Personal Finance
-
సిబిల్ స్కోర్ అప్డేట్.. ఆర్బీఐ ఆరు నిబంధనలు
ఆర్థిక అవసరాలు నిత్యం పెరుగుతున్నాయి. వాటిని తీర్చుకునేందుకు చాలామంది రుణాలు తీసుకుంటున్నారు. ఆర్థిక సంస్థలు రుణాలపై విధించే వడ్డీరేట్లు కూడా భారీగా ఉన్నాయి. మంచి క్రెడిట్ స్కోరు సొంతం చేసుకుంటే తక్కువ వడ్డీకే రుణాలు పొందే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల ఆర్బీఐ కస్టమర్ల రుణ ప్రక్రియను సులభతరం చేయడానికి కొన్ని నిబంధనలు జారీ చేసింది. ఆర్బీఐ విడుదల చేసిన ఈ ఆరు నిబంధనలు వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉండనున్నాయి.సిబిల్ స్కోర్ అప్డేషన్లో మార్పులుఆర్బీఐ జారీ చేసిన నిబంధనల ప్రకారం క్రెడిట్ స్కోర్ 30 రోజులకు బదులుగా ప్రతి 15 రోజులకు అప్డేట్ అవుతుంది. ఈ నిబంధనలు 2025 జనవరి 1 నుంచే అమల్లోకి వచ్చాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ క్రెడిట్ స్కోర్‌ను వీలైనంత త్వరగా అప్డేట్ చేసుకోవాలని ఆర్బీఐ బ్యాంకులకు సూచించింది. దీనితో పాటు క్రెడిట్ సంస్థలు ప్రతి నెలా కస్టమర్ క్రెడిట్ సమాచారాన్ని సీఐసీ(చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్)కి తెలియజేయాలి.తనిఖీ చేస్తే సమాచారంబ్యాంకు లేదా ఎన్బీఎఫ్సీ ఖాతాదారుల క్రెడిట్ రిపోర్టును తనిఖీ చేసినప్పుడల్లా ఆయా సమాచారాన్ని కస్టమర్లకు పంపాలని ఆర్బీఐ అన్ని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు తెలిపింది. నిబంధనల ప్రకారం ఈ సమాచారాన్ని కస్టమర్లకు పంపడానికి ఎస్ఎంఎస్ లేదా ఇమెయిల్ ఉపయోగించవచ్చు.అభ్యర్థన తిరస్కరణకు కారణాన్ని తెలిపేలా..ఖాతాదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కస్టమర్ అభ్యర్థనలను బ్యాంకులు తిరస్కరించినట్లయితే దానికిగల కారణాన్ని వారికి చెప్పాలి. తద్వారా వినియోగదారులు వారి అభ్యర్థన ఎందుకు తిరస్కరించబడిందో తెలుసుకోవచ్చని, వారు దాన్ని సకాలంలో మెరుగుపరచవచ్చని ఆర్బీఐ తెలిపింది.ఉచిత క్రెడిట్ రిపోర్టులునిబంధనల ప్రకారం కస్టమర్లు తమ క్రెడిట్ హిస్టరీని సరిగ్గా తెలుసుకునేందుకు వీలుగా ఏడాదికి ఒకసారి క్రెడిట్ కంపెనీలకు ఉచితంగా పూర్తి క్రెడిట్ స్కోర్లను అందించాలి. ఇందుకోసం క్రెడిట్ కంపెనీలు తమ వెబ్సైట్లో ప్రత్యేకంగా లింక్‌ను డిస్ప్లే చేయాలి.నోడల్ అధికారి నియామకంఏదైనా బ్యాంక్ కస్టమర్‌ను డిఫాల్ట్‌గా ప్రకటించబోతున్నట్లయితే అంతకుముందు ఆర్థిక సంస్థలు ఆ విషయాన్ని సదరు వ్యక్తికి సమాచారం అందించాలి. ఇందుకోసం రుణాలు ఇచ్చిన సంస్థలు ఎస్ఎంఎస్/ ఈ-మెయిల్ ద్వారా ఖాతాదారులకు సమాచారాన్ని చేరవేయాలి. దీనితో పాటు బ్యాంకు లేదా రుణం ఇచ్చిన సంస్థలు నోడల్ అధికారిని (నోడల్ ఆఫీసర్) నియమించాలి. ఖాతాదారుల క్రెడిట్ స్కోర్‌కు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ఈ నోడల్ అధికారి పనిచేస్తారు.ఇదీ చదవండి: పాక్ రైల్వే విస్తీర్ణం ఎంతో తెలుసా..?త్వరితగతిన ఫిర్యాదుల పరిష్కారంఖాతాదారులకు ఏవైనా సమస్యలు ఉంటే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీకి ఫిర్యాదు చేయవచ్చు. ఈ కంపెనీలు 30 రోజుల్లోగా వినియోగదారుల సమస్యలను పరిష్కరించకపోతే రోజుకు రూ.100 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. -
‘పెట్టుబడుల కంటే ప్రధానమైనవి ఇవే..’ కామత్ సూచన
పర్సనల్ ఫైనాన్స్(Personal Finance) ప్రణాళికలు మెరుగ్గా ఉంటే భవిష్యత్తులో ఆర్థిక స్వతంత్రం సాధించవచ్చని అనుకుంటారు. దాన్ని సాధించేందుకు చాలామంది స్టాక్‌మార్కెట్ లేదా ఇతర పెట్టుబడి మార్గాలవైపు మొగ్గు చూపుతారు. కానీ జెరోధా స్టాక్ బ్రోకింగ్ కంపెనీ వ్యవస్థాపకుడు నితిన్ కామత్(Nitin Kamat) మాత్రం పర్సనల్ ఫైనాన్స్ కంటే ముఖ్యమైన అంశాలపై పెట్టుబడిదారులు దృష్టి సారించాలని సూచించారు. ఇటీవల కామత్ తన బ్లాగ్‌లో స్పందిస్తూ పర్సనల్ ఫైనాన్స్ కంటే ప్రతిఒక ఇన్వెస్టర్ తప్పకుండా తెలుసుకోవాల్సిన అంశాలేంటో తెలియజేశారు.‘మీరు చేసే పెట్టుబడులు దీర్ఘకాలంలో మంచి రాబడులు అందించే అవకాశం ఉంటుంది. అందుకోసం చాలామంది స్టాక్ మార్కెట్లు, ఇతర మార్గాలను ఎంచుకుంటున్నారు. కానీ కుటుంబంలో మీపై ఆదారపడినవారు ఉంటే ముందుగా మీరు పెట్టుబడుల కంటే జీవిత బీమాకే తీసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అదే మీ గొప్ప పెట్టుబడి ఆలోచనవుతుంది. మీ కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడం మీ ప్రాథమిక బాధ్యత. అది చాలా అవసరం కూడా’ అని కామత్ రాశారు.ఇదీ చదవండి: ఒకే వాహనం.. 14 కెమెరాలు, 9 రాడార్లు, 6 సెన్సార్లు‘మారుతున్న జీవన ప్రమాణాలు, ఆహార అలవాట్ల దృష్ట్యా మనుషుల ఆరోగ్య సంరక్షణ ఖర్చులు పెరుగుతూ, ఆయుర్దాయం తగ్గుతోంది. ఊహించని వైద్య ఖర్చులను నిర్వహించేలా తగినంత ఆరోగ్య బీమాను ఎంచుకోండి. మీపై ఆధారపడిన వారి ఆర్థిక అవసరాలకు అనుగుణంగా మంచి టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. మారుతున్న జీవన పరిస్థితులకు అనుగుణంగా కవరేజీని క్రమానుగతంగా పునఃసమీక్షించాలి. ఈ చర్యలు మీ కుటుంబానికి ఆర్థిక కష్టాల నుంచి కాపాడటమే కాకుండా మనశాంతిని అందిస్తాయి. ఫలితంగా పెట్టుబడిదారులు ఆత్మవిశ్వాసంతో తమ ఆర్థిక లక్ష్యాలను కొనసాగించడానికి ఈ విధానాలు వీలు కల్పిస్తాయి’ అని తెలిపారు.దీర్ఘకాలిక దృక్పథంతో పెట్టుబడులుమార్కెట్ కరెక్షన్ల సమయంలో క్రమానుగత పెట్టుబడి విధానం(సిప్)లను ఆపవద్దని కామత్ ఇన్వెస్టర్లకు సూచించారు. ‘మార్కెట్ క్షీణత భయపెట్టవచ్చు, కానీ అవి దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలను అందిస్తాయి’ అని తెలిపారు. క్రమశిక్షణతో ఉండటం, సిప్ కంట్రిబ్యూషన్లను నిర్వహించడం ద్వారా పెట్టుబడిదారులు దీర్ఘకాలంలో మంచి రాబడులు పొందవచ్చు. పెట్టుబడి పెట్టడానికి కంటే ముందుకు ప్రతిఒక్కరు విధిగా జీవిత, ఆరోగ్య బీమాలు తీసుకోవాలని కామత్ కోరారు. -
ఇక యూపీఐ, రూపే లావాదేవీలపై ఛార్జీలు..
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI), రూపే డెబిట్ కార్డుల ద్వారా నిర్వహించే లావాదేవీలపై మర్చెంట్ ఫీజులను తిరిగి తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. ఈ మేరకు బ్యాంకింగ్ సమాఖ్య పంపిన ప్రతిపాదనలకు కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.ప్రస్తుతం ఈ లావాదేవీలపైన ఎటువంటి అదనపు ఛార్జీలు లేవు. అయితే వార్షిక ఆదాయం రూ. 40 లక్షల కంటే ఎక్కువ ఉన్న వ్యాపారుల యూపీఐ చెల్లింపుల మీద 'మర్చెంట్ డిస్కౌంట్ రేట్' (MDR)ను మళ్ళీ తీసుకురావాలని ప్రతిపాదిస్తూ బ్యాంకింగ్ ఇండస్ట్రీ ప్రతినిధులు కేంద్రానికి పంపించారు. దీనిపై కేంద్రం కూడా సానుకూలంగా స్పందించడంతో.. ఇది త్వరలోనే అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే వీసా కార్డు, మాస్టర్ కార్డు వంటి డెబిట్ కార్డులు.. క్రెడిట్ కార్డుల లావాదేవీలపై మర్చెంట్ డిస్కౌంట్ రేట్ చెల్లిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వారు యూపీఐ, రూపే డెబిట్ కార్డుల లావాదేవీలపై కూడా ఛార్జీలు ఎందుకు చెల్లించకూడదు?. ఈ విషయాన్ని కేంద్రం అలోచించి సానుకూలంగా స్పందించింది. అయితే వార్షిక ఆదాయం రూ. 40 లక్షల కంటే తక్కువ ఉన్నవారు ఈ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడంలో భాగంగా.. ప్రభుత్వం 2022 బడ్జెట్లో ఎండీఆర్ చార్జీలను తొలగిస్తున్నట్లు వెల్లడించారు. అప్పటి వరకు వ్యాపారుల లావాదేవీ మొత్తంలో ఒక శాతం కంటే తక్కువ ఛార్జీ వసూలు చేసేవారు. తరువాత ఈ ప్రాసెసింగ్ ఖర్చులను భర్తీ చేయడానికి బ్యాంకులు, ఫిన్‌టెక్ కంపెనీలకు కేంద్రం సబ్సిడీలు ఇస్తూ వచ్చింది. అయితే ఈ సబ్సిడీ కూడా ఈ ఏడాది రూ. 3,500 కోట్ల నుంచి రూ. 437 కోట్లకు తగ్గింది. ఇప్పుడు మళ్ళీ ఛార్జీలు వసూలు చేయడానికి కేంద్రం గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేసింది.ఇదీ చదవండి: దిగొచ్చిన బంగారం.. మరోసారి తగ్గిన రేటుఇటీవల కొత్తగా నియమితులైన ఆర్బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రాతో జరిగిన సమావేశంలో ఫిన్‌టెక్ అధికారులు డిజిటల్ చెల్లింపులపై ఎండీఆర్ అంశాన్ని లేవనెత్తారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) డేటా ప్రకారం, ఫిబ్రవరి 2025లో యూపీఐ లావాదేవీల మొత్తం 16.11 బిలియన్ డాలర్లు అని తెలుస్తోంది. -
మహిళలకూ కావాలి సమగ్ర బీమా
సంరక్షకులుగా, కుమార్తెలుగా, మాతృమూర్తులుగా తమ కుటుంబాల సంక్షేమం కోసం మహిళలు సమాజంలో ఎంతో కీలకమైన, వైవిధ్యమైన పాత్రలు పోషిస్తుంటారు. అయితే ఈ బాధ్యతలను నిర్వర్తించడంలో వారు సాధారణంగానే తమ సొంత ఆర్థిక, వైద్య భద్రత విషయాలను అంతగా పట్టించుకోరు. అందుకే చాలా మంది మహిళలకు తగినంత బీమా భద్రత లేకపోవడమో లేదా పూర్తిగా తమ జీవిత భాగస్వామి లేదా బంధువు బీమాపైనో ఆధారపడాల్సిన పరిస్థితి ఉంటోంది. జీవిత కాలం ఎక్కువగా ఉండటం, కెరియర్లో అంతరాయాలు, భారీ ఆరోగ్య సంరక్షణ ఖర్చుల్లాంటి ప్రత్యేక ఆరోగ్య, ఆర్థిక సవాళ్లెన్నో మహిళలకు ఉంటాయి. అందుకే వారి స్వాతంత్య్రానికి, స్థిరత్వానికి తగినంత బీమా రక్షణ ఉండటం ఎంతో అవసరం.కీలకంగా బీమా ..సాధారణంగా పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువ కాలం జీవించినప్పటికీ, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక పరిమితుల కారణంగా సుదీర్ఘ కాలం పాటు మెరుగైన జీవితాన్ని గడిపే అవకాశం ఉండకపోవచ్చు. సమగ్రమైన బీమా కవరేజీ ఉంటే సముచితమైన ఆరోగ్య సంరక్షణ పొందడానికి అవకాశాలు గణనీయంగా మెరుగుపడగలవు. 2023, 2024 మధ్య కాలంలో చూస్తే 15 నుంచి 49 ఏళ్ల వరకు వయస్సున్న మహిళల్లో 30 శాతం మందికి ఎటువంటి ఆరోగ్య బీమా గానీ ఆర్థిక రక్షణ కవచం గానీ లేదని వెల్లడైంది. ఇలా చాలా మంది మహిళలు తమ సొంత అవసరాలను పక్కన పెట్టి కుటుంబ అవసరాలకే ప్రాధాన్యమిస్తుంటారు. ఆర్థిక పరిమితుల వల్ల నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను పొందలేకపోతుంటారు.మెటర్నిటీ, కుటుంబ భద్రతప్రసవానికి పూర్వ పరీక్షలు, ప్రసవ వ్యయాలు, ప్రసవానంతర సంరక్షణ, నవజాత శిశువుల వైద్య అవసరాలకు అవసరమైన కీలక ఆర్థిక సహాయాన్ని మెటర్నిటీ ఇన్సూరెన్స్ అందిస్తుంది. పిల్లల కోసం సన్నద్ధమవుతున్న యువ జంటలకు ఇలాంటి పాలసీలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. శిశుజననం, సంబంధిత ఖర్చుల విషయంలో ఆర్థికంగా సన్నద్ధంగా ఉండేందుకు ఇవి సహాయకరంగా ఉంటాయి. చాలా మంది మహిళలు సాధారణంగా ఉద్యోగాలు చేసే సంస్థ ఇచ్చే బీమాపైనో లేదా జీవిత భాగస్వామి బీమాపైనో ఆధారపడుతుంటారు. కానీ సొంతంగా పాలసీ ఉంటే మరింత ఆర్థిక భద్రత ఉంటుంది. కెరియర్ మార్పుల వల్ల లేదా జీవితంలో మార్పుల వల్ల కవరేజీపై ప్రభావం పడే పరిస్థితుల్లో ఇదెంతో అండగా ఉంటుంది.రిటైర్మెంట్, దీర్ఘకాలిక సంరక్షణ ప్రణాళికమహిళలు సాధారణంగా పెద్ద వయస్సులోని బంధువుల బాగోగులను చూసుకునే సంరక్షకుల పాత్రను కూడా పోషిస్తూ ఉంటారు. ఇది భావోద్వేగాలపరంగా, ఆర్థికంగా భారంగా ఉండొచ్చు. దీర్ఘకాలిక సంరక్షణ బీమా అనేది వైద్య వ్యయాలను, ఆర్థిక ఒత్తిళ్లను అధిగమించేందుకు ఉపయోగపడుతుంది. సంరక్షకులు అలాగే వారిపై ఆధారపడిన వారికి కూడా మెరుగైన సహాయం లభించేలా తోడ్పడుతుంది. అంతేగాకుండా, జీవిత కాలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రిటైర్మెంట్ త ర్వాత కూడా స్థిరమైన, మెరుగైన జీవితాన్ని సాగించేలా మహిళలు పెన్షన్ ప్లాన్లు లేదా యాన్యుటీ ఆధారిత బీమా పాలసీలను తప్పక పరిశీలించాలి.వైకల్యం, ఆదాయ భద్రతపిల్లల సంరక్షణ కోసం కావచ్చు లేదా వయస్సు పైబడుతున్న తల్లిదండ్రుల సంరక్షణ కోసం కావచ్చు చాలా మంది మహిళలకు కెరియర్లో అంతరాయాలు ఏర్పడుతుంటాయి. దీనితో వారు పని చేసే కంపెనీల నుంచి బీమా ప్రయోజనాలు పరిమితంగానే ఉండొచ్చు. అలాగే దీర్ఘకాలిక పొదుపు కూడా తగ్గుతుంది. అనారోగ్యం లేదా ప్రమాదం బారిన పడి పని చేసే పరిస్థితి లేనప్పుడు కూడా స్థిరమైన ఆదాయం లభించేలా డిజేబిలిటీ ఇన్సూరెన్స్ అనేది ఆర్థిక భద్రతను అందిస్తుంది. జీవితపు అనిశ్చితుల్లోనూ ఆర్థిక భద్రత ఉండేందుకు ఈ రక్షణ ఉపయోగపడుతుంది.స్థిరమైన భవిష్యత్తుకు రక్షణ కవచంమహిళలు తమ ఆర్థిక స్వతంత్రత, ఆరోగ్య సంరక్షణ భద్రతకు తప్పక ప్రాధాన్యమివ్వాలి. వీలైనంత ముందుగా సమగ్ర బీమా పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల, అనూహ్య ఆర్థిక కష్టాల నుంచి రక్షణను, దీర్ఘకాలికంగా స్థిరత్వాన్ని పొందేందుకు వీలవుతుంది. క్రియాశీలకమైన చర్యలు తీసుకోవడం ద్వారా అనుకోని సవాళ్ల నుంచి మహిళలు తమను, తమ కుటుంబాలను రక్షించుకోవచ్చు.స్వతంత్రంగా నిర్ణయాలుతొలినాళ్లలోనే బీమా పాలసీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మహిళలు ఆర్థిక ప్రణాళికల విషయంలో క్రియాశీలకంగా వ్యవహరించాలి. చిన్న వయస్సులోనే బీమా తీసుకోవడం వల్ల ప్రీమియంల భారం తక్కువగా ఉంటుంది. అలాగే ప్రీ–ఎగ్జిస్టింగ్ కండీషన్స్‌కి సంబంధించిన ఎక్స్‌క్లూజన్స్ కూడా తగ్గుతాయి. యుక్తవయస్సులోని చాలా యువతులకు తమ తల్లిదండ్రుల హెల్త్ ఇన్సూరెన్స్‌తో కవరేజీ లభిస్తుంది. అయితే, స్వతంత్ర పాలసీకి మారడం వల్ల, డిపెండెంట్ కవరేజీ వయో పరిమితిని దాటిన తర్వాత కూడా నిరంతరాయ కవరేజీ, అదనపు ప్రయోజనాలను పొందవచ్చు.ఇదీ చదవండి: ఈటీఎఫ్‌లు–ఇండెక్స్ ఫండ్స్ మధ్య వ్యత్యాసం?స్మార్ట్ ఆర్థిక ప్రణాళికఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ, 80డీ కింద జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీలకు పన్ను ప్రయోజనాలు ఉంటాయి. ఆ రకంగా చూస్తే ఇవి ఆర్థికంగా స్మార్ట్ పెట్టుబడి సాధనాలుగా కూడా ఉంటాయి. వీలైనంత ముందుగా ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టిన మహిళలకు తక్కువ ప్రీమియంలతో ఎక్కువ కవరేజీ, తద్వారా దీర్ఘకాలం పాటు ఆర్థిక భద్రత ప్రయోజనాలు లభిస్తాయి. మెటర్నిటీ కేర్, డెలివరీ, ఫెర్టిలిటీ చికిత్సలు సహా మహిళలకు సంబంధించిన ప్రత్యేకమైన ఆరోగ్యసంరక్షణ అవసరాలను తీర్చే విధంగా బీమా పాలసీలు ఉంటాయి. మూడేళ్ల పాటు లైఫ్ కవరేజీ సహా సరోగేట్ తల్లులకు పూర్తి కవరేజీ ఉండాలని బీమా రంగ నియంత్రణ మరియు అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) నిర్దేశిస్తోంది.-అమితాబ్ జైన్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ -
మీ బ్యాంక్ డిపాజిట్ ఎంత భద్రం?
ముంబైకి చెందిన ధన్‌రాజ్ (50) ఉదయం నిద్రలేచి, పేపర్ చూడగానే ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యాడు. న్యూ ఇండియా సహకార బ్యాంక్‌లో స్కామ్ జరిగిందనేది ఆ వార్త సారాంశం. చిరుద్యోగి అయిన ధన్‌రాజ్ తన కుమార్తె వివాహం కోసమని రూ.4 లక్షలను అదే బ్యాంక్‌లో కొన్నాళ్ల క్రితం డిపాజిట్ చేశాడు. కంగారుగా బ్యాంక్ శాఖకు చేరుకుని విచారించగా, డిపాజిట్లకు ఢోకా లేదన్న సమాచారం విని కాస్తంత కుదుటపడ్డాడు. రూ.5 లక్షల వరకు డిపాజిట్లపై బీమా సదుపాయం ఉంటుందని కస్టమర్లు చెప్పుకుంటుండగా విని.. హమ్మయ్య అని ఊపిరిపీల్చుకున్నాడు. బ్యాంక్ డిపాజిట్.. దేశంలో చాలా మందికి తెలిసిన, ఇష్టమైన పెట్టుబడి సాధనం. చాలా మంది తమ పొదుపు సొమ్మును డిపాజిట్ రూపంలో మదుపు చేయడం కూడా చూస్తుంటాం. కానీ, ఇందులో ఉండే రిస్క్ ల గురించి అవగాహన ఉండదు. డిపాజిటర్లు అందరూ దీనిపై ఓసారి దృష్టి సారించాల్సిన అవసరాన్ని న్యూ ఇండియా కో ఆపరేటివ్ బ్యాంక్ ఉదంతం గుర్తు చేస్తోంది. ఒకప్పుడు ప్రతి కుటుంబ ఆర్థిక సాధనాల్లో బ్యాంక్ డిపాజట్ (ఎఫ్డీ) తప్పకుండా ఉండేది. కాలక్రమంలో ఇతర సాధనాల పట్ల ఆసక్తి పెరుగుతూ వస్తోంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ ఈటీఎఫ్‌లు తదితర వాటిల్లో పెట్టుబడులు పెరుగుతూ, డిపాజిట్లు తగ్గుతున్నాయి. ఇప్పటికీ 15 శాతం గృహ పొదుపులు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లలోకే (ఎఫ్డీలు/టర్మ్ డిపాజిట్లు) వెళుతున్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఎఫ్డీలు ఎంతో మందికి నమ్మకమైన, మెరుగైన సాధనం. దీర్ఘకాలంలో గొప్ప రాబడి రాకపోయినా సరే, అత్యవసరంలో వేగంగా వెనక్కి తీసుకునేందుకు అనుకూలంగా ఉండడం చాలా మందికి నచ్చే అంశం. పైగా డిపాజిట్ అంటే ఏ మాత్రం రిస్క్ ఉండదని చాలా మంది అభిప్రాయపడుతుంటారు. ప్రభుత్వ గ్యారంటీ (సావరీన్) ఉంటే తప్పించి, బ్యాంక్ ఎఫ్డీ అయినా, ఏ ఇతర పెట్టుబడి సాధనంలో అయినా ఎంతో కొంత రిస్క్ ఉంటుంది. దీనిపట్ల ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరం. మెరుగైన నియంత్రణలు ఎఫ్డీ ఎంతో ప్రాచుర్యానికి నోచుకోవడం వెనుక అందులోని సరళత్వం, భద్రత కీలకమని చెప్పుకోవాలి. ఏవో కొన్ని బ్యాంకు వైఫల్యాలను పక్కన పెడితే, మన దేశంలో బ్యాంకింగ్ రంగం పటిష్ట నియంత్రణల మధ్య కొనసాగుతుంటుంది. ప్రజల్లో నమ్మకం ఏర్పడడానికి ఇది కూడా ఒక కారణం. బ్యాంక్ యాజమన్యాలు/ఉద్యోగుల మోసపూరిత వ్యవహారం, రుణ వ్యాపారంలో దూకుడైన తీరు కొన్ని సందర్భాల్లో సమస్యలు, సంక్షోభాలకు దారితీయవచ్చు. ఎంత కట్టుదిట్టమైన నియంత్రణలు ఉన్నా కానీ, 2019లో పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంక్, 2020లో యస్ బ్యాంక్, ఇప్పుడు న్యూ ఇండియా కోపరేటివ్ బ్యాంక్ సంక్షోభాలు చోటుచేసుకున్నాయి. అంతకుముందు గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ కరాడ్ ఉదంతాలూ గుర్తుండే ఉంటాయి. కనుక బ్యాంక్ డిపాజిట్లలోనూ రిస్క్ ఉంటుందని అర్థం చేసుకోవాలి. కాకపోతే మనదగ్గర ఆర్బీఐ పటిష్ట నియంత్రణల కారణంగా ఈ తరహా సంక్షోభాలు చాలా తక్కువగా కనిపిస్తుంటాయి.డిపాజిట్‌పై బీమా ఆర్బీఐ నియంత్రణ పరిధిలోని అన్ని బ్యాంకుల్లోనూ రూ.5 లక్షల వరకు డిపాజిట్‌కు బీమా రక్షణ ఉంటుంది. అసలు లేదా అసలుతోపాటు వడ్డీ కలుపుకుని రూ.5 లక్షలకు మించి ఉన్నప్పటికీ బీమా రూ.5 లక్షలకే పరిమితం. బ్యాంక్ ఏదైనా సంక్షోభం పాలైతే అప్పుడు ఒక్కో డిపాజిట్ దారుడికి గరిష్టంగా రూ.5 లక్షలు వెనక్కి వస్తాయి. సేవింగ్స్, ఫిక్స్డ్, కరెంట్, రికరింగ్ ఇలా అన్ని డిపాజిట్లకూ ఈ రక్షణ వర్తిస్తుంది. ఈ వ్యవహారం అంతా చూసేది ఆర్బీఐ అనుబంధ సంస్థ అయిన ‘డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’ (డీఐసీజీసీ). ప్రతి రూ.100 డిపాజిట్‌పై రూ.12 పైసలు చొప్పున ప్రీమియం కింద బ్యాంక్‌లు డీఐసీజీసీకి చెల్లించాల్సి ఉంటుంది. ఒక బ్యాంక్‌కు చెందిన ఒకటికి మించిన శాఖలో డిపాజిట్లు ఉన్నప్పటికీ.. ఒక్కో ఖాతాదారుని పేరు మీద గరిష్ట బీమా రూ.5 లక్షలుగానే ఉంటుంది. కనుక ఒక బ్యాంక్‌లో రూ.5 లక్షలకు మించి చేసే డిపాజిట్‌పై కచ్చితంగా రిస్క్ ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఒక వ్యక్తి వేర్వేరు బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తే.. అప్పుడు విడిగా ఒక్కో బ్యాంక్ పరిధిలో సంబంధిత వ్యక్తికి గరిష్టంగా రూ.5 లక్షల డిపాజిట్‌కు బీమా రక్షణ వర్తిస్తుంది.బ్యాంక్ కుదుటపడితే.. బ్యాంకులో మోసం కావచ్చు. లేదా లిక్విడిటీ సంక్షోభం తలెత్తవచ్చు. రుణ ఎగవేతలతో క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్లిపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఆర్బీఐ తప్పకుండా జోక్యం చేసుకుంటుంది. తాత్కాలిక నిర్వహణ బాధ్యతల కోసం బోర్డ్‌ను ఏర్పాటు చేస్తుంది. బ్యాంక్ వ్యవహారాలను లోతుగా పరిశీలించి, చక్కదిద్దే వరకు డిపాజిట్ల ఉపసంహరణపై పూర్తిగా లేదా పాక్షికంగా ఆంక్షలు విధిస్తుంది. పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంక్‌లో రుణ అవకతవకలు సంక్షోభానికి దారితీయగా, ఆర్బీఐ దాన్ని చక్కదిద్దింది. అది ఇప్పుడు యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో భాగం అయింది. యస్ బ్యాంక్‌లోనూ రుణ మోసాలు బయటపడగా, కొత్త బోర్డ్‌ను ఏర్పాటు చేసి గాడిన పెట్టింది. రూ.5 లక్షలకు పైగా డిపాజిట్లు కలిగిన వారు.., రూ.5 లక్షలకు పైబడిన మొత్తాన్ని తిరిగి పొందడం కోసం బ్యాంక్ గాడిన పడే వరకు వేచి చూడాల్సిందే. అప్పటికీ పూర్తి మొత్తం వెనక్కి వస్తుందన్న గ్యారంటీ ఉండదు. ఎంత కోత పడుతుందన్నది బ్యాంక్ ఆర్థిక పద్దుల ఆరోగ్యంపైనే ఆధారపడి ఉంటుంది.బ్యాంకు నుంచే చెల్లింపులు బ్యాంక్‌లో సమస్య తలెత్తినప్పుడు డిపాజిట్‌దారులు డీఐసీజీసీని సంప్రదించాల్సిన అవసరం ఉండదు. బ్యాంక్ నిర్వహణ బాధ్యతలు చూసే బోర్డ్.. డిపాజిట్‌దారుల వివరాలతో జాబితాను డీఐసీజీసీకి పంపిస్తుంది. ఆ వివరాల వాస్తవికతను 30 రోజుల్లోపు డీఐసీజీసీ తేల్చాలి. అక్కడి నుంచి 15 రోజుల్లోపు డిపాజిట్‌దారులకు చెల్లించాల్సిన బీమా మొత్తాన్ని బ్యాంక్‌కు డీఐసీజీసీ బదిలీ చేస్తుంది. అప్పుడు ఖాతాదారులకు బ్యాంక్ సిబ్బంది చెల్లింపులు చేస్తారు. బ్యాంక్‌పై ఆంక్షలు విధించిన నాటి నుంచి 90 రోజుల్లో డిపాజిట్‌దారులకు బీమా మొత్తం వెనక్కి చెల్లించాలని నిబంధనలు చెబుతున్నాయి. విచారించుకున్న తర్వాతే.. ఆర్బీఐ పరిధిలోని అన్ని బ్యాంక్‌లు తప్పనిసరిగా డీఐసీజీసీ పరిధిలోకి వస్తాయి. అవి డిపాజిట్లపై బీమా ప్రీమియం కచ్చితంగా చెల్లించాల్సిందే. సందేహం ఉంటే డిపాజిట్ చేసే ముందు బ్యాంక్ అధికారిని అడిగి బీమా ఉందా? అని నిర్ధారించుకోవచ్చు. అన్ని ప్రభుత్వరంగ బ్యాంక్‌లు, ప్రైవేటు షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంక్‌లు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లు, భారత్‌లో కార్యకలాపాలు నిర్వహించే విదేశీ బ్యాంక్‌లు, కో ఆపరేటివ్ బ్యాంక్‌లు, లోకల్ ఏరియా బ్యాంక్‌లు, రీజినల్ రూరల్ బ్యాంక్‌లు, పేమెంట్స్ బ్యాంక్‌లు, స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్‌లు, అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్‌లు డీఐసీజీసీ పరిధిలోకి వస్తాయి. ప్రైమరీ కో ఆపరేటివ్ సొసైటీలు మాత్రం దీని కిందికి రావు.అధిక వడ్డీ రేట్లు.. అన్నీ చూసాకే ప్రభుత్వరంగ బ్యాంక్‌లు, ప్రైవేటు యూనివర్సల్ బ్యాంకులతో పోల్చితే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు డిపాజిట్లపై అధిక వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తుంటాయి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు రుణాలపై అధిక రేట్లను చార్జ్ చేస్తుంటాయి. కనుక అవి డిపాజిట్లను ఆకర్షించేందుకు ఎక్కువ రేట్లను ఇస్తుంటాయి. ఏ బ్యాంక్ అయినా సరే అధిక వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తుంటే, అందులో ఇన్వెస్ట్ చేసే ముందు ఈ రేషియోలను ఒక్కసారి పరిశీలించడం మంచిది. సీఆర్ఏఆర్: క్యాపిటల్ టు రిస్క్ అస్సెట్ రేషియో అని, దీన్నే క్యాపిటల్ అడెక్వెసీ రేషియో అని కూడా అంటారు. ప్రభుత్వరంగ బ్యాంక్‌లకు ఇది కనీసం 12 శాతంగా, ప్రైవేటు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్‌లకు 9 శాతం మేర ఉండాలి. అదే స్మాల్ ఫైనాన్స్‌బ్యాంక్‌లకు 15 శాతం ఉండాలి. బ్యాంక్ తనకు ఎదురయ్యే చెల్లింపుల బాధ్యతలను ఎంత సమర్థంగా ఎదుర్కోగలదన్నది ఇది తెలియజేస్తుంది. ఎల్‌సీఆర్: లిక్విడిటీ కవరేజీ రేషియో 100 శాతం ఉండాలి. 30 రోజుల అవసరాలకు సరిపడా నిధులు బ్యాంకుల వద్ద ఉంచడం కోసం ఈ నిబంధన. దీనివల్ల లిక్విడిటీ షాక్‌లను బ్యాంక్‌లు సమర్థంగా ఎదుర్కోగలవు. అసలు రాబడి ఎంత? అత్యవసర నిధిని అట్టి పెట్టుకునేందుకు, స్వల్పకాలిక అవసరాలకు ఉద్దేశించిన నిధులను బ్యాంక్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేసుకుంటానంటే ఫర్వాలేదు. కానీ, దీర్ఘకాల లక్ష్యాల కోసం నిధిని సమకూర్చుకునేందుకు, సంపద సృష్టికి బ్యాంక్ డిపాజిట్ మెరుగైన సాధనం కాబోదు. ఈక్విటీలపై దీర్ఘకాలంలో 12 శాతం, బంగారంలో 8 శాతం మేర సగటు రాబడి ఉంటోంది. ఈక్విటీ, బంగారంలో పెట్టుబడిని విక్రయించినప్పుడే లాభాలపై పన్ను చెల్లిస్తే సరిపోతుంది. బ్యాంక్ డిపాజిట్లపై అలా కాదు. ప్రతి ఏటా ఆర్జించే వడ్డీ రాబడి అదే ఏడాది ఇన్వెస్టర్ వార్షిక ఆదాయానికి కలిపి చూపించాలి. అవసరమైతే పన్ను చెల్లించాలి. ఎఫ్డీ రాబడిపై పన్ను చెల్లించగా, మిగిలే నికర రాబడి ద్రవ్యోల్బణ స్థాయిలోనే ఉంటుంది. కనుక డిపాజిట్లలో కాంపౌండింగ్ ప్రయోజనం పెద్దగా ఉండదు.బీమా మరింత పెంచేనా..? 2019లో పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంక్‌లో సంక్షోభం తలెత్తిన తర్వాతే.. డిపాజిట్లపై రూ.లక్షగా ఉన్న బీమా పరిమితిని 2020 ఫిబ్రవరిలో రూ.5 లక్షలకు పెంచారు. ఈ బీమా రక్షణను మరింత పెంచాలన్న ప్రతిపాదన పరిశీలనలో ఉందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఎం.నాగరాజు ఇటీవల చేసిన ప్రకటన ఈ దిశగా డిపాజిటర్లలో అంచనాలను పెంచింది. ఇప్పటికిప్పుడు దీన్ని పెంచకపోయినా, భవిష్యత్తులో ఇందుకు తప్పక అవకాశం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఎన్బీఎఫ్సీ డిపాజిట్ల సంగతేంటి? బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ తదితర డిపాజిట్లు స్వీకరించే ఆర్బీఐ అనుమతి కలిగిన ఎన్బీఎఫ్సీలు (ఎన్బీఎఫ్సీ–డీ) దేశంలో 25 ఉన్నాయి. వీటి పరిధిలో 2024 మార్చి నాటికి రూ.1,02,994 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. మరి ఉన్నట్టుండి వీటిల్లో ఏదైనా ఎన్బీఎఫ్సీకి నిధుల సమస్య తలెత్తితే పరిస్థితి ఏంటి? బ్యాంకుల్లో మాదిరి వీటిల్లో డిపాజిట్లకు డీఐసీజీసీ కింద ఎలాంటి బీమా రక్షణ లేదు. ఇవన్నీ ప్రజల డిపాజిట్లే కనుక వీటిని సైతం డీఐసీజీసీ కిందకు తీసుకురావాలన్న డిమాండ్లు ఉన్నాయి. వీటిల్లో డిపాజిట్ చేసే ముందు ఇన్వెస్టర్లు రిస్క్ లను అర్థం చేసుకోవాలి. బ్యాంకులకూ రేటింగ్ ఉండాలి.. ఎన్బీఎఫ్సీలు తమ నిధుల అవసరాల కోసం బాండ్లు, ఎన్సీడీలను జారీ చేస్తుంటాయి. సంబంధిత ఎన్బీఎఫ్సీ ఆర్థిక ఆరోగ్యం ఆధారంగా రేటింగ్ ఏజెన్సీలు క్రెడిట్ రేటింగ్‌ను ప్రకటిస్తాయి. నిబంధనల ప్రకారం రేటింగ్ తప్పనిసరి. బ్యాంక్‌లు సైతం బాండ్లను జారీ చేయాలంటే రేటింగ్ తీసుకోవాల్సిందే. కానీ బ్యాంక్ డిపాజిట్లకు వచ్చే సరికి ఈ తరహా రేటింగ్ విధానం లేకపోవడాన్ని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. బ్యాంక్ డిపాజిట్లకు సైతం రేటింగ్‌ను తప్పనిసరి చేయడం వల్ల పాలన మెరుగుపడుతుందని ఎన్ఎస్జీ అండ్ పార్ట్నర్స్ పార్ట్నర్ రవి భడానీ అభిప్రాయపడ్డారు. దీనివల్ల డిపాజిట్ చేసే సమయంలో ఆయా బ్యాంక్‌లకు సంబంధించి రిస్క్ ను ఇన్వెస్టర్లు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అలా చేస్తే అప్పుడు బలహీన బ్యాంక్‌ల నుంచి అధిక రేటింగ్ ఉన్న బ్యాంకుల్లోకి డిపాజిట్లు తరలిపోయే రిస్క్ ఏర్పడుతుందని ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ డైరెక్టర్ సతీష్ మరాటే పేర్కొన్నారు. దీనికి బదులు మెరుగైన రేటింగ్ ఉన్న బ్యాంకులకు డిపాజిట్లపై బీమా ప్రీమియం తక్కువ వసూలు చేసే విధానం ఫలితమిస్తుందన్నారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
క్రెడిట్ కార్డు రూల్స్‌లో కీలక మార్పులు
ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ, ప్రయివేట్ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకులు తమ క్రెడిట్ కార్డు పాలసీల్లో కీలక మార్పులు చేస్తున్నాయి. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ మైల్స్టోన్ టికెట్ వోచర్లతో సహా అనేక ప్రయోజనాలను నిలిపివేయనుండగా, ఎస్బీఐ తన క్లబ్ విస్తారా ఎస్బీఐ, క్లబ్ విస్తారా ఎస్బీఐ ప్రైమ్ క్రెడిట్ కార్డుల నిబంధనలను సవరించింది. 2025 ఏప్రిల్ 1 నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి.ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డు మార్పులుఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ 2025 మార్చి 31 నుండి మైల్స్టోన్ టికెట్ వోచర్లు, పునరుద్ధరణ ప్రయోజనాలు, ఇతర ఫీచర్లను అందించడాన్ని నిలిపివేయనుంది. అయితే 2026 మార్చి 31 వరకు మహారాజా పాయింట్లు కొనసాగుతాయి. ఆ తర్వాత కార్డు పూర్తిగా నిలిచిపోతుంది. బ్యాంక్ ప్రకటన ప్రకారం కీలక మార్పులు ఇవే..క్లబ్ విస్తారా సిల్వర్ మెంబర్ షిప్ ఇకపై అందుబాటులో ఉండదు.వన్ ప్రీమియం ఎకానమీ టికెట్, వన్ క్లాస్ అప్ గ్రేడ్ వోచర్ తో సహా కాంప్లిమెంటరీ వోచర్లు నిలిచిపోతాయి.ప్రీమియం ఎకానమీ టికెట్లకు మైల్ స్టోన్ వోచర్లు ఇకపై జారీ కావు.2025 మార్చి 31 తర్వాత కార్డులను రెన్యువల్ చేసుకునే కస్టమర్ల వార్షిక రుసుమును ఏడాది పాటు రద్దు చేస్తారు.ఎస్బీఐ క్రెడిట్ కార్డు పాలసీల్లో మార్పులుక్లబ్ విస్తారా ఎస్బీఐ క్రెడిట్ కార్డుదారులకు ఎకానమీ టికెట్ వోచర్లు ఇకపై ఉండవు.రూ.1.25 లక్షలు, రూ.2.5 లక్షలు, రూ.5 లక్షల వార్షిక ఖర్చులకు మైల్ స్టోన్ బెనిఫిట్స్ నిలిపివేయనున్నారు.క్లబ్ విస్తారా ఎస్బీఐ ప్రైమ్ క్రెడిట్ కార్డు ఇకపై ప్రీమియం ఎకానమీ టికెట్ వోచర్లను అందించదు.బేస్ కార్డు రెన్యువల్ ఫీజు రూ.1,499, పీఎం కార్డు రెన్యువల్ ఫీజు రూ.2,999.వినియోగదారులకు ఫీజు మాఫీకి ఇంకా అవకాశం ఉంటుంది.మార్పుల వెనుక కారణంగత ఏడాది నవంబర్‌లో విస్తారా-ఎయిరిండియా విలీనం తర్వాత ఈ మార్పులు జరిగాయి. ఇది ఎయిరిండియా మహారాజా క్లబ్ లాయల్టీ కార్యక్రమంలో సర్దుబాట్లకు దారితీసింది. ఎస్బీఐ, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ తమ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలను సవరించగా, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ ఇంకా ఎటువంటి మార్పులను ప్రకటించలేదు. -
క్రిప్టో మార్కెట్ వైపు అతివల అడుగులు: కారణం ఇదే..
క్రిప్టో కరెన్సీ విలువ రోజురోజుకి వృద్ధి చెందుతున్న తరుణంలో.. చాలామంది చూపు దీనిపై పడింది. అయితే క్రిప్టో కరెన్సీలో పెట్టుబడిపెడుతున్న వారిలో పురుషులే అధికంగా ఉన్నప్పటికీ.. స్త్రీల సంఖ్య కూడా కొంత పెరిగిందని, దేశంలోని ప్రముఖ క్రిప్టో ఎక్స్ఛేంజ్ 'జియోటస్' వెల్లడించింది.మహిళా పెట్టుబడిదారులు భారత క్రిప్టో మార్కెట్లోకి మునుపటి కంటే ఎక్కువగా ప్రవేశిస్తున్నారు. ఈ సంఖ్య 20 శాతం పెరిగిందని జియోటస్ స్పష్టం చేసింది. మహిళా పెట్టుబడిదారులు దీర్ఘకాలిక పెట్టుబడులలో మాత్రమే కాకుండా.. బిట్‌కాయిన్, ఎథెరియం వంటి వాటిలోకి ప్రవేశిస్తున్నారు.మహిళలు క్రిప్టో కరెన్సీవైపు ఎక్కువ ఆసక్తి చూపించడానికి ప్రధాన కారణం.. చదువుకున్న వారికి డిజిటల్ అవగాహన, పెట్టుబడికి సంబంధించిన అవగాహన పెరగడం అని తెలుస్తోంది. యువత ఎక్కువగా క్రిప్టోలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్నట్లు ఆర్ధిక నిపుణులు కూడా చెబుతున్నారు.ఇదీ చదవండి: శివ్ నాడార్ కీలక నిర్ణయం.. కుమార్తెకు భారీ గిఫ్ట్ఇప్పుడు పెద్ద పెద్ద పట్టణాల్లో ఉన్న మహిళలు మాత్రమే కాకుండా. టైర్ 2, టైర్ 3 నగరాల్లోని మహిళలు కూడా వివిధ రంగాలలో పెట్టుబడులు పెడుతున్నారు. ఇందులో క్రిప్టో కరెన్సీ కూడా ఉంది. రాబోయే రోజుల్లో మహిళా పెట్టుబడిదారుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉందని జియోటస్ అంచనా వేస్తోంది. -
డీఏ పెంపు.. ఈ సారి ఎంత ఉంటుందంటే?
హోలీకి ముందు కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్నెస్ అలవెన్స్ (DA) & డియర్నెస్ రిలీఫ్ (DR) పెంపును ప్రకటించే అవకాశం ఉంది. ఇదే జరిగితే 1.2 కోట్ల కంటే ఎక్కువ మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు.. పదవీ విరమణ చేసిన వారికి ప్రయోజనం చేకూరుతుంది.ప్రభుత్వం సంవత్సరానికి రెండుసార్లు (జనవరి, జూలై) డీఏను సమీక్షిస్తుంది. జనవరి సవరణ సాధారణంగా మార్చిలో జరిగితే.. జూలై సవరణ అక్టోబర్ లేదా నవంబర్‌లో ప్రకటిస్తారు. అయితే ఈ సారి డీఏ పెంపు 2 శాతం వరకు ఉండొచ్చని సమాచారం. గత ఏడాది.. కేంద్ర ప్రభుత్వం డీఏను రెండు సార్లు పెంచింది. దీంతో డీఏ 46 శాతం నుంచి 50 శాతానికి పెరిగింది. ఆ తరువాత అక్టోబర్‌లో 50 నుంచి 53 శాతానికి పెరిగింది. ఇప్పుడు వస్తున్న ఊహాగానాలు నిజమైతే.. డీఏ 53 శాతానికి చేరుతుంది.మార్చి 5న న్యూఢిల్లీలో జరిగిన కేబినెట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుపై ఎటువంటి చర్చ జరపలేదని తెలుస్తోంది. అయితే దీనిపై స్పష్టత రావడానికి హోలీ వరకు వేచి చూడాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాలను సమీక్షించడానికి 8వ వేతన సంఘం ఏర్పాటును ప్రభుత్వం జనవరి 2025లో ప్రకటించింది. ఇది వచ్చే ఏడాది జనవరి నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది.ఇదీ చదవండి: నెలకు 10 రోజులు.. టెక్ కంపెనీ కొత్త రూల్!కేంద్రం 8వ వేతన సంఘం ఏర్పాటు ప్రకటించినప్పటి నుంచి.. జీతం, పెన్షన్లలో సవరణలకు సంబంధించిన ఊహాగానాలు పెరిగిపోతున్నాయి. అయితే ఈ 8వ వేతన సంఘం తన సిఫార్సులను సంకలనం చేయడానికి దాదాపు ఒక సంవత్సరం పడుతుంది. ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగుల ప్రతినిధులను సంప్రదించి తుది ప్రతిపాదనలు చేసే ముందు వారి ఆందోళనలను అర్థం చేసుకుంటుంది. -
గోల్డ్ లోన్లు ఇక అంత ఈజీ కాదు..
గోల్డ్ లోన్లు (Gold Loans) పొందడం రానున్న రోజుల్లో అంత సులువు కాకపోవచ్చు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ విభాగంలో అవకతవకలను అరికట్టడం, ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడమే లక్ష్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బంగారు రుణాలపై నిబంధనలను కఠినతరం చేయనుంది.బంగారు ఆభరణాలు, వస్తువులు హామీగా పెట్టి తీసుకునే రుణాలు ఇటీవల కాలంలో అసాధరణంగా పెరిగాయి. 2024 సెప్టెంబర్ నుండి బంగారు రుణాలు 50% పెరుగుదలను చూశాయి. ఈ నేపథ్యంలో ఎటువంటి అనైతిక పద్ధతులకు ఆస్కారం లేకుండా బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (NBFC) రుణ విధానాలను ప్రామాణికం చేయడానికి సెంట్రల్ బ్యాంక్ చురుకైన చర్యలు తీసుకుంటోందని పరిశ్రమ వర్గాలతోపాటు ఆర్బీఐ ఆలోచనల గురించి తెలిసిన వ్యక్తులను ఉటంకిస్తూ వార్తా సంస్థ రాయిటర్స్ కథనం పేర్కొంది.కీలక ఆందోళనలు.. ప్రతిపాదిత మార్పులుగత 12 నుంచి 16 నెలలుగా ఆర్బీఐ నిర్వహించిన ఆడిట్లలో గోల్డ్ లోన్ రంగంలో అనేక అవకతవకలు వెలుగు చూశాయి. వాటిలో కొన్ని..సరిపోని నేపథ్య తనిఖీలు: తాకట్టు పెట్టిన బంగారం యాజమాన్యాన్ని ధ్రువీకరించడంలో, రుణగ్రహీతలపై క్షుణ్ణంగా శ్రద్ధ వహించడంలో బ్యాంకులు, రుణ సంస్థల లోపాలు కనిపించాయి.వాల్యుయేషన్ సమస్యలు: రుణగ్రహీత లేకుండా బంగారాన్ని మదింపు చేసిన సంఘటనలు, వాల్యుయేషన్ పద్ధతుల్లో అసమానతలు ఆందోళన కలిగిస్తున్నాయి.అనైతిక పద్ధతులు: కొన్ని రుణ సంస్థలు డిఫాల్ట్ రుణగ్రహీతలకు తెలియజేయకుండా, పారదర్శక నిబంధనలను ఉల్లంఘించి తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేశాయి.ఔట్ సోర్సింగ్ ప్రమాదాలు: ప్రామాణిక ప్రోటోకాల్స్ ను దాటవేస్తూ బంగారాన్ని సేకరించడం, నిల్వ చేయడం, తూకం వేయడం వంటి పనులను ఫిన్ టెక్ ఏజెంట్లకు అప్పగించారు.ఈ సమస్యలను పరిష్కరించడానికి, ఆర్బీఐ కఠినమైన అండర్ రైటింగ్ విధానాలను అమలు చేయాలని, రుణ వినియోగాన్ని నిశితంగా పర్యవేక్షించాలని, రుణదాతలందరికీ ఒకే విధమైన మార్గదర్శకాలను నిర్ధారించాలని యోచిస్తోంది. థర్డ్ పార్టీ ఏజెంట్లపై అతిగా ఆధారపడటాన్ని నివారించడం, రుణ సంస్థలు బంగారం మదింపు, నిల్వ వంటి కీలకమైన ప్రక్రియలను స్వయంగా నిర్వహించేలా చూడటం సెంట్రల్ బ్యాంక్ లక్ష్యం.పరిశీలన ఎందుకు?ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగారం వినియోగదారు అయిన భారత్ లో రికార్డు స్థాయిలో బంగారం ధరలు పెరగడం, అన్ సెక్యూర్డ్ లెండింగ్ పై నిబంధనలను కఠినతరం చేయడంతో బంగారం రుణాలు పెరిగాయి. కుటుంబాలు సాంప్రదాయకంగా పండుగలు, వివాహాలకు బంగారాన్ని కొనుగోలు చేస్తాయి. ఇది రుణాలను పొందడానికి విలువైన ఆస్తిగా మారుతుంది. ఏదేమైనా, ఈ విభాగం వేగవంతమైన వృద్ధి మొత్తం రుణ వృద్ధిని అధిగమించింది. దీంతో ఆర్బీఐ జోక్యం చేసుకుని రుణ పద్ధతులు నైతికంగా, పారదర్శకంగా ఉండేలా చూడటానికి ప్రేరేపించింది.రుణగ్రహీతలు, సంస్థలపై ప్రభావంప్రతిపాదిత మార్పులు రుణగ్రహీతలకు బంగారు రుణాలను మరింత సురక్షితంగా, విశ్వసనీయంగా మారుస్తాయని భావిస్తున్నారు. అయితే కఠినమైన నిబంధనలు రుణాలను ప్రాసెస్ చేయడానికి అవసరమైన సమయం, శ్రమను కూడా పెంచుతాయి. దీంతో రుణగ్రహీతలకు త్వరగా నిధులను పొందడం కష్టతరం అవుతుంది. ఇక రుణ సంస్థల విషయానికి వస్తే.. బంగారు రుణాలకు సంబంధించి ఆర్బీఐ ప్రమాణాలకు అనుగుణంగా శిక్షణ, సాంకేతికత, సమ్మతి చర్యలకు ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరాన్ని కొత్త నిబంధనలు కల్పిస్తాయి. -
లక్ష మంది పిల్లలకు ఎన్పీఎస్ వాత్సల్య
న్యూఢిల్లీ: ఎన్పీఎస్ వాత్సల్య పథకాన్ని లక్ష మంది పిల్లల పేరిట తెరిచినట్టు పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి మండలి (పీఎఫ్ఆర్డీఏ) వెల్లడించింది. గతేడాది సెప్టెంబర్‌లో ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది.దేశంలో పింఛను సదుపాయం ఉన్నవారు తక్కువగా ఉండడంతో ఈ పథకాన్ని మరింత మందికి చేరువ చేసేందుకు ఎన్నో చర్యలను అమలు చేస్తున్నట్టు పీఎఫ్ఆర్డీఏ చైర్పర్సన్ దీపక్ మహంతి తెలిపారు.‘అప్పుడే పుట్టిన శిశువులు సైతం ఎన్పీఎస్ను ఎంపిక చేసుకోవచ్చు. ఆర్ధిక మంత్రి గత సెప్టెంబర్‌లో ఈ పథకం ప్రారంభించిన నాటి నుంచి లక్ష మందికి పైగా శిశువులు ఎంపిక చేసుకున్నందుకు సంతోషంగా ఉంది’’అని చెప్పారు. ఎన్పీఎస్ వాత్సల్యలో 18 ఏళ్లు నిండని వారంతా చేరొచ్చు. పీఎఫ్ఆర్డీఏ నిర్వహించే అన్ని పింఛను పథకాల కింద (ఎన్పీఎస్, ఏపీఎస్) 7 కోట్ల మంది చందాదారులు ఉన్నట్టు మహంతి తెలిపారు. -
EPFO: క్షణాల్లో ఈపీఎఫ్‌వో విత్‌డ్రా
ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)ఖాతాదారులకు శుభవార్త. ఇప్పటికే ఉద్యోగుల సౌలభ్యం కోసం ఈపీఫ్ఓవో సంస్థ ఈపీఎఫ్‌వో అకౌంట్లలో పలు కీలక మార్పులు చేపట్టింది. ఈపీఎఫ్‌వో క్లయిమ్, వివరాలను చేర్చడం, తొలగించడం, ఎగ్జిట్ అవ్వడాన్ని సులభతరం చేసింది.తాజాగా, ఉద్యోగుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఫోన్‌పే,గూగుల్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్‌ల ద్వారా ఈపీఎఫ్‌వో విత్ర్ డ్రా చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తేనున్నట్లు తెలుస్తోంది వెలుగులోకి వచ్చిన నివేదికల ప్రకారం.. ప్రస్తుతం ఈపీఎఫ్‌వో సంస్థ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)తో కలిసి ఈ సౌకర్యాన్ని ప్రారంభించేందుకు చర్చలు జరుపుతుంది. సాధ్యసాధ్యాలను బట్టి సౌకర్యాన్ని ఈ ఏడాది మే, లేదా జూన్ నాటికి ప్రారంభించే యోచనలో ఈపీఎఫ్‌వో ఉందని వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. దీంతో పాటు ఈపీఎఫ్‌వో3.0లో ఏటీఎం ద్వారా ఈపీఎఫ్‌వో విత్‌డ్రా చేసుకునే వెసులు బాటు ఈ ఏడాది జూన్ నుంచి ప్రారంభించనున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు.ఉద్యోగులకు లభించే ప్రయోజనాలుయూపీఐ ద్వారా ఈపీఎఫ్‌వో విత్ డ్రా వల్ల ఉద్యోగలకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా అత్యవసర సమయాల్లో డబ్బుల్ని తక్షణమే పొందవచ్చు. పారదర్శకతతో పాటు ఈపీవోఎఫ్వో విత్ డ్రా ప్రక్రియ మరింత సజావుగా జరగనుంది.ఈపీఎఫ్‌వో 3.0 ప్రారంభంఈపీఎఫ్వో 3.0 అమల్లోకి వస్తే, సభ్యులు తమ పొదుపులను సాధారణ బ్యాంకు అకౌంట్ల నుంచి డబ్బులను ఉపసంహరించుకోవడం మరింత సులభం అవుతుంది. -
ఇన్వెస్టర్లూ.. ఇలాంటి స్కామ్‌లపై జాగ్రత్త!
అత్యంత మోసపూరితమైన ఆర్థిక నేరాల్లో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ (investment fraud) కూడా ఒకటి. టెక్నాలజీతో పాటు స్కాములు కూడా రూపాంతరం చెందుతున్న నేపథ్యంలో ఇలాంటి సైకలాజికల్ మోసాల బారిన పడకుండా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ (NPCI) ఇన్వెస్టర్లను అప్రమత్తం చేస్తూ అవగాహన కల్పిస్తోంది.ఆర్థిక నిపుణుల ముసుగులో, పేరొందిన సంస్థల పేరిట ఎండార్స్మెంట్స్తోనూ, కొన్ని సందర్భాల్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ఫేక్ వీడియోలను ఉపయోగించి మోసగాళ్లు అమాయకులకు వల వేస్తారు. అసాధారణమైన రాబడులొస్తాయని, విశిష్టమైన పెట్టుబడి అవకాశాలని, పరిమిత కాలం పాటే ఉండే డీల్స్ అంటూ కనీసం ఆలోచించుకోనివ్వకుండా ఇన్వెస్ట్ చేసేలా ప్రేరేపిస్తారు. ఇక ఇన్వెస్ట్ చేసిన వెంటనే మోసగాళ్లు ఠక్కున మాయమైపోతారు లేదా తాము మోసపోతున్నాననే విషయాన్ని బాధితులు గ్రహించే వరకు వారి నుంచి డబ్బు లాగుతూనే ఉంటారు.ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్‌లో రకాలుఫేక్ ట్రేడింగ్ ప్లాట్‌ఫాంలు, యాప్‌లు: స్కామర్లు అచ్చం చట్టబద్ధమైన బ్రోకర్లు, ఫండ్ హౌస్‌లు లేదా ఎక్స్చేంజీలవిగా అనిపించే బోగస్ ఇన్వెస్ట్మెంట్ యాప్‌లు లేదా వెబ్సైట్లను తయారు చేస్తారు. ఫేక్ స్క్రీన్లపై వర్చువల్ లాభాలను చూపించడం ద్వారా డబ్బు డిపాజిట్ చేసేలా తొలుత యూజర్లను వలలోకి లాగుతారు. యూజర్లు గణనీయమైన మొత్తాలను ఇన్వెస్ట్ చేశాక, వారు ఆ నిధులను విత్‌డ్రా చేసుకోకుండా అడ్డుపడతారు.డిస్కౌంట్ ధరల్లో షేర్లు: ఎవరికీ అంతగా తెలియని, అతి తక్కువ వాల్యూమ్స్‌తో ట్రేడయ్యే షేర్లను మోసగాళ్లు ప్రమోట్ చేస్తారు. ముందుగా అతి కొద్ది మంది క్లయింట్లకు మాత్రమే, భారీగా డిస్కౌంట్ రేట్లకు అవి లభిస్తాయని నమ్మబలుకుతారు. దురుద్దేశపూరితంగా, ఎక్స్చేంజ్ లేదా బ్రోకింగ్ హౌస్‌లకు కాకుండా తమ వ్యక్తిగత ఖాతాల్లోకి నిధులను బదిలీ చేయాలంటూ ఇన్వెస్టర్లను కోరతారు. షేర్ల ట్రేడింగ్ ద్వారా భారీ లాభాలు గడించొచ్చని మభ్యపెడుతూ, ఈ తరహా స్కామ్‌లలో మోసగాళ్లు సాధారణంగా లక్షల్లో భారీ ఎత్తున నిధులను కొల్లగొడతారు.ఫేక్ జాబ్ స్కామ్‌లు: సోషల్ మీడియా పేజీలను లైక్ చేయడం లేదా లేదా రివ్యూలు రాయడంలాంటి తేలికైన పనులు చేసే ఉద్యోగాలిచ్చే కంపెనీల ముసుగులో స్కామర్లు సంప్రదించవచ్చు. నమ్మకాన్ని చూరగొనేందుకు ముందు కాస్త మొత్తం చెల్లించవచ్చు. ఆ తర్వాత ప్రాథమిక పెట్టుబడుల అవకాశాలంటూ చిన్న చిన్న కొనుగోళ్లు జరిపేలా బాధితులను మోసగిస్తారు. ఆ తర్వాతెప్పుడో ఈ స్కీముల మోసపూరిత స్వభావం బయటపడుతుంది.పోంజి, పిరమిడ్ స్కీములు: ఈ తరహా స్కాముల్లో అధిక రాబడులు వస్తాయని ఇన్వెస్టర్లకు నమ్మబలుకుతారు. తొలుత వచ్చిన ఇన్వెస్టర్లకు వాస్తవ లాభాలను కాకుండా కొత్త ఇన్వెస్టర్ల నుంచి వచ్చే డబ్బు నుంచి చెల్లిస్తారు. కొత్తగా డబ్బు రావడం ఆగిపోతే ఇవి కుప్పకూలిపోతాయి.స్కామ్‌ల నుంచి ఇలా దూరంగా ఉండండి..ఇన్వెస్ట్ చేసే ముందు ధ్రువీకరించుకోవాలి: ఆయా సంస్థలు రిజిస్టర్ అయినవా లేదా అనేది సెబీ (SEBI), ఆర్బీఐ (RBI) లేదా ఇతరత్రా అధికారిక నియంత్రణ సంస్థల వెబ్సైట్లలో చెక్ చేసుకోవాలి.అధిక రాబడుల హామీలపై అప్రమత్తంగా ఉండాలి: ఏదైనా పెట్టుబడి నమ్మశక్యం కానంతగా బాగుందనిపిస్తోందంటే, అది మ్ అయి ఉండొచ్చు.ఒత్తిళ్లకు తలొగ్గవద్దు: చట్టబద్ధమైన పెట్టుబడులను చేసేందుకు అత్యవసరంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉండదువెబ్సైట్, ఈమెయిల్‌ను చెక్ చేసుకోవాలి: HTTPS, అధికారిక డొమైన్ పేర్లు చూసుకోవాలి, అవాంఛిత లింకులపై క్లిక్ చేయకూడదు.వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను షేర్ చేయొద్దు: మోసపుచ్చేందుకు, డబ్బు కాజేసేందుకు మోసగాళ్లు వీటిని ఉపయోగించుకుంటారు.అనుమానాస్పద నంబర్ల గురించి 1930కి డయల్ చేయడం ద్వారా నేషనల్ సైబర్‌క్రైమ్ హెల్ప్‌లైన్‌కి లేదా టెలికం డిపార్ట్మెంట్కి ఫిర్యాదు చేయండి. మెసేజీలను సేవ్ చేసుకోండి. స్క్రీన్షాట్లు తీసుకోండి. సంప్రదింపుల వివరాలను భద్రపర్చుకోండి. -
ఎస్బీఐ కొత్త స్కీమ్.. మామూలు కంటే ఎక్కువ వడ్డీ
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ (Fixed Deposit) పథకాన్ని ప్రారంభించింది. 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసు వారికి సురక్షితమైన, ఆకర్షణీయమైన పెట్టుబడి ఎంపికను అందించడం, వారి పదవీ విరమణ సంవత్సరాల్లో స్థిరమైన రాబడి, ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడం ఈ పథకం లక్ష్యం.పథకం ముఖ్య లక్షణాలుఅధిక వడ్డీ రేట్లు: సీనియర్ సిటిజన్లు సాధారణ డిపాజిటర్లకు అందించే ప్రామాణిక ఎఫ్డీ రేట్ల కంటే 0.50% అదనపు వడ్డీ రేటు నుండి ప్రయోజనం పొందుతారు. దీంతో వారి పెట్టుబడులపై అధిక రాబడులు లభిస్తాయి.ఫ్లెక్సిబుల్ కాలపరిమితి ఎంపికలు: ఈ పథకం అనేక రకాల కాలపరిమితి ఎంపికలను అందిస్తుంది. కస్టమర్లు వారి ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా వ్యవధిని ఎంచుకోవచ్చు. కాలపరిమితి స్వల్పకాలిక డిపాజిట్ల నుంచి 10 ఏళ్ల వరకు దీర్ఘకాలిక ఎంపికల వరకు ఉంటుంది.త్రైమాసిక చెల్లింపు: క్రమానుగత ఆదాయాన్ని కోరుకునేవారికి, ఈ పథకం త్రైమాసిక చెల్లింపు ఎంపికను అందిస్తుంది. లిక్విడిటీ, స్థిరమైన నగదు ప్రవాహాన్ని నిర్ధారిస్తుంది.సేఫ్టీ అండ్ సెక్యూరిటీ: ప్రభుత్వ మద్దతుతో చేపట్టిన ఈ పథకం డిపాజిట్ల భద్రతకు హామీ ఇస్తుంది. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) కింద డిపాజిట్లకు రూ .5 లక్షల వరకు బీమా ఉంటుంది.అర్హత, దరఖాస్తు ప్రక్రియ60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లకు ఈ స్కీమ్ ప్రత్యేకంగా అందుబాటులో ఉంది. ఆసక్తి ఉన్నవారు ఏదైనా ఎస్బీఐ శాఖను సందర్శించి లేదా బ్యాంక్ అధికారిక ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తు ప్రక్రియ కూడా సరళంగానే ఉంటుంది. వయస్సు, గుర్తింపు, చిరునామా రుజువు వంటి ప్రాథమిక డాక్యుమెంటేషన్ ఉంటే చాలు. -
నెలకు రూ.82,000 వేతనం.. ఇంటి ఖర్చులు భారం..
నెలవారీ ఎంత సంపాదిస్తున్నా జీవన వ్యయాలు భారమవుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులకు సంబంధించి ఇటీవల ఓ వ్యక్తి రెడ్డిట్‌లో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. నెలకు రూ.82,000 సంపాదించే ఆ వ్యక్తి తీసుకున్న గృహ రుణం భారంగా మారిందని తెలిపారు. దాంతోపాటు పెరుగుతున్న జీవన వ్యయాల వల్ల ఇంటి ఖర్చుల నిర్వహణలో సవాళ్లు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. తన ఆదాయం పెరిగేలా ఏదైనా సలహాలు ఇవ్వాలని కోరారు. తాను చేసిన పోస్ట్‌కు నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు.రెడ్డిట్‌లో చేసిన పోస్ట్ ప్రకారం.. ‘నా నెలవారీ సంపాదన రూ.82,000. జీతంలో గణనీయమైన భాగం అంటే రూ.36,000 నేను గతంలో తీసుకున్న రూ.46 లక్షల గృహ రుణానికి ఈఎంఐ చెల్లిస్తున్నాను. సౌకర్యవంతమైన ఆదాయం ఉన్నప్పటికీ ఇతర ఇంటి ఖర్చులను భరించడానికి ఇబ్బంది అవుతుంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉద్యోగం చేస్తున్నాను. రాత్రి 7 గంటలకు ఇంటికి వస్తాను. వచ్చాక డిన్నర్ ప్రిపేర్ చేసేందుకు నా భార్యకు సాయం చేస్తాను. ఇది నా షెడ్యుల్. గృహ రుణానికి అధిక మొత్తం కేటాయించడంతో ఇంటి ఖర్చులు భారమవుతున్నాయి. ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు నెలకు అదనంగా రూ.15,000 నుంచి రూ.20,000 సంపాదించాలని అనుకుంటున్నాను. కాన్వా, పవర్‌పాయింట్ డిజైనింగ్‌లో నైపుణ్యాలు ఉన్నాయి. పబ్లిక్ స్పీకింగ్, కస్టమర్ సర్వీస్‌లో ఆసక్తి ఉంది. తీరిక సమయాల్లో చరిత్ర, సాహిత్యంపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నాను. ఈ సామర్థ్యాలను సద్వినియోగం చేసుకోవడానికి నా షెడ్యూల్‌కు సరిపడే పార్ట్టైమ్వర్క్కు సంబంధించి సలహాలు ఇవ్వండి’ అంటూ పోస్ట్ చేశాడు.నెటిజన్ల స్పందన ఇలా..కొంతమంది నెటిజన్లు ఈ పోస్ట్‌కు విభిన్నంగా స్పందించారు. తన నైపుణ్యాన్ని పెంచుకుని అధిక వేతనంతో కూడిన మరో ఉద్యోగానికి మారాలని కొందరు సూచించారు. మరికొందరు ఫ్రీలాన్స్ అవకాశాలను అన్వేషించాలని లేదా యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాలని సిఫార్సు చేశారు. పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్, హిస్టరీపై ఉన్న ఆసక్తి దృష్ట్యా కొందరు గెస్ట్ లెక్చరర్‌గా పని చేయాలని చెప్పారు.చాలా మంది మధ్యతరగతి వృత్తి నిపుణులు, కొంత మెరుగైన ఆదాయం ఉన్నవారు ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను ఈ వ్యక్తి చేసిన పోస్ట్ హైలైట్ చేస్తుంది. పెరుగుతున్న స్థిరాస్తి ధరలు, అధికమవుతున్న జీవన వ్యయం చాలా మందికి భారంగా మారుతుంది. మెరుగైన ఆర్థిక ప్రణాళిక, నైపుణ్యాలను పెంచుకోవాల్సిన అవసరాన్ని ఈ పోస్ట్ గుర్తు చేస్తుంది.ఇదీ చదవండి: రాబడులపై పన్ను తగ్గింపు..?జాబ్ మార్కెట్లో కొన్ని నైపుణ్యాలకు అధిక డిమాండ్ ఉంది. కింద తెలిపిన స్కిల్స్ నేర్చుకుంటే మంచి వేతనంతో మెరుగైన ఉద్యోగ భవిష్యత్తు ఉంటుందని నిపుణులు సలహా ఇస్తున్నారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్: ఇవి హెల్త్ కేర్, ఫైనాన్స్, మార్కెటింగ్ వంటి రంగాల్లో ఆటోమేషన్, డెసిషన్ మేకింగ్‌కు సహకరిస్తాయి.క్లౌడ్ కంప్యూటింగ్: ఏడబ్ల్యుఎస్, మైక్రోసాఫ్ట్ అజూర్, గూగుల్ క్లౌడ్ వంటి టెక్నాలజీలపై అవగాహన.సైబర్ సెక్యూరిటీ: సున్నితమైన డేటాను రక్షించడం మొదటి ప్రాధాన్యత. ఇది సైబర్ సెక్యూరిటీ విశ్లేషకులు, ఎథికల్ హ్యాకర్లకు ఎంతో ముఖ్యం.డేటా అనాలిసిస్, డేటా సైన్స్: కంపెనీలు డేటా ఆధారిత ఇన్‌పుట్స్‌పై ఆధారపడతాయి. కాబట్టి పైథాన్, ఎస్‌క్యూఎల్, టాబ్లో వంటి డేటా విజువలైజేషన్ సాధనాల్లో నైపుణ్యాలకు డిమాండ్ ఉంది.సాఫ్ట్వేర్ డెవలప్మెంట్: జావాస్క్రిప్ట్, పైథాన్ వంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, రియాక్ట్ వంటి ఫ్రేమ్‌వర్క్‌లో ప్రావీణ్యం కీలకం. -
పదేళ్లు, అంతకుమించిన ఇన్వెస్ట్ చేయాలనుకుంటే..
ఈక్విటీలు ఎప్పుడూ అస్థిరతలతో చలిస్తుంటాయి. కొంత కాలం పాటు ర్యాలీ చేసి, కొంత కాలం దిద్దుబాటుకు గురవుతుంటాయి. భారత్ వేగంగా వృద్ధి చెందుతూ, అభివృద్ధి చెందిన దేశం కావాలన్న ఆకాంక్షలతో అడుగులు వేస్తోంది. కనుక దీర్ఘకాలంలో ఈక్విటీల్లో మెరుగైన రాబడులకే ఎక్కువ అవకాశాలున్నాయి.ఇన్వెస్టర్లు ముఖ్యమైన ఆర్థిక లక్ష్యాల కోసం ఈక్విటీల్లో, అది కూడా లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్ విభాగంలో పెట్టుబడి పెట్టుకోవడం ద్వారా దీర్ఘకాలంలో మెరుగైన రాబడులు పొందే అవకాశాలుంటాయన్నది నిపుణుల సూచన. ఈ రెండు విభాగాల్లో పెట్టుబడికి వీలు కల్పిస్తున్నదే మిరే అస్సెట్ లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్. కనీసం 10 ఏళ్లు అంతకుమించిన దీర్ఘకాల లక్ష్యాల కోసం ఇన్వెస్టర్లు ఈ పథకంలో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) పెట్టుబడులను పరిశీలించొచ్చు.రాబడులుఈ పథకం గడిచిన ఏడాదిలో ఒక శాతం నష్టాన్నిచ్చింది. ఇటీవలి కాలంలో స్టాక్స్ గణనీయంగా దిద్దుబాటుకు గురి కావడం చూస్తున్నాం. దీని ఫలితమే ఏడాది కాలంలో రాబడి కాస్తా నష్టంగా మారిపోవడం. మూడేళ్ల కాలాన్ని పరిశీలిస్తే 12 శాతానికి పైనే వార్షిక రాబడి ఈ పథకంలో ఇన్వెస్టర్లకు లభించింది. అదే ఐదేళ్లలో ఏటా 17 శాతం పెట్టుబడులపై రాబడి తెచ్చి పెట్టింది. ఏడేళ్లలోనూ 14.63 శాతం, పదేళ్లలో 16 శాతం చొప్పున వార్షిక రాబడులను అందించింది. ఈ పథకం గతంలో మిరే అస్సెట్ ఎమర్జింగ్ బ్లూచిప్ ఫండ్ పేరుతో పనిచేసింది. 2010 జూలైలో పథకం ప్రారంభం కాగా, నాటి నుంచి చూస్తే ఇప్పటి వరకు వార్షిక రాబడి 19 శాతంగా ఉండడం గమనార్హం.పెట్టుబడుల విధానంపేరులో ఉన్నట్టుగా ఈ పథకం లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటుంది. కంపెనీల భవిష్యత్ వృద్ధి సామర్థ్యాలపై ఈ పథకం ప్రధానంగా దృష్టి పెడుతుంది. భవిష్యత్‌లో దిగ్గజాలుగా ఎదిగే సామర్థ్యాలున్న కంపెనీలను ముందుగానే ఎంపిక చేసి ఇన్వెస్ట్ చేస్తుంది. దీర్ఘకాలం పాటు పెట్టుబడులు కొనసాగిస్తుంటుంది. ఈ పథకం సాధారణంగా 35 - 65 శాతం మధ్య లార్జ్‌క్యాప్ కంపెనీలకు (మార్కెట్ విలువ పరంగా 100 అగ్రగామి కంపెనీలు) కేటాయిస్తుంటుంది.మిడ్‌క్యాప్ కంపెనీలకు (మార్కెట్ విలువ పరంగా 101 నుంచి 250వరకు ఉన్నవి) కేటాయింపులు 35–65 శాతం మధ్య నిర్వహిస్తుంటుంది. భవిష్యత్ బ్లూచిప్ కంపెనీల్లో ముందే పెట్టుబడికి ఈ పథకం వీలు కల్పిస్తుంది. బోటమ్‌అప్, వ్యాల్యూ ఇన్వెస్టింగ్ విధానాలను అనుసరించి స్టాక్స్‌ను ఎంపిక చేస్తుంటుంది. అధిక నాణ్యమైన కంపెనీల్లో సహేతుక ధరల వద్దే పెట్టుబడులు పెడుతుంది. ఈ పథకం మొదలైన నాటి నుంచి నీలేష్ సురానా ఫండ్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. పోర్ట్‌ఫోలియో ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.36,514 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 99.31 శాతాన్ని ఇప్పటికే ఇన్వెస్ట్ చేసింది. మిగిలినది నగదు రూపంలో కలిగి ఉంది. పోర్ట్‌ఫోలియోలో మొత్తం 103 స్టాక్స్ ఉన్నాయి. ప్రస్తుతం లార్జ్‌క్యాప్‌లో 63 శాతం పెట్టుబడులు ఉన్నాయి. మిడ్‌క్యాప్‌లో 34 శాతానికి పైనే ఇన్వెస్ట్ చేసింది. స్మాల్‌క్యాప్ కంపెనీలకు 2.49 శాతం కేటాయింపులు చేసింది. అత్యధికంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు 28 శాతం పెట్టుబడులు కేటాయించింది. ఇండ్రస్టియల్స్ కంపెనీల్లో 13.71 శాతం, టెక్నాలజీ కంపెనీల్లో 13 శాతం, మెటీరియల్స్ కంపెనీల్లో 11 శాతం చొప్పున పెట్టుబడులు ఉన్నాయి. -
ఐటీఆర్ తప్పులు.. ట్యాక్స్‌పేయర్లకు అలర్ట్..
2024-25 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు గత రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నుల్లో ఏవైనా తప్పులు, పొరపాట్లు ఉంటే సరిదిద్దుకునే కీలక అవకాశం ఉంది. 2022 ఫైనాన్స్ చట్టంలో ప్రవేశపెట్టిన అప్డేటెడ్ రిటర్న్‌లను దాఖలు చేసే నిబంధన పన్ను చెల్లింపుదారులను 2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరాలకు వారి రిటర్నులను ఈ మార్చి 31 లోపు అప్డేట్ చేయడానికి అనుమతిస్తుంది..అప్డేటెడ్ ఐటీఆర్ నిబంధనస్వచ్ఛంద సమ్మతిని ప్రోత్సహించడానికి, లిటిగేషన్‌ను తగ్గించడానికి అప్డేటెడ్ రిటర్న్ నిబంధనను ప్రవేశపెట్టారు. సంబంధిత మదింపు సంవత్సరం ముగిసిన రెండు సంవత్సరాలలోపు అప్డేటెడ్ రిటర్న్‌ను సమర్పించడం ద్వారా పన్ను చెల్లింపుదారులు గతంలో దాఖలు చేసిన రిటర్న్‌లలో తప్పులు లేదా లోపాలను సరిదిద్దడానికి ఇది అనుమతిస్తుంది. ఉదాహరణకు 2022-23 మదింపు సంవత్సరానికి (2021-22 ఆర్థిక సంవత్సరం) తమ రిటర్నులను అప్డేట్ చేయాలనుకున్నవారు 2025 మార్చి 31లోగా ఫైల్ చేయాలి.గమనించాల్సిన కీలక అంశాలుఅప్డేటెడ్ రిటర్న్ దాఖలు చేయడానికి అదనపు పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. అదనపు పన్ను మొత్తం సంబంధిత మదింపు సంవత్సరం ముగిసినప్పటి నుండి గడిచే సమయంపై ఆధారపడి ఉంటుంది. ఎంత ఎక్కువ జాప్యం చేస్తే అంత అదనపు పన్ను పెరుగుతుంది.కొన్ని అసాధారణ సందర్భాల్లో మినహా చాలా సందర్భాల్లో అప్డేటెడ్ రిటర్న్ దాఖలు చేయవచ్చు. ఉదాహరణకు సవరించిన ఆదాయం తక్కువ పన్ను బాధ్యతకు దారితీస్తే, పన్ను రిఫండ్ లేదా అధిక రిఫండ్‌కు దారితీస్తే లేదా పన్ను చెల్లింపుదారు పన్ను అధికారుల విచారణలో ఉంటే అప్డేటెడ్ రిటర్న్ దాఖలుకు వీలుండదు.తొలుత అప్డేటెడ్ రిటర్న్ దాఖలుకు గరిష్టంగా రెండేళ్ల వరకు అవకాశం కల్పించారు. ఆ తర్వాత 2025 బడ్జెట్లో ఈ గడువును 48 నెలలకు పొడిగించారు. ఇది పన్ను చెల్లింపుదారులకు వారి ఫైలింగ్‌లలో ఏవైనా వ్యత్యాసాలను పరిష్కరించడానికి ఎక్కువ సమయం ఇస్తుంది.అప్డేటెడ్ రిటర్న్ ఎలా ఫైల్ చేయాలంటే..ఆదాయపు పన్ను శాఖకు సంబంధించిన ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో అందుబాటులో ఉన్న ఐటీఆర్-యు ఫారాన్ని ఉపయోగించి పన్ను చెల్లింపుదారులు అప్డేటెడ్ రిటర్న్‌ను దాఖలు చేయవచ్చు. ఈ ప్రక్రియలో ఈ కింది దశలు ఉంటాయి..ఈ-ఫైలింగ్ పోర్టల్‌లోకి వెళ్లి మీ క్రెడిన్షియల్స్‌ను ఉపయోగించి లాగిన్ చేయండి.సంబంధిత అసెస్మెంట్ సంవత్సరానికి ఐటీఆర్-యు ఫారాన్ని ఎంచుకోండి.అదనపు ఆదాయం, చెల్లించాల్సిన పన్నుతో సహా అవసరమైన వివరాలను అందించండి.సంబంధిత మదింపు సంవత్సరం ముగిసినప్పటి నుండి గడిచిన సమయం ఆధారంగా చెల్లించాల్సిన అదనపు పన్నును లెక్కించండి.వివరాలను సమీక్షించి అప్డేటెడ్ రిటర్న్ సబ్మిట్ చేయండి. -
బీమా సంస్థలకు ఐఆర్డీఏ గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: పోర్ట్‌ఫోలియోలకు హెడ్జింగ్‌గా డెరివేటివ్స్‌ను వినియోగించుకునేందుకు బీమా కంపెనీలను వీలు చిక్కింది. బీమా నియంత్రణ సంస్థ ఐఆర్డీఏ ఇందుకు తాజాగా అనుమతించింది. బీమా రంగ సంస్థల వినతులమేరకు ఈక్విటీ డెరివేటివ్స్ ద్వారా హెడ్జింగ్‌కు తెరతీసేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది.వెరసి ఆటుపోట్లను చవిచూస్తున్న క్యాపిటల్ మార్కెట్లో రిస్కులను తగ్గించుకునేందుకు వీలు కల్పించింది. ప్రస్తుత హెచ్చుతగ్గుల క్యాపిటల్ మార్కెట్లలో హెడ్జింగ్ చేపట్టడం ద్వారా ఈక్విటీ పోర్ట్‌ఫోలియోల రిసు్కలను తగ్గించుకునేందుకు బీమా కంపెనీలకు దారి ఏర్పడింది.తద్వారా ఈక్విటీ పెట్టుబడులను సంరక్షించుకునేందుకు ఐఆర్డీఏ మద్దతిస్తోంది. బీమా కంపెనీలు ఫార్వార్డ్ రేట్ అగ్రిమెంట్స్, ఇంటరెస్ట్ రేట్ స్వాప్స్, ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఇంటరెస్ట్ ఫ్యూచర్స్ ద్వారా రుపీ ఇంటరెస్ట్ రేట్ డెరివేటివ్స్‌లో లావాదేవీలు చేపట్టేందుకు ప్రస్తుత నిబంధనలు అనుమతిస్తున్నాయి. -
ఈపీఎఫ్ వడ్డీ రేటు ఖరారు: ఈసారీ అంతే..
2024-25 ఆర్థిక సంవత్సరానికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) డిపాజిట్లపై.. వడ్డీ రేటును ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నిర్దారించింది. ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ 8.25 శాతం వడ్డీరేటు యధావిధిగా కొనసాగించాలని నిర్ణయించారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం పొందిన తర్వాత.. ఈ వడ్డీ రేటు ఏడు కోట్లకు పైగా చందాదారులకు జమ అవుతుంది.2022-23లో ఈ వడ్డీ 8.15 శాతంగా ఉండేది. అయితే దీనిని 2023-24లో 8.25 శాతానికి పెంచారు. 2018-19లో ఈ రేటు 8.65గా ఉండేది. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో వడ్డీ రేటు ఏకంగా 8.1 శాతానికి పడిపోయింది. ఇప్పుడు గత ఏడాది మాదిరిగానే 8.25 శాతం వద్దనే కొనసాగుతుందని ప్రకటించారు.ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేయడం ఎలా?ఉమాంగ్ యాప్: ఉమాంగ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని.. మీ ఫోన్ నంబర్‌తో నమోదు చేసుకోండి. ఆ తరువాత EPF పాస్‌బుక్, క్లెయిమ్‌లు, బ్యాలెన్స్ చెక్ వంటి సేవలను యాక్సెస్ చేసుకోవచ్చు.ఈపీఎఫ్ఓ పోర్టల్: EPFO అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి, "మెంబర్ పాస్‌బుక్" విభాగానికి వెళ్లి, మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.మిస్డ్ కాల్: మీ UAN-రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 011-22901406 కు మిస్డ్ కాల్ ఇవ్వండం ద్వారా కూడా ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.ఇదీ చదవండి: పతనమవుతున్న పసిడి ధరలు: కొనడానికి ఇదే మంచి ఛాన్స్! -
ఎస్బీఐ అప్డేట్.. క్రెడిట్‌కార్డ్ బిల్ పేమెంట్ ఈజీ..
ప్రస్తుతం క్రెడిట్ కార్డుల (Credit Card) వినియోగం పెరిగిపోయింది. చాలా మంది దగ్గర ఒకటికి మించి క్రెడిట్ కార్డులు కూడా ఉన్నాయి. వీటితో ఖర్చు చేసేటప్పుడు సులువుగా ఉన్నా వాటి బిల్లుల చెల్లింపులో చిక్కులు ఎదురవుతుంటాయి. వేరువేరు గడువు తేదీలు, అధిక వడ్డీ రేట్లు, సంక్లిష్ట స్టేట్మెంట్, సాంకేతిక సమస్యల కారణంగా క్రెడిట్ కార్డు బిల్లులను చెల్లించడం సవాలుగా ఉంటుంది. ఈ తలనొప్పులేవీ లేకుండా ఎస్బీఐ (SBI) క్రెడిట్ కార్డు బిల్లులను యూపీఐ యాప్‌ల ద్వారా చెల్లించే అవకాశం ఉందని మీకు తెలుసా?దేశంలో డిజిటల్ చెల్లింపు వ్యవస్థలో యూపీఐ భారీ మార్పులను తీసుకువచ్చింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అభివృద్ధి చేసిన రియల్ టైమ్ పేమెంట్ సిస్టమ్ ఇది. దీని ద్వారా వినియోగదారులు సెకన్లలో డబ్బు పంపవచ్చు. అలాగే స్వీకరించవచ్చు. యూపీఐ సేవలు నిరంతరం అందుబాటులో ఉంటాయి. ఈ క్రమంలో ఏ యూపీఐ యాప్ (UPI App) ద్వారా అయినా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ బిల్లును సులువుగా చెల్లించవచ్చు.నేడు మార్కెట్లో పేటీఎం, క్రెడ్, మొబిక్విక్, ఫోన్‌పే, అమెజాన్ పే వంటి అనేక ప్రసిద్ధ థర్డ్ పార్టీ మొబైల్ యాప్స్ ఉన్నాయి. వీటి ద్వారా క్రెడిట్ కార్డు బిల్లును చెల్లించవచ్చు. అయితే, ఈ యాప్‌ల ద్వారా చెల్లింపులు చేసేటప్పుడు సెటిల్మెంట్లో జాప్యం జరగవచ్చు. మరోవైపు యూపీఐ ద్వారా చెల్లింపు చేసినప్పుడు అది వెంటనే మీ క్రెడిట్ కార్డు ఖాతాలో ప్రతిబింబిస్తుంది. యూపీఐ ద్వారా చేసిన చెల్లింపులు తక్షణమే ప్రాసెస్ అవుతాయి. మీ క్రెడిట్ కార్డ్ బిల్లు సకాలంలో చెల్లింపు అవుతుంది.యూపీఐ యాప్ ద్వారా చెల్లించండిలా..» మీ స్మార్ట్ ఫోన్ లో మీకు ఇష్టమైన యూపీఐ యాప్‌ను తెరవండి» పేమెంట్ సెక్షన్‌కు వెళ్లి 'పే' లేదా 'సెండ్ మనీ' ఎంచుకోండి» మీ ఎస్బీఐ క్రెడిట్ కార్డుకు లింక్ చేసిన వర్చువల్ పేమెంట్ అడ్రస్ (వీపీఏ) ఎంటర్ చేయండి.» మీ క్రెడిట్ కార్డ్ బిల్లు కోసం మీరు చెల్లించాలనుకుంటున్న మొత్తాన్ని పేర్కొనండి.» వివరాలను సరిచూసుకుని పేమెంట్‌ను కన్ఫమ్ చేయండి.» ఈ మొత్తం మీ బ్యాంక్ ఖాతా నుండి డెబిట్ అయి మీ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఖాతాకు క్రెడిట్ అవుతుంది.క్యూఆర్ కోడ్ ద్వారా అయితే ఇలా..» మీ యూపీఐ యాప్‌ను తెరిచి 'స్కాన్ క్యూఆర్ కోడ్' ఆప్షన్ ఎంచుకోండి.» క్రెడిట్ కార్డు చెల్లింపుల కోసం ఎస్బీఐ అందించే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయండి.» మీరు చెల్లించాలనుకుంటున్న మొత్తాన్ని నమోదు చేయండి.» వివరాలను సరిచూసుకుని పేమెంట్‌ను కన్ఫమ్ చేయండి. -
హోలీ.. ఉగాది పండుగలు: మార్చిలో బ్యాంక్ హాలిడేస్ ఇవే..
ఫిబ్రవరి 2025 ముగుస్తోంది. దేశంలోని బ్యాంకుల నియంత్రణ సంస్థ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్చిలో బ్యాంకులు ఎన్ని రోజులు మూసి ఉంటాయో జాబితాను (Bank Holidays) విడుదల చేసింది. వచ్చే నెలలో వివిధ పనుల నిమిత్తం బ్యాంకులకు వెళ్లాల్సినవారు తప్పకుండా ఈ సెలవుల జాబితాను తెలుసుకోవాలి. తద్వారా మీ ప్రాంతంలో బ్యాంకులు ఎన్ని రోజులు మూసిఉంటాయో.. ఏయే రోజుల్లో పనిచేస్తాయో తెలుస్తుంది. తదనుగుణంగా బ్యాంకింగ్ పనిని ప్లాన్ చేసుకునేందుకు ఆస్కారం ఉంటుంది.మార్చిలో బ్యాంక్ హాలిడేస్➤మార్చి 7 (శుక్రవారం): 'చాప్చార్ కుట్' పండుగను సందర్భంగా మిజోరాంలో సెలవు దినం.➤మార్చి 13 (గురువారం): మార్చి 13న హోలిక దహన్, అట్టుకల్ పొంగళ పండుగ కారణంగా జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, కేరళ వంటి రాష్ట్రాల్లో సెలవు ఉంటుంది.➤మార్చి 14 (శుక్రవారం): హోలీ పండుగ సందర్భంగా.. త్రిపుర, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, మణిపూర్, కేరళ, నాగాలాండ్ మినహా ఇతర రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో సెలవు.➤మార్చి 15 (శనివారం): కొన్ని రాష్ట్రాలు మార్చి 14కి బదులుగా మార్చి 15న హోలీని జరుపుకుంటాయి. ఈ జాబితాలో త్రిపుర, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, మణిపూర్ ఉన్నాయి.➤మార్చి 22 (శనివారం): 'బీహార్ దివస్' లేదా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మార్చి 22న బీహార్‌లో బ్యాంకులకు సెలవు.➤మార్చి 27-28 (గురువారం-శుక్రవారం): ఇస్లామిక్ క్యాలెండర్లో ముఖ్యమైన రోజు అయిన షబ్-ఎ-ఖదర్ను పురస్కరించుకుని జమ్మూ కాశ్మీర్ మార్చి 27న సెలవు దినంగా పాటిస్తుంది. రంజాన్ నెల చివరి శుక్రవారం అయిన జుమాత్-ఉల్-విదాను పురస్కరించుకుని కేంద్రపాలిత ప్రాంతం మార్చి 28న సెలవు దినంగా పాటిస్తుంది.➤మార్చి 31 (సోమవారం): మిజోరం, హిమాచల్ ప్రదేశ్ మినహా.. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మార్చిలో ఈద్ సందర్భంగా ప్రభుత్వ సెలవు దినంగా పాటిస్తాయి.బ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పని చేసుకోవాలనుకునే వారు బ్యాంక్ హాలిడేస్ గమనించి ముందుగానే పనులు పూర్తి చేసుకోవాలి. అయితే ఆన్లైన్ సేవలు అన్నీ సెలవు దినాల్లో కూడా అందుబాటులో ఉంటాయి.(బ్యాంకింగ్ సెలవుల షెడ్యూల్ మారవచ్చు.. కాబట్టి హాలిడే క్యాలెండర్లో ఏవైనా అప్డేట్లు లేదా రివిజన్ల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. లేదా మీ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక ప్రకటనలను గమనించాల్సి ఉంటుంది). -
EPFO కీలక ప్రకటన: ఆ గడువు మార్చి 15 వరకు పొడిగింపు
ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కటికీ ఈపీఎఫ్ఓ అకౌంట్ ఉంటుంది. వీరందరూ.. ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ (ELI) పథకం కింద ప్రయోజనాలను పొందడానికి, యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) యాక్టివేట్ చేయడానికి మాత్రమే కాకుండా.. మీ బ్యాంక్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేయాలి. దీనికి గడువును ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) మార్చి 15, 2025 వరకు పొడిగించింది.ఈపీఎఫ్ఓ.. ఈఎల్ఐ స్కీమ్ కింద ప్రయోజనాలను పొందడానికి, యూఏఎన్ యాక్టివేషన్ & బ్యాంక్ ఖాతాలను ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి. దీనికోసం గడువును మార్చి 15కు పొడిగిస్తూ ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 21, 2025న జారీ చేసిన సర్క్యులర్‌లో పేర్కొంది. ఈ గడువును ఇప్పటికే పలుమార్పు పొడిగించారు. కాగా ఇప్పుడు మరోమారు పొడిగించారు.యూఏఎన్ అంటే ఏమిటి?యూఏఎన్ అనేది.. అర్హత కలిగిన జీతం పొందే ఉద్యోగికి 'ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్' కేటాయించిన 12-అంకెల సంఖ్య. ఇది వారి కెరీర్ అంతటా వివిధ యజమానులలో వారి PF ఖాతాలను నిర్వహించడానికి ఒకే యాక్సెస్ పాయింట్‌గా పనిచేస్తుంది. ఒకే సంఖ్య కింద వారి ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్‌లను ట్రాక్ చేయడానికి, యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుంది.యూఏఎన్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే?➤ఈపీఎఫ్ఓ మెంబర్ మొదట అధికారిక ఈపీఎఫ్ఓ పోర్టల్ ఓపెన్ చేయాలి.➤అధికారిక పోర్టల్ ఓపెన్ చేసిన తరువాత సర్వీసెస్ సెలక్ట్ చేసి.. అందులో ఫర్ ఎంప్లాయీఎస్ ఆప్షన్ ఎంచుకోవాలి.➤తరువాత మెంబర్ యూఏఎన్ లేదా ఆన్లైన్ సర్వీసెస్ మీద క్లిక్ చేయాలి. ఆలా క్లిక్ చేసిన తరువాత ఓ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.➤కొత్త పేజీలో.. కుడివైపు కింద భాగంలో ఇంపార్టెంట్ లింక్స్ విభాగంలో యాక్టివేట్ యువర్ యూఏఎన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.➤క్లిక్ చేయగానే.. ఒక ఫారమ్ వంటిది కనిపిస్తుంది. అందులో మీ పేరు, పుట్టిన తేదీ, ఫోన్ నెంబర్ వంటి అవసరమైన అన్ని వివరాలను ఫిల్ చేయాలి.➤అన్నీ ఫిల్ చేసిన తరువాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి, ధృవీకరించడానికి కింద కనిపించే బాక్స్ మీద క్లిక్ చేయాలి.➤తరువాత గెట్ ఆథరైజేషన్ పిన్ మీద క్లిక్ చేయాలి. ఇలా చేసిన తరువాత మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది.➤ఓటీపీ ఎంటర్ చేసిన తరువాత.. ఐ అగ్రీపై క్లిక్ చేయాలి. -
యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ గురించి తెలుసా..?
సంప్రదాయ ఉద్యోగ ఆధారిత పథకాలను మించిన యూనివర్సల్ పెన్షన్ స్కీమ్‌ను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ పథకం మెరుగైన ఫలితాలు ఇస్తుందని, ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా దీన్ని రూపొందిస్తున్నట్లు కొన్ని సంస్థలు కథనాలు ప్రచురిస్తున్నాయి. అందులోని వివరాలు కింది విధంగా ఉన్నాయి.అసంఘటిత రంగాల్లోని కార్మికులు, వ్యాపారులు, 18 ఏళ్లు పైబడిన స్వయం ఉపాధి పొందుతున్న అన్ని వర్గాల వారికి ఈ పథకం వర్తిస్తుందని భావిస్తున్నారు. అలాగే ఈ పథకం ఏ నిర్దిష్ట ఉపాధితో ముడిపడి ఉండదని చెబుతున్నారు. వ్యక్తులు తమ పదవీ విరమణ తర్వాత పెన్షన్ పొందేలా దీన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ పెన్షన్ పథకంపై కార్మిక మంత్రిత్వ శాఖ చర్చలు ప్రారంభించిందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు.రెండు పథకాలను కలుపుతారా..?ఈ పథకానికి సంబంధించిన పూర్తి ఫ్రేమ్‌వర్క్‌ను ఖరారు చేసిన తర్వాత, ఇతర వివరాలను జోడించేందుకు, దాన్ని మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కీలక భాగస్వాముల నుంచి సూచనలు కోరుతుంది. ఇప్పటికే ఉన్న ప్రధాన మంత్రి-శ్రమ యోగి మాన్‌ధన్ స్కీమ్ (పీఎం-ఎస్వైఎం), నేషనల్ పెన్షన్ స్కీమ్ ఫర్ ట్రేడర్స్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ (ఎన్పీఎస్-ట్రేడర్స్) వంటి పెన్షన్ పథకాలను ఒకే వ్యవస్థ కింద క్రమబద్ధీకరించడం, వాటిని మరింత ప్రయోజనకరంగా, సులభంగా అందుబాటులో ఉంచడం ఈ పథకం లక్ష్యంగా భావిస్తున్నారు. ఈ రెండు పథకాలు స్వచ్ఛందంగా 60 ఏళ్ల తరువాత నెలకు రూ.3000 పెన్షన్ అందిస్తుంది. అందుకు వయసును అనుసరించి రూ.55 నుంచి రూ.200 వరకు కంట్రిబ్యూట్ చేయాలి.అటల్ పెన్షన్ యోజన పథకం కూడా కొత్త పథకంలో చేరే అవకాశం ఉందని కొందరు అంచనా వేస్తున్నారు. బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ (బీవోసీడబ్ల్యూ) చట్టం కింద వసూలు చేసిన మొత్తాన్ని ఈ రంగంలోని కార్మికులకు పింఛన్ల కోసం ఉపయోగించే అవకాశం ఉందని భావిస్తున్నారు.ఇదీ చదవండి: ఐదేళ్లలో రిలయన్స్ రూ.50,000 కోట్ల పెట్టుబడులుఈ పథకం ఎందుకు అవసరం?భారతదేశంలో 60 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్న సీనియర్ సిటిజన్ జనాభా 2036 నాటికి 22.7 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. వారికి ఎలాంటి ఆదాయం లేని సమయంలో సమగ్ర సామాజిక భద్రత లేదా పెన్షన్ పథకం అవసరం ఉంటుంది. అమెరికా, యూరప్, కెనడా, రష్యా, చైనా వంటి అనేక దేశాల్లో పింఛన్లు, ఆరోగ్యం, నిరుద్యోగం వంటి వాటికి సామాజిక బీమా వ్యవస్థలు ఉన్నాయి. భారతదేశంలో సామాజిక భద్రత అధికంగా ప్రావిడెంట్ ఫండ్ వ్యవస్థ, వృద్ధాప్య పింఛన్లు, ఆరోగ్య భీమాపై ఆధారపడి ఉంది. ఇది ప్రధానంగా దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి ప్రయోజనం చేకూరుస్తుంది. -
ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ చెల్లింపులు: ఎలా చేయాలంటే..
ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా.. యూపీఐ చెల్లింపులు చేయడం సాధ్యం కాదని అందరూ అనుకుంటారు. కానీ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రారంభించిన *99# సర్వీస్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండానే లావాదేవీలను పూర్తి చేయవచ్చు. ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా యూపీఐ ట్రాన్సక్షన్ ఎలా చేయాలి?.. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.ఎన్పీసీఐ ప్రారంభించిన *99# సర్వీస్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండానే.. బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఇంటర్‌బ్యాంక్ ఫండ్ బదిలీ చేయవచ్చు, యూపీఐ పిన్ను సెట్ చేసుకోవచ్చు లేదా మార్చుకోవచ్చు. అయితే యూపీఐ చెల్లింపులు చేయాలంటే కొన్ని టిప్స్ పాటించాల్సి ఉంటుంది.ఇంటర్నెట్ లేకుండా యూపీఐ చెల్లింపు చేయడం ఎలా..➤మీ బ్యాంక్ ఖాతాకు లింక్ అయిన.. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి *99# కు డయల్ చేయండి.➤డయల్ చేసిన తరువాత భాషను ఎంచుకోవాలి.➤మీ బ్యాంక్ పేరును ఎంటర్ చేసిన తరువాత.. మీ మొబైల్ నెంబర్‌కు లింక్ అయిన బ్యాంక్ ఖాతాల జాబితా కనిపిస్తుంది.➤కావాల్సిన ఖాతాను ఎంచుకోవాలి. ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయడానికి.. డెబిట్ కార్డ్ చివరి ఆరు అంకెలు, గడువు తేదీని ఎంటర్ చేయాలి.➤యూపీఐ పిన్ నెంబర్ సెట్ చేయకపోతే.. సెట్ చేసుకోవాలి. ఈ పిన్ లావాదేవీలను నిర్దారించడానికి ఉపయోగపడుతుంది.డబ్బు పంపించాలంటే..➤మీ ఫోన్లో *99# డయల్ చేసిన తరువాత.. డబ్బు పంపడానికి ఆప్షన్ ఎంచుకోవాలి.➤ఆ తరువాత ఎవరికైతే డబ్బు పంపించాలనుకుంటున్నారో.. వారి యూపీఐ ఐడీ లేదా బ్యాంక్ ఖాతా నెంబర్ ఎంటర్ చేయడానికి కావలసిన ఆప్షన్ ఎంచుకోవాలి.➤మీరు పంపించాలనుకున్న మొత్తాన్ని.. ఎంటర్ చేసి చేసిన తరువాత.. లావాదేవీలను ధృవీకరించడానికి పిన్ నెంబర్ నమోదు చేయండి. -
ఆదాయపన్నులో మార్పులు.. తరచూ అడిగే ప్రశ్నలు
ఈసారి బడ్జెట్ ప్రతిపాదనలతో పాటు సందేహాల నివృత్తి కోసం తరచుగా అడిగే ప్రశ్నలకు జవాబులు కూడా పొందుపర్చారు. ఇలా చేయటంతో డిపార్టుమెంటువారీ స్నేహభావం, సన్నద్ధంగా ఉండే విధానం రెండూ తెలుస్తున్నాయి. వ్యక్తుల ఆదాయపు పన్ను వరకు 21 ప్రశ్నలు ఉన్నాయి. వాటి సారాంశమే ఈ వారం కథనం.కొత్త విధానం అంటే ఏమిటి?కొత్త విధానంలో రాయితీ ఉండే పన్ను రేట్లు, ఉదారమైన శ్లాబులుంటాయి. స్టాండర్డ్ డిడక్షన్ మినహా ఎటువంటి మినహాయింపులు ఉండవు.రేట్లు, శ్లాబులుగతంలో ఈ శ్లాబులు, రేట్ల గురించి తెలియజేశాం. ఇక్కడ బేసిక్ లిమిట్ రూ.3,00,000 నుంచి రూ.4,00,000కు పెంచారు. రూ.4 లక్షల వరకు పన్ను ఉండదు. రూ.12 లక్షలు దాటిన వారికి మాత్రం రూ.4,00,000 నుంచి పన్ను శ్లాబుల ప్రకారం వడ్డిస్తారు. శ్లాబుల విషయంలో నాలుగో ఎక్కం.. రేట్ల విషయంలో ఐదో ఎక్కం గుర్తు పెట్టుకుంటే చాలు. ప్రతి రూ.ఒక లక్ష ఆదాయం పెరుగుదలకు ఎంత పన్ను భారం ఏర్పడుతుంది? ప్రస్తుతం ఎంత? ప్రతిపాదనల వల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది? అనే విషయాలను అంకెలతో ఉదాహరణగా పట్టిక పొందుపరిచారు.ఎంత వరకు పన్ను చెల్లించనక్కర్లేదు?కొత్త విధానంలో రూ.12,00,000 వరకు పన్ను భారం ఏర్పడదు.పన్ను భారం ‘నిల్‘గా ఉండాలంటే ఏం చేయాలి?రూ.12,00,000 వరకు ఆదాయంపై పన్ను భారం నిల్‌గా ఉండాలంటే కొత్త విధానాన్ని విధిగా ఎంచుకోవాలి. ఆ మేరకు రిటర్నులు దాఖలు చేయాలి. కొత్త విధానం ఎవరికి వర్తిస్తుంది?కొత్త విధానం వ్యక్తులకు, హిందూ ఉమ్మడి కుటుంబాలకు, వ్యక్తుల కలయిక లేదా సంస్థలకు వర్తిస్తుంది.పన్నెండు లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి ఏమిటి ప్రయోజనం?ఒకప్పుడు రూ.12,00,000 ఆదాయం ఉన్న వారు రూ.80,000 వరకు పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు వారు ఏమీ చెల్లించనక్కర్లేదు.ఆదాయ పరిమితిని పెంచినట్లా?అవుననే చెప్పాలి. నిల్‌గా పన్ను భారం రావాలంటే రూ.12,00,000 లోపల ఆదాయం ఉండాలి. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే ట్యాక్సబుల్ పరిమితిని పెంచినట్లు. అంటే రిబేటును పూర్తిగా వాడుకున్నట్లు.గతంలో ‘నిల్’కి లిమిట్ ఎంత ఉంది?ఒకప్పుడు ఇటువంటి లిమిట్ రూ.7,00,000గా ఉండేది. ఇప్పుడు ఈ పరిమితిని రూ.12,00,000కు పెంచారు.కొత్త విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ తగ్గిస్తారా?కొత్త విధానంలో ఉద్యోగస్తులకు రూ.75,000 తగ్గిస్తారు. ఈ తగ్గింపును పరిగణనలోకి తీసుకుంటే ఉద్యోగస్తులకు రూ.12,75,000 వరకు పన్ను ఉండదు.పాత విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ ఎంత?పాత విధానంలో రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్ మాత్రమే. ఎటువంటి పెంపుదల లేదు. మార్జినల్ రిలీఫ్‌ను ఎలా లెక్కించాలి?రూ.12,00,000 దాటితే రూ.4,00,000 నుంచి పన్ను భారం లెక్కించాలి. మీ ఆదాయం రూ.12,10,000 అనుకోండి, సాధారణంగానైతే పన్ను భారం రూ.61,500. ఇటువంటి వారికి ఇచ్చే ఉపశమనాన్నే మార్జినల్ రిలీఫ్ అంటారు. ఈ రిలీఫ్ వల్ల స్వల్పంగా అదనపు ఆదాయం ఉన్నా అధిక పన్ను చెల్లించనక్కర్లేదు. ఇలాంటప్పుడు పన్నుభారం రూ.10,000 మాత్రమే. ఇలా రూ.12,75,000 వరకు రిలీఫ్ కల్పించారు. ఈ మేరకు చక్కటి, సంపూర్ణమైన ఉదాహరణ ఇచ్చారు.ఎంత మొత్తం రిబేటు ఉంటుంది?రిబేటు రూ.60,000 దాటి ఇవ్వరు.రిబేటుకి మార్జినల్ రిలీఫ్‌కి తేడా ఏమిటి?రూ.12,00,000 లోపు ఆదాయం ఉన్నప్పుడు ఇచ్చేది రిబేటు. రూ.12,00,000 దాటిన తర్వాత (రూ.12,75,000 వరకు) వచ్చేది మార్జినల్ రిలీఫ్.ఇదీ చదవండి: ఫండ్ పనితీరు మదింపు ఇలా..ఇతర ఆదాయాలకు రిబేటు వర్తిస్తుందా?మూలధన లాభాలు, లాటరీ మొదలైన వాటి వల్ల ఏర్పడ్డ ఆదాయాలకు ఈ రిబేటు వర్తించదు. ఏ ఆదాయం మీద స్పెషల్ రేటు ఉందో, దాని మీద రిబేటు రాదు.ఎంత మంది లబ్ధిదార్లు ఉన్నారు?గత సంవత్సరం 8.75 కోట్ల మంది కొత్త విధానంలో రిటర్నులు వేశారు. వారందరికీ ఇప్పుడు లాభం చేకూరుతుంది.ఎంత ఆదా అవుతుంది?ఈ మార్పుల వల్ల సుమారుగా రూ.లక్ష కోట్లు ట్యాక్స్‌పేయర్స్ చేతిలో మిగులుతుంది. అదే వినియోగం పెరిగేందుకు నాంది.-కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య ట్యాక్సేషన్ నిపుణులు -
స్టాక్స్ అమ్మి ఫ్లాట్ కొనడం మంచిదా?
స్టాక్స్‌లో, మ్యూచువల్ ఫండ్స్‌లో ఉన్న పెట్టుబడులను విక్రయించి, ఉత్తర బెంగళూరులో ఫ్లాట్ కొనాలన్నది నా ఆలోచన. వచ్చే ఐదేళ్ల కాలానికి ఇది మంచి ఆప్షన్ అవుతుందా? లేదంటే మరో ఐదేళ్లపాటు ఈ పెట్టుబడులు కొనసాగించిన అనంతరం ఫ్లాట్ కొనుగోలు చేసుకోవాలా? ఈ రెండింటిలో ఏది మెరుగైన ఆప్షన్? – శంకర్ కృష్ణమూర్తిఈ విషయంలో కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫ్లాట్ కొనుగోలు చేస్తే ఎంత మేర లాభపడొచ్చు? దీని ద్వారా వచ్చే అద్దె ఆదాయం ఏ మేరకు ఉంటుంది? ఇవన్నీ పరిశీలించాలి. ఫ్లాట్‌పై పెట్టుబడి విలువకు వృద్ధి ఉండి, 4–6 శాతం మేర అద్దె రాబడి వచ్చేట్టు అయితే ఇప్పుడే స్టాక్స్ విక్రయించి కొనుగోలు చేయడం మంచి నిర్ణయం అవుతుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులను విక్రయించేంత వరకు ఎలాంటి పన్నులు చెల్లించక్కర్లేదు. కనుక పెట్టుబడి వృద్ధి, రిస్క్, పెట్టుబడి పరిమాణాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. అద్దె ఇంట్లో ఉంటూ, సొంత అవసరాల కోసం ఇల్లు కొనుగోలు చేస్తున్నట్టు అయితే ఇప్పుడు కొనుగోలు చేయడం మంచి నిర్ణయం అవుతుంది. అలాంటప్పుడు తక్కువ రాబడి వచ్చినా ఫర్వాలేదు.మిడ్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ తమ నిర్వహణ ఆస్తుల్లో (ఏయూఎం/పెట్టుబడులు) 30 శాతాన్ని లార్జ్‌క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. అలాంటప్పుడు ప్రత్యేకంగా లార్జ్‌క్యాప్ ఫండ్‌లో పెట్టుబడికి బదులు ఒకే మిడ్‌క్యాప్ ఫండ్‌లో ఎందుకు పెట్టకూడదు? దీనివల్ల రీబ్యాలన్స్ చేయాల్సిన అవసరం తప్పుతుందిగా? – రాఘేవేంద్ర సోరబ్మిడ్క్యాప్ ఫండ్‌లో అంతర్గతంగా ఉండే అస్థిరతల పట్ల సౌకర్యంగా ఉండేట్టు అయితే ఇన్వెస్ట్ చేయడం మంచి వ్యూహమే అవుతుంది. మిడ్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌కు నిబంధనల పరంగా కొంత వెసులుబాటు ఉంది. అవి తమ నిర్వహణ ఆస్తుల్లో కనీసం 65 శాతాన్ని మిడ్‌క్యాప్ స్టాక్స్ కేటాయించాల్సి ఉంటుంది. మిగిలిన 35 శాతం పెట్టుబడులను లార్జ్‌క్యాప్ లేదా స్మాల్‌క్యాప్‌లో ఎక్కడైనా, ఎంత మేరకు అయినా కేటాయింపులు చేసుకోవచ్చు. ఇది ఫండ్ మేనేజర్ విచక్షణపైనే ఆధారపడి ఉంటుంది. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఫండ్ మేనేజర్లు 35 శాతం పెట్టుబడులను వివిధ విభాగాల మధ్య మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. అయితే, చాలా మిడ్‌క్యాప్ ఫండ్స్ లార్జ్‌క్యాప్‌కు చాలా తక్కువగా అంటే.. సగటున 12 శాతం మేర కేటాయింపులు చేస్తున్నాయి. ఇవి ఎక్కువ శాతం పెట్టుబడులను మిడ్‌క్యాప్ స్టాక్స్‌కే కేటాయిస్తుంటాయి. ఇదీ చదవండి: ఆరోగ్య బీమా.. భారం తగ్గేదెలా?మిడ్‌క్యాప్ ఫండ్ ఆస్తుల సైజు చిన్నగా ఉంటే అప్పుడు ఫండ్ మేనేజర్ లార్జ్‌క్యాప్ ఎక్స్పోజర్ బదులు నూరు శాతం పెట్టుబడులను మిడ్‌క్యాప్ కోసమే కేటాయించడం సరైన విధానం అవుతుంది. లార్జ్, మిడ్, స్మాల్‌క్యాప్ వ్యాప్తంగా వైవిధ్యమైన పెట్టుబడులను మీరు కోరుకుంటుంటే అప్పుడు మిడ్‌క్యాప్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచి నిర్ణయం కాబోదు. మల్టీక్యాప్ ఫండ్స్ అయితే లార్జ్, మిడ్, స్మాల్‌క్యాప్ విభాగాల్లో కనీసం 25 శాతం చొప్పున పెట్టుబడులు పెడుతుంటాయి. ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్‌కు ఏ మార్కెట్ క్యాప్ విభాగంలో అయినా ఇన్వెస్ట్ చేసే స్వేచ్ఛ వీటికి ఉంటుంది. అయినప్పటికీ ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ 80 శాతం వరకు లార్జ్‌క్యాప్ కంపెనీలకే కేటాయిస్తుంటాయి.ధీరేంద్ర కుమార్, వ్యాల్యూ రీసెర్చ్ సీఈవో -
ఆరోగ్య బీమా.. భారం తగ్గేదెలా?
ఆరోగ్య అత్యవసర స్థితి చెప్పి రాదు. ఆహారం, నిద్ర వేళల్లో మార్పులు.. గంటల తరబడి కూర్చొని చేసే ఉద్యోగాల ప్రభావంతో జీవనశైలి వ్యాధుల రిస్క్ పెరిగింది. వీటి కారణంగా ఆస్పత్రి పాలైతే బిల్లులు చెల్లించడం మెజారిటీ వ్యక్తులకు అసాధ్యమే కాదు, ఆర్థికంగా కుదేలయ్యే పరిస్థితి. ఇలాంటి అనిశ్చితులకు రక్షణ కవచమే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. కరోనా తర్వాత వీటి ప్రీమియంలు దాదాపుగా రెట్టింపయ్యాయి. మోయలేనంత భారంగా మారాయి. ఇది చూసి ఇప్పటికీ హెల్త్ ప్లాన్‌కు దూరంగా ఉన్నవారు ఎందరో. కానీ, ప్రతి వ్యక్తికీ, ప్రతి కుటుంబానికీ ఇది తప్పనిసరి. కావాలంటే ప్రీమియం తగ్గించుకునే మార్గాన్ని వెతకండి. అంతేకానీ, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా రక్షణ కల్పించే హెల్త్ ఇన్సూరెన్స్‌కు దూరంగా ఉండొద్దనేది నిపుణుల మాట! ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) అధ్యయనం ప్రకారం.. దేశంలో 35 శాతం మంది హైపర్‌టెన్షన్ (అధిక రక్తపోటు)తో బాధపడుతున్నారు. 10 శాతం మందికి మధుమేహం సమస్య ఉంటే, 28 శాతం మంది అధిక కొలెస్ట్రాల్‌ను ఎదుర్కొంటున్నారు. జీవనశైలి వ్యాధులు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. మరోవైపు వైద్య రంగంలో అత్యాధునిక చికిత్సా విధానాలు.. మరింత కచ్చితత్వంతో, మెరుగైన ఫలితాలనిచ్చే రోబోటిక్ సర్జరీలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ వ్యయాలను అందరూ భరించలేరు. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ తప్పకుండా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే.. హెల్త్ ఇన్సూరెన్స్‌ను వీలైనంత చిన్న వయసులోనే తీసుకోవాలి. అంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడు తీసుకోవడం వల్ల ప్రీమియం తక్కువగా ఖరారవుతుంది. వయసు, ఆరోగ్య చరిత్ర తదితర అంశాలను బీమా సంస్థ పాలసీ జారీకి ముందు మదింపు చేస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు విషయంలో.. 25 ఏళ్ల వయసు వ్యక్తికి, 40 ఏళ్ల వయసు వ్యక్తికి ప్రీమియంలో ఎంతో వ్యత్యాసం ఉంటుంది. చిన్న వయసులో, ఆరోగ్యంగా ఉన్నప్పుడు పాలసీ తీసుకుంటే, ఆ తర్వాతి కాలంలో ప్రీమియం పెరగదా? అన్న సందేహం రావచ్చు. 35 ఏళ్లు నిండిన తర్వాత, 45 ఏళ్లు, 55 ఏళ్లు, 60 ఏళ్లు నిండిన తర్వాత వయసువారీ ప్రీమియం రేట్లు కచ్చితంగా సవరణకు నోచుకుంటాయి. కానీ, 35–40 ఏళ్ల తర్వాత కొత్తగా పాలసీ తీసుకునే వారితో పోల్చితే, 25 ఏళ్లలోపు వారికి ప్రీమియం తక్కువే ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు తీసుకుంటే, మూడేళ్లలో అన్ని రకాల వెయిటింగ్ పీరియడ్లు దాటేస్తారు. ముందస్తు వ్యాధులకు సైతం కవరేజీ అర్హత లభిస్తుంది. పైగా పాలసీ తీసుకుని 60 నెలలు (ఐదేళ్ల ప్రీమియం చెల్లింపులు) ముగిస్తే, ఆరోగ్య చరిత్రను సరిగ్గా వెల్లడించలేదనో, సమాచారం దాచిపెట్టారనే కారణంతో క్లెయిమ్‌ను బీమా సంస్థ తిరస్కరించడానికి కుదరదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ముందుగా తీసుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాలతోపాటు ప్రీమియం భారం తగ్గుతుంది. బోనస్, రీస్టోరేషన్ కేవలం రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్నే తీసుకున్నప్పటికీ అదనపు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండా కవరేజీని పెంచుకునే మార్గాలు కూడా ఉన్నాయి. దాదాపు అన్ని బీమా కంపెనీలు నో క్లెయిమ్ బోనస్, రీస్టోరేషన్ ఫీచర్లను అందిస్తున్నాయి. ఒక పాలసీ సంవత్సరంలో ఎలాంటి క్లెయిమ్ లేకపోతే 50–200 శాతం మేర సమ్ అష్యూర్డ్ (బీమా కవరేజీ)ను నో క్లెయిమ్ బోనస్ రూపంలో బీమా సంస్థలు ఇస్తుంటాయి. అప్పుడు రూ.5 లక్షల కవరేజీ రూ.10–15 లక్షలకు చేరుతుంది. రీస్టోరేషన్ సదుపాయం అన్నది.. హాస్పిటల్లో చేరినప్పుడు కవరేజీ పూర్తిగా అయిపోతే అంతే మొత్తాన్ని తిరిగి ఆ పాలసీ సంవత్సరానికి పునరుద్ధరించడం. కొన్ని బీమా సంస్థలు ఏడాదిలో ఒక్క రీస్టోరేషన్నే ఇస్తుంటే, కేర్, ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ తదితర కంపెనీలు కొన్ని ప్లాన్లలో అపరిమిత రీస్టోరేషన్ సదుపాయాలను ఆఫర్ చేస్తున్నాయి. ఇవి తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల బేస్ సమ్ అష్యూర్డ్ తక్కువగా ఎంపిక చేసుకున్నప్పటికీ ఎలాంటి నష్టం ఉండదు. పైగా ప్రీమియం భారం తగ్గుతుంది. చిన్న క్లెయిమ్‌లకు దూరం ఏడాదిలో ఎలాంటి క్లెయిమ్ లేకపోతేనే నో క్లెయిమ్ బోనస్ వస్తుంది. కనుక చిన్న క్లెయిమ్‌లకు దూరంగా ఉండాలి. ఉదాహరణకు రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్‌కు ఎలాంటి క్లెయిమ్ లేకపోతే ఏటా 50 నుంచి 100 శాతం చొప్పున సమ్ అష్యూర్డ్ పెరుగుతుంది. ఒకవేళ క్లెయిమ్ చేస్తే ఎంత అయితే పెరిగిందో, అంతే మేర తగ్గిపోతుంది. కనుక చిన్న క్లెయిమ్ కోసం రూ.2.5–5 లక్షల సమ్ అష్యూర్డ్‌ను ఒక ఏడాదిలో నష్టపోవాల్సి వస్తుంది. అందుకే రూ.50 వేల లోపు చిన్న వ్యయాలను సొంతంగా భరించడమే మంచిది. మంచి ఆహారం, జీవనశైలి.. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం కదా అన్న భరోసాతో ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తామా? అలా చేయడం మన సమస్యలను మరింత పెంచుతుంది. మంచి ఆరోగ్యం కోసం తమ వంతు కృషి చేయాల్సిందే. దీనివల్ల ఆస్పత్రి పాలు కావడాన్ని సాధ్యమైన మేర నివారించొచ్చు. దీనివల్ల ప్రీమియం కూడా తగ్గుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో చాలా వరకు ఈ ప్రయోజనాన్ని అందిస్తున్నాయి. ఎన్ని కేలరీలు ఖర్చు చేస్తే అంత ప్రయోజనం లభిస్తుంది. రోజువారీ నడక, పరుగు, ఏరోబిక్ వ్యాయా మాలు చేయడం ద్వారా హెల్త్ క్రెడిట్స్ పొందొచ్చు. వీటిని ప్రీమియంలో సర్దుబాటు చేసుకోవచ్చు. తద్వారా ప్రీమియంలో 100% రాయితీని సైతం కొన్ని సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. ముఖ్యంగా పొగతాగడం, మద్యపానం, గుట్కా/జర్దాలకు దూరంగా ఉండాలి. ఈ అలవాట్ల గురించి ఆరోగ్య చరిత్రలో వెల్లడించాల్సిందే. వీటి కారణంగా ప్రీమియం గణనీయంగా పెరిగిపోతుంది. వీటిని మానేయడం ద్వారా ప్రీమియం తగ్గించుకోవచ్చు.సూపర్ టాపప్ నేటి రోజుల్లో నలుగురు సభ్యుల ఒక కుటుంబానికి కనీసం రూ.10 లక్షల హెల్త్ కవరేజీ ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఇది కూడా చాలకపోవచ్చు. కానీ, రూ.10 లక్షల హెల్త్ ప్లాన్ కోసం 30 ఏళ్ల వ్యక్తి కుటుంబానికి రూ. 20 వేల వరకు ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. దీనికి బదులు రూ.5 లక్షల బేసిక్ ఇండెమ్నిటీ ప్లాన్ పరిశీలించొచ్చు. దీనికి అదనంగా రూ.5 లక్షల డిడక్టబుల్‌తో సూపర్ టాపప్ ప్లాన్ తీసుకోవాలి. ఉదాహరణకు రూ.50 లక్షల సూపర్ టాపప్ ప్లాన్ రూ.3,000కే వస్తుంది. ఇందులో మొదటి రూ.5 లక్షల బిల్లును మినహాయించి, ఆపై ఉన్న మొత్తానికి చెల్లింపులు లభిస్తాయి. రూ.10 లక్షల హెల్త్ ప్లాన్ ప్రీమియం అందుబాటు ధరలోనే వస్తే, అప్పుడు రూ.10 లక్షల డిడక్టబుల్‌తో రూ.50 లక్షలు లేదా రూ.కోటికి సూపర్ టాపప్ ప్లాన్ జోడించుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. మెరుగైన క్రెడిట్ స్కోర్ వ్యక్తిగత రుణ చరిత్రకు, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంకు సంబంధం ఏంటని అనుకుంటున్నారా?.. కొన్ని బీమా సంస్థలు మెరుగైన సిబిల్ స్కోర్ ఉన్న కస్టమర్లకు ప్రీమియంలో తగ్గింపు ఇస్తున్నాయి. ఎక్కువ స్కోరు ఉందంటే.. ఆర్థిక క్రమశిక్షణతో నడుచుకుంటున్నారని అర్థం. ఇలాంటి వారిని తక్కువ రిస్క్ కస్టమర్లుగా చూస్తూ ప్రీమియంలో డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నాయి. 15 శాతం వరకు తగ్గింపు పొందొచ్చు.ఆన్లైన్లో కొనుగోలు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ, ఫీచర్లపై అవగాహన కలిగిన వారు ఆన్లైన్లో కొనుగోలు చేయడం ద్వారా ప్రీమియంలో డిస్కౌంట్ పొందొచ్చు. పైగా పాలసీబజార్ పోర్టల్‌పై మొబైల్ ఓటీపీతో లాగిన్ అయ్యి, అన్ని బీమా సంస్థల పాలసీలను పరిశీలించొచ్చు. వాటి ఫీచర్లు, ప్రీమియం వ్యత్యాసాన్ని గమనించొచ్చు. తద్వారా మెరుగైన ఫీచర్లతో, తక్కువ ప్రీమియంతో ఉండే పాలసీని గుర్తించొచ్చు. బీమా సంస్థ పోర్టల్ ద్వారా నేరుగా పాలసీని కొనుగోలు చేయవచ్చు. దీనివల్ల స్వయంగా వివరాలు నమోదు చేయడం, నియమ, నిబంధనల గురించి అవగాహన కూడా ఏర్పడుతుంది. కొంత రాజీపడితే? సదుపాయాల విషయంలో కొంత రాజీధోరణితో వెళ్లేట్టు అయితే అప్పుడు కూడా ప్రీమియం భారాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఇందులో రూమ్ టైప్ ఒకటి. ఆస్పత్రిలో చేరినప్పుడు రోగికి ఐసీయూ వెలుపల పడక అవసరమవుతుంది. జనరల్ వార్డ్, షేరింగ్, సింగిల్ రూమ్, డీలక్స్ రూమ్ ఇలా పలు రకాలుంటాయి. పడక విషయంలో ఎలాంటి పరిమితుల్లేని పాలసీకి ఎక్కువ మంది మొగ్గు చూపిస్తుంటారు. ఒక విధంగా ఇదే సౌకర్యమైనది. ప్రీమియం భరించగలిగే వారు రూమ్ రెంట్లో పరిమితులు లేకుండా ఎంపిక చేసుకోవాలి. ప్రీమియం భారంగా భావించే వారు.. షేరింగ్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రైవేటు రూమ్‌ల్లోని సేవలతో పోల్చినప్పుడు షేరింగ్‌లో అందించే వైద్య సేవల చార్జీలు తక్కువగా ఉంటాయి. కనుక మొత్తం మీద బిల్లు తగ్గుతుంది. ఇది బీమా సంస్థపై భారాన్ని తగ్గిస్తుంది. షేరింగ్‌లోనూ రోగికి మెరుగైన సేవలే అందుతాయి. కనుక దీన్ని పరిశీలించొచ్చు. పైన చెప్పుకున్న అన్ని ఆప్షన్లు దాటి వచి్చన తర్వాత కూడా ప్రీమియం భారంగా అనిపిస్తే.. కోపేమెంట్కు వెళ్లడమే. ఈ విధానంలో ప్రతి ఆస్పత్రి బిల్లులో పాలసీదారు తన వంతు చెల్లించాల్సి వస్తుంది. ఉదాహరణకు 10 శాతం కో–పేమెంట్ ఎంపిక చేసుకున్నారని అనుకుందాం. రూ.2 లక్షల బిల్లు వచి్చనప్పుడు రోగి తన జేబు నుంచి రూ.20 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ కోపేమెంట్ ఆప్షన్‌కైనా వెళ్లొచ్చు. కానీ, దీనివల్ల ఏటా ప్రీమియం భారం తగ్గుతుంది కానీ, ఆస్పత్రిలో చేరినప్పుడు ఆ మేరకు జేబుపై భారం పడుతుందిఈఎంఐ రూపంలో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఏడాదికి ఒకే వాయిదాలో చెల్లించాల్సి ఉంటుంది. జీవిత బీమాలో మాదిరి నెలవారీ లేదా త్రైమాసికం లేదా ఆరు నెలలకోసారి ఆప్షన్ లేదు. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఒకే విడత అంత మొత్తం అంటే భారంగా అనిపించొచ్చు. అలాంటి వారు ఈఎంఐ ఆప్షన్ ఎంపిక చేసుకోవచ్చు. కొన్ని రకాల కార్డులపై బీమా సంస్థలు ఈ సదుపాయం కల్పిస్తున్నాయి. నెట్వర్క్ ఆస్పత్రుల్లోనే.. ప్రతి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ నెట్వర్క్ ఆస్పత్రులతో ఒక జాబితాను నిర్వహిస్తుంటుంది. తమ క్లయింట్లకు కొంచెం తగ్గింపు రేట్లపై సేవలు అందించే దిశగా ఆయా ఆస్పత్రులతో బీమా కంపెనీకి టైఅప్ ఉంటుంది. కనుక నాన్ నెట్వర్క్ ఆస్పత్రులతో పోల్చి చూస్తే నెట్వర్క్ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకోవడం వల్ల తక్కువ చార్జీలు పడతాయి. ఈ మేరకు బీమా కంపెనీలకు ఆదా అవుతుంది. కనుక స్టార్ హెల్త్ వంటి కొన్ని బీమా సంస్థలు నెట్వర్క్ ఆస్పత్రుల్లోనే చికిత్స తీసుకుంటే ప్రీమియంలో 15 శాతం వరకు రాయితీని అందిస్తున్నాయి. ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ కుటుంబంలో ప్రతి ఒక్కరికీ ఇండివిడ్యువల్ హెల్త్ కవరేజీ తీసుకుంటే ప్రీమియం ఎక్కువ పడుతుంది. దీనికి బదులు కుటుంబం అంతటికీ ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకోవాలి. ఎందుకంటే కుటుంబంలో అందరికీ కలిపి కవరేజీ ఒక్కటే అవుతుంది. కనుక ప్రీమియం తగ్గుతుంది. వెల్నెస్ ప్రయోజనాలు ఉపయోగించుకోవాలి.. తీసుకునే హెల్త్ ప్లాన్‌లో హెల్త్ చెకప్ వంటి వెల్నెస్ ప్రయోజనాలు ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల ఏడాదికోసారి ఉచితంగా అన్ని రక్త పరీక్షలు చేయించుకోవచ్చు. ఇందుకు అదనంగా పడే ప్రీమియం ఉండదు. కానీ, ఆరోగ్యం ఎలా ఉందన్నది గమనించుకోవచ్చు. ఈ మేరకు కొంత ఆదా చేసినట్టే అవుతుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఈపీఎఫ్ కనీస పెన్షన్.. నెలకు రూ. 7500?
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కింద ఉన్న, ప్రైవేట్ రంగ ఉద్యోగులు చాలా కాలంగా తమ కనీస పెన్షన్‌ను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన 2025-26 బడ్జెట్ సమావేశంలో నిర్మలా సీతారామన్ ప్రకటిస్తారేమో అని చూసారు. కానీ ఫలితం లేకుండా పోయింది. అయితే ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో దీనికి సంబంధించిన ప్రకటలను వెలువడే అవకాశం ఉంది.2024-25 ఆర్థిక సంవత్సరానికి.. ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటును ఖరారు చేయడానికి EPFO సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) ఫిబ్రవరి 28, 2025న సమావేశం కానుంది. ఇందులో పెన్షన్ సవరణకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు. వడ్డీ రేటుకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా.. పెన్షన్ పెంపుదల అంశం చర్చనీయాంశంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.2014 నుంచి మినిమమ్ పెన్షన్ నెలకు రూ. 1,000గా ఉంది. దీనిని 7500 రూపాయలకు పెంచాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. EPF సభ్యులు తమ జీతంలో 12 శాతం ప్రావిడెంట్ ఫండ్‌కు జమ చేస్తారు. అంతే మొత్తంలో సంస్థ కూడా జమచేస్తుంది. కంపెనీ జమచేసి 12 శాతంలో.. 8.33 శాతం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS)కి కేటాయిస్తారు. మిగిలిన 3.67 శాతం EPF స్కీమ్‌కి వెళుతుంది.గత కొన్ని సంవత్సరాలుగా.. పెన్షనర్లు, న్యాయవాద సంఘాలు ప్రస్తుత పెన్షన్ స్కీమును విమర్శిస్తున్నాయి. దాదాపు నాలుగు దశాబ్దాలుగా నెలకు రూ.1,000 పెన్షన్ సరిపోదని చెబుతున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వైద్య ఖర్చులతో, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. కాబట్టి ఇక సీబీటీ నిర్ణయం కోసం వారందరూ ఎదురు చూస్తున్నారు.EPFO కనీస పెన్షన్ పెంపు2025 బడ్జెట్‌కు ముందు.. EPS-95 పదవీ విరమణ చేసిన వారి ప్రతినిధి బృందం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి, నెలకు రూ. 7,500 కనీస పెన్షన్ పెంపు, డియర్నెస్ అలవెన్స్ (DA) గురించి వివరించారు. ఆ విషయాలను తప్పకుండా పరిశీలిస్తామని ఆర్థిక మంత్రి హామీ ఇచ్చారని EPS-95 జాతీయ కమిటీ పేర్కొంది. దీన్ని బట్టి చూస్తే.. మినిమమ్ పెన్షన్ పెంపు తప్పకుండా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. -
ఈపీఎఫ్ విత్‌డ్రా.. ఇక నేరుగా యూపీఐ..
ఈపీఎఫ్ (EPF) విత్‌డ్రా ఇక మరింత సులువు కానుంది. పీఎఫ్ మొత్తాన్ని నేరుగా యూపీఐ ద్వారా చెల్లింపులకు వాడుకునే వెసులుబాటు రానుంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) రాబోయే మూడు నెలల్లో ఈపీఎఫ్ క్లెయిమ్‌ల కోసం యునైటెడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) ఆధారిత ఉపసంహరణలను ప్రవేశపెట్టనుంది .ఈపీఎఫ్ విత్‌డ్రా (EPF Withdrawal) ప్రక్రియను మరింత సులువుగా మార్చడమే లక్ష్యంగా ఈపీఎఫ్‌వో ఈ వెసులుబాటు తీసుకొస్తోంది. దీని ద్వారా దాని లక్షల మంది చందాదారులకు ఈపీఎఫ్ ఉపసంహరణ వేగవంతంగా మరింత అందుబాటులో ఉంటుంది. దీని కోసం ఈపీఎఫ్ఓ ఇప్పటికే ఒక ప్రణాళికను సిద్ధం చేసి యూపీఐ ప్లాట్‌ఫామ్‌లలో ఈ ఫీచర్‌ను ప్రారంభించడానికి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.ఇది చదివారా? త్వరలో ప్రభుత్వ క్రెడిట్ కార్డులు.. రూ.5 లక్షలు లిమిట్‌తో..ఒకసారి ఇంటిగ్రేట్ ప్రక్రియ పూర్తయి ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే క్లెయిమ్ మొత్తాలను సబ్స్క్రైబర్లు డిజిటల్ వాలెట్ల ద్వారా సులభంగా యాక్సెస్ చేయవచ్చు. ఇది ప్రాసెసింగ్ సమయాన్ని తగ్గించి వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. ఉపసంహరణలను సులభతరం చేయడానికి, జాప్యాలను నివారించడానికి, కాగితపు పనిని తగ్గించడానికి, పారదర్శకతను మెరుగుపరచడానికి కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), వాణిజ్య బ్యాంకుల సహకారంతో ఈపీఎఫ్‌వో డిజిటల్ వ్యవస్థలను అప్‌గ్రేడ్ చేస్తోంది.పెన్షన్ సేవలను మెరుగుపరచడం, ప్రావిడెంట్ ఫండ్ ( PF ) క్లెయిమ్‌ల కోసం క్లెయిమ్ ప్రాసెసింగ్‌ను సులభతరం చేయడం లక్ష్యంగా ఇప్పటికే ఈపీఎఫ్‌వో అనేక సంస్కరణలు అమలు చేస్తోంది. అందులో భాగమే ఈ చొరవ. 2025 ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్‌లో 5 కోట్లకు పైగా చందాదారుల క్లెయిమ్‌లను ప్రాసెస్ చేసి, రూ . 2.05 లక్షల కోట్లకు పైగా సొమ్మును పంపిణీ చేసింది. -
త్వరలో ప్రభుత్వ క్రెడిట్ కార్డులు..
కేంద్ర ప్రభుత్వం నుంచి క్రెడిట్ కార్డులను (Credit Cards) సూక్ష్మ పరిశ్రమ వ్యవస్థాపకులు త్వరలో అందుకోనున్నారు. 2025 కేంద్ర బడ్జెట్లో (Union Budget 2025-26) హామీ ఇచ్చినట్లుగా మైక్రో ఎంట్రాప్రెన్యూర్లకు రూ. 5 లక్షల పరిమితితో క్రెడిట్ కార్డులను ఏప్రిల్ నుంచి కేంద్ర ప్రభుత్వం జారీ చేయనుంది.ఈ సౌకర్యం రాబోయే కొన్నేళ్లలో సూక్ష్మ-యూనిట్లకు అదనంగా రూ. 30,000 కోట్ల నిధులను అందించగలదు. ఇది వ్యాపార విస్తరణ కోసం ఇతర రుణ ఎంపికలకు అనుబంధంగా ఉంటుంది. ఈ పథకం నుండి ప్రయోజనం పొందడానికి, క్రెడిట్ కార్డు అందుకునేందుకు చిరు వ్యాపారులు నమోదు చేసుకోవాలి. ఈ నేపథ్యంలో రూ. 5 లక్షల పరిమితితో ఈ క్రెడిట్ కార్డును పొందడానికి అర్హత ప్రమాణాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..క్రెడిట్ కార్డు లిమిట్, షరతులురూ. 5 లక్షల లిమిట్ కలిగిన ఈ క్రెడిట్ కార్డ్.. చిరు దుకాణాలను, చిన్న తరహా తయారీ పరిశ్రమలను నిర్వహించేవారికి అందుబాటులో ఉంటుంది. దరఖాస్తుదారుల యూపీఐ లావాదేవీలు, బ్యాంక్ స్టేట్మెంట్లు వ్యాపార పరిస్థితులు అంచనా వేసిన తర్వాత ఈ క్రెడిట్ కార్డులు మంజూరు చేస్తారు. కార్డుకు ఒక సంవత్సరం చెల్లుబాటు వ్యవధి ఉంటుంది. రూ. 10-25 లక్షల మధ్య వార్షిక టర్నోవర్ ఉన్నవారు మాత్రమే ప్రభుత్వ మైక్రో-క్రెడిట్ కార్డుకు అర్హులు.దరఖాస్తు ప్రక్రియప్రభుత్వం జారీ చేసే ఈ క్రెడిట్ కార్డును పొందడానికి, దేశవ్యాప్తంగా ఉన్న చిరు వ్యాపారులు ముందుగా ఉద్యమ్ (Udyam) పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. అనంతరం ఎంఎస్ఎంఈ క్రెడిట్ కార్డును పొందవచ్చు. పోర్టల్‌లో నమోదుకు ఈ దశలు పాటించండి..» అధికారిక ఉద్యమ్ పోర్టల్ msme.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించండి. » 'క్విక్ లింక్స్' పై క్లిక్ చేయండి.» 'ఉద్యమ్ రిజిస్ట్రేషన్' ఎంచుకోండి.» రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి తదుపరి సూచనలను అనుసరించండి. -
22న యూపీఐ సేవలు బంద్!.. హెచ్డీఎఫ్సీ ప్రకటన
స్మార్ట్‌ఫోన్ వాడకంలోకి వచ్చిన తరువాత దాదాపు చాలామంది లావాదేవీల కోసం 'ఫోన్‌పే, గూగుల్ పే' వంటి యూపీఐ యాప్‌లను ఉపయోగిస్తున్నాయి. అయితే తాజాగా హెచ్డీఎఫ్సీ ఖాతాను.. యూపీఐ పేమెంట్స్ యాప్‌లకు లింక్ చేసుకున్నవారికోసం బ్యాంక్ ఓ సందేశం అందించింది.బ్యాంక్ అందించిన సందేశం ప్రకారం.. శనివారం (ఫిబ్రవరి 22) ఉదయం 2:30 AM నుంచి 7 AM వరకు.. హెచ్డీఎఫ్సీ ఖాతాకు లింక్ అయిన యూపీఐ సేవలు పనిచేయవు. అంటే 4:30 గంటలు యూపీఐ సేవలను నిలిపివేస్తున్నట్లు బ్యాంక్ అధికారికంగా వెల్లడించింది. తన ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించడంలో భాగంగానే సిస్టం మెయిటెనెన్స్ చేపడుతున్నట్లు హెచ్డీఎఫ్సీ వెల్లడించింది.హెచ్డీఎఫ్సీ ప్రకారం.. ఆ సమయంలో లావాదేవీలు పూర్తిగా నిలిచిపోతాయి. ఒకవేళా ఒకటికంటే ఎక్కువ ఖాతాలను కలిగి ఉన్నవారు.. ప్రైమరీ అకౌంట్‌గా హెచ్‌డీఎఫ్‌సీని లింక్ చేసి ఉంటే.. అత్యవసరం అనుకుంటే మార్చుకోవడం మంచింది. లేకుంటే 7 గంటల తరువాత యూపీఐ సేవలను యదావిధిగా కొనసాగించవచ్చు.చదవండి: 'ఆ నిర్ణయం నన్ను ఎంతగానో బాధించింది': బిల్ గేట్స్కేవలం హెచ్డీఎఫ్సీ అకౌంట్ మాత్రమే ఉన్నవాళ్లు.. ముందుగానే ఏటీఎం నుంచి డబ్బు విత్‌డ్రా చేసి పెట్టుకోండి. ఏదైనా ప్రయాణం సమయంలో, లేదా ఇతర అత్యవసర సమయంలో ఉపయోగించుకోవచ్చు. ఫిబ్రవరి 22న ఏ సమయంలో యూపీఐ పనిచేయదనే విషయాన్ని కస్టమర్లకు హెచ్డీఎఫ్సీ మెయిల్ ద్వారా తెలియజేసింది. -
పాలసీ జారీ తర్వాతే ప్రీమియం వసూలు
కొత్తగా బీమా పాలసీలు తీసుకునే వారి సౌలభ్యం కోసం బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (IRDAI) కీలక ఆదేశాలు జారీ చేసింది. పాలసీ జారీ చేసిన తర్వాతే అందుకు సంబంధించి ప్రీమియం వసూలు చేసుకునేందుకు వీలుగా.. బీమా–ఏఎస్బీఏ(Bima-Applications Supported by Blocked Amount) సదుపాయాన్ని అందించాలంటూ అన్ని బీమా సంస్థలను ఆదేశించింది.ఇదీ చదవండి: విద్యుత్ రంగంలో రూ.60 లక్షల కోట్ల పెట్టుబడులుపాలసీ జారీ అయ్యేంత వరకు ప్రీమియంకు సరిపడా మొత్తం కస్టమర్ బ్యాంక్ ఖాతాలో బ్లాక్ అయి ఉంటుంది. ప్రస్తుతం ఐపీవోలకు ఈ విధానం అమల్లో ఉంది. దీన్ని అప్లికేషన్ సపోర్టెడ్ బై బ్లాక్డ్ అమౌంట్ (ఏఎస్బీఏ) సదుపాయంగా చెబుతారు. ఇదే మాదిరి బీమా–ఏఎస్బీఏ విధానాన్ని బీమా పాలసీలకు అమలు చేయాలని ఐఆర్డీఏఐ సూచించింది. మార్చి 1 నాటికి ఈ సదుపాయాన్ని అమల్లోకి తీసుకురావాలని ఐఆర్డీఏఐ తెలిపింది. ఈ విధానంలో ప్రపోజల్‌ను ఆమోదిస్తున్నట్టు బీమా సంస్థ కస్టమర్‌కు తెలియజేసిన తర్వాతే, ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని ఐఆర్డీఏఐ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. -
ఎల్ఐసీ కొత్త ప్లాన్: సింగిల్ పేమెంట్.. జీవితాంతం ఆదాయం!
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) ఆఫ్ ఇండియా 'స్మార్ట్ పెన్షన్' (Smart Pension) ప్లాన్‌ను ప్రారంభించింది. పదవీ విరమణ సమయంలో ఆర్థిక భద్రతను అందించే లక్ష్యంతో సంస్థ ఈ ప్లాన్ స్టార్ట్ చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు వివరంగా.. ఈ కథనంలో చూసేద్దాం.ఒక ఉద్యోగి తన పదవీ విరమణ తరువాత కూడా.. క్రమం తప్పకుండా ఆదాయం వస్తే బాగుంటుందని, ఇలాంటి ప్లాన్స్ కోసం వెతుకుతుంటారు. అలాంటి వారికి ఎల్ఐసీ ప్రారంభించిన ఈ స్మార్ట్ పెన్షన్ ప్లాన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది సింగిల్-ప్రీమియం, నాన్-పార్, నాన్-లింక్డ్ ప్లాన్ సింగిల్ లైఫ్, జాయింట్ లైఫ్ యాన్యుటీ వంటి ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.సింగిల్ లైఫ్, జాయింట్ లైఫ్ అవసరాలకు అనుగుణంగా స్మార్ట్ పెన్షన్ ప్లాన్ ఎంచుకోవచ్చు. జీవిత భాగస్వాములు, తల్లిదండ్రులు, పిల్లలు, మనవరాళ్ళు, తోబుట్టువులు, అత్తమామలు వంటి కుటుంబ సభ్యుల కోసం జాయింట్ లైఫ్ యాన్యుటీని ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్ ఎంచుకుంటే.. ప్రియమైనవారికి ఆర్థిక స్థిరత్వాన్నిఅందించవచ్చు.నెల, మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరం ఇలా మీకు తగిన విధంగా యాన్యుటీ చెల్లింపులు ఎంచుకోవచ్చు. కొన్ని షరతులకు లోబడి.. కొంత మొత్తం లేదా పూర్తిగా కూడా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌ను.. పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్స్-లైఫ్ ఇన్సూరెన్స్ (POSP-LI) మరియు కామన్ పబ్లిక్ సర్వీస్ సెంటర్స్ (CPSC-SPV) వంటి ఏజెంట్ల ద్వారా ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. లేదా ఎల్ఐసీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కొనుగోలు చేయవచ్చు.అర్హత & ప్లాన్ వివరాలు18 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులు ఎవరైనా ఈ ప్లాన్ ఎంచుకోవచ్చు. అయితే మీరు ఎంచుకునే యాన్యుటీ ఆప్షన్లను బట్టి.. అర్హత మారుతుంది. ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే.. ఒకసారి యాన్యుటీ ఆప్షన్ ఎంచుకున్న తరువాత, దానిని మళ్ళీ మార్చలేము. ఎంచుకునే సమయంలోనే జాగ్రత్తగా సెలక్ట్ చేసుకోవాలి.స్మార్ట్ పెన్షన్ ప్లాన్‌కు.. మార్కెట్‌తో సంబంధం లేదు. మార్కెట్లు లాభాల్లో ఉన్నా.. నష్టాల్లో ఉన్న మీ డబ్బుకు గ్యారెంటీ లభిస్తుంది. నెలకు రూ. 1,000, మూడు నెలలకు రూ. 3,000, ఏడాది రూ. 12,000 చొప్పున పాలసీదారు యాన్యుటీని ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్ కోసం కనీస కొనుగోలు మొత్తం రూ. 1 లక్ష. గరిష్ట కొనుగోలుకు ఎలాంటి పరిమితి ఉండదు.ఇదీ చదవండి: అమితాబ్ అల్లుడు.. వేలకోట్ల కంపెనీకి రారాజు: ఎవరీ నందా?5, 10, 15, 20 సంవత్సరాలు.. ఇలా ఎంచుకున్న కాలమంతా స్మార్ట్ పెన్షన్ ప్లాన్ ద్వారా ఆదాయం వస్తుంది. అంతే కాకుండా ప్రతి ఏటా 3 శాతం లేదా 6 శాతం పెన్షన్ పెరుగుతూనే ఉంటుంది. జీవితాంతం పెన్షన్ అందుకునే యాన్యుటీనికి కూడా ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్ పరిచయం చేస్తూ.. ''పదవీ విరమణ అనేది సంపాదనకు ముగింపు కాదు, ఇది ఆర్థిక స్వేచ్ఛకు ప్రారంభం'' అని ఎల్ఐసీ తన ఎక్స్ ఖాతాలో పేర్కొంది.Retirement isn’t the end of earning—it’s the beginning of financial freedom! With LIC of India’s Smart Pension, enjoy a lifetime of steady income and stress-free golden years.https://t.co/YU86iMOu9M#LIC #SmartPension #PensionPlan pic.twitter.com/4bXUXbz90g— LIC India Forever (@LICIndiaForever) February 19, 2025 -
రూ.80 వేలు ఇన్వెస్ట్ చేస్తే రూ.1.15 లక్షలు గ్యారెంటీ!
table, th, td { border: 1px solid black; } పోస్టాఫీస్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్ఎస్సీ) పథకాన్ని సురక్షితమైన, గ్యారెంటీ రాబడిని కోరుకునే వ్యక్తులు మంచి పెట్టుబడి ఎంపికగా చూస్తారు. ప్రభుత్వ పథకం కావడంతో రిస్క్ తక్కువగా ఉంటుందనే భావనే ఇందుకు కారణం. అయితే ఈ స్కీమ్‌లో ఎంత పెట్టుబడి పెడితే ఎంత మొత్తం సమకూరుతుందో చాలామందికి సరైన అవగాహన ఉండదు. దానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడంతోపాటు ఈ పథకం కీలక అంశాలను కింద చూద్దాం.పోస్టాఫీస్ ఎన్ఎస్సీ పథకంనేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్ఎస్సీ) అనేది భారతీయ తపాలా కార్యాలయం అందించే స్థిర ఆదాయ పెట్టుబడి పథకం. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద స్థిరమైన రాబడులు, పన్ను ప్రయోజనాల హామీతో చిన్న, మధ్యతరహా పెట్టుబడిదారులను పొదుపు చేయడానికి ప్రోత్సహించడానికి దీన్ని రూపొందించారు.కీలక ఫీచర్లు..రిస్క్‌లేని పెట్టుబడి: భారత ప్రభుత్వ మద్దతు ఉండడంతో ఎన్ఎస్సీను సురక్షితమైన పెట్టుబడి ఎంపికగా పరిగణిస్తున్నారు.ఫిక్స్డ్ వడ్డీ రేటు: వడ్డీ రేటును ఏటా ఫిక్స్ చేసి కాంపౌండ్ చేస్తారు. 2024 మొదటి త్రైమాసిక కాలం నాటికి వడ్డీ రేటు ఏడాదికి 7.7 శాతంగా ఉంది.పన్ను ప్రయోజనాలు: రూ.1.5 లక్షల వరకు పెట్టుబడులకు సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది.గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు: పెట్టుబడిదారులు ఎన్ఎస్సీలో చేసే ఇన్వెస్ట్‌మెంట్‌కు గరిష్ట పరిమితి లేదు. ఎంతైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు.చక్రవడ్డీ: వడ్డీని ఏటా తిరిగి పెట్టుబడిగా పెడతారు. ఇది మెచ్యూరిటీ సమయంలో అధిక రాబడిని అందిస్తుంది.కనీస పెట్టుబడి: కనీస పెట్టుబడి మొత్తం రూ.1,000.ఇదీ చదవండి: పేరు మార్చుకుంటే రూ.8,400 కోట్లు ఆఫర్!ఐదేళ్ల తరువాత ఎంత వస్తుంది?ఐదేళ్ల కాలపరిమితికి ఎన్ఎస్సీ పథకంలో పెట్టుబడి చేస్తే రూ.80,000 ఇన్వెస్ట్‌మెంట్‌కు మెచ్యూరిటీ మొత్తం కింది విధంగా ఉంటుంది.(రూ.ల్లో)ఏడాదిఅసలు వడ్డీ మొత్తం 180,000 6,160 86,160286,160 6,633 92,7933 92,7937,14599,938499,938 7,695 1,07,63351,07,6338,2861,15,919 -
అంకెలు మారాయి కానీ.. ప్రశ్న మారలేదు..
మూడు బడ్జెట్ల నుంచి ఇదే ప్రశ్న.. పాత పన్ను విధానమా? కొత్త పన్ను విధానమా? ఏది మంచిది. ఏది ఎక్కువ ఉపయోగకరం. ఏది ఎవరికి ఎక్కువ ప్రయోజనకరం. ఏది మంచిదని ప్రశ్నించే బదులు ఏది ఉపయోగం అనేది సరైన ప్రశ్న. మళ్లీ పాత ప్రశ్నే. ఇరవై ఏళ్లు లేదా అంతకన్నా ముందు నుంచి అస్సెస్సీలతో సేవింగ్స్ చేయించి, అలా చేసినందుకు ఆ మేరకు మినహాయింపును ఇస్తూ వచ్చేవారు. ఏయే సెక్షన్ల ప్రకారం సేవ్ చేస్తే మినహాయింపు వస్తుంది.. అని ఆలోచించి అడుగేసేవాళ్లు.ఉద్యోగస్తులకు కంపల్సరీగా పీఎఫ్ తప్పదు. అంతేకాకుండా, ట్యాక్స్ విధానంలో ‘మినహాయింపు’ను అతిగా వాడారు. డిపాజిట్ చేస్తే మినహాయింపు, విత్‌డ్రా చేస్తే మినహాయింపు, దాని మీద వడ్డీకి కూడా మినహాయింపు. సంక్షేమం అనుకోండి, పొదుపు అనుకోండి, అలవాటు అనుకోండి, ఆకర్షణీయం అనుకోండి.. పీఎఫ్‌ను అతిగా ఆశ్రయించారు. ఇలాగే ఎన్నో పథకాలు. 80సీని ప్రోత్సహిస్తూ ఇరవై పైచిలుకు పథకాలను ప్రవేశపెట్టారు. లిమిట్‌ని పెంచుతూ, 10 సంవత్సరాల పాటు రూ.1,50,000 గరిష్ట పరిమితిగా ఉంచారు. ప్రతి సంవత్సరం ఆ రూ.1,50,000 పరిమితి పెరుగుతుందని అందరూ ఎదురుచూస్తూ వచ్చారు. కానీ నిరాశే. ఎటువంటి మార్పూ లేదు. కనీసం ద్రవ్యోల్బణానికి అనుగుణంగా కూడా మార్పులు తేలేదు. ఇది. అన్యాయమే. అలాగే ఉద్యోగస్తులకు ప్రత్యేకంగా ఇచ్చే వెసులుబాటైన స్టాండర్డ్ డిడక్షన్ మినహాయింపులో పెంపుదల.. రద్దు.. పునరుద్ధరణ .. పెంపుదల ఇలా మార్పులు తెచ్చారు. ఈ మినహాయింపుని అలాగే కొనసాగిస్తూ ద్రవ్యోల్బణానికి అనుగుణంగా మారిస్తే బాగుండేది. ఇలాంటివి ఎన్నో మినహాయింపులు ఉన్నాయి.ఇదీ చదవండి: ఆర్బిట్రేజ్ ఫండ్స్‌తో మెరుగైన రాబడులుపాతకాలం నాటి అంకెలు.. ఆంక్షలు.. వీటిని ఏమీ మార్చకపోవడాన్ని ‘పాలసీ’ అని సరిపెట్టుకోలేము. ప్రభుత్వపు అనిశ్చితి వైఖరి ఇది అనే చెప్పాలి. గత నెలలో ట్రంప్ గెలుపు, తీసుకురాబోయే విప్లవాత్మక మార్పులు, వాటి తీవ్ర ప్రభావం మన ప్రజల మీద ఉంటుంది అని తెలిసినా స్పష్టత లేదు. అలాంటి పరిస్థితుల్లో వచ్చింది మన సీతమ్మగారి పద్దు. ఒక ప్రశ్న మాత్రం మారలేదు. అదేమిటంటే.. ఏది బెటర్? పాత విధానమా లేక కొత్త విధానమా? అయితే, నిస్సందేహంగా ప్రభుత్వ జోరు, హోరు, వైఖరి, ధోరణి అంతా కొత్త విధానం వైపే మొగ్గు చూపుతోంది. ‘పొమ్మనలేక పొగబెట్టినట్లు’ పాత విధానాన్ని ప్రోత్సహించలేదు. అది ఉంటుందా అని అడిగితే కొనసాగిస్తున్నాం అని అన్నారు ఆర్థిక మంత్రి. అయితే, కొన్ని తేడాలు, సలహాలు, సూచనలను తెలుసుకోవాలి. అవేమిటంటే..భారీగా మినహాయింపు పొందాలనుకునే వారికి పాతది మంచిది. వినియోగం వైపు మొగ్గు చూపించే వారికి కొత్త విధానం ఆకర్షణీయంగా ఉంటుంది. నిలకడగా, నిర్దిష్టంగా, నిశ్చింతగా ఆలోచించే వారికి పాతదే బెటరేమో? స్వతంత్రంగా వ్యవహరించాలి. సులువుగా ఉండాలి. అనువుగా ఉండాలి. కమిట్మెంట్ వద్దనే వారికి కొత్త విధానం బెటరు. మీ ఆదాయాన్ని లెక్కించండి. కంపల్సరీ సేవింగ్స్‌ని పరిగణనలోకి తీసుకుని ఆలోచించండి. ఇప్పుడు మార్కెట్లో ఎన్నో రెడీమేడ్ కాల్క్యులేటర్స్ ఉన్నాయి. అప్పుడు సరైన విధానాన్ని ఎంచుకోండి. కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య ట్యాక్సేషన్ నిపుణులు -
బంగారం లాభాలపై పన్ను ఎంత?
గోల్డ్ ఫండ్స్ లేదా ఈటీఎఫ్‌లలో పెట్టుబడులపై ఏ మేరకు పన్ను ఎలా విధిస్తారు? – గిరిరాజ్మీరు ఏ తరహా బంగారం సాధనంలో ఇన్వెస్ట్ చేశారన్న అంశంపైనే పన్ను ఆధారపడి ఉంటుంది. గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్‌వోఎఫ్)లో పెట్టుబడులు పెట్టినట్టయితే.. వాటిని రెండేళ్ల పాటు కొనసాగించిన తర్వాత విక్రయిస్తే అప్పుడు దీర్ఘకాల మూలధన లాభాల పన్ను కిందకు వస్తుంది. లాభంపై 12.5 శాతం పన్ను చెల్లించాలి. రెండేళ్లలోపు విక్రయిస్తే వాటిని స్వల్పకాల మూలధన లాభాల పన్ను కింద పరిగణిస్తారు. ఈ మొత్తం వార్షిక ఆదాయానికి కలిపి, నిబంధనల మేరకు పన్ను చెల్లిస్తే సరిపోతుంది. గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ అన్నవి గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు పెడుతుంటాయి. ఇవి మ్యూచువల్ ఫండ్స్ కనుక స్వల్ప మొత్తం నుంచి సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అదే గోల్డ్ ఈటీఎఫ్‌లు అయితే ఇవి స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ట్రేడ్ అవుతుంటాయి. ఏడాది తర్వాత పెట్టుబడులు విక్రయిస్తే వచ్చే లాభంపై 12.5 శాతం పన్ను పడుతుంది. ఏడాదిలోపు విక్రయించగా వచ్చిన లాభం ఇన్వెస్టర్ వార్షిక ఆదాయానికి కలుస్తుంది. గోల్డ్ ఈటీఎఫ్‌లలో ఎక్స్పెన్స్ రేషియో (ఫండ్స్ సంస్థ వసూలు చేసే చార్జీ) తక్కువగా ఉంటుంది. వ్యయాల పరంగా చౌక. కాకపోతే వీటిల్లో ఇన్వెస్ట్ చేసేందుకు డీమ్యాట్, డ్రేడింగ్ అకౌంట్ అవసరం అవుతాయి. గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్‌లో అయితే డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలు అవసరం లేకుండానే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో రాబడులపై ఆర్బీఐ వడ్డీ రేట్ల ప్రభావం ఉంటుందా? – ఇస్మాయిల్ ఆర్బీఐ రెపో రేటును 0.25 శాతం (25 బేసిస్ పాయింట్లు) తగ్గించడంతో 6.25 శాతానికి దిగొచ్చింది. దీనికి డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఎలా స్పందిస్తాయో అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యం. వడ్డీ రేట్లు తగ్గినప్పుడు డెట్ మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని బాండ్లు (అధిక కూపన్ రేటుతో ఉన్నవి) మరింత విలువను సంతరించుకుంటాయి. ఎందుకంటే కొత్తగా జారీ చేసే బాండ్లతో పోల్చినప్పుడు అంతకుముందు కొనుగోలు చేసినవి ఎక్కువ వడ్డీ రేటును ఆఫర్ చేస్తాయి. ఫలితంగా ఆయా బాండ్ల ధరలు పెరుగుతాయి. దీంతో సంబంధిత డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఎన్ఏవీ కూడా ఆ మేరకు లాభపడుతుంది. వడ్డీ రేట్ల క్షీణత ప్రభావం లాంగ్ డ్యురేషన్ ఫండ్స్‌పై ఎక్కువగా ఉంటుంది. ఇదీ చదవండి: ఇవి రీచార్జ్ చేసుకుంటే ఫ్రీగా జియో హాట్స్టార్అధిక రేటు బాండ్లలో చేసిన పెట్టుబడులతో లాంగ్ టర్మ్ డెట్ ఫండ్స్ ఎక్కువ లాభపడతాయి. దీనికి వ్యతిరేకంగా వడ్డీ రేట్లు పెరిగే క్రమంలో లాంగ్ డ్యురేషన్ ఫండ్స్‌పై ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కొత్తగా జారీ చేసే బాండ్లు అధిక రేటును ఆఫర్ చేస్తుంటాయి. దీంతో అప్పటికే ఫండ్స్ పోర్ట్‌ఫోలియోలో ఉన్న బాండ్లపై రేటు తక్కువగా ఉండడంతో అవి ఆకర్షణీయత కోల్పోతాయి. దీంతో ఆయా బాండ్ల ధరలు పడిపోతాయి. దీని ఫలితంగా వాటి ఎన్ఏవీ కూడా క్షీణిస్తుంది. ఈ ధరల ఆధారిత ప్రయోజనానికి అదనంగా.. డెట్ ఫండ్స్‌కు వాటి నిర్వహణలోని బాండ్ల రూపంలో వడ్డీ ఆదాయం కూడా వస్తుంటుంది. వడ్డీ రేట్లలో మార్పులు చోటుచేసుకున్నప్పుడు డెట్ ఫండ్స్ తిరిగి చేసే పెట్టుబడులపై ఆ మేరకు ప్రభావం ఉంటుంది. ఇవన్నీ ఆయా ఫండ్స్‌లో పెట్టుబడులపై రాబడులను ప్రభావితం చేస్తుంటాయి. డెట్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లు ఈ అంశాలపై అవగాహన కలిగి ఉండాలి.- ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
గృహ రుణం.. దిగొస్తుంది భారం!
కొండెక్కి కూర్చున్న రుణ రేటును కిందికి దింపే దిశగా ఆర్బీఐ తొలి అడుగు వేసింది. రెపో రేటును పావు శాతం తగ్గించి రుణ గ్రహీతలకు తీపి కబురందించింది. చూడ్డానికి స్వల్ప మొత్తమే అయినా.. గృహ రుణ గ్రహీతలకు లక్షల్లో మిగలనున్నాయి. తమ వంతు కృషిని కొంచెం జోడిస్తే మరింత ఆదా చేసుకోవచ్చు. రుణానికి త్వరగా గుడ్‌బై చెప్పొచ్చు. తాజా రేటు తగ్గింపుతో మిగిలేదెంత? దీనికి అదనంగా మిగుల్చుకునేందుకు అందుబాటులో ఉన్న ఆప్షన్లు ఏవి? ఈ వివరాలను అందించే కథనమే ఇది. వడ్డీ భారం తగ్గేది ఇలా.. ఏడాది క్రితం 50 లక్షల గృహ రుణాన్ని 9 శాతం వడ్డీ రేటుపై 20 ఏళ్ల కాల వ్యవధి కోసం తీసుకున్నారని అనుకుందాం. ఈఎంఐని ఇంతకుముందు మాదిరే కొనసాగించేట్టు అయితే.. పావు శాతం తగ్గింపు, అర శాతం రేటు తగ్గింపుతో ఎంత ప్రయోజనం లభిస్తుందో చూద్దాం. (టేబుల్ 2) ప్రభావం ఏ మేరకు? 25 బేసిస్ పాయింట్లు (0.25 శాతం) తగ్గింపు చిన్న మొత్తమే అయినా దీర్ఘకాలంలో చెప్పుకోతగ్గ మొత్తం ఆదా కానుంది. నెలవారీ చెల్లించే ఈఎంఐ ఇంతకుముందు మాదిరే కొనసాగించుకుంటూ వెళితే, పావు శాతం రేటు తగ్గింపు వల్ల రుణం త్వరగా తీరిపోతుంది. ఒకవేళ రెపో రేటు తగ్గింపును ఈఎంఐలో సర్దుబాటు చేసుకుంటే.. అప్పుడు నెలవారీ చెల్లించే ఈఎంఐ తగ్గుతుంది. రుణ కాల వ్యవధి ఇంతకుముందే మాదిరే కొనసాగుతుంది. ఈఎంఐ తగ్గించడం లేదంటే అదే ఈఎంఐ కొనసాగించి, రుణ కాల వ్యవధి త్వరగా ముగించడం.. ఈ రెండు ఆప్షన్లను బ్యాంక్‌లు కల్పిస్తాయి. రుణ గ్రహీత తనకు అనుకూలమైన ఆప్షన్ ఎంపిక చేసుకోవచ్చు. ఉదాహరణకు 20 ఏళ్ల కాలానికి రూ.30 లక్షల గృహ రుణాన్ని 9 శాతం రేటుపై తీసుకున్నారని అనుకుందాం. సవరణ తర్వాత 8.75 శాతం తగ్గుతుంది. దీంతో రూ.26,992 ఈఎంఐ కాస్తా రూ.26,551కు దిగొస్తుంది. ఈఎంఐలో రూ.480 (1.8 శాతం) మిగులుతుంది. (టేబుల్ 1)అమలుకు ఎంత సమయం?బ్యాంక్‌లు 2019 అక్టోబర్ నుంచి అన్ని ఫ్లోటింగ్ రేటు రిటైల్ రుణాలను (గృహ రుణాలు సహా) ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్‌తో అనుసంధానించాయి. చాలా బ్యాంక్‌లు రెపో రేటునే ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్‌గా అనుసరిస్తున్నాయి. కనుక రెపో రేటులో మార్పులు రుణాలపై వేగంగా ప్రతిఫలించనున్నాయి. బ్యాంక్‌లు వడ్డీ రేట్లను ప్రతి త్రైమాసికానికి ఒకసారి సమీక్షించాలని ఆర్బీఐ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఎంసీఎల్ఆర్ ఆధారిత రుణా లు, దీనికంటే ముందున్న బేస్ రేటు ఆధారిత రుణాలపై రేటు తగ్గింపు అమల్లోకి రావడానికి 3 నెలల నుంచి 6 నెలల సమయం తీసుకోవచ్చు. ‘‘రె పో లింక్డ్ రుణాలపై ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు వేగంగా అమల్లోకి వస్తుంది. కొత్తగా రుణాలు తీసుకునే వారికీ ఈ మేరకు తక్కువ రేటుపై రు ణాలు లభిస్తాయి. ఇప్పటికే తీసుకున్న రుణాలపై రే టు తగ్గింపు అన్నది సమీక్షించే తేదీపైనే ఆధారపడి ఉంటుంది. అప్పటి వరకు ప్రస్తుతం మాదిరే రుణాలకు చెల్లింపులు కొనసాగించాలి’’ అని పైసాబజార్ సీఈవో, సహ వ్యవస్థాపకుడు నవీన్ కుక్రెజా తెలిపారు.కొత్తగా రుణం తీసుకునే వారికీ ఊరట ఈ ఏడాది ఆర్బీఐ మరో 25–50 బేసిస్ పాయింట్ల వరకు రెపో రేటును తగ్గించొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. అర శాతం రేటు తగ్గడం వల్ల మిగిలే ప్రయోజనం ఎంతన్నది పైనున్న టేబుల్–2లో గమనించొచ్చు. ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణం డేటాపైనే భవిష్యత్తు రేట్ల తగ్గింపు ఆధారపడి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ‘‘మరో 50–75 బేసిస్ పాయింట్ల తగ్గింపు అన్నది ద్రవ్యోల్బణం స్థిరత్వం, అంతర్జాతీయ ద్రవ్య పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది’’ అని పీఎల్ క్యాపిటల్ (ప్రభుదాస్ లీలాధర్) ఇనిస్టిట్యూషనల్ రీసెర్చ్ ఎకనామిస్ట్ అర్హ మోగ్రా అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది మరో 50 బేసిస్ పాయింట్ల తగ్గింపును అంచనా వేస్తున్నట్టు ట్రస్ట్ మ్యూచువల్ ఫండ్ సీఈవో సందీప్ బగ్లా తెలిపారు. తక్కువ రేటు రుణానికి మారిపోవడమే ఆర్బీఐ భవిష్యత్తులోనూ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలున్నాయి. ఎంసీఎల్ఆర్ విధానంలో ఉన్నవారికి ఈ రేటు తగ్గింపు ప్రయోజనం బదిలీ ఆలస్యంగా లభిస్తుంది. కనుక ఇప్పటికే ఎంసీఎల్ఆర్ ఆధారిత లేదా దీనికంటే ముందున్న బేస్ రేటు విధానంలో గృహ రుణాలు తీసుకున్నవారు రీఫైనాన్సింగ్ (వేరొక సంస్థకు మారిపోవడం) ఆప్షన్‌ను పరిశీలించొచ్చు. ప్రముఖ బ్యాంక్‌లు రెపో నుంచి ఆఫర్ చేస్తున్నాయి. గృహ రుణ కాల వ్యవధి ఇంకా దీర్ఘకాలం పాటు ఉంటే గనుక తక్కువ రేటుపై ఆఫర్ చేసే బ్యాంక్‌కు బదిలీ చేసుకోవడాన్ని పరిశీలించొచ్చు. దీని ద్వారా పెద్ద మొత్తమే ఆదా చేసుకోవచ్చు. లేదంటే ఇప్పటికే తీసుకున్న రుణాన్ని అదే బ్యాంక్ పరిధిలో రెపో రేటు విధానంలోకి మార్చి, రేటు తగ్గించాలని కూడా కోరొచ్చు. అన్ని బ్యాంక్‌లు కాకపోయినా కొన్ని బ్యాంక్‌లు ఇందుకు అనుమతించొచ్చు. రెపో ఆధారిత గృహ రుణ గ్రహీతలు సైతం మరింత తక్కువ రేటును ఆఫర్ చేస్తున్న బ్యాంక్/ఎన్బీఎఫ్సీకి మారిపోవడం ద్వారా వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చని బ్యాంక్ బజార్ సీఈవో ఆదిల్ శెట్టి సూచించారు. 0.35–0.50 శాతం రేటు తక్కువ ఉన్నా కానీ, బదిలీని పరిశీలించొచ్చన్నారు. పన్ను ఆదాతో కలిపితే ఆదా ఎక్కువే ‘‘రూ.25 లక్షల స్థూల ఆదాయం కలిగిన వ్యక్తి రూ.50 లక్షల గృహ రుణం తీసుకుని (20 ఏళ్ల కాలం, 9 శాతం రేటు) 2025 మార్చి నాటికి 12 ఈఎంఐలు చెల్లించినట్టయితే.. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.1.37 లక్షలను ఆదా చేసుకోవచ్చు. అంటే నెలవారీగా రూ.11,461. గృహ రుణం రేటును పావు శాతం తగ్గించడం, అధిక శ్లాబుల్లోని వారికి బడ్జెట్లో ప్రకటించిన పన్ను రాయితీలతో ఈ మొత్తం మిగలనుంది’’అని బ్యాంక్ బజార్ ఆదిల్ శెట్టి వివరించారు. ఎప్పుడు తీసుకున్నారు..? గృహ రుణాన్ని ఐదేళ్ల క్రితం తీసుకున్న వారితో పోల్చితే ఏడాది క్రితం తీసుకున్న వారికి .. తాజా రేటు తగ్గింపుతో మిగులు ఎక్కువగా లభిస్తుంది. ఉదాహరణ: రూ.75 లక్షల రుణాన్ని 20 ఏళ్లకు (240 నెలలు) 9 శాతం రేటుపై తీసుకున్నారు. దీనికి చెల్లించాల్సిన నెలవారీ ఈఎంఐ రూ.67,479. ఇలా 20 ఏళ్ల కాలలో మొత్తం చెల్లించాల్సింది రూ.1.62 కోట్లు. ఇందులో వడ్డీ రూ.87 లక్షలు. ఇప్పుడు రుణంపై వడ్డీ రేటు 9 శాతం నుంచి 8.75 శాతానికి దిగొచ్చింది. దీంతో గృహ రుణం తీసుకుని ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు, నాలుగేళ్లు, ఐదేళ్లు పూర్తయిన వారు.. ఇంతకుముందు మాదిరిగా అదే ఈఎంఐని చెల్లిస్తూ వెళితే మిగిలిన కాలంలో ఎంత మిగులుతుంది, ఎంత తొందరగా రుణం ముగుస్తుందో టేబుల్లో చూడొచ్చు. పాక్షిక చెల్లింపుతో ఇంకా ఆదాగృహ రుణ చెల్లింపుల భారం తగ్గించుకునేందుకు అందుబాటులోని మార్గాల్లో పాక్షిక చెల్లింపులు ఒకటి. ఏటా ఆదాయం ఎంతో కొంత పెరుగుతుంటుంది. కనుక గృహ రుణ ఈఎంఐని ఏటా 5 శాతం పెంచి చెల్లిస్తూ వెళ్లాలి. దీని ఫలితం ఎలా ఉంటుందో అర్థం చేసుకునేందుకు చిన్న ఉదాహరణ చూద్దాం. రూ.75 లక్షల రుణాన్ని 9 శాతం రేటుపై 25 ఏళ్ల కాలానికి తీసుకున్నారు. దీనిపై నెలవారీ రూ.62,940 ఈఎంఐగా చెల్లిస్తున్నారు. ఇలా చెల్లించినట్టయితే కాల వ్యవధి పూర్తయ్యే నాటికి చెల్లించే మొత్తం రూ.1.89 కోట్లు. ఇందులో వడ్డీయే రూ.1.14 కోట్లు. ఇప్పుడు ఈఎంఐని ఏటా 5 శాతం పెంచి చెల్లించడం వల్ల 25 ఏళ్లకు బదులు 13 ఏళ్లకే రుణం తీరిపోతుంది. అసలు, వడ్డీ కలిపి చెల్లించే మొత్తం కూడా రూ.1.37 కోట్లకు తగ్గుతుంది. తద్వారా రూ.52 లక్షలు ఆదా అవుతాయి. ఇలా చేస్తే అధిక ప్రయోజనం.. → క్రెడిట్ స్కోరు పెంచుకునేందుకు ప్రయతి్నంచాలి. మెరుగైన క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి బ్యాంక్‌లు గృహ రుణాలను 0.25 శాతం తక్కువకే ఇస్తుంటాయి. → గృహ రుణాన్ని వీలైనంత తక్కువ కాలానికి ఎంపిక చేసుకోవాలి. 20 ఏళ్ల కాలం మించకుండా చూసుకోవాలి. కొత్త పన్ను విధానంలో గృహ రుణంపై ఎలాంటి పన్ను ప్రయోజనాల్లేవు. → భవిష్యత్తులో రేట్లు తగ్గే అవకాశాలే ఎక్కువ. కనుక రెపో ఆధారిత రుణం తీసుకోవడమే మంచిది. → వీలైనంత అధిక డౌన్ పేమెంట్ ముందే సమకూర్చుకుని, రుణం మొత్తాన్ని తగ్గించుకోవాలి. → రుణ కాలవ్యవధి మరో 15 ఏళ్లు మిగిలి ఉంటే, ప్రస్తుత రుణ రేటు కంటే తక్కువ రేటుపై ఆఫర్ చేస్తున్న బ్యాంక్‌కు బదిలీ చేసుకోవడం వల్ల పెద్ద మొత్తం ఆదా అవుతుంది. → ఏటా వీలైనంత మేర ఈఎంఐ పెంచి చెల్లించడం వల్ల రుణాన్ని వేగంగా ముగించేయొచ్చు. బేరమాడడమే.. మెరుగైన క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి బ్యాంక్‌లు కొంత తక్కువ రేటును ఆఫర్ చేస్తుంటాయి. కనుక 760కు పైన క్రెడిట్ స్కోర్ ఉన్న వారు బ్యాంక్ అధికారితో సంప్రదించి రేటు తగ్గించుకోవడంలో సఫలం కావొచ్చు. ఇప్పటికే తీసుకున్న రుణంపై రేటు తగ్గించే విషయంలోనూ రుణ గ్రహీతల డిమాండ్‌ను అధికారులు అంగీకరించొచ్చు. లేదంటే మరొక బ్యాంక్‌కు రుణాన్ని బదిలీ చేసుకుంటామంటే దానికి బదులు రేటు తగ్గింపునకు వారు మొగ్గు చూపించొచ్చు. ముఖ్యంగా బ్యాంక్‌లకు బదులు ఎన్బీఎఫ్సీలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు తక్కువ రేటుపై రుణ బదిలీ చేసుకునే వారిని ప్రోత్సహిస్తుంటాయి. ఇందుకు కొంత ప్రాసెసింగ్ చార్జీలను భరించాల్సి రావచ్చు. ఆటో రుణాలపై తక్కువే రూ.10 లక్షల ఆటో రుణాన్ని ఐదేళ్ల కాలానికి 10 శాతం రేటుపై తీసుకుని రూ.21,247 ఈఎంఐ కింద చెల్లిస్తున్నారని అనుకుందాం. తగ్గింపు తర్వాత వడ్డీ రేటు 9.75 శాతానికి దిగొచ్చింది. ఇంతకుముందు మాదిరే రూ.21,247 ఈఎంఐ చెల్లిస్తూ వెళితే.. రుణం మూడు నెలల ముందుగా తీరిపోతుంది. వడ్డీ రూపంలో రూ.15,000 ఆదా అవుతుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
యూపీఐ లిమిట్ పెంచుకోండిలా..
భారతదేశంలో డిజిటల్ చెల్లింపులు ఎక్కువవుతున్నాయి. చాక్లెట్ దగ్గర నుంచి గోల్డ్ కొనుగోలు చేసే వరకు, చాలామంది ఆన్లైన్ చెల్లింపులకే మొగ్గు చూపుతున్నారు. అయితే యూపీఐ లిమిట్ ఉండటం వల్ల.. ఎంత కావాలంటే అంత లావాదేవీలు చేయడం సాధ్యం కాదు. దీనిని దృష్టిలో ఉంచుకుని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) UPI లావాదేవీ పరిమితి పెంచుకోవడానికి అవకాశం కల్పించింది.తన కస్టమర్ల అవసరాలను గుర్తించిన ఎస్బీఐ యూపీఐ పరిమితి 1,00,000 రూపాయలుగా నిర్ణయించింది. ఈ మొత్తాన్ని ఒకేసారి పంపవచ్చు, లేదా పదిసార్లుగా పంపవచ్చు. 10 కంటే ఎక్కువ సార్లు లావాదేవీలు జరపడానికి వీల్లేదు. లక్ష రూపాయల లావాదేవీలు పూర్తయిన 24 గంటల తరువాత మళ్ళీ ట్రాన్సక్షన్స్ కొనసాగించవచ్చు.నెలకు, సంవత్సరానికి సంబంధించిన పరిమితికి ఎస్బీఐ ఎటువంటి ఆంక్షలు విధించలేదు. అంటే రోజుకు (24 గంటలు) రూ. 1 లక్ష వరకు లావాదేవీలు చేసుకోవచ్చు. ఫోన్‌పే, గూగుల్ పే మొదలైన యూపీఐ యాప్‌లకు ఇదే నియమం వర్తిస్తుంది. అంటే ఏ యూపీఐ యాప్ నుంచి అయిన లక్ష రూపాయలు ట్రాన్సక్షన్ చేయవచ్చు.ఇదీ చదవండి: ఫిక్స్డ్ డిపాజిట్‌పై ఎక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంక్ ఏదంటే?యూపీఐ లిమిట్ ఎలా పెంచుకోవాలంటేఎస్బీఐ ఖాతాలో యూపీఏ లిమిట్ పెంచుకోవాలంటే.. ఎస్బీఐ యోనో యాప్ లేదా నెట్ బ్యాంకింగ్ కలిగి ఉండాలి. వీటి ద్వారా యూపీఐ లిమిట్ పెంచుకోవచ్చు.➤ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ లేదా యోనో యాప్ లాగిన్ అవ్వండి.➤'యూపీఐ ట్రాన్స్ఫర్' ఆప్షన్ మీద క్లిక్ చేయండి.➤'సెట్ యూపీఐ ట్రాన్సక్షన్ లిమిట్' కి వెళ్లండి.➤మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయండి.➤అప్పటికి మీకున్న యూపీఐ లిమిట్ చూసి, మీకు ఎంత కావాలనుకుంటే అంత లక్ష రూపాయలలోపు ఎంటర్ చేయండి.➤లిమిట్ లక్ష కంటే ఎక్కువ పెంచుకోలేము, కానీ తగ్గించుకోవచ్చు.➤కొత్త లిమిట్ ఎంటర్ చేసుకున్న తరువాత.. సబ్మిట్ మీద క్లిక్ చేయండి.➤ఓటీపీ వెరిఫికేషన్ పూర్తయిన తరువాత కొత్త లిమిట్ సెట్ అవుతుంది. -
పన్ను ఆదా.. భవిష్యత్తుకు పెట్టుబడి!
మనది పొదుపు సమాజం. మన తల్లిదండ్రులు, తాతలు ప్రతి రూపాయిని ఆచితూచి ఖర్చు చేసేవారు. భవిష్యత్ కోసం వీలైన ప్రతి రూపాయినీ ఆదా చేసేవారు. కానీ, నేటి తరం ఖర్చు చేయడాన్ని ఇష్టపడుతోంది. సౌకర్యాలు, సుఖాలు, ఆడంబరాలు, ఆనందం కోసం ఖర్చుకు వెనుకాడని ధోరణి పెరిగిపోతోంది. ‘ధనవంతుడు కావాలంటే పేదవారిగా బతకాలి’ అన్నది ఆర్థిక నిపుణులు చెప్పే సూక్తి. పేదవారిగా జీవించాలని చెప్పడం కాదు ఇందులోని అసలు అర్థం. ఆడంబరాలకు, అనవసర ఖర్చులకు పోకూడదన్న సూచన ఇందులో కనిపిస్తుంది. తాజా కేంద్ర బడ్జెట్లో ఆదాయపన్ను రాయితీలను గణనీయంగా పెంచేశారు విత్త మంత్రి. రూ.12.75 లక్షల వరకు కొత్త విధానంలో పన్ను లేకుండా వరాలు కురిపించారు. దీంతో వివిధ తరగతుల వారికి గరిష్టంగా రూ.లక్ష, అంతకుమించి పన్ను రూపంలో ఆదా కానుంది.ఇలా ఆదా అయ్యే మొత్తాన్ని ఖర్చు బకెట్లో వేసేసుకుని సంబరపడిపోకుండా.. పెట్టుబడులకూ కొంత కేటాయించుకోవాలన్నది నిపుణుల సూచన. తద్వారా భవిష్యత్ ఆర్థిక లక్ష్యాలకు మరింత బలం చేకూరుతుంది. త్వరగా ఆర్థిక స్వేచ్ఛను సొంతం చేసుకోగలరు. పన్ను భారం తప్పించుకునేందుకు కొత్త విధానంలోకి మారిపోయి.. ఇప్పటి వరకు పాత విధానంలో చేస్తున్న పన్ను ఆదా పెట్టుబడులకు మంగళం పాడే తప్పు అస్సలు చేయొద్దని సూచిస్తున్నారు. ఆదాయ స్థాయిలకు అనుగుణంగా కొత్త పన్ను విధానంలో ఆదా అయ్యే మొత్తం వేర్వేరుగా ఉంటుంది. ఏడాదికి రూ.12 లక్షలు సంపాదించే వారికి రూ.83,200, రూ.15 లక్షలు సంపాదించే వారికి రూ.32,500 వరకు తాజా ప్రతిపాదనలతో పన్ను ఆదా కానుంది. అలాగే, రూ.24 లక్షల సంపాదనాపరులకు రూ.1.14 లక్షలు, రూ.కోటి ఆదాయ వర్గాలకు రూ.1,25,840, రూ.5 కోట్ల ఆదాయం కలిగిన వారికి రూ.1.43 లక్షల వరకు పన్ను మిగులు లభించనుంది. ఈ కొత్త ప్రతిపాదనలు 2025–26 ఆర్థిక సంవత్సరం నుంచి అమలు కానున్నాయి. అంటే 2026–27 అసెస్మెంట్ సంవత్సరానికి ఇవి వర్తిస్తాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఇప్పటి వరకు అమల్లో ఉన్న రేట్లే వర్తిస్తాయి. పాత విధానంలో వివిధ సెక్షన్ల కింద పలు రకాల పెట్టుబడులతోపాటు, స్టాండర్డ్ డిడక్షన్ రూ.50 వేలతో కలుపుకుని రూ.8.50 లక్షల ఆదాయంపై పన్ను ఆదాకు అవకాశం ఉంది. పెట్టుబడులు ఆపొద్దు.. ప్రతి కుటుంబానికి ఆర్థిక ప్రణాళిక ఉండాలి. జీవితంలో అన్ని ముఖ్య అవసరాలను సాధించే మార్గసూచీగా ఇది ఉంటుంది. ఈ లక్ష్యాలకు పెట్టుబడులే ఆధారం. ఆదాయంలో కనీసం 30 శాతం అయినా పెట్టుబడులకు మళ్లించుకోవాలి. అయితే, జీవిత లక్ష్యాల దృష్టితో కాకుండా పన్ను ఆదా కోసమే పెట్టుబడులను ఆశ్రయించే వేతన జీవులు కూడా ఉన్నారు. ప్రజా భవిష్యనిధి (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్), ఐదేళ్ల పన్ను ఆదా ఎఫ్‌డీల్లో పెట్టుబడులు, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై సెక్షన్ 80సీ పరిధిలో (పాత పన్ను వ్యవస్థ) రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంది. దీనికి అదనంగా హెల్త్ ఇన్సూరెన్స్‌కు సెక్షన్ 80డీ పరిధిలో పన్ను మినహాయింపులు ఉన్నాయి. గృహ రుణం తీసుకుని అసలు చెల్లింపులను సెక్షన్ 80సీ పరిధిలో, వడ్డీ చెల్లింపులను సెక్షన్ 24 పరిధిలో చూపించుకోవచ్చు. కొత్త పన్ను వ్యవస్థ ఆకర్షణీయంగా ఉండడంతో, ఇంతకాలం పన్ను ఆదా దృష్టితో కొనసాగించిన ఈ పెట్టుబడులను నిలిపివేసే ప్రమాదం లేకపోలేదు. ఈ తప్పు అస్సలు చేయొద్దు. కొత్త పన్ను విధానం సూటిగా, సరళంగా ఉంటుంది. పన్నుల గందరగోళం వద్దనుకునే వారు కొత్త విధానాన్ని ఎంపిక చేసుకుంటే తప్పేమీ కాదు. కానీ, అదే సమయంలో పాత పన్ను విధానం ప్రోత్సహిస్తున్న ఆర్థిక క్రమశిక్షణ, పొదుపు, మదుపులను విస్మరించకుండా, వాటిని కొనసాగించడం ద్వారానే గరిష్ట ప్రయోజాన్ని పొందగలరు. పన్ను ఆదా కోసం ఉద్దేశించినవి కాకపోయినా, మెరుగైన ఇతర సాధనాల్లో అయి నా పెట్టుబడులు కొనసాగించుకో వాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈక్విటీ ఫండ్స్ ఈక్విటీ ఫండ్స్‌లో ఈఎల్ఎస్ఎస్ ఒక విభాగం. ఇందులో పెట్టుబడులపై మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. దీంతో ఇతర ఈక్విటీ ఫండ్స్ అంత అమ్మకాల ఒత్తిడి వీటిల్లో ఉండదు. కనుక స్థిరత్వం ఎక్కువ. మల్టీక్యాప్ (ఏ విభాగంలో అయినా ఇన్వెస్ట్ చేయగలదు) విధానంతో పెట్టుబడులు పెడుతుంటుంది. పదేళ్ల కాలంలో 12–18 శాతం మధ్య, ఐదేళ్లలో 13–27 శాతం మధ్య రాబడులు ఈ పథకాల్లో గమనించొచ్చు. కొత్త పన్ను విధానంలోకి మళ్లిన వారు ఈఎల్ఎస్ఎస్లోనే ఇన్వెస్ట్ చేయాలని లేదు. వీటికి ప్రత్యామ్నాయంగా లార్జ్ అండ్ మిడ్ క్యాప్, ఫ్లెక్సీక్యాప్, ఇండెక్స్ ఫండ్స్‌లో దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈఎల్ఎస్ఎస్, పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, బీమా పథకాలకు పన్ను ఆదాకు మించి ప్రయోజనాలను ఇచ్చే సామర్థ్యం ఉన్నట్టు సిరిల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ పార్ట్నర్ కునాల్ సవాని పేర్కొన్నారు. కొత్త విధానంలోకి వెళ్లినా కానీ, భవిష్యత్ కోసం ఉద్దేశించిన ఈ పెట్టుబడులను నిలిపివేయొద్దని సూచించారు. లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్ జీవిత బీమా (టర్మ్, ఎండోమెంట్) పాలసీల ప్రీమియం చెల్లింపులపై సెక్షన్ 80సీ కింద పాత వ్యవస్థలో పన్ను మిననహాయింపు ఉంది. వార్షిక ప్రీమియం మొత్తం కవరేజీలో (సమ్ అష్యూర్డ్/రక్షణ) 10 శాతం మించకపోతే, మెచ్యూరిటీ మొత్తంపైనా పన్ను లేదు. ఈ పన్ను ప్రయోజనం కోసం ఎండోమెంట్, టర్మ్ పాలసీలను కొందరు తీసుకుంటున్నారు. ఏ పన్ను విధానంలో ఉన్నారనే అంశంతో సంబంధం లేకుండా, కుటుంబానికి ఆర్థికంగా ఆధారమైన ప్రతి వ్యక్తీ తన పేరిట తగినంత బీమా కవరేజీతో అచ్చమైన టర్మ్ పాలసీ తీసుకోవాలన్నది నిపుణుల సూచన. తన వార్షిక ఆదాయానికి సుమారుగా 20 రెట్ల మేర సమ్ అష్యూర్డ్ ఉండేలా చూసుకోవాలి. దురదృష్టవశాత్తూ ఆర్జించే వ్యక్తి ప్రాణానికి ప్రమాదం వాటిల్లితే, వచ్చే బీమా పరిహారంతో అతనిపై ఆధారపడిన కుటుంబం సాఫీగా జీవించే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. నేడు జీవనశైలి వ్యాధులు పెరిగిపోయాయి. కనుక ప్రతి కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ రక్షణ ఉండేలా చూసుకోవడం తప్పనిసరి. ఇది కేవలం పన్ను ఆదా కోసం ఉద్దేశించిన సాధనం కానే కాదు. పెద్ద ప్రమాదం లేదా కరోనా వంటి విపత్తు పరిస్థితుల్లో ఆస్పత్రి పాలైతే, హెల్త్ కవరేజీ లేని పరిస్థితుల్లో అప్పటి వరకు కూడబెట్టినదంతా కరిగిపోయే ప్రమాదం ఎదురవుతుంది. అనారోగ్యంతో ఆస్పత్రి పాలు కావడం వల్ల ఆర్థికంగా సమస్యల్లోకి వెళ్లకూడదని కోరుకుంటే, హెల్త్ ఇన్సూరెన్స్‌ను తీసుకోవాలి. ఒక కుటుంబానికి ఎంత లేదన్నా రూ.10లక్షలు ఉండేలా చూసుకోవాలి. దీనిపై అదనపు కవరేజీని సూపర్ టాపప్ ప్లాన్ రూపంలో తీసుకోవచ్చు. ఉద్యోగం చేసే సంస్థ తరఫున గ్రూప్ హెల్త్ కవరేజీ ఉన్న వారు సైతం విడిగా తమ కుటుంబానికి ఒక హెల్త్ ప్లాన్ తీసుకోవాలి. ఎందుకంటే ఏదైనా కారణంతో కంపెనీని వీడినా, ఉద్యోగం మానేసినా కవరేజీ కొనసాగుతుంది.ఖర్చు కంటే పెట్టుబడి ముఖ్యం చాలా మంది తమ ఆదాయంలో ఖర్చులుపోను మిగులుంటే అప్పుడు పెట్టుబడులకు మళ్లిస్తుంటారు. కానీ, ముందు పెట్టుబడులకు కేటాయింపులు చేసిన తర్వాతే ఖర్చులకు వెళ్లాలన్నది నిపుణుల సూచన. కొత్త పన్ను వ్యవస్థలో మిగిలే నిధులను ఎన్పీఎస్ తదితర పెన్షన్ ప్లాన్లకు కేటాయించుకోవాలని సింఘానియా అండ్ కో పార్ట్నర్ బన్సాల్ సూచించారు. దీనివల్ల గణనీయమైన రిటైర్మెంట్ ఫండ్ ఏర్పడుతుందన్నారు. చాలా మంది రిటైర్మెంట్ లక్ష్యాన్ని పెద్దగా పట్టించుకోరు. 60 ఏళ్ల తర్వాత సంగతి కదా అని తేలికగా తీసుకుంటారు. కానీ, ఉద్యోగంలో చేరిన నాటి నుంచే రిటైర్మెంట్ తర్వాతి జీవితం కోసం పెట్టుబడి చేసుకుంటూ వెళ్లడం ద్వారా స్వల్ప మొత్తమే పెద్ద నిధిగా మారుతుందన్నది తెలుసుకోవాలి.కొత్త–పాత పన్ను వ్యవస్థలు ఏ విధానంలో కొనసాగాలన్నది తమ ఆదాయం ఆధారంగానే నిర్ణయించుకోవాలి. హెచ్ఆర్ఏ, గృహ రుణ ప్రయోజనాలు, ఎల్టీసీ, పీపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్, ఎన్పీఎస్ పెట్టుబడులతో రూ.8 లక్షలు, స్టాండర్డ్ డిడక్షన్‌తో రూ.50 వేలు మొత్తంగా రూ.8.50 లక్షల వరకు పాత పన్ను వ్యవస్థలో మినహాయింపులున్నాయి. వీటిని పూర్తిగా వినియోగించుకుంటే రూ.24 లక్షల నుంచి రూ.5 కోట్ల మధ్య ఆదాయం ఉన్న వారికి పాత వ్యవస్థ అనుకూలమని నిమిత్ కన్సల్టెన్సీ వ్యవస్థాపకుడు నితేష్ బుద్దదేవ్ తెలిపారు. ఒకవేళ తమ పెట్టుబడులు ఈ స్థాయిలో లేకపోతే కొత్త విధానాన్ని పరిశీలించొచ్చు. రూ.24 లక్షల్లోపు ఆదాయం ఉన్న వారికి కొత్త విధానమే అనుకూలం. ఎన్పీఎస్ రిటైర్మెంట్ ఫండ్ ఏర్పాటుకు అందుబాటులో ఉన్న మెరుగైన సాధనాల్లో ఎన్పీఎస్ ఒకటి. అతి తక్కువ నిర్వహణ చార్జీలతోపాటు, పెట్టుబడిపైనా, రాబడి ఉపసంహరణపైనా పన్ను ప్రయోజనాలున్నాయి. ఇందులో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేసి, ఆ మొత్తంపై సెక్షన్ 80సీసీఈ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. సెక్షన్ 80సీ గరిష్ట ప్రయోజనం కిందకే ఇది కూడా వర్తిస్తుంది. దీనికి అదనంగా సెక్షన్ 80సీసీడీ (1బి) కింద ఎన్పీఎస్ టైర్–1 ఖాతాలో మరో రూ.50,000 పెట్టుబడికి సైతం పన్ను మినహాయింపు ఉంది. ఈ సెక్షన్ కిందే ఎన్పీఎస్ వాత్సల్య పథకంలో పెట్టుబడికీ పన్ను ఆదా ప్రయోజనాన్ని 2025–26లో బడ్జెట్లో కల్పించారు. తమ పేరు మీద లేదా తమ కుమార్తె లేదా కుమారుల పేరిట ఎన్పీఎస్ వాత్సల్యలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సెక్షన్ 80సీసీడీ (1బి) కింద గరిష్ట ప్రయోజనం రూ.50వేలకు పరిమితం. 60 ఏళ్లు వచ్చిన తర్వాత ఈ పథకంలో సమకూరిన మొత్తం నిధి నుంచి 60 శాతాన్ని ఉపసంహరించుకోవచ్చు. దీనిపై ఎలాంటి పన్ను ఉండదు. మరో 40 శాతం మొత్తానికి పింఛను ఆదాయాన్నిచ్చే యాన్యుటీ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. కార్పొరేట్ కంపెనీ ఉద్యోగి ఎన్పీఎస్ ఖాతాలో చేసే జమలపైనా పాత విధానంలో పన్ను ప్రయోజనాలున్నాయి. సెక్షన్ 80సీసీడీ (2) కింద మూలవేతనం, డీఏ మొత్తంలో 10 శాతాన్ని ఉద్యోగి తరఫున యాజమాన్యం ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఆ మొత్తంపై మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఉద్యోగి తరఫున ప్రభుత్వమే జమ చేస్తుంటే అప్పుడు 14 శాతంపై పన్ను మినహాయింపు లభిస్తుంది. కొత్త పన్ను విధానంలోనూ సెక్షన్ 80సీసీడీ (2) కింద పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని కల్పించారు. కొత్త విధానంలో ఉద్యోగి తరఫున యాజమాన్యం ఎన్పీఎస్ టైర్–1లో జమ చేస్తే (మూలవేతనం, డీఏలో 10 శాతం / వచ్చే ఏప్రిల్ నుంచి 14 శాతం) ఆ మేరకు పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు.పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజనప్రజా భవిష్యనిధి (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన ప్రభుత్వ హామీతో కూడిన డెట్ పెట్టుబడి సాధనాలు. వీటిల్లో రిస్క్ సున్నా. ఈ రెండు సాధనాల్లో ఏటా చేసే పెట్టుబడులను పాత పన్ను వ్యవస్థలోని సెక్షన్ 80సీ పరిధిలో చూపించుకుని రూ.1.5 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు ప్రయోజనం పొందొచ్చు. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాల గడువు ముగిసిన తర్వాత చేతికి అందే మొత్తంపై పాత, కొత్త పన్ను వ్యవస్థల్లో పన్ను లేదు. పన్ను ప్రయోజనాలున్న ఈ మెరుగైన పథకాలు ప్రతి ఒక్కరి పోర్ట్‌ఫోలియోలో ఉండాల్సిందే. తమ మొత్తం పెట్టుబడుల్లో 30–40 శాతం ఈ సాధనాలకు కేటాయించుకుని, మిగిలిన మొత్తాన్ని ఈక్విటీ ఫండ్స్‌కు మళ్లించుకోవచ్చు. దీనివల్ల పెట్టుబడికి కొంత రక్షణతోపాటు దీర్ఘకాలంలో అధిక రాబడిని సొంతం చేసుకోగలరు. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాల్లో పెట్టుబడులకు వర్తించే వడ్డీ రేటు స్థిరంగా ఉండదు. ప్రతి మూడు నెలలకు ఒకసారి కేంద్ర ఆర్థిక శాఖ వీటి రేట్లను ప్రకటిస్తుంటుంది. పీపీఎఫ్‌లో ప్రస్తుతం 7.10 శాతం రేటు అమల్లో ఉంది. దీని కాల వ్యవధి 15 ఏళ్లు. అనంతరం మరో ఐదేళ్లు పొడిగించుకోవచ్చు. సుకన్య సమృద్ధి యోజన పథకంలో పెట్టుబడులపై ప్రస్తుతం 8.2 శాతం రేటు అమల్లో ఉంది. ఒక కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు కుమార్తెల పేరిట దీన్ని ప్రారంభించుకోవచ్చు. బాలికల వయసు 10 ఏళ్లు మించకూడదు. ఆలోపు వయసున్న వారి పేరుతో ఖాతా తెరిచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కుమార్తెలకు 21 ఏళ్లు నిండగానే పథకం ముగిసిపోతుంది. లేదా 18 ఏళ్లు నిండిన తర్వాత, 21 ఏళ్లు రాక ముందే వారికి వివాహం నిశ్చయమైతే అప్పుడు ఈ పథకం నుంచి వైదొలగొచ్చు. కొత్త పన్ను విధానంలో ఉన్న వారికీ పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాలు అనుకూలమేనని వేద్ జైన్ అండ్ అసోసియేట్స్ పార్ట్నర్ అంకిత్ జైన్ సూచించారు. ఎందుకంటే ఈ రెండు పథకాల్లో పెట్టుబడులపై పన్ను ప్రయోజనం కొత్త వ్యవస్థ కింద లేకపోయినా కానీ, వడ్డీ రాబడికి పన్ను మినహాయింపు ప్రయోజనం ఉన్నట్టు తెలిపారు. కుమార్తెల వివాహం, ఉన్నత విద్య కోసం సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్ పెట్టుబడులు ఎంతో ఉపయోగపడతాయి.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
గూగుల్ పేలో ఆటోపే.. సింపుల్‌గా క్యాన్సిల్ చేయండిలా
ఆన్లైన్ లావాదేవీలు వచ్చిన తరువాత.. దాదాపు చాలామంది గూగుల్ పే, ఫోన్ పే వంటివి విరివిగా ఉపయోగిస్తున్నారు. సబ్స్క్రిప్షన్లు, ఈఎంఐ వంటివి చెల్లించడానికి వీటినే వాడేస్తున్నారు. దీనికోసం గూగుల్ పేలోని 'ఆటోపే' (Autopay) సెట్ చేసుకుంటారు. ఇది ఆటోమాటిక్ చెల్లింపులకు ఉపయోగపడుతుంది. అయితే కొంతమంది ఆటోమాటిక్‌గా చెల్లించడానికి ఇష్టపడనప్పుడు 'ఆటోపే క్యాన్సిల్ చేసుకోవచ్చు.గూగుల్ పేలో ఆటోపే ఎలా నిలిపివేయాలంటే?➤గూగుల్ పే (Google Pay) యాప్ ఓపెన్ చేసిన తరువాత, ఎగువ భాగంలో కూడైవైపు కనిపించే మీ ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేయాలి.➤ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేసిన తరువాత ఆటోపే ఆప్షన్స్ కనిపించే వరకు కిందికి స్క్రోల్ చేయాలి.➤ఆటోపే ఆప్షన్ కనిపించిన తరువాత.. దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తరువాత లైవ్ ట్యాబ్ కింద యాక్టివ్ మ్యాండేట్ల జాబితా కనిపిస్తుంది. మీరు తీసివేయాలనుకుంటున్న ఆటోపే మ్యాండేట్‌పై క్లిక్ చేయండి.➤ఆటోపే క్యాన్సిల్ చేయాలనుకున్నప్పుడు.. క్యాన్సిల్ మీద క్లిక్ చేయాలి. ఆ తరువాత యూపీఐ పిన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ➤యూపీఐ ఎంటర్ చేయగానే ఆటోపే క్యాన్సిల్ అవుతుంది.మళ్ళీ ఆటోపే సెట్ చేసుకోవాలంటే?➤గూగుల్ పేలో మళ్ళీ ఆటోపే సెట్ చేసుకోవాలంటే.. మళ్ళీ యాప్ ఓపెన్ చేసి, ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేసి.. ఆటోపే ఆప్షన్స్ ఎంచుకోవాలి.➤ఉదాహరణకు నెట్‌ఫ్లిక్స్ కోసం ఆటోపే ఆదేశాన్ని సెటప్ చేసి, తరువాత దానిని రద్దు చేసి ఉంటే.. మీరు నెట్‌ఫ్లిక్స్‌లో చెల్లింపు పద్ధతిగా మీ యూపీఐ ఐడీని తిరిగి ఎంటర్ చేయాలి. ఆ తరువాత యధావిధిగా ఆటోపే యాక్టివేట్ అవుతుంది.ఇదీ చదవండి: పాలసీదారులకు ఎల్ఐసీ హెచ్చరికఆటోపే వల్ల ఉపయోగాలుబిజీ జీవితంలో అన్నింటిని గుర్తుపెట్టుకోవడం కొంత కష్టమైన పని. ఏదైనా చెల్లింపులు లేదా ఈఎంఐ వంటి చెల్లించడంలో ఆలస్యమైతే జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి జరిమానాల నుంచి తప్పించుకోవడానికి, సమయానికి చెల్లింపులు పూర్తి చేసుకోవడానికి ఆటోపే అనేది బెస్ట్ ఆప్షన్. -
హోమ్ లోన్ ఈఎంఐలు తగ్గుతాయ్..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. 6.50 శాతంగా ఉన్న రెపో రేటును 6.25 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తాజాగా ప్రకటించారు. దీని వలన వడ్డీ రేట్లు, ఈఎంఐలు తగ్గేందుకు ఆస్కారం కలిగింది.2019 అక్టోబర్ 1 తర్వాత మంజూరైన అన్ని రిటైల్ ఫ్లోటింగ్-రేట్ రుణాలు ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్‌తో అనుసంధానమై ఉంటాయి. చాలా సందర్భాలలో ఇదే రెపో రేటుగా ఉంటుంది. కాబట్టి రేటు తగ్గింపు గృహ రుణగ్రహీతలకు నేరుగా ప్రయోజనం చేకూరుస్తుంది. దేశంలోని గృహ రుణాలలో ఎక్కువ భాగం ఫ్లోటింగ్ వడ్డీ రేట్లను కలిగి ఉంటాయి. ఫలితంగా, వడ్డీ భారం, వాటి ఈఎంఐలు తగ్గుతాయి. దీంతో ఇంటి యజమానులకు ఉపశమనం కలిగిస్తుంది.దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత తొలిసారిగా ఆర్బీఐ రెపో రేటును తగ్గించింది. ఆర్బీఐ చివరిసారిగా 2020 మేలో రేట్లను తగ్గించింది. కోవిడ్-19 మహమ్మారి ప్రభావం నుండి ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి అప్పట్లో రెపో రేటును 4 శాతానికి తగ్గించింది. 2022 మే నుండి, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, సరఫరా గొలుసు అంతరాయాలు, ప్రపంచ ధరల పెరుగుదలను ఎదుర్కోవడానికి సెంట్రల్ బ్యాంక్ రెపో రేటును ఏడు సార్లు 6.5 శాతానికి పెంచింది.హోమ్ లోన్ కస్టమర్లకు భారీ ప్రయోజనాలుప్రస్తుత రేట్ల తగ్గింపు వల్ల హోమ్ లోన్ కస్టమర్లకు ఎంత మేర ప్రయోజనం కలుగుతుందో ఒక ఉదాహరణ ద్వారా ఇప్పుడు చూద్దాం.. ఒక సంవత్సరం క్రితం 9 శాతం వడ్డీ రేటు, 20 సంవత్సరాల కాలపరిమితి (240 నెలలు) తో రూ. 50 లక్షల గృహ రుణాన్ని తీసుకున్నట్లయితే.. నెలవారీ ఈఎంఐ సుమారు రూ. 44,986 ఉంటుంది. రుణ కాలంలో చెల్లించే అసలు, వడ్డీ మొత్తం కలిపి రూ. 58 లక్షలు అవుతుంది.ఇప్పుడు 25 బేసిస్ పాయింట్ల రేటు తగ్గింపుతో గృహ రుణ వడ్డీ రేటు 9 శాతం నుండి 8.75 శాతానికి తగ్గుతుంది. ఫలితంగా అసలు, వడ్డీ మొత్తం చెల్లింపు సుమారు రూ. 53.6 లక్షలకు తగ్గుతుంది. దీని వలన రూ. 4.4 లక్షలు ఆదా అవుతుంది. అలాగే రుణ కాలపరిమితి 230 నెలలకు తగ్గుతుంది. దీని వలన రుణాన్ని 10 నెలల ముందుగానే తిరిగి చెల్లించవచ్చు. -
పాలసీదారులకు ఎల్ఐసీ హెచ్చరిక
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ.. సైబర్ మోసాలు, సైబర్ నేరగాళ్లు విపరీతంగా పెరిగిపోతున్నారు. ఫేక్ యాప్స్, ఫేక్ మెసేజ్‌లతో ప్రజలను దోచేస్తున్నారు. ఇలాంటి మోసాల భారిన పడకుండా ఉండేందుకు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటోంది.ఇందులో భాగంగానే మొబైల్ ఫోన్లలో కాలర్ ట్యూన్ ద్వారా హెచ్చరిస్తోంది. తాజాగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) తన పాలసీదారులకు, కస్టమర్లకు హెచ్చరిక నోటీసు జారీ చేసింది.''లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పేరుతో మోసపూరిత మొబైల్ అప్లికేషన్లు చెలామణి అవుతున్నాయని మా దృష్టికి వచ్చింది" అని పేర్కొంటూ ఎల్ఐసీ పరిస్థితిని స్పష్టం చేసింది. ఫేక్ యాప్స్ నమ్మితే.. మోసపోతారని సంస్థ వెల్లడించింది. అంతే కాకుండా మీ వ్యక్తిగత సమాచారం.. ఆర్థిక లావాదేవీలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని చెప్పింది.పాలసీదారులు, కస్టమర్లు జాగ్రత్తగా ఉండాలి. మీ లావాదేవీలు అధికారిక మార్గాల ద్వారా మాత్రమే పూర్తయ్యేలా చూసుకోవాలని ఎల్ఐసీ పేర్కొంది. సేవల కోసం అధికారిక వెబ్సైట్ లేదా డిజిటల్ యాప్ వంటి వాటితో పాటు వారి వెబ్సైట్లో జాబితా చేసిన.. ఇతర చెల్లింపు గేట్వేలను మాత్రమే ఉపయోగించాలి. ఇతర ఫేక్ యాప్స్ ఉపయోగించి చెల్లింపు చేస్తే.. దానికి సంస్థ బాధ్యత వహించదని స్పష్టం చేసింది.1956లో ప్రారంభమైన ఎల్ఐసీ.. ప్రభుత్వ మద్దతుతో కూడిన కార్పొరేషన్ సంస్థ. ఇది రక్షణ, పొదుపు, పెట్టుబడి కోసం అందించే పాలసీలతో సహా విస్తృత శ్రేణి జీవిత బీమా అందిస్తుంది. అకాల మరణం లేదా వైకల్యం సంభవించినప్పుడు వ్యక్తులు & కుటుంబాలకు ఆర్థిక భద్రత, మద్దతును అందించడం మాత్రమే కాకుండా దీర్ఘకాలికంగా పొదుపు, సంపద సృష్టిని ప్రోత్సహించడం ఎల్ఐసీ ప్రధాన ఉద్దేశ్యం.ఇదీ చదవండి: మీ కూతురి బంగారు భవిష్యత్తు కోసం: ఇవి బెస్ట్ స్కీమ్స్..ప్రస్తుతం ఎల్ఐసీ.. ఏజెంట్లు, శాఖలు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లతో పెద్ద నెట్వర్క్ కలిగి ఉంది. ఇది భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన.. విస్తృతంగా గుర్తింపు పొందిన ఆర్థిక సంస్థలలో ఒకటిగా నిలిచింది. ఇందులో చాలామంది పెట్టుబడులు లేదా ఇన్సూరెన్స్ వంటివి చేశారు.Public caution notice for our policyholders and customers#LIC #CautionNotice pic.twitter.com/GEyLcxdGGK— LIC India Forever (@LICIndiaForever) February 4, 2025 -
ఖర్చు.. పొదుపు.. మీ దారెటు?
మారుతున్న కాలానికి అనుగుణంగా వినియోగదారుల ఖర్చు చేసే సామర్థ్యాలు అధికమవుతున్నాయి. దానికితోడు ఇటీవల కేంద్ర బడ్జెట్ 2025-26లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సామాన్యుడి చేతిలో మరింత ఆదాయం ఉంచేందుకు ఆదాయ పన్ను శ్లాబులను సవరించడం, రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం వినియోగదారులకు సంతోషం కలిగించే అంశమే అయినా ఖర్చు విషయంలో ఆచితూచి వ్యవహరించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.పెరుగుతున్న కొనుగోళ్లు..గత దశాబ్దంలో చాలా కుటుంబాల డిస్పోజబుల్ ఆదాయం(ఖర్చులుపోను మిగిలే మొత్తం) గణనీయంగా పెరిగింది. ఆర్థిక వృద్ధి, సాంకేతిక పరిజ్ఞానంలో పురోగతి, నిరంతరం విస్తరిస్తున్న వస్తువులు, సేవలతో వినియోగదారులు తమ జీవితాలను మెరుగుపరిచుకునేలా కొనుగోళ్లు చేస్తున్నారు. మునుపటి కంటే ఈ కొనుగోళ్లు పెరుగుతున్నాయి. రుణ సౌకర్యాలు, ఆన్లైన్ మార్కెట్ వాటా హెచ్చవుతుంది. సామాన్యుడి ఖర్చులు కూడా అదే రీతిలో పెరుగుతున్నాయి.ఖర్చు పెంచేలా..కొనుగోలుదారుల ఖర్చు చేసే శక్తిని పెంచడంలో ఆర్థిక సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాలు, తనఖా అవకాశాలు వినియోగదారులకు పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేయడానికి తోడ్పడుతున్నాయి. ఒకింత వారి భవిష్యత్తులో పెట్టుబడి పెట్టడానికి మార్గాలను అందిస్తున్నాయి. తిరిగి చెల్లించే మార్గాల సంగతి అటుంచితే సులభంగా డబ్బు సమకూరడంతో ఆఫర్లపై ఆకర్షణ, వ్యయం పెరగడానికి, రిటైల్ రంగం అభివృద్ధికి దారితీసింది.పొదుపు చేసేలా..ఆర్థిక సంస్థలు, వ్యక్తులు అప్పు ఇస్తున్నారు కదా అని పూర్తిగా వీటికి బానిసైతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సులభమైన రుణ సౌలభ్యం వల్ల శక్తికి మించి ఖర్చు చేయాలనే ప్రలోభాలు కలిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు. పెరుగుతున్న ఆదాయాలు, కేంద్ర ప్రకటిస్తున్న పన్నుల మినహాయింపుతో సమకూరుతున్న డబ్బును వృథా ఖర్చులకు కాకుండా, పెట్టుబడికి, పొదుపునకు ఉపయోగించాలని సూచిస్తున్నారు. వినియోగదారులు డబ్బు విషయంలో తర్కంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రధాన అవసరాలకే ప్రాధాన్యత ఇవ్వాలి. పొదుపు చేయడం, పెట్టుబడి పెట్టడం అలవాటు చేసుకోవాలి. -
డిజిటల్ ప్రపంచంలో.. సంపద ఇలా భద్రం..
డిజిటల్ టెక్నాలజీ వినియోగం వేగవంతం కావడంతో కమ్యూనికేషన్, వ్యాపారాల నుంచి హెల్త్‌కేర్, వినోదం వరకు మన జీవితాలన్నింటిలో చాలా మార్పులు వస్తున్నాయి. కృత్రిమ మేథ, మెషిన్ లెర్ణింగ్ మొదలైనవి డేటా విశ్లేషణ, ఆటోమేషన్ వంటి అంశాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తున్నాయి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అప్లికేషన్స్ సౌకర్యవంతంగా ఉంటున్నాయి. రోబోటిక్స్, ఆటోమేషన్‌లాంటివి తయారీ, లాజిస్టిక్స్, వ్యవసాయం లాంటి రంగాల్లో పెను మార్పులు తెస్తున్నాయి. ఇవన్నీ సౌకర్యవంతంగా ఉంటున్నప్పటికీ వీటి వినియోగం విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. పర్సనల్ ఫైనాన్స్‌కి సంబంధించి పోర్ట్‌ఫోలియోలను ఆన్లైన్లో ట్రాకింగ్ చేయడం నుంచి పెట్టుబడుల వరకు అన్నీ కూడా ఫోన్ ద్వారానే చేసే వీలుంటోంది. అయితే, ఈ సౌకర్యం వెనుక మన డిజిటల్ భద్రతకు ముప్పులు కూడా పొంచి ఉంటున్నాయి. ఇన్వెస్టర్ల విషయానికొస్తే తమ పాస్వర్డ్లు లేదా యాప్‌లను సురక్షితంగా ఉంచుకోవడం ఒకెత్తైతే, ఏళ్లతరబడి ఆర్థిక ప్రణాళికలను సైబర్ నేరగాళ్ల నుంచి కాపాడుకోవడం మరో ఎత్తుగా ఉంటోంది. సైబర్ నేరగాళ్లు కేవలం పెద్ద వ్యాపారులు, సంపన్నులనే కాదు.. చిన్న చిన్న ఇన్వెస్టర్లను కూడా టార్గెట్ చేసుకుంటున్నారు. ఫిషింగ్, ర్యాన్సమ్వేర్లాంటివి ప్రయోగిస్తున్నారు. ఫిషింగ్ సంగతి తీసుకుంటే, ఆర్థిక సంస్థలు లేదా అడ్వైజర్ల నుంచి వచి్చనట్లుగా కనిపించేలా ఈమెయిల్స్, మెసేజీల్లాంటివి పంపిస్తారు. మిమ్మల్ని మాయ చేసి పాస్వర్డ్ల్లాంటి వ్యక్తిగత వివరాలు సేకరిస్తారు. ఆ తర్వాత మీ ప్రమేయం లేకుండానే మీ ఖాతాల్లోనుంచి విత్‌డ్రా చేసుకోవడం, ట్రేడింగ్ చేయడంలాంటివి చేసి ఖాతాలను కొల్లగొడతారు. ఇక ఐడెంటిటీ థెఫ్ట్ కేసుల్లో మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి, మీ పేరు మీద రుణాలు తీసుకోవడం, మీ ఖాతాలను ఖాళీ చేయడంలాంటివి జరుగుతుంటాయి. ర్యాన్సమ్వేర్ దాడులు మరింత అధునాతనంగా ఉంటాయి. సైబర్ నేరగాళ్లు మీ ఖాతాలను స్తంభింపచేసి, తిరిగి మీ చేతికివ్వాలంటే డబ్బు కట్టాలంటూ బెదిరింపులకు దిగుతారు. మిమ్మల్ని నేరుగా టార్గెట్ చేయకపోయినా మీరు ఆధారపడే ఆర్థిక సేవలను లక్ష్యంగా చేసుకుని మీ లావాదేవీలకు అంతరాయం కలిగించవచ్చు. కొన్నిసార్లు క్రిమినల్స్ నేరుగా పెట్టుబడి ప్లాట్‌ఫాంలలోకి చొరబడి నిధులను దొంగిలించవచ్చు. తప్పుడు ట్రేడింగ్ చేసి నష్టపర్చవచ్చు. అలాగని ఇలాంటి పరిణామాల వల్ల డిజిటల్ సాధనాల మీద నమ్మకాన్ని కోల్పోనక్కర్లేదు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు ఇలాంటి సవాళ్లను అధిగమించవచ్చు. → మీ అకౌంట్లకు పటిష్టమైన పాస్‌వర్డ్‌లను వాడండి. తరచూ వాటిని అప్డేట్ చేస్తూ ఉండండి. పాస్‌వర్డ్‌లను భద్రపర్చుకునేందుకు ఒక పాస్ వర్డ్ మేనేజర్ వెబ్‌సైట్‌ను ఉపయోగించవచ్చు. → మల్టీ–ఫ్యాక్టర్ ఆథెంటికేషన్‌ను ఉపయోగించండి. వీలైన సందర్భాల్లో మీ ఫోన్‌కు వెరిఫికేషన్ కోడ్లు వచ్చేలా జాగ్రత్తలు తీసుకోండి. పర్సనల్ డివైజ్‌లను అన్‌లాక్ చేసేందుకు బయోమెట్రిక్స్‌ను ఎనేబుల్ చేయండి. → ఫిషింగ్, సోషల్ ఇంజినీరింగ్ దాడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. బ్యాంకులు, మ్యుచువల్ ఫండ్లు లేదా ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి వచి్చనట్లుగా అనిపించేలా మోసగాళ్లు ఈమెయిల్స్ లేదా మెసేజీలు పంపిస్తుంటారు. వ్యక్తిగత సమాచారాన్ని ఇచ్చేలా మిమ్మల్ని మభ్యపెట్టొచ్చు. అప్రమత్తత వహించండి. అనుమానం వస్తే వెంటనే ఆ సంస్థను అధికారిక మాధ్యమాల ద్వారా సంప్రదించండి. → డివైజ్‌లను భద్రంగా ఉంచుకోండి. విశ్వసనీయ ప్లాట్‌ఫాంలు, యాప్‌ల ద్వారానే ఆర్థిక లావాదేవీలు నిర్వహించండి. సాఫ్ట్వేర్, ఓఎస్‌లు, యాంటీవైరస్ ప్రోగ్రాంలను అప్డేటెడ్గా ఉంచండి. కీలకమైన డేటా చోరీ కాకుండా డివైజ్ ఎన్క్రిప్షన్ను ఎనేబుల్ చేయండి. డివైజ్‌ల స్క్రీన్‌ను లాక్ చేసి ఉంచండి. ఆటోలాక్ను ఎనేబుల్ చేయండి. సెషన్ హైజాక్ కాకుండా, ట్రాకింగ్‌ను, ఆటో–లాగిన్ రిసు్కలను నియంత్రించేందుకు బ్రౌజర్ నుంచి కుకీలను, హిస్టరీని తొలగించండి. → ఆర్థిక లావాదేవీల కోసం పబ్లిక్ వై–ఫైను వాడొద్దు. ప్రయాణాల్లో కీలకమైన అకౌంట్లు, ఆర్థిక సేవల ప్లాట్‌ఫాంలలోకి లాగిన్ అయ్యేందుకు సురక్షితమైన వీపీఎన్‌ను ఉపయోగించండి. → వ్యక్తిగత సమాచారాన్ని ఆన్లైన్లో షేర్ చేసుకోవడం తగ్గించుకోండి. మీ పుట్టిన రోజు లేదా ఆర్థిక వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోకండి. సైబర్ నేరగాళ్ల బారిన పడే రిసు్కలు ఉన్నాయి.→ బ్యాంకు ఖాతా స్టేట్మెంట్లు, లావాదేవీలను తరచూ పరిశీలించండి. అనధికారిక లావాదేవీలేవైనా కనిపిస్తే సత్వరం గుర్తించొచ్చు. → కీలకమైన డాక్యుమెంట్ల వంటి వాటిని సురక్షితమైన, ఆఫ్‌లైన్ లొకేషన్లలో బ్యాకప్ తీసుకోండి. రాన్సమ్వేర్ రిసు్కలను తగ్గించుకోవచ్చు. → సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త పద్ధతుల్లో మోసాలు చేస్తున్నారు. ఇలాంటి వాటి గురించి ఆర్థిక సంస్థలు తరచుగా అప్డేట్లు, టిప్‌లు ఇస్తున్నాయి. వాటిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, అప్డేట్గా ఉండాలి. -
గృహ రుణం.. స్మార్ట్‌గా తీర్చేద్దాం..!
రుణంతో సొంతింటి కలను కెరీర్ ఆరంభంలోనే నెరవేర్చుకుంటోంది నేటి తరం యువత. 25–30 ఏళ్ల కాలానికి రుణం తీసుకుని, క్రమం తప్పకుండా చెల్లించడం ఒక విధంగా పొదుపే. కానీ, అందరికీ అంత సుదీర్ఘకాలం పాటు రుణ వాయిదాలు చెల్లించే నగదు ప్రవాహ వెసులుబాటు ఉండకపోవచ్చు. వివాహం అనంతరం పెరిగిపోయిన ఖర్చులతో ఈఎంఐ చెల్లింపులు భారంగా మారొచ్చు. దీంతో త్వరగా రుణ భారం నుంచి బయటపడిపోవాలని అనిపిస్తుంటుంది. అయితే ఈ దిశగా ఆచరణ చాలా మందికి తోచదు. వ్యవస్థలో వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిలో ఉన్నాయి. కనుక గృహ రుణాన్ని నిర్ణీత కాలానికంటే ముందుగా తీర్చేయడం మంచి ఆలోచనే అవుతుంది. ఇందుకు ఎన్నో మార్గాలున్నాయి. ఈ దిశగా నిపుణులు ఏమంటున్నారో తెలియజేసే కథనమిది... ముంబైకి చెందిన నీరవ్ (35) 2015లో రూ.40 లక్షల గృహ రుణాన్ని 30 ఏళ్ల కాలానికి 8.5 శాతం వడ్డీ రేటుపై తీసుకున్నారు. నెలవారీ రూ.31,000 చొప్పున ఇంటి రుణానికి చెల్లిస్తున్నారు. దీంతో వేతనంలో సగానికి పైనే రుణ చెల్లింపులకు పోతోంది. రుణ ఖాతా వార్షిక నివేదికను ఒక్కసారి పరిశీలించగా, తొలి నాళ్లలో తాను చెల్లిస్తున్న ఈఎంఐలో అధిక భాగం వడ్డీ చెల్లింపులకే వెళుతున్నట్టు అర్థమైంది. దీంతో నిపుణుల సాయంతో ఐదేళ్లలోనే ఆ రుణాన్ని తీర్చివేశారు. నీరవ్ మాదిరే ప్రతి ఒక్కరూ తమకు వీలైన మార్గంలో గృహ రుణ భారాన్ని ముందుగానే వదిలించుకోవచ్చు. ఈఎంఐలో తొలి ఏడాది 90 శాతం వడ్డీ చెల్లింపులకు వెళుతుంది. ఏటా ఇది క్రమంగా తగ్గుతూ, అసలు వాటా పెరుగుతూ పోతుంది. ముఖ్యంగా 20–25 ఏళ్ల కాలానికి సంబంధించి గృహ రుణాల్లో మొదటి ఐదేళ్లలో వడ్డీ చెల్లింపులే ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు రూ.75 లక్షల గృహ రుణాన్ని 25 ఏళ్ల కాలానికి 8.5 శాతం వడ్డీ రేటుపై తీసుకున్నారని అనుకుందాం. అప్పుడు నెలవారీ ఈఎంఐ రూ.60,392 అవుతుంది. 25 ఏళ్లలో వడ్డీ రూపంలోనే రూ.1.06 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. అసలు రూ.75 లక్షలు కూడా కలిపితే మొత్తం రూ.1.81 కోట్లు అవుతుంది. అంటే తీసుకున్న మొత్తానికి రెట్టింపునకు పైగా వడ్డీ రూపంలో చెల్లించాలి. ఒకవేళ గృహ రుణంపై వడ్డీ రేటు 9.5 % గా ఉంటే అప్పుడు 25 ఏళ్లలో వడ్డీ రూపంలో 1.22 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. చాలా ఆదా చేసుకోవచ్చు.. గృహ రుణాన్ని కాల వ్యవధి చివర్లో కంటే మొదటి ఐదేళ్లలో తీర్చేయడం ఎంతో ప్రభావవంతంగా ఉంటుంది. ఎందుకంటే ఆరంభ సంవత్సరాల్లో ఈఎంఐలో వడ్డీ భాగమే ఎక్కువగా ఉంటుంది’’అని బ్యాంక్ బజార్ సీఈవో ఆదిల్ శెట్టి తెలిపారు. రూ.50 లక్షల రుణాన్ని 9 శాతం వడ్డీపై 20 ఏళ్ల కాలానికి తీసుకున్నారని అనుకుందాం. ఈ కాలంలో వడ్డీ రూపంలోనే రూ.58 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఏడాది పూర్తయిన వెంటనే రూ.5 లక్షల మొత్తాన్ని అదనంగా చెల్లించడం ద్వారా మొత్తం కాల వ్యవధిలో 17.6 లక్షల మేర వడ్డీని ఆదా చేసుకోవచ్చు. అంటే అప్పుడు నికరంగా రూ.40.4 లక్షలు చెల్లిస్తే సరిపోతుంది. అంతేకాదు 240 నెలల్లో తీరిపోవాల్సిన రుణ భారం, 190 నెలలకే ముగిసిపోతుంది. అంటే రుణాన్ని 50 నెలల ముందే ముగించేయొచ్చు. తొలి నాళ్లలో వడ్డీలకే సింహభాగం పోతుంది. దీంతో అసలు పెద్దగా తగ్గదు. ఇలా వడ్డీకి ఎక్కువ మొత్తం జమ అవుతున్న తొలి సంవత్సరాల్లో చేసే అదనపు చెల్లింపులతో అసలు భాగం తగ్గుతుంది. ఫలితంగా ఈఎంఐలో వడ్డీ భాగం తగ్గి, అసలు జమ వేగాన్ని అందుకుంటుంది.ముందుగా చెల్లిస్తే ఎంత ఆదా? రూ.50 లక్షల రుణం. కాల వ్యవధి 20 ఏళ్లు. వడ్డీ 9 శాతం. రూ.5 లక్షలను రుణం తీసుకున్న అనంతరం ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు, నాలుగేళ్లు, ఐదేళ్లు పూర్తి అయిన వెంటనే చెల్లించనట్టయితే, తద్వారా ఎంత మేర ఆదా అవుతుందో టేబుల్లో తెలుసుకోవచ్చు. ఈక్విటీలో పెట్టుబడులు గృహ రుణాన్ని ముందుగా వదిలించుకునేందుకు ఈక్విటీ పెట్టుబడుల మార్గాన్ని సైతం ఆశ్రయించొచ్చు. ఈక్విటీల్లో పదేళ్లకు పైన కాలంలో వార్షిక రాబడులు 12–15 శాతంగా ఉండొచ్చు. గృహ రుణంపై 9 శాతం వడ్డీయే పడుతుంది. కనుక ప్రతి నెలా గృహ రుణ ఈఎంఐ చెల్లిస్తూనే, ఈఎంఐలో 10–20 శాతం మేర ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాలి. ఐదేళ్లు ముగిసిన తర్వాత నుంచి అప్పటి వరకు ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి సమానంగా ఉపసంహరించుకుంటూ గృహ రుణ చెల్లింపులకు వినియోగించుకోవాలి. లేదా పదేళ్ల పాటు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత, మార్కెట్లు బుల్లిష్‌గా ఉన్న తరుణంలో ఆ మొత్తాన్ని ఉపసంహరించుకుని గృహ రుణానికి జమ చేసుకోవచ్చు. ఒక ఆరి్థక సంవత్సరంలో ఈక్విటీల్లో 1.25 లక్షల మొత్తంపై పన్ను లేదు. కనుక ఏడాదిలో రూ.1.25 లక్షల్లోపే వెనక్కి తీసుకోవడం ద్వారా పన్ను లేకుండా చూసుకోవచ్చు. పైన చెప్పుకున్న నీరవ్ ఉదాహరణను తీసుకుందాం. రూ.40 లక్షల రుణాన్ని 30 ఏళ్ల కాలానికి 8.50 శాతం రేటుపై తీసుకున్నారు. అప్పుడు నెలవారీ ఈఎంఐ రూ.31,000. మొత్తం కాల వ్యవధిలో సుమారు రూ.61 లక్షలు వడ్డీ పడుతోంది. ప్రతి నెలా ఈఎంఐలో 20 శాతానికి సమాన మొత్తం అంటే, 6,200 చొప్పున 12 శాతం రాబడిని ఇచ్చే ఈక్విటీ ఫండ్‌లో 30 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేసుకోవాలి. తద్వారా గృహ రుణం తీరిపోయే సమయానికి రూ. 62 లక్షలు సమకూరుతుంది. రుణంపై చెల్లించిన వడ్డీకి సమానంగా నిధి ఏర్పడినట్టు అవుతుంది. ఏటా 5 % లేదా ఒక ఈఎంఐ అసలులో ఏటా నిర్ణిత శాతాన్ని అదనంగా చెల్లించాలి. రూ.50 లక్షల రుణాన్ని 9 శాతం రేటుపై 20 ఏళ్లకు తీసుకుంటే నెలవారీ ఈఎంఐ రూ. 44,986 అవుతుంది. కేవలం వడ్డీ రూపంలోనే రూ. 58 లక్షలు చెల్లించాలి. ఏటా రుణ బకాయిలో 5% చొప్పున ఒకే విడత తీర్చుతూ వెళితే చెల్లించాల్సిన వడ్డీ రూ.29.8 లక్షలకు తగ్గిపోతుంది. దీంతో 240 నెలలకు బదులు 143 నెలల్లోనే రుణాన్ని ముగించేయొచ్చు. ఏటా ఒక ఈఎంఐ (రూ.44,986) చొప్పున అదనంగా చెల్లిస్తూ వెళితే మొత్తం చెల్లించాల్సిన వడ్డీ రూ.58 లక్షలకు బదులు రూ.45 లక్షలు అవుతుంది. రూ.13 లక్షల వడ్డీ ఆదా అవడంతోపాటు రుణం 45 నెలల ముందే తీరిపోతుంది. ఎన్నో మార్గాలు.. → ఉద్యోగులు అయితే వార్షిక బోనస్‌ను ముందస్తు రుణ చెల్లింపులకు వినియోగించుకోవచ్చు. → కొందరికి బోనస్‌లు రావు. కానీ వార్షికంగా ఎంతో కొంత వేతన పెంపు ఉంటుంది. పెరుగుతున్న వేతనం స్థాయిలోనే గృహ రుణం ఈఎంఐని పెంచుకుంటూ వెళ్లాలి. ఏడాదికి ఒక్క ఈఎంఐ అదనంగా చెల్లించినా చాలా మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చు. → స్వయం ఉపాధి, వ్యాపారాల్లోని వారు సైతం భిన్న సందర్భాల్లో వచ్చే అదనపు ఆదాయ వనరులను ఇందుకు వినియోగించుకోవచ్చు. → చాలా తక్కువ రాబడులు ఇచ్చే డెట్ పెట్టుబడులు ఉంటే వాటిని ఉపసంహరించుకుని గృహ రుణ చెల్లింపులకు మళ్లించుకోవచ్చు. కాకపోతే గృహ రుణం వడ్డీ రేటు కంటే, తక్కువ రాబడులు ఇస్తున్న పెట్టుబడులనే ఇందుకు పరిగణనలోకి తీసుకోవాలి. → ఈక్విటీ డివిడెండ్ రాబడులు ఉన్న వారు ఆ మొత్తాన్ని ఇందుకు వినియోగించుకోవచ్చు. → దీర్ఘకాల లక్ష్యాలైన రిటైర్మెంట్ (ఎన్పీఎస్), పిల్లల భవిష్యత్ విద్య (పీపీఎఫ్, ఈక్విటీ తదితర) కోసం ఉద్దేశించిన పెట్టుబడులను ఉపసంహరించుకోవద్దని నిపుణుల సూచన. → గృహ రుణం ముందుగా చెల్లించేస్తే ‘ఫోర్ క్లోజర్’ చార్జీలు విధించని బ్యాంక్‌ను ఎంపిక చేసుకోవాలి. → పదవీ కాలంలోనే గృహ రుణాన్ని ముగించేలా చూసుకోవాలని ఆదిల్ శెట్టి సూచన. హోమ్‌లోన్ ఓవర్‌డ్రాఫ్ట్ అకౌంట్... ఈ ఖాతా తెరవడం ద్వారా మిగులు నిధులను డిపాజిట్ చేసుకోవచ్చు. దీంతో రుణం అసలు వేగంగా తగ్గిపోతుంది. ‘‘ఓవర్‌డ్రాఫ్ట్ అకౌంట్లో మిగులు నిల్వలను కావాలనుకున్నప్పుడు జమ చేసుకోవచ్చు. ఈ విషయమై అధికారికంగా బ్యాంక్‌కు తెలియజేయక్కర్లేదు’’ అని ఆదిల్ శెట్టి వివరించారు. 20 20 60 ‘‘ఆదాయంలో 20 % పొదుపు చేసి పెట్టుబడులకు వినియోగించుకోవాలి. 20 శాతం రుణ ఈఎంఐలకి, మిగిలిన 60 శాతం జీవన అవసరాలకు వినియోగించుకోవాలి’’ అని ఎఫ్‌పీఎస్‌బీ ఇండియా (అమెరికాకు చెందిన స్టాండర్డ్ బోర్డు లిమిటెడ్ సబ్సిడరీ) సీఈవో కృష్ణ మిశ్రా సూచించారు. అంటే ఆదాయంలో గృహ రుణ ఈఎంఐ 20 శాతానికి పరిమితం చేసుకోవడం మంచి ఆలోచన అవుతుంది. జీవన అవసరాల్లో 10 శాతాన్ని ఆదా చేసి, ఆ మేరకు గృహ రుణ ముందస్తు చెల్లింపులకు కేటాయించుకోవచ్చు. అంటే ఆదాయంలో జీవన అవసరాలను 60 శాతానికి బదులు 50 శాతానికి పరిమితం చేసుకోవాలి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
రూ.13 లక్షలు ఆదాయం ఉంటే ట్యాక్స్ ఇలా..
కేంద్రబడ్జెట్ 2025-26లో నిర్మలా సీతారామన్ సామాన్యుడికి రూ.13 లక్షల వరకు ఆదాయపన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే చాలామందికి ఇది ఎలా వర్తిస్తుందో అనుమానాలున్నాయి. అయితే ఒక ఉదాహరణతో దీనిపై స్పష్టతకు వద్దాం. మీ వార్షిక వేతనం రూ.13 లక్షలనుకోండి. మీరు రిబేట్ పరిధిలోకి రారు. ఎందుకంటే మీ ఆదాయం ప్రభుత్వం ప్రకటించిన రూ.12 లక్షల కంటే ఎక్కువ ఉంది. మీ సంపాదన రూ.13 లక్షల నుంచి రూ.75వేలు స్టాండర్డ్ డిడక్షన్ తీసేయగా మిగిలిన రూ.12.25 లక్షలకు శ్లాబుల ప్రకారం పన్ను పడుతుంది.ఇందులో రూ.4 లక్షలవరకూ జీరో ట్యాక్స్‌రూ.4 –8 లక్షల ఆదాయానికి 5 శాతం.. అంటే 20వేలుమిగిలిన నాలుగు లక్షలు.. రూ.8–12 లక్షల ఆదాయానికి 10 శాతం అంటే 40 వేలుమిగిలిన 25 వేలపై 15 శాతం అంటే రూ.3,750గా లెక్కిస్తారు.మొత్తంగా రూ.4-8 లక్షలు- 5 శాతం ట్యాక్స్ రూ.20,000రూ.8-12 లక్షలు(మిగిలిన రూ.4 లక్షలనే పరిగణిస్తారు)-10 శాతం ట్యాక్స్ రూ.40,000రూ.12-16 లక్షలు(మిగిలిన రూ.25,000కు)- 15 శాతం ట్యాక్స్ రూ.3,750మొత్తం కలిపి రూ.13 లక్షలు ఆదాయం ఉంటే స్టాండర్డ్ డిడక్షన్స్ పోను మీరు చెల్లించాల్సిన ట్యాక్స్ రూ.63,750.ఇదీ చదవండి: స్టార్టప్‌లకు జోష్రూ.12.75 లక్షలకు ఒక్క రూపాయి మించినా..నిజానికి పన్ను మినహాయింపు పరిమితిని రూ.7 లక్షల నుంచి రూ.12 లక్షలవరకూ పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించటంతో చాలామంది తమకు రూ.15 లక్షల వేతనం ఉన్నట్లయితే కేవలం రూ.3 లక్షలపై పన్ను చెల్లిస్తే చాలుననే అపోహల్లో ఉన్నారు. వాస్తవానికి ఆర్థిక మంత్రి పెంచింది పన్ను మినహాయింపు పరిమితిని కాదు. పన్ను రిబేట్ పరిమితిని అని గుర్తుంచుకోవాలి.అంటే... 12 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు రిబేట్ పరిధిలోకి వస్తారు. కాబట్టి వారికి పన్ను ఉండదు. దీనికి ఎలాగూ స్టాండర్డ్ డిడక్షన్‌గా పేర్కొనే రూ.75వేలను కలుపుతారు. అంటే రూ.12.75 లక్షల వరకూ వార్షిక వేతనం ఉన్నవారు రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన పనిలేదు. దీనిప్రకారం చూసుకుంటే నెలకు రూ.1,06,250 వేతనం అన్నమాట. అయితే దీనికన్నా ఒక్క రూపాయి దాటినా వారు రిబేట్ పరిధిని దాటిపోతారు. కాబట్టి సహజంగా పన్ను శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. -
ఎన్పీఎస్ వాత్సల్యకూ పన్ను ఊరట
న్యూఢిల్లీ: చిన్నారుల రిటైర్మెంట్కు గణనీయమైన నిధిని సమకూర్చుకునే ఉద్దేశ్యంతో తీసుకొచ్చిన పీఎం వాత్సల్య ఎన్పీఎస్ పథకానికి తాజా బడ్జెట్లో రూ.50,000 పెట్టుబడులపై పన్ను ఆదా ప్రయోజనం కల్పించారు. తొలిసారిగా 2024–25 బడ్జెట్లో ఈ పథకాన్ని ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. మైనర్ల పేరిట తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఎన్పీఎస్ వాత్సల్య ఖాతా ప్రారంభించి ఇన్వెస్ట్ చేయవచ్చు. చిన్నారులు 18 ఏళ్లు నిండిన తర్వాత రెగ్యులర్ ఖాతా కింద మార్చుకుని, అప్పుడు వారు స్వయంగా ఇన్వెస్ట్ చేసుకోవడానికి వెసులుబాటు ఉంది. దీని కింద ఇప్పటికే 89,475 ఖాతాలు ప్రారంభమయ్యాయి. వీటి పరిధిలో రూ.62 కోట్ల పెట్టుబడులు సైతం సమకూరాయి. ఈ పథకానికి మరింత ఆదరణ కల్పించే ఉద్దేశ్యంతో తాజాగా పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని ఆర్థిక మంత్రి కల్పించారు. సాధారణ ఎన్పీఎస్ ఖాతాకు ఉన్నట్టుగానే ఎన్పీఎస్ వాత్సల్యకు ఒకే విధమైన పన్ను విధానాన్ని ప్రతిపాదిస్తున్నట్టు చెప్పారు. కాకపోతే చట్టం పరిధిలో ప్రస్తుతమున్న గరిష్ట ప్రయోజనాల పరిధిలోనే ఇది ఉంటుందన్నారు. సెక్షన్ 80 సీసీడీ(1బి) కింద సాధారణ ఎన్పీఎస్కు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50 వేల జమలపై పన్ను మినహాయింపు ప్రయోజనం ప్రస్తుతం పాత పన్ను విధానం కింద అమల్లో ఉంది. -
సామాన్యుడి జేబుకి చిల్లు!: రేపటి నుంచి కొత్త రూల్స్..
ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న 2025-26 బడ్జెట్‌తో అనేక మార్పులు జరగనున్నాయి. అవి మాత్రమే కాకుండా ప్రతి నెలా పలు విభాగాల్లో రూల్స్ మారుతూ ఉంటాయి. గ్యాస్ సిలిండర్ ధరలు, యూపీఐ లావాదేవీలు వంటివాటితో పాటు మారుతి సుజుకి కంపెనీ తన వాహనాల ధరలను కూడా పెంచనుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ కథనంలో చూసేద్దాం.ఎల్పీజీ సిలిండర్ ధరలుఎల్పీజీ సిలిండర్ ధరలు ప్రతి నెల 1వ తేదీన మారుతూ ఉంటాయి. చమురు మార్కెటింగ్ కంపెనీలు సిలిండర్ల ధరలను అప్డేట్ చేస్తూ ఉంటాయి. సిలిండర్ ధరలలో జరిగే మార్పులు నేరుగా ప్రజలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి రేపు (శనివారం) సిలిండర్ ధరలు పెరుగుతాయా? తగ్గుతాయా? అనే విషయం తెలియాల్సి ఉంది.యూపీఐ లావాదేవీలుఫిబ్రవరి 1వ తేదీన యూపీఐ నిబంధలనలకు సమందించిన కీలక మార్పులు రానున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నిర్దిష్ట UPI లావాదేవీలను బ్లాక్ చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇప్పటికే సర్క్యులర్ కూడా విడుదలైంది. కాబట్టి కొత్త రూల్స్ రేపటి నుంచే అమలులోకి రానున్నాయి.తాజా ఆదేశాల ప్రకారం ప్రత్యేక అక్షరాలను(స్పెషల్ క్యారెక్టర్లు) కలిగిన యూపీఐ ఐడీ (@, #, $, %, &, మొదలైనవి)ల ద్వారా చేసే లావాదేవీలను కేంద్ర వ్యవస్థ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికీ యూపీఐ ఐడీలో స్పెషల్ క్యారెక్టర్లు ఉన్న వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.కార్ల ధరలుదిగ్గజ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (MSIL), తన వాహన ధరలను గణనీయంగా పెంచనుంది. పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులు, నిర్వహణ ఖర్చులను పరిగణనలోకి తీసుకుని ధరలను పెంచనున్నట్లు.. పెరిగిన ధరలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. కంపెనీ ఆల్టో కే10, ఎస్ ప్రెస్సో, సెలెరియో, వ్యాగన్ ఆర్, స్విఫ్ట్, డిజైర్, బ్రెజ్జా, ఎర్టిగా, ఈకో, ఇగ్నిస్, బాలెనో, సియాజ్, ఎక్స్ఎల్6, ఫ్రాంక్స్, ఇన్విక్టో, జిమ్నీ, గ్రాండ్ విటారా మొదలైన కార్ల ధరలను పెంచనుంది.బ్యాంకింగ్ రూల్స్కోటక్ మహీంద్రా బ్యాంక్ తన సాధారణ సర్వీస్.. చార్జీలలో మార్పులు తీసుకురానుంది. ఈ మార్పుల గురించి తన వినియోగదారులకు తెలియజేసింది. కాబట్టి కొత్త నియమాలు ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఇందులో ఉచిత ఏటీఎమ్ లావాదేవీల పరిమితికి తగ్గించడం.. బ్యాంకింగ్ సేవలకు సంబంధించిన చార్జీలను పెంచడం వంటివి ఉన్నాయి.ఇదీ చదవండి: అయ్య బాబోయ్.. ఇక బంగారం కొనలేం!ఏటీఎఫ్ ధరలుఫిబ్రవరి 1 నుంచి విమాన ఇంధనం, ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరల్లో మార్పు జరిగే అవకాశం ఉంది. చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెలా మొదటి తేదీన విమాన ఇంధన ధరలను సవరిస్తాయి. కాబట్టి, ఫిబ్రవరి 1వ తేదీన ధరలలో మార్పు జరిగితే, అది నేరుగా విమాన ప్రయాణికులపై ప్రభావం చూపుతుంది. -
మహిళలకు భారీ వడ్డీ పథకం కొనసాగుతుందా?
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం (ఫిబ్రవరి 1) కేంద్ర బడ్జెట్ 2025-26ను (Union Budget 2025-26) సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నారు. పన్ను రేట్ల తగ్గింపు, పెంపు, సంబంధిత గడువులు, మినహాయింపు పరిమితులు, ప్రభుత్వ పథకాలు.. ఇలా అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. 2023 బడ్జెట్లో ప్రకటించిన మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ (Mahila Samman Savings Scheme)పైనా అటువంటి చర్చే సాగుతోంది.మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ అనేది మహిళలు, బాలికల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన వన్ టైమ్ పొదుపు పథకం. రెండేళ్ల కాల వ్యవధి ఉండే ఈ పథకం ప్రస్తుతం బ్యాంకులు రెండేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ రేటు కంటే ఎక్కువ వడ్డీ రేట్లను అందిస్తోంది. అయితే మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్‌కు ప్రభుత్వం ప్రకటించిన చివరి పెట్టుబడి తేదీ మార్చి 31 సమీపిస్తున్న నేపథ్యంలో రానున్న బడ్జెట్లో కేంద్రం నుండి దీనికి పొడిగింపు లభిస్తుందో లేదో చూడాలి.మహిళల ఆర్థిక చేరిక, సాధికారతను ప్రోత్సహించడంలో ముఖ్యమైన మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ పాత్ర పోషిస్తుందని వన్ ఫైనాన్స్‌లో మ్యూచువల్ ఫండ్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రజనీ తాడనే అన్నారు. ఈ పొదుపు పథకాన్ని పరిమిత అవకాశంగా ప్రవేశపెట్టారని, ఇది ఆకర్షణీయమైన 7.5 వడ్డీ రేటు అందిస్తున్నప్పటికీ ఎలాంటి పన్ను ప్రయోజనాలు ఉండవని చెప్పారు. "మహిళల కేంద్రీకృత విధానాలపై ప్రభుత్వ స్థిరమైన దృష్టిని దృష్టిలో పెట్టకుంటే ఈ పథకాన్ని పొడిగించవచ్చు లేదా ఇదే విధమైన ప్రత్యామ్నాయాన్ని ప్రవేశపెట్టవచ్చు" అని ఆయన ఎకనామిక్స్ టైమ్స్‌తో అన్నారు.మరోవైపు ఈక్విటీ పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్ల వైపు డిపాజిటర్ల దృష్టి మళ్లడంతో మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్‌కు పెద్దగా ఆదరణ లేదని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగించే అవకాశం లేదని వెల్త్ ట్రస్ట్ క్యాపిటల్ సర్వీసెస్ వ్యవస్థాపకురాలు, సీఈవో స్నేహ జైన్ అభిప్రాయపడుతున్నారు.రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఈ పథకాన్ని నిలిపివేయవచ్చని ఓ ప్రభుత్వ అధికారి గతంలో చెప్పినట్లుగా మనీకంట్రోల్ పేర్కొంది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్, సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్, సుకన్య సమృద్ధి యోజన వంటి చిన్న పొదుపు పథకాలు గతంలో బలమైన పనితీరును ప్రదర్శించాయని వివరించారు. అయితే వీటి ప్రభావం నేషనల్ స్మాల్ సేవింగ్స్ ఫండ్ (NSSF) పథకంపై పడినట్లు తెలుస్తోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకంలో రూ. 20,000 కోట్ల డిపాజిట్లు తగ్గిపోయాయి.7.5 శాతం వడ్డీ మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ పొడిగింపునకు సంబంధించి అనిశ్చితి ఉన్న నేపథ్యంలో ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నవారు మార్చి 31లోపు ఖాతా తెరవడం మంచిది. ఇందులో కనీస డిపాజిట్ రూ. 1,000 కాగా గరిష్టంగా రూ. 2 లక్షల వరకూ పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం 7.5 శాతం వడ్డీ వార్షిక వడ్డీ రేటుకు హామీ ఇస్తుంది. ఇది ఖాతా తెరిచిన తేదీ నుండి రెండు సంవత్సరాలకు మెచ్యూర్ అవుతుంది. సంవత్సరం తర్వాత అర్హత ఉన్న బ్యాలెన్స్‌లో 40 శాతం వరకు ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంది. -
యూపీఐకి క్రెడిట్ కార్డ్ లింక్.. లాభమా.. నష్టమా?
డిజిటల్ చెల్లింపులు విస్తృతమైన నేటి కాలంలో ఆన్లైన్ పేమెంట్స్ చేయడానికి క్రెడిట్ కార్డ్ అనేది శక్తివంతమైన ఆయుధం. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇది చెల్లింపులకు అనువుగా ఉండటమే కాకుండా అనేక రివార్డ్‌లు, క్యాష్‌బ్యాక్‌లను అందిస్తుంది.అయితే ఇదే సమయంలో కార్డ్ చెల్లింపుల కంటే యూపీఐ (UPI) చెల్లింపులు వేగంగా పెరుగుతున్నాయని గుర్తుంచుకోవడం ముఖ్యం. యూపీఐ ద్వారా చెల్లింపులు గతేడాది అక్టోబర్‌లో 2.34 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అంతకు ముందు ఏడాది కంటే 37 శాతం పెరినట్లు ఆర్బీఐ (RBI) తాజా డేటా తెలియజేస్తోంది.ఈనేపథ్యంలో క్రెడిట్ కార్డ్ సౌలభ్యాన్ని, యూపీఐ సేవల సౌకర్యాన్ని మిళితం చూస్తూ క్రెడిట్ లైన్ ఆన్ యూపీఐ అనే సర్వీస్ అందుబాటులో ఉంది. దీన్ని ఇప్పటికే కొంత మంది వినియోగిస్తున్నారు. అయితే దీని వల్ల లాభమా... నష్టమా? ప్రయోజనాలేంటి.. ప్రతికూలతలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడు తెలుసుకుందాం..ప్రయోజనాలుమామూలు యూపీఐ సర్వీస్ లాగా కాకుండా, వినియోగదారులు తమకు కావాల్సినప్పుడే క్రెడిట్ లైన్‌ను ఉపయోగించుకునేలా చేస్తుంది. సాధారణంగా యూపీఐ చెల్లింపు చేసిన ప్రతిసారి సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలో నగదు తరుగుతుంది. కానీ క్రెడిట్ కార్డ్ విషయంలో ఇది జరగదు.ప్రతి చిన్న ఖర్చుకు బ్యాంక్ ఖాతా ద్వారా చెల్లించినప్పుడు ఆ లావాదేవీకి బ్యాంక్ ఎంట్రీ జరుగుతుంది. అదే లావాదేవీ క్రెడిట్ కార్డ్ ద్వారా జరిగినప్పుడు, క్రెడిట్ కార్డ్‌కి చెల్లింపు మాత్రమే బ్యాంక్ స్టేట్మెంట్పై ప్రతిబింబిస్తుంది. తద్వారా బ్యాంక్ స్టేట్మెంట్ భారీగా ఉండే ఆస్కారం ఉండదు.సాధారణంగా చాలా మంది యూపీఐ వినియోగదారులు తమ ఉన్న క్రెడిట్ కార్డులను పెద్ద మొత్తంలో చేసే ఖర్చులకు మాత్రమే ఉపయోగిస్తారు. కాబట్టి వేర్వేరు ఖర్చుల కోసం వేర్వేరు మార్గాలను ఉపయోగించడం కంటే అన్ని చెల్లింపుల కోసం కేవలం ఒక మార్గాన్ని ఉపయోగించవచ్చు.నష్టాలుక్రెడిట్ లైన్ అందుబాటులో ఉన్నప్పుడు ఎక్కువగా ఖర్చు చేసే ధోరణి వినియోగదారులలో ఉంటుంది. డబ్బు తక్షణమే మీ బ్యాంక్‌కి వెళ్లనప్పుడు, మీరు మీ బడ్జెట్‌ను అధికంగా పెంచుతారు. కాబట్టి, చిన్న, పెద్ద ఖర్చులన్నింటినీ మీ క్రెడిట్ కార్డ్‌కి లింక్ చేయడం వల్ల అధిక ఖర్చులు జరిగే అవకాశం ఉంది.పెరిగిన టెక్నాలజీ కారణంగా చెల్లింపులు చాలా సౌకర్యవంతంగా మారాయి. అయితే ఏదైనా సాంకేతిక లోపం సంభవించినప్పుడు, పనులు నిలిచిపోవచ్చు. అందువల్ల, చెల్లింపులను వివిధ మార్గాల ద్వారా విస్తరించడం మంచిది.ప్రతి బ్యాంక్ కార్డ్ యూపీఐ యాక్టివేషన్‌ను అందించదు. కాబట్టి, మీరు ఒకే కార్డ్, ఒకే సర్వీస్‌కు కట్టుబడి ఉంటే కొన్ని క్యాష్‌బ్యాక్‌లు లేదా ప్రయోజనాలను పొందలేరు. -
బీమా రంగంపై ఆపోహలు.. వాస్తవాలు
లక్షలాది మంది పౌరులను, అనేక వ్యాపారాలను రక్షిస్తున్న బీమా పరిశ్రమ తరచూ విమర్శలను ఎదుర్కొంటుందని జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ ఛైర్మన్, బజాజ్ అలియన్జ్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ తపన్ సింఘాల్ తెలిపారు. చాలామంది బీమా కంపెనీలు కేవలం లాభాల కోసమేననే తప్పుడు అభిప్రాయంతో ఉన్నారని చెప్పారు. ఈ రంగంపై ఉన్న అపోహలు, వాస్తవాలపై ప్రజలకు అవగాహన ఉండాలని పేర్కొన్నారు. తపన్ సింఘాల్ బీమా రంగంలోని అంశాలను ప్రస్తావిస్తూ కొన్ని గణాంకాలను తెలియజేశారు. ఆయన తెలిపిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.ఐఆర్డీఏఐ వార్షిక నివేదిక ప్రకారం, గత ఏడాది జనరల్ ఇన్సూరెన్స్ పరిశ్రమ రూ.1.72 లక్షల కోట్ల విలువైన క్లెయిమ్‌లను పరిష్కరించింది. ఇందులో రూ.80,000 కోట్లకు పైగా ఆరోగ్య బీమాకు చెల్లించిందే. క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి 80% కంటే ఎక్కువే. తిరస్కరణకు గురయ్యే క్లెయిమ్‌ల్లో 20% తరచుగా మోసపూరితమైన లేదా ఆమోదయోగ్యం కాని విధంగా ఉంటున్నాయి. వైద్య ఖర్చుల కోసం బీమాపై ఆధారపడడం కంటే పొదుపు చేసి దాంతో వైద్య ఖర్చులు భరించవచ్చనే దోరణి కొందరిలో ఉంది. అయితే, నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం దేశంలో ప్రస్తుతం ఆరోగ్య బీమా ఉన్నా పాలసీదారులు సుమారు 60% ఆరోగ్యానికి ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదే బీమా లేకపోతే ఈ సంఖ్య 100%కు పెరుగుతుంది. ఏటా పెరుగుతున్న వైద్య ఖర్చుల వల్ల ఆరోగ్య సమస్యలున్న చాలా కుటుంబాలు పేదరికంలోని నెట్టివేయబడుతున్నాయి. ప్రస్తుతం దేశ జనాభాలో సుమారు 7% మంది ఆరోగ్య సంరక్షణ ఖర్చుల కారణంగా ఏటా పేదరికంలోకి జారుతున్నారు. అదే బీమా లేకపోతే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది.మోటార్ పరిశ్రమబీమా ఆధారిత ప్రమాద రక్షణ క్లెయిమ్ చెల్లింపులు సుమారు రూ.55,000 కోట్లు నిలిచిపోవడంతో మోటార్ బీమా విభాగం కుదేలవుతుంది. దాంతో ప్రమాదాల ఆర్థిక భారం పూర్తిగా వాహన యజమానులపై పడుతుంది. ఇది ఆర్థిక అస్థిరత పెరగడానికి, వాహన అమ్మకాలు తగ్గడానికి దారితీస్తుంది. మోటార్ థర్డ్ పార్టీ క్లెయిమ్‌లను కవర్ చేయడంలో బీమా సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయి. ఐఆర్డీఏఐ వార్షిక నివేదిక ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో మోటార్ బీమా విభాగంగా థర్డ్ పార్టీ క్లెయిమ్‌ల్లో రూ.27,000 కోట్లకు పైగా సెటిల్ చేశారు.సాంఘిక సంక్షేమ పథకాలుఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి-జన్ ఆరోగ్య యోజన (ఏబీ పీఎం-జేఏవై) కింద 2024 నవంబర్ 30 నాటికి దాదాపు 36 కోట్ల మంది లబ్ధిదారులను ధృవీకరించారు. ఈ ప్రభుత్వ పథకం సుమారు 55 కోట్ల మంది లబ్ధిదారులకు ఆసుపత్రిలో చేరడానికి ఏటా రూ.5 లక్షల ఆరోగ్య కవరేజీని అందిస్తుంది. బీమా పరిశ్రమ మద్దతు లేకుండా హైబ్రిడ్ నమూనా(ఇన్సూరెన్స్+నగదు చెల్లింపు)ను అవలంబించే రాష్ట్రాల్లో ఈ పథకం అంత ప్రభావవంతంగా ఉండదు. ఈ ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది.ప్రకృతి విపత్తులువరదలు, తుపాన్లు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు విపరీతమైన మానవ, ఆర్థిక నష్టాలను కలిగిస్తాయి. ఈ సమయాల్లో బీమా కీలకమైన రికవరీ మెకానిజంగా పనిచేస్తుంది. కేంద్ర ప్రభుత్వం 2021-22 నుంచి 2025-26 వరకు జాతీయ విపత్తు నివారణ నిధి (ఎన్డీఎంఎఫ్)కు రూ.13,693 కోట్లు, రాష్ట్ర విపత్తు నివారణ నిధికి (ఎస్డీఎంఎఫ్) రూ.32,030.60 కోట్లు కేటాయించింది. ప్రతి ప్రకృతి విపత్తు తర్వాత ప్రభుత్వం నష్టపరిహారం కోసం భారీగా ఖర్చు చేస్తుంది. మరింత పటిష్ఠమైన బీమా కార్యక్రమాలు అమల్లోకి వస్తే ఈ నిధులను అభివృద్ధి ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాలకు మళ్లించవచ్చు.వ్యవసాయంభారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వ్యవసాయం. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) వంటి పథకాలు గత ఎనిమిదేళ్లలో రూ.1.64 లక్షల కోట్ల క్లెయిమ్‌లను అందించాయి. ఈ చెల్లింపులు రైతులకు ఆర్థిక ఉపశమనం కలిగించాయి. రైతు ఆత్మహత్యలు తగ్గడానికి దోహదం చేశాయి. దేశ ఆహార భద్రతకు రైతులు తమ వంతు సహకారాన్ని అందించేందుకు బీమా దోహదపడుతుంది.రూ.1.73 లక్షల కోట్ల మోసపూరిత క్లెయిమ్లుమోసపూరిత క్లెయిమ్‌ల వల్ల బీమా పరిశ్రమకు ఏటా కోట్ల రూపాయలు నష్టం వాటిల్లుతుంది. ఈ సమస్యను నిత్యం ప్రత్యేక యంత్రాగాల ద్వారా పర్యవేక్షిస్తున్నా ఫ్రాడ్ క్లెయిమ్‌ల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత ఐదేళ్లలో మొత్తం బీమా పరిశ్రమలో సుమారు 3.01 లక్షల మోసపూరిత కేసులను గుర్తించారు. వీటి విలువ రూ.1.73 లక్షల కోట్లని తేలింది. భారతీయ జనరల్ ఇన్సూరెన్స్ పరిశ్రమ ఈ మోసాల వల్ల ఏటా సుమారు రూ.30,000 కోట్లు నష్టపోతున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి.అపోహలు వీడాలి..బీమా సంస్థలు భారీ లాభాలను ఆర్జిస్తున్నాయని కొందరి అభిప్రాయం. ఇవి కేవలం లాభాల కోసమే ఉన్నాయని చాలామంది అనుకుంటున్నారు. అయితే బీమా కంపెనీలకు లాభాలు వచ్చినా భవిష్యత్తులో క్లెయిమ్‌లకు భారీగానే చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు, జనరల్ ఇన్సూరెన్స్ పరిశ్రమ సగటు క్లెయిమ్ నిష్పత్తి 80 శాతం కంటే ఎక్కువే. కంపెనీల రాబడితో లెక్కిస్తే క్లెయిమ్ నిష్పత్తి 115% వద్ద ఉంది. అంటే ప్రీమియంల ద్వారా సమకూరిన ప్రతి రూ.100కు పరిశ్రమ రూ.115 చెల్లిస్తుంది. సరళంగా చెప్పాలంటే బీమా సంస్థలు క్లెయిమ్ చెల్లింపులు, నిర్వహణ ఖర్చులపై డబ్బును కోల్పోతున్నాయి.లక్షల మందికి ఉపాధిప్రత్యక్షంగా 10 లక్షల మందికి, పరోక్షంగా 50 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న బీమా పరిశ్రమ జీవనోపాధికి తోడ్పడుతోంది. ఈ పరిశ్రమలో లాభాపేక్ష లేదని చెప్పలేం. కానీ, అదే సమయంలో కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. బ్రోకర్లు, టీపీఏ(థర్డ్‌పార్టీ ఏజెంట్లు)లు, ఇన్సూరెన్స్ రంగంలోని నిపుణులు ఈ పరిశ్రమ విలువను పెంచుతూ ఆర్థిక, ఉపాధి వృద్ధికి మూలస్తంభంగా నిలుస్తున్నారు.ఇదీ చదవండి: భారత్‌లోకి స్టార్‌లింక్.. లైన్ క్లియర్..?వ్యవస్థను దిగజార్చకూడదు..బీమా కంపెనీలు లాభాలు సంపాదించినంత మాత్రాన అవి వినియోగదారులను మోసం చేస్తున్నాయనే అభిప్రాయాలుండడం సరైందికాదు. మోసపూరిత క్లెయిమ్‌లు చేస్తూ సంస్థలను, వ్యవస్థను దిగజార్చకూడదని నిపుణులు కోరుతున్నారు. ఈ పరిశ్రమపై అవగాహన ఉన్నవారు మరింత ఎక్కువ మందిని బీమా తీసుకునేలా ప్రోత్సహించాలని సూచిస్తున్నారు. -
ఇంటి అద్దె క్లెయిమ్ విధానంలో ఈ పొరపాట్లు వద్దు..
సాధారణంగా పన్ను క్లెయిమ్ చేసే విధానంలో ఎక్కువ మంది చేసే పొరపాట్లు కొన్ని కావాలని.. కొన్ని తెలియక చేసేవి ఉంటాయి. తప్పుడు క్లెయిమ్ చేసే వారికి ఆదాయపు పన్ను శాఖవారు నోటీసులు ఇస్తున్నారు. వివరాలు అడుగుతున్నారు. ‘మిమ్మల్ని ఇబ్బంది పెట్టం’ అని సీబీడీటీ వారు అంటున్నప్పటికీ మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి. ఈ కింద ఉదహరించిన కేసులన్నీ మీకు ఇబ్బంది కలిగించేవే. క్లెయిం రిజెక్షన్‌కు గురై పన్ను భారాన్ని పెంచేవి.. పెంచినవి కింద ఉన్నాయి. కాబట్టి తగిన జాగ్రత్త వహించండి. ఈ పొరపాట్లు చేయకపోవడమే మీ ప్లానింగ్‌కి కీలకంగా ఉంటుంది.కామేశ్వర్రావుగారు ఠంచనుగా ప్రతి నెలా రెంట్ పే చేస్తారు. బ్యాంకు అకౌంటులో ఖర్చు కనిపిస్తుంది. అయితే, ఓనర్ గారు ఇండియాలో లేరు. అమెరికాలో స్థిరనివాసం. ఆయన గారికి ఈ ఇంటికి వచ్చి చూసేటంత టైం లేదు.. ఓపికా లేదు. ఇద్దరు మంచివారే. ‘అవసరం లేదు’ అనుకున్నారు అగ్రిమెంటు గురించి. ఏ కాగితాలు లేవు. అగ్రిమెంటు లేదు. సంతకాలూ లేవు. దీంతో ఇంటద్దె అలవెన్సు క్లెయిమ్ చేయడానికి వీల్లేని పరిస్థితి.వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో మోతుబరి రైతు వామనరావుకు హైదరాబాద్‌లో లంకంత ఇల్లు ఉంది. దాన్ని అద్దెకిచ్చాడు. కానీ అగ్రిమెంటు రాయలేదు. బ్యాంకు చెల్లింపులు తీసుకోడు. అంతా నగదే. పిల్లల చదువుకని ఆ ఇంట్లోనే ఉంటున్నాడు విద్యాధర రావు. ఆయనకీ ఇంటద్దె అలవెన్స్ క్లెయమ్ చేయడానికి కాగితాలు లేవు.ముందు జాగ్రత్తగా అగ్రిమెంటు రాసుకున్నాడు వాసుదేవరావు. కానీ ఆస్తేమో ఓనరు పేరు మీద.. అగ్రిమెంటేమో భార్య వసుంధర పేరు మీద.. మ్యుటేషన్ జరగలేదు. దీంతో ఈ అగ్రిమెంటును కంపెనీవారు ఒప్పుకోలేదు.మావగారింట్లో బంటులా చేరి ఒంటెలా తయారయ్యాడు తాయార్రావు. మామగారు జరిగిపోయారు. అయినా అగ్రిమెంటు మీద తానే రెండు సంతకాలు పెట్టి, రశీదులు రాసి, పాన్ కార్డు వాడుతున్నాడు సదరు మంచి అల్లుడు.తప్పుడు సమాచారంతో అగ్రిమెంటు బనాయించాడు బాబూరావు. అసలు ఆ ఇల్లు లేదు. అద్దె లేదు.. ఓనరు లేడు .. వ్యవహారం లేదు. అద్దె మాత్రం ఏడాది మొత్తం మీద రూ.1,00,000 దాటకుండా మేనేజ్ చేస్తున్నాడు.అద్దె ఇంటి అగ్రిమెంట్లలో తప్పులు.. సమాచారం తప్పు.. తేదీలు తప్పు.. అమౌంటు తప్పు.. రెన్యువల్ జరగదు. బ్యాంకులో జమకి, వ్యవహారంలో మొత్తానికి పొంతనే లేదు. అన్నీ తేడానే. ఏ సమాచారంలో నిజమెంతో సరిపోలదు. పేమెంట్ చేసినట్లు ప్రూఫ్‌లు చూపించడం లేదు. ఇలా చేయడమూ తప్పే.కొడుకు ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇంట్లో తల్లిదండ్రులు ఉంటున్నారు. తండ్రి కొడుక్కి అద్దె ఇస్తున్నట్లు కాగితాలు సృష్టించారు. నిజానికి ఏ వ్యవహారం లేదు.ఇలాగే విదేశాల్లోని పిల్లల పేరు మీద ఆస్తులుంటాయి. అగ్రిమెంట్లు, తల్లిదండ్రుల పేరు మీద ఎడాపెడా ఎంటర్ అవుతున్నాయి. ప్రతి నెలా నిర్దిష్ట మొత్తం వారి అకౌంట్లలో పడుతోంది. అయినా వారు అకౌంట్లలో చూపించడం లేదు .. పోనీ పిల్లల అకౌంట్లలోనూ చూపించడం లేదు. ‘అక్కడ ఏమీ వద్దని’ ఆ పిల్లలు చెప్పడం.. వారి మాటను పెద్దలు జవదాటని వైనం. ఎంత రిస్కో చూడండి.హైదరాబాదులో సొంతిల్లు. అందులో ఉండటం.. అద్దె ఇచ్చినట్లు దొంగ రశీదులు ఇవ్వడం.. అమ్మ పేరు మీదో .. ఆలి పేరు మీదో దొంగ రశీదు.చిన్న చిన్న ఊళ్లలో ఎక్కువ అద్దె ఇస్తున్నట్లు దొంగ రశీదులు.సగం బ్యాంకు ద్వారా ఇవ్వడం, సగం నగదు ఇవ్వడం వల్ల బ్యాంకు వ్యవహారానికి మాత్రమే క్లెయిం చేసుకోగలరు.తనకెన్ని ఇళ్లు ఉన్నాయో తనకే తెలియదు ఒక ఓనరుకు. అంతా నగదు వసూళ్లే. ఎవరికీ రసీదు ఇవ్వరు. తన పాన్ కార్డు కాపీ ఇవ్వరు.ఇదీ చదవండి: మహిళకూ ఉండాలి టర్మ్ ఇన్సూరెన్స్ఇలా ఎందరో ఎన్నో పొరపాట్లు చేస్తున్నారు. ఏ పొరపాటు చేయకపోవడమే ప్లానింగ్‌లో ముఖ్యమైనది. భయపెట్టడమని కాదు. కానీ ఒక చేదు నిజం ఏమిటంటే దాదాపు 90,000 మంది అసెస్సీలతో రూ.వెయ్యి కోట్ల మినహాయింపును విత్‌డ్రా చేయించి మరీ వారితో పన్ను కట్టించారు. యజమానులు, సంస్థలు జాగ్రత్తగా ఉండాలని హితవు చెబుతూ అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది డిపార్టుమెంటు. మనమూ జాగ్రత్తపడదాం.- కే.సీ.హెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తికె.వి.ఎన్.లావణ్య, ట్యాక్సేషన్ నిపుణులు -
మహిళకూ ఉండాలి టర్మ్ ఇన్సూరెన్స్
భారతీయ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధిస్తున్నారు. ఆర్థికాంశాల్లో నిర్ణయాత్మక శక్తిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి కూడా టర్మ్ ఇన్సూరెన్స్(Term life insurance) ఆవశ్యకత పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ బీమా సాధనం గురించి తెలుసుకోవడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సాధారణంగా టర్మ్ ఇన్సూరెన్స్ అనేది నిర్దిష్ట ప్రీమియం చెల్లిస్తే, నిర్దిష్ట జీవిత బీమా కవరేజీని అందించే ప్యూర్ ప్రొటెక్షన్ పథకం. దురదృష్టవశాత్తు పాలసీదారు కన్నుమూసిన పక్షంలో సమ్ అష్యూర్డ్ మొత్తాన్ని వారి నామినీకి బీమా సంస్థ చెల్లిస్తుంది. మిగతా సాధనాలతో పోలిస్తే తక్కువ ప్రీమియంకే ఎక్కువ కవరేజీని అందించడం టర్మ్ ప్లాన్ల ప్రత్యేకత.ఉదాహరణకు 30 ఏళ్ల నేహా వార్షికంగా రూ.9,646 ప్రీమియంతో 30 ఏళ్ల వ్యవధికి రూ.1 కోటి సమ్ అష్యూర్డ్(Sum Assured)కి పాలసీ తీసుకున్నారనుకుందాం. ఒకవేళ దురదృష్టవశాత్తు నేహా మరణించిన పక్షంలో ఆమె నామినీకి రూ.1 కోటి బీమా మొత్తం లభిస్తుంది. ఇలా నేహా తీసుకున్న టర్మ్ పాలసీ అనేది ఆమె కుటుంబసభ్యులకు ఆర్థికంగా తోడ్పాటునిస్తుంది. అయితే, ఈ టర్మ్ పాలసీని ఎంత ముందుగా తీసుకుంటే అంత మంచిది. ఉదాహరణకు నేహా గనుక టర్మ్ పాలసీని తీసుకోవడం ఒక పదేళ్లు వాయిదా వేశారనుకోండి .. అప్పుడు అదే లైఫ్ కవరేజీకి ఆమె ఏకంగా రూ.15,900 వార్షిక ప్రీమియం కట్టాల్సి వస్తుంది. పైగా పాలసీ వ్యవధి కూడా 20 ఏళ్లకే పరిమితమవుతుంది. మొత్తం మీద ఆమె తక్కువ కాలవ్యవధికి వర్తించే పాలసీకి ఏటా రూ.6,000 చొప్పున కట్టాల్సి వస్తుంది. అదే ముందుగా తీసుకుని ఉంటే, ఈ అదనపు మొత్తాన్ని మరో చోట ఇన్వెస్ట్ చేసుకోవడానికి వీలవుతుంది. యాడ్–ఆన్‌తో అదనపు ప్రయోజనాలు ఉంటాయి. వ్యక్తిగత జీవిత పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా మరికాస్త ప్రీమియం చెల్లించడం ద్వారా మరిన్ని అదనపు ప్రయోజనాలను అందించేందుకు యాడ్–ఆన్ రైడర్లు ఉపయోగపడగలవు. క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్ఇది ఇటు ఆరోగ్యం అటు జీవిత బీమా ప్రయోజనాలను కూడా అందిస్తుంది. కొన్ని జీవిత బీమా కంపెనీలు 32 తీవ్ర అనారోగ్యాలకు కూడా కవరేజీని అందిస్తున్నాయి. మహిళలకు ప్రత్యేకమైన బ్రెస్ట్, సరి్వకల్, ఒవేరియన్ క్యాన్సర్లు, గుండె.. మెదడు.. కిడ్నీ సంబంధ సమస్యలు మొదలైనవి ఈ జాబితాలో ఉంటున్నాయి. 30 ఏళ్ల వయస్సు గల మహిళ, 30 ఏళ్ల కాలవ్యవధికి కేవలం నెలకు రూ. 977 చెల్లించడం ద్వారా రూ. 50 లక్షల వరకు ప్రయోజనాలను పొందేందుకు ఈ యాడ్–ఆన్‌ను తీసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా అనారోగ్యం ఉన్నట్లు తేలిందంటే, చికిత్స కోసం నిధుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా, బీమా సంస్థ ఏకమొత్తంగా చెల్లిస్తుంది. ప్రస్తుతం కీమోథెరపీ వ్యయం దాదాపు రూ. 25 లక్షల వరకు ఉంటోంది. ఇలా వైద్య చికిత్స వ్యయాలు గణనీయంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ యాడ్–ఆన్ ఎంతో ఉపయోగకరంగా ఉండగలదు.ప్రీమియం వెయివర్ఎప్పుడేం జరుగుతుందో ఊహించలేని విధంగా జీవితం ఉంటుంది. కాబట్టి పాలసీదారు ప్రమాదవశాత్తూ శాశ్వత వైకల్యానికి గురై ఆదాయాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడినప్పుడు ఈ యాడ్–ఆన్ బెనిఫిట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. చాలా మటుకు బీమా సంస్థలు అదనంగా తీసుకోకుండా, పాలసీ అంతర్గతంగానే ఈ ఫీచరును అందిస్తున్నాయి. ఒకవేళ మీరు తీసుకున్న పాలసీలో ఇది లేకపోతే, కొంత అదనపు ప్రీమియం చెల్లించైనా తీసుకోవడం శ్రేయస్కరం.యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల సంస్థ ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2023లో దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు 11.9 శాతం పెరిగాయి. ఈ నేపథ్యంలో ఈ యాడ్–ఆన్ ప్రయోజకరంగా ఉండగలదు. నెలకు కేవలం రూ.302 మేర అదనంగా ప్రీమియం చెల్లించడం ద్వారా రూ.50 లక్షల లైఫ్ కవరేజీకి నేహాలాంటి వారు ఈ యాడ్–ఆన్ బెనిఫిట్‌ను తీసుకోవచ్చు. ఉదాహరణకు, రూ.1 కోటి కవరేజీ గల బేస్ పాలసీని, రూ.50 లక్షల యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్‌ను తీసుకుంటే, ప్రమాదవశాత్తు మరణించిన పక్షంలో మొత్తం రూ.1.50 కోట్ల క్లెయిమ్ లభిస్తుంది.కుటుంబానికి ఆర్థికంగా దన్నుగా నిలుస్తున్న వారికి దురదృష్టవశాత్తూ ఏదైనా జరిగి, ఆదాయానికి అంతరాయం ఏర్పడినా, కుటుంబానికి ఆర్థిక భరోసాను కల్పిస్తుంది టర్మ్ ఇన్సూరెన్స్. క్లెయిమ్‌ల విషయంలో మెరుగైన ట్రాక్ రికార్డు ఉన్న బీమా సంస్థ నుంచి దీన్ని కొనుగోలు చేయడం మంచిది. ఉదాహరణకు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ 2024 ఏప్రిల్ నుంచి సెపె్టంబర్ మధ్య కాలంలో మొత్తం పరిశ్రమలో అత్యుత్తమంగా 99.3 శాతం క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తిని నమోదు చేసింది. అలాగే, నాన్–ఇన్వెస్టిగేటెడ్ డెత్ క్లెయిమ్‌లను సగటున 1.2 రోజుల వ్యవధిలోనే సెటిల్ చేసింది.– ఎలిజబెత్ రాయ్, హెడ్ (ప్రోడక్ట్ మేనేజ్మెంట్), ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ -
స్వల్పకాల పెట్టుబడికి దారేదీ?
ప్రతి వ్యక్తికి స్వల్పకాల, మధ్య కాల, దీర్ఘకాల లక్ష్యాలనేవి ఉంటాయి. వీటి ఆధారంగానే పెట్టుబడి సాధనాలను ఎంపిక చేసుకోవాలి. అన్నింటికీ ఒకే అస్త్రం ఫలితాలనివ్వదు. ప్రతి పెట్టుబడిలోనూ రిస్క్ ఉంటుంది. ఇది తమకు ఎంత వరకు ఆమోదమో పరిశీలించిన తర్వాతే వాటిపై నిర్ణయానికి రావాలి. దీర్ఘకాలానికి ఈక్విటీలు అధిక రాబడులు ఇస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మధ్య కాలిక లక్ష్యాలకు, ఈక్విటీ, డెట్‌తో కలయికతో ఉండే హైబ్రిడ్ ఫండ్స్ మెరుగైనవి. మరి స్వల్పకాల లక్ష్యాల మాటేమిటి? వీటి కోసం రిస్క్ తీసుకోవడం ఎంత మాత్రం సూచనీయం కాదు. స్వల్పకాలంలో రాబడి కంటే పెట్టుబడి రక్షణ కీలకం అవుతుంది. అదే సమయంలో ఎంతో కొంత రాబడి కూడా రావాలి. ఇందుకు అందుబాటులో ఉన్న మెరుగైన సాధనాలపై అవగాహన కల్పించే కథనం ఇది. స్వల్పకాలం అంటే..? నిజానికి స్వల్పకాలానికి ఇతమిత్థమైన నిర్వచనం లేదు. కొన్ని రోజుల నుంచి నెలల వరకు స్వల్పకాలం కిందకే వస్తుంది. ఏడాది, రెండేళ్లు కూడా స్వల్పకాలం కిందకే వస్తుంది. 3–5 ఏళ్ల కాలాన్ని మధ్యస్థంగా, 10 ఏళ్లు మించితే దీర్ఘకాలంగా పరిగణిస్తుంటారు. ముఖ్యంగా మూడేళ్ల కాలానికి ఈక్విటీలను పరిగణనలోకి తీసుకోకపోవడమే రిస్క్ పరంగా సానుకూలం. ఈక్విటీ పెట్టుబడులకు కనీసం ఐదేళ్లు అయినా ఉండాలన్నది నిపుణుల సూచన. గతంలో మాదిరిగా కాకుండా నేడు ఆర్థిక అస్థిరతలు పెరిగిపోయాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సైతం అధికమయ్యాయి. వీటి ప్రభావం ఈక్విటీలపై ఎక్కువగా ఉంటుంది. కనుక దీర్ఘకాలంలోనే ఈక్విటీల్లో మెరుగైన రాబడులు సాధ్యపడతాయి. మూడేళ్ల కోసం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత, ఒకవేళ ఈక్విటీలు బేరిష్ లోకి వెళ్లిపోతే కోలుకునేందుకు ఎంత సమయం అయినా తీసుకోవచ్చు. అందుకుని ఇన్వెస్టర్లు ఈక్విటీలకు బదులు సంప్రదాయ డెట్ సాధనాలను స్వల్ప కాలం కోసం పరిశీలించొచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్లు... బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీలు).. తాతల కాలం నుంచి ప్రాచుర్యంలో ఉన్న సాధనం. కానీ, నేడు అధిక రాబడుల కాంక్షతో చాలా మంది స్వల్పకాలానికీ ఈక్విటీల వైపు అడుగులు వేస్తున్నారు. దీర్ఘకాలానికి అధిక రాబడిని ఆశించడం సమంజసమే. అదే సమయంలో స్వల్ప కాల లక్ష్యాలకు తక్కువ రాబడిని ఇచ్చే రిస్క్ లేని ఎఫ్డీలను విస్మరించడం సరికాదు. ఫిక్స్డ్ డిపాజిట్‌తోపాటు, రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ) అందరికీ అర్థమయ్యే సాధనాలు. ముఖ్యంగా ఎఫ్డీలపై రాబడి స్థిరంగా ఉంటుంది. అందుకని స్వల్పకాలం కోసం ఉద్దేశించిన పెట్టుబడి కోసం వీటిని నమ్ముకోవచ్చు. పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తే.. అప్పుడు ఒకటికి మించిన బ్యాంకుల్లో ఎఫ్డీలు వేసుకోవాలి. ఒక బ్యాంక్‌లో గరిష్టంగా రూ.5 లక్షలు డిపాజిట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక బ్యాంక్ సంక్షోభం పాలైతే ఒక డిపాజిట్‌దారునికి గరిష్టంగా రూ.5 లక్షల వరకే బీమా కింద లభిస్తుంది. స్వీప్ ఇన్ ఎఫ్డీని సైతం పరిశీలించొచ్చు. ఇది సేవింగ్స్ బ్యాంక్ ఖాతాకు అనుబంధంగా ఉంటుంది. సేవింగ్స్ ఖాతాలో కనీస బ్యాలన్స్‌ను మించి నగదు చేరిన తర్వాత నిర్ణీత మొత్తం (రూ.1,000 అంతకుమించి) స్వీప్ ఇన్ డిపాజిట్‌గా మారుతుంది. సేవింగ్స్ ఖాతాలో బ్యాలన్స్‌పై వడ్డీ రేటు 3–4 శాతం మించదు. అదే స్వీప్ ఇన్‌లో అయితే 5–6 శాతం వరకు (డిపాజిట్ ఉంచిన కాలాన్ని బట్టి) లభిస్తుంది. డిపాజిట్ రూపంలోకి మారినా కానీ, అవసరమైనప్పుడు వెంటనే ఆ మొత్తాన్ని ఏటీఎం నుంచి అయినా ఉపసంహరించుకోవచ్చు. పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్లను సైతం పరిశీలించొచ్చు. కార్పొరేట్ ఎఫ్డీలు (కంపెనీలు నిధుల కోసం జారీ చేసేవి), ఎన్బీఎఫ్సీ సంస్థల ఎఫ్డీలకు దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే వీటిలో డిఫాల్ట్ రిస్క్ ఉంటుంది. అందుకే ఈ డిపాజిట్లలో రాబడి ఎక్కువగా ఉంటుంది. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎఫ్డీలను సైతం పరిశీలించొచ్చు. వీటిలో రిస్క్ ఉంటుంది. అయినప్పటికీ ఆర్బీఐ డిపాజిట్ గ్యారంటీ పథకం పరిధిలోకి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లు కూడా వస్తాయి. కనుక రూ.5 లక్షల డిపాజిట్ వరకు ఢోకా ఉండదు. ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో రూ.5 లక్షలు మించకుండా డిపాజిట్ చేసుకోవచ్చు. పెట్టుబడి ఉద్దేశం? పెట్టుబడిని కాపాడుకోవం, అదే సమయంలో కొంత రాబడిని సమకూర్చుకోవడం స్వల్పకాల పెట్టుబడుల ఉద్దేశంగా ఉండాలి. స్వల్పకాల పెట్టుబడుల కోసం అధిక రాబడులను ఇచ్చే విభాగాలను అస్సలు పరిగణనలోకి తీసుకోకూడదు. అధిక రాబడుల చరిత్ర కలిగిన ఈక్విటీల్లో స్వల్పకాలంలో పెట్టుబడికి సైతం రిస్క్ ఏర్పడుతుంది. దీర్ఘకాలంలోనే అలాంటి సాధనాల్లో రిస్క్ ను అధిగమించి రాబడులు సమకూర్చుకోగలరు. ఎఫ్డీలపై టీడీఎస్.. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే రాబడి ఒక ఆర్థి క సంవత్సరంలో రూ.40,000 మించితే (60 ఏళ్లలోపు వారికి), ఆ మొత్తంపై బ్యాంక్‌లు 10 శాతం టీడీఎస్ మినహాయిస్తాయి. 60 ఏళ్లు నిండిన వారికి రూ.50,000 మించితే అప్పుడు టీడీఎస్ అమలవుతుంది. కానీ, డెట్ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులకు టీడీఎస్ వర్తించదు. టీడీఎస్ వద్దనుకునే వారు ఎఫ్డీలకు బదులు డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బ్యాంక్ ఎఫ్‌డీల కంటే ఇతర డెట్ ఫండ్స్‌లోనే పన్ను అనంతరం రాబడి కాస్తంత అధికంగా ఉంటుంది. ముఖ్యంగా డెట్ మ్యూచువల్ ఫండ్స్‌ను గత రాబడుల ఆధారంగా ఎంపిక చేసుకోవడం సరైన విధానం కాదు. తమ పెట్టుబడుల కాల వ్యవధికి అనుకూలంగా ఉండే ఫండ్స్‌ను, అది కూడా వాటి పెట్టుబడుల పోర్ట్‌ఫోలియో చూసిన తర్వాత ఎంపిక చేసుకోవాలి. తిరిగి ఫలానా సమయంలో పెట్టుబడిని వెనక్కి తీసుకుంటానన్న స్పష్టత ఉన్న వారికి ఎఫ్డీలు మెరుగైనవి. ఎంత రాబడి వస్తుందో పెట్టుబడి సమయంలోనే తెలుసుకోవచ్చు. ఒకవేళ పెట్టుబడిని ఎప్పుడు వెనక్కి తీసుకోవాలన్న విషయంలో స్పష్టత లోపించినట్టయితే, అప్పుడు ఓవర్‌నైట్ ఫండ్స్ లేదా లిక్విడ్ ఫండ్స్ లేదా బ్యాంక్ స్వీప్ ఇన్ ఎఫ్డీ ఎంపిక చేసుకోవచ్చు. దీర్ఘకాలానికి సైతం.. డెట్ సాధనాలు కేవలం స్వల్పకాల పెట్టుబడులకే అనుకోవడం పొరపాటు. దీర్ఘకాల లక్ష్యాల విషయంలోనూ ఎవరైనా 100 శాతం పెట్టుబడులను ఈక్విటీలకు కేటాయించుకోవడం సరికాదు. కాల వ్యవధి, తమ రిస్క్ సామర్థ్యం ఆధారంగా అసెట్ అలోకేషన్ విధానాన్ని (వివిధ సాధనాల మధ్య కేటాయింపులు) రూపొందించుకోవాలన్నది నిపుణుల సూచన. 10–20 ఏళ్లకు మించిన కాలానికి ఒకరు తమ పెట్టుబడుల్లో 70 శాతం వరకు ఈక్విటీలకు కేటాయించుకోవచ్చు. మిగిలిన 30 శాతాన్ని డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. బంగారానికి సైతం 5–10 శాతం మేర కేటాయింపులు చేసుకోవచ్చు. ఇన్వెస్టర్ వయసు పెరుగుతూ, లక్ష్యానికి చేరువవుతున్న క్రమంలో ఈక్విటీ పెట్టుబడులను క్రమంగా తగ్గించుకుంటూ, డెట్‌లో పెట్టుబడులు పెంచుకుంటూ వెళ్లాలి. దీని ద్వారా రిస్క్ ను అధిగమించొచ్చు. లాభాలపై పన్ను డెట్ సాధనం ఏదైనా సరే పెట్టుబడిపై వచ్చే లాభం పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది. ఎంత కాలం పాటు ఇన్వెస్ట్ చేశారన్న అంశంతో సంబంధం లేదు. పెట్టుబడిని విక్రయించగా వచ్చిన లాభం సంబంధిత ఆర్థిక సంవత్సరంలో ఇన్వెస్టర్ ఆదాయానికి కలుస్తుంది. నిబంధనల మేరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. గతంలో మాదిరి మూడేళ్లు నిండిన పెట్టుబడులు విక్రయించినప్పుడు వచ్చిన లాభంపై ఇండెక్సేషన్ ప్రయోజనం ఇప్పుడు లేదు. ఓవర్‌నైట్ ఫండ్స్... డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇవి అతి తక్కువ రిస్క్ కలిగినవి. కొన్ని రోజుల పాటు పెట్టుబడికి ఓవర్‌నైట్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. వీటిలో వార్షిక రాబడి సుమారుగా 5 శాతం ఉంటుంది. కేవలం ఒక రోజులో గడువు తీరే సెక్యూరిటీల్లో ఓవర్‌నైట్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తాయి. కేవలం ఒక రోజు వ్యవధిలోనే ఈ పెట్టుబడిని నగదుగా మార్చుకోవచ్చు. ఎక్కువ లిక్విడిటీతో ఉంటాయి. ఆర్బీఐ వడ్డీ రేట్ల సవరణల ప్రభావం వీటిపై ఉంటుంది. ఏరోజుకారోజు ఇవి గడువు తీరిపోతుంటాయి. దీంతో ఫండ్ మేనేజర్లు రోజువారీగా సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కనుక వడ్డీ రేట్ల మార్పు ప్రభావం ఈ పెట్టుబడులపై వెంటనే అమల్లోకి వస్తుందని గుర్తు పెట్టుకోవాలి. ఆర్బీఐ రివర్స్ రెపో రేట్లను తగ్గించినప్పుడు వీటి రాబడులు కొంత వరకు ప్రభావితమవుతాయి. మనీ మార్కెట్ ఫండ్స్ ఏడాది వరకు కాల వ్యవధి తీరే సెక్యూరిటీల్లో (సర్టీఫికెట్ ఆఫ్ డిపాజిట్లు, కమర్షియల్ పేపర్లు, కమర్షియల్ బిల్లులు, ట్రెజరీ బిల్లులు) ఇవి పెట్టుబడులు పెడుతుంటాయి. అధిక లిక్విడిటీకి తోడు మెరుగైన రాబడిని ఇచ్చే విధంగా వీటి పనితీరు ఉంటుంది. సేవింగ్స్ బ్యాంక్ ఖాతా కంటే వీటిలో కాస్త అధిక రాబడి ఉంటుంది. గడిచిన ఏడాది కాలంలో ఇవి సగటున 7.59 శాతం రాబడిని ఇచ్చాయి. ఆర్బిట్రేజ్ ఫండ్స్ ఏడాదికి మించి పెట్టుబడి కొనసాగించేట్టు అయితే ఆర్బిట్రేజ్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. ఇవి ఈక్విటీ ఆర్బిట్రేజ్ అవకాశాల్లో (ధరల వ్యత్యాసం) పెట్టుబడులు పెడుతుంటాయి. గడిచిన ఏడాది కాలంలో (అక్టోబర్ నాటికి) ఆర్బిట్రేజ్ ఫండ్స్ సగటున 6.5–8 శాతం మధ్య రాబడులు ఇచ్చాయి. కానీ, మార్కెట్ అస్థిరతల్లో ఇవి తక్కువ రాబడులు, కొన్ని సందర్భాల్లో ప్రతికూల రాబడులు ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. అందుకే ఏడాదికి మించిన కాలానికే వీటిని పరిశీలించాలి. అల్ట్రా షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్ ఈ పథకాలు 3–6 నెలల్లో గడువు తీరే సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఇతర డెట్ పథకాలతో పోల్చినప్పుడు కాస్త సురక్షితమైనవి. అదే సమయంలో ఓవర్‌నైట్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్ కంటే వీటిలో కొంచెం రిస్క్ ఉంటుంది. అంతేకాదు, ఫండ్ మేనేజర్ తక్కువ రేటింగ్ బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తే, డిఫాల్ట్ రిస్క్ కూడా ఎదురుకావచ్చు. కనుక, పెట్టుబడికి ముందు వాటి పోర్ట్‌ఫోలియోలోని సెక్యూరిటీలను ఒక్కసారి పరిశీలించడం మంచిది. అధిక రేటింగ్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేసిన పథకాలనే ఎంపిక చేసుకోవడం సూచనీయం. ఇవి ఏడాది కాలంలో సగటున 7.5 శాతం మేర రాబడులు ఇచ్చాయి. లిక్విడ్ ఫండ్స్... కొన్ని నెలల పాటు పెట్టుబడులకు లిక్విడ్ ఫండ్స్ కూడా అనుకూలమే. అధిక నాణ్యతతో కూడిన డెట్ సెక్యూరిటీల్లో లిక్విడ్ ఫండ్ మేనేజర్లు పెట్టుబడులు పెడతారు. ఒక్కో డెట్ ఇన్స్ట్రుమెంట్ మెచ్యూరిటీ 91 రోజులకు మించకుండా ఉంటుంది. కావాల్సినప్పుడు వేగంగా వెనక్కి తీసుకోవచ్చు. కొన్ని లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్స్టంట్ రిఫండ్ సదుపాయాన్ని (రూ.50 వేల వరకు) అందిస్తున్నాయి. అంటే ఆ మేరకు వెంటనే బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. లేదంటే విక్రయించిన మరుసటి రోజున బ్యాంక్ ఖాతాకు ఈ మొత్తం అందుతుంది. వడ్డీ రేట్ల మార్పుల రిస్క్ వీటిపైనా ఉంటుంది. ఓవర్‌నైట్ ఫండ్స్‌తో పోలి్చతే రిస్క్ కాస్తంత ఎక్కువ. వీటిల్లో రాబడులు పెట్టుబడి కాలాన్ని బట్టి 5–6.5 శాతం మధ్య ఉంటాయి. స్వల్పకాలానికి 5 శాతం వరకు ఆశించొచ్చు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఏటీఎం నుంచి పీఎఫ్ విత్‌డ్రా.. ఎప్పటినుంచంటే?
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన కోట్లాది మంది సభ్యులకు గొప్ప వార్తను అందించింది. ప్రభుత్వం ప్రకారం.. పీఎఫ్ కొత్త విధానం వచ్చే జూన్ నాటికి అమలులోకి వస్తుంది. కొత్త విధానం ప్రకారం.. ఏటీఎం (ATM) నుండి పీఎఫ్ డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు కొత్త యాప్, ఇతర ఏర్పాట్లు ఉంటాయి.ఈపీఎఫ్‌వో కొత్త సాఫ్ట్వేర్ సిస్టమ్ EPFO 3.0 ఈ సంవత్సరం ప్రారంభమవుతుందని కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రకటించారు. ఈ కొత్త వ్యవస్థ ఉద్యోగులకు అనుకూలమైన, యూజర్ ఫ్రెండ్లీ అనుభవాన్ని అందిస్తుంది. ఈ ప్రక్రియలో మానవ జోక్యం ఉండదు. అంటే ఏ అధికారి క్లియరెన్స్ లేకుండానే పీఎఫ్ నుంచి డబ్బు విత్‌డ్రా అవుతుంది. ఈ సిస్టమ్ సభ్యులు తమ క్లెయిమ్‌లను ఒకే క్లిక్‌తో సెటిల్ చేసుకోవడానికి అనుమతిస్తుంది.ఈపీఎఫ్ఓ ఏటీఎం కార్డ్ సర్వీస్ఈపీఎఫ్ఓ 3.0 కింద సభ్యులందరికీ ఏటీఎం కార్డులు ఇస్తారు.ఈ కార్డ్ ద్వారా ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ (PF) ఖాతా మొత్తాన్ని సులభంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆర్థిక అత్యవసర సమయాల్లో ఈ సర్వీస్ సహాయపడుతుంది. వెబ్సైట్, సిస్టమ్‌లో ప్రాథమిక మెరుగుదలలు ఈ నెలలోపు పూర్తవుతాయని కేంద్ర మంత్రి మాండవ్య తెలిపారు. దీని తరువాత, ఈపీఎఫ్ఓ 3.0 దశలవారీగా అమలవుతుంది.కొత్త మొబైల్ యాప్ఈపీఎఫ్ఓ కొత్త మొబైల్ యాప్, ఇతర డిజిటల్ సేవలు కూడా ఈపీఎఫ్ఓ 3.0 కింద ప్రారంభమవుతాయి. 2025 జూన్ నాటికి కొత్త యాప్, ఏటీఎం కార్డ్, అధునాతన సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తెస్తామని.. దీంతోపాటు 12 శాతం కంట్రిబ్యూషన్ పరిమితిని తొలగించాలని కార్మిక మంత్రిత్వ శాఖ యోచిస్తోందని కేంద్ర మంత్రి మాండవ్య తెలిపారు. ఉద్యోగులు తమ పొదుపు ప్రణాళికలకు అనుగుణంగా పీఎఫ్‌కి డబ్బు జమ చేసుకోవచ్చు. అలాగే ఉద్యోగి సమ్మతితో ఈ మొత్తాన్ని పెన్షన్‌గా మార్చే ప్రతిపాదన కూడా ఉంది.ఈపీఎఫ్ఓ 3.0 ఉద్దేశండిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి సేవలను సరళంగా, వేగంగా, పారదర్శకంగా చేయడమే ఈపీఎఫ్ఓ 3.0 ఉద్దేశం. ఈ చొరవ సభ్యుల అనుభవాన్ని మెరుగుపరచడమే కాకుండా ఉద్యోగుల ఆర్థిక నిర్వహణను కూడా మెరుగుపరుస్తుంది. ఈపీఎఫ్ఓ కొత్త చొరవ కోట్లాది మంది ఉద్యోగులకు సురక్షితమైన పీఎఫ్ నిర్వహణ అవకాశాన్ని కల్పిస్తుంది. -
బీమాకు లభించేనా ధీమా..?
న్యూఢిల్లీ: పౌరులందరికీ బీమా రక్షణను చేరువ చేసే దిశగా 2025 బడ్జెట్లో కీలక చర్యలు ఉంటాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘2047 నాటికి అందరికీ బీమా’ లక్ష్యాన్ని చేరుకునేందుకు వీలుగా ఇన్సూరెన్స్‌కు పన్ను ప్రయోజనాలు, ఆరోగ్య సంరక్షణకు ప్రోత్సాహకాలు కల్పించాని పరిశ్రమ ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో నవీన్ చంద్ర ఝా మాట్లాడుతూ.. రానున్న బడ్జెట్లో హెల్త్ ఇన్సూరెన్స్ విస్తరణ దిశగా మరిన్ని చర్యలు ఉంటాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ‘బీమా సుగమ్’కు నియంత్రణ, నిధుల పరమైన మద్దతు అవసరమన్నారు. ఆర్థిక సేవలు తగినంత అందుబాటులో లేని ప్రాంతాల్లోని వారికి బీమా సేవలు చేరువ చేసేందుకు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం, సబ్సిడీలపైనా బడ్జెట్లో దృష్టి సారించొచ్చని అభిప్రాయపడ్డారు. → ఎన్పీఎస్ మాదిరి పన్ను ప్రయోజనాలను లైఫ్ ఇన్సూరెన్స్ యాన్యుటీ ఉత్పత్తులకు సైతం కల్పించాలని బజాజ్ అలియాంజ్ లైఫ్ ఎండీ, సీఈవో తరుణ్ ఛుగ్ కోరారు. కొత్త పన్ను విధానంలోనూ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై పన్ను ప్రయోజనాన్ని కల్పించాలని, టర్మ్ ఇన్సూరెన్స్ కోసం ప్రత్యేక పన్ను మినహాయింపు తీసుకురావాలని డిమాండ్ చేశారు. → ఐఆర్డీఏఐ నివేదిక ఆధారంగా జీవిత బీమా విస్తరణ (జీడీపీలో) 2022–23లో ఉన్న 4 శాతం నుంచి 2023–24లో 3.7 శాతానికి తగ్గినట్టు తెలుస్తోంది. → బడ్జెట్లో పెన్షన్, యాన్యుటీ ప్లాన్లకు మద్దతు చర్యలు ఉండొచ్చని పీఎన్బీ మెట్‌లైఫ్ ఎండీ, సీఈవో సమీర్ బన్సాల్ పేర్కొన్నారు. పెన్షనర్లకు ప్రోత్సాహకంగా యాన్యుటీ ప్లాన్ల ప్రీమియంపై జీఎస్టీని తొలగించాలని బన్సాల్ డిమాండ్ చేశారు. దీంతో యాన్యుటీలు మరింత అందుబాటులోకి వస్తాయన్నారు. → బీమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించేందుకు, బీమా ఉత్పత్తుల స్వీకరణను ప్రోత్సహించే దిశగా సంస్కరణలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వానికి బడ్జెట్ అవకాశం కల్పిస్తోందని ఇఫ్కో టోకియో జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో సుబ్రత మోండల్ పేర్కొన్నారు. మరింత మంది బీమా రక్షణను తీసుకునేందుకు వీలుగా పన్ను రాయితీలు కల్పిస్తారన్న అంచనాను ఆయన వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, ఆయుష్మాన్ భారత్‌కు సైతం బడ్జెట్లో కేటాయింపులు పెంచొచ్చని భావిస్తున్నారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లోని వారు, ఆర్థికంగా బలహీన వర్గాలకు బీమా అందుబాటులోకి వస్తుందన్నారు. → హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై జీఎస్టీని తొలగించడం ఎంతో అవసరమని యూనివర్సల్ సోంపో జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో శరద్ మాధుర్ అభిప్రాయపడ్డారు. బీమా మరింత మందికి చేరేందుకు వీలుగా ఆవిష్కరణలను ప్రోత్సహించాలని కోరారు.సుంకాలు, లైసెన్సు ఫీజులు తగ్గించాలిఓటీటీలు కూడా యూఎస్‌వో ఫండ్‌కి నిధులివ్వాలి కేంద్రానికి టెల్కోల బడ్జెట్ వినతులు న్యూఢిల్లీ: 4జీ, 5జీ నెట్వర్క్ ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకాలను, లైసెన్సు ఫీజులను తగ్గించాలని కేంద్రాన్ని టెలికం సంస్థలు కోరాయి. అలాగే భారీగా డేటా వినియోగానికి కారణమయ్యే ఓటీటీ ప్లాట్‌ఫాంలు, స్ట్రీమింగ్ సేవల సంస్థలు (ఎల్‌టీజీ) కూడా యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (యూఎస్‌వోఎఫ్)/డిజిటల్ భారత్ నిధి ఫండ్‌కి తప్పనిసరిగా చందా ఇచ్చేలా బడ్జెట్లో చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాయి. టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ ఈ మేరకు బడ్జెట్‌పై తమ వినతులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా మొదలైనవి ఇందులో సభ్యులుగా ఉన్నాయి. లైసెన్సు ఫీజును 3 శాతం నుంచి 1 శాతానికి తగ్గిస్తే టెలికం సంస్థలపై అదనపు ఆర్థిక భారం తగ్గుతుందని సీవోఏఐ తెలిపింది. ఇక తాము బోలెడంత ఖర్చు పెట్టి నెలకొల్పిన నెట్‌వర్క్‌ల ద్వారా కార్యకలాపాలు సాగిస్తూ, లాభాలు గడిస్తున్నా ఎల్టీజీలు .. పైసా కూడా కట్టడం లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో అవి కూడా తమలాగే యూఎస్‌వో ఫండ్‌కి చందా కట్టేలా చూడాలని కోరింది. తమపై విధిస్తున్న యూఎస్‌వో లెవీని పూర్తిగా తొలగించవచ్చని లేదా ప్రస్తుతమున్న రూ. 86,000 కోట్ల కార్పస్ పూర్తిగా ఖర్చు చేసేంతవరకైనా చందాలను నిలిపివేయొచ్చని సీవోఏఐ పేర్కొంది. టెల్కోలపై సుంకాల భారాన్ని తగ్గించడం, పెట్టుబడి అవకాశాలను ప్రోత్సహించడం వల్ల దేశ భవిష్యత్తుపై వ్యూహాత్మకంగా పెట్టుబడులు పెట్టినట్లవుతుందని వివరించింది. -
మీ కూతురి బంగారు భవిష్యత్తు కోసం: ఇవి బెస్ట్ స్కీమ్స్..
ప్రపంచం ఎంత వేగంగా ముందుకు సాగుతున్నా.. ఆడపిల్లల విషయంలో మాత్రం ఇంకా అసమానతలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ ఆడపిల్ల పుట్టకూడదని కోరుకునే తల్లిదండ్రులు లేకపోలేదు. చదువు, పెళ్లి ఇలాంటివన్నీ భారమనుకునేవారు నేటికీ ఉన్నారు. ఈ అసమానతలు తొలగిపోవాలి. ఆడబిడ్డలను కూడా అన్ని రంగాల్లో ఎగదనివ్వాలి. దీనిని దృష్టిలో ఉంచుకునికి, బాలికలను ప్రోత్సహించడానికి.. ప్రతి ఏటా జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటారు.ఆడపిల్ల పుడితే.. భారమనుకునే ఆలోచన మారాలి. మగపిల్లలు మాత్రమే కాకుండా.. ఆడపిల్లలు కూడా అన్ని రంగాల్లోనూ తమ ముద్ర వేస్తున్నారు. కాబట్టి వారి ఎదుగుదలకు ఉపయోగపడే కొన్ని పథకాలు గురించి తల్లిదండ్రులు తప్పకుండా తెలుసుకోవాలి.సుకన్య సమృద్ధి యోజనసుకన్య సమృద్ధి యోజన (SSY) అనేది ప్రభుత్వ మద్దతుతో కూడిన పొదుపు పథకం. ఈ స్కీమ్ కింద 8.2 శాతం వడ్డీ లభిస్తుంది. ఆడపిల్లల కోసం సంరక్షులు లేదా తల్లిదండ్రులు.. అమ్మాయి పుట్టిన తేదీ నుంచి 10 సంవత్సరాల వయస్సు వరకు మాత్రమే ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. సుకన్య సమృద్ధి ఖాతాను 250 రూపాయలతో ప్రారభించవచ్చు. ఇందులో గరిష్టంగా రూ. 1.50 లక్షలు వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఈ స్కీమ్ ఓపెన్ చేయడానికి పోస్టాఫీస్‌ను సందర్శించి ప్రారభించవచ్చు.చిల్డ్రన్ గిఫ్ట్ మ్యూచువల్ ఫండ్చిల్డ్రన్ గిఫ్ట్ మ్యూచువల్ ఫండ్ అనేది ఒక రకమైన మ్యూచువల్ ఫండ్. పిల్లల వివాహం, ఉన్నత విద్య మొదలైన దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. గిఫ్ట్ ఫండ్లు.. డెట్ అండ్ ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్ల కలయికలో పెట్టే పెట్టుబడి.ఎల్ఐసీ జీవన్ తరుణ్లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. ఈ 'జీవన్ తరుణ్ స్కీమ్' అందిస్తుంది. దీనిని ప్రత్యేకంగా 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య పిల్లల విద్యకు ఆర్ధిక సహాయం అందించే లక్ష్యంతో తీసుకొచ్చారు. ఇది లైఫ్ ఇన్సూరెన్స్ అందిస్తుంది. అంతే కాకుండా చదువుకునే సమయంలో విద్యా అవసరాలకు చెల్లింపులు అందుబాటులో ఉంటాయి. అంతే కాకుండా మెచ్యూరిటీ సమయంలో మొత్తం కవరేజ్ లభిస్తుంది.బాలికా సమృద్ధి యోజన (BSY)భారతదేశంలో ముఖ్యంగా ఆర్థికంగా బలహీన వర్గాల బాలికల సంక్షేమాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో బాలికా సమృద్ధి యోజన స్కీమ్ ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద, ఆడపిల్ల పుట్టినప్పుడు నగదు ప్రోత్సాహకం అందిస్తారు. ఆ తర్వాత వారు ఉన్నత పాఠశాల వరకు విద్యను పొందేలా చూసేందుకు వార్షిక స్కాలర్షిప్లను సైతం అందించడం జరుగుతుంది.సీబీఎస్ఈ ఉడాన్ పథకంసీబీఎస్ఈ ఉడాన్ స్కీమును భారత ప్రభుత్వ మానవ వనరులు మరియు అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MHRD) సహకారంతో 'సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్' (CBSE) ప్రారంభించింది. దేశంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో మహిళా విద్యార్థుల నమోదు రేటును పెంచడం దీని లక్ష్యం. -
రిటైర్మెంట్కు ఏ పథకాలు మేలు..?
రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది ఆర్థిక ప్రణాళికలో కీలకమైన భాగం. సరైన ప్రణాళిలు ఎంచుకుని వాటిని అనుసరిస్తే రిటైర్మెంట్ తర్వాత సురక్షితమైన, సౌకర్యవంతమైన జీవితాన్ని గడపవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో ప్రైవేట్ సంస్థలు విభిన్న రిటైర్మెంట్ స్కీమ్‌లతో వినియోగదారులకు ఆకర్షిస్తున్నాయి. కానీ ఆయా కంపెనీలు ఇస్తున్న హామీలపై చాలానే ప్రశ్నలొస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఫండ్స్‌ను ఎంచుకుని పదవీ విరమణ తర్వాత ఆర్థిక, సామాజిక భద్రత కలిగిన జీవితాన్ని సాగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), ఉద్యోగుల భవిష్య నిధి (EPF), నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)లను పదవీ విరమణ పథకాల్లో భాగంగా చాలామంది ఎంచుకుంటున్నారు. వీటి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.ఇదీ చదవండి: రూపాయి పడినా ఇంకా విలువైనదే.. -
ఈపీఎఫ్ సభ్యులకు ఉచిత జీవితబీమా
ఉద్యోగులకు సామాజిక భద్రతా కల్పించేందుకు ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) స్కీమ్ 1976లో భారత ప్రభుత్వం ప్రారంభించింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) నిర్వహించే ఈ పథకం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్)లో సభ్యులుగా ఉన్న ప్రైవేట్ రంగ ఉద్యోగులకు జీవిత బీమా ప్రయోజనాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈపీఎఫ్‌లో వాటాదారులైన ఉద్యోగులకు నిబంధనల ప్రకారం ఈ పథకాన్ని ఉచితంగా అమలు చేస్తారు.ఈడీఎల్ఐ స్కీమ్ వివరాలుఅర్హతలు: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్), ఇతర నిబంధనల చట్టం 1952 కింద నమోదైన అన్ని సంస్థలకు ఈ పథకం వర్తిస్తుంది. నెలకు రూ.15,000 వరకు మూల వేతనం ఉన్న ఉద్యోగులు ఈ స్కీమ్‌లో డిఫాల్ట్‌గా చేరతారు.యాజమాన్యం వాటా: ఉద్యోగి నెలవారీ వేతనంలో 0.5% యజమానులు ఈడీఎల్ఐ పథకానికి విరాళంగా ఇస్తారు. గరిష్ట వేతన పరిమితి రూ.15,000 వరకు మాత్రమే వర్తిస్తుంది. ఈడీఎల్ఐలో ఉద్యోగి నుంచి ఎలాంటి కంట్రిబ్యూషన్ అవసరం లేదు.బీమా కవరేజీ: సర్వీసులో ఉండగా ఉద్యోగి మరణిస్తే, రిజిస్టర్డ్ నామినీకి ఏకమొత్తంలో బీమా డబ్బులు అందుతాయి. గత 12 నెలల్లో ఉద్యోగి తీసుకున్న సగటు నెలవారీ వేతనానికి 30 రెట్లు, నెలకు గరిష్టంగా రూ.15,000కు లోబడి ఈ బెనిఫిట్‌ను లెక్కిస్తారు.ప్రయోజనాలు: కనీస హామీ ప్రయోజనం రూ.2.5 లక్షలు, గరిష్ట ప్రయోజనం రూ.7 లక్షలుగా ఉంది. ఇది నెలవారీ గరిష్టవేతన పరిమితిపై ఆధారపడుతుంది. మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక, సామాజిక భద్రత కల్పించేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది.గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ఈడీఎల్ఐ(EDLI) పథకంలో ఉద్యోగి వేతనంలో 0.5 శాతం వాటాను యాజమాన్యం జమచేయాలి. అయితే దీని కంటే మెరుగైన ఇన్సూరెన్స్ పాలసీ(Insurance Policy)లు ఏవైనా ఉంటే యజమానులు తమ ఉద్యోగుల కోసం గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్‌ను కూడా ఎంచుకోవచ్చు. ఇది ఈడీఎల్ఐ స్కీమ్ ద్వారా అందించబడే కవరేజీకి సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి.ఇదీ చదవండి: కూతురి కోసం మంచి పథకంఎలా క్లెయిమ్ చేయాలి?ఉద్యోగి మరణిస్తే నామినీ లేదా చట్టబద్ధమైన వారసులకు ఆ డబ్బులు చెందుతాయి. అందుకు అవసరమైన డాక్యుమెంట్లతో పాటు క్లెయిమ్ ఫారాన్ని ఈపీఎఫ్ఓకు సమర్పించాలి. క్లెయిమ్ మొత్తం నేరుగా నామినీ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. అందుకోసం నామినీ ఈపీఎఫ్ఓ వెబ్సైట్ లేదా సమీపంలోని ఈపీఎఫ్ఓ కార్యాలయం నుంచి ఫారం 5 ఐఎఫ్ (ఇన్సూరెన్స్ ఫండ్) పొందాలి. మరణించిన ఉద్యోగి పీఎఫ్ ఖాతా నంబర్, మరణించిన తేదీ, నామినీ వివరాలతో సహా అవసరమైన అన్ని వివరాలను ఫారంతో నింపి కార్యాలయంలో అందించాలి. అందుకు అవసరమైన డాక్యుమెంట్లను జతచేయాలి. -
కూతురి కోసం మంచి పథకం
ఎందెందు వెదికిన అందందు కలదె మగువా.. అని నేటి రోజుల్లో మహిళలు ప్రవేశించని రంగమంటూ లేదు. అయినా ఏదో తెలియని వెలితి. లింగ వివక్ష, ఆదాయాల్లో వ్యత్యాసాలు ఇప్పటికీ దేశంలో చాలాచోట్ల మహిళల పురోగతికి అవరోధంగానే నిలుస్తున్నాయి. 2022 లెక్కల ప్రకారం.. దేశంలో సుమారు 4.5 కోట్ల మంది పేదరికంతోనే జీవనం సాగిస్తున్నారు. ఇప్పటికీ దేశంలోని మారుమూల పల్లెల్లో అమ్మాయిల్ని మధ్యలోనే చదువు మాన్పించేయడం, చిన్నతనంలోనే పెళ్లిళ్లు చేసేయడం వంటి అంశాలు ఈ పేదరికానికి కారణంగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహిళల పురోభివృద్ధి, సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి వాటిని విజయవంతంగా అమలుచేస్తున్నాయి. ఇలాంటివాటిలో బాలికల ఆర్థిక శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఒక పథకమే ‘సుకన్య సమృద్ధి యోజన’. దేశంలో లక్షలాది బాలికలకు సాధికారత కల్పించే ఈ పథకం సరిగ్గా పదేళ్ల క్రితం బేటీ బచావో, బేటీ పఢావో ప్రచారంలో భాగంగా 2015 జనవరి 22న ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా గత నవంబర్ నాటికి 4.10 కోట్లకు పైగా సుకన్య సమృద్ధి ఖాతాలు ప్రారంభమయ్యాయి.ఇది ఎలా పనిచేస్తుంది?ఇదొక పొదుపు పథకం. ఇంట్లో అమ్మాయి పుట్టిన వెంటనే ఖాతా తెరవచ్చు.అంతేకాదు ఆమెకు పదేళ్లు వచ్చేవరకు ఏ సమయంలోనైనా ఖాతాను ప్రారంభించవచ్చు.కనీసం రూ.250తో ఈ పథకాన్ని అమ్మాయిల పేరిట తల్లిదండ్రులు/ సంరక్షకులు తెరవవచ్చు.ఖాతా తెరిచినప్పటి నుంచి ప్లాన్ మెచ్చూర్ అయ్యేవరకు లేదా ఖాతా మూసివేసే వరకు ఈ పథకం ప్రయోజనాలు అమ్మాయికే చెందుతాయి. ప్రతి అమ్మాయికీ ఒక ఖాతాను మాత్రమే అనుమతిస్తారు.తల్లిదండ్రులు తమ అమ్మాయిల కోసం గరిష్టంగా రెండు ఖాతాలను తెరవవచ్చు.కొన్ని సందర్భాల్లో ప్రత్యేక మినహాయింపు పొందవచ్చు. అదెలాగంటే కవలలుపుట్టినా, ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు పుట్టినా సంబంధిత ఆధారాలను సమర్పించడంద్వారా ఈ ప్రయోజనాన్ని దక్కించుకోవచ్చు.అవసరమైతే ఈ ఖాతాను దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా బదిలీ చేసుకోవచ్చు.ఖాతా తెరవాలంటే ఏదైనా పోస్టాఫీస్ లేదా వాణిజ్య బ్యాంకు శాఖలో ఈ ఖాతాను ప్రారంభించవచ్చు.ఖాతా తెరవడానికి పుట్టిన అమ్మాయి తాలూకు జనన ధ్రువీకరణ పత్రం, నివాస రుజువు సమర్పించాలి.కనీస డిపాజిట్ రూ.250. ఆపై రూ.50 చొప్పున అంటే 300, 350, 400, 450, 500..ఇలా మన స్థోమతను బట్టి డిపాజిట్ చేసుకోవచ్చు. అయితే ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఈ డిపాజిట్ పరిమితి రూ.1,50,000 మించకూడదు. ఖాతా తెరిచినప్పటి నుంచి 15 ఏళ్ల వరకు ఇలా డిపాజిట్ చేసుకుంటూ వెళ్లవచ్చు.ఆడపిల్లకు 18 ఏళ్లు వచ్చేవరకు ఈ ఖాతా నిర్వహణ తల్లిదండ్రులు, సంరక్షకులు చేతుల్లోనే ఉంటుంది.ఇది పిల్లల విద్య, భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించినందున ఎప్పుడుపడితే అప్పుడు ఈ పథకం నుంచి సొమ్ములు విత్ డ్రా చేయడానికి వీలుండదు.ఇక 18 ఏళ్లు నిండిన అమ్మాయి, ఆ విషయాన్ని ధ్రువీకరిస్తూ సంబంధిత పత్రాలను సమర్పించడం ద్వారా ఖాతాను తన అజమాయిషీలోకి తీసుకోవచ్చు. నెలవారీ ప్రాతిపదికన వడ్డీ లెక్కిస్తారు. దీన్ని ఆర్థిక సంవత్సరం చివర్లో ఖాతాకు జమ చేస్తారు.ఖాతాదారుకు 21 ఏళ్లు పూర్తి అయ్యాక ఈ పథకం మెచ్యూర్ అవుతుంది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో దీన్ని ముందుగానే మూసివేసే సౌలభ్యం ఉంది. అంటే అమ్మాయికి 18 ఏళ్లు నిండి, 21 ఏళ్ల లోపే పెళ్లి చేయాలనుకుంటే పథకం మెచ్యూర్ కాకముందే క్లోజ్ చేయవచ్చు. దీనికి తగిన ఆధారాలను సమర్పించాలి.ఒకవేళ పైచదువులకు డబ్బు కావాలి అనుకున్నప్పుడు కూడా కొంత సొమ్ము విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే ఖాతాదారు పదో తరగతి పూర్తి చేసి లేదా 18 ఏళ్లు నిండినా (వీటిలో ఏది ముందయితే అది) అంత క్రితం ఆర్థిక సంవత్సరం చివరి వరకు జమ అయినా మొత్తంలో సగం వెనక్కి తీసుకోవచ్చు. దీనికి కూడా తగిన ఆధారాలను సమర్పించాలి.ఈ విత్‌డ్రాలను ఒకేసారి గానీ, ఏడాదికోసారి చొప్పున అయిదేళ్లపాటు గానీ చేసుకోవచ్చు.ఒకవేళ ఖాతాదారు అకాల మరణం చెందితే డెత్ సర్టిఫికెట్తో దరఖాస్తు సమర్పించి ఖాతా మూసివేయవచ్చు. అప్పటివరకు ఉన్న బ్యాలెన్స్, వడ్డీలను తల్లిదండ్రులు/ సంరక్షకులకు చెల్లిస్తారు.ఒకవేళ దురదృష్టవశాత్తు తల్లిదండ్రులు లేదా సంరక్షుకులు చనిపోయి, ఖాతా నిర్వహించలేని సందర్భాల్లోనూ ముందుగానే ఖాతాను మూసివేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఖాతా తెరిచిన తొలి ఐదేళ్లలో మాత్రం ఇలా మూసివేయడానికి కుదరదు.ఈ పథకం కింద డిపాజిట్ చేసే మొత్తాలపై వచ్చే వడ్డీకి, మెచ్యూర్ అయ్యాక వచ్చే మొత్తాలకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ప్రయోజనాలు లభిస్తాయి.ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఈ పథకానికి ప్రభుత్వం నిర్ధారించిన వడ్డీ 8.2 శాతం.ఇదీ చదవండి: భారత్ క్రెడిట్ రేటింగ్‌కు సవాళ్లుకేవలం బాలికల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, వాళ్లకు విద్యా విషయంలోనూ, ఆర్థిక స్వతంత్రతలోనూ స్వావలంబన చేకూర్చాలన్న ఉద్దేశంతో ప్రారంభమైందే సుకన్య సమృద్ధి యోజన పథకం. ముఖ్యంగా చిన్న స్థాయి ఆదాయవర్గాల వారికి తమ పిల్లలపై చదువులకు అప్పటికప్పుడు పెద్ద మొత్తాలు అప్పులు చేయాల్సిన అవసరం నుంచి తప్పించుకోవచ్చు. అలాగే తమ అమ్మాయిల పెళ్లిళ్లకు అయ్యే ఖర్చు విషయంలోనూ ఈ సొమ్ములు చాలావరకు ఆదుకోగలుగుతాయి. తల్లిదండ్రులు దీన్నొక మంచి పథకం కింద భావించి ముందడుగు వేయొచ్చు.- బెహరా శ్రీనివాస రావు, ఆర్థిక నిపుణులు -
భార్య పేరు మీద డిపాజిట్.. రూ.32వేలు వడ్డీ
దేశంలోని వివిధ వర్గాల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక రకాల పొదుపు పథకాలను అమలు చేస్తోంది. ఇదే క్రమంలో మహిళల కోసం కొన్ని ప్రత్యేక పథకాలను కూడా అమలు చేస్తోంది. ఇందులో పెట్టుబడి పెట్టడం ద్వారా భారీ వడ్డీని పొందవచ్చు. అదే మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ (Mahila Samman Savings Certificate-MSSC) స్కీమ్. కేంద్ర ప్రభుత్వం 2023లో ఈ పథకాన్ని ప్రారంభించింది.కనీసం రూ.1000.. గరిష్టంగా రూ. 2 లక్షలుమహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్‌పై 7.5 శాతం వడ్డీ ఇస్తారు. ఈ పథకం కింద కనీసం రూ. 1000.. గరిష్టంగా రూ. 2 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. ఈ పథకం 2 సంవత్సరాలలో మెచ్యూర్ అవుతుంది. అయితే, మీరు ఖాతా తెరిచిన తేదీ నుండి సంవత్సరం తర్వాత అర్హత ఉన్న బ్యాలెన్స్‌లో 40 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ పథకం కింద, మీరు ఏదైనా బ్యాంకు లేదా పోస్టాఫీసులో మీ భార్య పేరు మీద మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ ఖాతాను తెరవవచ్చు.రూ.32,000 వడ్డీమహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకం కింద మీరు రూ. 2 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేయలేరు. ఒక వేళ రూ. 2 లక్షలు డిపాజిట్ చేస్తే, ఈ మొత్తంపై మీకు 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. దీని ప్రకారం మెచ్యూరిటీపై మొత్తం రూ. 2,32,044.00 పొందుతారు. అంటే రూ.2 లక్షల డిపాజిట్ పై రూ.32,044 వడ్డీని పొందుతారు.కుమార్తె లేదా తల్లి పేరుతోనూ ఖాతామీకు ఇంకా వివాహం కాకపోతే, మీరు మీ తల్లి పేరు మీద కూడా మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్‌లో కూడా పెట్టుబడి పెట్టవచ్చు. ఇది మాత్రమే కాదు, మీకు కుమార్తె ఉంటే, మీరు ఆమె పేరు మీద కూడా పెట్టుబడి పెట్టవచ్చు. -
కొత్త రకం క్రెడిట్ కార్డు.. ఎఫ్డీ, యూపీఐ లింక్‌తో..
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ (IDFC FIRST Bank) రూపే (RuPay) భాగస్వామ్యంతో ఫస్ట్ ఎర్న్ (FIRST EARN) పేరుతో కొత్త రకం క్రెడిట్ కార్డును ప్రారంభించింది. యూపీఐ (UPI), ఎఫ్డీ (FD) లింక్‌తో ఈ క్రెడిట్ కార్డ్‌ను ప్రారంభించినట్లు బ్యాంక్ ప్రకటించింది. ఇది ఫిక్స్డ్ డిపాజిట్‌కు అనుసంధానంగా దీన్ని జారీ చేస్తారు. దీంతో యూపీఐ చెల్లింపులపై క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు.ఈ క్రెడిట్ కార్డు దరఖాస్తులోనే ఫిక్స్డ్ డిపాజిట్ తెరిచే అంశాన్ని కూడా ఏకీకృతం చేసి ఉంటారు. దీంతో ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఈ కార్డుకు జమవుతుంది. అలాగే కస్టమర్లు ఈ కార్డు ద్వారా యూపీఐలో క్రెడిట్‌ని, రివార్డ్‌లను పొందే అవకాశం ఉంటుంది. ఈ క్రెడిట్ కార్డును యూపీఐతో సజావుగా అనుసంధానించడం వల్ల దేశం అంతటా 6 కోట్లకుపైగా యూపీఐ అనుసంధానిత మర్చెంట్ల వద్ద దీన్ని వినియోగించవచ్చు. ప్రతి యూపీఐ ఖర్చుపైనా కస్టమర్లు 1 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందుతారు. దీంతో ప్రతి లావాదేవీ రివార్డ్‌గా మారుతుంది."ఇది ఆర్థిక సేవల ప్రపంచానికి గేట్‌వే ఉత్పత్తిగా మొదటిసారి క్రెడిట్ కార్డ్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందింది" అని ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్‌లో క్రెడిట్ కార్డ్స్, ఫాస్ట్‌ట్యాగ్, లాయల్టీ ని హెడ్ శిరీష్ భండారి పేర్కొన్నారు. "ఈ ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాక్డ్ క్రెడిట్ కార్డ్ ఆన్లైన్లో అందుబాటులో ఉంది. కార్డ్ ఖాతాకు ఆటోమేటిక్‌గా క్రెడిట్ చేసే 1 శాతం క్యాష్‌బ్యాక్‌తో ప్రతి రోజు యూపీఐ చెల్లింపులను తక్షణమే సూపర్ రివార్డింగ్ చేస్తుందని తెలిపారు.ఫస్ట్ ఎర్న్ క్రెడిట్ కార్డు ముఖ్య ఫీచర్లు» ఈ క్రెడిట్ కార్డ్ 6 కోట్ల కంటే ఎక్కువ క్యూఆర్ కోడ్లలో యూపీఐ లావాదేవీలను అనుమతిస్తుంది .» ఇది వర్చువల్ క్రెడిట్ కార్డ్. తక్షణ ఉపయోగం కోసం యూపీఐ ఇంటిగ్రేషన్‌తో తక్షణమే జారీ చేస్తారు.» ఇది ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారా అందించే సురక్షిత క్రెడిట్ కార్డ్. అందరికీ అందుబాటులో ఉంటుంది.» కొత్త కార్డ్ హోల్డర్లు కార్డు జారీ చేసిన 15 15 రోజులలోపు చేసే మొదటి యూపీఐ లావాదేవీపై 100 శాతం రూ. 500 వరకు క్యాష్ బ్యాక్ పొందుతారు.ప్రభావవంతంగా మొదటి సంవత్సరం ఫీజు క్యాష్ బ్యాక్‌గా వెనక్కివస్తుంది.» బ్యాంక్ యాప్ ద్వారా చేసే యూపీఐ లావాదేవీలపై 1 శాతం క్యాష్‌బ్యాక్, ఇతర యూపీఐ యాప్‌ల ద్వారా చేసే లావాదేవీలపై అలాగే బీమా, యుటిలిటీ బిల్లులు, ఈ-కామర్స్ కొనుగోళ్లపై 0.5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.» జొమాటోకు చెందిన ‘డిస్ట్రిక్ట్’ ద్వారా సినిమా టికెట్లు కొనుగోలు చేస్తే 25% రూ.100 వరకు తగ్గింపు లభిస్తుంది.» బ్యాంక్ 1 సంవత్సరం 1 రోజు ఫిక్స్డ్ డిపాజిట్‌పై 7.25 శాతం వడ్డీని అందిస్తుంది.» రూ.1,399 విలువైన కాంప్లిమెంటరీ రోడ్‌సైడ్ సహాయం.» కార్డు పోగొట్టుకున్నప్పుడు రూ.25,000 కార్డ్ లయబిలిటీ కవర్ లభిస్తుంది.» రూ.2,00,000 వ్యక్తిగత ప్రమాద బీమా ఉంటుంది. -
కొత్త బడ్జెట్ వచ్చేలోపే బంగారం కొనేస్తే మంచిదా?
కేంద్ర బడ్జెట్ 2025-26 (Union Budget 2025-26) రాకకు ఇంక కొన్ని రోజులే ఉంది. రానున్న బడ్జెట్ బంగారంపై (Gold) కస్టమ్స్ సుంకాన్ని పెంచవచ్చని ఊహాగానాలు విస్తృతంగా ఉన్నాయి. తద్వారా ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుత ధర తగ్గుదల సమయంలో బంగారం కొనుగోలు చేయడం వ్యూహాత్మక చర్యగా నిపుణులు సూచిస్తున్నారు.2024లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో బంగారం, వెండి కడ్డీలపై కస్టమ్స్ సుంకాన్ని 15% నుండి 6%కి తగ్గించారు. తదనంతరం 2024 ఆగస్టులో బంగారం దిగుమతులు సంవత్సరానికి సుమారుగా 104% పెరిగి 10.06 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అయితే అదే సమయంలో భారత్ నుంచి రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 23% పైగా క్షీణించి 1.99 బిలియన్ డాలర్లకు పడిపోయాయి.గత బడ్జెట్లో ధరలను స్థిరీకరించడానికి, నిరంతర ద్రవ్యోల్బణం మధ్య తగినంత సరఫరాను నిర్ధారించడానికి ప్రభుత్వం బంగారంపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించింది. అయితే దిగుమతి సుంకం తగ్గింపు పెరిగిన బంగారం వినియోగం గురించి ఆందోళనలను లేవనెత్తింది. ఇది వాణిజ్య లోటును విస్తరిస్తుంది. ప్రపంచంలోని రెండవ అతిపెద్ద బంగారు వినియోగదారు అయిన భారత్ తన డిమాండ్‌ను తీర్చుకోవడానికి దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతోంది.బడ్జెట్ కంటే ముందే కొనేయాలా?డాలర్ బలపడుతున్నప్పటికీ గత వారం బంగారం ధరలు పెరిగాయి. బంగారం మార్కెట్ నుండి ఆరోగ్యకరమైన డిమాండ్, దేశీయ స్టాక్ మార్కెట్లో బలహీనత బంగారం ధరలలో నిరంతర పెరుగుదలకు దారితీసింది. గత వారం 1 శాతం పెరిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బంగారంపై కస్టమ్స్ సుంకాన్ని పెంచితే దేశీయ మార్కెట్లో బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు."బంగారం పట్ల పెరుగుతున్న ట్రెండ్‌ను అరికట్టడానికి, ముఖ్యంగా గత సంవత్సరం దిగుమతి సుంకాల తగ్గింపును అనుసరించి ప్రభుత్వం 2025 బడ్జెట్లో బంగారంపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని పెంచవచ్చు" అని ఎస్ఎస్ వెల్త్‌స్ట్రీట్ వ్యవస్థాపకుడు సుఖంద సచ్‌దేవా అభిప్రాయపడ్డారు. "దిగుమతి సుంకం పెంపు బంగారం ధరను పెంచుతుంది, తత్ఫలితంగా దేశీయ ధరలు పెరుగుతాయి. ధర తగ్గుదల సమయంలో బంగారం కొనుగోలు చేయడం వ్యూహాత్మక చర్యగా మారుతుంది. ఎందుకంటే కొనుగోలుదారులు స్వల్పకాలిక అంచనా ధరల పెరుగుదల నుండి ప్రయోజనం పొందవచ్చు" అన్నారు.అయితే, బంగారం ధరలకు కస్టమ్స్ సుంకం పెంపు ఒక్కటే ఉత్ప్రేరకం కాదు. ప్రభుత్వం కస్టమ్స్ సుంకాన్ని ముట్టుకోకపోయినా, అంతర్జాతీయ అనిశ్చితి కారణంగా బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. "పన్ను పెంపు లేకున్నా, ప్రపంచ ఆర్థిక దృశ్యం అనిశ్చితంగానే ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండవసారి పాలసీ మార్పులు బంగారం సురక్షిత ఆకర్షణను పెంచగలవు. ఇదే నెలలో జరగనున్న యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమావేశాన్ని మార్కెట్ భాగస్వాములు నిశితంగా పరిశీలిస్తారు. ప్రధాన ద్రవ్యోల్బణం డిసెంబరులో తగ్గినప్పటికీ గత రెండు నెలలుగా ఇది స్థిరంగా ఉంది. వడ్డీ రేటు తగ్గింపుపై ఫెడరల్ రిజర్వ్ తన వైఖరిని పునఃపరిశీలించవచ్చు. ఇది బంగారం ధరలకు మద్దతు ఇవ్చవచ్చు" అని సుఖంద సచ్‌దేవా పేర్కొన్నారు. -
యూపీఐ రాంగ్ పేమెంట్.. ఇలా చేయండి కంప్లయింట్..
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) వచ్చాక ఆర్థిక లావాదేవీలు అత్యంత సులభతరం అయ్యాయి. విస్తృతమైన బ్యాంకింగ్ ఆధారాల అవసరం లేకుండా డబ్బు పంపడానికి, స్వీకరించడానికి, బిల్లులు చెల్లించడానికి, వివిధ లావాదేవీలను నిర్వహించడానికి యూపీఐ వినియోగదారులకు వెసులుబాటు కలిగింది. ఓ వైపు సౌలభ్యం ఉన్నప్పటికీ, కొన్నిసార్లు స్లో బ్యాంక్ సర్వర్లు, సాంకేతిక లోపాలు లేదా అనధికార లావాదేవీలు వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్యలపై ఫిర్యాదు ఎలా చేయాలో ఇక్కడ అందిస్తున్నాం..యూపీఐ సమస్యల రకాలుఫిర్యాదును ఫైల్ చేసే ముందు మీరు ఎదుర్కొనే వివిధ రకాల యూఏఐ సమస్యలను అర్థం చేసుకోవడం చాలా అవసరం.» పిన్ సమస్యలు: యూపీఐ పిన్ బ్లాక్ అవడం లేదా ఎర్రర్ రావడం వంటి సమస్యలు మిమ్మల్ని లావాదేవీలను పూర్తి చేయకుండా నిరోధించవచ్చు.» ప్రాసెసింగ్ సమస్యలు: లావాదేవీలు జరగకుండానే డబ్బు కట్ అవడం, తప్పు ఖాతాలకు డబ్బు వెళ్లడం, లావాదేవీలు పెండింగ్‌లో పడిపోవడం లేదా తిరస్కరణకు గురికావడం, లావాదేవీల పరిమితులను అధిగమించడం లేదా లావాదేవీల సమయం ముగియడం వంటి సమస్యలు ఉంటాయి.» ఖాతా సమస్యలు: ఖాతా వివరాల లింక్, ఫెచ్చింగ్, ఖాతాను మార్చడం లేదా తొలగించడం లేదా నమోదు రద్దు చేయడం వంటి సమస్యలు.» ఇతర సమస్యలు: వీటిలో లాగిన్ వైఫల్యాలు, నమోదు సమస్యలు లేదా ఓటీపీ (OTP) లోపాలు ఉండవచ్చు.తప్పు లావాదేవీపై ఫిర్యాదుయూపీఐ లావాదేవీ సమయంలో సమస్యలను ఎదుర్కొంటే, మీరు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)కి ఫిర్యాదు చేయవచ్చు. తప్పుడు లావాదేవీపై ఫిర్యాదు చేయడానికి ఈ దశలను అనుసరించండి..» ఎన్పీసీఐ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి What we do' ట్యాబ్‌కు వెళ్లి 'UPI' ఆప్షన్‌ను ఎంచుకోవాలి.» 'UPI' విభాగం కింద 'Dispute Redressal Mechanism'పై క్లిక్ చేయండి.» 'Complaint' విభాగం కింద 'Transaction' ఎంపికకు స్క్రోల్ చేయండి.» మీ ఫిర్యాదు ప్రకారం 'Nature of the transaction'ని ఎంచుకోండి.» 'Incorrectly transferred to another account' ఎంచుకుని, మీ సమస్య క్లుప్త వివరణను అందించండి.» ట్రాన్సాక్షన్ ఐడీ, బ్యాంక్ పేరు, యూపీఐ ఐడీ, అమౌంట్, లావాదేవీ తేదీ, ఈమెయిల్ ఐడీని నమోదు చేయండి.» మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను అందించి అప్డేట్ చేసిన బ్యాంక్ ఖాతా స్టేట్మెంట్ ఫోటోను అప్లోడ్ చేయండి.» సత్వర పరిష్కారం కోసం అన్ని వివరాలు ఖచ్చితంగా ఉన్నాయని నిర్ధారించుకోండి.ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్‌పై ఫిర్యాదుయూపీఐ లావాదేవీ విఫలమైతే ఈ దశల ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.» ఎన్పీసీఐ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి What we do' ట్యాబ్‌కు వెళ్లి 'UPI' ఆప్షన్‌ను ఎంచుకోవాలి.» 'UPI' విభాగం కింద 'Dispute Redressal Mechanism'పై క్లిక్ చేయండి.» 'Complaint' విభాగం కింద 'Transaction' ఎంపికకు స్క్రోల్ చేయండి.» మీ ఫిర్యాదు ప్రకారం 'Nature of the transaction'ని ఎంచుకోండి.» 'Transaction failed but amount debited' ఎంచుకుని సమస్య క్లుప్త వివరణను అందించండి.» ట్రాన్సాక్షన్ ఐడీ, బ్యాంక్ పేరు, యూపీఐ ఐడీ, అమౌంట్, లావాదేవీ తేదీ, ఈమెయిల్ ఐడీని నమోదు చేయండి.» మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను అందించి అప్డేట్ చేసిన బ్యాంక్ ఖాతా స్టేట్మెంట్ ఫోటోను అప్లోడ్ చేయండి.» సత్వర పరిష్కారం కోసం అన్ని వివరాలు ఖచ్చితంగా ఉన్నాయని నిర్ధారించుకోండి. -
పిల్లలకు పాన్ కార్డ్: సింపుల్‌గా అప్లై చేయండిలా..
ప్రస్తుతం అందరికీ పాన్ కార్డు తప్పనిసరి అయిపోయింది. కేవలం ఉద్యోగం చేసేవారికి మాత్రమే కాకుండా, మైనర్స్ లేదా ఐదేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలకు కూడా పాన్ కార్డు తీసుకోవచ్చు. ఆదాయపన్ను శాఖలోని సెక్షన్ 160 ప్రకారం, పాన్ కార్డు జారీ చేయడానికి కనీస వయసు అవసరం లేదు. కాబట్టి ఎవ్వరైనా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే పిల్లలు స్వయంగా పాన్ కార్డు కోసం అప్లై చేసుకోలేరు. కాబట్టి వారి తరపున తల్లిదండ్రులే పాన్ కార్డు కోసం అప్లై చేయాల్సి ఉంటుంది.పిల్లలకు పాన్ కార్డు ఎందుకంటే?తల్లిదండ్రులు పిల్లల పేరుమీద ఏదైనా పెట్టుబడి పెట్టాలన్నప్పుడు, లేదా వారి ఆస్తులకు నామినీలుగా చేర్చినప్పుడు పాన్ కార్డు అవసరం. అంతే కాకుండా పిల్లల పేరుమీద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి, మైనర్ కుమార్తె కోసం సుకన్య సమృద్ధి యోజన (SSY) పథకాల కోసం ఖాతాలను ఓపెన్ చేయడానికి కూడా పాన్ కార్డు అవసరం.పిల్లల కోసం పాన్ కార్డుకు అప్లై చేయాలనుకునేవారు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లలో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అప్లై చేయడానికి తల్లిదండ్రుల చిరునామా, గుర్తింపు కోసం ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు, ఓటరు ఐడీ వంటివి అవసరమవుతాయి.ఆన్లైన్లో అప్లై చేయడం.. ➤ముందుగా అధికారిక 'నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీస్ లిమిటెడ్' (NSDL) వెబ్సైట్ ఓపెన్ చేయాలి.➤అప్లికేషన్ ఫారమ్‌లో 'న్యూ పాన్ - ఇండియన్ సిటిజన్ (ఫారం 49ఏ)', 'వ్యక్తిగతం' అనే వర్గాన్ని ఎంచుకోవాలి.➤అప్లికేషన్ వివరాల విభాగంలో అవసరమైన వివరాలను ఫిల్ చేయాలి.➤మైనర్ ఫోటో & అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి.➤డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తరువాత డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, డిమాండ్ డ్రాఫ్ట్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లింపు కొనసాగించాలి. తరువాత 'సమర్పించు' బటన్‌ను క్లిక్ చేయాలి.➤పైవన్నీ పూర్తయిన తరువాత మీకు ఒక అక్నాలెజ్మెంట్ నెంబర్ వస్తుంది. దీని ద్వారా మీ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. ధ్రువీకరణ పూర్తయిన తరువాత 15 నుంచి 20 రోజులలోపు మీ చిరునామాకు పాన్ కార్డు డెలివరీ అవుతుంది.ఇదీ చదవండి: కోట్లు సంపాదించే అవకాశం: నిఖిల్ కామత్ ట్వీట్ఆఫ్లైన్ విధానంలో అప్లై చేసుకోవడం..➤అధికారిక NSDL వెబ్సైట్ నుంచి ఫారమ్ 49ఏను డౌన్లోడ్ చేసుకోవాలి.➤సూచనల ప్రకారం అన్ని వివరాలను పూరించండి. ➤సంబంధిత డాక్యుమెంట్స్ కాపీలను, పిల్లల ఫోటోలు రెండు జత చేసి, సమీపంలోని పాన్ సెంటర్లో ఫీజు చెల్లించి సమర్పించండి.➤మీ అప్లికేషన్ సమర్పించిన తరువాత మీకు అక్నాలెజ్మెంట్ నెంబర్ ఇస్తారు. దీని ద్వారా అప్లికేషన్ స్థితిని ట్రాక్ చేయవచ్చు. ➤తరువాత మీ చిరునామాలకు 15 నుంచి 20 రోజులలోపు పాన్ కార్డు డెలివరీ అవుతుంది. -
ఇంటి అద్దె చెల్లిస్తున్నారా.. ప్లాన్ చేసుకోండి..
మీరు ఉద్యోగస్తులైతే, మీకిచ్చే జీతభత్యాల్లో బేసిక్, డీఏ, ఇంటద్దె అలవెన్సులు, ఇతర అలవెన్సులు ఉంటాయి. గవర్నమెంటు, పబ్లిక్ సంస్థల్లో అయితే, వారివారి రూల్స్/ఒప్పందం ప్రకారం ఉంటాయి. అలాగే చెల్లిస్తారు. మీ ప్రమేయమే ఉండదు. ఇచ్చింది.. ఇచ్చినట్లు తీసుకోవాలి. ప్రైవేట్ సంస్థల్లో కొంచెం వెసులుబాటు ఉండొచ్చు. అక్కడ కూడా బలమైన ఉద్యోగ సంస్థలుంటే మన పప్పులుడకవ్! మీరు ఆ సంస్థలో ఎంతో ముఖ్యమైన వ్యక్తులైతే, ఉద్యోగిగానే కొనసాగుతుంటే బేరసారాలతో పాటు అలవెన్సుల సంగతిలోనూ వెసులుబాటు అడగవచ్చు. ఆ గొడవలన్నీ పక్కన పెడితే, యజమాని ఇచ్చే ‘ఇంటద్దె అలవెన్సు’ జీతంలో ఒక అంశం. మొత్తం జీతభత్యాలతో కలిసి ఉంటుంది. ఈ అలవెన్సును ఆదాయంగా పరిగణిస్తారు. పన్నుకి గురి అవుతుంది. అయితే, అద్దె ఇంట్లో ఉంటూ, మీరు అద్దె ఇచ్చినట్లయితేనే చట్టప్రకారం మినహాయింపు లభిస్తుంది. ఈ అలవెన్సు ఉద్దేశం, మీరు ఆ మొత్తం ఇచ్చి అద్దె ఇంట్లో ఉండటం. అద్దె కోసం ఆ మొత్తాన్ని వినియోగించడం జరగాలి. ఈ మినహాయింపు పొందాలంటే కొన్ని షరతులు ఉన్నాయి.మీరు ఆ సంస్థలో ఉద్యోగిగానే ఉండాలి.మీరు అద్దె ఇంట్లోనే ఉంటూ అద్దె చెల్లిస్తుండాలి.అద్దె చెల్లిస్తున్నట్లు కాగితాలు, రుజువులు ఉండాలి.సొంత వ్యాపారస్తులకు, వృత్తి ఉన్నవారికి ఇది వర్తించదు.అద్దె అంటే వసతి కోసం ఇచ్చే అద్దె, నిర్వహణ ఖర్చులు మాత్రమే. కరెంటు చార్జీలు, నీటి చార్జీలు మొదలైనవి కావు.సొంత ఇంట్లో ఉంటూ ఈ మినహాయింపు పొందకూడదు. కుటుంబ సభ్యులతో ఉంటూ అద్దె చెల్లించకపోతే ఈ మినహాయింపు ఇవ్వరు.ఇచ్చే జీతభత్యాల్లో ఈ అలవెన్సు లేకపోతే ఎటువంటి మినహాయింపు ఇవ్వరు.ఈ మూడింట్లో తక్కువ దాన్నే మినహాయిస్తారు. (a) వచ్చిన అలవెన్సు (b) చెల్లించిన అద్దెలో నుంచి 10 శాతం జీతం తీయగా, మిగిలిన మొత్తం (c) మెట్రో నగరాల్లో జీతంలో 50 శాతం, ఇతర ప్రాంతాల్లో జీతాల్లో 40 శాతంచెల్లించినట్లు రుజువు కావాలి. అవసరమైతే అగ్రిమెంటు, మీ బ్యాంకు అకౌంటు, ఓనర్ పాన్ కార్డు, ఓనర్ బ్యాంకు అకౌంటు, రశీదులు మొదలైనవి కావాలి.ఆ ప్రాంతంలో సొంత ఇల్లు ఉండకూడదు. మీరు ఎక్కడ పని చేస్తున్నారో ఆ ప్రాంతంలో అద్దె చెల్లించాలి.ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చుభార్యభర్తలు ఒకే ఇంట్లో కాపురం ఉంటూ ఇద్దరూ మినహాయింపు పొందకండి. ఇద్దరూ వేర్వేరు అగ్రిమెంటు ద్వారా పెద్ద ఇల్లు తీసుకుంటే ఎక్కువ అద్దె అయితే, అగ్రిమెంట్లు వేరు, చెల్లింపులు వేరు, రశీదులు వేరు, లెక్కలు వేరు.ఒక్కరే ఉద్యోగి అయి, మిగతావారు ఓనర్ అయితే, అగ్రిమెంటు రాసుకోండి. చెల్లింపులు సక్రమంగా చేయండి. పాన్ తీసుకోండి. అటు పక్క వ్యక్తికి సంబంధించిన ఇన్‌కంట్యాక్స్ లెక్కల్లో ఆదాయంగా చూపించండి.అలాగే తల్లిదండ్రుల దగ్గర ఉన్నా, మావగారింట్లో చూరు పట్టుకు వేళ్లాడుతున్నా.. అగ్రిమెంట్లు ముఖ్యం. చెల్లింపులు, రశీదులు, లెక్కలు పక్కాగా ఉండాలి.దొంగ ఇంటి నంబర్లు వేసి క్లెయిమ్ చేయకండి.మీ ఇంటికి మీరే ఓనర్ అని ఎడమ చేత్తో సంతకం పెట్టి క్లెయిమ్ చేయకండి.హైదరాబాదులాంటి మహానగరంలో స్వంత ఇల్లు ఉండగా అద్దె ఇంట్లో ఉండే పరిస్థితి ఏర్పడవచ్చు. స్వంత ఇల్లు మీద అద్దె ఆదాయంగా చూపిస్తూ, క్లెయిమ్ చేయండి.కె.సి.హెచ్.ఎ.వి.ఎస్.ఎన్.మూర్తి, కె.వి.ఎన్.లావణ్య, ట్యాక్సేషన్ నిపుణులు -
స్మాల్‌క్యాప్ ఫండ్ పరిమాణం పెరిగితే..?
ఒక స్మాల్‌క్యాప్ ఫండ్ పరిమాణం (నిర్వహణలోని ఆస్తులు/ఏయూఎం) పెరిగే కొద్దీ దాని పనితీరుపై ప్రభావం పడుతుందా? – ఊర్మిళా సానుస్మాల్క్యాప్ పథకాలు పెద్దగా మారే క్రమంలో.. బలమైన పనితీరు కారణంగా అవి మరింత పెట్టుబడులను ఆకర్షించడం సహజంగానే చూస్తుంటాం. ఈ పరిణామం వినూత్నమైన సవాళ్లను తెచ్చి పెడుతుంది. దీనిపై ఇన్వెస్టర్లలో అవగాహన ఉండాలి. స్మాల్‌క్యాప్ ఫండ్స్ రూ.1,000–2,000 కోట్ల మార్కెట్ విలువ కలిగిన కంపెనీల్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తుంటాయి. రూ.100–200 కోట్ల ఏయూఎం నిర్వహించే స్మాల్‌క్యాప్ ఫండ్స్ తమకు ఆకర్షణీయం అనిపించిన కంపెనీల్లో చెప్పుకోతగ్గ మేర ఎక్స్పోజర్ తీసుకుంటాయి. కానీ, వాటి ఏయూఎం సైజు పెరుగుతున్న కొద్దీ అదే మాదిరి పెట్టుబడులు సవాలుగా మారతాయి. ఉదాహరణకు రూ.200 కోట్ల ఏయూఎం నిర్వహించే ఒక స్మాల్‌క్యాప్ ఫండ్ రూ.1,000 కోట్ల మార్కెట్ విలువ కలిగిన కంపెనీలో ఏకంగా 5 శాతం పెట్టుబడులు పెట్టగలదు. లేదా రూ.10 కోట్లు ఇన్వెస్ట్ చేయగలదు. ఇలా రూ.10 కోట్ల పెట్టుబడితో తన పనితీరుపై, లిక్విడిటీపై పెద్దగా ప్రభావం లేకుండా చూసుకోగలదు. ఒకవేళ స్మాల్‌క్యాప్ ఫండ్ ఏయూఎం రూ.2,000 కోట్లకు పెరిగితే, అప్పుడు ఒక కంపెనీలో 5 శాతం ఎక్స్పోజర్ కోసం రూ.100 కోట్లు కేటాయించాల్సి వస్తుంది. రూ.1,000 కోట్ల మార్కెట్ విలువ కలిగిన చిన్న కంపెనీల్లో రూ.100 కోట్ల పెట్టుబడి అంటే 10 శాతానికి సమానం. అంత చిన్న కంపెనీలో 10 శాతం సమానమైన వాటాలను విక్రయించాల్సి వచ్చినప్పుడు కొనుగోలుదారులను గుర్తించడం కష్టం (లిక్విడిటీ సమస్య) కావచ్చు. ఎందుకంటే స్మాల్‌క్యాప్ కంపెనీలు తక్కువ వ్యాల్యూమ్‌తో ట్రేడ్ అవుతుంటాయి.మితిమీరిన వైవిధ్యం కాబట్టి లిక్విడిటీ సమస్య రాకుండా ఫండ్ మేనేజర్లు మరిన్ని స్టాక్స్‌లో పెట్టుబడులను వైవిధ్యం చేస్తుంటారు. దీనివల్ల రిస్క్ తగ్గుతుంది. కానీ, మొత్తం మీద రాబడులు ప్రభావితం అవుతాయి. స్మాల్‌క్యాప్ ఫండ్స్ అసాధారణ రాబడుల పనితీరుతో ఇన్వెస్టర్ల నుంచి మరింత భారీగా పెట్టుబడులు వచ్చి పడుతుంటాయి. దీంతో ఆయా పథకాల సైజు మరింత పెరిగే రిస్క్ ఉంటుంది. ఇది భవిష్యత్ పనితీరుపై ప్రభావం చూపించొచ్చు. అదే సమయంలో స్మాల్‌క్యాప్ ఫండ్ పెట్టుబడులు రాబట్టుకోవడంలో విఫలమైతే, కోల్పోయే రిస్క్ కూడా ఉంటుంది. స్మాల్‌క్యాప్ ఫండ్ ఏయూఎం పెరగడాన్ని ప్రతికూలంగా చూడక్కర్లేదు. పెరిగిపోతున్న ఏయూఎం విషయమైన వాటికంటూ ప్రత్యేకమైన పెట్టుబడుల వ్యూహం ఉండొచ్చు. కనుక ఇన్వెస్టర్లు ఫండ్స్ ఏయూఎం కాకుండా, వాటి పనితీరుపై దృష్టి సారించడమే నయం. సిప్ ద్వారా దీర్ఘకాల పెట్టుబడుల్లో 50% నుంచి 60% మేర స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా..? – ఉమేష్ ఈక్విటీల్లో దీర్ఘకాల పెట్టుబడులకు (సిప్) పదేళ్లు అంతకంటే ఎక్కువ కాలం అనుకూలం. అయితే, 50–60 శాతం పెట్టుబడులను మిడ్, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌కు కేటాయించుకోవడం సూచనీయం కాదు. దీనికి బదులు ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. ఇలా చేస్తే మిడ్, స్మాల్‌క్యాప్ పెట్టుబడులు 25–30 శాతానికి పరిమితం అవుతాయి. లార్జ్‌క్యాప్ పెట్టుబడులు 70 శాతం మేర ఉంటాయి. వృద్ధికితోడు, స్థిరత్వాన్ని ప్రదర్శించే స్టాక్స్‌కే ప్రాధాన్యం ఇవ్వాలి. రిస్క్ ఎక్కువగా ఉండే సాధనాలకు తక్కువ కేటాయింపులు చేసుకోవాలి. మిడ్, స్మాల్‌క్యాప్ కంపెనీలు తీవ్ర అస్థిరతల మధ్య చలిస్తాయి. అధిక అస్థిరతలు ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో అధిక రాబడులు కోరుకుంటే అప్పుడు ఫ్లెక్సీక్యాప్తోపాటు మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లోనూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.ధీరేంద్ర కుమార్, సీఈఓ, వ్యాల్యూ రీసెర్చ్ -
బహుమతి పుచ్చుకుంటున్నారా..?
పెళ్లి, నామకరణం.. వేడుక ఏదైనా బోలెడన్ని బహుమానాలు వచ్చి పడుతుంటాయి. ఉద్యోగుల పనితీరుకు మెచ్చి యాజమాన్యాలు సైతం పలు రూపాల్లో ఉచిత కానుకలు అందిస్తుంటాయి. నగదు రూపంలో లేదా వస్తు రూపంలో లేదా పర్యటనల రూపంలో ఈ ప్రయోజనాలు ఉండొచ్చు. ఇలాంటి బహుమతులన్నీ ఆదాయపన్ను పరిధిలోకి వస్తాయన్నది వాస్తవం. ఈ విషయంలో చట్టంలో పలు మినహాయింపులు కూడా ఉన్నాయి. వీటిని తెలుసుకుంటే వచ్చిన కానుకలను చట్టబద్దం చేసుకోవచ్చు. ఇవి తెలియకపోతే ఆదాయపన్ను విభాగం నుంచి తర్వాత సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ అంశాలపై సమగ్ర అవగాహన కల్పించే కథనం ఇది. బహుమానం ఎవరి నుంచి వచ్చిందన్న దానితో సంబంధం లేదు. దాని విలువ రూ.50,000కు మించకుండా ఉంటే ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. ఒకవేళ ఈ బహుమానం స్నేహితులు, లేదా ఇతరుల నుంచి అందుకుంటే, దాని విలువ రూ.50,000కు మించి ఉంటే ఆ మొత్తంపై తప్పకుండా పన్ను చెల్లించాలి. ఒకవేళ ఈ బహుమానం విలువ రూ.50,000కు మించి ఉన్నా సరే.. దాన్ని సమీప బంధువుల నుంచి అందుకుంటే ఎలాంటి పన్ను వర్తించదని ఆదాయపన్ను చట్టం చెబుతోంది. రూ.50,000 వరకు పన్ను మినహాయింపు ఒక ఆర్థిక సంవత్సరానికే పరిమితం. అంటే ఒకే సారి కాకుండా, ఏటా రూ.50,000 విలువకు మించకుండా బంధువులు కాని వారి నుంచి బహుమతి స్వీకరించడం ద్వారా పన్ను లేకుండా చూసుకోవచ్చు. ప్రత్యేక మినహాయింపులు పెళ్లి సందర్భంగా బంధు మిత్రుల నుంచి వివిధ రూపాల్లో కానుకలు వస్తుంటాయి. విలువతో సంబంధం లేకుండా ఇలాంటివన్నీ కూడా పన్ను మినహాయింపు కిందకే వస్తాయి. బంగారం, వ్రస్తాలు, ప్రాపర్టిలు, షేర్లు, బాండ్లు.. ఇలా బహుమతి ఏదైనా, ఎంత విలువ అయినా పెళ్లి సమయంలో అందుకుంటే పన్ను పడదు. వీలునామా ద్వారా సంక్రమించిన కానుకలు (ఆస్తులు/మరేవైనా) లేదా వారసత్వంగా సంక్రమించిన ఆస్తులపైనా లేదా ఒకరి మరణంతో దానంగా సంక్రమించే వాటికి కూడా బహుమతి పన్ను మినహాయింపు ప్రయోజనం వర్తిస్తుంది. గిఫ్ట్ ట్యాక్స్‌ను మొట్టమొదటగా 1958 ఏప్రిల్‌లో ప్రవేశపెట్టారు. దీన్ని 1998లో రద్దు చేశారు. అనంతరం ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 56(2) కింద బహుమతి పన్నును ప్రవేశపెట్టారు. విలువతో కూడిన ఏ బహుమానం అయినా, అది ఏ రూపంలో ఉన్నా ఈ సెక్షన్ కింద పన్ను పరిధిలోకి వస్తుంది. బహుమతి స్వీకరించిన వారికే పన్ను బాధ్యత. ఇచ్చిన వారిపై ఉండదు. తప్పకుండా వెల్లడించాల్సిందే.. సమీప బంధువులు, బంధువులు కాని వారి నుంచి బహమతులు అందుకున్నా కానీ, ఈ వివరాలను ఆదాయపన్ను రిటర్నుల్లో వెల్లడించాల్సిందే. ‘ఎగ్జెంప్ట్ ఇన్కమ్’ షెడ్యూల్ కింద వివరాలు తెలియజేయాలి. ఉచిత బహుమతులే అయినప్పటికీ, వీటిని భవిష్యత్తులో విక్రయించినప్పుడు మూలధన లాభాల పన్ను బాధ్యత ఎదురవుతుంది. కనుక బహుమతుల స్వీకరణను ఐటీఆర్‌లో తప్పకుండా వెల్లడించడం ద్వారా భవిష్యత్తులో సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. అంతేకాదు గిఫ్ట్ స్వీకరణకు సంబంధించి ఆధారాలను సైతం జాగ్రత్తగా పదిలపరుచుకోవాలి. భవిష్యత్తులో ఆదాయపన్ను శాఖ అధికారులు వివరాలు కోరితే ఇవ్వడానికి ఉంటుంది. విలువైన, ఖరీదైన బహమతుల విషయంలో స్టాంప్ పేపర్‌పై గిఫ్ట్ డీడ్ రాసుకోవాలన్నది నిపుణుల సూచన. ఆదాయపన్ను శాఖ అదికారుల నుంచి పిలుపు వస్తే నిరూపించుకునేందుకు ఆధారంగా పనికొస్తుంది. ‘‘పన్ను పరిధిలోకి రాని బహుమతుల వివరాలు వెల్లడించేందుకు ప్రస్తుత ఐటీఆర్ షెడ్యూల్స్‌లో నిబంధనల్లేవు. అయినా కానీ, రక్షణాత్మక ధోరణితో వాటిని ‘షెడ్యూల్ ఎగ్జెంప్ట్ ఇన్కమ్’ కింద వెల్లడించడం సూచనీయం’’అని ఇండస్ లా పార్ట్నర్ శృతి కె.పి సూచించారు. అన్ని ఐటీఆర్ పత్రాల్లోనూ షెడ్యూల్ ఈఐ ఉంటుంది. కనుక ఆదాయ వనరుల ఆధారంగా ఐటీఆర్‌ను ఎంపిక చేసుకుని, అందులో బహమతుల వివరాలు వెల్లడించాలి. తల్లిదండ్రుల నుంచి బహుమతి తీసుకున్నప్పుడు, వారి ఆదాయ వనరుల గురించి ఆదాయపన్ను శాఖ అధికారులు ప్రశ్నించే అవకాశం లేకపోలేదు. సమీప బంధువులు ఎవరు? చట్టంలో ‘రిలేటివ్’ (బంధువు)కు వివరణ ఉంది. భార్య లేదా భర్త; తల్లి దండ్రులు; అమ్మ వైపు అమ్మమ్మ, తాతయ్య; నాన్న వైపు నాయనమ్మ, తాతయ్య; భార్య లేదా భర్త వైపు సహోదరులు; తల్లి, తండ్రి తోడబుట్టిన వారు.. వీరంతా బంధువు కిందకే వస్తారు. సెక్షన్ 56 ప్రకారం మరింత వివరంగా చెప్పుకోవాలంటే..? భార్యకు భర్త, భర్తకు భార్య బంధువే. వీరిలో ఒకరి సోదరులు, సోదరీమణులు మరొకరికి బంధువే అవుతారు. సోదరుడు, సోదరుడి భార్య, అలాగే సోదరి, సోదరి భర్తను కూడా చుట్టంగానే చట్టం పరిగణిస్తోంది. తండ్రి లేదా తల్లి తోడబుట్టిన వారు, వారి జీవిత భాగస్వాములు సైతం (అత్త, మామ, బాబాయి, పిన్ని) బంధువులే అవుతారు. అలాగే భార్య తన భర్త తండ్రి (మామ), తల్లి (అత్త) నుంచి, ఆ అత్తా మామల తల్లిదండ్రుల నుంచి తీసుకునే కానుకలు.. ఇదే మాదిరి భర్త తన భార్య తల్లిదండ్రులు (అత్త, మామ), ఈ అత్తా మామల తల్లిదండ్రుల నుంచి పొందే కానుకల విలువ ఎంత ఉన్నా చట్టం పరిధిలో పన్ను చెల్లించక్కర్లేదు. కానుకలు అన్నీ ఒక్కటేనా? ఉచితంగా ఇచ్చేవి ఏవైనా సరే కానుకల కిందకే వస్తాయి. వాస్తవ విలువలో కొంత మొత్తాన్ని తీసుకుని ఇచ్చినా చట్ట పరిధిలో బహుమతి అవుతుంది. బంగారం కావచ్చు. లేదా భూమి, ఫ్లాట్, ఆభరణాలు, కళాకృతులు (స్థిర, చరాస్తులు), గృహోపకరణాలు, ఇతర వస్తువులు ఏవైనా సరే చట్టం పరిధిలో బహుమతే అవుతుంది. నగదు రూపంలో వచ్చే బహుమానం విషయంలో, విలువ ఎంతన్న దానిపై గందరగోళం ఉండదు. కానీ, బంగారం లేదా షేర్లు, లేదా భూములు తదితర కానుకల విలువ నిర్ణయించే విషయంలో నిబంధనలను అనుసరించాల్సి ఉంటుంది. అంటే వీటికి చట్టపరిధిలో విలువను ఖరారు చేయాలి. లిస్టెడ్ కంపెనీల షేర్లు అయితే బహుమతి ఇచ్చే నాటికి ఉన్న ధరను పరిగణనలోకి తీసుకుంటారు. భూమి, ఫ్లాట్, ప్లాట్ తదితర స్థిరాస్తిని రూపాయి కూడా తీసుకోకుండా బహుమతి కింద ఇస్తే.. ఆ ప్రాపర్టీ స్టాంప్ డ్యూటీ విలువను పరిగణనలోకి తీసుకుంటారు. ఒకవేళ స్థిరాస్తిని (భూమి/భవనం) ఉచితంగా కాకుండా, మార్కెట్ విలువ కంటే తక్కువకు బహుమతి కింద ఇచ్చారని అనుకుందాం. అటువంటప్పుడు స్వీకర్త చెల్లించిన మొత్తం, స్టాంప్ డ్యూటీ విలువ నుంచి తీసివేసిన తర్వాత, దాని విలువ రూ. 50,000 కంటే ఎక్కువ ఉంటే అప్పుడు మొత్తం స్టాంప్ డ్యూటీలో 10 శాతాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఉదాహరణకు ఎక్స్ అనే వ్యక్తి వై అనే వ్యక్తికి రూ.10 లక్షల ప్రాపర్టీని రూ. 5లక్షలు తీసుకుని బహుమతి కింద ఇచ్చారని అనుకుందాం. ఆ ప్రాపర్టీ స్టాంప్ డ్యూటీ విలువ రూ.8 లక్షలు ఉంది. ఈ కేసులో మార్కెట్ విలువ రూ.8 లక్షల నుంచి, స్వీకర్త చెల్లించిన రూ.5 లక్షలు మినహాయించగా, మిగిలిన రూ.3లక్షలు.. రూ.50,000 పరిమితిని దాటింది. కనుక ఈ కేసులో స్టాంప్ ట్యూటీ విలువ రూ.8 లక్షల్లో 10 శాతం అంటే.. రూ.80,000పై పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఇక ఆభరణాలు, పెయింటింగ్‌లు, శిల్పాలు తదితర చరాస్తులను బహమతిగా పొందినప్పుడు, వాటి ఫెయిర్ మార్కెట్ ప్రైస్ (సహేతుక మార్కెట్ ధర) రూ.50,000 మించితే, ఆ మొత్తంపై పన్ను చెల్లించాలి. ఒకవేళ సహేతుక మార్కెట్ ధర కంటే తక్కువ మొత్తానికి కానుకగా పొందారనుకుంటే.. అప్పుడు సహేతుక మార్కెట్ ధర నుంచి, చెల్లించిన ధర తీసివేయగా మిగిలిన వ్యత్యాసంపై పన్ను చెల్లించాలి. స్థిరాస్తిని రూపాయి కూడా చెల్లించకుండా ఉచిత బహమతిగా పొందితే, విడిగా ప్రతి లావాదేవీకి రూ.50,000 పరిమితి వర్తిస్తుందని ఆదాయపన్ను శాఖ జారీ చేసిన ఎఫ్ఏక్యూ స్పష్టం చేస్తుంది. దీని ఆధారంగా ఎక్స్ అనే వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో మూడు స్థిరాస్తులను బహమతిగా స్వీకరించాడని అనుకుందాం. విడిగా ప్రతి ప్రాపర్టీ స్టాంప్ డ్యూటీ విలువ రూ.50,000 మించి లేదు. ఇలాంటప్పుడు పన్ను చెల్లించాల్సిన బాధ్యత ఏర్పడదు. హెచ్‌యూఎఫ్‌లకు కూడా ఇదే వర్తిస్తుంది. గిఫ్ట్ ద్వారా ఆదాయం..→ నామకరణం, ఇతర సందర్భాల్లో పిల్లల పేరిట కూడా బహమతులు సంక్రమిస్తుంటాయి. అ లాంటి బహుమతులపై వచ్చే ఆదాయం వారి తల్లిదండ్రుల వార్షిక ఆదాయానికి కలుస్తుంది. → కొంత మంది పన్ను భారం తప్పించుకోవచ్చన్న ఉద్దేశంతో.. ప్రాపర్టిపై తమకు వస్తున్న అద్దె ఆదాయాన్ని తమ పిల్లలు లేదా మనవళ్లు/మనవరాళ్లకు (బంధువులు) ఏ నెలకానెల బహుమతి కింద ఇచ్చేస్తుంటారు. చట్టం దీన్ని బహుమతిగానే పరిగణిస్తుంది. కానీ, దీనికంటే ముందు బహుమతిగా ఇస్తున్న వ్యక్తి వార్షిక ఆదాయానికి అద్దె ఆదాయం కలుస్తుందని మర్చిపోవద్దు. అంటే చట్ట ప్రకారం సంబంధిత అద్దె ఆదాయాన్ని తమ వార్షిక రిటర్నుల్లో చూపించి, పన్ను పరిధిలోకి వస్తే పన్ను చెల్లించాల్సిందే. → తల్లిదండ్రులు కొందరు తమ పిల్లల పేరిట బ్యాంక్ ఖాతా తెరిచి అందులో నగదు డిపాజిట్ చేస్తుంటారు. తల్లిదండ్రులు తమ ఆదాయంపై పన్ను చెల్లిస్తారు. కానీ, ఇలా మైనర్ పేరిట చేసిన డిపాజిట్‌పై వచ్చే ఆదాయం సంబంధిత తల్లితండ్రి లేదా సంరక్షకుల వార్షిక ఆదాయానికి కలుస్తుంది. డిపాజిట్‌ను బహమతిగా చూపించినప్పటికీ.. చిన్నారులు తల్లిదండ్రుల సంరక్షణలోనే ఉంటారు. వారికి ఏ విధమైన ఆదాయం ఉండదు. కనుక ఆ బహమ తులపై ఆదాయం వారి తల్లిదండ్రుల ఆదాయానికే కలుస్తుంది. → ఒకవేళ ప్రత్యేక నైపుణ్యాలు, మరేదైనా స్టార్టప్ రూపంలో చిన్నారులు సంపాదిస్తుంటే వారి వ్యక్తిగత ఆదాయమే అవుతుంది. అలాంటి కేసుల్లో చిన్నారుల తరఫున తల్లిదండ్రులు రిటర్నులు వేసి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల ఆదాయానికి కలిసే విషయంలో.. దంపతులు ఇద్దరూ సంపాదనా పరులైతే వారి లో ఎక్కువ ఆర్జించే వారికి ఇది కలుస్తుంది. → ఉదాహరణకు షేర్లను పిల్లలకు గిఫ్ట్‌గా ఇస్తే, వాటిపై వచ్చే డివిడెండ్ తల్లిదండ్రుల ఆదాయానికే కలుస్తుంది. యాజమాన్యం నుంచి బహమతులు మన దేశంలో ప్రైవేటు యాజమాన్యాలు తమ ఉద్యోగులకు పలు సందర్భాల్లో బహమతులు ఇస్తుంటాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో ఇచ్చే బహుమతుల విలువ రూ.5,000 మించకపోతే, దానిపై పన్ను చెల్లించక్కర్లేదు. నగదు, గిఫ్ట్ వోచర్, ఈ–వోచర్, ప్రీపెయిడ్కార్డ్ ఇలా ఏ రూపంలో ఉన్నా, వాటి విలువ రూ.5,000 మించితే ఆ మొత్తం వేతన ఆదాయానికి కలిపి చూపించి, పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ‘‘ఒక ఆర్థిక సంవత్సరంలో యాజమాన్యం చెల్లించే అన్ని రకాల బహుమతుల విలువ రూ.5,000 మించితే అది పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది’’అని బీడీవో ఇండియా పార్ట్నర్ (ట్యాక్స్) ప్రీతి శర్మ తెలిపారు. ఎంత పన్ను చెల్లించాలి? ఆదాయపన్ను చట్టం ప్రకారం పన్ను మినహాయింపుల్లేని కేసుల్లో.. ఒక ఆర్థిక సంవత్సరంలో అందుకున్న కానుకల విలువను ఇతర ఆదాయం (ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్) కింద చూపించాల్సి ఉంటుంది. అంటే సంబంధిత ఆర్థిక సంవత్సరంలో వారి మొత్తం ఆదాయానికి ఇది తోడవుతుంది. శ్లాబు రేటు ప్రకారం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఒకవేళ సంబంధిత ఆర్థిక సంవత్సరంలో వారి ఆదాయం బేసిక్ పన్ను మినహాయింపు (పాత విధానంలో రూ.2.5 లక్షలు, కొత్త విధానంలో రూ.3 లక్షలు) పరిధిలోనే ఉండి, బహుమానం విలువ కలిపిన తర్వాత కూడా బేసిక్ పరిమితి దాటకపోతే.. అప్పుడు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం రాదు. ఒక్కో బహుమతికి విడిగా రూ.50,000 పరిమితి వర్తించదని, ఒక ఆర్థిక సంవత్సరంలో అందుకున్న అన్ని బహుమతులకు (నిబంధనల మేరకు) రూ.50,000 పరిమితి వర్తిస్తుందని మనీఎడ్యుసూ్కల్ వ్యవస్థాపకుడు ఆర్ణవ్ పాండా తెలిపారు. – సాక్షి, బిజినెస్‌డెస్క్ -
ఆర్బీఐ కొత్త రూల్: ఎంతో మేలు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI).. బ్యాంక్ ఖాతాదారులకు ఎప్పటికప్పుడు మెరుగైన సేవలను అందించడానికి కావలసిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే.. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలలో పెద్ద సంఖ్యలో డిపాజిట్ ఖాతాలకు నామినీలు లేదని వెల్లడించింది. తప్పనిసరిగా ఖాతాదారులకు నామినీలు ఉండాలని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది.మరణించిన డిపాజిటర్ల ఖాతాలో డబ్బు ఉన్నట్లయితే.. దానిని తీసుకోవడానికి కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీనిని నివారించడానికి ఆర్బీఐ ఈ కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే ఉన్న ఖాతాదారులు లేదా కొత్త ఖాతాదారులందరికీ.. ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలు, సేవింగ్స్ ఖాతాలు, సేఫ్టీ లాకర్లు వంటివి ఉన్నట్లయితే వారందరికీ నామినీలు ఉండేలా చూడాల్సిందిగా ఆర్బీఐ చెప్పింది.అర్హత కలిగిన వ్యక్తి నామినీ అయితే.. మరణించిన వ్యక్తి పొదుపు ఖాతా, ఫిక్స్డ్ డిపాజిట్ లేదా సేఫ్ డిపాజిట్ లాకర్ల నుంచి నిధులను ఎటువంటి సమస్య లేకుండానే బదిలీ చేయవచ్చు.ఖాతాదారులు.. నామినీలను కలిగి ఉన్నారా లేదా అనే విషయాలను గురించి బ్యాంకులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాలి. మార్చి 31 నుంచి ప్రతి మూడు నెలలకు ఓ సారి.. దీనికి సంబంధించిన వివరాలను కూడా తెలియజేయాలని ఆర్బీఐ ఆదేశించింది. డిపాజిట్ అకౌంట్లకు సంబంధించిన దరఖాస్తు పత్రాలలో కూడా.. నామినీ పేరును తెలియజేసేలా, మార్పులు చేయాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ సూచించింది.నామినీ ఎవరు?ఖాతాదారుడు మరణిస్తే.. తమ నిధులను ఎవరికి బదిలీ చేయాలనుకుంటున్నాడో అతడే.. నామినీ. కాబట్టి అకౌంట్ ఓపెన్ చేసే సమయంలో నామినీ పేరును చేర్చవచ్చు లేదా అకౌంట్ ఓపెన్ చేసిన తరువాత అయినా నామినీ పేరును యాడ్ చేసుకోవచ్చు.ఇదీ చదవండి: క్రెడిట్ కార్డుతో అద్దె కడుతున్నారా.. ఈ విషయాలు తెలుసా? -
క్రెడిట్ కార్డు పోయిందా? బ్లాక్ చేయండిలా..
మారుతున్న జీవనశైలికి అనుగుణంగా క్రెడిట్‌కార్డుల వాడకం అధికమవుతోంది. అయితే ప్రయాణాల్లోనో లేదా ఇతర సందర్భాల్లోనో కార్డులను పోగోట్టుకోవడం సహజం. ఇలాంటి సమయాల్లో చాలామంది ఏ చర్యలు తీసుకోకుండా అలాగే వదిలేస్తూంటారు. ఆ కార్డు స్కామర్ల చేతికి చిక్కితే మాత్రం చాలా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా సందర్భాల్లో కార్డులు కోల్పోతే వెంటనే బ్యాంకు అధికారులకు తెలియజేయాలి. వాటిని బ్లాక్ చేయించి కొత్తగా కార్డు కోసం దరఖాస్తులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎస్బీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులు ఒకవేళ తమ కార్డు కోల్పోతే ఎలా బ్లాక్ చేయాలో కింద తెలుసుకుందాం.ఎస్బీఐ కార్డ్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలి. 39 02 02 02 (స్థానిక ఎస్టీడీ కోడను ముందు జత చేయాలి) లేదా 1860 180 1290కు డయల్ చేయాలి. పోయిన లేదా దొంగిలించబడిన కార్డు వివరాలతో ఐవీఆర్ సూచనలను పాటించాలి.ఎస్ఎంఎస్ ద్వారా కూడా కార్డును బ్లాక్ చేయవచ్చు. రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు నుంచి 5676791కు BLOCKXXXX (XXXX స్థానంలో కార్డు నెంబరు చివరి నాలుగు అంకెలు ఉండేలా చూసుకోవాలి)అని టైప్ చేసి టెక్ట్స్ మెసేజ్ చేయవచ్చు.ఎస్బీఐ కార్డ్ వెబ్సైట్ ద్వారా కూడా కార్డును బ్లాక్ చేయవచ్చు. అధికారిక వెబ్సైట్లో మాత్రమే లాగిన్ అవ్వాలి.ఎన్‌బీఐ కార్డ్స్ వెబ్సైట్(https://www.sbicard.com/)కు లాగిన్ అవ్వాలి.లాగిన్ చేసిన తర్వాత హోం పేజీ ఎడమవైపున ఉన్న ‘రిక్వెస్ట్స్’ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.‘రిపోర్ట్ లాస్ట్/ స్టోలెన్ కార్డ్’ ఆప్షన్ ఎంచుకోవాలి.కార్డును బ్లాక్ చేయడానికి ప్రాంప్ట్‌లను అనుసరించాలి.ఇదీ చదవండి: కొత్త ఉద్యోగం కోసం నిపుణులు పడిగాపులుఎస్బీఐ కార్డ్ మొబైల్ యాప్ ద్వారా బ్లాక్ చేయవచ్చు.ఎస్బీఐ కార్డ్ మొబైల్ యాప్‌లోకి లాగిన్ అవ్వాలి.హోం పేజీ ఎగువ ఎడమ వైపు కార్నర్లో మెనూ మీద ట్యాప్ చేయాలి.‘సర్వీస్ రిక్వెస్ట్’ ఆప్షన్ ఎంచుకోవాలి.‘లాస్/ స్టోలెన్ రిపోర్ట్’ ఆప్షన్ ఎంచుకోవాలి.కార్డ్ నెంబరు ఎంచుకుని రెక్వెస్ట్‌ను సబ్మిట్ చేయాలి.పైన చెప్పిన ఏ పద్ధతులు మీకు అందుబాటులో లేకపోతే వెంటనే మీ దగ్గర్లోని ఎస్బీఐ బ్రాంచ్‌ను సంప్రదించి సమస్యను తెలియజేయాలి. కార్డును బ్లాక్ చేసిన తరువాత ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా ధ్రువీకరణ అందుతుంది. -
ఈపీఎఫ్‌వో కొత్త రూల్.. కంపెనీ హెచ్ఆర్తో పనిలేదు!
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తమ 8 కోట్ల మంది క్రియాశీలక చందాదారుల కోసం కీలక సంస్కరణలు తీసుకువస్తోంది. వచ్చే జూన్ నుండి కేవైసీ (KYC) ధ్రువీకరణ కోసం స్వీయ-ధ్రువీకరణ సదుపాయాన్ని అమలు చేయబోతోంది. దీంతో కంపెనీ హెచ్ఆర్ ఆమోదంతో పనిలేకుండానే ఉద్యోగులు తమ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. తద్వారా ఈపీఎఫ్ ఖాతాల నిర్వహణలో సభ్యులకు వేగంతోపాటు ఎక్కువ సౌలభ్యం లభిస్తుంది.కేవైసీ ప్రక్రియ సులభతరంఇప్పటి వరకు సభ్యుల కేవైసీ వివరాలను వారి యూఏఎన్ (UAN) నంబర్ల ఆధారంగా ప్రామాణీకరించే బాధ్యత కంపెనీకు ఉండేది. ఇప్పుడు కంపెనీల ఆమోదంతో పని లేకుండా స్వీయ-ధ్రువీకరణ సదుపాయం ద్వారా సభ్యులు తామే ధ్రువీకరిస్తే సరిపోతుంది. దీంతో కంపెనీ షట్-డౌన్ మోడ్‌లోకి వెళ్లినప్పుడు లేదా సకాలంలో స్పందించడంలో విఫలమైనప్పుడు ప్రతిసారీ తలెత్తే ఇటువంటి ఆలస్యం తగ్గే అవకాశం ఉంది. అలాగే కేవైసీ ఫార్మాలిటీల అసంపూర్తి కారణంగా జరిగే ఈపీఎఫ్ క్లెయిమ్‌ల తిరస్కరణలు కూడా తగ్గుతాయని భావిస్తున్నారు.సభ్యులకు సేవలను మెరుగుపరచడానికి చేపడుతున్న ఈపీఎఫ్‌వో 3.0 (EPFO 3.0) ప్రాజెక్ట్‌లో స్వీయ-ధ్రువీకరణ సదుపాయం కూడా భాగం. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్‌లతో ఈపీఎఫ్‌వో మెంబర్షిప్ బేస్ 10 కోట్లకు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్న తరుణంలో ఈ డిజిటల్ అప్‌గ్రేడ్ సహాయం అందించనుంది. ఇప్పటికే సంస్థ ఐటీ వ్యవస్థలు బలంగా ఉన్న క్రమంలో ఇక సభ్యులకు వేగవంతమైన, సమర్థవంతమైన సేవలను అందించడంపై ఈపీఎఫ్‌వో దృష్టి సారిస్తోంది.క్లెయిమ్ పెట్టకుండానే ఉపసంహరణబ్యాంక్ ప్లస్ ఈపీఎఫ్‌వో 3.0 సిస్టమ్‌లో అందుబాటులోకి రానున్న మరో ముఖ్యమైన వెసులుబాటు క్లెయిమ్‌కు దరఖాస్తు చేయకుండానే నిధులను ఉపసంహరించుకోవడం. దీనికి సంబంధించిన వ్యవస్థను వచ్చే మార్చి లోపు ప్రవేశపెట్టాలని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. దీని కింద చందాదారు తన ఈపీఎఫ్ కార్పస్ నుండి క్లెయిమ్ దాఖలు చేయకుండానే నేరుగా మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇది 2025-26 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉంది.ఈపీఎఫ్‌వో చందాదారులు కష్టపడి సంపాదించి దాచుకున్న డబ్బును ఆలస్యం, అవాంతరాలు లేకుండా సులభంగా డ్రా చేసుకునేలా అవకాశం కల్పిస్తామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఇటీవల హామీ ఇచ్చారు. ఈపీఎఫ్‌వో అందించే సేవల ఆధునీకరణ దిశగా, లక్షలాది మంది కార్మికులకు ఆర్థిక సాధికారత కల్పించే దిశగా ఈ సంస్కరణలు ఒక ముఖ్యమైన దశను సూచిస్తాయి. -
పాత పన్ను విధానం తొలగింపు..?
కేంద్ర ప్రభుత్వం 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరిలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో పాత వ్యక్తిగత ఆదాయపు పన్ను(Income Tax) విధానంపై కీలక నిర్ణయాలు తీసుకోనుందని సమాచారం. క్రమంగా ఈ పాత పన్ను(Old Tax) విధానాన్ని తొలగించే ప్రకటనలు చేయాలని ప్రభుత్వ యోచిస్తోంది. కొత్త పన్ను(New Tax) విధానాన్నే పన్నుదారుల ఎంపికగా మార్చే లక్ష్యంతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రోడ్ మ్యాప్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటివరకు పన్నుదారులు పాత, కొత్త విధానాల్లో ఏదైనా ఎంచుకునే వీలుంది. ప్రభుత్వం ఒకవేళ దీనిపై నిర్ణయం తీసుకుంటే ఇకపై ఈ వెసులుబాటు ఉండదని నిపుణులు చెబుతున్నారు.2021 ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టిన కొత్త పన్ను విధానం తక్కువ పన్ను రేట్లను అందిస్తుంది. కానీ పాత పన్ను విధానంలో ఉన్నన్ని మినహాయింపులు మాత్రం కొత్త విధానంలో లేవని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పటికే 72% పైగా పన్ను చెల్లింపుదారులు కొత్త విధానాన్ని అనుసరిస్తున్నారు. ఈ విధానంలో ప్రభుత్వం తీసుకొచ్చిన తక్కువ రేట్లకు పన్నుదారులు ఆకర్షితులయ్యారు. వీరిని మరింత ప్రోత్సహించడానికి కొత్త శ్లాబ్‌లను తీసుకురావాలని ప్రభుత్వం వద్ద ప్రతిపాదనలున్నాయి.ఇదీ చదవండి: మీకు వచ్చే పెన్షన్ తెలుసుకోండిలా..ప్రస్తుతం కొత్త విధానంలో ఏడాదికి రూ.3 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు ఉంది. ఈ పరిమితిని రూ.4 లక్షలకు పెంచే అవకాశం ఉంది. మొదటి శ్లాబుగా ఉన్న రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల పరిధిని రూ.4 లక్షల నుంచి రూ.7 లక్షలకు సర్దుబాటు చేయవచ్చు. కొత్త విధానం చాలా మందికి అనుకూలంగా ఉన్నప్పటికీ, ఇంటి అద్దె భత్యం, పెట్టుబడులు, గృహ రుణ వడ్డీ వంటి వివిధ మినహాయింపులు, వాటి వల్ల కలిగే ప్రయోజనం పొందే అవకాశం పాత విధానంలో మెరుగ్గా ఉండేదనే వాదనలున్నాయి. -
మీకు వచ్చే పెన్షన్ తెలుసుకోండిలా..
పదవీ విరమణ తర్వాత ఆర్థిక భరోసా ఇచ్చే వాటిలో పెన్షన్ ప్రధానపాత్ర పోషిస్తుంది. పెన్షన్(Pension) లెక్కలకు సంబంధించి చాలామందికి చాలా ప్రశ్నలుంటాయి. ప్రైవేట్ సంస్థలో 10 సంవత్సరాలుగా పనిచేస్తుంటే పెన్షన్ ఎంత వస్తుందో ఈ కథనంలో తెలుసుకుందాం. అయితే అంతకంటే ఎక్కువ అనుభవం ఉంటే వచ్చే పెన్షన్ అధికంగా ఉంటుంది. అందుకు భిన్నంగా తక్కువ సర్వీసు ఉంటే తక్కువ పెన్షన్ అందుతుందని గుర్తుంచుకోవాలి.ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS)ను నిర్వహిస్తుంది. ఉద్యోగుల పెన్షన్ పథకానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు ముందుగా తెలిసుండాలి.పెన్షన్‌కు అర్హత పొందాలంటే కనీసం 10 ఏళ్ల సర్వీసు ఉండాలి.ఉద్యోగికి 58 సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచి పెన్షన్ విత్‌డ్రా చేసుకోవచ్చు.పెన్షన్ విధానంలో కనీసం నెలవారీ మొత్తం రూ.1,000 అందుతుంది.గరిష్ఠంగా అందే పెన్షన్ రూ 7,500.ఎలా లెక్కిస్తారంటే..ఈపీఎస్ కింద పెన్షన్ పొందాలంటే కనీసం 10 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకుని 58 ఏళ్లకు చేరుకుని ఉండాలి.పెన్షన్ తీసుకోవాలనుకునే సమయం నుంచి గత 60 నెలల సగటు జీతం (నెలకు గరిష్టంగా రూ.15,000)ను పరిగణనలోకి తీసుకుంటారు.ఈపీఎస్‌కు మీరు కంట్రిబ్యూషన్ చేసిన మొత్తం సంవత్సరాల సంఖ్యను పెన్షనబుల్ సర్వీసు అంటారు. కింది ఫార్ములా ఉపయోగించి పెన్షన్ లెక్కిస్తారు.నెలవారీ పెన్షన్ = పెన్షనబుల్ జీతం(రూ.15,000కు మించకుండా 60 నెలల సరాసరి)×పెన్షనబుల్ సర్వీస్/70ఉదాహరణకు, మీ పెన్షనబుల్ జీతం రూ.15,000, పెన్షనబుల్ సర్వీస్ 10 సంవత్సరాలు అయితే నెలవారీ పెన్షన్ కింది విధంగా ఉంటుంది.నెలవారీ పెన్షన్=15,000×10/70=2,143ఇదీ చదవండి: కాలర్ ఐడీ ఫీచర్‌ను వెంటనే అమలు చేయాలని ఆదేశాలుపదేళ్లలో విభిన్న కంపెనీలు మారితే..పెన్షన్ పొందాలంటే పదేళ్లు ఒకే కంపెనీలో పని చేయాలనే నిబంధనేం లేదు. పదేళ్లలోపు ఈపీఎస్ సర్వీసు అందుబాటులో ఉన్న విభిన్న కంపెనీల్లో పని చేసినా పెన్షన్ పొందడానికి అర్హులు అవుతారు. అయితే, మీ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (యూఏఎన్) మాత్రం యాక్టివ్‌గా ఉండాలి. కేవైసీ వివరాలను అప్డేట్ చేయాలి. ఉద్యోగం మారినప్పుడు మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ కొత్త యజమాన్యం పీఎఫ్ ఖాతాకు బదిలీ అవుతుంది. అయితే ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్) బ్యాలెన్స్ మీ మునుపటి యజమాని వద్ద ఉంటుంది. అయినప్పటికీ సర్వీస్ వివరాలు బదిలీ చేస్తారు. దాంతో మొత్తం సర్వీసును పరిగణలోకి తీసుకుని ట్రాక్ చేస్తారు. -
సులభంగా రూ.కోటి సంపాదన!
స్టాక్ మార్కెట్ అంటే తీవ్ర ఒడిదొడుకులు సహజం. ఒక్క రోజులో సెన్సెక్స్, నిఫ్టీ(NIFTY) సూచీలు భారీగా నష్టపోతాయి. మరో రోజు అవి అంతే వేగంతో పైకి దూసుకుపోతాయి. ఇది సహజమే. దీర్ఘకాలిక లక్ష్యాలతో మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారికి ఇలా సూచీల్లోని ఒడిదొడుకుల ప్రయోజనమే కలిగిస్తాయి. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానం (SIP) చేసేవారికి ఇదో మంచి అవకాశంగా భావించాలి. మార్కెట్ ఎటు వైపు పయనిస్తున్నా మదుపు చేస్తూ వెళ్లడమే వీరికి లాభాలు పెరిగేలా చేస్తుంది. అసలు సిప్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.మార్కెట్ భారీగా పెరిగినప్పుడు ఒకేసారి పెద్ద మొత్తం మదుపు చేయడం సరికాదు. అలాగని అలా పెరుగుతూ ఎక్కడి వరకు వెళ్తుందో స్పష్టంగా చెప్పలేం. ఒకవేళ తగ్గితే నష్టపోతామనే భయాలుంటాయి. కానీ సిప్ చేసేవారికి అలాంటి భయాలు ఉండకూడదు. ప్రతినెలా నిర్ణీత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లడం ద్వారా మార్కెట్ హెచ్చుతగ్గుల నుంచి లాభాలు అందుకోవచ్చు. ఇదే సిప్ ఉద్దేశం. కొద్ది మొత్తంతో ప్రారంభించి, ఏటా కొంత శాతం పెంచుకుంటూ వెళ్తే తక్కువ సమయంలోనే పెద్ద మొత్తంలో డబ్బు కూడబెట్టవచ్చు.లక్ష్యంపై స్పష్టతఅసలు ఏ ఇన్వెస్ట్ చేసినా అది మన ఆర్థిక లక్ష్యాలను చేరుకునేలా ఉండాలి. ఏ సమయంలో మనకు ఆ డబ్బు అవసరమో స్పష్టత ఉండాలి. దాన్ని సాధించేందుకు ఏం చేయాలి? అనే స్పష్టమైన ప్రణాళికతోనే సిప్‌ను ప్రారంభించాలి. మీరు ఇప్పుడు పెట్టుబడి పెట్టే లక్ష్యాలు కాలక్రమంలో మారిపోవచ్చు. మరింత అధిక మొత్తంలో డబ్బు అవసరం కావచ్చు. చాలామంది అనేక పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తారు. కానీ, కొన్నిసార్లు తమ అవసరానికి సరిపడా డబ్బు అందుకోకపోవచ్చు. కాబట్టి భవిష్యత్తు ప్రణాళికలు, లక్ష్యాలపై స్పష్టమైన వైఖరి ఉండాలి. నష్టభయం, రాబడి అంచనాలు, ఆర్థిక లక్ష్యాలు, వ్యవధి ఇలా పలు అంశాలను పరిశీలించాకే తగిన పథకాన్ని ఎంచుకోవాలి. ఏ సమయంలో మదుపు చేస్తున్నాం అనేదానికంటే.. ఎంత కాలం కొనసాగుతున్నాం అనేది ముఖ్యం.కోటి సులభంగానే..మ్యూచువల్ ఫండ్ల(Mutual Funds)లో సిప్ ద్వారా రూ.కోటిని జమ చేయడం కష్టమేమీ కాదు. కానీ, అందుకు దీర్ఘకాలం మదుపు చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు నెలకు రూ.2,000తో సిప్ చేసిన ఫండ్ కనీసం 15 శాతం సగటు వార్షిక రాబడి వస్తుందని భావిస్తే రూ.కోటికి మించి జమ అయ్యేందుకు వ్యవధి 28 ఏళ్లు. అదే స్టెప్అప్(ఏటా సెప్ పెంచుకుంటూ వెళ్లే పద్ధతి) ద్వారా మరింత త్వరగానే ఈ లక్ష్యాన్ని చేరవచ్చు. -
క్రెడిట్ కార్డుతో అద్దె కడుతున్నారా.. ఈ విషయాలు తెలుసా?
షాపింగ్ చేయాలన్నా..నిత్యావసరాలు కొనుగోలు చేయాలన్నా.. టికెట్ బుకింగ్స్ కోసం, ఇంటి అద్దె చెల్లించడం కోసం, ఇలా అవీ ఇవీ అని తేడా లేకుండా క్రెడిట్ కార్డును విచ్చలవిడిగా వాడేస్తున్నారు. వాడకం మంచిదే కానీ.. కొన్నిసార్లు ఆర్ధిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే క్రెడిట్ కార్డును ఉపయోగించి రెంట్ (అద్దె) కట్టడం మంచిదేనా? దీని వల్ల ఏమైనా నష్టాలు ఉన్నాయా? అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.అద్దె చెల్లించడానికి క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించడం.. రివార్డ్ పాయింట్లను కూడబెట్టుకోవడానికి లేదా క్రెడిట్ స్కోర్ పెంచుకోవడానికి మంచి వ్యూహం కావచ్చు. కానీ కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి.క్రెడిట్ కార్డుతో అద్దె చెల్లింపుప్రాసెసింగ్ ఛార్జీలు: మీరు క్రెడిట్ కార్డ్‌తో అద్దె చెల్లించినప్పుడు, కొంతమంది ఓనర్స్ లేదా ఏజెన్సీలు ప్రాసెసింగ్ ఛార్జీలను సైతం వసూలు చేస్తారు. ఈ ఛార్జి మీరు చెల్లించే అద్దెలో రెండు నుంచి మూడు శాతం వరకు ఉంటుంది.క్యాష్ అడ్వాన్స్ ఫీజు: అద్దె చెల్లింపులను సాధారణ లావాదేవీలుగా పరిగణించడానికి బదులు.. కొంతమంది క్రెడిట్ కార్డ్ జారీ చేసేవారు వాటిని క్యాష్ అడ్వాన్స్‌లుగా పరిగణిస్తారు. దీనికి సాధారణ వడ్డీ కంటే కూడా ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.గత బకాయి చెల్లింపులపై వడ్డీ: మీరు మీ క్రెడిట్ కార్డ్ బిల్లును ఎప్పటికప్పుడు చెల్లించకపోతే.. అది తప్పకుండా మీ మీద ఆర్ధిక భారం పెంచుతుంది. కాబట్టి అలాంటి సమయంలో అద్దె చెల్లిస్తే.. వడ్డీ మరింత ఎక్కువవుతుంది.క్రెడిట్ కార్డ్‌తో అద్దె చెల్లించే ముందు తెలుసుకోవసిన అంశాలుఫీజులు: అద్దె చెల్లించడానికి క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించడం వల్ల.. ప్రాసెసింగ్ ఫీజు కొంత ఎక్కువగా ఉంటుంది.వడ్డీ ఆధారిత ఫీజులు: మీరు మీ క్రెడిట్ కార్డ్ బిల్లును సకాలంలో చెల్లించకపోతే వడ్డీ ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా ఇది మీ క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్ మీద ప్రభావం చూపిస్తుంది.ఇదీ చదవండి: ఫిక్స్డ్ డిపాజిట్‌పై ఎక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంక్ ఇదే!క్రెడిట్ కార్డ్‌తో అద్దె చెల్లించడాం వల్ల లాభాలురివార్డ్లను సంపాదించవచ్చు: క్రెడిట్ కార్డ్‌తో అద్దె చెల్లిస్తే.. క్యాష్ బ్యాక్ లేదా క్రెడిట్ కార్డ్ రివార్డ్‌లను పొందవచ్చు. ఇది షాపింగ్ వంటి వాటికి ఉపయోగపడతాయి. కాబట్టి షాపింగ్ సమయంలో కొంత డబ్బు ఆదా అవుతుంది.క్రెడిట్ స్కోర్ పెంచుకోవచ్చు: క్రెడిట్ కార్డు ద్వారా అద్దె చెల్లింపులు చేయడం వల్ల.. క్రెడిట్ స్కోరును పెంచుకోవచ్చు. ఇది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది.అద్దె చెల్లించడంలో ఆలస్యం నివారించవచ్చు: చేతిలో డబ్బు లేకపోయినా.. మీరు క్రెడిట్ కార్డు ద్వారా సకాలంలో అద్దె చెల్లించవచ్చు. ఒకవేళా ఇంటి ఓనర్.. అద్దె ఆలస్యం చేస్తే విధించే ఫెనాల్టీ నుంచి తప్పించుకోవచ్చు.పేమెంట్ సెక్యూరిటీ: క్రెడిట్ కార్డు హిస్టరీ వల్ల మిమ్మల్ని ఎవరూ మోసం చేసే అవకాశం లేదు. కాబట్టి మీ చెల్లింపులకు ఇక్కడ భద్రత లభిస్తుంది. -
ఈఎంఐ ఇక మారదు! ఆర్బీఐ కీలక ఆదేశాలు
నెలవారీ సమాన వాయిదాలపై (EMI) మంజూరు చేసే అన్ని వ్యక్తిగత రుణాల్లో బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు తప్పనిసరిగా స్థిర వడ్డీ రేటు ఉత్పత్తిని అందించాల్సిందేనని ఆర్బీఐ (RBI) ప్రకటించింది. వడ్డీ రేటు ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ విధానంతో లేక ఇంటర్నల్ బెంచ్‌మార్క్ విధానంతో అనుసంధానమైనదా? అన్న దానితో సంబంధం లేకుండా అన్ని ఈఎంఐ ఆధారిత వ్యక్తిగత రుణాలకు ఇది అమలవుతుందని స్పష్టం చేసింది.రుణాన్ని మంజూరు చేసే సమయంలోనే వర్తించే వార్షిక వడ్డీ రేటు (ఏపీఆర్)ను కీలక సమాచార నివేదిక (కేఎఫ్ఎస్), రుణ ఒప్పంద పత్రాల్లో బ్యాంక్‌లు, ఇతర నియంత్రిత సంస్థలు (ఎన్బీఎఫ్సీలు)వెల్లడించాల్సి ఉంటుందని పేర్కొంది. రుణ కాల వ్యవధిలో ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ రేటు కారణంగా ఈఎంఐ/లేదా కాల వ్యవధిని పెంచేట్టు అయితే ఆ విషయాన్ని తప్పకుండా రుణగ్రహీతకు తెలియజేయాలని తెలిపింది.ప్రతి త్రైమాసికానికి ఒకసారి లోన్ అకౌంట్ స్టేట్మెంట్ను జారీ చేయాలని, అందులో అప్పటి వరకు చెల్లించిన వడ్డీ, అసలు ఎంత?, ఇంకా ఎన్ని ఈఎంఐలు మిగిలి ఉన్నాయనే సమాచారం ఉండాలని పేర్కొంది. ఈఎంఐ ద్వారా రుణాన్ని చెల్లించే వారికి స్థిర వడ్డీ రేటును లేదా కాల వ్యవధిని పెంచుకునే అవకాశం కల్పించానలి 2023 ఆగస్ట్‌లోనే బ్యాంక్‌లను ఆర్బీఐ ఆదేశించడం గమనార్హం. దీనికి సంబంధించి సందేహాలపై తాజా స్పష్టతనిచ్చింది. ఫిబ్రవరిలో ఆర్బీఐ ఎంపీసీ సమావేశంరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) పరపతి విధాన కమిటీ సమావేశం ఫిబ్రవరి 5-7 తేదీల్లో జరగనుంది. ఈ సమావేశంలో ఈసారి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కీలక వడ్డీరేట్లలో కోత విధిస్తారని పరిశ్రమల సంఘం సీఐఐ అంచనా వేసింది. ఇప్పటికే అమెరికాకు చెందిన ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్(US Fed) యూఎస్‌లో వడ్డీరేట్లను తగ్గించింది. ఈ తరుణంలో భారత్‌లోనూ వడ్డీరేట్లను తగ్గించాలనే డిమాండ్ ఉంది.ఇదీ చదవండి: ఈ క్రెడిట్ కార్డులు కనిపించవు! కానీ ఖర్చు చేయొచ్చు..ఆర్బీఐ వచ్చే ఎంపీసీ సమావేశంలో 50 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత మానిటరీ ఎంపీసీ సమావేశంలో ఆర్బీఐ నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ను 50 బేసిస్ పాయింట్లు తగ్గించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోనుందని చెబుతున్నారు. ఆర్బీఐ దేశంలో పెట్టుబడులు పెంచేలా నిర్ణయం తీసుకోవాలి. అందులో భాగంగా వడ్డీరేట్లను తగ్గించాల్సి ఉంది. -
ఫిక్స్డ్ డిపాజిట్‌పై ఎక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంక్ ఇదే!
చేతిలో డబ్బు ఉంటే.. కొందరు గోల్డ్ కొనుగోలు చేస్తారు. మరి కొందరు రియల్ ఎస్టేట్ మీద పెడతారు. ఇంకొందరు మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులుగా పెట్టి లాభాలను ఆర్జిస్తారు. ఇలా ఎన్నెన్ని పెట్టుబడి సాధనాలు ఉన్నా.. చాలా మంది చూపు మాత్రం 'ఫిక్స్డ్ డిపాజిట్' (FD) వైపు వెళ్తుంది.రిస్క్ లేకుండా వడ్డీ పొందాలంటే.. ఫిక్స్డ్ డిపాజిట్ ఉత్తమమైన మార్గం. వడ్డీ అనేది బ్యాంకులు రెండు విధాలుగా అందిస్తాయి. ఇందులో ఒకటి రెగ్యులర్, మరొకటి సీనియర్ సిటిజన్. రెగ్యులర్ కింద అందరికీ ఒకేరకమైన వడ్డీ లభిస్తుంది. కానీ సీనియర్ సిటిజన్లకు కొంత ఎక్కువ వడ్డీ లభిస్తుంది.ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకునే వ్యక్తి ముందుగానే ఏ బ్యాంక్ ఎంత వడ్డీ ఇస్తుందనే విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. చాలా బ్యాంకులు కొంతవరకు దాదాపు ఒకే విధమైన వడ్డీ రేట్లను అందిస్తున్నప్పటికీ.. 40 - 50 బేసిస్ పాయింట్ల స్వల్ప వ్యత్యాసం కూడా మీ డబ్బును పెంచడంలో సహాయపడుతుంది. మీ డబ్బును పెంచుకోవడానికి లేదా ఎక్కువ వడ్డీ పొందటానికి ఎన్ని సంవత్సలకు ఫిక్స్డ్ డిపాజిట్ చేశామన్నది సహాయపడుతుంది.ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై వివిధ ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులు వడ్డీ రేట్లు అందించే వడ్డీ రేట్లు➤హెచ్డీఎఫ్సీ బ్యాంక్: సాధారణ పౌరులకు లేదా రెగ్యులర్ వడ్డీ రేటు 7 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం➤ఐసీఐసీఐ బ్యాంక్: సాధారణ పౌరులకు లేదా రెగ్యులర్ వడ్డీ రేటు 7 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం➤యాక్సిస్ బ్యాంక్: సాధారణ పౌరులకు లేదా రెగ్యులర్ వడ్డీ రేటు 7 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం➤యెస్ బ్యాంక్: సాధారణ పౌరులకు లేదా రెగ్యులర్ వడ్డీ రేటు 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 8 శాతం➤స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI): సాధారణ పౌరులకు లేదా రెగ్యులర్ వడ్డీ రేటు 6.5 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం➤పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB): సాధారణ పౌరులకు లేదా రెగ్యులర్ వడ్డీ రేటు 6.5 శాతం, సీనియర్ సిటిజన్లకు 7 శాతం (ఈ వడ్డీ రేట్లు జనవరి 1, 2025 నుంచి అమల్లోకి వచ్చాయి).➤బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB): సాధారణ పౌరులకు లేదా రెగ్యులర్ వడ్డీ రేటు 6.8 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.4 శాతం (ఈ వడ్డీ రేట్లు అక్టోబర్ 14, 2024 నుంచి అమల్లో ఉన్నాయి).ఇదీ చదవండి: పేదోళ్లను లక్షాధికారి చేసే స్కీమ్: ఇదిగో డీటెయిల్స్బ్యాంకులలో ఫిక్స్డ్ చేయాలనుకునే ఎవరైనా.. ముందుగా మీరు ఏ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నారో, అక్కడ (బ్యాంకులో) వడ్డీ ఎంత ఇస్తున్నారనే విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. ఆ బ్యాంక్ ఇచ్చే వడ్డీని.. ఇతర బ్యాంకులతో కంపార్ చేసుకోవాలి. ఆ తరువాత మీకు నచ్చిన బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసివచ్చు. -
యూపీఐ ద్వారా క్రెడిట్ కార్డు చెల్లింపు ఎలాగంటే..
ఆన్లైన్ లావాదేవీలు పెరుగుతున్నాయి. ప్రధానంగా యూపీఐని ఎక్కువ మంది వాడుతుండడంతో, క్రెడిట్ కార్డు(credit card) వినియోగదారులు కొనుగోళ్లు చేయడానికి డిజిటల్ చెల్లింపులను ఎంచుకుంటున్నారు. తిరిగి కార్డు బిల్లులు చెల్లించేందుకు కూడా యూపీఐను ఎంచుకుంటే మరింత సులువుగా పేమెంట్స్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే యూపీఐ చెల్లింపుల కోసం క్రెడిట్ కార్డులను ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకుందాం.క్రెడిట్ కార్డును యూపీఐతో లింక్ చేయడం ఎలా?మొదటిసారి యూపీఐని ఉపయోగిస్తుంటే, డిజిటల్ చెల్లింపులు చేయడానికి, మీ క్రెడిట్ కార్డు(credit card)లను ఉపయోగించడానికి భారత్ ఇంటర్ ఫేస్ ఫర్ మనీ (BHIM) యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలి.క్రెడిట్ కార్డును యూపీఐతో జత చేయాలి. అందుకు యాప్ ఓపెన్ చేసి ‘యాడ్ పేమెంట్ మెథడ్’ విభాగానికి వెళ్లాలి.క్రెడిట్ కార్డ్ ఆప్షన్ ఎంచుకుని క్రెడిట్ కార్డ్ నంబర్, సివీవీ, ఎక్స్పైరీ తేదీ వంటి వివరాలను ఇవ్వాలి.తర్వాత మీ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌కు వన్ టైమ్ పాస్వర్డ్(ఓటీపీ) వస్తుంది. దాన్ని ఎంటర్ చేయాలి. దాంతో యూపీఐకు కార్డు లింక్ అవుతుంది.క్రెడిట్ కార్డు ఖాతాను లింక్ చేసిన తర్వాత కార్డుతో యూపీఐ ఐడీని సృష్టించాలి. యూపీఐ ఐడీ అనేది సంఖ్యలు, అక్షరాలు, స్పెషల్ సింబల్స్ కలిగిన ఒక ప్రత్యేక గుర్తింపు. మీ బ్యాంక్ ఖాతాతో లింక్ చేయబడిన ఈ ఐడీ యూపీఐ ద్వారా డబ్బు చెల్లించడానికి, స్వీకరించడానికి సహాయపడుతుంది.యూపీఐ ఐడీ చెక్ చేసుకోవడానికి యాప్‌లోని ప్రొఫైల్ సెక్షన్లోకి వెళ్లి ‘యూపీఐ ఐడీ’ని ఎంచుకోవాలి.ఇదీ చదవండి: మెటా కొంపముంచిన ఆ ఒక్క నిర్ణయంక్రెడిట్ కార్డు చెల్లింపులు చేయడం ఎలా?క్రెడిట్ కార్డు ద్వారా యూపీఐ చెల్లింపులు చేయడానికి, క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. లేదా ‘పే ఫోన్ నంబర్’ లేదా ‘పే కాంటాక్ట్స్’ వంటి ఆప్షన్‌ను ఎంచుకోవాలి.తర్వాత యూపీఐ ఐడీని ఎంటర్ చేయాలి. యాప్ క్యూఆర్ కోడ్, ఫోన్ నంబర్ లేదా కాంటాక్ట్ నంబర్‌ను ధ్రువీకరించిన తర్వాత, బదిలీ చేయాల్సిన మొత్తాన్ని నమోదు చేయాలి.తర్వాత చెల్లింపులు చేయడానికి క్రెడిట్ కార్డును ఎంచుకోవాలి.యూపీఐ పిన్ ఎంటర్ చేసి లావాదేవీ(UPI payments)ని పూర్తి చేయాలి.యాప్‌లో సంబంధిత చెల్లింపు ఎంపికల్లో ‘సెల్ఫ్ ట్రాన్స్ఫర్’ను కూడా ఎంచుకోవచ్చు. ఇది ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు డబ్బును బదిలీ చేయడానికి అనుమతిస్తుంది. -
అపోహలు వీడితేనే మంచి స్కోరు
ఆర్థిక అవసరాలు నిత్యం పెరుగుతున్నాయి. వాటిని తీర్చుకునేందుకు చాలామంది రుణాలు తీసుకుంటున్నారు. ఆర్థిక సంస్థలు రుణాలపై విధించే వడ్డీరేట్లు కూడా భారీగా ఉన్నాయి. మంచి క్రెడిట్ స్కోరు సొంతం చేసుకుంటే తక్కువ వడ్డీకే రుణాలు పొందే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మంచి స్కోరు(CIBIL score)ను సాధించాలంటే దీనిపై ఉన్న అపోహలు వీడాలని సూచిస్తున్నారు.ఉద్యోగంలో చేరిన కొన్ని నెలలకు సాలరీ ఆధారంగా క్రెడిట్ కార్డు(Credit Card) ఆఫర్ ఉందని ఫోన్లు వస్తుంటాయి. దాంతో చాలామంది క్రెడిట్‌కార్డును తీసుకుంటున్నారు. తొలి కార్డును సంపాదించడమే కొంత కష్టం. ఆ తర్వాత కార్డు బిల్లులు సకాలంలో చెల్లిస్తే, ఇతర బ్యాంకులు, ఆర్థిక సంస్థలు క్రెడిట్ స్కోరును ఆధారంగా చేసుకుని తమ క్రెడిట్ కార్డులు ఇస్తామంటూ ముందుకు వస్తాయి. అయితే క్రెడిట్ స్కోరును పెంచుకునే దశలో చాలామందికి కొన్ని సందేహాలున్నాయి. వాటిపై స్పష్టత ఉంటే స్కోరు దూసుకెళ్లేలా చేయవచ్చు.ఆదాయం అవసరమా..?క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉండాలంటే రాబడి బావుండాలని అనుకుంటారు. కానీ, ఆదాయంతో సంబంధం ఉండదు. ఏటా రూ.6 లక్షలు ఆదాయం ఉన్నవారికి మంచి క్రెడిట్ స్కోరు ఉండొచ్చు. ఏటా రూ.20 లక్షల ఆదాయం(Income) ఉన్నవారి స్కోరు పేలవంగా ఉండొచ్చు. వారు గతంలో తీసుకున్న రుణాలు, వాటి చెల్లింపులు సరళి ఎలా ఉందనే దానిపై ఇది ఆధారపడుతుంది. ఆదాయంతో సంబంధం లేకుండా సకాలంలో బిల్లులు చెల్లించడం, తక్కువ క్రెడిట్ వినియోగం వంటివి స్కోరు పెరిగేందుకు దోహదపడుతాయి.కార్డును పూర్తిగా వాడవచ్చా..?క్రెడిట్ కార్డు పరిమితి పూర్తిగా వాడలేదు కదా, స్కోరు పడిపోయిందనే సందేహం వ్యక్తం చేస్తారు. నిజానికి కార్డు మొత్తం పరిమితి మేరకు వినియోగిస్తే స్కోరుపై ప్రభావం పడుతుంది. ఉదాహరణకు మీ క్రెడిట్ కార్డు లిమిట్(Card Limit) రూ.1 లక్ష అనుకుందాం. మీరు అందులో సుమారు 40 శాతం అంటే రూ.40,000 వినియోగిస్తే మేలు. లిమిట్ ఉందని రూ.90,000 వరకు లిమిట్ వినియోగిస్తే మొదటికే మోసం వస్తుంది. ఏకమొత్తంలో అధికంగా క్రెడిట్ కార్డు వాడితే స్కోరు తగ్గే ప్రమాదం ఉంది.పాత కార్డులను క్లోజ్ చేయాలా..?గతంలో వాడి, ప్రస్తుతం వాడకుండా ఉన్న కార్డులను క్లోజ్ చేస్తే స్కోరు పెరుగుతుందనే వాదనలున్నాయి. ఇందులో నిజం లేదు. గతంలో మీరు వాడిన కార్డులపై క్రెడిట్ హిస్టరీ జనరేట్ అవుతుంది. మీరు కార్డు క్లోజ్ చేస్తే ఆ హిస్టరీ కూడా డెలిట్ అవుతుంది. సుధీర్ఘ క్రెడిట్ హిస్టరీ ఉంటే స్కోరు పెరిగేందుకు అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: ‘పెండింగ్ సబ్సిడీలను విడుదల చేయాలి’స్కోరు పెరగాలంటే..గతంలో తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించాలి.సమయానికి ఈఎంఐ చెల్లించకపోతే క్రెడిట్ స్కోర్ తగ్గే అవకాశం ఉంటుంది.రుణాలు తీసుకునే ముందు అన్ని తరహా లోన్స్‌కు ప్రాధాన్యమివ్వాలి. సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ రుణాల మధ్య బ్యాలెన్స్ పాటించాలి. హోమ్ లోన్స్, కారు లోన్స్‌ను సెక్యూర్డ్ లోన్స్గా పరిగణిస్తారు. పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ లోన్స్(Loans)ను అన్సెక్యూర్డ్ లోన్స్గా భావిస్తారు. ఇలా మీరు సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ లోన్స్‌కు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల బ్యాంకులు మంచి క్రెడిట్ రేటింగ్ ఇస్తాయి.క్రెడిట్ కార్డు లిమిట్‌ను పూర్తిగా ఉపయోగించొద్దు. కార్డు లిమిట్లో కేవలం 30-40 శాతం మాత్రమే ఉపయోగించాలి. ఈ లిమిట్ కన్నా ఎక్కువగా ఉపయోగిస్తే క్రెడిట్ స్కోరుపై ప్రతికూల ప్రభావం పడుతుంది.ఎదుటివారు తీసుకునే రుణాలకు గ్యారెంటీగా ఉండకూడదు. ఎందుకంటే అవతలి వ్యక్తి ఏదైనా పరిస్థితుల్లో రుణం చెల్లించకుండా డీఫాల్ట్ అయితే గ్యారెంటీ మీరు కాబట్టి మిమ్మల్ని చెల్లించమంటారు. ఆ సమయానికి డబ్బు సమకూరకపోతే అది మీ సిబిల్ స్కోరుపై ప్రభావం చూపిస్తుంది.క్రెడిట్‌కార్డు బిల్లు చెల్లించేప్పుడు వీలైతే రెండు దఫాలుగా పే చేయండి. ఉదాహరణకు మీ బిల్లు రూ.12000 అనుకుందాం. పేమెంట్ తేదీ 15 నుంచి 30వ తేదీ వరకు ఉందనుకుందాం. ఈ 15 రోజుల్లో ఒకసారి రూ.6000 మరోసారి మిగిలిన రూ.6000 చెల్లించండి. దాంతో మీ పేమెంట్ రెండుసార్లు రికార్డు అవుతుంది. ఫలితంగా క్రెడిట్‌స్కోరు పెరిగే అవకాశం ఉంటుంది. -
తగ్గనున్న ఈఎంఐ.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గుడ్‌న్యూస్
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఎంపిక చేసిన లోన్ కాలపరిమితి కోసం తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR)లో 5 బేసిస్ పాయింట్ల (బీపీఎస్) వరకు తగ్గింపును ప్రకటించింది. జనవరి 7 నుండి అమలులోకి వచ్చిన సవరించిన రేట్లు ఇప్పుడు 9.15 శాతం నుంచి 9.45 శాతం మధ్య ఉంటాయి.ఎంసీఎల్ఆర్ తగ్గింపు ద్వారా రుణగ్రహీతలకు వారి రుణాలపై వడ్డీ రేట్లు తగ్గుతాయి. ఫలితంగా ఎంసీఎల్ఆర్తో అనుసంధానమైన వ్యక్తిగత, వ్యాపార రుణాల వంటి ఫ్లోటింగ్ రేటు రుణాలపై సమానమైన నెలవారీ వాయిదాలు (EMI) కూడా తగ్గుతాయి.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తాజా ఎంసీఎల్ఆర్ రేట్లుహెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ని 9.20 శాతం నుండి 5 బేసిస్ పాయింట్లు తగ్గించి 9.15 శాతానికి సవరించింది. ఇక ఒక నెల, మూడు నెలల ఎంసీఎల్ఆర్ రేట్లు ఎటువంటి మార్పు లేకుండా వరుసగా 9.20 శాతం, 9.30 శాతంగా ఉన్నాయి.అదే విధంగా ఆరు నెలలు, ఏడాది, మూడు సంవత్సరాల ఎంసీఎల్ఆర్ రేట్లు ఒక్కొక్కటి 5 బేసిస్ పాయింట్లు చొప్పున తగ్గి 9.45 శాతంగా ఉన్నాయి. అయితే రెండు సంవత్సరాల ఎంసీఎల్ఆర్ 9.45 శాతం వద్ద యథాతథంగా ఉంది.ఎంసీఎల్ఆర్ అంటే?"ఎంసీఎల్ఆర్ అనేది ఒక నిర్దిష్ట రుణానికి ఆర్థిక సంస్థ విధించే కనీస వడ్డీ రేటు. ఇది రుణంపై వడ్డీ రేటు కనీస పరిమితిని నిర్ణయిస్తుంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ చెప్తే తప్ప తప్ప ఇందులో మార్పు ఉండదు" అని ఎంసీఎల్ఆర్ భావనను వివరిస్తూ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన వెబ్సైట్లో పేర్కొంది.పీఎల్ఆర్ ఇలా..ఎంసీఎల్ఆర్తో పాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు (PLR) సంవత్సరానికి 17.95 శాతం ఉంది. ఇది 2024 సెప్టెంబర్ 9 నుండి అమలులోకి వచ్చింది. నిర్దిష్ట రుణాలకు వర్తించే బేస్ రేటును అదే తేదీ నాటికి 9.45 శాతంగా నిర్ణయించారు.ఈబీఎల్ఆర్ గృహ రుణాల కోసం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్ (EBLR)ని అనుసరిస్తుంది. ఇది పాలసీ రెపో రేటుతో అనుసంధానమై ఉంటుంది. ప్రస్తుత రెపో రేటు 6.50 శాతంగా ఉంది. ఇక అడ్జస్టబుల్ రేట్ హోమ్ లోన్స్ (ARHL) వడ్డీ రేట్లు లోన్ వ్యవధిలో మారుతూ ఉంటాయి.హోమ్ లోన్ రేట్లుఉద్యోగులు, స్వయం ఉపాధి పొందే రుణగ్రహీతలు తీసుకునే ప్రత్యేక గృహ రుణాలపై వడ్డీ రేట్లు 8.75 శాతం నుంచి 9.65 శాతం మధ్య ఉంటాయి. రెపో రేటుతో పాటు 2.25 శాతం నుండి 3.15 శాతం అదనపు మార్జిన్ ఆధారంగా వీటిని నిర్ణయిస్తారు. ఇక ఇదే కేటగిరీకి చెందిన రుణగ్రహీతలకు ప్రామాణిక గృహ రుణ రేట్లు 9.40 శాతం నుండి 9.95 శాతం వరకు ఉంటాయి. వీటిలో రెపో రేటుతో పాటు 2.90 శాతం నుండి 3.45 శాతం మార్జిన్ కలిసి ఉంటాయి. -
ఈ క్రెడిట్ కార్డులు కనిపించవు! కానీ ఖర్చు చేయొచ్చు..
దేశంలో ఆర్థిక కార్యకలాపాలు, చెల్లింపు వ్యవస్థలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. క్రెడిట్ కార్డులు విస్తృతంగా పెరిగిపోయాయి. వీటికితోడు అనుకూలమైన, సురక్షితమైన చెల్లింపు ఎంపికగా వర్చువల్ క్రెడిట్ కార్డ్‌లు ఉద్భవించాయి. సాంప్రదాయ భౌతిక క్రెడిట్ కార్డ్‌ల మాదిరిగా చోరీకి గురవ్వడం, పోగొట్టుకోవడం వంటి సమస్యలు వర్చువల్ క్రెడిట్ కార్డ్‌లతో ఉండవు.ఏమిటీ వర్చువల్ క్రెడిట్ కార్డ్?వర్చువల్ క్రెడిట్ కార్డ్ అనేది భౌతిక క్రెడిట్ కార్డుకు డిజిటల్ రూపం. 16-అంకెల కార్డ్ నంబర్, సీవీవీ (CVV), గడువు తేదీతో సహా భౌతిక కార్డుకు ఉన్న అన్ని ముఖ్యమైన వివరాలూ దీనికీ ఉంటాయి. సాధారణంగా వర్చువల్ క్రెడిట్ కార్డ్ అనేది స్వల్పకాలిక కార్డ్. ఇది మీ ప్రస్తుత క్రెడిట్ కార్డ్‌కి యాడ్-ఆన్‌గా పనిచేస్తుంది. పరిమిత సంఖ్యలో లావాదేవీలను అనుమతిస్తుంది.ఎలా పని చేస్తుంది?వర్చువల్ క్రెడిట్ కార్డ్ ఫిజికల్ క్రెడిట్ కార్డ్ లాగానే పని చేస్తుంది. అయితే మెరుగైన భద్రతా లక్షణాలను అందిస్తుంది. వర్చువల్ కార్డ్‌ని ఉపయోగించి చెల్లింపు చేసినప్పుడు, వన్-టైమ్ పాస్వర్డ్ (OTP) వస్తుంది. మోసం ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.ఉపయోగించండిలా..» వర్చువల్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించడం సూటిగా ఉంటుంది. ఫిజికల్ కార్డ్‌ని స్వైప్ చేయాల్సిన అవసరం లేదు.» మీరు చెల్లింపు చేయాలనుకుంటున్న వెబ్‌సైట్‌కు వెళ్ళండి. » వర్చువల్ క్రెడిట్ కార్డ్ చెల్లింపు ఎంపికను ఎంచుకోండి.» మీ వర్చువల్ క్రెడిట్ కార్డ్ నంబర్, గడువు తేదీ, సీవీవీని నమోదు చేయండి.» తర్వాత, మీ రిజిస్టర్డ్ ఫోన్‌కు ఓటీపీ వస్తుతంది. ఇది కొన్ని నిమిషాలే చెల్లుబాటు అవుతుంది.» ఓటీపీని ఎంటర్ చేసి చెక్అవుట్ ప్రక్రియను పూర్తి చేయండి.వర్చువల్ క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలు» వర్చువల్ క్రెడిట్ కార్డ్‌లను మీ ఫోన్ లేదా ఆన్లైన్ ఖాతాల ద్వారా సులభంగా యాక్సెస్ చేయవచ్చు. భౌతిక కార్డ్‌ని తీసుకెళ్లాల్సిన అవసరాన్ని తొలగిస్తుంది.» భౌతిక కార్డ్‌ని కోల్పోయే ప్రమాదం ఉండదు. మోసపూరిత లావాదేవీల నుండి వినియోగదారులను రక్షించడానికి అనేక ప్లాట్‌ఫామ్‌లు అంతర్నిర్మిత డిజిటల్ మోస నివారణ సాధనాలను కూడా అందిస్తాయి.» వర్చువల్ క్రెడిట్ కార్డ్ కోసం ఖర్చు పరిమితులు, గడువు తేదీలను సెట్ చేయవచ్చు. ఇది మెరుగైన ఆర్థిక నిర్వహణకు అధిక వ్యయం చేసే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.వర్చువల్ క్రెడిట్ కార్డ్ పరిమితులు» వర్చువల్ క్రెడిట్ కార్డ్‌లను ప్రధానంగా ఆన్లైన్ చెల్లింపుల కోసం రూపొందించారు. భౌతిక కార్డ్‌ల వంటి ఆఫ్‌లైన్ లావాదేవీల కోసం వీటిని ఉపయోగించలేరు.» ఆన్లైన్ రిటైలర్లందరూ వర్చువల్ క్రెడిట్ కార్డ్‌లను అంగీకరించరు. దీంతో ఆన్లైన్ కొనుగోళ్లకు ఇబ్బంది కలుగుతుంది.» వర్చువల్ క్రెడిట్ కార్డ్‌లు సాధారణంగా తాత్కాలిక చెల్లుబాటును కలిగి ఉంటాయి. సాధారణంగా ఇది 24 నుండి 48 గంటల వరకు ఉంటుంది. అయితే ఇది జారీ చేసే సంస్థను బట్టి మారవచ్చు.టాప్ ఫ్రీ వర్చువల్ క్రెడిట్ కార్డ్‌లు ఇవే..దేశంలో వర్చువల్ క్రెడిట్ కార్డ్‌లను బ్యాంకులు అలాగే నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFC) అందిస్తాయి. దేశంలోని ప్రధాన బ్యాంకులు అందించే కొన్ని టాప్ వర్చువల్ క్రెడిట్ కార్డ్‌ల వివరాలు ఇక్కడ అందిస్తున్నాం. హెచ్డీఎఫ్సీ (HDFC) బ్యాంక్ హెచ్డీఎఫ్సీ నెట్సేఫ్ వర్చువల్ క్రెడిట్ కార్డ్, యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) ఫ్రీఛార్జ్ క్రెడిట్ కార్డ్, కోటక్ మహీంద్రా బ్యాంక్ (Kotak Mahindra Bank) నెట్ కార్డ్ (Netc@rd), హెచ్ఎస్బీసీ (HSBC) బ్యాంక్ అడ్వాంటేజ్ వర్చువల్ కార్డ్, ఎస్బీఐ (SBI) కార్పొరేట్ వర్చువల్ కార్డ్ పేరుతో వర్చువల్ కార్డులు అందిస్తున్నాయి. -
బ్యాంకుకు వెళ్లకుండానే.. మొబైల్ నెంబర్ అప్డేట్: ఇలా చేస్తే సింపుల్
టెక్నాలజీ విపరీతంగా పెరిగిన తరుణంలో దాదాపు ఏ పని చేయాలన్నా.. ఇంట్లో కూర్చునే చేసేస్తున్నారు. బ్యాంకింగ్ సేవలైతే మరీ సులభమైపోయాయి. కానీ ఇంకా చాలామందికి తెలియని విషయాలు లేకపోలేదు. కాబట్టి ఈ కథనంలో 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (SBI) రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ (Mobile Number) ఎలా మార్చుకోవాలి? ఎక్కడ మార్చుకోవాలి? అనే విషయాలను క్షుణ్ణంగా తెలుసుకుందాం.ఇంటర్నెట్ బ్యాంకింగ్ (Internet Banking) ద్వారా రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ అప్డేట్➤ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉన్న యూజర్లు లేదా కస్టమర్లు తమ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ అప్డేట్ చేయాలంటే.. ముందు ఎస్బీఐ అధికారిక నెట్ బేకింగ్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.➤కుడివైపు కనిపించే కంటిన్యూ టూ లాగిన్ మీద క్లిక్ చేసి.. తరువాత యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.➤అక్కడ కనిపించే చేంజ్ మొబైల్ నెంబర్ మీద క్లిక్ చేయండి.➤క్లిక్ చేసిన తరువాత మీరు మార్చాలనుకున్న మొబైల్ నెంబర్ లేదా కొత్త మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.ఏటీఎం (ATM) ద్వారా రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ అప్డేట్ఏటీఎం కేవలం మీ ఖాతాలోని నగదు విత్‌డ్రా చేసుకోవడానికి, డిపాజిట్ చేసుకోవడానికి మాత్రమే కాకుండా.. అవసరమైనప్పుడు రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ కూడా మార్చుకోవడానికి సహాయపడుతుంది.➢ముందుగా మీ సమీపంలోని ఏటీఎం సెంటర్‌కు వెళ్ళండి.➢మీ దగ్గరున్న డెబిట్ కార్డ్‌ని ఏటీఎం మెషీన్‌లోకి చొప్పించి.. పిన్ నెంబర్ ఎంటర్ చేయండి.➢పిన్ నెంబర్ ఎంటర్ చేసిన తరువాత స్క్రీన్ మీద కనిపించే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ సెలక్ట్ చేసుకోండి.➢తరువాత మొబైల్ నెంబర్ చేంజ్ ఆప్షన్ ఎంచుకోవాలి.➢ఆప్షన్ ఎంచుకున్న తరువాత మీ పాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై చేయాలి. తరువాత కొత్త నెంబర్ ఎంటర్ చేయాలి. ఇలా చేసినప్పుడు మీకు ఓటీపీ నెంబర్లు వస్తాయి. వీటిని ఎంటర్ చేయడం ద్వారా మొబైల్ నెంబర్ అప్డేట్ అవుతుంది.ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం ద్వారా మాత్రమే కాకుండా మీరు బ్యాంకును సంప్రదించి కూడా మీ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ మార్చుకోవచ్చు. అయితే దీనికి కావలసిన డాక్యుమెంట్స్ బ్యాంకులో అందించాల్సి ఉంటుంది. కాబట్టి బ్యాంకులు వెళ్లలేని వారు పైన చెప్పిన రెండు పద్దతుల ద్వారా మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు.ఇదీ చదవండి: పేదోళ్లను లక్షాధికారి చేసే స్కీమ్: ఇదిగో డీటెయిల్స్మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఎందుకుసాధారణంగా మనం డబ్బు విత్‌డ్రా చేసినా లేదా డిపాజిట్ చేసినా, ఖాతాలో ఎంత ఉండనే విషయం తెలుసుకోవాలంటే తప్పకుండా బ్యాంకుకు వెళ్లాల్సి ఉండేది. కానీ మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల.. మీ లావాదేవీలకు సంబంధించిన విషయాలు మీకు మెసేజ్ రూపంలో వస్తాయి. కాబట్టి ప్రత్యేకించి మీరు బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. అంతే కాకుండా రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ ద్వారా బ్యాంక్ టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి కూడా బ్యాలెన్స్ వివరాలను తెలుసుకోవచ్చు. -
పేదోళ్లను లక్షాధికారి చేసే స్కీమ్: ఇదిగో డీటెయిల్స్
భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టలేని వారు లేదా చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారి కోసం 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (SBI) హర్ ఘర్ లఖ్పతి రికరింగ్ డిపాజిట్ పేరుతో ఓ సరికొత్త స్కీమ్ తీసుకువచ్చింది. ఇందులో ప్రతి ఒక్కరూ సులభమైన పద్ధతిలో పొదుపు చేసుకోవచ్చు. ఆకర్షణీయమైన వడ్డీని పొందవచ్చు.హర్ ఘర్ లఖ్పతి పథకం (Har Ghar Lakhpati Scheme)హర్ ఘర్ లఖ్పతి పథకం అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభించిన ఓ సరికొత్త పొదుపు స్కీమ్. దీని ద్వారా ఒక వ్యక్తి లేదా కుటుంబం ఆర్థికంగా కొంత వృద్ధి చెందవచ్చు. అంతే కాకుండా క్రమశిక్షణతో కూడిన ఆర్థిక అలవాట్లను పెంపొందించుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇది పెద్దవారికి మాత్రమే కాకుండా.. మైనర్లకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది.హర్ ఘర్ లఖ్పతి పథకం కింద ప్రజలు 12 నెలల నుంచి 120 నెలల (1 ఏడాది నుంచి 10 సంవత్సరాలు) వరకు పొదుపు చేసుకోవచ్చు. వివాహాలకు లేదా ఇంటి కొనుగోళ్లు వంటి వాటికి ప్లాన్ చేసుకునేవారికి ఇది కొంత ప్రయోజనకారిగా ఉంటుంది. 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న వారి దగ్గర నుంచి పెద్దవారి వరకు ఎవరైనా ఇందులో పొదుపు చేసుకోవచ్చు. అయితే 10 ఏళ్లకంటే తక్కువ వయసున్న పిల్లలు మాత్రం తల్లిదండ్రులు లేదా సంరక్షకులతో అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది.వడ్డీ రేటు●సాధారణ ప్రజలకు 6.75 శాతం●సీనియర్ సిటిజన్లకు 7.25 శాతం●స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులకు 8 శాతం●ఆదాయ పన్నుశాఖ నిబంధనల ప్రకారం.. పన్ను మినహాయింపు వర్తిస్తుందినెలవారీ పెట్టుబడులుహర్ ఘర్ లఖ్పతి రికరింగ్ డిపాజిట్ పథకం కింద.. నెలవారీ పెట్టుబడులు చేయడం ద్వారా లక్ష రూపాయలు పొందవచ్చు. సాధారణ పౌరులకు, 6.75 శాతం వడ్డీతో మూడు సంవత్సరాలకు నెలకు రూ. 2,500 లేదా 6.50 శాతం చొప్పున ఐదు సంవత్సరాలకు నెలకు రూ. 1,407 పెట్టుబడి పెట్టడం లక్ష్యాన్ని చేరుకోవడానికి సహాయపడుతుంది. సీనియర్ సిటిజన్లు 7.25 శాతం చొప్పున మూడేళ్లపాటు నెలవారీ రూ. 2,480 లేదా 7 శాతం చొప్పున ఐదు సంవత్సరాలకు నెలకు రూ. 1,389 పెట్టుబడి పెట్టడం ద్వారా దీనిని పొందవచ్చు.ఇదీ చదవండి: ఈ టిప్స్ పాటిస్తే.. EMI ఆలస్యమైనా పర్లేదు!జరిమానాలువాయిదా ప్రకారం తప్పకుండా డిపాజిట్ చేయాలి. అలా చేయని సమయంలో లేదా ఆలస్యమైతే రూ.100కు రూ.1.50 పైసలు నుంచి 2 రూపాయలు జరిమానా పడుతుంది. అంతే కాకుండా ఆరు నెలల పాటు వాయిదాలు చెల్లించకపోతే మీ అకౌంట్ క్లోజ్ అవుతుంది. అప్పటికి మీరు పొదుపు చేసిన మొత్తం సేవింగ్ ఖాతాకు బదిలీ అవుతుంది.అకౌంట్ ఓపెన్ చేయడం ఎలా?●హర్ ఘర్ లఖ్పతి రికరింగ్ డిపాజిట్ పథకం కోసం అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే.. సమీపంలోని SBI బ్రాంచ్ సందర్సించాలి.●ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి కావలసిన డాక్యుమెంట్స్ సమర్పించాలి.●ఖాతా ప్రారంభించే సమయంలోనే మెచ్యూరిటీ మొత్తాన్ని, ఈఎంఐ వంటి వాటిని లెక్కించుకోవాలి. -
ఆధార్ కార్డు ఉంటే చాలు.. రూ.50 వేల లోన్
బ్యాంకులలో రుణాలు పొందడం అంత సులువు కాదు. హామీగా ఆస్తులు తాకట్టు పెట్టాలి.. సవాలక్ష డాక్యుమెంట్లు సమర్పించాలి. అయితే ఇవన్నీ లేకుండా కేవలం ఆధార్ కార్డు ఉంటే చాలు.. ప్రభుత్వ బ్యాంకుల నుంచి రూ.50 వేలు లోన్ పొందే అవకాశం ఉంది. అదే పీఎం స్వనిధి యోజన పథకం.కోవిడ్ (COVID-19) మహమ్మారి బారిన పడిన వ్యాపారాలకు మద్దతుగా ప్రభుత్వం ప్రధాన మంత్రి స్వనిధి యోజన (PM Svanidhi Yojana) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2020లో ప్రవేశపెట్టింది. చిరు వ్యాపారులు, వీధి వ్యాపారుల స్వావలంబన కల్పించాలన్నది ఈ పథకం ఉద్దేశం. ఈ స్కీమ్ కింద లబ్ధిదారులు ఎటువంటి గ్యారెంటీ లేకుండా ఆధార్ కార్డుతో రుణాన్ని పొందవచ్చు.ఇది ఎలా పని చేస్తుందంటే..చిరు వ్యాపారులకు ప్రారంభంలో రూ.10,000 వరకు రుణం ఇస్తారు. వారు ఈ లోన్ మొత్తాన్ని సకాలంలో తిరిగి చెల్లిస్తే, తదుపరిసారి రూ.20,000 రుణం పొందవచ్చు. దీన్ని కూడా సకాలంలో తిరిగి చెల్లించిన తర్వాత రూ.50,000 లోన్ అందుకోవచ్చు.ఆధార్ కార్డు తప్పనిసరిపీఎం స్వనిధి పథకం కింద రుణం పొందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి. వ్యాపారులు తమ ఆధార్ కార్డును ఉపయోగించి ప్రభుత్వ బ్యాంకులో ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రుణాన్ని 12 నెలల్లో వాయిదాల పద్ధతిలో తిరిగి చెల్లించాలి.ఎలా దరఖాస్తు చేయాలి?పీఎం స్వనిధి వెబ్సైట్ ప్రకారం.. రుణగ్రహీతలు తప్పనిసరిగా లోన్ అప్లికేషన్ ఫారమ్ (LAF)ని పూరించడానికి అవసరమైన సమాచార పత్రాలను అర్థం చేసుకోవాలి.ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియలో ఈ-కేవైసీ/ఆధార్ ధ్రువీకరణ కోసం మొబైల్ నంబర్‌ను ఆధార్ నంబర్‌కు లింక్ చేయడం తప్పనిసరి. దీంతోపాటు రుణగ్రహీతలు ప్రభుత్వ సంక్షేమ పథకాల నుండి భవిష్యత్తు ప్రయోజనాల కోసం పట్టణ స్థానిక సంస్థల (ULB) నుండి సిఫార్సు లేఖను పొందవలసి ఉంటుంది.మొబైల్ నంబర్లను అప్డేట్ చేయడానికి ఫారమ్‌ను తప్పనిసరిగా పూరించాలి. ఇతర పత్రాలు అవసరం లేదు.ఈ పథకంలో రుణం పొందడానికి అర్హులైన నాలుగు రకాల విక్రేతలు ఉన్నారు. అర్హత ప్రమాణాలను సరిచూసుకుని తదనుగుణంగా దరఖాస్తు చేసుకోండి.ఈ మూడు దశలను అనుసరించిన తర్వాత పోర్టల్‌లో దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించవచ్చు. రుణగ్రహీతలు నేరుగా పోర్టల్‌లో లేదా వారి ప్రాంతానికి సమీపంలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్ (CSC) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.మరి వడ్డీ రేటు ప్రధాన మంత్రి స్వనిధి యోజన పథకానికి షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (RRB), చిన్న ఫైనాన్స్ బ్యాంకులు (SFB), సహకార బ్యాంకుల వడ్డీ రేట్లు ప్రస్తుతం ఉన్న రేట్ల ప్రకారం ఉంటాయి. ఎన్‌బీఎఫ్‌సీలకు (NBFC) వడ్డీ రేట్లు ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం ఉంటాయి. ఎంఎంఫ్ఐలు (non NBFC) ఆర్బీఐ మార్గదర్శకాల పరిధిలోకి రాని ఇతర కేటగిరి సంస్థలకు ప్రస్తుతం ఉన్న ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం పథకం కింద వడ్డీ రేట్లు వర్తిస్తాయి. -
తాళి కట్టు శుభవేళ..బహుమతులపై పన్ను భారం ఉండదా?
అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక ఈ వారం విషయంలోకి వెళ్తే.. తాళి కట్టు శుభవేళ.. అంతా మంచే జరగాలని కోరుకుంటాం. వధూవరులను ఆశీర్వదిస్తాం. అంతా మంగళప్రదంగా జరగాలని.. కలకాలం కొత్త జంట చల్లగా ఉండాలని కోరుకుంటాం. పెళ్లి సందర్భంలో వధూవరులకు వచ్చే బహుమతులపై పన్ను భారం లేదు. అటువంటి వాటిని ఆదాయంగా పరిగణించరు. ఇప్పుడు ముందు రిసెప్షన్.. తర్వాత పెళ్లి... కాబోయే జంట పందిరిలో నిలబడటం.. మిగతా అందరూ లైన్లో వెళ్లి, వారికి బహుమతులివ్వడం.. తాళి కట్టిన తర్వాత కూడా కొందరు ఇస్తారు. ఏది ఏమైనా సందర్భం ‘పెళ్లి’ ఒక రోజు అటూ ఇటూ.. పెళ్లి పేరు చెప్పి ఎప్పుడు ఇచ్చినా ఏ ఇబ్బందీ లేదు.ఎటువంటి బహుమతులు ఇవ్వొచ్చు..నగదు ఇవ్వొచ్చు. దగ్గరి బంధువైతే ఎటువంటి ఆంక్షలు లేవు. బీరకాయ .. బెండకాయ సంబంధం కాదండి. బాదరాయణ సంబంధమూ కాదు. చట్టంలో పొందుపర్చిన నిర్వచనాన్ని గుర్తు పెట్టుకోండి. అలా అని రూ.2,00,000 దాటకండి. పేటీఎంలు, గూగుల్ పేమెంట్లు, చెక్కులు, డీడీలు, ఆర్టీజీఎస్, బదిలీలు, నగ, నట్రా, వెండి, బంగారం, ఆభరణాలు, కుక్కర్లు, వంట సామగ్రి, టీవీలు, ఫ్రిజ్జులు, భూములు, ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్లు, స్థిరాస్తి, షేర్లు, బాండ్లు.. ఎలాగైనా మీ ప్రేమ, అభిమానాన్ని ప్రకటించుకోండి. పుచ్చుకున్న వారికి ఆదాయంగా పరిగణించరు. పన్నుభారం పడదు. పన్ను చెల్లించనక్కర్లేదు. అయితే, కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి.వధూవరులకు వచ్చే వాటిని ఆదాయంగా పరిగణించరు.అత్తగారి లాంఛనం, ఆడపడుచు కట్నం మొదలైన వాటి మీద ఎటువంటి మినహాయింపు లేదు. కొన్ని పెళ్లిళ్లలో ఈ లాంఛనాలు భారీగా ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త.పూర్వకాలంలో పురోహితుడు నలుగురికి వినపడేలా అరిచేవారు. ఫలానా వారింత కట్నం అని.. కొంత మంది తమ పేరు నలుగురికి వినబడేలా చదివించుకునే వారు.ఇప్పుడు బాహాటంగా చదివింపులు లేవు. కవర్లో ఎంతో కొంత పెట్టి.. అది వారి చేతిలో పెట్టి, ఫొటోగ్రాఫర్ వైపు మొగం చూపెట్టి.. భోజనం దిశగా అడుగెట్టి.. ఇంటి దారి పట్టి.. వెళ్లిపోతున్నారు.ఇవి చిన్న మొత్తాలయితేనేం.. అధిక విలువగలవైతేనేం.. పంతులు గారికి ఒక వెయ్యి నూటపదహార్లు ఇచ్చి ఒక పుస్తకం.. పెళ్లి పుస్తకం తెరిపించండి.ఆ పుస్తకానికి పసుపు, కుంకుమ బాగా దట్టించండి. తారీఖు, టైం వేసి.. అందరి పేర్లూ రాయండి. పింకీ, సుబ్బు, పక్కింటి ఆంటీ అని కాకుండా వీలైతే పూర్తి పేరు రాయండి. అలాగే ఫోన్ పేమెంట్లు, గూగుల్ పేమెంట్లు, బ్యాంకులో జమలు, ప్రత్యేక జాబితా రాయండి. బ్యాంకు స్టేట్మెంట్లో ఈ ‘జవాబు’ను హైలైట్ చేయండి. మీరు మీ పెళ్లి పుస్తకంలో వారి పేరు, వీలైతే, సెల్ నంబరు రాయండి. బ్యాంకు స్టేట్మెంట్లు భద్రపరచండి.ఇదీ చదవండి: ‘ఐదు శాతం’తో రూ.1.8 కోట్లు సంపాదననగదు చదివింపులను వీలైతే బ్యాంకులో జమ చేయండి. ఆ పేయింగ్ స్లిప్‌ను మీ పుస్తకంలో అతికించండి.ఇలా రాయటం వల్ల రెండు ప్రయోజనాలు. ఒకటి మున్ముందు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్టుమెంట్ వారికి ‘సోర్స్’ వివరణ రెడీగా ఉంటుంది. రెండోది మీరు అటువంటి వారికి కట్నం ఇచ్చేటప్పుడు ఇదొక కొలబద్దగా ఉంటుంది.నగదు ఖర్చుపెట్టే అవసరం అయితే.. దేని నిమిత్తం ఖర్చు పెట్టారో రాయండి.భారీ కంచాలు, ప్లేట్లు, సీనరీలు, దేవుడి బొమ్మలు మొదలైనవి రాయకపోయినా ‘విలువైనవి’ అనిపించిన వస్తువుల జాబితా రాయండి.స్థిరాస్తులు మొదలైన అన్ని కాగితాలు తీసుకోండి. బదిలీ పత్రాలు తీసుకోండి. మరీ చాదస్తం అని కొట్టిపడేయకండి. దేనికైనా దస్త్రం కావాలి. అదీ మనమే సమకూర్చుకోవాలి. సకాలంలో సర్దుకోండి.-కే.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి-కె.వి.ఎన్ లావణ్య ట్యాక్సేషన్ నిపుణులు -
‘ఐదు శాతం’తో రూ.1.8 కోట్లు సంపాదన
కొత్త ఏడాదిలోకి ప్రవేశించాం. ఆర్థికంగా మరింత డబ్బు పోగు చేసుకోవాలని అందరూ అనుకుంటారు. కొత్త సంవత్సరంలో కొన్ని మార్గాలు పాటిస్తే సులువుగా ఆర్థిక లక్ష్యాలు(Financial Targets) చేరుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగులు తాము చేస్తున్న కొలువు(Job)లో ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ల రూపంలో అదనంగా సంపాదన అందుకుంటారు. దాన్ని వైవిధ్యంగా ఇన్వెస్ట్ చేస్తే సంపాదనను పెంచుకోవచ్చని సూచిస్తున్నారు. పదోన్నతులు, ఇంక్రిమెంట్ల వల్ల సమకూరే డబ్బును దీర్ఘకాలికంగా పొదుపు చేస్తే మదుపు ఖాతాలో ఇంకొంత సొమ్ము పోగవుతుందని చెబుతున్నారు.ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ల సమయంలో కంపెనీలు అదనంగా అందించే సుమారు ఐదు శాతం(సంస్థను బట్టి ఇది మారుతుంది) డబ్బు భవిష్యత్తులో భారీ ప్రభావాన్ని చూపుతుంది. ఉదాహరణకు మీకు నెలకు లక్ష రూపాయల జీతం అనుకుందాం. ఏటా ఐదు శాతం ఇంక్రిమెంటును పరిగణిలోకి తీసుకుందాం. మీరు ఇప్పటికే చేసిన పెట్టుబడులు ఏటా పది శాతంమేర రాబడిని ఇస్తున్నట్లు భావిద్దాం. ఇప్పటి దాకా చేస్తున్న ఇన్వెస్ట్‌మెంట్‌ను 15 శాతం నుంచి అదనంగా ఐదు శాతం కలిపి 20 శాతానికి పెంచడం వల్ల జీవనశైలిలో పెద్దగా మార్పు ఉండదు. కానీ దీర్ఘకాలంలో మీరు చేస్తున్న పెట్టుబడి భారీగా పెరిగి ముప్పై ఏళ్ల తర్వాత కనీసం రూ.5.3 కోట్ల స్థానంలో అక్షరాలా రూ.7.1 కోట్లకు పెరుగుతుంది. అంటే కేవలం ఐదు శాతం అదనంగా ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బు దాదాపు రూ.1.8 కోట్లు పెరుగుతుంది.ఇదీ చదవండి: మీకూ అందుతాయి ఐటీ నోటీసులు.. ఎప్పుడంటే..ముందు పొదుపు తర్వాతే ఖర్చుఖర్చు చేసిన తర్వాత మిగిలిన డబ్బును పొదుపు చేయాలని చాలామంది అనుకుంటారు. కానీ ముందు పొదుపు తర్వాతే ఖర్చు అనే సూత్రాన్ని పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగులు తప్పకుండా ఆరోగ్య బీమా(Health Insurance)తోపాటు జీవిత బీమాను తీసుకోవాలని సూచిస్తున్నారు. ఏదైనా అత్యవసర పరిస్థతుల్లో ఉద్యోగం పోయినా ఇంటి ఖర్చులు భరించేలా కనీసం ఆరు నెలలకు సరిపడా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలని చెబుతున్నారు. ఈ నిధిని వెంటనే నగదుగా మార్చుకునే ఫండ్స్‌ల్లో పెట్టుబడి పెట్టాలని, ఈక్వీటీల జోలికి వెళ్లకూడదని సూచిస్తున్నారు. -
మీకూ అందుతాయి ఐటీ నోటీసులు.. ఎప్పుడంటే..
డిజిటల్ ఇండియా(Digital India) యుగంలో చాలామంది ఆన్లైన్ నగదు లావాదేవీలు జరుపుతున్నారు. చిన్నమొత్తంలో జరిపే లావాదేవీల సంగతి అటుంచితే, పెద్దమొత్తంలో చేసే నగదు బదిలీలపై ప్రభుత్వం నిఘా వేస్తోంది. ఈ నగదు బదిలీల విషయంలో ఎవరైనా సరే నిబంధనలు అతిక్రమిస్తున్నట్లు ప్రభుత్వ పన్నుల యంత్రాంగం గుర్తిస్తే వారికి ఆదాయ పన్నుశాఖ నోటీసులు(IT Notices) తప్పవు. అయితే ఎలాంటి సందర్భాల్లో నోటీసులు అందుతాయో కొన్నింటి గురించి తెలుసుకుందాం.బ్యాంకు ఖాతాలో నగదు జమసెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) నిబంధనల ప్రకారం, ఎవరైనా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేస్తే, దానికి సంబంధించి ఆదాయపు పన్ను శాఖకు సమాచారం వెళ్తుంది. ఈ డబ్బు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఖాతాల్లో జమ చేసినా కొన్నిసార్లు నోటీసులు అందుకునే అవకాశం ఉంది. నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువ డబ్బు డిపాజిట్ చేస్తే ఆదాయపు పన్ను శాఖకు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.ఫిక్స్డ్ డిపాజిట్లో జమ చేయడంఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షల కంటే ఎక్కువ మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో జమ చేసినప్పుడు నోటీసులు అందుతున్నట్లే, ఫిక్స్డ్ డిపాజిట్(Fixed Deposite)ల విషయంలోనూ అదే జరుగుతుంది. ఆర్థిక సంవత్సరంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఎఫ్డీలలో రూ.10 లక్షల కంటే అధికంగా డిపాజిట్ చేస్తే కొన్నిసార్లు ఆదాయపు పన్ను శాఖ నోటీసు అందవచ్చు.ఆస్తి లావాదేవీలుస్థిరాస్తి కొనుగోలు చేసేటప్పుడు రూ.30 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు లావాదేవీలు జరిపినట్లయితే రిజిస్ట్రార్ ఖచ్చితంగా ఈ విషయాన్ని ఆదాయపు పన్ను శాఖకు తెలియజేస్తారు. అటువంటి పరిస్థితిలో భారీ లావాదేవీలు జరిపారు కాబట్టి, ఆ డబ్బు మీకు ఎలా సమకూరిందనే వివరాలు అడుగుతూ ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపవచ్చు.క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులుక్రెడిట్ కార్డ్ బిల్లు(Credit card Bill) రూ.1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ ఉంటే దాన్ని నగదు రూపంలో చెల్లిస్తే ఆ డబ్బు ఎలా సమకూరిందో ప్రభుత్వం అడగొచ్చు. మరోవైపు, ఏ ఆర్థిక సంవత్సరంలో అయినా మొత్తం కలిపి రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ పేమెంట్ చెల్లించినట్లయితే ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ఆదాయపు పన్ను శాఖ మిమ్మల్ని ప్రశ్నించే అవకాశం ఉంది.ఇదీ చదవండి: మానసిక ఆరోగ్యానికీ బీమా ధీమాషేర్లు, మ్యూచువల్ ఫండ్స్, డిబెంచర్ల కొనుగోలుషేర్లు, మ్యూచువల్ ఫండ్లు, డిబెంచర్లు లేదా బాండ్లను కొనుగోలు చేయడానికి పెద్ద మొత్తంలో నగదు ఉపయోగించినట్లయితే ఇది ఆదాయపు పన్ను శాఖకు సమాచారం వెళ్తుంది. ఒక వ్యక్తి రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలు చేస్తే దానికి సంబంధించిన సమాచారం ప్రభుత్వం వద్ద నమోదు అవుతుంది. ఆ సందర్భంలోనూ నోటీసులు అందవచ్చు. -
మానసిక ఆరోగ్యానికీ బీమా ధీమా
ప్రస్తుతం మానసిక ఆరోగ్యాన్ని(Mental health) పరిరక్షించుకోవడమనేది సవాలుగా మారుతోంది. శారీరక ఆరోగ్యం(Health)తో సమానంగా దీనికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి సమస్యలపై అవగాహన పెరుగుతుండటంతో వీటిని సైతం ఇప్పుడు తీవ్రమైన ఆరోగ్య సమస్యలుగా గుర్తిస్తున్నారు. అయితే, ఇందుకు అవసరమైన సహాయాన్ని పొందడానికి మాత్రం ఆర్థిక సమస్యలు అడ్డంకిగా ఉంటున్నాయి. ఆరోగ్య బీమా సంస్థలు తమ పథకాల్లో మానసిక ఆరోగ్య కవరేజీని చేర్చడం ప్రారంభించాయి. దీనితో కౌన్సిలింగ్, థెరపీ, ప్రివెంటివ్ కేర్ వంటి ముఖ్యమైన సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. దీర్ఘకాలంలో ప్రజల శారీరక, మానసిక ఆరోగ్యానికి సహాయకరంగా ఉంటున్నాయి. ఆరోగ్య బీమా(health insurance) ప్లాన్ ఎంపిక చేసుకునేటప్పుడు, అది అందించే కవరేజీ, ప్రయోజనాల గురించి ఆలోచించడం చాలా ముఖ్యం. అలా పరిశీలించతగిన కొన్ని ముఖ్యాంశాలు ఏమిటంటే..సమగ్ర కవరేజీకౌన్సిలింగ్, థెరపీ సెషన్లు వంటి మానసిక ఆరోగ్య సేవలను కవర్ చేసేవిగా పథకాలు ఉండాలి. సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులను కలిసే అవకాశాన్ని కల్పించాలి. టెలిమెడిసిన్ వంటి సౌకర్యాలు కూడా ఉండాలి. దీంతో దూరప్రాంతాల్లో ఉన్నవారు కూడా డాక్టర్లతో ఆన్లైన్లో సంప్రదించేందుకు వీలవుతుంది. అదనంగా, ఔట్‌పేషంట్ డిపార్ట్మెంట్ (ఓపేడీ) కవరేజీ ఉంటే ఆసుపత్రిలో చేరే అవసరం లేకుండా డాక్టర్‌ను సందర్శించవచ్చు, ఇది సమయంతో పాటు డబ్బును కూడా ఆదా చేస్తుంది.వెల్నెస్ ప్రోగ్రాంలుఅనేక బీమా కంపెనీలు ఇప్పుడు తమ పథకాలలో వెల్నెస్ ప్రోగ్రాంలను చేరుస్తున్నాయి. ఇవి మైండ్‌ఫుల్‌నెస్ సెషన్లు, ఒత్తిడిని అధిగమించేందుకు వర్క్‌షాప్‌లు నిర్వహించడం లేదా ఫిట్నెస్పరమైన ప్రోత్సాహకాలను అందించడం ద్వారా మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపర్చేవిగా ఉంటున్నాయి. ఉచిత యోగా తరగతులు, జిమ్ మెంబర్‌షిప్‌లు లేదా వెల్నెస్ యాప్(Wellness App)లకు యాక్సెస్ వంటి ప్రయోజనాలను కూడా కొన్ని పథకాలు అందిస్తున్నాయి. హోమ్ హెల్త్‌కేర్ సేవలుదీర్ఘకాలిక సమస్యలు లేదా మానసిక ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నవారికి క్లినిక్‌లకు ప్రయాణించడం కష్టంగా ఉంటుంది. అలాంటి వారికి హోమ్ హెల్త్‌కేర్ ప్రయోజనాలు ఉన్న పాలసీలు ఉపయోగకరంగా ఉంటాయి. ఇంటి వద్దే సంరక్షణ సేవలను సౌకర్యవంతంగా అందుకునేందుకు ఈ పాలసీలు సహాయపడతాయి. ఇన్సెంటివ్‌లు, రివార్డులుకొన్ని బీమా పథకాలు ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహిస్తూ రివార్డులు అందిస్తాయి. ఉదాహరణకు, మీరు రెగ్యులర్ హెల్త్ చెక్–అప్స్ చేయడం లేదా ఫిట్నెస్ లక్ష్యాలను చేరుకోవడం ద్వారా రెన్యువల్‌పై డిస్కౌంట్ పొందవచ్చు. కొన్ని పథకాలు వాకింగ్ లేదా వ్యాయామం మొదలైన వాటికి పాయింట్లు అందిస్తాయి. వీటిని తరువాత రిడీమ్ చేసుకోవచ్చు.వెల్నెస్ ప్రోగ్రాంలుఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించేందుకు తోడ్పడే వెల్నెస్ ప్రోగ్రాంలు, ప్రివెంటివ్ కేర్లాంటివి అందించే పాలసీ(Policy)లను ఎంచుకోవాలి. డిస్కౌంట్లు, రివార్డులు మొదలైనవి ఇచ్చే పాలసీల వల్ల బీమా వ్యయం తగ్గడంతో పాటు ఆరోగ్యకరమైన అలవాట్లు కూడా అలవడతాయి. డబ్బూ ఆదా అవుతుంది. ఇక టెలిమెడిసిన్, హోమ్ హెల్త్‌కేర్ ఫీచర్లు సత్వరం సేవలను పొందడాన్ని సులభతరం చేస్తాయి.ఇదీ చదవండి: ఫండ్స్ కటాఫ్ సమయం ఎప్పుడు?మానసిక ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయడనేది మరింత పెద్ద సమస్యలకు దారితీయొచ్చు. చికిత్స చేయకపోవడం వల్ల పలు రకాల పరిస్థితులు రోజువారీ జీవితానికి అడ్డంకులుగా మారతాయి. సంబంధాలను నాశనం చేస్తాయి. అలాగే, ఇతర ఆరోగ్య సమస్యలను మరింత తీవ్రం చేస్తాయి. డాక్టర్లను పదే పదే కలవాల్సి రావడం వల్ల, అలాగే ఎమర్జెన్సీ కవరేజీ అవసరాల వల్ల ఆర్థికంగా కూడా ఇది మరిన్ని ఖర్చులకు దారి తీస్తుంది. కాబట్టి తగినంత కవరేజీ ఉండే పాలసీని ఎంచుకోవడం వల్ల భావోద్వేగాలపరంగానూ, ఆర్థికంగాను సవాళ్లను అధిగమించేందుకు సహాయకరంగా ఉంటుంది. -
ఫండ్స్ కటాఫ్ సమయం ఎప్పుడు?
లిక్విడ్ ఫండ్‌లో ఉన్న నా పెట్టుబడులను శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు విక్రయించినట్టయితే, అదే రోజు ఎన్ఏవీ వర్తిస్తుందా? – అజయ్ కుమార్ఏ తరహా మ్యూచువల్ ఫండ్(Mutual Funds)లో పెట్టుబడులు ఉన్నాయి..ఏ సమయంలో అభ్యర్థన (కొనుగోలు/విక్రయం) పంపించారన్న దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మీరు లిక్విడ్ ఫండ్ పెట్టుబడులను శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు విక్రయించేందుకు ఆర్డర్ చేశారని అనుకుందాం. లిక్విడ్ ఫండ్స్‌కు కటాఫ్ సమయం మధ్యాహ్నం 3 గంటలు. మీ అభ్యర్థన ఈ సమయానికి ముందే చేశారు కనుక, విక్రయించిన యూనిట్లకు శుక్రవారం నాటి ఎన్ఏవీ వర్తిస్తుంది. ఇలా విక్రయించిన పెట్టుబడులు బ్యాంక్ అకౌంట్(Bank Account)లోకి వచ్చేందుకు ఎంత సమయం పడుతుంది? అన్నది తెలుసుకుందాం. ఈ విషయంలోనూ ఏ ఫండ్‌లో పెట్టుబడులు విక్రయించారన్నది కీలకం అవుతుంది. లిక్విడ్ ఫండ్, ఓవర్‌నైట్ ఫండ్‌లో పెట్టుబడులను విక్రయించినప్పుడు ఆ మొత్తం ఇన్వెస్టర్ బ్యాంక్ ఖాతాలో జమ అయ్యేందుకు ఒక పనిదినం పడుతుంది. ఇతర డెట్ ఫండ్స్ అయితే, రెండు రోజుల సమయం తీసుకుంటుంది. అదే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు వెనక్కి వచ్చేందుకు మూడు పనిదినాలు పడుతుంది. టీప్లస్ రూపంలో ఈ విషయాన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ఇన్వెస్టర్లకు తెలియజేస్తాయి.ఉదాహరణకు సోమవారం నాడు ఈక్విటీ ఫండ్స్(Equity Funds)లో పెట్టుబడులు విక్రయించారని అనుకుంటే, ఈ మొత్తం గురువారం నాడు బ్యాంక్ అకౌంట్లో జమ అవుతుంది. రియలైజింగ్ మనీ అంటే.. ఇన్వెస్టర్ కొనుగోలు ఆర్డర్‌కు సంబంధించిన మొత్తం మ్యూచువల్ ఫండ్స్ సంస్థ (AMC) అందుకోవడం. బ్యాంక్ నుంచి పంపించారనుకుంటే ఆ మొత్తం ఏఎంసీ చేరేందుకు కొన్ని గంటలు లేదా రోజు సమయం తీసుకోవచ్చు. కొనుగోలు ఏ రోజు చేశారన్న దానితో సంబంధం లేకుండా, ఏఎంసీకి ఆ మొత్తం అందిన రోజు ఎన్ఏవీనే పరిగణనలోకి తీసుకుంటారు. ఉదాహరణకు లిక్విడ్ ఫండ్‌లో పెట్టుబడులను కటాఫ్ సమయం 3 గంటలు దాటిన తర్వాత విక్రయించారని అనుకుంటే, అప్పుడు తర్వాతి రోజు ఎన్ఏవీ పెట్టుబడులకు వర్తిస్తుంది. ఎందుకంటే తర్వాతి రోజునే ఫండ్స్ సంస్థలు ఆ మేరకు విక్రయాలు చేస్తాయి.ఇదీ చదవండి: క్రెడిట్ కార్డు Vs ఛార్జ్ కార్డు.. ఏంటీ ఛార్జ్ కార్డు..నాకు ఒక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ రెగ్యులర్ ప్లాన్‌లో పెట్టుబడులు ఉన్నాయి. వాటిని ఇటీవలే విక్రయించి అదే పథకం డైరెక్ట్ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేశాను. కనుక లాభాలపై నేను పన్ను చెల్లించాలా? లేక భవిష్యత్తులో పెట్టుబడులు విక్రయించినప్పుడు పన్ను చెల్లించాల్సి వస్తుందా? – రాజన్ పీ.ఏఒక మ్యూచువల్ ఫండ్ ప్లాన్ నుంచి మరో ప్లాన్‌లోకి మారినప్పుడు, అది రెగ్యులర్ నుంచి డైరెక్ట్ ప్లాన్ అయినా సరే దాన్ని పెట్టుబడి ఉపసంహరణగానే చూస్తారు. ఆదాయపన్ను చట్టం కింద పెట్టుబడుల విక్రయమే అవుతుంది. దీనర్థం.. మూలధన లాభాలపై మీరు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని మరో ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేసి, భవిష్యత్తులో విక్రయించినట్టయితే.. హోల్డింగ్ పీరియడ్ (ఎంత కాలం పాటు పెట్టుబడులు కొనసాగించారు), వచ్చిన మూలధన లాభాల ఆధారంగా తిరిగి అప్పుడు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పెట్టుబడి నుంచి విక్రయం మధ్య కాలానికి పన్ను వర్తిస్తుందని అర్థం చేసుకోవాలి.-ధీరేంద్ర కుమార్, సీఈఓ వాల్యూ రీసెర్చ్ -
పర్సనల్ లోన్లు ఇక కష్టమే.. అమల్లోకి ఆర్బీఐ కొత్త రూల్
ఎడాపెడా పర్సనల్ లోన్లు (personal loans) పొందడం ఇకపై కష్టతరం కానుంది. బ్యాంకులు (Banks), రుణ వితరణ సంస్థలు ప్రతి 15 రోజులకూ క్రెడిట్ బ్యూరో రికార్డ్లను అప్డేట్ చేయాలనే కొత్త నిబంధన అమలులోకి వస్తోంది. ఇది ఇప్పటివరకు నెల రోజులుగా ఉండేది. ఇప్పుడు ప్రతి రెండు వారాలకు రికార్డులు అప్డేట్ చేయనుండటంతో బహుళ రుణాలకు అర్హత పొందేవారి సంఖ్య తగ్గనుంది.రిపోర్టింగ్ విరామాన్ని 15 రోజులకు తగ్గించాలని బ్యాంకులు, క్రెడిట్ బ్యూరోలకు గత ఆగస్టులోనే ఆర్బీఐ (RBI) ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వ్యవస్థలను రూపొందించుకునేందుకు జనవరి 1 వరకు గడువు ఇచ్చింది. దీనివల్ల రుణదాతలు రుణగ్రహీతలకు సంబంధించి మెరుగైన రిస్క్‌ను అంచనా వేయవచ్చని ఆర్బీఐ పేర్కొంది."ఈఎంఐలు (EMI) నెల అంతటా వివిధ తేదీలలో షెడ్యూల్ అయిఉంటాయి. నెలకు ఒకసారి రిపోర్టింగ్ సైకిల్ వల్ల డిఫాల్ట్‌లు లేదా చెల్లింపులను ప్రతిబింబించడంలో 40 రోజుల వరకు ఆలస్యం కావచ్చు. ఫలితంగా క్రెడిట్ మూల్యాంకనాల కోసం గడువు ముగిసిన డేటా వస్తుంది. 15-రోజుకోసారి రిపోర్టింగ్ సైకిల్ ఈ జాప్యాలను గణనీయంగా తగ్గిస్తుంది" అని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ సీఆర్ఐఎఫ్ హై మార్క్ ఛైర్మన్ సచిన్ సేథ్ అన్నారు.తరచుగా చేసే డేటా అప్డేట్లు "ఎవర్‌గ్రీనింగ్"(పాత రుణాలను తీర్చడానికి కొత్త రుణాలు చేయడం) వంటి పద్ధతులను కూడా నిరోధిస్తాయని రుణదాతలు చెబుతున్నారు. రిపోర్టింగ్ సైకిల్‌ను సగానికి తగ్గించడం ద్వారా క్రెడిట్ బ్యూరోలు, రుణదాతలు మరింత విశ్వసనీయమైన డేటాను పొందుతారు. ఇది నిర్ణయం తీసుకోవడాన్ని మెరుగుపరుస్తుంది. ఆరోగ్యకరమైన రుణ వ్యవస్థను ప్రోత్సహిస్తుంది. -
కొత్త ఏడాది సరికొత్త మ్యూచువల్ ఫండ్: జనవరి 16 వరకు ఛాన్స్!
ముంబై: యూటీఐ మ్యూచువల్ ఫండ్ (UTI) తమ యూటీఐ క్వాంట్ ఫండ్‌ను ఆవిష్కరించినట్లు ప్రకటించింది. ఇది ప్రెడిక్టివ్ మోడలింగ్‌ను పెట్టుబడుల పరిశోధనల్లో యూటీఐకి గల విస్తృత అనుభవం, పెట్టుబడి ప్రక్రియలో అది పాటించే విధానాలను మేళవించి నిర్వహించబడే ఒక యాక్టివ్ ఈక్విటీ ఫండ్. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా తనను తాను మల్చుకుంటూ, ఒడిదుడుకులను అధిగమిస్తూ, విస్తృత సూచీలకు మించిన రాబడులను స్థిరంగా అందించడమనేది ఈ ఫండ్ ప్రధాన లక్ష్యం. ఈ ఎన్ఎఫ్వో 2025 జనవరి 2న ప్రారంభమై 2025 జనవరి 16న ముగుస్తుంది.యూటీఐ క్వాంట్ ఫండ్ అనేది అధునాతనమైన క్వాంటిటేటివ్ పెట్టుబడుల వ్యూహాన్ని పాటించే ఓపెన్-ఎండెడ్ ఈక్విటీ స్కీము. బెంచ్‌మార్క్‌లను మించిన రాబడులు అందించే లక్ష్యంతో ఈ ఫండ్, ‘మూమెంటం, నాణ్యత, లో వోలటైలిటీ (Low Volatility), విలువ’ అనే నాలుగు అంశాలకు డైనమిక్‌గా వెయిటేజీని కేటాయించేలా ‘ఫ్యాక్టర్ అలొకేషన్’ విధానాన్ని పాటిస్తుంది.విస్తృత మార్కెట్లో సాధారణంగా కనిపించే హెచ్చుతగ్గులను అధిగమించేందుకు ఈ ఫ్యాక్టర్ మోడల్ సహాయకరంగా ఉంటుంది. మిగతా విధానాలతో పోలిస్తే మరింత మెరుగ్గా రిస్కుకు తగ్గ రాబడులను పొందేందుకు తోడ్పడుతుంది. వివిధ మార్కెట్ సైకిల్స్‌కి అనుగుణంగా మారగలిగే సామర్థ్యాల కారణంగా మార్కెట్ పరిస్థితులకు తగ్గట్లు వివిధ ఫ్యాక్టర్స్వ్యాప్తంగా కేటాయింపులను సర్దుబాటు చేసుకునేందుకు వీలవుతుంది.ఎలాంటి మార్కెట్ పరిస్థితుల్లోనైనా ముందుకెళ్లేందుకు ఇది ఒక పటిష్టమైన సాధనంగా ఉపయోగపడగలదు. రిస్కుకు తగ్గట్లుగా రాబడులనిచ్చే విషయంలో నిర్వహించిన పరీక్షల్లో ఈ ఫండ్ పటిష్టమైన పనితీరు కనపర్చింది. కాబట్టి వివిధ మార్కెట్ పరిస్థితులవ్యాప్తంగా మెరుగైన రాబడులు పొందే అవకాశాలను కోరుకునేవారికి ఇది ఆకర్షణీయమైన ఆప్షన్ కాగలదు.“మార్కెట్ సంక్లిష్టతలను అధిగమించి, పెట్టుబడుల విషయంలో మరింత సమాచారంతో తగిన నిర్ణయాలు తీసుకునేలా ఇన్వెస్టర్లకు ఒక క్రమబద్ధమైన మరియు పరిశోధన ఆధారితమైన విధానాన్ని అందించాలనేది మా లక్ష్యం. మా పెట్టుబడి ప్రక్రియ స్కోర్ ఆల్ఫాను (Score Alpha) మా సొంత ఫ్యాక్టర్ అలొకేషన్ మోడల్‌తో (Factor Allocation Model) మేళవించి ఈ ఫండ్ ఒక ‘సమగ్ర పెట్టుబడుల’ విధానాన్ని అమలు చేస్తుంది.2022 ఏప్రిల్ నుంచి యూటీఐ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ తన ఈక్విటీ పోర్ట్‌ఫోలియో నిర్వహణ కోసం ఈ ప్రక్రియను అమలు చేస్తోంది. ఈక్విటీ ఫండ్‌కి సంబంధించి ఈ అనుభవాన్ని & విధానాన్ని మరింతగా అందుబాటులోకి తేవడంపై మేము సంతోషిస్తున్నాం” అని యూటీఐ ఏఎంసీ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ శ్రీ వెట్రి సుబ్రమణియం (Vetri Subramaniam) తెలిపారు.“రుజువుల ఆధారిత వ్యూహాలతో ఇన్వెస్టర్లకు సాధికారత కల్పించేలా యూటీఐ క్వాంట్ ఫండ్ ఉంటుంది. సంప్రదాయ పెట్టుబడి సాధనాలు అందించలేని సరళత్వాన్ని, పరిస్థితులకు తగ్గట్లుగా మారగలిగే సామర్థ్యాలను ఇది అందించగలదు. డైనమిక్‌గా ఉండే నిధుల కేటాయింపు మోడల్ దన్నుతో ఒకవైపు రిస్కులను జాగ్రత్తగా ఎదుర్కొంటూనే మరోవైపు అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా ఈ ఫండ్ పనిచేస్తుంది. ఇలా రిస్కులు మరియు రాబడుల మధ్య సమతౌల్యతను పాటించగలిగే సామర్థ్యాల కారణంగా, వివిధ మార్కెట్ పరిస్థితులవ్యాప్తంగా మెరుగైన రాబడులను కోరుకునే వారికి ఈ ఫండ్ ఆకర్షణీయమైన ఆప్షన్‌గా ఉండగలదని ఆశిస్తున్నాం” అని యూటీఐ ఏఎంసీ హెడ్ (ప్యాసివ్, ఆర్బిట్రేజ్ & క్వాంట్ స్ట్రాటెజీస్) శర్వన్ కుమార్ గోయల్ (Sharwan Kumar Goyal) తెలిపారు.ప్రధాన అంశాలు•ఎన్ఎఫ్వో వ్యవధి: 2025 జనవరి 2 నుంచి 2025 జనవరి 16 వరకు•పెట్టుబడి లక్ష్యం: క్వాంటిటేటివ్ పెట్టుబడి థీమ్‌ను అనుసరించడం ద్వారా ఈక్విటీ మరియు సంబంధిత సాధనాలలో పెట్టుబడి పెట్టి, దీర్ఘకాలిక మూలధన వృద్ధి ప్రయోజనాలను అందించడం. అయితే, స్కీము యొక్క లక్ష్యాలు నెరవేరతాయనే కచ్చితమైన హామీ ఉండదు.•బెంచ్‌మార్క్: BSE 200 TRI•కనిష్ట పెట్టుబడి: కనిష్ట పెట్టుబడి రూ.1,000.•పథకాలు: రెగ్యులర్ అండ్ డైరెక్ట్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి, రెండింటిలో కూడా గ్రోత్ ఆప్షన్ మాత్రమే ఉంది.•లోడ్ స్వరూపం: సెబీ నిబంధనల ప్రకారం ఎంట్రీ లోడ్ లేదు. అయితే, అలాట్మెంట్ తేదీ నుంచి 90 రోజుల్లోపుగా రిడీమ్/స్విచ్ అవుట్ చేస్తే 1% ఎగ్జిట్ లోడ్ వర్తిస్తుంది, ఆ తర్వాత ఉండదు. -
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కొత్త డిపాజిట్ స్కీములు..
భారతీయులు ఎక్కువగా ఫిక్స్డ్ డిపాజిట్లలో (fixed deposits) పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతారు. రిస్క్ లేకుండా మంచి వడ్డీ వస్తుండటంతో ఎఫ్డీలు చాలా కాలంగా సామాన్యులకు ఇష్టమైన పెట్టుబడి ఎంపికగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ బ్యాంకులతోపాటు ప్రైవేట్ బ్యాంకులు కూడా ఆకర్షణీయమైన ఎఫ్డీ పథకాలను ప్రారంభిస్తున్నాయి.ఈ క్రమంలోనే పంజాబ్ నేషనల్ బ్యాంక్ (Punjab National Bank) కూడా తాజాగా వివిధ టెన్యూర్లలో రెండు కొత్త ఫిక్స్డ్ డిపాజిట్ స్కీములను (FD schemes) ప్రారంభించింది. 303 రోజులు, 506 రోజుల టెన్యూర్ ఉండే ఈ ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలలో రూ.3 కోట్ల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.పంజాబ్ నేషనల్ బ్యాంక్ కొత్త 303 రోజుల వ్యవధి ఎఫ్డీలో డబ్బు డిపాజిట్ చేసే పెట్టుబడిదారులు 7 శాతం వడ్డీని పొందుతారు. అదేవిధంగా 506 రోజుల వ్యవధికి వడ్డీ రేటు 6.7 శాతం. ఈ కొత్త వడ్డీ రేట్లు 2025 జనవరి 1 నుండి అమలులోకి వచ్చాయి. సీనియర్ సిటిజన్లు, సూపర్ సీనియర్ సిటిజన్లు అయితే ఈ రెండు ఎఫ్డీలలో ఎక్కువ వడ్డీని పొందుతారు.ఇదీ చదవండి: క్రెడిట్‌కార్డుతో పొరపాటున కూడా ఈ లావాదేవీలు చేయొద్దు.. చేశారో అంతే..!సీనియర్ సిటిజన్లకు 303 రోజుల వ్యవధి కలిగిన ఎఫ్డీలపై 7.5 శాతం వడ్డీ, 506 రోజుల టెన్యూర్ ఎఫ్డీలపై 7.2 శాతం వడ్డీ లభిస్తుంది. ఇక సూపర్ సీనియర్ సిటిజన్లకు 300 రోజుల వ్యవధి ఎఫ్డీలపై 7.85 శాతం, 506 రోజుల టెన్యూర్ ఎఫ్డీలపై 7.5 శాతం వడ్డీని బ్యాంక్ ఇస్తోంది.ఇతర ఎఫ్డీలుపంజాబ్ నేషనల్ బ్యాంక్ 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు టెన్యూర్ ఎఫ్డీ స్కీములను అందిస్తోంది. వీటిపై సాధారణ పౌరులకు వడ్డీ రేటు 3.50% నుండి 7.25% ఉంది. అదే సీనియర్ సిటిజన్లకు అయితే 4% నుండి 7.75% వడ్డీని అందిస్తోంది. 400 రోజుల వ్యవధి కలిగిన ఎఫ్డీలపై అత్యధికంగా సాధారణ పౌరులకు 7.25%, సీనియర్ సిటిజన్లకు 7.75% వడ్డీ రేటు లభిస్తోంది.సూపర్ సీనియర్ సిటిజన్లకు (80 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు) పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు టెన్యూర్ ఉన్నఎఫ్డీలపై 4.30% నుండి 8.05% వడ్డీని అందిస్తోంది. వీరికి ప్రస్తుతం 400 రోజుల కాలవ్యవధి ఎఫ్డీలపై 8.05% వడ్డీని బ్యాంక్ చెల్లిస్తోంది. -
(అ)సాధారణ బీమా
కోల్‌కతా: సాధారణ బీమా (జీవిత బీమా కాకుండా) రంగం ఈ ఏడాది రెండంకెల వృద్ధిని చూడనుంది. నియంత్రణపరమైన అనుకూల వాతావరణానికి తోడు, వినూత్నమైన ఉత్పత్తుల ఆవిష్కరణ వృద్ధిని నడిపిస్తుందని పరిశ్రమ అంచనా వేస్తోంది. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపు కల్పించడం, మోటార్ ఇన్సూరెన్స్ థర్డ్‌పార్టీ ప్రీమియం రేట్ల సమీక్ష నిర్ణయాలు తమకు అనుకూలిస్తాయని భావిస్తోంది. ‘‘హెల్త్ ఇన్సూరెన్స్ రానున్న సంవత్సరాల్లోనూ వృద్ధిని నడిపించనుంది. నాన్ మోటార్, పెట్ ఇన్సూరెన్స్, లయబిలిటీ, ప్రొఫెషనల్ ఇండెమ్నిటీ, హౌసింగ్ ఇన్సూరెన్స్ వంటి నాన్ హెల్త్ విభాగాల్లోనూ బీమా వ్యాప్తి గణనీయంగా పెరగనుంది’’అని ఫ్యూచర్ జనరాలి ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ఎండీ, సీఈవో అనూప్ రావు తెలిపారు. 14 శాతం మేర వృద్ధిని పరిశ్రమ అంచనా వేస్తున్నట్టు చెప్పారు. జీఎస్టీ, మోటార్ థర్డ్ పార్టీ రేట్ల విషయంలో పరిశ్రమకు సహకారం అవసరమన్నారు. ‘‘హెల్త్ ఇన్సూరెన్స్‌పై జీఎస్టీని తొలగిస్తే వాటి ధరలు మరింత అందుబాటులోకి వస్తాయి. దీంతో ఎక్కువ మందికి బీమా చేరువ అవుతుంది. దీనివల్ల ప్రజారోగ్యంపై ప్రభుత్వానికి భారం తగ్గుతుంది. మోటార్ థర్డ్ పార్టీ ప్రీమియం రేట్లు ఐదేళ్లుగా ఎలాంటి మార్పులకు నోచుకోలేదు. వీటిని తక్షణమే సవరించాల్సి ఉంది’’అని రావు వివరించారు. వ్యయాలను తగ్గించుకుని, అత్యవసర బీమా ఉత్పత్తులను అందరికీ చేరువ చేసేందుకు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ)ను వినియోగించుకోవాల్సి ఉందన్నారు. బీమా సుగం, బీమా విస్తార్, బీమా వాహక్స్ చర్యలు ఇందుకు వీలు కల్పిస్తాయన్నారు. అందరికీ అందుబాటు.. బీమాను అందుబాటు ధరలకు తీసుకురావాల్సిన అవసరాన్ని హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో అనుజ్ త్యాగి ప్రస్తావించారు. ‘‘ఉత్పత్తుల అభివృద్ధి, అండర్ రైటింగ్, కస్టమర్ సేవల్లో నూతనత్వం అన్నది బీమాను పౌరులకు మరింత చేరువ చేస్తుంది’’అని చెప్పారు. బీమా పరిశ్రమ పరిమాణాత్మక మార్పు వైపు అడుగులు వేస్తోందని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో తపన్ సింఘాల్ పేర్కొన్నారు. డిజిటల్ ఆవిష్కరణల ద్వారా వ్యక్తిగత అవసరాలకు అనుగుణమైన బీమా ఉత్పత్తులను అందించడాన్ని ప్రస్తావించారు. విపత్తుల నిర్వహణకు సంబంధించి పారామెట్రిక్ ఇన్సూరెన్స్‌తోపాటు సైబర్ ఇన్సూరెన్స్ సైతం ప్రాముఖ్యతను సంతరించుకోనున్నట్టు చెప్పారు. -
క్రెడిట్‌కార్డుతో పొరపాటున కూడా ఈ లావాదేవీలు చేయొద్దు..
ఆదాయపన్ను శాఖ (Income tax) ప్రతిఒక్కరినీ ఓ కంట కనిపెడుతూ ఉంటుంది. అన్ని లావాదేవీలపైనా నిఘా ఉంచుతుంది. ప్రస్తుతం క్రెడిట్‌కార్డుల వినియోగం పెరిగింది. అన్ని రకాల చెల్లింపులకూ క్రెడిట్ కార్డులే (Credit cards) వినియోగిస్తున్నారు. అయితే ఆదాయపు పన్ను నోటీసు రాకుండా నివారించాలనుకుంటే పొరపాటున కూడా చేయని లావాదేవీలు కొన్ని ఉన్నాయి.క్రెడిట్ కార్డులతో చేసే కొన్ని లావాదేవీలు నేరుగా ఆదాయపు పన్ను శాఖ దృష్టికి రావచ్చు. మీకు నోటీసు పంపవచ్చు. ఇవి అలాంటి లావాదేవీలైతే, సీఏలు కూడా మిమ్మల్ని రక్షించలేరు. అందుకే ఈ సమాచారం క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు చాలా ముఖ్యమైనది. ఎటాంటి లావాదేవీలు మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తాయో ఇక్కడ తెలుసుకోండి.ఒక సంవత్సరంలో విదేశీ ప్రయాణాలకు రూ.2 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేసినట్లయితే దాని డేటా ఆదాయపు పన్ను శాఖకు వెళుతుంది.క్రెడిట్ కార్డ్‌పై సంవత్సరానికి రూ.2 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేస్తే, ఆదాయపు పన్ను శాఖ మీపై నిఘా ఉంచుతుంది. రూ. 1 లక్ష కంటే ఎక్కువ నగదు రూపంలో క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులు వంటి పెద్ద లావాదేవీలు శాఖ దృష్టిని ఆకర్షించవచ్చు.ఒక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్స్, షేర్లు లేదా బాండ్లలో రూ.10 లక్షల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టినట్లయితే, ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపవచ్చు.రూ.30 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఆస్తిని కొనుగోలు చేసినట్లయితే, దాని సమాచారం ఆటోమేటిక్‌గా ఆదాయపు పన్ను శాఖకు చేరుతుంది.బ్యాంకు ఖాతాలో పెద్ద మొత్తంలో నగదు జమ చేయడం ఆదాయపు పన్ను శాఖ దృష్టిని ఆకర్షిస్తుంది. రూ.10 లక్షల కంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేస్తే నోటీసు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.నగదు రూపంలో జరిగే వ్యాపార లావాదేవీలపై ఆదాయపు పన్ను శాఖ నిఘా ఉంచుతుంది. రూ.50,000 కంటే ఎక్కువ వ్యాపార లావాదేవీల సమాచారం కోసం డిపార్ట్మెంట్ మిమ్మల్ని అడగవచ్చు. -
బంగారం ఎంత కొనచ్చు? పెళ్లికానివారికైతే అంతే!
భారత దేశంలో బంగారాన్ని (Gold) సంపదకు, ఐశ్వర్యానికి చిహ్నంగా పరిగణిస్తారు. మన సంప్రదాయాలలో పసిడి లోతుగా పాతుకుపోయింది. బంగారం కొనడాన్ని భారతీయులు అదృష్టంగా భావిస్తారు. ముఖ్యంగా పండుగ సందర్భాలలో పుత్తడి కొనుగోళ్లు అధికంగా ఉంటాయి. నాణేలు, ఆభరణాలు.. ఇలా వివిధ రూపాల్లో బంగారాన్ని కొని ఇంట్లో పెట్టుకుంటారు.అంతటి ప్రాధాన్యత ఉన్న బంగారాన్ని కొనడానికి ముందు దానికి సంబంధించిన నిబంధనలను తెలుసుకోవడం, అనుసరించడం కూడా అంతే ముఖ్యం. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) మార్గదర్శకాల ప్రకారం, డిక్లేర్డ్ ఆదాయం, వ్యవసాయ ఆదాయం, సహేతుకమైన గృహ పొదుపులు లేదా చట్టబద్ధంగా సంక్రమించిన ఆస్తులతో కొనుగోలు చేసిన బంగారంపై ఎటువంటి పన్నులు ఉండవు. ఇలా కాకుండా వేరే మార్గాల ద్వారా సమకూర్చుకున్న బంగారం పరిమితులకు మించి ఉంటే అధికారులు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది.ఎంత బంగారం ఉండొచ్చు?వివాహిత మహిళలు: 500 గ్రాముల వరకుఅవివాహిత స్త్రీలు: 250 గ్రాముల వరకుపురుషులు (వివాహితులు, అవివాహితులు ఎవరైనా): 100 గ్రాముల వరకుబంగారం.. పెట్టుబడి మార్గంస్టాక్లు, మ్యూచువల్ ఫండ్లు బాండ్లతో పాటు బంగారం కూడా చాలా కాలంగా విశ్వసనీయ పెట్టుబడి ఎంపికగా ఉంది. సంపదను పెంచుకోవడానికి ఇది నమ్మదగిన మార్గంగా ప్రజలను ఆకర్షిస్తూనే ఉంది. డిజిటల్ గోల్డ్, సావరిన్ గోల్డ్ బాండ్స్ (SGBs) వంటి బంగారు పెట్టుబడుల కొత్త రూపాలు ప్రజాదరణ పొందుతున్నప్పటికీ, చాలా మంది ఇప్పటికీ భౌతిక బంగారాన్ని ఇష్టపడుతున్నారు. వివిధ రకాల గోల్డ్ ఇన్వెస్ట్మెంట్లు వాటి నిబంధనలను పరిశీలిస్తే..ఫిజికల్ గోల్డ్: పురుషులు 100 గ్రాముల వరకు కలిగి ఉండవచ్చు. వివాహిత మహిళలు 500 గ్రాములు, అవివాహిత స్త్రీలు 250 గ్రాములు గరిష్టంగా కలిగి ఉండవచ్చు. మూడు సంవత్సరాల తర్వాత భౌతిక బంగారాన్ని విక్రయిస్తే దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను 20 శాతంతోపాటు సెస్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే స్వల్పకాలిక అమ్మకాలపై ఆదాయ స్లాబ్ రేట్ల ప్రకారం పన్ను ఉంటుంది. అలాగే కొనుగోళ్లపైనా 3% జీఎస్టీ (GST) ఉంటుంది.డిజిటల్ గోల్డ్: ఇది మరింత అనుకూలమైన ఎంపిక. డిజిటల్ గోల్డ్‌లో నిల్వ అవాంతరాలు ఉండవు. ఉపసంహరణపై మాత్రమే పన్నులు వర్తిస్తాయి. దీనిపై పెట్టే రోజువారీ ఖర్చు రూ. 2 లక్షలకు పరిమితం.సావరిన్ గోల్డ్ బాండ్: ఈ బాండ్లు సంవత్సరానికి 4 కిలోల వరకు పెట్టుబడిని అనుమతిస్తాయి. దీనిపై 2.5% వార్షిక వడ్డీ లభిస్తుంది. అయితే ఇది పన్ను పరిధిలోకి వస్తుంది. ఎనిమిది సంవత్సరాల తర్వాత వీటి నుండి వచ్చే లాభాలు పన్ను రహితంగా ఉంటాయి.గోల్డ్ ఈటీఎఫ్‌లు, మ్యూచువల్ ఫండ్లు: వీటి నుండి వచ్చే లాభాలపై భౌతిక బంగారంతో సమానంగా పన్ను ఉంటుంది. దీర్ఘకాలిక మూలధన లాభాలపై మూడేళ్ల తర్వాత 20 శాతం పన్ను విధిస్తారు. -
క్రెడిట్ కార్డు Vs ఛార్జ్ కార్డు.. ఏంటీ ఛార్జ్ కార్డు..
నెలవారీ వేతన జీవులతోపాటు చాలామంది వద్ద సాధారణంగా క్రెడిట్ కార్డు ఉండడం గమనిస్తుంటారు. అత్యవసర సమయాల్లో ఆర్థికంగా ఆదుకుంటుందనే ధీమాతో ఈ కార్డును తీసుకుంటారు. బిల్లు జనరేట్ అయ్యాక పూర్తి పేమెంట్ లేదా అత్యవసర సమయాల్లో మినియం బిల్లును చెల్లిస్తుంటారు. క్రెడిట్ కార్డు(Credit Card)లాగే కొన్ని బ్యాంకులు ఛార్జ్ కార్డు(Charge Card)లను జారీ చేస్తాయి. అయితే ఈ రెండింటి వినియోగంలో కొన్ని తేడాలున్నాయి. అసలు ఛార్జ్ కార్డులు ఎవరికి జారీ చేస్తారు.. పేమెంట్ నియమాలు ఎలా ఉంటాయి..ఛార్జ్ కార్డు నిజంగా ఎవరికి అవసరమో తెలుసుకుందాం.ఛార్జ్ కార్డులుఛార్జ్ కార్డు అనేది ఒక రకమైన చెల్లింపు కార్డు. ఎలాంటి ముందస్తు లిమిట్ పరిమితులు లేకుండా దీన్ని జారీ చేస్తారు. ప్రతి బిల్లింగ్ సైకిల్లో కొనుగోళ్లు చేయడానికి క్రెడిట్ కార్డులాగే దీన్ని వినియోగించవచ్చు. అయితే దీని వినియోగంలో పరిమితి ఉండదు కాబట్టి ఎంతైనా వాడుకోవచ్చు. కానీ బిల్లు సైకిల్ పూర్తి అయ్యేలోపు మొత్తం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సకాలంలో పూర్తి బ్యాలెన్స్ చెల్లించడంలో విఫలమైతే మాత్రం భారీ మొత్తంలో ఫీజులు చెల్లించాలి. క్రెడిట్ కార్డుల మాదిరిగానే ఛార్జ్ కార్డుల వినియోగంపై ట్రావెల్ పాయింట్లు, క్యాష్‌బ్యాక్, వివిధ రివార్డు పాయింట్లు ఇతర ప్రయోజనాలు అందిస్తారు.క్రెడిట్ కార్డు, ఛార్జ్ కార్డు మధ్య ప్రధాన తేడాలుక్రెడిట్ లిమిట్క్రెడిట్ కార్డులో ముందుగా సెట్ చేసిన లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ కంటే తక్కువే వాడుకోవాలి. కానీ ఛార్జ్ కార్డులో వ్యయ పరిమితి ఉండదు. ఎంతైనా వాడుకోవచ్చు. కానీ బిల్లు జనరేట్ అయ్యాక మాత్రం పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ పేమెంట్ చేయడంలో విఫలమైతే మాత్రం భారీగా ఛార్జీలు విధిస్తారు.బ్యాలెన్స్ పేమెంట్కనీస నెలవారీ చెల్లింపులకు క్రెడిట్ కార్డులో అవకాశం ఉంటుంది. కానీ ఛార్జ్ కార్డులో ఈ సదుపాయం ఉండదు. ప్రతి బిల్లింగ్ సైకిల్(Billing Cycle)లో పూర్తి బ్యాలెన్స్ చెల్లించాలి.వడ్డీ(Interest)మినిమం బ్యాలెన్స్ చెల్లించిన తర్వాత మిగతా చెల్లించాల్సిన దానికి క్రెడిట్ కార్డులో వడ్డీ విధిస్తారు. ఛార్జ్ కార్డులో అసలు ఆ సదుపాయమే ఉండదు.వార్షిక ఫీజులువార్షిక రుసుములు, ఆలస్య రుసుములు, వడ్డీ రేట్లు క్రెడిట్ కార్డులకు ఉంటాయి. ఛార్జ్ కార్డులకు కూడా వార్షిక రుసుము ఉంటుంది. అది క్రెడిట్ కార్డు రుసుముతో పోలిస్తే భారీగా ఉంటుంది. ఆలస్య రుసుము కూడా అధికంగానే విధిస్తారు.రివార్డులుక్రెడిట్ కార్డులు, ఛార్జ్ కార్డులు రెండింటిలోనూ క్యాష్ బ్యాక్, ట్రావెల్ పాయింట్స్(Travel Points), రివార్డు ప్రోగ్రామ్‌లు ఉంటాయి. ఛార్జ్ కార్డుల్లో ఇవి కొంత అధికంగా ఉంటాయి. బ్యాంకును అనుసరించి ఈ పాయింట్లు మారుతుంటాయి.ఛార్జ్ కార్డుకు అర్హులెవరు..అద్భుతమైన క్రెడిట్ స్కోర్: ఛార్జ్ కార్డ్ జారీ చేసేవారు సాధారణంగా అద్భుతమైన క్రెడిట్ స్కోర్ ఉన్న దరఖాస్తుదారుల కోసం చూస్తారు. సాధారణంగా 700 లేదా అంతకంటే ఎక్కువ ఉంటేనే దీన్ని జారీ చేసే అవకాశం ఉంటుంది.స్థిరమైన ఆదాయం: ప్రతి నెలా బ్యాలెన్స్ పూర్తిగా చెల్లించగలరని నిరూపించడానికి స్థిరమైన, గణనీయమైన ఆదాయాన్ని చూపించాల్సి ఉంటుంది.స్ట్రాంగ్ క్రెడిట్ హిస్టరీ: సకాలంలో చెల్లింపులు జరిపే ట్రాక్ రికార్డ్ ఉన్న క్రెడిట్ హిస్టరీ చాలా ముఖ్యం.తక్కువ రుణ-ఆదాయ నిష్పత్తి: రుణదాతలు తక్కువ రుణ-ఆదాయ నిష్పత్తి(ఆదాయం ఎక్కువ ఉండి రుణాలపై తక్కువగా ఆధారపడడం) ఉన్న దరఖాస్తుదారులకు ప్రాధాన్యం ఇస్తారు.రెసిడెన్సీ స్టేటస్: ఛార్జ్ కార్డు కోసం దరఖాస్తు చేయాలనుకుంటే మీరు ఏ దేశంలో అప్లై చేస్తున్నారో ఆ దేశ పౌరసత్వాన్ని కలిగి ఉండాలి.ఇదీ చదవండి: జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన మార్పులు ఇవే..ఇస్తున్నారు కదా అని..క్రెడిట్ కార్డు, ఛార్జ్ కార్డు.. ఏ కార్డు తీసుకున్నా అప్పు ఎప్పుటికీ మంచిదికాదు. తప్పని పరిస్థితుల్లో అప్పు చేసినా బిల్లు సైకిల్లోపు దాన్ని తిరిగి పూర్తిగా చెల్లించే ఆర్థిక సత్తా సంపాదించాలి. బ్యాంకువారు లేదా వేరొకరు ఇస్తున్నారు కదా అని అప్పు చేస్తే తిరిగి అది చెల్లించలేకపోతే తీవ్రంగా ఇబ్బందులు పడాల్సి ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. -
జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన మార్పులు ఇవే..
కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టాం. ఈ రోజు జనవరి 1, 2025 నుంచి దేశవ్యాప్తంగా కొన్ని అంశాల్లో మార్పులు అమలు అవుతున్నాయి. ఈపీఎఫ్ఓ, యూఎస్ వీసా, ఎల్పీజీ సిలిండర్ ధరలు, కార్ల ధరలు, రేషన్ కార్డులకు కేవైసీ నమోదు చేయడం వంటి వాటిలో మార్పులు వచ్చాయి. ఈమేరకు ఇప్పటికే ఆయా విభాగాలు ప్రకటనలు విడుదల చేశాయి. అందులో కొన్ని ముఖ్యమైన వాటి వివరాలు తెలుసుకుందాం.ఎల్పీజీ సిలిండర్ ధరలుజనవరి 1, 2025 నుంచి ప్రధాన నగరాల్లో 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలు తగ్గాయి. మారిన ధరలు కింది విధంగా ఉన్నాయి.ఢిల్లీ: రూ.1,804 (రూ.14.5 తగ్గింది)ముంబై: రూ.1,756 (రూ.15 తగ్గుదల)కోల్‌కతా: రూ.1,911 (రూ.16 తగ్గింది)చెన్నై: రూ.1,966 (రూ.14.5 తగ్గింది)14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర స్థిరంగా ఢిల్లీలో రూ.803, కోల్‌కతాలో రూ.829, ముంబైలో రూ.802.50, చెన్నైలో రూ.818.50గా ఉంది.కార్ల ధరలుమారుతి సుజుకీ, హ్యుందాయ్, మహీంద్రా, బీఎండబ్ల్యూ(BMW) వంటి ప్రధాన ఆటో కంపెనీలు కార్ల ధరలను 3% వరకు పెంచాయి.రేషన్ కార్డులకు ఈ-కేవైసీరేషన్ కార్డుదారులకు ఈ-కేవైసీ(e-KYC) తప్పనిసరి. 2024 డిసెంబర్ 31లోగా ఈ-కేవైసీ పూర్తి చేయని రేషన్‌కార్డులు రద్దవుతున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.పెన్షన్ ఉపసంహరణ నిబంధనలుపెన్షనర్లు అదనంగా ఎలాంటి ధ్రువీకరణ అవసరం లేకుండా ఏదైనా బ్యాంకు నుంచి పెన్షన్‌ను ఉపసంహరించుకోవడానికి ఈపీఎఫ్ఓ అనుమతించింది.ఏటీఎం ద్వారా పీఎఫ్ విత్డ్రాసులభంగా పీఎఫ్(PF) ఖాతాలోని నగదును ఉపసంహరించుకోవడానికి ఏటీఎం కార్డు సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఈపీఎఫ్ఓ తెలిపింది.ఇదీ చదవండి: ఏడాది మొదటిరోజు తులం బంగారం ఎంతంటే..యూపీఐ పరిమితి పెంపుయూపీఐ 123పే కింద ఫీచర్ ఫోన్ యూజర్లకు చెల్లింపు పరిమితిని రూ.10,000కు కేంద్రం పెంచింది. ఇది గతంలో రూ.5,000గా ఉండేది. జనవరి 1 నుంచి ఈ పెంపు అమల్లోకి వస్తున్నట్లు గతంలో ప్రభుత్వం ప్రకటించింది.యూఎస్ వీసా రూల్స్నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా(Visa) దరఖాస్తుదారులు జనవరి 1 నుంచి ఒకసారి ఉచితంగా అపాయింట్మెంట్ను రీషెడ్యూల్ చేసుకోవచ్చు. -
కొత్త సంవత్సరంలో ఎవరు ఏం చేయాలో తెలుసా..
ఎన్నో ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాం. పాత రోజుల్లాగే ఈ ఏడాదీ గడిచిపోతే కిక్కేముంటుంది. వైవిధ్యంగా ఉండాలని అందరూ అనుకుంటారు. ఆర్థికంగా ఈ ఏడాదిలో మరింత రాణిస్తూ, పెట్టుబడులను కాపాడుకోవాలని చాలా మంది భావిస్తారు. అయితే కొందరు వయసురీత్యా రిస్క్ చేయలేకపోవచ్చు. ఏ వయసువారు ఎలాంటి పెట్టుబడి పంథాను ఎంచుకోవాలో..తమ ఇన్వెస్ట్మెంట్ ఎలా కాపాడుకోవాలో ఆర్థిక నిపుణులు కొన్ని సలహాలు ఇస్తున్నారు.20-30 ఏళ్ల వయసువారు..ఈ వయసువారు కాస్త దూకుడుగా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. వీరు తమ పెట్టుబడుల్లో సుమారు 80 శాతం వరకూ ఈక్విటీలకు కేటాయించవచ్చు. ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియో మరింత సురక్షితంగా ఉండాలంటే 70 శాతం వరకు చేస్తే సరిపోతుంది. మిగతా మొత్తాన్ని నష్టం తక్కువగా ఉంటే లిక్విడ్, డెట్ ఫండ్లలో మదుపు చేయవచ్చు. ఇన్వెస్ట్ చేసినప్పటి నుంచి మూడేళ్లలోపు నగదు అవసరం ఉందని భావిస్తే ఈ పథకాల్లో నుంచి డబ్బు తీసుకునే వీలుంటుంది. ఈక్విటీలకు సంబంధించి దీర్ఘకాలంలో మంచి రాబడులిచ్చే స్మాల్‌క్యాప్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలి.30-40 ఏళ్ల గ్రూప్ వారు..వీరికి స్థిరంగా ఆదాయం ఉంటుంది. ఈ వయసులోవారు ఇల్లు కొనడం, పిల్లల చదువులు, కుటుంబ పెద్దల ఆరోగ్య ఖర్చులు, పెళ్లిళ్లు, బంధువుల ఇంటికి వెళ్లడం.. వంటి వాటికి ఎక్కువ ఖర్చు చేయాల్సి రావొచ్చు. దాంతోపాటు ప్రధానంగా పదవీ విరమణ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. కాబట్టి, రిస్క్‌తో కూడిన ఈక్విటీ పెట్టుబడులను కొంత తగ్గించుకోవాలి. మొత్తం పెట్టుబడుల్లో గరిష్ఠంగా 70 శాతం వరకే ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయాలి. మిగతాది సురక్షితంగా ఉండే వివిధ మార్గాల్లో మదుపు చేయాలి.40-50 ఏళ్లవారు..ఈ వయసులో రిస్క్ తీసుకోవడం సరికాదు. ఇది ప్రశాంతంగా ఉండాల్సిన సమయం. కాబట్టి ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌మెంట్‌ను తగ్గించుకుని స్థిరాదాయం ఇచ్చే డెట్ పథకాల్లోకి పెట్టుబడిని మళ్లించాలి. మొత్తం మదుపులో ఈక్విటీ పెట్టుబడులు 60 శాతం మించకుండా జాగ్రత్తపడాలి.ఇదీ చదవండి: మినిమం బ్యాలెన్స్ లేదంటే జరిమానా.. తప్పించుకోవడం ఎలా?50 దాటిన వారు..ఈ వయసులో అసలు రిస్క్ తీసుకోకూడదు. పదవీ విరమణ తర్వాత ప్రశాంత జీవితానికి ఏర్పాట్లు చేసుకోవాలి. పదవీ విరమణ మరో మూడేళ్లు ఉందనుకున్నప్పుడే క్రమంగా మీ ఈక్విటీ పెట్టుబడులను స్థిర ఆదాయం వచ్చే డెట్ ఫండ్స్‌లోకి మళ్లించాలి. లేదంటే ఏదైనా అనిశ్చితులు ఏర్పడి మార్కెట్ పడిపోయినా, కొంత కాలంపాటు ఎలాంటి పెరుగుదల లేకుండా కదలాడినా భారీగానే నష్టపోవాల్సి ఉంటుంది. పదవీవిరమణ తర్వాత ఆదాయం ఉండదు కాబట్టి డబ్బును కాపాడుకోవడం ఉత్తమం. -
రూ.15,100 కోట్ల క్లెయిమ్‌లను అనుమతించలేదు!
ఆరోగ్య బీమా సంస్థలు 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.15,100 కోట్ల విలువైన క్లెయిమ్(Claim)లను అనుమతించలేదు. దాఖలు చేసిన మొత్తం క్లెయిమ్‌ల్లో ఇవి 12.9 శాతానికి సమానమని బీమా నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ తాజాగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. సాధారణ, స్వతంత్ర ఆరోగ్య బీమా(Health Insurance) సంస్థలకు వచ్చిన మొత్తం రూ.1.17 లక్షల కోట్ల క్లెయిమ్‌లలో.. రూ.83,493.17 కోట్లు లేదా 71.29 శాతం చెల్లింపులు జరిగాయి. బీమా సంస్థలు రూ.10,937.18 కోట్ల (9.34 శాతం) క్లెయిమ్‌లను తిరస్కరించాయి. 2024 మార్చి నాటికి మొత్తం రూ.7,584.57 కోట్ల (6.48 శాతం) విలువైన క్లెయిమ్‌లు బకాయి ఉన్నాయి. 2023–24లో సుమారు 3.26 కోట్ల ఆరోగ్య బీమా క్లెయిమ్‌లు వచ్చి చేరాయి. వీటిలో 2.69 కోట్ల (82.46 శాతం) క్లెయిమ్‌లు పరిష్కారం అయ్యాయి. ఒక్కో క్లెయిమ్‌కు చెల్లించిన సగటు మొత్తం రూ.31,086గా ఉంది.నగదు రహితం 66.16%.. సెటిల్ అయిన క్లెయిమ్‌ల సంఖ్య పరంగా 72 శాతం థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్స్ (TPA) ద్వారా, మిగిలిన 28 శాతం కంపెనీల అంతర్గత యంత్రాంగం ద్వారా పరిష్కారం అయ్యాయి. క్లెయిమ్‌ల సెటిల్మెంట్ విధానంలో 66.16 శాతం నగదు రహితంగా, మరో 39 శాతం రీయింబర్స్మెంట్ విధానంలో పరిష్కరించారు. 2023–24 సంవత్సరంలో సాధారణ, ఆరోగ్య బీమా కంపెనీలు పర్సనల్ యాక్సిడెంట్, ట్రావెల్ ఇన్సూరెన్స్ మినహాయించి రూ.1,07,681 కోట్ల ఆరోగ్య బీమా ప్రీమియం వసూలు చేశాయి. బీమా ప్రీమియం అంత క్రితం ఏడాదితో పోలిస్తే 20.32 శాతం వృద్ధిని నమోదు చేసింది. పర్సనల్ యాక్సిడెంట్(Accident), ట్రావెల్ ఇన్సూరెన్స్ బీమా కింద జారీ చేసిన పాలసీలు మినహా సాధారణ, ఆరోగ్య బీమా కంపెనీలు 2.68 కోట్ల ఆరోగ్య బీమా పాలసీల ద్వారా 57 కోట్ల మందికి కవరేజ్ ఇచ్చాయి.ఇదీ చదవండి: ‘వ్యక్తిగత ఆదాయపన్ను తగ్గించాలి’165.05 కోట్ల జీవితాలను..2024 మార్చి చివరి నాటికి 25 సాధారణ బీమా సంస్థలు, 8 స్వతంత్ర ఆరోగ్య బీమా సంస్థలు సేవలు అందించాయి. గత ఆర్థిక సంవత్సరంలో వ్యక్తిగత ప్రమాద బీమా కింద పరిశ్రమ మొత్తం 165.05 కోట్ల జీవితాలను కవర్ చేసింది. ఇందులో ప్రభుత్వ ప్రధాన పథకాలు ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY), ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (PMJDY), ఈ–టికెట్ కొనుగోలు చేసిన ప్రయాణికుల కోసం ఐఆర్సీటీసీ ప్రయాణ బీమా కింద కవర్ చేయబడిన 90.10 కోట్ల జీవితాలు ఉన్నాయి. ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థలైన న్యూ ఇండియా, నేషనల్, ఓరియంటల్ ఇన్సూరెన్స్ విదేశాలలో ఆరోగ్య బీమా వ్యాపారం చేస్తున్నాయి. -
SBI రివార్డ్ పాయింట్ల తనిఖీ & రీడీమ్: ఇలా సింపుల్..
మీరు క్రెడిట్ కార్డ్‌తో లావాదేవీ జరిపిన ప్రతిసారీ 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (SBI) ప్రత్యేకమైన రివార్డ్‌లను అందిస్తుంది. ఈ రివార్డ్ పాయింట్లను ఇష్టమైన బ్రాండ్లపై అద్భుతమైన డీల్‌లు లేదా ఆఫర్ల కోసం రీడీమ్ చేసుకోవచ్చు. ఈ పాయింట్లతో మీకు కావాల్సిన వాటిని కొనుగోలు చేస్తూ.. ఖర్చులను కూడా ఆదా చేయవచ్చు. అయితే కొందరికి ఈ రివార్డ్ పాయింట్లను ఎలా చెక్ చేసుకోవాలి? ఎలా రీడీమ్ చేసుకోవాలి అనే విషయాలు తెలుసుండకపోవచ్చు. ఆ వివరాలను ఈ కథనంలో తెలుసుకోవచ్చు..ఎస్బీఐ రివార్డ్ పాయింట్లను ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్, కస్టమర్ కేర్ ద్వారా కూడా రీడిమ్ చేసుకోవచ్చు.ఇంటర్నెట్ బ్యాంకింగ్ (Internet Banking)➤కస్టమర్ ఐడీ, పాస్వర్డ్ ఉపయోగించి ఎస్బీఐ అధికారిక కార్డ్ పోర్టల్ లాగిన్ చేసిన తరువాత.. మెను బార్లో 'రివార్డ్‌లు' ఎంచుకుని, ఆపై 'రివార్డ్‌లను రీడీమ్ చేయి' ఆప్షన్ ఎంచుకోండి.➤రివార్డ్ పాయింట్స్, సిటీ, కేటగిరీ వంటి వాటిని ఎంచుకోవాలి.➤'రివార్డ్స్ కేటలాగ్' నుంచి మీకు కావలసిన వస్తువును ఎంచుకున్న తరువాత.. 'రీడీమ్ నౌ'పై క్లిక్ చేయడం ద్వారా మీ లావాదేవీని పూర్తి చేయవచ్చు.మొబైల్ యాప్ (Mobile App)●మీ స్మార్ట్‌ఫోన్‌లో ఎస్బీఐ కార్డ్ మొబైల్ అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి.●యాప్ డౌన్లోడ్ చేసుకున్న తరువాత.. కస్టమర్ ఐడీ, పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ చేయాలి.●లాగిన్ పూర్తయిన తరువాత 'రివార్డ్‌లు' విభాగానికి వెళ్లి, ఆపై 'రివార్డ్‌లను రీడీమ్ చేయి' ఎంచుకోవాలి.●రివార్డ్ పాయింట్స్, సిటీ, కేటగిరీ వంటి వాటిని ఎంచుకోవాలి.●'రివార్డ్స్ కేటలాగ్' నుంచి మీకు కావలసిన వస్తువును ఎంచుకున్న తరువాత.. 'రీడీమ్ నౌ'పై క్లిక్ చేయడం ద్వారా మీ లావాదేవీని పూర్తి చేయవచ్చు.ఇదీ చదవండి: ఏటీఎం కార్డు వల్ల ఇన్ని ఉపయోగాలున్నాయా?కస్టమర్ కేర్ ద్వారా ఆఫ్‌లైన్▶ఎస్బీఐ కార్డ్ కస్టమర్ కేర్‌కు కాల్ చేసి.. మీ రివార్డ్ పాయింట్లను రీడీమ్ చేయడంలో సహాయం కోసం అడగండి.▶కస్టమర్ ఎగ్జిక్యూటివ్ మీకు రీడీమ్ చేసుకోవడంలో సహాయం చేస్తారు.▶పూర్తిగా రీడీమ్ చేసుకున్న తరువాత మీకు కావలసిన వస్తువును కొనుగోలు చేసుకోవచ్చు.ఎస్బీఐ రివార్డ్ పాయింట్లను చెక్ చేసుకోవడం ఎలా?ఎస్బీఐ రివార్డ్ పాయింట్లను చెక్ చేసుకోవడానికి ఏఐ చాట్‌బాట్‌ను, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా కాల్ చేయడం, వెబ్సైట్ లేదా మొబైల్ యాప్స్ సాయంతో చెక్ చేసుకోవచ్చు. -
మినిమం బ్యాలెన్స్ లేదంటే జరిమానా.. తప్పించుకోవడం ఎలా?
పొదుపు ఖాతాలో మినిమం బ్యాలెన్స్ లేకపోతే జరిమానా(penalty) చెల్లించాలనేలా బ్యాంకు సిబ్బంది చెబుతుంటారు. అకౌంట్ నిర్వహణ, ఏటీఎం కార్డు ఛార్జీలు, ఎస్ఎంఎస్ ఛార్జీలు.. వంటి వాటికోసం సేవింగ్స్ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ ఉంచాలి. లేదంటే నిబంధనల ప్రకారం తిరిగి అకౌంట్(Bank Account) వినియోగించినప్పుడు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం చాలా మందికి ఒకటికి మించిన బ్యాంకు అకౌంట్లు ఉంటున్నాయి. దాంతో ప్రధానంగా ఉన్న అకౌంట్లోనే లావాదేవీలు(Transactions) నిర్వహిస్తూ మిగతావాటి జోలికి వెళ్లడంలేదు. దాంతో కొన్ని రోజుల తర్వాత తిరిగి ఆ అకౌంట్లో లావాదేవీలు చేయాలంటే జరిమానా చెల్లించడం తప్పడం లేదు. కొన్ని చిట్కాలు పాటించి జరిమానా భారాన్ని తప్పించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.మినిమం బ్యాలెన్స్ ఉండాల్సిందే..సేవింగ్స్ ఖాతాలో అవసరమైన మినిమం బ్యాలెన్స్(Minimum Balance) ఎల్లవేళలా ఉండేలా చూసుకోవాలి. సగటు నెలవారీ బ్యాలెన్స్ (MBA)ను ఎలా లెక్కిస్తారో మీ బ్యాంకు సిబ్బందిని అడిగి తెలుసుకోండి. దాని పరిమితికి మించి లావాదేవీలు నిర్వహించడానికి ప్రయత్నించాలి.ఉదాహరణకు, మీ మినిమం బ్యాలెన్స్ రూ.10,000 అయితే అవసరమైన ఎంఏబీని మెయింటెన్ చేయడానికి నెలలోపు ఆరు రోజుల పాటు రూ.50,000 మీ అకౌంట్లో ఉండాలి. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉన్నవారికి ఈ విధానం ఉపయోగపడుతుంది. ఈ నిబంధనలు ప్రతి బ్యాంకును అనుసరించి మారుతుంటాయి. మీ బ్యాంకులో ఎంఏబీ నిబంధనలు ఎలా ఉన్నాయో తెలుసుకుని అందుకు అనుగుణంగా అకౌంట్లో నగదు ఉంచుకోవాలి.జీరో బ్యాలెన్స్ ఖాతాలుబేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ (బీఎస్‌బీడీఏ) అని కూడా పిలువబడే ఈ జీరో బ్యాలెన్స్ పొదుపు ఖాతాకు మారేందుకు ప్రయత్నించాలి. చాలావరకు సాలరీ అకౌంట్లు ఈ తరహా ఖాతాలుగా ఉంటాయి. ఈ ఖాతాలకు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు.రెగ్యులర్ మానిటరింగ్అకౌంట్ బ్యాలెన్స్ అవసరమైన కనీస స్థాయి కంటే తగ్గకుండా ఉండేలా చూసుకోవాలి. బ్యాలెన్స్ ట్రాక్ చేయడంలో మీకు సహాయపడటానికి అలర్ట్‌లు లేదా రిమైండర్లను సెట్ చేసుకోవాలి. ఏదైనా కారణాలతో డబ్బు కట్ అయిన వెంటనే అలెర్ట్ వచ్చేలా ఏర్పాటు చేసుకుంటారు కాబట్టి, మినిమం బ్యాలెన్స్ పాటించవచ్చు.ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్స్అవసరమైన బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి మీరు తరచూ లావాదేవీలు చేసే ప్రధాన అకౌంట్ నుంచి బ్యాలెన్స్ తక్కువగా ఉన్న సేవింగ్స్ అకౌంట్‌కు ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్లను సెట్ చేసుకోవాలి.ఇదీ చదవండి: కొత్త ఏడాదిలో రైల్వేశాఖ కీలక నిర్ణయాలుఖాతాను మూసివేయడంఎంత ప్రయత్నించినా అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ నిర్వహించలేకపోతే, ప్రస్తుత ఖాతాను మూసివేసి, జీరో బ్యాలెన్స్ ఖాతాలను అందించే బ్యాంకుతో అనుసందానమై కొత్త ఖాతా తెరవడానికి ప్రయత్నించండి. -
జనవరి 1 నుంచి ఈ బ్యాంకు ఖాతాలు క్లోజ్..
దేశవ్యాప్తంగా లక్షలాది బ్యాంక్ ఖాతాలను (Bank Account)ప్రభావితం చేసే కీలకమైన మార్పులను 2025 జనవరి 1 నుండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అమలు చేస్తోంది. ఈ మార్పులను అర్థం చేసుకోవడం, ఆలస్యం కాకముందే మేల్కోవడం చాలా అవసరం. లేకపోతే మీ బ్యాంక్ ఖాతాకు యాక్సెస్‌ను కోల్పోయే ప్రమాదం ఉంది.బ్యాంకింగ్ లావాదేవీల భద్రత, పారదర్శకత, సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో కొన్ని రకాల బ్యాంక్ ఖాతాలను మూసివేయాలని ఆర్బీఐ నిర్ణయించింది. వ్యవస్థను క్రమబద్ధీకరించడం ద్వారా మోసపూరిత కార్యకలాపాలను, ముఖ్యంగా బ్యాంక్ ఖాతా హ్యాకింగ్‌ను అరికట్టడం, బ్యాంకింగ్ రంగంలో డిజిటలైజేషన్, ఆధునికీకరణను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది.రిస్క్‌లను తగ్గించడానికి, బ్యాంకింగ్ కార్యకలాపాల్లోని లోపాలను పరిష్కరించడానికి, కస్టమర్ల ప్రయోజనాలను పరిరక్షిస్తూ మెరుగైన సేవలను అందించడానికి ఈ కొత్త మార్పులను అమలు చేస్తోంది. ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం 2025 జనవరి 1 నాటికి మూడు నిర్దిష్ట రకాల బ్యాంక్ ఖాతాలను ఆర్బీఐ మూసివేస్తోంది.డార్మాంట్ అకౌంట్లుడార్మాంట్ అకౌంట్ అంటే రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ఎటువంటి లావాదేవీలు జరగని ఖాతా. మోసపూరిత కార్యకలాపాల కోసం తరచుగా ఇలాంటి ఖాతాలను లక్ష్యంగా చేసుకునే హ్యాకర్లు ఈ ఖాతాలను దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. ఖాతాదారులను, బ్యాంకింగ్ వ్యవస్థను రక్షించడానికి ఆర్బీఐ అటువంటి ఖాతాలను మూసివేయాలని నిర్ణయించింది.ఇనాక్టివ్ అకౌంట్లునిర్దిష్ట వ్యవధిలో (సాధారణంగా 12 నెలలు లేదా అంతకంటే ఎక్కువ) లావాదేవీ కార్యకలాపాలు లేని వాటిని ఇనాక్టివ్ అకౌంట్లుగా పరిగణిస్తారు. ఖాతా భద్రతను మెరుగుపరచడానికి, మోసపూరిత ప్రవర్తన ప్రమాదాన్ని తగ్గించే ప్రయత్నాలలో భాగంగా ఈ ఖాతాలను కూడా ఆర్బీఐ క్లోజ్ చేస్తోంది. మీకూ ఇలాంటి ఇనాక్టివ్ అకౌంట్ ఉంటే వెంటనే యాక్టివేట్ చేసుకోవడం తప్పనిసరి.జీరో బ్యాలెన్స్ ఖాతాలుఎక్కువ కాలం పాటు జీరో బ్యాలెన్స్‌ని కొనసాగించే ఖాతాలు కూడా క్లోజ్ కానున్నాయి. అటువంటి ఖాతాల దుర్వినియోగాన్ని అరికట్టడం, ఆర్థిక నష్టాలను తగ్గించడం, కస్టమర్లు తమ బ్యాంకులతో క్రియాశీల సంబంధాలను కొనసాగించేలా ప్రోత్సహించడం ఆర్బీఐ లక్ష్యం. అంతేకాకుండా కేవైసీ (KYC) నిబంధనలను బలోపేతం చేయడం ఈ చర్య ముఖ్య ఉద్దేశం. -
కొత్త సంవత్సరంలో సమీక్షించాల్సినవి..
దేశానికేకాదు, వ్యక్తులకు వారి పెట్టుబడులకు బడ్జెట్ ప్రణాళికలు అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఏటా ఆయా ఇన్వెస్ట్మెంట్ల(investments)ను సమీక్షించుకోవాలని సూచిస్తున్నారు. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో లేదా కొత్త సంవత్సరం ఆరంభంలో సాధారణంగా చాలామంది తమ పెట్టుబడులను సమీక్షిస్తారని చెబుతున్నారు.విడిగా ఒక లక్ష్యానికి ఎంత కాలంలో, ఎంత మొత్తం సమకూర్చుకోవాలన్నది బడ్జెట్లో రాసుకుంటారు. అందుకు అనుకూలించే ఫండ్స్‌ను ఎంపిక చేసుకుంటారు. మరి సదరు మ్యూచువల్ ఫండ్స్(Mutual Funds) పనితీరు మీ రాబడులు ఆకాంక్షలకు అనుగుణంగానే పనితీరు చూపిస్తున్నాయా? లేదా? పనితీరు బాగోలేకపోతే ఆ ఒక్క పథకంలోనే అలా ఉందా లేక ఆ విభాగంలోని మిగిలిన పథకాల పనితీరు కూడా అదే మాదిరిగా ఉందా? అన్నది పరిశీలించుకోవాలి. విభాగం మొత్తం పనితీరు అదే మాదిరిగా ఉంటే ఆందోళన అక్కర్లేదు. మరికొంత వ్యవధి ఇచ్చి చూడొచ్చు. పథకంలో లోపం ఉంటే, అందుకు కారణాలను గుర్తించాలి. అవి సమగ్రంగా లేకపోతే మరో పథకంలోకి మారిపోవడాన్ని పరిశీలించొచ్చు.రిస్క్‌ను అధిగమించేలా..ఈక్విటీ, డెట్ సాధనాల్లో ఏదో ఒక విభాగంలోని పెట్టుబడుల విలువ గణనీయంగా వృద్ధి చెందితే, రీబ్యాలన్స్ (Re balance) చేసుకోవాలి. ఒక విభాగం పెట్టుబడుల విలువ అధికంగా వృద్ధి చెందినప్పుడు.. అధిక విలువ ఉన్న చోట నిర్ణీత శాతం మేర పెట్టుబడులు విక్రయించి, తక్కువ విలువ వద్దనున్న విభాగంలోకి మార్చుకోవాలి. దీన్నే అస్సెట్ అలోకేషన్గా చెబుతారు. దీని ద్వారా రిస్క్‌ను అధిగమించొచ్చు. బీమా కవరేజీపై దృష్టిటర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్(Insurance)లోనూ మార్పులు అవసరం పడొచ్చు. ఉదాహరణకు గృహ రుణం తీసుకున్నారని అనుకోండి.. ఆ మేరకు టర్మ్ కవరేజీని పెంచుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. ఇతర ఏ రుణం తీసుకున్నా సరే ఆ మేరకు కవరేజీ పెంచుకోవాలి. వివాహం, పిల్లలతోపాటు బాధ్యతలూ పెరుగుతుంటాయి. ఏటా ఆదాయం కూడా వృద్ది చెందుతుంది. వాటికి అనుగుణంగా తమ బీమా కవరేజీని సమీక్షించుకోవాలి. ఆరోగ్య బీమా కవరేజీ ప్రస్తుత కుటుంబ అవసరకాలకు సరిపడా ఉందా? అని సమీక్షించుకోవాలి. లేదంటే అదనపు కవరేజీతో తక్కువ వ్యయానికే సూపర్ టాపప్ ప్లాన్ తీసుకోవచ్చు.ఇదీ చదవండి: 179 మంది మృతి..‘నాదే పూర్తి బాధ్యత’అత్యవసర నిధి.. వీలునామాలో మార్పులురుణ భారంలో ఉంటే కొత్త ఏడాదిలో దాన్నుంచి బయటపడే మార్గాన్ని గుర్తించాలి. అత్యవసర నిధిలోనూ మార్పులు అవసరమే. జీవన వ్యయాలు పెరుగుతూ ఉంటాయి. కనుక 2–5 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసుకున్న అత్యవసర నిధి ఇప్పటి అవసరాలకు సరిపోకపోవచ్చు. ప్రస్తుత ఖర్చులను కనీసం ఏడాది పాటు అయినా అత్యవసర నిధి గట్టెక్కించగలదా? అన్నది సమీక్షించుకోవాలి. లేదంటే అదనంగా సమకూర్చుకోవాలి. రెండేళ్ల అవసరాలకు సరిపడా ఏర్పాటు చేసుకుంటే మరింత నిశ్చింతగా ఉండొచ్చు. నామినేషన్లు, వీలునామాలో మార్పులు అవసరం అనుకుంటే ఆ మేరకు మార్పులు చేసుకోవాలి. అవసరమైతే ఏడాదిలో ఒక్కసారి అయినా ఆర్థిక నిపుణులను సంప్రదించి సమగ్రమైన సమీక్ష చేయించుకోవాలి. -
జాబ్ లేకపోయినా ఈజీగా హోమ్ లోన్.. బ్యాంకులు చూసేది ఇవే..
ప్రతి ఒక్కరూ ఏదో ఒకరోజు సొంత ఇల్లు (Home) కావాలని కోరుకుంటారు. అయితే ఇల్లు కొనడం లేదా ఇల్లు కట్టుకోవడం అంత ఈజీ కాదు. ఇల్లు కొనాలంటే మధ్యతరగతి వాళ్లు దాచుకున్న డబ్బునంతా పెట్టాలి. అయినా కూడా సరిపోకుంటే గృహ రుణం (Home loan) తీసుకోవలసిన అవసరం ఉంటుంది. 90 శాతం మంది ఇలా హోమ్ లోన్ తీసుకునే ఇల్లు కట్టుకుంటున్నారు.జాబ్ చేస్తూ జీతం తీసుకునే వ్యక్తులకు బ్యాంకులు హోమ్ లోన్ సులువుగా మంజూరు చేస్తాయి. ఇందుకోసం ఉద్యోగి జీతం, బ్యాంక్ స్టేట్మెంట్ వంటివి చెక్ చేశాయి. మరి స్వయం ఉపాధి పొందేవారికి ఇంటి రుణాలు ఎలా ఇస్తారో మీకు తెలుసా? బ్యాంకులు వారికి ఎంత మేర గృహ రుణం ఇవ్వవచ్చు.. వడ్డీ రేటు ఎంత ఉండాలి అన్నది నిర్ణయించడానికి బ్యాంకులు చూసే కీలక విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..వయసుగృహ రుణం ఇచ్చే సమయంలో ప్రతి బ్యాంకూ ఖచ్చితంగా రుణం తీసుకునే వ్యక్తి వయస్సును చూస్తుంది. ముఖ్యంగా స్వయం ఉపాధి పొందేవారికి రుణాలు ఇస్తున్నప్పుడు వయస్సుపై చాలా శ్రద్ధ వహిస్తారు. స్వయం ఉపాధి పొందే వ్యక్తి వయస్సు తక్కువగా ఉంటే ఎక్కువ గృహ రుణం పొందే అవకాశం ఉంటుంది. లోన్ కాల పరిమితి కూడా ఎక్కువగా పొందే ఆస్కారం ఉంటుంది. తద్వారా రుణాన్ని తిరిగి చెల్లించడంలో పెద్దగా కష్టం ఉండదు. ఎందుకంటే ఈఎంఐ (EMI) తక్కువగా ఉంటుంది.డాక్యుమెంట్లుహోమ్ లోన్ ఇవ్వడానికి ముందు, దరఖాస్తుదారు నుండి అనేక ముఖ్యమైన పత్రాలను తీసుకుంటారు. ఆదాయపు పన్ను రిటర్న్, లాభ-నష్ట స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్, బ్యాంక్ స్టేట్మెంట్ వంటివి ఇందులో ఉంటాయి. వీటిని బట్టి ఆ వ్యక్తి ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో అంచనా వేస్తారు. దీంతో పాటు ఆ వ్యక్తి వ్యాపారం ఎలా సాగుతుందో కూడా తెలుస్తుంది.ఆదాయంగృహ రుణం ఇచ్చే బ్యాంకుకు స్వయం ఉపాధి పొందే వ్యక్తి నికర ఆదాయం చాలా ముఖ్యం. దీని ఆధారంగా ఆ వ్యక్తికి నెలకు ఎంత డబ్బు అందుతుందో బ్యాంకుకు తెలుస్తుంది. బ్యాంకు అనేక రకాల డాక్యుమెంట్ల నుండి ఈ విషయాన్ని గుర్తించి, దాని ఆధారంగా లోన్ ఇస్తుంది. రుణ గ్రహీత అన్ని ఈఎంఐలను సకాలంలో చెల్లించగలడా లేదా అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి నికర ఆదాయం బ్యాంకుకు సహాయపడుతుంది.ఇక రుణ గ్రహీతకు ఇతర ఆదాయాలు ఏమైనా ఉన్నాయా.. లేదా వ్యాపారంపై మాత్రమే ఆధారపడి ఉన్నాడా అని కూడా బ్యాంక్ చూస్తుంది. ఇతర వనరుల నుండి వచ్చే ఈ ఆదాయం అంటే అద్దె ఆదాయం, ఎక్కడైనా పెట్టుబడి లేదా రియల్ ఎస్టేట్ నుండి వచ్చే ఆదాయం కావచ్చు. ఆ వ్యక్తి ఇతర వనరుల నుండి కూడా సంపాదిస్తున్నట్లయితే అది మంచి సంకేతం. ఇది సులభంగా గృహ రుణం పొందే అవకాశాలను పెంచుతుంది.క్రెడిట్ స్కోర్ఏదైనా వ్యక్తికి హోమ్ లోన్ ఇచ్చే ముందు బ్యాంకు ఆ వ్యక్తి క్రెడిట్ స్కోర్‌ను (Credit score) కూడా తనిఖీ చేస్తుంది. సదరు వ్యక్తి క్రెడిట్‌కి సంబంధించి ఎలా ఉన్నాడు.. అంటే సకాలంలో రుణం చెల్లించాడా లేదా అనేది ఇది చూపిస్తుంది. స్వయం ఉపాధి పొందే వ్యక్తి క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉంటే సులభంగా గృహ రుణం పొందవచ్చు. కానీ క్రెడిట్ స్కోర్ బాగా లేకపోతే లోన్ పొందడం కష్టం కావచ్చు. సాధారణంగా ఈ క్రెడిట్ స్కోర్ అనేది 300-900 మధ్య ఉంటుంది. -
కొత్త ఏడాదికి సన్నద్ధమా?
కేలండర్లో నంబర్ మారిపోతోంది. కొత్త సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నామంటే ఏదో తెలియని హుషారు. కొత్త ఏడాదిలో కలలు సాకారం కావాలని, మరిన్ని విజయాలు వరించాలని, గొప్ప అవకాశాలను అందుకోవాలని, వృత్తి/వ్యాపారం/ఉద్యోగంలో రాణించాలని ఇలా.. ఎన్నెన్నో ఆకాంక్షలు. ఈ జాబితాలో ఆర్థిక లక్ష్యాలకూ చోటు ఉండాల్సిందే. అయితే ఆర్థిక నిర్ణయాలకు ఫలితాలు వెంటనే కనిపించవు. కొన్నేళ్ల ప్రయాణం తర్వాతే విజయాలు సాకారం అవుతాయి. పెట్టుబడి వృద్ధి అన్నది ఒక్క ఏడాదితో అయ్యేది కాదు. ఇది సుదీర్ఘ ప్రయాణం. ఈ దిశగా ఆచరణ పక్కాగా ఉండాలి. కారు, సొంతిల్లు, పిల్లల విద్య, రిటైర్మెంట్.. తదితర కీలక లక్ష్యాలను సరైన ప్రణాళికతోనే చేరుకోగలరు. ప్రస్తుత ఏడాది ఆర్థిక నిర్ణయాలు, పెట్టుబడులు, రుణాలను ఒక్కసారి సమీక్షించుకోవాల్సిన తరుణం కూడా ఇదే. ఆర్థిక సన్నద్ధతను పరీక్షించుకోవాల్సిన సందర్భం కూడా ఇదే. బడ్జెట్ రూపకల్పనరూపాయి ఆదా చేయడం తిరిగి సంపాదించడంతో సమానం. అందుకే డబ్బు విషయంలో లెక్క పక్కాగా ఉండాలి. ఇందుకు వీలు కలి్పంచేదే ఆర్థిక ప్రణాళిక. ఈ దిశగా మొదట చేయాల్సింది కుటుంబానికి బడ్జెట్ ఏర్పాటు చేసుకోవడం. కానీ, అందరికీ ఆర్థిక అంశాలపై అవగాహన ఉండదు. అటువంటప్పుడు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ లేదా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ తదితర నిపుణుల సాయంతో బడ్జెట్ రూపొందించుకోవాలి. ముందుగా మీ ఆర్థిక స్థితిపై అవగాహన అవసరం. వివిధ మార్గాల్లో వస్తున్న మొత్తం ఆదాయం, వ్యయాలు, అవసరాలు, కోరికలు, జీవితంలో ముఖ్యమైన లక్ష్యాలు, వాటిని నెరవేర్చుకునేందుకు సమకూర్చుకోవాల్సిన వనరులు తదితర సమాచారం ఆధారంగా నిపుణులు మీకంటూ ప్రత్యేకమైన ఆర్థిక ప్రణాళికను సూచిస్తారు. ఆర్థిక స్వేచ్ఛకు స్పష్టమైన మార్గసూచీ మీకు లభిస్తుంది.50/30/20 సూత్రం ఆర్థిక క్రమశిక్షణతో మెలిగేవారికి 50/30/20 సూత్రం ఆచరణీయం. ఒక ఆర్థిక సంవత్సరంలో పన్నుల చెల్లింపులు పోను మిగులు ఆదాయంలో 50 శాతాన్ని అవసరాలకు వెచి్చంచుకోవాలి. రోజువారీ జీవన వ్యయాలు (గ్రోసరీ, ఇంటి అద్దె, ఫోన్, గ్యాస్, వాహన ఇంధన వ్యయాలు, పిల్లల స్కూల్/కాలేజీ ఫీజులు/ఔషధాలు, చికిత్సల ఖర్చులు), ఇన్సూరెన్స్ ప్రీమియం ఇవన్నీ అవసరాల కిందకే వస్తాయి. 30 శాతాన్ని కోరికలకు కేటాయించుకోవచ్చు. జీవనానికి కచ్చితంగా అవసరం లేనివి ఈ విభాగంలోకి వస్తాయి. రెస్టారెంట్లలో విందులు, విహార యాత్రలు, ఖరీదైన ఎల్రక్టానిక్ వస్తువులు, లగ్జరీ ఉత్పత్తులు, వినోదం ఈ విభాగం కిందకు వస్తాయి. మిగిలిన 20 శాతాన్ని పెట్టుబడులకు కేటాయించుకోవాలి. ఈ పెట్టుబడులు జీవితంలో ముఖ్యమైన లక్ష్యాలను నెరవేర్చే విధంగా ఉండాలి. ఇల్లు కొనుగోలు, పిల్లల ఉన్నత విద్య, పిల్లల వివాహాలు, ప్రశాంతమైన విశ్రాంత జీవనం వీటన్నింటికీ మద్దతుగా నిలవాలి. అవసరమైతే ముఖ్యమైన జీవన లక్ష్యాల కోసం 30–40 శాతం మేర పెట్టుబడులకు కేటాయించుకుని, కోరికలకు 20–10 శాతం బడ్జెట్‌తో సరిపెట్టుకున్నా తప్పులేదు. రోజువారీ ముఖ్యమైన జీవన అవసరాలు మొదటి ప్రాధాన్యంగా, ముఖ్యమైన జీవిత లక్ష్యాలు రెండో ప్రాధాన్యంగా పెట్టుబడుల ప్రణాళిక సాగిపోవాలి. పన్ను ప్రయోజనాలు పెట్టుబడులకు పన్ను ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. దీనివల్ల రాబడి పెంచుకోవచ్చు. ఈక్విటీ పెట్టుబడులపై సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల ఆదాయంపై పన్ను లేకుండా చూసుకోవాలంటే అందుకు ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ అనుకూలం. రిటైర్మెంట్ ఫండ్‌కు వీలైన పీపీఎఫ్, ఎన్పీఎస్ సాధనాల్లో చేసే పెట్టుబడులకూ పన్ను ప్రయోజనాలున్నాయి. అందుకే పెట్టుబడులను పన్ను ప్రయోజనాలతో సమన్వయం చేసుకోవాలి. జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై పన్ను ప్రయోజనాలను సైతం వినియోగించుకోవాలి. అంతేకాదు, పన్నుల్లోనూ ఎప్పటికప్పుడు మార్పులు చోటుచేసుకుంటూ ఉంటాయి. వీటికి అనుగుణంగా నిర్ణయాల్లో సవరణలు కూడా అవసరం కావొచ్చు. స్పష్టమైన ఆచరణ ముఖ్యమైన లక్ష్యాలకు అవసరమైన మొత్తాన్ని సమకూర్చుకోవడానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ లక్ష్యాలకు ఎంత మొత్తం అవసరం అన్నది నిపుణుల సాయంతో తేల్చుకోవాలి. ఈ మొత్తాన్ని సమకూర్చుకునేందుకు మెరుగైన పెట్టుబడి సాధనాలను గుర్తించాలి. 10 ఏళ్లు అంతకుమించిన సాధనాలకు ఈక్విటీలు మెరుగైనవి. కానీ, వీటిల్లో స్వల్పకాలానికి (మూడేళ్లలోపు) రిస్క్ ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాలంలో ఈ రిస్క్ ప్రభావం తగ్గిపోయి రాబడులు అధికంగా ఉంటాయి. ఐదేళ్ల కంటే తక్కువ కాల లక్ష్యాలకు డెట్ సాధనాలు అనుకూలం. ఐదు– ఏడేళ్ల కాల లక్ష్యాలకు డెట్, ఈక్విటీ కలయికగా పెట్టుబడులు ఉండాలి. మొత్తం పెట్టుబడుల్లో 5–10 శాతం బంగారానికీ కేటాయించుకోవాలి. లక్ష్యాలకు కావాల్సిన రాబడుల కోసం ఏ ఏ సాధనాలను ఎంపిక చేసుకోవాలన్నది నిపుణులను అడిగి తెలుసుకోవాలి. సరైన అస్సెట్ అలోకేషన్ (వివిధ సాధనాల మధ్య వర్గీకరణ) వ్యూహం అమలు చేయాలి. ఈక్విటీ పెట్టుబడులకు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎంపిక చేసుకోవాలి. ప్రతి నెలా నిర్ణయించిన మేర ఆటోమేటిగ్గా వాటిల్లోకి వెళ్లేలా చూసుకోవాలి. ఆదాయం వచి్చన వెంటనే ముందు చేయాల్సింది పెట్టుబడి. ఆ తర్వాతే మిగిలిన అవసరాల సంగతి చూడాలి. రిటైర్మెంట్ కోసం ఎన్పీఎస్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా సంపాదన మొదలు పెట్టిన మొదటి నెల నుంచే పెట్టుబడులు కూడా ప్రారంభం కావాలి. ఎందుకంటే పెట్టుబడి సంపదగా మారడంలో కాంపౌండింగ్ (రాబడిపై రాబడి) కీలకం అవుతుంది. ఈ కాంపౌండింగ్‌కు ఎక్కువ కాలం కావాలి. ఎంత ఎక్కువ వ్యవధి ఉంటే అంత అధికంగా సంపద సమకూర్చుకోవచ్చు. అత్యవసర నిధి కుటుంబానికి అత్యవసర నిధి తప్పనిసరి. కారణం ఏదైనా ఉన్నట్టుండి ఆదాయం ఆగిపోతే.. కుటుంబ అవసరాలు, పెట్టుబడుల లక్ష్యాలు నిలిచిపోకూడదు. ముఖ్యమైన అవసరాలు, పెట్టుబడులకు ప్రతి నెలా ఎంత మెత్తం వెచి్చస్తున్నారో చూసుకుని.. కనీసం ఆరు నెలల నుంచి 12 నెలలకు సరిపడే మొత్తాన్ని అత్యవసర నిధి కింద ఏర్పాటు చేసుకోవాలి. ఈ మొత్తాన్ని లిక్విడ్ ఫండ్స్‌లో లేదా ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవాలి. అవసరమైనప్పుడు వేగంగా వెనక్కి తీసుకో వచ్చు. బీమా రక్షణ అత్యవసర నిధితోపాటే బీమా రక్షణ కూడా చాలా ముఖ్యమైనది. కుటుంబానికి ఆధారమైన వ్యక్తికి జరగరానికి జరిగితే ఆ కుటుంబం ఆర్థికంగా కష్టాల్లోకి వెళ్లకుండా జీవిత బీమా రక్షణ (టర్మ్ లైఫ్) కలి్పస్తుంది. రోడ్డు ప్రమాదం లేదా అనారోగ్యం కారణంగా ఆస్పత్రి పాలైతే ఆరోగ్య బీమా అండగా నిలుస్తుంది. ఈ రెండింటిలో ఏది లేకపోయినా, ఆర్థిక కష్టాలను ఆహా్వనించినట్టే అవుతుంది. అంతేకాదు బడ్జెట్ ప్రణాళికలు తల్లకిందులవుతాయి. తన కుటుంబ జీవనం, కీలక లక్ష్యాలకు సంబంధించి పెట్టుబడులకు ఒక ఏడాదిలో ఎంత వ్యయం అవుతుందో.. అంతకు 20 రెట్ల మొత్తం టర్మ్ లైఫ్ అష్యూరెన్స్ తీసుకోవాలి. యాక్సిడెంటల్ డెత్, డిస్‌మెంబర్‌మెంట్ (వైకల్యం) రైడర్ జోడించుకోవాలి. ఒక కుటుంబానికి కనీసం రూ.5–10 లక్షల బేసిక్ ఇండెమ్నిటీ హెల్త్ పాలసీతోపాటు, రూ.50 లక్షలకు (రూ.5–10 డిడక్టబుల్) సూపర్ టాపప్ ప్లాన్, క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్ కూడా ఉండాలి. రుణపడొద్దు.. ఒక్కసారి బడ్జెట్ రూపొందించుకున్న తర్వాత దాని పరిధిలోనే లక్ష్మణ రేఖ దాటకుండా నడుచుకోవాలి. భవిష్యత్ అవసరాల కోసం నేటి కోరికలను నియంత్రించుకోవడం ఆర్థిక శాస్త్ర పరంగా ఎంత మాత్రం తప్పుకాదు. ఖర్చులు ఆర్జనను మించరాదు. మరీ ముఖ్యంగా ఆర్జనలో 70 శాతం దాటిపోకుండా చూసుకుంటేనే, ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లకుండా చూసుకోవడం సాధ్యపడుతుంది. ఇందులో భాగంగా బై నౌ పే లేటర్, క్రెడిట్ కార్డు రుణాలకు దూరంగా ఉండాలి. రేపటి వనరులను కూడా నేడే ఖర్చు పెట్టేందుకు వీలు కల్పించే సాధనాలు ఇవి. వీటికి అలవాటుపడితే బయటకురావడం అంత సులభం కాదు. ఆర్థిక స్వేచ్ఛకు అతిపెద్ద అవరోధం రుణమే. గృహ రుణం, విద్యా రుణం మినహా మరే ఇతర రుణం జోలికి పోవకపోవడమే మంచిది. తప్పనిసరి అయి ఏదైనా రుణాన్ని ఆశ్రయించినట్టయితే.. పెట్టుబడి కంటే ముందే ఈ రుణాన్ని తీర్చివేసేందుకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. తద్వారా క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉండేలా కాపాడుకోవచ్చు. దీనివల్ల భవిష్యత్‌లో విద్యా, గృహ రుణాలు సులభంగా, తక్కువ రేటుకు పొందొచ్చు. పెట్టుబడులను రుణాల కోసం త్యాగం చేయాల్సి వస్తే.. అప్పుడు భవిష్యత్ లక్ష్యాల్లోనూ రాజీపడాల్సి వస్తుంది. అందుకే వచి్చన ఆదాయం పరిధిలోనే జీవించడం నేర్చుకోవాలి. ఒకవేళ రుణఊబిలోకి దిగి, బయటకు వచ్చే మార్గం తోచకపోతే ఆలస్యం చేయకుండా నిపుణుల సాయం తీసుకోవాలి. అవసరమైతే ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేíÙంచాలి. ఇలా చేయడం వల్ల రుణాల నుంచి బయటపడడంతోపాటు, దీర్ఘకాల లక్ష్యాలకు కావాల్సిన పెట్టుబడిని సమకూర్చుకోవచ్చు. నామినీ/వీలునామా ఇక పెట్టుబడులకు నామినేషన్ ఇవ్వడం మర్చిపోవద్దు. బ్యాంక్ ఖాతా, లైఫ్ ఇన్సూరెన్స్,, మ్యూచువల్ పండ్స్, డీమ్యాట్ ఖాతా, ఫిక్స్డ్ డిపాజిట్లు ఇలా ప్రతి పెట్టుబడికి నామినీని నమోదు చేయాలి. అనుకోనిది జరిగితే, ఆయా పెట్టుబడులు తమ వారికి సులభంగా బదిలీ అయ్యేందుకు ఇది వీలు కల్పిస్తుంది. ఇక కుటుంబానికి ఆధారమైన వ్యక్తి వీలునామా రాయడం మంచి చర్య అవుతుంది. నామినేషన్ అన్నది కేవలం క్లెయిమ్ అర్హత కలి్పస్తుంది. కానీ, వీలునామా అన్నది చట్టపరమైన హక్కులకు మార్గాన్ని సులభం చేస్తుంది. వారసుల మధ్య వివాదాలను నివారిస్తుంది. తమ ఆకాంక్షలకు అనుగుణంగా ఆస్తుల బదిలీకి చట్టబద్ధమైన డాక్యుమెంట్‌గా సాయపడుతుంది. ముగ్గురిలో ఇద్దరు రుణగ్రస్తులే → మన దేశంలో రుణభారం లేని వారు 38 శాతమేనట. అంటే ప్రతి ముగ్గురిలో ఇద్దరు ఆర్థిక సంస్థలకు రుణపడి ఉన్నట్టు తెలుస్తోంది. → మరీ ముఖ్యంగా 60 ఏళ్లు దాటిన వారిలోనూ 31 శాతం మంది ఈఎంఐ చెల్లింపులతో సతమతం అవుతున్నారు. → 40 శాతం మందికి అత్యవసర నిధి లేదు → 27 శాతం మందికి మెరుగైన పన్నుల ప్రణాళిక లేదు. → దేశంలో 74 శాతం మందికి సరిపడా బీమా కవరేజీ లేదు. వీరిలో కొందరికి అసలు బీమా రక్షణే లేదు. → ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తున్న వారిలోనూ 54 శాతం మందికి కాంపౌండింగ్ గురించి తెలియకపోవడం విడ్డూరం (ఫైనాన్షియల్ ఫిట్నెస్ ప్లాట్‌ఫామ్ ‘ఫిన్నోవేట్’ ఈ ఏడాది నిర్వహించిన సర్వేలో తెలిసిన ఆసక్తికర అంశాలు ఇవి) – సాక్షి, బిజినెస్‌డెస్క్ -
తప్పుల మీద తప్పులు... అప్పుల మీద అప్పులు
సంపాదించని వ్యక్తిని సమాజమే కాదు... ఇంట్లో వాళ్ళు కూడా లోకువగా చూస్తారన్నది ఒక నానుడి. సంపాదిస్తేనే సరిపోదు... అది సద్వినియోగం అయితేనే సార్ధకత. గత ఆర్టికల్ లో ఆర్ధిక క్రమశిక్షణ (Financial discipline) పాటించే వ్యక్తి జీవితం పూలపానుపు గా ఎలా మారుతుందో విశ్లేషించుకున్నాం..గాడి తప్పితే ఏమవుతుందో ఇప్పుడు సోదాహరణంగా చూద్దాం.శివకుమార్ చిన్నప్పటినుంచి ఎన్నో కష్టాలు పడి పైకి వచ్చిన వ్యక్తి. చదువు పూర్తి కాగానే బతుకు తెరువు వెతుక్కుంటూ హైదరాబాద్ లో అడుగు పెట్టాడు. చిన్న ఉద్యోగం కూడా సంపాదించుకున్నాడు. తన ఖర్చులు పోగా కొంత మొత్తం ఇంటికి కూడా పంపేవాడు. కొన్నాళ్ళకు కొత్త జాబ్ ఆఫర్ వచ్చింది. గతంలో 20000 వచ్చే జీతం ఇప్పుడు 50000 అయింది. ఇంతకుముందు ఆర్టికల్ లో చెప్పుకున్న రాహుల్ మాదిరిగానే కుమార్ కు కూడా పాతికేళ్ల వయసులోనే 50000 ఉద్యోగం దొరికింది.అంతలోనే పెళ్లి కుదిరి ఓ ఇంటివాడయ్యాడు కూడా. భార్య రాకతో సింగిల్ రూమ్ ఖాళీ చేసి.. సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ అద్దెకు తీసుకున్నాడు. అప్పటిదాకా కడుతున్న 3000 రెంట్ కాస్తా 8000 కు పెరిగింది. తప్పదుగా.. కొత్త కాపురం కావడంతో తను దాచుకున్న డబ్బులు ఖర్చు పెట్టి ఇంటికి అవసరమైన ఫ్రిజ్, వాషింగ్ మెషిన్, బీరువా, ఓ పెద్ద టీవీ కొన్నాడు. పెళ్ళికి ముందే లక్షన్నర పెట్టి కొన్న బైక్ కి ఈఎంఐ (EMI) కడుతున్నాడు. అతనికున్న భారం ఏదైనా ఉందంటే ఇదొక్కటే. మరోపక్క అతనికున్న పెద్ద భరోసా క్రెడిట్ కార్డులు (Credit card) ... జీతం పెరిగాక పడి ఉంటాయిలే అని ఓ నాలుగైదు బ్యాంకుల క్రెడిట్ కార్డులు తీసుకున్నాడు. వాటి లిమిట్ కూడా దాదాపు 3 లక్షల దాకా ఉంది. క్రెడిట్ కార్డు మీద 30000 ఖర్చు పెట్టి ఓ మొబైల్ కొనుక్కున్నాడు. పెళ్లి అయ్యి ఏడాది కావడంతో వివాహ వార్షికోత్సవానికి భార్యకు లక్ష రూపాయలు పెట్టి ఓ నెక్లెస్ కొన్నాడు. రోజులు గడుస్తున్నాయి. ఇద్దరు పిల్లలు పుట్టుకు రావడమే కాదు, వాళ్ళను స్కూల్లో చేర్పించాల్సిన టైం కూడా వచ్చింది. ఫీజులు కాస్త ఎక్కువైనా వెనకాడక కొంచెం 'ఖరీదైన' స్కూల్లోనే చేర్పించాడు.మరోపక్క జీతం 80000 కు పెరగడం, బైక్ బాకీ తీరిపోవడంతో పెద్దగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులేవీ రాలేదు. ఒకవేళ వచ్చినా క్రెడిట్ కార్డులు వాడుతూ.. నెలనెలా కనీస మొత్తం కడుతూ వస్తున్నాడు. ఈనేపథ్యంలోనే సొంత ఇల్లు ప్లాన్ చేసి.. దాదాపు 70 లక్షలు పెట్టి ఓ డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కొన్నాడు. నెలకు 40000 రూపాయలు ఈఎంఐ పడుతోంది. ఇది పోను జీతంలో ఇంకో 40000 మిగులుతున్నా... ఇంటి ఖర్చులు, పిల్లల ఫీజులు, క్రెడిట్ కార్డు వాయిదాలు, ఊళ్ళో తల్లిదండ్రులకు పంపాల్సి ఉండటం.. ఇలా మొత్తం మీద వచ్చిన జీతం బొటాబొటీగా సరిపోతోంది. అయినా క్రెడిట్ కార్డులు ఉన్నాయన్న ధైర్యం అతన్ని పెద్దగా ఆందోళన పరచలేదు. ఇంతలో ఊహించని సంఘటన...ఓరోజు ఆఫీస్ నుంచి వస్తూండగా.. దారిలో ఆక్సిడెంట్ అయ్యి కాలు ఫ్రాక్చర్ అయ్యింది. హాస్పిటల్ లో వారం రోజులు ఉండి ఇంటికొచ్చాడు. హెల్త్ ఇన్సూరెన్సు పాలసీ తీసుకోకపోవడంతో హాస్పిటల్ బిల్లు రెండున్నర లక్షలు అప్పోసొప్పో చేసి కట్టక తప్పలేదు. మరోపక్క నాలుగు నెలల పాటు బెడ్ రెస్ట్. ఎర్న్డ్ లీవ్ లు ఓ రెండు నెలల పాటు ఆదుకున్నా... మిగతా రెండు నెలలపాటు లాస్ అఫ్ పే తప్పలేదు. చేతికి రూపాయి వచ్చే మార్గం లేదు. క్రెడిట్ కార్డుల్లో బాలన్స్ కూడా వాడేశాడు.4 నెలల తర్వాత జాబ్ లో తిరిగి జాయిన్ అయ్యాడు. ఐదో నెల నుంచి శాలరీ రావడం మొదలయింది. కానీ జీవితం ఇదివరకటిలా లేదు. వచ్చే శాలరీ కి మించి కమిట్మెంట్స్ ఉండనే ఉన్నాయి. ఇప్పుడు అదనంగా క్రెడిట్ కార్డు బాకీల రూపంలో (మూడు లక్షలూ వాడేయడం వల్ల) నెలకు 15000 భారం (కనీస మొత్తమే కడుతున్నాడు అనుకుంటే) పడింది. మరోపక్క గోటి చుట్టు మీద రోకటి పోటులా ఇద్దరు పిల్లలకూ తలో 50000 చొప్పున ట్యూషన్ ఫీజు కట్టాల్సి వచ్చింది గతంలో చేసిన అప్పుకు ఇది మరింత ఆజ్యం పోసింది. అప్పులు.. వడ్డీలు.. ఖర్చులు.. రానురాను భారం పెరిగిపోతూ వచ్చింది.తట్టుకునే పరిస్థితి కనుచూపు మేరలో కనిపించడం లేదు. బ్యాంకుల్లో పర్సనల్ లోన్ కోసం ప్రయత్నించాడు. అప్పటికే ఇంటి లోన్, క్రెడిట్ కార్డు బకాయిలు ఎక్కువగా ఉండటం వల్ల లోన్ రాలేదు. అయితే తన ఇంటి మీద టాప్ అప్ లోన్ వచ్చే అవకాశం ఉండటం తో దాన్ని ఆశ్రయించాడు. ఓ రెండు లక్షలు వచ్చాయి. దాంతో చిన్న చిన్న అప్పులు తీర్చేశాడు. అయినా భారం తగ్గకపోగా... కొత్త లోన్ తో ఈఎంఐ మరింత పెరిగింది. కష్టాలు కూడబలుక్కుని వస్తాయి అన్నట్లు తండ్రి ఆరోగ్యం దెబ్బతిని హాస్పిటల్ లో జాయిన్ చేయడంతో మరో 2 లక్షల దాకా ఖర్చయ్యాయి. ఇది కూడా అప్పే.ఇక పిల్లలు క్లాస్ మారడంతో పెరిగిన ఫీజు తట్టుకోలేక.. అలాగని వాళ్ళని ఆ స్కూల్ మాన్పించలేక (ప్రెస్టేజ్ ఇష్యూ) అప్పుల మీద అప్పులు చేస్తూ పోయాడు. బాకీలు తీర్చే పరిస్థితి లేకపోవడంతో మెల్లగా క్రెడిట్ కార్డులు డిఫాల్ట్ అవ్వడం మొదలైంది. ఇది అక్కడితో ఆగలేదు. ఇంటి లోన్ కూడా బకాయి పడే దుస్థితి ఎదురైంది. మొదట భార్య నెక్లెస్ కుదువ పెట్టాడు. తర్వాత బండి అమ్మేశాడు. ఆనక ఇల్లు అమ్ముకునే పరిస్థితి దాపురించింది.ఎన్నో కష్టాలుపడి జీవితంలో ఎదిగిన శివ కుమార్ చేసిన తప్పల్లా... ఆర్ధిక క్రమశిక్షణ పాటించకపోవడమే. దీనికి దారి తీసిన కారణాల గురించి విశ్లేషించుకుంటే...* ముందుచూపుతో వ్యవహరించకపోవడం * సరైన ఆర్ధిక ప్రణాళిక లేకపోవడం * తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోవడం* పెట్టుబడులపై దృష్టి పెట్టకపోవడం* ఆరోగ్య, జీవిత బీమా ల గురించి ఆలోచించకపోవడం * జీవితంలో పూర్తిగా స్థిరపడక మునుపే వివాహ బంధంలోకి అడుగుపెట్టడం * పిల్లల చదువుల విషయంలో స్థాయికి మించి పరుగులు తీయడం * చేతిలో కాసిని డబ్బులు కనబడగానే తనకు లోటు లేదనుకునే భ్రమలో బతికేయడం * ఎక్కువగా క్రెడిట్ కార్డు ల మీద ఆధారపడటం* క్రెడిట్ కార్డుల విషయంలో కనీస మొత్తాలు మాత్రమే చెల్లిస్తూ రావడం వల్ల బాకీ ఎప్పటికీ తీరకపోవడం* అప్పుల మీద అప్పులు చేస్తూ అధిక వడ్డీలు చెల్లించాల్సి రావడం... లోన్ ల కోసం ఎగబడటం * భవిష్యత్‌లో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా తట్టుకునే విధంగా పొదుపుపై దృష్టి పెట్టకపోవడం * స్థాయికి మించి ఖరీదైన వస్తువులు కొనుగోలు చేయడం...కష్టాలన్నవి చెప్పి చెప్పి రావు. అవి ఎప్పుడొచ్చినా తట్టుకునే విధంగా జీవితంలో ఆర్ధిక క్రమశిక్షణ అలవరచుకుంటేనే ఎలాంటి ఒడుదొడుకులనైనా తట్టుకునే సామర్ధ్యం కలుగుతుంది. మొదట్లో కాస్త కష్టపడ్డా... పక్కా ప్లానింగ్ తో ముందుకు సాగితే రాహుల్ మాదిరిగా చీకూ చింతా లేని జీవితం గడపగలుగుతాడు. లేదంటే శివకుమార్ లా అప్పుల ఊబిలో చిక్కుకుపోయి విలవిలలాడుతాడు.రాహుల్ లాంటి సుఖమయ జీవితం కావాలా.. శివకుమార్ లాంటి కష్టాల ప్రవాహం కావాలా... అన్నది మన చేతుల్లోనే ఉంది.-బెహరా శ్రీనివాస రావుపర్సనల్ ఫైనాన్స్ విశ్లేషకులు -
ఏటీఎం కార్డు వల్ల ఇన్ని ఉపయోగాలున్నాయా?
బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికీ.. దాదాపు 'ఏటీఎం' (ATM) కార్డు (డెబిట్ కార్డు) ఉంటుంది. ఏటీఎం అనేది కేవలం డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి మాత్రమే కాకుండా.. ఇతర కార్యకలాపాల కోసం కూడా ఉపయోగించవచ్చు. ఈ కథనంలో వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.బ్యాలెన్స్ ఎంక్వైరీ: ఏటీఎం కార్డు ఉపయోగించే మీరు బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేకుండానే.. ఖాతాలో బ్యాలెన్స్ ఎంత ఉందనే విషయం తెలుసుకోవచ్చు. అంతే కాకుండా లావాదేవీలకు సంబంధించిన మినీ స్టేట్మెంట్ కూడా తీసుకోవచ్చు.ఫండ్ ట్రాన్స్ఫర్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ప్రకారం.. మీరు డెబిట్ కార్డును ఉపయోగించి, ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు రోజుకు రూ. 40,000 ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దీనికి ఎస్బీఐ ఎలాంటి ఛార్జెస్ విధించదు.క్రెడిట్ కార్డ్ చెల్లింపు: క్రెడిట్ కార్డ్ చెల్లింపులను కూడా ఏటీఏం ద్వారా చెల్లించవచ్చు. దీనికి మీ డెబిట్ కార్డు, పిన్ నెంబర్ వంటివి అవసరమవుతాయి.బీమా ప్రీమియం చెల్లింపు: ఏటీఎం ఉపయోగించి బీమా ప్రీమియంలను చెల్లించవచ్చు. ఎల్ఐసీ, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ లైఫ్ వంటివి బ్యాంకులతో టై-అప్‌లను కలిగి ఉన్నాయి. కాబట్టి ఏటీఎంలోనే ప్రీమియం చెల్లించవచ్చు.చెక్‌బుక్ రిక్వెస్ట్: చెక్ లీఫ్లు అయిపోయినా చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఇప్పుడు ఏటీఎం వీడరనే కొత్త చెక్‌బుక్ కోసం రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. చిరునామా అక్కడ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఆ చిరునామాకే చెక్‌బుక్ (Checkbook) వస్తుంది.బిల్ పేమెంట్స్: ఏటీఎం ద్వారా యుటిలిటీ బిల్లులను చెల్లించవచ్చు. అయితే ముందుగా బిల్లింగ్ కంపెనీ ఏటీఎం నెట్వర్క్కి లింక్ చేయబడిందో లేదో చెక్ చేసుకోవాలి. డబ్బు పంపే ముందు, బ్యాంకు వెబ్సైట్లో చెల్లింపుదారు వివరాలను నమోదు చేసుకోవాలి.మొబైల్ బ్యాంకింగ్ యాక్టివేషన్: బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన తరువాత మొబైల్ బ్యాంకింగ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటివి యాక్టివేట్ చేస్తారు. అయితే మీరు ఏటీఎం ఉపయోగించి కూడా మొబైల్ బ్యాంకింగ్ యాక్టివేట్ చేసుకోవచ్చు లేదా డీయాక్టివేట్ చేసుకోవచ్చు.ఏటీఎం పిన్ చేంజ్: ఏటీఎం ఉపయోగించే.. పిన్ నెంబర్ మార్చుకోవచ్చు. అనుమానం వచ్చినప్పుడు ఏటీఎం పిన్ నెంబర్ మార్చుకోవడం మంచిది. కాబట్టి బ్యాంకుకు వెళ్లకుండానే.. ఏటీఎంలోనే పిన్ నెంబర్ మార్చుకోవచ్చు. -
ఇది కదా ఇప్పుడు కావాల్సింది: ఆర్ధిక క్రమశిక్షణ పాటిస్తే..
జీవితానికి క్రమశిక్షణ ఎంత ముఖ్యమో.. ఆర్ధిక అంశాల్లోనూ అంతే పద్ధతిగా ఉండకపోతే కొంపలారిపోతాయి, అన్నది తోసిపుచ్చలేని వాస్తవం. మన జీవితంలో ఆర్ధికం, ఆరోగ్యం.. అత్యంత ప్రాధాన్యాంశాలు. డబ్బుండి ఆరోగ్యం లేకపోయినా.. ఆరోగ్యం ఉండి డబ్బు లేకపోయినా ఆ వ్యక్తి జీవితం లేదా కుటుంబం అష్టకష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంచేత ప్రతి వ్యక్తికీ ఆర్ధిక క్రమశిక్షణ అనేది అత్యంత ముఖ్యం. చాలామంది చేతులు కాలాక మేలుకుంటారు. అప్పటికి వారి జీవితం నిండా మునిగిపోయి ఉంటుంది.. ఈ పరిస్థితి రాకుండా మొదటినుంచీ మెలకువతో వ్యవహరిస్తే వారి జీవితాలు బాగుపడతాయి. కానీ ఇలా చేసేవాళ్లు చాలా తక్కువమంది ఉంటారు.22 -24 ఏళ్ల వయసులో సంపాదనలో పడేటప్పుడే మనం భవిష్యత్ అవసరాలను మదింపు చేయగలగాలి. గతంలో మన పూర్వీకులకు ఆర్ధిక అంశాలపై అంత అవగాహన లేకపోవడం, పెద్ద పెద్ద కుటుంబాల వల్ల వచ్చింది వచ్చినట్లుగా ఖర్చుపెట్టేయడం, పెట్టుబడి మార్గాలు పెద్దగా లేకపోవడం.. ఇత్యాది అంశాలన్నీ ఆర్ధిక క్రమశిక్షణ విషయంలో అవరోధాలుగా నిలిచేవి. ఇప్పుడలా కాదు. రకరకాల ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృత సమాచారం అందుబాటులోకి ఉంటోంది. అదే సమయంలో విభిన్న పెట్టుబడి మార్గాలు మన కళ్ల ముందు ఉంటున్నాయి. ఇది ఒక రకంగా వరమనే చెప్పొచ్చు. కానీ ఎంతమంది వీటిని సద్వినియోగం చేసుకుంటున్నారన్నదే ప్రధాన ప్రశ్న.ఆర్ధిక క్రమశిక్షణ పాటిస్తే ఏమవుతుంది.. అన్న విషయాన్ని ఉదాహరణ పూర్వకంగా వివరిస్తాను.రాహుల్ వయసు 24 ఏళ్ళు. అతనో ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. నెల జీతం రూ. 50,000. అందులోంచి రూ. 10,000 ఊళ్ళో ఉండే తల్లిదండ్రులకు పంపిస్తూ ఉంటాడు. అతనుండే సిటీలో రూము అద్దె, కరెంటు బిల్, తిండి ఖర్చులు, సాదరు, రవాణా ఖర్చులకు దాదాపు రూ. 20,000 దాకా అవుతుంది. మిగిలిన సొమ్ములో రూ. 10,000 వరకు హెల్త్ ఇన్సూరెన్సు(తనకు, తల్లిదండ్రులకు), డిపాజిట్లు, పెట్టుబడుల కోసం కేటాయించాడు. మిగతా రూ.10,000 ను పొదుపు చేస్తాడు. ఇదీ అతని నెలవారీ ప్రణాళిక.పొదుపు ద్వారా ఏడాదికి రూ.1,20,000 దాచుకోగలిగాడు. మరోపక్క డిపాజిట్లు, పెట్టుబడుల ద్వారా రూ. ఏడాదికి 1,50,000 దాకా కూడబెట్టాడు. ఏడాది మొత్తానికి అతను రూ.2,70,000 వెనకేయగలిగాడు. ఇందులోంచి అత్యవసర ఖర్చులు, అనుకోని ఖర్చుల కోసం ఏడాది మొత్తం మీద ఇంకో 70,000 ఖర్చు చేశాడు అనుకుందాం. నికరంగా అతని దగ్గర ఏడాది తిరిగేసరికి కనీసం రూ. 2 లక్షలు ఉంటాయి. ఇప్పుడతను కాస్త పర్వాలేదు అనుకునే స్థాయికి వచ్చాడు.ఈ మొత్తాన్ని అనుభవజ్ఞుల సలహా, సాధకబాధకాలు అన్నీ పరిగణనలోకి తీసుకుని రిస్కు తక్కువగా ఉండేలా చూసుకుంటూ కొంత షేర్లలోకి మరికొంత బాండ్లలోకి మళ్ళించాడు. దీనిపై వచ్చే రాబడి తక్కువగా ఉన్నప్పటికీ తన క్యాపిటల్‌కు నష్టం రాకుండా ప్లాన్ చేసుకున్నాడు. తద్వారా ఏడాది తిరిగేసరికి ఆ రూ. 2 లక్షల మీద అతనికి రూ. 1.50 లక్షలు వచ్చాయి. ఇప్పుడతని పెట్టుబడుల్లో సొమ్ము రూ. 3.5 లక్షలు అయింది. మరోపక్క ఈ రెండేళ్లలో అతని శాలరీ ఇంకో రూ.10,000 పెరిగింది. అయితే ఖర్చులు కూడా పెరగడం వల్ల ఆ పెరిగింది కాస్తా వాటికే సరిపోయేది. కాబట్టి అతని చేతికి కొత్తగా రూపాయి వచ్చిందీ లేదు, పోయిందీ లేదు. కానీ పెట్టుబడులు, పొదుపు మాత్రం క్రమం తప్పక కొనసాగిస్తూనే వచ్చాడు. ఇలా నాలుగేళ్లు గడిచాయి.శాలరీ పెరుగుతూ వస్తున్నా పెరిగే ఖర్చులు, పుట్టుకొచ్చే కొత్త అవసరాలతో అది అక్కడికి అయిపోతుంది. కానీ ఈ నాలుగేళ్లలో అతని పొదుపు 4X120000 = 4,80,000 + వడ్డీ కలిపి దాదాపు రూ.5 లక్షల దాకా జమ అయింది. అదే సమయంలో పెట్టుబడులను ఎప్పటికప్పుడు తిరగేస్తూ రిస్క్ డోస్‌ను కొద్దికొద్దిగా పెంచుతూ వచ్చాడు. అంటే బాండ్లలో పెట్టుబడులు తగ్గిస్తూ.. షేర్లలో ఫ్రంట్ లైన్ స్టాక్స్‌ను ఎంచుకుంటూ.. వాటి రేట్లు దిగివచ్చిన ప్రతిసారీ కొనుగోలు చేస్తూ వచ్చాడు. తద్వారా మంచి లాభాలు కళ్లజూడగలిగాడు. ఇలా మూడో ఏడాది తిరిగేసరికి తన పెట్టుబడులు రూ.6 లక్షల దాకా అయ్యాయి. మరో ఏడాది పూర్తయ్యేసరికి అవి కాస్తా రూ.12,00,000 అయ్యాయి.పొదుపు ద్వారా సమకూర్చుకున్న రూ.5 లక్షలు కలిపితే ఇప్పుడు అతని చేతిలో దాదాపు రూ.17 లక్షల దాకా ఉన్నాయి. వయసు 28 ఏళ్ళు వచ్చాయి. మళ్ళీ అన్ని లెక్కలు బేరీజు వేసుకుని రూ. 50 లక్షల రేటులో సిటీకి కాస్త దూరమే అయినప్పటికీ ఒక డబల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కొన్నాడు. తన దగ్గరున్న 17 లక్షల్లో 10 లక్షలు ఇంటికోసం కేటాయించాడు. 7 లక్షలు చేతిలో ఉంచుకున్నాడు. 40 లక్షలు లోన్ తీసుకున్నాడు. దీనిపై కాల పరిమితి ఎక్కువ పెట్టుకుని ఈఎంఐ రూ. 25,000 మించకుండా చూసుకున్నాడు.తర్వాత అతను కంపెనీ మారడంతో (ఇది కూడా ప్లాన్ ప్రకారమే చేశాడు. మార్కెట్లో తనకున్న పొటెన్షియాలిటీ, ఉద్యోగంలో సంపాదించిన అనుభవం) శాలరీ పెరిగి దాదాపు రూ.లక్షకు చేరుకుంది. కొత్త ఉద్యోగంలో చేరితే (జాబ్ మారినప్పుడు కొన్ని బ్యాంకుల్లో లోన్ తీసుకోవడానికి కొంత ఇబ్బంది అవుతుంది. కొన్ని బ్యాంకులు మొత్తం అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని లోన్ ఇస్తాయి) లోన్‌కు ఇబ్బంది కావొచ్చన్న అంచనాతో జాబ్ మారడానికి ముందే చాలా తెలివిగా ఇంటి కొనుగోలుకు సిద్ధమయ్యాడు.ఇల్లు కొనడం, కొన్నాళ్లకే జాబ్ మారడం జరిగిపోయాయి. పెట్టుబడులు కొనసాగిస్తూనే ఉన్నాడు ఎక్కడా 'అతి' కి పోకుండా ప్లాన్‌కు తగ్గట్లే సాగుతూ వచ్చాడు. ఇంతలోనే పెళ్లి కుదిరింది. తన దగ్గరున్న సొమ్ముల్లోనే ఓ 2 లక్షలు వెచ్చించి ఇంటికి అవసరమైన సామాన్లు కొనుక్కున్నాడు. పెళ్లి చేసుకుని హ్యాపీ లైఫ్‌లోకి అడుగుపెట్టాడు.ఒక రూ.50,000 ఉద్యోగి.. కేవలం నాలుగేళ్ల వ్యవధిలో జీవితాన్ని స్థిరపరుచుకునే స్థాయికి ఎదిగాడు. ఇదంతా జరగడానికి అతను చేసిందల్లా...1. ఆర్ధిక క్రమశిక్షణ ఎక్కడా తప్పలేదు. 2. అత్యాశకు పోలేదు.3. తనకు ఉన్న దానితోనే సరిపెట్టుకున్నాడు. 4. పక్కవాళ్ళను చూసో, స్నేహితులను బట్టో అక్కర్లేని వస్తువులు కొనేయలేదు.5. లాభాలు వస్తున్నాయి కదా అని మొత్తం డబ్బులు తీసుకెళ్లి స్టాక్ మార్కెట్లో పెట్టేయలేదు.6. రిస్క్ స్థాయిని పెంచుకుంటూ వెళ్ళాడే తప్ప నూటికి నూరు శాతం రిస్క్ తీసుకోలేదు.7. ఆడంబరాలకు పోలేదు. మార్కెట్లో 50,000 ఖరీదు చేసే ఫోన్లు దొరుకుతున్నా తన స్థాయికి మించి 10,000-15,000 ఫోన్‌తోనే సరిపెట్టుకున్నాడు. 8. లోన్ పెట్టుకుంటే కారు కొనుక్కునే అవకాశం ఉన్నప్పటికీ కొనేయాలని ఉబలాటపడలేదు. 9. స్థిరపడేవరకు టూర్లు, విందులు, వినోదాలు, విలాసాల జోలికి పోకూడనే నిర్ణయం తీసుకుని కచ్చితంగా పాటిస్తూ వచ్చాడు. 10. వేలకు వేలు పోసి ఖరీదైన బట్టలని కొనేయలేదు.ఇలా చెప్పుకుంటూ పోతే... చాలానే ఉన్నా అతను పాటించింది మాత్రం పూర్తిగా ఆర్ధిక క్రమశిక్షణ. అదే అతని జీవితాన్ని ఇప్పుడు చాలా హుందాగా నిలబెట్టింది. కొత్త జీవితంలోకి అడుగు పెట్టేలా చేసింది. అతను త్వరలోనే కారూ కొనుక్కోగలడు, అవసరమైతే ఖరీదైన ఫోనూ కొనగలడు. చిన్న వయసులోనే ఇంత ఆర్ధిక క్రమశిక్షణ పాటించిన వ్యక్తి భవిష్యత్తులో గాడి తప్పకుండా ముందుకు సాగుతాడనే భావిద్దాం. మీరూ ఇలా చేసి చూడండి. మీ జీవితం కచ్చితంగా పూలమయం అవుతుంది. అలా కాదు.. నాకు తాత్కాలిక ప్రయోజనాలే ముఖ్యం.. అంటూ అర్ధం పర్ధం లేకుండా విచ్చలవిడిగా ఖర్చు చేసుకుంటూ పోతే ఏం జరుగుతుందో తదుపరి కథనంలో చూద్దాం. -బెహరా శ్రీనివాస రావు, పర్సనల్ ఫైనాన్స్ విశ్లేషకులు. -
పోస్టాఫీసులో అకౌంట్ ఉంటే ఇన్ని బెనిఫిట్సా?
నేటి రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా ఉంది. ముఖ్యంగా ఉద్యోగులు, వ్యాపారులకు కచ్చితంగా బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. బ్యాంక్ ఖాతాదారులకు సాధారణంగా ఏటీఎం ( ATM ) కార్డ్‌లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌తోపాటు మరిన్ని సౌకర్యాలు ఉంటాయి. అయితే గ్రామీణ ప్రాంతాలలో చాలా మంది ప్రజలు పోస్టాఫీసులో ( Post Office ) పొదుపు ఖాతాలను తెరవడానికి ఇష్టపడతారు.పోస్టాఫీసులు అందుబాటులో ఉండటంతోపాటు అందులో సరళమైన విధానాలే ఇందుకు కారణం. బ్యాంకు ఖాతాతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో దాదాపు అన్ని ప్రయోజనాలు పోస్టాఫీసులో పొదుపు ఖాతాను ( Savings Account ) తెరవడం వల్ల కూడా పొందవచ్చు. పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాను ఎవరు తెరవగలరు.. ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయన్నది ఈ కథనంలో పూర్తిగా తెలుసుకుందాం.పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాను ఎవరు తెరవచ్చు?పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాను తెరవడానికి ముందు మీరు అర్హులో కాదో చూసుకోవడం ముఖ్యం. అర్హత కలిగిన వయసున్న భారతీయ పౌరుడెవరైనా పోస్టాఫీసు అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఇక మైనర్ పిల్లల తరపున తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు ఖాతా తెరవవచ్చు.పోస్టాఫీసు సేవింగ్స్ అకౌంట్ ప్రయోజనాలు» ఏటీఎం కార్డ్ సౌకర్యం» చెక్‌బుక్ సేవలు» ఈ-బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్» కనీస డిపాజిట్ కేవలం రూ. 500. ఇది చాలా బ్యాంకు ఖాతాలతో పోలిస్తే తక్కువపోస్టాఫీసులో అకౌంట్ తెరవండిలా.. » మీ సమీప పోస్టాఫీసును సందర్శించండి. సంబంధిత అధికారిని కలవండి. అకౌంట్ ఓపెనింగ్ ఫారమ్ తీసుకుని అవసరమైన వివరాలను పూరించండి.» పూర్తి చేసిన ఫారమ్‌కు మీ ఆధార్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్ వంటి అవసరమైన డాక్యుమెంట్లను అటాచ్ చేయండి. మీ దరఖాస్తును సమీక్షించే అధికారికి ఫారమ్‌ను సమర్పించండి. మీ వివరాలను ధ్రువీకరించిన తర్వాత మీ సేవింగ్స్ ఖాతా తెరుస్తారు. -
క్రెడిట్ కార్డు మీ శ్రేయోభిలాషి.. శత్రువు!
జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో ఎప్పుడు ఏ అవసరాలు పుట్టుకొస్తాయో ఎవరమూ చెప్పలేం. అప్పటిదాకా సజావుగా సాగిపోతున్న జీవితాల్లో ఒక్క కుదుపు చాలు మొత్తం తిరగబడిపోవడానికి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఉపద్రవాలు తలెత్తితే కుటుంబాలే కుదేలయిపోతాయి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. తగిన ఆర్థిక భద్రత ఉండేలా చూసుకోవాలి. ఒడుదొడుకులు ఎదురైనప్పుడు తట్టుకునే విధంగా ఆర్ధిక పరిపుష్టి సాధించాలి. లేదంటే ప్రమాదమే. ఖర్చులు పెరిగిపోయి అరాకొరా జీతాలతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. సాధారణంగా ఇలాంటి వ్యక్తులు ఈమధ్యన ఎక్కువగా ఆశ్రయిస్తున్న సాధనం క్రెడిట్ కార్డులు. సగటున నెలకు రూ.25000-రూ.30000 ఆర్జించే వ్యక్తులు క్రెడిట్ కార్డులపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. కొందరు ఆర్ధికంగా మంచి స్థితిలోనే ఉన్నప్పటికీ క్రెడిట్ కార్డులను స్టేటస్ సింబల్ కోసమో, సరదాకో వాడటం కూడా చూస్తూనే ఉన్నాం.ఏదైనా మోతాదు మించకూడదు..అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్లు అతి ఎప్పటికే ప్రమాదమే. ఎక్కువగా క్రెడిట్ కార్డులను వాడినా సమస్యలు తప్పవు. ఆ తర్వాత బిల్లులు కట్టలేక నిండా మునిగిపోయే పరిస్థితి ఎదురవుతుంది.ఇలాంటి పరిస్థితులు తలెత్తకూడదంటే మొదటే జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆయా బ్యాంకులు, ఇతరత్రా ప్రైవేట్ సంస్థలు ఇస్తున్నాయి కదా అని కొంతమంది 4, 5 క్రెడిట్ కార్డులు కూడా తీసుకుంటున్నారు. ఇది మరింత ప్రమాదకరం.కార్డులిస్తున్న సంస్థలివే..దేశంలోని ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు క్రెడిట్ కార్డులను ఆఫర్ చేస్తున్నాయి. అలాగే కొన్ని అన్ రిజిస్టర్డ్ సంస్థలు కూడా వివిధ కార్పొరేట్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని కార్డులు ఇస్తున్నాయి.క్రెడిట్‌కార్డు పొందాలంటే..క్రెడిట్ కార్డు పొందాలంటే ముఖ్యంగా క్రెడిట్ స్కోర్ బావుండాలి. సాధారణంగా 750 -900 మధ్యలో క్రెడిట్ స్కోర్ ఉంటే కార్డు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనికి తోడు మన ఆదాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని క్రెడిట్ లిమిట్ ఆధారంగా కార్డులు జారీ చేస్తారు. నెలకు రూ.20000 ఆదాయం పొందే వ్యక్తికి కూడా క్రెడిట్ కార్డులను ఆయా బ్యాంకులు ఆఫర్ చేస్తున్నాయి. అదే ప్రీమియం కార్డుల విషయానికొస్తే రూ.1 లక్ష నుంచి రూ.3 లక్షల వరకు ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని కార్డులు జారీ చేస్తున్నాయి.కార్డు జారీకి ఇవి చాలా ముఖ్యంకార్డు జారీ చేయాలంటే క్రెడిట్ హిస్టరీ బావుండాలి. అంటే గతంలో ఏవైనా లోన్లు తీసుకుని ఉంటే అవి సక్రమంగా చెల్లిస్తున్నారా లేదా లోన్లు ఎంత ఉన్నాయి ఎప్పటికి క్లోజ్ అవుతాయనే వివరాలు పరిగణలోకి తీసుకుంటారు. కార్డు జారీలో మీరు పని చేస్తున్న కంపెనీ కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. మీరు ఎలాంటి కంపెనీలో పనిచేస్తున్నారు? ఎన్నాళ్లుగా పనిచేస్తున్నారు? ఆ కంపెనీ స్థాపించి ఎన్నాళ్లయింది? అది స్థిరమైన కంపెనీ యేనా? వంటి అంశాలు కూడా కార్డుల జారీలో బ్యాంకులు దృష్టిలో పెట్టుకుంటాయి.మెరుగైన సిబిల్ ఉంటేనే..కార్డుకు దరఖాస్తు చేసే ముందే మీ క్రెడిట్ స్కోర్ (దీన్నే సిబిల్ స్కోర్ అని కూడా అంటారు) ఎంతుందో తెలుసుకోవాలి. క్రెడిట్ కార్డు పొందడానికి 18 ఏళ్లు పైబడిన వారు మాత్రమే అర్హులు. కార్డు దరఖాస్తుకు అవసరమైన పత్రాలన్నీ మీరు అప్లై చేసే బ్యాంకులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆదాయ ధ్రువీకరణ పత్రాలు(Payslips) సమర్పించాలి. దీంతోపాటు ఫోటో ఐడీ, అడ్రస్ ప్రూఫ్, బ్యాంకు స్టేట్మెంట్ తదితర డాక్యుమెంట్లను ఇవ్వాలి. నేరుగా బ్యాంకులోగానీ ఆన్లైన్ ద్వారాగానీ దరఖాస్తు సమర్పించవచ్చు. ఆయా బ్యాంకులు లేదా కార్డు జారీ చేసే సంస్థల నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. సదరు బ్యాంకు లేదా సంస్థ మీరిచ్చిన పత్రాలన్నిటినీ సమగ్రంగా పరిశీలించి మీ అర్హతను బట్టి కార్డు జారీ చేస్తుంది.ఇదీ చదవండి: త్వరలో టీజీ రెరా యాప్..ఇష్టారాజ్యంగా వాడితే అంతే..కార్డు చేతికొచ్చాక మీరు దాన్ని సరిగా వాడుకుంటే అది మీకు చాలా మేలు చేస్తుంది. అలాకాక చేతిలో కార్డు ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వాడితే అదే మిమ్మల్ని కష్టాల్లోకి నెట్టేస్తుంది. కార్డు బిల్లు వచ్చాక చాలామంది సాధారణంగా ఒక పొరపాటు చేస్తూంటారు. కనీస మొత్తం చెల్లిస్తూ గడిపేస్తూ ఉంటారు. దీనివల్ల బాకీ ఎప్పటికీ తీరకపోగా తీసుకున్న మొత్తానికి మించి చెల్లిస్తారు. కట్టేది తక్కువేకదా అనే భ్రమ కలిగించేలా ఉన్న ఈ మినిమం పేమెంట్ ఊబిలో పడితే చాలా నష్టపోవాల్సి ఉంటుంది.ఉదా: ఒక వ్యక్తికి రూ.1 లక్ష విలువ చేసే క్రెడిట్ కార్డు వచ్చింది అనుకుందాం. అతను తన అవసరాల కోసం రూ.25,000 కార్డు నుంచి వాడేశాడు. దాని మీద అతను నెలకు కట్టాల్సిన కనీస మొత్తం రూ.1,250 మాత్రమే. కట్టేది తక్కువేగా అని ఆ మొత్తమే కట్టుకుంటూ పోతాడు. దీనివల్ల 6 నెలలు గడిచినా అతను అప్పటికి రూ.7,500 కట్టి ఉన్నా తీరేది అతి స్వల్ప మొత్తమే. ప్రతి నెలా చార్జీలు జత కలుస్తూనే ఉంటాయి. కార్డు వాడేవాళ్లలో నూటికి 95 మంది చేసే తప్పే ఇది.ఏం చేయాలంటే.. క్రెడిట్ కార్డు పేమెంట్ బిల్లు డేట్ జనరేట్ అయిన తర్వాత మళ్లీ బిల్లు వచ్చి దాన్ని చెల్లించేందుకు 45 రోజుల వడ్డీ రహిత సదుపాయం ఉంటుంది. దీన్ని ఉపయోగించుకుని మొత్తం బాకీ ఒకేసారి తీర్చేసి మళ్లీ కార్డును వాడుకుంటే మీకు వడ్డీల భారం తగ్గుతుంది. మీరు కట్టాల్సిన మొత్తం తీరిపోతుంది. అదే సమయంలో మీ క్రెడిట్ రికార్డూ పదిలంగా ఉంటుంది. సంస్థకు లేదా సంబంధిత బ్యాంకుకు మీపై విశ్వాసం పెరిగి మీ లిమిట్ మొత్తాన్ని పెంచడానికి ఆస్కారం ఉంటుంది. అర్ధమయింది కదా క్రెడిట్ కార్డును మీరు ఎలా వాడుతున్నారన్నది మీ చేతుల్లోనే ఉంటుంది. సద్వినియోగం చేసుకుంటే లబ్ది పొందుతారు. లేదంటే మునిగిపోతారు. ఆలోచించుకుని అడుగేయండి.-బెహరా శ్రీనివాస రావు,పర్సనల్ ఫైనాన్స్ విశ్లేషకులు -
ఈ టిప్స్ పాటిస్తే.. EMI ఆలస్యమైనా పర్లేదు!
ఎంత సంపాదించేవారికైనా.. కొన్ని సందర్భాల్లో లోన్ తీసుకోవాల్సి వస్తుంది. లోన్ తీసుకున్న తరువాత పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల ఈఎంఐ చెల్లించడంలో కొంత ఆలస్యం జరగవచ్చు. అలాంటి సమయంలో కొంతమంది రికవరీ ఏజంట్లు మీతో దూకుడుగా ప్రవర్తించే అవకాశం ఉంది. అప్పుడు మీరు కొంత ఒత్తిడికి గురవ్వొచ్చు. ఇలాంటి ఒత్తిడి నుంచి బయటపడటానికి ఈ ఐదు మార్గాలను పాటిస్తే సరిపోతుంది.బ్యాంక్‌తో కమ్యూనికేట్ చేయడంఆర్ధిక ఇబ్బందుల కారణంగా మీరు సరైన సమయానికి లోన్ చెల్లించకపోతే, ముందుగా మీరు ఎక్కడైనా లోన్ తీసుకున్నారో.. బ్యాంక్ లేదా ఫైనాన్సియల్ కంపెనీలను సంప్రదించండి. ఒకవేళా మీరు బజాజ్ ఫిన్సర్వ్, టాటా క్యాపిటల్, క్రెడిట్‌బీ లేదా నవీ ఫిన్సర్వ్ వంటి(నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ(NBFC) నుంచి లోన్ తీసుకున్నట్లైతే కస్టమర్ కేర్‌కు కాల్ చేసి మీ పరిస్థితిని వివరించండి. మీ రీపేమెంట్ షెడ్యూల్‌ను పొడిగించడం లేదా సవరించడం కోసం మీరు చేసిన అభ్యర్థనకు సంబంధించిన రికార్డు కోసం ఇమెయిల్ ద్వారా కమ్యూనికేట్ చేసుకోవడం మంచిది.లోన్ రీస్ట్రక్చరింగ్ (Loan Restructuring)లోన్ చెల్లించడంలో ఇబ్బందులు ఎదురైనప్పుడు బ్యాంక్ లేదా సంస్థతో చర్చలు జరిపి.. ఈఎంఐ తగ్గించుకోవడం, చెల్లింపు వ్యవధిని పొడిగించుకోవడం వంటివి చేసుకోవాలి. అయితే ఈ మార్గం కేవలం తక్షణ ఉపశమనం మాత్రమే అందిస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకోవాలి.పెనాల్టీ మినహాయింపులులోన్ ఈఎంఐ చెల్లింపులు ఆలస్యమైతే.. బ్యాంకులు లేదా ఆర్ధిక సంస్థలు భారీగా జరిమానా(ఫెనాల్టీ) విధించే అవకాశం ఉంది. అలాంటి సందర్భం మీకు ఎదురైతే.. ఫెనాల్టీ మాఫీ చేయమని అడగవచ్చు. కొన్ని బ్యాంకులు ఇలాంటి జరిమానాలు మాఫీ చేయడానికి అంగీకరించవచ్చు.బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ఈఎంఐ చెల్లించే వారికి 'బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్' అనేది ఓ మంచి ఆప్షన్. ఎందుకంటే ఒక బ్యాంక్.. మరో బ్యాంకుకు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేస్తే మీకు వడ్డీ రేటు వంటివి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఈఎంఐ పెరిగే అవకాశం ఉంటుంది.ఉదాహరణకు: మీరు ఒక బ్యాంకు నుంచి రూ.2 లక్షలు లోన్ తీసుకున్నారనుకోండి. అక్కడ కొన్ని రోజులు ఈఎంఐ చెల్లిస్తూ ఉంటే మీ సిబిల్ స్కోర్ పెరుగుతుంది. అలాంటి సమయంలో మీకు మరో బ్యాంకు కూడా లోన్ ఇవ్వడానికి సిద్దమవుతుంది. అక్కడ లోన్ తీసుకునే ముందు వడ్డీ రేటు కొంత తక్కువగా ఉండేట్లు చూసుకోవాలి. అప్పుడు ఆ బ్యాంక్ ఇచ్చే లోన్ మొత్తాన్ని, మీరు మొదట లోన్ తీసుకుని చెల్లిస్తున్న బ్యాంకుకు ట్రాన్స్ఫర్ చేసి, అక్కడ లోన్ కంప్లీట్ చేసుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని మీరు తీసుకోవచ్చు.ఇదీ చదవండి: చాన్నాళ్లకు తగ్గిన బంగారం ధర!.. తులం ఎంతంటే?లోన్ సెటిల్మెంట్మీరు పూర్తిగా లోన్ తిరిగి చెల్లించని సమయంలో.. బ్యాంక్‌తో సెటిల్మెంట్ గురించి చర్చించండి. అయితే లోన్ సెటిల్ చేయడం మీ సిబిల్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి.రికవరీ ఏజెంట్ల నుంచి వేధింపులు వస్తే?లోన్ చెల్లించని సమయంలో రికవరీ ఏజెంట్స్ కాల్ చేసి.. భయపెడుతూ ఉంటారు. అయితే ఇక్కడ మీరు కచ్చితంగా మీ హక్కులను గురించి తెలుసుకోవాలి. ఏజెంట్స్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల మధ్య మాత్రమే మిమ్మల్ని సంప్రదించాలి. మిమ్మల్ని భయపెట్టినా.. బెదిరించినా, సంబంధిత బ్యాంక్ లేదా పోలీసులకు నివేదించాలి. -
మధ్య తరగతికి పన్ను మినహాయింపు..?
అధిక పన్నులతో అల్లాడుతున్న మధ్య తరగతి ప్రజలకు రానున్న బడ్జెట్(Budget)లో ఊరట లభించనుందా? మందగించిన వినియోగానికి ప్రేరణగా ప్రభుత్వం పన్ను రేటు(Tax Rate)ను తగ్గించనుందా? విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ అంశాన్ని ప్రభుత్వం సునిశితంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.ఆర్థిక వ్యవస్థ మందగించిన తరుణంలో జీవన వ్యయాలు పెరిగిపోయి, మధ్య తరగతి ప్రజలు(middle class people) ఇబ్బంది పడుతున్నారని, వినియోగం పడిపోతుందన్న ఆందోళనలు వినిపిస్తుండడం తెలిసిందే. వీటికి పరిష్కారంగా పన్ను రేట్ల తగ్గింపుతో వినియోగానికి ఊతమివ్వాలన్నది ఈ ప్రతిపాదన లక్ష్యమని ఆ వర్గాలు వెల్లడించాయి. 2025–26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను 2025 ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు సమర్పించనున్నారు. ఇందులో ఈ మేరకు ప్రతిపాదన ఉంటే అది లక్షలాది మందికి ఊరట కల్పించనుంది. అయితే, కొత్త పన్ను వ్యవస్థలోనే ఈ మేరకు ఉపశమనం ఉండొచ్చన్నది సమాచారం. తద్వారా మరింత మందిని కొత్త పన్ను విధానం వైపు తీసుకురావడం కూడా ఈ ప్రతిపాదనలోని ఉద్దేశ్యంగా తెలుస్తోంది.కొత్త, పాత పన్ను విధానం..2020లో కేంద్రం అప్పటి వరకు ఉన్న పన్ను విధానానికి అదనంగా, మరో కొత్త విధానాన్ని సైతం ప్రవేశపెట్టింది. పాత విధానంలో ఆదాయం రూ.6లక్షలు మించితే 20 శాతం పన్ను పరిధిలోకి వస్తారు. అదే కొత్త పన్ను విధానంలో అయితే ప్రస్తుతం రూ.12 లక్షల వరకు ఆదాయంపై 15 శాతమే పన్ను అమల్లో ఉంది. కాకపోతే పాత పన్ను వ్యవస్థలో గృహ రుణం, బీమా ప్రీమియంలు, పెట్టుబడులపై పన్ను ప్రయోజనాలున్నాయి. కొత్త విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ మినహా ఇతర మినహాయింపుల్లేవు. ఈ రెండింటిలో ఏ విధానం ఎంచుకోవాలన్నది పన్నుదారుల ఐచ్ఛికమే.ఇదీ చదవండి: ప్రాపర్టీ ఎంపికలో పిల్లలూ కీలకమే..సర్కారుపై పెరుగుతున్న ఒత్తిళ్లు ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయిల నుంచి దిగిరావడం లేదు. వేతనాల్లో వృద్ధి సైతం మందగించింది. దీంతో ఖర్చు చేసేందుకు మిగులు లేక, మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తి క్షీణించింది. ఫలితంగా పట్టణ, గ్రామీణ వినియోగం క్షీణించి, అది దేశ ఆర్థిక వృద్ధిపైనా ప్రభావం చూపిస్తోంది. జీడీపీ ఏడు త్రైమాసికాల కనిష్ట స్థాయి అయిన 5.4 శాతానికి సెప్టెంబర్ త్రైమాసికంలో పడిపోవడం తెలిసిందే. దీంతో ఆదాయపన్ను రేట్లను తగ్గించాలంటూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. బడ్జెట్ ముందస్తు సమావేశాలు, వినతుల సందర్భంగా పలు రంగాల నిపుణులు, ఆర్థిక వేత్తలు సైతం పన్ను రేట్లు, కస్టమ్స్ టారిఫ్‌లు తగ్గించాలంటూ ప్రభుత్వానికి సూచించడం గమనార్హం. సహజంగా పన్ను తగ్గింపు డిమాండ్లు ఏటా బడ్జెట్ ముందు వినిపిస్తూనే ఉంటాయి. ఆర్థిక వృద్ధి క్షీణించిన తరుణంలో ఈ విడత ప్రభుత్వం ఈ దిశగా సానుకూల నిర్ణయం తీసుకుంటుందన్న ఆసక్తి నెలకొంది. -
ఫైనాన్స్‌లో దిట్ట.. అయినా వాటి జోలికి వెళ్లలేదు!
"సర్దార్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ" అని పిలిచే భారత మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ( Manmohan Singh ) కన్నుమూశారు. ఫైనాన్స్ పట్ల అసమానమైన అవగాహన ఉన్న ఆయన దేశ ఆర్థిక మంత్రిగా, ఆ తర్వాత రెండు పర్యాయాలు ప్రధానమంత్రిగా ( Prime Minister ) పనిచేశారు. ఆర్థిక సంస్కర్తగా ( Economic Reforms ) ఘనత వహించిన మన్మోహన్ సింగ్ ఎక్కడ ఇన్వెస్ట్ (invest ) చేసేవారు.. ఆయన పొదుపు ప్రణాళికల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.సంప్రదాయ పెట్టుబడులకు ప్రాధాన్యత1991లో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రి అయినప్పుడు సెన్సెక్స్ 999 పాయింట్ల వద్ద ఉండేది. ఆయన సంచలనాత్మక బడ్జెట్ సంస్కరణల తరువాత ఆ సంవత్సరం చివరి నాటికి సెన్సెక్స్ ( Sensex ) దాదాపు రెండింతలు పెరిగింది. భారతదేశ ఆర్థిక రూపును దిద్దడంలో ముఖ్యమైన పాత్ర ఉన్నప్పటికీ మన్మోహన్ సింగ్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయలేదు. ఫిక్స్డ్ డిపాజిట్లు ( FD ), పోస్టాఫీసు పొదుపు పథకాలు వంటి సాంప్రదాయ పెట్టుబడి సాధనాలకు ప్రాధాన్యత ఇచ్చారు.ఎఫ్డీలు, పోస్టాఫీసు పొదుపులుప్రధానమంత్రిగా ఆయన 2013 అఫిడవిట్ ప్రకారం.. మన్మోహన్ సింగ్ మొత్తం ఆస్తుల విలువ రూ. 11 కోట్లు. మన్మోహన్ సింగ్, ఆయన సతీమణి గురు శరణ్ కౌర్ ఇద్దరూ కలిసి రూ. 1 లక్ష నుండి రూ. 95 లక్షల విలువైన ఎనిమిది ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టారు. 2013 నాటికి వారి ఎప్డీలు, బ్యాంకు సేవింగ్స్ మొత్తం రూ. 4 కోట్లు కాగా వారి పోస్టాఫీసు ( Post office ) పొదుపు రూ. 4 లక్షలు.ఆస్తులు ఇవే.. 2019 నాటికి మన్మోహన్ సింగ్ ఆస్తుల విలువ రూ. 15 కోట్లు. ఢిల్లీ, చండీగడ్‌లోని ఆయన ఆస్తుల విలువ రూ. 7 కోట్లు. ఇక గురుశరణ్ కౌర్ వద్ద రూ. 3 లక్షల విలువైన 150 గ్రాముల బంగారం ఉండగా వారి బ్యాంకు ఎఫ్డీలు, సేవింగ్స్ రూ. 7 కోట్లు ఉన్నాయి. అదనంగా, వారు జాతీయ పొదుపు పథకం ( NSS )లో రూ.12 లక్షలు పొదుపు చేశారు.ఆర్థిక క్రమశిక్షణకు నిదర్శనంమన్మోహన్ ఆర్థిక క్రమశిక్షణకు నిదర్శనం. ఉదాహరణకు 2013 ఫిబ్రవరి 2 నుండి క్రమశిక్షణతో కూడిన ఆయన ఆర్థిక ప్రణాళికను పరిశీలిస్తే ఇది అర్థమవుతుంది. ఆ రోజున ఆయన మూడు ఎఫ్డీలలో రూ.2 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. మూడేళ్లలో ఇవి రూ. 2.62 కోట్లు అయ్యాయి. ఈ మొత్తాన్ని తిరిగి పెట్టుబడి పెట్టారు. ఆరేళ్లలో ఆయన సంపద రూ.4 కోట్లకు చేరింది. ఈ క్రమశిక్షణతో కూడిన విధానం ఆయన పెట్టుబడులును సురక్షితంగా, ఒత్తిడి లేకుండా ఉండేలా చూసింది.స్టాక్ మార్కెట్‌కు దూరంఫైనాన్స్ మీద అపారమైన అవగాహన ఉన్నప్పటికీ అధిక రాబడి కోసం మన్మోహన్ సింగ్ ఎన్నడూ స్టాక్ మార్కెట్ ( Stock market ) జోలికి వెళ్లలేదు. 1992లో స్టాక్ మార్కెట్ అస్థిరత సమయంలో అప్పటి ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ ‘స్టాక్‌మార్కెట్‌ను తలుచుకొని నా నిద్రను చెడగొట్టుకోను’ అంటూ స్టాక్ మార్కెట్‌పై తన అంతరంగాన్ని పార్లమెంటులో వెల్లడించారు. -
ఈపీఎఫ్‌వోలో కొత్త ఏడాది ముఖ్యమైన మార్పులు..
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) మార్గదర్శకాలు, విధానాల్లో కొన్ని ముఖ్యమైన మార్పులు తీసుకురానుంది. వీటిలో చాలా మార్పులు రాబోయే కొత్త సంవత్సరంలో అమలులోకి వస్తాయని భావిస్తున్నారు. వీటితోపాటు పలు కొత్త సేవలను పరిచయం చేయనుంది. పీఎఫ్ ఖాతాదారులకు సౌకర్యాన్ని మెరుగుపరచడమే ఈ అప్డేట్ల ప్రధాన లక్ష్యం. కొత్త ఏడాదిలో ఈపీఎఫ్‌వోలో వస్తున్న ముఖ్యమైన మార్పులు.. చేర్పులు ఏంటన్నది ఇక్కడ తెలుసుకుందాం.ఉద్యోగి కంట్రిబ్యూషన్ పరిమితిఈపీఎఫ్వో ముఖ్యమైన అప్డేట్లో ఉద్యోగుల ఈపీఎఫ్ ( EPF ) కంట్రిబ్యూషన్ పరిమితి తొలగింపు ఒకటి. ప్రస్తుతం, ఉద్యోగులు ప్రతి నెలా వారి ప్రాథమిక వేతనంలో 12% తమ ఈపీఎఫ్ ఖాతాకు కేటాయిస్తున్నారు. ఈ బేసిక్ వేతనాన్ని రూ. 15,000 లుగా ఈపీఎఫ్‌వో నిర్దేశించింది. దీనికి బదులుగా ఉద్యోగులు తమ వాస్తవ జీతం ఆధారంగా ఈపీఎఫ్ ఖాతాకు కేటాయించుకునేలా కొత్త ప్రతిపాదన ఉంది. ఇది అమలులోకి వచ్చిన తర్వాత ఉద్యోగులు పదవీ విరమణ నిధిని భారీగా కూడగట్టుకునే అవకాశం ఉంటుంది. ఫలితంగా నెలవారీ పెన్షన్ చెల్లింపు ఎక్కువగా ఉంటుంది.ఏటీఎం నుంచి పీఎఫ్ డబ్బుఈపీఎఫ్వో సభ్యులు తమ ప్రావిడెంట్ ఫండ్ డబ్బును ఏటీఎం ( ATM ) కార్డ్‌తో విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు అతి త్వరలోనే అందుబాటులోకి రానుంది. దీంతో చందాదారులు ఎప్పుడైనా, ఎక్కడైనా నిధులను ఉపసంహరించుకోవచ్చు. ఏటీఎం ఉపసంహరణ సౌకర్యం 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభం కానుంది. ఇది అందుబాటులోకి వస్తే సభ్యులు తమ బ్యాంకు ఖాతాల్లోకి పీఎఫ్ డబ్బును పొందడానికి 7 నుండి 10 రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా విలువైన సమయం ఆదా అవుతుంది.ఈపీఎఫ్‌వో ఐటీ సిస్టమ్ అప్గ్రేడ్పీఎఫ్ హక్కుదారులు, లబ్ధిదారులు తమ డిపాజిట్లను సులభంగా ఉపసంహరించుకునేలా ఈపీఎఫ్‌వో తన ఐటీ (IT) వ్యవస్థను మెరుగుపరుస్తోంది. ఈ అప్‌గ్రేడ్ 2025 జూన్ నాటికి పూర్తవుతుందని అంచనా. ఐటీ వ్యవస్థ అప్‌గ్రేడ్ పూర్తయిన తర్వాత, సభ్యులు వేగవంతమైన క్లెయిమ్ సెటిల్మెంట్లు, మెరుగైన పారదర్శకత, మోసపూరిత కార్యకలాపాల తగ్గుదలని ఆశించవచ్చు.ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ఈపీఎఫ్వో సభ్యులను ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ ( ETF ) పరిధికి మించి ఈక్విటీలలో పెట్టుబడి పెట్టడానికి అనుమతించే అవకాశాన్ని పరిశీలిస్తోంది. ఈ ప్రతిపాదిత మార్పు పీఎఫ్ ఖాతాదారులకు వారి ఫండ్లను మెరుగ్గా నిర్వహించడానికి, అధిక రాబడిని అందుకునేందుకు, పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్‌కు వీలు కల్పిస్తుంది. ఇది ఆమోదం పొందితే డైరెక్ట్ ఈక్విటీ పెట్టుబడి సభ్యులకు తమ పెట్టుబడి వ్యూహాలను, ఆర్థిక వృద్ధిని పెంచుకోవడానికి కొత్త మార్గాన్ని అందిస్తుంది.ఏ బ్యాంకు నుంచైనా పెన్షన్ఈపీఎఫ్వో పెన్షనర్ల కోసం గణనీయమైన మార్పులను అమలు చేస్తోంది. ఇటీవలి ఆదేశాల ప్రకారం.. పింఛనుదారులు అదనపు ధ్రువీకరణ లేకుండా తమ పెన్షన్‌ను దేశవ్యాప్తంగా ఏ బ్యాంకు నుండి అయినా ఉపసంహరించుకునే వెసులుబాటు రానుంది. -
జనవరి 1 నుంచి కొత్త రూల్స్.. ఇవన్నీ మారుతున్నాయ్!
2024 సంవత్సరానికి వీడ్కోలు చెప్పే సమయం ఆసన్నమైంది. త్వరలో 2025 వచ్చేస్తోంది. కొత్త సంవత్సరం జనవరి 1 నుంచి LPG సిలిండర్ ధరలు, వీసా నిబంధనలు, ఫిక్స్డ్ డిపాజిట్ నియమాలు మాత్రమే కాకుండా కార్ల ధరలలో కూడా మార్పులు జరగనున్నాయి.అమెజాన్ ప్రైమ్జనవరి 1 నుంచే డివైజ్‌ల వాడకంపై అమెజాన్ ప్రైమ్ పరిమితులను విధించనుంది. అంటే కొత్త రూల్స్ ప్రకారం.. ఐదు డివైజ్‌లలో.. ఏ డివైజ్ అన్నదానితో సంబంధం లేకుండా.. ఒకసారికి రెండు టీవీలలో మాత్రమే అమెజాన్ ప్రైమ్ వీడియోలను చూడవచ్చు. దీనికి సంబంధించిన వివరాలను యూజర్లు ఈమెయిల్స్ ద్వారా అందుకుంటారు. అయితే సెట్టింగ్స్ పేజీలోని మేనేజ్ ఆప్షన్ ద్వారా డివైజ్‌లను సెట్ చేసుకోవచ్చు.ఈ మొబైల్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు2025 జనవరి 1 నుంచి పాత వెర్షన్స్ అయిన.. శాంసంగ్ గెలాక్సీ ఎస్3, గెలాక్సీ ఎస్ 3, గెలాక్సీ ఎస్4 మినీ, హెచ్‌టీసీ వన్ ఎక్స్, వన్ ఎక్స్ ప్లస్, సోనీ ఎక్స్‌పీరియా జెడ్, ఎక్స్‌పీరియా టీ, ఎల్జీ ఆప్టిమస్ జీ, నెక్సస్ 4, మోటో జీ, మోటో ఈ 2014 వంటి వాటిలో వాట్సాప్ పనిచేయదు.కార్ల ధరల పెంపు2025 జనవరి 1 నుంచే కార్ల ధరలు సమంత పెరగనున్నాయి. ఈ జాబితాలో మారుతీ సుజుకీ, మెర్సిడెస్ బెంజ్, బిఎమ్‌డబ్ల్యూ, ఆడి, హ్యుందాయ్, మహీంద్రా మొదలైన కంపెనీలు ఉన్నాయి. కార్ల ధరలు 3 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని సమాచారం.థాయిలాండ్ ఈ-వీసా1 జనవరి 2025 నుంచి ప్రపంచంలోని ఏ దేశం నుంచి అయినా సందర్శకులు అధికారిక థాయిలాండ్ వీసా వెబ్సైట్ ద్వారా ఈ వీసా కోసం అప్లై చేసుకోవచ్చు. దీంతో థాయిలాండ్ దేశానికి వెళ్లే సందర్శకుల సంఖ్య బాగా పెరుగుతుంది. ఎందుకంటే థాయిలాండ్ వీసా మరింత సులభమైపోతోంది.యూఎస్ వీసా నిబంధనల్లో మార్పులుచదువుకోవడానికి లేదా ఉద్యోగం చేయడానికి అమెరికా వెళ్లే వ్యక్తులు కొత్త వీసా నిబంధనల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. 2025 జనవరి 1 నుంచి భారతదేశంలోని యూఎస్ ఎంబసీలో.. వీసా అపాయింట్మెంట్ల కోసం ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించడానికి అనేక మార్పులు చేయనున్నారు. అంతే కాకుండా యూఎస్ 'డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ' కూడా హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌లో పెద్ద మార్పును తీసుకురానున్నట్లు సమాచారం. యూఎస్ వీసా నిబంధనల్లో మార్పుల గురించి మరింత తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.LPG సిలిండర్ ధరలుచమురు కంపెనీలు ప్రతి నెల 1వ తేదీన సిలిండర్ ధరల సమాచారాన్ని అప్డేట్ చేస్తాయి. గత 5 నెలలుగా 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగాయి. అయితే గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు.RBI ఫిక్స్డ్ డిపాజిట్ నియమాలలో మార్పులురిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2025 జనవరి 1 నుంచి ఎన్బీఎఫ్సీలు & హెచ్ఎఫ్సీల ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించిన పాలసీని మార్చింది. ఇందులో ప్రజల నుంచి డిపాజిట్లను తీసుకునే నియమాలను మార్చే ప్రక్రియ, లిక్విడ్ ఆస్తులపై ఉంచే శాతం, డిపాజిట్ల బీమాకు సంబంధించిన నియమాలు ఉంటాయి.యూపీఐ 123 పేరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అక్టోబర్ 9న 'యూపీఐ 123 పే' (UPI 123Pay) పరిచయం చేస్తూ.. లావాదేవీల పరిమితులను కూడా రూ.5,000 నుంచి రూ. 10,000లకు పొడిగించింది. ఇది స్మార్ట్ఫోన్లలో మాత్రమే కాకుండా ఫీచర్ ఫోన్లలో కూడా పనిచేస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. -
నెలకు రూ. 7వేలతో.. ₹32 లక్షలు: ఎలా అంటే?
తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు రావాలంటే.. 'మ్యూచువల్ ఫండ్స్' (Mutual Funds) ఉత్తమ ఎంపిక. ఇప్పటికే రోజుకు 50 రూపాయల పెట్టుబడితే.. కోటి రూపాయలు ఎలా సంపాదించాలి? నెలకు రూ. 10వేలు పెట్టుబడిగా పెడుతూ.. రూ.7 కోట్లు ఎలా పొందాలి? అనే విషయాలను తెలుసుకున్నాం. ఈ కథనంలో నెలకు రూ.7,000 పెట్టుబడి పెడితే.. రూ.32 లక్షలు ఎలా వస్తాయి? దీని కోసం ఎన్ని సంవత్సరాలు వేచి చూడాలి అనే విషయాలు తెలుసుకుందాం.రూ.7వేలుతో.. 32 లక్షల రూపాయలునెలకు రూ.7000 చొప్పున 15 సంవత్సరాలు పెట్టుబడి పెడితే.. మీ ఇన్వెస్ట్మెంట్ (Investment) రూ. 12,60,000 అవుతుంది. దీనికి 11 శాతం రాబడిని ఆశిస్తే.. రిటర్న్స్ రూ. 19,52,003 వస్తాయి. పెట్టుబడి, రిటర్న్స్ కలిపితే 15 ఏళ్లలో మీకు వచ్చే మొత్తం రూ. 32,12,003.మీరు ఎక్కువ లాభాలను పొందాలంటే.. తప్పకుండా దీర్ఘకాలిక పెట్టుబడులు (Long Term Investment) పెట్టడానికి ప్లాన్స్ వేసుకోవాలి. అంతే కాకుండా ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు ఎంత తొందరగా ప్రారంభిస్తే.. మీకు లాభాలు కూడా అంత వేగంగానే వస్తాయి. ఉదాహరణకు, మీరు 20 ఏళ్ల వయసులో పెట్టుబడులు పెట్టడం ప్రారంభిస్తే.. 35 సంవత్సరాలకు రూ.32 లక్షలు వస్తాయి.పెట్టుబడులు ఆలస్యం చేస్తే.. లాభాలను పొందటానికి కొంత ఎక్కువ సమయం వేచి చూడాల్సి ఉంటుంది. కాబట్టి వీలైనంత తొందరగా ఇన్వెస్ట్మెంట్స్ ప్రారంభించాలి.ఇదీ చదవండి: రోజుకు రూ.50 పెట్టుబడి: ఆదాయం రూ.కోటిగమనిక: పెట్టుబడి పెట్టేవారు, ముందుగా మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే పెట్టుబడి అనేది ఒకరు ఇచ్చే సలహా కాదు. అది పూర్తిగా మీ వ్యక్తిగతం. కాబట్టి మీ ఆర్థిక ప్రణాళిక కోసం తప్పకుండా నిపుణులను సంప్రదించండి. ఆ తరువాత ఎక్కడ పెట్టుబడి పెట్టాలో నిర్ణయించుకోండి. అంతే కాకుండా మ్యూచువల్ ఫండ్స్‌లో ఎంత డబ్బు వస్తుందని ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే వచ్చే డబ్బు రాబడుల మీద ఆధారపడి ఉంటుంది. -
ఇలాంటి చెక్కు వస్తే డబ్బు డ్రా చేసుకోలేరు..
దాదాపు అందరికీ బ్యాంకు ఖాతాలు ఉంటాయి. కానీ చెక్కులను పెద్దగా ఉపయోగించరు. వాటిలో చాలా మందికి వివిధ రకాల చెక్కుల గురించి తెలియదు . అటువంటి వాటిలో ఒకటే క్రాస్ చెక్ (Cross Cheque). ఇటాంటి చెక్ పై వైపున ఎడమ మూలలో రెండు గీతలు గీస్తారు. ఈ గీతలు ఎందుకు గీస్తారో తెలుసా? నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881 ప్రకారం క్రాస్ చెక్‌ల గురించి ఇక్కడ తెలుసుకుందాం..నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881 (Negotiable Instruments Act)లోని సెక్షన్ 123 ప్రకారం.. ఇలాంటి చెక్ జారీ చేసిన వ్యక్తి ఇది క్రాస్డ్ చెక్ అని చెక్ ఎగువన ఎడమ మూలలో రెండు లైన్లతో బ్యాంక్‌కి సూచిస్తారు. ఈ రకమైన చెక్కుతో బ్యాంకుకు వెళ్లి నగదు తీసుకునేందుకు వీలుండదు. చెక్‌ను క్రాస్ చేయడం వలన నేరుగా డబ్బు విత్ డ్రా కాకుండా చెక్ పొందిన వ్యక్తి లేదా సూచించిన ఇతర వ్యక్తుల బ్యాంక్ ఖాతాలో మాత్రమే జమ చేసుకునేందుకు ఆస్కారం ఉంటుంది. దీని కోసం చెక్ వెనుక భాగంలోవారి సంతకం అవసరం.క్రాస్ చెక్ రకాలుఅయితే క్రాస్ చెక్లలోనూ అనేక రకాలు ఉన్నాయి. మొదటిది సాధారణ క్రాసింగ్. అంటే ఇప్పటిదాకా చెప్పుకొన్న అంశాలన్నీ ఈ రకం కిందకు వస్తాయి. రెండోది ప్రత్యేక క్రాసింగ్. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881లోని సెక్షన్ 124 ప్రకారం.. చెక్ గ్రహీత నిర్దిష్ట బ్యాంక్ ఖాతాలోకి వెళ్లాలని డ్రాయర్ కోరుకున్నప్పుడు ప్రత్యేక క్రాసింగ్ చెక్‌ను జారీ చేస్తారు.ఉదాహరణకు గ్రహీత ఎక్కువ బ్యాంక్ ఖాతాలను కలిగి ఉన్నట్లయితే, చెక్కు దిగువన ఉన్న పంక్తుల మధ్య దాని పేరును వ్రాయడం ద్వారా డ్రాయర్ బ్యాంక్‌ను పేర్కొనవచ్చు.ఇక చెక్‌పై క్రాసింగ్ లైన్ల మధ్య "అకౌంట్ పేయీ" అని రాసినట్లయితే, గ్రహీత మాత్రమే దాని నుండి డబ్బును విత్‌డ్రా చేయగలరని అర్థం. అయితే, ప్రత్యేక క్రాసింగ్‌తో నిర్దిష్ట బ్యాంకును పేర్కొన్నట్లయితే, డబ్బు ఆ బ్యాంకుకు మాత్రమే వెళ్తుంది. ఇది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881లో స్పష్టంగా పేర్కొననప్పటికీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank)తో సహా అనేక బ్యాంకులు దీనిని అనుసరిస్తున్నాయి.క్రాస్డ్ చెక్కులను ఎందుకు జారీ చేస్తారంటే..క్రాస్డ్ చెక్‌ల జారీ వెనుక ఉద్దేశం ఏమిటంటే, ఉద్దేశించిన గ్రహీత ఆ మొత్తాన్ని అందుకున్నారని నిర్ధారించుకోవడం. ఆ చెక్కు తప్పుడు చేతుల్లోకి వెళ్లినా.. అందులో నుంచి డబ్బులు తీసుకోలేరు. తద్వారా దాని భద్రతను (Cheque Security) పెంచుతుంది. -
టాప్ 10 పోస్టాఫీస్ స్కీమ్స్.. ఎంచుకో ఓ మంచి ఆప్షన్
పెట్టుబడులు పెట్టడానికి, స్థిరమైన రాబడులు పొందటానికి ఉత్తమైన ఆప్షన్ 'పోస్ట్ ఆఫీస్ పథకాలు'. పొదుపు చేసుకోవడానికి, ఉత్తమమైన రాబడులను అందుకోవడానికి.. అందుబాటులో ఉన్న 10 ఉత్తమమైన పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ (Post Office Scheme) గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ (Post Office Savings Account)పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ అనేది రిటైల్ బ్యాంక్ అందించే సేవింగ్స్ ఖాతా. ఈ అకౌంట్ కోసం కనీస 500 రూపాయల బ్యాలెన్స్ అవసరం. ఖాతా ఓపెన్ చేసిన తరువాత రూ.50 నుంచి.. ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్ కింద ఖాతాదారులకు 4 శాతం వడ్డీ లభిస్తుంది.నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్ ఖాతాసామాన్య ప్రజలు సైతం ఉపయోగించడానికి ఉత్తమైన పోస్టాఫీస్ సేవింగ్ ఖాతాలలో ఒకటి ఈ 'నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్'. ఇందులో నెలకు 100 రూపాయలు కూడా డిపాజిట్ చేసుకోవచ్చు. దీనికి వడ్డీ మూడు నెలలకు ఒకసారి యాడ్ చేస్తారు. వార్షిక వడ్డీ 6.7 శాతంగా ఉంది.నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్ అకౌంట్నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్ అకౌంట్ అనేది ఒకటి, రెండు, మూడు, ఐదు సంవత్సరాల కాల వ్యవధిలో అందుబాటులో ఉంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు కోరుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఈ ఖాతాను కనిష్టంగా రూ. 1,000లతో ఓపెన్ చేసుకోవచ్చు. ఇందులో వడ్డీ రేటు కూడా కొంత ఎక్కువగానే ఉంటుంది.నేషనల్ సేవింగ్స్ మంత్లీ ఇన్కమ్ అకౌంట్ఈ స్కీమ్ ద్వారా ఖాతాదారులు తమ అకౌంట్లో రూ.9 లక్షల వరకు ఉంచుకోవచ్చు. అయితే ఉమ్మడి ఖాతాలలో రూ.15 లక్షల వరకు ఉండొచ్చు. స్థిరమైన ఆదాయ వనరు కోసం వెతుకుతున్న వారు లేదా.. పదవీ విరమణ చేసిన వారికి ఇది ఓ మంచి ఎంపిక అవుతుంది. ఈ స్కీమ్ ద్వారా ఖాతాదారులు సుమారు 7 శాతం వడ్డీ పొందవచ్చు.సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వారి కోసం ఈ స్కీమ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో రూ. 1000 నుంచి రూ. 30 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. వన్-టైమ్ డిపాజిట్లకు కూడా ఇందులో అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ ద్వారా ఖాతాదారుడు కొంత ఎక్కువ వడ్డీని పొందవచ్చు. సాధారణ ఖర్చుల కోసం పెట్టుబడి రాబడిపై ఆధారపడే సీనియర్ సిటిజన్లకు అనువైనది.పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) అకౌంట్దీర్ఘకాలిక పొదుపుల కోసం ఎదురుకి హోసేవారికి ఇది మంచి ఎంపిక. ఇందులో రూ. 500 నుంచి రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. డిపాజిట్లు ఏక మొత్తంలో లేదా వాయిదాలలో చేయవచ్చు. ఇది రిటైర్మెంట్ ప్రణాళిక మరియు ఇతర దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలకు అనుకూలంగా ఉంటుంది. ఇందులో 7.1 శాతం వడ్డీ లభిస్తుంది.సుకన్య సమృద్ధి అకౌంట్ (SSA)ప్రత్యేకంగా ఆడ పిల్లల కోసం అందుబాటులో ఉన్న స్కీమ్. ఇది వారి విద్య, భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. ఈ స్కీమ్ గరిష్టంగా 8.2 శాతం వడ్డీ అందిస్తుంది. ఫ్లెక్సిబుల్ డిపాజిట్ ఆప్షన్లతో ఒక ఆర్థిక సంవత్సరానికి రూ. 250 నుంచి రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడులు పెట్టవచ్చు. ఈ పథకాన్ని బేటీ బచావో, బేటీ బడవో కింద 2015లో ప్రధాని 'నరేంద్ర మోదీ' ప్రారంభించారు.నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC)భారతీయులలో పొదుపును అలవాటు చేయడానికి కేంద్రం ఈ పథకాన్ని పరిచయం చేసింది. ఇందులో ఖాతాదారులు కనిష్టంగా రూ. 1000 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. దీనికి గరిష్ట పరిమితి అంటూ ఏమీ ఉండదు. ఇందులో ఖాతాదారుడు 7 శాతం కంటే ఎక్కువ వడ్డీని పొందవచ్చు.ఇదీ చదవండి: నెలకు ₹10 వేలు.. రూ.7 కోట్ల ఆదాయం - ఎలాగంటే?కిసాన్ వికాస్ పత్ర (KVP)ఈ స్కీమ్ ద్వారా పెట్టే పెట్టుబడి సుమారు 124 నెలల్లో రెట్టింపు అవుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడులకు ఇది బెస్ట్ ఆప్షన్. ఇందులో కూడా పెట్టుబడిపి గరిష్ట పరిమితి అంటూ ఏమి ఉండదు. ఇందులో వడ్డీ రేటు 7 శాతం కంటే ఎక్కువే ఉంటుంది.మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ (MSSC)మహిళలకు ఆర్థికంగా ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా ప్రారభించిన పథకమే ఈ 'మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్'. ఇందులో కనీస పెట్టుబడి రూ. 1000 కాగా, గరిష్టంగా రూ. 2 లక్షలు. ఆర్థిక భద్రత, వృద్ధిని కోరుకునే మహిళలకు ఇది సురక్షితమైన స్కీమ్.Note: పోస్టాఫీస్ పథకాలలో పెట్టుబడులు పెట్టాలంటే ముందుగా వీటి గురించి పూర్తిగా తెలుసుకోండి. ఈ పథకాలకు సంబంధించిన అనుమానాలను లేదా ఇతర వివరాలను తెలుసుకోవడానికి మీ సమీపంలోని పోస్ట్ ఆఫీసును సందర్శించండి. ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరగాళ్లు పెరుగుతున్న తరుణంలో.. పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త వహించడం చాలా అవసరం. -
రెండు పాలసీలుంటే క్లెయిమ్ ఎలా చేయాలి?
మారుతున్న జీవనశైలికి అనుగుణంగా ఆహార అలవాట్లలో తేడాలొస్తున్నాయి. దానికితోడు శారీరక శ్రమ లోపించి చాలామంది ఆసుపత్రుల బాట పడుతున్నారు. ఏదైనా కారణాలతో హాస్పటల్లో చేరితే ఆర్థికంగా భారం కాకూడదని చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్(Health Insurance) తీసుకుంటున్నారు. అయితే ఇటీవలి కాలంలో వేతన జీవుల్లో చాలా వరకు రెండు హెల్త్ పాలసీలు తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో చికిత్స వ్యయం బీమా కవరేజీని మించిపోయే ప్రమాదం ఉంది. అలాంటి సందర్భాలను ఒకటికి మించిన పాలసీలతో సులభంగా గట్టెక్కొచ్చు. కానీ, ఒకటి కంటే ఎక్కువ పాలసీలు ఉంటే క్లెయిమ్ ఎలా చేయాలనే విషయంలో చాలా మంది అయోమయాన్ని ఎదుర్కొంటూ ఉంటారు. ఈ విషయంలో నిపుణుల సూచనలు అందించే కథనమిది.ఒక వ్యక్తికి ఒకటికి మించిన బీమా సంస్థల నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటే, క్లెయిమ్ మొత్తాన్ని ఆయా సంస్థలు సమానంగా భరించాలనే నిబంధన గతంలో ఉండేది. 2013లో దీన్ని బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (IRDAI) తొలగించింది. దీంతో ఇప్పుడు ఒకటికి మించిన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు కలిగి ఉన్నా కానీ, పాలసీదారు తనకు నచ్చిన చోట లేదంటే రెండు సంస్థల వద్దా క్లెయిమ్ దాఖలు చేసుకోవచ్చు. క్లెయిమ్ ఎలా?రెండు ప్లాన్లు కలిగిన వారు ఆస్పత్రిలో చేరిన తర్వాత రెండు బీమా సంస్థలకు తప్పనిసరిగా సమాచారం అందించాలి. ఒకటికి మించిన సంస్థల నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు కలిగి ఉంటే, అప్పుడు ముందుగా ఒక బీమా సంస్థకు ప్రతిపాదనలు పంపిస్తే సరిపోతుంది. నగదు రహిత, రీయింబర్స్మెంట్ మార్గాల్లో దేనినైనా వినియోగించుకోవచ్చు. క్లెయిమ్ మొత్తం ఒక హెల్త్ ప్లాన్ కవరేజీ దాటనప్పుడు ఒక బీమా సంస్థ వద్దే దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. కానీ, ఒక పాలసీ కవరేజీకి మించి ఆస్పత్రి బిల్లు వచ్చినప్పుడు, రెండో బీమా సంస్థ వద్ద మిగిలిన మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవాలి. అంతే కానీ, ఒకేసారి ఒకే క్లెయిమ్‌ను రెండు సంస్థల వద్ద దాఖలు చేసేందుకు అవకాశం లేదని గుర్తుంచుకోవాలి. అలాకాకుండా రెండింటిలో దరఖాస్తు చేసుకుంటే ఒక్కోసారి రెండూ రెజెక్ట్ అయ్యే ప్రమాదం ఉందని తెలుసుకోవాలి.ఒకటికి మించిన ప్లాన్లు ఎందుకు?అసలు ఒకటికి మించి హెల్త్ పాలసీలు ఎందుకనే సందేహం రావచ్చు. ఒక్కొక్కరి అవసరాలే దీన్ని నిర్ణయిస్తాయి. ప్రైవేటు రంగంలో పనిచేసే వారికి పనిచేస్తున్న సంస్థ నుంచి గ్రూప్ హెల్త్ కవరేజీ సాధారణంగా ఉంటుంది. ఉన్నట్టుండి ఉద్యోగం నుంచి తప్పుకోవాల్సి వచ్చినా లేదంటే ఉద్యోగం కోల్పోయిన సందర్భాల్లో.. తిరిగి ఉపాధి లభించేందుకు కొంత సమయం పట్టొచ్చు. కంపెనీలు కల్పించే గ్రూప్ హెల్త్ కవరేజీ.. ఉద్యోగానికి రాజీనామా చేయడంతోనే ముగిసిపోతుంది. అందుకే వ్యక్తిగతంగా మరో ప్లాన్ కలిగి ఉంటే, ఉద్యోగం లేని సమయంలోనూ ఉపయోగపడుతుంది. వైద్య చికిత్సల వ్యయాలు గణనీయంగా పెరిగిపోతున్న తరుణంలో రెండు ప్లాన్లను కలిగి ఉండడం మంచి నిర్ణయమే అవుతుంది. లేదంటే బేస్ ప్లాన్ ఒకటి తీసుకుని, దానిపై మరింత మెరుగైన కవరేజీతో సూపర్ టాపప్ ప్లాన్(Topup Plan) జోడించుకోవడం మరొక మార్గం. -
మంచి మ్యూచువల్ ఫండ్ ఎంచుకోవడం ఎలా?
దీర్ఘకాలంలో మంచి రాబడులిచ్చే మ్యూచువల్ పండ్ను ఎంచుకునే ముందు చాలామంది సాధారణంగా ఓ తప్పు చేస్తూంటారు. కేవలం గత పనితీరుపైనే ఆధారపడి ఫండ్‌ను సెలక్ట్ చేసుకుంటారు. అయితే అన్నివేళలా అలాంటి పనితీరు కనిపించకపోవచ్చు. ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్ 100 శాతం రాబడులు ఇచ్చిదంటే అంతకంటే ముందుగానే ఆ పథకంలో ఇన్వెస్ట్ చేసిన వారికి అది విలువ సమకూర్చినట్టు అవుతుంది. కొత్తగా అదే పథకంలో ఇన్వెస్ట్ చేసే వారికి గత పనితీరు కేవలం ఒక సూచికే అవుతుంది. అంతేకానీ భవిష్యత్ రాబడులకు హామీ కాదు. ఒక మ్యూచువల్ ఫండ్ గత పనితీరు అన్నది మార్కెట్ల ఎత్తు, పల్లాల్లో ఎలా పనిచేసిందో తెలుసుకునేందుకు ఉపకరిస్తుంది.కొన్ని ఫండ్స్ నష్టాల నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టొచ్చు. కొన్ని వేగంగా కోలుకుంటాయి. దీనికి అంతర్గతంగా అవి ఎంచుకున్న కంపెనీలే కారణం. కాబట్టి ఒక ఫండ్‌ను ఎంపిక చేసుకునే ముందు.. పోటీ పథకాలతో పోల్చి చూస్తే పనితీరు ఎలా ఉందన్నది విశ్లేషించాలి. అదే విభాగం సగటు పనితీరు, ఆ విభాగంలోని పోటీ పథకాలతో పోల్చితే మధ్య, దీర్ఘకాలంలో రాబడులు ఎలా ఉన్నాయన్నది పరిశీలించాలి.స్వల్పకాల రాబడులు అంత ఉపయోకరం కాదు. నిర్ణీత కాలంలో పథకంలో రాబడులు స్థిరంగా ఉన్నాయా? అని కూడా చూడాలి. బుల్ మార్కెట్లలో నిదానంగా ర్యాలీ అయి, మార్కెట్ కరెక్షన్లలో తక్కువ నష్టాలకు పరిమితం చేసే విధంగా పథకం సామర్థ్యాలు ఉండాలి. అలాంటప్పుడు ఆ పథకం రాబడుల పరంగా నిరాశ మిగల్చదు. ఫండ్ మేనేజర్ ట్రాక్ రికార్డు (పనితీరు) కూడా పరిశీలించాలి.ఇదీ చదవండి: జనవరి 1 నుంచి వాట్సప్ పని చేయదు! కారణం..పథకం పనితీరు ఫండ్ మేనేజర్ ప్రతిభ వల్లే అయితే, సదరు ఫండ్ మేనేజర్ రాజీనామా చేసి వెళ్లిపోతే అది ప్రతికూలంగా మారొచ్చు. అంతేకాదు ఇన్వెస్టర్ వ్యవహార శైలి కూడా దీర్ఘకాల రాబడులను ప్రభావితం చేస్తుంది. మార్కెట్ల పతనాల్లో ఆందోళన చెందకుండా, పెట్టుబడుల విధానానికి కట్టుబడి ఉండాలి. మార్కెట్ పతనాల్లోనూ క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయాలి. ఇలా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. -
ఆలుమగలిద్దరూ ఉద్యోగస్తులైతే.. పన్నుభారం తగ్గించుకోవడం ఎలా?
గతవారం ఉద్యోగస్తులకు సంబంధించి వారి ఆదాయం విషయంలో కొత్త విధానమా.. పాత పద్ధతా.. ఏది మంచిది.. ఏ విధంగా అయితే పన్నుభారం తక్కువ అవుతుందనేది ఉదాహరణపూర్వకంగా తెలుసుకున్నాం. ఈవారం ఒకే కుటుంబంలో భార్య, భర్త ఇద్దరూ ఉద్యోగస్తులైతే ఎలా ఆలోచించాలో ఎలా ప్లాన్ చేయాలో తెలుసుకుందాం. ఇద్దరూ ఉద్యోగస్తులైనా.. ఇద్దరూ రిటైర్ అయినా.. ఒకరు రిటైర్ అయి ఒకరు ఉద్యోగంలో ఉన్నా ఈ ఆలోచనలను అమలుపరచవచ్చు.ఇద్దరూ గవర్నమెంటుకు సంబంధించిన వారయితే..గవర్నమెంటు నుండి జీతం/పెన్షన్ పుచ్చుకున్న వారైతే వారి వారి జీతభత్యాల విధానం వల్ల ఎటువంటి వెసులుబాటు ఉండదు. పే స్కేల్, వేతన ప్రమాణాలు, పే స్ట్రక్చర్.. అన్నీ నిర్దిష్టంగా ఉంటాయి. ఉద్యోగి తనకు అనుకూలంగా మార్చుకునే వెసులాటు ఉండదు. అన్నీ ప్రీ ఫిక్సిడ్. కాలానుగుణంగా పే రివిజన్ ప్రకారం మారతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆదాయం వచ్చినదంతా లెక్కించాల్సిందే. ఇద్దరి జీతభత్యాలను, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోండి. ఇద్దరికి ఇంచు మించు సమానమైన జీతభత్యాలు ఉంటే పెద్దగా ఆలోచించే పని లేదు. అంటే ఇద్దరూ ఒకే శ్లాబులో ఉంటే పన్నుభారం మారదు. ఎవరూ కట్టినా ఒకటే! పెద్దగా వెసులుబాటు ఉండదు. ఆస్కారం ఉండదు.కానీ జీతభత్యాల్లో తేడాలుండి.. ఆ తేడాల వల్ల శ్లాబులు మారే అవకాశం ఉంటే ఏదైనా ఆలోచన చేయడానికి అవకాశం ఉంటుంది. ➤ఒకరు జీరో.. ఒకరు 10 శాతం➤ఒకరు 10 శాతం.. ఒకరు 20 శాతం➤ఒకరు 20 శాతం.. ఒకరు 30 శాతంఎక్కువ శ్లాబులో ఉన్నవారైతే కంపల్సరీగా సేవింగ్స్ ఉంటాయి. పీఎఫ్ మొదలైనవి నిర్దిష్టంగా.. అంటే మీ ప్లానింగ్‌తో నిమిత్తం లేకుండా ఉంటాయి. అవి విధిగా చెల్లించవలసిందే. ఎక్కువ శ్లాబులో ఉన్నా వీలున్నంత వరకు సేవ్ చేసి మినహాయింపులు పొందండి. తక్కువ/చిన్న శ్లాబులో కంపల్సరీ సేవింగ్స్‌ని దాటి వెళ్లొద్దు.సొంత ఇల్లు ఉండి.. దాని మీద రుణం.. వడ్డీ ఉంటే.. ఎక్కువ శ్లాబున్న వారి అకౌంట్లో పేమెంట్లు జరగాలి. క్లెయిమ్ చేసే వారి బ్యాంకు అకౌంట్లోనే డెబిట్లు ఉండాలి. దస్తావేజుల్లో ఇద్దరి పేర్లు ఉంటే సమానంగా క్లెయిమ్ చేయండి. ఒక్కరి పేరే ఉంటే ఆ ఒక్కరే క్లెయిమ్ చేయండి.ఈ మేరకు, కాగితాలు, ప్లాన్లు సబ్మిట్ చేసినప్పటి నుంచి అప్రూవల్, బ్యాంకు పేమెంట్లు, బిల్లులు, ఒప్పందాలు, రశీదులు, రిజిస్ట్రేషన్ అన్నింటి వరకు అలాగే ఉండేలా జాగ్రత్తపడండి. అలాగే రుణ సౌకర్యంతో కట్టించిన ఇంటి మీద ఆదాయం, వచ్చిన అద్దె సమానంగా అకౌంటు చేయండి. ఒకవేళ అద్దె ఇంట్లో ఉంటే ఎవరో ఒకరు, ఎక్కువ శ్లాబులో ఉన్నవారు, ఇంటద్దె అలవెన్స్ మినహాయింపు పొందండి. ఇద్దరూ విడివిడిగా ఒకే ఊరిలో ఉద్యోగం ఉంటే క్లెయిమ్ చేయకండి. వేరు వేరు ప్రాంతాల్లో ఉంటే ఎటువంటి తప్పు లేదు. ప్లానింగ్ వల్ల నాలుగు రూపాయలు మిగులుతాయి అని అనుకోకుండా మీకు మనశ్శాంతి ఉండేలా ఉండండి. -
ఫండ్స్ పెట్టుబడులకు హెడ్జింగ్ వ్యూహం?
ఫండ్స్‌లో పెట్టుబడులు ఉన్నాయి. హెడ్జింగ్ చేసుకోవడం ఎలా? – శ్యామ్ ప్రసాద్ఈక్విటీ మార్కెట్ నష్టపోయే క్రమంలో సెన్సెక్స్, నిఫ్టీ, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ ఇలా అన్ని సూచీలు పడిపోతుంటాయి. మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో హెడ్జింగ్ ఆప్షన్ అంతర్గతంగా ఉండదు. కనుక పెట్టుబడులను వివిధ సాధనాల మధ్య వైవిధ్యం చేసుకోవడమే ఇన్వెస్టర్ల ముందున్న మార్గం. వివిధ సాధనాల మధ్య పెట్టుబడుల కేటాయింపుల (అసెట్ అలోకేషన్) ప్రణాళిక కలిగి ఉండడం ఈ దిశగా మంచి వ్యూహం అవుతుంది.ఉదాహరణకు మీ మొత్తం పెట్టుబడుల్లో 50 శాతాన్ని ఈక్విటీలు లేదా ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. మరో 50 శాతాన్ని డెట్ సెక్యూరిటీలు లేదా డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఈక్విటీ మార్కెట్లు పెరగడం కారణంగా ఈక్విటీ పెట్టుబడుల విలువ 70 శాతానికి చేరినప్పుడు.. 20 శాతం మేర విక్రయించి ఆ మొత్తాన్ని డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. అప్పుడు ఈక్విటీ/డెట్ రేషియో 50:50గా ఉంటుంది. ఉదాహరణకు రూ. లక్ష పెట్టుబడిలో రూ.50 వేలను ఈక్విటీల్లో, రూ.50 వేలను డెట్‌లో ఇన్వెస్ట్ చేశారని అనుకుందాం. కొంత కాలానికి ఈక్విటీ పెట్టుబడుల విలువ రూ.70 వేలకు చేరి, డెట్ పెట్టుబడుల విలువ రూ.55 వేలకు వృద్ధి చెందిందని అనుకుందాం. అప్పుడు ఈక్విటీల నుంచి రూ.7,500 పెట్టుబడిని వెనక్కి తీసుకుని డెట్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. అప్పుడు రెండు సాధనాల్లో పెట్టుబడులు సమానంగా ఉంటాయి.ఒకవేళ ఈక్విటీ మార్కెట్ల పతనంతో ఈక్విటీ పెట్టుబడుల విలువ రూ.50 వేల నుంచి రూ.40 వేలకు తగ్గి, డెట్ పెట్టుబడులు రూ.55వేలుగా ఉన్నాయనుకుంటే.. అప్పుడు డెట్ పెట్టుబడుల నుంచి రూ.7,500ను వెనక్కి తీసుకుని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇలా ఒక సాధనంలో పెట్టుబడుల విలువ మరో సాధనంలోని పెట్టుబడుల విలువ కంటే 10–15 శాతం అధికంగా ఉన్నప్పుడు మార్పులు చేర్పులు చేసుకోవాలి. అసెట్ అలోకేషన్ ఆటోమేట్ చేసుకోవడం, రీబ్యాలన్స్ వ్యూహాన్ని సరిగ్గా అమలు చేయడం ద్వారా మార్కెట్ల పతనంపై ఆందోళన చెందకుండా రాబడులను పెంచుకోవచ్చు.రూ.50 లక్షలను 15 ఏళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఈ మొత్తాన్ని 12 నెలల సమాన వాయిదాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా..? – శ్రీ కైవల్యకొంత రక్షణాత్మక ధోరణిలో అయితే మూడేళ్ల పాటు నెలసరి సమాన వాయిదాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కొంత రిస్క్ తీసుకునే ధోరణితో ఉంటే 18 - 24 నెలల సమాన వాయిదాల్లో ఈ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మార్కెట్లో దిద్దుబాట్లు పెట్టుబడుల అవకాశాలకు అనుకూలం.ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ మొత్తం విలువ తగ్గిపోతే విచారించాల్సి వస్తుంది. అందుకని ఒకే విడత కాకుండా క్రమంగా నెలకు కొంత చొప్పున కొంత కాలం పాటు ఇన్వెస్ట్ చేసుకోవడం సూచనీయం. వైవిధ్యమైన నేపథ్యంతో ఉండే ఫ్లెక్సీ క్యాప్ పథకాలను ఎంపిక చేసుకోవచ్చు. ఇవి వృద్ధి, రిస్‌్కను సమతుల్యం చేస్తుంటాయి. దీర్ఘకాల లక్ష్యాలకు ఇవి అనుకూలం. మీ వద్దనున్న మొత్తాన్ని లిక్వి డ్ లేదా అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్‌లో ముందు ఇన్వెస్ట్ చేసుకోవాలి. వాటి నుంచి ప్రతి నెలా నిరీ్ణత మొత్తాన్ని సిస్టమ్యాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ ద్వారా ఎంపిక చేసుకున్న ఈక్విటీ పథకాల్లోకి మళ్లించుకోవాలి.ధీరేంద్ర కుమార్ - సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
నెలకు ₹10 వేలు.. రూ.7 కోట్ల ఆదాయం - ఎలాగంటే?
డబ్బు ఆదా చేయాలనుకుంటే.. అనేక మార్గాలు కనిపిస్తాయి. కొందరు ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తే, మరికొందరు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. ఇంకొందరు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టి లాభాలను ఆర్జిస్తారు. ఈ కథనంలో నెలకు 10,000 రూపాయలు పెట్టుబడి పెడుతూ రూ. 7కోట్లు సంపాదించడం ఎలా? అనే విషయాన్ని గురించి వివరంగా తెలుసుకుందాం.ఒక వ్యక్తి సిప్‌లో నెలకు రూ.10వేలు ఇన్వెస్ట్ చేస్తే.. సంవత్సరానికి అతని పెట్టుబడి రూ.1.2 లక్షలు అవుతుంది. ఇలా 30 ఏళ్ళు ఇన్వెస్ట్ చేస్తే మొత్తం రూ.36 లక్షలు అవుతాయి. మార్కెట్ ఆధారంగా 15 శాతం వార్షిక రాబడి వస్తే.. పెట్టుబడులు భారీగా పెరుగుతాయి. దీంతో ఆ వ్యక్తి ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి అదనంగా రూ. 66 లక్షల కంటే ఎక్కువ డబ్బు వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్, అదనంగా వచ్చిన మొత్తం డబ్బు కలిపితే రూ.7 కోట్ల కంటే ఎక్కువ డబ్బు వస్తుంది.ఇన్వెస్ట్ చేయాలనుకునే వ్యక్తి ముందుగానే పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాలి. ఉదాహరణకు 20 ఏళ్ల వయసులో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తే.. 50 ఏళ్ల నాటికి రూ.7 కోట్లు పొందవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే దీర్ఘకాలిక పెట్టుబడులలో మాత్రమే భారీ లాభాలు వచ్చే అవకాశం ఉండ్తుంది.ఇదీ చదవండి: రోజుకు రూ.50 పెట్టుబడి: ఆదాయం రూ.కోటినోట్: పెట్టుబడి పెట్టేవారు, ముందుగా మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే పెట్టుబడి అనేది ఒకరు ఇచ్చే సలహా కాదు. అది పూర్తిగా మీ వ్యక్తిగతం. కాబట్టి మీ ఆర్థిక ప్రణాళిక కోసం తప్పకుండా నిపుణులను సంప్రదించండి. ఆ తరువాత ఎక్కడ పెట్టుబడి పెట్టాలో నిర్ణయించుకోండి. అంతే కాకుండా మ్యూచువల్ ఫండ్స్‌లో ఖచ్చితంగా ఇంత డబ్బు వస్తుందని చెప్పలేము. ఎందుకంటే వచ్చే డబ్బు రాబడుల మీద ఆధారపడి ఉంటుంది. -
రూ.399 కడితే.. ₹10 లక్షల బీమా: ఇదిగో ఫుల్ డీటెయిల్స్
జీవితంలో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో.. ఎవ్వరూ ఊహించలేరు. కానీ ఊహకందని ప్రమాదం జరిగినప్పుడు ఆర్థికంగా కొంత నిలదొక్కుకోవడానికి ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యం. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు కార్పొరేట్ సంస్థలు, ఐపీపీబీ (ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్).. 'గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్' ప్లాన్స్ ప్రవేశపెట్టింది. వీటికి సంబందించిన పూర్తి వివరాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ఐపీపీబీ రూ.399 ప్లాన్ఈ ప్లాన్ కింది మీరు ఏడాదికి రూ.399 చెల్లిస్తే.. ప్రమాదవశాత్తు మరణించినా లేదా వైకల్యం ఏర్పడినా, ప్రమాదంలో కాళ్ళు, చేతులు పనిచేయకుండా పోయినా.. రూ.10 లక్షల భీమా సౌకర్యం పొందవచ్చు.ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి ప్రమాదం వల్ల హాస్పిటల్లో చేరితే యాక్సిడెంటల్ మెడికల్ ఖర్చులు కోసం రూ.60,000 లేదా ప్రమాదవశాత్తు వైద్య ఖర్చుల కోసం రూ.30,000 అందిస్తారు. అంతే కాకుండా హాస్పిటల్లో 10 రోజులు ఉంటే రోజుకు రూ.1000 చొప్పున చెల్లిస్తారు. ఈ పాలసీ తీసుకున్న వ్యక్తికి కుటుంబ ప్రయోజనం కింద రవాణా ఖర్చుల కోసం రూ.25,000 లభిస్తుంది. ఒకవేళ పాలసీదారు మరణిస్తే అంత్యక్రియల కోసం మరో రూ.5,000 అందుతాయి. ఈ ప్లాన్ కింద ఎడ్యుకేషన్‌కు సంబంధించిన ప్రయోజనాలు లభిస్తాయి.ఐపీపీబీ రూ.299 ప్లాన్ఈ ప్లాన్ ఎంచుకునే పాలసీదారు సంవత్సరానికి రూ.299 చెల్లించి.. 10 లక్షల రూపాయల ప్రమాద భీమా పొందవచ్చు. ప్రమాదవశాత్తు మరణించినా లేదా వైకల్యం ఏర్పడినా, ప్రమాదంలో కాళ్ళు, చేతులు పనిచేయకుండా పోయినా.. రూ.10 లక్షల భీమా లభిస్తుంది.ఈ ప్లాన్ ఎంచుకునే పాలసీదారుకు రూ.399 ప్లాన్‌లో లభించే దాదాపు అన్ని ప్రయోజనాలు లభిస్తాయి. కానీ ఎడ్యుకేషన్ బెనిఫీట్స్.. హాస్పిటల్లో 10 రోజులు ఉంటే రోజుకు రూ.1,000 చొప్పున లభించే ప్రయోజనాలు అందవు.ఇదీ చదవండి: బ్యాంకులకు ఆరు రోజులు వరుస సెలవులుదీనికి అర్హులు ఎవరంటే..18 నుంచి 65 సంవత్సరాల వయసున్న ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు.గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ దేనిని కవర్ చేయదంటే..ఆత్మహత్య చేసుకున్నా, మిలటరీ సర్విసెస్‌లో ఉంటూ మరణించినా, యుద్ధంలో ప్రాణాలు కోల్పోయినా, చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడి కన్నుమూసినా, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, ఎయిడ్స్ వంటి వాటివల్ల చనిపోయినా.. ప్రమాదకరమైన క్రీడల్లో మృత్యువాత పడినా ఈ ఇన్సూరెన్స్ లభించదు. -
పెద్ద మొత్తంలో డబ్బు విత్‌డ్రా చేయాలంటే..?
బ్యాంకు సేవింగ్స్ ఖాతాలో డబ్బు విత్‌డ్రా చేయాలంటే ఏం చేస్తారు.. ‘సింపుల్..ఏటీఎం ద్వారా కావాల్సిన నగదును డ్రా చేస్తాం’ అంటారు కదూ. ఒకవేళ మీ ఖాతాలో రూ.5 లక్షలు ఉన్నాయనుకోండి దాన్ని విత్‌డ్రా చేయాలన్నా ఏటీఎం ద్వారానే చేస్తారా..? ఏటీఎం, చెక్‌బుక్, డీడీ ఇలా ప్రతిదానికి సంబంధించి ప్రభుత్వం కొన్ని పరిమితులు విధించింది. ఒకవేళ పెద్దమొత్తంలో డబ్బు విత్‌డ్రా చేయాలంటే ఎన్ని విధానాలు ఉన్నాయో తెలుసుకుందాం.ఏటీఎం విత్డ్రాఏటీఎం ద్వారా నగదు విత్‌డ్రా చేయాలంటే మీ కార్డును అనుసరించి రోజుకు రూ.40,000 నుంచి గరిష్ఠంగా రూ.ఒక లక్ష వరకు మాత్రమే సాధ్యం అవుతుంది. కొన్ని ప్రముఖ బ్యాంకుల కార్డులకు సంబంధించి విత్‌డ్రా పరిమితులు కింది విధంగా ఉన్నాయి.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాక్లాసిక్, మాస్ట్రో డెబిట్ కార్డులు: రోజుకు రూ.40,000.గ్లోబల్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు: రోజుకు రూ.40,000.ప్లాటినం ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు: రోజుకు రూ.1,00,000.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ఇంటర్నేషనల్, ఉమెన్స్ అడ్వాంటేజ్, ఎన్ఆర్వో డెబిట్ కార్డులు: రోజుకు రూ.25,000టైటానియం రాయల్ డెబిట్ కార్డు: రోజుకు రూ.75,000ప్లాటినం, ఇంపీరియా ప్లాటినం చిప్ డెబిట్ కార్డులు: రోజుకు రూ.1,00,000.ఐసీఐసీఐ బ్యాంక్క్లాసిక్ డెబిట్ కార్డు: రోజుకు రూ.40,000గోల్డ్ డెబిట్ కార్డు: రోజుకు రూ.50,000ప్లాటినం డెబిట్ కార్డు: రోజుకు రూ.1,00,000యాక్సిస్ బ్యాంక్క్లాసిక్ డెబిట్ కార్డు: రోజుకు రూ.40,000ప్లాటినం డెబిట్ కార్డు: రోజుకు రూ.1,00,000ఇదీ చదవండి: ‘బంగారం’లాంటి అవకాశం.. తులం ఎంతంటే..చెక్బుక్చెక్ లేదా పాస్‌బుక్ ద్వారా గరిష్ఠంగా రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్య నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇందుకోసం బ్యాంకుకు ముందుగా సమాచారం అందించాలి. ఆ సమయంలో ఆధార్, పాన్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్, చెక్‌బుక్ లేదా పాస్‌బుక్ వంటి డాక్యుమెంటేషన్ అవసరం కావచ్చు. రూ.2 లక్షలకు మించి నగదు విత్‌డ్రా చేస్తే పాన్ కార్డ్ కాపీ తప్పనిసరి.డిమాండ్ డ్రాఫ్ట్పెద్ద మొత్తంలో విత్‌డ్రా చేయాలంటే డిమాండ్ డ్రాఫ్ట్‌లు ఉపయోగించవచ్చు. ఇలా చేసే లావేదేవీలను బ్యాంకులు ట్రాక్ చేసేందుకు కొన్ని నియామాలు పాటించాయి. -
మనం లేకపోయినా మన వాళ్లతో ఉన్నట్లే!
జీవితం క్షణ భంగురం. ఈ విషయం అందరికీ తెలుసు. అయినా పెద్దగా పట్టించుకోం. అప్పటిదాకా వస్తే చూసుకుందాంలే అనుకుంటాం. పరిస్థితులు సహకరించకో, ఉదాసీనతో, నిర్లక్ష్యమో..కారణం ఏదైనా కావొచ్చు. భవిష్యత్ ప్రణాలికల్ని చాలా తేలిగ్గా తీసుకుంటాం. ‘పోయినవాడు బాగానే పోయాడు.. మాకు ఏం మిగిల్చాడు గనుక..’ అని ఉన్నవాళ్లు తిట్టుకోకూడదంటే కొంచెం ముందుచూపుతో వ్యవహరిస్తే చాలు. కుటుంబ పెద్దని దురదృష్టం పలకరించినా..ఆ కుటుంబం మాత్రం సురక్షితంగా ఉండాలంటే ఒక టర్మ్ పాలసీని తీసుకోవాలి. ఈ పాలసీ చేసే మేలు అంతాఇంతా కాదు. అదెలాగో తెలుసుకుందాం.చిన్న వయసులోనే ఈ పాలసీ తీసుకుంటే తక్కువ ప్రీమియంతో అధిక ప్రయోజనాన్ని పొందవచ్చు. నెలవారీ లేదా ఏడాదికోసారి ప్రీమియం చెల్లించవచ్చు.టర్మ్ ఇన్సూరెన్సు పరమార్థం ఏమిటంటే సాధారణంగా ఏ వ్యక్తి అయితే ప్రీమియం కడతాడో ఆ వ్యక్తి మరణానంతరం ఆర్థిక భరోసానిస్తుంది. ఒకేసారి బీమా మొత్తాన్ని సదరు కుటుంబం అందుకోవచ్చు లేదంటే..దఫాలవారీగా కూడా తీసుకోవచ్చు.సాధారణంగా 18 ఏళ్లు నిండిన వ్యక్తులు ఈ పాలసీ తీసుకోవడానికి అర్హులు. అప్పటి నుంచి మొదలుకొని 99 ఏళ్ల వరకు పాలసీలను తీసుకునే అవకాశం ఉంటుంది.ఒకేసారి బీమా మొత్తంపాలసీ చేసిన వ్యక్తి మరణానంతరం వారి నామినీ/ ప్రయోజనదారుకు ఒకేసారి బీమా మొత్తం (సమ్అష్యుర్డ్) చెల్లిస్తారు. ఇందుకు ఏడాదికోసారి ప్రీమియం చెల్లించే ఆప్షన్ ఎంచుకోవాలి.ఉదా: x అనే వ్యక్తి రూ.ఒక కోటి టర్మ్ పాలసీ తీసుకున్నాడు అనుకుందాం. నెలకు రూ.10,000 దాకా ప్రీమియం చెల్లిస్తున్నాడు. పాలసీ కాలవ్యవధి 35 ఏళ్లుగా భావిద్దాం. ఈ వ్యవధిలోనే పాలసీ తీసుకున్న వ్యక్తి దురదృష్టవశాత్తు కన్నుమూస్తే అతని కుటుంబం ఒకేసారి రూ.కోటి పొందగలుగుతుంది.దఫాల వారీగా కావాలంటే...ఆర్థిక పరమైన అంశాలపై పూర్తి అవగాహన ఉండే కుటుంబాలు తక్కువే. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విషయానికొస్తే ఇది మరింత తక్కువ ఉంటుంది. కోటి రూపాయలకు ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి చనిపోయినప్పుడు ఒకేసారి ఆ మొత్తం అందుకునే కుటుంబాలు అంత పెద్ద మొత్తాన్ని ఏం చేయాలో సరైన అవగాహన ఉండదు. ఒక్కోసారి ఆ సొమ్ము పక్కదారి పట్టే ప్రమాదం కూడా ఉంటుంది. లేదా విచ్చలవిడిగా ఆ సొమ్ముని ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఇలాంటి టర్మ్ పాలసీ తీసుకున్న ప్రయోజనం నెరవేరదు. అలా జరగకుండా ఉండాలంటే దఫాలవారీ చెల్లింపు పద్ధతిని ఆశ్రయించడం మేలు. ఈ పద్ధతిలో సదరు నామినీకి ఇన్సూరెన్సు కంపెనీ విడతల వారీగా సొమ్ము చెల్లిస్తుంది. అయితే పాలసీ తీసుకునే వ్యక్తికి తన కుటుంబం గురించి పూర్తి అవగాహన ఉంటుంది. తన భార్య, పిల్లలు, వారి చదువులు, పెద్దవాళ్ల అవసరాలు.. ఇలా ప్రతి అంశాన్నీ దృష్టిలో ఉంచుకుని ముందుగానే ఈ ఆప్షన్ ఎంచుకోవాలి. తన పిల్లలు పెద్ద చదువుల్లోకి వచ్చే సరికి ఇంతకావాలి.. తన పిల్లల పెళ్లిళ్ల ఖర్చుకు ఇంత అవసరమవుతుంది.. అనే అంశాలను పరిగణనలోకి తీసుకుని తదనుగుణంగా నామినీకి ఏయే సమయాల్లో ఎంతెంత చెల్లించాలో పేర్కొనవచ్చు.నెలవారీ చెల్లింపులుపాలసీదారు నెలవారీ చెల్లింపుల ఆప్షన్ ఎంచుకుంటే తదనుగుణంగానే నెలకింత చొప్పున నామినీకి బీమా కంపెనీ చెల్లిస్తుంది. ఒకేసారి రూ.ఒక కోటి మొత్తం వద్దనుకుంటే నెలకు కొంత వచ్చేటట్లు ఆప్షన్ ఎంచుకోవాలి. దాంతో సదరు బీమా కంపెనీ ఆ మొత్తాన్ని నెలకు రూ.50,000 చొప్పున 15 ఏళ్లపాటు చెల్లిస్తుంది.ఏడాదికోసారి చెల్లించేలా..నెలకోసారి కాకుండా ఏడాదికోసారి ప్రయోజనాన్ని పొందే అవకాశం కూడా ఉంది. దీని ప్రకారం ఏడాదికి రూ.6 లక్షలచొప్పున 15 ఏళ్లపాటు నామినీకి చెల్లిస్తారు.మరో పద్ధతిఈ పద్ధతి ప్రకారం నామినీకి సమ్ అష్యుర్డ్ (రూ.కోటి అనుకుందాం) మొత్తంలో 50-70% పాలసీదారు చనిపోయిన వెంటనే చెల్లిస్తారు. మిగతా మొత్తాన్ని కుటుంబ అవసరాలకు ఉపయోగపడే విధంగా నెలకింత చొప్పున చెల్లిస్తూ వస్తారు.అధిక ప్రయోజనం ఇచ్చే మరో విధానంఈ ఆప్షన్లో ముందుగా నామినీకి కొంత మొత్తం చెల్లిస్తారు. మిగిలిన మొత్తాన్ని 10-20 శాతం వార్షిక వృద్ధిని లెక్కగట్టి నెలవారీ చెల్లింపుల్లో అందిస్తారు. పెరిగే ఖర్చులను తట్టుకోవడానికి ఇది ఉపయుక్తంగా ఉంటుంది.ఇదీ చదవండి: బీమా పాలసీతో ఆరోగ్యం కొనుక్కోవచ్చు!టర్మ్ ఇన్సూరెన్సు అనేది ప్రతి కుటుంబానికి కచ్చితంగా అవసరమయ్యే ఒక సురక్ష సాధనమని చెప్పొచ్చు. కానీ దీన్ని చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. ఎప్పుడేం జరుగుతుందో తెలియని జీవితాలకు ఈ పాలసీ భరోసాను ఇస్తుందని మాత్రం ఎవరూ గ్రహించరు. మీ కుటుంబంలో ఆర్థిక పరమైన అవగాహన ఉండి, వచ్చే సొమ్ములు సరైన మార్గంలోనే సద్వినియోగం అవుతాయన్న నమ్మకం ఉన్నప్పుడు ఏకమొత్తం (లమ్సమ్) పొందే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. లేదంటే నెలవారీ, వార్షిక ప్రాతిపదికన చెల్లింపులను సెలక్ట్ చేసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికి తదనంతరం కుటుంబం ఆర్థిక సంక్షోభంతో ఇబ్బంది పడకూడదంటే మాత్రం కచ్చితంగా టర్మ్ పాలసీ వెంటనే తీసుకోవాలి.- బెహరా శ్రీనివాసరావు, పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు -
ఈ–వ్యాలెట్లలోకి పీఎఫ్ సొమ్ము?
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) సభ్యులు తమ పీఎఫ్ క్లెయిమ్‌లను త్వరలో ఏటీఎంల నుంచి ఉపసంహరించుకోవచ్చని కార్మిక శాఖ ఇటీవలే ప్రకటించగా.. ఈ–వ్యాలెట్ల నుంచి సైతం ఈ సదుపాయం కల్పించే దిశగా పనిచేస్తున్నట్టు తెలిపింది. కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ కార్యదర్శి సుమితా దావ్రా దీనిపై స్పందించారు.‘తమ సొమ్మును ఎంత సులభంగా ఉపసంహరించుకోవచ్చన్న దానిపై సభ్యుల్లో ఆసక్తి నెలకొంది. ఆటో సెటిల్మెంట్లో క్లెయిమ్ మొత్తం సభ్యుల బ్యాంక్ ఖాతాల్లోకి వెళుతుంది. దాంతో బ్యాంక్ ఏటీఎం నుంచి ఉపసహరించుకోవచ్చు. క్లెయిమ్ మొత్తం వ్యాలెట్లోకి నేరుగా ఎలా పంపాలన్న విషయమై కొన్ని మార్గదర్శకాలను రూపొందించాల్సి ఉంది. దీనిపై బ్యాంకర్లతో చర్చలు మొదలు పెట్టాం. దీని అమలు విషయమై ప్రణాళిక అవసరం’ అని పర్యాటక సదస్సుకు హాజరైన సందర్భంగా మీడియాకు సుమితా దావ్రా వివరించారు. ఆర్బీఐని సంప్రదించి త్వరలోనే తగిన ప్రణాళిక సిద్ధం చేస్తామని చెప్పారు.ఇదీ చదవండి: బీమా పాలసీతో ఆరోగ్యం కొనుక్కోవచ్చు!ఈపీఎఫ్‌వో సభ్యులు అతి త్వరలోనే తమ భవిష్యనిధి (పీఎఫ్) క్లెయిమ్‌ల మొత్తాన్ని ఏటీఎం నుంచి ఉపసంహరించుకునే అవకాశం అందుబాటులోకి రానున్నట్లు ఇప్పటికే ఆ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం ఈపీఎఫ్‌వో సభ్యుల ఆన్లైన్ క్లెయిమ్ ఆమోదానికి 7–10 రోజుల సమయం తీసుకుంటోంది. క్లెయిమ్ పరిష్కారం తర్వాత ఆ మొత్తాన్ని సభ్యుల బ్యాంక్ ఖాతాకు బదిలీ చేస్తున్నారు. ప్రతిపాదిత కొత్త విధానంలో సభ్యులకు ప్రత్యేకమైన కార్డులు అందించనున్నారు. వీటి ద్వారా ఏటీఎం నుంచి క్లెయిమ్ మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చని ఇటీవల ఓ సీనియర్ అధికారి తెలిపారు. -
బీమా పాలసీతో ఆరోగ్యం కొనుక్కోవచ్చు!
ఆరోగ్యం, సంపద... ఏ మనిషి జీవితంలోనైనా ప్రధాన పాత్ర పోషించే అంశాలివి. ఎంత సంపద ఉన్నా ఆరోగ్యం సరిగా లేకపోతే... ఏమీ ప్రయోజనం ఉండదు. అదే... సంపద లేకపోయినా ఆరోగ్యం బాగుంటే చాలు... ఎలాగైనా సంపాదించుకోవచ్చు. కాబట్టి ఆరోగ్యం అత్యంత ప్రధానం అన్న విషయం దీన్నిబట్టి మనకు స్పష్టంగా తెలుస్తోంది.ఇవాళ్టి రోజుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంత తేలిక్కాదు. కోవిడ్ మన జీవితాల్ని ఎంత ప్రభావితం చేసిందో ఎరుకే.. అదీగాక... మారిన కాలమాన పరిస్థితుల్లో... ఎప్పుడు ఎలాంటి రోగాలు పుట్టుకొస్తాయి ఎవ్వరం చెప్పలేం. అప్పటిదాకా ఎంతో హాయిగా.. ఎలాంటి చీకూ చింతా లేకుండా సాగిపోతున్న జీవితాల్లో ఒక్క అనారోగ్యం వాళ్ళ ఆర్ధిక పరిస్థితుల్ని తల్లకిందులు చేసేస్తోంది. అప్పటికప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వస్తే... లక్షలు సిద్ధం చేసుకోవాల్సిందే.. చూస్తూ చూస్తూ ప్రాణాలతో చెలగాటం ఆడలేం కదా... అంచేత అప్పో సొప్పో చేసి అయినా వైద్యం చేయిస్తాం.పల్లెలు పట్టణాలుగా, పట్నాలు నగరాలుగా మారిపోతూ ట్రాఫిక్ విచ్చలవిడిగా పెరిగిపోయి.. ఎప్పుడు ఏ ఆక్సిడెంట్ అవుతుందో... బయటకు వెళ్లిన మనిషి సురక్షితంగా వస్తాడో రాడో అంతుచిక్కని రోజులివి. ఇలా ఆకస్మికంగా తలెత్తే అనివార్య ఖర్చుల్ని తలెత్తుకోవడం అందరికీ సాధ్యం కాదు. ఇలాంటప్పుడే... మన చేతిలో ఆరోగ్య బీమా కార్డు ఉంటే... కొండంత ధైర్యాన్ని చేతిలో పెట్టుకున్నట్లే. పైగా నేటి రోజుల్లో కుటుంబానికంతటికీ జీవిత బీమా తో పాటు, ఆరోగ్య బీమా ఉండటం అత్యవసరంగా మారిపోయింది. ఈనేపథ్యంలో ఆరోగ్య బీమా స్థితిగతులను ఓసారి పరిశీలిద్దాం.మనదేశంలో ఆరోగ్య బీమాను అందించే ప్రముఖ కంపెనీలు ఇవి.స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్కేర్ హెల్త్ ఇన్సూరెన్స్హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ తదవనివా భూపా హెల్త్ ఇన్సూరెన్స్ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్మణిపాల్ సిగ్న హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీఅకో జనరల్ ఇన్సూరెన్స్టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్వైద్యం ఖరీదైన అంశంగా మారిపోయిన ఈరోజుల్లో మీరు తీసుకునే ఆరోగ్య బీమా పాలసీ మిమ్మల్ని వైద్య ఖర్చులనుంచి గట్టెక్కిస్తుంది.కనీసం రూ. 2 లక్షల నుంచి రూ. 2 కోట్ల వరకు పాలసీ తీసుకోవచ్చు.వయోపరిమితిని బట్టి ప్రీమియం రేట్లు ఉంటాయి. చిన్న వయసులో తక్కువ ప్రీమియం కే పెద్ద పాలసీ తీసుకోవచ్చు.ఏదైనా ఒక రోగంతో హాస్పిటల్ పాలైనప్పుడు ఆ వైద్యానికయ్యే ఖర్చుల్ని మనం ఎలాంటి నగదు చెల్లించనక్కర్లేకుండా పొందవచ్చు. మనం పాలసీ తీసుకునే ముందు కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి.వీటిలో అత్యంత ప్రధానమైంది మనం బీమా తీసుకునే సంస్థ ఏయే హాస్పిటల్స్ తో అనుసంధానం అయివుందో తెలుసుకోవడం.అంటే దేశవ్యాప్తంగా ప్రముఖ హాస్పిటల్స్ తో పాటు, స్థానిక హాస్పిటల్స్ లో కూడా వైద్యం చేయించుకోవడానికి వీలుగా కవరేజ్ కలిగి ఉండాలి.ఒక రోగానికి సంబంధించి హాస్పిటల్ లో జాయిన్ కావడానికి ముందు 30 రోజులు, డిశ్చార్జ్ అయ్యాక 30 రోజుల పాటు వైద్య ఖర్చులు పొందే సౌలభ్యాన్ని వివిధ బీమా సంస్థలు కల్పిస్తున్నాయి. పాలసీ తీసుకునే ముందు వాటి వివరాలు తెలుసుకోవాలి.మనం తీసుకునే పాలసీ కి చెల్లించే ప్రీమియానికి కొంచెం అదనంగా చెల్లించడం ద్వారా పర్సనల్ ఆక్సిడెంట్ కవర్, క్రిటికల్ ఇల్నెస్ కవర్ వంటి వాటిని కూడా ఎంచుకోవాలి.యాక్సిడెంట్ అయ్యి... ప్రాణాపాయం తప్పి శాశ్వత అంగ వైకల్యానికి లోనైతే... అడిషనల్ రైడర్స్ తీసుకోవడం వల్ల పెన్షన్ మాదిరి నెలనెలా (మన సమ్ అష్యురెడ్ ని బట్టి) సొమ్ములు పొందవచ్చు. సాధారణంగా వృద్ధాప్యానికి మరోపేరే అనారోగ్యం. కాబట్టి కచ్చితంగా ఆరోగ్య బీమా ఉండి తీరాల్సిందే. ఇప్పుడు వయోపరిమితితో సంబంధం లేకుండా.. ఎంత వయసువారైనా బీమా పాలసీ లు తీసుకోవడానికి ఐఆర్డీఏ వెసులుబాటు కల్పించింది. ఇది సీనియర్ సిటిజెన్లకు వరమనే చెప్పాలి. అలాగే ఒకే ప్రీమియం తో మొత్తం కుటుంబానికి ఆరోగ్య బీమా రక్షణ కల్పించే విధంగా పాలసీలు అందుబాటులో ఉన్నాయి.పాలసీ తీసుకునే టైం కే రోగాలు ఉన్నా కూడా వాటిని కవర్ చేస్తూ బీమా సదుపాయాన్ని పొందే అవకాశం కూడా ఉంది. అయితే వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. పాలసీ తీసుకునే సమయంలో ఏయే బీమా సంస్థలు ఎంతెంత వెయిటింగ్ పీరియడ్ ను పేర్కొంటున్నాయో తెలుసుకోవాలి.ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 డ్ కింద మనం కట్టే ప్రీమియానికి (షరతులకు లోబడి) రూ. 25,000 నుంచి రూ.75,000 వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.సాధారణంగా 24 గంటలు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటేనే పాలసీ వర్తిస్తుంది. ఇప్పుడు కొన్ని సంస్థలు అవుట్ పేషెంట్ గా చేయించుకునే వైద్యానికయ్యే ఖర్చులను కూడా బీమా కవరేజ్ లోకి తీసుకుంటున్నాయి. అంతేకాదు... ప్రత్యేకించి ఓపీ చికిత్సల కోసమే ఉపయోగపడే విధంగా పాలసీలు అందుబాటులోకి వచ్చాయి.ఎలాంటి ఆరోగ్య సేవలు పొందవచ్చు, ప్రీమియంలు ఎలా ఉంటాయి ఇత్యాది అంశాలను మరోసారి చర్చించుకుందాం.-బెహరా శ్రీనివాస రావు, పర్సనల్ ఫైనాన్స్ విశ్లేషకులు -
Income Tax: పాత విధానమా.. కొత్త విధానమా..?
ఆర్థిక సంవత్సరం 2020–21 నుంచి కొత్త విధానం అమల్లోకి వచ్చింది. మీకు ఇష్టమైతే ఈ విధానాన్ని ఎంచుకోవచ్చు. గడువు తేదీలోపల ఎంపిక చేసుకోవచ్చు. ఆ తర్వాత అయితే, కొత్త విధానమే పాటించాలి. పాత విధానంలో మినహాయింపులు ఉన్నాయి. రేట్లు 10 శాతం, 20 శాతం, 30 శాతం.. ఇలా ఉన్నాయి. కొత్త విధానంలో మినహాయింపులు ఉండవు. రేట్లు 5,10, 15, 20, 30 శాతంగా ఉన్నాయి. పైన చెప్పినవన్నీ వ్యక్తులకు, హిందూ ఉమ్మడి కుటుంబాలకు వర్తిస్తాయి. ఏ ప్రాతిపదికన ఎంచుకోవాలి? » మీ ఆదాయ స్వభావం » మీ ఆదాయం » సేవింగ్స్ » పెట్టుబడులు » సొంతిల్లు రుణం – రుణం మీద వడ్డీ » మెడికల్ ఖర్చులు, కొన్ని జబ్బుల మీద ఖర్చులు » జీతం మీద ఆదాయం ఒక్కటే ఉంటే ఒకలాగా ఆలోచించాలి » జీతంతో పాటు ఇతర ఆదాయాలు ఉంటే మరొకలాగా ఆలోచించాలి » వ్యాపారస్తులు, వృత్తి నిపుణులు .. వారి ఇన్వెస్ట్మెంట్ విధానం » ఉద్యోగస్తులు వారికి ఇష్టమైన విధానాన్ని ఎంచుకోవచ్చు. ప్రతి సంవత్సరం మార్చుకోవచ్చు. » వ్యాపారస్తులకు అలా మార్చుకునే వెసులుబాటు లేదు » ఒకరితో ఒకరు పోల్చుకోకండి. మీ విధానం మీదే. మీ ఆదాయం మీదే. మీ పన్నుభారం మీదే.ఎటువంటి సేవింగ్స్ లేకపోతే కొత్త పద్ధతిలో రూ. 29,900 పన్ను భారం తగ్గుతుంది. సుమారు రూ. 30,000 మిగులు. అయితే, మీ చేతిలో ఎంతో నిలవ ఉంటుంది. దీన్ని మీరు దేనికైనా ఖర్చు పెట్టుకోవచ్చు. మీరిచ్చే ప్రాధాన్యత, మీ అవసరం మొదలైన వాటి ప్రకారం మీ ఇష్టం.మరో కేసులో కేవలం జీతం రూ. 7,00,000 కాగా సేవింగ్స్ లేవు అనుకుందాం. అప్పుడు..కొత్త పద్ధతిలో ట్యాక్స్ పడదు. పాత పద్ధతిలో పడుతుంది. పాత పద్ధతిలో పన్ను పడకూడదంటే, ఆ మేరకు సేవింగ్స్ చేయాలి. సేవింగ్స్ అంటే మీ ఫండ్స్ బ్లాక్ అవుతాయి. ఆటోమేటిక్‌గా అందరూ కొత్త దాని వైపే మొగ్గు చూపుతారు. అయితే ఉద్యోగంలో కంపల్సరీగా పీఎఫ్ మొదలైన సేవింగ్స్ ఉంటాయి. ముందు జాగ్రత్తగా మనం సేవ్ చేస్తుంటాం. మన అవసరాలను, కలలను, ఆలోచనలను దృష్టిలో పెట్టుకోవాలి. ఒకే కుటుంబంలో ఇద్దరు ఉద్యోగస్తులంటే, ఒకరు సేవ్ చేసి మరొకరు మానేసి.. ఇద్దరూ కొంత చేసి.. ఇలా ఎన్నో ఆలోచనలే మీ ట్యాక్స్ ప్లానింగ్‌కి దారి తీస్తాయి.పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్ పంపించగలరు. -
ఈపీఎఫ్ క్లయిమ్ సెటిల్మెంట్లో మారిన నిబంధనలు.. అవేంటో మీకు తెలుసా?
ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)ఖాతాదారులకు శుభవార్త. ఖాతాదారులు ఈపీఎఫ్ క్లయిమ్ సెటిల్ చేసుకునే మొత్తం నగదుపుపై వడ్డీ, ఈపీఎఫ్ క్లయిమ్ సెటిల్ చేసుకునే సమయంపై ఈపీఎఫ్ఓ కీలక ప్రకటన చేసింది.కేంద్ర కార్మిక , ఉపాధి మంత్రిత్వ శాఖ నేతృత్వంలో ఈపీఎఫ్ఓ కార్యకలాపాలు నిర్వహించే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ (సీబీటీ) పాలక మండలి సమావేశం ఈ ఏడాది నవంబర్ 30న సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈపీఎఫ్ఓ సభ్యులకు లబ్ధి చేకూరేలా కొత్త నిబంధనను అమల్లోకి తేనున్నట్లు వెల్లడించింది.ఈ కొత్త నిబంధనతో ఈపీఎఫ్ఓ అధిక మొత్తంలో వడ్డీతో పాటు క్లయిమ్ సెటిల్మెంట్ వేగవంతం చేసుకోవచ్చని సూచించింది.ఈపీఎఫ్ఓలో కొత్త నిబంధనలు ఈపీఎఫ్‌వో ప్రకటన ప్రకారం.. సీబీటీ ఈపీఎఫ్ స్కీమ్ 1952లోని పేరా 60(2)(బి)లోని నిబంధనలను సవరణకు ఆమోదించింది. దీంతో ఈపీఎఫ్‌వో ఖాతాదారులు తమ పీఎఫ్ క్లయిమ్ సెటిల్ అయ్యిందో ఆ తేదీ వరకు వడ్డీని పొందవచ్చు.ఉదాహరణకు..ఓ సంస్థలో పనిచేస్తున్న సురేష్ అనే వ్యక్తి ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన రెండు నెలల తర్వాత, అంటే డిసెంబర్ నెలలో తన పీఎఫ్ క్లయిమ్ సెటిల్ చేసుకున్నారు. పీఎఫ్ క్లయిమ్ సెటిల్ చేసిన మొత్తం డిసెంబర్ 20న అకౌంట్లో జమ అయ్యిందని మెసేజ్ వచ్చింది. అయితే, ఆ క్లయిమ్ సెటిల్ చేసిన మొత్తంపై ఈపీఎఫ్ అందించే 8.25 శాతం వడ్డీ పొందడం సాధ్యం కాదు. నవంబర్ నెల వరకు మాత్రమే సెటిల్మెంట్పై వడ్డీ వర్తిస్తుందని, డిసెంబర్ 1 నుండి 20 వరకు ఈపీఎఫ్ సెటిల్పై వడ్డీ కోల్పోయే పరిస్థితి ఉంది.కానీ ఇప్పుడు ఈపీఎఫ్‌వో తాజా మార్పుల ద్వారా, ఆ 20 రోజుల వడ్డీ కూడా సురేష్ అందుకోగలుగుతారు. దీని ద్వారా సురేష్ వంటి ఈపీఎఫ్ ఖాతాదారులకు ఊరట లభించిందిదీంతో పాటు ఓ ఉద్యోగి తన సంస్థకు రాజీనామా చేసిన రెండు నెలల తర్వాత మూడో నెలలో 24వ తేదీకి లోపు ఈపీఎఫ్‌వో క్లయిమ్ సెటిల్మెంట్ చేసుకోవాలి. ఆ తర్వాత క్లయిమ్ ప్రాసెస్ జరగదు. 25వ తేదీ నుంచి నెల చివరి వరకు వడ్డీ నష్టపోవడం, అలాగే క్లయిమ్ సెటిల్ చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టేది. అయితే, ఇప్పుడు 25వ తేదీ తర్వాత కూడా క్లయిమ్ సెటిల్ ప్రాసెస్ జరిగేలా ఈపీఎఫ్‌వో నిర్ణయం తీసుకుంది. -
PAN 2.0: కొత్త పాన్ కార్డ్ ఎంత వరకూ సేఫ్?
ఆదాయపు పన్ను శాఖ పాన్ కార్డ్ అప్‌గ్రేడ్ వెర్షన్ 'పాన్ 2.0'ను ప్రారంభించింది. ఇందులో ప్రధానంగా మూడు విషయాల్లో జాగ్రత్తలు తీసుకున్నారు. మొదటిది యాక్సెసిబిలిటీ.. మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. రెండవది డేటా స్టోరేజ్.. ఇదీ సురక్షితం. ఇక మూడవది సులభతరమైన అప్లికేషన్ వెరిఫికేషన్ ప్రక్రియ. కొత్త పాన్ కార్డ్‌లో క్యూఆర్ కోడ్ సదుపాయం ఉంటుంది కాబట్టి డిజిటల్ వర్క్‌లో దాని ఉపయోగం మునుపటి కంటే సులభతరం అవుతుంది.ఎలా సురక్షితం?'పాన్ 2.0'లో ఈ-పాన్ కార్డ్ ఎటువంటి ఛార్జీ లేకుండా దరఖాస్తుదారు ఈ-మెయిల్‌కు వెంటనే డెలివరీ అవుతుంది. నామమాత్రపు రుసుముతో భౌతిక కార్డ్ కూడా పొందవచ్చు. కొత్త టెక్నికల్ సదుపాయాలు చేరిన తర్వాత కూడా పెరుగుతున్న సైబర్ మోసాల నుంచి కొత్త పాన్ కార్డు రక్షణ పొందుతుందా లేదా అనే ప్రశ్న సహజమే. సైబర్ నేరగాళ్ల వల్ల కలిగే ఆర్థిక నష్టాల నుండి ప్రజలను రక్షించడంలో కొత్త కార్డ్ ఎంతవరకు సమర్థంగా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం..తాజా సమాచారంకొత్త పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు మీ కార్డ్ ఆదాయపు పన్ను శాఖ తాజా ఫార్మాట్‌కి అప్‌గ్రేడ్ అవుతుంది. దానితో మీరు మీ కొత్త డేటాను అప్డేట్ చేయవచ్చు.దుర్వినియోగానికి కళ్లెంకొత్త పాన్ కార్డ్‌లోని క్యూఆర్ కోడ్ కారణంగా, సైబర్ దుండగులు దానిని సులభంగా నకిలీ చేయలేరు. తద్వారా సైబర్ మోసాలను కట్టడి చేయడాన్ని ఇది సులభతరం చేస్తుంది.మరింత సురక్షితంకొత్త పాన్ కార్డ్ క్యూఆర్ కోడ్‌లోని వ్యక్తిగత డేటా ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో ఉంటుంది. దీన్ని ప్రత్యేకంగా అధీకృత సాఫ్ట్వేర్ ద్వారా మాత్రమే రీడ్ చేసేందుకు వీలవుతుంది. దీంతో వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అయ్యే సంఘటనలను ఇది తగ్గిస్తుంది. అంతే కాకుండా పాన్ ధ్రువీకరించడంలో ఆర్థిక సంస్థలకు సహాయపడుతుంది.వేగవంతమైన ధ్రువీకరణక్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా పాన్ని సులభంగా ధ్రువీకరించవచ్చు. తద్వారా సమాచార దొంగతనం, టాంపరింగ్‌కు పాల్పడటం సులభం కాదు. ఇక కొత్త ఫీచర్లు ఎంత ప్రభావవంతంగా ఉండబోతున్నాయో చూస్తే.. ఒక వేళ అన్నింటికీ ఆధార్ కార్డు లింక్ చేయడం తప్పనిసరి చేస్తే.. రియల్ టైమ్ వ్యాలిడేషన్, అధునాతన డేటా అనలిటిక్స్ వంటి ఫీచర్లు కొత్త సిస్టమ్‌కు జత కలుస్తాయి. దీంతో సైబర్ భద్రతకు బలమైన వ్యవస్థ ఏర్పడుతుంది. అయితే సైబర్ సెక్యూరిటీ ముప్పులు నేడు కొత్త రూపాల్లో వస్తున్న నేపథ్యంలో ఈ వ్యవస్థ ఎంత ప్రభావవంతంగా, సమర్ధవంతంగా ఉంటుందో అన్నది రానున్న రోజులలో తెలుస్తుంది. -
ఉచిత ఆధార్ అప్డేట్ గడువు పొడిగింపు
యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఆధార్ ఉచిత అప్డేట్ గడువును వచ్చే ఏడాదికి పొడిగించింది. గతంలో తెలిపిన విధంగా ఉచిత ఆధార్ అప్డేట్కు ఈ రోజు చివిరి తేదీ. కానీ దాన్ని వచ్చే ఏడాది జూన్ 14 వరకు పొడిగిస్తున్నట్లు యూఐడీఏఐ ప్రకటన విడుదల చేసింది. ఈమేరకు ఆధార్ అధికారిక ఎక్స్ లింక్‌లో వివరాలు పోస్ట్ చేసింది.యూఐడీఏఐ వెల్లడించిన గడువు (2025, జూన్ 14) లోపు ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ చేసుకుంటే.. ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ ఆధార్ సెంటర్‌కు వెళ్లి అప్డేట్ చేసుకుంటే మాత్రం.. రూ.50 అప్లికేషన్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.#UIDAl extends free online document upload facility till 14th June 2025; to benefit millions of Aadhaar Number Holders. This free service is available only on #myAadhaar portal. UIDAl has been encouraging people to keep documents updated in their #Aadhaar. pic.twitter.com/wUc5zc73kh— Aadhaar (@UIDAI) December 14, 2024ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ చేసుకోవడం ఎలా?● మైఆధార్ పోర్టల్ ఓపెన్ చేయండి● లాగిన్ బటన్ మీద క్లిక్ చేసి.. మీ 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, దానికింద క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.● నెంబర్, క్యాప్చా ఎంటర్ చేసిన తరువాత లాగిన్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి.● రిజిస్టర్ మొబైల్ నెంబరుకు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.● అక్కడే డాక్యుమెంట్స్ అప్డేట్, అడ్రస్ అప్డేట్ వంటివన్నీ కనిపిస్తాయి.● మీరు ఏది అప్డేట్ చేయాలనుకుంటున్నారో.. దానిపైన క్లిక్ చేసి అప్డేట్ చేసుకోవచ్చు. అయితే దీనికి అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.● అవసరమైనవన్నీ అప్డేట్ చేసుకున్న తరువాత మీరు సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ పొందుతారు. దీని ద్వారా డాక్యుమెంట్ అప్డేట్ను ట్రాక్ చేయవచ్చు. -
పాలసీపై రాబడి ఉండాలా..? వద్దా..?
జీవిత బీమా అనగానే.. డబ్బు వృథా, అనవసరంగా ప్రీమియం చెల్లించాలనే ధోరణి ఉంది. దీన్ని గ్రహించిన కంపెనీలు వినియోగదారులు చెల్లించే ప్రీమియంపై రాబడి వచ్చేలా ఎండోమెంట్ పాలసీలను తీసుకొచ్చారు. అయితే ఇందుకు భారీగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో ఒకవైపు బీమా కవరేజీ.. మరోవైపు రాబడి ఉంటుంది. ఇదే ఎక్కువ మందిని ఆకర్షించే అంశం. బ్యాంక్ డిపాజిట్లో మాదిరిగా, లేదంటే అంతకంటే ఎక్కువ రాబడి బీమా పాలసీలో వస్తుందని నమ్ముతుంటారు. దీనికి అదనంగా బీమా రక్షణ ఉంటుందన్న కారణంతో దీనివైపే మొగ్గు చూపిస్తుంటారు. రాబడి ఇవ్వని టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లను అర్థం చేసుకుని తీసుకునే వారు మొత్తం మీద తక్కువ. కానీ, సంప్రదాయ బీమా పాలసీల్లో రాబడి విషయమై ఎక్కువ మందిలో ఉండే అంచనా సరైంది కాదని, కొన్నిసార్లు సగటు ద్రవ్యోల్బణం కంటే కూడా ఎండోమెంట్ పాలసీల్లో వచ్చే రాబడి తక్కువేనని నిపుణులు చెబుతున్నారు. బీమా సంస్థలు, ఏజెంట్లు మార్కెటింగ్‌లో భాగంగా సంప్రదాయ బీమా పాలసీలను ఆకర్షణీయంగా చూపించే ప్రయత్నాన్ని చేస్తుంటారు. కానీ, బీమా రక్షణా? లేక రాబడా? అనే అంశాలపై స్పష్టమైన అవగాహన ఉండాలి. ఈ అంశాలను వివరించే కథనం ఇది..బీమా, పొదుపుతో కూడిన ప్లాన్లుసంప్రదాయ బీమా పాలసీలు రెండు రకాల ప్రయోజనాలను ఆఫర్ చేస్తుంటాయి. మరణించినప్పుడు పరిహారాన్ని చెల్లిస్తాయి. పాలసీ కాలం పూర్తయ్యే వరకు జీవించి ఉన్నా ప్రయోజనం లభిస్తుంది. పాలసీదారు ఏదైనా కారణంతో దురదృష్టవశాత్తూ పాలసీ కాల వ్యవధిలో మరణిస్తే నామినీ ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. పాలసీదారు జీవించి ఉంటే చివర్లో అన్ని ప్రయోజనాలనూ కలిపి బీమా సంస్థ చెల్లిస్తుంది. బీమా ప్లాన్ బ్రోచర్లో ఈ వివరాలు ఉంటాయి. ఉదాహరణకు ప్రముఖ సంస్థకు చెందిన ఓ ప్లాన్ పరిశీలిస్తే.. ఇది పొదుపు, బీమాతో కూడిన ప్లాన్. 15–20 ఏళ్ల కాలానికి తీసుకోవచ్చు. పాలసీ కాల వ్యవధి అంతటా ప్రీమియం చెల్లించక్కర్లేదు. 5 ఏళ్లు తగ్గించి మిగిలిన కాలానికి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అంటే 20 ఏళ్ల టర్మ్ ప్లాన్ తీసుకుంటే 15 ఏళ్లపాటు ప్రీమియం చెల్లించాలి. ఉదాహరణకు 35 ఏళ్ల వ్యక్తి 20 ఏళ్ల కాలానికి పాలసీని రూ.15 లక్షల సమ్ అష్యూరెన్స్పై (బీమా రక్షణ/కవరేజీ) తీసుకుంటే అప్పుడు ఏటా చెల్లించాల్సిన ప్రీమియం సుమారు రూ.80వేలు. ఇలా 15 ఏళ్లపాటు చెల్లించాల్సి ఉంటుంది. జీవించి ఉంటే రెండు రూపాల్లో ఈ ప్లాన్ ప్రయోజనాలను అందిస్తుంది.ద్రవ్యోల్బణాన్ని అధిగమిస్తున్నాయా..?55 ఏళ్ల వరకు జీవించి ఉంటే అప్పుడు రూ.10 లక్షల సమ్ అష్యూరెన్స్తోపాటు గ్యారంటీడ్ అడిషన్స్ పొందొచ్చు. గ్యారంటీడ్ అడిషన్ అనేది ప్రతి రూ.1,000పై సుమారు రూ.50 చొప్పున వస్తుంది. మొత్తం మీద 20 ఏళ్ల కాలంలో ప్రీమియం రూపేణా రూ.12 లక్షలు చెల్లిస్తారు. అంటే రూ.10 లక్షల కవరేజీ కోసం అంతకంటే ఎక్కువ చెల్లిస్తున్నారు. జీవించి ఉంటే 20 ఏళ్ల తర్వాత వచ్చే మొత్తం రూ.20 లక్షలు. అంటే రాబడి రూ.8 లక్షలే. అది కూడా 20 ఏళ్ల కాలానికి. ఇందులో ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ (రాబడి రేటు) 4 శాతమే. ఇదనే కాదు.. జీవిత బీమా ఎండోమెంట్ ప్లాన్లు అన్నింటిలోనూ దాదాపు ఇదే స్థాయిలో రాబడి ఉంటుంది. ఒకవేళ 30–40 ఏళ్ల కాలానికి తీసుకుంటే ఈ రాబడి రేటు 4.5–5 శాతం మధ్య ఉంటుంది. కానీ, మన దేశంలో సగటు వార్షిక ద్రవ్యోల్బణం 6 శాతం స్థాయిలో ఉండడాన్ని గమనించొచ్చు. ద్రవ్యోల్బణం రేటు, అంతకంటే తక్కువ రాబడి రేటు ఏదైనా.. నికరంగా అది మనకు రాబడిని ఇచ్చినట్టు కాదని అర్థం చేసుకోవాలి.మరణిస్తే చెల్లింపులు ఇలా..ఒకవేళ ప్లాన్ కాల వ్యవధిలో పాలసీదారు మరణించినట్టయితే, సమ్ అష్యూరెన్స్తోపాటు అప్పటి వరకు సమకూరిన గ్యారంటీడ్ అడిషన్స్ చెల్లిస్తారు. బేసిక్ సమ్ అష్యూరెన్స్పై 125 శాతం, వార్షికంగా చెల్లించే ప్రీమియానికి ఏడు రెట్లు, లేదంటే అప్పటి వరకు చెల్లించిన ప్రీమియంకు 105 శాతం.. వీటిల్లో ఏది ఎక్కువ అయితే అది చెల్లిస్తారు. ఉదాహరణకు 35 ఏళ్ల వయసులో తీసుకుని 50 ఏళ్ల సమయంలో మరణం సంభవించినట్టయితే రూ.20 లక్షలు పరిహారంగా ముడుతుంది.ప్రత్యామ్నాయం..బీమా, పెట్టుబడి ఈ రెండింటినీ కలిపి చూడొద్దని నిపుణులు తరచూ చెబుతుంటారు. ఈ రెండూ కలిపి తీసుకోవడం వల్ల అటు సరైన బీమా రక్షణ, ఇటు సరైన రాబడి పొందలేని పరిస్థితికి సంప్రదాయ బీమా పాలసీలు అచ్చమైన ఉదాహరణ. అలా కాకుండా ప్యూర్ లైప్ ఇన్సూరెన్స్ ఆఫర్ చేసే టర్మ్ ప్లాన్ తీసుకుని, మరోవైపు మెరుగైన రాబడినిచ్చే సాధనంలో పెట్టుబడి పెట్టుకోవడమే మంచి నిర్ణయం అవుతుంది. పైఉదాహరణ ఆధారంగా బీమా, పెట్టుబడిని వేరు చేస్తే వచ్చే ప్రయోజనం ఏ మేరకు ఉంటుందో చూద్దాం.35 ఏళ్ల వయసున్న వ్యక్తి 25 ఏళ్ల కాలానికి అంటే 60 ఏళ్లు వచ్చే వరకు (రిటైర్మెంట్ వయసు/బాధ్యతలు ముగిసే సగటు వయసు) రూ.50 లక్షల సమ్ అష్యూరెన్స్‌తో టర్మ్ ప్లాన్ తీసుకుంటే చెల్లించాల్సిన ప్రీమియం రూ.10వేలు అనుకుందాం. ఎక్కువ కంపెనీల్లో ప్రీమియం రూ.7,400 నుంచి 9,800 మధ్య ఉంది. పొగతాగడం, మద్యపానం, అనారోగ్య సమస్యలు లేని వారికి ఈ ప్రీమియం అని అర్థం చేసుకోవాలి. పైన చెప్పుకున్న ప్లాన్‌లో ఏటా చెల్లించే ప్రీమియం రూ.80వేలు. కానీ బీమా రక్షణ రూ.10 లక్షలే. ఈ ప్రీమియంలో కేవలం 12 శాతం చెల్లించడం ద్వారా టర్మ్ ప్లాన్‌లో రూ.50 లక్షల బీమా కవరేజీని, అది కూడా 25 ఏళ్ల కాలానికి పొందొచ్చు. కేవలం 12 శాతం ప్రీమియానికే ఐదు రెట్లు అధిక బీమా రక్షణ తీసుకోవడం మెరుగైన నిర్ణయం అనిపించుకుంటుంది. అప్పుడు మిగిలిన రూ.70వేలను 15 ఏళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.పైప్లాన్లో ప్రీమియం చెల్లింపు 15 ఏళ్లే కనుక దాన్నే పరిగణనలోకి తీసుకుని చూద్దాం. 12 శాతం రాబడి ఇచ్చే మ్యూచువల్ ఫండ్ పథకంలో ఏడాదికోసారి రూ.70వేల చొప్పున ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళితే 15 ఏళ్ల చివరికి రూ.29.22 లక్షలు సమకూరుతుంది. ఇందులో అసలు రూ.10.5 లక్షలు అయితే, రాబడి రూ.18.72 లక్షలు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో దీర్ఘకాలానికి వార్షిక రాబడి 12 శాతం ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఒకవేళ 10 శాతం రాబడి ఆధారంగా అంచనా వేసుకున్నా.. 15 ఏళ్లలో రూ.24.46 లక్షలు సమకూరుతుంది. విడిగా బీమా ప్లాన్, పెట్టుబడి ప్లాన్ ఎంపిక చేసుకోవడం వల్ల మెరుగైన కవరేజీకితోడు, మెరుగైన సంపద సృష్టి సాధ్యపడుతుందని ఈఉదాహరణ తెలియజేస్తోంది.కాంపౌండింగ్ ఉండదు..విడిగా ఇన్వెస్ట్ చేసుకుంటే కాంపౌండింగ్ ఉంటుంది. అంటే రాబడిపై రాబడి తోడవుతుంది. కానీ, సంప్రదాయ బీమా ప్లాన్లలో చెల్లించే గ్యారంటీడ్ అడిషన్స్, రివర్షనరీ బోనస్, సింపుల్ అడిషన్స్ మొత్తంపై కాంపౌండింగ్ ఉండదు. అదే బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ లేదా బాండ్లను తీసుకుంటే, మొదటి ఏడాది రాబడిపై తర్వాతి కాలంలో రాబడి జమ అవుతుంది. ఇలా కాంపౌండింగ్ ప్రయోజనం లభిస్తుంది. పైకి కనిపించదు కానీ, సంపద సృష్టిలో కాంపౌండింగ్‌కు చాలా ప్రాధాన్యం ఉంది. సంప్రదాయ పెట్టుబడి సాధనాల్లో రాబడి రేటు ముందే చెబుతారు. అదే, సంప్రదాయ ఎండోమెంట్ ప్లాన్లలో రాబడి రేటు ముందు చెప్పరు. సమ్ అష్యూరెన్స్తోపాటు ఇతర ప్రయోజనాలు చెల్లించే విధంగా ప్లాన్ ఉంటుంది.ఇందులో నికర రాబడి ఏ మేరకు అన్నది అర్థం చేసుకోవడం సామాన్యుల వల్ల అయ్యే పని కాదు. సమ్ అష్యూరెన్స్కే హామీ ఉంటుంది. ఇతర చెల్లింపులకు హామీ ఉండదు. బీమా సంస్థ పనితీరు (అది చేసే పెట్టుబడులపై రాబడులు)పైనే ఆధారపడి ఉంటాయని అర్థం చేసుకోవాలి. అందుకే అన్నింటికంటే కుటుంబానికి మెరుగైన జీవిత బీమా రక్షణ కల్పించుకోవడం ముందుగా చేయాలి. రాబడి కోసం దీర్ఘకాలంలో ఈక్విటీలే మెరుగైన సాధనమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత, ఇంకా ఆర్థిక వెసులుబాటు ఉంటే అప్పుడు మీకు నచ్చిన ప్లాన్‌ను కొనుగోలు చేసుకోవచ్చు.గ్యారంటీడ్.. పార్టిసిపేటింగ్బీమా సంస్థలు సంప్రదాయ పాలసీలను ఆకర్షణీయంగా చూపించేందుకు బోనస్‌లను ప్రకటిస్తుంటాయి. బీమా సంస్థ పనితీరుపైనే ఇది ఆధారపడి ఉంటుంది. సంప్రదాయ బీమా ప్లాన్లు సింపుల్ రివర్షనరీ బోనస్, ఫైనల్ మెచ్యూరిటీ బోనస్, లాయల్టీ అడిషన్ అనే వాటిని ఆఫర్ చేస్తుంటాయి. ఇవన్నీ బీమా సంస్థ వద్ద మిగులు నిల్వలపైనే ఆధారపడి ఉంటాయనే షరతు విధిస్తారు. మిగులు ఉంటే అప్పుడు సింపుల్ రివర్షనరీ బోనస్‌ను చెల్లిస్తారు. కొన్ని ప్లాన్లలో సింపుల్ రివర్షనరీ బోనస్ అని కాకుండా, పాలసీ కాల వ్యవధి ముగింపు సమయంలో లాయల్టీ అడిషన్స్ పేరుతో వీటిని చెల్లిస్తారు.ఇదీ చదవండి: ఏటీఎం నుంచే పీఎఫ్ నిధుల డ్రాఇదే తరహా సంప్రదాయ ప్లాన్లు కొన్ని చివర్లో అడిషనల్ బోనస్ చెల్లింపునకు హామీ ఇస్తాయి. పార్టిసిపేటింగ్ బీమా ప్లాన్ తీసుకుంటే కాల వ్యవధి ముగిసే వరకు జీవించి ఉన్న సందర్భంలో సమ్ అష్యూరెన్స్‌కు అదనంగా ఏదో ఒక రూపంలో చెల్లింపు ఉంటుంది. అదే నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్ తీసుకుంటే జీవించి ఉంటే చివర్లో ఏమీ రాదు. టర్మ్ ఇన్సూరెన్స్‌ను నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్‌గా పేర్కొంటారు. ఇప్పుడు ప్రీమియం వెనక్కి ఇచ్చే టర్మ్ ప్లాన్లు కూడా వస్తున్నాయి. కనుక ఇక్కడ పొరపాటు పడొద్దు. ప్రీమియం వెనక్కి రాని టర్మ్ ప్లాన్ ప్రీమియంతో పోలిస్తే, చివర్లో ప్రీమియం వెనక్కి ఇచ్చే టర్మ్ ప్లాన్ ప్రీమియం అధికంగా ఉంటుంది. -
ఏటీఎం నుంచే పీఎఫ్ నిధుల డ్రా
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) సభ్యులు అతి త్వరలోనే తమ భవిష్యనిధి (పీఎఫ్) క్లెయిమ్‌ల మొత్తాన్ని ఏటీఎం నుంచి ఉపసంహరించుకునే అవకాశం అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఈపీఎఫ్‌వో సభ్యుల ఆన్లైన్ క్లెయిమ్ ఆమోదానికి 7–10 రోజుల సమయం తీసుకుంటోంది. క్లెయిమ్ పరిష్కారం తర్వాత ఆ మొత్తాన్ని సభ్యుల బ్యాంక్ ఖాతాకు బదిలీ చేస్తున్నారు. ప్రతిపాదిత కొత్త విధానంలో సభ్యులకు ప్రత్యేకమైన కార్డులు అందించనున్నారు. వీటి ద్వారా ఏటీఎం నుంచి క్లెయిమ్ మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఏడు కోట్లకు పైగా సభ్యులకు బ్యాంక్‌ల మాదిరి సేవలు అందించాలన్నది ఈపీఎఫ్‌వో ఆలోచనగా పేర్కొన్నారు. ఈపీఎఫ్‌వో తన ఐటీ సదుపాయాలను మెరుగుపరుచుకుంటోందని కార్మిక శాఖ కార్యదర్శి సుమితా దావ్రా తెలిపారు. కొత్త వ్యవస్థ అమల్లోకి వస్తే పీఎఫ్ ప్రయోజనాలు, బీమా ప్రయోజనాలను ఏటీఎంల నుంచే పొందొచ్చని చెప్పారు. -
ఆధార్ ఉచిత అప్డేట్.. రేపే లాస్ట్ డేట్!
మైఆధార్ పోర్టల్‌లో ఎటువంటి ఛార్జీలు చెల్లించకుండా.. ఆధార్ కార్డ్ హోల్డర్లు తమ వివరాలను అప్డేట్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ 'డిసెంబర్ 14' చివరి రోజుగా ప్రకటిస్తూ 'యూఐడీఏఐ' (UIDAI) వెల్లడించింది. అయితే పేర్కొన్న గడువు సమీపిస్తోంది. ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకోవడానికి రేపే లాస్ట్ డేట్. అయితే ఈ డేట్లో ఏమైనా మార్పులు ఉంటాయా? లేదా? అనేది రేపు తెలుస్తుంది.యూఐడీఏఐ వెల్లడించిన గడువు (డిసెంబర్ 14) లోపల ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ చేసుకుంటే.. ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ ఆధార్ సెంటర్‌కు వెళ్లి అప్డేట్ చేసుకుంటే మాత్రం.. రూ. 50 అప్లికేషన్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే మరో మారు గడువును పొడిగిస్తారా అనే విషయం మీద ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ చేసుకోవడం ఎలా?● మైఆధార్ పోర్టల్ ఓపెన్ చేయండి● లాగిన్ బటన్ మీద క్లిక్ చేసి.. మీ 16 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, దానికింద క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.● నెంబర్, క్యాప్చా ఎంటర్ చేసిన తరువాత లాగిన్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి.● రిజిస్టర్ మొబైల్ నెంబరుకు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.● అక్కడే డాక్యుమెంట్స్ అప్డేట్, అడ్రస్ అప్డేట్ వంటివన్నీ కనిపిస్తాయి.● మీరు ఏది అప్డేట్ చేయాలనుకుంటున్నారో.. దానిపైన క్లిక్ చేసి అప్డేట్ చేసుకోవచ్చు. అయితే దీనికి అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.● అవసరమైనవన్నీ అప్డేట్ చేసుకున్న తరువాత మీరు సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ పొందుతారు. దీని ద్వారా డాక్యుమెంట్ అప్డేట్ను ట్రాక్ చేయవచ్చు. -
ఆధార్ లాక్/అన్‌లాక్ గురించి తెలుసా?
ఆధార్ కార్డు జీవితంలో ఒక భాగమైపోయింది. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి, ప్రభుత్వ పథకాలను అప్లై చేయడానికి ఇలా.. అన్నింటికీ ఆధార్ అవసరమవుతోంది. ఆధార్ నమోదు సమయంలోనే వ్యక్తిగత వివరాలు, బయోమెట్రిక్, ఐరీష్ అన్నింటినీ రికార్డ్ చేసుకుంటారు. కాబట్టి వేలి ముద్ర వేయగానే మన డీటైల్స్ అన్నీ తెలిసిపోతాయి.వేలి ముద్ర వేయగానే అన్ని వివరాలు తెలిసిపోతుండటం వల్ల, సైబర్ నేరగాళ్లు వీటి ద్వారా ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వాటిని అరికట్టడానికి ఆధార్ కార్డును లాక్ చేసుకోవచ్చు. అవసరమైనప్పుడు అన్‌లాక్ కూడా చేసుకోవచ్చు.ఆధార్ బయోమెట్రిక్ లాక్ & అన్‌లాక్➤యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) అభివృద్ధి చేసిన 'ఎంఆధార్' (mAadhaar) మొబైల్ యాప్‌లో ఆధార్ డేటాను యాక్సెస్ చేసుకోవచ్చు. ఇందులో కేవలం ఒక వ్యక్తి ఆధార్ వివరాలను మాత్రమే కాకుండా.. కుటుంబ సభ్యుల ఆధార్ వివరాలను కూడా యాడ్ చేసుకోవచ్చు.➤యూఐడీఏఐ ఎంఆధార్ డౌన్లోడ్ చేసుకున్న తరువాత.. యాప్ ఓపెన్ చేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.➤ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తరువాత.. మీ రిజిస్టర్ మొబైల్ నెంబరుకు ఓటీపీ వస్తుంది.➤ఓటీపీ ఉపయోగించి లాగిన్ అయిన తరువాత మీకు 'ఎంఆధార్'ను యాక్సెస్ చేసుకోవడానికి ఒక పిన్ సెట్ చేసుకోవచ్చు.➤ఎంఆధార్ యాప్‌ను యాక్సెస్ చేసిన తరువాత ఆధార్ కార్డు, వ్యక్తిగత వివరాలు కనిపిస్తాయి.➤అయితే ఇప్పుడు బయోమెట్రిక్ లాక్ లేదా అన్‌లాక్ కోసం ఓ ప్రత్యేకమైన ఫీచర్ కనిపిస్తుంది. ఆధార్ లాక్ చేయడానికి 'బయోమెట్రిక్ లాక్' ఫీచర్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీ రిజిస్టర్ మొబైల్ నెంబరుకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే ఆధార్ లాక్ అవుతుంది.➤అన్‌లాక్ చేయడానికి బయోమెట్రిక్ లాక్' ఫీచర్ మీద క్లిక్ చేస్తే.. రిజిస్టర్ మొబైల్ నెంబరుకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్‌గా అన్‌లాక్ అవుతుంది.ఆధార్ లాక్ వల్ల ఉపయోగాలువ్యక్తిగత వివరాలు సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి పడకుండా ఉండటానికి ఆధార్ బయోమెట్రిక్ లాక్ ఉపయోగపడుతుంది. దీంతో మీరు మోసాలకు బలికాకుండా ఉండవచ్చు.ఇదీ చదవండి: ఆధార్ అప్డేట్ చేయకుంటే ఏమవుతుంది?: తప్పకుండా తెలుసుకోవాల్సిందే.. -
డిజిటల్ రేషన్ కార్డు: ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే..
భారతదేశంలో టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో కేంద్రం.. డిజిటల్ ఇండియా కింద ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తోంది. ఇందులో భాగంగానే.. ఇటీవల క్యూఆర్ కోడ్ పాన్ కార్డు (పాన్ 2.0) గురించి ప్రస్తావించింది. కాగా ఇప్పటికే డిజిటల్ రేషన్ కార్డును తీసుకురాడంలో ప్రభుత్వం సక్సెస్ సాధించింది. ఇంతకీ ఈ డిజిటల్ రేషన్ కార్డును ఎక్కడ, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. దీనివల్ల ఉపయోగాలు ఏమిటనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.డిజిటల్ రేషన్ కార్డు అనేది.. సాధారణ రేషన్ కార్డుకు డిజిటల్ వెర్షన్. దీనిని ఉపయోగించి కూడా ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) ద్వారా ఆహార ధాన్యాలు, ఇతర నిత్యావసర వస్తువులను పొందవచ్చు. డిజిటల్ రేషన్ కార్డును ఆన్లైన్లో లేదా మేరా రాషన్ 2.0 యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.డిజిటల్ రేషన్ కార్డును ఎలా డౌన్లోడ్ చేయాలంటే..•ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి, ఐఓఎస్ వినియోగదారులు యాపిల్ యాప్ స్టోర్ నుంచి 'మేరా రాషన్ 2.0' యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి.•మేరా రాషన్ 2.0 యాప్ డౌన్లోడ్ చేసుకున్న తరువాత, ఓపెన్ చేస్తే స్క్రీన్‌పైన ఆధార్ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేయమని ఉంటుంది.•ఆధార్ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేసిన తరువాత వెరిఫై మీద క్లిక్ చేయాలి. తరువాత రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.•మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసిన తరువాత వెరిఫై క్లిక్ చేయాలి.•ధ్రువీకరించిన తరువాత.. మీ డిజిటల్ రేషన్ కార్డు స్క్రీన్ మీద కనిపిస్తుంది. దానిని డౌన్లోడ్ చేసుకోవచ్చు.ఇదీ చదవండి: ఆధార్ ఫ్రీ అప్డేట్: గడువు ఆరు రోజులే!డిజిటల్ రేషన్ కార్డు ఉపయోగాలు•ఫిజికల్ రేషన్ కార్డు పోయినప్పటికీ.. దీనిని రేషన్ షాపుల్లో ఉపయోగించవచ్చు.•రేషన్ కార్డు ఎక్కడైనా పోతుందేమో అని భయం అవసరం లేదు.•డిజిటల్ రేషన్ కార్డు కాబట్టి.. మోసాలు జరిగే అవకాశాలు చాలా తక్కువ. -
ఆదాయాన్ని నిర్ధారించేవి.. ఈ మూడే..
మీ ట్యాక్సబుల్ ఆదాయాన్ని నిర్ధారించేవి ముఖ్యంగా మూడు అంశాలు. అవేంటంటే.. 1. రెసిడెన్షియల్ స్టేటస్ 2. ఆదాయం వచ్చే సమయం 3. ఆదాయానికి మూలం (సోర్స్) ఇక వివరాల్లోకి వెళ్దాం.1. రెసిడెన్షియల్ స్టేటస్ .. ఆదాయపు పన్ను చట్టంలో పన్ను భారాన్ని నిర్ధారించేది మీ రెసిడెన్షియల్ స్టేటస్ .. అంటే మీరు భారత్‌లో ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఎన్ని రోజులు ఉన్నారనే విషయం. పౌరసత్వానికి, పన్ను భారానికి ఎటువంటి సంబంధం లేదు. పౌరుడైనా, పౌరుడు కాకపోయినా ఆ వ్యక్తి స్టేటస్ .. అంటే ఇండియాలో ఎన్ని రోజులున్నాడనే అంశంపై ఆధారపడి ఉంటుంది.ఆదాయానికి మూలం కింద .. జీతం, ఇంటి మీద అద్దె, వ్యాపారం మీద ఆదాయం .. మొదలైనవి ఉంటాయి. ఈ స్టేటస్ ప్రతి సంవత్సరం మారొచ్చు. మారకపోవచ్చు. అందుకని ప్రతి సంవత్సరం ఈ షరతుని లేదా పరిస్థితిని లేదా కొలబద్దని కొలవాలి. లెక్కించాలి. వ్యక్తి విషయానికొస్తే.. 182 రోజులు లేదా అంతకన్నా ఎక్కువ రోజులుంటే, అటువంటి వ్యక్తిని రెసిడెంట్ అంటారు. సాధారణంగా మనందరం రెసిడెంట్లమే.మరో ప్రాతిపదిక ఏమిటంటే, గడిచిన నాలుగు సంవత్సరాల్లో 365 రోజులు లేదా పైగా ఉంటూ, ఆ ఆర్థిక సంవత్సరంలో 60 రోజులు ఉండాలి. ఇలాంటి వ్యక్తిని రెసిడెంట్ అంటారు. ఈ లెక్కింపులకు మీ పాస్‌పోర్ట్‌లలో ఎంట్రీలు ముఖ్యం. రెసిడెంటుకు, నాన్–రెసిడెంటుకు ఎన్నో విషయాల్లో భేదాలు ఉన్నాయి. మిగతా వారి విషయంలో ఇండియాలో ఉంటూ ‘‘నిర్వహణ, నియంత్రణ’’ చేసే వ్యవధి మీద స్టేటస్ ఆధారపడి ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి.2. ఆదాయం ఏర్పడే సమయం సాధారణంగా ఆ ఆర్థిక సంవత్సరంలో మీ చేతికి వచ్చినది, మీరు పుచ్చుకున్నది, మీ ఖాతాలో జమ అయినదాన్ని మీ ఆదాయం అంటారు. దీన్నే రావడం ... అంటే ARISE అంటారు. కానీ చట్టంలో ఒక చిన్న ఇంగ్లీష్ పదం ‘ACCRUE’ మరో అర్థాన్ని సూచిస్తుంది. ‘‘ఆదాయాన్ని’’ నిర్వచించే విధానం చూస్తే, వాడే భాష చూస్తే, ఆదాయ పరిధిని ‘‘వామన అవతారం’’లో ‘‘మూడు అడుగుల’’ను స్ఫురింపచేస్తుంది. ఎన్నో వివరణలు, తీర్పులు, పరిధులు ఉంటాయి. ‘‘ఇందుగలడందు కలడు’’ అనే నరసింహావతారం గుర్తుకు రాక తప్పదు.స్థూలంగా చెప్పడం అంటే మేము ‘సాహసం’ చేయడమే! పాతాళభైరవిలో నేపాల మాంత్రికుడి మాటల్ని స్ఫూర్తిగా తీసుకుంటూ, చేతికొచ్చింది .. చేతికి రావాల్సినది, హక్కు ఏర్పడి రానిది, హక్కు ఉండి అందనిది, ఆదాయంలా భావించేది, భావించతగ్గది, భావించినది, ఆదాయం కాకపోయినా తీసుకోక తప్పనిది (Deemed), కొన్ని సందర్భాల్లో మీకు కలిపేది (Included) అని చెప్పొచ్చు.3. ముచ్చటగా మూడోది..మూలం. అంటే Source. చట్టప్రకారం మనకు ఏర్పడే ఆదాయాల్ని ఐదు రకాలుగా, 5 శీర్షికల కింద వర్గీకరించారు. a) జీతాలు, వేతనాలు b) ఇంటి మీద ఆదాయం c) వ్యాపారం/వృత్తి మీద లాభనష్టాలు d) క్యాపిటల్ గెయిన్స్ e) పై నాలుగింటిలోకి విభజించలేక మిగిలినవి .. ఏ మూలమైనా, ఏ మూల నుంచి వచ్చినా ఈ శీర్షిక కింద పరిగణనలోకి తీసుకుంటారు. అవశేష ఆదాయం అని అనొచ్చు. ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకుని ట్యాక్స్ ప్లానింగ్‌కి శ్రీకారం చుడదాం.పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.comకు ఈ–మెయిల్ పంపించగలరు. -
మహిళలకు కొత్త బ్యాంక్ అకౌంట్
ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ తాజాగా మహిళలకు సమగ్రమైన ఆర్థిక సేవలు అందించే దిశగా ‘ఎరైజ్ ఉమెన్స్ సేవింగ్స్ అకౌంటు’ను ఆవిష్కరించింది. ముగ్గురు కుటుంబ సభ్యులకు కూడా ఉపయోగపడేలా ఫ్యామిలీ బ్యాంకింగ్ ప్రోగ్రాం, చిన్న–మధ్య స్థాయి లాకర్లపై తొలి ఏడాది జీరో రెంటల్ ఫీజు, పీవోఎస్లలో రూ. 5 లక్షల వరకు లావాదేవీ పరిమితితో ఏరైజ్ డెబిట్ కార్డు, కాంప్లిమెంటరీగా నియో క్రెడిట్ కార్డు వంటి ప్రయోజనాలను దీనితో పొందవచ్చు.అలాగే, మహిళా నిపుణులతో ఆర్థిక సలహాలు, తొలి ఏడాది డీమ్యాట్ అకౌంటుపై వార్షిక మెయింటెనెన్స్ చార్జీల నుంచి మినహాయింపు, ప్రత్యేకంగా మహిళల కోసం కస్టమైజ్ చేసిన స్టాక్స్ బాస్కెట్లో ఇన్వెస్ట్ చేసే అవకాశం మొదలైన సర్వీసులను అందుకోవచ్చు. ఆరోగ్య సంరక్షణ విషయంలో మహిళలకు సంబంధించిన ప్యాప్‌స్మియర్ తదితర నిర్దిష్ట వైద్యపరీక్షలపై 70 శాతం వరకు డిస్కౌంట్లు, ప్రముఖ ఆస్పత్రుల్లో వైద్యులతో అపరిమిత కన్సల్టేషన్లు తదితర ప్రయోజనాలను పొందవచ్చని బ్యాంకు తెలిపింది.దిగ్గజ ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒకటైన యాక్సిస్ బ్యాంకు ఇటీవలే ఫిక్స్డ్ డిపాజిట్లపైన వడ్డీ రేట్లను సవరించింది. గత అక్టోబర్ 21 నుంచే కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. వారం రోజుల నుంచి 10 సంవత్సరాల వ్యవధి డిపాజిట్లపై సాధారణ ప్రజలకు 3 శాతం నుంచి గరిష్టంగా 7.25 శాతం వడ్డీ అందుతోంది. ఇక సీనియర్ సిటిజెన్ల విషయానికి వస్తే.. కనీసం 3.50 శాతం నుంచి గరిష్టంగా 7.75 శాతం వడ్డీ లభిస్తోంది. -
రూ.30 లక్షలు ఇన్వెస్ట్.. ఫండ్స్లోనా లేదా స్టాక్స్లోనా..?
రూ.30 లక్షలను ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా లేదా నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఇందుకు అనుసరించాల్సిన వ్యూహం ఏంటి? మెరుగైన అస్సెట్ అలోకేషన్ విధానం ఏది అవుతుంది? – హితేంద్ర వాణిమీ పెట్టుబడి రూ.30 లక్షలను 12 నుంచి 24 సమాన నెలసరి వాయిదాలుగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మంచి పనితీరు కలిగిన ఫండ్‌ను ఎంపిక చేసుకోవాలి. లేదా నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసేట్టు అయితే అత్యుత్తమ నాణ్యత కలిగిన కంపెనీలను ఎంపిక చేసుకోవాలి. పటిష్టమైన ఈక్విటీ పోర్ట్‌ఫోలియోని నిర్మించుకోవడం పెద్ద సవాలుతో కూడుకున్నదే.రూ.30 లక్షలు ఇన్వెస్ట్ చేస్తున్నారు. కనుక ఒక కంపెనీకి గరిష్టంగా రూ.6 లక్షలు లేదా అంతకంటే తక్కువ కేటాయించుకోవచ్చు. బలమైన మూలాలు, నమ్మకమైన వృద్ధి అవకాశాలున్న కంపెనీలను ఎంపిక చేసుకోవాలి. పెట్టుబడులను వివిధ కంపెనీల మధ్య వైవిధ్యం చేసుకోవాలి. ఇది రిస్క్‌ను తగ్గిస్తుంది. పెట్టుబడుల నాణ్యతను పెంచుతుంది. ఎంపిక, పెట్టుబడుల కేటాయింపులు, వైవిధ్యం వీపోర్ట్ఫోలియో వీటికి ప్రాధాన్యం ఇవ్వాలి.తగినంత సమయం, విశ్వాసం లేకపోతే అప్పుడు మంచి ఫ్లెక్సీక్యాప్ లేదా మల్టీక్యాప్ ఫండ్ మేనేజర్‌పై ఆ బాధ్యతను పెట్టాలి. ఏ స్టాక్స్ ఎంపిక చేసుకోవాలన్న శ్రమ మీకు తప్పుతుంది. స్టాక్స్ పోర్ట్‌ఫోలియో నిర్వహణలో అనుభవం లేకపోతే నేరుగా ఇన్వెస్ట్ చేయకపోవడమే మంచిది. మీకు తగిన అనుభవం, సమయం ఉంటే, నిబంధనల ప్రకారం వ్యవహరించేట్టు అయితే ఫండ్స్‌తో పోలిస్తే ఎక్కువ రాబడులు సొంతం చేసుకోవచ్చు.నేను రిటైర్మైంట్ తీసుకున్నాను. క్రమానుగత పెట్టుబడుల ఉపసంహరణ (ఎస్‌డబ్ల్యూపీ) కోసం లిక్విడ్ ఫండ్ లేదా షార్ట్ డ్యురేషన్ ఫండ్‌లో దేనిని ఎంపిక చేసుకోవాలి? – విఘ్నేశ్లిక్విడ్ ఫండ్స్ స్థిరత్వంతో, తక్కువ రిస్క్‌తో ఉంటాయి. కనుక షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌తో పోల్చితే సిస్టమ్యాటిక్ విత్ డ్రాయల్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ) కోసం ఇవి అనుకూలం. అతి తక్కువ అస్థిరతలతో, స్థిరమైన రాబడులు ఇవ్వడం వల్ల లిక్విడ్ ఫండ్స్‌లో పెట్టుబడులతో నిశ్చింతగా ఉండొచ్చు.1. లిక్విడ్‌ఫండ్స్ పెట్టుబడుల విలువ దాదాపుగా తగ్గిపోవడం ఉండదు. వారం, నెల వ్యవధిలోనూ ఇలా జరగదు. ఉదాహరణకు కోటక్ లిక్విడ్ ఫండ్ గడిచిన దశాబ్ద కాలంలో వారం వారీ 99.78 శాతం సందర్భాల్లో సానుకూల రాబడులు ఇచ్చింది. నెలవారీగా చూస్తే నూరు శాతం సందర్భాల్లోనూ సానుకూల రాబడులు ఉన్నాయి. అదే కోటక్ షార్ట్ డ్యురేషన్ ఫండ్ పనితీరు గమనించినట్టయితే.. విలువలో కొంత క్షీణించడాన్ని గుర్తించొచ్చు. గడిచిన దశాబ్ద కాలంలో వారం వారీ రాబడులను గమనిస్తే 15.8 శాతం సందర్భాల్లో ప్రతికూలంగా, నెలవారీ రాబడుల్లో 7 శాతం సందర్భాల్లో ప్రతికూల పనితీరును గమనించొచ్చు.2. లిక్విడ్ ఫండ్స్ అయితే అదే రోజు లేదా మరుసటి రోజు పెట్టుబడులు చేతికి అందుతాయి. నెలవారీ ఊహించతగిన రాబడులకు అనుకూలంగా ఉంటాయి. షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌లోనూ లిక్విడిటీ ఎక్కువే. కాకపోతే వాటి ఎన్ఏవీలో స్వల్ప ఊగిసలాటలు ఉంటాయి. ఇది నెలవారీ ఉపసంహరించుకునే మొత్తంపై ప్రభావం చూపిస్తుంది.3. షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌లో రాబడులు కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు రూ.10 లక్షల పెట్టుబడిపై ఒక ఏడాదిలో రూ.వేలల్లో ఉంటుంది. కానీ, ఈ మేరకు రిస్క్ కూడా అధికంగా ఉంటుంది.4. లిక్విడ్ ఫండ్స్‌పై మార్కెట్ అస్థిరతలు పెద్దగా ఉండవు. కనుక ప్రశాంతంగా ఉండొచ్చు. -
క్రెడిట్ కార్డ్.. గీత దాటొద్దు..!
క్రెడిట్ కార్డు యూజర్ల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ ఏడాది మార్చి నాటికి యాక్టివ్ కార్డులు 10 కోట్ల మార్క్‌ను దాటగా.. వచ్చే ఐదేళ్లలో (2029 మార్చి నాటికి) 20 కోట్లకు పెరుగుతాయని పీడబ్ల్యూసీ అంచనా. యూపీఐ దెబ్బకు డెబిట్ కార్డుల వినియోగం గణనీయంగా తగ్గిపోయింది. చెల్లింపులకు వచ్చే సరికి యూపీఐ తర్వాత క్రెడిట్ కార్డుల హవాయే నడుస్తోంది. బ్యాంకు ఖాతాలో బ్యాలన్స్ ఉంటేనే యూపీఐ. బ్యాలన్స్ లేకపోయినా క్రెడిట్ (అరువు)తో కొనుగోళ్లకు క్రెడిట్ కార్డులు వీలు కల్పిస్తాయి. అందుకే వీటి వినియోగం పట్ల ఆసక్తి పెరుగుతూ పోతోంది. కానీ, క్రెడిట్ కార్డ్‌లను ఇష్టారీతిన వాడేయడం సరికాదు. ఇది క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేస్తుంది. భవిష్యత్‌లో రుణాల అర్హతకు గీటురాయిగా మారుతుంది. రుణ ఊబిలోకి నెట్టేసే ప్రమాదం లేకపోలేదు. క్రెడిట్ కార్డుపై లిమిట్ ఎంత? ఎంత వ్యయం చేయాలి? గీత దాటితే ఏమవుతుంది? తదితర అంశాలపై అవగాహన కల్పించే కథనమే ఇది. ఇప్పడంతా డిజిటల్ చెల్లింపులే. కరోనా విపత్తు తర్వాత నుంచి నగదు చెల్లింపులు గణనీయంగా తగ్గిపోయాయి. వినియోగదారులు నగదుకు బదులు క్రెడిట్ కార్డుతో షాపింగ్‌కు వెళితే మరింత ఎక్కువ ఖర్చు చేస్తున్నట్టు పలు అధ్యయనాల్లో వెల్లడైంది. పైగా గతంతో పోలిస్తే జీనవశైలి ఖర్చులు గణనీయంగా పెరిగిపోయాయి. దీంతో క్రెడిట్ కార్డుల స్వైపింగ్ మితిమీరుతోంది. పండుగల సందర్భంగా ఆకర్షించే ఆఫర్లు కూడా ఇందుకు ఒక కారణం. కార్డు ఉంది కదా అని చెప్పి ఇష్టారీతిన ఖర్చు చేస్తే.. తిరిగి చెల్లించేటప్పుడు ఆ భారం మోయాల్సి వస్తుంది. పైగా క్రెడిట్ స్కోర్‌ను ఇది ప్రతికూలంగా ప్రభావితం చేయగలదు. అందుకే క్రెడిట్ కార్డు వినియోగం విషయమై ప్రతి ఒక్కరూ అవగాహనతో, బాధ్యతతో వ్యవహరించాలి. క్రెడిట్ లిమిట్ కార్డుపై ఉన్న గరిష్ట వ్యయ పరిమితి ఇది. ఏ కాలంలో అయినా ఈ మేరకు గరిష్టంగా వినియోగించుకోవచ్చు. వినియోగించుకున్న మేర తదుపరి గడువు నాటికి పూర్తిగా చెల్లించేస్తే ఎలాంటి వడ్డీ భారం పడదు. ఆదాయం, వ్యక్తిగత ఆర్థిక చరిత్ర, రిస్క్ ఆధారంగా క్రెడిట్ లిమిట్‌ను కార్డు జారీ సమయంలోనే బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు నిర్ణయిస్తుంటాయి. సాధారణంగా ఆరంభంలో తక్కువ లిమిట్‌తో కార్డులు జారీ చేస్తుంటాయి. కార్డుపై వినియోగం, చెల్లింపుల తీరు ఆధారంగా తర్వాతి కాలంలో ఈ లిమిట్‌ను సవరించుకునే అవకాశం ఉంటుంది. వినియోగం కార్డుపై క్రెడిట్ లిమిట్ రూ.లక్ష ఉందనుకుంటే.. గరిష్టంగా రూ.లక్ష వరకు వినియోగించుకోవచ్చని అర్థం. ఇలా పూర్తి పరిమితి మేర ప్రతి నెలా కార్డు ఖర్చు చేస్తుంటే అది క్రెడిట్ స్కోర్‌కు ఏ మాత్రం మంచిది కాదు. క్రెడిట్ వినియోగ నిష్పత్తి (సీయూఆర్) అని ఒకటి ఉంటుంది. రూ.లక్ష క్రెడిట్ లిమిట్ ఉన్నప్పుడు ఒక నెలలో రూ.90,000 ఖర్చు పెట్టారని అనుకుందాం. అప్పుడు సీయూఆర్ 90 శాతం అవుతుంది. ‘‘అధిక క్రెడిట్ వినియోగ నిష్పత్తి రుణ దాహార్తిని తెలియజేస్తుంది. ఇది క్రెడిట్ స్కోర్‌ను తగ్గించేస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో సీయూఆర్ దాటి ఖర్చు చేయడం తప్పు కాదు. కానీ అది అరుదుగానే ఉండాలి. సీయూఆర్ 30 శాతం మించకుండా చూసుకుంటేనే మంచిది. కార్డుపై బకాయి మొత్తాన్ని గడువులోపు పూర్తిగా చెల్లించేయాలి. ఇలా చేయడం వల్ల క్రెడిట్ స్కోర్ మెరుగవుతుంది. దీనివల్ల తర్వాతి కాలంలో క్రెడిట్ లిమిట్‌ను సులభంగా పెంచుకోవచ్చు. రుణాలను తక్కువ వడ్డీ రేటుకు పొందొచ్చు’’అని బ్యాంక్ బజార్ సీఈవో ఆదిల్ శెట్టి సూచించారు. సాధారణంగా సీయూఆర్ 70 శాతం మించితే అది క్రెడిట్ స్కోర్‌ను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఖర్చులపై నియంత్రణలేమిని, బలహీన ఆర్థిక పరిస్థితులను ఇది తెలియజేస్తుంది. క్రెడిట్ స్కోర్‌పై రిమార్క్ కార్డు బకాయిల తిరిగి చెల్లింపులు తీరు క్రెడిట్ స్కోర్‌పై 35 శాతం మేర ప్రభావం చూపిస్తుందని బ్యాంక్ బజార్ చెబుతోంది. మెరుగైన క్రెడిట్ స్కోర్ కొనసాగాలంటే సకాలంలో బకాయిలు చెల్లించడం ఎంతో అవసరం. లేదంటే అధిక వడ్డీలకుతోడు, ఆలస్య రుసుములు చెల్లించాల్సి వస్తుంది. క్రెడిట్ స్కోర్ కూడా తగ్గిపోతుంది. క్రెడిట్ వినియోగ రేషియో అధికంగా ఉన్నా, క్రెడిట్ ఓవర్ లిమిట్‌కు వెళ్లినా కానీ క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం పడుతుంది. క్రెడిట్ స్కోరును లెక్కించే సందర్భంగా తక్కువ సీయూఆర్‌ను సానుకూలంగా చూస్తామని క్రిఫ్ హైమార్క్ (క్రెడిట్ బ్యూరో) మాజీ ఎండీ సంజీత్ దావర్ తెలిపారు.క్రెడిట్ ఓవర్ లిమిట్ ఒక బిల్లు సైకిల్ పరిధిలో క్రెడిట్ లిమిట్‌ను మొత్తం వాడేస్తే.. తదుపరి చెల్లింపులకు అవకాశం ఉండదు. కానీ, క్రెడిట్ స్కోర్ అధికంగా ఉన్న వారికి ఇందులో వెసులుబాటు ఉంది. క్రెడిట్ ఓవర్ లిమిట్ సదుపాయం వినియోగించుకోవచ్చు. కార్డు లిమిట్ పూర్తయినప్పటికీ.. అదే కార్డుపై మరింత లిమిట్ తీసుకోవచ్చు. ఇందుకు అదనపు చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ‘‘కొన్ని సందర్భాల్లో మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న కస్టమర్లకు తాత్కాలికంగా క్రెడిట్ లిమిట్‌ను బ్యాంక్‌లు పెంచుతాయి. ఇందుకోసం ముందుగానే సంప్రదించాలి. కొన్ని కార్డు సంస్థలు క్రెడిట్ లిమిట్ మించిపోయినప్పటికీ, లావాదేవీలను అనుమతిస్తుంటాయి. కాకపోతే అందుకు ఓవర్ లిమిట్ ఫీజు వడ్డిస్తాయి. పెనాల్టీ వడ్డీ రేట్లను కొన్ని అమలు చేస్తాయి. ఇవి సాధారణ రేట్ల కంటే అధికంగా ఉంటాయి’’అని ఆదిల్ శెట్టి వివరించారు. క్రెడిట్ ఓవర్ లిమిట్‌పై చార్జీలు అన్ని క్రెడిట్ కార్డు సంస్థల్లో ఒకే విధంగా ఉండవు. కొన్ని బ్యాంక్‌లు 2.5 శాతం లేదా కనీసం రూ.550, కొన్ని సంస్థలు 3 శాతం చొప్పున చార్జీ వసూలు చేస్తున్నాయి. క్రెడిట్ ఓవర్ లిమిట్ ఆప్షన్‌తో కొన్ని ప్రత్యేక కార్డులు కూడా ఉన్నాయి. లేని వారు బ్యాంక్ యాప్ లేదా వెబ్సైట్ ద్వారా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఏదైనా అసాధారణ పరిస్థితుల్లో తప్పించి, దీన్నొక అలవాటుగా మార్చుకోకూడదు. ఒకరికి ఎన్ని కార్డులు ‘‘అందరికీ ఒక్కటే సూత్రం వర్తించదు. ఆర్థిక పరిస్థితులు, ఖర్చు చేసే అలవాట్లపై ఎన్ని క్రెడిట్ కార్డులు అన్నది ఆధారపడి ఉంటుంది. బాధ్యతాయుతంగా వినియోగిస్తూ, సకాలంలో చెల్లింపులు చేసే వారు ఎన్ని కార్డులు అయినా కలిగి ఉండొచ్చు. కాకపోతే ఒకరికి రెండు లేదా మూడు కార్డులు మించి ఉండరాదన్నది సాధారణ సూత్రం’’అని మై మనీ మంత్ర వ్యవస్థాపకుడు రాజ్‌ఖోస్లా వివరించారు. ఆన్లైన్ చెల్లింపులకు వినియోగించేందుకు తక్కువ లిమిట్‌తో ఒక కార్డు, ఇతర ముఖ్యమైన, అత్యవసరాల కోసం మరొక కార్డు కలిగి ఉండొచ్చని ప్లాన్ అహెడ్ వెల్త్ అడ్వైజర్స్ వ్యవస్థాపకుడు విశాల్ ధావన్ సూచించారు. మినిమం డ్యూ ఒక నెలలో కార్డుపై చేసిన వ్యయం మొత్తాన్ని బిల్లు జారీ చేసిన నాటి నుంచి 20 రోజుల్లోపు చెల్లించాల్సి ఉంటుంది. అంత మొత్తం చెల్లించే వెసులుబాటు లేకపోతే, మినిమం డ్యూ అమౌంట్ అని ఉంటుంది. అంత చెల్లించినా సరిపోతుంది. మొత్తం బిల్లులో ఇది సుమారు 5 శాతంగా ఉంటుంది. అప్పుడు మిగిలిన బకాయిపై నెలవారీ 3 శాతానికి పైనే వడ్డీ రేటు పడిపోతుంది. ఇతర చార్జీలు కూడా చెల్లించుకోవాలి. మినిమం డ్యూ అమౌంట్ చెల్లించడం చెల్లింపుల వైఫల్యం కిందకు రాదు. బకాయి మొత్తాన్ని వెంటనే చెల్లించలేని వారు పెద్ద లావాదేవీలను ఈఎంఐ కిందకు మార్చుకోవచ్చు. లేదంటే లోన్ ఎగైనెస్ట్ క్రెడిట్ కార్డ్ (కార్డుపై రుణం) ఆఫర్‌ను వినియోగించుకోవడం ద్వారా రుణం పొంది సత్వర చెల్లింపుల నుంచి గట్టెక్కొచ్చు. క్రెడిట్ లిమిట్ కార్డుపై ఉన్న గరిష్ట వ్యయ పరిమితి ఇది. ఏ కాలంలో అయినా ఈ మేరకు గరిష్టంగా వినియోగించుకోవచ్చు. వినియోగించుకున్న మేర తదుపరి గడువు నాటికి పూర్తిగా చెల్లించేస్తే ఎలాంటి వడ్డీ భారం పడదు. ఆదాయం, వ్యక్తిగత ఆర్థిక చరిత్ర, రిస్క్ ఆధారంగా క్రెడిట్ లిమిట్‌ను కార్డు జారీ సమయంలోనే బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు నిర్ణయిస్తుంటాయి. సాధారణంగా ఆరంభంలో తక్కువ లిమిట్‌తో కార్డులు జారీ చేస్తుంటాయి. కార్డుపై వినియోగం, చెల్లింపుల తీరు ఆధారంగా తర్వాతి కాలంలో ఈ లిమిట్‌ను సవరించుకునే అవకాశం ఉంటుంది. లిమిట్ పెంచుకోవచ్చు.. క్రెడిట్ స్కోర్ మెరుగ్గా ఉండి, కార్డుపై అధిక వ్యయం చేసే వారికి ఉచితంగా లిమిట్‌ను పెంచుకునేందుకు బ్యాంక్‌లు ఆఫర్లు ఇస్తుంటాయి. లేదంటే ఎవరికి వారే స్వచ్ఛందంగా కార్డు సంస్థను సంప్రదించి లిమిట్ పెంచాలని కోరొచ్చు. వినియోగం 70–80 శాతం దాటుతున్న వారు ప్రస్తుత కార్డుపైనే లిమిట్‌ను పెంచుకోవడం లేదంటే మరో కార్డు తీసుకుని వ్యయాలను రెండు కార్డుల మధ్య వైవిధ్యం చేసుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. దీనివల్ల క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో (సీయూఆర్)ను తగ్గించుకోవచ్చు. స్వీయ నియంత్రణ క్రెడిట్ కార్డుపై వాస్తవ రుణ పరిమితి (క్రెడిట్ లిమిట్) కంటే తక్కువ లిమిట్‌ను ఎవరికి వారే విధించుకోవచ్చు. దీనివల్ల వ్యయాలపై నియంత్రణ సాధ్యపడుతుంది. బ్యాంక్/ఎన్బీఎఫ్సీ యాప్ ద్వారా క్రెడిట్ లిమిట్లో మార్పులు చేసుకోవచ్చు. ఉదాహరణకు రూ.3 లక్షల క్రెడిట్ లిమిట్ ఉన్నప్పుడు రూ.లక్ష పరిమితిని సొంతంగా నిర్ణయించుకోవచ్చు. అటువంటప్పుడు కార్డుపై ఒక నెలలో వ్యయం రూ.లక్షకు చేరగానే తదుపరి చెల్లింపులు తిరస్కరణకు గురవుతాయి. ఎలాంటి పెనాల్టీ చార్జీలు పడవు. ఖర్చులు చేయిదాటిపోకుండా, గుర్తు చేసేందుకు ఈ సదుపాయం అక్కరకు వస్తుంది. యాప్‌లోకి వెళ్లి ఈ పరిమితిలో ఎప్పుడైనా మార్పులు చేసుకోవచ్చు. లాభ–నష్టాలు.. → అధిక లిమిట్ అత్యవసర వైద్యం, ప్రయాణాలప్పుడు ఆదుకుంటుంది. → కార్డులు పెరిగేకొద్దీ వాటిపై వ్యయాలు కూడా ఇతోధికం అవుతుంటాయి. అన్నీ కలసి రుణ భారాన్ని పెంచేస్తాయి. → స్వీయ నియంత్రణ లేనట్టయితే, అధిక క్రెడిట్ లిమిట్ విషయంలో హద్దులేనట్టుగా వ్యవహరించినట్టయితే రుణ ఊబిలో చిక్కుకునే ప్రమాదం ఎదురవుతుంది. → కార్డులు ఎక్కువైనప్పుడు వాటి వేర్వేరు గడువు తేదీలను గుర్తు పెట్టుకుని, సకాలంలో చెల్లించాల్సి ఉంటుంది. → చెల్లింపుల వైఫల్యాలు, అధిక క్రెడిట్ వినియోగం క్రెడిట్ స్కోర్‌ను తగ్గించేస్తాయి. → బాధ్యతతో, వివేకంతో వినియోగిస్తే క్రెడిట్ కార్డు ద్వారా తగ్గింపు ఆఫర్లు పొందొచ్చు. వినియోగంపై రివార్డు పాయింట్లను కూడా పొందొచ్చు. క్రెడిట్ స్కోరును బలోపేతం చేసుకోవచ్చు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఆధార్ ఫ్రీ అప్డేట్: గడువు ఆరు రోజులే!
ఆధార కార్డు అప్డేట్ కోసం.. 'యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా' పలుమార్లు గడువును పెంచుకుంటూ వస్తూనే ఉంది. కాగా ఇప్పుడు పొడిగించిన గడువు (డిసెంబర్ 14) సమీపిస్తోంది. ఈ లోపు ఏదైనా మార్పులు చేయాలనుకునేవారు ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు.డిసెంబర్ 14 లోపల ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ చేసుకుంటే.. ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ ఆధార్ సెంటర్‌కు వెళ్లి అప్డేట్ చేసుకుంటే మాత్రం.. రూ. 50 అప్లికేషన్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే మరో మారు గడువును పొడిగిస్తారా అనే విషయం మీద ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.ఆధార్ కార్డు తీసుకుని 10 సంవత్సరాలు పూర్తయిన వారు, ఇప్పటి వరకు స్థాన చలనం చేయకుండా ఉంటే.. లేదా వ్యక్తిగత వివరాలలో ఎలాంటి అప్డేట్ అవసరం లేకుంటే.. అలాంటి వారు తప్పకుండా అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ బయోమెట్రిక్, ఫోటో వంటివి అప్డేట్ చేసుకోవడం ఉత్తమం. దీని వల్ల మోసాలను నివారించవచ్చు.ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ చేసుకోవడం ఎలా?➜మైఆధార్ పోర్టల్ ఓపెన్ చేయండి➜లాగిన్ బటన్ మీద క్లిక్ చేసి.. మీ 16 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, దానికింద క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.➜నెంబర్, క్యాప్చా ఎంటర్ చేసిన తరువాత లాగిన్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి.➜రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.➜అక్కడే డాక్యుమెంట్స్ అప్డేట్, అడ్రస్ అప్డేట్ వంటివన్నీ కనిపిస్తాయి.➜మీరు ఏదైనా అప్డేట్ చేయాలనుకుంటున్నారో దానిపైన క్లిక్ చేసి అప్డేట్ చేసుకోవచ్చు. అయితే దీనికి అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.➜అవసరమైనవన్నీ అప్డేట్ చేసుకున్న తరువాత మీరు సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ పొందుతారు. దీని ద్వారా డాక్యుమెంట్ అప్డేట్ను ట్రాక్ చేయవచ్చు.ఆధార్ కార్డును అప్డేట్ చేయడానికి.. రేషన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు, పాన్ కార్డు, నివాస ధ్రువీకరణ పత్రం, పాస్‌పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఏదైనా డాక్యుమెంట్స్ అవసరం.ఇదీ చదవండి: ఈ ఒక్క ఐడీ ఉంటే చాలు.. ఆధార్ నెంబర్‌తో పనే లేదు! -
ఈ ఒక్క ఐడీ చాలు.. ఆధార్ నెంబర్‌తో పనే లేదు!
ఆధార్ కార్డ్ అనేది భారతీయ పౌరులకు అవసరమైన గుర్తింపు పత్రం. దీనిని చాలా సందర్భాల్లో వివిధ పనులకు వినియోగించుకుంటారు. అయితే ప్రతి పనికి ఆధార్ నెంబర్‌ను ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీనికి బదులు 'వర్చువల్ ఐడీ' (VID) ఉపయోగించవచ్చు. ఇంతకీ ఈ వర్చువల్ ఐడీ అంటే ఏమిటి? దీనివల్ల ఉపయోగాలు ఏమిటనే విషయాలను ఇక్కడా వివరంగా తెలుసుకుందాం.వర్చువల్ ఐడీవర్చువల్ ఐడీ అనేది ఆధార్ కార్డ్‌తో అనుసంధానమైన 16 అంకెల సంఖ్య. దీనిని అసలైన ఆధార్ నెంబర్‌కు బదులుగా ఉపయోగించుకోవడానికి మాత్రమే కాకుండా.. ఈ-కేవైసీ వంటి వాటికోసం కూడా వినియోగించుకోవచ్చు. ఆధార్ నెంబర్ స్థానంలో.. వీఐడీ నెంబర్ ఉపయోగించడం వ్యక్తిగత గోప్యతను నిర్ధారిస్తుంది.ఆధార్ వర్చువల్ ఐడీ ఉపయోగాలు ● బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసుకోవడనికి ● ప్రభుత్వ సర్వీసులకు అప్లై చేసుకోవడనికి ● ఈ-కేవైసీ ప్రక్రియ కోసం ● ఆధార్ పీవీసీ కార్డ్ లేదా ఈ-ఆధార్‌ను డౌన్లోడ్ చేసుకోవడానికి ● ప్రభుత్వ సబ్సిడీలను పొందటానికి ● పాస్‌పోర్టు కోసం అప్లై చేసుకోవడానికి ● కొత్త బీమా పాలసీని కొనుగోలు చేయడానికిఆధార్ వర్చువల్ ఐడీని ఎలా పొందాలి?▸ఆధార్ వర్చువల్ ఐడీ కోసం ముందుగా అధికారిక వెబ్సైట్ 'యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా' (UIDAI)ను సందర్సించాలి.▸అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసిన తరువాత భాషను ఎంచుకోవాలి.▸ఆధార్ సర్వీస్ అనే సెక్షన్లో 'వర్చువల్ ఐడీ జనరేటర్'పైన క్లిక్ చేయాలి. ▸వర్చువల్ ఐడీ జనరేటర్‌పై క్లిక్ చేసిన తరువాత ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి.▸ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తరువాత మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై అండ్ ప్రాసెస్ మీద క్లిక్ చేయాలి. ఆ తరువాత మీకు ఒక 16 అంకెల వర్చువల్ ఐడీ నెంబర్ కనిపిస్తుంది.▸స్క్రీన్‌పైన వర్చువల్ ఐడీ నెంబర్ కనిపించడమే కాకుండా.. మీ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్‌కు మెసేజ్ రూపంలో కూడా వస్తుంది.ఇదీ చదవండి: బ్యాంక్ చెక్‌పై 'ఓన్లీ' అని ఎందుకు రాస్తారో తెలుసా?