Reality
-
హైదరాబాద్‌లో తగ్గిన ఇళ్ల విక్రయాలు.. విలువ ఎంతంటే..
న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో గతేడాది ఇళ్ల అమ్మకాల విలువ చెప్పుకోతగ్గ స్థాయిలో పడిపోయింది. 2023తో పోల్చి చూస్తే 18 శాతం తక్కువగా రూ.1.05 లక్షల కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. 2023లో విక్రయాల విలువ రూ.1.28 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. కానీ, దేశవ్యాప్తంగా టాప్ 9 ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాల విలువ 2024లో నికరంగా 12 శాతం పెరిగి రూ.6,73,000 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. రియల్ ఎస్టేట్ డేటా అనలైటిక్స్ సంస్థ ‘ప్రాప్‌ఈక్విటీ’ ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. 2023లో రూ.6,00,143 కోట్ల విలువైన ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి. ఢిల్లీలో సానుకూల పరిస్థితులు ‘‘ఢిల్లీ–ఎన్సీఆర్ మార్కెట్లో సగటు విక్రయ ధర చదరపు అడుగుకి (ఎస్ఎఫ్టీ) రూ.12,469గా ఉంది. మౌలిక వసతుల అభివృద్ధి మెరుగ్గా ఉండడం, కార్పొరేట్ కంపెనీల ప్రాతినిధ్యం పెరుగుతుండడం, విస్తృత ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రావడంతో డిమాండ్ పెరుగుతోంది’’అని ప్రాప్ ఈక్విటీ వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ జసూజ తెలిపారు. నగరాల వారీగా అమ్మకాలు.. ⇒ గురుగ్రామ్‌లో 2023లో రూ.64,314 కోట్ల ఇళ్ల విక్రయాలు జరిగితే, 2024లో రూ.1,06,739 కోట్లకు పెరిగాయి. ⇒ ఢిల్లీ–ఎన్సీఆర్ ప్రాంతంలో గతేడాది ఇళ్ల అమ్మకాలు 63 శాతం పెరిగి రూ.1,53,000 కోట్లకు చేరాయి. 2023లో అమ్మకాల విలువ రూ.94,143 కోట్లుగానే ఉంది. ⇒ ముంబై మార్కెట్లో అమ్మకాల విలువ 13 శాతం పెరిగి రూ.1.38 లక్షల కోట్లకు చేరింది. ⇒ నవీ ముంబైలోనూ 32 శాతం వృద్ధితో ఇళ్ల అమ్మకాలు రూ.25,000 కోట్లకు చేరాయి. ⇒ థానేలో 6 శాతం అధికంగా రూ.56,000 కోట్ల అమ్మకాలు 2024లో జరిగాయి. ⇒ బెంగళూరు మార్కెట్లో రూ.85,000 కోట్ల విలువైన ఇళ్ల విక్రయాలు గతేడాది జరిగాయి. అంతకుముందు ఏడాది విక్రయాలు రూ.75వేల కోట్లతో పోల్చి చూస్తే 13 శాతం పెరిగాయి. ⇒ చెన్నై మార్కెట్లో 5 శాతం వృద్ధితో ఇళ్ల విక్రయాలు రూ.20,000 కోట్లుగా ఉన్నాయి. ⇒ కోల్‌కతాలో రూ.15,000 కోట్ల అమ్మకాలు చోటుచేసుకున్నాయి. 2023లో విక్రయాలు రూ.13,000 కోట్లతో పోల్చి చూస్తే 15 శాతం వృద్ధి నమోదైంది. ⇒పుణెలో అమ్మకాల విలువ కేవలం ఒక శాతం క్షీణించి రూ.76,000 కోట్లుగా ఉంది. 2023లో ఇక్కడ రూ.77,000 కోట్ల విక్రయాలు జరిగాయి. -
ఇల్లే బంగారమాయె..
బంగారం, గృహం, స్టాక్ మార్కెట్.. ఈ మూడింట్లో ఎందులో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నారని మహిళలను అడిగితే.. ఠక్కున చెప్పే సమాధానం బంగారమే! కానీ, నేటి మహిళల పెట్టుబడి ఆలోచనల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. మొదట సొంతిల్లు.. ఆ తర్వాతే బంగారం, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ అంటున్నారు. 69 శాతం మంది మహిళలు సొంత ఇంటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుండగా.. 31 శాతం మంది పెట్టుబడి కోసం ప్రాపర్టీలను కొనుగోలు చేస్తున్నారని అనరాక్ కన్జ్యూమర్ సెంటిమెంట్ సర్వే వెల్లడించింది. – సాక్షి, సిటీబ్యూరో మన దేశంలో గృహ కొనుగోలు ప్రక్రియలో మహిళలు ఎల్లప్పుడూ కీలక నిర్ణయాధికారులే. మహిళలు స్వతంత్ర, వ్యక్తిగత ఆస్తుల కొనుగోళ్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రాపర్టీ కొనుగోళ్లలో మెజారిటీ మహిళలు తుది వినియోగదారులే. పెట్టుబడి రీత్యా ఆస్తుల కొనుగోళ్లూ ఆశించిన స్థాయిలోనే ఉండటం గమనార్హం. పెరుగుతున్న స్వాతంత్య్రం, వ్యక్తిగత స్వేచ్ఛ, నిర్ణయాధికారం, మెరుగైన ఆదాయ వనరులు కారణంగా గృహ విభాగంలో మహిళా పెట్టుబడిదారులు ఎక్కువగా వస్తున్నారు. 2022 హెచ్2 (జులై–డిసెంబర్)లో మహిళా గృహ కొనుగోలుదారుల్లో తుది వినియోగం: పెట్టుబడి నిష్పత్తి 79:21గా ఉండగా.. 2024 హెచ్2 నాటికి 69:31గా ఉందని తెలిపింది.లాంచింగ్ ప్రాజెక్టుల్లోనే.. సర్వేలో పాల్గొన్న 69 శాతం మహిళలకు రియల్ ఎస్టేట్ అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆస్తి తరగతిగా భావిస్తున్నారు. 2022 హెచ్2లో ఇది 65 శాతంగా ఉండగా.. కోవిడ్ కంటే ముందు 2019 హెచ్2లో 57 శాతంగా ఉంది. గతంలో కొత్తగా ప్రారంభించిన ప్రాజెక్ట్‌లలో కొనుగోళ్లకు 10 శాతం మంది మహిళలు మొగ్గుచూపగా.. ఇప్పుడది 18 శాతానికి పెరిగింది. నిర్మాణం పూర్తయి, గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్లు (రెడీ టు మూవ్) కొనుగోళ్ల ప్రాధాన్యత 29 శాతం మేర తగ్గింది.లగ్జరీకే మొగ్గు.. లగ్జరీ ప్రాపర్టీలకు మహిళలూ ఆసక్తి చూపిస్తున్నారు. రూ.90 లక్షల కంటే ఎక్కువ ధర ఉండే ప్రీమియం ఇళ్ల కొనుగోళ్లకు 52 శాతం ఉమెన్స్ మొగ్గు చూపిస్తున్నారు. వీటిలో 33 శాతం మంది రూ.90 లక్షల నుంచి రూ.1.5 కోట్ల ధర ఉండే ప్రాపర్టీలను ఇష్టపడుతుండగా.. 11 శాతం మంది రూ.1.5 కోట్ల నుంచి రూ.2.5 కోట్ల ధర ఉండే గృహాలను, 8 శాతం మంది రూ.2.5 కోట్ల కంటే ఎక్కువ ధర ఉండే అల్ట్రా లగ్జరీ ప్రాపర్టీల కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తున్నారు. దేశంలో మహిళా హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ) పెరుగుదలకు ఇదే నిదర్శనం.గోల్డ్, స్టాక్ మార్కెట్.. ప్రాపర్టీ తర్వాత మగువలకు అమితాసక్తి బంగారమే. అందుకే రియల్ ఎస్టేట్ తర్వాత గోల్డ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌కే మహిళలు జై కొడుతున్నారు. 2022 హెచ్2లో బంగారంలో పెట్టుబడులకు 8 శాతం మంది మహిళలు ఆసక్తి చూపించగా.. 2024 హెచ్2 నాటికి 12 శాతానికి పెరిగింది. ఇక, ఏటేటా స్టాక్ మార్కెట్ ఆకర్షణ కోల్పోతుంది. రెండేళ్ల క్రితం మార్కెట్లో పెట్టుబడులకు 20 శాతం మంది మహిళలు ఆసక్తి చూపిస్తే.. ఇప్పుడది ఏకంగా 2 శాతానికి పడిపోయింది. -
‘స్త్రీ’రాస్తి రంగంలో.. మహిళలు అంతంతే..
సాక్షి, సిటీబ్యూరో: అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా పోటీ పడుతున్న మహిళలు.. స్థిరాస్తి రంగంలో మాత్రం కాస్త వెనకబడే ఉన్నారు. దేశీయ రియల్ ఎస్టేట్ పరిశ్రమలో మహిళా కార్మికులు పరిమితంగానే ఉన్నారు. ప్రస్తుతం రియల్టీలో 7.1 కోట్ల మంది కార్మికులు పని చేస్తుండగా.. మహిళా కార్మికుల సంఖ్య కేవలం 70 లక్షలే. మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు (ఎల్ఎఫ్పీఆర్) కేవలం 25.1 శాతంగా మాత్రమే ఉందని రియల్టీ సంస్థ మ్యాక్స్ ఎస్టేట్స్, గ్లోబల్ కన్సల్టింగ్ ఇన్ టెన్డమ్ అధ్యయనం వెల్లడించింది. మహిళా జనాభాలో 1.2 శాతమే.. వ్యవసాయం తర్వాత అత్యధిక ఉపాధి, ఉద్యోగ అవకాశాలను సృష్టించే రంగం రియల్ ఎస్టేటే. కానీ, స్థిరాస్తి రంగ శ్రామిక శక్తిలో మహిళ భాగస్వామ్యం అంతంత మాత్రంగానే ఉంది. దేశీయ స్థిరాస్తి రంగం క్రాస్ రోడ్స్‌లో ఉంది. అద్భుతమైన వృద్ధికి సిద్ధంగా ఉంది. అదే సమయంలో తారాస్థాయిలో వృద్ధి చెందకుండా నిరోధించేందుకూ సవాళ్లు ముందున్నాయి. దేశ జనాభాలో మహిళలు 48.5 శాతం మంది ఉన్నారు. ఇందులో దాదాపు 1.2 శాతం మంది మహిళలు రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్నారు.సవాళ్లు ఇవీ.. స్థిరాస్తి రంగంలోని శ్రామిక శక్తిలో అన్ని స్థాయిలలోనూ మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉండటం, అసమాన వేతనం.. ఇవే ఈ రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న ప్రధానమైన సవాళ్లు. లింగ సమానతలు పరిష్కరించడం వల్ల గణనీయమైన ఆర్థిక క ప్రయోజనాలు చేకూరతాయి. ఉత్పాదకత, ఆవిష్కరణలు, లాభదాయకత పెరుగుతాయి. అలాగే ఈ రంగంలో బ్లూ, వైట్ కాలర్ మహిళా కార్మికులను శక్తివంతం చేయడానికి నైపుణ్యాభివృద్ధి, శిక్షణ కార్యక్రమాల అవసరం ఉంది. సరైన నాయకత్వం, సాంకేతికత వినియోగంతోనే దీన్ని సాధించగలమని నివేదిక సూచించింది. -
ఇంటి కొనుగోలు.. ‘ఆమె’కు నచ్చితేనే..
సాధారణంగా మహిళలు వంట గది విశాలంగా ఉండాలని కోరుకుంటారు. కానీ, నేటి అవసరాలు, అభిరుచులు మారుతుండటంతో ఆధునిక వసతులనూ కోరుకుంటున్నారు. జిమ్, మెడిటేషన్ వంటి సౌకర్యాలతో పాటు వాకింగ్, జాగింగ్ ట్రాక్స్, గ్రీనరీ స్పేస్, పిల్లల కోసం పార్క్, స్పోర్ట్స్ వంటి వసతులను ఎంచుకుంటున్నారని ఆర్క్ గ్రూప్ సీఈఓ మేఘన గుమ్మి తెలిపారు. గృహిణి, ఉద్యోగిని ఎవరైనా సరే ఇంటిని, కుటుంబ సభ్యుల బాగోగులను చూసుకునేది మహిళే. దీంతో ఇంట్లో ఏ గదికి ఎంత స్పేస్ అవసరమో నిర్ణయించగలదు. వాస్తవానికి పురుషుల కంటే మహిళలకే దృశ్యీకరణ (విజువలైజేషన్) శక్తి ఎక్కువగా ఉంటుంది. తాను ఉండబోయే కిచెన్, బెడ్ రూమ్, బాల్కనీ ఇంట్లోని ప్రతీది ఏ విధంగా ఉండబోతుందో ఊహించగలదు. –సాక్షి, సిటీబ్యూరోఐదారేళ్ల క్రితం వరకూ రియల్ ఎస్టేట్ రంగంలో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉండేది. అయితే స్థిరాస్తి రంగంలో వృత్తి నైపుణ్యం, ఆదాయ వనరులు పెరగడం, వర్క్ కల్చర్ మారడంతో క్రమంగా ఈ విభాగంలో మహిళలు ప్రవేశిస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్, హెచ్ఆర్, మార్కెటింగ్, సేల్స్ విభాగంలోనే కాదు సైట్ల మీద కూడా మహిళలు పనిచేసే స్థాయికి ఎదిగారు. దీంతో రియల్టీ సెక్టార్ అసంఘటిత రంగం నుంచి సంఘటిత రంగంగా అభివృద్ధి చెందుతుంది. ఐటీ, ఫార్మా వంటి రంగాల్లో మాదిరిగా రియల్టీ సెగ్మెంట్లోనూ వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి.ఆమెకు నచ్చితేనే.. ఇల్లు కొందామని నిర్ణయించుకున్నాక.. ప్రాంతం, ధర, ప్రాజెక్ట్, వసతులు ఏవైనా సరే భర్తకు నచ్చినా సరే అంతిమంగా నిర్ణయించాల్సింది, ఓకే చేయాల్సిందీ ఇల్లాలే. ఆమెకు నచ్చకుండే ఇంటి కొనుగోలు చేయరు. సొంతింటి ఎంపికలో మహిళల పవర్ అదీ. అపార్ట్మెంట్లతో పోలిస్తే విల్లాలలో ఓపెన్ స్పేస్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉండటంతో నేటి యంగ్ ఉమెన్స్ విల్లాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మరోవైపు నిర్ణయాధికారం, కొనుగోలు శక్తి పెరగడంతోనూ ప్రాపర్టీలకు డిమాండ్ ఏర్పడింది.ఇన్ఫ్రాకు నీడ రియల్టీ.. మనల్ని అంటిపెట్టుకొని నీడ ఎలాగైతే ఫాలో అవుతుందో.. ఇన్ఫ్రాకు రియల్ ఎస్టేట్ కూడా అంతే. మౌలిక వసతులు అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలోనే రియల్ పరుగులు పెడుతుంది. భూముల ధరలు పెరగడంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో అభివృద్ధి చెందుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం సౌత్ హైదరాబాద్ వైపు ఫోకస్ పెట్టింది. కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, రాయదుర్గం వంటి పశ్చిమ ప్రాంతాలు ఇప్పటికే కిక్కిరిసిపోయాయి. ఇక్కడ సామాన్యులు కొనే పరిస్థితి లేదు. సౌత్‌లో ఇన్ఫ్రా డెవలప్మెంట్తో కొత్తూరు, షాద్‌నగర్, ఆదిభట్ల, ముచ్చర్ల వంటి దక్షిణ ప్రాంతాలు బాగా డెవలప్ అవుతాయి. ప్రస్తుతం ఆయా ప్రాంతాలలో ధరలు తక్కువగా ఉన్నాయి కాబట్టి సామాన్య, మధ్యతరగతి ఈ టైమ్‌లో కొనుగోలు చేయడం ఉత్తమం. ఏ నగరమైనా సమాంతరంగా అభివృద్ధి చెందాలి. కానీ, మౌలిక వసతుల కల్పనలో హెచ్చు తగ్గులు కారణంగా అభివృద్ధి కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. దీంతో హైదరాబాద్‌లో వెస్ట్, సౌత్ జోన్లో భూముల ధరలు బాగా పెరిగాయి. మూసీ సుందరీకరణ, మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్డు, ఫ్యూచర్ సిటీ.. హైదరాబాద్ స్థిరాస్తి రంగాన్ని నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లడం ఖాయం. ఈ బృహత్తర ప్రాజెక్ట్‌లతో రియల్ ఎస్టేట్ మార్కెట్ మళ్లీ పుంజుకోవడం ఖాయం. -
ఇంటి ఓనర్ మహిళ అయితే ఎన్ని ప్రయోజనాలో..
ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలంటారు పెద్దలు. కానీ, ఇల్లే ఇల్లాలి పేరు మీద ఉండాలంటారు నిపుణులు! రెండూ నిజమే. మొదటి దాని గురించి చర్చ అవసరం లేకపోయినా.. రెండో దాని గురించి మాత్రం అవసరమే. ఎందుకంటే ఇంటి ఓనర్ లేదా కో–ఓనర్ మహిళ అయితే ఎన్నో ప్రయోజనాలున్నాయి గనక! గృహ రుణం నుంచి మొదలు పెడితే వడ్డీ రాయితీ, ఆదాయ పన్ను మినహాయింపు, స్టాంప్ డ్యూటీ తగ్గింపు.. ఇలా ఎనెన్నో ప్రయోజనాలున్నాయి. అందుకే తెలివైన గృహ కొనుగోలుదారుడు ఇంటిని భార్య, తల్లి లేకపోతే అక్క, చెల్లి మొత్తమ్మీద మహిళ పేరు మీద కొనుగోలు చేస్తారని నిపుణులు చెబుతున్నారు. – సాక్షి, సిటీబ్యూరోస్టాంప్ డ్యూటీలో తగ్గింపు.. పలు రాష్ట్రాలు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ల సమయంలో మహిళలకు స్టాంప్ డ్యూటీ రాయితీని అందిస్తున్నాయి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మహిళలకు 1 శాతం రాయితీ ఉండేది. ప్రస్తుతం లేదు. ఢిల్లీలో ప్రాపర్టీ కొనుగోలుదారులకు మగవారికైతే ప్రాపర్టీ విలువలో 6 శాతం స్టాంప్ డ్యూటీ వసూలు చేస్తుండగా.. మహిళ ఓనరైతే 4 శాతం చెల్లించాల్సి ఉంటుంది. జమ్మూ అండ్ కశ్మీర్లో అయితే మహిళ ప్రాపర్టీ కొనుగోలుదారులకు స్టాంప్ డ్యూటీనే లేదు. ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనూ మహిళా ఓనర్లకు స్టాంప్ డ్యూటీ మినహాయింపులు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అయితే పట్టణ, గ్రామీణ ప్రాంతాల వర్గీకరణ ఆధారంగా కూడా స్టాంప్ డ్యూటీలో మినహాయింపు ఉంది.ఐటీప్రయోజనాలు..గృహ యజమాని లేదా సహ–యజమాని మహిళ అయితే ఆదాయ పన్ను మినహాయింపులు కూడా ఉన్నాయి. భార్యభర్తలు ఇద్దరూ ఉద్యోగులైతే ఇద్దరు వేర్వేరుగా అసలు, వడ్డీలపై ఐటీ తగ్గింపులను క్లయిమ్ చేసుకునే వీలుంది. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ ప్రకారం సహ దరఖాస్తుదారు ప్రిన్సిపల్ అమౌంట్‌పై ఏడాదికి రూ.1.5 లక్షల వరకు, చెల్లించిన వడ్డీపై రూ.2 లక్షల వరకు ప్రయోజనాన్ని పొందవచ్చు. అలాగే సెక్షన్ 80ఈఈ కింద ఇతర క్లెయిమ్‌లతో పాటు తొలిసారి గృహ యజమానురాలు మహిళ అయితే ప్రిన్సిపల్ అమౌంట్ మీద రూ.50 వేలు తగ్గింపు కూడా అందుతుంది. అద్దె ఆదాయంపై కూడా.. మహిళలు ఆస్తిని విక్రయించేటప్పుడు క్యాపిటల్ గెయిన్ మినహాయింపులను కూడా పొందవచ్చు. అంతేకాకుండా ప్రాపర్టీని మహిళలు అద్దెకు ఇస్తే.. ఆమె రెండు రకాల తగ్గింపులకు క్లయిమ్ చేసుకోవచ్చు. అద్దెకు ఇచ్చిన ప్రాపర్టీపై ఏదైనా లోన్‌పై చెల్లించే వడ్డీపై పన్ను తగ్గింపుతో పాటు రెంటల్ ఆదాయంపై 30 శాతం స్టాండర్డ్ డిడెక్షన్ లభిస్తుంది. అయితే పన్ను ప్రయోజనాలను క్లెయిమ్ చేయాలంటే మహిళలకు ఆదాయ వనరులు ఉండాల్సిందే. గృహ రుణ వడ్డీ రేట్ల తగ్గింపు..బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలు మహిళలను విశ్వసనీయ రుణ గ్రహీతలుగా పరిగణిస్తుంటాయి. అందుకే స్థిరాస్తి రంగంలో మహిళా పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక రుణ కార్యక్రమాలను, స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకొస్తుంటాయి. తక్కువ వడ్డీ రేట్లకు రుణాలను అందిస్తున్నాయి. ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ వంటి బ్యాంకులలో పురుష రుణ గ్రహీతలతో పోలిస్తే మహిళలకు హోమ్ లోన్ వడ్డీ రేట్లు 0.5 నుంచి 1 శాతం తక్కువగా ఉంటాయి.ఈ శాతం తక్కువగా కనిపిస్తున్నప్పటికీ దీర్ఘకాలంలో డబ్బు, ఈఐఎంను ఆదా చేస్తుంది. ప్రధాన్‌మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద లో ఇన్‌కం గ్రూప్(ఎల్ఐజీ) కేటగిరీ కింద మహిళలకు రూ.6 లక్షల రుణానికి 6.5 శాతం వడ్డీ రాయితీతో.. రూ.2.67 లక్షల వరకు సబ్సిడీని పొందవచ్చు. ఇన్‌కం సోర్స్ లేని మహిళలకు బ్యాంక్‌లు రుణాలను అందించవు.వారసులకు బదిలీ సులువు..మహిళ పేరిట ప్రాపర్టీ ఉంటే అది ఆమె ఎస్టేట్‌లో భాగమవుతుంది. ఎటువంటి చట్టపరమైన చిక్కులు లేకుండా ఆమె వారసులకు సులభంగా బదిలీ అవుతుంది. అయితే విడాకుల సమయంలో సేల్‌డీడ్ ఆధారంగా ఆస్తి కేటాయింపులు ఉంటాయి. ఏదైనా చట్టపరమైన వివాదాలు తలెత్తితే ఆస్తి మహిళ పేరు మీద ఉన్నప్పటికీ భర్త ఉమ్మడిగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. -
హైదరాబాద్‌లో రూ.1,500 కోట్ల రియల్ఎస్టేట్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో మరో భారీ రియల్ ఎస్టేట్ (Real Estate) ప్రాజెక్ట్ రాబోతోంది. రియల్ ఎస్టేట్ రంగంలో తన ముద్రను విస్తరించడానికి జువారీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యాజమాన్యంలోని అనుబంధ సంస్థ జువారి ఇన్‌ఫ్రావరల్డ్ ఇండియా లిమిటెడ్ (జువారీ ఇన్ఫ్రా) గంగోత్రి డెవలపర్స్‌తో డెవలప్మెంట్ మేనేజ్మెంట్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. హైదరాబాద్ లోని కొల్లూరు మైక్రో మార్కెట్ లో సుమారు 9.4 ఎకరాల విస్తీర్ణంలో ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్టును అభివృద్ధి చేయడమే ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం లక్ష్యం.1,730 అపార్ట్మెంట్లు"జువారి గంగోత్రి త్రిభుజ" పేరుతో చేపట్టిన ఈ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ కొల్లూరు మైక్రో మార్కెట్ లో ఒక మైలురాయిగా నిలవనుంది. ఈ ప్రాజెక్టులో 1,730 విశాలమైన మూడు, నాలుగు పడక గదుల అపార్ట్మెంట్లతో కూడిన తొమ్మిది ఎత్తైన టవర్లు ఉంటాయి. రూ.1,500 కోట్లకు పైగా అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్ సుమారు 3.8 మిలియన్ చదరపు అడుగుల అమ్మకపు విస్తీర్ణాన్ని, సుమారు 5.3 మిలియన్ చదరపు అడుగుల మొత్తం అభివృద్ధి ప్రాంతాన్ని కలిగి ఉంటుంది.ఒప్పందం పరిధిడెవలప్మెంట్ మేనేజ్మెంట్ అగ్రిమెంట్ కింద బ్రాండింగ్, మార్కెటింగ్, సేల్స్, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ (సీఆర్ఎం), నిర్మాణ పర్యవేక్షణతో సహా సమగ్ర నిర్వహణ సేవలను జువారీ ఇన్ఫ్రా అందిస్తుంది. ఈ సహకారం రియల్ ఎస్టేట్ అభివృద్ధిలో జువారీ ఇన్ఫ్రా నైపుణ్యాన్ని, గంగోత్రి డెవలపర్స్ నిర్మాణ సామర్థ్యాలను ప్రపంచ స్థాయి రెసిడెన్షియల్ ప్రాజెక్టును అందించడానికి ఉపయోగిస్తుంది.ఇది చదివారా? హైదరాబాద్‌లో డేటా సెంటర్ల జోరు.. ఆ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ హుషారుసౌకర్యాలు, ఫీచర్లుఈ ప్రాజెక్ట్ అక్కడ నివసించేవారి జీవన అనుభవాన్ని మెరుగుపరచడానికి రూపొందించిన జీవనశైలి సౌకర్యాల శ్రేణిని అందిస్తుంది. స్విమ్మింగ్ పూల్స్, ఫిట్నెస్ సెంటర్లు, క్రీడా సౌకర్యాలు, ల్యాండ్‌స్కేప్డ్ గార్డెన్లతో సహా 50కి పైగా జీవనశైలి సౌకర్యాలతో పాటు సుమారు 100,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక గ్రాండ్ క్లబ్ హౌస్ ప్రధాన ఫీచర్‌గా ఉంటుంది. ఆధునిక నగరవాసుల అవసరాలను తీర్చడం ద్వారా స్థిరమైన జీవన వాతావరణాన్ని అందించడం ఈ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ లక్ష్యం.వ్యూహాత్మక స్థానంవ్యూహాత్మకంగా ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ 2కు కేవలం రెండు నిమిషాల దూరంలో ఉన్న ఈ ప్రాజెక్టు హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి కీలక వ్యాపార కేంద్రాలకు అద్భుతమైన కనెక్టివిటీని అందిస్తుంది. ఈ స్థానం ప్రధాన ఉపాధి కేంద్రాలు, విద్యా సంస్థలు, ఆస్పత్రులు, వినోద కేంద్రాలకు అందుబాటులో ఉంటుంది. ఈ సౌలభ్యాన్నీ కోరుకునే గృహ కొనుగోలుదారులకు ఇది అనువైన ఎంపికగా మారుతుంది. -
హైదరాబాద్‌లో డేటా సెంటర్ల జోరు
దక్షిణాది నగరాల్లో డేటా సెంటర్ల జోరు కొనసాగుతోంది. గ్లోబల్ డేటా సెంటర్లకు చిరునామాగా నిలుస్తున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, వ్యూహాత్మక మౌలిక సదుపాయాల పెట్టుబడులు, డిజిటల్ సేవలకు పెరుగుతున్న డిమాండ్ డేటా సెంటర్ల వృద్ధికి ప్రధాన కారణాలు. ప్రస్తుతం చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో 47 లక్షల చ.అ.ల్లో 213 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. మరో 27 లక్షల చ.అ.ల్లో 186 మెగావాట్లు నిర్మాణ దశలో, 24 లక్షల చ.అ.ల్లో 168 మెగావాట్లు ప్రణాళిక దశలో ఉన్నాయని కొల్లియర్స్ ఇండియా నివేదిక వెల్లడించింది. - సాక్షి, సిటీబ్యూరోప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటా సెంటర్ల సామర్థ్యంలో 35 ఆక్యుపెన్సీ బ్యాకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్ఎస్ఐ) విభాగానిదే.. ఆ తర్వాత 30 శాతం ఐటీ రంగం, 20 శాతం క్లౌడ్ సర్వీస్ విభాగం, ఇతరుల వాటా 15 శాతంగా ఉంది. డేటా సెంటర్ల నెలవారీ ఛార్జీలు కిలోవాట్‌కు రూ.6,650 నుంచి 8,500లుగా ఉన్నాయి.ప్రభుత్వ విధానాలు, మెరుగైన మౌలిక వసతులు, కనెక్టివిటీ కారణంగా హైదరాబాద్‌లో డేటా సెంటర్ల జోరు కొనసాగుతోంది. అత్యంత వేగంగా నగరం డేటా సెంటర్ల హాట్‌స్పాట్‌గా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం భాగ్యనగరంలో 10 లక్షల చ.అ.ల్లో 47 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లు అందుబాటులో ఉండగా.. మరో 3 లక్షల చ.అ.ల్లో 20 మెగావాట్లు నిర్మాణంలో, 5 లక్షల చ.అ.ల్లో 38 మెగావాట్లు ప్రణాళిక దశలో ఉన్నాయి. ప్రస్తుతం నగరంలో మైక్రోసాఫ్ట్, సీటీఆర్ఎల్ఎస్ వంటి పలు సంస్థలు డేటా సెంటర్లున్నాయి. గచ్చిబౌలి, మేకగూడ, షాద్‌నగర్, చందన్‌వ్యాలీ వంటి పలు ప్రాంతాల్లో మరిన్ని డేటా సెంటర్లు రానున్నాయి.రాయితీలు, పన్ను ప్రోత్సాహకాలు.. ప్రత్యేకమైన డేటా సెంటర్ పాలసీలు పెట్టుబడిదారులకు స్పష్టమైన, నిర్మాణాత్మక కార్యచరణకు దోహదపడతాయి. దీంతో ఆయా నగరాల్లో పెట్టుబడుల ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. డేటా సెంటర్ల ఏర్పాటుకు అవసరమైన భూ సేకరణలో గణనీయమైన రాయితీలు, విద్యుత్ టారీఫ్‌లలో తగ్గుదల, గణనీయమైన పన్ను మినహాయింపులు దక్షిణ దేశంలో డేటా సెంటర్ల పెట్టుబడుల ఆకర్షణకు ప్రధాన కారణాలని చెప్పొచ్చు. విద్యుత్, టెలీకమ్యూనికేషన్స్ మౌలిక వసతుల్లో పెట్టుబడులు అధిక వేగం, విశ్వసనీయతను నిర్ధారిస్తుంది. ఇది డేటా సెంటర్ల కార్యకలాపాలకు కీలక అంశం. సరళీకృత విధానాలు, వేగవంతమైన అనుమతి ప్రక్రియలు, బ్యూరోక్రాట్స్ నియంత్రణల తగ్గింపులు వంటివి డేటా సెంటర్ల ప్రాజెక్ట్‌లను ప్రోత్సహిస్తున్నాయి.చెన్నై, బెంగళూరులో.. జలాంతర్గామి కేబుల్ కనెక్టివిటీని అందించే వ్యూహాత్మక తీర ప్రాంతం కారణంగా చెన్నై ప్రధాన డేటా సెంటర్ హబ్‌గా మారింది. ప్రస్తుతం చెన్నైలో 17 లక్షల చ.అ.ల్లో 87 మెగావాట్ల సామర్థ్యం ఉన్న డేటా సెంటర్లు ఉన్నాయి. మరో 23 లక్షల చ.అ.ల్లో 156 మెగావాట్లు నిర్మాణంలో ఉండగా.. 16 లక్షల చ.అ.ల్లో 104 మెగావాట్లు ప్రణాళికలో ఉంది. అనుకూల వాతావరణం, మెరుగైన విద్యుత్ మౌలిక సదుపాయాలు వంటివి చెన్నైని డేటా సెంటర్ల పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మార్చాయి. బెంగళూరు: సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో ప్రస్తుతం 20 లక్షల చ.అ.ల్లో 79 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లున్నాయి. మరో లక్ష చ.అ.ల్లో 10 మెగావాట్లు నిర్మాణంలో, 3 లక్షల చ.అ.ల్లో 26 మెగావాట్లు పైప్‌లైన్‌లో ఉన్నాయి. బలమైన సాంకేతిక నైపుణ్యం, నిపుణుల లభ్యత బెంగళూరు డేటా సెంటర్ల మార్కెట్‌కు చోదకశక్తిగా నిలుస్తున్నాయి.ఐఓటీతో డిమాండ్.. 5జీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ), క్లౌడ్ సర్వీస్‌లు, ఎంటర్‌ప్రైజ్‌ల డిజిటలైజేషన్ పెరుగుదల కారణంగా డేటా సెంటర్ల డిమాండ్ మరింత పెరుగుతుందని కొల్లియర్స్ ఇండియా అడ్వైజరీ సర్వీసెస్ హెడ్ స్వాప్నిల్ అనిల్ అభిప్రాయపడ్డారు. 2030 నాటికి దక్షిణాది నగరాల్లో డేటా సెంటర్ల సామర్థ్యంలో 80 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా వేశారు. -
కో-వర్కింగ్‌కు డిమాండ్..
సాక్షి, సిటీబ్యూరో: కరోనా తర్వాతి నుంచి కో-వర్కింగ్ స్పేస్‌కు డిమాండ్ పెరిగింది. స్టార్టప్స్‌తో పాటు ప్రధాన కంపెనీలు కూడా ఫ్లెక్సిబుల్ వర్క్ ప్లేస్‌ల నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నాయి. దీంతో దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో ప్రతి ఏటా కో–వర్కింగ్ స్పేస్ లావాదేవీల వాటా 20 శాతానికి పైగా ఉంటుంది.కో–వర్కింగ్ స్పేస్ డిమాండ్‌కు ప్రధాన కారణం సిటీ సెంటర్లు లేదా ప్రధాన ఉపాధి కేంద్రాలలో మాత్రమే కాకుండా నగర వ్యాప్తంగా విస్తరించి ఉండటమే.. అభివృద్ధి చెందుతున్న కొత్త ఏరియాలు, శివారు ప్రాంతాలు, గృహ సముదాయాలకు చేరువలో ఈ సెంటర్లు ఉంటున్నాయి. అలాగే ప్రధాన మెట్రో నగరాలలో షాపింగ్ మాల్స్, హోటళ్లలోనూ ఫ్లెక్సిబుల్ స్పేస్‌లు అందుబాటులోకి వచ్చాయి.దీంతో చాలా కంపెనీలు ఉద్యోగుల గృహాలకు చేరువలో ఉండే కో–వర్కింగ్ స్పేస్‌లను తీసుకొని కార్యకలాపాలు సాగిస్తున్నాయని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పూరీ తెలిపారు. అలాగే ఫ్లెకిబుల్ ఆఫీస్ స్పేస్ అద్దె కూడా సాధారణ ఆఫీసు స్పేస్ రెంట్స్‌కు సమానంగా ఉండటం, రెగ్యులర్ ఆఫీసు స్పేస్‌కు ఉండే 3–4 ఏళ్ల లాకిన్ పీరియడ్‌తో పోలిస్తే కో–వర్కింగ్ స్పేస్‌కు కాల పరిమితి ఉండకపోవటం వంటివి కూడా కంపెనీల ఆకర్షణకు కారణాలని ఆయన పేర్కొన్నారు. -
రూ.3 లక్షలకే రెండు గుంటలు.. తొందరపడితే..
‘హైదరాబాద్ నుంచి 140 కి.మీ. దూరంలో ఉన్న నారాయణ్‌ఖేడ్‌లో ఓ నిర్మాణ సంస్థ ఫామ్‌ల్యాండ్ వెంచర్‌ను అభివృద్ధి చేస్తున్నామని ప్రచారం చేస్తుంది. రెండు గుంటలు (242 గజాలు)కు రూ.3 లక్షలు చెల్లిస్తే.. ప్రతినెలా రూ.15 వేల అద్దె చొప్పున 20 నెలల్లో తర్వాత మొదట్లో కట్టిన రూ.3 లక్షలతో సహా మొత్తం రూ.6 లక్షలు కొనుగోలుదారుడికి చెల్లిస్తోంది. అలాగే 4 గుంటల స్థలానికి రూ.6 లక్షలు చెల్లిస్తే.. ప్రతినెలా రూ.30 వేల చొప్పున 20 నెలల తర్వాత రూ.12 లక్షలు, అలాగే 8 గుంటలకు రూ.12 లక్షలు కడితే.. నెలకు రూ.24 వేల చొప్పున 20 నెలల్లో రూ.24 లక్షలు రిటర్న్ చేస్తుంది.’ ఇలా అపార్ట్మెంట్లకు ప్రతినెలా అద్దె చెల్లించినట్లుగానే ఓపెన్ ప్లాట్లకు, ఫామ్ల్యాండ్లకు కూడా రెంట్ చెల్లిస్తామని కొత్త తరహా మోసాలకు తెరలేపారు పలువురు బిల్డర్లు. – సాక్షి, సిటీబ్యూరోఇప్పటికే గృహ నిర్మాణంలో ప్రీలాంచ్ విక్రయాల పేరిట జరిగిన దందాలో మోసపోయిన కొనుగోలుదారులు పోలీసు స్టేషన్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటే.. కొత్తగా బై బ్యాక్, రెంటల్ ఇన్‌కం, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వంటి సరికొత్త ఆఫర్ల పేరిట అమాయకులను నట్టేట ముంచేస్తున్నారు.ఫామ్‌ప్లాట్లు, ఖాళీ స్థలాలను అక్రమ మార్గంలో విక్రయిస్తూ సామాన్యులను నిలువునా ముంచేస్తున్నారు. ఏడాదిలో అద్దెతో సహా కట్టిన సొమ్మును వాపస్ ఇస్తామని నమ్మించి మోసం చేస్తున్నారు. ఒకవేళ ఏడాది తర్వాత మార్కెట్ ఒడిదుడుకులలో ఉన్నా లేక కంపెనీ బోర్డు తిప్పేసినా నష్టపోయేది కొనుగోలుదారుడే. ఎందుకంటే ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం గజానికి రూ.5 వేలు కూడా పలకని ప్రాంతంలో రూ.10 వేలకు పైగానే ధరతో విక్రయించి.. ముందస్తుగానే బిల్డర్లు సొమ్ము వసూలు చేసేస్తున్నారు. కరోనా కాలంలో పుట్టుకొచ్చిన ఏవీ ఇన్ఫ్రాకాన్, జయగ్రూప్, ఫార్చ్యూన్ 99 వంటి పలు కొత్త నిర్మాణ సంస్థలు ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నాయి. డీటీసీపీ, హెచ్ఎండీఏ నుంచి ఎలాంటి నిర్మాణ అనుమతులు, రెరాలో నమోదు చేయకుండానే వెంచర్లను విక్రయిస్తున్నారు. సదాశివపేట, నారాయణ్‌ఖేడ్, నందివనపర్తి, చేవెళ్ల, జనగాం, బచ్చన్నపేట, చౌటుప్పల్, యాదాద్రి వంటి ప్రధాన నగరం నుంచి వందకుపైగా కి.మీ. దూరంలో ఉన్న శివారు ప్రాంతాల్లో ఈ తరహా ప్రాజెక్ట్‌లు కుప్పలుతెప్పలుగా ఉన్నాయి. రహదారులు, విద్యుత్, మురుగునీటి వ్యవస్థ వంటి కనీస మౌలిక వసతులు కూడా సరిగా లేని ప్రాంతాలలో వందలాది ఎకరాలలో ప్రాజెక్ట్‌లు చేస్తున్నామని మాయమాటలు చెబుతున్నారు.నమ్మకస్తులే మధ్యవర్తులుగా.. గ్రామాలు, శివారు ప్రాంతాలలో టీచర్లు, ఎల్ఐసీ ఏజెంట్లు, రిటైర్డ్ ఉద్యోగులను రియల్ ఎస్టేట్ ఏజెంట్లుగా నియమించుకుంటున్నారు. గ్రాఫిక్స్ హంగులను అద్ది రంగురంగుల బ్రోచర్లను ముద్రించి ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం చేస్తూ కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారు. ప్రతినెలా స్టార్ హోటళ్లలో మధ్యవర్తులతో సమావేశం నిర్వహించి, ఎక్కువ విక్రయాలు చేసిన ఏజెంట్లకు విదేశీ టూర్లు, కార్లు, బంగారం వంటివి బహుమతులుగా అందజేస్తున్నారు.ఇదీ చదవండి: లగ్జరీ రియల్ ఎస్టేట్.. మంచి లాభాలకు ఇదే రూట్! -
లగ్జరీ రియల్ ఎస్టేట్.. మంచి లాభాలకు ఇదే రూట్!
సాక్షి, సిటీబ్యూరో: అస్థిరత, వేగంగా మారుతున్న మార్కెట్ యుగంలో పెట్టుబడులకు ఆశించిన లాభాలు రావాలంటే వ్యూహాత్మక, వైవిధ్యభరిత ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. పెట్టుబడి సాధనాలలో రియల్ ఎస్టేట్ దీర్ఘకాలిక సంపద సృష్టి సాధనంగా మారింది. ఇందులోనూ లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఆకర్షణీయమైన పెట్టుబడి మార్గం.వైవిధ్యభరితమైన పెట్టుబడులతో రిస్క్ తక్కువగా ఉండటమే కాకుండా స్థిరమైన, నిరంతర లాభాలను అందుకోవచ్చు. పన్ను ప్రయోజనాలతో పాటు దీర్ఘకాల మూలధన లాభాలు అందుతాయి. సాంప్రదాయ పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో మార్కెట్ హెచ్చుతగ్గులు పెట్టుబడిదారులను అనిశ్చితిలోకి నెట్టేసే భయాందోళనలు కలిగిస్తుంది. ఇలాంటి ప్రతికూల సమయంలో లగ్జరీ రియల్టీ పెట్టుబడులు తక్కువ అస్థిరత, స్థిరమైన, సమతుల్య పెట్టుబడి విధానంతో మార్కెట్ గందరగోళ పరిస్థితుల నుంచి బయటపడవచ్చు.మార్కెట్ సెంటిమెంట్‌పై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. అద్దె ఆదాయం, నిరంతర నగదు ప్రవాహం ఉంటుంది. నివాస, వాణిజ్య, రిటైల్ ఇలా ప్రాపర్టీ రకాలు, ప్రాంతాలను బట్టి ఆదాయ వృద్ధిలో ప్రయోజనాలను అందుకోవచ్చు. పెట్టుబడులకు భద్రతతో పాటు దీర్ఘకాలిక రాబడులు ఉంటాయి. ద్రవ్యోల్బణం కాలక్రమేణా పెట్టుబడుల విలువలను తగ్గిస్తుంది.కానీ, స్థిరాస్తి రంగంలో పెట్టుబడులపై చాలా కాలంగా ద్రవ్యోల్బణ ఒత్తిడి లేదు. వినియోగదారుల ధరలు పెరిగే కొద్దీ స్థిరాస్తి విలువ కూడా పెరుగుతుంది. స్థిరాస్తి రంగంలో పెట్టుబడులపై దీర్ఘకాలిక మూలధన లాభాలను అందుకోవచ్చు. 2021లో 200 బిలియన్ డాలర్లుగా ఉన్న భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ 2030 నాటికి ఒక ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ అంచనా వేసింది. -
హైదరాబాద్‌లో ‘గ్లోబల్’ జోష్
గ్లోబల్ కేపబులిటీ సెంటర్స్(GCC)లకు ఇండియా ప్రధాన కేంద్రంగా మారింది. అంతర్జాతీయ బహుళ జాతి సంస్థలు ఇక్కడ జీసీసీ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తున్నాయి. గతేడాది దేశంలోని 7 ప్రధాన నగరాల్లో 2.83 కోట్ల చ.అ. జీసీసీ ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరిగాయని అనరాక్ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. - సాక్షి, సిటీబ్యూరోరెండేళ్లలో ఏకంగా 5.28 కోట్ల చదరపు అడుగుల డీల్స్ పూర్తయ్యాయి. జీసీసీ లావాదేవీల్లో ఐటీ హబ్‌లైన బెంగళూరు, హైదరాబాద్‌లు పోటీపడుతున్నాయని పేర్కొంది. 1.2 కోట్ల చదరపు అడుగులతో బెంగళూరు టాప్‌లో ఉండగా హైదరాబాద్‌లో 48.6 లక్షల చదరపు అడుగుల మేర జీసీసీ ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరిగాయి.జీసీసీ అంటే? అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలకు చెందిన అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలు తమ ప్రధాన కార్యాలయాలకు పొరుగు, ప్రాసెస్ సేవలను అందించేందుకు నైపుణ్యంతో పాటు చవకగా మానవ వనరులు లభించే ఇతర దేశాల్లో ఏర్పాటు చేసుకునే ఉప కార్యాలయాలనే గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు (జీసీసీ)లుగా పేర్కొంటారు.మూడో స్థానంలో హైదరాబాద్దేశంలోని బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (BFSI) రంగానికి చెందిన జీసీసీలలో దాదాపు 35% లేదా 42 బెంగళూరులో ఉండగా 16 జీసీసీలతో హైదరాబాద్.. ఢిల్లీ ఎన్సీఆర్ (22) తర్వాత మూడవ స్థానంలో ఉంది. అయితే నైపుణ్యాలు కలిగిన 19% మంది యాక్టివ్ ఉద్యోగార్థులతో రెండవ స్థానంలో ఉందని కెరీర్‌నెట్ తెలిపింది. -
రోహిత్ శర్మ అపార్ట్మెంట్ అద్దె ఎంతంటే..?
సొంతంగా అపార్ట్మెంట్ కొనుగోలు చేసి చాలామంది అద్దెలతోనే రూ.వేలు సంపాదిస్తున్నారు. విభిన్న రంగాల్లో తాము సంపాదించిన డబ్బంతా రియల్టీలో పెట్టుబడిగా పెట్టి రెగ్యులర్ ఇన్కమ్గా మలుచుకుంటున్నారు. తమ స్థాయికి తగినట్లు దాదాపు చాలామంది ఈ వ్యాపారంలో రాణిస్తున్నారు. అలాంటివారిలో ప్రముఖ భారత క్రికెటర్ రోహిత్ శర్మ ఏమీ తీసిపోలేదు. ముంబయిలోని లోయర్ పరేల్‌లో ఉన్న తన విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను ఇటీవల నెలకు రూ.2.6 లక్షలకు లీజుకు ఇచ్చారు. జనవరి 2025లో నమోదైన ఈ రియల్టీ లావాదేవీకి సంబంధించిన వివరాలను స్క్వేర్ యార్డ్స్ విడుదల చేసింది.ప్రైమ్ లొకేషన్, ప్రీమియం సౌకర్యాలుమాక్రోటెక్ డెవలపర్స్ లిమిటెడ్ (లోధా గ్రూప్) అభివృద్ధి చేసిన హై-ఎండ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ‘లోధా మార్క్విస్-ది పార్క్’లో ఈ అపార్ట్మెంట్ ఉంది. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ), నారిమన్ పాయింట్ వంటి ప్రధాన వ్యాపార ప్రాంతాలకు సమీపంలో ఉండడంతో భారీగా డిమాండ్ ఏర్పడింది. రోహిత్ శర్మకు చెందిన ఈ ప్రాపర్టీలో 1,298 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా, రెండు కార్ పార్కింగ్ స్థలాలు ఉన్నాయి. రోహిత్, అతని తండ్రి గురునాథ్ శర్మ 2013 మార్చిలో రూ.5.46 కోట్లకు ఈ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. స్క్వేర్ యార్డ్స్ వివరాల ప్రకారం ప్రస్తుత అద్దె ఆదాయం నెలకు రూ.2.6 లక్షలుగా ఉంది. ఇది 6 శాతం అద్దె రాబడిని ప్రతిబింబిస్తుంది.లోధా మార్క్విస్-ది పార్క్‌లో శర్మ కుటుంబానికి ఉన్న ఆస్తి ఇది ఒక్కటి మాత్రమే కాదు. మరో అపార్ట్‌మెంట్‌ను కూడా కొనుగోలు చేశారు. దీన్ని 2024 అక్టోబర్‌లో నెలకు రూ.2.65 లక్షలకు అద్దెకు ఇచ్చారు. ఇది ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్లో వ్యూహాత్మక పెట్టుబడులను హైలైట్ చేస్తుంది.ఇదీ చదవండి: రోజూ రెండు కోట్ల మంది భక్తులు.. అంతరాయంలేని కనెక్టివిటీ!ముంబయి స్థిరాస్తి మార్కెట్ ఎదుగుదలకు కారణాలు..ముంబయి భౌగోళిక పరిమితులు రియల్టీ రంగాన్ని భారీగా పెంచుతున్నాయి. ఒక వైపు అరేబియా సముద్రం ఉండడం, మరోవైపు విస్తరణకు పరిమిత భూమి ఉండడం ప్రాపర్టీ ధరల పెరుగుదలకు కారణమవుతుంది. ప్రధాన ఆర్థిక కేంద్రంగా, మెరుగైన ఉద్యోగ అవకాశాలు, జీవన ప్రమాణాలను కోరుకునే ప్రజలను ముంబయి ఆకర్షిస్తుంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) వంటి అనేక బహుళజాతి సంస్థలు, ఆర్థిక సంస్థలకు పుట్టినిల్లు ముంబయి. వృత్తి నిపుణులు, విద్యార్థులు, ప్రవాసుల రాక కారణంగా అద్దె ఆస్తులకు డిమాండ్ ఎక్కువగా ఉంది. దక్షిణ ముంబయి, బాంద్రా, అంధేరి, పొవాయ్ వంటి ప్రాంతాల్లో అద్దె భారీగా ఉంటుంది. -
భారత్‌లో ఖరీదైన నివాసాలు వీరివే!.. జాబితాలో ఫస్ట్ ఎవరంటే?
ప్రపంచంలో చాలామంది ధనవంతులు ఉన్నారు, వీరిలో దాదాపు అందరూ.. విలాసవంతమైన జీవితాలను గడుపుతూ, ఖరీదైన బంగ్లాలు, వాహనాలు కలిగి ఉన్నారు. అయితే అత్యంత విలాసవంతమైన లేదా ఖరీదైన నివాసాలను కలిగి ఉన్న.. కుబేరులు ఎవరు? వారికి సంబంధించిన రియల్ ఎస్టేట్స్ వంటివి ఈ కథనంలో తెలుసుకుందాం..ముఖేష్ అంబానీభారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నివాసాన్ని కలిగి ఉన్నారు. ముంబైలో ఉన్న 27 అంతస్తుల నివాసం (ఆంటిలియా) విలువ దాదాపు రూ. 15,000 కోట్లు. ఇది కాకుండా దుబాయ్‌లోని పామ్ జుమేరాలో బంగ్లా, యూకేలోని బకింగ్‌హామ్‌షైర్ ఎస్టేట్, మాన్‌హట్టన్‌లో లగ్జరీ హోటల్ (న్యూయార్క్) వంటివి ఉన్నాయి.పంకజ్ ఓస్వాల్2023లో స్విట్జర్లాండ్‌లోని జింగిన్స్లో.. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన భవనాలలో ఒకటైన 'వరి విల్లా' (Vari Villa)ను కొనుగోలు చేశారు. 40,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ నిర్మాణ కళాఖండాన్ని ఒబెరాయ్ ఉదయవిలాస్, ది లీలా హోటల్స్ వంటి వాటికి ప్రసిద్ధి చెందిన జెఫ్రీ విల్కేస్ రూపొందించారు. దీని ధర రూ. 1,650 కోట్లు.లక్ష్మీ మిట్టల్ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరైన.. లక్ష్మీ మిట్టల్ లండన్‌లో 'బిలియనీర్స్ రో'లో రెండు విలాసవంతమైన భవనాలను కలిగి ఉన్నారు. వీటి విలువ రూ. 2,000 కోట్ల కంటే ఎక్కువ ఉంటుందని సమాచారం. ఇది మాత్రమే కాకుండా.. ఢిల్లీలో కూడా రూ. 31 కోట్ల ఖరీదైన బంగ్లా కలిగి ఉన్నారు. రియల్ ఎస్టేట్ కాకుండా.. క్వీన్స్ పార్క్ రేంజర్స్ అనే ఫుట్‌బాల్ క్లబ్‌కు యజమానిగా ఉన్నారు.అదార్ పూనవాలాసీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ 'అదార్ పూనవల్లా' 2023 చివరిలో లండన్‌లోని హైడ్ పార్క్ సమీపంలోని అబెర్కాన్వే హౌస్‌ను సుమారు రూ. 1,444 కోట్లకు కొనుగోలు చేశారు. ఇది 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇది ఒకప్పుడు డొమినికా కుల్జిక్ యాజమాన్యంలో ఉండేది.హిందూజా బ్రదర్స్హిందూజా సోదరులు ప్రకాష్, అశోక్, శ్రీచంద్, గోపీచంద్.. కార్ల్టన్ హౌస్ టెర్రస్ అనే విలాసవంతమైన ఆరు అంతస్తుల విలాసవంతమైన ప్యాలెస్ కలిగి ఉన్నారు. ఇది లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్ దగ్గర ఉంది. దీనిని 2006లో కొనుగోలు చేశారు. ఇది యూకేలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన భవనాలలో ఒకటిగా ఉంది.ఇదీ చదవండి: రోజుకు రూ.27 కోట్లు విరాళం ఇచ్చిన వ్యక్తి.. ఈయన గురించి తెలుసా?రవి రుయాఎస్సార్ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు 'రవి రుయా' 2023లో లండన్‌లోని హనోవర్ లాడ్జ్‌ను సుమారు రూ. 1,200 కోట్లకు కొనుగోలు చేశారు. ఇది కూడా అత్యంత ఖరీదైన విలాసవంతమైన భవనాలలో ఒకటిగా ఉంది. -
హైదరాబాద్‌లో పెరిగిన ఇళ్ల ధరలు.. ఎంతంటే..
హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల ధరలు గత అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో 2 శాతం పెరిగినట్టు క్రెడాయ్–కొలియర్స్–లైసస్ ఫొరాస్ సంయుక్త నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా టాప్–8 నగరాల్లో ఇళ్ల ధరలు సగటున 10 శాతం పెరగ్గా.. అత్యధికంగా ఢిల్లీ ఎన్సీఆర్లో 31 శాతం ఎగసినట్టు తెలిపింది. ఈ మేరకు ఒక నివేదిక విడుదల చేసింది. బలమైన డిమాండ్‌కుతోడు అధిక నిర్మాణ వ్యయాలు ధరలు పెరగడానికి దారితీసినట్టు పేర్కొంది. వరుసగా 16వ త్రైమాసికంలోనూ ఇళ్ల ధరలు పెరిగినట్టు ఈ నివేదిక వెల్లడించింది. విశాలమైన ఇళ్లు, మెరుగైన జీవనశైలికి ప్రాధాన్యం వంటివి హౌసింగ్ డిమాండ్‌ను పెంచినట్టు క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ బొమన్ ఇరానీ తెలిపారు. నిర్మాణ వ్యయాలు, భూమి కొనుగోలు ధరలు పెరగడం ధరలకు ఆజ్యం పోసినట్టు చెప్పారు. రేట్ల తగ్గింపుతో విక్రయాలకు ఊతంటాప్–8 నగరాల్లో ఈ ఏడాది కూడా ఇళ్ల ధరలు పెరుగుతాయని కొలియర్స్ ఇండియా సీఈవో బాదల్ యాగ్నిక్ అంచనా వేశారు. ‘రానున్న రోజుల్లో బెంచ్‌మార్క్ రుణ రేట్లు మరింత తగ్గే అవకాశాలున్నాయి. దీంతో చాలా పట్టణాల్లో ఇళ్ల విక్రయాలు పుంజుకోవచ్చు. దీంతో ఇళ్ల ధరలు గతంలో మాదిరే 2025లోనూ పెరిగే అవకాశం ఉంది’ అని యాగ్నిక్ వివరించారు. అందుబాటు ధరల ఇళ్లు, మధ్యస్థ ధరల విభాగంలో ఇళ్ల సరఫరా, విక్రయాలు రానున్న రోజుల్లో పెరగొచ్చని లైసస్ ఫొరాస్ ఎండీ పంకజ్ కపూర్ అంచనా వేశారు. డిసెంబర్ త్రైమాసికంలో ఇళ్ల విక్రయాలు స్వల్పంగా తగ్గాయని, కొత్త ఇళ్ల ఆవిష్కరణ మోస్తరుగా ఉండడాన్ని కారణంగా పేర్కొన్నారు.ఇదీ చదవండి: జీసీసీలు @ రూ.8.72 లక్షల కోట్లుపట్టణాల వారీగా ధరల పెరుగుదలహైదరాబాద్లో 2024 అక్టోబర్–డిసెంబర్ క్వార్టర్లో ఇళ్ల ధరలు అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 2 శాతం పెరిగాయి. చదరపు అడుగు (ఎస్ఎఫ్టీ) ధర రూ.11,351కి చేరింది. ఢిల్లీ ఎన్సీఆర్లో ఎస్ఎఫ్టీ ధర 31 శాతం ఎగసి రూ.11,993కు చేరింది. బెంగళూరులో 23 శాతం పెరిగి ఎస్ఎఫ్టీ ధర రూ.12,238గా ఉంది. అహ్మదాబాద్‌లో ధరలు 15 శాతం పెరగడంతో చదరపు అడుగు రూ.7,725కు చేరింది. చెన్నైలో 6 శాతం వృద్ధితో ఎస్ఎఫ్టీ ధర రూ.8,141గా ఉంది.ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో ధరలు 3 శాతం పెరగడంతో ఎస్ఎఫ్టీ రూ.20,725కు చేరింది. పుణెలో ఇళ్ల ధరలు 9 శాతం పెరిగాయి. ఎస్ఎఫ్టీ రూ.9,982గా నమోదైంది. కోల్‌కతాలో అతి తక్కువగా ఒక శాతం ధర పెరగడంతో ఎస్ఎఫ్టీ రూ.7,971కి చేరింది. -
ఇళ్లు కట్టి.. ఈవీ చార్జింగ్ ఎక్కడ?
ప్రజల్లో పర్యావరణ స్పృహ పెరిగిపోయింది.. మంచిదే..! శబ్ద, వాయు కాలుష్యంతో మానవాళికి ఉపద్రవంగా మారుతున్న పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలు(ఈవీ) వినియోగించాలని వినియోగదారులు భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం కూడా ఈవీ వాహనాల కొనుగోళ్లు, వినియోగంపై ప్రత్యేక రాయితీలు అందిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఈవీ పాలసీని సైతం తీసుకొచ్చింది. అయితే వాహనాల కొనుగోళ్లకు రాయితీలు ఇస్తేనే సరిపోదు.. ఆయా వాహనాల చార్జింగ్ పాయింట్లు, స్టేషన్ల ఏర్పాటుపై కూడా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. – సాక్షి, సిటీబ్యూరోఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ డెవలపర్లకు వ్యాపారంతో పాటు సామాజిక బాధ్యత కూడా కాస్త ఎక్కువే. ప్రభుత్వం ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం పెద్ద ఎత్తున మౌలిక వసతులు కల్పిస్తున్న తరుణంలో.. బిల్డర్లు కూడా తమవంతు బాధ్యతగా భవన సముదాయాల్లోనే ఈవీ స్టేషన్ల ఏర్పాటుకు ముందుకు వస్తున్నారు. ఇక్కడే స్పష్టత లోపించింది. భవన సముదాయాల్లో ఎక్కడ ఈవీ స్టేషన్లు, పాయింట్లను ఏర్పాటు చేయాలనే దానిపై స్పష్టత కొరవడింది. బేస్మెంట్, సెల్లార్లోనా లేదా బయట ఓపెన్ స్పేస్‌లో ఈవీ స్టేషన్ ఏర్పాటు చేయాలా? అనే అంశంపై ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయలేదు. దీంతో ఈవీ పాలసీ అమలులో ఉన్నా.. స్పష్టత లేకపోవడంతో స్టేషన్ల ఏర్పాటుకు బిల్డర్లు వెనుకంజ వేస్తున్నారు.బిల్డర్‌ను బాధ్యుడిని చేస్తే ఎలా? ప్రస్తుతం గృహ కొనుగోలుదారులు వారి అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా నివాస సముదాయాల్లో వసతులను కోరుకుంటున్నారు. పర్యావరణ స్పృహ పెరిగిన నేపథ్యంలో కస్టమర్లు వారు ఉండే చోటే ఈవీ చార్జింగ్ స్టేషన్ ఉండాలని అడుగుతున్నారు. అయితే ప్రభుత్వం నుంచి స్పష్టమైన నిబంధనలు లేకపోవడంతో బిల్డర్లు పునరాలోచనలో పడుతున్నారు. ఒకవేళ సెల్లార్లో ఈవీ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో ఏమైనా ప్రమాదాలు సంభవిస్తే దానికి బిల్డర్‌ను బాధ్యులు చేస్తే ఎలా? అని సంశయంలో పడిపోతున్నారు.ఈవీపై స్పష్టత అవసరమే.. సాధారణంగా బిల్డర్ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసిన తర్వాత నివాస సముదాయాన్ని అసోసియేషన్‌కు అప్పచెబుతాడు. వారు ఈవీ చార్జింగ్ స్టేషన్‌ను సరిగా నిర్వహణ చేయపోయినా, ఇతరత్రా కారణాల వల్ల ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఎలా? అని పలువురు డెవలపర్లు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో నివాస సముదాయాల్లో ఈవీ స్టేషన్ల ఏర్పాటుపై స్పష్టమైన నిబంధనలు జారీ చేయాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు. ఉదాహరణకు గతంలో ప్రాజెక్ట్‌కు అగ్ని ప్రమాద శాఖ నిరభ్యంతర ధృవీకరణ పత్రం(ఎన్ఓసీ) వచ్చిందంటే ఇక ఆ ప్రాజెక్ట్ వంక అధికారులు చూసేవారు కాదు. కానీ, ఇప్పుడు ప్రతీ మూడేళ్లకు ఒకసారి రెన్యూవల్ చేసుకోవాలని కొత్త నిబంధనలను జోడించారు. ఇదే ఆహ్వానించదగ్గ పరిణామం. ఎందుకంటే ప్రాజెక్ట్‌ను అసోసియేషన్‌కు అప్పజెప్పిన తర్వాత నిర్వహణ సరిగా లేకపోవడంతో ప్రమాదం జరిగినప్పుడు ఫైర్ సేఫ్టీ ఉపకరణలు పనిచేయవు. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజా నిబంధనలతో నిర్వహణ సక్రమంగా ఉండటంతో పాటు క్రమంతప్పకుండా మాక్ డ్రిల్స్ చేస్తుంటారు. దీంతో ప్రమాదాలను నియంత్రించే అవకాశం ఉంటుంది. -
వేసవి వచ్చేస్తోంది.. ఇంటి సీలింగ్ ఎలా ఉండాలంటే..
వేసవి కాలం వచ్చేస్తోంది.. బయటే కాదు ఇంట్లో ఉన్నా ఎండ వేడి తగులుతుంది. అసలు ఇంటి పైకప్పు ఉందా లేదా అన్నట్టుగా ఉంటుంది ఇంట్లో వేడి. సాధారణ సీలింగ్ ఉన్న ఇంట్లో అయితే ఈ వేడిమి తీవ్రత మరింత ఎక్కువే. దీనికి పరిష్కారం చూపించి.. మండు వేసవిలో ఇంటిని చల్లగా మార్చేస్తుంది ‘ఫాల్స్ సీలింగ్’! ఫాల్స్ సీలింగ్ ప్రధాన ఉద్దేశం.. గదిలో ఆహ్లాద వాతావరణం ఏర్పర్చడమే. అలసిన మనసు, శరీరానికి సాంత్వన చేకూర్చడమే. ఫాల్స్ సీలింగ్‌తో ఇంట్లోని వాతావరణాన్ని అందంగా, ఆహ్లాదంగా మార్చుకోవటమే కాకుండా సాధారణ ఇంటి పైకప్పును డైమండ్, చతురస్రం, గోళాకారం వంటి విభిన్న ఆకృతుల్లో అందంగా కూడా తీర్చిదిద్దుకోవచ్చు.– సాక్షి, సిటీబ్యూరో» ఫాల్స్ సీలింగ్ రంగుల ఎంపికలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వారేమంటారంటే.. » గోడ రంగుతో పోల్చుకుంటే సీలింగ్‌కు వేసే వర్ణం తేలికగా ఉండాలి. అప్పుడు పైకప్పు తక్కువ ఎత్తులో ఉందనిపిస్తూ, విశాలంగా ఉన్న భావనను కలిగిస్తుంది. ముదురు షేడ్లను ఎంచుకుంటే పైకప్పు ఎత్తులో ఉందన్న అభిప్రాయాన్ని కలిగిస్తుంది. » మిగతా గదులతో పోల్చుకుంటే పడక గది సీలింగ్‌నే ఎక్కువసేపు చూస్తాం కాబట్టి వర్ణాల్లో సాదాసీదావి కాకుండా నేటి పోకడలకు అద్దంపట్టేవి ఎంచుకోవాలి. మధ్యస్తం, డార్క్, బ్రౌన్ వర్ణాలు పడకగదికి చక్కగా నప్పుతాయి. ఎందుకంటే ఈ వర్ణాలు ఉత్సాహపరిచే విధంగా, స్వభావానికి అనుకూలంగా ఉంటాయి మరి. » తాజాదనం ఉట్టిపడుతున్న లుక్ రావాలంటే మోనోక్రోమాటిక్ థీమ్‌ను ఎంచుకోవాలి. రెండు, మూడు వర్ణాలు కలిసినవి ఎంచుకుంటే మాత్రం అది పడకగది గోడలకు వేసిన రంగు కంటే తేలికగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మీ సీలింగ్ ప్రశాంత భావనను కలగజేస్తుంది. » గోడల రంగుకు, సీలింగ్‌కు ఒకే రకమైనవి కాకుండా.. వేర్వేరు వర్ణాల్ని కూడా వేసుకోవచ్చు. దగ్గర దగ్గర రంగులు కాకుండా, చూడగానే తేడా ఇట్టే కన్పించే వర్ణాలను ఎంపిక చేసుకోవటం మేలు. దృశ్య వ్యక్తీకరణ ప్రదేశంగా సీలింగ్‌ను వినియోగించుకోండి. ఆహ్లాదభరితమైన ఆకాశం, లేదంటే గదితో కలిసిపోయేలా ఆకట్టుకునే ఆకారాలు, వర్ణాలతో నాటకీయత కన్పించేలా అలంకరించుకోవచ్చు. జాగ్రత్తలివే.. » ఫాల్స్ సీలింగ్ ఎంపికలో ధర కంటే నాణ్యతకే ప్రాధాన్యమివ్వాలి. » ఫ్లోర్ నుంచి పైకప్పు మధ్య కనీసం 12 అడుగుల ఎత్తు అయినా ఉండాలి. » ఏమరుపాటుగా ఉంటే ఫాల్స్ సీలింగ్‌తో పాటు ఎయిర్ కండిషన్ మెషిన్ కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది. » ఉడెన్ ఫాల్స్ సీలింగ్‌లో అయితే ఎలుకలతో పాటు చెదలు, పురుగులు చేరే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. » దుమ్ము, ధూళి చేరకుండా అప్పుడప్పుడు శుభ్రం చేయాలి. -
సొంతిల్లు, వ్యాపారం దీర్ఘకాల లక్ష్యాలు
ముంబై: సొంతిల్లు సమకూర్చుకోవడం, వ్యాపారం ప్రారంభించడం, ఆర్థిక స్వేచ్ఛ.. మిలీనియల్స్ (1980–1996 మధ్య జన్మించినవారు) టాప్–3 దీర్ఘకాలిక ప్రాధాన్యతలుగా ఉన్నాయి. ‘ఫైబ్–మిలీనియల్ అప్‌గ్రేడ్ ఇండెక్స్’ నిర్వహించిన అధ్యయనంలో ఈ ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. మెట్రోలు, నాన్ మెట్రో పట్టణాల్లో 8,000 మంది వ్యక్తుల అభిప్రాయాలను ఈ అధ్యయనంలో భాగంగా తెలుసుకున్నారు. ముఖ్యమైన అంశాలు.. → 30 ఏళ్లలోపు వయసు వారిలో 41 శాతం మంది సొంతంగా ఇల్లు సమకూర్చుకోవడం తమ తొలి లక్ష్యంగా చెప్పారు. → ఒంటరి పురుషులతో పోల్చితే, ఒంటరి మహిళల్లో సొంతంగా ఇల్లు కొనుగోలు చేయడం ఎక్కువ ప్రాధాన్య లక్ష్యంగా ఉంది. → వ్యాపారం ప్రారంభించడం, దాన్ని వృద్ది చేయడం 21 మంది లక్ష్యంగా ఉంది. → దీర్ఘకాలంలో ఆర్థిక స్వేచ్ఛ సాధించడమే తమ లక్ష్యమని 19 శాతం మంది చెప్పారు. → ఇక స్వల్పకాల లక్ష్యాలను గమనించినట్టయితే.. వృత్తిలో ఎదుగుదల, కొత్త గ్యాడ్జెట్, వాహనం కొనుగోలు, ఆరోగ్యం విషయంలో దృఢంగా ఉండాలని (కంటి సర్జరీలు, దంత చికిత్సలు తదితర) మిలీనియల్స్ కోరుకుంటున్నారు. → పోటీ పెరగడంతో మంచి ఉద్యోగం సంపాదించే విషయంలో మెట్రోల్లోని మిలీనియల్స్ ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. ఇలా భావిస్తున్నవారు 60 శాతంగా ఉన్నారు. → తాము పొదుపు చేస్తామని, ఆర్థిక అంశాలకు వ్యూహాత్మకంగా ప్రణాళిక వేసుకుంటామని 39 శాతం మంది చెప్పారు. → 21 శాతం మంది ఇతర ఆదాయ వనరుల కోసం అన్వేషిస్తామని చెబితే, దీర్ఘకాల లక్ష్యాల కోసం రుణ సాయం తీసుకుంటామని 29 శాతం మంది తెలిపారు. → 15 శాతం మందిలో దీర్ఘకాల ఆర్థిక ప్రణాళిక లేనే లేదు. → స్వల్పకాల ఆకాంక్షలను తీర్చుకునేందుకు ఫైనాన్షియల్ ఇనిస్ట్యూషన్స్ నుంచి రుణాలు తీసుకుంటామని చాలా మంది చెప్పారు. → ఈ విషయంలో యువతరానికి మార్గదర్శనం అవసరమని ఈసర్వే నివేదిక అభిప్రాయపడింది. బాధ్యతాయుతమైన రుణాల దిశగా వారిని చైతన్యవంతం చేయాలని, తద్వారా తమ రుణ పరపతిని కాపాడుకుంటూనే కలలను సాకారం చేసుకోగలరని పేర్కొంది. -
రియల్టీలో ఆసక్తి.. లగ్జరీ ప్రాపర్టీల కొనుగోళ్లకు మొగ్గు
దేశీయ స్థిరాస్తి రంగంలో పెట్టుబడులకు హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ), అల్ట్రా హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (యూహెచ్‌ఎన్‌ఐ)లు ఆసక్తిగా ఉన్నారు. ఫలితంగా లగ్జరీ, అల్ట్రా ప్రీమియం ప్రాపర్టీలకు డిమాండ్ పెరిగింది. 65 శాతం మంది హెచ్ఎన్ఐ, యూహెచ్‌ఎన్‌ఐలు రూ.4–10 కోట్లు ధర ఉన్న లగ్జరీ ప్రాపర్టీ కొనుగోలుకు మొగ్గు చూపుతుండగా.. 13 శాతం మంది రూ.25 కోట్లకు పైన ధర ఉన్న స్థిరాస్తులపై ఆసక్తిగా ఉన్నారని ఇండియా సోత్‌బైస్ ఇంటర్నేషనల్ రియల్టీ(ఐఎస్‌ఐఆర్) వార్షిక సర్వే వెల్లడించింది. - సాక్షి, సిటీబ్యూరో కరోనాతో స్థిరాస్తి రంగానికి జరిగిన ప్రధాన మేలు.. సొంతింటి అవసరం తెలిసి రావడమే.. మరీ ముఖ్యంగా గృహ విభాగంలో యువతరం భాగస్వామ్యం పెరగడం. 74 శాతం సంపన్న కొనుగోలుదారులు ద్రవ్యోల్బణాన్ని నిరోధించేందుకు రియల్ ఎస్టేట్ ఒక ప్రధాన ఆస్తిగా పరిగణిస్తారు.61 శాతం మంది హెచ్ఎన్ఐ, యూహెచ్‌ఎన్‌ఐలు 2024–25లో లగ్జరీ ప్రాపర్టీలను కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. 34 శాతం మంది హైరైజ్ అపార్ట్మెంట్లు కొనుగోలుకు ఆసక్తిగా ఉండగా.. 30 శాతం మంది ఫామ్‌హౌస్‌లు, హాలిడే హోమ్స్‌లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే 23 శాతం మంది వాణిజ్య సముదాయాలలో పెట్టుబడులకు, 15 శాతం మంది స్థలాలపై ఆసక్తిగా ఉన్నారు.గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 34 శాతం మంది హెచ్ఎన్ఐ, యూహెచ్‌ఎన్‌ఐలు విలాసవంతమైన ప్రాపర్టీలను కొనుగోలు చేశారు. ఇప్పటికీ చాలామంది కొనుగోలుదారులు లగ్జరీ గృహాల కోసం శోధిస్తున్నారు. వచ్చే రెండు మూడేళ్లు దేశీయ రియల్టీ రంగం సరికొత్త రికార్డులను చేరుకుంటుందని విశ్వసిస్తున్నారు. 16 నెలలుగా లగ్జరీ గృహాల ధరలు పెరిగాయి. 2015 గరిష్ట ధరలతో పోలిస్తే స్వల్ప పెరుగుదలేనని తెలిపారు. విశాలవంతమైన గృహాలు, గ్రీనరీ ఎక్కువగా ఉండే ప్రాపర్టీలకే లగ్జరీ కొనుగోలుదారులు మొగ్గు చూపిస్తున్నారు. సంపన్న భారతీయుల ప్రాపర్టీ ఎంపికలో తొలి ప్రాధాన్యత మెరుగైన ఫిజికల్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదుపాయాలకే..ఈ నగరాలే హాట్‌స్పాట్స్.. సంపన్న కొనుగోలుదారులు ప్రాపర్టీ కొనుగోళ్లకు ప్రధాన కారణం మెరుగైన జీవన శైలి. మూలధన వృద్ధి, భవిష్యత్తు తరాలకు ఆస్తి వంటివి ఆ తర్వాతి అంశాలు. ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, గోవా, బెంగళూరు నగరాలలో గృహాల కొనుగోళ్లకు హెచ్ఎన్ఐ, యూహెచ్‌ఎన్‌ఐలు ఆసక్తిగా ఉన్నారు. 11 శాతం మంది సంపన్నులు విదేశాలలో ప్రాపర్టీలకు మొగ్గు చూపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా భయాలు తగ్గుముఖం పట్టడంతో విలాసవంతమైన భారతీయులు న్యూయార్క్, మయామి, లండన్, దుబాయ్, లిస్బన్ దేశాలలో లగ్జరీ అపార్ట్మెంట్ల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. -
హైదరాబాద్‌లో ఇంటి అద్దెలు పైపైకి!
తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం అధిక సంఖ్యలో హైదరాబాద్ నగరానికి వలస వస్తుండటంతో ఇక్కడ ఇంటి అద్దెలు (house rent) పెరుగుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం హైదరాబాద్‌లో ఇంటి అద్దెలు భారీగా పెరిగాయి. - సాక్షి, సిటీబ్యూరోహైదరాబాద్లోని దాదాపు అన్ని కార్యాలయాలు వర్క్ ఫ్రమ్ హోమ్ (Work from home) విధానాన్ని ఎత్తివేయడంతో అంతా నగరానికి చేరుకున్నారు. దీంతో ప్రధానంగా మెరుగైన ప్రయాణ సాధనాలు, పని కేంద్రాలకు చేరువలో ఉన్న అద్దె ఇళ్లకు డిమాండ్ ఉందని మ్యాజిక్‌బ్రిక్స్.కామ్ తెలిపింది.ప్రాపర్టీల విలువ పెరగడంతో గృహ యజమానులు అద్దెల కంటే లాభదాయకమైన ఆస్తుల విక్రయాల కోసం అన్వేషిస్తున్నారు. దీంతో సప్లై తగ్గడంతో అద్దె గృహాలకు డిమాండ్‌తో పాటు అద్దెలు కూడా పెరిగాయి.ఇదీ చదివారా? హైదరాబాద్ రియల్ ఎస్టేట్.. రిజిస్ట్రేషన్లు రయ్.. రయ్..ఈ ఏడాది హైదరాబాద్‌లో అద్దె గృహాలకు డిమాండ్ 22 శాతం మేర పెరిగింది. సరఫరా 2.1 శాతం క్షీణించగా.. సగటు రెంట్లు 4.5 శాతం మేర పెరిగాయి. అద్దెల మార్కెట్లో డిమాండ్, సప్లై వాటా 50, 39 శాతంగా ఉన్నాయి.గచ్చిబౌలి, కొండాపూర్‌లో అత్యధికంగా అద్దెలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. కార్యాలయాలు, ఉపాధి కేంద్రాలకు సమీపంలో ఉండటం, ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్)తో మెరుగైన కనెక్టివిటీ కారణం. 55 శాతం మంది అద్దెదారులు రూ.10 వేలు నుంచి రూ.20 వేలు నెలవారీ అద్దెలకు కోసం వెతుకుతున్నారు. 1000 చదరపు అడుగుల నుంచి 1,500 చ.అ. విస్తీర్ణంలో ఉన్న గృహాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. -
ప్రకటన కంపెనీల ఆగడాలకు ‘మాడా’ చెక్
దాదర్: ముంబైవ్యాప్తంగా ఖాళీస్థలాల్లో హోర్డింగులు నిర్మించి వాటిని అద్దెకివ్వాలని మహారాష్ట్ర హౌసింగ్ ఏరియా డెవలఫ్‌మెంట్ అథారిటీ (మాడా) నిర్ణయించింది. త్వరలోనే ఈ నిర్ణయానికి ఆమోదముద్ర వేయనుంది. ముంబైసహా ఉప నగరాలలో అనేక చోట్ల మాడాకు సొంత స్ధలాలున్నాయి. వీటిలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న స్ధలాల్లో హోర్డింగులు నిర్మించి వాటిని ప్రకటనల కంపెనీలకు అద్దెకు ఇవ్వనుంది. ఇప్పటికే బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) తమ సొంత స్ధలాల్లో హోర్డింగులు ఏర్పాటు చేసుకునేందుకు ప్రకటనల కంపెనీలకు అనుమతినిచ్చింది. వీటి ద్వారా ఏటా కొన్ని కోట్ల రూపాయలు అదనంగా అర్జిస్తోంది. ఇదే తరహాలో మాడా హోర్డింగులు నిర్మించి అద్దెకు ఇవ్వాలని భావిస్తోంది. హోర్డింగులపై ప్రత్యేక సర్వే... గతేడాది వర్షా కాలంలో ఘాట్కోపర్లోని చడ్డా నగర్లో 80/80 అడుగుల భారీ హోర్డింగ్ పక్కనే ఉన్న పెట్రోల్ బంకుపై కూలింది. ఈ ఘటనలో సుమారు 14 మంది చనిపోగా 60పైగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో అప్రమత్తమైన మాడా తమ సొంత స్ధలాల్లో ఏర్పాటుచేసిన హోర్డింగులపై సర్వే చేపట్టి వాటి స్ధితి గతులను పరిశీలించింది. ఈ సర్వేలో మొత్తం 62 భారీ హోర్డింగులకు గానూ 50 హోర్డింగులకు మాత్రమే నో అబ్జక్షన్ సరి్టఫికెట్ ఉందని తేలింది. అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన మిగిలిన 12 హోర్డింగులను నేలమట్టం చేసింది.నిబంధనల ప్రకారం కంపెనీలు హోర్డింగులు ఏర్పాటు చేసే ముందు బీఎంసీ నుంచి కచి్చతంగా అనుమతి పొందాల్సి ఉంటుంది. ఆ తరువాత స్ధలం యజమానిగా మాడా నుంచి ఎన్ఓసీ తీసుకోవల్సి ఉంటుంది. కానీ హోర్డింగుల ఏర్పాటుపై ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. భారీ హోర్డింగుల ఏర్పాటుకు పటిష్టమైన పునాది, బేస్మెంట్, ఇనుప చానెళ్లు తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే అవి గాలివేగాన్ని తట్టుకుని నిలబడగలుగుతాయి. అయితే కాంట్రాక్టు దక్కించుకున్న కంపెనీలు ఖర్చుల తగ్గింపుకోసం నామమాత్రంగా పునాదులు తవ్వి హోర్డింగులు నిర్మించి ప్రకటనల కంపెనీలకు లీజుకు ఇస్తున్నారు. ఇలాంటి హోర్డింగులు వర్షాకాలంలో వేగంగా వీచే గాలుల తాకిడికి తట్టుకోలేక నేల కూలుతున్నాయి. ఫలితంగా భారీ ఎత్తున ప్రాణ, ఆస్తి నçష్టం చోటుచేసుకుంటోంది. ఘాట్కోపర్లో గతేడాది జరిగిన హోర్డింగ్ ప్రమాదానికి ఇదే ప్రధాన కారణమని తేలింది. అనుమతి 40/40 అడుగులకు తీసుకుని రెట్టింపు సైజ్( 80/80)హోర్డింగును ఏర్పాటుచేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తమ సొంత స్ధలాల్లో స్వయంగా పటిష్టమైన పునాదులతో, బేస్‌మెంట్‌తో హోర్డింగుల ఇనుప చానెళ్లు నిర్మించి అద్దెకివ్వాలని మాడా భావించింది. ఇదీ చదవండి: కంటెంట్ క్వీన్స్ మ్యాజిక్ : ‘యూట్యూబ్ విలేజ్’ వైరల్ స్టోరీ -
కో-వర్కింగ్ సెంటర్ల జోరు.. హైదరాబాద్‌లో 26,000 సీట్లు
కో-వర్కింగ్ సెంటర్ ఆపరేటర్లు ఎనిమిది ప్రధాన నగరాల్లో గత ఏడాది రికార్డు స్థాయిలో 2.24 లక్షల సీట్లను అద్దెకు తీసుకున్నారు. 2023తో పోలిస్తే 43.6 శాతం వృద్ధి నమోదైంది. కార్పొరేట్ సంస్థల నుండి మేనేజ్డ్ ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ పెరగడం ఇందుకు కారణమని రియల్టీ కన్సల్టెంట్ కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదిక వెల్లడించింది.ఈ నివేదిక ప్రకారం.. 2023లో బెంగళూరు, ఢిల్లీ–ఎన్సీఆర్, పుణే, కోల్‌కత, ముంబై, హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్‌లలో మొత్తం 1.56 లక్షల డెస్క్‌లను కో–వర్కింగ్ లేదా ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ ఆపరేటర్లు కార్పొరేట్ సంస్థలకు అందించాయి. గత ఏడాది ఆపరేటర్లు బెంగళూరులో 64,000, పుణే 38,000, ఢిల్లీ ఎన్సీఆర్ 38,000, ముంబై 28,000, హైదరాబాద్ 26,000, చెన్నైలో 25,000 సీట్లను అద్దెకు ఇచ్చాయి. కోల్‌కత, అహ్మదాబాద్ కేవలం చెరో 1,900 సీట్లకే పరిమితం అయ్యాయి. బలమైన వృద్ధి నమోదు.. ఆఫీస్ స్పేస్ ఆపరేటర్లు తమ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవడానికి రియల్ ఎస్టేట్ డెవలపర్లు, ప్రాపర్టీ యజమానుల నుండి అద్దెకు ఆఫీసు స్థలాన్ని తీసుకుని.. మౌలిక సదుపాయాలతో కార్పొరేట్స్, నిపుణులు, వ్యక్తులకు వర్క్‌స్పేస్‌ను అందిస్తాయి. ‘సంప్రదాయ కార్యాలయాల ఏర్పాటుతోపాటు మేనేజ్డ్ వర్క్‌స్పేస్‌ను అంతర్జాతీయ సంస్థలు లీజుకు తీసుకుంటున్నాయి.దీంతో ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్‌కు డిమాండ్ ప్రస్తుత సంవత్సరంతోపాటు రాబోయే కాలంలో బలమైన వృద్ధి నమోదు చేయనుంది. దీంతో మేనేజ్డ్ స్పేస్ ఆపరేటర్ల ద్వారా ప్రధాన నగరాల్లోని గ్రేడ్ ఏ/ఏ+ ఆస్తులను మరింతగా పెంచుతుంది’ అని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ ఫ్లెక్స్ విభాగం హెడ్ రమిత అరోరా తెలిపారు. -
హైదరాబాద్ రియల్ ఎస్టేట్.. రిజిస్ట్రేషన్లు రయ్.. రయ్..
హైదరాబాద్‌లో ఖరీదైన ఇళ్ల అమ్మకాలు నిరంతరం పెరుగుతున్నాయి. మొత్తం ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ల సంఖ్య స్థిరంగా ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్ అయిన ఇళ్ల మొత్తం విలువ గత సంవత్సరంతో పోలిస్తే 5 శాతం పెరిగింది. అయితే అధిక సరఫరా కారణంగా అపార్ట్మెంట్ అమ్మకాల్లో మాత్రం మార్కెట్ ఫ్లాట్ వృద్ధిని నమోదు చేసింది. మొత్తం 5,444 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఈ మేరకు రియల్ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఓ నివేదిక విడుదల చేసింది.హైదరాబాద్ నివాస మార్కెట్ ప్రధానంగా హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి అనే నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉంది. ప్రాథమిక, ద్వితీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ల నుండి కూడా లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. "రిజిస్ట్రేషన్లలో రూ. 50 లక్షల లోపు ప్రాపర్టీలు ఆధిపత్యం చెలాయించాయి. కానీ ప్రీమియమైజేషన్ వైపు బలమైన మార్పు కనిపించింది. 2025 జనవరిలో రూ. 1 కోటి లేదా అంతకంటే ఎక్కువ ధర ఉన్న ఇళ్ల ధర 12% పెరిగింది. ఇది అధిక విలువ కలిగిన ప్రాపర్టీలకు పెరుగుతున్న ప్రాధాన్యతను ప్రతిబింబిస్తుంది" అని నైట్ ఫ్రాంక్ పేర్కొంది.హైదరాబాద్‌లో రిజిస్ట్రేషన్ అయిన ప్రాపర్టీలలో ఎక్కువ భాగం 1,000 నుండి 2,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్నవే. రిజిస్ట్రేషన్లన్నింటిలో వీటి వాటా 69%. 2024 జనవరిలో రిజిస్ట్రేషన్ అయిన 13%తో పోలిస్తే 2000 చదరపు అడుగుల కంటే ఎక్కువ పరిమాణంలో ఉన్న యూనిట్లు మొత్తం రిజిస్ట్రేషన్లలో 14% వాటా కలిగి ఉన్నాయని నైట్ ఫ్రాంక్ వివరించింది.మేడ్చల్-మల్కాజ్గిరి టాప్నైట్ ఫ్రాంక్ ప్రకారం.. జిల్లా స్థాయిలో చూస్తే 45% ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లతో మేడ్చల్-మల్కాజ్గిరి అగ్ర స్థానంలో ఉండగా 41% రిజిస్ట్రేషన్లతో రంగారెడ్డి జిల్లా ఆ తర్వాత స్థానంలో ఉంది. హైదరాబాద్ జిల్లా మొత్తం రిజిస్ట్రేషన్లలో మిగిలిన 14% వాటాను అందించింది. అమ్ముడుపోయిన నివాస ఆస్తుల సగటు ధర 2025 జనవరిలో 3% పెరుగుదలను చూసింది. జిల్లాలలో మేడ్చల్-మల్కాజ్గిరి అత్యధికంగా 11% పెరుగుదలను చూసిందని రిజిస్ట్రేషన్ డేటా చెబుతోంది.గృహ కొనుగోలుదారులు పెద్ద పరిమాణంలో, ఉన్నతమైన సౌకర్యాలను అందించే ఖరీదైన ఆస్తులను కూడా కొనుగోలు చేశారు. 2025 జనవరిలో జరిగిన మొదటి ఐదు డీల్స్‌లో 3,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ, రూ. 5.5 కోట్ల కంటే పైబడి విలువైన ఆస్తులు ఉన్నాయి. ఈ లావాదేవీలలో మూడు పశ్చిమ హైదరాబాద్‌లో రిజిస్ట్రేషన్ కాగా, రెండు రిజిస్ట్రేషన్లు సెంట్రల్ హైదరాబాద్‌లో జరిగాయి. -
హైదరాబాద్‌లో టూరిస్ట్ ఇళ్లు.. సకల వసతులు
సాక్షి, సిటీబ్యూరో: వేసవి సెలవుల్లో సేద తీరడానికి పలు కుటుంబాలు పర్యాటక ప్రదేశాలకు వెళ్తుంటాయి. కానీ, అక్కడి వసతి ఎలా? హోటళ్లలో ఉండాలంటే.. కాస్త ఖర్చు ఎక్కువే. నచ్చిన వంట వండుకోలేం. సరైన ఆతిథ్యాన్ని స్వీకరించలేం. వాళ్లు పెట్టినవాటిలో నుంచి ఎంపిక చేసుకొని తినాలి. దీనికి పరిష్కారం చూపించేవే పర్యాటక విడిదులు. స్టార్ హోటళ్లను తలదన్నేలా ఆధునిక వసతులు అందించడమే ఈ టూరిస్ట్ ఇళ్ల ప్రత్యేకత.ఇళ్లు.. హోం స్టేలుగా! భాగ్యనగరం అంటేనే చక్కని ఆతిథ్యానికి చిరునామా. అందుకే విదేశీ పర్యాటకులు ఇక్కడి ఆత్మీయత, ఆతిథ్యానికి ముగ్ధులవుతుంటారు. ఈ ఆనందాన్ని ద్విగుణీకృతం చేసేందుకు పర్యాటక శాఖ హోం స్టే పథకం ప్రవేశపెట్టింది. ఇదే తరహాలో పలు ప్రైవేట్ సంస్థలూ సేవలందిస్తున్నాయి. నగరంలోని గృహ యజమానులు తమ ఇళ్లను అద్దెకు ఇచ్చే బదులుగా ఇలా హోంస్టే సంస్థలతో ఒప్పందం చేసుకుంటున్నారు. ఆకట్టుకునేలా గృహాలను తీర్చిదిద్ది, అన్ని సౌకర్యాలు కల్పించి, పర్యాటకులకు తాత్కాలికంగా కిరాయికి ఇస్తున్నారు.అన్ని రకాల వసతులు.. ఎయిర్ బీఎన్బీ, వీఆర్బో, బుకింగ్.కామ్, మేక్ మై ట్రిప్, ట్రావెల్ స్టేషన్, హోమ్ టుగో వంటి సంస్థలు హోం స్టే సేవలను అందిస్తున్నాయి. దేశంలోని అన్ని ప్రధాన నగరాలతోపాటు పర్యాటక ప్రాంతాలు, బీచ్‌లు, తీర్థయాత్రలు అన్నిచోట్లా టూరిస్ట్ ఇళ్లు అందుబాటులో ఉన్నాయి. కిచెన్, స్విమ్మింగ్ పూల్, జిమ్ వంటి అన్ని రకాల వసతులు ఈ హోం స్టేలలో ఉంటాయి. సౌకర్యాలను బట్టి అద్దె ఒక రాత్రికి రూ.5 వేల నుంచి ఉంటాయి.ఆయా పర్యాటక ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న హోం స్టేల వివరాలను సంస్థలు తమ వెబ్సైట్లలో పొందుపరుస్తున్నాయి. వారికి అనువైన వసతిని వెతుక్కోవచ్చు. ఇందులోనే ధరలను కూడా నిర్ణయిస్తారు. వండి వడ్డించే భోజనం వివరాలు కూడా ఉంటాయి. విమానాశ్రయం నుంచి నేరుగా బస చేసే ఇంటికి వచ్చి ఆతిథ్యాన్ని అందుకోవచ్చు. -
ట్రంప్ నిర్ణయాల ఎఫెక్ట్.. అమెరికాలో అమ్మకానికి భారీగా ఇళ్లు!
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత.. డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇతర దేశాలను మాత్రమే కాకుండా, ఆ దేశ ప్రజలను కూడా భయపెడుతున్నాయి. దీంతో వాషింగ్టన్ డీసీలో రియల్ ఎస్టేట్ మార్కెట్ పతనం జరగనున్నట్లు భావించి.. వేల ఇళ్లను అమ్మకానికి ఉంచారు. దీనికి సంబంధించిన సోషల్ మీడియా పోస్టులు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.వాషింగ్టన్ డీసీలో గత 14 రోజుల్లోనే 4,271 కంటే ఎక్కువ ఇళ్ళు అమ్మకానికి ఉంచినట్లు.. ఒక ఎక్స్ యూజర్ పేర్కొంటూ.. ''ఎలుకలు పారిపోతున్నాయి” అని అన్నారు. నగరవాసులు తమ వస్తువులను సర్దుకుని.. సామూహికంగా నగరం విడిచి వెళ్తున్నారని అన్నారు.4,271 houses put up for sale in just the last 14 days in Washington, D.C. The rats are running away. 🇺🇸 pic.twitter.com/Ra5Gq21RBJ— Joseph 💎✌️🪑🇺🇸 Tesla Long Term Investor (@ShrimpTeslaLong) February 15, 2025వలసలకు కారణం.. ఇలాన్ మస్క్ నేతృత్వంలోని 'డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ' (DOGE) అని చెబుతున్నారు. నగరంలో, ఆ చుట్టుపక్కల అమ్మకానికి ఉన్న 14,825 ఇళ్లను చూపించే ఫోటోలను కూడా షేర్ చేశారు. నగరంలో 500 కంటే ఎక్కువ ఇల్లు రూ. 8 కోట్ల కంటే ఎక్కువ ధరకు అమ్మకానికి ఉన్నాయని.. అమెరికన్లను సురక్షితంగా ఉంచే విధానాలపై పనిచేసే థింక్ ట్యాంక్ అయిన సెంటర్ ఫర్ సెక్యూరిటీ పాలసీలో పనిచేస్తున్న సీనియర్ విశ్లేషకుడు పేర్కొన్నారు.ఇదీ చదవండి: యూపీఐ లిమిట్ పెంచుకోండిలా..ఆన్లైన్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌ప్లేస్ అయిన 'జిల్లో'లో అమ్మకానికి ఉన్న ఇళ్ల జాబితాలను మరో ఎక్స్ యూజర్ షేర్ చేసాడు. ఏడు రోజులలో 201, 14 రోజులలో 378, 30 రోజులలో 706, 90 రోజులలో 1,198 కొత్త ఇళ్లు అమ్మకానికి ఉన్నట్లు పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా షేర్ చేసాడు.Zillow Washington DC new home listings:•7 days: 201 new homes•14 days: 378 new homes•30 days: 706 new homes•90 days: 1,198 new homesIs this volume typical for the season? pic.twitter.com/KbGh3VOWhS— Architectoid (@Architectoids) February 15, 2025 -
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కొత్త రికార్డు..
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం కొత్త రికార్డులను సృష్టిస్తోంది. కోకాపేట, మోకిల పరిధిలో రికార్డుస్థాయిలో భూములు అమ్ముడుపోగా.. తాజాగా లగ్జరీ గృహాల ధరల వృద్ధిలో మరో మైలురాయిని చేరుకుంది. దేశంలోని ప్రధాన మెట్రో నగరాలతో పోలిస్తే భాగ్యనగరంలో విలాసవంతమైన ఇళ్ల ధరలు 42 శాతం మేర పెరిగాయి. రూ.కోటిన్నర కంటే ఎక్కువ ధర ఉండే ఈ ప్రీమియం యూనిట్ల రేట్లు గత ఐదేళ్లలో హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పెరిగాయని అనరాక్ గ్రూప్ తాజా అధ్యయనంలో వెల్లడైంది. నివేదికలోని పలు కీలకాంశాలివే..హైదరాబాద్‌లో 2018లో విలాసవంతమైన ఇళ్ల ధరలు చదరపు అడుగుకు రూ.7,450గా ఉండగా.. 2024 నాటికి ఏకంగా రూ.10,580కి పెరిగాయి. ఇదే సమయంలో బెంగళూరు, ముంబై నగరాల్లో లగ్జరీ ఇళ్ల ధరలు 27 శాతం మేర పెరిగాయి. కోవిడ్ అనంతరం లగ్జరీ గృహాల సరఫరా, డిమాండ్ పెరగడమే ఈ వృద్ధికి కారణమని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పూరి తెలిపారు. 2018లో బెంగళూరులో ప్రీమియం ఇళ్ల ధరలు చ.అ.కు రూ.10,210గా ఉండగా.. ఇప్పుడది రూ.12,970కి పెరిగింది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో రూ.23,119 నుంచి రూ.29,260కి చేరింది.దేశంలోని సగటు..2018 నుంచి 2024 నాటికి దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో సరసమైన గృహాల విలువలు సగటున 15 శాతం మేర పెరిగితే.. విలాసవంతమైన గృహాల విలువ 24 శాతం వృద్ధి నమోదైంది. రూ.కోటిన్నర కంటే ఎక్కువ ధర కలిగిన ఇళ్ల ధరలు చ.అ.కు సగటున 2018లో 12,400గా ఉండగా.. 2024 నాటికి 15,350కి పెరిగాయి.అందుబాటు గృహాల్లో 15 శాతం.. ఏడు ప్రధాన నగరాల్లో రూ.40 లక్షలలోపు ధర ఉండే సరసమైన గృహాల విలువలు 15 శాతం మేర పెరిగాయి. 2018లో సగటు ధర చ.అ.కు రూ.3,750గా ఉండగా.. ఇప్పుడది రూ.4,310కి పెరిగింది. అఫర్డబుల్ కేటగిరీలో ఎన్సీఆర్లో అత్యధికంగా 19 శాతం మేర ధరలు పెరిగాయి. ఈ విభాగపు ధరల వృద్ధిలో హైదరాబాద్‌ది రెండో స్థానం. ఐదేళ్లలో మన నగరంలో 16 శాతం మేర ధరలు పెరిగాయి. అందుబాటు గృహాల ప్రారంభ ధర చ.అ.కు రూ.4 వేలుగా ఉంది. ఐదేళ్ల కాలంలో టాప్–7 నగరాల్లో రూ.80 లక్షల నుంచి రూ.కోటిన్నర మధ్య ధర ఉండే మధ్య తరగతి విభాగంలోని ఇళ్ల విలువల్లో 18 శాతం మేర వృద్ధి చెందాయి. 2018లో సగటు ధర చ.అ.కు రూ. 6,050లుగా ఉండగా.. ఇప్పుడది రూ.7,120కి పెరిగింది. ఈ విభాగంలోనూ అత్యధికంగా 23 శాతం ధరల వృద్ధి హైదరాబాద్‌లోనే నమోదైంది. మన నగరంలో మిడ్‌సైజ్ గృహాల ప్రారంభ ధర చ.అ.కు రూ.5,780గా ఉంది. -
ఇల్లు ఎప్పుడు కొనాలి?
మార్కెట్ పడిపోతున్నప్పుడు కొనడం, పెరుగుతున్నప్పుడు అమ్మటమే లాభసాటి స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ చేసే పని! ఇదే సూత్రం రియల్ ఎస్టేట్‌కూ వర్తిస్తుంది. ప్రతికూల సమయంలో కొనుగోలు చేస్తే రేటు కలిసి వస్తుంది. మార్కెట్ బాగున్నప్పుడు విక్రయిస్తే రాబడి రెండింతలవుతుంది. హోమ్ బయ్యర్ నుంచి ఇన్వెస్టర్‌గా ఎదగాలంటే చేయాల్సిందిదే. స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు మాదిరిగానే స్థిరాస్తి రంగానికి కూడా కండీషన్స్ అప్లయి అనేది ఉంటుంది. ప్రాంతం ఎంపిక మొదలు డెవలపర్ ట్రాక్ రికార్డ్, ఆర్థిక పరిస్థితి, ప్రాంతం అభివృద్ధి అవకాశాలు, ప్రాజెక్ట్‌లోని వసతులు వరకు అన్నింటినీ పరిగణనలోకి తీసుకొని కొనుగోలు చేయాలి. అప్పుడే పెట్టుబడికి తగిన ప్రతిఫలాలను అందుకోవడం సాధ్యం. –సాక్షి, సిటీబ్యూరోఅభివృద్ధిని ముందుగానే అంచనా వేయాలి.. ప్రాంతం అభివృద్ధిని ముందుగా అంచనా వేయగలిగితే దాని ప్రతిఫలాలను వంద శాతం ఆస్వాదించవచ్చు. మెరుగైన మౌలిక వసతులు, భద్రత, కనెక్టివిటీ, నిత్యావసరాలు, అందుబాటు ధర వంటి వాటిని సమీక్షించుకొని ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవాలి. ఆయా అంశాల్లో బాచుపల్లి, దుండిగల్, మల్లంపేట, బౌరంపేట ప్రాంతాలు హాట్ డెస్టినేషన్. ఎందుకంటే.. 200 అడుగుల రోడ్లు, ఫ్లై ఓవర్, స్కైవే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పైగా ఓఆర్ఆర్ దుండిగల్ ఎగ్జిట్ మాత్రమే కాకుండా మల్లంపేట వద్ద మరో ఎగ్జిట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వీటితో ఇతర జిల్లా కేంద్రాలు, పలు ప్రాంతాలతో కనెక్టివిటీ పెరిగింది. కనెక్టివిటీ ఇబ్బందుల కారణంగా గతంలో ఆఫీసుకు దగ్గరలో ఉండే ప్రాజెక్ట్‌లలో కొనుగోలు చేసేందుకే కస్టమర్లు మొగ్గు చూపేవాళ్లు. కానీ, ఇప్పుడు మెట్రో రైలు, ఫ్లైఓవర్లు, స్కైవేలు, ఓఆర్ఆర్, లింక్ రోడ్లు వంటి వాటితో కనెక్టివిటీ మెరుగైంది. దీంతో ప్రధాన నగరంలోని బడ్జెట్‌తోనే 5–6 కి.మీ. దూరమైనా సరే పెద్ద సైజు అపార్ట్మెంట్ లేదా విల్లా కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.భూమి ధర మేరకే నిర్ణయం... శివారు ప్రాంతాల్లో భూముల క్రయవిక్రయాలు నిలిచిపోయాయంటే దానర్థం రేట్లు పడిపోయాయని కాదు. గత 3–4 ఏళ్లుగా స్థలాల ధరలు విపరీతంగా పెరిగిపోయి ప్రస్తుతం స్థిరంగా నిలిచిపోయాయి. భూమి ధరను బట్టే ఓపెన్ ప్లాట్, అపార్ట్మెంట్, విల్లా వంటి ప్రాజెక్ట్ చేయాలని బిల్డర్లు నిర్ణయించుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త డెవలపర్ ల్యాండ్ కొని, ప్రాజెక్ట్ చేసే పరిస్థితి లేదు. ఒకవేళ ఉన్నా గతంలో స్థల సమీకరణ చేసిన డెవలపర్లు నిర్మించే ప్రాజెక్ట్‌లతో పోలిస్తే ధరలు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు బాచుపల్లిలో రెండేళ్ల క్రితం ఎకరం రూ.12–13 కోట్లకు కొనుగోలు చేసిన ప్రణీత్ గ్రూప్ అపార్ట్‌మెంట్‌ను నిర్మిస్తోంది. చదరపు అడుగుకు రూ.5,500 చొప్పున విక్రయిస్తోంది. ఇప్పుడిదే ప్రాంతంలో ఎకరం రూ.20 కోట్లు–25 కోట్లుగా ఉంది. ఇలాంటి చోట కొత్త బిల్డర్ నిర్మించే ప్రాజెక్ట్‌లో ధర చదరపు అడుగుకు రూ.7 వేలు ఉంటే తప్ప గిట్టుబాటుకాని పరిస్థితి. దీంతో ధర తక్కువగా ఉన్న చోట కొనుగోలు చేయడమే కస్టమర్లకు లాభం. పైగా తుది దశకు చేరుకున్న పాత ప్రాజెక్ట్‌ల్లో కొనుగోలు చేస్తే గృహ ప్రవేశం చేసేయొచ్చు.రేపటి అవసరాన్ని గుర్తించి కొనాలి.. ప్రతికూల సమయంలో గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న వాటిల్లో కొనడమే ఉత్తమమని చాలామంది సలహా ఇస్తుంటారు. కానీ, ఒడిదుడుకుల మార్కెట్లో అమ్మకాలు లేకుండా నిర్మాణాన్ని పూర్తి చేసే సామర్థ్యం ఉందా అని ఆలోచించాలి. అందుకే ప్రతికూలంలోనూ బిల్డర్ ట్రాక్ రికార్డ్, ఆర్థిక సామర్థ్యం, గతంలో డెలివరీ చేసిన ప్రాజెక్ట్‌లు వంటి అంశాలను చూసి రెండేళ్లలో పూర్తయ్యే ప్రాజెక్ట్‌లో కొనుగోలు చేసినా నష్టం ఏమీ ఉండదు. పైగా రెడీ టు ఆక్యుపైతో పోలిస్తే వీటిల్లో ధర తక్కువగా ఉంటుంది. విస్తీర్ణం, ఇతరత్రా అంశాలపై బిల్డర్‌తో బేరసారాలు చేసే అవకాశం కూడా ఉంటుంది. భవిష్యత్తు అవసరాన్ని గుర్తించి వినియోగదారులు గృహాలను కొనుగోలు చేయాలి. చాలామంది ప్రస్తుతం సంపాదించే ఆదాయానికి పరిమితమై నిర్ణయం తీసుకుంటారు. కానీ, రేపటి రోజున ఆదాయ సామర్థ్యం పెరగొచ్చు. పెద్ద ఇళ్లు అవసరం ఏర్పడొచ్చు. అందుకే ఈ రోజు 2 బీహెచ్‌కే కొనేచోట 2–3 ఏళ్లలో డెలివరీ చేసే ప్రాజెక్ట్‌లో 2.5 బీహెచ్‌కే కొనుగోలు చేయడం ఉత్తమం. పైగా నిర్మాణంలో ఉంటుంది కాబట్టి 2 బీహెచ్‌కే ధరకే వస్తుంది. -
క్విప్ కింగ్ రియల్ ఎస్టేట్..
క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (క్విప్) మార్గంలో ఇన్వెస్టర్లకు ఈక్విటీ షేర్లను విక్రయించడం ద్వారా రియల్ ఎస్టేట్ డెవలపర్లు గతేడాది రూ. 22,320 కోట్లు సమీకరించాయి. 2024లో అన్ని రంగాలు కలిసి 99 క్విప్ ఇష్యూల ద్వారా మొత్తం రూ. 1,41,482 కోట్లు సమకూర్చుకున్నాయి. ఇందులో రియల్ ఎస్టేట్ రంగం అగ్రస్థానంలో నిల్చింది. 8 డెవలపర్లు, 1 రీట్ (రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్) కలిసి రూ. 22,320 కోట్లు సమీకరించాయి.క్విప్ ద్వారా వచ్చిన మొత్తం నిధుల్లో ఇది 16 శాతం. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. మార్కెట్లలో హెచ్చుతగ్గులు నెలకొన్నప్పటికీ క్యాపిటల్ మార్కెట్లు పటిష్టంగానే ఉన్నాయని, కంపెనీలు భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని అనరాక్ చైర్మన్ అనుజ్ పురి చెప్పారు.రియల్ ఎస్టేట్ రంగం వృద్ధి అవకాశాలపై సంస్థాగత ఇన్వెస్టర్లు అత్యంత బుల్లిష్‌గా ఉన్నట్లు వివరించారు. వివిధ రంగాలు 2020లో ఆల్‌టైం గరిష్ట స్థాయిలో క్విప్ మార్గంలో రూ. 80,816 కోట్లు సమీకరించాయి. 2024 గణాంకాలు దాని కన్నా 75 శాతం అధికం కావడం గమనార్హం. 2025లో క్విప్ ఫండింగ్ మిశ్రమంగా ఉండొచ్చని పురి తెలిపారు.నివేదిక ప్రకారం .. గోద్రెజ్ ప్రాపర్టీస్ రూ. 6,000 కోట్లు, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ రూ. 5,000 కోట్లు, బ్రూక్‌ఫీల్డ్ ఇండియా రీట్ రూ. 3,500 కోట్లు, మ్యాక్రోటెక్ డెవలపర్స్ రూ. 3,300 కోట్లు, బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ రూ. 1,500 కోట్లు సమీకరించాయి. -
ప్రతాప సింగారంలో హెచ్ఎండీఏ భారీ వెంచర్
హైదరాబాద్‌కు తూర్పున ఉన్న ప్రతాప సింగారం (pratap singaram) ‘రియల్’శోభ సంతరించుకోనుంది. దీనికిగాను హెచ్ఎండీఏ (HMDA) నడుంబిగించింది. ఈ మేరకు ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ కూడా ముగిసింది. భారీ వెంచర్‌కు ఫైనల్ లేఅవుట్ (lay out) సిద్ధం చేసింది. నగరం నలుదిక్కులా శివారు ప్రాంతాలు శరవేగంతో అభివృద్ధి చెందాలన్న ప్రభుత్వ సంకల్పంలో భాగంగా ఇది కార్యరూపం దాల్చబోతోంది. ఉప్పల్ భగాయత్ (uppal bhagayath) తరహాలో వెంచర్ రూపుదిద్దుకోనుంది. దాదాపు 150 మంది రైతుల నుంచి ఇప్పటికే 133 ఎకరాల పట్టాభూమితోపాటు మరో 18 ఎకరాల అసైన్డ్ భూమిని అధికారులు ల్యాండ్ పూలింగ్‌లో భాగంగా సేకరించారు. అసైన్డ్ భూమిని రైతులు ఇచ్చినప్పటికీ కలెక్టర్ ఆమోదముద్ర పడాల్సి ఉంది.వెంచర్ అభివృద్ధికి రూ.120 కోట్లు వెంచర్‌ను అన్ని రకాల మౌలిక వసతులతో అభివృద్ధి చేసేందుకు హెచ్ఎండీఏకు ప్రభుత్వం రూ.120 కోట్లను ఈ ఏడాది జనవరి 7న విడుదల చేసింది. 60:40 నిష్పత్తిలో ప్లాట్ల విస్తీర్ణాన్ని విభజించి ఎకరాకు 1,741 చదరపు గజాల అభివృద్ధి చేసిన ప్లాట్లను రైతు వాటాగా కేటాయిస్తారు. హెచ్ఎండీఏకు మొత్తం 30 ఎకరాల వాటా వస్తుంది. దీని విలువ సుమారు రూ. 270 కోట్లు ఉంటుందని అంచనా. ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తున్నందున ప్రతాపసింగారానికి రూ. 10 కోట్లను ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించి తమ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. అందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అసైన్డ్ ల్యాండ్ ఇచ్చిన రైతులకు చట్ట ప్రకారం అభివృద్ధి చేసిన లేఅవుట్లో ఎకరాకు 600 చదరపు గజాలు కేటాయించాలి. కానీ, వెయ్యి చదరపు గజాలు కావాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రోడ్ల నిర్మాణం, ప్లాట్ల కేటాయింపు.. వెంచర్ ప్రతిపాదనలు సిద్ధం చేసి మూడేళ్లు అవుతోంది. కొద్ది మంది రైతులు భూములను స్వాధీనం చేయడంలో జాప్యం కారణంగా లేఅవుట్ పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగలేదు. నిర్ణీత గడువులోగా లెంచర్ అభివృద్ధి చేయలేకపోతే రైతులకు భూమి విలువలో ఏటా 5 శాతం పరిహారంగా హెచ్ఎండీఏ చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే వెంచర్లో రోడ్లు నిర్మించి, మార్కింగ్ చేసిన ప్లాట్లను రైతులకు కేటాయించారు. ఉప్పల్ భగాయత్ నుంచి ఓఆర్ఆర్ వరకు 150 అడుగుల వెడల్పుతో వెళ్లే రేడియల్ రోడ్ నెంబర్ 20 మణిహారంలా ఈ వెంచర్‌కు ఆనుకునే ఉంది.త్వరలో ప్లాట్ల రిజిస్ట్రేషన్ షురూ.. ఇరిగేషన్ అధికారులు వెంచర్‌ను పరిశీలించి ఎన్వోసీ జారీ చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ ముగియగానే రైతులకు ప్లాట్లను రిజిస్టర్ చేసేందుకు హెచ్ఎండీఏ కసరత్తు చేస్తోంది. అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండేవిధంగా 110, 130, 190, 200, 220, 300, 400, 600, 1,200, 1,300, 1,500, 2,000 గజాల చొప్పున, ఒక ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలుగా ప్లాటింగ్ చేశారు. ఐటీ, వర్క్ స్టేషన్లు, డేటా సెంటర్ల ఏర్పాటు దిశగా కసరత్తు జరుగుతోంది. వీటి ద్వారా సుమారు 10 వేలకుపైగా మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉంటాయి.చదవండి: నీకోసం ఈ లోకం బహుమానం చేసేస్తా..డేటా సెంటర్ కోసం కృషి ప్రతాప సింగారంలోని హెచ్ఎండీఏ వెంచర్లో డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరాం. రూ.10 కోట్లను ప్రత్యేకంగా కేటాయించి ఈ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశాం. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. ల్యాండ్ పూలింగ్‌కు రైతులు సహకరించడాన్ని శుభపరిణామంగా భావిస్తున్నా. – మలిపెద్ది సుభాష్‌రెడ్డి, ప్రతాపసింగారంతూర్పు వైపు అభివృద్ధికి దోహదం.. హెచ్ఎండీఏ వెంచర్ల వల్ల తూర్పు హైదరాబాద్‌లో ఆస్తులకు డిమాండ్ పెరుగుతోంది. నగరంతో అద్భుతమైన అనుసంధానం ఏర్పడుతోంది. వ్యక్తిగతంగా భూములను అభివృద్ధి చేసుకోవడం అనేక ఖర్చులతో కూడుకున్న పని, కష్టసాధ్యం. అందుకే ల్యాండ్ పూలింగ్ను సమ్మతించాం. ఈ వెంచర్‌ను సకాలంలో అభివృద్ధి చేసి, మరో వెంచర్‌కు శ్రీకారం చుట్టాలని కోరుతున్నాం. – జున్ను నరేష్, భూ యజమాని, ప్రతాపసింగారం -
ఆఫీస్ మార్కెట్ రారాజు.. హైదరాబాద్
హైదరాబాద్: ఆఫీస్ మార్కెట్‌కు ఆకర్షణీయ కేంద్రంగా హైదరాబాద్ అవతరిస్తోంది. 134 మిలియన్ చదరపు అడుగుల (ఎస్ఎఫ్టీ) ఆఫీస్ స్పేస్‌తో దేశ ఆఫీస్ స్పేస్ (కార్యాలయ వసతులు) మార్కెట్లో హైదరాబాద్ 15 శాతం వాటా కలిగి ఉండగా, 2030 నాటికి 200 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరుకుంటుందని సీబీఆర్ఈ దక్షిణాసియా, హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) సంయుక్త నివేదిక అంచనా వేసింది. అంతర్జాతీయ సంస్థల నుంచి ఆఫీస్ స్పేస్‌కు బలమైన డిమాండ్ నెలకొందని, 2014 నుంచి చూస్తే హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ పరిమాణం మూడొంతులు పెరిగినట్టు తెలిపింది.అంతర్జాతీయ వ్యాపార, టెక్నాలజీ కేంద్రంగా హైదరాబాద్ అవతరించడం డిమాండ్‌కు అనుగుణంగా మారే స్వభావాన్ని తెలియజేస్తున్నట్టు సీబీఆర్ఈ ఇండియా చైర్మన్, సీఈవో అన్షుమన్ మ్యాగిజన్ పేర్కొన్నారు. విస్తృతమైన మౌలిక వసతులు, నైపుణ్య మానవ వనరుల లభ్యతతో భారత దేశ రియల్ ఎస్టేట్‌కు కీలక వృద్ధి కేంద్రంగా మారినట్టు తెలిపింది. టెక్నాలజీ, బీఎఫ్ఎస్ఐ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో గ్లోబల్ కేపబులిటీ సెంటర్లకు (జీసీసీ) హైదరాబాద్ ముఖ్య ఎంపికగా ఉన్నట్టు వెల్లడించింది.పర్యావరణ అనుకూల వసతులు..గ్రీన్ సరి్టఫైడ్ (పర్యావరణ అనుకూల ధ్రువీకరణ పొందిన) ఆఫీస్ వసతుల పరంగా హైదరాబాద్ మార్కెట్ దేశంలో 18 శాతం వాటా కలిగి ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది.డెవలపర్లు గ్రీన్ స్పేసెస్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారని, పర్యావరణ అనుకూల చర్యలు తీసుకుంటున్నారని వివరించింది. ఇందుకు సానుకూల ప్రభుత్వ విధానాలు ప్రోత్సాహమిస్తున్నట్టు పేర్కొంది. హైదరాబాద్ ఆఫీస్ లీజింగ్‌లో టెక్నాలజీ రంగం 31 శాతం వాటాతో అగ్రగామిగా ఉన్నట్టు తెలిపింది.జీసీసీలకు బెంగళూరు తర్వాత హైదరాబాద్ రెండో అతిపెద్ద కేంద్రంగా (లీజు పరంగా) ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. టెక్నాలజీ, ఫార్మా, బయో టెక్నాలజీ, ఫైనాన్షియల్ సరీ్వసెస్ ఇలా వివిధ రంగాల్లో జీసీసీలను హైదరాబాద్ ఆకర్షిస్తున్నట్టు పేర్కొంది. ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలైటిక్స్ వంటి అత్యాధునిక టెక్నాలజీల వినియోగం పెరిగే కొద్దీ హైదరాబాద్ ఆఫీస్ మార్కెట్ వృద్ధి మరింత వేగాన్ని అందుకుంటుందని అంచనా వేసింది.లీజింగ్‌లోనూ టాప్ఆఫీస్ స్పేస్ మార్కెట్లో ఈ ఏడాది హైరాబాద్, ఢిల్లీ ఎన్సీఆర్ అత్యధిక వృద్ధిని చూస్తాయని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ‘కొలియర్స్ ఇండియా’ సంస్థ అంచనా వేసింది. ఈ రెండు చోట్లా 10–15 మిలియన్ ఎస్ఎఫ్టీ చొప్పున గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ లీజింగ్ కార్యకలాపాలు నమోదు కావచ్చని తెలిపింది. దేశవ్యాప్తంగా ఆరు ప్రముఖ నగరాల్లో ఈ ఏడాది ఆఫీస్ స్పేస్ లీజింగ్ బలంగా ఉంటుందని.. 65–70 మిలియన్ ఎస్ఎఫ్టీ మేర లీజింగ్ నమోదు కావొచ్చని అంచనా వేసింది.2025 సంవత్సరంలో ఈ ఆరు నగరాల్లో ఆఫీస్ స్పేస్ మార్కెట్ ఎలా ఉండొచ్చన్న అంచనాలతో నివేదికను ఫిక్కీ 18వ రియల్ ఎస్టెట్ సదస్సు సందర్భంగా విడుదల చేసింది. ఈ ఆరు నగరాల్లో 2024లో స్థూల ఆఫీస్ లీజింగ్ 66.4 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉండగా.. ఈ ఏడాది 65–70 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంటుందని అంచనా వేసింది. జీసీసీల విస్తరణ, ఆశావహ వ్యాపార వాతావరణంతో లీజింగ్ పరి మాణం పెరగొచ్చని తెలిపింది.బెంగళూరులో అధిక డిమాండ్ ఈ ఏడాది స్థూల ఆఫీస్ స్పేస్ డిమాండ్‌లో మూడింట ఒక వంతు బెంగళూరు నుంచే ఉంటుందని కొలియర్స్ ఇండియా ఆఫీస్ సర్వీసెస్ ఎండీ అరి్పత్ మెహరోత్రా తెలిపారు. జీసీసీలు, ఇంజనీరింగ్, తయారీ సంస్థలు, ఫ్లెక్స్ ఆఫీస్ స్పేస్ ఆపరేటర్ల నుంచి డిమాండ్ ఉంటుందన్నారు. ముంబై, చెన్నై పుణెలలో 5–10 మిలియన్ ఎస్ఎఫ్టీ చొప్పున డిమాండ్ ఉండొచ్చని చెప్పారు. టాప్ మెట్రో నగరాల్లో జీసీసీలు అతిపెద్ద ఆఫీస్ స్పేస్ వినియోగదారులుగా ఉన్నట్టు అనరాక్ గ్రూప్ కమర్షియల్ లీజింగ్ ఎండీ పీయూష్ జైన్ సైతం తెలిపారు. -
స్టూడియో అపార్ట్మెంట్లకు తగ్గిన డిమాండ్
తెల్లారింది లేచామా.. ఆఫీసుకు వెళ్లామా.. రాత్రికి ఎప్పుడో ఇంటికి చేరుకున్నామా.. మరుసటి రోజు మళ్లీ సేమ్ టు సేమ్.. ఇదే నగరవాసి జీవితం.. సంపాదన బిజీలో పడిన సగటు జీవికి కాసేపు సేదతీరేందుకే గూడు. ఇదంతా కరోనాకు ముందు.. కరోనా వచ్చి సగటు మనిషి ప్రపంచాన్నే మార్చేసింది. కేవలం తినడం, పడుకోవడమే కాదు.. ఆఫీసు, స్కూల్, వ్యాయామం, వినోదం అన్నీ ఇంటి నుంచే కావడంతో ఒకప్పుడు హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన స్టూడియో అపార్ట్మెంట్లకు క్రమంగా డిమాండ్ పడిపోయింది. వీటి స్థానంగా విశాలమైన గృహాలు, ఫ్లాట్స్‌కు గిరాకీ పెరిగిపోయింది. – సాక్షి, సిటీబ్యూరో బెడ్ కం లివింగ్ రూమ్, కిచెన్, అటాచ్డ్ బాత్రూమ్ ఉండే వాటిని స్టూడియో అపార్ట్మెంట్ అంటారు. కరోనా మొదలైన ఏడాది(2020) నుంచి దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఈ తరహా అపార్ట్మెంట్ల సరఫరా క్రమంగా క్షీణిస్తూ వస్తోంది. గతేడాది తొలి అర్ధ వార్షికం(జనవరి–జూన్)లో 1,063 ప్రాజెక్ట్‌లు లాంచింగ్ కాగా.. ఇందులో కేవలం 9 శాతం(91 ప్రాజెక్ట్‌లు) మాత్రమే స్టూడియో అపార్ట్మెంట్ ప్రాజెక్ట్‌లు ఉన్నాయని అనరాక్ రీసెర్చ్ తాజా నివేదిక వెల్లడించింది. గతేడాది 1,207 ప్రాజెక్ట్‌లు లాంచింగ్ కాగా.. ఇందులో 145 ప్రాజెక్ట్‌లు స్టూడియో అపార్ట్మెంట్లున్నాయి. 19 శాతానికి స్టూడియో ప్రాజెక్ట్‌లు.. 2013 నుంచి 2019 మధ్య స్టూడియో అపార్ట్మెంట్ల ట్రెండ్ క్రమంగా పెరుగుతూ వచ్చింది. 2013లో ఏడు ప్రధాన నగరాల్లో 2,102 ప్రాజెక్ట్‌లు ప్రారంభం కాగా.. ఇందులో 4 శాతంతో 75 ప్రాజెక్ట్‌లు స్టూడియో అపార్ట్మెంట్లు ఉన్నాయి. అలాగే 2014లో 151, 2015లో 190, 2016లో 128, 2017లో 197, 2018లో 446 స్టూడియో ప్రాజెక్ట్‌లు లాంచ్ అయ్యాయి. 2019లో 1,921 ప్రాజెక్ట్‌లు ప్రారంభం కాగా.. 19 శాతం వాటాతో 368 ప్రాజెక్ట్‌లు స్టూడియో అపార్ట్మెంట్లే..లొకేషన్ ముఖ్యం.. స్టూడియో అపార్ట్మెంట్లను బ్యాచ్లర్స్, పర్యాటకులు, వ్యాపార ప్రయాణికులు, యువ దంపతులు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. వీటికి విస్తీర్ణంతో కాకుండా లొకేషన్ ఆధారంగా డిమాండ్ ఉంటుంది. తరచూ ఇవి ఉపాధి, వ్యాపార కేంద్రాల చుట్టూ, ఖరీదైన ప్రదేశాలలో ఎక్కువగా ఉంటాయని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పూరీ తెలిపారు. కానీ, కరోనా కారణంగా వర్క్ ఫ్రం హోమ్ సంస్కృతి మొదలైంది. దీంతో 2020 నుంచి పెద్ద సైజు ఇళ్లకు డిమాండ్ పెరిగిందన్నారు.మన దగ్గర తక్కువే.. స్టూడియో అపార్ట్మెంట్లకు ఉత్తరాది నగరాల్లో ఉన్నంత డిమాండ్ దక్షిణాదిలో ఉండదు. ముంబై, పుణె నగరాల్లో ఈ తరహా ఇళ్ల ట్రెండ్ కొనసాగుతోంది. 2013–20 మధ్య కాలంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో లాంచింగ్ అయిన స్టూడియో అపార్ట్మెంట్లలో 96 శాతం వాటా ముంబై, పుణెలదే. ఇదే కాలంలో దక్షిణాది నగరాలైన బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లలో కేవలం 34 స్టూడియో ప్రాజెక్ట్‌లు ప్రారంభమయ్యాయి. గతేడాది హెచ్–1లో ఏడు నగరాలలో ప్రారంభమైన 91 స్టూడియో ప్రాజెక్ట్‌ల్లో.. 71 ప్రాజెక్ట్‌లు ముంబైలోనే ఉన్నాయి. ఆ తర్వాత పుణెలో 18, బెంగళూరులో రెండు ప్రాజెక్ట్‌లు లాంచ్ అయ్యాయి. -
ఇవన్నీ ఉంటేనే ఇల్లు కొంటాం..
నివాస సముదాయాల్లో అన్ని వసతులు ఉండాల్సిందే.. ఆ విషయంలో మాత్రం అస్సలు తగ్గేదే లే అంటున్నారు కొనుగోలుదారులు.. గతంలో కమ్యూనిటీలలో జిమ్, స్విమ్మింగ్ పూల్ వంటి నాలుగైదు వసతులు ఉంటే సరిపోయేది. కానీ.. ప్రస్తుతం భవిష్యత్తు అవసరాలతో పాటు అభిరుచులకు తగ్గట్టుగా వసతులు ఉండాల్సిందే. ఇంటి నుంచి పని కోసం కో–వర్కింగ్ స్పేస్, ఆన్లైన్ క్లాస్‌ల కోసం డిజిటల్ క్లాస్ రూమ్ నుంచి మొదలుపెడితే.. టెర్రస్, క్లబ్హౌస్పై సౌర విద్యుత్ ఏర్పాట్లు, ఔట్‌డోర్ జిమ్, ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్స్, హోమ్ థియేటర్, ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్లు, పెట్పార్క్, గోల్ఫ్‌కోర్స్ వరకూ అన్ని ఆధునిక వసతులు కావాలని గృహ కొనుగోలుదారులు భావిస్తున్నారు. –సాక్షి, సిటీబ్యూరోపెట్ పార్క్, స్పా..జంతు ప్రేమికుల కోసం కూడా డెవలపర్లు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నివాస సముదాయాల్లో వసతుల జాబితాలో పెట్ పార్కులు కూడా చేరిపోయాయి. గేటెడ్ కమ్యూనిటీలలో కొనుగోలుదారులు పెంచుకునే పెంపుడు జంతువుల కోసం పెట్పార్క్, క్లబ్‌హౌస్‌లో పెట్ స్పాలను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు పెంపుడు జంతువుల ఆహార ఉత్పత్తులు, శిక్షకులు, వ్యాయామ ఉపకరణాలు వంటివి ఆయా ప్రాజెక్ట్‌లలో అందుబాటులో ఉంటాయి.సోలార్, హోమ్ గార్డెనింగ్ సొంతిల్లు కొనుగోలు చేసే క్రమంలో గేటెడ్ కమ్యూనిటీలో కామన్ ఏరియాలు ఎంత వరకు ఉన్నాయో అడిగి మరీ తెలుసుకుంటున్నారు. గతంలో కామన్ ఎలివేటర్, కామన్ కారిడార్, గ్యారేజ్, స్టేర్‌కేస్ ఉండేవి ఇప్పుడు వాటిని ప్రైవేట్ కావాలని అడుగుతున్నారు. ఇంట్లో సొంత అవసరాల కోసం కమ్యూనిటీ గార్డెన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. చిన్నపాటి స్థలంలో ఆకు కూరలు, కూరగాయలు పండించుకునేలా వర్టికల్ గార్డెనింగ్, బాల్కనీలలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వారాంతాల్లో కమ్యూనిటీ వాసులతో ఆహ్లాదంగా గడిపేందుకు ఔట్‌డోర్ కిచెన్, డైనింగ్ ఏరియా ఏర్పాటు చేస్తున్నారు. టెర్రస్, క్లబ్హౌస్పై సౌర విద్యుత్ ఏర్పాటు చేస్తున్నారు. వీధి దీపాలు, ఇతరత్రా అవసరాల కోసం ఈ విద్యుత్‌నే వినియోగిస్తున్నారు. దీంతో నివాసిత సంఘానికి కరెంట్ బిల్లు భారం తగ్గుతుంది.ఈవీ చార్జింగ్ స్టేషన్లుపెట్రోల్, డీజిల్ వంటి వాహనాలతో పర్యావరణం కాలుష్యం అవుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాయి. వాహన కొనుగోళ్లపై రాయితీలు అందిస్తుండటంతో పాటు చార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేస్తున్నాయి. డెవలపర్లు కూడా నివాస, వాణిజ్య సముదాయాల నిర్మాణంలో ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. నగరానికి చెందిన మైహోమ్, రాజపుష్ప, ప్రణీత్ గ్రూప్, పౌలోమి ఎస్టేట్స్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలు కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా వసతులను కల్పిస్తున్నారు.వసతులు ఇలా..నివాస సముదాయంలో ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్లు, ప్రతి పార్కింగ్ ప్లేస్ వద్ద చార్జింగ్ పెట్టుకునేందుకు వీలుగా పాయింట్లను ఇస్తున్నారు. జంతు ప్రేమికుల కోసం నివాస సముదాయంలోనే పెట్పార్క్, క్లబ్‌హౌస్‌లో పెట్ స్పాలను ఏర్పాటు చేస్తున్నారు. పెంపుడు జంతువుల ఆహార ఉత్పత్తులు, శిక్షకులు, వ్యాయామ ఉపకరణాలు వంటివి ఆయా ప్రాజెక్ట్‌లలో అందుబాటులో ఉంటాయి.రిచ్‌మ్యాన్ గేమ్‌గా పిలిచే గోల్ఫ్ కూడా వసతుల జాబితాలో చేరిపోయింది. ఆహ్లాదకరమైన వాతావరణంలో జిమ్ చేయాలని అందరూ భావిస్తున్నారు. దీంతో ఇండోర్ జిమ్‌లు కాస్త ఔట్‌డోర్‌లో ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఓజోనైజ్డ్ మెడిటేషన్ హాల్, ఉష్ణోగ్రత నియంత్రణ స్విమ్మింగ్ పూల్స్ వచ్చేశాయి.వైద్య అవసరాల కోసం మినీ ఆస్పత్రి, మెడికల్ షాపు, అంబులెన్స్, పారా మెడికల్ సిబ్బంది ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.గతంలో మాదిరిగా సినిమాలకు వెళ్లే పరిస్థితి లేకపోవటంతో నివాస సముదాయంలోనే మల్టీప్లెక్స్ అనుభూతి కలిగేలా స్క్రీన్లు, సౌండ్ సిస్టమ్స్‌ను డెవలపర్లు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా డిజిటల్ క్లాస్ రూమ్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. -
హైదరాబాద్‌లో షాపింగ్ మాల్స్.. రిటైల్ స్పేస్‌కు గిరాకీ
గతేడాది హైదరాబాద్ స్థిరాస్తి రంగానికి (Real estate) బాగానే కలిసొచ్చింది. నివాస, వాణిజ్య, కార్యాలయ విభాగాలతో పాటు రిటైల్ రంగం కూడా మెరుగైన పనితీరునే కనబర్చింది. షాపింగ్ మాల్స్‌లో రిటైల్ స్పేస్ క్రమంగా పెరుగుతోంది. గతేడాది నగరంలో 18 లక్షల రిటైల్ స్పేస్ లావాదేవీలు జరిగాయని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదిక వెల్లడించింది. - సాక్షి, సిటీబ్యూరోబంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, కోకాపేట వంటి సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్(సీబీడీ) ప్రాంతాల్లో 2 లక్షల చ.అ.లావాదేవీలు జరిగాయని తెలిపింది. దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాలలో కొత్తగా 59.48 లక్షల చ.అ.విస్తీర్ణంలో 11 షాపింగ్ మాల్స్ అందుబాటులోకి వచ్చాయి.సిటీలో మూడు మాల్స్ గతేడాది అత్యధికంగా హైదరాబాద్‌లో మూడు మాల్స్ అందుబాటులోకి వచ్చాయి. పుణె, చెన్నైలో రెండేసి, ముంబై, ఢిల్లీ, ఎన్సీఆర్, బెంగళూరు, అహ్మదాబాద్‌లో ఒక్కోటి చొప్పున అందుబాటులోకి వచ్చాయి. కోల్‌కత్తాలో ఒక్క మాల్ కార్యరూపంలోకి రాలేదు. 2023లో 15 లక్షల చ.అ.షాపింగ్ మాల్ స్పేస్ మార్కెట్లోకి రాగా.. ఈ ఏడాది నిర్మాణంలో ఉన్న మరో 20 లక్షల చ.అ. స్థలం అందుబాటులోకి రానుంది.నల్లగండ్ల, నానక్‌రాంగూడ, కొంపల్లి వంటి ప్రాంతాలలో కొత్త మాల్స్ నిర్మాణంలో ఉన్నాయి. నల్లగండ్లలో అపర్ణా సంస్థ 7 లక్షల చ.అ. విస్తీర్ణంలో మాల్ అండ్ మల్టీప్లెక్స్‌ను నిర్మిస్తోంది. కూకట్పల్లి 16.60 లక్షల చ.అ. లేక్‌షోర్ మాల్స్ శరవేగంగా నిర్మాణ పనులు పూర్తి చేసుకుంటున్నాయి.5–25 శాతం పెరిగిన అద్దెలు నగరంలో ఫ్యాషన్, హైపర్ మార్కెట్, ఫుడ్ అండ్ బేవరేజ్ వంటి విభాగాల పనితీరు బాగుండటంతో రిటైల్ స్పేస్‌కు గిరాకీ పెరిగింది. ప్రధానంగా కొంపల్లి, కోకాపేట, ఏఎస్‌రావ్ నగర్, నల్లగండ్ల, వనస్థలిపురం, కొండాపూర్, మణికొండ వంటి ప్రాంతాల్లో ఎక్కువ కార్యకలాపాలు జరిగాయి. అమీర్‌పేట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కొంపల్లి, కొత్తపేట, మాదాపూర్ వంటి ప్రధాన ప్రాంతాల్లో అద్దెలు పెరిగాయి. గత కొన్ని త్రైమాసికాలలో ఆయా ప్రాంతాలలో అద్దెలు 5–25 శాతం మేర వృద్ధి చెందాయి. -
హైదరాబాద్‌లో ఇళ్లకు డిమాండ్..
దేశీయ రియల్ ఎస్టేట్ రంగం వృద్ధిలో హైదరాబాద్, బెంగళూరు, ముంబై నగరాలు కీలకంగా మారాయి. ఈ ఏడాది గృహ విక్రయాలు ఈ మూడు నగరాల్లోనే అధిక స్థాయిలో జరిగాయి. తక్కువ వడ్డీ రేట్లు, స్థిరమైన ప్రాపర్టీ ధరలే ఇందుకు కారణమని హౌసింగ్. కామ్ ఇండియన్ రెసిడెన్షియల్ ఇండెక్స్ ఫర్ ఆన్లైన్ సెర్చ్ (ఐఆర్ఐఎస్) అంచనా వేసింది. రియల్టీ స్టేక్ హోల్డర్లు, ప్రభుత్వం, బ్యాంక్‌లు, ప్రాపర్టీ ఇన్వెస్టర్లు అందరూ టర్న్ ఎరౌంట్ మార్కెట్ కోసం ఎదురు చూస్తున్నారని తెలిపింది. అది గతేడాది సానుకూల దృక్పథంతో మొదలైందని తెలిపింది. గతేడాది వృద్ధే ఈ ఏడాది కూడా కొనసాగుతోంది. – సాక్షి, సిటీబ్యూరో ప్రధాన నగరంలో ఇరుకు ఇళ్ల మధ్య ఉండటం బదులు శివారు ప్రాంతాలు, హరిత భవనాలు, విస్తీర్ణం ఎక్కువగా ఉండే ఫ్లాట్లు, విల్లాలను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ద్వితీయ శ్రేణి పట్టణాలలోని ప్రాపర్టీలకు డిమాండ్ ఏర్పడింది. గతంలో సూరత్, జైపూర్, పాట్నా, మోహాలీ, లక్నో, కోయంబత్తూరు వంటి ద్వితీయ శ్రేణి పట్టణాలు ఆన్లైన్లో ప్రాపర్టీల సెర్చ్‌లో గణనీయమైన వృద్ధి నమోదు చేశాయని తెలిపింది. ఆయా ద్వితీయ శ్రేణి పట్టణాల్లో గృహ కొనుగోళ్లకు ఆసక్తి కనబరుస్తున్నారని పేర్కొంది. నోయిడాలోని నోయిడా ఎక్స్టెన్షన్, ముంబైలోని మీరా రోడ్ ఈస్ట్, అంధేరి వెస్ట్, బోరివలీ వెస్ట్, బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ ప్రాంతాలు ఈ ఏడాది దేశీయ నివాస సముదాయ మార్కెట్‌ను లీడ్ చేస్తాయని తెలిపింది.మారిన అభిరుచులు.. ఆన్లైన్లో రూ.2 కోట్లకు పైబడిన ప్రాపర్టీల శోధన ఒకట్నిర శాతం వృద్ధి చెందిందని పేర్కొంది. గతంలో ప్రాపర్టీ కొనాలంటే ధర, వసతులు ప్రధాన అంశాలుగా ఉండేవి. ప్రస్తుతం గృహ కొనుగోలుదారుల ఎంపికలో మార్పులొచ్చాయని హౌసింగ్.కామ్ కన్జ్యూమర్ సెంటిమెంట్ ఔట్లుక్ తెలిపింది. 3 బీహెచ్‌కే, ఆపై పడక గదుల గృహాల్లో 2023తో పోలిస్తే 2024లో 15 శాతం వృద్ధి నమోదైందని పేర్కొన్నారు. అదే సమయంలో గతేడాది పెద్ద సైజు ప్లాట్లలో 42 శాతం పెరుగుదల కనిపించిందని తెలిపింది.అద్దెలకు గిరాకీ.. ప్రాజెక్ట్‌ల ఆలస్యం, దివాళా డెవలపర్లు వంటి ప్రతికూల వాతావరణంలోనూ నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్సీఆర్)లో ప్రాపర్టీ కోసం సెర్చ్ గణనీయంగా పెరిగింది. నోయిడా ఎక్స్టెన్షన్ ప్రాంతం ఆన్లైన్ ప్రాపర్టీ సెర్చింగ్‌లో ప్రథమ స్థానంలో నిలిచింది. ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ఈ రీజియన్‌లో పలు మౌలిక సదుపాయల ప్రాజెక్ట్‌లను ప్రకటించడం, ధరలు అందుబాటులో ఉండటం వంటివి ఈ రీజియన్‌లో ప్రాపర్టీల వృద్ధికి కారణమని తెలిపింది. ఐటీ, ఫార్మా కంపెనీలు ఉద్యోగ నియామకాలను పెంచడంతో ముంబై, బెంగళూరు, ఢిల్లీ మార్కెట్లలో అద్దెలకు గిరాకీ పెరిగిందని పేర్కొంది. -
ముంబైలో ఆఫీస్ కొన్న సన్నీ లియోన్: ఎన్ని కొట్లో తెలుసా?
సినీతారలు, క్రికెటర్స్ లేదా పారిశ్రామిక వేత్తలు చాలామంది ఎప్పటికప్పుడు ఖరీదైన వాహనాలు, ప్లాట్స్ వంటివి కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇప్పటికే చాలామంది ముంబై వంటి అభివృద్ధి చెందిన నగరాల్లో ఆస్తులను కొనుగోలు చేశారు. తాజాగా ఈ జాబితాలోకి నటి 'సన్నీ లియోన్' (Sunny Leone) కూడా చేరింది. కోట్ల రూపాయలు వెచ్చించి ఓ కమర్షియల్ బిల్డింగ్ కొనుగోలు చేసింది.బర్త్ డే సాంగ్స్‌కు కేర్ ఆఫ్ అడ్రస్‌గా పాపులర్ అయిన సన్నీ లియోన్.. ముంబైలోని ఓషివారాలో రూ. 8 కోట్లకు ఆఫీస్ స్థలాన్ని కొనుగోలు చేసినట్లు స్క్వేర్ యార్డ్స్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్ వెల్లడించింది. ఇక్కడే ఆమె తన కార్యకలాపాలను కొనసాగించే అవకాశం ఉంది.బిగ్ బి, అజయ్ దేవగన్, కార్తీక్ ఆర్యన్ కార్యాలయాలు ఉన్న భవనంలోనే సన్నీ లియోన్ కార్యాలయాన్ని కొనుగోలు చేసింది. ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం.. కొనుగోలుకు సంబంధించిన లావాదేవీ ఫిబ్రవరి 2025లో జరిగినట్లు సమాచారం.సన్నీ లియోన్ ఆస్తిని.. ఆనంద్ కమల్నాయన్ పండిట్ & రూపా ఆనంద్ పండిట్ యాజమాన్యంలోని ఐశ్వర్య ప్రాపర్టీ అండ్ ఎస్టేట్స్ నుంచి కొనుగోలు చేసింది. ఆనంద్ పండిట్.. టోటల్ ధమాల్, చెహ్రే మరియు ది బిగ్ బుల్ వంటి చిత్రాలను నిర్మించారు.ఇదీ చదవండి: కొత్త బిజినెస్‌లోకి అనన్య బిర్లా: ఇషా అంబానీకి పోటీ!?సన్నీ లియోన్ కొనుగోలు చేసిన ఆఫీస్ స్థలంలో 176.98 చదరపు మీటర్ల (1,904.91 చదరపు అడుగులు) కార్పెట్ ఏరియా, 194.67 చదరపు మీటర్ల (2,095 చదరపు అడుగులు) బిల్ట్ అప్ ఏరియా వంటివి ఉన్నాయి. అంతే కాకుండా ఇందులో మూడు కార్ పార్కింగ్ స్థలాలు కూడా ఉన్నాయి. ఈ లావాదేవీకి రూ. 35.01 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లింపు, మరో రూ. 30,000 రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించాల్సి వచ్చింది. -
హైదరాబాద్‌లో ఇల్లు కొంటున్నారా..?
సొంతిల్లు ప్రతి ఒక్కరి జీవిత కల. పైసా పైసా కూడబెట్టి, గృహ రుణంతో సొంతింటి కలను నెరవేర్చుకుంటారు. గృహ కొనుగోలు (Buying House)నిర్ణయంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా, నిర్లక్ష్యం వహించినా కష్టార్జితమంతా వృథా అవుతుంది. మరీ ముఖ్యంగా తొలిసారి గృహ కొనుగోలుదారులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రాపర్టీని (Property) కొనుగోలు చేయడం అంటే కేవలం ఆర్థికపరమైన నిర్ణయం మాత్రమే కాదు.. జీవనశైలి ఎంపిక. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే అందబాటు ధరలు, అభివృద్ధి అవకాశాలు, దీర్ఘకాలిక పెట్టుబడికి సరైనది హైదరాబాద్. నగరంలో గృహ కొనుగోలుదారులు ఈ పంచ సూత్రాలు పాటిస్తే సొంతింటిని దక్కించుకోవచ్చు. – సాక్షి, సిటీబ్యూరోబంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కోకాపేట ప్రాంతాలు విలాసవంతమైన జీవనం, పెట్టుబడుల వృద్ధిలో అగ్రస్థానంలో ఉన్నాయి. వృద్ధి సమతుల్యత, అందుబాటు ధరల కోసమైతే నార్సింగి, కొల్లూరు, రాజేంద్రనగర్, తెల్లాపూర్ వంటి అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలను ఎంపిక చేసుకోవచ్చు. ఆయా ప్రాంతాలు ఆధునిక మౌలిక సదుపాయాలు, ఐటీ కారిడార్లకు సమీపంలో ఉండటంతో నివాసం ఉండేందుకు, పెట్టుబడులకు రెండింటికీ అనువైన ప్రాంతాలు.లగ్జరీ ప్రాపర్టీల కొనుగోలుదారులు ఇంటి ధరను మాత్రమే కాదు రిజిస్ట్రేషన్ ఫీజులు, ప్రీమియం వసతులు, హైఎండ్ ఇంటీరియర్ కూడా పరిగణలోకి తీసుకోవాలి. విలాసవంతమైన జీవితాన్ని విలువైనదిగా చేసే నిర్వహణ చార్జీలు కూడా ఉంటాయని గమనించాలి.విలాసవంతమైన ఇల్లు, దాని నిర్మాణ శైలి గురించి తెలుసుకోవాలి. లగ్జరీ ప్రాపర్టీల అనుభూతిని పొందాలంటే డెవలపర్ కీలకపాత్ర పోషిస్తారు. వారి ఉన్నత నైపుణ్యం, సకాలంలో డెలివరీ, వినూత్నమైన డిజైన్లు, ఎలివేషన్లకు ప్రసిద్ధి చెందిన బిల్డర్ ప్రాజెక్ట్‌లను ఎంచుకోవడం ఉత్తమం. నిర్మాణంలో నాణ్యత, ప్రత్యేకతలు అందించే రెరా ఆమోదిత ప్రాజెక్ట్‌లకు ప్రాధాన్యత ఇవ్వాలి.ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో స్టేషన్లు, రాబోయే మౌలిక సదుపాయాల ప్రాంతాలలో స్థలాలు, గృహాలను కొనుగోలు చేస్తే తక్కువ కాలంలో విలువ రెట్టింపు అవుతుంది. ప్రైవసీ, ప్రశాంతతను కోరుకునే వారికీ ఈ ప్రాంతాలే బెటర్. రవాణా సదుపాయాలు, కనెక్టివిటీ ఉన్న ప్రాంతాలైతే రాకపోకలు సౌలభ్యంగా ఉంటుంది.ఎంపిక చేసిన ప్రాపర్టీకి సంబంధించి న్యాయ నిపుణులు, ప్రొఫెషనల్స్ సలహాలు తీసుకోవాలి. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ వంటి ప్రభుత్వ విభాగాల నుంచి నిర్మాణ అనుమతులు గురించి ఆరా తీయాలి. -
బడ్జెట్ 2025-26: రియల్ ఎస్టేట్‌కు బూస్ట్!
దేశంలో రియల్ఎస్టేట్ రంగానికి వైభవం తీసుకొచ్చేలా కేంద్ర ప్రభుత్వం 2025-26 బడ్జెట్లో పలు కీలక నిర్ణయాలు ప్రకటించింది.మధ్యతరగతి గృహ కొనుగోలుదారులకు స్థోమతను పెంచేలా రూ. 12 లక్షలు.. స్టాండర్డ్ డిడక్షన్లతో కలుపుకొంటే రూ.12.75 లక్షల వరకు ఆదాయంపై పన్ను ఉండదని ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఇది ప్రజల కొనుగోలు శక్తిని పెంచుతుందని, హౌసింగ్ డిమాండ్, రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులను పెంచుతుందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంటున్నారు."కొత్త పన్ను నిర్మాణం మధ్యతరగతి పన్నులను గణనీయంగా తగ్గిస్తుంది. వారి చేతుల్లో ఎక్కువ డబ్బు ఉండేలా చేస్తుంది. గృహ వినియోగం, పొదుపు, పెట్టుబడిని పెంచుతుంది" అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. రియల్ ఎస్టేట్‌కు తాజా బడ్జెట్లో ఎలాంటి నిర్ణయాలు ప్రకటించారో ఇప్పుడు చూద్దాం..నిలిచిపోయిన ప్రాజెక్టుల్లో లక్ష ఇళ్లను పూర్తి చేసేందుకు స్వామి (SWAMIH ) ఫండ్-2ను ప్రభుత్వం ప్రకటించింది. 2025 బడ్జెట్లో అదనంగా లక్ష ఇళ్ల నిర్మాణం కోసం కొత్త స్వామి ఫండ్ 2కి రూ.15,000 కోట్ల కేటాయింపును ప్రకటిచింది. దీంతో చాలా కాలంగా ఆలస్యమవుతున్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లలో ఇళ్లు కొనుగోలుచేసిన వేలాది మందికి ఉపశమనం కలగనుంది.స్వామి స్కీమ్ కింద ప్రస్తుతం ఉన్న 50,000 నివాస యూనిట్లు పూర్తికావడం, మరో 40,000 పైప్‌లైన్‌లో ఉండటం సంక్షోభాన్ని పరిష్కరించడంలో ప్రభుత్వ గట్టి ప్రయత్నాన్ని తెలియజేస్తోందని నిపుణులు చెబుతున్నారు.అద్దె ఆదాయంపై వార్షిక టీడీఎస్ పరిమితిని ప్రస్తుత రూ. 2.4 లక్షల నుండి రూ.6 లక్షలకు పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. అద్దెపై వార్షిక టీడీఎస్ పరిమితిని రూ.2.40 లక్షల నుండి రూ.6 లక్షలకు పెంచడం వలన చిన్న పన్ను చెల్లింపుదారులు, భూస్వాములు కూడా గణనీయంగా ప్రయోజనం పొందుతారని రియల్ ఎస్టేట్ నిపుణులు అంటున్నారు.ఇన్వెస్టర్లు ఇప్పుడు కేవలం ఒకటి కాకుండా రెండు స్వీయ-ఆక్రమిత ఆస్తులకు నిల్ వాల్యుయేషన్‌ను క్లెయిమ్ చేయవచ్చు. ఇది రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ పెట్టుబడికి అనుకూలమైన చర్య.పట్టణ మౌలిక సదుపాయాలను పెంచేందుకు ప్రభుత్వం రూ.1 లక్ష కోట్ల అర్బన్ ఛాలెంజ్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తుంది. అర్బన్ డెవలప్మెంట్ ఫండ్ ఏర్పాటు వల్ల మౌలిక సదుపాయాలు పెరుగుతాయని, రియల్ ఎస్టేట్ సామర్థ్యం పుంజుకుంటుందని, నగరాలు ప్రధాన వృద్ధి కేంద్రాలుగా మారుతాయని నిపుణులు తెలిపారు.ప్రపంచ వ్యాపార కేంద్రంగా భారతదేశ స్థానాన్ని బలోపేతం చేస్తూ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ (GCC)ను ఆకర్షించడానికి, ప్రోత్సహించడానికి రాష్ట్రాలకు సహాయపడే జాతీయ మార్గదర్శక ఫ్రేమ్‌వర్క్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. పెరుగుతున్న దేశ ఆర్థిక ప్రభావం దృష్ట్యా ఈ చర్య బెంగళూరు, ముంబై, హైదరాబాద్, పూణె, చెన్నై వంటి ప్రధాన మెట్రోలతో పాటు టైర్-II, టైర్-III నగరాల్లో ఆఫీస్ స్పేస్ డిమాండ్‌ను పెంచుతుందని భావిస్తున్నారు.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025-26 ముఖ్యాంశాలు -
ఏఐతో రియల్ ఎస్టేట్ సేవలు..
దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ (real estate) రంగంలో సుమారు 5 లక్షల మంది ఉంటే, అందులో కేవలం 15 శాతం మంది మాత్రమే సాంకేతికతను, ఆన్లైన్ టూల్స్‌ను వినియోగిస్తున్నారని ఇటీవల పలు సర్వేలు వెల్లడించాయి. ముఖ్యంగా హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో రియల్ ఎస్టేట్ వ్యవస్థ అనేది దళారులపై ఆధారపడి ముందుకుసాగుతోంది. - సాక్షి, సిటీబ్యూరోఇందులో 80 నుంచి 85 శాతం వరకూ దళారులు మాన్యువల్ ప్రక్రియలపై ఆధారపడుతున్నారని రియల్ రంగ అధ్యయనాలు తెలిపాయి. ఈ తరుణంలో హైదరాబాద్ వంటి మహానగరాల్లో బ్రోకర్లు, గృహ కొనుగోలుదారులు, వ్యాపారులు ప్రధాన ఆస్తి పోర్టల్‌ను వినియోగించడం ఉత్తమమని మ్యాజిక్ బ్రిక్స్ సీఈఓ సుధీర్ పాయ్ తెలిపారు. దేశవ్యాప్త నెట్‌వర్క్‌తో.. దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన సాంకేతిక మౌలిక సదుపాయాలు, విస్తారమైన అమ్మకాల నెట్‌వర్క్‌తో, కన్సల్టెంట్లకు సీఆర్ఎమ్ పరిష్కారంగా ‘రీడ్ ప్రో’ (READPRO)ను ఆవిష్కరించామని సుధీర్ తెలిపారు. కృత్రిమ మేధ ఆధారిత సీఆర్ఎమ్ వేదికగా ఈ ‘రీడ్ ప్రో’ రెండు వందలకు పైగా నగరాల్లో 95 వేల యాక్టివ్ బ్రోకర్ లైసెన్స్‌లను సాధించింది. రియల్–టైమ్ సేల్స్ ట్రాకింగ్, లీడ్ ఇంటిగ్రేషన్, పెర్ఫార్మెన్స్ అనలిటిక్స్ వంటి ఫీచర్లతో ఈ రీడ్ ప్రో డేటా, లీడ్ మేనేజ్మెంట్, లైవ్ టీమ్ అప్డేట్లు, రియల్–టైమ్ పెర్ఫార్మెన్స్ ట్రాకింగ్, పెర్ఫార్మెన్స్ డాష్‌బోర్డ్‌లు, కంపాస్ వంటి అధునాతన సాధనాల ద్వారా లీడ్ జనరేషన్లో 200% పెరుగుదలకు సహాయపడిందన్నారు.రెండు కోట్ల కస్టమర్లకు.. ఈ ఆస్తి పోర్టల్‌లో వెరిఫైడ్ లీడ్స్, సైట్ సందర్శనలతో పాటు.. రెండు కోట్లకు పైగా కస్టమర్లు, 15 లక్షల జాబితాలతో మ్యాజిక్ బ్రిక్స్ రియల్ ఎస్టేట్ పరిశ్రమకు నాయకత్వం వహిస్తోంది. గృహ కొనుగోలు దారులు, దళారుల సామర్థ్యాలను, అవకాశాలను మెరుగు పరచడంలో ‘రీడ్ ప్రో’ వంటి సేవలు అత్యవసరమని రీడ్ ప్రో వ్యవస్థాపకుడు అక్షయ్ సేథ్ పేర్కొన్నారు. -
మాల్స్‌లో తగ్గిన రిటైల్ లీజింగ్
న్యూఢిల్లీ: షాపింగ్ మాల్స్, హై స్ట్రీట్లలో (ప్రముఖ షాపింగ్ ప్రాంతాలు) రిటైల్ స్థలాల లీజింగ్ 2024లో 10 శాతం తగ్గిపోయింది. దేశవ్యాప్తంగా ఎనిమిది నగరాల్లో 64 లక్షల చదరపు అడుగుల లీజింగ్ కార్యకలాపాలు 2024లో నమోదయ్యాయి. హైదరాబాద్, చెన్నై మాత్రం రాణించాయి. ఈ వివరాలను రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ వెల్లడించింది. 2023లో ఇవే నగరాల్లో స్థూల రిటైల్ స్పేస్ లీజింగ్ 71 లక్షల చదరపు అడుగులుగా ఉండడం గమనార్హం. ‘‘భార త రిటైల్ స్పేస్ విభాగం 2025లో గణీయమైన వృద్ధిని చూడనుంది. హైదరాబాద్, ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, బెంగళూరులో 50–60 లక్షల చదరపు అడుగుల గ్రేడ్–ఏ మాల్స్ స్థలాలు ఈ ఏడాది వినియోగంలోకి రానున్నాయి’’అని సీబీఆర్ఈ ఇండియా చైర్మన్, సీ ఈవో అన్హుమన్ మ్యాగజిన్ తెలిపారు. మధ్య శ్రేణి ఫ్యాషన్, వ్యాల్యూ ఫ్యాషన్, క్రీడా వ్రస్తాలు, జ్యుయ లరీ విభాగాల నుంచి బలమైన డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా సైతం మెరుగ్గా ఉంటుందని అంచనా వేశారు. రిటైల్ కేంద్రాలు షాపింగ్, డైనింగ్, వినోదం కలిసిన వినూత్నమైన అనుభవాన్ని అందిస్తూ, వినియోగదారులను ఆకర్షిస్తున్నట్టు తెలిపారు. పట్టణాల వారీగా లీజింగ్ → హైదరాబాద్ మార్కెట్లో 2024లో రిటైల్ స్పేస్ లీజింగ్ డిమాండ్ 10 లక్షల చదరపు అడుగులకు చేరింది. అంతక్రితం ఏడాది ఇది 7 లక్షల చదరపు అడుగులుగానే ఉంది. → చెన్నైలోనూ రిటైల్ స్పేస్ లీజింగ్ 6 లక్షల ఎస్ఎఫ్టీ నుంచి 7 లక్షల ఎస్ఎఫ్టీకి పెరిగింది. → ఢిల్లీ ఎన్సీఆర్లో 2023లో 14 లక్షల చదరపు అడుగుల లీజింగ్ నమోదు కాగా, 2024లో 10 లక్షల ఎస్ఎఫ్టీకి పరిమితమైంది. → బెంగళూరులో పెద్దగా మార్పు లేకుండా 19 లక్షల ఎస్ఎఫ్టీ లీజింగ్ లావాదేవీలు జరిగాయి. → ముంబైలో 10 లక్షల ఎస్ఎఫ్టీ నుంచి 8 లక్షల ఎస్ఎఫ్టీకి లీజింగ్ తగ్గింది. → పుణెలోనూ 8 లక్షల చదరపు అడుగుల నుంచి 6 లక్షలకు పరిమితమైంది. → కోల్‌కతాలో రిటైల్ స్పేస్ లీజింగ్ లక్ష చదరపు అడుగుల నుంచి 2 లక్షలకు పెరిగింది. → అహ్మదాబాద్‌లో 5 లక్షల నుంచి 4 లక్షల ఎస్ఎఫ్టీకి పరిమితమైంది. -
వచ్చే రెండేళ్లలో రూ. 1000 కోట్లు: రియల్టీ దిగ్గజం
చెన్నై: కార్యకలాపాల విస్తరణలో భాగంగా రియల్టీ దిగ్గజం జీ స్క్వేర్ రియల్టర్స్ వచ్చే రెండేళ్లలో రూ. 1,000 కోట్లు పైగా ఇన్వెస్ట్ చేయనుంది. ప్రస్తుతం హైదరాబాద్, కోయంబత్తూర్ తదితర నగరాల్లో ప్లాట్లను విక్రయిస్తున్న కంపెనీ ఇక తెలంగాణ, కర్ణాటక, తమిళనాడువ్యాప్తంగా రెసిడెన్షియల్ విభాగంలోకి విస్తరించాలని భావిస్తోంది. విల్లాలు, అపార్ట్మెంట్లను కూడా నిర్మించనుంది. ప్లాట్ మార్కెట్లో విజయవంతమైన నేపథ్యంలో గృహాల మార్కెట్లోకి కూడా ప్రవేశిస్తున్నట్లు సంస్థ ఎండీ బలరామజయం తెలిపారు. జీ స్క్వేర్ ఇప్పటివరకు 127 ప్రాజెక్టులను పూర్తి చేసిందని, 15,000 మంది పైగా కస్టమర్లకు సేవలు అందించిందని వివరించారు. -
ఇంటి కలకు భరోసా!
గత బడ్జెట్లో అందించిన పలు ప్రోత్సాహక చర్యలకు కొనసాగింపుగా, 2025 బడ్జెట్లోనూ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి పలు కీలక చర్యలు ఉంటాయని పరిశ్రమ వర్గాలు ఆశావహంగా ఉన్నాయి. ముఖ్యంగా 2024 ద్వితీయ భాగంలో ఇళ్ల అమ్మకాలు బలహీనడపడ్డాయి. అందుబాటు ధరల ఇళ్ల విభాగంలో (అఫర్డబుల్ హౌసింగ్) ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో పన్నుల ఉపశమనంతోపాటు, రియల్ ఎస్టేట్ రంగానికి మౌలిక రంగం హోదా కల్పించాలని, అనుమతులకు సింగిల్ విండో విధానం తీసుకురావాలని ఈ రంగం కోరుతోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన విస్తరణ, పారిశ్రామిక పార్కుల అభివృద్ధి, స్టాంప్ డ్యూటీ తగ్గింపు వంటి చర్యలకు గత బడ్జెట్లో చోటు కల్పించడం గమనార్హం. పరిశ్రమ వినతులు → మౌలిక రంగం హోదా కల్పించాలి. దీనివల్ల డెవలపర్లకు తక్కువ రేట్లకే రుణాలు అందుబాటులోకి వస్తాయి. కొనుగోలు దారులకు ఈ మేరకు ధరల్లో ఉపశమనం లభిస్తుంది. → రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌కు పలు రకాల అనుమతులు పొందేందుకు ఎంతో కాలం వృధా అవుతోంది. అన్ని రకాల అనుమతులకు సింగిల్ విండో (ఏకీకృత విభాగం) తీసుకురావాలి. → గతేడాది ఇళ్ల అమ్మకాలు క్షీణించడాన్ని రియల్టీ రంగం ప్రధానంగా ప్రస్తావిస్తోంది. అందుబాటు ధరల విభాగం (రూ.45 లక్షల్లోపు/60–90 చ.మీ కార్పెట్ ఏరియా)లో 2017 నుంచి అమ్మకాల్లో స్తబ్దత నెలకొంది. గత నాలుగేళ్లలో ధరలు పెరిగినందున ఈ విభాగం ధరల పరిమితిని సవరించాలి. → ఆదాయపన్ను పాత విధానంలో సెక్షన్ 24 కింద గృహ రుణ వడ్డీ చెల్లింపులపై రూ.2 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉండగా, దీన్ని మరింత పెంచాలి. కొత్త విధానంలోనూ వెసులుబాటు ఇవ్వాలి. → మరింత మంది డెవలపర్లు ఆఫీస్ స్పేస్ విభాగంలోకి అడుగు పెట్టేందుకు వీలుగా అద్దె ఆదాయంపై పన్ను ప్రయోజనాలు కల్పించాలి. → దేశవ్యాప్తంగా జీసీసీల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు కల్పించాలి. ప్రాపర్టీ లీజులకు జీఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సదుపాయం అందించాలి.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
రియల్టీపైనే కుబేరుల కన్ను..
న్యూఢిల్లీ: దేశీయంగా అత్యంత సంపన్నులు (హెచ్ఎన్ఐలు, యూహెచ్‌ఎన్‌ఐలు) రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్ చేయడంపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. వచ్చే రెండేళ్లలో రియల్టీపై గణనీయంగా పెట్టుబడులు పెట్టాలని 62 శాతం మంది పైగా కుబేరులు భావిస్తున్నారు. సంపన్నుల పెట్టుబడుల ధోరణులపై లగ్జరీ ప్రాపర్టీలకు సంబంధించిన రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ ఇండియా సోత్బీస్ ఇంటర్నేషనల్ రియల్టీ నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. పెద్ద నగరాలకు చెందిన 623 మంది హెచ్ఎన్ఐలు, యూహెచ్‌ఎన్‌ఐలు ఇందులో పాల్గొన్నారు.ఈ సర్వే ప్రకారం, భారత ఆర్థిక వృద్ధిపై ఆశాభావం కాస్త నెమ్మదించినప్పటికీ, వృద్ధి పటిష్టంగానే ఉండగలదనే అంచనాలు ఉన్నాయి. 2024లో ఆశాభావం 79 శాతంగా ఉండగా 2025 సర్వేలో ఇది 71 శాతానికి నెమ్మదించింది. అయినప్పటికీ, దేశ జీడీపీ వృద్ధి 6 శాతం నుంచి 6.5 శాతం వరకు ఉండొచ్చన్న అంచనాల నేపథ్యంలో.. భారత్ అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఎకానమీగానే కొనసాగుతుందని చాలా మటుకు హెచ్ఎన్ఐలు, యూహెచ్‌ఎన్‌ఐలు విశ్వసిస్తున్నారు.‘ఏడాది, రెండేళ్లలో రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్ చేయాలని భావిస్తున్న సంపన్నుల సంఖ్య 2024లో 71 శాతంగా ఉండగా 2025లో 62 శాతానికి పరిమితమైంది. అయినప్పటికీ పెట్టుబడులకు ఆకర్షణీయమైన సాధనంగా రియల్టీపై ఇంకా గట్టి నమ్మకం ఉండటాన్ని ఇది సూచిస్తుంది‘ అని నివేదిక వివరించింది. రాబడులపై ఆశాభావం.. పెట్టుబడి గణనీయంగా వృద్ధి చెందుతుందనే అంచనాలే, లగ్జరీ రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రధాన కారణమని సంపన్నులు వెల్లడించారు. 2024లో ఇలా చెప్పిన వారి సంఖ్య 44 %గా ఉండగా ప్రస్తుతం ఇది 55 శాతానికి పెరిగింది. ఇక రియల్టీ పెట్టుబడులపై రాబడులు 12–18% స్థాయిలో ఉంటాయని సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు సగం మంది ఆశాభావంతో ఉన్నారు. 38% మంది మాత్రం ఇది 12% కన్నా తక్కువే ఉంటుందని భావించగా .. 18 శాతానికి మించి ఉంటుందని 15%మంది అభిప్రాయపడ్డారు.‘కాస్త ఆచితూచి వ్యవహరించే ధోరణి నెలకొన్నా, దేశీయంగా లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్ వృద్ధి కొనసాగుతుంది. ముఖ్యంగా విశాలమైన ఫార్మ్‌హౌస్‌లు, గేటెడ్ కమ్యూనిటీ విల్లాలు మొదలైన వాటికి డిమాండ్ ఉంటుందని భావిస్తున్నాం‘ అని ఇండియా సోత్బీస్ ఇంటర్నేషనల్ రియల్టీ ఎండీ అమిత్ గోయల్ తెలిపారు. ఒకప్పుడు హోదాకు చిహ్నంగా నిల్చిన లగ్జరీ రియల్ ఎస్టేట్ ప్రస్తుతం మెరుగైన పెట్టుబడి సాధనంగా మారిందని సంస్థ సీఈవో అశ్విన్ చడ్ఢా పేర్కొన్నారు.బిలియనీర్ల బూస్ట్..దేశీయంగా బిలియనీర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం సైతం రియల్టీకి కలిసొస్తోందని నివేదిక పేర్కొంది. యూబీఎస్ నివేదికను ఉటంకిస్తూ, కుబేరుల సమష్టి సంపద 42 శాతం వృద్ధి చెంది ఏకంగా దాదాపు 905 బిలియన్ డాలర్ల స్థాయిని దాటిందని వివరించింది. గత దశాబ్దకాలంలో భారత్‌లో బిలియనీర్ల సంఖ్య రెట్టింపై 185కి చేరుకోగా, మొత్తం సంపద మూడు రెట్లు పెరిగినట్లు తెలిపింది. దీంతో అంతర్జాతీయంగా అత్యధిక సంఖ్యలో కుబేరులకు కేంద్రంగా అమెరికా, చైనా తర్వాత భారత్ మూడో స్థానంలో ఉన్నట్లు వివరించింది -
అభిషేక్ బచ్చన్‌కు ఎస్బీఐ నుంచి భారీ ఆదాయం
బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) తనయుడు అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడు, నిర్మాతగా ప్రసిద్ధి చెందారు. గురు, ధూమ్, దోస్తానా, హ్యాపీ న్యూ ఇయర్, బంటీ ఔర్ బబ్లీ వంటి చిత్రాలలో తన నటనతో గుర్తింపు పొందారు. అభిషేక్ నటనతో పాటు వ్యాపార రంగంలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. క్రీడలలోనూ చురుకుగా పాల్గొనే ఆయనకు వివిధ క్రీడా జట్లలో వాటాలు ఉన్నాయి.ఎస్బీఐ నుంచి నెలకు రూ.18లక్షలుదేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అభిషేక్ బచ్చన్‌కు ప్రతి నెలా రూ. 18 లక్షలు చెల్లిస్తుందని మీకు తెలుసా? అభిషేక్ బచ్చన్, విశ్వ సుందరి, బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్‌ను పెళ్లాడిన విషయం తెలిసిందే. ఈ దంపతులకు ఆరాధ్య బచ్చన్ అనే ఒక కుమార్తె ఉంది.రూ.280 కోట్ల నెట్‌వర్త్ ఉన్న అభిషేక్ బచ్చన్ తమ విలాసవంతమైన జుహు బంగ్లా, అమ్ము, వాట్స్ భవనాల్లోని గ్రౌండ్ ఫ్లోర్ కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో లాభదాయకమైన లీజు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఎస్బీఐ ఈ స్థలాన్ని 15 సంవత్సరాల పాటు లీజుకు తీసుకుంది. ఇది బచ్చన్ కుటుంబానికి గణనీయమైన అద్దె ఆదాయాన్ని అందిస్తుంది.రియల్ ఎస్టేట్ ఒప్పందాలను బయటపెట్టే జాప్కీ (Zapkey.com) అనే సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. బచ్చన్ కుటుంబం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య 15 సంవత్సరాల లీజు ఒప్పందం కుదిరింది. అభిషేక్ బచ్చన్ ప్రస్తుతం బ్యాంకు నుంచి నెలవారీ అద్దె రూ.18.9 లక్షలు తీసుకుంటున్నారు. ఈ అద్దె కాలానుగుణంగా పెరుగుదలకు సంబంధించిన క్లాజులు కూడా లీజులో పత్రాల్లో ఉన్నాయి. అద్దె ఐదేళ్ల తర్వాత రూ. 23.6 లక్షలకు, పదేళ్ల తర్వాత రూ. 29.5 లక్షలకు పెరుగుతుంది. నివేదికల ప్రకారం.. బచ్చన్ కుటుంబ నివాసమైన ‘జల్సా’కు సమీపంలో ఉన్న భవనంలో 3,150 చదరపు అడుగుల స్థలాన్నే ఎస్బీఐ లీజుకు తీసుకుంది. -
లగ్జరీ ఇళ్లల్లో కొత్త ట్రెండ్..
ఆధునికత, విలాసవంతమైన జీవనశైలికి యువ గృహ కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు. లగ్జరీ కాదు.. అంతకుమించి కోరుకుంటున్నారు. దీంతో 4 వేల నుంచి 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అపార్ట్మెంట్లను నిర్మిస్తున్నారు. ఇవి విశాలంగా ఉంటున్నాయే తప్ప సేవలపరంగా యువ కస్టమర్లలో అసంతృప్తి ఉంది. వీరిని సంతృప్తి పరిచేలా యువ డెవలపర్లు బ్రాండెడ్ హౌసింగ్‌లను నిర్మిస్తున్నారు. అగ్రశ్రేణి ఆతిథ్య సంస్థలతో కలిసి బ్రాండెడ్ రెసిడెన్సీ ప్రాజెక్ట్‌లను చేపడుతున్నారు. ఇప్పటివరకు ముంబై, బెంగళూరు, గుర్గావ్ వంటి నగరాలకే పరిమితమైన ఈ తరహా ప్రాజెక్ట్‌లు హైదరాబాద్‌లోనూ నిర్మితమవుతున్నాయి. – సాక్షి, సిటీబ్యూరోమారియట్, తాజ్, లీలా, ఇంటర్కాంటినెంటల్ వంటి అగ్రశ్రేణి ఆతిథ్య సంస్థలతో కలిసి విలాసవంతమైన అపార్ట్మెంట్లను నిర్మించడమే ఈ రెసిడెన్సీల ప్రత్యేకత. డిజైనింగ్, ఆర్కిటెక్చర్, ఎలివేషన్స్, విస్తీర్ణం, వసతులు, సేవలు.. అన్నీ టాప్ క్లాస్‌గా ఉంటాయి. బ్రాండెడ్ రెసిడెన్సీ అంటే కేవలం ప్రాపర్టీని కొనుగోలు చేయడం కాదు.. అంతర్జాతీయ జీవనశైలి అనుభూతిని పొందడం.బ్రాండెడ్ రెసిడెన్సీలు అంటే? స్టార్ హోటల్ సేవలు, అపార్ట్మెంట్ కలిపి ఉండే మిశ్రమ వినియోగ ప్రాజెక్ట్‌లనే బ్రాండెడ్ రెసిడెన్సీలు అంటారు. ఇందులో లేఔట్ స్థలంలో నివాసాల కోసం ప్రత్యేకంగా ఒక టవర్ ఉంటుంది. పక్కనే మరో టవర్‌లో హోటల్ ఉంటుంది. నివాసితులకు సేవలన్నీ ఆతిథ్య సంస్థలే అందిస్తాయి. కొన్ని ప్రాజెక్ట్‌లలో దిగువ అంతస్తుల్లో హోటల్, ఎగువ అంతస్తులో నివాస యూనిట్లు ఉంటాయి. నివాసితులకు ప్రత్యేక యాప్ ఉంటుంది. దాంట్లో నుంచి హోటల్లోని ఫుడ్, స్పా, సెలూన్ వంటి ఆర్డర్ చేయవచ్చు. వాళ్లే అపార్ట్‌మెంట్‌కు వచ్చి సర్వీస్ చేస్తారు. బ్రాండెడ్ గృహాల నిర్వహణ మొత్తం ఆతిథ్య సంస్థల ఆపరేటర్లే చూసుకుంటారు. హెచ్ఎన్ఐ, ప్రవాసులు కస్టమర్లు.. కొనుగోలుదారులకు అంతర్జాతీయ జీవనశైలి, డెవలపర్లకు అధిక రాబడి అందించే ప్రీమియం బ్రాండెడ్ గృహాలకు ఆదరణ పెరిగింది. ఫైవ్, సెవెన్ స్టార్ హోటళ్లు బ్రాండెడ్ రెసిడెన్సీల విభాగంలోకి ఎంట్రీ ఇచ్చాయి. దీంతో హెచ్ఎన్ఐలు(హై నెట్‌వర్త్ ఇండివిడ్యు వల్స్), ప్రవాసులు, బిజినెస్ టైకూన్లు, సినీ, క్రీడా సెలబ్రిటీలు డిజైనర్ హోమ్స్‌కు ఆసక్తి చూపిస్తున్నారు. బ్రాండెడ్ రెసిడెన్సీ కస్టమర్లు రెండు, లేదా మూడో గృహ కొనుగోలుదారులై ఉంటారు. దీంతో వీరికి ఆధునిక వసతులే అధిక ప్రాధాన్యత. ఎవరెక్కువ, వినూత్న, విలాసవంతమైన వసతులు అందిస్తారో అందులో కొనుగోలు చేస్తారు.ఎక్కడ వస్తున్నాయంటే.. దేశంలోని విలాసవంతమైన మార్కెట్లో హైదరాబాద్ వాటా 10 శాతంగా ఉంది. మన దేశంలో బ్రాండెడ్ హౌసెస్ 2,900 యూనిట్లు ఉండగా.. గ్లోబల్ మార్కెట్లో 3 శాతం వాటాగా నమోదైంది. అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు ఉన్న ప్రాంతాల్లోనే ఈ తరహా ప్రాజెక్ట్‌లకు డిమాండ్ ఉంటుంది. కోకాపేట, నియోపొలిస్, హైటెక్‌సిటీ, రాయదుర్గం, నానక్‌రాంగూడ, పుప్పాలగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రీమియం ప్రాంతాల్లో ఈ తరహా నిర్మాణాలు వస్తున్నాయి. శ్రీఆదిత్య హోమ్స్, బ్రిగేడ్ వంటి పలు నిర్మాణ సంస్థలు బ్రాండెడ్ రెసిడెన్సీలను నిర్మిస్తున్నాయి. వీటి ధరలు రూ.6–8 కోట్ల నుంచి ప్రారంభమవుతాయి.ప్రైవసీ, భద్రత.. కరోనా తర్వాత విలాసవంతమైన ఇళ్ల అమ్మకాలు పెరుగుతూ ఉన్నాయి. మిగతా విభాగంలోని ఇళ్లపై ప్రభావం పడినా.. అత్యంత లగ్జరీ ఆవాసాలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఐటీ, ఫార్మా, తయారీ రంగంతో పాటు కాస్మోపాలిటన్ కల్చర్‌తో నగరంలో లగ్జరీకి మించి జీవనశైలి కోరుకుంటున్నారు. సెవెన్ స్టార్ హోటల్లో మాదిరి గ్రాండ్ లాంజ్, డబుల్ హైట్ బాల్కనీ, హోమ్ ఆటోమేషన్, స్కై వ్యూ, స్పా, స్కై లాంజ్, మినీ థియేటర్, రూఫ్‌టాప్ డైనింగ్, ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్, ప్రైవసీ, భద్రత అన్ని ఉంటాయి.ఎక్కువ గ్రీనరీ, ఓపెన్ స్పేస్.. ఆర్కిటెక్చర్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ డిజైన్, పర్యావరణహితంగా ఉండేలా అంతర్జాతీయ డిజైనర్లతో తోడ్పాటు అందిస్తారు. ఈ ప్రాజెక్ట్‌లలో విశాలమైన బాల్కనీ, గ్రీనరీ, ఓపెన్ స్పేస్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దీంతో సాధారణ గృహాలతో పోలిస్తే రెసిడెన్సీలలో 5–7 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. ఇంట్లోకి గాలి, వెలుతురు ధారాళంగా వస్తాయి. వేర్వేరుగా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ద్వారాలు, ప్రతి అపార్ట్‌మెంట్‌కు ప్రత్యేక మార్గం ఉంటుంది. అపార్ట్మెంట్ ఫేసింగ్ ఎదురెదురుగా ఉండదు. దీంతో పూర్తిగా ప్రైవసీ ఉంటుంది. ఒకేరకమైన అభిరుచులు, జీవన శైలి కోరుకునే నివాసితులు ఒకే గేటెడ్ కమ్యూనిటీలో ఉండటంతో వీరి మధ్య సామాజిక సంబంధాలు బలపడతాయి. -
రియల్ ఎస్టేట్ సంస్థలు.. అదిరే లాభాలు!
రియల్ ఎస్టేట్ సంస్థ మాక్రోటెక్ డెవలపర్స్ (Macrotech Developers)ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్లో రూ.944 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. ఇళ్లకు డిమాండ్ పెరగడం ఇందుకు ప్రధాన కారణమని కంపెనీ తెలిపింది. గతేడాది ఇదే క్యూ3లో ఆర్జించిన రూ. 503 కోట్లతో పోలిస్తే ఇది 88 శాతం అధికంగా ఉంది. మొత్తం ఆదాయం రూ.2,958 కోట్ల నుంచి రూ.4,146 కోట్లకు చేరింది.‘‘డిసెంబర్ క్వార్టర్లో మొత్తం రూ.4,510 కోట్ల ముందస్తు విక్రయాలు జరిగాయి. ప్రీ–సేల్స్ రూ.4వేల కోట్ల పైగా జరగడం ఇది వరుసగా నాలుగో త్రైమాసికం. ఎన్నడూ లేని విధంగా ఈ క్యూ3లో మొత్తం రూ.4,290 కోట్ల వసూళ్లు జరిగాయి’’ అని కంపెనీ ఎండీ–సీఈవో అభిషేక్ లోధా తెలిపారు.– 2024–25 ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల్లో నికరలాభం రూ.883 కోట్ల నుంచి రూ.1,842 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం రూ.6,385 కోట్ల నుంచి రూ.9,749 కోట్లకు చేరింది. ఇదే కాలంలో ముందస్తు విక్రయాలు 25% వృద్ది చెంది రూ.12,820 కోట్లు జరిగాయి. మైండ్‌స్పేస్ రీట్ లాభం అప్రియల్టీ రంగ సంస్థ మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ రీట్ (Mindspace REIT) ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. నికర నిర్వహణ ఆదాయం(ఎన్వోఐ) 8 శాతం పుంజుకుని రూ. 522 కోట్లను తాకింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 473 కోట్లు మాత్రమే ఆర్జించింది.యూనిట్ హోల్డర్లకు ఒక్కో యూనిట్‌కు రూ. 5.32 చొప్పున పంపిణీ చేయనున్నట్లు కంపెనీ తెలియజేసింది. తద్వారా రూ. 315.5 కోట్లు వెచ్చించనుంది. దీనిలో ఒక్కో యూనిట్‌కు రూ. 3.2 చొప్పున డివిడెండ్ కలసి ఉంది. ఇందుకు రూ. 190 కోట్లు చెల్లించనుంది. ఈ కాలంలో 1.7 మిలియన్ చదరపు అడుగులను లీజ్ కిచ్చినట్లు కంపెనీ సీఈవో రమేష్ నాయిర్ పేర్కొన్నారు.కాగా.. సస్టెయిన్ ప్రాపర్టీస్‌లో 100 శాతం వాటా కొనుగోలుకి ఆఫర్ ఇచ్చినట్లు మైండ్‌స్పేస్ రీట్ వెల్లడించింది. హైదరాబాద్ రాయ్దుర్గ్లోని కామర్‌జోన్ ఐటీ పార్క్‌లో 1.8 మిలియన్ చదరపు అడుగులను సస్టెయిన్ కలిగి ఉన్నట్లు తెలియజేసింది. బీఎస్ఈలో మైండ్‌స్పేస్ రీట్ షేరు 0.6 శాతం క్షీణించి రూ. 375 వద్ద ముగిసింది. -
షారుఖ్ ఖాన్‌కి రూ.9 కోట్లు వెనక్కి..
బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్‌కి (Sharukh Khan) మహారాష్ట్ర ప్రభుత్వం వెనక్కి ఇస్తోంది. సముద్రానికి ఎదురుగా ఉన్న తన బంగ్లా 'మన్నత్' (Mannat) లీజును యాజమాన్యంగా మార్చుకునేందుకు అధికంగా చెల్లించిన రూ.9 కోట్లను మహారాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఇవ్వనుంది.2019లో షారుఖ్ ఖాన్, ఆయన భార్య గౌరీ ఖాన్ బాంద్రాలోని పురాతన ఆస్తిని 'క్లాస్ 1 పూర్తి యాజమాన్యం'గా మార్చారని, దాని కోసం కొంత ప్రీమియం ప్రభుత్వానికి చెల్లించారని రెసిడెంట్ సబర్బన్ కలెక్టర్ సతీష్ బాగల్ తెలిపారు. ప్రీమియం లెక్కింపులో ట్యాబులేషన్ లోపాన్ని గుర్తించిన తర్వాత, షారుఖ్ ఖాన్ దంపతులు ఇటీవల మంజూరైన రీఫండ్ కోసం రెవెన్యూ అథారిటీకి దరఖాస్తు చేసుకున్నారని ఆయన వివరించారు.మన్నత్ భవనం లీజ్ కన్వర్షన్ కోసం షారుఖ్ ఖాన్ దంపతులు మహారాష్ట్ర ప్రభుత్వానికి రూ. 25 కోట్లకు పైగా ప్రీమియం చెల్లించినట్లు మీడియా కథనాలు వచ్చాయి. అయితే ఇది ఎంత వరకూ వాస్తవం అన్నది అధికారులు ధ్రువీకరించలేదు.ఇంద్ర భవనమే!బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నివసించే రూ. 200 కోట్ల విలువైన బంగ్లా మన్నత్ ఇంద్ర భవనాన్ని తలపిస్తుంది. ఈ భవనాన్ని చూసేందుకు అభిమానులు తండోపతండాలుగా వస్తుంటారు. ఈ ఇంటి ఇంటీరియర్ డిజైనింగ్ అంతా గౌరీ ఖాన్ (Gouri Khan) స్వయంగా చేయించారు.ఈ బంగ్లాను షారుఖ్ ఖాన్ 2001లో కొనుగోలు చేశారు. ఆ తర్వాత దానికి మన్నత్ అని పేరు పెట్టారు. గౌరీ ఖాన్ తన భర్త షారుఖ్ కోసం ఇంట్లో ప్రత్యేకంగా ఓ కార్నర్ ని తయారు చేయించారు. అక్కడ షారుఖ్ ఖాన్ కి వచ్చిన అవార్డులన్నింటినీ ప్రత్యేకంగా అలంకరించారు. మన్నత్ చాలా విశాలంగా ఉంటుంది. ఇంట్లో భారీ లగ్జరీ హోమ్ థియేటర్ ఉంది. ఆరు అంతస్తుల ఈ ఇంట్లో లిఫ్ట్ వ్యవస్థ కూడా ఉంది. అంతేకాదు, ఇంటి మెట్లను చెక్కతో తయారు చేయగా, ఇంటి అలంకరణ కోసం చెక్కతో పాటు వివిధ దేశాల నుంచి ప్రత్యేకమైన ఇంటీరియర్ ని ఉపయోగించారు.మన్నత్ గురించి మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ బంగ్లాను మొదట సల్మాన్ ఖాన్ కొనాలనుకున్నారట. కానీ సల్మాన్ తండ్రి సలీం ఇంత పెద్ద బంగ్లా మనకు అవసరం లేదని చెప్పడంతో ఆయన ఆ ఆలోచనను విరమించుకున్నారు. -
హైదరాబాద్‌లో ఇళ్ల విక్రయాలు డీలా..
హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు (Housing sales) 2024లో నెమ్మదించాయి. 2023తో పోలిస్తే 25 శాతం తక్కువగా, 61,722 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2023లో విక్రయాలు 82,350 యూనిట్లుగా ఉండడం గమనార్హం. అంతేకాదు, దేశవ్యాప్తంగా తొమ్మిది నగరాల్లోనూ 2024లో ఇళ్ల అమ్మకాలు 9% మేర క్షీణించాయి. 4.71 లక్షల యూనిట్ల ఇళ్ల అమ్మకాలు నమోదయ్యాయి.2023లో ఈ తొమ్మిది నగరాల్లో అమ్మకాలు 5,14,820 యూనిట్లుగా ఉన్నాయి. ఈ మేరకు ప్రాప్ ఈక్విటీ (PropEquity) సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది. డిమాండ్‌తోపాటు, తాజా సరఫరా తగ్గడం ఇందుకు కారణాలుగా పేర్కొంది. తొమ్మిది నగరాల్లో కొత్త ఇళ్ల సరఫరా (విక్రయానికి అందుబాటులోకి రావడం) 15 శాతం తగ్గి 4,11,022 యూనిట్లుగా ఉంది.పట్టణాల వారీగా విక్రయాలు.. బెంగళూరులో ఇళ్ల అమ్మకాలు 2024లో 9 % క్షీణించి 60,506 యూనిట్లుగా నమోదు.చెన్నైలో 11% తక్కువగా 19,212 యూనిట్లు అమ్ముడయ్యాయి. కోల్‌కతాలో అమ్మకాలు 2023తో పోల్చితే కేవ లం 1% తగ్గి 19,212 యూనిట్లకు పరిమితం.ముంబైలో అమ్మకాలు 6% క్షీణించాయి. 50,140 యూనిట్ల విక్రయాలు జరిగాయి.నవీ ముంబైలో మాత్రం విక్రయాలు 16 శాతం పెరిగి 33,870 యూనిట్లుగా ఉన్నాయి.పుణెలో ఇళ్ల విక్రయాలు 13 శాతం తగ్గి 92,643 యూనిట్లుగా ఉన్నాయి. థానేలో 5% తక్కువగా 90,288 యూనిట్ల అమ్మకాలు జరిగాయి.ఢిల్లీ ఎన్సీఆర్లో గతేడాది ఇళ్ల అమ్మకాలు 5% వృద్ధితో 43,923 యూనిట్లుగా నమోదయ్యాయి.“2024లో హౌసింగ్ సప్లై,సేల్స్ తగ్గడానికి అధిక బేస్ ఎఫెక్ట్ కారణం. 2023లో ఇది అత్యంత గరిష్టానికి చేరింది. గణాంకాలను విశ్లేషణ ప్రకారం సేల్స్ పడిపోయినప్పటికీ, 2024లో సరఫరా-స్వీకరణ నిష్పత్తి 2023లో ఉన్నట్టుగానే ఉంది. ఇది రియల్ ఎస్టేట్ రంగం ప్రాథమికాలు బలంగా, ఆరోగ్యంగా ఉన్నాయని సూచిస్తున్నాయి” అని ప్రాప్‌ఈక్విటీ వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ జసూజా అన్నారు. -
దక్షిణ హైదరాబాద్‌కు 'రియల్' అభివృద్ధి!
నీళ్లు ఎత్తు నుంచి పల్లెం వైపునకు ప్రవహించినట్లే.. రోడ్లు, విద్యుత్, రవాణా వంటి మెరుగైన మౌలిక సదుపాయాలు ఉన్న చోటుకే అభివృద్ధి విస్తరిస్తుంది. ఐటీ ఆఫీస్ స్పేస్, నివాస, వాణిజ్య సముదాయాలతో కిక్కిరిసిపోయిన పశ్చిమ హైదరాబాద్ అభివృద్ధి (Real estate Development) క్రమంగా దక్షిణ హైదరాబాద్ (South Hyderabad) మార్గంలో శరవేగంగా విస్తరిస్తోంది. విమానాశ్రయంతో పాటు ఔటర్ మీదుగా వెస్ట్‌తో సౌత్ అనుసంధానమై ఉండటం ఈ ప్రాంతం మెయిన్ అడ్వాంటేజ్. దీనికి తోడు ప్రభుత్వం కూడా ఏఐ, ఫ్యూచర్ సిటీలను దక్షిణ హైదరాబాద్‌లోనే అభివృద్ధి చేయనుంది. పుష్కలంగా భూముల లభ్యత, అందుబాటు ధర, మెరుగైన రవాణా, మౌలిక వసతులు ఉండటంతో దక్షిణ ప్రాంతంలో రియల్ మార్కెట్ అభివృద్ధి చెందే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని శ్రీఆదిత్య హోమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆదిత్యరెడ్డి అన్నారు. ‘సాక్షి రియల్టీ’ ఇంటర్వ్యూలోని మరిన్ని అంశాలివీ.. – సాక్షి, సిటీబ్యూరోనగరం నాలుగు వైపులా అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రధాన నగరంలో మూసీ సుందరీకరణ, శివార్లలో ఫ్యూచర్ సిటీ, మెట్రో రెండో దశ విస్తరణ వంటి బృహత్తర ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుట్టింది. ఆయా ప్రాజెక్ట్‌లతో గృహ కొనుగోలుదారుల భావోద్వేగాలు మారుతాయి. జనసాంద్రత, రద్దీ ప్రాంతాల్లో ఉండే బదులు ప్రశాంతత కోసం దూరప్రాంతాలను ఎంచుకుంటారు. ఇదే సమయంలో మెట్రో విస్తరణతో కనెక్టివిటీ పెరగడంతో పాటు ఆయా మార్గాలలో రియల్ ఎస్టేట్ అవకాశాలు ఏర్పడతాయి. ఉదాహరణకు ఓల్డ్‌సిటీ, చాంద్రయాణగుట్ట మీదుగా శంషాబాద్‌కు మెట్రో అనుసంధానంతో ఆయా ప్రాంతాల్లో కూడా గేటెడ్ కమ్యూనిటీలు జోరుగా వస్తాయి. దీంతో బడ్జెట్ హోమ్స్‌తో సామాన్యుడి సొంతింటి కల మరింత చేరువవుతుంది.ట్రిపుల్ ఆర్తో ఉద్యోగ అవకాశాలు హైదరాబాద్ అభివృద్ధి దశను మార్చేసిన ఔటర్ రింగ్ రోడ్డుకు అవతల 30 కి.మీ. దూరంలో రీజినల్ రింగ్ రోడ్డు(ట్రిపుల్ ఆర్)ను నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఔటర్ లోపల ప్రాంతం ఇప్పటికే రద్దీ అయిపోయింది. ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్కు, ట్రిపుల్ ఆర్ నుంచి రాష్ట్ర సరిహద్దుల వరకు ఇలా వేర్వేరు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అభివృద్ధి ప్రణాళికలు, మాస్టర్ ప్లాన్లను చేపట్టాలి. ట్రిపుల్ ఆర్తో నగరంతోనే కాదు రాష్ట్రంలోని ఇతర జిల్లాలూ అనుసంధానమై ఉంటాయి. కనెక్టివిటీ పెరిగి రవాణా మెరుగవుతుంది. దీంతో ప్రధాన నగరంపై ఒత్తిడి తగ్గడంతో పాటు శివారు, పట్టణ ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందుతాయి. ట్రిపుల్ ఆర్ ప్రాంతాల్లో కేవలం నివాస, వాణిజ్య సముదాయాలే కాదు గిడ్డంగులు, పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది. దీంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.సిటీ వ్యూతో బాల్కనీ కల్చర్.. లగ్జరీ హౌసింగ్ అంటే కనిష్టంగా 2,500 చ.అ. విస్తీర్ణం ఉండాలి. అయితే విస్తీర్ణం మాత్రమే లగ్జరీని నిర్వచించలేదు. బెంగళూరు, ముంబైలలో 3 వేల చ.అ. ఫ్లాట్లనే ఉబర్ లగ్జరీ అపార్ట్‌మెంట్‌గా పరిగణిస్తారు. కానీ, మన దగ్గర 6, 8, 10 వేల చ.అ.ల్లో కూడా అపార్ట్మెంట్లు కూడా నిర్మిస్తున్నారు. అయినా కూడా ఇతర మెట్రోలతో పోలిస్తే మన దగ్గరే ధరలు తక్కువగా ఉంటాయి. ఉదాహరణకు.. హైదరాబాద్‌లో 5–10 వేల చ.అ. ఫ్లాట్ రూ.6–12 కోట్లలో ఉంటే.. బెంగళూరు, ముంబై నగరాల్లో 3 వేల చ.అ. ఫ్లాటే రూ.12 కోట్లు ఉంటుంది. పుష్కలమైన స్థలం, వాస్తు, కాస్మోపాలిటన్ కల్చర్, ఆహ్లాదకరమైన వాతావరణం, జీవనశైలి బాగుండటం వల్లే హైదరాబాద్‌లో లగ్జరీ ప్రాజెక్ట్‌లు వస్తున్నాయి. మన నగరంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి విశాలమైన, డబుల్ హైట్ బాల్కనీలను వాడుతుంటారు. అదే ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో వాతావరణం పొల్యూషన్ కాబట్టి బాల్కనీలు అంతగా ఇష్టపడరు.ఇంటి అవసరం పెరిగింది గతంలో ఇండిపెండెంట్ హౌస్‌లు ఎక్కువగా ఉండేవి. అందుకే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అబిడ్స్ వంటి పాత నగరంలో ఈ తరహా ఇళ్లే ఎక్కువగా కనిపిస్తాయి. కానీ, ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీలు, లగ్జరీ కమ్యూనిటీ లివింగ్ల ప్రాధాన్యం పెరిగింది. దీంతో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట వంటి ఖరీదైన ప్రాంతాల్లో నివాసానికి ఆసక్తి చూపిస్తున్నారు. కరోనా తర్వాత ఇంటి ప్రాముఖ్యత, అవసరం తెలిసొచ్చింది. వర్క్ ఫ్రం హోమ్‌తో 50–60 శాతం సమయం ఇంట్లోనే గడపాల్సిన పరిస్థితి. ఇప్పుడున్న పిల్లలు సెల్ఫోన్లు, టీవీలకు అతుక్కుపోతున్నారు. బయటకు వెళ్లి ఆడుకోవాలంటే ట్రాఫిక్ ఇబ్బందులు, భద్రత ఉండదు. అదే గేటెడ్ కమ్యూనిటీల్లో ఇబ్బందులు ఉండవు. కమ్యూనిటీ లివింగ్లలో గృహిణులు, పిల్లలకు రక్షణ ఉండటంతో పాటు ఒకే తరహా అభిరుచులు ఉన్నవాళ్లు ఒకే కమ్యూనిటీలో ఉంటారు. అలాగే ఒకే ప్రాంతంలో అన్ని వసతులు అందుబాటులో ఉంటాయి. దీంతో టెన్షన్ ఉండదు. చోరీలు, ప్రమాదాల వంటి భయం ఉండదు. సీసీటీవీ కెమెరాలు, 24/7 సెక్యూరిటీ సిబ్బందితో భద్రత ఉంటుంది. నిరంతరం నిర్వహణతో కమ్యూనిటీ పరిశుభ్రంగా, హైజీన్‌గా ఉంటుంది. థర్డ్ పార్టీ మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా వంద శాతం పవర్ బ్యాకప్, నిరంతరం నీటి సరఫరా ఉంటుంది. -
రియల్ ఎస్టేట్: ఫ్లాటా.. ప్లాటా.. ఏది బెటర్?
ఓపెన్ ప్లాట్ (Open plot), అపార్ట్మెంట్, కమర్షియల్ స్పేస్, రిటైల్.. ఇలా రియల్ ఎస్టేట్ (Real estate) పెట్టుబడులకు సాధనాలు అనేకం. కానీ, ఓపెన్ ప్లాట్లలో ఇన్వెస్ట్మెంట్స్తోనే అధిక రాబడి వస్తుందని హౌసింగ్.కామ్ సర్వే తెలిపింది. 2015 నుంచి దేశంలోని 8 ప్రధాన నగరాలలో ప్రతి సంవత్సరం స్థలాల ధరలలో 7 శాతం వృద్ధి నమోదవుతుంటే.. అపార్ట్మెంట్లలో మాత్రం 2 శాతమే పెరుగుదల కనిపిస్తోందని పేర్కొంది. హైదరాబాద్ (Hyderabad), చెన్నై, బెంగళూరు నగరాల్లోని నివాస ప్లాట్లకే ఎక్కువ డిమాండ్ ఉందని వెల్లడించింది. – సాక్షి, సిటీబ్యూరోపెద్ద నగరాలలో స్థలాల కొరత ఎక్కువగా ఉండటం, విపరీతమైన పోటీ నేపథ్యంలో ఉన్న కొద్ది స్థలాల ధరలు ఎక్కువగా ఉన్నాయని హౌసింగ్.కామ్ గ్రూప్ సీఈఓ ధ్రువ్ అగర్వాలా తెలిపారు. అందుకే ప్రధాన నగరాలలో పరిమిత స్థాయిలోని స్థలాలకు డిమాండ్ ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి సమయంలో ఓపెన్ ప్లాట్లకు, ఇండిపెండెంగ్ గృహాలకు డిమాండ్ ఏర్పడింది. దీంతో పెద్ద నగరాల్లోని శివారు ప్రాంతాలలో బడా డెవలపర్లు ఓపెన్ ప్లాట్ వెంచర్లు, వ్యక్తిగత గృహాల ప్రాజెక్ట్‌లను చేపడుతున్నారని, దీంతో డిమాండ్ పునఃప్రారంభమైందని చెప్పారు.కరోనాతో పెరిగిన డిమాండ్.. ఢిల్లీ–ఎన్సీఆర్, పుణే, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్కత్తా, అహ్మదాబాద్ ఎనిమిది ప్రధాన నగరాల్లో సాధారణంగా కొనుగోలుదారులు ఓపెన్ ప్లాట్ల కంటే ఫ్లాట్లు కొనుగోలు చేయడానికే ఇష్టపడతారు. ఎందుకంటే భద్రతతో పాటు పవర్ బ్యాకప్, కార్ పార్కింగ్, క్లబ్‌హౌస్, జిమ్, స్విమ్మింగ్ పూల్, గార్డెన్ వంటి కామన్ వసతులు ఉంటాయని అపార్ట్మెంట్ కొనుగోళ్లకే మొగ్గు చూపుతున్నారు. కానీ, కరోనా నేపథ్యంలో కామన్ వసతులు వినియోగం, అపార్ట్మెంట్లలో ఎక్కువ జనాభా వంటివి శ్రేయస్కరం కాదనే అభిప్రాయం ఏర్పడింది. దీంతో సొంతంగా స్థలం కొనుగోలు చేసి ఇళ్లు కట్టుకోవడమో లేక వ్యక్తిగత గృహాలను కొనుగోలు చేసేందుకే కొనుగోలుదారులు మొగ్గు చూపుతున్నారు.13–21 శాతం పెరిగిన ధరలు..హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలతో పాటూ గుర్గావ్లోని కొన్ని ప్రధాన ప్రాంతాలలోని నివాస స్థలాలకు డిమాండ్ పెరుగుతుందని హౌసింగ్.కామ్ రీసెర్చ్ హెడ్ అంకితా సూద్ తెలిపారు. 2018 నుంచి ఆయా నగరాలలోని ఓపెన్ ప్లాట్లలో రెండంకెల వృద్ధి నమోదవుతుందని పేర్కొన్నారు. గత మూడు సంవత్సరాలలో ఈ నగరాల్లో భూముల ధరలు 13–21 శాతం మేర పెరిగాయని చెప్పారు. ఇదే నగరాల్లోని అపార్ట్మెంట్ల ధరలలో మాత్రం 2–6 శాతం మేర వృద్ధి ఉందని తెలిపారు. కరోనా నేపథ్యంలో కొనుగోలుదారుల అభిరుచుల్లో వచ్చిన మార్పులు, పాలసీలతో రాబోయే త్రైమాసికంలో ఈ డిమాండ్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు.ఇదీ చదవండి: జూబ్లీహిల్స్‌లో బంగ్లా.. రూ.40 కోట్లు!హైదరాబాద్‌లో ప్లాట్లకే డిమాండ్ ఎక్కువఇతర దక్షిణాది నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోని ఓపెన్ ప్లాట్లకే డిమాండ్ ఎక్కువ గా ఉంది. 2018–24 మధ్య కాలంలో నగరంలోని స్థలాలలో గరిష్టంగా 21 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదవుతుంది. శంకర్పల్లి, పటాన్చెరు, తుక్కుగూడ, మహేశ్వరం, షాద్‌నగర్ ప్రాంతాల్లోని స్థలాలకు డిమాండ్, ధరల పెరుగుదల ఎక్కువగా ఉందని తెలిపింది. కాగా.. చెన్నైలో ప్లాట్లలో వార్షిక వృద్ధి రేటు 18 శాతం, బెంగళూరులో 13 శాతం ఉంది. చెన్నైలో అంబత్తూరు, అవడి, ఒరిగడం, శ్రీపెరంబుదూర్, తైయూర్ ప్రాంతాలలో, బెంగళూరులో నీలమంగళ, దేవనహళ్లి, చిక్కబల్లాపూర్, హోస్కేట్, కొంబల్‌గోడు ప్రాంతాల్లోని ప్లాట్లకు ఆదరణ ఎక్కువగా ఉంది.2018–24 మధ్య ఢిల్లీ–ఎన్సీఆర్లో ప్లాట్ల వార్షిక వృద్ధి రేటు 15 శాతంగా ఉంది. సోహ్నా, గుర్గావ్లో భూముల ధరలు ఏటా 6 శాతం పెరుగుతున్నాయి. సెక్టార్ 99, ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే, సెక్టార్ 95ఏ, సెక్టార్ 70ఏ, సెక్టార్ 63లలోని నివాస స్థలాలలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. -
రియల్టీలో మహిళలకు ఉపాధి ఎక్కడ?
రియల్ ఎస్టేట్ రంగంలో ఉపాధి పరంగా మహిళలకు తగినన్ని అవకాశాలు దక్కడం లేదని రియల్టీ(Realty) సంస్థ మ్యాక్స్ ఎస్టేట్స్, ఇన్ టాండెమ్ గ్లోబల్ కన్సల్టెంగ్‌తో కలసి నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. భారత రియల్ ఎస్టేట్ పరిశ్రమ 7.1 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తుంటే, అందులో మహిళలు 70 లక్షలుగానే (10 శాతం) ఉన్నట్టు తెలిపింది. ఈ రంగంలో సమానత్వం సాధనకు ఎంతో సమయం పడుతుందని పేర్కొంది.‘భారత రియల్ ఎస్టేట్(Real Estate) రంగం కూడలి వద్ద ఉంది. అసాధారణ వృద్ధికి సిద్దంగానే ఉన్నా, సవాళ్ల కారణంగా పూర్తి సామర్థ్యాలను చూడలేకుంది. భారత జనాభాలో మహిళలు 48.5 శాతంగా ఉంటే, ఇందులో కేవలం 1.2 శాతం మందికే రియల్ ఎస్టేట్ రంగంలో ఉపాధి లభిస్తోంది’అని ఈ నివేదిక వెల్లడించింది. ఒకవైపు మహిళలకు తగినంత ప్రాతినిధ్యం లేకపోగా, మరోవైపు వారికి వేతన చెల్లింపుల్లో అసమానత్వం ఈ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లలో ఒకటిగా పేర్కొంది.‘ఉపాధి కల్పనలో రియల్ ఎస్టేట్ రంగానికి గణనీయమైన పాత్ర ఉంది. అయినప్పటికీ మహిళలకు సమాన అవకాశాల కల్పన పరంగా ఎంతో దిగువన ఉంది. లింగ అసమానతను పరిష్కరించడం ద్వారా ఆర్థిక ప్రయోజనాలను, ఉత్పాదకతను, ఆవిష్కరణలను, లాభదాయకతను గణనీయంగా పెంచొచ్చు’ అని ఈ నివేదిక సూచించింది. బ్లూకాలర్, వైట్ కాలర్ మహిళా కార్మికుల సాధికారత పెంచేందుకు నైపుణ్య శిక్షణ అందించాలని పేర్కొంది. మరింత మంది మహిళలకు భాగస్వామ్యం కలి్పంచడం వల్ల ఈ రంగం ముఖచిత్రం మారిపోతుందని ఇన్టాండెమ్ గ్లోబల్ కన్సల్టెంగ్ ఎండీ శర్మిష్ట ఘోష్ అభిప్రాయపడ్డారు. -
హైదరాబాద్‌లో పెరిగిన రిజిస్ట్రేషన్లు.. ఏ ప్రాంతంలో ఎక్కువంటే..
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ 2024లో గణనీయమైన వృద్ధిని కనబరిచింది. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు ఏడాది ప్రాతిపదికన 7 శాతం పెరిగాయి. ఈమేరకు నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక విడుదల చేసింది. నగరంలో 2023లో 71,912 ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు జరగ్గా, 2024లో 76,613 రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. నమోదైన మొత్తం ఆస్తుల విలువ కూడా 23 శాతం పెరిగి రూ.47,173 కోట్లకు చేరింది.ప్రీమియం ప్రాపర్టీస్హైదరాబాద్ ప్రాపర్టీ మార్కెట్లో రూ.1 కోటి, అంతకంటే ఎక్కువ విలువ చేసే గృహాల రిజిస్ట్రేషన్లు పెరిగాయి. 2023లో అంతకుముందు ఏడాది కంటే 10 శాతం పెరగ్గా, ఇప్పుడు రిజిస్ట్రేషన్లలో 14 శాతం వృద్ధి నమోదైంది. వినియోగదారులు ప్రీమియం ప్రాపర్టీల వైపు మళ్లడం గృహ కొనుగోలుదారుల ఆకాంక్షలను, నగరవాసుల ఆర్థిక మూలాలను ప్రతిబింబిస్తుంది.జిల్లాల వారీగా..రియల్టీ వ్యాపారం సీటీ పరిసరాల్లో పెరుగుతున్న నేపథ్యంలో మొత్తం రిజిస్ట్రేషన్లలో 83 శాతం మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లోనే ఎక్కువగా ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు జరిగాయి. మేడ్చల్-మల్కాజ్గిరిలోనే 42 శాతం, రంగారెడ్డిలో 41 శాతం రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. మిగిలిన 17% వాటా హైదరాబాద్ జిల్లా నుంచి ఉంది.ప్రాపర్టీ పరిమాణాల వారీగా..ప్రాపర్టీ పరిమాణాల పరంగా చూస్తే 1,000 నుంచి 2,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న వాటిని గృహాల నిర్మాణానికి వినియోగించారు. మొత్తం రిజిస్ట్రేషన్లలో వీటి వాటా 69%గా ఉంది. 2000 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణం కలిగిన ఆస్తులు 2023లో 11 శాతం ఉండగా, 2024లో 14 శాతానికి పెరిగాయి. 2024 డిసెంబరులో లావాదేవీల సగటు ధర 6% పెరిగింది.ఇదీ చదవండి: రూ.1,275 లక్షల కోట్లకు ప్రపంచ కుబేరుల సంపదనైట్ ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజాల్ మాట్లాడుతూ.. లగ్జరీ జీవనానికి అలవాటు పడుతున్న నేపథ్యంలో ప్రీమియం గృహాలపై ఆసక్తి పెరుగుతుందన్నారు. అభివృద్ధి చెందుతున్న మార్కెట్ అవసరాలకు అనుగుణంగా అధునాతన ప్రాజెక్టులను ప్రారంభించడం ద్వారా డెవలపర్లు వినియోగదారుల డిమాండ్‌కు వేగంగా స్పందిస్తున్నారని చెప్పారు. -
ఇళ్ల నిర్మాణ వ్యయంలో భారీ కోత..?
భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామీణ గృహనిర్మాణ పథకం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ (PMAY-G)కు 2025 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదిత వ్యయం కంటే తక్కువ ఖర్చు చేయనున్నట్లు అంచనా. ఈ పథకం అమలుకు గతంలో అంచనా వేసిన దానికంటే రూ.20,000 కోట్లు కోత విధించబోతున్నట్లు తెలిసింది. ఈ పథకానికి సంబంధించి 2025-26 ఏడాదికి వాస్తవ వ్యయం సుమారు రూ.35,000 కోట్లు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీని గత బడ్జెట్(Budget) అంచనా రూ.54,500 కోట్ల కంటే చాలా తక్కువ.2025 నుంచి వచ్చే ఐదేళ్లలో రెండు కోట్ల ఇళ్లను నిర్మించాలని, గ్రామీణ కుటుంబాలకు అందుబాటు ధరల్లో గృహాలను అందించాలని పీఎంఏవై-జీ లక్ష్యంగా పెట్టుకుంది. పక్కా గృహాల నిర్మాణానికి యూనిట్‌కు రూ.2.39 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. అయితే, రాబోయే ఆర్థిక సంవత్సరానికి ముందుగా అనుకున్న మేరకు ఖర్చు చేయలేరనే అంచనాలు వెలువడుతున్నాయి. దాంతో ఈ పథకం లక్ష్యం నీరుగారినట్లువుతుందని లబ్ధిదారులు, మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ పథకం రెండో దశ ప్రారంభంలో ఆర్థిక సాయం అందించడంలో తీవ్రంగా జాప్యం జరగడమే ఈ అంచనాకు ప్రధాన కారణం. అర్హులైన కుటుంబాలను గుర్తించేందుకు సర్వే కొనసాగుతోందని, 2025 మార్చి వరకు ఈ సర్వే జరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. దాంతో సర్వే పూర్తై, నిధులు విడుదలై, ఇళ్ల నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందనే ప్రశ్నలు వస్తున్నాయి. పైగా 2025-26లో పథకం అమలు వ్యయంలో కోత విధిస్తారనే అంచనాలతో ఇళ్ల నిర్మాణం ప్రశ్నార్థకంగా మారుతుంది.ఇదీ చదవండి: చైనాపై ఆధారపడటాన్ని తగ్గించాలిపీఎం జన్‌మన్‌కు రూ.3.06 లక్షల కోట్లు2025 ఆర్థిక సంవత్సరం నుంచి ఐదేళ్లలో 20 లక్షల పక్కా గృహాలను నిర్మించాలనే లక్ష్యంతో ప్రధాన మంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (PM JANMAN)ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం పీఎంఏవై-జీ 2.0లో భాగంగా ఉంది. ఇది 2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి 2028-29 ఆర్థిక సంవత్సరం వరకు మొత్తం రూ.3.06 లక్షల కోట్లు కేటాయించింది. ఇలా ప్రధానంగా పీఏంఏవై-జీ అమలులో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అదే తరహా కొత్త పథకాలు ప్రవేశపెట్టి లబ్ధిదారులను తగ్గిస్తుండడం పట్ల విమర్శలు వస్తున్నాయి. -
విశాలమైన ఇళ్ల కొనుగోలు.. టైర్–2 జోరు
కరోనా నేపథ్యంలో మొదలైన వర్క్ ఫ్రం హోమ్ (Work form Home) నేటికీ కొనసాగుతుండటంతో ‘టైర్–2’ (tier 2 cities) ద్వితీయ శ్రేణి పట్టణాల్లోని ప్రాపర్టీలకు డిమాండ్ ఏర్పడింది. ప్రధాన నగరంలో ఇరుకు ఇళ్ల మధ్య ఉండటం బదులు శివారు ప్రాంతాలకు, హరిత భవనాలు, విస్తీర్ణం ఎక్కువగా ఉండే గృహాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపు తున్నారు. -సాక్షి, సిటీబ్యూరోకరోనా రెండో దశ ఉధృతి నేపథ్యంలో సూరత్, జైపూర్, పాట్నా, మోహాలీ, లక్నో, కోయంబత్తూరు వంటి ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఆన్లైన్లో ప్రాపర్టీల శోధన గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయని హౌసింగ్.కామ్ ఇండియన్ రెసిడెన్షియల్ ఇండెక్స్ ఫర్ ఆన్లైన్ సెర్చ్(ఐఆర్ఐఎస్) తెలిపింది. ఆయా ద్వితీయ శ్రేణి పట్టణాల్లో గృహ కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారని పేర్కొంది. నోయిడాలోని నోయిడా ఎక్స్టెన్షన్, ముంబై లోని మీరా రోడ్ ఈస్ట్, అంధేరి వెస్ట్, బోరివలీ వెస్ట్, బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ ప్రాంతాలు ఈ ఏడాది దేశీయ నివాస సముదాయ మార్కెట్‌ను లీడ్ చేస్తాయని తెలిపింది.మారిన అభిరుచులు.. ఆన్లైన్లో రూ.2 కోట్లకు పైబడిన ప్రాపర్టీల శోధన ఒకటిన్నర శాతం వృద్ధి చెందిందని పేర్కొంది. గతంలో ప్రాపర్టీ కొనుగోలు చేయాలంటే ధర, వసతులు ప్రధాన అంశాలుగా ఉండేవి. కరోనా తర్వాత నుంచి గృహ కొనుగోలుదారుల ఎంపికలో మార్పులొచ్చాయి. వైద్య సదుపాయాలకు ఎంత దూరంలో ఉంది? భద్రత ఎంత? అనే వాటికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపింది.గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా వైద్య సదుపాయాలు, భద్రత, ఓపెన్ స్పేస్ ఎక్కువగా ఉన్న ప్రాజెక్ట్‌లకు డిమాండ్ ఉంటుందని హౌసింగ్.కామ్ గ్రూప్ సీఈఓ ధ్రువ్ అగర్వాలా తెలిపారు. 3 బీహెచ్‌కే, ఆపై పడక గదుల గృహాల్లో అంతకు క్రితం ఏడాదితో పోలిస్తే 2021లో 15 శాతం వృద్ధి నమోదయ్యిందని పేర్కొన్నారు. అదే సమయంలో గతేడాది పెద్ద సైజు ప్లాట్లలో 42 శాతం పెరుగుదల కనిపించింది.అద్దెలకు గిరాకీ.. ప్రాజెక్ట్‌ల ఆలస్యం, దివాలా డెవలపర్లు వంటి ప్రతికూల వాతావరణంలోనూ నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్సీఆర్)లో ప్రాపర్టీ శోధనలు గణనీయమైన స్థాయిలో పెరిగింది. నోయిడా ఎక్స్టెన్షన్ ప్రాంతం ఆన్లైన్ ప్రాపర్టీ సెర్చింగ్‌లో ప్రథమ స్థానంలో నిలిచింది. కేంద్రం, ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వాలు ఈ రీజియన్‌లో పలు మౌలిక సదుపాయ ప్రాజెక్ట్‌లను ప్రకటించడం, ధరలు అందుబాటులో ఉండటం వంటివి ఈ రీజియన్‌లో ప్రాపర్టీల వృద్ధికి కారణమని తెలిపింది.ఐటీ, ఫార్మా కంపెనీలు ఉద్యోగ నియామకాలను పెంచడంతో ముంబై, బెంగళూరు, ఢిల్లీ మార్కెట్లలో అద్దెలకు గిరాకీ పెరిగిందని పేర్కొంది. ఈ ఏడాది దేశీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ వృద్ధికి మరీ ముఖ్యంగా నివాస సముదాయ మార్కెట్లో ముంబై, బెంగళూరు, హైదరాబాద్ అత్యంత కీలకంగా కానున్నాయని అంచనా వేసింది. -
జూబ్లీహిల్స్‌లో బంగ్లా.. రూ.40 కోట్లు!
సాక్షి, సిటీబ్యూరో: కరోనా తర్వాత నుంచి లగ్జరీ గృహాలకు (luxury homes) ఆదరణ పెరిగింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో రూ.80 కోట్ల ఖరీదైన రెండు బంగ్లాలు, ఒక్కోటి రూ.40 కోట్ల చొప్పున అమ్ముడుపోయాయి. గతేడాది దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో రూ.40 కోట్లకు పైగా విలువైన 59 అల్ట్రా లగ్జరీ గృహాల విక్రయాలు జరిగాయని అనరాక్ గ్రూప్ నివేదిక వెల్లడించింది. వీటి విలువ రూ.4,754 కోట్లు. వీటిలో 53 అపార్ట్మెంట్లు కాగా.. 6 బంగ్లాలు ఉన్నాయి.2023లో సుమారు రూ.4,063 కోట్ల విలువైన 58 లగ్జరీ గృహాలు విక్రయించారు. మొత్తం అమ్మక విలువలో వార్షిక పెరుగుదల 17 శాతంగా ఉంది. 2024లో అమ్ముడైన అల్ట్రా లగ్జరీ గృహాలలో రూ.100 కోట్ల విలువైన యూనిట్లు 17 ఉన్నాయి. వీటి విలువ రూ.2,344 కోట్లు. గతేడాది 88 శాతం వాటాతో అత్యధికంగా ముంబైలో 52 అల్ట్రా లగ్జరీ యూనిట్లు సేల్ అయ్యాయి. ఢిల్లీ–ఎన్సీఆర్లో మూడు, బెంగళూరు, హైదరాబాద్‌లో రెండేసి గృహాలు అమ్ముడయ్యాయి.హెచ్ఎన్ఐ, ప్రవాసుల డిమాండ్ గత రెండేళ్లలో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 130 అల్ట్రా లగ్జరీ గృహాలు విక్రయమ్యాయి. వీటి విలువ రూ.9,987 కోట్లు. 2022లో రూ.1,170 కోట్ల విలువైన 13 యూనిట్లు అమ్ముడుపోయాయి. వీటిలో 10 అపార్ట్మెంట్లు కాగా మూడు బంగ్లాలు ఉన్నాయి. 2023లో రూ.4,063 కోట్ల విలువైన 58 యూనిట్లు అమ్ముడయ్యాయి.హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ), ప్రవాసులు వ్యక్తిగత వినియోగం, పెట్టుబడుల కోసం అల్ట్రా లగ్జరీ గృహాలను కొనుగోలు చేస్తున్నారు. ఇన్పుట్ వ్యయం పెరుగుదల, బలమైన కొనుగోలుదారుల డిమాండ్ కారణంగా మెట్రో నగరాలలో ఈ తరహా ఇళ్ల పెరుగుతున్నాయి. దీంతో గ్రేడ్–ఏ డెవలపర్లు అల్ట్రా లగ్జరీ ప్రాజెక్ట్‌ల నిర్మాణాలకు మొగ్గు చూపుతున్నారు. -
అపార్ట్మెంట్, విల్లా కలిస్తే..
అవునూ.. హైదరాబాద్ నిర్మాణ రంగం (Hyderabad realty) ట్రెండ్ మారింది. అపార్ట్మెంట్, విల్లా రెండింటినీ మిక్స్ చేస్తూ స్కై విల్లాస్ (Sky villa) హాట్ కేక్‌లుగా అవతరించాయి. ఒక అపార్ట్మెంట్లో ఫ్లోర్‌కు ఒక్క ఫ్లాట్ మాత్రమే, అది కూడా 6 వేల నుంచి 16 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో.. పైగా విలాసవంతమైన వసతులు, భద్రత, ప్రైవసీలతో కట్టిపడేస్తున్నాయి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్(హెచ్ఎన్ఐ), ప్రవాసులు స్కై విల్లాస్ కొనుగోలుకు ఆసక్తి చూపిస్తుండటంతో నగరంలో వీటి నిర్మాణాలు జోరందుకున్నాయి.గతంలో విలాసవంతమైన ఇళ్లలో నివసించాలనుకునేవారి కోసం విల్లాలు, బంగ్లాలు నిర్మించేవారు. వీటికి కొంత పరిమితులున్నాయి. భూమి ధర విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో డెవలపర్లకు ప్రధాన నగరంలో విల్లాలు, బంగ్లాలు నిర్మించడం సాధ్యం కాదు. దీంతో ఎత్తయిన అపార్ట్మెంట్లలో స్కై విల్లాలను నిర్మిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లోని పచ్చదనం, సిటీ వ్యూ అనుభూతిని కలిగిస్తుండటంతో ఎత్తయిన భవనాల్లో నివసించాలనే కోరిక పెరిగింది. దీంతో మల్టీ లెవల్ స్కై విల్లాలు నివాస సముదాయ విభాగంలో హాటెస్ట్ ట్రెండ్‌గా మారింది. జీవనశైలి పట్టణ వినియోగదారుల్లో ప్రజాదరణ పొందుతోంది. – సాక్షి, సిటీబ్యూరోస్కై విల్లాస్ అంటే? విల్లాలు, అపార్ట్మెంట్ల డిజైన్, వసతులు ఒకే భవనంలో కలిపి ఉండేవే స్కై విల్లాలు లేదా విల్లామెంట్‌లు. సాధారణంగా విల్లాలు పెద్ద ఫ్లోర్ ప్లాన్, ఎక్కువ స్థలం కలిగి ఉండే స్వతంత్ర గృహాలు. వీటిల్లో లగ్జరీ వసతులు, ఔట్‌డోర్ స్పేస్ ఎక్కువగా ఉంటుంది. ఇక, అపార్ట్మెంట్లు చిన్నగా, సమూహంగా ఉంటాయి. వీటిల్లో నివాసితులు కామన్ ఏరియాలను షేరింగ్ చేసుకుంటారు. ఈ రెండు కాన్సెప్ట్‌లు కలిపి.. విల్లాలోని విశాలమైన స్థలం, లగ్జరీ, ప్రైవసీ, అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లోని సౌకర్యాలు, భద్రత కలిపి డిజైన్ చేసేవే స్కై విల్లాస్. సరళభాషలో చెప్పాలంటే ఇదొక డూప్లెక్స్ అపార్ట్మెంట్.ప్రైవసీ, ఆధునిక వసతులు.. ఒక స్వతంత్ర బంగ్లా మాదిరి కాకుండా స్కై విల్లాలు భవనం మొత్తం అంతస్తులో విస్తరించి ఉంటాయి. రెండు లేదా అంతకంటే ఎక్కువ అంతస్తులో విస్తరించి ఉండే విశాలమైన బహుళ స్థాయి గృహాలే స్కై విల్లాలు. ఈ ప్రాజెక్ట్‌లలో జన సాంద్రత తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రైవసీ, భద్రత ఎక్కువ. ఇంటి పరిమాణాన్ని బట్టి స్కై విల్లాలను ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ ఆటోమేషన్, టెక్నాలజీతో విలాసవంతంగా తీర్చిదిద్దవచ్చు.స్కై విల్లాల్లో చాలా వరకు నాలుగు వైపులా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. దీంతో సూర్యరశ్మి, గాలి, వెలుతురు ధారాళంగా వస్తాయి. మంచి వెంటిలేషన్ ఉంటుంది. స్కై విల్లాలలో ప్రైవేట్ లాన్, సన్డెక్తో కూడిన ప్రైవేట్ పూల్, ప్రత్యేక లిఫ్ట్, సెంట్రల్ ఎయిర్ కండీషనర్, హోమ్ థియేటర్, లగ్జరీ బెడ్ రూమ్స్, కిచెన్, స్టాఫ్ క్వార్టర్స్ వంటివి ఉంటాయి. అలాగే బ్యాడ్మింటన్ కోర్ట్, గోల్ఫ్ కోర్స్‌లు, విశాలమైన పిల్లల ఆట స్థలాలు, విలాసవంతమైన క్లబ్‌హౌస్, కాఫీ షాప్, స్విమ్మింగ్ పూల్తో పాటు ల్యాండ్ స్కేప్ గార్డెన్, వాకింగ్ ట్రాక్స్ వంటి వాటితో ప్రశాంత వాతావరణం ఉంటుంది.ఎక్కడ వస్తున్నాయంటే? స్కై విల్లాస్ ధరలు అపార్ట్మెంట్ల కంటే 30–40 శాతం ఎక్కువగా, విల్లా కంటే 20–30 శాతం తక్కువగా ఉంటాయి. ఈ ప్రాజెక్ట్‌ల్లోని ఫ్లాట్లు భారీ విస్తీర్ణంతో పాటు సకల సౌకర్యాలు ఉండటంతో వీటి ప్రారంభ ధర రూ.6 కోట్ల నుంచి ఉంటాయి. కొల్లూరు, ఉప్పల్, కోకాపేట, కొండాపూర్, నార్సింగి, పుప్పాలగూడ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఈ తరహా ప్రాజెక్ట్‌లు వస్తున్నాయి. 30–50 అంతస్తుల భవనాల్లో ఇలాంటి స్కై విల్లాలు నిర్మిస్తున్నారు. ఆకాశహర్మ్యల్లో ఎత్తుకు వెళ్లే కొద్దీ నిర్మాణ వ్యయం పెరుగుతుంది.అందుకే ఖర్చును తగ్గించుకునేందుకు 6 వేల నుంచి 16 వేల చ.అ. విస్తీర్ణంలో ఒకటే ఫ్లాట్ ఉండేలా ప్రత్యేకంగా డిజైనింగ్ చేస్తున్నారు. అపార్ట్మెంట్లోని పైఅంతస్తులో ఈ తరహా స్కై విల్లాలను కడుతున్నారు. సౌకర్యాలకు లోటు లేకుండా ఆకాశహరమ్యల్లో ప్రతీ గేటెడ్ కమ్యూనిటీల్లో ఉన్నట్లే క్లబ్‌హౌస్‌తో పాటు అన్ని రకాల ఆధునిక వసతులను కల్పిస్తున్నారు. ఒక్కో క్లబ్‌హౌస్ 50 వేల చ.అ.విస్తీర్ణంలో ఉంటుంది.ప్రయోజనాలివీ..» విల్లామెంట్ ప్రయోజనాల్లో ప్రధానమైనది విల్లాలాంటి అనుభూతి. నివాసితులు విడిగా ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో ఉండే వసతులు, సౌలభ్యాలను ఆస్వాదించవచ్చు. ఇందులో స్విమ్మింగ్ పూల్, జిమ్, పార్క్‌లు వంటి భాగస్వామ్య సౌకర్యాలతో పాటు భద్రత, నిర్వహణ సేవలు ఉంటాయి.» డూప్లెక్స్ డిజైన్ బెడ్ రూమ్‌లు, బాత్రూమ్లు, లివింగ్, డైనింగ్ ఏరియాలతో పాటు ప్రైవేట్ టెర్రస్ లేదా గార్డెన్ ఉంటాయి. అదనంగా విల్లామెంట్లలో ప్రైవేట్ లిఫ్ట్, విశాలమైన కార్ పార్కింగ్ సౌకర్యాలుంటాయి.» స్కై విల్లాస్ సాంప్రదాయ అపార్ట్మెంట్ కంటే ఎక్కువ స్థలం, ప్రైవసీని అందిస్తాయి.» విల్లామెంట్ కాంప్లెక్స్‌లు సెక్యూరిటీ గార్డులు, సీసీటీవీ కెమెరాలతో కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. నివాసితులకు సురక్షితమైన జీవనం, మనశ్శాంతిని అందిస్తాయి.» విల్లాలాగే ప్రాపర్టీ మొత్తం నిర్వహణ వ్యయం యజమాని భరించాల్సిన అవసరం లేదు. విల్లామెంట్‌ల నిర్వహణ కమ్యూనిటీలోని అందరూ పాలుపంచుకుంటారు. దీంతో నివాసితులకు వ్యయం, సమయం ఆదా అవుతుంది. -
రియల్టీలో పీఈ పెట్టుబడులు ప్లస్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి తొమ్మిది నెలల్లో రియల్టీ రంగంలోకి ప్రయివేట్ ఈక్విటీ(Private equity) పెట్టుబడులు 6 శాతం పెరిగాయి. ఏప్రిల్–డిసెంబర్లో 2.82 బిలియన్ డాలర్లకు చేరాయి. ప్రధానంగా ఇండ్రస్టియల్, లాజిస్టిక్స్ పార్క్‌లు పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. రియల్టీ కన్సల్టెంట్ అనరాక్ గణాంకాల ప్రకారం గతేడాది(2023–24) ఇదే కాలంలో 2.66 బిలియన్ డాలర్ల పీఈ పెట్టుబడులు లభించాయి. అయితే డీల్స్ 24కు పరిమితమయ్యాయి. గతేడాది 30 లావాదేవీలు నమోదయ్యాయి. మొత్తం పీఈ పెట్టుబడుల్లో విదేశీ ఫండ్స్ వాటా 82 శాతంకాగా.. దేశీయంగా 18 శాతం నిధులు లభించాయి. ఇండస్ట్రియల్, లాజిస్టిక్స్ విభాగం అత్యధికంగా 62 శాతం పెట్టుబడులను సమకూర్చుకుంది. ఈ బాటలో హౌసింగ్ 15 శాతం, ఆఫీస్ విభాగం 14 శాతం, మిక్స్డ్ వినియోగ ప్రాజెక్టులు 9 శాతం పెట్టుబడులను ఆకర్షించాయి. ఇదీ చదవండి: భారత్ ఎకానమీ వృద్ధి కోతటాప్–10 డీల్స్ హవాతొలి 9 నెలల మొత్తం పీఈ లావాదేవీలలో టాప్–10 డీల్స్ వాటా 93 శాతమని అనరాక్(Anarock Capital) క్యాపిటల్ సీఈవో శోభిత్ అగర్వాల్ వెల్లడించారు. 1.54 బిలియన్ డాలర్ల విలువైన రిలయన్స్, ఏడీఐఏ, కేకేఆర్ వేర్‌హౌసింగ్ డీల్‌ను అతిపెద్ద లావాదేవీగా పేర్కొన్నారు. దీనితోపాటు 20.4 కోట్ల డాలర్ల విలువైన బ్లాక్‌స్టోన్, లోగోస్ ఈక్విటీ డీల్.. లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ రంగానికి ప్రోత్సాహాన్నిచ్చినట్లు తెలియజేశారు. ఈ రంగం మొత్తం పీఈ పెట్టుబడుల్లో 62 శాతం వాటాను ఆక్రమించుకున్నట్లు వెల్లడించారు. -
లగ్జరీ ఇళ్ల మెరుపులు
న్యూఢిల్లీ: విశాలమైన ఇళ్లు, ప్రీమియం సదుపాయాలు కోరుకునే సంపన్నుల సంఖ్య పెరుగుతుండటంతో దానికి అనుగుణంగా లగ్జరీ ఇళ్లకు డిమాండ్ కూడా గణనీయంగా పెరుగుతోంది. 2024లో హైదరాబాద్ సహా ఏడు ప్రధాన నగరాల్లో రూ. 4 కోట్లకు పైగా ఖరీదు చేసే లగ్జరీ ఇళ్ల అమ్మకాలు 53 శాతం ఎగిసినట్లు రియల్ ఎస్టేట్ సంస్థ సీబీఆర్ఈ తెలిపింది. మొత్తం 19,700 యూనిట్లు అమ్ముడైనట్లు వివరించింది. హైదరాబాద్‌లో లగ్జరీ ఇళ్ల అమ్మకాలు 2,030 యూనిట్ల నుంచి 70 పెరిగి 2,100 యూనిట్లకు చేరాయి. ఢిల్లీ–ఎన్సీఆర్లో (నేషనల్ క్యాపిటల్ రీజియన్) అత్యధికంగా 10,500 యూనిట్లను రియల్టీ సంస్థలు విక్రయించాయి. 2023 క్యాలెండర్ సంవత్సరంలో రూ. 4 కోట్ల ఖరీదు చేసే లగ్జరీ ఇళ్లు 12,895 అమ్ముడయ్యాయి. కొనుగోళ్లకు నెలకొన్న డిమాండ్‌తో రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పటిష్టంగా ఉందని, రాబోయే క్వార్టర్లలోనూ ఇదే ధోరణి కొనసాగవచ్చని సీబీఆర్ఈ చైర్మన్ అన్షుమన్ మ్యాగజైన్ తెలిపారు. మధ్యస్థాయి ప్రాజెక్టుల ఉండే పుణె, చెన్నై తదితర నగరాలు కూడా హై–ఎండ్ ప్రాజెక్టుల వైపు మళ్లుతున్నాయని పేర్కొన్నారు. ప్రీమియం ప్రాంతాల్లో ఆధునిక సదుపాయాలు, అసమానమైన సౌకర్యాన్ని అందించే హై–ఎండ్ ఇళ్లకు డిమాండ్ భారీగా ఉంటోందని క్రిసుమి కార్పొరేషన్ ప్రెసిడెంట్ ఆకాశ్ ఖురానా వివరించారు. సీబీఆర్ఈ డేటా ప్రకారం.. → రూ. 4 కోట్ల పైబడి ఖరీదు చేసే ఇళ్ల అమ్మకాలు ముంబైలో 4,200 యూనిట్ల నుంచి 5,500 యూనిట్లకు పెరిగాయి. → పుణెలో 400 నుంచి 825 పెరగ్గా, బెంగళూరులో 265 యూనిట్ల నుంచి 50కి పడిపోయాయి. → కోల్‌కతాలో అమ్మకాలు 310 నుంచి 530కి, చెన్నైలో 165 యూనిట్ల నుంచి 275 యూనిట్లకు పెరిగాయి. -
హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ ఖాళీ
డిమాండ్‌కు మించి తాజా సరఫరా తోడవుతున్నందున 2026 మార్చి నాటికి హైదరాబాద్‌లోని మొత్తం కార్యాలయ స్థలంలో 24.5 శాతం ఖాళీగా ఉండవచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. వేకెన్సీ స్థాయి 2023 మార్చిలో 14.1 శాతం, 2025 సెప్టెంబర్‌లో 19.3 శాతంగా ఉందని తెలిపింది.‘హైదరాబాద్ మార్కెట్లో గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ ఆక్యుపెన్సీ 2026 మార్చి నాటికి 75.5–76 శాతానికి చేరవచ్చు. 2023 మార్చి నాటికి ఇది 86 శాతం నమోదైంది. నికర ఆక్యుపెన్సీతో పోలిస్తే సరఫరా ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్‌లో 2016–17 నుంచి 2023–24 మధ్య ఆఫీస్ స్పేస్ సరఫరా వార్షిక వృద్ధి రేటు ఏటా 14 శాతం దూసుకెళ్లింది. టాప్–6 ఆఫీస్ మార్కెట్లలో ఇది సుమారు 7 శాతం నమోదైంది. ఈ ఆరు మార్కెట్లలో 2024 మార్చి 31 నాటికి అందుబాటులో ఉన్న మొత్తం కార్యాలయ సరఫరాలో హైదరాబాద్ వాటా 15 శాతం. 2026 మార్చి నాటికి ఇది 17 శాతానికి చేరవచ్చు’ అని నివేదిక వివరించింది.ఇదీ చదవండి: బేర్.. ఎటాక్! మార్కెట్ నేల చూపులు ఎందుకంటే..అంచనాలు లేకుండా..అపరిమిత ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ) నియమాన్ని కలిగి ఉన్న ఏకైక ప్రముఖ భారతీయ నగరం హైదరాబాద్ అని ఇక్రా కార్పొరేట్ రేటింగ్స్ వైస్ ప్రెసిడెంట్, కో–గ్రూప్ హెడ్ అనుపమ రెడ్డి తెలిపారు. ‘ఈ నిబంధనలను సద్వినియోగం చేసుకుని కొంతమంది డెవలపర్లు సమీప కాలంలో లీజింగ్‌పై సరైన అంచనాలు లేకుండా భారీగా ఊహించుకుని నిర్మాణాలు చేపడుతున్నారు. ఫలితంగా డిమాండ్–సరఫరా మధ్య భారీగా అసమతుల్యత ఏర్పడింది’ అని అన్నారు. ‘2023–24 ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్‌లో 1.9 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ తోడైంది. ఇది హైదరాబాద్ చరిత్రలో అత్యధికం. అలాగే ఇతర టాప్ నగరాలతో పోలిస్తే ఇక్కడే ఎక్కువ. ఈ అధిక సరఫరా ధోరణి 2024–25, 2025–26 వరకు కొనసాగుతుంది. ఏటా 1.7–2 కోట్ల చదరపు అడుగుల కొత్త సరఫరా తోడు కానుంది. -
గోవాలో హై డిమాండ్ వేటికంటే..
పర్యాటక రంగంలో వృద్ధికి సంబంధించిన ఆందోళనలు ఉన్నప్పటికీ, అధిక నికర ఆస్తులు కలిగిన వ్యక్తులు (HNI), విదేశీ పెట్టుబడిదారులకు గోవా రియల్ ఎస్టేట్ మార్కెట్ ఆసక్తిగా కనిపిస్తోంది. హాలిడే హోమ్‌లు, స్టేయింగ్ రూమ్‌లకు డిమాండ్ అధికంగా ఉంది. అధిక అద్దె రాబడి, స్థిరమైన జీవనం సాగించేందుకు చాలామంది గోవాను ఎంచుకుంటున్నట్లు నిపుణులు తెలియజేస్తున్నారు.రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థలు, డెవలపర్ల ప్రకారం గోవాలోని బ్రాండెడ్ హోటళ్లు, రెంటల్ విల్లాలు పీక్ సీజన్లో పూర్తిగా బుక్ అవుతున్నాయి. ఈ కేటగిరీల్లో పెట్టుబడులు స్థిరంగా ఉన్నాయని కొనుగోలు దారులు భావిస్తున్నారు. సుస్థిర జీవనానికి ప్రాధాన్యమిచ్చే హెచ్ఎన్ఐలకు గోవా(Goa Realty)లోని పర్యావరణ అనుకూల గేటెడ్ కమ్యూనిటీలు ఆకర్షణీయంగా తోస్తున్నాయి.అంజునా, అర్పోరా, బగా, కలంగుటే, కాండోలిమ్, వాగ్తోర్ వంటి ప్రాంతాలతో సహా గోవా నార్త్ బీచ్ పోర్చుగీస్ పరిసరాలు, ప్రసిద్ధ రెస్టారెంట్లు, హోటళ్లు, బీచ్‌లకు దగ్గరగా ఉండటం వల్ల గృహ కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రాపర్టీ ధరలు ఏడాది ప్రాతిపదికన 19 శాతం పెరుగుదల నమోదు చేస్తున్నట్లు మార్కెట్ వర్గాలు తెలియజేస్తున్నాయి.ఇదీ చదవండి: క్రికెట్ యాడ్స్ ద్వారా రూ.6,000 కోట్లు టార్గెట్విదేశీ పెట్టుబడిదారులు(foreign funds) తమ పోర్ట్‌ఫోలియోలను వైవిధ్యంగా విస్తరించడానికి గోవాలోని నాణ్యమైన ఆస్తులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. హెచ్ఎన్ఐలు అద్దె ఆదాయాన్ని సృష్టించడానికి విల్లాలను కొనుగోలు చేస్తున్నారు. ఓ విదేశీ సంస్థ గోవాలోని ప్రతిష్టాత్మక హోటల్‌ను కొనుగోలు చేసే చివరి దశలో ఉంది. యాక్సిస్ ఈకార్ప్ సీఈఓ ఆదిత్య కుష్వాహా మాట్లాడుతూ..‘దేశీయ, అంతర్జాతీయంగా పెరుగుతున్న ఆకర్షణ గోవా రియల్టీ వ్యాపారం మరింత మెరుగుపడేలా చేస్తోంది. స్థిరంగా అద్దె వస్తుండడంతో ఎన్ఆర్ఐ కస్టమర్లు ఇక్కడ ఆస్తులు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు’ అని తెలిపారు. -
హైదరాబాద్ రియల్ ఎస్టేట్.. ఆల్ టైమ్ హై!
హైదరాబాద్ (Hyderabad) రియల్ ఎస్టేట్ (real estate) ఆల్ టైం హై స్థాయికి చేరుకుంది. గతేడాది నగరంలో రికార్డు స్థాయిలో గృహ విక్రయాలు, ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం, వడ్డీ రేట్ల పెంపు, హైడ్రా దూకుడు ఇవేవీ భాగ్యనగరంలో స్థిరాస్తి రంగాన్ని కదిలించలేకపోయాయి. కొత్త ప్రభుత్వ విధానాలతో కొద్ది కాలం అస్థిరత ఏర్పడినా.. మార్కెట్ తిరిగి శరవేగంగా పుంజుకుంది. దీంతో హైదరాబాద్ రియల్టీలో పూర్వ వైభవం సంతరించుకుంది. నగరంలో గతేడాది 32,974 యూనిట్లు విక్రయించగా.. 1.56 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లావాదేవీలు జరిగాయని నైట్‌ఫ్రాంక్ ఇండియా తాజా నివేదిక వెల్లడించింది. – సాక్షి, సిటీబ్యూరోఆర్థికవృద్ధి, మెరుగైన మౌలిక సదుపాయాలు, కొనుగోలుదారుల అభిరుచిలో మార్పుల కారణంగా హైదరాబాద్‌లో గృహ విక్రయాలు పెరిగాయి. గతేడాది నగరంలో 12 శాతం వృద్ధి రేటుతో 36,974 ఫ్లాట్లు అమ్ముడుపోయాయి. ప్రస్తుతం సిటీలో అపార్ట్మెంట్ల సగటు ధర చ.అ.కు రూ.5,974. ఏడాదిలో అపార్ట్మెంట్ల ధరలు 8 శాతం మేర పెరిగాయి. గతేడాది సిటీలో 44,013 యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. అంతకు క్రితం ఏడాదితో పోలిస్తే 6 శాతం తగ్గాయి. హైడ్రా దూకుడు వ్యవహారంతో కొత్త గృహాల ప్రారంభానికి డెవలపర్లు ఆచితూచి వ్యవహరించడంతో లాంచింగ్స్‌లో క్షీణత నమోదయ్యింది. పశ్చిమ హైదరాబాదే.. హైటెక్ సిటీ, కోకాపేట, రాయదుర్గం, కూకట్పల్లి, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి పశ్చిమ హైదరాబాదే కస్టమర్ల చాయిస్‌గా ఉంది. ఎల్బీనగర్, కొంపల్లి ప్రాంతాల్లో ధరల పెరుగుదల అధికంగా ఉంది. ఆయా ప్రాంతాల్లో వరుసగా 11, 10 శాతం మేర రేట్లు పెరిగాయి. ఆ తర్వాత బంజారాహిల్స్‌లో 8 శాతం, కోకాపేటలో 8 శాతం, మణికొండలో 6, నాచారం, సైనిక్‌పురిలో 5 శాతం మేర ధరలు పెరిగాయి. ప్రస్తుతం నగరంలో అత్యధికంగా చ.అ.ధరలు బంజారాహిల్స్‌లో రూ.14,400–16,020 మధ్య ఉండగా.. జూబ్లీహిల్స్‌లో 13,400–14,034, కోకాపేటలో 10,045–12,500, మణికొండలో రూ.8,500–9,220 మధ్య ధరలు ఉన్నాయి.ఆఫీస్ అ‘ధర’హో.. 2024లో హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ లావాదేవీలు సరికొత్త శిఖరాలను అధిరోహించాయి. గతేడాది కొత్తగా 1.03 కోట్ల చ.అ.ఆఫీస్ స్పేస్ పూర్తి కాగా.. 1.56 కోట్ల చ.అ. స్పేస్ లావాదేవీలు జరిగాయి. కార్యాలయాల స్థలం లీజు, కొనుగోళ్లలో గ్లోబల్ కెపబులిటీ సెంటర్స్(జీసీసీ) ఆధిపత్యాన్ని కొనసాగించాయి. గతేడాది జరిగిన ఆఫీసు స్పేస్ లావాదేవీల్లో జీసీసీ వాటా 49 శాతంగా ఉంది. 51 లక్షల చ.అ.ఆఫీస్ స్పేస్‌ను బహుళ జాతి కంపెనీలు జీసీసీ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. దేశీయ వ్యాపార సంస్థలు 24 లక్షల చ.అ.లు, ఫ్లెక్సీబుల్ ఆఫీసు స్పేస్ 18 లక్షల చ.అ.లు, 12 లక్షల చ.అడుగుల స్థలంలో థర్డ్ పార్టీ ఐటీ సంస్థల లావాదేవీలు ఉన్నాయి. నగరంలో ఆఫీస్ స్పేస్ ధర చ.అ.కు సగటున రూ.70గా ఉంది. ఏడాది కాలంలో ధరలు 7 శాతం మేర పెరిగాయి.దేశవ్యాప్తంగా ఇలా.. గతేడాది దేశంలోని 8 ప్రధాన నగరాల్లో 3,72,936 యూనిట్లు లాచింగ్ కాగా.. 3,50,612 ఇళ్లు అమ్ముడుపోయాయి. అంతకు క్రితం ఏడాదితో పోలిస్తే లాంచింగ్స్‌లో 6 శాతం, విక్రయాల్లో 7 శాతం వృద్ధి నమోదైంది. దేశంలో ఇంకా 4,95,839 యూనిట్ల ఇన్వెంటరీ ఉంది. వీటి విక్రయానికి 5.8 నెలల సమయం పడుతుంది. ఇక, గతేడాది 7.19 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్ లావాదేవీలు జరగ్గా.. 5.03 కోట్ల చ.అ. స్థలం కొత్తగా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం 8 నగరాల్లో మొత్తం 97.3 కోట్ల చ.అ.ఆఫీస్ స్పేస్ స్టాక్ ఉంది. -
మొదట కొనేది ఇల్లే.. ఆ తర్వాతే పెళ్లి, ఫ్యూచర్
చదువు పూర్తయ్యిందా.. మంచి ఉద్యోగం, తర్వాత పెళ్లి, పిల్లలు, రిటైర్మెంట్ నాటికి ఓ సొంతిల్లు.. మన నాన్నల ఆలోచనలివే కదూ! కానీ, ప్రస్తుత తరం ఆలోచనలు, అభిరుచులూ మారాయి. చదువు కొనసాగుతుండగానే ఉద్యోగావకాశాలు నడిచొస్తున్నాయి. దీంతో యువత ముందుగా స్థిరమైన నివాసానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ తర్వాతే పెళ్లి, విదేశీ ప్రయాణాలు, ఫ్యూచర్ ఇతరత్రా వాటి కోసం ప్లానింగ్ చేస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరోవిరివిగా రుణాల లభ్యత, బహుళ ఆదాయ మార్గాలు, మంచి ప్యాకేజీతో స్థిరమైన ఉద్యోగ అవకాశాలు ఉండటంతో స్థిరాస్తి రంగంలో పెట్టుబడులకు యువత ఆసక్తి చూపిస్తోంది. 2018లో గృహ కొనుగోలుదారుల్లో మిలీనియల్స్ (25–35 ఏళ్ల వయస్సు గలవారు) వాటా 28 శాతంగా ఉండగా.. గతేడాదికి 37 శాతానికి పెరిగింది. 2030 నాటికి 60 శాతానికి చేరుతుందని జేఎల్ఎల్ ఇండియా అంచనా వేసింది.ఇటీవల కాలంలో దేశీయ స్థిరాస్తి రంగంలో సరికొత్త మార్పులు వచ్చాయి. గతంలో రిటైర్డ్, సీనియర్ సిటీజన్స్, సంపన్న వర్గాల గృహ కొనుగోళ్లు, పెట్టుబడులు ఉండేవి. కానీ, కొన్నేళ్లుగా మిలీనియల్స్, జెన్–జెడ్ కస్టమర్ల వాటా పెరిగింది. జీవితం ప్రారంభ దశలోనే దీర్ఘకాలిక పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. తొలి కారు, డిజైనర్ హ్యాండ్ బ్యాగ్‌లాగే ప్రాపర్టీకి నేటి యువత ప్రాధాన్యత ఇస్తోంది. అందుబాటులో టెక్నాలజీ.. మ్యాజిక్‌బ్రిక్స్.కామ్, హౌసింగ్.కామ్, 99 ఎకర్స్ వంటి రియల్ ఎస్టేట్ యాప్స్ యువ కొనుగోలుదారుల ప్రాపర్టీ శోధనను మరింత సులువు చేశాయి. గతంలో ప్రాపర్టీ కొనుగోలు చేయాలంటే భౌతికంగా వెళ్లి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించడం, పరిసర ప్రాంతాల వాకబు వంటివి పెద్ద ప్రయాస ఉండేది. కానీ, నేటి యువతరానికి అంత టైం లేదు. దుస్తులు, ఫుడ్ ఆర్డర్ చేసినంత సులువుగా ప్రాపర్టీ కొనుగోళ్లు జరిగిపోవాలని కోరుకుంటున్నారు. వీరి అభిరుచికి తగ్గట్టు ప్రాపర్టీ సమీక్ష, రేటింగ్ యాప్స్, త్రీడీ వ్యూ, వర్చువల్ టూర్ వంటి సాంకేతికత పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాయి. గృహ రుణాలకు పోటీ.. యువ గృహ కొనుగోలుదారులకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు సైతం పోటీపడి హోమ్లోన్స్ అందిస్తున్నాయి. రుణాల మంజూరులో వేగం, తక్కువ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. క్రౌడ్ ఫండింగ్, ప్రాపర్టీ షేరింగ్ వంటి పాక్షిక యాజమాన్య ప్లాట్‌ఫామ్‌లు పరిమిత మూలధనంతో స్థిరాస్తి రంగంలో పెట్టుబడులకు అవకాశాలు కల్పిస్తున్నాయి. దీంతో భారీ ముందస్తు చెల్లింపులు అవసరం లేకుండానే నేటి యువ కస్టమర్లు లక్ష కంటే తక్కువ ప్రారంభ పెట్టుబడితో యువ ఇన్వెస్టర్లు ఖరీదైన, విలాసవంతమైన ప్రాపర్టీలను కొనుగోలు చేస్తున్నారు. ఐటీ హబ్‌లలో యువ పెట్టుబడులు.. బెంగళూరు, హైదరాబాద్ వంటి ఐటీ హబ్‌లలో యువ ఐటీ ఉద్యోగులు రియల్ ఎస్టేట్ మార్కెట్లో గణనీయమైన ప్రభావం చూపుతున్నారు. రూ.80 లక్షల నుంచి రూ.కోటి మధ్య ధర కలిగిన 2 బీహెచ్‌కే అపార్ట్మెంట్ల కొనుగోళ్లలో వీరి ప్రాధాన్యత అధికంగా ఉంది. కరోనాతో అలవాటైన వర్క్ ఫ్రం హోమ్‌తో యువ ఉద్యోగులకు నిత్యం ఆఫీస్‌కు వెళ్లాలనే టెన్షన్ లేదు. దీంతో ఆఫీస్ పరిసర ప్రాంతాల్లో ఇళ్లు ఉండాలనుకోవడం లేదు.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో లక్ష ఇళ్లు @సేల్!మెరుగైన రవాణా సౌకర్యాలు ఉంటే సిటీకి కాస్త దూరమైనా సరే ప్రాపర్టీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పైగా ప్రధాన ప్రాంతంలో కొనుగోలు చేసే ధరతోనే శివార్లలో పెద్ద సైజు ఇళ్లు, వసతులను పొందవచ్చనేది వారి అభిప్రాయం. అయితే గ్రీనరీతో పాటు విద్యుత్, నీటి వినియోగాన్ని ఆదా చేసే ప్రాజెక్ట్‌లు, సౌర ఫలకాలు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వంటి పర్యావరణ అనుకూల ఫీచర్లు ఉండే ఇళ్లను కోరుకుంటున్నారు.పెరిగిన పట్టణ గృహ యజమానులు.. కరోనాతో అలవాటైన వర్క్ ఫ్రం హోమ్ విధానంతో యువ ఉద్యోగులు ఆఫీసులో కూర్చొని పనిచేసే అవసరం లేదు. వారు ఇప్పుడు తమ పనికి కాకుండా జీవనశైలికి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో వారికి నచ్చిన ప్రాంతంలో నివసించే స్వేచ్ఛ కోరుకుంటున్నారు. వేగవంతమైన పట్టణీకరణ, సాంకేతిక ఆవిష్కరణలు, వినియోగదారుల అభిరుచులతో గృహ కొనుగోలుదారుల్లో మార్పులు వచ్చాయి.ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు కీలకమైన వృద్ధి కేంద్రాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. 2020లో పట్టణ గృహ యజమానుల రేటు 65 శాతంగా ఉండగా.. 2025 నాటికి 72 శాతానికి పెరుగుతుందని జేఎల్ఎల్ అంచనా వేసింది. సరసమైన గృహ రుణాలు, నివాస సముదాయంలో యువ కొనుగోలుదారుల ప్రాధాన్యతే ఈ వృద్ధికి ప్రధాన కారణాలు. -
హైదరాబాద్‌లో లక్ష ఇళ్లు @సేల్!
డిమాండ్‌కు మించి సరఫరా జరుగుతుండటంతో హైదరాబాద్‌లో (hyderabad) అమ్ముడుపోకుండా ఉన్న ఇళ్లు(ఇన్వెంటరీ) (residential real estate inventory) పెరిగిపోతున్నాయి. దేశంలోని ఏడు ప్రధాన మెట్రో నగరాలతో పోలిస్తే ముంబై తర్వాత హైదరాబాద్‌లోనే అత్యధిక ఇన్వెంటరీ ఉంది. - సాక్షి, సిటీబ్యూరోఇక, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాలతో పోలిస్తే మన దగ్గరే ఎక్కువ. గతేడాది నాటికి గ్రేటర్లో 1,01,091 ఇళ్ల ఇన్వెంటరీ (వీటిలో నిర్మాణంలో ఉన్నవి, పూర్తయినవి కలిపి) ఉంది. వీటి విక్రయానికి కనిష్టంగా 19 నెలల కాలం పడుతుంది. గత రెండేళ్లలో నగరంలో గృహాల సరఫరా పెరగడమే ఇన్వెంటరీ పెరుగుదలకు ప్రధాన కారణం.దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో ఏడాది తొలి తొమ్మిది నెలల కాలంలో మొత్తం 5,64,416 యూనిట్ల ఇన్వెంటరీ మిగిలి ఉందని, వీటి విక్రయానికి కనిష్టంగా 14 నెలల కాలం పడుతుందని అనరాక్ గ్రూప్ నివేదిక వెల్లడించింది.ఇదీ చదవండి: మెట్రో వెంట.. రియల్ ఎస్టేట్ బూమ్!2024లో కొత్త ఇళ్ల సరఫరా అంతకు ముందు ఏడాదితో పోలిస్తే తగ్గిందని అనరాక్ నివేదిక పేర్కొంది. ఎన్నికల నేపథ్యంలో అప్రూవల్స్‌లో జాప్యం కారణంగా హౌసింగ్ సప్లయి తగ్గిపోయినట్లు చెప్పినట్లు చొప్పుకొచ్చింది.2025 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని ప్రధాన నగరాల్లో దాదాపు 253 మిలియన్ చ.అ.మేర కొత్త ఇళ్ల సరఫరాను ప్రారంభించే ప్రణాళికలను టాప్ 11 లిస్టెడ్ డెవలపర్లు ఏడాది ప్రారంభంలో ప్రకటించారని అనరాక్ గుర్తు చేసింది. అయితే సార్వత్రిక, రాష్ట్రాల ఎన్నికల కారణంగా వీటిలో కేవలం 23% లేదా 57 మిలియన్ చ.అ.ల మేర ప్రాజెక్ట్‌లు మాత్రమే ఏడాది ప్రథమార్థంలో ప్రారంభమయ్యాయి. -
మెట్రో వెంట.. సొంతింటి ప్రయాణం!
హైదరాబాద్ స్థిరాస్తి రంగాన్ని నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లింది మెట్రో, ఔటర్ ప్రాజెక్ట్‌లే.. మెట్రో రైలుతో ప్రధాన నగరంలో, ఓఆర్ఆర్తో శివారు ప్రాంతాలతో కనెక్టివిటీ పెరిగింది. దీంతో నగరంలో రియల్ బూమ్ ఏర్పడింది. తాజాగా ప్రభుత్వం రెండో దశలో ఔటర్ రింగ్ రోడ్డు వరకూ మెట్రో విస్తరించాలని నిర్ణయించింది. దీంతో మెట్రో మార్గంలో చుట్టూ 10 కి.మీ. వరకూ స్థిరాస్తి అవకాశాలు మెరుగవుతాయి. ఇదే సమయంలో మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లను అనుసంధానిస్తే నగరం నలువైపులా ప్రయాణం సులువవుతుంది. బడ్జెట్ గృహాల లభ్యత పెరిగి, ఐటీ ఉద్యోగ వర్గాల సొంతింటి కల సాకారమవుతుందని జనప్రియ అప్స్కేల్ ఎండీ క్రాంతి కిరణ్‌రెడ్డి అన్నారు. – సాక్షి, సిటీబ్యూరోప్రజల దైనందిన జీవితంలో ప్రజారవాణా అత్యంత కీలకం. దీంతో ప్రభుత్వం మెట్రోని పొడిగించాలని నిర్ణయించింది. వచ్చే 5–10 ఏళ్లలో దశలవారీగా మెట్రో 2.0 అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ రియల్టీ మరింత దూరం విస్తరిస్తోంది. సాధారణంగా ప్రజలు మెరుగైన రవాణా సదుపాయాలు ఉన్న ప్రాంతాల్లోనే ఉండేందుకు ఇష్టపడతారు.ఐటీ కేంద్రాల చుట్టుపక్కల ఇళ్ల ధరలు రూ.కోటి దాటిపోయాయి. ఐటీ ఉద్యోగ వర్గాలకు అందనంత ఎత్తుకు ఎగబాకాయి. మెట్రోతో శివార్లకు రవాణా సౌకర్యం రావడంతో ఐటీ కారిడార్‌లో పనిచేసే ఉద్యోగులు ఆయా ప్రాంతాల్లో నివాసం ఉంటూ రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో వీరంతా తమ బడ్జెట్లో నివాసాలు దొరికే తూర్పు హైదరాబాద్‌లో కొనుగోలు చేశారు.విదేశాల్లో ప్రైవేట్‌కే స్టేషన్ల బాధ్యత.. సింగపూర్, న్యూయార్క్ వంటి దేశాల్లో మాదిరిగా నగరంలోనూ భూగర్భ మెట్రో ఉంటే మేలు. విదేశాలలో భూగర్భ మెట్రో స్టేషన్ నిర్మాణ వ్యయాన్ని స్థానికంగా హోటల్స్, మాల్స్ వంటి వాణిజ్య సముదాయాలకే అప్పగిస్తారు. స్టేషన్ నుంచి వచ్చిపోయే ప్రయాణికులకు ఆయా వాణిజ్య సముదాయాలకు యాక్సెస్ ఉంటుంది. దీంతో యజమానులకు బిజినెస్ అవుతుంది. ప్రతిఫలంగా స్టేషన్ నిర్మాణ వ్యయాన్ని వాణిజ్య యజమానులే భరిస్తారు. దీంతో అటు ప్రభుత్వం, ఇటు యజమానికి ఇద్దరికీ లాభమే.ఇదీ చదవండి: వెస్ట్ హైదరాబాద్.. వామ్మో ఎంత ఎత్తో..చిత్తడి, వదులుగా ఉండే నేలలో భూగర్భ మెట్రో కష్టమవుతుంది. కానీ, మనది రాతి భూభాగం. భూగర్భ మెట్రో లైన్ కోసం సొరంగం తవ్వడం కష్టమవుతుందేమో.. కానీ ఒకసారి తవ్వాక నియంత్రణ సులువు. రోడ్డు మార్గం ఎలా ఉంటుందో మెట్రో లైన్ కూడా అలాగే వేయాల్సి ఉంటుంది. పైగా వంకర్లు ఉండే మార్గంలో ఎక్కువ బోగీలతో మెట్రోను నడపడం కుదరదు. కానీ, భూగర్భ మెట్రోను ఏ నుంచి బీ పాయింట్‌కు సరళ రేఖ మాదిరిగా వేయవచ్చు. దీంతో మెట్రో రైలు వేగం పెరగడంతో పాటు ఎక్కువ బోగీలతో మెట్రో నడపొచ్చు.భవిష్యత్తు ఈ ప్రాంతాలదే.. ఇప్పటి వరకు ఐటీ, ఫార్మా రంగాల బహుళ జాతి సంస్థలే నగరానికి ప్రాధాన్యం ఇచ్చాయి. కానీ, కొన్నేళ్లుగా తయారీ రంగంలో కూడా మల్టీనేషనల్ కంపెనీలు విస్తరిస్తున్నాయి. ఫాక్స్‌కాన్, టాటా ఎయిరోస్పేస్ వంటి సంస్థలు ఆదిభట్ల, శంషాబాద్ ప్రాంతాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఐటీ అంతా వెస్ట్‌లోనే ఉంది కాబట్టి ఈ ప్రాంతాలకు ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. కానీ, ఇప్పటికే ఆయా ప్రాంతాలలో నివాస, వాణిజ్య భవనాలతో కిక్కిరిసిపోవడంతో ఈ అభివృద్ధి చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరిస్తుంది. కొంగరకలాన్, ఆదిభట్ల, శంషాబాద్, కొల్లూరు, శామీర్‌పేట వంటి ప్రాంతాల్లో మార్కెట్ ఊపందుకుంటుంది.హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు.. ఐటీలోనే కాదు రియల్ ఎస్టేట్‌లోనూ హైదరాబాద్, బెంగళూరు పోటీ పడుతున్నాయి. రెండు నగరాలకు ఉన్న తేడా.. రోడ్ల వెడల్పు. బెంగళూరులో ఎయిర్‌పోర్టు రోడ్డు తప్ప అన్నీ దాదాపు 60 ఫీట్ల రోడ్లే.. కానీ, మన దగ్గర 100, 140 ఫీట్ల రోడ్లు కూడా ఉన్నాయి. నగరంలో అంత పెద్ద రోడ్లు ఎలా వచ్చాయి? రోడ్డు వెడల్పుగా ఉంటే అపరిమిత ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్(ఎఫ్ఎస్ఐ) ఉంటుందని యజమానులు రోడ్ల కోసం భూములు ఇచ్చారు.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో అక్కడ.. కోకాపేట ధరలో సగానికే లగ్జరీ ఫ్లాట్లు..!దీంతో భారీ టౌన్‌షిప్‌లు, స్కై స్క్రాపర్లు వస్తున్నాయి. తాజాగా హైరైజ్ ప్రాజెక్ట్‌లతో ట్రాఫిక్ పెరుగుతోందని ఎఫ్ఎస్ఐపై ఆంక్షలు పెట్టాలనే ప్రతిపాదనకు బదులుగా రోడ్లను ఇంకా వెడల్పు చేయడం ఉత్తమం. హైదరాబాద్ రియల్టీకి వరమైన జీవో–86 వల్లే దేశ, విదేశీ పెట్టుబడులు వచ్చాయి. అలాంటి సమర్థవంతమైన జీవోపై ఆంక్షలు పెట్టాలనుకోవడం సరైన నిర్ణయం కాదు. -
ఆఫీసు స్థలాలకు డిమాండ్.. ఆల్‌టైమ్ హై!
దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన నగరాల్లో 2024లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ (office space) నూతన గరిష్టాలకు చేరింది. మొత్తం 719 లక్షల చదరపు అడుగుల (ఎస్ఎఫ్టీ) పరిమాణంలో లీజు లావాదేవీలు నమోదయ్యాయి. 2023లో స్థూల లీజింగ్‌తో పోల్చి చూసినప్పుడు 21 శాతం అధికం కాగా, కరోనా విపత్తుకు ముందు ఏడాది 2019 గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 19 శాతం వృద్ధి కనిపించింది. ఈ వివరాలను రియల్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్‌ఫ్రాంక్ ఇండియా (Knight Frank) విడుదల చేసింది. కరోనా కారణంగా 2020, 2021 సంవత్సరాల్లో ఆఫీస్ స్పేస్ మార్కెట్ కుదేలవగా ఆ తర్వాత నుంచి ఏటా పుంజుకుంటూ వస్తోంది. నగరాల వారీ లీజింగ్బెంగళూరులో స్థూల ఆఫీస్ లీజింగ్ ముందటి సంవత్సరంతో పోల్చితే 2024లో 45 శాతం వృద్ధితో 181 లక్షల ఎస్ఎఫ్టీకి చేరింది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో 25% వృద్ధితో స్థూల లీజింగ్ 127 లక్షల ఎస్‌ఎఫ్‌టీగా నమోదైంది.హైదరాబాద్‌లో డిమాండ్ 17 శాతం పెరిగి 103 లక్షల చదరపు అడుగులకు చేరుకుంది.ముంబై మార్కెట్లోనూ 40 శాతం వృద్ధి నమోదైంది. 104 లక్షల చదరపు అడుగుల లీజింగ్ లావాదేవీలు జరిగాయి. పుణెలో 19 శాతం పెరిగి 80 లక్షల చదరపు అడుగులకు చేరింది. అహ్మదాబాద్‌లో 64 శాతం వృద్ధితో 30 లక్షల ఎస్ఎఫ్టీ స్థూల లీజింగ్ లావాదేవీలు నమోదయ్యాయి. చెన్నై మార్కెట్లో 25 శాతం క్షీణించి 81 లక్షల ఎస్ఎఫ్టీకి పరిమితమైంది. కోల్‌కతాలో స్థూల ఆఫీస్ స్పేస్ లీజింగ్ స్వల్పంగా 14 లక్షల చదరపు అడుగులకు తగ్గింది.సానుకూలతలు ఎన్నో.. ఆఫీస్ స్పేస్ లీజింగ్ నూతన గరిష్టాలకు చేరడం వెనుక దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండడం, బలమైన దేశీ వినియోగం, అంతర్జాతీయంగా పెరుగుతున్న భారత్ ప్రాతినిధ్యం తదితర అంశాలను కారణాలుగా నైట్‌ఫ్రాంక్ ఇండియా పేర్కొంది. ఆఫీస్ స్పేస్‌కు అసాధారణ డిమాండ్ ఉండడం దేశ, విదేశీ సంస్థల్లో వ్యాపార విశ్వాసానికి నిదర్శనంగా పేర్కొంది. జీసీసీలు, ఐటీఈఎస్, బీఎఫ్ఎస్ఐ రంగాలు ఈ డిమాండ్‌కు దన్నుగా నిలుస్తున్నట్టు తెలిపింది. -
హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాల జోరు
న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు ఆల్‌టైమ్ గరిష్టానికి చేరాయి. 2024లో 12 శాతం అధికంగా 36,974 యూనిట్ల ఇళ్లు అమ్ముడుపోయినట్టు నైట్‌ఫ్రాంక్ ఇండియా సంస్థ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఎనిమిది నగరాల్లో 2024లో 7 శాతం మేర ఇళ్ల విక్రయాలు పెరిగాయి. మొత్తం 3,50,613 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది 12 ఏళ్ల గరిష్ట స్థాయి. హైదరాబాద్‌తోపాటు పుణెలో ఆల్‌టైమ్ గరిష్టాలకు విక్రయాలు చేరగా, ముంబైలో 13 ఏళ్ల గరిష్టానికి చేరుకున్నట్టు నైట్‌ఫ్రాంక్ తెలిపింది. ‘‘ప్రీమియం ఇళ్లకు డిమాండ్ నెలకొంది. రూ.2–5 కోట్ల విభాగంలోని ఇళ్ల విక్రయాల్లో 85 శాతం వృద్ధి నమోదైంది.మరోవైపు రూ.50 లక్షల్లోపు ధరలో, రూ.50లక్షల నుంచి రూ.కోటి మధ్య ధరల విభాగాల్లోనూ వృద్ధి లేకపోవడం లేదా బలహీనపడడం కనిపించింది’’అని తెలిపింది. రూ.2–5 కోట్ల ధరల ఇళ్లకు బలమైన డిమాండ్ ఉన్నట్టు నైట్‌ఫ్రాంక్ ఇండియా చైర్మన్, ఎండీ శిశిర్ బైజాల్ తెలిపారు. 2020 నుంచి నివాస గృహాల మార్కెట్ అద్భుతమైన ర్యాలీని చూసిందని, 2024 విక్రయాలు 12 ఏళ్ల గరిష్టానికి చేరాయని చెప్పారు. ‘‘ప్రీమియమైజేషన్ ధోరణి పెరిగిపోయింది. ఇళ్ల మార్కెట్లో క్రమంగా అధిక ధరల వైపు కస్టమర్లు మళ్లుతున్నారు. మెరుగైన జీవన అవసరాలకు అనుగుణంగా ఎంపిక చేసుకుంటున్నారు’’అని వివరించారు. స్థిరమైన ఆర్థిక వృద్ధి, వడ్డీ రేట్లు అనుకూలిస్తున్నట్టు చెప్పారు. పట్టణాల వారీ విక్రయాలు.. ⇒ 2024లో ముంబైలో ఇళ్ల అమ్మకాలు అంతక్రితం ఏడాదితో పోలి్చతే 11 శాతం పెరిగి 96,187 యూనిట్లుగా ఉన్నాయి. ⇒ బెంగళూరులో 2 శాతం అధికంగా 55,362 ఇళ్ల యూనిట్లు అమ్ముడయ్యాయి. ⇒ పుణెలో 6 శాతం వృద్ధితో ఇళ్ల అమ్మకాలు 52,346 యూనిట్లకు చేరాయి. ⇒ అహ్మదాబాద్‌లో 15 శాతం వృద్ధి కనిపించింది. 18,462 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. ⇒ కోల్‌కతాలోనూ 16 శాతం పెరిగి 17,389 యూనిట్లు అమ్ముడయ్యాయి. ⇒ చెన్నైలో అమ్మకాలు 9 శాతం మేర పెరిగి.. 16,238 యూనిట్లకు చేరాయి. ⇒ ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో 4 శాతం క్షీణించి 57,654 యూనిట్లకు విక్రయాలు పరిమితమయ్యాయి. అందుబాటు ధరల ఇళ్ల విభాగం మెరుగుపడుతుంది.. ‘‘ఇళ్ల మార్కెట్లో సెంటిమెంట్ బలంగా ఉంది. ధరలతోపాటు అమ్మకాల్లోనూ స్థిరమైన పెరుగుదల కనిపిస్తోంది. రూ.కోటిలోపు ఇళ్ల అమ్మకాలు బలహీనపడడం పట్ల ఆందోళనలు నెలకొన్నాయి. కానీ, అందుబాటు ధరల ఇళ్లకు ప్రభుత్వం నుంచి మద్దతు, ప్రైవేటు రంగం ఆసక్తి చూపిస్తుండడంతో ఈ విభాగంలో అమ్మకాలు స్థిరపడతాయి’’అని నైట్‌ఫ్రాంక్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీసెర్చ్ సీనియర్ ఈడీ గులామ్ జియా వివరించారు. -
ఇంటి విలువను పెంచే ల్యాండ్ స్కేపింగ్
గతంలో ప్రతి చిన్న అవసరానికి బయటకు వెళ్లేవారు. ఇంట్లో గడిపే సమయం తక్కువగా ఉండేది. కానీ, ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక అంతా ఆన్లైన్ మీదే ఆధారపడుతున్నారు. దీంతో ఇంట్లో గడిపే నాణ్యమైన సమయం పెరిగింది. ఇల్లు, పరిసర ప్రాంతాలు స్వచ్ఛమైన గాలి, వెలుతురు, ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చదనం ఉండాలని కోరుకుంటున్నారు. ఈనేపథ్యంలో నివాస సముదాయాల్లో (Residential) ల్యాండ్ స్కేపింగ్‌కు (landscaping) ఆదరణ పెరిగింది. - సాక్షి, సిటీబ్యూరోవేగవంతమైన పట్టణీకరణ, పెరుగుతున్న భవన నిర్మాణ సముదాయాలతో హైదరాబాద్ (hyderabad) అర్బన్ జంగిల్‌గా మారిపోతోంది. దీంతో నివాసితులకు పచ్చదనం, ఆహ్లాదకర వాతావరణం అనుభూతి కలిగించాలంటే ల్యాండ్ స్కేపింగ్ అనివార్యమైపోయింది. కనుచూపు మేర పచ్చదనం, అది కూడా సేఫ్టీ, సెక్యూరిటీ ఉండే గేటెడ్ కమ్యూనిటీలోనే ఉండాలని నేటి గృహ కొనుగోలుదారులు కోరుకుంటున్నారు. పురుగుమందులు, రసాయనాలతో గాలి, నేల కాలుష్యం అవుతోంది. దీంతో సేంద్రీయ, సస్టెయినబుల్ గార్డెనింగ్‌కు ఆదరణ పెరుగుతోంది. వాక్ వే, టెర్రస్లలో.. సువాసన, ఆకర్షణీయమైన పూల మొక్కలు, చెట్లు, గడ్డితో నివాస సముదాయంలో వాక్, రన్ వే, డెక్‌లు, టెర్రస్ వంటి ప్రాంతాల్లో ల్యాండ్ స్కేపింగ్‌లను చేపడుతున్నారు. విశ్రాంతి తీసుకోవడానికి, సమావేశాల కోసం వినూత్న లైట్లతో ప్రత్యేకమైన థీమ్‌లతో అందంగా అలంకరిస్తున్నారు. స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణంతో కూడిన ల్యాండ్ స్కేపింగ్‌తో బార్బిక్యూ వంటి ఔట్‌డోర్ ఈవెంట్లు, పార్టీలను చేసుకునేందుకు ఆహ్లాదకరమైన వేదికగా ఉంటుంది.ఇదీ చదవండి: వెస్ట్ హైదరాబాద్.. వామ్మో ఎంత ఎత్తో..విద్యుత్ బిల్లు ఆదా.. గ్లోబల్ ల్యాండ్ స్కేపింగ్ సర్వీస్ మార్కెట్ 2024లో 330.8 బిలియన్ డాలర్లుగా ఉందని, 2024 నుంచి 2030 నాటికి 6.7 శాతం వృద్ధి రేటు ఉంటుందని పరిశ్రమ వర్గాల అంచనా. వేసవి వచ్చిదంటే చాలు భానుడి ప్రతాపం 43 డిగ్రీలు దాటుతోంది. ఎండ, ఉక్కపోతతో ఇంట్లో ఉండలేని పరిస్థితి. ఏసీ, కూలర్లు ఉన్నా కృత్రిమమే. దీంతో ల్యాండ్ స్కేపింగ్ ప్రాజెక్ట్‌లకు డిమాండ్ పెరిగింది. ల్యాండ్ స్కేపింగ్ ప్రాజెక్ట్‌లలో ఉష్ణోగ్రతలు 2–3 డిగ్రీలు తక్కువగా ఉంటుంది. సాధారణ ఇళ్లతో పోలిస్తే ల్యాండ్ స్కేపింగ్ గృహాల్లో విద్యుత్ బిల్లు రూ.700 నుంచి రూ.వెయ్యి వరకు ఆదా అవుతుంది.ఇంటి విలువ 20 శాతం వృద్ధి.. ల్యాండ్ స్కేపింగ్‌తో ఇల్లు, పరిసర ప్రాంతాల రూపరేఖలు మారిపోతాయి. సహజ సౌందర్యం, ఆకర్షణీయంగా ఉంటుంది. అందమైన ల్యాండ్ స్కేపింగ్‌తో ఇంటి విలువ దాదాపు 20 శాతం వరకు పెరుగుతుంది. నిరంతరం గ్రీనరీ చూస్తుండటంతో మనిషిలో ఒత్తిడి తగ్గడంతో పాటు సృజనాత్మకత పెరుగుతుంది. ల్యాండ్ స్కేపింగ్‌తో పరిసర ప్రాంతాల్లో గాలి కాలుష్యం తగ్గుతుంది. అలాగే గడ్డి, పొదలతో కూడిన ల్యాండ్ స్కేపింగ్ మట్టిని బలంగా ఉండేలా చేస్తుంది. దీంతో వరదలు, వర్షం వంటి వాటితో భూమి కోతలను నివారిస్తుంది. అంతేకాకుండా సీతాకోకచిలుకలు, చిన్న పక్షలు వంటి స్థానికంగా జీవవైవిధ్యానికి ల్యాండ్ స్కేపింగ్ ఆసరాగా నిలుస్తుంది.క్లబ్ హౌస్‌లో కో–వర్కింగ్ ప్లేస్.. కరోనా తర్వాతి నుంచి వర్క్ ఫ్రం హోమ్ విధానం అలవాటయ్యింది. ఉద్యోగుల ఆసక్తి, నిర్వహణ వ్యయం తక్కువగా ఉండటం, మెరుగైన ఉత్పాదకత కారణంగా ఇప్పటికీ కొన్ని బహుళ జాతి కంపెనీలు ఇంటి నుంచి పని విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఇంట్లో ప్రత్యేకంగా కొంత స్పేస్ ఆఫీస్ కోసం వినియోగిస్తే ఒప్పుకోవడం లేదు. ఇంట్లో పిల్లల అల్లరి, పెద్దల అవసరాలు, బంధువులు వస్తే హడావుడి తదితర కారణాలతో ఇంట్లోనే ఆఫీస్ స్పేస్ ఇస్తే ఇష్టపడటం లేదు.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో అక్కడ.. కోకాపేట ధరలో సగానికే లగ్జరీ ఫ్లాట్లు..!క్లబ్‌హౌస్‌లో ప్రత్యేకంగా కో–వర్కింగ్ స్పేస్ ఇస్తున్నారు. హై నెట్వర్క్ స్పీడ్‌తో వైఫై సేవలను అందిస్తున్నారు. కూర్చునేందుకు వీలుగా మంచి కుర్చీలు, ఇతరత్రా ఏర్పాట్లను చేస్తున్నారు. దీంతో ఆయా నివాస సముదాయంలో వర్క్ ఫ్రం హోమ్ చేసుకునే నివాసితులందరూ ఒకే చోట పనిచేసుకునే వీలు కలుగుతుంది. దీంతో ఇంట్లో ఎలాంటి అంతరాయం కలగదు. పైగా అత్యవసర సమయంలో వెంటనే ఇంటికి చేరుకోవచ్చు. -
వెస్ట్ హైదరాబాద్.. వామ్మో ఎంత ఎత్తో..
హైదరాబాద్ నగరంలో హైరైజ్ నిర్మాణాలు (High rise apartments)ఆకాశాన్ని తాకుతున్నాయి. గతంలో పాతిక ఫ్లోర్ల భవనం అంటే.. వామ్మో అనుకునే పరిస్థితి. కానీ, ఇప్పుడు 50 అంతస్తులపైనే నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. స్కై స్క్రాపర్లలో (skyscrapers) నివాసం అనేది స్టేటస్ సింబల్‌గా మారిపోవడంతో ప్రవాసులు, ఎంటర్ప్రెన్యూర్లు, బ్యూరోక్రాట్ల అభిరుచి మేరకు డెవలపర్లు పోటాపోటీగా ఆకాశహర్మ్యాలను నిర్మిస్తున్నారు.దీంతో పశ్చిమ హైదరాబాద్‌లో (hyderabad) తలెత్తి చూస్తే తప్ప అపార్ట్మెంట్ కనిపించని పరిస్థితి! దేశంలో హైరైజ్ ప్రాజెక్ట్‌లకు పెట్టింది పేరు ముంబై. ఇక్కడ భూమి లభ్యత తక్కువ కాబట్టి వర్టికల్ నిర్మాణాలు సహజమే. కానీ, హైదరాబాద్‌లో భూమి లభ్యత ఉన్నప్పటికీ అధిక ధరల కారణంగా డెవలపర్లు హైరైజ్ ప్రాజెక్ట్‌లను చేయక తప్పని పరిస్థితి. మరోవైపు అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులున్న ప్రాంతంలో నివాసం ఉండేందుకు కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తుండటంతో ఎత్తయిన గృహ సముదాయాలు వెలుస్తున్నాయి. – సాక్షి, సిటీబ్యూరోవెస్ట్లోనే ఎక్కువ.. షేక్‌పేట, రాయదుర్గం, మదీనాగూడ, ఖాజాగూడ, పుప్పాలగూడ, గండిపేట, కోకాపేట, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కొండాపూర్ వంటి పశ్చిమ హైదరాబాద్ ప్రాంతాల్లోనే ఎక్కువగా హైరైజ్ ప్రాజెక్ట్‌లు నిర్మాణంలో ఉన్నాయి. ప్రవాసులు, హెచ్ఎన్ఐలు సెకండ్ డెస్టినేషన్‌గా హైదరాబాద్‌లో లగ్జరీ అపార్ట్మెంట్ ఉండాలని కోరుకుంటున్నారు. అధిక అద్దెలు, ఆస్తుల విలువల పెంపు కారణంగా పెట్టుబడిదారులు ఇలాంటి ప్రాజెక్ట్‌లను ఎంచుకుంటున్నారు. దీంతో అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులున్న పశ్చిమ హైదరాబాద్‌లోనే ఆకాశహర్మ్యాలు ఎక్కువగా వస్తున్నాయి. భవనం ఎత్తు పెరిగే కొద్దీ నిర్మాణ వ్యయం పెరుగుతుంది కాబట్టి హైరైజ్ ప్రాజెక్ట్‌లలో అపార్ట్మెంట్ల ధరలు ప్రీమియంగానే ఉంటాయి.బాల్కనీలోంచి సిటీ వ్యూ.. ప్రస్తుతం నగరంలో 200 మీటర్ల ఎత్తు అంటే 50 నుంచి 59 అంతస్తుల హైరైజ్ ప్రాజెక్ట్‌లు నిర్మాణంలో ఉన్నాయి. ప్రవాసులు, హైనెట్ వర్త్ ఇండివిడ్యువల్స్, ఎంటర్ప్రెన్యూర్లు, ఐటీ, ఫార్మా రంగాల్లోని ఉన్నతోద్యోగులు ఎక్కువగా ఆకాశహర్మ్యాలలో ఉండేందుకు ఇష్టపడుతున్నారు. హైరైజ్ ప్రాజెక్ట్‌ల ఎంపికకు మరో ప్రధాన కారణం సిటీ వ్యూ.. 200 మీటర్ల ఎత్తులోని ఫ్లాట్‌లోంచి చూస్తే సిటీ మొత్తం కనిపిస్తుంది. ఉదయం, సాయంత్రం సమయాల్లోని నగరంలోని పరిసరాలను ఆస్వాదించవచ్చు. అంతేకాకుండా హైఎండ్ కుటుంబాలు, అభిరుచులు కలిగిన నివాసితులు ఒకే చోట ఉండటంతో వారి మధ్య సామాజిక బంధం మరింత బలపడుతుంది. జీవన నాణ్యత మెరుగవుతుంది.స్వచ్ఛమైన గాలి, వెలుతురుఅత్యంత ఎత్తులో ఫ్లాట్ ఉంటుంది కాబట్టి వాహనాల ధ్వని, వాయు కాలుష్య సమస్యలూ ఉండవు. ఏకాంతం కోరుకునేవారికి అనువైన గృహాలివే. పైగా ఇంట్లోకి ధారాళమైన గాలి, వెలుతురు, సూర్యరశ్మి వస్తాయి. ఈ ప్రాజెక్ట్‌లకు చేరువలోనే అంతర్జాతీయ విద్యా, వైద్య సంస్థలు, వినోద కేంద్రాలు, నిత్యావసరాలు అన్నీ లభ్యమవుతాయి. ఇంట్లో ఉన్నంత సేపు కుటుంబ, వృత్తి, కెరీర్ వంటి వ్యాపకాలపై ఫోకస్ చేయవచ్చు. వీటిల్లో క్లబ్ హౌస్‌తో పాటు వాకింగ్, జాగింగ్ ట్రాక్‌లు, స్విమ్మింగ్ పూల్, జిమ్, డే కేర్ సెంటర్, మెడిటేషన్ హాల్స్, వెయిటింగ్ రూమ్స్ వంటి అన్ని రకాల ఆధునిక వసతులుంటాయి. సీసీటీవీ కెమెరాలు, సెక్యూరిటీతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయి.మరింత మౌలిక వసతులు కల్పించాలి పెరుగుతున్న జనాభాకు తగ్గట్టు గృహాలను అందించాలంటే హైరైజ్ నిర్మాణాలే సరైనవి. కాకపోతే ప్రజల జీవన నాణ్యత మెరుగు పరిచేందుకు అవసరమైన రహదారులు, నీటి సరఫరా, మురుగు నీటి వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించాలి. – ప్రశాంత్‌రావు, డైరెక్టర్, పౌలోమీ ఎస్టేట్స్ -
కోకాపేట ధరలో సగానికే లగ్జరీ ఫ్లాట్లు..!
ఐటీ రంగంలో దాదాపు 80 శాతం వరకు హైటెక్ సిటీ, కొండాపూర్, మాదాపూర్ ప్రాంతాల్లోనే పనిచేయాల్సి ఉంటుంది. అక్కడకు సుమారు 10 కిలోమీటర్ల పరిధిలో నివాసం ఉండాలంటే.. కోకాపేట ప్రాంతం చూసుకుంటే అక్కడ చదరపు అడుగు ధర దాదాపు రూ.12–14 వేల వరకు ఉంటోంది. మిగిలిన ప్రాంతాలన్నీ ఇప్పటికే బాగా రద్దీగా ఉంటున్నాయి. దాంతో ఇప్పుడు చాలామంది బాలానగర్ వైపు చూస్తున్నారు. - సాక్షి, సిటీబ్యూరోఒకప్పుడు బాలానగర్ అంటే పారిశ్రామికవాడ అని, భూగర్భ జలాలు కలుషితం అయ్యాయని, గాలి కూడా కాలుష్యంతో ఉంటుందని అనుకునేవారు. కానీ ఇప్పుడు అలాంటి అభిప్రాయాలు అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్నవి.. కేవలం నైఫర్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ), సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ వంటి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు మాత్రమే.ఒకప్పుడు ఇక్కడ ఉండే ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ (ఐడీపీఎల్) వంటి కంపెనీలు కొన్ని వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించినా, అది చాలాకాలం క్రితమే మూతపడింది. పైపెచ్చు, ఈ కంపెనీకి చెందిన 100 ఎకరాల భూముల్లో పచ్చదనం విస్తరించింది. ఇంతకుముందు బాలానగర్ దాటి చింతల్, గుండ్లపోచంపల్లి ప్రాంతాల వరకు గేటెడ్ కమ్యూనిటీలు విస్తరించాయి గానీ, బాలానగర్‌లో ఇంతకుముందు రాలేదు.లగ్జరీ నిర్మాణాలు షురూ.. ఇప్పుడిప్పుడే బాలానగర్ వైపు కూడా లగ్జరీ నిర్మాణాలు మొదలవుతున్నాయి. కోకాపేటతో సహా ఇతర ప్రాంతాల్లో లభించే సదుపాయాలన్నీ ఇక్కడ కూడా లభిస్తున్నాయి. కానీ, కోకాపేటలో చదరపు అడుగు దాదాపు రూ.12–14 వేలు ఉండగా, ఇక్కడ దాదాపు రూ.6 నుంచి రూ.7 వేలకే లభ్యమవుతున్నాయి. అంటే ఇంచుమించు కోకాపేట ధరలో సగానికే లగ్జరీ ఫ్లాట్లు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.హైటెక్ సిటీకి బాలానగర్ ప్రాంతం కూడా దాదాపు 12–13 కిలో మీటర్ల దూరంలోనే ఉంది. అయితే, ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు వంటి మౌలిక సదుపాయాలు రావడంతో అర గంటలోపే బాలానగర్ నుంచి హైటెక్ సిటీకి చేరుకోవచ్చు. పైగా ఈ ప్రాంతంలో మంచి పెద్ద పెద్ద స్కూళ్లు, ఇంజినీరింగ్ కాలేజీలు కూడా ఇక్కడ ఉండటంతో పిల్లల చదువుల గురించి ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. మాల్స్, మల్టీప్లెక్సులు కూడా ఉండటంతో వినోదం, విహారానికి కూడా మంచి అవకాశాలున్నాయి.బాలానగర్ వైపు.. మాదాపూర్, కొండాపూర్ వంటి ప్రాంతాల్లో లగ్జరీ ఫ్లాట్లు కావాలంటే ఎంత లేదన్నా కనీసం రూ.6 నుంచి రూ.7 కోట్లకుపైగా పెట్టాలి. అదే బాలానగర్‌లో లగ్జరీ ఫ్లాటు అంటే దాదాపు 2 వేల చ.అ. విస్తీర్ణం ఉండే ఫ్లాటు అన్ని సౌకర్యాలతో కలిపి కూడా సుమారు రూ.కోటిన్నర– రెండు కోట్లలోపే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైటెక్ సిటీకి సమీపంలో ఇంత తక్కువ ధరలో, అన్ని సదుపాయాలు ఉన్న ప్రాంతంలో దొరకడం దాదాపు ఇంకెక్కడా లేదు. కాబట్టి, ఐటీ జనాలు క్రమంగా ఇప్పుడు బాలానగర్ వైపు చూస్తున్నారు. గతంలో వేర్వేరు ప్రాంతాల్లో పనిచేసినా, చివరకు హైదరాబాద్ వచ్చి స్థిరపడాలని అనుకుంటున్నవారు కూడా బాలానగర్ ప్రాంతం వైపు మొగ్గు చూపుతున్నారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగుల ఇల్లు.. ఇదే కొత్త ట్రెండు!
సొంతిల్లు ప్రతి ఒక్కరి స్వప్నం.. దానికి తగ్గట్టుగానే ఇంటిని (homes) అభిరుచికి తగ్గట్లు నిర్మించుకోవడంతో పాటు సరికొత్త ఇంటీరియర్ (interior) ఏర్పాటు చేసుకుంటున్నారు. విల్లా, ఫ్లాట్, ఇండిపెండెంట్ హౌజ్ ఇలా ఏదైనా సరే.. కొత్తదనం కొట్టొచ్చినట్లు కనిపించేలా తీర్చిదిద్దుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు నగరవాసులు. ఇంట్లోకి అడుగు పెట్టగానే వావ్ అనిపించేలా హాల్, మోడ్రన్ కిచెన్, బెడ్రూమ్స్తో పాటు బాల్కనీని (balcony) ముస్తాబు చేసుకుంటున్నారు. కాఫీ కప్పుతో అలా బాల్కనీలోకి వెళ్తే మనసుకు హాయినిచ్చేలా మలుచుకుంటున్నారు. చాలామంది గ్రీనరీ ఫీల్ కోసం ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ లాన్ ఏర్పాటు చేసుకొని అందమైన మొక్కలతో అలంకరిస్తున్నారు. బాల్కనీ, పెంట్‌హౌస్ సైజును దృష్టిలో ఉంచుకొని కొన్ని సంస్థలు ప్రత్యేక డిజైన్లతో మైమరపిస్తున్నాయి.కరోనా కాలం తర్వాత నగరవాసులు ఎన్నో నూతన ఒరవడుల వైపు ఆసక్తి కనబరిచారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు (software employees) ఇలాంటి వాటికి అధికంగా మొగ్గుచూపారు. దీనికి ఓ కారణం ఉంది.. లాక్డౌన్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ (work from home) కారణంగా అధిక సంఖ్యలో ఉద్యోగులు ఇళ్లలో ఉండటం, వర్క్ స్ట్రెస్ తగ్గించుకోవడం కోసం ఇంట్లో ఇంటీరియర్‌తో పాటు బాల్కనీ ఆహ్లాదకరంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. వర్క్ మధ్యలో ఫ్యామిలీతో అలా బాల్కనీ, పెంట్‌హౌస్‌లో కూర్చొని సరదాగా కాసేపు గడిపి మళ్లీ పని చేసుకుంటున్నారు. నగరంలో వేగంగా విస్తరిస్తున్న రియల్ ఎస్టేట్ (real estate) వ్యాపారంతో సమానంగా ఇంటీరియర్, పలు థీమ్స్‌తో కొన్ని సంస్థలు రంగంలోకి దిగాయి. ఇప్పటి వరకు ఒకలా.. ఇప్పటి నుంచి మరోలా అనే విధంగా ముస్తాబు చేస్తున్నాయి. అపార్ట్మెంట్స్ బాల్కనీ.. అపార్ట్మెంట్ బాల్కనీ కొద్ది స్పేస్ అయినా వాటిని మరింత సుందరీకరణకు మొగ్గు చూపుతున్నారు. కొందరు వారికి నచ్చిన థీమ్స్‌తో డిజైన్ చేయించుకుంటారు. థీమ్ నేమ్స్, లైటింగ్ కొటేషన్స్, సేఫ్టీ కోసం ఇన్విజిబుల్ గ్రిల్స్, వాల్ ఆర్ట్‌ను ఎంచుకుంటున్నారు. వర్క్‌ఫ్రమ్ హోమ్ ఉన్న వారు బాల్కానీని ఆఫీస్ థీమ్స్‌తో పాటు పలు విభిన్న థీమ్స్‌తో సిటీ వ్యూ చూస్తూ డిజైన్స్ కోరుకుంటున్నారు. పిల్లలకు స్టడీస్ ఇంట్రెస్ట్ రావడానికి సరికొత్త డిజైన్స్ ఎంచుకుంటున్నారు. గ్రీనరీతో పాటు ఉన్న స్పేస్‌లో మొక్కలు, రెండు మూడు రకాల కూరగాయలు పెంచుతున్నారు. త్రీ బెడ్రూమ్స్లో ఒక బెడ్రూమ్లో కొత్త థీమ్స్‌కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. విల్లాస్ కల్చర్ పెరిగింది. పెంట్‌హౌస్‌లో ఉన్న స్పేస్‌కి చాలా ఖర్చు పెడుతున్నారు. సిటీ వ్యూ కనబడేలా అవుట్ డోర్ స్విమ్మింగ్ పూల్, జెకూజీ, బార్ కౌంటర్, హోమ్ థియేటర్ తదితర సౌకర్యాలు ఏర్పాటు చేసుకుంటున్నారు.ఫ్యూచర్లో బాల్కనీ స్పేస్ పెరుగుతుంది విల్లాస్, అపార్ట్‌మెంట్స్‌లో ఇంటీరియర్‌కి ఎంతో ఖర్చు చేస్తున్నారు. అందులో భాగంగానే బాల్కనీని చేరుస్తున్నారు. ఫ్యూచర్లో బాల్కనీ స్పేస్ రెట్టింపు అవుతుంది. గ్రీనరీ, ఇంట్లోనే వెజిటబుల్స్ పెంచుకొనేలా ఉన్న స్పేస్‌తో కాకుండా కొత్త స్పేస్ ఇచ్చే ఆలోచన అపార్ట్మెంట్, గేటెడ్ కమ్యూనిటీలో వస్తోంది. వచ్చిన అతిథులు బాల్కనీ, పెంట్‌హౌస్ చూసి వావ్ అనేలా ఉండాలని కోరుకుంటున్నారు. వారు బాల్కనీ, పెంట్హౌస్లనే ఇష్టపడేలా డిజైన్ చేసుకుంటున్నారు. వర్క్‌ఫ్రమ్ హోమ్ ఉన్న వారు ఆఫీస్ థీమ్స్‌తో పాటు పలు విభిన్న థీమ్స్‌తో సిటీ వ్యూ ఉండేలా డిజైన్స్ కోరుకుంటున్నారు. పిల్లలకు స్టడీస్ పట్ల ఇంట్రెస్ట్ రావడానికి వారికి నచ్చినట్లు డిజైన్ చేస్తున్నారు. గ్రీనరీతో పాటు ఉన్న స్పేస్‌లో మొక్కలు, రెండు మూడు రకాల కూరగాయలు పెంచుతున్నారు. – హేమలత రామా, స్వర్గ బాల్కనీ మేకోవర్స్, సీఈఓ -
త్వరలో టీజీ రెరా యాప్..
రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనంతో పాటు కొనుగోలుదారుల ప్రయోజనాలను రక్షించేందుకు ఉద్దేశించినదే తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(TG-RERA). సాంకేతికత వినియోగం పెరిగిన ఈ రోజుల్లో టీజీ రెరా సేవలకు కూడా ఆధునికత చేర్చాలని నిర్ణయించారు. రియల్ ఎస్టేట్(Real Estate) ప్రాజెక్ట్‌లు, ఏజెంట్ల రిజిస్ట్రేషన్, ఫిర్యాదుల ట్రాకింగ్, రియల్ టైం నోటిఫికేషన్ల క్రమబద్ధీకరణ కోసం టీజీ రెరా యాప్‌ను తీసుకురానున్నట్లు టీజీ రెరా ఛైర్మన్ డాక్టర్ ఎన్.సత్యనారాయణ ‘సాక్షి రియల్టీ’తో చెప్పారు. అలాగే ప్రాజెక్ట్‌లు, ఏజెంట్ల రిజిస్ట్రేషన్లు తక్షణ ధ్రువీకరణ కోసం క్యూఆర్ కోడ్ సాంకేతికత అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం టీజీ రెరా వెబ్సైట్(Website)లో రిజిస్ట్రేషన్లు, ఫిర్యాదులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నప్పటికీ.. వినియోగదారులకు మరింత సౌలభ్యాన్ని అందించడమే దీన్ని ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. ‘సాక్షి రియల్టీ’ ఇంటర్వ్యూ పూర్తి వివరాలివీ.. – సాక్షి, సిటీబ్యూరోనివాస సముదాయాలు మాత్రమే రెరాలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా? వాణిజ్య భవనాలకు రెరా రిజిస్ట్రేషన్ అవసరం లేదా?జవాబు: నివాస, వాణిజ్య ఏ భవనమైనా సరే రెరాలో రిజిస్ట్రేషన్ చేయాల్సిందే. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ, యూడీఏ, టీజీఐఐసీ, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ నుంచి అనుమతి పొందిన 500 చ.మీ. లేదా 8 యూనిట్ల కంటే ఎక్కువ ఫ్లాట్లు ఉన్న ప్రతీ ప్రాజెక్ట్ కూడా ఆర్ఈ(R and D) చట్టంలోని సెక్షన్–3 కింద రిజిస్ట్రేషన్ చేయాలి.రెరాలో రిజిస్ట్రేషన్ చేయకుండానే విక్రయాలు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు?జవాబు: బ్రోచర్లు, కరపత్రాలతో సహా అన్ని ప్రింట్, ఎల్రక్టానిక్, సోషల్ మీడియాలో ప్రచురించే ప్రకటనలు, ప్రాజెక్ట్(Project)లకు తప్పనిసరిగా రెరా రిజిస్ట్రేషన్ నంబరు ఉండాలి. దాన్ని ప్రదర్శించాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే తొలుత షోకాజ్ నోటీసు జారీ చేస్తారు. 15 రోజుల వ్యవధిలో ప్రత్యుత్తరాన్ని సమర్పించాలి. లేని పక్షంలో ప్రాజెక్ట్ వ్యయంలో 10 శాతం వరకు జరిమానా విధిస్తారు. ఉల్లంఘనలు పునరావృతమైతే సంబంధిత ప్రమోటర్‌కు మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా విధిస్తారు.ఇల్లు కొనేందుకు కొనుగోలు దారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?జవాబు: ప్రాపర్టీ కొనుగోలు చేసే ముందు కొనుగోలుదారులు సంబంధిత ప్రాజెక్ట్‌కు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ(HMDA), డీటీసీపీ, యూడీఏ, టీజీఐఐసీ వంటి స్థానిక సంస్థల నుంచి నిర్మాణ అనుమతులు ఉన్నాయా? లేదా అని తెలుసుకోవడంతో పాటు రెరాలో రిజిస్ట్రేషన్ అయ్యిందో లేదో నిర్ధారించుకోవాలి. రెరా వెబ్సైట్ ద్వారా ప్రాజెక్ట్ రెరా రిజిస్ట్రేషన్ నంబర్‌ను పరిశీలించవచ్చు. అలాగే లీగల్ టైటిల్, ఆమోదిత లేఔట్ ప్లాన్, ప్రాజెక్ట్ పేరు, వసతులు, ప్రాంతం వివరాలు, చట్టపరమైన టైటిల్ డీడ్స్, ప్రాజెక్ట్ నిర్మాణ గడువు వంటి అన్ని రకాల వివరాలను పరిశీలించవచ్చు.బాధితులు రెరాకు ఎలా ఫిర్యాదు చేయాలి? జవాబు: రెరా రిజిస్ట్రేషన్ లేకుండా, ప్రీలాంచ్, బైబ్యాక్ స్కీమ్‌ల పేరిట ప్రచారం చేసినా, విక్రయాలు చేసినా టీజీ రెరాకు ఫిర్యాదు చేయవచ్చు. 040–29394972 లేదా 9000006301 వాట్సాప్ నంబరులో ఫిర్యాదు చేయవచ్చు. అలాగే https://rera.telangana.gov.in/complaint/ లేదా rera-maud@telangana.gov.in లేదా secy-rera-maud@telangana.gov.inలకు ఈ–మెయిల్స్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. అంతేకాకుండా అగ్రిమెంట్ ఆఫ్ సేల్ లేదా సేల్‌డీడ్‌లో పేర్కొన్న గడువులోగా ప్రాజెక్ట్‌ను పూర్తి చేయకపోయినా, అడ్వాన్స్‌గా 10 శాతం కంటే ఎక్కువ సొమ్ము వసూలు చేసినా రెరాకు ఫిర్యాదు చేయవచ్చు.ఇప్పటి వరకు రెరాలో ఎన్ని ప్రాజెక్ట్‌లు రిజిస్ట్రేషన్ అయ్యాయి?జవాబు: ఇప్పటివరకు టీజీ రెరాలో 9,129 ప్రాజెక్ట్‌లు రెరాలో రిజిస్ట్రేషన్ అయ్యాయి. వీటిలో అత్యధికంగా రంగారెడ్డిలో 2,954, అత్యల్పంగా ఆసిఫాబాద్‌లో 2 ప్రాజెక్ట్‌లు రిజిస్టర్ అయ్యాయి. జిల్లాల వారీగా చూస్తే.. మేడ్చల్–మల్కాజ్గిరి 2,199, సంగారెడ్డి 986, హైదరాబాద్ 516, వరంగల్ అర్బన్ 414, యాదాద్రి భువనగిరి 349, మహబూబ్‌నగర్ 257, ఖమ్మం 280, నిజామాబాద్ 158, కరీంనగర్ 144, సిద్దిపేట 101, వికారాబాద్ 101, సూర్యాపేట 98, నల్లగొండ 87, నాగర్‌కర్నూల్ 66, మెదక్ 61, కామారెడ్డి 53, మంచిర్యాల 37, భద్రాది కొత్తగూడెం 34, జగిత్యాల 32, ఆదిలాబాద్ 31, మహబూబాబాద్ 27, పెద్దపల్లి 26, జనగాం 24, వనపర్తి 21, రాజన్న సిరిసిల్ల 19, జోగులాంబ గద్వాల్ 17, నిర్మల్ 12, వరంగల్ రూరల్ 12, జయశంకర్ 11 ప్రాజెక్ట్‌లు రిజిస్టరయ్యాయి.ఇప్పటి వరకు రెరా ఎంత జరిమానా విధించింది? ఎంత వసూలైంది?జవాబు: ఇప్పటి వరకు రెరా నిబంధనల ఉల్లంఘనదారులపై రూ.40.95 కోట్ల జరిమానాలు విధించాం. ఇందులో రూ.15.64 కోట్లు వసూలు చేశాం.నిర్మాణ సంస్థలు జరిమానా చెల్లించకపోతే రెరా తదుపరి చర్యలు ఏంటి?జవాబు: రెరా విధించిన జరిమానా లేదా వడ్డీ పరిహారం చెల్లించడంలో ప్రమోటర్ విఫలమైతే.. అది రెవెన్యూ బకాయిగా పరిగణిస్తారు. ఈ తరహా కేసులను ఆర్ఈ(ఆర్అండ్డీ) చట్టం–2016లోని సెక్షన్ 40(1) కింద జరిమానా లేదా వడ్డీ రికవరీ చేయాలని సంబంధిత జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేస్తాం.ఇప్పటి వరకు ఎంత మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు రెరాలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు?జవాబు: రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కూడా తప్పనిసరిగా రెరాలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. రెరా రిజిస్ట్రేషన్ నంబరు లేకుండా ఏజెంట్లు ప్లాట్లు, ఫ్లాట్, ఇల్లు ఏ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌ను విక్రయించకూడదు. ఇప్పటి వరకు టీజీ–రెరాలో 3,925 మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు రిజిస్టరయ్యారు.ఇదీ చదవండి: భవిష్యత్తులో కనుమరుగయ్యే ఉద్యోగాలు ఇవే..ఈమధ్య కాలంలో బిల్డర్ల చీటింగ్ కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. వీటిలో చాలా మంది బిల్డర్లు ఏజెంట్ల ద్వారా విక్రయాలు చేసినవాళ్లే.. మరి, ఏజెంట్ల మీద రెరా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది?జవాబు: రెరా చట్టంలోని 9, 10లను ఉల్లంఘించిన రియల్ ఎస్టేట్ ఏజెంట్లపై కూడా రెరా జరిమానా విధిస్తుంది. ఇప్పటి వరకు భృగు ఇన్ఫ్రా, సాయిసూర్య డెవలపర్స్, భారతి ఇన్ఫ్రా డెవలపర్స్, రియల్ ఎస్టేట్ అవెన్యూ కన్సల్టెంట్ సర్వీసెస్, యంగ్ ఇండియా హౌసింగ్ ప్రై.లి. వంటి ఏజెంట్లపై రెరా చర్యలు తీసుకున్నాం. రెవెన్యూ రికవరీ చట్టం కింద జరిమానా రికవరీ చేసేందుకు సంబంధిత జిల్లా కలెక్టర్ చర్యలు కూడా ప్రారంభించారు.ఇప్పటి వరకు రెరా ఎన్ని ఫిర్యాదులను పరిష్కరించింది?జవాబు: టీజీ రెరా పోర్టల్ ద్వారా ప్రాజెక్ట్‌లు, ఏజెంట్ల రిజిస్ట్రేషన్ మాత్రమే కాకుండా ఆన్లైన్లో కేసుల విచారణ కూడా చేపడుతున్నాం. దీంతో ఎక్కడి నుంచైనా సరే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మౌఖిక వాదనాలు వినిపించవచ్చు. ఇప్పటి వరకు 1,216 ఫిర్యాదులను పరిష్కరించాం. -
భారీ స్థాయిలో ఆఫీస్ వసతుల నిర్మాణం
పని ప్రదేశాలకు (Work Space) డిమాండ్ పెరుగుతోంది. ఈ విభాగంలో దేశ, విదేశీ కంపెనీల అవసరాలను తీర్చేందుకు వీలుగా దేశవ్యాప్తంగా ప్రముఖ పట్టణాల్లో 250 లక్షల చదరపు అడుగుల (Sft) ఆఫీస్ వసతుల నిర్మాణం జరుగుతున్నట్టు రియల్టీ కన్సల్టెంట్ అనరాక్ వెల్లడించింది. హౌసింగ్ బ్రోకరేజీ, క్యాపిటల్ మార్కెట్ లావాదేవీలు, రిటైల్, ఇండస్ట్రియల్, వేర్‌హౌసింగ్ లీజింగ్ విభాగాల్లో సేవలు అందిస్తున్న అనరాక్ ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లోకి అడుగు పెట్టడం గమనార్హం.భారత ఆఫీస్ మార్కెట్‌కు 2024 ఎంతో సానుకూలంగా నిలిచిపోతుందని అనరాక్ కమర్షియల్ లీజింగ్ అండ్ అడ్వైజరీ ఎండీ పీయూష్ జైన్ తెలిపారు. రికార్డు స్థాయిలో ఆఫీస్ మార్కెట్ లీజింగ్ లావాదేవీలు నమోదైనట్టు, ఖాళీ ఆఫీస్ స్పేస్ తగ్గినట్టు చెప్పారు. 2025లోనూ ఆఫీస్ మార్కెట్లో బలమైన డిమాండ్ కొనసాగుతుందన్నారు. కరోనా తర్వాత ఆఫీస్ మార్కెట్ చాలా బలంగా కోలుకున్నట్టు పేర్కొన్నారు. గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్లను (జీసీసీలు) బహుళజాతి సంస్థలు భారత్‌తో పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేస్తుండడం, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, పుణె, చెన్నై, అహ్మదాబాద్, కోల్‌కతా నగారల్లో ఆఫీస్ స్పేస్‌కు గణనీయమైన డిమాండ్‌ను తీసుకొస్తున్నట్టు జైన్ వెల్లడించారు. ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ (గంటలు, రోజుల తరబడి లీజింగ్‌కు అవకాశం ఇచ్చేవి) ఆపరేటర్లు పెద్ద ఎత్తున కార్యకలాపాలను విస్తరిస్తూ, ఆఫీస్ స్పేస్‌లను లీజుకు తీసుకుంటున్నట్టు అనరాక్ నివేదిక తెలిపింది.ఈ రంగాల నుంచి డిమాండ్..ఐటీ/ఐటీఈఎస్, ఫైనాన్షియల్ సర్వీసెస్ (బ్యాంకులు సహా), ఇంజినీరింగ్ అండ్ తయారీ రంగ కంపెనీలు ఆఫీస్ స్పేస్ లీజింగ్ డిమాండ్‌కు కీలకంగా ఉన్నట్టు అనరాక్ నివేదిక వెల్లడించింది. ‘2025 సంవత్సరంలో డిమాండ్ ఆశావహంగా ఉండనుంది. స్థిరీకరణ, విస్తరణ, హైబ్రిడ్ పని నమునా డిమాండ్‌కు మద్దతుగా నిలవనున్నాయి. గురుగ్రామ్, బెంగళూరు, పుణెలో గ్రేడ్–1 ఆఫీస్ స్పేస్ సరఫరాలో కొరత ఉంది. డెవలపర్లు ఈ అంతరాన్ని భర్తీ చేసేందుకు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20–25 మిలియన్ (200–250 లక్షల ) ఎస్ఎఫ్టీ గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ నిర్మాణంలో ఉంది. సకాలంలో నిర్మాణం పూర్తి చేసే డెవలపర్లు పెరుగుతున్న డిమాండ్ అవకాశాలను సొంతం చేసుకోవడంలో ముందుంటారు’ అని జైన్ తెలిపారు. ఈ డిమాండ్ స్థిరంగా కొనసాగుతుందన్నారు. తక్కువ వ్యయాలు, నైపుణ్య మానవ వనరులు, నిర్వహణ సామర్థ్యాలు వెరసి బీఎఫ్ఎస్ఐ, హెల్త్‌కేర్, టెక్నాలజీ, ఆర్అండ్డీ పరిశ్రమల్లో జీసీసీలకు భారత్ చిరునామాగా మారుతోందన్నారు. ఇదీ చదవండి: స్వరంతో సంపద సృష్టించిన గాయనీమణులుసవాళ్లు ఇవే..ఆఫీస్ స్పేస్ మార్కెట్లో సవాళ్ల గురించి జైన్ ప్రస్తావించారు. అధిక ముడి సరుకుల ధరలు, సరఫరా సమస్యలతో నిర్మాణంలో జాప్యం నెలకొనడం ప్రధాన సవాలుగా ఉన్నట్లు చెప్పారు. ఆఫీస్ స్పేస్‌లో స్వల్పకాల లీజుకు ప్రాధాన్యం ఇస్తుండడం ఈ విభాగంలో దీర్ఘకాల ఒప్పందాలపై ప్రభావం చూపిస్తున్నట్టు తెలిపారు. -
ప్రాపర్టీ ఎంపికలో పిల్లలూ కీలకమే..
‘మా వాడికేం తెలుసు, వాడింకా చిన్నపిల్లోడే..’ ‘పెద్దవాళ్ల నిర్ణయాల్లో చిన్నోడివి తలదూర్చటం ఎందుకు..?’ ‘నీకింకా నిర్ణయం తీసుకునేంత వయస్సు రాలేదులే..’..పిల్లల విషయంలో మన పెద్దల అభిప్రాయాలివీ. కానీ, నేటి జనరేషన్ పేరెంట్స్ ఇలాంటి మాటలకు టాటా చెప్పేశారు. ఎందుకంటే ఇప్పుడు ప్రాపర్టీ(Property) ఎంపికలో పిల్లలే అంతిమ నిర్ణేతలయ్యారు. పిల్లల అవసరాలు, అభిరుచులకు తగ్గట్టుగా ఉన్న ప్రాజెక్ట్‌లకే తల్లిదండ్రులు జై కొడుతున్నారు. దీంతో ప్రాజెక్ట్ ఎలివేషన్ నుంచి వసతుల వరకూ పిల్లలను ఆకట్టుకునే ప్రత్యేక థీమ్‌లు, క్లబ్‌హౌస్‌లతో నిర్మాణ సంస్థలు ప్రాజెక్ట్‌లను చేపడుతున్నాయి. ఇల్లంటే నాలుగు గోడలు కాదు.. పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరి అవసరాలు, అభిరుచులకు తగ్గట్టుగా ఉండాలి. అందుకే మూస ధోరణిలో నిర్మించే ప్రాజెక్ట్(Project)లను కొనుగోలుదారులు ఆదరించడం లేదు. ఇది వరకు అంతగా పట్టించుకోని చిన్నారుల అవసరాలే ఇప్పుడు గృహ కొనుగోలు నిర్ణయాలను చాలా వరకు ప్రభావితం చేస్తున్నాయి. విదేశీ తరహాలో నిర్మాణం, ఆధునిక వసతులు ఉండే ప్రాజెక్ట్‌లలో కొనుగోళ్లకే మొగ్గు చూపిస్తున్నారు. అవును.. సొంతిల్లు కొంటున్నామంటే ఇప్పుడు పిల్లల అభిరుచులు, అవసరాలు తీరడం కూడా ముఖ్యమే. – సాక్షి, సిటీబ్యూరోపెద్దలు వృత్తి, ఉద్యోగ రీత్యా అధిక సమయం బయటే గడుపుతారు. వాస్తవానికి ఇంట్లో ఎక్కువ సమయం గడిపేది చిన్నారులే. పాఠశాల సమయం మినహా మిగతా సమయం ఇంట్లోనే ఉంటారు. ఇంట్లో, పరిసరాల్లో వీరి అవసరాలు తీరే వసతులు ఏ మేరకు ఉంటున్నాయనేది కీలకం. సౌకర్యాలంటే ప్రత్యేకంగా వారికంటూ ఒక గది, అందులో నచ్చేట్లుగా ఉండే రంగులు, ఇంటీరియర్(interior) మాత్రమే కాదన్నది నేటితరం పిల్లల భావన. బయట పరిసరాలు వీరిని ఎక్కువ ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి కేవలం బాల్యం వరకే కాదు పెరిగి పెద్దయ్యే వరకూ చుట్టుపక్కల తగిన వసతులు ఉండేలా చూడటం పెద్దల బాధ్యత. కొత్తగా పెళ్లయిన దంపతులు సైతం ఇల్లు కొనేటప్పుడు పిల్లల గురించి పరిగణలోకి తీసుకోవడం మర్చిపోవద్దు.కిడ్స్ థీమ్‌లతో ప్రాజెక్ట్‌లు..నివాస సముదాయంలోని క్లబ్‌హౌస్‌లు కమ్యూనిటీ లివింగ్‌ను ప్రోత్సహించడంతో పాటు పిల్లలకు మంచి అలవాట్లు పెంపొందేందుకు సహాయపడతాయి. దీంతో నిర్మాణ సంస్థలు డిస్నీ, హ్యారీపోర్టర్ వంటి కిడ్స్ థీమ్(Kids Theme)లతో కూడిన ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నాయి. వీటిల్లో చిన్న పిల్లలు ఆడుకునే క్రమంలో కిందపడిపోయినా గాయాలు కాకుండా మృదువైన ఆట పరికరాలు, ఇంటరాక్టివ్ అండ్ ఎడ్యుకేషనల్ టాయ్స్ ప్లే ఏరియాలు, ఆర్ట్, డ్యాన్స్ ఇతరత్రా హాబీల శిక్షణ తరగతుల కోసం యాక్టివిటీ జోన్లు, చిట్టడవి, శాండ్ పిట్స్, ట్రీ బెంచ్, మినీ సాకర్ ఫీల్డ్, యాంపీ థియేటర్ వంటి ఇతరత్రా వసతుల జోన్లను కల్పిస్తున్నారు.మంచి కమ్యూనిటీ, ప్లేగ్రౌండ్ఒకవైపు విశాలమైన ఆట స్థలాలు, వినూత్నమైన ఎలివేషన్లతో పిల్లలను ఆకట్టుకుంటే.. మరోవైపు ప్రాజెక్ట్‌లోనే క్రచ్, ప్లేగ్రౌండ్, మంచి కమ్యూనిటీ వంటి వాటితో తల్లిదండ్రులనూ కట్టిపడేస్తున్నారు బిల్డర్లు. అనారోగ్య సమస్యలు తలెత్తితే ఆస్పత్రికి వెళ్లేందుకు ఎక్కువ దూరం ప్రయాణం చేయడం, వర్షం కురుస్తున్నప్పుడు ఇంటి నుంచి కిలో మీటర్ల దూరం ఉండే స్కూల్‌కు పిల్లలను పంపించేందుకు తల్లిదండ్రులు ఏమాత్రం ఇష్టపడట్లేదు. అందుకే అపార్ట్మెంట్ కొనుగోలు చేసేముందు పిల్లల అవసరాలు, ఆరోగ్యాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రాజెక్ట్‌లోనే స్విమ్మింగ్ పూల్, జిమ్ వంటి వసతులే కాదు, ఇందులోనే కమ్యూనిటీ మంచి సర్కిల్, ప్లేగ్రౌండ్ వంటివి ఉంటేనే కొనేందుకు ముందుకొస్తున్నారు. పార్కులు, థియేటర్లు, మాల్స్, రెస్టారెంట్లు ఉన్నాయో లేవో కూడా కొనుగోలుదారులు చూస్తున్నారని నిర్మాణదారులు అంటున్నారు. ధరలపై ప్రభావం..వసతులన్నీ ఉంటే ఆ ప్రాంతం అభివృద్ధి చెంది ఉంటుంది. సహజంగానే దీని ప్రభావం ధరలపై ఉంటుంది. పేరున్న పాఠశాలలు, ఆస్పత్రులు, ప్రజా రవాణా, మాల్స్ ఉన్నట్లయితే ఎక్కువ మంది ఆ చుట్టుపక్కల నివాసం ఉండేందుకు ఆసక్తి చూపుతుంటారు. దీంతో కొత్త నిర్మాణాలకు డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. ఇవన్నీ చూపెట్టి ఆయా ప్రాంతంలో ఉన్న ధరల కంటే ఎక్కవ ధరకు విక్రయించేవారు ఉంటారు. నాణ్యమైన నిర్మాణం, గడువులోగా పూర్తి చేసే నిర్మాణదారులనే అంతిమంగా ఎంపిక చేసుకోవాలి.అభిరుచుల కోసం క్లబ్‌హౌస్‌లు..ప్రస్తుతం మార్కెట్లో చాలా ప్రాజెక్ట్‌లు పిల్లల వసతులపై దృష్టిపెడుతున్నాయి. వారు ఆటలాడుకునేందుకు ప్రత్యేకంగా స్థలం కేటాయిస్తున్నాయి. తక్కువ లోతులో ఈత కొలనులు నిర్మిస్తున్నాయి. పెద్దలకే కాదు పిల్లల కోసం వేర్వేరు ప్లే కోర్టులను తమ ప్రాజెక్ట్‌లో చేరుస్తున్నాయి. తక్కువ స్థలంలో నిర్మాణాలు చేపడుతూ ఖాళీ స్థలం ఎక్కువ ఉండేలా పచ్చదనానికి పెద్దపీట వేస్తున్నాయి. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల కోసం ప్రత్యేకంగా ట్యూషన్లు చెప్పిస్తుంటారు. ఈ దృష్ట్యా కొన్ని నిర్మాణ సంస్థలు అపార్ట్మెంట్లలోనే ట్యూషన్ గదులను నిర్మిస్తున్నాయి. వ్యాపకాలు, అభిరుచులకు పదును పెట్టేలా చిన్నారుల కోసం ప్రత్యేకంగా క్లబ్‌హౌస్‌లను నిర్మించడం నేటి పోకడ. ఉద్యోగాలకు వెళ్లిన తల్లిదండ్రుల కంటే పిల్లలు పాఠశాల నుంచి ముందుగానే ఇంటికి చేరుకుంటారు. అమ్మానాన్న వచ్చే వరకు వీరు క్లబ్ హౌస్‌లో ఇతర నైపుణ్యాలను పెంపొందించుకునే కార్యక్రమాల్లో పాల్గొనే సదుపాయం కల్పిస్తున్నాయి.నేటి పేరెంట్స్ నిర్ణయంలో మార్పులుమెట్రో నగరాల్లో భార్యభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయక తప్పని పరిస్థితి. దీంతో పిల్లలకు సమయం కేటాయించలేని పరిస్థితి. అందుకే కనీసం నివాసం ఉండే ప్రాజెక్ట్‌లోనైనా పిల్లల అవసరాలు, అభిరుచులను తీర్చేవిధంగా ఉండాలని భావిస్తున్నారు. చిన్నారులకు భద్రమైన, ఆధునిక వసతులను అందించే ప్రాజెక్ట్‌లను కోరుకుంటున్నారు.– వంశీకృష్ణ, డైరెక్టర్, ప్రైమార్క్ డెవలపర్స్ -
హైదరాబాద్‌లో తగ్గిన ఇళ్ల అమ్మకాలు - కారణం ఇదే..
హైదరాబాద్ (Hyderabad) ఇళ్ల మార్కెట్ నీరసించింది. ఈ ఏడాది మొత్తం మీద ఇళ్ల అమ్మకాలు క్రితం ఏడాది కంటే 5 శాతం తక్కువగా నమోదు కావొచ్చంటూ రియల్ ఎస్టేట్ (Real Estate) కన్సల్టెంట్ అనరాక్ తెలిపింది. 58,540 యూనిట్ల అమ్మకాలు ఉంటాయని అంచనా వేసింది. క్రితం ఏడాది విక్రయాలు 61,715 యూనిట్లుగా ఉన్నాయి.హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో ఈ ఏడాది ఇళ్ల అమ్మకాలు 4 శాతం తగ్గి రూ.4.6 లక్షల యూనిట్లుగా ఉండొచ్చంటూ.. 2024 ఏడాదిపై అంచనాలతో అనరాక్ నివేదిక విడుదల చేసింది. గతేడాది ఇవే నగరాల్లో 4,76,530 యూనిట్లు అమ్ముడయ్యాయి. కాకపోతే గతేడాదితో పోల్చితే ఇళ్ల అమ్మకాల విలువ ఈ ఏడాది 16 శాతం పెరిగి రూ.5.68 లక్షల కోట్లుగా ఉంది.ఒక ఇల్లు సగటు విక్రయ ధర ఈ ఏడాది 21 శాతం పెరిగింది. భూముల ధరలు, కార్మికుల వేతనాలు, ముడి సరుకుల ధరలు పెరగడం ఇందుకు కారణాలుగా ఉన్నాయి. అలాగే, సాధారణ, అసెంబ్లీ ఎన్నికల సమయంలో నియంత్రణ పరమైన అనుమతుల్లో జాప్యంతో కొత్త హౌసింగ్ ప్రాజెక్టుల ప్రారంభం నిదానించడాన్ని కూడా కారణంగా పేర్కొంది.ఇదీ చదవండి: రూ.16.8 కోట్ల అడ్వాన్స్.. నెల అద్దె తెలిస్తే షాకవుతారు!ఇళ్ల ధరలు పెరగడంతో అమ్మకాల విలువ గతేడాది కంటే అధికంగా ఉన్నట్టు వివరించింది. ‘‘భారత హౌసింగ్ రంగానికి 2024 మిశ్రమంగా ఉంది. సాధారణ ఎన్నికలకు తోడు, నిర్మాణ అనుమతుల్లో జాప్యం నెలకొంది. నూతన ఇళ్ల సరఫరాపై దీని ప్రభావం పడింది. గతేడాదితో పోల్చితే ఇళ్ల అమ్మకాలు సంఖ్యా పరంగా తగ్గినప్పటికీ, ధరల పెరగుదలతో అమ్మకాల విలువ 16 శాతం పెరిగింది’’అని అనరాక్ చైర్మన్ అనుజ్ పురి తెలిపారు.సరఫరాలో క్షీణత➤తాజా ఇళ్ల సరఫరా ఏడు ప్రధాన నగరాల్లో ఈ ఏడాది 7 శాతం తగ్గి, 4,12,520 యూనిట్లుగా ఉండొచ్చు.➤ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ఈ ఏడాది ఇళ్ల అమ్మకాలు గతేడాదితో పోల్చితే 6 శాతం తగ్గి 61,900 యూనిట్లుగా ఉంటాయి. గతేడాది 65,625 యూనిట్ల విక్రయాలు జరిగాయి. ➤ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (MMR)లో అమ్మకాలు ఒక శాతం పెరిగి 1,55,335 యూనిట్లకు చేరొచ్చు.➤బెంగళూరులో ఇళ్ల అమ్మకాలు 2 శాతం వృద్ధితో 65,230 యూనిట్లుగా ఉండొచ్చని అంచనా. ➤పూణేలో 6 శాతం తక్కువగా 81,090 యూనిట్ల విక్రయాలు నమోదు అవుతాయి.➤కోల్‌కతాలో 20 శాతం క్షీణతతో 18,335 యూనిట్లకు అమ్మకాలు పరిమితం కావొచ్చు.➤చెన్నైలో 11 శాతం తగ్గి 19,220 యూనిట్లుగా ఉంటాయని అనరాక్ నివేదిక అంచనా వేసింది. -
హైదరాబాద్‌లో ఆఫీస్ లీజింగ్ కళకళ
హైదరాబాద్ (Hyderabad) మార్కెట్లో కార్యాలయ స్థలాలకు (office space) బలమైన డిమాండ్ కొనసాగుతోంది. ప్రస్తుత ఏడాది మొత్తం మీద గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ లీజింగ్ 56 శాతం పెరిగి 12.5 మిలియన్ చదరపు అడుగులు (ఎస్ఎఫ్టీ)గా ఉన్నట్టు కొలియర్స్ ఇండియా (Colliers) నివేదిక వెల్లడించింది. క్రితం ఏడాది లీజు పరిమాణం 8 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉన్నట్టు పేర్కొంది. ఇక దేశవ్యాప్తంగా ఆరు ప్రధాన నగరాల్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ ఈ ఏడాది 14 శాతం పెరిగి 66.4 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉన్నట్టు కొలియర్స్ నివేదిక తెలిపింది. క్రితం ఏడాది ఇవే పట్టణాల్లో స్థూల కార్యాలయ స్థలాల లీజింగ్ 58.2 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. పట్టణాల వారీగా.. » బెంగళూరులో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 21.7 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరింది. క్రితం ఏడాది 15.6 మిలియన్ ఎస్ఎఫ్టీ లీజుతో పోల్చితే 39 శాతం పెరిగింది. » ముంబైలోనూ 43 శాతం వృద్ధితో 10 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా నమోదైంది. » పుణెలో ఆఫీస్ స్పేస్ లీజింగ్ క్రితం ఏడాదితో పోల్చి చూస్తే 4 శాతం పెరిగి 5.7 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరింది. » చెన్నైలో స్థూల లీజింగ్ 35 శాతం క్షీణతతో 6.8 మిలియన్ ఎస్ఎఫ్టీకి పరిమితమైంది. 2023లో ఇదే పట్టణంలో లీజింగ్ 10.5 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. » ఢిల్లీ ఎన్సీఆర్లోనూ 16 శాతం తక్కువగా 9.7 మిలియన్ ఎస్ఎఫ్టీ లీజు నమోదైంది.2025లోనూ గరిష్ట స్థాయిలోనే.. టెక్నాలజీ, ఇంజనీరింగ్, తయారీ కంపెనీలతోపాటు ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీల నుంచి ఆఫీస్ స్థలాలకు ఈ ఏడాది డిమాండ్ ఎక్కువగా ఉన్నట్టు కొలియర్స్ ఇండియా నివేదిక తెలిపింది. 2025లోనూ ఆఫీస్ స్పేస్ లీజింగ్ గరిష్ట స్థాయిలోనే కొనసాగొచ్చొని కొలియర్స్ ఇండియా ఆఫీస్ సర్వీసెస్ విభాగం ఎండీ అర్పిత్ మెహరోత్రా అంచనా వేశారు. వచ్చే కొన్నేళ్ల పాటు లీజింగ్ 60 మిలియన్ ఎస్ఎఫ్టీకి మించి కొనసాగడం సాధారణ అంశంగా మారుతుందన్నారు. గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల (జీసీసీలు) నుంచి స్థిరమైన డిమాండ్ కొనసాగడం పెద్ద పరిమాణంలో ఆఫీస్ స్థలాల లీజింగ్‌కు మద్దతుగా నిలుస్తున్నట్టు బెంగళూరు కేంద్రంగా పనిచేసే సుమధుర గ్రూప్ సీఎండీ మధుసూదన్ పేర్కొన్నారు. లాజిస్టిక్స్, ఇండస్ట్రియల్ వసతులకూ డిమాండ్ దేశవ్యాప్తంగా టాప్–8 నగరాల్లో లాజిస్టిక్స్, ఇండస్ట్రియల్ (ఎల్‌అండ్‌ఐ) వసతుల లీజింగ్ ప్రస్తుత ఏడాది మొత్తం మీద 50–53 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉండొచ్చని కుష్మన్ అండ్ వేక్ ఫీల్డ్ సంస్థ తెలిపింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, పుణె, అహ్మదాబాద్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్) పరిధిలో గతేడాది లాజిస్టిక్స్ అండ్ ఇండస్ట్రియల్ వసతుల లీజింగ్ 53.57 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉన్నట్టు పేర్కొంది. ఈ ఏడాది అక్టోబర్ వరకు లీజింగ్ ఈ నగరాల్లో 41 మిలియన్ ఎస్ఎఫ్టీని అధిగమించినట్టు తెలిపింది.‘‘ప్రభుత్వం 2020లో ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) ప్రకటించిన నాటి నుంచి ఇండస్ట్రియల్ స్థలాల లీజింగ్‌లో మెరుగైన వృద్ధి నమోదవుతోంది. దీనికితోడు రిటైల్, ఈ–కామర్స్ సైతం బలంగా అవతరించడం డిమాండ్‌కు మద్దతుగా నిలిచింది’’అని ఈ నివేదిక వెల్లడించింది. బలమైన పారిశ్రామిక కార్యకలాపాలకు తోడు వినియోగ దోరణి విస్తృతం కావడంతో 2025లో లీజింగ్ బలంగా కొనసాగొచ్చని అంచనా వేసింది. చైనా ప్లస్ వన్ విధానంతో భారత్ సైతం ప్రయోజనం పొందుతుండడం ఈ రంగాల్లో డిమాండ్‌కు కలిసొస్తున్నట్టు వివరించింది. -
భవనాల ఎత్తుకు క్యాప్ పెట్టండి!
‘ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్(ఎఫ్ఎస్ఐ) పరిమితులు ఉన్నాయి. కానీ, ఔటర్ రింగ్ రోడ్డు వరకూ స్థలాల లభ్యత ఉన్న హైదరాబాద్‌లో మాత్రం ఎఫ్ఎస్ఐపై ఆంక్షలు లేవు. దీంతో రోడ్డు, స్థలం విస్తీర్ణంతో సంబంధం లేకుండా బిల్డర్లు ఇష్టారాజ్యంగా హైరైజ్ భవనాలను నిర్మిస్తున్నారు. దీంతో భూములు, అపార్ట్మెంట్ల ధరలు పెరుగుతున్నాయి. ఒకే ప్రాంతంలో భవన నిర్మాణాలు ఉండటంతో రోడ్లపై వాహనాల రద్దీ, కాలుష్యం పెరగడంతో పాటు విద్యుత్, డ్రైనేజీ, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలపై అదనపు భారం పడుతుంది’ అని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్(నరెడ్కో) వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ ఛైర్మన్ ఎం.ప్రేమ్‌కుమార్ అన్నారు. ‘సాక్షి రియల్టీ’తో ఆయన ఇంటర్వ్యూ పూర్తి వివరాలివీ.. – సాక్షి, సిటీబ్యూరోమౌలిక వసతులు, డిమాండ్ ఉన్న ప్రాంతంలో తక్కువ స్థలం దొరికినా చాలు బిల్డర్లు హైరైజ్ భవనాలు కట్టేస్తున్నారు. దీంతో స్థలాలు, అపార్ట్మెంట్ల ధరలు పెరగడం తప్ప సమాంతర అభివృద్ధి జరగడం లేదు. నగరాభివృద్ధికి ఆకాశహర్మ్యలే ప్రతీక. ఆర్థికంగా, సాంకేతికంగా మనం ఎంత శక్తిమంతులమో ఇవి నిరూపిస్తాయి. అలా అని రోడ్డు, మౌలిక సదుపాయాలపై పడే ప్రభావాన్ని అంచనా వేయకుండా అనుమతులు ఇవ్వకూడదు. ఎఫ్ఎస్ఐపై ఆంక్షలు ఉంటేనే బిల్డర్లు ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కాకుండా ఓఆర్ఆర్ చుట్టూ ఖాళీగా ఉన్న ప్రాంతాల వైపు దృష్టిసారిస్తారు. దీంతో ధరలు తగ్గి, సామాన్యుల సొంతింటి కల సాకారం అవుతుంది. నార్సింగి, పుప్పాలగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ఖరీదైన ప్రాంతాల్లో కనీసం నివాస భవనాలకైనా ఎఫ్ఎప్ఐపై క్యాప్ పెట్టాలి.మూసీ పరిహారంగా స్థలాలు..గ్లోబల్ సిటీగా బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్న హైదరాబాద్‌లో కంపుకొట్టే మూసీ నది ఉండటం శోచనీయం. విదేశీ పర్యాటకులు, పెట్టుబడులను ఆకర్షించాలంటే మూసీ సుందరీకరణ అనివార్యం. ఈ బృహత్తర కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం అభినందనీయం. అయితే మూసీ పరివాహక ప్రాంతంలోని నివాసితులను ఒప్పించి ఆయా భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. మూసీ బాధితులకు శివారు ప్రాంతంలో ప్రభుత్వమే లేఔట్ చేసి, 60–80 గజాల చొప్పున స్థలాన్ని కేటాయించాలి. దీంతో వాళ్లే సొంతంగా ఇళ్లు కట్టుకుంటారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుల నిధులను ఇతర అవసరాలకు వినియోగించుకోవచ్చు. మెట్రో, ఎంఎంటీఎస్ విస్తరణతో రవాణా వ్యవస్థ మరింత మెరుగవుతుంది. రోడ్ల మీద వాహనాల రద్దీతో పాటు ప్రయాణ సమయం తగ్గుతుంది. మెరుగైన రవాణాతో నగరం సమాంతరంగా అభివృద్ధి చెందుతుంది.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ఎన్ని ఇళ్లు అమ్మకానికి ఉన్నాయంటే..చెరువుల్లో పట్టా భూములు..చెరువులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు ఏర్పాటైన హైడ్రా ఉద్దేశం మంచిదే. కానీ, ప్రభుత్వం దీన్ని సరైన రీతిలో పరిచయం చేయలేదు. ఇప్పటికీ గ్రేటర్లో చాలా చెరువులకు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను ప్రభుత్వం నిర్ధారించలేదు. అయినా ఆగమేఘాల మీద బుల్డోజర్లతో కూల్చివేతలు చేశారు. అలా కాకుండా ముందుగా చెరువులకు కంచె వేసి, బఫర్ జోన్లను నిర్ధారించాలి. గ్రేటర్‌లోని చాలా చెరువుల్లో పట్టా భూములు ఉన్నాయి. ఆయా భూయజమానులకు 400 శాతం ట్రాన్స్ఫర్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) భూములను స్వాధీనం చేసుకోవాలి. ఈ విధానాన్ని హైదరాబాద్‌కే కాకుండా రాష్ట్రమంతటా అమలు చేయాలి. అప్పుడే బాధితులు ముందుకొస్తారు. గతంలో కొనుగోలుదారులు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పర్మిషన్ ఉందా అడిగేవారు కానీ ఇప్పుడు హైడ్రా పర్మిషన్ ఉందా అని అడుగుతున్నారు. -
హైదరాబాద్‌లో ఎన్ని ఇళ్లు అమ్మకానికి ఉన్నాయంటే..
డిమాండ్‌కు మించి సరఫరా జరుగుతుండటంతో హైదరాబాద్‌లో అమ్మకానికి ఉన్న ఇళ్లు(ఇన్వెంటరీ) పెరిగిపోతున్నాయి. దేశంలోని ఏడు ప్రధాన మెట్రో నగరాలతో పోలిస్తే ముంబై తర్వాత హైదరాబాద్‌లోనే అత్యధిక ఇన్వెంటరీ ఉంది. ఇక, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాలతో పోలిస్తే మన దగ్గరే ఎక్కువ. ప్రస్తుతం గ్రేటర్లో 1,01,091 ఇళ్ల ఇన్వెంటరీ (వీటిలో నిర్మాణంలో ఉన్నవి, పూర్తయినవి కలిపి) ఉంది. వీటి విక్రయానికి కనిష్టంగా 19 నెలల కాలం పడుతుంది.రెండేళ్లలో నగరంలో గృహాల సరఫరా పెరగడమే ఇన్వెంటరీ పెరుగుదలకు ప్రధాన కారణం. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఏడాది తొలి తొమ్మిది నెలల కాలంలో మొత్తం 5,64,416 యూనిట్ల ఇన్వెంటరీ మిగిలి ఉందని, వీటి విక్రయానికి కనిష్టంగా 14 నెలల కాలం పడుతుందని అనరాక్ గ్రూప్ నివేదిక వెల్లడించింది.ఇదీ చదవండి: ట్రంప్ కలం నుంచి జాలువారిన అక్షరాలునగరాల వారీగా ఇన్వెంటరీ (యూనిట్లలో)ఎన్సీఆర్ ఢిల్లీ 85,460 ఎంఎంఆర్ ముంబయి 1,86,677 బెంగళూరు 46,316 పుణే 88,176 హైదరాబాద్ 1,01,091 చెన్నై 28,758 కోల్‌కతా 25,938 -
సోలారే సోబెటరూ..
సాక్షి, సిటీబ్యూరో: ఈ మధ్య కాలంలో వచ్చిన అధునాతన సాంకేతిక మార్పుగా అవతరించి, సామాజికంగా అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న వాటిలో ‘సోలార్ విద్యుత్ శక్తి, ఈ–వాహనాలు’ హవా కొనసాగిస్తున్నాయి. ఈ రెండు అంశాలు సామాజిక జీవన వైవిధ్యంలో పెను మార్పులకు నాంది పలికాయి. ఒక వైపు విపరీతంగా పెరిగిపోతున్న కరెంట్ వాడకం, దానికి అనుగుణంగానే పెరిగిపోతున్న విద్యుత్ ఛార్జీలు. వెరసీ అందరి చూపూ సోలార్ విద్యుత్ వైపునకు మళ్లింది.దశాబ్ద కాలంగానే సోలార్కు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నప్పటికీ అది నగరాల వరకే పరిమితమైంది. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంతో గ్రామీణ ప్రాంతాల్లోనూ సోలార్ సెట్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ స్కీంలో భాగంగా దేశవ్యాప్తంగా కోటి ఇళ్లకు సోలార్ వ్యవస్థను వ్యాప్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ప్రత్యేక సబ్సిడీలను సైతం అందిస్తున్నారు. కొన్నేళ్లుగా సోలార్ వ్యవస్థ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న వ్యాపార సంస్థలు సైతం ఈ సందర్భంగా వారి సేవలు పెంచుతున్నాయి. కొన్ని సంస్థలైతే వివిధ జిల్లాల్లోని టౌన్లలో ప్రత్యేకంగా ఎక్స్పీరియన్స్ సెంటర్లను ఆవిష్కరించి ఈ సోలార్ సెట్ వాడకంపై అవగాహన కల్పిస్తున్నారు.సూర్య ఘర్ స్కీంతో సబ్సిడీ..హైదరాబాద్ వంటి నగరాల్లో సోలార్ వాడకంపై అవగాహన మెరుగ్గానే ఉంది. సోలార్ విద్యుత్ వినియోగించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఇప్పుడిప్పుడే ఈ విధానానికి అలవాటు పడుతున్నారు. ఈ సోలార్ పద్ధతులు వ్యక్తిగత ఇళ్లతో పాటు చిన్న–పెద్ద తరహా పరిశ్రమల్లోనూ విరివిగా వాడుతున్నారు. వారి వారి విద్యుత్ వాడకానికి అనుగుణంగానే పీఎం సూర్య ఘర్ స్కీంలో ఒక కిలో వాట్ నుంచి వినియోగాన్ని బట్టి అవసరమైనన్ని కిలో వాట్ల సోలార్సెట్లను, వాటికి సబ్సిడీని అందిస్తుంది. ఈ సోలార్ విధానాన్ని రెసిడెన్షియల్ ఏరియాలో, స్కూల్స్, ఫామ్ హౌజ్‌లు, రైస్‌మిల్స్ వంటి చిన్న తరహా పరిశ్రమల్లోనూ ఎక్కువగా వాడుతున్నారు. పరిశ్రమలైనా, వ్యక్తిగత వినియోగమైనా.. టెక్నాలజీ పెరగడంతో కరెంట్ వినియోగం సైతం అధికంగా పెరిగిపోయింది. గతంలో ఇళ్లలో రూ.200 నుంచి రూ.500ల కరెంట్ బిల్ అత్యధికం అనుకుంటే.. ఇప్పుడది రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు పెరిగిపోయింది. ఇక పరిశ్రమల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మిషనరీ, అధునాతన సాంకేతికత వినియోగం పెరగడంతో వాటి చార్జీలు మూడింతల కన్నా పైగానే పెరిగాయని నిపుణులు తెలుపుతున్నారు. పర్యావరణ హితం.. సోలార్ సిస్టం..విద్యుత్ తయారీ కోసం ప్రస్తుతం వాడే పద్ధతులన్నీ ఏదో విధంగా పర్యావరణానికి హాని చేసేవే అని పరిశోధకుల అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. సాధారణంగా థర్మల్, గ్యాస్, విండ్, హైడ్రో తదితర పద్ధతుల్లో విద్యుత్‌ను సేకరిస్తున్నారు. ఈ తరుణంలో కిలో వాట్ సోలార్ సిస్టమ్ పెట్టుకుంటే కొన్ని వందల మొక్కలు పెంచిన దానితో సమానమని, అంతటి కాలుష్యాన్ని తగ్గించే విధానంగా సోలార్ నిలుస్తుందని నిపుణుల మాట. ప్రస్తుతం గ్లోబల్ వార్మింగ్ పెరగడం, కార్బన్ మోనాక్సైడ్ స్థాయిలు పెరగడం.. తదితర కారణాలతో ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు ఏర్పడటం, వెరసీ పర్యావరణ మార్పులతో పెను ప్రమాదాలను ఎదుర్కొంటున్నాం. ఇలాంటి తరుణంలో కాలుష్యరహిత పద్ధతులైన సోలార్ సిస్టమ్ అత్యంత శ్రేయస్కరమని భావిస్తున్నారు. అంతా లాభమే.. – రాధికా చౌదరి, ఫ్రెయర్ ఎనర్జీ కోఫౌండర్రాష్ట్రంలో సోలార్ వినియోగంపై అవగాహన పెరిగింది. ఈ రంగంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, ఉత్తర్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనూ సేవలందిస్తున్నాం. కరోనా అనంతరం సోలార్ ఎనర్జీను వినియోగించేవారి సంఖ్య అధికంగా పెరిగింది. పీఎం సూర్య ఘర్ స్కీం కూడా దీనికి కారణం. ఇందులో భాగంగా రూ.2 లక్షల సోలార్ సెట్ బిగించుకుంటే దాదాపు రూ.78 వేల సబ్సిడీ లభిస్తుంది. మిగతా పెట్టుబడి కూడా రెండు మూడేళ్ల కరెంట్ ఛార్జీలతో సమానం. కాబట్టి మూడేళ్ల తర్వాత వినియోగించే సోలార్ కరెంట్ అంతా లాభమే. -
రియల్టీలో ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: దేశీ రియల్టీ రంగంలో ప్రైవేట్ ఈక్విటీ(పీఈ) పెట్టుబడులు భారీగా ఎగిశాయి. ప్రస్తుత క్యాలండర్ ఏడాది(2024)లో ఇప్పటివరకూ 4.15 బిలియన్ డాలర్లు లభించాయి. రియల్టీ రంగ కన్సల్టెంట్ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక ప్రకారం వార్షికంగా ఇవి 32 శాతం అధికం. పెట్టుబడుల్లో అత్యధికంగా హౌసింగ్ విభాగానికి ప్రవహించినట్లు తెలియజేసింది. 2024 ఇండియాలో పీఈ పెట్టుబడుల ట్రెండ్ పేరుతో నివేదికను విడుదల చేసింది. ఈ వివరాల ప్రకారం 2024లో ఇప్పటివరకూ రియల్టీలో పీఈ పెట్టుబడులు 415 కోట్ల డాలర్లను అధిగమించాయి.వేర్‌హౌసింగ్ ఆధిపత్యంరియల్టీ రంగ మొత్తం పీఈ పెట్టుబడుల్లో వేర్‌హౌసింగ్ 45 శాతం వాటాతో అగ్రస్థానంలో నిలవగా.. రెసిడెన్షియల్ విభాగం 28 శాతం వాటాను ఆక్రమించింది. కార్యాలయ విభాగం 26 శాతం పెట్టుబడులను ఆకట్టుకుంది. అయితే గతేడాదితో పోలిస్తే రెసిడెన్షియల్ విభాగం రెట్టింపునకుపైగా వృద్ధితో 117.7 కోట్ల డాలర్లు అందుకుంది. గృహ కొనుగోళ్లలో వినియోగదారుల నుంచి పెరుగుతున్న డిమాండ్ ప్రభావం చూపుతోంది. కాగా.. వేర్‌హౌసింగ్‌కు 187.7 కోట్ల డాలర్లు అందితే.. ఆఫీస్ ప్రాపర్టీలకు 109.8 కోట్ల డాలర్లు లభించాయి. పదేళ్లుగా పెరుగుదల..ప్రధానంగా భారత్‌లో గత దశాబ్ద కాలం నుంచి పెట్టుబడులు పుంజుకుంటున్నట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్, ఎండీ శిశిర్ బైజల్ పేర్కొన్నారు. ఇందుకు ఆర్థిక సుస్థిరత, నిరవధిక వృద్ధి సహకరిస్తున్నట్లు తెలియజేశారు. ఈకామర్స్, థర్డ్‌పార్టీ లాజిస్టిక్స్ ఊపందుకున్న నేపథ్యంలో వేర్‌హౌసింగ్‌కు భారీ డిమాండ్ నెలకొన్నట్లు వివరించారు. వెరసి వేర్‌హౌసింగ్ విభాగం అత్యధిక పెట్టుబడులకు నెలవుగా మారినట్లు తెలియజేశారు. ఈ బాటలో గృహ రంగం సైతం ప్రస్తావించదగ్గ స్థాయిలో పెట్టుబడులను ఆకట్టుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: మళ్లీ భగ్గుమన్న బంగారం.. తులం ఎంతో తెలుసా?ఆఫీసులు కళకళపీఈ పెట్టుబడుల్లో కార్యాలయ విభాగం కొంతమేర నీరసించినప్పటికీ ఉద్యోగులు తిరిగి వర్క్‌ప్లేస్‌లకు రావడం, ఆఫీసులు పెరగడం, అద్దెలు బలపడటం వంటి అంశాలు అండగా నిలుస్తున్నట్లు శిశిర్ వివరించారు. ఇక దేశీయంగా మొత్తం రియల్టీ పీఈ పెట్టుబడుల్లో ముంబై 50 శాతం వాటాను ఆక్రమించడం గమనార్హం! మొత్తం పెట్టుబడుల్లో 42 శాతం వాటాకు సమానమైన 1.7 బిలియన్ డాలర్లు యూఏఈ నుంచి లభించాయి. దేశీ పీఈ ఇన్వెస్టర్లు 32 శాతం వాటాకు సమానమైన 1.3 బిలియన్ డాలర్లు సమకూర్చారు! సింగపూర్ ఫండ్స్, ఇన్స్టిట్యూషన్స్ నుంచి 63.37 కోట్ల డాలర్లు ప్రవహించాయి. -
హైదరాబాద్ ‘రియల్’ ట్రెండ్
దేశీయ స్థిరాస్తి రంగంలో హైదరాబాద్ పవర్ హౌస్‌గా మారింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ), లైఫ్ సైన్స్ రంగాల బహుళ స్థిరాస్తి పెట్టుబడులకు వేదికగా అభివృద్ధి చెందింది. గతంలో సిటీ రియల్ ఎస్టేట్‌లో ఐటీ కంపెనీలు, ఉద్యోగుల లావాదేవీలు ఎక్కువగా జరుగుతుండేవి. కానీ, కొంతకాలంగా ఫార్మాసూటికల్స్ రంగం నుంచి కూడా పెట్టుబడులు, కొనుగోళ్లు పెరుగుతున్నాయి. దీంతో గృహాలు, ఆఫీసులు, గిడ్డండులు, డేటా సెంటర్లకు డిమాండ్ ఏర్పడింది. – సాక్షి, సిటీబ్యూరోఇదీ రియల్ వృద్ధి..హైదరాబాద్‌లో ఈ ఏడాది తొమ్మిది నెలల్లో రూ.36,461 కోట్లు విలువ చేసే రూ.59,386 గృహాలు అమ్ముడుపోయాయని నైట్‌ఫ్రాంక్ ఇండియా తెలిపింది. అలాగే మార్కెట్లోకి కొత్తగా 85 లక్షల చ.అ. ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఉన్న ఆఫీస్ స్పేస్‌తో కలిపి మొత్తం 87 లక్షల చ.అ. కార్యాలయాల స్థలాల లావాదేవీలు జరిగాయి. ఇక గ్రేటర్లో 54 లక్షల చ.అ. గిడ్డంగుల స్థలం, 47 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 20 మెగావాట్లు నిర్మాణంలో ఉండగా.. మరో 38 మెగావాట్లు ప్రణాళిక దశలో ఉన్నాయని కొల్లియర్స్ ఇండియా నివేదిక తెలిపింది.భవిష్యత్తులో మరింత జోష్ఫోర్త్ సిటీ, ఏఐ సిటీ, టీ–స్క్వేర్, ఫార్మా క్లస్టర్లు, మెట్రో విస్తరణతో పాటు విమానాశ్రయంతో కనెక్టివిటీ, రీజినల్ రింగ్‌రోడ్ వంటి బృహత్తర ప్రాజెక్ట్‌లకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీంతో సిటీ విస్తరణ పెరగడంతో పాటు పెట్టుబడులకు అపారమైన అవకాశాలు ఏర్పడతాయి. దీంతో హైదరాబాద్‌లో ఇళ్లు, ఆఫీసులు, వేర్‌హౌస్, డేటా సెంటర్లకు మరింత డిమాండ్ ఏర్పడుతుందని పరిశ్రమ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. వచ్చే 3–4 ఏళ్లలో నగరంలో కొత్తగా లక్ష గృహాలు లాంచింగ్ అవుతాయని, 2026 నాటికి ఏటా 1.7–1.9 కోట్ల చ.అ. ఆఫీసు స్థలాన్ని అందుబాటులోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే వచ్చే రెండేళ్లలో వేర్‌హౌస్ స్థలం 40 లక్షల చ.అ.కు, డేటా సెంటర్ల సామర్థ్యం 23 మెగావాట్లకు విస్తరిస్తాయని అంచనా.ఐటీ వర్సెస్ ఫార్మా..ఐటీ, ఐటీఈఎస్ ఎగుమతులు, ఉత్పత్తులతో హైదరాబాద్ ఐటీ హబ్‌గా పేరొందింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఐటీ ఎగుమతులు 11.3 శాతం పెరిగి రూ.2.68 లక్షల కోట్లను అధిగమించాయి. ప్రస్తుతం 1,500లకు పైగా ఐటీ, ఐటీఈఎస్ కంపెనీల్లో 9 లక్షలకు పైగా ఉద్యోగులున్నారు. టీ–హబ్, టీ–వర్క్స్ వంటి ఇన్నోవేషన్ పవర్హౌస్లతో నగరం 4 వేల స్టార్టప్‌లకు ఆతిథ్యం ఇస్తోంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్(ఏఐ), సెమీకండక్టర్ల డిజైన్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ వంటి అత్యాధునిక సాంకేతికతలపై దృష్టి పెట్టడంతో అభివృద్ధి మరింత జోరందుకుంటుంది.లైఫ్ సైన్సెస్ క్యాపిటల్‌గా పిలిచే హైదరాబాద్‌లో 1,500లకు పైగా ఫార్మాసూటికల్స్, బయోటెక్ కంపెనీలున్నాయి. దేశంలోని మొత్తం ఫార్మా ఎగుమతుల్లో మన రాష్ట్రం వాటా 20–30 శాతం. దేశంలో మూడింట ఒక వంతు వ్యాక్సిన్లు హైదరాబాద్ నుంచే ఉత్పత్తి అవుతున్నాయి. 2023–24లో రూ.36,893 కోట్ల ఫార్మాసూటికల్స్ ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. వచ్చే పదేళ్లలో లైఫ్ సైన్స్ పరిశ్రమ వంద బిలియన్ డాలర్ల అభివృద్ధి చేయాలని, కొత్తగా 4 లక్షల ఉద్యోగాలను సృష్టించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఫార్మా క్లస్టర్లు, జీనోమ్ వ్యాలీ, మెడికల్ డివైస్ పార్క్‌ల విస్తరణ తదితర బృహత్తర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.ఇదీ చదవండి: మళ్లీ భగ్గుమన్న బంగారం.. తులం ఎంతో తెలుసా?2023–24 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ఎగుమతులు రూ.1,16,182 కోట్లు కాగా.. ఇందులో రూ.2,68,233 కోట్లు ఐటీ, రూ.36,893 కోట్ల ఫార్మాస్యూటికల్స్ ఎగుమతుల వాటాను కలిగి ఉన్నాయి. నగరంలో ఐటీతో మొదలైన రియల్ బూమ్ ఫార్మా ఎంట్రీతో నెక్ట్స్ లెవల్‌కి చేరింది. బలమైన ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వ వ్యూహాత్మక ప్రణాళికలు, వ్యాపార అనుకూల విధానాలు, అంతర్జాతీయ మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి, అందుబాటులో ప్రాపర్టీల ధరలు.. ఇవన్నీ ఐటీ, ఫార్మా రంగాలకు చోదక శక్తిగా మారాయి. బహుళ రంగాల్లో అంతర్జాతీయ కంపెనీలు కొలువుదీరడంతో నగరం శరవేగంగా అభివృద్ధి చెందింది. రాష్ట్రంలో ఐటీ, ఫార్మా ఎగుమతుల్లో గ్రేటర్ వాటా 60 శాతానికి పైగానే ఉంటుంది. వెస్ట్ హైదరాబాద్‌తో పాటు పోచారం, ఆదిభట్ల వంటి ప్రాంతాల్లో ఐటీ సంస్థలు, మేడ్చల్, కొత్తూరు, పటాన్చెరు వంటి ప్రాంతాల్లో వేర్‌హౌస్‌లు, శంషాబాద్, కందుకూరు, మేకగూడ వంటి ప్రాంతాల్లో డేటా సెంటర్లకు డిమాండ్ ఏర్పడింది. -
హైదరాబాద్‌లో ఇల్లు.. రూ.కోటి అయినా కొనేద్దాం!
కరోనా తర్వాత నుంచి విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్ పెరిగింది. దీంతో హైదరాబాద్‌లో గృహాల ధరలు పెరిగిపోయాయి. 2024 తొలి అర్ధ ఆర్థిక సంవత్సరం(హెచ్1)లో నగరంలో ఇళ్ల సగటు ధర రూ.84 లక్షలుగా ఉండగా.. 2025 హెచ్1 నాటికి రూ.1.15 కోట్లకు పెరిగింది. ఏడాది కాలంలో 37 శాతం ధరలు వృద్ధి చెందాయని అనరాక్ తాజా నివేదిక వెల్లడించింది. అలాగే నగరంలో 2024 హెచ్1లో రూ.25,059 కోట్లు విలువ చేసే 29,940 యూనిట్లు అమ్ముడుపోగా.. 2025 హెచ్1 నాటికి 27,820 ఇళ్లు విక్రయించారు. వీటి విలువ రూ.31,993 కోట్లు. - సాక్షి, సిటీబ్యూరోదేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో విక్రయాలు, లాంచింగ్స్ రికార్డు స్థాయిలో జరిగాయి. 2024 హెచ్1 గృహాల ధర సగటున రూ.కోటిగా ఉండగా.. 2025 హెచ్1 నాటికి 23 శాతం పెరిగి, ఏకంగా రూ.1.25 కోట్లకు చేరింది. ఇక, 2024 ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య కాలంలో టాప్–7 సిటీస్‌లో రూ.2,79,309 కోట్లు విలువ చేసే 2,27,400 యూనిట్లు అమ్ముడుపోగా.. 2025 హెచ్1 నాటికి రూ.2,35,800 కోట్ల విలువైన 2,35,200 విక్రయమయ్యాయి. యూనిట్ల అమ్మకాల్లో 3 శాతం క్షీణత ఉన్నప్పటికీ.. సేల్స్ వ్యాల్యూ మాత్రం 18 శాతం పెరిగింది.ఇదీ చదవండి: హైదరాబాద్ రియల్ఎస్టేట్లో కొత్త మైక్రో మార్కెట్..ముంబైలో స్థిరంగా ధరలు.. ఆసక్తికరంగా ఏడాది కాలంలో ముంబై(ఎంఎంఆర్)లో యూనిట్ల ధరలు పెరగలేదు. 2024 హెచ్1లో ధర సగటున రూ.1.45 కోట్లుగా ఉండగా.. 2025 హెచ్1లోనూ అదే ధర ఉంది. ఇక, అత్యధికంగా ఢిల్లీ–ఎన్సీఆర్లో ఇళ్ల ధరలు పెరిగాయి. 2024 హెచ్1లో ఇక్కడ ధర సగటు రూ.93 లక్షలు కాగా.. 2025 హెచ్1 నాటికి రూ.1.45 కోట్లకు పెరిగాయి. ఆ తర్వాత బెంగళూరులో గతంలో రూ.84 లక్షలు ఉండగా.. ఇప్పుడు రూ.1.21 కోట్లు, చెన్నైలో రూ.72 లక్షల నుంచి రూ.95 లక్షలకు, పుణేలో రూ.66 లక్షల నుంచి రూ.85 లక్షలకు, అలాగే 2024 హెచ్1లో కోల్‌కత్తాలో యూనిట్ ధర సగటు రూ.53 లక్షలుగా పలకగా.. 2025 హెచ్1 నాటికి రూ.61 లక్షలకు పెరిగింది. -
ఇంటి ధర రూ.85! రెనొవేషన్కు రూ.3.8 కోట్లు!!
ఇంటి ధర కేవలం రూ.85.. కానీ దాని రెనొవేషన్కు మాత్రం ఏకంగా రూ.3.8 కోట్లు ఖర్చు అయింది.. ‘అదేంటి.. రూ.85కే ఇళ్లు ఎక్కడ దొరుకుతుంది. అద్దె ఇళ్లే దాదాపు రూ.15,000 వరకు ఉంది. మరి అంత తక్కువకు ఇళ్లు ఎవరిస్తారు?’ అని అనుకుంటున్నారా. అలా అయితే మనం ఇటలీలో జరిగిన ఈ సంఘటన గురించి తెలసుకోవాల్సిందే.ఇటలీలోని సాంబుకా డి సిసిలియాలో 2019లో నిరుపయోగంగా ఉన్న ఇళ్లను వేలం వేశారు. అలా చాలా ఏళ్లుగా ఉపయోగంలోలేని ఓ ఇంటిని చికాగోకు చెందిన ఆర్థిక సలహాదారు మెరెడిత్ టాబోన్ కొనుగోలు చేశారు. కేవలం 1.05 డాలర్లు(రూ.85)కే దాన్ని వేలంలో దక్కించుకున్నారు. ఆ ఇంటిని 17 శతాబ్దంలో నిర్మించినట్లు తెలిసింది. దానికి కరెంట్, నీటి సౌకర్యం లేదు. వేలం పూర్తయిన తర్వాతే తాను ఆ ఇంటిని చూశారు. సాంబుకా డి సిసిలియా ప్రాంత్రంలో ఓ మూలన ఉన్న ఆ ఇంటిని మొదటగా చూసి మెరెడిత్ దాన్ని పునరుద్ధరణ చేయించాలనుకున్నారు. దాంతో గడిచిన నాలుగేళ్లల్లో అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దారు. అందుకు 4,46,000(దాదాపు రూ.3.8 కోట్లు) ఖర్చు అయినట్లు ఆమె తెలిపారు. View this post on Instagram A post shared by Meredith Tabbone (@meredith.tabbone)ఇదీ చదవండి: మళ్లీ డబ్బు పెడుతున్న ఎఫ్పీఐలుమెరెడిత్ టాబోన్ ఇంత ఖర్చు చేసి ఎందుకు దీన్ని పునరుద్ధరించారని ఓ మీడియా సంస్థ అడిగిన ప్రశ్నకు ‘1908లో నా కుంటుంబం యూఎస్‌కు వెళ్లడానికి ముందు మా ముత్తాత ఈ ప్రాంతంలోనే ఉండేవారు. తన జ్ఞాపకాలకు గుర్తుగా దీన్ని ఎంచుకున్నాను’ అని సమాధానం ఇచ్చారు. ఇంటికి సంబంధించిన వీడియో తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అదికాస్తా వైరల్‌గా మారింది. కాగా, ఇంట్లో ప్రత్యేకంగా డిజైనింగ్, టైల్స్, ఇంటీరియర్.. వంటి వాటికి భారీగా ఖర్చవుతున్నాయి. ప్రస్తుత రోజుల్లో ఇల్లు కట్టేందుకు అయ్యే ఖర్చు ఒకెత్తైతే, మన అభిరుచులకు తగినట్లుగా ఇంటీరియర్ డిజైన్ చేయించేందుకు అయ్యే ఖర్చు తడిసిమోపెడవుతుంది. -
రికార్డు స్థాయిలో ఆఫీస్ లీజింగ్
న్యూఢిల్లీ: కార్యాలయ వసతుల(ఆఫీస్ స్పేస్) మార్కెట్ ఈ ఏడాది మంచి జోరును కొనసాగించింది. గతేడాదితో పోల్చితే సుమారు 14 శాతం అధికంగా 85 మిలియన్ చదరపు అడుగుల మేర (ఎస్ఎఫ్టీ) స్థూల లీజింగ్ ఈ ఏడాది ఎనిమిది ప్రధాన నగరాల్లో నమోదవుతుందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ తన అంచనాలు వెల్లడించింది. 2023లో ఇవే నగరాల్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 74.6 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉండడం గమనార్హం.‘‘ఎనిమిది ప్రధాన నగరాల్లో 2022 నుంచి ఆఫీస్ స్పేస్ స్థూల లీజింగ్ ఏటా 70 మిలియన్ ఎస్ఎఫ్టీపైనే ఉంటూ వస్తోంది’’అని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదిక వివరించింది. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 66.7 మిలియన్ ఎస్ఎఫ్టీ స్థూల లీజింగ్ లావాదేవీలు జరిగినట్టు ప్రకటించింది. స్థూల ఆఫీస్ స్పేస్ లీజింగ్ 2018లో 49.1 మిలియన్ ఎస్ఎఫ్టీ, 2019లో 67.7 మిలియన్ ఎస్ఎఫ్టీ, 2020లో 46.6 మిలియన్ ఎస్ఎఫ్టీ, 2021లో 50.4 మిలియన్ ఎస్ఎఫ్టీ, 2022లో 72 మిలియన్ ఎస్ఎఫ్టీ, 2023లో 74.6 మిలియన్ ఎస్ఎఫ్టీ చొప్పున నమోదైనట్టు ఈ నివేదిక వెల్లడించింది. ఈ రంగాల్లో డిమాండ్ అధికం.. ముఖ్యంగా ఐటీ–బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ (ఐటీ–బీపీఎం), బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (బీఎఫ్ఎస్ఐ), ఇంజనీరింగ్, తయారీ రంగాలతోపాటు, ఫ్లెక్స్ ఆపరేటర్ స్పేస్ విభాగాలు ఈ వృద్ధిని నడిపిస్తున్నట్టు కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదిక వెల్లడించింది. ఈ రంగాలు మెరుగైన పనితీరు చూపిస్తున్నట్టు తెలిపింది. ‘‘2024 భారత ఆఫీస్ రంగానికి రికార్డుగా నిలిచిపోతుంది. స్థూల లీజింగ్ ఈ ఏడాది 85 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరుకోవచ్చు.ఇందులో నికర వినియోగం 45 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉండొచ్చు. భారత వాణిజ్య రియల్ ఎస్టేట్‌లో అత్యధిక గరిష్ట స్థాయి ఇది’’అని కుష్మన్ అండ్ వేక్ ఫీల్డ్ తెలిపింది. మొత్తం ఆఫీస్ లీజింగ్‌లో గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు (జీసీసీ) 30 శాతం వాటా ఆక్రమిస్తాయని పేర్కొంది. డిమాండ్ పెరగంతో ప్రముఖ ప్రాంతాల్లో కార్యాలయ వసతుల అద్దెల పెరుగుదలపై ఒత్తిడి నెలకొన్నట్టు తెలిపింది. ‘‘2025లో అధిక శాతం నూతన వసతుల సరఫరా ప్రముఖ ప్రాంతాల చుట్టూనే ఉండనుంది. స్థిరమైన సరఫరాతో అద్దెల పెరుగుదల మోస్తరు స్థాయిలో ఉండనుంది. దీంతో కిరాయిదారుల అనుకూల సెంటిమెంట్ కొంత కాలం పాటు కొనసాగనుంది’’అని వివరించింది. -
హైదరాబాద్‌లో బోటింగ్ విల్లాలు..
పొద్దున లేవగానే గలగలా పారే నీటి సవ్వడి.. వీకెండ్ వస్తే కుటుంబంతో కలిసి హ్యాపీగా పడవలో షికారు.. వీటి కోసం ఎక్కడో టూరిస్ట్ ప్లేస్‌కు వెళ్లాల్సిందేనని అనుకోకండి. నగర స్థిరాస్తి రంగంలోనే తొలిసారిగా ప్రణీత్ గ్రూప్ నివాస సముదాయంలోనే బోటింగ్ సదుపాయాన్ని కల్పిస్తోంది. -సాక్షి, సిటీబ్యూరోగాగిళ్లపూర్లో నిర్మిస్తున్న గ్రూవ్ పార్క్ లగ్జరీ విల్లా గేటెడ్ కమ్యూనిటీలో బోటింగ్ వసతిని అందుబాటులోకి తీసుకురానుంది. ఈమేరకు ప్రాజెక్ట్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని కంపెనీ డైరెక్టర్ నరేంద్ర కుమార్ కామరాజు తెలిపారు. ప్రాజెక్ట్‌కు మధ్యలో చెరువు ఉండటంతో నివాసితులకు వినూత్నంగా బోటింగ్ సేవలను అందించాలని నిర్ణయించామని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: హైదరాబాద్ రియల్ఎస్టేట్లో కొత్త మైక్రో మార్కెట్..70 ఎకరాల్లో 884 ట్రిపులెక్స్ విల్లాలను నిర్మిస్తున్నామని, ఇప్పటికే 50 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయని ఆయన చెప్పారు. 167 నుంచి 350 గజాల్లో వేర్వేరు విస్తీర్ణాలలో స్పానిష్ ఆర్కిటెక్చర్ విల్లాలు ఉన్నాయని, ప్రారంభ ధర రూ.1.70 కోట్లుగా నిర్ణయించామని పేర్కొన్నారు. -
ఇంటికి టైల్.. యమస్టైల్!
ఇళ్లు నిర్మించుకోవడం ఒక ఎత్తయితే.. టైల్స్ ఎంపిక మరో ఎత్తు.. ఏ మాత్రం తేడా వచ్చినా ఇంటి అందం పూర్తిగా దెబ్బతింటుంది. అయితే ఎంత పెద్ద ఇల్లు కట్టినా ఆకర్షణీయంగా కనిపించడంలో కీలక పాత్ర పోషించేది నేలపై పరిచే టైల్స్. వాటి డిజైన్ ఎంపిక విషయంలో దాదాపు ఒక యుద్ధం చేసినంత కసరత్తు చేస్తారనడంలో అతిశయోక్తి లేదు. అందుకే చాలా కంపెనీలు కస్టమర్ల అభిరుచులు, ట్రెండ్‌కు తగ్గట్టు తయారు చేస్తున్నాయి. ప్రతి ఏటా కస్టమర్ల అభిరుచుల్లో చాలా తేడా కనిపిస్తోందని పలు కంపెనీలు చెబుతున్నాయి. రంగులు, డిజైన్లు, ఆకారాల విషయంలో ప్రజలు ఎంతో జాగ్రత్త వహిస్తున్నారని పేర్కొంటున్నాయి. – సాక్షి, సిటీబ్యూరోప్రకృతి నుంచి స్ఫూర్తి టైల్స్ డిజైన్ రూపొందించే విషయంలో ప్రతి అంశం నుంచి స్ఫూర్తి పొందుతుంటారని తయారీదారులు చెబుతున్నారు. ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కోలా ఉంటుందని, ప్రకృతికి సంబంధించి చెట్లు, పూలు, ఆకులను మనసులో ఉంచుకుని తయారు చేస్తుంటామని పేర్కొంటున్నారు. ఇక, వివిధ రకాల ఆకారాలు కూడా ముఖ్యమని, రంగులు, విభిన్న కాన్సెప్టులతో మార్బుల్, స్టోన్స్‌తో రూపొందిస్తుంటామని చెబుతున్నారు. గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో సుస్థిరాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తయారు చేస్తున్నారు.రూ.35 నుంచి ప్రారంభం.. టైల్స్‌లో కూడా ఒక్కో డిజైన్, ఒక్కో ఆకారాన్ని బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంది. ప్రతి చదరపు అడుగు టైల్కు రూ.35 నుంచి రూ.500 వరకు కూడా ఉంది. సెరామిక్ టైల్స్‌కు కాస్త తక్కువ ధర ఉంటుంది. విట్రిఫైడ్, మార్బుల్ టైల్స్, గ్రానైట్ టైల్స్, వుడ్ లుక్ టైల్స్, సిమెంట్ టైల్స్ వంటి రకాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మార్బుల్ టైల్స్‌కు కాస్త ధర ఎక్కువ ఉంటుందని అందరికీ తెలిసిందే. ఎక్కువగా సెరామిక్ టైల్స్‌కు కస్టమర్లు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ తర్వాత విట్రిఫైడ్ టైల్స్‌కు, ఆ తర్వాత వేరే రకం టైల్స్‌ను వాడుతున్నారు. ఏటా భారీస్థాయిలో వృద్ధి.. టైల్స్ రంగం ఏటా భారీ స్థాయిలో వృద్ధి నమోదు చేస్తోంది. ఏటా 11.96 శాతం పెరుగుదల కనిపిస్తోందని కెన్ పరిశోధనలు తేల్చాయి. 2023లో టైల్స్ మార్కెట్ ఏకంగా 8,543.9 మిలియన్ డాలర్లు నమోదు చేయగా, 2030 నాటికి ఈ మార్కెట్ విలువ ఏకంగా 13,265.2 మిలియన్ డాలర్లకు ఎగబాకుతుందని అంచనా వేస్తున్నారు. 2024 నుంచి 2030 మధ్య ఈ రంగం ఏకంగా 6.5 శాతం వృద్ధి నమోదు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. దినుసుల స్ఫూర్తిగా.. దేశంలోని మసాలా దినుసులను స్ఫూర్తిగా తీసుకుని టైల్స్ డిజైన్ రూపొందిస్తుంటాను. భారతీయత ఉట్టిపడేలా, ఇక్కడి ప్రకృతి రమణీయతను టైల్స్ డిజైన్స్‌లో ఉండేలా చూసుకుంటాను. అనేక దేశాల్లో ఇలాంటి డిజైన్స్‌కు యమ గిరాకీ ఉంది. ప్రజల అభిరుచికి తగ్గట్టు టైల్స్ డిజైన్స్ రూపొందించేందుకు నిరంతరం ప్రయత్నిస్తుంటాను. – మారియా కాస్టిలో, రీజెన్సీ టైల్స్ చీఫ్ డిజైనర్ -
హైదరాబాద్ రియల్ఎస్టేట్లో కొత్త మైక్రో మార్కెట్
బోనమెత్తిన భక్తుల కోర్కెలు తీర్చే గ్రామదేవతగా పూజించే గండిమైసమ్మ.. అందుబాటు ధరల్లోనే సామాన్య, మధ్యతరగతి సొంతింటి కలనూ తీరుస్తోంది. అర్ధగంట ప్రయాణ వ్యవధిలోనే ఐటీ కారిడార్‌కు చేరుకునే వీలు, శంషాబాద్ విమానాశ్రయంతో పాటు ఇతర జిల్లా కేంద్రాలకు చేరుకునేందుకు ఔటర్ రింగ్ రోడ్డుతో కనెక్టివిటీ.. సమీప దూరంలోనే అంతర్జాతీయ విద్యా, వైద్య సంస్థలు, వినోద, ఉపాధి కేంద్రాలు.. అన్నింటికీ మించి అందుబాటులోనే గృహాల ధరలు ఉండటంతో బహదూర్‌పల్లి, గండిమైసమ్మ ప్రాంతాలకు డిమాండ్ ఏర్పడింది. –సాక్షి, సిటీబ్యూరోనీరు ఎత్తు నుంచి పల్లెం వైపు ప్రవహించినట్టే.. అభివృద్ధి కూడా మెరుగైన మౌలిక వసతులు ఉన్న ప్రాంతాల వైపే విస్తరిస్తుంది. ఇందుకు సరైన ఉదాహరణ బహదూర్‌పల్లి, గండిమైసమ్మ ప్రాంతాలు. ఐటీ కారిడార్‌కు చేరువలో ఉండటంతో మియాపూర్, బాచుపల్లి ప్రాంతాల్లో అభివృద్ధి చెందాయి. దీంతో ఇక్కడ పెద్ద ఎత్తున నివాస, వాణిజ్య సముదాయాలు వెలిశాయి. ఇప్పుడా డెవలప్మెంట్ బాచుపల్లికి కొనసాగింపుగా.. బహదూర్‌పల్లి, గండిమైసమ్మ మార్గంలో విస్తరించింది. అన్నింటికీ మించి చౌక ధరలతో సామాన్య, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను గండిమైసమ్మ తీరుస్తోంది.వెస్ట్, నార్త్ జోన్లతో కనెక్టివిటీ.. మెరుగైన రోడ్లు, రవాణా సదుపాయాలతో వెస్ట్, నార్త్ హైదరాబాద్ ప్రాంతాలకు సులువుగా చేరుకునే వీలు ఉండటం బహదూర్‌పల్లి, గండిమైసమ్మ ఏరియాల ప్రత్యేకత. ఇక్కడి నుంచి అరగంటలో బాచుపల్లి మార్గంలో ప్రగతినగర్ మీదుగా జేఎన్టీయూకి, అక్కడి నుంచి హైటెక్‌సిటీకి వెళ్లొచ్చు. ఇప్పటికే మియాపూర్–బాచుపల్లి ఆరులైన్ల రహదారి మార్గం నిర్మాణంలో ఉంది. ఇది పూర్తయితే ప్రయాణ సమయం మరింత తగ్గుతుంది. అలాగే 1.5 కి.మీ. దూరంలోని దుండిగల్ ఔటర్ ఎగ్జిట్–5 ఎక్కితే శంషాబాద్ విమానాశ్రయానికి ఈజీగా చేరుకోవచ్చు.ఉపాధి అవకాశాలు మెండుగానే.. ఉపాధిపరంగా ఐటీ కారిడార్‌కు సులువుగా చేరుకోవడంతో పాటు స్థానికంగా పలు ఫార్మా కంపెనీల పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు ఇక్కడే ఉన్నాయి. కండ్లకోయ, బహదూర్‌పల్లి ఐటీ పార్క్‌లు ఉండటంతో ఉపాధి అవకాశాలు మెరుగ్గానే ఉన్నాయి. సమీపంలోని గౌడవెల్లిలో 600 ఎకరాల్లో అర్బన్ ఫారెస్ట్, దూలపల్లిలో ఫారెస్ట్ అకాడమీలు ఉండటంతో చుట్టూ పచ్చదనంతో ప్రశాంత వాతావరణం, కాలుష్య రహిత గృహాలు ఉండటం ఈ ప్రాంతాల ప్రత్యేకత. గండిమైసమ్మ చుట్టు పక్కల పదుల సంఖ్యలో ఇంటర్నేషనల్ స్కూళ్లు, ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలున్నాయి. మల్లారెడ్డి, టెక్ మహీంద్రా విశ్వవిద్యాలయాలు చుట్టుపక్కలే ఉన్నాయి. వైద్య కళాశాలతో పాటు నారాయణ హృదయాలయ, మల్లారెడ్డి, జీవీకే ఆస్పత్రులు చేరువలోనే ఉన్నాయి.అందుబాటు ధరల్లోనే ఇళ్లు..హైదరాబాద్ రియల్టీలో కొత్త మైక్రో మార్కెట్‌గా వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో ఇక్కడ పెద్ద ఎత్తున గృహ నిర్మాణం జరుగుతోంది. బహదూర్‌పల్లి, గండిమైసమ్మ, బాసుర్గడి, గౌడవెల్లి, అయోధ్యక్రాస్ రోడ్స్ వంటి ప్రాంతాల్లో అపార్ట్మెంట్లు, విల్లా ప్రాజెక్ట్‌లో నిర్మాణంలో ఉన్నాయి. ప్రైమార్క్, రూబ్రిక్ కన్స్ట్రక్షన్స్, వాసవి, ప్రణీత్ గ్రూప్, అపర్ణా వంటి సంస్థలు పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపడుతున్నాయి. ప్రస్తుతం ఆయా ప్రాంతాలల్లో ధర చదరపు అడుగుకు రూ.5,500 వేలుగా చెబుతున్నారు. ప్రాజెక్ట్‌లలోని వసతులు, విస్తీర్ణాలను బట్టి ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి.ఇదీ చదవండి: హైదరాబాద్ 2.o.. అభివృద్ధి ఖాయం!నార్త్ వేవ్‌లో సెంచరీ క్రాస్.. నిర్మాణ రంగంలో దశాబ్ధన్నర కాలం అనుభవంలో ఇప్పటివరకు 18 లక్షల చ.అ.ల్లో 30కు పైగా ప్రాజెక్ట్‌లను పూర్తి చేశాం. తాజాగా బహదూర్‌పల్లిలో 13.5 ఎకరాల్లో నార్త్వేవ్ గేటెడ్ కమ్యూనిటీని నిర్మిస్తున్నాం. 14 బ్లాక్‌లు, ఒక్కోటి 9 అంతస్తుల్లో మొత్తం 1,026 యూనిట్లు ఉంటాయి. నార్త్ వేవ్ ప్రాజెక్ట్‌ను కిడ్స్ సెంట్రిక్ జోన్‌గా తీర్చిదిద్దుతున్నాం. ఇందులో పిల్లలకు, పెద్దలకు ప్రత్యేకంగా ప్లే ఏరియా, పెట్ జోన్, ఔట్‌డోర్ ఫిట్నెస్ స్టేషన్, యోగా, స్విమ్మింగ్ పూల్, జిమ్, క్రికెట్ పిచ్, బీబీక్యూ పార్టీ లాన్, మినీ గోల్ప్, రాక్ క్లయింబింగ్, ప్లే స్కూల్.. ఇలా వందకు పైగా ఆధునిక వసతులను కల్పిస్తున్నాం. – సాయికృష్ణ బొర్రా, డైరెక్టర్, ప్రైమార్క్ డెవలపర్స్మాడ్యులర్ కిచెన్ ఫ్రీ.. గండిమైసమ్మ– మేడ్చల్ మార్గంలోని అయోధ్య క్రాస్‌రోడ్స్‌లో 5.2 ఎకరాల్లో శ్రీవెన్ త్రిపుర ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. 3 టవర్లలో 638 యూనిట్లుంటాయి. న్యూ ఇయర్ సందర్భంగా ప్రతి ఫ్లాట్‌కు మాడ్యులర్ కిచెన్‌ను ఉచితంగా అందిస్తున్నాం. అలాగే ఈ ఏడాది డిసెంబర్ 31లోపు ఫ్లాట్ కొనుగోలు చేసేవారికి లోయర్ ఫ్లాట్, ఈస్ట్, కార్నర్ ఫ్లాట్లపై ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవు. అలాగే 12 నెలల పాటు నిర్వహణ ఉచితం. ఆఫర్లతో కస్టమర్లకు సుమారు రూ.5–6 లక్షలు ఆదా అవుతుంది. 50 వేల చదరపు అడుగుల క్లబ్ హౌస్‌లో స్విమ్మింగ్ పూల్, జిమ్, టెన్నిస్ కోర్ట్, సూపర్ మార్కెట్, బాంక్వెట్ హాల్ వంటి అన్ని రకాల వసతులు ఉంటాయి. 299 యూనిట్లతో కూడిన టవర్–1ను దసరా నాటికి కస్టమర్లకు హ్యాండోవర్ చేస్తాం. నిర్మాణంలో ఉన్న మిగిలిన రెండు టవర్లను 2027 మార్చి వరకు పూర్తి చేస్తాం. – ఎండీ కృష్ణరావు, రూబ్రిక్ కన్స్ట్రక్షన్ -
హైదరాబాద్ 2.o.. అభివృద్ధి ఖాయం!
‘మూసీ పునరుజ్జీవం, మెట్రో విస్తరణ బృహత్తర ప్రాజెక్ట్‌లతో హైదరాబాద్ అభివృద్ధి ఖాయం. ఏ నగరంలోనైనా సరే ప్రభుత్వం, డెవలపర్లు సంయుక్తంగా ప్రజా కేంద్రీకృత విధానాలతో నగరానికి అవసరమైన మౌలిక సదుపాయాలను సృష్టిస్తారు. రోడ్లు, విద్యుత్, డ్రైనేజ్, నీరు వంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్లను ప్రభుత్వం కల్పిస్తే.. కాలనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలపర్లు చేపడతారు’ అని తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్(టీడీఏ) ప్రెసిడెంట్ జీవీ రావు అన్నారు. – సాక్షి, సిటీబ్యూరోసబర్బన్ పాలసీ అవసరం.. విద్యా, ఉద్యోగం, ఆరోగ్యం, వినోదం ఇలా ప్రతీ అవసరం కోసం ప్రజలు ప్రధాన నగరానికి రావాల్సిన, ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఏటా 3 లక్షల మంది నగరానికి వలస వస్తున్నారు. శివారు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయకపోతే కోర్ సిటీలో జన సాంద్రత పెరిగి, బెంగళూరు, ఢిల్లీ మాదిరిగా రద్దీ, కాలుష్య నగరంగా మారే ప్రమాదం ఉంది. అందుకే శివారు ప్రాంతాలు మెరుగైన మౌలిక వసతులతో అభివృద్ధి చెందేందుకు సబర్బన్ పాలసీ అవసరం. మెట్రో విస్తరణతో ప్రధాన నగరం, శివారు ప్రాంతాలు అనుసంధానం కావడంతో పాటు శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. శరవేగమైన పట్టణీకరణ కారణంగా మౌలిక సదుపాయాల కల్పన తప్పనిసరి. అందుకే హైదరాబాద్ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.10 వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. ఇందులో ఈ ఏడాది రూ.5 వేల కోట్ల నిధులతో నాలాల పునరుద్ధరణ పూర్తి చేయాలి.ఆదాయంలో 25–30 శాతం వాటా.. ప్రస్తుతం గ్రేటర్లో 1.1 కోట్ల జనాభా ఉంది. మెరుగైన మౌలిక వసతులతో దేశంలోనే నివాసితయోగ్యమైన నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా నిలిచింది. వ్యవసాయం తర్వాత రెండో అత్యధిక ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే పరిశ్రమ రియల్ ఎస్టేట్ రంగం. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, జీఎస్టీ, నిర్మాణ అనుమతుల రుసుము, ఇంపాక్ట్ ఫీజు, ఆదాయ పన్ను ఇలా స్థిరాస్తి రంగం నుంచి ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం సమకూరుతుంది. రాష్ట్ర ఆదాయంలో 25–30 శాతం వాటా స్థిరాస్తి రంగానిదే.‘యూజర్ పే’తో గ్రోత్ కారిడార్‌లో రోడ్లు.. ఓఆర్ఆర్ నిర్మాణ సమయంలోనే గ్రోత్ కారిడార్‌కు రెండు వైపులా రహదారులను ప్లాన్ చేశారు. కానీ.. ఇప్పటికీ వేయలేదు. ప్రస్తుత ప్రభుత్వం ఆయా రోడ్లను ప్రత్యామ్నాయ ఆదాయ మార్గంగా మార్చుకోవచ్చు. ఫైనాన్షియల్ హోల్డింగ్ కంపెనీతో హెచ్ఎండీఏ ఒప్పందం చేసుకొని, రైతుల నుంచి భూములను సేకరించి రహదారులను నిర్మించాలి. ఇందుకైన వ్యయాన్ని ఈ రోడ్లను వినియోగించుకునే డెవలపర్ల నుంచి వసూలు చేస్తారు. ఉదాహరణకు టోల్ మాదిరిగా ఏ నుంచి బీ రోడ్డు నిర్మాణానికి అయిన వ్యయాన్ని బిల్డర్లు ‘యూజర్ పే’ రూపంలో చెల్లిస్తారు. దీంతో ప్రభుత్వంపై వ్యయ భారం తగ్గడంతో పాటు మెరుగైన రోడ్లతో ఆయా ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతాయి. ఈ రోడ్లలో కొన్ని రీజినల్ రింగ్ రోడ్ అనుసంధానించబడి రేడియల్ రోడ్లుగా అభివృద్ధి చెందుతాయి.వాక్ టు వర్క్‌తో.. ఫోర్త్ సిటీ.. తెలంగాణ ప్రభుత్వం 50 వేల ఎకరాల్లో ఫోర్త్ సిటీ నిర్మాణాన్ని తలపెట్టింది. అయితే.. ఈ పట్టణం ప్రణాళికబద్ధమైన అభివృద్ధికి ప్లాన్ చేయాలి. వాక్ టు వర్క్ కాన్సెప్ట్‌లతో కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విద్యా, వైద్య, క్రీడా మౌలిక సదుపాయాల కల్పనతో ఫోర్త్ సిటీ స్వయం సమృద్ధి చెందుతుంది. ఈ మోడల్‌ను హైదరాబాద్‌లోని మిగతా మూడు వైపులకూ విస్తరించాలి.నివాస, వాణిజ్య స్థిరాస్తికి డిమాండ్.. హైడ్రా దూకుడుతో కొంత కాలంగా స్థిరాస్తి రంగం మందగమనాన్ని ఎదుర్కొంది. అయితే నిర్మాణ అనుమతులు ఉన్న ప్రాజెక్ట్‌ల జోలికి వెళ్లమని ప్రభుత్వం ప్రకటించడంతో ప్రస్తుతం మార్కెట్లో నిలకడ వాతావరణం నెలకొంది. దీంతో కొత్త కస్టమర్ల నుంచి ఎంక్వైరీలు పెరిగాయి. ఐటీ, ఫార్మా పరిశ్రమలకు కేరాఫ్ హైదరాబాద్. ఆయా రంగాల్లో 1.50 లక్షల కొత్త ఉద్యోగాలతో రాబోయే కాలంలో నివాస, వాణిజ్య స్థిరాస్తి రంగానికి డిమాండ్ తప్పకుండా ఉంటుంది. ఉప్పల్ నుంచి నారాపల్లి, పరేడ్ గ్రౌండ్ నుంచి శామీర్‌పేట, పరేడ్ గ్రౌండ్ నుంచి కొంపల్లి ఫ్లై ఓవర్లను ప్రభుత్వం నిర్మించనుంది. ఈ మూడు మార్గాలతో పాటు ఆదిభట్ల నుంచి లేమూరు మార్గంలో నివాస కార్యకలాపాలు పెరగనున్నాయి. దీంతో సామాన్య, మధ్యతరగతికి అందుబాటులో ధరల్లో ఇళ్లు లభ్యమవుతాయి. -
ఎవరీ 'రిషి పార్టి'.. ఏకంగా రూ.190 కోట్ల ప్లాట్ కొన్నాడు
హర్యానాలోని గురుగ్రామ్ ఇప్పుడు లగ్జరీ ప్రాపర్టీ మార్కెట్ విభాగంలో.. ముంబై, బెంగళూరులతో పోటీ పడుతోంది. అల్ట్రా లగ్జరీ ప్రాజెక్ట్ ది కామెలియాస్‌లో వ్యాపారవేత్త 'రిషి పార్టి' (Rishi Parti) ఏకంగా రూ. 190 కోట్లు చెల్లించి.. 16,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. ఇంతకీ రిషి పార్టీ ఎవరు? ఆయనకు సంబంధించిన కంపెనీలు ఏవి? అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.ఎవరీ రిషి పార్టి?ఇన్ఫో-ఎక్స్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, ఫైండ్ మై స్టే ప్రైవేట్ లిమిటెడ్, ఇంటిగ్రేటర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో సహా నాలుగు కంపెనీలకు 'రిషి పార్టి' డైరెక్టర్. అయితే ఎక్కువగా ఇన్ఫో-ఎక్స్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్‌పై ద్రుష్టి సారిస్తున్నారు. అంతే కాకుండా ఈయన ఏంజెల్ ఇన్వెస్టర్‌గా ఉన్నారు.ఇన్ఫో-ఎక్స్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ఇన్ఫో-ఎక్స్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అనేది లాజిస్టిక్స్‌కు సంబంధించిన కంపెనీ. ఇది 2001లో ప్రారంభమైనట్లు సమాచారం. ఈ సంస్థ లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి లాజిస్టిక్స్ కంపెనీలలో కొత్తదనానికి మార్గం వేస్తోంది. రిషి పార్టి దీనిని 24ఏళ్ల వయసులో మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి ప్రారభించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ కంపెనీలో 150 ఉద్యోగులు పనిచేస్తున్నట్లు సమాచారం. -
ప్రాపర్టీ సందర్శన సేవలు ప్రారంభం
రియల్టీ రంగంలో ఆన్లైన్ సేవలందిస్తున్న టైమ్స్ గ్రూప్ ఆధ్వర్యంలోని మ్యాజిక్‌బ్రిక్స్ సంస్థ తన వినియోగదారులకు మెరుగైన సర్వీసు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. ప్రాపర్టీ కొనుగోలు, అమ్మకాలకు సంబంధించిన వినియోగదారులు మరింత సమర్థంగా నిర్ణయం తీసుకునేందుకు వీలుగా హైదరాబాద్‌లో ప్రాపర్టీ సందర్శనను ప్రారంభించింది. ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రాపర్టీ కొనుగోలు చేయాలంటే చాలామందికి అనుమానాలుంటాయి. కాబట్టి నేరుగా ప్రాపర్టీ సందర్శించి నిర్ణయం తీసుకునేందుకు మ్యాజిక్స్బ్రిక్స్ తన ప్లాట్‌ఫామ్ ద్వారా అవకాశం కల్పిస్తుంది.మ్యాజిక్ బ్రిక్స్ 100కుపైగా బిల్డర్లతో కలిసి హైదరాబాద్‌లో సైట్ విజట్ ప్రోడక్ట్లను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపింది. ఇప్పటికే బెంగళూరులో ఉన్న ఈ సర్వీసును విస్తరించినట్లు ప్రకటించింది. ఔరా రియల్టీ, విజన్ ఇన్ఫ్రా డెవలపర్స్, ఎలిగెంట్ ఇన్ఫ్రా, అపర్ణ కన్స్ట్రక్షన్స్ వంటి ప్రముఖ సంస్థలతో సహా 100కు పైగా డెవలపర్లతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు పేర్కొంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆరునెలల్లో 120కి పైగా ప్రాజెక్టుల్లో 8,200 కంటే ఎక్కువ సైట్ సందర్శనలను అందించినట్లు తెలిపింది. వినియోగదారులు సగటున రూ.1.25 కోట్లతో 450 కంటే ఎక్కువ విలువైన ఇళ్లు బుక్ చేసుకున్నట్లు వివరించింది.ఇదీ చదవండి: పది పాసైన మహిళలకు ఎల్ఐసీ ఉపాధి అవకాశంఈ కార్యక్రమానికి సంబంధించి మ్యాజిక్ బ్రిక్స్ సీఈఓ సుధీర్ పాయ్ మాట్లాడుతూ..‘సాధారణంగా పండగ సీజన్ తరువాత డిసెంబరులో నివాస కొనుగోళ్లు తగ్గుతాయి. అయితే గత 2-3 సంవత్సరాలుగా ఇంటి యజమానుల ఆకాంక్ష మేరకు డిమాండ్ బలంగానే ఉంటుంది. ఇళ్లు కొనాలని ఆసక్తి ఉన్నవారు పండగలు, ప్రత్యేక రోజులకు అతీతంగా కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. దేశవ్యాప్తంగా కంపెనీ అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రాపర్టీ విజిట్ ఫెస్ట్‌కు మంచి స్పందన ఉంది. కొంతమంది కొనుగోలుదారులతో ఒకే రోజులో 4-5 ప్రాపర్టీలను సందర్శించడం వల్ల నిర్ణయాలు తీసుకునే సమయాన్ని దాదాపు 50% తగ్గించేందుకు వీలవుతుంది. రియల్టీ రంగంలో టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలకు అందిస్తూ మెరుగైన సేవలు అందుబాటులో ఉంచుతున్నాం’ అన్నారు. -
అపార్ట్మెంట్ ఖరీదు అబ్బో.. దేశంలోనే ఖరీదైన డీల్!
దేశంలోనే ఖరీదైన రియల్ ఎస్టేట్ మార్కెట్ ఏది అంటే ముంబై అని చెబుతారు. కానీ ఖరీదైన ప్రాపర్టీ డీల్స్‌లో ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతం ముంబైని మించిపోతోంది. గుర్గావ్లోని డీఎల్ఎఫ్ కామెలియాస్‌లోని ఓ అపార్ట్మెంట్ ఇటీవల రూ. 190 కోట్లకు అమ్ముడుపోయింది. ఇది ఎన్సీఆర్లో అత్యంత ఖరీదైన హై-రైజ్ కండోమినియం అపార్ట్మెంట్ డీల్‌గా నిలిచింది. చదరపు అడుగుల ధర (కార్పెట్ ఏరియా) పరంగా దేశంలోనే అతిపెద్దది.ఇండెక్స్ట్యాప్కు లభించిన పత్రాల ప్రకారం.. ఇన్ఫో ఎక్స్ సాఫ్ట్వేర్ టెక్ ప్రయివేట్ లిమిటెడ్ అనే కంపెనీ పేరుతో దాని డైరెక్టర్ రిషి పార్థీ ఈ 16,290 చదరపు అడుగుల పెంట్‌హౌస్‌ని కొనుగోలు చేశారు. ఈ డీల్ డిసెంబర్ 2న నమోదైంది. ఇందుకోసం కంపెనీ రూ.13 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించింది. అయితే ఈ డీల్‌పై డీఎల్ఎఫ్ స్పందించలేదు.దేశంలోనే అతిపెద్దది“చదరపు అడుగుల ప్రకారం చూస్తే ఒక హై రైజ్ అపార్ట్‌మెంట్‌కు రూ. 190 కోట్ల ధర దేశంలోనే అత్యధికం. ఇది ముంబైని మించిపోయింది. సూపర్ ఏరియాను పరిగణనలోకి తీసుకుంటే చదరపు అడుగుకు రూ. 1.18 లక్షలు, కార్పెట్ ఏరియా పరంగా అయితేరూ. 1.82 లక్షలు. ఢిల్లీ ఎన్సీఆర్లో ప్రాపర్టీ ధరలు సూపర్ ఏరియా ప్రాతిపదికన ఉండగా, ముంబైలో కార్పెట్ ఏరియాలో ఉంటాయి. కాబట్టి ఈ గుర్గావ్ ఒప్పందం కార్పెట్ ఏరియా పరంగా ముంబై ధర కంటే చాలా అధికం’’ అని రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ ప్రొపెక్విటీ ఫౌండర్-సీఈవో సమీర్ జసుజా పేర్కొన్నారు.ఇదీ చదవండి: అద్దెను ఈఎంఐగా చెల్లిస్తే చాలు.. ఇల్లు సొంతం!ముంబైలోని టానియెస్ట్ ఏరియాల్లో కార్పెట్ ఏరియా ధరలు రూ. 1,62,700 వరకు ఉన్నాయి. ఈ కామెలియాస్ డీల్‌కు ముందు జరిగిన అత్యంత ఖరీదైన అపార్ట్మెంట్ డీల్‌లలో ముంబైలోని లోధా మలబార్లో జరిగిన డీల్ ఒకటి. ఇక్కడ ఓ కంపెనీ గత ఏడాది చదరపు అడుగుకు (కార్పెట్ ఏరియా) రూ. 1,36,000 చొప్పున రూ. 263 కోట్లకు మూడు అపార్ట్మెంట్లను కొనుగోలు చేసింది. -
రూ.50 కోట్లతో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు.. ఎక్కడంటే..
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు ఎన్ఆర్ నారాయణ మూర్తి కొత్తగా రూ.50 కోట్లతో ఫ్లాట్ కొనుగోలు చేసి వార్తల్లో నిలిచారు. బెంగళూరులో కింగ్‌ఫిషర్ టవర్స్‌లోని పదహారో అంతస్తులో ఆయన ఫ్లాట్ కొనుగోలు చేశారు. సుమారు 8,400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఫ్లాట్ నాలుగు బెడ్రూమ్లను కలిగి ఉంది. దీనికి ఐదు కారు పార్కింగ్ స్థలాలున్నాయి. మూర్తి దీన్ని రూ.50 కోట్లతో కొనుగోలు చేయడంతో నగరంలోని అత్యంత ఖరీదైన ఫ్లాట్ల్లో ఒకటిగా నిలిచింది. దాదాపు పదేళ్ల క్రితం ఈ టవర్స్‌లో ఫ్లాట్ సొంతం చేసుకున్న ముంబయికి చెందిన ఓ వ్యాపారవేత్త నుంచి మూర్తి తాజాగా ఈ ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు.బెంగళూరు నగరం మెయిన్ సిటీలో ఉన్న యూబీ సిటీ హౌస్ వద్ద కింగ్‌ఫిషర్ టవర్స్ 4.5 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో మూడు బ్లాకుల్లో 34 అంతస్తుల్లో 81 ఫ్లాట్లు ఉన్నాయి. ఒక్కోటి సగటున 8,321 చదరపు అడుగుల పరిమాణంలో ఉన్నాయి. గతంలో ఈ ప్రదేశంలో విజయ్ మాల్యా పూర్వీకుల ఇల్లు ఉండేది. అందులో ఫ్లాట్లు నిర్మించారు. ఇందుకోసం 2010లో కింగ్‌ఫిషర్, ప్రెస్టీజ్ గ్రూప్ కలిసి పనిచేశాయి. ఇప్పటికే ప్రెస్టీజ్ గ్రూప్ ఆధ్వర్యంలోని 41 లగ్జరీ అపార్ట్మెంట్లను సంస్థ విక్రయించింది.ఇదీ చదవండి: విభిన్న ఖాతాలు.. మరెన్నో పరిమితులు!ఇప్పటికే నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి ఆ టవర్స్‌లో 23 అంతస్తులో రూ.29 కోట్లతో ఓ ఫ్లాట్ కొనుగోలు చేశారు. బయోకాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్పర్సన్ కిరణ్ మజుందార్‌షా, కర్ణాటక విద్యుత్‌శాఖ మంత్రి కేజే జార్జ్ కుమారుడు రానా జార్జ్, క్వెస్ట్ గ్లోబల్ సీఈఓ, ఛైర్మన్ అజిత్ప్రభు ఈ టవర్స్‌లో ఫ్లాట్లు కొనుగోలు చేశారు. -
రూ.అర కోటి లోపు ఇల్లు కావాలి..
భూముల ధరలు పెరగడం, నిర్మాణ సామగ్రి ధరలు, కార్మికుల వేతనాల భారం.. వంటి రకరకాల కారణాలతో సామాన్యులకు హైదరాబాద్‌లో సొంతిల్లు అనేది అందనంత దూరంలో ఉంటోంది. 2–3 ఏళ్ల క్రితం వరకు కూడా దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే గృహాలు అందుబాటు ధరల్లో ఉండేవి. కానీ, హైరైజ్ అపార్ట్మెంట్లు, ఆధునిక వసతుల కల్పనతో కూడిన లగ్జరీ హోమ్స్ నిర్మాణంలో బిల్డర్లు పోటీపడుతుండటంతో కోట్లు వెచ్చిస్తే గానీ సొంతింటి కల సాకారం కానీ పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో సామాన్యుల సొంతింటి కల నెరవేరడానికి దగ్గరి దారిని చూపించే ప్రాంతాలపై ‘సాక్షి రియల్టీ’ప్రత్యేక కథనం... –సాక్షి, సిటీబ్యూరోరెండు బెడ్రూమ్స్, కిచెన్, హాల్, టాయిలెట్స్‌తో 700 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే బడ్జెట్ హోమ్స్‌కు ఇప్పటికీ ఆదరణ ఉంది. చిన్న వ్యాపారులు, సూపర్వైజర్లు, డ్రైవర్లు, మధ్యస్థాయి ఉద్యోగులు వంటి సామాన్య, మధ్యతరగతి వర్గాలు సొంతింటి కలను బడ్జెట్ హోమ్స్‌తో తీర్చుకుంటారు. అద్దెకు ఉండే బదులు అదే అద్దెసొమ్మును నెలవారీ వాయిదా(ఈఐఎం) రూపంలో చెల్లిస్తే సొంతిల్లు సొంతమవుతుందనేది వారి ఆలోచనగా ఉంటుంది. దీంతో రూ.50 లక్షలలోపు ధర ఉండే గృహాలకు డిమాండ్ బాగా పెరిగింది. ఏ ప్రాంతాల్లో కొనొచ్చంటే... మాదాపూర్, నార్సింగి, నానక్‌రాంగూడ, కోకాపేట వంటి పశ్చిమ హైదరాబాద్ మినహా మిగిలిన మూడు జోన్లలో ఇప్పటికీ సామాన్యులకు రూ.50 లక్షలలోపు ధర ఉండే అఫర్డబుల్ గృహాలు దొరుకుతున్నాయి. ఇబ్రహీంపట్నం, నాగార్జునసాగర్ రోడ్, హయత్‌నగర్, పోచారం, ఘట్కేసర్, కీసర, శామీర్‌పేట వంటి ప్రాంతాల్లో బడ్జెట్ హోమ్స్ కొనుగోలు చేయవచ్చు. ఔటర్ లోపల ఉండే నివాస ప్రాంతాల్లోని గేటెడ్ కమ్యూనిటీల్లో ఎంపిక చేసుకోవడం ఉత్తమం. వీటిల్లో క్లబ్ హౌస్, వాకింగ్ ట్రాక్స్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా వంటివి ఉండేలా చూసుకోవాలి. దీంతో ఇల్లు చిన్నగా అనిపించినా, చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది.పీఎంఏవైను సవరించాలి.. లాభం ఉందంటే అఫర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్ట్‌లను చేపట్టేందుకు డెవలపర్లు కూడా ముందుకొస్తారు. అఫర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్ట్‌లకు ప్రభుత్వం రాయితీలు, ప్రోత్సాహకాలు అందించాలి. దీంతో డెవలపర్లలో విశ్వాసం పెరుగుతుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) పథకం నిబంధనలను సవరించాలి. అన్ని రాష్ట్రాలకు ఒకే విధమైన నిబంధనల వర్తింపు సరికాదు. ఎందుకంటే... 700 చదరపు అడుగుల ఫ్లాట్ అంటే ముంబైలో లగ్జరీ అపార్ట్మెంట్. దానిని హైదరాబాద్‌లో బడ్జెట్ హోమ్‌గా పరిగణిస్తుంటారు. అందుకే పీఎంఏవై స్కీమ్ ప్రయోజనాలను గృహ కొనుగోలుదారుల ఆదాయాన్ని బట్టి కాకుండా అపార్ట్మెంట్ విస్తీర్ణాన్ని బట్టి వర్తింపజేయాలి. దీంతో ఎక్కువ మంది ఈ పథకానికి అర్హత పొందుతారు. కొనే ముందు వీటిని పరిశీలించాలి.. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ వంటి విభాగాల నుంచి నిర్మాణ అనుమతులతోపాటు రెరా రిజిస్ట్రేషన్ ఉన్న ప్రాజెక్ట్‌లలోనే కొనుగోలు చేయాలి. ప్రమోటర్లు, బిల్డర్ల పాత చరిత్ర చూడాలి. ప్రాజెక్ట్‌లను పూర్తి చేసే ఆర్థిక శక్తి నిర్మాణ సంస్థకు ఉందా లేదో పరిశీలించాలి. రోడ్డు, విద్యుత్, మంచినీటి సరఫరా వంటి కనీస మౌలిక వసతులు ఉన్న ప్రాంతాల్లో కొనుగోలు చేయడం ఉత్తమం. బడ్జెట్ హోమ్స్ ప్రాజెక్ట్‌లకు సమీపంలో విద్యాసంస్థలు, ఉపాధి అవకాశాలు ఉన్న ప్రాంతాలను ఎంచుకోవడం మంచిది.వేగంగా అనుమతులివ్వాలిబడ్జెట్ హోమ్స్‌తో రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. సొంతింటి కోసం ప్రభుత్వం ఆదాయపడాల్సిన అవసరం, ధనిక, పేద తరగతి మధ్య వ్యత్యాసం తగ్గుతాయి. ఈ తరహా నిర్మాణాలకు అనుమతులు త్వరితగతిన జారీ చేయాలి. ఈ ఇళ్ల రిజిస్ట్రేషన్లలో స్టాంప్ డ్యూటీని తగ్గించాలి. బ్యాంక్‌లు కూడా బడ్జెట్ గృహ కొనుగోలుదారులను ప్రోత్సహించేలా వడ్డీరేట్ల తగ్గింపు, రుణ నిబంధనల సడలింపులతో ప్రత్యేక పథ కాన్ని తీసుకురావాలి. – జక్కా వెంకట్‌రెడ్డి, ఏవీ కన్స్ట్రక్షన్స్ -
ఇంటి డెసిషన్.. ఇంత ఫాస్టా?
ఇల్లు కొనే ముందు సవాలక్ష ఎంక్వైరీలు, చర్చలు, లాభనష్టాల బేరీజులు... ఇలా చాంతాడంత లిస్టే ఉంటుంది. కానీ, నేటి యువతరం గృహ కొనుగోలు నిర్ణయాన్ని చిటికేసినంత ఈజీగా తీసేసుకుంటున్నారు. నాణ్యత, ప్రాంతం, వసతులు నచ్చితే చాలు ధర గురించి ఆలోచించకుండా ముందుకెళ్లిపోతున్నారు. మూడేళ్ల క్రితం వరకు ఇంటి కొనుగోలు నిర్ణయానికి 33 రోజుల సమయం పడితే.. ఈ ఆర్థిక సంవత్సరం అర్ధ వార్షికం(హెచ్1) నాటికి కేవలం 26 రోజుల్లోనే డెసిషన్ తీసుకుంటున్నారు. - సాక్షి, సిటీబ్యూరో మనదేశంలో అత్యంత ప్రాధాన్య పెట్టుబడి స్థిరాస్తి రంగమే. ప్రాపర్టీ అన్వేషకులు కొనుగోలుదారులుగా మారేందుకు పట్టే సమయంపై ప్రాపర్టీ కన్సల్టెన్సీ అనరాక్ అధ్యయనం చేసి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 2019, 2024 ఆర్థిక సంవత్సరంలో ఈ కొనుగోలు సమయం కేవలం 25 రోజులుగా ఉంది. 2021 కోవిడ్ మహమ్మారి సమయంలో గరిష్టంగా 33 రోజుల సమయం పట్టింది.వేగానికి కారణమిదే... ఆర్థికంగా సన్నద్ధమయ్యాకే ప్రాపర్టీలను కొనేందుకు ముందుకొస్తున్నారు. కొన్నేళ్లుగా మార్కెట్లో బ్రాండెడ్ డెవలపర్ల నుంచి గృహాల విక్రయాలు పెరిగాయి. నిర్మాణంలో నాణ్యత, గడువులోగా పూర్తి చేస్తారనే విశ్వాసం ఆయా సంస్థలపై ఉండటంతో కొనుగోలుదారులు త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటున్నారు.రూ.3 కోట్లయినా చిటికెలో నిర్ణయం.. సాధారణంగా గృహ కొనుగోలులో ధరకే అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు. కానీ, యువ కస్టమర్లు ధర గురించి పట్టించుకోవట్లేదు. రూ.3 కోట్ల ధర ఉన్న అల్ట్రా లగ్జరీ గృహాల ఎంపికకు అతి తక్కువగా, కేవలం 15 రోజుల్లోనే నిర్ణయం తీసుకుంటున్నారు. రూ.1–3 కోట్ల ధర ఉన్న ఇళ్లకు 27 రోజులు, రూ.50 లక్షల నుంచి రూ.కోటి రేటు ఉన్న యూనిట్ల కొనుగోలుకు ఏకంగా 30 రోజులు సమయం తీసుకుంటున్నారు.డిమాండ్‌తో వేగంగా నిర్ణయం కోవిడ్ తర్వాతి నుంచి విశాలైన గృహాలు, హైఎండ్ ప్రాజెక్ట్‌లకు డిమాండ్ పెరిగింది. ఈ విభాగంలో ఇళ్లు వేగంగా అమ్ముడవుతున్న కారణంగా కస్టమర్లు కొనుగోలు నిర్ణయాన్ని వేగంగా తీసుకుంటున్నారు. – ప్రశాంత్‌రావు, డైరెక్టర్, పౌలోమీ ఎస్టేట్స్ -
అక్టోబర్‌లో.. రియల్ బ్యాక్!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రియల్ ఎస్టేట్ మార్కెట్ మళ్లీ పుంజుకుంది. వరుస ఎన్నికలు, కొత్త ప్రభుత్వ విధానాలు, అంతర్జాతీయ మార్కెట్లో ఆర్థిక ఒడిదుడుకుల నేపథ్యంలో ఏడాదిన్నర కాలంగా నగర స్థిరాస్తి రంగంలో కొంతకాలంగా ప్రతిష్టంభన నెలకొంది. అయితే, ఇటీవల ప్రభుత్వం కుదురుకోవటం, ఆర్థిక స్థిరత్వం చేకూరడం, అనుకూలమైన వడ్డీ రేట్లు ఉండటంతో కొనుగోలుదారుల్లో విశ్వాసం పెరిగింది. దీంతో గృహ విక్రయాలు ప్రతి నెలా పెరుగుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సెప్టెంబర్‌లో రూ.2,820 కోట్ల విలువైన 4,903 అపార్ట్మెంట్లు రిజిస్ట్రేషన్ కాగా.. అక్టోబర్ నాటికి రూ.3,617 కోట్ల విలువైన 5,894 యూనిట్లు అమ్ముడుపోయాయి. నెలరోజుల్లో ప్రాపర్టీ వ్యాల్యూలో 28 శాతం, విక్రయాల్లో 20 శాతం వృద్ధి నమోదైందని నైట్‌ఫ్రాంక్ ఇండియా తాజా నివేదిక వెల్లడించింది.14 శాతం వాటా లగ్జరీదే..గ్రేటర్లో గతేడాది జనవరి–అక్టోబర్ మధ్య కాలంలో రూ.30,464 కోట్ల విలువైన 58,390 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఈ ఏడాది అదే 10 నెలకాలంలో 65,280 అపార్ట్మెంట్లను విక్రయించారు. వీటి విలువ రూ.40,078 కోట్లు. గత నెలలో అమ్ముడైన వాటిల్లో రూ.కోటి విలువైన, 2 వేల చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న లగ్జరీ గృహాలదే 14 శాతం వాటా. గత నెలలో రూ.497 కోట్ల విలువైన 811 లగ్జరీ యూనిట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. రూ.50 లక్షల నుంచి రూ.కోటి ధర ఉన్న 1,601 ప్రాపరీ్టలు, రూ.50 లక్షల లోపు ధర ఉన్న 3,482 యూనిట్లు అమ్ముడుపోయాయి. -
నిర్మాణం ఆలస్యమైతే వడ్డీ ఇస్తారని తెలుసా..?
సాక్షి, హైదరాబాద్: సొంతింటి కల సాకారంలో కస్టమర్‌తో బిల్డర్ చేసుకునే సేల్ అగ్రిమెంట్ అత్యంత కీలకం. ఒప్పందపత్రంలోని నిబంధనలు, షరతులను బట్టి మన కల తీరుతుందో లేక మధ్యలోనే పటాపంచలవుతుందో ఇట్టే చెప్పేయొచ్చు. అందుకే మనిషికి హృదయ స్పందనలాగే డెవలపర్‌కు, కొనుగోలుదారులకు మధ్య జరిగే సేల్ అగ్రిమెంట్ అంతకంటే ముఖ్యమని తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీజీ–రెరా) సభ్యులు కె.శ్రీనివాస రావు అంటున్నారు. ఆయనతో ‘సాక్షి రియల్టీ’ ఇంటర్వ్యూ విశేషాలివీ..బహుళ అంతస్తుల నిర్మాణ సంస్థలన్నీ తమకు అనుకూలమైన నిబంధనలను, షరతులను పొందుపరిచి కస్టమైజ్డ్ అగ్రిమెంట్లను రూపొందించి కస్టమర్లతో సేల్ అగ్రిమెంట్ చేసుకుంటున్నాయి. ఇలాంటి వాటిపట్ల గృహ కొనుగోలుదారులు అప్రమత్తంగా వ్యవహరించాలి. పెట్టుబడులకు భద్రత, రక్షణ ఉండాలంటే రెరా రిజిస్ట్రేషన్ ఉన్న ప్రాజెక్ట్‌ల్లో కొనుగోలు చేయడం ఉత్తమం. తక్కువ ధరకు వస్తుందనో, ఆఫర్లు ఇస్తున్నారనో ప్రీలాంచ్, బై బ్యాక్ స్కీమ్స్ వలలో చిక్కితే రోడ్డున పడతారు. నిర్మాణం ఆలస్యమైతే వడ్డీ చెల్లించాల్సిందే.. నిర్మాణ దశలను బట్టి డెవలపర్లకు బ్యాంక్ నిధులను విడుదల చేస్తుంది. రెరా నిబంధనల ప్రకారం ఆయా నిధులను ప్రత్యేకంగా ఎస్క్రో ఖాతాలో జమ చేసి, ఆ నిర్మాణ పనుల కోసం మాత్రమే వినియోగించాలి. అయితే డెవలపర్లు నిధులను ఇతర ప్రాజెక్ట్‌లు, అవసరాలకు మళ్లిస్తుండటంతో ప్రాజెక్ట్ తుదిదశకు చేరుకునే సరికి నిధులు సరిపడాలేక అది ఆగిపోతుంది. మరోవైపు నిధులు పూర్తిగా విడుదల కాగానే కస్టమర్‌కు బ్యాంక్ నుంచి నెలవారీ వాయిదా (ఈఎంఐ) చెల్లించడం ప్రారంభమవుతుంది. కానీ, కస్టమర్‌కు ఆ టైంకు ఫ్లాట్ చేతికి రాదు. గృహప్రవేశం చేయలేరు. దీంతో బయట అద్దె, ఫ్లాట్‌కు ఈఎంఐ చెల్లించడం కస్టమర్‌కు అదనపు భారంగా మారుతుంది. గడువులోగా ప్రాజెక్ట్‌లను పూర్తి చేయని డెవలపర్లు ఆలస్యం అయిన కాలానికి 10.25 శాతం వడ్డీని కస్టమర్‌కు చెల్లించాల్సిందే. ఒకవేళ సమయానికి కస్టమర్లు బిల్డర్‌కు సొమ్ము చెల్లించకపోతే వారు కూడా 10.25 శాతం వడ్డీని డెవలపర్‌కు అందజేయాల్సిందే. కార్పస్ ఫండ్ అందజేయాలి.. సెమీ ఫర్నిష్ ఫ్లాట్‌ను రిజిస్ట్రేషన్ చేసుకుంటే రూ.2 లక్షలు, 3 లక్షల మేర రిజిస్ట్రేషన్ చార్జీలు తగ్గుతాయనే బిల్డర్ల ఉచిత సలహాకు చాలామంది కస్టమర్లు చిక్కుతున్నారు. అయితే సెమీ ఫర్నీష్ ఫ్లాట్‌ను పూర్తి ఫర్నీష్గా ఎప్పుడు చేస్తారనే విషయంపై బిల్డర్‌తో సప్లిమెంటరీ అగ్రిమెంట్ చేసుకోవాలి. లేకపోతే రిజిస్ట్రేషన్ అయిపోయిందంటూ టైల్స్, పెయింటింగ్ వంటి తుది మెరుగులు దిద్దకుండా అసంపూర్తి ఫ్లాట్‌నే కస్టమర్‌కు అప్పగించి బిల్డర్లు చేతులు దులుపుకుంటారు. కస్టమర్ల నుంచి వసూలు చేసే కార్పస్ ఫండ్‌ను బిల్డర్ తీసుకోరాదు. అసోసియేషన్‌కు ప్రత్యేకంగా ఎస్క్రో బ్యాంక్ ఖాతాను తెరిచి, వడ్డీతోసహా కార్పస్ ఫండ్‌ను అందులో జమ చేయాలి. కస్టమర్ల అనుమతి తప్పనిసరి.. కస్టమర్‌తో ఒప్పందం చేసుకున్నాక ప్రాజెక్ట్ లేదా ఫ్లాట్ డిజైనింగ్, ఎలివేషన్ వంటి వాటిల్లో బిల్డర్ ఏమైనా మార్పులు చేయాలంటే 2/3 వంతు కస్టమర్ల అనుమతి తప్పనిసరి. ప్రాజెక్ట్ నిర్మాణాన్ని బిల్డర్ బ్యాంక్ రుణంతోనే కడుతున్నప్పుడు కస్టమర్లు బిల్డర్‌కు పోస్ట్ డేటెడ్ చెక్స్ అందజేయాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా డెవలపర్లు కస్టమర్ల నుంచి 10 శాతానికి మించి టోకెన్ అమౌంట్‌ను వసూలు చేయకూడదు. భూ యజమానికి చిక్కులు.. నిర్మాణం పూర్తయ్యాక ఫ్లాట్ పొజిషన్‌కు కస్టమర్‌కు రెరా చట్టం ప్రకారం 2 నెలల సమయం ఉంటుంది. కానీ, 15 రోజుల్లోనే పొజిషన్ తీసుకోవాలని బిల్డర్లు కస్టమర్లను ఒత్తిడి చేస్తుంటారు. ఇంటీరియర్ పనులు, వ్యక్తిగత కారణాల వల్ల కొందరు కస్టమర్లు పొజిషన్ తీసుకోవడంలో ఆలస్యం చేస్తుంటారు. మరికొందరు పొజిషన్ తీసుకుంటే అపార్ట్మెంట్ నిర్వహణ వ్యయం చెల్లించాల్సి ఉంటుందని ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తుంటారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి స్థల యజమానితో బిల్డర్ ఒప్పందం చేసుకుంటే రెరా చట్టం ప్రకారం డెవలపర్ కూడా ప్రమోటరే అవుతారు. కాబట్టి ఇరువురి మధ్య జరిగే అగ్రిమెంట్లు పారదర్శకంగా ఉండాలి. లేకపోతే భూ యజమానికి కూడా చిక్కులు తప్పవు. -
ఇక్కడ ఇళ్ల ధరలకు రెక్కలు..
దేశవ్యాప్తంగా ద్వితీయ శ్రేణి నగరాల్లో (టైర్–2) ఇళ్ల ధరలు ఈ ఏడాది జనవరి–సెప్టెంబర్ మధ్య కాలంలో గణనీయంగా పెరిగాయి. 23 ప్రముఖ పట్టణాల్లో సగటున 65 శాతం ఎగిసినట్టు ప్రాప్ ఈక్విటీ సంస్థ వెల్లడించింది. అదే విధంగా ఐదు నగరాల్లో ధరలు తగ్గాయి.ముఖ్యంగా దక్షిణాదిన గుంటూరు పట్టణంలో 51 శాతం మేర ధరల్లో పెరుగుదల కనిపించింది. ఆ తర్వాత విశాఖపట్టణంలో 29 శాతం, విజయవాడలో 21 శాతం చొప్పున పెరిగాయి. దక్షిణాదిలోనే మంగళూరులో 41 శాతం, కోయింబత్తూర్‌లో 11 శాతం, గోవాలో 6 శాతం, కోచిలో 2 శాతం చొప్పున వృద్ధి చెందాయి. త్రివేండ్రంలో మాత్రం 4 శాతం, మైసూర్లో 14 శాతం చొప్పున ధరలు తగ్గాయి. జైపూర్ టాప్.. టైర్–2 పట్టణాల్లో దేశంలోనే అత్యధికంగా జైపూర్‌లో 65 శాతం మేర ధరలు పెరిగినట్టు ప్రాప్ ఈక్విటీ నివేదిక తెలిపింది. జనవరి–సెప్టెంబర్ మధ్య కాలంలో కొత్తగా ప్రారంభించిన ప్రాజెక్టుల్లో చదరపు అడుగు (ఎస్ఎఫ్టీ) ధర రూ.6,979కు చేరింది. క్రితం సంవత్సరం ఇదే కాలంలో రూ.4,240గా ఉండడం గమనార్హం. ఉత్తరాదిన ఆగ్రా.. ఉత్తరాదిన ఆగ్రాలో ఇళ్ల ధరలు 59 శాతం పెరిగాయి. ఆ తర్వాత చండీగఢ్‌లో 34 శాతం, బివాండిలో 25 శాతం, ఇండోర్‌లో 20 శాతం, డెహ్రాడూన్‌లో 14 శాతం, లుధియానాలో 11 శాతం, లక్నోలో ఒక శాతం చొప్పున ధరల్లో వృద్ధి కనిపించింది. భోపాల్‌లో 5 శాతం, మోహాలిలో 8 శాతం, సోనేపట్‌లో 26 శాతం చొప్పున ధరలు పతనమయ్యాయి.పశ్చిమాన గాంధీనగర్ పశ్చిమభారత్లో గాంధీనగర్‌లో అత్యధికంగా 19 శాతం మేర ఇళ్ల ధరలు ఎగిశాయి. ఆ తర్వాత సూరత్‌లో 14 శాతం, నాగ్‌పూర్‌లో 12 శాతం, వడోదరలో 10 శాతం, నాసిక్‌లో 4 శాతం, అహ్మదాబాద్‌లో 4 శాతం చొప్పున ధరలు పెరిగాయి. తూర్పున భువనేశ్వర్‌లో 15 శాతం, రాయ్‌పూర్‌లో 14 శాతం చొప్పున ఇళ్ల ధరల్లో వృద్ధి కనిపించింది.బలంగా డిమాండ్.. ‘‘టైర్–2 నగరాల్లో డెవలపర్లు, కార్పొరేట్లు, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్లు, ఇన్వెస్టర్ల సమూహం నుంచి ఇళ్లకు ఆసక్తి పెరిగింది. ఈ నగరాల్లో భూమి చౌకగా లభించడం, మౌలిక ససతులతో పెద్ద ఎత్తున అనుసంధానత, బలమైన డిమాండ్ వెరసి ప్రీమియం, లగ్జరీ ఇళ్ల సరఫరా మెరుగుపడింది’’అని ప్రాప్‌ఈక్విటీ వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ జసూజా తెలిపారు. -
రూ.21 లక్షల కోట్లకు ఇన్విట్స్ ఏయూఎం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా మౌలిక సదుపాయాల అభివృద్ధిపై మరింతగా దృష్టి పెడుతున్న నేపథ్యంలో 2030 నాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌ల (ఇన్విట్స్) నిర్వహణలోని ఆస్తుల పరిమాణం (ఏయూఎం) రూ. 21 లక్షల కోట్లకు చేరగలదని అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఇది రూ.5 లక్షల కోట్లుగా ఉంది. అలాగే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్స్) పోర్ట్‌ఫోలియోలోని 125 మిలియన్ చ.అ. ఆఫీస్ స్పేస్ వచ్చే కొన్నేళ్లలో 4 రెట్లు పెరిగి 400 మిలియన్ చ.అ.లకు చేరనుంది.బుధవారమిక్కడ ఈ సాధనాలపై రిటైల్ ఇన్వెస్టర్ల కోసం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో రీట్స్, ఇన్విట్స్ అసోసియేషన్ల ప్రతినిధులు ఈ విషయాలు తెలిపారు. సాధారణంగా రియల్టీ, ఇన్ఫ్రాలో పెట్టుబడులు పెట్టాలంటే పెద్ద మొత్తం అవసరమవుతుందని, కానీ రీట్స్, ఇన్విట్స్ ద్వారా చాలా తక్కువ మొత్తాన్నే ఇన్వెస్ట్ చేసి మెరుగైన ప్రయోజనాలు పొందవచ్చని వివరించారు. రీట్స్‌లో కనిష్టంగా రూ. 100–400కి కూడా యూనిట్లను కొనుగోలు చేయొచ్చని పేర్కొన్నారు. మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ రీట్ సీఎఫ్‌వో ప్రీతి ఛేడా, హైవే ఇన్ఫ్రా ట్రస్ట్ సీఎఫ్‌వో అభిషేక్ ఛాజర్, నెకస్స్ సెలెక్ట్ ట్రస్ట్ సీఈవో రాజేష్ దేవ్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. దేశీయంగా 26 ఇన్విట్స్ ఉండగా, లిస్టెడ్ రీట్స్ నాలుగు ఉన్నాయి. -
అందుబాటు ధరల్లో ఇళ్లు... విలువ రూ. 67 లక్షల కోట్లు
దేశంలో 2030 నాటికి దాదాపు రూ.67 లక్షల కోట్లు విలువ చేసే గృహాల కొరత ఉండబోతుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని వర్గాల ప్రజలకు 3.12 కోట్ల కొత్త ఇళ్లు అవసరం అవుతాయని ఇండస్ట్రీ బాడీ సీఐఐ, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా బుధవారం జరిగిన ఒక సమావేశంలో సంయుక్తంగా ‘అఫర్డబుల్ హౌసింగ్ ఇన్ ఇండియా’ నివేదికను విడుదల చేశాయి.నివేదికలోని వివరాల ప్రకారం..పెరుగుతున్న పట్టణీకరణ, ఉపాధి అవకాశాల వల్ల 2030 నాటికి దేశంలోని వివిధ పట్టణ కేంద్రాల్లో 2.2 కోట్ల గృహాలు అవసరం అవుతాయి.ఇందులో 2.1 కోట్ల గృహాలు(95.2 శాతం) ఆర్థికంగా వెనకబడిన వర్గాల వారికి అందుబాటులో ఉండాలి.ప్రస్తుతం 1.1 కోట్ల యూనిట్ల ఇళ్ల కొరత ఉంది. మొత్తంగా 2030 నాటికి వీటి డిమాండ్ 3.2 కోట్లకు చేరనుంది.ఈమేరకు దేశవ్యాప్తంగా దాదాపు రూ .67 లక్షల కోట్ల రియల్టీ వ్యాపారం జరుగుతుందని అంచనా.ప్రస్తుతం గృహాల కొనుగోలు రుణ మార్కెట్ విలువ రూ.13 లక్షల కోట్లుగా ఉంది. అందులో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (హెచ్ఎఫ్సీ) రూ.6.9 లక్షల కోట్లు, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు (ఎస్సీబీ) రూ .6.2 లక్షల కోట్ల రుణ విలువను కలిగి ఉన్నాయి.భవిష్యత్తులో వివిధ ఆర్థిక సంస్థలు అందజేసే గృహ రుణ వాటా మరింత పెరగనుంది.కొత్తగా ఇళ్లు కొనేవారు దాదాపు 77 శాతం మంది 2030 నాటికి రుణాలు తీసుకుంటారని అంచనా.మొత్తం రూ.67 లక్షల కోట్ల మార్కెట్లో దాదాపు రూ.45 లక్షల కోట్లు బ్యాంకులు, హెచ్ఎఫ్సీలు ప్రజలకు ఫైనాన్సింగ్ ఇచ్చే అవకాశం ఉంది.ఇదీ చదవండి: గగనతలంలో 17 కోట్ల మంది!నైట్ ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజాల్ మాట్లాడుతూ..‘2030 నాటికి దేశంలో పెద్దమొత్తంలో గృహాలు అవసరం అవుతాయి. అప్పటివరకు చాలా ఇళ్ల కొరత కూడా ఏర్పడనుంది. ప్రధానంగా పట్టణ కేంద్రాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో వీటికి డిమాండ్ ఏర్పడుతుంది’ అన్నారు. -
హైదరాబాద్‌లో ఇళ్ల ధరల పెరుగుదల
దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన నగారల్లో ఇళ్ల ధరలు జులై–సెప్టెంబర్ త్రైమాసికంలో 11 శాతం మేర పెరిగాయి. ఇందులో అత్యధికంగా ఢిల్లీ ఎన్సీఆర్లో 32 శాతం మేర ధరలు ఎగిసిపడగా, హైదరాబాద్‌లో 3 శాతం పెరిగాయి. ఈ వివరాలను రియల్టర్ల మండలి క్రెడాయ్, కొలియర్స్, లైసెస్ ఫొరాస్ సంస్థల సంయుక్త నివేదిక వెల్లడించింది. సెప్టెంబర్ త్రైమాసికంలో రియల్టీ మార్కెట్లో బలమైన డిమాండ్ నమోదైంది. ఇళ్ల సగటు ధరలు వరుసగా 15వ త్రైమాసికంలోనూ వృద్ధి బాటలో నడిచాయి. ఎనిమిది నగరాల్లో ఇళ్ల సగటు ధరలు 11 శాతం వృద్ధితో చదరపు అడుగు (ఎస్ఎఫ్టీ) ధర రూ.11,000కు చేరినట్టు ఈ నివేదిక వెల్లడించింది. పట్టణాల వారీగా..జులై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో అత్యధికంగా 32 శాతం మేర ఇళ్ల ధరల్లో వృద్ధి కనిపించింది. ఎస్ఎఫ్టీ ధర రూ.11,438కి చేరింది.ఢిల్లీ తర్వాత అత్యధికంగా బెంగళూరులో ఇళ్ల ధరలు సగటున 24 శాతం పెరిగాయి. చదరపు అడుగు ధర రూ.11,743గా నమోదైంది. హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు సగటున 3 శాతం పెరిగాయి. ఎస్ఎఫ్టీ రూ.11,351కి చేరింది. అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలో ఇది రూ.11,040గా ఉంది. పుణెలో ఎస్ఎఫ్టీ ధర 10 శాతం పెరిగి రూ.9,890కు చేరింది.ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో 4 శాతం పెరిగి ఎస్ఎఫ్టీ రూ.20,438గా ఉంది. కోల్‌కతాలోనూ 3 శాతం పెరుగుదల నమోదైంది. చదరపు అడుగు ధర రూ.11,351కి చేరింది. చెన్నై మార్కెట్లో చదరపు అడుగు ధర రూ.7,889గా నమోదైంది. మెట్రోల్లో అతి తక్కువ పెరుగుదల ఇక్కడే. అహ్మదాబాద్‌లో 16 శాతం వృద్ధితో ఎస్ఎఫ్టీ రూ.7,640కు చేరింది.సానుకూల సెంటిమెంట్..ఇళ్ల ధరల పెరుగుదల గృహ కొనుగోలుదారుల్లో నెలకొన్న సానుకూల సెంటిమెంట్, సానుకూల వాతావరణానికి నిదర్శనమని క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ బొమన్ ఇరానీ పేర్కొన్నారు. విక్రయాలు, ధరల పెరుగుదల కొనసాగడం అందుబాటు ధరలు, డిమాండ్‌ను తెలియజేస్తున్నట్ట లైసస్ ఫొరాస్ ఎండీ పంకజ్ కపూర్ వ్యాఖ్యానించారు. కొత్త ప్రాజెక్టుల ఆవిష్కరణలు క్రమంగా తగ్గుతున్నప్పటికీ లగ్జరీ ఇళ్ల విభాగం ఆధిపత్యం కొనసాగుతోందని చెప్పారు. ఎంఎంఆర్, పుణె, హైదరాబాద్ మార్కెట్లు విక్రయాలు, సరఫరాల్లో మార్పులేని స్థితికి చేరాయని.. ఢిల్లీ ఎన్సీఆర్, చెన్నై, టైర్–2 పట్టణాల్లో సరఫరా తగ్గిందని తెలిపారు. ధరలు పెరుగుతున్నప్పటికీ.. ద్రవ్య విధానాన్ని ఆర్బీఐ సరళీకరించడం, రెపో రేటు తగ్గింపు అంచనాలతో గృహ కొనుగోలుదారులకు సమీప కాలంలో ఉపశమనం లభిస్తుందని కొలియర్స్ ఇండియా సీఈవో బాదల్ యాగ్నిక్ అభిప్రాయపడ్డారు.పెట్టుబడుల తీరు..రియల్టీ తర్వాత ఐటీ/ఐటీఈఎస్ రంగంలోకి అత్యధికంగా రూ.27,815 కోట్లు ఏఐఎఫ్‌ల ద్వారా వచ్చాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో రూ.25,782 కోట్లు, ఎన్‌బీఎఫ్‌సీల్లోకి రూ.21,503 కోట్లు, బ్యాంకుల్లోకి రూ.18,242 కోట్లు, ఫార్మాలోకి రూ.17,272 కోట్లు, ఎఫ్‌ఎంసీజీలోకి రూ.11,680 కోట్లు, రిటైల్‌లోకి రూ.11,379 కోట్లు, పునరుత్పాదక ఇంధన వనరుల రంగంలోకి రూ.10,672 కోట్లు, ఇతర రంగాల్లోకి రూ.2,29,571 కోట్లు వచ్చాయని ఈ నివేదిక వెల్లడించింది. దశాబ్ద గరిష్టానికి ఏఐఎఫ్ పెట్టుబడులు చేరాయని, మొత్తం ఏఐఎఫ్ ఫండ్స్ సంఖ్యలోనూ వృద్ధి నెలకొన్నట్టు తెలిపింది. ‘ఏఐఎఫ్ పెట్టుబడుల్లో కేటగిరీ 2 ఏఐఎఫ్‌ల పాత్ర కీలకంగా ఉంది. రియల్ ఎస్టేట్ ఫండ్స్, ప్రైవేటు ఈక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్స్, ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్‌వోఎఫ్) ఇందులో భాగంగా ఉన్నాయి’ అని పురి తెలిపారు. గడిచిన ఐదేళ్ల కాలంలో మొత్తం ఏఐఎఫ్ పెట్టుబడుల్లో కేటగిరీ–2 నుంచే 80 శాతం మేర ఉన్నట్టు అనరాక్ నివేదిక తెలిపంది. రియల్ ఎస్టేట్‌లో ఏఐఎఫ్ పెట్టుబడులు అధికంగా ఉండడం వెనుక ఈ రంగంలో భద్రత, రక్షణ ఎక్కువగా ఉండడమే కారణమని గోల్డెన్ గ్రోత్ ఫండ్ సీఈవో అంకుర్ జైన్ తెలిపారు.రియల్టీలోకి భారీగా ఏఐఎఫ్ పెట్టుబడులురియల్ ఎస్టేట్ రంగంలోకి ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధులు (ఏఐఎఫ్) పెద్ద ఎత్తున వస్తున్నాయి. దేశ రియల్ ఎస్టేట్ పరిశ్రమలో ఏఐఎఫ్ పెట్టుబడులు రూ.75,000 కోట్లకు చేరినట్టు రియల్టీ కన్సల్టెంట్ అనరాక్ తెలిపింది. ఏఐఎఫ్ మొత్తం పెట్టుబడుల్లో 17 శాతం రియల్ ఎస్టేట్ రంగంలోకే వచ్చినట్లు వెల్లడించింది. గడిచిన 10 ఏళ్లలో భారత్‌లో ఏఐఎఫ్‌లలో భారీ వృద్ధి కనిపించినట్టు పేర్కొంది. మిగిలిన రంగాలతో పోల్చి చూసినప్పుడు ఏఐఎఫ్ పెట్టుబడులకు రియల్టీ ఆకర్షణీయ ఎంపికగా ఉన్నట్టు వివరించింది.ఇదీ చదవండి: చమురుపై విండ్‌ఫాల్ ట్యాక్స్ ఎత్తివేతరియల్ఎస్టేట్లో రూ.75,468 కోట్లు‘సెబీ తాజా డేటా ప్రకారం.. 2024–25 సెప్టెంబర్ త్రైమాసికం (క్యూ2) వరకు రూ.4,49,384 కోట్ల ఏఐఎఫ్ పెట్టుబడుల్లో రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చినవి రూ.75,468 కోట్లు (17 శాతం)గా ఉన్నాయి’ అని అనరాక్ నివేదిక వెల్లడించింది. రియల్ ఎస్టేట్ తర్వాత ఐటీ/ఐటీఈఎస్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎన్బీఎఫ్సీలు, బ్యాంక్‌లు, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, రిటైల్, రెన్యువబుల్ ఎనర్జీ, ఇతర రంగాలు ఏఐఎఫ్‌లతో ప్రయోజనం పొందినట్టు తెలిపింది. ‘ఏఐఎఫ్ ద్వారా రియల్ ఎస్టేట్‌లోకి వచ్చిన పెట్టుబడులు 2024 మార్చి నాటికి రూ.68,540 కోట్లుగా ఉంటే, 2024–25 సెప్టెంబర్ త్రైమాసికం నాటికి రూ.75,468 కోట్లకు పెరిగాయి. కేవలం ఆరు నెలల్లోనే 10 శాతం మేర పెట్టుబడుల్లో వృద్ధి కనిపించింది’ అని అనరాక్ ఛైర్మన్ అనుజ్‌పురి వెల్లడించారు. -
హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌కు మళ్లీ పూర్వ వైభవం
మూసీ సుందరీకరణ, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు, ఫ్యూచర్ సిటీ.. హైదరాబాద్ స్థిరాస్తి రంగాన్ని నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లడం ఖాయం. ఈ బృహత్తర ప్రాజెక్ట్‌లు వచ్చే ఏడాదిలో ప్రారంభమవుతాయి. దీంతో రియల్ ఎస్టేట్ మార్కెట్ మళ్లీ పూర్వవైభవాన్ని సంతరించుకుంటుందని భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య(క్రెడాయ్) జాతీయ కార్యదర్శి గుమ్మి రాంరెడ్డి అన్నారు. ‘సాక్షి రియల్టీ’తో ఆయన ఇంటర్వ్యూ విశేషాలివీ.. –సాక్షి, సిటీబ్యూరోప్రభుత్వ ఆస్తులు, జలాశయాల రక్షణ కోసం ఏర్పాటైన హైడ్రా అవసరమే. కానీ, దాన్ని కార్యరూపంలోకి తీసుకొచ్చిన తీరే గందరగోళాన్ని సృష్టించింది. హైడ్రా ప్రభావం ప్రాజెక్ట్‌లపై కంటే కస్టమర్ల సెంటిమెంట్‌పై ఎక్కువ ప్రభావం చూపించింది. రియల్టీ మార్కెట్ సైకిల్ వ్యవస్థ. వరుస ఎన్నికలు, కొత్త ప్రభుత్వ విధానాల అమలులో జాప్యం, అధిక సరఫరా కారణంగా 2024లో రియల్టీ మార్కెట్ స్తబ్దుగానే ఉంది. కానీ, ఇప్పుడు ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది.ఇప్పటికే మూసీలోని అక్రమ నిర్మాణాలు, నిర్వాసితులకు పరిహారం తదితర అంశాలపై హైకోర్టు నుంచి అడ్డంకులు కూడా తొలగాయి. దీంతో మూసీ పునరుజ్జీవానికి ప్రభుత్వం ముందడుగులు వేస్తోంది. రెండోదశ మెట్రో విస్తరణ పనులను జనవరి నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. ట్రిపుల్ ఆర్ నిర్మాణం, 14 వేల ఎకరాల్లోని ఫ్యూచర్ సిటీలను ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆయా ప్రాజెక్ట్‌లతో నగరం మరింత అభివృద్ధి చెందడంతోపాటు కొత్త మార్గాలు, ప్రాంతాల్లో రియల్ అవకాశాలు మెరుగవుతాయి. పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి.లుక్ ఆల్ డైరెక్షన్స్.. ఏ నగరమైనా సమాంతరంగా అభివృద్ధి చెందాలి. కానీ, మౌలిక వసతుల కల్పనలో హెచ్చుతగ్గుల కారణంగా అభివృద్ధి కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. దీంతో హైదరాబాద్‌లో వెస్ట్, సౌత్ జోన్లో భూముల ధరలు బాగా పెరిగాయి. అందుబాటు ధర లేదు. సామాన్యుడు ఇల్లు కొనే పరిస్థితి లేదు. అందుకే పాలసీల్లో కొన్ని మార్పులు తేవాలి. ఔటర్ గ్రోత్ కారిడార్‌ను అభివృద్ధి చేస్తే ప్రతి ఒక్కరికీ సొంతింటి కల సాకారమవుతుంది. అక్కడ భూముల ధరలు తక్కువగా ఉన్నాయి. గత ప్రభుత్వం లుక్ ఈస్ట్ పాలసీని తీసుకొచ్చింది. కానీ, కార్యరూపం దాల్చలేదు. ఈ ప్రభుత్వం లుక్ ఆల్ డైరెక్షన్ అమలు చేయాలి. రింగ్‌రోడ్డు చుట్టూ మొత్తం గ్రిడ్ రోడ్లు వేస్తే అక్కడ బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగి సామాన్యుడికి సొంతింటి కలను సాకారం చేసుకునే అవకాశాలు మెరుగవుతాయి.పెట్టుబడులకు సౌత్ బెటర్.. కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, రాయదుర్గం వంటి పశ్చిమ ప్రాంతాల్లో స్థలాల ధరలు ఆకాశంలో ఉన్నాయి. ఇక్కడ సామాన్యులు కొనే పరిస్థితి లేదు. రేవంత్ ప్రభుత్వం కొత్త విధానాలు, అభివృద్ధి పనులతో వచ్చే ఏడాది కొత్తూరు, షాద్‌నగర్, ఆదిభట్ల, ముచ్చర్ల వంటి దక్షిణ ప్రాంతాలు బాగా అభివృద్ధి అవుతాయి. ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో ధరలు తక్కువగా ఉన్నందున సామాన్య, మధ్యతరగతి వారు స్థలాలు కొనుగోలు చేయడం ఉత్తమం. వెస్ట్ జోన్లో అపార్ట్మెంట్ కొనే ధరకే చ.అ.కు రూ.7–9 వేలకే సౌత్‌లో విల్లా వస్తుంది. అంతేకాకుండా ఓఆర్ఆర్తో ప్రధాన నగరం నుంచి 30–40 నిమిషాల ప్రయాణ వ్యవధిలోనే సౌత్‌కు చేరుకోవచ్చు. -
హైదరాబాద్‌లో రిటైల్ స్పేస్‌కు ఫుల్ డిమాండ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: షాపింగ్ మాల్స్, ప్రముఖ హై స్ట్రీట్లలో రిటైల్ స్థలం లీజుకు ఇవ్వడం 2024 జనవరి–సెప్టెంబర్ మధ్య ఎనిమిది ప్రధాన నగరాల్లో దాదాపు 5 శాతం పెరిగిందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదిక వెల్లడించింది. ఈ కాలంలో టాప్–8 నగరాల్లోని గ్రేడ్–ఏ మాల్స్, ప్రధాన హై స్ట్రీట్లలో లీజుకు తీసుకున్న రిటైల్ స్థలం 5.53 మిలియన్ చదరపు అడుగులు. గతేడాది ఇదే కాలంలో 5.29 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణం నమోదైంది.ఈ నగరాల జాబితాలో ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, పుణే, అహ్మదాబాద్ ఉన్నాయి. హై స్ట్రీట్లలో రిటైల్ స్థలాన్ని లీజుకు ఇవ్వడం గతేడాదితో పోలిస్తే 3.44 మిలియన్ చదరపు అడుగుల నుండి 3.82 మిలియన్ చదరపు అడుగులకు దూసుకెళ్లింది. మరోవైపు షాపింగ్ మాల్స్‌లో రిటైల్ స్థలం 1.85 మిలియన్ చదరపు అడుగుల నుండి 1.72 మిలియన్ చదరపు అడుగులకు వచ్చి చేరింది.హైదరాబాద్‌లోని ప్రముఖ హై–స్ట్రీట్ కేంద్రాలు రిటైల్ స్థలానికి బలమైన డిమాండ్‌ను నమోదు చేశాయి. ఈ నగరంలో వివిధ బ్రాండ్లు 2024 జనవరి–సెప్టెంబర్ కాలంలో 1.72 మిలియన్ చదరపు అడుగుల స్థలం లీజుకు తీసుకున్నాయి. గతేడాది ఇదే కాలంలో ఇది 1.60 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. ఈ వృద్ధి రిటైల్ రంగం బలంగా పుంజుకోవడం, నూతన విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంది. కరోనా మహమ్మారి తదనంతరం అభివృద్ధి చెందుతున్న వినియోగదారు ప్రవర్తనతో, ఆకర్షణీయ, అనుభవపూర్వక స్థలాలకు స్పష్టమైన డిమాండ్ ఉందని నివేదిక వివరించింది.ప్రీమియం రిటైల్ స్థలాలకు డిమాండ్..ప్రధాన నగరాల్లో మాల్ లీజింగ్ కార్యకలాపాలు స్థిరంగా పెరగడం రిటైల్ రంగం యొక్క బలమైన పునరుద్ధరణ, విస్తరణను నొక్కి చెబుతోందని లులు మాల్స్ తెలిపింది. ఈ సానుకూల ధోరణి రిటైల్ భాగస్వాముల కోసం అభివృద్ధి చెందుతున్న పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహిస్తూ వినియోగదారుల ప్రాధాన్యతలను అభివృద్ధి చేసే ప్రపంచ–స్థాయి రిటైల్ అనుభవాలను సృష్టించే తమ కంపెనీ దృష్టికి అనుగుణంగా ఉంటుందని వివరించింది.మాల్స్, ప్రధాన వీధుల్లో బలమైన లీజింగ్ కారణంగా భారత రిటైల్ రియల్ ఎస్టేట్ వృద్ధి చెక్కుచెదరకుండా ఉందని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ క్యాపిటల్ మార్కెట్స్ ఎండీ, రిటైల్–ఇండియా హెడ్ సౌరభ్ షట్డాల్ తెలిపారు. విచక్షణతో కూడిన వ్యయాలు పెరగడం, వినియోగదారుల ప్రాధాన్యత.. వెరశి ప్రీమియం రిటైల్ స్థలాలకు డిమాండ్‌ను పెంచుతున్నాయని ఆయన తెలిపారు. ‘భారత్ మరింత ఎక్కువ లావాదేవీల పరిమణాలను చవిచూడాలంటే ప్రధాన నగరాల్లో నాణ్యమైన రిటైల్ స్పేస్‌ల అభివృద్ధిని వేగవంతం చేయాలి. ఎందుకంటే ఇది తమ వ్యాపారాలను విస్తరించాలని చూస్తున్న ప్రపంచ రిటైలర్లకు అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది’ అని అన్నారు. -
రియల్ ఎస్టేట్ ఆఖరి ఆరు నెలలూ సానుకూలం
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ ఆరు నెలల్లో (2023 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకు) సానుకూల పనితీరు చూపించనుంది. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంపై రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ ఇండెక్స్‌ను నైట్‌ఫ్రాంక్, నరెడ్కో సంయుక్తంగా విడుదల చేశాయి.ఏప్రిల్–జూన్ క్వార్టర్‌కు సెంటిమెంట్ స్కోరు 65గా ఉంటే, జూలై–సెప్టెంబర్‌లో 64కు తగ్గింది. అయితే భవిష్యత్ సెంటిమెంట్ స్కోర్ మాత్రం 65 నుంచి 67కు పెరిగింది. వచ్చే ఆరు నెలల్లో రియల్టీ పరిశ్రమ వృద్ధి పట్ల ఉన్న విశ్వాసాన్ని ఇది తెలియజేస్తున్నట్టు నైట్‌ఫ్రాంక్, నరెడ్కో నివేదిక తెలిపింది. రియల్ ఎస్టేట్ పరిశ్రమకు సంబంధించి సరఫరా వైపు భాగస్వాములు, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్ల అంచనాలు, ఆర్థిక వాతావరణం, నిధుల లభ్యతను ఈ సూచీ తెలియజేస్తుంది.స్కోర్ 50గా ఉంటే తటస్థంగా, 50కి పైన సానుకూలంగా, 50కి దిగువన ప్రతికూల ధోరణిని ప్రతిఫలిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ప్రస్తుత, భవిష్యత్ సెంటిమెంట్ రెండూ సానుకూల శ్రేణిలోనే ఉన్నట్టు తాజా గణాంకాలు తెలియజేస్తున్నాయని, పరిశ్రమ దీర్ఘకాల సామర్థ్యాలపై స్థిరమైన విశ్వాసానికి నిదర్శనమని నివేదిక పేర్కొంది. ఇళ్ల మార్కెట్లోనూ సానుకూలత: ఇళ్ల మార్కెట్లో భవిష్యత్ సెంటిమెంట్ సానుకూలంగా నమోదైంది. ధరలు పెరుగుతాయని 62 శాతం మంది అంచనా వేస్తుంటే, అమ్మకాలు పెరుగుతాయని 40 శాతం మంది భాగస్వాములు అంచనా వేస్తున్నారు. 38 శాతం మంది మార్కెట్ స్థిరంగా ఉంటుందని భాస్తున్నారు. ఆఫీస్ మార్కెట్లో లీజింగ్, సరఫరా, అద్దెల పరంగా బలమైన సానుకూలత కనిపించింది. రానున్న నెలల్లో ఆఫీస్ మార్కెట్ బలమైన పనితీరు చూపిస్తుందన్న అంచనాలున్నట్టు నివేదిక తెలిపింది.అంతర్జాతీయ అనిశ్చితుల్లోనూ భారత రియల్ ఎస్టేట్ పరిశ్రమ బలంగా ఉండడడాన్ని సెంటిమెంట్ సూచీ తెలియజేస్తోందని నరెడ్కో ప్రెసిడెంట్ హరిబాబు పేర్కొన్నారు. ‘‘2024–25 సంవత్సరానికి జీడీపీ 7.2 శాతంగా ఉంటుందని ఆర్బీఐ చెబుతోంది. స్థిరమైన వడ్డీ రేట్లతో ఇన్వెస్టర్ సెంటిమెంట్ మరింత బలపడుతుంది. స్థిరమైన వృద్ధికి గాను ఈ రంగం సవాళ్లను పరిష్కరించుకుని, అవకాశాలు అందిపుచ్చుకోవాలి’’అని వివరించారు. -
హైదరాబాద్‌లో ఫ్లాట్ కొంటున్నారా..? ధరలు.. ఏ ఏరియాలో ఎంత?
సాక్షి, సిటీబ్యూరో: స్టీల్, సిమెంట్ తదితర నిర్మాణ సామగ్రి రేట్లు పెరుగుతుండటంతో అపార్ట్మెంట్ల ధరలు సైతం పెరుగుతున్నాయి. సోమాజిగూడ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి సెలబ్రిటీలు, ఉన్నత వర్గాలు ఉండే ప్రాంతాల్లో ఫ్లాట్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో కొత్త ప్రాజెక్టులు, గృహాల సరఫరా తక్కువగా ఉంటుంది.కొండాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి పశ్చిమ హైదరాబాద్‌లో అంతర్జాతీయ మౌలిక వసతులు, హైరైజ్ ప్రాజెక్ట్‌లతో ఫ్లాట్ల ధరలు ఎక్కువ పలుకుతున్నాయి. కరోనా తర్వాత విశాలమైన అపార్ట్మెంట్లు, హైరైజ్ ప్రాజెక్ట్‌లకు డిమాండ్ పెరిగింది. దీంతో బిల్డర్లు హైరైజ్ ప్రాజెక్ట్‌లలో స్విమ్మింగ్ పూల్, జిమ్, వాకింగ్, జాగింగ్ ట్రాక్స్ వంటి ఆధునిక వసతులను కల్పిస్తున్నారు.కోకాపేట, నార్సింగి, పుప్పాలగూడ, నానక్‌రాంగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాల్లో లగ్జరీ ప్రాజెక్టులు వస్తున్నాయి. వీటి పరిధిలో చ.అ.కు రూ.10 వేల నుంచి రూ.15 వేలకు పైగానే ధరలు ఉంటున్నాయి. నగరంలో అపార్ట్మెంట్ చదరపు అడుగు నిర్మాణానికి రూ.2,500 ఖర్చవుతోంది. భవనం ఎత్తును బట్టి నిర్మాణ వ్యయం పెరుగుతూంటుంది.నోట్: అపార్ట్మెంట్ విస్తీర్ణం, వసతులు, ప్రాంతాన్ని బట్టి ధర మారుతుంది. -
ఇల్లు కట్టుకోవాలా..? ఇదిగో ఈజీగా పర్మిషన్!
సాక్షి, సిటీబ్యూరో: మధ్యతరగతి వర్గాలు సొంత ఇంటి కలను సాకారం చేసుకోవాలనుకున్నా.. నిర్మాణ సంస్థలు బహుళ అంతస్తుల భవనాలు నిర్మించాలన్నా.. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) నుంచి అనుమతులు తీసుకోవడం తప్పనిసరి. భవన నిర్మాణాలకే కాకుండా నిర్మాణం పూర్తయిన ఇళ్లు, అపార్ట్మెంట్లలో నివాసానికి సైతం హెచ్ఎండీఏ నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు(ఓసీ) తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది.అన్ని రకాల డాక్యుమెంట్లు, ఆధారాలు ఉంటే దరఖాస్తుదారులు ప్రత్యేకంగా హెచ్ఎండీఏ అధికారుల వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. టీజీబీపాస్ ద్వారా దరఖాస్తు చేసుకొని నిర్ణీత వ్యవధిలో ప్రొసీడింగ్స్ పొందవచ్చు. కొత్తగా అపార్ట్మెంట్ కానీ, బిల్డింగ్లు కానీ నిర్మించేందుకు చాలామంది సకాలంలో సరైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయకపోవడం వల్లనే ఇబ్బందులకు గురవుతున్నారని అధికారులు చెబుతున్నారు.ఇదీ చదవండి: రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌ల్లో.. పెట్ పార్క్అన్ని విధాలుగా నిర్మాణ యోగ్యత ఉన్నట్లు తేలితే వారం, పది రోజుల్లోనే ప్రొసీడింగ్స్ లభిస్తాయని హెచ్ఎండీఏ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. ‘కొద్ది రోజులుగా హెచ్ఎండీఏ ఫైళ్లకు కదలిక వచ్చింది. లేఅవుట్లు, అపార్ట్మెంట్లకు ఇచ్చే అనుమతుల్లో వేగం పెరిగింది. సమస్యలు ఉన్న స్థలాల్లో మాత్రమే ప్రతిష్టంభన నెలకొంటోందని’ అన్నారు. ఈ క్రమంలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొనే సమయంలోనే అన్ని డాక్యుమెంట్లను సరి చూసుకోవాలని చెప్పారు.మీ స్థలం జాడ తెలుసుకోండి.. » హెచ్ఎండీఏ పరిధిలో సుమారు 3,350కి పైగా చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటికి సమీపంలో ఉండే నిర్మాణ స్థలాలు బఫర్ జోన్లలో ఉన్నా, ఎఫ్టీఎస్ పరిధిలో ఉన్నా అనుమతులు లభించవు. ఇందుకోసం హెచ్ఎండీఏ వెబ్‌సైట్‌లోని చెరువుల మ్యాపులను పరిశీలించి నిర్ధారణ చేసుకొనే అవకాశం ఉంది.» టీజీబీపాస్లో దరఖాస్తు చేసుకొనే సమయంలోనే రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారుల నుంచి అనుమతులు పొంది ఉండటం తప్పనిసరి. ప్రభుత్వం కొత్తగా హైడ్రాను ఏర్పాటు చేసిన తర్వాత క్షేత్రస్థాయిలో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు తనిఖీలు చేసి ఎన్ఓసీలు ఇచ్చిన తర్వాతే హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగం దరఖాస్తులను స్వీకరించే విధంగా మార్పు చేశారు.» ఇప్పుడు ఈ అనుమతుల ప్రక్రియ రెండు అంచెలుగా మారింది. మొదట నీటి పారుదల, రెవెన్యూ అధికారులు పరిశీలించి నివేదికలు ఇచ్చిన అనంతరం ప్లానింగ్ అధికారి పరిశీలనలోకి వెళ్తుంది. అక్కడ ఏమైనా సందేహాలు ఉంటే సదరు ఫైల్‌ను వెనక్కి పంపించే అవకాశం ఉంది. అన్నీ క్లీయర్‌గా ఉంటే ప్లానింగ్ డైరెక్టర్ పరిశీలిస్తారు. అనంతరం హెచ్ఎండీఏ కమిషనర్ ఆమోదంతో నిర్మాణానికి అనుమతి పత్రాలు (ప్రొసీడింగ్స్) లభిస్తాయి.డాక్యుమెంట్లు ఇవీ..» సాధారణంగా నిర్మాణ సంస్థలు సొంతంగా కానీ లేదా కన్సల్టెంట్ సంస్థల ద్వారా కానీ టీజీబీపాస్ ద్వారా దరఖాస్తులను అప్లోడ్ చేస్తున్నాయి. సొంత ఇళ్లు నిర్మించుకొనే మధ్యతరగతి వర్గాలు సైతం ఆర్కిటెక్చర్లు, కన్సల్టెంట్ల సహాయం తీసుకుంటారు. అన్ని అంశాల పట్ల స్పష్టమైన అవగాహన ఉన్నవాళ్లు స్వయంగా తమ దరఖాస్తులను అప్లోడ్ చేసుకోవచ్చు. ఏ విధంగా దరఖాస్తు చేసినప్పటికీ అవసరమైన డాక్యుమెంట్లు మాత్రం తప్పనిసరిగా ఉండాల్సిందే.» భూమి డాక్యుమెంట్లు, లింక్‌డాక్యుమెంట్లు, పాస్‌బుక్, టైటిల్ డీడ్, ఎమ్మార్వో ప్రొసీడింగ్స్, భూమికి సంబంధించిన పహణీలు, కాస్రాపహణీ, రెవెన్యూ స్కెచ్, 13 ఏళ్ల ఈసీ పత్రాలను అప్లోడ్ చేయాలి.» మార్కెట్ వాల్యూ, నాలా చార్జీలు, ఎన్ఓసీలు, సైట్ ఫొటోలు, జియో కోఆర్టినేట్స్, సైట్ సర్వే బౌండరీలు తదితర పత్రాలన్నీ ఉంటే సకాలంలో అనుమతులు పొందవచ్చు.» భవన నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను కూడా అధికారులు పరిశీలిస్తారు. ఇందుకోసం భూమి స్వభావాన్ని ధ్రువీకరించే సర్టిఫికెట్, నీటి నాణ్యత ధ్రువీకరణ, డిజైన్లు, ఫైర్, పర్యావరణ తదితర సంస్థల అనుమతులు, బిల్డింగ్ రిస్క్ ఇన్సూరెన్స్ వంటివి ఉండాలి. -
రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌ల్లో.. పెట్ పార్క్
సాక్షి, సిటీబ్యూరో: పెంపుడు జంతువులు పెంచుకోవడం స్టేటస్ సింబల్‌గా మారిపోయింది. పెట్స్‌తో రక్షణతో పాటు మానసిక ప్రశాంతత కూడా చేకూరుతుండటంతో ఇదో హాబీగా మారింది. చాలా మంది ఎగువ మధ్యతరగతి కుటుంబాల వారు కుక్కలు, పిల్లలు, కుందేళ్లు.. ఇలా రకరకాల పెంపుడు జంతువులను పెంచుకుంటుంటారు. విదేశాల నుంచి కూడా పెట్స్‌ను కొనుగోలు చేస్తుంటారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.అయితే చాలా మంది ఉదయం, సాయంత్రం వేళల్లో తమ వెంట పెట్స్‌ను రోడ్ల మీద, పార్క్‌లకు తీసుకెళ్తుంటారు. దీంతో ఇతరుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. చాలా మంది డెవలపర్లు నివాస సముదాయాల్లోనే పెంపుడు జంతువుల కోసం ప్రత్యేకంగా పెట్ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పెట్స్ పార్క్ ఉన్న ప్రాజెక్ట్‌లకు డిమాండ్ పెరిగింది.వందకుపైగా వసతులుహైదరాబాద్కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రణీత్ గ్రూప్ జేఎన్టీయూ సమీపంలో ఇక్సోరా పేరుతో ప్రీమియం హైరైజ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. 8.31 ఎకరాల్లోని ఈ ప్రాజెక్ట్‌లో నాలుగు టవర్లుంటాయి. జీ+37 అంతస్తుల్లో మొత్తం 1,504 యూనిట్లు ఉంటాయి. 1,305 చ.అ. నుంచి 3,130 చ.అ. మధ్య ఫ్లాట్ల విస్తీర్ణాలు ఉంటాయి. వెహికిల్ ఫ్రీ పోడియం పార్కింగ్, పెట్ పార్క్, యాంపీ థియేటర్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, ఫిట్నెస్ స్టేషన్, యోగా డెక్.. ఇలా వందకు పైగా వసతులుంటాయి.50 వేల చ.అ. క్లబ్‌హౌస్ కోసం కేటాయించారు. ఈ ప్రాజెక్ట్‌లో 80 శాతం ఓపెన్ ప్లేస్ ఉంటుంది. గడువులోగా ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి కొనుగోలుదారులకు అందించాలనే లక్ష్యంగా శరవేగంగా నిర్మాణ పనులను చేపడుతున్నామని ప్రణీత్ గ్రూప్ ఎండీ నరేంద్ర కుమార్ తెలిపారు. ఇప్పటికే టవర్ 1, 2లలో బేస్మెంట్ నిర్మాణం పూర్తయ్యిందని, గ్రౌండ్ ఫ్లోర్ పనులు జరుగుతున్నాయని చెప్పారు. -
హైదరాబాద్‌లో ఆఫీస్ స్థలాలకు గిరాకీ
హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ సరికొత్త శిఖరాలను తాకింది. దేశంలో కార్యాలయాల స్థలాల లావాదేవీల్లో మూడో స్థానంలో, సరఫరాలో రెండో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది తొమ్మిది నెలల కాలంలో గ్రేటర్లో 87 లక్షల చదరపు అడుగులు(చ.అ.) ఆఫీస్ స్పేస్ లావాదేవీలు జరగ్గా.. కొత్తగా 85 లక్షల చ.అ. స్థలం సరఫరా అయ్యింది. ఏటేటా ఆఫీస్ స్పేస్ రంగంలో 34 శాతం వృద్ధి నమోదవుతోందని సావిల్స్ ఇండియా తాజా నివేదిక వెల్లడించింది. వర్క్ ఫ్రమ్ హోమ్, హైబ్రిడ్ వంటి పని విధానాలకు స్వస్తి పలికి ఆఫీస్ యాజమాన్యాలు ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు రప్పిస్తున్నాయి. దీంతో మెట్రో నగరాల్లో ఆఫీస్ స్థలాలకు డిమాండ్ ఊపందుకుంది. – సాక్షి, సిటీబ్యూరోఐటీ, బ్యాంకింగ్, ఫార్మా, తయారీ రంగ సంస్థలు కొత్త యూనిట్ల ఏర్పాటు, ఉన్న వాటి విస్తరణకు ప్రణాళికలు చేస్తున్నాయి. దీంతో ప్రధాన ప్రాంతాలతో పాటు రవాణా సదుపాయాలున్న శివారు ప్రాంతాల్లోని ఆఫీస్ స్పేస్‌లకు డిమాండ్ ఏర్పడింది. ఇక ఈ ఏడాది మూడో త్రైమాసికంలో నగరంలో 58 లక్షల చ.అ. ఆఫీస్ స్పేస్ సరఫరా జరిగింది. వార్షిక ప్రాతిపదికన 8 శాతం పెరుగుదల నమోదైంది. 2024 మూడో త్రైమాసికంలో (జులై–సెప్టెంబర్)లోనే 30 లక్షల చ.అ. లావాదేవీలు జరిగాయి. ఎక్కువగా 25 వేల నుంచి లక్షలోపు చ.అ. మధ్యస్థాయి ఆఫీస్ స్పేస్ ఒప్పందాలు ఎక్కువగా జరిగాయి. 54 శాతం వాటాతో ఈ విభాగంలో 16 లక్షల చ.అ. లావాదేవీలు పూర్తయ్యాయి.బెంగళూరు–హైదరాబాద్ పోటాపోటీ.. కార్యాలయాల స్థలాల విభాగంలో ఐటీ హబ్‌లుగా పేరొందిన హైదరాబాద్, బెంగళూరు పోటీపడుతున్నాయి. అత్యధికంగా గ్రేడ్–ఏ ఆఫీసు స్పేస్ అందుబాటులో ఉన్న నగరాల్లో హైదరాబాద్ మూడో స్థానంలో ఉంది. గ్రేటర్లో ఇప్పటి వరకు గ్రేటర్లో 12.57 కోట్ల చ.అ. గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ అందుబాటులో ఉంది. అత్యధికంగా బెంగళూరులో 23.15 కోట్ల చ.అ., ఢిల్లీ–ఎన్సీఆర్లో 14.46 కోట్ల చ.అ. స్థలం అందుబాటులో ఉంది. ఇక, ముంబైలో 12.14, చెన్నైలో 9.13, పుణేలో 6.82 కోట్ల చ.అ. స్థలం ఉంది.దేశంలో 7 కోట్ల చ.అ. దాటనున్న ఆఫీస్ స్పేస్.. దేశంలో ఆఫీస్ స్పేస్ మార్కెట్ రికార్డ్లను బ్రేక్ చేసింది. దేశంలోని ఆరు మెట్రో నగరాల్లో 2024 జనవరి–సెప్టెంబర్ మధ్య కాలంలో 5.51 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్ లావాదేవీలు పూర్తికాగా.. ఈ ఏడాది చివరి నాటికి 7 కోట్ల చ.అ.లను అధిగమిస్తుందని, ఆఫీస్ స్పేస్ సప్లయ్ 6.2 కోట్ల చ.అ.లకు చేరుతుందని సావిల్స్ ఇండియా అంచనా వేసింది. ఈ ఏడాది చివరి నాటికి దేశంలో గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ స్టాక్ 81 కోట్ల చ.అ. చేరుకుంటుంది. ఏటేటా ఆఫీస్ స్పేస్ రంగంలో 30 శాతం వృద్ధి రేటు నమోదవుతుంది. కార్యాలయాల స్థలాలకు డిమాండ్ ఉన్నప్పటికీ.. నిర్మాణం పూర్తి చేసు కొని, మార్కెట్లో అందుబాటులోకి ఆఫీస్ స్పేస్ మాత్రం మందగమనంలో సాగుతోంది. ఈ ఏడాది 9 నెలల్లో కొత్తగా 3.26 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్ మార్కెట్లోకి వచ్చింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 12 శాతం తగ్గుదల. ఆఫీస్ స్పేస్ వేకన్సీ ఎక్కువగా ఉండటంతో ధరలు 15.5 శాతం మేర తగ్గాయి. -
హోమ్ లోన్‌పై నూరు శాతం పన్ను ప్రయోజనం..
న్యూఢిల్లీ: గృహ రుణాలకు చెల్లించే వడ్డీ మొత్తంపైనా ఆదాయపన్ను ప్రయోజనం కల్పించాలని రియల్టర్ల మండలి ‘క్రెడాయ్’ కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచన చేసింది. ఇలా చేయడం వల్ల అందుబాటు ధరల ఇళ్లు, మధ్య శ్రేణి ఇళ్ల అమ్మకాలకు డిమాండ్ పెరుగుతుందని పేర్కొంది.అలాగే, రూ.45 లక్షలుగా ఉన్న అందుబాటు ధరల ఇళ్ల నిర్వచనాన్ని రూ.75–80 లక్షలకు పెంచాలని కోరింది. క్రెడాయ్ 25వ వ్యవస్థాపక దినం సందర్భంగా ప్రెసిడెంట్ బొమన్ ఇరానీ మీడియాతో మాట్లాడారు. నిర్మాణంలోని రూ.75–80 లక్షల ధరల్లోని ఇళ్ల ప్రాజెక్టులకు ఒక శాతం జీఎస్టీని అమలు చేయాలని, తద్వారా డిమాండ్‌కు ఊతం లభిస్తుందని చెప్పారు. ప్రస్తుతం రూ.45 లక్షల ధరల్లోపు నిర్మాణంలోని ఇళ్లకే ఒక శాతం జీఎస్టీ అమల్లో ఉంది. ఇంతకుమించిన ఇళ్లకు 5 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. పైగా డెవలపర్లు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను పొందేందుకు వీల్లేదు.‘‘ఎప్పుడో 2017లో రూ.45 లక్షల్లోపు ఇళ్లను అందుబాటు ధరల ఇళ్లుగా నిర్ణయించారు. నాటి నుంచి వార్షిక ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని చూసినా, ఈ ధరల పరిమితి రూ.75–80లక్షలకు సవరించాల్సి ఉంది’’అని బొమన్ ఇరానీ పేర్కొన్నారు. ధరల పరిమితిని పెంచడం వల్ల కొనుగోలు దారులు తక్కువ జీఎస్టీ నుంచి ప్రయోజనం పొందుతారని చెప్పారు. మరో కీలక సూచన.. ఇక అందుబాటు ధరల ఇళ్లకు ఎలాంటి ధరల పరిమితి విధించొద్దని క్రెడాయ్ మరో కీలక సూచన చేసింది. దీనికి బదులు మెట్రోల్లో 60 మీటర్ల కార్పెట్ ఏరియా, నాన్ మెట్రోల్లో 90 మీటర్ల కార్పెట్ ఏరియాను అందుబాటు ధరలకు పరిమితిగా కొనసాగించాలని కోరింది. పన్ను తగ్గించడం ద్వారా వినియోగదారుల చేతుల్లో నిధులు మిగులు ఉండేలా చూడాలని బొమన్ ఇరానీ ప్రభుత్వానికి సూచించారు.ప్రస్తుతం గృహ రుణాలపై ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.2లక్షల వరకు వడ్డీ చెల్లింపులపై సెక్షన్ 24 కింద ఆదాయపన్ను మినహాయింపు ప్రయోజనం ఉండగా, దీని స్థానంలో చెల్లించిన వడ్డీ మొత్తానికి (నూరు శాతం) పన్ను మినహాయింపు ఇవ్వాలని క్రెడాయ్ నూతన ప్రెసిడెంట్‌గా ఎన్నికైన శేఖర్ పటేల్ కోరారు. నూరు శాతం పన్ను మినహాయింపు ఇవ్వడం డిమాండ్‌ను పెద్ద ఎత్తున పెంచుతుందని ఇరానీ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం నుంచి వివిధ రకాల ఆమోదాల కోసం 12–18 నెలల సమయం పడుతోందని, ఈ విషయంలో వ్యాపార సులభతర నిర్వహణకు వీలుగా చర్యలు తీసుకోవాలని క్రెడాయ్ చైర్మన్ మనోజ్ గౌర్ డిమాండ్ చేశారు. -
రియల్టీ బూమ్.. రూ. 35,000 కోట్ల ప్రాపర్టీల విక్రయం
న్యూఢిల్లీ: వర్షాలు, నియంత్రణ సంస్థల నుంచి పూర్తిగా అనుమతులు రాకపోవడం తదితర అంశాల కారణంగా 2024–25 రెండో త్రైమాసికంలో కాస్త ప్రతికూల ప్రభావం పడినా లిస్టెడ్ రియల్టీ దిగ్గజాల విక్రయాలు గణనీయంగా నమోదయ్యాయి. 26 సంస్థలు ఏకంగా రూ. 35,000 కోట్ల విలువ చేసే ప్రాపర్టీలను విక్రయించాయి.గోద్రెజ్ ప్రాపర్టీస్ అత్యధికంగా రూ. 5,198 కోట్ల బుకింగ్స్ నమోదు చేసింది. నియంత్రణ సంస్థలకు సమర్పించిన వివరాల ప్రకారం 26 దిగ్గజ సంస్థలు రూ. 34,985 కోట్ల ప్రాపర్టీలు విక్రయించాయి. అత్యధికంగా రెసిడెన్షియల్ సెగ్మెంట్లో ప్రీ–సేల్స్ నమోదయ్యాయి. లోధా బ్రాండ్‌పై కార్యకలాపాలు సాగించే ముంబైకి చెందిన మ్యాక్రోటెక్ డెవలపర్స్ రూ. 4,290 కోట్ల బుకింగ్స్ సాధించింది. ఢిల్లీ–ఎన్సీఆర్ (నేషనల్ క్యాపిటల్ రీజియన్) సంస్థ మ్యాక్స్ ఎస్టేట్స్ రూ. 4,100 కోట్లు, బెంగళూరు కంపెనీలు ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ రూ. 4,023 కోట్లు, సిగ్నేచర్ గ్లోబల్ రూ. 2,780 కోట్ల ప్రాజెక్టులు విక్రయించాయి.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ప్రాపర్టీ కొంటున్నారా? అయితే మీ కోసమే ఈ జాగ్రత్తలుఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో చాలా మటుకు రియల్టీ కంపెనీలు రూ. 500 – రూ. 1,000 కోట్ల అమ్మకాలు నమోదు చేశాయి. అయితే, తొలి త్రైమాసికంతో పోలిస్తే రెండో త్రైమాసికంలో కొన్ని సంస్థల విక్రయాలు నెమ్మదించాయి. మార్కెట్ క్యాపిటలైజేషన్‌పరంగా అగ్రస్థానంలో ఉన్న డీఎల్ఎఫ్ తొలి త్రైమాసికంలో రూ. 6,404 కోట్ల ప్రీ–సేల్స్ సాధించగా కొత్త ప్రాజెక్టులేమీ ప్రకటించకపోవడంతో రెండో త్రైమాసికంలో రూ. 692 కోట్లు మాత్రమే నమోదు చేసింది. -
ప్రాపర్టీస్ ధరలు తగ్గుతాయి!.. కారణం ఇదే
భారతదేశాన్ని వాయు కాలుష్యం మహమ్మారిలా పట్టి పీడిస్తోంది. ఈ సమయంలో జెరోధా కో-ఫౌండర్ 'నితిన్ కామత్' రియల్ ఎస్టేట్‌కు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఓ ట్వీట్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.నితిన్ కామత్ తన ఎక్స్ ఖాతాలో ఒక ఫోటోను షేర్ చేస్తూ.. వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాము. కింద కనిపిస్తున్నది 2019 వరకు డేటా. అయితే గత ఐదేళ్లలో పరిస్థితులు ఎంత దిగజారాయనిధి స్పష్టంగా కనిపిస్తోంది. వాయు కాలుష్యం కారణంగా భారతదేశంలో ప్రతి ఏటా లెక్కకు మించిన జనం ప్రాణాలు కోల్పోతున్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గాలి కాలుష్యం కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య అధికం.భూమిని కొనుగోలు చేసే ఎవరైనా గాలి, నీటి నాణ్యతను ఆస్తిగా భావించరు. కానీ గాలి, నీటి నాణ్యత అనేది ఆస్తి రేటును నిర్ణయిస్తుంది. నేను బెంగళూరులోని జేపీ నగర్లో ఆస్తిని కలిగి ఉన్నాను. ఇది ఇతర లేఅవుట్ల కంటే మంచి వాతావరణంలో ఉందని నితిన్ కామత్ పేర్కొన్నారు.దేశ రాజధాని అందరినీ ఆకర్శిస్తున్నప్పటీ.. అక్కడి వాతావరణం చాలా దుర్భర స్థితిలో ఉంది. ఇక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 412 కంటే ఎక్కువ ఉంది. దీన్ని బట్టి చూస్తే.. ఢిల్లీలో వాయు కాలుష్యం ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమైపోతోంది. అయితే నోయిడా, ఘజియాబాద్ వంటి ప్రాంతాల్లో గాలి నాణ్యత కొంత మెరుగ్గానే ఉంది.ఇదీ చదవండి: జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారు?.. ఇవి తెలుసుకోండిఢిల్లీ మాత్రమే కాకుండా.. ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరులో కూడా కాలుష్యం కొంత తీవ్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది. వాయు కాలుష్యం అనేది కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైన సమస్య కాదు. కాబట్టి దీనికోసం సమిష్టి పరిష్కారాలు అవసరం. లేకుంటే.. రాబోయే రోజుల్లో అభివృద్ధి చెందిన నగరాల్లో కూడా భూములు కొనుగోలు చేయడానికి ఎవరూ ఆసక్తి చూపరు. కాబట్టి రియల్ ఎస్టేట్ ధరలను కాలుష్యం నిర్ణయిస్తుందని నితిన్ కామత్ అన్నారు.You have to wonder what it will take for us to take air pollution more seriously. By the way, this data only covers until 2019, and things have only gotten worse in the last five years. Maybe a property price discount for the quality of air and water is the solution. If… pic.twitter.com/QtyzkqoG43— Nithin Kamath (@Nithin0dha) November 24, 2024 -
లోన్ పట్టు.. ఇల్లు కట్టు!
‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు’అన్నారు పెద్దలు. జీవితంలో ఆ రెండు ఘట్టాలు దాటిన వారు సప్త సముద్రాలు దాటినట్టే లెక్క. అయితే ఈ తరంలో ఇల్లు యజమాని కావడం అంటే ఆషామాషీ కాదు. అయినా కూడా సొంతింటి కల నెరవేర్చుకునేందుకు ఎన్నో ప్రయాసలు పడుతున్నారు. కలల సౌధం నిర్మించుకుని.. ఓ ఇంటి వాడయ్యేందుకు ప్రతిక్షణం కష్టపడుతున్నారు. - సాక్షి, హైదరాబాద్నగరాల్లో ఇండిపెండెంట్ ఇల్లు కట్టుకునే పరిస్థితి ఎప్పుడో పోయింది. కాస్తో కూస్తో.. కుదిరితే ఏ అపార్ట్‌మెంట్‌లోనో ఓ ఫ్లాట్ కొనుక్కుని బతుకు బండి లాగిద్దామనుకునే వారే ఎక్కువ మంది. దానికి కూడా కూడబెట్టుకున్న కాస్త డబ్బుకు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని కొత్తింట్లో అడుగుపెడుతున్నారు. తాజాగా నైట్ ఫ్రాంక్ అనే సంస్థ విడుదల చేసిన ‘బ్యాంకింగ్ ఆన్ బ్రిక్స్’అనే సర్వేలో కూడా ఇదే విషయం వెల్లడైంది.ఇదీ చదవండి: అద్దె అర లక్ష! హైదరాబాద్‌లో హడలెత్తిస్తున్న హౌస్ రెంట్79% రుణాలపైనే భారం దేశవ్యాప్తంగా నగరాల్లో సొంతింటి కల నెరవేర్చుకున్నవారిపై లండన్‌కు చెందిన నైట్ ఫ్రాంక్ సంస్థ ఓ సర్వే నిర్వహించింది. దాదాపు 1,629 మంది పాల్గొన్న ఈ సర్వేలో అనేక ఆసక్తికరమైన వివరాలు వెలుగులోకి వచ్చాయి. సర్వేలో పాల్గొన్నవారిలో దాదాపు 79 శాతం మంది ఇల్లు కొనుక్కునేందుకు బ్యాంకు రుణాన్ని ఆప్షన్‌గా ఎంచుకున్నట్టు తెలిపారు. 52 శాతం మంది అపార్ట్‌మెంట్స్‌లో ఫ్లాట్స్వైపు మొగ్గు చూపగా, 19 శాతం మంది స్టూడియో (చిన్నపాటి) అపార్ట్మెంట్లు, 17 శాతం మంది మాత్రం ఇండిపెండెంట్ ఇళ్లు కోరుకున్నారు. 7 శాతం మంది గేటెడ్ కమ్యూనిటీల్లో ఇల్లు కొనేందుకు, 5 శాతం మంది మాత్రం ఖాళీ భూమి కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపారు.సొంతిళ్లే కావాలి సర్వేలో పాల్గొన్నవారిలో 80 శాతం మంది తమకు సొంతిల్లు అవసరమని చెప్పారు. 19 శాతం మంది మాత్రం సొంతిల్లు కన్నా అద్దెకు ఉండటమే బెటర్ అని భావిస్తున్నారు. 1 శాతం మంది ఎటూ తేల్చుకోలేకపోయారు. సొంతిల్లు విషయంలో ఒక్కో తరాన్ని బట్టి ఒక్కో విధంగా ఆలోచనలు ఉన్నాయి. బేబీ బూమర్స్ (1946–1964 మధ్య పుట్టిన వారు) 79 శాతం మంది సొంతిల్లు ఉంటే బాగుంటుందని ఆలోచిస్తున్నారు. జెన్ ఎక్స్ (1965–1980 మధ్య పుట్టిన వారు)లో 80 శాతం మంది, మిలీనియల్స్ (1981–1996 మధ్య పుట్టినవారు)లో 82 శాతం మంది సొంతిల్లు కావాలని కోరుకుంటున్నారు. అయితే వెరైటీగా జెన్–జీ (1997–2012) మధ్య జన్మించిన వారిలో 71 శాతం సొంతిల్లు ఉండాలని భావిస్తుండగా, ఏకంగా 27 శాతం మంది అద్దె ఇంట్లో ఉంటేనే బెటర్ అని భావిస్తుండటం గమనార్హం.సొంతిల్లు ఎందుకంటే? సొంతిల్లు కావాలని చాలా మంది కోరుకుంటున్నా.. అందుకు కారణాలపై మాత్రం ఒక్కో తరం వారిలో ఒక్కో ఆలోచన ఉంది. బేబీ బూమర్స్ జెనరేషన్‌కు చెందినవారు ఇల్లు కొనుక్కోవడం అనేది ఓ పెట్టుబడిగా ఆలోచిస్తున్నారు. అదే మిలీనియల్స్ జెనరేషన్ వాళ్లు మాత్రం వారి సంపదను మరింత పెంచుకోవడంలో భాగంగా ఇల్లు కట్టుకుంటున్నారని సర్వేలో తేలింది. బేబీ బూమర్స్‌లో 29 శాతం మంది ఇల్లు కొనడాన్ని పెట్టుబడిగా భావిస్తే.. 15 శాతం మంది మాత్రం రిటైర్మెంట్ ప్లాన్‌గా కొనుగోలు చేస్తున్నట్టు పేర్కొన్నారు.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ప్రాపర్టీ కొంటున్నారా? అయితే మీ కోసమే ఈ జాగ్రత్తలుసర్వేలో పాల్గొన్న వారందరిలో 37 శాతం మంది ఉన్న ఇంటిని లగ్జరీ ఇళ్లుగా మార్చుకోవాలని భావిస్తున్నారు. ఒకప్పుడు ఈ ట్రెండ్ కొన్ని నగరాల్లోనే ఉండగా, ఇప్పుడు దేశంలోని ప్రథమ శ్రేణి నగరాలన్నింటిలో కనిపిస్తోంది. 32 శాతం మంది మాత్రం తొలిసారిగా ఇల్లు కొన్నామని, జీవితాంతం అదే గృహంలోనే ఉంటామని చెప్పారు. 25 శాతం మంది పెట్టుబడిగా కొనుక్కున్నామని, 7 శాతం మంది రిటైర్మెంట్, రెండో ఇల్లు ఉండాలని, వెకేషన్ కోసం అంటూ పలు కారణాల వల్ల ఇల్లు కొన్నామని వివరించారు.ప్రీమియం వైపు ఆలోచనలు..దేశంలో ఇల్లు కొనేవారి ఆలోచనల్లో మార్పులు వస్తున్నాయి. తాజాగా మేం జరిపిన అధ్యయనంలో కూడా ఇదే విషయం తేలింది. దాదాపు 80 శాతం మంది సొంతిల్లు కట్టుకోవాలని ఆలోచిస్తున్నారు. అర్బన్ ప్రాంతాల్లో ప్రీమియం, లగ్జరీ ఇళ్లు కట్టుకోవాలనే ట్రెండ్ పెరుగుతోంది. కేవలం దేశ ఆర్థిక వృద్ధి, జీడీపీ, ఉద్యోగ కల్పనకు మాత్రమే దేశ స్థిరాస్తి రంగం ఉపయోగపడదు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడమే కాకుండా కొనేవారి ప్రాధాన్యాలను కూడా అంచనా వేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. – శిశిర్ బైజల్, నైట్ ఫ్రాంక్ ఇండియా, చైర్మన్, ఎండీఇదీ చదవండి: థీమ్..హోమ్! ఇళ్ల నిర్మాణంలో సరికొత్త ట్రెండ్ -
హైదరాబాద్‌లో ప్రాపర్టీ కొంటున్నారా?
సాక్షి, సిటీబ్యూరో: రాజధాని చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్(ఓఆర్ఆర్) హద్దుగా జలవనరులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా) పేరు చెబితే ఇప్పుడు అందరూ ఉలిక్కిపడుతున్నారు. ఈ ప్రత్యేక విభాగం ఆపరేషన్స్ నేపథ్యంలో స్థిరాస్తి క్రయవిక్రయాలకు సంబంధించి సామాన్యుల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని కొన్ని విభాగాలతో పాటు కొందరు వ్యక్తులూ రెచ్చిపోతున్నారు. ఓ పక్క నోటీసులు, మరోపక్క బెదిరింపులతో తమ ‘పని’ పూర్తి చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ అంశాలను ‘సాక్షి’.. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ దృష్టికి తీసుకువెళ్లింది. వివరాలు ఆయన మాటల్లోనే.. అక్రమ నిర్మాణం అయినప్పటికీ ఇప్పటికే ప్రజలు నివసిస్తుంటే ఆ జనావాసాల జోలికి హైడ్రా వెళ్లదు. జలవనరుల పరిరక్షణలో భాగంగా కొత్తగా నిర్మిస్తున్న వాటిపైనే చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వం సామాన్యుడికి అండగా నిలవాలనే స్పష్టం చేస్తోంది. ఎవరైనా ప్లాట్, ఫ్లాట్ ఖరీదు చేసుకునే ముందు దానికి సంబంధించిన వివరాలు సరిచూసుకోండి. నగరంలోని అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం కుంట, చెరువు కనిపించకపోయినప్పటికీ ఒకప్పుడు అక్కడ ఉండొచ్చు. ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం అక్కడ జలవనరు ఉన్నట్లు రికార్డు ఉంటుంది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న పట్టాభూములు సైతం కేవలం వ్యవసాయం చేసుకోవడానికి ఉద్దేశించినవి. ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు, ఈ భూములు క్రయవిక్రయాలు చేయకూడదు.రాజధానిలోని భూములకు సంబంధించిన సమగ్ర వివరాలు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌కి (ఎన్ఆర్ఎస్సీ) ఆధీనంలోని భువన్, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ధరణి వెబ్సైట్లలో, జలవనరులకు సంబంధించిన వివరాలు హెచ్ఎండీఏ లేక్స్ వెబ్‌సైట్స్‌లో ఉంటాయి. వీటితో పాటు రెవెన్యూ రికార్డులను సైతం సరిచూసుకున్న తర్వాతే క్రయవిక్రయాల విషయంలో ముందుకు వెళ్లాలి. రాజధానిలో ఎక్కడైనా స్థిరాస్తి కొనుగోలు చేసేప్పుడు మరికొన్ని అంశాలనూ సరిచూసుకోండి. ఆ నిర్మాణానికి అనుమతులు ఉన్నాయా? అవి ఇవ్వాల్సిన విభాగాలే ఇచ్చినవి సక్రమ అనుమతులేనా? ఆ అనుమతుల్ని రద్దు చేయడం వంటివి జరిగాయా? కోర్టు వివాదాలు ఉన్నాయా? అనేవి చూసుకోండి. కొన్ని నిర్మాణాలకు హెచ్ఎండీఏకు బదులు పంచాయితీ సెక్రటరీ, ఆర్ఐలు అనుమతులు మంజూరు చేసిన ఉదంతాలు ఉన్నాయి. లేఅవుట్లలో ఉన్న కామన్ ఏరియాలు, పార్కులు, రహదారులు సైతం కాలక్రమంలో ఆక్రమణలకు గురవుతున్నాయి. కేవలం రికార్డుల్లో మాత్రమే ఇవి ఉంటూ.. వాస్తవంలో కనుమరుగు అవుతున్నాయి. ఈ విషయాన్ని హైడ్రా సీరియస్‌గా తీసుకుంటోంది. ఇలా ఆక్రమణలకు గురైన వాటినీ పునరుద్ధరిస్తుంది. వీటిని పరిరక్షించడం కోసం నిర్దిష్ట విధానాన్ని రూపొందించింది. -
థీమ్..హోమ్! ఇళ్ల నిర్మాణంలో సరికొత్త ట్రెండ్
సాక్షి, సిటీబ్యూరో: మార్పు అనివార్యం.. జీవనశైలిలోనైనా, నిర్మాణ శైలిలోనైనా.. కాలానుగుణంగా అభిరుచులను, అవసరాలను తీర్చే వాటికి ఎవరైనా జై కొడతారు. వినూత్న నిర్మాణ శైలి, విలాసవంతం, ఆధునికత నగర గృహ నిర్మాణ రంగంలో ఇప్పుడిదే ట్రెండ్ కొనసాగుతోంది. లగ్జరీ వసతులు, ఇంటీరియర్ మాత్రమే కాదు డిజైనింగ్, ఆర్కిటెక్చర్ నుంచే ప్రత్యేకత కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే థీమ్ బేస్డ్ హోమ్స్ ట్రెండ్‌గా మారిపోయాయి.థీమ్ ఆధారిత నిర్మాణాలు కొత్తదేమీ కాదు. పురాతన కాలంలో రాజ భవనాలు, రాజ ప్రాసాదాలు, కోటలు, గోపురాలను దైవం, వాస్తు, శిల్పం వంటి ఇతివృత్తంగా ఆయా నిర్మాణాలు ఉండేవి. వాటికే డెవలపర్లు ఆధునికతను జోడించి గృహ సముదాయాల స్థాయికి తీసుకొచ్చేశారు. సాధారణంగా థీమ్ బేస్డ్ రిసార్ట్లు, హోటళ్లు, పార్క్‌లు ఉంటాయి. కానీ, ఇప్పుడు మెట్రో నగరాల్లో లగ్జరీ అపార్ట్మెంట్లు, విల్లాలు, క్లబ్ హౌస్‌లను ఈ తరహాలో నిర్మిస్తున్నారు.థీమ్ బేస్డ్ అంటే? స్పోర్ట్స్, డిస్నీ, హెల్త్ అండ్ వెల్నెస్, గోల్ఫ్, ఈజిప్టియన్, అరబిక్, స్పానిష్, రోమన్ వంటి ఏదైనా ఇతివృతం ఆధారంగా నిర్మించే నివాస సముదాయాలనే థీమ్ బేస్డ్ హోమ్స్ అంటారు. ఒకే రకమైన అభిరుచులు, ఆసక్తులు ఉన్న నివాసితులు ఒకే గృహ సముదాయంలో ఉండటమే వీటి ప్రత్యేకత. దీంతో నివాసితుల జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. అద్భుతమైన శిల్పా లు, విశాలమైన ద్వారాలు, కిటికీలు, అందమైన మంటపాలు, గ్రాండ్ గ్యాలరీ, ఆహ్లాదకరమైన పచ్చదనంతో ఉంటాయి.అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోనే.. కొనుగోలుదారుల అభిరుచులు, అవసరాలకు అనుగుణంగా థీమ్ ఆధారిత గృహాలను నిర్మించేందుకు డెవలపర్లు ముందుకు వస్తున్నారు. అపార్ట్మెంట్లు, విల్లాలు, క్లబ్ హౌస్‌లను కూడా థీమ్ ఆధారంగానే నిర్మిస్తున్నారు. పౌలోమి ఎస్టేట్స్, సుచిరిండియా, రాంకీ, గిరిధారి హోమ్స్ వంటి పలు నిర్మాణ సంస్థలు ఈ తరహా ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నాయి. కోకాపేట, తెల్లాపూర్, నల్లగండ్ల, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కొల్లూరు, మాదాపూర్ వంటి అన్ని రకాల మౌలిక వసతులతో అభివృద్ధి చెందిన ప్రాంతాలలో ఎక్కువగా నిర్మిస్తున్నారు.మౌలిక వసతులూ మెరుగ్గానే.. గృహ కొనుగోలుదారుల అభిరుచులు మారిపోయాయి. స్విమ్మింగ్ పూల్, జిమ్, పార్క్, క్లబ్ హౌస్ వంటి సౌకర్యాలను విలాసవంతమైన వసతులుగా పరిగణించడం లేదు. అంతకుమించి ఆధునికతను కావాలంటున్నారు. ఒక వసతుల విషయంలోనే కాదు ప్రాజెక్ట్ డిజైనింగ్, ఆర్కిటెక్చర్ అన్నింట్లోనూ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని భావిస్తున్నారు. ప్రత్యేకత లేదో ప్రాజెక్ట్‌ను ఎంపిక చేయడం లేదు. మెరుగైన మౌలిక వసతులు, అన్ని రకాల రవాణా సదుపాయాలు, విస్తీర్ణమైన స్థలం ఉన్న ప్రాంతాల థీమ్ బేస్డ్ ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి సరైనవి.థీమ్ బేస్ట్ ప్రాజెక్ట్‌లను ఆర్కిటెక్చర్, కల్చర్, లైఫ్ స్టయిల్ మూడు రకాలుగా వర్గీకరిస్తారు.1. ఆర్కిటెక్చర్: ఈ భవన నిర్మాణాల శైలి వినూత్నంగా ఉంటాయి. ఈ తరహా నిర్మాణ శైలిని ప్రపంచ దేశాల్లోని చరిత్రలో వివిధ కాల వ్యవధుల్లో వచ్చిన నిర్మాణాలను ప్రేరణగా తీసుకొని ఆర్కిటెక్చర్ డిజైనింగ్‌ను రూపొందిస్తారు. ఈ తరహా భవన నిర్మాణాలు సమగ్రత్తను నిర్ధారించడంతో పాటు ఫ్యాషన్ సింబల్‌గా మారాయి. ఉదాహరణ: ఇండో సార్సెనిక్, గోతిక్ అండ్ విక్టోరియన్, మొగల్స్, ఈజిప్టియన్, అరబిక్, స్పానిష్, రోమన్, మొరాకన్ ఆర్కిటెక్చర్ నిర్మాణాలు.2. కల్చర్: ప్రపంచంలోని వివిధ సంస్కృతులను ప్రతిబింబించేలా ఈ నివాస సముదాయాలు ఉంటాయి. ఉదాహరణకు: డెన్మార్క్, నార్వే, స్వీడన్ వంటి స్కాండినేవియన్ దేశాల్లో గృహాల డిజైన్లు ప్రకృతిని పెంపొందించేలా, జపనీయుల హోమ్స్ మినిమలిస్టిక్ డిజైన్లను అవలంభిస్తుంటారు. భారతీయులు చైతన్యపరిచే గృహాలను ఇష్టపడుతుంటారు.3. లైఫ్ స్టయిల్: కొనుగోలుదారుల జీవనశైలి, అవసరాలు, అభిరుచులకు తగ్గట్టుగా నిర్మించే కస్టమైజ్డ్ గృహాలివీ. ఈ ప్రాజెక్ట్‌లలో గ్రీనరీకి అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో ధారాళమైన గాలి, వెలుతురుతో ఇట్టే ఆకట్టుకుంటాయి.ఉదాహరణకు: స్పోర్ట్స్ టౌన్‌షిప్‌లు, డిస్నీ, చిల్డ్రన్ సెంట్రిక్ హోమ్స్, హెల్త్ అండ్ వెల్నెస్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లు వంటివి. -
అద్దె అర లక్ష! హైదరాబాద్‌లో హడలెత్తిస్తున్న హౌస్ రెంట్
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నగరంలో అద్దెలు హడలెత్తిస్తున్నాయి. మూడు నెలల్లో కిరాయిలు 1–4 శాతం మేర పెరిగాయి. ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో, ఆఫీసులకు దగ్గరగా ఉన్న చోట, అలాగే మెట్రో కనెక్టివిటీ, ఇతర రవాణా సదుపాయాలు మెరుగ్గా ఉన్న ప్రాంతాల్లో నెలవారీ అద్దెలు ఎక్కువగా వృద్ధి చెందుతున్నాయని అనరాక్ అధ్యయనంలో వెల్లడైంది.ప్రస్తుతం హైదరాబాద్‌లో 1000-1,300 చదరపు అడుగుల 2 బీహెచ్‌కే ఫ్లాట్ ధరలను పరిశీలిస్తే.. కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, జూబ్లీహిల్స్, కొండాపూర్ వంటి ప్రాంతాలలో నెలవారీ అద్దె అర లక్ష రూపాయలకు పైగానే ఉంటోంది. -
రియల్ ఎస్టేట్‌లో ఈక్విటీ పెట్టుబడుల జోరు
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ రంగంలో దేశంలో ప్రస్తుత సంవత్సరం ఈక్విటీ పెట్టుబడులు 49 శాతం పెరిగి 11 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని పరిశ్రమల సమాఖ్య సీఐఐ, రియల్టీ కన్సల్టెంట్ సీబీఆర్ఈ నివేదిక తెలిపింది. ఆస్తులకు బలమైన డిమాండ్ ఈ స్థాయి జోరుకు కారణమని వివరించింది.‘2023లో ఈక్విటీ పెట్టుబడులు ఈ రంగంలో 7.4 బిలియన్ డాలర్లు. ఈక్విటీ మూలధన ప్రవాహం 2024 జనవరి–సెప్టెంబర్ మధ్య 8.9 బిలియన్ డాలర్లకు చేరుకుంది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 46 శాతం వృద్ధిని నమోదు చేసింది. రియల్ ఎస్టేట్ రంగంలో 2024లో మొత్తం ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ మొదటిసారిగా 10 బిలియన్ డాలర్లను అధిగమించి కొత్త రికార్డును నమోదు చేయబోతున్నాయి. నిర్మాణం పూర్తి అయిన ఆఫీస్ అసెట్స్‌లో పెట్టుబడుల పునరుద్ధరణ, రెసిడెన్షియల్ విభాగంలో స్థలాల కోసం బలమైన డిమాండ్‌తో ప్రస్తుత సంవత్సరం మొత్తం ఈక్విటీ పెట్టుబడులు 10–11 బిలియన్ డాలర్ల శ్రేణిలో ఉంటాయి.2024 జనవరి–సెప్టెంబర్ మధ్య పరిశ్రమ అందుకున్న నిధుల్లో విదేశీ ఇన్వెస్టర్ల వాటా 3.1 బిలియన్ డాలర్లు ఉంది. ఇందులో ఉత్తర అమెరికా, సింగపూర్ ఇన్వెస్టర్లు 85 శాతం సమకూర్చారు. సెబీ యొక్క ఎస్ఎం–ఆర్ఈఐటీ ఫ్రేమ్‌వర్క్‌తో ద్వితీయ శ్రేణి నగరాల్లో అధిక నాణ్యత గల చిన్న స్థాయి ఆస్తులు కూడా వ్యూహా త్మక మూలధన విస్తరణకు కొత్త మార్గాలను అందజేస్తాయి’ అని నివేదిక వివరించింది. -
ఒక్క నెలలో రూ.3,617 కోట్ల ఇళ్ల అమ్మకాలు
హైదరాబాద్‌లో అక్టోబర్ నెలలో ఇళ్ల అమ్మకాలు పెరిగినట్లు నైట్‌ఫ్రాంక్ నివేదించింది. మొత్తం 5,894 ఇళ్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ నమోదైనట్లు పేర్కొంది. వాటి విలువ సమారు రూ.3,617 కోట్లు ఉంటుందని తెలిపింది. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో ప్రైమరీ, సెకండరీ రియల్ ఎస్టేట్ మార్కెట్లను పరిగణనలోకి తీసుకొని ఈ రిపోర్ట్ తయారు చేసినట్లు నైట్‌ఫ్రాంక్ తెలిపింది.నైట్‌ఫ్రాంక్ నివేదిక ప్రకారంహైదరాబాద్‌లో అక్టోబర్ 2024లో మొత్తం రూ.3,617 కోట్ల ఇళ్లు అమ్మకాలు జరిగాయి. ఇది గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 14%, ఈ ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే 28% వృద్ధి కనబరిచింది.అక్టోబర్‌లో మొత్తం 5,894 యూనిట్ల ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇది ఏడాదివారీగా 2%, నెలవారీగా 20% పెరుగుదల నమోదు చేసింది.సెప్టెంబర్ 17-అక్టోబర్ 2, 2024 తర్వాత రిజిస్ట్రేషన్లు పుంజుకున్నాయి.ఇదీ చదవండి: అధిక వడ్డీ కావాలా? ఇది మీ కోసమే!హైదరాబాద్‌లో రూ.50 లక్షల లోపు విలువ చేసే ఆస్తుల రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరుగుతుంటాయి. కానీ ఇటీవల రూ .ఒక కోటి లేదా అంతకంటే ఎక్కువ ధర కలిగిన గృహాల అమ్మకాలు పెరుగుతున్నాయి.ప్రీమియం ఇళ్ల విక్రయాల వాటా అక్టోబర్ 2024లో 10% నుంచి 14%కి పెరిగింది. రూ.కోటి పైబడిన ఇళ్ల రిజిస్ట్రేషన్లు ఏడాది ప్రాతిపదికన 36 శాతం పెరిగాయి.జనవరి-అక్టోబర్ మధ్యకాలంలో రిజిస్ట్రేషన్ జరిగిన మొత్తం ఇళ్ల సంఖ్య 65,280. ఇది ఏడాది ప్రాతిపదికన 12 శాతం పెరుగుదలను నమోదు చేసింది.జనవరి-అక్టోబర్ మధ్యకాలంలో రూ.40,078 కోట్ల విలువై ఇళ్ల విక్రయాలు జరిగాయి. ఇది ఏడాది ప్రాతిపదికన 32 శాతం అధికం. -
హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్‌కు కొరత
న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో కార్యాలయ వసతులకు (ఆఫీస్ స్పేస్) సంబంధించి కొత్త సరఫరా 25 శాతం తగ్గి 4.10 మిలియన్ చదరపు అడుగులకు (ఎస్ఎఫ్టీ) పరిమితమైంది. స్థూల లీజింగ్ సైతం 25 శాతం తగ్గి 2.79 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా నమోదైంది. దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లోనూ కొత్త కార్యాలయ వసతుల సరఫరా జూలై–సెప్టెంబర్ కాలంలో 4 శాతం మేర తగ్గి 12.8 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. ఇదే కాలంలో ఏడు నగరాల పరిధిలో ప్రైమ్ వర్క్‌స్పేస్ (ప్రధాన ప్రాంతాల్లో) స్థూల లీజింగ్ 17 శాతం పెరిగి 18.61 మిలియన్ ఎస్ఎఫ్టీలకు చేరింది. ఈ వివరాలను రియల్టీ కన్సల్టెంట్ ‘వెస్టియన్’ విడుదల చేసింది. నగరాల వారీ వివరాలు.. → బెంగళూరులో ఆఫీస్ స్పేస్ కొత్త సరఫరా 33 శాతం పెరిగి 3.60 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరింది. ఇక్కడ లీజింగ్ 84 శాతం పెరిగి 6.63 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. → ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో సరఫరా 360 శాతం అధికమై 2.3 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా నమోదైంది. స్థూల లీజింగ్ 17 శాతం వృద్ధితో 1.49 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరింది. → పుణెలో ఆఫీస్ వసతుల సరఫరా 26 శాతం తగ్గి 1.4 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. ఇక్కడ ఆఫీస్ స్పేస్ లీజింగ్ 112 శాతం పెరిగి 2.33 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరింది. → ముంబైలో కొత్త సరఫరా 0.90 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. స్థూల లీజింగ్ 2 శాతం తగ్గి 2.25 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. → చెన్నైలో తాజా ఆఫీసు వసతుల సరఫరా 58 శాతం తగ్గి 0.5 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా నమోదైంది. లీజింగ్ పరంగా పెద్ద మార్పు లేకుండా 2.01 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. → కోల్‌కతాలో గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ విభాగంలో సెప్టెంబర్ క్వార్టర్లో తాజా సరఫరా లేదు. ఆఫీస్ స్పేస్ లీజింగ్ 45 శాతం తక్కువగా 0.11 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా నమోదైంది. → బీఎఫ్ఎస్ఐ, ఫ్లెక్సిబుల్ స్పేస్ ఆపరేటర్లు ఆఫీస్ స్పేస్ డిమాండ్ కీలక చోదకాలుగా ఉన్నట్టు వెస్టియన్ తెలిపింది. వేగంగా వృద్ధి చెందుతున్న భాగ్యనగరం దేశ వ్యాప్తంగా ఆరు ప్రముఖ నగరాల్లో వేగంగా వృద్ధి చెందుతున్న నగరంగా హైదరాబాద్‌కు మొదటి స్థానం దక్కింది. పరిపాలన, సామాజిక ఆర్థిక అంశాలు, రియల్ ఎస్టేట్, మౌలిక వసతుల ఆధారంగా నైట్‌ఫ్రాంక్ ఇండియా ఈ విషయాన్ని ప్రకటించింది. వివిధ వృద్ది అంశాల ఆధారంగా ఆరు ప్రధాన నగరాల పనితీరును నైట్‌ఫ్రాంక్ విశ్లేషించింది. ‘‘వీటిల్లో హైదరాబాద్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది. బలమైన మౌలిక వసతుల అభివృద్ధి, రియల్ ఎస్టేట్ డిమాండ్ పెరగడం, అల్ట్రా హెచ్ఎన్ఐలు(అధిక ధనవంతులు), హెచ్ఐఎన్ల జనాభా పెరుగుదల, చురుకైన విధానాలు సామాజిక ఆర్థిక పరపతిని పెంచుతున్నాయి’’ అని నైట్‌ఫ్రాంక్ నివేదిక పేర్కొంది. అద్భుతమైన నిపుణుల లభ్యత, వ్యాపార నిర్వహణకు ఉన్న అనుకూలతలతో బెంగళూరు అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రెండో నగరంగా నిలిచింది. ముంబై ఎప్పటి మాదిరే అన్ని అంశాల్లో స్థిరమైన పురోగతి చూపించింది. దేశ ఆర్థిక రాజధాని హోదాను కాపాడుకుంది. విడిగా చూస్తే గొప్ప మౌలిక వసతులు, పరిపాలన పరంగా ఢిల్లీ ఎన్సీఆర్కు టాప్ ర్యాంక్ దక్కింది. సామాజిక ఆర్థిక అంశాల పరంగా బెంగళూరు ముందంజలో ఉంది. రియల్ ఎస్టేట్ వృద్ధి పరంగా హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. -
ఆ రంగంలో హైదరాబాద్ టాప్: ఆ తరువాతే అన్నీ..
భారతదేశంలో విభిన్న రంగాల్లో (ఆర్థిక పరిస్థితులు, రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాలు, పాలన) వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన నగరాల జాబితాను నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడించింది. రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్, ఆర్థిక రంగంలో బెంగళూరు, పాలన, మౌలిక సదుపాయాలలో ఢిల్లీ మొదటి స్థానంలో ఉన్నాయి.➤రియల్ ఎస్టేట్ విభాగంలో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంది. ఆ తరువాత బెంగళూరు, ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్, చెన్నై ఉన్నాయి. హైదరాబాద్‌లో అపార్ట్మెంట్లకు, ఇతర స్థలాలకు మంచి డిమాండ్ ఉంది. గతంలో పోలిస్తే ఇక్కడ ధరలు కూడా 11 శాతం పెరిగాయి.➤ఆర్థిక పరిస్థితుల పరంగా బెంగళూరు మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాత హైదరాబాద్, ముంబై, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్ ఉన్నాయి. అత్యధిక శ్రామిక శక్తి కలిగిన నగరాల్లో బెంగళూరు టాప్‌లో ఉంది. బెంగళూరులో వ్యాపార కార్యకలాపాలు అధికంగా జరుగుతాయి.➤భౌతిక మౌలిక సదుపాయాల విషయానికి వచ్చేసరికి హైదరాబాద్ రెండో స్థానంలోనూ.. ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాత ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్, చెన్నై ఉన్నాయి. భారతదేశపు అతిపెద్ద మెట్రో నెట్వర్క్ కలిగి ఢిల్లీ మెట్రో రోజువారీ ప్రయాణీకుల సంఖ్య 68 లక్షల కంటే ఎక్కువే.➤ఇక చివరిగా పాలన విషయానికి వస్తే.. ఈ విభాగంలో కూడా ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాత స్థానాల్లో హైదరాబాద్, అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై ఉన్నాయి. ఢిల్లీ గవర్నమెంట్ సర్వీసెస్ పోర్టల్ వంటి ఢిల్లీ ఈ గవర్నెన్స్ కార్యక్రమాలు, మెరుగైన పబ్లిక్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయని నివేదికలో వెల్లడైంది. -
సెలబ్రిటీలు కూడా కొనలేకపోతున్న ఇల్లు ఇది!
సాధారణంగా వ్యాపార ప్రముఖులు, బాలీవుడ్ సెలబ్రిటీలు ఖరీదైన ఇళ్లు కొంటూ వార్తల్లో నిలుస్తుంటారు. కానీ ముంబైలోని ఒక పెంట్‌హౌస్ వార్తల్లో నిలిచింది. రూ.120 కోట్లకు అమ్మకానికి పెట్టిన ఈ ఇంటికి ‘అర్హులైన’ కొనుగోలుదారు దొరకడం లేదు. చాలా మంది సెలబ్రిటీలు రూ.కోట్లు పెట్టి కొనడానికి ముందుకు వచ్చినా ఓనర్ వారికి అమ్మడం లేదు.వన్ అవిఘ్నా పార్క్ 60వ అంతస్తులో ఉన్న విశాలమైన 16,000 చదరపు అడుగుల ఈ పెంట్ హౌస్ గ్లాస్-వాల్డ్ ఎలివేటర్, రూఫ్‌టాప్ పూల్, జిమ్, ఆరు బెడ్రూమ్లు, ఎనిమిది వాహనాల వరకు పార్కింగ్ వంటి అనేక విలాసవంతమైన ఫీచర్లను అందిస్తుంది. అద్భుతమైన ఆఫర్లు ఉన్నప్పటికీ, యజమాని కఠినమైన ఎంపిక ప్రమాణాల కారణంగా కొనుగోలుదారు దొరకడం లేదు.డబ్బుకు మించి..బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. ఈ ఇంటి అమ్మకం లక్ష్యం కేవలం డబ్బు మాత్రమే కాదని పెంట్ హౌస్ యజమాని, భవనాన్ని అభివృద్ధి చేసిన రియల్ ఎస్టేట్ కంపెనీకి అధిపతి కూడా అయిన నిశాంత్ అగర్వాల్ చెబుతున్నారు. “ఈ ఇంటిని కేవలం డబ్బుతో కొనలేరు. కొనుగోలుదారు సరైన వ్యక్తి అని మేము నిర్ధారించుకోవాలి" అని అగర్వాల్ వివరించారు.సేల్‌ను పర్యవేక్షించేందుకు, ప్రముఖ రియల్ ఎస్టేట్ బ్రోకర్ రవి కేవల్రమణితో సహా ఉన్నత స్థాయి బృందం ఏర్పాటు చేశారు. కొనుగోలుదారుల ఆర్థిక స్థితి, సమాజంలో ప్రతిష్టతోపాటు వారి నేపథ్యాన్ని సమగ్రంగా తనిఖీ చేస్తారు. ఇందు కోసం కొనుగోలుదారుల ఆఫీస్‌లను సైతం సందర్శించాలని ఏజెంట్లకు సూచనలు ఉండటం గమనార్హం.స్క్రీనింగ్‌లో ఫెయిల్బాలీవుడ్ సెలబ్రిటీలు సహా డజన్ల కొద్దీ ప్రముఖులు పెంట్ హౌస్ కొనుగోలుపై ఆసక్తి చూపినప్పటికీ, యజమాని నిర్ణయించిన కఠినమైన అర్హతలను ఎవరూ అందుకోలేకపోతున్నారు. పరిశ్రమలోని కొన్ని పెద్ద స్టార్స్ కూడా స్క్రీనింగ్ ప్రక్రియలో అర్హత సాధించలేదని కేవల్రమణి తెలిపారు. "మేము పొరుగువారితో బాగా కలిసిపోయే కుటుంబాన్ని కోరుకుంటున్నాము. వినయంతోపాటు తమ సంపదను చాటుకోని గుణం ఉన్నవారు కావాలి" అని ఆయన చెప్పారు.ఒకవేళ తాము కోరుకుంటున్న సరైన కొనుగోలుదారు రాకపోతే నెలకు రూ.40 లక్షలకు ఈ పెంట్‌హౌస్‌ను అద్దెకు ఇవ్వాలని యాజమాన్యం యోచిస్తోంది. అయితే అద్దెకు వచ్చేవారికి కూడా అదే కఠినమైన పరిశీలన ప్రక్రియ వర్తిస్తుంది. View this post on Instagram A post shared by Ravi Kewalramani (@rk.ravikewalramani) -
రాజధానిలో ఇళ్ల ధరలు రెట్టింపు..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ప్రాంతమైన గురుగ్రామ్, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్ (ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతం) పరిధిలో గడిచిన ఐదేళ్ల కాలంలో కొత్త ప్రాజెక్టుల్లోని ఇళ్ల ధరలు సగటున రెట్టింపైనట్టు రియల్ ఎస్టేట్ డేటా అనలైటిక్ సంస్థ ప్రాప్ ఈక్విటీ తెలిపింది. 2019 నుంచి 2024 సెప్టెంబర్ మధ్య కాలంలో నోయిడాలో అత్యధికంగా చదరపు అడుగు (ఎస్ఎఫ్టీ) ధర 152 శాతం మేర పెరిగి రూ.5,910 నుంచి రూ.14,946కు చేరింది.ఘజియాబాద్‌లో 139 శాతం పెరిగి రూ.3,691 నుంచి రూ.8,823కు చేరింది. గురుగ్రామ్‌లో ఎస్ఎఫ్టీ ధర రూ.19,535కు చేరింది. 2019లో ఉన్న రూ.8,299తో పోల్చి చూస్తే 135 శాతం పెరిగింది. గ్రేటర్ నోయిడాలో చదరపు అడుగు ధర 121 శాతం పెరిగి రూ.8,601గా ఉంది. 2019లో ఇక్కడ చదరపు అడుగు రేటు రూ.3,900గా ఉంది. -
హైదరాబాద్‌లో రియల్టీ జోరు!
హైదరాబాద్‌లో గృహ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. దేశంలోని ఏడు మెట్రో నగరాల్లోని ఇళ్ల అమ్మకాల్లో హైదరాబాద్ వాటా 12 శాతంగా ఉంది. ఈ ఏడాది జూలై–సెప్టెంబర్(క్యూ3)లో నగరంలో 12,700 గృహాలు అమ్ముడుపోగా.. 13,900 యూనిట్లు సిద్ధం అయ్యాయి. క్యూ2తో పోలిస్తే విక్రయాలు 16 శాతం క్షీణించగా.. కొత్తగా సిద్ధమైనవి ఒక శాతం పెరిగాయని అనరాక్ తాజా అధ్యయనం వెల్లడించింది.గృహ విక్రయాల్లో పశ్చిమ హైదరాబాద్ హవా కొనసాగుతోంది. క్యూ3లో అమ్ముడైన ఇళ్లలో 53 శాతం వెస్ట్ జోన్లోనే జరిగాయి. ఆ తర్వాత నార్త్‌లో 28 శాతం, సౌత్‌లో 13 శాతం, ఈస్ట్‌లో 4 శాతం, సెంట్రల్ హైదరాబాద్‌లో ఒక శాతం విక్రయాలు జరిగాయి. నగరంలో అపార్ట్మెంట్ల చదరపు అడుగు ధర సగటున రూ.7,150లుగా ఉన్నాయి.లక్ష దాటిన ఇన్వెంటరీ..హైదరాబాద్‌లో తొలిసారిగా ఇన్వెంటరీ లక్ష యూనిట్లను దాటింది. ఈ ఏడాది మూడో త్రైమాసికం నాటికి నగరంలో 1.01 లక్షల గృహాల ఇన్వెంటరీ ఉంది. దేశంలోని ఇన్వెంటరీలో 18 శాతం నగరానిదే. అత్యధికంగా పశ్చిమ హైదరాబాద్‌లో 60 శాతం, నార్త్‌లో 25 శాతం ఇన్వెంటరీ ఉంది.3–5 శాతం ధరల వృద్ధి..నగరంలో మూడు నెలల్లో గృహాల అద్దెలు 1–4 శాతం, అపార్ట్మెంట్లలో చదరపు అడుగుకు ధరలు 3–5 శాతం మేర పెరిగాయి. ఆదిభట్లలో చ.అ. ధర సగటు రూ.4,650, ఎల్బీనగర్లో రూ.6,800, మియాపూర్‌లో 6,700, కొండాపూర్‌లో రూ.8,600, గచ్చిబౌలీలో రూ.8,900లుగా ఉన్నాయి. ఇక అద్దెలు డబుల్, ట్రిపుల్ బెడ్ రూమ్‌లకు నెలకు ఆయా ప్రాంతాల్లో రూ.14 వేల నుంచి రూ.42 వేలుగా ఉన్నాయి.ఇదీ చదవండి: మెటాపై రూ.6,972 కోట్ల జరిమానా!లగ్జరీ గృహాలే ఎక్కువ..నగరంలో క్యూ3లో 13,900 యూనిట్లు సిద్ధం కాగా.. లగ్జరీ గృహాలు అత్యధికంగా ఉన్నాయి. రూ.1.5 కోట్లకు పైగా ధర ఉన్న ప్రీమియం ఇళ్ల వాటా 60 శాతంగా ఉంది. విభాగాల వారీగా చూస్తే.. రూ.40–80 లక్షల ధర ఉన్న గృహాల వాటా మూడు శాతం, రూ.80 లక్షల నుంచి రూ.1.5 కోట్ల ఉన్న యూనిట్ల వాటా 37%, రూ.1.5–2.5 కోట్ల ధర ఉన్న ఇళ్ల వాటా 40%, రెండున్నర కోట్ల కంటే ఎక్కువ ధర ఉన్న యూనిట్ల వాటా 20 శాతంగా ఉంది. -
నెలలో 5.9 శాతం తగ్గిన ఇళ్ల ధరలు!
చైనాలో కొత్త ఇళ్ల ధరలు భారీగా తగ్గుతున్నాయి. గతేడాది అక్టోబర్ నెలతో పోలిస్తే ఈసారి గృహాల ధరలు 5.9 శాతం క్షీణించాయి. అంతకుముందు సెప్టెంబర్‌లో ఇది 5.8 శాతం పడిపోయింది. వరుసగా గత 16 నెలల నుంచి కొత్త ఇళ్ల ధరలు తగ్గుతుండడం గమనార్హం. 2015 అక్టోబర్ నెలతో పోలిస్తే ఏడాది ప్రాతిపదికన గత తొమ్మిదేళ్లుగా వీటి ధరలు భారీగా తగ్గిపోతున్నాయి. అయితే చైనా ప్రభుత్వం వీటి ధరలను స్థిరీకరించేందుకు ప్రయత్నిస్తుందని నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (ఎన్బీఎస్) డేటా ఆధారంగా రాయిటర్స్ నివేదించింది.ఎన్బీఎస్ తెలిపిన వివరాల ప్రకారం.. చైనాలోని ప్రధాన నగరాలతోపాటు టైర్ 2, టైర్ 3 పట్టణాల్లోనూ రియల్ఎస్టేట్ వ్యాపారం భారీగా తగ్గిపోయింది. దాంతో కొత్త ఇళ్ల ధరలు క్షీణిస్తున్నాయి. అయితే సమీప భవిష్యత్తులో ఇది మారనుంది. రానున్న రోజుల్లో గృహాల ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఉందని 75.9% మంది అభిప్రాయపడుతున్నారు. ఇటీవల చేసిన సర్వేలో 70 నగరాల్లో కేవలం మూడింటిలో మాత్రమే అక్టోబర్ నెలలో గృహాల ధరలు పెరిగాయి.ఇదీ చదవండి: మరిన్ని జిల్లాల్లో ‘తప్పనిసరి హాల్‌మార్కింగ్’చైనాలోనే అతిపెద్ద కంపెనీగా పేరున్న రియల్ఎస్టేట్ సంస్థ ఎవర్‌గ్రాండ్ గ్రూప్ 2021లో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. దాని ప్రభావం చైనాపై బలంగానే ఉంది. ఆ సంక్షోభం తర్వాత చైనా ప్రాపర్టీ సెక్టార్‌కు మద్దతుగా కొన్ని విధానాలు ప్రవేశపెట్టింది. ఈ విధానాల ప్రభావం త్వరలో చూడబోతున్నామని ప్రభుత్వం తెలిపింది. రానున్న రోజుల్లో ప్రాపర్టీ మార్కెట్ స్థిరీకరించబడుతుందని ధీమా వ్యక్తం చేసింది. -
రూ.199 కోట్లతో ఇవాంకా ఇంటి పనులు
అమెరికా అధ్యక్షుడి పీఠాన్ని రెండోసారి అధిరోహించనున్న డొనాల్డ్ట్రంప్ కూతురు ఇవాంకాట్రంప్ ఇటీవల తన పాత మాన్షన్‌ను పునరుద్దరించినట్లు తెలిపారు. ఇందుకోసం 24 మిలియన్ డాలర్లు(సుమారు రూ.199 కోట్లు) ఖర్చు చేసినట్లు ‘బెంజింగా’ అనే రియల్ ఎస్టేట్ రిసెర్చ్ సంస్థ నివేదించింది. కొత్తగా పునరుద్ధరించిన ఇవాంకా మాన్షన్ ‘బిలియనీర్ బంకర్’లో ఉంది. మియామిలో అత్యంత గుర్తించదగిన ఆధునిక భవనాల జాబితాలో తన మాన్షన్ ఒకటిగా నిలిచినట్లు బెంజింగా తెలిపింది.ఇవాంకా మాన్షన్ ఫ్లోరిడాలోని మియామి డెడ్ కౌంటీలో ఉన్న ఇండియన్ క్రీక్ ఐల్యాండ్‌లో ఉంది.ఈ ఇండియన్ క్రీక్ ఐల్యాండ్‌ను బిలియనీర్ బంకర్ అని పిలుస్తారు.ఈ ఐల్యాండ్ ఒక ప్రైవేట్, గేటెడ్ కమ్యూనిటీ. దీనికి అత్యంత భద్రత ఉంటుంది.ఫ్లోరిడా స్టేట్ పోలీసు ఫోర్స్, 24/7 ఆర్మ్డ్ మిలిటరీ దీనికి గస్తీ కాస్తోంది.ఈ ద్వీపంలో కేవలం 41 నివాస గృహాలు మాత్రమే ఉన్నాయి.ఇది యునైటెడ్ స్టేట్స్‌లోని అత్యంత ప్రత్యేకమైన, సంపన్న వర్గాలకు చెందిందిగా ప్రసిద్ధి.ఇండియన్ క్రీక్‌లో లగ్జరీ సౌకర్యాలున్నాయి.ప్రముఖ సింగర్ జూలియో ఇగ్లేసియాస్, ఎన్ఎఫ్ఎల్ లెజెండ్ టామ్ బ్రాడీ, గిసెల్ బాండ్చెన్, ఇవాంకా ట్రంప్, జారెడ్ కుష్నర్, కార్ల్ ఇకాన్లతో సహా మరికొందరు ప్రముఖులు ఇక్కడ నివాసముంటున్నారు.ఇదీ చదవండి: 10 కి.మీ ఎత్తులో బూడిద! విమాన సర్వీసులు రద్దు -
రెండో ఆదాయంపై కన్నేసిన సినీతారలు: అందరి చూపు అటువైపే..
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే చందాన.. సినీతారలు చాలా మంది రియల్ ఎస్టేట్, కమర్షియల్ రెసిడెన్షియల్స్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఈ జాబితాలో అమితాబ్ బచ్చన్, మనోజ్ బాజ్‌పేయి, సారా అలీ ఖాన్, కార్తీక్ ఆర్యన్, అజయ్ దేవగన్ మొదలైనవారు ఉన్నారు.ఆర్ధిక నిపుణులు ప్రకారం.. మనిషి కేవలం ఒక ఆదాయ వనరుమీద మాత్రమే ఆధారపడకూడదు. ఆదాయం వచ్చే మరికొన్ని మార్గాలను ఎప్పటికప్పుడు అన్వేషించాలి. అవే కష్ట సమయాల్లో ఆదుకుంటాయి. ఈ సూత్రాన్ని సెలబ్రిటీలు మాత్రమే చాలామంది పాటిస్తున్నారు. వీరంతా కేవలం సినిమాల మీద మాత్రమే కాకుండా.. ఇతర ఆదాయాల మీద కూడా పెట్టుబడులు పెట్టి ఆర్జిస్తున్నారు.2020 - 2024 మధ్య బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ రియల్ ఎస్టేట్‌లో సుమారు రూ. 194 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. దీంతో రియల్ ఎస్టేట్‌లో అధిక పెట్టుబడిన వ్యక్తిగా అమితాబ్ అగ్రస్థానంలో నిలిచారు. ఈ తరువాత జాన్వీ కపూర్ (రూ. 169 కోట్లు), రణవీర్ సింగ్, దీపికా పదుకొనే ఫ్యామిలీ (రూ. 156 కోట్లు), అజయ్ దేవగన్ & కాజోల్ (రూ. 110 కోట్లు), షాహిద్ కపూర్ (రూ. 59 కోట్లు) కూడా రియల్ ఎస్టేట్‌లో భారీ పెట్టుబడులను పెట్టినట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి.రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టడానికి కారణం ఏంటంటే?డబ్బు చేతిలో ఉన్నా.. బ్యాంకులో ఉన్న పెద్దగా ప్రయోజనం ఉండదు. అభివృద్ధి చెందుతున్న రంగాల్లో పెట్టుబడుటలుగా ఇన్వెస్ట్ చేస్తే.. రెండింతలు, మూడింతల లాభాలు కూడా వస్తాయి. అయితే ఇన్వెస్ట్ చేసేముందు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆదమరిస్తే మోసపోవడం ఖాయం.ఇదీ చదవండి: మూడేళ్ళలో 15 రెట్లు.. అక్కడ దూసుకెళ్తున్న రియల్ ఎస్టేట్ మార్కెట్2021లో ఒక ఎకరా భూమిని రూ. 25 లక్షల నుంచి రూ. 50 లక్షల మధ్య ధరతో కొనుగోలు చేసిన భూమి, మూడేళ్ళ తరువాత 15 రేట్లు పెరిగిందని.. దాని విలువ రూ. 5 కోట్లకు చేరిందని 'హౌస్ ఆఫ్ అభినందన్ లోధా' (HoABL) చైర్మన్ 'అభినందన్ లోధా' ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ధరల పెరుగుదల అనేది ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అన్ని చోట్లా 15 రేట్లు లాభాలు వస్తాయనుకోవడం పొరపాటే. కానీ రియల్ ఎస్టేట్‌లో తప్పకుండా లాభాలు వస్తాయని మాత్రం నిపుణులు చెబుతున్నారు. -
కోకాపేటలో 55 అంతస్తుల అబ్బురం!
సాక్షి, హైదరాబాద్: స్థిరాస్తి ధరల పెరుగుదలలో దేశంలోనే రెండో స్థానంలో నిలిచిన కోకాపేటలో నగరానికి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ పౌలోమి గ్రూప్ విలాసవంతమైన ఆకాశహర్మ్యాన్ని నిర్మిస్తోంది. గోల్డెన్ మైల్ లేఔట్లో, ఔటర్ రింగ్ రోడ్ ఎదురుగా 55 అంతస్తుల్లో పలాజో స్కై స్క్రాపర్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది.ప్రస్తుతం ఐదవ అంతస్తు నిర్మాణ పనులు పూర్తయ్యాయని, దీపావళి సందర్భంగా ఆరో ఫ్లోర్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని కంపెనీ డైరెక్టర్ ప్రశాంత్ రావు తెలిపారు. పలాజో ప్రాజెక్ట్‌కు ఆసియా పసిఫిక్ ప్రాపర్టీ నుంచి దేశంలోనే బెస్ట్ రెసిడెన్షియల్ హైరైజ్ ఆర్కిటెక్చర్ అవార్డును సొంతం చేసుకుందని పేర్కొన్నారు. 2.3 ఎకరాల్లోని ఈ ప్రాజెక్ట్‌లో 141 అపార్ట్మెంట్లు ఉంటాయని, 6,225 చ.అ. నుంచి 8,100 చ.అ. మధ్య ఉంటాయని చెప్పారు.ఇదీ చదవండి: పెర్రీ చనిపోయిన ఇల్లు.. రూ.71 కోట్లకు కొన్న భారతీయ మహిళ2026 డిసెంబర్ నాటికి ప్రాజెక్ట్ నివాసితులకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ప్రతికూల మార్కెట్ పరిస్థితులు ఉన్నప్పటికీ పలాజో ప్రాజెక్ట్‌కు కొనుగోలుదారుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోందని, అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని వివరించారు. ప్రముఖ సంస్థల సీఎక్స్ఓలు, వ్యాపారవేత్తలు, వైద్యులు, ఎంటర్ప్రెన్యూర్లు కస్టమర్లుగా ఉన్నారని తెలిపారు.52వ ఫ్లోర్లో ఇన్ఫినిటీ పూల్.. 70 అడుగుల ఎత్తు గల గ్రాండ్ ఎంట్రన్స్ లాబీ, డబుల్ హైట్ బాల్కనీ, 52వ అంతస్తులో ఇన్ఫినిటీ పూల్.. ఇవీ పలాజో ప్రాజెక్ట్ వసతుల్లో ప్రత్యేకమైనవి. దీంతో నివాసితులకు సెవెన్ స్టార్ హోటల్ అనుభూతి కలుగుతుంది. ఆకాశమంత ఎత్తులో పూల్ ఉండటంతో కనుచూపు మేర వరకూ సిటీ వ్యూను ఎంజాయ్ చేస్తూ స్విమ్ చేయడం అద్భుతమైన అనుభూతిని పొందొచ్చు. 75 వేల చ.అ.ల్లోని క్లబ్‌హౌస్‌లో స్పా, ప్రైవేట్ డైనింగ్ రూమ్, ఫిట్నెస్ సెంటర్, ఫ్యామిలీ ఈవెంట్స్ కోసం బాంక్వెట్ హాల్, బాస్కెట్‌బాల్, స్క్వాష్, బ్యాడ్మింటన్ కోర్టులు వంటి అన్ని రకాల ఆధునిక వసతులుంటాయి. -
మూడేళ్ళలో 15 రెట్లు.. అక్కడ దూసుకెళ్తున్న రియల్ ఎస్టేట్ మార్కెట్
దేశంలోని ప్రధాన నగరాల్లో రియల్ ఎస్టేట్ రంగం వేగంగా దూసుకెళ్తోంది. గత మూడేళ్లలో అయోధ్యలో భూముల ధరలు 15 రెట్లు పెరిగాయని 'హౌస్ ఆఫ్ అభినందన్ లోధా' (HoABL) చైర్మన్ 'అభినందన్ లోధా' అన్నారు.ఒక ప్రముఖ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభినందన్ లోధా మాట్లాడుతూ.. 2021లో అయోధ్యలో భూమిని కొనుగోలు చేయడం ప్రారంభించినట్లు చెప్పారు. అప్పట్లో ఒక ఎకరా భూమి ధర రూ. 25 లక్షల నుంచి రూ. 50 లక్షలు మధ్య ఉండేది. కానీ ప్రాంతాన్ని బట్టి నేడు అయోధ్యలో ఎకరం భూమి ధర రూ. 5 కోట్లు వరకు ఉందని ఆయన అన్నారు.2021లో కొనుగోలు చేసిన భూమిని మేము ఈ ఏడాది విక్రయించడం ప్రారంభించాము. 7 నెలల్లో 1400 ప్లాట్లను విక్రయించాము. మేము ఈ సంవత్సరం చివరగా అమ్మిన భూమి చదరపు గజం విలువ రూ. 15,000. మా సంస్థ మొత్తం 1400 రైతుల దగ్గర నుంచి ఇప్పటికే 51 ఎకరాల భూమిని కొనుగోలు చేసిందని అభినందన్ లోధా పేర్కొన్నాడు.పవిత్ర నగరమైన అయోధ్యలో భూముల విక్రయం మాత్రమే కాకుండా.. 6,000 చెట్లను నాటడం, 30కి పైగా స్థానిక జాతులను సంరక్షించడం, 1000 చెట్లను పెంచడం వంటివి కూడా చేసినట్లు లోధా చెప్పారు.ఇదీ చదవండి: 38 ఏళ్ల వయసు.. 120 కోట్ల విరాళం: ఎవరో తెలుసా?ప్రముఖ సినీ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా అయోధ్యలో 15000 చదరపు అడుగుల భూమిని కొనుగోలు చేశారు. అయోధ్య ఇప్పుడు మతపరమైన నగరంగా మారిన తరువాత.. వారణాసి, బృందావన్‌లలో ప్రాజెక్టులను ప్రారంభించనున్నట్లు లోధా ప్రకటించారు. ముంబైకి సమీపంలోని అమృత్సర్, బృందావన్, వారణాసి, సిమ్లా, నాగ్‌పూర్, ఖోపోలీలో 352 ఎకరాలు భూసేకరణను ఇటీవలే ముగించినట్లు కూడా ఈ సందర్భంగా వెల్లడించారు. -
పెర్రీ చనిపోయిన ఇల్లు.. రూ.71 కోట్లకు కొన్న భారతీయ మహిళ
ప్రముఖ అమెరికన్-కెనడియన్ నటుడు, ప్రఖ్యాత టీవీ సిరీస్ ‘ఫ్రెండ్స్’ స్టార్ మాథ్యూ పెర్రీ ఇంటిని భారత్‌కు చెందిన ఓ మహిళ కొనుగోలు చేశారు. అది కూడా రూ.71 కోట్లు పెట్టి మరీ కొన్నారు. పెర్రీ కెటామైన్ డోస్ ఎక్కువై ఆ ఇంట్లోనే తుది శ్వాస విడిచారు.సాధారణంగా భారతీయులు.. ఎవరైనా ఇంట్లో చనిపోతే ఆ ఇల్లు కొనడానికి ఇష్టపడరు. కానీ భారతీయ మూలాలున్న అనితా వర్మ-లాలియన్ లాస్ ఏంజిల్స్‌లోని మాథ్యూ పెర్రీ విల్లాను కొనుగోలు చేశారు. అక్కడ ఆయన గతేడాది అక్టోబర్‌లో హాట్ టబ్‌లో చనిపోయారు.పెర్రీ జ్ఞాపకాలకు గౌరవంపెర్రీ జ్ఞాపకాలు, సానుకూల అంశాలను గౌరవించాలనే ఉద్దేశంతో ఈ ఇంటిని కొనుగోలు చేసినట్లు అనితా వర్మ చెబుతున్నారు. హిందూ మతాన్ని ఆచరించే ఆమె అక్కడ పూజలు చేయించారు. ఆ పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.ఎవరీ అనితా వర్మ?భారతీయ మూలాలున్న అనితా వర్మ-లాలియన్ క్యామెల్బ్యాక్ ప్రొడక్షన్స్ అనే ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీని స్థాపించారు. వర్మ-లాలియన్ అరిజోనాలో ప్రసిద్ధ వాణిజ్య రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కూడా. ఆమె తన కుటుంబ వ్యాపారమైన వర్మలాండ్ను విడిచి అరిజోనా ల్యాండ్ కన్సల్టింగ్ను ప్రారంభించారు. కాగా ఇక ఇంటి విషయానికి వస్తే అనితా వర్మ 8.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.71 కోట్లు) పెట్టి కొనుగోలు చేశారు. ఇదే ఇంటిని పెర్రీ 2020లో 6 మిలియన్ డాలర్లకు కొన్నారు. -
రీట్స్, ఇన్విట్స్తో రిస్క్ హెడ్జింగ్
రియల్టీ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు(రీట్స్), చిన్న, మధ్యతరహా(ఎస్ఎం) రీట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు(ఇన్విట్స్)లను ఇంటరెస్ట్ రేట్ డెరివేటివ్స్‌గా వినియోగించుకునేందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా ప్రతిపాదించింది. రిస్క్ హెడ్జింగ్‌కు వీలుగా వీటి వినియోగానికి అనుమతించాలని భావిస్తోంది. వీటికితోడు లిస్టెడ్ కంపెనీల ప్రమోటర్లకు వర్తించే నిబంధనల బాటలో స్పాన్సర్లతోపాటు.. తమ గ్రూప్‌లకు లాక్డ్ఇన్ రీట్స్, ఇన్విట్స్ యూనిట్ల బదిలీకి సైతం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనుంది. తద్వారా ఆయా సంస్థలు తమ ఆర్థిక లక్ష్యాలను వీడకుండా సొంత హోల్డింగ్స్ నిర్వహణకు వీలు చిక్కనుంది.ఇదీ చదవండి: త్వరలో 7,000 మందికి జాబ్ కట్! ఎక్కడంటే..రీట్స్, ఇన్విట్స్ లెవరేజ్ మదింపులో ఫిక్స్డ్ డిపాజిట్లను నగదుకు సమానంగా పరిగణించేందుకు వీలు కల్పించనుంది. ఈ బాటలో రీట్, ఇన్విట్ సమీకరణకు క్రెడిట్ రేటింగ్ అవసరాలు, ఆయా సంస్థల బోర్డులలో ఖాళీలకు సభ్యుల ఎంపిక గడువు, ఆస్తుల మూలాల విస్తరణ తదితర అంశాలపై మార్గదర్శకాలకు తెరతీయాలని ప్రతిపాదించింది. ఇక మరోవైపు రీట్స్‌ను లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు అనుమతించేలా ప్రతిపాదించింది. ఇన్వెస్టర్ల పరిరక్షణతోపాటు రీట్స్, ఇని్వట్స్ సులభతర వ్యాపార నిర్వహణకు వీలైన చర్యలకు తెరతీయాలని సెబీ తాజా ప్రతిపాదనలలో అభిప్రాయపడింది. -
మళ్లీ ‘రియల్’ డౌన్.. తెలంగాణ వ్యాప్తంగా తగ్గిన రిజిస్ట్రేషన్లు, రాబడులు
సాక్షి, హైదరాబాద్: వరుసగా మూడో నెలలోనూ తెలంగాణ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ లావాదేవీలు తగ్గుముఖం పట్టాయి. గతేడాది అక్టోబర్‌తో పోలిస్తే ఈ ఏడాది అక్టోబర్‌లో ఏకంగా రూ. 140 కోట్ల ఆదాయం తగ్గిందని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే గతేడాదితో పోలిస్తే ఆదాయం విషయంలో రూ. 1,000 కోట్లకుపైగా వెనుకబడి ఉన్న స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ.. గత 3 నెలలుగా తగ్గుతున్న ఆదాయంతో తల పట్టుకుంటోంది. వరుసగా రిజిస్ట్రేషన్ల కార్యకలాపాలు మందగించడంపై ఆందోళన చెందుతోంది. అన్ని జిల్లాల్లోనూ అదే వరుస.. అక్టోబర్ నెలలో పరిస్థితిని చూస్తే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు మందగించాయి. ఆదిలాబాద్ మొదలు హైదరాబాద్ (సౌత్) వరకు 12 రిజిస్ట్రేషన్ జిల్లాల్లో లావాదేవీల సంఖ్య, రాబడి తగ్గింది. గతేడాది అక్టోబర్ కంటే ఈ ఏడాది అక్టోబర్‌లో దాదాపు 12 వేల లావాదేవీలు తగ్గిపోయాయి. అంటే సగటున రోజుకు 400 లావాదేవీలు తగ్గాయన్న మాట. గతేడాది అక్టోబర్‌లో మొత్తం 91,619 రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరగ్గా ఈ ఏడాది 79,562 డాక్యుమెంట్లు మాత్రమే రిజిస్టర్ కావడం గమనార్హం. ఇక జిల్లాలవారీగా పరిశీలిస్తే రంగారెడ్డిలో గతేడాది అక్టోబర్ కంటే ఈ ఏడాది అక్టోబర్‌లో రూ. 94 కోట్ల మేర ఆదాయం తగ్గింది. ఈ జిల్లాలో సుమారు 1,600 లావాదేవీలు కూడా తగ్గాయి. హైదరాబాద్, హైదరాబాద్ (సౌత్), మేడ్చల్, వరంగల్, కరీంనగర్, నల్లగొండ లాంటి జిల్లాల్లోనూ లావాదేవీల గణాంకాలు తగ్గుముఖం పట్టాయి. ఇందుకు ప్రధానంగా రెండు కారణాలున్నాయని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌లో ‘హైడ్రా’అక్రమ కట్టడాల కూల్చివేతల కారణంగా రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో భూములు, ఆస్తుల కొనుగోళ్లు మందగించాయని అంటున్నారు. దీనికితోడు దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం గడ్డుకాలం ఎదుర్కొంటోందని.. ఈ నేపథ్యంలోనే ఇతర జిల్లాల్లోనూ లావాదేవీలు తగ్గుముఖం పట్టాయని చెబుతున్నారు. -
తండ్రి నుంచి అప్పు తీసుకున్న ట్రంప్!! కారణం ఏంటంటే..
ప్రపంచ దేశాలు ఇప్పుడు అమెరికావైపు చూస్తున్నాయి. అధ్యక్ష ఎన్నికలో ఎవరు గెలుస్తారు?. అగ్రరాజ్య ముఖచిత్రాన్ని మార్చేది ఎవరు? అనే దాని కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఒకవైపు డెమోక్రటిక్ పార్టీ తరఫున ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, మరోసారి వైట్‌హౌజ్ నుంచి పాలించాలని రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఉవ్విళ్లూరుతున్నారు. అయితే.. రాజకీయాల్లోకి రాకముందు.. ట్రంప్ రియల్ ఎస్టేట్ రంగంలో మకుటం లేని మహారాజు అనే విషయం మీకు తెలుసా?.. డొనాల్డ్ ట్రంప్ న్యూయార్క్ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫ్రెడ్ ట్రంప్‌కు నాలుగో సంతానం. 13 ఏళ్ల వయసులో ట్రంప్ సైనిక్ అకాడమీలో చేరాడు. ఆ తరువాత యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియా.. వార్టన్ స్కూల్ నుంచి డిగ్రీ పొందిన తరువాత కుటుంబ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు.కుటుంబ వ్యాపారంలోకి అడుగుపెట్టడాని ముందే ట్రంప్ తన తండ్రి నుంచి కొంత మొత్తం అప్పుగా తీసుకుని రియల్ ఎస్టేట్‌లోకి ప్రవేశించినట్లు సమాచారం. ఆ తరువాత తండ్రి రెసిడెన్షియల్ హౌసింగ్ ప్రాజెక్ట్‌లను నిర్వహించడంలో కీలక పాత్రం పోషించాడు. 1971లో కంపెనీని నియంత్రణలోకి తీసుకున్న తరువాత.. దానిని ట్రంప్ ఆర్గనైజేషన్‌గా మార్చేశారు. ఆ తరువాత వివిధ వ్యాపారాలలోకి ప్రవేశించారు.1973 నాటికి ట్రంప్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడిగా ట్రంప్ బ్రూక్లిన్, క్వీన్స్ & స్టాటెన్ ఐలాండ్‌లో 14,000 అపార్ట్మెంట్లను పర్యవేక్షించారు. 1978లో గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ పక్కనే గ్రాండ్ హయత్ హోటల్‌ను అభివృద్ధి చేయడం కూడా ఈయన సారథ్యంలోనే జరిగింది. 1983లో మిడ్‌టౌన్ మాన్‌హట్టన్‌లోని 58 అంతస్తుల 'ట్రంప్ టవర్'ను ట్రంప్ పూర్తి చేశారు. ఈయన కుటుంబానికి చెందిన పలువురు సభ్యులు కూడా ఈ భవనంలోనే నివసిస్తున్నట్లు తెలుస్తోంది.వ్యాపార రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పాటు చేసుకున్న ట్రంప్ 2016 అధ్యక్ష ఎన్నికల్లో గెలిచారు. అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన తరువాత.. ట్రంప్ సంస్థలోని అన్ని నిర్వహణ బాధ్యతలకు రాజీనామా చేసి, కంపెనీ నిర్వహణను తన కుమారులు డోనాల్డ్ జూనియర్, ఎరిక్‌లకు అప్పగించారు. కాగా ఇప్పుడు మరోసారి అమెరికా అధ్యక్ష పదవి కోసం కమలా హరిస్తో పోటీ పడుతున్నారు. -
విల్లా కొంటే.. లంబోర్ఘిని కారు ఫ్రీ
భారతదేశంలోని చాలామంది వాహన ప్రియులు జీవితంలో ఒక్కసారైనా లంబోర్ఘిని కారును డ్రైవ్ చేయాలనుకుంటారు. అయితే దీని ధర రూ. కోట్లలో ఉండటం వల్ల అందరికి సాధ్యం కాకపోవచ్చు. అలాంటి కారు ఫ్రీగా ఇస్తానంటే? ఎవరు మాత్రం వద్దంటారు. అయితే లంబోర్ఘిని కారు కావాలంటే.. ఓ విల్లా కొనాల్సి ఉంటుంది.ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ జేపీ గ్రీన్స్ ఈ ప్రకటన చేసింది. ఇందులో లగ్జరీ విల్లా కొనుగోలు చేసినవారికి రూ. 4 కోట్ల కంటే ఎక్కువ ఖరీదైన లంబోర్ఘిని కారును ఉచితంగా అందించనున్నట్లు వెల్లడించింది. అయితే ఇక్కడ ఓ విల్లా కొనుగోలు చేయాలంటే.. రూ.26 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: ఇది కదా అసలైన పండుగ.. మళ్ళీ తగ్గిన బంగారం ధరలువిల్లా కోసం రూ. 26 కోట్లు చెల్లిస్తే అంతటితో సరిపోతుంది అనుకుంటే పొరపాటే. ఎందుకంటే కారు పార్కింగ్ చేయడానికి, క్లబ్ మెంబర్షిప్ కోసం, గోల్ఫ్ కోర్స్ కోసం ఇలా దాదాపు మరో రూ. కోటి కంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.Noida’s got a new Villa Project coming up at 26 Cr that's offering 1 Lamborghini with each of those! 🙄 pic.twitter.com/gZqOC8hNdZ— Gaurav Gupta | Realtor (@YourRealAsset) October 27, 2024 -
లగ్జరీ ప్రాపర్టీలకు డిమాండ్.. డీఎల్ఎఫ్ లాభం డబుల్
న్యూఢిల్లీ: లగ్జరీ ప్రాపర్టీలకు డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో సెప్టెంబర్ త్రైమాసికంలో రియల్టీ దిగ్గజం డీఎల్ఎఫ్ నికర లాభం రెండు రెట్లు పెరిగి రూ. 1,381 కోట్లకు చేరింది. గత క్యూ2లో ఇది రూ. 622 కోట్లు.సమీక్షాకాలంలో మొత్తం ఆదాయం 48 శాతం పెరిగి రూ. 1,476 కోట్ల నుంచి రూ. 2,181 కోట్లకు చేరింది. ప్రథమార్ధంలో నికర లాభం రూ. 1,150 కోట్ల నుంచి రూ. 2,027 కోట్లకు ఎగిసింది. మొత్తం ఆదాయం రూ. 2,998 కోట్ల నుంచి రూ. 3,910 కోట్లకు చేరింది.మార్కెట్ క్యాపిటలైజేషన్లో డీఎల్ఎఫ్ దేశంలోనే అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ.ఇది ప్రాథమికంగా రెసిడెన్షియల్ ప్రాపర్టీల అభివృద్ధి, విక్రయాలతోపాటు కమర్షియల్, రిటైల్ ప్రాపర్టీల అభివృద్ధి, లీజింగ్ వ్యాపారంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. -
తస్మాత్ జాగ్రత్త! రియల్టీ సంస్థల నయా మోసం
ప్రీలాంచ్, సాఫ్ట్ లాంచ్ పేర్లతో స్థిరాస్తి కొనుగోలుదారులు, పెట్టుబడిదారులను మోసం చేస్తున్న రియల్టీ సంస్థలు..తాజాగా బై బ్యాక్ స్కీమ్‌కు తెరలేపాయి. ముందస్తుగా కొంత మేర కంపెనీలో డిపాజిట్ చేస్తే ప్రతీ నెలా అధికంగా వడ్డీ చెల్లించడంతో పాటు కొంత స్థలం లీజు డీడ్ చేసిస్తామని మోసం చేయడం ఈ స్కీమ్ స్కామ్. తాజాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 120 మంది బాధితుల నుంచి రూ.24 కోట్లు వసూలు చేసి బిచాణా ఎత్తేశారు. స్క్వేర్స్ అండ్ యార్డ్స్ ఇన్ఫ్రా, యాడ్ అవెన్యూస్ కంపెనీలకు చెందిన నలుగురు ప్రతినిధులను సైబరాబాద్ ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం (ఈఓడబ్ల్యూ) పోలీసులు అరెస్టు చేసి, జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలించారు. డీసీపీ కె.ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం..ఏపీలోని చిలకలూరిపేటకు చెందిన బైర చంద్రశేఖర్, విజయవాడకు చెందిన వేములపల్లి జాన్వీ, రెడ్డిపల్లి కృష్ణ చైతన్య, ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నంకు చెందిన గరిమెల్ల వెంకట అఖిల్ నలుగురు కలిసి డైరెక్టర్లుగా పేర్కొంటూ కూకట్‌పల్లిలోని మంజీరా ట్రినిటీ మాల్లో స్క్వేర్స్ అండ్ యార్డ్స్ ఇన్ఫ్రా, యాడ్ అవెన్యూస్ పేర్లతో రెండు స్థిరాస్తి సంస్థలను ఏర్పాటు చేశారు. నెలకు అధిక వడ్డీ చెల్లిస్తామంటూ కస్టమర్లకు, పెట్టుబడిదారులకు ఆశ పెట్టారు. రూ.17 లక్షలు డిపాజిట్ చేస్తే వంద నెలల పాటు ప్రతీ నెలా రూ.20 వేల వడ్డీ చెల్లిస్తామని, అలాగే మహబూబ్‌నగర్ జిల్లాలోని తిరుమలగిరిలో 267 గజాల వ్యవసాయ భూమిని రిజిస్టర్ చేసి ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. అంతేకాకుండా ఈ భూమిలో శాండల్‌వుడ్ చెట్లను పెంచుతామని, 13–15 ఏళ్ల తర్వాత ఈ చెట్లను విక్రయించగా వచ్చిన సొమ్ములో 50 శాతం లాభాలను కూడా అందిస్తామని ఆశ పెట్టారు.బాధితులను నమ్మించేందుకు లీజు డీడ్ మెమోరాండమ్ ఆఫ్ అండర్ స్టాండింగ్ (ఎంఓయూ), చెక్‌లను అందించారు. కొన్ని నెలల పాటు వడ్డీ చెల్లించి, ఆ తర్వాత చెల్లించడం మానేశారు. వడ్డీలు చెల్లించకపోవడంతో కస్టమర్లు ఆఫీసుకు రావడం మొదలుపెట్టారు. దీంతో నిందితులు కూకట్పల్లి నుంచి జూబ్లీహిల్స్‌కు కార్యాలయాన్ని మార్చి, తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఎట్టకేలకు కార్యాలయ జాడను బాధితులు పట్టేయడం, చెల్లించిన సొమ్ము తిరిగి ఇచ్చేయాలని ఒత్తిడి చేయడంతో నిందితులు రాత్రికి రాత్రే ఆఫీసుకు తాళం వేసి పరారయ్యారు. దీంతో కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన అల్లం నాగరాజు ఫిర్యాదు మేరకు సైబరాబాద్ ఈఓడబ్ల్యూ ఠాణాలో తెలంగాణ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్–1999 కింద కేసులు నమోదు చేశారు. సాంకేతిక ఆధారాలతో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.ఇదీ చదవండి: ‘నా పెళ్లి కోసం అన్నయ్య పెళ్లి వాయిదా’కష్టపడి పొదుపు చేయాలకున్న సొమ్మును ఇలా ఎలాంటి నియంత్రణ ఆధ్వర్యంలోలేని కంపెనీల్లో పెట్టుబడి పెట్టి మోసపోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. దీర్ఘకాలంలో మంచి రాబడులు ఇచ్చే ఈక్విటీ మార్కెట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, ఈటీఎఫ్..వంటివి ఎంచుకోవాలని చెబుతున్నారు. ప్రధానంగా ఎలాంటి నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలోని లేని కంపెనీలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. -
ఆఫీస్ స్పేస్‌కు భలే గిరాకీ.. భారీగా పెరిగిన లీజింగ్
న్యూఢిల్లీ: కార్యాలయ వసతుల లీజింగ్ (ఆఫీస్ స్పేస్)కు బలమైన డిమాండ్ కొనసాగుతోంది. సెప్టెంబర్ త్రైమాసికంలో దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రముఖ పట్టణాల్లో (టాప్–8) 24.8 మిలియన్ చదరపు అడుగుల మేర (ఎస్ఎఫ్టీ) ఆఫీస్ లీజింగ్ నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలోని గణాంకాలతో పోల్చి చూస్తే 66 శాతం పెరిగింది. ఆఫీస్ స్పేస్ లీజింగ్ మార్కెట్ చరిత్రలో త్రైమాసికం వారీ ఇది రెండో గరిష్ట స్థాయి.ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 9 నెలల్లో 66.7 మిలియన్ ఎస్ఎఫ్టీ మేర లీజింగ్ నమోదైంది. పూర్తి ఏడాదికి 80 మిలియన్ ఎస్ఎఫ్టీ దాటిపోతుందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ‘కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్’ సంస్థ అంచనా వేసింది. గతేడాది టాప్–8 పట్టణాల్లో 74.5 మిలియన్ చదరపు అడుగుల (ఎస్ఎఫ్టీ) ఆఫీస్ స్పేస్ లీజు లావాదేవీలు నమోదయ్యాయి. 2018లో 49.1 మిలియన్ ఎస్ఎఫ్టీ, 2019లో 67.7 మిలియన్ ఎస్ఎఫ్టీ, 2020లో 46.6 మిలియన్ ఎస్ఎఫ్టీ, 2021లో 50.4 మిలియన్ ఎస్ఎఫ్టీ, 2022లో 72 మిలియన్ ఎస్ఎఫ్టీ చొప్పున లీజింగ్ నమోదైంది. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఆఫీస్ మార్కెట్ గణాంకాలతో కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ ఒక నివేదికను విడుదల చేసింది. పటిష్ట మార్కెట్ ‘‘మార్కెట్ మూలాలు బలంగా ఉండడంతో భారత ఆఫీస్ మార్కెట్లో లీజింగ్ అసాధారణ స్థాయిలో కొనసాగుతోంది. టాప్–8 పట్టణాల్లో వేకెన్సీ రేటు (ఖాళీగా ఉన్న ఆఫీస్ స్పేస్) తక్కువగా ఉండడం ఆఫీస్ వసతులకు బలమైన డిమాండ్‌ను సూచిస్తోంది’’అని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ ఇండియా సీఈవో అన్షుల్ జైన్ తెలిపారు. ఈ వృద్ధిలో గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు (జీసీసీఉల) కీలక పాత్ర పోషిస్తున్నాయని.. ఆవిష్కరణలు, వృద్ధికి కీలక అవుట్సోర్స్ మార్కెట్‌గా భారత్ స్థానాన్ని బలోపేతం చేస్తున్నాయని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదిక తెలిపింది.ఇదీ చదవండి: ల్యాండ్ డీల్స్ జోరు.. టాప్‌లో హైదరాబాద్ఇటీవలి కాలంలో సగటు త్రైమాసికం లీజింగ్ 20 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంటోందని, 2024 మొత్తం మీద లీజింగ్ 80 మిలియన్ ఎస్ఎఫ్టీని దాటుతుందని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ టెనెంట్ రిప్రజెంటేషన్ ఎండీ వీరబాబు తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో సరఫరా పరిమితంగా ఉన్నట్టు చెప్పారు. సమీప కాలంలో సరఫరా పెరగొచ్చని.. అయినా సరే డిమాండ్ ఎక్కువగా ఉంటుందన్నారు.టాప్–8 పట్టణాల్లో వేకెన్సీ రేటు 17.1 శాతంగా సెప్టెంబర్ త్రైమాసికంలో నమోదైంది. ఇది 14 త్రైమాసికాల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. జూన్ త్రైమాసికంతో పోల్చి చూస్తే 0.60 శాతం మేర వేకెన్సీ రేటు తగ్గింది. హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, పుణె, అహ్మదాబాద్ పట్టణాల గణాంకాలు ఈ నివేదికలో ఉన్నాయి. -
ల్యాండ్ డీల్స్ జోరు.. టాప్‌లో హైదరాబాద్
న్యూఢిల్లీ: భారత రియల్ ఎస్టేట్ రంగంలో భూముల క్రయవిక్రయాలు ఈ ఏడాది జనవరి–సెప్టెంబర్‌లో భారీగా పెరిగాయి. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ ప్రకారం.. 100 కంటే ఎక్కువ భూ ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందాల్లో భాగంగా సుమారు 1,700 ఎకరాలు చేతులు మారాయి. గతేడాది ఇదే కాలంలో 60 డీల్స్‌కుగాను 1,200 ఎకరాలు చేతులు మారాయి.డీల్స్ సంఖ్య పరంగా ఈ ఏడాది 65 శాతం వృద్ధి నమోదైంది. ల్యాండ్ డీల్స్‌లో ఆరు ప్రధాన భారతీయ నగరాలు ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, పుణే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ ఏడాది జరిగిన ల్యాండ్ డీల్స్‌లో రెసిడెన్షియల్ 61 శాతం, ఇండస్ట్రియల్, లాజిస్టిక్స్ 13 శాతం, ఆఫీస్ విభాగం 8 శాతం నమోదయ్యాయి. విభిన్న రకాల ఆస్తులకు సంబంధించి పెరిగిన భూ ఒప్పంద కార్యకలాపాలు బలమైన పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను, భారతీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ అభివృద్ధి చెందుతున్న తీరుతెన్నులను ప్రతిబింబిస్తున్నట్లు సీబీఆర్ఈ తెలియజేసింది.ఇదీ చదవండి: ఆఫీస్ స్పేస్‌కు భలే గిరాకీ.. భారీగా పెరిగిన లీజింగ్‘‘రెసిడెన్షియల్, ఆఫీస్, డేటా సెంటర్ల వంటి అభివృద్ధి చెందుతున్న విభాగాలలో బలమైన వృద్ధిని చూస్తున్నాం. భారత రియల్ ఎస్టేట్ రంగం యొక్క దీర్ఘకాలిక అవకాశాలపై పెట్టుబడిదారులు మరింత నమ్మకంగా ఉన్నారనడానికి ఇది నిదర్శనం. ఈ ఆశావాదం భారత్‌ను రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు వ్యూహాత్మక మార్కెట్‌గా నిలుపుతోంది. వివిధ మార్కెట్లలో బలమైన డిమాండ్, అనుకూల ఆర్థిక పరిస్థితులతో కలిపి వృద్ధికి అనుకూల వాతావరణాన్ని సృష్టించింది. మార్కెట్ స్థిరత్వం, దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలను నొక్కి చెప్పే వ్యూహాత్మక పెట్టుబడుల ద్వారా ఈ ఊపు కొనసాగుతుందని ఆశిస్తున్నాం’’ అని సీబీఆర్ఈ వివరించింది. -
హైదరాబాద్‌లో తగ్గిన ఇళ్ల విక్రయాలు: తొమ్మిది నెలల్లో..
హైదరాబాద్‌లో 2024 జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య రూ. 36,461 కోట్ల విలువైన గృహ విక్రయాలు జరిగినట్లు నైట్ ఫ్రాంక్ రీసెర్చ్ తన నివేదికలు వెల్లడించింది. ఈ సేల్స్ అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 34 శాతం పెరుగుదలను నమోదు చేసినట్లు సమాచారం. ఇళ్ల రిజిస్ట్రేషన్ల సంఖ్య (59,386) కూడా గణనీయంగా పెరిగింది.నైట్ ఫ్రాంక్ నివేదిక ప్రకారం.. సెప్టెంబర్ 2023లో రిజిస్ట్రేషన్ల సంఖ్య 6,304 యూనిట్లు (రూ. 3,459 కోట్లు). 2024 సెప్టెంబర్‌లో ఈ అమ్మకాలు కేవలం 4,903 యూనిట్లు (రూ.2,820 కోట్లు) మాత్రమే. దీన్ని బట్టి చూస్తే ఇళ్ల అమ్మకాలు ఈ సెప్టెంబర్‌లో 22 శాతం తగ్గినట్లు స్పష్టంగా తెలుస్తోంది.హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి ప్రాంతాల్లో ఇళ్ల విక్రయాలు జరిగినట్లు సమాచారం. హైదరాబాద్‌లో రూ. 50 లక్షల కంటే తక్కువ ధర కలిగిన ఆస్తుల రిజిస్ట్రేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది మొదటి 9 నెలల్లో రూ. 1 కోటి, అంతకంటే ఎక్కువ ధర కలిగిన గృహాల విక్రయాలు 9 శాతం నుంచి 14 శాతానికి చేరాయి.సెప్టెంబర్ 2024లో హైదరాబాద్‌లో రిజిస్టర్ అయిన ఆస్తులలో ఎక్కువ భాగం 1,000 నుంచి 2,000 చదరపు అడుగుల పరిధిలో కేంద్రీకృతమై ఉన్నాయి. 2000 అడుగులు, అంతకంటే ఎక్కువ విస్తీర్ణం కలిగిన ఆస్తుల సేల్స్ కూడా ఆశాజనంగానే ఉన్నాయి.జిల్లా స్థాయిలో, మేడ్చల్-మల్కాజ్గిరి మార్కెట్లో 42 శాతం ఆస్తి రిజిస్ట్రేషన్లు జరిగాయి. సెప్టెంబర్ 2023లో ఈ రిజిస్ట్రేషన్స్ 45 శాతం కావడం గమనార్హం. మొత్తం రిజిస్ట్రేషన్‌లో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలు వరుసగా 39 శాతం, 19 శాతం వాటా కలిగి ఉన్నాయి. రెసిడెన్షియల్ ప్రాపర్టీల సగటు ధర సెప్టెంబర్ 2024లో 3 శాతం పెరిగింది. మేడ్చల్-మల్కాజ్‌గిరిలో అత్యధికంగా 7 శాతం పెరుగుదల జరిగింది. రంగారెడ్డి, సంగారెడ్డిలు వరుసగా 3 శాతం, 2 శాతం పెరుగుదల జరిగింది. -
కళ్లు చెదిరే ఈ భవనం కొనగలరా?
అమెరికన్ వ్యాపారవేత్త డార్విన్ డీసన్కు చెందిన లా జోల్లా ఎస్టేట్ 'ది శాండ్కాజిల్' రికార్డ్ ధరకు అమ్మకానికి వచ్చింది. 108 మిలియన్ డాలర్లు (సుమారు రూ.907 కోట్లు)కు లిస్టయింది. ఇది శాన్ డియాగో కౌంటీ రియల్ ఎస్టేట్‌కు రికార్డ్-బ్రేకింగ్ ధర.లిస్టింగ్‌లో పెట్టిన ధరకు అమ్ముడుపోతే ఈ సంవత్సరం ప్రారంభంలో డెల్ మార్ ఓషన్ ఫ్రంట్ ప్రాపర్టీని కొనుగోలు చేసిన బిలియనీర్ ఎగాన్ డర్బన్ పేరిట ఉన్న 44 మిలియన్ డాలర్ల ప్రస్తుత రికార్డును ఇది అధిగమిస్తుంది. అఫ్లియేటెడ్ కంప్యూటర్ సర్వీసెస్ (తర్వాత జిరాక్స్ సంస్థకు విక్రయించారు) స్థాపకుడు డార్విన్ డీసన్ 2009లో ఈ ఎస్టేట్‌ను, దాని పక్కనున్న స్థలాన్ని 26 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. తర్వాత దాని నిర్మాణం కోసం 60 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు.దాదాపు 13,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఎస్టేట్ ప్రైవేట్ ఎలివేటెడ్ బీచ్‌ను కలిగి ఉంది. అలనాటి ఐరోపా శైలిలో బంగారు పరదాలు, పాలరాతి ఫ్లోర్లు, ఆకృతులతో ఇంటీరియర్‌ను తీర్చిదిద్దారు. హాలీవుడ్ ప్రముఖులు, రాజ కుటుంబాల ఇళ్లకు డిజైన్ చేసిన ప్రఖ్యాత డిజైనర్ తిమోతీ కొరిగాన్ ఈ భవనానికి ఇంటీరియర్లను రూపొందించారు.ఇందులోని ఫర్నిచర్ ఫ్రెంచ్ సొగసుతో ఆకట్టుకుంటుంది. 16 మంది కూర్చునేందుకు వీలుగా రాజసమైన డైనింగ్ రూం, నాటికల్ నేపథ్యంతో తీర్చిదిద్దిన బార్ ఇందులో ఉన్నాయి. ఇక భవనం లోగిలిలో ఒక పూల్, ఫిట్నెస్ సెంటర్, చైనా స్లేట్ రూఫ్ టైల్స్‌తో కూడిన బీచ్ ఫ్రంట్ బోట్‌హౌస్ ఉన్నాయి. అగస్టా నేషనల్ గోల్ఫ్ క్లబ్ సిగ్నేచర్ వైట్ షేడ్ లాంటి లుక్ కోసం 40 వేల డాలర్లతో దిగుమతి చేసుకున్న ఇసుక ఈ భవనానికి వినిగియోగించారు. ఇంత విలాసవంతంగా భవనం నిర్మించుకున్నప్పటికీ దీన్ని పెద్దగా ఉపయోగించలేదని డీసన్ చెబుతున్నారు. -
ఇళ్ల అమ్మకాల తగ్గుదలకు కారణాలు..
దేశవ్యాప్తంగా 30 ద్వితీయ శ్రేణి ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు తగ్గినట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి. జులై–సెప్టెంబర్‌లో 41,871 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. 2023 సెప్టెంబర్ త్రైమాసికంతో పోలిస్తే విక్రయాలు 13 శాతం తగ్గాయని ప్రాప్‌ఈక్విటీ నివేదిక తెలిపింది. గతేడాది రికార్డు స్థాయిలో అమ్మకాలు నమోదు కావడమే ఈ క్షీణతకు కారణం అని వివరించింది.నివేదికలోని వివరాల ప్రకారం..కొత్త ప్రాజెక్టుల ఆవిష్కరణ 34 శాతం క్షీణించింది. మొత్తం విక్రయాల్లో అహ్మదాబాద్, వడోదర, గాందీనగర్, సూరత్, గోవా, నాసిక్, నాగ్‌పూర్‌తో కూడిన వెస్ట్ జోన్ వాటా 72 శాతం ఉంది. తక్కువ జీవన వ్యయం, నైపుణ్యం కలిగిన నిపుణుల లభ్యత, కంపెనీలకు అనుకూల కార్యాచరణ వ్యయంతో పాటు రాష్ట్ర రాజధానుల్లో మంచి కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలు గృహాలకు డిమాండ్‌ను పెంచుతున్నాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో అమ్మకాలు పడిపోయినప్పటికీ హౌసింగ్ మార్కెట్ స్థితిస్థాపకంగా ఉంది. ప్రస్తుత పండుగ త్రైమాసికంలో బలమైన విక్రయాలు ఉంటాయని అంచనా వేశారు.ఇదీ చదవండి: గరిష్ఠాలను చేరిన బంగారం, వెండి ధరలు‘ద్వితీయ శ్రేణి నగరాలు రియల్ ఎస్టేట్ పెట్టుబడికి పెద్దగా అనుకూలించవు. వివిధ ప్రాంతాలకు కనెక్టివిటీ, మౌలిక సదుపాయాల వృద్ధి ఉన్నప్పటికీ ఈ నగరాలు ఇన్వెస్టర్లను ఆకర్షించడంలో విఫలమయ్యాయి. పేలవమైన అద్దె ఆదాయం, మూలధన విలువలో అంతగా వృద్ధి ఉండకపోవడం, ఆస్తి నిర్వహణ ఖర్చు.. వెరసి ఈ నగరాల్లో పెట్టుబడిని అత్యంత ప్రమాదకరం చేస్తోంది’ అని నివేదిక వివరించింది. -
హైదరాబాద్‌లో ఇళ్ల విక్రయాలు ఎలా ఉన్నాయంటే..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా విలాస ఇళ్లకు (లగర్జీ) డిమాండ్ బలంగా కొనసాగుతోంది. సెపె్టంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో రూ.4కోట్లకు పైగా విలువైన 12,630 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 9,165 యూనిట్లతో పోల్చి చూస్తే 38 శాతం వృద్ధి నమోదైంది. ఈ వివరాలను రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ విడుదల చేసింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో మాత్రం రూ.4కోట్లపైన ఖరీదైన ఇళ్ల విక్రయాలు 1,540 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో కాస్త మెరుగ్గా 1,560 యూనిట్లు అమ్ముడుపోవడం గమనార్హం. పట్టణాల వారీగా.. → ఢిల్లీ ఎన్సీఆర్లో అత్యధికంగా 5,855 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది విక్రయాలు 3,410 యూనిట్లతో పోల్చితే 70 శాతం పెరిగాయి. → ముంబైలో అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 3,250 యూనిట్ల నుంచి 3,820 యూనిట్లకు పెరిగాయి. → బెంగళూరులో లగ్జరీ ఇళ్ల అమ్మకాలు 240 యూనిట్ల నుంచి 35 యూనిట్లకు తగ్గిపోయాయి. → పుణెలో రెట్టింపునకు పైగా పెరిగి 810 యూనిట్ల మేర అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 330 యూనిట్లుగానే ఉన్నాయి. → చెన్నైలోనూ 130 యూనిట్ల నుంచి 185 యూనిట్లకు అమ్మకాలు వృద్ధి చెందాయి. → కోల్‌కతాలో రూ.4కోట్లకు పైన విలువ చేసే 380 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాంలో 240 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఆధునిక అపార్ట్మెంట్ల వైపు మొగ్గు.. ‘‘ప్రీమియం ఇళ్ల విభాగంలో డిమాండ్ పెరగడం చూస్తున్నాం. సంప్రదాయంగా మధ్యస్థ బడ్జెట్ ఇళ్ల మార్కెట్లు అయిన నోయిడా, బెంగళూరు, పుణె, చెన్నైలోనూ క్రమంగా లగ్జరీ ఇళ్ల వైపునకు వినియోగదారులు మొగ్గు చూపిస్తున్నారు. బంగళాల నుంచి ఆధునిక అపార్ట్మెంట్లు, పెంట్‌హౌస్‌ల వైపు మార్కెట్ మళ్లుతోంది. దీంతో లగ్జరీ ప్రాజెక్టుల్లో ప్రీమియం సౌకర్యాల కల్పన ఇతర ప్రాజెక్టులతో పోలి్చతే కీలక వైవిధ్యంగా మారింది’’అని సీబీఆర్ఈ ఇండియా చైర్మన్, సీఈవో అన్షుమన్ మ్యాగజీన్ తెలిపారు. ఖర్చు చేసే ఆదాయం పెరగడం, సులభతర రుణ సదుపాయాలు, ఆధునిక, సకల సౌకర్యాలతో కూడిన ఇళ్లు అటు నివాసానికి, ఇటు పెట్టుబడులకు ఆకర్షణీయంగా మారినట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రీమియం నివాస అనుభవం, ప్రపంచస్థాయి వసతులు మారిన కొనుగోలుదారుల ఆకాంక్షలను ప్రతిఫలిస్తున్నట్టు బెంగళూరుకు చెందిన రియల్టీ సంస్థ సుమధుర గ్రూప్ సీఎండీ మధుసూదన్ పేర్కొన్నారు. -
ప్రాపర్టీ ధరల పెరుగుదలలో కోకాపేట అదుర్స్
సాక్షి, హైదరాబాద్: కోకాపేట బంగారం కంటే ఖరీదైపోయింది. ఇక్కడ ప్రాజెక్ట్ నిర్మించడం, నివాసం ఉండటం డెవలపర్లకు, కొనుగోలుదారులకు ఇద్దరికీ స్టేటస్ సింబల్‌గా మారిపోయింది. గత ఐదేళ్లలో ప్రాపర్టీ ధరల పెరుగుదలలో దేశంలోనే కోకాపేట రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ 89 శాతం మేర పెరుగుదల నమోదు కాగా.. బాచుపల్లిలో 57 శాతం, తెల్లాపూర్‌లో 53 శాతం ధరలు పెరిగాయని అనరాక్ రీసెర్చ్ రిపోర్ట్ వెల్లడించింది. 2019లో ఈ ప్రాంతంలో ధర చదరపు అడుగుకు రూ.4,750గా ఉండగా.. 2024 నాటికి రూ.9 వేలకు పెరిగింది. ఈ ప్రాంతంలో భూముల ధరలు ఖరీదు కావడంతో విల్లాల కంటే ఎక్కువగా హైరైజ్ భవనాలనే ఎక్కువగా నిర్మిస్తున్నారు. మూడేళ్ల క్రితం వరకూ కోకాపేట బడ్జెట్ హోమ్స్ దొరికేవి కానీ, ఇప్పుడు 40 అంతస్తుల స్కై స్క్రాపర్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కనిష్టంగా 8 వేల చదరపు అడుగు నుంచి గరిష్టంగా 16 వేల చదరపు అడుగు విస్తీర్ణం ఉన్న అపార్ట్మెంట్లు సైతం నిర్మిస్తున్నారు.ధర రూ.2.5 కోట్లకు పైమాటే.. గత ఐదేళ్లలో కోకాపేటలో దాదాపు 12,920 యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. ఇందులో అల్ట్రా లగ్జరీ గృహాలే ఎక్కువగా ఉన్నాయి. రూ.2.5 కోట్ల కంటే ఎక్కువ ధర కలిగిన యూనిట్ల వాటా 52 శాతంగా ఉందంటే డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు. 30 శాతం మధ్య, ప్రీమియం విభాగం యూనిట్లు, రూ.1.5–2.5 కోట్ల మధ్య ఉన్న లగ్జరీ గృహాల వాటా 19 శాతంగా ఉంది.బాచుపల్లిలో బూమ్.. బాచుపల్లిలో కూడా రియల్టీ మార్కెట్ బూమ్‌లో ఉంది. ఇక్కడ గత ఐదేళ్లలో ధరలు 57 శాతం పెరిగాయి. 2019లో ఇక్కడ సగటు ధర చదరపు అడుగుకు రూ.3,690 ఉండగా.. 2024 నాటికి రూ.5,800లకు పెరిగాయి. మిడ్, ప్రీమియం విభాగానికి బాచుపల్లి కేంద్రంగా మారింది. 2019లో తెల్లాపూర్‌లో ధర చదరపు అడుగుకు రూ.4,819గా ఉండగా.. 2024 నాటికి 53 శాతం వృద్ధి రేటుతో రూ.7,350కు పెరిగాయి. తెల్లాపూర్‌లో గత ఐదేళ్లలో 18,960 యూనిట్లు లాంచింగ్ కాగా.. ఇందులో 66 శాతం ప్రీమియం, 34 శాతం లగ్జరీ విభాగం గృహాలే.చదవండి: మాట మార్చిన నిఖిల్ కామత్!.. అప్పుడు అద్దె ఇల్లే బెస్ట్ అని.. సంపన్న వర్గాల ఆసక్తి.. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాలలో రద్దీ పెరగడంతో ఇక్కడి వారు కోకాపేటకు మారుతున్నారు. ఈ ప్రాంతం హై ప్రొఫైల్, ప్రీమియం ప్రాజెక్ట్‌లకు డెస్టినేషన్‌గా మారింది. – ప్రశాంత్ రావు, డైరెక్టర్, పౌలోమీ ఎస్టేట్స్మౌలిక వసతులే మెయిన్ ఐటీ కారిడార్లకు చేరువగా ఉండటమే బాచుపల్లి హైలైట్. అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులతో పాటు ఇంటర్నేషనల్ స్కూల్స్, హాస్పిటల్స్, మాల్స్‌తో ఈ ప్రాంతానికి డిమాండ్ పెరిగింది. ప్రవాసులు, ఉన్నత హోదా ఉద్యోగులు ఇక్కడ నివాసం ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. – నరేంద్ర కుమార్, డైరెక్టర్, ప్రణీత్ గ్రూప్ -
ఇళ్ల కొనుగోలులో కీలకంగా వడ్డీ రేట్లు
ముంబై: గృహ రుణాలపై వడ్డీ రేట్లు 9 శాతం దాటితే తమ ఇళ్ల కొనుగోలు నిర్ణయంపై గణనీయమైన ప్రభావం పడుతుందని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. ఫిక్కీ, అనరాక్ నిర్వహించిన సర్వేలో 90 శాతం మంది ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇరు సంస్థలూ ‘హోమ్ బయ్యర్ సెంటిమెంట్ సర్వే’ వివరాలను ముంబైలో జరుగుతున్న రియల్ ఎస్టేట్ సదస్సులో భాగంగా విడుదల చేశాయి. 7,615 మంది అభిప్రాయాల ఆధారంగా ఈ వివరాలను రూపొందించాయి. ఇళ్ల కొనుగోలుపై పెరిగిన రుణ రేట్ల ప్రభావం ఏ మేరకు ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేశాయి. సర్వేలో వ్యక్తమైన అభిప్రాయాలు.. → గృహ రుణ రేట్లు 8.5 శాతం దిగువనే కొనసాగితే తమ ఇంటి కొనుగోలు నిర్ణయంపై ఎలాంటి ప్రభావం ఉండదని 71 శాతం మంది స్పష్టం చేశారు. → 9 శాతం దాటితే తమ నిర్ణయాలు ప్రభావితం అవుతాయని 87 శాతం మంది తెలిపారు. 8.5–9 శాతం మధ్య రేట్లు కొనసాగితే తమ నిర్ణయాలపై ఓ మోస్తరు ప్రభావమే ఉంటుందని 54 శాతం మంది చెప్పారు. → 59 శాతం మందికి రియల్ ఎస్టేట్ ప్రాధాన్య పెట్టుబడి సాధనంగా ఉంది. 67 శాతం మంది సొంత నివాస అవసరాలకే కొనుగోలు చేస్తున్నారు. → రూ.45–90 లక్షల ఇళ్లకు 35 శాతం మంది మొగ్గు చూపిస్తుంటే, రూ.90 లక్షల నుంచి రూ.1.5 కోట్ల బడ్జెట్ ఇళ్లకు 28 శాతం మంది ఆసక్తి చూపిస్తున్నారు. → 93 శాతం మంది నిర్మాణంలో నాణ్యతకు, 72 శాతం మంది మంచి వెలుతురు ఉండే ఇళ్లకు ప్రాధాన్యం చూపిస్తున్నారు. చెప్పుకోతగ్గ మార్పు..‘‘భారత రియల్ ఎస్టేట్ రంగం చెప్పుకోతగ్గ పరిణామక్రమాన్ని చూసింది. ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్ల కంటే నిర్మాణంలోని ప్రాపర్టీల వైపు వినియోగదారులు మొగ్గు చూపిస్తుండడం డెవలపర్ల పట్ల, నియంత్రణ వాతావరణం పట్ల పెరిగిన విశ్వాసాన్ని తెలియజేస్తోంది’’అని ఫిక్కీ ప్రెసిడెంట్ సందీప్ సోమాని తెలిపారు. నివాస ఇళ్ల మార్కెట్ 2029 నాటికి 1.04 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఫిక్కీ అర్బన్ డెవలప్మెంట్, రియల్ ఎస్టేట్ చైర్మన్ రాజ్ మెండా తెలిపారు. ఏటా 25.6 శాతం వృద్ధి చెందుతుందన్నారు. ఈ కన్జ్యూమర్ సర్వేకు ఎంతో ప్రాముఖ్యత ఉందని అనరాక్ చైర్మన్ అనుజ్ పురి పేర్కొన్నారు. ప్రస్తుత మార్కెట్ వాతావరణంలో వినియోగదారుల ప్రాధాన్యతలకు ఇది అద్దం పడుతుందన్నారు. దేశ రియల్ ఎస్టేట్ మార్కెట్ ధోరణలను తెలియజేస్తుందన్నారు. రీట్లకు పెరుగుతున్న ఆదరణను టాటా రియల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎండీ, సీఈవో సంజయ్ దత్ ఈ సదస్సులో భాగంగా గుర్తు చేశారు. పాక్షిక యాజమాన్యంలో ఉన్న సానుకూలతలను ప్రస్తావించారు. తక్కువ పెట్టుబడితోనే నాణ్యమైన ఆస్తుల్లో వాటాను వీటి ద్వారా పొందొచ్చన్నారు. -
రూ.5.18 లక్షలు.. జీతం కాదు.. ఇంటి అద్దె!
దేశ వాణిజ్య రాజధానిగా పేరున్న ముంబయిలో నివసించాలంటే రూ.5.18 లక్షలు ఉండాల్సిందే. ఇది ఏటా వేతనం అనుకుంటే పొరపడినట్లే..కేవలం ఇంటి అద్దె కోసమే ఇంత వెచ్చించాలి. అవునండి..ముంబయిలో ఇంటి అద్దెలు దేశంలో ఎక్కడా లేనివిధంగా పెరుగుతున్నాయి. సింగిల్ బెడ్ రూమ్(1 బీహెచ్‌కే) ఇళ్లు కావాలంటే ఏకంగా ఐదు లక్షలు చెల్లించాల్సిందేనని ‘క్రెడాయ్-ఎంసీహెచ్ఐ’ నివేదిక పేర్కొంది.నివేదికలోని వివరాల ప్రకారం..దేశ వాణిజ్య రాజధానిగా పేరున్న ముంబయిలో ఇంటి అద్దెలు భారీగా పెరుగుతున్నాయి. బెంగళూరులో సింగిల్ బెడ్రూమ్ అద్దె రూ.2.32 లక్షలుగా ఉంటే ఢిల్లీ ఎన్సీఆర్లో రూ.2.29 లక్షలుగా ఉంది. ఇందుకు భిన్నంగా ముంబయిలో అధికంగా రూ.5.18 లక్షలు ఇంటి అద్దె ఉంది. స్థానికంగా జూనియర్ లెవల్ ఉద్యోగికి వచ్చే ఏడాది వేతనం రూ.4.49 లక్షలు. తన సంపాదనపోను ముంబయిలో 1 బీహెచ్‌కే ఇంటి అద్దె కోసం అప్పు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవేళ ముంబయిలో డబుల్ బెడ్ రూమ్(2 బీహెచ్‌కే) ఇళ్లు అద్దెకు తీసుకోవాలంటే ఉద్యోగుల వేతనం రూ.15.07 లక్షలుండాలి. అందులో రూ.7.5 లక్షలు అద్దెకే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదే బెంగళూరు, ఢిల్లీలో 2 బీహెచ్‌కే అద్దెలు వరుసగా రూ.3.9 లక్షలు, రూ.3.55 లక్షలుగా ఉన్నాయి.ముంబయిలోని సీనియర్ లెవల్ ఉద్యోగుల వేతనం దాదాపు రూ.33.95 లక్షలుగా ఉంది. వారు 3 బీహెచ్‌కే ఇంట్లో అద్దెకు ఉండాలనుకుంటే ఏటా రూ.14.05 చెల్లించాల్సి ఉంటుంది. అది బెంగళూరు, ఢిల్లీలో వరుసగా రూ.6.25 లక్షలు, రూ.5.78 లక్షలుగా ఉంది. అంటే ముంబయిలో సింగిల్ బెడ్ రూమ్ ఇంటి అద్దె బెంగళూరు, ఢిల్లీలోని 3 బీహెచ్‌కే ఇంటి అద్దెకు దాదాపు సమానంగా ఉంది.ఇదీ చదవండి: విదేశాలకు వెళ్తున్నారా? ఈ పాలసీ మీ కోసమే..ముంబయిలో జూనియర్, మిడిల్ లెవల్ ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇంటి అద్దెలు వారి జీతాలను గణనీయంగా ప్రభావితం చేస్తున్నాయి. పొదుపు, నిత్యావసరాల కోసం వారికి ఇబ్బందులు తప్పడం లేదు. స్థానికంగా కార్యాలయాలు ఉన్న ప్రాంతాల్లో ఈ అద్దెలు మరింత అధికంగా ఉండడంతో దూర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. దాంతో గంటల తరబడి ప్రయాణించి కార్యాలయానికి వస్తున్నారు. ఫలితంగా తీవ్ర శారీరక, మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ పరిస్థితుల వల్ల భవిష్యత్తులో ‘బ్రెయిన్ డ్రెయిన్(మెరుగైన అవకాశాల కోసం ఉద్యోగుల వలస)’కు దారి తీయవచ్చు. -
ముంబై ‘రియల్’ కింగ్‌లు! సింహ భాగం వీరిదే..
దేశంలోనే అత్యంత ఖరీదైన నగరమేది అంటే ముంబై అని టక్కున చెప్పేస్తారు. దేశ ఆర్థిక రాజధానిగా పిలిచే ఈ నగరంలో భూమి కొరత ఎక్కువగా ఉండటమే ధరలు ఆ స్థాయిలో ఉండటానికి కారణమని చెబుతారు. ఇంత ఖరీదైన నగరంలో స్లమ్ రిహాబిలిటేషన్ అథారిటీ (SRA) నిర్వహించిన ఒక సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.మహారాష్ట్రలోని మురికివాడల పునరాభివృద్ధి ప్రాజెక్టులను నియంత్రించే స్లమ్ రిహాబిలిటేషన్ అథారిటీ 2015 సర్వే ప్రకారం.. ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్ లక్ష ఎకరాలకుపైగా విస్తీర్ణంలో విస్తరించింది. ఇందులో నివాసయోగ్యమైన భూమి భాగం సుమారు 34 వేల ఎకరాలు.ఇందులో దాదాపు 20 శాతం భూమి తొమ్మిది మంది ల్యాండ్లార్డ్ల చేతిలోనే ఉంది. వీరిలో ప్రయివేటు సంస్థలు, వ్యాపార కుటుంబాలు, ట్రస్టులు ఉన్నాయి.అతిపెద్ద ల్యాండ్‌లార్డ్ గోద్రెజ్స్లమ్ రిహాబిలిటేషన్ అథారిటీ సర్వే ప్రకారం.. ముంబైలోని విఖ్రోలి ప్రాంతంలో గోద్రెజ్ కుటుంబానికి 3,400 ఎకరాలకు పైగా భూమి ఉంది. విఖ్రోలిలోని ఈస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవే పక్కనే ఈ భూమి ఉంది. అయితే ఈ భూమిపై కొన్ని పరిమితులు ఉన్నాయి. ఈ పరిమితులతో కూడిన భూమి విలువను పరిగణనలోకి తీసుకుంటే, అది దాదాపు రూ.30,000 కోట్లు ఉండవచ్చు. పరిమితులను లేకుండా అయితే రూ.50,000 కోట్లకు పైగా ఉంటుందని రియల్ ఎస్టేట్ ఎక్స్‌పర్ట్‌లు చెబుతున్నారు.గ్రోద్రెజ్ తర్వాత ఎఫ్ఈ దిన్షా ట్రస్ట్ రెండవ స్థానంలో ఉంది. మలాడ్, పరిసర ప్రాంతాల్లో ఇది దాదాపు 683 ఎకరాల భూమిని కలిగి ఉంది. ఎఫ్ఈ దిన్షా ఒక పార్సీ న్యాయవాది, ఫైనాన్సర్. 1936లో మరణించారు. ఈ భూమిని క్రమంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటూ వస్తోంది. ఇక మూడవ స్థానంలో ప్రతాప్‌సింగ్ వల్లభదాస్ సూర్జీ కుటుంబం ఉంది. ఈ కుటుంబానికి ముంబైలోని భాండూప్, దాని పరిసరాల్లో సుమారు 647 ఎకరాల భూమి ఉంది.నాల్గవ స్థానంలో ఉన్న జీజీబోయ్ అర్దేషిర్ ట్రస్ట్‌కు ముంబైలోని చెంబూర్‌లో 508 ఎకరాల భూమి ఉంది. ఆ తర్వాత ఏహెచ్ వాడియా ట్రస్ట్‌కు కుర్లాలో 361 ఎకరాలు ఉంది. ఇందులో చాలామటుకు ఆక్రమణకు గురైంది. సర్వే ప్రకారం ముంబైలోని వివిధ ప్రాంతాల్లో బైరామ్జీ జీజీబోయ్ ట్రస్ట్ 269 ఎకరాల భూమిని కలిగి ఉంది. ఇవే కాకుండా, సర్ ముహమ్మద్ యూసుఫ్ ఖోట్ ట్రస్ట్, వీకే లాల్ కుటుంబం వంటి ఇతర ప్రైవేట్ భూస్వాములకు కూడా ముంబైలోని కంజుర్మార్గ్, కండివాలి ప్రాంతంలో భారీగా భూములు ఉన్నాయి. -
క్యూ3లో 25 రియల్ ఎస్టేట్ డీల్స్..
దేశీ రియల్టీ రంగంలో ఈ కేలండర్ సంవత్సరం(2024) మూడో త్రైమాసికంలో 25 డీల్స్ జరిగినట్లు కన్సల్టింగ్ సంస్థ గ్రాంట్ థార్న్టన్ భారత్ నివేదిక పేర్కొంది. వీటి విలువ 1.4 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 11,760 కోట్లు)గా తెలియజేసింది. ప్రధానంగా డెవలపర్స్ చేపట్టిన అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్)దే వీటిలో ప్రధాన వాటాగా వెల్లడించింది. ‘రియల్టీ, రీట్స్ డీల్ ట్రాకర్– ఎంఅండ్ఏ, పీఈ డీల్ ఇన్సైట్స్’ పేరుతో విడుదల చేసిన నివేదిక వివరాలు చూద్దాం..కొత్త రికార్డ్ రియల్టీ రంగ జోరును కొనసాగిస్తూ ఈ ఏడాది జులై–సెపె్టంబర్(క్యూ3)లో ఏకంగా 25 డీల్స్ నమోదయ్యాయి. పరిమాణంరీత్యా ఇది సరికొత్త రికార్డుకాగా.. విలువ(రూ. 11,760 కోట్లు)రీత్యా 2023 ఏడాది క్యూ2 తదుపరి గరిష్ట విలువగా నమోదైంది. ప్రధానంగా క్విప్ జారీ పుంజుకోవడం ఇందుకు దోహదపడింది. వీటికి రెసిడెన్షియల్, వాణిజ్య విభాగాలలో పీఈ నిధులు జత కలిశాయి. అంతేకాకుండా రియల్టీ టెక్నాలజీ కంపెనీలలోనూ ఒప్పందాలు కలిసొచ్చాయి. డీల్స్ తీరిలా క్యూ2లో నమోదైన మొత్తం డీల్స్‌లో 5.1 కోట్ల డాలర్ల విలువైన 8 ఒప్పందాలు కొనుగోళ్లు, విలీనం(ఎంఅండ్ఏ) విభాగంలో జరిగాయి. ప్రయివేట్ ఈక్విటీ(పీఈ), వెంచర్ క్యాపిటల్(వీసీ) విభాగంలో 40.1 కోట్ల విలువైన 12 డీల్స్ నమోదయ్యాయి. అయితే ఏప్రిల్–జూన్(క్యూ2)లో లభించిన 1.4 బిలియన్ డాలర్లతో పోలిస్తే భారీగా క్షీణించాయి. కాగా.. క్యూ3లో 4.9 కోట్ల డాలర్ల విలువైన ఒక ఐపీవోసహా 94 కోట్ల డాలర్ల విలువైన క్విప్‌లు జారీ అయ్యాయి. ఇందుకు క్యాపిటల్ మార్కెట్లు బలపడటం సహకరించింది. క్విప్‌లో 94 కోట్ల డాలర్ల విలువైన 4 డీల్స్ జరిగాయి. ప్రెస్టీజ్ ఎస్టేట్స్ 60.2 కోట్ల డాలర్ల డీల్ దీనిలో కలసి ఉంది. ఇవి క్యూ2తో పోలిస్తే ఆరు రెట్లు అధికం. -
రియల్టీలో భారీగా పెరిగిన పెట్టుబడులు: సీబీఆర్ఈ
2024 జనవరి-సెప్టెంబర్ మధ్య కాలంలో దేశీ రియల్ ఎస్టేట్ రంగంలోకి ఈక్విటీ పెట్టుబడులు 8.9 బిలియన్ డాలర్ల మేర వచ్చాయి. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 46 శాతం పెరిగాయి. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ నివేదిక ప్రకారం 2018లో ఈ పెట్టుబడులు 5.8 బిలియన్ డాలర్లుగా ఉండగా, 2019లో 6.4 బిలియన్ డాలర్లు, 2020లో 6 బిలియన్ డాలర్లు, 2021లో 5.9 బిలియన్ డాలర్లు, 2022లో 7.8 బిలియన్ డాలర్లు, 2023లో 7.4 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్, సావరీన్ వెల్త్ ఫండ్స్, సంస్థాగత ఇన్వెస్టర్లు, రియల్ ఎస్టేట్ డెవలపర్లు. రియల్ ఎస్టేట్ ఫండ్ – కమ్ – డెవలపర్లు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు, కార్పొరేట్ గ్రూప్‌లు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు మొదలైనవి చేసే ఇన్వెస్ట్మెంట్లను ఈక్విటీ పెట్టుబడులుగా వ్యవహరిస్తారు. డేటా ప్రకారం జూన్ త్రైమాసికంలో పెట్టుబడుల ప్రవాహం పెరగడంతో 2024 జనవరి–సెప్టెంబర్ మధ్య కాలంలో దేశీ రియల్ ఎస్టేట్‌లోకి ఇన్వెస్ట్మెంట్లు కొత్త గరిష్టాలకు ఎగిశాయి. జూలై–సెపె్టంబర్ మధ్య కాలంలో రియల్టీలోకి 2.6 బిలియన్ డాలర్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. రాబోయే రోజుల్లోనూ ఇదే తీరు కొనసాగే అవకాశం ఉందని సీబీఆర్ఈ చైర్మన్ (భారత్, ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా) అన్షుమన్ మ్యాగజైన్ తెలిపారు.సెప్టెంబర్ త్రైమాసికంలో దేశీ ఇన్వెస్టర్లు (ప్రధానంగా డెవలపర్లు) పెట్టుబడులకు నేతృత్వం వహించారు. ఆఫీస్ లీజింగ్ మార్కెట్ పుంజుకోవడం, గృహాల కొనుగోలు.. ఖర్చు చేసే విషయంలో వినియోగదారుల్లో రిస్కు సామర్థ్యాలు అసాధారణంగా పెరగడం తదితర అంశాలు ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల్లో రియల్టీలోకి పెట్టుబడులు రావడానికి దోహదపడినట్లు నివేదిక వివరించింది. -
మూడు ఈఎంఐలతో రూ.13 లక్షలు ఆదా!
సొంతిల్లు సామాన్యుడి కల. ఈ కలను నెరవేర్చుకునేందుకు చాలామంది తమ జీవితాంతం కష్టపడుతారు. ఏళ్ల తరబడి నెలవారీ సంపాదన పోగుచేస్తుంటారు. అయినా ఇప్పుడు మార్కెట్లో ఉన్న రేటుకు ఇల్లు కొనాలంటే చాలా వరకు హోంలోన్ తీసుకోవాల్సిందే. ఇదే అదనుగా హోమ్‌లోన్‌కు సంబంధించి చాలా బ్యాంకులు కనీసం 20 ఏళ్ల కాలపరిమితి ఉండేలా జాగ్రత్త పడుతుంటాయి. దాంతో కస్టమర్ల నుంచి అధిక వడ్డీ సమకూరే అవకాశం ఉంటుంది. కానీ లోన్ తీసుకునే వారికి అది భారంగా మారుతుంది. కాబట్టి కొన్ని చిట్కాలు పాటించి ఈ హోమ్‌లోన్ భారాన్ని తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.ఉదాహరణకు..విజయ్ ఏటా తొమ్మిది శాతం వడ్డీ చొప్పున 20 ఏళ్ల కాలానికిగాను రూ.25,00,000 హోంలోన్ తీసుకున్నాడని అనుకుందాం. లోన్ మొత్తానికి నెలవారీ ఈఎంఐ రూ.22,493. ఇరవై ఏళ్ల కాలానికి వడ్డీ రూ.29 లక్షలు అవుతుంది. అయితే చిన్న చిట్కాతో ఈ వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చు. ఏడాది ప్రాతిపదికన 12 నెలలకు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఏటా కేవలం మూడు ఈఎంఐలు అధికంగా చెల్లిస్తే ఏకంగా రూ.13 లక్షలు వడ్డీ ఆదా చేసుకోవచ్చు. బ్యాంకు సిబ్బందితో మాట్లాడి ఏటా 15 ఈఎంఐలు..అంటే మూడు ఈఎంఐలు అధికంగా చెల్లిస్తే సరిపోతుంది. అందుకు కొన్ని బ్యాంకులు ఒప్పుకోవు. ఎందుకంటే బ్యాంకు వడ్డీ కోల్పోయే ప్రమాదం ఉంది. దానివల్ల లోన్ తీసుకునేవారికి మేలు జరుగుతుంది. నిబంధనల ప్రకారం ఏడాదిలో 15 ఈఎంఐలు చెల్లించేందుకు ప్రతి బ్యాంకు అనుమతించాల్సిందే.ఇదీ చదవండి: ఇంట్లో ఎంత బంగారం ఉండాలంటే..నెలవారీ సంపాదనను దృష్టిలో ఉంచుకుని ఈఎంఐలు 20-30 శాతం దాటకుండా జాగ్రత్తపడాలి. సొంతిల్లు లేకపోతే సమాజం ఏమనుకుంటుందోననే భావనతో సరైన ఆర్థిక స్థోమత లేకపోయినా అప్పుచేసి ఇల్లుకొని ఇబ్బంది పడకూడదని నిపుణులు చెబుతున్నారు. -
హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు డౌన్.. కారణం ఏంటో తెలుసా?
న్యూఢిల్లీ: సెప్టెంబర్ త్రైమాసికంలో ఇళ్ల మార్కెట్ కొంత నీరసించింది. హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు 19 శాతం క్షీణించగా, దేశవ్యాప్తంగా ఎనిమిది పట్టణాల్లో సగటున 5 శాతం మేర విక్రయాలు తగ్గాయి. ఎనిమిది పట్టణాల్లో 96,544 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 1,01,221 యూనిట్లుగా ఉన్నాయి. కొత్త ఇళ్ల ఆవిష్కరణలు (తాజా సరఫరా) సెప్టెంబర్ త్రైమాసికంలో 25 శాతం తక్కువగా 91,863 యూనిట్లుగానే ఉన్నాయి. ఈ వివరాలను రియల్ ఎస్టేట్ బ్రోకరేజీ సంస్థ ప్రాప్‌టైగర్ విడుదల చేసింది. నూతన ఇళ్ల సరఫరా తగ్గడానికి తోడు, ధరలు పెరగడం విక్రయాలు క్షీణించడానికి కారణమని ఈ నివేదిక పేర్కొంది. ముఖ్యంగా ఎనిమిది పట్టణాల్లో ఇళ్ల ధరలు 20 శాతం పెరగడంతో ధరల అందుబాటుపై ప్రభావం చూపించినట్టు వివరించింది. పట్టణాల వారీగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్ కాలంలో హైదరాబాద్‌లో 11,564 యూనిట్ల ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 14,191 యూనిట్లుగా ఉండడం గమనార్హం. అంటే 19 శాతం క్షీణత కనిపిస్తోంది. బెంగళూరులోనూ 11% తక్కువగా 11,160 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు నమోదయ్యాయి. చెన్నైలో 8 శాతం తక్కువగా 3,560 యూనిట్లు అమ్ముడయ్యాయి. కోల్‌కతాలో అమ్మకాలు 2,796 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలం అమ్మకాలతో పోల్చి చూస్తే 22 శాతం తగ్గాయి. చదవండి: ఇల్లు పూర్తయినా.. ఈ అనుభవం మీకూ ఎదురైందా?ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో అమ్మకాలు ఒక శాతం తక్కువగా 30,010 యూనిట్లుగా నమోదయ్యాయి. పుణెలోనూ విక్రయాలు 3 శాతం తగ్గి 18,004 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో మాత్రం ఇళ్ల అమ్మ కాలు 29% పెరిగాయి. 10,098 యూనిట్ల విక్రయాలు జరిగాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 7,800 యూనిట్లుగా ఉన్నాయి. అహ్మదాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు 9 శాతం క్షీణించి 9,352 యూనిట్లుగా నమోదయ్యాయి.పండుగల సీజన్‌తో అమ్మకాలకు ఊతం ‘‘వార్షికంగా చూస్తే సెపె్టంబర్ క్వార్టర్లో ఇళ్ల అమ్మకాలు, కొత్త ఇళ్ల ఆవిష్కరణలు తగ్గడం ధరల పెరుగుదలకు స్పందనగా కనిపిస్తోంది. మార్కెట్ కార్యకలాపాలు మోస్తరు స్థాయికి చేరడం చూస్తున్నాం. ఇది స్థిరమైన వృద్ధిని తీసుకొస్తుంది. అంతిమంగా వినియోగదారులకు మేలు చేస్తుంది. గడిచిన కొన్ని త్రైమాసికాల్లో ఇళ్ల ధరలు కొన్ని ప్రాంతాల్లో 3 శాతం నుంచి 50 శాతం వరకూ పెరిగాయి. ఇది తక్షణ ఇళ్ల కొనుగోలు నిర్ణయాలపై ప్రభావం చూపిస్తోంది’’ అని ప్రాప్‌టైగర్ బిజినెస్ హెడ్ వికాస్ వాధ్వాన్ వివరించారు. కొత్త ధరలకు వినియోగదారులు సర్దుకోవడానికి కొంత సమయం పడుతుందన్నారు. దేవీ నవరాత్రులతో పండుగల సీజన్ ఊపందుకుందని, అమ్మకాలు పెరుగుతాయని భావిస్తున్నట్టు చెప్పారు. హైదరాబాద్, పుణె మార్కెట్లో డెవలపర్లు డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా వ్యూహాలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. -
పెరిగిన ఇళ్ల అమ్మకాలు.. ఈ ఎనిమిది పట్టణాలే టాప్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రముఖ పట్టణాల్లో ఇళ్ల అమ్మకాలు సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో 5 శాతం పెరిగాయి. ఇదే కాలంలో ఆఫీస్ వసతుల (స్పేస్) లీజింగ్ సైతం 18% పెరిగింది. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఎనిమిది పట్టణాలకు సంబంధించిన డేటాను రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా విడుదల చేసింది. ఎనిమిది ప్రముఖ పట్టణాల్లో జూలై–సెప్టెంబర్ కాలంలో 87108 యూనిట్ల ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 82,612 యూనిట్లుగా ఉన్నాయి.స్థూల ఆఫీస్ లీజింగ్ క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు ఈ పట్టణాల్లో 18% పెరిగి 19 మిలియన్ చదరపు అడుగులకు (ఎస్ఎప్టీ) చేరింది. బహుళజాతి కంపెనీలు, గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్ల (జీసీసీ) నుంచి అధిక డిమాండ్ నెలకొంది. జూలై–సెప్టెంబర్‌లో ఇళ్ల అమ్మకాలు పెరిగాయన్న అనరాక్, ప్రాప్ ఈక్విటీ సంస్థల అంచనాలకు భిన్నంగా నైట్‌ఫ్రాంక్ గణాంకాలు ఉండడం గమనార్హం. ‘‘2024లో ఇళ్ల మార్కెట్లో సానుకూల ధోరణి నెలకొంది. క్యూ3లో రికార్డు స్థాయిలో అమ్మకాలు నమోదయ్యాయి’’అని నైట్‌ఫ్రాంక్ నివేదిక తెలిపింది. రూ.1 కోటికి మించి ధర కలిగిన ప్రీమియం ఇళ్లకు ఏర్పడిన డిమాండ్ అమ్మకాల వృద్ధికి సాయపడుతున్నట్టు నైట్‌ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజాల్ వెల్లడించారు. అందుబాటు ధరల విభాగంలో ఇళ్ల అమ్మకాలు తగ్గినట్టు చెప్పారు. ఇళ్ల లభ్యత, వాటి ధరల పరంగా సవాళ్లు నెలకొన్నట్టు తెలిపారు. జీసీసీల ముఖ్య భూమిక‘‘భారత్‌లో వ్యాపార సంస్థలు, జీసీసీలు తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. వృద్ధిలో వీటిదే ప్ర ముఖ పాత్ర. ఈ ఏడాది మిగిలిన కాలంలోనూ ఇదే ధోరణి ఉంటుందని అంచనా వేస్తున్నాం. 2024 మొత్తం మీద ఆఫీస్ స్థలాల లీజింగ్ 70 మిలియన్ ఎస్ఎఫ్టీని అధిగమించొచ్చు. నికరంగా 10 మిలియన్ ఎస్ఎఫ్టీ ఎక్కువ. క్రితం ఏడాది కంటే 20% అధికం. అంతర్జాతీయ వ్యాపార కేంద్రంగా భారత్ అభివృద్ధి చెందుతుండడాన్ని ఈ అసాధారణ వృద్ధి తెలియజేస్తోంది’’అని శిశిర్ బైజాల్ వివరించారు. హైదరాబాద్‌లో 9 శాతం వృద్ధి➤హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు 2024 జూలై–సెపె్టంబర్ త్రైమాసికంలో 9 శాతం పెరిగి 9,114 యూనిట్లుగా ఉన్నాయి. హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 26 శాతం తగ్గి 2.2 మిలియన్ చదరపు అడుగులకు (ఎస్ఎఫ్టీ) పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో లీజింగ్ 2.9 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉండడం గమనార్హం. ➤ముంబై మార్కెట్లో రికార్డు స్థాయిలో 24,222 యూనిట్ల ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో అమ్మకాల కంటే 9 శాతం ఎక్కువ. కానీ, ఆఫీస్ స్పేస్ లీజింగ్ మాత్రం 17 శాతం తగ్గిపోయి 2.7 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా నమోదైంది. ➤బెంగళూరులో 11 శాతం వృద్ధితో 14,604 యూనిట్ల ఇళ్లు అమ్ముడయ్యాయి. ఆఫీస్ స్పేస్ లీజింగ్ ఇక్కడ రెండున్నర రెట్లు పెరిగి 5.3 మిలియన్ చదరపు అడుగులకు దూసుకుపోయింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లీజింగ్ 2.1 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగానే ఉంది.➤పుణెలో ఇళ్ల అమ్మకాలు కేవలం ఒక శాతమే పెరిగి 13,200 యూనిట్లుగా ఉన్నాయి. ఇక్క డ కార్యాలయ స్థలాల లీజింగ్ 14 శాతం క్షీణించి 2.6 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది.➤అహ్మదాబాద్‌లో 11 శాతం వృద్ధి నమోదైంది. 4,578 యూనిట్ల విక్రయాలు జరిగాయి. ఆఫీస్ స్పేస్ లీజింగ్ సైతం 69 శాతం వృద్ధిని నమోదు చేసింది. 0.3 మిలియన్ చదరపు అడుగుల లీజింగ్ లావాదేవీలు చోటుచేసుకున్నాయి. ➤కోల్‌కతాలోనూ 14 శాతం అధికంగా 4,309 యూనిట్ల ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి. స్థూల ఆఫీస్ స్థలాల లీజింగ్ 38 శాతం తక్కువగా 0.18 మిలియన్ ఎస్ఎఫ్టీకి పరిమితమైంది.➤ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు 7 శాతం తగ్గాయి. 12,976 యూనిట్లు అమ్ముడయ్యాయి. కానీ, ఆఫీస్ స్పేస్ లీజింగ్ 26 శాతం పెరిగి 3.2 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరింది.➤చెన్నైలో 4,105 యూనిట్ల ఇళ్లు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలోని విక్రయాల కంటే 6 శాతం తక్కువ. చెన్నైలో ఆఫీస్ స్పేస్ 35 శాతం వృద్ధితో 2.6 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా నమోదైంది.➤జూలై–సెప్టెంబర్ కాలంలో మొత్తం ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లో జీసీసీలు తీసుకున్నదే 37 శాతం (7.1 మిలియన్ ఎస్ఎఫ్టీ)గా ఉంది. -
దేశంలో ఆఫీస్ స్పేస్ విస్తరణ.. కారణం..
దేశీయంగా మూడో త్రైమాసికంలో ప్రధానం నగరాల్లోని కంపెనీలు 19 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని లీజ్‌కు తీసుకున్నట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. 2023లో ఇదే సమయంలో అద్దెకు తీసుకున్న 16.1 మిలియన్ చదరపు అడుగుల స్థలంతో పోలిస్తే ఈసారి 18 శాతం పెరుగుదల నమోదైందని నివేదికలో పేర్కొంది. 2024 సంవత్సరం మొదటి 9 నెలల్లో 53.7 మిలియన్ చదరపు అడుగుల మేర ఆఫీస్ స్థలాన్ని లీజ్‌కు తీసుకున్నట్లు నైట్ ఫ్రాంక్ నివేదించింది.నివేదికలోని వివరాల ప్రకారం..2024 క్యూ3లో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు (జీసీసీ) 7.1 మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని అద్దెకు తీసుకున్నాయి. ఆఫీస్ స్పేస్‌కు మార్కెట్లో డిమాండ్ భారీగా పెరుగుతోంది. జీసీసీల వృద్ధి అందుకు ప్రధాన కారణంగా నిలుస్తుంది. దాంతోపాటు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి. దేశంలో 2024 క్యూ3లో బెంగళూరు నగరం 5.3 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ అద్దెతో మొదటిస్థానంలో నిలిచింది. ఎన్సీఆర్ ఢిల్లీ 3.2, ముంబయి 2.6, పుణె 2.6, చెన్నై 2.6, హైదరాబాద్‌లో 2.2 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఆఫీస్ స్పేస్‌ను లీస్‌కు తీసుకున్నారు. కొత్తగా హైదరాబాద్ నగరం 4.2, పుణె 2.7, బెంగళూరు 2.5, ఎన్సీఆర్ ఢిల్లీ 0.9, ముంబయి 0.8 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఆఫీస్ స్థలాన్ని నిర్మించాయి.ఇదీ చదవండి: మార్కెట్ కల్లోలానికి కారణాలుదేశంలోని ఐటీ కంపెనీలు, ఇతర టెక్ సర్వీస్‌లు అందించే సంస్థలు కొంతకాలంగా అనుసరిస్తున్న వర్క్‌ఫ్రంహోం, హైబ్రిడ్ వర్క్ కల్చర్‌కు స్వస్తి పలుకుతున్నాయి. క్రమంగా ఉద్యోగులను పూర్తి స్థాయిలో ఆఫీస్ నుంచే పని చేయాలని మెయిళ్లు పంపుతున్నాయి. దాంతో కరోనా సమయం నుంచి ఇంటి వద్ద పనిచేస్తున్నవారు తిరిగి కార్యాలయాలకు వస్తున్నారు. నిత్యం సంస్థలు తమ కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. దాంతో గడిచిన 3-4 ఏళ్ల నుంచి కంపెనీల్లోని మానవ వనరులు పెరిగాయి. తిరిగి అందరూ ఆఫీస్‌కు వస్తుండడంతో అందుకు సరిపడా స్పేస్‌ను లీజ్‌కు తీసుకుంటున్నాయి. దేశీయంగా మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఫలితంగా ప్రధాన నగరాల్లో జీసీసీల సంఖ్య పెరుగుతోంది. వాటిలోనూ పెద్ద సంఖ్యలో ఉద్యోగులు చేరుతుండడంతో అద్దె స్థలం పెరుగుతోంది.