Corporate
-
మహిళా వ్యాపారులకు షీట్రేడ్స్ ఇండియా హబ్
న్యూఢిల్లీ: ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తలకు సాధికారత కల్పించేందుకు, ఎగుమతుల వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్ఐఈవో మంగళవారం షీట్రేడ్స్ ఇండియా హబ్‌ను ఆవిష్కరించింది. ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ (ఐటీసీ) భాగస్వామ్యంతో ఏర్పాటైన ఈ కేంద్రానికి బ్రిటన్ ప్రభుత్వానికి చెందిన షీట్రేడ్స్ కామన్వెల్త్ప్లస్ ప్రోగ్రాం కింద నిధులు అందుతాయి.ఇదీ చదవండి: ఫ్రెంచ్ కంపెనీపై జైడస్ లైఫ్ కన్నుఇది మహిళల సారథ్యంలో ఎగుమతుల వృద్ధికి దోహదపడుతుందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిస్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) సంతోష్ కుమార్ సారంగి తెలిపారు. ఇందులో 3 లక్షల మంది మహిళా ఎంట్రప్రెన్యూర్లను ఎన్రోల్ చేయడంపై ఎఫ్ఐఈవో, ఐటీసీ దృష్టి పెట్టాలని సూచించారు. దేశవ్యాప్తంగా మహిళల ఆధ్వర్యంలోని వ్యాపారాలకు వనరులను సమకూర్చే సమగ్ర కేంద్రంగా షీట్రేడ్స్ ఇండియా హబ్ ఉంటుంది. ఇందులో సామర్థ్యాలను పెంచుకునేందుకు ఉపయోగపడే వర్క్‌షాప్‌లు, మెంటారింగ్ సెషన్లు మొదలైనవి నిర్వహిస్తారు. భారత్ ఏటా 80,000 కోట్ల డాలర్ల ఉత్పత్తులు, సర్వీసులు ఎగుమతి చేస్తోందని, వచ్చే కొన్నేళ్లలో దీన్ని 2 లక్షల కోట్ల డాలర్లకు చేర్చుకోవాలనేది లక్ష్యంగా నిర్దేశించుకుందని సారంగి చెప్పారు. -
ఫ్రెంచ్ కంపెనీపై జైడస్ లైఫ్ కన్ను
న్యూఢిల్లీ: మెడ్‌టెక్ ఫ్రెంచ్ కంపెనీ యాంప్లిట్యూడ్ సర్జికల్‌లో మెజారిటీ వాటా కొనుగోలు చేసేందుకు ప్రత్యేక చర్చలు నిర్వహిస్తున్నట్లు దేశీ హెల్త్‌కేర్ సంస్థ జైడస్ లైఫ్‌సైన్సెస్ పేర్కొంది. మెజారిటీ వాటా సొంతం చేసుకునేందుకు కంపెనీ యాజమాన్యం పీఏఐ పార్ట్నర్స్సహా రెండు మైనారిటీ వాటాదారు సంస్థలతో డీల్ కుదుర్చుకోనున్నట్లు తెలియజేసింది. వెరసి వోటింగ్ హక్కులతో 85.6% వాటా కొనుగోలుకి 25.68 కోట్ల యూరోలు (రూ.2,444 కోట్లు) వెచ్చించనున్నట్లు వెల్లడించింది. అత్యంత నాణ్యమైన లోయర్లింబ్ ఆర్థోపెడిక్ టెక్నాలజీలలో యాంప్లిట్యూడ్కు పట్టున్నట్లు పేర్కొంది. వీటిలో సమస్యాత్మకంగా మారిన జాయింట్ల రీప్లేస్మెంట్లో విని యోగించే మెడికల్ ప్రొడక్టుల డిజైన్, డెవలప్మెంట్ తదితర కార్యకలాపాలున్నట్లు తెలియజేసింది.ఇదీ చదవండి: సిబిల్ స్కోర్ అప్డేట్.. ఆర్బీఐ ఆరు నిబంధనలునిఫ్టీ కెమికల్ ఇండెక్స్ షురూకెమికల్ రంగానికీ ఎన్ఎస్ఈ ప్రాధాన్యతన్యూఢిల్లీ: స్టాక్ ఎక్ఛ్సేంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ తాజాగా కెమికల్ రంగానికి ఇండెక్స్‌ను ప్రవేశపెట్టింది. నిఫ్టీ కెమికల్స్ పేరుతో ఆవిష్కరించింది. నిఫ్టీ 500 నుంచి కెమికల్ రంగ షేర్ల పనితీరును ఇండెక్స్ ప్రతిఫలించనుంది. అనుబంధ సంస్థ ఎన్ఎస్ఈ ఇండిసెస్ ద్వారా కొత్త ఇండెక్సునకు తెరతీసింది. తాజా ఇండెక్స్ అసెట్ మేనేజర్లకు ప్రామాణికంగా నిలిచే వీలున్నట్లు ఎన్ఎస్ఈ అంచనా వేస్తోంది. ఈటీఎఫ్‌ల రూపంలో ప్యాసివ్ ఫండ్స్ ట్రాక్ చేసే రిఫరెన్స్ ఇండెక్స్‌గా ఉపయోగపడనున్నట్లు అభిప్రాయపడింది. ఆరు నెలల సగటు ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా 20 స్టాక్స్‌ను ఎంపిక చేసినట్లు పేర్కొంది. ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో ట్రేడింగ్‌కు అందుబాటులో ఉన్న షేర్లను పరిగణించింది. ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ విలువ ఆధారంగా ఒక్కో షేరుకి వెయిట్ ఉంటుందని, 33 శాతానికి మించదని ఎక్ఛ్సేంజీ వెల్లడించింది. -
పెరుగుతున్న ఫ్లైట్లు, హోటళ్ల బుకింగ్స్.. కారణం..
సాక్షి, బిజినెస్ డెస్క్ : మహా కుంభ మేళా హడావిడి ముగిసిన తర్వాత పర్యాటకానికి హోలీ పండుగ రూపంలో మరో కొత్త దన్ను దొరికింది. శుక్రవారం నాడు హోలీ కావడంతో సుదీర్ఘ వారాంతపు సెలవులొస్తున్న నేపథ్యంలో టూరిజానికి డిమాండ్ పెరిగింది. వివిధ ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీల డేటా ప్రకారం గత సీజన్‌తో పోలిస్తే ఫ్లయిట్ బుకింగ్స్ 25–30 శాతం ఎగిశాయి. అలాగే హోటల్ బుకింగ్స్ కూడా 20–30 శాతం పెరిగాయి.ఇక వీటితో పాటు ప్రయాణికులను ఆకట్టుకునేందుకు విమానయాన సంస్థ డిస్కౌంట్లు, ప్రమోషనల్ ఆఫర్లు ఇస్తున్నప్పటికీ చార్జీలు సైతం పెరిగాయి. దేశీ ప్రయాణాలకు సంబంధించి చార్జీలు సగటున 12–18 శాతం, అంతర్జాతీయ రూట్లలో చార్జీలు 8–14 శాతం పెరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి సందర్భాల్లో వీలైనంత ముందుగా ట్రావెల్ ప్రణాళికలు వేసుకోవాలంటూ కస్టమర్లకు సూచిస్తున్నట్లు వివరించాయి. లగ్జరీ హోటళ్లలో టారిఫ్‌లు జూమ్.. ఇక హోటళ్ల విషయం తీసుకుంటే, సాధారణ వీకెండ్ బుకింగ్స్‌తో పోల్చినప్పుడు లగ్జరీ, ప్రీమియం ప్రాపర్టీల్లో గదుల రేట్లు 30–40 శాతం పెరిగినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. అదే స్టాండర్డ్ హోటళ్లలో చూస్తే ధరల పెరుగుదల 15–20 శాతం మేర ఉన్నట్లు వివరించాయి. జైపూర్, ఉదయ్‌పూర్, వారణాసి, గోవా, అలీబాగ్, లోనావాలా, రిషికేష్, కూర్గ్, కేరళ వంటి డెస్టినేషన్లలో హోటల్ గదుల బుకింగ్స్ 25–30 శాతం పెరిగాయి.కుటుంబాలు, ఫ్రెండ్స్ బృందాలు ఎక్కువగా ప్రైవేట్ విల్లాలు, లగ్జరీ హోటళ్లు, ప్రీమియం రిసార్టులవైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో లగ్జరీ ప్రాపర్టీలు, ప్రైవేట్ విల్లాల బుకింగ్స్ సాధారణ వీకెండ్స్‌తో పోలిస్తే 40–50 శాతం పెరిగాయి. రాజస్థాన్, గోవాతో పాటు ప్రధాన మెట్రోలకు సమీపంలో ఉన్న హిల్ స్టేషన్లలో చాలా మటుకు ప్రీమియం, లగ్జరీ హోటల్స్ ఇప్పటికే 70–80 శాతం బుక్ అయిపోయాయి.కొన్ని రిసార్టుల్లో ఇప్పటికే ఆక్యుపెన్సీ పూర్తి స్థాయికి చేరినట్లు జోస్టెల్ సంస్థ వివరించింది. కాక్స్ అండ్ కింగ్స్ ప్రకారం జైపూర్, వారణాసి, రిషికేష్, గోవాలాంటి ప్రాంతాలకు టూర్ ప్యాకేజీలు, హోటల్ బుకింగ్స్‌కి భారీ డిమాండ్ నెలకొంది. ఇక అంతర్జాతీయంగా చూస్తే దుబాయ్, సింగపూర్, బ్యాంకాక్లాంటివి ఫేవరెట్ డెస్టినేషన్లుగా ఉంటున్నాయి. ఎయిర్‌లైన్స్ ప్రత్యేక ఆఫర్లు..హోలీ అనంతరం కూడా ప్రయాణాలకు డిమాండ్ భారీగా పడిపోకుండా విమానయాన సంస్థలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆకాశ ఎయిర్, ఇండిగో తదితర సంస్థలు పరిమిత కాలం పాటు డిస్కౌంట్లు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. పౌర విమానయాన శాఖ డేటా ప్రకారం ఫిబ్రవరి ఆఖరు వారంలో నమోదైన 5.2 లక్షల మంది రోజువారీ విమాన ప్రయాణికుల సంఖ్య మార్చి తొలి రెండు వారాల్లో సుమారు 4.8 లక్షల ప్యాసింజర్లకు పడిపోయినప్పటికీ.. వార్షికంగా చూస్తే మాత్రం మెరుగ్గానే ఉన్నట్లు తెలుస్తోంది. -
పాక్ రైల్వే విస్తీర్ణం ఎంతో తెలుసా..?
భారత్‌కు దాయాది దేశంగా ఉన్న పాకిస్థాన్‌లో బెలూచిస్థాన్ వేర్పాటు వాదులు తాజాగా తీవ్ర కార్యకలాపాలకు పాల్పడ్డారు. పాకిస్థాన్‌కు చెందిన పాక్ జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను (Jaffar Express) తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సుమారు 100కి పైగా ప్రయాణికులను బంధించారు. ఈ చర్యలను ప్రతిఘటించిన ఆరుగురు పాకిస్థాన్ జవాన్లను హతమార్చారు. పాకిస్తాన్ రైల్వే దేశవ్యాప్తంగా ముఖ్యమైన రవాణా సాధనంగా పనిచేస్తోంది. దీని విస్తృతమైన నెట్వర్క్ మారుమూల ప్రాంతాలను అనుసంధానించడంలో, వాణిజ్యాన్ని సులభతరం చేయడంలో, పర్యాటకానికి మద్దతుగా నిలవడంతో తోడ్పడుతుంది. అసలే అంతంతమాత్రంగా ఉన్న పాకిస్థాన్ ఎకనామీకి ఇలాంటి ఘటనలు కోలుకోలేని దెబ్బగా మారే ప్రమాదముందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.భారత్‌తో పోలిస్తే చాలా తక్కువ..పాకిస్థాన్‌లో 1861లో కరాచీ నుంచి కోత్రి మధ్య మొదటి రైల్వే లైన్ ప్రారంభమైంది. బ్రిటిష్ వలసరాజ్య కాలంలో నార్త్ వెస్ట్రన్ స్టేట్ రైల్వేగా స్థాపించిన ఈ రైల్వే 1947లో భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత పాకిస్థాన్ రైల్వేగా మారింది. కాలక్రమేణా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలు, పట్టణాలను కలుపుతూ నెట్‌వర్క్‌ను విస్తరించింది. ప్రస్తుతం పాకిస్థాన్ రైల్వే సుమారు 7,789 కిలోమీటర్ల మేరకు విస్తరించింది. ఇది భారతరైల్వే విస్తరించిన సుమారు 68,000 కిలోమీటర్ల ట్రాక్‌తో పోలిస్తే చాలా తక్కువ. పాక్ రైల్వే కేవలం 479 స్టేషన్లను కవర్ చేస్తుంది. ఈ నెట్వర్క్ ప్యాసింజర్, సరుకు రవాణా సేవలకు కీలకంగా మారింది.చైనా-పాక్ మధ్య ఎంఎల్-1 ప్రాజెక్ట్ఇటీవలి కాలంలో పాకిస్థాన్ రైల్వే సేవలను పెంచడానికి ఆధునీకరణ కార్యక్రమాలను ప్రారంభించింది. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా మెయిన్ లైన్ 1 (ఎంఎల్-1) వంటి ప్రధాన రైల్వే మార్గాలు ఏర్పాటు చేస్తుంది. ఇది కరాచీ, లాహోర్, పెషావర్ వంటి పట్టణ కేంద్రాలను కలుపుతుంది. ఎంఎల్-1 అప్‌గ్రేడేషన్ వంటి ప్రాజెక్టులు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, రైలు వేగాన్ని పెంచడం, రైల్వే సామర్థ్యాన్ని విస్తరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా కరాచీ నుంచి చైనాలోని పెషావర్ వరకు 1,726 కిలోమీటర్ల రైల్వే లైన్‌ను ఏర్పాటు చేయనున్నారు. క్రమంగా భవిష్యత్తులో ట్రాక్‌ను రెట్టింపు చేయడం, రైలు వేగాన్ని గంటకు 160 కిలోమీటర్లకు పెంచడం వంటివి ప్రాజెక్ట్ లక్ష్యాల్లో కీలకంగా ఉన్నాయి.ఈ ప్రాజెక్ట్ ఎందుకోసం అంటే..సరుకులు, ప్రయాణీకుల రవాణాను సులభతరం చేయడం ద్వారా ఈ ప్రాజెక్ట్ వాణిజ్యాన్ని పెంచుతుందని నమ్ముతున్నారు. ఇతర దేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షిస్తుందని, నిర్మాణ సమయంలో, తర్వాత కాలంలో కూడా వందలాది ఉద్యోగాలను సృష్టిస్తుందని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థలు, డబుల్ ట్రాక్‌లు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇవి ఆపరేషనల్ భద్రతను మెరుగుపరుస్తాయని, ప్రమాదాలను తగ్గిస్తాయని అంచనా వేస్తున్నారు. రోడ్డు రవాణా కంటే రైలు మార్గాలను ప్రోత్సహించడం ద్వారా ఈ ప్రాజెక్ట్ ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తూ, కర్బన ఉద్గారాలను నియంత్రిస్తుందని చెబుతున్నారు.ఇదీ చదవండి: ‘పెట్టుబడుల కంటే ప్రధానమైనవి ఇవే..’సవాళ్లు ఇవే..ఈ ప్రాజెక్ట్‌కు ప్రాముఖ్యత ఉన్నప్పటికీ పాకిస్థాన్ రైల్వే కాలం చెల్లిన మౌలిక సదుపాయాలతో నెట్టుకొస్తోంది. దేశంలో సరైన భద్రత లేకపోవడంతో తాజాగా జరిగిన ట్రెయిన్ హైజాక్ వంటి ఘటనలు పునరావృత్తమైతే ఆర్థిక వ్యవస్థపై, దేశ సమగ్రతపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇప్పటికే బెలుచిస్థాన్‌లో వేర్పాటు వాదులు పాకిస్థాన్‌కు పక్కలో బళ్లెంలాగా పరిణమిస్తున్నారు. దేశంలో ఇప్పటికే ఆర్థిక పరిస్థితి తీవ్రరూపం దాల్చినట్లు నివేదికలు వెల్లడవుతున్నాయి. చైనా-భారత్ మధ్య చెలరేగుతున్న భౌగోళిక అనిశ్చితుల నేపథ్యంలో భారత్‌కు శత్రు దేశమైన పాకిస్థాన్‌తో చెలిమి చేస్తే భవిష్యత్తులో ఆసరాగా ఉంటుందని చైనా నమ్ముతుంది. దాంతో పాక్ ప్రాజెక్ట్‌ల్లో చైనా పెట్టుబడి పెడుతోంది. పాక్ పెద్దలు ఈ విషయాన్ని గ్రహించినా అక్కడి ఆర్థిక పరిమితులకు లోబడి చైనాతో చెలిమి చేయక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.‘కేసీఆర్’ ప్రాజెక్టుభారత్లో ఐఆర్సీటీసీ మాదిరిగానే పాకిస్థాన్‌లో ఆన్లైన్ టికెట్ బుకింగ్, లైవ్ ట్రైన్ ట్రాకింగ్, డిజిటల్ పేమెంట్స్, రియల్ టైమ్ అప్డేట్స్ అందించే ‘రబితా అప్లికేషన్’ను అక్కడి రైల్వే ప్రవేశపెట్టింది. కరాచీలోని పట్టణ రవాణా వ్యవస్థను పునరుద్ధరించడానికి, ఆధునీకరించడానికి కరాచీ సర్క్యులర్ రైల్వే (కేసీఆర్) ప్రాజెక్టును ప్రారంభించారు. ఇది ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, నగరవాసులకు రైలు సేవలను చేరువ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. -
భారత్‌లో స్టార్‌లింక్.. ఎలాన్ మస్క్‌తో ఎయిర్టెల్ డీల్
ఢిల్లీ : ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ శుభవార్త చెప్పింది. తన వినియోగదారులకు హైస్పీడ్ ఇంటర్నెట్ను అందించేందుకు అపరకుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. స్పేస్ఎక్స్కు చెందిన స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని భారత్‌లో ఎయిర్టెల్ కస్టమర్లకు అందించనున్నట్లు ఎయిర్టెల్ ప్రెస్‌నోట్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా ఎయిటెల్ మేనేజింగ్ డైరెక్టర్, వైస్ ఛైర్మన్ గోపాల్ మిట్టల్ మాట్లాడుతూ.. భారత్‌లో ఎయిర్టెల్ కస్టమర్లకు శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందించేందుకు స్పేఎక్స్‌తో పనిచేయడం ఓ మైలురాయి. ముఖ్యంగా కస్టమర్లకు శాటిలైట్ ఇంటర్నెట్ను అందించేందుకు సంస్థ కట్టుబడి ఉంది. ఎయిర్టెల్, స్పేస్ఎక్స్ ఒప్పందంలో భాగంగా ఎయిర్టెల్ రిటైల్ స్టోర్లలో స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని పొందేందుకు అవసరమయ్యే ఎక్విప్మెంట్ పొందవచ్చు. దీంతో పాటు భారత్‌లో మారుమూల ప్రాంతాల్లో పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, తదితర వాటిని కనెక్ట్ చేసేందుకు ఈ డీల్ ఉపయోగపడనుందని తెలిపారు. ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా స్టార్‌లింక్ పేరుతో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందిస్తోంది. దీంతో పాటు మొబైల్ బ్రాడ్ బ్యాండ్‌ను అందించే లక్ష్యంతో పనిచేస్తోంది. తద్వారా యూజర్లు స్ట్రీమింగ్, వీడియో కాల్స్, ఆన్లైన్ గేమింగ్, రిమోట్ వర్కింగ్ కార్యకలాపాలు సులభతరం కానున్నాయి. ఇప్పుడే ఈ సంస్థతో ఎయిర్టెల్ ఒప్పందం కుదుర్చుకుంది. -
15 నిమిషాల్లో అంబులెన్స్: జెంజో సంస్థ కీలక నిర్ణయం
ముంబై: ఎమర్జెన్సీ సేవల సంస్థ జెంజో దేశవ్యాప్తంగా 450 నగరాల్లో 25,000 ప్రైవేట్ అంబులెన్స్‌లను ప్రవేశపెట్టింది. 15 నిమిషాల్లోపే స్పందించే విధంగా ఈ నెట్వర్క్ ఉంటుందని సంస్థ తెలిపింది. ఎమర్జెన్సీ సర్వీసులు, ప్రథమ చికిత్స, సీపీఆర్ ట్రైనింగ్ మొదలైన వాటిపై అవగాహన పెంచేందుకు జొమాటోతో పాటు ఇతరత్రా డెలివరీ ప్లాట్‌ఫాంలు, ఈకామర్స్ సంస్థలతో చేతులు కలిపినట్లు వివరించింది.దీని టోల్ ఫ్రీ నంబరు 1800 102 1298గా ఉంటుంది. 5 కి.మీ. పరిధికి బేసిక్ అంబులెన్స్ చార్జీలు రూ. 1,500గా ఉంటాయి. ఆ తర్వాత ప్రతి కిలోమీటరుకు అదనంగా రూ. 50 చెల్లించాలి. కార్డియాక్ అంబులెన్స్కైతే 5 కి.మీ.కు రూ. 2,500, ఆ తర్వాత నుంచి ప్రతి కిలోమీటరుకు రూ. 100 చార్జీలు వర్తిస్తాయి. రాబోయే రోజుల్లో డిమాండ్‌ను బట్టి మరిన్ని నగరాల్లో మరిన్ని అంబులెన్స్‌లను జోడిస్తామని సంస్థ సహ వ్యవస్థాపకురాలు శ్వేతా మంగళ్ తెలిపారు. -
పోర్ట్‌ఫోలియోలో వైవిధ్యానికి మొమెంటం ఇన్వెస్టింగ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టాక్స్‌కి సంబంధించి నిర్దిష్ట లక్షణాల ప్రాతిపదికన పెట్టుబడులు పెట్టే ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్లో భాగంగా ముమెంటం ఇన్వెస్టింగ్‌కి గణనీయంగా ప్రాచుర్యం పెరుగుతోందని టాటా అసెట్ మేనేజ్మెంట్ హెడ్ (ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్) ఆనంద్ వరదరాజన్ తెలిపారు.డిమాండ్ దృష్ట్యా ఎన్ఎస్ఈ ప్రస్తుతం దాదాపు 31 ఫ్యాక్టర్ ఆధారిత సూచీలను అందిస్తోందని వివరించారు. ధరపరంగా బలమైన ట్రెండ్‌ను ప్రదర్శిస్తున్న స్టాక్స్‌ను గుర్తించి, క్రమశిక్షణతో పెట్టుబడులు పెట్టడం ద్వారా అధిక రాబడులను అందించడంపై ముమెంటం ఇన్వెస్టింగ్ ప్రధానంగా దృష్టి పెడుతుందని తెలిపారు. దీర్ఘకాలికంగా మెరుగైన రాబడులను అందుకునేందుకు, పోర్ట్‌ఫోలియోలో వైవిధ్యాన్ని పాటించేందుకు ఇన్వెస్టర్లు కొంత భాగాన్ని ఈ వ్యూహానికి కేటాయించే అవకాశాన్ని పరిశీలించవచ్చని వరదరాజన్ చెప్పారు. గత కొన్నాళ్లుగా మార్కెట్లు కరెక్షన్కు లోను కావడంతో పాటు ఒడిదుడుకులమయంగా ఉంటున్నప్పటికీ నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 ముమెంటం 50 ఇండెక్స్‌ను ట్రాక్ చేసే ఇండెక్స్ ఫండ్స్ మాత్రం మెరుగ్గా రాణిస్తున్నాయని పేర్కొన్నారు. తమ టాటా నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 ముమెంటం 50 ఇండెక్స్ ఫండ్‌లోకి గతేడాది పెట్టుబడులు మూడింతలై సుమారు రూ. 500 కోట్లకు చేరడం వీటిపై పెరుగుతున్న ఆకర్షణకు నిదర్శనమని వరదరాజన్ తెలిపారు. -
మస్క్ పతనం మొదలైందా?: లక్షల కోట్లు ఆవిరి
టెస్లా, స్పేస్ఎక్స్, ఎక్స్ (ట్విటర్) వంటి సంస్థలను విజయవంతంగా ముందుకు నడిపిస్తున్న ఎలాన్ మస్క్ సంపద భారీగా ఆవిరవుతోంది. ఇటీవల తన నికర విలువలో 120 బిలియన్ డాలర్లు (రూ. 10లక్షల కోట్ల కంటే ఎక్కువ) తగ్గింది. అయితే.. 330 బిలియన్ డాలర్ల సంపదతో, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్నప్పటికీ.. 2025 ప్రారంభం నుంచి సంపదలో 25 శాతం క్షీణతను పొందారు. ఇది ఇలాగే కొనసాగితే.. నెం.1 స్థానానికే ముప్పు ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.మస్క్ తరువాత స్థానంలో అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ (Jeff Bezos), ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) ఉన్నారు. మస్క్ సంపద ఇలాగే తగ్గుతూ పోతే.. ప్రపంచ కుబేరుడి స్థానాన్ని మరొకరు స్వాధీనం చేసుకుంటారు.మస్క్ సంపద తగ్గడానికి కారణంమస్క్ సంపద తగ్గడానికి ప్రధాన కారణం టెస్లా (Tesla) అని తెలుస్తోంది. ఈ ఎలక్ట్రిక్ కార్ కంపెనీ అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉండటం వల్ల.. టెస్లా అమ్మకాలు 2024 డిసెంబర్ నుంచి 2025 జనవరి వరకు 16 శాతం తగ్గాయి. అంతే కాకుండా గత రెండు నెలల్లో, టెస్లా షేర్ ధర దాదాపు 35% తగ్గింది. దీంతో మస్క్ సంపద గణనీయంగా తగ్గింది.ఇదీ చదవండి: ఎక్స్‌పై సైబర్ ఎటాక్ ఆ దేశం పనే!మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసే సంస్థలు కూడా పెరిగాయి. దీంతో చాలామంది కొత్త కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపారు. దెబ్బకు టెస్లా ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు పడిపోయాయి. అమ్మకాల్లో ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వాల్సి వచ్చింది. కాగా టెస్లా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు తెలుస్తోంది.రాజకీయ ప్రమేయంప్రపంచ కుబేరుడు, దిగ్గజ వ్యాపారవేత్త మస్క్ సంపద తగ్గడానికి మరో కారణం.. పెరుగుతున్న రాజకీయ ప్రమేయం అని తెలుస్తోంది. ట్రంప్ ఎన్నికల ప్రచారానికి మస్క్ భారీగా ఖర్చు చేశారు. దీంతో అమెరికా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత.. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ (DOGE) అధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తరువాత కొంతమంది పెట్టుబడిదారులతో భయం మొదలైంది. ఇది కూడా మస్క్ కంపెనీ షేర్స్ తగ్గడానికి కారణమైంది. -
ఐఫోన్లపై అదిరిపోయే డిస్కౌంట్స్!
భారతదేశంలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ (మార్చి 7 నుంచి 13 వరకు) ప్రారంభమైంది. ఇందులో భాగంగా లేటెస్ట్ ఐఫోన్ 16, ఐఫోన్ 15 మోడళ్లపై డిస్కౌంట్స్ కూడా ప్రకటించింది. ఈ తగ్గింపులకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ఐఫోన్ 16 సిరీస్ ఆఫర్లుఐఫోన్ 16 బేస్ వేరియంట్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 79,900 నుంచి 68,999 రూపాయలకు చేరింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆఫర్ కింద రూ. 4000, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కింద రూ. 5000 తగ్గింపును పొందవచ్చు. అంటే ఇప్పుడు ఐఫోన్ 16ను రూ. 59,999లకు సొంతం చేసుకోవచ్చు. నో కాస్ట్ ఈఎమ్ఐ కూడా రూ. 10,000 నుంచి ప్రారంభమవుతుంది.కొత్తగా విడుదలైన ఐఫోన్ 16e ధర రూ. 59,900. అయితే ఇది ఇప్పుడు 55,900 రూపాయలకు అందుబాటులో ఉంది. ఐఫోన్ 16 ప్లస్ ధర రూ. 89,900 నుంచి రూ. 78,999కు చేరింది. ఐఫోన్ 16 ప్రో రూ. 1,19,900 నుంచి రూ. 1,08,900కు & ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ అసలు ధర రూ. 1,44,900 కాగా, సేల్‌లో భాగంగా రూ. 1,31,900కు లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్స్, ఇతర ప్రయోజనాలను ఉపయోగించుకుంటే.. వీటి ధరలు మరింత తగ్గుతాయి.ఐఫోన్ 15 సిరీస్ ఆఫర్లుఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సమయంలో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 14 వరుసగా రూ. 60,999, రూ. 64,999 & రూ. 50,999 ప్రారంభ ధరలకు అందుబాటులో ఉన్నాయి. సాధారణ డిస్కౌంట్లతో పాటు, కొనుగోలుదారులు నో కాస్ట్ ఈఎమ్ఐ ఎంపికలు, స్టాండర్డ్ ఈఎమ్ఐ ఎంపికలు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు, కూపన్ ఆధారిత డిస్కౌంట్లను సేల్‌లో పొందవచ్చు. -
జీవ్ మే శివ్ హై.. వంతారా కృషిపై ఆధ్యాత్మిక గురువు స్పందన
వన్యప్రాణుల సంరక్షణలో అనంత్ అంబానీ చేస్తున్న విశేష కృషిని బాగేశ్వర్ ధామ్ ఆధ్యాత్మిక గురువు ధీరేంద్ర కృష్ణ శాస్త్రి ప్రశంసించారు. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ నేతృత్వంలోని ప్రపంచంలోనే అతిపెద్ద జంతు సంరక్షణ, పునరావాస కేంద్రం వంతారా ‘జీవ్ మే శివ్ హై’ అనే దృక్పథంతో పని చేస్తుందని చెప్పారు. ధీరేంద్ర శాస్త్రి వంతారా చేస్తున్న కృషిని కొనియాడుతూ వీడియో విడుదల చేశారు. అదికాస్తా వివిధ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.వీడియోలో ధీరేంద్ర కృష్ణ శాస్త్రి తెలిపిన వివరాల ప్రకారం..‘జీవ్ మే హి శివ్ హై.. ప్రతి జీవంలో శివుడు ఉంటాడు. ఇది అన్ని జీవుల్లో దైవిక ఉనికిని గుర్తించే తత్వం. ఎన్నో కారణాలవల్ల సంరక్షణకు నోచుకోని జంతువులకు కొత్త జీవితాన్ని అందించే కేంద్రం వంతారా ఎంతో కృషి చేస్తోంది. వంతారా అంటే ‘అటవీ నక్షత్రం’. దీని పేరుకు తగినట్లుగానే ఎన్నో వన్యప్రాణులను రక్షిస్తోంది. ఇందుకు అనంత్ అంబానీ అనుసరిస్తున్న విధానాలు ప్రశంసణీయం. వంతారా ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి వణ్యప్రాణుల సంరక్షణ చర్యలకు ప్రేరణ ఇస్తోంది. మానవాళికి సమస్త జీవరాశుల సంరక్షణ స్ఫూర్తిని పెంపొందిస్తోంది’ అని తెలిపారు. View this post on Instagram A post shared by Peepingmoon (@peepingmoonofficial)వంతారాఅనంత్ అంబానీ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో 3వేల ఎకరాల్లో వంతారా పేరుతో కృత్రిమ అడవిని ఏర్పాటు చేశారు. ఇందులో జంతువులు నివసించేందుకు వీలుగా సహజంగా ఉండేలా వసతులు ఏర్పాటు చేశారు. ఈ అడవిలో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రి ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్దది. పూర్తిగా పోర్టబుల్ ఎక్స్‌రే యంత్రాలు, శస్త్ర చికిత్సల కోసం లేజర్ యంత్రాలు, పాథాలజీ ల్యాబ్‌లు, హైపర్బారిక్ ఆక్సిజన్ ఛాంబర్‌తోపాటు అధునాతన సదుపాయాలు ఉన్నాయి. ఈ ఎలిఫెంట్ కేర్ సెంటర్లో 240కి పైగా ఏనుగులను రక్షించారు. అల్లోపతి, ఆయుర్వేదం, ఆక్యుపంక్చర్(చైనాలో మాదిరి సుదులతో గుచ్చి రోగాన్ని నయం చేయడం) వైద్యాన్ని సమ్మిళితం చేసే అధునాతన పశువైద్య చికిత్సలను వంతారాలో అందిస్తున్నారు. ఆర్థరైటిస్ చికిత్స కోసం హైడ్రోథెరపీ, గాయం నయం చేయడానికి హైపర్బారిక్ ఆక్సిజన్ ఛాంబర్ వంటి ప్రత్యేక సదుపాయాలున్నాయి.ఇదీ చదవండి: హోలీ గేట్‌వే సేల్.. రూ.1,199కే విమాన ప్రయాణం!‘ప్రాణి మిత్ర’గా గుర్తింపుఅనంత్ అంబానీకి జంతు సంరక్షణలో చేస్తున్న కృషికి గుర్తుగా ఇటీవల భారతదేశపు అత్యున్నత గౌరవమైన ప్రతిష్టాత్మక ‘ప్రాణి మిత్ర’ జాతీయ పురస్కారం లభించింది. ప్రాణి మిత్ర జాతీయ పురస్కారం జంతు సంరక్షణ విభాగంలో అందించే అత్యున్నత పురస్కారం. జంతువుల శ్రేయస్సుకు అవార్డు గ్రహీతలు చేసిన అసాధారణ కృషిని ఇది గుర్తిస్తుంది. గత ఐదేళ్లలో జంతు సంక్షేమానికి విశేష కృషి చేసిన సంస్థలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ సంస్థలు, సహకార సంఘాల కృషిని గుర్తించి భారత ప్రభుత్వం ఈ అవార్డును అందిస్తోంది. -
హోలీ గేట్‌వే సేల్.. రూ.1,199కే విమాన ప్రయాణం!
ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఇండిగో తన వినియోగదారులకు హోలీ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ‘హోలీ గెట్‌వే సేల్’ పేరుతో ఆకర్షణీయ ఆఫర్లను అందించింది. ఇది ప్రయాణికులు తక్కువ ధరలతే తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు అవకాశం కల్పిస్తుందని కంపెనీ తెలిపింది. ఇందులో భాగంగా మార్చి 10 నుంచి మార్చి 12, 2025 వరకు బుకింగ్స్ కోసం పరిమిత ఆఫర్‌ను అందిస్తుంది. ఈ సమయాల్లో విమాన టికెట్లు బుక్ చేసిన ప్యాసింజర్లు మార్చి 17 నుంచి సెప్టెంబర్ 21, 2025 వరకు ప్రయాణించేందుకు వీలు కల్పిస్తున్నట్లు పేర్కొంది.విమాన ఛార్జీలు ఇలా..ఈ హోలీ గెట్‌వే సేల్‌లో భాగంగా ఇండిగో దేశీయ రూట్లలో రూ.1,199, అంతర్జాతీయ రూట్లలో రూ.4,199 నుంచి వన్ వే విమాన ఛార్జీలు అమలు చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. రానున్న వేసవిలో విహారయాత్రలు, సెలవులకు వెళ్లే వారికి ఈ ఆఫర్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పింది. విమాన ఛార్జీల్లో తగ్గుదలతోపాటు యాడ్-ఆన్ సర్వీసుల్లో డిస్కౌంట్లను కూడా అందిస్తున్నట్లు పేర్కొంది. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలకు ప్రీపెయిడ్ అదనపు బ్యాగేజీపై 20 శాతం వరకు తగ్గింపు ఇస్తున్నారు. స్టాండర్డ్ సీట్ సెలక్షన్లో 35 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు. నిబంధనల ప్రకారం ముందుగా బుక్ చేసుకున్న వారికి భోజనం ఖర్చులో 10 శాతం తగ్గింపు ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది.ఇదీ చదవండి: ఐపీఎల్లో పొగాకు, మద్యం ఉత్పత్తుల ప్రకటనలపై నిషేధం?అదనంగా ఐదు శాతం తగ్గింపు..ఇండిగో అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా తమ విమానాలను బుక్ చేసుకునే ప్రయాణికులు అదనంగా 5 శాతం డిస్కౌంట్ పొందవచ్చని కంపెనీ పేర్కొంది. అయితే ఇండిగో హోలీ గెట్ వే సేల్ పరిధిలోని ఏయే గమ్యస్థానాలు వస్తాయో స్పష్టత ఇవ్వలేదు. సంస్థ విమానాల నెట్వర్క్ దేశీయ, అంతర్జాతీయ గమ్యస్థానాలను కవర్ చేస్తుంది. ప్రధానంగా ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, కోల్‌కతా వంటి ప్రసిద్ధ దేశీయ నగరాలతో పాటు దుబాయ్, సింగపూర్, బ్యాంకాక్, కౌలాలంపూర్ వంటి అంతర్జాతీయ గమ్యస్థానాలకు అధికంగా సర్వీసులు నడుపుతోంది. వీటికి ఉన్న పాపులారిటీ, కనెక్టివిటీ దృష్ట్యా ఈ సేల్‌లో ఈ గమ్యస్థానాలు భాగం అయ్యే అవకాశం ఉంది. -
ఐపీఎల్లో పొగాకు, మద్యం ఉత్పత్తుల ప్రకటనలపై నిషేధం?
ప్రజారోగ్యాన్ని పెంపొందించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మ్యాచ్‌లు, సంబంధిత కార్యక్రమాలు, జాతీయ టెలివిజన్ ప్రసారాల సమయంలో అన్ని రకాల పొగాకు, ఆల్కహాల్ ప్రకటనలను నిషేధించాలని కోరింది. ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించడంలో, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్సీడీ) వ్యాప్తిని నియంత్రించడంలో క్రీడల పాత్ర కీలకమని ఎత్తిచూపుతూ ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ సింగ్ ధుమాల్, బీసీసీఐకి లేఖ రాసింది.దేశంలో ఏటా సంభవించే మరణాల్లో 70 శాతం ఎన్సీడీల వల్ల జరుగుతున్నవేనని ఆరోగ్య మంత్రిత్వ శాఖ లేఖలో హైలైట్ చేసింది. పొగాకు, మద్యపానం హృదయ సంబంధ వ్యాధులు, క్యాన్సర్, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు, మధుమేహంతో సహా అనేక ఇతర రోగాలకు దోహదం చేసే ప్రధాన ప్రమాద కారకాలుగా ఉన్నాయని తెలిపింది. పొగాకు సంబంధిత మరణాల్లో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి దాదాపు 14 లక్షల మరణాలతో రెండో స్థానంలో ఉందని గణాంకాలను తెలియజేసింది.ఇదీ చదవండి: స్వల్పంగా పెరిగిన బంగారం ధర! తులం ఎంతంటే..క్రికెట్‌కు భారత్‌లో ఆదరణ పెరుగుతోందని తెలియజేస్తూ, క్రీడలు ప్రజల ఆరోగ్య సంరక్షణ బాధ్యతను నిర్వర్తించాలని చెప్పింది. పొగాకు లేదా ఆల్కహాల్ బ్రాండ్లను ప్రోత్సహించే ప్రకటనలను నిరోధించడానికి కఠినమైన నిబంధనలు అనుసరించాలని ఐపీఎల్, బీసీసీఐను మంత్రిత్వ శాఖ కోరింది. అంతేకాకుండా క్రీడాకారులు, కామెంటేటర్లు, ఇతర భాగస్వాములు పొగాకు, ఆల్కహాల్‌తో ముడిపడి ఉన్న ఉత్పత్తులను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రోత్సహించకుండా తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఐపీఎల్‌కు ఉన్న అపారమైన ప్రజాదరణ, రోల్ మోడల్స్‌గా క్రికెటర్ల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజారోగ్య కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని తెలిపింది. మార్చి 22 నుంచి ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభంకానుంది. -
రూ.550 కోట్లతో కూతురి పెళ్లి.. దివాలా తీసిన వ్యాపారవేత్త
ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికి తెలియదు. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయి. అలాంటి ఘటన ఒకటి బడా పారిశ్రామికవేత్త విషయంలో నిజమయ్యింది. ఒకప్పుడు ఉక్కు పరిశ్రమలో ప్రముఖ వ్యక్తిగా ప్రమోద్ మిట్టల్‌కు గొప్పపేరుండేది. విలాసవంతమైన జీవనశైలికి బ్రాండ్అంబాసిడర్గా ఉండే మిట్టల్ సుమారు రూ.24,000 కోట్ల అప్పు తీర్చలేక దివాలా తేశారు. ఒక్కప్పుడు తన కూతురి పెళ్లికి ఏకంగా రూ.550 కోట్లు ఖర్చు చేసి వార్తల్లో నిలిచిన ఆ వ్యక్తి ఎందుకు ఇంతలా దిగజారిపోయారు. అందుకుగల కారణాలను ఈ కథనంలో తెలుసుకుందాం.భారతీయ ఉక్కు దిగ్గజం, ప్రపంచంలోని అతిపెద్ద ఉక్కు మైనింగ్ కంపెనీ ఆర్సెలర్ మిట్టల్ ఛైర్మన్, దేశంలోని స్టీల్ పరిశ్రమలో ఎన్నో విజయాలు సాధించి ‘స్టీల్ మాగ్నెట్’గా పేరు తెచ్చుకున్న లక్ష్మీ మిట్టల్ సోదరుడే ఈ ప్రమోద్ మిట్టల్. మైనింగ్, మెటల్స్ రంగంలో లక్ష్మీ మిట్టల్ అత్యంత సంపన్నుల్లో ఒకరిగా కొనసాగుతుండగా, ప్రమోద్ అదృష్టం మరో మలుపు తిరిగింది. బిలియనీర్‌గా, ఇస్పాత్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్‌గా ప్రమోద్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని కొనసాగించారు. 2013లో తన కుమార్తె సృష్టి మిట్టల్ పెళ్లి కోసం రూ.550 కోట్లు వెచ్చించి వార్తల్లో నిలిచారు. స్పెయిన్‌లోని బార్సిలోనాలో జరిగిన ఈ వివాహ కార్యక్రమంలో రుచికరమైన వంటకాలు, విస్తారమైన అలంకరణలు, హైప్రొఫైల్ అతిథులు పాల్గొన్నారు.బోస్నియా కోక్ ఉత్పత్తిదారు గ్లోబల్ ఇస్పాత్ కోక్స్నా ఇండస్ట్రీస్ లుకావాక్ (జీఐకేఐఎల్) చేసిన అప్పులకు హామీదారుగా ప్రమోద్ మిట్టల్ పాత్ర ఉందని అధికారులు తెలిపారు. ఇది దాని ఆర్థిక బాధ్యతలను తీర్చడంలో విఫలమైంది. దాంతో ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరిగా ఉన్న ప్రమోద్ ఆర్థిక సామ్రాజ్యం కుప్పకూలింది. మోసం ఆరోపణలపై 2019లో బోస్నియాలో తనను అరెస్టు చేశారు. రూ.24,000 కోట్లకు పైగా అప్పులతో ప్రమోద్ దివాలా తీసినట్లు 2020లో లండన్ కోర్టు ప్రకటించింది. తుజ్లాలోని కంటోనల్ కోర్టు జీఐకేఐఎల్ నష్టపరిహారంగా దాదాపు 11 మిలియన్ యూరోలను డిపాజిట్ చేయాలని ప్రమోద్ను ఆదేశించింది. దాంతో అతని ఆర్థిక కష్టాలు మరింత పెరిగాయి.ఇదీ చదవండి: 100 మంది ఐటీ ఉద్యోగులు ర్యాలీ.. కారణం..ప్రమోద్ మిట్టల్ వ్యవహారం నేర్పే ఆర్థిక పాఠాలు..మితిమీరిన అప్పులు: మిట్టల్ ఆర్థిక ఇబ్బందులకు ప్రధాన కారణం మితిమీరిన అప్పులు చేయడం. తిరిగి చెల్లించే సామర్థ్యానికి మించి రుణాలు తీసుకోవడం వ్యక్తులకు, వ్యాపారాలకు దివాలాకు దారితీస్తుంది.వివేకవంతమైన ఖర్చు: తన కుమార్తె వివాహానికి విచ్చలవిడిగా ఖర్చు చేయడం, సంపదను ప్రదర్శించడం, అదుపులేని దుబారా వల్ల ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వానికి ప్రాధాన్యమివ్వడం కీలకం.రిస్క్ మేనేజ్మెంట్: జీఐకేఐఎల్ కేసులో మిట్టల్ చేసినట్లుగా రుణాలకు హామీదారుగా వ్యవహరించడం సరికాదు. అవతలి పక్షం అప్పులు చెల్లించడంలో డిఫాల్ట్ అయితే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. హామీలకు కట్టుబడి ఉండేముందు ప్రమాదాలను అర్థం చేసుకోవడం చాలా అవసరం.ఫైనాన్షియల్ ప్లానింగ్: అపారమైన సంపద ఉన్నప్పటికీ పేలవమైన ఆర్థిక ప్రణాళిక, ఆకస్మిక నిల్వలు లేకపోవడం దివాలాకు దారితీస్తుంది. అత్యవసర నిధిని నిర్వహించేటప్పుడు ఆస్తులను వైవిధ్యపరచడం చాలా ముఖ్యం. -
100 మంది ఐటీ ఉద్యోగులు ర్యాలీ.. కారణం..
ఐటీ రంగంలో ఆరోగ్యకరమైన వర్క్-లైఫ్ బ్యాలెన్స్(Work Life Balance) విధానానికి ఉద్యోగులు తమ మద్దతు ప్రకటిస్తున్నారు. వర్క్-లైఫ్ సమతుల్యత కోసం కర్ణాటక స్టేట్ ఐటీ/ఐటీఈఎస్ ఎంప్లాయీస్ యూనియన్ (కేఐటీయూ) ఆధ్వర్యంలో బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్ వద్ద 100 మందికి పైగా ఐటీ నిపుణులు సమావేశమయ్యారు. ఉద్యోగుల ఆరోగ్యం, మానసిక శ్రేయస్సుపై అధిక పని గంటలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. ప్రస్తుత పని విధానాలపై పెరుగుతున్న ఆందోళనలను పరిష్కరించడమే లక్ష్యంగా ఇటీవల ర్యాలీ నిర్వహించారు.ఐటీ రంగంలో ఉత్పాదకతను పెంచేందుకు పరిష్కారంగా పనివేళలను పొడిగించాలని సూచించిన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి, ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ సహా కొందరు పరిశ్రమ ప్రముఖులు ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ఈ నిరసన నిర్వహించారు. పని వేళలపై కంపెనీ ప్రముఖులు చేసిన ప్రకటనలు విస్తృత విమర్శలకు దారితీశాయి. చాలా మంది ఉద్యోగులు శారీరక, మానసిక ఆరోగ్యంపై అధిక పనివేళలు వంటి పద్ధతుల ప్రతికూల ప్రభావాన్ని ర్యాలీలో ఎత్తిచూపారు.అధిక పని ఒత్తిడితో సమస్యలుచాలా కాలంగా పని సంస్కృతితో ఐటీ రంగం విమర్శల పాలవుతోంది. ఇందులో వెంటనే సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరాన్ని కేఐటీయూ సభ్యులు నొక్కిచెప్పారు. కేఐటీయూ ప్రధాన కార్యదర్శి సుహాస్ అడిగ మాట్లాడుతూ..‘దేశంలో ఐటీ కంపెనీలు అనుసరిస్తున్న సుదీర్ఘ పని గంటల వల్ల ఉద్యోగులపై హానికరమైన ప్రభావాలు ఉంటున్నాయి. ఈ మేరకు అనేక అధ్యయనాలు, సర్వేలు వెల్లడవుతున్నాయి. ఈ రంగంలో 70 శాతానికి పైగా ఉద్యోగులు అధిక పని ఒత్తిడి కారణంగా మానసిక, ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. వెంటనే ప్రస్తుతం పని విధానంలో సంస్కరణలు తీసుకురావాలి’ అని డిమాండ్ చేశారు.రైట్ టు డిస్కనెక్ట్ విధానం..రోజువారీ పని గంటల పరిమితులను అమలు చేయడం, కార్మిక చట్ట ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోవడం, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో అవలంబిస్తున్నట్లు ‘రైట్ టు డిస్కనెక్ట్’(అధికారిక పని వేళలు పూర్తయితే ఈమెయిల్స్, కాల్స్ లేదా సందేశాలు వంటి కమ్యూనికేషన్లకు స్పందిచకూడదనే నిబంధన) విధానాన్ని అమలు చేయాలని యూనియన్ డిమాండ్ చేస్తుంది. పనిగంటలను క్రమబద్ధీకరించడంలో, కార్మిక చట్టాలను పాటించేలా చూడటంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం లేదని ఉద్యోగులు విమర్శించారు. ఓవర్ టైమ్ అలవెన్స్‌లు, చట్టబద్ధమైన పనిగంటల పరిమితులను ఉల్లంఘించారని ఆరోపిస్తూ గత ఏడాది కార్మిక మంత్రికి వినతిపత్రం సమర్పించినప్పటికీ ఈ సమస్యల పరిష్కారానికి నిర్దిష్టమైన చర్యలు తీసుకోలేదని యూనియన్ పేర్కొంది.ఇదీ చదవండి: నేటి నుంచి యూఎస్‌పై చైనా సుంకాలు.. వ్యూహాత్మక ప్రతీకారండిమాండ్లు తెలిపేందుకే ర్యాలీఉద్యోగులు తమ ఆందోళనలను వ్యక్తం చేయడానికి, పాలసీ విధానకర్తలకు తమ డిమాండ్లు తెలియజేయడానికి ఈ ర్యాలీ ఒక వేదికగా నిలిచిందని ఉద్యోగులు భావిస్తున్నారు. ఈ ర్యాలీలోని ఒక ఐటీ ఉద్యోగి స్పందిస్తూ..‘మేము మా ఉద్యోగాలను ప్రేమిస్తాం. పరిశ్రమకు సహకారం కొనసాగించాలనుకుంటున్నాం. కానీ అదే సమయంలో మా ఆరోగ్యం, వ్యక్తిగత జీవితాలను పణంగా పెట్టం’ అని అన్నారు. ప్రస్తుత పని విధానాలకు వ్యతిరేకంగా ఐటీ నిపుణుల్లో పెరుగుతున్న అవగాహన, వ్యతిరేకతను ఈ కార్యక్రమం హైలైట్ చేసింది. దేశంలోని అత్యంత ప్రముఖ పరిశ్రమల్లో ఐటీ ఒకటి. ఈ విభాగంలో ఉద్యోగుల్లో స్నేహపూర్వక పని వాతావరణాన్ని సృష్టించడానికి సమష్టి కృషి అవసరం. -
ఈ ఏడాది మరో 500 నగరాల్లో సర్వీసులు
న్యూఢిల్లీ: ఈ ఏడాది మరో 500 నగరాల్లో సర్వీసులను విస్తరించే ప్రణాళికల్లో ఉన్నట్లు రైడ్ సేవల సంస్థ ర్యాపిడో సహ వ్యవస్థాపకుడు పవన్ గుంటుపల్లి వెల్లడించారు. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మార్కెట్లలో 50 పైచిలుకు నగరాల్లో సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. తదుపరి తమిళనాడు, కర్ణాటకలో, ఆ తర్వాత ఉత్తరాది రాష్ట్రాల్లోను విస్తరించనున్నట్లు పవన్ చెప్పారు. ప్రస్తుతం రోజుకు 33 లక్షల రైడ్లు నమోదవుతున్నాయన్నారు. ఇందులో 15 లక్షలు టూ–వీలర్ల విభాగంలో, 13 లక్షలు త్రీ–వీలర్ సెగ్మెంట్లో, 5 లక్షల రైడ్స్ కార్ల విభాగంలో ఉంటున్నాయని పవన్ చెప్పారు. గతేడాదే తాము ఫోర్ వీలర్ల విభాగంలోకి ప్రవేశించినా, గణనీయంగా వృద్ధి నమోదు చేశామని తెలిపారు. తాము కమీషన్ ప్రాతిపదికన కాకుండా ప్లాట్‌ఫాం యాక్సెస్ ఫీజు విధానాన్ని అమలు చేయడం వల్ల కెప్టెన్లకు (డ్రైవర్లు) ఆదాయ అవకాశాలు మరింతగా ఉంటాయని పవన్ చెప్పారు. కంపెనీ వద్ద గణనీయంగా నిధులు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం పబ్లిక్ ఇష్యూకి వచ్చే యోచనేదీ లేదన్నారు. ప్రస్తానికి కార్యకలాపాల విస్తరణపైనే ఫోకస్ చేస్తున్నట్లు చెప్పారు. -
గ్రాన్యూల్స్ ఇండియాకు ఎఫ్‌డీఏ అక్షింతలు
ముంబై: ఫార్ములేషన్స్ ప్లాంటులో నిర్వహణ లోపాలకు గాను గ్రాన్యూల్స్ ఇండియాను అమెరికా ఆహార, ఔషధ రంగ నియంత్రణ సంస్థ యూఎస్ఎఫ్డీఏ తీవ్రంగా ఆక్షేపించింది. ఔషధాలను నిల్వ చేయడంలో, యంత్ర పరికరాల పరిశుభ్రత, నిర్వహణ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు నిరూపించడంలో విఫలమైనట్లు వ్యాఖ్యానించింది. తెలంగాణలోని మేడ్చల్–మల్కాజిగిరి తయారీ ప్లాంటులో గతేడాది ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 6 వరకు నిర్వహించిన తనిఖీలకు గాను కంపెనీ సీఎండీ కృష్ణప్రసాద్ చిగురుపాటికి ఎఫ్‌డీఏ ఈ మేరకు హెచ్చరిక లేఖ పంపింది. ఔషధాలు కలుషితం కాకుండా నివారించే ఫిల్టర్లు ఉన్నప్పటికీ, వాటిని సరిగ్గా శుభ్రం చేయకపోవడం వల్ల అవి నిరుపయోగంగా మారాయని తనిఖీల్లో తేలినట్లు పేర్కొంది. తయారీ, ప్రాసెసింగ్, ప్యాకింగ్, నిల్వకు ఉపయోగించే బిల్డింగ్‌ల నిర్వహణ సరిగ్గా లేదని వ్యాఖ్యానించింది. ఎయిర్ ప్యూరిఫికేషన్ యూనిట్లు, డక్ట్లు, ఫ్లోర్‌ల్లాంటి నిర్దిష్ట ప్రదేశాల్లో పక్షుల రెట్టలు, ఈకలు కనిపించినట్లు పేర్కొంది. దిద్దుబాటు చర్యలపై సంతృప్తి కలిగేంత వరకు కంపెనీ సమర్పించే కొత్త ఔషధాల దరఖాస్తులకు అనుమతులను నిలిపివేయొచ్చని పేర్కొంది. -
దేశీ ఎయిర్‌లైన్స్‌లో అవకాశాలపై ఐబీఎస్ ఫోకస్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ట్రావెల్ పరిశ్రమకు సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్విస్ (సాస్) సేవలు అందించే ఐబీఎస్ సాఫ్ట్వేర్ .. భారత ఎయిర్‌లైన్స్ రంగంలో, లాయల్టీ ప్రోగ్రామ్స్ విభాగంలో అవకాశాలను అందిపుచ్చుకోవడంపై దృష్టి పెడుతోంది. తాము ప్రస్తుతం భారత్‌లో ఎయిర్ కార్గో నిర్వహణ విభాగంలో, అలాగే ఎయిరిండియాకి స్టాఫ్ ట్రావెల్ మేనేజ్మెంట్కి సంబంధించి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అందిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు, చైర్మన్ వీకే మాథ్యూస్ తెలిపారు. మిగతా పోటీ సంస్థలతో పోలిస్తే తమ ఉత్పత్తులు కాస్త ఖరీదైనవిగానే ఉంటాయి కాబట్టి తగిన భాగస్వామిని ఎంచుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ధరకు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చే భారత మార్కెట్లో ఐటీని విలువను చేకూర్చేదిగా కాకుండా ఖర్చుగానే పరిగణిస్తారని, కానీ ప్రస్తుతం ఆ ధోరణి క్రమంగా మారుతోందని మాథ్యూస్ చెప్పారు. ఇప్పుడు ధరే ప్రాతిపదికగా ఉంటున్నప్పటికీ ఎకానమీ పురోగమించే కొద్దీ విలువకు ప్రాధాన్యత పెరుగుతుందన్నారు. మిగతా మార్కెట్లలోలాగా భారత్, చైనా మార్కెట్లలో తాము అంత విజయం సాధించలేకపోయామని అంగీకరించిన మాథ్యూస్ భారత మార్కెట్‌కి గణనీయంగా వృద్ధి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. వచ్చే 20 ఏళ్ల పాటు వృద్ధి బాటలో కొనసాగుతుందన్నారు. కస్టమర్లతో మెరుగైన సంబంధాలు, అత్యుత్తమ టెక్నాలజీ సిస్టంలు, ట్రావెల్ కామర్స్ మొదలైనవి పరిశ్రమలో కీలక ట్రెండ్స్‌గా ఉంటున్నాయన్నారు. -
టాటా స్టీల్ మూసివేత.. 900 మంది అప్పు తీర్చిన హాలీవుడ్ నటుడు
సౌత్ వేల్స్ లోని పోర్ట్ టాల్బోట్లోని టాటా స్టీల్ బ్లాస్ట్ ఫర్నేస్ మూసివేత తర్వాత అక్కడి వారి జీవితాలు దుర్భరంగా మారాయి. 2,800 మంది కార్మికుల ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో అదే ప్రాంతానికి చెందిన ప్రముఖ హాలీవుడ్ నటుడు మైఖేల్ షీన్.. తమ ప్రాంత ప్రజలను ఆదుకునేందుకు ముందుకువచ్చారు. సుమారు 900 మందికి చెందిన 1 మిలియన్ పౌండ్ల (సుమారు రూ.8 కోట్లు) రుణాలను తాను చెల్లించారు.ది క్వీన్, గుడ్ ఓమెన్స్, ట్విలైట్ చిత్రాల్లో నటించిన మైఖేల్ షీన్ బాధితుల ఆర్థిక భారాన్ని తగ్గించే బాధ్యతను తనపై వేసుకున్నాడు. షీన్ తన వ్యక్తిగత సంపాదన లోంచి 1,00,000 పౌండ్లు వెచ్చించి 900 మందికి సంబంధించిన రుణాలను తీర్చడం కోసం ఒక సంస్థను స్థాపించాడు. రుణ పరిశ్రమ ఎలా పనిచేస్తుందనే దానిపై మొదట్లో తనకు అవగాహన లేదని, కానీ మార్పు తీసుకురావాలని నిశ్చయించుకున్నానని షీన్ చెప్పాడు. మైఖేల్ షీన్ సీక్రెట్ మిలియన్ పౌండ్ గిఫ్ట్ గురించి త్వరలో ప్రసారం కానున్న ఛానెల్ 4 షోలో డాక్యుమెంట్ చేశారు.టాటా స్టీల్ మూసివేత ప్రభావంపోర్ట్ టాల్బోట్లోని టాటా స్టీల్ బ్లాస్ట్ ఫర్నేస్ మూసివేత ఈ ప్రాంతంలో సాంప్రదాయ ఉక్కు తయారీ ముగింపును సూచిస్తోంది. పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల గణనీయ సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోవడంతోపాటు స్థానికులకు సైతం ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టింది. పోర్ట్ టాల్బోట్కు చెందిన షీన్.. కార్మికులు, వారి కుటుంబాల దుస్థితిని చూసి చలించిపోయారు. స్థానిక కేఫ్ ను సందర్శించిన సందర్భంగా ఆయన ఉద్యోగుల తొలగింపు భావోద్వేగాలను కళ్లారా చూశారు. ఉక్కు కార్మికులు తమ అనిశ్చిత భవిష్యత్తుపై కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో వారిని ఆదుకునేందుకు ఏదైనా చేయాలని సంకల్పించారు.ఎవరీ మైఖేల్ షీన్?మైఖేల్ షీన్ బహుముఖ ప్రజ్ఞతోపాటు సామాజిక కారణాల పట్ల నిబద్ధతకు ప్రసిద్ధి చెందిన నటుడు. 1969లో వేల్స్ లోని న్యూపోర్ట్ లో జన్మించిన షీన్ రాయల్ అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్ (రాడా)లో శిక్షణ పొంది నాటకరంగంలో తన కెరీర్ ను ప్రారంభించారు. ది క్వీన్ అండ్ ది స్పెషల్ రిలేషన్ షిప్ లో బ్రిటిష్ ప్రధాని టోనీ బ్లెయిర్ పాత్రలకు అంతర్జాతీయ ప్రశంసలు పొందాడు. తన నటజీవితానికి మించి, సామాజిక పోరాటకారుడైన షీన్.. తనను తాను "లాభాపేక్ష లేని నటుడిగా" ప్రకటించుకున్నాడు. తన సంపాదనను సామాజిక కార్యక్రమాల కోసం వెచ్చిస్తున్నాడు. ఇప్పుడే కాదు.. 2021లోనే అతను తన సంపదను ధార్మిక కార్యక్రమాలకు విరాళంగా ఇవ్వాలనే నిర్ణయాన్ని ప్రకటించాడు. -
ఎలాంటి ప్రశ్నలు లేకుండా మహిళలకు వర్క్ ఫ్రమ్ హోమ్
న్యూఢిల్లీ: సంస్థ మొత్తం ఉద్యోగుల్లో 2030 నాటికి మహిళల సంఖ్య 30 శాతం సాధన దిశగా అడుగులు వేస్తున్నామని వేదాంత తెలిపింది. మహిళా సిబ్బందిలో అత్యంత కీలక నిర్ణయాలు తీసుకొనే పదవుల్లో 28% మంది ఉన్నారని, ఇది దేశంలో మెటల్స్, మైనింగ్ కంపెనీల్లోనే అత్యధికమని పేర్కొంది.అర్హత కలిగిన మహిళలకు తగిన స్థానం కల్పిస్తున్నామని కంపెనీ తెలిపింది. అనువైన పని గంటలు, ఎటువంటి ప్రశ్నలు వేయకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం, పిల్లల సంరక్షణ కోసం ఏడాదంతా సెలవులు, జీవిత భాగస్వామి నియామకం తదితర స్నేహపూర్వక విధానాల అమలు ద్వారా ప్రతి దశలోనూ మహిళల ప్రగతికి తోడ్పాటు అందిస్తున్నామని వివరించింది.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వేదాంత గ్రూప్‌నకు చెందిన హిందుస్థాన్ జింక్ ఉమెన్ ఆఫ్ జింక్ క్యాంపేయిన్ ప్రారంభించింది. మెటల్ రంగం పట్ల మహిళల్లో మరింత ఆసక్తిని పెంచడం ఈ ప్రచార కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. -
గుజరాతీలు జాబ్స్ ఎందుకు చేయరంటే..
వ్యాపారం, ఆర్థిక రంగాల్లో గుజరాతీల (Gujaratis) ఆధిపత్యం గురించి తెలిసిందే. అయితే వారు ఆయా రంగాల్లో అంతలా రాణించడానికి కారణాలు ఏంటి.. సంపద సృష్టిలో వారికున్న ప్రత్యేక లక్షణాలేంటి అన్న దానిపై పై స్టాకిఫీ వ్యవస్థాపకుడు అభిజిత్ చోక్సీ అద్భుతమైన విశ్లేషణ చేశారు. వారి ఆర్థిక ప్రభావాన్ని హైలైట్ చేసే గణాంకాలతో ఆయన ‘ఎక్స్’లో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.దేశంలోని 191 మంది బిలియనీర్లలో 108 మంది గుజరాతీలేనని రాసుకొచ్చిన చోక్సీ సంపద సృష్టిలో వారికున్న ప్రత్యేకతలను వివరించారు. చివరికి అమెరికాలో నివసిస్తున్న గుజరాతీ.. సగటు అమెరికన్ కంటే మూడు రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నాడని చోక్సీ అభిప్రాయపడ్డారు. భారతదేశ జనాభాలో కేవలం 5% మాత్రమే ఉన్నప్పటికీ, గుజరాత్ దేశ జీడీపీకి 8% పైగా, దేశ పారిశ్రామిక ఉత్పత్తిలో 18% భాగస్వామ్యం వహిస్తోంది. భారత భూభాగంలో కేవలం 6% మాత్రమే ఉన్న గుజరాత్ దేశం మొత్తం ఎగుమతుల్లో 25% వాటాను కలిగి ఉంది.గుజరాతీల సక్సెస్‌కు కారణాలివే..మరి గుజరాతీలు వ్యాపారంలో అంత సక్సెస్ కావడానికి కారణం ఏమిటి? చోక్సీ ప్రకారం.. ఇది తరతరాలుగా వస్తున్న జ్ఞానం, వ్యవస్థాపక మనస్తత్వం, కొత్త మార్కెట్లను స్వీకరించడానికి, ఆధిపత్యం చేయడానికి సాటిలేని సామర్థ్యం కలయిక. గుజరాతీలు వ్యాపార, ఆర్థిక వ్యవహారాలను శాసించడానికి 20 కారణాలను ఆయన వివరించారు.ఉద్యోగాల (Jobs) కంటే వ్యాపారానికి తరతరాలుగా ప్రాధాన్యత ఇవ్వడమే ఈ విజయానికి కారణమని చోక్సీ పేర్కొన్నారు. "నౌకరీ తో గరీబోన్ కా దండా చే" (ఉద్యోగాలు పేదల కోసం) అనేది గుజరాతీ కుటుంబాలలో ఒక సాధారణ నమ్మకం. వ్యాపారం అనేదేదో నేర్చుకోవాల్సిన ఒక నైపుణ్యంలాగా కాకుండా గుజరాతీ పిల్లలు.. తమ కుటుంబాల్లో డబ్బును ఎలా నిర్వహిస్తున్నారు.. డీల్స్ ఎలా చేస్తున్నారు.. నష్టాలను ఎలా అంచనా వేస్తున్నారు.. అనేది నిత్యం చూస్తూ పెరుగుతారు.రిస్క్ తీసుకోవడం అనేది మరో ముఖ్యమైన లక్షణం. వజ్రాల ట్రేడింగ్ నుంచి స్టాక్ మార్కెట్ల వరకు గుజరాతీలు అనిశ్చితిని స్వీకరించి అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఈ మనస్తత్వం ప్రారంభ ఆర్థిక విద్య ద్వారా బలపడుతుంది. చాలా మంది పిల్లలు చిన్న వయస్సు నుండే కుటుంబ వ్యాపారాలలో సహాయపడతారు. ఏ ఎంబీఏ బోధించలేని రియల్ వరల్డ్ ఆర్థిక శాస్త్రాన్ని నేర్చుకుంటారు.నెట్ వర్కింగ్, కమ్యూనిటీ సపోర్ట్ కీలకం. రుణాలు, మార్గదర్శకత్వం, మార్కెట్ విషయంలో గుజరాతీలు ఒకరికొకరు చురుకుగా సహాయపడతారు. వారి పొదుపు జీవనశైలి కూడా ఒక పాత్ర పోషిస్తుంది. లాభాలను విలాసవంతంగా ఖర్చు చేయకుండా తిరిగి పెట్టుబడి పెడతారు. ఇది దీర్ఘకాలిక సంపద సేకరణకు దారితీస్తుంది.వివిధ పరిశ్రమల్లో గుజరాతీలు ఎలా ఆధిపత్యం చెలాయిస్తున్నారో కూడా చోక్సీ తెలియజేశారు. ప్రపంచంలోని 90 శాతం వజ్రాలను సూరత్ మాత్రమే ప్రాసెస్ చేస్తోందని, బెల్జియం, ఇజ్రాయెల్ లోని పోటీదారులను గుజరాతీ పారిశ్రామికవేత్తలు ఎలా అధిగమించారో ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా, భారతదేశ స్టాక్ మార్కెట్ వ్యాపారులలో 60% పైగా గుజరాతీలు లేదా మార్వాడీలు ఉన్నారు.అమెరికాలో కూడా గుజరాతీలు వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించుకున్నారు. అమెరికాలోని మొత్తం హోటళ్లలో 60 శాతానికి పైగా గుజరాతీ కుటుంబాలకు చెందినవేనని, ప్రధానంగా పటేల్ సామాజిక వర్గానికి చెందినవని చోక్సీ వెల్లడించారు. 1950వ దశకంలో చిన్న చిన్న పెట్టుబడులుగా ప్రారంభమైన ఈ పరిశ్రమ మల్టీ బిలియన్ డాలర్ల పరిశ్రమగా రూపాంతరం చెందింది.108 out of 191 Indian billionaires are Gujarati.A Gujarati living in America makes three times more than an average American.Gujarat, which has 5% of India’s population, contributes over 8% to the GDP and 18% of the industrial output.Gujarat has a land area of only 6% but… pic.twitter.com/ZId5idzCNS— Abhijit Chokshi | Investors का दोस्त (@stockifi_Invest) March 8, 2025 -
స్పైస్‌జెట్‌కు కొత్త చిక్కులు
చవక విమానయాన సేవలు అందిస్తున్న స్పైస్‌జెట్‌కు కొత్త సమస్యలు ఎదురయ్యాయి. విమానాల లీజు రంగంలో ఉన్న ఐర్లాండ్‌కు చెందిన మూడు సంస్థలు, ఒక మాజీ పైలట్ స్పైస్‌జెట్‌పై ఎన్సీఎల్టీలో దివాలా పిటిషన్లు దాఖలు చేయడం ఇందుకు కారణం. స్పైస్‌జెట్ సుమారు రూ.110 కోట్లు బకాయి పడిందని, ఐబీసీ సెక్షన్ 9 కింద దివాలా ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ ఎన్‌జీఎఫ్ ఆల్ఫా, ఎన్‌జీఎఫ్ జెనెసిస్, ఎన్‌జీఎఫ్ చార్లీ పిటిషన్లు దాఖలు చేశాయి.ఈ వారం ప్రారంభంలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ విచారణ సందర్భంగా పరిష్కార చర్చలు జరుగుతున్నందున ఈ విషయాన్ని పరిష్కరించడానికి స్పైస్‌జెట్ కొంత సమయం కోరింది. తదుపరి విచారణ కోసం 2025 ఏప్రిల్ 7న మూడు పిటిషన్లను లిస్ట్ చేయాలని ఎన్సీఎల్టీ ఆదేశించింది. లీజుదారులు గతంలో స్పైస్‌జెట్‌కు ఐదు బోయింగ్ 737 విమానాలను లీజుకు ఇచ్చాయి.ఇంజిన్లతో సహా విమానంలోని భాగాలను దొంగిలించి ఇతర విమానాలలో ఉపయోగించారని ఆరోపిస్తూ ఈ కంపెనీలు స్పైస్‌జెట్‌కు లీగల్ నోటీసును పంపించాయి. 19 సంవత్సరాలుగా విమానయాన రంగంలో ఉన్న స్పైస్‌జెట్.. ఎన్సీఎల్టీ, అప్పీలేట్ ట్రిబ్యునల్ ఎన్సీఎల్ఏటీ వద్ద విల్లిస్ లీజ్, ఎయిర్కాజిల్ ఐర్లాండ్, విల్మింగ్టన్, సెలెస్టియల్ ఏవియేషన్ వంటి రుణదాతల నుండి దివాలా పిటిషన్లను ఎదుర్కొంటోంది. -
అందరికీ గూగుల్ జాబే కావాలి.. ఎందుకో వీడియో చూసేయండి
దిగ్గజ టెక్ కంపెనీ 'గూగుల్'లో జాబ్ తెచ్చుకోవాలని చాలామంది కలలు కంటారు. దీనికి కారణం ఎక్కువ వేతనాలు, ఆఫీసులోనే లగ్జరీ సదుపాయాలు. ఇటీవల సోషల్ మీడియాలో వెల్లడైన ఒక వీడియోలో గూగుల్ ఆఫీస్ ఎలా ఉంటుందో చూడవచ్చు.శివ్జీ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ తన ఖాతాలో గూగుల్ ఆఫీస్ వీడియో షేర్ చేశారు. ఇది గురుగ్రామ్‌లోని గూగుల్ ఆఫీస్ అని తెలుస్తోంది. అద్భుతమైన డోర్స్, హాల్, కావలసినన్ని స్నాక్స్, డ్రింక్స్ వంటివన్నీ ఆఫీసులోనే ఉండటం చూడవచ్చు. మైక్రో కిచెన్, పూల్ టేబుల్ ఉన్న గేమ్స్ రూమ్, ఒక స్నాప్ రూమ్, మసాజ్ కుర్చీలతో కూడిన రూమ్ కూడా వీడియోలో కనిపిస్తాయి. వీడియో షేర్ చేస్తూ.. గూగుల్‌లో మరో అలసిపోయే రోజు! అని క్యాప్షన్ ఇచ్చింది.ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 4,72,786 లైక్స్ పొందిన ఈ వీడియోను 12.3 మిలియన్ల మంది వీక్షించారు. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఎప్పుడూ ఎంటర్టైన్మెంట్ మాత్రమేనా.. పనిచేసేది ఏమైనా ఉందా? అని ఒకరు కామెంట్ చేశారు. ఇన్ని సౌకర్యాలను ఉపయోగించుకుంటూ పని చేస్తున్నారు కదా.. మీకు జీతం ఎంత ఇస్తారు అని మరొకరు కామెంట్ చేశారు. నాకు విశ్రాంతి తీసుకునే గది చాలాబాగా నచ్చిందని ఇంకొకరు కామెంట్ చేశారు.ఇదీ చదవండి: బనస్కాంత నుంచి బోర్డ్‌రూమ్ వరకు: అదానీ పోస్ట్ వైరల్గూగుల్ కంపెనీ.. తమ ఉద్యోగులకు ఆఫీసులోనే చాలా సౌకర్యాలను అందిస్తుంది. దీనికోసం కార్యాలయాలను ప్రత్యేకంగా డిజైన్ చేస్తారు. ఆఫీసులోనే ఫిట్నెస్ కేంద్రాలు, ఆన్ సైట్ చైల్డ్‌కేర్, గేమ్ రూమ్‌లు, వినోద ప్రదేశాలు, విశ్రాంతి ప్రాంతాలు ఉన్నాయి. ఇటీవల గూగుల్ కంపెనీ బెంగళూరులో అత్యాధునిక సదుపాయాలతో.. ఓ ఆఫీస్ ప్రారంభించింది. View this post on Instagram A post shared by Shivangi Gupta | Content creator 🌶️ (@shivjeee) -
'అప్పుడే అలా ప్రతిజ్ఞ చేశాను': గౌతమ్ అదానీ
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. ప్రముఖ పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్ చైర్మన్ 'గౌతమ్ అదానీ' (Gautam Adani) లింగ సమానత్వం, అన్ని రంగాలలో మహిళల సాధికారత పట్ల తన నిబద్ధతను వెల్లడించారు. తన ప్రయాణాన్ని రూపొందించిన బలమైన మహిళల గురించి మాట్లాడుతూ.. ''బనస్కాంత నుండి బోర్డ్‌రూమ్‌ల వరకు: నా ప్రపంచాన్ని తీర్చిదిద్దిన మహిళలు" అనే పేరుతో ఓ పోస్ట్ చేశారు.లింగ సమానత్వం అంటే..తన మనవరాళ్లు.. తమ కలలను సాధించడంలో మహిళలు ఎటువంటి అడ్డంకులు ఎదుర్కోని ప్రపంచాన్ని నిర్మించాలనే తన సంకల్పాన్ని ఆదానీ వివరించారు. నన్ను, నా ప్రయాణాన్ని దృఢంగా రూపందించుకోవడంలో.. నా తల్లి, భార్య సహాయం చేశారని చెప్పారు. లింగ సమానత్వం అంటే.. ''కేవలం మహిళలకు అవకాశాలు కల్పించడం మాత్రమే కాదు, ఇది మానవ మనుగడకు ఎంతో అవసరం'' అని నొక్కి చెప్పారు.అవధులు లేని ప్రపంచాన్నిదశాబ్దం క్రితం, నా మొదటి మనవరాలి సున్నితమైన వేళ్లను నేను పట్టుకున్నప్పుడు, నేను నిశ్శబ్దంగా ఒక ప్రతిజ్ఞ చేసాను. ఆమె ఆకాంక్షలకు అవధులు లేని ప్రపంచాన్ని నిర్మించడంలో సహాయం చేయాలని అనుకున్నాను. ఇప్పుడు అందమైన ముగ్గురు మానవరాళ్లను చూస్తుంటే.. నా వాగ్దానం మరింత గుర్తుకొస్తోందని అదానీ చెప్పుకొచ్చారు.ఇదీ చదవండి: ప్రపంచ కుబేరుడితో నాల్గవ బిడ్డకు జన్మనిచ్చింది: ఎవరీ షివోన్ జిలిస్?క్యాలెండర్లో ఒక తేదీఅంతర్జాతీయ మహిళా దినోత్సవం కేవలం క్యాలెండర్లో ఒక తేదీ కాదు, మనం సాధించిన పురోగతిని.. ముందుకు సాగుతున్న ప్రయాణాన్ని గుర్తుచేస్తుంది. వ్యక్తిగతంగా.. తల్లి నుంచి ప్రేరణ పొందిన చిన్న పిల్లవాడిగా, నాయకత్వంలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను చూస్తున్న వ్యాపారవేత్తగా, నా భార్య ప్రీతి అదానీ ఫౌండేషన్ పట్ల అచంచలమైన అంకితభావంతో ప్రేరణ పొందిన భర్తగా.. నన్ను దాదూ అని ఆప్యాయంగా పిలిచే అమ్మాయిల కోసం పరిమితులు లేని ప్రపంచం గురించి కలలు కంటున్న తాతగా నన్ను నేను చూసుకుంటున్నాను.ప్రతిభకు హద్దులు లేవుగౌతమ్ అదానీ.. తన కంపెనీ ఓడరేవులలో ఒకదానిని సందర్శించినప్పుడు తనకు ఎదురైన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకున్నారు. అక్కడ నాయకత్వ పాత్రల్లో మహిళలు లేకపోవడాన్ని గమనించారు. ఇదే ఆయనలో మార్పు తీసుకురావడానికి దోహదపడింది. నాయకత్వ పాత్రల్లో మహిళలు లేకపోవడానికి కారణం.. సామర్థ్యం లేకపోవడం కాదు, పురుషాధిక్యంతో వివిధ రంగాలలో మార్గాలు లేకపోవడం అని తెలుసుకున్నారు. మహిళల ప్రతిభకు హద్దులు లేవు, వారికి కూడా సమాన అవకాశాలు కల్పించాలి. కాబట్టి అన్ని రంగాల్లోనూ మహిళలకు సమానమైన అవకాశాలు కల్పించాలని మహిళా దినోత్సవం సందర్భంగా అదానీ సంకల్పించారు. -
అప్పుల్లోనూ ఆమెదే పైచేయి
ముంబై: ఇంటి బాధ్యతల్లో కీలక పాత్ర పోషిస్తున్న మహిళలు.. కుటుంబం, వృత్తిపరమైన అవసరాలకు రుణాలను తీసుకోవడానికీ వెనుకాడడం లేదు. గతేడాది యాక్టివ్ రుణ గ్రహీతల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉన్నట్టు క్రెడిట్ బ్యూరో సంస్థ ‘క్రిఫ్ హైమార్క్’ తెలిపింది.రుణాలు తీసుకోవడమే కాదు, వాటిని సకాలంలో తిరిగి చెల్లించడంలోనూ పురుషులతో పోల్చితే మహిళలే మెరుగైన పనితీరు చూపిస్తున్నట్టు వెల్లడించింది. 2024 డిసెంబర్ నాటికి యాక్టివ్ మహిళా రుణగ్రహీతలు 10.8 శాతం పెరిగి 8.3 కోట్లుగా ఉన్నట్టు తెలిపింది. అదే సమయంలో పురుష రుణ గ్రహీతల్లో వృద్ధి 6.5 శాతంగానే ఉన్నట్టు వెల్లడించింది. ‘‘రుణాల విషయంలో పురుషుల కంటే స్త్రీలే మెరుగైన ప్రవర్తన చూపిస్తున్నారు. బంగారం రుణాలు మినహా మిగిలిన రుణాల్లో 91 నుంచి 180 రోజుల వరకు చెల్లింపులు నిలిపివేసిన రుణ గ్రహీతల్లో మహిళలు తక్కువగా ఉన్నారు’’అని ఈ నివేదిక తెలిపింది.గృహ రుణాలు, వ్యాపార రుణాలు, వ్యవసాయం, ట్రాక్టర్ల రుణాలు, ప్రాపర్టీ రుణాలు, విద్యా రుణాల్లో మహిళల తీరు మెరుగ్గా ఉన్నట్టు వెల్లడించింది. వినియోగ రుణాల్లోనూ (కన్జ్యూమర్) మగవారి కంటే చెల్లింపుల పరంగా మహిళల ప్రవర్తనే మెరుగ్గా ఉన్నట్టు తెలిపింది. 2024 చివరికి మొత్తం మహిళా రుణ గ్రహీతలు 18 శాతం పెరిగి 36.5 కోట్లుగా ఉన్నట్టు పేర్కొంది. రుణాల్లో 35 ఏళ్లలోపు వారు ఎక్కువగా తీసుకుంటున్నారు. మహిళలకు సంబంధించి గృహ రుణాలు, వ్యాపార రుణాలు, ప్రాపర్టీ రుణాలు, ఆటో రుణాలు, క్రెడిట్‌కార్డ్, విద్యా రుణాల్లో మహారాష్ట్ర ముందున్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. -
ప్రపంచ కుబేరుడితో నాల్గవ బిడ్డకు జన్మనిచ్చింది: ఎవరీ షివోన్ జిలిస్?
ప్రపంచ కుబేరుడు 'ఎలాన్ మస్క్' (Elon Musk) గురించి తెలిసిన చాలామందికి.. అతని నలుగురు పిల్లలకు తల్లి అయిన 'షివోన్ జిలిస్' (Shivon Zilis) గురించి బహుశా తెలిసుండకపోవచ్చు. ఇంతకీ ఈమె ఎవరు? ఈమె గురించి ఆసక్తికరమైన విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.నిజానికి.. షివోన్ జిలిస్ భారతీయ మూలాలున్న మహిళ. ఎలా అంటే ఈమె తల్లి పంజాబీ ఇండియన్ శారద. అయితే శారద కెనడియన్ అయిన రిచర్డ్‌ని వివాహం చేసుకుంది. వీరిద్దరికి పుట్టిన సంతానమే షివోన్ జిలిస్. ఈమె 1986 ఫిబ్రవరి 8న కెనడాలోని అంటారియోలోని మార్ఖమ్‌లో జన్మించింది.షివోన్ జిలిస్ అమెరికాలోని ప్రతిష్టాత్మక యేల్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రం, తత్వశాస్త్ర డిగ్రీలు పూర్తి చేశారు. ఐటీ దిగ్గజం ఐబీఎం కంపెనీలో తన కెరీర్ ప్రారంభించింది. యేల్ యూనివర్సిటిలో చదువుకునే సమయంలో ఐస్ హాకీ జట్టులో కీలక సభ్యురాలు. గోల్ కీపర్‌గా ఆల్ టైమ్ బెస్ట్. ఆమె గిటార్, డ్రమ్స్ కూడా ప్లే చేసేది.షివోన్ జిలిస్ కెనడియన్ ఏఐ నిపుణురాలు, వెంచర్ క్యాపిటలిస్ట్. ఆమె మస్క్ వ్యాపార సామ్రాజ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతే కాకుండా ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్‌లో ప్రత్యేకత కలిగిన టెస్లా, ఓపెన్ఏఐ, న్యూరాలింక్ వంటి కంపెనీలలో పనిచేసినట్లు సమాచారం.షివోన్ జిలిస్ 2016లో ఓపెన్ఏఐ (OpenAI)లో బోర్డు సభ్యురాలిగా చేరింది. తరువాత 2017 నుంచి 2019 వరకు టెస్లాలో పనిచేసింది, అక్కడ ఆమె కంపెనీ ఆటోపైలట్ ప్రోగ్రామ్, సెమీకండక్టర్ వంటి విభాగాల్లో కీలక పాత్ర పోషించింది. ఆ సమయంలో మస్క్ బ్రెయిన్ చిప్ స్టార్టప్ న్యూరాలింక్‌లో ప్రధాన పాత్ర పోషించింది. అక్కడ ఆమె ఆపరేషన్స్, ప్రత్యేక ప్రాజెక్టుల డైరెక్టర్‌గా పనిచేస్తోంది.ఇదీ చదవండి: ఆ నగరం భారతదేశ బాహుబలి: ఆనంద్ మహీంద్రా2021లో షివోన్ జిలిస్ కవలలకు జన్మనించింది, 2024లో మూడవ బిడ్డను స్వాగతించింది. కాగా ఇటీవల నాల్గవ బిడ్డకు జన్మనిచ్చినట్లు, బిడ్డకు సెల్డాన్ లైకుర్గస్ (Seldon Lycurgus) అని పేరు పెట్టినట్లు వెల్లడించింది. మొత్తం మీద ఇప్పుడు ఎలాన్ మస్క్ 14 మంది పిల్లలకు తండ్రి అయ్యారు. -
హైదరాబాద్‌లో సీఐఐ తెలంగాణ సమావేశం
భారత పరిశ్రమల సమాఖ్య (CII) తెలంగాణ, తన యాన్యువల్ సెషన్ & కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని ఒక ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను నిర్మించడమే ప్రధాన ఉద్దేశ్యంగా.. హైదరాబాద్‌లో నిర్వహించింది. ఈ సందర్భంగా, పరిశ్రమ నాయకులు గ్రీన్ ఛాంపియన్లకు వనమహోత్సవ్ అవార్డులను అందజేశారు. అంతే కాకుండా సీఐఐ తెలంగాణ.. సీఐఐ ఆదిలాబాద్ జిల్లా జోన్‌ను ప్రారంభించింది.పరిశ్రమలు 4.0 నుంచి 5.0కు సాగాలని, దీనికోసం తెలంగాణ పారిశ్రామిక పరివర్తనను వేగవంతం చేయడంపై సీఐఐ తెలంగాణ నివేదికను విడుదల చేసింది. అంతే కాకుండా.. 2025-26 సంవత్సరానికి సీఐఐ తెలంగాణ చైర్మన్‌గా ఆర్ శివ ప్రసాద్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా గౌతమ్ రెడ్డి మెరెడ్డి ఎన్నికయ్యారు.సీఐఐ సమావేశంలో ఈవై ఇండియా మేనేజింగ్ పార్టనర్ రోహన్ సచ్దేవ్ మాట్లాడుతూ.. జీసీసీలు ఆవిష్కరణ కేంద్రాలుగా ఆవిర్భవించాయని అన్నారు. హైదరాబాద్‌లో దాదాపు 7000 స్టార్టప్‌లు, 51 ఇంక్యుబేషన్ సెంటర్లు, దాదాపు 300 మంది పెట్టుబడిదారులు ఉన్నారు. ఇటీవలి కాలంలో రాష్ట్రం ఆవిష్కరణ కేంద్రంగా అవతరించిందని అన్నారు. స్థిరమైన పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణ ముందంజలో ఉందని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో.. సీఐఐ సదరన్ రీజియన్ & సైయెంట్ లిమిటెడ్ చైర్మన్ డాక్టర్ బీవీఆర్ మోహన్ రెడ్డి, చంద్ర టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్పర్సన్ డాక్టర్ ఆర్ నందిని, సీఐఐ తెలంగాణ చైర్మన్ & భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డీ ప్రసాద్, సీఐఐ తెలంగాణ మాజీ ఛైర్మన్ & ఎలికో లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వనితా దట్ల మొదలైనవారు పాల్గొన్నారు. -
2030 నాటికి రూ.115-125 లక్షల కోట్ల రుణ సమీకరణ.. ఎందుకంటే..
దేశీయ కార్పొరేట్ కంపెనీల మూలధన వ్యయం పెరుగుతోంది. దాంతో 2030 నాటికి సుమారు రూ.115-125 లక్షల కోట్లు రుణాన్ని సమీకరించనున్నాయని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ భారీ నిధులు ఆయా కంపెనీలకు మూలధన వ్యయం (CAPEX), వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు (NBFC) ఫైనాన్సింగ్ కోసం ఉపయోగించబోతున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. కార్పొరేట్ రంగంలో భవిష్యత్తులో మౌలిక సదుపాయాల రంగం కీలక పాత్ర పోషిస్తుందని, ఈ పెట్టుబడుల్లో సింహభాగం అందుకే ఖర్చు చేస్తాయని భావిస్తున్నారు.రుణ కేటాయింపులు ఇలా..మూలధన వ్యయం: మొత్తం రుణంలో సుమారు రూ.45-50 లక్షల కోట్లు కాపెక్స్‌కు కేటాయిస్తారు. ఉత్పత్తి సామర్థ్యాలను విస్తరించడానికి, సాంకేతిక పరిజ్ఞానాన్ని అప్‌గ్రేడ్ చేయడానికి, వివిధ పరిశ్రమల్లో కొత్త సౌకర్యాలను సిద్ధం చేయాడానికి ఈ పెట్టుబడి కీలకం.వర్కింగ్ క్యాపిటల్, ఎన్బీఎఫ్సీ ఫైనాన్సింగ్: మిగిలిన రూ.70-75 లక్షల కోట్లు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, ఎన్బీఎఫ్సీ ఫైనాన్సింగ్ అవసరాలను తీరుస్తాయి. కార్పొరేట్ ఎకోసిస్టమ్‌లో కార్యకలాపాలు సజావుగా, లిక్విడిటీ ఉండేలా ఈ ఫండ్స్ దోహదపడతాయి.మౌలిక సదుపాయాలు: కార్పొరేట్ కంపెనీ అభివృద్ధిలో భాగంగా మొత్తం పెట్టుబడుల్లో దాదాపు మూడొంతుల వాటాను మౌలిక సదుపాయాలకు ఖర్చు చేస్తారు. ఇందులోనూ ప్రధానంగా కింది విభాగాల్లో ఖర్చులు పెరగన్నాయని చెబుతున్నారు.రవాణా: కనెక్టివిటీ, లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని పెంచడానికి రోడ్లు, రైల్వేలు, ఓడరేవుల్లో పెట్టుబడులు పెడుతారు.ఎనర్జీ: పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల విస్తరణ, పవర్ గ్రిడ్ల ఆధునీకరణకు ఇన్వెస్ట్ చేస్తారు.పట్టణాభివృద్ధి: పట్టణ ప్రాంతాల్లో గృహనిర్మాణం, నీటి సరఫరా, పారిశుద్ధాన్ని మెరుగుపరిచేందుకు చర్యలు చేపడుతారు.ఇదీ చదవండి: 2025 ఆర్థిక సంవత్సరంలో గోధుమల దిగుమతి ఎంతంటే..సవాళ్లు, అవకాశాలురుణ ఆధారిత కార్పొరేట్ కంపెనీల విస్తరణ అపారమైన అవకాశాలను అందిస్తున్నప్పటికీ ఈ విధానంలో కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు. బ్యాంకులు, కార్పొరేట్ బాండ్లు, బాహ్య వాణిజ్య రుణాలు(ఈసీబీ) సహా ఫైనాన్సింగ్ ఎకోసిస్టమ్ వార్షికంగా 10 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. అయితే పెరుగుతున్న రుణ అవసరాలను తీర్చడానికి ఈ వృద్ధి సరిపోకపోవచ్చు. ఇది రూ.10-20 లక్షల కోట్ల నిధుల అంతరానికి దారితీస్తుంది. ఈ అంతరాన్ని పూడ్చడానికి కార్పొరేట్ బాండ్ మార్కెట్ కీలకపాత్ర పోషించాలని నిపుణులు సూచిస్తున్నారు. -
ఆ నగరం భారతదేశ బాహుబలి: ఆనంద్ మహీంద్రా
ప్రముఖ పారిశ్రామికవేత్త 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra).. ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే తాజాగా గుజరాత్‌లోని ఓ చిన్న పట్టణానికి చెందిన వీడియో షేర్ చేశారు. ఇది నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.మహీంద్రా & మహీంద్రా చైర్మన్ షేర్ చేసిన వీడియోలో.. గుజరాత్‌లోని మోర్బి, సిరామిక్ పరిశ్రమలో దాని ఆధిపత్యాన్ని వెల్లడించడం చూడవచ్చు. కేవలం 9 కి.మీ. విస్తీర్ణంలో ఉన్న మోర్బి పట్టణం భారతదేశ సిరామిక్ ఉత్పత్తిలో 90% వాటాను కలిగి.. ప్రపంచ సిరామిక్ హబ్‌గా ఎలా అభివృద్ధి చెందిందో ఈ వీడియోలో చూడవచ్చు. 1930 నుంచి దాదాపు 1,000 కుటుంబాల యాజమాన్యంలో ఈ పరిశ్రమ వృద్ధి చెందింది.నాణ్యతలో ఏ మాత్రం తీసిపోకుండా.. తక్కువ ధరలోన సిరామిక్ వస్తువులు లభిస్తున్నాయి. ప్రపంచంలోని మొత్తం సిరామిక్ ఉత్పత్తిలో మోర్బి గణనీయమైన వాటాను కలిగి ఉంది. మోర్బి వ్యవస్థాపకులను ప్రశంసిస్తూ.. భారతీయ వ్యాపారాలు చైనాతో పోటీ పడగలవా? బహుశా మనం విజయగాథల కోసం సరైన ప్రదేశాల కోసం వెతకడం లేదు. 'మోర్బి' ప్రభావానికి సంబంధించిన ఈ వీడియో చూసి నేను సంతోషించాను. ఇది చిన్న పట్టణమే అయినప్పటికీ.. భారతదేశ 'బాహుబలి' అని ఆనంద్ మహీంద్రా అన్నారు.మోర్బి సిరామిక్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లుప్రపంచవ్యాప్తంగా విజయం సాధించినప్పటికీ.. మోర్బి సిరామిక్ పరిశ్రమ దేశీయ, అంతర్జాతీయ డిమాండ్ తగ్గడంతో ఇబ్బంది పడుతోంది. గ్యాస్ వినియోగంపై పన్నులను తగ్గించాలని, వ్యాట్ నుంచి GSTకి మారాలని.. ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ ప్రయోజనాల వంటివి కావాలని ప్రభుత్వాన్ని తయారీదారులు కోరుతున్నారు. ఈ పరిశ్రమ రోజుకు దాదాపు మూడు మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను వినియోగిస్తుంది. తయారీదారులు దీనికే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది.ఇదీ చదవండి: శివ్ నాడార్ కీలక నిర్ణయం: కుమార్తెకు భారీ గిఫ్ట్సౌదీ అరేబియా, ఖతార్, తైవాన్ వంటి దేశాలు 50% నుంచి 106% వరకు యాంటీ డంపింగ్ సుంకాలు విధించడం వల్ల ఎగుమతులు కూడా దెబ్బతిన్నాయి. అంతే కాకుండా.. ఇరాన్‌పై వాణిజ్య ఆంక్షలు కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, అజర్‌బైజాన్‌లకు ఎగుమతి మార్గాలను దెబ్బతీశాయి. దీని వలన తయారీదారులు ఖరీదైన ప్రత్యామ్నాయ షిప్పింగ్ మార్గాలను ఎంచుకోవలసి వచ్చింది. ఇన్ని సవాళ్ళను ఎదుర్కొంటూనే.. మోర్బి ప్రపంచ సిరామిక్ నాయకుడిగా భారతదేశం ఖ్యాతిని నలుదిశల వ్యాపింపజేస్తోంది.Can Indian businesses compete with China?Maybe we’re not looking in the right places for success stories.I was delighted to see this video on the ‘Morbi’ effect.Agile, small-town entrepreneurs—The ‘bahubalis’ of India.👏🏽👏🏽👏🏽 pic.twitter.com/L4PiMVzYZl— anand mahindra (@anandmahindra) March 7, 2025 -
కుమార్తెకు భారీ గిఫ్ట్: శివ్ నాడార్ కీలక నిర్ణయం
వారసత్వ ప్రణాళికను క్రమబద్దీకరించడానికి.. ఫ్యామిలీ హోల్డింగ్లను ఏకీకృతం చేయడానికి, ఒక ముఖ్యమైన చర్యలో భాగంగా.. దేశంలో మూడో అతిపెద్ద ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఫౌండర్ 'శివ్ నాడార్' (Shiv Nadar) కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. హెచ్‌సీఎల్ కంపెనీలో మాత్రమే కాకుండా.. ప్రమోటర్ కంపెనీలైన వామ సుందరి ఇన్వెస్ట్మెంట్స్ (ఢిల్లీ) ప్రైవేట్ లిమిటెడ్‌లలోని తనకు చెందిన మొత్తంలో 47 శాతం వాటాను తన కుమార్తె 'రోష్ని నాడార్ మల్హోత్రా'కు బదిలీ చేస్తూ గిఫ్ట్ డీడ్లను అమలు చేశారు.ఈ బదిలీలకు ముందు, శివ్ నాడార్.. రోష్ని నాడార్ మల్హోత్రా రెండు సంస్థలలోనూ వరుసగా 51%, 10.33% వాటాలను కలిగి ఉన్నారు. లావాదేవీల తరువాత, HCL కార్పొరేషన్, VSIPL లలో రోష్ని వాటాలు 57.33 శాతానికి పెరిగాయి, శివ్ నాడార్ వాటా 4 శాతానికి చేరుకున్నాయి.రోష్ని నాడార్ మల్హోత్రా (Roshni Nadar Malhotra)టెక్ దిగ్గజం, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకులు 'శివ్ నాడార్'కు ఏకైక సంతానంగా ఢిల్లీలో 1982లో జన్మించిన రోష్ని.. వసంత్ వ్యాలీ పాఠశాలలో చదువుకున్నారు. నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ నుంచి కమ్యూనికేషన్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, కెలాగ్స్ యూనివర్సిటీ నుంచి ఎంబిఏ చేశారు. చదువు పూర్తి కాగానే బ్రిటన్‌లో న్యూస్ ప్రొడ్యూసర్‌గా కెరీర్ ప్రారంభించారు. 27 సంవత్సరాలు వచ్చేసరికి తండ్రి ప్రారంభించిన వ్యాపారంలో భాగస్వాములయ్యారు. హెచ్‌సీఎల్‌లో చేరిన సంవత్సరానికే ఆ కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా మాత్రమే కాకుండా కంపెనీ సీఈఓగా బాధ్యతలు కూడా చేపట్టారు.ఇదీ చదవండి: నెలకు ఒకరోజు సెలవు.. దిగ్గజ కంపెనీ కీలక నిర్ణయం -
61 ఏళ్ల వయసులో నీతా అంబానీ ఫిటెనెస్ సీక్రెట్ ఇదే..
రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ(61) ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటూ లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె తన రోజువారీ ఫిట్నెస్ షెడ్యూల్‌ను పంచుకున్నారు. ముఖ్యంగా 30 ఏళ్లు పైబడిన మహిళలు ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యత ఇవ్వాలని నొక్కి చెప్పారు. ఈమేరకు ఒక వీడియో విడుదల చేశారు. అదికాస్తా వైరల్ అవుతోంది.వీడియోలో నీతా అంబానీ తెలిపిన వివరాల ప్రకారం..‘రోజూ 5,000 నుంచి 7,000 అడుగులు నడుస్తాను. నేను చురుకుగా ఉండటానికి సరళమైన ప్రభావవంతమైన మార్గం ఇది. దినచర్యలో భాగంగా నిత్యం జిమ్ వ్యాయామాలు, స్విమ్మింగ్, యోగా, ఆక్వా వ్యాయామాలు ఉంటాయి. అదనంగా డ్యాన్స్ చేస్తాను. ఇది నన్ను శారీరకంగా ఫిట్‌గా ఉంచడంతోపాటు మానసిక స్థితికి ఎంతో తోడ్పాటు అందిస్తోంది. ప్రతిరోజూ #StrongHERMovement(ట్విటర్-ఎక్స్‌లో ట్యాగ్)లో చేరి ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి మరింత దృఢంగా మారి ఎన్నో విజయాలు సాధించాలి’ అన్నారు.‘షుగర్-ఫ్రీ’ లైఫ్స్టైల్నీతా అంబానీ ఫిట్నెస్ జర్నీలో ఆహారం కీలక అంశమని తెలిపారు. ఆర్గానిక్, ప్రకృతి ఆధారిత ఆహార పదార్థాలపై దృష్టి సారించాలని సూచించారు. తాను ఎప్పుడూ శాకాహారం తీసుకుంటానని పేర్కొన్నారు. ఆమె షుగర్(చక్కెర ఉండే పదార్థాలు) అధికంగా ఉండే ఆహారానికి దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. సమతుల భోజనం, ప్రోటీన్లు, పోషకాలు సమృద్ధిగా ఉండేలా జాగ్రత్త పడతానని చెప్పారు.ఆరోగ్యానికి 30 నిమిషాలుUnstoppable at 61! This International Women’s Day, Mrs. Nita Ambani shares her inspiring fitness journey and invites women of all ages to prioritize their health and wellbeing. With her dedicated workout routine, she shows us that age is just a number. Join the #StrongHERMovement… pic.twitter.com/CyhfT1zm9r— Reliance Industries Limited (@RIL_Updates) March 8, 2025మహిళలు రోజుకు కనీసం 30 నిమిషాలపాటు వారి ఆరోగ్యానికి సమయం కేటాయించాలని నీతా అంబానీ సూచించారు. ఫిట్నెస్ అంటే వయసుతో పోరాడటం కాదని, దాన్ని పాజిటివిటీతో స్వీకరించడం అని నొక్కి చెప్పారు. నీతా ఫిట్నెస్ సందేశం అన్ని వయసుల మహిళలకు ఎంతో ఉపయోగపడుతుంది. అతివల స్వీయ సంరక్షణ, శ్రేయస్సుకు ఎంతో దోహదం చేస్తుంది. ఫిట్‌గా, యాక్టివ్‌గా ఉండాలనుకునేవారికి వయసుతో సంబంధం లేదని నిరూపిస్తూ ఆమె ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. -
రైల్వే కీలక నిర్ణయం.. ఇక కన్ఫర్మ్ టికెట్ ఉంటేనే..
మెరుగైన క్రౌడ్ మేనేజ్మెంట్ దిశగా భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో దేశవ్యాప్తంగా 60 కీలక రైల్వే స్టేషన్లలో కన్ఫర్మ్ టికెట్లు ఉన్న ప్రయాణికులను మాత్రమే ప్లాట్‌ఫామ్ మీదకు అనుమతించనుంది. రద్దీని నియంత్రించడానికి, సురక్షితమైన ప్రయాణ పరిస్థితులను నిర్ధారించడానికి ఈ స్టేషన్లలో శాశ్వత ప్రయాణికుల హోల్డింగ్ ప్రాంతాలు ఉంటాయి.రద్దీ రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రాకపోకల క్రమబద్ధీకరణపై జరిగిన ఉన్నత స్థాయి సమావేశం అనంతరం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. అధికారులతో విస్తృతంగా చర్చించి రద్దీగా ఉండే ప్రయాణ సమయాల్లో ఎంపిక చేసిన స్టేషన్లలో అమలు చేసిన విజయవంతమైన రద్దీ నియంత్రణ చర్యలను సమీక్షించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఉన్నవారు అక్కడే.. ఇందులో భాగంగా ఈ 60 స్టేషన్లలో వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఉన్న ప్రయాణికులను స్టేషన్ ఆవరణ వెలుపల నిర్దేశిత వెయిటింగ్ ప్రాంతాలకు పంపనున్నారు. ఇటీవలి మహాకుంభమేళా సందర్భంగా ప్రయాణికుల భారీ రద్దీని నిర్వహించడానికి ప్రయాగ్‌రాజ్‌తోపాటు సమీప తొమ్మిది స్టేషన్లలో బాహ్య వెయిటింగ్ జోన్లను ఏర్పాటు చేశారు. ఇవి సత్ఫలితాలు ఇచ్చిన నేపథ్యంలో ఎక్కువ రద్దీ ఉండే మరిన్ని స్టేషన్లలో శాశ్వత వెయిటింగ్ ఏరియాలను అమలు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది.‘వార్ రూమ్’ల ఏర్పాటుఇప్పటికే న్యూఢిల్లీ, ఆనంద్ విహార్, వారణాసి, అయోధ్య, పాట్నా వంటి స్టేషన్లలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఈ స్టేషన్లలో అనధికారిక ప్రవేశాన్ని నివారించడానికి నియంత్రిత యాక్సెస్ గేట్లను ఏర్పాటు చేశారు. సమర్థవంతమైన పర్యవేక్షణ కోసం స్టేషన్లు, పరిసర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా నిఘాను పెంచాలని రైల్వే శాఖ యోచిస్తోంది. వీటితోపాటు ప్రధాన స్టేషన్లలో రద్దీ మరీ ఎక్కువగా ఉన్న సమయాల్లో వివిధ శాఖల అధికారులు సమన్వయం చేసుకుని చర్చించుకునేందుకు ‘వార్ రూమ్’లను సైతం ఏర్పాటు కానున్నాయి.కమ్యూనికేషన్‌ను మెరుగుపరచడానికి, ప్రయాణికుల భారీ రద్దీని నిర్వహించే స్టేషన్లలో వాకీ-టాకీలు, అధునాతన అనౌన్స్మెంట్ వ్యవస్థలు, మెరుగైన కాలింగ్ వ్యవస్థలతో సహా కొత్త డిజిటల్ పరికరాలు ప్రవేశపెట్టనున్నారు. ముఖ్యంగా అత్యవసర సమయాల్లో సులభంగా గుర్తించేందుకు వీలుగా సిబ్బందికి రీడిజైన్ చేసిన ఐడీ కార్డులు, కొత్త యూనిఫామ్ అందించనున్నారు. అలాగే అన్ని ప్రధాన స్టేషన్లలో సీనియర్ అధికారులను స్టేషన్ డైరెక్టర్లుగా నియమించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. వీటితోపాటు స్టేషన్ కెపాసిటీ ఆధారంగా టికెట్ల అమ్మకాలను నియంత్రించడం, మరింత సమర్థవంతమైన క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకోవడానికి అధికారులకు మరిన్ని అధికారాలు కల్పించనున్నారు. -
వేతన పెరుగుదలలో టీచింగ్ లీడర్లదే హవా!
వేగంగా అభివృద్ధి చెందుతున్న స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో కంపెనీలకు నాయకత్వ వాహిస్తున్న వారికి మెరుగైన వేతనాలున్నాయని కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ కంపెనీలను విజయపథంలో నడిపించడంలో సమర్థవంతమైన నాయకత్వం కీలక పాత్ర పోషిస్తుందనేది రహస్యమేమీ కాదు. అయితే స్టార్టప్ లీడర్లు, ముఖ్యంగా టీచింగ్ రోల్స్‌లో ఉన్నవారు వేతనాల విషయంలో 80 శాతం ముందంజలో ఉన్నారని నిపుణులు చెబుతున్నారు.బోధించే నాయకుల ప్రాముఖ్యతస్టార్టప్ల్లో టీచింగ్ లీడర్లు అంటే సంస్థల్లో మెంటార్షిప్, ఎడ్యుకేషనల్ బాధ్యతలను చేపట్టేవారు. ఈ వ్యక్తులు తమ బృందాలకు నాయకత్వం వహించడమే కాకుండా సహోద్యోగుల నైపుణ్యాలు, జ్ఞానాన్ని పెంపొందించడంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. అలా చేయడం ద్వారా నిరంతర అభ్యాసం, నూతన ఆవిష్కరణలకు దోహదపడుతుంది. స్టార్టప్‌ల సుస్థిరతకు ఇది ఎంతో అవసరం అవుతుంది.ఇదీ చదవండి: ఇంటి ఓనర్ మహిళ అయితే ఎన్ని ప్రయోజనాలో..ఫైనాన్షియల్ రివార్డులుస్టార్టప్ల్లో టీచింగ్ లీడర్లకు ఇచ్చే ఆర్థిక రివార్డులు ఇటీవలి కాలంలో గణనీయంగా పెరుగుతున్నాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం బోధనా బాధ్యతలను చేపట్టే నాయకులు, అటువంటి కార్యకలాపాల్లో పాల్గొనని ఒకే స్థాయి తోటి ఉద్యోగులతో పోలిస్తే వేతన ప్యాకేజీలపరంగా 80 శాతం ముందుంజలో ఉంటున్నారు. ఈ వేతన పెంపునకు కొన్ని కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.సంస్థ విలువను పెంచడం: టీచింగ్ లీడర్లను సంస్థకు సంబంధించిన అమూల్యమైన ఆస్తులుగా పరిగణిస్తారు. ఎందుకంటే వారు టీమ్ మొత్తం అభివృద్ధికి దోహదం చేస్తారు. ఇతర ఉద్యోగుల్లో నైపుణ్యాలు పెంచి స్టార్టప్ పనితీరును ప్రభావితం చేస్తారు.ప్రతిభను నిలుపుకోవడం: బలమైన టీచింగ్ లీడర్లు ఉన్న స్టార్టప్‌లు టాప్ టాలెంట్‌ను ఆకర్షించడానికి, దాన్ని నిలుపుకోవడానికి మొగ్గు చూపుతాయి. ఉద్యోగులు కంపెనీ ఎదిగేందుకు సహకరిస్తూ, టర్నోవర్ వ్యయాలను తగ్గించే అవకాశం ఉంటుంది.మెరుగైన నాయకత్వ నైపుణ్యాలు: టీచింగ్ లీడర్లు సహజంగానే అధునాతన నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించుకుంటారు. ఇతరులకు మార్గనిర్దేశం చేయడం ద్వారా వారు తమ కమ్యూనికేషన్, సమస్యా పరిష్కార సామర్థ్యాలను మెరుగుపరుస్తారు. -
మహిళలకు ఎస్బీఐ ప్రత్యేక పథకం.. డెబిట్ కార్డు
మహిళా ఎంట్రప్రెన్యూర్లకు పూచీకత్తు లేకుండా, తక్కువ వడ్డీ రేటుపై రుణాలు అందించేలా ’అస్మిత’ పథకాన్ని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ప్రవేశపెట్టింది. మహిళల సారథ్యంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా యూనిట్లకు డిజిటల్ మాధ్యమం ద్వారా వేగవంతంగా, సులభతరంగా రుణ సదుపాయం లభించేందుకు ఇది ఉపయోగపడుతుందని బ్యాంక్ చైర్మన్ సీఎస్ శెట్టి తెలిపారు.వినియోగ ప్రయోజనాల కోసం రుణాలు తీసుకోవడానికి ఇష్టపడే మహిళలు వ్యాపార రుణాలకు తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ట్రాన్స్ యూనియన్ సిబిల్ ప్రకటించిన కొద్ది రోజుల్లోనే ఈ ఆవిష్కరణ జరగడం గమనార్హం. ప్రముఖ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ ప్రకారం.. మహిళలు తీసుకున్న రుణాలలో కేవలం 3 శాతం మాత్రమే వ్యాపార ప్రయోజనాల కోసం, 42 శాతం వ్యక్తిగత రుణాలు, కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్స్, హోమ్ ఓనర్షిప్ వంటి పర్సనల్ ఫైనాన్స్ ఉత్పత్తుల కోసం, 38 శాతం బంగారంపై ఉన్నాయి.మరోవైపు, మహిళల కోసమే ప్రత్యేకంగా రూపొందించిన రూపే ఆధారిత ’నారీ శక్తి’ ప్లాటినం డెబిట్ కార్డును కూడా బ్యాంకు ఆవిష్కరించింది. ఇక మరో ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా ప్రవాస భారతీయులలో మహిళల కోసం 'బీవోబీ గ్లోబల్ ఉమెన్ ఎన్ఆర్ఈ అండ్ ఎన్ఆర్ఓ సేవింగ్స్ అకౌంట్' పేరిట ప్రత్యేక ఖాతాను ప్రారంభించింది. -
మహిళలకు ఫ్రెష్‌బస్ ఫ్రీ కార్డులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న తమ బస్సుల్లో ప్రయాణించే మహిళా ప్రయాణికులకు రూ. 500 వరకు పొదుపు చేసే ఫ్రెష్ కార్డులను ఉచితంగా ఇస్తున్నట్లు ఫ్రెష్‌బస్ తెలిపింది. వీటిని తదుపరి 10 రైడ్స్ కోసం ఉపయోగించుకోవచ్చని, ఒక్కో రైడ్‌పై రూ. 50 ఆదా చేసుకోవచ్చని వివరించింది.తమ వెబ్సైట్ లేదా యాప్‌లో బుక్ చేసుకున్న వారికి ఇది వర్తిస్తుందని పేర్కొంది. హైదరాబాద్, తిరుపతి, గుంటూరు, విజయవాడ, బెంగళూరు తదితర రూట్లలో సర్వీసులు నడిపిస్తున్నట్లు కంపెనీ వ్యవస్థాపకుడు సుధాకర్ రెడ్డి చిర్రా తెలిపారు. సంస్థను ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకూ తమ బస్సుల్లో 6.5 లక్షల మంది ప్రయాణించగా ఇందులో 30 శాతం అంటే 1.94 లక్షల మంది మహిళలు ప్రయాణించారని ఆయన తెలిపారు. మహిళలకు తమ సంస్థపై పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు. -
టెక్ అంకురాల్లోనూ మహిళల హవా..!
న్యూఢిల్లీ: వినూత్న ఆవిష్కరణలతో ఆకట్టుకుంటున్న మహిళా స్టార్టప్‌లు, భారీ ఎత్తున నిధుల సమీకరణలోనూ సత్తా చాటుతున్నాయి. మహిళల సారథ్యంలోని అంకుర సంస్థలు ఇప్పటివరకు 26 బిలియన్ డాలర్ల పెట్టుబడులను సమీకరించాయి. ఆల్‌టైమ్ ఫండింగ్ విషయంలో అమెరికా తర్వాత స్థానంలో నిల్చాయి. రీసెర్చ్, అనలిటిక్స్ సంస్థ ట్రాక్షన్ ఒక నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది. దీని ప్రకారం దేశీయంగా మహిళల సారథ్యంలోని అంకుర సంస్థల సంఖ్య 7,000 పైచిలుకు ఉంది. క్రియాశీలకంగా ఉన్న మొత్తం స్టార్టప్‌లలో వీటి వాటా 7.5 శాతం. ఇవన్నీ కలిసి ఇప్పటివరకు 26.4 బిలియన్ డాలర్లు సమీకరించాయి. 2021లో అత్యధికంగా 6.3 బిలియన్ డాలర్లు దక్కించుకున్నాయి. 2022లో అంతర్జాతీయంగా చూస్తే మహిళా స్టార్టప్‌లు మొత్తం మీద 32.8 బిలియన్ డాలర్లు సమీకరించగా .. దేశీ అంకురాలు 5 బిలియన్ డాలర్లతో 15.18% వాటా దక్కించుకున్నాయి. ఇక 2024లో అంతర్జాతీయంగా మహిళల సారథ్యంలోని స్టార్టప్‌లకు ఫండింగ్ విషయంలో 3.96% వాటాతో అమెరికా, బ్రిటన్ తర్వాత భారత్ మూడో స్థానంలో నిలి్చంది. ఈ స్టార్టప్‌లు భారీగా నిధులను సమీకరించడంతో పాటు పరిశ్రమలకు కొత్త నిర్వచనాన్ని ఇస్తూ, ఉద్యోగాలు కల్పిస్తూ, భవిష్యత్ ఎంట్రప్రెన్యూర్లకు కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తున్నాయని ట్రాక్షన్ పేర్కొంది. ఇవి మరింత వృద్ధిలోకి రావాల ంటే ఆర్థిక తోడ్పాటు, మెంటార్షిప్, వ్యవస్థాగతంగా మద్దతు లభించడం కీలకమని వివరించింది. నివేదికలోని మరిన్ని విశేషాలు.. → రంగాలవారీగా చూస్తే రిటైల్ స్టార్టప్‌లు అత్యధికంగా 7.8 బిలియన్ డాలర్లు, ఎడ్టెక్ 5.4 బిలియన్ డాలర్లు, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అంకురాలు 5 బిలియన్ డాలర్లు సమీకరించాయి. బిజినెస్ టు కన్జూమర్ ఈ–కామర్స్, ఇంటర్నెట్ ఫస్ట్ బ్రాండ్లు, ఫ్యాషన్ టెక్ అంకురాలు కూడా గణనీయంగా రాణిస్తున్నాయి. → మహిళా స్టార్టప్‌ల సంఖ్యాపరంగా, అలాగే ఇప్పటి వరకు సమీకరించిన నిధులపరంగా బెంగళూరు అగ్రస్థానంలో ఉంది. ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్ ఆ తర్వాత స్థానాల్లో నిల్చాయి. → 2021లో మహిళల సారథ్యంలోని స్టార్టప్‌లలో అత్యధికంగా ఎనిమిది అంకురాలు యూనికార్న్‌లుగా ఎదిగాయి. 2019లో మూడు, 2020లో నాలుగు, 2022లో అయిదు ఈ హోదా సాధించాయి. అయితే, 2017, 2023, 2024లో ఒక్క యూనికార్న్ కూడా నమోదు కాలేదు. → 2021లో మహిళా స్టార్టప్‌లు అత్యధికంగా 45 సంస్థలను కొనుగోలు చేశాయి. 2022లో ఇది 36కి, 2023లో 25కి, 2024లో 16కి తగ్గింది. → 2024లో మహిళల సారథ్యంలోని అయిదు స్టార్టప్‌లు పబ్లిక్ ఇష్యూకి వచ్చాయి. మొబిక్విక్, ఉషా ఫైనాన్షియల్, తన్వాల్, ఇంటీరియర్స్ అండ్ మోర్, లాసీఖో వీటిలో ఉన్నాయి. -
అమెరికాలో టెక్ మహీంద్రా విస్తరణ
న్యూఢిల్లీ: అమెరికా మార్కెట్లో కార్యకలాపాల విస్తరణలో భాగంగా ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా తాజాగా టెక్సాస్‌లోని ప్లానోలో ఆఫీసు ఏర్పాటు చేసింది. ఇది 130 సీట్ల సామర్థ్యంతో 27,000 చ.అ. విస్తీర్ణంలో ఏర్పాటైంది. అమెరికాలో ఇది తమకు పంతొమ్మిదో కార్యాలయమని సంస్థ తెలిపింది. కన్సలి్టంగ్, డెలివరీ, కస్టమర్ సపోర్ట్ సర్వీసులు మొదలైన సరీ్వసులు దీని ద్వారా అందించనున్నట్లు వివరించింది. ఇదే ప్రాంగణంలో ఇన్నోవేషన్ ల్యాబ్‌ను కూడా ప్రారంభించనున్నట్లు కంపెనీ తెలిపింది. ప్రస్తుతం 90 పైగా దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న టెక్ మహీంద్రాలో 1,50,000 మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. -
అంతర్జాతీయ మహిళా దినోత్సవం: అద్భుతమైన సందేశం
ప్రపంచ వ్యాప్తంగా.. వివిధ రంగాలలో మహిళలు సాధించిన విజయాలకు గుర్తుగా, వారిని గౌరవించడానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని (International Women’s Day) జరుపుకుంటారు. ఈ సందర్భంగా గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ 'ప్రియాంక చిగురుపాటి' (Priyanka Chigurupati) ఓ సందేశాన్ని ఇచ్చారు.మహిళా దినోత్సవం అనేది.. ఒక వేడుక కంటే ఎక్కువ. ఇది ప్రతి మహిళలో దాగి ఉన్న శక్తిసామర్త్యాల జ్ఞాపకం. మన దేశంలో మహిళా వ్యవస్థాపకులు కేవలం వ్యాపారాలను మాత్రమే కాకుండా.. భవిష్యత్తులను రూపొందిస్తున్నారు. నేడు స్టాక్ మార్కెట్లోకి కొత్తగా అడుగుపెడుతున్న నలుగురు వ్యక్తులలో ఒకరు స్త్రీ కావడం గమనార్హం, గర్వించదగ్గ విషయం. ఇది కేవలం గణాంకాల కోసం చెప్పుకునే సంఖ్య కాదు.. వారు సొంతంగా నిలబడుతున్నారు అనేదానికి నిదర్శనం అని ప్రియాంక అన్నారు.మహళలు పురోగతి సాధించాలంటే.. ఒంటరి ప్రయత్నం కాకుండా, సమిష్టిగా కృషి చేయాల్సి ఉంటుంది. ఇది వ్యవస్థాగత అడ్డంకులను ఛేదించడానికి, ఆర్థిక.. వృత్తిపరమైన అభివృద్ధికి, స్త్రీ సామర్థ్యాన్ని గుర్తించడానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.గ్రాన్యూల్స్.. నిజమైన సాధికారత పని ప్రదేశానికంటే ఉత్తమంగా ఉంటుంది. మహిళలను నాయకులుగా, ఆవిష్కర్తలుగా, సమాజంలో మార్పు తీసుకొచ్చేవారిగా అభివృద్ధి చెందే పర్యావరణ వ్యవస్థలను రూపొందించడమే కంపెనీ ఉద్దేశ్యం. వీరు శాస్త్రీయ పురోగతులను నడిపిస్తున్నా, విజయవంతమైన సంస్థలను నడుపుతున్నా లేదా ఆర్థిక భవిష్యత్తును రూపొందిస్తున్నా వారిని ఇంకా అభివృద్ధి చెందేలా చేయాలి. దీనికోసం మహిళా దినోత్సవం నుంచే పాటు పడాలని చెప్పారు. -
20 రాష్ట్రాలు.. 100 స్టేషన్లు: ఫుడ్ డెలివరీలో స్విగ్గీ హవా
ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ (Swiggy).. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) భాగస్వామ్యంతో దేశంలోని 20 రాష్ట్రాలలో 100 రైల్వే స్టేషన్లకు తన సేవలను విస్తరించింది. రాబోయే రోజుల్లో మరిన్ని రైల్వే స్టేషన్లకు ఈ సదుపాయాన్ని విస్తరించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.నిజానికి రైలు ప్రయాణం అనేది.. భారతదేశ సంస్కృతిలో అంతర్భాగమైపోయింది. ఈ ప్రయాణంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. రైళ్లలో స్విగ్గీ ఫుడ్‌ను 100 స్టేషన్లకు విస్తరించడం వల్ల ప్రయాణీకులకు ఎక్కువ సౌలభ్యంగా ఉంది. అంతే కాకుండా దేశవ్యాప్తంగా విభిన్న రకాల భోజనాలను రుచి చూసే అవకాశం లభించిందని.. స్విగ్గీ ఫుడ్ మార్కెట్‌ప్లేస్ వైస్ ప్రెసిడెంట్ దీపక్ మాలూ అన్నారు.స్విగ్గీ 2024 మార్చిలో ఐఆర్సీటీసీతో ఒప్పందం కుదుర్చుకున్న తరువాత.. సీటుకు గ్యారెంటీ డెలివరీ (లేదా పూర్తి వాపసు) ప్రకటించింది. తాము ఎక్కడైతే ఫుడ్ డెలివరీ చేసుకోవాలనుకుంటున్నారో.. ముందు స్టేషన్లోనే నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. అప్పుడు తాము చేరుకునే సమయానికి ఫుడ్ డెలివరీ అవుతుంది. జొమాటో కూడా ఈ తరహా ఫుడ్ డెలివరీ చేస్తోంది. ఈ రెండు సంస్థలు రోజుకు లక్ష కంటే ఎక్కువ ఫుడ్ డెలివరీలు చేస్తున్నట్లు సమాచారం. -
నెలకు ఒకరోజు సెలవు: దిగ్గజ కంపెనీ కీలక నిర్ణయం
వేల మంది ఉద్యోగిణులకు ఉపాధి కల్పించిన ఇంజనీరింగ్, నిర్మాణరంగ దిగ్గజ సంస్థ లార్సెన్ అండ్ టూబ్రో(ఎల్అండ్టీ) సంస్థ గురువారం మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. నెలసరి సమయంలో ఒకరోజు పెయిడ్ లీవ్ ఇస్తున్నట్లు ప్రకటించింది.అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఎల్ అండ్ టీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ ఈ ప్రకటన చేశారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దేశంలో ఎల్అండ్టీ వంటి దిగ్గజ కార్పొరేట్ సంస్థ ఒకటి ఇలా నెలసరి పెయిడ్ లీవ్ ఇవ్వడం ఇదే తొలిసారి. పెయిడ్ లీవ్ విధానాన్ని ఏ తరహాలో అమలుచేస్తారనే వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే ఎల్అండ్టీ మాతృసంస్థలో పనిచేసే మహిళలకే ఈ లీవ్ సౌకర్యం ఉంటుందని తెలుస్తోంది.ఇదీ చదవండి: నెలకు 10 రోజులు: టెక్ కంపెనీ కొత్త రూల్!ఎల్అండ్టీ అనుబంధ విభాగాలైన ఆర్థిక సేవలు లేదా టెక్నాలజీ వంటి విభాగాల్లో చేసే ఉద్యోగిణులకు ఈ సౌకర్యం ఉండకపోవచ్చని ఆయా వర్గాలు స్పష్టంచేశాయి. ప్రస్తుతం ఎల్అండ్టీలో 60,000 మంది ఉద్యోగులు ఉండగా వారిలో 9 శాతం అంటే దాదాపు 5,000 మంది మహిళలు ఉన్నారు. -
హైదరాబాద్‌లో అతిపెద్ద జ్యువెలరీ ప్రదర్శన: ఎన్ని రోజులంటే..
మార్చి 7, 2025, హైదరాబాద్: దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రియమైన ఫైన్ జ్యువెలరీ బ్రాండ్ అయిన PMJ జ్యువెల్స్ ఆధ్వర్యంలో శుక్రవారం బంజారా హిల్స్‌లోని తాజ్ కృష్ణలో హైదరాబాద్‌లో అతిపెద్ద వెడ్డింగ్, హాఫ్ సారీ ఆభరణాల ప్రదర్శనను ప్రారంభమైంది.ఈ ప్రదర్శన కార్యక్రమానికి.. PMJ జ్యువెల్స్ ఆధ్వర్యంలో ప్రతీక్ జైన్, చక్రపాణి, పాండు గౌడ్, ఇతర ప్రముఖ వ్యక్తులు హాజరయ్యారు. మార్చి 7న ప్రారంభమైన ఈ ప్రదర్శన మార్చి 9 వరకు కొనసాగుతుంది. ఆభరణాల ప్రదర్శనలో 20,000 కంటే ఎక్కువ PMJకు చెందిన హ్యండ్ మేడ్ డిజైనర్ ఆభరణాలను ప్రదర్శిస్తారు.వివాహ ఆభరణాలు, హాఫ్ సారీ ఆభరణాలతో పాటు.. ఈ ప్రదర్శనలో రోజువారీ దుస్తులు, ఫెస్టివల్ క్రియేషన్లు కూడా ప్రదర్శించనున్నారు. ఇవి ప్రత్యేక సీజన్లకు మాత్రమే కాకుండా ఆఫీసు, పార్టీలతో పాటు సాధారణ దుస్తులకు కూడా అనుకూలంగా ఉంటాయి.ఈ ప్రదర్శనలో ప్రత్యేకంగా క్యూరేట్ చేసిన.. బ్యూటీ డిజైన్లు ఉంటాయి. ఇవి కాలాతీత సంప్రదాయాన్ని సమతుల్యం చేయడంతో పాటు ఫ్యాషన్ డిజైన్లను ప్రతిబింభిస్తున్నాయి. వజ్రాలు, బంగారం, పోల్కీ, సాలిటైర్లలో విస్తృత శ్రేణి డిజైన్లతో.., ఈ ప్రదర్శనలో సాంప్రదాయ డిజైన్లు మొదలు ఆధునిక హంగుల వరకు సమకాలీన సౌందర్యంతో అలరిస్తున్నాయి. -
ఈ బ్యాంక్ సీఈఓ జీతం ఎంతో తెలుసా?: ప్రపంచంలోనే..
గురువారం విడుదలైన బ్యాంక్ వార్షిక నివేదిక ప్రకారం, డీబీఎస్ గ్రూప్ హోల్డింగ్స్ లిమిటెడ్‌లో.. భారత సంతతికి చెందిన సీఈఓ 'పియూష్ గుప్తా' (Piyush Gupta) వేతనం భారీగా పెరిగింది. 2024 సంవత్సరానికి 56 శాతం వేతన పెంపును పొందారు. దీంతో ఆయన వేతనం 17.6 మిలియన్ సింగపూర్ డాలర్లకు (రూ. 110 కోట్ల కంటే ఎక్కువ) చేరింది.సింగపూర్‌కు చెందిన DBS గ్రూప్ హోల్డింగ్స్ సీఈఓ గుప్తా.. 2023లో డిజిటల్ బ్యాంకింగ్ లోపాల కారణంగా 11.2 మిలియన్ సింగపూర్ డాలర్లను వార్షిక వేతనంగా తీసుకున్నారు. ఆ తరువాత ఈయన వేతనం క్రమంగా పెరిగింది. ఇప్పుడు 17.6 మిలియన్లకు చేరింది. కాగా పియూష్ గుప్తా ఈ నెలలో తన పదవిని వీడుతున్నట్లు తెలుస్తోంది. ఆ స్థానంలో 'టాన్ సు షాన్' నియమితులయ్యారు. ఈయన మార్చి 28 నుంచి DBS గ్రూప్ హోల్డింగ్స్ బాధ్యతలు స్వీకరిస్తారు.2024 సంవత్సరానికి పియూష్ గుప్తా.. తన ప్యాకేజీలో 6.6 మిలియన్స్ క్యాష్ బోనస్, 2.5 డాలర్స్ ఇతర అలవెన్స్ వంటివి పొందారు. దీంతో ప్రపంచంలోనే అత్యధిక జీతం పొందుతున్న బ్యాంకర్లలో ఒకరిగా నిలిచారు. కాగా మొదటి వ్యక్తి.. స్టాండర్డ్ చార్టర్డ్ సీఈవో 'బిల్ వింటర్స్' ఉన్నారు.ఇదీ చదవండి: రెండు లక్షలమంది కొన్న కారు: ఇప్పుడు కొత్త ఎడిషన్‌లో..గత 15 సంవత్సరాలుగా.. డీబీఎస్ బ్యాంక్ మార్కెట్ క్యాప్ గణనీయంగా పెరుగుతోంది. 2009లో ఈ బ్యాంక్ మార్కెట్ క్యాప్ 35 బిలియన్ సింగపూర్ డాలర్స్ కాగా.. 2024 నాటికి ఇది 124 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో 100 బిలియన్ డాలర్ల మార్కును దాటిన సింగపూర్ లిస్టెడ్ కంపెనీల జాబితాలో చేరింది. 2009లో కేవలం 14,000 మంది ఉద్యోగులు మాత్రమే ఈ బ్యాంకులో పనిచేసేవారు. ఈ సంఖ్య 2024కు 41,000 మందికి చేరింది. డీబీఎస్ బ్యాంక్ సీఈఓ జీతం మాత్రమే కాకుండా.. ఇతర సీనియర్ ఉద్యోగుల జీతాలు కూడా పెరిగినట్లు తెలుస్తోంది. -
స్టాక్మార్కెట్లోకి ‘చాయ్ పాయింట్’
న్యూఢిల్లీ: టీ, కాఫీ చైన్.. చాయ్ పాయింట్ 2026 మే నెలకల్లా స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యే ప్రణాళికల్లో ఉంది. ఈ అంశాన్ని ప్రతిరోజు సుమారు 9 లక్షల కప్పుల టీ, కాఫీ విక్రయిస్తున్న సంస్థ సహవ్యవస్థాపకుడు తరుణ్ ఖన్నా తెలియజేశారు. అయితే కుంభమేళాలో రోజుకి 10 లక్షలకంటే అధికంగా విక్రయించినట్లు తెలియజేశారు.ముంబైలో తమ విద్యార్ధి అములీక్ సింగ్ బిజ్రాల్తో కలసి ఒక కేఫ్‌లో టీ తాగే సమయంలో 2009లో చాయ్ పాయింట్ ప్రారంభించే ఆలోచన వచ్చినట్లు హార్వార్డ్ యూనివర్శిటీ ప్రొఫెసర్ ఖన్నా వెల్లడించారు. ప్లాస్టిక్ కప్పులలో అంత శుభ్రతలేని విధంగా అందిస్తున్న చాయ్ స్థానే అత్యున్నత నాణ్యతతో, పరిశుభ్రంగా అందుబాటు ధరలో సువాసనలతో కూడిన చాయ్ అందించాలనే ఆలోచనతో చాయ్ పాయింట్‌కు తెరతీసినట్లు వివరించారు.దీంతో టీ అందించే వ్యక్తు(చోటూ)లకు ఉపాధిని సైతం కల్పించవచ్చని భావించినట్లు తెలియజేశారు. దీంతో 2010లో బెంగళూరులోని కోరమంగళలో తొలి ఔట్‌లెట్‌ను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. అములీక్తో కలిసి ఐదుగురు ఉద్యోగులతో బిజినెస్‌ను మొదలుపెట్టినట్లు వెల్లడించారు. ప్రస్తుతం రోజుకి 90 లక్షల కప్పుల టీ, కాఫీలను విక్రయిస్తున్నట్లు తెలియజేశారు. -
డిపాజిట్లపై బీమా పెంచితే బ్యాంకులపై ప్రభావం
ముంబై: డిపాజిట్లపై బీమా పరిమితిని రూ.5 లక్షలకు మించి పెంచితే అది బ్యాంకుల లాభదాయకతపై ప్రభావం చూపిస్తుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. దీనివల్ల సుమారు రూ.12,000 కోట్ల మేర లాభం తగ్గిపోవచ్చని అంచనా వేసింది. ప్రస్తుతం ఒక బ్యాంక్ పరిధిలో ఒక కస్టమర్ పేరిట రూ.5లక్షల బీమా సదుపాయాన్ని డీఐసీజీసీ అందిస్తోంది. ఇందుకు గాను బ్యాంక్‌లు డిపాజిట్ల మొత్తంపై డీఐసీజీసీకి ప్రీమియం చెల్లిస్తుంటాయి.రూ.5 లక్షలకు మించి పెంచే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్టు కేంద్ర ఆర్థిక సేవల కార్యదర్శి నాగరాజు ఇటీవలే ప్రకటించడం గమనార్హం. ప్రభుత్వం ఆమోదం తెలిపితే, నోటిఫై చేస్తామని చెప్పారు. ‘‘ఇటీవల ఓ కోపరేటివ్ బ్యాంక్ (న్యూ ఇండియా కోపరేటివ్ బ్యాంక్) వైఫల్యం నేపథ్యంలో డిపాజిట్ ఇన్సూరెన్స్ పరిమితి పెంపు చర్చకు వచ్చింది. ఇది బ్యాంక్‌లపై స్వల్ప స్థాయిలోనే అయినా, చెప్పుకోతగ్గ మేర లాభదాయకతపై ప్రభావం చూపించనుంది’’అని ఇక్రా ఫైనాన్షియల్ రంగం రేటింగ్స్ హెడ్ సచిన్ సచ్దేవ పేర్కొన్నారు. పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంక్ వైలఫ్యంతో చివరిగా 2020 ఫిబ్రవరిలో డిపాజిట్‌పై బీమాను రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచినట్టు గుర్తు చేశారు.97.8 శాతం డిపాజిట్లకు రక్షణ 2024 మార్చి నాటికి 97.8 శాతం బ్యాంక్ ఖాతాలు బీమా రక్షణ పరిధిలో ఉన్నట్టు ఇక్రా తెలిపింది. ఈ ఖాతాల్లోని డిపాజిట్ల మొత్తం రూ.5లక్షల్లోపే ఉన్నట్టు పేర్కొంది. ఇన్సూర్డ్ డిపాజిట్ రేషియో (ఐడీఆర్) 43.1 శాతంగా ఉన్నట్టు తెలిపింది. ఈ ఐడీఆర్‌ను 47 శాతం నుంచి 66.5 శాతానికి తీసుకెళితే, అప్పుడు బ్యాంకుల నికర లాభం రూ.1,800 కోట్ల నుంచి రూ.12,000 కోట్ల మేర ప్రభావితమవుతుందని వివరించింది. దీంతో బ్యాంకుల రిటర్న్ ఆన్ అసెట్స్ (ఆర్వోఏ) 0.01–0.04 శాతం మేర, రిటర్న్ ఆన్ ఈక్విటీ (ఆర్‌వోఈ) 0.07–0.4 శాతం మేర ప్రభావితం కావొచ్చని అంచనా వేసింది. -
రూ.260 కోట్లు.. ఆర్జనలోనూ అతివలే..
మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఇప్పుడిప్పుడే ఆధిపత్యాన్ని చాటుతున్నారు. ప్రస్తుతం ప్రపంచం మహిళా దినోత్సవాన్ని జరుపుకొంటున్న వేళ ప్రముఖ అంతర్జాతీయ ఆతిథ్య సంస్థ ఎయిర్‌బీఎన్‌బీ.. మహిళల వ్యాపార పురోభివృద్ధిపై ఆసక్తికర విశేషాల్ని వెల్లడించింది.ఎయిర్‌బీఎన్‌బీలో భారతీయ మహిళా హోస్ట్‌లకు (హోటల్స్, పీజీలు అద్దెకిచ్చే వారు) 2024 సంవత్సరం ఒక మైలురాయిగా నిలిచింది. వారు ఆ ఏడాదిలో రూ.260 కోట్లు ఆర్జించారు. ఇది ఆ ప్లాట్‌ఫామ్ ఆతిథ్య ల్యాండ్ స్కేప్‌కు గణనీయంగా దోహదం చేసింది. దేశంలోని ఎయిర్‌బీఎన్‌బీ హోస్ట్ లలో దాదాపు 30% ఉన్న మహిళలు సమ్మిళితతను పెంపొందించడం, ఆర్థిక అవకాశాలను అందిపుచ్చుకోవడం ద్వారా సాంప్రదాయ ఆతిథ్య పరిశ్రమను పునర్నిర్మించారు. దేశవ్యాప్తంగా ట్రావెల్ అనుభవాలను పునర్నిర్వచించడంలో మహిళల ప్రాముఖ్యత పెరుగుతోందనడానికి వారి సాధనలే నిదర్శనం.పెరుగుతున్న మహిళా హోస్ట్లుదేశంలో మహిళా హోస్ట్‌లు గణనీయమైన విజయాన్ని సాధించారు. భారత్‌లో ఎయిర్‌బీఎన్‌బీ గెస్ట్ ఫేవరెట్ లిస్టింగ్స్‌లో దాదాపు 35% మహిళా హోస్ట్‌లే నిర్వహిస్తుంటం విశేషం. చిరస్మరణీయమైన, సౌకర్యవంతమైన బసలను అందించడంలో వారి అసాధారణ సామర్థ్యాన్ని ఇది హైలైట్ చేస్తుంది. సుందరమైన ప్రదేశాలలో సౌకర్యవంతమైన హోమ్ స్టేల నుండి ఆధునిక పట్టణ అపార్ట్ మెంట్ల వరకు, మహిళలు సృజనాత్మకత, శ్రద్ధ, అతిథి అంచనాలపై లోతైన అవగాహనను ప్రదర్శించారు.భారతీయ మహిళల్లో ట్రావెల్ ట్రెండ్స్దేశీయ, అంతర్జాతీయ పర్యటనలకు ఎయిర్‌బీఎన్‌బీని భారత మహిళా ప్రయాణికులు వేదికగా ఎంచుకున్నారు. 2024లో భారతీయ మహిళా ప్రయాణికులకు అత్యంత డిమాండ్ ఉన్న దేశీయ గమ్యస్థానాలలో గోవా, ఢిల్లీ, బెంగళూరు, పూణే, జైపూర్ ఉన్నాయి. అంతర్జాతీయంగా లండన్, దుబాయ్, బ్యాంకాక్, పారిస్, రోమ్ వంటి నగరాలు వారి ట్రావెల్ విష్ లిస్ట్‌లో అగ్రస్థానంలో నిలిచాయి.మిలీనియల్ మహిళలు (1981-1996 మధ్య పుట్టినవారు) తమ ప్రయాణ ప్రణాళికల కోసం ఎయిర్‌బీఎన్‌బీని ఉపయోగించడంలో ముందంజలో ఉన్నారు. వారి తరువాత వరుసలో జెన్‌జెడ్ మహిళలు (1996-2012 మధ్య పుట్టినవారు) ఉన్నారు. సౌలభ్యం, ప్రత్యేకమైన అనుభవాలు, స్థోమత కోసం వారి ప్రాధాన్యత ఎయిర్‌బీఎన్‌బీ ప్రజాదరణను పెంచింది. డుయో ట్రావెల్ అత్యంత ఇష్టమైన ట్రిప్ టైప్ గా అవతరించింది. తరువాత సమూహ ప్రయాణాలు, మహిళల్లో భాగస్వామ్య ప్రయాణ అనుభవాల పెరుగుతున్న ధోరణిని ప్రతిబింబిస్తున్నాయి. -
రూ. 1,100 కోట్ల లాభం వస్తుంది.. ఓయో అంచనా
న్యూఢిల్లీ: రానున్న ఆర్థిక సంవత్సరం(2025–26)లో రూ. 1,100 కోట్ల నికర లాభం ఆర్జించగలమని ట్రావెల్ టెక్ స్టార్టప్ ఓయో అంచనా వేసింది. ఈ బాటలో రూ. 2,000 కోట్ల నిర్వహణ లాభం(ఇబిటా) సాధించగలమని భావిస్తున్నట్లు యూనికార్న్ సంస్థ ఓయో వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ పేర్కొన్నారు. ఇందుకు ఆదాయంలో వృద్ధి దోహదపడగలదని అభిప్రాయపడ్డారు.ఇటీవల కొనుగోలు చేసిన మోటెల్ 6 తాజా అంచనాలకు దన్నుగా నిలవనున్నట్లు తెలియజేశారు. ఈ కాలంలో మోటెల్ 6 ఇబిటా రూ. 630 కోట్లకు చేరగలదని ఓయో ఊహిస్తోంది. ఓయో కొనుగోలు చేశాక తొలిసారి మోటెల్ 6 పూర్తి ఏడాది పనితీరును వెల్లడించనుంది. వెరసి ఓయో సంయుక్త ఇబిటా రూ. 2,,000 కోట్లను తాకనున్నట్లు సంబంధిత వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఈ ఏడాది క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో ఓయో రూ. 166 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో నమోదైన రూ. 25 కోట్లతో పోలిస్తే నికర లాభం ఆరు రెట్లు ఎగసింది. వెరసి ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి 9 నెలల్లో(ఏప్రిల్–డిసెంబర్) రూ. 457 కోట్ల నికర లాభం ప్రకటించింది. గతేడాది ఇదే కాలంలో రూ. 111 కోట్ల నష్టం ప్రకటించింది. -
క్యాస్ట్రాల్ ఇండియాపై అరామ్కో కన్ను
న్యూఢిల్లీ: గత నాలుగు రోజులుగా ర్యాలీ బాటలో సాగుతున్న లూబ్రికెంట్స్ తయారీ దిగ్గజం క్యాస్ట్రాల్ ఇండియా కౌంటర్‌కు మరోసారి డిమాండ్ పెరిగింది. దీంతో బీఎస్ఈలో షేరు 11 శాతం జంప్‌చేసి రూ. 246 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈలోనూ 10 శాతం ఎగసి రూ. 245 వద్ద నిలిచింది. ఒక దశలో 13.4 శాతం దూసుకెళ్లి రూ. 252 వద్ద గరిష్టానికి చేరింది.ఎన్ఎస్ఈలో 7.39 కోట్ల షేర్లు, బీఎస్ఈలో 23.62 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. బీపీ(గతంలో బ్రిటిష్ పెట్రోలియం)కు చెందిన లూబ్రికెంట్ బిజినెస్‌ను సౌదీ చమురు దిగ్గజం అరామ్కో కొనుగోలు చేయనున్నట్లు వెలువడిన వార్తలు షేరుపై సానుకూల ప్రభావం చూపుతున్నాయి. దీంతో వరుసగా నాలుగో రోజు క్యాస్ట్రాల్ ఇండియా బలపడింది. 10 బిలియన్ డాలర్లు.. క్యాస్ట్రాల్ బ్రాండుతో బీపీ.. లూబ్రికెంట్స్ విక్రయించే సంగతి తెలిసిందే. బీపీ ఇటీవల పునర్వ్యవస్థీకరణలో భాగంగా లూబ్రికెంట్స్ విభాగం విలువను దాదాపు 10 బిలియన్ డాలర్లుగా మదింపు చేసినట్లు తెలుస్తోంది! కాగా.. వాల్వోలైన్ లూబ్రికెంట్స్ యూనిట్‌తో క్యాస్ట్రాల్ ఆస్తులను జత చేసే యోచనలో అరామ్కో ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.2023లో 2.65 బిలియన్ డాలర్లకు వాల్వోలైన్‌ను అరామ్కో కొనుగోలు చేసింది. భారత్, చైనా, ఆగ్నేయ ఆసియాలో అదనపు రిఫైనింగ్, కెమికల్స్ బిజినెస్‌ల కొనుగోలుకి చూస్తున్నట్లు అరామ్కో గతేడాది పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో క్యాస్ట్రాల్ ఇండియా కొనుగోలుపై అంచనాలు పెరిగినట్లు నిపుణులు తెలియజేశారు. -
మహిళా పారిశ్రామిక వేత్తలకు సాధికారత
న్యూఢిల్లీ: మహిళా పారిశ్రామికవేత్తల సాధికారత కోసం ఎస్ఎంఈ ఫోరమ్, నీతి ఆయోగ్ సంయుక్తంగా ‘ఏ మిలియన్ ఉమెన్ అరైజ్’ పేరుతో కార్యక్రమాన్ని చేపట్టాయి. దేశవ్యాప్తంగా 6 కోట్ల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్ఎంఈ) సంస్థలు ఉంటే, అందులో 35 శాతం మహిళల నిర్వహణలోనివేనని కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ డైరెక్టర్ అంకితా పాండే ఈ సందర్భంగా తెలిపారు. అయినప్పటికీ లింగపరమైన పక్షపాతం, మార్కెట్లో పరిమిత అవకాశాల వంటి వినూత్న సవాళ్లను వారు ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. సంఘటితం చేయడం, మార్గదర్శకం, సామర్థ్య నిర్మాణం, ఈ–కామర్స్‌తో అనుసంధానం ద్వారా ఈ అంతరాలను పరిష్కరించేందుకు ఎంఎస్ఎంఈ శాఖ కట్టుబడి ఉన్నట్టు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో మహిళా వ్యాపారవేత్తలకు మద్దతుగా మహిళా ఎంటర్ప్రెన్యుర్షిప్ ప్లాట్‌ఫామ్ (డబ్ల్యూఈపీ)ను ఏర్పాటు చేసినట్టు నీతి ఆయోగ్ డైరెక్టర్ అన్నారాయ్ తెలిపారు.మహిళ వ్యాపారవేత్తలకు రుణ సదుపాయం, నిబంధనలపరమైన మద్దతు, నైపుణ్య కల్పన, మార్గదర్శకం, నెట్వర్కింగ్ పరంగా సాయమందించనున్నట్టు చెప్పారు. నీతి ఆయోగ్ సహకారంతో డబ్ల్యూఈపీ కార్యక్రమాన్ని లక్షలాది మంది ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తలకు చేరువ చేయగలమని ఇండియా ఎస్ఎంఈ ఫోరమ్ ప్రెసిడెంట్ వినోద్ కుమార్ చెప్పారు. ఎంఎస్ఎంఈలకు మెరుగైన రవాణా పరిష్కారాలను అందించే లక్ష్యంతో ఎయిర్‌లైన్స్ సంస్థ ఇండిగోతో ఎస్ఎంఈ ఫోరమ్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఈ సందర్భంగా కుదుర్చుకుంది. రెట్టింపు సంఖ్యలో మహిళలకు రుణాలు: సరళ్ ఎస్సీఎఫ్ బ్లాక్‌సాయిల్ క్యాపిటల్‌కు చెందిన ఎస్ఎంఈ ప్లాట్‌ఫామ్ ‘సరళ్ ఎస్సీఎఫ్’ 2025లో రెట్టింపు మహిళా వ్యాపారవేత్తలకు సాయమందించాలనుకుంటోంది. ఇప్పటికే 150 మంది మహిళా వ్యాపారవేత్తలకు రూ.64 కోట్ల రుణాలను సమకూర్చినట్టు ప్రకటించింది. వృద్ధికి పెట్టుబడి, దీర్ఘకాల స్థిరత్వం దిశగా వారికి మద్దతుగా నిలుస్తున్నట్టు పేర్కొంది. 2024లో ఈ సంస్థ అంతక్రితం సంవత్సరంతో పోల్చితే 34 శాతం అధికంగా రూ.1,237 కోట్ల రుణాలను మంజూరు చేసినట్టు ప్రకటించింది. -
ఇంటర్నెట్లాగే ఏఐతో కొత్త ఉద్యోగాలొస్తాయ్..
బెంగళూరు: గతంలో ఇంటర్నెట్, సోషల్ మీడియాతో కొత్త కెరియర్లు వచ్చినట్లే కృత్రిమ మేథతో (ఏఐ) కూడా కొత్త ఉద్యోగాలు వస్తాయని జోహో సీఈవో మణి వెంబు తెలిపారు. ఏఐ సొల్యూషన్స్‌కి సంబంధించి పాశ్చాత్య దేశాలకు భారత్ గట్టి పోటీదారుగా ఎదగగలదని ధీమా వ్యక్తం చేశారు. పుష్కలంగా నిపుణుల లభిస్తుండటం, దేశీయంగా సొల్యూషన్స్ రూపొందించుకోవాలన్న ఆకాంక్షలు పెరుగుతుండటం ఇందుకు దోహదపడగలవని వెంబు చెప్పారు. ఏఐ కల్పించగలిగే అవకాశాలను విశాల దృక్పథంతో పరిశీలించి, తగు దిశలో ముందుకెళ్లాలని ఆయన పేర్కొన్నారు. ఏఐ, కొత్త సాంకేతికతలను ఉపయోగించి తమ ప్రస్తుత సిబ్బంది ఉత్పాదకతను పెంచుకునే మార్గాలపై జోహో ప్రధానంగా దృష్టి పెడుతోందని వెంబు వివరించారు. మరోవైపు, అమెరికాలో విధానాలు, టారిఫ్‌లపరంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రభావాలను దేశీ ఐటీ పరిశ్రమ ఇప్పుడే అంచనా వేయలేదని, వేచి చూసే ధోరణిని పాటించాల్సి ఉంటుందని వెంబు చెప్పారు. -
ఓటీటీ.. బంపర్ హిట్
డిజిటల్ స్ట్రీమింగ్ మీడియా సేవల (ఓటీటీ) ముందు నేడు సినిమా థియేటర్లు, టీవీలు చిన్నవైపోతున్నాయి. ప్రేక్షకుల సందడి లేక థియేటర్లు వెలవెలబోతుంటే.. వీక్షకులను కాపాడుకునేందుకు టీవీ చానళ్లు తంటాలు పడుతున్నాయి. వీటికి అందనన్నట్టుగా ఓటీటీ వేదికలు ఎక్స్‌ప్రెస్ వేగంతో దూసుకుపోతున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియోస్టార్, యూట్యూబ్, జీ5, సోనీలివ్, ఆహా.. ఇలా ఓటీటీల జాబితా చాలా పెద్దదే. ఓటీటీ సేవలకు 4జీ టెలికం ఊతమిస్తే.. కరోనా విపత్తు ప్రేక్షకులకు మరింత చేరువ చేసిందని చెప్పుకోవాలి. బాహుబలుల కుస్తీపట్లకు వేదికైన ‘వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్’ (డబ్ల్యూడబ్ల్యూఈ) షోలకు అమెరికా తర్వాత ఎక్కువ మంది వీక్షకులు ఉన్నది భారత్‌లోనేనని నెట్‌ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ మోనికా షెర్గిల్ వెల్లడించారు. డబ్ల్యూడబ్ల్యూఈకి చెందిన రా, ఎన్ఎక్స్టీ, స్మాక్‌డౌన్ ఇలా ప్రతి ఫార్మాట్‌కు సంబంధించి షోలు నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉన్నట్టు చెప్పారు. 2019లోనే డబ్ల్యూడబ్ల్యూఈ ఫార్మాట్లను భారత్‌లో 5 కోట్ల మంది యూజర్లు వీక్షించడం గమనార్హం. చేతిలో స్మార్ట్‌టీవీ మాదిరిగా ఓటీటీ పరిశ్రమ విస్తరిస్తోంది. విస్తరణ వ్యూహాలు.. అమెజాన్ ప్రైమ్‌లో ఇప్పుడు ‘శివరాపల్లి’ వెబ్‌సిరీస్ అదరగొడుతోంది. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఓటీటీ షోలలో ‘పంచాయత్’ ఒకటి. మొదట హిందీలో వచ్చిన ఈ షో ఆ తర్వాత తమిళంలోకి ‘తలైవెట్టియాన్ పాళయం’పేరుతో అనువదించగా, అక్కడా దుమ్ము దులుపుతోంది. ఆ తర్వాత శివరాపల్లి పేరుతో గత నెలలో విడుదలై క్రమంగా ఆదరణ పెంచుకుంటోంది. అమెజాన్ ప్రైమ్ ఇప్పుడు 8,500 టైటిళ్లను ఆఫర్ చేస్తోంది. కొత్తగా విడుదలైన సినిమాలను వేగంగా ప్రైమ్‌లోకి తీసుకొచ్చేందుకు ఎంత చెల్లించడానికైనా వెనుకాడడం లేదు. సెలబ్రిటీ షోల విషయంలోనూ దూకుడు ప్రదర్శిస్తోంది. సోనీ లివ్ ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్’, ‘రాకెట్ బోయ్స్’, షార్క్ ట్యాంక్ ఇండియా, మిలియన్ డాలర్ లిస్టింగ్ తదితర పాపులర్ షోలతో తన యూజర్లను 3.3 కోట్లకు పెంచుకోవడం గమనార్హం. 5.5 కోట్ల యూజర్లు కలిగిన జియోహాట్‌స్టార్ అయితే.. రిలయన్స్ జియోకి ఉన్న 42 కోట్ల కస్టమర్లకు చేరువయ్యేందుకు వ్యూహాలు అమలు చేస్తోంది. సాధారణంగా ఒక వెబ్‌సిరీస్‌లో 6–7 షోలు ఉంటే.. 100 వరకు ఎపిసోడ్లతో సి రీస్ తీసుకురావాలని నిర్మాతలను కోరుతోంది. తద్వారా యూజర్ ఎంగేజ్మెంట్ పెంచుకోవాలని అనుకుంటోంది. విలీనాలు.. కొనుగోళ్లుభారీ మార్కెట్, అదే సమయంలో గణనీయమైన పోటీ నేపథ్యంలో ఓటీటీ పరిశ్రమలో అగ్రస్థానంలో ఉన్న డిస్నీ హాట్‌స్టార్.. తనకు ప్రధాన ప్రత్యర్థిగా అవతరిస్తున్న జియో సినిమాస్‌తో చేతులు కలపడం పరిశ్రమలో స్థిరీకరణ దిశగా బలమైన అడుగులు పడినట్టయింది. పరిశ్రమలో ఇప్పుడు జియోహాట్‌స్టార్ నంబర్ 1 ప్లేయర్. జీతో విలీనం అయ్యేందుకు సోనీ చేసిన ప్రయత్నం ఫలించలేదు. పోటీ పెరగడంతో అమెజాన్ లైట్ పేరుతో ఒక్కరు/ఇద్దరు సభ్యుల కుటుంబం కోసం తక్కువ చార్జీల నమూనాను తీసుకొచ్చింది. అలాగే, 2024లో ఎంఎక్స్ ప్లేయర్‌ను కొనుగోలు చేసి.. దీనిపై ఉచిత కంటెంట్‌ను అందుబాటులో ఉంచింది.భారీగా ఆదాయం.. 2024లో ఓటీటీ సంస్థలు రూ.35,600 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకున్నాయి. ఇందులో యూజర్ల సబ్‌్రస్కిప్షన్ చార్జీలతోపాటు ప్రకటనల ఆదాయం కలిసి ఉంది. ఇందులో 40 శాతం యూట్యూబ్‌కే రావడం గమనార్హం. 2022లో 11.2 కోట్ల ఓటీటీ యూజర్లు కాస్తా, 2023లో 9.6 కోట్లకు తగ్గారు. దీంతో మరింత కంటెంట్‌తో, చౌక ప్లాన్లతో ఓటీటీలు 2024లో యూజర్లను 12.5 కోట్లకు పెంచుకున్నాయి. కెనక్టెట్ టీవీల (ఇంటర్నెట్ అనుసంధానం కలిగినవి) కొనుగోళ్లు పెరుగుతుండడం ఓటీటీలకు మరింత డిమాండ్‌ను తెచ్చి పెడుతోంది. చేతిలో స్మార్ట్ ఫోన్‌కు బదులు పెద్ద సైజు టీవీ తెరలపై షోలను వీక్షించేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. పరిశ్రమ ఆదాయం 2022లో రూ.21,600 కోట్లుగా ఉంటే, 2023లో రూ.30,300 కోట్లకు, 2024లో రూ.35,600 కోట్లకు వృద్ధి చెందింది. వృద్ధికి భారీ అవకాశాలు.. 90 కోట్ల టీవీ వీక్షకులతో పోల్చి చూస్తే.. 12.5 కోట్ల వీక్షకులు కలిగిన ఓటీటీ పరిశ్రమకు మరింత మందిని చేరుకునేందుకు గణనీయమైన అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. దేశంలో స్మార్ట్‌ఫోన్ యూజర్లు 2024 నాటికి 65 కోట్ల మంది ఉంటారని అంచనా. 5 కోట్ల కనెక్టెడ్ టీవీలు కూడా ఉన్నాయి. ఈ పరంగా చూస్తే ఓటీటీల విస్తరణకు దండిగా అవకాశాలున్నాయన్నది విశ్లేషుకుల అభిప్రాయం. తొమ్మిదేళ్ల క్రితం ఫస్ట్ గేర్‌లోకి ప్రవేశించిన ఓటీటీ పరిశ్రమ ప్రస్తుతం పట్టణ యూజర్లకు వేగంగా చేరువ కాగా, దేశంలోని ఇతర ప్రాంతాల వారికీ తమ కంటెంట్‌ను చేరువ చేయాల్సి ఉందంటున్నారు. ఇందుకు వీలుగా ప్రకటనలతో కూడిన తక్కువ సబ్‌్రస్కిప్షన్ ప్యాక్‌లు సాయపడతాయని చెబుతున్నారు. సాక్షి, బిజినెస్ డెస్క్ -
నెలకు 10 రోజులు: టెక్ కంపెనీ కొత్త రూల్!
కరోనా తరువాత దాదాపు అన్ని కంపెనీలు.. వర్క్ ఫ్రమ్ విధానానికి మంగళం పాడాలని నిర్ణయించుకున్నాయి. దశల వారీగా ఈ విధానం తొలగించడానికి సిద్దమయ్యాయి. ఇందులో భాగంగానే ప్రముఖ టెక్ కంపెనీ ఇన్ఫోసిస్.. టెక్నాలజీ టీమ్, నెలలో కనీసం 10 రోజులు ఆఫీసు నుంచి పని చేయాలనే ఆదేశాలను జారీ చేసింది.ఎక్కువ మంది ఆఫీస్ నుంచే పనిచేయాలనే.. ఉద్దేశ్యంతో ఇన్ఫోసిస్ ఈ నిర్ణయం తీసుకుంది. మార్చి 10 నుంచి ఈ రూల్ అమలులోకి రానున్నట్లు తెలుస్తోంది. ప్రతి నెల.. ఆదరినీ ఆఫీసుకు రప్పించాలని, ఉద్యోగులకు అనుకూలంగా ఉండేలా.. కనీసం 10 రోజులు ఆఫీస్ నుంచి, మిగిలిన రోజులు ఇంటి నుంచి పనిచేసుకునే వెసులుబాటు కల్పించింది.ఈ విషయంపై ఇన్ఫోసిస్ అధికారికంగా స్పందించలేదు. అయితే సంస్థలో పనిచేస్తున్న 3.23 లక్షల కంటే ఎక్కువ మంది ఉద్యోగుల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి.. ఈ తరహా హైబ్రిడ్ సిస్టం ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: తగ్గిన బెంచ్ టైమ్.. ఐటీ ఉద్యోగులకు ఊరట!ఈ కొత్త రూల్ లెవల్ 5, అంతకేనట తక్కువ స్థాయి ఉద్యోగులకు వరిస్తుందని తెలుస్తోంది. ఇందులో టీమ్ లీడర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, సీనియర్ ఇంజనీర్లు, సిస్టమ్ ఇంజనీర్లు, కన్సల్టెంట్లు ఉన్నారు. ఎవరైనా 10 రోజులు ఆఫీసుకు రానట్లయితే.. లేదా ఒకటి, రెండు రోజులు తగ్గితే.. వాటిని ఉద్యోగి సెలవుల బ్యాలెన్స్ నుంచి తీసివేసే అవకాశం ఉంది. -
మీడియా దిగ్గజం కీలక నిర్ణయం: 1100 మందిపై వేటు..
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు చెందిన వయాకామ్18.. ది వాల్ట్ డిస్నీ కో. ఇండియా యూనిట్ మధ్య కొత్తగా ఏర్పడిన జాయింట్ వెంచర్ విలీనం తర్వాత 'జియోస్టార్' (Jiostar) ఉద్యోగులను తొలగించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే తొలగింపులు ప్రక్రియ మొదలైనట్లు.. లేఆప్స్ జూన్ వరకు కొనసాగుతాయని చెబుతున్నారు.జియోస్టార్ లేఆప్స్ ప్రభావం సుమారు 1100 మంది ఉద్యోగులపై ప్రభావం చూపుతుంది. ఇందులో ఎంట్రీ లెవల్ ఉద్యోగులు, సీనియర్ మేనేజర్లు, సీనియర్ డైరెక్టర్లు, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్లు ఉన్నారు.అయితే.. ఛాంపియన్స్ ట్రోఫీ, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వంటి అనేక హై-ప్రొఫైల్ టోర్నమెంట్ల ప్రసారాన్ని నిర్వహిస్తున్నందున, మీడియా దిగ్గజం క్రీడా విభాగంలో పనిచేసే ఉద్యోగులపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలుస్తోంది.ఐపీఎల్ 2025 సమయంలో భారీ లాభాలను చవిచూడటమే లక్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే.. ఉద్యోగుల సంఖ్యను తగ్గించడానికి పూనుకుంది. లేఆప్స్ ప్రభావానికి గురైన ఉద్యోగులకు.. వారి పదవీకాలాన్ని బట్టి 6-12 నెలల జీతంతో సహా ఇతర ప్యాకేజీలను అందించనున్నట్లు సమాచారం.జియోస్టార్ నవంబర్ 2024లో రిలయన్స్ నేతృత్వంలోని వయాకామ్18, స్టార్ ఇండియా మధ్య జాయింట్ వెంచర్‌గా ఏర్పడింది. దీంతో 8.5 బిలియన్ డాలర్ల మీడియా దిగ్గజం అవతరించింది. ప్రస్తుతం ఇది నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి స్ట్రీమింగ్ దిగ్గజాలను ప్రత్యర్థిగా ఉంది. -
ఐటీలో మారిన పరిస్థితులు: తగ్గిన బెంచ్ టైమ్..
ఐటీ కంపెనీలు ఎప్పటికప్పుడు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ.. ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవడానికి కూడా ప్రయత్నించేవి. అయితే ఇప్పుడు ఐటీ రంగంలో కీలక మార్పులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే.. పలు టెక్ కంపెనీలు బెంచ్ టైమ్, నెంబర్ తగ్గిస్తున్నట్లు వెల్లడించాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఐటీ కంపెనీలలో ప్రాజెక్టులు కేటాయించని ఉద్యోగులను 'బెంచింగ్' అంటారు. వీరిని సంస్థలు బ్యాకప్ మాదిరిగా ఉపయోగించుకుంటాయి. వీరు ఎక్కువ రోజులు బెంచింగ్ మీద ఉంటే.. వారు లేఆఫ్స్‌కు దగ్గర ఉన్నట్లు. నిజానికి కొత్తగా ఉద్యోగంలో చేరినవారిని కొంతకాలం బెంచ్‌పై కూర్చోబెడతారు. కొన్ని సార్లు అనుభవజ్ఞులైన ఉద్యోగులు కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది.ఏడాదిన్నర కాలంగా బెంచ్ సమయం మారుతోంది. 2020-21 ఆర్ధిక సంవత్సరంలో బెంచ్ టైమ్ 45 నుంచి 60 రోజులు ఉండేది. దీనిని ప్రస్తుతం 35 నుంచి 45 రోజులకు తగ్గించారు. దీంతో బెంచ్‌పై ఉన్న ఉద్యోగుల సంఖ్య, సమయం రెండూ తగ్గాయి. ఇది ఐటీ ఉద్యోగులకు పెద్ద ఊరట అనే చెప్పాలి.భారతదేశంలో ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, అసెంచర్, హెచ్‌సీఎల్ వంటి దిగ్గజ కంపెనీలు.. బెంచ్‌పై ఉన్న ఉద్యోగుల సంఖ్యను, బెంచ్‌పై ఉండే సమయాన్ని తగ్గించాయి. దీనికి కారణం గత కొన్ని రోజులుగా కొత్త ఉద్యోగులను తీసుకోకపోవడమే అని తెలుస్తోంది. కరోనా తరువాత లెక్కకు మించిన ప్రాజెక్టులు లభిస్తున్నాయి. దీంతో ఐటీ కంపెనీలోని ఉద్యోగులకు చేతి నిండా పని దొరుకుతోంది. కొన్ని కంపెనీలు ఉద్యోగ నియామకాలను కూడా చేపట్టాయి.ఇదీ చదవండి: మీడియా దిగ్గజం కీలక నిర్ణయం.. 1100 మందిపై వేటు..రెండేళ్లకు ముందు బెంచ్ ఉద్యోగులు 10 నుంచి 15 శాతం ఉండేది. ఇప్పుడు ఈ శాతం 2 నుంచి 5 శాతానికి చేరింది. ఒకప్పుడు ఫ్రెషర్స్ మాత్రమే బెంచ్‌పై ఉండేవాళ్ళు. ఇప్పుడు కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్‌కి సంబంధించిన ప్రత్యేక నైపుణ్యాలకు డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల.. ప్రస్తుతం, తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాల అనుభవం ఉన్న ఉద్యోగులు కూడా బెంచ్ లేఆఫ్‌ల ప్రమాదంలో ఉన్నారు. వీరందరూ కొత్త టెక్నాలజీలను తప్పకుండా నేర్చుకోవాల్సిందే. లేకుంటే ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుంది. -
వస్త్ర రంగం అభివృద్ధికి ‘జీటీటీఈఎస్ 2025’లో చర్చలు
భారతదేశంలోని టెక్స్టైల్ పరిశ్రమ ఎదుర్కొంటున్న పర్యావరణ సవాళ్లను పరిష్కరిస్తూ రీసైక్లింగ్, సుస్థిర పద్ధతులపై ఇటీవల చర్చ జరిగింది. ముంబైలోని బాంబే ఎగ్జిబిషన్ సెంటర్లో 2025 ఫిబ్రవరి 21 నుంచి 23 వరకు జరిగిన గ్లోబల్ టెక్స్టైల్ టెక్నాలజీ అండ్ ఇంజినీరింగ్ ఎగ్జిబిషన్ (జీటీటీఈఎస్ 2025) వస్త్ర పరిశ్రమకు కీలకంగా మారింది. ఇండియా ఇంటర్నేషనల్ టెక్స్టైల్ మెషినరీ ఎగ్జిబిషన్స్ సొసైటీ (ఐటీఎంఈ సొసైటీ) నిర్వహించిన ఈ మూడు రోజుల కార్యక్రమంలో టెక్స్టైల్ టెక్నాలజీలో పురోగతిని ప్రదర్శించేందుకు, అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశ్రమ వర్గాలు, ఆవిష్కర్తలు, వాటాదారులు ఒకచోట చేరారు.జీటీటీఈఎస్ 2025 ముఖ్యాంశాలుభారత టెక్స్టైల్ కమిషనర్ రూప్రాశి మహాపాత్ర, దక్షిణాఫ్రికా, బెలారస్, బుర్కినా ఫాసో వంటి దేశాలకు చెందిన అంతర్జాతీయ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రెండో రోజున సెషన్‌ను ప్రారంభించిన అనంతరం ఐటీఎంఈ సొసైటీ ఛైర్మన్, స్టీరింగ్ కమిటీ మెంబర్ కేతన్ సంఘ్వీ మాట్లాడారు. ఛత్తీస్‌గఢ్ కొత్త పారిశ్రామిక అభివృద్ధి విధానం 2024-2030ను ప్రారంభించిందన్నారు. అభివృద్ధి చెందుతున్న పర్యావరణ వ్యవస్థను ప్రభావితం చేయడంలో ఈ వేదిక కీలకంగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. టెక్నాలజీ ఇన్నోవేషన్‌తోపాటు వ్యూహాత్మక అభివృద్ధికి ఇది కీలకంగా మారుతుందని చెప్పారు. టెక్స్టైల్ రంగం పురోగతికి ఈ కార్యక్రమం దిశానిర్దేశం చేస్తుందని తెలిపారు.ఛతీస్‌గఢ్ రాష్ట్ర పారిశామిక కార్పొరేషన్ అభివృద్ధి సభ్యులు, అదనపు డైరెక్టర్ ప్రవీణ్ శుక్లా మాట్లాడుతూ..రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వస్త్ర రంగం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. 24 ఏళ్లల్లో ఎగుమతులు 35.9 బిలియన్ డాలర్ల(సుమారు రూ.2.97 లక్షల కోట్లు)కు చేరుకున్నాయని చెప్పారు. ఇది దేశ జీడీపీలో 2.3 శాతానికి సమానమని తెలిపారు. జాతీయ ఎగుమతులకు ఈ పరిశ్రమ 10.5 శాతం దోహదం చేస్తుందన్నారు. రాష్ట్రంలోని జాంగీర్చంపాలో నెలకొల్పే వస్త్ర పరిశ్రమతో భవిష్యత్తులో ఛతీస్‌గఢ్ వస్త్ర కేంద్రంగా మారనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 25,000 కంటే ఎక్కువ ఎంఎస్ఎంఈలు, 1,400 కంటే ఎక్కువ నమోదిత సార్టప్‌లతో రాష్ట్ర వ్యవస్థాపక పర్యావరణ వ్యవస్థ అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు.ఆసియా అరబ్ చాంబర్ ఆఫ్ కామర్స్ హానరీ ట్రేడ్ కమిషనర్ మురుజా షబ్బీర్ అర్సీవాలా మాటాడుతూ..‘మేము ఆసియా ప్రాంతం, మిడిల్ ఈస్ట్ దేశాల్లో చాలా వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నాం. ఇప్పటివరకు దైపాక్షిక వాణిజ్యం, దిగుమతి-ఎగుమతులు పెంచడంలో, పెట్టుబడుల పరంగా రెండు వైపులా ఉన్న కంపెనీలకు సాయం అందించడంలో విజయం సాధించాం. వస్త్ర రంగంలో పనిచేయడంతోపాటు ప్రపంచ పర్యటనలో భాగంగా ఏ ప్రాంతాన్ని సందర్శించినా హాస్పిటాలిటీ రంగం రంగం మా అజెండాలో భాగంగా ఉంటుంది. ఆయా సంస్థలతో కలిసి పనిచేయడానికి ఉత్సాహంగా ఉన్నాం’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఎస్ఐడీస్ పర్సనల్ కన్సలెంట్ పురోహిత్, గురత్ భాటియా, ఐటీఎంఈ ట్రెజరర్స్ ఆఫ్ ఇండియా సెంతిల్ కుమార్ తదితరులు ఉన్నారు.ఇదీ చదవండి: 100 గిగావాట్ల అణువిద్యుత్‌కు రోడ్ మ్యాప్జీటీటీఈఎస్ 2025లో 39 దేశాలకు చెందిన 210 మంది ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం నెట్ వర్కింగ్, నాలెడ్జ్ ఎక్స్ఛేంజ్, వ్యాపార సహకారాలకు కేంద్రంగా పనిచేసింది. స్పిన్నింగ్, వీవింగ్, డైయింగ్, డిజిటల్ ప్రింటింగ్, టెక్స్టైల్ రీసైక్లింగ్‌లో పురోగతితో సహా అత్యాధునిక యంత్రాలు, సాంకేతికతలను ఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు. పరిశ్రమ ఎదుర్కొంటున్న పర్యావరణ సవాళ్లను పరిష్కరించే ప్రయత్నం చేస్తూ టెక్స్ టైల్ రీసైక్లింగ్, సుస్థిర పద్ధతులను ఈ కార్యక్రమంలో హైలైట్ చేశారు. ఎక్స్‌క్లూజివ్ బీ2బీ(బిజినెస్ టు బిజినెస్) సమావేశాలు, ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ వాటాదారుల జాయింట్ వెంచర్లు, వాణిజ్య సహకారాలు, సాంకేతిక పరిజ్ఞాన బదిలీలను అన్వేషించడానికి ఈ కార్యక్రమం వేదికగా నిలిచింది. ప్రపంచ టెక్స్టైల్ మెషినరీ మార్కెట్‌ను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఇందులో చర్చలు జరిగాయి. -
Latest Appointments: తాజా నియామకాలు
న్యూఢిల్లీ: వాణిజ్యయ శాఖ అదనపు సెక్రటరీగా ఉన్న అజయ్ భదూని ప్రభుత్వ కొనుగోళ్ల ప్లాట్‌ఫామ్ (గవర్నమెంట్ ఈ–మార్కెట్/జెమ్) సీఈవోగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటించింది. ప్రస్తుత బాధ్యతలకు అదనంగా కొత్త బాధ్యతలు చేపడతారని తెలిపింది. జెమ్ పోర్టల్‌ను ప్రభుత్వం 2016 ఆగస్ట్ 9న ప్రారంభించడం గమనార్హం. అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాలు తమకు కావాల్సిన వస్తువుల కొనుగోళ్లకు వీలుగా దీన్ని అభివృద్ధి చేసింది. 1999 గుజరాత్ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన భదూ విభిన్న రంగాల్లో విధానాల రూపకల్పన, అమలులో కీలక పాత్ర పోషించారు. ఇదీ చదవండి: టాటా డిస్ప్లే చిప్స్ వస్తున్నాయ్..ఆర్బీఐ ఈడీగా అజిత్ రత్నాకర్ముంబై: గణాంకాలు, సమాచార నిర్వహణ, ఆరి్థక సుస్థితర శాఖలో ప్రధాన సలహాదారుగా సేవలందిస్తున్న అజిత్ రత్నాకర్ జోషి ఇకపై ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ)గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ శాఖతోపాటు సైబర్ రిస్క్ మేనేజ్మెంట్లో మూడు దశాబ్దాల అనుభవం కలిగిన జోషీకి ఆర్బీఐ తాజాగా పదవోన్నతి కలి్పంచింది. జోషీ హైదరాబాద్‌లోని బ్యాంకింగ్ టెక్నాలజీ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీ సభ్యులుగా సైతం పనిచేశారు.అంతేకాకుండా స్థూల ఆరి్థక గణాంకాలు, విధాన సవాళ్లకు సంబంధించిన సంకలనాలపై ఏర్పాటైన వర్కింగ్ గ్రూప్‌లు, కమిటీలలోనూ సభ్యులుగా బాధ్యతలు నిర్వర్తించారు. నాగ్‌పూర్ యూనివర్శిటీ నుంచి స్టాటిస్టిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. ఐఐటీ మద్రాస్ నుంచి మానిటరీ ఎకనామిక్స్‌లో పీహెచ్డీ చేశారు. -
కార్మిక శక్తిలో 70 శాతం మహిళలే
న్యూఢిల్లీ: 2047 నాటికి వికసిత్ భారత్ (అభివృద్ధి చెందిన దేశం) లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి సుమితా దావ్రా ప్రకటించారు. అప్పటికి శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని 70 శాతానికి పెంచనున్నట్టు చెప్పారు. సేవల రంగంలో మహిళల ప్రాతినిధ్యంపై సీఐఐ నిర్వహించిన సదస్సులో భాగంగా ఆమె మాట్లాడారు. కొన్ని రంగాల్లో మహిళలు మరింత పెద్ద ఎత్తున పాలుపంచుకునేందుకు గొప్ప అవకాశాలున్నట్టు చెప్పారు. జాతీయ విద్యా విధానం కింద మహిళల విద్యార్హతల పెంపుపై దృష్టి సారించాల్సి ఉందన్నారు. మహిళల ఆధ్వర్యంలోని స్టార్టప్‌లు, సంస్థలకు వెంచర్ క్యాపిటల్ మద్దతుకు పిలుపునిచ్చారు. ‘‘మహిళా వ్యాపారవేత్తలకు వెంచర్ క్యాపిటల్ మద్దతు ఎంతో కీలకం. వారు నాయకులుగా మారేందుకు, నిర్ణయాలు తీసుకునేందుకు మార్గదర్శకం అవసరం’’అని సుమిత దావ్రా పేర్కొన్నారు. వివక్ష ..శ్రామికశక్తిలో మరింత మంది మహిళలు భాగస్వాములు కాకుండా వివక్ష వారిని అడ్డుకుంటున్నట్టు సుమితా దావ్రా పేర్కొన్నారు. వేతనం, నాయకత్వ బాధ్యతల్లో, ఉద్యోగ భద్రతలో అసమానతలు ఉన్నట్టు చెప్పారు. అయితే గడిచిన ఆరేళ్లలో ఆరి్థక కార్యకలాపాల్లో మహిళల పాత్ర పెరిగినట్టు చెప్పారు. అలాగే, విద్యావంతులైన మహిళలు ఉద్యోగాల్లో చేరడంలో, స్థిరమైన ఆర్జనలోనూ పురోగతి ఉన్నట్టు వివరించారు. ‘‘టెక్నాలజీ, ఫైనాన్స్ రంగాలతోపాటు తయారీలోనూ మహిళలు రాణిస్తుండడాన్ని చూస్తున్నాం. మహిళలకు సంబంధించి వర్కర్ పాపులేషన్ రేషియో (డబ్ల్యూపీఆర్) గత ఆరేళ్లలో రెట్టింపైనట్టు డేటా తెలియజేస్తోంది’’అని సుమితా దావ్రా చెప్పారు. హిందుస్థాన్ జింక్‌లో 30 శాతం మహిళలే 2030 నాటికి తమ కంపెనీ ఉద్యోగుల్లో 30 శాతం మహిళలే ఉండాలన్న లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఉన్నట్టు వేదాంత గ్రూప్ కంపెనీ హిందుస్థాన్ జింక్ (హెచ్‌జెడ్‌ఎల్) ప్రకటించింది. ప్రస్తుతం హిందుస్థాన్ జింక్ ఉద్యోగుల్లో మహిళలు 25% ఉన్నారు. -
ఇండియా ‘హై రిచ్’..
భారత్ సంపన్నులకు నిలయంగా మారుతోంది. దేశంలో బిలియనీర్ల సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. నైట్ ఫ్రాంక్ వారి వెల్త్ రిపోర్ట్ 2025 ప్రకారం.. 85,698 మంది 10 మిలియన్ డాలర్లకుపైగా ఆస్తులు కలిగిన హై నెట్‌వర్త్ వ్యక్తులతో (HNWI) భారత్ ప్రపంచంలో నాల్గవ స్థానంలో ఉంది. అమెరికా, చైనా, జపాన్ తర్వాతి స్థానంలో నిలిచింది. ఇక 2028 నాటికి భారతదేశ ఈ హెచ్ఎన్డబ్ల్యూఐ జనాభా 93,753 కు పెరుగుతుందని నివేదిక అంచనా వేసింది.3.7 శాతం భారత్‌లోనే..ప్రపంచ హెచ్ఎన్డబ్ల్యూఐ జనాభాలో భారత్ 3.7% ఉందని నివేదిక హైలైట్ చేసింది. ఇది ప్రపంచ సంపద సృష్టిలో పెరుగుతున్న దేశ ప్రభావాన్ని సూచిస్తుంది. భారతదేశంలో హెచ్‌ఎన్‌డబ్ల్యూఐల సంఖ్య సంవత్సరానికి 6% పెరిగింది. ఇది 2023 లో 80,686 నుండి 2024 నాటికి 85,698 కు పెరిగింది. ఈ వృద్ధికి దేశ బలమైన ఆర్థిక పనితీరు, పెరుగుతున్న పెట్టుబడి అవకాశాలు, అభివృద్ధి చెందుతున్న పరిశ్రమల పెరుగుదల కారణం.బిలియనీర్లలో మూడో స్థానంభారతదేశ బిలియనీర్ల జనాభా కూడా గణనీయమైన వృద్ధిని చూసింది. 2024 లో సంవత్సరానికి 12% పెరిగింది. ప్రస్తుతం దేశంలో 191 మంది బిలియనీర్లు ఉండగా, వీరిలో 26 మంది గత ఏడాదిలోనే ఈ జాబితాలో చేరారు. భారతీయ బిలియనీర్ల మొత్తం సంపద 950 బిలియన్ డాలర్లుగా అంచనా. బిలియనీర్ సంపద పరంగా భారత్.. యునైటెడ్ స్టేట్స్, చైనా తరువాత ప్రపంచవ్యాప్తంగా మూడవ అతిపెద్ద సంపద కేంద్రంగా ఉంది.లగ్జరీ పెట్టుబడులు, రియల్ ఎస్టేట్భారతదేశంలో పెరుగుతున్న సంపద దాని సంపన్న వర్గాల ప్రాధాన్యతలలో ప్రతిబింబిస్తుంది. నైట్ ఫ్రాంక్ సర్వే ప్రకారం వీరిలో 46.5 శాతం మంది లగ్జరీ కార్లను సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు. 25.7 శాతం మంది హైఎండ్ ఇళ్లకు మొగ్గు చూపుతున్నారు. గ్లోబల్ లగ్జరీ రెసిడెన్షియల్ మార్కెట్లలో, ఢిల్లీ లగ్జరీ ప్రాపర్టీ ధరలు 2024 లో 6.7% పెరిగాయి, నైట్ ఫ్రాంక్ ప్రైమ్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ ఇండెక్స్ (పీఐఆర్ఐ 100) లో ఇది 18వ స్థానాన్ని సంపాదించింది. ముంబై 21వ స్థానానికి చేరుకోగా, బెంగళూరు 40వ స్థానానికి ఎగబాకింది.అత్యంత లగ్జరీ వస్తువులు హ్యాండ్ బ్యాగులే.. 2024లో హ్యాండ్ బ్యాగులు టాప్ పెర్ఫార్మింగ్ లగ్జరీ అసెట్ క్లాస్ అని నైట్ ఫ్రాంక్ లగ్జరీ ఇన్వెస్ట్మెంట్ ఇండెక్స్ (కేఎఫ్ఎల్ఐఐ) వెల్లడించింది. వీటి ధరలు 2.8% పెరిగాయి. క్లాసిక్ కార్లు, ఆర్ట్ కలెక్షన్లు, ప్రైవేట్ జెట్లు కూడా పెట్టుబడిదారులలో ప్రజాదరణ పొందిన పెట్టుబడి వర్గాలుగా ఆవిర్భవించాయి. -
ఆరు శాతం ఉద్యోగులకు డిస్నీ లేఆఫ్స్! కారణం..
టెలివిజన్ ప్రేక్షకులు తగ్గిపోవడం, ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లకు ఆదరణ పెరుగుతుండడం సంప్రదాయ ఎంటర్టైన్మెంట్ నెటవర్క్లకు శాపంగా మారుతోంది. మారుతున్న మీడియా అవకాశాలకు అనుగుణంగా డిస్నీ ఏబీసీ న్యూస్ గ్రూప్, డిస్నీ ఎంటర్టైన్మెంట్ నెట్‌వర్క్‌ల్లో పని చేస్తున్న తన సిబ్బందిని తగ్గించే ప్రణాళికలను ప్రకటించింది. సంస్థలోని ఆరు శాతం ఉద్యోగులు అంటే సుమారు 200 మందిపై ఈ ప్రభావం పడనుందని కంపెనీ వర్గాలు తెలిపాయి.ఏబీసీ వార్తలపై ప్రభావం‘20/20’, ‘నైట్ లైన్’తో సహా అనేక షోలు ఒకే యూనిట్‌గా ఏకీకృతం కాబోతున్న ఏబీసీ న్యూస్‌పై ఈ తొలగింపులు ప్రభావం చూపుతాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. పాపులర్ న్యూస్ టాక్ షో ‘గుడ్ మార్నింగ్ అమెరికా’ దాని మూడు గంటల షో సమయాన్ని ఒకే ప్రొడక్షన్ టీమ్ కింద ఏకీకృతం చేయనున్నారు. లేఆఫ్స్‌తో దీని కార్యకలాపాలను క్రమబద్ధీకరించబోతున్నట్లు తెలుస్తుంది. డిస్నీ పునర్నిర్మాణ ప్రయత్నాల్లో భాగంగా తన డిజిటల్ ఎడిటోరియల్, సోషల్ బృందాలను వార్తల సేకరణ, ప్రదర్శనలు, సొంత స్టేషన్ల విభాగాలతో అనుసంధానించాలని యోచిస్తోంది.ఇదీ చదవండి: బ్యాంకు ఉద్యోగుల సమ్మె.. వరుసగా నాలుగు రోజులు సెలవుసంప్రదాయ కేబుల్ టీవీల వాడకం తగ్గుతుండడం, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లకు ప్రేక్షకులు మళ్లుతుండడంతో డిస్నీ ఇలా లేఆఫ్స్ నిర్ణయం తీసుకున్నట్లు కొందరు అధికారులు తెలిపారు. డిమాండ్ ఉన్న కంటెంట్(కంటెంట్ ఆన్ డిమాండ్) ఆధిపత్యం చలాయిస్తున్న యుగంలో ఇతర పోటీదారులకంటే మెరుగ్గా ఉండేందుకు ప్రపంచవ్యాప్తంగా మీడియా కంపెనీలు తమ వ్యాపార నమూనాలను పునర్నిర్మిస్తున్నాయి. డిస్నీ తీసుకున్న ఈ లేఫ్స్ ప్రకటన ఉద్యోగుల్లో ఆందోళనను రేకెత్తించినప్పటికీ, మారుతున్న వినియోగదారుల ప్రాధాన్యతల నేపథ్యంలో మీడియా సంస్థలు అభివృద్ధి చెందాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతోంది. కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకు ప్రాధాన్యత ఇవ్వడంపై డిస్నీ దృష్టి పెట్టడం కంపెనీకి మేలు చేస్తుందని కొందరు నమ్ముతున్నారు. -
కేదార్నాథ్ రోప్‌వేకి కేంద్ర కేబినెట్ ఆమోదం
కేదార్నాథ్ రోప్‌వే నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ .4,081 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్.. 8-9 గంటలు పట్టే కఠినమైన ట్రెక్కింగ్‌ను కేవలం 36 నిమిషాల ప్రయాణానికి తగ్గిస్తుంది. యాత్రికులకు వేగవంతమైన, సురక్షితమైన, మరింత సౌకర్యవంతమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది.ప్రాజెక్టు వివరాలుసోన్ ప్రయాగ్ నుంచి కేదార్ నాథ్ ను కలుపుతూ రోప్ వే 12.9 కిలోమీటర్లు ఉంటుంది. డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ (డీబీఎఫ్ఓటీ) మోడల్ కింద ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో దీన్ని అభివృద్ధి చేయనున్నారు. ప్రతి దిశలో గంటకు 1,800 మంది ప్రయాణికులను తీసుకెళ్లగల అధునాతన ట్రై-కేబుల్ డిటాచబుల్ గొండోలా (3ఎస్) సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ ప్రాజెక్టు ఉపయోగిస్తుంది.ప్రయోజనాలుకేదార్నాథ్ రోప్ వే యాత్రికులకు గేమ్ ఛేంజర్ గా నిలవనుంది. అన్ని రకాల వాతావరణాల్లో 12 పవిత్ర జ్యోతిర్లింగాలలో ఒకటైన ఈ ఆలయాన్ని సందర్శించే భాగ్యం భక్తులకు కలుగుతుంది. ప్రస్తుతం గౌరీకుండ్ నుంచి కాలినడకన, గుర్రాల ద్వారా లేదా హెలికాఫ్టర్ సర్వీసుల ద్వారా 16 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లాల్సి వస్తోంది. రోప్ వే ఈ ప్రయాణాన్ని సులభతరం చేయడమే కాకుండా వృద్ధులు, దివ్యాంగ యాత్రికులకు మరింత సమ్మిళిత అనుభవాన్ని అందిస్తుంది.అంతేకాకుండా ఈ ప్రాజెక్టు ఈ ప్రాంతంలో పర్యాటకాన్ని పెంచుతుందని, నిర్మాణం, కార్యాచరణ దశలలో గణనీయమైన ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని భావిస్తున్నారు. ఆతిథ్యం, ట్రావెల్, ఆహార, పానీయాల వ్యాపారాలు వంటి అనుబంధ పరిశ్రమలు కూడా ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఇది ఈ ప్రాంత సామాజిక-ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తుంది.పర్యావరణ, ఆర్థిక ప్రభావంసంప్రదాయ రవాణా విధానాలతో ముడిపడి ఉన్న కేదార్నాథ్ సందర్శనలో పర్యావరణ హితంగా రోప్‌వేను రూపొందించారు. గుర్రాలు, హెలికాప్టర్లపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా, సుస్థిర ప్రయాణ పరిష్కారాన్ని అందిస్తూ పెళుసైన హిమాలయ పర్యావరణ వ్యవస్థను పరిరక్షించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.ఆర్థికంగా, కొండ ప్రాంతాలలో సమతుల్య అభివృద్ధిని పెంపొందించే దిశగా ఈ ప్రాజెక్టు ఒక ముఖ్యమైన అడుగు. లాస్ట్ మైల్ కనెక్టివిటీని పెంపొందించడం, మారుమూల ప్రాంతాల్లో వేగవంతమైన ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించాలనే ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా ఈ ప్రాజెక్ట్ ఉంటుంది.మరో రోప్‌వేకీ గ్రీన్ సిగ్నల్కనెక్టివిటీని పెంచడానికి, పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి మరో రోప్‌వేకి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉత్తరాఖండ్‌లోని గోవింద్‌ఘాట్ నుండి హేమకుండ్ సాహిబ్‌జి వరకు 12.4 కిలోమీటర్ల పొడవైన రోప్‌వే ప్రాజెక్టును అభివృద్ధి చేయడానికి ఆమోదం తెలిపింది. నేషనల్ రోప్ వేస్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ ‘పర్వతమాల పరియోజన’లో భాగంగా ఈ ప్రాజెక్ట్‌లను కేంద్ర ప్రభుత్వం చేపడుతోంది.రూ.2,730.13 కోట్ల అంచనా వ్యయంతో డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ (డీబీఎఫ్ఓటీ) మోడల్ కింద ఈ రోప్‌వేను అభివృద్ధి చేయనున్నారు. గోవింద్‌ఘాట్ నుంచి ఘంగారియా స్ట్రెచ్ (10.55 కిలోమీటర్లు) కోసం మోనోకేబుల్ డిటాచబుల్ గోండోలా (ఎండీజీ) వ్యవస్థ, ఘంగారియా నుంచి హేమకుండ్ సాహిబ్ జీ స్ట్రెచ్ (1.85 కిలోమీటర్లు) కోసం ట్రైకబుల్ డిటాచబుల్ గోండోలా (3ఎస్) వ్యవస్థతో సహా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించనున్నారు. ఈ రోప్ వే యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం అయిన వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్‌కు ప్రవేశ ద్వారంగా మారనుంది. -
రియల్టీ ప్లాట్ఫామ్లో ధోని పెట్టుబడులు
ప్రముఖ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని ఫ్యామిలీ ఆఫీసు నుంచి వ్యూహాత్మక పెట్టుబడులు అందుకున్నట్లు రియల్టీ సర్వీసుల ప్లాట్‌ఫామ్ ఎస్ఐఎల్ఏ(సిలా) తాజాగా పేర్కొంది. అయితే ఏమేరకు పెట్టుబడి పెట్టారో మాత్రం వివరాలు వెల్లడించలేదు. 2010లో రుషభ్, సాహిల్ వోరా ఏర్పాటు చేసిన సిలా దేశవ్యాప్తంగా రియల్టీ అడ్వయిజరీ సర్వీసులు అందిస్తోంది. సంస్థలో నార్వెస్ట్ వెంచర్ పార్ట్నర్స్కు సైతం పెట్టుబడులున్నాయి. దేశీయంగా 20 కోట్ల చదరపు అడుగుల రియల్టీ ఆస్తులను నిర్వహిస్తున్న కంపెనీలో 25,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.ఇదీ చదవండి: నెలకు రూ.82,000 వేతనం.. ఇంటి ఖర్చులు భారం..కెప్టెన్కూల్గా పేరున్న మహేంద్ర సింగ్ ధోనీ ఇప్పటికే వివిధ పరిశ్రమల్లో అనేక వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టారు. ఆయన ఇన్వెస్ట్ చేసిన కొన్ని కంపెనీల జాబితా కింది విధంగా ఉంది.బ్లూస్మార్ట్ మొబిలిటీ: గురుగ్రామ్‌కు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ ఆధారిత కంపెనీ టెక్నాలజీ సర్వీసులు అందిస్తూ స్థిరమైన రవాణాపై దృష్టి సారించింది.గరుడ ఏరోస్పేస్: వ్యవసాయం, రక్షణ, పారిశ్రామిక డ్రోన్లలో ప్రత్యేకత కలిగిన చెన్నైకి చెందిన డ్రోన్ టెక్నాలజీ సంస్థ.ఈమోటోరాడ్: ఎకో ఫ్రెండ్లీ ట్రాన్స్పోర్ట్ సొల్యూషన్స్‌ను ప్రోత్సహించే ఎలక్ట్రిక్ సైకిల్ స్టార్టప్.హోమ్ లేన్: బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైన్ అండ్ హోమ్ డెకోర్ కంపెనీ.ఖాతాబుక్: డిజిటల్ పేమెంట్స్, బుక్ కీపింగ్ కోసం ఏర్పాటు చేసిన ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్.కార్స్24: పాత కార్లను కొనడానికి, విక్రయించడానికి ఆన్లైన్ సేవలందించే ప్లాట్‌ఫామ్.షాకా హ్యారీ: ముంబైకి చెందిన మొక్కల ఆధారిత ఆహార సంస్థ.7ఇంక్ బ్రూస్: ఫుడ్ అండ్ బెవరేజ్ బ్రాండ్.తగ్డా రహో: ఫిట్నెస్ అండ్ వెల్నెస్ బ్రాండ్.రిగి: సోషల్, కంటెంట్ మానిటైజేషన్ ప్లాట్‌ఫామ్. -
వేతనం కాదు.. ఉద్యోగుల మనోభావాలివి..
ఉద్యోగుల మొదటి ప్రాధాన్యం వేతనానికే అనుకుంటాం. కానీ, అలా అనుకోవడం పొరపాటే అవుతుంది. వేతనం కంటే పనిచేసే చోట సానుకూల పరిస్థితులు, నేర్చుకునే, ఎదిగే అవకాశాలకు ఎక్కువ మంది ఉద్యోగులు ప్రాధాన్యం ఇస్తున్నట్టు రాండ్‌స్టాడ్ నిర్వహించిన ‘ఇండియా వర్క్ మానిటర్ 2025’(Randstad Workmonitor 2025) సర్వేలో తెలిసింది. సర్వేలోని వివరాలు కింది విధంగా ఉన్నాయి.పనిలో సౌలభ్యం లేకపోతే ఆ ఉద్యోగానికి గుడ్‌బై చెబుతామని 52 శాతం మంది చెప్పారు.సౌకర్యవంతమైన పనివేళలు లేని ఉద్యోగాన్ని తిరస్కరిస్తామని 60 శాతం మంది తెలిపారు.పనిచేసే ప్రదేశం అనుకూలంగా లేకపోతే ఆ ఉద్యోగాన్ని కాదనుకుంటామని 56 శాతం మంది చెప్పారు. తమ మేనేజర్‌తో మంచి సంబంధాలు లేకపోతే ఉద్యోగాన్ని వీడుతామని 60 శాతం మంది తెలిపారు.తాము చేసే ఉద్యోగంలో నేర్చుకోవడానికి, అభివృద్ధి చెందడానికి అవకాశం లేకపోతే దాన్ని వదులుకుంటామని 67 శాతం మంది చెప్పారు. అంతర్జాతీయంగా ఇదే అభిప్రాయం చెప్పిన వారు 41 శాతమే.దేశీయంగా 69 శాతం మంది ఉద్యోగులు సమష్టి పని సంస్కృతిని కోరుకుంటున్నారు. అంతర్జాతీయంగా 55 శాతం మందిలో ఇదే భావన నెలకొంది.తమ విలువలకు సరిపడని సంస్థలో పనిచేయబోమని 70% మంది తేల్చిచెప్పారు.పనిలో ప్రయోజనాలుంటే (పనివేళల్లో, పని ప్రదేశాల్లో వెసులుబాట్లు) యాజమాన్యాలను విశ్వసిస్తామని 73 శాతం మంది సర్వేలో తమ అభిప్రాయాన్ని తెలిపారు. ఇదీ చదవండి: రిలయన్స్‌కు రూ.24,500 కోట్ల డిమాండ్ నోటీసులుయాజమాన్యాలు మారాల్సిందే..పని ప్రదేశాల్లో వస్తున్న మార్పులకు ఈ సర్వే ఫలితాలు అద్దం పడుతున్నట్టు రాండ్‌స్టాడ్ సర్వే నివేదిక తెలిపింది. ‘జెన్ జెడ్ లేదా మిలీనియల్స్ అయినా వ్యక్తిగత కట్టుబాట్లు, కెరీర్ వృద్ధిని సమతుల్యం చేసుకోవాలని అనుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ తమదైన రీతిలో (స్వేచ్ఛగా) పనిచేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. పనిలో నేర్చుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారంటే, వారు కేవలం ఉద్యోగాలనే కోరుకోవడం లేదు. కెరీర్ పురోగతిని కోరుకుంటున్నారని అర్థమవుతోంది. యాజమాన్యాలు ఈ మార్పును తప్పకుండా గుర్తించి, నిపుణులైన మానవ వనరుల అంచనాలను అందుకునే వ్యూహాలను రూపొందించుకోవాలి. లేదంటే నిపుణులను కోల్పోవాల్సి వస్తుంది’ అని రాండ్‌స్టాడ్ ఇండియా ఎండీ, సీఈవో విశ్వనాథ్ పీఎస్ తెలిపారు. -
రిలయన్స్‌కు రూ.24,500 కోట్ల డిమాండ్ నోటీసులు
వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి కేంద్రం షాకిచ్చింది. ఓఎన్జీసీకి చెందిన క్షేత్రం నుంచి గ్యాస్ అక్రమంగా ఉత్పత్తి చేసినందుకు, గడువులోగా బ్యాటరీ సెల్ ప్లాంటు ఏర్పాటు చేయనందుకు గాను రెండు డిమాండ్ నోటీసులు ఇచ్చింది. మొదటి దానికి సంబంధించి రూ.24,500 కోట్ల నష్టపరిహారం కట్టాలని ఆదేశించింది. ఇక రెండో అంశానికి సంబంధించి సుమారు 3.1 కోట్ల పెనాల్టీ విధించింది.కృష్ణా గోదావరి బేసిన్లో రిలయన్స్–బీపీ, ప్రభుత్వ రంగ ఓఎన్జీసీ గ్యాస్ క్షేత్రాలు పక్కపక్కనే ఉన్నాయి. ఓఎన్జీసీ క్షేత్రం నుంచి తమ క్షేత్రంలోకి వచ్చిన గ్యాస్‌ను రిలయన్స్, దాని భాగస్వామ్య సంస్థ బీపీ వెలికితీసి, విక్రయించుకుని, లబ్ధి పొందినట్లు అభియోగాలు ఉన్నాయి. దీనికి సంబంధించి రిలయన్స్, బీపీ నష్టపరిహారం కట్టాలనే అంశం తెరపైకి వచ్చింది. కానీ, ఈ వివాదంలో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌లో కంపెనీలకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చినప్పటికీ ఢిల్లీ హైకోర్టు ఫిబ్రవరి 14న వాటిని తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో తమతో పాటు నికో (గతంలో భాగస్వామి)కి కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ డిమాండ్ నోటీసులు పంపినట్లు ఎక్ఛ్సేంజీలకు రిలయన్స్ తెలిపింది. ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్: ఆరు నెలలు.. అన్లిమిటెడ్మరోవైపు, 10 గిగావాట్ హవర్ (జీడబ్ల్యూహెచ్) సామర్థ్యంతో బ్యాటరీ సెల్ ప్లాంటు ఏర్పాటుకు సంబంధించి తొలి మైలురాయి పనులను పూర్తి చేయడంలో జాప్యానికిగాను అనుబంధ సంస్థ రిలయన్స్ న్యూ ఎనర్జీ బ్యాటరీ స్టోరేజ్ లిమిటెడ్‌కి భారీ పరిశ్రమల శాఖ పెనాల్టీ విధించినట్లు రిలయన్స్ తెలిపింది. ఈ గడువును పొడిగించాలంటూ ప్రభుత్వాన్ని ఆర్‌ఎన్‌ఈబీఎస్‌ఎల్ కోరినట్లు వివరించింది. జనవరి 1 నుంచి మార్చి 3 వరకు లెక్కేస్తే జరిమానా రూ. 3.1 కోట్లు ఉంటుంది. -
ఐటీ అధికారులకు కొత్త అధికారాలు
ఆదాయ పన్ను శాఖ అధికారులకు కొత్త అధికారాలు రానున్నాయి. అనుమానం వస్తే మీ సోషల్ మీడియా ప్రొఫైల్స్, ఇ-మెయిల్స్, బ్యాంక్ అకౌంట్లు, ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్స్, ట్రేడింగ్ ఖాతాలపై దర్యాప్తు చేసే చట్టబద్ధమైన హక్కు ఆదాయపు పన్ను శాఖకు ఉంటుంది. మీరు పన్నులు ఎగ్గొట్టారని లేదా ఏదైనా అప్రకటిత ఆస్తులు, నగదు, బంగారం, ఆభరణాలు లేదా ఇతర విలువైన వస్తువులను కలిగి ఉన్నారని ఐటీ అధికారులకు అనుమానం వస్తే వారు మీ ఖాతాలను దర్యాప్తు చేయవచ్చు.ప్రతిపాదిత ఆదాయపు పన్ను బిల్లు కింద ఈ కొత్త నిబంధన అమల్లోకి వస్తుందని ఎకానమిక్ టైమ్స్ నివేదిక తెలిపింది. ఆర్థిక మోసాలు, అప్రకటిత ఆస్తులు, పన్ను ఎగవేతలను నిరోధించడంలో భాగంగా డిజిటల్ యుగానికి అనుగుణంగా పన్ను దర్యాప్తు ప్రక్రియకు మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 132 ప్రకారం, పన్ను ఎగవేత ఉద్దేశంతో ఎవరైనా తన ఆదాయం, ఆస్తులు లేదా ఆర్థిక వివరాలను దాచినట్లు విశ్వసనీయ సమాచారం ఉంటే పన్ను అధికారులు తనిఖీలు చేసి సీజ్ చేయవచ్చు.అప్రకటిత ఆస్తులు, ఆర్థిక రికార్డులు దాగి ఉన్నాయని అనుమానం వస్తే తలుపులు, సేఫ్ లు, లాకర్లు పగులగొట్టి దర్యాప్తు చేసే అధికారం ఇప్పటి వరకు వారికి ఉండేది. కానీ 2026 ఏప్రిల్ 1 నుంచి ఈ అధికారాలు డిజిటల్ సాధనాలకు కూడా విస్తరిస్తారు. అంటే పన్ను ఎగవేతకు సంబంధించిన సమాచారం దాచినట్లు అనుమానించినట్లయితే కంప్యూటర్ సిస్టమ్‌లు, ఆన్లైన్ ఖాతాలను యాక్సెస్ చేసే హక్కు కూడా అధికారులకు ఉంటుంది.ఆర్థిక లావాదేవీలు డిజిటల్ గా మారడంతో పన్ను అధికారుల దర్యాప్తు ప్రక్రియ కూడా ఆధునికంగా మారుతోంది. పన్ను దర్యాప్తులో డిజిటల్ ఫోరెన్సిక్స్ కీలక పాత్ర పోషిస్తుందని ఈ కొత్త చట్టం చెబుతోంది. అయితే, పన్ను ఎగవేతను అరికట్టడంలో ఈ మార్పు ప్రభావవంతంగా ఉంటుందా లేక గోప్యత ఆందోళనలను లేవనెత్తుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. -
ఉక్రెయిన్ ఖనిజ కాంతులు
అమెరికా, ఉక్రెయిన్ దేశాల మధ్య జరిగిన ఖనిజాల ఒప్పందంపై సఫలీకృతం కాలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ మధ్య వైట్‌హౌస్‌లో జరిగిన వివాదాస్పద ఓవల్ ఆఫీస్ సమావేశం తర్వాత అమెరికా, ఉక్రెయిన్ మధ్య ఆశించిన ఖనిజాల ఒప్పందంపై సంతకాలు జరగలేదు.ప్రతిపాదిత పునర్నిర్మాణ పెట్టుబడి నిధి "ఖనిజాలు, హైడ్రోకార్బన్లు, చమురు, వాయు నిక్షేపాలను" సూచిస్తోంది. మరీ ముఖ్యంగా లౌడ్ స్పీకర్లు, కంప్యూటర్ హార్డ్ డ్రైవ్ లతో సహా హైటెక్ ఉత్పత్తుల తయారీకి కీలకమైన లోహాలపై ట్రంప్ ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది.ఓ వైపు రష్యాతో యుద్ధం.. మరో వైపు అమెరికాతో ఖనిజాల ఒప్పందం నేపథ్యంలో ఉక్రెయిన్ ఖనిజ సంపద ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. దాదాపు 15 ట్రిలియన్ డాలర్ల విలువైన ఖనిజ వనరులను కలిగి ఉన్నట్లు ఉక్రెయిన్ చెప్పుకుంటోంది. దీని ప్రకారం.. ఇది ఐరోపాలో అత్యంత ఖనిజ వనరులు కలిగిన దేశాలలో ఉక్రెయిన్ ఒకటి. ఇక్కడ లిథియం, టైటానియం, యురేనియం నిల్వలు అధికంగా ఉన్నాయి.ఖనిజ వనరుల సంపదఉక్రేనియన్ జియాలజికల్ సర్వే నుండి వచ్చిన డేటా ప్రకారం ఉక్రెయిన్ ప్రపంచంలోని ఖనిజ వనరులలో సుమారు 5% కలిగి ఉంది. వీటిలో అమెరికా కీలకమైనవిగా భావించే 50 పదార్థాలలో 23 ఉన్నాయి. ఉక్రెయిన్ వైవిధ్యమైన భౌగోళిక భూభాగం విలువైన ఖనిజాల విస్తృత శ్రేణికి నిలయంగా ఉంది.లిథియం నిల్వలుఉక్రెయిన్ ఐరోపాలో అతిపెద్ద లిథియం నిల్వలను కలిగి ఉంది. ఇది ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి నిల్వలలో ఉపయోగించే లిథియం-అయాన్ బ్యాటరీలకు కీలకమైన భాగం. క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్ వైపు మళ్లడం వల్ల లిథియంకు పెరుగుతున్న డిమాండ్ ఉక్రెయిన్ లిథియం నిక్షేపాల వ్యూహాత్మక ప్రాముఖ్యతను తెలిజేస్తోంది.టైటానియం నిల్వలుఏరోస్పేస్, సైనిక, వైద్య అనువర్తనాలకు కీలక లోహమైన టైటానియం నిల్వలు ఉక్రెయిన్‌లోనే అధికంగా ఉన్నాయి. ప్రపంచంలో వెలికితీస్తున్న టైటానియం ఖనిజంలో 7 శాతం ఇక్కడి నుంచే వస్తోంది.యురేనియం నిల్వలులిథియం టైటానియంతో పాటు , ఉక్రెయిన్ ఐరోపాలో అతిపెద్ద యురేనియం నిల్వలకు నిలయంగా ఉంది. ఇది అణుశక్తి ఉత్పత్తికి ఒక కీలక వనరు. ఇక్కడి యురేనియం నిక్షేపాలు ప్రపంచ ఇంధన అవసరాలకు సహకరిస్తూ శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడంలో గణనీయమైన పాత్ర పోషిస్తున్నాయి.భౌగోళిక, రాజకీయ, ఆర్థిక ప్రభావాలుఉక్రెయిన్ ఖనిజ సంపద వ్యూహాత్మక ప్రాముఖ్యత అతిశయోక్తి కాదు. డిఫెన్స్, హైటెక్, ఏరోస్పేస్, గ్రీన్ ఎనర్జీ వంటి పరిశ్రమలకు ఈ వనరుల అందుబాటు కీలకం. రష్యాతో కొనసాగుతున్న సంఘర్షణ, కీలకమైన ఖనిజాల కోసం ప్రపంచ పోటీ ఉక్రెయిన్ నిక్షేపాలపై ఆసక్తిని పెంచింది.సవాళ్లు.. అవకాశాలుఉక్రెయిన్ ఖనిజ సంపద గణనీయమైన అవకాశాలను అందిస్తుండగా, పరిగణించవలసిన సవాళ్లు కూడా ఉన్నాయి. ఈ ఖనిజాల వెలికితీత, ప్రాసెసింగ్ కు గణనీయమైన మూలధన పెట్టుబడి సాంకేతిక నైపుణ్యం అవసరం. అదనంగా, రష్యాతో కొనసాగుతున్న సంఘర్షణ మైనింగ్ కార్యకలాపాల స్థిరత్వం భద్రతకు ప్రమాదాలను కలిగిస్తుంది. ఈ సవాళ్లు ఉన్నప్పటికీ, అవసరమైన వనరుల ప్రధాన ప్రపంచ సరఫరాదారుగా ఉక్రెయిన్ సామర్థ్యం బలంగా ఉంది. ఈ దేశం తన ఖనిజ సంపదను సద్వినియోగం చేసుకునే సామర్థ్యం గణనీయమైన ఆర్థిక లాభాలను ఇస్తుంది. ప్రపంచ సరఫరా గొలుసుల వైవిధ్యతకు దోహదం చేస్తుంది. -
ఉద్యోగులకు ఈ మార్చి ఇంత దారుణంగా ఉంటుందా?
ఈ మార్చి (March 2025) నెల ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల పాలిట దారుణంగా ఉండబోతోంది. ఈనెలలో దాదాపు 100 కంపెనీలు ఉద్యోగుల తొలగింపును (Lay Off) ప్రకటించే అవకాశం ఉంది. నివేదికల ప్రకారం.. ఈ తొలగింపులు వివిధ పరిశ్రమలలో విస్తరించి ఉన్నాయి. ఇది మహమ్మారి అనంతరం వ్యాపారాలు ఎదుర్కొంటున్న విస్తృత ఆర్థిక సవాళ్లను ప్రతిబింబిస్తుంది.వార్నింగ్ నోటీసులుఈ మేరకు ప్రభావిత ఉద్యోగులకు ఇప్పటికే యాజమాన్యాలు వార్న్ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. యూఎస్‌లోని వర్కర్ అడ్జస్ట్ మెంట్ అండ్ రీట్రైనింగ్ నోటిఫికేషన్ (వార్న్) చట్టం ప్రకారం జాబ్స్ రిస్క్‌లో ఉంటే ఆయా కంపెనీలు ఉద్యోగులకు ముందస్తు నోటీసు ఇవ్వాలి. పెద్ద ఎత్తున తొలగింపులు, మూసివేతలకు ఉద్యోగులు, యాజమాన్యాలు, కమ్యూనిటీలు సిద్ధం కావడానికి ఈ చట్టపరమైన ఆవశ్యకత సహాయపడుతుంది. ఈ తొలగింపుల వల్ల ప్రభావితమైన ఉద్యోగుల సంఖ్య ఒక్కో కంపెనీకి 10 నుంచి 500 వరకు ఉంటుంది.కొన్ని ప్రముఖ కంపెనీలు ఇవే..టెక్ లేఆఫ్స్ పతాక శీర్షికల్లో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, తొలగింపులు టెక్ రంగానికి మాత్రమే పరిమితం కాలేదు. జోన్ ఫ్యాబ్రిక్స్, వాల్‌గ్రీన్స్ వంటి రిటైలర్లు ఉద్యోగులను తగ్గించే అవకాశం ఉంది. ఇంటెల్, ఫెడెక్స్, నీమన్ మార్కస్, జాన్ డీర్ ఈ జాబితాలోని ఇతర గుర్తించదగిన కంపెనీలుగా ఉన్నాయి.వచ్చే మూడేళ్లలో 150 స్టోర్లను మూసివేసే బృహత్తర వ్యూహంలో భాగంగా 66 స్టోర్లను మూసివేసే యోచనలో ఉన్నట్లు మాకీస్ ప్రకటించింది. రిటైల్ పరిశ్రమలో మార్పులకు అనుగుణంగా కాలిఫోర్నియా, ఇతర రాష్ట్రాల్లోని ఉద్యోగులను కూడా వాల్‌గ్రీన్స్ వదులుకుంటోంది.ఇది చదివారా? ఈసారి బ్యాడ్ న్యూస్ కాగ్నిజెంట్ ఉద్యోగులకు..ఆర్థిక కారకాలుఈ విస్తృతమైన తొలగింపులకు అనేక అంశాలు దోహదం చేస్తాయి. పెరుగుతున్న వడ్డీ రేట్లు రుణాలను మరింత ఖరీదైనవిగా మార్చాయి. కంపెనీలపై ఆర్థిక ఒత్తిడిని పెంచాయి. అదనంగా, ద్రవ్యోల్బణం నిర్వహణ ఖర్చులను పెంచింది. వ్యాపారాలు లాభదాయకంగా ఉండటం సవాలుగా మారింది. వినియోగదారుల ప్రవర్తన, డిమాండ్ లో మార్పులు కూడా అనేక కంపెనీల ఆర్థిక కష్టాలకు కారణమయ్యాయి.ఆటోమేషన్.. పునర్నిర్మాణంఆటోమేషన్కు ఊతమివ్వడమే ఈ ఉద్యోగుల తొలగింపునకు ప్రధాన కారణమని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, ఖర్చులను తగ్గించడానికి కంపెనీలు ఉద్యోగాలను ఆటోమేటెడ్ సొల్యూషన్లతో భర్తీ చేయాలని చూస్తున్నాయి. ఆర్థిక ఒత్తిళ్లకు ప్రతిస్పందనగా కంపెనీలు తమ కార్యకలాపాలను పునర్నిర్మించడానికి ప్రయత్నిస్తున్నందున ఈ ధోరణి కొనసాగుతుందని భావిస్తున్నారు. -
నిధుల వేటలో అంకురాలు..
న్యూఢిల్లీ: దేశీ అంకుర సంస్థలు ఫిబ్రవరిలో సగటున 83.2 మిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో 1.65 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 14,418 కోట్లు) నిధులను సమీకరించాయి. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఫిబ్రవరి మధ్య కాలంలో స్టార్టప్‌లు మొత్తం 2,200 విడతల్లో 25.4 బిలియన్ డాలర్లు సమీకరించినట్లయిందని అధ్యయన సర్వీసుల సంస్థ ట్రాక్షన్ గణాంకాల్లో వెల్లడైంది. దీని ప్రకారం జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో మొత్తం ఫండింగ్ 19.5 శాతం పెరిగింది.వార్షిక ప్రాతిపదికన, గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే మాత్రం 2.06 బిలియన్ డాలర్ల మేర తగ్గింది. మరిన్ని విశేషాలు..➤స్టార్టప్‌ల రాజధాని బెంగళూరులో అంకురాలు సగటున 2 మిలియన్ డాలర్ల చొప్పున 353 మిలియన్ డాలర్లు, ముంబైలో స్టార్టప్‌లు 102 మిలియన్ డాలర్లు సమీకరించాయి.➤ఫిన్‌టెక్ సంస్థ ఆక్సిజో 1 బిలియన్ డాలర్లు, బీ2బీ ప్లాట్‌ఫాం ఉడాన్ 75 మిలియన్ డాలర్లు దక్కించుకున్నాయి. స్పాట్డ్రాఫ్ట్, క్యాష్‌ఫ్రీ పేమెంట్స్, జెటా, జినీమోడ్ మొదలైనవి ఇతరత్రా సంస్థల్లో ఉన్నాయి. ➤ఫిబ్రవరిలో కంపెనీల కొనుగోలు లావాదేవీలు కూడా చెప్పుకోతగ్గ స్థాయిలో నమోదయ్యాయి. అడ్డా52 మాతృసంస్థ డెల్టాటెక్ గేమింగ్‌ను హెడ్ డిజిటల్ వర్క్స్ రూ. 491 కోట్లకు దక్కించుకుంది. అలాగే, ఫ్రాడ్ డిటెక్షన్ ప్లాట్‌ఫాం క్లారి5ని పెర్ఫియోస్ అనే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ (సాస్) సంస్థ కొనుగోలు చేయగా, మెగాఫైన్ ఫార్మాలో మెజారిటీ వాటాలను మోతీలాల్ ఓస్వాల్ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ రూ. 460 కోట్లకు దక్కించుకుంది. ➤26.5 మిలియన్ డాలర్ల సగటు మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో ఫిబ్రవరిలో 16 ఐపీవోలు లిస్టయ్యాయి. హెక్సావేర్, ఎజాక్స్, కెన్ ఇండియా, డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్, రాయల్ ఆర్క్ మొదలైన లిస్టింగ్స్ వీటిలో ఉన్నాయి.➤ఇన్వెస్టర్ల జాబితాలో షార్క్‌లు రితేష్ అగర్వాల్, అనుపమ్ మిట్టల్, అమన్ గుప్తా, పియుష్ బన్సల్ టాప్‌లో ఉండగా, వెంచర్ క్యాపిటల్ సంస్థల్లో బ్లూమ్ వెంచర్స్, ఎక్సిమియస్ వెంచర్స్, యూనికార్న్ ఇండియా వెంచర్స్, పీక్ ఫిఫ్టీన్, యాక్సెల్, నెక్స్ వెంచర్ పార్ట్నర్స్ గణనీయంగా ఇన్వెస్ట్ చేశాయి.➤2024 మొత్తం మీద దేశీ అంకుర సంస్థలు 30.4 బిలియన్ డాలర్లు సమీకరించాయి. 2023లో నమోదైన 32.5 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇది 6.5 శాతం తక్కువ. -
స్టీల్‌కు డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది
జమ్‌షేడ్‌పూర్: భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ స్టీల్‌కు డిమాండ్ పెరుగుతూనే ఉంటుందని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ అన్నారు. వ్యయ నిర్వహణ, సామర్థ్యాలతో దీన్ని ఎదుర్కోవాలన్నారు. టాటా స్టీల్ వ్యవస్థాపకుడు జేఎన్ టాటా 186వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. టెక్నాలజీని అందుపుచ్చుకునే విషయంలో ఉద్యోగులు, కార్మిక సంఘాలతోపాటు ప్రభుత్వం, విధానాల రూపంలో కంపెనీకి సాయం అవసరమన్నారు. ‘‘విస్తరణ విషయంలో సాహసోపేతంగా వ్యవహరించాలి. సామర్థ్యాలు, వ్యయ నియంత్రణలు కొనసాగించాలి. ఉత్పాదకతను పెంచుకోవాలి. అదే సమయంలో పెట్టుబడులు కొనసాగించాలి’’అని టాటా స్టీల్ విషయంలో కర్తవ్యబోధ చేశారు. టారిఫ్‌లపై కొనసాగుతున్న చర్చను ప్రస్తావించగా.. సుంకాల గురించి మాట్లాడుకోవడంలో అర్థం లేదంటూ, ఉత్పాదకతపై దృష్టి పెట్టాలని సూచించారు. టారిఫ్‌లు అన్నవి ప్రభుత్వం విధించే సుంకాలని, విదేశీ వస్తువులు దేశంలోకి దిగుమతి చేసుకునేందుకు కంపెనీలు వీటిని చెల్లిస్తాయన్నారు. సెమీకండక్టర్ చిప్‌ల విషయంలో భారత్ స్వావలంబన సాధించాల్సి ఉందన్న అభిప్రాయాన్ని చంద్రశేఖర్ వ్యక్తం చేశారు. ఎల్రక్టానిక్స్, హెల్త్‌కేర్, డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాలు చిప్‌లపై ఆధారపడి ఉన్నట్టు చెప్పారు. ఇందుకోసమే అసోం, గుజరాత్లో టాటాగ్రూప్ సెమీకండక్టర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్టు గుర్తు చేశారు. -
పేటీఎంకు ఈడీ నోటీస్
న్యూఢిల్లీ: ప్రముఖ ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్ పేటీఎం మాతృ సంస్థ ‘వన్ 97 కమ్యూనికేషన్స్’కు (ఓసీఎల్) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసు జారీ చేసింది. వన్97 కమ్యూనికేషన్స్‌తోపాటు, సంస్థ చైర్మన్, ఎండీ విజయ్ శేఖర్ శర్మ, సబ్సిడరీ కంపెనీలైన లిటిల్ ఇంటర్నెట్, నియర్‌బై ఇండియాకు నోటీసులు జారీ అయ్యాయి. రూ.611 కోట్ల విలువకు సంబంధించి విదేశీ మారక ద్రవ్య చట్టం (ఫెమా) నిబంధనలను ఉల్లంఘించినట్టు దర్యాప్తులో తేలడంతో న్యాయపరమైన చర్యలకు ముందు ఈడీ స్పెషల్ డైరెక్టర్ ఈ నోటీసు జారీ చేశారు. నియంత్రణ ప్రక్రియలు, చట్టబద్ధమైన మార్గా ల్లో ఈ సమస్యను పరిష్కరించుకుంటామని పేటీఎం అధికార ప్రతినిధి ప్రకటించారు. ఓసీఎల్ సింగపూర్‌లో పెట్టుబడులు పెట్టి, విదేశాల్లో సబ్సిడరీ ఏర్పాటు విషయాన్ని ఆర్బీఐకి వెల్లడించలేదని దర్యాప్తులో గుర్తించినట్టు ఈడీ ప్రకటించింది. ఆర్బీఐ నిర్దేశిత ధరల మార్గదర్శకాలను అనుసరించకుండా, ఓసీఎల్ సబ్సిడరీ అయిన లిటిల్ ఇంటర్నెట్ ప్రైవేటు లిమిటెడ్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అందుకున్నట్టు తెలిపింది. కాగా, ఈ రెండు కంపెనీలను తాము 2017లో దక్కించుకున్నామని, వీటికి సంబంధించి నిబంధనల ఉల్లంఘన తమ సబ్సిడరీలు కాకముందు జరిగినవిగా పేటీఎం స్పష్టత ఇచి్చంది. పేటీఎం షేరు ఎన్ఎస్ఈలో 4% పడి, ఇంట్రాడే కనిష్టానికి (రూ.684) దిగజారింది. చివరికి 2 శాతం లాభంతో రూ.729 వద్ద ముగిసింది. -
దేశ ఉక్కు సంకల్పం.. టాటా
టాటా గ్రూప్ లో భాగమైన టాటా స్టీల్ లిమిటెడ్ భౌగోళికంగా ప్రపంచంలోని అత్యంత వైవిధ్యభరితమైన ఉక్కు ఉత్పత్తిదారులలో ఒకటి. 1907లో జంషెడ్జీ నుస్సెర్వాన్‌జీ టాటా చేత టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ లిమిటెడ్ (టిస్కో) గా స్థాపితమైన ఈ సంస్థ ఉక్కు పరిశ్రమలో గ్లోబల్ లీడర్‌గా ఎదిగింది. మహారాష్ట్రలోని ముంబై కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న టాటా స్టీల్ భారత్, నెదర్లాండ్స్, యునైటెడ్ కింగ్ డమ్ లలో కీలక కార్యకలాపాలతో 26 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.జేఎన్ టాటా జయంతిటాటా స్టీల్ దార్శనిక వ్యవస్థాపకుడు, క్లుప్తంగా జెఎన్ టాటా అని పిలిచే జంషెడ్జీ నుస్సెర్వాన్‌జీ టాటా జయంతి మార్చి 3న. ఈసారి 186వ జయంతిని ఆ సంస్థ సగర్వంగా జరుపుకుంటోంది. దేశ అత్యంత ఐకానిక్ కంపెనీలలో ఒకదానికి పునాది వేసిన మార్గదర్శక స్ఫూర్తి, పారిశ్రామిక ఔన్నత్యానికి అచంచలమైన నిబద్ధత ఉన్న వ్యక్తికి నివాళిగా ఆయన జయంతిని ఫౌండర్ డేగా నిర్వహిస్తున్నారు.దూరదృష్టి గల నాయకుడు1839 మార్చి 3న గుజరాత్ లో జన్మించిన జేఎన్ టాటా భారత పారిశ్రామిక ముఖచిత్రాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన దార్శనిక పారిశ్రామికవేత్త. 1870 లలో మధ్య భారతదేశంలో ఒక వస్త్ర మిల్లుతో ఆయన వ్యవస్థాపక ప్రయాణం ప్రారంభమైంది. అయితే, ఆయన దార్శనికత వస్త్ర వ్యాపారాన్ని దాటి విస్తరించింది. భారత్ ను పారిశ్రామిక దేశాల సరసన నిలిపే ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పాలన్నది జేఎన్ టాటా కల. 1907లో టాటా స్టీల్ స్థాపనతో ఈ కల సాకారమైంది. ఇది భారతదేశ ఉక్కు పరిశ్రమకు నాంది పలికింది.టాటా స్టీల్ ఘనతలు● 2024 మార్చి 31 తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఈ గ్రూప్ దాదాపు 27.7 బిలియన్ డాలర్ల ఏకీకృత టర్నోవర్‌ను నమోదు చేసింది.● గ్రేట్ ప్లేస్ టు వర్క్ సంస్థగా గుర్తింపు పొందిన టాటా స్టీల్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, అసోసియేట్లు, జాయింట్ వెంచర్లతో కలిసి, 78,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులతో ఐదు ఖండాలలో విస్తరించి ఉంది.● టాటా స్టీల్ 2045 నాటికి నికర జీరోతో సహా దాని ప్రధాన స్థిరత్వ లక్ష్యాలను ప్రకటించింది.● కంపెనీ తన జంషెడ్పూర్, కళింగనగర్ , ఐజేముదీన్ ప్లాంట్లకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ లైట్‌హౌస్ గుర్తింపును అందుకుంది. టాటా స్టీల్‌ను ఎకనామిక్ టైమ్స్ సీఐఓ 'డిజిటల్ ఎంటర్ప్రైజ్ ఆఫ్ ఇండియా - స్టీల్' అవార్డు 2024తో గుర్తించింది.● ఈ కంపెనీ వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ డైవర్సిటీ ఈక్విటీ & ఇంక్లూజన్ లైట్‌హౌస్ 2023తో గుర్తింపు పొందింది.● ఈ కంపెనీ 2012 నుండి డీజేఎస్ఐ ఎమర్జింగ్ మార్కెట్స్ ఇండెక్స్‌లో భాగంగా ఉంది. 2016 నుండి డీజేఎస్ఐ కార్పొరేట్ సస్టైనబిలిటీ అసెస్మెంట్లో టాప్ 10 స్టీల్ కంపెనీలలో స్థిరంగా స్థానం సంపాదించుకుంది.● టాటా స్టీల్ జంషెడ్పూర్ ప్లాంట్ భారతదేశంలో రెస్పాన్సిబుల్ స్టీల్ సర్టిఫికేషన్ పొందిన మొట్టమొదటి సైట్. తదనంతరం కళింగనగర్, మెరామండలి ప్లాంట్లు కూడా సర్టిఫికేషన్ పొందాయి దేశంలో, టాటా స్టీల్ ఇప్పుడు దాని ఉక్కు ఉత్పత్తిలో 90% కంటే ఎక్కువ రెస్పాన్సిబుల్ స్టీల్ సర్టిఫైడ్ సైట్ల నుండి కలిగి ఉంది.● 2016-17 సంవత్సరానికి ఉత్తమ పనితీరు కనబరిచిన ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌గా ప్రైమ్ మినిస్టర్స్ ట్రోపీ, 2024లో వరల్డ్ స్టీల్ నుంచి వరుసగా ఏడు సంవత్సరాలు స్టీల్ సస్టైనబిలిటీ ఛాంపియన్ గుర్తింపు, సీడీపీ ద్వారా 2023 క్లైమేట్ చేంజ్ లీడర్షిప్ అవార్డు, 2022లో డన్ & బ్రాడ్‌స్ట్రీట్ టాప్ 500 కంపెనీలలో అగ్రగామి, బ్రాండ్ ఫైనాన్స్ ద్వారా దేశంలో 2024 అత్యంత విలువైన మైనింగ్ అండ్ మెటల్స్ బ్రాండ్‌గా ర్యాంక్, ఎథిస్పియర్ ఇన్స్టిట్యూట్ నుండి 2021లో 'మోస్ట్ ఎథికల్ కంపెనీ' అవార్డు, స్పోర్ట్‌స్టార్ ఏసెస్ అవార్డ్స్ 2024లో 'బెస్ట్ కార్పొరేట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ స్పోర్ట్స్' గుర్తింపును పొందింది.● 2023 గ్లోబల్ ఈఆర్ఎం (ఎంటర్ప్రైజ్ రిస్క్ మేనేజ్మెంట్) అవార్డు ఆఫ్ డిస్టింక్షన్, వరుసగా ఎనిమిదవ సంవత్సరం 'మాస్టర్స్ ఆఫ్ రిస్క్' - మెటల్స్ & మైనింగ్ సెక్టార్ గుర్తింపు, ఐసీఎస్ఐ బిజినెస్ రెస్పాన్సిబిలిటీ అండ్ సస్టైనబిలిటీ అవార్డు 2023 అందుకుంది. -
తాత్కాలిక ఉద్యోగాలపై పెరుగుతున్న ఆసక్తి
ఫ్లెక్సీ వర్క్‌ఫోర్స్ (తాత్కాలిక, కాంట్రాక్ట్ ఆధారిత, నిర్ణీత పనివేళలు లేని... ఉద్యోగశ్రేణి) వృద్ధికి ఫార్మల్ స్టాఫింగ్ కంపెనీలు మార్గం సుగమం చేస్తున్నాయి. రెగ్యులర్ ఉద్యోగేతర.. తాత్కాలిక ఉద్యోగాల స్థితిగతుల గురించి ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్ (ఐఎస్ఎఫ్) వారి ఫ్లెక్సీ ఎంప్లాయ్మెంట్ సోషల్ ఇంపాక్ట్ రిపోర్ట్ 2024 వెల్లడించింది.నివేదిక ప్రకారం ఫ్లెక్సీ ఎంప్లాయ్మెంట్ అనేది మహిళలు, యువత తక్కువ నైపుణ్యం కలిగిన కార్మికులతో సహా విభిన్న సమూహాలకు సాధికారత కల్పిస్తోంది. అదే సమయంలో శాశ్వత ఉద్యోగ అవకాశాలకు స్పష్టమైన మార్గాలను అందిస్తుంది.. దాదాపు 23% తాత్కాలిక కార్మికులు ఫార్మల్ స్టాఫింగ్ ఇండస్ట్రీ ద్వారా శాశ్వత ఉద్యోగాలకు మళ్లారు.ఫ్లెక్సీ వర్కర్లలో 79% మంది మూడు నెలల పాటు అసైన్మెంట్లలో ఉన్నారని, 6–12 నెలలు పొడిగించిన కాంట్రాక్టులలో సంవత్సరానికి 40% పెరుగుదల ఉందని నివేదిక వెల్లడించింది. ఈ మార్పు అనువైన ఉపాధిలో ఎక్కువ స్థిరత్వాన్ని సూచిస్తుంది, ఎందుకంటే ఎక్కువ మంది కార్మికులు దీర్ఘకాలిక అసైన్మెంట్లను పొందుతారు.అదనంగా, ఫ్లెక్సీ వర్క్‌ఫోర్స్‌లో 78% మంది ఆరు నెలలకు మించి కాంట్రాక్ట్‌లలో పాల్గొంటున్నారు. ఇది ఫ్లెక్సీ పనుల దీర్ఘకాలిక ప్రయోజనాలపై పెరుగుతున్న నమ్మకాన్ని సూచిస్తుందని నివేదిక తెలిపింది. 60% తాత్కాలిక కార్మికులు సామాజిక భద్రత, సకాలంలో వేతనాలు, వైద్య కవరేజీ వంటి ప్రయోజనాల ద్వారా ఆకర్షితులవుతారని తేల్చింది. ఈ కార్మికులలో 78% మంది తమ ఉద్యోగ పరిస్థితుల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. -
కరూర్ వైశ్యా బ్యాంక్ కొత్త శాఖలు..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని పొద్దుటూర్‌తో పాటు తమిళనాడులో కొత్తగా ఆరు శాఖలను ప్రారంభించినట్లు ప్రైవేట్ రంగ కరూర్ వైశ్యా బ్యాంక్ వెల్లడించింది. ఇవి సేవింగ్స్, కరెంట్ అకౌంట్స్, డిపాజిట్లు, రుణాలు తదితర బ్యాంకింగ్ సర్వీసులను సమగ్రంగా అందిస్తాయని బ్యాంక్ తెలిపింది.2024–25లో కొత్తగా 35 శాఖలను ప్రారంభించినట్లు, మొత్తం బ్రాంచీల సంఖ్య 877కి చేరినట్లు వివరించింది. కస్టమర్లకు అనుకూలంగా ఉండేలా తమ మొబైల్ బ్యాంకింగ్ యాప్ కేవీబీ డిలైట్‌ను 150 పైచిలుకు ఫీచర్లతో మెరుగుపర్చినట్లు పేర్కొంది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం ఆఖరు నాటికి బ్యాంక్ మొత్తం వ్యాపార పరిమాణం రూ. 1,81,993 కోట్లకు చేరింది. తొమ్మిది నెలల కాలానికి నికర లాభం రూ. 1,428 కోట్లుగా నమోదైంది. -
కష్టజీవులపై చలానాస్త్రం! ‘రూ.9.6 లక్షలు పిండేశాం’
నగరాలలో పొట్టకూటి కోసం చిరుద్యోగాలు చేసుకునే కష్టజీవులు చాలా మంది కనిపిస్తారు. వీరిలో ముఖ్యంగా ఈ-కామర్స్ సంస్థలకు డెలివరీ ఏజెంట్లుగా పనిచేస్తూ పొట్టపోసుకునేవారే ఎక్కువ. రోజంతా రోడ్లపై తిరుగుతూ కష్టపడితే పదో పాతికో సంపాదిస్తారు. వీళ్లనే టార్గెట్ చేశారు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు. చిన్న చిన్న ఉల్లంఘనల పేరుతో జరిమానాల రూపంలో లక్షల రూపాయలు పిండేశారు.నిబంధనలు ఉల్లంఘించే ఈ-కామర్స్ వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు శనివారం (మార్చి 1) స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మొత్తం 1,859 మంది నుంచి జరిమానాల రూపంలో రూ.9.6 లక్షలు వసూలు చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా చూడటం రహదారి భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా, ఈ-కామర్స్ డెలివరీ వాహనాల ద్వారా పెరుగుతున్న ట్రాఫిక్ ఉల్లంఘనలను పరిష్కరించే విస్తృత ప్రయత్నంలో భాగంగా ఈ డ్రైవ్ చేపట్టినట్లు పోలీసులు చెబుతున్నారు.స్పెషల్ డ్రైవ్ లో ఎక్కువగా ఈ-బైకులే నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్టు గుర్తించామని జాయింట్ పోలీస్ కమిషనర్ (ట్రాఫిక్) ఎంఎన్ అనుచేత్ తెలిపారు. ఈ వాహనాలు ఎక్కువగా మైక్రో మొబిలిటీ వాహనాలు, వాటి వినియోగదారులకు నిబంధనలు తెలియవు. మైక్రో మొబిలిటీ వాహనాలకు రిజిస్ట్రేషన్ నంబర్లు లేవని, వాటి వినియోగదారులు హెల్మెట్ ధరించాల్సిన అవసరం లేదని ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారి ఒకరు వివరించారు.చిరు ఉల్లంఘనలుఫుట్ పాత్ లపై ప్రయాణించినందుకు 79 మంది, నో ఎంట్రీ నిబంధనను ఉల్లంఘించినందుకు 389 మంది, వన్ వేకు విరుద్ధంగా ప్రయాణించినందుకు 354 మంది, సిగ్నల్ జంప్ చేసినందుకు 209 మంది, హెల్మెట్ ధరించనందుకు 582 మంది, రాంగ్ పార్కింగ్ చేసినందుకు 98 మంది, ట్రాఫిక్ కు ఆటంకం కలిగించినందుకు 148 మందిని పోలీసులు పట్టుకున్నారు. అక్కడికక్కడే జరిమానా చెల్లించేందుకు తమ వద్ద డబ్బులు లేవని రైడర్లు చెప్పడంతో పోలీసులు 794 వాహనాలకు నోటీసులు జారీ చేశారు.అవగాహన లేమిచాలా మంది రైడర్లు తమకు నిబంధనలపై అవగాహన లేదని చెప్పడంతో, వారికి గంటకు పైగా ఆయా పరిధుల్లో రూల్ ట్రైనింగ్ ఇచ్చినట్లు అనుచేత్ తెలిపారు. ఈ-కామర్స్ కు అనుబంధంగా ఉన్న ఎల్లోబోర్డు వాహనాలను ట్రాఫిక్ పోలీసులు టార్గెట్ చేస్తున్నారనే ప్రచారం జరిగింది. అయితే దీన్ని పోలీసులు ఖండించారు. వాహనం నంబర్ ప్లేట్ రంగుతో సంబంధం లేకుండా ఈ-కామర్స్ డెలివరీ కోసం ఉపయోగించే అన్ని రకాల వాహనాలు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్లు కేసులు నమోదు చేసినట్లు అనుచేత్ తెలిపారు. -
కస్టమర్ ఖాతాలోకి లక్షల కోట్లు!!
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ సిస్టమ్స్‌లో లోపాల వల్ల కస్టమర్ల ఖాతాల్లోకి వేరే వాళ్ల డబ్బులొచ్చి పడుతుండటం, బ్యాంకులు నాలిక్కర్చుకుని మళ్లీ వెనక్కి తీసుకునే ఉదంతాలు మనకు అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటాయి. సాధారణంగా ఇది వేలు, లక్షల రూపాయల స్థాయిలో ఉంటుంది. అమెరికన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ దిగ్గజం సిటీ గ్రూప్‌లోనూ అలాంటిదే జరిగింది. కాకపోతే, ఒకటి రెండూ లక్షలు కాదు ఏకంగా లక్షల కోట్ల డాలర్ల స్థాయిలో! సంబంధిత వర్గాల కథనం ప్రకారం.. 2023 ఏప్రిల్‌లో సిటీ గ్రూప్ ఉద్యోగి ఓ కస్టమర్ ఖాతాలోకి 280 డాలర్లు క్రెడిట్ చేయబోయి.. అక్షరాలా 81 లక్షల కోట్ల డాలర్లను క్రెడిట్ చేశారు. లావాదేవీలను పర్యవేక్షించాల్సిన మరో ఉద్యోగి కూడా దాన్ని క్లియర్ చేశారు. ఈ దెబ్బతో సిటీగ్రూప్ ఖజానా ఖాళీ అయిపోయింది. దాదాపు గంటన్నర తర్వాతెప్పుడో జరిగిన పొరపాటును ఇంకో ఉద్యోగి గుర్తించడంతో, ఇది బైటపడింది. చివరికి ఆ లావాదేవీని రివర్స్ చేసి, ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకుని హమ్మయ్య అనుకున్నారు.నిజానికి సిటీ గ్రూప్ గత ఏడాది కాలంగా సుమారు 100 కోట్ల డాలర్ల మొత్తానికి సంబంధించి ఇలాంటి పది పొరపాటు లావాదేవీలను తృటిలో తప్పించుకుంది. వాస్తవానికి ఇలాంటి పొరపాట్ల సంఖ్య పదమూడు నుంచి పదికి తగ్గిందట. ఇలాంటి పొరపాట్లను నివారించడంలో ఆశించినంత పురోగతి సాధించనందుకు గాను సిటీగ్రూప్‌కు నియంత్రణ సంస్థ 13.6 కోట్ల డాలర్ల జరిమానా విధించగా, రిస్కులు.. డేటా వైఫల్యాలకు గాను 40 కోట్ల డాలర్ల పెనాల్టీ కూడా పడింది. -
మారిన పాస్‌పోర్ట్ రూల్స్..
పాస్‌పోర్టుల (Passport) జారీకి సంబంధించిన నిబంధనలలో భారత ప్రభుత్వం తాజాగా మార్పులు చేసింది. పాస్‌పోర్టుల జారీ కోసం సమర్పించే పుట్టినరోజు తేదీ రుజువుకు సంబంధించిన నిబంధనలకు సవరణలు ప్రకటిస్తూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. పాస్‌పోర్ట్ (సవరణ) నిబంధనలు, 2025 లో భాగమైన ఈ మార్పులు పాస్‌పోర్ట్ దరఖాస్తు ప్రక్రియను క్రమబద్ధీకరించడం, అవసరమైన డాక్యుమెంటేషన్‌లో ఏకరూపతను నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.నిబంధనల్లో కీలక మార్పులు2023 అక్టోబర్ 1 లేదా ఆ తర్వాత జన్మించిన పిల్లలకు జనన మరణాల రిజిస్ట్రార్, మునిసిపల్ కార్పొరేషన్ లేదా జనన, మరణాల నమోదు చట్టం, 1969 ప్రకారం అధికారం ఉన్న ఏదైనా ఇతర అథారిటీ జారీ చేసిన జనన ధృవీకరణ పత్రం మాత్రమే పుట్టిన తేదీకి చెల్లుబాటు అయ్యే రుజువు అని కొత్త నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. ఈ మార్పు శిశువులకు జనన ధృవీకరణ పత్రాన్ని పొందాల్సిన ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. అలాగే పుట్టిన తేదీని అధికారిక రికార్డులలో ఖచ్చితంగా నమోదు చేసేలా చేస్తుంది.2023 అక్టోబర్ 1 కంటే ముందు పుట్టినవారికి..2023 అక్టోబర్ 1 కంటే ముందు జన్మించిన వారికి పుట్టిన తేదీకి సంబంధించి అనుమతించదగిన రుజువులు మరింత సరళంగా ఉంటాయి. ఈ కింది డాక్యుమెంట్లను డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా ఆమోదిస్తారు.జనన మరణాల రిజిస్ట్రార్, మునిసిపల్ కార్పొరేషన్ లేదా జనన మరణాల నమోదు చట్టం, 1969 ప్రకారం అధికారం ఉన్న మరేదైనా అథారిటీ జారీ చేసిన జనన ధృవీకరణ పత్రం.దరఖాస్తుదారు పుట్టిన తేదీని కలిగి ఉన్న గుర్తింపు పొందిన పాఠశాల లేదా గుర్తింపు పొందిన విద్యా బోర్డు జారీ చేసిన బదిలీ లేదా స్కూల్ లీవింగ్ లేదా మెట్రిక్యులేషన్ సర్టిఫికెట్.దరఖాస్తుదారు పుట్టిన తేదీతో ఆదాయపు పన్ను శాఖ జారీ చేసే శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) కార్డు.దరఖాస్తుదారు పుట్టిన తేదీ ఉండే సర్వీస్ రికార్డ్ ఎక్స్ట్రాక్ట్ లేదా వేతన పెన్షన్ ఆర్డర్ కాపీలు (ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తాయి). వీటికి సంబంధిత మంత్రిత్వ శాఖ లేదా దరఖాస్తుదారు అడ్మినిస్ట్రేషన్ ఇన్‌ఛార్జి అధికారి ధ్రువీకరణ ఉండాలి.దరఖాస్తుదారు పుట్టిన తేదీతో సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ రవాణా శాఖ జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్.దరఖాస్తుదారు పుట్టిన తేదీతో కూడిన ఎన్నికల సంఘం జారీ చేసిన ఎలక్షన్ ఫోటో ఐడీ కార్డు.లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లేదా ప్రభుత్వ కంపెనీలు జారీ చేసే పాలసీ బాండ్. ఇందులో బీమా పాలసీ హోల్డర్ పుట్టిన తేదీ ఉంటుంది.దరఖాస్తుదారులపై ప్రభావంకొత్త నిబంధనలు ప్రధానంగా 2023 అక్టోబర్ 1 లేదా తరువాత జన్మించిన పిల్లల తల్లిదండ్రులను ప్రభావితం చేస్తాయి. వారు పాస్‌పోర్ట్ దరఖాస్తులకు పుట్టిన తేదీ ఏకైక రుజువుగా జనన ధ్రువీకరణ పత్రాన్ని పొందాల్సి ఉంటుంది. ఈ మార్పు డాక్యుమెంటేషన్ ప్రక్రియను ప్రామాణీకరించడం, పుట్టిన తేదీ రికార్డులలో వ్యత్యాసాలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే 2023 అక్టోబర్ 1 కంటే ముందు జన్మించినవారిపై మాత్రం ఎటువంటి ప్రభావం ఉండదు. పాస్‌పోర్ట్ కోసం వారు ఎప్పటిలాగే వివిధ రకాల డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌లను సమర్పించవచ్చు. -
'ప్రైవేట్ టెల్కో నెట్వర్క్ అవసరం లేదు'
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా టెలికం నెట్వర్క్ కవరేజీ ఉన్న నేపథ్యంలో కంపెనీలు సొంతంగా ప్రైవేట్ నెట్‌వర్క్‌లను (సీఎన్‌పీఎన్) ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం దాదాపుగా లేదని టెల్కోల సమాఖ్య సీవోఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచ్చర్ వ్యాఖ్యానించారు.ప్రజలకు టెలికం కనెక్టివిటీ చాలా పరిమితంగా ఉన్న చోట్ల లేదా అస్సలు లేని కనెక్టివిటీనే లేని భౌగోళిక ప్రాంతాల్లో, చాలా తక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఇలాంటివి కావాలి తప్ప భారత్‌లో అనవసరమని తెలిపారు. కంపెనీలు తమ ఫ్యాక్టరీ కార్యకలాపాలు మొదలైన అవసరాల కోసం, నేరుగా టెలికం శాఖ నుంచి స్పెక్ట్రంను తీసుకుని, సొంతంగా ప్రైవేట్ నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలోనే కొచ్చర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రైవేట్ నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేయడానికి బదులుగా పారిశ్రామిక వృద్ధికి దోహదపడే టెలికం మౌలిక సదుపాయాలను పటిష్టం చేయడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. డిజిటల్ భారత్ నిధికి మరింతగా నిధులను సమకూర్చగలిగితే ఇంకా కనెక్టివిటీ అంతగా లేని ప్రాంతాల్లోనూ సేవలను విస్తరించేందుకు ఉపయోగకరంగా ఉంటుందని కొచ్చర్ పేర్కొన్నారు. -
'స్పెక్ట్రం అవసరం మరింత పెరుగుతుంది': టెలికం కార్యదర్శి
న్యూఢిల్లీ: దేశీయంగా డేటా వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో టెలికం సదుపాయాలను మరింత మెరుగుపర్చుకోవాల్సి ఉంటుందని కేంద్ర టెలికం శాఖ కార్యదర్శి 'నీరజ్ మిట్టల్' తెలిపారు. మొబైల్, బ్రాడ్‌బ్యాండ్ వినియోగానికి మరింత స్పెక్ట్రం అవసరమవుతుందని తెలిపారు. అటు 5జీ సేవల కోసం చేసిన ఇన్వెస్ట్మెంట్లపై టెల్కోలకు రాబడులు లభించడం కష్టతరంగా ఉంటున్న నేపథ్యంలో.. ఈ రెండు అంశాల మీద ప్రభుత్వం దృష్టి పెడుతున్నట్లు వివరించారు.దేశీయంగా డేటా స్పీడ్ సగటున 99–100 ఎంబీపీఎస్ నుంచి 151 ఎంబీపీఎస్‌కి పెరిగినట్లు చెప్పారు. సగటున ప్రతి నెలా ఒక్కో యూజరు దాదాపు 29 గిగాబైట్ల డేటాను వినియోగిస్తున్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో 5జీ నుంచి 6జీకి మారాలంటే మౌలిక సదుపాయాలపై భారీగా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందని, మరింత స్పెక్ట్రం అవసరమవుతుందని చెప్పారు.ప్రైవేట్ టెల్కోలు 5జీ సేవల కోసం 2024లో టెలికం మౌలిక సదుపాయాలు, స్పెక్ట్రంపై రూ. 70,000 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. ప్రస్తుతం జియో, భారతి ఎయిర్టెల్ 5జీ సర్వీసులను అందిస్తుండగా.. వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ ఇంకా సేవలను ప్రారంభించాల్సి ఉంది. భారీగా డేటాను వినియోగించే యూజర్లున్నందున నెట్‌ఫ్లిక్స్, మెటా, అమెజాన్, గూగుల్‌లాంటి టెక్ దిగ్గజాలు కూడా తమ ఆదాయాల్లో కొంత భాగాన్ని భారత్‌లో నెట్వర్క్ మౌలిక సదుపాయాల కల్పన కోసం అందించాలంటూ టెల్కోలు కోరుతున్నాయి. -
'8-8-8 రూల్ పాటించండి': పనిగంటలపై నీర్జా బిర్లా
దేశం మొత్తం మీద పనిగంటల ప్రస్తావన జరుగుతున్న సమయంలో.. ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా భార్య.. 'నీర్జా బిర్లా' (Neerja Birla) తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రోజులోని 24 గంటలను '8-8-8' నియమంగా విభజించుకుంటే.. జీవితం సాఫీగా సాగుతుందని పేర్కొన్నారు.పనికి 8 గంటలు, నిద్రకు 8 గంటలు, విశ్రాంతికి మిగిలిన 8 గంటలు కేటాయించుకోవాలి. ఇలా విభజించుకుంటే.. 24 గంటలు సరిపోతుంది. పనిని మాత్రమే కాకుండా.. వ్యక్తిగత జీవితాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవడంపై ద్రుష్టి సారించాలి. ఈ నియమం పాటించడానికి కొంత కష్టంగా ఉన్నప్పటికీ.. సమతుల్యం చేసుకోవడానికి ప్రయత్నించాలని నీర్జా బిర్లా స్పష్టం చేశారు.వారానికి 70 గంటలు, 90 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్ నారాయణమూర్తి, ఎల్ & టీ చైర్మన్ సుబ్రమణ్యన్ చెప్పారు వ్యాఖ్యానించారు. ఈ మాటలను ఆనంద్ మహీంద్రా, గౌతమ్ అదానీ, ఎంక్యూర్ ఫార్మాస్యూటికల్స్ సీఈఓ 'నిమితా థాపర్' మొదలైనవారు విమర్శించారు. తాజాగా నీర్జా బిర్లా కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.పని గంటలపై ఆకాష్ అంబానీముంబై టెక్ వీక్ కార్యక్రమంలో 'ఆకాష్ అంబానీ' మాట్లాడుతూ.. ఆఫీసులో ఎంతసేపు (ఎన్ని గంటలు) ఉంటారనేది ముఖ్యం కాదు, చేస్తున్న పనిలో నాణ్యత ఉండాలి, దాని గురించి మాత్రమే ఆలోచిస్తాను అని అన్నారు. వృద్ధి అంటే జీవితం అనేది రిలయన్స్ నినాదం, అది వ్యక్తిగత జీవితానికి కూడా వరిస్తుందని అన్నారు. కాబట్టి మీరు ప్రతి రోజు ఎదగడానికి కృషి చేయాలని పేర్కొన్నారు.ఇదీ చదవండి: 'అర్ధరాత్రి 2 గంటల వరకు మేల్కొనే ఉంటారు': తండ్రి గురించి చెప్పిన ఆకాశ్ అంబానీ -
బిజినెస్ క్లోజ్.. మొత్తం ఉద్యోగుల తొలగింపు
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తన విభాగమైన ఏఎన్ఎస్ కామర్స్ వ్యాపారాన్ని మూసివేసి, మొత్తం ఉద్యోగులను తొలగించింది. 2017లో స్థాపించిన ఈ సంస్థ తమ ఉత్పత్తిని ఆన్లైన్లో విక్రయించాలనుకునే సంస్థలకు మార్కెటింగ్ టూల్స్, వేర్‌హౌసింగ్ వంటి సహకారాన్ని అందిస్తోంది. దీన్ని ఫ్లిప్‌కార్ట్ 2022లో కొనుగోలు చేసింది.‘పరిస్థితులన్నీ క్షుణ్ణంగా పరిశీలించి 2022లో ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు చేసిన ఫుల్ స్టాక్ ఈ-కామర్స్ సంస్థ ఏఎన్ఎస్ కామర్స్ తన కార్యకలాపాలను మూసివేయాలని నిర్ణయించింది. కార్యకలాపాలను మూసివేస్తున్న క్రమంలో ఉద్యోగులు, వినియోగదారులతో సహా భాగస్వాములందరికీ పరివర్తనను సజావుగా జరిగేలా మేము కట్టుబడి ఉన్నాము’ అని కంపెనీ వర్గాలు ధ్రువీకరించాయి.ఈ పరివర్తన సమయంలో ఉద్యోగులపై ప్రభావాన్ని తగ్గించడానికి, ఫ్లిప్‌కార్ట్‌లో అంతర్గత అవకాశాలు, అవుట్ ప్లేస్మెంట్ సేవలు, సెవెరెన్స్ ప్యాకేజీలను అందించాలని యోచిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. మూసివేత వల్ల ఎంతమంది ఉద్యోగులు ప్రభావితమయ్యారో తెలియరాలేదు. 2022 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఏఎన్ఎస్ కామర్స్‌లో 600 మంది ఉద్యోగులు ఉన్నారు. -
అంబానీ అల్లుడికి ట్యాక్స్ నోటీసు..
ఆసియాలోనే అపర కుబేరుడైన ముఖేష్ అంబానీ అల్లుడికి భారీ ట్యాక్స్ నోటీసు వచ్చింది. ఇషా అంబానీకి భర్త అయిన ఆనంద్ పిరమల్ ప్రమోటర్‌గా ఉన్న రూ.19,675 కోట్ల పిరమల్ గ్రూప్ లో ప్రముఖ సంస్థ అయిన పిరమల్ ఎంటర్‌ప్రైజెస్‌కు రూ.1,502 కోట్ల పన్ను డిమాండ్ నోటీసు అందింది. 2021 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ తన ఫార్మా వ్యాపారాన్ని పిరమల్ ఫార్మా లిమిటెడ్‌కు విక్రయించడానికి సంబంధించి మహారాష్ట్ర డిప్యూటీ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్ ఈ నోటీసు జారీ చేశారు. రూ.4,487 కోట్ల విలువైన ఈ లావాదేవీలో అనుబంధ సంస్థల బదలాయింపు కూడా ఉంది. రూ.1,502 కోట్ల పన్ను డిమాండ్‌లో పన్ను మొత్తం రూ.837.17 కోట్లు కాగా వడ్డీ కింద రూ.581.53 కోట్లు, జరిమానాగా రూ.83.71 కోట్లు చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు.వివాదం ఇదే.. లావాదేవీ వర్గీకరణలోనే పన్ను వివాదం సారాంశం ఉంది. పిరమల్ ఎంటర్ప్రైజెస్ అమ్మకాన్ని "స్లంప్ సేల్" గా వర్గీకరించింది. వ్యక్తిగత విలువలను కేటాయించకుండా ఆస్తులు, అప్పులతో సహా మొత్తం వ్యాపార సంస్థను బదిలీ చేస్తే దాన్ని స్లంప్ సేల్‌గా పేర్కొంటారు. ఇటువంటి అమ్మకాలు సాధారణంగా జీఎస్టీ పరిధిలోకి రావు. అయితే ఈ వర్గీకరణ తప్పని, ఈ లావాదేవీ "ఐటమైజ్డ్ సేల్" అని పన్ను అధికారులు వాదిస్తున్నారు. ఇక్కడ ఆస్తులు, అప్పులకు ప్రత్యేక విలువలు కేటాయించి మొత్తం అమ్మకాలపై 18 శాతం జీఎస్టీ విధించారు.పిరమల్ ఎంటర్ప్రైజెస్ స్పందనపన్ను ఉత్తర్వులను పిరమల్ ఎంటర్ప్రైజెస్ తీవ్రంగా ఖండించింది. ఈ డిమాండ్ సమంజసం కాదని భావించిన కంపెనీ ఈ తీర్పును సవాలు చేయడానికి తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది. "కంపెనీ తన ఉత్తమ ప్రయోజనాల కోసం తగిన చర్యలు తీసుకుంటుంది. ఆర్డర్ ను పక్కన పెట్టడం వల్ల సానుకూల ఫలితం ఉంటుందని సహేతుకంగా ఆశిస్తున్నాము. ఈ ఆర్డర్ కంపెనీ లాభనష్టాల ప్రకటనపై ఎలాంటి ప్రభావం చూపదు" అని రెగ్యులేటరీ ఫైలింగ్ లో పిరమల్ ఎంటర్ప్రైజెస్ పేర్కొంది.ఇది చదివారా? అంబానీ వారసులలో ఎవరు ఎక్కువ రిచ్?ఆర్థిక ప్రభావంపన్ను వివాదం కొనసాగుతున్నప్పటికీ, పిరమల్ ఎంటర్ప్రైజెస్ 2024 డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికంలో రూ .38.6 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.2,476 కోట్లతో పోలిస్తే 1.1 శాతం క్షీణతతో రూ.2,449 కోట్లకు పరిమితమైంది. వడ్డీ, పన్ను, తరుగుదల, ఎమోర్టైజేషన్ (ఇబిటా) ముందు ఆదాయం 10.8 శాతం క్షీణించి రూ.1,075 కోట్లకు పరిమితమైంది. -
'నాన్న అర్ధరాత్రి 2 గంటల వరకు మేల్కొనే ఉంటారు'
భారతీయ కుబేరుడు 'ముకేశ్ అంబానీ' గురించి చాలామందికి తెలియని ఆసక్తికర విషయాలను.. ఆకాష్ అంబానీ పేర్కొన్నారు. నాన్న పనితీరు నాకు ఆదర్శమని 'ముంబై టెక్ వీక్' కార్యక్రమంలో వెల్లడించారు.ఇప్పటికి కూడా నాన్న (ముకేశ్ అంబానీ) తనకొచ్చిన అన్ని ఈమెయిల్‌కు రిప్లై ఇస్తూ.. తెల్లవారుజామున 2 గంటల వరకు మేల్కొని ఉంటారని ఆకాష్ అంబానీ చెప్పారు. నాలుగు దశాబ్దాలుగా.. కంపెనీ వృద్ధి కోసం కష్టపడుతూనే ఉన్నారు. ఇది 45వ ఏడాది. ఆయన పనతీరు నాకు ఆదర్శమని.. ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు.అమ్మకు, నాకు క్రికెట్ అంటే ఇష్టం. ఇద్దరూ టీవిలో క్రికెట్ కూస్తూ ఉంటాము. అప్పుడు అమ్మ చిన్నచిన్న విషయాలను కూడా గమనిస్తూ ఉంటారు. అవన్నీ నన్ను ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అమ్మ, నాన్నకు అంకితభావం ఎక్కువ. అవి మాకందరికీ స్ఫూర్తి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా కుటుంబాన్ని చూసే నేర్చుకున్నానని చెప్పారు.జీవితంలో పని మాత్రమే కాదు, కుటుంబానికి కూడా ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం. గత 10 సంవత్సరాలుగా రిలయన్స్‌లో పనిచేస్తూనే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేస్తున్నాను. ఇషా, నేను కవల పిల్లలం. మేము ఇద్దరూ కూడా కుటుంబ విలువలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము. నా పిల్లలతో గడపడం నాకు చాలా ఇష్టం. శ్లోకా భార్యగా రావడం నా అదృష్టం. తను నన్ను ఎంతగానో అర్థం చేసుకుంటుంది.పనిగంటలుముంబై టెక్ వీక్ కార్యక్రమంలో 'ఆకాష్ అంబానీ' పనిగంటలపై కూడా మాట్లాడారు. ఆఫీసులో ఎంతసేపు (ఎన్ని గంటలు) ఉంటారనేది ముఖ్యం కాదు, చేస్తున్న పనిలో నాణ్యత ఉండాలి, దాని గురించి మాత్రమే ఆలోచిస్తాను అని అన్నారు. వృద్ధి అంటే జీవితం అనేది రిలయన్స్ నినాదం, అది వ్యక్తిగత జీవితానికి కూడా వరిస్తుందని అన్నారు. కాబట్టి మీరు ప్రతి రోజు ఎదగడానికి కృషి చేయాలని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఆర్బీఐని సంప్రదించండి.. అనిల్ అంబానీకి కోర్టు ఆదేశంఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మార్గనిర్దేశం చేయడానికి తమ కంపెనీ 1,000 మందికి పైగా డేటా సైంటిస్టులు, పరిశోధకులు, ఇంజనీర్లతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసింది ఆకాష్ అంబానీ అన్నారు. అంతే కాకుండా ఏఐలో దేశం ముందుకు సాగటానికి సహాయపడటానికి రిలయన్స్.. జామ్‌నగర్‌లో 1GW సామర్థ్యం గల డేటా సెంటర్‌ను కూడా కంపెనీ ఏర్పాటు చేస్తోందని అన్నారు. -
సెబీ మార్గదర్శకాలలో సవరణలు
న్యూఢిల్లీ: డీమ్యాట్ ఖాతాలు, మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియోలకు నామినీలను పేర్కొనే విషయంలో నిబంధనలను క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ సవరించింది. ఆస్తుల బదిలీ, నామినీ సులభతర ఎంపికకు వీలుగా మార్గదర్శకాలను సవరిస్తూ తాజాగా సర్క్యులర్ జారీ చేసింది. వెరసి సెక్యూరిటీల మార్కెట్లలో నామినేషన్ సౌకర్యంపై అవసరమైన స్పష్టతను కల్పించింది.ఒక వ్యక్తి లేదా సంయుక్త ఖాతాదారులలో ఒకరు మరణిస్తే ఆస్తుల బదిలీని అదనపు కేవైసీ అవసరంలేకుండా రెండవ వ్యక్తికి బదిలీ చేసేందుకు దారి ఏర్పాటు చేసింది. ముందస్తుగానే కేవైసీ ఇచ్చి ఉంటే వీటి అవసరం ఉండదు. ఖాతాదారులలో జీవించి ఉన్న వ్యక్తి ఏ సమయంలోనైనా కాంటాక్టు వివరాలు, నామినీ మార్పు వంటివి చేపట్టవచ్చు.ఈ బాటలో ఫిజికల్‌గా ఖాతా నిర్వహించేలేని వ్యక్తులు, ఎన్ఆర్ఐలకు సంబంధించి సైతం మార్పులు ప్రవేపెట్టింది. తాజా సవరణలు 2025 మార్చి1 నుంచి మూడు దశలలో అమలుకానున్నాయి. సవరించిన మరికొన్ని నిబంధనలు జూన్1 నుంచి, పూర్తి నిబంధనలు సెపె్టంబర్ 1నుంచి వర్తించనున్నాయి. -
ఆర్బీఐని సంప్రదించండి: అనిల్ అంబానీకి కోర్టు ఆదేశం
బ్యాంకులు ఖాతాలను 'ఎగవేత' లేదా 'మోసం'గా ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసే "కట్, కాపీ, పేస్ట్ పద్ధతి"పై శుక్రవారం బాంబే హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. తన రుణ ఖాతాను 'మోసం'గా ప్రకటిస్తూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఆర్బీఐని సంప్రదించాలని పారిశ్రామికవేత్త 'అనిల్ అంబానీ' (Anil Ambani)ని కోరింది.యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2024 అక్టోబర్ 10న జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ.. అనిల్ అంబానీ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తులు రేవతి మోహితే డెరె, నీలా గోఖలేలతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. ఆదేశాలు జారీ చేయడానికి ముందు తనకు ఎటువంటి విచారణకు అనుమతి ఇవ్వలేదని, బ్యాంక్ జారీ చేసిన రెండు షో-కాజ్ నోటీసులను సవాలు చేస్తూ ఆయన పిటిషన్ వేశారు. ఈ ఆదేశాలను జారీ చేసేందుకు ఏ పత్రాలపై ఆధారపడ్డారో, వాటి నకళ్లు అడిగినా ఇవ్వలేదని తన పిటిషన్లో అనిల్ పేర్కొన్నారు.విచారణ సందర్భంగా.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించకుండా, బ్యాంకులు ఖాతాలను 'మోసం' లేదా 'ఉద్దేశపూర్వక ఎగవేత'గా ప్రకటించే కేసులు పదే పదే వస్తున్నాయని కోర్టు తెలిపింది. ఇలాంటి కట్, కాపీ, పేస్ట్ ఆర్డర్లు ఉండకూడదు. ఇది ప్రజాధనం. మనం అలాంటి ఆర్డర్లను అంత యాదృచ్ఛికంగా ఆమోదించకూడదు. దీనికోసం కొత్త వ్యవస్థను తీసుకురావాలని ధర్మాసనం పేర్కొంది.ఇదీ చదవండి: 12 మంది.. రూ. 60వేల పెట్టుబడి: పార్లే-జీ ప్రస్థానం గురించి తెలుసా?ఆర్బీఐ 'మాస్టర్ సర్క్యులర్'లలో ప్రచురించిన మార్గదర్శకాలు అమలులో ఉన్నాయనే వాస్తవాన్ని బ్యాంకులు తప్పకుండా గుర్తుంచుకోవాలని హైకోర్టు పేర్కొంది. బ్యాంకు అధికారులపై 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' చర్య తీసుకోకపోతే ఇటువంటి ఆదేశాలు జారీ చేస్తూనే ఉంటాయని, దీనిని దృష్టిలో ఉంచుకుని.. ఆర్బీఐ కొత్త యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం మంచిది అని కోర్టు తెలిపింది. -
పని గంటలా..? పని నాణ్యతా..?
పని గంటలపై ప్రముఖులు స్పందిస్తుండడంతో దీనిపై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ముకేశ్ అంబానీ తనయుడు, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్ ఆకాష్ అంబానీ అధిక పని గంటలపై తన అభిప్రాయం వెల్లడించారు. ముంబై టెక్ వీక్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆఫీసులో ఎంతసేపు (ఎన్ని గంటలు) ఉంటారనేది ముఖ్యం కాదు.. చేస్తున్న పనిలో నాణ్యత ఉండాలంటూ దాని గురించి మాత్రమే ఆలోచిస్తానని చెప్పారు. ఇటీవల ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకులు నారాయణమూర్తి, ఎల్అండ్టీ ఛైర్మన్ సుబ్రహ్మణియన్..వంటి ప్రముఖులు ఈ పని గంటలపై స్పందిస్తూ ఆఫీస్‌లో ఎక్కువసేపు పని చేయాలని చెప్పారు. పని గంటలు, పని నాణ్యతపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో నిపుణులు అందులోని విభిన్న అంశాలను విశ్లేషిస్తున్నారు.పని గంటలునిర్దిష్ట వ్యవధిలో పనులు పూర్తి: సరైన పని గంటలు ఉండడం వల్ల ఉద్యోగులు క్రమశిక్షణతో, ఫోకస్‌గా పని చేసేందుకు వీలవుతుంది. నిర్దిష్ట కాలవ్యవధిలో పనులు పూర్తయ్యేలా ఉపయోగపడుతుంది. ఇది మొత్తం ఉత్పాదకతకు దోహదం చేస్తుంది.సమన్వయం, సహకారం: టీమ్ సభ్యుల మధ్య సమన్వయం, సహకారాన్ని సులభతరం చేయడానికి పని గంటలు తోడ్పడుతాయి. అందరూ ఒకేసారి అందుబాటులో ఉన్నప్పుడు సమావేశాలను షెడ్యూల్ చేయడం, ప్రాజెక్టులను చర్చించడం, సమష్టి నిర్ణయాలు తీసుకోవడం సులభం అవుతుంది.వర్క్-లైఫ్ బ్యాలెన్స్: నిర్దిష్ట పని గంటలు వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితాల మధ్య స్పష్టమైన సరిహద్దును సృష్టించడంలో సహాయపడతాయి. ఆరోగ్యకరమైన వర్క్-లైఫ్ సమతుల్యతను నిర్వహించడానికి కీలకం అవుతాయి.పని నాణ్యతక్లయింట్లు సంతృప్తి: పని నాణ్యతపై దృష్టి పెట్టడం వల్ల ఉద్యోగులు మెరుగైన ఫలితాలు అందించే అవకాశం ఉంది. దీనివల్ల క్లయింట్లు సంతృప్తి చెందుతారు.ఇన్నోవేషన్ అండ్ క్రియేటివిటీ: క్వాలిటీ ఆధారిత పని ఆవిష్కరణలను, సృజనాత్మకతను ప్రోత్సహిస్తుంది. కఠినమైన పనిగంటలకు పరిమితం కాని ఉద్యోగులు కొత్త ఆలోచనలు, విభిన్న విధానాలను అన్వేషించవచ్చు.ఉద్యోగుల సంతృప్తి: పనిలో నిత్యం అధిక నాణ్యమైన అవుట్‌పుట్ ఇవ్వడం వల్ల ఉద్యోగులు సంతృప్తి చెందుతూ, కొత్త ఆవిష్కరణలు చేసేందుకు ప్రేరణ పొందే అవకాశం ఉంది. ఇది సానుకూల పని వాతావరణానికి దారితీస్తుంది.పని గంటలు, పని నాణ్యత ప్రాముఖ్యంఉత్పాదకత పెంచడానికి పని గంటలు, పని నాణ్యత రెండూ చాలా ముఖ్యమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకోసం కొన్ని విధానాలను సూచిస్తున్నారు.ఫ్లెక్సిబుల్ పని వేళలు: ఫ్లెక్సిబుల్ వర్క్ షెడ్యూళ్లలో పని చేసేందుకు వీలుగా ఉద్యోగులకు అవకాశం కల్పించాలి. దానివల్ల ఎలాంటి ఒత్తిడి లేకుండా అధిక నాణ్యత కలిగిన అవుట్ పుట్ వస్తుంది.అవుట్ పుట్‌పై దృష్టి: పని గంటల సంఖ్యకు బదులుగా అవుట్ పుట్ నాణ్యతపై దృష్టి కేంద్రీకరించాలి. అందుకోసం సంస్థలు స్పష్టమైన లక్ష్యాలు, అంచనాలను నిర్ణయించాలి. సహేతుకమైన కాలపరిమితిలో అధిక నాణ్యత పనిని అందిస్తే కలిగే ప్రయోజనాలను నొక్కి చెప్పాలి.విరామాలు: క్రమం తప్పకుండా విరామాలు, డౌన్‌టైమ్‌ను ప్రోత్సహించడం సృజనాత్మకతను పెంచుతుంది. కొంతమంది ఉద్యోగులు పని సమయాల్లో కాసేపు రిలాక్స్ అవ్వలనుకుంటారు. అలాంటివారికి రీఛార్జ్ అయ్యేందుకు కొంత సమయం ఇస్తే నాణ్యమైన అవుట్‌పుట్ అందించే అవకాశం ఉంటుంది.నైపుణ్యాలు అభివృద్ధి: ఉద్యోగులకు శిక్షణ, నైపుణ్యాల అభివృద్ధికి అవకాశాలను అందించాలి. దాంతో వారి పని నాణ్యత మెరుగుపడుతుంది. నిరంతర అభ్యాసం సృజనాత్మకతకు దోహదం చేస్తుంది.ఇదీ చదవండి: రూ.1,700తో అమెరికా వెళ్లి రూ.16,400 కోట్లు సంపాదనపని గంటలు, పని నాణ్యత రెండూ ముఖ్యమైనవే. అయినప్పటికీ ఒకదాని కంటే మరొకదానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం అసమతుల్యతకు దారితీస్తుంది. ఆరోగ్యకరమైన వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌ను కాపాడుకుంటూ ఉద్యోగులు అధిక నాణ్యమైన పనిని అందించడానికి కృషి చేయాలి. -
రూ.1,700తో అమెరికా వెళ్లి రూ.16,400 కోట్లు సంపాదన
దృఢ సంకల్పం, పట్టుదల ఉంటే జీవితంలో ఏదైనా సాధించగలమని ప్రముఖ పారిశ్రామికవేత్త రాజ్ సర్దానా నిరూపించారు. ఢిల్లీలో ప్రభుత్వం నిర్మించిన ఒక చిన్న ఇంట్లో ఉంటూ జీవనం సాగించిన సర్దానా వ్యాపారంలో ఎదిగి యునైటెడ్ స్టేట్స్లో బిలియనీర్‌గా స్థిరపడ్డారు. జేబులో కేవలం 100 డాలర్ల(సర్దానా అమెరికా వెళ్లే సమయానికి విలువ రూ.1700)తో అమెరికాలో అడుగుపెట్టిన ఆయన తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి ఏకంగా రెండు బిలియన్ డాలర్ల(ప్రస్తుతం రూ.16,490 కోట్లు) నికర సంపదని సృష్టించారు. రాజ్ సర్దానా జీవిత ప్రయాణం ఎంతోమంది పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.ఢిల్లీలో జీవితం ప్రారంభం..1947 విభజన తర్వాత భారతదేశానికి వలస వచ్చిన పంజాబీ తల్లిదండ్రులకు 1960లో సర్దానా జన్మించారు. న్యూఢిల్లీలోని ప్రభుత్వ గృహంలో పెరిగారు. ఎలాంటి సదుపాయాలు లేని సాధారణ జీవితం సాగించారు. ‘నా తల్లిదండ్రులు నా ఎదుగుదలకు అలుపెరగని కృషి చేశారు. ఎన్నో విలువలు నేర్పించారు. నాకు, నా సోదరుడికి నాణ్యమైన విద్యను అందించడానికి చాలా కష్టపడ్డారు’ అని అథారిటీ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సర్దానా గుర్తు చేసుకున్నారు.అమెరికాకు తరలివెళ్లి..సర్దానా 1981లో జార్జియా టెక్‌లో మెకానికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ చేయడానికి యునైటెడ్ స్టేట్స్కు వెళ్లారు. అమెరికా వెళ్లే సమయానికి తన వద్ద కేవలం 100 డాలర్లు(ప్రస్తుతం దాని విలువ రూ.8,500) ఉన్నాయి. పొట్టకూటికోసం కాలేజీ క్యాంటీన్లో పని చేయాలని నిర్ణయించుకున్నాడు. అక్కడ సంపాదించగా వచ్చిన డబ్బుతోనే చదువు పూర్తిచేశాడు. గ్రాడ్యుయేషన్ తరువాత సర్దానా హెచ్-1 వీసా (నేటి హెచ్-1 బీ వీసా) పొంది హౌమెట్ ఏరోస్పేస్లో కెరియర్ ప్రారంభించారు.కెరియర్లో ఒడిదొడుకులు1987 నాటికి సర్దానా తోమహాక్ క్షిపణి ఇంజిన్లను తయారు చేసే టెలీడైన్ సీఏఈ అనే సంస్థలో ప్రతిష్ఠాత్మక ఉద్యోగంలో చేరాడు. అయితే 1990లో ప్రచ్ఛన్న యుద్ధం(యూఎస్-సోవియట్ యూనియర్ మధ్య యుద్ధం) ముగియడంతో క్షిపణి ఉత్పత్తి నిలిచిపోయింది. దాంతో సర్దానా ఉద్యోగం కోల్పోయారు. ‘అప్పటికే నేను తనఖాతో ఇల్లు కొన్నాను. ఆరు నెలల కుమార్తె ఉంది. నా తల్లిదండ్రులు కూడా నాతో నివసిస్తున్నారు. ఆ సమయంలో నా కుటుంబాన్ని పోషించడానికి ఆదాయం లేదు’ అని సర్దానా ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ సమయంలో ఆర్థిక అనిశ్చితి ఎదుర్కొన్న ఆయన సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని పారిశ్రామికవేత్తగా ఎదగాలని నిర్ణయించుకున్నారు. అప్పటికే తన వద్ద ఉన్న పొదుపు 25,000 డాలర్లు(ఇప్పటి విలువ రూ.21.86 లక్షలు)తో సొంత వ్యాపారాన్ని ప్రారంభించాడు.ఇదీ చదవండి: ఆకాశవీధిలో పెరిగిన ప్రయాణికులుఇన్నోవా సొల్యూషన్స్ఐటీ సేవలకు భవిష్యత్తులో గిరాకీ ఉంటుందని గ్రహించిన రాజ్ తరువాతి కాలంలో కొన్ని ఐటీ సంస్థలను కొనుగోలు చేసి ఇన్నోవా సొల్యూషన్స్ అనే ఐటీ సేవల సంస్థను అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఇన్నోవా సొల్యూషన్స్‌లో ప్రపంచవ్యాప్తంగా 50,000 మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. సర్దానా సంస్థల నికర విలువ రెండు బిలియన్ డాలర్లు(రూ.16 వేల కోట్లు)గా ఉంది. ఢిల్లీలోని ప్రభుత్వ గృహంలో నివసించి కేవలం జేబులో 100 డాలర్లతో అమెరికా వెళ్లిన సర్దానా ప్రస్తుతం బిలియనీర్‌గా ఎదిగి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు. -
పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల మాదిరిగానే.. ఎల్పీజీ గ్యాస్ ధరలను ప్రకటించాయి. అయితే ఈ సారి కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను ఏకంగా రూ. 6 పెంచింది. యూనియన్ బడ్జెట్ తరువాత గ్యాస్ ధరలు పెరగడం ఇది మొదటిసారి.ఈ రోజు (మార్చి 1) నుంచి 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర 1,803 రూపాయలు. ధరల పెరుగుదలకు ముందు దీని రేటు రూ. 1797 వద్ద ఉండేది. అయితే 14 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలలో ఎటువంటి మార్పు లేదు.19 కేజీల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలుఢిల్లీ: రూ. 1803కోల్‌కతా: రూ. 1913ముంబై: రూ. 1755చెన్నై: రూ. 196514 కేజీల గ్యాస్ సిలిండర్ ధరలుఢిల్లీ: రూ. 803కోల్‌కతా: రూ. 829ముంబై: రూ. 802.50చెన్నై: రూ. 818.50స్థానిక పన్నులు, రవాణా ఖర్చులలో వ్యత్యాసం కారణంగా LPG ధరలు రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అయితే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరల పెరుగుదల వల్ల రెస్టారెంట్లు, హోటళ్ళు, ఇతర వాణిజ్య సంస్థల ఇన్పుట్ ఖర్చును పెంచే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఈ భారం వినియోగదారులపై పడుతుంది.ఇదీ చదవండి: అమాంతం తగ్గిన గోల్డ్ రేటు: కొనేందుకు త్వరపడాల్సిందే! -
ఆకాశవీధిలో పెరిగిన ప్రయాణికులు
దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2025 జనవరిలో దేశీయ విమానయాన సంస్థలు 1.46 కోట్ల ప్రయాణీకులను తమ గమ్యస్థానాలకు చేరవేశాయి. ఇది 2024 జనవరిలో 1.31 కోట్లుగా ఉంది. దాంతో 11.28 శాతం పెరుగుదల నమోదు చేసినట్లయింది. ఈ పెరుగుదల దేశంలో విమాన ప్రయాణానికి అధికమవుతున్న డిమాండ్‌ను ప్రతిబింబిస్తుంది.విమాన ప్రయాణికులకు సంబంధించి ఇండిగో వాటా 65.2 శాతంగా ఉంటే ఎయిరిండియా గ్రూప్ వాటా 25.7 శాతం, ఆకాసా ఎయిర్, స్పైస్‌జెట్ వాటాలు వరుసగా 4.7, 3.2 శాతంగా నమోదయ్యాయి. ఆన్ టైమ్ పెర్ఫార్మెన్స్ (ఓటీపీ-సమయానికి రాకపోకలు నిర్వహించడం)లో ఇండిగో 75.5 శాతంతో మొదటిస్థానంలో నిలువగా, ఆకాసా ఎయిర్ 71.5 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. ఎయిరిండియా గ్రూప్ ఓటీపీ 69.8 శాతం, అలయన్స్ ఎయిర్ ఓటీపీ 57.6 శాతం, స్పైస్ జెట్ 54.8 శాతంగా ఉన్నాయి.షెడ్యూల్ చేసిన దేశీయ విమానయాన సంస్థల మొత్తం రద్దు రేటు జనవరి 2025లో 1.62 శాతంగా ఉంది. ఫ్లై బిగ్ అత్యధికంగా 17.74 శాతం, ఫ్లై91 5.09 శాతం, అలయన్స్ ఎయిర్ 4.35 శాతం రద్దు రేటును నమోదు చేశాయి. విమానాల ఆలస్యం వల్ల 1,78,934 మంది ప్రయాణీకులు ప్రభావితం అయ్యారు. వీరికి సౌకర్యాలు అందించేందుకు విమానయాన సంస్థలు రూ.2.38 కోట్లు ఖర్చు చేశాయి. 2024 జనవరితో పోలిస్తే 2025లో విమానయాన సంస్థలు సామర్థ్య విస్తరణను 10.8 శాతం పెంచాయి. దేశీయ విమానయాన రంగం 2024 జనవరిలో 89.2 శాతం ఉన్న ప్యాసింజర్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్-మొత్తం సీట్లకు తగిన ప్యాసింజర్లు) 2025లో 92.1 శాతంగా నమోదైంది.ఇదీ చదవండి: వ్యవసాయ ఉత్పత్తులపై అధిక సుంకాల ప్రభావంప్రయాణికుల పెరుగుదలకు కారణాలు..కొవిడ్ తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకోవడంతో విమాన ప్రయాణికుల్లో విశ్వాసం నెలకొంది. ఎయిర్ లైన్ నెట్‌వర్క్‌ల విస్తరణ, కొత్త మార్గాలను ఆవిష్కరించిడంతో అధిక జనాభా విమాన ప్రయాణం చేసేందుకు వీలువుతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. విమానయాన సంస్థలు ప్రయాణికులను ఆకర్షించడానికి పోటీ ఛార్జీలు, ప్రమోషనల్ డీల్స్‌ను అందిస్తున్నాయి. ఇది విమాన ట్రాఫిక్ పెరుగుదలను మరింత పెంచింది. విమానాశ్రయ మౌలిక సదుపాయాలు, ఆధునీకరణలో పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఇది కూడా ప్రయాణ సంఖ్య పెరిగేందుకు దోహదం చేస్తోంది. -
మొన్న క్యాప్‌జెమిని సీఈఓ.. నేడు ఆకాష్ అంబానీ
పనిగంటలపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో ముకేశ్ అంబానీ తనయుడు.. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ 'ఆకాష్ అంబానీ' కూడా తన అభిప్రాయం వెల్లడించారు.ముంబై టెక్ వీక్ కార్యక్రమంలో 'ఆకాష్ అంబానీ' మాట్లాడుతూ.. ఆఫీసులో ఎంతసేపు (ఎన్ని గంటలు) ఉంటారనేది ముఖ్యం కాదు, చేస్తున్న పనిలో నాణ్యత ఉండాలి, దాని గురించి మాత్రమే ఆలోచిస్తాను అని అన్నారు. వృద్ధి అంటే జీవితం అనేది రిలయన్స్ నినాదం, అది వ్యక్తిగత జీవితానికి కూడా వరిస్తుందని అన్నారు. కాబట్టి మీరు ప్రతి రోజు ఎదగడానికి కృషి చేయాలని పేర్కొన్నారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మార్గనిర్దేశం చేయడానికి తమ కంపెనీ 1,000 మందికి పైగా డేటా సైంటిస్టులు, పరిశోధకులు, ఇంజనీర్లతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసింది ఆకాష్ అంబానీ అన్నారు. అంతే కాకుండా ఏఐలో దేశం ముందుకు సాగటానికి సహాయపడటానికి రిలయన్స్.. జామ్‌నగర్‌లో 1GW సామర్థ్యం గల డేటా సెంటర్‌ను కూడా కంపెనీ ఏర్పాటు చేస్తోందని అన్నారు.పనిగంటలపై క్యాప్‌జెమిని సీఈఓఉన్నత స్థాయి అధికారులు పని గంటలు ఎక్కువ చేయాలని పిలుపునిస్తుండగా.. క్యాప్‌జెమిని సీఈఓ అశ్విన్ యార్డి వారానికి 47.5 గంటల పని సరిపోతుందని, వారాంతాల్లో ఉద్యోగులకు పనికి సంబంధించిన ఎటువంటి ఈమెయిల్‌లు పంపవద్దని పిలుపునిచ్చారు. రోజుకి 9:30 గంటలు, వారానికి ఐదు రోజులు (47:30 గంటలు) పని చేస్తే చాలని నాస్కామ్ టెక్నాలజీ అండ్ లీడర్షిప్ ఫోరంలో వెల్లడించారు.ఇదీ చదవండి: 12 మంది.. రూ. 60వేల పెట్టుబడి: పార్లే-జీ ప్రస్థానం గురించి తెలుసా?అంతకు ముందు టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి వారానికి 70 గంటలు పనిచేయాలని చెబితే.. 90 గంటలు పనిచేయాలని ఎల్ & టీ చైర్మన్ సుబ్రమణ్యన్ చెప్పారు. దీనిని పలువురు ప్రముఖులు ఖండించారు. ఇందులో ఆనంద్ మహీంద్రా, గౌతమ్ అదానీ, ఎంక్యూర్ ఫార్మాస్యూటికల్స్ సీఈఓ 'నిమితా థాపర్' మొదలైనవారు ఉన్నారు. -
ప్రైవేటు ఆసుపత్రులు రూ.11,500 కోట్ల పెట్టుబడి
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగంలో ఉన్న ఆసుపత్రులు వచ్చే ఆర్థిక సంవత్సరంలో 4,000 పడకలను జోడించనున్నాయి. ఇందుకు సుమారు రూ.11,500 కోట్లు పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నాయని క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.64,000 కోట్ల ఆదాయం నమోదు చేసిన 91 ప్రైవేట్ ఆసుపత్రులను విశ్లేషించినట్టు వెల్లడించింది. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థలు దాదాపు 6,000 బెడ్స్‌ను జోడించాయి. ఈ రెండు ఆర్థిక సంవత్సరాల్లో జోడిస్తున్న పడకలు 2020–2024 మధ్య తోడైన వాటికి సమానంగా ఉంటుంది. ఆక్యుపెన్సీ 65–70 శాతం గరిష్ట స్థాయికి చేరుకోవడం, నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ కోసం నిరంతర డిమాండ్.. వెరశి ప్రైవేట్ ఆసుపత్రులు ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.25,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నాయి. గత నాలుగు ఆర్థిక సంవత్సరాలలో సగటు వార్షిక పెట్టుబడి కంటే ఇది దాదాపు 80 శాతం అధికం’ అని నివేదిక తెలిపింది. అంతర్గత వనరుల ద్వారా.. మూలధన వ్యయంలో దాదాపు నాలుగింట మూడు వంతులు అంతర్గత వనరుల ద్వారా ఆసుపత్రులు సమకూరుస్తున్నాయి. అంతేకాకుండా మెరుగైన రాబడుల కారణంగా 2022 ఆర్థిక సంవత్సరం నుండి ప్రైవేట్ ఈక్విటీ, ఈక్విటీ మార్కెట్ల నుండి గణనీయంగా రూ.55,000–60,000 కోట్ల పెట్టుబడిని ఆకర్షించాయి. కొత్త పడకలలో సగం నూతన ఆసుపత్రుల ఏర్పాటు ద్వారా సమకూరనున్నాయి. కొత్త ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలలో గణనీయ పెట్టుబడికి ఇది నిదర్శనం. ఇప్పటికే ఉన్న ఆసుపత్రుల అభివృద్ధి కారణంగా దాదాపు 40 శాతం పడకలు తోడు కానున్నాయి. ప్రస్తుత సౌకర్యాలను ఆధునీకరించడం, మెరుగుపర్చడంపై సంస్థలు దృష్టి సారిస్తాయి. నిర్మాణంలో ఉన్న, చిన్న, మధ్య తరహా ఆసుపత్రులను పెద్ద కంపెనీలు స్వా«దీనం చేసుకోవడం ద్వారా మిగిలిన 10 శాతం పడకలు జతకానున్నాయని క్రిసిల్ రేటింగ్స్ వెల్లడించింది. బలమైన పనితీరు.. వైద్య రంగం ఆదాయంలో ప్రైవేట్ ఆసుపత్రుల వాటా 63 శాతం. 2020–2024 ఆర్థిక సంవత్సరాల్లో ప్రైవేట్ ఆసుపత్రులు ఆదాయంలో 18 శాతం సగటు వార్షిక వృద్ధి రేటును, 18 శాతం ఆరోగ్యకర నిర్వహణ లాభాలను సాధించాయి. ఇది బలమైన నగదు ప్రవాహాన్ని నిర్ధారిస్తుంది. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే భారతదేశంలో ఆసుపత్రుల బలమైన పనితీరు, తలసరి పడకల సామర్థ్యం తక్కువగా ఉండటంతో ప్రైవేట్ ఈక్విటీ, ఐపీవోల ద్వారా గణనీయంగా పెట్టుబడులు పెరిగాయి. ఇది బ్యాలెన్స్ షీట్లను బలోపేతం చేసింది. ఆసుపత్రులు వాటి క్రెడిట్ ప్రొఫైల్స్‌ను భౌతికంగా ప్రభావితం చేయకుండా ప్రతిష్టాత్మకంగా పడకల జోడింపును కొనసాగించడానికి వీలు కల్పించిందని నివేదిక వివరించింది. -
పని వేళలు కాదు.. నాణ్యత ముఖ్యం..
ముంబై: ఆఫీసులో ఎన్ని గంటలు పని చేశామన్నది కాదు.. ప్రతి రోజు ఎంత నాణ్యమైన పని చేశామనేదే తనకు ముఖ్యమని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాశ్ అంబానీ వ్యాఖ్యానించారు. తనకు పని, కుటుంబం రెండూ ప్రాధాన్యతాంశాలేనని ముంబై టెక్ వీక్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరు జీవితంలో తమ తమ ప్రాధాన్యతలను గుర్తెరిగి వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. వారానికి 90 గంటల వరకు పని చేయాలంటూ కొందరు, 50 గంటలలోపు చాలంటూ మరికొందరు కార్పొరేట్లు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో ఆకాశ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో మార్గనిర్దేశం చేసేందుకు తమ కంపెనీ 1,000 మంది డేటా సైంటిస్టులు, పరిశోధకులు, ఇంజినీర్ల బృందాన్ని ఏర్పాటు చేసుకుందని అంబానీ చెప్పారు. జామ్‌నగర్‌లో 1 గిగావాట్ల సామర్ధ్యంతో డేటా సెంటర్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. అలాగే, గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లను (జీపీయూ) సర్విసుగా అందించే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. -
వాళ్లంతా కుమ్మక్కయ్యారు..
న్యూఢిల్లీ: దేశ, విదేశాల్లో రుణదాతలతో న్యాయవివాదం ఎదుర్కొంటున్న ఎడ్టెక్ సంస్థ బైజూస్ వ్యవస్థాపకుడు బైజూస్ రవీంద్రన్ సంచలన ఆరోపణలు చేశారు. అమెరికాకు చెందిన రుణదాత గ్లాస్ ట్రస్ట్, ఈవై ఇండియా, తాత్కాలిక పరిష్కార నిపుణుడు (ఐఆర్పీ) పంకజ్ శ్రీవాస్తవ కుమ్మక్కయారని వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి తనతో పాటు పలువురు ఉద్యోగులకు స్పష్టమైన ఆధారాలున్న డాక్యుమెంట్ అందిందని ఆయన చెప్పారు. దీనిపై అధికారులు తక్షణం దృష్టి పెట్టాలని, లోతుగా విచారణ చేస్తే వాస్తవాలు బైటికొస్తాయని రవీంద్రన్ పేర్కొన్నారు. ఇకపై తానే స్వయంగా వివరాలను తెలియజేస్తానని సోషల్ మీడియా ప్లాట్‌ఫాం లింక్డ్ఇన్లో పోస్ట్ చేశారు. సంస్థను పునరి్నరి్మంచేందుకు ప్రణాలికలను వివరించారు. కంపెనీ దివాలా చర్యల బారిన పడకుండా అన్ని ప్రయత్నాలు చేసినట్లు రవీంద్రన్ చెప్పారు. కాగా, అమెరికన్ అనుబంధ సంస్థ బైజూస్ ఆల్ఫా నుంచి 533 మిలియన్ డాలర్లను మళ్లించడానికి థింక్ అండ్ లెర్న్ (మాతృసంస్థ), దాని డైరెక్టర్ రిజు రవీంద్రన్, క్యామ్‌షాఫ్ట్ క్యాపిటల్ మోసపూరిత స్కీముకు తెరతీసినట్లు అమెరికన్ దివాలా కోర్టు తేలి్చంది. -
అతి పొడవైన ఎల్పీజీ పైప్‌లైన్ త్వరలోనే ..
ప్రపంచంలోనే అతి పొడవైన లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ( LPG ) పైప్‌లైన్ భారత్ నిర్మించనుంది. పశ్చిమ తీరంలోని కాండ్లా నుంచి ఉత్తరాన గోరఖ్‌పూర్ వరకు 2,800 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు 2025 జూన్ నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. 1.3 బిలియన్ డాలర్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్ రవాణా ఖర్చులను, ఎల్పీజీ రవాణా సంబంధిత రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించనుంది.8.3 మిలియన్ టన్నుల ఎల్పీజీ రవాణా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ సంయుక్త భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్న ఈ పైప్‌లైన్ ద్వారా ఏటా 8.3 మిలియన్ టన్నుల ఎల్పీజీ రవాణా కానుంది. ఇది భారతదేశ మొత్తం ఎల్పీజీ డిమాండ్‌లో సుమారు 25% ఉంటుంది. ఈ పైప్‌లైన్ అందుబాటులోకి వస్తే ట్రక్కులపై ఆధారపడటం రహదారి రవాణాపై ఒత్తిడి తగ్గిపోతుంది.ఆర్థిక, పర్యావరణ ప్రయోజనాలుఎల్పీజీ పైప్‌లైన్ నిర్మాణం గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలను తీసుకువస్తుందని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎల్పీజీని రవాణా చేయడానికి వందలాది ట్రక్కుల అవసరం లేకుండా పైప్‌లైన్ రవాణా ఖర్చులను తగ్గిస్తుంది. సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. స్వచ్ఛమైన వంట ఇంధనాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో ఎల్పీజీకి డిమాండ్ పెరిగిన నేపథ్యంలో పైప్‌లైన్ నిర్మాణం కీలకం కానుంది.భద్రత, ప్రమాద నివారణపైప్లైన్ అత్యంత ముఖ్యమైన ప్రయోజనాలలో ఒకటి రోడ్డు ప్రమాదాలను తగ్గించడం. రోడ్డు మార్గం ద్వారా ఎల్పీజీ రవాణా ప్రమాదాలతో నిండి ఉంటుంది. ఇది గతంలో అనేక ప్రాణాంతక ప్రమాదాలకు దారితీసింది. పైప్‌లైన్ సురక్షితమైన, మరింత విశ్వసనీయమైన రవాణా విధానాన్ని అందించడం ద్వారా ఈ ప్రమాదాలను తగ్గిస్తుంది. రోడ్డు భద్రతను పెంపొందించడానికి ఈ పరిణామం ఒక కీలకమైన అడుగు.సవాళ్లు, భవిష్యత్తు అవకాశాలుఆశాజనక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఆలస్యం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల సరఫరా గొలుసు అంతరాయాలతో సహా ఈ ప్రాజెక్ట్ అనేక సవాళ్లను ఎదుర్కొంది. ఏదేమైనా, పైప్‌లైన్ విజయవంతంగా పూర్తవడం భారతదేశ ఇంధన రంగంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. భవిష్యత్తు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు బెంచ్‌మార్క్‌ను ఏర్పరుస్తుంది. -
యూపీఐ లైట్లో కొత్త ఫీచర్..
చిన్న మొత్తాల్లో లావాదేవాలకు ఉద్దేశించిన యూపీఐ లైట్ (UPI Lite) సేవల్లో 'ట్రాన్స్ఫర్ అవుట్' అనే కొత్త ఫీచర్‌ను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తీసుకువచ్చింది. ఇందుకోసం మార్చి 31 నాటికి అవసరమైన మార్పులను అమలు చేయాలని అన్ని ఇష్యూయర్ బ్యాంకులు, పీఎస్పీ (పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్) బ్యాంకులు, యూపీఐ యాప్‌లను ఎన్పీసీఐ ఆదేశించింది.'ట్రాన్స్ ఫర్ అవుట్' అంటే..దాదాపు అన్ని యూపీఐ యాప్‌లలోనూ యూపీఐ లైట్ అనే ఆప్షన్ ఉంటుంది. చిన్న మొత్తాలకు పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా వేగంగా చెల్లింపులు చేసేందుకు దీన్ని రూపొందించారు. దీని ద్వారా చెల్లింపులు జరపాలంటే ఇందుకోసం ప్రత్యేకంగా బ్యాలెన్స్ ఉంచుకోవాల్సి ఉంటుంది. ఈ బ్యాలెన్స్ నుంచి చెల్లింపులకు నగదు వెళ్తుంది. ఈ మొత్తాన్ని తిరిగి బ్యాంక్ అకౌంట్‌కు జమ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఇది యూపీఐ లైట్ ఆప్షన్ ఆన్‌లో ఉంటేనే సాధ్యమయ్యేది.తాజాగా తీసుకొచ్చిన 'ట్రాన్స్ ఫర్ అవుట్' ఫీచర్‌తో యూపీఐ లైట్‌ను డిసేబుల్ చేయకుండానే తమ యూపీఐ లైట్ బ్యాలెన్స్ నుంచి డబ్బును తిరిగి ఒరిజినల్ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసుకోవచ్చు. ఈ ఫంక్షనాలిటీ వినియోగదారులకు తమ నిధులపై మెరుగైన నియంత్రణను అందిస్తుంది. అదే సమయంలో ఇబ్బంది లేని చిన్న చెల్లింపులనూ అనుమతిస్తుంది.నూతన మార్గదర్శకాలు» యూపీఐ లైట్ అందించే బ్యాంకులు లైట్ రిఫరెన్స్ నంబర్ (ఎల్ఆర్ఎన్) స్థాయిలో బ్యాలెన్స్‌లను ట్రాక్ చేస్తూ వాటిని ప్రతిరోజూ ఎన్పీసీఐ డేటాతో సరిపోల్చాలి.» యాక్టివ్ యూపీఐ లైట్ ఉన్న యూపీఐ యాప్‌లలో లాగిన్ చేసేటప్పుడు పాస్ కోడ్, బయోమెట్రిక్ వెరిఫికేషన్ లేదా ప్యాట్రన్ ఆధారిత లాక్ ద్వారా ప్రామాణీకరించాల్సి ఉంటుంది.» యూపీఐ లైట్ అందించే అన్ని ఇష్యూయర్ బ్యాంకులు, పీఎస్పీ బ్యాంకులు, యూపీఐ యాప్‌లు మార్చి 31 లోగా అవసరమైన మార్పులు చేయాల్సి ఉంటుంది.» ఈ మార్పులు మినహా ప్రస్తుతం ఉన్న అన్ని యూపీఐ లైట్ మార్గదర్శకాలు అలాగే ఉంటాయి. వాటిలో ఎటువంటి మార్పు ఉండదు.పెరిగిన యూపీఐ లైట్ పరిమితియూపీఐ లైట్ వ్యాలెట్ పరిమితిని రూ.2,000 నుంచి రూ.5,000కు పెంచారు. అలాగే, ప్రతి లావాదేవీ పరిమితిని గతంలో ఉన్న రూ.100 నుంచి రూ.500కు పెంచారు. యూపీఐ 123పేకు ప్రతి లావాదేవీ పరిమితిని కూడా సవరించారు, ఇది గతంలో ఉన్న రూ .5,000 ఉండగా ప్రస్తుతం రూ .10,000 వరకు చెల్లింపులను అనుమతిస్తుంది. -
10 నిమిషాల్లో యాపిల్ ఉత్పత్తుల డెలివరీ
క్విక్ కామర్స్ రంగంలో ఉన్న బ్లింకిట్ (Blinkit) 10 నిమిషాల్లో యాపిల్ (Apple) ఉత్పత్తుల డెలివరీ సేవలను ప్రారంభించింది. మ్యాక్‌బుక్ ఎయిర్, ఐప్యాడ్, ఎయిర్‌పాడ్, యాపిల్ వాచ్, యాక్సెసరీస్‌ను కస్టమర్లు బ్లింకిట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, పుణే, లక్నో, అహ్మదాబాద్, చండీగఢ్, చెన్నై, జైపూర్, బెంగళూరు, కోల్‌కతలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. కాగా గత ఏడాది యాపిల్ ప్రీమియం రీసెల్లర్ యూనికార్న్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుని ఆర్డర్లు ఇచ్చిన 10 నిమిషాల్లోనే ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ ఫోన్లను కస్టమర్లకు డెలివరీ చేసింది.అంతకుముందు బ్లింకిట్ పైలట్ ప్రాజెక్టుగా గురుగ్రామ్‌లోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో 10 నిమిషాల అంబులెన్స్ సేవలను ప్రారంభించింది. ఈ అంబులెన్సుల్లో ఆక్సిజన్ సిలిండర్లు, ఏఈడీ (ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్), స్ట్రెచర్, మానిటర్, సక్షన్ మెషీన్, అత్యవసర మందులు, ఇంజెక్షన్లు వంటి అవసరమైన ప్రాణరక్షణ పరికరాలు ఉంటాయి.జొమాటోకు చెందిన ఈ క్విక్ కామర్స్ బిజినెస్ 2024 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.103 కోట్ల నష్టాన్ని చవిచూసింది. పెట్టుబడుల కారణంగా బ్లింకిట్ కింద క్విక్ కామర్స్ వ్యాపారంలో నష్టాలు సమీపకాలంలో కొనసాగుతాయని కంపెనీ భావిస్తోందని షేర్ హోల్డర్లకు రాసిన లేఖలో జొమాటో పేర్కొంది. -
డీటీహెచ్ లైసెన్సింగ్ ఫీజు తగ్గించాలి: డిష్ టీవీ సీఈవో
న్యూఢిల్లీ: ప్రస్తుతం ఏజీఆర్‌లో (సవరించిన స్థూల ఆదాయం) 8 శాతంగా ఉన్న డీటీహెచ్ లైసెన్సింగ్ ఫీజుని 3 శాతానికి తగ్గించాలన్న టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ సిఫార్సులను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిష్ టీవీ సీఈవో మనోజ్ దోభాల్ కోరారు.సవాళ్లతో సతమతమవుతున్న డీటీహెచ్ పరిశ్రమ దీర్ఘకాలికంగా నిలదొక్కుకునేందుకు, వృద్ధి చెందేందుకు ఇవి దోహదపడతాయని, వీటిపై సత్వరం చర్యలు తీసుకోవాలని కేంద్ర సమాచార, ప్రసార శాఖకు విజ్ఞప్తి చేశారు.ట్రాయ్ సిఫార్సులను అమలు చేయడం వల్ల మరిన్ని పెట్టుబడులు వస్తాయని, కొత్త ఆవిష్కరణలకు ఊతం లభిస్తుందని, వినియోగదారులకు నాణ్యమైన సరీ్వసులు లభిస్తాయని మనోజ్ చెప్పారు. సరీ్వస్ ప్రొవైడర్లు, పే టీవీ వ్యవస్థ మనుగడకు .. ఇప్పుడున్న లైసెన్సింగ్ విధానాలు ప్రతిబంధకాలుగా ఉన్నాయని పేర్కొన్నారు. -
జస్ట్ మిస్.. బ్యాంక్ డబ్బులు మొత్తం ఖాళీ అయ్యేవి!
అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజం సిటీగ్రూప్ సిబ్బంది చేసిన పొరపాటుతో బ్యాంక్‌లోని డబ్బులు మొత్తం ఖాళీ అయ్యేవి. ఫైనాన్షియల్ టైమ్స్ కథనం ప్రకారం.. సిటీ బ్యాంక్ గత ఏప్రిల్ నెలలో 280 డాలర్లకు బదులుగా 81 ట్రిలియన్ డాలర్లను (ప్రస్తుత మారక విలువ ప్రకారం భారతీయ కరెన్సీలో రూ.6,723 లక్షల కోట్లు) పొరపాటున ఓ ఖాతాదారుడి ఖాతాలో జమ చేసింది.ఈ పొరపాటును ఇద్దరు ఉద్యోగులు పట్టుకోలేకపోయారు. డబ్బులు జమ చేసిన 90 నిమిషాల తర్వాత మూడో ఉద్యోగి గుర్తించారని నివేదిక తెలిపింది. అయితే బ్యాంకు నుంచి నిధులు పూర్తిగా ఆ ఖాతాలోకి బదిలీ కాలేదని, తృటి తప్పిందని (near miss) ఫెడరల్ రిజర్వ్, కంప్ట్రోలర్ ఆఫ్ ది కరెన్సీ కార్యాలయానికి సీటీగ్రూప్ తెలియజేసింది."ఇంత పరిమాణంలో చెల్లింపు వాస్తవానికి పూర్తి కాలేదన్న విషయాన్ని పక్కన పెడితే మా డిటెక్టివ్ నియంత్రణలు రెండు సిటీ లెడ్జర్ ఖాతాల మధ్య ఇన్పుట్ దోషాన్ని వెంటనే గుర్తించాయి. మేము ఎంట్రీని తిప్పికొట్టాము" అని సిటీగ్రూప్ ప్రతినిధి ఈ-మెయిల్ ప్రతిస్పందనలో తెలిపారు. "మా నివారణ నియంత్రణలు పొరబాటున బ్యాంకు నుంచి నిధులు బయటకు వెళ్లకుండా నిలిపివేస్తాయి" అని పేర్కొన్నారు. ఈ సంఘటన బ్యాంకుపై గానీ, తమ క్లయింట్లపై గానీ ఎలాంటి ప్రభావం చూపలేదని బ్యాంక్ ప్రతినిధి తెలిపారు.ఇలాంటివి 10 పొరపాట్లుసిటీ బ్యాంక్‌లో 1 బిలియన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ మొత్తానికి సంబంధించి ఇలాంటి పొరపాట్లు గత ఏడాది మొత్తం 10 జరిగాయని అంతర్గత నివేదికను ఉటంకిస్తూ ఎఫ్టీ తెలిపింది. అంతకు ముందు ఏడాది నమోదైన 13 కేసులతో పోలిస్తే ఇది తగ్గినప్పటికీ, యూఎస్ బ్యాంక్ పరిశ్రమలో 1 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ మొత్తానికి సంబంధించిన పొరపాట్లు అసాధారణమని నివేదిక పేర్కొంది. -
12 మందితో మొదలైన పార్లే-జీ.. ప్యాకెట్‌పై ఉన్న పాప ఎవరో తెలుసా?
బిస్కెట్ అంటే గుర్తొచ్చే కంపెనీ.. దశాబ్దాల చరిత్ర కలిగిన కలిగిన సంస్థ, కేవలం 12మందితో ప్రారంభమై.. నేడు వేలకోట్ల సామ్రాజ్యంగా ఎదిగిన బ్రాండ్.. ఇంతకీ ఆ కంపెనీ ఎదనుకుంటున్నారా? అదేనండీ.. అందరికీ సుపరిచయమైన 'పార్లే-జీ'. ఇంతకీ ఈ కంపెనీ ఎలా మొదలైంది. ఈ కంపెనీ బిస్కెట్ ప్యాకెట్ మీద ఉన్న పాప ఎవరు? అనే ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.మన దేశంలో చాలామందికి తెలిసిన బిస్కెట్ కంపెనీ 'పార్లే-జీ' (Parle-G). ఈ బిస్కెట్లను తినని వారు బహుశా ఉండరు. ప్రస్తుతం మార్కెట్లో.. లెక్కకు మించిన బిస్కెట్ బ్రాండ్స్ ఉన్నప్పటికీ, ఈ బిస్కెట్లకు (పార్లే-జీ) ఉన్న ఆదరణ మాత్రం ప్రత్యేకం. ప్రతి ఏటా కంపెనీ రూ. 8,000 కోట్ల విలువైన బిస్కెట్లను విక్రయిస్తూ.. ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న బిస్కెట్స్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది.పార్లే-జీ ప్రస్థానం1929లో స్వదేశీ ఉద్యమం మధ్యలో.. చౌహన్ కుటుంబానికి చెందిన 'మోహన్ లాల్ దయాల్' ముంబైలోని విలే పార్లేలో తొలి పార్లే ఫ్యాక్టరీని స్థాపించారు. ఆ సమయంలో 12 మందితో.. జర్మన్ నుంచి దిగుమతి చేసుకున్న యంత్రాలను ఉపయోగించి బిస్కెట్స్ తయారు చేశారు. అప్పట్లో ఆ యంత్రాల కోసం రూ. 60వేలు ఖర్చు చేశారు. ఆ కంపనీ నేడు.. అనేక ఇతర దేశాలకు విస్తరించింది.'పార్లే-జీ'ని మొదట్లో “పార్లే గ్లూకో” గా పరిచయం చేశారు. కానీ చివరికి బిస్కెట్ పరిశ్రమలో పెరుగుతున్న పోటీని కొనసాగించడానికి దాని పేరును 'పార్లే-జీ'గా మార్చారు. పార్లే-జి లోని G అనే పదం మొదట్లో 'గ్లూకోజ్' ని సూచిస్తుంది, తరువాత అది కంపెనీ బ్రాండ్ నినాదానికి అనుగుణంగా 'జీనియస్'గా మారింది. దాని పేరు అనేక మార్పులకు గురైనప్పటికీ, దాని రుచి, ప్యాకేజింగ్ మాత్రం అలాగే ఉన్నాయి.పార్లే-జీ ప్యాకెట్ మీద ఉన్న పాప ఎవరంటే?పార్లే-జీ బిస్కెట్స్ గురించి తెలిసిన చాలామందికి తెలియాల్సిన ప్రశ్న.. ఆ బిస్కెట్ ప్యాకెట్‌పై ఉన్న చిన్నారి ఎవరు? అని. కొందరు ఆ పాప ఇన్ఫోసిస్ చైర్పర్సన్ సుధామూర్తి అనే భావించారు. మరికొందరు నీరూ దేశ్‌పాండే అని.. ఇంకొందరు గుంజన్ దుండానియా అని అనుకున్నారు.నిజానికి పార్లే బిస్కెట్ ప్యాకెట్‌పై ఉన్న పాప కేవలం.. ఎవరెస్ట్ క్రియేటివ్ ఆర్టిస్ట్ 'మగన్ లాల్ దహియా' ఊహాజనితమే అనే తెలిసింది. మొత్తానికి చాలామందికి దశాబ్దాలుగా తెలుసుకోవాలనుకుంటున్న ప్రశ్నలకు జవాబు తెలిసిపోయింది.ఇదీ చదవండి: ప్రపంచంలోని సూపర్ బిలియనీర్స్.. జాబితాలో 24 మంది -
ప్లేస్మెంట్లో ఒక్కడికే ఏకంగా ఏడు ఆఫర్లు!!.. కోటి రూపాయల ప్యాకేజీతో కుర్రాడికి జాబ్
లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ (ఎల్పీయూ)కు ఈ ఏడాది చాలా ఉత్సాహంతో మొదలైంది. ఫైనల్ ఇయర్ బీటెక్ విద్యార్థి రూ.1.03 కోట్ల (1,18,000 డాలర్లు)తో ఉద్యోగావకాశం పొందారు. రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్‌లో B.Tech చేస్తున్న బేతిరెడ్డి నాగవంశీరెడ్డి 2025 మేలో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేయనున్నారు. ప్రముఖ ఏఐ రోబోటిక్స్ సంస్థలో రోబోటిక్స్ ఇంజినీర్‌గా చేరనున్నారు. ఈ అసాధారణ విజయం అటు పరిశ్రమ వర్గాల్లోనూ ఇటు విద్యా ప్రపంచంలోనూ సంచలనం సృష్టించింది. విద్యార్థులకు సూపర్ డూపర్ ప్యాకేజీలు అందించగల అత్యున్నత విద్యా సంస్థగా ఎల్పీయూ తనస్థానాన్ని సుస్థిరం చేసుకుంది.వేర్వేరు బీటెక్ విభాగాల్లోని మొత్తం 7361 మంది విద్యార్థులకు పాలో ఆల్టో నెట్వర్క్స్, నుటానిక్స్, మైక్రోసాఫ్ట్, సిస్కో, పేపాల్ అమెజాన్ వంటి ప్రతిష్టాత్మక మల్టీనేషనల్ కంపెనీల నుంచి ప్లేస్మెంట్లు లభించాయి. వీరిలో 1700 మంది టాప్ ఎమ్మెన్సీల నుంచి ఏడాదికి రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకూ ప్యాకేజీలు అందాయి. టాప్ ఎంఎన్‌సీలు ఇచ్చిన సగటు ప్యాకేజీ రూ.16 లక్షలు (ఏడాదికి). ఉద్యోగ మార్కెట్లో ఎల్‌పీయూకు ఉన్న అధిక డిమాండ్‌కు నిదర్శనాలు ఈ ప్లేస్మెంట్లు.గత ప్లేస్మెంట్ సీజన్ కూడా ఆకట్టుకునేదే. ఇండస్ట్రీలోనే అతిపెద్ద కంఎనీలు ఆకర్షణీయమైన ప్యాకేజీలు అందించాయి. పాలో ఆల్టో నెట్వర్క్స్ ఏకంగా ఏడాదికి రూ.54.75 లక్షల ప్యాకేజీని అందించగా నుటానిక్స్ రూ.53 లక్షల ప్యాకేజీ ఇచ్చింది. మైక్రోసాఫ్ట్ రూ.52.20 LPA ప్యాకేజీ అందించింది. మొత్తం 1912మందికి ఒకటి కంటే ఎక్కువ ఆఫర్లు అందాయి. 377 మందికి మూడు ఆఫర్లు, 97 మందికి నాలుగు ఆఫర్లు, 18 మందికి ఐదు, ఏడుగురికి ఆరు ఆఫర్లు లభించాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ విద్యార్థి ఆదిరెడ్డి వాసుకు నమ్మశక్యం కాని రీతిలో ఏకంగా ఏడు ఆఫర్లు వచ్చాయి. ఇదో అరుదైన, ఆకట్టుకునే రికార్డు.పైన చెప్పుకున్న కంపెనీలు మాత్రమే కాకుండా.. అమెజాన్ (రూ.48.64 LPA), ఇన్ట్యూట్ లిమిటెడ్ (రూ. 44.92 LPA), సర్వీస్ నౌ ( రూ. 42.86 LPA), సిస్కో (రూ. 40.13 LPA), పేపాల్ (రూ. 34.4 LPA), APNA (రూ.34 LPA), కామ్వాల్ట్ (రూ. 33.42 LPA), స్కేలర్ (రూ. 32.50 LPA)లు కూడా స్కిల్ డెవెలప్మెంట్, అత్యాధునిక టెక్నాలజీల్లో నైపుణ్యం అందించేందుకు ఎల్పీయూ చూపుతున్న శ్రద్ధకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.ఎల్పీయూ పట్టభద్రుల సాంకేతిక పరిజ్ఞాన బుద్ధికుశలత కారణంగా భారీ నియామకాలు చేపట్టే ఆక్సెంచర్, క్యాప్‌జెమినీ, టీసీఎస్ తదితర ప్రముఖ కంపెనీల నుంచి మంచి డిమాండ్ ఉంది. క్యాప్‌జెమినీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 736 మంది విద్యార్థులకు అనలిస్ట్, సీనియర్ అనలిస్ట్ రోల్స్ కోసం ఉద్యగావకాశం ఇచ్చింది. అలాగే మైండ్‌ట్రీ 467 మంది విద్యార్థులను గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పొజిషన్ కోసం తీసుకుంది. కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ కూడా 418 మంది విద్యార్థులను జెన్సీ రోల్స్ కోసం తీసుకుంది. ఎల్పీయూ నుంచి విద్యార్థులను ఎంపిక చేసుకున్న ఇతర కంపెనీల్లో ఆక్సెంచర్ (279 మంది), టీసీఎస్ (260 మంది), కేపీఐటీ టెక్నాలజీస్ (229 మంది), డీఎక్స్‌సీ టెక్నాలజీ (203), MPHASIS (94 మంది) కంపెనీలు ఉన్నాయి.రొబోటిక్స్, ఆటోమేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్ వంటి కోర్ ఇంజినీరింగ్ విభాగాల్లో అత్యధిక స్థాయిలో ప్లేస్మెంట్లు లభించాయి. పాలో ఆల్టో నెట్వర్క్స్, సిలికాన్ ల్యాబ్స్, ట్రైడెంట్‌గ్రూప్, నుటానిక్స్, ఆటోడెస్క్, అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీలు ఈ విభాగాల్లోని విద్యార్థులను భారీగా నియమించుకుంటున్నాయి.‘‘ఎప్పటికప్పుడు మారిపోతున్న ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులు విజయం సాధించేలా చేసేందుకు ఎల్పీయూ కట్టుబడి ఉంది. ఎల్పీయూలో బోధించే అంశాలు కంపెనీల అవసరాలకు తగ్గట్టుగా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఎల్పీయూలో సంప్రదాయ పద్ధతులకు అతీతంగా సృజనాత్మక రీతిలో సాగే బోధన విద్యార్థులునిమగ్నమైయెలా ఉంటుంది. విద్యార్థులు పెద్ద సంఖ్యలో టాప్ కంపెనీల నుంచి ప్లేస్మెంట్ ఆఫర్లు పొందుతూండటం దీనికి నిదర్శనం. ఎల్పీయూ బోధనాంశాల సత్తానుచాటుతున్నాయి ఈ ప్లేస్మెంట్లు. జాతీయ, అంతర్జాతీయ ప్రముఖ సంస్థల్లో విద్యార్థులకు మంచి మంచి ప్లేస్‌మెంట్స్ సాధించిన రికార్డు ఎల్పీయూ సొంతం. అమెరికా, యూకే, ఆస్ట్రేలియాలల్లోని ఎన్నో పేరొందిన కంపెనీల్లో ఎల్పీయూ విద్యార్థులు ఏడాదికి రూ.కోటి కంటే ఎక్కువ ప్యాకేజీలతో పని చేస్తున్నారు. అత్యున్నత నైపుణ్యం కలిగిన ప్రొఫెషనల్స్‌ను తయారు చేయగల ఎల్పీయూ శక్తి సామర్థ్యాలకు, అంతర్జాతీయ స్థాయి ఎదుగుదలకు ఇవి నిదర్శనాలు.’’ అని రాజ్యసభ సభ్యులు, ఎల్పీయూ ఫౌండర్ ఛాన్సలర్ డాక్టర్ అశోక్ కుమార్ మిట్టల్ వివరించారు.2025 బ్యాచ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు చివరితేదీ దగ్గరపడింది. ఎల్పీయూలో అడ్మిషన్లకు పోటీ ఎక్కువ. యూనివర్శిటీలో అడ్మిషన్ కోసం విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. అలాగే ‘ఎల్పీయూ నెస్ట్ 2025’, ఇంటర్వ్యూలలోనూ పాసైన వారికి మాత్రమే కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లోకి ప్రవేశం లభిస్తుంది. పరీక్ష, అడ్మిషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలనుకునే ఆసక్తిగల విద్యార్థులు https://bit.ly/43340ai ను సందర్శించగలరు. -
ప్రపంచంలోని సూపర్ బిలియనీర్స్: జాబితాలో 24 మంది
ప్రపంచంలోని అత్యంత సంపన్నులైన సూపర్ బిలియనీర్ల జాబితాను 'ది వాల్ స్ట్రీట్ జర్నల్' (WSJ) విడుదల చేసింది. గ్లోబల్ వెల్త్ ఇంటెలిజెన్స్ సంస్థ ఆల్ట్రాటా డేటా ఆధారంగా డబ్ల్యూఎస్‌జే 24 మందిని సూపర్ బిలియనీర్లుగా గుర్తించింది. సంపద నికర విలువ 50 బిలియన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నవారు సూపర్ బిలియనీర్లు. 24 మంది సూపర్ బిలియనీర్లలో, 16 మంది సెంటీ బిలియనీర్ల వర్గంలోకి వస్తారు, వీరి నికర విలువ కనీసం 100 బిలియన్ డాలర్లు.ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడుడబ్ల్యూఎస్జే ప్రకారం.. టెక్ బిలియనీర్ 'ఎలాన్ మస్క్' భూమిపై అత్యంత ధనవంతుడు. ఈయన సంపద 419.4 బిలియన్ డాలర్లు (రూ. 36 లక్షల కోట్ల కంటే ఎక్కువ). మస్క్ సారథ్యంలో టెస్లా, స్పేస్ఎక్స్, న్యూరాలింక్, ఎక్స్ వంటి కంపెనీలు ఉన్నాయి.సూపర్ బిలియనీర్ల జాబితాలో భారతీయ వ్యాపార దిగ్గజాలు ముఖేష్ అంబానీ (17వ స్థానం), గౌతమ్ అదానీ (21వ స్థానం) కూడా ఉన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ నికర విలువ 90.6 బిలియన్ డాలర్లు (రూ.7 లక్షల కోట్ల కంటే ఎక్కువ), అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ నికర విలువ 60.6 బిలియన్ డాలర్లు (రూ.5 లక్షల కోట్ల కంటే ఎక్కువ).సూపర్ బిలియనీర్ల జాబితా➤ఎలాన్ మస్క్: రూ.36.65 లక్షల కోట్లు➤జెఫ్ బెజోస్: రూ. 23.05 లక్షల కోట్లు➤బెర్నార్డ్ ఆర్నాల్ట్: రూ. 20.87 లక్షల కోట్లు➤లారెన్స్ ఎల్లిసన్: రూ. 20. 71 లక్షల కోట్లు➤మార్క్ జుకర్‌బర్గ్: రూ. 19.29 లక్షల కోట్లు ➤సెర్గీ బిన్: రూ. 14.02 లక్షల కోట్లు➤స్టీవెన్ బాల్మెర్: రూ. 13.75 లక్షల కోట్లు➤వారెన్ బఫెట్: రూ. 13.47 లక్షల కోట్లు➤జేమ్స్ వాల్టన్: రూ. 10.27 లక్షల కోట్లు➤సామ్యూల్ రాబ్సన్ వాల్టన్: రూ. 9.9 లక్షల కోట్లు➤అమాన్సియో ఒర్టెగా: రూ. 9.8 లక్షల కోట్లు➤ఆలిస్ వాల్టన్: రూ. 9.6లక్షల కోట్లు➤జెన్సెన్ హువాంగ్: రూ. 9.4 లక్షల కోట్లు ➤బిల్ గేట్స్: రూ. 9.2 లక్షల కోట్లు ➤మైఖేల్ బ్లూమ్‌బెర్గ్: రూ. 9.0 లక్షల కోట్లు➤లారెన్స్ పేజ్: రూ. 8.8 లక్షల కోట్లు ➤ముఖేష్ అంబానీ: రూ. 7.9 లక్షల కోట్లు ➤చార్లెస్ కోచ్: రూ. 5.8 లక్షల కోట్లు ➤జూలియా కోచ్: రూ. 5.6 లక్షల కోట్లు ➤ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్: రూ. 5.4 లక్షల కోట్లు ➤గౌతమ్ అదానీ: రూ. 5.2 లక్షల కోట్లు ➤మైఖేల్ డెల్: రూ. 5.2 లక్షల కోట్లు ➤జోంగ్ షాన్షాన్: రూ. 5.0 లక్షల కోట్లు ➤ప్రజోగో పంగేస్తు: రూ. 4.8 లక్షల కోట్లు -
వేసవిలో బాడీ ఆర్మర్ లైట్ స్పోర్ట్స్ డ్రింక్
న్యూఢిల్లీ: ఈసారి వేసవి ప్రభావం కాస్త ముందే కనిపిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ స్పోర్ట్స్ డ్రింక్ బాడీఆర్మర్లైట్తో పాటు హానెస్ట్ టీ తదితర బ్రాండ్లను ఈ వేసవిలో భారత మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు కోకా కోలా ఇండియా, నైరుతి ఆసియా వైస్ ప్రెసిడెంట్ సందీప్ బజోరియా తెలిపారు. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టు కింద విమానాశ్రయాల్లాంటి ప్రదేశాల్లో విక్రయిస్తున్న విటమిన్వాటర్ను మరింత అందుబాటులోకి తేనున్నట్లు వివరించారు. అలాగే కోక్ జీరో షుగర్, స్ప్రైట్ జీరో షుగర్ శ్రేణిని మరింతగా విస్తరిస్తామన్నారు. ఎలక్ట్రోలైట్స్, కొబ్బరి నీటితో తయారైన బాడీఆర్మర్లైట్.. హైడ్రేషన్ విభాగానికి చెందిన బ్రాండ్ కాగా హానెస్ట్ టీ అనేది అస్సాం తేయాకుతో తయారైన సేంద్రియ టీ బ్రాండు. మరోవైపు, థమ్సప్, స్ప్రైట్ త్వరలో 2 బిలియన్ డాలర్ల బ్రాండ్లుగా మారే అవకాశం ఉందని సందీప్ వివరించారు. వీటితో పాటు మాజా, మినిట్ మెయిడ్ విక్రయాలను కూడా పెంచుకునేందుకు మరింతగా అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. -
కొత్త నగరాలకు ఐకియా
న్యూఢిల్లీ: ఫర్నిచర్ రంగ దిగ్గజం ఐకియా భారీగా విస్తరిస్తోంది. ఢిల్లీ–ఎన్సీఆర్తోపాటు మరో తొమ్మిది మార్కెట్లలో ఆన్లైన్ విక్రయాలను ఈ వారం ప్రారంభిస్తోంది. స్వీడన్‌కు చెందిన ఈ సంస్థ భారత్‌లో తదుపరి దశ పెట్టుబడుల కోసం చూస్తోందని, విస్తరణ తర్వాత లాభదాయకతకు చేరుకుంటుందని ఐకియా ఇండియా సీఈవో సుసాన్ పల్వరర్ తెలిపారు. ఢిల్లీ–ఎన్సీఆర్లో 2026లో గురుగ్రామ్ వద్ద, అలాగే 2028లో నోయిడాలో పూర్తి స్థాయిలో స్టోర్లను నెలకొల్పాలని యోచిస్తున్నట్టు వెల్లడించారు. చెన్నై, పుణేలోనూ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. భారీ స్టోర్ ఏర్పాటుకు ముందే చిన్న కేంద్రాలను ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ప్రారంభించాలని సంస్థ భావిస్తోంది. పుణేలో కంపెనీ ఇప్పటికే ఆన్లైన్లో అమ్మకాలను సాగిస్తోంది. ప్రస్తుతం సంస్థకు హైదరాబాద్, నవీ ముంబై, బెంగళూరులో భారీ స్టోర్లున్నాయి. రూ.10,500 కోట్లతో..: పదేళ్లలో అనుబంధ మౌలిక సదుపాయాలతో ఐకియా ద్వారా 10 స్టోర్లను ఏర్పాటు చేయడానికి రూ.10,500 కోట్ల ఎఫ్‌డీఐ ప్రతిపాదనకు 2013లో కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఇంగ్కా గ్రూప్‌లో భాగమైన ఇంగ్కా సెంటర్స్ ఐకియా రిటైల్‌ను నిర్వహిస్తోంది. గురుగ్రామ్, నోయిడాలో లైక్లీ బ్రాండ్ కింద కేంద్రాలను ఏర్పాటు చేయడానికి రూ.9,136 కోట్ల పెట్టుబడి పెడుతోంది. పెట్టుబడుల విషయమై ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్టు ఆమె చెప్పారు. మెట్రోల్లో విస్తరించిన తర్వాత తదుపరి దశలో చిన్న స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్టు సుసాన్ తెలిపారు. కాగా, 2023–24లో కంపెనీ టర్నోవర్ భారత్‌లో రూ.1,810 కోట్లు. నష్టాలు రూ.1,299 కోట్లకు చేరాయి. రాబోయే సంవత్సరాల్లో భారత్‌లో కూడా లాభాలను ఆర్జిస్తామని సుసాన్ వివరించారు. -
ఎయిర్టెల్ టీవీ, టాటా ప్లే విలీనం!
ముంబై: ప్రయివేట్ రంగ కార్పొరేట్ దిగ్గజాలు టాటా గ్రూప్, భారతీ ఎయిర్టెల్ చేతులు కలపనున్నాయి. తద్వారా నష్టాలలో ఉన్న డైరెక్ట్ టు హోమ్(డీటీహెచ్) బిజినెస్‌లను ఒకటి చేస్తున్నాయి. ఈ అంశంపై భారతీ ఎయిర్టెల్ తాజాగా స్టాక్ ఎక్సే్ఛంజీలకు సమాచారమిచ్చింది. శాటిలైట్, కేబుల్ టీవీ సర్వీసుల భారతీ టెలీమీడియా, టాటా ప్లే(గతంలో టాటా స్కై) విలీనానికి వీలుగా చర్చలు జరుగుతున్నట్లు వెల్లడించింది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ఇందుకు వీలుగా షేర్ల మార్పిడి ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నాయి. ఇటీవల కొంతకాలంగా దేశీ వినియోగదారుల అభిరుచి కేబుళ్ల నుంచి డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌వైపు మళ్లుతోంది. ఓటీటీల కారణంగా డీటీహెచ్ వినియోగదారుల సంఖ్య తగ్గుతోంది. ఈ నేపథ్యంలో తాజా ఒప్పందానికి ప్రాధాన్యత ఏర్పడింది. కొద్ది రోజులుగా లైసెన్స్ ఫీజు తగ్గింపునకు డీటీహెచ్ సంస్థలు అభ్యర్థిస్తున్నాయి. టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ ప్రస్తుత 8 శాతం ఫీజును ఏజీఆర్‌లో 3 శాతానికి తగ్గించేందుకు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. 2027 చివరికల్లా ఫీజును ఎత్తివేయాలని సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. డీటీహెచ్ యూజర్లు @ 6 కోట్లుతాజా డీల్ నేపథ్యంలో టాటా ప్లేకున్న 1.9 కోట్ల గృహాలతో ఎయిర్టెల్ కనెక్ట్ అయ్యేందుకు వీలు చిక్కనుంది. ఎయిర్టెల్ డిజిటల్ టీవీ సైతం 1.58 కోట్లమంది వినియోగదారులను కలిగి ఉంది. దీంతో టెలికం, బ్రాడ్‌బ్యాండ్, డీటీహెచ్ సర్వీసులను కలిపి ట్రిపుల్ ప్లే వ్యూహాన్ని అమలు చేసేందుకు అవకాశముంటుంది. ఓవైపు రిలయన్స్ జియో టెలికం, బ్రాడ్‌బ్యాండ్, కంటెంట్లతో ప్యాకేజీలను ఆఫర్ చేస్తూ సమీకృత సేవలవైపు దూసుకెళుతున్న సంగతి తెలిసిందే. దేశీయంగా ప్రస్తుతం డీటీహెచ్ వినియోగదారుల సంఖ్య దాదాపు 6 కోట్లు. ట్రాయ్ వివరాల ప్రకారం 2024 జూన్‌లో ఈ సంఖ్య 6.22 కోట్లుగా నమోదైంది. మొబైలేతర విభాగ ఆదాయాన్ని పెంచుకునే బాటలో టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ కన్వర్జెన్స్‌పై దృష్టి పెట్టింది. దేశీయంగా డీటీహెచ్ సేవలలో అతిపెద్ద కంపెనీగా నిలుస్తున్న టాటా ప్లే గతంలో గ్లోబల్ మీడియా దిగ్గజం రూపర్ట్ మర్డోక్ న్యూస్ కార్ప్‌తో భాగస్వామ్య సంస్థ(టాటా స్కై)ను ఏర్పాటు చేసింది. అయితే 2019లో మర్డోక్ సంస్థ ట్వంటీఫస్ట్ సెంచురీ ఫాక్స్‌ను వాల్ట్ డిస్నీ కొనుగోలు చేయడంతో భాగస్వామ్య వాటా చేతులు మారింది. ఇతర డీల్స్...ఎయిర్టెల్, టాటా ప్లే మధ్య డీల్ కుదిరితే డీటీహెచ్ రంగంలో రెండో అతిపెద్ద ఒప్పందంగా నిలవవచ్చు. ఇంతక్రితం 2016లో డిష్ టీవీ, వీడియోకాన్ డీ2హెచ్ విలీనమైన విషయం విదితమే. అయితే ఇటీవల రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీ చేతులు కలిపిన సంగతి తెలిసిందే. దీంతో స్టార్ ఇండియా, వయాకామ్18 విలీనమయ్యాయి. ఫలితంగా జియోస్టార్ బ్రాండుతో దేశీయంగా అతిపెద్ద మీడియా, ఎంటర్టైన్మెంట్ కంపెనీ ఆవిర్భవించింది. వీటి సంయుక్త ఆదాయం 2024లో రూ. 26,000 కోట్లుగా నమోదుకావడం గమనార్హం! 2023–24లో భారతీ టెలీమీడియా రూ. 3,045 కోట్ల టర్నోవర్, రూ. 76 కోట్ల నికర నష్టం ప్రకటించింది. ఇదే సమయంలో టాటా ప్లే నిర్వహణ ఆదాయం రూ. 4,305 కోట్లను తాకగా.. కన్సాలిడేటెడ్ నష్టం రూ. 354 కోట్లకు చేరింది. కాగా.. ఇంతక్రితం ఐపీవో చేపట్టేందుకు సెబీ నుంచి అనుమతి పొందింది. అయితే సమాచార శాఖ కంపెనీ ఈక్విటీ నిర్మాణంలో సవరణలకు ఆదేశించడంతో లిస్టింగ్ కార్యాచరణను ఆలస్యం చేసింది. కంపెనీ ఆర్వోసీకి దాఖలు చేసిన తాజా సమాచారం ప్రకారం టాటా సన్స్ తదుపరి నెట్వర్క్ డిజిటల్ డి్రస్టిబ్యూషన్ సర్వీసెస్ ఎఫ్‌జెడ్ ఎల్ఎల్సీ, టీఎస్ ఇన్వెస్ట్మెంట్స్.. విడిగా 20 శాతం వాటాలతో రెండో పెద్ద వాటాదారులుగా నిలుస్తున్నాయి. టాటా ప్లేలో బేట్రీ ఇన్వెస్ట్మెంట్స్(మారిషస్) పీటీఈ సైతం 10 శాతం వాటా కలిగి ఉంది. -
ఎల్ఐసీ.. రూ.480 కోట్లు కట్టు!
ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC)కి భారీ మొత్తంలో జీఎస్టీ (GST) చెల్లించాలని నోటీసు వచ్చింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను ముంబైలోని స్టేట్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ నుంచి జీఎస్టీ డిమాండ్ ఆర్డర్ అందుకున్నట్లు ఎల్ఐసీ తెలిపింది. జీఎస్టీ, వడ్డీ, పెనాల్టీతో కలిపి మొత్తం రూ.479.88 కోట్లు చెల్లించాలని ఆ నోటీసులో ఉంది.ఈ రూ.479.88 కోట్ల మొత్తంలో జీఎస్టీ రూపంలో రూ.242.23 కోట్లు, వడ్డీ కింద రూ.213.43 కోట్లు, పెనాల్టీ రూపంలో రూ.24.22 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)ను తప్పుగా పొందడం, షార్ట్ రివర్స్ చేయడం, ఆలస్య చెల్లింపులపై వడ్డీ, తక్కువ పన్ను చెల్లించడం వంటి కారణాలతో ఈ నోటీసు జారీ చేసినట్లుగా ఎల్ఐసీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.ఈ ఆర్డర్‌ను ముంబైలోని జాయింట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్ (అప్పీల్స్) ముందు అప్పీల్ చేసే అవకాశం ఉందని ఎల్ఐసి పేర్కొంది. కాగా ఈ డిమాండ్ నోటీసు తమ ఆర్థికాంశాలు లేదా కార్యకలాపాలపై నేరుగా ఎటువంటి ప్రభావాన్ని చూపదని స్పష్టం చేసింది. ‘ఈ డిమాండ్ ఆర్థిక ప్రభావం జీఎస్టీ, వడ్డీ, పెనాల్టీల వరకే ఉంటుంది. కార్పొరేషన్ ఆర్థిక, ఇతర కార్యకలాపాలపై ఎటువంటి భౌతిక ప్రభావం ఉండదు" అని ఎల్ఐసీ తెలిపింది.మెరుగైన లాభాలుఇటీవల ప్రకటించిన త్రైమాసిక ఫలితాలలో ఎల్ఐసీ బలమైన పనితీరును ప్రకటించింది. 2025 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో మెరుగైన పెట్టుబడి ఆదాయం, అధిక ప్రీమియం వసూళ్లతో లాభంలో 16 శాతం పెరుగుదలను నమోదు చేసింది. కార్యకలాపాల నుండి కూడా ఆదాయం గణనీయంగా పెరిగింది. లాభాల వృద్ధితో పాటు ఎల్ఐసీ నికర ప్రీమియం ఆదాయం ఏడాది ప్రాతిపదికన 12 శాతం పెరిగి రూ.1.5 లక్షల కోట్లకు చేరింది. -
ఐటీ హాబ్‌గా మేడ్చల్ జిల్లా!
హైదరాబాద్ నగర శివారుల్లో పారిశ్రామిక రంగ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కొత్త పరిశ్రమలతో వందలాది మంది నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, వేలాది కుటుంబాలకు పరోక్షంగా ఉపాధి అవకాశాలను కల్పించటమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తోంది. హైదరాబాద్– వరంగల్ పారిశ్రామిక కారిడార్‌తోపాటు హైదరాబాద్ (Hydearabad) మహానగరం నలువైపులా పారిశ్రామిక పార్కుల విస్తరణపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా (Rangareddy District) ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాటు ఐటీ శాఖ మంత్రి కావటంతో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాపై ప్రత్యేక ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తోంది.గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉప్పల్ జెన్ ప్యాక్ వద్ద 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ పార్కు, నగరానికి ఉత్తరాన కండ్లకోయలో గేట్‌వే ఐటీ పార్కుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. వీటిని వేగవంతం చేయటంతోపాటు నగరానికి తూర్పు దిశలో ఉన్న ఘట్కేసర్ మండలం మాదారంలో ఇండ్రస్టియల్ పార్కు (Madaram Industrial Park) స్థాపనకు కాంగ్రెస్ సర్కారు చర్యలు తీసుకుంటోంది. ఇదే మండలంలోని పోచారంలో దాదాపు 450 ఎకరాల విస్తీర్ణంలో కొనసాగుతున్న ఇన్ఫోసిస్‌ను మరో రూ.750 కోట్ల పెట్టుబడులతో మరింత విస్తరింపజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.ముఖ్యమంతి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) దావోస్ పర్యటనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఇన్ఫోసిస్ (Infosys) విస్తరణపై ఇటీవల వారితో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే పోచారంలో ఇన్ఫోసిస్ వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పింస్తోంది. మరింత విస్తరింపజేయటం ద్వారా త్వరలో కొత్తగా వందలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశముంది. నరానికి తూర్పు వైపు ఐటీ విస్తరణలో భాగంగా ప్రభుత్వ భూముల వివరాల సేకరణకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో... పారిశ్రామిక పార్కుల ఏర్పాటు కోసం జాతీయ రహదారులకు ఇరువైపులా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించటంతోపాటు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు, రోడ్లు, రైల్వే సౌకర్యం, నీటి సరఫరా, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. కొండలు, గుట్టలు, అటవీ భూములు కాకుండా ఇతర భూములను ఎంపిక చేయాలని సూచించింది. ప్రభుత్వ భూములు అందుబాటులో లేకుంటే ప్రైవేట్ భూములను కూడా గుర్తించాలని, వాటి బహిరంగ మార్కెట్ ధరలు, ప్రభుత్వ ధరలను తెలపాలని పేర్కొంది.చదవండి: హైదరాబాద్‌లో హెచ్‌సీఎల్ టెక్ మరో జీడీసీస్థానికంగా ఉన్న వనరుల వివరాలతోపాటు ఏఏ పరిశ్రమలకు భూములు, ప్రాంతాలు అనువుగా ఉంటాయన్న విషయాలతో అధికారులు నివేదికను సిద్ధం చేస్తున్నారు. భూములను గుర్తించిన తర్వాత ఆయా ప్రాంత చిత్రాలు (లొకేషన్ మ్యాప్‌లు) తయారు చేసి రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీఎస్ఐఐసీ)కి పంపించాలని నిర్దేశించటంతో అందుకు అనుగుణంగా కార్యాచరణకు వ్యూహా రచన చేస్తోంది. ఈ నేపథ్యంలోనే మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో ప్రభుత్వ భూముల సమగ్ర సర్వేలో రెవెన్యూ యంత్రాంగం తలములకలైనట్లు తెలుస్తోంది. సానుకూల చర్యలతో పారిశ్రామిక ప్రగతి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న పలు సానుకూల చర్యలతో పారిశ్రామిక ప్రగతి సాధ్యమవుతుందని మేడ్చల్ జిల్లా (Medchal District) పరిశ్రమల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. మేడ్చల్ జిల్లాలో 2024 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు అంటే.. తొమ్మిది నెలల కాలంలో రూ.380 కోట్ల పెట్టుబడులతో పారిశ్రామిక వేత్తలు 130 కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేశారు. 2,700 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి. జిల్లాలో కొత్తగా 783 భారీ, సూక్ష్య, మధ్యతరహా పరిశ్రమలను రూ.12,523 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ కొత్త పరిశ్రమల ఏర్పాటుతో మేడ్చల్ జిల్లాలో మరో 46,356 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్లు అంచనా వేస్తున్నారు.చదవండి: షంషేర్.. చార్మినార్..కొత్త పరిశ్రమల ఏర్పాటుతో మేడ్చల్ జిల్లా ఐటీ హాబ్‌గా మారనుంది. ప్రస్తుతమున్న పరిశ్రమలకు తోడుగా మేడ్చల్‌లో హాస్పిటల్ అండ్ హెల్త్ ఇండస్ట్రీ, శామీర్‌పేటలో అమ్యూజ్మెంట్ అండ్ ఎగ్జిబిషన్ ఇండస్ట్రీ, కీసరలో నాలెడ్జ్ అండ్ సైన్స్ ఇండస్ట్రీ, ఘట్కేసర్లో ఐటీ అండ్ ట్రాన్స్‌పోర్టు ఇండస్ట్రీ, గుండ్ల పోచారంలో ఫార్మా అండ్ బల్క్ డ్రగ్స్ ఇండస్ట్రీ రానున్నాయి. మేడ్చల్ జిల్లా ఉప్పల్, మేడ్చల్ నియోజకవర్గాల పరిధిలోని పోచారం, ఘట్కేసర్, ఉప్పల్, శామీర్‌పేట, మేడ్చల్, కీసర, బోడుప్పల్, చెంగిచర్ల తదితర ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటు నిమిత్తం భూసేకరణకు టీఎస్ఐఐసీ ఏర్పాట్లు చేస్తోంది. -
టెక్ దిగ్గజం కీలక నిర్ణయం: మరికొంతమంది ఉద్యోగులపై వేటు!
కొన్ని కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను పెంచుకుంటూ ఉంటే.. మరికొన్ని దిగ్గజ సంస్థలు ఉద్యోగులను తగ్గించుకునే పనిలో ఉన్నాయి. ఈ జాబితాలో గూగుల్ ఒకటి. ఈ కంపెనీ తాజాగా తన క్లౌడ్ డివిజన్లో ఉద్యోగుల సంఖ్యను తగ్గించింది. ఈ విషయాన్ని బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది.గూగుల్ ఉద్యోగులను తొలగించిన విషయం వెల్లడైనప్పటికీ.. ఎంతమంది ఉద్యోగులను తొలగించారు అనేదానికి సంబంధించిన విషయం వెల్లడికాలేదు. అయితే తొలగింపులు కొన్ని విభాగాలకు మాత్రమే పరిమితమైనట్లు తెలుస్తోంది. సంస్థ దీర్ఘకాలిక విజయాల కోసం కంపెనీ కీలకమైన కొన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి యోచిస్తోంది. ఈ సమయంలో కొన్ని సర్దుబాట్లు చేయాల్సిన అవసరం ఉంది. ఈ కారణంగానే.. కొంతమంది ఉద్యోగులను తొలగించినట్లు గూగుల్ ప్రతినిధి వెల్లడించారు.బెంగళూరులో గూగుల్ కొత్త ఆఫీస్టెక్ దిగ్గజం గూగుల్ (Google) బెంగళూరులో తమ కొత్త క్యాంపస్‌ను ప్రారంభించింది. దీనికి ’అనంత’ అని పేరు కూడా పెట్టింది. అనంత అంటే 'అపరిమితం' అని అర్థం. ఇది టెక్నాలజీ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అపరిమితమైన అవకాశాలను సూచిస్తుంది. ఇప్పటి వరకు ఉన్న.. భారీ ఆఫీసులలో ఇది ఒకటని పేర్కొంది. -
ఆ కంపెనీల ఆదాయం పెరిగింది: ఆర్బీఐ
ముంబై: ప్రైవేట్ రంగంలో ఉన్న ఆర్థికేతర లిస్టెడ్ కంపెనీల ఆదాయం 2024-25 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో 8 శాతం పెరిగిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. గత ఏడాది ఇదే కాలంలో ఇది 5.5 శాతంగా ఉందని తెలిపింది. జూలై–సెప్టెంబర్ కాలంలో అమ్మకాల వృద్ధి 5.4 శాతం నమోదైంది.డిసెంబర్ త్రైమాసికంలో ప్రైవేట్ కార్పొరేట్ రంగం పనితీరుపై 2,924 ఆర్థికేతర లిస్టెడ్ కంపెనీల సంక్షిప్త త్రైమాసిక ఆర్థిక ఫలితాల ఆధారంగా ఆర్బీఐ నివేదిక రూపొందించింది. ఆటోమొబైల్స్, రసాయనాలు, ఆహార ఉత్పత్తులు, విద్యుత్ యంత్రాల పరిశ్రమలలో అధిక అమ్మకాల జోరు కారణంగా 1,675 లిస్టెడ్ ప్రైవేట్ తయారీ కంపెనీల ఆదాయ వృద్ధి 7.7 శాతానికి మెరుగుపడింది.పెట్రోలియం, ఇనుము, ఉక్కు, సిమెంట్ పరిశ్రమల ఆదాయం వార్షిక ప్రాతిపదికన తగ్గింది. ఐటీ కంపెనీల టర్నోవర్ 6.8 శాతం ఎగిసింది. గత ఏడాది ఇదే కాలంలో ఇది 3.2 శాతంగా ఉంది. ముడి పదార్థాలపై తయారీ కంపెనీల ఖర్చులు 6.3 శాతం దూసుకెళ్లాయి. వేతనాల ఖర్చు అధికంగా 9.5 శాతం పెరిగింది. ఇది ఐటీలో 5 శాతం, ఐటీయేతర సేవల కంపెనీల్లో 12.4 శాతం అధికమైంది. 2024 అక్టోబర్–డిసెంబర్లో లిస్టెడ్ నాన్–ఫైనాన్షియల్ కంపెనీల ప్రాఫిట్ మార్జిన్ వరుసగా 50 బేసిస్ పాయింట్లు వృద్ధి చెంది 16.2 శాతానికి చేరుకుందని ఆర్బీఐ తెలిపింది. -
హైదరాబాద్‌లో ఫనాటిక్స్ విస్తరణ..
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ స్పోర్ట్స్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఫనాటిక్స్ భారత్‌లో తన కార్యకలాపాలను విస్తరించనుంది. ఐసీసీతోపాటు పలు దేశాల్లోని లీగ్పోటీలకు, క్రీడాకారులకు జెర్సీలు, జ్ఞాపికలు, ఇతర వాణిజ్య వస్తువుల డిజైనింగ్, తయారీ, మార్కెటింగ్ పనులు ఫనాటిక్స్ వ్యాపారం. ప్రపంచవ్యాప్తంగా సుమారు 80 కేంద్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ ఆరేళ్ల క్రితం హైదరాబాద్‌లోనూ ఒక కేంద్రాన్ని ప్రారంభించింది.అయితే పెరుగుతున్న అవసరాలకు తగినట్లుగా ఈ కేంద్రాన్ని విస్తరించేందుకు నిర్ణయించామని, ఇందులో భాగంగా అభిషేక్ దశ్మనాను వైస్ ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్‌గా నియమించామని ఫనాటిక్స్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మథియాస్ స్పైచర్ తెలిపారు. అంతేకాకుండా.. రానున్న రెండేళ్లలో హైదరాబాద్ కేంద్రం ఉద్యోగుల సంఖ్యను 250 నుంచి 500కు పెంచుతామని, వచ్చే ఏడాది తొలినాళ్లలోనే హైటెక్ సిటీ సమీపంలో సుమారు 1,20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న విశాలమైన ఆఫీసుకు వెళ్లనున్నామని ఆయన వివరించారు.ఈ కేంద్రం నుంచే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పది కోట్ల మంది క్రీడాభిమానులకు ఉత్పత్తులు, సేవలు అందిస్తామని చెప్పారు. సంస్థ కార్యకలాపాలన్నింటికీ హైదరాబాద్ కేంద్ర బిందువుగా మారనుందని అన్నారు. కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్ వంటి అనేక అత్యాధునిక టెక్నాలజీలను హైదరాబాద్ కేంద్రంలో ఉపయోగించనున్నామని చెప్పారు. ప్రోడక్ట్ డెవలప్మెంట్, డేటా అనలిటిక్స్, ఏఐ అప్లికేషన్స్, ఫనాటిక్స్ గ్లోబల్ కార్యకలాపాలన్నింటికీ అవసరమైన బ్యాక్ఎండ్ టెక్నాలజీలను ఇక్కడ అభివృద్ధి చేస్తామన్నారు.ఈ సందర్భంగా అభిషేక్ దశ్మనా మాట్లాడుతూ.. భారత్‌లో క్రీడలపై ఆసక్తి ఏటికేడాదీ పెరుగుతోందని.. క్రీడాభిమానుల మనసు గెలుచుకునేందుకు ఫనాటిక్స్ హైదరాబాద్ కేంద్రం కార్యకలాపాలు ఉపకరిస్తాయన్నారు. ఫనాటిక్స్ ద్వారా ప్రపంచంలోని ఏ మూలనున్న స్పోర్ట్స్ టీమ్ తాలూకూ జెర్సీ, ఇతర వాణిజ్యవస్తువులను భారత్‌లో కూర్చుని తెప్పించుకునేందకు అవకాశం ఏర్పడిందని అన్నారు.సుమారు 190 దేశాలకు ఫనాటిక్స్ ఉత్పత్తులు రవాణా అవుతూంటాయని, ఇందుకోసం 80కిపైగా తయారీ కేంద్రాలుండగా.. మొత్తం 900 మంది భాగస్వాములతో కలిసి వీటిని ఉత్పత్తి చేస్తున్నామని వివరించారు. ఐపీఎల్ లాంటి భారతీయ క్రీడల్లో భాగస్వామ్యం వహించే ఆలోచన ప్రస్తుతానికి లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మెర్చండైజ్ తయారీ వంటివి భవిష్యత్తులో తగిన సమయంలో చేపట్టే అవకాశం లేకపోలేదన్నారు. -
ఇన్ఫ్లుయెంజా వైరస్‌కు జైడస్ వ్యాక్సిన్: ఇక వారంతా సేఫ్!
కొత్త రకం ఇన్‌ఫ్లూయెంజా వైరస్ నుంచి రక్షణ కోసం వ్యాక్సిన్‌ను ప్రవేశపెడుతున్నట్టు ఔషధ తయారీ సంస్థ 'జైడస్ లైఫ్‌సైన్సెస్' (Zydus Lifesciences) బుధవారం తెలిపింది.ఫ్లూ నుంచి రక్షణ కోసం డబ్ల్యుహెచ్ఓ సిఫార్సు చేసిన కూర్పు ప్రకారం దేశంలోనే మొట్టమొదటి క్వాడ్రివలెంట్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్ వ్యాక్సిన్ వ్యాక్సిఫ్లూ-4ను పరిచయం చేస్తున్నట్టు వెల్లడించింది. ఈ టీకాను సెంట్రల్ డ్రగ్ లాబొరేటరీ (CDL) ఆమోదించిందని కంపెనీ తెలిపింది.రాబోయే ఫ్లూ సీజన్ ప్రబలంగా ఉంటుందని, దీనిని దృష్టిలో ఉంచుకుని నాలుగు ఇన్‌ఫ్లూయెంజా వైరస్ జాతులకు వ్యతిరేకంగా కాలానుగుణ రక్షణను, క్రియాశీల రోగనిరోధకతను అందించేలా క్వాడ్రివాలెంట్ ఇన్‌ఫ్లూయెంజా వ్యాక్సిన్‌ను తీసుకొచ్చినట్లు కంపెనీ వివరించింది. దీనిని సంస్థ అహ్మదాబాద్‌లోని వ్యాక్సిన్ టెక్నాలజీ సెంటర్ (VTC) అభివృద్ధి చేసింది.ఇన్‌ఫ్లూయెంజా అనేది.. ఇన్‌ఫ్లూయెంజా వైరస్ వల్ల సోకే దగ్గు, తుమ్ముల వ్యాప్తిని నివారిస్తుంది. శ్వాసకోశ సంబంధిత వ్యాధులను ముందుగా గుర్తించి.. కావలసిన వ్యాక్సిన్ తీసుకోకపోతే, తీవ్ర అనారోగ్యం ఏర్పడుతుంది. కొన్ని సార్లు మరణానికి కూడా దారితీయవచ్చు. ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లలు, వృద్ధులకు ఈ వ్యాక్సిన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, సీజనల్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్ కారణంగా.. ప్రతి సంవత్సరం 2.9 లక్షల నుంచి 6.5 లక్షల మంచి మరణిస్తున్నారని తెలిసింది. కాబట్టి ఈ వ్యాక్సిన్ మరణాల రేటును తగ్గిస్తుందని చెబుతున్నారు. -
ఈపీఎఫ్‌వోలో కొత్తగా 16 లక్షల మందికి చోటు
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) కిందకు 2024 డిసెంబర్లో కొత్తగా 16.05 లక్షల మంది సభ్యులుగా నమోదయ్యారు. 2024 నవంబర్ నెల గణాంకాలతో పోల్చి చూస్తే 10 శాతం, 2023 డిసెంబర్ గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 2.74 శాతం చొప్పున వృద్ధి నమోదైంది. ఈ వివరాలను కేంద్ర కార్మిక శాఖ విడుదల చేసింది. నికరంగా చూస్తే 8.47 లక్షల కొత్త చందాదారులు చేరారు. ఇది ఉపాధి అవకాశాల కల్పన పెరుగుదలను సూచిస్తున్నట్టు కార్మిక శాఖ తెలిపింది.కొత్త సభ్యుల్లో 4.85 లక్షల మంది 18–25 ఏళ్ల వయసులోని వారే కావడం గమనార్హం. నికర కొత్త సభ్యుల్లో 57 శాతం మేర ఈ వయసు నుంచే ఉన్నారు. వీరంతా మొదటిసారి సంఘటిత రంగంలో ఉపాధి పొందినట్టు తెలుస్తోంది. 15.12 లక్షల మంది సభ్యులు ఒక సంస్థలో మానేసి, మరో సంస్థలో చేరారు. 2024 నవంబర్ నెలతో పోల్చి చూసినప్పుడు వీరి సంఖ్య 5 శాతం పెరిగింది. కొత్త సభ్యుల్లో 2.22 లక్షల మంది మహిళలు ఉన్నారు. 2023 డిసెంబర్ నెలతో పోల్చి చూస్తే మహిళా సభ్యుల చేరికలో 6.34 శాతం వృద్ధి నమోదైంది.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో పెరిగిన ఇళ్ల ధరలు.. ఎంతంటే..టాప్–5 రాష్ట్రాల నుంచే 60 శాతం కొత్త సభ్యుల్లో 60 శాతం మంది టాప్ 5 రాష్ట్రాల నుంచే ఉన్నారు. ఒక్క మహారాష్ట్ర నుంచే 21.71 శాతం మంది ఈపీఎఫ్‌లో చేరారు. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, హర్యానా, ఢిల్లీ, తమిళనాడు, యూపీ, తెలంగాణ ఇలా ఒక్కో రాష్ట్రం నుంచి విడిగా 5 శాతానికి పైనే కొత్త సభ్యులు చేరారు. మానవ వనరుల సరఫరా, కాంట్రాక్టర్లు, సెక్యూరిటీ సేవలు తదితర ఎక్స్పర్ట్సరీ్వసెస్ తరఫున 41 శాతం మంది కొత్తగా ఈపీఎఫ్‌వో కిందకు వచ్చారు. -
అంకుర సంస్థలకు ప్రభుత్వ తోడ్పాటు
తయారీ, ఫిన్‌టెక్ స్టార్టప్‌ల అభివృద్ధికి తోడ్పాటు అందించే దిశగా కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పేటీఎంతో పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం డీపీఐఐటీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అంకుర సంస్థలు కార్యకలాపాలు విస్తరించేందుకు, కొత్త ఆవిష్కరణలు చేసేందుకు అవసరమైన మెంటార్షిప్, మార్కెట్ యాక్సెస్, నిధుల అవకాశాలు, మౌలిక సదుపాయాల కల్పన మొదలైన అంశాలపరంగా మద్దతునిచ్చేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడనుంది.ఈ చర్యల్లో భాగంగా నియంత్రణ నిబంధనలను పాటించడంపై, పెట్టుబడులను సమకూర్చుకోవడానికి ఉన్న అవకాశాలపై అవగాహన కల్పించేందుకు వర్క్‌షాప్‌లను నిర్వహిస్తారు. పేటీఎం విస్తృత మర్చంట్ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుని స్టార్టప్‌లు తమ ఉత్పత్తులను టెస్ట్ చేసేందుకు, వేలిడేట్ చేసేందుకు, వాటిని మరింత మెరుగుపర్చుకునేందుకు ఉపయోగపడేలా మౌలిక సదుపాయాలు, మార్కెట్ యాక్సెస్‌కి సంబంధించిన మద్దతు లభిస్తుంది. మెంటార్షిప్, ఆర్థిక సాయం, అధునాతన టెక్నాలజీ ద్వారా ఔత్సాహిక వ్యాపారవేత్తలకు సాధికారత కలి్పంచేందుకు పేటీఎం కట్టుబడి ఉందని సంస్థ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ చెప్పారు. పేటీఎం ఫిన్‌టెక్ అనుభవాన్ని, మౌలిక సదుపాయాలను ఉపయోగించుకుని, కార్యకలాపాలను విస్తరించడంలో, సవాళ్లను అధిగమించడంలో స్టార్టప్‌లను తోడ్పాటు అందిస్తామని డీపీఐఐటీ సంయుక్త కార్యదర్శి సంజీవ్ తెలిపారు.హెచ్బీఎన్ డెయిరీస్‌కు నోసెబీ తాజా హెచ్చరికక్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా హెచ్బీఎన్ డెయిరీస్‌కు సంబంధించిన ఎలాంటి లావాదేవీలు చేపట్టవద్దంటూ పబ్లిక్‌ను హెచ్చరించింది. హెచ్బీఎన్ డెయిరీస్ అండ్ అలైడ్ లిమిటెడ్‌కు చెందిన ఎలాంటి ప్రాపర్టీ కొనుగోలు లేదా లావాదేవీలు చేపట్టవద్దంటూ పేర్కొంది. వీటి విషయంలో అప్రమత్తంగా వ్యవహరించవలసిందిగా సూచించింది. కొంతమంది వ్యక్తులు లేదా సంస్థలు తప్పుడు సమాచారం(వదంతులు) ప్రచారం చేస్తూ హెచ్బీఎన్ ప్రాపర్టీస్ వేలాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని తెలియజేసింది. సెబీ అధికారులుగా చెప్పుకుంటూ చట్టాన్ని అతిక్రమిస్తున్నట్లు వెల్లడించింది. తద్వారా నిజమైన కొనుగోలుదారులను పక్కదారి పట్టించడంతోపాటు.. సెబీ ఈవేలం విధానానికి అడ్డుతగులుతున్నట్లు వివరించింది. హెచ్బీఎన్ ప్రాపరీ్టస్లో.. సంస్థ డైరెక్టర్లు, సంబంధిత అనుబంధ, సహచర సంస్థలు తదితరాలకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి హక్కులూ లేవని స్పష్టం చేసింది. వెరసి హెచ్బీఎన్ ఆస్తుల విషయంలో సంస్థకు సంబంధించిన ఏ వ్యక్తినీ లేదా ఏ సంస్థనూ చట్ట విరుద్ధంగా అనుమతించబోమని పేర్కొంది. -
జీసీసీలు @ రూ.8.72 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: దేశీయంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) ఆదాయం 2030 నాటికి 105 బిలియన్ డాలర్ల(సుమారు రూ.8.72 లక్షల కోట్లు)కు చేరుతుందనే అంచనాలు ఉన్నట్లు కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి సుమీతా దావ్రా తెలిపారు. అప్పటికి 28 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తూ ఎంటర్ప్రైజ్ ఆపరేషన్స్, నవకల్పనల్లో గ్లోబల్ హబ్‌గా భారత్ స్థానం మరింత పటిష్టమవుతుందని పేర్కొన్నారు. గతేడాది 1,700 జీసీసీల్లో 19 లక్షల మంది నిపుణులు పనిచేస్తుండగా, 64.6 బిలియన్ డాలర్ల ఆదాయం నమోదైందని వివరించారు.మరో అయిదేళ్లలో జీసీసీల సంఖ్య దాదాపు 2,400కి చేరవచ్చని దావ్రా చెప్పారు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్వో) బృందంతో భేటీ అయిన సందర్భంగా ఆమె ఈ విషయాలు వివరించారు. హైదరాబాద్, బెంగళూరు, పుణె, చెన్నై మొదలైన ప్రాంతాలు కీలక జీసీసీ హబ్‌లుగా ఉంటున్నాయని పేర్కొన్నారు. మరోవైపు, కొత్త ఆవిష్కరణలు, వ్యాపార అభివృద్ధికి దోహదపడే నిపుణులు పెద్ద సంఖ్యలో ఉన్నందున భారత్ పోటీతత్వం మరింతగా మెరుగుపడుతోందని ఐఎల్వో డైరెక్టర్ జనరల్ గిల్బర్ట్ ఎఫ్ హువాంగ్బో తెలిపారు. కృత్రిమ మేథ, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, సెమీకండక్టర్లు మొదలైన కొత్త విభాగాల్లో జీసీసీలు విస్తరించడం కొత్త ట్రెండ్ అని పేర్కొన్నారు. వెల్స్పన్ రూ.1,000 కోట్ల పెట్టుబడులుముంబై: గిడ్డంగుల విభాగానికి సంబంధించి రూ.1,000 కోట్ల పెట్టుబడుల ప్రోగ్రాంను వెల్స్పన్ వన్ ఆవిష్కరించింది. తమ రెండో ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధి అయిన ఫండ్ 2కి ఇది మద్దతుగా ఉంటుందని వివరించింది. 50 లక్షల చ.అ. వేర్‌హౌసింగ్ స్పేస్‌ను అభివృద్ధి చేసేందుకు ఈ నిధులు తోడ్పడతాయని సంస్థ తెలిపింది. దీనితో కంపెనీ పోర్ట్‌ఫోలియో మొత్తం 2.2 కోట్ల చ.అ.కు చేరుతుందని పేర్కొంది.ఇదీ చదవండి: ఇన్ఫోసిస్‌లో 20 శాతం వరకు వేతన పెంపునిర్మాణం పూర్తయిన తర్వాత నికరంగా రూ.1,100 కోట్ల నిర్వహణ ఆదాయం రాగలదని అంచనా వేస్తున్నట్లు వెల్స్పన్ తెలిపింది. రూ.2,000 కోట్ల కార్పస్ నిధి లక్ష్యంతో 2023 మార్చిలో ఆవిష్కరించిన ఫండ్ 2, ప్రధానంగా ఈ–కామర్స్ వంటి విభాగాలకు అనుగుణంగా ఉండే కొత్త తరం గిడ్డంగులపై దృష్టి పెడుతోంది. దీని కింద ఇప్పటికే తొమ్మిది గ్రేడ్ ఏ అసెట్స్‌కి వెల్స్పన్ కేటాయింపులు జరిపింది. కొత్తగా కో–ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రాంతో తమ పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోను 14–15 పెంచుకోవాలని భావిస్తోంది. -
స్పైస్‌జెట్ లాభం 26 కోట్లు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో బడ్జెట్ ఎయిర్‌లైన్ స్పైస్‌జెట్ రూ. 26 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత క్యూ3లో కంపెనీ రూ. 300 కోట్ల నష్టం నమోదు చేసింది. సమీక్షాకాలంలో ఆదాయం 35 శాతం పెరిగి రూ. 1,077 కోట్ల నుంచి రూ. 1,651 కోట్లకు పెరిగింది. అయితే క్యూ2లో నమోదైన రూ. 2,149 కోట్లతో పోలిస్తే మా త్రం ఆదాయం తగ్గింది. ప్యాసింజర్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్) 87%గా నమోదైనట్లు కంపెనీ తెలిపింది. వాస్తవానికి క్యూ3 ఆర్థిక ఫలితాలను మంగళవారమే ప్రకటించాల్సి ఉన్నా , బోర్డు సమావేశం అర్ధరాత్రి వరకు సాగడంతో బుధవారం తెల్లవారుఝామున ఒంటి గంటకు ఫైలింగ్ చేసినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు స్పైస్‌జెట్ తెలిపింది. -
మైక్రోమ్యాక్స్ సోలార్ పవర్
న్యూఢిల్లీ: దేశీ మొబైల్, ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ మైక్రోమ్యాక్స్ ఇన్ఫర్మాటిక్స్ తాజాగా పునరుత్పాదక ఇంధన రంగంలోకి ప్రవేశించింది. సోలార్ ప్యానెళ్ల తయారీ కోసం స్టార్టప్ ఎనర్జీ పేరిట సంస్థను ఏర్పాటు చేసింది. నివాస గృహాలు, కమర్షియల్, పారిశ్రామిక అవసరాలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన సోలార్ ప్యానెళ్లను తయారు చేయడంపై ఇది దృష్టి పెడుతుందని మైక్రోమ్యాక్స్ ఇన్ఫర్మాటిక్స్ ఎండీ రాజేశ్ అగర్వాల్ తెలిపారు. అధునాతన ఆటోమేషన్ సామర్థ్యాలతో స్టార్టప్ ఎనర్జీ తయారీ ప్లాంటును ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. ఇందుకోసం చైనాకు చెందిన జిన్చెన్ సంస్థతో వ్యూహాత్మక కాంట్రాక్ట్ కుదుర్చుకున్నట్లు వివరించారు. దీని కింద 5 గిగావాట్ల అధునాతన సోలార్ మాడ్యూల్స్ తయారీ లైన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్త తరం సోలార్ సొల్యూషన్స్‌పై పరిశోధనలు, అభివృద్ధి కోసం స్టార్టప్ ఎనర్జీ వ్యూహాత్మక భాగస్వామ్యాలను కుదుర్చుకుంటుందని చెప్పారు. -
విప్లవాత్మక ఆవిష్కరణ.. స్మార్ట్ ఏఐ నోట్‌బుక్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత, సుస్థిర సాంకేతిక పరిష్కారాల్లో అగ్రగామిగా ఉన్న క్వాడ్రిక్ ఐటీ.. బయో ఏషియా 2025లో అద్భుతమైన ఆవిష్కరణలతో ప్రభావం చూపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను సుస్థిరతతో మిళితం చేస్తూ రూపొందించిన పలు ఉత్పత్తులు, పరిష్కారాలను ప్రదర్శించింది.రీయూజబుల్ స్మార్ట్ ఏఐ నోట్ బుక్క్వాడ్రిక్ ఐటీ అందించిన అద్భుతమైన ఆవిష్కరణలలో రీయూజబుల్ స్మార్ట్ ఏఐ ఆధారిత నోట్ బుక్ ఒకటి. సుమన్ బాలబొమ్ము, కేసరి సాయికృష్ణ శబనివీసు, రఘు రామ్ తాతవర్తి కలిసి రూపొందించిన ఈ నోట్ బుక్ సమావేశాల్లో నోట్స్ తీసుకునే విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత నోట్ బుక్ సంప్రదాయ నోట్ బుక్ లాగే పనిచేస్తుంది. కానీ ప్రతి పేజీని 100 సార్లు పునర్వినియోగించుకోవచ్చు. రెనోట్ఏఐ అనువర్తనాన్ని ఉపయోగించి చేతిరాత కంటెంట్‌ను డిజిటల్ ఫార్మాట్లోకి సులభంగా మార్చవచ్చు. అలాగే క్లౌడ్ స్టోరేజ్, ఏఐ-జనరేటెడ్ ప్రాంప్ట్‌ల ద్వారా సమాచారాన్ని కావాల్సినప్పుడు తిరిగి పొందవచ్చు. ఈ నోట్‌బుక్ పేజీలను తడి గుడ్డ లేదా టిష్యూతో తుడిచివేసి మళ్లీ ఉపయోగించవచ్చు. దీంతో కాగితం వినియోగం బాగా తగ్గుతుంది.మరిన్ని ఏఐ పరిష్కారాలురీ యూజబుల్ స్మార్ట్ నోట్‌బుక్‌తో పాటు క్వాడ్రిక్ ఐటీ.. బయో, ఫార్మా పరిశ్రమల కోసం రూపొందించిన మరిన్ని కృత్రిమ మేధ, డేటా ఆధారిత పరిష్కారాలను ప్రదర్శించింది. ఈ ఆవిష్కరణలు కార్యకలాపాలను క్రమబద్ధీకరించడంతోపాటు వేగవంతంగా నిర్ణయాలు తీసుకోవడంలో దోహదపడతాయి. అలాగే పర్యావరణ హితానికి తోడ్పడతాయి. -
ఆరోగ్య సంరక్షణలో సరికొత్త మార్పులు
డిజిటల్ ఆవిష్కరణలతో ఆరోగ్య సంరక్షణలో సరికొత్త మార్పులు వచ్చాయని అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతా రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న బయోఏషియా 2025 సదస్సులో పాల్గొన్న ఆమె 'ఇంటిగ్రేటెడ్ హెల్త్‌కేర్ అండ్ పేషెంట్ అవుట్‌కమ్స్' అనే అంశంపై జరిగిన ప్యానెల్ చర్చలో మాట్లాడారు.ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ABDM) ఈ-సంజీవని టెలిమెడిసిన్ వంటి కార్యక్రమాల ప్రభావాన్ని ఎత్తి చూపారు. ఈ కార్యక్రమాలు ఆసుపత్రులు, డిజిటల్ హెల్త్ వేదికలు, ఇంటి ఆధారిత ఆరోగ్య సంరక్షణ మధ్య అంతరాలను పూడ్చాయని, ఎక్కువ మందికి ఆరోగ్య సంరక్షణ అందేలా చేశాయని వివరించారు. కోవిడ్ మహమ్మారి తర్వాత డిజిటల్ స్వీకరణ 300 శాతానికి పైగా పెరిగిందని, ఈ నేపథ్యంలో ఇంటిగ్రేటెడ్ హెల్త్‌కేర్ మోడల్స్ మరిన్ని రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.టెక్నాలజీ పాత్రవైద్యుల నైపుణ్యాన్ని భర్తీ చేయడం కంటే, సాంకేతిక పరిజ్ఞానం క్లినికల్ ఎక్సలెన్స్ కు తోడ్పడాలని డాక్టర్ సంగీతా రెడ్డి అభిప్రాయపడ్డారు. మెరుగైన రోగ నిర్ధారణ, చికిత్స ప్రణాళిక, రోగి పర్యవేక్షణ కోసం కృత్రిమ మేధ ఆధారిత సాధనాలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించామని, ఇందులో భాగంగా మైక్రోసాఫ్ట్ తో అపోలో హాస్పిటల్స్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పరచుకున్నట్లు వెల్లడించారు.ఎక్కువ మందికి చేరువఆయుష్మాన్ భారత్, మైక్రో ఇన్సూరెన్స్ మోడల్స్, హెల్త్ కేర్ లెండింగ్ వంటి కార్యక్రమాల ప్రాముఖ్యతను డాక్టర్ సంగీతా రెడ్డి నొక్కి చెప్పారు. ఆర్థిక అడ్డంకులను తగ్గించడానికి, టైర్ -2 నగరాలు, అణగారిన కమ్యూనిటీలకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను చేరువ చేసేందుకు ఈ చర్యలు అవసరమని ఉద్ఘాటించారు. అధునాతన చికిత్సలను అందుబాటులోకి తీసుకురావడం, నివారణ చేయడంలోనే ఆరోగ్య సంరక్షణ భవిష్యత్తు ఉందని ఆమె స్పష్టం చేశారు. అత్యాధునిక ఆవిష్కరణలను క్లినికల్ నైపుణ్యంతో మిళితం చేయడం ద్వారా ముదిరిపోక ముందే వ్యాధి భారాన్ని తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. -
రైలు టికెట్ ఇలా కొంటే క్యాష్‌బ్యాక్..
సాక్షి, సిటీబ్యూరో: సాధారణ టికెట్ల (Train ticket) కోసం ప్రవేశపెట్టిన అన్ రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టమ్ (UTS) మొబైల్ యాప్ ద్వారా టికెట్లు కొనుగోలు చేసే ప్రయాణికులకు 3 శాతం క్యాష్‌బ్యాక్ (Cashback) రాయితీ ఇవ్వనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు. 2016లో హైదరాబాద్ నగరంలోని ఎంఎంటీఎస్ ప్రయాణికుల కోసం మొదటిసారి యూటీఎస్‌ను ప్రవేశపెట్టారు.ఆ తరువాత 2018 జూలై నుంచి అన్ని రైళ్లలో సాధారణ టికెట్ కొనుగోళ్లకు దీన్ని విస్తరించారు. ప్లాట్‌ఫామ్ టికెట్లు, సీజన్ టికెట్లు కూడా యూటీఎస్ ఆర్–వాలెట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. దేశవ్యాప్తంగా ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ప్రయాణికులు ఆర్–వాలెట్‌తోపాటు, పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే, యూపీఐ యాప్‌లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా డిజిటల్ చెల్లింపులు చేయవచ్చు.ఆర్–వాలెట్లో రూ.20 వేల వరకు డిపాజిట్ చేసే సదుపాయం ఉంది. యూటీఎస్ యాప్ ద్వారా టికెట్ కొనుగోళ్లను ప్రోత్సహించడానికే ఈ క్యాష్‌బ్యాక్ సదుపాయాన్ని ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. గత సంవత్సరం సగటున ప్రతిరోజు సుమారు 83,510 మంది యూటీఎస్‌ను వినియోగించుకోగా, ఈ ఏడాది ఆ సంఖ్య రోజుకు 93,487కు పెరిగింది.ఏడాది కాలంలో 12 శాతం పెరిగినట్లు సీపీఆర్వో తెలిపారు. టికెట్ కౌంటర్ల వద్ద పడిగాపులు కాయవలసిన అవసరం లేకుండా అప్పటికప్పుడు యాప్ ద్వారా కొనుగోలు చేసుకొని బయలుదేరవచ్చు. దీని వల్ల ప్రయాణికులకు సమయం ఆదా కావడమే కాకుండా క్యాష్ బ్యాక్ ప్రయోజనాన్ని కూడా పొందే ఆస్కారం ఉంటుంది. -
యాపిల్ డీఈఐ కార్యక్రమాలు రద్దు చేసుకోవాలని ప్రతిపాదనలు
అమెరికాలోని నేషనల్ సెంటర్ ఫర్ పబ్లిక్ పాలసీ రీసెర్చ్ (ఎన్సీపీపీఆర్) యాపిల్ తన డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్‌క్లూజన్(డీఈఐ) కార్యక్రమాలను రద్దు చేసుకోవాలని కోరుతూ ఇటీవల ఒక ప్రతిపాదనను రూపొందించింది. దీనికి స్పందించిన యాపిల్ వాటాదారులు ఎన్సీపీపీఆర్ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఓటు వేశారు. డీఈఐ కార్యక్రమాలకు కట్టుబడి ఉంటానని యాపిల్ స్పష్టం చేసింది.అమెరికాలోని ప్రజా విధాన సమస్యలకు స్వేచ్ఛా మార్కెట్ పరిష్కారాలను ప్రోత్సహించడంపై ఎన్సీపీపీఆర్ దృష్టి సారిస్తుంది. అయితే యాపిల్ అనుసరిస్తున్న డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్‌క్లూజన్(డీఈఐ) కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఎన్సీపీపీఆర్ ప్రతిపాదనలు సిద్ధం చేయడం చర్చనీయాంశమైంది. ఫెడరల్ ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో డీఈఐ కార్యక్రమాలను నిర్వీర్యం చేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విస్తృతంగా ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదన వస్తున్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు.డీఈఐపై చట్టపరమైన, ఆర్థిక ఆందోళనలుఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డీఈఐ కార్యక్రమాలను తీవ్రంగా విమర్శిస్తున్నారు. తన ప్రమాణ స్వీకారం తరువాత ఫెడరల్ ఏజెన్సీలను అన్ని డీఈఐ కార్యక్రమాలను నిలిపివేయాలని ఆదేశిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వు(ఎగ్జిక్యూటివ్ ఆర్డర్)ను జారీ చేశారు. వాటిని ‘ప్రజా వ్యర్థాలు’గా అభివర్ణించారు. ఈ ఉత్తర్వులు ప్రైవేట్ కంపెనీలను కూడా వర్తింపజేయాలని చెప్పారు. డీఈఐ ప్రోగ్రామ్‌లతో ముడిపడి ఉన్న చట్టపరమైన ప్రమాదాల గురించి కొన్ని కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇవి వివక్షకు సంబంధించిన కేసులకు దారితీస్తాయని భయపడుతున్నాయి. డీఈఐ కార్యక్రమాలు ఆర్థిక ప్రమాదాలను కలిగిస్తాయనే నమ్మకం కొంతమంది వ్యాపార నాయకుల్లో ఉంది.ఇప్పటికే డీఈఐ కార్యక్రమాల నుంచి వైదొలిగిన కొన్ని హైప్రొఫైల్ కంపెనీల బాటలోనే యాపిల్ కూడా నడవాలని ఎన్సీపీపీఆర్ ప్రతిపాదన కోరుతోంది. డీఈఐ కార్యక్రమాలు కంపెనీలకు, వాటి వాటాదారులకు గణనీయమైన ఆర్థిక ప్రమాదాలను కలిగిస్తాయని వాదిస్తుంది. డీఈఐ విధానాలు ఇటీవలి కోర్టు తీర్పులకు అనుగుణంగా లేవని సూచిస్తుంది.ఇదీ చదవండి: ఇన్ఫోసిస్‌లో 20 శాతం వరకు వేతన పెంపుయాపిల్ స్పందన..ఎన్సీపీపీఆర్ నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ యాపిల్ తన డీఈఐ కార్యక్రమాలకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేసింది. కంపెనీ వైవిధ్య కార్యక్రమాలు తన సంస్కృతి, విధానాల్లో భాగమని తెలిపింది. డీఈఐ ప్రయత్నాలు మరింత సమ్మిళిత, సృజనాత్మక పనివాతావరణాన్ని సృష్టిస్తాయని నొక్కి చెప్పింది. ఇటీవల జరిగిన వాటాదారుల సమావేశంలో యాపిల్ యాజమాన్యం దాని డీఈఐ కార్యక్రమాలను సమర్థించుకుంది. వాటాదారులు ఎన్సీపీపీఆర్ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఓటు వేశారు. -
ఇన్ఫోసిస్‌లో 20 శాతం వరకు వేతన పెంపు
భారతదేశంలోని ప్రముఖ ఐటీ సేవల సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్ ఇటీవల ఉద్యోగులకు వేతన సవరణలను ప్రకటించింది. వ్యక్తిగత పనితీరు ఆధారంగా 5% నుంచి 20% వరకు ఇంక్రిమెంట్లను అందిస్తూ కంపెనీ వేతన పెంపు లేఖలను విడుదల చేసింది. ఉద్యోగులను మూడు విధాలుగా వర్గీకరించి ఈ పెంపును వర్తింపజేసినట్లు కంపెనీ తెలిపింది.కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం సంస్థ అంచనాలను చేరుకున్నవారికి 5-7 శాతం పెంపు, ప్రశంసనీయమైన పనితీరు కనబరిచిన ఉద్యోగులకు 7-10 శాతం పెంపు, పనిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి 10 నుంచి 20 శాతం వేతనాలు పెంచినట్లు తెలిపింది. అయితే గరిష్ఠంగా వేతనాల పెంపు అందుకున్నవారి సంఖ్య తక్కువగా ఉన్నట్లు పేర్కొంది. ఇదిలాఉండగా ‘అవసరాల మెరుగుదల(నీడ్స్ ఇంప్రూవ్మెంట్)’ కేటగిరీలోని ఉద్యోగులకు ఎలాంటి పెంపు లభించలేదు.పెంపు అమలు తేదీలుసవరించిన వేతనాలు జాబ్ లెవల్ 5 (టీమ్ లీడర్ల వరకు), జాబ్ లెవల్ 6 (మేనేజర్ల నుంచి వైస్ ప్రెసిడెంట్ల కంటే తక్కువ స్థాయి వరకు)లోని ఉద్యోగులకు వర్తిస్తాయి. లెవల్ 5లోని ఉద్యోగులు జనవరి 1 నుంచి పెరిగిన వేతన పరిధిలోకి వస్తారని కంపెనీ తెలిపింది. లెవల్ 6లోని ఉద్యోగులకు ఏప్రిల్ 1 నుంచి పెంపు అమల్లోకి వస్తుందని పేర్కొంది.ఇదీ చదవండి: భారత్-పాక్ మ్యాచ్.. విజేతగా ముఖేష్ అంబానీ!ఉద్యోగుల స్పందనతాజా వేతన పెంపుపై ఇన్ఫోసిస్ ఉద్యోగుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా కంపెనీ బలమైన ఆర్థిక పనితీరు దృష్ట్యా భారీ వేతన పెంపును ఆశించి కొందరు నిరాశకు గురైనట్లు తెలుపుతున్నారు. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ఇన్ఫోసిస్ నికర లాభం 11.4 శాతం పెరిగి 800 మిలియన్ డాలర్లకు, ఆదాయం 7.6 శాతం పెరిగి 4.9 బిలియన్ డాలర్లకు చేరింది. ఊహించిన దానికంటే తక్కువ వేతన పెంపు ఉన్నప్పటికీ ఇన్ఫోసిస్ ఆర్థికంగా మంచి పనితీరును కొనసాగిస్తోంది. -
భారత్-పాక్ మ్యాచ్.. విజేతగా ముఖేష్ అంబానీ!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఇటీవల భారత్-పాక్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ తన సత్తా చాటారు. దాంతోపాటు ఈ మ్యాచ్ ప్రారంభం కాకముందే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ రికార్డు సృష్టించారు. అదెలా అనుకుంటున్నారా.. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జియోహాట్‌స్టార్ భారత్-పాక్ మ్యాచ్‌ను ప్రసారం చేసే ప్రత్యేక హక్కులను కలిగి ఉంది. దాంతో కొన్ని గంటలపాటు సుమారు 12 కోట్ల మందికిపైగా ఈ మ్యాచ్‌ను వీక్షించారు. కంపెనీకి ఇతర ప్రసార హక్కులు, యాడ్ రెవెన్యూ ద్వారా బారీగానే ఆదాయం సమకూరినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. దాంతో భారత్-పాక్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడంతోపాటు దీన్ని అందరూ వీక్షించేందుకు ప్రసార హక్కులు సాధించిన ముఖేశ్ అంబానీ కూడా విజేతగానే నిలిచినట్లు భావిస్తున్నారు.రిలయన్స్ ఇటీవలే అధికారికంగా హాట్‌స్టార్‌తో కలిసి జియోహాట్‌స్టార్‌ను ఆవిష్కరించింది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ఇరు కంపెనీలకు ఎంతో లాభదాయకమని రెండు సంస్థలు గతంలో తెలిపాయి. ఇటీవల జరిగిన ఒక్కమ్యాచ్‌లోనే భారీగా రెవెన్యూ సంపాదించినట్లు మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ రసవత్తరంగా ఉంటుందని ముందే గ్రహించిన కోట్లాదిమంది వ్యూయర్స్ జియోహాట్‌స్టార్‌లో ఈ మ్యాచ్‌ను లైవ్‌లో వీక్షించారు. ఇది ప్లాట్‌ఫామ్ వ్యూయర్షిప్ను పెంచడమే కాకుండా ప్రకటనలు, సబ్స్క్రిప్షన్లను, సంస్థ ఆదాయాన్ని కూడా పెంచింది. అంతేకాకుండా, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలోని మరో ఛానెల్ స్పోర్ట్స్ 18 ఈ మ్యాచ్‌ను టెలివిజన్‌లో ప్రసారం చేసే హక్కులను కలిగి ఉంది. దీంతో అంబానీ కంపెనీ ఆన్లైన్, టీవీ వ్యూయర్షిప్ రెండింటి నుంచి లాభపడింది.ఇటీవల భారత్-పాక్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ తన సత్తా చాటారు. 242 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాలో కోహ్లీ సెంచరీ (111 బంతుల్లో 100) చేశారు. మరో 7.3 ఓవర్లు మిగిలి ఉండగానే ఆరు వికెట్ల తేడాతో భారత్ మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయం సెమీఫైనల్లో భారత్ స్థానాన్ని సుస్థిరం చేయడమే కాకుండా 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత వన్డేల్లో పాకిస్థాన్‌పై రికార్డు నెలకొల్పింది.ఇదీ చదవండి: గాల్లో ఎగిరే కారు వచ్చేసింది..! ధర ఎంతంటే..జియోహాట్‌స్టార్ ప్లాన్లు ఇలా..రూ.195 డేటా ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. 15GB డేటాను అందిస్తుంది. క్రీడలు, వినోద ప్రియులకు ఇది తగిన ఎంపికగా ఉంటుంది. ఇతర ప్రామాణిక రీఛార్జ్ ప్లాన్ల మాదిరిగా ఈ ఆఫర్లో వాయిస్ లేదా ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఉండవు. గుర్తించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇందులో లభించే జియోహాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ 90 రోజుల మొబైల్ ప్లాన్ మాత్రమే. అంటే యూజర్లు జియోహాట్‌స్టార్‌ను మొబైల్లో మాత్రమే వీక్షించగలరు.రీచార్జ్ ఇలా..వినియోగదారులు ఈ ఆఫర్‌ను మైజియో (MyJio) యాప్, జియో వెబ్సైట్ లేదా అధీకృత జియో రిటైలర్ల ద్వారా పొందవచ్చు. రీఛార్జ్ ప్రక్రియ ఇతర జియో ప్రీపెయిడ్ ప్లాన్ల మాదిరిగానే ఉంటుంది. థర్డ్-పార్టీ రీఛార్జ్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కూడా ఈ ప్లాన్ అందుబాటులో ఉంది.మరో ప్లాన్రూ.195 డేటా ప్లాన్‌తోపాటు జియో హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా వచ్చే మరో స్టాండర్డ్ ప్లాన్ కూడా అందుబాటులో ఉంది. అదే రూ.949 ప్లాన్. దీనికి 84 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. 2GB రోజువారీ డేటా, అపరిమిత 5G డేటా, 84 రోజుల పాటు జియో హాట్‌స్టార్ ఉచిత మొబైల్ సబ్స్క్రిప్షన్ ప్రయోజనాలను ఈ ప్లాన్ అందిస్తుంది. -
దేశంలో 100 ప్రాంతాలకు విస్తరించిన స్టార్ హెల్త్ హెచ్హెచ్సీ
ప్రముఖ ఆరోగ్య బీమా సంస్థ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్(star health) భారతదేశంలో హోమ్ హెల్త్ కేర్ (HHC) సర్వీస్‌ను 100 ప్రాంతాలకు విస్తరించినట్లు తెలిపింది. తమ కస్టమర్ బేస్‌లో 85 శాతం మంది ఈ సర్వీస్ పరిధిలోకి వచ్చినట్లు పేర్కొంది. హెచ్హెచ్సీ వల్ల కేవలం మూడు గంటల్లో ఇంటివద్దే వైద్య సంరక్షణను అందిస్తున్నట్లు తెలిపింది. రోగులకు అదనపు ఖర్చులు అవసరం లేకుండా నాణ్యమైన వైద్య సహాయం పొందేలా ఈ చర్యలు చేపట్టినట్లు కంపెనీ స్పష్టం చేసింది.ఈ సందర్భంగా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈఓ ఆనంద్ రాయ్ మాట్లాడుతూ..‘జులై 2023లో ప్రారంభించిన స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ హెచ్హెచ్సీ సర్వీసులు వేగంగా విస్తరిస్తున్నాయి. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఫైనాన్షియల్ కవరేజీని మించిన సాధనం. ప్రతి వ్యక్తికి అందుబాటులో ఉండేందుకు వీలుగా సరసమైన ధరలకే పాలసీలు అందిస్తున్నాం. అధిక హాస్పిటలైజేషన్ ఖర్చులు, లాజిస్టిక్ సవాళ్లను తొలగించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. నాణ్యమైన వైద్య సంరక్షణను వినియోగదారులకు చేరువ చేయడం ద్వారా ఎంతో మేలు జరుగుతుంది. వివిధ అంటువ్యాధుల బారిన పడిన రోగులకు హెచ్హెచ్సీ కార్యక్రమం ద్వారా సకాలంలో వైద్య సంరక్షణ అందుతుంది. ఈ కార్యక్రమం కింద రోగి పరిస్థితిని అంచనా వేయడానికి, రోగ నిర్ధారణను నిర్వహించడానికి ప్రత్యేకంగా వైద్యుడిని కేటాయిస్తారు. రోగి లక్షణాల మేరకు ఆసుపత్రిలో చేరడం అనవసరమని భావిస్తే అందుకు తగిన చికిత్సను సదరు వైద్యుడు ఇంటివద్దే అందిస్తాడు. క్రమం తప్పకుండా ఫాలోఅప్‌లు ఉంటాయి. తర్వాత రోగి ఆరోగ్య పరిస్థితి, తీవ్రత ఆధారంగా ఆసుపత్రిలో చేరేందుకు వైద్యుడు సిఫారసు చేయవచ్చు’ అని చెప్పారు.ఇదీ చదవండి: గాల్లో ఎగిరే కారు వచ్చేసింది..! ధర ఎంతంటే..‘ముంబై, ఢిల్లీ, పుణె వంటి నగరాలు ఈ సేవలను స్వీకరించడంలో ముందున్నాయి. ఈ హెచ్హెచ్సీ సేవలు ప్రధానంగా వైరల్ ఫీవర్, డెంగ్యూ, ఎంటరిక్ ఫీవర్, అక్యూట్ గ్యాస్ట్రోఎంటెరిటిస్, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు వంటి వాటికి చికిత్స అందించడంపై దృష్టి సారించాయి. హోమ్ అడ్మిషన్స్, హోమ్ బేస్డ్ కన్సల్టేషన్ల ద్వారా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ హోమ్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్ ద్వారా 15,000 మందికి పైగా రోగులు ప్రయోజనం పొందారు. హెచ్హెచ్సీ సర్వీసుల కోసం కేర్ 24, పోర్టియా, అర్గాలా, అతుల్య, అపోలోతో సహా ప్రముఖ ఆసుపత్రులతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాం’ అని ఆనంద్ రాయ్ తెలిపారు. -
మూడేళ్లలో రూ.2,000 కోట్ల ఆదాయం
ఎనర్జీ సొల్యూషన్స్ బిజినెస్ ద్వారా రానున్న మూడేళ్లలో రూ.2,000 కోట్ల టర్నోవర్ సాధించాలని గోద్రెజ్ ఎంటర్ప్రైజెస్ ఆశిస్తోంది. ఇందుకు డేటా సెంటర్ల వృద్ధి, తదితర అంశాలు దోహదపడతాయని భావిస్తోంది. కంపెనీ సమాచారం ప్రకారం ప్రస్తుతం ఆర్డర్ బుక్ విలువ రూ.2,400 కోట్లకు చేరింది. ప్రధానంగా 400కేవీ, 765 కేవీ విభాగాలలో శుద్ధ ఇంధన విద్యుత్ ప్రసారంలో కంపెనీ నాయకత్వ స్థాయిని ఇది వెల్లడిస్తున్నట్లు గోద్రెజ్ ఎంటర్ప్రైజెస్ పేర్కొంది. ఎనర్జీ, డిజిటల్ మౌలిక సదుపాయాలలో భారత్ వేగవంత మార్పులకు లోనవుతున్నట్లు తెలియజేసింది. ప్రధాన నగరాల్లో డేటా సెంటర్ల సామర్థ్యం వార్షికంగా 30 శాతం చొప్పున వృద్ధి చెందనున్నట్లు అంచనా వేసింది. సస్టెయినబుల్ ఎనర్జీ సొల్యూషన్స్‌పై జాతీయస్థాయిలో దృష్టి పెట్టినట్లు పేర్కొంది. యాక్సిస్ ఫైనాన్స్‌లో వాటాల విక్రయంపై యాక్సిస్ కసరత్తుబిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌పై దృష్టిన్యూఢిల్లీ: నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్యకలాపాలు నిర్వహించే యాక్సిస్ ఫైనాన్స్‌లో మెజారిటీ వాటాలను విక్రయించాలని యాక్సిస్ బ్యాంక్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం అడ్వైజరుతో కూడా బ్యాంకు కలిసి పని చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనిపై ఇంకా సంప్రదింపులు జరుగుతున్నాయని, వాటాల విక్రయంపై నిర్ణయమేదీ తీసుకోలేదని పేర్కొన్నాయి. ఒకవేళ ముందుకెళ్లే పక్షంలో, యాక్సిస్ ఫైనాన్స్‌కి యాక్సిస్ బ్యాంక్ 900 మిలియన్ డాలర్ల నుంచి బిలియన్ డాలర్ల వరకు వేల్యుయేషన్ అడిగే అవకాశం ఉందని వివరించాయి. యాక్సిస్ ఫైనాన్స్ వృద్ధికి బ్యాంకు గణనీయంగా నిధులు సమకూర్చినట్లు ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ జనవరిలో ఒక నివేదికలో తెలిపింది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఫైనాన్స్‌కి రూ.300 కోట్లు అందించినట్లు వివరించింది. యాక్సిస్ ఫైనాన్స్ ప్రధానంగా కార్పొరేట్, రియల్ ఎస్టేట్ రంగాలకు రుణాల సర్వీసులు అందిస్తోంది. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ నిధుల సమీకరణన్యూఢిల్లీ: జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ తాజాగా ప్రైవేట్ ప్లేస్మెంట్ ప్రాతిపదికన నాన్–కన్వర్టబుల్ బాండ్లను జారీ చేయడం ద్వారా రూ.1,100 కోట్లు సమీకరించింది. ఈ బాండ్లకు 5 శాతం కూపన్ రేటుతో 36 నెలల కాలపరిమితి ఉంటుంది. -
కేశోరామ్ విడదీత మార్చి1న
న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్ సిమెంట్ రంగ దిగ్గజం అ్రల్టాటెక్ బోర్డు కేశోరామ్ ఇండస్ట్రీస్‌కు చెందిన సిమెంట్ బిజినెస్ విడదీతకు నిర్ణయించింది. దీంతో 2025 మార్చి1 నుంచి విడదీత పథకం అమలుకానున్నట్లు అ్రల్టాటెక్ సిమెంట్ పేర్కొంది. దీని ప్రకారం కేశోరామ్ ఇండస్ట్రీస్ నుంచి సిమెంట్ బిజినెస్‌ను విడదీసి అ్రల్టాటెక్ సిమెంట్‌లో విలీనం చేస్తారు. మంగళవారం సమావేశమైన బోర్డు 1:52 నిష్పత్తిలో ఇందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు అ్రల్టాటెక్ వెల్లడించింది. కేశోరామ్ ఇండస్ట్రీస్ వాటాదారులకు తమ వద్ద గల ప్రతీ 52 షేర్లకుగాను 1 అ్రల్టాటెక్ షేరును జారీ చేస్తారు. కేశోరామ్ ప్రిఫరెన్స్ వాటాదారులకు 7.3 శాతంతో 54.86 లక్షల మార్పిడికి వీలుకాని రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్ల(ఎన్సీఆర్పీ)ను జారీ చేయనుంది.90 లక్షల(5 శాతం) క్యుములేటివ్ ఎన్సీఆర్పీల స్థానే వీటిని కేటాయించనుంది. అంతేకాకుండా 19.19 లక్షల ఆప్షనల్లీ కన్వర్టిబుల్ రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్ల స్థానే 7.3 శాతంతో 8.64 లక్షల ఎన్సీఆర్పీలను జారీ చేయనుంది. ఈ పథకానికి 2023 నవంబర్ 30న రెండు కంపెనీల బోర్డులూ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఆపై సీసీఐ, ఎన్సీఎల్టీ తదితర నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు సైతం లభించాయి.కాగా.. సిమెంట్ బిజినెస్ విడదీత తదుపరి ట్రాన్స్పరెంట్ పేపర్, రేయాన్ విభాగాలతో కేశోరామ్ ఇండస్ట్రీస్ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. మరోపక్క అ్రల్టాటెక్‌కు వార్షికంగా 7 మిలియన్ టన్నుల సిమెంట్ తయారీ సామర్థ్యం జత కలవనుంది. ప్రస్తుత అ్రల్టాటెక్ సిమెంట్ తయారీ సామర్థ్యం వార్షికంగా 183 మిలియన్ టన్నులుకాగా.. సిమెంట్ తయారీలో చైనా వెలుపల ప్రపంచంలోనే మూడో పెద్ద కంపెనీగా నిలుస్తోంది. -
జీసీసీల్లో హైరింగ్ జోరు
సాక్షి, బిజినెస్ డెస్క్: ఈ ఏడాది టెక్ నిపుణుల హైరింగ్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ), మిడ్–స్మాల్ ఐటీ కంపెనీలు ముందువరుసలో ఉండనున్నాయి. బడా ఐటీ కంపెనీలు కాస్త ఆచి తూచి వ్యవహరించనున్నాయి. అలాగే మిడ్–సీనియర్ స్థాయిల్లో నియామకాలు మెరుగ్గానే ఉండనున్నప్పటికీ ఎంట్రీ లెవెల్ స్థాయిలో మాత్రం హైరింగ్ నెమ్మదించవచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రాజెక్టులను అసైన్ చేయడానికి ముందు మళ్లీ ప్రత్యేకంగా శిక్షణనివ్వాల్సిన పరిస్థితి ఉండకూడదని కంపెనీలు భావిస్తుండటమే ఇందుకు కారణమని వివరించాయి. ఈ నేపథ్యంలోనే వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో పెద్ద ఎత్తున ఫ్రెషర్లను తీసుకోవడం కన్నా మిడ్ నుంచి సీనియర్ స్థాయి సిబ్బందిని తీసుకోవడానికే ప్రాధాన్యమివ్వొచ్చని పేర్కొన్నాయి.‘చాలా మంది ఫ్రెషర్లలో ఉద్యోగ నైపుణ్యాలు ప్రశ్నార్థకంగా ఉండటం వల్ల ఐటీ సర్వీసుల కంపెనీలు హైరింగ్ విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నాయి’ అని మైఖేల్ పేజ్ ఇండియా ప్రాంతీయ డైరెక్టర్ ప్రాంశు ఉపాధ్యాయ్ తెలిపారు. బహుళ జాతి సంస్థలు దేశీయంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు ఏర్పాటు చేస్తుండటం, విస్తరిస్తుండటంతో టెక్నాలజీ లో అనుభవమున్న ఉద్యోగులకు జీసీసీల్లో డిమాండ్ బాగా ఉంటోంది. టీమ్‌లీజ్ గణాంకాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 55 లక్షలుగా ఉన్న ఐటీ ఉద్యోగుల సంఖ్య 2027 ఆర్థిక సంవత్సరం నాటికి 65 లక్షలకు చేరే అవకాశం ఉంది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో టెక్ మహీంద్రా, టాటా కన్సల్టెన్సీ సర్విసెస్, ఇన్ఫోసిస్ మొదలైన సంస్థల్లో నియామకాలు పెరిగినా, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, కాగ్నిజెంట్ తదితర సంస్థల్లో తగ్గాయి. 2024లో నియామకాలు 5–7 శాతం తగ్గినప్పటికీ, మొత్తం మీద 2025లో హైరింగ్ వృద్ధి కాస్త సానుకూలంగా 8–12 శాతం స్థాయిలో ఉండొచ్చని ఉపాధ్యాయ్ పేర్కొన్నారు.స్పెషలైజ్డ్ నైపుణ్యాలకు డిమాండ్సాధారణ విధులకు సంబంధించి వేరే సంస్థలకు వెళ్లిపోయిన ఉద్యోగుల స్థానాలను భర్తీ చేయడం లేదా కొత్తవారిని తీసుకోవడమనేది 2024లో 8–10 శాతం మేర తగ్గినట్లు రాండ్‌స్టాడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే, చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఐటీ కంపెనీలు ప్రత్యేక టెక్ నైపుణ్యాలున్న వారిని నియమించుకునే ధోరణి పెరుగుతోందని పేర్కొన్నాయి. 2025లో ఏఐ, ఎంఎల్, డేటా అనలిటిక్స్, క్లౌడ్ టెక్నాలజీస్ తదితర విభాగాల్లో నిపుణులను దేశీ ఐటీ కంపెనీలు నియమించుకోవచ్చని వివరించాయి.ఉత్పాదకతపైనే ఫోకస్ కంపెనీలు ఉత్పాదకత, వ్యయాల నియంత్రణపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. అందుకే తక్కువ వేతనాలకే పెద్ద సంఖ్యలో ఫ్రెషర్లు దొరికే అవకాశం ఉన్నప్పటికీ నియామకాలపై సుముఖంగా లేవు. సాధారణంగా ఎంట్రీ లెవెల్ ఉద్యోగులు గరిష్ట స్థాయిలో ఉత్పాదకత సాధించాలంటే ఏడాది, రెండేళ్లు పట్టేస్తుందని, కంపెనీలు అంత కాలం నిరీక్షించే పరిస్థితి లేదని ఎగ్జిక్యూటివ్ సెర్చ్ సంస్థ ఏబీసీ కన్సల్టెంట్స్ వర్గాలు తెలిపాయి. ఉద్యోగులను నియమించుకున్న దగ్గర్నుంచే కంపెనీలు పనితీరు, ఉత్పాదకతను పరిశీలిస్తున్నాయని వివరించాయి. -
'ఐదు రోజులే పని.. వారాంతంలో నో ఈమెయిల్స్'
భారతదేశంలో పనిగంటలపై తీవ్రమైన చర్చలు జరుగుతూనే ఉన్నాయి. టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి వారానికి 70 గంటలు పనిచేయాలని చెబితే.. 90 గంటలు పనిచేయాలని ఎల్ & టీ చైర్మన్ సుబ్రమణ్యన్ చెప్పారు. ఇప్పుడు తాజాగా క్యాప్‌జెమిని సీఈఓ 'అశ్విన్ యార్డి' (Ashwin Yardi) వారానికి 47.5 గంటల పని సరిపోతుందని అన్నారు.ఉన్నత స్థాయి అధికారులు పని గంటలు ఎక్కువ చేయాలని పిలుపునిస్తుండగా.. క్యాప్‌జెమిని సీఈఓ అశ్విన్ యార్డి వారానికి 47.5 గంటల పని సరిపోతుందని, వారాంతాల్లో ఉద్యోగులకు పనికి సంబంధించిన ఎటువంటి ఈమెయిల్‌లు పంపవద్దని పిలుపునిచ్చారు. రోజుకి 9:30 గంటలు, వారానికి ఐదు రోజులు (47:30 గంటలు) పని చేస్తే చాలని నాస్కామ్ టెక్నాలజీ అండ్ లీడర్షిప్ ఫోరంలో వెల్లడించారు.ఇదీ చదవండి: 'ఐదు రోజులే పని.. వారాంతంలో నో ఈమెయిల్స్': క్యాప్‌జెమిని సీఈఓనాలుగు సంవత్సరాలుగా ఇదే ఫార్ములా పాటిస్తున్నానని.. కొన్ని సార్లు తప్పనిసరి అయితే మాత్రమే తాను వారాంతంలో పనిచేసినట్లు చెప్పారు. అయితే వారాంతంలో నేను పనిచేసినప్పుడు కూడా ఉద్యోగులకు ఈమెయిల్స్ పంపనని అని అన్నారు. అశ్విన్ యార్డి మాటలతో.. నాస్కామ్ చైర్పర్సన్ సింధు గంగాధరన్ కూడా ఏకీభవించారు. పని గంటల కంటే ఫలితాలు ముఖ్యమని నొక్కి చెప్పారు. మారికో సీఈఓ సౌగత గుప్తా కూడా ఇదే అభిప్రాయాన్ని పంచుకున్నారు.. కానీ అప్పుడప్పుడు రాత్రి 11.00 గంటల వరకు ఈమెయిల్‌లు పంపినట్లు అంగీకరించారు. -
పెళ్లి చేసుకుంటారా?.. ఉద్యోగం వదులుకుంటారా?: కంపెనీ వార్నింగ్
బ్యాచిలర్లకు మాత్రమే ఉద్యోగాలిచ్చే కంపెనీల గురించి విన్నాం. పెళ్లి చేసుకున్న వారికి జాబ్స్ ఇచ్చే కంపెనీలను చూసాం. కానీ పెళ్లి చేసుకోకపోతే ఉద్యోగం వదులుకోవాల్సి వస్తుంది అని అంటోంది ఓ సంస్థ. దీని గురించి మరిన్ని వివరాలు విపులంగా ఇక్కడ తెలుసుకుందాం.చైనాలోని 'షాన్డాంగ్ షుంటియన్ కెమికల్ గ్రూప్ కో. లిమిటెడ్' కంపెనీ ఒంటరిగా ఉన్న, విడాకులు తీసుకున్న ఉద్యోగులు సెప్టెంబర్ నాటికి వివాహం చేసుకోవాలి. లేకుంటే.. ఉద్యోగం వదులుకోవాల్సి వస్తుందని ఆదేశాలు జారీ చేసింది. అయితే వివాదాస్పద విధానాన్ని ప్రవేశపెట్టిన కంపెనీని అధికారులు మందలించారు.అధికారులు మందలించినప్పటికీ.. కంపెనీ మాత్రం తమ విధానాన్ని సమర్ధించుకుంది. దేశంలో వివాహ రేటు గణనీయంగా తగ్గుతోంది. వివాహ రేటును మెరుగుపరచాలనే ప్రభుత్వ పిలుపుకు మద్దతుగా ఈ ప్రకటన జారీ చేసినట్లు సంస్థ తెలిపింది. కానీ ఇది రాజ్యాంగ విరుద్ధమని న్యాయ నిపుణులు కూడా విమర్శించారు.ఇదీ చదవండి: రోజుకు రూ.27 కోట్లు విరాళం ఇచ్చిన వ్యక్తి.. ఈయన గురించి తెలుసా?కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం మీద.. పెకింగ్ యూనివర్సిటీ లా స్కూల్లో అసోసియేట్ ప్రొఫెసర్ 'యాన్ టియాన్' మాట్లాడుతూ.. చైనా కార్మిక చట్టాల ప్రకారం, కంపెనీలు ఉద్యోగ దరఖాస్తుదారులను వారి వివాహం లేదా పిల్లలు కనడానికి సంబంధించిన విషయాలను గురించి అడగడానికి అనుమతి లేదు. ఇది వారి స్వేచ్చకు భంగం కలిగించడం అవుతుందని అన్నారు. వివాదం ముదరడంతో.. కంపెనీ నోటీసును రద్దు చేస్తూ ఒక ఉత్తర్వు జారీ చేసింది. -
ఐదేళ్లలో రిలయన్స్ రూ.50,000 కోట్ల పెట్టుబడులు
అస్సాం ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) వచ్చే ఐదేళ్లలో రూ.50,000 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది. ‘అడ్వాంటేజ్ అస్సాం 2.0 ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్’ సందర్భంగా ఆర్ఐఎల్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ ఈమేరకు ప్రకటన చేశారు. టెక్నాలజీ, మౌలిక సదుపాయాలు, రిటైల్ విస్తరణ ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కంపెనీ ప్రతిష్టాత్మక ప్రణాళికలను వివరించారు. 2018లో జరిగిన సదస్సులో రాష్ట్రంలో రూ.5,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ హామీ ఇచ్చిందని, కానీ దానిని రూ.12,000 కోట్లకు పెంచామని అంబానీ గుర్తు చేశారు. విద్య, వైద్యం, వ్యవసాయం సహా వివిధ రంగాలకు ప్రయోజనం చేకూర్చేలా ఏఐను ఉపయోగించుకోవాలని ఈ సమ్మిట్ లక్ష్యంగా పెట్టుకుంది.కీలక పెట్టుబడి రంగాలుఏఐ డేటా సెంటర్: అస్సాంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-రెడీ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ఆర్ఐఎల్ యోచిస్తోంది. కృత్రిమ మేధ సహాయంతో ఉపాధ్యాయులు, వైద్యులు, రైతులు అస్సాం నివాసితుల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని కంపెనీ ఆశిస్తున్నట్లు అంబానీ తెలిపారు.మెగా ఫుడ్ పార్క్: అస్సాంలో సమృద్ధిగా ఉన్న వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులకు విలువను జోడించడానికి మెగా ఫుడ్ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ చర్య రాష్ట్ర రైతులకు మద్దతు ఇస్తుంది. ఫుడ్ ప్రాసెసింగ్, పంపిణీకి కొత్త అవకాశాలను సృష్టించడం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థను మెరుగవుతుంది.రిలయన్స్ రిటైల్ విస్తరణ: అస్సాంలో రిలయన్స్ రిటైల్ స్టోర్ల సంఖ్యను రెట్టింపు చేయాలని ఆర్ఐఎల్ యోచిస్తోంది. ఈ సంఖ్యను 400 నుంచి 800కు పెంచనుంది. ఈ విస్తరణ రిటైల్ ల్యాండ్ స్కేప్‌ను మెరుగుపరుస్తుంది. వినియోగదారులకు విస్తృత శ్రేణి ఉత్పత్తులను అందుబాటులో ఉంచేందుకు ఇది తోడ్పడుతుంది.క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ: అణు ఇంధనంతో సహా క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీకి అస్సాంను హబ్‌గా మార్చడంపై కూడా రిలయన్స్ దృష్టి సారించనుంది. అస్సాంలో రెండు కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్లాంట్లను ఆర్ఐఎల్ నిర్మించనుంది. ఇవి ఏటా 8 లక్షల టన్నుల క్లీన్ బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేస్తాయి. ప్రతిరోజూ రెండు లక్షల ప్యాసింజర్ వాహనాలకు ఇంధనం అందించేందుకు సరిపోతుంది.హై-ఎండ్ హాస్పిటాలిటీ: హై ఎండ్ హాస్పిటాలిటీ రంగాన్ని ప్రోత్సహించడానికి ఆర్ఐఎల్ అస్సాం నడిబొడ్డున విలాసవంతమైన సెవెన్ స్టార్ ఒబెరాయ్ హోటట్ను నిర్మించనుంది. పర్యాటకులను ఆకర్షించడం, రాష్ట్ర ఆతిథ్య ప్రమాణాలను పెంచడం ఈ అభివృద్ధి లక్ష్యం.ఇదీ చదవండి: లకారానికి దగ్గర్లో గోల్డ్రేటు.. ఈ దేశాల్లో చీప్‌గా కొనుగోలుఈ కార్యక్రమాలు అసోంలోని యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయని అంబానీ తెలిపారు. రిలయన్స్ ఫౌండేషన్ తన ‘స్వదేశ్’ స్టోర్ల ద్వారా గ్రీన్ గోల్డ్(వెదురు)ను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ అస్సాంతోపాటు ఈశాన్య రాష్ట్రాలను భారతదేశ అభివృద్ధిలో ప్రధానంగా నిలిపారని అంబానీ కొనియాడారు. -
రూ.26 లక్షల కోట్ల నిల్వలపై మౌనం వీడిన వారెన్ బఫెట్
బెర్క్ షైర్ హాత్వే ఇన్వెస్ట్మెంట్ సంస్థ సీఈఓ వారెన్ బఫెట్ ఎట్టకేలకు కంపెనీ వద్ద పోగైన 321 బిలియన్ డాలర్ల(సుమారు రూ.26 లక్షల కోట్లు) నగదు నిల్వలకు సంబంధించిన విషయాలు పంచుకున్నారు. బఫెట్ తన పెట్టుబడి వ్యూహాన్ని, తాను లక్ష్యంగా పెట్టుకోవాలనుకుంటున్న రంగాలను వివరిస్తూ షేర్ హోల్డర్లకు తాజాగా వార్షిక లేఖ విడుదల చేశారు.బెర్క్ షైర్ హాత్వే నగదు, ట్రెజరీ బిల్లు హోల్డింగ్స్ ఆల్ టైమ్ గరిష్టానికి చేరాయి. ఇది బఫెట్ పెట్టుబడి వ్యూహం, మార్కెట్ దృక్పథంపై ప్రశ్నలను లేవనెత్తింది. గత కొన్ని త్రైమాసికాలుగా బెర్క్ షైర్ ఈక్విటీ సెక్యూరిటీలను బారీగా అమ్ముతూ వచ్చింది. దాంతో కంపెనీ వద్ద దాదాపు 321 బిలియన్ డాలర్ల(సుమారు రూ.26 లక్షల కోట్లు) మొత్తం సమకూరింది. టాప్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఇలా భారీగా అమ్మకాలు చేపట్టడం వెనుక గల కారణాలపై ఊహాగానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లో అధిక వాల్యుయేషన్లు, ఆకర్షణీయమైన పెట్టుబడి అవకాశాలను కనుగొనడం సవాలుగా మారాయని బఫెట్ స్పష్టత ఇచ్చారు.వ్యూహాత్మక పెట్టుబడి ప్రణాళికలుబెర్క్ షైర్ హాత్వే పెట్టుబడి విధానం ఎల్లప్పుడూ మంచి వ్యాపారాలను సరసమైన ధరలకు కొనుగోలు చేయడంపై కేంద్రీకృతమై ఉంటుందని బఫెడ్ తెలిపారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులతో సరైన అవకాశాల కోసం ఓపికగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. బెర్క్ షైర్ నగదు నిల్వలను ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్న కొన్ని విభాగాలు కింది విధంగా ఉన్నాయి.ఈక్విటీ పెట్టుబడులు: ఈ విభాగంలో ఇటీవల స్టాక్ అమ్మకాలు ఉన్నప్పటికీ బఫెట్ స్థిర ఆదాయ పెట్టుబడుల కంటే ఈక్విటీలపై నమ్మకంగా ఉన్నట్లు తెలిపారు. బెర్క్ షైర్ మెరుగైన నియంత్రిత యాజమాన్యంలోని వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టేందుకు ప్రాధాన్యత ఇస్తుందని నొక్కి చెప్పారు.జపాన్ మార్కెట్‌పై ఆసక్తి: సంస్థ వద్ద ఉన్న నగదులో కొంత బఫెట్ జపాన్‌లోని ఐదు అతిపెద్ద వాణిజ్య సంస్థలైన ఇటోచు, మరుబెని, మిత్సుబిషి, మిత్సుయి, సుమిటోమోల్లో పెట్టుబడి పెంచాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఆయా కంపెనీల్లో బెర్క్ షైర్ హాత్వే ఇన్వెస్ట్ చేసింది.అమెరికా కంపెనీలు: బఫెట్ అధిక వాల్యుయేషన్ల విషయంలో అప్రమత్తంగా ఉన్నప్పటికీ తన పెట్టుబడి ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న యూఎస్ కంపెనీలను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. బెర్క్ షైర్ డీర్, యునైటెడ్ పార్సిల్ సర్వీస్, సీవీఎస్ హెల్త్ వంటి కంపెనీల్లో కొనుగోళ్లను పరిగణిస్తున్నట్లు తెలిపింది.ట్రెజరీ బిల్లులు: బెర్క్ షైర్ స్టాక్ అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని యూఎస్ ట్రెజరీ బిల్లుల్లో తిరిగి పెట్టుబడి పెడుతోంది. ఈ వ్యూహం మరింత ఆకర్షణీయమైన పెట్టుబడి అవకాశాల కోసం లిక్విడిటీ రాబడిని అందిస్తుంది.ఇదీ చదవండి: లకారానికి దగ్గర్లో గోల్డ్రేటు.. ఈ దేశాల్లో చీప్‌గా కొనుగోలుసహనం ప్రాముఖ్యతబఫెట్ ఇన్వెస్ట్మెంట్ విధానం పెట్టుబడిలో సహనం, క్రమశిక్షణ ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఓపిగ్గా వేచి చూస్తే తప్పకుండా మంచి రాబడులు అందుకోవచ్చని బఫెట్ నిరూపించారు. తక్కువ రిస్క్, గణనీయమైన రాబడిని అందించే అవకాశాల కోసం ఎదురుచూస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఈ వైఖరి చాలా సంవత్సరాలుగా బెర్క్ షైర్‌కు బాగా ఉపయోగపడింది. ఇది మార్కెట్ తిరోగమనాన్ని కూడా అవకాశంగా మలుచుకునేందుకు తోడ్పడింది. -
జెన్ఏఐకు దూరంగా ‘జెన్‌జెడ్’
వేగంగా అభివృద్ధి చెందుతున్న జనరేటివ్ ఏఐ (జెన్ఏఐ) ఐటీ పరిశ్రమకు కీలక శక్తిగా అవతరించిందని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) నివేదిక తెలిపింది. గ్లోబల్ ఔట్ సోర్సింగ్‌లో 58 శాతం వాటా కలిగిన ఇండియన్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ (ఐటీఈఎస్ )కు జెన్ఏఐ కీలకంగా మారింది. అయితే 80 శాతం మంది భారతీయ డెవలపర్లు జెన్ఏఐ ఉత్పాదకత ప్రయోజనాలను గుర్తిస్తుండగా, కేవలం 39 శాతం మంది మాత్రమే దీన్ని సమర్థవంతంగా ఉపయోగిస్తున్నారని పేర్కొంది. జెన్ జెడ్(2000 తర్వాత జన్మించినవారు) డెవలపర్లలో ఈ అంతరం మరింత విస్తృతంగా ఉందని చెప్పింది. కేవలం 31 శాతం జెన్ జెడ్ డెవలపర్లు ఈ జెన్ఏఐను వినియోగిస్తున్నట్లు బీసీజీ రూపొందించిన ‘ది జెన్ఏఐ అడాప్షన్ కొనండ్రమ్’ నివేదిక తెలిపింది.బీసీజీ నివేదికలోని అంశాలు..క్లౌడ్ కంప్యూటింగ్ ప్రభావంతో భారత్‌లో ఐటీ సేవలను మార్చే సామర్థ్యం జెన్‌ఏఐకి ఉంది.జెన్ఏఐను సమర్థవంతంగా వినియోగిస్తే ఐటీ పరిశ్రమ ఎన్నో రెట్లు అభివృద్ధి చెందుతుంది.భారత ఐటీ కంపెనీలు తమ ఉద్యోగుల ఉత్పాదకతను మెరుగుపరచడానికి జెన్ఏఐ సాధనాలను స్వీకరించే ప్రయత్నాలను వేగవంతం చేయాలి.జెన్ఏఐ రంగంలో గ్లోబల్‌గా పెట్టుబడులు పెరుగుతున్నాయి. అమెరికా, చైనా, ఈయూ, మిడిల్ ఈస్ట్ దేశాలు జెన్ఏఐని తమ వర్క్‌ఫ్లోలో ఏకీకృతం చేసేందుకు దృష్టి సారించాయి.భారత్ కూడా ఐటీ సేవల రంగంలో ఈ మేరకు ప్రయత్నాలు చేయకపోతే ఈ విభాగంలో నాయకత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.భారత్ కొన్నేళ్లుగా ప్రపంచ ఐటీ సేవలకు సారథ్యం వహిస్తోంది. సంక్లిష్ట కోడింగ్, సాఫ్ట్ వేర్ అభివృద్ధి, డిజిటల్ అప్లికేషన్లను పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది. అయితే సాఫ్ట్వేర్ ఎలా నిర్మిస్తారో, ఎలా టెస్ట్ చేస్తారో, దాన్ని ఎలా ఉపయోగిస్తారో వంటి చాలా అంశాలను జెఎన్ఏఐ నిర్వహిస్తోంది. ఇలాంటి సందర్భాల్లో ఐటీ పరిశ్రమ సంప్రదాయ పద్ధతులపై మాత్రమే ఆధారపడటం సరికాదు.పునరావృతమయ్యే పనులను ఆటోమేట్ చేసేందుకు జెన్ఏఐను వాడుతున్నారు. డెవలపర్లు సాధారణంగా వాడే కోడింగ్ పనులపై తక్కువ సమయం గడిపేందుకు, సమస్యలను సృజనాత్మకంగా పరిష్కారించేందుకు ఎక్కువ సమయం కేటాయించేందుకు ఇంది ఎంతో ఉపయోగపడుతుంది.ఏఐ మంచిదే.. కానీ..భారతీయ డెవలపర్లలో 39 శాతం మంది మాత్రమే జెఎన్ఏఐ సాధనాలను నమ్మకంగా వాడుతున్నారు. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి.శిక్షణ, సరైన వనరులు: సమగ్ర శిక్షణా కార్యక్రమాలు, సరైన వనరులు పరిమితంగా అందుబాటులో ఉన్నాయి. దాంతో చాలా మంది డెవలపర్లకు జెఎన్ఏఐ సామర్థ్యం గురించి తెలిసినప్పటికీ, దాని పూర్తి సామర్థ్యాలను ఉపయోగించుకోవడానికి అవసరమైన నిర్మాణాత్మక మార్గదర్శకత్వాలు లేకుండా పోతున్నాయి.ఇంటిగ్రేషన్ సమస్యలు: ప్రస్తుత పని విధానంలో కొన్నిసార్లు జెన్ఏఐను చేర్చడం సులభం కాదు. డెవలపర్లకు సాఫ్ట్వేర్ ఇంటిగ్రేషన్ అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. కోడింగ్ పద్ధతుల్లో సర్దుబాట్ల చేయాల్సి ఉంటుంది.మార్పునకు దూరంగా: సంప్రదాయ కోడింగ్ పద్ధతులకు అలవాటు పడిన డెవలపర్లు నైపుణ్యాలు అభివృద్ధి చేసుకుని జెన్ఏఐను వాడడం కొంత సవాలుతో కూడుకుంది. చాలా సందర్భాల్లో కొత్త సాంకేతికతలను స్వీకరించడానికి సంకోచించవచ్చు.జెన్ జెడ్: గ్రాడ్యుయేషన్ పూర్తయి కొత్తగా ఉద్యోగంలో చేరిన జెన్ జెడ్ కేటగిరీ యువతలో జెన్ఏఐ నైపుణ్య అంతరాలు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాము అధికంగా డిజిటల్ ప్లాట్ఫామ్ల్లో సమయం గడుపుతున్నప్పటికీ కేవలం 31 శాతం మంది మాత్రమే జెఎన్ఏఐ నైపుణ్యాలను కలిగి ఉంటున్నారు. అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి.అనుభవం లేకపోవడం: జెన్ జెడ్ డెవలపర్లు సాధారణంగా కెరియర్ ప్రారంభ దశలో ఉంటారు. అధునాతన జెన్ఏఐ సాధనాల్లో వారికి తగినంత శిక్షణ ఉండకపోవచ్చు.విద్యా అంతరాలు: ప్రస్తుత విద్యా విధానంలో కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్‌లో తాజా పురోగతిని తగినంతగా కవర్ చేయకపోవచ్చు. ఇది యువ డెవలపర్లకు సవాలుగా మారుతుంది.సరైన వనరులు లేకపోవడం: నేర్చుకోవాలని ఉన్నా ఆర్థిక కారణాలు, అత్యాధునిక సాధనాలు, సరైన వనరులు అందుబాటులో లేకపోవడం కూడా జెన్ జెడ్ డెవలపర్లలో ఈ నైపుణ్యాలు కొరవడేందుకు కారణాలుగా ఉన్నాయి.ఆర్థిక అనిశ్చితి: వెండర్ కన్సాలిడేషన్(సర్వీసులు పొందేవారి సంఖ్యలో మార్పులు), అనిశ్చితుల వల్ల కుంచించుకుపోతున్న మార్కెట్లు సవాలుగా మారుతున్నాయి.పెరుగుతున్న కస్టమర్ ఆకాంక్షలు: వేగంగా మారుతున్న ఈ విభాగంలో కస్టమర్లు ఆకాంక్షలు పెరుగుతున్నాయి.రెగ్యులేటరీ నిబంధనలు: కఠినమైన డేటా గోప్యతా చట్టాలను అనుసరించడం, వాటికి తగ్గట్టుగా పరిమితులను సిద్ధం చేసుకోవడం క్లిష్టంగా మారుతుంది.ఈ అంతరాన్ని పూడ్చడం ఎలాజెన్ఏఐ ఉత్పాదకత ప్రయోజనాలను పూర్తిగా వినియోగించుకునేందుకు, నైపుణ్య అంతరాన్ని పూడ్చడానికి సమష్టి ప్రయత్నాలు అవసరం.సమగ్ర శిక్షణా కార్యక్రమాలు: సంస్థాగత, విద్యా స్థాయుల్లో మెరుగైన శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. విభిన్న డెవలపర్లతో ప్రత్యేక సెషన్లను నిర్వహించాలి. పరిశ్రమకు అవసరమయ్యే నిర్దిష్ట అవసరాలను తీర్చే ప్రోగ్రామ్‌లు నైపుణ్యాన్ని పెంపొందించడంలో సహాయపడతాయి.మెంటార్ షిప్: మార్గదర్శకత్వాన్ని ప్రోత్సహించాలి. పీర్ లెర్నింగ్ సంస్కృతిని పెంపొందించాలి. జెన్ఏఐ వాడకాన్ని వేగవంతం చేయాలి. అనుభవజ్ఞులైన డెవలపర్లు తమకంటే తక్కువ నైపుణ్యం కలిగిన తోటివారికి మార్గనిర్దేశం చేయవచ్చు.జెన్ ఏఐ వినియోగం పెంచాలి..బీసీజీ మేనేజింగ్ డైరెక్టర్, సీనియర్ పార్టనర్ రాజీవ్ గుప్తా మాట్లాడుతూ..‘జెఎన్ఏఐ వేగాన్ని అందుకోవాలంటే భారతీయ ఐటీ రంగం నిబద్ధతతో దానికి నాయకత్వం వహించాలి. అత్యవసరంగా జెన్ఏఐని వినియోగాన్ని పెంచాలి. కృత్రిమ మేధ ఆధారిత సేవల భవిష్యత్తును రూపొందించే హక్కును సంపాదించాలి. ఈ విభాగంలో వస్తున్న మార్పులను స్వీకరించి ప్రపంచానికి నాయకత్వం వహించేలా చర్యలు చేపట్టాలి. లేదంటే ఐటీ విభాగంలో భారత్ ప్రస్తుతం స్థానం కోల్పోతుంది’ అన్నారు.ఆదరణ పెరుగుతున్నా వాడకానికి సంకోచంబీసీజీ ఎండీపీ సంభవ్ జైన్ మాట్లాడుతూ..‘జెఎన్ఎఐకు ఆదరణ పెరుగుతున్నా 40 శాతం కంటే తక్కువ మంది దాని వాడడానికి సంకోచిస్తున్నారు. అవకాశం ఉన్నా దాన్ని వినియోగించుకోవడం లేదు. ఇది ఫార్ములా 1 రేసింగ్ కారును వాకింగ్ స్పీడ్ కోసం ఉపయోగించినట్లుంది. జెన్‌జెడ్ జెన్ఏఐ తరం అని నమ్ముతున్నారు. కానీ అందుకు విరుద్ధంగా 31 శాతం జెన్‌జెడ్ యువతే దీన్ని వినియోగిస్తున్నారు’ అని తెలిపారు.ఎలా ఉపయోగించాలో తెలియదు..బీసీజీ పార్టనర్ షావీ గాంధీ మాట్లాడుతూ..‘జెఎన్ఏఐ వాడకానికి సంబంధించి డెవలపర్లు సుపరిచిత సాధనాలు, వర్క్ ఫ్లోలకు అలవాటుపడ్డారు. అందులో నుంచి బయటకు రావడానికి వారికి కష్టంగా మారుతుంది. జెన్ఏఐ దీర్ఘకాలిక విలువ గురించి వీరు నమ్మకంగా లేరు. దాంతో తరచు ఉద్యోగాలు మారేందుకు భయపడుతున్నారు. దాదాపు సగం మంది డెవలపర్లకు తమ వర్క్ ఫ్లోలో టూల్ సామర్థ్యాలను ఎలా పూర్తిగా ఉపయోగించుకోవాలో తెలియడం లేదు. 90వ దశకంలో కొత్త ఇంటర్నెట్ వచ్చిన కొత్తలో దాన్ని ఉపయోగించడానికి నిరాకరించినట్లే ప్రస్తుతం జెన్ఏఐ వాడేందుకు భయపడుతున్నామా’ అని సందేహం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: ఐటీలో వేతన పెంపు ఎంతంటే..అవేర్నెస్ ముఖ్యం..డెవలపర్లు ఐదు లేదా అంతకంటే ఎక్కువ ట్రెయినింగ్ సెషన్లను పొందినప్పుడు జెఎన్ఏఐ అడాప్షన్ 16% నుంచి 48%కు పెరుగుతుంది. 92% ఎంటర్ప్రైజ్ క్లయింట్లు ఏఐ ఆధారిత సేవల కోసం ప్రీమియం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే వారికి స్పష్టమైన ప్రణాళికలు, రుజువులు అవసరం అవుతాయి. సంస్థలు ఏఐ ఉత్పాదకతను శాస్త్రీయంగా ట్రాక్ చేయాలి. సామర్థ్యం, నాణ్యత, అవుట్ పుట్ అంతటా ఏఐ ప్రభావాన్ని పరిగణలోకి తీసుకోవాలి. -
ఐటీలో వేతన పెంపు ఎంతంటే..
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) సేవల రంగంలో ఈ ఏడాది (2024–25) వేతన పెంపు మోస్తరుగానే ఉండొచ్చని పరిశ్రమకు చెందిన నిపుణులు అంచనా వేస్తున్నారు. సగటున 4–8.5 శాతం మధ్య పెంపు ఉండొచ్చని భావిస్తున్నారు. అంతకుముందు సంవత్సరాలతో పోలిస్తే ఇది తక్కువ కావడం గమనార్హం. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితుల నేపథ్యం, కృత్రిమ మేథ (ఏఐ) వినియోగం పెరుగుతుండడం, నైపుణ్యాలకు డిమాండ్ తదితర పరిస్థితులను ఇందుకు నిదర్శంగా ప్రస్తావిస్తున్నారు. ఏఐ, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ ఇంజనీరింగ్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, డేటా సైన్స్, బ్లాక్ చైన్ డెవలప్మెంట్ తదితర కీలక నైపుణ్యాలున్న వారికి మరింత అధికంగా వేతన పెంపులు లభించొచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. వేతన పెంపు విషయంలో ఐటీ కంపెనీలు అప్రమత్త ధోరణి అనుసరించొచ్చని టీమ్‌లీజ్ డిజిటల్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణవిజ్ అభిప్రాయపడ్డారు.‘ఐటీ కంపెనీల్లో వేతన పెంపు 4–8.5 శాతం మధ్య ఉండొచ్చు. క్రితం సంవత్సరాల కంటే తక్కువ. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక సవాళ్లు, విచక్షణారహిత వ్యయాల తగ్గింపు, వ్యాపార ప్రాధాన్యతల్లో మార్పుతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో ఏప్రిల్–జూన్ మధ్య సాధారణంగా చేపట్టే వేతన పెంపును మరింత జాప్యం చేయొచ్చు’ అని వివరించారు. సంస్థలు వేతన పెంపునకు బదులు రిటెన్షన్ బోనస్ (కంపెనీతోనే కొనసాగితే), ఇ–సాప్లు, ప్రాజెక్ట్ ఆధారిత ఇన్సెంటివ్‌లు ఇవ్వొచ్చన్నారు. 5–8.5 శాతం..ఈ ఏడాది ఐటీలో వేతనాల పెంపు 5–8.5 శాతం మధ్య ఉండొచ్చని రీడ్ అండ్ విల్లో సీఈవో జానూ మోతియాని అంచనా వేశారు. ‘రెండంకెల వేతన పెంపులు ఇప్పటికైతే గతమే. పరిశ్రమ వ్యాప్తంగా అప్రమత్త ధోరణి నెలకొంది. టీసీఎస్ 4–8 శాతం మధ్య వేతన పెంపును (ఏప్రిల్ నుంచి) ప్రకటించడం ద్వారా మిగిలిన పరిశ్రమ వ్యాప్తంగా ఇదే తరహా పెంపునకు బాటలు వేసింది’ అని వివరించారు. ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, టెక్ మహీంద్రా ఇంకా తుది ప్రకటనలు చేయలేదని, అవి రక్షణాత్మక ధోరణితో అడుగులు వేస్తున్నట్టుందన్నారు. ఏఐ ఆధారిత సామర్థ్యాలకు డిమాండ్ పెరుగుతుండడం, క్లయింట్ డిమాండ్లలో మార్పులు ఐటీ కంపెనీల వేతన బడ్జెట్ కేటాయింపులను ప్రభావితం చేస్తున్నట్టు చెప్పారు.ఇదీ చదవండి: పీఎస్‌యూ బ్యాంకుల్లో వాటా విక్రయంపై దృష్టివలసలూ తగ్గాయ్..ఐటీ రంగంలో వలసల రేటు (ఉద్యోగులు కంపెనీలను వీడడం) 2023లో 18.3 శాతం ఉంటే, 2024 చివరికి 17.7 శాతానికి తగ్గడం గమనించొచ్చు. వలసల రేటు నిదానించడంతో వారిని కాపాడుకునేందుకు రిటెన్షన్ బోనస్, దూకుడుగా పారితోషికాలు ఇవ్వాల్సిన అత్యవసర పరిస్థితి లేకపోవడాన్ని మోతియాని ప్రస్తావించారు. సగటు వేతన పెంపులు 6–10 శాతం మధ్య ఉండొచ్చని, ఏఐ తదితర డిమాండ్ నైపుణ్యాలు కలిగిన మధ్యస్థాయి నుంచి సీనియర్ ఉద్యోగులకు అధిక వేతన పెంపు లభించొచ్చని అడెకో ఇండియా అంచనా వేసింది. ‘ఫ్రెషర్లకు వేతన పెంపులు 2–4 శాతం మధ్య ఉండొచ్చు. ఏఐ, సైబర్ సెక్యూరిటీ తదితర ప్రత్యేక నైపుణ్యాలున్న వారికి 10–12 శాతం వరకు కూడా వేతనాలు పెరగొచ్చు. సీనియర్ లెవల్ నిపుణులు, ముఖ్యంగా కీలకమైన టెక్నికల్ విధులు, నాయకత్వ బాధ్యతల్లో ఉన్న వారికి 12–15 శాతం మధ్య వేతన పెంపు ఉండొచ్చు’ అని అడెకో ఇండియా కంట్రీ మేనేజర్ సునీల్ చెమ్మన్‌కోటిల్ తెలిపారు. ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ (ఐబీఈఎఫ్) ప్రకారం దేశ జీడీపీలో ఐటీ రంగం వాటా 7 శాతంగా ఉంది. -
భారత్‌లో ఎల్జీ ఛైర్మన్ పర్యటన
న్యూఢిల్లీ: భారత్‌లో లిస్టింగ్‌పై ఎల్జీ ఎల్రక్టానిక్స్ ఇండియా కసరత్తు చేస్తున్న నేపథ్యంలో కంపెనీ మాతృ సంస్థ ఎల్జీ కార్పొరేషన్ చైర్మన్ ‘క్వాంగ్ మో కూ’ భారత పర్యటనకు వచ్చినట్లు సమాచారం. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఎల్జీ ఎల్రక్టానిక్స్ ఇండియా ఎండీతో పాటు పలు సీనియర్ అధికారులతో ఆయన భేటీ అవుతారని, ఐపీవో సన్నాహాల గురించి తెలుసుకుంటారని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అలాగే పెట్టుబడుల ప్రణాళికలను చర్చించవచ్చని వివరించాయి.గ్రేటర్ నోయిడాలోని కంపెనీ ప్లాంటును ఆయన సందర్శించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వ వర్గాలతో కూడా భేటీ అవుతారా లేదా అనే అంశంపై స్పష్టత రాలేదు. ఐపీవో ద్వారా ఎల్జీ ఎల్రక్టానిక్స్ 1.5 బిలియన్ డాలర్ల వరకు సమీకరించనున్న సంగతి తెలిసిందే. ఇది పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) రూపంలో ఉంటుంది. ఈ పబ్లిక్ ఇష్యూకి సంబంధించి కంపెనీ రోడ్‌షోలు కూడా నిర్వహిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఎల్జీ ఎల్రక్టానిక్స్ ఇండియా ఆదాయం రూ. 64,088 కోట్లుగా నమోదైంది. -
డీబీఎస్‌లో 4000 ఉద్యోగాలు కట్
ముంబై: అంతర్జాతీయ బ్యాంకింగ్ సంస్థ డీబీఎస్ గ్రూప్ కృత్రిమ మేధ (ఏఐ) అమలుతో వచ్చే మూడేళ్లలో 10 శాతం మేర సిబ్బందిని తగ్గించుకోనున్నట్టు ప్రకటించింది. తమ కార్యకలాపాల్లో ఏఐని మరింత పెద్ద ఎత్తున వినియోగించనున్నట్టు సంస్థ సీఈవో పీయూష్ గుప్తా తెలిపారు. డీబీఎస్ గ్రూప్‌లో 15 ఏళ్ల తన పదవీ కాలంలో మొదటిసారి ఉద్యోగాల సృష్టి పరంగా ఇబ్బందిని ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. ఏఐ అన్నది భిన్నమైనదని, గతంలో వచ్చిన మరే ఇతర సాంకేతిక పరిజ్ఞానం మాదిరి కాదన్నారు. వచ్చే మూడేళ్లలో 4,000 మంది (10 శాతం) సిబ్బంది తగ్గిపోనున్నట్టు తన ప్రస్తుత అంచనాగా చెప్పారు. నాస్కామ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడారు. ‘‘ఏఐ ఎంతో శక్తిమంతమైనది. తనను తాను సొంతంగా ఆవిష్కరించుకోగలదు. మరొకరిని అనుసరించగలదు. ఇది ఎంతో భిన్నమైనది. గత పదేళ్లలో గ్రూప్‌లో ఉద్యోగాల కోత అన్నదే లేదు’’అని గుప్తా ఏఐ రాకతో గ్రూప్ స్థాయిలో చోటుచేసుకోనున్న మార్పులను వివరించారు. డీబీఎస్ గ్రూప్ రెండేళ్ల క్రితమే జెనరేటివ్ ఏఐ సొల్యూషన్లను అమలు చేయడం ప్రారంభించిందని, ఇందుకు సంబంధించి పూర్తి ప్రయోజనాలను ఇంకా చవిచూడాల్సి ఉందన్నారు. కస్టమర్లను చేరుకోవడం, క్రెడిట్ అండర్‌రైటింగ్ (రుణ వితరణ), నియామకాల్లో ఏఐని డీబీఎస్ గ్రూపు అమలు చేస్తోంది. కాంట్రాక్టు సిబ్బందే.. వచ్చే మూడేళ్లలో 4,000 మందితగ్గింపు అన్నది ప్రధానంగా కాంట్రాక్టు, తాత్కాలిక సిబ్బంది రూపంలోనే ఉంటుందని డీబీఎస్ గ్రూప్ వివరణ ఇచ్చింది. సహజంగా కంపెనీ నుంచి వెళ్లిపోయే ఉద్యోగుల రూపంలోనూ సిబ్బంది తగ్గనున్నట్టు తెలిపింది. -
బంగారు ఆభరణాల తయారీ ఛార్జీలపై డిస్కౌంట్
హైదరాబాద్: ప్రముఖ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెల్లరీ సంస్థ భీమా జ్యువెల్స్ ‘అద్భుతమైన ఫిబ్రవరి’ ఆఫర్ ప్రకటించింది. బంగారు, వెండి ఆభరణాల తయారీ చార్జీలపై 70% డిస్కౌంట్ అందిస్తుంది. వజ్రాభరణాలపై క్యారెట్‌కు రూ.7,000 తగ్గింపుతో పాటు ప్రతి క్యారెట్‌తో ఒక గ్రాము బంగారు నాణెం ఉచితంగా పొందవచ్చు. ప్రతి వారం నిర్వహించే ‘గ్రాండ్ వీక్లీ లక్కీ డ్రా’ ద్వారా 20 మంది కస్టమర్లు అప్రిలియా స్కూటర్ గెలుచుకోవచ్చు. స్క్రాచ్ అండ్ విన్ క్యాష్ ఆఫర్లో భాగంగా ప్రతి గ్రాముకు రూ.150 వరకు క్యాష్ బ్యాక్ గెలుచుకోవచ్చు. ఇప్పటికే మొదలైన ‘అద్భుతమైన ఆఫర్’ ఫిబ్రవరి 28 వరకు అందుబాటులో ఉంటుందని, కస్టమర్లు సది్వనియోగం చేసుకోవాలని కంపెనీ తెలిపింది. -
మస్క్ గొప్ప పని చేస్తున్నాడు, కానీ..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ప్రపంచ కుబేరుడు 'ఎలాన్ మస్క్' (Elon Musk)ను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ఫెడరల్ వర్క్‌ఫోర్స్‌ను పునర్నిర్మించడానికి చేసిన ప్రయత్నాలను కొనియాడుతూ.. మరింత దూకుడుగా వ్యవహరించాలని అన్నారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.''ఎలాన్ గొప్ప పని చేస్తున్నాడు, కానీ అతను మరింత దూకుడుగా ఉండటం నేను చూడాలనుకుంటున్నాను. గుర్తుంచుకోండి, మనం కాపాడుకోవాల్సిన దేశం ఉంది, ఇంతకు ముందు కంటే గొప్పగా చేయాలి" అని అన్నారు. దీనికి మస్క్ రిప్లై ఇస్తూ.. ''చేస్తాను మిస్టర్ ప్రెసిడెంట్'' అని అన్నారు.డొనాల్డ్ ట్రంప్.. ఆదేశాల మేరకు ఫెడరల్ ఉద్యోగులందరికీ ఒక మెయిల్ వస్తుందని, గత వారం వారంతా ఏం పనిచేశారో రిపోర్ట్ ఇవ్వాలన్నారు. ఎవరైతే ఈ మెయిల్‌కు స్పందించరో వారు రాజీనామా చేసినట్లుగా భావించాల్సి వస్తుందని ఎలాన్ మస్క్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: రోజుకు రూ.27 కోట్లు విరాళం ఇచ్చిన వ్యక్తి.. ఈయన గురించి తెలుసా?మస్క్ తన ట్వీట్లో చెప్పినట్లుగానే ఉద్యోగులకు శనివారం రాత్రి మెయిల్స్ అందాయి. ఈ మెయిల్లో ఐదు బుల్లెట్ పాయింట్లలో ప్రశ్నలు అడిగారు. గత వారం మీరు మీ పనిలో ఏం సాధించారనేది ఆ ప్రశ్నల సారాంశం. ఈ మెయిల్‌కు సమాధానమిచ్చేందుకు ఉద్యోగులకు సోమవారం రాత్రి దాకా సమయమిచ్చారు. అయితే మెయిల్‌కు సమాధానమివ్వని వారిపై ఏం చర్య తీసుకుంటారన్నది ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.Will do, Mr. President! pic.twitter.com/2VMS2wY7mw— Elon Musk (@elonmusk) February 22, 2025 -
రూ.1,655 కోట్లతో హైదరాబాద్‌లో ‘ఆమ్జెన్’ జీసీసీ
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ ఫార్మా రాజధానిగా పేరొందిన హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ దిగ్గజ ఫార్మా కంపెనీ తన జీసీసీ (గ్లోబల్ కేపబిలిటీ సెంటర్)ని ప్రారంభించింది. అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాకు చెందిన ‘ఆమ్జెన్’ హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ ప్రాంతంలో తన కార్యకలాపాలను ప్రారంభించింది.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఈ కేంద్రాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఆమ్జెన్ సీఈవో రాబర్ట్ బ్రాడ్వే, ఆమ్జెన్ ఇండియా ఉన్నతాధికారి నవీన్ గుళ్లపల్లి తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. జీవశాస్త్ర రంగం, బయోటెక్నాలజీ, ఫారా, డేటాసైన్స్, కృత్రిమ మేథ రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఆమ్జెన్ లాంటి కంపెనీలు ఇక్కడ తమ జీసీసీలను ఏర్పాటు చేయడం ఎంతైనా ఆహ్వానించదగ్గ పరిణామమని అన్నారు.‘‘రోగుల జీవితాల్లో మెరుగైన మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న ఆమ్జెన్కు స్వాగతం. బయోటెక్ హబ్‌గా హైదరాబాద్ స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు ఆమ్జెన్ లాంటి కంపెనీలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఏడాది క్రితం ఆమ్జెన్తో తొలిసారి మాట్లాడామని, ఆ తరువాత అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో ఆమ్జెన్ కేంద్రాన్ని సందర్శించిన తరువాత హైదరాబాద్‌లో జీసీసీ ఏర్పాటుకు అంగీకరించారని ముఖ్యమంత్రి వివరించారు. ఆమ్జెన్ లాంటి కంపెనీలు తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని, తెలంగాణ స్థూల జాతీయోత్పత్తిని లక్ష కోట్ల డాలర్లకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు.అంతకుమునుపు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఆమ్జెన్ జీసీసీ కేంద్రం ఏర్పాటు ఉద్యోగావకాశాలు కల్పించడానికి మాత్రమే పరిమితం కారాదని, ఆకాంక్షించారు. హైదరాబాద్ పరిసరాల్లోని పరిశోధన సంస్థలు, యూనివర్శిటీలతో కలిసి సంయుక్తంగా పరిశోధనలు, ప్రాజెక్టులు చేపట్టాలని ముఖ్యమంత్రి కోరారు.‘‘ఆమ్జెన్ లాంటి సంస్థలు హైదరాబాద్‌లో తమ జీసీసీలు ఏర్పాటు చేస్తూండటం తెలంగాణ సామర్థ్యాన్ని మరింత పెంచేది.. మరిన్ని అవకాశాలను కల్పించేది. అలాగే బయోటెక్, టెక్నాలజీ రంగాలు రెండింటిలోనూ అత్యద్భుత ఆవిష్కరణలకు వీలు కల్పించేది’’ అని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. అంతర్జాతీయ కంపెనీలకు అనువైన సిబ్బందిని తయారు చేసే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ ద్వారా రేపటి తరం ఫార్మా ఉద్యోగుల తయారీకి తగిన శిక్షణ కార్యక్రమాలను తయారు చేసి అమలు చేయాలని కోరారు. ప్రస్తుత ఉద్యోగులకు కొత్త నైపుణ్యాలను అందించడం, అప్‌స్కిల్లింగ్ కూడా చేపట్టాలని సూచించారు. ఆమ్జెన్ పెద్ద ఎత్తున చేపట్టిన పరిశోధనలు వ్యక్తిగత వైద్యాన్ని మనిషికి మరింత దగ్గర చేస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.‘‘తెలంగాణ అభివృద్ధి ఆకాంక్షలకు ఆమ్జెన్ ఇండియా ఒక నిదర్శనం. అలాగే ప్రపంచ స్థాయిలో ఆరోగ్య పరిరక్షణకు చేస్తున్న ప్రయత్నాల దిశగా పడిన మరో ముందడుగు. భారత్‌లోని ప్రపంచస్థాయి బయోటెక్ ఎకోసిస్టమ్‌కు మా వంతు తోడ్పాటు అందించేందుకు మేము సిద్ధం. అలాగే భారత నైపుణ్యానికీ స్వాగతం పలుకుతున్నాం.’’ అని ఆమ్జెన్ ఇండియా నేషనల్ ఎగ్జిక్యూటివ్ సోమ్ ఛటోపాధ్యాయ అన్నారు. 200 మి.డాలర్ల పెట్టుబడి..ఆమ్జెన్ హైదరాబాద్ జీసీసీ కోసం 200 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతున్నామని.. రానున్న రోజుల్లో ఈ మొత్తం మరింత పెరుగుతుందని కంపెనీ ఛైర్మన్, సీఈవో రాబర్ట్ బ్రాడ్వే తెలిపారు. ప్రస్తుతం ఈ కేంద్రంలో 300 మంది పని చేస్తూండగా.. మరో 300 మంది చేరబోతున్నారని, ఈ ఏడాది చివరికల్లా ఉద్యోగుల సంఖ్య రెండు వేలకుపైబడి ఉంటుందని ఆయన వివరించారు. 1980లో దక్షిణ కాలిఫోర్నియాలో ప్రారంభమైన ఆమ్జెన్ ప్రస్తుతం వంద దేశాలకు విస్తరించింది, మొత్తం 28 వేల మంది ఇందులో పని చేస్తున్నారని రాబర్ట్ తెలిపారు. బయోటెక్‌తోపాటు అత్యాధునిక డిజిటల్ టెక్నాలజీలు, ఏఐల సాయంతో ఎన్నో వ్యాధులకు మెరుగైన మందులను సృష్టించి తయార చేశామని, సుమారు 36 ఉత్పత్తులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని అన్నారు. తాజాగా అరుదైన వ్యాధులకు మందులు కనుక్కునే ప్రయత్నాలూ మొదలుపెట్టామని, హైదరాబాద్ కేంద్రం ఇందుకు ఎంతో ఉపయోగపడనుందని తెలిపారు. -
తొలగించిన వారిని తిరిగి చేర్చుకోవాలని అభ్యర్థన
అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ఇటీవల తొలగించిన కొందరు శాస్త్రవేత్తలను తమ స్థానాల్లోకి తిరిగి తీసుకోవాలని కోరుతోంది. మాదకద్రవ్యాలు, ఆహార భద్రత, వైద్య పరికరాలు, పొగాకు ఉత్పత్తులను సమీక్షించే ఏజెన్సీలో గణనీయమైన సంఖ్యలో ఉద్యోగులను తొలగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఆయా విభాగాల్లో కొంత మందికి లేఆఫ్స్ ప్రకటించారు. అయితే అందులో తిరిగి 300 మందిని విధుల్లోకి తీసుకోవాలని ఎఫ్‌డీఏ కోరుతోంది.న్యూరాలింక్లోకి శాస్త్రవేత్తలుఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని బ్రెయిన్ ఇంప్లాంట్ కంపెనీ న్యూరాలింక్‌ను సమీక్షించడంలో నిమగ్నమైన శాస్త్రవేత్తలు ఈ రీహైరింగ్ ప్రయత్నాల్లో భాగంగా తిరిగి సంస్థలో పని చేయబోతున్నట్లు తెలిసింది. క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించాలన్న న్యూరాలింక్ అభ్యర్థనను గతంలో భద్రతా కారణాల దృష్ట్యా ఎప్డీఏ తిరస్కరించింది. కానీ తర్వాత ట్రయల్స్‌కు అనుమతి ఇచ్చింది. కొన్ని రోజులకు శాస్త్రవేత్తల ఆకస్మిక తొలగింపు నిర్ణయం వెలువడింది. తాజాగా తిరిగి వీరు విధుల్లో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.ప్రభావం ఇలా..ఎలాన్ మస్క్ స్థాపించిన న్యూరాలింక్ టెక్నాలజీతో మానవుల ఆరోగ్యాన్ని సంరక్షించే ప్రయత్నాలు చేస్తోంది. మెదడులో చిప్‌ను ఏర్పాటు చేయడం ద్వారా దీర్ఘకాల వ్యాధులు, పక్షవాతం బాదితులతో సమర్థంగా కమ్యునికేట్ చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ విప్లవాత్మక మార్పులో భాగంగా మెదడు-కంప్యూటర్ ఇంటర్ఫేస్ పరికరాలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. న్యూరాలింక్ పనితీరును సమీక్షిస్తున్న శాస్త్రవేత్తలను తిరిగి నియమించాలన్న ఎఫ్‌డీఏ నిర్ణయంతో ఈ టెక్నాలజీ పురోగతికి ఆటంకాలు లేకుండా చేసినట్లయింది.ఇదీ చదవండి: యాపిల్ తయారీ ప్లాంట్ అమెరికాకు తరలింపుఉద్యోగాలు కోల్పోయిన కొంతమంది శాస్త్రవేత్తలు ప్రజారోగ్యం, భద్రత మిషన్‌లో పని చేసేవారని ఎఫ్‌డీఏ తెలిపింది. వారిని తిరిగి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. వారివల్ల అమెరికన్ రోగులకు సాయపడే వైద్య సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం సాధ్యమవుతుందని తెలిపింది. గతంలో అణ్వాయుధ కార్యక్రమాలను, బర్డ్ ఫ్లూ వ్యాప్తిని పర్యవేక్షించడానికి బాధ్యత వహించిన ఫెడరల్ ఉద్యోగులను తొలగించారు. వీరిని కూడా తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆయా ఏజెన్సీలు కోరుతున్నాయి. -
చందాకొచ్చర్ న్యూ జర్నీ: కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తి
బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద స్కాంగా నిలిచిన ఐసీఐసీఐ బ్యాంక్ స్కాంలో నిందితురాలిగా ఉన్న చందా కొచ్చర్ కొత్త జర్నీని ప్రారంభించారు. ఐసీఐసీఐబ్యాంక్ సీఎండీగా ఉన్నపుడు చందా కొచ్చర్ క్రిడ్‌ప్రోకు పాల్పడ్డారనే ఆరోపణలు సంచలనం రేపాయి. ఈ కేసులో ఉద్యోగం కోల్పోవడంతో పాటు భర్త దీపక్ కొచ్చర్తో సహా జైలు శిక్ష అనుభవించారు. ప్రస్తుతం భర్తతో పాటు బెయిల్‌పై ఉన్న చందా కొచ్చర్ సోషల్ మీడియాలో సంచలనం రేపేందుకు సన్నద్ధమయ్యారు. యూట్యూబ్ పాడ్‌కాస్ట్ సిరీస్ 'జర్నీ అన్‌స్క్రిప్టెడ్ విత్ చందా కొచ్చర్' ను లాంచ్ చేశారు. ఎలాంటి పరిణామాన్నైనా ఎందుర్కొనేందుకు ద్ధంగా ఉన్నాననీ, తన పాడ్‌కాస్ట్ చాలా విషయాలను వెలుగులోకి తీసుకొస్తుందని అన్నారు. జెన్ జెడ్ కి ఇష్టమైన మాధ్యమం ద్వారా వెలుగులోకి వస్తున్న చందాకొచ్చర్ పాడ్కాస్ట్పై కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.'జర్నీ అన్‌స్క్రిప్టెడ్' అనే పాడ్‌కాస్ట్‌ను చందా కొచ్చర్ ప్రారంభించారు. స్వయంగా తాను ఎంతో రీసెర్చ్ చేసి, అతిథులను స్వయంగా ఎంచుకుంటానని ఈ సందర్బంగా ఆమె చెప్పారు. నెలకు మూడు పాడ్‌కాస్ట్‌లు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నానని తెలిపారు. ప్రతిరోజూ కొత్తది నేర్చుకోవడం, మార్పుతోపాటు ముందుకు సాగడం ఈ రెండే తన లక్ష్యాలని ఆమె చెప్పారు. ఈ షోలో ఆమె తొలి అతిథి మారికో వ్యవస్థాపకుడు, ఛైర్మన్ హర్ష్ మారివాలా. రెండో గెస్ట్‌గా నటుడు రాబోతున్నారని కూడా హింట్ ఇచ్చారు. కానీ ఆ గెస్ట్ పేరును వెల్లడించడానికి నిరాకరించారు. ఈ పాడ్‌కాస్ట్‌ను స్వతంత్ర కంటెంట్, డిజైన్ ఏజెన్సీ ‘ది సాల్ట్ ఇంక్’ రూపొందిస్తోంది. తొలి ఎపిసోడ్ ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా ట్విటర్లో దీన్ని షేర్ చేశారు. కాగా 1984లో ICICI బ్యాంక్‌లో చేరారు చందాకొచ్చర్. 2009లో బ్యాంకు ఎండీ, సీఈవో అయ్యారు. బ్యాంకింగ్ పరిశ్రమలో అత్యంత ప్రసిద్ధి చెందిన మహిళగా గుర్తింపు తెచ్చుకున్నారు. బ్యాంకులు లాభాల పరుగులు పెట్టించి గోల్డెన్ గర్ల్‌గా ప్రశంస లందుకున్నారు. 2010లో ఫోర్బ్స్ 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళలలో ఒకరిగా కూడా స్థానం దక్కించుకున్నారు. అంతేకాదు దేశీయ అత్యంత గౌరవనీయమైన ప్రతిష్టాత్మక పద్మ భూషణ్ సహా, ఇంకా అనేక అంతర్జాతీయ అవార్డులను కూడా అందుకున్నారు.Thoroughly enjoyed this insightful debut podcast by Chanda Kochhar and one of my favorite people @hcmariwala. So many valuable learnings which Harsh has generously shared from his life experiences! Hear the full podcast in https://t.co/Tf2Ax3n8w1 . Some snippets here… pic.twitter.com/dwnkKVeH93— Harsh Goenka (@hvgoenka) February 16, 2025 2017లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ప్రాథమిక విచారణ ప్రారంభించినప్పుడు ఈ స్కాం వెలుగులోకి వచ్చింది. వీడియోకాన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌కు రూ.3,250 కోట్ల విలువైన రుణాల కేటాయింపు విషయంలో బ్యాంకు సీఎండీ అక్రమాలకు పాల్పడ్డారనేది ప్రధాన ఆరోపణ. 2019లో, వీడియోకాన్ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్‌కు రూ.300 కోట్లు ఇచ్చాన మంజూరు కమిటీలో కొచ్చర్ భాగమని, చివరకు ఆ కంపెనీ దానిని చెల్లించడంలో విఫలమైందని సీబీఐ తన ఎఫ్ఐఆర్లో పేర్కొంది. ఈ కేసులో వేణుగోపాల్ ధూత్, ఆమె భర్త దీపక్ కొచ్చర్ మధ్య జరిగిన క్విడ్ ప్రోకోలో కొచ్చర్ భాగమని సీబీఐ ఆరోపించింది. వీడియోకాన్‌కు రూ.300 కోట్ల రుణం క్లియర్ అయిన ఒక రోజు తర్వాత దీపక్ కొచ్చర్ కంపెనీ నుపవర్ రెన్యూవబుల్స్‌లో వీడియోకాన్ రూ.64 కోట్లు పెట్టుబడి పెట్టిందని సీబీఐ ఆరోపించింది. -
యాపిల్ తయారీ ప్లాంట్ అమెరికాకు తరలింపు
యాపిల్ సీఈఓ టిమ్ కుక్ మెక్సికోలోని సంస్థ తయారీ యూనిట్‌ను అమెరికాకు తరలించే యోచనలో ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. కుక్ మెక్సికోలో రెండు ప్లాంట్లను నిలిపివేశారని, దానికి బదులుగా అమెరికాలో ఉత్పత్తులను తయారు చేస్తారని అమెరికా గవర్నర్ల సమావేశంలో ట్రంప్ పేర్కొన్నారు. పెరుగుతున్న టారిఫ్ ఒత్తిళ్లు, కొనసాగుతున్న అమెరికా-చైనా వాణిజ్య వివాదానికి ప్రతిస్పందనగా ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంటున్నట్లు కొందరు భావిస్తున్నారు.అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇటీవల టిమ్ కుక్ ట్రంప్‌తో వైట్‌హౌజ్‌లో సమావేశమయ్యారు. చైనాలో యాపిల్ తన తయారీ ప్లాంట్ నుంచి భారీగానే వివిధ దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. అందులో కొంతభాగం అమెరికాకూ ఎగుమతి అవుతోంది. అయితే ఇటీవల అమెరికా-చైనాల మధ్య సుంకాల విషయంలో తీవ్ర చర్చ సాగుతున్న నేపథ్యంలో టిమ్ కుక్ ట్రంప్‌తో భేటీ అయ్యారు. కానీ గతంలో మాదిరి కాకుండా ఈసారి యాపిల్‌కు ఎలాంటి మినహాయింపులు ఉండవని ట్రంప్ సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో ట్రంప్ కుక్‌తో సమావేశమైన మరుసటి రోజే యూఎస్‌కు తయారీ ప్లాంట్ తరలింపు ప్రకటన చేయడం చర్చనీయాంశం అయింది.అమెరికాలో పెట్టుబడులు..అమెరికాలో వందల మిలియన్ డాలర్లు పెట్టుబడి పెడతానని కుక్ హామీ ఇచ్చినట్లు ట్రంప్ తెలిపారు. ఈ పెట్టుబడి ఉద్యోగాలను సృష్టిస్తుందని, యూఎస్ సరఫరా గొలుసును బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. ఈ చర్య వల్ల దేశీయ ఉత్పత్తిని పునరుద్ధరించడం, బాహ్య ఆర్థిక ఒత్తిళ్ల నుంచి కీలక పరిశ్రమలను రక్షించవచ్చని చెప్పారు. కంపెనీలు తీసుకునే నిర్ణయాలు తన పరిపాలన విస్తృత లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయని ట్రంప్ అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: ఎస్బీఐ ధోనీకి రూ.6 కోట్లు, అభిషేక్‌కు రూ.18 లక్షలు చెల్లింపుయాపిల్పై ప్రభావంట్రంప్ వ్యాఖ్యలకు సంబంధించి యాపిల్ ఇంకా అధికారిక ప్రకటన చేయనప్పటికీ, ఇది సంస్థపై గణనీయమైన ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. తయారీ కార్యకలాపాలను అమెరికాకు తరలించడం ద్వారా దిగుమతి సుంకాల ప్రభావాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. ఇది లాభాల మార్జిన్లు, ధరలను ప్రభావితం చేస్తుంది. ఈ వ్యూహాత్మక మార్పు ఉద్యోగాల కల్పనతో పాటు అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని కొందరు అంచనా వేస్తున్నారు. -
రోజుకు రూ.27 కోట్లు విరాళం ఇచ్చిన వ్యక్తి.. ఈయన గురించి తెలుసా?
భారతదేశం సర్వమత సమ్మేళనం.. కాబట్టి ఇక్కడ అనేక మతాల ప్రజలు నివసిస్తున్నారు. ఇందులో ముస్లింల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. వీరు (ముస్లింలు) కళ, సాహిత్యం, సైన్స్ వంటి వివిధ రంగాలలో తమదైన ముద్ర వేసినప్పటికీ.. వ్యాపార రంగంలో మాత్రం ఇతరులతో పోలిస్తే కొంత వెనుకబడి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అజీమ్ ప్రేమ్‌జీ కుటుంబం మాత్రం దీనికి భిన్నం. ఎందుకంటే మూడు తరాలుగా వ్యాపార సామ్రాజ్యాన్ని పాలిస్తోంది.1947లో దేశ విభజన సమయంలో మహమ్మద్ అలీ జిన్నా.. అజీమ్ ప్రేమ్‌జీ తండ్రి 'మహ్మద్ ప్రేమ్‌జీ'ని పాకిస్తాన్‌కు రమ్మని ఆహ్వానించడమే కాకుండా.. అక్కడ ఆర్ధిక మంత్రి పదవిని కూడా ఇస్తామని చెప్పారు. కానీ మహ్మద్ ప్రేమ్‌జీ నిరాకరించి, భారతదేశంలో ఉండిపోయారు. నిజానికి మహ్మద్ ప్రేమ్‌జీ బియ్యం వ్యాపారి. ఈయన మొదట్లో మయన్మార్‌లో వ్యాపారం చేసేవారు. ఆ తరువాత 1940లో ఇండియాకు వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. అజీమ్ ప్రేమ్‌జీ ముంబైలోనే 1945లో జన్మించారు.అజీమ్ ప్రేమ్‌జీ.. ఐటీ దిగ్గజం విప్రో వ్యవస్థాపకుడు. ఈయన ప్రపంచ ధనవంతుల జాబితాలో ఒకరు. ఫోర్బ్స్ ప్రకారం అజీమ్ ప్రేమ్‌జీ నికర విలువ రూ. లక్ష కోట్ల కంటే ఎక్కువ.ప్రాథమిక విద్యను భారతదేశంలోనే పూర్తి చేసిన అజీమ్ ప్రేమ్‌జీ.. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. అమెరికాలోని ప్రతిష్టాత్మక స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని పొందారు. ఆ సమయంలోనే అజీమ్ ప్రేమ్‌జీ అన్న ఫరూఖ్ ప్రేమ్‌జీ తన తండ్రి వ్యాపారం చూసుకోవడం మొదలుపెట్టారు. అయితే అతని వివాహానంతరం.. పాకిస్తాన్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.ముహమ్మద్ ప్రేమ్‌జీ మరణానంతరం.. అజీమ్ ప్రేమ్‌జీ అప్పులపాలైన కుటుంబ వ్యాపారాన్ని (చమురు వ్యాపారం) నిర్వహించాల్సి వచ్చింది. తన తెలివితో చమురు వ్యాపారాన్ని సంక్షోభం నుంచి బయటపడేశాడు. ఆ తరువాత దానిని విస్తరించడం మాత్రమే కాకుండా.. ఇతర రంగాలలోకి కూడా అడుగుపెట్టారు. ఇందులో భాగంగానే విప్రో కంపెనీ ప్రారంభించారు.ఇదీ చదవండి: బిలియనీర్ కుమార్తె జైలు కష్టాలు.. ఆహారం, నీరు ఇవ్వడానికి కూడా..భారతదేశంలో 19వ ధనవంతుడు.. ప్రపంచంలోని 195వ ధనవంతుడైన అజీమ్ ప్రేమ్‌జీ, ఉదారంగా విరాళాలు అందించడంలో కూడా ముందున్నారు. 2020- 2021ఆర్ధిక సంవత్సరంలో భారతదేశంలో ఎక్కువ విరాళాలు అందించిన వ్యక్తుల జాబితాలో.. ఈయన రూ. 9713 కోట్లు విరాళం అందించి అగ్రస్థానంలో నిలిచారు. దీన్ని బట్టి చూస్తే అజీమ్ ప్రేమ్‌జీ రోజుకు రూ. 27 కోట్లు విరాళంగా అందిస్తున్నట్లు తెలుస్తోంది. -
ధోనీకి రూ.6 కోట్లు, అభిషేక్‌కు రూ.18 లక్షలు చెల్లింపు.. ఎందుకంటే..
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఇద్దరు ప్రముఖ భారతీయ వ్యక్తులు మహేంద్ర సింగ్ ధోనీ, అభిషేక్ బచ్చన్‌కు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లిస్తూ వార్తల్లో నిలిచింది. ప్రముఖ క్రికెటర్ ధోనికేమో బ్యాంక్ బ్రాండ్‌ను ఎండార్స్ చేస్తున్నందుకు డబ్బు చెల్లిస్తుంటే.. అభిషేక్ బచ్చన్‌కు తన ప్రాపర్టీని బ్యాంకు అద్దెకు తీసుకున్నందుకు చెల్లింపులు చేస్తుంది.ఎంఎస్ ధోనీతో డీల్కెప్టెన్ కూల్‌గా పిలవబడే మహేంద్ర సింగ్ ధోనీని ఎస్బీఐ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. క్రికెట్ జట్టులో అసాధారణ నాయకత్వ నైపుణ్యాలకు ప్రసిద్ధి చెందిన ధోని ఎస్బీఐతో కలిసి పనిచేయడం సంస్థ ఉత్పత్తులను, రెవెన్యూ వృద్ధికి ఎంతో తోడ్పడుతుందని బ్యాంకు నమ్ముతుంది. ధోనీకి తమ బ్రాండ్ ఎండార్స్మెంట్ కోసం ఎస్బీఐ రూ.ఆరు కోట్లు చెల్లిస్తుంది. ఐసీసీ పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న చివరి భారత కెప్టెన్‌గా ధోనీకి ఎంతో గుర్తింపు ఉంది. క్రికెట్ అభిమానులను తనదైన శైలిలో ఆకట్టుకున్నారు.ఇదీ చదవండి: ఆదాయపన్నులో మార్పులు.. తరచూ అడిగే ప్రశ్నలుఅభిషేక్ బచ్చన్‌తో ప్రాపర్టీ లీజు ఒప్పందంబాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ప్రస్తుతం ఎస్బీఐ నుంచి ప్రతి నెల రూ.18,00,000 అద్దె పొందుతున్నారు. ముంబయిలోని ప్రముఖులు నివసించే జుహు ప్రాంతాలోని బచ్చన్ కుటుంబానికి చెందిన జుహు బంగ్లాను లీజుకు ఇవ్వడానికి బ్యాంకుతో 15 సంవత్సరాల లీజు ఒప్పందం కుదుర్చుకున్నారు. దాంతో లీజు ఒప్పందంలో భాగంగా బచ్చన్ కుటుంబానికి స్థిరమైన ఆదాయ సమకూరుతోంది. ఈ ఒప్పందంలో కాలానుగుణ అద్దె పెంపు కోసం క్లాజులు ఉన్నాయి. అభిషేక్ బచ్చన్ విజయవంతమైన నటుడిగానే కాకుండా వ్యూహాత్మక పెట్టుబడుల ద్వారా తన వ్యాపార చతురతను నిరూపించుకున్నారు. జుహు బంగ్లాను ఎస్బీఐకు లీజుకు ఇవ్వాలని ఆయన తీసుకున్న నిర్ణయం మెరుగైన ఆర్థిక ప్రణాళికల్లో ఒకటిగా చూస్తున్నారు. -
డెల్టా ఎల్రక్టానిక్స్ 50 కోట్ల డాలర్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: భారత్‌లో కార్యకలాపాల విస్తరణపై 50 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తైవాన్‌కి చెందిన డెల్టా ఎల్రక్టానిక్స్ ఇండియా ప్రెసిడెంట్ బెంజమిన్ లిన్ తెలిపారు. స్మార్ట్ తయారీ, విద్యుత్ మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి భారత్ స్వయం సమృద్ధిని సాధించడంలో తమ వంతు తోడ్పాటు అందిస్తున్నట్లు ’ఎలెక్‌రమా 2025’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వివరించారు. బెంగళూరుకు దగ్గర్లోని కృష్ణగిరిలో ఉన్న ప్లాంటులో ఎలక్ట్రిక్ మొబిలిటీ సెగ్మెంట్‌కి అవసరమైన ఈవీ చార్జింగ్ మౌలిక సదుపాయాలు, టెలికం పరిశ్రమలో ఉపయోగించే డైరెక్ట్ కరెంట్ కన్వర్టర్లు, రెక్టిఫయర్లు మొదలైనవి ఉత్పత్తి చేస్తున్నామని లిన్ చెప్పారు. ఈ ప్లాంటును కూడా విస్తరిస్తున్నామని తెలిపారు. 2003లో భారత మార్కెట్లో ప్రవేశించినప్పటి నుంచి గణనీయంగా ఇన్వెస్ట్ చేసినట్లు లిన్ చెప్పారు. -
ఐపీవో బాటలో ఎల్సీసీ ప్రాజెక్ట్స్
న్యూఢిల్లీ: ఈపీసీ సంస్థ ఎల్సీసీ ప్రాజెక్ట్స్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. వీటి ప్రకారం ఐపీవోలో భాగంగా రూ. 320 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో .29 కోట్ల షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను పరికరాల కొనుగోలు, రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ ప్రధానంగా నీటి పారుదల, నీటి సరఫరా ప్రాజెక్టుల విభాగాలలో ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్(ఈపీసీ) సేవలు అందిస్తోంది. రెండు దశాబ్దాల కాలంలో కంపెనీ ఆనకట్టలు, బ్యారేజీలు, హైడ్రాలిక్ స్ట్రక్చర్లు, లిఫ్ట్ ఇరిగేషన్ పనులు తదితర ప్రాజెక్టులను పూర్తి చేసింది. -
‘ఫెవికాల్’ పుట్టిందిలా..
పుస్తకాలు అతికించడం నుంచి గృహోపకరణాల తయారీ వరకూ అనేక చోట్ల ఉపయోగించే ‘ఫెవికోల్’ (Fevicol) దశాబ్దాలుగా భారతీయ ఇళ్లలో భాగంగా మారిపోయింది. ఫోటోకాపీయింగ్కు జిరాక్స్ ఎలాగైతే పర్యాయ పదంగా మారిందో అలాగే బ్రాండ్‌తో సంబంధం లేకుండా జిగురు (గమ్) పదార్థాలకు ఫెవికోల్ పర్యాయపదంగా మారింది. అయితే ఈ ఐకానిక్ బ్రాండ్ వెనుక చిన్న వ్యాపారాన్ని బిలియన్ డాలర్ల వ్యాపార సామ్రాజ్యంగా మార్చిన మొదటి తరం వ్యవస్థాపకుడు బల్వంత్ పరేఖ్ అద్భుతమైన కృషి ఉంది. స్వాతంత్ర్య సమరయోధుడైన ఆయన ప్యూన్‌గా ప్రారంభమై పారిశ్రామికవేత్తగా ఎదిగిన తీరు అందరికీ ఆదర్శనీయం. "ఫెవికోల్ మ్యాన్" స్ఫూర్తిదాయకమైన ప్రస్థానాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం.ప్రారంభ జీవితం పోరాటాలే..గుజరాత్ లోని మహువాలో జైన కుటుంబంలో జన్మించిన బల్వంత్ పరేఖ్ తొలి జీవితం అనేక పోరాటాలతో కూడుకున్నది. ముంబైలోని గవర్నమెంట్ లా కాలేజీ నుంచి లా డిగ్రీ పొందినప్పటికీ ఆయన వేరే మార్గాన్ని ఎంచుకున్నారు. బల్వంత్ పరేఖ్ ప్రారంభ జీవితం చాలా కఠినంగా గడిచింది. ఆయన డైయింగ్, ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేశారు. తరువాత ప్యూన్ గా పనిచేశారు. ఆ సమయంలో భారతదేశం స్వాతంత్ర్య పోరాటంలో ఉంది. పరేఖ్ కూడా క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. అయితే కుటుంబ ఒత్తిడితో చదువును పునఃప్రారంభించి లా డిగ్రీ పూర్తి చేశారు.వ్యాపార సామ్రాజ్యానికి పునాదిమోహన్ అనే ఇన్వెస్టర్ సహకారంతో సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకున్న పరేఖ్.. పాశ్చాత్య దేశాల నుంచి సైకిల్, అరెకా, కాగితపు రంగులను దిగుమతి చేసుకోవడం ప్రారంభించారు. ఇందులో విజయాన్ని సాధించిన తరువాత, పరేఖ్ కుటుంబం ముంబైకి మకాం మార్చారు. ఇది ఆయన జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. తరువాత బల్వంత్ తమ ఉత్పత్తులను భారతదేశంలో మార్కెటింగ్ చేయడానికి జర్మన్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. 1954 లో ఆ కంపెనీ ఆహ్వానం మేరకు ఆయన జర్మనీ వెళ్లారు. కానీ వారి మేనేజింగ్ డైరెక్టర్ మరణించిన తరువాత ఆ సంస్థ భాగస్వామ్యం నుంచి వైదొలిగింది. ఈ ఎదురుదెబ్బ పరేఖ్‌ను అడ్డుకోలేదు. తాను కూడా సొంత వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పానికి అది ఆజ్యం పోసింది.ఫెవికోల్ ప్రారంభమైందిలా.. 1954లో బల్వంత్, ఆయన సోదరుడు సుశీల్ ముంబైలోని జాకబ్ సర్కిల్లో పరేఖ్ డైచెమ్ ఇండస్ట్రీస్‌ను స్థాపించారు. పారిశ్రామిక రసాయనాలు, వర్ణద్రవ్య ఎమల్షన్లు, రంగులను తయారు చేసి విక్రయించడం మొదలుపెట్టారు. భారతీయ జిగురు మార్కెట్లో జంతువుల కొవ్వుతో తయారైన జిగురులు ఆధిపత్యం చెలాయిస్తున్నాయని, అవి వికృతమైనవి, సంక్లిష్టమైనవని గమనించిన పరేఖ్ ఒక అవకాశాన్ని చూశారు. ఫెవికాల్ బ్రాండ్ పేరుతో తెల్ల జిగురు తయారీని ప్రారంభించారు. ఫెవికాల్ అనే పేరు మోవికాల్ అని పిలువబడే ఇలాంటి ఉత్పత్తిని తయారు చేసే ఒక జర్మన్ కంపెనీ ప్రేరణతో వచ్చింది. జర్మన్ భాషలో "కోల్" అంటే రెండు వస్తువలను అతికించేదని అర్థం.పిడిలైట్ ఇండస్ట్రీస్ నిర్మాణంఫెవికాల్ విజయం 1959 లో పిడిలైట్ ఇండస్ట్రీస్ స్థాపనకు దారితీసింది. ఫెవికాల్ దాని నాణ్యత, విశ్వసనీయతకు గుర్తింపు పొందడంతో కంపెనీ త్వరగా ఇంటి పేరుగా మారింది. విరిగిన పాత్రలను అతికించడం దగ్గర నుంచి ఇళ్ల నిర్మాణం వరకు ఫెవికాల్ భారతీయ గృహాలలో అంతర్భాగమైంది. "ఫెవికోల్ కా జోడ్ హై, తూటేగా నహీ" అనే ట్యాగ్ లైన్ తో చేసిన అడ్వర్టైజింగ్ ప్రచారాలు వినియోగదారుల హృదయాలలో ఈ ఐకానిక్ బ్రాండ్ స్థానాన్ని మరింత సుస్థిరం చేశాయి. -
ప్రేమ్ జీ ఇన్వెస్ట్.. తిరుగులేని పోర్ట్‌ఫోలియో
అజీమ్ ప్రేమ్ జీ (Azim Premji) ఫ్యామిలీ ఆఫీస్ ఇన్వెస్ట్ మెంట్ విభాగమైన ప్రేమ్ జీ ఇన్వెస్ట్ ఇన్వెస్ట్ మెంట్ ల్యాండ్ స్కేప్ లో తిరుగులేని సంస్థగా నిలదొక్కుకుంది. దీర్ఘకాలిక విలువ సృష్టిపై దృష్టి సారించిన ప్రేమ్‌జీ ఇన్వెస్ట్మెంట్ టెక్నాలజీ, హెల్త్ కేర్, ఫైనాన్షియల్ సర్వీసెస్, కన్జ్యూమర్ గూడ్స్ సహా వివిధ రంగాలకు చెందిన వైవిధ్యమైన పోర్ట్‌ఫోలియోను నిర్మించింది.ఇన్వెస్ట్ మెంట్ ఫిలాసఫీప్రేమ్ జీ ఇన్వెస్ట్ దీర్ఘకాలంలో వ్యాపారాలను నిర్మించడం, మద్దతు ఇవ్వడంపై కేంద్రీకృతమైన స్పష్టమైన పెట్టుబడి తత్వంతో పనిచేస్తుంది. బలమైన వృద్ధి సామర్ధ్యం ఉన్న కంపెనీలను గుర్తించడానికి, పెట్టుబడి పెట్టడానికి సంస్థ తన విస్తృతమైన నెట్వర్క్, లోతైన పరిశ్రమ నైపుణ్యాన్ని ఉపయోగిస్తుంది. 10 బిలియన్ డాలర్లకు పైగా ఎవర్ గ్రీన్ క్యాపిటల్ తో ప్రేమ్ జీ ఇన్వెస్ట్ ఇన్నోవేషన్ ను ప్రోత్సహించడానికి, సుస్థిర వృద్ధిని నడిపించడానికి కట్టుబడి పనిచేస్తోంది.కీలక పెట్టుబడులుటెక్నాలజీ: ప్రేమ్ జీ ఇన్వెస్ట్ ప్రముఖ ఐవేర్ రిటైలర్ లెన్స్ కార్ట్, టెక్ ఆధారిత సప్లై చైన్ ఫైనాన్సింగ్ కంపెనీ మింటిఫి సహా టెక్నాలజీ కంపెనీల్లో గణనీయమైన పెట్టుబడులు పెట్టింది. ఈ పెట్టుబడులు టెక్నాలజీ పరివర్తన శక్తి, ఆర్థిక వృద్ధిని నడిపించే సామర్థ్యంపై సంస్థ నమ్మకాన్ని ప్రతిబింబిస్తాయి.హెల్త్ కేర్: జీవన నాణ్యతను మెరుగుపరచడంలో, ఆర్థిక అభివృద్ధిని నడిపించడంలో ఈ రంగం కీలక పాత్రను గుర్తించిన ఈ సంస్థ హెల్త్ కేర్ కంపెనీల్లో కూడా పెట్టుబడులు పెట్టింది. ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ హెల్త్ కేర్ పోర్ట్‌ఫోలియోలో మెడికల్ ఇన్నోవేషన్, పేషెంట్ కేర్‌లో ముందంజలో ఉన్న కంపెనీలు ఉన్నాయి.ఫైనాన్షియల్ సర్వీసెస్: డిజిటల్ కన్జ్యూమర్ లెండింగ్ ప్లాట్‌ఫామ్ క్రెడిట్‌బీ, టెక్నాలజీ ఫస్ట్ వెల్త్ మేనేజ్మెంట్ ప్లాట్‌ఫామ్ డెజెర్వ్ వంటి కంపెనీల్లో పెట్టుబడులతో ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌కు ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్లో బలమైన ఉనికి ఉంది.కన్జ్యూమర్ గూడ్స్: అధిక నాణ్యత కలిగిన ఉత్పత్తులు, సేవలకు పెరుగుతున్న డిమాండ్ ను గుర్తించిన ఈ సంస్థ కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది. ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ కన్జ్యూమర్ గూడ్స్ పోర్ట్ ఫోలియోలో ఆయా పరిశ్రమలలో అగ్రగామిగా ఉన్న, వృద్ధి, సృజనాత్మకతలో బలమైన ట్రాక్ రికార్డ్ ఉన్న కంపెనీలు ఉన్నాయి.తాజాగా 9 కంపెనీలలో షేర్ల కొనుగోలుప్రేమ్జీ ఇన్వెస్ట్ తాజాగా 9 కంపెనీలలో షేర్లు కొనుగోలు చేసింది. ఈ జాబితాలో భారతీ ఎయిర్టెల్, జిందాల్ స్టీల్ అండ్ పవర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ తదితరాలున్నాయి. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా ఇందుకు రూ. 446 కోట్లకుపైగా వెచ్చించింది. అనుబంధ సంస్థ పీఐ అపార్చునిటీస్ ఏఐఎఫ్వీ ఎల్ఎల్పీ ద్వారా ఎయిర్‌టెల్‌లో 5.44 లక్షల షేర్లు, జిందాల్ స్టీల్‌లో 9.72 లక్షల షేర్లు, రిలయన్స్‌లో 5.7 లక్షల షేర్లు, ఇన్ఫోసిస్‌లో 3.28 లక్షల షేర్లు సొంతం చేసుకుంది.ఈ బాటలో ఐసీఐసీఐ బ్యాంకులో 3.33 లక్షల షేర్లు, హిందాల్కోలో 8.13 లక్షల షేర్లు, అంబుజా సిమెంట్స్‌లో 5.14 లక్షల షేర్లు, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్‌లో 1.09 లక్షల షేర్లు, ఎస్బీఐ లైఫ్‌లో 84,375 షేర్లు చొప్పున కొనుగోలు చేసింది. ఒక్కో షేరునీ సగటున రూ. 477–1,807 ధరల శ్రేణిలో సొంతం చేసుకుంది. టారిష్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ కంపెనీ ఈ వాటాలు విక్రయించింది. -
మొదటి బిడ్డకు స్వాగతం పలికిన శామ్ ఆల్ట్మాన్ - ఫొటో వైరల్
ఓపెన్ఏఐ సీఈఓ 'శామ్ ఆల్ట్మాన్'.. మగబిడ్డకు స్వాగతం పలికారు. ఈ విషయాన్ని తన ఎక్స్ ఖాతాలో అధికారికంగా వెల్లడించారు. ఫోటో కూడా షేర్ చేశారు.ప్రపంచానికి స్వాగతం, చిన్నవాడా!, అని పేర్కొంటూ శామ్ ఆల్ట్మాన్.. బిడ్డ చేతిని చూపుడు వేలుతో పట్టుకున్న ఫోటో షేర్ చేశారు. తన బిడ్డ ముందుగానే జన్మించినట్లు, ప్రస్తుతం నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU)లో వైద్య సంరక్షణలో ఉన్నట్లు వెల్లడించారు. నేను ఇంత ప్రేమను ఎప్పుడూ అనుభవించలేదని అన్నారు.శామ్ ఆల్ట్మాన్ వెల్లడించిన ఈ విషయంపై.. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల స్పందించారు. "నా హృదయపూర్వక అభినందనలు, శామ్! పేరెంట్‌హుడ్ అనేది జీవితంలో అత్యంత గొప్ప అనుభవాలలో ఒకటి. మీకు.. మీ కుటుంబానికి శుభాకాంక్షలు" అని ట్వీట్ చేశారు. పలువురు నెటిజన్లు కూడా శుభాకాంక్షలు చెబుతున్నారు.ఇదీ చదవండి: బిలియనీర్ కుమార్తె జైలు కష్టాలు: ఆహారం, నీరు ఇవ్వడానికి కూడా..శామ్ ఆల్ట్మాన్.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆలివర్ ముల్హెరిన్‌ను వివాహం చేసుకున్నారు. ఈ జంట సముద్రతీర ప్రదేశంలో ఉంగరాలు మార్చుకుంటున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీరు జంటగా కనిపించిన సందర్భాలు చాలా తక్కువ.My heartfelt congratulations, @sama! Parenthood is one of life’s most profound and rewarding experiences. Wishing you and your family the very best.— Satya Nadella (@satyanadella) February 22, 2025 -
బిలియనీర్ కుమార్తె జైలు కష్టాలు: ఆహారం, నీరు ఇవ్వడానికి..
భారత సంతతికి చెందిన బిలియనీర్ పంకజ్ ఓస్వాల్ కుమార్తె 'వసుంధర ఓస్వాల్' ఉగాండాలో జైలు పాలైన దాదాపు నాలుగు నెలల తర్వాత.. అక్కడ తాను అనుభవించిన కొన్ని కష్టాలను వివరించింది. తనను ఐదు రోజుల పాటు నిర్బంధించారని.. ఆహారం, నీరు వంటి ప్రాథమిక సౌకర్యాలను అందించలేదని పేర్కొంది. ఆఖరికి స్నానం చేయడానికి కూడా నిరాకరించారని వెల్లడించింది.ఇంటర్‌పోల్‌కు వెళ్లడానికి తాను అయిష్టత చూపినప్పుడు.. ఒక పురుష అధికారి తనను ఎత్తుకుని వారి వ్యాన్‌లో పడేశారని వసుంధర ఓస్వాల్ ఆరోపించింది.వసుంధర (26)పై గత సంవత్సరం తన తండ్రి పంకజ్ ఓస్వాల్ మాజీ ఉద్యోగి ముఖేష్ మెనారియా కిడ్నాప్ & హత్య కేసులో తప్పుడు అభియోగం మోపబడింది. తరువాత అతను టాంజానియాలో సజీవంగా కనిపించాడు. అయితే ఈమెను 2024 అక్టోబర్ 1న అరెస్టు చేశారు. అదే నెలలో (అక్టోబర్ 2) బెయిల్ మంజూరు చేశారు.నన్ను ఐదు రోజులు నిర్బంధించారు, మరో రెండు వారాల పాటు జైలులో పెట్టారని.. వసుంధర ఓస్వాల్ పేర్కొంది. ఆ సమయంలో వారు స్నానం చేయనివ్వలేదు. ఆహారం & నీరు ఇవ్వడానికి కూడా నిరాకరించారు. నాకు ఆహారం, నీరు వంటి ప్రాథమిక అవసరా కోసం నా తల్లిదండ్రులు న్యాయవాదుల ద్వారా పోలీసు అధికారులకు లంచం ఇవ్వవలసి వచ్చిందని పేర్కొంది.ఇదీ చదవండి: గ్రామంలో నివాసం.. వేలకోట్ల కంపెనీకి సారథ్యం!.. ఎవరో తెలుసా?ఒక విధమైన శిక్షగా వాష్‌రూమ్‌ను ఉపయోగించుకోవడానికి అనుమతించలేదని వసుంధర ఓస్వాల్ ఆరోపించారు. పోలీసులు వారెంట్ లేకుండా తన ఇంటిని సోదా చేశారని ఆరోపించారు. -
గ్రామంలో నివాసం.. వేలకోట్ల కంపెనీకి సారథ్యం!.. ఎవరో తెలుసా?
మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా.. వచ్చిన దారిని, మూలలను మరచిపోకూడదు. డబ్బు సంపాదించగానే లగ్జరీకి అలవాటుపడే మనుషులున్న ఈ రోజుల్లో కూడా.. వేలకోట్ల రూపాయల కంపెనీ అతని సారథ్యంలో ఉన్నప్పటికీ, నిరాడంబరంగా.. పంచె కట్టుకుని జీవితం గడిపేస్తున్నారు. ఇంతకీ అయన ఎవరు? ఆయన స్థాపించిన కంపెనీ ఏది? సంపాదన ఎంత అనే ఆసక్తికరమైన వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.తమిళనాడులో జన్మించిన 'శ్రీధర్ వెంబు'.. సాధారణ నేపథ్యం నుంచి వచ్చి, నేడు ఎంతోమందికి ఆదర్శమయ్యారు. చిన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని.. ఆ తరువాత ఉన్నత చదువుల కోసం విదేశాలకు పయనమయ్యారు. చదువు పూర్తయిన తరువాత ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ సంపాదించారు. కానీ కొన్ని రోజులకు మంచి ఉద్యోగాన్ని వదిలి, ఇండియాకు వచ్చేసారు.ఉద్యోగం వదిలి, భారత్ వచ్చిన తరువాత.. సొంత సాఫ్ట్వేర్ సామ్రాజ్యాన్ని నిర్మించారు. అదే నేడు అందరికి సుపరిచయమైన.. 'జోహో కార్పొరేషన్'. చాలా మంది ప్రజలు మంచి అవకాశాల కోసం గ్రామాల నుంచి నగరాలకు, ఆపై విదేశాలకు తరలిపోతున్న సమయంలో వెంబు ఈ ధోరణిని తిప్పికొట్టారు.అమెరికాను విడిచిపెట్టి తమిళనాడులోని ఒక చిన్న గ్రామానికి తిరిగి వచ్చి, అక్కడ నుంచే ఇప్పుడు తన బిలియన్ డాలర్ల కంపెనీని నడుపుతున్నారు. జోహో ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది, కానీ వెంబు 630 కిలోమీటర్ల దూరంలో ఉన్న తెన్కాసికి సమీపంలోని మారుమూల గ్రామమైన మథలంపారైలో ఓ ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నారు.శ్రీధర్ వెంబు తీసుకున్న ఈ నిర్ణయం.. కంపెనీని అభివృద్ధికి మాత్రమే కాకుండా, సమాజ అభివృద్ధిని ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ భారతదేశాన్ని నిర్మించడానికి దోహదపడింది. దీంతో భారత ప్రభుత్వం.. 72వ గణతంత్ర దినోత్సవం నాడు వెంబుకు ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డును అందించింది.గ్రామీణ ప్రాంతంలో ఆఫీస్ ఏర్పాటు చేయాలనే.. వెంబు ఆలోచన చాలామందిని ఆశ్చర్యపరిచింది. గ్రామాలను వదిలి నగరాలకు ప్రజలు తరచుగా వెళ్లే వలస ధోరణిని తిప్పికొట్టాలనే గ్రామంలో ఆఫీస్ స్టార్ట్ చేసినట్లు శ్రీధర్ వెంబు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.వెంబు తెన్కాసిలో ఒక చిన్న కార్యాలయాన్ని అద్దెకు తీసుకొని ప్రారంభించారు. ఆ తరువాత మథలంపారైలో ఒక పాత ఫ్యాక్టరీని కొనుగోలు చేసి, దానిని టెక్ క్యాంపస్‌గా మార్చారు. వెంబు కార్యాలయాలను ఏర్పాటు చేయడంతోనే ఆగిపోలేదు. ఆయన జోహో స్కూల్ ఆఫ్ లెర్నింగ్‌ను కూడా ప్రారంభించారు. ఇక్కడ ఉన్నత పాఠశాల, డిప్లొమా విద్యార్థులు వివిధ నైపుణ్యాలలో శిక్షణ పొందుతారు.ఇదీ చదవండి: భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. ప్రధాన కారణాలివే!శ్రీధర్ వెంబు ప్రారంభించిన.. జోహో కార్పొరేషన్ విలువ రూ. లక్ష కోట్ల కంటే ఎక్కువ. కాగా ఈయన ఆస్తి రూ. 28వేలకోట్ల కంటే ఎక్కువని సమాచారం. వేలకోట్ల సంపద కలిగి ఉన్నప్పటికీ.. వెంబు చాలా సాధారణ జీవితం గడుపుతున్నారు. రోజువారీ ప్రయాణానికి ఆయన సైకిల్ ఉపయోగిస్తున్నారు. ఖరీదైన సూట్ కాకుండా.. పంచె కట్టుకుంటుటారు. ఇటీవలే 'శ్రీధర్ వెంబు' తన సీఈఓ పదవికి రాజీనామా చేశారు. అయితే అదే కంపెనీలో చీఫ్ సైంటిస్ట్‌గా పనిచేయనున్నట్లు సమాచారం. -
సునీల్ మిత్తల్‌కు అరుదైన పురస్కారం
న్యూఢిల్లీ: టెలికం, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తదితర రంగాల్లో ఉన్న భారతీ ఎంటర్ప్రైసెస్ ఫౌండర్, చైర్మన్ సునీల్ భారతీ మిత్తల్ తాజాగా గౌరవ నైట్‌హుడ్ పతకాన్ని అందుకున్నారు.బ్రిటన్‌లో నాయకత్వం, వ్యాపార పెట్టుబడులకుగాను మిత్తల్‌కు నైట్ కమాండర్ ఆఫ్ ద మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ద బ్రిటీష్ ఎంపైర్ (కేబీఈ) వరించింది. యూకే రాజు చార్లెస్–3 తరఫున ఢిల్లీలో బ్రిటిష్ హై కమిషనర్ లిండీ కామెరాన్ నుండి ఆయన ఈ గౌరవాన్ని స్వీకరించారు.Sunil Bharti Mittal was presented the insignia of the Knight Commander of the Most Excellent Order of the British Empire (KBE) by H.E. Lindy Cameron on behalf of HM King Charles III. The KBE was conferred to Mr. Mittal for advancing UK-India business relations. pic.twitter.com/9C1xxmF11Y— Bharti Airtel (@airtelnews) February 22, 2025 -
ఐటీ దిగ్గజం భారీ పెట్టుబడి: ఏకంగా తొమ్మిది సంస్థలలో..
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం అజీమ్ ప్రేమ్‌జీ పెట్టుబడుల సంస్థ ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ తాజాగా 9 కంపెనీలలో వాటాలు కొనుగోలు చేసింది. జాబితాలో భారతీ ఎయిర్టెల్, జిందాల్ స్టీల్ అండ్ పవర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ తదితరాలున్నాయి. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా ఇందుకు రూ. 446 కోట్లకుపైగా వెచ్చించింది.అనుబంధ సంస్థ పీఐ అపార్చునిటీస్ ఏఐఎఫ్ వీ ఎల్ఎల్పీ ద్వారా ఎయిర్‌టెల్‌లో 5.44 లక్షల షేర్లు, జిందాల్ స్టీల్‌లో 9.72 లక్షల షేర్లు, రిలయన్స్‌లో 5.7 లక్షల షేర్లు, ఇన్ఫోసిస్‌లో 3.28 లక్షల షేర్లు సొంతం చేసుకుంది.ఈ బాటలో ఐసీఐసీఐ బ్యాంకులో 3.33 లక్షల షేర్లు, హిందాల్కోలో 8.13 లక్షల షేర్లు, అంబుజా సిమెంట్స్‌లో 5.14 లక్షల షేర్లు, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్‌లో 1.09 లక్షల షేర్లు, ఎస్బీఐ లైఫ్‌లో 84,375 షేర్లు చొప్పున కొనుగోలు చేసింది. ఒక్కో షేరునీ సగటున రూ. 477–1,807 ధరల శ్రేణిలో సొంతం చేసుకుంది. టారిష్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ కంపెనీ ఈ వాటాలు విక్రయించింది. -
మఖానా... మా ఖానా!
పేరేమో బ్లాక్ డైమండ్స్.. లోపలున్నది వైట్ గోల్డ్! అవునండీ.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఉన్న సూపర్ ఫుడ్ ‘మఖానా’సంగతే ఇది. పుష్కలమైన పోషకాలతో ఆరోగ్య వరప్రదాయినిగా అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన ఫూల్ మఖానా క్రేజ్ కేక పుట్టిస్తోంది. బిహారీ రైతులకు కాసుల పంటగా మారింది. మఖానాకు తాజా కేంద్ర బడ్జెట్లో కూడా పెద్దపీట వేయడంతో దీని పేరు మరింత మార్మోగుతోంది. మఖానా బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు బడ్జెట్లో మోదీ సర్కారు ప్రకటించింది. దీనివల్ల మార్కెటింగ్ సదుపాయాలు పెరగడంతో పాటు రైతులకు కూడా మరింత చేయూత లభించనుంది. సాక్షి, బిజినెస్ డెస్క్: రుచిలోనే కాదు.. పోషకాల్లోనూ రారాజుగా నిలుస్తున్న మఖానా.. ప్రపంచ సూపర్ ఫుడ్స్ మార్కెట్‌ను షేక్ చేస్తోంది. ఫూల్ మఖానా, లోటస్ సీడ్స్, పఫ్డ్ వాటర్ లిల్లీ సీడ్స్, ఫాక్స్ నట్స్ వంటి పేర్లతో ప్రాచుర్యం పొందిన వీటిని అచ్చ తెలుగులో చెప్పాలంటే తామర గింజలు. సహజమైన, సమతుల్య ఆహారంతో శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవాలనుకునే వారికి ఈ బ్లాక్ డైమండ్స్ వరంలా మారుతున్నాయి. ఇతర చిరుతిళ్లకు బదులు పోషకాల ఖజానా.. మఖానాను డైట్లో చేర్చుకుంటున్నారు. మిలీనియల్స్‌తో పాటు జెన్ జీ యువతరం కూడా ఇప్పుడు దీని వెంట పడుతున్నారు. విదేశాలకు ఎగుమతులు జోరందుకోవడంతో ‘వైట్ గోల్డ్’రేటు కూడా బంగారంలా దూసుకెళ్తోంది. మార్కెట్లో కేజీ ధర రూ.2,000 పైనే పలుకుతోంది. పెళ్లిళ్లతో పాటు ఏ పంక్షన్లో చూసినా మఖానా వంటకం ట్రెండింగ్ ఫుడ్‌గా నిలుస్తోంది! ఇక హోటళ్లు, కేఫ్‌లు, రెస్టారెంట్లు, బేకరీల్లో ఈ హెల్తీ స్నాక్ ప్రత్యేక స్థానం సంపాదించుకుంటోంది. సోషల్ మీడియాలో ఫుడ్ వ్లాగింగ్ చానెల్స్ కూడా వీటి ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రచారం చేస్తుండటంతో మఖానాకు మాంచి డిమాండ్ నెలకొంది. బిహార్ హబ్..ప్రపంచవ్యాప్తంగా మఖానా ఉత్పత్తిలో 90 శాతం వాటా భారత్‌దే. అందులో 85 శాతం ఒక్క బిహార్ నుంచే వస్తుండటం విశేషం! అంతర్జాతీయంగా ఈ సూపర్ ఫుడ్‌కు ఫుల్ డిమాండ్‌తో బిహార్ రైతులు పండగ చేసుకుంటున్నారు. ముఖ్యంగా మిథిలాంచల్ ప్రాంతం ఈ పంటకు ప్రధాన కేంద్రం. ఇక్కడి ప్రత్యేక వాతావరణ పరిస్థితులతో పాటు పుష్కలంగా చిత్తడి నేలలు (వెట్ ల్యాండ్స్) ఉండటం తామర పంట సాగుకు సానుకూలంగా నిలుస్తోంది. 200 ఏళ్లుగా ఇక్కడ మఖానా సాగు కొనసాగుతూనే ఉంది. మధుబనీ దీనికి పుట్టినిల్లుగా చెబుతారు. 2020లో బిహార్ మఖానాకు భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్) కూడా లభించడంతో ప్రపంచవ్యాప్తంగా మరింత ఖ్యాతి పొందింది. ఎందుకింత రేటు? ఫూల్ మఖానా ఒక ప్రత్యేకమైన తామర పూల రకానికి చెందినది. సాధారణంగా ప్రిక్లీ వాటర్ లిల్లీగా పిలిచే దీని శాస్త్రీయ నామం యూరేల్ ఫెరాక్స్. ఇవి ఎక్కువగా ఆసియా ప్రాంతంలో చెరువుల్లో, చిత్తడి నేలల్లో పెరుగుతాయి. తామర పూల రెక్కలన్నీ రాలిపోయాక.. నల్లటి విత్తనాలు నీటి అడుగుకు (4–12 అడుగుల లోతు) చేరుకుంటాయి. రైతులు వీటిని వలలు, బుట్టలతో సేకరించాక, ఎండలో బాగా ఆరబెడతారు. తర్వాత ప్రత్యేకంగా వేయించి, జాగ్రత్తగా గింజల్ని పగలగొడితే తెల్లగా.. పఫీగా ఉండే ఫాక్స్ నట్స్ విక్రయానికి సిద్ధమవుతాయి. ఇదంతా ఎంతో శ్రమతో కూడిన ప్రక్రియ. ఇది కొన్ని ప్రాంతాల్లోనే, అది కూడా చాలా తక్కువ విస్తీర్ణంలో మాత్రమే ఈ పంట సాగవుతోంది. జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో తక్కువ మొత్తంలో ఉత్పత్తి అవుతోంది. సరఫరా పరిమితంగా ఉండటం.. దేశ, విదేశాల్లో గిరాకీ భారీగా పెరిగిపోవడంతో రేటు అ‘ధర’హో అనిపిస్తోంది! మార్కెట్ రయ్... 2023లో భారత్ మఖానా మార్కెట్ పరిమాణం రూ.780 కోట్లుగా నమోదైంది. 2032 నాటికి ఇది రూ.1,890 కోట్లకు వృద్ధి చెందుతుందని ఐమార్క్ గ్రూప్ అంచనా వేసింది. ఏటా ఈ మార్కెట్ 9.7 శాతం వృద్ధి చెందనుందని లెక్కగట్టింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి 25,130 టన్నుల మఖానా ఎగుమతులు జరిగాయి. భారత్ నుంచి ఫూల్ మఖానా ఎగుమతికి అతిపెద్ద మార్కెట్‌గా అమెరికా ఉంది. కెనడా, ఆ్రస్టేలియా, జపాన్, దక్షిణ కొరియా, యూరప్ దేశాల ప్రజలు కూడా మన మఖానాను లొట్టలేసుకుంటూ లాగించేస్తున్నారు. అంతర్జాతీయంగా చూస్తే, 2024లో 15 కోట్ల డాలర్లుగా ఉన్న ఫూల్ మఖానా మార్కెట్.. 2031 నాటికి 8.5 శాతం వార్షిక వృద్ధితో 26.6 కోట్ల డాలర్లకు చేరవచ్చని కాగి్నటివ్ మార్కెట్ రీసెర్చ్ నివేదిక పేర్కొంది. ఆరోగ్యమే ’మఖానా’భాగ్యం.. » మఖానాలో ప్రొటీన్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, కీలకమైన ఖనిజ లవణాలు సమృద్ధిగా లభిస్తాయి. తక్కువ క్యాలరీలు ఉండటం వల్లే ఇది గ్లోబల్ సూపర్ ఫుడ్‌గా పేరుగాంచింది. » ప్రతి 100 గ్రాముల గింజల్లో 9.7 గ్రాముల ప్రొటీన్, 14 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇది శాఖాహారులకు అద్భుతమైన ప్రొటీన్ సోర్స్‌గా మారింది. » 25 గ్రాముల మఖానాలో 89 క్యాలరీలు మాత్రమే ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునేవారు మఖానా మంత్రం జపిస్తున్నారు. » గ్లూటెన్ అస్సలు లేకపోవడం, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, అధిక పీచు పదార్థం (ఫైబర్) ఉండటం వల్ల మధుమేహం, కిడ్నీ సమస్యలు ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది. » ఇక అధిక మెగ్నీషియం, తక్కువ సోడియం కారణంగా రక్తపోటును నియంత్రించి, హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. -
ఏఐ ఏజెంట్.. సాఫ్ట్వేర్ ఇంజినీర్లపై ప్రభావం!
ఓపెన్ఏఐ (OpenAI) తన 'ఏఐ ఏజెంట్'ను అనేక కొత్త దేశాలకు విస్తరించింది. గతంలో యునైటెడ్ స్టేట్స్‌లోని చాట్‌జీపీటీ ప్రో వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండే 'ఏఐ ఏజెంట్' ఇప్పుడు.. ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, భారతదేశం, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, యునైటెడ్ కింగ్డమ్ వంటి దేశాల్లో కూడా అందుబాటులోకి వచ్చేసింది.స్విట్జర్లాండ్, నార్వే, లీచ్టెన్స్టెయిన్, ఐస్‌లాండ్‌తో సహా కొన్ని యూరోపియన్ దేశాలలో దీనిని యాక్సెస్ చేయడానికి ఇంకా కొంతకాలం వేచి ఉండాల్సి ఉంది. ఈ విషయాన్ని సంస్థ తన ఎక్స్ ఖాతాలో అధికారికంగా వెల్లడించింది.Operator is now rolling out to Pro users in Australia, Brazil, Canada, India, Japan, Singapore, South Korea, the UK, and most places ChatGPT is available.Still working on making Operator available in the EU, Switzerland, Norway, Liechtenstein & Iceland—we’ll keep you updated!— OpenAI (@OpenAI) February 21, 2025యూజర్లు ఇచ్చే ఆదేశాలను అనుసరించి ఏఐ ఏజెంట్ పనిచేస్తుంది. కఠినమైన ఆన్లైన్ టాస్క్‌లను సైతం అవలీలగా నిర్వహించగలిగిన ఈ ఏఐ ఏజెంట్.. ఆపరేటర్ కంప్యూటర్ యూజింగ్ ఏజెంట్ ఆధారంగా పనులు పూర్తి చేస్తుంది. ఇది టెక్స్ట్, ఇమేజ్ వంటి ఇన్పుట్లను స్వీకరించి.. లోపాలను పరిష్కరిస్తుంది. కాబట్టి యూజర్ వేరొక పనిలో ఉన్నప్పుడు, ఈ ఏఐ ఏజెంట్ స్వతంత్రంగా పనిచేస్తుంది. తద్వారా ఉత్పాదకత పెరుగుతుంది.ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ చేసే పనులను ఏఐ ఏజెంట్ పూర్తి చేస్తుందని.. ఓపెన్ఏఐ సీఈఓ 'శామ్ ఆల్ట్‌మన్' గతంలోనే వెల్లడించారు. కానీ ఏఐ ఏజెంట్స్.. వాటికి అప్పగించిన పనులు మాత్రమే చేస్తాయి. సొంతంగా ఆలోచించగలిగే జ్ఞానం వాటికి లేదని ఆయన స్పష్టం చేశారు. అన్ని రంగాల్లోనూ ఏఐ ఏజెంట్ ఉపయోగపడుతుందని అన్నారు.ఇదీ చదవండి: 'భారత్‌లో టెస్లా కార్ల ధరలు ఇలాగే ఉంటాయి!': సీఎల్ఎస్ఏ రిపోర్ట్సాఫ్ట్వేర్ ఇంజినీర్లను ఏఐ ఏజెంట్ పూర్తిగా భర్తీ చేయలేకపోవచ్చు, కానీ ఆ రంగంపై.. ప్రభావం చూపుతుంది. కొంతమందిపై అయిన ప్రభావం చూపుతుంది. దీంతో కొందరు ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉంది.