Crime
-
భారత్ గెలుపు వేళ అభిమానులపై దాడి.. నిందితులకు పోలీసుల వింత శిక్ష
భోపాల్: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజయం తర్వాత దేశవ్యాప్తంగా అభిమానాలు సంబరాలు జరుపుకున్నారు. సంబరాల సందర్భంగా మధ్యప్రదేశ్‌లో అల్లర్లు చేలరేగాయి. అభిమానులు ఒకరిపై మరొకరు రాళ్లు విసురుకున్నారు. ఈ నేపథ్యంలో ఘర్షణకు కారణమైన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, వారికి పోలీసులు వింత శిక్ష విధించారు. వారికి గుండు గీయించి, ఊరేగింపు నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల ప్రకారం.. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్ టీమ్‌ని రోహిత్ సేన ఓడించింది. ఈ విజయం పట్ల దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు వేడక చేసుకున్నారు. విజయం అనంతరం రోడ్లపైకి వచ్చి తమ ఆనందాన్ని వ్యక్తి చేశారు. అయితే, మధ్యప్రదేశ్ మోవ్, దేవాస్ నగరాల్లో విజయోత్సవాల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వేడుకల సందర్బంగా పట్టణంలోని జామా మసీదు దగ్గర అభిమానుల మీద దాడి జరిగింది. అక్కడ ఎందుకు ఊరేగింపు చేస్తున్నారంటూ గొడవ మొదలుపెట్టారు. మాటామాటా పెరగడంతో ఊరేగింపు మీద రాళ్ళు రువ్వారు. ఆ దాడిలో పలువురు క్రికెట్ ప్రేమికులు గాయపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కొందరు అసాంఘిక శక్తులు క్రీడాభిమానుల వాహనాలను ధ్వంసం చేసారు. రెండు వాహనాలకు, రెండు దుకాణాలకూ నిప్పు పెట్టారు. దీంతో హింస చెలరేగింది.అయితే, దేవాస్‌లో జరిగిన అల్లర్లలో పాల్గొన్నట్లుగా భావిస్తున్న నిందితులను పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. వారికి గుండు గీయించి, ఊరేగింపు నిర్వహించారు. వేడుకల్లో పాల్గొన్న కొందరు యువకులు అత్యుత్సాహంతో పోలీసులతో దురుసుగా ప్రవర్తించినట్లు తెలిసింది. వీరిని కస్టడీలోకి తీసుకున్నారు. ఇక, దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.VIDEO | Madhya Pradesh: Police shave heads and parade those accused of creating ruckus in Dewas after India's ICC Champions Trophy victory on the night of March 9. (Full video available on PTI Videos - https://t.co/dv5TRAShcC) pic.twitter.com/PqCIvX4p0y— Press Trust of India (@PTI_News) March 11, 2025 -
ఉద్యోగం కోసం భర్తను చంపిన భార్య అరెస్ట్
నల్లగొండ: ప్రభుత్వ ఉద్యోగం కోసం భర్తను హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని ఉస్మాన్‌పురాలో నివాసముంటున్న మహ్మద్ ఖలీల్ నల్లగొండ మండలం చర్లగౌరారం జెడ్పీహెచ్ఎస్లో అటెండర్‌గా పనిచేస్తున్నాడు.అతడికి 2007లో అక్సర్ జహతో వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు. ఖలీల్ చేస్తున్న అటెండర్ ఉద్యోగం తనకు లేదా పిల్లలకు ఇవ్వాలని అతడిని భార్య అక్సర్ జహ వేధింపులకు గురిచేస్తోంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 24న ఖలీల్ అనారోగ్యంతో ఇంట్లో పడిపోయాడని చుట్టుపక్కల వారిని అక్సర్ జహ నమ్మించి, ఆటోలో నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లింది. ఖలీల్‌కు ఎటువంటి వైద్యం చేయించకుండానే ఇంటికి తీసుకొచ్చింది. అదే రోజు రాత్రి ఖలీల్ మృతిచెందాడు.మరుసటిరోజు ఖలీల్ తల్లి అహ్మది బేగం తన కుమారుడి మృతికి కోడలే కారణమంటూ నల్లగొండ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న ఎస్ఐ శంకర్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. పోస్టుమార్టం రిపోర్ట్‌లో మృతుడి తలపై మారణాయుధాలతో కొట్టడంతో పాటు ముక్కు, నోటిని బలవంతంగా మూయడంతో ఊపిరాడక చనిపోయినట్లు తేలింది. దీంతో వన్‌టౌన్ సీఐ రాజశేఖర్‌రెడ్డి అక్సర్ జహను అదుపులోకి తీసుకుని విచారించగా.. చేసిన నేరాన్ని అంగీకరించిందని డీఎస్పీ తెలిపారు. దీంతో ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. -
చిత్తూరు టౌన్లో టెన్షన్.. హైటెన్షన్
చిత్తూరు, సాక్షి: పట్టణంలోని గాంధీ రోడ్డులో బుధవారం ఉదయం కాల్పుల కలకలం రేగింది. ఓ బిల్డింగ్‌లోకి తుపాకులతో ప్రవేశించిన దొంగల ముఠా పోలీసులపైకి కాల్పులు జరిపింది. వాళ్లలో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. భవనంలో నక్కిన మరికొందరిని పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.అర్ధరాత్రి దాటాక ఓ దొంగల ముఠా గాంధీ రోడ్డులో ఉన్న ఓ భవనంలోకి చొరబడింది. అది గమనించిన ఆ బిల్డింగ్ యాజమాని పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులను చూసి దుండగులు రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. అయితే పోలీసులు చాకచక్యంగా ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరికొందరు ఇంకా ఆ భవనంలోనే ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ మణికంఠ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. చుట్టుపక్కల భవనాల్లో ఉన్నవారిని ఖాళీ చేయిస్తున్నారు. బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు ధరించి లోపలికి వెళ్లేందుకు సిద్ధమైనట్లు సమాచారం. నిందితుల దగ్గర తుపాకులు ఉండడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అదుపులో ఉన్నవాళ్ల దగ్గరి నుంచి 3 తుపాకులు, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పక్కనే ఉన్న ఓ బ్యాంకులో దోపిడీ కోసమే ఆ దొంగల ముఠా వచ్చి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. -
నటి రన్యా రావు కేసులో భారీ ట్విస్ట్.. తరుణ్ రాజు అరెస్ట్
బెంగళూరు: కన్నడ సినీ నటి రన్యా రావు బంగారం స్మగ్లింగ్ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో ఆమె సవతి తండ్రి, డీజీపీ స్థాయి అధికారి కె.రామచంద్రరావు ప్రమేయంపై నిగ్గు తేల్చాలని కర్ణాటక ప్రభుత్వం అదనపు చీఫ్ సెక్రటరీ గౌరవ్ గుప్తాను ఆదేశించింది. ఈ మేరకు సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ అయినట్లు సీఎం కార్యాలయం మంగళవారం తెలిపింది.ఇక, అదే సమయంలో, కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో విధి నిర్వహణలో పోలీసు అధికారుల నిర్లక్ష్యం, లోటుపాట్లపైనా విచారణ చేపట్టాలని సీఐడీ విభాగాన్ని ఆదేశించింది. తక్షణమే దర్యాప్తు చేపట్టి, వారం లోగా నివేదిక అందించాలని స్పష్టం చేసింది. విచారణకు సహకరించాల్సిందిగా సంబంధిత పోలీసు విభాగాలను సీఎంవో కోరింది.రామచంద్రరావు ప్రస్తుతం కర్ణాటక స్టేట్ పోలీస్ హౌసింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ నెల 3వ తేదీన దుబాయ్ నుంచి బెంగళూరుకు చేరుకున్న రన్యా రావు వద్ద డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ)అధికారులు రూ.12.56 కోట్ల విలువైన బంగారు కడ్డీలను స్వా«దీనం చేసుకున్నారు. మరునాడు ఆమె ఇంట్లో మరికొంత బంగారం, డబ్బు స్వా«దీనం చేసుకోవడం తెలిసిందే. తరచూ దుబాయి వెళ్లి వస్తూ ఆమె బంగారాన్ని దొంగచాటుగా తీసుకువస్తోందని, విమానాశ్రయంలోని పోలీసు సిబ్బంది సోదాలు జరపకుండా ఆమెను పంపించి వేస్తున్నట్లు తేలింది. ఈ వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టించడంతో రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. కాగా, రన్యా రావు బంగారం స్మగ్లింగ్ వ్యవహారంతో మంత్రులకు సంబంధాలున్నట్లు వస్తున్న వార్తలన్నీ రాజకీయ పుకార్లేనని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కొట్టిపారేశారు. కేంద్ర విభాగాలు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. DRI Busts Smuggling Nexus: Ranya Rao’s associate, Tarun Raju, has been taken into custody as part of the ongoing smuggling investigation.#RanyaRao #TarunRaju #DRIProbe #SmugglingCase #BreakingNews #NewsX pic.twitter.com/7zE4CBQA3i— NewsX World (@NewsX) March 11, 2025హోటల్ యజమాని మనవడు అరెస్ట్ ఇదే కేసులో డీఆర్ఐ అధికారులు మంగళవారం బెంగళూరులోని అట్రియా హోటల్ యజమాని మనవడు తరుణ్ రాజును అరెస్ట్ చేశారు. అతడిని బెంగళూరులోని ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టులో హాజరు పరచగా ఐదు రోజుల కస్టడీకి అనుమతించిందని డీఆర్ఐ తెలిపింది. రన్యా రావు, తరుణ్ రాజులకు సన్నిహిత సంబంధాలున్నాయని, విదేశాల నుంచి బంగారాన్ని దొంగచాటుగా తేవడం వీరు కూడబలుక్కుని చేసిందేనని అంటోంది. రన్యా రావు వేరొకరిని పెళ్లి చేసుకోవడంతో వీరి మధ్య సంబంధాలు బెడిసి కొట్టినా చట్ట విరుద్ధ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారంది. దుబాయి నుంచి బంగారాన్ని తీసుకువచ్చేటప్పుడు రన్యా రావు తరుణ్ రాజుతో ఫోన్లో మాట్లాడినట్లు డీఆర్ఐ తెలిపింది. వీరిద్దరినీ వేర్వేరుగా, కలిపి సైతం విచారించినట్లు వివరించింది. అయితే, విచారణ సమయంలో అధికారులు తనను బెదిరించారని, మానసికంగా వేధించారని సోమవారం కోర్టు విచారణ సమయంలో రన్యా రావు ఆరోపించింది. తనను కొట్ట లేదు కానీ, పరుషంగా దూషించారని తెలిపింది. ఇష్టం లేకున్నా తనతో కొన్ని పత్రాలపై సంతకాలు చేయించారని రోదిస్తూ జడ్జికి ఫిర్యాదు చేసింది. -
లే నాన్నా.. అమ్మా, చెల్లి వచ్చాం
సిరిసిల్ల/సిరిసిల్లక్రైం: ‘లే నాన్న.. అమ్మా.. చెల్లి వచ్చాం.. ఒక్కసారి చూడండి నాన్న.. మీరే మా ధైర్యం.. ఇలా వెళ్లి పోతే ఎలా.. మీకు ఎన్ని గాయాలు అయ్యాయి.. నాన్న పడిపోతుంటే.. మీరంతా ఉండి ఏం చేస్తున్నారు..!! అంటూ.. సిరిసిల్లలో ప్రమాదవ శాత్తు మృతిచెందిన 17వ పోలీస్ బెటాలియన్ కమాండెంట్ తోట గంగారాం(61)(Police Commandant Gangaram) కూతురు డాక్టర్ గౌతమి కన్నీరు కార్చుతూ విలవిలాడిపోయారు. వివరాలు.. రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకట్రావునగర్‌లో రమేశ్ ఇంట్లో సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి అద్దెకు ఉంటారు. చంద్రశేఖర్‌రెడ్డి కూతురు ఇటీవల మరణించారు. అతన్ని ఓదార్చేందుకు వారి ఇంటికి వెళ్లిన తోట గంగారాం తిరిగి వస్తుండగా.. లోపల లిఫ్ట్ లేకుండానే గేటు ఓపెన్ కావడంతో అందులో ప్రమాదశాత్తు పడిపోయాడు. మూడో అంతస్తు నుంచి గంగారాం పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డారు. పోలీస్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది తాళ్ల సాయంతో గంగారాంను బయటకు తీయగా అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. లిఫ్ట్ నిర్వహణ లోపమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు సిద్దిపేటకు చెందిన లిఫ్ట్ నిర్మాణ సంస్థ ప్రతినిధిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.పోలీస్ బెటాలియన్‌లో..సిరిసిల్ల శివారులోని సర్ధాపూర్ 17వ పోలీస్ బెటాలియన్‌లో కమాండెంట్ మృతదేహాన్ని ఉంచి పలువురు నివాళులు అర్పించారు. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా బెటాలియన్‌కు చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. అంతకు ముందు రాత్రి ఎస్పీ గిటే మహేశ్ బాబా సాహేబ్, ఏఎస్పీ చంద్రయ్య గంగారాం మృతదేహాన్ని పరిశీలించి నివాలి అర్పించారు. గతంలో హైదరాబాద్ సచివాలయం ఛీప్ సెక్యూరిటీ ఆఫీస్(సీఎస్‌వో) గా గంగారాం పని చేశారని, ఆయన మృతిపట్ల సిరిసిల్ల ఎమ్మెల్యే, మాజీ మంత్రి కె.తారక రామారావు సంతాపం తెలిపారు. కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్‌కుమార్ పోలీస్ కమాండెంట్ మృతిపై సంతాపం ప్రకటించారు. బెటాలియన్ పోలీస్ సిబ్బంది కన్నీటి నివాళి మధ్య గంగారాం మృతదేహాన్ని స్వగ్రామం నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సిద్దులంకు తరలించారు. -
నటి రన్యారావు కేసులో కీలక మలుపు
సినీ నటి రన్యారావు కీలక నిందితురాలిగా ఉన్న బంగారం అక్రమ రవాణా కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగిస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంతో పాటు వీఐపీ ప్రొటోకాల్ దుర్వినియోగం.. అందులో ఆమె సవతి తండ్రి ప్రమేయం తేల్చేందుకు సీఎం సిద్ధరామయ్య ప్రత్యేక విచారణకు ఆదేశించారు.ఈ కేసులో పోలీసుల ప్రమేయం ఉందన్న ఆరోపణలు.. అలాగే తన విదేశీ పర్యటనల టైంలో వాళ్ల చేతుల్లో వేధింపులకు గురయ్యానన్న రన్యారావు ఆరోపణలపై సీఐడీ దర్యాప్తు జరపనుంది. వీలైనంత త్వరగా నిజనిర్ధారణలతో నివేదిక సమర్పించాలని దర్యాప్తు ఏజెన్సీని ప్రభుత్వం ఆదేశించింది.ఇక మరోవైపు.. నటి రన్యారావు వీఐపీ ప్రోటోకాల్‌ను దుర్వినియోగం చేస్తూ బంగారం అక్రమ రవాణా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కెంపగౌడ ఎయిర్‌పోర్టులో ప్రోటోకాల్ దుర్వినియోగం అంశంపైనా ప్రభుత్వం విడిగా మరో దర్యాప్తునకు ఆదేశించింది. ఈ బాధ్యతలను సీనియర్ ఐఏఎస్ అధికారి, అదనపు సీఎస్ గౌరవ్ గుప్తా అప్పగించింది. అలాగే.. ఈ అంశంలో ఆమె సవతి తండ్రి, డీజీపీ కె. రామచంద్రరావు పాత్రపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, అవసరమైతే ఆయన్ని విచారించాలని కోరింది. ఈ వ్యవహారంలో రామచంద్ర పాత్ర ఉందా? లేదా? అనేది తేల్చాలని గుప్తాకు వారం గడువు ఇచ్చింది ప్రభుత్వం. మార్చి 3వ తేదీన 14.8 కేజీల అక్రమ బంగారాన్ని దుబాయ్ నుంచి తీసుకొస్తూ.. బెంగళూరు ఎయిర్‌పోర్టులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్సీ(DRI) అధికారులకు చిక్కిన కన్నడ నటి రన్యారావు చిక్కారు. ఈ కేసు దర్యాప్తులో లోతుకు వెళ్లే కొద్దీ.. కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. -
కర్ణాటక బస్సు బీభత్సం.. నలుగురి మృతి
సాక్షి, కర్నూలు జిల్లా: కర్ణాటక గంగావతి డిపోకు చెందిన కేఎస్ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. గంగావతి నుంచి రాయచూర్‌కు వెళ్తున్న బస్సు ఆదోని మండలం పాండవగళ్లు గ్రామ సమీపంలో ముందు వెళ్తున్న రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు అక్కడికక్కడ డే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.మృతి చెందిన వారిలో ఆదోని మండలం కుప్పగళ్లు గ్రామానికి చెందిన భార్యా భర్తలు, కర్ణాటకలోని మాన్వికి చెందిన అక్కా తమ్ముళ్లు ఉన్నారు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
ప్రియుడిని పెళ్లి చేసుకునేందుకు భర్తను కడతేర్చింది
అన్నానగర్: తన మరో ప్రియుడిని పెళ్లి చేసుకునేందుకు ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తనే కడతేర్చిందో మహిళ. వివరాలు.. కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన జనార్థన (22). అదే ప్రాంతానికి చెందిన ఎలన్ మేరీ(21) కాలేజీలో చదువుతున్నప్పుడే ప్రేమించుకున్నారు. పెద్దలను కాదని వీరిద్దరూ నాగై జిల్లాలోని వేలంగన్నికి వచ్చి మాతా గుడిలో పెళ్లి చేసుకుని లాడ్జిలో ఉంటున్నారు. అయితే ఆదివారం జనార్థన వేలంగన్ని రైల్వే స్టేషన్ సమీపంలో శవమై వెలుగులోకి రావడం కలకలం రేపింది. అయితే జనార్థన, మేరీతో కలిసి ఉంటున్న ఇద్దరు వ్యక్తులు రైలులో తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని పట్టుకుని విచారణ చేశారు. వారు బెంగళూరు శివమొగ్గ ప్రాంతానికి చెందిన సుబ్రమణ్య కుమారుడు జీవన్ (19), 15 ఏళ్ల బాలుడు అని తేలింది. జనార్థనను పక్కా ప్లాన్ చేసి కడతేర్చారని తేలింది. ఎలన్‌మేరీ ఓ వైపు జనార్థన ప్రేమిస్తూనే, మరోవైపు జీవన్‌తో కూడా ప్రేమాయణం వెలగబెడుతున్నట్టు వెల్లడైంది. తమకు అడ్డుగా ఉన్న జనార్థనను కడతేర్చాలని ఎలన్ మేరి, జీవన్ వ్యూహం పన్నారు. దీని ప్రకారం వేలంగన్నిలో జనార్థనను వివాహం చేసుకున్న ఎలన్ మేరి, తన ప్రియుడు జీవన్‌తో కలిసి అతడిని హత్య చేసింది. వాస్తవానికి ఆమెకు రెండేళ్ల క్రితమే ధర్మపురిలో వివాహమైంది. ఆ తర్వాత జనార్థనను ప్రేమించి రెండో పెళ్లి చేసుకుని, ఆ తర్వాత జీవన్‌ను పెళ్లిచేసుకునేందుకు హత్యకు స్కెచ్ వేసింది. ఈ హత్యకు సంబంధించి ఎలన్ మేరి, జీవన్‌తోపాటు 15 ఏళ్ల బాలుడిని పోలీసులు అరెస్టు చేశారు. -
రోజా కేసులో రోజుకో ట్విస్ట్
సాక్షి, విశాఖపట్నం: ఎన్ఆర్ఐ మహిళ రోజా అనుమానాస్పద మృతి క్రైం థ్రిల్లర్‌ను తలపిస్తోంది. కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. నగర పోలీసు కమిషనర్ ఆదేశాలతో ఎట్టకేలకు మృతురాలి స్నేహితుడు, నిందితుడిగా భావిస్తున్న డాక్టర్ శ్రీధర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎన్ఆర్ఐ మహిళ రోజాకు.. డాక్టర్ శ్రీధర్‌కు మధ్య ఉన్న సంబంధం ఏంటి?.. రోజా హోటల్‌కు వచ్చిన రెండు గంటల్లో అనుమానాస్పదంగా మృతి చెందడం వెనుక ఏం జరిగిందో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ నెల 6వ తేదీ మధ్యాహ్నం 1.40 గంటలకు శ్రీధర్‌ను కలిసేందుకు మేఘాలయ హోటల్లోని రూం నంబర్ 229కి రోజా వెళ్లింది. 3.35 గంటల తరువాత ఆమె బాత్రూమ్లో అపస్మారక స్థితిలో ఉందని శ్రీధర్ హోటల్ సిబ్బందికి చెప్పాడు. హత్యా? ఆత్మహత్యా? రెండు గంటల వ్యవధిలో రోజా అనుమానాస్పదంగా మృతి చెందడంపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. రెండు గంటలు ఇద్దరూ ఒకే గదిలో ఉన్నారు. ఈ సమయంలో రోజా–శ్రీధర్‌కు మధ్య గొడవ జరిగిందా?.. ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాడా? అందుకే ఆమె ఆత్మహత్య చేసుకున్నా ఆపకుండా చూస్తూ ఉండిపోయాడా?.. మృతి చెందిందని నిర్ధారించుకున్న తరువాతే హోటల్ సిబ్బందికి సమాచారం ఇచ్చాడని ప్రచారం జరుగుతోంది. నిజానికి రోజాను ఆత్మహత్య చేసుకునేలా అమెరికాలో ఉన్నప్పటి నుంచే శ్రీధర్ ప్రేరేపిస్తున్నాడని పోలీసులు విచారణలో తెలినట్లు తెలిసింది. ఒకవేళ రోజాది ఆత్మహత్య కాకపోతే అదే రూమ్‌లో ఉన్న శ్రీధర్ ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రోజా పోస్టుమార్టం నివేదిక వస్తే తప్ప నిజనిజాలు బయట పడే అవకాశం లేదు. ఎఫ్ఐఆర్లో శ్రీధర్ పేరు చేర్చలేదెందుకు? ఈ కేసులో మొదటి నుంచి పోలీసులు నిర్లక్ష్యం కనిపిస్తూనే ఉంది. డాక్టర్ శ్రీధర్‌ను కేసు నుంచి తప్పించేయత్నం జరుగుతోందని విస్తృతంగా ప్రచారం జరిగింది. కేసు తేలిపోయేవిధంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఒకే గదిలో రోజా–శ్రీధర్ ఉన్న సమయంలో.. రోజా అనుమానాస్పదంగా మృతి చెందితే ఎఫ్ఐఆర్లో శ్రీధర్ పేరు చేర్చకపోవడం చర్చనీయాంశమైంది. కేసును నీరుగార్చేందుకు పోలీసులు ఎందుకు ప్రయత్నించారు? డాక్టర్ శ్రీధర్ వెనుక ఎవరున్నారు? పోలీసులపై ఎవరి ఒత్తిడైనా ఉందా? అన్న ప్రశ్నలకు వారే సమాధానం చెప్పాలి. ఈ కేసు విషయంలో విమర్శలు రావడంతో ఎట్టకేలకు మూడో పట్టణ పోలీసులు శ్రీధర్‌ను అరెస్టు చేసినట్లు ఆదివారం ఆర్ధరాత్రి ప్రకటించారు. అన్ని వేళ్లూ పోలీసులవైపే.. ఎన్ఆర్ఐ మహిళా అనుమానాస్పద మృతిపై పోలీసులు చర్యలు విమర్శలకు తావిచ్చింది. సంఘటన జరిగిన వెంటనే శ్రీధర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తే నిజనిజాలు బయటపడేవి. అయితే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు నుంచి విచారణ వరకు అన్ని వేళ్లు వారివైపే చూపించేలా వ్యవహరించారు. 6వ తేదీన రోజా మృతి చెందినప్పటికీ 8వ తేదీ వరకు అటువంటి ఘటన జరగలేదు అన్నట్లు వ్యవహరించారు. పలుకుబడి ఉన్న కుటుంబాలకు చెందిన వ్యక్తులు తప్పు చేస్తే వెనకేసుకువచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు. పేద, మధ్యతరగతికి చెందిన ఎవరైనా తప్పు చేస్తే మీడియా సమావేశాలు పెట్టి మరీ ప్రచారం చేసుకునే పోలీసులు ఈ కేసు విషయంలో పాటిస్తున్న గోప్యత అనుమానాలకు తావిస్తోంది. -
హైదరాబాద్: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు...
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక ఇబ్బందులకు నలుగురు సభ్యుల కుటుంబం బలైన విషాద సంఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న భార్యాభర్తలు, అంతకుముందు తమ ఇద్దరు పిల్లలకు విషం ఇచి్చనట్లుగా అనుమానిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం మోకురాలకు చెందిన చంద్రశేఖర్‌రెడ్డి (40), కవితారెడ్డి (35) దంపతులు హబ్సిగూడ మహేశ్వర్‌నగర్‌లోని సెయింట్ జోసెఫ్ స్కూల్ సమీపంలోని ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వారికి తొమ్మిదో తరగతి చదువుతున్న శ్రీతరెడ్డి (13), ఐదవ తరగతి చదువుతున్న విశ్వంత్‌రెడ్డి (10) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. చంద్రశేఖర్‌రెడ్డి గతంలో నారాయణ కళాశాలలో లెక్చరర్‌గా పని చేశాడు.గత ఆరు నెలల నుంచి ఉద్యోగం లేకపోవడంతో కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సోమవారం రాత్రి సమీపంలో ఉండే బంధువులు ఫోన్ చేస్తే దంపతులు ఎత్తలేదు. దీంతో అనుమానం వచ్చి ఇంటికి రాగా చంద్రశేఖర్‌రెడ్డి, కవితారెడ్డి చెరొక గదిలో సీలింగ్ ఫ్యాన్లకు చున్నీతో ఉరి వేసుకుని కని్పంచారు. ఓ గదిలో మంచంపై పిల్లలిద్దరూ చనిపోయి కనిపించారు.దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఓయూ పోలీసులు, నలుగురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శ్రీత అబిడ్స్‌లోని ఫిట్జీ స్కూల్లో, విశ్వంత్ హబ్సిగూడలోని జాన్సన్ గ్రామర్ స్కూల్లో చదువుతున్నట్లు తెలిసింది. -
అంగన్వాడీ టీచర్ ఆత్మహత్య
నకరికల్లు: టీడీపీ, జనసేన నాయకుల బెదిరింపులు భరించలేక ఒక అంగన్వాడీ టీచర్ ఆత్మహత్య చేసుకున్నారు. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం పాపిశెట్టిపాలేనికి చెందిన షేక్ ఫాతిమాబేగం (35) అదే గ్రామంలో 11 ఏళ్లుగా అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆమెను అంగన్వాడీ టీచర్ పోస్టు నుంచి తొలగించి, తమవారిని నియమించుకుంటామని గ్రామానికి చెందిన టీడీపీ, జనసేన నాయకులు బెదిరిస్తున్నారని ఫాతిమాబేగం కుటుంబ సభ్యులు తెలిపారు. దాదాపు 9 నెలలుగా ఆమెను బెదిరిస్తూనే ఉండటంతో తీవ్ర ఒత్తిడికి గురవుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఫాతిమాబేగాన్ని అంగన్వాడీ టీచర్ ఉద్యోగం నుంచి తొలగిస్తారని టీడీపీ, జనసేన నాయకులు ప్రచారం చేస్తుండటంతో తీవ్ర ఆందోళనకు గురైన ఆమె ఆదివారం తమ ఇంట్లోనే గడ్డిమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. వెంటనే బంధువులు నరసరావుపేటలోని ఒక ప్రైవేటు వైద్యశాలకు తీసుకువెళ్లారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందారు. ఫాతిమాబేగం భర్త సైదావలి గుంటూరులో మెకానిక్‌గా పని చేస్తున్నారు. వారికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. తన భార్య మృతిపై సైదావలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
బీఈడీ ప్రశ్నాపత్రం లీకేజీలో 10 మంది అరెస్టు
నగరంపాలెం: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎన్‌యూ) బీఈడీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో పది మందిని అరెస్టుచేసినట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. లీకేజీకి వినియోగించిన 13 మొబైల్ఫోన్లను సీజ్ చేశామని చెప్పారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఉత్తర డీఎస్పీ మురళీకృష్ణ, పెదకాకాని సీఐ టీపీ నారాయణస్వామితో కలిసి ఆయన కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. వినుకొండ కాలేజీలో లీక్.. ఏఎన్‌యూ పరిధిలో గత శుక్రవారం (ఈనెల 7న) మ.2 గంటలకు బీఈడీ పరీక్ష ప్రారంభం కావల్సి ఉండగా మ.1.22కు ప్రశ్నపత్రం లీకైంది. దీన్ని ఏఎన్‌యూ ఉప కులపతి (వీసీ), పరీక్ష కేంద్రం సమన్వయకర్త గుర్తించారు. లీకేజీ వ్యవహారంపై ఏఎన్‌యూ పీజీ, వృత్తి విద్య కోర్సుల పరీక్ష కేంద్రం సమన్వయకర్త మన్నవ సుబ్బారావు పెదకాకాని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం సాయంతో పల్నాడు జిల్లా వినుకొండ టౌన్‌లోని శ్రీ వివేకానంద కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ సంస్థలోని కంప్యూటర్ గది నుంచి లీకైనట్లు తేల్చారు. దీంతో కళాశాల కరస్పాండెంట్ సయ్యద్ రఫిక్ అహ్మద్, ప్రిన్సిపాల్ దుపాటి సురేష్ కుమార్, కంప్యూటర్ ఆపరేటర్ ధార స్వర్ణరాజ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు.కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ నిర్వాకం ఇక పరీక్ష ప్రారంభమయ్యే నలభై నిమిషాల ముందు ఆయా పరీక్ష కేంద్రాలకు పాస్వర్డ్ పంపిస్తారు. తద్వారా పాస్వర్డ్ కొట్టి, ప్రశ్నాపత్రాన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంది. కానీ, ఈ పాస్‌వర్డ్‌ను కరస్పాండెంట్, ప్రిన్సిపాల్, కంప్యూటర్ ఆపరేటర్లు దుర్వినియోగం చేసి, వాట్సాప్ గ్రూప్ ద్వారా ప్రశ్నాపత్రాన్ని లీక్ చేశారు. తద్వారా ఒడిశాకు చెందిన సంతోష్‌కుమార్ సాహు, బిష్ణుప్రసాద్ పాత్రో, సుకాంత్, విద్యార్థులు పురుషోత్తం ప్రధాన్, ధీరేన్కుమార్ సాహులకు చేరింది. వీరు ప్రియబత్రో గోడయ్, మిలాన్ తృష్టిలకు పంపించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఈ పదిమందినీ అరెస్టుచేసి వీరి నుంచి 13 మొబైల్ఫోన్లను స్వా«దీనం చేసుకుని సీజ్ చేశామని ఎస్పీ తెలిపారు. ఒడిశా నిందితులు తమ రాష్ట్రంలో విద్యార్థులతో బీఈడీ పరీక్షలు రాయించి వారు ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణతయ్యేందుకు ఈ లీకేజీకి శ్రీకారం చుట్టారు. అలాగే, శ్రీ వివేకానంద కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ సంస్థ నిర్వాహకులు కూడా ఇదే పద్ధతి అవలంబించినట్లు దర్యాప్తులో తేలింది. ఇక కేసుని త్వరితగతిన ఛేదించిన ఉత్తర డీఎస్పీ సీహెచ్ మురళీకృష్ణ, పెదకాకాని సీఐ టీపీ నారాయణస్వామిలను ఎస్పీ అభినందించారు. -
ప్రణయ్ హంతకుడికి ఉరి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దళిత యువకుడు పెరుమాళ్ల ప్రణయ్ పరువు హత్య కేసులో తుది తీర్పు వెలువడింది. ఐపీసీ సెక్షన్ 302, 129 (బీ), 109 ప్రివెన్షన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ అట్రా సిటీ యాక్ట్ కింద నిందితులకు శిక్షలు ఖరా రు చేస్తూ.. నల్లగొండ రెండో అదనపు జిల్లా జడ్జి, ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి రోజా రమణి సోమవారం తీర్పు ఇచ్చారు.ప్రధాన నిందితుడు (ఏ1) తిరునగరు మారుతీరావు నాలుగేళ్ల కింద ఆత్మహత్య చేసుకోగా.. ఏ2గా ఉన్న సుభాష్ కుమార్‌శర్మకు మరణశిక్ష విధించారు. ఏ3గా ఉన్న మహ్మద్ అజ్గర్‌అలీ, ఏ4 మహ్మద్ అబ్దుల్ బారీ, ఏ5 అబ్దుల్ కరీం, ఏ6 తిరునగరు శ్రవణ్‌కుమార్, ఏ7 సముద్రాల శివ, ఏ8 ఎంఏ నిజాంలకు జీవిత ఖైదు విధించారు. 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్ హత్యకు గురవగా.. సుమారు ఆరున్నరేళ్ల విచారణ తర్వాత నిందితులకు శిక్ష పడింది.కూతురి ప్రేమ వివాహాన్ని తట్టుకోలేక.. మిర్యాలగూడ పట్టణానికి చెందిన వ్యాపారి, వైశ్య సామాజిక వర్గానికి చెందిన తిరునగరు మారుతీరావు, గిరిజ దంపతులకు అమృత వర్షిణి ఒక్కరే కూతురు. పట్టణంలోని ముత్తిరెడ్డికుంటలోని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పెరుమాళ్ల బాలస్వామి, ప్రేమలత దంపతుల కుమారుడు పెరుమాళ్ల ప్రణయ్. ఇద్దరూ మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారు.ఈ క్రమంలో 2018 జనవరి 30న హైదరాబాద్‌లోని ఆర్య సమాజ్‌లో వివాహం చేసు కున్నారు. అక్కడి నుంచి నేరుగా నల్లగొండ ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. తన తండ్రి మారుతీరావు నుంచి రక్షణకల్పించాలని అమృత వర్షిణి పోలీసులను కోరారు. దీని తో పోలీసులు ప్రణయ్, అమృత ఇద్దరి తల్లి దండ్రులను మిర్యాలగూడ డీఎíస్పీ కార్యాలయానికి పిలిపించి కౌన్సెలింగ్ చేశారు. అనంతరం అమృత ప్రణయ్‌తో కలసి ముత్తిరెడ్డికుంటలోని ఇంటికి వెళ్లారు.తర్వాత ప్రణయ్ కుటుంబం ఆధ్వర్యంలో వారు వివాహ రిసెప్షన్ చేసుకున్నారు. సుపారీ గ్యాంగ్‌తో హత్య..: కూతురు ప్రేమ వివాహం, పట్టణంలోనే రిసెప్షన్ చేసుకోవడాన్ని చూసి మారుతీరావు తట్టుకోలేకపోయారు. ప్రణయ్‌ను చంపాలని నిర్ణయించుకున్నారు. సుపారీ గ్యాంగ్‌కు రూ.కోటి ఇచ్చి ప్రణయ్ హత్యకు ప్లాన్ చేశారు. అప్పటికే అమృత, ప్రణయ్ వివాహమై 8 నెలలు గడిచింది.అమృత 5 నెలల గర్భిణి కూడా. 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్ తల్లితో కలసి అమృతను మెడికల్ చెకప్ కోసం పట్టణంలోని జ్యోతి ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రి నుంచి బయటికి వస్తుండగా.. అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్న బిహారీ సుపారీ కిల్లర్ సుభాష్ కుమార్ శర్మ కత్తితో ప్రణయ్‌పై దాడి చేశాడు. అజ్గర్ అలీ, నిజాం అతడికి సాయం చేశారు. ప్రణయ్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు వదిలాడు. 1,200 పేజీలతో చార్జిషిట్.. ప్రణయ్ పరువు హత్య అప్పట్లో జాతీయ స్థాయిలో కలకలం రేపింది. ఆ సమయంలో నల్లగొండ ఎస్పీగా ఉన్న ఏవీ రంగనాథ్ ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆయన ఆదేశాల మేరకు.. ఆస్పత్రిలోని సీసీ పుటేజీ ఆధారంగా మిర్యాలగూడ పోలీ సులు కేసు దర్యాప్తు చేపట్టారు. 4 రోజుల్లోనే నిందితులను అరెస్టు చేశారు. 9 నెలల పాటు దర్యాప్తు చేసి, 78 మంది సాక్షులను ప్రశ్నించి 2019 జూన్ 19న 1,200 పేజీలతో చార్జిషిట్‌ను దాఖలు చేశారు. 8 మందిని నిందితులుగా చేర్చారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడైన మారుతీరావు 2020 మార్చి 8న హైదరాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లోని గదిలో ఆత్మహత్య చేసుకున్నారు. సుదీర్ఘ విచారణ అనంతరం.. ఈ కేసులో విచారణ సుదీర్ఘంగా జరిగింది. తాజాగా సోమవారం కోర్టు తుది తీర్పు వెల్లడించింది. ఏ2 సుభా‹Ùకుమార్ శర్మకు న్యాయమూర్తి ఐపీసీ సెక్షన్ 302, ప్రివెన్షన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్, సెక్షన్ 27 (3), ఆయుధ నిరోధక చట్టం కింద మరణశిక్ష విధించారు. హత్యలో పాలుపంచుకున్న ఏ3 అజ్గర్ అలీ, ఏ4 మహ్మద్ అబ్దుల్ బారీ, ఏ5 మహ్మద్ అబ్దుల్ కరీం, ఏ6 మారుతీరావు తమ్ముడు తిరునగరు శ్రవణ్‌కుమార్, ఏ7 మారుతీరావు కారు డ్రైవర్ సముద్రాల శివ, ఏ8 ఆటోడ్రైవర్ ఎంఏ నిజాంలకు ఐపీసీ 302 రెడ్‌విత్ 120 (బీ), 109, ప్రివెన్షన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద జీవిత ఖైదు విధించారు. ఇక రూ.10 వేల నుంచి రూ.15 వేలు జరిమానాలు చెల్లించాలని, లేదంటే 4 నెలలు జైలుశిక్ష అనుభవించాలని జడ్జి తీర్పులో వెల్లడించారు.కోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్తత: ప్రణయ్ హత్య కేసులో సోమవారం తుది తీర్పు వెలువడు తుందని తెలిసిన ప్రజా సంఘాల నాయ కులు, ప్రజలు పెద్ద సంఖ్యలో కోర్టు వద్దకు వచ్చారు. దీనితో పోలీసులు భారీగా బందో బస్తు ఏర్పాటు చేశారు. న్యాయవాదులు, సిబ్బంది, నిందితుల కుటుంబ సభ్యులను మాత్రమే కోర్టు లోపలికి అనుమతించారు. న్యాయమూర్తి తీర్పు వెలువరించాక.. నింది తుల కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంత మయ్యారు. తన తండ్రి ఎలాంటి నేరం చేయలేదని, అయినా శిక్ష పడిందంటూ.. తిరునగరు శ్రవణ్‌కుమార్ కూతురు శ్రుతి బోరున విలపించింది. కాగా.. కోర్టు తీర్పు పరువు హత్యలకు పాల్పడే వారికి చెంప పెట్టు వంటిదని ప్రణయ్ హత్య కేసును వాదించిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దర్శనం నర్సింహ పేర్కొన్నారు.అమృతకు బాసటగా కౌసల్య మిర్యాలగూడ అర్బన్: ప్రణయ్ హత్య ఘటన జాతీయ స్థాయిలో సంచలనం రేప డంతో.. ఇదే తరహాలో బాధితురాలిగా మారిన తమిళనాడు మహిళ కౌసల్య మిర్యాలగూడకు వచ్చి అమృతకు బాసట గా నిలిచారు. కౌసల్య గతంలో శంకర్ అనే యువకుడిని ప్రేమించి కులాంతర వివా హం చేసుకుంది. ఇది తట్టుకోలేని కౌసల్య తండ్రి.. శంకర్‌ను హత్య చేయించాడు. తన భర్త మృతికి కారణమైన వారిని శిక్షించాలంటూ పోరాటం చేసిన కౌసల్య నిందితులకు శిక్షపడేలా చేసింది.ప్రణయ్ ఘటన విషయం తెలిసి మిర్యాలగూడకు వచ్చింది. తనకు జరిగిన అన్యాయం, ఆ కేసులో నిందితులకు పడిన శిక్షలను అమృతకు వివరించి ధైర్యం చెప్పింది. తమిళ నాడులోని కేసుకు సంబంధించిన ఫైల్ కాపీని సైతం ఆమె ఇక్కడి పోలీసులకు అందజేసినట్టు సమాచారం.కేరళ ఎంపీ డిమాండ్‌తో..: కేరళకు చెందిన దళిత సోషల్ ముక్తి మంచ్ జాతీయ నాయకుడు, ఎంపీ సోం ప్రసాద్ మిర్యాల గూడకు వచ్చి.. అమృతను పరామర్శించారు. దేశంలో పరువు హత్యలను నివారించడానికి ప్రణయ్ చట్టం తేవాలని ఆయన పార్లమెంట్ సమావేశాల్లో డిమాండ్ చేశారు. దానితో ఈ అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. -
ఆర్థిక ఇబ్బందులకు కుటుంబం బలి!
లాలాపేట (హైదరాబాద్): ఆర్థిక ఇబ్బందులకు నలుగురు సభ్యుల కుటుంబం బలైన విషాద సంఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న భార్యాభర్తలు, అంతకుముందు తమ ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చినట్లుగా అనుమానిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం మోకురాలకు చెందిన చంద్రశేఖర్‌రెడ్డి (40), కవితారెడ్డి (35) దంపతులు హబ్సిగూడ మహేశ్వర్‌నగర్‌లోని సెయింట్ జోసెఫ్ స్కూల్ సమీపంలోని ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వారికి తొమ్మిదో తరగతి చదువుతున్న శ్రీతరెడ్డి (13), ఐదవ తరగతి చదువుతున్న విశ్వంత్‌రెడ్డి (10) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. చంద్రశేఖర్‌రెడ్డి గతంలో నారాయణ కళాశాలలో లెక్చరర్‌గా పని చేశాడు. గత ఆరు నెలల నుంచి ఉద్యోగం లేకపోవడంతో కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది.సోమవారం రాత్రి సమీపంలో ఉండే బంధువులు ఫోన్ చేస్తే దంపతులు ఎత్తలేదు. దీంతో అనుమానం వచ్చి ఇంటికి రాగా చంద్రశేఖర్‌రెడ్డి, కవితారెడ్డి చెరొక గదిలో సీలింగ్ ఫ్యాన్లకు చున్నీతో ఉరి వేసుకుని కన్పించారు. ఓ గదిలో మంచంపై పిల్లలిద్దరూ చనిపోయి కన్పించారు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఘటనా స్థలానికి చేరుకున్న ఓయూ పోలీసులు, నలుగురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శ్రీత అబిడ్స్‌లోని ఫిట్జీ స్కూల్లో, విశ్వంత్ హబ్సిగూడలోని జాన్సన్ గ్రామర్ స్కూల్లో చదువుతున్నట్లు తెలిసింది. -
మాటలతో హింసిస్తున్నారు.. బెదిరిస్తున్నారు: కోర్టులో రన్యారావు
బెంగళూరు: గోల్డ్ స్మగ్మింగ్ కేసులో భాగంగా ప్రస్తుతం డీఆర్ఐ కస్టడీలో ఉన్న కన్నడ నటి రన్యారావును ఈరోజు(సోమవారం) బెంగళూరు స్పెషల్ కోర్టులో హాజరుపరిచారు. తన మొహంపై గాయాలు కనిపిస్తున్న క్రమంలో ఆమెను కోర్టుకు తీసుకెళ్లారు డీఆర్ఐ అధికారులు. అయితే కస్టడీలో ఏమైనా భౌతిక దాడులు జరిగాయా అని కోర్టు ప్రశ్నించగా.. తనను శారీరకంగా ఏమీ ఇబ్బందులు గురి చేయడం లేదని, కానీ మాటలతో మానసికంగా హింసిస్తున్నారని కోర్టులో కన్నీటి పర్యంతమైంది. అయితే మానసికంగా మాటలతో హింసిస్తున్నారని ఆమె చెబుతున్న వాదనను డీఆర్ఐ ఖండించింది. అందులో ఎటువంటి వాస్తవం లేదని, తమ నిబంధనల మేరjo దర్యాప్తు చేస్తున్నామన్నారు. తమ దర్యాప్తును మొత్తం రికార్డు చేస్తున్నామని డీఆర్ఐ పేర్కొంది.వైరల్‌గా మారిన ఫోటోరన్యారావుకు చెందిన ఓ ఫోటో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.. ఆమె కంటి కింద గాయాలు, ఉబికిన మొహంతో ఆమె ఫోటోలో ఉంది. ఆమెను కస్టడీలో తీసుకుని విచారణ పేరుతో చిత్ర హింసలు పెట్టారా? అనే అనుమానం కలుగుతోంది. దీనిపై కర్ణాకట మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.ప్రధానంగా వైరల్ గా మారిన ఫోటోను ఉటంకిస్తూ మహిళా కమిషన్ చైర్మన్ నాగలక్ష్మీ చౌదరి అనుమానం వ్యక్తం చేశారు. ఆమెపై అధికారులు దాడికి పాల్పడ్డారా? అనే ప్రశ్న లేవనెత్తారు. అయితే దీనిపై తాము నేరుగా దర్యాప్తు చేసే అవకాశం లేదన్నారు. రన్యారావు తముకు ఏమైనా ఫిర్యాదు చేస్తే ఆమెకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు నాగలక్ష్మి,‘మాకు ఆమె లేఖ రూపంలో ఫిర్యాదు చేస్తే మేము సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆమె నుంచి ఫిర్యాదు అందిన పక్షంలో తమ పరిధిలో ఉన్న ఆయా విభాగాలను అప్రమత్తం చేస్తాం. సరైన రీతిలో దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఆమె ఏమైనా దాడికి గురయ్యిందా అనేది ఆమె ఫిర్యాదు రూపంలో ఇస్తేనే మేము ఏమైనా చేయగలం. ఒకవేళ ఆమె మమ్మల్ని సంప్రదించకపోతే దీనిపై కనీసం కామెంట్ కూడా చేయలేం’ అని మహిళా కమిషన్ చైర్ పర్సన్ నాగలక్ష్మి పేర్కొన్నారు. ఈ నేపధ్యంలోనే ఆమెను స్పెషల్ కోర్టులో హాజరుపరిచినట్లు తెలుస్తోంది. గత సోమవారం 12 కేజీలకు పైగా బంగారం కడ్డీలను తన బెల్ట్ లో పెట్టుకుని దుబాయ్ నుంచి అక్రమంగా తరలిస్తూ రన్యారావు పట్టుబడింది. బెంగూళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆమె అధికారులకు చిక్కింది. ప్రస్తుతం ఆమె మూడు రోజుల డీఆర్ఐ అధికారుల కస్టడీలో ఉంది. దీనిలో భాగంగా ఆమెను విచారిస్తున్న అధికారులు ఇందులో ‘కింగ్ పిన్’ ఎవరు అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు. -
ఎన్ఆర్ఐ మహిళ మృతి కేసులో బిగ్ ట్విస్ట్
విశాఖ: ఇటీవల నగరంలో ఓ స్టార్ హోటల్ లో ఓ ఎన్ఆర్ఐ మహిళ మృతికి సంబంధించిన కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులు, అనుమానితులు ఎవరూ లేరని తొలుత ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న పోలీసులు.. చివరకు ఆమె వెంటే ఉన్న డాక్టర్ శ్రీధర్ ను అదుపులోకి తీసుకున్నారు.ఈ కేసుకు సంబంధించి అనుమానాలు ఎక్కువ కావడంతో పాటు ‘సాక్షి’ వరుస కథనాలతో పోలీసు యంత్రాంగం కదిలింది. ఆ ఎన్ఆర్ఐ మహిళ ఆత్మహత్య చేసుకునేలా డాక్టర్ పిల్లా శ్రీధర్ ప్రేరేపించాడని అభియోగాలు నమోదు చేసిన పోలీసులు.. డాక్టర్ శ్రీధర్ ను అరెస్ట్ చేశారుఈ నెల 8వ తేదీన ఓ స్టార్ హెటల్ లో ఎన్నారై మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆ హోటల్ వాష్ రూమ్ లో ఎన్నారై మహిళ ఉరివేసుకుని ఉంది. అయితే ఆ సమయంలోనే కూడా ఉన్న డాక్టర్ పై అనుమానాలు రేకెత్తాయి. చివరకు డాక్టర్ శ్రీధర్ ను అరెస్ట్ చేయడంతో ఈ కేసు మరో అడుగు ముందుకు కదిలింది. బీఎన్ఎస్ 108 ప్రకారం కేసు నమోదు చేసి.. నిందితుడిని రిమాండ్ కు తరలించారు. అయితే ఎన్నారై మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆత్మహత్య చేసుకునేలా చేశాడా?, లేక హత్య చేశాడా అనేది విచారణలో తెలియాల్సి ఉంది. ఇక డాక్టర్ పిల్లా శ్రీధర్ ను పోలీసులు కస్టడీకి కోరతారా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. -
పట్టపగలే దొంగల ముఠా బీభత్సం.. భారీ దోపిడీ!
పాట్నా: బీహార్ రాష్ట్రంలో పట్టపగలే దోపిడీ దొంగలు బీభత్సం స్పష్టించారు. ఓ నగల షాపులో ప్రవేశించి సుమారు రెండు కోట్ల రూపాయిల విలువైన బంగారు ఆభరణాలను దొంగిలించారు. రాష్ట్రంలోని బోజ్ పూర్ జిల్లాలోని గోపాలి చౌక్ వద్ద ఉన్న తనిష్క్ నగల దుకాణంలోకి ప్రవేశించిన ఒక ముఠా వారిని బెదిరించి భారీ ఎత్తును నగలను, నగదును తస్కరించుకుపోయారు. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో పట్ట పగలే ఇలా ఒక దుకాణంలోకి ప్రవేశించి నగలను, భారీ ఎత్తును డబ్బును దోచుకుపోవడంతో స్థానికంగా కలకలం రేగింది.అరగంటకు పైగా షాపులోనే..దోపిడీ ప్రణాళిక వచ్చిన ఒక ముఠా సుమారు అరగంట పాటు షాపులోనే ఉన్నారు. పెద్ద ఎత్తున తుపాకులతో వచ్చిన దొంగల ముఠా.. ఎటువంటి అనుమానం రాకుండా అరగంటకు పైగా షాపులోనే గడిపారు. ముందుగా నగల షాపులో ఉన్న వారిని బెదిరించి వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నగలను, క్యాష్ కౌంటర్ లో ఉన్న నగదును దొంగిలించుకుపోయారు.సెక్యూరిటీ గార్డు గన్ ను దొంగిలించి..నగల షాపు దోచుకున్న అనంతరం సెక్యూరిటీ గార్డు వద్ద ఉన్న గన్ ను సైతం దొంగలు దొంగిలించి అక్కడ నుంచి పారిపోయారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వచ్చేసరికి దొంగలు అక్కడ నుంచి పారిపోయారు.నలుగురు తప్పించుకున్నారు.. ఇద్దరు దొరికారుదీనిపై వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. ఆ ప్రాంతంలో జల్లెడ పట్టే యత్నం చేశారు. అయితే ఆ దొంగల్లో ఇద్దరు పోలీసులను చూసి తప్పించుకోవాలని చూశారు. దాంతో పోలీసులు షూట్ చేసి ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు వారి నుంచి నాలుగు బండిల్స్ జ్యూయలరీని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇంకో నలుగురు తప్పించుకున్నారు. ఈ భారీ దొంగతనంపై సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్న పోలీసులు.. త్వరలోనే మిగతా నలుగుర్ని పట్టుకుంటమన్నారు. -
అమృత వల్లే ఇదంతా: సోదరి సంచలన వ్యాఖ్యలు
నల్గొండ, సాక్షి: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ పరువు హత్య కేసులో నిందితులకు ఎట్టకేలకు శిక్షలు పడ్డాయి. దీంతో ప్రణయ్ తల్లిదండ్రులు(Pranay Parents) మీడియాతో మాట్లాడుతూ తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. అంతకు ముందు.. కొడుకు సమాధిని ముద్దాడి నివాళులర్పించారు. అయితే ఈ కేసులో ఇప్పటికే అమృత తండ్రి మారుతి రావు బలవన్మరణంతో మృతి చెందగా.. ఇప్పుడు అమృత చిన్నాన్న శ్రవణ్‌కు జీవిత ఖైదు పడింది.ప్రణయ్ హత్య ప్లాన్ అమలులో ఆరుగురు ప్రధాన సూత్రధారులని.. అందులో తన బాబాయ్ శ్రవణ్ కీలకంగా వ్యవహరించారంటూ అమృత అప్పట్లో ఘటన జరిగిన టైంలో ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆ ఆరోపణల ఆధారంగానే దర్యాప్తు జరిపిన పోలీసులు.. శ్రవణ్‌ను ఏ6గా నిందితుల జాబితాలో చేర్చారు. అయితే ఇవాళ తీర్పులో ఆయనకు జీవిత ఖైదు పడగా.. శ్రవణ్ కుటుంబం పోలీసులతో వాగ్వాదానికి దిగింది.ఏ తప్పు చేయకున్నా.. తన తండ్రిని ఈ కేసులో ఇరికించారని శ్రవణ్ కూతురు మీడియా ముందు వాపోయింది. ఈ ఎపిసోడ్‌కు అమృతే కారణమంటూ ఆరోపించింది కూడా. ఈ క్రమంలో ఈ కేసులో తన తండ్రి ప్రమేయం లేదని చెబుతూ.. ఆయన్ని తమకు అప్పగించాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారామె.సంచలనం సృష్టించిన ఈ కేసులో మొత్తం ఎనిమిది మంది నిందితులు ఉన్నారు. ఏ1 మారుతి మృతి చెందగా.. హంతకుడు సుభాష్ శర్మకు ఉరి శిక్ష పడింది. అమృత బాబాయ్ శ్రవణ్ సహా మిగతా నిందితులకు జీవిత ఖైదు పడింది. మారుతిరావు నుంచి సుపారీ అందుకున్న అస్ఘర్(ఉగ్రవాది కూడా), సుభాష్ శర్మలు అండర్ ట్రయల్స్‌గా ఉండగా.. మిగతా వాళ్లు బెయిల్‌పై బయటకు వచ్చారు. పోలీసులు 1600 పేజీల ఛార్జ్‌షీట్ దాఖలు చేయగా.. 5 సంవత్సరాల 9 నెలలపాటు విచారణ జరిగింది.ఇదీ చదవండి: ప్రణయ్ హత్య కేసులో సంచలన తీర్పు -
Chittoor: ‘నా భర్తను కొట్టి చంపేశారు’
పుత్తూరు: తన భర్తను కొట్టి చంపేశారని, ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షంచాలంటూ భార్య ఆక్రందనలతో పుత్తూరు ఆసుపత్రిలో మిన్నంటాయి. పుత్తూరు పట్టణ పరిధిలోని చినరాజుకుప్పం గ్రామంలో ఆదివారం సాయంత్రం గ్రామానికి చెందిన మణికంఠ(29) రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గుర్తించిన ఓ మహిళ అరుస్తూ వెళ్లి గ్రామస్తులకు తెలిపింది. వెంటనే గ్రామస్తులు 108కు సమాచారం అందించి పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. అప్పుడే పుత్తూరులో బస్సు దిగిన మృతుడి భార్యకు విషయం తెలియడంతో ఆసుపత్రిలో భర్త మృతదేహాన్ని చూసిన ఆమె బోరున విలపించింది. బాధితురాలి కథనం మేరకు వివరాలు... చినరాజుకుప్పం గ్రామానికి చెందిన సుబ్బరాయుడు కుమారుడు మణికంఠ (29)కు తమిళనాడుకు చెందిన వీకేఆర్‌పురం గ్రామానికి చెందిన జననితో ఆరేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి 5 ఏళ్ల కుమారుడు అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో జనని శుక్రవారం కుమారుడ్ని చూడడానికి పుట్టింటికి వెళ్లింది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు పుత్తూరులో బస్సు దిగి గ్రామానికి వెళ్లాల్సి ఉండగా గ్రామస్తులు కనబడి నీ భర్త చనిపోయాడని, పుత్తూరు ఆసుపత్రికి తీసుకొచ్చారని తెలిపారు. ఎందుకు ఎలా అంటూ ఆరా తీయగా మణికంఠ అతడి చిన్నాన్న వెంకటేశులు ఇంట్లో రక్తపు మడుగులో పడి ఉండడాన్ని చూసి తెలిపారని చెప్పారు. ఎవరు, ఎందుకు, ఎలా చంపేశారో తెలియదని, దీనిని పోలీసులే తేలి్చ, దోషులను కఠినంగా శిక్షించాలంటూ బాధితురాలు జనని ఆక్రోశించింది. మణికంఠ తిరుపతిలోని మహర్షి అభ్యుదయ సేవా సమితిలో పని చేస్తుండగా జనని ప్రస్తుతం గర్భిణి. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రాణం తీసిన పల్లిగింజ
సాక్షిప్రతినిధి, వరంగల్: పల్లిగింజ తిన్న చిన్నారికి అదే యమపాశమైంది.. గొంతులో గింజ ఇరుక్కుని శ్వాస ఆడక బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం నాయక్‌పల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుండెల వీరన్న–కల్పన దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు అక్షయ్ (18 నెలలు) ఉన్నాడు. గురువారం ఇంటి ఎదుట పల్లీలు ఆరబెట్టగా ఆడుకుంటున్న అక్షయ్ గింజ తిన్నాడు. దీంతో గింజ గొంతులో ఇరుక్కుని శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. గుర్తించిన తల్లిదండ్రులు వెంటనే వరంగల్ ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. చిన్నారి మృతదేహంమీద పడి తల్లిదండ్రులు, కుటుంబీకులు గుండెలవిసేలా రోదించారు. అప్పుడే నీకు నూరేళ్లు నిండిపోయాయ బిడ్డా అంటూ బోరున విలపించారు. -
ప్రణయ్ కేసులో ఒకరికి ఉరి.. ఆరుగురికి జీవితఖైదు
నల్లగొండ, సాక్షి: తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన మిర్యాలగూడ పరువు హత్య కేసులో(Nalgonda Miryalaguda Honour Killing Case) సంచలన తీర్పు వెలువడింది. ప్రణయ్(24)ను దారుణంగా చంపిన సుభాష్ శర్మకు నల్లగొండ ఎస్సీ/ ఎస్టీ కోర్టు మరణశిక్ష శిక్ష విధించింది. అలాగే మిగతా ఆరుగురు నిందితులందరికీ జీవిత ఖైదును ఖరారు చేసింది. అమృత వర్షిణి-ప్రణయ్‌లు చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఆ స్నేహం.. ప్రేమగా మారి 2018లో పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు. ప్రణయ్ కుటుంబ సభ్యులు ఆ ప్రేమ వివాహాన్ని అంగీకరించగా.. తన కుమార్తె కులాంతర వివాహం చేసుకుందని మారుతీ రావు(Maruthi Rao) రగిలిపోయాడు. ఈ క్రమంలో ఆమె భర్త ప్రణయ్‌ను హతమార్చడానికి అస్ఘర్ అలీకి కోటి రూపాయల సుపారీ ఇచ్చాడు. అస్ఘర్ ఏడుగురితో కలిసి గ్యాంగ్‌ను ఏర్పాటు చేసి ప్రణయ్‌ను అంతమొందించాడు.👉ఆరేళ్లకు పైగా ప్రణయ్ కేసు(Pranay Case) విచారణ జరిగింది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు మారుతి రావు ఆత్మహత్య చేసుకోగా.. మరో ముగ్గురు నిందితులు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. మిగతా నలుగురు నిందితులు బెయిల్ మీద బయట ఉన్నారు. ఈ నేపథ్యంలో నిందితులదరినీ ఇవాళ కోర్టులో పోలీసులు హాజరు పరిచి.. తీర్పు అనంతరం అదుపులోకి తీసుకున్నారు.👉2018లో ప్రణయ్- అమృతల వివాహం జరిగింది. ఐదు నెలల గర్భంతో ఉన్న భార్య అమృత(Amrutha Pranay)తో కలిసి చెకప్‌నకు వెళ్లి తిరిగి వస్తుండగా.. సుపారీ గ్యాంగ్‌లోని సుభాష్ శర్మ గొడ్డలితో ప్రణయ్‌పై దాడి చేయడంతో తల్లి, భార్య చూస్తుండగానే రక్తపు మడుగులో విలవిలలాడుతూ మరణించాడు. 👉మిర్యాలగూడలో 2018 సెప్టెంబరు 14వ తేదీన పెరుమాళ్ల ప్రణయ్(Perumalla Pranay) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసుకు సంబంధించి.. ప్రణయ్ తండ్రి బాలస్వామి ఫిర్యాదుతో మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు అయ్యింది. 👉ఈ కేసులో అమృత తండ్రి మారుతీ రావు ఏ1గా ఉండగా.. ప్రణయ్‌ను కత్తితో నరికి చంపిన సుభాష్ శర్మ ఏ2గా ఉన్నాడు. మొత్తంగా ఎనిమిది మందిపై కేసు నమోదు కాగా.. దాదాపు ఐదున్నరేళ్ల పాటు సాగిన విచారణ సాగింది. 👉ఏ-3 అజ్గర్ అలీ, ఏ-4 అబ్దుల్ భారీ, ఏ-5 ఎంఏ కరీం, ఏ-6 తిరునగరు శ్రవణ్ కుమార్(మారుతి రావు సోదరుడు), ఏ-7 సముద్రాల శివ(మారుతి రావు డ్రైవర్), ఏ-8 నిజాం(నిందితులు ప్రయాణించిన ఆటో డ్రైవర్ ఓనర్)గా ఉన్నారు. 👉2019 జూన్ 12న పోలీసుల చార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో అరెస్టైన అమృత తండ్రి మారుతి రావుకు బెయిల్ దక్కింది.ఏ-1 మారుతీరావు 2020 మార్చి7వ తేదీన హైదరాబాద్ ఖైరతాబాద్ వైశ్య భవన్ లో ఆత్మహత్య చేసుకున్నారు. ఇక నల్లగొండ జిల్లా కోర్టు సముదాయంలోని.. ఎస్సీ ఎస్టీ కోర్టు ఈ కేసును సుదీర్ఘంగా విచారించి.. మార్చి 10కి(ఇవాళ్టికి) తీర్పును రిజర్వ్ చేసింది.👉మరో ఏడుగురు నిందితుల పాత్రపై సైంటిఫిక్ ఎవిడెన్స్, పోస్టుమార్టం నివేదిక, చార్జ్ షీట్ తో పాటు సాక్షులను విచారించింది కోర్టు👉నిందితుల్లో అస్ఘర్ అలీ ఐఎస్ఐ ఉగ్రవాదిగా తేలింది. గతంలో గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్యా హత్యతో పాటు పలు ఉగ్ర కుట్రల్లో కీలకంగా వ్యవహరించాడు. అంతేకాదు.. ప్రణయ్ కేసులో మారుతి రావు సుపారీ ఇచ్చింది కూడా ఇతనికే. మొత్తం ఏడుగురిని ఒక గ్రూప్‌గా చేసి.. ప్రణయ్ హత్య స్కెచ్‌ను అస్ఘర్ అమలు పరిచాడు. -
ట్రక్కును ఢీకొన్న వాహనం.. ఏడుగురు భక్తులు మృతి
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. భక్తులతో వెళ్తున్న ఎస్యూవీ వాహనం ట్రక్కును ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా.. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.వివరాల ప్రకారం..‘మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో బహ్రీ వద్ద ట్రక్కు, ఎస్యూవీ వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే ఏడుగురు మృతిచెందారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆసుపత్రిలో క్షతగాత్రులకు చికిత్స జరగుతోంది. అయితే, వీరంతా మైహార్ ఆలయానికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటన అనంతరం, ట్రక్కు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.VIDEO | Madhya Pradesh: Several people died, while some others got injured after a car collided with a truck in Sidhi last night.DSP Gayatri Tiwari says, “Last night at around 2 am, we received the information about the accident between a bulker and a car near Utni Petrol Pump.… pic.twitter.com/LVxoYGOrRe— Press Trust of India (@PTI_News) March 10, 2025 -
White House: గన్ తో సంచరిస్తున్న వ్యక్తి కాల్చివేత
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు నివాసముండే వైట్ హౌస్ కు కూతవేటు దూరంలో మారణాయుధాలతో సంచరిస్తున్న ఓ వ్యక్తిని బలగాలు కాల్చి చంపాయి. వైట్ హౌస్ ఎబ్లాక్ కు కూతవేటు దూరంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు. అతని వద్ద గన్ తో పాటు పలు మారణాయుధాలు ఉన్నట్లు గుర్తించిన అమెరికన్ సీక్రెట్ సర్వీస్ సిబ్బంది అతన్ని షూట్ చేసి చంపారు. భారత కాలమాన ప్రకారం ఈరోజు(ఆదివారం) ఉదయం అతను అనుమనాస్పద రీతిలో వైట్ హౌస్ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నాడు. దీన్ని గుర్తించిన యూఎస్ సీక్రెట్ సర్వీస్ సిబ్బంది.. అతనిపై ఒక్కసారిగా కాల్పులకు దిగి మట్టుబట్టాయి. అతను ఆత్మాహుతి దాడికి పాల్పడటానికి వచ్చినట్లు అనుమానిస్తున్నారు.తొలుత ఆతన్ని నివారించే క్రమంలో ఎదురుకాల్పులకు దిగేందుకు సిద్ధమయ్యారు. అంతే ఒక్కసారిగా అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ అతనిపై కాల్పులు జరిపారు. అతనికి తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన అతను మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు. ఈ ఘటనలో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఎవరూ గాయపడలేదని వైట్ హౌస్ వర్గాలు స్పష్టం చేశాయి. ఆ సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లో లేరని, ఫ్లోరిడాలో ఉన్నట్లు పేర్కొన్నాయి. అయితే అతనే ఏ ఉద్దేశంతో మారణాయుధాలతో అక్కడకు వచ్చాడనేది తెలియలేదన్నాయి, -
పోలీస్ స్టేషన్లోనే రక్షణ కరువు.. గుట్టు చప్పుడు కాకుండా..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పోలీస్ స్టేషన్లో కూడా రక్షణ కరువైంది. స్టేషన్లోనే అందరూ చూస్తుండగానే గొంతు కోసిన వైనం కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. మిస్సింగ్ కేస్ క్లోజింగ్ కోసం వెళ్లిన ప్రేమికులకు ప్రాణహాని జరిగింది.పోలీస్ స్టేషన్ రిసెప్షన్లోనే అమ్మాయి తరపు బంధువు.. యువకుడి గొంతు కోసేశాడు. దీంతో గొంతుకు నాలుగు కుట్లు పడ్డాయి. గుట్టు చప్పుడు కాకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించిన పోలీసులు.. ఇంటికి పంపేశారు. పోలీస్ స్టేషన్లోనే తమకు రక్షణ లేకపోతే ఇంకా బయట మా పరిస్థితి ఎలా ఉంటుందంటూ ఆ ప్రేమ జంట వాపోతున్నారు. -
భర్త మటన్ కట్టింగ్.. ప్రియుడు కిరాణం షాపు.. చివరికి..
సాక్షి, నాగర్ కర్నూల్/మహబూబ్‌నగర్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను చంపించిన భార్య కటకటాల పాలైంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలను శుక్రవారం విలేకరుల సమావేశంలో వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వర్రావు వెల్లడించారు. పాన్‌గల్‌కు చెందిన ఎండీ పర్వీన్‌బేగం 12 ఏళ్ల క్రితం ఏపీలోని కర్నూలుకు చెందిన ఎండీ రహమతుల్లాకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి సంతానం. వివాహమైన రెండేళ్లపాటు పాటు కర్నూలులోనే ఉండగా.. సంసారం విషయంలో గొడవలు వచ్చాయి. దీంతో పదేళ్ల క్రితమే భార్యాభర్తలు, పిల్లలు కలిసి ఆమె తల్లిగారి గ్రామమైన పాన్‌గల్‌కు వచ్చి సంతబజార్‌లో కిరాయి ఇంట్లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. భర్త రహమతుల్లా పెయింటింగ్, మటన్ కట్టింగ్ పనిచేస్తుండగా.. భార్య టైలర్ పనిచేస్తుంది. ఈ క్రమంలో పక్కనే ఉన్న కిరాణం షాపు నడుపుతున్న కుమ్మరి రాఘవేందర్(ఎ1)తో పరిచయం ఏర్పడి.. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం పసిగట్టిన రహమతుల్లా ఇరు కుటుంబ పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. ఆ తర్వాత కూడా రహమతుల్లా తరుచుగా ఆమెను వేధించేవాడు. దీంతో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన వారు రహమతుల్లాను హత్య చేయడానికి నిర్ణయించారు. ఈ క్రమంలోనే రాఘవేంద్ర తనకు పరిచయం ఉన్న కురుమూర్తితో కలిసి ఒప్పందం కుదుర్చుకున్నారు. పథకం ప్రకారం ఈ నెల 1న తెల్లవారుజామున 4 గంటల సమయంలో కురుమూర్తిని రహమతుల్లా ఇంటికి పంపించి గొర్రెను కోసేది ఉంది అని చెప్పి వెంట తీసుకొని పాన్‌గల్ గ్రామ శివారులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలోని కేఎల్ఐ కాల్వ దగ్గరకు వెళ్లగా అప్పటికే రాఘవేంద్ర తన బైక్‌పై అక్కడికి వచ్చి హతమార్చారు. చదవండి: తెల్లారితే పెళ్లి.. అంతలోనే బలవన్మరణంరాఘవేంద్ర రహమతుల్లా గొంతు పిసకగా.. కురుమూర్తి అతని చేతులు పట్టుకున్నాడు. కొద్దిసేపటికి రహమతుల్లా మృతదేహం, అతని వెంట తెచ్చుకున్న కత్తిని పక్కనే ఉన్న కేఎల్ఐ కాల్వలో పడేసి రాఘవేంద్ర, కురుమూర్తి కలిసి మోటార్ సైకిల్‌పై వెళ్లిపోయారు. ఈ మేరకు నిందితులు ఉపయోగించిన మోటార్ సైకిల్, 3 సెల్ఫోన్లు స్వాదీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. హత్య కేసులో ఎ1 కుమ్మరి రాఘవేంద్ర, ఎ2 ప్యాట కురుమూర్తి, ఎ3 పర్వీన్‌బేగంను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. కేసు ఛేదనలో ప్రతిభచూపిన వనపర్తి సీఐ కృష్ణ, స్థానిక ఎస్ఐ శ్రీనివాసులును, పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
తెల్లారితే పెళ్లి.. అంతలోనే బలవన్మరణం
మెట్‌పల్లిరూరల్(కోరుట్ల): తెల్లారితే వై భవంగా పెళ్లి జరగాల్సిన ఇంట్లో రోద నలు మిన్నంటాయి. మేళతాళాలతో సందడి నెలకొనాల్సిన పందిట్లో చావు డప్పులతో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరి కొన్ని గంటల్లోనే పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు అర్ధంతరంగా తనువు చాలించిన విషాదకరమైన ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. మెట్పల్లి మండలం వెల్లుల అనుబంధ గ్రామమైన రాంచంద్రంపేట గ్రామానికి చెందిన లక్కినపల్లి లక్ష్మి–లింబాద్రిలకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతు ళ్లు. వీరిలో ముగ్గురికి వివాహమైంది. చివరివాడై నా కిరణ్(37) మెట్‌పల్లిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్నాడు. ఇతడికి వివా హం చేయాలని నిశ్చయించిన తల్లిదండ్రులు పక్క గ్రామమైన వెల్లులకు చెందిన అమ్మాయితో పెళ్లి ఖరారు చేశారు. ఇటీవల నిశ్చితార్థం జరగ్గా.. పెళ్లి తేదీ ఈనెల 9. శుక్రవారం వధువుతో ఫొటో షూట్‌కు సైతం వెళ్లిన కిరణ్.. మ ధ్యాహ్నం తర్వాత ఇంటికొచ్చాడు. వచి్చ న నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు కుటుంబ సభ్యులు, ఇంటికొచ్చిన బంధువులతో సైతం బాగానే ఉన్నాడు. పడుకునేందుకు గదిలోకి వెళ్లాడు. ఆ తర్వాత ఏం జరిగిందో గానీ.. శనివారం ఉదయం తెల్లవారుజామున కిరణ్ సోదరికి ఫ్యాన్‌కు ఉరేసుకొని వేలాడుతూ కనిపించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆరా తీశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం మెట్పల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కిరణ్ ఆత్మహత్యకు అతడి అనారోగ్య సమస్యలే కారణమని ఆయన తల్లిదండ్రులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అనారోగ్య సమస్యల కారణంగా పెళ్లి జరిగాక భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తాయేమోననే భయంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని ఫిర్యాదు ఇచ్చారు. కేసు నమోదు చేసినట్లు మెట్పల్లి ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపారు. -
కుల్‌భూషణ్ జాదవ్ కిడ్నాప్ వెనకున్న పాక్ మతపెద్ద హతం
ఇస్లామాబాద్: ఇరాన్లో భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ కిడ్నాప్‌లో పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐకు సహకరించాడనే ఆరోపణలు ఉన్న పాక్ మతపెద్ద ముఫ్తీ షా మిర్ హత్యకు గురయ్యారు. బలూచిస్థాన్‌లో గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపాడు. బలూచి ప్రాంతంలో మతపెద్ద అయిన ముఫ్తీ గతంలో రెండుసార్లు హత్యాయత్నం నుంచి తప్పించుకున్నారు.తుర్బాట్‌లోని స్థానిక మసీదులో ముఫ్తీ మిర్ రాత్రి ప్రార్థనలు ముగించుకుని వెళ్తుండగా.. బైక్‌పై వచ్చిన ముష్కరులు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ముఫ్తీ షా మిర్‌పై అనేకసార్లు కాల్పులు జరిపారని, తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన ఆయన.. శుక్రవారం మరణించినట్లు పేర్కొన్నారు.మత సంస్థ జమియత్ ఉలేమా-ఇ-ఇస్లాం (జేయూఐ)లో సభ్యుడైన ముఫ్తీ షా మీర్.. అక్కడి ప్రముఖ వ్యక్తుల్లో ఒకడిగా చలామణి అయ్యేవాడని.. ఆయుధాలు, మానవ అక్రమ రవాణా వంటి కార్యకలాపాలకు పాల్పడేవాడని జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. పాకిస్థాన్‌లోని పలు ఉగ్రవాద సంస్థలతో అతడిని సన్నిహిత సంబంధాలు ఉన్నాయని.. భారత భూభాగంలోకి అక్రమంగా చొరబడడానికి సాయం చేసే వాడని తెలిపాయి.కుల్‌భూషణ్ జాదవ్ కేసు.. అసలేం జరిగిందంటే..నావికాదళంలో బాధ్యతలు నిర్వర్తించి.. పదవీ విరమణ చేసిన కుల్‌భూషణ్ జాదవ్ ఇరాన్‌లోని చాబహార్ ప్రాంతంలో బిజినెస్ చేసేవారు. 2016లో ఆయన్ను ఇరాన్లో పాక్ ఐఎస్ఐ ఏజెంట్లు కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత బలూచిస్థాన్లోకి ఆయన ప్రవేశిస్తే అరెస్ట్ చేసినట్లు చూపారు. 2017 గూఢచర్యం ఆరోపణలపై పాకిస్థాన్ మిలిటరీ కోర్టు ఆయనకు మరణశిక్ష కూడా విధించింది. ఈ అంశంపై భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. ఆ మరణశిక్షను సవాల్ చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. నాటి నుంచి ఈ విచారణ కొనసాగుతూనే ఉంది. -
రన్యారావు కేసు కీలక మలుపు.. ఆమె శరీరంపై గాయాలు
బంగారం అక్రమ రవాణా కేసులో పట్టుబడిన నటి రన్యారావు(34) కేసు కీలక మలుపు తిరిగింది. తాజాగా ఆమెపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. ఇక నుంచి ఆమె సీబీఐ బోనులోకి వెళ్లాల్సిందే. వారు అడిగే ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరి కావాల్సిందే. మరో రెండు రోజుల్లో ఆమెను సీబీఐ అధికారులు విచారించనున్నారు. రన్యారావును పోలీసులు విచారిస్తున్న క్రమంలో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం బంగారం అక్రమ రవాణా మాత్రమే కాకుండా సంఘవిద్రోహ శక్తులతో కూడా ఆమెకు సంబంధాలు ఉన్నట్లు వారు కనుగొన్నారు. సౌదీ అరేబియాతో పాటు అమెరికా, పశ్చిమాసియా, ఐరోపా దేశాలలో కూడా రన్యారావు ప్రయాణించినట్లు అధికారులు గుర్తించారు. ఈ కారణంతోనే సీబీఐ రంగంలోకి దిగింది.రన్యారావు నుంచి ఇప్పటికే 14 కిలోల బంగారు బిస్కెట్లు, రూ.2 కోట్ల విలువైన ఆభరణాలు, సుమారు రూ.3 కోట్ల నగదును డీఆర్ఐ అధికారులు జప్తు చేశారు. ఆమె వద్ద మొత్తం రూ. 18 కోట్ల ఆస్తులను గుర్తించినట్లు తెలుస్తోంది. ఆమెకు సంబంధించిన ఫోన్స్‌తో పాటు ల్యాప్‌టాప్‌లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ప్రస్తుతం ఆమె డీఆర్ఐ అధికారుల విచారణలో ఉంది. త్వరలో సీబీఐ అధికారులు కూడా ఆమెను ప్రశ్నించనున్నారు. వారు ఇప్పటికే పలు ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు.రన్యారావును విచారించిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సంచలన విషయాలను తెలిపింది. ఆమె శరీరంపై పలుచోట్ల గాయాలున్నాయని తెలిపింది. అయితే, దుబాయ్‌కి వెళ్లక ముందే తనకు ఈ గాయాలు అయినట్లు ఆమె తెలియజేసిందని అధికారులు చెప్పారు. దీంతో ఆమెకు అవసరం అయితే వైద్య సాయం అందించాలని జైలు అధికారులను కోర్టు సూచించింది. రన్యారావు విచారణలో భాగంగా తమకు సహకరించడం లేదని డీఆర్ఐ అధికారులు కోర్టుకు తెలిపారు. -
బ్యాంకింగ్ సంస్థల పేరిట బురిడీ!
సాక్షి, అమరావతి: బ్రాండింగ్ ముసుగులో సైబర్ నేరగాళ్లు పేట్రేగిపోతున్నారు. బ్యాంకింగ్, ఆర్థిక సంస్థల పేర్లతోనే అత్యధికంగా నిధులు కొల్లగొడుతున్నారు. రిటైల్, టెక్నాలజీ రంగాల పేరిట మోసాలు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇక సైబర్ నేరస్తులు నిధులు కొల్లగొట్టేందుకు ఫిషింగ్ యాప్‌లు, లింక్‌లనే ప్రధాన సాధనంగా చేసుకుంటున్నారు. ప్రముఖ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ ‘క్లౌడ్ సేక్’ దేశంలో సైబర్ నేరాల తీవ్రతపై తాజా నివేదికలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. 2025లో దేశంలో సైబర్ నేరగాళ్లు మరింతగా రెచ్చిపోయే అవకాశాలున్నాయని కూడా అంచనా వేసింది. నివేదికలోని ప్రధాన అంశాలివి..» బ్యాంకులు, ఆర్థిక సంస్థల పేరిట మోసాలే మొదటి స్థానంలో ఉన్నాయి. దేశంలో 39.5 శాతం సైబర్ నేరాలు బ్యాంకులు, ఆర్థిక సంస్థల పేరిటæ బురిడీ కొట్టించి నిధులు కొల్లగొడుతున్నారు. » రెండు, మూడు స్థానాల్లో రిటైల్/ఈ–కామర్స్, టెక్నాలజీ సంస్థలున్నాయి. రిటైల్ సంస్థల పేరుతో 21.4 శాతం, టెక్నాలజీ సంస్థల పేరిట 12.5శాతం సైబర్ నేరస్తులు బురిడీ కొట్టిస్తున్నారు. ఇక టెలీ కమ్యూనికేషన్ల సంస్థలు(9.1శాతం), ట్రావెల్ సంస్థలు(8.6శాతం), రియల్ ఎస్టేట్ సంస్థలు(2.5శాతం), బీమా కంపెనీలు(1.9%) పేరిట కూడా సైబర్ నేరస్తులు మోసాలకు పాల్పడుతున్నారు.» సైబర్ ముఠాలు అత్యధికంగా ఫిషింగ్ యాప్‌లు/లింకులనే తమ మోసాలకు సాధనంగా చేసుకుంటున్నాయి. ఫిషింగ్ యాప్‌లు/ లింకులు పంపి వాటిని క్లిక్ చేయగానే బ్యాంకు ఖాతాల్లో నిధులు కొల్లగొడుతున్నాయి. మొత్తం సైబర్ నేరాల్లో ఈ తరహా మోసాలు ఏకంగా 58% ఉండటం గమనార్హం. » తర్వాత స్థానాల్లో సోషల్ మీడియా మాధ్యమాలున్నాయి. ఫేక్ ఫేస్బుక్ ఐడీల పేరిట 25.7శాతం, యూట్యూబ్ ద్వారా 5.8శాతం, ఎక్స్( ట్విట్టర్) ఖాతాల ద్వారా 3.2శాతం, ఇన్స్టాగామ్ ద్వారా 2.5శాతం సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. » సైబర్ నేరస్తులు 2025లో దేశంలో ఏకంగా రూ.20 వేల కోట్లు కొల్లగొట్టే అవకాశం ఉందని అంచనా. దేశంలో సైబర్ మోసాలపై ఏకంగా 25 లక్షలకు పైగా ఫిర్యాదులు నమోదయ్యే అవకాశం ఉంది. వాటిలో 41 శాతం వరకు బ్యాంకింగ్, ఆర్థిక సంస్థల పేరిట మోసాలే ఉంటాయని భావిస్తున్నారు. ఇక దేశంలో మోసపూరితమైన యాప్‌లు 83 శాతం, ఫేక్ సోషల్ మీడియా ఖాతాలు 65 శాతం పెరగొచ్చని అంచనా. -
మనవడి చితిలోనే తాత మరణ శాసనం..
భోపాల్: ఇదొక కల్లోలం.. ముగ్గురి జీవితాలపై విధి ఆడిన వింత నాటకం. సాఫీగా సాగుతున్న జీవితంలో ఒక్క ఉదుటను దూకిన ‘మృత్యుఘోష’. ఈ ఘటనలో ఒకరు హత్యకు గురైతే, మరొకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకొకరు ఆత్మాహుతి చేసుకున్నారు. మధ్యప్రదేశ్ లో జరిగిన ఈ విషాద ఘటన తలుచుకుంటేనే ఒళ్లు గగుర్పాటుకు గురౌవుతుంది.రాష్ట్రంలోని బాహ్రి పోలీస్ స్టేషన్ పరిధిలో సిహోలియా గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది. ముందుగా భార్యను చంపిన భర్త ఆపై ఆత్మహత్య చేసుకున్నాడు. మెడకు ఉరితాడు బిగించుకుని తాను కూడా ప్రాణాలు విడిచాడు. ఆ తర్వాత మనవడి మరణాన్ని జీర్ణించుకోలేని తాత.. అదే చితిమంటల్లో దూకి ఆత్మార్పణం చేసుకున్నాడు.అభయ్ రాజ్ అనే 34 ఏళ్ల వ్యక్తి.. భార్య సవితా యాదవ్(31)ను హత్య చేశాడు. ఇక తనులేని జీవితం వద్దనుకున్నాడో, లేక జైలు పాలు కావాల్సి వస్తుందని భయపడ్డాడో కానీ ఉరి వేసుకుని అతను కూడా తనువు చాలించాడు. ఇది శుక్రవారం ఉదయం జరగ్గా, అదే రోజు సాయంత్ర వారి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే మనవడిఅభయ్ రాజ్) లేని జీవితం వద్దనుకున్న తాత రామావతార్.. తాను కూడా ఆ మనవడి అంత్యక్రియలు నిర్వహించిన చితి మంటల్లోనే దూకి ప్రాణం తీసుకున్నాడు. అయితే శనివారం ఉదయమే ఈ వార్త తెలుసుకున్న పోలీసులు.. అక్కడకు చేరుకుని కాలిన మృతదేహాన్ని బయటకు తీశారు. అయితే ఒక హత్య, రెండు ఆత్మహత్యల వెనుక కారణాలు ఏమిటో తెలియలేదని సిధి జిల్లా డీఎస్పీ గాయత్రి తివారీ తెలిపారు. దీనిపై దర్యాప్తు సాగిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. -
విశాఖలో ఎన్నారై మహిళ అనుమానాస్పద మృతి!
విశాఖ: నగరంలోని ఓ స్టార్ హెటల్ లో ఎన్నారై మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆ హోటల్ వాష్ రూమ్ లో ఎన్నారై మహిళ ఉరివేసున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. అయితే ఈ కేసును అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకున్నట్లు సీపీ తెలిపారు. దీనికి సంబంధించి ఆమె వెంట ఉన్న ఎన్ఆర్ఐ డాక్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళ మృతదేహానికి పోస్టు మార్టం పూర్తయ్యిందని, అనుమానాస్పద మృతి కేసుగా దర్యాప్తు చేస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు. ఆమె ఆత్మహత్య చేసుకుందా? లేక ఎవరైనా చంపేసి ఆమె మెడకు ఉరితాడు బిగించి వాష్ రూమ్ లో పెట్టారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆ మహిళ ఎవరు.. ఎక్కడ నుంచి వచ్చారు.. ఆమె కూడా ఉన్న డా క్టర్ ఎవరు అనే విషయాలు తెలియాల్సి ఉంది. -
ఎస్సార్ఎస్పీ కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. కుమారుడి మృతి.. తండ్రి, కుమార్తె గల్లంతు
సాక్షి, వరంగల్ జిల్లా: ఎస్సార్ఎస్పీ కెనాల్లోకి కారు దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో కుమారుడు మృతి చెందగా, తండ్రి కూతురు గల్లంతయ్యారు. తల్లిని స్థానిక రైతులు కాపాడారు. సంగెం మండలం తీగరాజు పల్లి వద్ద ఘటన జరిగింది. మేత రాజు పల్లి నుంచి వరంగల్ వైపు వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది.పర్వతగిరి మండలం మేచరాజుపల్లికి చెందిన సోమారపు ప్రవీణ్ కుమార్ తన భార్య కృష్ణవేణి, కుమార్తె సాయి చరిత, కుమారుడు హర్షవర్ధన్‌తో కలిసి హన్మకొండ నుంచి స్వగ్రామానికి కారులో బయలుదేరారు. మార్గమధ్యలో కారు డ్రైవ్ చేస్తున్న ప్రవీణ్‌కు గుండెపోటు రాగా, చికిత్స కోసం తిరిగి వరంగల్ వెళ్లేందుకు ప్రయత్నించారు.గుండె నొప్పి ఎక్కువై కారు అదుపు తప్పి ఎస్సారెస్పీ కాలువలోకి దూసుకెళ్లింది. స్థానిక రైతుల సాయంతో కృష్ణవేణి బయటపడ్డగా.. కుమారుడు మృతి చెందాడు. కారుతో సహా ప్రవీణ్, సాయి చరిత నీటిలో గల్లంతయ్యారు. ప్రవీణ్, చైత్రసాయి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
‘అమ్మా..నాన్నా.. ఒక్కసారి మాట్లాడండి’
తిరుపతి: మండల కేంద్రమైన సైదాపురంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గురువారం సైదాపురం–తిప్పవరపాడు మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సైదాపురానికి చెందిన దొడ్డగా మునెయ్య, భార్య జ్యోతి అక్కడికక్కడే మృతిచెందారు. కుమార్తె వైష్ణవి రక్తగాయాలతో బయటపడింది. ఈ క్రమంలో శుక్రవారం సైదాపురంలో మృతదేహాలకు అంతిమ వీడ్కోలు పలికారు.కంటతడి పెట్టించిన కుమార్తెల మాటలుకళ్లెదుటే తల్లిదండ్రులు విగత జీవులుగా పడి ఉండడంతో ఆ పసి హృదయాలు తల్లడిల్లిపోయాయి. ‘అమ్మా..నాన్నా.. ఒక్కసారి మాట్లాడండి’ అంటూ వారిపై పడి గుండెలు బాదుకోవడం అక్కడి వారిని కలచివేసింది. గాయపడిన వైష్ణవి చివరగా తల్లిదండ్రుల అంతిమయాత్రలో టాటా చెప్పడం స్థానికులకు కన్నీళ్లు తెప్పించింది.గోకుల బృందావనంలో పుట్టి..మండల కేంద్రమైన సైదాపురం సమీపంలోనే ఉన్న గోకుల బృందావనం గ్రామంలో దొడ్డగ మునెయ్య జన్మించారు. ఆయనకు అన్నలు భాస్కర్, చంద్రయ్య ఉన్నారు. వారంతా గోకులబృందావనం గ్రామం వీడి సైదాపురానికి చేరుకుని అక్కడే స్థిరపడ్డారు. మునెయ్యకు పెళ్లి చేసి సైదాపురంలోనే ఇల్లు కటించి బాగోగులు చూసుకునే వారు. ఈ క్రమంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మునెయ్యతోపాటు భార్య జ్యోతి మరణించడంతో విషాదంలో మునిగిపోయారు. ముక్కుపచ్చలారని పసిబిడ్డలను వదిలివెళ్తున్నారా..! అంటూ కన్నీరుమున్నీరయ్యారు. మృతుని కుటుంబాన్ని వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మన్నారపు రవికుమార్ పరామర్శించారు. మృతుని కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.‘అమ్మా..నాన్నా మమ్మల్ని వదిలి వెళ్లిపోయారా..! -
తుంగభద్ర కాలువ వద్ద దారుణం.. అర్ధరాత్రి టూరిస్ట్ మహిళపై..
బెంగళూరు: కర్ణాటకలో అమానుష ఘటన చోటుచేసుకుంది. మన దేశానికి అపఖ్యాతి మూటగట్టుకునే విధంగా కొందరు మూకలు దారుణానికి ఒడిగట్టారు. భారత పర్యటనకు వచ్చిన ఇజ్రాయెల్ యువతి, మరో మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన బెంగళూరుకు 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొప్పల్‌లో చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఇద్దరు మహిళల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం వారికి ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది.వివరాల ప్రకారం.. కొప్పల్‌కు చెందిన మహిళ(29) పర్యాటకుల కోసం హోమ్ స్టే నిర్వహిస్తోంది. విదేశాల నుంచి వచ్చే టూరిస్టులకు తన ఇంట్లో ఆశ్రయం ఇస్తూ ఆదాయం పొందుతోంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఇజ్రాయెల్ నుంచి ఓ మహిళ, అమెరికా నుంచి వచ్చిన డేనియల్ సహా మరో ఇద్దరికి ఆశ్రయం కల్పించింది. దీంతో, వారంతా ఆమె ఇంట్లోనే ఉంటున్నారు. అయితే, గురువారం వారంతా డిన్నర్ చేసిన అనంతరం బయటకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు.Israeli Tourist, Homestay Owner Gang-Raped While Stargazing In Karnataka pic.twitter.com/DbtuOlGuxp— NDTV (@ndtv) March 8, 2025అనంతరం, సోనాపూర్ సమీపంలోని తుంగభద్ర కెనాల్ ఒడ్డుకు వెళ్లాలని నిర్ణయించారు. దీంతో, వారంతా గురువారం రాత్రి 11:30 గంటల సమయంలో తుంగభద్ర కాలువ వద్దకు వెళ్లారు. కాలువ ఒడ్డున కూర్చుని నక్షత్రాలను చూస్తూ మాట్లాడుకుంటుండగా గుర్తు తెలియని వ్యక్తులు కొందరు అక్కడికి వచ్చి వారిపై దాడి చేశారు. టూరిస్టులలోని ముగ్గురు మగవాళ్లను కాలువలోకి తోసేసి, ఇజ్రాయెల్ పౌరురాలితో పాటు హోమ్ స్టే యజమానిపై అత్యాచారం చేసి పారిపోయారు. కాలువలో పడ్డ డేనియల్, మహారాష్ట్రకు చెందిన పంకజ్ బయటకు రాగా, ఒడిశాకు చెందిన బిబాష్ జాడ మాత్రం తెలియరాలేదు. ఈ క్రమంలో టూరిస్టులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరు యువతులను ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు స్పష్టం చేశారు. -
ఆనందంగా పెళ్లి ఊరేగింపు.. అంతలోనే ప్రమాదం..!
కరీంనగర్ జిల్లా: పెళ్లి బరాత్‌లో జరిగిన కారు ప్రమాదంలో గాయపడిన బాకారపు ఉమ (35) శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందినట్లు ఎస్సై రవి తెలిపారు. మండలంలోని మెట్పల్లి గ్రామానికి చెందిన బాకారపు ప్రభా కర్ కూతురు నవ్య వివాహం మానకొండూర్ మండలం చెంజర్ల గ్రామానికి చెందిన జినుక అశోక్‌తో గురువారం జరిగింది. రాత్రి పెళ్లి బరాత్ జరుగుతుండగా పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్లకు చెందిన కారు డ్రైవర్ శ్రవణ్ కారు దిగి ఫోన్ మాట్లాడుతున్నాడు. బరాత్‌లో కొందరు డ్యాన్స్ చేస్తుండగా పెళ్లికొడుకు అశోక్ కారు నడిపాడు. ఒక్కసారిగా బాకారపు ఉమ, ఆమె కూతురు నిఖితతోపాటు మరి కొందరిని కారు ఢీకొనడంతో గాయపడ్డారు. తీవ్రగాయాలైన ఉమ, నిఖితను హుజూ రాబాద్, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఉమ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ప్రమాదానికి పెళ్లి కొడుకు జినుక అశోక్ కారణమంటూ ఉమ భర్త పర్శరాములు కేశవపట్నం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. హుజూరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట బంధువులు ఆందోళన చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన వారికి పరిహారం ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. హుజూరాబాద్ రూరల్ సీఐ వెంకటి, ఎస్సై రవి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో ఉంచారు. -
బస్సులోనే శాశ్వత నిద్రలోకి.!
కరీంనగర్, సాక్షి: చావు ఎవరికి చెప్పి రాదు!. అప్పటిదాకా ఉన్న ఆనంద క్షణాలను.. హఠాన్మరణాలు హరించి వేస్తున్న ఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నవే. అలాంటిదే కరీంనగర్లో చోటు చేసుకుంది. డ్యూటీకి వెళ్లొస్తానంటూ ఇంట్లో చెప్పి బయల్దేరిన ఆ వ్యక్తి.. ప్రయాణంలోనే గుండె ఆగి ఊరిలో విషాదం నింపాడు. జమ్మికుంట(Jammikunta) నుంచి కరీంనగర్ చేరుకున్న బస్సులో శుక్రవారం ఉదయం ఓ వ్యక్తి అచేతనంగా పడి ఉన్న దృశ్యం కండక్టర్ కంట పడింది. నిద్రపోయాడనుకుని లేపే ప్రయత్నం చేశాడు. అయితే ఆ వ్యక్తి శాశ్వత నిద్రలోకి జారుకున్నాడని కాస్త ఆలస్యంగా గుర్తించాడు. వీణవంక(Veenkavanka) మండలం రెడ్డిపల్లికి చెందిన ఓదెలు.. కరీంనగర్ ఐసీఐసీఐ బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఊరిలో బస్సెక్కి కరీంనగర్ వెళ్తున్న క్రమంలో కన్నుమూశాడు. కరీంనగర్(Karim Nagar) వెళ్లిన తరువాత గుర్తించిన బస్సు కండక్టర్.. పోలీసులకు సమాచారం అందించాడు. గుండెపోటు(Heart Attack)తోనే అతను చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఓదెలు హఠాన్మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
రన్యారావుకు ఏమైంది.. వైరల్ గా మారిన ఫోటో..!
న్యూఢిల్లీ: బంగారం స్మగ్మింగ్ కేసులో భాగంగా ప్రస్తుతం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) కస్టడీలో ఉన్న కన్నడ నటి రన్యారావుకు చెందిన తాజా ఫోటో వైరల్ గా మారింది. ఆమె కంటి కింద గాయాలు, ఉబికిన మొహంతో ఆమె ఫోటోలో ఉంది. ఆమెను కస్టడీలో తీసుకుని విచారణ పేరుతో చిత్ర హింసలు పెట్టారా? అనే అనుమానం కలుగుతోంది. దీనిపై కర్ణాకట మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధానంగా వైరల్ గా మారిన ఫోటోను ఉటంకిస్తూ మహిళా కమిషన్ చైర్మన్ నాగలక్ష్మీ చౌదరి అనుమానం వ్యక్తం చేశారు. ఆమెపై అధికారులు దాడికి పాల్పడ్డారా? అనే ప్రశ్న లేవనెత్తారు. అయితే దీనిపై తాము నేరుగా దర్యాప్తు చేసే అవకాశం లేదన్నారు. రన్యారావు తముకు ఏమైనా ఫిర్యాదు చేస్తే ఆమెకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు నాగలక్ష్మి,‘ మాకు ఆమె లేఖ రూపంలో ఫిర్యాదు చేస్తే మేము సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆమె నుంచి ఫిర్యాదు అందిన పక్షంలో తమ పరిధిలో ఉన్న ఆయా విభాగాలను అప్రమత్తం చేస్తాం. సరైన రీతిలో దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఆమె ఏమైనా దాడికి గురయ్యిందా అనేది ఆమె ఫిర్యాదు రూపంలో ఇస్తేనే మేము ఏమైనా చేయగలం. ఒకవేళ ఆమె మమ్మల్ని సంప్రదించకపోతే దీనిపై కనీసం కామెంట్ కూడా చేయలేం’ అని మహిళా కమిషన్ చైర్ పర్సన్ నాగలక్ష్మి పేర్కొన్నారు.కాగా, విదేశాల నుంచి బంగారు కడ్డీలను తరలిస్తూ పట్టుబడ్డ కన్నడ నటి రన్యారావు.. తాను అమాయకరాలునని అంటోంది. తాను ట్రాప్ లో పడ్డానని, కావాలని ఇలా అక్రమంగా బంగారు కడ్డీలను తరలించలేదని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్((DRI)అధికారుల ముందు బోరుమంది.తాను నేరం చేసినట్లు ఒప్పుకుంటూనే, ఇది తాను కావాల్సి చేసిన పని కాదని అధికారుల ముందు చెప్పినట్లు తెలుస్తోంది. డీఆర్ఐ అధికారుల తాజా విచారణలో తాను దుబాయ్ తో పాటు, యూరప్, అమెరికా, మిగతా మిడిల్ ఈస్ట్ దేశాలను తిరిగి వచ్చినట్లు పేర్కొంది.ప్రస్తుతం డీఆర్ఐ విచారణ ఎదుర్కొంటున్న క్రమంలో రన్యారావుకు చెందిన ఎలక్ట్రానిక్స్ పరికరాలను అధికారాలు ముందుగా సీజ్ చేశారు. మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్ తదితర వస్తువుల్ని డీఆర్ఐ అధికారులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆమెకు ఎవరితో లింకులు ఉన్నాయనే కోణాన్ని కూడా పరిశీలిస్తున్నారు. 2024 నుంచి ఆమె జరిపిన ఫైనాన్షియల్ వ్యవహారాలపై కూడా ఆరా తీస్తున్నారు. అసలు ఈ రాకెట్ వెనుక మాస్టర్ మైండ్స్ ఎవరు అనే కోణంలో ప్రధానంగా దర్యాప్తు సాగుతోంది.కాగా, గత సోమవారం 12 కేజీలకు పైగా బంగారం కడ్డీలను తన బెల్ట్ లో పెట్టుకుని దుబాయ్ నుంచి అక్రమంగా తరలిస్తూ రన్యారావు పట్టుబడిన సంగతి తెలిసిందే. బెంగూళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆమె అధికారులకు చిక్కింది. ప్రస్తుతం ఆమె మూడు రోజుల డీఆర్ఐ అధికారుల కస్టడీలో ఉంది. దీనిలో భాగంగా ఆమెను విచారిస్తున్న అధికారులు ఇందులో ‘కింగ్ పిన్’ ఎవరు అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు.రన్యారావు కేసు.. వెలుగులోకి కొత్త విషయాలు -
లేడీస్ హాస్టల్లో స్పై కెమెరా కలకలం.. వెలుగులోకి సంచలన విషయాలు
సాక్షి, సంగారెడ్డి జిల్లా: కిష్టారెడ్డి పేట మైత్రి విల్లాస్ లేడీస్ హాస్టల్లో స్పై కెమెరాల గుర్తింపుతో ఒక్కసారిగా కలకలం రేగింది. బండారు మహేశ్వర్ అనే వ్యక్తి నడుపుతున్న హాస్టల్లో స్పై కెమెరాలను విద్యార్థినులు గుర్తించారు. విల్లా నంబర్ 75లోని హాస్టల్లో కెమెరాను గుర్తించారు. విద్యార్థుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన అమీన్ పూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడ్ని పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి పోలీసులు విచారిస్తున్నారు. స్పై కెమెరాలోని పలు చిప్స్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు.కాగా, లేడీస్ హాస్టల్లో స్పై కెమెరా ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంట్లో భార్య, తల్లి గొడవ పడుతున్నారనే కారణంగా మహేశ్వరరావు అనే వ్యక్తి మొదట ఇంట్లో స్పై కెమెరా పెట్టినట్లు సమాచారం. ఇంతటితో ఆగకుండా ఎవరు ఏం చేస్తున్నారో తెలుసుకునేందుకు అమెజాన్‌లో ఓ కెమెరాను కొనుగోలు చేసిన మహేశ్వరరావు.. ఆ తర్వాత హాస్టల్ కిచెన్‌లో సీక్రెట్ కెమెరా పెట్టాడు. ఎవరికి తెలియకుండా అమ్మాయిల రూమ్‌లో కూడా కెమెరా పెట్టాడు. ఓ యువతి కెమెరా చూసి పసిగట్టడంతో ఈ బాగోతం బయటపడింది. -
ఆర్టీసీ బస్సు-లారీ ఢీ.. ఐదుగురు మృతి
తిరుత్తణి: తమిళనాడులోని తిరుత్తణి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు. 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. మరో 20 మందికి తీవ్రంగా గాయపడ్డారు.స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
Nishant Tripathi : ‘భార్యకు ప్రేమతో’.. కంపెనీ సైట్లో కంటతడి పెట్టిస్తోన్న లేఖ
ముంబై : ‘ఓయ్ నిన్నే.. నీపై నాకు ప్రేమ అనంతం. నేను నీకు ప్రామీస్ చేస్తున్నా అది ఎప్పటికీ చెరిగిపోదు’ అంటూ ఓ భర్త తన భార్యపై అమితమైన ప్రేమను వ్యక్తం చేస్తూ ఓ లేఖ రాశాడు. అనంతరం, నా చావుకు నా భార్య, ఆమె అత్తే కారణమని ఆ లేఖలో రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘ఆత్మహత్యకు గల కారణాలేంటో మా అమ్మకు బాగా తెలుసు. నా మరణం తర్వాత.. మీరు (భార్యను,భార్య అత్తను ఉద్దేశిస్తూ) ఆమెను ఇబ్బంది పెట్టకండి. ఇప్పటికే ఆమె మనసు విరిగిపోయింది. ఇకనైనా ఆమెను మనశాంతిగా ఉండనివ్వండి’ అంటూ విజ్ఞప్తి చేశాడు. ముంబైలో యానిమేటర్‌గా పని చేస్తున్న నిషాంత్ త్రిపాఠి (Nishant Tripathi) గత శనివారం ముంబైలో సహారా హోటల్ (sahara hotel mumbai) రూంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే, తమ హోటల్లో రూం బుక్ చేసి మూడురోజులవుతున్నా.. ఎప్పుడు వెళ్లినా ‘డు నాట్ డిస్ట్రబ్’ అనే బోర్డ్ తగిలించే ఉంది. దీంతో సహార హోటల్ యాజమాన్యానికి అనుమానం వచ్చి నిషాంత్ త్రిపాఠి ఉన్న రూంను పరిశీలించింది. త్రిపాఠిని పిలిచే ప్రయత్నించింది. సిబ్బంది ఎంత సేపటికి పిలుస్తున్నా హోటల్ గది నుంచి ఎలాంటి స్పందన రాలేదు.ఉరికి వేలాడుతూ సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాస్టర్ కీ సాయంతో హోటల్ రూంను ఓపెన్ చేసి చూడగా ఉరికి వేలాడుతూ త్రిపాఠి కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుడి తల్లి,మహిళా హక్కుల కార్యకర్త నీలం చతుర్వేది ఫిర్యాదుతో బాధితుడి భార్య అపూర్వ పరేఖ్, భార్య అత్త ప్రార్థనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ‘భార్యకు ప్రేమతో’.. కంపెనీ సైట్లో సూసైడ్ నోట్పోలీసుల దర్యాప్తులో బాధితుడు త్రిపాఠి కంపెనీ వెబ్సైట్లో అప్లోడ్ చేసిన ఆత్మహత్య లేఖను స్వాధీనం చేసుకున్నారు. ఆ లేఖలో అతను తన భార్య పట్ల తనకున్న ప్రేమను వ్యక్తం చేశాడు. తన మరణానికి ఆమెను, ఆమె అత్తే కారణమన్నారు. అంతేకాదు, భార్యపై తనకున్న ప్రేమను వ్యక్తం చేస్తూ.. ‘నువ్వు ఈ లేఖ చదివే సమయానికి నేనుండనేమో. నా చివరి క్షణాల్లో జరిగిన ప్రతిదానికీ నేను నిన్ను ద్వేషించేవాడినే. కానీ నేను అలా చేయను. చావు ముందు క్షణం వరకు నేను ప్రేమనే ఎంచుకుంటాను. అప్పుడు..ఇప్పుడు..ఎప్పుడూ నేను నిన్నే ప్రేమిస్తుంటాను. ఇప్పుడు కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను మాటిచ్చినట్లు నీపై నా ప్రేమ ఎప్పటికీ మసకబారదు’ అని రాశాడు.నా తలకొరివి పెట్టాల్సింది పోయితన కుమారుడి మరణంపై త్రిపాఠి తల్లి నీల చతుర్వేది (neelam chaturvedi) ఫేస్బుక్ (meta)లో సుదీర్ఘంగా ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్‌లో నేను నా జీవితాన్ని మహిళల హక్కులు, లింగ సమానత్వం కోసం నా జీవితాన్ని అంకితం చేశాను. ఇప్పుడు నా జీవితం ఇప్పుడు ముగిసింది. నా కొడుకు నిషాంత్ నన్ను విడిచిపెట్టి వెళ్లిపోయాడు. నన్ను జీవత్సవాన్ని చేశాడు. నాకు అంత్యక్రియలు చేయాల్సిన కొడుక్కే ఈరోజు ఈరోజు మార్చి 2న ముంబైలో ఈకో మోక్షాలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నా. నా కుమార్తె ప్రాచి తన అన్నయ్య అంత్యక్రియలు నిర్వహించింది. ఇంతటి విషాదంలో నా కుమార్తె ప్రాచిలో ధైర్యాన్ని నూరి పోయిండి అంటూ వేడుకుంది.కాగా, భార్యల వేధింపుల కారణంగా ఆత్మహత్య కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మగవారికి అనుకూలంగా ఉండేలా చట్టాలు తేవాలనే డిమాండ్లు కొనసాగుతున్న ఆందోళనల మధ్య ఈ దుర్ఘటన జరగడంపై సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. -
నాకేమీ తెలీదు.. ట్రాప్‌లో పడ్డాను: బోరుమన్న రన్యారావు
బెంగళూరు: విదేశాల నుంచి బంగారు కడ్డీలను తరలిస్తూ పట్టుబడ్డ కన్నడ నటి రన్యారావు.. తాను అమాయకరాలునని అంటోంది. తాను ట్రాప్ లో పడ్డానని, కావాలని ఇలా అక్రమంగా బంగారు కడ్డీలను తరలించలేదని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్((DRI)అధికారుల ముందు బోరుమంది.తాను నేరం చేసినట్లు ఒప్పుకుంటూనే, ఇది తాను కావాల్సి చేసిన పని కాదని అధికారుల ముందు చెప్పినట్లు తెలుస్తోంది. డీఆర్ఐ అధికారుల తాజా విచారణలో తాను దుబాయ్ తో పాటు, యూరప్, అమెరికా, మిగతా మిడిల్ ఈస్ట్ దేశాలను తిరిగి వచ్చినట్లు పేర్కొంది.గతేడాది కూడా ఇదే తరహాలో,..ప్రస్తుత రన్యారావు కేసుకు, గతేడాది చెన్నైలో జరిగిన బంగారం స్మగ్మింగ్ కేసుకు పోలికలు ఉండటంతో ఆ కోణంలో విచారణ ఆరంభించారు అధికారులు. గత సంవత్సరం సాఫ్ట్ వేర్ ఉద్యోగి భార్య 12 కేజీల బంగారాన్ని దుబాయ్ నుంచి తరలిస్తూ అధికారులకు పట్టుబడింది. అయితే తాను ఒక ఫ్రెండ్ వలలో చిక్కుకునే బంగారం స్మగ్మింగ్ చేసినట్లు ఆమె వెల్లడించింది. ఇప్పుడు ఈ కేసును కూడా అదే కోణంలో పరిశీలిస్తున్నారు పోలీసులు. ఇందులో ఎవరు పాత్ర ఉందనే దానిపై ఆరా తీస్తున్నారు. తాను ట్రాప్ లో చిక్కుకునే ఈ కథ నడిపినట్లు ఆమె పేర్కొనడంతో దీని వెనుక ఎవరున్నారు అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.ఆమె ఎలక్ట్రానిక్ పరికరాలు సీజ్..ప్రస్తుతం డీఆర్ఐ విచారణ ఎదుర్కొంటున్న క్రమంలో రన్యారావుకు చెందిన ఎలక్ట్రానిక్స్ పరికరాలను అధికారాలు ముందుగా సీజ్ చేశారు. మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్ తదితర వస్తువుల్ని డీఆర్ఐ అధికారులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆమెకు ఎవరితో లింకులు ఉన్నాయనే కోణాన్ని కూడా పరిశీలిస్తున్నారు. 2024 నుంచి ఆమె జరిపిన ఫైనాన్షియల్ వ్యవహారాలపై కూడా ఆరా తీస్తున్నారు. అసలు ఈ రాకెట్ వెనుక మాస్టర్ మైండ్స్ ఎవరు అనే కోణంలో ప్రధానంగా దర్యాప్తు సాగుతోంది.కాగా, గత సోమవారం 12 కేజీలకు పైగా బంగారం కడ్డీలను తన బెల్ట్ లో పెట్టుకుని దుబాయ్ నుంచి అక్రమంగా తరలిస్తూ రన్యారావు పట్టుబడిన సంగతి తెలిసిందే. బెంగూళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆమె అధికారులకు చిక్కింది. ప్రస్తుతం ఆమె మూడు రోజుల డీఆర్ఐ అధికారుల కస్టడీలో ఉంది. దీనిలో భాగంగా ఆమెను విచారిస్తున్న అధికారులు ఇందులో ‘కింగ్ పిన్’ ఎవరు అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు. -
హైదరాబాద్ పిల్లల అమ్మకాల కేసులో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: నగరంలో కలకలం రేపిన పిల్లల అమ్మకాల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో కీలక సూత్రధారి వందనను పోలీసులు అరెస్ట్ చేశారు. అహ్మదాబాద్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చి హైదరాబాద్‌లో అమ్మిన వందన.. నలుగురు బ్రోకర్లకు నలుగురు పిల్లలను విక్రయించింది. అహ్మదాబాద్‌కు చెందిన వందనను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు.ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. వందన.. ఆసుపత్రుల నుంచి, రోడ్లపై చెత్త ఏరుకునే వారి పిల్లలను అపహరించినట్లు తమ విచారణ తేలినట్లు పోలీసులు వెల్లడించారు. పేద తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా పిల్లలను కొనుగోలు చేసినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. వందనను 5 రోజుల పాటు పోలీసులు కస్టడీ కోరారు. -
మానసిక పరిస్థితి బాగా లేక వివాహిత..
ఉమ్మడి జిల్లాలో వేర్వేరు కారణాలతో నలుగురు బలవన్మరణం చెందారు. అప్పుల బాధతో ఆటోడ్రైవర్, అనారోగ్యంతో ఒకరు, భార్య కాపురానికి రావడం లేదని మరొకరు ఉరేసుకున్నారు. మానసిక పరిస్థితి బాగా లేక వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.మానసిక పరిస్థితి బాగా లేక వివాహిత..మంచిర్యాలక్రైం: మానసిక పరిస్థితి బాగాలేక వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సీఐ కిరణ్‌కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. జిల్లాకేంద్రంలోని గోపాలవాడకు చెందిన కనవేణి సతీశ్, రాజమణి(35) భార్యాభర్తలు. వీరికి ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. రాజమణి గత కొంతకాలంగా మానసికంగా బాధపడుతుంది. ఆస్పత్రుల్లో చూయించినా నయం కాలేదు. ప్రతీరోజు భయం, భయంగా ఉంటుంది. తమ్ముడు రఘువర్ధన్ గమనించి అక్క రాజమణికి ధైర్యం చెప్పేవాడు. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుంది. మృతురాలి తమ్ముడు ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.అప్పుల బాధతో ఆటోడ్రైవర్బజార్హత్నూర్: అప్పుల బాధతో ఆటోడ్రైవర్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై అప్పారావ్ తెలిపారు. ఎస్సై, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు..మండలంలోని జాతర్ల పంచాయతీ పరిధి రాంనగర్ గ్రామానికి చెందిన భగత్ సంతోష్ (36) ఆటో నడుపుకుని జీవనం కొనసాగిస్తుండేవాడు. కుటుంబ పోషణకు, ఆటో కొనుగోలుకు రూ.4 లక్షలు ప్రైవేటు అప్పులు చేయగా వడ్డీలు పెరిగాయి. ఆదాయం అంతంత మాత్రమే ఉండటంతో అప్పు ఎలా తీర్చాలో మదనపడేవాడు. గురువారం ఉదయం గ్రామ సమీపంలో చెట్టుకు ఉరేసుకున్నాడు. భార్య రోజా ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.అనారోగ్యంతో ఒకరు, భార్య కాపురానికి రాలేదని మరొకరుభైంసాటౌన్: భైంసా రూరల్ పోలీసుస్టేషన్ పరిధిలో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడినట్లు సీఐ నైలునాయక్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.. ఇలేగాం గ్రామానికి చెందిన అవదూత్ పెద్ద పోశెట్టి(60) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. బుధవారం సాయంత్రం తన ఇంట్లో ఉరేసుకున్నాడు. అలాగే దేగాంకు చెందిన ఇరగదెండ్ల ప్రవీణ్ (27) భార్య కాపురానికి రావడం లేదని బుధవారం రాత్రి గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. -
స్కూటీ అదుపు తప్పి.. మహిళా పోలీస్ దుర్మరణం
అనకాపల్లి: స్కూటీ (Scooty)అదుపు తప్పిన ఘటనలో మహిళా పోలీసు(Female police officer) చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి మల్కాపురం ఎస్ఐ శ్యామలరావు తెలిపిన వివరాలివి. అంగనపూడి ప్రాంతానికి చెందిన మీను భూషణ్(46) కూర్మన్నపాలెం సచివాలయంలో మహిళా పోలీసుగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె భర్త స్టీల్‌ప్లాంట్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో మీను భూషణ్ తన కుమార్తెతో కలిసి స్కూటీపై షీలానగర్ నుంచి పోర్టు ఫ్లైఓవర్ బ్రిడ్జి మీదుగా నగరం వైపు వెళ్తున్నారు. బ్రిడ్జి ఎక్కుతుండగా, ఆమె వెళ్తున్న మార్గంలో ఇద్దరు వ్యక్తులు గడ్డి పట్టుకుని రోడ్డు దాటుతున్నారు. వారిని గుర్తించిన మీను భూషణ్ వెంటనే తన స్కూటీకి అకస్మాత్తుగా బ్రేక్ వేశారు. దీంతో వాహనం అదుపు తప్పి పక్కనున్న డివైడర్‌ను ఆమె ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో మీను భూషణ్‌కు తలకు, ఆమె కుమార్తెకు శరీరంపై గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన ఇద్దరినీ చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మీను భూషణ్ గురువారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కాళ్లు పట్టుకుని బతిమిలాడాను.. -
పోలీసుల కాళ్లు పట్టుకుని బతిమిలాడాను..
ఏలూరు : ‘బండి చోరీ కేసు అంటూ.. మూడు రోజుల క్రితం మా అబ్బాయిని పోలీసులు(Police) తీసుకువెళ్లారు.. నిన్న స్టేషన్‌కు వెళ్లాను.. ఒక్కసారైనా మా అబ్బాయి ముఖం చూపించండయ్యా అని పోలీసుల కాళ్లు పట్టుకుని బతిమిలాడాను.. ఏమీ లేదమ్మా.. రేపు ఇంటికి వచ్చేస్తాడు అన్నారు.. వన్‌టౌన్, టూటౌన్, త్రీటౌన్, హనుమాన్ జంక్షన్ పోలీస్స్టేషన్లల్లో ఉన్నాడని తలో మాట చెప్పారు.. ఈరోజు చూస్తే జీజీహెచ్‌లో శవమై కనిపించాడు’ అంటూ బాలుడి తల్లి వనిత బోరున విలపించింది. పదో తరగతి విద్యార్థి(Tenth grade student) (16) ఒంటిపై, అరికాళ్లపై దెబ్బలతో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం ఏలూరులో తీవ్ర సంచలనంగా మారింది. అసలేం జరిగిందంటే.. ఏలూరులోని చేపలతూము ప్రాంతానికి చెందిన బంగారు శివ చింతలపూడిలోని విద్యాశాఖలో అ టెండర్‌గా పనిచేస్తున్నారు. శివ చిన్న కుమారుడు యశ్వంత్‌కుమార్ (16) ఏలూరులోని ప్రభుత్వ హై సూ్కల్లో పదో తరగతి చదువుతున్నాడు. మూడు రోజుల క్రితం ఏలూరు సీసీఎస్ పోలీసులు బండి చోరీ కేసులో రికవరీల కోసమని యశ్వంత్‌తో పాటు మరో ఆరుగురు పిల్లలను తీసుకువెళ్లారు. అయితే వారిని సీసీఎస్ స్టేషన్లో కాకుండా వేరే ప్రాంతంలో ఉంచి విచారించారు. ఈ నేపథ్యంలో తన కుమారు డి కోసం యశ్వంత్ తల్లి వనిత రెండు రోజులుగా పోలీస్స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోలేదు. ఈ క్రమంలో గురువారం వేకువజామున 5 గంటల సమయంలో పెదవేగి మండలం మొండూ రు ప్రాంతంలో గోదావరి కుడికాల్వ గట్టుపై య శ్వంత్ అపస్మారక స్థితిలో పడి ఉండగా.. గుర్తించి ఏలూరు జీజీహెచ్‌కు తరలించారు. అయితే బా లుడు అప్పటికే మృతి చెందడంతో మార్చురీలో పెట్టి కనీసం కుటుంబ సభ్యులకు కూడా పోలీసులు సమాచారం ఇవ్వలేదు. మార్చురీ వద్ద ఆందోళన మార్చురీ సిబ్బంది ద్వారా యశ్వంత్ మృతి వార్త తెలిసిన తల్లిదండ్రులు శివ, వనిత, సోదరుడు కృష్ణవర్ధన్ బంధువులతో కలిసి జీజీహెచ్‌కు వచ్చారు. యశ్వంత్ మృతదేహాన్ని చూసి బోరున విలపించా రు. అరికాళ్ల నుంచి చాతీ వరకూ తీవ్ర గాయాలయ్యేలా నిర్దాక్షిణ్యంగా పోలీసులే కొట్టి చంపేసి, శవాన్ని ఎక్కడో పడేశారంటూ విలపించారు. తమ కుమారుడి మృతికి న్యాయం చేయాలంటూ మార్చురీ వద్ద బైఠాయించి దీనిపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తామని ఆందోళనకు దిగారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చొదిమెళ్లలో జరిగిన బస్సు ప్రమాద బాధితులను పరామర్శించడానికి కలెక్టర్ వెట్రిసెల్వి జీజీహెచ్‌కు రాగా ఆమెను కలిసి యశ్వంత్ మృతిపై ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీతో మాట్లాడి విచారణకు ఆదేశించి న్యాయం చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. భిన్నంగా పెదవేగిలో ఫిర్యాదు ఇదిలా ఉండగా పెదవేగి పోలీస్‌స్టేషన్‌లో భిన్నంగా ఫిర్యాదు నమోదైంది. పోలీసులు, చోటా నేతల ఒత్తి ళ్లతో యశ్వంత్ సోదరుడు కృష్ణవర్ధన్‌తో పెదవేగి పో లీసులు ఫిర్యాదు తీసుకున్నారు. ఈనెల 5న తన సో దరుడు ఇంటి నుంచి బయటకు వెళ్లాడని, 6న మొండూరు కాల్వ గట్టుపై అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పెదవేగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలుడిని జీజీహెచ్‌కు తరలించగా అప్పటికే మృతిచెందాడని, మార్చురీకి తరలించి తమకు సమాచారం ఇచ్చారని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
నాన్న.. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు..
కాజీపేట రూరల్: పెళ్లి (marriage)చేసుకోవడం ఇష్టం లేదని ఓ విద్యార్థిని కాజీపేట జంక్షన్ రైల్వే(Kazipet Junction Railway) యార్డులో గురువారం తెల్లవారు జామున ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా పోలీసులు అదుపులోకి తీసుకోని ఆమె తండ్రికి అప్పగించిన సంఘటన కాజీపేటలో జరిగింది. జీఆర్పీ కానిస్టేబుల్ ఆర్.కమలాకర్ తెలిపిన వివరాల ప్రకారం. మహబూబాబాద్ జిల్లాకు చెందిన నందిని హాస్టల్లో ఉంటూ బీటెక్ చదువుతోంది. ఇంటికి వచ్చిన నందినికి పెళ్లి చేస్తానని చెప్పడంతో తల్లి కూతుళ్ల మధ్య గొడవ జరిగింది. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని నందిని బుధవారం ఇంటి నుంచి వచ్చి కాజీపేట రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. అదే రోజు రాత్రి నందిని కాజీపేటలో ప్రయాణికుడి సెల్‌ఫోన్ నుంచి తండ్రికి ఫోన్ చేసి కాజీపేట రైల్వే స్టేషన్లో ఉన్నానని, రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పింది. అప్రమత్తమై తండ్రి మహబూబాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై సమాచారంతో కాజీపేట జీఆర్పీ పోలీసులు రైల్వే యార్డు ఆర్ఆర్ఐ సమీపంలో ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధంగా ఉన్న నందినిని గుర్తించి అదుపులోకి తీసుకోని జీఆర్పీ స్టేషన్‌కు తరలించారు. తండ్రిని పిలిపించి జీఆర్పీ అధికారుల ఆదేశాలనుసారం నందినిని తండ్రి అప్పగించినట్లు ఆయన తెలిపారు.మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి జైలు, జరిమానామడికొండ : మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి కోర్టు జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది. మడికొండ ఇన్స్పెక్టర్ కిషన్ తెలిపిన వివరాల ప్రకారం.. కాజీపేట మండలం రాంపేట గ్రామానికి చెందిన మీరాల రాజు 2017, జూలై 22న సాయంత్రం అదే గ్రామానికి చెందిన ఓ మహిళ ఇంట్లోకి ప్రవేశించి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. అప్పటి ఎస్సై మధుప్రసాద్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయగా, విచారణలో భాగంగా గురువారం కానిస్టేబుల్ వి.రాజేష్ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టాడు. ప్రాసిక్యూషన్ తరఫున ఎస్.దుర్గబాయ్ వాదించగా నిందితుడిపై నేరం రుజువైంది. దీంతో హనుమకొండ మొదటి అదనపు న్యాయమూర్తి చింతాడ శ్రావణ స్వాతి నిందితుడికి ఏడాది జైలు శిక్షతో పాటు రూ.6,000ల జరిమానా విధించినట్లు ఇన్స్పెక్టర్ కిషన్ తెలిపారు. -
వీడియో: కర్ణాటకలో దారుణం.. పెళ్లి పేరుతో మైనర్‌ను బలవంతంగా లాక్కెళ్లి..
బెంగళూరు: మన దేశంలో బాల్య వివాహాలపై ఎన్ని చట్టాల తెస్తున్నా ఎక్కడో ఒక చోట మైనర్లకు బలవంతపు పెళ్లిళ్లు చేస్తూనే ఉన్నారు. మైనర్లకు ఇష్టం లేని పెళ్లిళ్లు చేసి వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే కర్ణాటకలో చోటుచేసుకుంది. ఓ 14 ఏళ్ల బాలికకు పెళ్లి చేసి, ఆమెను బలవంతంగా కాపురానికి పంపే ప్రయత్నంలో ఒక పశువును లాక్కెళ్లినట్లు లాక్కెళ్లారు. భార్యను ఆమెను ఎత్తుకుని పరుగు తీశాడు. దీంతో, అక్కడున్న వారు.. ఆమెను కిడ్నాప్ చేశారని అనుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల ప్రకారం..తమిళనాడులోని హోసూర్ సమీపంలోని తొట్టమంజు పర్వత ప్రాంతంలోని తిమ్మత్తూర్ అనే చిన్న గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలిక.. స్థానిక పాఠశాలలో ఏడో తరగతి వరకు చదివి, ఆ తర్వాతి ఇంటి వద్దే ఉంటోంది. ఈ క్రమంలో ఆమెకు పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు భావించి.. కర్ణాటకలోని కాలికుట్టై పర్వత గ్రామానికి చెందిన మాదేష్(29)తో వివాహం జరిపించారు. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని ఎంత చెప్పినా తల్లిదండ్రులు పట్టించుకోలేదు. ఇక, ఇటీవలే వీరి వివాహం బెంగళూరులో జరిగింది. అనంతరం, సదరు బాలిక తన స్వగ్రామానికి వచ్చేసింది. ఈ క్రమంలో అత్తారింటికి వెళ్లేందుకు నిరాకరించింది."என்னை விடுங்க.." உயிரை வெறுத்து கதறிய சிறுமி.. குண்டுக்கட்டாக தூக்கி சென்ற இளைஞர் - ஷாக்கிங் வீடியோ#childmarriage #hosur #thanthitv pic.twitter.com/lheSh1UjZ8— Thanthi TV (@ThanthiTV) March 6, 2025అయితే, పెళ్లి తర్వాత అత్తారింటికి వెళ్లాలని పేరెంట్స్.. ఆమెకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఆమె వినలేదు. దీంతో, భర్త మాదేష్, అతడి కుటుంబ సభ్యులు బాలిక ఇంటి వచ్చారు. బలవంతంగా ఆమెను తమ ఇంటికి తీసుకెళ్లారు. ఓ గొర్రె పిల్లను బలవంతంగా బలికి తీసుకెళ్లినట్లు ఎత్తుకెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఆమె కేకలు వేస్తూ కన్నీరు పెట్టుకుంది. ఈ దృశ్యాలను కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. మరికొందరు ఆమెకు కిడ్నాప్ చేస్తున్నారని అనుకున్నారు. ఈ వీడియో పోలీసులకు చేరడంతో వారిపై పోక్సో చట్టం, బాల్య వివాహ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇక, బాధితురాలు ప్రస్తుతం తన అమ్మమ్మ ఇంట్లో ఉంటోంది. -
HYD: మద్యం మత్తులో యువతి హల్చల్.. బైక్‌ను ఢీకొట్టి..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కేపీహెచ్‌బీ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. మద్యం సేవించిన యువతి అతి వేగంతో కారు నడిపి బైకును ఢీకొట్టింది. ఈ క్రమంలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తికి గాయాలు కావడంతో పోలీసులను ఆశ్రయించారు.వివరాల ప్రకారం.. మద్యం సేవించిన యువతి కారు నడిపి కూకట్‌పల్లిలో గురువారం అర్థరాత్రి బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో అతి వేగంగా డ్రైవ్ చేసి ఓ బైకర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకర్‌కు గాయాలు కావడంతో సదరు వ్యక్తి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో, అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు చేయగా 212 పాయింట్స్ రీడింగ్ నమోదైంది. దీంతో, ఆమెపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. -
దుబాయ్ ట్రిప్.. 'రన్యా రావ్'కు ఎంత కమీషన్ ఇచ్చేవారంటే..
బంగారం అక్రమ రవాణా కేసులో పట్టుబడిన నటి రన్యా రావ్ కేసు కీలక మలుపు తిరిగింది. కిలో బంగారం రవాణాకు రన్యారావ్‌కు రూ.5 లక్షల కమీషన్ అందిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నటి పాత్రధారి కాగా అసలైన సూత్రధారి వేరే వ్యక్తి అని తెలిసింది. నటి రన్యారావ్‌ను డీఆర్ఏ అధికారులు తీవ్ర విచారణ చేపట్టగా నేను పాత్రధారి మాత్రమే అని, అసలు వ్యక్తి వేరేవారని తెలిపింది. రూ.17 కోట్లు విలువ చేసే బంగారం కొనుగోలు చేసే శ్రీమంతురాలు కాదు. ఈమె సీనియర్ పోలీస్ అధికారి పెంపుడు కూతురు కావడంతో ఆమెను ఈ దందాకు వాడుకుంటే చాలా సులభంగా బంగారం రవాణా చేయవచ్చనే అంచనాతో నటి రన్యారావ్‌ను బంగారం రవాణాకు వాడుకున్నారు. అక్రమ బంగారం రవాణాలో విమానాశ్రయంలోని కొందరు అధికారులు కూడా కుమ్మకైనట్లు అనుమానం వ్యక్తమైంది. డీఆర్ఐ అధికారులు ఈ కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు. కిలో బంగారం రవాణా కోసం రన్యారావ్‌కు రూ.5 లక్షలు కమీషన్ ఇస్తున్నట్లు తెలిసింది. కమీషన్‌తో పాటు రాకపోకలు, బస, ఇతర ఖర్చులకు మొత్తంగా రూ.12 లక్షలు వసూలు చేసేదని విచారణలో తేలింది. ఒక్క ట్రిప్‌లో ఆమె సుమారు పది కేజీలకు పైగానే బంగారం అక్రమ రవాణా చేసేదని పోలీసులు గుర్తించారు. రన్యారావ్ బెంగళూరుకు తీసుకువచ్చిన బంగారం ఎవరికి ఇస్తుంది అనేదానిపై అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. గత రెండేళ్లుగా రన్యారావ్ వాడుతున్న బ్యాంక్ అకౌంట్ మొబైల్‌ను అదికారులు స్వాధీనం చేసుకున్నారు. డీఆర్ఐ అధికారులు అసలు సూత్రధారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.అయితే, ఈ అక్రమ బంగారం రవాణా స్టోరీలో ఆమెకు ఓ రాజకీయ నాయకుడి సహకారమూ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రన్యా రావుకు పరిచయం ఉన్న నాయకులతో పాటు ఇతర అధికారుల పేర్లు విచారణలో తెలుస్తాయని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య న్యాయ సలహాదారు, ఎమ్మెల్యే ఏఎస్ పొన్నణ్ణ పేర్కొన్నారు. కొందరు స్మగ్లర్లతో ఆమెకు సంబంధం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఆమె సుమారు 30 సార్లు దుబాయ్ వెళ్లి వచ్చినట్లు సమాచారం.అధికారితో గొడవ వల్లే దొరికిపోయిందికొద్దిరోజుల క్రితం రన్యా రావు దుబాయ్ నుంచి బెంగళూరుకు వచ్చిన సమయంలో విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారితో ఆమె గొడవకు దిగింది. తన బంధువు పేరును వాడుకున్న ఆమె తన దర్పాన్ని ఆ అధికారి వద్ద ప్రదర్శించింది. ఈ గొడవే ఆమెకు చిక్కులు తెచ్చిపెట్టింది. ఆ ఘటన వల్ల రన్యా రావు రాకపోకల వివరాలను ఆ అధికారి పరిశీలించారు. ఈ క్రమంలో గతంలో ఆమె ఎక్కడెక్కడకు ప్రయాణం చేశారో చెక్ చేశారు. అయితే, ఆమె తరచూ దుబాయ్‌కు వెళ్లి వస్తుండటమే కాకుండా.. వెళ్లిన ప్రతిసారీ ఒకే రకమైన దుస్తులు ధరించి కనిపిస్తుండటంతో ఆయన అనుమానించారు.ఈసారి ఆమె దుబాయ్ నుంచి మళ్లీ వచ్చినప్పుడు సోదాలు చేయాలని పక్కా ప్రణాళికతో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆమె బంగారం బిస్కెట్లతో దొరికిపోయింది. -
యూఏఈలో మరో ఇద్దరు భారతీయులకు మరణశిక్ష అమలు
దుబాయ్: యూఏఈలో మరో ఇద్దరు భారతీయులకు మరణశిక్ష అమలైంది. హత్య కేసులో కేరళకు చెందిన ఇద్దరికి మరణశిక్ష అమలు చేసినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖకు యూఏఈ అధికారులు తాజాగా స్పష్టం చేశారు.కేరళ రాష్ట్రంలోని కన్నూర్ కు చెందిన మహ్మద్ రినాష్, పీవీ మురళీధరన్ లకు మరణశిక్ష అమలు చేసిన విషయాన్ని భారత విదేశాంగ శాఖ దృష్టికి తీసుకొచ్చారు. వివరాల్లోకి వెళితే.. ట్రావెల్ ఏజెన్సీ ఏఐ ఎయిన్ లో పని చేసిన రినాష్.. ఓ హత్య కేసులో ఇరుక్కున్నాడు. యూఏఈకి చెందిన ఓ వ్యక్తిని హత్య చేసిన నేరం కింద మరణశిక్ష అమలు చేయగా,. మురళీధరన్ అనే వ్యక్తి భారత్ కు చెందిన ఓ వ్యక్తిని హత్య చేసిన కేసులో మరణశిక్షను అమలు చేశారు.వీరి హత్య కేసులో భాగంగా కావాల్సిన అన్ని న్యాయపరమైన ఏర్పాట్లు చేసినట్లు భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అయితే వారిపై ఉన్నవి హత్యానేరాలు కావడంతో మరణశిక్ష అమలు తప్పలేదని, వారి చివరి మజిలీలో భాగంగా కుటుంబ సభ్యుల్లో ఇద్దరి చొప్పున అక్కడికి వెళ్లేందుకు ఏర్పాటు చేసినట్లు విదేశాంగ అధికారులు పేర్కొన్నారు. ఫిబ్రవరి 28వ తేదీనే వీరికి మరణశిక్షను ఖరారు చేయగా, తాజాగా వారి శిక్షను అమలు చేశారు. ఇప్పటిరవకూభారత్ కు చెందిన 28 మంది యూఏఈలో మరణశిక్ష బారిన పడ్డారు. ఇటీవల మార్చి 3వ తేదీన ఒక మహిళకు కూడా మరణశిక్షను అమలు చేసిన సంగతి తెలిసిందే.యూఏఈలో భారతీయ మహిళకు మరణశిక్ష అమలు -
నాన్న కాదు.. నరహంతకుడు..
దారుణాతి దారుణం.. ఘోరాతి ఘోరం.. కన్నతండ్రే కూతురికి స్వయంగా మరణశాసనం రాశాడు. దగ్గరుండి మరీ కన్నబిడ్డను కాటికి పంపాడు. కళ్లెదుట కన్నకూతురు ప్రాణాలు పోతున్నా ఆ పాషణ హృదయం కరగలేదు. ప్రేమించిన వాడిని మరిచిపోలేనని చెప్పిన పాపానికి కూతురిని కర్కశంగా బలితీసుకున్నాడో నరహంతక తండ్రి. ఈ అవమానవీయ ఘటన గురించి తెలిసిన వారందరూ భయంతో వణికిపోతున్నారు. ఇలాంటి సమాజంలో ఉన్నందుకు సిగ్గుతో తలదించుకుంటున్నారు.గుంతకల్లు రూరల్: కుమార్తె ప్రేమ వ్యవహారం (love affair) కారణంగా కుటుంబ పరువు, మర్యాద మంటగలసి పోతున్నాయనే ఉద్దేశంతో కన్న కూతురినే కడతేర్చాడో తండ్రి. అనంతపురం జిల్లా (Anantapur District) గుంతకల్లులో ఐదు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగు చూసింది. గుంతకల్లు పట్టణంలోని తిలక్ నగర్లో నివాసం ఉంటున్న తుపాకుల రామాంజనేయులు, సావిత్రి దంపతులకు నలుగురు కుమార్తెలు. హోటల్ నిర్వహణతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ముగ్గురు కుమార్తెలకు ఇదివరకే వివాహం చేశారు. చివరి కుమార్తె భారతి (20) కర్నూలులోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతోంది. ఈమె ఇంటికి సమీపంలోనే ఉంటున్న యువకుడిని ప్రేమించింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వారిస్తూ వచ్చారు. ఎంతకూ వారి మాట వినని భారతి ‘చావనైనా చస్తాను గానీ ప్రేమించిన యువకుడిని మరచిపోలేన’ని తెగేసి చెప్పింది. నిర్మానుష్య ప్రాంతంలో ఘాతుకం..తండ్రి రామాంజనేయులు ఈ నెల ఒకటో తేదీన కుమార్తెతో మరోమారు మాట్లాడి.. ఆమె మనసు మార్చే ప్రయత్నం చేశాడు. అయినా వినకపోవడంతో తనతో పాటు ఒక తాడును తీసుకొని కుమార్తెను స్కూటర్‌పై తీసుకొని కసాపురం గ్రామ శివారులోని తిక్కస్వామి తోట సమీపంలో నిర్మానుష్య ప్రాంతానికి చేరుకున్నారు. తాడుతో అక్కడి చెట్టుకు ఉరితాడు సిద్ధం చేశాడు. ఇప్పటికైనా మాట వింటావా లేక చస్తావా అని అడిగాడు. తాను చావడానికైనా సిద్ధమని స్పష్టం చేయడంతో ‘సరే చావు’ అంటూ ఆమెను ఎత్తి పట్టుకున్నాడు. వెంటనే ఆ అమ్మాయి చెట్టుకు వేలాడుతున్న ఉరితాడును తన మెడకు వేసుకుంది.కుమార్తెను మరోసారి బతిమాలిన రామాంజనేయులు ఆమె మాట వినకపోవడంతో ఉరికి వదిలేసి.. వెనక్కు తిరిగి చూడకుండా ముందుకు కదిలాడు. కొంత దూరం వచ్చాక తిరిగి వెనక్కు వెళ్లి చూడగా అప్పటికే భారతి విగతజీవిగా ఉరికి వేలాడుతోంది. దీంతో మృతదేహాన్ని కిందకు దింపి తన స్కూటర్లోని పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అక్కడి నుంచి నేరుగా ఇంటికి చేరుకున్నాడు. మూడు రోజుల తర్వాత ఈ నెల నాల్గో తేదీన గుంతకల్లు టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి.. కుమార్తెను చంపేశానని చెప్పి లొంగిపోయాడు.చదవండి: పాపం శిరీష.. ఆడపడుచు కపట ప్రేమకాటుకు బలైందికసాపురం శివారులో ఘటన జరిగినట్లుగా తెలపడంతో రామాంజనేయులుతో కలిసి రూరల్ సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్ఐ టీపీ వెంకటస్వామి, పోలీసులు మంగళవారం రాత్రి 9.30 గంటల వరకూ గాలింపు చేపట్టినా ఘటనా స్థలాన్ని గుర్తించలేకపోయారు. దీంతో బుధవారం ఉదయం మరోమారు గాలించి సంఘటన స్థలాన్ని గుర్తించారు. కాలిన మృతదేహాన్ని కొంతమేర కుక్కలు పీక్కు తిన్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడే పోస్టుమార్టం నిర్వహింపజేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
Kuppam : ప్రేమ వివాహం చేసుకుందని..!
కుప్పం: అల్లారుముద్దుగా పెంచిన ఒక్కగానొక్క కూతురు కులాంతర వివాహం చేసుకోవడాన్ని తండ్రి జీరి్ణంచుకోలేకపోయాడు. పెద్దల సమక్షంలో పంచాయితీ చేసి, రాజీ కుదుర్చుతుండగా అమ్మాయి తండ్రి ప్రేమికులపై దాడి చేశాడు. దీంతో ప్రేమికులతో పాటు మధ్యవర్తులకూ గాయాలయ్యాయి. ఈ సంఘటన కుప్పం పట్టణం ఆర్అండ్బీ అతిథిగృహంలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే.. గుడుపల్లె మండలం అగరం కొత్తూరు గ్రామానికి చెందిన శివశంకర్, కోదండప్ప అనే వ్యక్తులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరిద్దరు పక్కపక్క ఇళ్లలో నివసిస్తూ పిల్లలను చదివిస్తున్నారు. ఈ క్రమంలో కోదండప్ప కుమారుడు చంద్రశేఖర్, శివశంకర్ కుమార్తె కౌసల్య ఇరువురు గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కౌసల్య ఒక్కగానొక్క కూతురు కావడంతో శివశంకర్ కూతుర్ని గారాబంగా పెంచి డిగ్రీ చదివిస్తున్నాడు. కౌసల్య, చంద్రశేఖర్‌ల ప్రేమ విషయం పెద్దలకు తెలియడంతో శివశంకర్ తన కూతురు కౌసల్యను పలుమార్లు మందలించాడు. డిగ్రీ వరకు చదువుకున్న అమ్మాయిని వ్యవసాయ కూలీకి ఇచ్చి వివాహం చేయడం ఇష్టం లేదంటూ కూతురికి పలుసార్లు నచ్చజెప్పాడు.కానీ కౌసల్య ససేమిరా అనడంతో పాటు గత రెండు రోజుల క్రితం చంద్రశేఖర్‌తో పరారై తమిళనాడులోని ఓ దేవస్థానంలో ప్రేమ వివాహం చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న అగరం కొత్తూరు గ్రామస్తులు ఇరువురికి నచ్చజెప్పే ప్రయత్నంలో భాగంగా గురువారం ఆర్అండ్బీ అతిథి గృహం వద్ద పంచాయితీ ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న శివశంకర్ కత్తులతో ఒంటరిగా ఉన్న ప్రేమికులపై దాడి చేశాడు. ఈ దాడిలో కౌసల్య చంద్రశేఖర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడికి అడ్డువచ్చిన గ్రామస్తులు రమేష్, సీతారామప్పలకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే వీరిని పక్కనే ఉన్న కుప్పం వంద పడకల ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ మేరకు కుప్పం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఏలూరు: ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సును ఢీకొన్న లారీ.. ముగ్గురి మృతి
సాక్షి, ఏలూరు జిల్లా: ఏలూరు సమీపంలోని చొదిమెళ్ల వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిమెంట్‌ను లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఏలూరు ఆసుపత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తుండగా ప్రమాదం జరిగింది.లారీ లోయలో పడి ముగ్గురి మృతిమరో ఘటనలో వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని మద్దిమడుగు ఘాట్ పైన బుధవారం మధ్యాహ్నం లారీ లోయలోకి పడిన ఘటనలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళితే.. చేపల మేత లోడుతో బెంగళూరు నుంచి ఏలూరుకు వెళ్తున్న లారీ మద్దిమడుగు ఘాట్ పైన నాలుగో మలుపు వద్దకు రాగానే బ్రేక్ ఫెయిల్ అయి అదుపుతప్పి 50 అడుగులున్న లోయలోకి పడిపోయింది.లారీలోని డ్రైవర్ సాంబయ్య, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందగా.. చక్రాయపేట మండలం కప్పకుంటపల్లెకు చెందిన కె.వివేకానందరెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రమాద తీవ్రత కారణంగా లారీ మూడు ముక్కలుగా విడిపోయి కేబిన్ నుజ్జునుజ్జు అయ్యింది. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న రక్షక్ సిబ్బంది అగ్ని మాపక సిబ్బందిని, 108 అంబులెన్స్‌ను పిలిపించి క్షతగాత్రులను కాపాడే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే లారీ డ్రైవర్, క్లీనర్ మృతి చెందారు. -
అమెరికాలో కాల్పులు.. కేశంపేట యువకుడి మృతి
కేశంపేట: ఉన్నత ఆశయాలతో అమెరికా వెళ్లిన ఓ విద్యార్థి.. అక్కడ గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో మృతిచెందాడు. ఈ ఘటన తల్లిదండ్రులకు తీరని విషాదాన్ని మిగిల్చింది. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల కేంద్రానికి చెందిన వ్యాపారి గంప రాఘవులు, రమాదేవి దంపతులకు ప్రవీణ్‌కుమార్ (27), గాయత్రి సంతానం. గీతం యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తిచేసిన ప్రవీణ్.. అనంతరం 2023 ఆగస్టులో అమెరికాలోని మిల్వాకీ పట్టణంలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్లో ఎంఎస్ చదివేందుకు వెళ్లాడు. అదే పట్టణంలోని ఓ మాల్లో పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నాడు. గతేడాది డిసెంబర్ 18న ఇంటికి వచ్చిన ప్రవీణ్ జనవరి 20న తిరిగి అమెరికా వెళ్లాడు. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 2.50 నిమిషాలకు ప్రవీణ్ తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. అయితే కుటుంబ సభ్యులు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తిరిగి ఉదయాన్నే వాట్సాప్ కాల్ చేయమని మెసేజ్ పెట్టినా ప్రవీణ్ నుంచి రిప్లయ్ రాలేదు. దీంతో ఉదయం 7 గంటలకు కుమారుడి ఫోన్‌కు కాల్ చేశారు. ఫోన్ లిఫ్ట్ చేసిన అవతలి వ్యక్తులు ప్రవీణ్ వివరాలను అడగటంతో సైబర్ నేరగాళ్లు అనుకుని ఫోన్ కట్ చేశారు. మరోసారి ప్రవీణ్‌తో కలిసి రూంలో ఉండే అతని మిత్రులకు ఫోన్ చేశారు. కొద్దిసేపటి తర్వాత వివరాలు తెలుసుకున్న వారు గుర్తుతెలియని వ్యక్తులు మాల్లో ప్రవీణ్‌ను గన్‌తో కాల్చారని, బుల్లెట్ గాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడని చెప్పడంతో కుటుంబ సభ్యులు కుప్పకూలారు. ప్రవీణ్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అండగా ఉంటాం: డీకే అరుణ అమెరికాలో మృతిచెందిన ప్రవీణ్‌కుమార్ కుటుంబ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి బుధవారం ప్రవీణ్ తల్లిదండ్రులను కలిసి పరామర్శించారు. అనంతరం ఎంపీతో ఫోన్లో మాట్లాడించారు. వివరాలను అందిస్తే మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి తెచ్చేందుకు కృషి చేస్తామని ఆమె వారికి హామీ ఇచ్చారు. -
పాపం శిరీష.. ఆడపడుచు కపటప్రేమ కాటుకు బలైంది
ఆడపడుచు తప్పుడు మార్గంలో వెళ్తుంటే.. వద్దని శిరీష వారించింది. ఇది ఇలాగే కొనసాగితే పరువు పోతుందని చెప్పింది. అలా మంచి చెప్పడమే ఆమె పాలిట శాపమైంది. అదను కోసం ఎదురు చూసిన ఆడపడుచు.. కపట ప్రేమతో శిరీషను నమ్మించి బలిగొంది. నగరంలో చర్చనీయాంశమైన మలక్‌పేట శిరీష హత్య కేసులో సంచలన కోణం వెలుగు చూసింది ఇప్పుడు.. హైదరాబాద్, సాక్షి: మలక్‌పేట్ శిరీష(Malakpet Sirisha Case) హత్య కేసులో.. భర్త వినయ్, అతని సోదరి సరిత కలిసి నేరానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో తాజాగా వివాహేతర సంబంధ కోణం వెలుగుచూసింది. ఆ గుట్టు ఎక్కడ బయటపడుతుందోననే భయంతో శిరీషను సరితే హత్య చేసినట్లు తేలింది. వినయ్ సోదరి సరిత(Vinay Sister Saritha) భర్త ఒమన్‌లో ఉంటాడు. దీంతో సరిత మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం తెలియడంతో శిరీష.. పరువు పోతుందని ఆమెను మందలించింది. ఇది మనసులో పెట్టుకుని కోపంతో రగిలిపోయిన సరిత.. అవకాశం కోసం ఎదురు చూసింది. శిరీష కొంతకాలం నుంచి నిద్ర కోసం మత్తు ఇంజక్షన్లు వాడుతోంది. ఈ క్రమంలో ఈనెల 2న సరిత, శిరీష మధ్య మరోసారి ఘర్షణ జరిగింది. అయితే శిరీషకు క్షమాపణలు చెప్పినట్లు నటించిన సరిత.. ఇక నుంచి మంచిగా ఉంటానని నమ్మబలికింది. కాసేపు ఇద్దరూ కబుర్లు చెప్పున్నారు. ఆ ప్రేమ నిజమేనని శిరీష నమ్మింది. ఆపై నిద్రపోయేందుకు శిరీషకు సరితే మత్తు ఇంజక్షన్ ఇచ్చింది. అయితే.. నిద్ర మత్తులోకి జారిపోయిన శిరీషకు.. ఓవర్‌డోస్ ఇంజెక్షన్ ఇచ్చింది సరిత. అలా నిద్రలోనే ఆమె ప్రాణం తీసింది. మరుసటిరోజు శిరీషను లేపేందుకు ప్రయత్నించినట్టు.. ఆపై ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు నాటకం ఆడింది. ఈ నాటకంలో సరిత సోదరుడు, శిరీష భర్త వినయ్ కూడా భాగమయ్యాడు. శిరీష గుండెపోటుతో చనిపోయిందని డాక్టర్లతో చెప్పించింది. 👉ఆపై శిరీష సోదరి స్వాతికి.. ఫోన్ చేసి, శిరీష ఛాతి నొప్పితో మరణించినట్టు అక్కాతమ్ముడు సమాచారమిచ్చారు. ఈ విషయాన్ని స్వాతి నిజాంపేట్‌లోని మేనమామ మధుకర్‌కు చెప్పింది. అయితే తాను వచ్చేంత వరకు మృతదేహాన్ని ఆస్పత్రిలోనే ఉంచాలని ఆయన సూచించాడు. ఆపై పలుమార్లు ఫోన్‌చేసినా స్పందన లేకుండా పోయింది. దీంతో.. సదరు ఆసుపత్రి వాళ్లను ఆయన సంప్రదించాడు. వాళ్లు మృతదేహాన్ని అంబులెన్స్‌లో తీసుకెళ్తున్నట్లు సమాచారమిచ్చారు. ఆలస్యం చేయకుండా ఆయన అంబులెన్స్ డ్రైవర్ నెంబర్ తీసుకుని ఫోన్ చేసి.. ఆరా తీశారు. 👉మృతదేహాన్ని నాగర్‌కర్నూల్ దోమలపెంట(Domalpenta)కు తరలిస్తున్నట్లు ఆంబులెన్స్ డ్రైవర్ చెప్పాడు. దీంతో మధుకర్ పోలీసుల సాయంతో.. ఆ అంబులెన్స్‌ను వెనక్కి రప్పించారు. ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి.. ఆపై చాదర్‌ఘాట్ పోలీసులకు తన మేనకోడలు శిరీష మృతిపై అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదు చేశాడు.👉శిరీష మెడ చుట్టూ గాయాలు ఉండడంతో మధుకర్, ఇతర బంధువులు వినయ్‌ను నిలదీశారు. ఛాతీ నొప్పితో శిరీష కుప్పకూలినపుడు సీపీఆర్ చేశామని.. ఆ సమయంలో చేతి గోళ్లు గుచ్చుకొని ఉండవచ్చని ఒకసారి.. మృతదేహాన్ని తరలించేటప్పుడు గాయాలైనట్టు మరోసారి పొంతన లేకుండా చెప్పాడు. దీంతో బంధువులను పోలీసులను ఆశ్రయించగా.. వాళ్లు తమదైన శైలిలో విచారించి అసలు విషయం బయటకు లాగారు. తాజాగా వచ్చిన ఉస్మానియా పోస్టు మార్టం రిపోర్టుతో ఈ కేసు మిస్టరీ వీడిపోయింది. 👉హత్య విషయం తెలిసినా దాన్ని బయటపెట్టకుండా సోదరి సరితతో కలిసి శిరీష మృతదేహాన్ని వినయ్ మాయం చేయాలనున్నాడు. దీంతో సరితకు సహకరించినందుకు వినయ్‌ను సహనిందితుడిగా చేర్చారు. పాపం శిరీషశిరీష స్వస్థలం హనుమకొండ జిల్లా పరకాల. చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో.. ముగ్గురు పిల్లల్లో చిన్నదైన శిరీషను కరీంనగర్‌కు చెందిన ఓ ప్రొఫెసర్ దత్తత తీసుకుని చదవించాడు. కాలేజీ రోజుల్లో నాగర్‌కర్నూలు జిల్లా దోమలపెంటకు చెందిన వినయ్ ఆమెను ప్రేమించాడు. అయితే అప్పటికే వినయ్ కు రెండు పెళ్లిళ్లు అయ్యాయి. మొదటిభార్యను చంపేసినట్లుగా, రెండో భార్య ఇతడి టార్చర్ తట్టుకోలేక పారిపోయినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. అయితే అవేం తెలియని శిరీష వినయ్ ప్రేమ మత్తులో ముగినిపోయింది. 2016లో వినయ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. ఈ పెళ్లి ఇష్టం లేని ప్రొఫెసర్ కుటుంబం ఆమెను దూరం పెట్టింది. ఆపై హైదరాబాద్ మలక్‌పేట జమున టవర్స్‌లో వినయ్-శిరీష్ కాపురం పెట్టారు. ప్రైవేటు ఉద్యోగం చేసిన వినయ్ ప్రస్తుతం ఖాళీగా ఉండగా... శిరీష్ నర్సుగా పని చేస్తూ భర్త, బిడ్డను పోషిస్తోంది. ఇదిలా ఉంటే.. వినయ్ తరచూ శిరీషపై అనుమానంతో హింసించేవాడని.. అందుకు ఆడపడుచు సరిత కూడా సహకరించేదని చుట్టుపక్కల వాళ్లు చెబుతున్నారు. -
కుప్పంలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటపై అమ్మాయి తండ్రి దాడి
సాక్షి, చిత్తూరు జిల్లా: కుప్పంలో దారుణం జరిగింది. ప్రేమ వివాహం చేసుకున్న జంటపై అమ్మాయి తండ్రి కత్తితో దాడి చేశారు. అడ్డుకున్న మరో ఇద్దరిపైనా కూడా దాడికి పాల్పడ్డాడు. పెద్దల సమక్షంలో రాజీ పంచాయితీ అంటూ పిలిచి నలుగురిపై విచక్షణరహితంగా కత్తితో దాడి చేశారు.ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కత్తి కడుపులో ఇరుక్కుపోయింది. బాధితులను గుడుపల్లి మండలం అగరం గ్రామానికి చెందిన చంద్రశేఖర్, రమేష్, కౌసల్య, సీతారామప్పగా గుర్తించారు. వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
ఇంటి గుట్టు : దెబ్బకి రూ. 80 లక్షలు ఖతం, చివరికి!
మోసగాళ్లు మనకు తెలియకుండానే మన చుట్టూ వైఫైలా ముసిరేసి ఉంటారు. ఏ మాత్రం గుట్టు జారినా, ఆదమర్చి ఉన్నా భారీ నష్టం తప్పదు. అలా ఒక బాలిక అమాయకంగా ఇంట్లోని కొన్ని ఆర్థిక విషయాలు షేర్ చేసినందుకు గాను ఆమె కుటుంబం చిక్కుల్లోపడింది. ఇంటిగుట్టు లంకకు చేటు అన్నట్టు అయి పోయింది. 15 ఏళ్ల పాఠశాల విద్యార్థినిని బ్లాక్మెయిల్ చేసి రూ.80 లక్షలు దోచుకున్న వైనం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్టోరీ ఏంటంటే.. గురుగ్రామ్‌లో 9వ తరగతి చదువుతున్న బాలిక బాలిక గొప్పగా చెప్పిందో, అమాయకంగా చెప్పిందో కానీ తన అమ్మమ్మ ఖాతాలో భార మొత్తంలో సొమ్ము ఉందని ఫ్రెండ్స్‌కి చెప్పింది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం బాలిక అమ్మమ్మ( 75) తనకున్న ఆస్తిని అమ్మి తన ఖాతాలో రూ.80 లక్షలు జమ చేసింది. ఈ వివరాలతోపాటు, అమ్మమ్మ బ్యాంకు ఖాతాకు యాక్సెస్ కూడా తనకుందని తొలుత పదో తరగతి అబ్బాయికి చెప్పింది. అతను తన అన్నయ్యకు చెప్పాడు. వాడు తన స్నేహితుడికి చెప్పి ఆ డబ్బులు కొట్టేసేందుకు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే ఆ అమ్మాయికి బెదిరింపులు మొదలయ్యాయి. మార్ఫ్ చేసిన చిత్రాలతోఆమెను బ్లాక్మెయిల్ చేసి, వాటిని సోషల్ మీడియాలో లీక్ చేస్తామని, అలా చేయకుండా ఉండాలంటే, సొమ్మును ముట్టచెప్పాలని బాలికను బెదిరించారు. దీంతో బెంబేలెత్తిన బాలిక ఒకటీ రెండు సార్లు పలుదఫాలుగా నిందితుడు ఇచ్చిన ఫోన్ నంబర్లకు రూ. 80 లక్షలను బదిలీ చేసింది. ఇలా అమ్మమ్మ ఖాతాలోని మొత్తం డబ్బులన్నీ డిసెంబర్ 21 నాటికి స్వాహా అయిపోయాయి.అయినా బెదింపులు అగలేదు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో, క్లాస్‌లో ముభావంగా ఉన్న బాలికను గమనించిన టీచర్ గట్టిగా నిలదీయడంతో విషయమంతా టీచర్‌కు చెప్పింది. అలా అసలు సంగతి కుటుంబానికి చేరింది. దీంతో అమ్మమ్మ, ఇతర కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగు చూసింది. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మార్ఫింగ్ ఫోటోలతో బెదిరింపులకు పాల్పడ్డారు. వివిధ అకౌంట్ల ద్వారా, డబ్బును తమకు బదిలీ చేయించుకున్నారు. ఇలా కొట్టేసిన సొమ్మంతా దాదాపు పార్టీలకు ఖర్చు చేశారు.గత ఏడాది డిసెంబర్లో నమోదైన ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకూ ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు నవీన్ కుమార్ గత రెండు నెలలుగా పరారీలో ఉన్నాడని పోలీసులు మంగళవారం తెలిపారు. నవీన్ కుమార్ (28) గురుగ్రామ్‌లోని గర్హి హర్సారులోని న్యూ కాలనీ నివాసి. సోమవారం రాత్రి అతన్ని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించామని పోలీసు అధికారి రాంబీర్ సింగ్ తెలిపారు. అలాగే నిందితుడి నుంచి రూ.5.13 లక్షలు, బాధితురాలి ఏటీఎం కార్డును స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇప్పటివరకు రూ. 36 లక్షలు స్వాధీనం చేసుకున్నామని, దర్యాప్తు కొనసాగుతోందన్నారు. -
శిరీష కేసులో బిగ్ ట్విస్ట్.. స్వాతి, వినయ్ ప్లాన్ ప్రకారమే...
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మలక్‌పేటలో జరిగిన వివాహిత శిరీష హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. శిరీషను భర్త, ఆమె ఆడపడుచు (భర్త సోదరి) స్వాతి కలిసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ క్రమంలో వినయ్, స్వాతిని బుధవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటనపై వివరాల ప్రకారం.. మలక్‌పేటకు చెందిన శిరీషను తన భర్త, ఆడపడుచు స్వాతి కలిసి హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. స్వాతి ప్లాన్ ప్రకారం.. శిరీషకు మత్తుమందు ఇచ్చి, స్పృహ కోల్పోయిన తర్వాత ఊపిరాడకుండా చేసి చంపినట్లు పోలీసులు తేల్చారు. తన అక్క మాట వినకుండా ఎదురు తిరుగుతుందని కోపంతో వినయ్ హత్య చేసినట్టు చెప్పారు. హత్య విషయం తెలిసినప్పటికీ బయటపెట్టకుండా తన సోదరితో కలిసి శిరీష మృతదేహాన్ని భర్త వినయ్ మాయం చేయాలనుకున్నాడని వెల్లడించారు. మరోవైపు, ఊపిరాడకుండా చేయటంతోనే ఆమె మరణించినట్టు పోస్టుమార్టం నివేదికలో సైతం వెల్లడైంది.మెడ చుట్టూ గాయాలు..అంతకుముందు.. శిరీష మెడ చుట్టూ గాయాలను గుర్తించి.. మృతురాలి బంధువులు వినయ్‌ను నిలదీయగా, పొంతన లేని సమాధానాలు చెప్పినట్టు సమాచారం. ఛాతీ నొప్పితో కుప్పకూలినపుడు సీపీఆర్ చేశానని, ఆ సమయంలో చేతి గోళ్లు గీసుకుపోయాయంటూ ఒకసారి.. మృతదేహాన్ని తరలించేటప్పుడు కుదుపులకు గాయాలైనట్టు మరోసారి చెప్పాడు. దీంతో, శిరీషను అతడే హత్య చేసినట్టు బంధువులు ఆరోపించారు.భర్త వేధింపులు.. నాగర్‌కర్నూలు జిల్లా దోమలపెంటకు చెందిన వినయ్‌ను 2017లో శిరీష ప్రేమ వివాహం చేసుకుంది. దంపతులిద్దరూ మలక్‌పేటలోని జమున టవర్స్‌లో ఉంటున్నారు. ప్రైవేటు ఉద్యోగం చేసిన వినయ్ ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. శిరీష ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. 2019లో పాప జన్మించింది. పెళ్లయిన ఏడాది నుంచే భార్యపై అనుమానంతో వినయ్ నిత్యం గొడవ పడేవాడు. ఈ క్రమంలోనే మార్చి రెండో తేదీన ప్లాన్ చేసి ఆమెను హత్య చేశారు. అనంతరం, గుండెపోటుతో చనిపోయినట్టు ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు వినయ్.ఈ క్రమంలో వారు వచ్చేలోపే మృతదేహాన్ని అంబులెన్స్‌లో గ్రామానికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. దీంతో, శిరీష కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దోమలపెంటకు అంబులెన్సులో తరలిస్తుండగా సీసీ ఫుటేజ్ ద్వారా వాహనాన్ని గుర్తించి పోలీసులు మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకి తరలించారు. అనుమానాస్పద మృతిగా చాదర్‌ఘాట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
సైబర్ నేరగాళ్ల వలలో చిక్కిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
సాక్షి, నల్లగొండ: తెలంగాణలో మరోసారి సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. ఏకంగా ఎమ్మెల్యేను టార్గెట్ చేసి నగ్నంగా వీడియో కాల్ చేసి బెదిరింపులకు దిగారు. వీడియో కాల్ సందర్భంగా కొన్ని సెకన్ల పాటు స్క్రీన్ రికార్డు చేసి ఆయనకే వీడియో పంపించారు. అనంతరం, డబ్బులు కావాలని డిమాండ్ చేశారు.వివరాల ప్రకారం.. నకిరేకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ చేశారు. దీంతో, ఆయన కాల్ లిఫ్ట్ చేయడంతో అవతలి వ్యక్తి నగ్నంగా కనిపిస్తూ కాల్ మాట్లాడారు. ఈ క్రమంలో కేటుగాళ్లు ఫోన్ స్క్రీన్ రికార్డు చేశారు. అనంతరం, ఆ వీడియోను ఆయనకే పంపించారు. వీడియో విషయమై బెదిరింపులకు గురిచేస్తూ డబ్బులు డిమాండ్ చేశారు. కానీ, ఆయన స్పందించకపోవడంతో ఆ వీడియోను కొందరు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు పంపారు.ఈ క్రమంలో సదరు నేతలు, కార్యకర్తలు ఆయనను ఫోన్లు చేయడంతో వీరేశం ఖంగుతిన్నారు. దీంతో నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు వేముల వీరేశం ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, రాత్రి అనుచరులతో ఫోన్ మాట్లాడుతుండగా కాల్ రావడంతో లిఫ్ట్ చేసినట్టు ఆయన తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక పరిణామం.. కెనడాలో ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావు ఎక్కడంటే?
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping case) కీలక పరిణామం చోటుచేసుకుంది. సీబీఐ ద్వారా ఇంటర్ పోల్‌కు రెడ్ కార్నర్ నోటీసు పత్రాలు చేరుకున్నాయి. ఈ క్రమంలో ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు అమెరికాను వదిలి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. బెల్జియంలో శ్రవణ్‌రావు, కెనడాలో ప్రభాకర్‌రావు ఉన్నట్టు సమాచారం.తెలంగాణలో రాజకీయంగా ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన అన్ని పత్రాలతో సీబీఐ సంతృప్తి చెందారు. దీంతో, కేసు దర్యాప్తులో తమ వంతు సాయం అందించారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు నిందితులపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని సీబీఐ.. ఇంటర్ పోల్‌ను కోరింది. దీంతో, సీబీఐ ద్వారా ఇంటర్ పోల్(Interpol )కు రెడ్ కార్నర్ నోటీసు పత్రాలు చేరుకున్నాయి.అనంతరం స్పందించిన ఇంటర్ పోల్ అధికారులు.. 196 దేశాల ప్రతినిధులను అప్రమత్తం చేయనున్నారు. అయితే, ఇప్పటికే నిందితులు ఇద్దరూ అమెరికాను వీడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బెల్జియంలో శ్రవణ్‌రావు, కెనడాలో ప్రభాకర్‌రావు ఉన్నట్టు సమాచారం. కాగా, ఇంటర్ పోల్ నుంచి రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయితే ఇద్దరిని ఇండియాకు రప్పించే ప్రయత్నాల్లో హైదరాబాద్(Hyderabad) పోలీసులు ఉన్నారు. -
ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం!
హైదరాబాద్: ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం. కల్పన నిద్రమాత్రలు మింగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెను ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. . నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితిలో వెళ్లిన ఆమెను తలుపులు పగలగొట్టి బయటకు తీశారు. గత రెండు రోజులుగా ఇంటి తలుపులు ఓపెన్ చేయలేదని అపార్ట్ మెంట్ వాసులు అంటున్నారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలపడంతో వారు తలుపులు పగలుగొట్టి చూడగా ఆమెకు నిద్రమాత్రలు మింగినట్లు గమనించారు. దాంతో ఆమెను నిజాంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. -
‘నీ వల్లే నా జీవితాన్ని ఇక్కడితో ముగిస్తున్నా’.. అంటూ వీడియో కాల్
అతనొక టైలర్. వృత్తి చేసుకుంటూ జీవనం సాగించడానికి ఒక ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ అంతా ప్రశాంతంగానే గడిచింది. తిరిగి సొంతూరికి వచ్చిన తర్వాత ఒక మహిళతో వివాహేతర సంబంధానికి దారి తీయగా, అ సంబంధం కాస్తా ఇప్పుడు అతన్ని ప్రాణాలు తీసింది. చాలా కాలం ఆమెతో వివాహేతర బంధాన్ని కొనసాగించిన సదరు వ్యక్తి.. ఆమె బ్లాక్ మెయిలింగ్ కు బలయ్యాడు. ఆమె వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు. తాను చనిపోతున్న విషయాన్ని ఆమెకు వీడియో కాల్ లో తెలిపి మరీ చనిపోయాడు.వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నావ్ జిల్లాకు చెందిన అల్తాఫ్ అనే వ్యక్తి మహారాష్ట్రలోని థానేలో టైలర్ గా జీవనం సాగిస్తున్నాడు. గతేడాది తన తల్లి చనిపోయినప్పుడు ఇంటికి వచ్చిన అల్తాఫ్.. ఆపై థానేకు తిరిగి వెళ్లిపోయాడు. అయితే అతని కుటుంబ సభ్యులు ఇక్కడే(థానే)లో పని చేసుకోమని చెప్పడంతో అక్కడకు తిరిగి వచ్చేశాడు. ఈ క్రమంలోనే సమీప బంధువులైన ఒక మహిళతో అల్తాఫ్ కు వివాహేతర బంధం ఏర్పడింది. అయితే మహిళతో వివాహేతర సంబంధాన్ని గ్రహించిన అతని కుటుంబ సభ్యులు.. తిరిగి థానేకు పంపించేశారు.అయినప్పటికీ ఆ మహిళ.. అతన్ని ఫోన్ లో వేధింపులకు గురి చేసింది. తాను కడుపుతో ఉన్నానని, రూ. 10 వేల నుంచి లక్ష వరకూ పంపాలంటూ డిమాండ్ చేసిందని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తప్పుడు కేసు బనాయించిన సదరు మహిళ.. డబ్బుల కోసం వేధించేదని అల్తాఫ్ సోదరి అంటోంది. జైలుకు పంపుతానని బెదిరింపులకు గురి చేయడంతోనే తన సోదరుడు బలవన్మరణానికి పాల్పడ్డాడని సోదరి రేష్మ స్పష్టం చేసింది.చనిపోతున్నానని చెప్పినా..తాను చనిపోయే ముందు వివాహేత బంధం కొనసాగించిన మహిళకు వీడియో కాల్ చేశాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, నీ వేధింపులు భరించలేక చనిపోవాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. ‘చనిపోతే చనిపో.. నాకేమీ నష్టం లేదు. నాకు భర్త ఉన్నాడు. నువ్వు చనిపోవడం వల్ల నేనేమీ కోల్పోను’ అని చెప్పినట్లు వీడియో కాల్ లో రికార్డు అయ్యింది.నేను విషం తీసుకుంటున్నా. నేనేమీ డ్రామా ఆడటం లేదు. నేను బాధలో ఉన్నా. నువ్వు అర్థం చేసుకోవడం లేదు. నీవల్ల నా జీవితాన్ని ఇక్కడితో ముగిస్తున్నా’ అంటూ మరొక వీడియో కాల్ లో రికార్డు అయ్యింది. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
రూ.10 కోసం తండ్రిని చంపి.. తలతో పోలీస్ స్టేషన్‌కు..
బారిపడా: ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో దారుణం జరిగింది. 40 ఏళ్ల వ్యక్తి 'గుట్కా' కొనడానికి తన తండ్రిని రూ.10 అడిగాడు. ఇవ్వడానికి నిరాకరించిన తండ్రిని తల నరికి చంపేశాడు. నిందితుడు.. తండ్రి తలను చందువా పోలీస్ స్టేషన్‌కు తీసుకుని వచ్చి లొంగిపోయాడు. మృతి చెందిన వ్యక్తిని బైధర్ సింగ్‌గా పోలీసులు గుర్తించారు.తల్లిదండ్రులు, నిందితుడికి మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకోగా, తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ వ్యక్తి తండ్రిని దారుణంగా హత్య చేశాడు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన అతని తల్లి అక్కడి నుంచి పారిపోయింది. పోలీస్ అధికారి మాట్లాడుతూ చిన్న సమస్య హత్యకు దాని తీసిందని తెలిపారు. పోలీసులు ఫోరెన్సిక్ బృందంతో కలిసి గ్రామానికి చేరుకున్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. -
బెంగుళూరు ఎయిర్‌పోర్ట్‌లో కన్నడ నటి అరెస్ట్
బెంగుళూరు: బెంగుళూరు ఎయిర్‌పోర్టులో భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. కన్నడ హీరోయిన్ రాన్యారావును గోల్డ్ స్మగ్లింగ్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి బెంగుళూర్‌కు 14 కేజీల బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తుండగా డీఆర్ఐ అధికారులకు పట్టుబడ్డారు. రాన్యారావును అధికారులు ప్రశ్నిస్తున్నారు. కాగా, అధికారులకు తాను డీజీపీ కూతురినంటూ రన్యారావు చెప్పినట్లు సమాచారం.తరచుగా దుబాయ్ వెళ్లే రన్యారావు.. ఈసారి కూడా వెళ్లి మార్చి 3వ తేదీ రాత్రి తిరిగి దుబాయ్ నుంచి వచ్చింది. బెంగుళూరు ఎయిర్ పోర్ట్‌లో అనుమానంతో ఆమెను అధికారులు చెక్ చేయగా, స్మగ్లింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆమె దుస్తులలో 14.8 కిలోల బంగారం బయటపడింది. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ దాదాపు రూ.12 కోట్లు ఉంటుందని అంచనా. కాగా, కన్నడలో సుదీప్తో మాణిక్య సినిమాలో రాన్యా నటించింది. -
నాకు ధైర్యం చెప్పే మేనకోడలు.. ఈరోజు విగతజీవిలా మారిపోయింది..!
హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలిలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని దేవిక ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. ఆరు నెలల క్రితమే సాఫ్ట్ వేర్ ఉద్యోగినే ప్రేమ వివాహం చేసుకున్న దేవిక.. ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఆమెకు వేధింపులు ఎక్కువ కావడంతోనే ఈ దారుణానినికి పాల్పడి ఉంటుందని ఆరోపిస్తున్నారు.అతనొక ఉన్మాది..దేవికను ప్రేమించి పెళ్లిచేసుకున్న శరత్ చంద్ర అనే వ్యక్తి ఒక ఉన్మాది అని, అతనికి ఉరిశిక్షే సరైనదని దేవిక మేనమామ అంటున్నారు. ‘సాక్షి’తో మాట్లాడిన దేవిక మేనమామ.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందన్నారు. ఎప్పుడూ అందరికీ ధైర్యం చెప్పే తన మేనకోడలు.. ఈరోజు ఇలా విగత జీవిలా పడి ఉండటం తమను ఎంతగానో బాధిస్తుందన్నారు. తానొక రైతునని, తనకు ఎప్పుడు కష్టం వచ్చినా ధైర్యం చెప్పే మేనకోడలు ఈరోజు లేదన్నారు. నేటి సమాజంలో ఏ అమ్మాయికి ఇటువంటి పరిస్థితి రాకూడదన్నారు. తన మేనకోడలు ఎంతో గట్టి మనస్తత్వం ఉన్న అమ్మాయి అని, కానీ భర్త వల్ల ఎంతగా కృంగిపోతే ఆత్మహత్య చేసుకుందో తమకు అర్థమైందన్నారు. అతన్ని కచ్చితంగా కఠినంగా శిక్షించాల్సిందేనన్నారు మేనమామ.మండే వస్తా మమ్మీ అంది.. శవమై వచ్చింది నా బిడ్డ..!తన కూతురు ఆత్మహత్యపై తల్లి పడే రోదన అంతా ఇంతా కాదు. ఇంటికి వస్తానన్న బిడ్డ, శవమై వచ్చిందంటూ ఆమె తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తన బిడ్డ తనకు ప్రతీ రోజూ ఫోన్ చేసేదని, తిన్నావా మమ్మీ, ఎలా ఉన్నావ్ మమ్మీ అనే అడిగేదని కన్నీటి పర్యంతమయ్యారు తల్లి. ‘మొన్న పోయిన సండే ఇంటికి రా బిడ్డా అని అడిగితే, లేదు మమ్మీ మండే వస్తానంది.. వచ్చి నన్ను ఆస్పత్రిలో చూపిస్తానంది. మండే నాడు శవమై వచ్చింది నా కూతురు’ అంటూ తల్లి కన్నీటి పర్యంతమయ్యారు. ఆరు నెలల క్రితమే ప్రేమ పెళ్లి..కాగా, వికారాబాద్ జిల్లా, తోర్మామిడికి చెందిన కమలాపురం దేవిక(25) మాదాపూర్‌లోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తోంది. మంచిర్యాల మార్కెట్ రోడ్డుకు చెందిన సద్గుర్తి శరత్ చంద్రతో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీయడంతో పెద్దల అంగీకారంతో వారిద్దరూ గతేడాది ఆగస్టు 23న గోవాలో పెళ్లి చేసుకున్నారు. రాయదుర్గంలోని ప్రశాంత్ హిల్స్‌లో నివాసం ఉంటున్నారు.అయితే, కొద్ది రోజులుగా భార్యా భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి కూడా వారి మధ్య గొడవ జరగడంతో దేవిక గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుంది. బయటికి వెళ్లి తిరిగి వచ్చిన శరత్చంద్ర తలుపు తట్టినా దేవిక స్పందించకపోవడంతో నిద్రపోయి ఉంటుందని భావించాడు. సోమవారం ఉదయం 10 గంటలైనా దేవిక బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన శరత్ చంద్ర తలుపు విరగ్గొట్టి చూడగా ఆమె ఉరి వేసుకుని కనిపించింది.ఈ క్రమంలో ఇరుగు పొరుగు సహాయంతో కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందింది. వరకట్నం కోసం శరత్చంద్ర తన కుమార్తెను వేధిస్తున్నాడని, ఈ కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని మృతురాలి తల్లి రామలక్ష్మి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఐటీ ఉద్యోగుల ప్రేమ పెళ్లి.. ఇంతలోనే దేవిక ఆత్మహత్య
సాక్షి, గచ్చిబౌలి: ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులే.. ఆరు నెలల కిందటే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇంతలోనే దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో.. నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అయితే, వరకట్న వేధింపుల కారణంగానే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా, తోర్మామిడికి చెందిన కమలాపురం దేవిక(25) మాదాపూర్‌లోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తోంది. మంచిర్యాల మార్కెట్ రోడ్డుకు చెందిన సద్గుర్తి శరత్ చంద్రతో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీయడంతో పెద్దల అంగీకారంతో వారిద్దరూ గతేడాది ఆగస్టు 23న గోవాలో పెళ్లి చేసుకున్నారు. రాయదుర్గంలోని ప్రశాంత్ హిల్స్‌లో నివాసం ఉంటున్నారు.అయితే, కొద్ది రోజులుగా భార్యా భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి కూడా వారి మధ్య గొడవ జరగడంతో దేవిక గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుంది. బయటికి వెళ్లి తిరిగి వచ్చిన శరత్చంద్ర తలుపు తట్టినా దేవిక స్పందించకపోవడంతో నిద్రపోయి ఉంటుందని భావించాడు. సోమవారం ఉదయం 10 గంటలైనా దేవిక బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన శరత్ చంద్ర తలుపు విరగ్గొట్టి చూడగా ఆమె ఉరి వేసుకుని కనిపించింది.ఈ క్రమంలో ఇరుగు పొరుగు సహాయంతో కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందింది. వరకట్నం కోసం శరత్చంద్ర తన కుమార్తెను వేధిస్తున్నాడని, ఈ కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని మృతురాలి తల్లి రామలక్ష్మి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బాపూ.. నాకీ చదువులొద్దంటే విన్నావా!
జైపూర్: ఇంటర్ పరీక్షలు ఇంకా మొదలవ్వలేదు. కానీ, అప్పుడే ఫెయిల్ అవుతానన్న భయంతో ఓ ఇంటర్ విద్యార్థి అఘాయిత్యానికి పాల్పడింది. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం షెట్పల్లి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని షెట్పల్లి గ్రామానికి చెందిన తుంగపిండి రాజేశంకు కుమారుడు, కూతురు హాసిని (18) ఉన్నారు. భార్య గతంలోనే మృతిచెందింది. కుమారుడికి పెళ్లి కాగా సీసీసీలో నివాసం ఉంటున్నాడు.రాజేశం కూలీ పనులు చేస్తూ కూతురిని చదివిస్తున్నాడు. చెన్నూర్ కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో హాసినిని ఇంటర్లో చేర్పించాడు. అయితే.. చదవడం ఇష్టం లేక బాలిక మధ్యలోనే మానేసి ఇంట్లోనే ఉంది. ఆ విద్యాసంవత్సరం వృథా కావడంతో కూతురుని ఒప్పించి మళ్లీ ఈ విద్యాసంవత్సరం మంచిర్యాలలోని ప్రైవేటు కళాశాలలో చేర్పించాడు. ఈ క్రమంలో ఇంటర్ పరీక్షలు సమీపిస్తుండటంతో ఫెయిలవుతాననే భయంతో హాసిని సోమవారం వేకువజామున ఇంట్లోనే ఉరేసుకుంది. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై బాలయ్య తెలిపారు.ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
ప్రేమ పేరుతో CISF అధికారిణి వంచన.. ఐటీ ఉద్యోగి ఆత్మహత్య
యశవంతపుర: సీఐఎస్ఎఫ్ మహిళా అధికారి పెళ్లి పేరుతో తనను మోసం చేసిందంటూ ఆమె ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలోని బెళగావిలో వెలుగు చూసింది. సెల్ఫీ వీడియోను ఇన్‌స్టాలో పోస్టు చేసి సదరు వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఘటన చర్చనీయాంశంగా మారింది.వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజిపురకు చెందిన అభిషేక్ సింగ్(40).. చెన్నైలోని ఓ ఐటీ కంపెనీలో పని చేస్తున్నారు. ఈ క్రమంలో గుజరాత్ చెందిన మోనిక సింగ్‌తో అభిషేక్‌కు పరిచయం ఏర్పడింది. ఆమె బెళగావిలో సీఐఎస్ఎఫ్లో సహాయక కమాండెంట్‌గా పని చేస్తున్నారు. అయితే, ఆమె తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసిందని అభిషేక్ ఆరోపించారు. సోమవారం మంగళూరు రావ్ సర్కిల్లోని ఓ లాడ్జ్‌లో అభిషేక్ సింగ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.అంతకుముందు ఆయన రాసిన లేఖలో సదరు మహిళకు వివాహం అయినప్పటికీ, వివాహం కాలేదని నమ్మించి తన లైంగిక అవసరాలు తీర్చుకున్నారని ఆరోపించారు. పెళ్లి చేసుకుందామని అడిగితే బెదిరించి మానసికంగా హింసిస్తోందని వీడియోలో చెప్పాడు. ఈ సందర్భగా తాము సన్నిహితంగా ఉన్న ఫోటోలను కూడా పోస్టు చేశాడు. ఈ ఘటనపై బెళగావి నగర పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.A shocking incident has come to light in #Karnataka's #Mangaluru where a man from #UttarPradesh died by suicide, alleging he was exploited by a #CISF woman officer.The deceased, identified as #AbhishekSingh (40) from #Ghazipur, Uttar Pradesh, was found hanging in a lodge near… pic.twitter.com/QKuh3pcdOD— Hate Detector 🔍 (@HateDetectors) March 3, 2025 -
కాంగ్రెస్ హిమానీ హత్య కేసు.. వెలుగులోకి సీసీటీవీ వీడియో
ఢిల్లీ: హర్యానాకు చెందిన కాంగ్రెస్ నాయకురాలు హిమానీ నర్వాల్ హత్య కేసులో కీలక ఆధారాలు బయటకు వచ్చాయి. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే సచిన్ అనే నిందితుడిని అరెస్టు చేశారు. తానే హత్య చేసినట్టు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. ఇక, తాజాగా నిందితుడు హిమానీ హత్యకు గురైన రోజున ఆమె నివాసం సమీపంలో నుంచి సూటుకేసును తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది.హర్యానాలో రోహ్తక్ జిల్లాలోని సాంప్లా బస్టాండ్ సమీపంలో మార్చి ఒకటో తేదీన సూట్‌కేసులో హిమానీ నర్వాల్ మృతదేహం బయటపడటం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో హిమానీ హత్య కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సోమవారం సచిన్ అనే నిందితుడిని అరెస్టు చేశారు. అనంతరం, హిమానీ నివాసం వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. ఈ క్రమంలో నిందితుడు ఓ సూట్‌కేసును పట్టుకుని వెళ్తున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. ఫిబ్రవరి 28న రాత్రి 10 గంటల సమయంలో హిమానీ నివాసం సమీపం నుంచి అతడు వెళ్లడం గుర్తించారు. మరుసటి రోజు ఉదయం అదే సూట్‌కేసులో ఆమె మృతదేహం ఉండటం గమనార్హం.ఈ నేపథ్యంలో హిమానీ నర్వాల్ తన ఇంట్లోనే హత్యకు గురైనట్టు పోలీసులు వెల్లడించారు. అయితే, ఆమెతో తనకు సన్నిహిత సంబంధం ఉందని నిందితుడు చెప్పుకొచ్చారు. అలాగే, తనను తరచూ డబ్బులు డిమాండ్ చేయడంతోనే హత్య చేసినట్టు సచిన్ పోలీసుల విచారణలో చెప్పినట్లు సమాచారం. ఇక, వారిద్దరు స్నేహితులని, నిందితుడికి ఇప్పటికే వివాహమైందని పోలీసులు తెలిపారు.VIDEO | Himani Narwal murder case: CCTV footage - dated February 28, 2025 - shows accused Sachin carrying the black suitcase with the body stuffed in it, through a street. The CCTV visuals have been verified by the police. Sachin - a "friend" of Congress worker Himani Narwal -… pic.twitter.com/f9qvKFR5rz— Press Trust of India (@PTI_News) March 3, 2025 -
గంజాయి కేసులో ఐఐటీ బాబా అరెస్ట్!
జైపూర్: మహా కుంభమేళాతో దేశం దృష్టిని ఆకర్షించిన ఐఐటీ బాబా(IIT Baba) అభయ్ సింగ్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. గంజాయి కేసులో తాజాగా ఆయన్ని జైపూర్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా ఐఐటీ బాబానే ధృవీకరించడం విశేషం. ఐఐటీ బాబా సూసైడ్ చేసుకుంటానన్న ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు జైపూర్ షిప్రా పాథ్ పోలీసులు ఓ హోటల్లో ఉన్నారనే సమాచారంతో అక్కడికి వెళ్లారు. ఆ టైంలో ఆయన నుంచి గంజాయి సేవిస్తుండడంతో పోలీసులు అదుపులోకి తీన్నారు. ఆయనపై నార్కోటిక్ డ్రగ్స్ &సైకోట్రోపిక్ సబ్స్టానెన్స్(NDPS) యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు అక్కడి మీడియా కథనాలు ఇచ్చింది. VIDEO | Amid reports of his arrest, Maha Kumbh fame Abhay Singh, alias 'IIT Baba' was seen celebrating his birthday with followers in Jaipur. pic.twitter.com/WhA8aTIUv2— Press Trust of India (@PTI_News) March 3, 2025అయితే.. ఆయన అరెస్ట్ ప్రచారం నడుమ అనూహ్యంగా ఆయన తన భక్తుల మధ్య పుట్టినరోజు వేడుకలు చేసుకుంటూ కనిపించారు. దీంతో మీడియా ఆయన్ని అరెస్ట్‌పై ఆరా తీసింది. తాను ఆత్మహత్య చేసుకుంటానన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని అన్నారాయన. అయితే తాను గంజాయి తీసుకున్న మాట వాస్తవమేనని.. అయితే పరిమితితో కూడి గంజాయి ఉండడంతో పోలీసులు బెయిల్ మీద తనను విడుదల చేశారని అన్నారాయన. అయితే తన దృష్టిలో అది గంజాయి కాదని.. ప్రసాదమని ఆయన వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. ఓప్రైవేట్ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో తనపై దాడి జరిగిందంటూ నోయిడా పీఎస్ వద్ద ఐఐటీ బాబా హడావిడి చేసిన సంగతి తెలిసిందే. చివరకు పోలీసులు ఆయన్ని శాంతపర్చి అక్కడి నుంచి పంపించేశారు. అయితే ఇంటర్వ్యూకు ముందు ఆయనే సదరు ఛానెల్ యాంకర్‌పై దాడి చేశారంటూ ప్రచారం జరగడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి కేసు నమోదు కాలేదు.ఐఐటీ బాబాగా ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా(Prayagraj Maha Kumbh) అభయ్ సింగ్ ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూతో పాపులారిటీ సంపాదించుకున్నారు. హర్యానా చెందిన అభయ్ ఐఐటీ బాంబేలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ పూర్తిచేసినట్లు చెబుతున్నారు. కొంతకాలం ఓ కార్పొరేట్ సంస్థలో పనిచేసిన ఆయన.. దాన్ని వదిలేశారట. ఆపై కొంతకాలం ఫొటోగ్రఫీ.. అటు నుంచి ఆధ్యాత్మికం వైపు అడుగులు వేశారట. -
శిరీష అనుమానాస్పద మృతి.. శరీరంపై గాయాలు.. ఏమైంది?
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మలక్‌పేటలో విషాదకర చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న జమున టవర్స్‌లో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతురాలి భర్త వినయ్ కుమార్ గుండెపోటుతో చనిపోయిందని కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చాడు. దీంతో, ఆమె పేరెంట్స్ వచ్చే సరికే మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించే ప్రయత్నం చేయడంతో అనుమానం వ్యక్తమవుతోంది.వివరాల ప్రకారం.. కర్నూలుకు చెందిన సింగం శిరీషతో హైదరాబాద్‌కు వినయ్‌కు మధ్య 2017లో వీరికి వివాహం జరిగింది. వీరు మలక్‌పేట జమున టవర్స్‌లో నివాసం ఉంటున్నారు. అయితే, శిరీష అనుమానాస్పద స్థితిలో సోమవారం ఉదయం మృతి చెందారు. అనంతరం, భర్త వినయ్ కుమార్.. ఆమె గుండెపోటుతో చనిపోయిందని కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చాడు. ఈ క్రమంలో అత్తమామలు, మృతురాలి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరకముందే మృతదేహాన్ని సొంత గ్రామం శ్రీశైలం తరలించే ప్రయత్నం చేశారు.దీంతో, శిరీష కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దోమలపెంటకు అంబులెన్సులో తరలిస్తుండగా సీసీ ఫుటేజ్ ద్వారా వాహనాన్ని గుర్తించి పోలీసులు మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మృతదేహంపై గాయాలు ఉండటంతో హత్య చేసి చంపి.. గుండెపోటుగా చెపుతున్నారని మృతురాలి కుటుంబ సభ్యులు మలక్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. చదవండి: 4 నిమిషాల్లో రూ.29.69 లక్షలు దోచేశారు! -
4 నిమిషాలు.. రూ.29.69 లక్షలు!
ఇబ్రహీంపట్నం రూరల్: ముఖాలకు మాస్క్‌లు.. చేతులకు గ్లౌస్లు.. వెంట ఇనుప రాడ్లు, గ్యాస్ కట్టర్లు.. దర్జాగా స్విఫ్ట్ కారులో వచ్చి ఏటీఎంలోకి చొరబాటు.. కట్ చేస్తే సినీ ఫక్కీలో నాలుగంటే నాలుగే నిమిషాల్లో రూ.29,69,900 కొట్టేశారు. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ చోరీ ఘటన జరిగింది. సీఐ రాఘవేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. తుక్కుగూడ మున్సిపల్ పరిధిలోని రావిర్యాలలో శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు తెల్లని కారులో ఎస్బీఐ ఏటీఎం వద్దకు చేరుకున్నారు.ముందుగా ఒక వ్యక్తి కారులోంచి దిగి ఏటీఎంలోకి ప్రవేశించాడు. అలారం మోగకుండా వైర్లు కత్తిరించాడు. తర్వాత విద్యుత్ సరఫరా నిలిపివేశాడు. మరో ఇద్దరు వెంటనే కారు దిగి వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్లు, గ్యాస్ కట్టర్లతో రాత్రి 1:55 గంటలకు ఏటీఎం లోపలికి ప్రవేశించారు. ఒక వ్యక్తి సీసీ కెమెరాలపై స్ప్రే కొట్టాడు. దీంతో సీసీ కెమెరాలు బ్లర్ అయిపోయి రికార్డింగ్ ఆగిపోయింది. వెంటనే గ్యాస్ కట్టర్లతో ఏటీఎంను కట్ చేసి, అందులో ఉన్న రూ.29.69 లక్షల నగదు అపహరించుకుపోయారు. ముందే రెక్కీ? ఈ చోరీకి ఒకటి రెండు రోజుల ముందే దుండగులు రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్లాన్ ప్రకారం నాలుగు నిమిషాల్లో పని పూర్తి చేయడంతో దొంగలను ప్రొఫెషనల్స్‌గా భావిస్తున్నారు. కాగా, దుండగుల కారు పహాడీషరీఫ్ వైపు నుంచి వచ్చి మళ్లీ అటే వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో గుర్తించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీసీపీ చోరీ జరిగిన పది నిమిషాల్లోనే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఆదిభట్ల పోలీసులకు సమాచారం వచి్చంది. వెంటనే అక్కడికి చేరుకోగా అప్పటికే దొంగలు పరారయ్యారు. ఆదిబట్ల ఎస్ఐ వెంకటేశ్, సీఐ రాఘవేందర్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు, మహేశ్వరం జోన్ డీసీపీ సునీతారెడ్డి, క్రైం డీసీపీ అరవింద్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు . ఐదు బృందాలతో గాలింపు రావిర్యాలలో జరిగిన ఈ చోరీ ఘటనను రాచకొండ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఆదిభట్ల పోలీసులు, క్రైమ్ సిబ్బంది, ఎస్ఓటీ, సైబర్ క్రైమ్ సిబ్బందిని కలిపి మొత్తం ఐదు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఇప్పటికే సీసీ కెమెరాల ఆధారంగా దొంగలు వెళ్లిన స్థలాలను, వారి కారు నంబర్‌ను గుర్తించే పనిలో పడ్డారు. -
కాంగ్రెస్ నేత హిమాని కేసులో బిగ్ ట్విస్ట్.. అతడే హంతకుడు?
ఢిల్లీ: కాంగ్రెస్ నేత హిమాని నర్వాల్ దారుణ హత్య హర్యానాలో తీవ్ర కలకలం సృష్టించింది. ఆమె హత్య కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో తాజాగా ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ఢిల్లీకి చెందిన వ్యక్తి కాగా.. అతడు హిమానికి స్నేహితుడు అని తెలుస్తోంది. హర్యానాకు చెందిన కాంగ్రెస్ నేత హిమాని హత్య కేసులో సోమవారం ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి పేరును మాత్రం వెల్లడించలేదు. ఇక, పోలీసులు అతడి దగ్గర నుంచి హిమాని మొబైల్ ఫోన్, ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు. విచారణలో భాగంగా హిమానికి స్నేహితుడి అని తెలిసింది. అత్యంత సన్నిహితుడిగా ఉన్నట్టు సమాచారం. హిమాని ఇంటికి దగ్గరలోనే నివాసం ఉంటున్నట్టు పోలీసులు తెలిపారు. హిమాని అతడిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసిందని ఆరోపణలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. హర్యానాలోని రోహతక్ జిల్లాలో శనివారం హిమాని నర్వాల్ దారుణ హత్యకు గురయ్యారు. ఆమెను హత్య చేసిన అనంతరం సూట్ కేసులో మూటగట్టి ఓ నిర్మానుష ప్రాంతంలో మృతదేహాన్ని పడేశారు దుండగులు. సంప్లా బస్టాండ్ దగ్గర సూట్ కేసులో హిమానీ నార్వాల్ మృతదేహం ఉండటంతో స్థానికంగా కలకలం రేగింది. ఆ బస్టాండ్ వద్ద సూట్ కేసు పడి ఉండటంతో తెరిచి చూడటంతో ఈ దారుణం వెలుగు చూసింది. గతంలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్రలో ఆమె చురుగ్గా పాల్గొన్నారు. ఆమె మెడపై గాయాలుండటం కూడా ఇదే హత్యేనని అనడానికి మరింత బలం చేకూర్చుతోంది.ఇక, హిమాని నర్వాల్ హత్యపై దర్యాప్తు చేయడానికి పోలీసులు ప్రత్యేక దర్యాప్తు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. బాధితురాలి కుటుంబం ఢిల్లీలో ఉండగా, హిమాని నర్వాల్ హర్యానాలో ఒంటరిగా ఉంటుందని సాంప్లా డీఎస్పీ రజనీష్ కుమార్ తెలిపారు.#WATCH | Rohtak, Haryana: Visuals of the accused who is arrested in Congress worker Himani Narwal murder case. pic.twitter.com/zSvHIEIP7a— ANI (@ANI) March 3, 2025బాధితురాలి తల్లి ఆరోపణలుఅంతకుముందు, బాధితురాలి తల్లి సవిత సంచలన ఆరోపణలు చేసింది. రాజకీయాల్లో తన కూతురు ఎదుగుదలను తట్టుకోలేక పార్టీలోని కొందరు వ్యక్తులే తన కూతురిని హతమార్చి ఉండొచ్చంటూ ఆమె సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ కోసం తన కూతురు పదేళ్లుగా ఎన్నో త్యాగాలు చేశారని తెలిపారు. పార్టీలోని గొడవలు, వాగ్వాదాలపై కూతురు తనతో చెప్పేదన్నారు. తన కూతురికి న్యాయం జరిగే వరకు తాను ఆమె అంత్యక్రియలు చేయనని అన్నారు. -
కేంద్ర మంత్రి కుమార్తెకు పోకిరీల వేధింపులు
జల్గావ్: తన కుమార్తెను వేధించారంటూ కేంద్ర యువజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రక్షా ఖడ్సే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహారాష్ట్రలో శాంతి భద్రతలపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. జల్గావ్ జిల్లా ముక్తాయ్‌నగర్‌లో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న తన కుమార్తెను అక్కడ కొందరు యువకులు వేధించారని.. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మంత్రి వెల్లడించారు.“ప్రతి ఏడాది మహాశివరాత్రి సందర్భంగా మా ప్రాంతంలో సంత్ ముక్తాయ్ యాత్ర జరుగుతుంది. రెండు రోజుల క్రితం నా కూతురు యాత్రకు వెళ్లింది. కొందరు యువకులు ఆమెను వేధించారు. వారిపై ఫిర్యాదు చేసేందుకు నేను పోలీస్ స్టేషన్‌కు వెళ్లాను' అని మీడియాకు కేంద్ర మంత్రి ఖడ్సే చెప్పారు. అడ్డుకున్న భద్రతా సిబ్బందిపైనా ఆ యువకులు దురుసుగా ప్రవర్తించారు. గుజరాత్ పర్యటన నుంచి నేను ఇంటికి రాగానే నా కుమార్తె ఈ విషయం చెప్పింది. కేంద్ర మంత్రి కుమార్తెకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే.. సాధారణ మహిళల సంగతి ఏంటో అర్థం చేసుకోవచ్చంటూ కేంద్ర మంత్రి ఖడ్సే వ్యాఖ్యానించారు.రక్షా ఖడ్సే మామ ఏక్నాథ్ ఖడ్సే మాట్లాడుతూ.. ఈ యువకులపై గతంలోనూ పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. వారు కరుడుగట్టిన నేరస్థులు. మహారాష్ట్రలో నేరస్థులకు పోలీసులంటే భయమే లేదు. రోజురోజుకు మహిళలపై నేరాలు పెరుగుతున్నాయి. బాధిత మహిళలు ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదు. వారి తల్లిదండ్రులు కూడా తమ కుమార్తెల పేర్లు బయటకు రాకూడదని భావిస్తున్నారు. వేరే మార్గం లేకనే ఫిర్యాదు చేశాం’’ అని ఏక్నాథ్ ఖడ్సే తెలిపారు.పోలీస్ స్టేషన్‌కు వెళితే రెండు గంటలు మమ్మల్ని కూర్చోబెట్టారని.. అమ్మాయిల విషయం కావడంతో ఆలోచించుకోవాలంటూ పోలీసులు మాకు సలహా ఇచ్చారు. వేధింపులకు పాల్పడ యువకులకు రాజకీయ నాయకుల అండ ఉంది. డీఎస్పీ, ఐజీతో కూడా చెప్పాను’’ అని ఖడ్సే తెలిపారు. -
‘నేను లేకుండా ఆమె ఒంటరిగా బ్రతకలేదు..’!
తిరువనంతపురం: కేరళలో ప్రియురాలితో సహా, నలుగురు కుటుంబ సభ్యుల్ని అతి దారుణంగా హత్య చేసిన ‘సైకో కిల్లర్’ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 23 ఏళ్ల అఫాన్ నుంచి కీలక వాంగ్మూలాన్ని నమోదు చేశారు పోలీసులు.ఈ హత్యలు అనంతరం వెంజరామూడు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన అఫాన్.. ఆపై ఆత్మహత్యాయత్నం చేశాడు. పాయిజన్ తీసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. ఇదంతా పోలీసులకు సరెండర్ అయిన తర్వాత జరగ, ప్రస్తుతం అతనికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ నిందితుడి నుంచి స్టేట్ మెంట్ లు తీసుకుంటున్నారు పోలీసులు. అసలు ఎందుకు చంపాల్సి వచ్చింది అనే కోణంలో ప్రశ్నించగా, తన గర్ల్ ఫ్రెండ్ ను ఎందుకు హత్య చేశాడో వెల్లడించాడు.ఒంటరిగా ఉండలేను అన్నందుకే..తన ప్రేయసిని చంపడానికి ‘నేను లేకుండా ఆమె ఒంటరిగా బ్రతకలేదు’’ అనే ఉద్దేశంతోనే హత్య చేయాల్సి వచ్చిందని నిందితుడు పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు. కుటుంబాన్ని ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందనే దానికి సదరు నిందితుడు సమాధానం చెప్పాడు. తన కుటుంబం ఆత్మహత్య చేసుకుని చనిపోవాలనుకుందని, అందుకు తానే హత్య చేయాలనుకున్నానని పోలీసులు పేర్కొన్నారు.అయితే అతని స్టేట్ మెంట్ ను ఇంకా పూర్తిగా నమ్మలేమని, విచారణ జరుగుతుందన్నారు పోలీసులు. అతను చెప్పేదాంట్లో నిజమెంతో ఇంకా దర్యాప్తు చేస్తే కానీ తెలియదన్నారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారన్నారు. అతని బ్లడ్ శాంపిల్స్ ను మెడికల్ టెస్టు కోసం పంపామన్నారు. అరెస్ట్ చేసి రిమాండ్ కోరతామని, ఈ కేసులో పూర్తిస్థాయి దర్యాప్తు కోసం అతన్ని కస్టడీకి తీసుకుని విచారిస్తామన్నారు.రూ. 65 లక్షల అప్పు.. ఆపై హత్యలకు ప్లానింగ్ఈ హత్యలకు ముందు 14 మంది రూ. 65 లక్షల వరకూ అప్పు తీసుకున్నాడు. అనంతరం తాను హత్యలు చేయడానికి ప్లాన్ చేసుకున్నాడు. నిందితుడి కుటుంబ సభ్యుల్లో ఒకరైన 88 ఏళ్ల బామ్మతో పాటు, 13 ఏళ్ల తమ్ముడిని, వరుసకు అత్తయ్య ఆమెను, ఆమె భర్తను, గర్ల్ ఫ్రెండ్ ను హత్య చేశాడు. -
పోలీసులకే సవాల్ గా మారిన వరుస చోరీలు
నందిగామ: ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో వరుస దొంగతనాలు పోలీసులకు సవాల్ గా మారాయి. వరుస దోపిడీలతో కలకలం రేపుతున్న దొంగలు.. భారీగా నగదు, బంగారం చోరీ చేస్తూ ప్రజల్ని హడలెత్తిస్తున్నారు. ఇంట్లో ఎవరూ లేని ఇళ్లనే ప్రధానంగా టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్నారు దొంగలు. నందిగామ మండలం లింగాలపాడు గ్రామంలో కనిశెట్టి గాంధీ ఇంట్లో రూ. 3 లక్షల విలువగల బంగారాన్ని, రూ. 45 వేల రూపాయల్ని దోచుకెళ్లారు దొంగలు. చందర్లపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలో రెండు ఇళ్లల్లో లక్షా 50 వేల నగదు చోరీ చేశారు దొంగలు.చందర్లపాడు మండలంప కాండ్రపాడులో ఇళ్లలో సైతం దొంగలు చోరీకి పాల్పడ్డారు. చిన్న వెంకటరెడ్డి ఇంటిలో రూ. 12 లక్షల విలువగల బంగారం, రూ. 15 వేల నగదు చోరీ చేశారు. మహేశ్వర్ రెడ్డి ఇంటిలో రూ. 1 లక్ష 50 వేలు విలువగల బంగారం చోరీ చేశారు. నందిగామ ప్రాంతంలో ఒక్కరోజే రూ. 20 లక్షల రూపాయల విలువగల బంగారం, నగదు చోరీ చేశారు. నందిగామ పరిసర ప్రాంతాల్లో వరుస చోరీలు జరుగుతుండటంతో ప్రజలు భయాందోళనలకు గురౌతున్నారు. -
కూతురివేనా నువ్వు.. తల్లిని నిర్బంధించి కిరాతకంగా దాడి(వీడియో)
హిసార్: ఆస్తి కోసం కూతురు తన తల్లిని చిత్రహింసలకు గురిచేసిన హృదయవిదారక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రక్తం తాగుతాను అంటూ కన్న తల్లినే కూతురు హింసించింది. ఈ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. దీనిపై ఆమె కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది.వివరాల ప్రకారం.. హర్యానాలోని హిసార్‌కు చెందిన రీటాకు రెండేళ్ల క్రితం రాజ్‌గఢ్ సమీపంలోని గ్రామానికి చెందిన సంజయ్ పునియాతో వివాహం జరిగింది. వీరికి వివాహం జరిగిన సమయంలో పునియాకు ఎలాంటి సంపాదన లేదు. దీంతో, రీటా.. తన తల్లి నిర్మలాదేవి ఇంటికి తిరిగి వచ్చేసింది. తల్లి ఇంట్లోనే ఉంటోంది. ఈ క్రమంలోనే ఆస్తి కోసం తన తల్లిని నిర్భందించి వేధించడం ప్రారంభించింది.రీటా.. ఇప్పటికే కురుక్షేత్రలో తమ కుటుంబానికి చెందిన పలు ఆస్తులను అమ్మేసి దాదాపు రూ.65 లక్షలు తన దగ్గర ఉంచుకుంది. ఇప్పుడు తల్లి నివసిస్తున్న ఇంటిని తన పేరుమీదకు మార్చాలని వేధింపులకు గురిచేస్తోంది. ఇంటిని తన పేరు మీద రిజిస్టర్ చేయమని తల్లిని ఇంత దారుణంగా హింసించింది. ఈ సందర్భంగా రీటా.. ఆస్తి ఇస్తావా లేదా? నీ రక్తం తాగుతా అంటూ జుట్టు లాగి కొడుతూ, నోటితో కొరుకుతూ నానా విధాలుగా హింసించింది. దీంతో, నిర్మలాదేవి రోదిస్తూ రెండు చేతులూ జోడించి వేడుకుంటోంది. ఈ వీడియోలో ఒక పురుషుడి మాటలు కూడా వినిపిస్తున్నాయి. కాగా, తన తల్లిపై దాడి విషయం తెలియడంతో ఆమె కుమారుడు అమర్దీప్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను ఇంట్లోకి రానివ్వడం లేదని తెలిపాడు. రీటాపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.A shocking incident of abuse has surfaced from Hisar, Haryana, where a viral video shows a daughter, Rita, physically assaulting her mother, Nirmala Devi, in a desperate attempt to gain control of family property. Police have now intervened, registering a case under the… pic.twitter.com/gpK7xPHHWv— Mojo Story (@themojostory) March 1, 2025 -
హిమానీ నార్వాల్ హత్య.. సమగ్ర దర్యాప్తునకు కాంగ్రెస్ డిమాండ్
చంఢీగడ్: హర్యానా కాంగ్రెస్ మహిళా కార్యకర్త హిమానీ నార్వాల్ హత్యపై సమగ్ర దర్యాప్తు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఇంతటి దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. శనివారం రాత్రి సమయంలో ఆమె మృతదేహాన్ని సూట్ కేసులో కనుగొనడంతో హిమానీ హత్య గావించబడ్డ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ ఆరంభించారు.అయితే దీనిపై సమగ్ర కోణంలో విచారణ జరిపించాలనేది కాంగ్రెస్ డిమాండ్. ఇందుకోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)ను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది. ఈ మేరకు హర్యానా కాంగ్రెస్ ఎంఎల్ఏ భరత్ భూషణ్ బర్రా.. పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఈ ఘోరానికి పాల్పడ్డ వారికి కఠినమైన శిక్ష పడేలా చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.సూట్ కేసులో మృతదేహంహర్యానాలోని రోహతక్ జిల్లాలో చోటు చేసుకున్న దారణం నిన్న(శనివారం) వెలుగులోకి వచ్చింది. మహిళా కాంగ్రెస్ నేత హిమానీ నార్వాల్ దారుణ హత్యకు గురయ్యారు. ఆమెను హత్య చేసిన అనంతరం సూట్ కేసులో మూటగట్టి ఓ నిర్మానుష ప్రాంతంలో పడేశారు దుండగులు. ఆమె మృతదేహం సూట్ కేసులో లభించింది. సప్లా బస్టాండ్ దగ్గర సూట్ కేసులో హిమానీ నార్వాల్ మృతదేహం ఉండటంతో స్థానికంగా కలకలం రేగింది. ఆ బస్టాండ్ వద్ద సూట్ కేసు పడి ఉండటంతో తెరిచి చూడటంతో ఈ దారుణం వెలుగు చూసింది. గతంలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్రలో ఆమె చురుగ్గా పాల్గొన్నారు. ఆమె మెడపై గాయాలుండటం కూడా ఇదే హత్యేనని అనడానికి మరింత బలంగా చేకూర్చుతోంది.రాహుల్ తో కలిసి జోడో యాత్రలోఏఐసీసీ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ఆమె చురుగ్గా పాల్గొన్నారు. సోన్ పేట్ లోని కతారా గ్రామానికి చెందిన హిమానీ నార్వాల్.. కాంగ్రెస్ చేసిన ప్రతీ ర్యాలీలోనూ ఉత్సాహంగా పాల్గొనేది. దాంతో పార్టీ చేపట్టే సోషల్ ఈవెంట్స్ లో కూడా పాల్గొని ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.రాష్ట్రంలో పరిస్థితులు మరింత దిగజారిపోయాయితాము మంచి కార్యకర్తను కోల్పోయామని హర్యానా మాజీ సీఎం భూపేందర్ సింగ్ హుడా పేర్కొన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు ఇంతలా దిగజారిపోయాయి అనడానికి నార్వాల్ హత్య ఒక ఉదాహరణ అని ఆయన అన్నారు. దీనిపై హై లెవెల్ దర్యాప్తు చేస్తే కానీ అసలు నిందితులు ఎవరు బయటకు రారని ఆయన పేర్కొన్నారు. నిందితులకు అమలు చేసే అత్యంత కఠినంగా ఉండాలన్నారు. మరొకసారి భవిష్యత్ లో ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండేలా శిక్ష అమలు చేయాలని భూపేందర్ సింగ్ డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం పరిపాలన ఎంత దారుణంగా ఉందో ఈ హత్యోదంతాన్ని చూస్తే అర్థమవుతుందన్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) రికార్డులు చూస్తే రాష్ట్రం నేర చరిత్ర ఏ విధంగా తెలుస్తుందన్నారు. ప్రతి నిత్యం ఏదొక చోట మూడు నుంచి నాలుగు హత్యలు, అత్యాచారాలు, కిడ్నాప్ లు, దొంగతనలు జరుగుతూనే ఉన్నాయన్నారు ఆయన. -
హత్యలు చేసి... పుణ్యక్షేత్రాల్లో మకాం!
మార్కాపురం: అనుమానంతో భార్యను, ఆపై ఆమె తల్లిని హత్య చేసిన నిందితుడు పరారై.. పోలీసులకు దొరక్కుండా ఎనిమిది నెలలుగా పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ముప్పు తిప్పలు పెట్టాడు. చివరికి పోలీసులకు పట్టుబడ్డాడు. ప్రకాశం జిల్లా మార్కాపురం డీఎస్పీ డాక్టర్ యు.నాగరాజు శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ విషయాలను వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం యర్రగొండపాలెం మండలం యల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రేళ్ల శ్రీనుకు, వేములకోట గ్రామానికి చెందిన కన్నెసాని నారాయణమ్మ కుమార్తె సునీతతో వివాహమైంది.భార్యపై అనుమానంతో తరచుగా వేధింపులకు గురిచేసేవాడు. ఈ నేపథ్యంలో 2023 మార్చి 14న వేములకోటలోని తన అత్తగారింట్లో ఉన్న భార్య సునీతను రోకలిబండతో హత్యచేసి పరారయ్యాడు. పోలీసులు అరెస్టుచేసి జైలుకు పంపగా బెయిల్‌పై బయటకు వచ్చాడు. అయితే శ్రీను తన అత్త నారాయణమ్మను కూడా హతమార్చాలని నిర్ణయించుకుని గతేడాది జూన్ 30వ తేదీ రాత్రి వేములకోటలోని తన ఇంటిలో నిద్రపోతున్న ఆమెను కత్తితో విచక్షణా రహితంగా నరికి చంపి పారిపోయాడు. ఈ సంఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. పుణ్యక్షేత్రాల్లో నివాసం..నిందితుడైన శ్రీను హత్య కేసుల నుంచి తప్పించుకునేందుకు పుణ్యక్షేత్రాల్లో నివాసమున్నట్లు పోలీసులు గుర్తించారు. సెల్‌ఫోన్ వాడితే తనను పోలీసులు పట్టుకుంటారని భావించి దారిన పోయేవారి సెల్‌ఫోన్ తీసుకుని తెలిసిన వారికి ఫోన్‌చేస్తూ సమాచారం కనుక్కుంటూ ఉండేవాడు. ఈ విషయం తెలిసిన పోలీసులు శ్రీనుకు తెలిసిన వారి ఫోన్నంబర్లపై నిఘా పెట్టారు. సీఐ సుబ్బారావు, రూరల్ ఎస్సై అంకమరావు ప్రత్యేక టీమును ఏర్పాటు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టారు.నిందితుడైన శ్రీను షిరిడీ, కాశీ, వేములవాడ, రామేశ్వరం, చెన్నై, పూణే తదితర ప్రాంతాల్లో ఉంటూ ఒక చోట టీ మాస్టరుగా, మరోచోట దోసె మాస్టరుగా హోటల్లో పనిచేస్తూ ఎక్కడా పట్టుమని 10 రోజులు కూడా ఉండకుండా మకాంలు మారుస్తూ పోలీసులను ముప్పుతిప్పలు పెడుతూ వచ్చాడు. కాగా నిందితుడు ఎక్కడ ఉన్నా శివాలయానికి వెళ్తాడని పోలీసులు గుర్తించి మాటు వేశారు. తిరుత్తణి దగ్గర త్రుటిలో తప్పించుకున్న శ్రీను శ్రీశైలం నుంచి త్రిపురాంతకం వెళ్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇందులో భాగంగా శనివారం దేవరాజుగట్టు ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద గాలింపు చర్యలు చేపట్టగా నిందితుడు పట్టుబడ్డాడు. అరెస్ట్ అనంతరం నిందితుడిని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. పోలీసు సిబ్బందికి రివార్డులు.. ఎనిమిది నెలలలుగా తప్పించుకుని తిరుగుతూ ముప్పుతిప్పలు పెట్టిన శ్రీనును అరెస్టు చేసే విషయంలో కీలకంగా వ్యవహరించిన డీఎస్పీ నాగరాజు, సీఐ సుబ్బారావు, రూరల్ ఎస్సై అంకమరావు, ఏఎస్సైలు ఎస్కే జిలానీ, డీ శ్రీనివాసరావు, సిబ్బంది వెంకటేశ్వర్లు, అరుణగిరి ఆంజనేయులు, జె వెంకటేశ్వర్లును ఎస్పీ దామోదర్ అభినందించారు. డీఎస్పీ నాగరాజు పలువురికి నగదు బహుమతి అందజేశారు. ప్రెస్మీట్లో సీఐ సుబ్బారావు, ఎస్సైలు అంకమరావు, సైదుబాబు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ మహిళా కార్యకర్త దారుణ హత్య
చండీగఢ్: హర్యానా రాష్ట్రంలో రోహతక్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మహిళా కాంగ్రెస్ కార్యకర్త హిమానీ నార్వాల్ దారుణ హత్యకు గురయ్యారు. ఆమెను హత్య చేసిన అనంతరం సూట్ కేసులో మూటగట్టి ఓ నిర్మానుష ప్రాంతంలో పడేశారు దుండగులు. ఆమె మృతదేహం సూట్ కేసులో లభించింది. సప్లా బస్టాండ్ దగ్గర సూట్ కేసులో హిమానీ నార్వాల్ మృతదేహం ఉండటంతో స్థానికంగా కలకలం రేగింది. ఆ బస్టాండ్ వద్ద సూట్ కేసు పడి ఉండటంతో తెరిచి చూడటంతో ఈ దారుణం వెలుగు చూసింది. గతంలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్రలో ఆమె చురుగ్గా పాల్గొన్నారు. -
పోసానిపై ‘పచ్చ’ పగ
తాడేపల్లి : కూటమి ప్రభుత్వం అక్రమ కేసులతో ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసి దగ్గర్నుంచి ఈరోజు(శనివారం) రిమ్స్ ఆస్పత్రి తరలించే విషయంలోనూ పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడింది పోసాని అనారోగ్యంతో ఉన్నా పోలీసుల వేధింపుల పర్వం మాత్రం కొనసాగుతోంది. అరెస్టు సమయంలో తన అనారోగ్యం సమస్యలను పోసాని, ఆయన కుటుంబ సభ్యులు.. పోలీసులకు చెప్పారు. అరెస్ట్ చేసేటప్పుడు తనకు రేపు ఎంఆర్ఐ స్కాన్ ఉందని పోలీసులకు స్పష్టం చేశారు. అయినా వినిపించుకోకుండా పోసానిని అరెస్ట్ చేశారు. తమ వద్ద మంచి డాక్టర్లు ఉన్నారంటూ జీపులో ఎక్కించుకుని పోసానిని తీసుకువెళ్లారు సంబేపల్లి ఎస్ఐ.తెల్లారిదాకా జీప్‌లో తిప్పుతూ..ఇలా తెల్లారిదాకా జీపులోనే తిప్పుతూ పోసానిని తీవ్రంగా ఇబ్బంది పెట్టారు ఖాకీలు. 27వ తేదీ మధ్యాహ్నం ఓబులవారి పల్లె పీఎస్ కు తరలించారు. అప్పుడు కూడా పోసానిని 9 గంటల పాటు విచారించారు. కోర్టుకు తరలించే ముందు పీహెచ్ సీ వైద్యులతో పరీక్షలు నిర్వహించారు. గొంతు, చేయి నొప్పితో ఉన్న పోసానికి బీపీ, షగర్ చెక్ చేసి కోర్టుకు తరలించారు. రెండు రాత్రిళ్లు నిద్ర, ఆహారం లేకుండా పోసానిని ఖాకీలు ఇబ్బంది పెట్టారు. రాజంపేట జైలుకు తరలించిన తర్వాత ఛాతి నొప్పితో పోసాని తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇక జైలు నుంచి ఆస్పత్రికి తరలింపులోనూ ప్రభుత్వ నిర్లక్ష్యం కనబడింది. తీవ్రంగా నొప్పితో బాధపడుతున్నా మధ్యాహ్నం వరకూ ఆస్పత్రికి తరలించకుండా వేధింపులకు గురిచేశారు. ఈసీజీ పరీక్షల్లో హార్ట్ బీట్ తేడా కనపించడంతో కడప రిమ్స్ కు తరలించారు. రిమ్స్ కు పోసానిని తరలించే విషయంలో కూడా అలక్ష్యం ప్రదర్శించారు. చాతి నొప్పితో బాధపడుతున్న పోసానిని అంబులెన్స్ లో కాకుండా పోలీస్ వ్యాన్ లో తరలించడం పోలీసుల వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయి అనే దానికి అద్దం పడుతోంది. -
ఢీ షో డ్యాన్సర్ మోసం చేశాడంటూ యువతి...
ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్‌లో విషాదం నెలకొంది. తన చావుకు ఢీ షో డ్యాన్సర్ అభి కారణమంటూ కావ్య కల్యాణి(24)(Kavya Kalyani) అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. తనని పెళ్ళి చేసుకొని తనతో కాపురం చేస్తూ ఇప్పుడు మరో యువతిని పెళ్ళి చేసుకుంటున్నట్లు కావ్యకళ్యాణి సెల్ఫీ వీడియోలో చెప్పుకొచ్చింది. 'నా పేరు కావ్య. నేను చచ్చిపోబోతున్నాను. నా చావుకి కారణం అభి. ఐదు సంవత్సరాల నుంచి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి,తన ఇంటికి తీసుకెళ్లాడు. ఇప్పుడేమో మరో అమ్మాయిని తీసుకొచి.. ఆమెనే పెళ్లి చేసుకుంటానని చెబుతున్నాడు. నన్ను వెళ్లిపొమ్మన్నాడు. ఇప్పుడు నేను ఉరేసుకుంటున్నాను. సారీ అమ్మ.. సారీ డాడీ' అంటూ యువతి సెల్ఫీ వీడియో ద్వారా తెలిపింది.ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
డాక్టర్ మృతి.. భార్య, ప్రియుడు స్కెచ్?
సాక్షి, వరంగల్: వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ వైద్యుడు సుమంత్ రెడ్డి మృతిచెందారు. ఎనిమిది రోజులుగా మృత్యువుతో పోరాడిన సుమంత్ రెడ్డి శుక్రవారం అర్థరాత్రి చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. సుమంత్ మృతితో ఆయన కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇక, సుమంత్ రెడ్డి భార్యే ప్రియుడితో కలిసి హత్య చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో రెండు రోజుల క్రితం సుమంత్ రెడ్డి భార్య ఫ్లోరా మరియా, దాడికి సహకరించిన ఏఆర్ కానిస్టేబుల్ రాజ్ కుమార్, సామ్యూల్‌లను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. డాక్టర్ సుమంత్ రెడ్డి, ఫ్లోరా మరియాలు ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. కాజీపేటలో సుమంత్ క్లినిక్‌ను నిర్వహిస్తుండగా, అతని భార్య ఫ్లోరా మరియా రంగశాయిపేటలో డిగ్రీ లెక్చరర్‌గా పనిచేస్తోంది. అయితే, క్లినిక్ ప్రారంభించకముందు ఓ ఆస్పత్రిలో డాక్టర్‌గా సుమంత్ పనిచేసేవారు. ఆ సమయంలో ఫ్లోరా మరియా ఓ జిమ్‌లో చేరింది. అక్కడే ఆమెకు సామెల్ అనే యువకుడు పరిచయమయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారింది.దీంతో, వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం మొదలైంది. ఆ విషయం సుమంత్‌కు తెలిసిపోవడంతో భార్య ఫ్లోరాను మందలించాడు. అయినా, ఆమె వినిపించుకోలేదు. భర్తను వద్దనుకొని, ప్రియుడే కావాలని అనుకున్న ఆమె, చివరికి భర్తను అడ్డు తొలగించుకోవాలని అనుకుంది. ఇందుకోసం ప్రియుడు సామెల్, అతని స్నేహితుడు ఏఆర్ కానిస్టేబుల్ రాజును ఆమె పురమాయించింది. నేరం చేస్తే తన చేతికి మట్టి అంటకుండా ఉండాలన్న ఉద్దేశ్యంతో భర్తను ఎక్కడ, ఎలా హత్య చేయాలో ఫ్లోరా చెప్పింది.సుమంత్‌ను చంపి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు స్కెచ్ వేసింది. ప్లాన్ ప్రకారం, యాక్సిడెంట్ ప్లాన్ విఫలమయ్యాక, ప్లాన్ బీ ప్రకారం ఈ నెల 20న రాత్రి ఖాజీపేట నుండి బట్టుపల్లి బైపాస్ రహదారిలో సమంత్ కారును అడ్డగించి, అతడిపై ఐరన్ రాడ్లతో దాడి చేశారు. చనిపోయాడనుకున్న తర్వాత నిందితులు పరారయ్యారు. కానీ చావుబతుకుల మధ్య ఉన్న బాధితుణ్ని స్థానికులు అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. సుమంత్‌పై జరిగిన హత్యాయత్నంపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో కట్టుకున్న భార్య ఫ్లోరా మరియా, ఆమె ప్రియుడు సామెల్, సామెల్ స్నేహితుడు ఏఆర్ కానిస్టేబుల్ రాజు నిందితులని తేలింది. -
రోడ్డురోలర్ కొట్టేసి.. తుక్కుకింద అమ్మేసి..
మహబూబాబాద్ రూరల్: బంగారం, వెండి, డబ్బులు, ఇతర వస్తువులు చోరీ జరగడం సాధారణమే. కానీ టన్నులకొద్దీ బరువుండే రోడ్డు రోలర్‌ను కొందరు దొంగలు అపహరించి.. పాత ఇనుప సామాను దుకాణంలో అమ్మేసి డబ్బుతో ఉడాయించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన తండ్రీకొడుకులు ఎస్.కే.బడేమియా, ఖాదర్, కరీమ్ ఉమ్మడిగా పాత ఇనుప సామాను (స్క్రాప్) దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. కాగా కొద్దిరోజుల క్రితం మహారాష్ట్రలోని నాగ్‌పూర్ పట్టణానికి చెందిన ఎంఎస్ కన్స్ట్రక్షన్ సివిల్ రైల్వే కాంట్రాక్టర్ మోహన్‌మిశ్రా పేరిట ఉన్న రోడ్డురోలర్‌ను.. కొందరు వ్యక్తులు జేసీబీతో పాత ఇనుప సామాను దుకాణానికి తీసుకొచ్చారు. రూ.2.19 లక్షలకు దాన్ని విక్రయించి, వచ్చిన నగదుతో వెళ్లిపోయారు. కాగా, చోరీ చేసి తీసుకువచ్చి విక్రయించారని గ్రహించని స్క్రాప్ దుకాణం నిర్వాహకులు రోడ్డురోలర్‌ను గ్యాస్ కట్టర్‌తో ముక్కలు చేసే పనిలో నిమగ్నం కాగా.. వారికి ఒక ఫోన్ వచ్చింది.రోడ్డురోలర్ యజమానిని మాట్లాడుతున్నానని.. ఇటీవల చోరీ అయిన తన రోడ్డురోలర్‌ను ఎలా కొనుగోలు చేశారని అవతలి వ్యక్తి ప్రశ్నించాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించాడు. దీంతో తమను మోసగించి విక్రయించారని దుకాణ యజమానులు లబోదిబోమన్నారు. రోడ్డురోలర్ చోరీ, విక్రయంపై యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
తెలుగు తమ్ముళ్ల ఘరానా మోసం
సాక్షి, విశాఖపట్నం: శ్రీకాకుళం కేంద్రంగా మొదలై.. హైదరాబాద్ వరకు ఇద్దరు టీడీపీ నేతలు చేసిన ఘరానా మోసం వెలుగులోకి వచ్చిoది. విదేశాల్లో ఉద్యోగాల పేరిట 350 మందికి టోకరా వేసి సుమారు రూ.6 కోట్లతో పరారైన వైనం బయటపడింది. ఇచ్ఛాపురానికి 70 కిలోమీటర్ల దూరంలోని ఒడిశా చీకటి బ్లాక్ పార్వతీపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కొచ్చెర్ల ధర్మారావురెడ్డి పోలెండ్‌లో వలస కూలీగా పనిచేస్తున్నాడు. కొన్నాళ్ల తర్వాత ఏజెంట్‌గా అవతారం ఎత్తి స్థానిక యువకులకు ఉద్యోగాల ఎర వేశాడు. దగ్గర బంధువుల్లో నిరుద్యోగులుగా ఉన్నవారినే లక్ష్యంగా చేసుకున్నాడు. ఇటలీలో అదిరిపోయే ఉద్యోగాలున్నాయని ఊరించాడు. ధర్మారావురెడ్డి తన బంధువులైన ఇచ్ఛాపురం టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు కాయి దిలీప్(తేలుకుంచి), శ్రీను(బెజ్జిపద్ర)తో ప్రచారం ఊదరగొట్టించాడు. ఇటలీలో ఫ్రూట్స్ కటింగ్, ప్యాకింగ్, వైన్, బీర్ల కంపెనీలు, ప్యాకింగ్ మొదలైన సంస్థల్లో మంచి ఉద్యోగాలు, కష్టం లేని పని, రూ.లక్షల్లో జీతం అంటూ నమ్మించాడు. ఎంత వీలైతే అంతమందికి ఉద్యోగాలున్నాయని.. ఎక్కువ మందిని తీసుకొస్తే ఫీజులో కొంత తగ్గిస్తానంటూ ఆశ చూపించాడు. టీడీపీ నేతల మాటలు నమ్మిన నిరుద్యోగులు.. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, ప్రకాశం, గుంటూరు తదితర ప్రాంతాల్లో చిన్న చిన్న పనులు చేసుకుంటున్న బంధువులు, స్నేహితులను సంప్రదించారు. వారిని కూడా ఈ ఉచ్చులోకి తీసుకొచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చాకే.. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ధర్మారావురెడ్డి, దిలీప్ కలిసి ప్లాన్ వేసినట్లు పక్కాగా స్పష్టమవుతోంది. ఇచ్ఛాపురం ఎమ్మెల్యేతో ఉన్న అనుబంధం.. ఏం జరిగినా పార్టీ కాపాడుతుందన్న తెగింపుతో.. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 350 మందిని ఎంపిక చేశారు. ఇచ్చాç³#రంలో లాడ్జిని తీసుకొని మొదటి విడతలో 2024 ఏడాది జూలై 26న 75 మందిని ఇంటర్వ్యూ చేసి రూ.20 వేలు అడ్వాన్స్, తర్వాత రూ.1.35 లక్షలు వసూలు చేశారు. ఆగస్టులో హైదరాబాద్‌లో మరో 175 మందిని ఇంటర్వ్యూ చేసి రూ.1.35 లక్షలు చొప్పున తీసుకున్నారు. జనవరిలో శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో 120 మందికి ఇంటర్వ్యూ నిర్వహించి రూ.50 వేలు వంతున వసూలు చేశారు. అందరి దగ్గర విద్యార్హతల ధ్రువపత్రాల జిరాక్స్‌లు, ఫొటోలు తీసుకున్నారు. ఫిబ్రవరి లేదా మార్చి మొదటి వారంలో ఇటలీ వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సమాచారం ఇచ్చారు. మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ కావాలని అడుగుతున్నారని చెప్పి ఇచ్ఛాపురంలోని ఓ ప్రైవేట్ మెడికల్ ల్యాబ్‌లో 350 మంది నిరుద్యోగులకు వారి సొంత డబ్బు తోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. ఢిల్లీ వెళ్లాక బట్టబయలైన మోసంఇటలీ ప్రయాణానికి మొదటి విడతలో 30 మంది పాస్‌పోర్టు చెకింగ్, స్లాట్ బుకింగ్ చేసుకోవాలని ధర్మారావు, దిలీప్ రెండు వారాల క్రితం చెప్పడంతో.. ఢిల్లీ వెళ్లిన యువకులకు అసలు విషయం తెలిసింది. వాళ్లు చెప్పిన అడ్రస్‌లు, పాస్‌పోర్టు చెకింగ్లు అంతా మోసమని గ్రహించారు. 350 మందితో ఒక వాట్సప్ గ్రూప్ పెట్టిన టీడీపీ నేతలు.. ’’మీతో పాటు మేము కూడా మోసపోయాం.. అందరూ క్షమించాలి‘‘ అంటూ వాయిస్ మెసేజ్ పెట్టి ఫోన్ స్విచ్చాఫ్ చేసేశారు. బాధితులంతా లబోదిబోమంటూ రోడ్డున పడ్డారు. పోలీసుల్ని ఆశ్రయించినా పట్టించుకోవడం లేదు.! ధర్మారావురెడ్డి బాధితులు ఫిబ్రవరి 17న ఇచ్ఛాపురం రూరల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పరిశీలిస్తామని చెప్పారు తప్ప.. విచారణకు సాహసించలేదు. స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడి తెచ్చి.. విచారణను ఆపుతున్నట్లు బాధితులు గ్రహించారు. చేసేదిలేక విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్‌కు వచి్చనా పట్టించుకోలేదంటూ బాధిత నిరుద్యోగులు వాపోతున్నారు. రాజకీయ పలుకుబడితో.. కేసును తప్పుదారి పట్టిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు.సీఎం కార్యాలయంలోనూ ఫిర్యాదు చేశాం టీడీపీ నేతల బాధితులు ధర్మారెడ్డి మంచివాడు అని నమ్మబలికిన దిలీప్ మధ్యవర్తిత్వంతో అందరం డబ్బు చెల్లించాం. మోసపోయామని చివరి నిమిషంలో తెలిసింది. దిలీప్‌ను నిలదీసినా స్పందించలేదు. ఇచ్ఛాపురం పోలీసులు పట్టించుకోలేదు. సీఎం ఆఫీస్‌కు వెళ్లాం. ఆయన ఎమ్మెల్సీ ఎన్నికలకు వెళ్లారని చెప్పడంతో.. సీఎం కార్యాలయంలోనూ, మంత్రి లోకేష్ కార్యాలయంలోనూ ఫిర్యాదు చేశాం. మా ఎంపీ, కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడును కలిసి ఫిర్యాదు చేస్తే.. రెండు రోజుల్లో పరిష్కరిస్తానని చెప్పారు. వారం దాటినా ఎలాంటి స్పందన లేదు. చాలామంది ఉన్న ఉద్యోగం వదిలి డబ్బులు కట్టాం. రోడ్డున పడ్డాం. డబ్బు తిరిగి చెల్లించాలి. -
మా గోడు వినండి..భార్య వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న భర్త కథ
లక్నో: కట్టుకున్న భార్య (wife) రాచిరంపాన పెడుతోందంటూ జీవితాల్ని అర్థాంతరంగా జీవితాల్ని ముగుస్తున్న భర్తల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ఇప్పటికే బెంగళూరులో అతుల్ సుభాష్, కర్ణాటకలో ఓ కానిస్టేబుల్ తిప్పన్న.. రాజస్థాన్‌లో ఓ డాక్టర్ అజయ్.. ఇలా రోజుకొక ఉదంతం వెలుగులోకి వస్తోంది. ఇదిలా ఉండగానే.. ఉత్తరప్రదేశ్‌లో మరో అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది.ప్రముఖ టెక్ కంపెనీ టీసీఎస్ (tcs)లో మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న 25ఏళ్ల మానవ్ శర్మ(manav sharma) బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఫిబ్రవరి 24న తన ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు. అయితే,మరణానికి ముందు మానవ్ శర్మ ఆవేదనతో కూడిన ఆరు నిమిషాల 50 సెకన్ల నిడివిగల ఓ వీడియోను రికార్డ్ చేశాడు. ఆ వీడియోలో తన వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నాయని, తన భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని, ఇదే విషయంలో తనకు, తన భార్యకు గొడవలు జరిగేవని అన్నారు. అయినా తనలో మార్పు రాలేదన్నారు. మగాళ్లకు రక్షణే లేదామానవ్ శర్మ ఏడుస్తూ.. దేశంలో మహిళలను రక్షించేలా చట్టాలు ఉన్నట్లు.. పురుషులను రక్షించేలా చట్టాలు ఉంటే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేశాడు. పురుషుల గురించి ఆలోచించండి’ అని న్యాయస్థానాల్ని వేడుకున్నాడు. పురుషులకు రక్షణ కల్పించకపోతే.. వారు అంతమవుతారని హెచ్చరించారు. కోడలి నిర్వాకం వల్లే ఈ సందర్భంగా తన మణికట్టుపై కత్తికోసుకున్న గుర్తులను చూపిస్తూ అంతకుముందు తాను ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు శర్మ వెల్లడించాడు. నా మరణానంతరం నా తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టొద్దని అర్జిస్తూ వీడియోను ముగించాడు. అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యపై సమాచారం అందుకున్న శర్మ తండ్రి సదర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన కుమారుడు మరణానికి తన కోడలు కారణమని ఆరోపించారు.అన్నీ అవాస్తవాలేమానవ్ శర్మ ఆత్మహత్యపై ఆయన సతీమణి ఖండించారు. నా భర్త మద్యానికి బానిసయ్యారు. అతిగా మద్యం సేవించి పలుమార్లు ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించారు. మూడు సార్లు నేనే రక్షించా. మద్యం సేవించిన తరువాత నాపై దాడి చేసేవారు. ఇదే విషయాన్ని తన అత్తమామల దగ్గర ప్రస్తావించినా వారు పట్టించుకోలేదు.అవన్నీ పెళ్లికి ముందే.. పెళ్లి తర్వాత భర్తే నా సర్వసంవివాహేతర సంబంధంపై మీడియా ఆమెను ప్రశ్నించగా..అవన్నీ పెళ్లికి ముందే. పెళ్లి తర్వాత భర్తే నా సర్వసం’అని అన్నారు. ఈ సందర్భంగా వాట్సాప్ చాట్‌ను బహిర్ఘతం చేశారు. ఆ చాట్‌లో దీదీ, దయచేసి ఏదో ఒకటి చేయండి. తనను తాను చంపుకుంటాడు అని తన భర్త సోదరికి(వదిన) మెసేజ్ చేసింది. బదులుగా అతన్ని ఒంటరిగా ఉండనివ్వండి. నిద్రపోండి’ అని బదులిచ్చినట్లు గమనించవచ్చు.ఇప్పటి వరకూ జరగని అరెస్టులుమానవ్ శర్మ ఆత్మహత్యపై ఆగ్రా ఏఎస్పీ వినయక్ గోపాల్ మాట్లాడారు. ‘మాకు ఆగ్రాలోని మిలటరీ హాస్పిటల్లో మానవ్ మృతదేహం ఉందనే సమాచారం వచ్చింది. మానవ్ బలవన్మరణానికి పాల్పడ్డారు. అతని ఆత్మహత్య కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు. బాధితుడు రికార్డ్ చేసిన వీడియోను గుర్తించాం. అందులో తన భార్యతో విభేదాలు, ఇతర సమస్యల కారణంగా ప్రాణాలు తీసుకున్నట్లు గుర్తించామని’ చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. -
మద్యం మత్తులో అత్యంత పైశాచికంగా..
మద్యం మత్తులో ఆ యువకుడు మృగంగా మారాడు. భయ్యా అని పిలిచే ఐదేళ్ల చిన్నారిపై లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. ఈ క్రమంలో అత్యంత పైశాచికంగా ప్రవర్తించడంతో ఆమె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. మధ్యప్రదేశ్ శివపురి(Shivpuri District) జిల్లాలో జరిగిన పాశవికమైన ఘటన వివరాల్లోకి వెళ్తే..ఆ చిన్నారి ఓ యువకుడు జరిపిన లైంగికదాడి(Sexual Assault)లో తీవ్రంగా గాయపడింది. ఎంతలా అంటే.. ఆమె తలను గోడకేసి బాదడంతో తీవ్ర గాయాలయ్యాయి, ఒంటి నిండా పంటి గుర్తులు పడ్డాయి. పెద్ద పేగు చిధ్రమైంది. ఆఖరికి ప్రైవేటు భాగం రెండుగా చీల్చేసి ఉంది. కనీసం మంచంపై పక్కకు కూడా తిరగలేని స్థితిలో.. కొన ఊపిరితో ఉందా చిన్నారి. ఫిబ్రవరి 22వ తేదీన దినార(Dinara) ప్రాంతంలో ఇంటి డాబాపైన ఆడుకుంటున్న ఆ ఐదేళ్ల చిన్నారి.. హఠాత్తుగా కనిపించకుండా పోయింది. తోటి పిల్లలను ఆ తల్లి ఆరా తీస్తే.. పక్కింటి భయ్యా చాక్లెట్ కొనిస్తానని తీసుకెళ్లాడని చెప్పారు. రెండు గంటలైనా వాళ్లు తిరిగి రాలేదు. దీంతో.. కంగారుపడిన తల్లిదండ్రులు, స్థానికులు చుట్టుపక్కల గాలించారు. కాసేపటికి ఆ కాలనీకి పక్కనే ఉన్న ఓ పాడుబడ్డ ఇంట్లో రక్తపు మడుగులో స్థానికులు గుర్తించారు. శరీరంపై తీవ్ర గాయాలై.. లైంగిక దాడి జరిగిన ఆనవాళ్లు కనిపించడంతో చిన్నారిని హుటాహుటిన గ్వాలియర్ కమలారాజ్ ఆస్పత్రిలో చేర్పించారు.అత్యంత దారుణంగా..ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెకు రెండు గంటలపాటు అత్యవసర సర్జరీలు చేశారు వైద్యులు. గాయాలకు చికిత్సతో పాటు చిధ్రమైన పెద్ద పేగును కత్తిరించి కృతిమంగా మలద్వారం సృష్టించారు. ప్రైవేట్ పార్ట్‌కు 28 కుట్లు వేశారు. అయినప్పటికీ శరీరం మొత్తం గాయాలు కావడంతో చిన్నారి విపరీతమైన నొప్పితో బాధపడుతోంది. ఆమె పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.మైనర్‌గా చూపించి..ఆమెపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తి ఆమె పక్కింట్లోనే ఉంటాడు. మద్యం మత్తులో తాను ఈ నేరానికి పాల్పడినటట్లు నిందితుడు అంగీకరించాడు. అయితే.. అతని వయసు 17 ఏళ్లుగా పోలీసులు ప్రకటించడంతో ప్రజాగ్రహం పెల్లుబిక్కింది. నిందితుడిని మైనర్‌గా చూపించి.. శిక్ష నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని బాధిత తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళన చేపట్టారు. నిందితుడికి మరణశిక్ష విధించాలని వాళ్లంతా డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆందోళనకు రాజకీయ పార్టీలు మద్ధతు ప్రకటించాయి. జిల్లా కలెక్టరేట్ ఎదుట బీజేపీ కాంగ్రెస్‌లు పోటాపోటీ నిరసనలు చేపట్టాయి. అయితే..పోలీసులు మాత్రం నిందితుడి వయసు నిర్ధారణ ఇంకా జరగలేదని చెబుతున్నారు. అప్పటిదాకా.. జువైనల్ చట్టాల ప్రకారమే అతన్ని అదుపులో ఉంచుతున్నట్లు ప్రకటించారు. మరోవైపు స్థానిక ఎంపీ జ్యోతిరాధిత్య సింధియా(Jyotiraditya Scindia) ఈ దారుణ ఘటనను ఖండించారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీతోపాటు బాధిత తల్లిదండ్రులతోనూ ఆయన మాట్లాడారు. చట్టం ప్రకారం ఈ కేసులో కఠినంగా శిక్ష పడాల్సిందేనని ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. शिवपुरी के दिनारा में हमारी मासूम बेटी के साथ हुए अमानवीय कृत्य की जानकारी मिलते ही आज परिजनों से फोन पर बातचीत की एवं उन्हें हौसला दिया। बेटी अभी अस्पताल में भर्ती है और उसकी हालत स्थिर है। मैं लगातार डॉक्टरों की टीम के संपर्क में हूं। हमारे क्षेत्र और प्रदेश में इस तरह के…— Jyotiraditya M. Scindia (@JM_Scindia) February 25, 2025 -
పూణే అత్యాచార కేసు.. నిందితుడు రామ్‌దాస్ అరెస్ట్
పూణే: మహారాష్ట్రలోని పూణే అత్యాచార కేసులో నిందితుడు దత్తాత్రేయ్ రామ్‌దాస్ గాదేను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. దారుణ ఘటన తర్వాత 75 గంటల గాలింపు అనంతరం నిందితుడు పోలీసులకు చిక్కాడు. నిందితుడి కోసం పోలీసులు 13 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.వివరాల ప్రకారం.. పూణేలోని స్వర్గేటు బస్టాండ్ వద్ద 26 ఏళ్ల యువతిపై బస్సులో అత్యాచారానికి పాల్పడిన దత్తాత్రేయ్ రామ్‌దాస్ పోలీసులకు చిక్కాడు. 75 గంటల గాలింపు చర్యల అనంతరం నిందితుడు రామ్‌దాస్‌ను శుక్రవారం తెల్లవారుజామున శ్రీరూర్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం, పోలీసు స్టేషన్‌కు తరలించారు. అత్యాచార ఘటన తర్వాత నిందితుడు పరారీలో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడి ఆచూకీ చెప్పిన వారికి రూ.లక్ష రివార్డు అందజేస్తామని పోలీసుశాఖ సైతం తెలిపింది.Pune rape case -; Accused, Dattatray Ramdas Gade, has been arrested by Pune Crime Branch from a village in Shirur Tehsil of Pune district#punecrime #Rape #maharshtra @PuneCityPolice pic.twitter.com/G8PdSUGHO8— Indrajeet chaubey (@indrajeet8080) February 28, 2025 జరిగింది ఇదీ..పూణేలో అత్యంత రద్దీగా ఉండే బస్ స్టేషన్లలో ఒకటైన స్వర్గేట్లో మంగళవారం ఉదయం అత్యాచార చోటు చేసుకుంది. తన స్వగ్రామానికి వెళ్లేందుకు బస్‌స్టేషన్‌కు చేరుకున్న యువతితో నిందితుడు మాటలు కలిపాడు. అక్క అని సంబోధిస్తూ నమ్మించాడు. గ్రామానికి వెళ్లే బస్సు మరో చోట ఉందని చెప్పి బస్ స్టేషన్లోనే దూరంగా ఎవరూ లేని చోట ఆగి ఉన్న మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్ దగ్గరకు ఆమెను తీసుకెళ్లాడు.బస్సులోకి వెళ్లేందుకు యువతి తటపటాయించడంతో లోపల ప్రయాణికులు ఉన్నారని.. నిద్రలో ఉండటంతో వాళ్లు లైట్లు వేసుకోలేదని నమ్మించాడు. బస్సులోకి యువతి ప్రవేశించగానే తలుపు వేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు దత్తాత్రేయ రామదాస్ (36)గా పోలీసులు గుర్తించారు. అతడిపై అనేక కేసులు ఉన్నాయని, 2019 నుంచి బెయిల్ మీద ఉన్నాడని తెలిపారు. రామదాస్‌ను పట్టుకొనేందుకు ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అత్యాచారం జరిగిన ప్రాంతానికి 100 మీటర్ల దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉండటం గమనార్హం. -
హెచ్ఐవీ దాచి.. వివాహం చేసుకోబోయిన వరుడు
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని క్రిస్టియన్‌పేటలోని ఓ చర్చిలో తాళికట్టే సమయానికి ఏపీ ఎన్జీవోస్(AP NGOs) ప్రతినిధులు వచ్చి మంగళవారం ఓ వివాహాన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా హెచ్ఐవీ డిస్ట్రిక్ ప్రాజెక్ట్ మేనేజర్ శ్యామ్సన్ అందించిన వివరాలు.. 2013లో హెచ్ఐవీ పాజిటివ్(HIV Positive) నిర్ధారణ అయి, ప్రస్తుతం 35 సంవత్సరాల వయసు ఉన్న ఓ యువకుడు ఆరోగ్యంగా ఉన్నాడు. అయితే ఓ యువతిని వివాహం చేసుకుంటున్నాడని తెలియడంతో ఆరోగ్యంగా ఉన్న యువతిని అనారోగ్యం బారిన పడకుండా కాపాడేందుకు ఏపీ ఎన్జీవోస్(AP NGOs) మహిళా ప్రతినిధులు క్రిస్టియన్‌పేట వచ్చి చర్చి పాస్టర్కు వివరించారు. అమ్మాయి బంధువులతో పెళ్లి కొడుకుకు హెచ్ఐవీ(HIV Positive) ఉందని చెప్పడంతో వారు వివాహాన్ని నిలిపివేశారు. వివాహం నిలిపివేయడంతో పెళ్లికొడుకు బంధువులు పెళ్లికూతురు బంధువులతో గొడవకు దిగారు. వివాహం చేసే పాస్టర్, హెచ్ఐవీ పాజిటివ్ ఉంటే ఎలా వివాహం జరిపిస్తామని మాట్లాడడంతో పెళ్లికొడుకు బంధువులు అక్కడ ఉన్నవారిపై దాడికి పాల్పడ్డారు. ఏపీఎన్జీవోస్ అధికారులు మేము బహిరంగం చేయాలను కోవడం లేదని, ఇక్కడ గొడవ చేయవద్దని మా వారు వేడుకుకున్నప్పటికీ వినకుండా వీరిపై దాడి చేశారని హెచ్ఐవీ డిస్ట్రిక్ ప్రాజెక్ట్ మేనేజర్ తెలిపారు. సమాచారం అందుకున్న తాడేపల్లి పోలీసులు, ఘటనా స్థలానికి వచ్చారు. మా సిబ్బందిపై దాడిచేసి ఫోన్లు లాక్కున్నారని, మా ఎన్జీవోస్ ఫోన్లు ఇప్పించాలని ఆయన పోలీసులను కోరారు. -
వరంగల్‌లో నల్లగొండ విద్యార్థిని ఆత్మహత్య
రామగిరి(నల్లగొండ): నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన విద్యార్థిని వరంగల్ జిల్లా అరేపల్లి సమీపంలోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్(BSc agriculture student) యూనివర్సిటీ ఆవరణలోని వరంగల్ వ్యవసాయ కళాశాలలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. నల్లగొండ పట్టణానికి చెందిన గుంటోజు సత్యనారాయణ, రమ్య దంపతులు రాక్హిల్స్ కాలనీలో నివాసం ఉంటున్నారు. సత్యనారాయణ పెద్దకాపర్తిలో బ్రాంచి పోస్ట్‌మాస్టర్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. మూడవ సంతానం రేష్మిత(19)కు(Reshmitha)ఇటీవల వరంగల్ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ బీఎస్సీలో సీటు వచ్చింది. నెల రోజుల క్రితం అడ్మిషన్ తీసుకుని హాస్టల్ ఉంటోంది. హాస్టల్లో చేరినప్పటి నుంచి చదువుతో ఒత్తిడికి గురవుతున్నట్లు కుటుంబ సభ్యులకు చెబుతోంది. దీంతో ఇటీవల ఇంటికి తీసుకొచ్చి నచ్చజెప్పి మళ్లీ వరంగల్ కాలేజీకి పంపించారు. మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులతో రేష్మిత ఫోన్లో మాట్లాడింది. మంగళవారం హాస్టల్ గదిలో రేష్మిత్ మాత్రమే ఉంది. బుధవారం ఉదయం రేష్మిత ఉన్న గది తలుపులు తీయకపోవడంతో అనుమానంతో తలుపులు పగులగొట్టి చూడగా.. రేష్మిత గదిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఇంటి నుంచి వెళ్లిన వారంలోనే కుమార్తె హఠాన్మరణం చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని నల్లగొండకు తరలించారు. గురువారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. హాస్టల్ సిబ్బంది, మేనేజ్మెంట్ పర్యవేక్షణ లోపం వల్లే తన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని తండ్రి సత్యనారాయణ ఏనుమాముల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. -
పరీక్షల్లో మళ్లీ ఫెయిలవుతానేమోనని..
కోరుట్ల రూరల్: మండలంలోని చిన్నమెట్పల్లికి చెందిన మోత్కూరి సంజయ్(19) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. మోత్కూరి వెంకటేశం–లత దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. చిన్న కొడుకు సంజయ్ కల్లూర్ మోడల్ స్కూల్లో ఇంటర్ చదివాడు. గతేడాది జరిగిన ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో ఫెయిలయ్యాడు. అప్పటినుంచి మనోవేదనకు గురవుతున్నాడు. అయితే, ఈసారి కూడా ఫెయిలవుతానేమోనని భయపడ్డాడు. బుధవారం శివరాత్రి కావడంతో తల్లిదండ్రులు గుడికి బయలుదేరారు. వారికి తాను తర్వాత వస్తానని చెప్పి, ఇంట్లోనే ఉరేసుకున్నాడు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. మృతుడి తండ్రి వెంకటేశ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
Hyderabad: గుర్రపు డెక్క తొలగిస్తుండగా ప్రమాదం
హైదరాబాద్: లంగర్‌హౌస్‌లోని చెరువులో గుర్రపు డెక్క తొలగించడానికి వెళ్లిన జీహెచ్ఎంసీ మలేరియా విభాగం కాంట్రాక్ట్ ఉద్యోగి షేక్ కరీం, తొమ్మిదో తరగతి చదువుతున్న ఆయన కుమారుడు సాహిల్ ప్రమాదవశాత్తు అందులో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన బుధవారం జరిగింది. కాగా.. బల్దియా అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తండ్రీ కొడుకులు చెరువులో మునిగి మృత్యువాత పడ్డారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. చాంద్రాయణ గుట్ట కందికల్ గేట్ ప్రాంతంలో నివసించే షేక్ కరీం (39) జీహెచ్ఎంసీ మలేరియా విభాగంలో కాంట్రాక్ట్ ఉద్యోగి. ఇతడికి ఈత బాగా రావడంతో చెరువుల శుద్ధి కోసం పంపించేవారు. ఇందులో భాగంగా మంగళవారం లంగర్‌హౌస్‌లోని జీహెచ్ఎంసీ చెరువులో కరీం గుర్రపు డెక్క తొలగించి వెళ్లాడు. బుధవారం సెలవు కావడంతో 9 వ తరగతి చదువుతున్న తన కుమారుడు సాహిల్‌ను అధికారుల అంగీకారంతో తనతో పాటు తీసుకువచ్చాడు. గుర్రపు డెక్క తీస్తుండగా ప్రమాదవశాత్తు ఇద్దరూ చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయారు. పతంగుల మాంజానే ప్రాణాలు తీశాయా? లంగర్‌హౌస్ చెరువును ఎప్పటికప్పుడు శుద్ధి చేయకపోవడంతో గుర్రపు డెక్కతో పాటు చెరువులో చెత్త పేరుకుపోయింది. దీనికితోడు ఇటీవల పతంగులు చెరువు నిండా పడ్డాయి. పతంగుల మాంజా దారాలలో చిక్కుకొని తండ్రీ కొడుకులు మృతి చెందినట్లు అధికారులు చెబుతున్నారు. కుమారుణ్ని కాపాడే ప్రయత్నంలో.. గుర్రపు డెక్క తొలగించడానికి చెరువులో దిగిన సమయంలో రెండు బండరాళ్ల వద్దకు కరీం తన కుమారుడు సాహిల్‌ను పంపించాడు. ఆ సమయంలో కాలుకు ఏదో తట్టుకుందని, తనతో కావట్లేదు.. తనను కాపాడాలని సాహిల్ అరిచాడు. ఇటువైపు ఉన్న తండ్రి వెంటనే అక్కడికి వెళ్లి కుమారుడిని ఎత్తే ప్రయత్నంలో ఇద్దరు మునిగిపోయారు.అధికారులు పరార్.. కరీం, సాహిల్‌లు చెరువులో ఉన్న సమయంలో ఒడ్డున ఎంటమాలజిస్టు అధికారి రమేష్‌తో పాటు ఆరుగురు మలేరియా విభాగం సిబ్బంది ఉన్నారు. నీటిలో మునిగిపోతున్న కుమారుడు సాహిల్‌ను కరీం తన భుజాలపై ఎత్తుకుని సిబ్బందిని కాపాడాలని కోరాడు. ఆ సమయంలో అధికారులతో పాటు సిబ్బంది కాపాడే ప్రయత్నం చేయకుండా జరిగిన విషయాన్ని స్థానిక నాయకులకు, మరికొందరికి ఫోన్ ద్వారా తెలుపుతూ సహాయం కావాలని కోరారు. వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది స్పందించి ఉంటే వారి ప్రాణాలు దక్కేవని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే.. జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి తాను బాధ్యతలు స్వీకరించిన వారం రోజుల్లో లంగర్‌హౌస్‌కు వచ్చి ఈ చెరువును దత్తత తీసుకొని అభివృద్ది చేస్తానన్నారు. అప్పుడు వచ్చి వెళ్లిన ఆమె మళ్లీ ఇటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం గమనార్హం. వెంటనే స్పందించిన హైడ్రా కమిషనర్.. చెరువులో తండ్రీ కొడుకులు మునిగిపోవడంతో పోలీసులు, స్థానిక ఎమ్మెల్యే వెంటనే హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఫోన్ చేసి సహాయం కోరారు. స్పందించిన ఆయన వెంటనే సహాయం కోసం డీఆర్ఎఫ్ సిబ్బందిని ఘటనా స్థలానికి పంపారు. సహాయక సిబ్బందికి కూడా మాంజా దారాలు అడ్డు రావడంతో 3 గంటల పాటు శ్రమించి తండ్రీకొడుకుల మృతదేహాలను వెలికితీశారు. కాగా.. 14 ఏళ్ల బాలుడిని పనిలో ఎలా పెట్టుకుంటారని జీహెచ్ఎంసీపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లంగర్‌హౌస్ చెరువులో తండ్రికొడుకుల మృతికి జీహెచ్ఎంసీ కమిషనర్, జోనల్ కమిషనర్లే బాధ్యత వహించాలని కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ మండిపడ్డారు. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఆయన సహాయక చర్యలను పర్యవేక్షించారు. -
ఆటోడ్రైవర్ అఘాయిత్యం
దొడ్డబళ్లాపురం(కర్ణాటక ): ఓ కిరాతక భర్త భార్యను హత్య చేసి ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన బెంగళూరు తిగళరపాళ్యలోని ముబారక్ నగర్లో చోటుచేసుకుంది. వివరాలు.. సురేశ్ (40), మమత (33) దంపతులు, అతడు ఆటో డ్రైవర్‌గా కుటుంబాన్ని పోషించేవాడు. అయితే సురేశ్ ఈ మధ్య సరిగా పనికి వెళ్లకపోవడంతో మమత గొడవపడేది. బుధవారం పండుగ అని ఇంట్లోనే ఉన్నాడు. మమత ప్రశ్నించడంతో రగడ మొదలైంది. ఆ సమయంలో వారి కొడుకు (6) అక్కడే ఉన్నాడు. సురేశ్ కోపం పట్టలేక మమతను గొంతు నులిమి చంపి, తరువాత తానూ ఉరి బిగించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే సురేశ్ భార్యకు మొబైల్లో అశ్లీల చిత్రాలు చూపించి వేధించేవాడని, ఈ విషయాన్ని మమత సురేశ్ తల్లికి చెప్పడంతో సహించలేక హత్య చేసినట్టు కూడా స్థానికులు చెబుతున్నారు. వీరిద్దరి స్వస్థలం తుమకూరు జిల్లా గుబ్బి. బ్యాడరహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
పుణె బస్టాండ్‌లో దారుణం
పుణె: మహారాష్ట్రలోని పుణెలో మంగళవారం ఉదయం స్వార్గేట్ జంక్షన్ బస్టాండ్‌లో ఆగిఉన్న ప్రభుత్వ బస్సులో 26 ఏళ్ల మహిళను ఒక పాత నేరస్తుడు రేప్ చేసి పారిపోయాడు. మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్‌కు చెందిన అత్యంత రద్దీగా ఉండే బస్‌జంక్షన్‌లలో ఒకటైన స్వార్గేట్ బస్టాండ్‌లో ఈ దారుణం చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. విషయం తెల్సుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిందితుడిని 36 ఏళ్ల దత్తాత్రేయ రాందాస్ గాడేగా గుర్తించారు. గతంలో ఇతనిపై దొంగతనం, దోపిడీ, చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి. ఘటనపై పోలీసులు, బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం తెల్లవారుజామున 5.45 గంటలకు సతారా జిల్లాలోని ఫల్టణ్ పట్టణానికి వెళ్లే బస్సు ఎక్కేందుకు బాధిత మహిళ ఈ బస్టాండ్‌లోని ఒక ప్లాట్‌ఫామ్ వద్ద వేచిచూస్తోంది. అదే సమయానికి అక్కడికి వచ్చిన నిందితుడు ‘సోదరీ’ అంటూ ఆమెతో మాటలు కలిపాడు. తాను బస్ కండక్టర్‌ను అని, మీరు ఎక్సాలిన బస్సు సమీపంలో ఆగి ఉందని చెప్పి, సమీపంలో ఆగి ఉన్న ‘శివ్ షాహీ’ ఏసీ బస్సును చూపించాడు. అది మీరు వెళ్లాల్సిన రూట్లో వెళ్తుందని చెప్పి ఆ బస్సు ఎక్కాలని ఆమెకు సలహా ఇచ్చాడు. అతని మాటలు నమ్మిన ఆమె ఎవరూ లేని ఆ బస్సు ఎక్కింది. లైట్లు ఆఫ్ చేసి, చిమ్మచీకటిగా ఉన్న బస్సును ఎక్కేందుకు తొలుత ఆమె తటపటాయించింది. బస్సులో ప్రయాణికులు నిద్రిస్తుండటంతో లైట్లు ఆర్పివేశారని, నచ్చజెప్పి బస్సులో లోపలిదాకా వెళ్లేలా చేశాడు. వెంటనే వెనకాలే వచ్చిన అతను బస్సు తలుపు మూసేసి, ఆమెను రేప్‌చేసి పారిపోయాడని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ స్మార్థనా పాటిల్ చెప్పారు. ఘటన జరిగినప్పుడు బస్టాండ్‌లో ఎన్నో బస్సులు, ఎంతో మంది ప్రయాణికులు ఉన్నారు. మహిళ తనకు జరిగిన అన్యాయంపై వెంటనే ఎవరికీ ఫిర్యాదు చేయలేదు. ఫల్టణ్కు వెళ్లే బస్సు ఎక్కి మార్గమధ్యంలో తన స్నేహితురాలికి ఫోన్‌చేసి ఘోరాన్ని వివరించింది. ఆమె సలహామేరకు బాధితురాలు వెంటనే బస్సు దిగి సమీప పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేసింది. దీంతో పోలీసులు భారతీయ న్యాయ సంహిత చట్టం కింద కేసు నమోదుచేశారు. నిందితుడిని అరెస్ట్చేసేందుకు పోలీసులు ఎనిమిది బృందాలను ఏర్పాటుచేసి వేట మొదలెట్టారు. పోలీస్‌స్టేషన్‌కు ఈ బస్టాండ్ కేవలం 100 మీటర్ల దూరంలో ఉంది. నిందితుడు గతంలో ఒక కేసులో బెయిల్ సంపాదించి 2019 ఏడాది నుంచి బయటే ఉన్నాడు.విపక్షాల విమర్శలు‘‘ఏమాత్రం భయం లేకుండా అసాంఘిక శక్తులు స్వైర విహారం చేస్తున్నాయి. పుణెలో నేరాలను అరికట్టడంలో హోం శాఖ బాధ్యతలు చూస్తున్న సీఎం విఫలమయ్యారు’’ అని ఎన్సీపీ(ఎస్పీ) నాయ కురాలు, ఎంపీ సుప్రియా సూలే విమర్శించారు. -
పుణ్యస్నానాలకు వెళ్లి ఏడుగురి మృతి
కొవ్వూరు/తాళ్లపూడి/శ్రీశైలం ప్రాజెక్ట్/కొళ్లికూళ్ల (పెనుగంచిప్రోలు): మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా బుధవారం నదీ స్నానాలకు వెళ్లిన ఏడుగురు మృత్యువాత పడ్డారు. వీరిలో ఐదుగురు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన యువకులు కాగా, ఇద్దరు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన తండ్రి, కుమారుడు ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామానికి చెందిన 12 మంది యువకులు బుధవారం ఉదయం ఏడున్నర గంటల సమయంలో మోటారు సైకిళ్లపై సమీపంలోని చింతలపూడి పంప్‌హౌస్ వద్ద గోదావరి నదిలో స్నానాలకు వెళ్లారు. అక్కడి ఇసుక ర్యాంపు వద్ద నీరు మూడు అడుగులే ఉండటంతో స్నానాలకు దిగారు. కేరింతలు కొడుతూ ఉత్సాహంగా స్నానాలు చేస్తూ నీరు ఎక్కువగా ఉన్న వైపు వెళ్లారు. కొద్ది దూరం వెళ్లేసరికి ప్రవాహం పెరగడంతో తిరుమలశెట్టి సాయిపవన్ (17), పడాల దుర్గాప్రసాద్ (19), అనిశెట్టి పవన్ గణేష్ (18), పడాల దేవదత్త సాయి (19), గర్రే ఆకాశ్ (19) కొట్టుకుపోయారు. వెంటనే స్థానిక జాలర్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందం సభ్యులు పడవలతో గాలించారు. మృతులంతా పేద కుటుంబాలకు చెందినవారే. జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి, ఎస్పీ నరసింహ కిశోర్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి తలారి వెంకట్రావు ఘటనా స్థలానికి వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శించారు. రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ కొవ్వూరు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి మృతదేహాలను పరిశీలించారు. ఈ ఘటనను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు మంత్రి తెలిపారు. శ్రీశైలం వద్ద తండ్రి, కుమారుడు మృతి ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం కొళ్లికూళ్ల గ్రామానికి చెందిన పెరుగు చిన్న గురవయ్య (35), ఆయన కుమారుడు వాసు (11) శ్రీశైలం లింగాలగట్టు వద్ద కృష్ణా నదిలో మునిగి మరణించారు. శివ దీక్ష తీసుకున్న గురవయ్య, భార్య తిరుపతమ్మ, కుమారుడు వాసు, ఆ గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన 40 మంది భక్తులు మంగళవారం బస్సులో శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లారు. బుధవారం ఉదయం స్నానాలు చేసేందుకు లింగాలగట్టు వద్దకు వెళ్లారు. కృష్ణా నదిలో స్నానం చేస్తుండగా వాసు కాలు జారి నీటిలో పడిపోయాడు. కుమారుడిని కాపాడబోయిన చిన్న గురవయ్య కూడా నీటిలో మునిగిపోయాడు. ఒడ్డున ఉన్న తిరుపతమ్మ పెద్దగా కేకలు వేయడంతో సమీపంలోని మత్స్యకారులు నదిలో దూకి వారిని రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. గురవయ్య, వాసు మృతదేహాలను పోలీసులు సున్నిపెంట ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. -
ఇంటర్నేషనల్ డ్రగ్స్ దందా కేసులో రూ.7.98 కోట్ల ఆస్తులు జప్తు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్నేషనల్ డ్రగ్స్ దందా కేసులో రూ.7.98 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) నిబంధనల మేరకు చేపట్టిన ఈ తాత్కాలిక జప్తులో 22 స్థిర, 8 చరాస్తులున్నాయి. మధ్యప్రదేశ్ ఇండోర్‌లో నిందితుడు ఆశిష్ జైన్, అతని కుటుంబ సభ్యుల పేరుపై ఉన్న రూ.6.52 కోట్ల విలువైన భూములు, రూ.1.46 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు సీజ్ చేసినట్లు ఈడీ బుధవారం పేర్కొంది. హైదరాబాద్ దోమలగూడలోని జేఆర్ ఇన్ఫినిటీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఆశిష్ జైన్ డ్రగ్స్ దందా నడుపుతున్నట్లు 2022లో ఎన్సీబీ అధికారులు గుర్తించారు. ఆశిష్ ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించి, రూ.3.72 కోట్ల నగదుతో పాటు ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్, ఇతర ఎల్రక్టానిక్ గాడ్జెట్లను స్వాధీనం చేసుకున్నారు. 2022, మే 4న ఎన్సీబీ కేసు ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. జేఆర్ ఇన్ఫినిటీ, ఆశిష్ జైన్, అతని కుటుంబ సభ్యులపై దర్యాప్తు ప్రారంభించింది. హైదరాబాద్‌లోని ఇంటర్నెట్ ఫార్మసీ ద్వారా అమెరికా తదితర దేశాలకు ఫార్మా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించింది. ఎవరికీ ఎటువంటి అనుమానం రాకుండా రహస్యంగా కంపెనీ ఆన్లైన్లో ఫార్మా మందులతో పాటు జేఆర్ ఇన్ఫినిటీ పేరుతో అక్రమ దందా నడుపుతున్నట్లు తెలుసుకుంది. మెయిల్స్, వీఓఐపీ ద్వారా కస్టమర్ల నుంచి ఆర్డర్స్ తీసుకుని డ్రగ్స్ సరఫరా చేసేవారని, క్రెడిట్ కార్డు, బిట్ కాయిన్స్ ద్వారా చెల్లింపులు కొనసాగుతున్నాయని గ్రహించింది. అ్రల్ఫాజోలం, జోల్పిడెమ్, లోరాజెపామ్, క్లోనాజెపామ్, హైడ్రోకోడోన్, ఆక్సికోడోన్ తదితర సైకోట్రోపిక్ పదార్థాలను ట్యాబ్లెట్ల రూపంలో చట్టవిరుద్ధంగా ఎగుమతి చేస్తున్నారని విచారణలో తేలింది. జేఆర్ ఇన్ఫినిటీ ఏర్పాటుకు ముందే ఆశిష్‌జైన్, అతని కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాల్లో రూ.4.50 కోట్లు విదేశాల నుంచి వచి్చనట్లు తేల్చారు. ఇలా రూ.12.76 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్లకు, స్థిరాస్తుల కొనుగోలుకు వె చ్చించినట్లు ఈడీ పేర్కొంది. -
ఆట కదరా శివా..!
ఎన్నో కలలు.. మరెన్నో ఆశలు.. ఇంకెన్నో కోరికలు.. యుక్తవయసు పిల్లలు. చదువులు గట్టెక్కాలని..అమ్మానాన్నలను ఆదుకోవాలని.. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలని ఎన్ని విషయాలు శివయ్యకు చెప్పుకొందామనుకున్నారో.. వారికేం తెలుసు ఆ స్వామి నేరుగా తన వద్దకే తీసుకుపోతాడని? గోదారి గంగలో శుచిగా స్నానమాచరించి స్వామి దర్శనం చేసుకుందామనుకున్న వారిని ఆ అమ్మే స్వయంగా అయ్య వద్దకు తీసుకువెళ్తుందని అనుకుని ఉండరు. అర్ధాంతరంగా తనువులు చాలించిన ఆ యువకుల పరిస్థితి అలా ఉంటే.. లయకారుడివని తెలుసు కానీ ఇంత నిర్దయగా మా కంటి పాపలను తీసుకుపోయి మా బతుకులలో అంధకారం మిగులుస్తావనుకోలేదని ఆ తల్లిదండ్రులు దీనంగా స్వామివారివైపు చూస్తున్నారు. నీ ఆటలు మాపైనా శివయ్యా.. ఇది నీకు తగునా అని కన్నీటి పర్యంతమవుతున్నారు.కొవ్వూరు/తాళ్లపూడి: మహా శివరాత్రి రోజు తాడిపూడిలో తీరని విషాదం చోటు చేసుకుంది. పరమేశ్వరుని దర్శనానికి గోదావరి నదిలో స్నానాలు ఆచరించి వెళ్దామనుకున్న 12 మంది యువకులలో ఐదుగురు నీట మునిగి మృతి చెందగా మరో ఏడుగురు సురక్షితంగా బయటపడ్డారు. బుధవారం ఉదయం తాడిపూడి గ్రామ శివారున ఇసుక ర్యాంపు వద్ద ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఆ యువకులు నదిలో శివరాత్రి పుణ్య స్నానాలు ఆచరించేందుకు గ్రామ శివారున చింతలపూడి ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ వెనుక భాగంలోని ఇసుక ర్యాంపు వద్దకు వెళ్లారు. నదిలో స్నానాలు ఆచరించి ప్రక్కిలంక శివాలయానికి వెళ్దామనుకున్నారు. స్నానాల కోసం నదిలో దిగారు. ఆ ప్రాంతంలో ఇసుక మేటలు వేయడంతో నదిలోతు తక్కువగా ఉంది. రెండు మూడు అడుగుల మేర మాత్రమే నీరు ఉండడంతో వారంతా ఉత్సాహంగా జలకాలాడుతూ కొంత ముందుకు వెళ్లారు. అక్కడ నది లోతుగా ఉండడంతో వారిలో పడాల దుర్గా ప్రసాద్ (19), పడాల దేవదత్త సాయి (18), అనిశెట్టి పవన్ గణేష్(18), గర్రే ఆకాష్ (19), తిరుమలశెట్టి పవన్ కుమార్ (19) అదుపుతప్పి ఒకరి తర్వాత మరొకరు నీట మునిగి మృత్యువాత పడ్డారు. వీరితో పాటు వెంట వెళ్లిన పడాల మల్లికార్జున్, ఆకుల రాజేష్, గంటా రాజా నరేంద్ర, గర్రే హర్షవర్ధన్, దుర్గాప్రసాద్, కరిబండి వినయ్‌తేజ, టేకు అంజనికుమార్ సురక్షితంగా బయటపడ్డారు. మునిగిపోతున్న వాళ్లను రక్షించేందుకు వారు యత్నించినప్పటికీ, ఈత రాకపోవడంతో వారి కళ్లెదుటే నదిలో మునిగిపోయారు. విషయం తెలుసుకుని స్థానిక గ్రామస్తులు భారీ సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి, ఎస్పీ నరసింహ కిశోర్, ఆర్డీవో రాణి సుస్మిత, డీఎస్పీ జి.దేవకుమార్‌తో ఇతర అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు. స్థానిక జాలర్లు, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక బృందాలతో నదిలో పడవల సాయంతో గాలించి మృతదేహాలను వెలికితీశారు. రిస్క్యూ టీం నాలుగు గంటల పాటు శ్రమించి, వెలికితీసిన మృతదేహాలను కొవ్వూరు ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించారు. ఘటనా ప్రదేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు, కొవ్వూరు రూరల్ సీఐ కె.విజయబాబు, డీఎఫ్‌వో మార్టిన్ లూథర్, తాళ్లపూడి ఎస్సై టి.రామకృష్ణ పర్యవేక్షించారు. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కో–ఆర్డినేటర్ తలారి వెంకట్రావు బాధిత కుటుంబాలను పరామర్శించారు. మంత్రి కందుల దుర్గేష్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మృతదేహాలను పరిశీలించి, బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని ప్రకటించారు.వారందరిదీ ఒకే గ్రామంగోదావరిలో మునిగి మృత్యువాత పడిన ఐదుగురు యువకులు తాడిపూడి వాసులే. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు నిరుపేదలు. వీరి మృతితో ఆ సామాజిక వర్గంలో విషాదం అలుముకుంది. మృతుల్లో ముగ్గురు వారి కుటుంబాల్లో ఏకైక కుమారులు కావడం, 20 ఏళ్ల లోపువారే కావడంతో వారి బాధ వర్ణనాతీతం.నాలుగేళ్ల క్రితం ముగ్గురు దుర్మరణంకొవ్వూరు పట్టణంలో సీతారామ స్నాన ఘట్టం సమీపంలో గోదావరి నదీ పాయల్లో స్నానాలకు వెళ్లి చాగల్లుకి చెందిన ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. 2021 ఏప్రిల్ 11న గోదావరి నదీ పాయల్లో నీరు తక్కువగా ఉందని వెళ్లి చాగల్లుకి చెందిన ఆరుగురు యువకులు ప్రమాదవశాత్తూ నీట మునిగి మృతి చెందారు. అదే ఏడాది కొవ్వూరు గోష్పాదక్షేత్రంలో ముగ్గురు మత్యువాత పడ్డారు. గోదావరి నదిలో వేసవి కాలంలో నీరు తగ్గిపోవడంతో ఇసుక మేటలు బయటపడుతున్నాయి. ఆ సమయంలో లోతు తక్కువగా కనిపిస్తుందని భావించి స్నానాలకు వెళ్లి ప్రమాదాల బారిన పడుతున్నారు. వీటి నియంత్రణపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంది.మృతుల కుటుంబాలను ఆదుకోవాలిగోదావరి నదిలో మునిగి మృత్యువాత పడిన ఐదుగురు యువకుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, ఒక్కొక్కరి కుటుంబానికి రూ.20 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి తలారి వెంకట్రావు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు. అంతకు ముందు ఘటన స్థలానికి వెళ్లి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఐదేళ్ల క్రితమే తండ్రి మృతిమృతుడు అనిశెట్టి పవన్ గణేష్ తండ్రి ఐదేళ్ల కిత్రమే మృతి చెందారు. తల్లి రజని చిన్న ప్రైవేటు స్కూలు టీచర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఆమెతో పాటు సోదరి ఉంది. పవన్ గణేష్ పదో తరగతి చదివి అనంతరం రాజమహేంద్రవరంలో గైట్ కాలేజీలో పాలిటెక్నిక్ డిప్లొమా మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఉద్యోగం చేసి కుటుంబానికి ఆసరా అవుతాడనుకున్న కొడుకును అకాల మృత్యువు కాటేయడంతో గర్భశోకంతో ఆ తల్లి దిక్కులు పిక్కటిల్లేలా రోదిస్తోంది.ఉన్న ఒక్క కొడుకునూ కోల్పోయాంమృతుడు తిరుమలశెట్టి పవన్ కుమార్ తల్లిదండ్రులకు ఏకై క కుమారుడు. ప్రస్తుతం కొవ్వూరులో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి రంగబాబు, తల్లి ఆదిలక్ష్మి, ఒక అక్క ఉన్నారు. తండ్రి కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. చేతికి అందివచ్చిన కొడుకు ప్రయోజకుడై కుటుంబానికి ఆధారంగా నిలుస్తాడని భావించిన వారి ఆశలు ఆవిరయ్యాయి.పెద్ద కొడుకుని కోల్పోయాంమృతుడు పడాల దుర్గా ప్రసాద్ ప్రక్కిలంకలోని ఐటీఐ చదువుతున్నారు. తండ్రి వెంకన్న దొర, తల్లి కుమారిలకు మొదటి సంతానం. తమ్ముడు మల్లికార్జున స్వామి ఇంటర్ చదువుతున్నాడు. తండ్రి వెంకన్న దొర వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ ఇద్దరు పిల్లల్ని చదివిస్తున్నాడు. మహా శివరాత్రి పర్వదినం రోజు పెద్ద కుమారుడిని గోదావరి కబళించిడంతో ఆ కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేక పోతున్నారు.స్టాఫ్‌వేర్ ఉద్యోగం చేస్తానన్నాడుగర్రే ఆకాశ్ ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం చేస్తానని చెప్పి అందని తీరాలకు వెళ్లిపోయాడు. తాళ్లపూడిలో ఇంటర్ ఎంపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. తండ్రి సీతారాం, తల్లి లక్ష్మి, తమ్ముడు ఉన్నారు. చదువులో చురుకుగా ఉండే ఆకాష్ ఇంటర్ తరువాత సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తానని చెప్పేవాడు. వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించే తండ్రికి ఆసరాగా నిలవాలనుకున్నాడు. ఇటీవల కళాశాల ఫేర్వెల్ డేలో కూడా ఉత్సాహంగా పాల్గొన్నాడు. మార్చి రెండు నుంచి జరిగే పరీక్షలకు ఇంటి దగ్గర కష్టపడి చదువు కుంటున్నాడని, ఇంతలోనే అతడు ప్రాణాలు కోల్పోవడాన్ని తట్టుకోలేక పోతున్నామని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.అండగా ఉంటాడనుకున్నాంమృతుడు పడాల దేవదత్త సాయి తండ్రి రామ దుర్గారావు వ్యవసాయ కూలి. ప్రస్తుతం తాళ్లపూడి కళాశాలలో ఇంటర్ ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. తల్లి లక్ష్మి గృహిణి. సోదరి దివ్య ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. వీరిది పేద కుటుంబం. మార్చి ఒకటి నుంచి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. చదువులో ముందుండే సాయి ఇంటర్లో మంచి మార్కులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇంతలోనే ఈ ఘోరం జరిగింది. చేతి అందివచ్చిన కొడుకు తమకు అండగా ఉంటాడానని భావించాం. ఇలా ఆకాల మృత్యువుకు బలవుతాడని అనుకోలేదంటూ తండ్రి రామదుర్గారావు కన్నీటి పర్యంతం అయ్యారు. -
వచ్చే నెలలో వివాహం.. అంతలోనే విషాదం
కీసర: బైక్‌ను కారు ఢీకొన్న ప్రమాదంలో అన్నదమ్ములిద్దరూ మృతి చెందిన విషాద ఘటన సోమవారం రాత్రి యాద్గార్పల్లి ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డులో జరిగింది. మృతుల్లో తమ్ముడికి వచ్చే నెలలో వివాహం జరగాల్సి ఉండగా.. అంతలోనే రోడ్డు ప్రమాదం అతడిని బలిగొనడంతో ఆ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. కీసర సీఐ శ్రీనివాస్, ఎస్ఐ నాగరాజు చెప్పిన వివరాల ప్రకారం.. యాదాద్రి–భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం రహీంఖాన్‌గూడకు చెందిన గూడూరు చంద్రశేఖర్ (36) బతుకుదెరువు నిమిత్తం కొన్నేళ్ల క్రితం నగరానికి వలస వచ్చాడు. తార్నాక ప్రాంతంలో టైలర్‌గా పని చేస్తున్నాడు.లాలాపేట శాంతినగర్‌లో ఉండే అతని సోదరుడు మత్స్యగిరి (27) విజయ డెయిరీలో పని చేస్తున్నాడు. వీరిద్దరూ కలిసి సోమవారం తమ అల్లుడు శ్రీను (17)తోకలిసి సోమవారం యాద్గార్‌పల్లిలోని బంధువుల ఇంటికి ద్విచక్ర వాహనంపై వచ్చారు. ఇదే రోజు రాత్రి తిరిగి నగరానికి వెళ్తుండగా యాద్గార్పల్లి– చీర్యాల ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో ఎదురుగా అతివేగంతో వచ్చిన కారు వీరి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో ముగ్గురు రోడ్డుపై పడిపోయారు. తీవ్ర గాయాలతో చంద్రశేఖర్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మత్స్యగిరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశాడు. చంద్రశేఖర్‌కు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. మార్చి 20న మత్స్యగిరి వివాహం జరగాల్సి ఉంది. రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములిద్దరూ మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నగరంలోని గాంధీ ఆసుపత్రిలో పోస్టు మార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రమాదంలో గాయపడిన శ్రీను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఆటగదరా శివ!
పలమనేరు: కర్మ సిద్ధాంతం ఒకటి ఉంటుందని గుర్తు చేసే ఘటన సోమవారం పలమనేరులో వెలుగు చూసింది. ఓ వివాహిత భర్తను, పిల్లలను కాదనుకుని ప్రియుడితో వెళ్లేందుకు ప్రయత్నించింది. అనూహ్యంగా.. ఆరు నెలలపాటు జైలు జీవితం గడిపింది. బయటకు వచ్చిన ఆమెను భర్త పెద్ద మనసుతో స్వీకరించాడు. అయితే చిన్నపాటి గొడవకే ఇప్పుడు ఆమె బలవన్మరణానికి పాల్పడింది. గత ఏడాది.. ఈ ఏడాది.. శివరాత్రి సందర్భంలోనే ఈ ఘటన జరగడం ఇక్కడ గమనార్హం. మున్సిపాలిటీ పరిధిలోని బోడిరెడ్డిపల్లికి చెందిన జగన్నాథం భార్య కోమల (36) బలవన్మరణానికి పాల్పడింది. సోమవారం ఉదయం ఇంట్లో చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన ఆమె జల్లిపేట చెరువులో ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో శివరాత్రి పూట ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గత శివరాత్రి నాడు ఏం జరిగిందంటే... గడ్డూరుకు చెందిన కోమలకు జగన్నాథంతో ఏడేళ్ల కిందట వివాహమైంది. ఈ జంటకు ఇద్దరు పిల్లలున్నారు. కిందటి ఏడాది.. శివరాత్రి పర్వదినాన జాగరణ పేరిట గుడి వెళ్తున్నానని చెప్పి.. కొలమాసనపల్లికి చెందిన గౌతం(26)తో వెళ్లిపోయేందుకు ప్రయత్నించింది. బైక్‌పై గడ్డూరు శివారులోని జగమర్ల అడవి వైపుగా వెళ్లారు. అయితే అప్పటికే జంటలను టార్గెట్ చేసే సైకో వినయ్ కంట వీళ్లు పడ్డారు.పెద్దపంజాణి మండలం శివాడికి చెందిన వినయ్.. ఏకాంతం కోసం అడవుల్లోకి, పార్క్‌ల్లోకి వచ్చే జంటను బెదిరించి బంగారం, డబ్బులు, స్మార్ట్ఫోన్లు చోరీ చేసేవాడు. అంతటితో ఆగకుండా బ్లాక్మెయిల్ చేసి అత్యాచారాలు చేసేవాడు. అలా.. ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో సైకో వినయ్‌పై కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో.. కోమల, గౌతంలను వినయ్ బెదిరించాడు. అందుకు వాళ్లు ఒప్పుకోకపోవడంతో రాడుతో దాడికి పాల్పడబోయాడు. అయితే జరిగిన పెనులాగటలో వినయ్ కింద పడిపోగా.. గౌతం పక్కనే ఉన్న బండరాయి పడేశాడు. దీంతో వినయ్ అక్కడిక్కడే మరణించాడు. ఆపై ఏమీ తెలియనట్లు గౌతం, కోమల అక్కడి నుంచి వెళ్లిపోయారు. మూడు రోజుల తర్వాత ఈ హత్యోదంతం వెలుగుచూసింది. దీంతో భయపడిన ఇద్దరూ అతన్ని చంపింది తామేనని పోలీసులకు లొంగిపోయారు.ఇప్పుడేమైందంటే... ఆరు నెలల తర్వాత కోమలను ఆమె తల్లిదండ్రులు బెయిల్ మీద బయటకు తీసుకొచ్చారు. మళ్లీ తప్పు చేయనని మాట తీసుకుని భర్త ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. అప్పటి నుంచి అంతా హాయిగా నడుస్తోంది. ఈ క్రమంలో చిన్నపాటి గొడవకు తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె ప్రాణం తీసుకోవడం ఆ ఇంట విషాదం నింపింది. ఇదంతా ఆ శివుడే ఆడించిన ఆట అంటూ గ్రామస్తులు పలువురు చర్చించుకుంటున్నారు. -
ఒకే అబ్బాయిని ప్రేమించిన ఇద్దరు అమ్మాయిలు..
అనంతపురం: ఓ యువకుడు ఇద్దరు యువతులను ప్రేమించి మోసం చేశాడు. దీంతో మనస్తాపం చెందిన యువతులు వాస్మాయిల్ తాగారు. ఇందులో ఒకరు మృతి చెందగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అనంతపురం వన్‌టౌన్ సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ తెలిపిన మేరకు... బత్తలపల్లి మండలం గెరిశనపల్లికి చెందిన దివాకర్ అనంతపురం బళ్లారి రోడ్డులోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. గతంలో ముదిగుబ్బకు చెందిన రేష్మ అనే యువతితో ప్రేమ వ్యవహారం నడిపాడు. పెద్దలు రేష్మకు వివాహం చేయగా.. పెళ్లయిన నెలకే ఆమె తన భర్తకు విడాకులు ఇచ్చింది. మళ్లీ దివాకర్‌తో ప్రేమాయణం సాగించింది.ఈ క్రమంలో రూ.2 లక్షలకు పైగా డబ్బు ఇచ్చింది. కాగా, కణేకల్లు మండలం ఎర్రగుంట గ్రామానికి చెందిన శారద (23) అనే యువతితోనూ దివాకర్ ప్రేమాయణం సాగించాడు. అటు రేష్మ, ఇటు శారద ఇద్దరితోనూ ఏకకాలంలో ప్రేమ బంధం నడిపాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో చాటింగ్ చేసేవాడు. ఇటీవల శారదకు దివాకర్ తీరుపై అనుమానం వచ్చి ఇన్‌స్టాగ్రామ్‌ను పరిశీలించగా.. రేష్మతో అతడి బాగోతం బయటపడింది. ఇదే క్రమంలో రేష్మ కూడా దివాకర్‌ను నిలదీసింది. విషయం తెలుసుకున్న రేష్మ కుటుంబ సభ్యులు ఆమెను కదిరిలో ఉన్న తమ బంధువుల ఇంటికి పంపారు.అయితే, శనివారం దివాకర్‌తో మరోమారు రేష్మ ఫోన్లో వాగ్వాదానికి దిగింది. ఈ క్రమంలో దివాకర్ కదిరికి వెళ్లి ఆమెను బైక్‌పై అనంతపురం తీసుకొచ్చాడు. శారద ఉంటున్న హాస్టల్లోనే ఆమెను వదిలాడు. ఆదివారం సాయంత్రం రేష్మ, శారదలు దివాకర్‌ను తామున్న చోటుకు పిలిచి ఇద్దరినీ పెళ్లిచేసుకోవాలని కోరారు. అయితే, తానెవరినీ పెళ్లి చేసుకునేది లేదంటూ దివాకర్ వెళ్లిపోయాడు. దీంతో మనస్తాపం చెందిన ఇద్దరు యువతులు ఆర్టీఓ కార్యాలయం వద్దకు వెళ్లి వాస్మాయిల్ తాగారు.విషయాన్ని దివాకర్‌కు ఫోన్లో తెలియజేయగా.. వెంటనే అతను అక్కడకు చేరుకుని స్థానికుల సాయంతో ఇద్దరినీ ప్రభుత్వ సర్వజనాసుపత్రికి తరలించాడు. ఆస్పత్రిలో చికిత్స ఫలించక శారద మృతి చెందింది. రేష్మ పరిస్థితి నిలకడగా ఉంది. శారద వాస్మాయిల్ ఎక్కువ తాగిందని, రేష్మ కొంచెమే సేవించినట్లు గుర్తించిన పోలీసులు ఇందులో రేష్మ పాత్రపైనా ఆరా తీస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ పేర్కొన్నారు.‘అమ్మా.. డ్యాన్స్ ప్రాక్టీస్‌కు వెళ్తున్నా’ -
మహా కుంభమేళాకు వెళ్లి ముగ్గురు మృతి
న్యాల్కల్(జహీరాబాద్): మహా కుంభమేళా యాత్ర రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడంతో మామిడ్గి, గంగ్వార్, మల్గి గ్రామాలు శోకసంద్రమయ్యాయి. రెండు రోజుల్లో తిరిగి వస్తామంటూ చిన్నారులను చెప్పి వెళ్లిన వారు తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. మామిడ్గికి చెందిన వెంకట్రాంరెడ్డి, భార్య విలాసిని, వదిన విశాల, ఇటికెపల్లి చెందిన జ్ఞానేశ్వర్‌రెడ్డి, మల్గికి చెందిన మల్లారెడ్డి, సంగారెడ్డికి చెందిన ఉపాధ్యాయుడు మోతిలాల్ కలిసి 22న కారులో మహా కుంభమేళాకు వెళ్లారు. పుణ్య స్నానాలు చేసి కాశీకి బయలు దేరగా మార్గమధ్యలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ట్రక్కును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో వెంకట్రాంరెడ్డి, విలాసిని, డ్రైవర్ మల్లారెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలు కాగా విశాల వారణాసి ట్రామా సెంటర్లో చికిత్స పొందుతున్నారు. వెంకట్రాంరెడ్డి సంగారెడ్డిలో ఉంటూ జహీరాబాద్ ఇరిగేషన్ డీఈఈగా, కోహీర్ ఇన్చార్జి అధికారిగా విధులు నిర్వహిస్తున్నాడు. అలాగే.. మల్లారెడ్డి కొంత కాలంగా జహీరాబాద్‌లో ఉంటున్నాడు. కూతురు, కుమారుడు ఉన్నారు. కూతురు ప్రియాంశీ 5వ తరగతి, కుమారుడు సాయి స్లోక్ రెడ్డి 7వ తరగతి చదువుతున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు న్యూఢిల్లీలోని తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ కార్యాలయం ఆయా జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తోంది. గాయాలైన వారికి మెరుగైన చికిత్స అందించడంతోపాటు మృతదేహాలను స్వస్థలాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటోంది. వెంకట్రాంరెడ్డి సౌమ్యుడు జహీరాబాద్: రోడ్డు ప్రమాదంలో మరణించిన నీటిపారుదల శాఖ డీఈఈ వెంకట్రాంరెడ్డి విధి నిర్వహణలో అందరికీ ఆదర్శంగా ఉండేవారు. తాను ఉన్నత ఉద్యోగిని అనేవిషయాన్ని పక్కన పెట్టి తానే స్వయంగా పనులు చూసేవారు. విధి నిర్వహణలో ఏ మాత్రం అలక్ష్యం చేయకుండా అన్నీ తానై చూసేవారు. పనుల నాణ్యత విషయంలో ఏ మాత్రం రాజీ పడేవాడు కారని, పని సంతృప్తి కరంగా ఉన్నట్లయితేనే బిల్లులు మంజురు సేచేవారనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. జహీరాబాద్‌లోని శ్రీసరస్వతీ శిశుమందిరంలో 1998లో 10వ తరగతి పూర్తి చేసుకున్నారు. అనంతరం ఉన్నత చదువులు హైదరాబాద్‌లో పూర్తి చేసుకుని 2007 జహీరాబాద్‌లో ఉద్యోగం పొందాడు. నీటిపారుదల శాఖలో ఏఈగా విధుల్లో చేరారు. అనంతరం పటాన్చెరు, నారాయణఖేడ్‌లో ఏఈగా పని చేశారు. డీఈఈగా పదోన్నతిపై తిరిగి జహీరాబాద్ వచ్చారు. తోటి ఉద్యోగులు, సిబ్బంది, స్నేహితులు, బంధువులతో మర్యాదగా మసలుకుంటూ సౌమ్యుడిగా పేరుతెచ్చుకున్నారు. రోడ్డుప్రమాదంలో మరణించిన డీఈఈ వెంకట్రాంరెడ్డికి దైవభక్తి అధికం. ప్రతి ఏటా కుటుంబంతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లివచ్చే వారు. సడెన్‌గా యాత్రకు వెళ్లాలని నిర్ణయం ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు వెళ్లిరావాలనే నిర్ణయం అప్పటికప్పుడు తీసుకున్నట్లుగా బంధువుల ద్వారా తెలుస్తోంది. యాత్రకు వెళుతున్న విషయం సన్నిహితులకు కూడా సమాచారం లేదు. కుంభమేళ ముగుస్తుండడంతో ఎలాగైనా వెళ్లిరావాలని బంధువులంతా నిర్ణయించి ప్రయాణమయినట్లు బంధువర్గాల సమాచారం. -
ప్రియురాలిని ఇంటికి తెచ్చి.. ఆపై ఇంట్లోవాళ్లని హతమార్చి!
కేరళలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు కుటుంబ సభ్యులతో పాటు ప్రియురాలి మీద దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురు చనిపోగా.. అతని తల్లి, ప్రియురాలు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నారు. తిరువనంతపురం సమీపంలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. వెంజరమూడు(Venjaramoodu) పీఎస్‌కు సోమవారం సాయంత్రం ఓ యువకుడు వచ్చాడు. తాను తన కుటుంబ సభ్యులను చంపినట్లు చెబుతూ పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటనపై ఆరా తీసిన పోలీసులు.. అది నిజమేనని తేలడంతో షాక్‌కి గురయ్యారు. ఈలోపు ఆ యువకుడు తనతో తెచ్చుకున్న ఎలుకల మందు తాగి పీఎస్‌లోనే పడిపోయాడు. దీంతో.. అతన్ని చికిత్స కోసం తిరువనంతపురం మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు.పెర్ములాలో నివాసం ఉంటున్న అఫన్(Afan).. స్థానికంగా బీఎస్సీ చదివే ఫర్సనాతో ప్రేమలో ఉన్నాడు. వాళ్ల ప్రేమకు ఫర్సనా కుటుంబ సభ్యులు అడ్డు చెప్పలేదు. ఈ క్రమంలో కొన్నిరోజుల కిందట ఆమెను అఫన్ తన ఇంటికి తీసుకొచ్చాడు. అయితే ఏం జరిగిందో తెలియదు.. సోమవారం తన ఇంట్లో తల్లి షమీ, సోదరుడు అఫ్సన్(13), ఫర్సనాపై దాడి చేశాడు. అక్కడి నుంచి బైక్ మీద ఎన్ఎన్ పురంలో ఉన్న మేనమామ లతీఫ్(69) ఇంటికి వెళ్లి ఆయన్ని, ఆయన భార్య షాహిదా(59)ను హతమార్చాడు. అక్కడి నుంచి పాంగోడ్లో ఉన్న బామ్మ సల్మా బీవీ దగ్గరకు వెళ్లి ఆమెను కూడా చంపేశాడు. 16 కిలోమీటర్ల పరిధిలోనే ఈ దారుణాలకు తెగబడ్డాడు. ఆపై నేరుగా పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.అఫన్.. పక్కన దాడి కోసం బైక్‌పై వెళ్తు క్రమంలో రికార్డైన దృశ్యంఅఫన్ దాడిలో తీవ్రంగా గాయపడ్డ తల్లి షమీ, ప్రియురాలు ఫర్సనా తీవ్ర గాయాలతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వాళ్లిద్దరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. మరోవైపు.. ఆత్మహత్యాయత్నం చేసిన అఫన్ ఆస్పత్రిలోనూ హల్చల్ చేశాడు. ఆస్పత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగి చికిత్సకు నిరాకరించాడు. దీంతో.. పోలీసుల సాయంతో బేడీలు వేయించి మరి బలవంతంగా అతనికి చికిత్స అందించారు.అఫన్కు డ్రగ్స్ అలవాటు ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ మత్తులోనే అఫన్ ఈ దారుణానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. తిరువనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నిందితుడి నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపించారు. మరోవైపు.. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగుతోందని, మంగళవారం అఫన్ను విచారణ జరుపుతామని వెంజరమూడు పోలీసులు చెబుతున్నారు. -
‘అమ్మా.. డ్యాన్స్ ప్రాక్టీస్‌కు వెళ్తున్నా’
కర్నూలు: మరో రెండు రోజుల్లో పాఠశాలలో వేడుక ఉంది. అందులో నిర్వహించే డ్యాన్స్ కార్యక్రమంలో అందరినీ అలరించాలని ఆ బాలుడు ఎంతో ఎదురు చూశాడు. ఇంతలోనే విషాదం చోటు చేసుకుంది. ‘అమ్మా.. డ్యాన్స్ ప్రాక్టీస్‌కు వెళ్తున్నా’ అని ఇంటి నుంచి బయటకు వెళ్లిన కుమారుడు విగత జీవిగా తిరిగొచ్చాడు. తండ్రి కళ్లేదుటే ఆ కుమారుడు లారీ చక్రాల కింద నలిగిపోయాడు. ఈ ఘటన ఆదోని పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని లంగర్‌బావి వీధికి చెందిన గురురాజ, ప్రతిభ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సత్యనారాయణ 9వ తరగతి, ద్వితీయ కుమారుడు ఆదిత్యనారాయణ (10) ఐదో తరగతి చదువుతున్నారు. గురురాజ.. మెడికల్ ఏజెన్సీ వృత్తి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఎమ్మిగనూరు రోడ్డులోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆదిత్యనారాయణ విద్యనభ్యసిస్తున్నాడు. అకాడమీ పూర్తి కావడంతో మంగళవారం ఫెర్వెల్ పార్టీ నిర్వహించాలని పాఠశాల యాజమాన్యం నిర్ణయించింది. ఈ సందర్భంగా విద్యార్థులతో నృత్య, సాంస్కృతిక ప్రదర్శనలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ మేరకు ఆదివారం కొందరు విద్యార్థులు డ్యాన్స్ ప్రాక్టీస్ చేయాలనుకున్నారు. ఈ క్రమంలో ఆదిత్యనారాయణ ఉదయం తన తండ్రి గురురాజతో బైక్‌పై పాఠశాలకు బయలుదేరాడు. మార్గమధ్యలో ఎమ్మిగనూరు రోడ్డులోని శ్రీ కృష్ణదేవాలయం సమీపంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ లారీ ఆదోని వైపు వేగంగా దూసుకువస్తుండగా తప్పించబోయి అదుపు తప్పి కింద పడ్డారు. అయితే గురురాజ ఒకవైపు పడిపోయి సురక్షితంగా ఉన్నాడు. మరోవైపు ఆదిత్యనారాయణ లారీ టైరు కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. బాలుడు మృతిచెందినా లారీని నిలబెట్టకుండా డ్రైవర్ పరారయ్యాడు. విషయం తెలుసుకున్న తల్లి ప్రమాద స్థలానికి చేరుకుని.. కుమారుడి జ్ఞాపకాలను తలుచుకుని రోదిస్తున్న తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఆసుపత్రికి తరలించారు. తండ్రి గురురాజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. తప్పించుకున్న లారీ డ్రైవర్, లారీని సీసీ కెమెరా ద్వారా పోలీసులు గుర్తించారు. త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.అమ్మా.. నేనేం పాపం చేశా! -
రోహింగ్యాల వ్యవస్థీకృత వ్యభిచార దందా
సాక్షి, హైదరాబాద్: మయన్మార్ నుంచి అక్రమంగా నగరానికి వలస వచ్చిన రోహింగ్యాలు వ్యవస్థీకృతంగా వ్యభిచార దందా కొనసాగిస్తున్నారు. తమ జాతీయతను దాచి పెట్టడానికి నకిలీ ఆధార్ కార్డులు తయారు చేసుకున్నారు. వీరి వ్యవహారాలపై సమాచారం అందుకున్న దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పాతబస్తీతో పాటు పలు ప్రాంతాల్లో సోమవారం మెరుపు దాడులు చేశారు. 18 మందిని అదుపులోకి తీసుకుని చాదర్‌ఘాట్ పోలీసులకు అప్పగించారు. మయన్మార్ నుంచి బంగ్లాదేశ్ మీదుగా అక్రమంగా సరిహద్దులు దాటి వచ్చిన ఈ రోహింగ్యాలు కోల్‌కతాలో నకిలీ ఆధార్ కార్డులు సంపాదించారు. వీటిని తయారు చేసి ఇచ్చిన వ్యక్తులు వారిని వెస్ట్‌బెంగాల్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన వారిగా చూపించారు. ఈ ఆధార్ కార్డుల ఆధారంగా నగరానికి చేరుకున్న వీరు పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. వీరిలో పురుషులు సెకండ్ హ్యాండ్ బైకులు కొనుగోలు చేసి వాటి ఆధారంగా ట్యాక్సీ డ్రైవర్లుగా పని చేస్తుండగా... మహిళలు, యువతులు వ్యభిచార వృత్తిలో దిగారు. పరిచయస్తులతోనే ఈ దందా చేస్తున్న వారిని సంబందీకులైన పురుషులే తమ వాహనాలపై తీసుకెళ్లి కస్టమర్ల వద్ద వదిలి వస్తున్నారు. కొన్నాళ్లుగా సాగుతున్న ఈ దందాపై దక్షిణ మండల టాస్‌్కఫోర్స్‌కు సమాచారం అందడంతో సోమవారం వివిధ ప్రాంతాల్లో వరుస దాడులు చేసిన ప్రత్యేక బృందాలు మొత్తం 18 మందిని పట్టుకున్నాయి. వారి నుంచి వాహనాలు, నకిలీ గుర్తింపుకార్డులతో పాటు ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రోహింగ్యాల్లో కొందరిని చాదర్‌ఘాట్ పోలీసులకు అప్పగించినట్లు తెలిసింది. -
డాక్టర్ సుమంత్ రెడ్డిపై హత్యాయత్నం.. దారి తప్పిన భార్య కథ
సాక్షి, హైదరాబాద్ : వాళ్లిద్దరూ భార్య భర్తలు. ఎనిమిదేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. దంపతులిద్దరూ సమాజంలో గౌరవప్రదమైన డాక్టర్, లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే, లెక్చరర్‌గా విద్యాబుద్ధులు నేర్పించే భార్య పక్కదారి పట్టింది. దారుణానికి ఒడిగట్టింది. తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హతమార్చేందుకు ప్లాన్ చేసింది. హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. ముందస్తు ప్లాన్ ప్రకారం, అనుకున్నట్లుగా భర్త చనిపోకపోవడంతో చివరికి పోలీసులకు పట్టుబడింది. దోషిగా కటకటాల్లోకి వెళ్లనుంది.రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వరంగల్ డాక్టర్ సుమంత్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనలో అసలు సూత్రధారి, పాత్రదారి బాధితుడి భార్య ఫ్లోరా మరియా అని తేలడం అందర్నీ షాక్‌కు గురి చేసింది. మంగళవారం నిందితులను పోలీసులు మీడియా ఎదుట హాజరు పరిచే అవకాశం ఉన్నట్లు సమాచారం.పోలీసుల వివరాల మేరకు, డాక్టర్ సుమంత్ రెడ్డి, ఫ్లోరా మరియాలు ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. కాజీపేటలో సుమంత్ క్లినిక్‌ను నిర్వహిస్తుండగా, అతని భార్య ఫ్లోరా మరియా రంగశాయిపేటలో డిగ్రీ లెక్చరర్‌గా పనిచేస్తోంది. అయితే, క్లినిక్ ప్రారంభించకముందు ఓ ఆస్పత్రిలో డాక్టర్‌గా సుమంత్ పనిచేసేవారు. ఆ సమయంలో ఫ్లోరా మరియా ఓ జిమ్‌లో చేరింది. అక్కడే ఆమెకు సామెల్ అనే యువకుడు పరిచయమయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారింది. వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం మొదలైంది. ఆ విషయం సుమంత్‌కు తెలిసిపోవడంతో భార్య ఫ్లోరాను మందలించాడు.అయినా, ఆమె వినిపించుకోలేదు. భర్తను వద్దనుకొని, ప్రియుడే కావాలని అనుకున్న ఆమె, చివరికి భర్తను అడ్డొదగొట్టాలని అనుకుంది. ఇందుకోసం ప్రియుడు సామెల్, అతని స్నేహితుడు ఏఆర్ కానిస్టేబుల్ రాజును ఆమె పురమాయించింది. నేరం చేస్తే మట్టికి అంటకుండా ఉండాలన్న ఉద్దేశ్యంతో భర్తను ఎక్కడ, ఎలా హత్య చేయాలో ఫ్లోరా చెప్పింది.సుమంత్‌ను చంపి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు స్కెచ్ వేసింది. ప్లాన్ ప్రకారం, యాక్సిడెంట్ ప్లాన్ విఫలమయ్యాక, ప్లాన్ బీ ప్రకారం ఈ నెల 20న రాత్రి ఖాజీపేట నుండి బట్టుపల్లి బైపాస్ రహదారిలో సమంత్ కారును అడ్డగించి, అతడిపై ఐరన్ రాడ్లతో దాడి చేశారు. చనిపోయాడనుకున్న తర్వాత నిందితులు పరారయ్యారు. కానీ చావుబతుకుల మధ్య ఉన్న బాధితుణ్ని స్థానికులు అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సుమంత్‌పై జరిగిన హత్యాయత్నంపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో కట్టుకున్న భార్య ఫ్లోరా మరియా, ఆమె ప్రియుడు సామెల్, సామెల్ స్నేహితుడు ఏఆర్ కానిస్టేబుల్ రాజు నిందితులని తేలింది. మంగళవారం నిందితులను పోలీసులు మీడియా ఎదుట హాజరుపరచి, హత్యయత్నానికి సంబంధించిన వివరాలను వెల్లడించనున్నారు. -
గుంటూరు పెదకాకానిలో తీవ్ర విషాదం
గుంటూరు: జిల్లాలోని పెదకాకానిలో తీవ్ర విషాదం నెలకొంది. విద్యుత్ షాక్‌తో నలుగురు దుర్మరణ చెందారు. గోశాల వద్ద సంపులో పూడిక తీస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుది. ఒక రైతుతో పాటు ముగ్గురు కూలీలు మృతి చెందారు. సంపులో పూడిక తీసివేతకు రైతు.. కూలీలను మాట్లాడుకుని ఆ పని చేస్తుండగా ఈ విషాదం జరిగినట్లు తెలుస్తోంది. -
అమ్మా.. నేనేం పాపం చేశా!
మహాబూబాబాద్, సాక్షి: కన్నతల్లే ఆ పిల్లల పాలిట మృత్యు దేవతగా మారింది. తన భర్త మరణించాక మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. అయితే తన సుఖానికి పిల్లలే అడ్డొస్తున్నారని భావించి వాళ్లను లేకుండా చేయాలనుకుంది. ఈ ప్రయత్నంలో ఆ చిట్టితల్లిని విషమిచ్చి ఆ కన్నతల్లి చేజేతులారా చంపేసుకుంది. డోర్నకల్ మండలంలోని జోగ్య తండ గ్రామ పంచాయతీ పరిధిలోని మంగళ్ తండాకు చెందిన వాంకుడోత్ వెంకటేష్(30) నాలుగు నెలల కిందట అనారోగ్యంతో చనిపోయాడు. దీంతో ఆయన భార్య ఉష, ఇద్దరు పిల్లలు నిత్యశ్రీ (05) అబ్బాయి వరుణ్ తేజ (07)ల అత్తింట్లోనే ఉంటోంది. ఈ నెల 5వ తేదీన ఇంటి వద్ద ఆడుకుంటూ పిల్లలిద్దరూ కిందపడి పోయారు. వాంతులు, విరోచనాలు కావడంతో కంగారు పడిపోయిన వెంకటేష్ తల్లి.. పిల్లలను ఏం జరిగిందని వాకబు చేసింది. అమ్మ కూల్‌డ్రింక్ తాగించిందని అమాయకంగా చెప్పారు ఆ ఇద్దరూ. ఆ తర్వాత బాబాయ్ రాంబాబు సహాయంతో పిల్లలను ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ రెండు రోజుల చికిత్స అనంతరం పిల్లల శరీరంలో గడ్డిమందు అవశేషాలు ఉన్నాయని వైద్యులు తెలపడంతో బంధువులు ఉషను నిలదీశారు. పిల్లలకు కూల్‌డ్రింక్‌లో గడ్డిమందు కలిపి తాగించినట్లు ఒప్పుకుందామె. ఈలోపు పిల్లల ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. పిల్లలకు ఏమైనా జరిగితే తనను చంపేస్తారన్న భయంతో.. ఉష ఎలుకల మందు తాగింది. దీంతో ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు పిల్లల బాబాయ్ ఫిర్యాదు చేయడంతో.. డోర్నకల్ పోలీసులు ఈ నెల 10న హత్యాయత్నం కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సుమారు రెండువారాల తర్వాత వరుణ్‌తేజ్ కోలుకోగా.. పరిస్థితి విషమించి నిత్యశ్రీ ఆదివారం మృతి చెందింది. దీంతో కేసును హత్య కేసుగా మార్చిన పోలీసులు.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక ఆమెను అరెస్ట్ చేస్తామని ప్రకటించారు. ఆ అధికారితో ఉష సంబంధం!నిత్యశ్రీ పోస్టుమార్టంను పర్యవేక్షించిన డోర్నకల్ సీఐ బీ రాజేశ్.. దగ్గరుండి ఆ చిన్నారి మృతదేహాన్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. కుటుంబ సభ్యులకు అప్పగించే క్రమంలో జోగ్యతండాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉషను తీసుకు రావాలంటూ ఆగ్రహంతో స్థానికులు ఊగిపోయారు. ఆంబులెన్స్‌కు అడ్డుపడి ధర్నా చేపట్టారు. స్థానికంగా ఉన్న ఓ పోలీస్ అధికారితో ఉష సంబంధం ఉందని, ఆ అధికారి చెప్పడంతోనే ఆమె ఈ ఘోరానికి పాల్పడిందని ఆరోపించారు. చిన్నారి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలా.. 12 గంటలు ధర్నా కొనసాగించారు. ఈ తరుణంలో గ్రామ పెద్దలతో పోలీసులు చర్చలు జరిపారు. నిత్యశ్రీ మృతికి కారణమైన పోలీస్ అధికారిపై విచారణ జరిపించి.. ఈ విషయంలో అయన పాత్ర ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు ధర్నా విరమించగా.. నిత్యశ్రీ మృతదేహాన్ని బంధవులకు అప్పగించారు. -
రాజలింగమూర్తి భార్య సంచలన వ్యాఖ్యలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నాగవెల్లి రాజలింగమూర్తి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తన భర్త నాగవెల్లి రాజలింగమూర్తి హత్యకేసులో బీఆర్ఎస్ పెద్దల హస్తం ఉందని బాధితుడి భార్య సరళ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజలింగమూర్తి హత్యపై ఆయన భార్య సరళ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నా భర్త హత్యలో బీఆర్ఎస్ పెద్దల హస్తం ఉంది. గండ్ర వెంకట రమణా రెడ్డి నా భర్త హత్యలో సంబంధం లేదన్నారు. ఇప్పుడు ఆయన ప్రధాన అనుచరుడే హత్యకు సూత్రదారుడిగా ఉన్నారు.దీన్ని బట్టే అర్థమవుతోంది.. హత్య వెనుక ఎవరెవరి హస్తాలు ఉన్నాయో. హత్యకు గల కారణం ఏంటో. చిన్న భూమి తగాద విషయంలో ఈ హత్య జరగలేదు. భూమి విషయంలో హత్య జరిగితే ఎలాంటి సంబంధం లేని కొత్త హరిబాబు ప్రమేయం ఇందులో ఎందుకు ఉంది.మేడిగడ్డ ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై కేసు వేసినందుకే నా భర్తను హత్య చేశారు.రేణికుంట్ల కొమురయ్యకు భూమి తగదాలో నా భర్త వారికి సహాయం చేశారు. నా భర్త హత్య కేసు నమోదు సమయంలో నేను ఇచ్చిన సంచారం వేరు, పోలీసులు నమోదు చేసుకున్నది వేరుగా వుంది. సీబిసిఐడి దర్యాప్తు బృందం చేత హత్య కేసు విచారణ జరిపించాలి. గండ్ర వెంకటరమణా రెడ్డి, కొత్త హరిబాబులను శిక్షించి మా కుటుంబానికి న్యాయం చేయాలి’ అని డిమాండ్ చేశారు. -
Hanamkonda: నిద్రలోనే కన్నుమూసిన కవలలు
గణపురం : ముక్కు పచ్చలారని ఇద్దరు కవలలు నిద్రలోనే కన్నుమూశారు.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం నగరంపల్లిలో శని వారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. గణపురం మండలం గొల్లపల్లిలకి చెందిన మర్రి లాస్యశ్రీ, అశోక్ దంపతులకు రెండో సంతానంగా ఒక బాబు, ఒక పాప కవల పిల్లలు జన్మించారు. లాస్య నగరంపల్లిలోని తల్లిగారింటి వద్ద నా లుగు నెలలుగా ఉంటోంది. శనివారం మధ్యాహ్నం లాస్య పిల్లలకు డబ్బా పాలు తాగించి పడుకోబెట్టింది. కొద్ది సేపటి తర్వాత వారిని చూడగా ముక్కులనుంచి నురగ రావడాన్ని గమనించి భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వంద పడకల ఆస్పత్రికి తరలిçంచగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.న్యూట్రీసియా కంపెనీకి చెందిన ‘డిక్సోలాక్ ’డబ్బా పాల వల్లే త మ పిల్లలు మృతి చెందినట్లు లాస్య ఆరోపిస్తోంది. పాల డబ్బా కు ఎక్స్పైరీ డేట్ ఈ ఏ డాది డిసెంబర్ వరకు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు గణ పురం ఎస్సై రేఖ అశోక్ తెలిపారు. పిల్లల మృతదేహాలకు వైద్యపరీక్షలు నిర్వహించిన తరువాతే మృతికి కారణాలు తెలుస్తాయని ఆయన వివరించారు. -
రాజలింగమూర్తి కేసులో ఏడుగురు అరెస్ట్.. నిందితుల్లో బీఆర్ఎస్ నాయకుడు!
సాక్షి, భూపాలపల్లి: తెలంగాణలో సంచలనంగా మారిన భూపాలపల్లి రాజలింగమూర్తి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. తాజాగా ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక, అరెస్ట్ అయిన వారిలో బీఆర్ఎస్ నేత హరిబాబు కూడా ఉన్నారు. ఆయనే ప్లాన్ చేసినట్టు పోలీసులు తెలిపారు.భూపాలపల్లి రాజలింగమూర్తి హత్య కేసుకు సంబంధించిన వివరాలను తాజాగా ఎస్పీ కిరణ్ ఖరే మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ..‘రాజలింగమూర్తి హత్యకు భూ వివాదమే కారణం. సంజీవ్, రాజలింగమూర్తి మధ్య భూ వివాదం కొనసాగుతోంది. పక్కా ప్లాన్ ప్రకారమే హత్య చేశారు. కంట్లో కారం కొట్టి కత్తులతో పొడిచి హతమార్చారు. ఈ హత్యలో నలుగురు వ్యక్తులు నేరుగా పాల్గొన్నారు. మిగతా వాళ్లు వారితో టచ్‌లో ఉన్నారు. బీఆర్ఎస్ నాయకుడు హరిబాబు ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు గుర్తించాం. ప్లాన్ ప్రకారం వరంగల్‌లోని కాశీబుగ్గలో హత్యకోసం కత్తులు, రాడ్లను దుండగులు కొనుగోలు చేశారు. ఇతర కోణాల్లో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ఇప్పటి వరకు ఈ హత్య కేసులో పాత్రధారులు, సూత్రదారులైన ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశాం. మరికొంత మంది నిందితులు పరారీలో ఉన్నారు. ఆరు బృందాలతో కలిసి పోలీసులు వారి కోసం గాలింపు చర్యల్లో ఉన్నారు. త్వరగానే పరారీలో ఉన్న నిందితులను పట్టుకుంటామని చెప్పారు. ఇదిలా ఉండగా.. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, మాజీ ఎమ్మేల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి ముఖ్య అనుచరుడే కొత్త హరిబాబు. ఈ కేసులో A1 రేణిగుంట్ల సంజీవ్.. హత్యకు ముందు, తర్వాత హరిబాబుతో టచ్‌లో ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ హత్య కేసుతో సంబంధం ఉన్న వారందరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఎస్పీ వెల్లడించారు.నిందితుల పేర్లు వెల్లడి..A1)రేణికుంట్ల సంజీవ్A2) పింగిలి సీమంత్A3)మోరె కుమార్A4)కొత్తూరి కిరణ్A5) రేణికుంట్ల కొమురయ్యA6) దాసర కృష్ణA7) రేణిగుంట్ల సాంబయ్యపరారీలో ఉన్న వారుA8) కొత్తూరి హరిబాబు A9) పుల్ల నరేష్ A10) పుల్ల సురేష్ -
వివాహమైన నెలకే భార్య దూరమైందని .....
సికింద్రాబాద్: వివాహమైన నెల రోజులకే భార్యతో మనస్పర్థలు వచ్చి విడిపోవడంతో..జీవితంపై విరక్తి చెందిన ఒక యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖాదౌర గ్రామానికి చెందిన నీలేశ్ సింగ్ (25) తన సోదరుడు ముఖేశ్ సింగ్ ఇతర స్నేహితులతో కలిసి ఉపాధి కోసం నగరానికి వచ్చారు. మేడ్చల్ ప్రాంతంలో ఉంటూ రాయల్‌పూర్ క్వారీలో టిప్పర్ డ్రైవర్‌గా పని చేస్తున్నారు. మేడ్చల్ ప్రాంతంలో వీరందరి పని పూర్తవడంతో కడపలోని క్వారీలో పని చూసుకున్నారు. æకడపకు వెళ్లేందుకు నీలేశ్ తన సోదరుడు ముఖేష్, మిత్రులతో కలిసి శనివారం సాయంత్రం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాడు. రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైలు టికెట్ తీసుకున్న వారంతా రైల్వేస్టేషన్ వెయిటింగ్ హాలులో కూర్చున్నారు. అదే సమయంలో తన పాకెట్లోంచి సెల్‌ఫోన్, పర్సు తీసిన నీలేశ్ తన బ్యాగులో పెట్టి ఇప్పుడే వస్తానని సోదరుడికి చెప్పి బయటకు వెళ్లాడు. రైలు వచ్చే సమయం అవుతున్నా నీలేశ్ రాకపోవడంతో అతడి సోదరుడు, మిత్రులు స్టేషన్ అంతటా గాలించినా ఆచూకీ లభించలేదు. ఇదిలా ఉండగా రైల్వేస్టేషన్ యార్డు సమీపంలో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్టు స్టేషన్ డిప్యూటీ మేనేజర్ రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల దర్యాప్తులో నీలేశ్ ఆత్మహత్యకు పాల్పడినట్టు తేలింది. ఇదిలా ఉండగా ఇటీవలే నీలేశ్‌కు వివాహం జరిగిందని, వ్యక్తిగత కారణాలతో నెల రోజుల కాపురం అనంతరం వారిద్దరు విడిపోయారని మృతుడి సోదరుడు ముఖేష్ పోలీసులకు వివరించాడు. అప్పటి నుంచి నీలేశ్ ముభావంగా ఉంటన్నాడని, అదే కారణంతో ఆత్మహత్యకు పాల్పడ్డట్టు తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు నీలేష్ మృతదేహానికి పోస్టుమార్టం చేయించి బంధువులకు అప్పగించారు. -
ట్రాక్టర్‌ను ఢీకొన్న పెళ్లి బస్సు.. ఒకరు మృతి, పలువురికి గాయాలు
సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. నార్కట్‌పల్లి-అద్దంకి హైవేపై ఓ ప్రైవేటు బస్సు..ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ పప్రమాదంలో ఒక మహిళ మృతిచెందగా.. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఈ ఘటనకు సంబంధించి వివరాల ప్రకారం.. మిర్యాలగూడ సమీపంలో నార్కట్‌పల్లి-అద్దంకి హైవేపై ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న ట్రాక్టర్‌ను ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌పై ప్రయాణిస్తున్న మహిళ మృతిచెందింది. ఇదే సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో 12 మంది గాయాలయ్యాయి. దీంతో, వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, వీరంతా హైదరాబాద్‌లో ఓ వివాహ వేడుకకు హాజరై నెల్లూరుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది, ఇక, ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 36 మంది ఉన్నట్టు సమాచారం. -
పీఈటీ కొట్టారని విద్యార్థి ఆత్మహత్య
ఉప్పల్ (హైదరాబాద్): నగరంలోని ఓ పాఠశాలలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్కూల్ పీఈటీ కొట్టడమే కాకుండా తోటి విద్యార్థుల ముందు అవమానించాడంటూ ఎనిమిదో తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్కూల్ భవనం నాల్గో అంతస్తు నుంచి కిందికి దూకి బలవన్మరణం పొందిన ఘటన శనివారం ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని సిద్ద హంగిర్గా గ్రామానికి చెందిన ముంగ ధర్మారెడ్డి, సంగీత దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు లింగారెడ్డి, చిన్న కుమారుడు సంగారెడ్డి(14). వీరి కుటుంబం 15 ఏళ్ల క్రితం నగరానికి వచ్చి బోడుప్పల్ పరిధిలోని ద్వారకా నగర్లో నివాసముంటోంది. తోపుడు బండిపై వ్యాపారం చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. సంగారెడ్డి.. ఉప్పల్‌లోని న్యూ భరత్‌నగర్‌లోని సాగర్ గ్రామర్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం స్టడీ అవర్ సమయంలో సంగారెడ్డి స్కూల్లో సీసీ కెమెరాలను కదిలించాడంటూ క్లాస్ టీచర్.. పీఈటీ ఆంజనేయులుకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆంజనేయులు కొట్టడంతోపాటు మందలించారు. శనివారం ఉదయాన్నే స్కూల్‌కు వచి్చన సంగారెడ్డిని పీఈటీ పనిష్మెంట్ పేరిట మరోసారి తరగతి గదిలో కొట్టడంతోపాటు అరగంటపాటు నిలబెట్టారు. తల్లిదండ్రులను పిలిపిస్తానని, టీసీ ఇచ్చి పంపిస్తానని బెదిరించారు. తోటి విద్యార్థుల ముందు దీన్ని అవమానంగా భావించిన సంగారెడ్డి.. ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నాడు. ముందుగా తన నోట్ బుక్‌లో ‘సారీ మదర్– ఐ విల్ డై టుడే’అని రాసి వాష్‌రూంకు వెళ్తున్నానని చెప్పి తరగతి బయటకు వచ్చాడు. వస్తూ వస్తూ స్నేహితులకు బైబై అని చెప్పాడు. మూడవ అంతస్తులో ఉన్న తరగతి గది నుంచి నాల్గో అంతస్తుకు చేరుకుని అక్కడినుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న మల్కాజిగిరి ఏసీపీ చక్రపాణి, ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డి, మేడిపల్లి సీఐ గోవింద్ రెడ్డి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పంచనామా నిర్వహించి సంగారెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ అసుపత్రికి తరలించారు. స్కూల్ యాజమాన్యం, పీఈటీ ఆంజనేయులు, క్లాస్ టీచర్‌పై కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమంటూ డీఈవో పాఠశాలను సీజ్ చేశారు. కన్నీరు మున్నీరైన తల్లి ‘ప్రయోజకుడు కావాలని రెక్కలు ముక్కలు చేసుకుని పిల్లలను ప్రైవేట్ బడిలో చదివిస్తున్నా. ఎంతకష్టమొచి్చనా ఫీజును ఆపే వాళ్లం కాదు. నా కొడుకు ఏ పాపం చేశాడని చంపేశారు? అంటూ సంగారెడ్డి తల్లి కన్నీరు మున్నీరైంది. బాధ్యులను కఠినంగా శిక్షించాలని పోలీసులను వేడుకుంది. ఆమె ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్ ఆవరణలో కూర్చుని రోదించడం స్థానికులను కలచివేసింది. -
పట్టపగలే నడిరోడ్డుపై.. కన్న కొడుకే తండ్రిని కత్తితో పొడిచి..
సాక్షి, మేడ్చల్ జిల్లా: కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. పట్టపగలే నడిరోడ్డుపై కన్న కొడుకే తండ్రిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. సికింద్రాబాద్ లాలాపేటకు చెందిన ఆరెల్లి మొగిలి (45) ప్యాకర్స్ అండ్ మూవర్స్‌లో పనిచేస్తుండగా, అతని కుమారుడు సాయి కూడా అదే కంపెనీలో పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసైన మొగిలి.. నిత్యం తాగొచ్చి ఇంట్లో గొడవ చేసేవాడు. కుటుంబ కలహాలతో పాటు వీరిమధ్య కొంతకాలంగా ఆస్తికి సంబంధించి తగాదాలు కూడా ఉన్నాయి.దీంతో విసిగిపోయిన సాయికుమార్.. తండ్రినే హతమార్చాలని భావించాడు. శనివారం మధ్యాహ్నం లాలాపేట నుంచి బస్సులో వెళ్తున్న మొగలిని కుమారుడు సాయి వెంబడించాడు.. ఈసీఐఎల్ బస్ టెర్మినల్ వద్ద మొగిలి బస్సు దిగగానే.. వెనుక నుంచి వెళ్లి కత్తితో దాడి చేశాడు. దాదాపు 15 సార్లు విచక్షణారహితంగా కత్తితో పొడిచాడు. స్థానికులు మొగిలిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించగా, అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు. సీసీ కెమెరాల్లో రికార్డయిన దాడి దృశ్యాలు ఆధారంగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఒకే ఇంట్లో ముగ్గురి మృతి.. డైరీలో ఆమె ఫోన్ నంబర్!
వారిద్దరూ విద్యావంతులు. దానికి తోడు ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు. ఏమైందో ఏమో తెలియదుగానీ తల్లితో కలిసి విగతజీవులుగా మారిపోయారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మరణాలు కేరళలో (Kerala) కలకలం రేపాయి. వారు ముగ్గురు ఎలా చనిపోయారు, ఎందుకు అకాల మరణం చెందారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విచారణ పూర్తయితేనే అన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు అంటున్నారు.అసలేం జరిగింది?కొచ్చిలోని ఎకాముఖ్ ప్రాంతంలో ఉన్న సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ క్వార్టర్స్‌లోని ఓ ఇంటిలో ఇద్దరు మహిళలతో పాటు ముగ్గురి మృతదేహాలను పోలీసులు శుక్రవారం కనుగొన్నారు. మృతులు శాలిని విజయ్, మనీశ్ విజయ్, శకుంతలగా గుర్తించారు. శాలిని.. జార్ఖండ్ (Jharkhand) సాంఘిక సంక్షేమ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తుండగా, ఆమె సోదరుడు మనీశ్.. ఐఆర్ఎస్ అధికారి. కొచ్చిలోని సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ విభాగంలో అడిషనల్ కమిషనర్ ఉద్యోగం చేస్తున్నాడు. లివింగ్ రూములో సీలింగ్ హుక్కు ఉరివేసుకుని మనీశ్ చనిపోయాడు. మరో గదిలో శాలిని నిర్జీవంగా కనిపించారు. వీరి తల్లి శకుంతల మృతదేహం తెల్లని వస్త్రంలో చుట్టివుందని, పూలు చల్లిన ఆనవాళ్లు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.మనీశ్ డైరీలో చెల్లెలి ఫోన్ నంబర్మనీశ్, శాలిని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. శకుంతల మరణానికి గల కారణాలు అటాప్సీ రిపోర్ట్ వచ్చిన తర్వాతే వెల్లడవుతాయని చెప్పారు. ‘శకుంతల మరణం సహజమా, మరేదైనా కారణాలు ఉన్నాయనేది అటాప్సీ నివేదిక వచ్చిన తర్వాతే తెలిసే అవకాశం ఉంద’ని త్రిక్కకరా ఏసీపీ పీవీ బేబీ తెలిపారు. మనీశ్ డైరీలో ఫిబ్రవరి 15న రాసిన నోట్‌ను పోలీసులు గుర్తించారు. తమకు సంబంధించిన కొన్ని పత్రాలను దుబాయ్‌లో (Dubai) ఉంటున్న తన చెల్లెలికి అప్పగించాలని కోరుతూ, ఆమె ఫోన్ నంబరు కూడా అందులో రాశారు.టాపర్‌గా నిలిచి.. కేసులో ఇరుక్కుని.. శాలిని.. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(జేపీఎస్సీ) 2003లో నిర్వహించిన మొదటి సివిల్ సర్వీసెస్ కంబైన్డ్ పోటీ పరీక్షలో టాపర్‌గా నిలిచారు. ఈ పరీక్ష ద్వారా 64 మంది ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాలు సాధించారు. అయితే ఇందులో అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టింది. దర్యాప్తు ముందుకు సాగకపోవడంతో 2022, జూలైలో జార్ఖండ్ హైకోర్టు విచారణను సీబీఐకి అప్పగించింది. రంగంలోకి దిగిన సీబీఐ.. శాలినితో పాటు మిగతా నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. ఈ కేసులో తదుపరి విచారణ ఈనెల 27న జరగాల్సివుంది. ఈ నేపథ్యంలో శాలిని మరణించడం చర్చనీయాంశంగా మారింది.ప్రొఫెసర్ శకుంతల శకుంతల బొకారో (Bokaro) ప్రాంతానికి చెందిన వారని, వీరి కుటుంబం రాంచీలో 2013 వరకు అద్దె ఇంటిలో ఉందని తెలిసింది. శకుంతల కుటుంబ సభ్యులు భక్తిభావంతో మెలిగేవారని, తమతో స్నేహంగా ఉండేవారని పొరుగింటివారు వెల్లడించారు. బొకారోలో శకుంతల ప్రొఫెసర్‌గా పనిచేసేవారని తెలిపారు. ఆమె మరో కుమార్తె పెళ్లిచేసుకుని రాజస్థాన్‌లో స్థిరపడిందని చెప్పారు. నాలుగేళ్ల క్రితం రాంచీ ఇన్‌కం ట్యాక్స్ ఆఫీసులో కలిసినప్పుడు మనీశ్ అప్యాయంగా పలకరించాడని.. అతడితో పాటు శాలిని, శకుంతల మరణించారన్న వార్త తెలిసి చాలా బాధపడ్డామన్నారు. కాగా వీరి ముగ్గురి మరణానికి కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు.చదవండి: వివాహ వేడుకలో విషాదం.. విచారణలో బయటపడ్డ అసలు విషయంఅన్నికోణాల్లోనూ దర్యాప్తుశాలినిపై సీబీఐ కేసు కారణంగానే వీరు ఆత్మహత్య చేసుకున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శకుంతల సహజంగా చనిపోయివుంటే ఆమె మరణాన్ని తట్టుకోలేక కూతురు, కొడుకు ప్రాణాలు తీసుకున్నారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. వీరి మానసిక పరిస్థితి గురించి కూడా ఆరా తీస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. -
వివాహ వేడుకలో విషాదం.. విచారణలో బయటపడ్డ అసలు విషయం
Shocking Viral Video: పెళ్లి వేడుకలో అంతా హుషారుగా డ్యాన్సులు వేస్తున్నారు. అంతలో ఊహించిన ఘటన.. ఆ ఊరిలో తీవ్ర విషాదం నింపింది. హుషారుగా డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో ఆ ఊరి సర్పంచ్ భర్త ఊపిరి ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. అయితే.. ఈలోపు సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియో చక్కర్లు కొట్టగా.. విచారణలో అసలు విషయం బయటపడింది.పంజాబ్ జలంధర్ గోరయా ప్రాంతంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఆ ఊరి సర్పంచ్ భర్త పరమ్‌జిత్ సింగ్(49) ఓ వివాహ వేడుకలో హుషారుగా చిందులేస్తూ కుప్పకూలిపోయారు. గుండెపోటుతో ఆయన మరణించారని కుటుంబ సభ్యులు, పోలీసులు వెల్లడించారు. అయితే సోషల్ సోషల్ మీడియాలో ఓ వైరల్ అయ్యింది.వివాహ వేడుకలో ఓ వ్యక్తి చిందులేస్తూ.. తుపాకీ పేల్చాడు. అయితే అది పక్కనే డ్యాన్స్ చేస్తున్న పరమ్జిత్కు తగిలింది. దీంతో ఆయన కిందపడిపోయారు. కిందపడిన పరమ్‌జిత్.. తుపాకీతో కాల్చిన వ్యక్తిని మందలించారు కూడా. అయితే ఆ వెంటనే ఆయన అలాగే స్పృహ కోల్పోయారు. వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. బుల్లెట్ గాయంతోనే పరమ్‌జిత్ మరణించాడని, విషయం బయటకు రాకుండా బాధిత కుటుంబం పెద్దల సమక్షంలో డబ్బు తీసుకుందని తేలింది. పిస్టల్ పేల్చిన వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పంజాబ్ సహా భారతదేశంలో ఇలాంటి వేడుకలలో బహిరంగంగా ఆయుధాల్ని ప్రదర్శించడం నిషిద్ధం. ఒకవేళ అది ఉల్లంఘిస్తే నేరం కిందకే వస్తుంది. जालंधर में एक शादी समारोह में की गई हवाई फायरिंग में एक युवक को गोली लग गई, जिससे उसकी मौत हो गई. जानकारी के मुताबिक मृतक गांव की मौजूदा सरपंच के पति हैं. घटना का वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है. #Jalandhar | #Firing pic.twitter.com/NovyLH21vK— Veer Arjun (@VeerArjunDainik) February 22, 2025 VIDEO Credits: VeerArjunDainik -
ఇల్లాలిని, పిల్లనిచ్చిన మామను అతి కిరాతంగా నరికిన భర్త..
కొవ్వూరు(కాకినాడ): కుటుంబ కలహాల నేపథ్యంలో కట్టుకున్న ఇల్లాలిని, పిల్లనిచ్చిన మామను ఓ వ్యక్తి అతి దారుణంగా కత్తితో నరికిన ఘటన సంచలనం రేపింది. ఈ ఘటనలో భార్య మృతి చెందగా, మామ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. కొవ్వూరు ఎస్సై కె.జగన్మోహన్ కథనం ప్రకారం.. కొవ్వూరు మండలం వాడపల్లి బంగారుపేటకు చెందిన అడ్డాల నాగయ్య రెండో కుమార్తె కృష్ణతులసి(33)కి, కృష్ణా జిల్లా తిరువూరు మండలం రాజుగూడేనికి చెందిన మురళీకృష్ణకు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. దంపతుల మధ్య మనస్పర్థలు రావటంతో కృష్ణతులసి కుమారుడు రాముతో కలసి ఆరు నెలల క్రితం బంగారుపేటలోని తండ్రి నాగయ్య వద్దకు వచ్చేసింది. ఈ నేపథ్యంలో మురళీకృష్ణ కూడా బంగారుపేటకు వచ్చి కొబ్బరి బొండాల వ్యాపారం చేసుకుంటున్నారు. దంపతులిద్దరూ విడివిడిగా జీవనం సాగిస్తున్నారు. నాగయ్యకు అల్లుడు మురళీకృష్ణ కొంత సొమ్ము ఇవ్వాల్సి ఉంది. ఆ డబ్బులు అడిగేందుకు కృష్ణతులసి గురువారం సాయంత్రం భర్త మురళీకృష్ణ వద్దకు వెళ్లింది. తనను డబ్బులు అడగడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన మురళీకృష్ణ కొబ్బరి బొండాలు నరికే కత్తితో ఆమైపె దాడి చేశాడు. అది గమనించిన నాగయ్య అడ్డుకునేందుకు ప్రయత్నించగా అతడిపై కూడా మురళీకృష్ణ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో కృష్ణతులసి అక్కడికక్కడే మృతి చెందగా, నాగయ్య తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొవ్వూరు డీఎస్పీ సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు మురళీకృష్ణ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. కృష్ణతులసి కుమారుడు రాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కె.జగన్మోహన్ తెలిపారు. -
ప్రేమించకపోతే మీ కుటుంబ సభ్యులను చంపేస్తా..!
కామవరపుకోట: ఆకతాయిల వేధింపులు తాళలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం కామవరపుకోట పంచాయతీ వడ్లపల్లిలో చోటుచేసుకుంది. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వడ్లపల్లి గ్రామానికి చెందిన గంజి నాగ దీప్తి (19) ఏలూరు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతోంది. గత కొంతకాలంగా నాగ దీప్తి కాలేజీకి వచ్చి, వెళ్లే సమయాల్లో కామవరపుకోటకు చెందిన ఆకతాయిలు ఆమెను ప్రేమించాలని, లేకపోతే మీ కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరించేవారు. ఈ విషయంపై ఆమె అన్నయ్య అరవింద్ ఆ యువకులను నిలదీశాడు. దీంతో ఇటీవల కామవరపుకోటలో జరిగిన వీరభద్రస్వామి తిరునాళ్లలో అరవింద్‌ను తీవ్రంగా కొట్టినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. బుధవారం మళ్లీ ఆ యువకులు నాగ దీప్తికి ఫోన్ చేసి తమను ప్రేమించకపోతే మీ అన్నయ్యతో సహా మీ కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరించారు. దీంతో మనస్థాపానికి గురైన నాగదీప్తి గురువారం ఇంట్లో ఫ్యాన్‌కు ఊరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆసమయంలో తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు, రాణి వ్యవసాయ పనుల నిమిత్తం పొలం వెళ్లగా అన్నయ్య అరవింద్ గదిలో నిద్రపోతున్నాడు. నాగ దీప్తి ఫ్యానుకు వేలాడుతూ ఉండడాన్ని గమనించిన అరవింద్ చుట్టుపక్కల బంధువుల సహాయంతో జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నా కుమార్తె మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఆమె కన్నీటి పర్యంతమైంది. ఈ ఘటనపై తడికలపూడి ఎస్సై చెన్నారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఇంటర్ విద్యార్థిని బలవన్మరణం
ఖమ్మం సహకారనగర్: ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఇంటరీ్మడియెట్ ప్రథమ సంవత్సరం(ఎంపీసీ) చదువుతున్న విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఏటపాకకు చెందిన యోగ నందిని (16) ఖమ్మంలోని ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతూ కాలేజీ హాస్టల్లోనే ఉంటోంది. ఆమె ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తుండగా సంక్రాంతి సెలవులకు వెళ్లి చాన్నాళ్ల తర్వాత కాలేజీకి తిరిగి వచ్చినట్లు తెలిసింది. ఆపై మళ్లీ ఇంటికి వెళ్లగా గురువారమే హాస్టల్‌కు చేరుకుంది. శుక్రవారం ఉదయం ప్రత్యేక తరగతులకు హాజరైన నందిని ఆపై రెగ్యులర్ తరగతులకు కూడా వెళ్లింది. మధ్యలో తన ఆరోగ్యం బాగాలేదని హాస్టల్ గదికి వెళ్లి ఎంతసేపటికీ రాకపోవడంతో హాస్టల్ సిబ్బంది వెళ్లి చూడగా తలుపులు వేసి ఉన్నాయి. పిలిచినా పలకకపోవడంతో తలుపులు పగలగొట్టి చూడగా ఉరికి వేలాడుతోంది. అపస్మారక స్థితికి చేరుకున్న ఆమెను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా, నందిని మృతి సమాచారం తెలుసుకుని వచ్చిన ఆమె తల్లిదండ్రులు రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. కాగా, యోగనందిని కుడి చేతికి సర్జరీ కావడం, ఆ బాధతో పరీక్షలు రాయలేక మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుందని ఆమె తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఖమ్మం అర్బన్ పోలీసులు తెలిపారు -
పెళ్లి మంటపంలో కుప్పకూలిన వధువు తండ్రి
భిక్కనూరు(హైదరాబాద్): మంగళ వాయిద్యాలు మోగుతుండగా వేదపండితులు పెళ్లి తంతు నిర్వహిస్తున్నారు. బంధువులు, స్నేహితులంతా పెళ్లి మంటపానికి చేరుకున్నారు. అల్లుడు, కూతురు కాళ్లు కడిగిన వధువు తండ్రి ఆనందంగా అందరినీ పలకరిస్తున్నారు. మరోవైపు భోజనాలు కూడా మొదలయ్యాయి. ఇంతలోనే ఆ తండ్రి గుండెపోటుతో కుప్పకూలిపోయారు. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. వివరాలు ఇలా ఉన్నాయి.. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం రామేశ్వర్పల్లికి చెందిన కుడిక్యాల బాల్‌చంద్రం (55) కామారెడ్డి పట్టణంలోని హౌసింగ్‌బోర్డులో నివసిస్తున్నారు. చిన్నచిన్న కాంట్రాక్టు పనులు చేసేవారు. ఆయనకు భార్య రాజమణి, కూతుళ్లు కనకమహాలక్ష్మి, కల్యాణలక్ష్మి ఉన్నారు. పెద్ద కూతురు కనకమహాలక్ష్మి పెళ్లి కుదిరింది. శుక్రవారం భిక్కనూరు మండలం బీటీఎస్ చౌరస్తా వద్ద ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో పెళ్లి జరిగింది. ఈ సందర్భంగా స్నేహితులు, బంధువులను బాల్‌చంద్రం ఆనందంగా పలకరించారు. అందరూ అభినందనలు తెలిపారు. వచ్చే ఏడాది చిన్న కూతురు పెళ్లి కూడా చేస్తానని చాలా మందితో బాల్‌చంద్రం చెబుతూ సంతోషంగా ఉన్నారు. ఇంతలోనే ఒక్కసారిగా ఆయన గుండెపోటుతో కుప్పకూలిపోయారు. బాల్‌చంద్రంను వెంటనే కామారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ ఆయన కన్నుమూశారు. కూతురు పెళ్లిలో తండ్రి కన్నుమూయడం ఆ కుటుంబానికి తీరని విషాదం మిగిలింది. పెళ్లి కోసం వేసిన పందిరిలో విగతజీవిగా పడిపోయిన తండ్రిని చూసి ఆ కూతురు రోదించిన తీరు అందరినీ కలచివేసింది. సాయంత్రం కామారెడ్డి పట్టణంలో బాల్‌చంద్రం అంత్యక్రియలు నిర్వహించారు. -
భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న జాయింట్ కమిషనర్ భార్య
బౌద్ధనగర్: తనను వేధింపులకు గురి చేస్తూ.. మరో మహిళతో కలిసి ఉన్న జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించింది ఆయన భార్య. ఈ ఘటన వారాసిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ రాచకొండ సైదులు, బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌లోని వారాసిగూడకు చెందిన జానకీరామ్ జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకు గతంలో వివాహమైంది. కొంత కాలం తర్వాత దంపతులు విడాకులు తీసుకున్నారు. 2018లో బౌద్ధనగర్‌కు చెందిన కల్యాణితో జానకీరామ్‌కు రెండో పెళ్లి జరిగింది. కొన్నాళ్ల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. ఆ తర్వాత జానకీరామ్, కల్యాణి కలిసి ఆయన తల్లిదండ్రులతో నివసించసాగారు. ఈ క్రమంలోనే కల్యాణిని అత్తామామలతో పాటు తన భర్త అన్న, వదిన వేధింపులకు గురి చేసేవారు. జానకీరామ్‌కు మరో వివాహం చేసేందుకు కల్యాణిని ఇంట్లో నుంచి వెళ్లగొట్టే ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో జానకీరామ్ నాలుగు నెలల క్రితం భార్యను ఆమె పుట్టింట్లో వదిలేసి వెళ్లాడు. అప్పటి నుంచి కల్యాణి ఎన్నిసార్లు ఫోన్లు చేసినా భర్త లిఫ్ట్ చేసేవాడు కాదు. దీంతో భర్తపై అనుమానం కలిగిన కల్యాణి శుక్రవారం తన కుటుంబ సభ్యులతో కలిసి వారాసిగూడలోని భర్త ఇంటికి వెళ్లి చూడగా.. అతను మరో అమ్మాయితో కలిసి ఉన్నాడు. వీరిద్దరినీ పట్టుకొని దేహశుద్ధి చేశారు. వారాసిగూడ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని జానకీరామ్‌తో పాటు సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు. కాగా.. తన భర్త మరో మహిళను పెళ్లి చేసుకుని కాపురం పెట్టినట్లు సమాచారం రావడంతో వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు బాధితురాలు కల్యాణి తెలిపారు. తన భర్తతో పాటు ఆయన కుటుంబ సభ్యులు తనను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేశారని, తాను 3 నెలల గర్భిణిగా ఉన్న సమయంలో కడుపుపై భర్త తన్నడంతో గర్భస్రావం జరిగిందని తెలిపారు. గ్యాస్ సిలిండర్ లీక్ చేసి చంపేందుకు ప్రయత్నించాడని ఫిర్యాదులో కల్యాణి పేర్కొన్నారు. 20 మంది దాడి చేశారు: జానకీరామ్ తనతో పాటు ఇంట్లో ఉన్న తన స్నేహితురాలిపై 20 మంది దాడికి పాల్పడ్డారని జాయింట్ కమిషనర్ జానకీరామ్ వారాసిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన భార్య కల్యాణి, బావమరిది బులిశెట్టి భాస్కర్ సుమారు 20 మందితో కలిసి ఇంట్లోకి వచ్చి దాడి చేశారన్నారు. ఇరువురి ఫిర్యాదుల మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ రాచకొండ సైదులు తెలిపారు. -
కలిమెల సమితిలో దారుణం
మల్కన్‌గిరి(భువనేశ్వర్): మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి గుముకా పంచాయతీలో దారుణం జరిగింది. ఓ మహిళపై ఆత్యాచారం చేసి అనంతరం ఆమెను హత్య చేశాడో మృగాడు. వివరాల్లోకి వెళితే.. గుముకా గ్రామంలో సీంగే మడ్కమి (30) అనే మహిళ నివసిస్తుంది. ఆమె భర్త మాల్ల మడ్కమి వలస కూలీగా ఆంధ్రాలో పని చేస్తున్నాడు. వీరి తొమ్మిదేళ్ల కుమారుడు వెంకటాపల్లేం ఆశ్రమ పాఠశాలలో ఉంటూ చదువుకుంటున్నారు. సీంగే పొలం పనులు చేసుకుంటూ ఒక్కర్తే ఉంటుంది. సీంగే ఓంటరిగా ఉంటున్నట్టు తెలుసుకున్న పుల్లిమేట్ల గ్రామానికి చెందిన ముక్క పడియామి గురువారం సాయంత్రం ఆమె ఇంట్లోకి చొరబడి ఆత్యాచారం జరిపి అనంతరం చంపేశాడు. సీంగే కేకలు విన్న స్థానికులు ఇంటి తలుపులు తెరచి చూడగా నిందితుడు పారిపోతుండగా పట్టుకొని చెట్టుకు కట్టి దేహశుద్ధి చేశారు. అనంతరం కలిమెల పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసు ఐఐసీ చంద్రకాంత్ తండ వచ్చి నిందితుడ్ని అరెస్టు చేశారు. అయితే స్థానికులు కొట్టడంతో తీవ్రంగా గాయపడడంతో అతన్ని కలిమెల ఆరోగ్యకేంద్రానికి చికిత్స నిమిత్తం తరలించారు. కాగా సీంగే మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు భర్తకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసు అధికారులు చెప్పారు. -
బెంగళూరులో మహిళపై సామూహిక అత్యాచారం
బెంగళూరు: నగరంలో ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తాజాగా వెలుగు చూసింది. ఓ హోటల్లో 33 ఏళ్ల మహిళపై కొంతమంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. క్యాటరింగ్ సర్వ్ చేసే మహిళపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. జ్యోతి నివాస్ కాలేజ్ జంక్షన్ వద్ద వెయిట్ చేస్తున్న ఆ మహిళను ఓ నలుగురు కుర్రాళ్లు ఫాలో అయ్యారు. వారంతా హోటల్ తీసుకున్నామని, అక్కడకి డిన్నర్ కు భోజనం తీసుకురమ్మని చెప్పారు. దాంతో ఆమె డిన్నర్‌కు భోజనం తీసుకెళ్లగా వారు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.డిన్నర్ చేసిన తర్వాత వారంతా ఆమెను లొంగదీసుకున్నట్లు ఆమె ఫిర్యాదు చేసిందని పోలీసులు పేర్కొన్నారు. ఆ హెటల్ టెర్రాస్ పై కి తీసుకెళ్లి ఆ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తామని బెదిరించారన్నారు. ఈ ఉదయం(శుక్రవారం) ఆరు గంటలకు ఆమెను వదిలేశారన్నారు. ఈ విషయాన్ని ఆమె తన భర్తకు తెలియజేయటంతో పాటు పోలీసులకు చెప్పడంతో అసలు విషయం వెలుగు చూసింది. ఈ ఘటనలో ముగ్గుర్ని అరెస్ట్ చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు చెప్పారు.ఆమెపై అత్యాచారానికి పాల్పడిన నిందితులంతా వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడ హోటల్లో పని చేయడానికి వచ్చిన వారిగా గుర్తించినట్లు సదరు పోలీస్ అధికారి చెప్పారు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీ కొట్టిన బస్సు.. ఏడుగురు మృతి
గాంధీ నగర్ : గుజరాత్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కచ్ జిల్లాలో జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు దుర్మురణం పాలయ్యారు. శుక్రవారం కీరా ముంద్రా రహదారి మార్గంలో 40మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.రోడ్డు ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు, ఇతర వాహనదారులు క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారికి చికిత్స కొనసాగుతుండగా.. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
ఢిల్లీ లేడీడాన్ అరెస్ట్.. డ్రగ్స్ సరఫరా చేస్తుండగా..
న్యూఢిల్లీ:దేశ రాజధాని ఢిల్లీలో లేడి డాన్‌గా పేరొందిన జోయాఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. జోయాఖాన్ వద్ద నుంచి 270 గ్రాముల నిషేధిత హెరాయిన్‌ను స్పెషల్ సెల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ హషీమ్బాబా మూడో భార్య అయిన జోయాఖాన్ బాబా నేర సామ్రాజ్యాన్ని నడిపిస్తోంది. విలాసవంతమైన జీవితం గడిపే జోయా సెలబ్రిటీల పార్టీలు,ఫంక్షన్లకు తరచు హాజరవుతుంది.గ్యాంగ్ నడిపే విషయమై తన భర్త బాబాను తరచు జైలుకు వెళ్లి కలిసి సలహాలు తీసుకుంటుందని పోలీసులు తెలిపారు.జోయాను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నప్పటికీ ఆమె వారి నుంచి తప్పించుకుంటూ వస్తోంది.అయితే నార్త్ఈస్ట్ఢిల్లీలో డ్రగ్స్ సరఫరా చేస్తోందని వచ్చిన సమాచారం మేరకు దాడి చేసి జోయాను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు.జోయా వద్ద దొరికిన 270 గ్రాముల హెరాయిన్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో ఒక కోటి రూపాయల దాకా ఉంటుందని అంచనా. -
చీటింగ్ కేసులోమంత్రికి రెండేళ్ల జైలు శిక్ష
నాసిక్: 30 ఏళ్ల నాటి చీటింగ్, ఫోర్జరీ కేసుకు సంబంధించి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మాణిక్‌రావు కొకాటేకు నాసిక్ జిల్లా కోర్టు రెండేళ్ల జైలు శిక్ష, యాభైవేల జరిమానా విధించింది. ఈ కేసులో మంత్రి సోదరుడు సునీల్ కోకాటేను కూడా దోషిగా పేర్కొంటూ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. కోకాటే సోదరులు 1995లో తాము తక్కువ ఆదాయ వర్గానికి (ఎల్ఐజీ) చెందినవారమని పేర్కొంటూ ముఖ్యమంత్రి విచక్షణ కోటా కింద ఇక్కడి యోలకర్ మాలలోని కాలేజీ రోడ్డులో రెండు ఫ్లాట్లను పొందారు. దీనిపై మాజీ మంత్రి, దివంగత టీఎస్ ఢిఘోల్ ఫిర్యాదు మేరకు అప్పట్లో సర్కార్వాడ పోలీస్ స్టేషన్లో కోకాటే సోదరులు, మరో ఇద్దరిపై చీటింగ్, ఫోర్జరీ కే సు నమోదైంది. దీనిపై సుదీర్ఘ విచారణ అనంతరం కొకాటే సోదరులకు శిక్ష, జరిమానా విధించిన కోర్టు మరో ఇద్దరిని నిర్దోషులుగా విడుదల చేసింది. కాగా ఈ కేసులో తనకు బెయిల్ లభించిందని, ఉత్తర్వులపై పైకోర్టులో అప్పీలు చేస్తానని మంత్రి కొకాటే తెలిపారు. -
అమ్మాయితో భార్యకు అడ్డంగా దొరికిన జీహెచ్ఎంసీ అధికారి
సాక్షి, హైదరాబాద్: ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాలు కుటుంబాలను రోడ్డునపడేస్తున్న ఘటనలు చాలానే ఉన్నాయి. సొసైటీలో కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులు సైతం వివాహేతర సంబంధాల్లో చిక్కుకుంటున్నారు. ఈ క్రమంలో పరువు తీసుకుని నవ్వుల పాలవుతున్నారు. తాజాగా జీహెచ్ఎంసీకి చెందిన ఓ అధికారి బాగోతం బట్టబయలైంది. తన కంటే 20 ఏళ్ల తక్కువ వయసున్న అమ్మాయితో సదరు అధికారి వివాహేతర సంబంధం పెట్టుకోగా అతడి భార్య వారిద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదారు.వివరాల ప్రకారం.. జీహెచ్ఎంసీ అడ్మిన్‌లో జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తున్న జానకీరామ్‌ను వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఆమెతో కలిసి నగరంలోని వారాసిగూడలో మకాం ఉంటున్నాడు. భర్త రోజుల తరబడి ఇంటికి రాకపోవడంతో భార్య కళ్యాణికి అనుమానం వచ్చింది. ఈ క్రమంలో జానకీరామ్ ఎక్కడికి వెళుతున్నాడని కళ్యాణి నిఘా పెట్టింది. దీంతో, వారాసిగూడలోని ఒక అపార్ట్మెంట్లో ఉన్నట్లు గుర్తించింది.దీంతో, ప్లాన్ ప్రకారం భర్తను ఫాలో చేసిన కళ్యాణి.. అపార్ట్మెంట్లోని గదిలో వారిద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ క్రమంలో వారిద్దరినీ ఆమె చితకబాదారు. అనంతరం, కళ్యాణి మాట్లాడుతూ.. జానకీరామ్ తనకంటే 20 ఏళ్ల చిన్న వయసున్న అమ్మాయితో వివాహేతర బంధం పెట్టుకున్నాడని అన్నారు. ఆయన ఎక్కడ పనిచేసినా అక్కడ ఆఫీసులో ఉన్న అమ్మాయిలతో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటాడని ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం వెళ్లడంతో పోలీసులు అక్కడికి చేరుకుని వారిద్దరిని స్టేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో జానకీరామ్‌కు తగిన బుద్ది చెప్పాలని పోలీసులను కళ్యాణి కోరారు. -
శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య.. ఖమ్మంలో ఉద్రిక్తత!
సాక్షి, ఖమ్మం: తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తోంది. తాజాగా శ్రీచైతన్య కాలేజీలో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. సదరు విద్యార్థిని తరగతి గదిలోనే ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది.వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లాలోని శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థిని నందిని(16) ఆత్మహత్య చేసుకుంది. క్లాస్‌రూమ్‌లోనే నందిని ఆత్మహత్య చేసుకుంది. దీంతో, కాలేజీ యాజమాన్యం ఆమె పేరెంట్స్‌కు సమాచారం అందించారు. వెంటనే నందిని మృతదేహాన్ని ఆసుపత్రి యాజమాన్యం మార్చురీకి తరలించింది. అయితే, విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. నందిని మృతితో ఆమె కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.కాగా, విద్యార్థిని మృతి నేపథ్యంలో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆసుపత్రి వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళనలకు దిగాయి. కాలేజీ యాజమాన్యంపై తప్పుడు సమాచారం ఇచ్చారని తెలిపారు. కాలేజీపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
రోడ్డుపైనే కుప్పకూలిన టెన్త్ విద్యార్థిని
కామారెడ్డి: జిల్లా కేంద్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గుండెపోటుతో పదో తరగతి విద్యార్థిని కన్నుమూసింది. స్కూల్‌కు వెళ్తున్న క్రమంలో ఈ విషాదం చోటు చేసుకోవడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. రామారెడ్డి మండలం సింగరాయిపల్లికి చెందిన విద్యార్థిని శ్రీనిధి(14). కామారెడ్డిలోని కల్కినగర్‌లో తన పెద్దనాన్న ఇంట్లో ఉంటూ ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. గురువారం ఉదయం ఇంటి నుంచి టిఫిన్ బాక్స్‌తో ఆమె బయల్దేరింది. కాలినడకన వస్తూ పాఠశాలకు సమీపంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. పాఠశాల యాజమాన్యం అక్కడికి చేరుకొని విద్యార్థినిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సీపీఆర్ చేసి రక్షించే ప్రయత్నం చేశారు. పరిస్థితిలో మార్పు లేకపోవడంతో మరో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడా సీపీఆర్ చేస్తూ వైద్య చికిత్స అందిస్తుండగానే.. ప్రాణాలు కోల్పోయింది. గుండెపోటుతోనే ఆమె కన్నుమూసిందని వైద్యులు ధృవీకరించారు. -
కాల్ మెర్జింగ్‌తో కాజేస్తారు!
సాక్షి, హైదరాబాద్: దేశంలో సైబర్ నేరగాళ్లు రోజుకో రూపంలో అమాయకులను మోసం చేసి డబ్బు కొల్లగొడుతున్నారు. తాజాగా కాల్ మెర్జింగ్ స్కాంకు తెరలేపారు. మనకు తెలియకుండానే మన నుంచి ఓటీపీలు తీసుకుని మన బ్యాంకు ఖాతాలను కాజేస్తున్నారు. ఈ తరహా మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)కు చెందిన ది యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) హెచ్చరించింది. అపరిచితులు ఫోన్ చేసి అడిగితే ఎట్టి పరిస్థితుల్లో ఓటీపీలను చెప్పవద్దని సూచించింది.కాల్ మెర్జింగ్ స్కాం అంటే? ఒక అపరిచితుడు మీ ఫోన్ నంబర్‌ను మీ స్నేహితుడి నుంచి తీసుకున్నానని చెబుతూ కాల్ చేయడంతో ఈ స్కాం ప్రారంభమవుతుంది. మీతో ఫోన్ మాట్లాడుతూనే.. మీ స్నేహితుడు వేరే నంబర్ నుంచి కాల్ చేస్తున్నాడని చెప్పి, రెండు కాల్స్‌ను విలీనం (మెర్జ్) చేయమని స్కామర్ అడుగుతాడు. ఆ ‘స్నేహితుడి’కాల్ నిజంగా మీ మిత్రుడిది కాదు. అది బ్యాంకు ఓటీపీ కాల్. స్కామర్ అడగ్గానే మీరు కాల్ విలీనానికి అనుమతిస్తే సదరు వ్యక్తి వెంటనే బ్యాంకు ధ్రువీకరణకు సంబంధించిన ఓటీపీ కాల్‌తో కనెక్ట్ అవుతాడు. ఇలా బ్యాంకు కాల్ నుంచి వచ్చే ఓటీపీని అవతలి నుంచి వింటున్న సైబర్ మోసగాళ్లు సేకరిస్తారు. అప్పటికే బ్యాంకు వివరాలు తీసుకుని పెట్టుకునే సైబర్ మోసగాళ్లు..ఆ ఓటీపీని ఉపయోగించి మీ బ్యాంకు ఖాతాల్లోంచి డబ్బులు కొల్లగొడతారు. ఇదంతా కచ్చితమైన సమయంలోపు పూర్తిచేస్తారు. మీరు బ్యాంకు ఓటీపీ వారికి చెప్పినట్లు కూడా గుర్తించలేరు.కాల్ మెర్జింగ్ స్కాంకు చిక్కకుండా ఉండాలంటే?» అపరిచిత వ్యక్తులు మీకు ఫోన్ చేసి, మరో నంబర్ నుంచి వస్తున్న కాల్‌ను మెర్జ్ చేయాలని కోరితే అది కచ్చితంగా మోసమని గ్రహించాలి.» మీకు అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి మేం బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని, లేదా మీకు స్నేహితుడికి స్నేహితుడిని అని చెప్తే నమ్మవద్దు.» అనుమానాస్పద ఫోన్‌కాల్స్‌పై వెంటనే సైబర్ సెక్యూరిటీ బ్యూరో టోల్‌ఫ్రీ నంబర్ 1930లో ఫిర్యాదు చేయాలి.» మీరు ఓటీపీ పంచుకున్నట్టు అనుమానం వస్తే వెంటనే మీ బ్యాంకు అధికారులకు సమాచారం ఇచ్చి డబ్బులు పోకుండా తగిన చర్యలు తీసుకోవాలి. -
అమ్మకానికి కుంభమేళా మహిళల పుణ్య స్నానాల వీడియోలు!
లక్నో : ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు (Kumbh Mela) భక్తులు పెద్దఎత్తున తరలివస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు 56 కోట్ల మందికి పైగా భక్తులు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు.ఈక్రమంలో కుంభమేళాలో స్నానం చేస్తున్న మహిళా భక్తుల వీడియోలు విక్రయిస్తున్న,కొనుగోలు చేస్తున్న నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.ఇప్పటివరకు 103 సోషల్ మీడియా ఖాతాలను గుర్తించి చర్యలు తీసుకుంటున్నట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు.యూపీ సోషల్ మీడియా మానిటరింగ్ టీమ్ కుంభమేళాలో మహిళలు స్నానమాచరించడం, దుస్తులు మార్చుకునే వీడియోల్ని పలువురు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలో కొన్ని సోషల్ మీడియా ప్రొఫైళ్లు, గ్రూపుల్లో అనైతిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించి, వాటిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు కుంభమేళా డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (DIG) వైభవ్ కృష్ణ మీడియాతో తెలిపారు. బుధవారం కుంభమేళాలో స్నానం చేయడంతో పాటు, దుస్తులు మార్చుకుంటున్న మహిళల వీడియోల్ని తీస్తున్నారు. వాటిని అమ్మకానికి పెడుతున్నట్లు సమాచారం వచ్చింది.ఆ వీడియోలను అమ్మేవారిని, కొనుగోలు చేసే వారిని అరెస్ట్ చేస్తాం. మా సోషల్ మీడియా టీమ్ నిరంతరం వీటిని మానిటర్ చేస్తోంది. ఎవరైతే మహిళల ప్రైవేట్ వీడియోలను అప్లోడ్ చేస్తున్నారో, వారి ప్రొఫైళ్లపై చర్యలు తీసుకుంటాం’ అని స్పష్టం చేశారు.ఇప్పటివరకు ఎంతమంది వ్యక్తులు లేదా గ్రూపులను గుర్తించారనే సమాచారంపై డీఐజీ వైభవ్ కృష్ణ స్పందించారు. 103 సోషల్ మీడియా ప్రొఫైళను గుర్తించాం. వీటిలో ప్రజల్ని భయాందోళనకు గురి చేసే అకౌంట్లతో పాటు మహిళల ప్రైవేట్ వీడియోలను పోస్ట్ చేస్తున్న అకౌంట్లు ఉన్నట్లు వెల్లడించారు. 26 సోషల్ మీడియా ఫ్లాట్ఫారమ్లలో కుంభమేళాలో స్నానమాచరించే మహిళల వీడియోల్ని అప్లోడ్ చేసినట్లు గుర్తించారు. ఇందులో ప్రమేయం ఉన్నవారందరిపై చర్యలు తీసుకుంటామని కుంభమేళా డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (DIG) వైభవ్ కృష్ణ హెచ్చరించారు. కాగా, కుంభమేళాలో మహిళల వీడియోల్ని తీస్తున్న దుండగులు ఒక్కో వీడియోను రూ.2వేల నుంచి రూ.3వేల వరకు విక్రయిస్తున్నారని తెలుస్తోంది. -
విశాఖలో జ్యోతిష్యుడి దారుణ హత్య
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. జ్యోతిష్యుడు దారుణ హత్యకు గురయ్యారు. జ్యోతిష్యుడు అప్పన్న అస్థి పంజరం కాపులుప్పాడలో లభ్యమైంది. మహిళతో అసభ్య ప్రవర్తన నేపథ్యంలో హత్య జరిగినట్టు పోలీసుల అనుమానిస్తున్నారు. ఒక రౌడీ షీటర్, ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసి కెమెరాల ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలంలో క్షుద్ర పూజలు ఆనవాళ్లు కనిపించాయి. అస్థి పంజరం వద్ద పూసలు, సగం కాలిన ఫోటో, పంచే లభ్యమయ్యాయి.మరోవైపు, తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి. కరీంనగర్ శివారు దుర్శేడ్ గ్రామంలోని పాఠశాలలో క్షుద్ర పూజలు చేశారు. పాఠశాల ఆవరణలో ప్రధానోపాధ్యాయుడి గది ముందు పసుపు, కుంకుమ కుద్రపూజల ఆనవాళ్లు చూసి విద్యార్థులు బెంబేలెత్తారు. -
'నా కుమారుడిది ముమ్మాటికీ హత్యే ...
అల్లూరి సీతారామరాజు జిల్లా: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన బుధవారం మండలంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. పాడేరు–హుకుంపేట ప్రధాన రహదారిలో పాటిమామిడి గ్రామం సమీపంలో ద్విచక్రవాహనంపై పాడేరు నుంచి వస్తు డివైడర్‌ను ఢీకొని పాడి శ్రీకాంత్(28) సంఘటన స్థలంలో మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో డివైడర్‌ను ఢీకొనగా వాహనం అతనిపై పడినట్టు పేర్కొన్నారు. దీనిపై మృతుడు తండ్రి పాడి చంటిబాబు తన కుమారుడు ప్రమాదంలో మృతి చెంది ఉండరని హత్యచేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ప్రమాదంలో కేసు నమోదు చేసి పోస్టుమార్టం చేపట్టి యువకుడి మృత దేహాన్ని కుటుంబ సభ్యులకు అందించినట్టు ఎస్ఐ సురేష్ కుమార్ తెలిపారు. అదృశ్యమైన జ్యోతిష్యుడు.. అస్థిపంజరమై! -
నిజామాబాద్: కుటుంబాన్ని బలిగొన్న కరెంట్
నిజామాబాద్, సాక్షి: బోధన్ మండలం పెగడపల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కరెంట్ తీగలు తగిలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. షాటాపూర్‌కి చెందిన గంగారాంకి పెగడపల్లిలో కొంత వ్యవసాయ భూమి ఉంది. అయితే అడవి పందుల బారి నుంచి పంటను రక్షించుకునేందుకు కరెంట్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలనుకున్నాడు. ఈ క్రమంలో.. భార్య, కొడుకుతో కలిసి పొలానికి వెళ్లాడు. ఈ టైంలో బోర్ మోటార్ కరెంట్ వైర్లు బయటకు వచ్చి.. ఆ కుటుంబ సభ్యులకు తగిలింది. దీంతో ఆ ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. -
హైదరాబాద్‌లో విషాదం.. తుంగభద్రలో మునిగి డాక్టర్ అనన్య మృతి
సాక్షి, బెంగళూరు/హైదరాబాద్: సరదాగా విహారయాత్రకు వెళ్లిన వైద్యుల బృందంలో విషాదం చోటుచేసుకుంది. తుంగభద్రలో దూకి ఈత కొట్టే క్రమంలో హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ అనన్యరావు (27) మృతిచెందారు. నదిలో నుంచి రెస్క్యూ టీమ్ తాజాగా ఆమె మృతదేహాన్ని బయటకు తీశారు. దీంతో, కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీటి పర్యంతమవుతున్నారు.వివరాల ప్రకారం.. డాక్టర్ అనన్యరావు, మరో ఇద్దరు స్నేహితులు సాత్విన్, హషితలతో కలిసి హంపీ టూర్‌కి వచ్చారు. స్మారకాలను వీక్షించి మంగళవారం రాత్రి సణాపుర గ్రామంలోని ఓ అతిథి గృహంలో బస చేశారు. బుధవారం మధ్యాహ్నం ఈత కొట్టడానికి తుంగభద్ర నది వద్దకు వెళ్లారు. అనంతరం, సుమారు 25 అడుగుల ఎత్తు గల బండరాయి నుంచి అనన్యరావు నీటిలో దూకి ఈత కొట్టాలనుకుంది.దీంతో, రాళ్ల పైనుంచి నీటిలో దూకెసింది. నీటిలో కాసేపు ఈత కొట్టిన అనన్య.. కాసేపటికే నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయింది. ఈ క్రమంలో అనన్య కాపాడేందుకు స్నేహితులు ప్రయత్నించారు. కానీ, వారి ప్రయత్నం ఫలించలేదు. ఇక, ఈ ప్రదేశంలో తుంగభద్ర రాతి గుహల్లో ప్రవహిస్తూ ఉంటుంది. యువతి ఈ గుహల్లో చిక్కుకు పోయింటారని పోలీసులు అనుమానించారు. దీంతో గంగావతి గ్రామీణ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. స్థానిక గజ ఈతగాళ్లు, అగ్నిమాపకదళం సాయంత్రం వరకు ప్రయత్నించినా ఆమె జాడ కనిపించలేదు.తాజాగా గురువారం ఉదయం అనన్యరావు మృతదేహాన్ని బయటకు తీశారు. దీంతో, అనన్య కుటుంబ సభ్యులు, స్నేహితులు బోరున విలపిస్తున్నారు. ఇక, అనన్య నదిలో దూకిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు.. అనన్యరావు తండ్రి డా.మెహన్రావు అని, ఆమె వీకేసీ ఆస్పత్రిలో వైద్యురాలని తెలిసింది.#KoppalMishap #Sanapur Video showing #AnanyaRao a doctor from #Hyderabad who jumped into the #Tungabhadra river on Tuesday went missing . Rescue operation has not yielded any results so far @NewIndianXpress @XpressBengaluru @Dir_Lokesh pic.twitter.com/Bsd0H9VnzA— Amit Upadhye (@AmitSUpadhye) February 19, 2025 -
తీవ్ర విషాదం.. ప్రాక్టీస్‌లో భారీ బరువులెత్తబోయి 17 ఏళ్ల యస్తిక..
యువ పవర్ లిఫ్టర్(Powerlifter) మృతి చెందిన విషాద ఘటన బుధవారం చోటు చేసుకుంది. రాజస్తాన్‌కు చెందిన 17 ఏళ్ల యస్తిక ఆచార్య(Yashtika Acharya) పవర్లిఫ్టర్గా జాతీయ స్థాయిలో రాణిస్తోంది. గత ఏడాది సబ్ జూనియర్ విభాగంలో (ప్లస్ 84 కేజీలు) జాతీయ బెంచ్ ప్రెస్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం కూడా సాధించింది.270 కేజీల బరువును ఎత్తే క్రమంలోతన రెగ్యులర్ ప్రాక్టీస్‌లో భాగంగా జిమ్‌లో ఆమె కోచ్‌తో కలిసి సాధన చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 270 కేజీల బరువును ఎత్తే క్రమంలో పట్టు జారి ఆమె వెనక్కి పడిపోయింది. రాడ్ ఆమె మెడ వెనకభాగంలో పడటంతో మెడ విరిగిపోయి యస్తిక కుప్పకూలిపోయింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినా లాభం లేకపోయింది. ఇంత భారీ బరువు ఎత్తుతున్నప్పుడు సాధారణంగా వెనక నిలబడి కోచ్ సహకరిస్తాడు. కానీ అతను కూడా నిలువరించలేకపోవడంతో యువ క్రీడాకారిణి జీవితం ముగిసింది. ఈ క్రమంలో కోచ్‌కు కూడా స్వల్ప గాయాలయ్యాయి.యస్తిక దుర్మరణంపైఈ విషాదం గురించి స్థానిక పోలీసులు మాట్లాడుతూ.. ఘటన జరిగిన వెంటనే యస్తిక ఆచార్యను ఆస్పత్రికి తీసుకువెళ్లగా.. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారని తెలిపారు. అయితే, ఈ యస్తిక దుర్మరణంపై ఆమె కుటుంబ సభ్యులు ఇంత వరకు ఫిర్యాదు మాత్రం చేయలేదని చెప్పారు. పోస్ట్‌మార్టం అనంతరం ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు.కాగా పవర్‌లిఫ్టింగ్‌లో స్క్వాట్, బెంచ్ ప్రెస్, డెడ్‌లిఫ్ట్ అనే మూడురకాల లిఫ్ట్స్ ఉంటాయి. కాగా ఈనెల 19 నుంచి 23 వరకు పురుషుల,మహిళల క్లాసిక్ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌నకు పంజాబ్‌లో గల జలంధర్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఆతిథ్యం ఇస్తోంది. చదవండి: ధనవంతులకు మాత్రమే.. : పుల్లెల గోపీచంద్ ‘షాకింగ్’ కామెంట్స్ -
తుంగభద్రలో నగర వైద్యురాలి గల్లంతు
సాక్షి, బళ్లారి: సరదాగా విహారయాత్రకు వచ్చిన యువ వైద్యురాలు తుంగభద్ర నదిలో మునిగిపోయింది. ఈ సంఘటన బుధవారం కర్ణాటకలోని హంపీ వద్ద చోటుచేసుకుంది. డాక్టర్ అనన్యరావు (27), స్నేహితుడు సాత్విన్, హషితలతో కలిసి హంపీ టూర్‌కి వచ్చారు. నది ఒడ్డున సణాపురలో ఓ రిసార్టులో మకాం వేశారు. బుధవారం మధ్యాహ్నం నదిలో ఈత కొట్టడానికి వచ్చారు. సుమారు 25 అడుగుల ఎత్తు గల బండరాయి నుంచి అనన్యరావు దూకి ఈత కొట్టాలనుకుంది. నదికి మరోవైపు నుంచి స్నేహితులు సరదాగా వీడియో తీస్తున్నారు. అంతెత్తు నుంచి దూకిన అనన్య కొన్ని క్షణాల పాటు ఈత కొట్టి నీటి ఉధృతికి నదిలో కొట్టుకుపోసాగింది. స్నేహితులు గట్టిగా కేకలు వేసినా ఫలితం లేదు. నీటి ప్రవాహంలో కనుమరుగైపోయింది. స్నేహితులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బందితో వచ్చి బండరాళ్ల మధ్య గాలించారు. రాత్రి అయినప్పటికీ అనన్యరావు జాడ కానరాలేదు. ఈ సంఘటన ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. అనన్యరావు తండ్రి డా.మెహన్రావు అని, ఆమె వీకేసీ ఆస్పత్రిలో వైద్యురాలని తెలిసింది. కొప్పళ జిల్లా ఎస్పీ రామ్ అరసిద్ది మాట్లాడుతూ ఆమె కోసం గాలిస్తున్నామని, ప్రాణాలతో ఉందో లేదో తెలియదని అన్నారు. గంగావతి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
రూ.20 లక్షలు ఇస్తా.. నన్ను మరిచిపో..
బంజారాహిల్స్(హైదరాబాద్) : ప్రేమించానన్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. సదరు యువతితో చనువుగా మెదిలాడు. పెళ్లి మాట ఎత్తేసరికి మాత్రం.. మరిచిపో అంటూ తాపీగా చెప్పేశాడు. తాను మోసపోయానని గ్రహించిన బాధిత యువతి జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదైంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–10లోని గాయత్రీహిల్స్‌లో నివసిస్తున్న సాయిప్రణీత్ (26) సాఫ్ట్వేర్ డెవలపర్‌గా పని చేస్తున్నాడు. ఆయన బెంగళూరులో ఉన్న సమయంలో 2023లో ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి ఒకే హాస్టల్ గదిలో పేయింగ్ గెస్ట్‌గా ఉండేవారు. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో నమ్మిన యువతి సాయిప్రణీత్‌తో సాన్నిహిత్యం పెంచుకుంది. అనంతరం నగరంలోని గాయత్రీ హిల్స్‌కు మకాం మార్చిన సాయిప్రణీత్.. కొద్ది రోజులు యువతితో కలిసి సహజీవనం కూడా చేశాడు. తన చెల్లెలి పెళ్లి తర్వాత మన పెళ్లి జరుగుతుందంటూ ఆమెను నమ్మించి గత ఏడాది నవంబర్‌లో వెళ్లిపోయాడు.మీ చెల్లెలి పెళ్లి ఫొటోలు పంపించాలని యువతి చెప్పగా.. కొన్నింటిని పంపించాడు. ఆ ఫొటోలను చూసి అనుమానం వచ్చినది బాధితురాలు ఇటీవల మరింతగా ఒత్తిడి చేయడం ప్రారంభించింది. దీంతో రెండు రోజుల క్రితం సాయిప్రణీత్ గదికి వెళ్లిన ఆమెను కొట్టి.. మెడ పట్టి గెంటివేశాడు. ఇన్ని రోజులు నాతో తిరిగినందుకు ఖరీదుగా రూ.20 లక్షలు ఇస్తాను.. మన బంధం మరిచిపో అంటూ చెప్పేశాడు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు జూబ్లీహిల్స్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
గన్ బ్యాక్‌ఫైర్.. జవాన్ మృత్యువాత!
పిట్టలవానిపాలెం (కర్లపాలెం): పంజాబ్‌లోని సూరత్ బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్న బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం పంచాయతీ గౌడపాలెం గ్రామానికి చెందిన జవాన్ పరిశా మోహన్ వెంకటేష్ (27) గన్‌లోని బుల్లెట్ బ్యాక్‌ఫైర్ అయ్యి రాజస్థాన్‌లో మృత్యువాత పడ్డారు. ఈ మేరకు సైనిక అధికారుల నుంచి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. దీంతో ఆయన భార్య, తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. పరిశా శ్రీనివాసరావు, శివపార్వతి దంపతులకు కుమారులు మోహన్ వెంకటేష్, గోపీకృష్ణ ఉన్నారు. ఇంటర్ వరకు చదివిన మోహన్ వెంకటేష్ 2019 డిసెంబర్లో ఆర్మీలో చేరారు. రాజస్థాన్‌లో సోమవారం జరిగిన ఆర్మ్డ్ గన్ ఫీల్డ్ ఫైరింగ్ ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు తల్లిదండ్రులతో మోహన్ వెంకటేష్ ఫోన్లో మాట్లాడారు. మధ్యాహ్నం 2 గంటలకు భార్యకు వీడియోకాల్ చేసి ముచ్చటించాక, పాపను కూడా చూశారు. మళ్లీ రాత్రికి ఫోన్ చేస్తానని చెప్పారు. కానీ మధ్యాహ్నం 3.30 గంటలకు గన్ క్లియర్ చేస్తుండగా బ్యాక్ ఫైర్ అయ్యి బుల్లెట్ తలకు తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. గురువారం ఆయన భౌతికకాయం స్వగ్రామానికి రానుందని సైనికాధికారులు తెలిపారు. -
చంపింది ప్రియురాలి భర్త, మామలే!
నిడమర్రు(పశ్చిమ గోదావరి): బావాయిపాలెంలో సంచలనం రేకెత్తించిన మజ్జి ఏసు హత్య కేసు కొలిక్కివచ్చినట్లు తెలుస్తోంది. వివాహేతర సంబంధమే ఈ హత్యకు ప్రధాన కారణంగా ఉంది. నిందితులు ఏసు ప్రియురాలి భర్త, మామలే.. వారు పోలీసులు అదుపులో ఉన్నట్లు సమాచారం. కాగా ఈ హత్యకు సహకరించిన ఉండి మండలంకు చెందిన మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.పోలీసుల విచారణలో...బావాయిపాలెంలో ఏసు రాజు ఇంటి సమీపంలో ఉంటున్న ఒక మహిళతో వివాహేతర సంబంధమే సాగించడమే ఈ హత్యకు కారణంగా చెబుతున్నారు. హత్య జరిగిన రోజు పోలీసు జాగిలాలు సదరు మహిళ ఇంటి వద్దనే తిరగడంతోపాటు.. ఆ ఇంటికి చెందిన తండ్రి, కొడుకులు (పిల్లి అన్నవరం, పిల్లి ఏసు) ఫోన్లో కూడా అందుబాటులోకి రాకపోవడంతో పోలీసులు ఆదిశగా విచారణ ప్రారంభించారు. ఈ వివాహేతర సంబంధం తెలిసి ఏడాదిగా రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. పంచాయతీ పెద్దల వరకు గొడవ వెళ్లగా వారు సర్దిచెప్పినట్లు తెలిసింది.పథకం ప్రకారం హత్యనిందుతులుగా భావిస్తున్న తండ్రి కొడుకులు పిల్లి అన్నవరం, పిల్లి ఏసు పథకం ప్రకారం మజ్జి ఏసును హత్య చేసినట్లు తెలిసింది. ఈనెల 15వ తేదీ రాత్రి బావాయిపాలెం గ్రామంలో కాపవరం కాలువ గట్టు వద్దకు ముగ్గురూ కలిసి మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉండగా తండ్రి, కొడుకులు కలిసి దాడి చేసి పదునైన కత్తితో మృతుడు ఏసురాజు కుడి చెయ్యి నరికేశారు. ఆ తర్వాత పీక నొక్కి చంపేసినట్లు సమాచారం. నరికిన చెయ్యిని కాపవరం కాలువలో విసిరేశారు. ఈ తతంగంలో మూడో వ్యక్తి ఉన్నట్లు తెలిసింది. కనిపించకుండా పోయిన మృతుడి కుడి చెయ్యి భాగాన్ని పోలీసులు కాపవరం కాలువలో గుర్తించి సేకరించారు. అయితే మృతుడు ఏసు రాజు పలువురు మహిళలతో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితులైన తండ్రి, కొడుకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని, వీరికి సహకరించిన మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం.అత్యంత దారుణంగా హత్య చేసి.. కుడి చేయి తీసుకెళ్లినా హంతకులు -
నీ భార్యతో ఉన్నా.. ఏం చేస్తావో చేయ్!
ఇంద్రవెల్లి (మంచిర్యాల): ఓ వివాహిత ఓ యువకుడితో సంబంధం పెట్టుకుంది. ఆ ప్రియుడు ఆ భర్తను రెచ్చగొట్టాడు. రగిలిపోయిన ఆ భర్త.. భార్యతోపాటు అత్త, వాళ్ల తరఫు బంధువులపై కూడా కత్తులతో దాడికి పాల్పడ్డాడు. మండలకేంద్రంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై సునీల్ కథనం ప్రకారం.. మండలకేంద్రానికి చెందిన సంజీవాణికి దనోరా(బి) గ్రామానికి చెందిన గుట్టె అంకుష్‌తో వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు సంతానం. భర్త అంకుష్ గత కొంత కాలంగా భార్యపై అనుమానం పెంచుకున్నాడు. తరచూ ఆమెతో గొడవ పడేవాడు. దీంతో.. వారం క్రితం సంజీవాణి పుట్టింటికి వెళ్లిపోయింది.అయితే.. మంగళవారం మధ్యాహ్నం సంజీవాణి ప్రియుడు రాహుల్ అంకుష్‌కు ఫోన్ చేశాడు. ‘‘నీ భార్యతో ఆమె ఇంట్లోనే ఉన్నా.. ఏం చేస్తావో చేయ్..అంటూ సవాల్ విసిరాడు. అంకుష్ కోపంతో అత్తగారింటికి వచ్చాడు. భార్యపై కత్తితో దాడి చేశాడు. ప్రతిఘటించిన తల్లి అనిత, అమ్మమ్మ రాధాబాయిలపై దాడి చేయగా వారికి స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రగాయాలైన సంజీవాణితోపాటు ఇద్దరిని స్థానికులు మండలకేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న ఎస్సై సునీల్ ఆస్పత్రికి చేరుకుని క్షతగాత్రులను 108లో ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.భర్త స్నేహితునితో భార్య అనైతిక సంబంధం.. భర్త ప్రాణత్యాగం -
అమిత్ షా కొడుకు పేరుతో వసూళ్లు.. మోసగాడి అరెస్ట్
డెహ్రాడూన్:కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు,ఐసీసీ ఛైర్మన్ జై షాపేరుతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరాఖండ్‌కు చెందిన ప్రియాంషు పంత్ (19) జై షా పేరు చెప్పి ఇక్కడి ఎమ్మెల్యే ఆదేశ్ చౌహాన్‌కు ఫోన్ చేశాడు.తనను అమిత్ షా కుమారుడు జై షాగా పరిచయం చేసుకొని పార్టీ కోసం రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.అనుమానం వచ్చిన ఎమ్మెల్యే ప్రశ్నించగా తమ మధ్య జరిగిన సంభాషణను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు.దీంతో ఎమ్మెల్యే మోసగాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాలింపు మొదలు పెట్టిన పోలీసులు మోసానికి పాల్పడుతున్న ప్రియాంశు పంత్‌ను ఢిల్లీలో అరెస్టు చేశారు. అయితే నిందితుడు మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కూడా జై షా పేరుతో ఫోన్ చేసి డబ్బులిస్తే మంత్రి పదవులు ఇప్పిస్తానని చెప్పినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.విలాసవంతమైన జీవితం గడిపేందుకే పంత్ ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడ్డట్టు పోలీసులు తెలిపారు. -
ఇల్లరికం అల్లుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
పాపన్నపేట(మెదక్): భర్త వైద్యానికి అయ్యే ఖర్చును భరించలేక అతడిని..అల్లుడితో కలిసి ఉరేసి హత్య చేసింది ఓ భార్య. పైగా దీనిని సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. తీరా మృతుడి మెడపై కమిలిపోయిన గాయాలు ఉండటంతో పోలీసుల వరకు వెళ్లింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని బాచారం గ్రామానికి చెందిన కర్రెల ఆశయ్య (45), శివ్వమ్మ దంపతులకు కూతురు లావణ్య, కుమారుడు శివకుమార్ ఉన్నారు. ఎకరంన్నర అసైన్డ్ భూమిలో పంటలు పండక, నగరానికి కూలీలుగా వలస వెళ్లారు.రోడ్డు ప్రమాదంలో కొడుకు చనిపోయాడు. దీంతో స్వగ్రామానికి వచ్చారు. కూతురు లావణ్యను జూకల్కు చెందిన రమేశ్‌కు ఇచ్చి వివాహం చేసి ఇల్లరికం తెచ్చారు. ఆశయ్య గ్రామంలోనే పశువులు కాస్తున్నాడు. ఇటీవల బోరు వేసి ఆ భూమిని వ్యవసాయ యోగ్యంగా మార్చారు. శనివారం పొలం పనులకు వెళ్లిన ఆశయ్య జారిపడగా, తుంటి ఎముక విరిగింది. ఆశయ్యకు శస్త్ర చికిత్సకు రూ.50 వేలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. ఇంటికెళ్లిన తర్వాత వైద్య ఖర్చులు ఎలా భరించాలి అనుకున్నారో, అవిటితనంతో కుటుంబానికి భారమవుతాడని భావించారో, లేక రైతు బీమా కోసం ఆశ పడ్డారో తెలియదు కానీ ఆదివారం అర్ధరాత్రి అల్లుడు రమేశ్‌తో కలిసి, శివ్వమ్మ నిద్రలో ఉన్న భర్త ఆశయ్య మెడకు తువ్వాలతో ఉరేసి హత్య చేసింది. పొద్దున ఆశయ్యది సహజ మరణంగా చిత్రీకరించారు. సోమవారం సాయంత్రం ఆశయ్య మృతదేహాన్ని దింపుడు కల్లం వద్ద ఆపారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్‌గౌడ్ శవాన్ని స్వాధీనం చేసుకొని మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి సోదరి గంగమణి ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
AP: అపార్ట్మెంట్లో డ్రగ్స్ పార్టీ.. ఇంజనీరింగ్ విద్యార్థులు అరెస్ట్
సాక్షి, గుంటూరు: గుంటూరులో మత్తుమందు సేవిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో 10 గ్రాముల ఎండీఎంఏ మత్తుమందును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్‌ను బెంగళూరు నుంచి గుంటూరుకు తీసుకు వచ్చినట్టు పోలీసులు గుర్తించారు.గుంటూరులో సాయిక్రిష్టనగర్‌లోని ఒక అపార్ట్మెంట్లో మత్తుమందు సేవిస్తున్నారనే సమాచారంతో పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ క్రమంలో ఎండీఎంఏ మత్తు మందును సేవిస్తూ, విక్రయిస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థులతో సహా డ్రగ్స్ ముఠాను అరెస్ట్ చేశారు. తొమ్మిది మందిని అరెస్ట్ చేసి 10.67 గ్రాముల ఎండీఎంను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో బెంగుళూరు నుంచి గుంటూరుకు ఇంజనీరింగ్ విద్యార్థి సాయిక్రిష్ణ డ్రగ్స్ తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.దాడుల సందర్భంగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎండీఎం మత్తుమందును ఒక గ్రామును 1400 రూపాయలకు కొనుగోలు చేసి సాయిక్రిష్ట్ర దాన్ని ఐదు వేలకు అమ్ముతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ ముఠాలో మొత్తం 11 మంది నిందితులు ఉండగా.. వారిలో ఇద్దరు తప్పించుకున్నారు. వారి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
Moinabad: పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు పాడె ఎక్కాడు..
మొయినాబాద్ (రంగారెడ్డి జిల్లా): త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నేను చనిపోతున్నా అంటూ వీడియో రికార్డు చేసి బంధువులకు పంపి చెట్టుకు ఉరేసుకున్నాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పరిధిలో మంగళవారం వెలుగుచూసింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. చిలుకూరుకు చెందిన వీఎం సాయికుమార్(32)కు వికారాబాద్ జిల్లా కొడంగల్‌కు చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. మార్చి 6న పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు. వివాహం కుదిరిన రోజు నుంచి సాయికుమార్ తన కు కాబోయే భార్యతో నిత్యం ఫోన్ మాట్లాడేవాడు. ఉన్నట్టుండి ఏం జరిగిందో తెలియదు కానీ సోమవారం రాత్రి 7 గంటల సమయంలో నేను చనిపోతున్నా అంటూ వీడియో రికార్డ్ చేసి బంధువులకు పంపించాడు.వారు వెంటనే ఈ విషయాన్ని సాయికుమార్ తల్లి లక్ష్మికి తెలియజేశారు. కుటుంబసభ్యులు రాత్రంతా వెతికారు. మంగళవారం ఉదయం 9.50 గంటల సమయంలో గండిపేట ్త సమీపంలోని ఓ చెట్టుకు ఉరేసుకొని కనిపించాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు చెప్పారు. సాయికుమార్ ఆత్మహత్యకు అమ్మాయి తరఫు కుటుంబసభ్యుల వేధింపులే కారణమని తల్లి లక్ష్మి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
భార్య విద్రోహం.. భర్త ప్రాణత్యాగం
తుమకూరు: ప్రేమించుకున్నారు, అగ్నిసాక్షిగా ఏడడుగులు నడిచి తాళితో ఒక్కటయ్యారు. కానీ ఆమె మరొకరిపై మోజుపడి కట్టుకున్నోడికి ద్రోహం చేసింది. అంతే, భర్త గుండె పగిలి ప్రాణాలే వద్దనుకున్నాడు. తన స్నేహితుడే భార్యను తీసుకెళ్లడంతో విరక్తి చెందిన భర్త సెల్ఫీ వీడియో తీసి, చావుకు పరారైన భార్య, స్నేహితుడే కారణమని, తనకు న్యాయం చేయాలని స్నేహితులను కోరుతూ ఫేస్బుక్లో అప్లోడ్ చేసి ఉరి వేసుకున్నాడు. చిచ్చుపెట్టిన స్నేహితుడు హృదయ విదారకమైన ఈ ఘటన మంగళవారం జిల్లాలోని గుబ్బి పట్టణంలోని గట్టి లేఅవుట్ బడావణెలో జరిగింది. వివరాలు.. నాగేష్ (35), 12 సంవత్సరాల క్రితం రంజిత అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. నాగేష్ ఇటీవల సొంత ఇల్లు విక్రయించి గట్టి లేఅవుట్ బడావణెలో బాడుగ ఇంట్లో ఉంటున్నాడు. అతని స్నేహితుడు భరత్.. అప్పుడప్పుడు ఇంటికి వస్తూ రంజిత మనసు మార్చాడు, ఇటీవల ఇద్దరూ వెళ్లిపోయారు. ఈ పరిణామంతో విరక్తి చెందిన నాగేష్.. మిత్రుడు భరత్ తన భార్య రంజితతో అనైతిక సంబంధం పెట్టుకున్నాడని, పరారు కావడంతో ఆవేదనతో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సెల్ఫీ వీడియోలో తెలిపాడు. గుబ్బి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
‘తల్లి’ మరణంపై కూతురు బొమ్మ.. కేసులో బిగ్ ట్విస్ట్
ఝాన్సీ: ‘పాపా కిల్డ్ మమ్మీ, హ్యాంగ్డ్ బాడీ’ అంటూ నాలుగేళ్ల బాలిక వేసిన బొమ్మతో ఆమె తల్లి మరణోదంతం కొత్త మలుపు తిరిగింది. తల్లిని చంపేస్తానని తండ్రి గతంలోనూ బెదిరించాడని బాలిక చెప్పింది. అంతేగాక తననూ చంపేస్తానన్నాడని చెప్పుకొచ్చింది. దాంతో అత్తింటివారి ‘ఆత్మహత్య’ కథనాన్ని పోలీసులు అనుమానించారు.ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌లోని తికంగఢ్ జిల్లాకు చెందిన సోనాలికి ఝాన్సీలోని కొత్వాలీకి చెందిన సందీప్ బుధోలియాతో 2019లో వివాహమైంది. రూ.20 లక్షల కట్నమిచ్చారు. కారు అడగ్గా తమ శక్తికి మించినదని తల్లిదండ్రులు చెప్పారు. అప్పట్నుంచీ సోనాలిపై వేధింపులు మొదలయ్యాయి."🚨 Jhansi: A 4-year-old girl's drawing exposed the murder of her mother, Sonali Budholia. She alleged her father, Sandeep Budholia, killed her after years of dowry harassment & abuse. 💔 Police are investigating. #JusticeForSonali #StopDowry #UttarPradesh" pic.twitter.com/ayZG51DKxO— HK Chronicle (@HK_Chronicle_) February 18, 2025నాలుగేళ్లకు పాప పుట్టడంతో.. భర్త, అత్తామామలు సోనాలిని ఆసుపత్రిలో ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయారు. సోనాలి తండ్రే ఆస్పత్రి బిల్లు చెల్లించి కూతురిని ఇంటికి తీసుకొచ్చాడు. కొంతకాలానికి అత్తింటివారు వచ్చి తల్లీకూతుళ్లను ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం, సోనాలి ఆరోగ్యం బాగాలేదంటూ భర్త ఇటీవల ఆమె తల్లిదండ్రలకు ఫోన్ చేశాడు. కాదు, ఉరేసుకుందంటూ ఆ వెంటనే సమాచారమిచ్చాడు. వెళ్లి చూసేసరికి సోనాలి చనిపోయి ఉంది. దాంతో కూతురిని అత్తింటివారే హత్య చేశారని తల్లిదండ్రులు ఆరోపించారు.అయితే తండ్రే తన తల్లిని చంపాడని వారి నాలుగేళ్ల దర్శిత చెప్పింది. ‘మమ్మీపై డాడీ దాడి చేసి చంపేశాడు. తర్వాత ‘కావాలంటే నువ్వు చచ్చిపో అని నన్ను అన్నాడు. అమ్మకు ఉరేసి రాయితో తలపై కొట్టాడు. తర్వాత కిందకు దించి సంచిలో పడేశాడు’ అంటూ బొమ్మగీసి మరి చూపించింది. ‘నువ్వు మా అమ్మను తాకితే నీ చెయ్యి విరగ్గొడతానని గతంలో నాన్నను తిట్టా. దాంతో ‘మీ అమ్మను చంపేస్తా, నిన్నూ చంపేస్తా’ అని అన్నాడు’ అని కన్నీరు పెట్టుకుంది. కూతురి వాంగ్మూలం, మృతురాలి తల్లిదండ్రుల ఆరోపణల నేపథ్యంలో హత్య కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
నేపాలి విద్యార్థిని ఆత్మహత్య.. ఐదుగురు కీలక వ్యక్తులు అరెస్ట్
భువనేశ్వర్: ఒడిశాలోని భువనేశ్వర్ పట్టణంలోని ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ అయిన కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండ్రస్టియల్ టెక్నాలజీ(కేఐఐటీ)లో 20 ఏళ్ల నేపాలీ బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్ట్‌చేశారు. అరెస్ట్ అయిన వారిలో కాలేజీ హెచ్ఆర్ విభాగ డైరెక్టర్ జనరల్, పరిపాలనా విభాగ డైరెక్టర్, హాస్టల్స్ డైరెక్టర్, ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఉన్నారు.వివరాల ప్రకారం.. విద్యార్థి వేధింపుల కారణంగా కేఐఐటీ హాస్టల్లో ప్రకృతి లాంసాల్ అనే బీటెక్ మూడో ఏడాది విద్యార్థిని ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. దీంతో అదే కాలేజీలో విద్యనభ్యసిస్తున్న 900 మంది నేపాలీ విద్యార్థులు నిరసన చేపట్టారు. విద్యార్థుల ఆందోళనకు అణచివేసేందుకు వర్సిటీలోని ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు విచక్షణారహితంగా కొట్టడం, తర్వాత 800 మంది విద్యార్థులను హాస్టల్ ఖాళీ చేయించి పంపేయడం చర్చనీయాంశమైంది. ఘటనలో వాస్తవాలను వెలికితీసేందుకు రాష్ట్ర హోం శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సారథ్యంలో ముగ్గురితో నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఉన్నత విద్యాశాఖ, మహిళా శిశు అభివృద్ధి శాఖల కార్యదర్శులు ఈ కమిటీలో ఉన్నారు. తోటి నేపాలీ అమ్మాయి చనిపోతే నిరసన తెలుపుతున్న విద్యార్థులకు సస్పెన్షన్ లేఖలు జారీచేయాల్సినంతగా కాలేజీలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయో ఈ కమిటీ ఆరాతీసి ప్రభుత్వానికి నివేదించనుంది.ఇక, ఘటనపై నేపాల్ ప్రభుత్వం స్పందించింది. తమ దేశ విద్యార్థులను కలిసి విషయం తెల్సుకుని తదుపరి కార్యచరణ కోసం ఢిల్లీలోని తమ రాయబార కార్యాలయం నుంచి ఇద్దరు అధికారులను ఒడిశాకు పంపింది. విద్యార్థుల నిర్ణయం మేరకు కుదిరితే మళ్లీ హాస్టల్లో చేర్పించడం లేదంటే స్వదేశానికి తీసుకెళ్లడంపై విద్యార్థులకు ఆ అధికారులు సలహాలు, సూచనలు చేస్తారు. విద్యార్థి మరణం వార్త తెల్సి నేపాల్ ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలి సైతం విచారం వ్యక్తంచేశారు. The tragic death of Nepali student Prakriti Lamsal at KIIT has sparked protests,Alleged harassment led to her suicide, with the college’s mishandling and irresponsible comments from officials raising serious concerns. investigations are ongoing #JusticeForPrakriti#KIITUniversity pic.twitter.com/Bl2GS71Oic— R0ni (@R0ni9801025590) February 18, 2025 -
ఫొటో షూట్ పేరుతో రాసలీలలు!
నెల్లూరు సిటీ: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ నెల్లూరు డీఐజీ కిరణ్‌కుమార్ చీకటి కోణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆయన పలువురు మహిళా ఉద్యోగులను ఫొటోషూట్ల పేరుతో దూర ప్రాంతాలకు తీసుకువెళ్లి రాసలీలలు సాగించారని సమాచారం. ఆ దుర్మార్గాలను ఫొటోలు తీసుకుని దాచుకునేవాడని తెలుస్తోంది. కిరణ్‌కుమార్ చీకటి జీవితాన్ని వివరిస్తూ ఆయన భార్య అనసూయరాణి బయటపెట్టిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. భార్యకు దూరంగా ఉంటూ...గుంటూరు జిల్లాకు చెందిన కిరణ్‌కుమార్, అనసూయరాణి ప్రేమించుకుని 1998లో పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు ఉన్నారు. కిరణ్‌కుమార్‌కు 2009లో రిజిస్ట్రార్ ఉద్యోగం వచ్చింది. కిరణ్‌కుమార్, అనసూయరాణి మధ్య ఏడాది కిందట విభేదాలు తలెత్తాయి. ఇద్దరూ విడివిడిగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అనసూయరాణి వద్ద కుమారుడు ఉండేలా, వారి బాగోగులను కిరణ్‌కుమార్ చూసుకునేలా పది నెలల కిందట పెద్దల సమక్షంలో రాతపూర్వకంగా ఒప్పందాలు జరిగాయి. సోమవారం విజయవాడలో ఒక ఫంక్షన్లో కలిసిన కిరణ్‌కుమార్, అనసూయరాణి మధ్య గొడవ జరిగింది. తనతోపాటు తన కుమారుడిపై కిరణ్‌కుమార్ విచక్షణారహితంగా దాడి చేశారని అనసూయరాణి గుంటూరు అరండల్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన వికృత చేష్టలు భరించలేక విడిగా ఉంటున్నానని ఆమె తెలిపారు. కిరణ్‌కుమార్ ఇతర మహిళలతో ఏకాంతంగా గడిపిన ఫొటోలను తనకు పంపించి మానసిక క్షోభకు గురిచేసేవాడని ఆవేదన వ్యక్తంచేశారు. ఆమె కొన్ని ఫొటోలను కూడా బయటపెట్టారు. -
మెదక్ జిల్లాలో దారుణం.. ప్రియురాలు దూరం పెట్టిందన్న కక్షతో..
సాక్షి, మెదక్: మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. పోలీసుల విచారణలో హత్య ఘటన బయటపడింది. తనను దూరం పెట్టిందని ప్రియురాలిని ప్రియుడు హత్య చేశాడు. హత్య తర్వాత ప్రెటోలు పోసి తగలబెట్టాడు. ఈ నెల 6 నుంచి రేణుక కనిపించకూడా పోయింది. తల్లి కనిపించకపోవడంతో మెదక్ టౌన్ పీఎస్‌లో కొడుకు శ్రీనాథ్ ఫిర్యాదు చేశాడు.విచారణ చేపట్టిన పోలీసులు. మహిళ కాల్ డేటాలో ప్రియుడి నెంబర్ గుర్తించారు. దీంతో హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. భర్త చనిపోవడంతో రేణుక.. తన ఇద్దరు పిల్లలతో కలిసి మెదక్ ఫతేనగర్ ఉంటుంది. ఇంటిపక్కనే ఉంటున్న వ్యక్తితో రేణుకకు వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం ఇంట్లో తెలిసి కుమారులు మందలించడంతో ఆ మహిళ ప్రియుడిని దూరంగా పెట్టింది. రేణుక దూరం పట్టిందనే కక్షతో ప్రియుడు హత్యకు ప్లాన్ చేశాడు. హత్య చేసిన తర్వాత ప్రెటోలు పోసి తగలబెట్టాడు.