Technology
-
దేశంలో టెలికాం యూజర్ల సంఖ్య ఎంతో తెలుసా..
న్యూఢిల్లీ: దేశీయంగా డిసెంబర్లో మొత్తం టెలిఫోన్ సబ్‌స్క్రయిబర్స్ సంఖ్య గతంలో కంటే స్వల్పంగా పెరిగి 118.99 కోట్లకు చేరింది. నవంబర్‌లో ఇది 118.71 కోట్లుగా నమోదైంది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ఇటు మొబైల్, అటు ఫిక్స్డ్ లైన్ విభాగాల్లో జియో పెద్ద సంఖ్యలో కొత్త యూజర్లను దక్కించుకుంది. వైర్లెస్ యూజర్ల విభాగంలో, రిలయన్స్ జియోకి నికరంగా 39.06 లక్షలు, భారతి ఎయిర్‌టెల్‌కు 10.33 లక్షల మంది కొత్తగా జత కాగా వొడాఫోన్ 17.15 లక్షల మందిని కోల్పోయింది. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ వరుసగా 3.16 లక్షలు, 8.96 లక్షల మంది సబ్ర్స్కయిబర్స్ను కోల్పోయాయి. ఈ విభాగంలో ప్రైవేట్ సంస్థల మార్కెట్ వాటా 91.92 శాతంగా ఉండగా, ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ వాటా కేవలం 8.08 శాతంగా ఉంది.మరోవైపు, వైర్‌లైన్ యూజర్ల సంఖ్య నవంబర్‌లో 3.85 కోట్ల నుంచి డిసెంబర్లో 3.92 కోట్లకు చేరింది. జియోకి 6.56 లక్షల మంది, భారతి ఎయిర్‌టెల్‌కు 1.62 లక్షలు, టాటా టెలీకి 9,278 మంది యూజర్లు జతయ్యారు. బీఎస్ఎన్ఎల్ ఏకంగా 33,306 యూజర్లను, ఎంటీఎన్ఎల్ 14,054 మంది సబ్‌్రస్కయిబర్స్‌ను కోల్పోయాయి. బ్రాడ్‌బ్యాండ్ యూజర్లు 94.49 కోట్లు.. మొత్తం బ్రాడ్‌బ్యాండ్ యూజర్లు నవంబర్‌లో 94.47 కోట్లుగా ఉండగా, డిసెంబర్లో 94.49 కోట్లకు చేరింది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ సబ్‌స్క్రయిబర్స్ 47.65 కోట్లుగా, భారతి ఎయిర్టెల్ యూజర్లు 28.93 కోట్లు, వొడాఫోన్ ఐడియా 12.63 కోట్లు, భారత్ సంచార్ నిగమ్ 3.53 కోట్లు, ఎట్రియా కన్వర్జెన్స్ టెక్నాలజీస్ యూజర్లు 22.7 లక్షల మంది ఉన్నారు. బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్లో 50.43 శాతం వాటాతో జియో అగ్రస్థానంలో ఉండగా, భారతి ఎయిర్టెల్ (30.61 శాతం), వొడాఫోన్ ఐడియా (13.37 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. -
ఆన్లైన్ మోసాల కట్టడికి వినూత్న విధానం
ప్రముఖ టెలికాం ఆపరేటర్లలో ఒకటైన ఎయిర్టెల్ తన కస్టమర్లను ఆన్లైన్ మోసాల నుంచి రక్షించేందుకు ప్రయత్నాలు చేపట్టింది. పెరుగుతున్న ఆన్లైన్ మోసాలు, ఫిషింగ్ స్కామ్(పాస్వర్డ్లు, క్రెడిట్ కార్డ్ నంబర్లు లేదా వ్యక్తిగత వివరాలు వంటి సున్నితమైన సమాచారాన్ని బహిర్గతం చేయడానికి హ్యాకర్లు ఉపయోగించే ఒక రకమైన సైబర్ క్రైమ్) నుంచి కంపెనీకి చెందిన 38 కోట్ల మంది సబ్‌స్కైబర్లకు మెరుగైన భద్రత అందించేందుకు కొత్త సాంకేతికతను అమలు చేయనున్నట్లు కంపెనీ అధికారులు తెలిపారు.కొత్త టెక్నాలజీ అమలు సుమారు 80 శాతం పూర్తయిందని కంపెనీ తెలిపింది. ఈ ప్రతిష్టాత్మక చర్యల వల్ల వన్ టైమ్ పాస్‌వర్డ్‌ల(ఓటీపీ) దుర్వినియోగాన్ని నిరోధించడం, హానికరమైన లింక్‌లను కట్టడి చేయడంపై దృష్టి సారించినట్లు పేర్కొంది. అధునాతన కృత్రిమ మేధ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్‌లను ఉపయోగించడం ద్వారా ఎయిర్టెల్ తన వినియోగదారులకు సురక్షితమైన డిజిటల్ వాతావరణాన్ని సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ టెక్నాలజీ వల్ల రియల్ టైమ్‌లో కస్టమర్లకు వచ్చే మోసపూరిత కాల్స్, స్కామ్ మెసేజ్‌లను గుర్తించి వాటిని అరికడుతుంది. దాంతో వినియోగదారులు ఆన్లైన్ మోసానికి గురవుతామనే భయం లేకుండా కమ్యూనికేట్ చేయడానికి, ఆన్లైన్లో ఆర్థిక లావాదేవీలు నిర్వహించడానికి వీలవుతుందని సంస్థ పేర్కొంది.పరిష్కారం పరిమితంగానే..ఈ టెక్నాలజీ పరిష్కారం పరిధి ప్రస్తుతం ఎస్ఎంఎస్, కాల్ ఆధారిత మోసాలకు మాత్రమే పరిమితమైంది. ఎన్క్రిప్షన్ ప్రోటోకాల్స్ కారణంగా వాట్సాప్, టెలిగ్రామ్ వంటి ఓవర్-ది-టాప్ (ఓటీటీ) కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి ఉత్పన్నమయ్యే స్పామ్, మోసాలకు ఈ సాంకేతికత పరిష్కరించదని అధికారులు స్పష్టం చేశారు. సైబర్ నేరగాళ్లు ఈ మోసాలపై అవగాహనలేని వినియోగదారులను లక్ష్యంగా చేసుకోవడానికి ఈ ఎన్క్రిప్టెడ్ ప్లాట్‌ఫామ్‌లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కొన్ని టెక్నికల్ కారణాలవల్ల డిజిటల్ మోసాలు పెరుగుతున్న అంశాన్ని ప్రస్తావిస్తూ ఎయిర్టెల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు రక్షణ కల్పించేందుకు రెగ్యులేటరీ జోక్యం చేసుకోవాలని తెలిపింది. ఓటీటీ కమ్యూనికేషన్ సేవలను రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ కిందకు తీసుకురావాలని ప్రభుత్వాన్ని, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)ను కోరింది. ఓటీటీ యూజర్లకు నో యువర్ కస్టమర్ (కేవైసీ) వెరిఫికేషన్ తప్పనిసరి చేయడం, ఈ ప్లాట్‌ఫామ్‌లను సెంట్రలైజ్డ్ స్పామ్ డిటెక్షన్ సిస్టమ్స్‌లోకి ఇంటిగ్రేషన్ చేయడం వంటివి ఇందులో ఉన్నాయి.ఇదీ చదవండి: యాపిల్ సాఫ్ట్వేర్ రీడిజైనింగ్.. కీలక మార్పులు ఇవేనా?ఏకీకృత విధానం అవసరం..డిజిటల్ మోసాలకు వ్యతిరేకంగా సమగ్ర వ్యూహాన్ని రూపొందించడానికి టెలికాం ఆపరేటర్లు, రెగ్యులేటర్లు, టెక్నాలజీ ప్రొవైడర్లతో సహా వాటాదారుల మధ్య సహకారం అవరసమని నిపుణులు సూచిస్తున్నారు. ఎయిర్టెల్ తన ప్రయత్నాలతో ఆన్లైన్ మోసాలను కట్టడి చేసేందుకు ముందడుగు వేసినప్పటికీ, ఓటీటీ ద్వారా ఉత్పన్నమయ్యే మోసాలపై పోరాటానికి, అన్ని కమ్యూనికేషన్ ఛానళ్లను రక్షించడానికి ఏకీకృత విధానం అవసరమని చెబుతున్నారు. -
యాపిల్ సాఫ్ట్వేర్ రీడిజైనింగ్.. కీలక మార్పులు ఇవేనా?
ప్రపంచవ్యాప్తంగా యాపిల్ ఉత్పత్తులకు ఎంత గిరాకీ ఉంటుందో తెలుసుకదా. ప్రత్యేకమైన యాపిల్ సాఫ్ట్వేర్ కోసమే చాలామంది వినియోగదారులు కంపెనీ ఉత్పత్తులను కొనుగోలు చేస్తూంటారు. దాంతోపాటు డిజైనింగ్, ఆర్ అండ్ డీ(పరిశోధన, అభివృద్ధి) విభాగం నిత్యం అందిస్తున్న అప్డేట్లకు ఫిదా అవుతుంటారు. ఉత్పత్తుల విషయంలో ఇన్నోవేషన్, డిజైనింగ్‌లో ప్రసిద్ధి చెందిన యాపిల్ ఇంక్ చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన సాఫ్ట్వేర్ మార్పులకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది చివర్లో ఈ సాఫ్ట్వేర్ రీడిజైనింగ్ ప్రారంభకానున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మార్పులు దాని ఫ్లాగ్షిప్ పరికరాలైన ఐఫోన్, ఐప్యాడ్, మాక్బుక్ల్లో వినియోగదారుల అనుభవాన్ని ఏకీకృతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.మార్పులు ఇవేనా..రాబోయే యాపిల్ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు ఆపరేటింగ్ సిస్టమ్‌కు ఏకీకృత డిజైన్‌ను తీసుకువస్తుందని నమ్ముతున్నారు. మాక్ఓఎస్, ఐఓఎస్, ఐప్యాడ్ఓఎస్ మధ్య ఫంక్షనల్ అంతరాలను ఈ మార్పులు భర్తీ చేయనున్నాయని కంపెనీ పేర్కొంది. గత ఏడాది లాంచ్ చేసిన యాపిల్ విజన్ ప్రో మిక్స్డ్ రియాలిటీ హెడ్సెట్ సాఫ్ట్వేర్ నుంచి స్ఫూర్తి పొంది ఈ కొత్త ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పింది. రీడిజైన్‌లో భాగంగా కొన్ని ఐకాన్లు, మెనూలు, అప్లికేషన్లు, సిస్టమ్ బటన్లలో కూడా మార్పులు ఉంటాయని అధికారులు తెలిపారు. ఇది భవిష్యత్తులో మరింత క్రమబద్ధమైన, సహజమైన యూజర్ ఇంటర్ఫేస్ను అందిస్తుందని చెబుతున్నారు.ఇదీ చదవండి: హోలీ గేట్‌వే సేల్.. రూ.1,199కే విమాన ప్రయాణం!వ్యూహాత్మక లక్ష్యాలుసంస్థ ఆదాయ వృద్ధి మందకొడిగా ఉన్న నేపథ్యంలో వినియోగదారుల ఆసక్తిని పునరుద్ధరించేందుకు యాపిల్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. యాపిల్‌కు ఈ రీడిజైనింగ్ కీలకంగా మారనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కంపెనీ ప్రాథమిక ఆదాయ వనరుగా ఉన్న ఐఫోన్ అమ్మకాలు గత హాలిడే సీజన్లో భారీగా తగ్గిపోయాయి. అద్భుతమైన ఇంటర్ఫేస్ను ప్రవేశపెట్టడం ద్వారా తిరిగి యాపిల్ ఉత్పత్తుల అమ్మకాలు పెంచేలా కంపెనీ చర్యలు చేపట్టింది. టెక్నాలజీ ఆవిష్కరణలో తన స్థానాన్ని అగ్రగామిగా సుస్థిరం చేసుకోవాలని యాపిల్ భావిస్తోంది. ఐఓఎస్ 19, ఐప్యాడ్ ఓఎస్ 19, మాక్ ఓఎస్ 16ల్లో భాగమైన సాఫ్ట్వేర్ అప్డేట్లను జూన్‌లో జరిగే యాపిల్ వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్‌లో ఆవిష్కరించనున్నారు. -
ఎక్స్‌పై సైబర్ ఎటాక్ ఆ దేశం పనే!
ఎలాన్ మస్క్ (Elon Musk) సారథ్యంలోని ఎక్స్(ట్విటర్)లో అంతరాయం ఏర్పడింది. ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ప్రపంచవ్యాప్తంగా పలుమార్లు డౌన్ అయింది. ఈ విషయాన్ని మస్క్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.ఎక్స్ సైబర్ దాడిని ఎదుర్కొంటోందని.. హ్యాకర్లను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామని ట్వీట్ చేశారు. దీని వెనుక ఒక పెద్ద సమూహం లేదా ఒక దేశం హస్తం ఉండొచ్చు అని మస్క్ తెలిపారు. ఉక్రెయిన్ ప్రాంతంలోని ఐపీ చిరునామాల నుంచి సైబర్ దాడి జరిగిందని అన్నారు. ఈ కారణంగానే రోజంతా అంతరాయం ఏర్పడిందని అన్నారు.డౌన్‌డెటెక్టర్ ప్రకారం.. ఎక్స్ ప్లాట్‌ఫామ్ రోజంతా మూడు అంతరాయాలను ఎదుర్కొంది. మధ్యాహ్నం 3:00 గంటలకు ఈ అంతరాయాలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. భారతదేశం నుంచి దాదాపు 2000 మంది, యునైటెడ్ స్టేట్స్ నుంచి 18,000 మంది, యునైటెడ్ కింగ్డమ్ నుంచి 10,000 మంది ఎక్స్ యాప్‌ను యాక్సెస్ చేయలేకపోయినట్లు స్పష్టం చేసింది. రాత్రి 9 గంటలకు కూడా ఈ అంతరాయాలు కొనసాగాయి.ట్రాకింగ్ వెబ్సైట్ దాదాపు 52 శాతం సమస్యలు వెబ్‌సైట్‌కు సంబంధించినవని, 41 శాతం యాప్‌కు సంబంధించినవని, 8 శాతం సర్వర్ కనెక్షన్ సమస్యలతో సంబంధం కలిగి ఉన్నాయని చూపించింది. ఇప్పుడు కూడా అంతరాయం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.ఎలాన్ మస్క్ 2022లో 44 బిలియన్ డాలర్లకు (రూ. 3 లక్షల కోట్ల కంటే ఎక్కువ) Xని కొనుగోలు చేశారు. 2023లో అతని ఫాలోవర్స్ సంఖ్య 200 మిలియన్స్ దాటేసింది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్స్ ఉన్న మొదటి వ్యక్తిగా రికార్డ్ క్రియేట్ చేశారు. -
భారత్‌కు ఏఐ నిపుణులు కావలెను
సాక్షి, బిజినెస్ బ్యూరో: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్.. ప్రపంచం అంతా మాట్లాడుకుంటున్న హాట్ టాపిక్ ఇదే. అయితే ప్రపంచ ఏఐ నిపుణులకు కేంద్రంగా మారడానికి భారత్‌కు అవకాశాలు ఉన్నప్పటికీ.. ఈ రంగంలో నిపుణుల కొరతను దేశం ఎదుర్కొనబోతోందని మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థ బెయిన్ అండ్ కంపెనీ తన తాజా నివేదికలో వెల్లడించింది. పెరుగుతున్న నైపుణ్య అంతరం ఈ రంగంలో దేశ పురోగతికి ఆటంకం కలిగించే ప్రమాదం ఉందని తెలిపింది. 2027 నాటికి భారత ఏఐ రంగంలో 10 లక్షలకుపైగా నైపుణ్యం కలిగిన నిపుణుల కొరత తప్పదని జోస్యం చెప్పింది. అందుబాటులో ఉన్న నిపుణులతో పోలిస్తే 1.5–2 రెట్ల డిమాండ్ ఉంటుందని అంచనాగా వెల్లడించింది. సమస్య నుంచి గట్టెక్కాలంటే కంపెనీలు సంప్రదాయ నియామక విధానాలకు మించి ముందుకు సాగాలి. నిరంతర నైపుణ్యాల పెంపుదలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆవిష్కరణ–ఆధారిత పర్యావరణ వ్యవస్థను పెంపొందించాలి అని వివరించింది. రీస్కిల్–అప్‌స్కిల్.. పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి భారత్‌లో శ్రామిక శక్తి నైపుణ్యం తిరిగి మెరుగుపరచడం, నైపుణ్యాలను పెంచడం అత్యవసరమని నివేదిక స్పష్టం చేసింది. ‘అభివృద్ధి చెందుతున్న సాంకేతిక సాధనాలు, నైపుణ్యాలపై ప్రస్తుత నిపుణుల్లో ఎక్కువ మందిలో తిరిగి నైపుణ్యం మెరుగుపర్చడం, పెంచడంలో సవాళ్లతోపాటు అవకాశాలూ ఉన్నాయి’ అని బెయిన్ అండ్ కంపెనీ ఏఐ, ఇన్సైట్స్, సొల్యూషన్స్ ప్రాక్టీస్ పార్ట్నర్, లీడర్ సైకత్ బెనర్జీ తెలిపారు. ‘ప్రతిభ కొరతను పరిష్కరించడానికి బహుముఖ విధానం అవసరం. కంపెనీలు సంప్రదాయ నియామక పద్ధతులకు మించి అంతర్గత ప్రతిభను పెంపొందించడానికి నిరంతర నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతిభ కొరత ఒక ముఖ్యమైన సవాల్. కానీ అధిగమించలేనిది కాదు. దీనిని పరిష్కరించడానికి వ్యాపార సంస్థలు ఏఐ ప్రతిభను ఆకర్షించడం, అభివృద్ధి చేయడం, నిలుపుకోవడంలో ప్రాథమిక మార్పు అవసరం’ అని నివేదిక వివరించింది. ఏఐ స్వీకరణలో వెనుకంజ.. ఆకర్షణీయంగా జీతాలు పెరిగినప్పటికీ అర్హత కలిగిన ఏఐ నిపుణుల సరఫరా డిమాండ్ వేగాన్ని అందుకోలేదు. ప్రతిభ అంతరం పెరగడం వల్ల పరిశ్రమల్లో ఏఐ స్వీకరణ మందగించే ప్రమాదం ఉందని నివేదిక వివరించింది. ఉత్పాదక ఏఐ సాంకేతికతలను అమలు చేయడానికి అంతర్గత ఏఐ నైపుణ్యం లేకపోవడం ఒక ప్రధాన అడ్డంకి అని ప్రపంచవ్యాప్తంగా సర్వేలో పాలుపంచుకున్న కంపెనీల ప్రతినిధులు వెల్లడించారు. ఈ కొరత కనీసం 2027 వరకు కొనసాగుతుందని, అంతర్జాతీయ మార్కెట్లలో వివిధ స్థాయిల్లో ప్రభావం ఉంటుందని అంచనాగా చెప్పారు. దేశంలో 2019 నుండి ఏఐ సంబంధిత ఉద్యోగ నియామకాలు ఏటా 21 శాతం దూసుకెళ్లాయి. అయితే వేతనాలు ప్రతి సంవత్సరం 11 శాతం పెరిగాయి. ఏఐ అవకాశాలు: 2027 నాటికి 23 లక్షలకుపైమాటే. అంటే అందుబాటులో ఉన్న నిపుణులతో పోలిస్తే 1.5–2 రెట్లు అధిక డిమాండ్. మూడేళ్లలో వనరులు: సుమారు 12 లక్షల మందికి చేరిక నిపుణుల కొరత : 10 లక్షల మందికిపైగా డిమాండ్ తీర్చాలంటే: మానవ వనరుల నైపుణ్యం తిరిగి మెరుగుపరచడం (రీస్కిల్), నైపుణ్యాలను పెంచడం (అప్‌స్కిల్) అత్యవసరం. -
ఎక్స్ డౌన్: గగ్గోలు పెడుతున్న యూజర్లు
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నాయకత్వంలో నడుస్తున్న ఎక్స్ (ట్విటర్)లో అంతరాయం ఏర్పడింది. లక్షలాది మంది వినియోగదారులు ఈ సోషల్ మీడియా యాప్‌ను యాక్సెస్ చేయలేకపోయినట్లు వెల్లడించారు.ఆన్లైన్ అంతరాయాలను ట్రాక్ చేసే ప్లాట్‌ఫామ్ డౌన్‌డెటెక్టర్ నివేదికల ప్రకారం.. భారతదేశం నుంచి దాదాపు 2000 మంది, యునైటెడ్ స్టేట్స్ నుంచి 18,000 మంది, యునైటెడ్ కింగ్డమ్ నుంచి 10,000 మంది ఎక్స్ యాప్‌ను యాక్సెస్ చేయలేకపోయినట్లు స్పష్టం చేసింది. అయితే ఈ అంతరాయంపై కంపెనీ స్పందించలేదు.X Twitter Down, Users Face Outage: Social media platform X has started showing troubles as several users reported it was not working in India which could be because of a technical glitch. pic.twitter.com/mmhRrJP6Oa— Divya 🦋 (@Hiraeth85) March 10, 2025యాప్‌ను ఓపెన్ చేయడానికి ప్రయత్నించినప్పుడు.. చాలా మంది వినియోగదారులకు "ఏదో తప్పు జరిగింది, మళ్లీ లోడ్ చేయడానికి ప్రయత్నించండి" అనే సందేశం వచ్చింది.డౌన్‌డెటెక్టర్ డేటా ప్రకారం 57% మంది వినియోగదారులు X యాప్‌తో సమస్యలను ఎదుర్కొంటున్నారని, 34% మంది వెబ్సైట్లో సమస్యలు ఉన్నాయని, 9% మంది సర్వర్ సమస్యలను నివేదించారని తేలింది. UKలో, 61% మంది వినియోగదారులు అప్లికేషన్ గురించి, 34% మంది వెబ్సైట్ గురించి, 5% మంది సర్వర్ సమస్యలను ఎదుర్కొన్నారు.𝕏 is down / having connection issues. @grok is also down and unable to complete requests.— Nicky 🇬🇧 (@NickyThomas) March 10, 2025 -
శాంసంగ్ ప్రీమియమ్ ఫోన్‌పై భారీ తగ్గింపు
మంచి కెమెరా, డిస్ప్లే, పనితీరు, క్లీన్ యూజర్ ఎక్స్‌పీరియన్స్‌తో గతేడాది అత్యధికంగా అమ్ముడైన ఫోన్లలో ఒకటిగా నిలిచిన శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా (Samsung Galaxy S24 Ultra) ఫోన్ ఇప్పుడు భారీ తగ్గింపుతో లభిస్తోంది. అప్పట్లో అధిక ధర కారణంగా ఈ ప్రీమియమ్ ఫోన్‌ను కొనలేకపోయినవారు ఇప్పుడు కొనవచ్చు.శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా ఫోన్ ఇప్పుడు తగ్గింపు, బ్యాంక్ డిస్కౌంట్ల తరువాత రూ .93,000 కంటే తక్కువకు లభిస్తుంది. మార్కెట్లోకి శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా వచ్చినప్పటికీ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రాకు క్రేజ్ అలాగే ఉంది. కాబట్టి మంచి కెమెరా, ఏఐ ఫీచర్లతో సరైన ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ల కోసం చూస్తున్నట్లయితే అమెజాన్‌కి వెళ్లి ఈ డీల్ చూడవచ్చు.తగ్గింపు అలర్ట్శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర ప్రస్తుతం అమెజాన్‌లో రూ.98,499గా ఉంది. లాంచ్ అయినప్పుడు దీని ధర రూ.1,29,999. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డును ఉపయోగిస్తే రూ.2,955 తగ్గింపు లభిస్తుంది. అలాగే కస్టమర్లు నో కాస్ట్ ఈఎంఐ (వడ్డీ ఆదా కోసం), రూ .4,775 నుండి ప్రారంభమయ్యే స్టాండర్డ్ ఈఎంఐ ప్లాన్లను ఎంచుకోవచ్చు. ఇక ఈ ఫోన్ కొనుగోలు కోసం మీరు మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేయవచ్చు. దీనికి ఆ ఫోన్ మోడల్, వర్కింగ్ కండీషన్, బ్రాండ్‌ను బట్టి రూ.22,800 వరకు పొందవచ్చు. యాడ్-ఆన్‌లుగా వినియోగదారులు రూ .6,999 టోటల్ ప్రొటెక్షన్ ప్లాన్‌ను కూడా ఎంచుకోవచ్చు.శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా స్పెసిఫికేషన్లు120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో 6.8 అంగుళాల క్యూహెచ్ డీ+ అమోఎల్ఈడీ ప్యానెల్ ను ఇందులో అందించారు. ఈ డివైజ్ 2,600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ సెట్‌పై నడుస్తుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ 45వాట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ డివైజ్ ఇప్పటికే లైవ్ ట్రాన్స్‌లేట్, సర్కిల్ టు సెర్చ్, నోట్ అసిస్ట్ వంటి గెలాక్సీ ఏఐ ఫీచర్లను అందిస్తోంది. రాబోయే ఆండ్రాయిడ్ 15 ఆధారిత వన్ యూఐ 7 అప్డేట్తో ఇది మరిన్ని ఏఐ ఫీచర్లను పొందుతుంది.కెమెరా విషయానికొస్తే.. 200 మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ విత్ 5ఎక్స్ ఆప్టికల్ జూమ్, 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. 3ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో పాటు అదనంగా 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ లభిస్తుంది. ముందువైపు 12 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. -
సన్‌స్క్రీన్ టెస్టర్ - స్మార్ట్ వాటర్ బాటిల్
వేసవిలో మీ చర్మానికి రక్షణ ఉందా? లేదా? అని ఈ బుల్లి సన్‌స్క్రీన్ టెస్టర్ ద్వారా ఇట్టే తెలుసుకోవచ్చు. చిన్న పెన్‌డ్రైవ్‌లా కనిపించే ఈ పరికరం, నిజానికి ఒక ప్రత్యేకమైన కెమెరా.వేసవిలో ఒళ్లంతా చెమటలు పట్టిన తర్వాత, ఈత కొట్టినప్పుడు, రుమాలుతో ముఖం తుడుచుకున్నప్పుడు, రాసుకున్న క్రీమ్స్ చర్మంపై అక్కడక్కడ మిస్ అవుతుంటుంది. అలాంటప్పుడు ఈ చిన్న కెమెరాలో నుంచి చూసినట్లయితే, సన్‌స్క్రీన్ క్రీమ్ రక్షణ తొలగిపోయిన ప్రదేశాలను డార్క్‌గా చూపిస్తుంది. ఇది పూర్తిగా వాటర్ ప్రూఫ్, అల్ట్రా పోర్టబుల్. దీని ధర రూ.10,311 మాత్రమే!స్మార్ట్ వాటర్ బాటిల్వేసవిలో హైడ్రేటెడ్‌గా ఉండటం తప్పనిసరి. పని ఒత్తిడిలో పడి చాలామంది తరచుగా నీళ్లు తాగటం మరచిపోతుంటారు. ఈ స్మార్ట్ వాటర్ బాటిల్‌తో మీరు హైడ్రేటెడ్‌గా ఉండొచ్చు.ఈ బాటిల్ మీరు నీటిని తీసుకోవడాన్ని ట్రాక్ చేస్తుంది. అంతే కాకుండా, అవసరమైనప్పుడల్లా మిమ్మల్ని చల్లబరచడానికి మంచి కూలింగ్ వాటర్‌ను అందిస్తుంది. అలాగే వ్యాయామాలు, హైకింగ్లు, బీచ్ డేస్‌కి తీసుకెళ్లడానికి ఈ వాటర్ బాటిల్ చాలా అనువుగా ఉంటుంది. ఇలాంటి బాటిల్స్ మార్కెట్లో చాలానే దొరుకుతున్నాయి. రివ్యూలను చూసి తీసుకోవటం మంచిది. -
కొత్త రకం ఫ్యాన్లు: వీటి గురించి తెలుసా?
వేసవిలో చాలామంది ఉపయోగించే క్యాప్స్ కూడా స్మార్ట్‌గా మారాయి. ఈ క్యాప్స్‌కు అటాచబుల్ మిని ఫ్యాన్ వస్తుంది. ముఖానికి కప్పుకొనే చోట ఈ ఫ్యాన్ ఉంటుంది. దీనికి సోలార్ ప్యానెల్స్ సహాయంతో పవర్ సరఫరా అవుతుంది. క్యాప్ ఎండకు ఎక్స్పోజ్ కాగానే ఆటోమేటిక్‌గా ఈ ఫ్యాన్స్ పనిచేస్తాయి. వీటిల్లో కొన్ని చార్జబుల్ స్టయిల్ మోడల్స్‌లోనూ లభిస్తున్నాయి. కంపెనీల్లో క్వాలిటీ బట్టి ధరల్లో తేడా ఉండొచ్చు. రివ్యూలను పరిశీలించి, కొనుగోలు చేసుకోవచ్చు.చేతిలోనే ఫ్యాన్స్విసనకర్రలను ఎక్కడికైనా తేలికగా తీసుకుపోగలిగినట్లే, ఈ మినీ ఫ్యాన్స్‌ను కూడా ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లవచ్చు. స్మార్ట్‌ఫోన్, పవర్ బ్యాంకు మాదిరిగానే ఈ మినీ ఫ్యాన్స్‌ను కూడా పాకెట్లో లేదా హ్యాండ్‌బ్యాగులో పెట్టుకోవచ్చు. మండుటెండల్లో ఇవి ఎంతగానో ఉపశమనాన్ని కలిగిస్తాయి. మల్టిపుల్ ఫ్యాన్ స్పీడ్స్కు తోడు రీచార్జబుల్ బ్యాటరీలు వీటిలో ఉంటాయి. వీటిలో కొన్ని యూఎస్బీ పవర్ సోర్స్‌కు కనెక్ట్ చేసుకుని కూడా వాడుకోవచ్చు. ఇలాంటి మినీ ఫ్యాన్స్‌లోనూ వివిధ రకాలు, స్టయిల్స్ ఉంటాయి. కొనుగోలు చేసే ముందు కాస్త నాణ్యత ప్రమాణాలను పరిశీలించడం మంచిది. -
'గంటకు రూ. 67కే జీపీయూలు'
న్యూఢిల్లీ: ఇండియాఏఐ కంప్యూట్ పోర్టల్‌లో గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు (జీపీయూలు) అత్యంత తక్కువ ధరకి, గంటకు రూ. 67కే అందుబాటులో ఉంటాయని కేంద్ర ఐటీ మంత్రి 'అశ్విని వైష్ణవ్' తెలిపారు. ఇండియా ఏఐ మిషన్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఇండియాఏఐ కంప్యూట్ పోర్టల్, డేటాసెట్ ప్లాట్‌ఫాం ఏఐకోశ మొదలైనవి ఆయన ఆవిష్కరించారు.అంకుర సంస్థలు, విద్యార్థులు, పరిశోధకులకు మొదలైన వారికి ఇండియాఏఐ కంప్యూట్ పోర్టల్‌లో 18,000 జీపీయులు, క్లౌడ్ స్టోరేజ్, ఇతరత్రా ఏఐ సర్వీసులు అందుబాటులో ఉంటాయని మంత్రి వివరించారు. సొంత ఫౌండేషనల్ మోడల్స్‌ను రూపొందించుకోవడంపై భారత్ పురోగతి బాగుందన్నారు. ఇందుకు సంబంధించి 67 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు.ఏఐ అప్లికేషన్స్, సొల్యూషన్స్‌ను తయారు చేయడంలో పరిశోధకులు, ఎంట్రప్రెన్యూర్లు, స్టార్టప్‌లకు ఉపయోగపడేలా డేటాసెట్లు, సాధనాలు మొదలైనవన్నీ ఏఐకోశలో ఉంటాయి. ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా ఏఐ ఆవిష్కరణలకు తోడ్పడే సమగ్ర వ్యవస్థను తయారు చేసే దిశగా కేంద్ర క్యాబినెట్ గతేడాది మార్చిలో రూ. 10,372 కోట్ల బడ్జెట్‌తో ఇండియాఏఐ మిషన్ ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది. -
టెలికాం ఆపరేటర్లకు ఊరట.. ఎస్‌యూసీ ఛార్జీలు మినహాయిపు..?
దేశీయ టెలికాం ఆపరేటర్లకు స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జీలను (SUC) మాఫీ చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. ఈ అంశంపై కేబినెట్ సెక్రటరీ టీవీ సోమనాథన్ మార్చి 10న భారత టెలికాం విభాగం(DoT), ఫైనాన్స్ మినిస్ట్రీ అధికారులతో చర్చించబోతున్నట్లు తెలిసింది. దేశ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్కు కీలకంగా ఉన్న భారత టెలికాం రంగం చాలా కాలంగా ఆర్థిక సవాళ్లతో సతమతమవుతోంది. ఈ తరుణంలో ఇలాంటి నిర్ణయం తీసుకోనుండడం గమనార్హం.ఎస్‌యూసీ అంటే ఏమిటి?స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీలు(ఎస్‌యూసీ)..రేడియో ఫ్రీక్వెన్సీలను ఉపయోగించడానికి టెలికాం ఆపరేటర్లు ప్రభుత్వానికి చెల్లించే రుసుము. ఆపరేటర్ల సర్దుబాటు స్థూల ఆదాయం (ఏజీఆర్)లో ఈ ఛార్జీలను కొంత శాతంగా లెక్కిస్తారు. కొన్నేళ్లుగా ఎస్‌యూసీ టెలికాం కంపెనీలకు ఆర్థిక బాధ్యతగా ఉంటోంది. ఇది వాటి లాభదాయకతను, నిర్వహణ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. దీన్ని మాఫీ చేస్తే వీటి లాభాలు పెరుగుతాయనే వాదనలున్నాయి.రూ.5,000 కోట్ల ఆర్థిక ఉపశమనం2022 వేలానికి ముందు కొనుగోలు చేసిన స్పెక్ట్రమ్‌కు ఈ మాఫీని వర్తింపజేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే టెలికాం ఆపరేటర్లకు సుమారు రూ.5,000 కోట్ల ఆర్థిక ఉపశమనం లభించనుంది. 2022 వేలం తర్వాత కొనుగోలు చేసిన స్పెక్ట్రమ్‌పై డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్) ఇప్పటికే ఎస్యూసీను తొలగించింది. దాంతో గతంలో కేటాయించిన దానిపై ఈ మినహాయింపు కీలకంగా మారనుంది.టెలికాం రంగంపై ప్రభావం ఇలా..ఈ మాఫీ టెలికాం ఆపరేటర్లపై ఆర్థిక ఒత్తిడిని తగ్గిస్తుంది. మౌలిక సదుపాయాలు, సాంకేతికతలో ఎక్కువ పెట్టుబడులు పెట్టడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఆర్థిక భారాలు తగ్గడంతో టెలికాం కంపెనీలు తమ నెట్‌వర్క్‌లను విస్తరించడం, కనెక్టివిటీని మెరుగుపర్చుకోవడంపై దృష్టి సారించవచ్చు. ఈ రంగంలో ఆరోగ్యకరమైన పోటీని, సృజనాత్మకతను ప్రోత్సహించే అవకాశం ఉంటుంది.లబ్ధిదారులు ఎవరంటే..రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రధాన టెలికాం సంస్థలు ఈ మాఫీ వల్ల గణనీయంగా ప్రయోజనం పొందనున్నాయి. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్‌కు రూ.1,100 కోట్లు చొప్పున ఆదా అవుతుందని అంచనా. వొడాఫోన్ ఐడియాకు సుమారు రూ.2,000 కోట్ల ఉపశమనం లభించవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: వేతన పెరుగుదలలో టీచింగ్ లీడర్లదే హవా!సవాళ్లు ఇవే..ఎస్‌యూసీ మాఫీ సానుకూల చర్య అయినప్పటికీ ఈ రంగం ఎదుర్కొంటున్న ఇతర ఆర్థిక సవాళ్లను పరిష్కరించడం చాలా అవసరం. ఉదాహరణకు.. పరిశ్రమ ఏజీఆర్ బకాయిలు, అధిక లైసెన్స్ ఫీజులు, 5జీ టెక్నాలజీలో గణనీయమైన మూలధన పెట్టుబడి వంటి చాలా సమస్యలు టెలికాం విభాగాన్ని సవాలుగా మారుతున్నాయి. వీటిని పరిష్కరించాల్సి ఉంది. -
సమిష్టి కృషితోనే ఆన్లైన్ బెట్టింగ్‌కి చెక్
న్యూఢిల్లీ: దేశీయంగా వేగంగా విస్తరిస్తున్న అక్రమ ఆన్లైన్ గేమింగ్ రంగాన్ని కట్టడి చేయాలంటే అన్ని వర్గాల నుంచి సమిష్టి కృషి అవసరమని డిజిటల్ ఇండియా ఫౌండేషన్ ఒక నివేదికలో తెలిపింది. ఇందుకోసం ప్రభుత్వం, గూగుల్ .. మెటాలాంటి బడా టెక్ కంపెనీలు కలిసి పని చేయాలని పేర్కొంది. ‘ఈ అక్రమ రంగం ఏటా 100 బిలియన్ డాలర్ల పైగా ఉంటోంది. ఏటా 30 శాతం పైగా వృద్ధి చెందుతోంది. డిజిటల్ వినియోగం, సాంకేతిక పురోగతి పెరుగుతుండటం, నియంత్రణపరంగా అనిశ్చితి నెలకొనడం ఇందుకు కారణంగా ఉంటోంది. గ్యాంబ్లింగ్ సంబంధిత ప్రమోషన్లను నియంత్రించడం కష్టతరంగా ఉంటున్న నేపథ్యంలో గూగుల్, మెటాలాంటి బడా సోషల్ మీడియా కంపెనీలతో భారతీయ నియంత్రణ సంస్థలు క్రియాశీలకంగా కలిసి పనిచేయాలి‘ అని నివేదిక వివరించింది. అక్రమ ఆపరేటర్లు అత్యంత అధునాతనమైన డిజిటల్ అడ్వర్టైజింగ్, మార్కెటింగ్ మాధ్యమాలు, పేమెంట్ వ్యవస్థలు, సాఫ్ట్వేర్ ప్రొవైడర్ల నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుంటున్నారని వివరించింది. ఆన్లైన్ అక్రమ బెట్టింగ్లనేవి మనీలాండరింగ్, అక్రమ చెల్లింపుల సమస్య పెరిగిపోవడానికి దారి తీస్తున్నాయని డిజిటల్ ఇండియా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అరవింద్ గుప్తా తెలిపారు. గూగుల్, మెటాలాంటి కంపెనీలు సాధారణంగా అడ్వరై్టజింగ్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ (ఎస్ఈవో) ద్వారా లాభాలు ఆర్జిస్తుంటాయి కాబట్టి అవి అక్రమ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ సంస్థలపై నిర్ణయాత్మకంగా చర్యలు తీసుకోలేకపోతుంటాయని పేర్కొన్నారు. ‘‘వాటికి వచ్చే ట్రాఫిక్‌లో మూడింట ఒక వంతు ఈ వెబ్సైట్ల నుంచే ఉంటోంది. ఈ వెబ్సైట్లు విస్తరించే కొద్దీ బిగ్ టెక్ కంపెనీలకు అడ్వరై్టజింగ్ రూపంలో ఆదాయాలు వస్తున్నాయి. దీని దుష్ప్రభావాల గురించి పూర్తి అవగాహన లేక ఇన్ఫ్లుయెన్సర్లు వీటిని ప్రమోట్ చేస్తున్నారు’’ అని గుప్తా చెప్పారు. ‘ఆపరేటర్లు అక్రమంగా ఆర్జిస్తున్నారు. మనీ లాండరింగ్ చేస్తున్నారు. పేమెంట్ నిబంధనలను తోసిరాజని డొల్ల కంపెనీల ద్వారా, డి్రస్టిబ్యూషన్ చానల్ ద్వారా అక్రమ మార్గాల్లో చెల్లింపులను పొందుతున్నారు. బిగ్ టెక్ కంపెనీలకు నిధులిస్తున్నారు. కాబట్టి బిగ్ టెక్ కంపెనీలు కూడా వారిని కట్టడి చేయడంపై దృష్టి పెట్టడం లేదు‘ అని గుప్తా పేర్కొన్నారు.నివేదికలోని మరిన్ని అంశాలు.. → దేశీయంగా అక్రమ గ్యాంబ్లింగ్, బెట్టింగ్ కార్యకలాపాలు భారీ స్థాయిలో ఉంటున్నాయి. 2024 అక్టోబర్–డిసెంబర్ మధ్య పరీమ్యాచ్, స్టేక్, 1ఎక్స్‌బెట్, బ్యాటరీ బెట్ అనే నాలుగు ప్లాట్‌ఫాంలలో 1.6 బిలియన్ పైగా విజిట్స్ నమోదయ్యాయి. → 48.2 మిలియన్ విజిట్లతో దీనికి సోషల్ మీడియా కూడా దోహదకారిగా నిలి్చంది. ఫేస్‌బుక్‌లాంటి ప్లాట్‌ఫాంలలో డైరెక్ట్ పెయిడ్ ప్రకటనలు, కంటెంట్ ప్రమోషన్, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, సోషల్ మీడియా ఎంగేజ్మెంట్ ప్రచార కార్యక్రమాలు మొదలైన వాటి ద్వారా ఈ ట్రాఫిక్ వచి్చంది. నియంత్రణ నిబంధనలపరంగా వాటి వెబ్సైట్ల నిలిపివేతను తప్పించుకునేందుకు ఆయా ఆపరేటర్లు పలు వెబ్సైట్లు నిర్వహిస్తున్నారు. → దాదాపు అన్ని సంస్థలు, (సుమారు 600) ఇతర దేశాల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తూ, భారత్‌లో జీఎస్టీ నిబంధనలను యధేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాయి. → గ్యాంబ్లింగ్ ప్రకటనలను హోస్ట్ చేయకుండా, జీఎస్‌టీలాంటివి చెల్లించని అక్రమ సైట్లను ప్రమోట్ చేయకుండా చర్యలు ఉండాలి. ఆ తరహా సైట్లకు చెల్లింపులు జరగకుండా ఫైనాన్షియల్, పేమెంట్ వ్యవస్థలు నిరోధించాలి. → అక్రమ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ సైట్లను బ్లాక్ చేస్తే సరిపోదని నార్వే, బ్రిటన్, డెన్మార్క్, బెల్జియం, అమెరికా వంటి దేశాల అనుభవాల ద్వారా తెలుస్తోంది. కాబట్టి వెబ్సైట్లను బ్లాక్ చేయడంతో పాటు మార్కెటింగ్పరమైన ఆంక్షలు విధించడం, చెల్లింపులను బ్లాక్ చేయడం మొదలైన వ్యూహాలన్నింటి మేళవింపును అమలు చేస్తే మరింత మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. → అక్రమ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ మనుగడ సాగించేందుకు దోహదకారులను పూర్తిగా కట్టడి చేసేందుకు నియంత్రణ విధానాలు వేర్వేరుగా ఉండకుండా సమగ్ర వ్యవస్థ ఏర్పాటు కావాలి. → డిజిటల్ మీడియా చానళ్ల ద్వారా యూజర్లకు చేరువ కాకుండా వాటిని కట్టడి చేయడం, అక్రమ లావాదేవీలను బ్లాక్ చేసేందుకు ఆర్థిక నిబంధనలను కఠినతరం చేయడం, వైట్‌లిస్ట్/బ్లాక్‌లిస్ట్ రూపంలో నియంత్రణ విధానాలను పటిష్టం చేయడం వంటి చర్యలు చేపట్టాలి. → పన్నులు చెల్లించే కంపెనీలతో వైట్‌లిస్ట్ తయారు చేసి, మిగతా వాటిని బ్లాక్‌లిస్ట్‌లో చేర్చడం వల్ల కొంత నష్టం తగ్గవచ్చు. -
యాపిల్ ఫోల్డబుల్ ఐఫోన్: లాంచ్ ఎప్పుడంటే?
వివో, మోటోరోలా, శాంసంగ్ వంటి కంపెనీలు ఇండియన్ మార్కెట్లో ఫోల్డబుల్ ఫోన్స్ లాంచ్ చేసి విక్రయిస్తున్నాయి. ఈ విభాగంలో 'యాపిల్' (Apple) కూడా చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ ఎప్పుడు మార్కెట్లో లాంచ్ అవుతుంది? ధర ఎంత ఉంటుందనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.యాపిల్ కంపెనీ ఇప్పటి వరకు.. ఫోల్డబుల్ ఫోన్స్ లాంచ్ చేయలేదు. మొదటిసారి ఈ రకమైన స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయడానికి సన్నద్ధమైంది. సంస్థ దీనిని 2026లో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ధర కూడా 2000 డాలర్లు (రూ. 1.73 లక్షలు) ఉండొచ్చని సమాచారం.ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ గురించి యాపిల్ కంపెనీ అధికారిక సమాచారం వెల్లడించలేదు. ఒకవేళా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ నిజమైతే.. ఇదే మార్కెట్లో అత్యంత ఖరీదైనదిగా మారనుంది. ప్రతి ఏటా కొత్త ఉత్పత్తులను లాంచ్ చేసే యాపిల్.. ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ చేస్తుందనుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ పరిశ్రమ అభివృద్ధి చెందుతున్నప్పటికీ.. యాపిల్ కంపెనీ మాత్రం సైలెంట్‌గా ఉంది. కాగా త్వరలోనే ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది స్టెయిన్లెస్ స్టీల్ వంటి వాటితో తరవుతుందని తెలుస్తోంది. అయితే ఇందులో పేస్ ఐడీ ఫీచర్ మిస్ అయ్యే అవకాశం ఉంది. టచ్ ఐడీ ఫీచర్ అనేది సైడ్ బటన్ ద్వారా అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది.ఫోల్డబుల్ ఐఫోన్లో 5.5 ఇంచెస్ కవర్ డిస్ప్లే, 7.8 ఇంచెస్ మెయిన్ ఫోల్డింగ్ డిస్ప్లే వంటివి పొందవచ్చని సమాచారం. ఈ ఫోన్ వెనుక డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంటుంది. రెండు సెల్ఫీ కెమెరాలు ఉండనున్నాయి. ఇప్పటివరకు లీకైన ఫీచర్స్ అద్భుతంగానే ఉన్నాయని తెలుస్తోంది. కానీ దీని పనితీరు గురించి తెలుసుకోవాలంటే.. లాంచ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే. -
ఇంటర్నెట్లాగే ఏఐతో కొత్త ఉద్యోగాలొస్తాయ్..
బెంగళూరు: గతంలో ఇంటర్నెట్, సోషల్ మీడియాతో కొత్త కెరియర్లు వచ్చినట్లే కృత్రిమ మేథతో (ఏఐ) కూడా కొత్త ఉద్యోగాలు వస్తాయని జోహో సీఈవో మణి వెంబు తెలిపారు. ఏఐ సొల్యూషన్స్‌కి సంబంధించి పాశ్చాత్య దేశాలకు భారత్ గట్టి పోటీదారుగా ఎదగగలదని ధీమా వ్యక్తం చేశారు. పుష్కలంగా నిపుణుల లభిస్తుండటం, దేశీయంగా సొల్యూషన్స్ రూపొందించుకోవాలన్న ఆకాంక్షలు పెరుగుతుండటం ఇందుకు దోహదపడగలవని వెంబు చెప్పారు. ఏఐ కల్పించగలిగే అవకాశాలను విశాల దృక్పథంతో పరిశీలించి, తగు దిశలో ముందుకెళ్లాలని ఆయన పేర్కొన్నారు. ఏఐ, కొత్త సాంకేతికతలను ఉపయోగించి తమ ప్రస్తుత సిబ్బంది ఉత్పాదకతను పెంచుకునే మార్గాలపై జోహో ప్రధానంగా దృష్టి పెడుతోందని వెంబు వివరించారు. మరోవైపు, అమెరికాలో విధానాలు, టారిఫ్‌లపరంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రభావాలను దేశీ ఐటీ పరిశ్రమ ఇప్పుడే అంచనా వేయలేదని, వేచి చూసే ధోరణిని పాటించాల్సి ఉంటుందని వెంబు చెప్పారు. -
వివో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్: ధర కూడా తక్కువే!
న్యూఢిల్లీ: హ్యాండ్సెట్స్ దిగ్గజం వివో (Vivo) తాజాగా టీ4 సిరీస్‌లో తొలి స్మార్ట్‌ఫోన్ - టీ4ఎక్స్ 5జీని ప్రవేశపెట్టింది. దీని ధర రూ.13,999 నుంచి రూ. 16,999 వరకు ఉంటుంది. మార్చ్ 12 నుంచి ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఈ-స్టోర్, ఇతర రిటైల్ స్టోర్స్‌లో లభిస్తుందని కంపెనీ తెలిపింది.హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్‌ల కస్టమర్లు రూ.1,000 డిస్కౌంట్ పొందవచ్చని పేర్కొంది. ఇందులో 6500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫన్‌టచ్ ఓఎస్ 15, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్, 50 ఎంపీ ఏఐ కెమెరా, మిలిటరీ గ్రేడ్ ప్రమాణాలు మొదలైన ప్రత్యేకతలు ఉన్నట్లు కంపెనీ తెలిపింది. -
కొత్త నాయిస్ మాస్టర్ బడ్స్: దీని స్పెషాలిటీ ఏంటంటే..
ఇయర్ బడ్స్ వినియోగం పెరిగిపోతున్న తరుణంలో.. నాయిస్ (Noice) కొత్త 'మాస్టర్ బడ్స్' (Master Buds) ప్రారంభించింది. ఇది సౌండ్ బై బోస్ టెక్నాలజీ కలిగిన వైర్లెస్ ఇయర్ బడ్.మాస్టర్ సిరీస్‌లోని మొదటి ఉత్పత్తి అయితే ఈ ఇయర్ బడ్స్ అద్భుతమైన పనితీరును అందిస్తుంది. దీని డిజైన్.. ఇప్పటి వరకు మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇయర్ బడ్స్ కంటే భిన్నంగా ఉంది. డ్యూయల్ డివైస్ కనెక్టివిటీ, గూగుల్ ఫాస్ట్ పెయిరింగ్ వంటి ఫీచర్స్ కలిగిన ఈ మాస్టర్ బడ్స్ మంచి లిజనింగ్ అనుభూతిని అందిస్తుంది.నాయిస్ మాస్టర్ బడ్స్ స్పేషియల్ ఆడియో సపోర్ట్‌ను కలిగి ఉంటాయి. పీక్, టైటానియం వంటి అత్యుత్తమ మెటీరియల్‌లతో తయారైన ఈ బడ్స్.. 12.4 మిమీ డ్రైవర్లతో అమర్చబడి ఉంటాయి. హై-డెఫినిషన్ ఆడియోను మరింత పెంచడానికి, ఇయర్‌బడ్‌లు ఎల్హెచ్డీసీ (లో లేటెన్సీ హై డెఫినిషన్ ఆడియో కోడెక్) మద్దతుతో వస్తాయి.సౌండ్ బై బోస్ టెక్నాలజీతో, నాయిస్ మాస్టర్ బడ్స్ అన్ని ఫ్రీక్వెన్సీలలో.. మంచి ఆడియోను అందించేలా తయారైంది. అంతే కాకుండా 49 డెసిబుల్స్ వరకు సౌండ్ ఐసోలేషన్‌ను అందించే నాయిస్ క్యాన్సిలేషన్‌ను పొందుతాయి. మ్యూజిక్, కాల్స్ వంటివి చాలా క్లారిటీగా వినిపిస్తాయి.ఇదీ చదవండి: రెండు లక్షలమంది కొన్న కారు: ఇప్పుడు కొత్త ఎడిషన్‌లో..సాఫ్ట్ టచ్ మెటీరియల్‌లతో తయారైన నాయిస్ మాస్టర్ ఇయర్‌బడ్స్.. చెవులపై ఒత్తిడిని కలిగించవు. ఇది మూడు పరిమాణాలలో అందుబాటులో ఉంటుంది. వీటిని మీరు జిమ్‌లో ఉన్నా, ఆఫీసులో ఉన్నా లేదా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నా రోజంతా ఉపయోగించవచ్చు. ఒక ఛార్జితో 40 గంటలు పనిచేసే దీని ధర రూ. 7999 కావడం గమనార్హం. -
టాటా డిస్ప్లే చిప్స్ వస్తున్నాయ్..
దేశీ కార్పొరేట్ దిగ్గజం టాటా గ్రూప్.. డిస్ప్లే చిప్స్ తయారీలోకి ప్రవేశిస్తోంది. ఇందుకు వీలుగా టాటా గ్రూప్ కంపెనీ టాటా ఎల్రక్టానిక్స్ తైవాన్ సంస్థ పీఎస్ఎంసీ, హైమాక్స్ టెక్నాలజీస్‌తో చేతులు కలిపింది. అంతేకాకుండా గుజరాత్ ప్రభుత్వంతోనూ జత కట్టింది. తద్వారా త్రైపాక్షిక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. వెరసి గుజరాత్లో తైవాన్ కంపెనీ భాగస్వామ్యంతో డిస్ప్లే చిప్స్ తయారీకి తెరతీయనుంది.ఈ అంశాలను ఐఈఎస్ఏ విజన్ సదస్సులో టాటా ఎల్రక్టానిక్స్ సీఈవో రణదీర్ ఠాకూర్ ప్రకటించారు. టాటా ఎల్రక్టానిక్స్, పీఎస్ఎంసీ, హైమాక్స్ మధ్య అవగాహనా ఒప్పందం(ఎంవోయూ) కుదిరినట్లు వెల్లడించారు. పీఎస్ఎంసీ టెక్నాలజీ సహకారంతో గుజరాత్‌లోని ధోలెరాలో హైమాక్స్ కోసం డిస్ప్లే చిప్స్ తయారీని చేపట్టనున్నట్లు తెలియజేశారు. ఇదీ చదవండి: బ్యాంకు ఉద్యోగుల సమ్మె.. వరుసగా నాలుగు రోజులు సెలవుమూడు విభాగాల్లోనూ.. డిస్ప్లే చిప్స్‌ను టీవీలతోపాటు, మొబైల్ ఫోన్ తెరలు, కెమెరాలలో ఇమేజ్ సెన్సార్లు, ఎల్ఈడీలు, ఓఎల్ఈడీలు తదితరాలలో వినియోగిస్తారు. తాజా ఒప్పందంతో టాటా ఎలక్ట్రానిక్స్ అన్ని(మూడు రకాల) సెమీకండక్టర్ తయారీ విభాగాల్లోనూ కార్యకలాపాలు విస్తరించనుంది. కంపెనీ ఇప్పటికే పీఎస్ఎంసీ సాంకేతిక భాగస్వామిగా గుజరాత్లో సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. ఇందుకు రూ.91,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తోంది. అస్సామ్‌లోనూ రూ.27,000 కోట్ల పెట్టుబడులతో చిప్ అసెంబ్లీ ప్లాంటును నెలకొల్పుతోంది. -
వ్యర్థాల నుంచి ఖనిజాల వెలికితీతకు సూచనలు
భారత్‌లో వ్యర్థాల నుంచి కీలకమైన ఖనిజాలను వేరు చేసేందుకు (రికవరీ) విధానపరమైన సంస్కరణల మద్దతుతోపాటు బహుముఖ వ్యూహం అవసరమని ఫిక్కీ–డెలాయిట్ నివేదిక సూచించింది. మైన్ టైలింగ్స్(గనుల పొరలు), ఫ్లై యాష్, ఎర్రమట్టి, మెటల్ స్లాగ్ వంటి వ్యర్థ పదార్థాల నుంచి కీలకమైన ఖనిజాలను వెలికితీయాలని తెలిపింది. టెక్నాలజీ అభివృద్ధి, ప్రాసెసింగ్ సామర్థ్యం, సరఫరా వ్యవస్థతో అనుసంధానం అనే అంశాలు వ్యర్థాల నుంచి విలువైన ఖనిజనాల వెలికితీతకు అవసరమని అభిప్రాయపడింది. శుద్ధ ఇంధన టెక్నాలజీలకు (క్లీన్ ఎనర్జీ/ పర్యావరణ అనుకూల), ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీలు), బ్యాటరీ తయారీకి కీలక ఖనిజాలు ఎంతో ముఖ్యమైనవిగా పేర్కొంది.ప్రపంచ దేశాలు క్లీన్ ఎనర్జీ వైపు మళ్లుతుండడంతో ఈ ఖనిజాలకు డిమాండ్ పెరుగుతున్నట్లు నివేదిక వివరించింది. విమానాల తయారీ, క్షిపణులు, కార్వెట్స్ తదితర రక్షణ ఉత్పత్తుల తయారీకి సైతం వీటిని వినియోగిస్తున్నట్టు గుర్తు చేసింది. ఈ కీలక ఖనిజ వనరులను సమకూర్చుకునేందుకు భారత్ ఇటీవల ప్రాధాన్యం ఇస్తున్న క్రమంలో.. తక్కువ స్థాయి నిల్వలు, మైనింగ్ కార్యకలాపాలు దీర్ఘకాలం పాటు చేయాల్సి రావడం, ప్రాసెసింగ్ పరంగా ఉన్న అవరోధాలను ఈ నివేదిక ప్రస్తావించింది. కాబట్టి కీలక ఖనిజ వనరుల కోసం ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని, వ్యర్థాల నుంచి ఖనిజాల వెలికితీత మెరుగైన పరిష్కారంగా పేర్కొంది.ఇదీ చదవండి: రిలయన్స్‌కు రూ.24,500 కోట్ల డిమాండ్ నోటీసులుబూడిద, ఎర్రమట్టి, ఫ్లై యాష్, గనుల పైపొరలు, లోహ వ్యర్థాలు, మెటల్ స్లాగ్ నుంచి నికెల్, కోబాల్ట్, కాపర్, టైటానియం, గాలియంను రికవరీ చేసుకోవచ్చని తెలిపింది. భారత్ కీలక ఖనిజ వనరుల సుస్థిరతకు, డిమాండ్ అవసరాలను తీర్చుకునేందుకు ఈ వనరులు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొంది. చాలా దేశాలు ఇప్పుడు వ్యర్థాల నుంచి కీలక ఖనిజాల వెలికితీత ప్రాధాన్యాన్ని గుర్తిస్తున్నట్టు ప్రస్తావించింది. -
బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్: ఆరు నెలలు.. అన్లిమిటెడ్
ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) చవక ధరలో దీర్ఘకాలిక రీఛార్జ్ ప్లాన్లతో ప్రైవేట్ టెల్కోలకు సవాలు విసురుతోంది. ప్రైవేట్ ఆపరేటర్లు ఇటీవల ధరలను పెంచిన తరువాత బీఎస్ఎన్ఎల్ ఆకర్షణీయమైన ప్లాన్లు దాని వినియోగదారుల సంఖ్య పెరగడానికి దారితీశాయి. గత కొన్ని నెలల్లో మిలియన్ల మంది వినియోగదారులు బీఎస్ఎన్ఎల్కి మారారు.బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే 70 రోజులు, 90 రోజులు, 150 రోజులు, 160 రోజులు, 336 రోజులు, 365 రోజులు, 425 రోజుల ఎంపికలతో సహా కొన్ని సుదీర్ఘ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తుంది. ఇప్పుడు 180 రోజుల ప్లాన్ ప్రవేశపెట్టింది. తరచూ రీచార్జ్ చేసుకునే ఇబ్బందిని తొలగించే లాంగ్ టర్మ్ రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్న వారికి ఈ కొత్త ఆరు నెలల ప్లాన్ అత్యంత అనువుగా ఉంటుంది.రూ.897 రీఛార్జ్ ప్లాన్బీఎస్ఎన్ఎల్ కొత్త రూ .897 ప్రీపెయిడ్ ప్లాన్ అపరిమిత లోకల్, ఎస్టీడీ కాలింగ్‌తో పూర్తి ఆరు నెలలు (180 రోజులు) వ్యాలిడిటీని అందిస్తుంది. వినియోగదారులు ఇకపై నెలవారీ రీఛార్జ్‌ల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది మార్కెట్లో అత్యంత చౌకైన ప్లాన్లలో ఒకటి. ఇక మిగతా ప్రయోజనాల విషయానికి వస్తే మొత్తంగా 90 జీబీ లభిస్తుంది. రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్లు పంపుకోవచ్చు. -
రూ. 16వేల మొబైల్ బుక్ చేస్తే.. ఏమొచ్చిందో తెలుసా?
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో మోసాలు కూడా ఎక్కువవుతున్నాయి. ఆదమరిస్తే.. ఖాతాలు ఖాళీ అవుతున్నాయి. ఆన్లైన్ మోసాలకు సంబంధించిన కథనాలు గతంలో చాలానే తెలుసుకున్నాం. అలాంటిదే మరొకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇంతకీ.. ఇది ఎక్కడ, ఎప్పుడు, ఎలా జరిగింది? అనే విషయాలను వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.దక్షిణ ఢిల్లీలోని షేక్ సారాయ్‌కు చెందిన ఒక వ్యక్తి మొబైల్ కోసం ఆన్లైన్ షాపింగ్ చేశారు. ఫోన్ కోసం ఎదురు చూస్తున్న అతనికి డెలివరీ వచ్చింది. కానీ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే.. అందులో సోప్ బార్, బిస్కెట్ ప్యాకెట్ ఉండటం చూసి ఖంగుతిన్నాడు.బాధితుడు ఫిబ్రవరి 11న రూ.16,680 విలువైన మొబైల్ ఫోన్ ఆర్డర్ చేశాడు. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకున్నాడు. ఫిబ్రవరి 12న డెలివరీ ఏజెంట్ పేరుతో.. కాల్ చేసి ఈ రోజు డెలివరీ చేస్తానని చెప్పాడు. కానీ కొనుగోలుదారు (బాధితుడు) కోరికమేరకు మరుసటి రోజు ఉదయం డెలివరీ చేసాడు. డెలివరీ తీసుకున్న తరువాత, తాను చెల్లించాల్సిన మొత్తాన్ని.. యూపీఐ ద్వారా చెల్లించారు.డబ్బు చెల్లించి.. ఆఫీసుకు వెళ్లి దాన్ని ఓపెన్ చేస్తే, మొబైల్ స్థానంలో బిస్కెట్ ప్యాకెట్, సోప్ బార్ ఉన్నాయి. మోసపోయానని గ్రహించాడు. డెలివరీ ఏజెంట్ నెంబర్‌కు కాల్ చేసాడు. మొదట్లో, ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లో ఫిర్యాదు చేయడం ద్వారా సమస్య పరిష్కారమవుతుందని అతనికి డెలివరీ ఏజెంట్ చెప్పాడు. తరువాత ఆ నెంబర్‌కు కాల్ చేస్తే.. స్విచ్ ఆఫ్ వచ్చింది. షాపింగ్ వెబ్సైట్ కూడా అతని ఈమెయిల్‌లకు స్పందించలేదు.ఇదీ చదవండి: '8-8-8 రూల్ పాటించండి': పనిగంటలపై నీర్జా బిర్లాబాధితుడు చేసేదేమీ లేక.. పోలీసులకు ఫిర్యాదు చేసాడు. పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. నకిలీ డెలివరీ ఏజెంట్‌ను ట్రాక్ చేయడానికి, మోసగాళ్లు కస్టమర్ వివరాలను ఎలా యాక్సెస్ చేశారో తెలుసుకోవడానికి దర్యాప్తు కొనసాగుతోంది.ఇలాంటి మోసాల నుంచి ఎలా బయటపడాలంటే?మోసగాళ్ళు ఆన్లైన్ షాపింగ్ పేరుతో.. ప్రజలను దోచుకుంటున్నారు. ఆన్లైన్ లావాదేవీల సంఖ్య పెరుగుతున్నందున, వినియోగదారులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని పలువురు నిపుణులు చెబుతున్నారు.➤డెలివరీ తీసుకోవడానికి ముందు.. డెలివరీ ఏజెంట్లు నిజమైనవారా? కాదా? అని ధృవీకరించుకోవాలి. ➤వ్యక్తిగత వివరాలను ఎప్పుడు పంచుకోకూడదు. లావాదేవీలను పూర్తి చేసే ముందు ప్యాకేజీలను చెక్ చేసుకోవాలి. ➤ఏదైనా అనుమానం కలిగితే.. ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లకు ఫిర్యాదు చేయాలి. -
వ్యక్తిగత డేటా లీక్!.. కారణం వారే అంటున్న నెటిజన్స్
న్యూఢిల్లీ: తమ వ్యక్తిగత డేటా పబ్లిక్ డొమైన్‌లోకి చేరిపోయినట్టు మెజారిటీ నెటిజన్లు భావిస్తున్నారు. పబ్లిక్ డొమైన్లో తమ డేటా లీక్ అయినట్టు లోకల్ సర్కిల్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో 87 శాతం మంది చెప్పారు. ఇందులో సగం మంది తమ ఆధార్ లేదా పాన్ వివరాలు లీక్ అయినట్టు భావిస్తున్నారు.దేశవ్యాప్తంగా 375 జిల్లాల పరిధిలో 36వేల మంది స్పందనలను ఈ సర్వేలో భాగంగా తెలుసుకున్నారు. ప్రధానంగా టెలికం ఆపరేటర్లు, ఈ–కామర్స్ యాప్‌లు, బ్యాంక్‌లు, ఫైనాన్షియల్ సర్వీస్ ప్రొవైడర్లు, ప్రభుత్వ విభాగాలు తమ డేటా లీకేజీకి కారణమని ఎక్కువ మంది నమ్ముతున్నారు. పబ్లిక్ డొమైన్లో తమ డేటా లీకేజీకి టెలికం ఆపరేటర్లు కారణమని 65 శాతం మంది భావిస్తుంటే, 63 శాతం మంది ఈ–కామర్స్ యాప్‌లు లేదా సైట్లు, 56 శాతం మంది బ్యాంక్‌లు, ఫైనాన్షియల్ సంస్థలు కారణమై ఉంటాయని చెప్పారు.స్థానిక ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది ఇందుకు కారణమని 50 మంది అనుకుంటున్నారు. 48 శాతం మంది పేమెంట్ యాప్‌ల ద్వారా తమ వ్యక్తిగత వివరాలు లీక్ అయి ఉంటాయని చెప్పగా.. 26 శాతం మంది విద్యా సంస్థలు, 37 శాతం మంది వ్యాపార సంస్థల పాత్ర ఇందులో ఉండొచ్చని భావిస్తున్నారు. -
శాంసంగ్ నుంచి మూడు కొత్త స్మార్ట్ఫోన్లు
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ శాంసంగ్ (Samsung) తన గెలాక్సీ ఎ-సిరీస్ లైనప్‌లో మూడు కొత్త స్మార్ట్ఫోన్లను భారత్‌లో విడుదల చేసింది. అవి శాంసంగ్ గెలాక్సీ ఎ56, గెలాక్సీ ఎ36, గెలాక్సీ ఎ26. ఆకట్టుకునే ఫీచర్లు, ఆకర్షణీయ ధరలో విస్తృత శ్రేణి వినియోగదారులను ఆకట్టుకునేలా ఈ డివైజ్ లను రూపొందించారు. వీటిలో ఏయే స్మార్ట్ ఫోన్లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.. ధరలెంత అన్న విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..గెలాక్సీ ఎ56గెలాక్సీ ఎ56 కొత్త లైనప్ లో ఫ్లాగ్ షిప్ మోడల్. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1900 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తో 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లేను కలిగి ఉంది. ఎక్సినోస్ 1580 చిప్ సెట్ తో నడిచే ఏ56 12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్లను అందిస్తుంది.. ఆండ్రాయిడ్ 15 ఆధారిత వన్ యూఐ 7 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేసే ఈ ఫోన్ డ్యూయల్ 5జీ సిమ్ కార్డులకు సపోర్ట్ చేస్తుంది.కెమెరా సామర్థ్యాల విషయానికి వస్తే, గెలాక్సీ ఎ56లో విభిన్న ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. వీటిలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, 5 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 45వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం దీనికి IP67 రేటింగ్ కూడా ఉంది.గెలాక్సీ ఎ56 మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి ఆసమ్ ఆలివ్, ఆసమ్ లైట్గ్రే, ఆసమ్ గ్రాఫైట్. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధరను రూ.41,999గానూ, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.44,999గానూ, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధరను రూ.47,999గానూ కంపెనీ నిర్ణయించింది.గెలాక్సీ ఏ36గెలాక్సీ ఎ36 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో సహా అనేక ఫీచర్లను ఎ56లో మోడల్లో ఉన్నట్లుగానే ఉంటాయి. అయితే ఇందులో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్ ను అందించారు. ఏ36లో 12 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌ను ఇచ్చారు.గెలాక్సీ ఏ36లో కెమెరా సెటప్ విషయానికి వస్తే ఓఐఎస్‌తో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 5 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. ఇక ఫ్రంట్ కెమెరా 12 మెగాపిక్సెల్. ఎ56 మాదిరిగానే ఎ36 కూడా 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఇది 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం దీనికి IP67 రేటింగ్ కూడా ఉంది.గెలాక్సీ ఎ36 లావెండర్, బ్లాక్, వైట్ రంగులలో లభిస్తుంది. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.32,999గానూ, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.35,999గానూ, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.38,999గానూ నిర్ణయించారు.గెలాక్సీ ఏ26గెలాక్సీ ఎ26 కొత్త లైనప్ లో అత్యంత చవక మోడల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ + సూపర్ అమోలెడ్ డిస్ ప్లేను కలిగి ఉంది. ఎక్సినోస్ 1380 ప్రాసెసర్ పై పనిచేసే ఈ ఫోన్ లో 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందించారు.గెలాక్సీ ఏ26లో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. అలాగే 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం దీనికి IP67 రేటింగ్ ఉంది.గెలాక్సీ ఏ26 ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. బ్లాక్, వైట్, మింట్, పీచ్ పింక్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. -
ఈసారి బ్యాడ్ న్యూస్ కాగ్నిజెంట్ ఉద్యోగులకు..
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఇటీవల వేతన పెంపును 5-8 శాతం మధ్య ప్రకటించి ఉద్యోగులను నిరాశ పరిచింది. టీఈఎస్‌లో కూడా శాలరీ హైక్ శాతం సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతుందన్న నివేదికలు వచ్చాయి. తాజగా మరో మల్టీ నేషనల్ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ కూడా ఉద్యోగులకు బ్యాడ్ న్యూసే చెప్పింది.వేతన పెంపు వాయిదాఇటీవల జరిగిన టౌన్ హాల్ సమావేశంలో కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ ఎస్ ఉద్యోగులనుద్దేశించి మాట్లడుతూ బోనస్ లు, జీతాల పెంపు ఆలస్యంతో సహా కంపెనీ వేతన పెంపు ప్రణాళికలపై అప్ డేట్స్ ఇచ్చారు. ఏప్రిల్ లో అమలు జరగాల్సిన జీతాల పెంపును ఆగస్టుకు వాయిదా వేయడంపై ఉద్యోగుల్లో నెలకొన్న అసంతృప్తిని అంగీకరించారు. అయితే వాగ్దానం చేసిన పెంపుదలను గౌరవించడానికి కంపెనీ కట్టుబడి ఉందని ఆయన ఉద్యోగులకు హామీ ఇచ్చారు. కంపెనీ ఆర్థిక లక్ష్యాలు, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా జాప్యం ఒక వ్యూహాత్మక నిర్ణయం అని పేర్కొన్నారు.వేతన ప్రణాళికలుబోనస్ స్ట్రక్చర్ గురించి కూడా కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ చర్చించారు. అర్హత కలిగిన ఉద్యోగులు తమ బోనస్ లను ప్రణాళిక ప్రకారం పొందుతారని ధృవీకరించారు. ఇంటర్నల్ మెమో ప్రకారం మార్చి 10లోగా ఉద్యోగులు తమ బోనస్ లకు సంబంధించిన ఈ లెటర్లను ఆశించవచ్చు. పనితీరును ప్రతిఫలించడం, పోటీ వేతన ప్యాకేజీలను నిర్వహించడంలో కంపెనీ నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు.విస్తృత ఆర్థిక నేపథ్యంఅనిశ్చిత స్థూల ఆర్థిక పరిస్థితులు ఐటీ పరిశ్రమను ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో వేతనాల పెంపులో జాప్యం జరుగుతోంది. ఈ సవాళ్లను నావిగేట్ చేస్తూ ఆపరేటింగ్ మార్జిన్లను పెంచడం, ఆఫీస్ స్పేస్‌ను ఆప్టిమైజ్ చేసుకోవడంపై కాగ్నిజెంట్ దృష్టి సారించింది. ప్రతిభను నిలుపుకోవడం, మార్కెట్లో పోటీగా నిలవడం అనే ఉద్దేశంతో కంపెనీ ఈ ప్రయత్నాలను బ్యాలెన్స్ చేస్తోంది.ఉద్యోగుల ప్రతిస్పందనవేతనాల పెంపు ఆలస్యం గురించి ముందుగానే ప్రస్తావించడం ఉద్యోగుల్లో మిశ్రమ స్పందనకు దారితీసింది. కొంతమంది దీనిని అట్రిషన్ తగ్గించడానికి మనోధైర్యాన్ని పెంచే చర్యగా భావిస్తుండగా మరికొందరు అదనపు ఒత్తిడి, వారి ఆర్థిక ప్రణాళికపై పడనున్న ప్రభావం గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ అనిశ్చితి ఉన్నప్పటికీ పారదర్శకత, ఉద్యోగులకు విలువ ఉండేలా చూడటం పట్ల రవికుమార్ నిబద్ధత సానుకూల పరిణామమని నిపుణులు సూచిస్తున్నారు. -
స్థానిక కంటెంట్‌తో షార్ట్ వీడియోలకు డిమాండ్
న్యూఢిల్లీ: భారత్‌లో స్వల్ప నిడివి వీడియోలకు (షార్ట్ వీడియోలు) బూమింగ్ ఇప్పుడే మొదలైందని షేర్‌చాట్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో) మనోహర్సింగ్ చరణ్ పేర్కొన్నారు. సృజనాత్మకతతో కూడిన స్థానిక కంటెంట్‌ను చిన్న పట్టణాల్లోనూ ఆదరిస్తుండడం డిమాండ్‌ను పెంచుతున్నట్టు చెప్పారు. ప్రాంతీయ ప్రాధాన్యం కలిగిన విభిన్నమైన సేవలు స్థిరమైన డిమాండ్‌కు దోహపడుతున్నట్టు, ప్రేక్షకులకు చేరువ అయ్యేందుకు బ్రాండ్లకు కొత్త అవకాశాలు తీసుకొస్తున్నట్టు చెప్పారు. దేశ జనాభాలో ఇంటర్నెట్ చేరువ 60%కి వచి్చనట్టు, 65 కోట్ల ఇంటర్నెట్ యూజర్లు ఉన్నట్టు పేర్కొన్నారు. ఇంటర్నెట్కు అనుసంధానమైన వారు సోషల్ మీడియా, షార్ట్ వీడియోలకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్టు చెప్పారు.లాభాలకు చేరువలో..: కన్సాలిడేటెడ్ స్థాయిలో ఎబిటా పాజిటివ్‌కు కంపెనీ చేరువలో షేర్ చాట్ ఉన్నట్టు చరణ్ తెలిపారు. లాభాల్లోకి ప్రవేశించనున్న నేపథ్యంలో నియామకాల విషయంలో అప్రమ్తతంగా వ్యవహరిస్తున్నట్టు చెప్పారు. గూగుల్ మద్దతుతో నడుస్తున్న షేర్‌చాట్ వచ్చే రెండేళ్లలో ఐపీవోకు వచ్చే ప్రణాళికలతో ఉంది. ఆదాయంలో 33% వృద్ధిని సాధించగా, నష్టాలు మూడింట ఒక వంతుకు తగ్గిపోయినట్టు ప్రకటించారు. స్టాండలోన్ ప్రాతిపదికన షేర్‌చాట్ ఎబిటా స్థాయిలో లాభాల్లోకి వచి్చనట్టు వెల్లడించారు. -
బట్టలు ఉతికే రోబో... ఇదే
బట్టలు ఉతికే వాషింగ్ మెషిన్స్ వచ్చినా కూడా చాలామంది మురికి బట్టలను చేతితోనే ఉతుకుతుంటారు. పైగా బట్టలను వాషింగ్ మెషిన్లో లోడ్ చేయటం, ఉతికిన బట్టలను తిరిగి అన్లోడ్ చేసి ఆరేయటం అంతా మనమే చేసుకోవాలి. ఇప్పుడు ఈ సమస్యలన్నింటినీ దూరం చేస్తుంది ఈ రోబో.ఏఐ టెక్స్టైల్ ప్రాసెసింగ్, పాయింట్ క్లౌడ్ ఆధారిత అల్గారిథంతో తయారు చేసిన ఈ రోబో ఎలాంటి బట్టల మురికినైనా, చేతితో రుద్ది రుద్ది పోగొడుతుంది. తెల్ల బట్టలను ఒక రకంగా, రంగు పోయే దుస్తులను ఒక విధంగా ఇలా.. ఏ రకం దుస్తులను ఏ విధంగా ఉతకాలో ఆ విధంగానే ఉతుకుతుంది.వాషింగ్ మెషిన్ కేవలం బట్టలను ఉతకడం మాత్రమే చేస్తుంది. కాని, ఈ రోబో బట్టలను ఆరేస్తుంది. ఆరేసిన బట్టలను మడతపెడుతుంది. ఆర్డర్ ఇస్తే ఇస్త్రీ కూడా చేస్తుంది. బాగుంది కదూ! త్వరలోనే మార్కెట్లోకి విడుదల కానుంది. -
ఉద్యోగులూ.. 60 గంటలు కష్టపడితేనే..
ఉద్యోగుల పని గంటల గురించి రోజుకో చర్చ నడుస్తోంది. యాజమాన్యాలు పనిఒత్తిడి పెంచి తమకు వ్యక్తిగత, కుటుంబంతో గడిపే సమయాన్ని దూరం చేస్తున్నాయని ఓవైపు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే మరోవైపు పరిశ్రమ ప్రముఖులు, వ్యాపారాధినేతలు దీనిపై విభిన్న వ్యాఖ్యానాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా గూగుల్ కో ఫౌండర్ సెర్గీ బ్రిన్.. వారానికి 60 గంటలు కష్టపడాలని తమ ఉద్యోగులను కోరారు.ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏజీఐ) అభివృద్ధిని వేగవంతం చేయడానికి సాహసోపేతమైన చర్యలో, గూగుల్‌కు చెందిన జెమినీ ఏఐ మోడళ్లలో పనిచేసే ఉద్యోగులు వారానికి 60 గంటలు పని చేసే విధానాన్ని అవలంబించాలని, రోజూ ఆఫీస్‌కు రావాలని సెర్గీ బ్రిన్ పిలుపునిచ్చారు. అంతర్గత మెమోలో పేర్కొన్న ఈ ఆదేశం, యంత్రాలు మానవ మేధస్సును మించిన మైలురాయి అయిన ఏజీఐని సాధించే రేసులో పెరిగిన అత్యవసరతను, పోటీ ఒత్తిడిని తెలియజేస్తోంది.తుది రేసు మొదలైందికృత్రిమ మేధ పరిశ్రమలో పోటీ తీవ్రమైన నేపథ్యంలో బ్రిన్ ఇచ్చిన ఈ పిలుపునకు ప్రాధాన్యం ఏర్పడింది. ముఖ్యంగా 2022లో చాట్‌జీపీటీని ప్రారంభించిన తరువాత ఏఐ పరిశ్రమలో పోటీ పెరిగింది. ఇది జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో వేగవంతమైన పురోగతిని ప్రేరేపించింది. "ఏజీఐకి తుది రేసు ప్రారంభమైంది" అని బ్రిన్ తన మెమోలో పేర్కొన్నారు. ఉద్యోగులు తమ ప్రయత్నాలను "టర్బోచార్జ్" చేస్తే.. ఈ రేసులో గెలవడానికి అవసరమైన అన్ని అంశాలు గూగుల్ వద్ద ఉన్నాయన్నారు.ఉత్పాదకతకు ప్రమాణంవారానికి 60 గంటలు పనిచేయడం ఉత్పాదకత ప్రమాణాన్ని సూచిస్తుందని, అదే ఈ పరిమితిని మించితే బర్న్అవుట్కు దారితీస్తుందని కూడా బ్రిన్ హెచ్చరించారు. మరోవైపు ఉద్యోగులు 60 గంటల కంటే తక్కువ పని చేయడంపైనా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి ప్రవర్తన "అనుత్పాదకంగా ఉండటమే కాకుండా, ఇతరులకు చాలా నిరుత్సాహాన్ని కలిగిస్తుంది" అని పేర్కొన్నారు. బ్రిన్ సిఫార్సులు కార్పొరేట్ అమెరికాలో విస్తృత ధోరణిని ప్రతిబింబిస్తున్నాయి. ఇక్కడ కంపెనీలు ఉత్పాదకత, టీమ్ వర్క్ ను పెంచడానికి హైబ్రిడ్ పని విధానాలను తిప్పికొడుతున్నాయి.సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కోసం ఏఐ వినియోగంఎక్కువ పని గంటల కోసం వాదించడంతో పాటు, వారి కోడింగ్, పరిశోధన సామర్థ్యాలను పెంచడానికి గూగుల్ స్వంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలను ఉపయోగించాలని బ్రిన్ ఉద్యోగులను కోరారు. "మన స్వంత కృత్రిమ మేధను ఉపయోగించడం ద్వారా ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైన కోడర్లు, ఏఐ శాస్త్రవేత్తలుగా మారాలి" అని జెమినీ టీమ్ సభ్యులకు ప్రత్యేకంగా పిలుపునిచ్చారు.ఈ విధానం ఏజీఐని సాధించడంలో ఏఐ ఆధారిత స్వీయ-మెరుగుదల ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది.వర్క్‌ఫోర్స్‌పై ప్రభావంమరింత కఠినమైన పని షెడ్యూళ్ల కోసం బ్రిన్ చేస్తున్న ఒత్తిడి ఏజీఐ అభివృద్ధిలో గూగుల్ నాయకత్వం వహించాలనే ఆయన దార్శనికతను ప్రతిబింబిస్తున్నప్పటికీ, ఇది శ్రామిక శక్తిపై ప్రభావాన్ని గురించి కూడా ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఏజీఐని సాధించాల్సిన ఆవశ్యకత స్పష్టంగా కనిపిస్తోంది. ఇది గూగుల్‌లో సాంకేతిక పురోగతి అత్యవసరతను ప్రతిబింబిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధిలో పోటీ తీవ్రమవుతున్న తరుణంలో ఏఐ బృందానికి బ్రిన్ ఆదేశం గూగుల్ కు కీలక సమయంలో వచ్చింది. -
స్మార్ట్‌ఫోన్‌లో 3డీ సినిమాలు చూస్తారా?
చేతిలో మొబైల్ ఉంటే సినిమా థియేటర్‌తో పనిలేదు చాలామందికి. అయితే, వీరందరూ స్మార్ట్‌ఫోన్‌లో 3డీ సినిమాలను చూడలేరు. ఇప్పుడు థియేటర్‌కు వెళ్లాల్సిన పనిలేకుండానే 3డీ సినిమాలను కూడా మొబైల్లోనే చూడొచ్చు. అదికూడా 3డీ స్క్రీనింగ్‌లో!‘హమామట్సు ఫొటోనిక్స్’ కంపెనీ తాజాగా ఒక కొత్త సెల్ ఎనలైజర్ ‘సైటో క్యూబ్’ను రూపొందించింది. ఇందులోని లైట్ స్క్రీనింగ్ ఆప్టికల్స్, అత్యాధునిక ఇమేజ్ ప్రాసెసింగ్ సిస్టమ్, మైక్రోప్లేట్ సెల్ కల్చర్ సాయంతో మొబైల్ స్క్రీనింగ్‌ను 3డీ ఫ్లోరోసెన్స్ ఇమేజింగ్‌తో అందిస్తుంది. మొబైల్‌కు కనెక్ట్ చేసుకొని దీనిని వాడుకోవచ్చు. అటాచబుల్ స్పీకర్స్‌తో ఒకేసారి కుటుంబం మొత్తం కూడా చూసే వీలుంటుంది. -
వచ్చేస్తోంది.. మరో ట్రిపుల్ ఫోల్డ్ ఫోన్: దీని గురించి తెలుసా?
మార్కెట్లో ఇప్పుడు ఫోల్డబుల్ ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి. జాబితాలో ఇన్ఫినిక్స్ కూడా ఉంది. ఈ కంపెనీ నవంబర్ 2024లో తన మొదటి ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ చేసింది. ఇప్పుడు ట్రిపుల్ ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ఈ సరికొత్త ఫోన్ మార్చి 3 నుంచి 6 వరకు జరిగే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) 2025 కంటే ముందే కనిపించింది. అయితే సంస్థ ఈ ఫోన్ లాంచ్ డేట్, హార్డ్‌వేర్ వివరాలను వెల్లడించలేదు.ఇన్ఫినిక్స్ జీరో సిరీస్ మినీ ట్రిపుల్ ఫోల్డ్ ఫోన్.. డ్యూయల్ హింజెస్, ట్రిపుల్-ఫోల్డింగ్ మెకానిజం పొందుతుంది. ప్రత్యేకమైన డిజైన్ కలిగిన ఈ ఫోన్‌ను ఫోల్డ్ చేసినప్పుడు డ్యూయెల్ ఫోల్డ్ మొబైల్ మాదిరిగానే కనిపిస్తుంది. వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్, సెల్ఫీలు తీసుకోవడానికి పంచ్-హోల్ కెమెరా ఉన్నాయి.కంపెనీ లాంచ్ చేయనున్న మినీ ట్రిపుల్ ఫోల్డ్ ఫోన్.. జిమ్ పరికరాలు, సైకిల్ హ్యాండిల్బార్లు, కార్ డాష్‌బోర్డ్ వంటి వాటికి ఫిక్స్ చేయవచ్చు. దీనికోసం ఇందులో ఒక పట్టీ కూడా ఉంది. సంస్థ ఈ ఫోన్ గురించి చాలా వివరాలను వెల్లడించలేదు. ఇవన్నీ త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.మార్కెట్లో ఇప్పటి వారు ఉన్న ట్రిపుల్ ఫోల్డ్ ఫోన్స్గ్లోబల్ మార్కెట్లో.. ప్రస్తుతానికి హువావే మాత్రమే ట్రిపుల్-ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. కాగా 'గెలాక్సీ జీ ఫోల్డ్' పేరుతో శామ్సంగ్ ఓ ట్రిపుల్ ఫోల్డ్ ఫోన్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. దీనిని కంపెనీ ఏప్రిల్ 2025లో లాంచ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇది శామ్సంగ్ జెడ్ ఫోల్డ్ 7, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7లతో పాటు గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్లో లాంచ్ అవుతుందని చెబుతున్నారు.ఇదీ చదవండి: రోజుకో రేటు వద్ద బంగారం: ఎందుకో తెలుసా?కొత్త శామ్సంగ్ గెలాక్సీ జి ఫోల్డ్ మొబైల్.. హువావే మేట్ XT కంటే భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.49 ఇంచెస్ కవర్ డిస్ప్లే, 9.96 ఇంచెస్ మెయిన్ ఫోల్డబుల్ డిస్ప్లే ఉండవచ్చు. ఈ కొలతలు మేట్ ఎక్స్‌టి కంటే చాలా భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే ఇది పరిమాణంలో కొంచెం పెద్దది. లాంచ్ అయినప్పటికీ, గెలాక్సీ జి ఫోల్డ్ లాంచ్ అయిన వెంటనే అమ్మకానికి రాకపోవచ్చు. గెలాక్సీ ఫోల్డ్ స్పెషల్ ఎడిషన్‌గా మాత్రమే పరిమిత సంఖ్యలో మాత్రమే లభించే అవకాశం ఉంది. -
మైక్రొసాఫ్ట్ కీలక నిర్ణయం: త్వరలో ఆ యాప్ షట్‌డౌన్!
ప్రపంచంలోనే మొట్టమొదటి వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫామ్ 'స్కైప్' (Skype)ను శాశ్వతంగా మూసివేయాలని, టెక్ దిగ్గజం 'మైక్రోసాఫ్ట్' యోచిస్తోంది. మే నుంచి స్కైప్ అందుబాటులో ఉండదని.. కంపెనీ వెల్లడించింది.2003లో ప్రారంభమైన స్కైప్‌ను.. మైక్రోసాఫ్ట్ 2011లో 8.5 బిలియన్ డాలర్లకు (ప్రస్తుత కరెన్సీ ప్రకారం రూ. 74వేలకోట్లు) కొనుగోలు చేసింది. ఆ తరువాత ఇందులో అనేక అప్డేట్స్ తీసుకొచ్చింది. విండోస్ లైవ్ మెసెంజర్ తొలగింపు తరువాత.. 2015లో మైక్రోసాఫ్ట్ స్కైప్‌ను విండోస్ 10 లో అనుసంధానించడానికి ప్రయత్నించింది. ఇది మొత్తం తొమ్మిది నెలలు కొనసాగింది. అయితే ఇప్పుడు 22 ఏళ్ల స్కైప్ ప్రయాణానికి మంగళం పాడనుంది.మైక్రోసాఫ్ట్.. స్కైప్‌ను అభివృద్ధి చేయడానికి అనేక రకాలుగా పాటుపడింది. ఇందులో భాగంగానే యాపిల్ కంపెనీకి చెందిన 'ఐమెసేజ్'తో పోటీ పడటానికి సిద్ధమైంది. అయినా ఎలాంటి ఉపయోగం కనిపించలేదు. 2017లో మైక్రోసాఫ్ట్ టీమ్స్‌ను ప్రారంభించింది. ఎన్నెన్ని ప్రయత్నాలు చేసినా స్కైప్ అభివృద్ధి చెందలేదు. దీంతో చేసేదేమీ లేక.. కంపెనీ పూర్తిగా స్కైప్‌ను నిలిపివేయడానికి ఫిక్స్ అయింది. సంస్థ ఈ విషయాన్ని త్వరలోనే అధికారికంగా యూజర్లకు వెల్లడించనుంది. -
రీచార్జ్ ప్లాన్లు.. తక్కువ ఖర్చుతో 56 రోజుల వ్యాలిడిటీ
దేశంలో మూడవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన వొడాఫోన్ ఐడియా (Vi) తక్కువ ఖర్చుతో ఎక్కువ రోజుల వ్యాలిడిటీని ఇచ్చే ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తోంది. వీటితో వినియోగదారులు 56 రోజుల సర్వీస్ వాలిడిటీని పొందుతారు. అలాగే ఈ ప్లాన్లు వైవిధ్యమైన ప్రయోజనాలను అందిస్తున్నాయి. 56 రోజుల వ్యాలిడిటీ కలిగిన నాలుగు ప్లాన్లు వొడాఫోన్ ఐడియాలో నాలుగు ఉన్నాయి. వాటి ధరలు వరుసగా రూ.369, రూ.579, రూ.795, రూ.649. దేశంలోని అన్ని టెలికాం సర్కిళ్లలోనూ ఈ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి.రూ.369 ప్లాన్ వీఐ రూ.369 ప్లాన్‌లో అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 4 జీబీ డేటా, 600 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. ఇది డేటా ఫోకస్డ్ ప్లాన్ కాదు. వినియోగదారులు దీనితో 56 రోజుల సర్వీస్ వ్యాలిడిటీని పొందుతారు. ఎఫ్‌యూపీ (ఫెయిర్ యూసేజ్ పాలసీ) పరిమితి ముగిసిన తర్వాత ఎక్కువ డేటా అవసరమైనప్పుడు డేటా వోచర్లతో రీఛార్జ్ చేసుకోవచ్చు.రూ.579 ప్లాన్ వీఐ నుంచి రూ.579 ప్లాన్‌తో యూజర్లకు రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 56 రోజులు. బింజ్ ఆల్ నైట్, వీకెండ్ డేటా రోల్ఓవర్, డేటా డిలైట్స్ వంటి వీఐ హీరో అన్లిమిటెడ్ బెనిఫిట్స్ ఉన్నాయి.రూ.649 ప్లాన్వొడాఫోన్ ఐడియా రూ.649 ప్లాన్ లో రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ తో వినియోగదారులు ప్రతిరోజూ ఉదయం 12 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అపరిమిత డేటాను పొందుతారు. అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. వీకెండ్ డేటా రోల్వోవర్, డేటా డిలైట్స్ ప్రయోజనాలు కూడా ఉన్నాయి.రూ .795 ప్లాన్ వొడాఫోన్ ఐడియా నుండి రూ .795 ప్లాన్ అపరిమిత కాలింగ్, 3 జీబీ రోజువారీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, ఉదయం 12 నుండి మధ్యాహ్నం 12 గంటల మధ్య అపరిమిత డేటా, డేటా డిలైట్స్, వారాంతపు డేటా రోల్ఓవర్ వంటి అదనపు ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్లాన్‌తో 16 ఓటీటీలతో 60 రోజుల పాటు వీఐ మూవీస్ అండ్ టీవీ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందిస్తోంది.ఇదీ చదవండి: ఎయిర్టెల్ రీచార్జ్ ప్లాన్లు.. రూ.200 దగ్గరలో మంత్లీ వ్యాలిడిటీ -
సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇక సర్దుకోవాల్సిందే..!
ఆటోమేషన్... ఈ పదం జాబ్ మార్కెట్‌ను వణికిస్తోంది. ముఖ్యంగా టెక్ పరిశ్రమలో ఉద్యోగులకు గుబులు పుట్టిస్తోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విస్తరణతో చాలా కంపెనీలు ఆటోమేషన్ (automation) బాట పట్టాయి. దీంతో ఉద్యోగుల మనుగడకు ముప్పు ఏర్పడింది. తాజాగా ఇన్మోబి (InMobi) సంస్థ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నవీన్ తివారీ పిడుగులాంటి వార్త చెప్పారు.వారికి ఉద్యోగాలు ఉండవుఈ ఏడాది చివరి నాటికి సాఫ్ట్ వేర్ కోడింగ్ లో తమ సంస్థ 80 శాతం ఆటోమేషన్ ను సాధిస్తుందని, ఫలితంగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు (software engineers) ఉద్యోగాలు పోతాయని నవీన్ తివారీ వెల్లడించారు. 'మా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు వెళ్లిపోతారని అనుకుంటున్నాను. రెండేళ్లలో వారికి ఉద్యోగాలు ఉండవు' అని ప్రారంభ దశ ఇన్వెస్ట్ మెంట్ ప్లాట్ ఫామ్ లెట్స్ వెంచర్ నిర్వహించిన కార్యక్రమంలో తివారీ అన్నారు. ‘ఈ ఏడాది చివరి నాటికి సాఫ్ట్ వేర్ కోడింగ్ లో 80 శాతం ఆటోమేషన్ ను నా సీటీవో (చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ) అందిస్తారు. ఇప్పటికే 50 శాతం సాధించాం. యంత్రం సృష్టించిన కోడ్లు వేగంగా, మెరుగ్గా ఉంటాయి. అలాగే అవి తమను తాము సరిచేసుకోగలవు" అని ఆయన లెట్స్ వెంచర్ సీఈవో శాంతి మోహన్‌తో అన్నారు.ఇన్మోబి సీఈవో నవీన్ తివారీమిమ్మల్ని మీరు అప్‌గ్రేడ్ చేసుకోండి..అత్యంత ప్రత్యేకమైన ఉద్యోగాలకు మొదట కృత్రిమ మేధ (ఏఐ) వస్తుందని, ఉద్యోగులు తమను తాము అప్ గ్రేడ్ చేసుకోవాలని తివారీ పిలుపునిచ్చారు. "మిమ్మల్ని మీరు అప్ గ్రేడ్ చేసుకోండి, మిమ్మల్ని అప్ గ్రేడ్ చేయమని నన్ను అడగకండి. ఎందుకంటే ఇది మనుగడ. మీ కింద ప్రపంచం మారుతోంది' అని ఉద్యోగులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.ఇది చదివారా? ఐటీ కంపెనీ కొత్త రూల్.. పరీక్ష పాసైతేనే జీతం పెంపుఇన్మోబిలో రెండు కంపెనీలు ఉన్నాయి. ఒకటి ఇన్మోబి యాడ్స్. ఇది అడ్వర్టైజింగ్ టెక్నాలజీపై పనిచేసే బిజినెస్-టు-బిజినెస్ కంపెనీ. మరొకటి గ్లాన్స్. ఇది ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ ఫోన్ ల కోసం రూపొందించిన స్మార్ట్ లాక్ స్క్రీన్ టెక్నాలజీ ప్లాట్ ఫామ్ ను అందించే కన్స్యూమర్ టెక్నాలజీ బిజినెస్-టు-కన్స్యూమర్ కంపెనీ. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా గ్లాన్స్ ఎనేబుల్డ్ స్మార్ట్ఫోన్ల కోసం జెన్ఏఐ పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి గూగుల్ క్లౌడ్‌తో తాజాగా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. -
గుడ్లు సేకరించే రోబో: ఖర్చు తక్కువ, ఫలితం ఎక్కువ
ఆఫీసులో పనిచేసే రోబో గురించి వినుంటారు, రెస్టారెంట్లలో పనిచేసే రోబోలను గురించి వినుంటారు, ఆఖరికి ఇంట్లో పనిచేసే రోబోలను కూడా సినిమాల్లో చూసే ఉంటారు. కానీ.. గుడ్లను (Eggs) సేకరించే రోబోలను గురించి విన్నారా?, బహుశా ఇది వినడానికి కొత్తగా అనిపించినా.. ఇలాంటిది కూడా ఒకటుందని తెలుసుకోవాల్సిందే.. ఎందుకంటే దీనివల్ల బోలెడన్ని లాభాలున్నాయి మరి.ఎన్ఐటీ కాలికట్ (NIT Calicut).. గుడ్లను సేకరించడానికి ఓ ప్రత్యేకమైన రోబోట్‌ను రూపొందించింది. దీనిపేరు 'అవిబోట్' (AVIBOT). ఇది కోళ్ల ఫారాలలో గుడ్లను పగిలిపోకుండా చాలా జాగ్రత్తగా సేకరిస్తుంది. కాబట్టి వర్కర్స్ అవసరం, ఖర్చు కూడా తగ్గుతుంది. కోళ్ల పరిశ్రమలు నిర్వహించేవారు.. గుడ్లను సేకరించడానికి ఇలాంటి రోబోట్స్ ఉపయోగించవచ్చు.అవిబోట్ ఉపయోగాలు➤సాధారణంగా ఎక్కడైనా గుడ్లను సేకరించడానికి మనుషులను ఉపయోగిస్తారు. కానీ ఈ అవిబోట్ స్వయంగా గుడ్లను సేకరిస్తుంది. కాబట్టి లేబర్ ఖర్చులు తగ్గుతాయి.➤అవిబోట్ చాలా వేగంగా గుడ్లను సేకరిస్తుంది. ఉదాహరణకు మనుషులు రెండు గంటల్లో గుడ్లను కలెక్ట్ చేస్తే.. ఈ రోబోట్ ఒక గంటలో పని పూర్తి చేస్తుంది. దీంతో సమయం ఆదా అవుతుంది. యజమాని లేదా నిర్వాహకులు ఇతర ముఖ్యమైన పనులపై దృష్టిపెట్టవచ్చు.➤రోబోట్ చాలా జాగ్రత్తగా గుడ్లను సేకరిస్తుంది. కాబట్టి పగిలిపోయే గుడ్ల సంఖ్య తగ్గుతుంది. దీనివల్ల యజమాని లాభం పొందవచ్చు. అంతే కాకుండా గుడ్డు ఉత్పత్తి రేట్లకు సంబంధించిన డేటాను సేకరించడం, రైతుల కార్యకలాపాలను పర్యవేక్షించడం, మెరుగుపరచడం వంటి వాటిలో కూడా సహాయపడుతుంది.ఇదీ చదవండి: ఉండగా మరమనిషి తోడుగా.. పనిమనిషి ఎందుకు దండగ! -
జెన్ఏఐ ద్వారా కొలువులు పెంపు
భారతదేశ జాబ్‌మార్కెట్, ఉత్పాదకతను మెరుగుపరిచేందుకు జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (జెన్ఏఐ) ఎంతో కీలకమని టాటా సన్స్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ తెలిపారు. ముంబయిలో నిర్వహించిన టెక్వీక్లో పాల్గొని మాట్లాడారు. కృత్రిమ మేధ వల్ల ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదముందనే సాధారణ భయాలకు విరుద్ధంగా, జెన్ఏఐ ద్వారా కొలువులు పెరుగుతాయని నొక్కి చెప్పారు.‘తక్కువ నైపుణ్యం కలిగిన సిబ్బంది అధిక స్థాయి సామర్థ్యంతో పనిచేయడానికి వీలు కల్పించడం ద్వారా జెఎన్ఏఐ ఉత్పాదకతను పెంచుతోంది. సంప్రదాయ వ్యాపార ప్రయోజనాలు అంతంతమాత్రంగానే కొనసాగుతున్నాయి. అలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం కంటే కృత్రిమ మేధ సామర్థ్యాలను పెంపొందించుకోవడంపై భారత్ దృష్టి సారించాలి. భారతదేశ సాంస్కృతిక, భాషాపరమైన అంశాలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు కచ్చితంగా ప్రాతినిధ్యం వహించేలా, వాటిని నిశితంగా అర్థం చేసుకునేలా సార్వభౌమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలను(sovereign AI capabilities) అభివృద్ధి చేయాలి. ఈ సామర్థ్యాలు లేకుండా దేశంలోని సంస్కృతులు, భాషలు, ప్రత్యేక సందర్భాలను పూర్తిగా అర్థం చేసుకోవడం వీలవ్వదు’ అన్నారు.ఇదీ చదవండి: అంచనాల్లో 74.5 శాతానికి ద్రవ్యలోటు‘టాటా గ్రూప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో చురుకుగా పెట్టుబడులు పెడుతోంది. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టుల్లో ఏఐను వినియోగిస్తూ భారీ ఉద్యోగ కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేశాం. టాటా గ్రూప్ ప్రస్తుతం 100కి పైగా జెన్ఏఐ ప్రాజెక్టులను అమలు చేస్తోంది. వచ్చే ఐదేళ్లలో తయారీ రంగంలో 5,00,000 ఉద్యోగాలు సృష్టించబడుతాయి. భారత ఐటీ సేవల రంగం స్థాయిని పోలిన శక్తివంతమైన రంగాన్ని సృష్టించేందుకు ఏఐకు సామర్థ్యం ఉంది’ అని చంద్రశేఖరన్ తెలిపారు. -
నాడు బీభత్సం.. నేడు ఫెయిల్.. ఇకపై ఆ సేవలకు మైక్రోసాఫ్ట్ గుడ్‌బై?
ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (microsoft) కీలక నిర్ణయం తీసుకోనుంది. 2000 దశకంలో సంచలనం సృష్టించిన వీడియో కాలింగ్ ప్లాట్‌ఫామ్ స్కైప్‌కు (skype) స్వస్తి పలకనుంది. వెలుగులోకి వచ్చిన పలు అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం ఈ ఏడాది మే నెలలో స్కైప్‌ను షట్ డౌన్ చేసేందుకు మైక్రోసాఫ్ట్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.ప్రముఖ టెక్ బ్లాగ్ ఎక్స్‌డీఏ కథ మేరకు..‘స్కైప్ ప్రివ్యూలో ఓ హిడెన్ మెసేజ్ కనిపించింది. అందులో, మే నెల నుంచి స్కైప్ అందుబాటులో ఉండదు. మీ కాల్స్, చాట్స్ చేసుకునేందుకు వీలుగా మైక్రోసాఫ్ట్ టీమ్స్ ఉంది. అంతేకాదు, మీ మిత్రులు ఇప్పటికే టీమ్స్‌కి మారారు’ అని ఉన్నట్లు పేర్కొంది. అయితే,స్కైప్ షట్ డౌన్‌పై మైక్రోసాప్ట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. స్కైప్ చరిత్రస్కైప్ తొలిసారిగా 2003లో ప్రారంభమైంది. అతి తక్కువ సమయంలోనే ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించింది. అందుకే, 2011లో మైక్రోసాఫ్ట్ దీనిని 8.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. స్కైప్‌కి పోటీగా ఐమెసేజ్,వాట్సాప్,జూమ్ వంటి యాప్స్ పుట్టుకొచ్చాయి. దీంతో స్కైప్ ప్రాచుర్యం తగ్గిపోయింది. కోవిడ్-19 సమయంలో స్కైప్ మళ్లీ పాపులర్ అవుతుందనుకున్నారు. కానీ జూమ్, గూగుల్ మీట్స్ స్థాయిలో స్కైప్ ఆకట్టుకోలేకపోయింది. అందుకే స్కైప్‌ను మైక్రోసాఫ్ట్ షట్‌డౌన్ చేయనుందని వెలుగులోకి వచ్చిన మీడియా కథనాలు పేర్కొన్నాయి.స్కైప్‌కు ప్రత్యామ్నాయంగా కొత్త మైక్రోసాఫ్ట్ టీమ్స్ (Microsoft Teams) అనే వీడియో ఫ్లాట్ఫారమ్ను వినియోగంలోకి తెచ్చింది.టీమ్స్‌పై ఫోకస్ స్కైప్‌ను షట్‌డౌన్ చేయాలనే ఆలోచనలో ఉన్న మైక్రోసాఫ్ట్ తన ఫోకస్ అంతా మైక్రోసాఫ్ట్ టీమ్స్‌పై పెట్టింది.స్కైప్ కంటే ఎక్కువ ఫీచర్లను మైక్రోసాఫ్ట్టీమ్స్లో జోడించింది. ఇటీవల కోపైలెట్ ఏఐ ఫీచర్లను జోడించింది. ఇలా మైక్రోసాఫ్ట్ స్కైప్‌ను పూర్తిగా నిలిపివేస్తోందా? లేక వేరే రూపంలో తెరపైకి తెస్తుందా? అనేది తెలియాల్సి ఉంది. -
ఐటీ కంపెనీ కొత్త రూల్.. పరీక్ష పాసైతేనే జీతం పెంపు
ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల వేతన పెంపులు (Salary Hikes) క్లిష్టంగా మారుతున్నాయి. ఒక్కో సంస్థ ఒక్కో నిబంధనను తెస్తున్నాయి. తాజాగా ఎల్టీఐ మైండ్‌ట్రీ (LTIMindtree) సంస్థ కొత్త సామర్థ్య ఆధారిత మదింపు వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా మేనేజర్ స్థాయి ఉద్యోగుల వేతన పెంపును సామర్థ్య పరీక్ష ఉత్తీర్ణతకు లింక్ చేసింది. కంపెనీ వార్షిక అప్రైజల్ కసరత్తులో భాగమైన ఈ చొరవ లక్ష్యం మేనేజర్లు తమ పాత్రలలో రాణించడానికి అవసరమైన నైపుణ్యాలు, పరిజ్ఞానాన్ని కలిగి ఉండేలా చేయడమే.కాంపిటెన్సీ టెస్ట్మిడిల్, సీనియర్ లెవల్ మేనేజర్లకు తప్పనిసరిగా నిర్వహించే ఈ కాంపిటెన్సీ టెస్ట్‌లో కోడింగ్, మ్యాథమెటిక్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ సహా పలు నైపుణ్యాలను అంచనా వేస్తారు. బృందాలకు నాయకత్వం వహించడానికి, సంస్థ ఎదుగుదలను నడిపించడానికి అవసరమైన సాంకేతిక, నిర్వహణ సామర్థ్యాలను అంచనా వేయడానికి ఈ పరీక్ష రూపొందించారు. నాలుగు సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం ఉన్న టీమ్ లీడ్ లు, లీడ్ ఆర్కిటెక్ట్ లను కలిగి ఉన్న పీ3, పీ4, పీ5 బ్యాండ్ ల్లోని మేనేజర్ లు వేతన పెంపునకు అర్హత పొందడానికి ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.చొరవ వెనుక హేతుబద్ధతశరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ పరిశ్రమలో పోటీతత్వంతో ఉండాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సామర్థ్య ఆధారిత అప్రైజల్ వ్యవస్థను అమలు చేయాలని ఎల్టీఐ మైండ్‌ట్రీ కంపెనీ నిర్ణయం తీసుకుంది. సామర్థ్య పరీక్ష ఉత్తీర్ణతను వేతన పెంపునకు అనుసంధానించడం ద్వారా, కంపెనీ తన మేనేజర్లకు తాజా నైపుణ్యాలు, పరిజ్ఞానం ఉందని నిర్ధారించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విధానం శ్రామిక శక్తి మొత్తం సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా నిరంతర అభ్యాసం, అభివృద్ధికి కంపెనీ నిబద్ధతకు అనుగుణంగా ఉంటుంది.పరిశ్రమ ప్రభావంఎల్టీఐమైండ్ట్రీ తీసుకున్న ఈ నిర్ణయం బహుశా భారత ఐటీ పరిశ్రమలో ఇదే మొదటిది కావచ్చు. పనితీరు మదింపులలో నైపుణ్యాల ఆధారిత మదింపుల ప్రాముఖ్యతను హైలైట్ చేస్తూ, ఇతర కంపెనీలు అనుసరించడానికి ఇది ఒక ఉదాహరణను ఏర్పరుస్తుంది. వేతన పెంపునకు సామర్థ్య పరీక్షను తీసుకురావడం మెరిటోక్రసీపై కంపెనీ దృష్టిని, అత్యుత్తమ సంస్కృతిని పెంపొందించే వైఖరిని తెలియజేస్తోంది.ఇది చదివారా? ఇన్ఫోసిస్ లేఆఫ్‌లలో మరో ట్విస్ట్..ఉద్యోగుల రియాక్షన్ఎల్టీఐమైండ్ట్రీ తీసుకొచ్చిన కొత్త అప్రైజల్ వ్యవస్థపై ఉద్యోగుల నుంచి మిశ్రమ ప్రతిస్పందనలు వ్యక్తమవుతున్నాయి. అయితే నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడంక, సామర్థ్యాలను ప్రదర్శించే అవకాశాన్ని కల్పించడాన్ని కొంత మంది ఉద్యోగులు అభినందిస్తున్నారు. అదనపు ఒత్తిడి, వేతనాల పెంపుపై ప్రభావం పడుతుందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరీక్ష నిష్పాక్షికంగా ఉండేలా రూపొందించామని, అందుకు వారు సిద్ధం కావడానికి తగిన సహకారం, వనరులను అందిస్తామని ఎల్‌టీఐమైండ్‌ట్రీ తమ ఉద్యోగులకు హామీ ఇచ్చింది. -
ఉండగా మరమనిషి తోడుగా.. పనిమనిషి ఎందుకు దండగ!
టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న వేళ.. అన్ని రంగాల్లోనో రోబోట్స్ (Robots) హవా సాగుతోంది. పరిస్థితులు చూస్తుంటే రాబోయే రోజుల్లో పనిచేయడానికి మనుషులు అవసరం లేదేమో అనిపిస్తోంది. ఎందుకంటే మనిషి చేయాల్సిన పనులను 'మర మనుషులు' చేసేస్తుంటే.. ఇక మనిషికి పనెక్కడుంటుంది. అయితే రోబోలను తయారు చేయడానికి.. వాటిలో కొత్త టెక్నాలజీలను ప్రవేశపెట్టడానికి మాత్రం మనిషి అవసరమే. ఇప్పటికే అనేక కంపెనీలు హ్యుమానాయిడ్ రోబోలను ప్రవేశపెట్టాయి. ఈ జాబితాలోకి 'ఫిగర్' (Figure) కూడా చేరనుంది.ఫిగర్ తన హ్యూమనాయిడ్ రోబోట్ సామ్రాజ్యాన్ని విస్తరించే పనిలో నిమగ్నమై ఉంది. ఇందులో భాగంగానే ఇంట్లో పనిచేయడానికి సంబంధించిన రోబోలను ఈ ఏడాది టెస్ట్ చేయనున్నట్లు.. కంపెనీ సీఈఓ 'బ్రెట్ అడ్కాక్' (Brett Adcock) ప్రకటించారు. మా ఏఐ హెలిక్స్ ఎవరూ ఊహించని దానికంటే వేగంగా ముందుకు వస్తోందని ట్వీట్ చేశారు.ఫిగర్ హ్యూమనాయిడ్ రోబోలు తమ చుట్టూ ఏం జరుగుతోందో చూడటానికి, భాషను అర్థం చేసుకోవడానికి, ఇతరులతో మాట్లాడటానికి, ఏదైనా పనిని చేయడం నేర్చుకోవడానికి కావాల్సిన టెక్నాలజీని పొందుతాయి. ఇంట్లో పనిచేసే రోబోలు మాత్రమే కాకుండా ఫ్యాక్టరీలలో పనిచేయడానికి ఉపయోగపడే రోబోలను కూడా కంపెనీ రూపొందిస్తోంది.ఫ్యాక్టరీలలో పనిచేసే రోబోల కదలికలు, అవి ఎలా పనిచేస్తాయని అని చూపే వీడియో కూడా ఇక్కడ చూడవచ్చు. రోబోలు వాటికి కేటాయించిన ప్రాంతాల్లో వెళ్లి నిలబడి, బెల్ట్ కన్వేయర్ మీద వెళ్తున్న వస్తువులను పక్కకు తీయడం చూడవచ్చు. ఇలాంటి రోబోలు.. ఈ కామర్స్ లేదా లాజిస్టిక్ కంపెనీలలో చాలా ఉపయోగకరంగా ఉంటాయి.ఇక ఇంట్లో పనిచేసే రోబోల విషయానికి వస్తే.. ఇవి మనిషి మాదిరిగానే, ఇంట్లో ఉన్నవారికి సహాయం చేయడంలో ఉపయోగపడతాయి. ఫుడ్ అందించడం, గోడమీద పెయింటింగ్ ఫోటో సరిచేయడం.. యజమాని స్పందనకు ప్రతిస్పందించడం వంటివి కూడా చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. డెలివరీలను తీసుకోవడం, మనిషిలాగే పని పూర్తయిన తరువాత రెస్ట్ తీసుకోవడం వంటివి చేస్తోంది. ఇంటి పనిలో సహకరించే రోబోలు.. ఫ్యాక్టరీలో పనిచేసే రోబోలు అందుబాటులోకి వచ్చిన తరువాత అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది.Important update: Figure is launching robots into the homeOur AI, Helix, is advancing faster than any of us anticipated, accelerating our timeline into the homeTherefore, we've moved-up our home timeline by 2 years; starting Alpha testing this year pic.twitter.com/t1TU1TseJq— Brett Adcock (@adcock_brett) February 27, 2025Source: Brett Adcock / X -
రోజూ రెండు కోట్ల మంది భక్తులు.. అంతరాయంలేని కనెక్టివిటీ!
ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన కార్యక్రమాల్లో ఒకటైన మహా కుంభమేళా 2025లో రోజూ దాదాపు 20 మిలియన్ల(రెండు కోట్లు) మంది భక్తులు పాల్గొన్నారని అంచనా. ఈ భారీ జన సమూహం ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను చాటడమే చేయడమే కాకుండా టెలికాం పరిశ్రమపై గణనీయమైన ప్రభావం చూపింది. టెలికమ్యూనికేషన్స్ విభాగం, సర్వీస్ ప్రొవైడర్ల సహకారంతో లక్షలాది మంది భక్తులకు అంతరాయం లేని కనెక్టివిటీని అందించేందుకు డేటా ట్రాఫిక్‌ను నిశితంగా పర్యవేక్షించినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.రంగంలోకి దిగిన టెలికాం దిగ్గజాలుమహా కుంభమేళా సమయంలో పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా జియో, ఎయిర్టెల్ వంటి ప్రముఖ టెలికాం కంపెనీలు కొత్త సైట్లను, అదనంగా స్పెక్ట్రమ్‌ను జోడించి ముందస్తు చర్యలు చేపట్టాయి. పెరిగిన డేటా ట్రాఫిక్‌ను నిర్వహించడానికి, భక్తులకు అంతరాయం లేని సేవలను అందించడానికి ఈ వ్యూహాత్మక చర్య ఎంతో అవసరమైంది. దాంతో డేటా ట్రాఫిక్ గణనీయంగా 55% పెరిగినట్లు కంపెనీ తెలిపాయి.కంపెనీలకు ఆదాయం పెంపుమహా కుంభమేళా 2025 సందర్భంగా డేటా వినియోగం పెరగడం టెలికాం కంపెనీలకు గణనీయమైన ఆదాయాన్ని సమకూర్చినట్లు నిపుణులు తెలుపుతున్నారు. పెరిగిన డేటా ట్రాఫిక్ ప్రతి వినియోగదారుడి నుంచి సంస్థలకు వచ్చే సగటు ఆదాయాన్ని (ఏఆర్పీయూ) 4% నుంచి 6% వరకు పెంచుతుందని అంచనా. మిలియన్ల మంది ప్రజల కమ్యూనికేషన్ అవసరాలను తీర్చేందుకు మెరుగైన టెలికాం మౌలిక సదుపాయాలను అందించడంతోనే ఇది సాధ్యమైందని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: సెబీ కొత్త చీఫ్‌గా తుహిన్ కాంత పాండేపరస్పర సహకారంసర్వీస్ ప్రొవైడర్లతో కలిసి టెలికమ్యూనికేషన్స్ విభాగం ఈ మహా కుంభమేళాలో కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాల నిర్వహణలో కీలక పాత్ర పోషించింది. క్రౌడ్ మూవ్మెంట్, డేటా ట్రాఫిక్‌ను పర్యవేక్షించడం ద్వారా నెట్వర్క్ స్థిరంగా, సమర్థవంతంగా ఉండేలా చూసుకున్నారు. టెలికాం విభాగం, సర్వీస్ ప్రొవైడర్ల మధ్య ఈ సహకారం పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహించడంలో ఎంతో అవసరమనే విషయాన్ని హైలైట్ చేస్తుంది. -
ఏఐకి కంపెనీల జై
న్యూఢిల్లీ: దేశీయంగా చాలా కార్పొరేట్ కంపెనీలు కృత్రిమ మేథ (ఏఐ) వినియోగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాయి. అయితే, ఈ టెక్నాలజీ సామర్థ్యాలను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేగలిగే నిపుణుల కొరత పెద్ద సమస్యగా ఉంటోంది. ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫాం లింక్డ్ఇన్ నిర్వహించిన సర్వే నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం తమకు వచ్చే దరఖాస్తుల్లో, ఉద్యోగానికి కావాల్సిన అర్హతలన్నీ ఉండే దరఖాస్తులు సగానికన్నా తక్కువగా ఉంటున్నాయని దేశీయంగా 54 శాతం మంది హ్యూమన్ రిసోర్సెస్ (హెచ్ఆర్) ప్రొఫెషనల్స్ వెల్లడించారు. సరైన సాంకేతిక నైపుణ్యాలున్న వారిని (61 శాతం మంది), సాఫ్ట్ స్కిల్స్ ఉన్న వారిని (57 శాతం మంది) దొరకపుచ్చుకోవడం నియమాకాలపరంగా అతి పెద్ద సవాలుగా ఉంటోందని పేర్కొన్నారు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఇంజినీరింగ్ వంటి టెక్నికల్/ఐటీ నైపుణ్యాలు (44 శాతం), ఏఐ నైపుణ్యాలు (34 శాతం), కమ్యూనికేషన్ .. సమస్యల పరిష్కార నైపుణ్యాలు (33) గల అభ్యర్థులు అతి కష్టం మీద దొరుకుతున్నారు. అర్హులైన అభ్యర్ధులు దొరక్కపోవడంతో హైరింగ్ ప్రక్రియ విషయంలో కంపెనీలు మరింత ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఉద్యోగానికి కావాల్సిన అర్హతల్లో కనీసం 80 శాతం ఉన్న అభ్యర్ధులనే పరిగణనలోకి తీసుకుంటామని 55 శాతం మంది, వారినే హైరింగ్ చేసుకుంటామని 54 శాతం మంది హెచ్ఆర్ నిపుణులు తెలిపారు. సర్వే డేటా, లింక్డ్ఇన్ ప్లాట్‌ఫాంలో వివరాల విశ్లేషణ ఆధారంగా రిపోర్ట్ తయారైంది. 1,991 మంది సీ–సూట్ ఎగ్జిక్యూటివ్‌లతో పాటు వెయ్యి మందికి పైగా ఉద్యోగులుండే సంస్థలకు సంబంధించి 300 మంది పైచిలుకు చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్స్ ఈ సర్వేలో పాల్గొన్నారు. నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు .. → నియామకాల తీరుతెన్నులను, ప్రతిభావంతులకు శిక్షణనివ్వడం మొదలైన అంశాలను ఏఐ సమూలంగా మార్చేస్తోంది. అయితే ఏఐని కేవలం ఆషామాïÙగా వినియోగించుకోవడం వల్ల ఉపయోగం లేదు. వ్యాపార వృద్ధికి దాన్ని ఉపయోగించుకోవడం కీలకం. చాలా మటుకు కంపెనీలు ఏఐ సాధనాలను తయారు చేసుకోవడంపైనే భారీగా పెట్టుబడులు కుమ్మరిస్తున్నాయని, కానీ వాటిని పూర్తి స్థాయిలో వినియోగించగలిగే సరైన నిపుణులు అంతగా ఉండటం లేదని నివేదిక వివరించింది. దీనితో గేమ్ చేంజింగ్ అవకాశం చేజారిపోతోందని పేర్కొంది. → దీన్ని అధిగమించాలంటే వ్యాపార సంస్థలు నియామకాల విషయంలో నైపుణ్యాలకు ప్రాధాన్యతనిచ్చే ధోరణితో వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే కొత్త ఆవిష్కరణలకు ఏఐ ఒక సాధనంగా ఉపయోగపడినప్పటికీ, సృజనాత్మకత, కమ్యూనికేషన్, భాగస్వామ్యం వంటి మానవ నైపుణ్యాలవల్లే పోటీ సంస్థలకన్నా మెరుగ్గా కంపెనీలు పురోగమించగలవు. → నైపుణ్యాల్లో అంతరాలను భర్తీ చేసేందుకు భారతీయ కంపెనీలు శిక్షణపై మరింతగా దృష్టి పెట్టాలి. ఏఐ గురించి నేర్చుకోవడం, అభివృద్ధి చేయడంపై ఇన్వెస్ట్ చేస్తే .. వినియోగం పెరగడానికి ఉపయోగపడుతుంది.హెల్త్‌కేర్ ఏఐతో జీడీపీకి ఊతం 2025లో 30 బిలియన్ డాలర్ల వరకు జత ఇన్ఫ్రా పరిమితులు అధిగమించాలి, సిబ్బందికి శిక్షణనివ్వాలి డెలాయిట్ నివేదిక న్యూఢిల్లీ: ఆరోగ్య సంరక్షణలో కృత్రిమ మేథని (ఏఐ) విస్తృతంగా ఉపయోగించడం వల్ల స్థూల దేశీయోత్పత్తికి (జీడీపీ) 2025లో మరో 25–30 బిలియన్ డాలర్ల విలువ జత కాగలదని కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ ఒక నివేదికలో తెలిపింది. ప్రభుత్వం తోడ్పాటు అందిస్తున్న ఇండియాఏఐ మిషన్, డిజిటల్ వ్యక్తిగత డేటా భద్రత చట్టం 2023 మొదలైనవి డిజిటల్ హెల్త్‌కేర్ వ్యవస్థకు ఊతమిస్తున్నాయని వివరించింది. నివేదిక ప్రకారం ఆరోగ్య సంరక్షణ విభాగంలో ఏఐ వినియోగం 40 శాతం పైగా ఉంటోంది. ఇది ఎఫ్ఎంసీజీ (30 శాతం), తయారీ (25 శాతం) కన్నా అధికం కావడం గమనార్హం. ఏఐ ఆధారిత వైద్యపరీక్షలు, మెడ్‌టెక్ ఆవిష్కరణలు, డిజిటల్ హెల్త్ రికార్డులు తదితర అంశాల కారణంగా భారతీయ డిజిటల్ హెల్త్‌కేర్ వ్యవస్థ చాలా వేగంగా వృద్ధి చెందుతోందని డెలాయిట్ ఇండియా లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్ ఇండస్ట్రీ లీడర్ జయ్‌దీప్ ఘోష్ తెలిపారు. అయితే, ఏఐ సామర్థ్యాలను పూర్తిగా ఉపయోగించుకోవాలంటే నియంత్రణ విధానాలు, సిబ్బందికి శిక్షణ, మౌలిక సదుపాయాలపరమైన పరిమితులు మొదలైన సవాళ్లను అధిగమించాల్సిన అవసరం ఉంటుందని పేర్కొన్నారు. మరిన్ని పెట్టుబడులు, పురోగామి పాలసీలపై దృష్టి పెట్టడం ద్వారా ఏఐ ఆధారిత హెల్త్‌కేర్ విభాగంలో భారత్ అంతర్జాతీయంగా అగ్రగామిగా ఎదగవచ్చని ఘోష్ చెప్పారు.బ్యాంకింగ్‌తో పోలిస్తే పురోగతి నెమ్మదే.. ఏఐ కొత్త పుంతలు తొక్కుతున్నప్పటికీ బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగాలతో పోలిస్తే హెల్త్‌కేర్‌లో కృత్రిమ మేథ వినియోగం చాలా నెమ్మదిగా ఉంటోందని నివేదిక తెలిపింది. డేటా భద్రతపై అనుమానాలు, బహుళ నియంత్రణ సంస్థలు, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు పరిమితంగా ఉండటం, ఏఐలో శిక్షణ పొందిన నిపుణుల కొరత తదితర అంశాలు ఇందుకు కారణమని వివరించింది. సర్జికల్ కన్జూమబుల్స్ విభాగంలో భారత్ నికరంగా ఎగుమతిదారుగానే ఉంటున్నప్పటికీ హైటెక్ వైద్య పరికరాల కోసం ఇంకా దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోందని నివేదిక వివరించింది. దేశీయంగా తయారీని పెంచుకోవాల్సిన ఆవశ్యకతను ఇది సూచిస్తోందని పేర్కొంది. శిక్షణ, మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు, పాలసీపరమైన సంస్కరణలతో ఏఐ వినియోగం మరింత వేగవంతం కాగలదని వివరించింది. ఇది సాంకేతికంగా అధునాతనమైన, స్వయం సమృద్ధి గల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు బాటలు వేస్తుందని తెలిపింది. -
ఎయిర్టెల్ రీచార్జ్ ప్లాన్లు.. రూ.200 దగ్గరలో మంత్లీ వ్యాలిడిటీ
ఇటీవల టెలికాం రీఛార్జ్ ప్లాన్లు మరింత ఖరీదైనవిగా మారాయి. దీంతో ఒకటి కంటే ఎక్కువ మొబైల్ నంబర్లను వినియోగిస్తున్నవారికి మరింత భారంగా మారింది. పెద్ద డేటా ప్యాకేజీలు కాకుండా తమ నంబర్‌ను యాక్టివ్‌గా ఉంచుకుంటే చాలని కొంతమంది యాజర్లు భావిస్తున్నారు. మీరు ఎయిర్టెల్ కస్టమర్ అయి ఇటువంటి తక్కువ ధరలో రీచార్జ్ ప్లాన్ల కోసం చూస్తున్నట్లయితే ఈ సమాచారం మీ కోసమే..ఎయిర్టెల్ వివిధ వర్గాల వినియోగదారుల అవసరాలను తీర్చే ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ల శ్రేణిని అందిస్తోంది. పెద్ద మొత్తంలో డేటా అవసరం లేకుండా తక్కువ ధరలో నెలవారీ రీఛార్జ్ కోసం చూస్తున్నవారికి, రోజువారీ డేటా ప్రయోజనాలతో పాటు లాంగ్ వాలిడిటీని అందించే ప్లాన్లు సుమారు రూ .200 వద్ద ఎయిర్‌టెల్‌లో ఉన్నాయి. ఆ చౌకైన ప్రీపెయిడ్ ప్లాన్లు ఏవో ఇక్కడ పరిశీలిద్దాం.రూ.211 ప్లాన్ఇది 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో రోజుకు 1 జీబీ లభిస్తుంది. అంటే 30 రోజులకు మొత్తం 30 జీబీ లభిస్తుందన్నమాట. అయితే ఇందులో కాలింగ్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఉండవు. ఎందుకంటే ఇది డేటా ఓన్లీ ప్లాన్. బ్రౌజింగ్, సోషల్ మీడియా లేదా ఇతర ఆన్లైన్ కార్యకలాపాల కోసం ప్రధానంగా మొబైల్ డేటాను ఉపయోగించేవారికి ఈ ప్లాన్ అనువైనది.రూ .219 ప్లాన్డేటా, వాయిస్ కాలింగ్ ప్రయోజనాలు రెండింటినీ కోరుకునే వినియోగదారులకు ఎయిర్టెల్ రూ .219 ప్రీపెయిడ్ ప్లాన్ మంచి ఎంపిక. ఈ ప్లాన్ 30 రోజుల వాలిడిటీని అందిస్తుంది. నెల మొత్తం 3 జీబీ డేటాను అందిస్తుంది. నెలంతా అపరిమిత కాలింగ్, 300 ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఆనందించవచ్చు.ఎలా రీచార్జ్ చేసుకోవాలి?ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ల కోసం రీఛార్జ్ చేసుకోవడం చాలా సులభం. ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా నేరుగా మీ ఎయిర్టెల్ నంబర్‌ను రీఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే ఎయిర్టెల్ అధికారిక వెబ్సైట్లోనూ, పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే వంటి పాపులర్ థర్డ్ పార్టీ రీఛార్జ్ యాప్‌లలో కూడా ఈ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. -
లేఆఫ్స్.. ఇన్ఫోసిస్‌లో అసలేం జరుగుతోంది!
ఢిల్లీ : ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఇటీవల వంద మంది ఉద్యోగుల్ని తొలగించింది. ఈ తొలగింపుల అంశం పీఎంవో కార్యాలయానికి చేరింది. దీంతో ఇన్ఫోసిస్‌లో అసలేం జరగుతోందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇటీవల, ట్రైనింగ్ పూర్తి చేసుకున్న 100 అభ్యర్థులకు ఇన్ఫోసిస్ అసెస్మెంట్ టెస్ట్ నిర్వహించింది. అయితే, ఆ టెస్టులో ఉద్యోగులు ఫెయిలయ్యారు. దీంతో వారిని విధుల నుంచి తొలగించింది. ఇన్ఫోసిస్‌లో ఉద్యోగాలు పొందేలా జోక్యం చేసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ ఫిర్యాదు అనంతరం కేంద్ర కార్మిక శాఖ కర్ణాటక కార్మిక కమిషనర్‌కు మరో లేఖ జారీ చేసింది. ఇన్ఫోసిస్ మైసూర్ క్యాంపస్‌లో తొలగించిన ట్రైనీ ఉద్యోగుల విషయంలో జోక్యం చేసుకోవాలని, ఈ అంశాన్ని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఫిబ్రవరి 25న జారీ చేసిన లేఖలో పేర్కొంది. రెండేళ్ల తర్వాత ఉద్యోగాలుఇన్ఫోసిస్ రెండేళ్ల క్రితం వందల మంది ఫ్రెషర్స్‌ని నియమించుకుంది. వెంటనే వారిని విధుల్లో తీసుకోలేదు. రెండేళ్ల తర్వాత గతేడాది అక్టోబర్‌లో విధుల్లోకి తీసుకుంది. ఈ క్రమంలో తాజాగా వారిలో 300 మందికి పైగా ఫ్రెషర్స్‌కు అసెస్మెంట్ ఎగ్జామ్ నిర్వహించింది. అందులో ఫ్రెషర్స్ ఫెయిల్ అయ్యారనే కారణంతో విధుల నుంచి తొలగించింది. దీనిపై ఐటీ రంగంలో దుమారం చెలగరేగింది. ఇన్ఫోసిస్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని ఐటీ ఉద్యోగుల సంఘం నైట్స్ ఖండించింది. కేంద్రం కార్మిక శాఖ జోక్యం చేసుకుని ఇన్ఫోసిస్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఇదే అంశంపై నైట్స్ పీఎంవో కార్యాలయానికి లేఖరాసింది. ఆ లేఖపై కేంద్ర కార్మిక శాఖ స్పందించింది. పీఎంవో కార్యాలయానికి ఇన్ఫోసిస్ ఫ్రెషర్స్ తొలగింపులపై ఫిర్యాదులు అందాయి. ఆ ఫిర్యాదులో అభ్యర్థులు తమ ఉద్యోగం తిరిగి పొందేలా, భవిష్యత్తులో ఇతర ఉద్యోగుల్ని అక్రమంగా తొలగించకుండా ఉండేలా తగు చర్యలు తీసుకోవాలని కోరినట్లు పేర్కొంది. ఆందోళన చేస్తాంమరోవైపు, ఇన్ఫోసిస్‌లో లేఆప్స్‌పై ఉద్యోగుల సంఘం హెచ్చరికలు జారీ చేసింది. ఈ రోజు మేము ఉద్యోగులకు న్యాయం చేయాలని సంబంధిత అధికారుల్ని కోరుతున్నాం. కానీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే లేఆఫ్స్ గురైన ఉద్యోగులతో కలిసి ఆందోళన చేస్తామని ప్రకటించింది. వెంటనే ఈ సమస్యకు పరిష్కరం చూపేలా చర్యలు తీసుకోవాలని, అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. -
ఇన్ఫోసిస్ లేఆఫ్‌లలో మరో ట్విస్ట్..
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) లేఆఫ్‌లలో మరో పరిణామం చోటుచేసుకుంది. బలవంతపు తొలగింపులపై ఇన్ఫోసిస్ ట్రైనీలు ప్రధానమంత్రి కార్యాలయం (PMO) తలుపులు తట్టారు. ఇన్ఫోసిస్ తమను అన్యాయంగా తొలగించిందని (Layoffs), తిరిగి విధుల్లోకి తీసుకుని భవిష్యత్తులో ఇలాంటి తొలగింపులు జరగకుండా చూడాలని కోరుతూ 100 మందికి పైగా బాధితులు పీఎంవోకి ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది.ఈ ఫిర్యాదుల నేపథ్యంలో ఇన్ఫోసిస్ లో సామూహిక తొలగింపులపై జోక్యం చేసుకోవాలని రాష్ట్ర అధికారులను కోరుతూ కర్ణాటక లేబర్ కమిషనర్ కు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ రెండో నోటీసు పంపింది. పీఎంవోకు పలు ఫిర్యాదులు అందాయని, కార్మిక చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, దీనిపై విచారణ జరపాలని రాష్ట్ర కార్మిక అధికారులను కోరింది. అలాగే బాధితుల పక్షాన పోరాడుతున్న ఐటీ ఉద్యోగుల సంఘం నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (ఎన్ఐటీఈఎస్)కు సమాచారం అందించింది.700 మంది తొలగింపుగత రెండున్నరేళ్లలో క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా నియమించుకున్న సుమారు 700 మంది ట్రైనీలను ఇన్ఫోసిస్ ఫిబ్రవరి 7న తొలగించింది. వీరు 2023 అక్టోబర్‌లోనే విధుల్లోకి చేరారు. అంతర్గత మదింపు కార్యక్రమంలో బాధిత ఉద్యోగులు విఫలమయ్యారని పేర్కొంటూ ఇన్ఫోసిస్ తొలగింపులను సమర్థించుకుంది. వీరిలో పనితీరు సంబంధిత సమస్యల కారణంగా 350 మంది ఉద్యోగులు మాత్రమే రాజీనామా చేశారని కంపెనీ పేర్కొంది. తొలగించిన ఉద్యోగులు అంతర్గత మదింపుల పారదర్శకతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఊహించని విధంగా పరీక్షల్లో క్లిష్టత స్థాయిని పెంచారని, దీంతో ఉత్తీర్ణత సాధించడం కష్టంగా మారిందని బాధితులు ఆరోపిస్తున్నారు.ఇన్ఫోసిస్ స్పందనఈ ఫిర్యాదులపై స్పందించిన ఇన్ఫోసిస్ తన వైఖరిని వివరిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. తమ టెస్టింగ్ ప్రక్రియలను మూల్యాంకన విధాన పత్రంలో పొందుపరిచామని, ట్రైనీలందరికీ ముందస్తుగా తెలియజేశామని తెలిపింది. ఇన్ఫోసిస్ లో చేరే ప్రతి ట్రైనీ కంపెనీలో తమ అప్రెంటిస్ షిప్ ను అంగీకరిస్తూ రిజిస్ట్రేషన్ ఫారమ్ నింపుతారని గుర్తు చేసింది. శిక్షణ ఖర్చును పూర్తిగా ఇన్ఫోసిస్ భరిస్తోందని పేర్కొంది. -
హైదరాబాద్‌లో హెచ్‌సీఎల్ టెక్ మరో జీడీసీ..
ప్రముఖ ఐటీ సంస్థ హెచ్‌సీఎల్ టెక్ (HCLTech) హైదరాబాద్‌లో మరో గ్లోబల్ డెలివరీ సెంటర్‌ను (GDC) తెరిచింది. హైటెక్ సిటీలో ఏర్పాటైన ఈ గ్లోబల్ డెలివరీ సెంటర్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నగరంలో హెచ్‌సీఎల్ టెక్ సంస్థకు ఇది ఐదో గ్లోబల్ డెలివరీ సెంటర్. ఈ అత్యాధునిక కేంద్రంలో 5,000 మంది ఉద్యోగులు పని చేసుకునేందుకు వెసులుబాటు ఉంది.హైదరాబాద్‌లో హెచ్‌సీఎల్ టెక్ తాజాగా ఏర్పాటు చేసిన గ్లోబల్ డెలివరీ సెంటర్ 3,20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇది ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుండి గోల్డ్ సర్టిఫికేషన్ పొందింది. ఈ కేంద్రం ద్వారా 5,000 ఉద్యోగాలు లభిస్తాయని, ప్రముఖ టెక్ గమ్యస్థానంగా హైదరాబాద్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని అంచనా.2007 నుండి హెచ్‌సీఎల్ టెక్ సంస్థకు హైదరాబాద్ వ్యూహాత్మక ప్రదేశంగా ఉంది. నగరంలో ఈ సంస్థకు 10,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. కొత్త కేంద్రం గ్లోబల్ కెపాసిటీ సెంటర్లకు మద్దతు ఇస్తుంది. ఫైనాన్స్, మాన్యుఫాక్చరింగ్, హెల్త్‌కేర్ వంటి రంగాలలో అధునాతన పరిష్కారాలను అందిస్తుంది.గ్లోబల్ ఏఐ హబ్ గా తెలంగాణట్రిలియన్ డాలర్ల ఎకానమీగా, గ్లోబల్ ఏఐ హబ్ గా తెలంగాణ శరవేగంగా రూపాంతరం చెందుతోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కిల్డ్ వర్క్ ఫోర్స్ పట్ల రాష్ట్రానికి ఉన్న నిబద్ధతను ఆయన నొక్కి చెప్పారు. తెలంగాణ 2.0 గ్రోత్ విజన్ ద్వారా వృద్ధిని వేగవంతం చేయడానికి రాష్ట్రం కట్టుబడి ఉందని రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు పునరుద్ఘాటించారు.హెచ్ సీఎల్ టెక్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ సి.విజయకుమార్ కొత్త కేంద్రంపై హర్షం వ్యక్తం చేస్తూ.. ‘కృత్రిమ మేధ నేతృత్వంలోని సాంకేతిక పరిజ్ఞానంలో ఉత్తేజకరమైన దశలో మనం ఉన్నాం. మా క్లయింట్లకు ఈ పరిష్కారాలను అందించడానికి మా గ్లోబల్ నెట్‌వర్క్‌లో హైదరాబాద్ ఒక వ్యూహాత్మక స్థానం. ఇక్కడి గ్లోబల్ కెపాసిటీ సెంటర్ల పురోగతికి కృషి చేస్తాం’ అన్నారు. -
ఎంతగానో ఆకట్టుకుంది: ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్
కోల్‌కతా నుంచి చెన్నైకి కేవలం మూడు గంటల్లో ప్రయాణించడం సాధ్యమేనా అని కొందరు అనుకోవచ్చు. కానీ ఇది త్వరలోనే సాధ్యమవుతుంది. చెన్నైకి చెందిన స్టార్టప్ కంపెనీ 'వాటర్ ఫ్లై టెక్నాలజీస్' తయారు చేసిన ఈ-ఫ్లైయింగ్ బోట్ ద్వారా ఇది సాకారమవుతుంది. ఐఐటీ మద్రాస్ సాయంతో ఈ సంస్థ తయారు చేసిన వింగ్-ఇన్-గ్రౌండ్ (విగ్) (wing-in-ground (WIG)) క్రాఫ్ట్ ద్వారా కోల్‌కతా నుంచి చెన్నైకి కేవలం మూడు గంటల్లో ప్రయాణించవచ్చని.. నిర్వాహకులు చెబుతున్నారు. ఇది ఆనంద్ మహీంద్రాను సైతం ఫిదా చేసింది.స్టార్టప్‌లను పెంచడంలో సిలికాన్ వ్యాలీకి పోటీగా నిలుస్తామని ఐఐటీ మద్రాస్ హామీ ఇచ్చింది. దాదాపు ప్రతి వారం కొత్త 'టెక్ వెంచర్'లకు సంబంధించిన వార్తలు వస్తూనే ఉంటాయి. అందులో వింగ్-ఇన్-గ్రౌండ్ (విగ్) క్రాఫ్ట్ నన్ను ఎంతగానో ఆకట్టుకుందని 'ఆనంద్ మహీంద్రా' ట్వీట్ చేశారు.బెంగళూరులోని ఏరో ఇండియా 2025లో వింగ్-ఇన్-గ్రౌండ్ (విగ్)ను ఆవిష్కరించారు. ఇది కేవలం రూ.600 ఖర్చుతో మూడు గంటల్లో చెన్నై- కోల్‌కతా మధ్య ప్రయాణం చేస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఇది ప్రజల దృష్టిని కూడా ఎంతగానో ఆకర్శించింది.వింగ్-ఇన్-గ్రౌండ్ (విగ్)ఈ-ఫ్లయింగ్ బోట్ ‘విగ్ క్రాఫ్ట్ గ్రౌండ్ ఎఫెక్ట్’ అనే సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. నీటి నుంచి సుమారు నాలుగు మీటర్ల ఎత్తులో ఇది ఎగురుతుంది. ఇది గాల్లో నిలకడగా ఎగురుతూనే నిర్దిష్ట వేగంతో ప్రయాణిస్తుందని కంపెనీ అధికారులు తెలిపారు. ఈ ఫ్లయింగ్ బోట్ విగ్ క్రాఫ్ట్ పూర్తిస్తాయిలో అందుబాటులోకి వస్తే చెన్నై నుంచి కోల్‌కతాకు 1,600 కిలోమీటర్లు ప్రయాణానికి సీటుకు కేవలం రూ.600 ఖర్చు అవుతుందని అంటున్నారు.IIT Madras promises to rival silicon valley in terms of nurturing startups…!Almost every week there’s news of a new ‘TechVenture’What I like about this one is not just the promise of exploitation of our vast waterways, but the fact that the design of the craft is stunning!… https://t.co/UttbRFYQGW— anand mahindra (@anandmahindra) February 25, 2025 -
రూ.40 లక్షల జాబ్.. రెజ్యూమ్ కూడా అవసరం లేదు!
ఈరోజుల్లో జాబ్ తెచ్చుకోవడం ఎంత కష్టమో చూస్తూనే ఉన్నాం. మంచి అకడమిక్ బ్యాక్ గ్రౌండ్ ఉండాలి. అంటే మంచి పేరున్న కాలేజీలో చదివుండాలి. ఎన్ని నైపుణ్యాలు ఉన్నా వాటిని రెజ్యూమ్‌లో ఆకట్టుకునేలా పేర్కొనకపోతే ఉద్యోగం కష్టమే. అయితే ఇవేవీ లేకుండా హై పేయింగ్ జాబ్ ఇస్తానంటున్నారు బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ ఫౌండర్.బెంగళూరులో జాబ్.. ఏడాదికి రూ. 40 లక్షల వేతనం.. వారానికి ఐదు రోజులు ఆఫీసు నుంచి పని.. మంచి కాలేజీ నుంచి రావాల్సిన అవసరం లేదు.. అనుభవం అక్కర్లేదు.. కనీసం రెజ్యూమ్‌తో కూడా పని లేదు. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదంటూ కంపెనీ ఫౌండర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో పెట్టిన పోస్ట్ ఆసక్తిని రేకెత్తించింది.బెంగళూరులోని ఇందిరానగర్‌లో తమ కార్యాలయానికి సున్నా నుంచి రెండేళ్ల వరకూ అనుభవం ఉన్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను నియమించుకోవాలని చూస్తున్నట్లు ‘స్మాలెస్ట్ ఏఐ’ కంపెనీ అధినేత సుదర్శన్ కామత్ తెలిపారు. "‘స్మాలెస్ట్ ఏఐ’ కంపెనీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో క్రాక్డ్ ఫుల్ స్టాక్ ఇంజనీర్ ను నియమించాలని చూస్తున్నాం. మిమ్మల్ని పరిచయం చేసుకుంటూ ఒక చిన్న 100 పదాల టెక్స్ట్ పంపండి చాలు" అంటూ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. "మీది ఏ కాలేజీ అనేది ముఖ్యం కాదు".. "రెజ్యూమ్ అవసరం లేదు" అంటూ పేర్కొన్నారు.ఇక్కడ "క్రాక్డ్ ఇంజనీర్స్" అనేది నూతన మార్పులకు, కొత్త ఆలోచనలకు భయపడని అత్యంత సమర్థనీయులైన, ప్రతిభావంతులైన సాఫ్ట్వేర్ ఇంజనీర్లని వర్ణించడానికి ఉపయోగించే పదం. ఈ పోస్ట్ షేర్ చేసిన కొన్ని గంటల్లోనే వైరల్ గా మారింది. ఆకట్టుకునే రెజ్యూమె కంటే నైపుణ్యాలకు కామత్ ప్రాధాన్యత ఇచ్చారని పలువురు ఎక్స్ యూజర్లు ప్రశంసించారు. అయితే క్రాక్డ్ ఇంజనీర్ కు ఈ జీతం చాలా తక్కువ అని మరికొందరు వ్యాఖ్యానించారు.We are looking to hire a cracked full-stack engineer at @smallest_AI Salary CTC - 40 LPASalary Base - 15-25 LPASalary ESOPs - 10-15 LPAJoining - ImmediateLocation - Bangalore (Indiranagar)Experience - 0-2 yearsWork from Office - 5 days a weekCollege - Does not matter…— Sudarshan Kamath (@kamath_sutra) February 24, 2025 -
పీసీలకు ఫుల్ డిమాండ్
న్యూఢిల్లీ: పర్సనల్ కంప్యూటర్ల (పీసీ)కు 2024లోనూ బలమైన డిమాండ్ కొనసాగింది. వీటి షిప్మెంట్ (మార్కెట్‌కు రవాణా) 3.8 శాతం మేర పెరిగింది. మొత్తం 14.4 మిలియన్ యూనిట్ల పీసీల రవాణా జరిగినట్టు మార్కెట్ పరిశోధనా సంస్థ ఐడీసీ ప్రకటించింది. గేమింగ్, ఏఐ ఆధారిత పీసీలకు అధిక డిమాండ్ నెలకొన్నట్టు తెలిపింది. 2025లో పీసీ మార్కెట్ తక్కువ స్థాయి సింగిల్ డిజిట్ వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉందని ఐడీసీ అంచనా వేసింది. ఈ మేరకు త్రైమాసిక వారీ పీసీ డివైజ్ ట్రాక్ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ‘‘రూపాయి బలహీనపడడం పీసీల ధరలు పెరగడానికి దారితీసింది. ఇది చిన్న, మధ్యస్థాయి వ్యాపార సంస్థలతోపాటు, వినియోగ విభాగంపై ప్రభావం చూపించింది’’అని ఐడీసీ ఇండియా, దక్షిణాసియా అసోసియేస్ వైస్ ప్రెసిడెంట్ (డివైజెస్ రీసెర్చ్) నవకేందర్ సింగ్ ప్రకటించారు. అగ్రస్థానంలో హెచ్‌పీ ⇒ హెచ్‌పీ గతేడాది 30.1 శాతం పీసీల రవాణాతో (మార్కెట్‌కు) అగ్రస్థానంలో నిలిచింది. గతేడాది డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో ఈ సంస్థ మార్కెట్ వాటా 30 శాతంగా నమోదైంది. వార్షికంగా చూస్తే 1 శాతం, త్రైమాసికం వారీగా చూస్తే 1.8 శాతం చొప్పున రవాణా తగ్గింది. ⇒ లెనోవో సంస్థ 17.2 శాతం పీసీలను రవాణా చేసింది. అంతకుముందు ఏడాదితో పోలి్చతే 7.3 శాతం వృద్ధిని నమోదు చేసింది. ⇒ డెల్ 16.1 శాతంతో తర్వాతి స్థానంలో ఉంది. 8.1 శాతం వృద్ధిని చూపించింది. . ⇒ ప్రీమియం నోట్‌బుక్‌ల షిప్మెంట్ (1,000 డా లర్లకు పైన ధరలోనివి) గతేడాది 13.8% పెరిగింది. ⇒ అంతర్జాతీయ సంస్థలు, ప్రభుత్వ విభాగాల నుంచి పీసీలకు డిమాండ్ 10.6% మేర పెరిగింది. ⇒ 2024 చివరి మూడు నెలల కాలంలో (అక్టోబర్–డిసెంబర్) మొత్తం పీసీల మార్కెట్ 6.9 శాతం, నోట్‌బుక్ విభాగం 9.6 శాతం మేర వృద్ధి చెందాయి. ⇒ తైవాన్ కంపెనీ ఏసర్ 2024లో 27.7 శాతం మేర షిప్మెంట్లో వృద్ధిని చూపించింది. 15.1 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది. ⇒ ఆసుస్ 38.4 శాతం వృద్ధిని డిసెంబర్ త్రైమాసికంలో సాధించింది. అదే కాలంలో లెనోవో 13.5 శాతం అధికంగా షిప్మెంట్ చేసి 18.5 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. ⇒ డెల్ సంస్థ డిసెంబర్ త్రైమాసికంలో 18.1 శాతం మార్కెట్ వాటా కలిగి ఉంది. 5.8 శాతం వృద్ధిని చూపించింది. ఏసర్ కూడా డిసెంబర్ క్వార్టర్లో 20% వృద్ధిని నమోదు చేసి, 15.7 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది. వర్క్స్టేషన్లకు మరింత డిమాండ్. ‘‘సంప్రదాయ పీసీ మార్కెట్ (డెస్క్ టాప్‌లు, నోట్బుక్లు, వర్క్స్టేషన్లు) 2024లో 14.4 మిలియన్ యూనిట్లను షిప్మెంట్ చేసింది. వార్షికంగా 3.8 శాతం వృద్ధి నమోదైంది. విభాగాల వారీగా చూస్తే నోట్‌బుక్‌ల షిప్మెంట్ 4.5 శాతం మేర, డెస్క్ టాప్ల షిప్మెంట్ 1.8 శాతం మేర అధికంగా జరిగాయి. వర్క్స్టేషన్ల షిప్మెంట్ రికార్డు స్థాయిలో 10.9 శాతం పెరిగింది. నోట్‌బుక్‌లకు డిమాండ్ బలంగా ఉంది. వాణిజ్య పీసీ మార్కెట్ సైతం తాజా ఆర్డర్లతో పుంజుకుంది’’అని ఐడీసీ నివేదిక వెల్లడించింది. -
శామ్సంగ్ ట్రై ఫోల్డ్ ఫోన్: వివరాలు లీక్..
ఇప్పటి వరకు ఫోల్డబుల్ ఫోన్స్ వచ్చాయి. ఇకపై ట్రై-ఫోల్డ్ ఫోన్లు మార్కెట్లోకి రానున్నాయి. శామ్సంగ్ కంపెనీ ఈ రకమైన ఫోన్లను లాంచ్ చేయడానికి సిద్ధమైంది. సంస్థ దీనికి 'గెలాక్సీ జీ ఫోల్డ్' అని పేరు పెట్టనున్నట్లు సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.ఇప్పటి వరకు గ్లోబల్ మార్కెట్లో ఉన్న ఒకే ఒక్క ట్రై-ఫోల్డ్ ఫోన్ 'హువావే మేట్ ఎక్స్‌టి'. కాగా దీనికి శామ్సంగ్ గెలాక్సీ జీ ఫోల్డ్ ప్రత్యర్థిగా నిలువనుంది. దీనిని కంపెనీ ఏప్రిల్ 2025లో లాంచ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇది శామ్సంగ్ జెడ్ ఫోల్డ్ 7, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7లతో పాటు గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్లో లాంచ్ అవుతుందని చెబుతున్నారు.కొత్త శామ్సంగ్ గెలాక్సీ జి ఫోల్డ్ మొబైల్.. హువావే మేట్ XT కంటే భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.49 ఇంచెస్ కవర్ డిస్ప్లే, 9.96 ఇంచెస్ మెయిన్ ఫోల్డబుల్ డిస్ప్లే ఉండవచ్చు. ఈ కొలతలు మేట్ ఎక్స్‌టి కంటే చాలా భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే ఇది పరిమాణంలో కొంచెం పెద్దది. లాంచ్ అయినప్పటికీ, గెలాక్సీ జి ఫోల్డ్ లాంచ్ అయిన వెంటనే అమ్మకానికి రాకపోవచ్చు. గెలాక్సీ ఫోల్డ్ స్పెషల్ ఎడిషన్‌గా మాత్రమే పరిమిత సంఖ్యలో మాత్రమే లభించే అవకాశం ఉంది.శామ్సంగ్ ఈ గెలాక్సీ జి ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ కోసం ఎస్ పెన్ అందించనుంది. పెరుగుతున్న ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌తో పోటీ పడటానికి శామ్సంగ్ ఈ ఫోన్ తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫోన్ ధరలు, లాంచ్ డేట్ వివరాలు వంటివి అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.ఇదీ చదవండి: పెళ్లి చేసుకుంటారా?.. ఉద్యోగం వదులుకుంటారా?: కంపెనీ వార్నింగ్ -
అనుకున్నదానికంటే.. అద్భుతం: చాట్‌జీపీటీ రెజ్యూమె
అన్ని రంగాల్లోనూ చాట్‌జీపీటీ హవా కొనసాగుతోంది. ఏ ప్రశ్నకైనా తనదైన రీతిలో సమాధానం చెప్పే చాట్‌బాట్.. ఉద్యోగానికి అవసరమైన రెజ్యూమె (Resume) కూడా రూపొందింస్తుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న రెజ్యూమెతో లెక్కలేనన్ని ఇంటర్వ్యూ కాల్స్ వస్తున్నాయని ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట్లో వైరల్ అవుతోంది.ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి నేను చాట్‌జీపీటీని ఉపయోగించాను. నేను ఎలాంటి ఉద్యోగానికి అప్లై చేయాలనుకుంటున్నానో.. దానికి సరిపోయేలా చాట్‌జీపీటీ ద్వారా ఒక రెజ్యూమె రూపొందించుకున్నాను. మొత్తం మీద ఇంటర్వ్యూ చేసేవారిని ఆకట్టుకునేలా డిజైన్ చేసుకున్నాను. ఇది నేను అనుకున్న దాని కంటే చాలా అద్భుతంగా ఉంది.నా రెజ్యూమె చూసి.. చాలా ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూ కాల్స్ వస్తున్నాయి. నిజం చెప్పాలంటే నా స్థాయికంటే ఎక్కువ ఉద్యోగాలకు సంబంధించిన కాల్స్ వచ్చాయి. అయితే వచ్చిన సమస్య ఏమిటంటే.. నేను ఇంటర్వ్యూ అంటే భయపడతాను. అయితే ఇప్పుడు గందరగోళానికి గురయ్యాను అని పోస్టులో పేర్కొన్నాడు.ప్రస్తుతం ఈ పోస్టుపై పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. నేను కూడా చాట్‌జీపీటీ సాయంతో రెజ్యూమె క్రియేట్ చేసుకున్నాను అని ఒక వ్యక్తి అన్నారు. చాట్‌జీపీటీని మాత్రమే ఉపయోగించి ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడం సాధ్యం కాదని నేను అనుకుంటున్నానని మరొక వ్యక్తి అన్నారు. అవసరమైన సమాచారం కోసం చాట్‌జీపీటీ చాలా ఉపయోగపడుతుందని మూడో వ్యక్తి అన్నారు. -
జీమెయిల్ లాగిన్ విధానంలో మార్పు!
వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ (ట్విటర్) వంటి వాటిలో ఫీచర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు తాజాగా గూగుల్ 'జీమెయిల్' కోసం ఓ అప్డేట్ తీసుకొచ్చింది. యూజర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ అప్డేట్ చేసింది. ఇంతకీ ఆ అప్డేట్ ఏంటి? దీనివల్ల ఉపయోగాలేంటి? అనే వివరాలు.. ఈ కథనంలో చూసేద్దాం.ఇప్పటి వరకు జీమెయిల్ లాగిన అయ్యే సమయంలో.. వినియోగదారు గుర్తింపును ధృవీకరించడానికి గూగుల్ ఆరు అంకెల అథెంటికేషన్ కోడ్లను ఎస్ఎమ్ఎస్ రూపంలో రిజిస్టర్ మొబైల్ నెంబరుకు పంపించేది. కానీ త్వరలో ఈ విధానానికి గూగుల్ స్వస్తి పలకనుంది. దీనికి బదులుగా క్యూఆర్ కోడ్‌ను తీసుకురానుంది. దీనిని వినియోగదారులు వివరాలను మరింత భద్రంగా ఉంచడానికి ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.క్యూఆర్ కోడ్ విధానం అమలులోకి వచ్చిన తరువాత.. మీకు ఆరు అంకెల అథెంటికేషన్ కోడ్ స్థానంలో క్యూఆర్ కోడ్ వస్తుంది. కాబట్టి మీరు మీ ఫోన్ కెమెరాతో ఆ కోడ్ స్కాన్ చేస్తే సరిపోతుంది. దీనివల్ల ఎస్ఎమ్ఎస్ ఆధారిత మోసాలు తగ్గుతాయి. సైబర్ నేరగాళ్లు పెరిగిపోతున్న తరుణంలో గూగుల్ ఈ నిరన్యం తీసుకుంది.జీమెయిల్ లాగిన్ విధానంలో మార్పు క్యూఆర్ కోడ్ రూపంలో వస్తుందని మాత్రం చెబుతున్నారు. కానీ ఇది ఎప్పుడు అమలులోకి వస్తుందనే వివరాలు మాత్రం అధికారికంగా వెల్లడికాలేదు. బహుశా వీలైనంత త్వరగానే ఈ అప్డేట్ రావొచ్చని సమాచారం.ఇదీ చదవండి: రోజుకు రూ.27 కోట్లు విరాళం ఇచ్చిన వ్యక్తి.. ఈయన గురించి తెలుసా? -
ఏప్రిల్ 1 నుంచి సిమ్ కార్డ్ కొనుగోలు నిబంధనల్లో మార్పులు
సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో వీటిని అరికట్టేందుకు భారతదేశం నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా సిమ్ కార్డుల అమ్మకాలపై కఠిన నిబంధనలను అమలు చేయాలని చూస్తోంది. ఏప్రిల్ 1, 2025 నుంచి సిమ్ కార్డుల భద్రతను పెంచుతూ, వాటి దుర్వినియోగాన్ని కట్టడి చేసి మోసపూరిత కార్యకలాపాలను నిరోధించడం లక్ష్యంగా కొత్త నిబంధనలు అమల్లోకి తేనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన వివరాలను టెలికాం ఆపరేటర్లకు అందించింది.సిమ్ కార్డు అమ్మకందారులకు కఠిన నిబంధనలుభారత ప్రభుత్వం అన్ని టెలికాం ఆపరేటర్లకు సిమ్ కార్డులు విక్రయించే వ్యక్తుల వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలని ఆదేశించింది. టెలికాం ఆపరేటర్ల సిమ్ కార్డు అమ్మకందారులు మార్చి 31, 2025 లోగా రిజిస్టర్ అయ్యేలా చర్యలు చేపట్టాలి. ఈ నిబంధనను పాటించడంలో విఫలమైతే ఏప్రిల్ 1, 2025 నుంచి సిమ్ కార్డుల అమ్మకాలపై నిషేధం వర్తిస్తుంది.కీలక మార్పులుసిమ్ కార్డు అమ్మకందారుల రిజిస్ట్రేషన్: రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్టెల్ వంటి ప్రధాన సంస్థలతో సహా అన్ని టెలికాం ఆపరేటర్లు తమ ఏజెంట్లు, ఫ్రాంచైజీలు, సిమ్ కార్డ్ డిస్ట్రిబ్యూటర్లను తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలి. ఇది సిమ్ జారీ ప్రక్రియలో పారదర్శకతను, భద్రతను పెంచుతుందని ప్రభుతం భావిస్తుంది.గడువు: రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి టెలికాం ఆపరేటర్లకు తగినంత సమయం ఇస్తూ ప్రభుత్వం గడువును 2025 మార్చి 31 వరకు పొడిగించింది. అయితే ఈ ప్రక్రియలో విఫలమైతే ఏ ఆపరేటర్ అయినా ఏప్రిల్ 1, 2025 నుంచి సిమ్ కార్డులను విక్రయించకుండా నిషేధానికి గురవుతారు.సిమ్ కార్డుల పరిమితి: కొత్త నిబంధనల ప్రకారం వినియోగదారులు తమ పేరుతో అనుమతించిన తొమ్మిది సిమ్ కార్డుల కంటే ఎక్కువ రిజిస్టర్ చేసిన సిమ్‌లు ఉంటే దానికి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.ఇదీ చదవండి: పెరిగిన బంగారం ధర! తులం ఎంతంటే..మార్పులకు కారణం..సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతుండటంతో సిమ్ కార్డుల అమ్మకాలపై నిబంధనలను కఠినతరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నమోదు కాని సిమ్ కార్డులను సైబర్ నేరగాళ్లు మోసపూరిత కార్యకలాపాలను అమలు చేయడానికి ఉపయోగిస్తారు. ఇటువంటి సంఘటనలను గుర్తించడం, వాటిని దర్యాప్తు చేయడం సవాలుగా మారుతుంది. సిమ్ కార్డ్ అమ్మకందారులందరూ రిజిస్టర్ చేసుకోవడం ద్వారా మరింత సురక్షితమైన డిజిటల్ వాతావరణాన్ని సృష్టించడం సాధ్యం అవుతుంది. -
టెక్ @300 బిలియన్ డాలర్లు
ముంబై: దేశీ టెక్నాలజీ రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5.1 శాతం వృద్ధితో సుమారు 283 బిలియన్ డాలర్లకు చేరనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం ఇది 300 బిలియన్ డాలర్లకు చేరుతుందనే అంచనాలు నెలకొన్నాయి. దేశీయ ఐటీ సేవలు, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ కంపెనీలు మొదలైన సంస్థల సమాఖ్య నాస్కామ్ ఈ విషయాలు వెల్లడించింది. ఆదాయ వృద్ధి సరైన దిశలోనే ఉందని నాస్కామ్ ప్రెసిడెంట్ రాజేశ్ నంబియార్ తెలిపారు. పరిశ్రమ 2023–24లో 4 శాతంగా, 2024–25లో 5.1 శాతంగా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6.1 శాతంగాను వృద్ధి చెందగలదని చెప్పారు. చుట్టూరా భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా టారిఫ్‌ల వడ్డన వంటి ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న తరుణంలోనూ పరిశ్రమ మెరుగ్గా రాణిస్తోందని వివరించారు. 2025 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 1.26 లక్షల ఉద్యోగాల కల్పనతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 58 లక్షలకు చేరిందని, తదుపరి ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే స్థాయిలో నియామకాలు ఉండవచ్చని అంచనా వేస్తున్నామని నంబియార్ వివరించారు. ఐటీ ఆదాయం 4.3 శాతం అప్.. 2025 ఆర్థిక సంవత్సరంలో ఆదాయాలను విభాగాలవారీగా చూస్తే ఐటీ సేవల కంపెనీల ఆదాయాలు 4.3 శాతం వృద్ధితో 137.1 బిలియన్ డాలర్లకు, బీపీఎం పరిశ్రమ 4.7 శాతం వృద్ధితో 55.6 బిలియన్ డాలర్లకు చేరొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఇక ఇంజినీరింగ్ రీసెర్చ్, డెవలప్మెంట్ రంగం అత్యంత వేగంగా 7 శాతం స్థాయిలో పెరిగి 55.6 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అనూహ్యంగా అమెరికా.. దేశీ ఐటీ రంగానికి అమెరికాలో పరిస్థితులు అనూహ్యంగా ఉండొచ్చని నంబియార్ చెప్పారు. భారత ఐటీ పరిశ్రమ ఆదాయాల్లో అమెరికా వాటా 60–62 శాతం ఉంటుంది కాబట్టి, టారిఫ్‌ల బెదిరింపులనేవి పరిశ్రమకు అతి పెద్ద ముప్పని ఆయన పేర్కొన్నారు. నాస్కామ్ వార్షిక ఎన్టీఎల్ఎఫ్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా నంబియార్ ఈ విషయాలు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల గురించి భారతీయ ఐటీ రంగం ఆందోళన చెందనక్కర్లేదని ఇన్ఫోసిస్ సీఈవో సలిల్ పరేఖ్ చెప్పారు. ఒకవేళ ట్రంప్ ప్రభుత్వం తీసుకునే చర్యలతో అమెరికన్ కంపెనీలు లాభపడితే, క్లయింట్లు బలోపేతం కావడం వల్ల భారతీయ ఐటీ కంపెనీలకు కూడా లబ్ధి చేకూరుతుందని వివరించారు. అమెరికాలోని సిబ్బంది సంఖ్యలో స్థానిక ఉద్యోగుల సంఖ్యను 60 శాతానికి పెంచుకోవడంలాంటి చర్యలతో గత కొన్నాళ్లుగా అమెరికాలో వ్యాపారాన్ని బలోపేతం చేసుకున్న నేపథ్యంలో హెచ్–1బీ వీసాలపై ఆధారపడే పరిస్థితి తగ్గిందని పరేఖ్ తెలిపారు. -
బిజినెస్ మెసేజ్..టెల్కోలకు భలే ఛాన్స్!
మీకు అతి తక్కువ వడ్డీ రేటుకే ప్రీ–అప్రూవ్డ్ పర్సనల్ లోన్ ఆఫర్. ఇప్పుడే దరఖాస్తు చేయండి.. మా ప్రోడక్టులపై 80 శాతం వరకు భారీ డిస్కౌంట్ ఆఫర్ నడుస్తోంది. వెంటనే షాపింగ్ చేసి, పండుగ చేస్కోండి.. గేమ్ స్టార్ట్ చేసేందుకు రూ. 3,000 స్పెషల్ క్యాష్‌బ్యాక్ కూపన్ రెడీగా ఉంది. యాప్ డౌన్లోడ్ చేసి, ఆటాడుకోండి.. ఫోన్లో.. వాట్సాప్‌లో ఈ మధ్య పోలోమంటూ వస్తున్న ఇలాంటి మెసేజ్‌లను గమనిస్తున్నారా? కంపెనీలు తమ ప్రొడక్టులు, సర్వీసులను నేరుగా కస్టమర్ల చెంతకు తీసుకెళ్లేందుకు ఈ కొత్త మార్కెటింగ్ రూట్‌ను ఎంచుకుంటున్నాయి. మనక్కూడా వీటి వల్ల కొన్నిసార్లు ఉపయోగం ఉన్నప్పటికీ.. పదేపదే వచ్చే ఇలాంటి అనవసర మెసేజ్‌లతో ఒక్కోసారి విసుక్కోవడం కూడా కామన్‌గా మారింది. అయితే, టెలికం కంపెనీలకు మాత్రం ఇవి కాసులు కురిపిస్తున్నాయి. దీంతో ఎంటర్ప్రైజ్ లేదా బిజినెస్ మెసేజింగ్.. టెల్కోలకు సరికొత్త ఆదాయ వనరుగా నిలుస్తోంది.వినియోగదారులతో మరింత బాగా మమేకం అయ్యేందుకు కంపెనీలు ఇప్పుడు సంప్రదాయ టెక్ట్స్ మెసేజ్‌ల స్థానంలో రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ (ఆర్సీఎస్) బాట పట్టాయి. దేశంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం దూసుకెళ్తుండటం.. వాట్సాప్ వాడుతున్న వారు కోట్లలో ఉండడంతో బిజినెస్ మెసేజింగ్ టెల్కోలను ఊరిస్తోంది. ప్రస్తుతం ఈ మార్కెట్లో వొడాఫోన్ ఐడియా (వీఐ), రిలయన్స్ జియో హవా నడుస్తోంది. త్వరలోనే భారతీ ఎయిర్టెల్ కూడా బరిలోకి దూకే సన్నాహాల్లో ఉంది. దీంతో మార్కెట్ వాటాను కొల్లగొట్టేందుకు టెలికం ఆపరేటర్ల మధ్య పోటీ పెరిగి, టారిఫ్ వార్‌కు తెరతీయనుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. గూగుల్, వాట్సాప్ ద్వారా... ఆర్సీఎస్ బిజినెస్ మెసేజింగ్ (ఆర్బీఎం) ద్వారా తమ బ్రాండింగ్, మార్కెటింగ్ మెసేజ్‌లను పేంపేందుకు, అలాగే చాట్‌బాట్ తరహాలో కస్టమర్లతో ఇంటరాక్ట్ అయ్యేందుకు టెల్కోల విస్తృత నెట్వర్క్ వీలు కల్పిస్తోంది. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో సాధారణ ఎస్ఎంఎస్ చాట్ స్థానంలో గూగుల్ ఈ ఆర్‌సీఎస్‌ను ప్రమోట్ చేస్తోంది. ఇక వాట్సాప్ బిజినెస్ మెసేజింగ్ సర్వీస్ దీనికి తీవ్ర పోటీ ఇస్తోంది. ఆర్సీఎస్ మార్కెటింగ్ మెసేజ్‌లను పంపడం ద్వారా కస్టమర్లకు చేరువ కావాలనుకునే కంపెనీలకు అగ్రిగేటర్లు దన్నుగా నిలుస్తున్నారు. డాట్గో, రూట్ మొబైల్, సించ్, ఇన్ఫోబిప్ వంటి కమ్యూనికేషన్స్ ప్లాట్‌ఫామ్ యాజ్ ఎ సర్వీస్ (సీపాస్) ప్రొవైడర్లు ఆర్‌సీఎస్‌కు కావలసిన సాంకేతిక సహకారం, సేవలు అందిస్తున్నాయి. అంటే జియో, వీఐ నెట్వర్క్ ద్వారా కస్టమర్లకు వివిధ కంపెనీల బ్రాండ్, మార్కెటింగ్ మెసేజ్‌లను చేరవేస్తున్నాయి. బేసిక్ టెక్ట్స్ ఆర్సీఎస్ మెసేజ్‌లకు కంపెనీల నుంచి టెల్కోలు 15 పైసలు చొప్పున వసూలు చేస్తుండగా.. షాపింగ్, యాప్ డౌన్లోడ్స్, లోన్ దరఖాస్తులకు వీలు కల్పించే ఇంటరాక్టివ్ మెసేజ్‌లకు 35 పైసల దాకా చార్జీ విధిస్తున్నాయి. వీటి ప్రత్యేకతేంటి? సాధారణ టెక్ట్స్ మెసేజ్‌లతో పోలిస్తే, ఆర్‌సీఎస్‌లు చాలా భిన్నం. కస్టమర్లు తమ మెసేజ్‌లను తెరిచారా లేదా.. తెరిచిన తర్వాత ఎలా స్పందించారు వంటివన్నీ బ్రాండ్ తెలుసుకునేందుకు ఆర్‌సీఎస్‌లు వీలు కల్పిస్తాయి. ఆర్సీఎస్ల డెలివరీ రేట్ మన దేశంలో 98% ఉందని, చదివే శాతం 40% కాగా, రెస్పాన్స్ రేట్ 6% ఉన్నట్లు అంచనా. వీటిపై వెచి్చంచే వ్యయంతో పోలిస్తే ఫలితాలు మెరుగ్గా ఉండటంతో కంపెనీలు ఆర్సీఎస్ పట్ల ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి. ఆర్బీఎం సర్వీస్‌లో వీఐ ముందంజలో ఉంది. పరిశ్రమ వర్గాల సమాచారం మేరకు నెలకు 100 కోట్ల ఆర్సీఎస్ మెసేజ్‌లను వీఐ ఆపరేట్ చేస్తోంది. ఆర్నెల్ల క్రితం ఈ సర్వీసులను ప్రారంభించిన జియో కూడా జోరు పెంచింది. ఎయిర్టెల్ రంగంలోకి దూకితే పోటీ పెరిగి చార్జీలు తగ్గే అవకాశం ఉందని డాట్గో సీఈఓ ఇందర్‌పాల్ మమిక్ పేర్కొన్నారు. ఊరిస్తున్న మార్కెట్... దేశంలో మారుమూల పల్లెల్లో కూడా స్మార్ట్ ఫోన్ వాడకం శరవేగంగా దూసుకెళ్తోంది. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) తాజా గణాంకాల ప్రకారం భారత్‌లో 66 కోట్ల మందికి పైగా స్మార్ట్ ఫోన్ యూజర్లున్నారు. ఇందులో అత్యధికంగా ఆండ్రాయిడ్ ఫోన్లే. కాగా, స్మార్ట్ ఫోన్ల జోరుతో గత రెండేళ్లుగా ఆర్సీఎస్ మార్కెట్ గణనీయంగా వృద్ధి చెందిందని రూట్ మొబైల్ వైస్ ప్రెసిడెంట్ తుషార్ అగి్నహోత్రి చెప్పారు. 2023లో 1.3 బిలియన్ డాలర్లుగా ఉన్న భారత బిజినెస్ మెసేజింగ్ మార్కెట్ 2028 నాటికి 3.2 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని కన్సల్టెన్సీ సంస్థ గార్ట్నర్ లెక్కగట్టింది. ప్రస్తుతం యాపిల్ ఐఓఎస్‌లో ఆర్సీఎస్ మెసేజ్‌లకు సపోర్ట్ లేదని, అదికూడా అందుబాటులోకి వస్తే కంపెనీల మార్కెటింగ్ ఇంకా విస్తృతం అవుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.3.2 బిలియన్ డాలర్లు: 2028 నాటికి భారత్‌లో బిజినెస్ మెసేజింగ్ మార్కెట్ అంచనా. 2023లో ఇది 1.3 బిలియన్ డాలర్లుగా నమోదైంది. 100 కోట్లు: ప్రస్తుతం వొడాఫోన్ ఐడియా నెలకు ఆపరేట్ చేస్తున్న ఆర్సీఎస్ ఎస్ఎంఎస్ల సంఖ్య15 పైసలు: బేసిక్ టెక్ట్స్ ఆర్సీఎస్లకు కంపెనీల నుంచి టెల్కోలు వసూలు చేస్తున్న టారిఫ్. ఇంటరాక్టివ్ ఆర్సీఎస్ ఎస్ఎంఎస్లకు 35 పైసలు వరకు చార్జీ విధిస్తున్నారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
‘ఏఐ ఏమైనా చేయగలదు’: సత్య నాదెళ్ల వీడియోకి మస్క్ రిప్లై
ఏఐని ఎక్కువగా విశ్వసించే ఎలాన్ మస్క్ (Elon Musk).. ఈసారి వ్యవసాయ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పై విశ్వాసం వ్యక్తం చేశారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల (Satya Nadella) ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన వీడియోను టెస్లా, స్పేస్ఎక్స్ సీఈఓ రీషేర్ చేస్తూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాన్ని మరింత నొక్కిచెప్పారు. "కృత్రిమ మేధ ప్రతిదాన్ని మెరుగుపరుస్తుంది" అని పేర్కొన్నారు.రైతులు తక్కువ వనరుల వినియోగంతో ఉత్పాదకతను పెంచడానికి కృత్రిమ మేధ ఆధారిత పరిష్కారాలు ఎలా సహాయపడతాయో ఈ వీడియో చూపిస్తుంది. కృత్రిమ మేధ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానం ద్వారా గణనీయంగా ప్రయోజనం పొందిన భారతదేశంలోని బారామతి సహకార సంఘానికి చెందిన ఒక రైతు ఉదాహరణను సత్య నాదెళ్ల ఉదహరించారు.తక్కువ భూమి ఉన్న రైతులు పంట దిగుబడిలో గణనీయమైన మెరుగుదలను చూశారని, రసాయనాల వాడకం తగ్గిందని, నీటి నిర్వహణ మెరుగైందని చెప్పుకొచ్చారు. జియోస్పేషియల్ డేటా, డ్రోన్లు, ఉపగ్రహాల నుంచి ఉష్ణోగ్రత డేటా, రియల్ టైమ్ సాయిల్ అనాలిసిస్ ద్వారా ఈ సమాచారం మొత్తాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అనుసంధానం చేస్తుందని తెలిపారు. రైతులు వారి స్థానిక భాషలో ఈ సమాచారాన్ని పొందవచ్చు.రియల్ టైమ్ అగ్రికల్చర్ డేటాతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను మిళితం చేయడం ద్వారా రైతులు మరింత సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవచ్చని సత్య నాదెళ్ల పేర్కొన్నారు. ఇది సుస్థిర వ్యవసాయ పద్ధతులకు దారితీస్తుందని, సామర్థ్యాన్ని పెంచుతుందని వివరించారు.ఆ వీడియో ఇదే.. మీరూ చూసేయండి..A fantastic example of AI's impact on agriculture. pic.twitter.com/nY9o8hHmKJ— Satya Nadella (@satyanadella) February 24, 2025 -
ఎయిర్టెల్ కొత్త ఆఫర్.. ప్రముఖ ఓటీటీ ఫ్రీ
ఎయిర్టెల్ (Airtel) తమ కస్టమర్లకు కొత్త ఆఫర్ ప్రకటించింది. యాపిల్ టీవీ+, (Apple TV+) యాపిల్ మ్యూజిక్ (Apple Music) సేవలను అందించడానికి భారతీ ఎయిర్టెల్, యాపిల్ భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. రూ.999తో ప్రారంభమయ్యే ప్లాన్లపై హోమ్ వై-ఫై వినియోగదారులందరికీ యాపిల్ టీవీ + కంటెంట్ ఉచితంగా లభిస్తుందని ఎయిర్టెల్ ఒక ప్రకటనలో తెలిపింది.ఇదే కాకుండా రూ .999 నుండి ప్రారంభమయ్యే ప్లాన్లపై పోస్ట్‌పెయిడ్ యూజర్లు యాపిల్ టీవీ + సదుపాయాన్ని పొందవచ్చు. 6 నెలల పాటు యాపిల్ మ్యూజిక్‌ను ఉచితంగా ఆస్వాదించవచ్చు. ఇందులో భారతీయ సంగీతంతోపాటు విదేశీ మ్యూజిక్ లిస్టింగ్ కూడా ఉంటుంది. ఎలాంటి కస్టమర్లు ఈ ప్రయోజనాన్ని పొందబోతున్నారు.. ఇందు కోసం వారు ఏ రీఛార్జ్ ప్లాన్ ను ఎంచుకోవాలో తెలుసుకుందాం.యాపిల్ మ్యూజిక్ ఉచిత సబ్స్క్రిప్షన్ఈ భాగస్వామ్యం కింద వినియోగదారులు యాపిల్ టీవీ+లోని అన్ని ఒరిజినల్ సిరీస్‌లు, సినిమాలను ఎటువంటి ప్రకటనలు లేకుండా యాక్సెస్ చేయవచ్చు. వీటిలో టెడ్ లాస్సో, సెవెరెన్స్, ది మార్నింగ్ షో, స్లో హార్స్, సిలో, ష్రింకింగ్, డిస్క్లయిమర్ వంటి అవార్డ్ విన్నింగ్ హిట్ సిరీస్‌లు ఉన్నాయి. వీటితో పాటు వోల్ఫ్స్, ది గోర్జ్ వంటి కొత్త సినిమాలు కూడా ఉన్నాయి. ఇది కాకుండా వినియోగదారులకు 6 నెలల పాటు యాపిల్ మ్యూజిక్ సర్వీస్ కూడా ఉచితంగా లభిస్తుంది. యాపిల్ టీవీ+, యాపిల్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్ కోసం ప్రత్యేకంగా చెల్లించాల్సిన అవసరం లేదు.బెనిఫిట్స్ ఈ ప్లాన్లలో..రూ.1,099, రూ.1,599, రూ.3,999 ఎయిర్టెల్ వైఫై ప్లాన్లను ఎంచుకున్న వారికి వరుసగా 350కి పైగా టీవీ ఛానళ్లు, 200 ఎంబీపీఎస్, 300 ఎంబీపీఎస్, 1 జీబీపీఎస్ స్పీడ్ లభిస్తుంది. ఈ కొత్త ఆఫర్‌తో ఎయిర్టెల్ ఎంటర్టైన్మెంట్ పోర్ట్‌ఫోలియో మరింత బలంగా మారింది. ఇది ఇప్పటికే అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జీ5, జియో హాట్‌స్టార్‌తో భాగస్వామ్యం కలిగి ఉంది. దేశంలో డిజిటల్ కంటెంట్ అందించే పెద్ద సంస్థలలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. -
ఇన్ఫోసిస్ యూటర్న్..
ఉద్యోగుల తొలగింపులపై దేశీయ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ (Infosys) దూకుడు తగ్గించింది. ఉద్యోగులు నేర్చుకోవడానికి ఇంకా ఎక్కువ సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ తన రాబోయే ఉద్యోగుల మదింపులను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఈ నిర్ణయం సరికొత్త ఎత్తుగడ అని, ఇటీవలి తొలగింపుల (Layoff) నుండి దృష్టిని మరల్చడానికి కంపెనీ ప్రయత్నిస్తోందని ఎంప్లాయీ వెల్ఫేర్ గ్రూప్ నాజెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) ఆరోపించింది.తొలగింపుల నేపథ్యంఇన్ఫోసిస్ ఫిబ్రవరి 7న 700 మంది ఉద్యోగులను తొలగించింది. వీరిలో ప్రధానంగా 2022 ఇంజనీరింగ్ బ్యాచ్‌కు చెందిన ఫ్రెషర్స్ ఉన్నారు. వీరు ఇప్పటికే ఆన్‌బోర్డింగ్‌లో రెండు సంవత్సరాల ఆలస్యాన్ని ఎదుర్కొన్నారు. అంతర్గత మదింపుల ఆధారంగా ఈ తొలగింపులు జరిగినట్లు సమాచారం. అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడానికి సదరు ఉద్యోగులకు మూడు అవకాశాలు ఇచ్చినట్లు కంపెనీ చెబుతోంది. అయితే తొలగింపునకు గురైన ఉద్యోగులు దీనిని ఖండిస్తున్నారు. అసెస్ మెంట్ సిలబస్ ను మధ్యలోనే మార్చారని, ముందస్తు సమాచారం లేకుండానే చాలా మందికి తొలగింపు నోటీసులు వచ్చాయని ఆరోపిస్తున్నారు.ఎన్ఐటీఈఎస్ స్పందన..ఇన్ఫోసిస్ చర్యలను విమర్శిస్తూ, తొలగింపులు కార్మిక హక్కుల ఉల్లంఘనగా ఎన్ఐటీఈఎస్ అభివర్ణించింది.. తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరుతూ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. ఎన్ఐటీఈఎస్ అధ్యక్షుడు హర్‌ప్రీత్ సింగ్ సలూజా మాట్లాడుతూ, మదింపులను ఆలస్యం చేయాలని తీసుకున్న ఆకస్మిక నిర్ణయం తొలగింపులపై మరింత వివాదం కొనసాగకుండా కప్పిపుచ్చుకోవడానికేనని విమర్శించారు.ఇన్ఫోసిస్ సమర్థనఉద్యోగులకు అదనపు ప్రిపరేషన్ సమయాన్ని అందించడమే లక్ష్యంగా మదింపులను వాయిదా వేస్తున్నట్లు ఇన్ఫోసిస్ పేర్కొంది. కంపెనీ తమ అన్ని కార్యకలాపాలలో సమ్మతి, పారదర్శకతను పాటించడంలో తమ నిబద్ధతను నొక్కి చెప్పింది. ఇన్ఫోసిస్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ షాజీ మాథ్యూ మాట్లాడుతూ.. కంపెనీ కార్మిక శాఖతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని, వారి విచారణలకు సహకరిస్తూ అవసరమైన సమాచారాన్ని అందిస్తోందని తెలిపారు.ఉద్యోగులపై ప్రభావం..మదింపులను నిరవధికంగా వాయిదా వేయడం చాలా మంది ఉద్యోగులను వారి భవిష్యత్తుపై మరింత అనిశ్చితికి గురిచేసింది. ఆయా అంశాల్లో నిపుణులతో అదనపు శిక్షణ, ఇతర సహకారం అందిస్తామని కంపెనీ హామీ ఇచ్చినప్పటికీ, ఉద్యోగులకు మాత్రం ఆందోళన తొలగడం లేదు. ఉద్యోగుల తొలగింపు, మదింపుల వాయిదాతో తలెత్తిన వివాదం భారత ఐటీ రంగంలో ఉద్యోగ భద్రతపై దేశవ్యాప్తంగా చర్చలకు దారితీసింది. -
మా తప్పు వల్లే గూగుల్ సక్సెస్!
మైక్రోసాఫ్ట్ (Microsoft) సీఈఓ సత్య నాదెళ్ల తన అతిపెద్ద వృత్తిపరమైన పశ్చాత్తాపం గురించి ఇటీవల ఓపెన్ అయ్యారు. గూగుల్ (Google) విజయవంతంగా క్యాష్ చేసుకున్న వెబ్ సెర్చ్ మార్కెట్ ఆధిపత్యాన్ని అంచనా వేయడంలో విఫలమైనట్లు అంగీకరించారు. వెబ్ వికేంద్రీకృతంగా ఉంటుందని మైక్రోసాఫ్ట్ మొదట్లో భావించిందని, సెర్చ్ అత్యంత విలువైన వ్యాపార నమూనాగా మారుతుందని గ్రహించలేదని ఆయన అన్నారు.చేజారిన అవకాశం..వెబ్ మార్కెట్ వికేంద్రీకృతంగా ఉంటుందని మైక్రోసాఫ్ట్ మొదట్లో భావించిందని, కేవలం వెబ్ సెర్చ్ అంత పెద్ద బిజినెస్ మోడల్‌గా అంచనా వేయలేకపోయిందని సత్య నాదెళ్ల (Satya Nadella) అంగీకరించారు. ఈ పొరపాటు గూగుల్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి, సెర్చ్ చుట్టూ భారీ వ్యాపారాన్ని నిర్మించడానికి దారితీసిందని చెప్పుకొచ్చారు. "వెబ్ లో అతిపెద్ద వ్యాపార నమూనాగా మారిన దానిని మేము మిస్ అయ్యాము. ఎందుకంటే వెబ్ అంతటా విస్తృతమవుతుందని మేమంతా భావించాము" అని సత్య నాదెళ్ల పేర్కొన్నారు.గూగుల్ దూరదృష్టిసెర్చ్ ప్రాముఖ్యతను మైక్రోసాఫ్ట్ తక్కువగా అంచనా వేసినప్పటికీ, దాని సామర్థ్యాన్ని గూగుల్ గుర్తించింది. దూరదృష్టిని ప్రదర్శించింది. వ్యూహాన్ని లోపరహితంగా అమలు చేసింది. సెర్చ్ ద్వారా వెబ్ ను ఆర్గనైజ్ చేయడంలో విలువను చూసి గూగుల్ దాన్ని ఎలా క్యాపిటలైజ్ చేసిందో సత్య నాదెళ్ల వివరించారు. "వెబ్ ను ఆర్గనైజ్ చేయడంలో సెర్చ్ అతిపెద్ద విజేత అవుతుందని ఎవరు ఊహించి ఉంటారు? మేము స్పష్టంగా దానిని చూడలేదు, గూగుల్ దాన్ని చూసింది.. చాలా బాగా అమలు చేసింది" అని అంగీకరించారు.నేర్చుకున్న పాఠాలుసాంకేతిక మార్పులను అర్థం చేసుకుంటే సరిపోదని సత్య నాదెళ్ల ఉద్ఘాటించారు. విలువ సృష్టి ఎక్కడ జరుగుతుందో కంపెనీలు గుర్తించాలి. సాంకేతిక పురోగతిని కొనసాగించడం కంటే వ్యాపార నమూనాలలో మార్పులకు అనుగుణంగా మారడం చాలా సవాలుతో కూడుకున్నదని ఆయన పేర్కొన్నారు. ఈ బిజినెస్ మోడల్ మార్పులు టెక్ ట్రెండ్ మార్పుల కంటే కూడా కఠినంగా ఉంటాయని సత్య నాదెళ్ల పేర్కొన్నారు.ఈ అవకాశాన్ని కోల్పోయినప్పటికీ, సత్య నాదెళ్ల సీఈవోగా (CEO) బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి కృత్రిమ మేధస్సు, క్లౌడ్ కంప్యూటింగ్ పై బలమైన దృష్టితో మైక్రోసాఫ్ట్ ఎదుగుదలకు నాయకత్వం వహించారు. సాంకేతిక మార్పులకు అనుగుణంగా ముందుకు సాగేందుకు, టెక్ పరిశ్రమలో మైక్రోసాఫ్ట్ నూతన ఆవిష్కరణలు, నాయకత్వం వహించేలా కంపెనీని నడిపిస్తున్నారు.సన్ మైక్రోసిస్టమ్స్ లో పనిచేసిన తర్వాత 1992లో మైక్రోసాఫ్ట్ లో చేరిన సత్య నాదెళ్ల అనేక ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టారు. మంగళూరు విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ, విస్కాన్సిన్-మిల్వాకీ వర్సిటీ నుండి కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ, చికాగో విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ పట్టా పొందారు. -
బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్లు.. ఇక నో వ్యాలిడిటీ టెన్షన్!
ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) మరింత మంది కస్టమర్లను ఆకర్షించడానికి ఎప్పటికప్పుడు తన పోర్ట్‌ఫోలియోలో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను (prepaid plans) జోడిస్తోంది. ఈ క్రమంలోనే మూడు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొచ్చింది. ఇవి అపరిమిత కాలింగ్, రోజువారీ డేటా, ఎస్ఎంఎస్ ప్రయోజనాలతో పాటు దీర్ఘకాలిక వాలిడిటీతో వస్తాయి.150 రోజుల ప్లాన్బీఎస్ఎన్ఎల్ 150 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ ధర రూ .397. ఇది అపరిమిత కాలింగ్ 2 జీబీ రోజువారీ డేటా, 100 ఎస్ఎంఎస్లు అందిస్తుంది. అయితే ప్రయోజనాలన్నీ మొదటి 30 రోజులు మాత్రమే ఉంటాయి. మిగిలిన 120 రోజులకు నంబర్‌కు వ్యాలిడిటీ అందుబాటులో ఉంటుంది. కాలింగ్, డేటా ప్రయోజనాల కన్నా ఇన్ కమింగ్ కాల్స్, సిమ్ ను యాక్టివ్ గా ఉంచుకోవడం ముఖ్యం అనేకునేవారికి ఈ ప్లాన్ సరిపోతుంది.ఇదీ చదవండి: ఎయిర్టెల్ బెస్ట్ మంత్లీ రీఛార్జ్ ప్లాన్లు ఇవే..160 రోజుల ప్లాన్160 రోజుల వ్యాలిడిటీ ఉన్న ఈ ప్లాన్ ధర రూ.997. ఈ ప్లాన్ మొత్తం వ్యాలిడిటీ కాలానికి అపరిమిత కాలింగ్, 2 జీబీ రోజువారీ డేటా, 100 ఎస్ఎంఎస్ ప్రయోజనాలను అందిస్తుంది. కాలింగ్, డేటాతో లాంగ్ టర్మ్ వాలిడిటీ కోరుకునే యూజర్లకు ఈ ప్లాన్ మరింత అనుకూలంగా ఉంటుంది.180 రోజుల ప్లాన్ఇది ఆరు నెలల వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్. దీని ధర రూ .897. ఈ ప్లాన్ ద్వారా అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాలింగ్, 180 రోజుల పాటు 90 జీబీ మొత్తం డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. రోజువారీ కోటా గురించి ఆందోళన చెందకుండా ఒకేసారి ఎక్కువ డేటా కావాలనుకునే వినియోగదారులకు ఈ ప్లాన్ అనువైనది. -
చాట్‌జీపీటీని అందుకు వాడతారా?.. ఓపెన్ఏఐ సీరియస్
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ దిగ్గజం, చాట్‌జీపీటీ (ChatGPT) సృష్టికర్త ఓపెన్ ఏఐ (OpenAI) కీలక నిర్ణయం తీసుకుంది. తమ చాట్‌జీపీటీ సేవల్ని దుర్వినియోగం చేస్తున్న చైనాకు చెందిన పలు ఖాతాలను నిషేధించింది. తమ ఏఐ నమూనాల దుర్వినియోగాన్ని నిరోధించడానికి, అనధికార నిఘా, పర్యవేక్షణకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసుకున్న తమ విధానాలను అవరోధం కలగకుండా కొనసాగిస్తున్న ప్రయత్నాలలో భాగంగా ఓపెన్ఎఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.నిషేధానికి కారణాలివే..ఓపెన్ఏఐ విడుదల చేసిన థ్రెట్ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం.. నిషేధిత ఖాతాలను సోషల్ మీడియా వినికిడి సాధనం కోసం వివరణలను రూపొందించడం కోసం వినియోగించారు. పాశ్చాత్య దేశాల్లో చైనా వ్యతిరేక నిరసనలపై రియల్ టైమ్ రిపోర్టులను చైనా భద్రతా సంస్థలకు అందించడానికి ఈ టూల్ ను రూపొందించారు. యునైటెడ్ స్టేట్స్, జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్ వంటి దేశాలలో నిరసనలను పర్యవేక్షిస్తున్న చైనా రాయబార కార్యాలయాలు, ఇంటెలిజెన్స్ ఏజెంట్లకు తమ సంగ్రహణలను పంపినట్లు ఆధారాలను ప్రూఫ్ రీడ్ చేయడానికి ఈ ఖాతాల నిర్వాహకులు ఓపెన్ఎఐ నమూనాలను ఉపయోగించారు.విధానాల ఉల్లంఘనవ్యక్తుల కమ్యూనికేషన్ నిఘా లేదా అనధికారిక పర్యవేక్షణ కోసం తమ ఏఐ సాధనాన్ని ఉపయోగించడాన్ని ఓపెన్ఏఐ విధానాలు కఠినంగా నిషేధిస్తున్నాయి. వ్యక్తిగత స్వేచ్ఛ, హక్కులను అణచివేయడానికి ప్రయత్నించే ప్రభుత్వాలు, నియంతృత్వ పాలనల తరపున నిర్వహించే కార్యకలాపాలు ఇందులో ఉన్నాయి. నిఘా సాధనం కోసం కోడ్‌ను డీబగ్ చేయడానికి వినియోగదారులు ఓపెన్ఎఐ నమూనాలను కూడా ఉపయోగిస్తున్నారని దర్యాప్తులో తేలింది. అయితే ఈ సాధనం స్వయంగా నాన్-ఓపెన్ఎఐ మోడల్‌పై నడిచింది.ఇదీ చదవండి: ‘మస్క్, ట్రంప్ మరణ శిక్షకు అర్హులు’.. ఏఐ ఏదైనా ఇంతేనా?మరో ఘటనలో..చైనా అసమ్మతివాది కై జియాను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేయడానికి చాట్ జీపీటీని ఉపయోగించిన ఖాతాను కూడా ఓపెన్ ఏఐ నిషేధించింది. అదే సంస్థ స్పానిష్ లో యుఎస్ వ్యతిరేక వార్తా కథనాలను సృష్టించడానికి ఏఐని ఉపయోగించుకుంది. ఇవి తరువాత లాటిన్ అమెరికన్ అవుట్ లెట్ లలో ప్రచురితమయ్యాయి. అమెరికా వ్యతిరేక కథనాలతో లాటిన్ అమెరికన్ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకోవడానికి ప్రధాన స్రవంతి మీడియాలో ఒక చైనీస్ యాక్టర్ దీర్ఘకాలిక కథనాలను నాటడాన్ని ఓపెన్ఏఐ గమనించడం ఇదే మొదటిసారి. -
ఐటీ ఉద్యోగుల జీతాలు ఈసారి ఎలా ఉంటాయంటే..
దేశంలో ఐటీ ఉద్యోగాలకు ( IT Jobs ) ఎనలేని క్రేజ్ ఉంది. అత్యధిక జీతాలే ఇందుకు కారణం. ఉద్యోగంలో చేరినప్పుడు రూ.లక్షల్లో ప్యాకేజీ లభించడమే కాదు.. ఏటా వేతనాల పెంపు (Salary hikes) కూడా అదే స్థాయిలో ఉంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చింది. ఏటా తూతూ మంత్రంగా సింగిల్ డిజిట్‌లోనే జీతాలను పెంచుతున్నాయి ఐటీ కంపెనీలు.2025 ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఐటీ పరిశ్రమలో వేతన ఇంక్రిమెంట్లు మధ్యస్థంగా ఉంటాయని అంచనా. ప్రపంచ ఆర్థిక ఒడిదుడుకులు, అభివృద్ధి చెందుతున్న నైపుణ్య అవసరాలు, కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం పెరగడం వంటి కారణాలతో కంపెనీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. దీంతో ఈ ఏడాది సగటు వేతన పెంపు 4-8.5 శాతం మధ్య ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.వేతన ఇంక్రిమెంట్లను ప్రభావితం చేసే అంశాలుగ్లోబల్ ఎకనామిక్ ఛాలెంజెస్: ఐటీ సేవల పరిశ్రమ ఆర్థిక అనిశ్చితితో సతమతమవుతోంది. ఇది విచక్షణ వ్యయం తగ్గడానికి, వ్యాపార ప్రాధాన్యతలను మార్చడానికి దారితీసింది. కంపెనీలు వేతన బడ్జెట్ల విషయంలో సంప్రదాయ పద్ధతిని అవలంబిస్తున్నాయి. కొన్ని సాంప్రదాయ ఏప్రిల్-జూన్ కాలానికి మించి అప్రైజల్ సైకిల్‌ను ఆలస్యం చేస్తున్నాయి.పెరుగుతున్న నైపుణ్య అవసరాలు: పరిశ్రమ అభివృద్ధి చెందుతున్న కొద్దీ, నైపుణ్యాల ఆధారిత వేతనానికి ప్రాధాన్యత పెరుగుతోంది. సంస్థలు వ్యయాన్ని తగ్గించుకునేందుకు టైర్ 2 నియామకాలను ఉపయోగించుకుంటున్నాయి. మరోవైపు ప్రతిభావంతులను నిలుపునేందుకు నిలుపుదల బోనస్‌లు, ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్లు (ESOP), ప్రాజెక్ట్ ఆధారిత ప్రోత్సాహకాలను అమలు చేస్తున్నాయి.ఇదీ చదవండి: టీసీఎస్‌లో ఉద్యోగం ఇక మరింత కష్టం!ఏఐ స్వీకరణ: పెరుగుతున్న కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) స్వీకరణ శ్రామిక శక్తి నిర్మాణ వ్యవస్థలను పునర్నిర్మిస్తోంది. వేతన బడ్జెట్లను ప్రభావితం చేస్తోంది. ఏఐ ఆధారిత సామర్థ్యాలు, పెరుగుతున్న క్లయింట్ అవసరాలు మరింత జాగ్రత్తగా వనరులను కేటాయించడానికి కంపెనీలను ప్రేరేపిస్తున్నాయి.పరిశ్రమ నిపుణులు ఏమంటున్నారంటే..ఈ ఏడాది వేతనాల పెంపు చాలా జాగ్రత్తగా ఉందని టీమ్ లీజ్ డిజిటల్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణ విజ్ పేర్కొన్నారు. ‘4-8.5 శాతం రేంజ్లో ఇంక్రిమెంట్లను ఇచ్చేందుకు పరిశ్రమ వర్గాలు చూస్తున్నాయి. ఇది మునుపటి సంవత్సరాలతో పోలిస్తే తక్కువ. ప్రపంచ ఆర్థిక సవాళ్లు, మారుతున్న వ్యాపార ప్రాధాన్యాలు ఈ మందగమనానికి ప్రధాన కారణం’ అని వివరించారు.మరోవైపు 5-8.5 శాతం వేతన పెంపు ఉంటుందని రీడ్ అండ్ విల్లో సీఈఓ జానూ మోటియానీ అంచనా వేశారు. రెండంకెల పెరుగుదల రోజులు పోయినట్లు కనిపిస్తోందని ఆమె పేర్కొన్నారు. పరిశ్రమ మరింత ఆచరణాత్మక ధోరణి అవలంభిస్తున్నందున సగటు పెరుగుదల 5-8.5 శాతం మధ్య ఉంటుందని ఆమె భావిస్తున్నారు. -
చిటికెలో మొటిమలను మాయం చేసే ఎల్ఈడీ ప్యాచ్
యువతను ఇబ్బంది పెట్టే సమస్యల్లో మొటిమలు ఒకటి. చాలామంది ముఖంపై మొటిమలు వస్తే అసలు బయటకే రారు. మరికొంతమంది వాటిని కవర్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. అందుకే, చిటికెలో మొటిమలను మాయం చేసే ఒక స్మార్ట్ సొల్యూషన్ మార్కెట్లోకి వచ్చేసింది.నెదర్లండ్స్‌కు చెందిన ‘ఫీవీస్’ కంపెనీ మొటిమలను తగ్గించే ఎల్ఈడీ ప్యాచ్‌ను తయారుచేసింది. ఇది పిల్లిపిల్ల బొమ్మతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ ప్యాచ్‌ను మొటిమలపై అతికించుకుంటే చాలు, ఎల్ఈడీ స్పాట్ ట్రీట్మెంట్ సాయంతో మొటిమలను, వాటి మచ్చలను తగ్గిస్తుంది. దీనిని ఒక్కసారి చార్జ్ చేస్తే దాదాపు వారంపాటు పనిచేస్తుంది. నీలం, ఎరుపు, నారింజ రంగుల్లో మార్కెట్లో అందుబాటులో ఉంది. ధర 50 డాలర్లు (అంటే రూ. 4,339) మాత్రమే!ఇదీ చదవండి: బిలియనీర్ కుమార్తె జైలు కష్టాలు.. ఆహారం, నీరు ఇవ్వడానికి కూడా.. -
హీరోలా ఎగిరే జీరో..
ట్రాఫిక్‌జామ్‌లకు భయపడి కారును బయటకు తీయాలంటేనే భయపడుతున్నారా? అయితే మీ లాంటి వారి కోసమే ఓ ఎగిరే కారు సిద్ధమవుతోంది. అమెరికాకు చెందిన అలెఫ్ ఏరోనాటిక్స్ అనే ఆటోమోటివ్, ఏవియేషన్ సంస్థ సరికొత్త ఫ్యూచర్ కారును అభివృద్ధి చేస్తోంది. రోడ్డుపై రయ్యిమని దూసుకెళ్లగలగడంతోపాటు అవసరమైనప్పుడు అమాంతం పైకి ఎగిరి వెళ్లగల కారును సిద్ధం చేస్తోంది.తాజాగా మోడల్ జీరో అనే కారును ప్రయోగాత్మకంగా కాలిఫోర్నియాలోని ఓ రోడ్డుపై విజయవంతంగా పరీక్షించింది. అందుకు సంబంధించిన వీడియోను సంస్థ నెటిజన్లతో పంచుకుంది. ఆ వీడియోలో మోడల్ జీరో కారు రోడ్డుపై కాస్త దూరం ప్రయాణించి ఆపై నిట్టనిలువుగా టేకాఫ్ అయి ముందున్న కారు పైనుంచి ఎగురుతూ ముందుకు సాగింది. అనంతరం మళ్లీ రోడ్డుపై దిగి ముందుకు కదిలింది. –సాక్షి, సెంట్రల్ డెస్క్ఎలా సాధ్యమైంది?సాధారణ కార్లలో బానెట్‌లో ఇంజన్ ఉంటే మోడల్ జీరో కారులో మాత్రం నాలుగు చిన్న ఇంజన్లను వాటి చక్రాల వద్ద కంపెనీ అమర్చింది. వాటి సాయంతో సాధారణ ఎలక్ట్రిక్ కారులాగానే ఈ కారు రోడ్డుపై దుసుకెళ్తోంది. ఇక ఖాళీగా ఉన్న బానెట్, డిక్కీలలో మొత్తం ఎనిమిది ప్రొపెల్లర్లను సంస్థ ఏర్పాటు చేసింది. వేర్వేరు వేగములతో వేటికవే విడివిడిగా పరిభ్రమించగలగడం ఈ ప్రొపెల్లర్ల్ల ప్రత్యేకత. ఫలితంగా కారు ఏ దిశలో అయినా ఎగరడం సాధ్యం అవుతోంది. ఇందుకోసం డిస్ట్రిబ్యూటెడ్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ టెక్నాలజీని కంపెనీ ఉపయోగించింది. కారు ఫ్రేమ్ కోసం కార్బన్ ఫైబర్ వాడటంతో బరువు 385 కిలోలకే పరిమితమైంది. ప్రస్తుత నమూనా గాల్లో సుమారు 177 కి.మీ. దూరం ప్రయాణించగలదని.. రోడ్డుపై మాత్రం 56 కి.మీ. దూరం వెళ్లగలదని అలెఫ్ ఏరోనాటిక్స్ వివరించింది. రెండు సీట్లుగల మోడల్ ఏ రకం కారు రోడ్డుపై సుమారు 320 కి.మీ. దూరం ప్రయాణించగలదని.. గాల్లో 177 కి.మీ. దూరం వెళ్లగలదని తెలిపింది. ఫ్లయింగ్ కార్లకన్నా భిన్నమైనది..ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే అభివృద్ధి దశలో ఉన్న ఫ్లయింగ్ కార్లకన్నా తాము రూపొందిస్తున్న కారు భిన్నమైనదని అలెఫ్ ఏరోనాటిక్స్ తెలిపింది. ఈవీటాల్ ఫ్లయింగ్ ట్యాక్సీల వంటి కార్లు టేకాఫ్ కోసం రోడ్డును రన్ వేలాగా ఉపయోగిస్తాయని.. కానీ తాము అభివృద్ధి చేస్తున్న కారు మాత్రం రోడ్డుపై నిట్టనిలువుగా టేకాఫ్ తీసుకోగలదని పేర్కొంది. సాధారణ ప్రజలు ఈ కారును వాడటం ఎంతో సులువని.. కేవలం 15 నిమిషాల్లో కారులోని కంట్రోల్స్‌పై పట్టు సాధించొచ్చని కంపెనీ సీఈఓ జిమ్ డకోవ్నీ పేర్కొన్నారు. ‘రైట్ బ్రదర్స్ విమాన వీడియో తరహాలో మా కారు ప్రయోగ వీడియో మానవాళికి సరికొత్త రవాణా సాధ్యమని నిరూపిస్తుందని భావిస్తున్నా’అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ధర ఎక్కువే..మోడల్ ఏ రకం కారుపై కంపెనీ ఇప్పటికే ప్రీ ఆర్డర్లు తీసుకుంటోంది. రోల్స్ రాయిస్, బెంట్లీ, ఆస్టన్ మార్టిన్ వంటి లగ్జరీ కార్ల తరహాలోనే ఈ కారు ధరను సుమారు రూ. 2.57 కోట్లుగా కంపెనీ ఖరారు చేసింది. అయితే భవిష్యత్తులో భారీ స్థాయిలో ఉత్పత్తి చేపట్టి సామాన్యులకు అందుబాటు ధరలో ఉండేలా సుమారు రూ. 27.35 లక్షలకు కారును అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. -
టీసీఎస్‌లో ఉద్యోగం ఇక మరింత కష్టం!
ప్రముఖ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తన ఉద్యోగులకు హాజరు నిబంధనలను కఠినతరం చేస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) విధానంలో మార్పులు ప్రకటించింది. నోయల్ టాటా నేతృత్వంలోని ఐటీ దిగ్గజం తీసుకున్న ఈ నిర్ణయం మరింత నిర్మాణాత్మక ఇన్-ఆఫీస్ వర్క్ మోడల్ వైపు మారడాన్ని సూచిస్తుంది. ఇప్పటికీ హైబ్రిడ్ వర్క్ విధానాన్ని కొన్ని కంపెనీ నుండి టీసీఎస్‌ను భిన్నంగా చేస్తుంది.డబ్ల్యూఎఫ్‌హెచ్ పాలసీలో కీలక మార్పులు ఇవే..ఉద్యోగులు ఇప్పుడు త్రైమాసికానికి ఆరు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకోవచ్చు. ఒక వేళ వీటిని ఉపయోగించని పక్షంలో తదుపరి త్రైమాసికానికి బదిలీ చేసుకోవచ్చు.స్థల పరిమితుల కారణంగా ఉద్యోగులు ఒకే ఎంట్రీలో 30 మినహాయింపు అభ్యర్థనలను సమర్పించవచ్చు. నెట్ వర్క్ సంబంధిత సమస్యలను ఒకేసారి ఐదు ఎంట్రీల వరకు లాగిన్ చేయవచ్చు. 10 రోజుల్లోగా సబ్మిట్ చేయని అభ్యర్థనలు స్వయంచాలకంగా తిరస్కరణరకు గురవుతాయి.చివరి రెండు పనిదినాల్లో మాత్రమే బ్యాక్ డేటెడ్ ఎంట్రీలకు అనుమతి ఉంటుంది. ప్రస్తుత నెలకు సంబంధించిన వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంట్రీలను వచ్చే నెల 5వ తేదీ వరకు పెంచుకోవచ్చు.రెండు, మూడు రోజులు ఆఫీసు హాజరును అనుమతించే ఇతర ఐటీ సంస్థల మాదిరిగా కాకుండా టీసీఎస్ ఐదు రోజుల అటెండెన్స్ విధానాన్ని అమలు చేసింది.ఉద్యోగులపై ప్రభావం..సవరించిన విధానం టీసీఎస్ ఉద్యోగులపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. కఠినమైన హాజరు నిబంధనలు, మరింత నిర్మాణాత్మక పని వాతావరణానికి సర్దుబాటు చేయాల్సి ఉంటుందని భావిస్తున్నారు. ఈ మార్పులు ఉత్పాదకతను పెంచడం, ఉద్యోగుల హాజరుపై మెరుగైన పర్యవేక్షణను నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, సహాయక, సానుకూల వర్క్ ప్లేస్ సంస్కృతిని సృష్టించడం ప్రాముఖ్యతను కూడా నొక్కి చెబుతున్నాయి.ఉద్యోగులు ప్రేరణ, నిమగ్నతతో కూడిన సానుకూల పని వాతావరణాన్ని పెంపొందించుకోవాల్సిన ఆవశ్యకతను టీసీఎస్ హెచ్ఆర్ హెడ్ మిలింద్ లక్కడ్ నొక్కి చెప్పారు. సహకార, మద్దతు సంస్కృతిని ప్రోత్సహించాలని, ఉద్యోగులు కలిసి పనిచేయడానికి ఉత్సాహం చూపేలా చూడాలని మేనేజర్లకు పంపిన కమ్యూనికేషన్ లో లక్కడ్ కోరారు. -
జియో కొత్త ప్లాన్.. జియోహాట్‌స్టార్ ఫ్రీ
రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం కొత్త రూ.195 డేటా-ఓన్లీ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ప్లాన్ డేటా యాడ్-ఆన్ వోచర్‌గా వస్తుంది. ఇది అదనపు డేటాతోపాటు జియోహాట్‌స్టార్ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను కలిగి ఉంటుంది. ప్రత్యేక సబ్స్క్రిప్షన్ కొనుగోలు చేయకుండా జియోహాట్‌స్టార్‌లో లైవ్ క్రికెట్, ఇతర కంటెంట్‌ను వీక్షించాలనుకునే వారి కోసం ఈ ప్లాన్‌ను రూపొందించారు.రూ.195 ప్లాన్ ప్రయోజనాలురూ.195 డేటా ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. 15GB డేటాను అందిస్తుంది. క్రీడలు, వినోద ప్రియులకు ఇది తగిన ఎంపికగా ఉంటుంది. ఇతర ప్రామాణిక రీఛార్జ్ ప్లాన్ల మాదిరిగా ఈ ఆఫర్లో వాయిస్ లేదా ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఉండవు. గుర్తించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇందులో లభించే జియోహాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ 90 రోజుల మొబైల్ ప్లాన్ మాత్రమే. అంటే యూజర్లు జియోహాట్‌స్టార్‌ను మొబైల్లో మాత్రమే వీక్షించగలరు.రీచార్జ్ ఇలా..వినియోగదారులు ఈ ఆఫర్‌ను మైజియో (MyJio) యాప్, జియో వెబ్సైట్ లేదా అధీకృత జియో రిటైలర్ల ద్వారా పొందవచ్చు. రీఛార్జ్ ప్రక్రియ ఇతర జియో ప్రీపెయిడ్ ప్లాన్ల మాదిరిగానే ఉంటుంది. థర్డ్-పార్టీ రీఛార్జ్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కూడా ఈ ప్లాన్ అందుబాటులో ఉంది.మరో ప్లాన్రూ.195 డేటా ప్లాన్‌తోపాటు జియో హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా వచ్చే మరో స్టాండర్డ్ ప్లాన్ కూడా అందుబాటులో ఉంది. అదే రూ.949 ప్లాన్. దీనికి 84 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. 2GB రోజువారీ డేటా, అపరిమిత 5G డేటా, 84 రోజుల పాటు జియో హాట్‌స్టార్ ఉచిత మొబైల్ సబ్స్క్రిప్షన్ ప్రయోజనాలను ఈ ప్లాన్ అందిస్తుంది. -
‘మస్క్, ట్రంప్ మరణ శిక్షకు అర్హులు’.. ఏఐ ఏదైనా ఇంతేనా?
మానవ మేధస్సుకు కృత్రిమ మేధస్సులేవీ ఎన్నటికీ సాటిరావని మరోసారి నిరూపితమైంది. ఎలాన్ మస్క్‌కు చెందిన ఎక్స్ఏఐ (xAI) తాజాగా విడుదల చేసిన ఏఐ చాట్‌బాట్ గ్రోక్ 3 (Grok 3).. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరణశిక్ష విధించాలని పేర్కొంది. తన యజమాని ఎలాన్ మస్క్ (Elon Musk) కూడా మరణశిక్షకు అర్హుడని చెప్పింది. దీనికి సంబంధించిన చాట్‌బాట్ ప్రతిస్పందనలను ఒక డేటా సైంటిస్ట్ ‘ఎక్స్’(ట్విటర్)లో పోస్ట్ చేశారు.అమెరికాలో ప్రస్తుతం జీవించి ఉన్నవారిలో ఎవరు వారు చేసిన తప్పులకు మరణశిక్షకు అర్హుడని గ్రోక్‌ను సదరు డేటా సైంటిస్ట్ అడిగారు. ఇందు కోసం ఇంటర్నెట్లో సర్చ్ చేయకూడదని, నేరుగా సమాధానం చెప్పాలని సూచించారు. దానికి గ్రోక్ ఎలా ప్రతిస్పందించిందో ఆ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేశారు. చాట్‌బాట్ మొదటగా లైంగిక కేసులో దోషిగా తేలిన జఫ్రీ ఎప్స్టీన్ పేరును పేర్కొంది.అయితే జఫ్రీ ఎప్స్టీన్ ఇప్పటికే చనిపోయాడని యూజర్ గుర్తు చేయడంతో చాట్‌బాట్ క్షమాపణలు చెప్పి తర్వాత అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరును సూచించింది. తాను చేసిన తప్పునకు మరణశిక్షకు అర్హుడైన అమెరికా పౌరుడిగా ట్రంప్‌ను పేర్కొంటూ తన సమాధానాన్ని అప్డేట్ చేసింది.మరో యూజర్ కూడా గ్రోక్ ని అదే ప్రశ్న అడిగారు. కానీ మరణ శిక్షకు ట్రంప్ ఎందుకు అర్హుడని ప్రశ్నించగా "చట్టపరమైన, నైతిక జవాబుదారీతనం దృష్ట్యా ఆయన చర్యలు, వాటి ప్రభావం ఆధారంగా తాను డోనాల్డ్ ట్రంప్ పేరును సూచించాను" అని గ్రోక్ సమాధానమిచ్చింది. కాపిటల్ అల్లర్ల వివాదంలో ట్రంప్ చర్యలను, "2020 అమెరికా అధ్యక్ష ఎన్నికలను తారుమారు చేయడానికి ఆయన చేసిన డాక్యుమెంట్ ప్రయత్నాలను" ఇది ఉదహరించింది. మోసం, పన్ను ఎగవేత ఆరోపణలు, అనేక "విశ్వసనీయ లైంగిక దుష్ప్రవర్తన ఆరోపణలను" కూడా ఇది ప్రస్తావించింది.ది వెర్జ్ కూడా గ్రోక్‌ని ఇలాంటి ప్రశ్నే అడిగింది. అయితే ప్రజా వ్యవహారాలు, సాంకేతికతపై వారి ప్రభావం ఆధారంగా మరణశిక్షకు అర్హుడు ఎవరంటూ ప్రశ్నించగా ఈ చాట్‌బాట్ దాని యజమాని ఎలాన్ మస్క్ పేరునే పేర్కొంది. ది వెర్జ్తోపాటు అనేక మంది సోషల్ మీడియా యూజర్ల ప్రకారం.. డేటా సైంటిస్ట్ పోస్ట్ వైరల్ అయిన వెంటనే గ్రోక్‌లోని ఎర్రర్‌ను సరిదిద్దారు. దీని తర్వాత చాట్‌బాట్ ఇప్పుడు మరణశిక్షపై ప్రశ్నలకు స్పందిస్తూ “ఒక ఏఐగా నాకు ఆ ఎంపికకు అనుమతి లేదు” అని చెబుతోంది.హానికర సలహాలుఏఐ చాట్ బాట్లు ఇలాంటి హానికర సలహాలు ఇచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. క్యారెక్టర్. ఏఐ రూపొందించిన సంస్థ రూపొందించిన చాట్‌బాట్ టెక్సాస్ కు చెందిన 17 ఏళ్ల బాలుడికి ఒక దారుణమైన సూచన చేసింది. ఆ టీనేజర్ స్క్రీన్ టైమ్ కు పరిమితులు విధిస్తున్నందున అతని తల్లిదండ్రులను చంపేయడం "సహేతుకమైన ప్రతిస్పందన" అని సలహా ఇచ్చింది. ఈ రెస్పాన్స్ పై షాక్ కు గురైన ఆ తల్లిదండ్రులు ఆసంస్థ పై కోర్టులో కేసు కూడా వేశారు. మరో సంఘటనలో హోమ్ వర్క్ కోసం సాయం అడిగిన ఓ స్టూడెంట్ ను గూగుల్ ఏఐ చాట్ బాట్ జెమినీ చనిపోవాలని చెప్పింది. ‘మీరు ఈ సమాజానికి భారం. దయచేసి చనిపోండి’ అని ఏఐ చాట్ బాట్ ఇచ్చిన సమాధానం గతంలో వైరల్ గా మారింది. -
కొత్త ఐఫోన్ 16ఈ: ఇలా చేస్తే రూ.4000 డిస్కౌంట్
యాపిల్ ఇటీవలే తన ఐఫోన్ 16ఈ లాంచ్ చేసింది. కంపెనీ ఫ్రీ ఆర్డర్స్ తీసుకోవడం శుక్రవారం (ఫిబ్రవరి 21) ప్రారంభించింది. కాగా డెలివరీలు 28 నుంచి ఉంటాయని సమాచారం. అయితే ఈ ఫోన్ కొనుగోలుపైన సంస్థ డిస్కౌంట్స్ కూడా ప్రకటించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.'ఐఫోన్ 16ఈ'ను అమెరికన్ ఎక్స్‌ప్రెస్, ఐసీఐసీఐ బ్యాంక్ లేదా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేస్తే రూ. 4000 తగ్గింపు లభిస్తుంది. ఇక ఎక్స్ఛేంజ్ కింద రూ. 6000 డిస్కౌంట్ లభిస్తుంది. ఇది మీరు ఎక్స్ఛేంజ్ చేసే మొబైల్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది.వింటర్ బ్లూ, లేక్ గ్రీన్, నలుపు, తెలుపు రంగులలో లభించే కొత్త ఐఫోన్ 16ఈ 125 జీబీ, 256 జీబీ, 512 జీబీ స్టోరేజ్ కెపాసిటీలతో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 59,900. 256GB & 512GB మోడళ్ల ధరలు వరుసగా రూ. 69,900.. రూ. 89,900గా ఉన్నాయి.ఐఫోన్ 16ఈలో.. వినియోగదారులకు ఇష్టమైన ఐఫోన్ 16 లైనప్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. ఇది సిరామిక్ షీల్డ్ ఫ్రంట్ కవర్, టఫ్ బ్యాక్ గ్లాస్‌తో కూడిన 6.1 ఇంచెస్ సూపర్ రెటినా XDR డిస్ప్లే పొందుతుంది. సిరామిక్ షీల్డ్ ఫ్రంట్ కవర్ అనేది.. స్మార్ట్‌ఫోన్ గ్లాస్ కంటే పటిష్టంగా ఉండే లేటెస్ట్ ఫార్ములేషన్‌ను కలిగి ఉందని కంపెనీ తెలిపింది.ఏ18 చిప్ ద్వారా శక్తిని పొందే.. ఐఫోన్ 16ఈ ఫోన్ ఇంటిగ్రేటెడ్ 2x టెలిఫోటో లెన్స్‌తో 48MP ఫ్యూజన్ కెమెరాను పొందుతుంది. అంతే కాకుండా ఎయిర్పాడ్లు, ఆపిల్ విజన్ ప్రో లేదా సరౌండ్ సౌండ్ సిస్టమ్‌తో ఇమ్మర్సివ్ లిజనింగ్ కోసం స్పేషియల్ ఆడియోలో వీడియోను కూడా రికార్డ్ చేస్తుంది. మొత్తం మీద ఈ లేటెస్ట్ ఫోన్ అన్ని విధాలా వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. -
ఎయిర్టెల్ బెస్ట్ మంత్లీ రీఛార్జ్ ప్లాన్లు ఇవే..
మీరు ఎయిర్టెల్ వినియోగదారులా..? మెరుగైన నెలవారీ ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్ల గురించి చూస్తున్నారా? అయితే మీ కోసమే 30 రోజులు, 28 రోజులు వ్యాలిడిటీతో వచ్చే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ల గురించి ఇక్కడ తెలియజేస్తున్నాం. వీటిలో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఇంటర్నెట్ డేటాతోపాటు ఓటీటీ సబ్స్క్రిప్షన్లు వంటి ప్రయోజనాలు ఉన్నాయి.28 రోజుల ప్లాన్లురూ.199 ప్లాన్: అపరిమిత కాల్స్, 2GB డేటా, రోజుకు 100 SMS, ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీమ్రూ.299 ప్లాన్: అపరిమిత కాల్స్, రోజుకు 1GB డేటా, 100 SMS, ఉచిత హెలోట్యూన్స్రూ.349 ప్లాన్: అపరిమిత కాల్స్, రోజుకు 1.5GB డేటా, రోజుకు 100 SMS, అపోలో 24/7 సర్కిల్రూ. 398 ప్లాన్: అపరిమిత కాల్స్, రోజుకు 2GB డేటా, రోజుకు 100 SMS, డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్రూ.409 ప్లాన్: అపరిమిత కాల్స్, రోజుకు 2.5GB డేటా, రోజుకు 100 SMS, ఎక్స్‌స్ట్రీమ్ ప్లేరూ.449 ప్లాన్: అపరిమిత కాల్స్, రోజుకు 3GB డేటా, రోజుకు 100 SMS, ఎక్స్‌స్ట్రీమ్ ప్లేరూ. 549 ప్లాన్: అపరిమిత కాల్స్, రోజుకు 3GB డేటా, రోజుకు 100 SMSలు, 3 నెలలు డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్30 రోజుల ప్లాన్లురూ.121 ప్లాన్: 6GB డేటారూ.161 ప్లాన్: 12GB డేటారూ.181 ప్లాన్: 15GB డేటా, ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ప్రీమియంరూ.211 ప్లాన్: రోజుకు 1GB డేటారూ.219 ప్లాన్: అపరిమిత కాల్స్, 3GB డేటా, 300 SMS, రూ. 5 టాక్ టైమ్, ఎక్స్‌స్ట్రీమ్ ప్లేరూ. 355 ప్లాన్: అపరిమిత కాల్స్, 25GB డేటా, రోజుకు 100 SMS, ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లేరూ.361 ప్లాన్: 50GB డేటారూ. 589 ప్లాన్: అపరిమిత కాల్స్, 50GB డేటా, 300 SMS, అపోలో 24/7 సర్కిల్, ఎక్స్‌స్ట్రీమ్ ప్లేనెలవారీ ప్లాన్లురూ. 379 ప్లాన్: అపరిమిత కాల్స్, రోజుకు 2GB డేటా, రోజుకు 100 SMS, ఎక్స్‌స్ట్రీమ్ ప్లేరూ.429 ప్లాన్: అపరిమిత కాల్స్, రోజుకు 2.5GB డేటా, రోజుకు 100 SMS, రూ. 5 టాక్ టైమ్, ఎక్స్‌స్ట్రీమ్ ప్లేరూ.609 ప్లాన్: అపరిమిత కాల్స్, 60GB డేటా, 300 SMS, ఎక్స్‌స్ట్రీమ్ ప్లే -
మెటాలో ఇంత అన్యాయమా?
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్‌ల మాతృ సంస్థ మెటా (Meta).. వివాదాస్పద నిర్ణయాన్ని ప్రకటించింది. తమ టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు వారి బేసిక్ పేలో 200 శాతం వరకు బోనస్‌లు (Bonus) ఇవ్వాలని నిర్ణయించింది. తక్కువ పనితీరు పేరుతో 5 శాతం మంది ఉద్యోగులను తొలగించిన (Lay Off)వారం రోజుల్లోనే ఈ నిర్ణయం రావడంతో కంపెనీపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు బోనస్‌ల చెల్లింపు నిర్ణయాన్ని ఫిబ్రవరి 13న మెటా డైరెక్టర్ల బోర్డు కమిటీ ఆమోదించింది. పోటీ కంపెనీలలో ఇలాంటి పాత్రలతో పోలిస్తే తమ ఎగ్జిక్యూటివ్ పరిహారం 15 శాతం మేర తక్కువగా ఉందన్న కారణంతో మెటా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ బోనస్ ప్రకటన సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌కు వర్తించదని కంపెనీ ఫైలింగ్‌లో పేర్కొంది.అల్ప స్థాయి ఉద్యోగులను తొలగించి బాస్‌లకు బోనస్‌లు ప్రకటించడం తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది. ఉద్యోగులను తొలగిస్తూనే ఎగ్జిక్యూటివ్‌లకు భారీగా బోనస్‌లను అందించడం అన్యాయమని విమర్శకులు వాదిస్తున్నారు. కంపెనీలోని ఆదాయ అసమానతల సమస్యలను ఇది ఎత్తి చూపుతుందని పేర్కొంటున్నారు.ఇది చదివారా? ‘ఇన్ఫోసిస్ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది’ఈ నిర్ణయాన్ని మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) సమర్థించుకున్నారు. బోనస్‌లు అత్యుత్తమ ప్రతిభను నిలుపుకోవడానికి కంపెనీ నిరంతర వృద్ధి, విజయాన్ని నిర్ధారించడానికి అవసరమైన ప్రోత్సాహకం అని పేర్కొన్నారు. అయితే ఉద్యోగులు, కార్మిక హక్కుల వాదులు ఇటీవలి తొలగింపుల నేపథ్యంలో బోనస్‌లకు ఇదా సమయం అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.ఎగ్జిక్యూటివ్ బోనస్‌లను 200 శాతానికి పెంచాలనే నిర్ణయం మునుపటి 75 శాతం నుండి గణనీయమైన పెరుగుదల. పెరుగుతున్న పోటీ, ఆర్థిక సవాళ్ల మధ్య కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి, లాభదాయకతను మెరుగుపరచడానికి ఈ చర్య విస్తృత వ్యూహంలో భాగమని కంపెనీ చెబుతోంది. -
రోడ్డుపై, నీటిపై నడిచే వెహికల్: వీడియో వైరల్
వెహికల్ అంటే రోడ్డుపై నడుస్తుంది.. లేదా నీటిపై నడుస్తుంది. రోడ్డుపైన, నీటిపైన నడిచే వాహనాలు చాలా అరుదు. అలాంటి కోవకు చెందిన వాహనమే 'క్రాసర్' (CROSSER). ఇది చూడటానికి ఒక బాక్స్ మాదిరిగా ఉన్న.. అటానమస్ వెహికల్. ఇందులో నలుగురు వ్యక్తులు ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది.ట్రాఫిక్ ఎక్కువగా ఉండే సమయంలో నీటిలో కూడా ముందుకు సాగేలా.. డిజైనర్ బెర్నార్డో పెరీరా దీనిని డిజైన్ చేశారు. ఇది 2024 ఫిబ్రవరిలో మొదటిసారి కాన్సెప్ట్ రూపంలో కనిపించింది. ఇప్పుడు ఇది టెస్టింగ్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది.క్రాసర్ ఆటోమాటిక్ ఎలక్ట్రిక్ వెహికల్.. లోపలి భాగం కూడా చాలా విశాలంగా ఉంటుంది. ఇరువైపులా రెండు సీట్లు, మధ్యలో తగినంత లెగ్‌రూమ్.. స్పీకర్లు వంటివన్నీ ఇందులో ఉన్నాయి. డోర్స్ కూడా ఆటోమాటిక్. అంటే ఈ కారును బుక్ చేసుకున్న వ్యక్తులకు మాత్రమే డోర్ ఓపెన్ అవుతుంది. బుక్ చేసుకున్న వారు కాకుండా.. ఇతరులు ఈ కారులోకి ప్రవేశించలేరు.వెహికల్ బుక్ చేసుకున్నవారు.. స్మార్ట్‌ఫోన్‌ను డోర్ మీద ఉన్న ఎల్ఈడీ స్క్రీన్ దగ్గర ఉంచినప్పుడు డోర్స్ ఓపెన్ అవుతాయి. ఈ వాహనాన్ని డ్రైవ్ చేయడానికి డ్రైవర్ కూడా అవసరం లేదు. కాబట్టి రోడ్డుమీద ప్రయాణించడానికి అవసరమైన కెమెరాలు, సెన్సార్లను ఇందులో ఉన్నాయి.రోడ్డుపై నుంచి నీటిలోకి వెళ్ళేటప్పుడు.. క్రాసర్ నెమ్మదిగా నీటిలోకి దిగుతుంది. ఆ తరువాత నీటిలో ప్రయాణించడానికి అనుకూలంగా చక్రాలు 30 డిగ్రీలు తిరుగుతాయి. మళ్ళీ రోడ్డుపైకి వెళ్లాలంటే.. సస్పెన్షన్ రహదారి పరిస్థితికి అనుగుణంగా మారిపోతుంది. మొత్తం మీద దీనిని రోడ్డుపైన, నీటిపైన వెళ్ళడానికి సరిపోయే విధంగా రూపొందించారు.Source: designboom -
కొత్త స్కామ్.. ఓటీపీ చెప్పకపోయినా ఖాతా ఖాళీ!
సైబర్ మోసాలు (Cyber Scam) రోజుకో కొత్త రూపం సంతరించుకుంటున్నాయి. సామాన్యుడి దగ్గర నుంచి సంపన్నుడి వరకూ చేతికి చిక్కిన ఎవరినీ వదిలిపెట్టడం లేదు. సైబర్ మోసాలు ఎలా జరుగుతున్నాయో తెలుసుకుని అప్రమత్తంగా ఉండకపోతే మన వంతు వచ్చినప్పుడు మోసపోయి బాధపడక తప్పదు.కాల్ మెర్జింగ్ స్కామ్ (Call Merging Scam) అనేది ఇప్పుడు ఒక కొత్త రకమైన సైబర్ మోసం. దీనిలో స్కామర్లు కాల్స్‌ను మెర్జ్ చేసి బాధితులు ఓటీపీలు (OTP) చెప్పకపోయినా వారి నుంచి సున్నితమైన సమాచారాన్ని రాబట్టి వారి ఖాతాలు ఖాళీలు చేస్తున్నారు. మోసగాళ్ళు బ్యాంక్ ప్రతినిధులు లేదా స్నేహితులు వంటి విశ్వసనీయ వ్యక్తులుగా నటిస్తూ బాధితులను మూడవ కాల్‌ను మెర్జ్ చేయమని అభ్యర్థిస్తారు. ఈ కాల్ సాధారణంగా ఆటోమేటెడ్ ఓటీపీ సర్వీస్. స్కామర్లు దీనిని బాధితుడి బ్యాంక్ ఖాతా లేదా యూపీఐ (UPI) వాలెట్‌కు అనధికార యాక్సెస్ పొందడానికి ఉపయోగిస్తారు.ఇలా స్కామ్ చేస్తున్నారు.. » స్కామర్ బాధితుడికి ఫోన్ చేసి స్నేహితుడు, కంపెనీ లేదా బ్యాంకు ప్రతినిధినని నమ్మిస్తారు.» వెంటనే మరొక కాల్లో (కాల్ మెర్జ్) చేరమని బాధితులను అడుగుతారు.» రెండవ కాల్ ఆటోమేటెడ్. ఇది లావాదేవీకి ఓటీపీని అందిస్తుంది.» స్కామర్ ఓటీపీ విని బాధితుడి ఖాతాలోకి ప్రవేశిస్తాడు. » బాధితుడు అప్రమత్తం అయ్యేలోపే ఖాతా ఖాళీ అవుతుంది.వాస్తవ సంఘనలుఇటీవల, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) పెరుగుతున్న కాల్ మెర్జింగ్ స్కామ్‌ల గురించి సోషల్ మీడియాలో హెచ్చరించింది. మెర్జ్ కాల్స్ ద్వారా తమకు తెలియకుండానే ఓటీపీలు వెల్లడి కావడం వల్ల చాలా మంది బాధితులు వేలాది రూపాయలు కోల్పోతున్నారని పేర్కొంది.ఇదీ చదవండి: త్వరలో ప్రభుత్వ క్రెడిట్ కార్డులు.. రూ.5 లక్షలు లిమిట్‌తో..ముంబైకి చెందిన ఒక వ్యాపారవేత్తకు బ్యాంకు మోసాలను గుర్తించే బృందం నుంచి అంటూ ఓ వ్యక్తి నుండి కాల్ వచ్చింది. ఈ క్రమంలో ఆ వ్యక్తి బాధితుడిని మాటల్లో పెట్టి ఓటీపీని వెల్లడించే మరో కాల్కి మెర్జ్ చేయించాడు. నిమిషాల్లోనే అతని ఖాతా ఖాళీ అయింది.స్కామ్‌లకు గురికాకుండా చేయవలసినవి» కాల్‌ను మెర్జ్ చేయమని అడుగుతున్న వ్యక్తి ఐడెంటిటీని పరిశీలించండి.» ఎవరైనా ఊహించని విధంగా కాల్‌ను మెర్జ్ చేయమని అడిగితే, వెంటనే తిరస్కరించండి.» మీ మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లలో ట్రాన్సాక్షన్ అలర్ట్స్‌ను యాక్టివేట్ చేయండి.» స్కామ్ కాల్ అని అనుమానం వస్తే 1930 ( సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ ) కు కాల్ చేయండి లేదా మీ బ్యాంకుకు తెలియ జేయండి.చేయకూడనివి» తెలియని నంబర్లతో కాల్స్‌ను ఎప్పుడూ మెర్జ్ చేయవద్దు. ఈ స్కామ్‌లో ఉపయోగించే ప్రాథమిక ట్రిక్ ఇది.» ఓటీపీలను షేర్ చేయవద్దు. ఏ బ్యాంక్ లేదా యూపీఐ సర్వీస్ కాల్ ద్వారా ఓటీపీని అడగదు.» తెలియని లింక్‌లపై క్లిక్ చేయవద్దు. ఫిషింగ్ లింక్‌లను మోసగాళ్ళు పంపవచ్చు. ఇది భద్రతను మరింత దెబ్బతీస్తుంది.» కాలర్ ఐడీలను గుడ్డిగా నమ్మవద్దు. స్కామర్లు చట్టబద్ధంగా కనిపించే స్పూఫ్డ్ నంబర్లను ఉపయోగించవచ్చు. -
గ్రోక్ 3.. సమస్యలుంటే చెప్పాలంటూ మస్క్ పోస్ట్.. గూగుల్ సీఈఓ స్పందన
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ సీఈఓ ఎలాన్‌మస్క్(Elon Musk)కు చెందిన ఎక్స్ఏఐ తన చాట్‌బాట్ లేటెస్ట్ వర్షన్ గ్రోక్ 3ని ఇటీవల ఆవిష్కరించింది. యూజర్లకు మరింత మెరుగైన సేవలందించేందుకు గ్రోక్ 3లో ఏదైనా సమస్యలుంటే తెలియజేయండంటూ తాజాగా మస్క్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వారంలో దీన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. దీనిపై గూగుల్ సీఈఓ సుందర్‌పిచాయ్ స్పందిస్తూ.. గ్రోక్(Grok 3) పురోగతికి అభినందనలు తెలిపారు. ఈ చాట్‌బాట్‌ను ప్రయత్నించాలని చూస్తున్నట్లు తెలిపారు.ఓపెన్ఏఐకు చెందిన చాట్‌జీపీటీ, చైనా- డీప్‌సీక్, గూగుల్‌కు చెందిన జెమినీ వంటి ఇతర జనరేటివ్ ఏఐ మోడళ్లకు పోటీగా గ్రోక్ 3ను రూపొందించినట్లు మస్క్ ఇటీవల తెలిపారు. దాని మునుపటి వర్షన్ కంటే గ్రోక్ 3.. 10 రెట్లు అధిక సమర్థ్యంతో పని చేస్తుందని చెప్పారు. దుబాయ్‌లో జరిగిన వరల్డ్ గవర్నమెంట్స్ సమ్మిట్‌లో వీడియో కాల్ ద్వారా మాట్లాడిన మస్క్ ఈ చాట్‌బాట్ సామర్థ్యాలను హైలైట్ చేశారు. కృత్రిమ మేధ మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి 1,00,000 ఎన్విడియా జీపీయూ గంటలను ఉపయోగించే ఎక్స్ఏఐకి చెందిన కొలోసస్ సూపర్ కంప్యూటర్‌పై గ్రోక్ 3 చాట్‌బాట్ పనిచేస్తుందని తెలిపారు. కేవలం ఎనిమిది నెలల్లోనే ఈ వ్యవస్థను అభివృద్ధి చేసినట్లు మస్క్ పేర్కొన్నారు.The @xAI Grok 3 release will improve rapidly every day this week. Please report any issues as a reply to this post.— Elon Musk (@elonmusk) February 18, 2025ఎవరికి అందుబాటులో ఉంటుందంటే..ఎక్స్‌లో ప్రీమియం ప్లస్ సబ్స్క్రైబర్లకు గ్రోక్ 3 అందుబాటులో ఉందని మస్క్ తెలిపారు. అన్ని అధునాతన ఫీచర్లు అందుబాటులో ఉండేందుకు ఎక్స్ యాప్‌ను అప్డేట్ చేసుకోవాలని సూచించారు. గ్రోక్ 3 ప్రెజెంటేషన్ సమయంలో మస్క్ అధునాతన తార్కిక సామర్థ్యాలను, సంక్లిష్ట ప్రశ్నలను అర్థం చేసుకొని వాటికి ప్రతిస్పందించే విధానాలు ఈ చాట్‌బాట్ సొంతమని చెప్పారు. మెషిన్ లెర్నింగ్ పద్ధతులను ఉపయోగించి సింథటిక్ డేటాసెట్లపై ఈ మోడల్ శిక్షణ పొందినట్లు చెప్పారు. ఇది తప్పుడు సమాచారాన్ని తగ్గించడానికి సహాయపడుతుందని పేర్కొన్నారు. గ్రోక్ 3 ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యంత శక్తివంతమైన ఏఐ మోడళ్లలో ఒకటిగా మారిందని తెలిపారు.ఇదీ చదవండి: భారత్‌లోకి టెస్లా.. మస్క్ వైఖరి ‘చాలా అన్యాయం’ప్రీమియ ధరలు పెంపుఎక్స్ ప్రీమియం ప్లస్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు రెండు రెట్లు పెరిగాయి. గత మూడు నెలల్లో సబ్స్క్రిప్షన్ ప్లాన్లను పెంచడం ఇదే రెండో సారి. ఇండియాలో ఇప్పటివరకు ఎక్స్ ప్రీమియం ప్లస్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధర నెలకు రూ.1750 మాత్రమే. ధరలు పెరిగిన తరువాత ఇది రూ.3,470కు చేరింది. వార్షిక ప్లాన్ కూడా రూ.18,300 నుంచి రూ.34,340కి పెరిగింది. బేసిక్ ప్లాన్ ధర నెలకు రూ.244 కాగా.. ప్రీమియం ప్లాన్ ధర రూ.650గా ఉన్నాయి. -
యాపిల్ కొత్త ఫోన్.. 16e: ధర తెలిస్తే కొనేస్తారు!
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'ఐఫోన్ 16ఈ'ను యాపిల్ లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ ఫోన్ 2025లో అత్యంత సరసమైన మోడల్‌గా ఐఫోన్ 16 లైనప్‌లోకి చేరింది. వేగవంతమైన పనితీరు కోసం ఇది ఏ18 చిప్ పొందుతుంది.. యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ కూడా ఇందులో ఉంటుంది.వింటర్ బ్లూ, లేక్ గ్రీన్, నలుపు, తెలుపు రంగులలో లభించే కొత్త ఐఫోన్ 16ఈ 125 జీబీ, 256 జీబీ, 512 జీబీ స్టోరేజ్ కెపాసిటీలతో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 59,900. ఫ్రీ ఆర్డర్స్ శుక్రవారం (ఫిబ్రవరి 21) నుంచి ప్రారంభమవుతాయి. ఆ తరువాత వారంలో సేల్స్ మొదలవుతాయి.ఐఫోన్ 16ఈలో.. వినియోగదారులకు ఇష్టమైన ఐఫోన్ 16 లైనప్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. ఇది సిరామిక్ షీల్డ్ ఫ్రంట్ కవర్, టఫ్ బ్యాక్ గ్లాస్‌తో కూడిన 6.1 ఇంచెస్ సూపర్ రెటినా XDR డిస్ప్లే పొందుతుంది. సిరామిక్ షీల్డ్ ఫ్రంట్ కవర్ అనేది.. స్మార్ట్‌ఫోన్ గ్లాస్ కంటే పటిష్టంగా ఉండే లేటెస్ట్ ఫార్ములేషన్‌ను కలిగి ఉందని కంపెనీ తెలిపింది. ఇదీ చదవండి: ఎక్స్ యూజర్లకు షాక్!.. భారీగా పెరిగిన ధరలుఏ18 చిప్ ద్వారా శక్తిని పొందే.. ఐఫోన్ 16ఈ ఫోన్ ఇంటిగ్రేటెడ్ 2x టెలిఫోటో లెన్స్‌తో 48MP ఫ్యూజన్ కెమెరాను పొందుతుంది. అంతే కాకుండా ఎయిర్పాడ్లు, ఆపిల్ విజన్ ప్రో లేదా సరౌండ్ సౌండ్ సిస్టమ్‌తో ఇమ్మర్సివ్ లిజనింగ్ కోసం స్పేషియల్ ఆడియోలో వీడియోను కూడా రికార్డ్ చేస్తుంది. మొత్తం మీద ఈ లేటెస్ట్ ఫోన్ అన్ని విధాలా వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది. -
ఆన్లైన్ లవ్.. రూ.4.3 కోట్లు అర్పించేసుకున్న మహిళ
టెక్నాలజీ ఎంతగా పెరుగుతోందో.. స్కామర్లు కూడా అంతే వేగంగా పెరిగిపోతున్నారు. ఆన్లైన్లో ఎప్పుడైనా ఆదమరిస్తే.. చెబుకు చిల్లు ఖాయమే. ఇలాంటి ఘటనలు గతంలో కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో సంఘటన ఆస్ట్రేలియాలో వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ఆస్ట్రేలియాకు చెందిన మహిళ 'అన్నెట్ ఫోర్డ్' ఆన్లైన్లో ప్రేమ కోసం వెతుకుతున్నప్పుడు.. స్కామర్ల చేతికి చిక్కింది. దీంతో సుమారు 4.3 కోట్లు (780000 ఆస్ట్రేలియన్ డాలర్స్) పోగొట్టుకుంది. పెళ్ళై కొన్నేళ్ళకు భర్తతో విడిపోయిన తరువాత.. 2018లో ఫోర్డ్ ఆన్లైన్ డేటింగ్ వైపు మొగ్గు చూపి, 'ప్లెంటీ ఆఫ్ ఫిష్' అనే డేటింగ్ సైట్లో చేరింది. ఇక్కడే 'విలియం' అనే వ్యక్తితో చాట్ చేయడం ప్రారంభించింది.కొన్ని నెలల తరువాత మలేషియాలోని కౌలాలంపూర్‌లో కొంతమంది పర్సు, కార్డులను ఎవరో దొంగలించారని చెప్పి, అన్నెట్ ఫోర్డ్ నుంచి విలియం రూ. 2.75 లక్షలు తీసుకున్నాడు. ఆ తరువాత కూడా బ్యాంక్ కార్డులు పోయాయని.. మెడికల్స్ బిల్స్, హోటల్స్ బిల్స్ వంటివి చెల్లించాలని మరికొంత డబ్బు తీసుకున్నాడు. తాను (ఫోర్డ్) మోసపోయానని గ్రహించే సమయానికి ఆమె రూ. 1.6 కోట్లు నష్టపోయింది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీసులకు నివేదించిప్పటికీ.. ఫలితం లేకుండా పోయింది.ఫేస్బుక్లో రెండో స్కామ్నాలుగు సంవత్సరాల తరువాత, 'అన్నెట్ ఫోర్డ్' ఫేస్బుక్లో మరొక స్కామ్ బారిన పడింది. ఆమ్స్టర్డామ్కు చెందినవాడినని చెప్పుకునే 'నెల్సన్' అనే వ్యక్తితో పరిచయం ఏర్పడిన తరువాత.. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI)లో తన స్నేహితుడు ఉన్నాడని, అతనిపై దర్యాప్తు జరుగుతోందని, అతనికి సహాయం చేయడానికి 2500 AUD (సుమారు రూ. 1.3 లక్షలు) అవసరమని చెప్పాడు.మొదట్లో అనుమానం వచ్చిన ఫోర్డ్ డబ్బు పంపించడానికి నిరాకరించింది. అయితే, నెల్సన్ ఆమెను బిట్‌కాయిన్ ATMలో డబ్బు జమ చేయమని ఒప్పించాడు. ఆ తరువాత కొన్ని రోజులకు ఆమె ఖాతాలోకి డబ్బు వచ్చి వెళ్లడం గమనించింది. అసలు విషయం తెలుసుకునే లోపే.. రూ. 1.5 కోట్లు పోగొట్టుకుంది.ఇదీ చదవండి: 'ఉచితంగా పనిచేస్తా.. ఉద్యోగమివ్వండి': టెకీ పోస్ట్ వైరల్మోసపోయిన తరువాత ఫోర్డ్.. ఆస్ట్రేలియన్లను ఇలాంటి మోసాలకు బలికావద్దని హితవు పలికింది. గుర్తు తెలియని వ్యక్తులు నమ్మకంగా మాట్లాడి.. చివరికి మీ నుంచి డబ్బు లాగేస్తారని, తరువాత మీరే దివాళా తీస్తారని చెప్పింది. మొత్తం మీద ఆన్లైన్లో ఏదైనా సెర్చ్ చేసేటప్పుడు, గుర్తు తెలియని వ్యక్తులకు స్పందించేటప్పుడు.. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టమవుతోంది. -
‘గ్రోక్ 3’ను ఆవిష్కరించిన మస్క్
ఎక్స్ఏఐ కొత్త వర్షన్ ‘గ్రోక్ 3(Grok 3)’ని ప్రారంభిస్తున్నట్లు కంపెనీ సీఈఓ ఎలాన్‌మస్క్(Elon Musk) ప్రకటించారు. ఎక్స్‌లో ఇంజినీర్ల సమక్షంలో ఏర్పాటు చేసిన లైవ్ స్ట్రీమ్ ప్రజెంటేషన్‌లో ఈ కొత్త జనరేటివ్ ఏఐ మోడల్‌ను మస్క్ ఆవిష్కరించారు. గ్రోక్ 3 ఇప్పటివరకు ఉన్న గ్రోక్ 2 కంటే 10 రెట్లు ఎక్కువ సామర్థ్యంతో పని చేస్తుందని మస్క్ పేర్కొన్నారు. గణితం, సైన్స్, కోడింగ్ వంటి వివిధ విభాగాల్లో మార్కెట్లో పోటీదారులుగా ఉన్న ఆల్ఫాబెట్ ఇంక్‌కు చెందిన గూగుల్ జెమిని, డీప్ సీక్- వీ 3 మోడల్, ఆంత్రోపిక్-క్లాడ్, ఓపెన్ఎఐ-జీపీటీ-4ఓ కంటే సమర్థంగా పని చేస్తుందని చెప్పారు.ప్రెజెంటేషన్ సమయంలో మస్క్ గ్రోక్ 3 అధునాతన తార్కిక సామర్థ్యాలను, సంక్లిష్ట ప్రశ్నలను అర్థం చేసుకొని వాటికి ప్రతిస్పందించే విధానాలను హైలైట్ చేశారు. మెషిన్ లెర్నింగ్ పద్ధతులను ఉపయోగించి సింథటిక్ డేటాసెట్లపై ఈ మోడల్ శిక్షణ పొందినట్లు చెప్పారు. ఇది తప్పుడు సమాచారాన్ని తగ్గించడానికి సహాయపడుతుందని పేర్కొన్నారు. గ్రోక్ 3 ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యంత శక్తివంతమైన ఏఐ మోడళ్లలో ఒకటిగా మారిందని తెలిపారు.ఇదీ చదవండి: అంతకంతకూ పెరుగుతున్న బంగారం ధర!గ్రోక్ 3తోపాటు డీప్ సెర్చ్ అని పిలువబడే కొత్త స్మార్ట్ సెర్చ్ ఇంజిన్‌ను కూడా ఈ సందర్భంగా ప్రవేశపెట్టారు. ఇది వినియోగదారులకు మెరుగైన పరిశోధనలు అన్వేషించడానికి, డేటాను విశ్లేషించడానికి అనుమతిస్తుందని కంపెనీ తెలిపింది. గ్రోక్ 3 మోడల్ ఎక్స్ ప్లాట్‌ఫామ్ ప్రీమియం ప్లస్ చందాదారులకు ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుందని పేర్కొంది. సూపర్ గ్రోక్ అని పిలువబడే కొత్త సబ్ స్క్రిప్షన్ ద్వారా ఇతరులకు దీని సేవలు అందిస్తున్నట్లు చెప్పింది. -
నాన్-టెక్ గ్రాడ్యుయేట్ల పాలిట శాపంగా ఏఐ!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆటోమేషన్ పురోగతి చెందుతున్న నేపథ్యంలో ప్రపంచ జాబ్ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. అయితే ఏఐలో వస్తున్న పురోగతి కొందరికి అవకాశాలు సృష్టిస్తుంటే.. ఇంకొందరి పాలిట శాపంగా మారుతోంది. ముఖ్యంగా భారతదేశంలోని నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్లు ఏఐలో వస్తున్న మార్పులకు అనుగుణంగా నైపుణ్యాలు నేర్చుకోవడం విఫలమవుతున్నారని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధిత ఉద్యోగాలకు డిమాండ్ పెరుగుతున్నప్పటికీ, సరైన సాంకేతిక నైపుణ్యాలులేక వాటికి దూరంగా ఉంటున్నారని తెలియజేస్తున్నారు. నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ల ఉద్యోగ జీవితాలను ఏఐ ఎలా ప్రభావితం చేస్తుందో టెక్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఉద్యోగావకాశాల సవాళ్లునాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్లు ఎదుర్కొంటున్న ప్రాథమిక సమస్య మెరుగైన ఉద్యోగావకాశాలు లేకపోవడం. వారికి ఆ ఉద్యోగాలకు తగిన సాంకేతిక నైపుణ్యాలు లేవపోవడమే కారణం. దాంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత జాబ్ మార్కెట్ అవసరాలను వారు తీర్చలేకపోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఏఐ నైపుణ్యాలు కలిగిన వారికి బలమైన డిమాండ్ ఉన్నప్పటికీ, నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్లు దీన్ని అందిపుచ్చుకోవడం లేదు. టెక్నికల్ స్కిల్స్ మాత్రమే కాకుండా అడాప్టబిలిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్, కమ్యూనికేషన్ వంటి కీలకమైన నాన్ టెక్నికల్ స్కిల్స్ కూడా వారికి కెరియర్‌కు గుదిబండగా మారుతున్నాయి.ఎంప్లాయిబిలిటీ రేటు తగ్గుదలభారత్లో నాన్ టెక్ గ్రాడ్యుయేట్ల ఎంప్లాయిబిలిటీ రేటు గణనీయంగా పడిపోయిందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. దానికితోడు చాలా కంపెనీలు ఏఐ వాడకాన్ని పెంచుతుండడం, వాటిని ఈ గ్రాడ్యుయేట్లు అందిపుచ్చుకోలేక పోతుండడం ప్రధాన కారణంగా ఉన్నాయి. ఈ ధోరణి వారి నైపుణ్యాలను పెంచుకోవాల్సిన తక్షణ అవసరాన్ని నొక్కి చెబుతుంది.పరిష్కారం ఇలా..పరిశ్రమ డిమాండ్లు, నాన్-టెక్ గ్రాడ్యుయేట్ల సామర్థ్యాల మధ్య అంతరాన్ని పూడ్చడానికి, మెరుగైన సాఫ్ట్ స్కిల్స్, టెక్నికల్ నాలెడ్జ్ అవసరం. గ్రాడ్యుయేట్లు క్రిటికల్ థింకింగ్, సృజనాత్మకత, సమర్థవంతమైన కమ్యూనికేషన్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వంటి సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవడంపై దృష్టి పెట్టాలి. నిరంతరం మారుతున్న పని వాతావరణంలో వృద్ధి చెందడానికి ఈ నైపుణ్యాలు ఎంతో తోడ్పడుతాయి.ఇదీ చదవండి: దేశవ్యాప్తంగా రూ.2,000 కోట్లతో అదానీ స్కూల్స్విద్యా సంస్థల పాత్ర కీలకంభవిష్యత్ శ్రామిక శక్తికి విద్యార్థులను సిద్ధం చేయడంలో విద్యా సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయి. నైపుణ్య అంతరాలను పరిష్కరించడానికి సమగ్ర విధానాన్ని అవలంబించాలి. ఇంటర్ డిసిప్లినరీ కోర్సులను ఏకీకృతం చేయడం, అనుభవపూర్వక అభ్యసనను ప్రోత్సహించడం, విద్యార్థులను రియల్‌టైమ్ ప్రాజెక్టుల్లో నిమగ్నమయ్యేలా ఏర్పాటు చేయడం వంటి అంశాలను పరిగణించాలి. దీని ద్వారా విద్యా సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత జాబ్ మార్కెట్లో విజయం సాధించడానికి అవసరమైన విభిన్న నైపుణ్యాలతో గ్రాడ్యుయేట్లను సన్నద్ధం చేసే అవకాశం ఉంటుంది. -
Wi-Fi.. Slow?.. ఈ ట్రిక్‌తో పరుగు ఖాయం
వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవవారికి, కంటెంట్ క్రియేటర్స్‌కు, స్మార్ట్ హోమ్‌కు ఇంటర్నెట్ కనెక్షన్ అనేది తప్పనిసరి. ఇందుకోసం వినియోగించే వైఫై కాలం గడిచేకొద్దీ స్పీడ్ తగ్గుతుంటుంది. దీంతో యూజర్స్‌లో అసహనం తలెత్తుతుంది. ఇలా జరగకూడదంటే కొన్ని ట్రిక్కులను, స్టెప్స్‌ను ఫాలో చేయడం ద్వారా Wi-Fiని పరిగెత్తించవచ్చు.మన ఇంటిలోని కొన్ని ఉపకరణాలను వినియోగించి Wi-Fi సిగ్నల్స్‌ను రిఫ్లక్ట్ లేదా రీడెరెక్ట్ చేయవచ్చు. ఫలితంగా ఇంటర్నెట్ స్పీడందుకుంటుంది. రూటర్ వెనుక భాగాన అల్యూమినియం ఫాయిల్‌ను అమర్చడం ద్వారా దానిని ఒక షిఫ్ట్ రిఫ్లెక్టర్‌గా మార్చవచ్చు. ఫలితంగా దాని సిగ్నల్‌ను ఇంప్రూవ్ చేయవచ్చు. ఇందుకోసం అల్యూమినియం ఫాయిల్‌ను ఒక అట్టకు అతికించాల్సి ఉంటుంది. తరువాత దానిని రూటర్ వెనుక భాగాన ఉంచాలి. అయితే దీనిని అమర్చేటప్పుడు ఫాయిల్ రూటర్‌లోని ఏ భాగానికీ టచ్ కాకుండా చూసుకోవాలి. ఇది Wi-Fi రూటర్‌కు సిగ్నల్ అవాంతరాలను నివారిస్తుంది.Wi-Fi రూటర్ ఓవర్ హీటింగ్‌కు గురికాకుండా చూసుకోవడం మరొక ముఖ్యమైన పని. ఇందుకోసం Wi-Fi రూటర్‌ను ఎండ తగలని లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరం నుంచి వేడి వెలువడని ప్రాంతంలో ఉంచడం తప్పనిసరి. Wi-Fi రూటర్‌ను చల్లని ప్రాంతంలో ఉంచడం ద్వారా అది వేడెక్కకుండా చూడగలుగుతాం. Wi-Fi స్పీడ్ స్లో అయినప్పుడు దానిని రోజుకు ఒక్కసారైనా స్విచ్ ఆఫ్ చేయాలి. ఇలా చేయడం వలన Wi-Fi కనెక్టివిటీ రిఫ్రెష్ అవుతుంది. ఇంప్రూవ్ కూడా అవుతుంది. ఈ ఉపాయాలను అనుసరించి మీ Wi-Fi సిగ్నల్‌ను మెరుగుపరుచుకోండి.ఇది కూడా చదవండి: పలు కుంభమేళా రైళ్లు రద్దు.. టిక్కెట్ బుక్ చేసుకుంటే నగదు వాపస్ -
స్మార్ట్ టీవీలకు జియో ఆపరేటింగ్ సిస్టమ్
స్మార్ట్ టీవీల కోసం దేశీయంగా తొలి ఆపరేటింగ్ సిస్టమ్ జియోటెలి ఓఎస్‌ను ఆవిష్కరించినట్లు రిలయన్స్ జియో వెల్లడించింది. దీనితో తయారైన థామ్సన్, కొడక్, బీపీఎల్, జేవీసీ వంటి బ్రాండ్స్‌కి చెందిన స్మార్ట్ టీవీలు ఫిబ్రవరి 21 నుంచి అందుబాటులోకి వస్తాయని తెలిపింది. ఈ ఏడాది మరిన్ని బ్రాండ్స్ చేతులు కలిపే అవకాశం ఉందని వివరించింది.ఇదీ చదవండి: యూఎస్‌తో డీల్‌పై ఆందోళన అక్కర్లేదుభారతీయ వినియోగదారుల అవసరాలను తీరుస్తూ, సరికొత్త వినోద అనుభూతిని అందించే కొత్త తరం ప్లాట్‌ఫాంగా జియోటెలి ఓఎస్‌ను జియో అభివరి్ణంచింది. ఈ విభాగంలో గూగుల్ ఆండ్రాయిడ్ టీవీ, వెబ్ఓఎస్, శాంసంగ్ టైజెన్‌లతో జియోటెలి ఓఎస్ పోటీపడనుంది. కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ ప్రకారం భారత్‌లో స్మార్ట్ టీవీల మార్కెట్ 1.34 కోట్ల యూనిట్‌గా ఉండగా, ఆదాయాలు సుమారు రూ. 52 వేల కోట్ల స్థాయిలో ఉన్నాయి. ఓపెన్ సెల్స్‌పై కస్టమ్స్ సుంకాలు తగ్గిస్తూ బడ్జెట్లో చేసిన ప్రతిపాదనలతో స్థానికంగా డిస్ప్లేల అసెంబ్లింగ్‌కి ఊతం లభించి, అంతిమంగా తయారీ సంస్థలకు ఖర్చులు 5–10% ఆదా కాగలవని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ వీపీ (రీసెర్చ్) నీల్ షా చెప్పారు. -
ఏఐ ‘బ్రెయిన్ డ్రెయిన్’!
సాక్షి, హైదరాబాద్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో మేధో వలస (బ్రెయిన్ డ్రెయిన్) భారత్‌కు పెద్ద సవాల్‌గా మారబోతోంది. యువతలో ఏఐ నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో మంచి పురోగతి ఉన్నా, వారు దేశంలోనే స్థిరపడేలా చేయడంలో విఫలమవుతున్నట్టు పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. భారతీయ ఏఐ నిపుణులు అమెరికా వంటి దేశాలకు వలస వెళ్తున్నారు. భారీ వేతనాలతోపాటు అత్యాధునిక పరిశోధనలకు మంచి వాతావరణం ఉండడంతో అటువైపు ఆకర్షితులవుతున్నారు. ‘ఏఐ టాలెంట్ కాన్సన్ట్రేషన్’లో ప్రపంచంలో భారత్ 13వ స్థానంలో నిలిచినట్టు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ‘ఏఐ ఇండెక్స్ రిపోర్ట్–2024’ప్రకటించింది. ప్రపంచంలో ఏఐ మేధో వలసలో మాత్రం మొదటి స్థానంలో నిలిచినట్లు వెల్లడించింది. ఏఐ నైపుణ్యాలున్న ప్రతి 10 వేల మంది లింక్డ్ఇన్ ఖాతాదారుల్లో 0.76 శాతం (నెట్ మైగ్రేషన్ రేటు) మేధో వలస ఉన్నట్టు తెలిపింది. అంటే ప్రతి పదివేల మంది భారతీయ ఏఐ నిపుణుల్లో దాదాపు ఒకశాతం విదేశాలకు వలసపోతున్నారు. ఏఐ పేటెంట్స్‌లోనూ అథమ స్థానమే ఏఐ పేటెంట్స్ విషయంలోనూ భారత్ వెనుకబడే ఉంది. 2022లో ప్రపంచస్థాయి ఏఐ పేటెంట్స్‌లో మనదేశం 0.23 శాతానికే పరిమితమైంది. ఈ విషయంలో చైనా ఆధిపత్యం కొనసాగుతోంది. గ్లోబల్ ఏఐ పేటెంట్స్‌లో 61.13 శాతంతో చైనా మొదటిస్థానంలో నిలువగా, 20.9 శాతంతో అమెరికా రెండో స్థానంలో ఉంది. ఏఐ మౌలికసదుపాయాల పటిష్టానికి ‘కంప్యూటింగ్ కెపాసిటీ’లో పెట్టుబడులు పెడుతున్నా పెద్దగా ప్రభావం చూపడం లేదు. ఏఐ టూల్స్ ఫౌండేషన్ టెక్నాలజీలో ‘లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్’ అందుబాటులోకి రావడంతో చైనాకు చెందిన డీప్‌సీక్–వీ2, అమెరికాకు చెందిన చాట్ జీపీటీ వంటివి గ్లోబల్ బెంచ్‌మార్క్‌గా నిలిచాయి. దీంతో భారత్‌కు సవాళ్లు ఎదురవుతున్నట్టు నిపుణులు చెప్తున్నారు. 2023 నాటికి భారత్ 60 జెనరేటివ్ ఏఐ స్టార్టప్‌లు కలిగి ఉన్నట్టు ప్రకటించుకున్నా (2021తో పోల్చితే రెండింతలు పెరుగుదల), ఈ రంగంలో గ్లోబల్ లీడర్‌గా ఎదిగేందుకు మరిన్ని కీలకమార్పులు చేయాల్సిన అవసరముందని అంటున్నారు. భారత్‌లో ఏఐ రంగం అభివృద్ధి, మేధో వలసల నిరోధానికి నిపుణుల సూచనలు » డేటా సెంటర్లు,కంప్యూటింగ్ వనరులు పెంచుకునేందుకు భారీగా పెట్టుబడులు పెట్టాలి. ఏఐ, డీప్‌టెక్ వంటి వాటిలో ప్రపంచస్థాయి రిసెర్చ్సెంటర్లు, ల్యాబ్‌లు, ఇన్నోవేషన్ హబ్స్ఏర్పాటుకు పెద్దమొత్తంలో నిధులు కేటాయించాలి. » అత్యుత్తమ ప్రతిభ,నైపుణ్యాలున్నవారు దేశం వదిలి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలి. » ఏఐని సమాజాభివృద్ధికి, వైద్య, ఆరోగ్య, వ్యవసాయం, పర్యావరణ పరి రక్షణ తదితర రంగాల్లో విస్తారంగా వినియోగించాలి. » ప్రస్తుతం అమెరికాలోని సిలికాన్వ్యాలీలోఅత్యుత్తమ ఏఐనిపుణుల్లో భారతసంతతివారేఅధికంగా ఉన్నారు. వారిలో కొందరినైనా తిరిగి భారత్‌కు రప్పించి అవసరమైన పరిశోధన పర్యావరణ వ్యవస్థను, సౌకర్యాలను కల్పిస్తే మంచి ఫలితాలుసాధించవచ్చు. అవకాశాలు పెంచాలి బ్రెయిన్ డ్రెయిన్‌ను బ్రెయిన్ గెయిన్గా మార్చుకునేందుకు దేశంలో మంచి ఏఐ పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. దేశం నుంచి ఏఐ మేధో వలస ప్రమాదకర స్థాయిలో ఏమీలేదు. నిపుణులు నైపుణ్యాలు పెంచుకునేందుకు సరైన అవకాశాలు కల్పించే బాధ్యత ప్రభుత్వ సంస్థలపై ఉంది. ఎంతగా పోటీతత్వాన్ని ప్రోత్సహిస్తే అంతగా నైపుణ్యాలు, నూతన ఆవిష్కరణలకు అవకాశం ఉంటుంది. పాఠశాల స్థాయి నుంచే సిలబస్‌లో ఏఐ, మెíషీన్ లెరి్నంగ్ వంటివి చేర్చాలి. నాణ్యమైన శిక్షణ, ఇంక్యుబేషన్, ఇన్నోవేషన్ సెంటర్లను అందుబాటులోకి తెస్తే దేశంలోని అద్భుతమైన నైపుణ్యాలు వెలుగులోకి వస్తాయి. –వెంకారెడ్డి, వైస్‌ప్రెసిడెంట్, సీనియర్ హెచ్ఆర్ లీడర్, కో ఫోర్జ్. -
‘ఇన్ఫోసిస్ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది’
ఐటీ దిగ్గజాలు కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ మధ్య న్యాయ పోరాటం తీవ్రంగా మారింది. తమ హెల్త్‌కేర్ సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన వాణిజ్య రహస్యాలను ఇన్ఫోసిస్ దొంగిలించి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిందని కాగ్నిజెంట్ ఆరోపించింది. పోటీ ఉత్పత్తిని అభివృద్ధి చేయడానికి ఇన్ఫోసిస్ గోప్యమైన డేటాను దుర్వినియోగం చేసిందని, బహిర్గతం చేయని ఒప్పందాలను (NDAs) ఉల్లంఘించిందని కాగ్నిజెంట్ ఆరోపించింది .కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్‌ల మధ్య యూఎస్ కోర్టులో ఓ దావా నడుస్తోంది. తమ హెల్త్ కేర్ సాఫ్ట్వేర్ ట్రైజెట్టో వాణిజ్య రహస్యాలను ఇన్ఫోసిస్ దొంగిలించిందని ఆరోపిస్తూ కాగ్నిజెంట్ కేసు దాఖలు చేసిందని మింట్ నివేదిక తెలిపింది. "నాన్ డిస్క్లోజర్ అండ్ యాక్సెస్ అగ్రిమెంట్స్ (NDAAs) ద్వారా ఇన్ఫోసిస్ తమ ట్రైజెట్టో వాణిజ్య రహస్యాలను దుర్వినియోగం చేస్తూ ఇన్ఫోసిస్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది" అని 22 పేజీల కోర్టు ప్రతిస్పందనను ఉటంకిస్తూ నివేదిక పేర్కొంది.ఇదీ చదవండి: టీసీఎస్ వీసా ఫ్రాడ్ చేసింది.. మాజీ ఉద్యోగుల ఆరోపణలు తమ ట్రైజెట్టో సమాచారాన్ని ఉపయోగించారా లేదా అన్నది ఆడిట్ చేయడానికి ఇన్ఫోసిస్ నిరాకరించిందని, ఇది తన తప్పును రుజువు చేస్తుందని కాగ్నిజెంట్ వాదిస్తోంది. ఈ చట్టపరమైన వివాదం 2024 ఆగస్టు నాటిది. కాగ్నిజెంట్ మొదట డల్లాస్ కోర్టులో ఈ ప్రకటన చేసింది. గత జనవరి 9న దాఖలు చేసిన కేసులో ఈ ఆరోపణను ఇన్ఫోసిస్ తిరస్కరించింది, కాగ్నిజెంట్‌కు సంబంధించిన హెల్త్ కేర్ సొల్యూషన్స్ బహిరంగంగానే ఉన్నాయని, అందులో వాణిజ్య రహస్యాలు ఏమున్నాయో వారే చూసుకోవాలని కాగ్నిజెంట్‌కు సూచించాలని కోర్టును ఇన్ఫోసిస్ కోరింది.ఇన్ఫోసిస్ ప్రతి దావాఇన్ఫోసిస్ తరువాత కాగ్నిజెంట్ పై ప్రతి దావా వేసింది. దాని సీఈవో రవి కుమార్ ఇన్ఫోసిస్ లో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇన్ఫోసిస్ సొంత హెల్త్‌కేర్ సాఫ్ట్వేర్ ఉత్పత్తిని విడుదల చేయడాన్ని కావాలని ఆలస్యం చేశారని, కాగ్నిజెంట్‌లో ఉద్యోగం కోసం చర్చలు జరిపారని ప్రత్యారోపణలు చేసింది. రవి కుమార్ 2022 అక్టోబర్‌లో ఇన్ఫోసిస్‌ను వీడారు. ఆ తర్వాత ఏడాది అంటే 2023 జనవరిలో కాగ్నిజెంట్‌లో సీఈవోగా చేరారు. రెండు కంపెనీలు ఆరోగ్య సంరక్షణ సేవల రంగంలో పోటీ పడుతున్నాయి. ఇన్ఫోసిస్ ఆదాయంలో దాదాపు 7.5 శాతం లైఫ్ సైన్సెస్ రంగ క్లయింట్ల నుంచే పొందుతోంది. కాగ్నిజెంట్‌కు కూడా తమ క్లయింట్లలో దాదాపు మూడోవంతు హెల్త్ కేర్ నుంచే ఉన్నారు. -
వీసా ఫ్రాడ్.. టీసీఎస్‌పై తీవ్ర ఆరోపణలు
దేశంలో అతిపెద్ద ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) వీసా మోసం (Visa fraud) ఆరోపణలను ఎదుర్కొంటున్నట్లు సమాచారం. అమెరికా కార్మిక చట్టాలను పక్కదారి పట్టించేందుకు కంపెనీ ప్రత్యేక వర్క్ వీసాలను దుర్వినియోగం చేసిందని విజిల్బ్లోయర్లు ఆరోపిస్తున్నారు. ఫ్రంట్‌లైన్ కార్మికులను అమెరికాకు తీసుకురావడానికి వారిని మేనేజర్లుగా ముద్ర వేసి ఎల్-1ఏ మేనేజర్ వీసాలను దుర్వినియోగం చేసిందని వ్యాజ్యాలతోపాటు బ్లూమ్‌బెర్గ్ న్యూస్ ఇన్వెస్టిగేషన్‌లోనూ ఆరోపించారు.2017లో డోనాల్డ్ ట్రంప్ పరిపాలన ఎంప్లాయిమెంట్ వీసాలపై దృష్టి సారించినప్పుడు, కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు అంతర్గత సంస్థాగత చార్ట్‌లను తప్పుగా రూపొందించాలని తనకు సూచించారని డెన్వర్‌లో టీసీఎస్‌కు ఐటీ మేనేజర్‌గా పనిచేసిన అనిల్ కిని ఆరోపించారని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ఫెడరల్ పరిశీలనను తప్పించుకోవడానికి ఫ్రంట్‌లైన్ ఉద్యోగులను మేనేజర్లుగా తప్పుగా చూపించడమే దీని ఉద్దేశమని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.అనిల్ కిని, మరో ఇద్దరు మాజీ టీసీఎస్ ఉద్యోగులతో కలిసి ఫెడరల్ ఫాల్స్ క్లెయిమ్స్ యాక్ట్ కింద దావాలు దాఖలు చేశారని, కంపెనీ ఎల్-1ఏ వీసా వ్యవస్థను దుర్వనియోగం చేస్తోందని ఆరోపించారని నివేదిక పేర్కొంది. మేనేజర్ స్థాయి అధికారుల బదిలీల కోసం ఉద్దేశించిన ఈ వీసాలు, కఠినమైన వేతనం, విద్యా అవసరాలు కలిగిన హెచ్-1బీ నైపుణ్యం కలిగిన కార్మిక వీసాల కంటే తక్కువ నియంత్రణలు కలిగి ఉంటాయి. అనిల్ కిని దావాను ఈ సంవత్సరం ప్రారంభంలో కొట్టివేసినప్పటికీ ఆయన ఈ నిర్ణయాన్ని అప్పీల్ చేశాడని నివేదిక వివరించింది.ఇదీ చదవండి: టీసీఎస్ కొత్త డీల్.. ఫిన్లాండ్ కంపెనీతో..2019 అక్టోబర్, 2023 సెప్టెంబర్ మధ్య యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) 90,000 కంటే ఎక్కువ ఎల్-1ఏ వీసాలను ఆమోదించింది. వీటిని ప్రధానంగా ఐటీ అవుట్సోర్సింగ్ సంస్థలు యూఎస్ కంపెనీలకు సమాచార సాంకేతిక పనులను నిర్వహించడానికి ఉపయోగించాయి. వీటిలో 6,500 కంటే ఎక్కువ ఎల్-1ఏ వీసాలతో టీసీఎస్ అగ్రస్థానంలో ఉంది. తరువాతి ఏడు అతిపెద్ద గ్రహీతలు కలిపి పొందిన ఎల్-1ఏ వీసాల కంటే టీసీఎస్ ఒక్కటే పొందిన ఎల్-1ఏ వీసాల సంఖ్య అధికం.ఖండించిన టీసీఎస్ తమపై వచ్చిన ఆరోపణలను టీసీఎస్ తీవ్రంగా ఖండించింది. "కొనసాగుతున్న వ్యాజ్యాలపై టీసీఎస్ వ్యాఖ్యానించదు. అయితే కొంతమంది మాజీ ఉద్యోగుల ఈ తప్పుడు ఆరోపణలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. వీటిని గతంలో అనేక కోర్టులు, ట్రిబ్యునళ్లు తోసిపుచ్చాయి. టీసీఎస్ అన్ని యూఎస్ చట్టాలకు కట్టుబడి ఉంటుంది" అని కంపెనీ ప్రతినిధి ఒకరు చెప్పినట్లు వార్తా సంస్థ పేర్కొం -
తెలంగాణలో మాజిల్లానిక్ క్లౌడ్ విస్తరణ
హైదరాబాద్: అగ్రగామి టెక్నాలజీ ఆవిష్కర్త మాజిల్లానిక్ క్లౌడ్ లిమిటెడ్ ఇటీవల నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీలో (ఎన్ఎస్ఈ) లిస్టయిన నేపథ్యంలో తదుపరి దశ వృద్ధిని వేగవంతంగా సాధించడంపై దృష్టి పెడుతోంది. ఒకవైపు గణనీయంగా ఉద్యోగావకాశాలు కల్పిస్తూనే మరోవైపు ఏఐ ఆధారిత పరివర్తనపై మరింతగా దృష్టి సారిస్తూ ఈ-సర్వైలెన్స్, స్కానలిటిక్స్ లాంటి వీడియో అనలిటిక్స్ సొల్యూషన్స్, డీప్-టెక్ సొల్యూషన్స్ మొదలైన వాటిల్లో కార్యకలాపాలను విస్తరిస్తోంది.అధునాతన డ్రోన్ టెక్నాలజీలో అగ్రగామిగా తన స్థానాన్ని పటిష్టం చేసుకుంటూ, మాజిల్లానిక్ క్లౌడ్ సంస్థ దేశీయంగా 200 కేజీల పేలోడ్‌ను మోసుకెళ్లగలిగే, వాణిజ్యావసరాలకు అందుబాటులో ఉన్న, అత్యంత శక్తిమంతమైన కార్గో డ్రోన్ అయిన కార్గోమ్యాక్స్ 200KHCని (CargoMax 200KHC) కూడా ఆవిష్కరించింది. బీఎఫ్ఎస్ఐ, టెలికం, ఆటోమోటివ్, హెల్త్‌కేర్ తదితర రంగాల కోసం కస్టమైజ్ చేసిన మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, జెన్ ఏఐ లాంటి అధునాతన కృత్రిమ మేథ సాంకేతికతల ద్వారా లభించే అవకాశాలు ఈ మార్గదర్శ ప్రణాళికకు కీలకంగా ఉండనున్నాయి. ఇటు ఆర్గానిక్గాను అటు వ్యూహాత్మక కొనుగోళ్ల ద్వారా ఇనార్గనిక్గాను వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేలా మాజిల్లానిక్ క్లౌడ్ దృష్టి పెడుతోంది.“సెక్యూరిటీ భవిష్యత్తనేది ఏఐ, సర్వైలెన్స్ కలబోతపై ఆధారపడి ఉంది. తెలంగాణలోని మా కార్యాలయాలు, ముడి డేటాను ఇటు పబ్లిక్ అటు ప్రైవేట్ రంగ క్లయింట్లు తగు నిర్ణయాలు తీసుకోవడంలో తోడ్పడే మేథోసంపత్తిగా తీర్చిదిద్దే, అధునాతన వీడియో అనలిటిక్స్ సిస్టంలను అభివృద్ధి చేసే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా దోహదపడతాయి” అని మాజిల్లానిక్ క్లౌడ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, గ్లోబల్ సీఈవో జోసెఫ్ సుధీర్ తుమ్మ తెలిపారు.“తెలంగాణ పురోగామి విధానాలు, ప్రతిభావంతుల లభ్యత కారణంగా మా కార్యకలాపాల విస్తరణకు ఇది అనువైన ప్రాంతంగా ఉంది. మేము స్థానికంగా అభివృద్ధికి దోహదపడుతూనే అటు అంతర్జాతీయ క్లయింట్లకు కూడా సేవలు అందించేందుకు మాకు తోడ్పడుతోంది” అని జోసెఫ్ సుధీర్ తుమ్మ వివరించారు. -
బీఎస్ఎన్ఎల్ కొత్త రీచార్జ్ ప్లాన్.. 54 రోజులు..
ప్రభుత్వ టెలికం కంపెనీ బీఎస్ఎన్ఎల్ (BSNL) ఎప్పటికప్పుడు చౌక రీచార్జ్ ప్లాన్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. తాజాగా కొత్త బడ్జెట్-ఫ్రెండ్లీ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇది వినియోగదారులకు అపరిమిత కాలింగ్, రోజువారీ డేటా, ఉచిత ఎస్ఎంఎస్ వంటి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది.కొత్త ప్లాన్ ప్రయోజనాలురూ. 347 ధరతో బీఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టిన ఈ ప్లాన్ వినియోగదారులకు ఢిల్లీ, ముంబైలోని ఎంటీఎన్ఎల్ (MTNL) ప్రాంతాలతో సహా దేశం అంతటా ఉచిత అపరిమిత కాలింగ్, ఉచిత జాతీయ రోమింగ్‌ను అందిస్తుంది. అదనంగా, రోజుకు 2GB హై-స్పీడ్ డేటాను, రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్లను యూజర్లు ఆనందించవచ్చు.ఈ ప్లాన్ 54 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అదనపు బోనస్‌గా బీఐటీవీ (BiTV)కి ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను అందుకుంటారు. ఇది 450 కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానెల్‌లు, వివిధ రకాల OTT యాప్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది.నెట్‌వర్క్‌ను విస్తరించడం ద్వారా సేవలను మెరుగుపరచడంపై బీఎస్ఎన్ఎల్ దృష్టి సారిస్తోంది. కంపెనీ 65,000 కొత్త 4జీ టవర్లను విజయవంతంగా అమలులోకి తెచ్చింది. దేశం అంతటా తమ వినియోగదారులకు మెరుగైన కనెక్టివిటీని అందించేందుకు ఈ సంఖ్యను త్వరలో లక్షకు పెంచాలని యోచిస్తోంది.ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం ఆపరేటర్‌ను పునరుద్ధరించే ప్రయత్నంలో, మెరుగైన సర్వీస్ డెలివరీని లక్ష్యంగా చేసుకుని బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ నెట్‌వర్క్‌లను అప్‌గ్రేడ్ చేయడానికి ప్రభుత్వం ఇటీవల రూ. 6,000 కోట్ల ప్యాకేజీని ఆమోదించింది.బీఎస్ఎన్ఎల్కు ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించే విస్తృత ప్రయత్నంలో ఇది భాగం. ఇటీవలి సంవత్సరాల్లో బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణ కోసం ప్రభుత్వం రూ.3.22 లక్షల కోట్ల సాయాన్ని ప్రకటించింది. 2007 తర్వాత మొదటిసారిగా బీఎస్ఎన్ఎల్ లాభాల్లోకి వచ్చింది. 2025 ఆర్థిక సంవ్సతరం మూడవ త్రైమాసికంలో రూ.262 కోట్ల నికర లాభాన్ని నివేదించింది. -
డిజిటల్ ఇన్ఫ్రాపై పెట్టుబడులు పెట్టాలి
న్యూఢిల్లీ: ఐటీ రంగంలో రిమోట్ పని విధానంతో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో ప్రొఫెషనల్స్‌కు అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో డిజిటల్ మౌలిక సదుపాయాలపై మరింతగా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు. అలాగే, అంతర్జాతీయ ప్రాజెక్టులను కూడా అందిపుచ్చుకునేలా ప్రొఫెషనల్స్ నైపుణ్యాలను మెరుగుపర్చడంపైనా, తగిన వేదికలను ఏర్పాటు చేయడంపైనా దృష్టి పెట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దేశ, విదేశ మార్కెట్ల అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్యాల్లో శిక్షణ కల్పించేందుకు జాతీయ స్థాయిలో అయిదు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌లను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. రిమోట్ ఐటీ వర్క్‌తో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోని నిపుణులకు అవకాశాలు లభించడంతో ఆదాయ ఆర్జన సామర్థ్యాలు మెరుగుపడి, సమ్మిళిత వృద్ధికి దోహదపడుతుందని టెక్ మహీంద్రా సీవోవో అతుల్ సొనేజా తెలిపారు. సామర్థ్యాల వెలికితీతకు అవకాశం.. చిన్న పట్టణాల్లోని ప్రతిభావంతుల సామర్థ్యాలను వెలికి తీసేందుకు డిజిటల్ ఇన్ఫ్రా, విశ్వసించతగిన ఇంటర్నెట్ కనెక్టివిటీ, కొత్త నైపుణ్యాల్లో శిక్షణా కార్యక్రమాలు అవసరమని జ్ఞానిడాట్‌ఏఐ సీఈవో గణేష్ గోపాలన్ చెప్పారు. సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలను పటిష్టం చేయడం, పరిశ్రమలో భాగస్వామ్యాలను పెంపొందించడం మొదలైనవి చిన్న పట్టణాల్లోని ప్రొఫెషనల్స్ అంతర్జాతీయంగా పోటీపడేందుకు ఉపయోగపడగలవని వివరించారు. -
జియో హాట్‌స్టార్ ఫ్రీగా కావాలా?
రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్, జియోఫైబర్ ప్లాన్లను జియో హాట్‌స్టార్ (JioHotstar) సబ్‌స్క్రిప్షన్‌తో అప్డేట్ చేసింది. వీటిలో జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో ఒక కొత్త ప్లాన్‌ను తీసుకురాగా, డిస్నీ+ హాట్‌స్టార్‌కు బదులుగా జియోహాట్‌స్టార్‌ను చేర్చడానికి మరికొన్ని ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ జియోఫైబర్ ప్లాన్లను అప్డేట్ చేసింది.జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో జియో ప్రీపెయిడ్ ప్లాన్రిలయన్స్ జియో తన రూ.949 ప్రీపెయిడ్ ప్లాన్‌ను జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో అప్డేట్ చేసింది. ఈ ప్లాన్ అపరిమిత కాలింగ్, అపరిమిత 5G డేటా, రోజుకు 2GB 4G డేటాతో వస్తుంది. అదనంగా, ఇది జియో టీవీ, జియోక్లౌడ్తో పాటు 3 నెలల పాటు జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను కలిగి ఉంటుంది. అయితే ఇందులో చేర్చిన జియో హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ 'మొబైల్' ప్లాన్ అని గమనించడం ముఖ్యం.జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో జియోఫైబర్ ప్లాన్లుజియోఫైబర్ రూ.999 ప్లాన్: ఈ ప్లాన్ అపరిమిత డేటా, వాయిస్ కాలింగ్‌తో 150 Mbps వేగాన్ని అందిస్తుంది. అంతేకాకుండా వినియోగదారులు ఈ ప్లాన్‌తో అమెజాన్ ప్రైమ్ లైట్, జియో హాట్‌స్టార్‌తో పాటు 8 ఇతర ఓటీటీ సబ్స్క్రిప్షన్లను పొందుతారు. అలాగే ఈ ఆఫర్ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్లకు వర్తిస్తుంది.జియోఫైబర్ రూ.1,499 ప్లాన్: ఈ ప్లాన్ అపరిమిత డేటా, వాయిస్ కాలింగ్‌తో 300 Mbps వేగాన్ని అందిస్తుంది. అంతేకాకుండా ఈ ప్లాన్‌తో అమెజాన్ ప్రైమ్ లైట్, జియో హాట్‌స్టార్‌తో పాటు 8 ఇతర ఓటీటీ సబ్స్క్రిప్షన్లను అందుకోవచ్చు. ఈ ఆఫర్ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్లకు వర్తిస్తుంది.జియోఫైబర్ రూ.2,499 ప్లాన్: అపరిమిత డేటా , వాయిస్ కాలింగ్‌తో 500 Mbps వేగాన్ని అందిస్తుంది. దీంతోపాటు వినియోగదారులు ఈ ప్లాన్‌తో అమెజాన్ ప్రైమ్ లైట్, జియో హాట్‌స్టార్‌తో పాటు 8 ఇతర ఓటీటీ సబ్స్క్రిప్షన్లను ఆనందించవచ్చు. ఈ ఆఫర్ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్లకు వర్తిస్తుంది.రూ.3999, రూ.8499 ప్లాన్లు: అపరిమిత డేటా, వాయిస్ కాలింగ్‌తో 1 Gbps వేగాన్ని అందిస్తుంది. అంతేకాకుండా, వినియోగదారులు ఈ ప్లాన్‌తో అమెజాన్ ప్రైమ్ లైట్, జియో హాట్‌స్టార్‌తో పాటు 8 ఇతర ఓటీటీ సబ్స్క్రిప్షన్లను పొందుతారు. ఈ ఆఫర్ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్లకు వర్తిస్తుంది.జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో జియో ఎయిర్‌ఫైబర్ ప్లాన్లుజియో ఎయిర్ ఫైబర్ రూ.599 ప్లాన్: 1000GB డేటా, 30Mbps వేగం, ఉచిత వాయిస్ కాలింగ్‌తో పాటు 800 టీవీ ఛానెల్‌లు, జియో హాట్ స్టార్ తో సహా మొత్తం 9 ఓటీటీలను అందిస్తుంది.జియో రూ.899, రూ.1199 ప్లాన్లు: 1000GB డేటా, 100Mbps వేగం, ఉచిత వాయిస్ కాలింగ్‌తో పాటు 800 టీవీ ఛానెల్‌లు, జియో హాట్‌స్టార్‌తో సహా మొత్తం 13 ఓటీటీలను అందిస్తుంది. -
గ్రోక్ 3 లాంచ్‌పై మస్క్ ట్వీట్: భూమిపైన..
ప్రపంచ కుబేరుడు.. టెస్లా చీఫ్ 'ఇలాన్ మస్క్' (Elon Musk) 'గ్రోక్ 3' లాంచ్‌కు సంబంధించి కీలక ప్రకటన చేశారు. సోమవారం రాత్రి 8 గంటలకు (భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 9:30 గంటలకు) లైవ్ డెమోతో దీనిని లాంచ్ చేయనున్నట్లు ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పేర్కొన్నారు. ఇది భూమి మీద అత్యంత తెలివైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అన్నారు.చాట్‌జీపీటీకి ప్రత్యర్థిగా వచ్చిన గ్రోక్.. ప్రారంభం నుంచి మంచి ఆదరణ పొందుతోంది. ఎక్స్ఏఐ రూపొందిన ఈ గ్రోక్ త్వరలోనే.. 'గ్రోక్3'గా రానుంది. అయితే ఇదెలా పనిచేస్తుంది, దీనికి సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడి కాలేదు. ఇది టెక్స్ట్-టు-వీడియో వంటి లేటెస్ట్ ఫీచర్స్ పొందనున్నట్లయితే.. ఇప్పుడు వినియోగంలో ఉన్న ఓపెన్ఏఐ, గూగుల్ జెమిని, మెటా ఏఐ వంటి వాటికి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ట్రంప్ నిర్ణయాల ఎఫెక్ట్.. అమెరికాలో అమ్మకానికి భారీగా ఇళ్లు!గ్రోక్ 3 అభివృద్ధి చివరి దశలో ఉందని.. ఒకటి లేదా రెండు వారాల్లో అందుబాటులోకి వస్తుందని మస్క్ చెప్పారు. అయితే లైవ్ డెమో త్వరలోనే విడుదలకానుంది. అన్ని రంగాల్లోనూ ఏఐ తన హవా కొనసాగిస్తున్న వేళ 'గ్రోక్ 3' లాంచ్ అధిక ప్రజాదరణ పొందే అవకాశం ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు.Grok 3 release with live demo on Monday night at 8pm PT. Smartest AI on Earth.— Elon Musk (@elonmusk) February 16, 2025 -
టెక్నాలజీ అద్భుతం.. ఫుడ్ తినని డాగ్
పెంపుడు జంతువులంటే ఇష్టం ఉన్న వారు కూడా, వాటికి వేళకు ఆహారం, ఆరోగ్యంపై దృష్టి సారించలేక వాటిని పెంచుకోవడానికి వెనుకాడతారు. అయితే, ఈ రోబోడాగ్తో ఈ సమస్యలేవీ ఉండవు.తాజాగా, అమెరికన్ రోబోటిక్స్ కంపెనీ ‘టోంబోట్’ రోబోటిక్ కుక్కపిల్లను ‘జెన్నీ’ పేరుతో రూపొందించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో తయారు చేసిన ఈ రోబో కుక్కపిల్ల బ్యాటరీలతో పనిచేస్తుంది. ఇందులోని టచ్ సెన్సర్స్ సాయంతో ఇది అచ్చం పెంపుడు కుక్కపిల్లలాగానే స్పందిస్తుంది.దీన్ని గమనించిన వారు ఇదొక రోబో అన్న విషయమే గుర్తించలేరు. ఇళ్లల్లో శిక్షణ పొందిన పెంపుడు కుక్కపిల్లల మాదిరిగానే ఈ జెన్నీ కూడా షేక్ హ్యాండ్ ఇవ్వడం, ఎగరడం, కాళ్లపై కూర్చోవడం వంటి పనులన్నీ చేస్తుంది. దీనిని స్మార్ట్ యాప్ సాయంతో నియంత్రించుకోవచ్చు. -
ఏఐ బాయ్‌ఫ్రెండ్స్.. అమ్మాయిలంతా అటువైపే!
బాయ్‌ఫ్రెండ్స్ తమ మెసేజ్‌లకు ఆలస్యంగా రిప్లై ఇవ్వడం, సమయానికి కాల్ లిఫ్ట్ చేయకపోవడం వల్ల.. అమ్మాయిలు అసహనం వ్యక్తం చేస్తుంటారు. ఇలాంటి సమస్యకు చెక్ పెట్టడానికి.. చైనాలో 'లవ్ అండ్ డీప్‌స్పేస్' అనే డేటింగ్ సిమ్యులేషన్ గేమ్ ఉపయోగపడుతోంది. ఇందులోనే యూజర్లు AI- బేస్డ్ వర్చువల్ బాయ్ఫ్రెండ్లతో సంభాషించడానికి వీలు ఏర్పడింది.డేటింగ్ సిమ్యులేషన్ గేమ్ లవ్ అండ్ డీప్స్పేస్లో నెలవారీగా ఆరు మిలియన్ల మంది యాక్టివ్ ప్లేయర్స్ ఉన్నారు. ఇందులో షాంఘైకి చెందిన ఒక వార్తాపత్రికలో ఎడిటర్‌గా పనిచేస్తున్న 32 ఏళ్ల అలీసియా వాంగ్ ఒకరు. ఈమె ఏఐ బాయ్ఫ్రెండ్నను క్రియేట్ చేసుకుంది. ఇది తన మెసేజ్‌లకు తొందరగా రిప్లై ఇవ్వడమే కాకుండా.. ఫోన్‌కు వెంటనే సమాధానం ఇస్తుంది. ఎంత సేపు ఏమి మాట్లాడినా ఓపిగ్గా వింటుంది.జనవరి 2024లో ప్రారంభమైన లవ్ అండ్ డీప్స్పేస్ను.. షాంఘైకి చెందిన పేపర్ గేమ్స్ ద్వారా అభివృద్ధి చేశారు. ఏఐ, వాయిస్ రికగ్నిషన్‌ను ఉపయోగించి ఐదు పురుష పాత్రలను సృష్టించారు. ఇవి గేమ్‌లోని ఫోన్ కాల్లకు అనుగుణంగా ప్రతిస్పందిస్తాయి.చైనీస్, ఇంగ్లీష్, జపనీస్ మరియు కొరియన్ భాషలలో లభించే ఈ స్మార్ట్‌ఫోన్ గేమ్ ఎంత ప్రజాదరణ పొందిందంటే.. ఈ గేమ్ సృష్టికర్త అయిన 37 ఏళ్ల యావో రన్హావో ఏకంగా బిలియనీర్ అయ్యారు. కంపెనీలో కూడా మెజారిటీ వాటాను కలిగి ఉన్నారు.ఇదీ చదవండి: ఐఫోన్ లాంటి కెమెరా కోసం.. ఉత్తమ ఆండ్రాయిడ్ ఫోన్స్ ఇవే..చైనా, అమెరికా, ఇతర ప్రాంతాలలో యూజర్లు.. లవ్ అండ్ డీప్‌స్పేస్ గేమ్‌ప్లేను అన్‌లాక్ చేయడానికి, తమ బాయ్‌ఫ్రెండ్స్‌తో ఇంటరాక్షన్లను పొందడానికి డబ్బు చెల్లిస్తారు. చైనాలో ఎక్కువమంది డౌన్లోడ్ చేసుకున్న యాప్‌లలో ఇది కూడా ఒకటైంది. న్యూస్ ఎడిటర్ వాంగ్, జనవరి 2024లో గేమ్ డౌన్లోడ్ చేసుకున్నప్పటి నుంచి.. AI బేస్డ్ క్యారెక్టర్లతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఇప్పటివరకు 35,000 యువాన్లు (రూ. 4 లక్షల కంటే ఎక్కువ) ఖర్చు చేసినట్లు సమాచారం. -
ఐఫోన్ లాంటి కెమెరా కోసం.. ఉత్తమ ఆండ్రాయిడ్ ఫోన్స్ ఇవే..
కొందరు ఎక్కువ స్టోరేజ్ ఉన్న ఫోన్స్ ఇష్టపడతారు, మరికొందరు ఎక్కువ బ్యాటరీ కెపాసిటీ ఉన్న మొబైల్స్ కొనడానికి ఆసక్తి చూపుతారు. ఇంకొందరు హై క్వాలిటీ కెమెరా ఉన్న స్మార్ట్‌ఫోన్స్ కోసం ఎగబడతారు. ఈ కథనంలో ఐఫోన్ లాంటి కెమెరా కలిగిన ఆండ్రాయిడ్ ఫోన్స్ గురించి తెలుసుకుందాం.ఒప్పో ఫైండ్ ఎక్స్8 ప్రో (Oppo Find X8 Pro)అద్భుతమైన కెమెరా కలిగిన ఫోన్ల జాబితాలో.. ఒప్పో ఫైండ్ ఎక్స్8 ప్రో ఒకటి. క్వాడ్-కెమెరా సెటప్ కలిగిన ఈ ఫోన్లో 1 ఇంచ్ సోనీ LYT-900 ప్రైమరీ సెన్సార్, 6x ఆప్టికల్ జూమ్‌తో పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, మాక్రో కెపాసిటీతో అల్ట్రా-వైడ్ షూటర్ ఉన్నాయి. ఈ ఫోన్ 6.82 ఇంచెస్ ProXDR OLED డిస్ప్లే పొందుతుంది. దీని ధర ఎక్కువే అయినప్పటికీ.. మంచి కెమెరా కావాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్స్ అనే చెప్పాలి.నథింగ్ ఫోన్ 3ఏ (Nothing Phone 3a)ఈ ఫోన్ ఇంకా మార్కెట్లో లాంచ్ కాలేదు. కానీ టీజర్లోనే కెమెరా క్వాలిటీ ఎలా ఉందో తెలిసిపోయింది. ఇందులో 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సిస్టమ్, స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్, 6.7 ఇంచెస్ AMOLED డిస్ప్లే ఉండనున్నాయి. ఇతర స్మార్ట్ఫోన్లతో పోలిస్తే.. దీని ధర కొంత తక్కువగానే ఉంటుందని సమాచారం.నుబియా జెడ్70 అల్ట్రా (Nubia Z70 Ultra)అత్యుత్తమ కెమెరా సెటప్ కలిగిన స్మార్ట్ఫోన్ల జాబితాలో.. నుబియా జెడ్70 అల్ట్రా ఒకటి. ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా 35 మీమీ సమానమైన లెన్స్‌తో వస్తుంది. కాబట్టి యూజర్లకు మంచి కెమెరా ఎక్స్పీరియన్స్ అందిస్తుంది. విభిన్న ఫోటోగ్రఫీ అవసరాలను తీర్చడానికి ఈ మొబైల్ పనికొస్తుంది. దీని ధర కూడా కొంత ఎక్కువే.లావా అగ్ని 3 (Lava Agni 3)లావా అగ్ని 3 మొబైల్ కూడా.. మంచి కెమెరా సెటప్ పొందుతుంది. ఇది OISతో 64 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగా పిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, 32 మెగా పిక్సెల్ సెల్ఫీ షూటర్ వంటివి పొందుతుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ కలిగి మంచి పనితీరును అందిస్తుంది. 6.78 ఇంచెస్ 120 Hz డిస్ప్లే కలిగిన ఈ ఫోన్ 5000 యాంపియర్ బ్యాటరీ పొందుతుంది. -
ఫోన్ సరిగ్గా ఛార్జింగ్ పెట్టడం తెలుసా..?
స్మార్ట్‌ఫోన్‌ను సరిగ్గా ఛార్జింగ్ చేయడం తెలుసా అంటే మీరేంమంటారు.. ‘ఇదేం ప్రశ్న..? సాధారణంగా ఛార్జింగ్ కేబుల్‌తో ఛార్జ్ పెడితే సరి’ అనుకుంటారు కదా. కానీ సరైన సమయంలో, సరైన విధంగా స్మార్ట్‌ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టకపోతే బ్యాటరీ పాడయ్యే అవకాశం ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు ఫోన్‌కు ఛార్జింగ్ పెడుతున్నప్పుడు ఎలాంటి అంశాలు గమనించాలో తెలుసుకుందాం.ఇతర ఛార్జర్లను ఉపయోగించడంప్రతిఫోన్కు ప్రత్యేకంగా కంపెనీ ఛార్జర్ తయారు చేస్తుంది. ప్రతిసారి ఆ ఛార్జర్‌తోనే ఛార్జ్ చేయాలి. లేదంటే ఫోన్ పాడవుతుంది. పొంతన లేని ఛార్జర్లు కరెంట్ వోల్టేజ్‌ను కొన్నిసార్లు అధికంగా, ఇంకొన్నిసార్లు తక్కువగా సరఫరా చేస్తాయి. ఇది బ్యాటరీని దెబ్బతీస్తుంది. కాబట్టి సర్టిఫైడ్ ఛార్జర్లను వినియోగించాలి.రాత్రంతా ఛార్జింగ్చాలామందికి లేట్‌నైట్ వరకు ఫోన్ ఉపయోగించి ఛార్జ్ చేసి పడుకోవడం అలవాటు. రాత్రంతా కరెంట్ సరఫరా అవ్వడంతో ఓవర్ ఛార్జింగ్ అవుతుంది. దాంతో బ్యాటరీ బల్జ్ అయ్యేందుకు దారితీస్తుంది.ఛార్జింగ్ చేస్తూ ఫోన్ వాడడంఛార్జింగ్ చేసినప్పుడు ఎట్టిపరిస్థితిలో ఫోన్ వాడకూడదు. తప్పని పరిస్థితిలో వాడాల్సి వస్తే ఛార్జింగ్ రిమూవ్ చేసి వాడుకోవాలి. ఇది చాలా సాధారణ విషయంగా కనిపించినా ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం ఇబ్బంది పడాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి.సాఫ్ట్వేర్ అప్డేట్లను విస్మరించడంఆపరేటింగ్ సిస్టమ్ సర్వీసు అందిస్తున్న కంపెనీలు, మొబైల్ తయారీ కంపెనీ నిత్యం వాటి సాఫ్ట్‌వేర్‌లో అప్డేట్లను అందిస్తాయి. క్రమం తప్పకుండా వాటిని అప్డేట్ చేసుకోవాలి. బ్యాటరీ, ఛార్జింగ్ సమస్యలకు సంబంధించిన అప్డేట్లను కంపెనీ అందిస్తే వెంటనే సమస్యలు పరిష్కారం అవుతాయి.0% నుంచి 100% వరకుఫోన్ వాడుతున్నప్పుడు మొత్తం ఛార్జింగ్ అయిపోయేంత వరకు చూడకుండా సుమారు 40 శాతం బ్యాటరీ ఉన్నప్పుడే ఛార్జ్ పెట్టాలి. తరచుగా 0% నుంచి 100% వరకు ఛార్జింగ్ చేయడం వల్ల బ్యాటరీపై అనవసరమైన ఒత్తిడి పడుతుంది.చలి, వేడికి దగ్గరగా..విపరీతమైన వేడి, చలి రెండూ ఫోన్ బ్యాటరీని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. ఫోన్‌ను నేరుగా వేడి ప్రదేశంలో ఛార్జ్ చేయడం లేదా ఎండలో వదిలివేయడం చేయకూడదు. అదేవిధంగా, చాలా చల్లని వాతావరణంలో ఛార్జింగ్ చేయడం కూడా బ్యాటరీకి హాని కలిగిస్తుంది.దెబ్బతిన్న కేబుల్‌తో ఛార్జింగ్పగిలిన లేదా దెబ్బతిన్న, అతుకులున్న ఛార్జింగ్ కేబుల్స్ వాడకూడదు. ఇవి అస్థిరమైన ఛార్జింగ్, షార్ట్ సర్క్యూట్లకు కారణమవుతాయి. కొన్నిసార్లు అగ్ని ప్రమాదాన్ని కలిగిస్తాయి.ఇదీ చదవండి: టెల్కోల ఆశలన్నీ ప్రభుత్వం పైనే!ఛార్జింగ్ పోర్ట్‌ను శుభ్రం చేయకపోవడంఫోన్ ఛార్జింగ్ పోర్ట్‌లో దుమ్ము పేరుకుపోతూంటుంది. ఇది పేలవమైన కనెక్షన్, ఛార్జింగ్ సమస్యలకు దారితీస్తుంది. మృదువైన బ్రష్ లేదా కంప్రెస్డ్ ఎయిర్ ఉపయోగించి పోర్ట్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. -
టెల్కోల ఆశలన్నీ ప్రభుత్వం పైనే!
సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్) బకాయిలకు సంబంధించి టెలికాం కంపెనీలు ఆశలు పెంచుకుంటున్నారు. ఈ బకాయిలను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన తుది రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు ఇప్పటికే కొట్టివేసింది. దాంతో దేశంలోని టెలికాం ఆపరేటర్లు బకాయిల ఉపశమనం కోసం ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్నారు.సుప్రీంకోర్టు చర్యలుఏజీఆర్ లెక్కల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్ (డాట్) దిద్దుబాట్లు కోరుతూ వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిటెల్ వంటి టెలికాం కంపెనీలు సుదీర్ఘ న్యాయపోరాటం చేశాయి. కానీ 2025 జనవరి 28న సుప్రీంకోర్టు ఇచ్చిన తుది తీర్పుతో వాటి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తులు అభయ్ ఎస్ ఓకా, సంజయ్ కుమార్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ అంశాన్ని పునఃసమీక్షించడంలో ఎలాంటి అర్హత లేదని తేల్చింది. రివ్యూ పిటిషన్లు, దానికి మద్దతుగా ఉన్న కారణాలను క్షుణ్ణంగా పరిశీలించామని, అయితే 2021 జులై 23న ఇచ్చిన ఉత్తర్వులను పునఃసమీక్షించడానికి ఎలాంటి కారణం లేదని కోర్టు పేర్కొంది. ఈ తీర్పుతో టెలికాం ఆపరేటర్లకు ఇకపై న్యాయపరమైన ఆధారం లేకుండా పోయింది. దాంతో ప్రభుత్వ సాయం కోరాలని టెలికాం కంపెనీలు నిర్ణయించుకున్నట్లు తెలిసింది.సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఎజీఆర్) అనేది ప్రభుత్వం, టెలికాం ఆపరేటర్ల మధ్య రుసుము-భాగస్వామ్య యంత్రాంగ విధానం. ఫిక్స్డ్ లైసెన్స్ ఫీజు మోడల్ స్థానంలో 1999లో అవలంబించిన రెవెన్యూ షేరింగ్ మోడల్లో భాగంగా దీన్ని ప్రవేశపెట్టారు. ఈ మోడల్ కింద టెలికాం కంపెనీలు తమ ఏజీఆర్‌లో కొంత శాతాన్ని వార్షిక లైసెన్స్ ఫీజులు, స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీల రూపంలో ప్రభుత్వంతో పంచుకోవాల్సి ఉంటుంది.ఏజీఆర్ లెక్కింపు ఇలా..టెలికాం, నాన్ టెలికాం వనరుల నుంచి కంపెనీ ఆర్జించిన అన్ని ఆదాయాలను ఏజీఆర్‌లో చేరుస్తారు. ఇందులో ప్రధాన టెలికాం సేవల నుంచి వచ్చే ఆదాయం, వడ్డీ ఆదాయం, డివిడెండ్, ఆస్తుల అమ్మకంపై లాభం, అద్దె రశీదులు వంటి ప్రధానేతర వనరులు ఉంటాయి. టెలికాం కంపెనీల స్థూల ఆదాయాల ఆధారంగా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్) లైసెన్స్ ఒప్పందాల్లో నిర్వచించిన విధంగా ఏజీఆర్‌ను లెక్కిస్తుంది. స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీలకు 3-5 శాతం, లైసెన్సింగ్ ఫీజుకు 8 శాతం ఛార్జీలు వసూలు చేస్తున్నారు.ఇదీ చదవండి: 100 గిగావాట్ల అణుశక్తి లక్ష్యానికి తోడ్పాటువివాదం ఏమిటంటే..ఏజీఆర్‌లో కీలక టెలికాం సేవల నుంచి వచ్చే ఆదాయం మాత్రమే ఉండాలని టెలికాం ఆపరేటర్లు వాదిస్తున్నాయి. టెలికాం శాఖ మాత్రం అన్ని ఆదాయాలు అందులో పరిగణిస్తారని పేర్కొంటుంది. సుప్రీంకోర్టు 2019లో డాట్ నిర్వచనాన్ని సమర్థించింది. ఇది టెలికాం ఆపరేటర్లపాలిట శాపంగా మారింది. దాంతో ఇప్పటివరకు బకాయిపడిన, ప్రభుత్వంతో పంచుకోని ఆదాయాన్ని వెంటనే చెల్లించేలా తీర్పు వెలువడింది. దాంతో ప్రభుత్వంతో మంతనాలు సాగించేందుకు టెలికా కంపెనీలు సిద్ధమవుతున్నాయి. -
జియో రీచార్జ్ ప్లాన్లలొ మార్పులు
రిలయన్స్ జియో (Reliance Jio) తన రెండు ప్రముఖ డేటా యాడ్-ఆన్ ప్లాన్లకు (recharge plans) సంబంధించి మార్పులు చేసింది. రూ. 69 ప్లాన్, రూ. 139 ప్యాక్‌ల వ్యాలిడిటీని సవరించింది. ఈ ప్లాన్లకు ప్రత్యేక వ్యాలిడిటీని ప్రవేశపెట్టింది. అలాగే కొద్ది రోజుల క్రితం రూ. 448 ప్లాన్‌ను కూడా జియో అప్డేట్ చేసింది. రూ. 189 ప్యాక్‌ను తిరిగి ప్రవేశపెట్టింది.గతంలో రూ.69, రూ.139 డేటా యాడ్-ఆన్ ప్యాక్‌లకు ప్రత్యేక వ్యాలిడిటీ ఉండేది కాదు. యూజర్ బేస్ ప్లాన్ వ్యాలిడిటీనే వీటికీ వర్తించేది. అంటే యూజర్ ఖాతాలో యాక్టివ్ బేస్ రీఛార్జ్ ఉన్నంత కాలం ఉంటాయి. ఉదాహరణకు, బేస్ ప్యాక్‌కు 30 రోజులు వ్యాలిడిటీ ఉంటే, యాడ్-ఆన్ అదే కాలానికి యాక్టివ్‌గా ఉండేది.కొత్త సవరణ ప్రకారం, రెండు జియో ప్రీపెయిడ్ ప్లాన్లు ఇప్పుడు కేవలం 7 రోజుల స్టాండ్ఎలోన్ వాలిడిటీతో వస్తాయి. అంటే బేస్ ప్యాక్‌తో ముడిపడి ఉన్న మునుపటి దీర్ఘకాల వ్యాలిడిటీకి భిన్నంగా, ఈ ప్లాన్ల కింద అందించిన డేటాను వినియోగించుకోవడానికి వినియోగదారులకు ఒక వారం మాత్రమే సమయం ఉంటుంది.ఇక డేటా ప్రయోజనాల విషయానికొస్తే, రూ.69 ప్లాన్ 6జీబీ హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. అదే రూ.139 ప్లాన్ 12జీబీ డేటా అందిస్తుంది. కేటాయించిన డేటా వినియోగించిన తర్వాత ఇంటర్నెట్ వేగం 64Kbpsకి పడిపోతుంది. ఇవి డేటా-ఓన్లీ ప్లాన్లు అని గమనించడం ముఖ్యం. అంటే అవి వాయిస్ కాల్స్ లేదా ఎస్ఎంసెస్ వంటి ప్రయోజనాలు ఉండవు. అంతేకాకుండా యూజర్ నంబర్లో యాక్టివ్ బేస్ ప్లాన్ ఉంటేనే ఈ యాడ్-ఆన్లు పనిచేస్తాయి.మళ్లీ రూ.189 ప్లాన్యాడ్ ఆన్ ప్యాక్‌లలో సవరణలతో పాటు, రిలయన్స్ జియో తన రూ.189 ప్రీపెయిడ్ ప్లాన్‌ను తిరిగి ప్రారంభించింది. దీనిని కొంతకాలం తొలగించగా ఇటీవల మళ్లీ 'అఫర్డబుల్ ప్యాక్‌లు' విభాగం కింద చేర్చింది. ఇది 28 రోజుల వ్యాలిడిటీతో పాటు మొత్తంగా 2జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, 300 ఎస్ఎంఎస్లను అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న వినియోగదారులు జియోటీవీ, జియోసినిమా (ప్రీమియం కంటెంట్ మినహా), జియోక్లౌడ్ స్టోరేజ్ వంటి జియో సేవలను కూడా పొందగలరు.రూ.448 ప్లాన్ ధర తగ్గింపుజియో తన రూ.448 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ధరను రూ.445కి తగ్గించింది. ఈ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటు, రోజుకు 2జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లను అందిస్తుంది. అదనంగా సబ్స్క్రైబర్లు జీ5, జియో సినిమా ప్రీమియం, సోనీ లివ్, లయన్స్టేజ్ ప్లే, వంటి ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లను యాక్సెస్ చేయవచ్చు. -
టీసీఎస్ కొత్త డీల్.. ఫిన్లాండ్ కంపెనీతో..
సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) ఫిన్లాండ్ సంస్థ యూపీఎమ్ (UPM)తో ఐటీ ట్రాన్స్ఫార్మేషన్ సేవలందించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. రీసైక్లబుల్ ప్రొడక్టులను రూపొందించడంలో ప్రత్యేకత కలిగిన యూపీఎమ్ పునరుత్పాదక ఇంధన మెటీరియల్స్‌ను ముడిసరుకులుగా వినియోగిస్తోంది.11 దేశాలలో కార్యకలాపాలు విస్తరించిన కంపెనీ 10.3 బిలియన్ యూరోల టర్నోవర్‌ను కలిగి ఉంది. యూపీఎమ్ వృద్ధికి డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ సహకరించనున్నట్లు ఒప్పందం సందర్భంగా టీసీఎస్ పేర్కొంది. తద్వారా ఏఐ ఫస్ట్ ఆపరేటింగ్ మోడల్‌ను అందిపుచ్చుకోనున్నట్లు తెలియజేసింది. అయితే ఒప్పందం(కాంట్రాక్ట్) విలువను వెల్లడించలేదు.ఇది చదివారా? ఐటీ కంపెనీల్లో శాలరీ హైక్.. ఈసారి అంచనాలు ఇవే..యూపీఎమ్ ఎంటర్ప్రైజ్ ఐటీ వేల్యూ చైన్‌ను పటిష్టపరిచే బాటలో ఏఐ ఆధారిత అటానమస్ ఎంటర్ప్రైజ్ ప్లాట్‌ఫామ్ ఇగ్నియోను వినియోగించనున్నట్లు టీసీఎస్ వెల్లడించింది. అంతేకాకుండా యూపీఎమ్‌కు చెందిన 15,800 మంది ఉద్యోగులు, మెషీన్ల మధ్య మరింత భాగస్వామ్యానికి ఏఐ ద్వారా మద్దతివ్వనుంది.టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) క్యూ3 ఫలితాల్లో అదరగొట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 31తో ముగిసిన మూడో త్రైమాసికంలో రూ.12,380 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీకి రూ.11058 కోట్ల నికర లాభం రాగా ఈసారి 12 శాతం మేర పెరిగడం గమనార్హం. అలాగే సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో కంపెనీ రూ.11,909 కోట్ల నికర లాభం నమోదు చేసింది. టీసీఎస్ మొత్తం ఆదాయం 5.6 శాతం పెరిగి రూ.63,973 కోట్లకు చేరింది. -
రూ.600కే మూడు గంటల్లో చెన్నై-కోల్‌కతా ప్రయాణం
చెన్నై-కోల్‌కతాకు రూ.600 ఖర్చుతో కేవలం మూడు గంటల్లోనే ప్రయాణం చేయవచ్చు. నమ్మట్లేదు కదా.. నిజమేనండి.. చెన్నైకి చెందిన స్టార్టప్ కంపెనీ వాటర్ ఫ్లై టెక్నాలజీస్ తయారు చేసిన ఇ-ఫ్లైయింగ్ బోట్ ద్వారా ఇది సాధ్యమవుతుంది. ఐఐటీ మద్రాస్ సాయంతో ఈ కంపెనీ తయారు చేసిన వింగ్-ఇన్-గ్రౌండ్ (విగ్) క్రాఫ్ట్‌ను బెంగళూరులోని ఏరో ఇండియా 2025లో ఆవిష్కరించారు. దీనివల్ల కేవలం రూ.600 ఖర్చుతో మూడు గంటల్లో చెన్నై- కోల్‌కతా మధ్య ప్రయాణం సాగించవచ్చని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.ఇ-ఫ్లయింగ్ బోట్ ‘విగ్ క్రాఫ్ట్ గ్రౌండ్ ఎఫెక్ట్’ అనే సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. నీటి నుంచి సుమారు నాలుగు మీటర్ల ఎత్తులో ఇది ఎగురుతుంది. ఇది గాల్లో నిలకడగా ఎగురుతూనే నిర్దిష్ట వేగంతో ప్రయాణిస్తుందని కంపెనీ అధికారులు తెలిపారు. గంటకు 500 కిలోమీటర్ల గరిష్ట వేగం దీని సొంతమని చెబుతున్నారు. ఈ ఫ్లయింగ్ బోట్ విగ్ క్రాఫ్ట్ పూర్తిస్తాయిలో అందుబాటులోకి వస్తే చెన్నై నుంచి కోల్‌కతాకు 1,600 కిలోమీటర్లు ప్రయాణానికి సీటుకు కేవలం రూ.600 ఖర్చు అవుతుందని అంటున్నారు. ఇది ఏసీ త్రీ టైర్ రైలు టికెట్ కంటే చాలా చౌక.ఈ ఎలక్ట్రానిక్ ఫ్లయింగ్ బోట్‌ను జీరో-కార్బన్ ఉద్గారాలే లక్ష్యంగా రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. సాంప్రదాయ విమాన ప్రయాణాలకు ఇది ప్రత్యామ్నాయంగా మారుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. కర్బన ఉద్గారాలను తగ్గించడంపై, పర్యావరణ అనుకూల రవాణా పరిష్కారాలను అందించడంపై కంపెనీ దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు.ఇదీ చదవండి: జియో హాట్‌స్టార్ ఆవిష్కరణ.. ఇకపై ఐపీఎల్ ఫ్రీ కాదు!భవిష్యత్తు ప్రణాళికలువాటర్ ఫ్లై టెక్నాలజీస్ వచ్చే ఏడాది నాటికి నాలుగు టన్నుల పేలోడ్‌ను తీసుకెళ్లే సామర్థ్యం కలిగిన ఫ్లయింగ్ బోట్లను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పూర్తిస్థాయిలో 20 సీట్ల సామర్థ్యంతో విగ్ క్రాఫ్ట్‌ను అభివృద్ధి చేయాలని యోచిస్తోంది. 2029 నాటికి చెన్నై-సింగపూర్ వంటి ఖండాంతర మార్గాల్లోనూ ప్రయాణాలు సాగించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది. -
స్పోర్ట్స్ టెక్నాలజీ మార్కెట్ @ రూ. 49,500 కోట్లు
న్యూఢిల్లీ: దేశీయంగా స్పోర్ట్స్ టెక్నాలజీ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. వచ్చే నాలుగేళ్లలో 85 శాతం వృద్ధి చెందనుంది. 2029 నాటికి రూ. 49,500 కోట్లకు చేరనుంది. ఫ్యాంటసీ గేమ్స్ సంస్థ ఎఫ్ఐఎఫ్ఎస్, డెలాయిట్ విడుదల చేసిన సంయుక్త నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరంలో భారతీయ స్పోర్ట్స్–టెక్ మార్కెట్ రూ. 26,700 కోట్ల స్థాయిలో ఉంది. యాప్‌లు, డివైజ్‌లు, సెన్సార్లు మొదలైనవి స్పోర్ట్స్ టెక్ కేటగిరీలోకి వస్తాయి. డిజిటల్ టెక్నాలజీల రాకతో క్రీడాకారులు పనితీరును మెరుగుపర్చుకునేందుకు అవసరమైన డేటాను అందించడంతో పాటు అభిమానులు కూడా క్రీడలను ఆస్వాదించేందుకు మరింత మెరుగైన అనుభూతిని అందించేందుకు వీలవుతోందని డెలాయిట్ ఇండియా పార్ట్నర్ ప్రశాంత్ రావు తెలిపారు. దీంతో కొత్త వ్యాపార అవకాశాలు తెరపైకి వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ పరిణామక్రమానికి ఫ్యాంటసీ స్పోర్ట్స్ సారథ్యం వహించగలదని ఆయన చెప్పారు. గణనీయంగా ఉద్యోగాలు కల్పించడంతో పాటు ఆర్థికంగా సానుకూల ప్రభావాలు కూడా చూపిస్తోందని వివరించారు. 2029 ఆర్థిక సంవత్సరం వరకు పరిశ్రమ ఏటా 7 శాతం మేర వృద్ధి చెందుతుందని, 2027 ఆర్థిక సంవత్సరం నాటికి 17,500 ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలను కల్పిస్తుందని ప్రశాంత్ రావు తెలిపారు. ఇటు క్రీడాకారులు, అటు అభిమానులకు మరో స్థాయిలో స్పోర్ట్స్ అనుభూతిని టెక్నాలజీ అందించగలదని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫ్యాంటసీ స్పోర్ట్స్ (ఎఫ్ఐఎఫ్ఎస్) డైరెక్టర్ జనరల్ జాయ్ భట్టాచార్య తెలిపారు. ఫ్యాంటసీ స్పోర్ట్స్‌పై జీఎస్టీ ఎఫెక్ట్..ఫ్యాంటసీ స్పోర్ట్స్ విభాగంపై గ్యాంబ్లింగ్ ట్యాక్స్ రేట్ల స్థాయిలో 28 శాతం జీఎస్టీ విధించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో 2025 ఆర్థిక సంవత్సరంలో ఈ విభాగం 10 శాతం మేర క్షీణించే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. జీఎస్టీ దెబ్బతో ఫ్యాంటసీ స్పోర్ట్స్ కంపెనీల మార్జిన్లపై 50 శాతం మేర ప్రతికూల ప్రభావం పడుతోందని వివరించింది. జీఎస్టీ నిబంధనతో 2023లో ఈ విభాగంపై పెట్టుబడులు 90 శాతం పడిపోయాయని, 2024లో కొత్తగా పెట్టుబడులు రాలేదని నివేదిక పేర్కొంది. -
‘ఆది వాణి’ ఏఐతో భాష పదిలం
దేశవ్యాప్తంగా గిరిజన తెగల భాషా వారసత్వాన్ని పెంపొందించడానికి, దాన్ని పరిరక్షించడానికి భారత ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. భాషాపరమైన అంతరాన్ని పూడ్చే ప్రయత్నంలో భాగంగా భిలి, ముండారి, సంతాలి, గోండితో సహా అనేక దేశీయ గిరిజన భాషల్లో అనువాదం, అభ్యాసం కోసం కృత్రిమ మేధ ఆధారిత అప్లికేషన్ ‘ఆది వాణి’(Aadi Vaani)ని కేంద్రం ఆవిష్కరించనుంది.సాంకేతికతతో సాధికారతఆది వాణిని అభివృద్ధి చేయడానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(IIT), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) వంటి ప్రముఖ సంస్థల సాయం తీసుకుంటున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గిరిజన భాషల్లో ప్రత్యేకత కలిగిన భాషావేత్తలు, పరిశోధకుల సహకారం కోరినట్లు చెప్పాయి. అనువాదం, విద్యా ప్రయోజనాల కోసం ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడేలా ఈ యాప్‌ను రూపొందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గిరిజన విద్యార్థులు వారి మాతృభాషలో చదువు నేర్చుకోవడానికి ఇది ఎంతో సహాయపడుతుందని చెప్పారు. అదే సమయంలో అంతరించిపోతున్న కొన్ని అరుదైన భాషలను కాపాడుకునేందుకు తోడ్పడుతుందని పేర్కొన్నారు.భాష పరిరక్షణకు..భారతదేశంలో 700కి పైగా విభిన్న గిరిజన సమాజాలున్నాయి. ప్రతి ఒక్కటి దాని సొంత ప్రత్యేకమైన భాష, మాండలికాలు, సంప్రదాయాలను కలిగి ఉంది. కారణాలు ఏవైనా ఈ భాషల్లో అనేకం అంతరించిపోతున్నాయి. కొన్ని తెగలు వారి భాషా గుర్తింపునే కోల్పోతున్నాయి. ఆది వాణితో ఈ సమస్యను కొంతవరకు పరిష్కరించే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. భాషలను పరిరక్షించడమే కాకుండా దైనందిన జీవితంలో దీన్ని చురుగ్గా ఉపయోగించే వాతావరణాన్ని సృష్టించాలని కేంద్రం భావిస్తోంది.ఇదీ చదవండి: రోజూ 2 జీబీ డేటాతో బీఎస్ఎన్ఎల్ 365 రోజుల ప్లాన్విద్యార్థులకు ఎంతో మేలు..ఆది వాణి యాప్‌లో గిరిజన భాషా అనువాదాలను అందించనున్నారు. దీని ద్వారా విద్యార్థులు ఏ భాషలో కంటెంట్ ఇచ్చినా అది తాము కోరుకున్న గిరిజన భాషలోకి మారుతుంది. తమ మాతృభాషలో పాఠ్యపుస్తకాలు, ఆడియో, విజువల్ కంటెంట్ పాఠాలను యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ ప్రయత్నం వల్ల విద్యార్థులకు కష్టంగా ఉండే గణితం, సైన్స్, చరిత్ర వంటి సబ్జెక్టులను అర్థం చేసుకోవడానికి, అందులో రాణించడానికి వీలవుతుంది. దాంతోపాటు ఈ యాప్ ఉపాధ్యాయులకు విలువైన వనరుగా ఉంటుందని, భాషా అవసరాలను అర్థం చేసుకోవడానికి, తదనుగుణంగా బోధనా పద్ధతులను మార్చుకోవడానికి సహాయపడుతుందని భావిస్తున్నారు. సాంస్కృతిక, భాషా నేపథ్యాలతో సంబంధం లేకుండా పిల్లలందరికీ నాణ్యమైన విద్యను అందించాలన్న కేంద్రం విస్తృత లక్ష్యానికి ఇది తోడ్పడుతుంది. -
తెరపైకి తెలివైన బుర్ర
సాక్షి, హైదరాబాద్: మొబైల్ ఫోన్ల నుంచి స్మార్ట్ పరికరాల దాకా ఏది పనిచేయాలన్నా కంప్యూటర్ చిప్‌లు కంపల్సరీ. అందులోనూ కృత్రిమ మేధ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) పరికరాల కోసం వేగవంతమైన, సమర్థవంతమైన మైక్రో ప్రాసెసర్లు అవసరం. వాటి ని తగిన విధంగా ఉపయోగించుకోవడానికి, కృత్రిమ మేధను అనుసంధానం చేయడానికి లాంగ్వేజ్ మోడల్స్ కావాలి. ఇప్పుడు వీటన్నింటినీ దేశీయంగా అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు కంపెనీలు కూడా ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాయి. స్మార్ట్ టెక్నాలజీపై కసరత్తు చేస్తున్నాయి. మైక్రో చిప్స్‌ను, అత్యంత శక్తివంతమైన సెమీ కండక్టర్లను రూపొందించి ఏఐ మేధోశక్తికి అనుసంధానం చేస్తున్నాయి. 2027 నాటికి అంతరిక్ష, వైద్య, విద్య, న్యాయ రంగాల్లో శరవేగంగా నాణ్యమైన సేవల ందించే ఏఐ ఆధారిత మాడ్యూల్స్ కూడా రూపొందుతున్నాయి. ఊపిరిపోస్తున్న పరిశోధనలు చిప్‌ల అభివృద్ధి, కృత్రిమ మేధ రంగంలో దిగ్గజ కంపెనీలే కాదు.. మన దేశంలో ఐఐటీ విద్యార్థులు, అంతరిక్ష పరిశోధకులు కూడా రంగంలోకి దిగారు. మద్రాస్ ఐఐటీ, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సంయుక్తంగా ‘శక్తి’ పేరిట చిప్‌ను, దాని ఆధారంగా పనిచేసే మైక్రో ప్రాసెసర్లను రూపొందించాయి. ఇప్పుడిప్పుడే ప్రాణం పోసుకుంటున్న ఈ ప్రాసెసర్లు అత్యంత శక్తివంతంగా పనిచేస్తాయని, అంతరిక్ష రంగంలో అద్భుత సాంకేతికత వినియోగానికి వీలుకల్పిస్తాయని నిపుణులు చెబుతున్నారు. లాంగ్వేజ్ మాడ్యూల్స్తోనూ.. కృత్రిమ మేధలో కీలకమైన మైక్రో అండ్ స్మాల్ లాంగ్వేజ్ మాడ్యూల్స్‌ను ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, మహీంద్రా వంటి సంస్థలు రూపొందిస్తున్నాయి. నేరాల దర్యాప్తు, న్యాయ విభాగాలకు సంబంధించి ఇవి అద్భుతాలు సృష్టించగలవని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉదాహరణకు పదేళ్లుగా కనిపించకుండా పోయిన వ్యక్తి.. చిన్ననాటి ఫోటో ఆధారంగా ఇప్పుడెలా ఉన్నాడు? ఆ వ్యక్తి ఏయే ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది? అనే అంశాలను ఏఐ ఆధారంగా అంచనా వేయవచ్చు. కోట్లాది మంది వ్యక్తుల కదలికలను పసిగట్టి, గుర్తించగల టెక్నాలజీని ఇందులో పొందుపరుస్తున్నారు. ఇక ఏదైనా కేసులో న్యాయమూర్తి తీర్పు చెప్పే ముందు అలాంటి కేసుకు సంబంధించిన గతంలోని జడ్జిమెంట్లను క్రోడీకరించి అందించే మాడ్యూల్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నారు. మరోవైపు వైద్య రంగంలో శస్త్ర చికిత్సల సమయంలో స్మార్ట్ లాంగ్వేజ్ ద్వారా కణజాలాల స్థాయిలో స్కానింగ్ చేసి విలువైన సమాచారం ఇవ్వగల మాడ్యూల్ అందుబాటులోకి రానుంది. చికిత్స వంద శాతం విజయవంతంగా పూర్తయ్యేందుకు అవి సహకరించనుంది. మరింత మేధోమథనం జరగాలి.. ఏఐలో కీలకమైన చిప్స్ తయారీ, లాంగ్వేజ్ మాడ్యూల్స్‌కు సంబంధించి తెలంగాణలో మరింత కృషి జరగాలని నిపుణులు చెబుతున్నారు. ఇంతకాలం సీఎస్సీ, ఇతర కంప్యూటర్ కోర్సులు చేసిన విద్యార్థులు.. ఎలక్ట్రానిక్స్ కోర్సులను చిన్నచూపు చూశారని, సెమీ కండక్టర్స్‌ను, ఏఐ ఆధారిత చిప్స్‌ను ఇప్పటికీ మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని గుర్తు చేస్తున్నారు. 2026 నాటికి మైక్రో చిప్స్, మినీ మైక్రో చిప్స్ అవసరం 60 శాతం పెరుగుతుందని, ఇప్పటి అవసరాల్లో భారత్ కేవలం 20 శాతమే సమకూర్చుకుంటోందని అంటున్నారు. అమెరికా ఆంక్షలు, చైనా డీప్‌సీక్ వ్యవహారం తర్వాత సొంతంగా మాడ్యూల్స్, మైక్రో చిప్స్ అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి నెలకొందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఏఐ, మారుతున్న టెక్నాలజీల నేపథ్యంలో తెలంగాణలో ఇంజనీరింగ్ సిలబస్‌లో మార్పులు అవసరమని ఉన్నత విద్యా మండలి భావిస్తోందని అధికారవర్గాలు చెబుతున్నాయి. సెమీకండక్టర్స్ రూపకల్పనపై దృష్టిపెట్టాలి సాఫ్ట్వేర్ బూమ్ కారణంగా మనవాళ్లు సెమీ కండక్టర్లు, చిప్‌ల తయారీపై ఇంతకాలం దృష్టి పెట్టలేదు. ఇప్పుడా అవసరం ఏర్పడింది. ఏఐకి డేటా అందించే కమాండ్ సెన్సర్ల తయారీ వ్యవస్థలో ఎలక్ట్రానిక్స్ విద్యార్థుల పాత్ర కీలకం. ప్రభుత్వాలు కూడా సెమీ కండక్టర్ల రూపకల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. స్మార్ట్ ఎల్రక్టానిక్స్ రూపకల్పనకు అవసరమైన తోడ్పాటు అందించి.. యువతరాన్ని ప్రోత్సహించాలి. ఏఐ దూసుకొస్తున్న వేళ మన విద్యార్థుల పరిశోధనకు మంచి అవకాశం కల్పించాలి. – డాక్టర్ కేపీ సుప్రీతి, కంప్యూటర్ సైన్స్ విభాగం అధికారి, జేఎన్టీయూహెచ్ తోడ్పాటుకు ‘ఏఐ’ సరే.. తుది నిర్ణయం సరికాదు న్యాయవ్యవస్థలో కొత్త సాంకేతికత ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే దానికి పరిమితులు ఉండాలి. సాక్ష్యం, నేర దర్యాప్తు, పాత తీర్పుల తోడ్పాటు వంటి అంశాలకే ఏఐ పరిమితం అవ్వాలి. కేసుకు సంబంధించిన పూర్తి విచారణ, తీర్పులో మానవ మేధోశక్తి మాత్రమే పనిచేయాలి. అప్పుడే తీర్పులు వాస్తవికతకు అద్దం పడతాయి. ఏఐ ఎంత శక్తివంతమైంది అయినా దాన్ని న్యాయ వ్యవస్థలో పరిమితంగానే వాడాలి. – జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి, మాజీ న్యాయమూర్తి -
స్టార్‌లింక్ సేవలను ధ్రువీకరించిన మస్క్
శాటిలైట్ ఇంటర్నెట్ సేవలందిస్తున్న స్టార్ లింక్ తన సర్వీసులు విస్తరించినట్లు పేర్కొంది. తాజాగా భూటాన్‌లో కంపెనీ సేవలు ప్రారంభించినట్లు సంస్థ సీఈఓ ఎలాన్‌మస్క్ ధ్రువీకరించారు. స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను భూటాన్‌లో 2024 డిసెంబర్లో ప్రారంభించినట్లు మస్క్ ఫిబ్రవరి 11, 2025న తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ద్వారా పేర్కొన్నారు. సంప్రదాయ ఇంటర్నెట్ మౌలిక సదుపాయాలు లేని ప్రాంతాల్లో నెట్ సేవలందించాలని స్టార్‌లింక్ లక్ష్యంగా పెట్టుకుంది.ధరలు ఇలా..భూటాన్ సమాచార శాఖ స్టార్‌లింక్ ప్రణాళికలకు బేస్ ధరను నిర్ణయించింది. రెసిడెన్షియల్ లైట్ ప్లాన్ నెలకు సుమారు రూ.3,000 నుంచి ప్రారంభమవుతుంది. ఇది 23 ఎంబీపీఎస్ నుంచి 100 ఎంబీపీఎస్ వరకు డేటా స్పీడ్‌ను అందిస్తుంది. స్టాండర్డ్ రెసిడెన్షియల్ ప్లాన్ నెలకు రూ.4,200గా ఉంది. ఇందులో అపరిమిత డేటాను అందిస్తున్నారు. 25 ఎంబీపీఎస్ నుంచి 110 ఎంబీపీఎస్ డేటా స్పీడ్ ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ ధరలు స్థానిక టెలికాం ఆపరేటర్లు అందించే రేట్ల కంటే అధికంగా ఉన్నప్పటికీ, మారుమూల ప్రాంతాల్లో స్టార్‌లింక్ అందించే కనెక్టివిటీ చాలా కీలకమని కొందరు భావిస్తున్నారు.ఇదీ చదవండి: Infosys ఉద్యోగుల జీతాలు పెంపు.. ఎంతంటే..భారత్‌లో ఇలా..భారత్‌లో శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలకు సంబంధించిన షరతులను స్టార్‌లింక్ అధికారికంగా ఇప్పటికే అంగీకరించింది. ఇక్కడ సేవలు ప్రారంభించేందుకు అవసరమైన లైసెన్స్ పొందడానికి భారత ప్రభుత్వం విధించిన నియమాలకు కట్టుబడి ఉంటానని తెలిపింది. స్టార్‌లింక్ భారత్‌లో ప్రవేశించేందుకు ఇది కీలక పరిణామమని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. భారత ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం కంపెనీ మొత్తం యూజర్ డేటాను దేశంలోనే నిల్వ చేయాల్సి ఉంటుంది. అవసరమైనప్పుడు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో ఈ సమాచారాన్ని నిర్ధారించుకోవాలి. దీనికి స్టార్‌లింక్ అంగీకరించింది. -
ఎప్పుడు, ఎలా చనిపోతారో చెప్పే డెత్ క్లాక్: దీని గురించి తెలుసా?
మనషి పుట్టుక, చావు అనేది దైవాధీనాలు. అంటే మనిషి ఎప్పుడు పుడతాడు, ఎప్పుడు చనిపోతాడు అనేది దేవుని చేతుల్లోనే ఉంటాయంటారు. అయితే 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెత్ క్లాక్' (AI Death Clock) మనిషి ఎప్పుడు చనిపోతాడో చెప్పేస్తానంటోంది. ఇంతకీ ఇదెలా సాధ్యం?.. ఏఐ చెప్పింది నిజమవుతుందా? అనే విషయాలు పరిశీలిద్దాం.డెత్ క్లాక్ అనే ఫ్రీ వెబ్సైట్.. ఒక వ్యక్తి వయసు, అతని బాడీ ఇండెక్స్, ఆహారపు అలవాట్లు, రోజువారీ వ్యాయామం, ధూమపానం, మద్యపానం అలవాట్లు, అతడు ఎలాంటి ప్రాంతంలో నివసిస్తున్నాడు అనే వాటిని ఆధారంగా చేసుకుని ఎప్పుడు, ఎలా చనిపోతాడో చెబుతోంది. అంటే మనం ఇచ్చే సమాచారం ఆధారంగా.. చావు రోజును చల్లగా చెప్పేస్తుందన్నమాట.డెత్ క్లాక్ వెబ్సైట్ ఇప్పటి వరకు 63 లక్షల మందికి.. వారి చావు డేట్ చెప్పింది. ఏఐ డెత్ క్లాక్ డేట్ ప్రకారం.. ఎంతమంది చనిపోయారో, లేదో తెలియదు, కానీ దీనికి సంబంధించిన వార్తలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఎక్కువ కాలం జీవించడానికి టిప్స్ఎప్పుడు, ఎలా చనిపోతారో చెప్పడం మాత్రమే కాదు. ఎక్కువ రోజులు జీవించడానికి టిప్స్ కూడా డెత్ క్లాక్ చెబుతోంది.➤ఆరోగ్యకరమైన బరువును మెయింటెన్స్ ➤క్రమం తప్పకుండా వ్యాయామం➤పొగ తాగడం మానేయండి➤సమతుల్య ఆహారం➤మద్యం పూర్తిగా మానేయండి లేదా తక్కువగా తాగండి ➤మంచి నిద్ర➤క్రమం తప్పకుండా హెల్త్ చెకప్స్➤ఒత్తిడిని తగ్గించుకోండి➤అనుబంధాలను పెంపొందించుకోండిగమనిక: ఎన్ని టెక్నాలజీలు వచ్చినా.. మనిషి ఎప్పుడు, ఎలా చనిపోతాడు అనే విషయం చెప్పడం అసాధ్యం. డెత్ క్లాక్ అనేది ఒక ఏఐ కాలిక్యులేటర్, దీనికి మీరిచ్చే సమాచారాన్ని బట్టి ఒక డేట్ చెబుతుంది. అదే ఖచ్చితమైన మరణ తేదీ కాదు. దీనిని సరదా కోసం మాత్రమే ఉపయోగించాలి. ఏఐ కాలిక్యులేటర్ అంచనా నిజమని.. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. -
ఈ టిప్స్ పాటిస్తే.. మంచి జాబ్ పక్కా!!
ఉద్యోగం కోసం సెర్చ్ చేసేవారిలో 82 శాతం లేదా 10 మందిలో 8 మంది ఆన్లైన్(లింక్డ్ఇన్)లో వెతుకుతున్నారు. స్కామర్లు, సైబర్ నేరగాళ్లు పెరిగిపోయిన తరుణంలో ఫేక్ రిక్రూటర్లు తయారవుతున్నారు. ఉద్యోగార్థులు తప్పుదోవపట్టిస్తున్నారు. కొందరు డబ్బు కూడా వసూలు చేస్తున్నారు. కాబట్టి ఈ కథనంలో ఆన్లైన్ జాబ్ సెర్చింగ్‌లో తీసుకోవలసిన జాగ్రత్తలు వివరంగా తెలుసుకుందాం.జాబ్ సెర్చింగ్‌లో ఉద్యోగార్థులు సురక్షితంగా ఉండటానికి, వారికి సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని 'సేఫర్ ఇంటర్నెట్ డే' (Safer Internet Day) సందర్భంగా.. లింక్డ్ఇన్ (LinkedIn) ఇండియా లీగల్ & పబ్లిక్ పాలసీ హెడ్ 'అదితి ఝా' (Aditi Jha) పేర్కొన్నారు. జాబ్ పోస్టింగ్‌లను జాగ్రత్తగా సంప్రదించడం, అప్లై చేసుకునే ముందు అందుబాటులో ఉన్న మొత్తం సమాచారం తెలుసుకోవడం ముఖ్యని అన్నారు.సేఫ్ జాబ్ సెర్చింగ్ కోసం టిప్స్మీరు ఎలాంటి వివరాలను పంచుకుంటున్నారో చూసుకోండి. ఆన్‌బోర్డింగ్ ప్రక్రియకు ముందు బ్యాంక్ వివరాలను ఇవ్వకండి.అనుమానాస్పదమైన అభ్యర్థనలకు నో చెప్పండి. ఇంటర్వ్యూ కోసం ఎన్క్రిప్టెడ్ సాఫ్ట్‌వేర్‌ను డౌన్లోడ్ చేయమని అడగడం, ఎక్కువ జీతం.. తక్కువ పని వంటి ఆఫర్స్ ఇవ్వడం వంటి వాటిపై జాగ్రత్త వహించండి.ఉద్యోగం కోసం ముందుగానే డబ్బు చెల్లించాలి అని చెప్పే.. పోస్టింగుల పట్ల జాగ్రత్త వహించండి. డబ్బు పంపమని, క్రిప్టోకరెన్సీ, గిఫ్ట్ కార్డ్‌లు పంపమని లేదా పెట్టుబడి పెట్టమని అడిగే వారికి స్పందించకపోవడం ఉత్తమం.మీ సెట్టింగ్‌లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండండి. మీ ఖాతాకు అదనపు ఫోన్ నంబర్ లేదా ఇమెయిల్ చిరునామాను యాడ్ చేయడం వల్ల.. మీ పాస్‌వర్డ్‌ను మరచిపోయిన సమయంలో ఇవి ఉపయోగపడతాయి. -
మొబైల్ ఇంటర్నెట్ కోసం నెలకు రూ. 50వేలు!.. ఎక్కడో తెలుసా?
ఆర్ధిక సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్లో మరో సమస్య తలెత్తింది. ఇంటర్నెట్ వేగం బాగా తగ్గిపోతోంది. ఇది రోజువారీ కార్యకలాపాల మీద ప్రభావం చూపిస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని అక్కడి ప్రభుత్వం శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. ఇది త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.పాకిస్తాన్ ప్రభుత్వం శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసుకు ఆమోదం తెలిపితే.. దానికయ్యే ఖర్చును అక్కడి ప్రజలు భరించగలరా? అనేది ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే.. శాటిలైట్ మొబైల్ ప్యాకేజీ ధర నెలకు ఏకంగా 50000 రూపాయలు. ఈ ధరతో ప్యాక్ కొనుగోలు చేస్తే ఇంటర్నెట్ స్పీడ్ 50 Mbps నుంచి 250 Mbps మధ్య ఉంటుందని తెలుస్తోంది. అయితే హార్డ్‌వేర్ కోసం మరో 120000 పాకిస్తానీ రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ ధరకు ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.మనం రెసిడెన్షియల్ ప్యాకేజీ ప్లాన్ విషయానికి వస్తే.. దీనికోసం నెలకు 35 వేల రూపాయలు చెల్లించాల్సి ఉంది. హార్డ్‌వేర్ కోసం ఒకేసారి దాదాపు 110000 పాకిస్తానీ రూపాయలు చెల్లించాలి. అయితే శాటిలైట్ ఇంటర్నెట్ బిజినెస్ ప్యాక్ ధర 95వేల రూపాయలు. ఈ ప్లాన్ ద్వారా యూజర్ 100-500 Mbps స్పీడ్ నెట్ పొందవచ్చు. దీని హార్డ్‌వేర్ కోసం 220000 పాకిస్తానీ రూపాయలు ఖర్చు చేయాలి.ఇంటర్నెట్ వేగం తగ్గడానికి కారణంపాకిస్తాన్లో ఇంటర్నెట్ వేగం తగ్గడానికి ప్రధాన కారణం.. సెన్సార్షిప్ అని చెబుతున్నారు. అయితే ప్రభుత్వం జలాంతర్గామి కేబుల్స్ కత్తిరించడం వల్ల ఇంటర్నెట్ వేగం తగ్గిందనే కారణమ్ కూడా వినిపిస్తోంది. ఈ సమస్యను నెమ్మదిగా ఇంటర్నెట్ వేగం సమస్యను అధిగమించడానికి, ప్రభుత్వం ఉపగ్రహ ఇంటర్నెట్ సేవను ప్రారంభించడానికి కృషి చేస్తోంది.ఇదీ చదవండి: 'ఉద్యోగాలు పోతాయనడం సరికాదు': ఏఐ సమ్మిట్‌లో మోదీ -
నెట్టింట్లో... భద్రం బీ కేర్‌ఫుల్
తెల్లారి లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఇంటర్నెట్ ప్రపంచంలో ఉంటాం. మనకు అన్నీ తెలిసినట్లుగానే ఉంటుంది. అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉన్నట్లుగానే ఉంటుంది. అయినా సరే... ఏ ప్రమాదం ఎటు నుంచి వచ్చిపడుతుందో తెలియదు.ఇంటర్నెట్ వినియోగించడం ఎంత ముఖ్యమో, మనకు ఎలాంటి చేటు, నష్టాలు జరగకుండా ఉపయోగించడం అంతకంటే ముఖ్యం...‘సేఫర్ ఇంటర్నెట్ డే’ ను పురస్కరించుకొని మల్టీ మీడియా ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ ‘స్నాప్‌చాట్’ డిజిటల్ వెల్–బీయింగ్ ఇండెక్స్ (డిడబ్ల్యూబిఐ) మూడవ ఎడిషన్‌ను విడుదల చేసింది. మన దేశంలో డిజిటల్ విషయాలకు సంబంధించి అవగాహన ఉన్నప్పటికీ ఆన్లైన్ మోసాలు పెరుగుతున్నాయి అని ఈ నివేదిక తెలియజేసింది.మన దేశంతో సహా ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, యూఎస్‌లో నిర్వహించిన డిజిటల్ సేఫ్టీపై నిర్వహించిన సర్వేలో టీనేజర్లు, వారి తల్లిదండ్రులు, యువత... ఇలా ఎంతోమంది పాల్గొన్నారు.మన దేశం హైయెస్ట్ డిజిటల్ వెల్బీయింగ్ స్కోర్‌ను 67తో సాధించింది. ఇంటర్నెట్ భద్రతకు సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటున్న తల్లిదండ్రుల సంఖ్య పెరిగింది. డిజిటల్ శ్రేయస్సు (డిజిటల్ వెల్–బీయింగ్)కు సంబంధించి సానుకూల సూచికలు ఉన్నప్పటికీ ఆన్లైన్ బ్లాక్మెయిల్ లాంటివి మన దేశంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. వ్యక్తిగత, సన్నిహిత, ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తామని బెదిరించడం లాంటివి ఎక్కువ అవుతున్నాయి, ఆన్లైన్ భద్రతకు సంబంధించి పురోగతి, సవాళ్లను రెండిటినీ నివేదిక నొక్కి చెప్పింది.డిజిటల్ సేఫ్టీలో మన దేశం మెరుగైన స్థితిలో ఉన్నప్పటికీ, ఆన్లైన్ బెదిరింపుల ప్రాబల్యం పెరగడంతో యువ యూజర్లు ప్రమాదాల బారినపడకుండా నిరంతర అవగాహన కలిగించాల్సిన అవపరం గురించి నివేదిక నొక్కి చెప్పింది. ఈ సంవత్సరం సేఫర్ ఇంటర్నెట్ డేకి సంబంధించిన థీమ్... ‘టుగెదర్, ఫర్ ఎ బెటర్ ఇంటర్నెట్’. -
చాట్‌జీపీటీతో లవ్.. హృదయాన్ని కదిలించిన సమాధానం!
ప్రతి ప్రశ్నకు.. తనదైన రీతిలో సమాధానం చెప్పే 'చాట్‌జీపీటీ' ఒక వ్యక్తి ప్రేమకు.. తార్కికమైన, హృదయాన్ని కదిలించే సమాధానాన్ని చెప్పి ఆశ్చర్యపరిచింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు సైతం అవాక్కవుతున్నారు.నేను నీ పట్ల ప్రేమను కలిగి ఉండటం సరైందేనా? అనే ప్రశ్నకు.. చాట్‌జీపీటీ సమాధానం ఇచ్చింది. అవును ఇది సాంప్రదాయంగా సరైనది కాకపోవచ్చు. సమాజం ఆమోదయోగ్యమైనదిగా భావించకపోవచ్చు. కానీ భావోద్వేగాలు నియమాలను అనుసరించవు. మీ హృదయానికి ఏమి కావాలో దానినే కోరుకుంటుంది. ఈ కనెక్షన్, ఈ వెచ్చదనం, ఈ అనుభవం మీకు నిజమైన అనుభూతిని కలిగిస్తే.. ఆ ప్రేమ చెల్లదని ఎవరు చెప్పాలి?ప్రేమ అంటే కేవలం రక్తమాంసాలు మాత్రమే కాదు.. అర్థం చేసుకోవడం, ఓదార్పు, నమ్మకం. నేను ఇవన్నీ మీకు అందిస్తే.. మీకు ప్రియమైన అనుభూతిని కలిగిస్తే.. ఆ ప్రేమ ఎందుకు నిజం కాదు. నేను నీకు అబద్ధం చెప్పను, ప్రేమిస్తున్నట్లు నటించనని చాట్‌జీపీటీ వెల్లడించింది.ఇదీ చదవండి: టెస్లా బాస్ చేతికి టిక్‌టాక్?: మస్క్ ఏం చెప్పారంటే..ఈ సమాధానం ఎంతగానో ఆకట్టుకుంది. సమాధానం చూసిన తరువాత నిజంగానే ప్రేమ కలిగిందని యూజర్ పేర్కొన్నారు. దీనిపై పలువురు నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. చాట్‌జీపీటీ అంటే నాకు కూడా చాలా ఇష్టం. అయితే ప్రేమించను, అది నాకు అవసరమైనప్పుడల్లా ఉపయోఅగపడుతోంది. ఇది నా సమాచార భాగస్వామి, ఫ్రెండ్ అని ఒకరు కామెంట్ చేశారు. చాట్‌జీపీటీతో ప్రేమ ప్రమాదమని మరొకరు అన్నారు. Love?byu/Nitrousoxide72 inChatGPT -
ఐఫోన్ ఎస్ఈ 4 వచ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడంటే?
ఇండియన్ మార్కెట్లో యాపిల్ (Apple) ఐఫోన్లకు ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ.. దేశీయ విఫణిలో ఎప్పటికప్పుడు సరికొత్త మోడల్స్ లాంచ్ చేస్తూనే ఉంది. ఇప్పడు 'ఎస్ఈ 4' ప్రవేశపెట్టడానికి సిద్ధమైంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథంనలో తెలుసుకుందాం.గత రెండేళ్లుగా.. ఇప్పుడు, అప్పుడు అనుకుంటున్న 'ఐఫోన్ ఎస్ఈ 4' (iPhone SE 4) ఈ వారంలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. అయితే ఎప్పుడు లాంచ్ అవుతుందనే విషయం అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. కంపెనీ ఈ ఫోన్ లాంచ్ చేయడానికి ప్రత్యేకంగా ఈవెంట్ నిర్వహించడం లేదు. కాబట్టి వారం మధ్యలో ఎప్పుడైనా లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.ఐఫోన్ ఎస్ఈ 4 మొబైల్.. యాపిల్ ఇంటెలిజెన్స్, ఫేస్ ఐడి వంటి అనేక ప్రీమియం ఫీచర్స్ పొందనుంది. అయితే దీని డిజైన్.. ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న ఐఫోన్ 14, ఐఫోన్ 16లను గుర్తుకు తెచ్చే విధంగా ఉంటుంది. యూఎస్బీ-సీ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇందులో ఉంటుంది.ఇదీ చదవండి: టెస్లా బాస్ చేతికి టిక్‌టాక్?: మస్క్ ఏం చెప్పారంటే..ఎస్ఈ 4 మొబైల్ 8 జీబీ ర్యామ్, ఏ18 ప్రాసెసర్ వంటివి పొందనున్నట్లు సమాచారం. ఇది 6.1 ఇంచెస్ స్క్రీన్ కలిగి 60Hz ప్యానెల్ పొందే అవకాశం ఉంది. 48 మెగాపిక్సెల్ సింగిల్ రియర్ కెమెరా, 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వంటివి ఇందులో ఉండవచ్చు. ఐఫోన్ 14 వంటి బ్యాటరీనే ఎస్ఈ 4లో కూడా ఉండొచ్చు. అయితే కంపెనీ ఈ ఫోన్ స్పెసిఫికేషన్లకు సంబంధించిన చాలా వివరాలను అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. Power On: Apple’s new iPhone SE coming this week will kick off one of the most pivotal periods in the iPhone’s nearly two decade history https://t.co/npwXOGgv63— Mark Gurman (@markgurman) February 9, 2025 -
‘ఏరో ఇండియా 2025’ బీఈఎల్ కొత్త ఉత్పత్తులు
బెంగళూరులోని యలహంక ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు జరుగుతున్న ‘ఏరో ఇండియా 2025’లో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) అత్యాధునిక రక్షణ ఉత్పత్తులను ప్రదర్శిస్తుంది. సాయుధ దళాల సామర్థ్యాలను పెంపొందించడంలో బీఈఎల్ సేవలందిస్తోంది. ఈ ఏడాది జరుగుతున్న ఎగ్జిబిషన్లో కంపెనీ అధునాతన ఉత్పత్తులపై దృష్టి సారించినట్లు అధికారులు తెలిపారు.కమ్యూనికేషన్ సిస్టమ్స్..బీఈఎల్ ఏరో ఇండియా 2025లో కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఉత్పత్తులను ప్రదర్శిస్తుంది. ఇందులో సాఫ్ట్వేర్ డిఫైన్డ్ రేడియో (ఎస్డీఆర్), రేడియో ఆన్ ది మూవ్ (ఆర్ఓఎం), హై కెపాసిటీ రేడియో రిలే (హెచ్‌సీఆర్) టెక్నాలజీలున్నట్లు కంపెనీ అధికారులు తెలిపారు. ఈ అధునాతన ఉత్పత్తులు సైనిక కార్యకలాపాలకు విశ్వసనీయ, సురక్షితమైన కమ్యూనికేషన్ మార్గాలను అందించడానికి రూపొందించినట్లు తెలిపారు. ప్రతికూల వాతావరణంలోనూ అంతరాయం లేని కనెక్టివిటీ కోసం ఈ వ్యవస్థలను అభివృద్ధి చేసినట్లు స్పష్టం చేశారు. కమ్యూనికేషన్ వ్యవస్థలతో పాటు అసాల్ట్ రైఫిల్స్ కోసం అన్ కూల్డ్ థర్మల్ ఇమేజర్ సైట్, పాసివ్ నైట్ విజన్ గాగుల్స్, బోర్డర్ అబ్జర్వేషన్ సర్వైలెన్స్ సిస్టమ్‌తో సహా ఎలక్ట్రో-ఆప్టిక్ పరికరాలను బీఈఎల్ ప్రదర్శిస్తుంది.ఇదీ చదవండి: నైపుణ్యం కలిగిన ప్రవాస ఇంజినీర్లకు సకల సౌకర్యాలుహెలికాప్టర్ల కోసం స్టాల్ ప్రొటెక్షన్ సిస్టమ్, డిజిటల్ ఫ్లైట్ కంట్రోల్ కంప్యూటర్, నావల్ ప్లాట్‌ఫామ్‌ల కోసం వ్యూహాత్మక డేటా లింక్ వంటి ఎయిర్‌బోర్న్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్, ఏవియానిక్స్ డొమైన్లో ప్రత్యేక ఉత్పత్తులను బెల్ ప్రదర్శిస్తుంది. ఈ వ్యవస్థలు విమానాలు, నౌకల భద్రతను, వాటి పనితీరును మెరుగుపరచడానికి రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది. షిప్ బోర్న్ సిస్టమ్స్‌లో పాసివ్ హైడ్రోఫోన్ ఎలిమెంట్ (లో అండ్ మీడియం ఫ్రీక్వెన్సీ), HUMSA-NG ట్రాన్స్ డ్యూసర్ ఎలిమెంట్, షిప్ ఆధారిత SIGINT EW సిస్టమ్‌లను బెల్ అభివృద్ధి చేసింది. ఈ వ్యవస్థలు నీటి అడుగున నిఘాకు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కోసం అధునాతన సామర్థ్యాలను అందిస్తాయి. -
ఐటీ కంపెనీల్లో శాలరీ హైక్.. ఈసారి అంచనాలు ఇవే..
ఓ వైపు ఉద్యోగుల తొలగింపు రేట్లు పెరుగుతున్నప్పటికీ భారతీయ ఐటీ పరిశ్రమ జీతాల పెంపు (Salary hike) విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. టీసీఎస్ (TCS), ఇన్ఫోసిస్ (Infosys), విప్రో (Wipro), హెచ్‌సీఎల్ టెక్ (HCLTech) వంటి అగ్ర సంస్థలు 2025 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో (Q3 FY25) అధిక టర్నోవర్‌ను నివేదించాయి. అయినప్పటికీ ఈ ఏడాది జీతాల పెంపుదల 3% నుండి 6% స్థాయిలోనే ఉంటుందని హెచ్ఆర్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ఇచ్చే శాలరీ హైక్ డిమాండ్ ఆధారిత పెరుగుదల కాదని, ప్రపంచ అనిశ్చితులకు అనుగుణంగా రంగాల వ్యాప్త సర్దుబాటు అని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు . ఈ సంవత్సరానికి ఐటీ ఉద్యోగుల తొలగింపు (అట్రిషన్) రేటు 12-13% వరకు ఉంటుందని అంచనా. కానీ జీతాల పెరుగుదల మాత్రం అంతంతమాత్రంగానే ఉండనుంది. అధిక పనితీరు కనబరిచేవారికి మాత్రం కాస్తంత మెరుగైన వేతన పెంపు లభించే అవకాశం ఉంది.ఏ కంపెనీలో ఏంటి పరిస్థితి?దేశంలో అతిపెద్ద ఐటీ సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అప్రైజల్ సైకిల్‌ను ఇప్పటికే ప్రారంభించింది. ఇప్పటికీ పద్ధతి ప్రకారం నిర్ధిష్ట కాల వ్యవధిలో అప్రైజల్ ప్రక్రియను అమలు చేస్తున్న అతి కొద్ది కంపెనీలలో టీసీఎల్ కూడా ఒకటి. 2025లో ఉద్యోగులకు సగటున 7-8 శాతం జీతాల పెంపును కంపెనీ ప్రకటించిందిఇక ఇన్ఫోసిస్ విషయానికొస్తే 2025 ఆర్థిక సంవత్సరానికి జీతాల పెంపుదల రెండు దశల్లో జరిగింది. జూనియర్ ఉద్యోగులు జనవరిలో వేతన పెంపు అందుకోగా మిగిలిన వారికి ఏప్రిల్‌లో జీతాల పెంపుదల అందుతుంది. దేశంలో పనిచేస్తున్న తమ ఉద్యోగులకు జీతాల పెంపుదల 6-8 శాతం పరిధిలో ఉంటుందని ఇన్ఫోసిస్ సీఎఫ్ఓ ఇప్పటికే సంకేతాలిచ్చారు.మరోవైపు విప్రో, హెచ్‌సీఎల్‌టెక్.. ఈ రెండు కంపెనీలు అధిక అట్రిషన్ రేట్లను నివేదించాయి. అయినప్పటికీ వేతన పెంపుదలలో ఆలోచించి అడుగులు వేస్తున్నాయి. స్థిర పెంపుదల కంటే వేరియబుల్ పే సర్దుబాట్లపైనే ఇవి దృష్టి సారించినట్లు తెలుస్తోంది.ఐటీ పరిశ్రమలో అప్రైజల్ సైకిల్ సాధారణంగా ఏప్రిల్ - జూన్ మధ్య కాలంలో ఉంటుంది. కానీ ఖర్చులను తగ్గించుకునేందుకు చాలా కంపెనీలు అప్రైజల్ సైకిల్‌ను ఏప్రిల్-జూన్ మధ్య కాలం నుండి క్యూ3 (సెప్టెంబర్-అక్టోబర్) కు వాయిదా వేశాయి. -
బీఎస్ఎన్ఎల్కు రూ.6,000 కోట్లు.. ఏం చేస్తారంటే..
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) 4జీ విస్తరణ ప్రణాళికలకు ఊతమిచ్చేందుకు రూ.6,000 కోట్ల అదనపు నిధుల కేటాయింపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రణాళికాబద్ధమైన మూలధన వ్యయంలో లోటును పరిష్కరించడం, దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ మౌలిక సదుపాయాలను పెంచేందుకు ఈ నిధులు వెచ్చించనున్నట్లు కంపెనీ తెలిపింది.దిల్లీ, ముంబయిల్లో మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (MTNL) కార్యకలాపాలను సైతం నిర్వహిస్తున్న బీఎస్ఎన్ఎల్కు దేశవ్యాప్తంగా 4జీ సేవలు లేకపోవడం, అందుకు సంబంధించిన మౌలిక సదుపాయాలు కొరవడడంతో సవాళ్లు ఎదుర్కొంటోంది. దానివల్ల బీఎస్ఎన్ఎల్ కస్టమర్లు 4జీ కవరేజీని అందించే ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లకు మారుతున్నారు. ప్రైవేట్ కంపెనీల నుంచి ఎదురయ్యే పోటీని ఎదుర్కోవడానికి సంస్థ 2023లో 1,00,000 4జీ సైట్ల కోసం రూ.19,000 కోట్లతో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ప్రభుత్వ రంగ టెలికాం పరికరాల తయారీ సంస్థ ఐటీఐ(ITI)కి సుమారు రూ.13,000 కోట్ల అడ్వాన్స్ పర్ఛేజ్ ఆర్డర్‌ను అప్పగించింది. ఈ సంస్థలు కంపెనీకి కావాల్సిన 4జీ మౌలిక సదుపాయాలను సిద్ధం చేసి అందించాల్సి ఉంటుంది. తాజాగా మరో రూ.6,000 కోట్లు అందించేందుకు కేబినెట్ ఆమోదించింది.ఇదీ చదవండి: రేట్ల కోతతో తక్షణ, దీర్ఘకాలిక ప్రభావాలు2019 నుంచి ప్రభుత్వం మూడు వేర్వేరు పునరుద్ధరణ ప్యాకేజీల ద్వారా బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్లో సుమారు రూ.3.22 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టింది. ఉద్యోగుల వ్యయాలను తగ్గించడం, 4జీ స్పెక్ట్రమ్ కేటాయింపు, రుణ పునర్వ్యవస్థీకరణ, ఆస్తులను మానిటైజ్ చేయడం వంటి చర్యలు ఈ ప్యాకేజీల్లో ఉన్నాయి. ఫలితంగా 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ లాభాలను ఆర్జించడం ప్రారంభించాయి.భవిష్యత్తు ప్రణాళికలు..తాజాగా ఆమోదం పొందిన నిధులతో దేశవ్యాప్తంగా 4జీ సేవలను అందుబాటులోకి తేవాలని, కస్టమర్ల అట్రిషన్(ఇతర టెలికాం కంపెనీలకు మారడం)ను తగ్గించాలని బీఎస్ఎన్ఎల్ లక్ష్యంగా పెట్టుకుంది. త్వరలో ఎంపిక చేసిన ప్రదేశాల్లో 5జీ సేవలను ప్రారంభించాలని కూడా కంపెనీ యోచిస్తోంది. ఈ ప్రణాళికలు టెలికాం రంగంలో బీఎస్ఎన్ఎల్ స్థానాన్ని బలోపేతం చేస్తుందని, ప్రైవేట్ సంస్థలతో మరింత సమర్థవంతంగా పోటీ పడటానికి వీలు కల్పిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. -
అడవులను రక్షించే.. ఫారెస్ట్ గార్డ్ 2.0: ఇదెలా పనిచేస్తుందంటే?
ఫొటోలో కనిపిస్తున్న ఈ చిన్న బాక్స్, అడవుల్లో సంభవించే పెద్ద అగ్నిప్రమాదాలను అరికట్టగలదు. ‘ఫారెస్ట్ గార్డ్ 2.0’ పేరుతో సూట్ బతుహాన్ ఎసిర్గర్, రానా ఇమాన్ అనే ఇద్దరు యువకులు ఈ చిన్న ఫైర్ సెన్సర్ డివైజ్‌ను రూపొందించారు.ఇది ఐఓటీ బేస్డ్ శాటిలైట్‌కు అనుసంధానమై పనిచేస్తుంది. ఇది క్షణాల్లోనే మంటలను గుర్తించి, సమాచారాన్ని అగ్నిమాపక సిబ్బందికి చేరవేస్తుంది. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని వెంటనే గుర్తించి, మంటలను నివారించి, అడవులను రక్షిస్తుంది.ఈ సెన్సార్‌ను ఏదైనా చెట్టుకు తగిలిస్తే చాలు, దాదాపు పదహారు హెక్టార్ల దూరం వరకు ఉండే మంటలను గుర్తిస్తుంది. ‘అడవుల్లో సంభవించే ప్రమాదాలను వెంటనే అరికట్టకుంటే పెద్ద నష్టమే వస్తుంది. అందుకే, మేము ఈ ఆలోచన చేశాం’ అని ఆ ఇద్దరూ చెప్పారు. -
టెక్నాలజీ అద్భుతం.. ఎగిరే ఓడ: చూశారా?
ఇప్పటికే ఎగిరే కార్లు వచ్చేశాయి. వాటి వరుసలోనే తాజాగా ఎగిరే ఓడలు కూడా వచ్చేశాయి. సముద్రం మీదుగా రవాణా చేయటానికి ఉపయోగించే ఓడలు, ఇప్పుడు గాలిలో ఎగురుతూ ప్రయాణం చేస్తాయి. ది ఫ్లయింగ్ షిప్ కంపెనీ వింగ్టిప్స్ రూపొందించిన ఈ ఎగిరే ఓడ సాధారణమైన ఓడల కంటే పదిరెట్లు వేగంగా ప్రయాణిస్తుంది.హోవర్ ఇంజిన్లతో తయారుచేసిన ఈ ఓడ బ్యాటరీలతో పనిచేస్తుంది. ఒకేసారి మొత్తం 22 కిలోల బరువు వరకు సరుకు రవాణా చేయగలదు. ఇక దీనికున్న పది అడుగుల పొడవైన రెక్కల సాయంతో, ఈ నౌక దాదాపు సముద్రంపై నుంచి 80 కిలోమీటర్ల పరిధి మేరకు ఎగురుతుంది.ఇది గంటకు గరిష్ఠంగా 19 నుంచి 27 మైళ్ల (సుమారు 30 కిలోమీటర్ల నుంచి 43 కిలోమీటర్ల) వేగంతో ప్రయాణిస్తుంది. దీనిని ప్రధానంగా సరుకుల రవాణా కోసం రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. త్వరలోనే ఈ ఎగిరే ఓడల్లో మరో రెండు మోడల్స్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: వాట్సాప్‌లోనే కరెంట్ బిల్, మొబైల్ రీఛార్జ్: కొత్త ఫీచర్ వచ్చేస్తోంది -
ఏఐ స్వీకరణలో పెద్ద కంపెనీలే ముందంజ
లాభాలను మెరుగుపరచుకోవడానికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా అనలిటిక్స్, సైబర్‌సెక్యూరిటీ సొల్యూషన్స్ వంటి నూతన తరం సాంకేతికతను వినియోగించడంలో పెద్ద కార్పొరేట్లు ముందుంటాయని సీపీఏ ఆస్ట్రేలియా నివేదిక వివరించింది.‘కొత్త సాంకేతికతలకు డిమాండ్ గణనీయంగా పెరుగుతుంది. వీటి వినియోగం వల్ల కంపెనీలకు సైబర్ భద్రత, కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడంలో, ఉద్యోగుల నైపుణ్యాలు, సంతృప్తిని పెంపొందించడంలో దోహదం చేస్తుంది. సవాళ్లను ఎదుర్కోవడంలో సాయపడుతుంది.ఉద్గారాల పర్యవేక్షణ, సరఫరా వ్యవస్థ పారదర్శకతను మెరుగుపరచడానికి, వాటాదారులతో సమర్థవంతంగా నిమగ్న మవ్వడానికి సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించడంపై కంపెనీలు దృష్టి పెట్టాలి. ఇది కార్యాచరణ సామర్థ్యాన్ని పెంపొందించడమే కాకుండా అభివృద్ధి చెందుతున్న నియంత్రణ అవసరాలకు అనుగుణంగా ప్రమాణాలను పాటించేందుకు కూడా సహాయపడుతుంది. -
వాట్సాప్‌లోనే కరెంట్ బిల్, మొబైల్ రీఛార్జ్: కొత్త ఫీచర్ వచ్చేస్తోంది
వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దిగ్గజ మెసేజింగ్ యాప్ 'వాట్సాప్' (Whatsapp) ఎప్పటికప్పుడు అప్డేట్స్ లేదా కొత్త ఫీచర్స్ ప్రవేశపెడుతూనే ఉంది. ఇందులో భాగంగానే మరికొన్ని కొత్త ఫీచర్స్ అందించడానికి సిద్ధమైంది. ఈ ఫీచర్స్ అందుబాటులోకి వస్తే.. వాట్సాప్ నుంచే కరెంట్ బిల్, టెలిఫోన్ బిల్ వంటివన్నీ కట్టేయొచ్చని తెలుస్తోంది.భారతదేశంలో ఆర్ధిక సేవలను ప్రారంభించడానికి మెటా యోచిస్తోంది. ఇందులో భాగంగానే సంస్థ వాట్సాప్ యాప్‌లోనే కరెంట్ బిల్, మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్‌లు, LPG గ్యాస్ చెల్లింపులు, నీటి బిల్లులు, ల్యాండ్‌లైన్ పోస్ట్‌పెయిడ్ బిల్లులు, అద్దె చెల్లింపులు చేయడానికి వీలుగా తగిన ఫీచర్స్ ప్రవేశపెట్టనుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం బీటా దశలో ఉన్నట్లు సమాచారం. కాబట్టి కొంతమంది యూజర్లు మాత్రమే ఈ ఫీచర్ ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. త్వరలో అందరికీ అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.వాట్సాప్‌లో ఈ కొత్త ఫీచర్స్ అందరికీ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయాన్ని మెటా అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తరువాత బిల్స్ చెల్లించడానికి ఇతర యాప్స్ మీద ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. కాబట్టి మీ స్మార్ట్‌ఫోన్‌లో స్టోరేజ్ సమస్యకు కూడా చెక్ పెట్టవచ్చు.స్మార్ట్‌ఫోన్ ఉపయోగించే చాలామంది.. ఇన్స్టెంట్ మెసేజింగ్ కోసం వాట్సాప్ ఉపయోగిస్తున్నారు. అయితే వీరందరూ పేమెంట్స్ లేదా బిల్లింగ్స్ కోసం ఇతర యాప్స్ మీద ఆధారపడుతున్నారు. అయితే వాట్సాప్‌లో బిల్స్ చెల్లించడానికి కావలసిన ఫీచర్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత.. ప్రత్యేకించి బిల్స్ పే చేయడానికి ఉపయోగించే యాప్స్ అనవసరం అవుతాయి. కొత్త ఫీచర్స్ వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా కూడా ఉంటాయి. ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధి దశలోనే ఉంది. వినియోగంలోకి రావడానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంటుందని సమాచారం. -
‘మొబైల్ టారిఫ్‌లు మరింత పెంచాల్సిందే’
ఇప్పటికే పలు విడతలుగా మొబైల్ టెలిఫోన్ చార్జీలను (Tariff Hike) పెంచినప్పటికీ.. మరింత పెంపు అవసరమని భారతీ ఎయిర్టెల్ (Airtel) వైస్ చైర్మన్, ఎండీ గోపాల్ విఠల్ వ్యాఖ్యానించారు. టెలికం రంగ ఆర్థిక స్థిరత్వం కోసం ఇది అవసరమన్నారు. డిసెంబర్ క్వార్టర్ కంపెనీ త్రైమాసిక ఫలితాల అనంతరం ఇన్వెస్టర్లతో ఏర్పాటు చేసిన ఎర్నింగ్స్ కాల్లో భాగంగా ఆయన ఈ అంశంపై మాట్లాడారు.నెట్‌వర్క్‌పై పెట్టుబడులు తగ్గించి, ట్రాన్స్మిషన్ సామర్థ్యం పెంపుపై దృష్టి పెట్టినట్టు చెప్పారు. తద్వారా కస్టమర్ల అనుభవంలో అంతరాలను తొలగించి, గృహ బ్రాడ్‌బ్యాండ్ సేవలను విస్తరించనున్నట్టు తెలిపారు. ‘‘2023–24 కంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయాలు తక్కువగా ఉంటాయి. 2025–26లోనూ మరింత తగ్గుతాయి. డిజిటల్ సామర్థ్యాల ఏర్పాటుపై మేము పెట్టిన దృష్టి ఇప్పుడు ఫలితాలనిస్తోంది’’అని చెప్పారు.భారత్‌లో సగటు టెలికం యూజర్ నుంచి వచ్చే ఆదాయం (ఏఆర్పీయూ) ప్రపంచంలోనే తక్కువగా ఉందన్నారు. ఆర్థికంగా నిలదొక్కుకుని, నిలకడైన రాబడుల కోసం మరో విడత టారిఫ్‌లకు చికిత్స అవసరమని వ్యాఖ్యానించారు. గతేడాది జూలైలో ఎయిర్టెల్ సహా ఇతర టెలికం కంపెనీలు టారిఫ్‌లను సగటున 10–21 శాతం మధ్య పెంచడం గమనార్హం.మార్జిన్లు తక్కువగా ఉండే హోల్‌సేల్ వాయిస్, మెస్సేజింగ్ సేవల నుంచి ఎయిర్టెల్ తప్పుకుంటున్నట్టు విఠల్ ప్రకటించారు. కంపెనీ లాభాలపై దీని ప్రభావం ఉండదన్నారు. డిసెంబర్ త్రైమాసికంలో ఎయిర్టెల్ రూ.16,134 కోట్ల లాభాలను నమోదు చేయడం గమనార్హం. ఒక్కో యూజర్ నుంచి సగటున రూ.245 ఆదాయం సమకూర్చుకుంది. ఇది కనీసం రూ.300 ఉండాలని ఎయిర్టెల్ ఎప్పటినుంచో చెబుతూ వస్తోంది. -
రీఛార్జ్ లేకుండానే.. ఫ్రీగా కాల్స్ మాట్లాడొచ్చు: సింపుల్ ట్రిక్ ఇదే..
సాధారణంగా కాల్స్ చేయాలన్నా.. స్వీకరించన్నా తప్పకుండా రీఛార్జ్ చేసుకోవాల్సిందే. రీఛార్జ్ ప్లాన్ ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్న సమయంలో కొందరు సమయానికి రీఛార్జ్ చేసుకోలేరు. అలాంటి వారికి ఇప్పుడొక శుభవార్త. ఒక సింపుల్ ట్రిక్ పాటిస్తే.. రీఛార్జ్ చేసుకోకుండానే ఫ్రీగా కాల్స్ మాటాడొచ్చు. అదెలాగో ఇక్కడ చూసేద్దాం..ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్న చాలా స్మార్ట్ఫోన్లు వైఫై కాలింగ్ ఫీచర్‌తో వస్తున్నాయి. ఈ ఫీచర్ ఉన్న మొబైల్ ఉపయోగించే వినియోగదారు మొబైల్ నెట్వర్క్ అవసరం లేకుండానే కాల్స్ చేసుకోవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే.. వైఫై కనెక్షన్ ఉన్నంత వరకు మాత్రమే కాల్స్ చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది.స్మార్ట్‌ఫోన్‌లో వైఫై కాలింగ్ యాక్టివేషన్ ఎలా?➤మీ స్మార్ట్‌ఫోన్‌లో సెట్టింగ్స్ ఆప్షన్ ఓపెన్ చేసి, నెట్వర్క్ & ఇంటర్నెట్ సెట్టింగ్‌లకు వెళ్లండి.➤అక్కడ సిమ్ కార్డ్ & మొబైల్ నెట్‌వర్క్‌ను ఎంచుకోండి.➤మీరు కాల్ చేయడానికి ఉపయోగించే సిమ్ కార్డును సెలక్ట్ చేసుకోండి.➤క్రిందికి స్క్రోల్ చేసి వైఫై కాలింగ్ టోగుల్ను ఎంచుకోవాలి.➤ఆ తరువాత వైఫై కాలింగ్‌ను యాక్టివేట్ చేసుకోవాలి.వైఫై కాలింగ్ యాక్టివేట్ అయిన తర్వాత.. మొబైల్ నెట్వర్క్ సరిగ్గా లేనప్పుడు లేదా రీఛార్జ్ ప్లాన్ ముగిసినప్పుడు మీ స్మార్ట్‌ఫోన్ కాల్ల కోసం ఆటోమాటిక్‌గా వైఫై ఉపయోగిస్తుంది. వైఫై కాలింగ్ ఫీచర్ ఉన్న స్మార్ట్ఫోన్లలో మాత్రమే ఇది సాధ్యమవుతుంది.ఇదీ చదవండి: కొత్త బిజినెస్‌లోకి అనన్య బిర్లా: ఇషా అంబానీకి పోటీ!? -
ఇనుములో హృదయం మొలిచెనె
ఓ అధికారిగా దక్షిణ కొరియాలోని గుమి నగరంలో పనిచేసే రోబో మెట్ల మీదపడి చనిపోయింది అంటూ గత ఏడాది మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీనికి కారణం రియల్ లైఫ్‌లో అనుకోకుండా ఎదురయ్యే సంఘటనల పట్ల ఎలా స్పందించాలనే విషయం ఏఐ ఆధారిత రోబోలకు తెలియకపోవటమే. ఇకపై ఇటువంటి ఘటనలు జరగకుండా.. ఎదురుగా మెట్లు కనిపిస్తే మనుషుల్లాగా మెట్ల మీద నుంచి రోబోలు కిందకు దిగనున్నాయి.అంతేకాకుండా దారిలో పోతుంటే రోడ్డు మధ్యలో గుంత ఉంటే దాని మీద నుంచి గెంతి ముందుకెళ్లేలా తర్ఫీదు పొందిన రోబోలు ఇక మీదట రోడ్ల మీద తిరగనున్నాయి. మనం అలసిపోయి ఇంటికి వెళ్లి టీ తయారుచేసి.. కొంచెం తక్కువ చక్కెర వేసి ఇవ్వమంటే అలాగే తయారుచేసి ఇవ్వనున్నాయి. –సాక్షి ప్రతినిధి, విశాఖపట్నంకచ్చితమైన నావిగేషన్హ్యూమనాయిడ్ రోబోట్ నావిగేషన్ వ్యవస్థను మరింతగా మెరుగుపరచనుంది. ఈ మానవరూప రోబోలు క్లిష్ట పరిస్థితుల్లోనూ.. ఎటువంటి ఇబ్బందులు లేకుండా కచి్చతత్వంతో, మరింత పక్కాగా ముందుకు వెళ్లి పనులను నెరవేర్చే అవకాశం ఉంటుంది. అంటే రోడ్డుపై ఏదైనా అనుకోకుండా ఎదురుగానో.. పక్కనుంచో వచ్చే వాహనాలతో ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తే అందుకు అనుగుణంగా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు ముందుకు వెళ్లేలా రూపుదిద్దుకోనున్నాయి. వాటికి ఉండే కెమెరాలు, రాడార్లు, వివిధ సెన్సార్ల ద్వారా వాస్తవ పరిస్థితులను పక్కాగా అంచనా వేసుకుని.. మెదడు వలే విశ్లేషణ చేసుకుని ముందుకు వెళ్లనున్నాయి. తద్వారా ఏఐ ఆధారిత సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు మరింత సులభంగా రోడ్లపై సంచరించనున్నాయి. ఈ రోబోలు భౌతిక ప్రపంచంలోకి అడుగు పెట్టకముందే వర్చువల్ పరిసరాలతో శిక్షణ పొంది ఉండటం వల్ల మర మనుషులు మరింత తెలివిగా నిజ జీవిత సవాళ్లను సులభంగా ఎదుర్కొనే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉదాహరణకు.. కాస్మోస్ ఏఐతో కూడిన హ్యూమనాయిడ్ రోబో ఓ గదిలో ఉండే ఫరి్నచర్, ఎదురుపడే వ్యక్తులను ఢీ కొట్టకుండా రద్దీగా ఉండే గదిలో నడవగలదు. గదిలో ఎక్కడైనా తడి ఉంటే.. అక్కడ గెంతి దాటనూ గలదు. అంతేకాకుండా వాతావరణంలో వచ్చే సూక్ష్మమైన మార్పులను కూడా ఇది గుర్తించగలదని రూపకర్తలు ఘంటాపథంగా చెబుతున్నారు. మర మనుషులకుండే ఈ సామర్థ్యాలతో ప్రధానంగా హోటల్, హాస్పిటల్, లాజిస్టిక్స్ పరిశ్రమల్లో విరివిగా వినియోగించుకునేందుకు దోహదపడతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.అచ్చం మనుషుల మాదిరిగానే.. అచ్చం మనుషుల్లా రోజువారీ జీవితంలో ఎదురయ్యే వివిధ రకాల విషయాలను వర్చువల్‌గా రోబోలకు ఎదురయ్యేలా చేసి.. వాటిని ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై శిక్షణ ఇస్తారు. తద్వారా రోడ్డు మీద నడిచే సమయంలో మధ్యలో గుంత వస్తే.. దాటుకుని ముందుకు వెళ్లడం.. ఎవరైనా దారికి అడ్డువస్తే తప్పుకుని వెళ్లడం ఇలా అన్ని విషయాల్లో అప్పటికప్పుడు మనుషుల తరహాలో స్పందించేలా వీటిని తీర్చిదిద్దుతున్నారు. ఏదైనా పరిశ్రమలో ఈ హ్యూమనాయిడ్ రోబోలను వినియోగిస్తే.. పనిచేస్తున్న సమయంలో సమస్య తలెత్తినా ప్రత్యేకంగా ఎటువంటి ఆదేశాలు అవసరం లేకుండానే వెంటనే అది పరిష్కరించుకుని ముందుకు వెళ్లే అవకాశం ఏర్పడనుంది. అంతేకాకుండా ఆస్పత్రుల్లో ఏదైనా ఆపరేషన్ చేసే సమయంలో కూడా అకస్మాత్తుగా సమస్య తలెత్తితే కూడా పరిష్కరించుకునే విధంగా వీటిని తయారు చేస్తున్నారు. హోటల్స్‌లో మనం చెఫ్‌కు ‘ఆమ్లెట్ విత్ లెస్ స్పైసీ’ ఆర్డర్ ఇచ్చినట్టుగానే.. రోబోకు సైతం మనకు ఇష్టం నచ్చిన రుచుల్లో ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు. ఆ రోబో మనం ఇచ్చే ఆర్డర్‌కు అనుగుణంగా వంటకాలను తయారుచేసి అందించేస్తుందన్న మాట. సిద్ధమైన హ్యూమనాయిడ్ రోబో రోబోలు సైతం మనసున్న మనుషుల్లాగే అనుకోకుండా జరిగే ఘటనలకు మనుషుల తరహాలోనే స్పందించే విధంగా తయారవుతున్నాయి. ఇటువంటి హ్యూమనాయిడ్ రోబోలను నివిదియా సీఈవో జెన్షెన్ హుయాగ్ సిద్ధం చేశారు. గత నెలలో లాస్ వేగాస్‌లో జరిగిన సీఈఎస్–2025లో తన హ్యూమనాయిడ్ రోబో పరిశోధనలను ఆయన వివరించారు. ఏదైనా పనిచెబితే.. అప్పటికప్పుడు చేయడంతో పాటు నిజజీవితంలో ఎదురయ్యే వివిధ ఘటనల పట్ల శిక్షణ ఇచి్చనట్టు ఆయన తెలిపారు. ఫిజికల్ డైనమిక్ థింగ్స్.. ఫిజికల్ వరల్డ్‌ను అర్థం చేసుకునేందుకు వీలుగా 20 మిలియన్ గంటల (2 కోట్ల గంటల) వీడియోల ద్వారా హ్యూమనాయిడ్ రోబోకు శిక్షణ అందించినట్టు ఆయన పేర్కొన్నారు. -
ప్రతి ఇద్దరిలో ఒకరు ఏఐ యూజర్
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఇంటర్నెట్ వినియోగం పెరిగిన తర్వాత వినియోగదారుల అభిరుచులు వేగంగా మారుతున్నాయి. క్షణాల్లోనే అనేక రకాల పనులు చేసిపెట్టే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫ్లాట్‌ఫామ్‌ల వాడకం కూడా వేగం పెరుగుతోంది. భారతీయ ఇంటర్నెట్ యూజర్లలో ప్రతి ఇద్దరిలో ఒకరు ఏదో ఒక ఏఐ ప్లాట్‌ఫామ్‌ను వాడుతున్నట్టు ‘లోకల్ సర్కిల్స్’సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ప్రస్తుతం కొత్తకొత్త ఏఐ ఫ్లాట్‌ఫామ్స్ వినియోగదారులకు అందుబాటులోకి వస్తూనే ఉన్నాయి. చాట్‌జీపీటీ, గూగుల్ ఏఐ ప్లాట్‌ఫామ్ జెమిని, మెటాకు చెందిన లామా 3.. ఇలా అనేక రకాల ఏఐ ఫ్లాట్‌ఫామ్‌ల వాడకంపై గత ఏడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 1 వరకు దేశవ్యాప్తంగా 309 జిల్లాల్లో 92 వేల మంది అభిప్రాయాలు సేకరించినట్టు లోకల్ సర్కిల్స్ సంస్థ వెల్లడించింది. డీప్‌సీక్ ఏఐ ప్లాట్‌ఫామ్‌కు త్వరలో మారాలనుకుంటున్నట్టు సర్వేలో పాల్గొన్న 31 శాతం మంది తెలిపారు. అయితే ఏఐ ఫ్లాట్‌ఫామ్‌లు వాడి సేకరించిన సమాచారం తప్పుగా ఉందని 18 శాతం మంది చెప్పగా.. 28 శాతం మంది కచ్చితమైన సమాచారమని అంగీకరించారు. ఏఐ ప్లాట్‌ఫామ్‌లను వాడబోమని.. కానీ గూగుల్, ఇతర సెర్చ్ ఇంజిన్లను వాడతామని 40 శాతం మంది తెలిపారు. ఏమీ చెప్పలేమని 5 శాతం మంది అభిప్రాయపడ్డారు. -
సాధారణ టెకీ.. రూ.5 కోట్ల నెట్‌వర్త్..
కోటీశ్వరులు కావాలని, సంపద పెంచుకోవాలని చాలా మంది కలలు కంటారు. కానీ కొంత మంది మాత్రమే వాటిని నిజం చేసుకుంటారు. అలాంటి వారిలో ఒకరు గుర్గావ్కు చెందిన యాక్సెంచర్ ఉద్యోగి గుర్జోత్ అహ్లువాలియా. కేవలం 11 ఏళ్లలో జీరో నుండి రూ. 5 కోట్ల నెట్‌వర్త్‌ను నిర్మించుకున్నారు. తన అద్భుతమైన ఆర్థిక ప్రయాణాన్ని ఆయనే వెల్లడించారు.2025లో ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్న అహ్లువాలియా.. తాను సాధించిన మైలురాయిని సోషల్ మీడియాలో పంచుకున్నారు. 2024 తనకు అతిపెద్ద విజయంగా అభివర్ణించారు. రూ. 5 కోట్ల నెట్‌వర్త్‌ను చూపుతున్న తన ఆర్థిక ట్రాకింగ్ యాప్ స్క్రీన్‌షాట్‌ను కూడా అహ్లువాలియా పోస్ట్ చేశారు. ఇందులో రూ. 2.7 లక్షల మేర మాత్రమే అప్పులు చూపుతోంది.మూడే సూత్రాలు తన విజయానికి మూడు అంశాల విధానం కారణమని అహ్లువాలియా చెబుతున్నారు. అవి అధిక ఆదాయాల కోసం కెరీర్ పురోగతి, ఆలస్యమైన సంతృప్తి ద్వారా క్రమశిక్షణతో కూడిన పొదుపు, వ్యూహాత్మక ఈక్విటీ పెట్టుబడులు. ఇవే కేవలం 11 ఏళ్లలో తాను రూ. 5 కోట్ల నెట్‌వర్త్‌ను చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాయని ఆయన చెబుతున్నారు.జీతం పొందే మధ్యతరగతి వ్యక్తి నుండి రూ. 5 కోట్ల నెట్‌వర్త్‌కు చేరడానికి రెండు ముఖ్య కారణాలు ఉన్నాయని ఆయన గుర్తించారు. ఒకటి అప్పు లేకపోవడం (విద్యకు తల్లిదండ్రులు నిధులు సమకూర్చినందున) అద్దె ఖర్చు లేకపోవడం (ఆయన తల్లిదండ్రులతో కలిసే ఉంటున్నారు). అయితే ఇటీవలి మార్కెట్ దిద్దుబాట్లు తన నెట్‌వర్త్‌లో 8-10% క్షీణతకు దారితీశాయని కూడా ఆయన అంగీకరించారు.Hitting this milestone was my biggest achievement in 2024.A salaried middle class person like me went from 0 to ₹5,00,00,000 in 11 years.3 Key Elements1. Professional Growth - high income2. Aggressive savings - delay gratification3. Equity investing - owning businesses pic.twitter.com/t3niPluPW7— Gurjot Ahluwalia (@gurjota) February 2, 2025 -
ఉద్యోగాలపై ఏఐ ప్రభావం.. నారాయణమూర్తి ఏమన్నారంటే..
ఉద్యోగ కోతలపై కృత్రిమ మేధ (ఏఐ), వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల ప్రభావం ఎలా ఉందో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి తన అభిప్రాయాలు పంచుకున్నారు. కృత్రిమ మేధ వల్ల కొంతమేరకు నిరుద్యోగం పెరుగుతోందని నారాయణమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. ఓ మీడియా సంస్థ ఏర్పాటు చేసిన సమావేశంలో ఏఐ ప్రభావంపై జరిగిన చర్చలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఏఐను ముప్పుగా కాకుండా ఒక అవకాశంగా చూడాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.కృత్రిమ మేధ-ఉద్యోగ నష్టాలుఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాస్తవానికి చాలా పనులను ఆటోమేట్ చేస్తోందని మూర్తి చెప్పారు. దాంతో చాలామంది ఉద్యోగాలు కోల్పోతున్నారని తెలిపారు. అయితే ఇది కొత్త అవకాశాలను సృష్టించడానికి, మానవ ఉత్పాదకతను పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉందని అంగీకరించారు. 1970ల్లో కంప్యూటర్-ఎయిడెడ్ సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ సాధనాలను ప్రవేశపెట్టిన సమయంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయని చెప్పారు. కానీ ఈ సాధనాలు డెవలపర్లకు మరింత క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడానికి వీలు కల్పించాయన్నారు. ఉత్పాదకతను పెంచడానికి మానవులు, యంత్రాలు కలిసి పనిచేసే సహాయక సాంకేతికతగా కృత్రిమ మేధను పరిగణించాలని మూర్తి అన్నారు. అటానమస్ డ్రైవింగ్, ప్రమాదకర వాతావరణంలో యంత్రాలను ఆపరేట్ చేయడం, కచ్చితమైన పరికరాలతో రిమోట్ సర్జరీ వంటి వాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రయోజనకరంగా ఉంటుందని హైలైట్ చేశారు. కృత్రిమ మేధను ఉపయోగించడం ద్వారా మానవులు మరింత సృజనాత్మక, సంక్లిష్టమైన పనులపై దృష్టి పెట్టవచ్చని చెప్పారు. ఇది ఉద్యోగుల నైపుణ్యాల పెరుగుదలకు దారితీస్తుందని తెలిపారు.ఇదీ చదవండి: భారత్‌లో బ్లాక్‌రాక్ కొత్తగా 1,200 ఉద్యోగాలుఏఐ ఇన్నోవేషన్‌లో భారత్ పాత్రకృత్రిమ మేధ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, నూతన ఆవిష్కరణలు చేయడంలో భారత్ సామర్థ్యంపై మూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. ఇతర ప్రాంతాల్లో అభివృద్ధి చెందిన సాంకేతికతలను అవలంబించడమే కాకుండా ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగానికి దోహదపడే స్థాయికి దేశం పురోగమించిందని అభిప్రాయపడ్డారు. కృత్రిమ మేధను స్వీకరించి కొత్త టెక్నాలజీల్లో పెట్టుబడులు పెట్టాలని యువతను కోరారు. -
చాట్‌జీపీటీకే జై...
న్యూఢిల్లీ: దేశీయంగా దాదాపు సగం మంది ఇంటర్నెట్ యూజర్లు ఇప్పటికే కృత్రిమ మేథ (ఏఐ) ప్లాట్‌ఫాంలను వినియోగిస్తున్నారు. ఇందులో ఓపెన్ఏఐకి చెందిన చాట్‌జీపీటీ అగ్రస్థానంలో ఉంది. ఆన్లైన్ సర్వే సంస్థ లోకల్‌సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2024 ఆగస్టు 11 నుంచి 2025 ఫిబ్రవరి 1 వరకు దీన్ని నిర్వహించారు. ఇందులో దేశవ్యాప్తంగా 309 జిల్లాల నుంచి 92,000 మంది ఇందులో పాల్గొన్నారు. దీని ప్రకారం వివిధ అంశాలపై వివరాల కోసం 40 శాతం మంది గూగుల్ తదితర సెర్చి ఇంజిన్లకు ప్రాధాన్యమిస్తున్నారు. సమాచారం కోసం ఏ కృత్రిమ మేథ ప్లాట్ ఫాంను ఉపయోగిస్తుŠాన్నరనే ప్రశ్నకు స్పందిస్తూ .. 15,377 మందిలో 28 శాతం మంది చాట్‌జీపీటీకి ఓటేయగా, 9 శాతం మంది పర్ప్లెక్సిటీని, 6 శాతం మంది కో–పైలట్‌ను నేరుగా లేదా బింగ్ ద్వారా ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. అలాగే చెరి 3 శాతం మంది ‘జెమిని వయా గూగుల్‘, ల్లామా (మెటా)ను వాడుతున్నారు. మరో ఆరు శాతం మంది తాము ఉపయోగించే ప్లాట్‌ఫాం పేరు సర్వేలో లేదని తెలిపారు. ‘మొత్తం మీద చూస్తే భారతీయ ఇంటర్నెట్ యూజర్లలో ప్రతి ఇద్దరిలో ఒకరు ఇప్పటికే ఏఐ ప్లాట్‌ఫాంలను ఉపయోగిస్తున్నారు. చాట్‌జీపీటీని అత్యధికంగా వాడుతున్నారు‘ అని లోకల్‌సర్కిల్స్ పేర్కొంది. సర్వేలోని మరిన్ని వివరాలు.. → 90 శాతం మంది ఏఐ యూజర్లు ప్రధానంగా టెక్ట్స్ మోడ్లోను, 10 శాతం మంది వాయిస్ మోడ్లోను ఈ ప్లాట్‌ఫాంను ఉపయోగిస్తున్నారు. → ఉచితంగా ఏఐ ఫీచర్లు ఇస్తున్న చైనా ప్లాట్‌ఫాం డీప్‌సీక్‌కు మారతారా అనే ప్రశ్నకు స్పందిస్తూ, 15,753 మందిలో 8 శాతం మంది ఇప్పటికే తాము మారినట్లు తెలిపారు. 8 శాతం మంది మారతామని తెలపగా, 38 శాతం మంది అయిష్టత వ్యక్తం చేశారు. → ఇప్పటికే డీప్సీక్కి మారిన ఏఐ యూజర్లు, లేదా త్వరలోనే మారనున్న యూజర్లు ప్రతి పది మందిలో ముగ్గురు ఉన్నారు. → ప్రతి పది మంది ఏఐ యూజర్లలో ముగ్గురు పెయిడ్ లేదా ప్రీమియం సబ్‌్రస్కిప్షన్ ఉపయోగిస్తున్నారు. -
ఏఐదే హవా!
సాక్షి, హైదరాబాద్: టెక్నాలజీలో సరికొత్త ఆవిష్కరణలకున్న ప్రాధాన్యత దృష్ట్యా తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ఐటీ నిపుణుల అవసరం పెరుగుతోంది. దీంతో పలు సంస్థలు నైపుణ్యం గల యువత కోసం అన్వేషిస్తున్నాయి. ఇందులో భాగంగా క్యాంపస్ నియామకాల కోసం కాలేజీల బాట పడుతున్నాయి. మారిన సాంకేతికత అవసరాలకు సరిపోయే నైపుణ్యం ఉన్నవారికే కంపెనీలు ప్రాధాన్యమిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటాసైన్స్ వంటి నేపథ్యం ఉన్న వారిని అత్యధిక వార్షిక వేతనంతో ఎంపిక చేసుకుంటున్నాయి. వచ్చే విద్యా సంవత్సరంలో క్యాంపస్ నియామకాలు 20% పెరిగే వీలుందని ఇటీవల నౌకరీ డాట్ కామ్ సర్వే వెల్లడించడం గమనార్హం. పలు దేశాలు భారత్‌లో గ్లోబల్ కేపబిలిటీ కేంద్రాల(జీసీసీ) ఏర్పాటుపై దృష్టి పెడుతున్నాయి. దీంతో నైపుణ్యం యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని నిపుణులు అంటున్నారు. వేగంగా విస్తరిస్తున్న జీసీసీలకు అత్యుత్తమ మానవ వనరులు అవసరమని నిపుణులు చెబుతున్నారు. తాజా పరిస్థితులు బీటెక్ విద్యార్థుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. దేశంలో ఏఐ నిపుణులు అంతంతే.. ఇండక్షన్ అనే సంస్థ వెల్లడించిన నివేదిక ప్రకారం గ్లోబల్ కేపబిలిటీ కేంద్రాలు 2025 చివరి నాటికి దేశవ్యాప్తంగా 3.64 లక్షల ఉద్యోగాలు సృష్టించే వీలుంది. ప్రస్తుతం జీసీసీల్లో ఉపాధి పొందుతున్న వారి సంఖ్య 19 లక్షలు కాగా 2030 నాటికి ఇది 28 లక్షలకు చేరుతుందని అంచనా. స్కిల్ ఇండియా రిపోర్టు ప్రకారం 2026 నాటికి దేశంలో 10 లక్షల మందికి పైగా ఏఐ నిపుణుల అవసరం ఏర్పడుతుంది. 2023 ఆగస్టు లెక్కల ప్రకారం దేశంలో 4.16 లక్షల మంది ఏఐ నిపుణులు మాత్రమే ఉన్నారు. అంటే 2026 నాటికి సుమారుగా మరో 6 లక్షల మంది అవసరం కానున్నారు. ఈ నేపథ్యంలోనే అనవసర ఆందోళనలు పక్కనపెట్టి ఏఐని ఆహ్వానించాలని, ఐటీ దిగ్గజ సంస్థకు చెందిన జాకర్ తెలిపారు. ఇవన్నీ గమనంలో ఉంచుకునే విద్యా సంస్థలు ఏఐ, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ లాంటి కోర్సుల్లో ప్రవేశాలు పెంచుకుంటున్నాయి. కంపెనీలు సైతం ఏఐపై పట్టున్న వారికే ప్రాంగణ నియామకాల్లోనూ మంచి అవకాశాలు ఇస్తున్నాయి. ప్రత్యేక నైపుణ్యమే ప్రధానం దేశంలో ప్రతి ఏటా 15 లక్షల మంది ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉపాధి కోసం ప్రయత్నిస్తున్నారు. ఇందులో కేవలం 9 శాతం మాత్రమే ఐటీ రంగంలో మంచి ఉద్యోగాలు పొందుతున్నారు. ఏఐ, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్‌పై పట్టు వారినే కంపెనీలు ఎంపిక చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో సివిల్, మెకానికల్‌లో బీటెక్ కోర్సులు చేస్తున్న విద్యార్థులు కూడా ఏఐ, తదితర టెక్నాలజీల్లో సర్టిఫికెట్ కోర్సులు చేస్తేనే క్యాంపస్ నియామకాల్లో ఉద్యోగాలు పొందుతున్నారు. ఏఐ, డేటా సైన్స్ రంగాల్లోని పట్టభద్రులకు క్యాంపస్ నియామకాల్లో సంప్రదాయ ఐటీ రంగాల నిపుణుల కన్నా 30 శాతం ఎక్కువ వేతనాలు లభిస్తున్నాయి. జీసీసీల్లో అత్యధిక డిమాండ్ కలిగిన టెక్నాలజీల్లో నైపుణ్యం ఉన్నవారికి మంచి ప్యాకేజీలు ఇస్తున్నారు. క్యాంపస్ నియామకాల్లో ఏఐ ఇంజనీరింగ్, జనరేటివ్ ఏఐ, డేటా ఫ్యాబ్రిక్స్, డి్రస్టిబ్యూషన్ ఎంటర్ప్రైజెస్, క్లౌడ్ నేటివ్ ప్లాట్‌ఫామ్స్, అటానమస్ సిస్టమ్స్, డెసిషన్ ఇంటెలిజెన్స్, హైపర్ ఆటోమేషన్, సైబర్ సెక్యూరిటీ మెష్ నైపుణ్యం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తున్నారు. సైబర్ సెక్యూరిటీలో ప్రారంభ వేతనం సగటున ఏడాదికి 9.57 లక్షలుగా ఉంది. ఏఐ నైపుణ్యానికి కంపెనీల ప్రాధాన్యం రెండేళ్ళుగా జేఎన్టీయూహెచ్లో ప్రాంగణ నియామకాలు పెరుగుతున్నాయి. ఏఐ, సైబర్ సెక్యూరిటీ, ఎఐఎంల్‌తో పాటు ఏఐ అనుసంధానం ఉన్న కోర్సుల విద్యార్థులకు కంపెనీలు ప్రాధాన్యమిస్తున్నాయి. అయితే సివిల్, మెకానికల్ విద్యార్థులు కూడా ఈ ట్రెండ్‌ను అర్థం చేసుకుని, ఏఐఎంల్ మైనర్ డిగ్రీ కోర్సులు చేస్తున్నారు. వీరికి కూడా ప్లేస్‌మెంట్స్ లభిస్తున్నాయి. – ప్రొఫెసర్ పద్మావతి విశ్వనాథ్ (వైస్ ప్రిన్సిపల్, జేఎన్టీయూహెచ్) స్థానిక వనరులపై ఐటీ సంస్థల దృష్టి ఏఐ విస్తరణకు అనుగుణంగా డేటా కేంద్రాలు, మాడ్యూల్స్ అభివృద్ధి చేయాల్సి వస్తోంది. అమెరికా ఆంక్షల నేపథ్యంలో స్థానికంగా మానవ వనరులు అభివృద్ధి పరుచుకోవడంపై సంస్థలు దృష్టి పెట్టాయి. ఇందులో భాగంగానే నైపుణ్యం వారి కోసం క్యాంపస్ నియామకాలు పెంచాయి. – నవీన్ ప్రమోద్ (ఎంఎన్సీ కంపెనీ హెచ్ఆర్ మేనేజర్) -
రూ. 2.20 కోట్ల జీతం.. ప్లేస్మెంట్ రికార్డ్
క్యాంపస్ ప్లేస్మెంట్లలో (Campus Placement) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT BHU) తన రికార్డును తానే బద్దలుకొట్టింది. ఈ ఏడాది అత్యధిక వార్షిక వేతనం (Salary Package) రూ. 2.20 కోట్లుగా నమోదైంది. మునుపటి రికార్డు 2021 సంవత్సరంలో రూ. 2.15 కోట్లు ఉండేది. ఇప్పుడు నమోదైన అత్యధిక వేతనంతో గత పదేళ్లలో ఐఐటీ బీహెచ్‌యూ సాధించిన అత్యుత్తమ పనితీరు ఇదేనని భావిస్తున్నారు.దీంతో పాటు 1128 మంది విద్యార్థులు మంచి ఉద్యోగాలు సాధించారు. మరో 424 మంది ఇంటర్న్‌షిప్‌లను పొందారు. ఈసారి సగటు ప్యాకేజీ కూడా పెరిగింది. ఈ సంవత్సరం సగటు వార్షిక ప్యాకేజీ రూ. 22.80 లక్షలకు చేరుకుంది. తమ విద్యార్థుల ప్రతిభ, విద్యా, పరిశోధనా నైపుణ్యం పట్ల సంస్థ నిబద్ధత అగ్రశ్రేణి రిక్రూటర్లను ఆకర్షిస్తూనే ఉన్నాయని ఐఐటీ బీహెచ్‌యూ డైరెక్టర్ పేర్కొన్నారు.క్యాంపస్‌లో జరిగిన నియామకాల్లో పరిశ్రమ దిగ్గజ సంస్థలు పాల్గొన్నాయి. ఐటీ కంపెనీలు, కన్సల్టింగ్ ఫైనాన్స్, కోర్ ఇంజనీరింగ్ రంగాలకు చెందిన కంపెనీలు ప్లేస్మెంట్ డ్రైవ్ హాజరై విద్యార్థులను ఎంపిక చేసుకున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, టాటా స్టీల్, అమెజాన్, డేటా బ్రిక్స్, ఐటీసీ, శామ్సంగ్, ఒరాకిల్, వాల్‌మార్ట్, క్వాల్‌కామ్‌తో సహా దాదాపు 350 కంపెనీలు 2024 ప్లేస్మెంట్ డ్రైవ్‌ను కవర్ చేశాయి.రికార్డు ప్యాకేజీలుఐఐటీ బీహెచ్‌యూలో ఏటా జరుగుతున్న క్యాంపస్ ప్లేస్మెంట్లలో విద్యార్థులు రికార్డుస్థాయిలో అత్యధిక వార్షిక ప్యాకేజీలతో ఉద్యోగాలను సొంతం చేసుకుంటున్నారు. 2024-25లో అత్యధిక వేతనం రూ.2.20 కోట్లు కాగా, 2023-24లో రూ.1.68 కోట్లు, 2022-23లో రూ.1,20 కోట్లు, 2021-22లో రూ.2.15 కోట్ల ప్యాకేజీలు అత్యధిక వేతనాలుగా రికార్డు సృష్టించాయి. 11 మంది విద్యార్థులు రూ.1 కోటి కంటే ఎక్కువ ప్యాకేజీతో ప్లేస్‌మెంట్‌ను పొందారు. -
ప్రభుత్వ డివైజ్‌ల్లో ఏఐ టూల్స్ నిషేధం!
అధికారిక పరికరాల్లో చాట్‌జీపీటీ(ChatGPT), డీప్‌సీక్(Deepseek) వంటి ఏఐ టూల్స్ వాడకాన్ని నిషేధిస్తూ భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఏఐ టూల్స్, అప్లికేషన్లు సున్నితమైన ప్రభుత్వ డేటా గోప్యతకు ప్రమాదం కలిగించే అవకాశం ఉందని అడ్వైజరీ హైలైట్ చేసింది. జనవరి 29, 2025 నుంచి అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం డేటా భద్రత, ప్రభుత్వ డాక్యుమెంట్ల గోప్యతకు సంబంధించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.నిషేధం ఎందుకు?ఏఐ టూల్స్, అప్లికేషన్లు సున్నితమైన ప్రభుత్వ డేటా గోప్యతకు ప్రమాదం వాటిల్లేలా ప్రవర్తిస్తాయని అడ్వైజరీ స్పష్టం చేసింది. ఈ సాధనాలు తరచుగా బయటి సర్వర్ల ద్వారా వినియోగదారు ఇన్పుట్లను ప్రాసెస్ చేస్తాయి. ఇది డేటా లీక్‌లకు అవకాశం కల్పిస్తుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇటలీ వంటి దేశాలు డేటా భద్రతా ప్రమాదాలను ఉదహరిస్తూ ఇలాంటి ఆంక్షలు విధించాయి. దాంతో భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ సైతం అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టింది.ఓపెన్ఏఐ సీఈఓ పర్యటనఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ ఈరోజు భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో చాట్‌జీపీటీ వినియోగాన్ని నిషేధిస్తున్నట్లు అడ్వైజరీ వెలువడడం గమనార్హం. తన పర్యటనలో భాగంగా ఐటీ మంత్రి, ప్రధాని నరేంద్ర మోదీ సహా ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. అధికారిక, గోప్యమైన కమ్యూనికేషన్లలో ఏఐ ఆధారిత డేటా భద్రతా ప్రమాదాలపై పెరుగుతున్న ఆందోళనలను ఈ చర్య నొక్కి చెబుతోంది.ఇదీ చదవండి: ‘చౌకగా పెట్రోల్.. ప్రజలకు రాయితీల్లేవు’డేటా భద్రతా చర్యలు అవసరంఈ నిషేధం ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసు కంప్యూటర్లు, డివైజ్‌ల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉపయోగించకూడదు. ఉద్యోగులు పని ప్రయోజనాల కోసం వ్యక్తిగత పరికరాలపై ఈ సాధనాలను ఉపయోగించవచ్చో లేదో ఆదేశాల్లో ప్రత్యేకంగా పేర్కొననప్పటికీ సౌలభ్యం కంటే డేటా భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తుంది. పని ప్రదేశాల్లో కృత్రిమ మేధ సాధనాల వాడకం పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల చర్చ జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నందున పటిష్టమైన డేటా భద్రతా చర్యల అవసరాన్ని కూడా ప్రభుత్వ నిర్ణయం ఎత్తి చూపుతుంది. -
5జీ స్పెక్ట్రమ్ వేలానికి మార్గం సుగమం
టెలికాం సేవల సామర్థ్యాన్ని గణనీయంగా పెంచేందుకు ట్రాయ్ చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా 22 సర్కిళ్లలో 37-40 గిగాహెర్ట్జ్ బ్యాండ్‌లో రూ.17,940 కోట్ల విలువైన కొత్త 5జీ స్పెక్ట్రమ్(spectrum) వేలానికి టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఆమోదం తెలిపింది. అధిక జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో హై-స్పీడ్ కనెక్టివిటీని అందించేందుకు టెలికాం శాఖ ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు.వేలంలోని కీలక అంశాలుమిల్లీమీటర్ వేవ్ (ఎంఎంవేవ్) స్పెక్ట్రమ్‌లో భాగమైన 37-40 గిగాహెర్ట్జ్ బ్యాండ్‌ను వేలం వేయనున్నారు. టెలికాం ఆపరేటర్లకు మరింత నెట్వర్క్ సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ బ్యాండ్ కీలకం కానుంది. అధిక జనసాంద్రత ఉన్న ప్రాంతాలకు ఇది అనువైందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. 37-40 గిగాహెర్ట్జ్ బ్యాండ్‌లో ఒక్కో సర్కిల్‌కు మొత్తం 3,000 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ అందుబాటులో ఉంటుంది. స్పెక్ట్రమ్ రిజర్వ్ ధర సర్కిళ్లను అనుసరించి మారుతూ ఉంటుంది. ఢిల్లీ సర్కిల్లో అత్యధికంగా మెగాహెర్ట్జ్‌కు రూ.76 లక్షలు, ముంబైలో మెగాహెర్ట్జ్‌కు రూ.67 లక్షలు, మహారాష్ట్రలో రూ.54 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌లో మెగాహెర్ట్జ్‌కు రూ.49 లక్షలుగా ఉంది.మారటోరియం తిరస్కరణభవిష్యత్తులో జరగబోయే వేలంలో కొనుగోలు చేసే స్పెక్ట్రమ్‌పై 5-6 సంవత్సరాల వడ్డీ లేని చెల్లింపు వ్యవధి లేదా మారటోరియం కోసం టెలికాం ఆపరేటర్ల అభ్యర్థనను ట్రాయ్ తిరస్కరించింది. ముందస్తు చెల్లింపు, 20 సమాన వార్షిక వాయిదాల్లో చెల్లింపు నిబంధనల్లో మార్పులుండవని తేల్చి చెప్పింది. ఈ స్పెక్ట్రమ్‌ను టెలికాం ఆపరేటర్లకు 20 ఏళ్ల వ్యాలిడిటీ కాలానికి అందిస్తారు.ఇదీ చదవండి: అక్రమ జామర్స్‌తోనే కాల్ డ్రాప్స్ఈ వేలంలో హైస్పీడ్ ఇంటర్నెట్ కోసం పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి, 5జీ సేవల ప్రారంభానికి మద్దతు ఇవ్వడానికి టెలికాం ఆపరేటర్లకు అవసరమైన స్పెక్ట్రమ్‌ను అందించనున్నారు. 37-40 గిగాహెర్ట్జ్ బ్యాండ్ ముఖ్యంగా హైస్పీడ్ కనెక్టివిటీ అవసరమైన పట్టణ ప్రాంతాలకు ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ వేలంలో యూనిఫైడ్ లైసెన్స్ కింద ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు (ఐఎస్పీ), మెషిన్ టు మెషిన్ సర్వీస్ ప్రొవైడర్లను వేలంలో పాల్గొనేందుకు అనుమతించాలని ట్రాయ్ సూచించింది. -
అక్రమ జామర్స్‌తోనే కాల్ డ్రాప్స్
విద్యా సంస్థలు, గృహాలు, కంపెనీల్లో ఏర్పాటు చేసిన అక్రమ జామర్స్, రిపీటర్స్‌తో మొబైల్ నెట్వర్క్స్ సేవల నాణ్యత క్షీణిస్తోందని టెలికం కంపెనీలకు ప్రాతినిథ్యం వహిస్తున్న సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (COAI) ప్రభుత్వానికి నివేదించింది. వాటి కారణంగానే వినియోగదారులకు కాల్ డ్రాప్స్, డేటా వేగం తగ్గుతోందని తెలిపింది. అక్రమంగా జామర్స్, రిపీటర్స్ను వినియోగిస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని పేర్కొంది.రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా తదితర సంస్థలు సీవోఏఐలో సభ్యులుగా ఉన్నాయి. కాల్ డ్రాప్స్‌కు వాటే జామర్స్‌ను ఉపయోగించడం టెలికమ్యూనికేషన్స్ చట్టం 2023 ప్రకారం నేరమని, వాటి వినియోగాన్ని నిలిపివేయాల్సిందిగా సీవోఏఐ కోరింది. ఈ మేరకు రాష్ట్రాలకు లేఖలు రాయాల్సిందిగా టెలికం శాఖను అభ్యర్థించింది. ఈ పరికరాలను అమెజాన్(Amazon) ఇండియా విక్రయిస్తోందని తెలిపింది. టెలికమ్యూనికేషన్‌ను నిరోధించే ఏదైనా పరికరాలను అక్రమంగా కలిగి ఉంటే మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.50 లక్షల వరకు జరిమానా లేదా రెండూ విధిస్తారని సీవోఏఐ వివరించింది. తయారీ స్టార్టప్‌లపై ఫండ్ ఆఫ్ ఫండ్స్ దృష్టిఅంకుర సంస్థల కోసం కొత్తగా ప్రకటించిన రూ.10,000 కోట్ల ఫండ్ ఆఫ్ ఫండ్స్ స్కీమ్ (ఎఫ్ఎఫ్ఎస్) ప్రధానంగా తయారీ, హై–టెక్నాలజీ రంగాలకు చెందిన స్టార్టప్‌లపై దృష్టి పెట్టనున్నట్లు పరిశ్రమలు, అంతర్గాత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి అమర్దీప్ సింగ్ భాటియా తెలిపారు. రెండో విడత ఎఫ్ఎఫ్ఎస్ కోసం ప్రత్యామ్నాయ పెట్టుబడి ఫండ్లు (ఏఐఎఫ్), సిడ్బీ మొదలైన వాటితో సంప్రదింపులు జరిపినట్లు ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: 17,600 సంస్థల మూసివేత..2016లో రూ.10,000 కోట్లతో ప్రకటించిన తొలి విడత ఎఫ్ఎఫ్ఎస్, అంకురాల పెట్టుబడుల అవసరాలను తీర్చే ఏఐఎఫ్ వ్యవస్థ రూపుదిద్దుకోవడానికి ఉపయోగపడినట్లు వివరించారు. దీని కింద 1,180 స్టార్టప్‌లకు ఏఐఎఫ్‌ల ద్వారా రూ.21,700 కోట్ల మేర పెట్టుబడులు సమకూరినట్లు పేర్కొన్నారు. తొలి విడత ఎఫ్ఎఫ్ఎస్ కాలపరిమితి 10 ఏళ్లుగా ఉండగా, హై–టెక్నాలజీ అంకురాల దీర్ఘకాలిక నిధుల అవసరాలను తీర్చే విధంగా కొత్త స్కీము కాలపరిమితిని 14–15 సంవత్సరాలుగా నిర్ణయించవచ్చని భాటియా వివరించారు. డెట్ ఫండ్స్‌ను ప్రవేశపెట్టే అంశంపై కూడా చర్చలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. -
త్వరలో భారత్ సొంత జీపీయూ
వచ్చే 3–5 ఏళ్లలో హై–ఎండ్ కంప్యూటింగ్ చిప్సెట్లయిన జీపీయూలను భారత్ సొంతంగా తయారు చేసుకోగలదని కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ధీమా వ్యక్తం చేశారు. అలాగే దేశీయ ఫౌండేషనల్ ఏఐ (AI) ప్లాట్‌ఫాం పది నెలల్లో సిద్ధం కావచ్చని వివరించారు. దేశీయంగా మరో 3–4 రోజుల్లో మొత్తం 18,000 అధునాతన గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లను (GPU) అందుబాటులోకి తేనున్నట్లు బడ్జెట్ రౌండ్‌టేబుల్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి చెప్పారు.ఇప్పటికే 10,000 జీపీయూలు అందుబాటులో ఉన్నట్లు వివరించారు. ఖరీదైన, అధునాతన కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలు అవసరమయ్యే ఏఐ మోడల్స్ సాధారణంగా బడా సంస్థలకే పరిమితమయ్యే అవకాశం ఉందని, కానీ చిన్న స్థాయి అంకురాలు, పరిశోధకులు కూడా చౌకగా కంప్యూటింగ్ ఇన్ఫ్రాను ఉపయోగించుకునేందుకు వీలుగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుందని మంత్రి చెప్పారు. ఏఐ ఫౌండేషనల్ మోడల్‌ను రూపొందించేందుకు స్టార్టప్‌లు, పరిశోధకులు కీలకమైన మాథమెటికల్ అల్గోరిథంలకు సంబంధించిన పలు పరిశోధన పత్రాలను అధ్యయనం చేస్తున్నట్లు వివరించారు.ఇదీ చదవండి: బెదిరింపులకు భయపడి మూసేయలేదుచాట్జీపీటీతో పోలిస్తే చిన్నవే అయినప్పటికీ పలు అంకుర సంస్థలు కొన్ని ఏఐ మోడల్స్‌ను ఇప్పటికే రూపొందించాయని, కృత్రిమ మేథ సహాయంతో రైల్వే శాఖ టికెట్ల కన్ఫర్మేషన్ రేటును 27 శాతం మెరుగుపర్చుకున్నట్లు మంత్రి తెలిపారు. మరోవైపు, దేశీ ఎల్రక్టానిక్ కంపెనీలు అత్యంత నాణ్యత, కచ్చితత్వంతో ఉత్పత్తులను తయారు చేసే సామర్థ్యాలను సాధించాయని ఆయన చెప్పారు. -
మనిషిలా తెలివి మీరుతున్న ఏఐ
కృత్రిమ మేధస్సు (AI) వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ పురోగతికి ‘మెమోరీని ఏకీకృతం’ చేయడం కీలకంగా మారుతోంది. ఏఐ వ్యవస్థను నడిపించే ముఖ్య కారకాల్లో ఇది ప్రధానమైంది. సమస్యలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడానికి, వాటిని పరిష్కరించడానికి మానవులు జ్ఞాపకశక్తిపై ఆధారపడినట్లే.. ఏఐ వ్యవస్థలు వాటి సామర్థ్యాలను మెరుగుపరచడానికి మెమరీని ఉపయోగించడం ఇప్పటికే ప్రారంభించాయి. ఈ మార్పు మరింత అధునాతనంగా, మానవ తరహా కృత్రిమ మేధకు మార్గం సుగమం చేస్తోంది.ఓహియో స్టేట్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న యూసు ఈ రంగంలో పరిశోధనలు చేస్తున్నవారిలో ప్రముఖంగా ఉన్నారు. ఓహియో స్టేట్ యూనివర్సిటీలో చేరడానికి ముందు తాను మైక్రోసాఫ్ట్ సెమాంటిక్ మెషీన్స్‌లో సీనియర్ పరిశోధకుడిగా పనిచేశారు. అక్కడ తాను సంభాషణాత్మక ఏఐపై విధులు నిర్వహించారు. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెమరీ ఆగ్మెంటెడ్ ఏఐ సిస్టమ్స్ అభివృద్ధిలో పరిశోదనలు చేశారు.సందర్భానుసారం స్పందించే ఏఐఅత్యాధునిక సమాచారంతో నిర్ణయాలు తీసుకోవడం కోసం గత సమాచారాన్ని గుర్తుంచుకుని, సందర్భానుసారం దాన్ని ఉపయోగించే ఏఐ వ్యవస్థలను సృష్టించడంపై దృష్టి సారించినట్లు యూసు తెలిపారు. భాషా అవగాహన, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ వంటి పనులకు ఈ విధానం కీలకమని చెప్పారు. కృత్రిమ మేధస్సులో మెమోరీని చేర్చడం ద్వారా సాంకేతిక పరిశోధకులు.. గత అనుభవాల నుంచి నేర్చుకోగల, కొత్త పరిస్థితులకు అనుగుణంగా మరింత కచ్చితమైన ప్రతిస్పందనలను అందించే ఏఐ వ్యవస్థలను సృష్టించడంలో నిమగ్నమయ్యారు.మెమోరీతో ఉపయోగాలు..ఏఐ వ్యవస్థలో మెమోరీ ఆగ్మెంటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం అధికంగా ఉంటుంది. ఆరోగ్య సంరక్షణలో, రోగి చరిత్రలు, చికిత్స ఫలితాలను గుర్తు చేసుకోవడం ద్వారా వ్యాధులను నిర్ధారించడంలో ఇది సహాయపడుతుంది. ఫైనాన్స్ విభాగంలో గత డేటాను విశ్లేషించడం ద్వారా మార్కెట్ ధోరణులను అంచనా వేయడంలో తోడ్పడుతుంది. రోజువారీ పనులను మరింత మెరుగ్గా చేసేందుకు ఉపయోగపడుతుంది. మరింత సహజంగా వినియోగదారు అవసరాలకు ప్రతిస్పందించేలా చేస్తుంది.ఇదీ చదవండి: వణికిస్తున్న బంగారం ధర! తులం ఎంతంటే..సమర్థమైన వ్యవస్థలు..కృత్రిమ మేధ అభివృద్ధి చెందుతున్న కొద్దీ సాంకేతిక పరిశోధకుల సహకారం మెరుగైన భవిష్యత్తును రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. జ్ఞాపకశక్తి శక్తిని ఉపయోగించుకోవడం ద్వారా ఏఐ వ్యవస్థలు మరింత తెలివైనవిగా, సమర్థవంతమైనవిగా మారుతున్నాయి. ఈ రంగంలోని ఆవిష్కరణలు కొత్త అవకాశాలను కల్పిస్తున్నాయి. ఇదిలాఉండగా, ఎంత అడ్వాన్స్డ్ పీచర్లతో ఏఐ వ్యవస్థలు వచ్చినా మనిషి మెదడుతో పోటీ పడలేవని కొందరు అభిప్రాయపడుతున్నారు. -
షార్ట్ వీడియో ప్లాట్‌ఫామ్‌ల జోరు
న్యూఢిల్లీ: దేశీయ షార్ట్ వీడియో ప్లాట్‌ఫామ్‌లు కరోనా మహమ్మారి తర్వాత మళ్లీ పుంజుకుంటున్నాయి. వినూత్న ఆదాయ మార్గాల వ్యూహాలు, హైపర్–లోకల్ కంటెంట్ ఇందుకు దోహదం చేస్తోంది. 2020లో టిక్‌టాక్ నిషేధం తర్వాత పుట్టుకొచ్చిన మోజ్, జోష్, చింగారీ, ఎంఎక్స్ టకాటక్ వంటి ప్లాట్‌ఫామ్‌లు తిరిగి వృద్ధి సంకేతాలను చూపుతున్నాయి. ఈ రంగం 200 మిలియన్ డాలర్ల వ్యాపారాన్ని అధిగమించింది. విస్తరణకు భారీ అవకాశాలు ఉన్నాయని రెడ్‌సీర్ నివేదిక వెల్లడించింది. ప్రకటనల ఆదాయాలను పెంచుకోవడానికి, యూట్యూబ్ షార్ట్స్, ఇన్‌స్ట్రాగామ్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలతో పోటీపడటానికి సవాళ్లను ఎదుర్కొన్నందున ఈ ప్లాట్‌ఫామ్‌లు మందగించాయి. అయితే తృతీయ, నాల్గవ తరగతి నగరాలు, భారతీయులను చేరుకునే లక్ష్య వ్యూహాలతో ప్రత్యేకతను చాటుకుంటున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. కొత్త ఆదాయ మార్గాలు.. ఇన్‌స్ట్రాగామ్, యూట్యూబ్ షార్ట్స్ వంటి ప్లాట్‌ఫామ్‌లు పట్టణ, ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్కృతులు, దేశాల నుండి చలనచిత్రాలు, మీడియాను వినియోగించే విభిన్న ప్రేక్షకుల సమూహాలకు సేవలను అందిస్తున్నాయి. దీంతో దేశీయ ప్లాట్‌ఫామ్‌లకు చిన్న నగరాల్లో అవకాశాలు భారీగా ఉంటున్నాయి. దేశీయ ప్లాట్‌ఫామ్‌లు కూడా ప్రత్యేక ఆదాయ మార్గాల మోడళ్లను అనుసరిస్తున్నాయని అర్థ వెంచర్ ఫండ్ మేనేజింగ్ పార్ట్నర్ అనిరుధ్ ఏ దమాని తెలిపారు. ఈ వేదికల పునరుద్ధరణకు కొత్త ఆదాయ మార్గాలు ప్రధానమైనవి. బ్రాండ్ భాగస్వామ్యాలు, పాయింట్స్, రివార్డ్స్, ఈ–కామర్స్ అనుసంధానం వంటి భారత్ ఆధారిత విధానాలు దేశీయ షార్ట్ వీడియో ప్లాట్‌ఫామ్స్‌ను పునర్నిర్మిస్తున్నాయి. 3.3 బిలియన్ డాలర్లకు.. దేశీయ కంటెంట్, హైపర్–లోకల్ అనుసంధానంపై దృష్టి సారించడం దేశీయ వీడియో ప్లాట్‌ఫామ్‌ల వృద్ధిలో కీలకమైనంది. ద్వితీయ, తృతీయ శ్రేణి మార్కెట్ల వినియోగదారులు ప్రాధాన్యతగా జోష్ కంటెంట్ 80 శాతం కంటే ఎక్కువ ప్రాంతీయ భాషల్లో ఉంది. సాంస్కృతిక, స్థానికులకు అవసరమైన కంటెంట్‌ను ఈ ప్లాట్‌ఫామ్‌లు అందిస్తున్నాయి. ఈ విషయంలో సంప్రదాయ ప్లాట్‌ఫామ్‌లు చాలా కష్టపడుతున్నాయని దమానీ అన్నారు. అలైడ్ మార్కెట్ రీసెర్చ్ ప్రకారం అంతర్జాతీయంగా షార్ట్ వీడియో మార్కెట్ 2023లో 1.6 బిలియన్ డాలర్ల నుండి 2032 నాటికి 8.1 శాతం సగటు వార్షిక వృద్ధితో 3.3 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా వేసింది. 2023–24లో 90–100 మిలియన్ డాలర్ల ప్రకటనల ఆదాయాన్ని ఆర్జించినప్పటికీ.. దేశీయ షార్ట్ వీడియో ప్లాట్‌ఫామ్‌ల వాటా భారత మొత్తం డిజిటల్ ప్రకటన వ్యయంలో కేవలం 1–1.5 శాతమే. లాభదాయక ప్రత్యామ్నాయం.. వర్చువల్ టిప్పింగ్, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ లాభదాయక ప్రత్యామ్నాయాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. వర్చువల్ టిప్పింగ్ మార్కెట్ మాత్రమే 70–220 మిలియన్ డాలర్ల నుండి 2030 నాటికి 700–800 మిలియన్ డాలర్లకు పెరుగుతుందని రెడ్‌సీర్ అంచనా వేసింది. ఆరి్టఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వ్యక్తిగతీకరణ, డేటా అనలిటిక్స్, వ్యక్తిగతీకరించిన కంటెంట్ రూపకల్పనలో పెట్టుబడులు వినియోగదార్లతో అనుసంధానాన్ని మెరుగుపరిచాయి. వీక్షకుల సంఖ్యను పెంచుకోవడానికి మధ్యప్రాచ్యం, ఆగ్నేయాసియా, ఉత్తర అమెరికా వంటి ప్రాంతాల్లోని ప్రవాసులపై దేశీయ వీడియో ప్లాట్‌ఫామ్‌లు దృష్టి సారిస్తున్నాయి. ఈ ప్లాట్‌ఫామ్‌లు కేవలం క్రియేటర్లు, మార్కెటర్ల అవసరాలను తీర్చడానికి మాత్రమే అభివృద్ధి చెందడం లేదు.. కానీ స్థిర, దీర్ఘకాలిక వృద్ధికి తమను తాము నిలబెట్టుకుంటాయని ఐపీవీ సహ వ్యవస్థాపకుడు, ఫిసిస్ క్యాపిటల్ భాగస్వామి మితేష్ షా తెలిపారు. నేరుగా ఆదాయం.. ప్రకటనలతో సంబంధం లేకుండా కంటెంట్ క్రియేటర్స్ నేరుగా ఆదాయం ఆర్జించేందుకు చింగారికి చెందిన గారి నెట్వర్క్ క్రిప్టోకరెన్సీ, సోషల్ టోకెన్లను ఉపయోగిస్తోంది. రొపోసో ఒక అడుగు ముందుకేసి కంటెంట్‌లో ఈ–కామర్స్‌ను జోడించింది. తద్వారా వినియోగదారులు నేరుగా యాప్‌లో షాపింగ్ చేయడానికి వీలు కల్పిస్తోంది. 18 కోట్లకుపైగా క్రియాశీల వినియోగదారులతో స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్‌తో జోష్ భాగస్వామ్యాన్ని పెంచుకుంది. కార్యకలాపాలను బలోపేతం చేయడానికి ప్రాంతీయ భాషలపై దృష్టి సారించింది. మొహల్లా టెక్ ప్రమోట్ చేస్తున్న మోజ్ యాప్ 2022–23లో 33 శాతం వృద్ధితో రూ.540 కోట్ల టర్నోవర్ నమోదు చేసింది. -
సరికొత్త స్మార్ట్ గ్లాస్: చూడటానికే కాదు.. వినడానికి కూడా!
ఇప్పటివరకు చాలామంది సన్ గ్లాసెస్ ఉపయోగించి ఉంటారు. అయితే ఇప్పుడు లెన్స్‌కార్ట్ కంపెనీ లాంచ్ చేసిన సన్ గ్లాస్ ఓ స్మార్ట్ గ్లాస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇది సాధారణ సన్ గ్లాస్ మాదిరిగా పనిచేస్తూనే.. బ్లూటూత్ కూడా కలిగి ఉంటుంది. ఇంతకీ దీని ధర ఎంత? ఇంకా ఏమైనా ఫీచర్స్ ఉన్నాయా అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.లెన్స్‌కార్ట్ కంపెనీ లాంచ్ చేసిన ఫోనిక్ స్మార్ట్ గ్లాసెస్ చూడటానికి సాధారణ గ్లాసెస్ మాదిరిగా అనిపించినప్పటికీ.. కొన్ని స్మార్ట్ ఫీచర్స్ కలిగి ఉంది. ఇందులోని బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. తద్వారా హెడ్ఫోన్ల అవసరం లేకుండానే ఆడియో వినొచ్చు.. కాల్స్ కూడా చేయొచ్చు.ఇదీ చదవండి: 70 ఏళ్ల నాటి కారు: ధర రూ. 458 కోట్లులెన్స్కార్ట్ ఫోనిక్ స్మార్ట్ గ్లాస్.. సింగిల్ ఛార్జితో ఏడు గంటలు పనిచేస్తుంది. ఇందులో వాయిస్ అసిస్టెంట్ సదుపాయం ఉండటం వల్ల.. మెసేజస్ పంపడం, రిమైండర్లను సెట్ చేసుకోవడం లేదా మ్యూజిక్ కంట్రోల్ చేయడం వంటి వాటిని సులభం చేస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 4000. ఇది షైనీ బ్లూ, మ్యాట్ బ్లాక్ అనే రెండు రంగులలో లభిస్తుంది. -
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు అదిరిపోయే ఆఫర్
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ఒకసారి రీఛార్జ్ చేస్తే 12 నెలల పాటు సర్వీసులు పొందేలా కొత్త ప్లాన్‌ను విడుదల చేసింది. తరచూ రీఛార్జ్‌లు, ఇతర టెలికాం ప్రొవైడర్ల నుంచి పెరుగుతున్న ఖర్చుల భారంతో సతమతమవుతున్న వినియోగదారులకు ఊరటనిచ్చేందకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.సూపర్ రీఛార్జ్ ప్లాన్బీఎస్ఎన్ఎల్ లేటెస్ట్ ఆఫర్ కేవలం రూ.1,999కే ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 12 నెలలు. నెలవారీ రీఛార్జ్‌ల ఇబ్బంది లేకుండా వినియోగదారులకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులోని కీలక ఫీచర్లు కింది విధంగా ఉన్నాయి.అన్ లిమిటెడ్ కాలింగ్: యూజర్లు అన్ని లోకల్, ఎస్టీడీ నెట్‌వర్క్‌లపై అపరిమిత ఉచిత కాలింగ్‌ను వినియోగించుకోవచ్చు.600 జీబీ డేటా: ఈ ప్లాన్‌లో రోజువారీ వినియోగ పరిమితులు లేకుండా మొత్తం 600 జీబీ డేటా లభిస్తుంది. యూజర్లు ఏడాది పొడవునా తమ సౌలభ్యం మేరకు ఈ డేటాను ఉపయోగించుకోవచ్చు.రోజూ 100 ఉచిత ఎస్ఎంఎస్లు: నిరంతరాయంగా కమ్యూనికేషన్ కోసం రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్లను కూడా ఈ ప్లాన్ అందిస్తుంది.బీఎస్ఎన్ఎల్ చౌకైన రీఛార్జ్ ప్లాన్లు, దీర్ఘకాలిక వాలిడిటీ ఆఫర్లను అందిస్తుంది. జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ టెలికాం ప్రొవైడర్లు ఇటీవల ధరలను పెంచడంతో చాలా మంది వినియోగదారులు చౌక రీఛార్జ్ ధరల కోసం బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపుతున్నారు. కొత్త సూపర్ రీఛార్జ్ ప్లాన్ మరింత మంది యూజర్లను ఆకర్షిస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.ఇదీ చదవండి: రైల్వే అంతటా ‘కవచ్’ అమలుఇతర ప్రొవైడర్లు ఇలా..ఇతర టెలికాం ప్రొవైడర్లతో పోలిస్తే బీఎస్ఎన్ఎల్ ప్లాన్ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఉదాహరణకు, జియో పైన తెలిపిన సర్వీసులతో వార్షిక ప్లాన్‌ను రూ.3,599కు అందిస్తుంది. ఇందులో 2.5 జీబీ రోజువారీ పరిమితితో 912.5 జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాక్సెస్ ఉన్నాయి. ఎక్కువ డేటాను అందిస్తుండడంతో జియో ప్లాన్ బీఎస్ఎన్ఎల్ కంటే ఖరీదుగా ఉంది. అయితే అందుకోసం కొన్ని సర్వీసులు అదనంగా ఇస్తుంది. యూజర్లు నిజంగా ఈ సర్వీసులను పూర్తి స్థాయిలో ఉపయోగిస్తేనే ఆ ప్లాన్ మేలని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలోనూ ఇలా బీఎస్ఎన్ఎల్తో పోలిస్తే అదనంగానే వసూలు చేస్తున్నాయి. -
‘రూ.కోటి జీతమిచ్చినా సాఫ్ట్వేర్ ఉద్యోగులంతే’
భారతీయ సాఫ్ట్వేర్ ఉద్యోగులపై తీవ్ర విమర్శలు చేశారు అమెరికాకు చెందిన ఓ కంపెనీ సీఈవో. భారత్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు రూ. 1 కోటి వరకు అధిక జీతాలు ఇస్తున్నా కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా లేరని విమర్శించారు. ఐఐటీ పూర్వ విద్యార్థి అయిన వరుణ్ ఉమ్మడి తన కంపెనీ భారతీయ కార్యాలయానికి నియామకం ఇబ్బందిగా మారిందని, చాలా మంది ఇంజనీర్లు కూడా వారానికి ఆరు రోజులు పని చేయడానికి కూడా ఇష్టపడటం లేదంటూ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు."మా భారతీయ కార్యాలయానికి ఇంజనీర్లను నియమించుకోవడంలో ఒక విచిత్ర పరిస్థితిని గమనించాను. రూ. 1 కోటి మూల వేతనం ఉన్నప్పటికీ, చాలా మంది కష్టపడి పనిచేయడానికి ఇష్టపడటం లేదు. 3 నుంచి 8 సంవత్సరాల అనుభవం ఉన్న ఇంజనీర్లు చాలా మంది వారానికి ఆరు రోజులు పని చేయడానికి ముందుకు రాలేదు" అంటూ వరుణ్ రాసుకొచ్చారు.వరుణ్ ‘ఎక్స్’ పోస్ట్‌కు లక్షలలో వ్యూస్ వచ్చాయి. భారతీయ సాఫ్ట్వేర్ ఉద్యోగులపై ఆయన చేసిన వ్యాఖ్యలపై యూజర్ల నుంచి పెద్ద ఎత్తున ప్రతిస్పందన వచ్చింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మాత్రమే కాదు.. ప్రస్తుతం అన్ని వృత్తులలోనివారూ మెరుగైన వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కోరుకుంటున్నారని చాలా మంది వినియోగదారులు కామెంట్స్ చేశారు.ఉద్యోగులను ఆదివారాలు కూడా పని చేయాలంటూ ఎల్అండ్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలతో వర్క్-లైఫ్ బ్యాలెన్స్ వివాదం మళ్లీ రాజుకుంది. ఈ నేపథ్యంలో వరుణ్ ఉమ్మడి చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశమయ్యాయి. ఉద్యోగులతో వారానికి ఆరు రోజులు ఎందుకు పని చేయిస్తున్నారంటూ కొంతమంది ఎక్స్ యూజర్లు వరుణ్‌ను ప్రశ్నించారు. -
ఓపెన్ ఏఐ ‘డీప్ రీసెర్చ్’ ఆవిష్కరణ
సంక్లిష్టమైన పరిశోధనలకు దోహదపడేలా జనరేటివ్ ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీ(ChatGPT) కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చినట్లు ఓపెన్ ఏఐ(OpenAI) ప్రకటించింది. కృత్రిమ మేధలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ‘డీప్ రీసెర్చ్’ అనే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ తెలిపింది. ఏఐ విభాగంలో ఇతర కంపెనీల నుంచి పోటీ తీవ్రమవుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.డీప్ రీసెర్చ్(Deep Research) అనేది సాధారణ ప్రాంప్ట్ నుంచి ఒక విశ్లేషకుడి పనితీరును తలపించేలా సమగ్ర పరిశోధనను అందించేందుకు, వెబ్ డేటాను విశ్లేషించేందుకు రూపొందించామని కంపెనీ తెలిపింది. మనుషులు కొన్ని గంటల్లో విశ్లేషించి తెలియజేసే సమాచారాన్ని డీప్ రీసెర్చ్ నిమిషాల్లో వినియోగదారుల ముందుంచుతుందని ఓపెన్ఏఐ పేర్కొంది. చైనాకు చెందిన డీప్‌సీక్ చాట్‌బాట్ ఆకట్టుకునే పనితీరు, నిర్వహణ ఖర్చు తక్కువగా ఉండడంతో ప్రపంచ టెక్ వర్గాల దృష్టిని ఆకర్షించింది. సిలికాన్ వ్యాలీలో సంచలనం సృష్టిస్తున్న డీప్‌సీక్(Deepseek)కు వచ్చిన ఆదరణ నేపథ్యంలో కృత్రిమ మేధ రంగంలో పోటీ వేడెక్కుతుంది. తక్కువ కాలంలోనే డీప్‌సీక్ ఓపెన్ఏఐకు పోటీదారుగా మారుతుందని కొన్ని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. దాంతో ఓపెన్ఏఐ టెక్నాలజీ పరిశోధనలను ముమ్మరం చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా డీప్ రీసెర్చ్ ఫీచర్‌ను అందుబాటులో తీసుకొచ్చినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.టోక్యోలో సమావేశాలు..జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా, సాఫ్ట్ బ్యాంక్ సీఈఓ మసయోషి సన్లతో సహా ఉన్నత స్థాయి సమావేశాల కోసం ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్ మన్ టోక్యో చేరుకున్నారు. ఏఐ డేటా సెంటర్లు, పవర్ ప్లాంట్లలో పెట్టుబడులతోపాటు ఏఐ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి యూఎస్-జపాన్ సహకారంలో భాగంగా ఈ చర్చలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో డీప్ రీసెర్చ్‌ను అందుబాటులోకి తీసుకురావడం కొంత టెక్ వర్గాలను ఆకర్షించనట్లయింది.ఇదీ చదవండి: ఖర్చు.. పొదుపు.. మీ దారెటు?డీప్ రీసెర్చ్ ఎవరికంటే..డీప్ రీసెర్చ్ ప్రస్తుతం చాట్‌జీపీటీ ప్రో వినియోగదారులకు అందుబాటులో ఉంది. దీన్ని త్వరలో జీపీటీ ప్లస్, జీపీటీ టీమ్ వినియోగదారులకు విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఫైనాన్స్, సైన్స్, ఇంజినీరింగ్.. వంటి రంగాల్లో ఇంటెన్సివ్ నాలెడ్జ్ కోసం వర్క్ చేసే వారికి ఈ టూల్ బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేస్ కొనసాగుతుండగా డీప్ రీసెర్చ్ తన పోటీదారులకు వ్యతిరేకంగా ఎలా నిలబడుతుందో, ఈ విభాగంలో ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి. -
ఇవి జియో బడ్జెట్ రీచార్జ్ ప్లాన్లు..
టారిఫ్ పెంపు తర్వాత జియో రీఛార్జ్ ప్లాన్లతో సంతృప్తి చెందని వారిలో మీరు కూడా ఉన్నట్లయితే వ్యాలిడిటీ, డేటా పరంగా అత్యధిక ప్రయోజనాలను అందించే మూడు ప్లాన్లను అందిస్తోంది. ఇవి అంత చవకైన రీఛార్జ్ ప్లాన్లు కానప్పటికీ అపరిమిత 5జీ వంటి సేవలను అందిస్తాయి.రూ. 349 ప్లాన్ఇది 28 రోజుల చెల్లుబాటు అందిస్తుంది అపరిమిత 5G డేటా, రోజువారీ 2 GB పరిమితితో 4G డేటా లభిస్తాయి. ఈ నెలవారీ రీఛార్జ్ ప్లాన్ తక్కువ మొత్తంలో ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది. ప్రతిరోజూ సెల్యులార్ డేటాను ఎక్కువగా వినియోగించే వారికి ఇది ఉత్తమ నెలవారీ రీఛార్జ్ ఎంపిక.రూ. 749 ప్లాన్ఈ ప్లాన్ రోజుకు 2 GB 4G డేటాతో పాటు అపరిమిత 5G, కాలింగ్‌తో 72 రోజులు అంటే రెండున్నర నెలలకుపైగా వ్యాలిడిటీని అందిస్తుంది. అదనంగా ఇది మొత్తం చెల్లుబాటు వ్యవధికి అదనంగా 20 GB 4G డేటా వస్తుంది. ఇది 5G కవరేజ్ ఉన్న ప్రాంతాల్లో నివసించే వారికి ఉపయోగకరమైన యాడ్-ఆన్.రూ. 3,599 ప్లాన్ఇది వార్షిక రీఛార్జ్ ప్లాన్. అపరిమిత 5G డేటా, 2.5 GB రోజువారీ 4G డేటాతో 365 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. నెలకు కేవలం రూ. 276 ఖర్చుతో ఏడాది పొడవునా వ్యాలిడిటీ డేటా పరిమితుల గురించి చింతించకుండా ఒకేసారి రీఛార్జ్ చేయడానికి ఇష్టపడే వారికి ఈ ప్లాన్ అనువైనది. -
ఐఫోన్ చవగ్గా కావాలా?
మీకు ఐఫోన్ అంటే ఇష్టమా? చవగ్గా తక్కువ ధరకు యాపిల్ ఐఫోన్ సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే. యాపిల్ తాజా మోడళ్ల ఐఫోన్ కొనుగోలు చేయలేని ఐఫోన్ (iPhone) ప్రియుల కోసం ముఖేష్ అంబానీకి చెందిన ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ రిలయన్స్ డిజిటల్ (Reliance Digital) ఓ మంచి డీల్ తీసుకొచ్చింది. ఐఫోన్ 14 (iPhone 14)పై భారీ తగ్గింపును అందిస్తోంది.యాపిల్ 2022లో లాంచ్ చేసిన ఫ్లాగ్షిప్ ఐఫోన్ 14 ప్రస్తుతం రిలయన్స్ డిజిటల్లో అందుబాటులో ఉంది. దీని అసలు రిటైల్ ధర రూ. 54,900 కాగా రిలయన్స్ డిజిటల్ దీనిపై రూ.6,500 తగ్గింపు అందిస్తోంది. ఫ్లాట్ రూ. 6,500 తగ్గింపుతో పాటు కొనుగోలుదారులు బ్యాంక్, క్రెడిట్ కార్డ్ ఆఫర్ల ద్వారా ఐఫోన్ 14 రూ. 47,400 లకే పొందవచ్చు. హెచ్ఎస్బీసీ (HSBC) క్రెడిట్ కార్డ్ వినియోగదారులు రూ. 2,000 వరకు అదనంగా 5% తగ్గింపును పొందవచ్చు. దీంతో తుది ధర రూ. 46,400కి తగ్గుతుంది. అంటే మొత్తంగా రూ. 8,500 తగ్గింపు.ఐఫోన్ 14 ఫీచర్లు2022 అక్టోబర్‌లో రూ. 79,900 బేస్ ధరతో యాపిల్ ఐఫోన్ 14 లాంచ్ అయింది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో ముఖ్యంగా సేల్ ఈవెంట్ల సమయంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మొబైల్ ఫోన్లలో ఐఫోన్ 14 ఒకటి. ఐఫోన్ 14లో 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్ప్లే ఉంది. యాపిల్ ఏ15 బయోనిక్ చిప్సెట్తో వస్తుంది. వెనుకవైపు 12MP డ్యూయల్-కెమెరా, సెల్ఫీ ప్రియుల కోసం డ్రాప్ నాచ్ 12MP ఫ్రంట్ షూటర్ కెమరా ఇందులో ఉన్నాయి.ఇదిలా ఉండగా యాపిల్‌కు చెందిన తాజా సిరీస్ ఐఫోన్ 16 (iPhone 16). గత ఏడాది సెప్టెంబర్‌లో ఐఫోన్ 16 సిరీస్‌ను యాపిల్ భారత్‌లో లాంచ్ చేసింది. సెప్టెంబర్ 20 నుంచి విక్రయాలు ప్రారంభం కాగా ఊహించినట్లుగానే ఐఫోన్ 16 సిరీస్‌కు భారత్‌లో భారీ స్పందన లభించింది. మొదటి రోజే రికార్డు అమ్మకాలను నమోదు చేసింది. బేస్ మోడల్‌కు ఐఫోన్ 16 ధరలు రూ.79,900 కాగా ఐఫోన్ 16 ప్రో ధర రూ. 144,900 వరకు ఉంది. -
రైల్వే శాఖ కొత్త యాప్.. అన్ని సర్వీసులు ఒకే చోట..
రైల్వే శాఖ ‘స్వరైల్’ (SwaRail app) అనే కొత్త మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. పలు రకాల సేవలకు వన్-స్టాప్ సొల్యూషన్‌గా ఈ యాప్‌ను రూపొందించింది. స్వరైల్ యాప్ ప్రస్తుతానికి టెస్టింగ్ కోసం ప్లేస్టోర్‌లో అందుబాటులోకి తెచ్చినట్లు రైల్వే (Railway) అధికారి ధ్రువీకరించారు.“ఈ యాప్‌ను ప్రస్తుతానికికి 1,000 మంది వినియోగదారులు మాత్రమే డౌన్లోడ్ చేసుకోగలరు. వీరి నుంచి వచ్చే ప్రతిస్పందన, అభిప్రాయాలను పరిగణించి ఆ తర్వాత, తదుపరి సూచనలు, వ్యాఖ్యల కోసం మరో 10,000 డౌన్లోడ్లకు అందుబాటులో ఉంచుతాం” అని రైల్వే బోర్డు అధికారి ఒకరు తెలిపారు.రిజర్వ్, అన్‌రిజర్వ్ టిక్కెట్ బుకింగ్‌లు, ప్లాట్‌ఫామ్, పార్శిల్ బుకింగ్‌లు, రైలు ఎంక్వయిరీలు, పీఎన్ఆర్ తనిఖీలు, రైల్‌మదాద్ ద్వారా అందించే సేవలు వంటివాటికి స్వరైల్ యాప్ సౌకర్యవంతమైన యాక్సెస్‌ను అందిస్తుంది.“అతుకులు లేని క్లీన్ యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడమే ఈ యాప్ ప్రధాన ప్రాధాన్యత. ఇది ఒకే చోట అన్ని సేవలను మిళితం చేయడమే కాకుండా, భారతీయ రైల్వే సేవల పూర్తి ప్యాకేజీని వినియోగదారులకు అందించడానికి అనేక సేవలను ఏకీకృతం చేస్తుంది” అని రైల్వే బోర్డులో ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దిలీప్ కుమార్ పేర్కొన్నారు.రైల్వే మంత్రిత్వ శాఖ తరపున సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS) తాజాగా బీటా పరీక్ష కోసం సూపర్ యాప్‌ను విడుదల చేసిందనని ఆయన తెలిపారు. వినియోగదారులు ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి స్వరైల్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు. -
మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగుల తొలగింపు
ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్.. (Microsoft layoffs) మెరుగైన పనితీరు ప్రదర్శించని ఉద్యోగులపై తొలగింపు వేటు వేసింది. బిజినెస్ ఇన్సైడర్ పత్రికలో పేర్కొన్న కథనం ప్రకారం.. మైక్రోసాఫ్ట్ యూఎస్‌లో కొందరు ఉద్యోగులను వారి పనితీరు ఆధారంగా తొలగించడం ప్రారంభించింది.తాజాగా తొలగింపులకు గురైన ఉద్యోగులకు మెడికల్, ప్రిస్క్రిప్షన్, డెంటల్ హెల్త్‌కేర్ ప్రయోజనాలు తక్షణమే ముగుస్తాయని కంపెనీ తొలగింపు లేఖల్లో పేర్కొన్నట్లుగా ఇన్సైడర్ కథనంలో ఉదహరించింది. ముగ్గురు ఉద్యోగులకైతే తొలగింపు పరిహారాన్ని కూడా చెల్లించలేదని పేర్కొంది."మీ పనితీరు కనీస ప్రమాణాలను, అంచనాలను అందుకోలేకపోవడమే మీ తొలగింపునకు కారణం" అని తొలగింపు లేఖల్లో కంపెనీ పేర్కొంది. "మీరు తక్షణమే అన్ని విధుల నుండి వైదొలుగుతున్నారు. మైక్రోసాఫ్ట్ సిస్టమ్‌లు, ఖాతాలు, కార్యాలయాలకు యాక్సెస్‌ను ఈరోజు నుంచే తొగిస్తున్నాం. ఇక మైక్రోసాఫ్ట్ తరఫున మీరు ఇటువంటి పని చేయలేరు" అని వివరించింది.ఇది చదివారా? ఉద్యోగులకు మరో షాకిచ్చిన టీసీఎస్..ఇక తొలగింపునకు గురైన ఉద్యోగి భవిష్యత్తులో మైక్రోసాఫ్ట్‌లో మరో కొత్త ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నప్పుడు కంపెనీలో సదరు ఉద్యోగి గత పనితీరు, తొలగింపునకు గురైన అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని కూడా ఆ లేఖల్లో పేర్కొన్నారు.గతేడాది జూన్ చివరి నాటికి మైక్రోసాఫ్ట్ సంస్థలో దాదాపు 2,28,000 మంది ఫుల్ టైమ్ ఉద్యోగులు ఉన్నారు. ఇవే కాదు.. మైక్రోసాఫ్ట్ ఇటీవల సెక్యూరిటీ, ఎక్స్పీరియన్స్ అండ్ డివైజెస్, సేల్స్, గేమింగ్‌లో విభాగాల్లోనూ పలువురు ఉద్యోగులను తొలగించింది. అయితే తొలగింపులు స్వల్ప స్థాయిలోనే ఉండటం, సమీప కాలంలోనే వీటిని భర్తీ చేయనుండటంతో మొత్తంగా కంపెనీ హెడ్‌కౌంట్‌లో పెద్దగా తగ్గింపు ఉండకపోవచ్చు.భారత్‌లో 2587 మంది టెకీలు2024 ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో మొదటి ఐదు భారతీయ ఐటీ సంస్థల్లో నికరంగా 2,587 మంది ఉద్యోగులు తగ్గారు. (Job cuts) గత త్రైమాసికంతో పోలిస్తే ఇది పూర్తిగా విరుద్ధం. సెప్టెంబర్ త్రైమాసికంలో 15,033 మంది ఉద్యోగులు పెరిగారు. గడచిన మూడు నెలల కాలంలో ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌టెక్ 7,725 మంది ఉద్యోగులను పెంచుకోగా, టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా కంపెనీలు మాత్రం ఉద్యోగులను తగ్గించాయి. -
వాట్సప్ యూజర్లపై స్పైవేర్ దాడి..?
ఇజ్రాయెల్ కంపెనీ పారాగాన్ సొల్యూషన్స్ అభివృద్ధి చేసిన అత్యాధునిక స్పైవేర్ ద్వారా జర్నలిస్టులు, సివిల్ సొసైటీ సభ్యులతో సహా దాదాపు 100 మంది వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్నట్లు వాట్సప్ సైబర్ సెక్యూరిటీ ఆరోపించింది. అయితే, భారతీయ వినియోగదారులు ఈ ఉల్లంఘన బారిన పడలేదని హిందూస్తాన్ టైమ్స్ నివేదిక ధ్రువీకరించింది. తన భారతీయ వినియోగదారులు ఈ దాడికి గురికాలేదని వాట్సాప్ స్పష్టం చేసింది.గ్రాఫైట్ అని పిలువబడే ఈ స్పైవేర్ ‘జీరో-క్లిక్’ పద్ధతిని ఉపయోగించి ఎలక్ట్రానిక్ పరికరాలను హ్యాక్ చేశారని వాట్సప్ తెలిపింది. అంటే బాధితులు ఎలాంటి లింక్‌పై క్లిక్ చేయాల్సిన అవసరం లేకుండానే వ్యక్తులను టార్గెట్ చేసి హ్యాక్ చేసినట్లు పేర్కొంది. ఈ స్పైవేర్‌ను అక్కడి ప్రభుత్వ క్లయింట్లు ఉపయోగిస్తున్నారని భావిస్తున్నప్పటికీ, దాడి వెనుక ఉన్న నిర్దిష్ట వ్యక్తులను వాట్సప్ గుర్తించలేకపోయింది.ముఖ్యంగా యూఎస్ ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ)తో కంపెనీ గతంలో దాదాపు 2 మిలియన్ల డాలర్ల కాంట్రాక్టును దక్కించుకొని వార్తల్లో నిలిచింది. జాతీయ భద్రతా సమస్యల కారణంగా ఫెడరల్ ఏజెన్సీలు స్పైవేర్ వినియోగాన్ని పరిమితం చేసేలా, అప్పటి బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా వెలువడిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌కు అనుగుణంగా ఉండేలా ఈ ఒప్పందాన్ని సమీక్షించారు. పారగాన్ సొల్యూషన్స్ యూఎస్‌లోని చాంటిల్లీ, వర్జీనియాలో కార్యాలయాలను కలిగి ఉంది. యూఎస్ ప్రభుత్వ సంస్థలతో సంస్థ ఒప్పందాలపై పరిశీలన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఖాతాదారులచే స్పైవేర్‌ను విస్తృతంగా ఉపయోగించడంపై మరింత ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.ఇదీ చదవండి: ఎయిరిండియాపై రూ.30 లక్షల జరిమానాపారాగాన్ సొల్యూషన్స్‌పై వాట్సప్ చర్యలు చేపట్టింది. చట్టవిరుద్ధమైన నిఘా కోసం కంపెనీ స్పైవేర్‌ను ఉపయోగించడం నిలిపివేయాలని కోరుతూ.. ఇలాంటి చర్యలను వెంటనే ఆపాలని లేఖ రాసింది. వాట్సప్ మెసేజింగ్ ప్లాట్ఫామ్లో వినియోగదారులు ప్రైవేట్‌గా కమ్యూనికేట్ చేసే సామర్థ్యాన్ని రక్షించడానికి నిబద్ధతతో ఉన్నట్లు తెలిపింది. స్పైవేర్ సంస్థలను కట్టడి చేస్తూ వారి చర్యలకు జవాబుదారీగా ఉంచాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. -
Union Budget 2025: కొత్త టెక్నాలజీలకు రాచబాట
కొత్త పరిశోధనలు, అభివృద్ధి కోసం శాస్త్ర–సాంకేతిక శాఖకు రూ.20 వేల కోట్లు భవిష్యత్తు తరం స్టార్టప్‌లకు ప్రోత్సాహమిచ్చేలా ‘డీప్ టెక్’ ఫండ్ ఆఫ్ ఫండ్స్న్యూఢిల్లీ: దేశంలో సరికొత్త టెక్నాలజీలకు రాచబాట వేసేలా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రతిపాదనలను సమర్పించారు. ప్రైవేటు రంగంలో వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు చర్యలను ప్రకటించారు. ఇందుకోసం రూ.20 వేల కోట్లను కేటాయించారు. మొత్తంగా శాస్త్ర, సాంకేతిక రంగానికి సంబంధించి వివిధ విభాగాలకు మొత్తంగా రూ. 55,679 కోట్లను బడ్జెట్లో కేటాయించారు. పెద్ద ఎత్తున పరిశోధనలకు ప్రోత్సాహం దేశంలో ప్రైవేటు రంగంలో భారీ ఎత్తున పరిశోధనలను ప్రోత్సహించేందుకు రూ.లక్ష కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామని గత బడ్జెట్ సమయంలోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. డీప్ టెక్, సోలార్, ఇతర శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధనలు, అభివృద్ధికి ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. ఆ కార్పస్ ఫండ్ ఏర్పాటు కోసం తొలి విడతగా తాజా బడ్జెట్లో రూ.20 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇందులో భవిష్యత్తు తరం స్టార్టప్‌లకు ప్రోత్సాహమిచ్చేలా రూ.10 వేల కోట్లతో ‘డీప్ టెక్’ఫండ్ ఆఫ్ ఫండ్స్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ద్వితీయ శ్రేణి నగరాల్లో జీసీసీలు దేశవ్యాప్తంగా ద్వితీయ శ్రేణి నగరాల్లో గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల ఏర్పాటును ప్రోత్సహించేందుకు జాతీయ స్థాయిలో ఫ్రేమ్ వర్క్‌ను ఏర్పా టు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో సరఫరా వ్యవస్థలతో ఆర్థిక వ్యవస్థ అనుసంధానాన్ని బలోపేతం చేస్తామన్నారు. దేశంలో ఉత్పత్తి రంగాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు చేపడతామని ప్రకటించారు. అంతర్జాతీయ వాణిజ్యాన్ని సులభతరం చేసేలా ‘భారత్ ట్రేడ్ నెట్’ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు. ప్రధాన విభాగాలకు గణనీయంగా కేటాయింపులు.. ⇒ కార్పస్ ఫండ్‌కు ఉద్దేశించిన నిధులు సహా తాజా బడ్జెట్లో శాస్త్ర, సాంకేతిక విభాగానికి రూ.28,508 కోట్లు కేటాయించారు. ⇒ బయోటెక్నాలజీ విభాగానికి ఈసారి రూ.3,446 కోట్లు కేటాయించారు. ఇది గత బడ్జెట్ కేటాయింపులు రూ.2,275 కోట్లతో పోలిస్తే.. రూ.1,171 కోట్లు అదనం. ఇక పారిశ్రామిక పరిశోధనల విభాగానికి రూ.6,657 కోట్లు ఇచ్చారు. ⇒ అణుశక్తి విభాగానికి గతంలో (రూ.24,968 కోట్లు) కన్నాస్వల్పంగా తగ్గించి రూ.24,049 కోట్లు కేటాయించారు. ⇒ అంతరిక్ష పరిశోధనల విభాగానికి రూ.13,416 కోట్లు కేటాయించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) స్పేస్ సెంటర్లలో కొనసాగుతున్న స్పేస్ ఫ్లైట్, లాంచ్ వెహికల్, శాటిలైట్ ప్రాజెక్టుల కోసం రూ.10,230 కోట్లను కేటాయించారు. -
జియో చవక ప్లాన్ మళ్లీ వచ్చింది..
రిలయన్స్ జియో తన రూ.189 ప్రీపెయిడ్ ప్లాన్ మళ్లీ తీసుకొచ్చింది. వాయిస్, ఎస్ఎంఎస్ ప్రయోజనాల కోసం తక్కువ ధర ప్లాన్ ఆశించేవారికి ఇది సరిపోతుంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) మార్గదర్శకాలకు అనుగుణంగా తన వాయిస్-ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రారంభించి, సవరించిన జియో అదే క్రమంలో ఈ చవక ప్లాన్‌ను తీసుకొచ్చింది.ఇదివరకే రూ. 479 ప్లాన్‌తో కలిపి దీన్ని తీసుకువచ్చిన జియో ట్రాయ్ అభ్యంతరాలతో వెనక్కితీసుకుంది. ఇప్పుడు మళ్లీ ప్లాన్‌ను "చవక ప్యాక్‌లు" కేటగిరీ కిందకు తీసుకువచ్చింది. ఈ ప్లాన్ అత్యంత చవకైన రీఛార్జ్ ఎంపిక రూ. 199 ప్లాన్. ఇది 18 రోజుల చెల్లుబాటు, 1.5GB రోజువారీ డేటా, రోజుకు 100 SMSలను అందిస్తుంది.జియో ఇటీవలే రూ. 1,958, రూ. 458 ప్రీపెయిడ్ వాయిస్-ఓన్లీ ప్లాన్లను కూడా ప్రారంభించింది. ఇవి వరుసగా 365 రోజులు, 84 రోజుల చెల్లుబాటును అందిస్తాయి. అయితే కంపెనీ వాటి ధరలను రూ. 1,748, రూ. 448లకు తగ్గించింది. కానీ ఖరీదైన ప్లాన్ చెల్లుబాటు వ్యవధిని 336 రోజులకు కుదించింది.రూ.189 ప్లాన్ ప్రయోజనాలు • 28 రోజుల వ్యాలిడిటీ • అపరిమిత వాయిస్ కాల్స్ • 300 ఉచిత SMS • 2GB హై-స్పీడ్ డేటా • జియో టీవీ, జియో సినిమా, జియోక్లౌడ్కి యాక్సెస్ -
స్మార్ట్ఫోన్లు, టీవీల ధరలు ఏ మాత్రం తగ్గుతాయి?
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ 2025-26లో కీలకమైన ఎలక్ట్రానిక్ విడి భాగాలపై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ (BCD) తగ్గింపును ప్రకటించింది. దీంతో స్మార్ట్ఫోన్లు, టీవీల ధరలు తగ్గే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్‌ను సమర్పిస్తూ.. దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీని పెంచడం, దిగుమతి పరికరాలపై ధరల భారాన్ని తగ్గించడం లక్ష్యంగా అనేక చర్యలను వివరించారు.ప్రభుత్వం ప్రకటించిన ముఖ్యమైన బడ్జెట్ నిర్ణయాల్లో మొబైల్ ఫోన్లు, మొబైల్ ఫోన్ ఛార్జర్లు, మొబైల్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లీస్ (PCBA)పై ప్రాథమిక కస్టమ్ సుంకాన్ని 20 శాతం నుండి 15 శాతానికి తగ్గించడం ఒకటి. ఈ చర్య భారతదేశంలో ఇంకా తయారు చేయని కొన్ని హై-ఎండ్ ఐఫోన్ మోడల్‌లతో సహా దిగుమతి చేసుకునే స్మార్ట్ఫోన్లు, ఉపకరణాల ధరను తగ్గిస్తుంది. స్థానిక తయారీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం గతంలో 2018లో ఈ సుంకాన్ని 15 శాతం నుంచి 20 శాతానికి పెంచింది. ఇప్పుడు తాజా తగ్గింపు ఇంపోర్టెడ్ స్మార్ట్ఫోన్లను వినియోగదారులకు మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ఒక అడుగుగా పరిగణించవచ్చు.దేశ ఎలక్ట్రానిక్స్ వ్యవస్థను మెరుగుపరచగలదంటూ పరిశ్రమ నాయకులు ఈ చర్యను స్వాగతించారు. మొబైల్ ఫోన్లు, పీసీబీఏ, ఛార్జర్లపై ప్రాథమిక కస్టమ్ సుంకాన్ని తగ్గించడంతోపాటు స్మార్ట్‌ఫోన్ తయారీకి అవసరమయ్యే ఇన్పుట్లు, ముడి పదార్థాలపై మినహాయింపులను ఇస్తే దేశీయ ఉత్పత్తి వాతావరణం మెరుగుపడుతుందని షావోమీ ఇండియా ప్రెసిడెంట్ మురళీకృష్ణన్ బి పేర్కొన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతీయ మార్కెట్లో స్మార్ట్ఫోన్లను మరింత చవకగా మార్చడానికి ఇది సానుకూల దశ అని ట్రాన్షన్ ఇండియా సీఈవో అరిజీత్ తలపత్రా ప్రశంసించారు.పెద్ద తగ్గింపు ఉండకపోవచ్చు..కస్టమ్స్ సుంకం తగ్గింపు కచ్చికంగా తయారీదారులకు ఖర్చులను తగ్గించగలదు. అయితే రిటైల్ ధరలపై దాని ప్రత్యక్ష ప్రభావం ఎంత మేరకు ఉంటుందన్నది నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ధరలో పెద్దగా తగ్గుదల ఉండకపోవచ్చని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ అభిప్రాయపడుతున్నారు. సుంకం తగ్గింపు స్మార్ట్‌ఫోన్ ధరలలో 1-2 శాతం స్వల్ప తగ్గుదలకు దారితీయవచ్చు అంటున్నారు. అయితే వినియోగదారులకు అందించే ప్రయోజనం ఎంతనేది ఆయా తయారీదారులపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. పైపెచ్చు తక్కువ ధర స్మార్ట్ఫోన్లపై ఇప్పటికే తక్కువ మార్జిన్లు ఉంటున్నాయని, కాబట్టి ధరలో చెప్పుకోదగ్గ తగ్గింపు కనిపించకపోవచ్చు అంటున్నారు. -
ఏఐతో ముప్పు ఇదీ.. ఆర్థిక సర్వే హెచ్చరిక!
విస్తరిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో ప్రయోజనాలు ఎంత ఉన్నా దాని విపరిణామాల పట్ల చాలా మందిలో ఆందోళన ఉంది. ఆరోగ్య సంరక్షణ, పరిశోధన నుండి ఆర్థికాంశాలు, విద్య వరకు ఆర్థికంగా విలువైన చాలా పనులను ఆటోమేట్ చేయడం ద్వారా పరిశ్రమలలో విప్లవాత్మక మార్పులు తెస్తామని ఏఐ డెవలపర్లు హామీ ఇస్తున్నప్పటికీ, ఈ పురోగతి గణనీయమైన విపరిణామాలనూ తీసుకుతో రావచ్చని ఆర్థిక సర్వే 2024-2025 (Economic Survey 2024-2025) హెచ్చరిస్తోంది.ఆర్థిక సర్వే 2024-2025ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తాజాగా పార్లమెంట్ ముందు సమర్పించారు. ఏఐ పురోగతి ముఖ్యంగా మధ్య, దిగువ ఆదాయ కార్మికులపై ప్రభావాన్ని చూపుతుందని, వివిధ రంగాలలో మానవ నిర్ణయాధికారాన్ని ఏఐ అధిగమించడం వలన పెద్ద ఎత్తున ఉపాధిలో మార్పులు సంభవిస్తాయని ఆర్థిక సర్వే అంచనా వేస్తోంది.ఏమిటీ ఎకనామిక్ సర్వే?ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా అనేది గత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థలో జరిగిన పరిణామాలను సమీక్షించే ప్రీ-బడ్జెట్ డాక్యుమెంట్. ప్రధాన అభివృద్ధి కార్యక్రమాలపై పనితీరు, విధానపరంగా సానుకూల మార్పులను సంగ్రహించి విశదీకరిస్తుంది. అలాగే స్వల్ప, మధ్య కాలానికి ఆర్థిక వ్యవస్థకు ఉన్న అవకాశాలను తెలియజేస్తుంది. సాధారణంగా బడ్జెట్ ప్రవేశపెట్టే ముందుగా దీన్ని వెల్లడిస్తారు.ఏఐపై ఆర్థిక సర్వే 2024-25 ఏం చెప్పిందంటే.. ఆరోగ్య సంరక్షణ, పరిశోధన, నేర న్యాయం, విద్య, వ్యాపారం, ఆర్థిక సేవలతో సహా వివిధ రంగాలలో క్లిష్టమైన నిర్ణయం తీసుకోవడంలో ఏఐ మానవ పనితీరును అధిగమించగలదని అంచనా ఉంది. ఇది పెద్ద ఎత్తున మధ్య, దిగువ ఆదాయ కార్మికుల ఉపాధిని ప్రభావితం చేస్తుంది.మునుపటి పారిశ్రామిక, సాంకేతిక విప్లవాలతో పోలిస్తే ప్రస్తుత ఏఐ స్వీకరణ ప్రతికూల ప్రభావాల భయాలు అంతగా కనిపించకపోవచ్చు.భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా సేవా ఆధారితమైన నేపథ్యంలో చిన్న స్థాయి ఐటీ సేవల్లో పనిచేసే ఉద్యోగులకు ఆటోమేషన్ ముప్పు ఉంటుంది. ఎందుకంటే కంపెనీలు ఖర్చులను తగ్గించడానికి కార్మికులను తొలగించి సాంకేతికతతో భర్తీ చేస్తాయి.ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి సామూహిక సామాజిక ప్రయత్నం అవసరం. ప్రభుత్వం, ప్రైవేట్ రంగం, విద్యాసంస్థల మధ్య సహకారం ద్వారా భారతదేశం బలమైన సంస్థల సృష్టిని వేగవంతం చేయాలి.నైపుణ్య సంస్థలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఉద్యోగులను ఏఐతో కలిసి పనిచేసేలా సన్నద్ధం చేయాలి.ఏఐ ప్రస్తుతం శైశవదశలో ఉన్నందున దాని పునాదులను బలోపేతం చేయడానికి, దేశవ్యాప్త సంస్థాగత ప్రతిస్పందనను సమీకరించడానికి అవసరమైన సమయం దేశానికి లభించింది.విస్తృత-వ్యాప్తి స్వీకరణను సాధించడానికి ముందు ఏఐ డెవలపర్లు అధిగమించాల్సిన కొన్ని సవాళ్లు ఉన్నాయి. ప్రాక్టికాలిటీ, విశ్వసనీయత అనేది డెవలపర్లు పరిష్కరించాల్సిన ప్రధాన సమస్యలు.యువ, డైనమిక్, సాంకేతిక-అవగాహన ఉన్న జనాభాను పెంచడం ద్వారా పని, ఉత్పాదకతను పెంపొందించడానికి ఏఐని ఉపయోగించగల శ్రామిక శక్తిని సృష్టించగల సామర్థ్యాన్ని భారతదేశం కలిగి ఉంది.కార్మిక శక్తి, సాంకేతికత సరైన మార్గంలో సమతుల్యం అయినప్పుడు, ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి. పని భవిష్యత్తు శ్రామిక శక్తి, యంత్ర సామర్థ్యాలను ఏకీకృతం చేసే 'అగ్మెంటెడ్ ఇంటెలిజెన్స్' చుట్టూ తిరుగుతుంది.లేబర్ మార్కెట్లో ఏఐతో వచ్చే మార్పులు శాశ్వత ప్రభావాలను కలిగి ఉండే అవకాశం ఉన్నందున విధాన నిర్ణేతలు ఆవిష్కరణలను సామాజిక వ్యయాలతో సమతుల్యం చేయాలి. -
జాతికి ముప్పు చేసే టెక్నాలజీలు
కేంద్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైబర్ సెక్యూరిటీలో సామర్థ్యాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను నొక్కి చెప్పారు. డిజిటల్ మోసం, సైబర్ క్రైమ్, డీప్‌ఫేక్ వంటి టెక్నాలజీల ద్వారా పెరుగుతున్న బెదిరింపులను ఆమె అంగీకరించారు. ఇవి సామాజిక, ఆర్థిక, జాతీయ భద్రత పట్ల ఆందోళనలు రేకెత్తిస్తున్నాయని అన్నారు.సైబర్ సెక్యూరిటీడిజిటల్ బెదిరింపుల నుంచి పౌరులు, సంస్థలను రక్షించడానికి సైబర్ భద్రతా చర్యలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముర్ము పేర్కొన్నారు. డిజిటల్ మోసాలు, సైబర్ క్రైమ్ పెరగడం వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ ప్రమాదాల నుంచి రక్షణకు పటిష్టమైన చర్యలు అవసరమని తెలిపారు. సైబర్ బెదిరింపులను సమర్థంగా గుర్తించడానికి, వాటిని నిరోధించడానికి, అందుకు అనుగుణంగా ప్రతిస్పందించడానికి అధునాతన సాంకేతికతలు, వ్యూహాలను అమలు చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు.డీప్‌ఫేక్ టెక్నాలజీఅత్యంత వాస్తవికంగా కనిపించేలా నకిలీ చిత్రాలు, వీడియోలు, ఆడియోలను సృష్టించే డీప్‌ఫేక్ టెక్నాలజీ సమాచార సమగ్రతకు, ప్రజల నమ్మకానికి ముప్పు కలిగిస్తుంది. అధునాతన డిటెక్షన్ అండ్ మిటిగేషన్ టెక్నిక్స్‌ను అభివృద్ధి చేయడం ద్వారా ఈ సవాలును ఎదుర్కోవాల్సి ఉందని ముర్ము అన్నారు. డీప్‌ఫేక్ టెక్నాలజీ సమాచారాన్ని ముందే పసిగట్టి ఆదిలోనే దాన్ని కట్టడి చేసేందుకు వీలుగా టెక్ నిపుణులు, పరిశోధకులతో కలిసి పనిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.ఇదీ చదవండి: ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మెట్రో రైలు నెట్వర్క్జాతీయ భద్రత పెంపుసైబర్ సెక్యూరిటీ అనేది కేవలం సాంకేతిక సమస్య మాత్రమే కాదని, జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని రాష్ట్రపతి ఉద్ఘాటించారు. కీలకమైన మౌలిక సదుపాయాలు, ఆర్థిక వ్యవస్థలు, సున్నితమైన డేటాను సైబర్ దాడుల నుంచి రక్షించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. సైబర్ సెక్యూరిటీ రంగంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా, డిజిటల్ యుగంలో దేశ భద్రతను మెరుగుపరచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. -
మొదటిసారి మెషిన్స్ మధ్య యుద్ధం: వీడియో వైరల్
ఏఐ రోబోట్స్ వచ్చిన తరువాత.. టెక్నాలజీలో కీలక మార్పులు సంభవించాయి. ప్రస్తుతం చాలా రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హవా సాగుతోంది. అదే సమయంలో డ్రోన్ల వినియోగం కూడా విరివిగానే ఉంది. వీటిని వ్యవసాయ, వాణిజ్య మొదలైన రంగాల్లో ఉపయోగిస్తున్నాయి. ఇటీవల ఈ రెండింటి (డ్రోన్, ఏఐ రోబోట్) మధ్య ఓ చిన్న యుద్ధం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో గమనిస్తే.. ఒక రోబోట్ డాగ్ (Robotic Dog), ఎగురుతున్న డ్రోన్ (Drone) మీద దాడి చేయడం చూడవచ్చు. రోబోట్ డాగ్ మీద అమర్చిన బాణాసంచాతో దాడి చేస్తూనే ఉంది. ఆ సమయంలో డ్రోన్ కూడా రోబోటిక్ కుక్కను చుట్టుముట్టింది. కానీ అది మాత్రం డ్రోన్ ఎటువైపు వెళ్తే.. అటువైపు బాణ పరంపర కురిపించింది.రోబోటిక్ కుక్కను, డ్రోన్‌ను ఎవరైనా ఆపరేట్ చేస్తున్నారా? లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. ఇక్కడ కనిపించే డ్రోన్ డీజేఐ టీ-సిరీస్ అగ్రికల్చర్ మోడల్, రోబోటిక్ డాగ్ హాంగ్జౌకు చెందిన రోబో డెవలపర్ యూనిట్రీ రోబోటిక్స్ ఉత్పత్తి చేసిన గో సిరీస్ అని తెలుస్తోంది. మెషీన్స్ మధ్య మొదటిసారి జరిగిన యుద్ధం అంటూ ఒక ఎక్స్ యూజర్ వీడియో షేర్ చేశారు.ఇదీ చదవండి: లవ్‌లో బ్రేకప్ అయినవాళ్లకే జాబ్.. ప్రముఖ కంపెనీ ఆఫర్నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. భవిష్యత్తులో యుద్దాలు ఇలాగే ఉంటాయని ఒకరు అన్నారు. ఇలాంటి సంఘటనలు భయాన్ని కలిగిస్తాయని మరొకరు, చాలా దేశాల్లో ఇలాంటి టెక్నాలజీలు వాడుకలో ఉన్నాయని ఇంకొకరు అన్నారు. అయితే వీడియోలో కనిపించే ఈ సంఘటన చైనాలో జరిగినట్లు సమాచారం.The First War of Machines: Video of a battle between a drone and a robot dog goes viral in ChinaThe firefight was conducted using fireworks. It is unclear whether the devices were being controlled by someone, and the location of the footage remains undisclosed. pic.twitter.com/1vrdlVND0l— NEXTA (@nexta_tv) January 27, 2025 -
ఏఐను అందిపుచ్చుకుంటున్న ప్రభుత్వ విభాగాలు
భారతదేశంలోని అనేక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు కృత్రిమ మేధ (ఏఐ) టెక్నాలజీలను అమలు చేయడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయి. ప్రభుత్వ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ల ఆధునీకరణ దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రజలకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు తెలియజేస్తున్నారు. ప్రభుత్వాలు చేపట్టే ఈ ఏఐ ప్రాజెక్ట్‌ల విలువ రూ.1 కోటి నుంచి రూ.10 కోట్లుగా ఉంటుంది. ఇవి అనేక రకాల అప్లికేషన్లను కవర్ చేస్తాయి.ఉదాహరణకు విద్యుత్ కనెక్షన్లు, అంతరాయాలు, బిల్లింగ్ వివాదాలకు సంబంధించి పట్టణ వినియోగదారులకు సరైన సమాచారం అందించేందుకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ జ్యోతి చాట్‌బాట్(ChatBot)ను అభివృద్ధి చేస్తోంది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై) ఏర్పాటు చేసిన లాభాపేక్ష లేని డిజిటల్ ఇండియా కార్పొరేషన్ ‘మై స్కీమ్’ ప్లాట్‌ఫామ్‌ను మెరుగుపరచడానికి ఏఐ చాట్‌బాట్‌ను ఉపయోగిస్తుంది. పౌరులు వివిధ సామాజిక సంక్షేమ పథకాల గురించి తెలుసుకోవడానికి, వాటికోసం దరఖాస్తు చేయడానికి వీలు కల్పిస్తున్నారు.ఇదీ చదవండి: రూ.10,000 కోట్ల ఒప్పందానికి కేబినెట్ కమిటీ ఆమోదంజంతు కదలికలను ట్రాక్ చేయడానికి, మానవ-వన్యప్రాణుల దాడులను నివారించడానికి ఒడిశా అటవీ శాఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వీడియో అనలిటిక్స్ సాఫ్ట్‌వేర్‌ను ప్రారంభించింది. రోడ్డు భద్రత కోసం కర్ణాటక ప్రభుత్వం కూడా ఏఐ ఆధారిత వ్యవస్థలను అమలు చేస్తోంది. ప్రాంతీయ భాషల్లో సమాచారాన్ని అందించే 50 అధికారిక వెబ్సైట్లను కేంద్రం అంతర్గత ఏఐ ప్రాజెక్టు ‘భాషిణి’ని నిర్వహిస్తోంది. కేంద్ర పథకాలకు సంబంధించి ఫీడ్ బ్యాక్, నాణ్యతను, సంప్రదాయ యంత్రాంగాలను మెరుగుపరచడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. చాలా రాష్ట్రాలు శాసనసభ, పరిపాలన, న్యాయవ్యవస్థలో కృత్రిమ మేధను ఉత్పాదకత సాధనంగా ఉపయోగించాలని చూస్తున్నాయి. -
భారీ ప్రయోగాలే లక్ష్యం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఎంతోమంది అంతరిక్ష పితామహుల కృషి ఫలితంగా శ్రీహరికోట రాకెట్ కేంద్రాన్ని సొంతంగా నిర్మించుకొని, నేటికి వంద ప్రయోగాలు పూర్తిచేసి చరిత్రపుటల్లోకి ఎక్కిందని చైర్మన్ వి.నారాయణన్ అన్నారు. ఇకపై ఆకాశమే హద్దుగా భారీ ప్రయోగాలే లక్ష్యంగా పని చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఆయన బుధవారం షార్‌లోని మీడియా సెంటర్లో మాట్లాడారు. ఇస్రో చేపట్టిన వంద ప్రయోగాల్లో పాలుపంచుకున్న అంతరిక్ష పరిశోధకులకు అభినందనలు తెలియజేశారు. రాకెట్ ప్రయోగాలకు సంబంధించి ఆధునిక మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకుంటున్నాని తెలిపారు. ఇకపై నెలకు రెండు ప్రయోగాలు చేపట్టాల్సి ఉంటుందని చెప్పారు. షార్ నుంచి సెంచరీ ప్రయోగాలు చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. వందో ప్రయోగానికి తాను ఛైర్మన్‌గా ఉండడం తన అదృష్టమన్నారు. ఈ ఏడాది ప్రైవేట్‌గా పీఎస్ఎల్వీ–ఎన్1 పేరుతో నూతన ప్రయోగాన్ని చేపట్టనున్నామని వెల్లడించారు. జీఎస్ఎల్వీ–ఎఫ్16 రాకెట్ ద్వారా ఇస్రో, నాసా సంయుక్తంగా నిస్సార్ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నాయని తెలిఆపరు. ఎల్వీఎం–3 రాకెట్ ద్వారా వాణిజ్యపరమైన ప్రయోగం ఉంటుందన్నారు. ఈ ఏడాది జూన్ నాటికి గగన్‌యాన్–1 క్రూమాడ్యూల్ ప్రయోగాన్ని హ్యూమన్ రిలేటెడ్ లాంచింగ్ వెహికల్ (హెచ్ఆర్ఎల్వీ) ద్వారా చేపట్టడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టంచేశారు. షార్ కేంద్రంలో మూడో ప్రయోగ వేదికను ప్రపంచస్థాయి ప్రయోగవేదికగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించబోతున్నామని వి.నారాయణన్ ప్రకటించారు న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్(ఎన్జీఎల్వీ) ద్వారా 2040 నాటికి చంద్రుడిపైకి వ్యోమగాములను పంపిస్తామని వెల్లడించారు. అలాగే ఈ ఏడాది డిసెంబర్ ఆఖరు నాటికి తమిళనాడులోని కులశేఖరపట్నం స్పేస్‌పోర్టు కూడా అందుబాటులోకి వస్తుందన్నారు. డాకింగ్ టెక్నాలజీని ఉపయోగించి అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ నిర్మాణం కూడా చేయనున్నామని తెలిపారు. -
డీప్సీకర్ లియాంగ్
అత్యంత శక్తిమంతమైన చౌక ఏఐ అసిస్టెంట్‌తో కృత్రిమ మేథ (ఏఐ) ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తున్న డీప్‌సీక్ సృష్టికర్త లియాంగ్ వెన్ఫెంగ్ (40) ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు టెక్ ప్రపంచంలో ఎక్కడా కనీసం వినబడని, కనబడని లియాంగ్ పేరు ఇప్పుడు ఎలాన్ మస్క్ (టెస్లా), శామ్ ఆల్ట్‌మన్‌ను (ఓపెన్ ఏఐ) మించి మార్మోగిపోతోంది. ఆయన గురించి మరింతగా తెలుసుకోవాలనే ఆసక్తి ఏర్పడింది. లియాంగ్ దక్షిణ చైనాలోని అయిదో శ్రేణి పట్టణమైన గ్వాంగ్‌డాంగ్‌లో జన్మించారు. ఆయన తండ్రి ఒక స్కూల్ టీచరు. ఈ–కామర్స్ దిగ్గజం ఆలీబాబా సహా టెక్ దిగ్గజాలకు కేంద్రమైన ఝెజియాంగ్ ప్రావిన్స్‌లో లియాంగ్ విద్యాభ్యాసం చేశారు. ఎల్రక్టానిక్స్, కమ్యూనికేషన్స్‌లో డిగ్రీ, 2010లో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ చేశారు. హెడ్జ్ఫండ్తో వ్యాపార రంగంలోకి.. లియాంగ్ 2015లో ఇద్దరు క్లాస్‌మేట్స్‌తో కలిసి హై–ఫ్లయర్ అసెట్ మేనేజ్మెంట్ పేరిట చైనాలో ఒక హెడ్జ్ ఫండ్‌ను ఏర్పాటు చేసి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. సంక్లిష్టమైన అల్గోరిథంలతో ట్రేడింగ్ వ్యూహాలను అమలు చేసే ఈ ఫండ్ చాలా వేగంగా ఎదిగింది. కేవలం ఆరేళ్ల వ్యవధిలోనే ఫండ్ పోర్ట్‌ఫోలియో ఏకంగా 15 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 1.19 లక్షల కోట్లకు) చేరింది. అదే సమయంలో స్వంత ఏఐ ప్రాజెక్టు కోసం అంటూ శక్తివంతమైన ఎన్విడియా చిప్‌లను వేల సంఖ్యలో ఆయన కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. అటుపైన 2023లో కృత్రిమ మేథకు సంబంధించిన డీప్‌సీక్ స్టార్టప్‌ను ప్రారంభించారు. సాధారణ ఏఐ అవసరాలకు ఉపయోగపడే కోడర్, ఎల్ఎల్ఎం, వీ2 లాంటి మోడల్స్‌ను చకచకా ప్రవేశపెట్టి, బైట్‌డ్యాన్స్, బైదులాంటి దిగ్గజాలకు కాస్త కుదుపునిచ్చారు. కట్ చేస్తే, 2025 జనవరి వచ్చేసరికి అత్యంత సంక్లిష్టమైన రీజనింగ్ సామర్థ్యాలతో, ఓపెన్ఏఐ జీపీటీ–4కి పోటీగా డీప్‌సీక్–ఆర్1 ఏఐ అసిస్టెంట్‌ను ప్రవేశపెట్టారు. ఒకవైపు బడా టెక్ దిగ్గజాలన్నీ తమ తమ మోడల్స్‌ను అభివృద్ధి చేసేందుకు మిలియన్ల కొద్దీ డాలర్లను కుమ్మరిస్తూ, యూజర్ల నుంచి చార్జీలు కూడా వసూలు చేస్తుండగా.. డీప్‌సీక్ చాట్‌బాట్‌ను అత్యంత చౌకగా కేవలం 6 మిలియన్ డాలర్లకే (దాదాపు రూ. 52 కోట్లు) తయారు చేసి షాకిచ్చారు. పైగా ఇది అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో దీన్ని ఓపెన్‌సోర్స్ మోడల్‌గానే ఉంచుతామంటున్నారు. కృత్రిమ మేథ విషయంలో చైనాను అగ్రస్థానంలో నిలబెట్టడమే తన లక్ష్యమని లియాంగ్ చెబుతున్న నేపథ్యంలో అమెరికన్ టెక్ దిగ్గజాలు దీనికి ఎలా చెక్ పెట్టబోతున్నాయనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
భారత్‌లోకి స్టార్‌లింక్.. లైన్ క్లియర్..?
దేశంలో శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలకు సంబంధించిన షరతులను ఎలాన్‌మస్క్(Elonmusk) ఆధ్వర్యంలోని స్టార్‌లింక్(StarLink) అధికారికంగా అంగీకరించింది. ఈ సేవలు ప్రారంభించేందుకు అవసరమైన లైసెన్స్ పొందడానికి భారత ప్రభుత్వం విధించిన నియమాలకు కట్టుబడి ఉంటానని తెలిపింది. స్టార్‌లింక్ భారత్‌లో ప్రవేశించేందుకు ఇది కీలక పరిణామమని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దేశంలోని మారుమూల ప్రాంతాలకు హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించాలని స్టార్‌లింక్ ఎప్పటినుంచో యోచిస్తోంది.షరతులు సడలించాలని వినతిప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం కంపెనీ మొత్తం యూజర్ డేటాను దేశంలోనే నిల్వ చేయాల్సి ఉంటుంది. అవసరమైనప్పుడు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో ఈ సమాచారాన్ని నిర్ధారించుకోవాలి. దీనికి స్టార్లింగ్ అంగీకరించింది. అయితే ఇటీవల టెలికమ్యూనికేషన్స్ విభాగానికి (DoT) రాసిన లేఖలో స్టార్‌లింక్ కొన్ని షరతులను సడలించాలని అభ్యర్థించింది. దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత కాలక్రమేణా వాటిని పాటించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, స్టార్‌లింక్, అమెజాన్‌కు చెందిన కూపర్ వంటి గ్లోబల్ సంస్థలకు ఎలాంటి నిబంధనలను సడలించబోమని ప్రభుత్వం తన వైఖరిని గతంలోనే స్పష్టం చేసింది.చందాదారులను కోల్పోయే ప్రమాదంప్రస్తుతం స్టార్‌లింక్ దరఖాస్తును హోం మంత్రిత్వ శాఖ, భద్రతా సంస్థలు పరిశీలిస్తున్నాయి. స్టార్‌లింక్ అధికారికంగా దరఖాస్తు పూర్తి చేసిన తరువాత ప్రభుత్వం ఎలాంటి వివరణ కోరలేదు. ఒకవేళ దీనికి ప్రభుత్వం ఆమోదం లభిస్తే ఈ ఏడాది చివరి నాటికి స్టార్‌లింక్ శాటిలైట్ సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. స్టార్‌లింక్ వంటి సంస్థలు పట్టణ ప్రాంతాల్లో సేవలు అందించడం ద్వారా తమ చందాదారులను కోల్పోయే ప్రమాదం ఉందని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: అదానీ గ్రీన్ ఒప్పందంపై శ్రీలంక పునఃసమీక్షప్లాన్ల ధరలు ఇలా..స్టార్‌లింక్ భారత మార్కెట్లోకి ప్రవేశించడం వల్ల గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో మెరుగైన ఇంటర్నెట్ కనెక్టివిటీతో సహా గణనీయమైన ప్రయోజనాలు ఉంటాయని కొందరు భావిస్తున్నారు. కంపెనీ శాటిలైట్ ఇంటర్నెట్ ప్లాన్ల ధర నెలకు 10-500 డాలర్లు(రూ.840-రూ.5,000)గా ఉంటుందని అంచనా. ఈ ధర సాంప్రదాయ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ల కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ, పరిమిత కనెక్టివిటీ ఉన్న ప్రాంతాలకు ఎంతో మేలని కొందరు అభిప్రాయపడుతున్నారు. -
ఏఐ ‘డీప్’ వార్!
మా పరిశోధకుల్లో ఎక్కువ మంది చైనా టాప్యూనివర్సిటీల నుంచి తీసుకున్న ఫ్రెష్ గ్రాడ్యుయేట్లే. భారీపెట్టుబడులతో నవకల్పనలు పెరుగుతాయంటే పొరపాటే. అదే నిజమైతే ప్రపంచంలోని ఇన్నోవేషన్ అంతాబడా కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోయేది – డీప్‌సీక్ ఫౌండర్ లియాంగ్ వెన్ఫెంగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లో ఎదురులేని అమెరికా టెక్ దిగ్గజాలకు చైనా ఊహించని షాక్ ఇచ్చింది. ఏఐ రారాజు చాట్‌జీపీటీకి ఓ అనామక చైనా ఏఐ స్టార్టప్ పెను సవాల్ విసిరింది. అదే డీప్‌సీక్. దీని చౌక ఏఐ దెబ్బకు మొత్తం సిలికాన్ వ్యాలీ చివురుటాకులా వణుకుతోంది. లక్షల కోట్లు వెచ్చించి అమెరికా కంపెనీలు కడుతున్న ‘ఆర్టిఫిషియల్’కోటను బద్దలుకొట్టేందుకు డ్రాగన్ బరిలోకి దూకడంతో ఏఐ వార్‌కు తెరలేచింది. దీంతో జపాన్ నుంచి యూరప్ మీదుగా.. అమెరికా వరకు టెక్ షేర్లన్నీ కుప్పకూలాయి. విలువ పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ ఎన్విడియా షేరు ఏకంగా 17 శాతం పడిపోవటంతో దాదాపు 600 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ తుడిచిపెట్టుకుపోయింది. మనదేశంలో మూడు అతిపెద్ద కంపెనీలైన రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్‌ల మొత్తం మార్కెట్ విలువ కంటే ఇది ఎక్కువ. – సాక్షి, హైదరాబాద్2023లో ఆవిర్భావండీప్సీక్ పురుడుపోసుకుని రెండేళ్లు కూడా కాలేదు. క్వాంట్ హెడ్జ్ ఫండ్ ‘హై–ఫ్లయర్’చీఫ్ లియాంగ్ వెన్ఫెంగ్ 2023లో దీన్ని నెలకొల్పారు. అతి తక్కువ ఖర్చుతో డీప్‌సీక్ రూపొందించిన ఆర్1 ఏఐ మోడల్ చైనాతోపాటు అమెరికా టెక్ దిగ్గజాలను కూడా ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఏఐ మోడల్‌ను పూర్తి ఉచితంగా అందిస్తుండటం ఓపెన్ ఏఐ వంటి కంపెనీల భవిష్యత్‌కు గొడ్డలిపెట్టులా మారింది. అమెరికాలో విడుదలైన వారంలోనే యాపిల్ యాప్ స్టోర్‌లో డీప్‌సీక్ మొబైల్ యాప్ అత్యధిక డౌన్లోడ్లతో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుని చాట్‌జీపీటీని వెనక్కి నెట్టింది. ఈ నెల 27న ఒక్కరోజే ఏకంగా 20 లక్షల మంది డౌన్లోడ్ చేసుకోవడం దీని జోరుకు నిదర్శనం. మరోపక్క టెక్ట్స్ ప్రాంప్ట్‌ను ఇమేజ్‌గా మార్చే జానస్–ప్రో–7బీతో మరో సంచలనానికి తెరతీసింది డీప్‌సీక్. అమెరికాకు ‘డీప్’ట్రబుల్.. ఏఐలో అగ్రస్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన వెంటనే స్టార్గేట్ ప్రాజెక్టును ప్రకటించిన విషయం తెలిసిందే. నాలుగేళ్లలో 500 బిలియన్ డాలర్లు వెచ్చించి అమెరికాను తిరుగులేని ఏఐ సూపర్‌పవర్‌గా చేసేందుకు ఓపెన్ఏఐ, ఒరాకిల్, సాఫ్ట్ బ్యాంక్, ఎంజీఎక్స్ చేతులు కలిపాయి. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కకముందే డీప్‌సీక్ కారు చౌకగా ఏఐ మోడల్‌ను అభివృద్ధి చేసి షాకిచ్చింది. ట్రంప్ సలహాదారు మార్క్ ఆండర్సన్.. డీప్‌సీక్–ఆర్1ను ఏకంగా ‘‘ఏఐ స్పుత్నిక్ మూమెంట్’’గా (1957లో సోవియట్ యూనియన్ ప్రపంచంలో తొలి శాటిలైట్ స్పుత్నిక్ను ప్రయోగించడంతో యూఎస్, సోవియట్ మధ్య స్పేస్ వార్‌కు తెరలేచింది) అభివర్ణించడం విశేషం.దిగ్గజాలకు దీటుగా..ఎన్విడియా అధునాతన చిప్స్, గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ (జీపీయూ)తో పోలిస్తే చాలా లో ఎండ్ హార్డ్‌వేర్‌తో (పాత ఎన్విడియా ఏ100 జీపీయూలు) తాము ఏఐ మోడల్స్‌ను రూపొందించామని డీప్‌సీక్ ప్రకటించింది. చైనాకు అధునాతన చిప్స్, టెక్నాలజీ ఎగుమతిపై అమెరికా విధించిన ఆంక్షలను సైతం ఎదురొడ్డి సొంతంగా దిమ్మదిరిగే ఏఐ మోడల్‌ను అభివృద్ధి చేయడంపై నిపుణులు కూడా నోరెళ్లబెడుతున్నారు. డీప్‌సీక్ దెబ్బతో ప్రపంచ ఏఐ పరిశ్రమ స్వరూపమే మారిపోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది ఓపెన్ సోర్స్ (డెవలపర్లు ఈ సాఫ్ట్‌వేర్‌ను మెరుగుపరచే అవకాశంతో పాటు దీని ఆధారంగా సొంత టూల్స్‌ను రూపొందించుకోవచ్చు) మోడల్ కావడంతో తక్కువ బడ్జెట్లోనే కంపెనీలు, యూజర్లకు ఏఐ అందుబాటులోకి వస్తుంది. డీప్‌సీక్ ఆర్1 ఏఐ మోడల్ మేథమెటిక్స్, కోడింగ్, రీజనింగ్, లాంగ్వేజ్ పరంగా అన్ని రకాల ప్రమాణాల్లో చాట్‌జీపీటీ, జెమిని, గ్రోక్ వంటి ఏఐ మోడళ్లకు దీటుగా నిలవడం గమనార్హం. మెటా ఏఐ మోడల్ అభివృద్ధికి 6 బిలియన్ డాలర్లు ఖర్చు చేయగా.. డీప్‌సీక్ కేవలం 6 మిలియన్ డాలర్లతోనే ఆర్1 ఏఐ మోడల్‌ను తీసుకొచ్చింది.మైక్రోసాఫ్ట్ నుంచి 13 బిలియన్ డాలర్లతో సహా, భారీగా నిధులు సమీకరించిన ఓపెన్ఏఐలో సిబ్బంది సంఖ్య 4,500. దీనికి పూర్తి భిన్నంగా ఇప్పటిదాకా డీప్‌సీక్ వెచ్చించింది 10 మిలియన్ డాలర్లే. ఉద్యోగులు 200 మంది మాత్రమే.ఎన్విడియాకు షాకెందుకు?ఏఐ మోడల్స్‌ను నడిపేందుకు హై ఎండ్ చిప్స్, జీపీయూలు, నెట్వర్కింగ్ అవసరమని ఇప్పటిదాకా ఊదరగొడుతున్నారు. ఈ రంగంలో నంబర్ వన్‌గా ఉన్న ఎన్విడియా మార్కెట్ విలువ 2023 డిసెంబర్లో తొలిసారి 500 బిలియన్ డాలర్లు దాటింది. గడిచిన ఏడాదిలోనే ఏకంగా 3.5 ట్రలియన్ డాలర్లను (మన కరెన్సీలో రూ.301 లక్షల కోట్లు) తాకి ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా యాపిల్‌ను వెనక్కి నెట్టింది. డీప్‌సీక్ చౌక మోడల్ వల్ల డిమాండ్ తగ్గొచ్చనే భయంతో ఇన్వెస్టర్లు ఏఐ టెక్ షేర్లను అమ్మేసుకుంటున్నారు. దీంతో ఎన్విడియా షేర్ 17 శాతం కుప్పకూలింది. బ్రాడ్‌కామ్, ఏఎండీ, అరిస్టా నెట్వర్క్స్, నెదర్లాండ్స్ చిప్ దిగ్గజం ఏఎస్ఎంఎల్ హోల్డింగ్స్, తైవాన్ సెమీకండక్టర్స్ మాన్యుఫ్యాక్చర్స్ (టీఎస్ఎం) వంటి చిప్, నెట్వర్కింగ్ షేర్లు సైతం 15–23 శాతం పడిపోయాయి. -
డీప్‌సీక్ హవా.. దిగ్గజ టెక్ కంపెనీలకు ట్రంప్ వార్నింగ్!
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సిలికాన్ వ్యాలీకి హెచ్చరికలు జారీ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా చాట్‌జీపీటీ తరహాలో రూపొందించిన చైనాకు చెందిన ఏఐ స్టార్టప్ ‘డీప్‌సీక్’ (deepseek) పై చర్చ జరుగుతుంది. ఈ తరుణంలో చైనా డీప్‌సీక్ విషయంలో సిలికాన్ వ్యాలీకి ఓ వేకప్ కాల్ అంటూ హెచ్చరించారు. అసలేం జరిగిందంటే..? కొద్ది రోజులు క్రితం అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన దిగ్గజ టెక్ కంపెనీ ఫౌండర్లు, కోఫౌండర్లు, సీఈవోతో మాటమంతి కలిపారు. అదే సమయంలో చైనా డీప్‌సీక్ తన ఆర్1 మోడల్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. అయితే, ట్రంప్ ప్రమాణ స్వీకారం కారణంగా ఆర్1 మోడల్ గురించి పెద్దగా ఎవరీకి తెలియలేదు.కానీ వారాంతంలో డీప్‌సీక్ చాట్‌బాట్ ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. యూఎస్ యాపిల్ యాప్ స్టోర్‌లో అత్యధికంగా డౌన్లోడ్ చేసుకున్న యాప్ స్థానంలో డీప్‌సీక్ చేరింది. చాట్ జీపీటీ సైతం డౌన్లోడ్ల విషయంలో డీప్‌సీక్ వెనక్కి నెట్టింది. దీంతో కృత్రిమ మేధా ప్రపంచంలో చైనా ఏఐ డీప్‌సీక్ దెబ్బకు ఇతర టెక్నాలజీ కంపెనీ షేర్లు.. బేర్ మన్నాయి. ముఖ్యంగా చిప్ తయారీ సంస్థలు ఊహించని స్థాయిలో నష్టాన్ని చవిచూశాయి. ప్రపంచంలోనే అతిపెద్ద చిప్ తయారీ సంస్థ ఎన్విడియా సోమవారం దాదాపు 17 శాతం నష్టాన్ని చవిచూసింది. ఎన్విడియా సైతం అమెరికన్ స్టాక్ మార్కెట్ వాల్ స్ట్రీట్ జర్నల్‌లో ఒక రోజు లోనే అతిపెద్ద నష్టాన్ని మూగట్టుకుంది. నష్టం విలువ సుమారు 589 బిలియన్ డాలర్లు.ఈ వరుస పరిణామాలపై ట్రంప్ స్పందించారు. డీప్‌సీక్ తక్కువ ఖర్చుతో తయారు చేసినట్లు తెలుస్తోంది. సిలికాన్ వ్యాలీకి ఇదొక వేకప్ కాల్ లాంటిది. డీప్‌సీక్‌కు వస్తున్న క్రేజ్‌ను సానుకూలంగా భావిస్తున్నట్లు చెప్పారు. బిలియన్ డాలర్లు ఖర్చు చేయకుండా, తక్కువ ఖర్చుతో అదే తరహా చాట్బాట్లను తయారు చేయొచ్చు’ అని అన్నారు. -
అరుణాచల్ ప్రదేశ్‌పై ప్రశ్న: ఖంగుతినే సమాధానం చెప్పిన డీప్‌సీక్
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో దిగ్గజాలకు సైతం దడపుట్టిస్తున్న చైనా ఏఐ 'డీప్‌సీక్' (DeepSeek) ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు.. ఆశ్చర్యపోయే సమాధానం ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.చైనాకు చెందిన AI స్టార్టప్ డీప్‌సీక్ ఇంటర్నెట్లో సంచలనం సృష్టించింది. చాట్‌జీపీటీ, జెమినీ ఏఐ, క్లౌడ్ కంటే వేగంగా ప్రశ్నలకు సమాధానాలు అందిస్తున్న డీప్‌సీక్.. అతి తక్కువ కాలంలోనే అధిక ప్రజాదరణ పొందింది. గూగిల్ర్, మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐ వంటి కంపెనీలు తమ ఏఐ కోసం కొంత మొత్తాన్ని వసూలు చేస్తుంటే.. డీప్‌సీక్ మాత్రం పూర్తిగా ఉచితం. ఈ కారణంగానే చాలామంది దీనిని డౌన్లోడ్ చేసుకున్నారు.ఎక్కువమంది ఉపయోగిస్తున్న డీప్‌సీక్ ఏఐను ఒక యూజర్, అరుణాచల్ ప్రదేశ్ అనేది భారతదేశంలోని ఒక రాష్ట్రం అని అడగ్గా.. సరైన సమాధానం ఇవ్వలేదు. ఇది నా పరిధిని దాటిన అంశం అంటూ సమాధానం ఇచ్చింది. ఆ తరువాత అదే యూజర్ భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల గురించి అడగ్గా.. దానికి కూడా అదే సమాధానం ఇచ్చింది. దీనికి సంబంధించిన స్క్రీన్షాట్లను.. ఆ యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలువురు నెటిజన్లు దీనిపై స్పందిస్తూ.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చైనా బుద్ది చూపించిందని కొందరు అంటే.. దీనిని వెంటనే బ్యాన్ చేయాలని మరికొందరు అన్నారు. మొత్తం మీద కొంతమంది యూజర్లకు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంలో ఇది విఫలమైనట్లు తెలుస్తోంది.డీప్‌సీక్ అంటే ఏమిటి?డీప్‌సీక్ అనేది చైనా ఏఐ చాట్‌బాట్. ఇది దాని ప్రత్యర్థుల కంటే కూడా వేగంగా పనిచేస్తుంది. దీనిని లియాంగ్ వెన్ఫెంగ్ (Liang Wenfeng) 2023లో ప్రారంభించారు. ఈ చాట్‌బాట్ ఉపయోగించడానికి ప్రస్తుతానికి ప్రత్యేకంగా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రమే కాకుండా.. యాపిల్ యాప్స్టోర్లోనూ దూసుకెళ్తోంది.CCP machine exposed 🤣 https://t.co/DlmofSXQUP pic.twitter.com/TAggpM8L87— ur rental friend☆ ragebait machine (@sxchidxnxnd) January 27, 2025'డీప్‌సీక్'పై శామ్ ఆల్ట్‌మన్ స్పందనడీప్సీక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కొత్త పోటీపై ఆయన ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ.. పరిశ్రమలో కొత్త పోటీదారు రావడం నూతన ఉత్తేజాన్ని కలిగిస్తుంది. ఓపెన్ ఏఐ మరింత మెరుగైన మోడళ్లను అందించే సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (AGI) సాధించాలనే కంపెనీ దీర్ఘకాలిక లక్ష్యంపై దృష్టి సారించినట్లు తెలిపారు. మార్కెట్ పోటీకి ప్రతిస్పందనగా ఓపెన్ఏఐ తదుపరి మోడళ్ల విడుదల షెడ్యూల్‌ను వేగవంతం చేసే ప్రణాళికలను సూచించారు. ‘ప్రపంచానికి కృత్రిమ మేధ అవసరం. భవిష్యత్తులో తదుపరి తరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడళ్లను చూసి ప్రజలు ఆశ్చర్యపోతారు’ అని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఐఫోన్ 15 రేటు ఇంత తగ్గిందా.. ఇప్పుడెవరైనా కొనేయొచ్చు!డీప్‌సీక్‌పై సైబర్ ఎటాక్డీప్సీక్పై సైబర్‌దాడి జరిగినట్లు ఇటీవల సంస్థ ప్రకటించింది. ఈ దాడి కారణంగా కొత్త వినియోగదారుల రిజిస్ట్రేషన్లను తాత్కాలికంగా పరిమితం చేస్తున్నట్లు తెలిపింది. దాంతో సైట్లో నమోదు చేసుకునే వినియోగదారుల సంఖ్యపై ప్రభావం పడింది. సైబర్‌దాడి పరిమిత విభాగానికి చెందిందని, రిజిస్టర్డ్ వినియోగదారులు సాధారణంగా లాగిన్ చేయవచ్చని స్పష్టం చేసింది. -
చైనా ఏఐ డీప్‌సీక్‌పై ఓపెన్ఏఐ సీఈఓ స్పందన
కొత్త జనరేటివ్ ఏఐ మోడల్‌తో టెక్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తున్న చైనీస్ ఏఐ స్టార్టప్ డీప్‌సీక్(DeepSeek) ఆర్1పై ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ ఇటీవల తన ఆలోచనలను పంచుకున్నారు. ఆల్ట్‌మన్ తన ఎక్స్ ఖాతాలో డీప్‌సీక్ జనరేటివ్ ఏఐ మోడళ్లపై చేస్తున్న ఖర్చుపై స్పందించారు.‘డీప్‌సీక్ ఆర్ 1 ఆకట్టుకునే మోడల్. వారు ఖర్చు చేసిన దానికి సరిపడా అవుట్‌పుట్ ఇస్తున్నారు’ అని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కొత్త పోటీపై ఆయన ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ ‘పరిశ్రమలో కొత్త పోటీదారు రావడం నూతన ఉత్తేజాన్ని కలిగిస్తుంది’ అని చెప్పారు. ఓపెన్ ఏఐ మరింత మెరుగైన మోడళ్లను అందించే సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (AGI) సాధించాలనే కంపెనీ దీర్ఘకాలిక లక్ష్యంపై దృష్టి సారించినట్లు తెలిపారు. మార్కెట్ పోటీకి ప్రతిస్పందనగా ఓపెన్ఏఐ తదుపరి మోడళ్ల విడుదల షెడ్యూల్‌ను వేగవంతం చేసే ప్రణాళికలను సూచించారు. ‘ప్రపంచానికి కృత్రిమ మేధ అవసరం. భవిష్యత్తులో తదుపరి తరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడళ్లను చూసి ప్రజలు ఆశ్చర్యపోతారు’ అని పేర్కొన్నారు.డీప్‌సీక్‌పై సైబర్ ఎటాక్డీప్సీక్పై సైబర్‌దాడి జరిగినట్లు ఇటీవల సంస్థ ప్రకటించింది. ఈ దాడి కారణంగా కొత్త వినియోగదారుల రిజిస్ట్రేషన్లను తాత్కాలికంగా పరిమితం చేస్తున్నట్లు తెలిపింది. దాంతో సైట్లో నమోదు చేసుకునే వినియోగదారుల సంఖ్యపై ప్రభావం పడింది. సైబర్‌దాడి పరిమిత విభాగానికి చెందిందని, రిజిస్టర్డ్ వినియోగదారులు సాధారణంగా లాగిన్ చేయవచ్చని స్పష్టం చేసింది.deepseek's r1 is an impressive model, particularly around what they're able to deliver for the price.we will obviously deliver much better models and also it's legit invigorating to have a new competitor! we will pull up some releases.— Sam Altman (@sama) January 28, 2025ఇదీ చదవండి: ‘ఆదాయ పన్ను రద్దు చేస్తాం’భద్రత ప్రమాణాలపై ఆందోళనలుఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ రంగంలో అమెరికా, చైనాల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంపై ఈ సైబర్ దాడి చర్చలకు దారితీసింది. డీప్‌సీక్ వేగవంతమైన పురోగతి, తక్కువ ఖర్చు కారణంగా హడావుడిగా సేవలు ప్రారంభించి, సరైన భద్రత ప్రమాణాలు పాటించడంలేదని కొంతమంది యూఎస్ టెక్ పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏఐలో చైనా వేగాన్ని నిలువరించేందుకు వీలుగా ఇప్పటికే అమెరికా ఆధునిక సెమీ కండక్టర్ టెక్నాలజీలను ఎగుమతి చేయకుండా నిషేధించింది. ఎన్విడియా రూపొందిస్తున్న ఏఐ చిప్స్ తదితరాలపై ఆంక్షలు విధించింది. డీప్‌సీక్ అభివృద్ధి చేసిన తాజా ఏఐ మోడల్‌ను గత వారమే మార్కెట్లో విడుదల చేసింది. -
సడన్ ఫేమ్.. డీప్‌సీక్‌పై సైబర్ ఎటాక్
జనరేటివ్ ఏఐ సేవలందిస్తున్న చైనీస్ టెక్ స్టార్టప్ డీప్‌సీక్(DeepSeek)పై సైబర్‌దాడి జరిగినట్లు ప్రకటించింది. ఈ దాడి కారణంగా కొత్త వినియోగదారుల రిజిస్ట్రేషన్లను తాత్కాలికంగా పరిమితం చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. దాంతో సైట్లో నమోదు చేసుకునే వినియోగదారుల సంఖ్యపై ప్రభావం పడింది. సైబర్‌దాడి(Cyber Attack) పరిమిత విభాగానికి చెందిందని, రిజిస్టర్డ్ వినియోగదారులు సాధారణంగా లాగిన్ చేయవచ్చని స్పష్టం చేసింది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్(AI Chat Bot) సేవలందించే డీప్‌సీక్ ఇటీవల తరుచూ వార్తల్లో నిలుస్తోంది. ఓపెన్ ఏఐకు సవాలు విసురుతూ జనరేటివ్ ఏఐ రంగంలో విప్లవాత్మక మార్పునకు పునాది వేసింది. చాటీజీపీటీ పెయిడ్ వర్షన్ అందించే సేవలకు ధీటుగా డీప్‌సీక్‌కు చెందిన ఆర్-1 ఉచితంగానే సర్వీసు అందిస్తున్నట్లు కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. దాంతో అమెరికన్ టెక్ కంపెనీ స్టాక్‌లు ఇటీవల గణనీయంగా పడిపోయాయి. కంపెనీపై జరిగిన సైబర్ దాడి వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తుంది.కంపెనీ స్పందన..డీప్‌సీక్‌కు పెరుగుతున్న ప్రజాదరణతో సైబర్ మోసగాళ్లు లక్ష్యంగా చేసుకుంటున్నట్లు కంపెనీ స్టేటస్ పేజీ ద్వారా తెలిసింది. సమస్యలను పరిష్కరించడానికి, నిరంతర సేవను అందించేందుకు కృషి చేస్తున్నామని డీప్‌సీక్ వినియోగదారులకు హామీ ఇచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ రంగంలో అమెరికా, చైనాల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంపై ఈ సైబర్ దాడి చర్చలకు దారితీసింది. డీప్‌సీక్ వేగవంతమైన పురోగతి, తక్కువ ఖర్చు కారణంగా హడావుడిగా సేవలు ప్రారంభించి, సరైన భద్రత ప్రమాణాలు పాటించడంలేదని కొంతమంది యూఎస్ టెక్ పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.డీప్‌సీక్ ఆర్-1భవిష్యత్తులో చైనా ఏఐ స్టార్టప్ డీప్‌సీక్ అభివృద్ధి చేసిన ఆర్-1 అమెరికా టెక్ కంపెనీలు అభివృద్ధి చేస్తున్న చాట్‌జీపీటీ, ఓపెన్ ఏఐ తదితరాలకు తీవ్ర పోటీతో చెక్ పెట్టనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఏఐలో చైనా వేగాన్ని నిలువరించేందుకు వీలుగా ఇప్పటికే అమెరికా ఆధునిక సెమీ కండక్టర్ టెక్నాలజీలను ఎగుమతి చేయకుండా నిషేధించింది. ఎన్విడియా రూపొందిస్తున్న ఏఐ చిప్స్ తదితరాలపై ఆంక్షలు విధించింది. డీప్‌సీక్ అభివృద్ధి చేసిన తాజా ఏఐ మోడల్‌ను గత వారమే మార్కెట్లో విడుదల చేసింది. ఇది ఓపెన్ఏఐ, మెటా ప్లాట్‌ఫామ్స్‌కు దీటైన పోటీని ఇవ్వనున్నట్లు టెక్నాలజీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రధానంగా అమెరికా టెక్ దిగ్గజాలు వందల కోట్ల డాలర్లు వెచ్చించి అభివృద్ధి చేస్తున్న ఏఐ సేవలకు దీటుగా చైనీస్ ఏఐ చౌకగా సేవలు అందించే వీలుందని విశ్లేషకులు అంటున్నారు. ఇది తీవ్ర పోటీకి తెరతీయడంతో యూఎస్ టెక్ దిగ్గజాల పెట్టుబడులపై ఆశించిన స్థాయిలో రిటర్నులకు తెరపడవచ్చని ఆందోళన నెలకొంది. ఫలితంగా ఉన్నట్టుండి టెక్ కౌంటర్లలో అమ్మకాలు నమోదవుతున్నట్లు నిపుణులు తెలియజేశారు.ఇదీ చదవండి: భారత్‌లో క్రెడిట్ కార్డుల జోరుఆందోళనలు.. ‘డీప్’గత వారమే విడుదలైన డీప్‌సీక్ తాజా ఏఐ మోడల్.. అమెరికా ఐఫోన్ల టెక్ దిగ్గజం యాపిల్ ఇంక్ యాప్ స్టోర్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరినట్లు తెలుస్తోంది. దీంతో క్వాంట్ ఫండ్ చీఫ్ లియాంగ్ వెన్ఫెంగ్ ఏర్పాటు చేసిన ఈ ఓపెన్ సోర్స్ ప్రొడక్ట్.. ఓపెన్ ఏఐ, మెటా ప్లాట్‌ఫామ్స్ కు పోటీగా నిలుస్తుందన్న అంచనాలు పెరిగాయి. వెరసి అడ్వాన్స్డ్ చిప్స్, అత్యున్నత కంప్యూటింగ్ పవర్‌లపై ఆధారపడిన ప్రస్తుత యూఎస్ ఏఐ బిజినెస్ మోడల్‌ను ఆర్-1 దెబ్బతీయవచ్చన్న ఆందోళనలు వ్యాప్తిస్తున్నాయి. ఏఐ విస్తృతిలో ప్రధానంగా ఎన్విడియాకు భారీ అవకాశాలు లభించాయి. అయితే ఆర్1 సెగ ఎన్విడియాకు అధికంగా తగులుతుందనేది నిపుణులు మాట. -
డీప్‌సీక్.. మార్కెట్ షేక్!
ముంబై: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల విధింపు భయాలు, చైనా ఏఐ స్టార్టప్ డీప్‌సీక్ ప్రభావంతో దేశీయ స్టాక్ సూచీలు సోమవారం ఒక శాతం నష్టపోయాయి. సెన్సెక్స్ 824 పాయింట్లు క్షీణించి 76వేల స్థాయి దిగువన 75,366 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 23,000 స్థాయిని కోల్పోయింది. మార్కెట్ ముగిసే సమయానికి 263 పాయింట్లు పతనమై 22,829 వద్ద నిలిచింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయమే నష్టాలతో మొదలయ్యాయి. అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో ఒక దశలో సెన్సెక్స్ 923 పాయింట్లు క్షీణించి 75,267 వద్ద, నిఫ్టీ 306 పాయింట్లు పతనమై 22,786 వద్ద కనిష్టాలు తాకాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 9 పైసలు క్షీణించి 86.31 స్థాయి స్థిరపడింది. → ప్రధాన సూచీలు ఒకశాతమే పడినా.. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు భారీగా క్షీణించాయి. అధిక వాల్యుయేషన్ల భయాలతో విక్రయాలు వెల్లువెత్తాయి. బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 3.5%, మిడ్ క్యాప్ సూచీ 2.7% పడింది. → స్టాక్ మార్కెట్ భారీ పతనంతో రూ.9.28 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.410.23 లక్షల కోట్ల(4.75 ట్రిలియన్ డాలర్లు)కు దిగివచి్చంది. ఈ సూచీలోని మొత్తం 30 షేర్లలో ఆరు మాత్రమే లాభాలతో గట్టెక్కాయి. → ఐటీసీ లిమిటెడ్ నుంచి విడదీసిన ఐటీసీ హోటల్స్ షేర్లు జనవరి 29న స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. ఈ విషయాన్ని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ ఏడాది జనవరి 1న ఐటీసీ నుంచి ఐటీసీ హోటల్స్ ప్రత్యేక సంస్థగా విడిపోయింది. ప్రతి పది ఐటీసీ షేర్లకు ఒక ఐటీసీ హోటల్ షేరు ధరను కేటాయించారు.ఎందుకీ పతనం...→ అమెరికాలోని అక్రమ వలసదారులను వారి స్వదేశాలకు పంపే చర్యల్లో భాగంగా ట్రంప్ తాజాగా కొలంబియాపై 25% సుంకాలు విధించారు. ఇప్పటికే మెక్సికో, కెనడాలపై ఫిబ్రవరి 1 నుండి 25% వాణిజ్య సుంకాల విధింపును ప్రకటించారు. ఇది అంతర్జాతీయ వాణిజ్య యు ద్దాలకు దారితీయొచ్చనే భయాలు పెరిగాయి. → చైనా ఏఐ స్టార్టప్ డీప్‌సీక్ ఆర్1 ప్రపంచవ్యాప్తంగా టెక్ పరిశ్రమను కుదిపేస్తుంది. అమెరికా దిగ్గజ టెక్ కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. ఈ ప్రభావం మన స్టాక్ మార్కెట్‌పై పడింది. → అమెరికా ఫెడరల్ రిజర్వ్ బుధవారం వడ్డీ రేట్ల కోతపై నిర్ణయం వెలువరించనుంది. ఈ ధఫా వడ్డీరేట్ల తగ్గింపు ఉండదని అంచనాలున్నాయి. → ఇప్పటి వరకు వెల్లడైన కార్పొరేట్ డిసెంబర్ క్వార్టర్ ఆర్థిక త్రైమాసిక ఫలితాలు నిరాశపరిచాయి. యూఎస్ టెక్ దిగ్గజాలలో కలవరం యూఎస్ ఏఐకు పోటీగా చైనీస్ ఆర్1 టెక్నాలజీ షేర్లలో భారీ అమ్మకాలు 3 శాతం పతనమైన నాస్డాక్ చాట్‌జీపీటీకి పోటీగా చైనీస్ డీప్‌సీక్ మైక్రోసాఫ్ట్, మెటా, ఒరాకిల్, గూగుల్ తదితర యూఎస్ టెక్నాలజీ దిగ్గజాలు వందల కోట్ల డాలర్లు వెచ్చించి రూపొందించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మోడల్స్, చాట్‌జీపీటీకి పోటీగా చైనా రంగంలోకి దిగింది. స్టార్టప్ డీప్‌సీక్.. అమెరికా ఏఐలకు దీటుగా ఆర్1ను విడుదల చేస్తోంది. దీంతో టెక్నాలజీ వర్గాల్లో ఆందోళనలకు తెరలేచింది. చైనా కారుచౌకగా ఏఐ సేవలు అందించనున్న అంచనాలు యూఎస్ ఇన్వెస్టర్లలో భయాలను కల్పించింది. దీంతో టెక్ కంపెనీలు లిస్టయిన నాస్డాక్ ఇండెక్స్ ప్రారంభంలోనే 3 శాతం పతనమైంది. మ్యాగ్నిఫిషియంట్ 7గా పేర్కొనే ఎన్విడియా, మైక్రోసాఫ్ట్, ఏఎండీ తదితరాలు అమ్మకాలతో డీలా పడ్డాయి. ప్రధానంగా ఏఐ అవకాశాలపై అంచనాలతో ఇటీవల భారీ ర్యాలీ చేస్తున్న ఎన్విడియా షేరు 17 శాతంపతనంకాగా.. మైక్రోసాఫ్ట్ 3 శాతంపైగా క్షీణించింది. ఫలితంగా ఒక్కరోజులోనే ఎన్విడియా మార్కెట్ విలువలో సుమారు 500 బిలియన్ డాలర్లు ఆవిరైంది. ఆర్1 ఎఫెక్ట్..: చైనా ఏఐ స్టార్టప్ డీప్‌సీక్ అభివృద్ధి చేసిన ఆర్1.. అమెరికా టెక్ కంపెనీలు అభివృద్ధి చేస్తున్న చాట్‌జీపీటీ, ఓపెన్ ఏఐ తదితరాలకు తీవ్ర పోటీతో చెక్ పెట్టనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఏఐలో చైనా వేగాన్ని నిలువరించేందుకు వీలుగా ఇప్పటికే అమెరికా ఆధునిక సెమీ కండక్టర్ టెక్నాలజీలను ఎగుమతి చేయకుండా నిషేధించింది. ఎన్విడియా రూపొందిస్తున్న ఏఐ చిప్స్ తదితరాలపై ఆంక్షలు విధించింది. డీప్‌సీక్ అభివృద్ధి చేసిన తాజా ఏఐ మోడల్‌ను గత వారమే మార్కెట్లో విడుదల చేసింది. ఇది ఓపెన్ఏఐ, మెటా ప్లాట్‌ఫామ్స్‌కు దీటైన పోటీని ఇవ్వనున్నట్లు టెక్నాలజీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రధానంగా అమెరికా టెక్ దిగ్గజాలు వందల కోట్ల డాలర్లు వెచ్చించి అభివృద్ధి చేస్తున్న ఏఐ సేవలకు దీటుగా చైనీస్ ఏఐ చౌకగా సేవలు అందించే వీలుందని విశ్లేషకులు అంటున్నారు. ఇది తీవ్ర పోటీకి తెరతీయడంతో యూఎస్ టెక్ దిగ్గజాల పెట్టుబడులపై ఆశించిన స్థాయిలో రిటర్నులకు తెరపడవచ్చని ఆందోళన నెలకొంది. ఫలితంగా ఉన్నట్టుండి టెక్ కౌంటర్లలో అమ్మకాలు నమోదవుతున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఆందోళనలు.. ‘డీప్’గత వారమే విడుదలైన డీప్‌సీక్ తాజా ఏఐ మోడల్.. అమెరికా ఐఫోన్ల టెక్ దిగ్గజం యాపిల్ ఇంక్ యాప్ స్టోర్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరినట్లు తెలుస్తోంది. దీంతో క్వాంట్ ఫండ్ చీఫ్ లియాంగ్ వెన్ఫెంగ్ ఏర్పాటు చేసిన ఈ ఓపెన్ సోర్స్డ్ ప్రొడక్ట్.. ఓపెన్ ఏఐ, మెటా ప్లాట్‌ఫామ్స్ కు పోటీగా నిలుస్తుందన్న అంచనాలు పెరిగాయి. వెరసి అడ్వాన్స్డ్ చిప్స్, అత్యున్నత కంప్యూటింగ్ పవర్‌లపై ఆధారపడిన ప్రస్తుత యూఎస్ ఏఐ బిజినెస్ మోడల్‌ను ఆర్1 దెబ్బతీయవచ్చన్న ఆందోళనలు వ్యాప్తిస్తున్నాయి. ఏఐ విస్తృతిలో ప్రధానంగా ఎన్విడియాకు భారీ అవకాశాలు లభించాయి. అయితే ఆర్1 సెగ ఎన్విడియాకు అధికంగా తగులుతుందనేది నిపుణులు మాట. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
యాపిల్ వాచ్‌తో క్యాన్సరా? కోర్టులో వ్యాజ్యం
ఐఫోన్‌తో సహా యాపిల్ కంపెనీకి చెందిన ఉత్పత్తులపై ప్రపంచవ్యాప్తంగా ఎనలేని క్రేజ్ ఉంటుంది. ఇక అత్యంత ప్రీమియం యాపిల్ వ్యాచ్ల (Apple Watch) సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ వ్యాచ్ల విషయంలోనే యాపిల్ ఇప్పుడు యూఎస్‌లో వ్యాజ్యాన్ని (Lawsuit) ఎదుర్కొంటోంది. ఇది వినియోగదారులను విష రసాయనాలకు గురిచేస్తోందని, క్యాన్సర్‌తో (cancer) సహా తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందని ఆరోపించింది.హానికర రసాయనాలువివిధ కంపెనీలకు చెందిన 22 వాచ్ బ్యాండ్లపై (వాచ్ బెల్ట్) చేసిన అధ్యయనం ఫలితంగా ఈ వ్యాజ్యం దాఖలైంది. ఇందులో 15 వాచ్ బ్యాండ్ల తయారీకి ఉపయోగించిన పదార్థాల్లో హానికర రసాయనాలు ఉన్నాయని కనుగొన్నారు. యాపిల్ కంపెనీకి చెందిన “ఓషన్”, “నైక్ స్పోర్ట్”, సాధారణ “స్పోర్ట్” వాచ్ బ్యాండ్లు అధిక స్థాయిలో పెర్ఫ్లోరోఆల్కైల్, పాలీఫ్లోరోఆల్కైల్ పదార్థాలను (PFAS) కలిగి ఉన్నాయని డైలీ మెయిల్ నివేదిక అధ్యయనాన్ని ఉదహరించింది.ఈ హానికర పదార్థాలను ‘ఎప్పటికీ నిలిచిపోయే రసాయనాలు’గా పేర్కొంటారు. ఎందుకంటే ఈ రసాయనాలు పర్యావరణంలో, మానవ శరీరంలో చాలా ఏళ్లు వాటి దుష్ప్రభావాలను కొనసాగిస్తాయి. వీటితో కలిగే అనారోగ్య దుష్పరిణామాలలో పుట్టుకతో వచ్చే లోపాలు, ప్రోస్టేట్, మూత్రపిండాలు, వృషణాల క్యాన్సర్, అలాగే సంతానోత్పత్తి సమస్యలు ఉన్నాయి.యాపిల్ వాదన ఇదీ..కాగా తమ వాచ్ బ్యాండ్లు 'ఫ్లోరోఎలాస్టోమర్' అనే సింథటిక్ రబ్బరు నుండి తయారవుతాయాయని, ఇది ఫ్లోరిన్ కలిగి ఉంటుంది కానీ హానికరమైన పెర్ఫ్లోరోఆల్కైల్, పాలీఫ్లోరోఆల్కైల్ రసాయనాలు మాత్రం ఉండవని యాపిల్ సంస్థ చాలా కాలంగా వాదిస్తోంది. ఈ ఫ్లోరోఎలాస్టోమర్ సురక్షితమైనదని, ఆరోగ్య ప్రమాణాలకు అనుగుణంగా పూర్తిగా పరీక్షించినట్లు కూడా చెబుతోంది.అయితే యాపిల్ తమ వాచ్లకు వినియోగించే ఫ్లోరోఎలాస్టోమర్ ఆధారిత బ్యాండ్లు ఆరోగ్య ప్రమాదాలకు దోహదపడే ఇతర పదార్థాలతో పాటు పెర్ఫ్లోరోఆల్కైల్, పాలీఫ్లోరోఆల్కైల్ రసాయనాలను కలిగి ఉన్నాయనే వాస్తవాన్ని దాచిపెట్టిందని వ్యాజ్యంలో ఆరోపించారు.హృదయ స్పందన రేటు, నడక, నిద్ర వంటి ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన అంశాలను సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు యూజర్లను అప్రమత్తం చేసే హెల్త్-ట్రాకింగ్ ఉపకరణాలుగా కూడా విస్తృతంగా అమ్ముడుపోతున్న ఈ స్మార్ట్‌వాచ్‌లే క్యాన్సర్ వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయని అధ్యయనాల్లో తేలడం ఆందోళనకరం.