Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement

ఫొటోలు

A to Z

Advertisement

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Katrina Kaif Visits Kukke Subramanya Swamy Temple1
సంతాన ప్రాప్తి కోసం కత్రినా కైఫ్ భక్తి మార్గం!

దేవుడు, పూజలు అనేవి చాలా పవిత్రమైనవి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎప్పుడో ఓసారి భక్తి మార్గంలోకి వెళ్తారు. అలా కొన్నాళ్లపాటు దేవాలయాలు, పూజలు అని చాలా బిజీ అయిపోతారు. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ కూడా అలానే చేస్తోంది.'ఛావా'తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న విక్కీ కౌశల్ ని.. కత్రినా కైఫ్ 2021లో పెళ్లి చేసుకుంది. వయసులో తన కంటే చిన్నవాడైనప్పటికీ కత్రినా అతడితో కొత్త జీవితం ప్రారంభించింది. పెళ్లి తర్వాత ఒకటి రెండు మూవీస్ చేసింది గానీ ప్రస్తుతానికైతే ఈమె చేతిలో కొత్త ప్రాజెక్టులేం లేవు.(ఇదీ చదవండి: సినిమాలో ఫైట్స్ నచ్చకపోతే నన్ను చితక్కొట్టండి: 'దిల్ రుబా' నిర్మాత)కొన్నాళ్ల క్రితం కుంభమేళాలో పాల్గొన్న కత్రినా కైఫ్.. త్రివేణి సంగమంలో పుణ్యస్నానమాచరించింది. భక్తులకు ప్రసాదం కూడా పంచిపెట్టింది. ఇది జరిగిన ఎన్నిరోజులు కాలేదు ఇప్పుడు కర్ణాటకలోని ప్రసిద్ధ కుక్కే సుబ్రమణ్యస్వామి దేవాలయంలో దర్శనమిచ్చింది. కుటుంబంతో కలిసి సర్ప సంస్కార పూజలో పాల్గొంది.అయితే కుక్కే సుబ్రమణ్యస్వామి దేవాలయాన్ని దర్శిస్తే పెళ్లి కాని యువతలు త్వరలో ఓ ఇంటివారవుతారని, సంతాన ప్రాప్తి కూడా కలుగుతుందని చాలామంది నమ్ముతారు. ఇప్పుడు కత్రినా కూడా ఈ దేవాలయాన్ని సందర్శించడం, ప్రత్యేక పూజలు చేయించడం లాంటివి చూస్తుంటే పిల్లల కోసం గుళ్లు, గోపురాలు తిరిగేస్తూ భక్తి మార్గంలోకి వెళ్లిపోయిందా అనిపిస్తుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ 'ఛావా'.. డేట్ ఫిక్సయిందా?)

Rukshar Dhillon Walks Out Dilruba Pre Release Event2
కోపం తగ్గలే.. హీరోయిన్ ని మళ్లీ పక్కనబెట్టేశారు!

సినిమా సెలబ్రిటీలు పెద్దగా గొడవలు పడటానికి ఇష్టపడరు. కానీ కొన్నిసార్లు నోరుజారి లేదంటే పరిస్థితుల వల్ల ఇబ్బందులకు గురవుతుంటారు. గత కొన్నిరోజుల నుంచి హీరోయిన్ రుక్సార్ ధిల్లాన్ ఇలాంటి అనుభవాలే ఎదుర్కొంటోంది. తాజాగా 'దిల్ రుబా' ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ ఈ తరహా సంఘటనే జరిగింది.(ఇదీ చదవండి: సినిమాలో ఫైట్స్ నచ్చకపోతే నన్ను చితక్కొట్టండి: 'దిల్ రుబా' నిర్మాత)తెలుగులో కొన్ని సినిమాలు చేసిన రుక్సార్ లేటెస్ట్ మూవీ 'దిల్ రుబా'. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ చిత్రం.. మార్చిన 14న థియేటర్లలోకి రానుంది. కొన్నిరోజుల క్రితం ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఫొటోగ్రాఫర్లతో ఈమెకు చిన్నపాటి వివాదం జరిగింది. తనకు అసౌకర్యమని చెప్పినా సరే ఫొటోలు తీస్తున్నారని చెప్పింది. దీంతో అప్పటినుంచి మూవీ ఈవెంట్స్ కవర్ చేసే ఫొటోగ్రాఫర్స్ ఈమెని సైడ్ చేస్తున్నారు.తాజాగా హైదరాబాద్ లో మంగళవారం రాత్రి 'దిల్ రుబా' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా.. చివర్లో టీమ్ అంతా ఫొటోలకు పోజులిచ్చారు. కానీ రుక్సార్ ని మాత్రం సైడ్ అయిపోమని ఫొటోగ్రాఫర్స్ చెప్పారు. దీంతో ఆమె పక్కకు తప్పుకొంది. మరి ఈ వివాదం ఎన్నిరోజులు నడుస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)

Dilruba Movie Producer Ravi Speech Pre Release Event3
సినిమాలో ఫైట్స్ నచ్చకపోతే నన్ను చితక్కొట్టండి: టాలీవుడ్ నిర్మాత

ఇప్పుడు ప్రేక్షకులు చాలా తెలివైనోళ్లు. ఏ సినిమాని థియేటర్లలో చూడాలి, ఏ మూవీని ఓటీటీలో చూడాలనేది వాళ్లకు తెలుసు. దీంతో తక్కువ బడ్జెట్ తో చిత్రాల్ని తీసిన దర్శకులు, నిర్మాతలు.. ప్రేక్షకుల్ని ఆకర్షించేందుకు రకరకాల స్టేట్మెంట్స్ ఇస్తూ వైరల్ అవుతున్నారు. మొన్నీమధ్యే 'కోర్ట్' మూవీ కోసం నిర్మాత నాని.. ఇది నచ్చకపోతే త్వరలో రాబోయే తన 'హిట్ 3' చూడొద్దని అన్నాడు. ఇప్పుడైతే కిరణ్ అబ్బవరంతో 'దిల్ రుబా' అనే మూవీ తీసిన నిర్మాత రవి.. సినిమాలో ఫైట్స్ నచ్చకపోతే తనని చితక్కొట్టి బయటకు విసిరేయండని చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)'ఫైట్స్ చూసి థియేటర్ తెరని చింపి అవతల పడేయకపోతే.. మధ్యాహ్నం నేను పెట్టే ప్రెస్ మీట్ లో అక్కడే నన్ను చితక్కొట్టేయండి. తర్వాత నన్ను బయటకు విసిరేయొచ్చు. సినిమాలో ఫైట్స్ చూసి మెస్మరైజ్ కాకపోతే నేను నిర్మాతగా మళ్లీ సినిమా తీయను. ఇది కూడా కాన్ఫిడెంట్ గా చెబుతున్నాను' అని నిర్మాత రవి చెప్పుకొచ్చారు.అయితే ఇలాంటి స్టేట్మెంట్స్ యూట్యూబ్ లో వైరల్ అవ్వడానికి, సినిమాపై కొందరి దృష్టి పడటానికి పనికొస్తాయేమో గానీ మూవీ హిట్ అవ్వాలంటే అంతిమంగా ఉండాల్సింది కంటెంట్ మాత్రమే. మరి ఈ శుక్రవారం రిలీజయ్యే 'దిల్ రుబా' ఏం చేస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: ఆ పాట వల్ల మూడురోజులు నిద్రపోలేదు: జాన్వీ కపూర్)

Manchu Vishnu Hold Kannappa Movie OTT Rights4
'కన్నప్ప'తో మంచు విష్ణు అంత రిస్క్ చేస్తారా?

మంచు విష్ణు 'కన్నప్ప' నుంచి తొలి టీజర్ రిలీజైనప్పుడు ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువొచ్చాయి. కానీ కొన్నాళ్ల ముందు విడుదల చేసిన మరో టీజర్ కి మాత్రం పర్లేదు బాగుందనే టాక్ వచ్చింది. దీనికి తోడు రెండు పాటలు కూడా వినసొంపుగా అనిపించాయి. ఇలా ఓ మాదిరి బజ్ ఏర్పడింది. ఇలా 'కన్నప్ప' గురించి కాస్తోకూస్తో అంచనాలు పెరుగుతున్న టైంలో మంచు విష్ణు రిస్క్ తీసుకున్నాడనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుత ట్రెండ్ లో భారీ బడ్జెట్ సినిమాలు చాలా వాటి ఓటీటీ డీల్స్ ముందే పూర్తవుతున్నాయి. తద్వారా పెట్టిన బడ్జెట్ కొంతమేర రికవర్ చేయొచ్చనేది నిర్మాతల ప్లాన్.(ఇదీ చదవండి: దళపతి విజయ్ పై పోలీసులకు ఫిర్యాదు)కానీ 'కన్నప్ప' విషయంలో మాత్రం మంచు విష్ణు రిస్క్ తీసుకోవాలని ఫిక్సయ్యాడట. మూవీ రిలీజ్ కి ముందు డీల్ కుదుర్చుకుంటే ఓటీటీలు ఇచ్చినంత తీసుకోవాలి. అదే రిలీజ్ తర్వాత మూవీ హిట్ టాక్ తెచ్చుకుంటే మనం డిమాండ్ చేయొచ్చని విష్ణు ప్లాన్ అట. మరి ఇందులో నిజమెంతో?కన్నప్పలో మంచు విష్ణుతో పాటు ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్ తదితరులు కీలక పాత్రలు పోషించారని టాక్. ఏప్రిల్ 25న థియేటర్లలోకి రానుంది. మరి బిగ్ స్క్రీన్ పై ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)

Janhvi Kapoor Not Sleep 3 Days For Song Shoot5
ఆ పాట వల్ల మూడురోజులు నిద్రపోలేదు: జాన్వీ కపూర్

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. హిందీలో పలు సినిమాలు చేసింది గానీ పెద్దగా గుర్తింపు రాలేదు. ఎన్టీఆర్ 'దేవర'తో మంచి పాపులారిటీ తెచ్చుకుంది. ప్రస్తుతం రామ్ చరణ్-బుచ్చిబాబు మూవీలో నటిస్తోంది.తాజాగా తాను నటించిన రూహి సినిమాకు నాలుగేళ్లు పూర్తయిన సందర్బంగా ఈ మూవీలో 'నదియో పార్' పాట చిత్రీకరణ అనుభవాల్ని పంచుకుంది. దీని షూటింగ్ టైంలో తాను చాలా టెన్షన్ పడ్డాడని, మూడు రోజులు నిద్రపోలేదని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: దళపతి విజయ్ పై పోలీసులకు ఫిర్యాదు)'రూహి సినిమా తీసే సమయానికి నటిగా నాకున్న అనుభవం చాలా తక్కువ. దీంతో నదియో పార్ పాట విషయంలో చాలా టెన్షన్ పడ్డాను. భారీ లైట్స్ వెలుగులో కళ్లు తెరిచి చూడలేకపోయేదాన్ని. ఓవైపు 'గుడ్ లక్ జెర్రీ' షూటింగ్ లో పాల్గొంటూనే ఈ పాట రిహార్సల్స్ చేసేదాన్ని. పటియాలాలో రాత్రంతా షూట్ చేసి.. పేకప్ తర్వాత ప్రయాణం చేసొచ్చి పాట షూటింగ్ లో పాల్గొనేదాన్ని.''నిద్రలేకపోయినా 7 గంటల్లో ఆ పాట పూర్తిచేయగలిగాను. మళ్లీ వెంటనే గుడ్ లక్ జెర్రీ షూటింగ్ కి వెళ్లేదాన్ని. అలా మూడురోజుల పాట నిద్రపోలేకపోయాను. కానీ కెమెరా ముందుకొచ్చేసరికి మాత్రం ఎనర్జీ వచ్చేసేది' అని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

Complaint Filed Against Thalapathy Vijay Iftar Event6
దళపతి విజయ్ పై పోలీసులకు ఫిర్యాదు

హీరో దళపతి విజయ్.. ముస్లింలని అవమానించారని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు తమిళనాడు సున్నత్ జమాత్.. చెన్నై పోలీసులకు కంప్లైంట్ చేశారని వార్తలొస్తున్నాయి. రీసెంట్ గా విజయ్ ఇచ్చిన ఇఫ్తార్ విందు దీనికి కారణమని పేర్కొన్నారు.తమిళంలో హీరోగా స్టార్ డమ్ ఉన్న విజయ్.. గతేడాది రాజకీయ అరంగ్రేటం చేశారు. తమిళ వెట్రి కళగం (టీవీకే) పేరుతో పార్టీని స్థాపించారు. వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయంగా తన ముద్ర వేసే ప్రయత్నాల్లో ఉన్నారు.(ఇదీ చదవండి: తమ్ముడి పెళ్లిలో సాయిపల్లవి డ్యాన్స్.. వీడియో వైరల్)అలా గత శుక్రవారం రాయపేట వైఎంసీఏ గ్రౌండులో ముస్లింల కోసం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. రంజాన్ ఉపవాస దీక్ష విరమించే ముందు ప్రార్థనల్లో పాల్గొన్న విజయ్.. హాజరైన వారితో కలిసి విందు కూడా చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కొన్ని వైరల్ అయ్యాయి.అయితే విజయ్ పై తమిళనాడు సున్నత్ జమాత్ ఫిర్యాదు చేసింది. ఉపవాస దీక్షలు, ఇఫ్తార్ విందులతో సంబంధం లేని తాగుబోతులు, రౌడీలు పాల్గొనడం ముస్లింలను అవమానించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఏర్పాట్లు సక్రమంగా చేయలేదని, విజయ్ తెచ్చిన విదేశీ గార్డులు ప్రజలను అగౌరవపరిచారని తమిళనాడు సున్నత్ జమాత్ కోశాధికారి సయ్యద్ కౌస్ మీడియాతో చెప్పారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)

Katrina Kaif Visits Kukke Subramanya Temple In Karnataka For Puja7
ప్రముఖ ఆలయంలో స్టార్ హీరోయిన్ పూజలు

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్‌ ఆధ్యాత్మిక బాట పట్టారు. కర్ణాటకలోని ప్రముఖ కుక్కే శ్రీ సుబ్రమణ్య ఆలయాన్ని సందర్శించారు. ఇటీవలే కుంభమేళాలోనూ కత్రినా కైఫ్ పుణ్యస్నానమాచరించారు. తాజాగా శ్రీ సుబ్రమణ్య ‍ప్రత్యేకమైన పూజులు చేశారు. అనంతరం అక్కడే నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్‌ను పెళ్లాడిన కత్రినా కైఫ్ స్టార్‌ హీరోయిన్‌గా పలు సినిమాల్లో నటించింది. హీరో విక్కీ కౌశల్‌ ప్రేమాయణం నడిపిన ముద్దుగుమ్మ 2021లో అతన్ని పెళ్లాడింది. తెలుగులో వెంకటేశ్ సరసన మల్లీశ్వరి చిత్రంలో మెరిసింది. 2023లో మేరీ క్రిస్మస్, టైగర్-3 చిత్రాలతో అభిమానులను మెప్పించిన ముద్దుగుమ్మ ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్ట్‌లో నటించడం లేదు. ప్రస్తుతం ఆమె భర్త విక్కీ కౌశల్ నటించిన ఛావా మూవీ థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. ఛత్రపతి శివాజీ మహారాజ్‌ కుమారుడు శంభాజీ మహారాజ్‌ జీవితం ఆధారంగా ఛావాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇటీవలే తెలుగులోనూ థియేటర్లలో విడుదల చేశారు. ఇప్పటికీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు సృష్టిస్తోంది.కాగా... కత్రినా కైఫ్ ఇటీవల ఐఫా అవార్డ్స్- 2025 వేడుకలో మెరిసింది. జైపూర్‌లో జరిగిన ఈ వేడుకల్లో పలువురు సినీ అగ్రతారలు పాల్గొని సందడి చేశారు. ఈ అవార్డ్స్‌లో కిరణ్ రావు తెరకెక్కించిన లపతా లేడీస్ అత్యధిక అవార్డులు సొంతం చేసుకుంది. ఈ వేడుకల్లో బాలీవుడ్ సినీతారలు షారూఖ్ ఖాన్, రవీనా టాండన్, ఆమె కుమార్తె రాషా తడాని, అభిషేక్ బెనర్జీ వంటి ప్రముఖులు కూడా పాల్గొన్నారు.

Janhvi Kapoor And Mrunal Thakur Latest News8
గ్లామరస్ జాన్వీ కపూర్.. చిన్నపిల్లలా మృణాల్ క్యూట్ నెస్!

హాయ్ నాన్న జ్ఞాపకాలు షేర్ చేసిన మృణాల్మెరుపుల డ్రస్సుతో కాక రేపుతున్న జాన్వీ కపూర్గవర్నమెంట్ స్కూల్ కి వెళ్లిన నవదీప్-తేజస్వి మదివాడరంజాన్ సీజన్.. ఛార్మినార్ దగ్గర వితికా షేర్ సందడిచీరలో క్యూట్ నెస్ తో కట్టేపడేస్తున్న బిగ్ బాస్ దివిఎర్రచీరలో కలర్ ఫుల్ గా హీరోయిన్ చాందిని చౌదరిబ్లాక్ శారీలో బాలీవుడ్ బ్యూటీ నిమ్రత్ కౌర్ గ్లామర్ View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Chandini Chowdary (@chandini.chowdary) View this post on Instagram A post shared by Poonam kaur (@puunamkhaur) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Vedhika (@vedhika4u) View this post on Instagram A post shared by Sapthami Gowda 🧿 (@sapthami_gowda) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Kavya Thapar (@kavyathapar20) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) View this post on Instagram A post shared by moonchild (@deeptisati) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Sri Satya (@sri_satya_) View this post on Instagram A post shared by Amyra Dastur (@amyradastur) View this post on Instagram A post shared by ISWARYA MENON (@iswarya.menon) View this post on Instagram A post shared by Nimrat Kaur (@nimratofficial) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Rasha Thadani (@rashathadani) View this post on Instagram A post shared by Nehha Pendse (@nehhapendse) View this post on Instagram A post shared by Sakshi Agarwal (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Ragini Dwivedi (@rraginidwivedi)

Priyadarshi Pulikonda Comments About Ram Charan Movie Orange9
ఆరెంజ్‌ సినిమా నా ఫేవరేట్‌.. ఎందుకు ఫ్లాఫ్ అయిందో తెలియదు: ప్రియదర్శి

ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం కోర్ట్. విభిన్నమైన పాత్రలతో అభిమానులను మెప్పించే మరో కొత్త కథలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ మూవీలో రోషన్, శ్రీదేవి కీలక పాత్రలు పోషించనున్నారు. రామ్‌ జగదీశ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నాని వాల్‌ పోస్టర్‌ సినిమా సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 14న థియేటర్లలో సందడి చేయనుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు ప్రియదర్శి. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ప్రియదర్శి.. రామ్ చరణ్ నటించిన ఆరెంజ్‌ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.ప్రియదర్శి మాట్లాడుతూ..' రామ్ చరణ్ నటించిన బెస్ట్ ఫిల్స్మ్‌లో ఆరెంజ్ అంటే ఇష్టం. ఆ సినిమా నాకు ఇన్‌స్పైరేషన్. అప్పుట్లో ఆ సినిమా అంత కలెక్షన్స్ వచ్చి ఉండవు. కానీ మొన్న రిలీజైనప్పుడు సూపర్‌గా ఆడింది. ఆ సినిమా ఎప్పుడొచ్చినా నేను, మా చెల్లి చూసేవాళ్లం. మీరు ఆరెంజ్ సినిమాలో సూపర్‌గా చేశారన్న అని చెప్పేవాన్ని. ఆ సినిమా నాకు ఇప్పుడిచ్చిన చేస్తా. నాకు ఇష్టమైన డైరెక్టర్‌ ఆయన. అప్పుడు ఎందుకు ఆడలేదో ఇప్పటికీ నాకు అర్థం కాదు. రెండోసార్లు థియేటర్లలో చూశా. ఓటీటీలో వచ్చినప్పుడు కూడా చూశా. ముఖ్యంగా రామ్ చరణ్ అన్న యాక్టింగ్ అంటే చాలా ఇష్టం' అని అన్నారు.కాగా.. కోర్ట్ సినిమాను పోక్సో కేసు ఆధారంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్ చూస్తే ఆ విషయం అర్థమవుతోంది. ఈ చిత్రంలో ప్రియదర్శి లాయర్‌గా అభిమానులను అలరించనున్నారు. పోక్సో కేసు అంటే ఏంటి? ఎలాంటి శిక్షలు ఉంటాయి? అనే కోణంలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

Priyadarshi Pulikonda Interesting Comments On Game Changer Movie10
25 రోజులు షూటింగ్‌ చేస్తే.. 2 నిమిషాలు కూడా ఉంచలేదు: ప్రియదర్శి

శంకర్‌ దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ హీరోగా నటించిన చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’(Game Changer). ఈ సంక్రాంతికి థియేటర్స్‌లో రిలీజైన ఈ చిత్రం భారీ అపజయాన్ని మూటగట్టుకుంది. శంకర్‌ దర్శకత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. భారీ బడ్జెట్‌ తీసుకొని.. సినిమాను దారణంగా తీశాడని మండిపడ్డారు. అయితే ఈ సినిమా బడ్జెట్‌ అనుకున్నదానికన్నా ఎక్కువ పెరగడానికి సవాలక్ష కారణాలు ఉన్నాయి. వాటిలో ఆరిస్టుల ఎంపిక కూడా ఒకటని చెప్పొచ్చు. చిన్న చిన్న పాత్రలకోసం మంచి గుర్తింపు ఉన్న నటీనటులను పెట్టాడు. పోనీ ఆ పాత్రలకు అయినా న్యాయం చేశాడా అంటే అదీలేదు. చాలా మంది నటీనటులను ఒకటి రెండు సీన్లకే పరిమితం చేశారు. అలాంటి వారిలో ప్రియదర్శి కూడా ఒకడు. ఆ సినిమాలో హీరో స్నేహితుడిగా నటించాడు. మొదటి పాట ఫస్ట్ షాట్, పెళ్లిలో డిన్నర్ సీన్ దగ్గర కొద్దిసేపు కనిపించే ప్రియదర్శి తర్వాత ఎక్కడా కనిపించడు. ‘బలగం’ సినిమాతో భారీ పాపులారిటీ సంపాదించుకున్న ప్రియదర్శి కేవలం రెండు సీన్లలో వచ్చివెళ్లడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. తాజాగా దీనిపై ప్రియదర్శి స్పందించాడు.ఆయన నటించిన కోర్టు సినిమా మార్చి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘గేమ్‌ ఛేంజర్‌’లో తను అంత చిన్న పాత్ర ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పారు. ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా ‘బలగం’ కథ వినకముందు ఓకే చేశాను. అప్పుడు నేను హీరో ఫ్రెండ్‌ పాత్రలు చేస్తుండేవాడిని. గేమ్‌ ఛేంజర్‌లో కూడా అలాంటి పాత్రే. 25 రోజుల పాటు నేను కాల్షిట్లు ఇచ్చాను. షూటింగ్‌ చేశారు. కానీ ఎడిటింగ్‌లో ఆ సీన్లు మొత్తం తొలగించారు. నాది చిన్న పాత్ర అని తెలిసినా.. ఒప్పుకోవడానికి ఒకే ఒక కారణం శంకర్‌. అలాంటి డైరెక్టర్‌తో పని చేసే అవకాశం మళ్లీ రాకపోవచ్చు. అందుకే చిన్న పాత్ర అయినా చేశాను. 25 రోజుల పాటు షూటింగ్‌ చేస్తే.. 2 నిమిషాలు కూడా తెరపై చూపించలేదు. శంకర్‌గారితో పని చేశాననే తృప్తి మాత్రం నాకు ఉంది. దానికోసమే ఆ సినిమా చేశాను’అని ప్రియదర్శి చెప్పుకొచ్చాడు.

Advertisement
Advertisement