు గతంలో ఎన్నడూ చేయని అధిక స్థాయిలో వార్షిక విక్రయాలు నమోదు చేశాయి. ఇదీ చదవండి: కంపెనీల విడదీత.. లాభాల మోత!మారుతీ సుజుకీ 2024లో 17,90,977 వాహనాలు విక్రయించింది. అంతకు ముందు 2018లో అమ్ముడైన 17,51,919 యూనిట్ల అమ్మకాల రికార్డు బద్దలైంది. కాగా 2023లో కంపెనీ మొత్తం 17,26,661 వాహనాలను విక్రయించింది.గత క్యాలెండర్ ఏడాదిలో హ్యుందాయ్ మోటార్ రికార్డు స్థాయిలో 6,05,433 యూనిట్లు విక్రయించింది. వీటిలో ఎస్యూవీ విభాగపు వాటా 60.6 శాతంగా ఉంది. కాగా 2023లో 6,02,111 విక్రయాలు నమోదయ్యాయి. -
ఆటో దిగ్గజాల జత.. సక్సెస్ మంత్ర..!
ఆటోరంగం ప్రపంచవ్యాప్తంగా కొంతకాలంగా ఒక కొత్త ఒత్తిడిని ఎదుర్కొంటోంది. వేగంగా దూసుకొస్తున్న ఎలక్ట్రిక్ కార్లు ఒకవైపు, ఆర్టీఫిషియల్ టెక్నాలజీతో నడిచే డ్రైవర్ లెస్ కార్లు రోబో ట్యాక్సీలు మరోవైపు ఆటో కంపెనీ లకు ఆర్థిక భారాన్ని పెడుతున్నాయి.. అమెరికా కార్ల దిగ్గజం టెస్లా ఎలక్ట్రిక్ కార్లతో ఆధిపత్యం చెలాయిస్తుంటే, చైనా కంపెనీలు బీవైడీ, నియో, గ్రేట్‌వాల్ మోటార్స్ తక్కువ ధరకే ఈవీలను రోడ్లపైకి తెస్తూ చైనాకు చెక్ పెడుతున్నాయి. కొత్తగా ఎదురవుతున్న పోటీని తట్టుకోవడానికి, అనేక దేశాల్లో ఆటో కంపెనీలు తమ పోటీ కంపెనీలతోనే పొత్తుకు దిగుతున్నాయి.ప్రత్యర్ధి కంపెనీలతోనే చేతులు కలుపుతున్నాయి. కార్ల తయారీ నుంచి మార్కెటింగ్ దాకా పలు విభాగాల్లో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నాయి. కొన్ని కంపెనీలు పూర్తిగా విలీనం బాట పట్టి ఇతర మార్కెట్లకు విస్తరిస్తుంటే మరికొన్ని టెక్నాలజీని షేర్ చేసుకుంటూ కొత్త మోడళ్ల అభివృద్ధి వ్యయాలు తగ్గించుకుంటున్నాయి. తాజాగా జపనీస్ కంపెనీలు నిస్సాన్, హోండా కూడా విలీనానికి చేతులు కలపడం ఆటో రంగంలో ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే కొన్నాళ్లుగా ఈ ట్రెండ్ కొనసాగుతున్నా విలీనాలు, భాగస్వామ్యాలతో ఏ కంపెనీ ఎక్కువ లాభపడినట్లు గణాంకాలు వెల్లడించడంలేదు. వివరాలు చూద్దాం. – సాక్షి, బిజినెస్ డెస్క్భాగస్వామ్యాల తీరిదీ.. ⇒ ఎలక్ట్రిక్ వాహనాలు, అటానమస్ డ్రైవింగ్ సాంకేతికతల కోసం ఫోర్డ్ మోటార్, ఫోక్స్‌వేగన్ చేతులు కలిపాయి. అయితే సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల బిజినెస్‌ను మూసివేయగా.. కొంతమేర లబ్ధి పొందాయి. ⇒ జనరల్ మోటార్స్‌తో హోండా జత కలిసింది. జీఎం తయారు చేసే 2 ఈవీ కార్లను హోండా విక్రయిస్తోంది. ఈ రెండింటికి మాత్రమే ఈ భాగస్వామ్యం పరిమితం. ⇒ ఫ్రాన్స్ ప్యూజో, ఫియట్ క్రిస్లర్ జట్టు కట్టడం ద్వారా 2021లో స్టెల్లాంటిస్‌కు ఊపిరిపోశాయి. అయితే ఫ్యాక్టరీలు మూసివేత బాటలో ఉన్నట్లు తెలుస్తోంది. ⇒ రేనాల్ట్తో నిస్సాన్ జత కలిసింది. దీంతో నిస్సాన్ నిలదొక్కుకుంది. అయితే దీర్ఘకాలికంగా చూస్తే అంత విజయవంతంకాలేదు. ⇒ అందుబాటు ధరల కార్ల తయారీకి వీలుగా లగ్జరీ కార్ల కంపెనీ దైమ్లర్తో, క్రిస్లర్ విలీనమైనప్పటికీ 9 ఏళ్ల తదుపరి 2007లో విడిపోయాయి.దేశీయంగా.. టయోటా మోటార్, సుజుకీ మోటార్ కార్పొరేషన్ 2016లోనే భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. 2019 ఆగస్ట్‌లో దీర్ఘకాలిక సహకారంలో భాగంగా ఈవీ టెక్నాలజీ, అటానమస్ డ్రైవింగ్‌పై కన్నేశాయి. ఈ బాటలో దేశీయంగా మారుతీ సుజుకీ బ్రాండ్ ద్వారా కార్ల అమ్మకాలు పెంచుకునే ప్రణాళికలు వేశాయి. మరోపక్క మారుతీ సియాజ్, ఎర్టిగా ప్లాట్‌ఫామ్ ద్వారా అభివృద్ధి చేసిన వాహనాలను సరఫరా చేయనుంది. ఇదేవిధంగా సీవిభాగంలోని ఎంపీవీ, టయోటా కరోలా సెడాన్, విటారా బ్రెజ్జా తదితర ప్లాట్‌ఫామ్‌లను పరస్పరం అభివృద్ధి చేయనున్నాయి.టాటా చేతికి జేఎల్ఆర్ 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం తదుపరి జాగ్వార్– ల్యాండ్‌రోవర్(జేఎల్ఆర్), మజ్దా, వోల్వో విభాగాలను ఫోర్డ్ మోటార్ కంపెనీ విక్రయించింది. ఆర్థిక మందగమన పరిస్థితుల్లోనూ భారీ నష్టాలలో ఉన్న బ్రిటిష్ లగ్జరీ కార్ల విభాగం జేఎల్ఆర్ను దేశీ కార్పొరేట్ దిగ్గజం టాటా మోటార్స్ కొనుగోలు చేసింది. తదుపరి కార్పొరేట్ దిగ్గజం రతన్ టాటా అధ్యక్షతన నష్టాలను వీడి లాభాల బాట పట్టిన సంగతి తెలిసిందే. హోండా – నిస్సాన్ విలీనం.. మూడో పెద్ద కంపెనీ జపనీస్ దిగ్గజాలు హోండా, నిస్సాన్ తాజాగా విలీనానికి అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీంతో అమ్మకాలరీత్యా ప్రపంచంలోనే మూడో పెద్ద కంపెనీ ఆవిర్భావానికి తెరతీయనున్నాయి. మిత్సుబిషీ సైతం వీటితో కలవనున్నట్లు తెలుస్తోంది. కొత్తగా ఏర్పడే విలీన కంపెనీ టయోటా, ఫోక్స్వ్యాగన్తో పోటీ పడనుంది. ఇప్పటికే నిస్సాన్, హోండా, మిత్సుబిషీ సంయుక్తంగా ఈవీల కోసం బ్యాటరీలు తదితర విడిభాగాల తయారీ టెక్నాలజీని పంచుకోనున్నట్లు ప్రకటించాయి. అంతేకాకుండా అటానమస్ డ్రైవింగ్‌కు వీలుగా సాఫ్ట్ వేర్‌పై పరిశోధనలు సైతం చేపట్టనున్నట్లు తెలియజేశాయి.ఆర్ఐఎల్– టెస్లా టెస్లా దేశీయంగా రిలయన్స్‌తో భాగస్వామ్యానికి చర్చలు జరుపుతున్నట్లు సమా చారం. తద్వారా స్థానికంగా టెస్లా ఎల క్ట్రిక్ కార్ల తయారీ ప్లాంటును ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం. ఇప్పటికే వాణిజ్య వాహనాల కంపెనీ అశోక్ లేలాండ్‌తో భాగస్వామ్యం ద్వారా రిలయన్స్ దేశీయంగా తొలి హైడ్రోజన్ ఐసీఈ ఇంజిన్‌తో నడిచే హెవీడ్యూటీ ట్రక్‌ను 2023లో ఆవిష్కరించింది.జేఎస్‌డబ్ల్యూ– చైనీస్ ఎలక్ట్రిక్ కార్ల తయారీకి జిందాల్ గ్రూప్ దిగ్గజం జేఎస్‌డబ్ల్యూ సైతం చైనీస్ దిగ్గజాలు బీవైడీ, జీలీ తదితరాలతో చర్చలు. జరుపుతోంది. లైసెన్సింగ్ ఒప్పందం, టెక్నాలజీ బదిలీ తదితరాలకు ఒప్పందాలు కుదుర్చుకునే సన్నాహాల్లో ఉంది. వోల్వో కార్ల కంపెనీగా జీలీ ఇప్పటికే పరోక్షంగా కార్యకలాపాలు కలిగి ఉంది. దేశీయంగా 2024 తొలి 11 నెలల్లో 18.7 లక్షల ఎలక్ట్రిక్ కార్లు విక్రయంకావడంతో పలు దిగ్గజాలు ఈవీ మార్కెట్‌పై ఆసక్తి చూపుతున్నాయి. -
ఐదు బెస్ట్ కార్లు: తక్కువ ధర & ఎక్కువ సేఫ్టీ!
ఓ కారును కొనాలంటే డిజైన్, మైలేజ్ చూస్తే సరిపోదు. అందులోని సేఫ్టీ ఫీచర్స్ కూడా చూడాలి. అంటే.. ఆ కారులో ఎన్ని ఎయిర్ బ్యాగులున్నాయి.. రియర్ కెమెరా వంటివి ఉన్నాయా? లేదా? అనే విషయాలు కూడా తప్పకుండా పరిశీలించాలి. ఇవన్నీ ఉన్న కారు కొనాలంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేయాలేమో అనే అనుమానం మీకు రావచ్చు. కానీ ఈ కథనంలో తక్కువ ధర వద్ద.. 6 ఎయిర్ ఎయిర్‌బ్యాగ్‌లను కలిగిన టాప్ 5 కార్లను గురించి తెలుసుకుందాం.హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ (Hyundai Grand i10 Nios)ఇండియన్ మార్కెట్లో అధిక అమ్మకాలు పొందిన 'హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్' అన్ని వేరియంట్లలోనూ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు లభిస్తాయి. ఈ కారు ధర రూ. 5.92 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ హ్యాచ్‌బ్యాక్ 1.2 లీటర్ ఇంజిన్ ద్వారా 82 Bhp పవర్, 114 Nm టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ & ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను పొందుతుంది.హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ 6 ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు ఏబీఎస్ విత్ ఈబీడీ, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, త్రీ పాయింట్ సీట్ బెల్ట్, రియర్ కెమెరా, రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి.నిస్సాన్ మాగ్నైట్ (Nissan Magnite)ఇటీవల ఫేస్‌లిఫ్ట్ రూపంలో మార్కెట్లో లాంచ్ అయిన నిస్సాన్ మాగ్నైట్ ధర రూ. 5.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ మోడల్ ఎంట్రీ-లెవల్ వేరియంట్ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను పొందుతుంది. ఇందులోని 1 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ 71 Bhp, 96 Nm టార్క్ అందిస్తే.. 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 99 Bhp పవర్, 160 Nm టార్క్ డెలివరీ చేస్తుంది. ఈ కారులో 360 డిగ్రీ కెమెరా, ఏబీఎస్ విత్ ఈబీడీ, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, త్రీ పాయింట్ సీట్ బెల్ట్, రియర్ కెమెరా, రియర్ పార్కింగ్ సెన్సార్లు మొదలైనవన్నీ ఉన్నాయి.మారుతి స్విఫ్ట్ (Maruti Swift)మారుతి సుజుకి కంపెనీకి చెందిన స్విఫ్ట్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మారుతి కార్లను ఉపయోగిస్తున్న వారిలో చాలామంది ఈ 'స్విఫ్ట్' కారునే ఉపయోగిస్తున్నారు. దీని ప్రారంభ ధర రూ. 6.5 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కారులో 5 స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇది 6 ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు ఏబీఎస్ విత్ ఈబీడీ, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, త్రీ పాయింట్ సీట్ బెల్ట్, రియర్ కెమెరా, రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటి సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది.ఇదీ చదవండి: అంబానీ ఇంటికి కొత్త అతిథి.. ఇది చాలా స్పెషల్!హ్యుందాయ్ ఎక్స్టర్ (Hyundai Exter)హ్యుందాయ్ కంపెనీకి చెందిన కాంపాక్ట్ ఎస్యూవీ ఎక్స్టర్.. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను పొందుతుంది. ఈ కారు ప్రారంభ ధర రూ. 5.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది డాష్‌క్యామ్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, ఏబీఎస్ విత్ ఈబీడీ వంటి అనేక సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. ఇందులోని 1.2 లీటర్ ఇంజిన్ మంచి పనితీరును అందిస్తుంది.సిట్రోయెన్ సీ3 (Citroen C3)రూ. 6.16 లక్షల ఎక్స్ షోరూమ్ వద్ద లభించే 'సిట్రోయెన్ సీ3' కూడా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు పొందుతుంది. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఫీల్ (ఓ), షైన్ వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఎయిర్‌బ్యాగ్‌లు కాకుండా ఇందులో ఈబీఎస్ విత్ ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్పెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్, డే-నైట్ ఐవీఆర్ఎం వంటివి కూడా ఉన్నాయి. -
హీరో ఎలక్ట్రిక్‌పై దివాలా చర్యలు
న్యూఢిల్లీ: హీరో ఎలక్ట్రిక్ పై దివాలా చర్యలకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ), ఢిల్లీ బెంచ్ ఆదేశించింది. మెట్రో టైర్స్ అనే ఆపరేషనల్ క్రెడిటర్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ట్రిబ్యునల్ తాజా చర్య తీసుకుంది. హీరో ఎలక్ట్రిక్ రూ. 1.85 కోట్లు బకాయి పడినట్లు మెట్రో టైర్స్ తన పిటిషన్లో పేర్కొంది. దివాల ప్రక్రియ ప్రకారం, హీరో ఎలక్ట్రిక్ బోర్డును సస్పెండ్ చేసి భూపేష్ గుప్తాను మధ్యంతర పరిష్కార అధికారి (ఐఆర్పీ)గా ఎన్సీఎల్టీ నియమించింది. దివాలా ప్రక్రియ కింద కంపెనీపై ఇతర కోర్టులు, ట్రిబ్యునల్స్ లేదా ఆర్బిట్రేషన్ ప్యానెల్స్ నుండి ఆదేశాలను నిలిపివేయాలని ఆదేశించిన ఎన్సీఎల్టీ, ఈ కంపెనీ ఆస్తులను బదిలీ చేయడం, నిలిపివేయడం, విక్రయించడం లేదా ఏ విధమైన మార్పులు చేయడం పై నిషేధాన్ని విధించింది. హీరో ఎలక్ట్రిక్ అభ్యంతరాల తిరస్కరణ మెట్రో టైర్స్‌తో తన వివాదం ‘‘లిమిటేషన్లోలేని గత ఎంతో కాలానికి సంబంధించినదని’’ హీరో ఎలక్ట్రిక్ చేసిన వాదనను ఎన్సీఎల్టీ తిరస్కరించింది. దివాలా పరిష్కార చట్టాల ప్రకారం, ఇలాంటి వాదన న్యాయ సమ్మతమైనది కాదని స్పష్టం చేసింది. టైర్లు, ట్యూబులు సరఫరా చేసిన మెట్రో టైర్స్‌తో ఉన్న బకాయిల పరిష్కారానికి హీరో ఎలక్ట్రిక్ గత తొమ్మిది నెలలుగా ఎటువంటి చర్చలూ జరపలేదని ఎన్సీఎల్టీ పేర్కొంది. వివాద నేపథ్యం తాను సరఫరా చేసిన టైర్లు, ట్యూబులకు సంబంధించి రూ.1.85 కోట్ల బకాయిల కోసం మెట్రో టైర్స్ 2022 ఆగస్ట్ 9 నుండి డిసెంబర్ 3 మధ్య హీరో ఎలక్ట్రిక్‌కు పలు డిమాండ్ నోటీసులు పంపింది. అయితే సరఫరా నాణ్యత వల్ల దీనిపై స్పందించదలేదన్నది హీరో ఎలక్ట్రిక్ వాదన. కాగా, సరఫరా నాణ్యతపై మెట్రో టైర్స్ వద్ద హీరో ఎలక్ట్రిక్ నుండి అసలు ఎటువంటి వివాదం లేవనెత్తలేదని నిర్ధారణ అయినట్లు ఎన్సీఎల్టీ బెంచ్ పేర్కొంది. బ్యాలెన్స్ కన్ఫర్మేషన్ లెటర్లు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నట్లు పేర్కొంది. పైగా హీరో ఎలక్ట్రిక్ యూజర్ మాన్యువల్ ప్రకారం టైర్లు అలాగే ట్యూబులు వారంటీ కింద రావని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మెట్రో టైర్స్ చేసిన క్లెయిమ్ ప్రామాణికమైనదిగా పరిగణించి హీరో ఎలక్ట్రిక్‌పై ఇన్సాల్వెన్సీ చర్యలు ప్రారంభించాలని ఎన్సీఎల్టీ నిర్ణయించింది. -
సుజుకీ యాక్సెస్ 125 రికార్డు
ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా సరికొత్త రికార్డు సాధించింది. సుజుకీ యాక్సెస్ 125 మోడల్లో కంపెనీ 60 లక్షల స్కూటర్ల తయారీ మార్కును దాటింది. ఈ ఘనతను సాధించడానికి సంస్థకు 18 ఏళ్లు పట్టింది. సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా నుంచి అత్యధికంగా అమ్ముడు అవుతున్న మోడల్ కూడా ఇదే. దీర్ఘకాలిక మన్నిక, మెరుగైన పనితీరు, మైలేజీ, నిర్వహణ వ్యయాలు తక్కువగా ఉండడంతో యాక్సెస్ 125 స్కూటర్‌కు కస్టమర్ల నుంచి దేశ విదేశాల్లో మంచి స్పందన ఉంది. భారత్‌తోపాటు అంతర్జాతీయంగా కస్టమర్ల నమ్మకానికి ఈ గణాంకాలే నిదర్శనమని కంపెనీ ఎండీ కెనిచి ఉమేద తెలిపారు. యాక్సెస్ 125 తొలిసారిగా భారత్‌లో 2006లో అడుగుపెట్టింది. భారత రోడ్లపై 125 సీసీ ఇంజన్ సామర్థ్యంతో పరుగెత్తిన తొలి స్కూటర్ కూడా ఇదే కావడం విశేషం.మూడవ స్థానంలో కంపెనీ..దేశవ్యాప్తంగా 2024 ఏప్రిల్–నవంబర్ మధ్య వివిధ కంపెనీలకు చెందిన 47,87,080 స్కూటర్లు రోడ్డెక్కాయి. ఇందులో సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా 14 శాతం వాటాతో మూడవ స్థానంలో ఉంది. గతేడాదితో పోలిస్తే 2024 ఏప్రిల్–నవంబర్‌లో కంపెనీ 18 శాతం దూసుకెళ్లి 6,84,898 యూనిట్ల స్కూటర్ల అమ్మకాలను సాధించింది. సుజుకీ ఎకో పెర్ఫార్మెన్స్ టెక్నాలజీతో 125 సీసీ ఎయిర్‌కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో ఇది రూపుదిద్దుకుంది. 5,500 ఆర్పీఎం వద్ద 10 ఎన్ఎం గరిష్ట టార్క్ అందిస్తుంది. బ్లూటూత్ ఆధారిత డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఏర్పాటు చేశారు. కాల్స్, ఎస్ఎంఎస్, వాట్సాప్ అలర్ట్స్, మిస్డ్ కాల్ అలర్ట్స్ అందుకోవచ్చు. స్పీడ్ వార్నింగ్, ఫోన్ బ్యాటరీ లెవెల్ డిస్ప్లే, గమ్యస్థానానికి చేరుకునే సమయం వంటివి తెలుసుకోవచ్చు. 22.3 లీటర్ల స్టోరేజ్, ఈజీ స్టార్ట్ కీ సిస్టమ్, పొడవైన సీటు వంటివి అదనపు హంగులు. -
ఎక్కువమంది కొనుగోలు చేస్తున్న బైకులు ఇవే!
భారతదేశంలోని అత్యంత సరసమైన బైకుల జాబితాలో హీరో హెచ్ఎఫ్ డీలక్స్, హోండా షైన్, టీవీఎస్ స్పోర్ట్, బజాజ్ ప్లాటినా, యమహా ఎఫ్‌జెడ్ ఎఫ్ఐ వంటివి ఉన్నాయి. ఈ బైక్స్ ధరలు ఎలా ఉన్నాయి? ఇతర వివరాలు ఏంటి అనేది ఇక్కడ చూసేద్దాం.హీరో హెచ్ఎఫ్ డీలక్స్ (Hero HF Deluxe)భారతదేశంలో తక్కువ ధర వద్ద లభిస్తున్న ఉత్తమ బైకులలో 'హీరో హెచ్ఎఫ్ డీలక్స్' ఒకటి. దీని ధర రూ.56,674 (ఎక్స్ షోరూమ్). ఇది మొత్తం ఐదు వేరియంట్లలో, ఏడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ బైకులోని 97 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 7.91 Bhp పవర్, 8.05 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 4 స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.హోండా షైన్ (Honda Shine)రూ.62,990 (ఎక్స్ షోరూమ్) వద్ద లభిస్తున్న హోండా షైన్ 124 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభించే ఈ బైక్ 10.59 Bhp పవర్, 11 Nm టార్క్ అందిస్తుంది. ఇది రెండు వేరియంట్లలో, ఐదు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది కూడా భారతదేశంలో అందుబాటులో ఉన్న అత్యంత సరసమైన బైకుల జాబితాలో ఒకటి.టీవీఎస్ స్పోర్ట్ (TVS Sport)భారతదేశంలో ఎక్కువమంది కొనుగోలు చేస్తున్న.. సరసమైన బైకుల జాబితాలో ఒకటిగా ఉన్న మోడల్ టీవీఎస్ స్పోర్ట్. దీని ధర రూ.64,410 (ఎక్స్ షోరూమ్). ఈ బైకులోని 190 సీసీ ఇంజిన్ 8.18 Bhp పవర్, 8.7 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. రెండు వేరియంట్లలో లభించే ఈ బైక్.. మొత్తం ఎనిమిది రంగులలో లభిస్తుంది.బజాజ్ ప్లాటినా (Bajaj Platina)సరసమైన బైకుల జాబితాలో ఒకటి బజాజ్ ప్లాటినా. దీని ధర రూ.66,840 (ఎక్స్ షోరూమ్). ఈ బైకులో 7.79 Bhp పవర్, 8.34 Nm టార్క్ అందించే 102 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 4 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఇది కేవలం ఒకే వేరియంట్.. నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.ఇదీ చదవండి: గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన హ్యుందాయ్ కారు ఇదేయమహా ఎఫ్‌జెడ్ ఎఫ్ఐ (Yamaha FZ Fi)యమహా కంపెనీకి చెందిన ఎఫ్‌జెడ్ ఎఫ్ఐ.. సరసమైన బైకుల జాబితాలో ఒకటిగా ఉన్నప్పటికీ, మన జాబితాలో కొంత ఎక్కువ ఖరీదైన బైక్ అనే చెప్పాలి. దీని ధర రూ.1.16 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైకులో 149 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 12.2 Bhp పవర్, 13.3 Nm టార్క్ అందిస్తుంది. ఇది రెండు వేరియంట్లు, రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. -
గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన హ్యుందాయ్ కారు ఇదే
ప్రముఖ వాహన తయారీ సంస్థ 'హ్యుందాయ్' (Hyundai).. దేశీయ మార్కెట్లో లాంచ్ చేసిన 'ఐయోనిక్ 5' (IONIQ 5) ఎలక్ట్రిక్ కారు తాజాగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకుంది.హ్యుందాయ్ ఐయోనిక్ 5 కారు అత్యంత ఎత్తైన ప్రదేశాన్ని ఎక్కిన ఎలక్ట్రిక్ కారుగా చరిత్ర సృష్టించడంతో.. గిన్నిస్ రికార్డులో చోటు దక్కించుకుంది. ఈ కారు లేహ్ లడఖ్‌లోని ఉమ్లింగ్ లా నుంచి సముద్ర మట్టానికి 5799 మీ (19,024 అడుగులు) ఎత్తులో కేరళలోని కుట్టనాడ్ వరకు ప్రయాణించింది.మొత్తం 14 రోజులు 4900 కిమీ కంటే ఎక్కువ దూరం.. విభిన్న రహదారుల్లో, పలు వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ ఐయోనిక్ 5 విజయవంతంగా గమ్యాన్ని చేరుకుంది. ఈవో ఇండియా టీమ్ ఈ డ్రైవ్‌ను చేపట్టింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.హ్యుందాయ్ కారు గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకున్న సందర్భంగా.. హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ 'అన్సూ కిమ్' (Unsoo Kim) మాట్లాడుతూ, ఐయోనిక్ 5 పర్ఫామెన్స్.. ఇంజినీరింగ్ నైపుణ్యం వంటివి తిరుగులేనివి. కంపెనీ విజయానికి, కస్టమర్ల నమ్మకానికి ఇది నిదర్శనం అని అన్నారు.Hyundai IONIQ 5 takes part in GUINNESS WORLD RECORDS™ Title for the Greatest Altitude Change by an Electric Car ▶ https://t.co/KeB82JGXOX@GWR #Hyundai #IONIQ5 #EV #GUINNESSWORLDRECORDS pic.twitter.com/G2kzjNjVr2— Hyundai Motor Group (@HMGnewsroom) December 26, 2024హ్యుందాయ్ ఐయోనిక్ 5హ్యుందాయ్ ఐయోనిక్ 5 అనేది ఎలక్ట్రిక్ గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్‌ఫామ్ (E-GMP)పై తయారైంది. స్మార్ట్ మొబిలిటీ అనుభవాలకు ప్రాధాన్యతనిస్తూ ఈ ప్లాట్‌ఫామ్ ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వాహనాల కోసం నిర్దేశించింది.ఇదీ చదవండి: రూ.15 లక్షలుంటే చాలు.. ఇందులో ఓ కారు మీ సొంతం!ఫ్యూచరిస్టిక్ డిజైన్ కలిగిన ఈ ఎలక్ట్రిక్ కారు 72.6 కిలోవాట్ బ్యాటరీ పొందుతుంది. ఇది ఒక ఫుల్ ఛార్జితో 600 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుందని సమాచారం. వాస్తవ ప్రపంచంలో ఈ రేంజ్ కొంత తగ్గే అవకాశం ఉంది. ఇది లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉండటమే కాకుండా స్మార్ట్ టెక్నాలజీ కూడా పొందుతుంది. దీని ధర రూ. 52.92 లక్షలు (ఎక్స్ షోరూమ్). -
మూడేళ్లలో మూడింతల ఆదాయం
న్యూఢిల్లీ: కార్ సర్వీసెస్ (Car service), రిపేర్ (Car repair) ప్లాట్‌ఫామ్ గోమెకానిక్ (GoMechanic) మూడేళ్లలో నికర ఆదాయం మూడింతలకుపైగా అధికమై రూ.700 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తోంది. ఆ తర్వాత పబ్లిక్ లిస్టింగ్‌కు (IPO) వెళ్తామని కంపెనీ కో–ఫౌండర్, సీఈవో హిమాన్షు అరోరా తెలిపారు. ప్రస్తుతం 3 శాతం మార్కెట్ వాటా కలిగి ఉన్నామని, మూడేళ్లలో దీనిని 10 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. ద్విచక్ర, ఎలక్ట్రిక్ వెహికిల్స్ సర్వీసెస్ విభాగంలోకి ప్రవేశిస్తామన్నారు.‘కంపెనీ ప్రస్తుతం 125 నగరాల్లో 800 గరాజ్ల ద్వారా సేవలను అందిస్తోంది. 2027 నాటికి 500 నగరాల్లో 2,500 గరాజ్లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాం’ అని వివరించారు. గతంలో ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు బయటపడడంతో కంపెనీని ఇన్వెస్టర్లు అమ్మకానికి పెట్టారు. లైఫ్‌లాంగ్ గ్రూప్ అనుబంధ కంపెనీ సర్వీజ్జీ 2023 మార్చిలో గోమెకానిక్ను కొనుగోలు చేసింది. 8 లక్షల మంది కస్టమర్లు.. గోమెకానిక్ 2023–24లో రూ.210 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్‌లో రూ.85 కోట్లు నమోదు చేసింది. ‘విడిభాగాలు, ఉపకరణాల అమ్మకాలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. వీటి విక్రయాలు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.432 కోట్లు నమోదయ్యే అవకాశం ఉంది. నికర రాబడి దాదాపు రూ.200 కోట్లకు చేరుకుంటాం’ అని అరోరా చెప్పారు. యాక్టివ్ కస్టమర్లు నెలకు 8 లక్షలు ఉన్నారని గోమెకానిక్ కో–ఫౌండర్, సీవోవో ముస్కాన్ కక్కర్ వివరించారు. నిర్వహణ లాభం నమోదు చేస్తున్నామని, 2027 నాటికి నికరలాభం అందుకుంటామని ఆమె వెల్లడించారు. కంపెనీ రోల్స్‌పై 550 మంది, ఫ్రాంచైజీ నెట్‌వర్క్‌లో 4,000 మంది పనిచేస్తున్నారని వివరించారు. -
రూ.8.89 లక్షల కొత్త ట్రయంఫ్ బైక్ ఇదే..
ప్రముఖ వాహన తయారీ సంస్థ 'ట్రయంఫ్ మోటార్‌సైకిల్' (Triumph Motorcycle).. భారతదేశంలో రూ. 8.89 లక్షల (ఎక్స్ షోరూమ్) విలువైన 'స్పీడ్ ట్విన్ 900' (Speed Twin 900) లాంచ్ చేసింది. ఇది దాను మునుపటి అన్ని మోడల్స్ కంటే కూడా కొంత ఎక్కువ అప్డేట్స్ పొందినట్లు తెలుస్తోంది.ట్రయంఫ్ స్పీడ్ ట్విన్ 900 బైకులో 900 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజన్ ఉంటుంది. ఇది 65 హార్స్ పవర్, 80 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఈ అప్డేటెడ్ బైక్ లేటెస్ట్ యూరో 5 ప్లస్ నిబంధనలకు అనుగుణంగా ఉంది.కొత్త ట్రయంఫ్ స్పీడ్ ట్విన్ 900 ఇప్పుడు ఎక్కువ బ్లాక్ అవుట్ ఎలిమెంట్స్ పొందుతుంది. ఇచ్చి చూడటానికి స్పీడ్ ట్విన్ 1200ని పోలి ఉంటుంది. అయితే ఇందులో యూఎస్డీ ఫ్రంట్ ఫోర్క్, బ్రాండెడ్ రేడియల్ కాలిపర్‌ను కలిగి ఉంది. ఈ బైక్ సీటు ఎత్తు 900 మిమీ వరకు ఉంది. సింగిల్-పాడ్ డిజి-అనలాగ్ డిస్ప్లే స్థానంలో TFT యూనిట్ ఉంటుంది.ట్రయంఫ్ స్పీడ్ ట్విన్ 900 బైక్ ఇప్పుడు మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దీని డెలివరీలు 2025 జనవరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. స్పీడ్ ట్విన్ 900 పర్ఫామెన్స్ కూడా ఉత్తమంగా ఉంటుందని భావిస్తున్నారు.Your journey to making every ride exceptional begins here. The new Speed Twin 900 is priced from ₹ 8 89 000* /- Ex showroom Delhi.Discover more: https://t.co/AUDQTKfjrc#SpeedTwin900 #MeetTheNewOriginal #MakeEveryRideExceptional #TriumphMotorcycles #ForTheRide pic.twitter.com/gMiAku7wtS— TriumphIndiaOfficial (@IndiaTriumph) December 23, 2024 -
విభిన్న రంగుల్లో నంబర్ ప్లేట్లు.. ఎందుకలా..
రోడ్లపై నిత్యం విభిన్న రకాల వాహనాలను గమనిస్తుంటాం. అందులో కొన్ని వెహికిల్స్ నంబర్ప్లేట్లు(Number Plate) సాధారణంగా కాకుండా భిన్నంగా ఉంటాయి. వాటిపై నంబర్లు, రంగులో తేడా ఉండడం గమనిస్తుంటాం. కొన్ని నంబర్ప్లేట్లు తెలుపు రంగులో ఉంటే, మరికొన్ని ఆకుపచ్చ రంగులో, ఇంకొన్ని పసుపు రంగులో.. ఇలా వేర్వేరుగా ఉంటాయి. అయితే ఒక్కో రంగు ప్లేట్ వాహనానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఆ వివరాలు తెలుసుకుందాం.తెలుపు రంగు ప్లేట్ఈ ప్లేట్లను వాణిజ్యేతర వాహనాలకు ఉపయోగిస్తారు. సాధారణంగా ఎక్కువగా ఇలాంటి నంబర్ ప్లేట్ ఉన్న వాహనాలు కనిపిస్తాయి. తెలుపు రంగు ప్లేట్‌పై నలుపు అక్షరాలుంటాయి. ఇది ప్రైవేట్ యాజమాన్యాన్ని సూచిస్తుంది. ఈ వాహనాలను వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించలేరు.ఆకుపచ్చ నంబర్ ప్లేట్పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలకు గ్రీన్(Green Plate) నంబర్ ప్లేట్లు కేటాయించారు. అవి తెల్లని అక్షరాలను కలిగి ఉంటాయి. ఎలక్ట్రిక్ కార్లు, బైక్‌లు, ఈ-రిక్షాలు, బస్సులు వంటి ఎలక్ట్రిక్ వాహనాలకు దీన్ని ఉపయోగిస్తారు.పసుపు రంగు ప్లేట్పసుపు రంగు ప్లేట్‌పై నలుపు అక్షరాలుంటాయి. ఈ ప్లేట్లు కలిగి ఉన్న వాహనాలను అద్దె కోసం ఉపయోగించుకోవచ్చు.బ్లూ నంబర్ ప్లేట్విదేశీ దౌత్యవేత్తలు ఉపయోగించే వాహనాలకు తెలుపు అక్షరాలతో బ్లూ కలర్ ప్లేట్లు కేటాయిస్తారు.ఎరుపు రంగు ప్లేట్ఎరుపు రంగు ప్లేట్ శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం వేచి ఉన్న వాహనాన్ని సూచిస్తుంది. ఈ తాత్కాలిక రిజిస్ట్రేషన్ సాధారణంగా ఒక నెల వరకు చెల్లుబాటు అవుతుంది.పైకి బాణం ఉన్న నంబర్ ప్లేట్ఈ ప్లేట్లు సైనిక వాహనాలకు చెందినవి. వాహనం కొనుగోలు చేసిన సంవత్సరంతో పాటు పైకి సూచించే బాణాన్ని కలిగి ఉంటాయి. ఈ నంబరింగ్ సిస్టమ్ రక్షణ మంత్రిత్వ శాఖకు(Defence) ప్రత్యేకమైంది.జాతీయ చిహ్నంతో ఎరుపు రంగు ప్లేట్భారత రాష్ట్రపతి, రాష్ట్ర గవర్నర్లు ఉపయోగించే వాహనాలు భారత జాతీయ చిహ్నంతో కూడిన ఎరుపు పలకను కలిగి ఉంటాయి.ఇదీ చదవండి: రెండు పాలసీలుంటే క్లెయిమ్ ఎలా చేయాలి?భారత్ నంబర్ ప్లేట్రాష్ట్రాల మధ్య తరచుగా ప్రయాణించే వారి కోసం వాహనాల రిజిస్ట్రేషన్‌ను రెన్యువల్ చేసుకునేందుకు వీలుగా భారత్ నంబర్ ప్లేట్‌ను 2021లో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వేరే రాష్ట్రానికి వెళ్లేటప్పుడు మళ్లీ రిజిస్టర్ చేయవలసిన అవసరం ఉండదు. ఇది ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ సిబ్బంది, దేశ వ్యాప్తంగా బహుళ కార్యాలయాలు కలిగిన కంపెనీల్లో పని చేసే వారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. -
ఆన్లైన్ ఉన్నా చివరకు షోరూంలోనే..
మార్కెట్లో ఎలాంటి కార్లు ఉన్నాయి.. బడ్జెట్ వివరాలతోపాటు మనకు కావాల్సిన ఫీచర్లు ఏ మోడళ్లలో ఉన్నాయి. ఒక ధరల శ్రేణిలో లభిస్తున్న మోడళ్ల మధ్య ఉన్న వ్యత్యాసాలు ఏమిటి.. ఇలాంటి అంశాలన్నీ ఆన్లైన్లో తెలుసుకుంటున్నప్పటికీ అత్యధికులు షోరూంకు వెళ్లే కారు స్టీరింగ్ పడుతున్నారట. ప్రత్యక్షంగా ఔట్‌లెట్‌కు వెళ్లి పరిశీలించిన తర్వాతే వాహనాన్ని కొనుగోలు చేస్తున్నారని అర్బన్ సైన్స్ సర్వేలో తేలింది. భారత్‌తోపాటు యూఎస్, జర్మనీ, యూకే, చైనా, మెక్సికో నుంచి 9,000 పైచిలుకు మంది ఈ సర్వేలో పాలుపంచుకున్నారు. భారత్‌లో 10 మంది కార్ల కొనుగోలుదార్లలో దాదాపు 9 మంది షోరూంను సందర్శించడానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నారట. సర్వేలోని వివరాలు కింది విధంగా ఉన్నాయి.నమ్మదగిన విధానం..ఇలా ఔట్‌లెట్‌కు వెళ్లడాన్ని ఒక ప్రధాన ఆర్థిక నిర్ణయం తీసుకోవడానికి నమ్మదగిన విధానంగా కస్టమర్లు భావిస్తున్నారు. కారును కొనుగోలు చేయడంలో కుటుంబ పాత్ర ఉంటుంది. షోరూంలతో వ్యక్తిగత సంబంధాలు ఉంటాయి. నేరుగా వెళ్లడం వల్ల కార్లను ప్రత్యక్షంగా చూడవచ్చు. ఇటువంటి అనుభవాన్ని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు ఇవ్వలేవు. డీలర్‌షిప్‌లు నమ్మకాన్ని పెంపొందిస్తాయి, వ్యక్తిగతీకరించిన డీల్స్ ఉంటాయి. సంబంధాలు పెంపొందించబడతాయి. అమ్మకాల తర్వాత మద్దతు కూడా ఉంటుందన్నది కస్టమర్ల భావన. ఇందుకు అనుగుణంగా కస్టమర్లలో విశ్వాసాన్ని పెంపొందించేందుకు తయారీ సంస్థలు నెట్‌వర్క్‌లను విస్తరిస్తున్నాయి. ఇదీ చదవండి: వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ల కోసం ప్రత్యేక ప్లాన్ఆన్లైన్లో బ్రౌజింగ్..సంప్రదాయ డీలర్‌షిప్‌లు ప్రస్తుతం భారతదేశ ఆటోమోటివ్ వ్యవస్థలో ఆధిపత్యం చెలాయిస్తుండగా.. డిజిటల్ వేవ్ క్రమంగా ఊపందుకుంటోంది. యువకులు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వినియోగదారులు షోరూమ్‌లోకి అడుగుపెట్టే ముందు ఆన్లైన్లో బ్రౌజ్ చేస్తున్నారు. డీలర్‌షిప్‌లు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు రెండూ భవిష్యత్తులో కొనసాగుతాయి. సంప్రదాయ డీలర్‌షిప్‌లు ప్రత్యేకంగా అందించే నమ్మకాన్ని, వ్యక్తిగత సంబంధాలను కాపాడుకుంటూ.. అభివృద్ధి చెందుతున్న వినియోగదారుల అంచనాలను అందుకోవడానికి సరైన సమతూకం సాధించడం చాలా అవసరం’ అని సర్వేలో వెల్లడైంది. -
హోండా, నిస్సాన్ విలీనం
టోక్యో: జపాన్ ఆటోమొబైల్ దిగ్గజాలు హోండా, నిస్సాన్ విలీనం కానున్నట్లు ప్రకటించాయి. ఇందుకు సంబంధించి ఇరు సంస్థలు ఒక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. నిస్సాన్‌కు వాటాలున్న మిత్సుబిషి మోటార్స్ కూడా తన వ్యాపారాన్ని విలీనం చేసే చర్చల్లో భాగమయ్యేందుకు అంగీకరించినట్లు కంపెనీలు వెల్లడించాయి. ఈ డీల్‌తో విలీన సంస్థ.. అమ్మకాలపరంగా ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆటోమొబైల్ కంపెనీగా ఆవిర్భవించనుంది. ఫ్రాన్స్‌కు చెందిన రెనోతో భాగస్వామ్యం, అలాగే మిత్సుబిషి మోటార్స్ కార్ప్‌లతో కలిసి హోండా, నిస్సాన్ కూటమి.. జపాన్‌కే చెందిన ఆటోమొబైల్ దిగ్గజం టయోటా మోటర్ కార్ప్, జర్మనీకి చెందిన ఫోక్స్వ్యాగన్లతో పోటీ పడనుంది. విలీనం అమల్లోకి వస్తే మరింత పెద్ద స్థాయిలో కస్టమర్లకు చేరువయ్యేందుకు తోడ్పడగలదని నిస్సాన్ సీఈవో మకొటొ యుషిడా తెలిపారు. ఇటీవలే హోండా, నిస్సాన్ విలీన వార్తలు రావడం తెలిసిందే. ఆటోమొబైల్ పరిశ్రమ క్రమంగా శిలాజ ఇంధనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాలు, స్వయంచాలిత టెక్నాలజీల వైపు మళ్లుతున్న తరుణంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.50 బిలియన్ డాలర్ల దిగ్గజం..: మూడు కంపెనీల కలయికతో 50 బిలియన్ డాలర్ల పైగా మార్కెట్ విలువ గల దిగ్గజ సంస్థ ఏర్పాటవుతుంది. వీటి వార్షిక వాహనాల ఉత్పత్తి పరిమాణం 80 లక్షలు ఉంటుంది. 2023లో హోండా 40 లక్షలు, నిస్సాన్ 34 లక్షలు, మిత్సుబిషి మోటర్స్ దాదాపు 10 లక్షల వాహనాలను ఉత్పత్తి చేశాయి. అయితే ఈ మూడూ కలిసినా కూడా ఉత్పత్తిపరంగా టయోటానే అగ్రగామిగా కొనసాగనుంది. 2023లో టయోటా మొత్తం 1.15 కోట్ల వాహనాల తయారీతో టాప్‌లో ఉంది. ఫోక్స్‌వ్యాగన్ సుమారు 89 లక్షల వాహనాల ఉత్పత్తితో రెండో స్థానంలో నిల్చింది. ప్రస్తుతం దాదాపు 68 లక్షల వాహనాలతో (కియా, జెనెసిస్ బ్రాండ్లతో కలిసి) దక్షిణ కొరియా సంస్థ హ్యుందాయ్ మూడో స్థానంలో ఉంది. ప్రయోజనాలేమిటంటే.. ఒకవైపు వాహన కంపెనీలు శిలాజ ఇంధనాల వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లేందుకు తంటాలు పడుతుండగా మరోవైపు చైనా కంపెనీలు కొత్త టెక్నాలజీల విషయంలో దూసుకెళ్తుండటం పరిశ్రమను కుదిపేస్తోంది. చైనాకు చెందిన బీవైడీ, గ్రేట్ వాల్, నియో వంటి చౌక ప్రత్యామ్నాయ ఎలక్ట్రిక్ వాహనాలు.. జపాన్, అమెరికన్ కార్ల కంపెనీల మార్కెట్ వాటాను కొల్లగొడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పరిశ్రమలో కన్సాలిడేషన్ చోటుచేసుకుంటున్నట్లు పరిశ్రమల వర్గాలు తెలిపాయి. ఆరి్థక సమస్యలు, తగ్గుతున్న లాభదాయకతతో నిస్సాన్ సతమతమవుతోంది. చైనాలో అమ్మకాల బలహీన తతో హోండా లాభాలపైనా ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో విలీనం చోటు చేసుకుంటోంది. 2023లో జరిగిన అమ్మకాల పరంగా టాప్ 10 అతిపెద్ద వాహన తయారీదారుల జాబితాటయోటా - 10.3 మిలియన్ వాహనాలువోక్స్ వ్యాగన్ గ్రూప్ - 9.2 మిలియన్ వాహనాలుహ్యుందాయ్ మోటార్ గ్రూప్ - 7.3 మిలియన్ వాహనాలుస్టెలాంటిస్ - 6.4 మిలియన్ వాహనాలుజనరల్ మోటార్స్ - 6.2 మిలియన్ వాహనాలుఫోర్డ్ మోటార్ కంపెనీ - 4.4 మిలియన్ వాహనాలుహోండా - 4.2 మిలియన్ వాహనాలునిస్సాన్ - 3.4 మిలియన్ వాహనాలు(నోట్: విలీన ప్రక్రియ పూర్తైతే హోండా, నిస్సాన్ కలిపి అమ్మకాల్లో టాప్ 3 కంపెనీ అవతరించినట్లువుతుంది.)బీఎండబ్ల్యూ గ్రూప్ - 2.6 మిలియన్ వాహనాలుమెర్సిడెస్ బెంజ్ - 2.5 మిలియన్ వాహనాలు -
సెల్ఫీ కొట్టు.. స్కూటర్ పట్టు: ఎలా అంటే?
ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ 'ఓలా ఎలక్ట్రిక్' (Ola Electric).. సరికొత్త ఎస్1 ప్రో 'సోనా' లిమిటెడ్ ఎడిషన్ స్కూటర్‌ను తీసుకు వస్తున్నట్లు వెల్లడించింది. ఈ స్కూటర్ ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ఇతర స్కూటర్ల కంటే కూడా చాలా భిన్నంగా ఉంటుంది. ఈ స్కూటర్ సొంతం చేసుకోవాలంటే డబ్బు చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. ఇంకెలా ఈ స్కూటర్ సొంతం చేసుకోవచ్చో ఈ కథనంలో తెలుసుకుందాం.ఓలా ఎలక్ట్రిక్ పరిచయం చేసిన కొత్త ఎస్1 ప్రో 'సోనా' లిమిటెడ్ ఎడిషన్ గోల్డ్ కలర్ ఎలిమెంట్స్ పొందుతుంది. కాబట్టి వీల్స్, మిర్రర్స్ వంటివన్నీ కూడా బంగారు రంగులో ఉండటం చూడవచ్చు. ఈ స్కూటర్ డ్యూయెల్ టోన్ డిజైన్ థీమ్‌తో పెర్ల్ వైట్, గోల్డ్ రంగులను పొందుతుంది.ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లిమిటెడ్ ఎడిషన్ ఆఫర్లో మరింత పర్సనలైజ్డ్ అనుభవం కోసం రూపొందించిన ప్రత్యేక ఫీచర్లతో వస్తోంది. ఇందులో మూవ్ ఓఎస్ సాఫ్ట్వేర్ కూడా లభిస్తుంది. ఈ మోడల్ గోల్డ్ థీమ్ యూజర్ ఇంటర్ఫేస్, కస్టమైజ్డ్ మూవ్ఓఎస్ డ్యాష్‌బోర్డ్‌ని పొందుతుంది. వ్యక్తిగత ప్రాధాన్యతలకు అనుగుణంగా పర్సనలైజ్డ్ చేసుకునేందుకు మరింత సూక్ష్మమైన, ప్రీమియం చిమ్స్ ఇందులో ఉన్నాయి.ఈ స్కూటర్‌ను ఎలా సొంతం చేసుకోవచ్చంటే?ఓలా ఎలక్ట్రిక్ ఎంపిక చేసిన కస్టమర్లకు ఓలా సోనా కాంటెస్ట్ ద్వారా ఎస్1 ప్రో సోనా లిమిటెడ్ ఎడిషన్‌ను గెలుచుకునే అవకాశం ఉంది. ఇందులో పాల్గొనాలకునేవారు ఓలా ఎస్1తో రీల్ పోస్ట్ చేయాలి లేదా బ్రాండ్ స్టోర్ వెలుపల ఒక ఫోటో లేదా సెల్ఫీ తీసుకుని #OlaSonaContest అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఓలా ఎలక్ట్రిక్‌ను ట్యాగ్ చేయాలి. డిసెంబర్ 25న ఓలా స్టోర్లలో జరిగే పోటీలో విజేతను ప్రకటిస్తారు. -
2025 ఆటో ఎక్స్‌పోలో ‘ఈ–విటారా’
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ వచ్చే ఏడాది (2025) జరగబోయే భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో తమ తొలి ఎలక్ట్రిక్ కారు ఈ–విటారాను ప్రదర్శించే ప్రణాళికల్లో ఉంది. ఇటీవలే దీన్ని ఇటలీలో ఆవిష్కరించింది. వాహన రంగంలో దశాబ్దాల అనుభవంతో అధునాతన ఎలక్ట్రిక్ టెక్నాలజీని ఉపయోగించి దీన్ని రూపొందించినట్లు మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) పార్థో బెనర్జీ తెలిపారు. మరోవైపు, సమగ్రమైన ఎలక్ట్రిక్ వాహనాల వ్యవస్థను కూడా అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మారుతీ సుజుకీ డీలర్íÙప్లు, సరీ్వస్ టచ్ పాయింట్లలో ఫాస్ట్ చార్జర్ల నెట్వర్క్, హోమ్ చార్జింగ్ సొల్యూషన్స్ మొదలైనవి వీటిలో ఉంటాయని వివరించారు. సరైన చార్జింగ్ మౌలిక సదుపాయాలు లేకపోవడమే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి పెద్ద అవరోధంగా ఉంటోందని బెనర్జీ తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఈవీలను మ రింత అదుబాటులోకి తెచ్చేందు కు, విస్తృత స్థాయిలో కస్టమర్లకు ఆకర్షణీయంగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. -
సరికొత్తగా హోండా యాక్టివా 125
గురుగ్రామ్: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) తాజాగా అధునాతన ఫీచర్లతో సరికొత్త యాక్టివా 125 స్కూటర్‌ను విడుదల చేసింది. రూ.94,422 ధరతో డీఎల్ఎక్స్, రూ.97,146 ధరతో హెచ్–స్మార్ట్ అనే రెండు వేరియంట్లలో ఇది లభిస్తుంది. బ్లూటూత్ అనుసంధానంతో 4.2 అంగుళాల టీఎఫ్టీ డిస్ప్లే కలిగి ఉంది. 123.99 సీసీ సామర్థ్యం కలిగిన సింగిల్ సిలిండర్ పీజీఎం–ఎఫ్ఐ ఇంజిన్‌తో తయారైంది. ఇది 6.20 కిలోవాట్ల శక్తిని, 10.5ఎన్ఎం టార్క్ విడుదల చేస్తుంది. యూఎస్బీ టైప్–సీ చార్జింగ్ సదుపాయం ఉంది. పర్ల్ ఇగ్నోస్ బ్లాక్, మాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, పర్ల్ డీప్ గ్రౌండ్ గ్రే, పర్ల్ సిరెన్ బ్లూ, రెబల్ రెడ్ మెటాలిక్, పర్ల్ ప్రీసియఎస్ వైట్ రంగుల్లో లభిస్తుంది. ఈ సరికొత్త 2025 హోండా యాక్టివా 125 స్కూటర్ దేశవ్యాప్తంగా అన్ని డీలర్ల వద్ద అందుబాటులో ఉందని హెచ్ఎంఎస్ఐ తెలిపింది. -
భారత్‌లో రూ.13.49 లక్షల బైక్ లాంచ్: బుకింగ్స్ షురూ
కవాసకి దేశీయ మార్కెట్లో 2025 నింజా 1100ఎస్ఎక్స్ లాంచ్ చేసింది. దీని ధర రూ.13.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ బైక్ కోసం బుకింగ్స్ ప్రారంభమైనప్పటికీ.. డెలివరీలు వచ్చే ఏడాది ప్రారంభంలో మొదలయ్యే అవకాశం ఉందని సమాచారం.నింజా 1100ఎస్ఎక్స్ బైక్ లిక్విడ్ కూల్డ్, 1099సీసీ ఇంజిన్ పొందుతుంది. ఇది 9000 rpm వద్ద, 136 హార్స్ పవర్ & 7600 rpm వద్ద 113 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్ పొందుతుంది. కాబట్టి ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా ఉత్తమ పనితీరును అందిస్తుందని భావిస్తున్నాము.చూడటానికి కవాసకి నింజా దాని మునుపటి మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. ఇది కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతుంది. ఇందులో ట్విన్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, షార్ప్ అండ్ అగ్రెసివ్ ఫ్రంట్ ఫెయిరింగ్ వంటివన్నీ ఉన్నాయి. ఇందులో 4.3 ఇంచెస్ TFT డిస్ప్లే ఉంటుంది. ఇది కాల్స్, ఎస్ఎమ్ఎస్ అలర్ట్ వంటి వాటిని చూపిస్తుంది. అంతే కాకుండా ఈ బైకులో క్రూయిజ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, మల్టిపుల్ పవర్ మోడ్లు, హ్యాండిల్‌బార్ మౌంటెడ్ USB ఛార్జింగ్ పోర్ట్ వంటివి కూడా ఉన్నాయి.ఇదీ చదవండి: రూ.5 లక్షలు పెరిగిన ధర.. ఇప్పుడు ఈ కారు రేటెంతో తెలుసా?మార్కెట్లో లాంచ్ అయిన కొత్త కవాసకి నింజా 1100ఎస్ఎక్స్ బైకుకు ప్రత్యక్ష ప్రత్యర్థులు లేదు. అయితే ధర పరంగా ట్రయంఫ్ రోడ్-బియాస్డ్ టైగర్ 900 జీటీ పోటీపడుతోంది. కాగా ఈ బైక్ కోసం కవాసకి డీలర్‌షిప్‌లలో రూ. 50,000 టోకెన్ మొత్తంతో బుక్ చేసుకోవచ్చు. -
రూ.5 లక్షలు పెరిగిన ధర.. ఇప్పుడు ఈ కారు రేటెంతో తెలుసా?
భారతీయ మార్కెట్లో '2025 రేంజ్ రోవర్ స్పోర్ట్' రూ.1.45 కోట్ల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ అయింది. దేశీయ విఫణిలో తయారైన ఈ కారు ధర రూ.5 లక్షలు పెరిగింది. బ్రాండ్ ఇప్పుడు డైనమిక్ ఎస్ఈ వేరియంట్‌ను నిలిపివేసి.. స్థానికంగా తయారైన 'డైనమిక్ హెచ్ఎస్ఈ' వేరియంట్‌తో భర్తీ చేశారు.2025 రేంజ్ రోవర్ స్పోర్ట్ డైనమిక్ హెచ్ఎస్ఈ.. 3.0 లీటర్ 6 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. ఇది 400 హార్స్ పవర్ అందిస్తుంది. ఇందులోని 3.0 లీటర్ 6 సిలిండర్ డీజిల్ ఇంజిన్ 351 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇవి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతాయి.సాంటోరిని బ్లాక్, వారెసిన్ బ్లూ, ఫుజి వైట్, ఛారెంటే గ్రే, జియోలా గ్రీన్ అనే కలర్ ఆప్షన్లలో లభించే ఈ కారు ఆటో పార్కింగ్ అసిస్ట్, ఎయిర్ సస్పెన్షన్, అడాప్టివ్ ఆఫ్ రోడ్ క్రూయిజ్ కంట్రోల్, మెరిడియన్ సౌండ్ సిస్టమ్, పవర్డ్ అండ్ హీటెడ్ రియర్ సీట్లు వంటి వాటిని పొందుతుంది.కొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్ డైనమిక్ హెచ్ఎస్ఈ అడాప్టివ్ ఫ్రంట్ లైటింగ్, లో స్పీడ్ మ్యాన్యువరింగ్ లైట్లు, డిజిటల్ ఎల్ఈడీ హెడ్లైట్లను పొందుతుంది. కాబట్టి ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అత్యుత్తమ పనితీరును అందిస్తుందని సమాచారం. -
ఒకసారి ఛార్జింగ్‌తో 153 కిలోమీటర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం బజాజ్ ఆటో ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్ నుంచి సరికొత్త 35 సిరీస్‌ను ఆవిష్కరించింది. 3.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ సామర్థ్యంతో మూడు వేరియంట్లలో వీటిని రూపొందించింది. ఒకసారి ఛార్జింగ్‌తో 153 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.కొత్త చేతక్ రూ.1.2 లక్షల ధరతో మిడ్ వేరియంట్ 3502, రూ.1.27 లక్షల ధరతో టాప్–ఎండ్ వేరియంట్ 3501 మాత్రమే ప్రస్తుతానికి విడుదలైంది. వీటి టాప్ స్పీడ్ గంటకు 73 కిలోమీటర్లు. బేస్ వేరియంట్ అయిన 3503 కొద్ది రోజుల్లో రంగ ప్రవేశం చేయనుంది. ఈ వేరియంట్ టాప్ స్పీడ్ గంటకు 63 కిలోమీటర్లు. డెలివరీలు డిసెంబర్ చివరి వారం నుంచి ప్రారంభం అతుతాయని కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: మళ్లీ భగ్గుమన్న బంగారం.. తులం ఎంతో తెలుసా?నావిగేషన్, మ్యూజిక్ కంట్రోల్, కాల్స్ అందుకునేలా స్మార్ట్ టచ్‌స్క్రీన్ పొందుపరిచారు. సీటు కింద 35 లీటర్ల స్టోరేజ్ ఏర్పాటు ఉంది. స్టోరేజ్ స్థలం పరంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల్లో ఇదే అత్యధికం. రిమోట్ ఇమ్మొబిలైజేషన్, గైడ్ మీ హోమ్ లైట్స్, జియో ఫెన్సింగ్, యాంటీ థెఫ్ట్, యాక్సిడెంట్ డిటెక్షన్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. 3501 మూడు గంటల్లో, 3502 వేరియంట్ 3 గంటల 25 నిముషాల్లో 80 శాతం చార్జింగ్ పూర్తి అవుతుందని కంపెనీ తెలిపింది. వారంటీ మూడేళ్లు లేదా 50,000 కిలోమీటర్లు ఉంటుందని పేర్కొంది. -
రూ.15 లక్షలుంటే చాలు.. ఇందులో ఓ కారు మీ సొంతం!
కరోనా మహమ్మారి వ్యాపించిన తరువాత చాలామంది సొంతగా కారు ఉంటే బాగుంటుందని భావించారు. ఆ తరువాత కొంతమంది కార్లను కొనుగోలు చేయడం ప్రారంభించారు. అయితే ఇందులో కొందరు రూ. 10 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే కార్లను కొనుగోలు చేస్తే.. మరికొందరు రూ. 20 లక్షల లోపు ధర వద్ద లభించే కార్లను కొనుగోలు చేయడానికి మక్కువ చూపించారు. మనం ఈ కథనంలో రూ.15 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే కార్లు ఏవి? వాటి వివరాలు ఏమిటనే విషయాలను తెలుసుకుందాం.హోండా సిటీహోండా అంటే ముందుగా గుర్తొచ్చే కారు 'సిటీ'. ఈ కారు ప్రారంభ ధర రూ. 11.82 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ద్వారా 117 Bhp పవర్, 145 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ పొందుతుంది.ఫీచర్స్ విషయానికి వస్తే.. హోండా సిటీ 8.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్, వైర్లెస్ ఛార్జింగ్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఎయిర్ ప్యూరిఫైయర్తో స్మార్ట్‌ఫోన్ ఇంటిగ్రేషన్ వంటి వాటితో పాటు.. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఐసోఫిక్స్ యాంకర్స్ వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి.స్కోడా స్లావియాస్కోడా స్లావియా ప్రారంభ ధర రూ.10.50 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కారు రెండు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో 8 ఇంచెస్ ఫుల్లీ డిజిటల్ క్లస్టర్‌తో పాటు.. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేకు సపోర్ట్ చేసే 10 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇందులో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్, ఆటో క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ కూడా ఉన్నాయి.ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ఫోక్స్వ్యాగన్ కంపెనీకి చెందిన వర్టస్ కారు కూడా రూ.15 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభిస్తున్న ఉత్తమ మోడల్. ఈ కారు ప్రారంభ ధర రూ.10 .89 లక్షలు. ఇది కూడా రెండు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. ఇందులో 8 ఇంచెస్ ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, 10 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, వైర్లెస్ ఛార్జింగ్, ఆటో క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ మొదలైన ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ కారు.. అత్యాధునిక సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. కాబట్టి ఇది క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ సాధించింది. దీంతో మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటిగా నిలిచింది.హ్యుందాయ్ వెర్నారూ. 11 లక్షల (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధర వద్ద లభిస్తున్న హ్యుందాయ్ వెర్నా కూడా మన జాబితాలో చెప్పుకోదగ్గ మోడల్. ఇది 1.5 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్స్ పొందుతుంది. ఈ కారు కూడా క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ సాధించి.. అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటిగా నిలిచింది.ఇదీ చదవండి: భారత్‌లోని 5 బెస్ట్ ఫ్యామిలీ కార్లు ఇవే!మారుతి సుజుకి సియాజ్2014లో మొదటిసారి దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన మారుతి సుజుకి కంపెనీకి చెందిన 'సియాజ్' ఆ తరువాత కాలంలో అనేక అప్డేట్స్ పొందింది. ప్రస్తుతం ఈ కారు ధర రూ.9.40 లక్షల నుంచి రూ.12.30 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. సియాజ్ మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన 1.5 లీటర్ కే15 పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ లేదా 4 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. -
భారత్‌లోని 5 బెస్ట్ ఫ్యామిలీ కార్లు ఇవే!
త్వరలో న్యూ ఇయర్ వచ్చేస్తోంది, ఆ తరువాత సంక్రాతి సెలవులు రానున్నాయి. సెలవుల్లో చాలామంది ఫ్యామిలీతో కలిసి లాంగ్ డ్రైవ్ వెళ్లాలనుకుంటారు. అలాంటి వాళ్ళు ఒకవేలా కొత్త కారు కొనాలంటే.. ఎలాంటి మోడల్ ఎందుకోవాలి? దాని ధర ఎంత? ఇతర వివరాలు ఏంటనేది ఇక్కడ తెలుసుకుందాం.ఎంజీ హెక్టర్ఎంజీ మోటార్ కంపెనీ లాంచ్ చేసిన కార్లలో ఎక్కువ ప్రజాదరణ పొందిన మోడల్ హెక్టర్. రూ.13.99 లక్షల ప్రారంభ ధర వద్ద లభించే ఈ కారు ఏకంగా 587 లీటర్ల బూట్ స్పేస్ పొందుతుంది. ఇందులో 14 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, వైర్లెస్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లతో డిజిటల్ బ్లూటూత్ కీ, 75 కంటే ఎక్కువ కనెక్టెడ్ కార్ ఫీచర్లు, పనోరమిక్ సన్‌రూఫ్ మొదలైనవన్నీ ఉన్నాయి.ఎంజీ విండ్సర్ఇటీవలే మార్కెట్లో లాంచ్ అయిన ఎంజీ విండ్సర్ ఎలక్ట్రిక్ కారు కూడా.. లాంగ్ డ్రైవ్ వెళ్ళడానికి ఉత్తమంగా ఉంటుంది. ఈ కారు ప్రారంభ ధర రూ. 13.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). 604 లీటర్ బూట్ స్పేస్ కలిగిన ఈ కారు ఏరోడైనమిక్ డిజైన్ పొందుతుంది. ఇది సింగిల్ ఛార్జితో 332 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ కారులోని లేటెస్ట్ ఫీచర్స్ వాహన వినియోగదారులకు బెస్ట్ డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.హోండా సిటీరూ.11.88 లక్షల (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధర వద్ద లభించే హోండా సిటీ.. 506 లీటర్ బూట్ స్పేస్ పొందుతుంది. ఇది మంచి డిజైన్ కలిగి.. ఉత్తమ ఇంటీరియర్ ఫీచర్స్ పొందుతుంది. ఈ కారు రోజు వారీ వినియోగానికి మాత్రమే కాకుండా.. లాంగ్ డ్రైవ్ చేయడానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. హోండా కంపెనీ ఎక్కువగా విక్రయించిన కార్ల జాబితాలో సిటీ సెడాన్ చెప్పుకోదగ్గ మోడల్.రెనాల్ట్ కైగర్మార్కెట్లో ఎక్కువ మంది ఇష్టపడి కొనుగోలు చేస్తున్న కార్ల జాబితాలో రెనాల్ట్ కైగర్ కూడా ఒకటి. దీని ధరలు రూ.6 లక్షల నుంచి రూ. 11.23 లక్షల మధ్య ఉన్నాయి. ఈ కారులోని బూట్ స్పేస్ 405 లీటర్లు. ఎక్కువ లగేజ్ తీసుకెళ్లాలనుకునే వారికి ఇది అనుకూలంగా ఉంటుంది. సింపుల్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ కారు ఉత్తమ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉండటం వల్ల నగర ప్రయాణానికి మాత్రమే కాకుండా.. గ్రామీణ ప్రాంతాలలో డ్రైవ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది.మహీంద్రా స్కార్పియో ఎన్మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి చెందిన 'స్కార్పియో ఎన్' కూడా ఫ్యామిలీతో కలిసి ప్రయాణించడానికి అనుకూలంగా ఉండే ఓ బెస్ట్ మోడల్. 460 లీటర్ల బూట్ స్పేస్ కలిగిన ఈ కారు ప్రారంభ ధర రూ. 13.85 లక్షలు (ఎక్స్ షోరూమ్). దృఢమైన నిర్మాణం కలిగిన ఈ కారు అత్యుత్తమ సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందింది. కాబట్టి ఇది క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ పొందింది. ఈ కారులోని ఫీచర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే.. ఇందులో వాహన వినియోగదారులకు కావాల్సిన దాదాపు అన్ని ఫీచర్స్ ఉన్నాయి. -
కియా కొత్త ఎస్యూవీ సిరోస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ కియా ఇండియా సరికొత్త సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ సిరోస్‌ను భారత్ వేదికగా అంతర్జాతీయంగా ఆవిష్కరించింది. 2025 జనవరి 3 నుంచి బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి మొదటి వారం నుంచి డెలివరీలు మొదలవుతాయి. ధర ఎక్స్‌షోరూంలో రూ.10–15 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. 118 బీహెచ్పీ, 172 ఎన్ఎం టార్క్‌తో పెట్రోల్ వేరియంట్ 1.0 లీటర్ త్రీ–సిలిండర్ టర్బోచార్జ్డ్ ఇంజిన్‌తో తయారైంది. 6 స్పీడ్ మాన్యువల్ లేదా 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ఎంచుకోవచ్చు. లెవెల్–2 అడాస్, 6 ఎయిర్‌బ్యాగ్స్, ఎల్రక్టానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి భద్రతా ఫీచర్లు జోడించారు. 30 అంగుళాల పనోరమిక్ డ్యూయల్ స్క్రీన్ సెటప్, 360 డిగ్రీ పార్కింగ్ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి హంగులు జోడించారు. -
రూ.20 లక్షల కోట్లకు ఈవీ మార్కెట్
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) మార్కెట్ విలువ భారత్‌లో 2030 నాటికి రూ.20 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉందని కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం తెలిపారు. ఆ సమయానికి మొత్తం ఈవీ పర్యావరణ వ్యవస్థలో దాదాపు 5 కోట్ల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని అన్నారు. ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమ సుస్థిరతపై 8వ సదస్సు ఈవీఎక్స్‌పో 2024 సందర్భంగా ఆయన మాట్లాడారు. 2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల ఫైనాన్స్ మార్కెట్ పరిమాణం దేశంలో దాదాపు రూ.4 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనాగా వెల్లడించారు. భారత్‌లో 40 శాతం వాయు కాలుష్యం రవాణా రంగం వల్లే అని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. సౌర విద్యుత్ 44 శాతం.. భారత్ రూ. 22 లక్షల కోట్ల విలువైన శిలాజ ఇంధనాలను దిగుమతి చేసుకుంటోందని, ఇది పెద్ద ఆర్థిక సవాలుగా మారిందని గడ్కరీ అన్నారు. ఈ శిలాజ ఇంధనాల దిగుమతి మన దేశంలో చాలా సమస్యలను సృష్టిస్తోందని తెలిపారు. భారత్‌లో ఉత్పత్తి అవుతున్న మొత్తం విద్యుత్‌లో 44 శాతం సౌరవిద్యుత్ కైవసం చేసుకున్నందున ప్రభుత్వం పర్యావరణ అనుకూల శక్తి వనరులపై దృష్టి పెడుతోందని వివరించారు.లక్ష ఈ–బస్‌లు అవసరం.. ఎలక్ట్రిక్ బస్‌ల కొరతను భారత్ ఎదుర్కొంటోందని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. ‘మన దేశానికి లక్ష ఎలక్ట్రిక్ బస్‌లు అవసరం. అయితే ప్రస్తుతం మన సామర్థ్యం 50,000 ఈ–బస్‌లు. మీరు మీ ఫ్యాక్టరీని విస్తరించుకోవడానికి ఇదే సరైన సమయం. ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులు నాణ్యత విషయంలో రాజీ పడొద్దు’ అని తయారీ కంపెనీలను ఉద్దేశించి అన్నారు.