Delhi
-
మిస్టరీగా తెలుగమ్మాయి అదృశ్యం
న్యూఢిల్లీ: కరీబియన్ దేశం డొమినికన్ రిపబ్లిక్లో తెలుగు విద్యార్థిని అదృశ్యం మిస్టరీగా మారింది. 20 ఏళ్ల సుదీక్ష కోణంకి కుటుంబం అమెరికాలో వర్జీనియాలోని లౌడౌన్ కౌంటీలోని చంటిల్లీలో నివసిస్తోంది. సుదీక్షకు అమెరికా శాశ్వత నివాస హోదా ఉంది. పిట్స్బర్గ్ వర్సిటీలో మెడిసిన్ చదువుతోంది. ఐదుగురు తోటి విద్యారి్థనులతో వారం క్రితం డొమినికన్ రిపబ్లిక్‌లోని పుంటా కానాకు వెళ్లింది. అక్కడి రియు రిపబ్లికా రిస్టార్టులో వారికి మరో ఇద్దరు అమెరికా టూరిస్టులు కలిశారు. అంతా మార్చి 5న రాత్రి స్థానిక నైట్ క్లబ్‌కు వెళ్లారు. 6వ తేదీ తెల్లవారుజామున నాలుగింటి సమయంలో అక్కడి బీచ్‌కు చేరుకున్నారు. ఉదయం 5.50 సమయంలో మిగతా వాళ్లు రిసార్టుకు వచ్చేయగా టూరిస్టుల్లో ఒకరైన జాషువా స్టీవెన్ రిబే (24), సుదీక్ష బీచ్‌లోనే ఉండిపోయారు. ఆ తరువాత ఆమె కనిపించలేదు. ఉదయం 9 గంటలప్పుడు రిబే ఒక్కడే బీచ్ నుంచి వెళ్లిపోయినట్లు సీసీటీవీల్లో రికార్డయ్యింది. సాయంత్రమైనా సుదీక్ష ఆచూకీ లేకపోవడంతో స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటినుంచి హెలికాప్టర్లు, డ్రోన్లు, పడవలు, స్కూబా డైవర్లు, ఏటీవీలను మోహరించి తీరం, పరిసర ప్రాంతాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు. నాలుగు రోజులైనా ఆమె ఆచూకీ దొరకలేదు. దీనికి తోడు ఆమె అదృశ్యంపై స్నేహితుల నుంచి విరుద్ధ కథనాలు వస్తుండటంతో కుటుంబీకులు మరింత ఆందోళన చెందుతున్నారు. సుదీక్ష తల్లిదండ్రులు సుబ్బారాయుడు, శ్రీదేవి కూడా పుంటా కానా వెళ్లారు. ఆదివారం వారు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘‘కుమార్తె సెల్‌ఫోన్, బ్యాగ్, ఇతర వస్తువులన్నీ స్నేహితుల వద్దే ఉన్నాయి. ఆమెనెవరో కిడ్నాప్ చేసి ఉండొచ్చు’’అని అనుమానం వ్యక్తం చేశారు. ఆ దిశగా దర్యాప్తు చేయాలని కోరుతున్నారు. సుదీక్ష ఆచూకీ కోసం తాజాగా ఎఫ్‌బీఐ కూడా రంగంలోకి దిగింది. స్థానిక భారత రాయబార కార్యాలయం కూడా దర్యాప్తును పర్యవేక్షిస్తోంది. సుదీక్ష అదృశ్యంపై ఇంటర్‌పోల్ ఎల్లో నోటీస్ జారీ చేసింది.భిన్న కథనాలు సుదీక్షను చివరిసారిగా చూసిన జాషువా ఆమె అదృశ్యంపై భిన్న కథనాలు చెబుతున్నాడు. పెద్ద అలలు రావడంతో బీచ్ నుంచి వెళ్లిపోయానని ఓసారి, సుదీక్ష మోకాలి లోతు నీటిలో ఉండగా చివరగా చూశానని మరోసారి చెప్పాడు. ఆమె తీరంలో నడుస్తుండగా తాను నిద్రపోయానని మరోసారి చెప్పుకొచ్చాడు. పోలీసులు మాత్రం అతన్ని అనుమానితుడిగా భావించడం లేదు. బీచ్ లాంజ్‌లో ఆమె దుస్తులు కనిపించాయి. బహుశా బికినీలో సముద్రంలోకి వెళ్లి మునిగిపోయి ఉంటుందని భావిస్తున్నారు. ఆమె తండ్రి మాత్రం జాషువానే అనుమానిస్తున్నారు. -
రెండు నెలల్లో ట్రిపుల్ ఆర్ ఆమోదం!
సాక్షి, న్యూఢిల్లీ: రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) క్లియరెన్స్‌లన్నీ త్వరలో పూర్తికానున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. అనంతరం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే కేంద్ర కేబినెట్ ఆమోదానికి వెళ్తుందని చెప్పారు. ఈప్రక్రియ అంతా రెండు నెలల్లో పూర్తి చేస్తామని కేంద్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. కోమటిరెడ్డి మంగళవారం ఆర్ అండ్ బీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందనలతో కలిసి గడ్కరీతో భేటీ అయ్యారు.ట్రిపుల్ ఆర్, హైదరాబాద్–విజయవాడ ఆరులేన్ల రోడ్డు, 12 ఆర్వోబీలు తదితర అంశాలపై గడ్కరీతో చర్చలు జరిపారు. ఆ తర్వాత రాష్ట్రంలో పలు విమానాశ్రయాల గురించి పౌరవిమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుతో భేటీ అయ్యారు. కొత్తగూడెం, రామగుండం, పెద్దపల్లి, ఆదిలాబాద్, నిజామాబాద్ ఎయిర్‌పోర్టుల అంశంపై చర్చించారు. అనంతరం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. 95 శాతం భూసేకరణ చేశాం 2018–19లో రీజినల్ రింగ్ రోడ్డు ప్రకటించగా.. అప్పటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని కోమటి రెడ్డి విమర్శించారు. తాము అధికారం చేపట్టిన నాటి నుంచి కేంద్రంతో టచ్‌లో ఉంటూ ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే జంగారెడ్డి–భువనగిరి–చౌటుప్పల్ వరకు టెండర్లు పిలిచామన్నారు. 95 శాతం భూసేకరణను క్లియర్ చేశామని, కేంద్రం నుంచి ఆమోదం వచ్చాక వారికి పరిహారమిస్తామని తెలిపారు.‘హైదరాబాద్–విజయవాడ ఆరులేన్ల రహదారిని మచిలీపట్నం వరకు పొడిగిస్తున్నామని, ఇందుకు కన్సల్టెంట్‌ను పిలిచినట్లు గడ్కరీ తెలిపారు. అయితే, హైదరాబాద్–విజయవాడ వరకు ఇప్పటికే భూసేకరణ పూర్తయినందున త్వరగా టెండర్లు పిలవాలని కోరాను. రెండు ప్యాకేజీలుగా ఈ రహదారిని నిర్మించేందుకు కేంద్రం సిద్ధమైంది.మొదటి ప్యాకేజీలో మల్కాపూర్–విజయవాడ, రెండో ప్యాకేజీలో విజయవాడ–మచిలీపట్నం వరకు నిర్మాణం జరిపేందుకు గడ్కరీ ఒప్పుకున్నారు. పర్వతమాల పథకం కింద యాదగిరిగుట్ట, భువనగిరి కోటకు, నల్లగొండ పట్టణంలోని హనుమాన్ కొండ, నాగార్జున సాగర్ ఆనకట్ట మీదుగా నాగార్జున కొండను కలుపుతూ, మంథనిలోని రామగిరి కోట ప్రాంతాల్లో రోప్‌వేలు అడిగాను. వీటిపై గడ్కరీ సానుకూలంగా స్పందించారు’అని కోమటిరెడ్డి చెప్పారు.అనర్హత వేటు పడుతుందనే అసెంబ్లీకి కేసీఆర్ అనర్హత వేటు పడుతుందనే భయంతోనే బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు వస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎద్దేవాచేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇక లేనట్లేనని, ఆ పార్టీని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేరని మీడియాతో చిట్‌చాట్‌లో అన్నారు. ‘కాంగ్రెస్ వైఫల్యాలను ప్రశ్నిస్తానని కేసీఆర్ అంటున్నారు, ఒకవేళ కేసీఆర్ ఒక అంశాన్ని ఎత్తి చూపితే పది అంశాలను సభ ముందు పెడతాం. దళిత సీఎం నుంచి జర్నలిస్ట్‌ల వరకు కేసీఆర్ చేసిన మోసాలను ఎండగడతాం’అని అన్నారు. రేవంత్‌రెడ్డి పదేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని తెలిపారు. సీఎం మార్పు జరుగుతుందని వస్తున్నవన్నీ అసత్య ప్రచారాలేనంటూ కొట్టిపడేశారు. -
14 నెలలైనా.. హామీల అమలులో అదే కాలయాపన
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు 6 గ్యారంటీలు ప్రకటించి, అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్నా ఆ హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి మండిపడ్డారు. దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే పార్టీ బీజేపీ అని, తాము చేయలేకపోయిన హామీలను ఇంకొకరి మీద వేసి, వారు అడ్డుకుంటున్నారు అని ఎప్పుడూ ఎవరినీ నిందించలేదని పరోక్షంగా సీఎం రేవంత్‌రెడ్డిని కిషన్‌రెడ్డి విమర్శించారు. కొత్త ప్రాజెక్టుల పేరు మీద రూ. 1.5 లక్షల కోట్లు కావాలి అంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం చిన్నపిల్లల నవ్వులాటలా ఉందని ఎద్దేవా చేశారు. ఆర్థిక వనరులకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించాలని కిషన్‌రెడ్డి సూచించారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని తన నివాసంలో భారతీయ పురాతన చేతివృత్తుల వైభవాన్ని గుర్తుచేస్తూ రచించిన ‘వూట్జ్: ద ఫర్గాటెన్ మెటల్ క్రాఫ్ట్ ఆఫ్ డెక్కన్’పుస్తకాన్ని కిషన్‌రెడ్డి ఆవిష్కరించారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, తన వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ప్రజల దృష్టి మళ్లించడానికి కొత్త ప్రాజెక్టుల రూపకల్పన చేసి కేంద్ర ప్రభుత్వాన్ని డబ్బులు అడుగుతున్నారని విమర్శించారు. ఇది దివాలాకోరు విధానం, బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో రూ. 7.5 లక్షల కోట్లు అప్పు చేసిందని, తమకు తెలియదని, రాష్ట్ర అప్పు రూ.3.5 లక్షల కోట్లే అనుకున్నానని రేవంత్‌రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలను కిషన్‌రెడ్డి తప్పుబట్టారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నానని, హామీలు అమలు చేయలేకపోతున్నానంటూ ముఖ్యమంత్రి మాట మార్చడం రాహుల్‌గాం«దీ, రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, అసమర్థతకు అద్దం పడుతోందని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డుకు తామే హామీ ఇచ్చామని, తప్పకుండా అమలు చేస్తామని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. బుధవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసా, మహిళలకు ఇచ్చిన హామీలు, జాబ్ కేలండర్, నిరుద్యోగ భృతి, రైతులు, కౌలు రైతులకు ఆర్థిక సహాయం, పెన్షన్లు సహా ఇచి్చన అన్ని హామీల గురించి ప్రస్తావిస్తామన్నారు. వీటన్నింటి గురించి శాసనసభలో చర్చిస్తే బాగుంటుందని కిషన్‌రెడ్డి సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 14 నెలల్లో రాష్ట్రాన్ని దోపిడీ చేశారని, రియల్టర్లను వేధిస్తున్నారని మండిపడ్డారు. ఓడిపోతామన్న భయంతోనే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో తనపై వ్యక్తిగత విమర్శలు చేశారన్నారు. తనను ఎవరు తిట్టినా వారి విజ్ఞతకే వదిలేస్తానని చెప్పారు. -
ఇండస్ఇండ్ ఇన్వెస్టర్లకు షాక్
న్యూఢిల్లీ: డెరివేటివ్స్ పోర్ట్‌ఫోలియో ఖాతాల నిర్వహణలో రూ. 2,100 కోట్లమేర అంతరం నమోదైనట్లు తాజాగా ప్రయివేట్ రంగ సంస్థ ఇండస్ఇండ్ బ్యాంక్ వెల్లడించింది. అయితే బ్యాంక్‌వద్ద తగినంత రిజర్వులు, మూలధనం ఉండటంతో కవర్ చేసుకోగలమని పేర్కొంది. అయితే యాజమాన్యం హామీ ఇచ్చినప్పటికీ ఇన్వెస్టర్లలో ఆందోళనలు తలెత్తాయి. ఫలితంగా ట్రేడింగ్ ప్రారంభంలోనే ఇండస్ఇండ్ షేరు 10% పతనమైంది. ఆపై మరింత బలహీనపడుతూ 20% సర్క్యూట్‌ను తాకింది. సర్క్యూట్ నుంచి రిలీజ్ అయ్యాక మరింత దిగజారింది. వెరసి ట్రేడింగ్ ముగిసేసరికి 27% కుప్పకూలి రూ. 657 వద్ద నిలిచింది. ఒక దశలో రూ. 649 వద్ద ఏడాది కనిష్టాన్ని తాకింది. ఏం జరిగిందంటే? ఖాతాలో వ్యత్యాసాన్ని గతేడాది(2024) సెప్టెంబరు– అక్టోబర్‌లో గుర్తించినట్లు ఇండస్ఇండ్ బ్యాంక్ సీఈవో, ఎండీ సుమంత్ కథ్పాలియా పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రాథమిక సమాచారాన్ని ఆర్బీఐకు గత వారమే నివేదించినట్లు తెలియజేశారు. అయితే తుది వివరాలు బయటి ఏజెన్సీతో చేయిస్తున్న ఆడిట్ ద్వారా వెల్లడికానున్నట్లు పేర్కొన్నారు. నివేదిక ఏప్రిల్ మొదట్లో వెలువడనున్నట్లు తెలియజేశారు. లాభదాయకత, మూలధన పటిష్టత నేపథ్యంలో ఈ ప్రభావాన్ని బ్యాంక్ సర్దుబాటు చేసుకోగలదన్నారు. 2024 ఏప్రిల్1కు ముందు 5–7ఏళ్లుగా డెరివేటివ్ పోర్ట్‌ఫోలియో ఖాతాలో తేడా నమోదవుతూ వచ్చిందని చెప్పారు. ఎక్స్ఛేంజీలకు సమాచారం...డెరివేటివ్స్ పోర్ట్‌ఫోలియోలో కొన్ని అంతరాలున్నట్లు సోమవారం ఇండస్ఇండ్ బ్యాంక్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు నివేదించింది. వీటి వల్ల బ్యాంక్ నెట్‌వర్త్‌పై 2.35 శాతంమేర ప్రతికూల ప్రభావం పడే వీలున్నట్లు పేర్కొంది. అంతర్గత సమీక్ష ద్వారా ఈ అంశాన్ని గుర్తించినట్లు వెల్లడించింది. వీటిని స్వతంత్రంగా సమీక్షించి నిర్ధారించేందుకు బయటి ఏజెన్సీని ఎంపిక చేసినట్లు తెలిపింది.కాగా.. ట్రెజరీ బిజినెస్‌లో గుర్తించిన వ్యత్యాసం అంతర్గత, చట్టబద్ధ, ఆర్బీఐ ఆడిట్లలో బయటపడకపోవడం గమనార్హం! 2024 ఏప్రిల్ 1నుంచి డెరివేటివ్స్‌లో ఇంటర్నల్ ట్రేడ్‌ను నిలిపివేస్తూ 2023 సెప్టెంబరులో జారీ అయిన ఆర్బీఐ సర్క్యులర్ కారణంగా అంతర్గత బుక్‌పై సమీక్షకు తెరతీసినట్లు సుమంత్ వెల్లడించారు. దీంతో బయటి ఆడిట్‌కు ఆదేశించినట్లు తెలియజేశారు. అయితే బ్యాంక్ ఎండీ, సీఈవోగా తిరిగి ఎంపిక చేయడంలో ఆర్బీఐపై ఈ అంశంప్రభావం చూపి ఉండవచ్చని పేర్కొన్నారు. బ్యాంక్ బోర్డు మూడేళ్ల కాలానికి ప్రతిపాదించగా.. గత వారం ఆర్బీఐ ఏడాది కాలానికే సుమంత్ బాధ్యతల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.రూ. 19,000 కోట్లు ఆవిరి...షేరు భారీ పతనంతో ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే ఇండస్ఇండ్ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)కు ఒక్కరోజులోనే రూ. 19,000 కోట్లమేర చిల్లుపడింది. ఈ నెల 10న నమోదైన రూ. 70,150 కోట్ల నుంచి బ్యాంక్ మార్కెట్ విలువ తాజాగా రూ. 51,168 కోట్లకు క్షీణించింది. బ్యాంక్ షేరు 2018 ఆగస్ట్‌లో రూ. 2038 వద్ద చరిత్రాత్మక గరిష్టానికి చేరింది. గతేడాది అంటే 2024 ఏప్రిల్ 8న రూ. 1,576 వద్ద నమోదైన గరిష్టం నుంచి తాజాగా 52 వారాల కనిష్టం రూ. 649ను తాకింది. వెరసి 59 శాతం పతనమైంది. ఫండ్స్ లబోదిబో ఇది ఇండెక్స్ షేరు కావడంతో 2025 ఫిబ్రవరికల్లా 35 మ్యూచువల్ ఫండ్స్ 360 పథకాల ద్వారా ఇండస్ఇండ్ బ్యాంక్‌లో ఇన్వెస్ట్ చేశాయి. 20.88 కోట్ల షేర్లను కలిగి ఉన్నాయి. ఈ హోల్డింగ్స్ విలువ రూ. 20,670 కోట్లు కాగా.. షేరు తాజా పతనంలో రూ. 6,970 కోట్లు ఆవిరైంది. దీంతో హోల్డింగ్స్ విలువ రూ. 13,700 కోట్లకు పరిమితమైంది. ఇక ప్యాసివ్ ఫండ్స్ సైతం బ్యాంక్ షేర్ల పతనంతో ప్రభావితమైనట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. -
Dharmendra Pradhan: కేంద్ర మంత్రిపై ప్రివిలేజ్ మోషన్
న్యూఢిల్లీ: తమిళుల మనోభావాలు దెబ్బతీశారంటూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై మండిపడుతున్న డీఎంకే పార్టీ.. ఆయనపై ప్రివిలేజ్ మోషన్(Privilege motion) ఇచ్చింది. ఆయన చట్ట సభను తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ డీఎంకే ఎంపీ కనిమొళి లోక్‌సభలో ఈ తీర్మానం దాఖలు చేశారు.తమిళనాడు.. అక్కడి ప్రజలు అనాగరికులు(Uncivilized) అంటూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఆయన తక్షణమే క్షమాపణలు చెప్పాలని డీఎంకే, 8 కోట్ల మంది తమిళుల తరఫున నేను డిమాండ్ చేస్తున్నా అని అన్నారామె.జాతీయ విద్యా విధానం విషయంలో తమిళనాడు ప్రభుత్వం యూటర్న్ తీసుకుందని.. ఈ విషయంలో ఏమాత్రం నిజాయితీ లేకుండా వ్యవహరించిందని ధర్మేంద్ర ప్రధాన్(dharmendra pradhan) మండిపడిన సంగతి తెలిసిందే. ‘‘వాళ్లకు ఏమాత్రం నిజాయితీ లేదు. విద్యార్థుల జీవితాలు నాశనం చేసేలా రాజకీయాలు చేస్తున్నారు’’ అంటూ సోమవారం బడ్జెట్ మలివిడత సమావేశాల సందర్భంగా లోక్‌సభ వ్యాఖ్యలు చేశారు. దీంతో డీఎంకే ఎంపీలు ఆందోళనకు దిగగా.. సభ వాయిదా పడింది.అయితే కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై డీఎంకే భగ్గుమంది. ధర్మేంద్ర ప్రధాన్వి తలపొగరు వ్యాఖ్యలని డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. ఇది తమిళులను అవమానించడమేనని,ప్రధాని మోదీ ఇలాంటి వ్యాఖ్యలను అంగీకరిస్తారా? అంటూ మండిపడ్డారు.మరోవైపు.. పీఎం శ్రీ(PM SHRI) పథకం విషయంలో తమిళనాడు ప్రభుత్వం ఎంవోయూపై సంతకాలకు అంగీకరించి.. ఆపై వెనక్కి తగ్గిందని ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. అయితే ఇది ఏమాత్రం నిజం కాదని.. ఈ ప్రకటన పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించేదేనని.. ఇది సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని డీఎంకే అంటోంది. ఈ నేపథ్యంలో ఎంపీ కనిమొళి ప్రివిలేజ్ మోషన్ దాఖలు చేయగా.. ఆ తీర్మానాన్నిస్పీకర్ ఓం బిర్లా పరిశీలించనున్నారు. ఒకవేళ స్పీకర్ గనుక ఆ తీర్మానాన్ని అంగీకరిస్తే దర్యాప్తునకు ఆదేశిస్తారు. అందులో ఉల్లంఘన జరిగినట్లు తేలితే క్రమశిక్షణా ఉల్లంఘన కింద చర్యలు తీసుకుంటారు. -
తమిళులు అనాగరికులు!
న్యూఢిల్లీ: మోదీ సర్కారుకు, తమిళనాడులోని అధికార డీఎంకేకు మధ్య కొన్నాళ్లుగా సాగుతున్న రగడ పార్లమెంటునూ తాకింది. ‘అనాగరికులు’ అంటూ కేంద్ర విద్యా శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. వాటిపై డీఎంకే ఎంపీల నిరసనలు, ఆందోళనలతో సోమవారం రెండో విడత బడ్జెట్ సమావేశాల తొలి రోజు లోక్‌సభ అట్టుడికిపోయింది. తమిళుల ఆత్మగౌరవాన్ని మంత్రి దారుణంగా దెబ్బతీశారంటూ డీఎంకే ఎంపీ కనిమొళి దుయ్యబట్టారు. ఆయనపై సభాహక్కుల తీర్మానం ప్రవేశపెడతామని ప్రకటించారు. ప్రధాన్ వ్యాఖ్యలపై తమిళనాడు అంతటా డీఎంకే శ్రేణులు నిరసనకు దిగాయి. ఆయన దిష్టి బొమ్మలు తగలబెట్టాయి. తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా దీనిపై తీవ్రంగా స్పందించారు. ఆయన చెన్నైలో మీడియాతో మాట్లాడారు. ‘‘మంత్రివి అహంకారపూరిత వ్యాఖ్యలు. ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలి’’ అంటూ హెచ్చరించారు. ‘‘తమిళ ప్రజలందరినీ మంత్రి ఘోరంగా అవమానించారు. దీన్ని ప్రధాని నరేంద్ర మోదీ సమర్థిస్తారా?’’ అని ప్రశ్నించారు. మంత్రి వ్యాఖ్యలు దారుణమంటూ కాంగ్రెస్‌తో పాటు ఇతర విపక్షాలు కూడా లోక్‌సభ ప్రాంగణంలో దుయ్యబట్టాయి. డీఎంకేకు నిజాయితీ లేదు! సభ ప్రారంభం కాగానే నూతన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) అంశాన్ని డీఎంకే సభ్యులు లేవనెత్తారు. దాన్ని తమ రాష్ట్రంపై బలవంతంగా రుద్దేందుకు అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. అనంతరం పీఎంశ్రీ పథకంపై ప్రశ్నకు ప్రధాన్ బదులిస్తూ డీఎంకే ఎంపీల తీరుపై తీవ్రంగా స్పందించారు. వారికి నిజాయితీ లేదంటూ ఆక్షేపించారు. ‘‘కర్ణాటక, హిమాచల్ వంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా పీఎంశ్రీని అమలు చేస్తున్నాయి. అది తమకూ అంగీకారమేనని పలువురు డీఎంకే ఎంపీలు నాతో స్వయంగా చెప్పారు. ఈ మేరకు స్టాలిన్ కూడా ప్రకటన చేశారు. తర్వాత ఏ ’సూపర్ సీఎం’ జోక్యం చేసుకున్నాడో గానీ, ఉన్నట్టుండి యూటర్న్ తీసుకున్నారు. కేవలం భాషాపరమైన వివాదాలు సృష్టించడమే పనిగా ఫక్తు రాజకీయాలు చేస్తున్నారు. తమిళ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారు’’ అంటూ దుయ్యబట్టారు. విద్యార్థుల భవితవ్యం దృష్ట్యా స్వార్థాన్ని పక్కనపెట్టి రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని, ఎన్ఈపీకి అంగీకరించాలని హితవు పలికారు. వీటిపై డీఎంకే సభ్యులు తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు. ఎన్ఈపీ అంగీకారమేనని ప్రధాన్‌తో తామెన్నడూ చెప్పలేదన్నారు. ఆయన పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. నిరసనలు, నినాదాలు, ఆందోళనలతో హోరెత్తించారు. దక్షిణ భారతదేశానికి అన్యాయం చేసే ప్రయత్నాలు మానుకోవాలంటూ డిమాండ్ చేశారు. శాంతించాలంటూ స్పీకర్ విజ్ఞప్తి చేసినా వెనక్కు తగ్గలేదు. దాంతో సభ కాసేపు వాయిదా పడింది. మళ్లీ సమావేశమయ్యాక కూడా రగడ కొనసాగింది. కేంద్రానికి వ్యతిరేకంగా డీఎంకే సభ్యులు నినాదాలు కొనసాగించారు. ఎన్ఈపీని, హిందీ తప్పనిసరంటున్న త్రిభాషా సూత్రాన్ని డీఎంకే ముందునుంచీ వ్యతిరేకిస్తోందని కనిమొళి అన్నారు. ప్రధాన్ వ్యాఖ్యలు, ప్రత్యేకంచి ఒక పదం తమను తీవ్రంగా బాధించిందని ఆవేదన వెలిబుచ్చారు. దాంతో మంత్రి స్పందిస్తూ, ‘‘నా సోదరి రెండు అంశాలు లేవనెత్తారు. తమిళనాడు ప్రభుత్వం, ఎంపీలు, తమిళ ప్రజలను ఉద్దేశించి నేనలాంటి పదం వాడకుండా ఉండాల్సిందని అన్నారు. ఆ పదాన్ని వెనక్కు తీసుకుంటున్నా’’ అని ప్రకటించారు. అవి రికార్డుల్లోకి వెళ్లబోవని స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి పార్లమెంటు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ తమిళ ప్రజలను అవమానించేలా ప్రధాన్ దారుణ వ్యాఖ్యలు చేశారన్నారు. విద్యావిధానం వంటి అంశాలను ఏ రాష్ట్రంపైనా బలవంతంగా రుద్దరాదని కనిమొళి అభిప్రాయపడ్డారు. పార్లమెంటు ఆవరణలో ఆమె మీడియాతో మాట్లాడారు. మంత్రి తమను అబద్ధాలకోరులు అనడం ఏ మేరకు సబబని ప్రశ్నించారు. త్రిభాషా సూత్రాన్ని తమిళనాడు అంగీకరించేదే లేదని ఆ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం కూడా అన్నారు. ‘‘హిందీని మాపై రుద్దడాన్ని ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఈ విషయంలో రాష్ట్రంలో అన్ని పార్టీలదీ ఒకే వైఖరి’’ అని స్పష్టం చేశారు. మీపై చర్యలు తప్పవ్ మారన్‌పై స్పీకర్ ఆగ్రహం డీఎంకే సభ్యుడు దయానిధి మారన్‌పై స్పీకర్ ఓం బిర్లా మండిపడ్డారు. ఎన్ఈపీపై డీఎంకే సభ్యుల ఆందోళన సందర్భంగా పోడియం వద్ద మారన్ ఏవో వ్యాఖ్యలు చేశారు. వాటిపై స్పీకర్ తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. ఆయనపై కఠిన చర్యలు తప్పవని ప్రకటించారు. ‘‘మాట్లాడేటప్పుడు కాస్త నోరు జాగ్రత్త. మీ వ్యాఖ్యలు రికార్డులకు ఎక్కి ఉంటే తక్షణమే చర్యలు తీసుకునేవాడిని’’ అంటూ హెచ్చరించారు. మారన్‌పై చర్యలకు తీర్మానం ప్రవేశపెట్టాల్సిందిగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజుకు సూచించారు. లేదంటే తానే చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. సభ గౌరవానికి భంగం కలిగించే ప్రవర్తనను సహించే ప్రసక్తే లేదని స్పీకర్ స్పష్టం చేశారు. -
ఈసీ తీరుపై... అన్నీ అనుమానాలే!
సాక్షి, న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా అవకతవకలు, నకిలీ ఓటర్ కార్డులు, ఓటర్ల సంఖ్యలో అనూహ్య పెరుగుదల, ఇష్టారాజ్యంగా ఓటర్ల తొలగింపు తదితర అంశాలను కాంగ్రెస్‌తో పాటు విపక్ష పార్టీలన్నీ సోమవారం లోక్‌సభలో లేవనెత్తాయి. వీటిపై సందేహాలు, నానాటికీ దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న ఆరోపణలు మొత్తం ఎన్నికల ప్రక్రియ సమగ్రతనే ప్రశ్నార్థకంగా మార్చాయంటూ ఆందోళన వెలిబుచ్చాయి. పైగా వీటిపై కేంద్ర ఎన్నికల సంఘం అరకొర స్పందన మరిన్ని అనుమానాలకు తావిస్తోందన్నాయి. కనుక ఈ మొత్తం అంశంపై లోక్‌సభలో పూర్తిస్థాయి చర్చ జరగాల్సిందేనని డిమాండ్ చేశాయి. ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ జీరో అవర్‌లో ఈ అంశాన్ని లేవనెత్తారు. ఇది ప్రతిపక్షాలన్నీ ముక్త కంఠంతో చేస్తున్న డిమాండని ఆయన స్పష్టం చేశారు. స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ ఓటర్ల జాబితాను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేస్తుందా అని ప్రశ్నించారు. ‘‘కేంద్రం తయారు చేయదన్నది నిజమే. కానీ ఇవన్నీ మొత్తం ఎన్నికల ప్రక్రియపైనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అందుకే ఈ అంశంపై సవివరమైన చర్చకు మేం డిమాండ్ చేస్తున్నాం’’ అని రాహుల్ బదులిచ్చారు. ‘‘ఓటర్ల జాబితాల విశ్వసనీయతను దేశవ్యాప్తంగా విపక్ష పార్టీలన్నీ ప్రశ్నిస్తున్నాయి. మహారాష్ట్రతో సహా ప్రతి రాష్ట్రంలోనూ ప్రతిపక్షాలు దీనిపై అనుమానాలు లేవనెత్తాయి’’ అని గుర్తు చేశారు. ఇది చాలా తీవ్రమైన అంశమంటూ సమాజ్‌వాదీ, ఆర్జేడీ, బిజూ జనతాదళ్, ఆప్ కూడా గొంతు కలిపాయి. దీన్ని పార్లమెంటు చర్చకు స్వీకరించాల్సిందేనని పట్టుబట్టాయి. తృణముల్ కాంగ్రెస్ ఎంపీ సౌగతారాయ్ ఓటర్ల జాబితా అంశాన్ని జీరో అవర్‌లో లేవనెత్తారు. ‘‘ఓటర్ల ఫొటో గుర్తింపు కార్డు నంబర్లలో నకిలీల సమస్య దశాబ్దాలుగా ఉంది. కానీ పశి్చమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆందోళన అనంతరమే కేంద్ర ఎన్నికల సంఘం దీనిపై స్పందించింది. సమస్యను మూడు నెలల్లో పరిష్కరిస్తామని ప్రకటించింది’’ అంటూ దృష్టికి తెచ్చారు. అంటే ఇంతకాలంగా తప్పిదాలు జరుగుతూ వస్తున్నట్టే కదా అని ఆయన ప్రశ్నించారు. ‘‘బెంగాల్, హరియాణాల్లో నకిలీ ఓటరు కార్డులు దొరికాయి. ఇటీవలి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటర్ల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది. దానిపై అందరూ ప్రశ్నలు లేవనెత్తారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికలప్పుడూ ఇలాగే జరిగింది. ఇవన్నీ తీవ్రమైన లోటుపాట్లే. వచ్చే ఏడాది బెంగాల్, అసోం అసెంబ్లీ ఎన్నికలున్నందున ఆలోపే ఓటర్ల జాబితాలను పూర్తిగా సవరించాలి’’ అని డిమాండ్ చేశారు. ఈ తప్పిదాలపై దేశ ప్రజలకు ఈసీ బదులివ్వాల్సిందేనన్నారు. ఈ అంశంపై సమగ్ర చర్చకు డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు నిరసనలతో హోరెత్తించారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ పక్షపాతరహితంగా వ్యవహరించాలని సమాజ్‌వాదీ సభ్యుడు ధర్మేంద్రయాదవ్ అన్నారు. ‘‘మహారాష్ట్రలో నెలల వ్యవధిలోనే కొత్తగా లక్షలాది ఓటర్లు ఎలా పుట్టుకొచ్చారు? ఢిల్లీలోనూ అదే జరిగింది. 2022లో యూపీలోనూ ఇదే చేశారు’’ అని ఆరోపించారు.రాజ్యసభలోనూ... రాజ్యసభలో కూడా జీరో అవర్‌లో ఈ అంశాన్ని లేవనెత్తేందుకు విపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రయత్నించారు. డిప్యూటీ చైర్మన్ హరివంశ్ అందుకు అనుమతివ్వలేదు. దీనితో పాటు డజనుకు పైగా అంశాలపై 267వ నిబంధన కింద చర్చకు డిమాండ్ చేస్తూ విపక్షాలు ఇచి్చన నోటీసులన్నింటినీ తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు. దీన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌తో పాటు విపక్షాలన్నీ వాకౌట్ చేశాయి. ‘‘మహారాష్ట్రలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల మధ్య ఆర్నెల్లలోనే ఓటర్ల సంఖ్య భారీగా పెరిగిపోయింది. ఇదెలా సాధ్యం? దీనిపై కాంగ్రెస్‌తో పాటు విపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు ఈసీ వద్ద సమాధానమే లేదు. ఓటింగ్ ప్రక్రియ కోసం ఉపయోగించిన ఫొటో ఓటర్ల జాబితాను ఎక్సెల్ ఫార్మాట్లో మాకు అందజేయాలని డిమాండ్ చేస్తే ఈసీ నేటికీ స్పందించనే లేదు. దేశవ్యాప్తంగా ఓటర్ల పేర్లను ఇష్టారాజ్యంగా తొలగించడం, డూప్లికేట్ ఈపీఐసీ నంబర్ల వంటి తీవ్ర తప్పిదాలు, లోటుపాట్లు ఇష్టారాజ్యాంగా చోటుచేసుకుంటున్నాయి. ఇవన్నీ ఎన్నికల ప్రక్రియ తాలూకు సమగ్రతనే సవాలు చేస్తున్నాయి. పైగా ఈ తప్పిదాలను స్వయంగా ఈసీయే అంగీకరించింది. కనుక వీటన్నింటిపై పార్లమెంటులో చర్చ జరగాల్సిందే. అందుకు మోదీ సర్కారు అంగీకరించాల్సిందే’’ అంటూ అనంతరం ఖర్గే ఎక్స్‌లో పోస్ట్ చేశారు. తద్వారా ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగంపై ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలన్నారు. దేశంలో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడంలో కేంద్ర ఎన్నికల సంఘం కొన్నేళ్లుగా ఘోరంగా విఫలమవుతోందని అంతకుముందు టీఎంసీ సభ్యుడు కల్యాణ్ బెనర్జీ సభలో దుయ్యబట్టారు. ఇందుకు ఈసీపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘‘డూప్లికేట్ ఓటర్ కార్డుల అంశాన్ని సీఎం మమతే తొలిసారి లేవనెత్తారు. దీనిపై ఈసీ ఇచ్చిన వివరణ ఎన్నికల నిర్వహణ నిబంధనలకే విరుద్ధంగా ఉంది’’ అని ఆరోపించారు. అనుమానాలన్నింటినీ నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్రం, ఈసీపై ఉందని ఆప్ సభ్యుడు సంజయ్‌సింగ్ అన్నారు. ఇటీవలి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో హరియాణా పౌరులకు విచ్చలవిడిగా ఓటరు కార్డులిచ్చారని ఆరోపించారు. తద్వారా ఎన్నికల ప్రక్రియనే ప్రహసనంగా ఈసీ మార్చేసిందని దుయ్యబట్టారు. తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఈసీ ప్రయత్నిస్తోందని ఆర్జేడీ సభ్యుడు మనోజ్ ఝా ఆరోపించారు. ‘‘ఎన్నికల ప్రక్రియే పార్లమెంటు ఉనికికి ప్రాణం. ఎన్నికల అవకతవకలపై ఇక్కడ చర్చించేందుకు అవకాశమివ్వకపోతే ప్రజాస్వామ్యానికి అర్థమే లేదు’’ అన్నారు. -
బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలి.. రాజ్యసభలో వైఎస్సార్సీపీ డిమాండ్
ఢిల్లీ: తిరుపతిలో కొత్తగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీ మేడ రఘునాథ్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. రాజ్యసభలో రైల్వే సవరణ బిల్లుపై చర్చ జరిగింది. వైఎస్సార్సీపీ తరఫున ఎంపీ మేడ రఘునాథ్ రెడ్డి చర్చలో పాల్గొన్నారు.రాజ్యసభలో చర్చ సందర్భంగా ఎంపీ మేడ రఘునాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. తిరుపతిలో కొత్తగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలి. చెన్నై, బెంగళూరుకు సమాన దూరంలో ఉన్న తిరుపతికి భారీ సంఖ్యలో ప్రయాణికులు వస్తుంటారు.భారీ సంఖ్యలో ప్రయాణికులను నేపథ్యంలో ఈ డివిజన్ ఫీజిబిలిటీ ఉంది. తిరుపతి రైల్వే స్టేషన్‌ను వరల్డ్ క్లాసు రైల్వే స్టేషన్‌గా తీర్చిదిద్దాలి. అన్నమయ్య జిల్లాలో నందలూరు రైల్వే స్టేషన్ వద్ద ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ స్థాపించాలి. అక్కడ 400 ఎకరాల భూమి, అవసరమైన నీరు అందుబాటులో ఉంది.వైజాగ్ రైల్వే జోన్లో వాల్తేరు జోనును సంపూర్ణంగా విలీనం చేయాలి.రైల్వే బోర్డులో ఏపీకి తగిన ప్రాతినిధ్యం కల్పించాలి. ప్రీమియం ట్రైన్లలో సామాన్య ప్రయాణికుల కోసం ఐదు కోచ్ లు అదనంగా ఏర్పాటు చేయాలి. రైల్వే ప్రమాదాల నేపథ్యంలో ఇండిపెండెంట్ సేఫ్టీ ఆడిట్ జరగాలి.అపరిశుభ్రమైన రైలు నాణ్యతలేని ఆహారం తదితరు అంశాలపై ప్రయాణికుల ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోవాలి.’అని కోరారు. -
బడ్జెట్ సమావేశాలు: రాజ్యసభ నుంచి వాకౌట్
Parliament Live Updates March 10th: పార్లమెంట్ మలి(రెండో) విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. కాసేపటికే ఉభయ సభల్లో విపక్షాలకు ఆందోళనలకు దిగాయి.లోకసభ వాయిదామధ్యాహ్నం 12గంటల వరకు వాయిదా వేసిన స్పీకర్జాతీయ విద్యా విధానంలో త్రిభాషా వ్యవస్థకు వ్యతిరేకంగా విపక్షాల ఆందోళన గందరగోళం నడుమ సభను కాసేపు వాయిదా వేసిన స్పీకర్ ఓం బిర్లా #Loksabha adjourned till 12 noon. pic.twitter.com/OWiOwstBES— Lok Poll (@LokPoll) March 10, 2025 #WATCH | On the New Education Policy and three language row, Union Education Minister Dharmendra Pradhan says, "...They (DMK) are dishonest. They are not committed to the students of Tamil Nadu. They are ruining the future of Tamil Nadu students. Their only job is to raise… pic.twitter.com/LdBVqwH6le— ANI (@ANI) March 10, 2025 రాజ్యసభ నుంచి ప్రతిపక్షం వాకౌట్పెద్దల సభను కుదిపేసిన డీలిమిటేషన్ వ్యవహారంరాజ్యసభ నుంచి కాంగ్రెస్ సభ్యుల వాకౌట్ డీలిమిటేషన్(నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణ అంశంపై చర్చించాలని, అనుమానాలను నివృత్తి చేయాలని పట్టుబట్టిన విపక్షాలుప్రతిపక్షాల చర్యలపై ఎన్డీయే సభ్యుల ఆగ్రహం #WATCH | Delhi: Rajya Sabha MP Rekha Sharma says, "The opposition always obstructs the House and important issues are left behind...Today also they will do something similar and we are ready for that too...only those issues will come up in Parliament which are for the… pic.twitter.com/uWHQDiXooN— ANI (@ANI) March 10, 2025 రాజ్యసభలో టీమిండియాకు శుభాకాంక్షలుఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్టీమిండియాకు రాజ్యసభలో అభినందనలు #WATCH | Delhi: On behalf of Rajya Sabha members, Rajya Sabha Deputy Chairman Harivansh Narayan Singh congratulates the Indian team for clinching the Champions Trophy (Source: Sansad TV) pic.twitter.com/1HcsW5GgFb— ANI (@ANI) March 10, 2025 ప్రారంభమైన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కాసేపట్లో పార్లమెంట్ రెండవ విడత బడ్జెట్ సమావేశాలువక్ఫ్ బిల్లు ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్న విపక్షాలుఓటర్ల జాబితాలో అవకతవకలు, త్రిభాషా అంశం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశం పై విధించే సుంకాల పై చర్చ జరపాలని డిమాండ్ చేసే అవకాశం మార్చి 10 నుండి ఏప్రిల్ 4 వరకు కొనసాగనున్న సమావేశాలు2025-26 ఆర్ధిక సంవత్సరానికి గాను డిమాండ్ ఫర్ గ్రాంట్ల పై జరుగనున్న చర్చనేడు లోక్ సభలో రెండో విడత పద్దులను ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్మణిపూర్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్లోక్ సభలో నేడు త్రిభువన్ సహకారి యూనివర్సిటీ బిల్లు ను ప్రవేశపెట్టనున్న కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షాఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ ఆనంద్ ను, త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయంగా మారుస్తూ బిల్లుఈ సమావేశాల్లో బ్యాంకింగ్ చట్ట సవరణ బిల్లు, కోస్టల్ షిప్పింగ్ బిల్లు, 2024, ఇమ్మిగ్రేషన్ ఆండ్ ఫారినర్స్ బిల్లు,2025, రైల్వేస్ చట్ట సవరణ బిల్లు లను పార్లమెంట్ ఆమోదం కోసం ప్రవేశపెట్టనున్న కేంద్రంఈ సమావేశాల్లో వక్స్ బోర్డ్ సవరణ బిల్లు, 2024 ను కేంద్రం ప్రవేశపెట్టే అవకాశం -
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్కు అస్వస్థత.. ఎయిమ్స్‌కు తరలింపు
ఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్(Jagdeep Dhankar) అస్వస్థతకు గురయ్యారు. దీంతో, ఆయనను వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. అయితే, ఛాతి నొప్పితో బాధపడినట్లు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున ఆయనకు ఛాతి నొప్పితో బాధపడినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో, తెల్లవారుజామున 2 గంటలకు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)కు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ రాజీవ్ నారంగ్ ఆధ్వర్యంలో ఆయనకు చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యబృందం తెలిపింది. ఇక, ధన్కర్ అస్వస్థత విషయం తెలిసిన వెంటనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. ఎయిమ్స్‌కు వెళ్లి ఆయనను పరామర్శించారు. Vice President Jagdeep Dhankhar was admitted to the cardiac department at AIIMS Delhi in the early morning. He is stable and under observation: AIIMS Hospital Sources— ANI (@ANI) March 9, 2025 -
నేడు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులపై కసరత్తు పూర్తయ్యింది. నేడు ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్ఠానం ఖారారు చేయనుంది. కాగా, చివరి నిమిషంలో తెలంగాణ నేతల ఢిల్లీ పర్యటన రద్దు అయ్యింది. కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో లేకపోవడంతో పర్యటన రద్దు అయ్యింది. ఇవాళ రాష్ట్ర అగ్రనేతలతో ఫోన్లో కేసీ వేణుగోపాల్ మాట్లాడనున్నారు. ఎమ్మెల్సీస్థానాల కోసం కాంగ్రెస్‌లో భారీ పోటీ నెలకొంది. తమకు అవకాశం కల్పించాలంటూ ఆశావహులు కోరుతున్నారు. నేడు అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించే అవకాశముంది.కాగా, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఉత్కంఠ నెలకొంది, ఎమ్మెల్సీ బరిలో ఓసీ కేటగిరి నుంచి వేం నరేందర్ రెడ్డి, పారిజాత నరసింహ రెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డి, కుమార్ రావు, కుసుమ కుమార్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.బీసీ కేటగిరి నుండి ఇరవత్రి అనిల్, కొనగాల మహేష్, జెర్పేటి జైపాల్, గాలి అనిల్ ఉన్నారు. ఎస్సీ కేటగిరి నుండి అద్దంకి దయాకర్, జ్ఞాన సుందర్, దొమ్మటి సాంబయ్య, రాచమల్ల సిద్దేశ్వర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఎస్టీ నుంచి బెల్లయ్య నాయక్, బానోతు విజయాభాయి, రేఖా నాయక్ పేర్లను హైకమాండ్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. -
రైల్వే ప్రయాణికులకు గమనిక.. ప్లాట్‌ఫామ్‌పై ఎంట్రీకి కొత్త రూల్!
సాక్షి, న్యూఢిల్లీ: రైలులో ప్రయాణించాలనుకునే వారు ఇకపై కన్ఫార్మ్ టికెట్ ఉంటేనే ప్లాట్‌ఫామ్ పైకి వెళ్ల గలుగుతారు. పైలట్ ప్రాజెక్టు కింద న్యూఢిల్లీ, ఆనంద్ విహార్, సూరత్, వారణాసి, అయోధ్య, పాట్నా రైల్వే స్టేషన్లలో ఈ వ్యవస్థను తక్షణమే అమల్లోకి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణీకులు రైల్వే శాఖ ఆదేశాలను పాటించాలని సూచనలు చేశారు.తాజాగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ నియంత్రణపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశవ్యాప్తంగా 60 ప్రధాన రైల్వే స్టేషన్లలోని అనధికార ఎంట్రీ పాయింట్లను మూసివేసి.. కన్ఫార్మ్ టికెట్లు ఉన్న ప్రయాణీకులను మాత్రమే ప్లాట్‌ఫామ్‌లపైకి అనుమతించాలని నిర్ణయించారు. మహా కుంభమేళా సందర్భంగా దేశంలోని 60 రైల్వే స్టేషన్లలో తాత్కాలికంగా వెయింటింగ్ రూములు ఏర్పాటు చేశారు. న్యూఢిల్లీ, సూరత్, పాట్నాల్లో రద్దీని నియంత్రించడంలో ఇవి ఎంతో ఉపయోగపడ్డాయి. రైలు విచ్చిన తర్వాతే ప్రయాణికులను ప్లాట్‌ఫామ్‌పైకి అనుమతించారు. ఇదే పద్ధతిని ఇప్పుడు శాశ్వతంగా అమలు చేయాలని నిర్ణయించారు.60 స్టేషన్లలో తాత్కాలికంగా నిర్మించిన వెయిటింగ్ రూములను శాశ్వతంగా ఉపయోగపడేలా మార్చబోతున్నారు. పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లలో రైళ్ల సామర్థ్యం మేరకే టికెట్లు విక్రయిస్తారు. ఈ స్టేషన్లలో రైల్వే సిబ్బందికి ప్రత్యేక డ్రెస్ కోడ్ కూడా ఉంటుంది. కుంభమేళా సందర్భంగా ఢిల్లీ స్టేషన్లో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో ప్రయాణికుల భద్రతపై రైల్వే శాఖ ఈ కీలక నిర్ణయాలు తీసుకుంది. BIG BREAKING NEWS 🚨 Only confirmed ticket holders will be allowed to enter platforms at 60 railway stations.Big decision by Railway Minister Ashwini Vaishnav to decongest stations.Those without a ticket or with a waiting list ticket will wait in the outside waiting area.… pic.twitter.com/IEmxJok5AE— Times Algebra (@TimesAlgebraIND) March 8, 2025 -
కేంద్ర మంత్రికి పొన్నం ప్రభాకర్ లేఖ.. ఎందుకంటే
సాక్షి, హైదరాబాద్: తిరుమలకు వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని కరీంనగర్ నుంచి ప్రతిరోజు తిరుపతికి రైలు నడపాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర మంత్రికి లేఖ రాశారు. తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి ఉత్తర తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వెళతారని పొన్నం ప్రభాకర్ ప్రస్తావించారు.ప్రస్తుతం కరీంనగర్ నుంచి తిరుపతికి వారానికి రెండు సార్లు, గురువారం, ఆదివారం మాత్రమే రైలు వెళ్తుందన్నారు. ఆ ఎక్స్ ప్రెస్ రైలు తిరుపతి నుంచి కరీంనగర్‌కు బుధ, శనివారాల్లో బయలుదేరుతుందన్నారు. యూపీఏ హయాంలో తాను ఎంపీగా ఉన్నప్పుడు ఉత్తర తెలంగాణ ప్రజలు తిరుపతికి వెళ్లడానికి వీలుగా ఈ రైలును అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆయన చెప్పారు.ఉత్తర తెలంగాణ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తుల సంఖ్య పెరుగుతోందని, ఈ క్రమంలో ఈ రైలు ప్రతిరోజు నడిచేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు తెలిపారు. బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి గత పదేళ్లుగా రైల్వే శాఖ మంత్రిగా మీకు, స్థానిక ఎంపీ బండి సంజయ్‌కి విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆ లేఖలో పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా రైలును నడిపేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
Women's Day : మహిళలకు ప్రతీ నెల రూ. 2,500!
ఢిల్లీ: మహిళా దినోత్సవం రోజున బీజేపీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం ఆ రాష్ట్ర మహిళలకు తీపి కబురు అందించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచితంగా నెలకు రూ. 2,500 చొప్పున అందిస్తామని ఢిల్లీ సర్కార్ స్పష్టం చేసింది. ‘మహిళా సమృద్ధి యోజనా’ పథకంలో భాగంగా ఈ హామీని అమలు చేయాలని ఢిల్లీ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఆధ్వర్యంలో జరిగిన ఈ క్యాబినెట్ భేటీలో మహిళలకు రూ. 2500 స్కీమ్‌కు ఆమోద ముద్ర పడింది. దీనిపై సీఎం రేఖా గుప్తా మాట్లాడుతూ.. ‘ ఈరోజు మహిళల దినోత్సవం. మన క్యాబినెట్ సమావేశం కూడా అందుకే ఈరోజున పెట్టాం. మహిళా సమృద్ధి యోజనా పథకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ హామీని ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చాం. దాన్ని ఇప్పుడు అమలు చేయబోతున్నాం’ అని ఆమె తెలిపారు. ఈ స్కీమ్ కోసం రూ. 5,100 కోట్ల బడ్జెట్ ను కేటాయించినట్లు సీఎం రేఖా గుప్తా తెలిపారు. ఇందుకోసం ఒక కమిటీని తన నేతృత్వంలోనే ఏర్పాటు చేసి మరీ పథకాన్ని అమలు చేయడానికి శ్రీకారం చుట్టామన్నారు. ఇందుకోసం ఒక వెబ్ పోర్టల్ ను త్వరలోనే ఏర్పాటు చేస్తామని, ఈ పథకం కోసం రిజిస్ట్రేషన్లు అతి త్వరలోనే ప్రారంభమవుతాయన్నారు రేఖా గుప్తా.మహిళా సమృద్ధి యోజనా పథకానికి ఆమోద ముద్ర పడింది. ఇందుకోసం పోర్టల్ త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తాం. ఇక్కడ నుంచి అర్హులైన మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు సంబంధించిన వివరాలను పోర్టల్ పొందుపరుస్తాం. దీనికి ముగ్గురు మంత్రుల కమిటీ ఉంది. కపిల్ శర్మ, అశిష్ సూద్, పర్వేష్ వర్మలతో కూడిన కమిటీని ఏర్పాటు చేశాం. ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని మంత్రి మన్ జిందర్ సింగ్ సిర్సా పేర్కొన్నారు. -
వణక్కం.. ఇక అంతా వీళ్ల చేతుల్లోనే!
న్యూఢిల్లీ, సాక్షి: దేశ ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) మహిళా దినోత్సవం సందర్భంగా.. నారీశక్తికి వందనం అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. మరోసారి అత్యంత అరుదైన నిర్ణయం తీసుకున్నారాయన. తన సోషల్ మీడియా అకౌంట్ల బాధ్యతలను ఎంపిక చేసిన మహిళలకు అప్పజెప్పారు. ఈ క్రమంలోనే వణక్కం.. అంటూ ఆయన ఖాతా నుంచి ఓ పోస్ట్ అయ్యింది.ఇవాళ తన సోషల్ మీడియా ఖాతాల నిర్వహణ బాధ్యతను ఇండియన్ గ్రాండ్ చెస్ మాస్టర్ వైశాలి రమేష్‌బాబు(Vaishali Rameshbabu)కి అప్పగించారు. ఇదే విషయాన్ని మోదీ ఎక్స్ ఖాతా నుంచి వైశాలి తెలియజేశారు. తాను చెస్ ప్లేయర్‌నని, దేశం తరఫు ప్రాతినిధ్యం వహించడం తనకు ఎంతో గర్వకారణంగా ఉందని పోస్ట్ చేశారామె. ప్రధాని ఖాతాను నిర్వహించడం తనకు దక్కిన గౌరవమని అన్నారు. ఈరోజంతా ఆమే ఆయన ఖాతా బాధ్యతలను చూసుకోనున్నారు. ఆరో ఏట నుంచి నేను చెస్ ఆడుతున్నాను. అది నాకొక ఉత్తేజకరమైన ప్రయాణం. మీరు ఎంచుకున్న మార్గంలో ఎన్ని అవరోధాలు ఎదురైనా మీ కలలు సాకారం చేసుకోవడానికి ముందుకుసాగండి. ఆడపిల్లలకు అండగా నిలవాలని తల్లిదండ్రులు, తోబుట్టువులను ఈసందర్భంగా కోరుతున్నాను. వారి సామర్థ్యంపై నమ్మకం ఉంచండి. వారు అద్భుతాలు చేయగలరు అని వైశాలి సందేశం ఉంచారు. మరోవైపు.. వైశాలితో పాటు న్యూక్లియర్, స్పేస్ సైంటిస్ట్‌లు అయిన ఎలినా మిశ్రా, శిల్పి సోనీ.. మోదీ ఖాతా నుంచి పోస్టులు పెట్టారు. భారతదేశం సైన్స్ పరిశోధనలకు అత్యంత అనుకూలమైన ప్రదేశమన్నారు. మరింత ఎక్కుమంది మహిళలు ఈ రంగాన్ని ఎంచుకోవాలని కోరారు.నేను అనితా దేవిని.. నలందా జిల్లాకు చెందిన అనితాదేవి ప్రధాని ఖాతా నుంచి తన విజయాలు వెల్లడించారు. ‘‘నేను జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాను. నా కాళ్ల మీద నిలబడి, సొంతంగా ఏదైనా సాధించాలనే తపన ఉండేది. 2016లో ఆ దిశగా అడుగేశాను. అప్పుడే స్టార్టప్‌లపై క్రేజ్ పెరుగుతోంది. నేను కూడా మాదోపుర్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్‌ను ప్రారంభించాను. నాతో కలిసి పనిచేసిన మహిళలు స్వయంసమృద్ధి సాధించడం నాకు అత్యంత సంతోషాన్ని ఇచ్చింది. వారి కుటుంబాలు బాగుపడటం ఎంతో సంతృప్తిని ఇచ్చింది. ఆర్థిక స్వాతంత్య్రం మహిళలకు గౌరవాన్ని ఇస్తుందని నా నమ్మకం. మీరు అంకిత భావం, కృషితో ముందుకుసాగాలని బలంగా అనుకుంటే ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు’’ అంటూ తన స్టోరీ వెల్లడించారు.ప్రధాని మోదీ గతంలోనూ ఇలానే తన సోషల్ మీడియా అకౌంట్లను స్ఫూర్తిదాయకమైన మహిళలకు అప్పగించారు కూడా. ఇక.. మహిళా దినోత్సవం(Women's Day 2025) పురస్కరించుకొని ఇవాళ ప్రధాని భద్రతను కూడా పూర్తిగా మహిళా పోలీసులే పర్యవేక్షించనుండడం గమనార్హం. ప్రస్తుతం ఆయన గుజరాత్ పర్యటనలో ఉన్నారు. అంతకు ముందు తన మహిళా దినోత్సవ సందేశంలో.. ‘‘వివిధ అభివృద్ధి పథకాల ద్వారా ఎన్డీయే ప్రభుత్వం మహిళా సాధికారికతకు కృషి చేస్తోంది’’ అని అన్నారాయన. -
ఎయిరిండియా నిర్వాకం.. ఐసీయూలో వృద్ధురాలు
ఎయిరిండియా విమానయాన సంస్థపై సంచలన ఆరోపణలు వెల్లువెత్తాయి. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఓ వృద్ధురాలికి వీల్‌ఛైర్ సేవలు నిరాకరించడంతో ఆమె కిందపడి గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెకు ఐసీయూలో చికిత్స అందుతుండగా.. ‘తప్పనిసరి పరిస్థితుల్లో..’ అంటూ ఆమె మనవరాలు జరిగిందంతా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యాన్ని ఆమె ఎండగట్టడంతో.. దెబ్బకు ఎయిరిండియా దిగొచ్చింది. రాజ్ పశ్రీచా(82) మాజీ సైనికాధికారి భార్య. తన కుటుంబ సభ్యులతో ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్లడానికి ఎయిరిండియా విమానంలో టికెట్ బుక్ చేసుకున్నారు. వృద్ధాప్య సమస్యలతో ఉన్న ఆమెకు వీల్‌ఛైర్ కోసం బుక్ చేసుకోగా.. అది కన్ఫర్మ్ అయ్యింది. అయితే గంటసేపైనా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఎవరూ పట్టించుకోలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె కుటుంబ సభ్యుల సాయంతో ముందుకు వెళ్లారు. కాలు జారి కిందపడి గాయపడ్డారు.ఆమె తలకు గాయం కాగా.. ముక్కు, నోటి నుంచి రక్తం కారింది. అయితే ఆ టైంలోనూ సిబ్బంది ఎవరూ సాయానికి ముందుకు రాలేదని, తామే మెడికల్ కిట్ కొనుక్కొచ్చి ఫస్ట్ ఎయిడ్ చేశామని మనవరాలు పరుల్ కన్వర్(Parul Kanwar) తెలిపారు. ఆపై కాసేపటికి వీల్‌ఛైర్ వచ్చిందని.. గాయాలతోనే ఆమెను బెంగళూరుకు తీసుకొచ్చామని తెలిపారు. అయితే.. ఈ మధ్యలో విమాన సిబ్బంది సాయం కోరగా.. బెంగళూరు ఎయిర్‌పోర్టులో ఆమెకు వైద్య సేవలు అందాయని, తలకు రెండు కుట్లు పడ్డాయని తెలిపారామె. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతుండగా.. ఎడమ వైపు భాగానికి పక్షవాతం సోకిందని, మెదడులో రక్తస్రావం జరిగిందేమోననే అనుమానాలను వైద్యులు వ్యక్తం చేశారని పరుల్ తెలిపారు. ఈ ఘటనను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆమె.. మనిషి జీవితానికి కొంచెమైనా విలువ ఇవ్వండి అంటూ ఎయిరిండియా సిబ్బందిని ఉద్దేశించి పోస్ట్ చేశారు. ఈ ఘటనపై డైరెక్టోరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA), ఎయిరిండియాలకు ఫిర్యాదు చేశామని, చర్యలకు కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారామె.అయితే పరుల్ పోస్టుపై ఎయిరిండియా స్పందించింది. ఆమె సోషల్ మీడియా ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్నామని బాధితురాలు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ఎయిరిండియా తెలిపింది. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఫోన్ నెంబర్, పూర్తి వివరాలను తమకు అందించాలని ఎయిరిండియా ఆమెను కోరింది. అయితే ఘటనపై దర్యాప్తు పూర్తైతేగానీ తాను ఎయిరిండియాతో సంప్రదింపులు జరపబోనని తేల్చారామె. -
మాది టీ20 మోడల్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రానిది టీ–20 మోడల్, దేశానికి రోల్‌మోడల్ అని.. గుజరాత్ మోడల్ కాలం చెల్లిన టెస్ట్ మ్యాచ్ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గుజరాత్ మోడల్లో ఏ విధమైన సంక్షేమం లేదని, ఏమైనా అభివృద్ధి ఉందనుకుంటే అది మోదీ సీఎంగా ఉన్నప్పుడు ప్రయత్నించినదేనని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి అయిన తర్వాత కూడా మోదీ గుజరాత్ కోసమే పనిచేస్తున్నారని ఆరోపించారు.దేశంలో ఏదైనా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే సహకరించడం లేదని.. గుజరాత్‌కు వెళ్లి పెట్టుబడులు పెట్టా లని చెబుతున్నారని విమర్శించారు. మోదీ ప్రధాని అయి ఉండీ ఇదేం పద్ధతని ప్రశ్నించారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఇండియాటుడే కాన్క్లేవ్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పలు అంశాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘గుజరాత్ మోడల్‌కు, తెలంగాణ మోడల్‌కు మధ్య ఎంతో తేడా ఉంది.మాది అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన నమూనా. తెలంగాణ నమూ నాతో ఎవరూ పోటీపడలేరు. అహ్మదాబాద్, హైదరాబాద్‌లోని మౌలిక వసతులను పోల్చిచూడాలి. హైదరాబాద్‌తో పోటీపడేలా ఔటర్ రింగు రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం అహ్మదాబాద్‌కు ఉన్నాయా? గుజరాత్లో ఫార్మా, ఐటీ పెట్టుబడులు ఉన్నాయా? గుజరాత్లో ఏం ఉంది? హైదరాబాద్ ఇప్పుడు అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, ఢిల్లీ నగరాలతో పోటీపడట్లేదు. మేం న్యూయార్క్, సియోల్, టోక్యోలతో పోటీపడాలనుకుంటున్నాం. చార్మినార్, గోల్కొండ కోట చంద్రబాబు కట్టారా? హైదరాబాద్ అభివృద్ధి ఇప్పుడు ప్రారంభమైంది కాదు. 450 ఏళ్లకుపైగా చరిత్ర ఉన్న నగరం. కులీకుతుబ్ షా నుంచి ప్రారంభమై నిజాం సర్కార్, తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం, స్వాతంత్య్రం తర్వాత మర్రి చెన్నారెడ్డి, చంద్రబాబునాయుడు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి.. అలా ఇప్పుడు నేను అభివృద్ధి చేస్తున్నా. చార్మినార్, గోల్కొండ కోట చంద్రబాబు ఏమైనా కట్టారా? హైదరాబాద్‌లో ప్రముఖ కట్టడాలన్నీ 450 ఏళ్ల కింద ప్రారంభమయ్యాయి. ప్రభుత్వాలు మారినా సీఎంలు మారినా అభివృద్ధి కొనసాగింది. బీసీలకు బీజేపీ అన్యాయం జనాభా లెక్కల్లో ఎస్సీ, ఎస్టీల లెక్కలు తీస్తున్నప్పుడు బీసీల లెక్కలు ఎందుకు చేయకూడదు. అందుకే జనగణనలో కులగణన కూడా చేపట్టాలని శాసనసభలో తీర్మానం చేశాం. బీసీలకు బీజేపీ అన్యాయం చేసింది. గతంలో ఎస్సీ, ఎస్టీలకు కాంగ్రెస్ రిజర్వేషన్లు ఇచ్చింది. ఇప్పుడు ఓబీసీలకు ఇవ్వాలనుకుంటున్నాం.బీజేపీ అనుబంధ సంస్థలుగా ఈడీ, సీబీఐ, ఐటీ... కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంస్థలుగా యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, విద్యార్థి కాంగ్రెస్‌లు ఉంటే.. బీజేపీకి అనుబంధ సంస్థలుగా ఈడీ, సీబీఐ, ఐటీలు పనిచేస్తున్నాయి. ప్రజాస్వామ్యయుతంగా, ఉదారంగా ఉండటమే కాంగ్రెస్ పార్టీ బలహీనత. అయినా పార్టీ వేరు, ప్రభుత్వం వేరు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.ముఖ్యమంత్రిగా నేను ప్రధాన మంత్రిని గౌరవిస్తా.. అదే సమయంలో పార్టీ వేదికపై పార్టీ విషయాలు మాట్లాడుతా. తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీకి అదానీ రూ.వంద కోట్లు ఆఫర్ చేస్తే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించలేదు. రాష్ట్రంలోని ప్రతిపక్షాలు బీజేపీ, బీఆర్ఎస్ వ్యతిరేకించాయి. మేం ప్రజల కోసం రూ.100 కోట్లు తేవాలనుకున్నాం. బీజేపీ అదానీ నుంచి తీసుకున్న బాండ్లను ఎందుకు వెనక్కి ఇవ్వలేదో చెప్పాలి?..’’ అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. మోదీతో విభేదాల్లేవు.. ఆయన విధానాలతోనే.. అభివృద్ధి విషయంలో ఎవరిపైనా పక్షపాతం చూపవద్దనే నేను కోరుతున్నాను. ప్రధాని మోదీ గిఫ్ట్ సిటీని గుజరాత్‌కు తీసుకెళ్లారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఎందుకు ఆ అవకాశం ఇవ్వలేదు? ప్రధాని మోదీతో నాకు వ్యక్తిగతంగా ఎటువంటి విభేదాలు లేవు. నేను మోదీ విధానాలతో విభేదిస్తున్నాను. దేశానికి ప్రధానిగా ఉన్నందున మోదీకి గౌరవం ఇవ్వాలి. ఆయనను కలసి తెలంగాణకు కావల్సినవి అడగడం నా హక్కు, నా బాధ్యత. ఆదాయంతో అన్నీ చేయగలమనుకున్నా.. అందరిలాగే 2023లో అధికారంలోకి వచ్చే వరకు కూడా నేను రాష్ట్రానికి రూ.3.75 లక్షల కోట్లు మాత్రమే అప్పు ఉందని అనుకున్నాను. వచ్చే ఆదాయంతో అన్నీ చేయగలమనుకున్నాను. సీఎం కురీ్చలో కూర్చున్న తర్వాత తెలంగాణకు రూ.7 లక్షల కోట్లు అప్పు ఉందన్న అసలు విషయం బయటపడింది. కేసీఆర్ పదేళ్ల కాలంలోనే రూ.6 లక్షల కోట్లకుపైగా అప్పులు చేసి వెళ్లారు. దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గించేందుకు బీజేపీ ప్రయత్నం ఒకే దేశం– ఒకే ఎన్నిక, నియోజకవర్గాల పునర్విభజన, ఇతర అంశాలపైన మాత్రమే గాకుండా గ్యారంటీలపై, మూలధన వ్యయంపై చర్చ జరగాలి. దక్షిణాదిలో బీజేపీకి అధికారం, ప్రాతినిధ్యం లేనందునే ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. ఇందుకోసం నియోజకవర్గాల పునర్విభజన అనే ఆయుధాన్ని ఎంచుకుంది. దక్షిణాది ప్రాతినిధ్యాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది.కుటుంబ నియంత్రణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిస్తే దక్షిణాది రాష్ట్రాలు అమలు చేసినందుకు ఇప్పుడు మాపై ప్రతీకారం తీర్చుకుంటారా? కొత్త కొత్త మార్గాల ద్వారా దక్షిణాదిని ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేస్తోంది. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే కుటుంబ నియంత్రణ విధానానికి ముందటి 1971 లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలి. లేకుంటే కేవలం బిహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలే ఎక్కువగా లబ్ధిపొందుతాయి. ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాలే కాకుండా పంజాబ్ సహా ఉత్తరాది రాష్ట్రాలు కలసి రావాలి. హైదరాబాద్‌కు ‘ఒలంపిక్స్’ చాన్స్ ఇవ్వాలి.. ఒలంపిక్స్ నిర్వహించేందుకు అహ్మదాబాద్ కన్నా వంద రెట్లు ఎక్కువగా హైదరాబాద్‌లో వసతులున్నాయి. అహ్మదాబాద్, హైదరాబాద్‌లలో ఏమేం వసతులు ఉన్నాయో తేల్చాలి. ఒలింపిక్స్ గేమ్స్ నిర్వహణలో హైదరాబాద్‌కు అవకాశం ఇవ్వాలి. ప్రపంచ సుందరి పోటీలు హైదరాబాద్‌లో జరుగుతున్నప్పుడు ఒలంపిక్స్ ఎందుకు జరగకూడదు? అహ్మదాబాద్‌కు నరేంద్ర మోదీ బ్రాండ్ అంబాసిడర్.. రాబోయే రోజుల్లో హైదరాబాద్ బ్రాండ్‌ను నేను ఎక్కడికి తీసుకెళతారో చూడండి. -
బాలుడికి చెంపదెబ్బ.. పోలీస్ అధికారి ట్రాన్స్ఫర్, ఆగిన శాలరీ హైక్
గాంధీ నగర్ : ప్రధాని మోదీ ఇవాళ తన సొంతరాష్ట్రమైన గుజరాత్లో పర్యటించారు. అయితే, ఈ పర్యటనకు ముందు రోజు అంటే నిన్న ప్రధాని మోదీ ఖాళీ కాన్వాయ్‌తో రిహార్సల్స్ నిర్వహించారు అధికారులు. అంత వరకు బాగానే ఉన్నా.. కాన్వాయ్ రిహార్సల్స్ సమయంలో ఓ పోలీసు అధికారి అత్యుత్సాహం ప్రదర్శించారు. అందుకు తగిన మూల్యం చెల్లించుకున్నారు.ప్రధాని మోదీ రాక నేపథ్యంలో సెక్యూరిటీ రిత్యా ఆయా ప్రాంతాల్లో ఖాళీ కాన్వాయ్‌తో రిహార్సల్స్ నిర్వహిస్తుంటారు. గుజరాత్ పర్యటన వేళ గుజారత్‌లోని రతన్ చౌక్ వద్ద పోలీస్ ఉన్నతాధికారులు మోదీ కాన్వాయ్‌తో రిహారాల్స్ నిర్వహించారు. ఆ సమయంలో 17ఏళ్ల బాలుడు సైకిల్ తొక్కుకుంటూ పొరపాటున రిహార్సల్స్ జరిగే ప్రాంతం వైపు వచ్చాడు. వెంటనే రెప్పపాటులో సైకిల్‌ను వెనక్కి తిప్పాడు.అదే సమయంలో పక్కనే విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారి ఎస్ బీఎస్ గాధ్వీ సదరు బాలుడిని జుట్టు పట్టుకుని లాగారు. ఆపై చెంప చెల్లు మనిపించాడు. దీంతో బాలుడు వెక్కివెక్కి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లి పోయాడు. అయితే, బాలుడిపై సదరు పోలీస్ అధికారి దాడి సమయంలో స్థానికంగా పలువురు వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో పోలీసు అధికారిపై విమర్శలు వెల్లువెత్తాయి. సంబంధిత వీడియోలు సైతం వైరల్‌గా మారాయి. వైరలైన వీడియోలపై డిప్యూటీ పోలీస్ కమిషనర్ అమిత్ వానాని స్పందించారు. గాధ్వీ తీరు క్షమించరానిది. ప్రస్తుతం,మ్రోబి జిల్లాలో పోలీస్‌స్టేషన్‌లో విధిలు నిర్వహిస్తున్న ఆయన్ను కంట్రోల్ రూంకి ట్రాన్స్ఫర్ చేసినట్లు తెలిపారు. అంతేకాదు, ఏడాదిపాటు శాలరీ ఇంక్రిమెంట్ సైతం నిలిపివేసినట్లు తెలుస్తోంది.This Gujarat Police officer brutally thrashed a harmless kid on a cycle just for coming in between the convoy of Police VVIP movement rehearsal.Look at how he makes a fist and punches the kid. NAME AND SHAME THIS COP UNITL HE IS SUSPENDED! pic.twitter.com/5a08yvdUVd— Roshan Rai (@RoshanKrRaii) March 7, 2025 -
కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీలు ఎవరు?.. స్థానాలు ‘నాలుగు’ రేసులో 16 మంది
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఆదివారం(మార్చి 9న) తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ సందర్బంగా ఏఐసీసీ పెద్దలతో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ కానున్నారు.తెలంగాణలో ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరు అనే సస్పెన్స్ కాంగ్రెస్ పార్టీ నేతలు నెలకొంది. ఈ క్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షీ నటరాజన్, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్.. ఆదివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. అదే రోజున ఏఐసీసీ పెద్దలతో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ కానున్నారు. ఇక, తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను అధిష్ఠానం ఖరారు చేయనుంది. కాంగ్రెస్ నేతల భేటీ సందర్భంగానే మంత్రి వర్గ విస్తరణ, పార్టీలో కీలక పదవులు కూడా ఖరారు చేసే అవకాశం ఉంది. అన్ని పదవులు భర్తీ చేసి భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెట్టాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.మరోవైపు.. ఎమ్మెల్సీ బరిలో ఓసీ కేటగిరి నుంచి వేం నరేందర్ రెడ్డి, పారిజాత నరసింహ రెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డి, కుమార్ రావు, కుసుమ కుమార్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. బీసీ కేటగిరి నుండి ఇరవత్రి అనిల్, కొనగాల మహేష్, జెర్పేటి జైపాల్, గాలి అనిల్ ఉన్నారు. ఎస్సీ కేటగిరి నుండి అద్దంకి దయాకర్, జ్ఞాన సుందర్, దొమ్మటి సాంబయ్య, రాచమల్ల సిద్దేశ్వర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఎస్టీ నుంచి బెల్లయ్య నాయక్ , బానోతు విజయాభాయి, రేఖా నాయక్ పేర్లను హైకమాండ్ పరిశీలిస్తున్నట్టు సమాచారం.ఇదిలా ఉండగా.. తెలంగాణ ఎమ్మెల్సీల నామినేషన్లు దాఖలుకు ఈ నెల 10 చివరి తేదీ కావడంతో కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఇప్పటికే వడపోత ప్రక్రియ ప్రారంభించారు. పలువురి పేర్లను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఈనెల 20న ఎమ్మెల్సీ ఎన్నికల జరుగుతున్న క్రమంలో ఖాళీ అయిన ఐదు స్థానాలలో నాలుగు కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశం ఉంది. ఇక, నాలుగు సీట్లలో ఒకటి సీపీఐకి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. -
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జైమాల్యా బాగ్చీ
న్యూఢిల్లీ: కలకత్తా హైకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ జైమాల్యా బాగ్చీని సుప్రీంకోర్టు న్యాయ మూర్తిగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం గురు వారం కేంద్ర ప్రభు త్వానికి సిఫార్సు చేసింది. 2013 జూలై 18న జస్టిస్ అల్తమస్ కబీర్ పదవీ విరమణ చేసిన చేసిన తర్వాత కలకత్తా హైకోర్టు నుంచి ఏ న్యాయమూర్తి కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందలేదు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం ప్రత్యేకంగా ప్రస్తావించింది. కొలీజియం సిఫా ర్సును కేంద్రం ఆమోదిస్తే జస్టిస్ జైమాల్యా బాగ్చీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితు లవుతారు. ఆయన పదవీకాలం ఆరేళ్లకుపైగా ఉన్నందున సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందే అవకాశం ఉంది. -
గంగా మాత ఆశీస్సులతో దేశ సేవ: ప్రధాని మోదీ
హర్సిల్/న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో పర్యాటక రంగ అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఇక్కడ ఏదో ఒక సీజన్‌కు పరిమితం కాకుండా ఏడాది పొడవునా పర్యాటకులను ఆకర్శించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మంచు కొండలు, ప్రకృతి రమణీయతతో కూడిన సుందరమైన రాష్ట్రం ఉత్తరాఖండ్‌లో ఆఫ్–సీజన్ అనేదే ఉండకూడదని పేర్కొన్నారు. పర్యాటర రంగాన్ని అభివృద్ధి చేసుకుంటే స్థానికులకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయని, తద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ గురువారం ఉత్తరాఖండ్‌లో పర్యటించారు. ఉత్తరకాశీ జిల్లాలోని ముఖ్వా గ్రామంలో గంగా మాత ఆలయాన్ని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. తనను గంగా మాత దత్తత తీసుకున్నట్లు భావిస్తున్నానని, ఆ తల్లి ఆశీస్సులే తనను కాశీ(వారణాసి)కి తీసుకెళ్లాయని, దేశ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాయని వ్యాఖ్యానించారు. అనంతరం హర్సిల్ గ్రామంలో బహిరంగ సభలో నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఉత్తరాఖండ్‌లో శీతాకాలంలో పర్యటిస్తే చక్కటి అనుభూతి లభిస్తుందని అన్నారు. దేశమంతా పొగమంచుతో కప్పబడి ఉన్న సమయంలో ఉత్తరాఖండ్ మాత్రం సూర్యకాంతిలో స్నానమాడుతూ కనిపిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 12 నెలల టూ రిజం విజన్‌ను ప్రధానమంత్రి ప్రశంసించారు. పర్యాటకులను ఆకర్శించడానికి బహుముఖ చర్యలు అవసరమని పేర్కొన్నారు. వేసవి కాలంలో పర్యాటకులతో కళకళలాడే ఉత్తరాఖండ్ చలికాలంలో మాత్రం ఖాళీగా దర్శనిస్తోందని, ఈ పరిస్థితి మారాలని స్పష్టంచేశారు. అన్ని సీజన్లలో పర్యాటకులు భారీగా తరలివచ్చేలా వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని కోరారు. వింటర్ టూరిజం మనం లక్ష్యం కావాలని అన్నారు. చలికాలంలోనే అసలైన ఉత్తరాఖండ్‌ను అనుభూతి చెందవచ్చని పర్యాటకులకు సూచించారు. గిరిజన గ్రామమైన జడూంగ్ నుంచి హర్సిల్ విలేజ్ వరకూ ట్రెక్, బైక్ జర్నీని ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రంలో రెండు కీలకమైన రోప్‌వే ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు గుర్తుచేశారు. రోప్‌వే ప్రాజెక్టుతో కేదార్నాథ్ ప్రయాణం 9 గంటల నుంచి 30 నిమిషాలకు తగ్గిపోతుందని వెల్లడించారు. వివాహాలు చేసుకొనేందుకు, సినిమాలు, షార్ట్‌ఫిలింల షూటింగ్‌లకు ఉత్తరాఖండ్‌లో చక్కటి వేదికలు ఉన్నాయని, వీటిని ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. సరిహద్దు గ్రామమైన హర్సిల్‌లో అడుగుపెట్టిన మొట్టమొదటి ప్రధానమంత్రి మోదీయేనని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామీ పేర్కొన్నారు. రేపు గుజరాత్లో మోదీ పర్యటన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8వ తేదీన గుజరాత్లో పర్యటించనున్నారు. నవసారి జిల్లాలో లఖ్పతి దీదీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని పూర్తిగా మహిళా పోలీసులు, మహిళా సిబ్బంది ఆధ్వర్యంలోనే నిర్వహించబోతున్నారు. -
కుటుంబ నియంత్రణపై నా ఆలోచన మారింది
సాక్షి, న్యూఢిల్లీ : జనాభా నియంత్రణ విషయంలో తన ఆలోచన విధానం పూర్తిగా మారిపోయిందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. గురువారం సాయంత్రం ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన రిపబ్లిక్ టీవీ ‘లిమిట్లెస్ ఇండియా’ సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో జనాభా నిర్వహణ భారత్‌కు చాలా ముఖ్యమైనదని చెప్పారు. ప్రస్తుతం చైనా, జపాన్, యూరప్‌లలో జనాభా పెరుగుదల తగ్గిపోయిందని అన్నారు. 2047 కల్లా దేశంలో 65% మంది ప్రజలు 35 ఏళ్లలోపు వారు ఉంటారన్నారు. కుటుంబ నియంత్రణ విధానాన్ని సక్రమంగా నిర్వహించినందుకు దక్షిణ భారత దేశంలో జనాభా తగ్గిందన్నారు. ఇప్పుడు జనాభా నియంత్రణ విషయంలో దక్షిణాదిలో ఆలోచనా విధానం మారాలని సూచించారు. బీహార్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాలు ఎక్కువ మంది జనాభాతో దేశాన్ని కాపాడుతున్నాయని, ఈ విధానాన్ని అన్ని రాష్ట్రాలూ అనుసరించాలని చెప్పారు.మెట్రో ప్రాజెక్టులకు వందశాతం సహాయం చేయండివిశాఖపట్నం, విజయవాడ నగరాలకు మెట్రో ప్రాజెక్టుల అనుమతులను త్వరితగతిన ఇవ్వాలని సీఎం చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. ఈ ప్రాజెక్టులకు వంద శాతం ఖర్చును కేంద్రమే భరించాలని విన్నవించారు. చంద్రబాబు గురువారం ఢిల్లీలో కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి, విద్యుత్తు శాఖల మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో సమావేశమై ఈమేరకు విజ్ఞప్తి చేశారు. ఈ భేటీ వివరాలను సీఎం ఎక్స్ ద్వారా వెల్లడించారు. విశాఖపట్నంలో ట్రాఫిక్ రద్దీ పెరుగుతోందని తెలిపారు. భోగాపురం విమానాశ్రయం వచ్చే ఏడాది జూన్‌కి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నందున జాతీయ రహదారులకు మెట్రోను అనుసంధానించడం ఎంతో ముఖ్యమని తెలిపారు. విజయవాడ మెట్రో ప్రాజెక్టు అమరావతి ప్రవేశ ద్వారంగా ప్రాంతీయ కనెక్టివిటీని బలోపేతం చేయడానికి, ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుందన్నారు. విజయవాడలో పెరుగుతున్న రవాణా అవసరాలను తీర్చడానికి ఈ ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ భేటీలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా పాల్గొన్నారు. లూథ్రాతో చంద్రబాబు రహస్య భేటీ?ఎలాగైనా కేసులన్నీ క్లోజ్ అయ్యేలా చూడాలని వినతి!సాక్షి, న్యూఢిల్లీః సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్థార్థ లూథ్రాతో సీఎం చంద్రబాబు రహస్యంగా సమావేశమైనట్లు తెలిసింది. ఈ భేటీలో గతంలో చంద్రబాబుపై నమోదైన కేసులను ఎత్తివేసే అంశంపై చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. గురువారం రాత్రి ఢిల్లీ వచ్చిన చంద్రబాబు రిపబ్లికన్ టీవీ నిర్వహించిన ‘లిమిట్ లెస్ ఇండియా’ సదస్సుకు హాజరయ్యారు. సదస్సు అనంతరం ఆయన నేరుగా డిఫెన్స్ కాలనీలోని లూథ్రా నివాసానికి వెళ్లారు. దాదాపు 40 నిమిషాలు వీరిద్దరూ పలు విషయాలపై చర్చించినట్లు తెలిసింది. ఏం చేసైనా సరే తనపై ఉన్న కేసులన్నీ త్వరితగతిన క్లోజ్ అయ్యేలా చూడాలని లూథ్రాను చంద్రబాబు కోరినట్లు విశ్వసనీయ సమచారం.ఆ కేసులన్నీ మూసేద్దాం2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు చేసిన దోపిడీని సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఆధారాలతో సహా నిగ్గు తేల్చిన విషయం తెలిసిందే. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం, అసైన్డ్ భూముల దోపిడీ, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణం, ఫైబర్‌నెట్ కుంభకోణాల కుట్రదారు, లబ్ధిదారు చంద్రబాబే అనే విషయాన్ని సిట్ ఆధారాలతో సహా బట్టబయలు చేసింది. నిబంధనలకు విరుద్ధమని చెప్పినా సరే సీఎం హెూదాలో చంద్రబాబు ఆదేశించడంతోనే అక్రమాలకు పాల్పడాల్సి వచ్చిందని ఉన్నతాధికారులు, ఇతరులు వాంగ్మూలాలు కూడా ఇచ్చారు. అక్రమ నిధులు హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి, టీడీపీ బ్యాంకు ఖాతాలకు చేరినట్టు ఆధారాలను సిట్ సేకరించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ కేసుల నుంచి చంద్రబాబు పేరు తప్పించేందుకు కుట్ర పన్నుతోంది. చంద్రబాబు అవినీతి కేసుల్లో గతంలో సిట్ సేకరించిన డాక్యుమెంటరీ ఆధారాలను తారుమారు చేసే విషయాలపై లూథ్రాతో చంద్రబాబు చర్చించినట్లు తెలిసింది. ఈ కేసులన్నింటి నుంచి త్వరితగతిన ఉపశమనం కలిగేలా మార్గాలను చూడాలని లూథ్రాను సీఎం కోరినట్లు సమాచారం. దేశంలో తానే సీనియర్ ముఖ్యమంత్రినని, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కక్షగట్టి తనని జైలుపాలు చేసిందని చంద్రబాబు అన్నట్లు తెలిసింది. వైఎస్సార్సీపీ పదే పదే ఆ కేసులను ప్రస్తావించడం, ప్రజల్లోకి తీసికెళ్లడం వల్ల తనపై ప్రజల్లో నమ్మకం పోతుందని, అందుకే ఆ కేసుల నుంచి వీలైనంత త్వరగా ఉపశమనం కలిగేలా చూడాలని లూథ్రాను కోరినట్లు సమాచారం. గురువారం రాత్రి చంద్రబాబు ఢిల్లీలోని అధికార నివాసంలో బస చేశారు. శుక్రవారం ఉదయం విజయవాడకు వెళ్లనున్నారు. -
‘మెడలో తాళి, నుదుటున బొట్టు లేదు.. మీ భర్త మిమ్మల్ని ఎలా ప్రేమిస్తారు’: కోర్టు
ముంబై : వాళ్లిద్దరూ భార్యా, భర్తలు. అయితే, భర్త తనని వేధిస్తున్నాడని ఆరోపిస్తూ భార్య కోర్టును ఆశ్రయించింది. భర్త నుంచి తనకు విడాకులు కావాలని కోరింది. ఈ కేసుపై కోర్టు విచారణ చేపట్టింది. విచారణ సమయంలో న్యాయమూర్తికి, మహిళకు మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.పూణేకు చెందిన అంకుర్ ఆర్ జగిధర్ లాయర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా, ఓ మహిళ తన భర్త నుంచి తనకు విడాకులు ఇప్పించాలని కోరుతూ తనని సంప్రదించిందని, అందుకే ఆమె తరుఫున వాదిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే, తాజాగా తన క్లయింట్ కేసు పూణే జిల్లా కోర్టులో విచారణకు వచ్చిందని, విచారణ సమయంలో న్యాయమూర్తితో జరిగిన వాదనలను భార్య తరుఫు లాయర్ లింక్డిన్లో పోస్ట్ చేశారు. ఆ పోస్టులో పూణే జిల్లా కోర్టులో ‘‘నా క్లయింట్ విడాకుల కేసు విచారణ జరిగింది. విచారణలో భర్త తన డిమాండ్లను నెరవేర్చాలని కోర్టును కోరింది. అయితే, ఈ కేసు విచారిస్తున్న న్యాయమూర్తి నా క్లయింట్‌ను ఇలా ప్రశ్నించారు. ‘‘ఏమ్మా.. మిమ్మల్ని చూస్తుంటే మొడలో మంగళసూత్రం, నుదుట బొట్టు పెట్టుకునేవారిలా కనిపించడం లేదే? వివాహం జరిగిన స్త్రీగా మీరు కనిపించకపోతే.. మీ వారు.. మిమ్మల్ని ఎలా ఇష్టపడతారు? అందుకే భర్తలతో ప్రేమగా ఉండండి. కఠువగా ఉండకండి అని సలహా ఇచ్చారు.అంతేకాదు.. మాటల మధ్యలో న్యాయమూర్తి ఇలా అన్నారు. ‘‘ఒక స్త్రీ బాగా సంపాదిస్తే, ఆమె ఎప్పుడూ తనకంటే ఎక్కువ సంపాదిస్తున్న భర్తనే కోరుకుంటుంది. తక్కువ సంపాదిస్తున్న వ్యక్తి చాల్లే అని సరిపెట్టుకోదు. అదే బాగా సంపాదించే వ్యక్తి తాను వివాహం చేసుకోవాలనుకుంటే, తన ఇంట్లో పాత్రలు కడిగే పనిమనిషినైనా సరే వివాహం చేసుకోవాలనుకుంటాడు. కాబట్టి మీరు మీ భర్త పట్ల కాస్త ప్రేమను చూపించండి. కఠినంగా ఉండొద్దు అని ఇద్దరు దంపతుల్ని ఒక్కటి చేసే ప్రయత్నం చేశారని వివరిస్తూ’’ సదరు న్యాయవాది రాసిన సోషల్ మీడియా పోస్టు నెట్టింట్లో చక్కెర్లు కొడుతోంది. -
తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ గురువారం ఉదయం ఓ సందేశం విడుదల చేశారాయన. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని ఆశీర్వదించి గెలిపించిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు. కొత్తగా ఎన్నికైన మా అభ్యర్థులకు అభినందనలు. గొప్ప శ్రద్ధతో పని చేసిన పార్టీ కార్యకర్తలను చూసి నేను గర్విస్తున్నా’’ అని ఎక్స్ పోస్టులో సందేశం ఉంచారాయన. ఇదిలా ఉంటే.. కరీంనగర్–మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య గెలిచారు. ఇక.. ఉత్కంఠ భరితంగా సాగిన ఉమ్మడి కరీంనగర్- ఆదిలాబాద్- నిజామాబాద్- మెదక్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా చిన్నమైల్ అంజిరెడ్డి నెగ్గారు. టీచర్స్ ఎమ్మెల్సీగా కొమురయ్య మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలవగా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ మాత్రం ఉత్కంఠ భరితంగా సాగింది. చివరకు.. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన అల్ఫోర్స్ నరేందర్రెడ్డిపై 5,106 ఓట్ల ఆధిక్యంతో అంజిరెడ్డి జయకేతనం ఎగురవేశారు. -
త్వరలో ల్యాండ్ గ్రాబింగ్ ప్రొవిజన్ బిల్లు
సాక్షి, న్యూఢిల్లీ: త్వరలో రాష్ట్రంలో ‘ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొవిజన్’ బిల్లును తీసుకురానున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌తో ఆయన వేర్వేరుగా భేటీ అయ్యారు. అనంతరం ఎంపిక చేసుకున్న మీడియాతో సీఎం సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఐదేళ్లలో అనేక భూములు కబ్జాకు గురయ్యాయని ఆరోపించారు. ప్రతి పది కేసుల్లో ఆరు భూ వివాదాలకు సంబంధించినవే అన్నారు. భూముల కంప్యూటరీకరణలో సరైన విధానం లేక సమస్యలు ఎదురవుతున్నట్లు చెప్పారు. ప్రైవేటు భూములను బలవంతంగా 22ఏలో చేర్చారని.. అటవీ భూములను అధికారులతో కలిసి ఆక్రమించారని ఆరోపించారు. గుజరాత్లో ల్యాండ్ గ్రాబింగ్ బిల్లు విజయవంతంగా అమలవుతోందని, దాని అమలును ఏపీలో కూడా అనుమతించాలని కోరినట్లు చెప్పారు. డీలిమిటేషన్ నిరంతర ప్రక్రియనియోజకవర్గాల పునర్విభజన అనేది నిరంతర ప్రక్రియ అని.. దీనిపై సమయానుకూలంగా స్పందిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. గతంలో జనాభా నియంత్రణను ప్రోత్సహించానని, ఇప్పుడు జనాభాను పెంచాలనే విషయం అర్థమై పిలుపునిస్తున్నట్లు చెప్పారు.పోలవరం 2027 కల్లా పూర్తిగత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల బకాయిలను వదిలిపెట్టిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలకు తెలిపినట్లు చంద్రబాబు చెప్పారు. రాయలసీమ వంటి కరువు ప్రాంతాలకు నీరందించేందుకు.. సముద్రంలో కలిసే జలాలను వినియోగించుకుంటామని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామన్నారు. పోలవరంను 2027 కల్లా పూర్తి చేస్తామని తెలిపారు. 189 కి.మీ. మేర అమరావతి ఔటర్ఎనిమిది లైన్లతో 189 కి.మీ. మేర అమరావతి ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించినట్లు చంద్రబాబు చెప్పారు. శ్రీశైలం ఆలయం వద్ద ట్రాఫిక్ రద్దీని పరిష్కరించేందుకు రోడ్డును విస్తరించాలని, వినుకొండ–అమరావతి తదితర ప్రాజెక్టులపై చర్చించినట్లు తెలిపారు. డీపీఆర్‌లు సిద్ధం చేసిన తర్వాత టెండర్లు పిలుస్తామని గడ్కరీ చెప్పారని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రానికి రూ.6.5 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయన్నారు. మిర్చి క్వింటాకు రూ.11,781 మద్దతు ధర ఇచ్చేందుకు కేంద్రం ఒప్పుకొందన్నారు. కాగా, ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అవుతున్న 5 ఎమ్మెల్సీ స్థానాల సర్దుబాటుకే చంద్రబాబు ఢిల్లీ వచ్చారని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. -
చాలా బాగుంది.. ఎలా తయారు చేస్తారు?
సాక్షి, న్యూఢిల్లీ/భద్రాచలం: ‘యే క్యాహై?.. బహుత్ అచ్ఛా హై.. ఇస్కో కైసే బనాతే హో? (ఇదేంటి? చాలా బాగుంది..! ఎలా తయారు చేస్తారు?)’.. అంటూ అగ్గిపెట్టెలో పట్టేలా చేతితో నేసిన చీరను చూసి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆశ్చర్యానికి గురయ్యారు. సిరిసిల్ల చేనేత కళాకారులపై ప్రశంసలు కురిపిస్తూ చీర తయారీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. బుధవారం రాష్ట్రపతి భవన్‌లోని అమృత్ ఉద్యాన్‌లో రాష్ట్రపతి ముఖ్యఅతిథిగా ‘వివిధతా కా అమృత్ మహోత్సవ్’ సౌత్ ఎడిషన్ ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంబోత్సవానికి ముందు తెలంగాణ పెవిలియన్‌ను సందర్శించిన రాష్ట్రపతిని.. గవర్నర్, ఉపముఖ్యమంత్రి సాదరంగా ఆహ్వానించి తెలంగాణ చేనేత కళాకారుల పనితనాన్ని, చేతివృత్తుల ప్రాముఖ్యతను వివరించారు. ఉత్సవ ప్రారంభంలో కళాకారులు ప్రదర్శించిన గుస్సాడీ నృత్యం ఆహూతులను అలరించింది. ఈనెల 9 వరకు ఉత్సవం కొనసాగనుంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పెవిలియన్‌లో రాష్ట్రానికి చెందిన పద్మశ్రీ పురస్కార గ్రహీతలు గజం అంజయ్య, గజం గోవర్ధన్‌తో సహా 20 మంది పలు ప్రాంతాలకు చెందిన ప్రముఖ చేనేత కార్మికులు, 20 మంది నిపుణులతో స్టాళ్లు ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి భవన్లో ‘భద్రాద్రి’ ఉత్పత్తులు తెలంగాణ నుంచి భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని మహిళలు రూపొందించిన పలు రకాల సబ్బులు, షాంపూలు, మిల్లెట్ బిస్కెట్లు, కరక్కాయ పౌడర్, తేనె, న్యూట్రీ మిక్స్ ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచినట్టు పీఓ రాహుల్ తెలిపారు. ఆదివాసీ గిరిజన మహిళలు రూపొందించే ఉత్పత్తులు, వాటి వల్ల ప్రయోజనాలను ఇతర రాష్ట్రాల ప్రతినిధులు, ప్రజలకు తెలియజేసి ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేలా గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరీ సూచనలతో ఈ స్టాళ్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. -
‘నా భార్య నా రక్తం తాగేస్తోంది.. ఏం చేయమంటారు!’
లక్నో: ‘నా భార్యకు నాకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. తను ప్రతి రోజు నా కలలోకి వస్తుంది. నా గుండెలపై కూర్చుంటుంది. నా రక్తాన్ని తాగేందుకు ప్రయత్నిస్తుంది. అందుకే నేను నిద్ర పోలేకపోతున్నా. ఫలితమే నా విధుల్లో సమయ పాలన పాటించలేకపోతున్నా’అంటూ ఓ పారామిలటరీ జవాన్ తన కమాండర్‌కు లేఖ రాశారు. ఆ లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భార్య పోరు పడలేక సదరు జవాన్ రాసిన ఆ లేఖను లక్షల మంది నెటిజన్లు షేర్ చేస్తున్నారు. ఇంతకి ఏం జరిగింది?దేశంలో శాంతి భద్రతలకు విఘూతం కలగకుండా డేగ కన్నుతో నిత్యం రక్షణ కల్పించే పారా మిలరీ విభాగంలో ప్రొవిన్సియల్ ఆర్మ్డ్ కానిస్టేబులరీ (pac) విభాగం ఉంది. ఉత్తరప్రదేశ్ కేంద్రంగా 44వ ప్రదేషిక్ ఆర్మ్డ్ కాన్స్టేబులరీ (Pradeshik Armed Constabulary) విభాగంలో ఓ జవాన్ విధులు నిర్వహిస్తున్నారు. విధుల్లో సిన్సియర్‌గా, స్ట్రిక్ట్‌గా ఉండే సదరు జవాన్‌లో ఇటీవల కాలంలో సమయ పాలన లోపించింది. డ్యూటీ టైంకు రాకపోవడం,షేవింగ్ చేసుకోకపోవడం, చిందవందరగా యూనిఫారమ్ ధరించడం, ఇచ్చిన పనిని సకాలంలో చేయకుండా ఆలస్యం చేస్తుండేవారు.విధుల్లో నిర్లక్ష్యం.. అందుకు కారణంఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ గత నెల 17న పీఏసీ 44వ బెటాలియన్ జీస్వ్కాడ్ కమాండర్ మదుసూధన్ శర్మ సదరు జవాన్‌కు విధుల్లో అలసత్వం వహిస్తున్నారని, వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసుల్లో.. మందురోజు విధులు ఎలా జరిగాయో తెలుసుకుని.. ఆ రోజు విధులు ఎక్కడ నిర్వహించాలో ప్రతి రోజు ఉదయం బ్రీఫింగ్ ఉంటుంది. ఆ బ్రీఫింగ్‌కు గైర్హాజరు కావడం కాకుండా ఆలస్యంగా రావడం, మిలటరీ విభాగంలో విధులు నిర్వహించే వారు తప్పని సరిగా ఫుల్ షేవింగ్ చేసుకోవాలి. కానీ అలా షేవింగ్ చేసుకోకుండా విధులు నిర్వహించడం, ఇష్టానుసారంగా యూనిఫారమ్ ధరించడం, ఇచ్చిన పనిని సకాలంలో పూర్తి చేయకుండా ఆలస్యం ఎందుకు చేస్తున్నారో లేఖలో పేర్కొన్నారు. వివరణ ఇచ్చేందుకు ఒకరోజు సమయం కూడా ఇచ్చారు.అసలేం జరిగిందంటే?కమాండర్ నుంచి వచ్చిన లేఖపై సదరు పీఏసీ జవాన్ వివరణ ఇచ్చారు. తాను విధుల్లో ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నారో భావోద్వేగంతో పలు కారణాల్ని జత చేశారు. ‘సార్ నేను ఫిబ్రవరి 16న డ్యూటీకి ఆలస్యంగా వచ్చాను. ఎందుకంటే వ్యక్తిగత సమస్యలు నన్ను తీవ్రంగా వేధిస్తున్నాయి. వాటి వల్ల రాత్రిపూట నిద్రపోవడం కష్టంగా మారింది. కొద్ది రోజుల క్రితం నా భార్యతో గొడవలు జరిగాయి. గొడవ తర్వాత నా భార్య నా కలలోకి వస్తుంది. నా గుండెలపై కూర్చుకుంటుంది. నా రక్తాన్ని తాగేందుకు ప్రయత్నిస్తుంది. దీనికి తోడు నా తల్లిని అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. కారణంగా నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నాను. తీవ్ర మనోవేధనకు గురవుతున్నా. దీని నుంచి భయటపడేందుకు చికిత్స తీసుకుంటున్నాను. నేను పడుతున్న కష్టాల నుంచి విముక్తి కలిగించేలా ఓ దారి చూపాలని ఆ లేఖలో ప్రాధేయపడ్డారు. ఆ లేఖపై 44వ బెటాలియన్ పీఏసీ కమాండంట్ సత్యేంద్ర పటేల్ స్పందించారు. ఆన్లైన్లో వైరల్ అవుతున్న లేఖ నిజమేనా? అదే నిజమైతే ఎవరు రాశారో? పరిశీలిస్తాం. సదరు జవాన్‌కు ఇబ్బందులు ఉంటే అతనికి అండగా నిలుస్తాం. చికిత్స కూడా అందిస్తాం’అని అన్నారు. -
రాహుల్ గాంధీకి కోర్టు రూ.200 జరిమానా.. ఎందుకంటే?
లక్నో: లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీకి (Rahul Gandhi) కోర్టు ఫైన్ విధించింది. స్వాతంత్య్ర సమరయోధుడు వీర్‌సావర్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను రాహుల్‌పై పరువు నష్టం దావా కేసు నమోదైంది. అయితే, ఈ కేసు విచారణలో భాగంగా రాహుల్ గాంధీ లక్నోలోని అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ (acjm)ముందు హాజరు కావాల్సి ఉంది.కానీ రాహుల్ కోర్టు విచారణకు గైర్హాజరయ్యారు. రాహుల్ తీరుపై ఏసీజేఎం న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.200 ఫైన్ విధించారు. ఇదే కేసులో ఏప్రిల్ 14న కోర్టు విచారణకు తప్పని సరిగా హాజరు కావాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. -
సగం జనాభా లావెక్కింది
న్యూఢిల్లీ: ప్రపంచ జనాభాలో సగానికి పైగా వయోజనులు ఊబకాయులుగా మారిపోయారు! 2050 నాటికి ఇది 57 శాతం దాటనుంది. అంతేగాక పిల్లలు, టీనేజర్లు, యువకుల్లో మూడింట ఒక వంతు ఊబకాయులుగా మారొచ్చని లానెస్ట్ జర్నల్ అంచనా వేసింది. 200 పైగా దేశాలకు చెందిన గ్లోబల్ డేటాను విశ్లేషించిన మీదట ప్రచురించిన తాజా అధ్యయనంలో ఈ వివరాలను వెల్లడించింది. దశాబ్ద కాలంలో ముఖ్యంగా అల్పాదాయ దేశాల్లో ఊబకాయం వేగంగా పెరుగుతోందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దీని కట్టడికి ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌లోని ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ (ఐహెచ్ఎంఈ)కు చెందిన ప్రొఫెసర్ ఇమ్మాన్యుయేల్ నాయకత్వంలో ఈ పరిశోధన జరిగింది. ఊబకాయుల సంఖ్య 1990తో పోలిస్తే నేడు రెట్టింపైంది. 2021 నాటికి ప్రపంచ వయోజనుల్లో సగం మంది ఊబకాయులుగా మారిపోయారు. 25 ఏళ్లు, అంతకు పైబడ్డ వారిలో ఏకంగా 100 కోట్ల పురుషులు, 111 కోట్ల మంది మహిళలు అధిక బరువుతో బాధపడుతున్నారు. ఈ ధోరణులు ఇలాగే కొనసాగితే 2050 ప్రపంచవ్యాప్తంగా వయోజనుల్లో ఊబకాయుల సంఖ్య పురుషుల్లో 57.4 శాతానికి, స్త్రీలలో 60.3 శాతానికి పెరగవచ్చు. ఇక 1990 నుంచి 2021 నాటికి పిల్లలు, టీనేజర్లలో ఊబకాయులు 8.8 శాతం నుంచి 18.1 శాతానికి పెరిగారు. 20–25 మధ్య వయసు యువతలో 9.9 నుంచి 20.3 శాతానికి పెరిగింది. చైనాలో 62 కోట్లు ఊబకాయుల సంఖ్య 2050 నాటికి చైనాలో 62.7 కోట్లు, భారత్‌లో 45 కోట్లు, అమెరికాలో 21.4 కోట్లకు చేరనుంది. సబ్ సహారా ఆఫ్రికా దేశాల్లో ఈ సంఖ్య ఏకంగా 250 శాతానికి పైగా పెరిగి 52.2 కోట్లకు చేరుతుదని అంచనా. నైజీరియా 2021లో 3.66 కోట్ల మంది అధిక బరువుతో ఉండగా 2050 కల్లా 14.1 కోట్లకు చేరనుంది. సామాజిక వైఫల్యం... వయోజనుల్లో సగం ఊబకాయులే కావడాన్ని సామా జిక వైఫల్యంగా చూడాలని ప్రొఫెసర్ ఇమ్మాన్యుయేల్ అన్నారు. యువతలో ఊబకాయం వేగంగా పెరుగుతుండటం ఆందోళనకరమన్నారు. ‘‘కొత్తగా వచ్చిన బరువు తగ్గించే మందుల ప్రభావాన్ని అధ్యయనం పరిగణనలోకి తీసుకోలేదు. ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకుంటే విపత్తును ఎంతో కొంత నివారించవచ్చు’’అని ఆమె వెల్లడించారు. ఆరోగ్య వ్యవస్థలకు సవాలు ఊబకాయం పెరగడం ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలకు సవాలేనంటున్నారు ఆస్ట్రేలియాలోని మర్డోక్ చి్రల్డన్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన డాక్టర్ జెస్సికా కెర్. ‘‘పిల్లలు, టీనేజర్ల విషయంలో ఇప్పట్నుంచే శ్రద్ధ పెడితే ఊబకాయాన్ని నివారించడం సాధ్యమే. యూరప్, దక్షిణాసియా దేశాల్లో పిల్లలు, టీనేజర్లు అధిక బరువుతో ఉన్నట్టు అధ్యయనంలో తేలింది.ఉత్తర అమెరికా, ఆస్ట్రలేషియా, ఓషియానియా, ఉత్తర ఆఫ్రికా, పశ్చిమాసియా, లాటిన్ అమెరికా దేశాల్లో కూడా ఊబకాయుల సంఖ్య భారీగా పెరుగుతోంది. టీనేజీ బాలికల్లో ఎక్కువగా ఉంది’’అని చెప్పారు. భావి తరాలు అనారోగ్యం బారిన పడకుండా చూడటం, ఆర్థిక, సామాజిక నష్టాలను నివారించడం తక్షణ కర్తవ్యమని సూచించారు. -
ప్రపంచం చూపు.. భారత్ వైపు
న్యూఢిల్లీ: ప్రపంచమంతా భారత్‌ను నమ్మకమైన భాగస్వామిగా చూస్తోందని, ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి భారీ స్థాయిలో చర్యలు చేపట్టాలని పారిశ్రామిక రంగానికి ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. తయారీ రంగాన్ని, ఎగుమతులను మరింతగా ప్రోత్సహించేందుకు త్వరలోనే ప్రభుత్వం రెండు పథకాలను ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. నియంత్రణలు, పెట్టుబడులు, సులభతరమైన వ్యాపార నిర్వహణకు సంబంధించిన సంస్కరణలపై బడ్జెట్ తదనంతర వెబినార్‌లో మాట్లాడుతూ ఆయన ఈ అంశాలను పేర్కొన్నారు.ప్రపంచ డిమాండ్‌ను తీర్చగలిగేలా భారత్‌లో తయారు చేయగల కొత్త ఉత్పత్తులను గుర్తించాలని పారిశ్రామికవేత్తలను ఆయన కోరారు. ‘దీన్ని సాకారం చేసే సత్తా మన దేశానికి, మీకు (పరిశ్రమలు) ఉంది. ఇదొకొ గొప్ప అవకాశం. ప్రపంచ ఆకాంక్షల విషయంలో మన పరిశ్రమలు ప్రేక్షక పాత్ర వహించకుండా, అందులో కీలకపాత్ర పోషించాలి. మీకు మీరే అవకాశాలను అందింపుచ్చుకోవాలి’ అని పారిశ్రామికవేత్తలకు మోదీ సూచించారు. ‘భారత్ ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వృద్ధి ఇంజిన్‌గా నిలుస్తోంది. అందుకే ప్రతి దేశం భారత్‌తో ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలనుకుంటోంది. మన తయారీ రంగం దీన్ని సద్వినియోగం చేసుకోవాలి’ అని పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈలకు చౌక రుణాలివ్వాలి... దేశవ్యాప్తంగా ఉన్న ఆరు కోట్ల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థ (ఎంఎస్ఎంఈ)లకు సకాలంలో, తక్కువ వడ్డీ రేట్లకు నిధులను అందించే దుకు కొత్త తరహా రుణ పంపిణీ విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందని మోదీ నొక్కి చెప్పారు. 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ మహిళా ఎంట్రప్రెన్యూర్లకు తొలిసారిగా రూ. 2 కోట్ల వరకు రుణాలను అందించనున్నట్లు తెలిపారు. ఎంఎస్ఎంఈలకు కేవలం రుణాలివ్వడమే కాకుండా, మార్గనిర్దేశం, తోడ్పాటు అందించేలా మెంటార్షిప్ ప్రోగ్రామ్‌లను రూపొందించాలన్నారు. ఏ దేశ ప్రగతికైనా మెరుగైన వ్యాపార పరిస్థితులు చాలా కీలకమని, అందుకే తమ ప్రభుత్వం కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో 40,000కు పైగా నిబంధనల అమలు అడ్డంకులను తొలగించిందన్నారు. జనవిశ్వాస్ 2.0 చట్టాన్ని తీసుకొస్తామని చెప్పారు. బడ్జెట్లో ఎంఎస్ఎంఈ రుణాలపై గ్యారంటీ కవరేజీని రెట్టింపు స్థాయిలో రూ.20 కోట్లకు పెంచామని, వర్కింగ్ క్యాపిటల్ అవసరాల నిమిత్తం రూ.5 లక్షల వరకు పరిమితితో క్రెడిట్ కార్డులను అందించనున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. -
ఆ దేశాలపై సుంకాలు.. భారత్‌కు అవకాశాలు
న్యూఢిల్లీ: చైనా, మెక్సికో, కెనడాపై అమెరికా అధిక దిగుమతి సుంకాలు (టారిఫ్‌లు) మోపడం అన్నది, భారత ఎగుమతిదారులకు అమెరికా మార్కెట్లో అవకాశాలను విస్తృతం చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మన దేశం నుంచి వ్యవసాయం, ఇంజనీరింగ్, మెషిన్ టూల్స్, గార్మెంట్స్, టెక్స్టైల్స్, రసాయనాలు, లెదర్ పరిశ్రమకు ఎక్కువ ప్రయోజనం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ మొదటి నాలుగేళ్ల పదవీ కాలంలో చైనాపై అధిక సుంకాల బాదుడు నుంచి ఎక్కువగా లాభపడిన దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో ఉండడం గమనార్హం. మెక్సికో, కెనడాలపై 25 శాతం సుంకాలు 4వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ట్రంప్ లోగడే ప్రకటించారు. చైనా ఉత్పత్తులపైనా టారిఫ్‌ను 20 శాతానికి పెంచుతున్నట్టు పేర్కొనడం తెలిసిందే. ‘‘అమెరికా విధించిన సుంకాలతో అమెరికా మార్కెట్లో చైనా, మెక్సికో, కెనడా వస్తువుల ధరలను పెంచేస్తాయి. దీంతో వాటి పోటీతత్వం తగ్గిపోతుంది. భారత ఎగుమతిదారులు ఈ అవకాశాలను సొంతం చేసుకోవాలి’’అని భారత ఎగుమతిదారుల సమాఖ్య (ఎఫ్ఐఈవో) ప్రెసిడెంట్ ఎస్సీ రాల్హన్ తెలిపారు. భారత్‌కు ప్రయోజనం: జీటీఆర్ఐ ప్రైవేటు పరిశోధనా సంస్థ అయిన గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. వాణిజ్య యుద్ధం భారత్‌కు అనుకూలిస్తుందని, ఎగుమతులను పెంచుకోవడంతోపాటు అమెరికా కంపెనీల నుంచి పెట్టుబడులను ఆకర్షించడానికి సాయపడుతుందని పేర్కొంది. చైనాపై అధిక సుంకాలు భారత్ తన తయారీరంగాన్ని బలోపేతం చేసుకునేందుకు అవకాశంగా మలుచుకోవాలని సూచించింది. ఒప్పందాలకు కట్టుబడని ట్రంప్ వైఖరి దృష్ట్యా ఆ దేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ హెచ్చరించారు. దీనికి బదులు జీరోకి జీరో టారిఫ్ డీల్‌ను కుదుర్చుకోవాలని సూచించారు. సుంకాలేతర చర్యలు భారత ఎగుమతులకు అడ్డు: డీజీఎఫ్టీ అభివృద్ధి చెందిన దేశాలు విధించిన నాన్ టారిఫ్ (సుంకాలు కాని ఇతర చర్యలు)లు భారత వస్తువులకు మార్కెట్ అవకాశాలను పరిమితం చేయొచ్చని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారీన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) సంతోష్ కుమార్ సారంగి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఐరోపా సమాఖ్య (ఈయూ) విధించిన కార్బన్ ట్యాక్స్, డీఫారెస్టేషన్ నిబంధనలను ప్రస్తావించారు. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థతో భారత్ అనుసంధానమై ఉండకపోవడం, అధిక దిగుమతి సుంకాలు, టెక్నాలజీ పరంగా అననుకూలత, అధిక లాజిస్టిక్స్ వ్యయాలు వంటి ఇతర సవాళ్లు కూడా ఉన్నట్టు చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాల దుందుడుకు పారిశ్రామిక విధానాలు సైతం భారత ఎగుమతులకు అవరోధంగా మారొచ్చన్నారు. ‘‘2023–24లో 437 బిలియన్ డాలర్ల వస్తు ఎగుమతులకు గాను 284 బిలియన్ డాలర్ల రుణ సాయం అవసరం. కానీ, అందించిన రుణ సాయం 125 మిలియన్ డాలర్లుగానే ఉంది. 2030 నాటికి ఎగుమతుల రుణ డిమాండ్ 650 బిలియన్ డాలర్లకు చేరుకోనుంది’’అని సారంగి వివరించారు. -
రూ.1,891 కోట్ల బియ్యం బకాయిలివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణకు రావాల్సిన బియ్యం బకాయిలు రూ.1,891 కోట్లను విడుదల చేయాలని కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఢిల్లీలో కేంద్రమంత్రిని ఆయన నివాసంలో సీఎం రేవంత్‌తోపాటు రాష్ట్ర ఆహార, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కలిశారు. ⇒ ఎఫ్‌సీఐకి 2014–15 ఖరీఫ్ కాలంలో రాష్ట్రంనుంచి సరఫరా చేసిన బియ్యానికి సంబంధించి బకాయి పెట్టిన రూ.1,468.94 కోట్లను వెంటనే విడుదల చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. అప్పుడు అదనపు లెవీ సేకరణకు సంబంధించిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించిందని కేంద్రమంత్రి దృష్టికి వారు తీసుకెళ్లారు. ⇒ ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద 2021 మే నుంచి 2022 మార్చి వరకు సరఫరా చేసిన అదనపు బియ్యం, 2022 ఏప్రిల్ నెలలో సరఫరా చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు రూ.343.27 కోట్లు విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. ⇒ 2021 జూన్ నుంచి 2022 ఏప్రిల్ వరకు నాన్ ఎన్ఎఫ్ఎస్ఏ (నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్) కింద పంపిణీ చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు రూ.79.09 కోట్లు వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ⇒ సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) గడువును నెల రోజులు కాకుండా కనీసం నాలుగు నెలలు పొడిగించాలని, అప్పుడే సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని కేంద్రమంత్రికి తెలియజేశారు. 4,000 మెగావాట్ల మంజూరును పునరుద్ధరించండి తెలంగాణకు పీఎం కుసుమ్ కింద గతంలో ఇచ్చిన 4 వేల మెగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తికి అనుమతులను పునరుద్ధరించాలని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు గతంలో నాలుగు వేల మెగావాట్లకు అనుమతులు ఇచ్చిన కేంద్రం, తర్వాత దానిని వెయ్యి మెగావాట్లకు కుదించిందంటూ కేంద్రమంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. రాష్ట్రంలో మహిళా సంఘాల ద్వారా సోలార్ విద్యుదుత్పత్తిని తాము ప్రోత్సహిస్తున్నామంటూ కేంద్ర మంత్రికి వివరించారు. కేంద్రమంత్రిని కలిసిన వారిలో ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి మాణిక్‌రాజ్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ ఉన్నారు. పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని కోరాం: మంత్రి ఉత్తమ్ తెలంగాణకు రావాల్సిన పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కేంద్రాన్ని కోరినట్టు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ అనంతరం ఉత్తమ్ విలేకరులతో మాట్లాడారు. ‘ఉదయం, సాయంత్రం రెండుసార్లు కేంద్రమంత్రిని కలిశాం. తెలంగాణకు గత పదేళ్ల నుంచి పౌరసరఫరాల విషయంలో కొన్ని బకాయిలున్నాయి. గతంలో కొన్ని డాక్యుమెంటేషన్ పెండింగ్ వల్ల ఆ నిధులు రాలేదు. సుమారు రూ.2వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు రావాల్సి ఉంది. వాటిని విడుదల చేయాలని కోరాం. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్కమార్క నాయకత్వంలో మహిళా సంఘాలకు కూడా సోలార్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్నామని, ‘పీఎం కుసుమ్’పథకం కింద వాటికి కేంద్ర ప్రభుత్వం నుంచి 4వేల మెగావాట్ల సబ్బిడీ ఇవ్వాలని కోరాం. గిరిజన, మారు ప్రాంతాలకు సబ్సిడీతో సహా అదనంగా సోలార్ పంప్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశాం. అన్ని విషయాల్లో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సానుకూలంగా స్పందించారు. అన్ని విజ్ఞప్తులను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు’అని ఉత్తమ్ తెలిపారు. -
నిర్ణయం ఇంకెప్పుడు?
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ప్రతిసారీ ‘‘స్పీకర్ తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటారు’’ అంటున్నారు. తగినంత సమయం అంటే ఎంత? ఐదేళ్ల పదవీ కాలం పూర్తయ్యే వరకా?. తగినంత సమయాన్ని కోర్టు ఫిక్స్ చేయాలా? వద్దా?. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. చట్ట సభల గడువు ముగిసే వరకు నిర్ణయం తీసుకోకపోతే ఎలా? ప్రజాస్వామ్యానికి అర్థం ఏం ఉంటుంది? ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్ అనే విధంగా వ్యవహరించడం ఎంతమాత్రం సరికాదు..’ అంటూ సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో కొనసాగుతున్న ఎమ్మెల్యేల వ్యవహారంలో స్పీకర్ కార్యాలయం ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి, స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘం, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు హైకోర్టు రిజిస్ట్రార్ ద్వారా అందజేయాలని జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జ్ల ధర్మాసనం ఆదేశించింది. ఈ నోటీసులపై వీరంతా ఈనెల 22లోపు వివరణ ఇవ్వాలని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది. ఓ ఎస్ఎల్పీ, మరో రిట్ పిటిషన్‌పై విచారణ కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్‌లపై ఎస్ఎల్పీ, మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎం.సంజయ్‌కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, గూడెం మహీపాల్ రెడ్డి, అరెకపూడి గాందీలపై రిట్ పిటిషన్ దాఖలు అయిన విషయం తెలిసిందే. కాగా ఈ రెండు పిటిషన్లపై తాజాగా మంగళవారం సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు ఆర్యమ సుందరం, దామ శేషాద్రినాయుడు, పి.మోహిత్‌రావు, స్పీకర్ తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మనుసింఘ్వీ, ముకుల్ రోహత్గీ తదితరులు వాదనలు వినిపించారు. ఏడాది కావొస్తున్నా చర్యలు లేవు ‘గతేడాది మార్చి, ఏప్రిల్‌లో పార్టీ ఫిరాయింపులపై తొలిసారి కోర్టును ఆశ్రయించాం. అనంతరం జూన్‌లో రిట్ పిటిషన్ దాఖలు చేశాం. ఏడాది అవుతున్నా ఇప్పటివరకు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్పీకర్ ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. ఆర్టికల్ 32, 226 ప్రకారం స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి ఎలాంటి సమయం అవసరం లేదు. ప్రధానంగా పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ బీ ఫాంపై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. మరో ఎమ్మెల్యే ఏకంగా కాంగ్రెస్ పార్టీ కోసం లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేశారు. మిగిలిన ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు వాళ్లు పార్టీ ఫిరాయించినట్టే. దీనిపై తొలుత రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా..విచారణకు సమయాన్ని ఖరారు చేయాలంటూ సింగిల్ బెంచ్ నాలుగు వారాలు గడువు ఇచ్చింది. దీనిపై స్పీకర్ కార్యాలయం అప్పీల్‌కు వెళ్లింది. అయితే స్పీకర్‌కు తగినంత సమయం ఇవ్వాలన్న భావనతో ఈ ఉత్తర్వులను డివిజన్ బెంచ్ పక్కన పెట్టింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంను ఆశ్రయించాం. కానీ స్పీకర్ కార్యాలయం ఇప్పటివరకు ఆ తగినంత సమయం అంటే ఎంతో చెప్పనేలేదు. స్పీకర్ సమయం తీసుకునే విషయంలో సుభాష్ దేశాయ్, కేశం మేఘాచంద్, రాజేంద్ర సింగ్ రాణా కేసుల్లో సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. ఈ తీర్పుల ఆధారంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంది..’ అని అని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. అయితే సుభాష్ దేశాయ్ కేసులో స్పీకర్ నిర్ణయంపై ఎలాంటి గడువు ఫిక్స్ చేయలేదని జస్టిస్ బీఆర్ గవాయి అన్నారు. రాణా కేసులో మూడు నెలల సమయం ఇవ్వాలని చెప్పిందని తెలిపారు. ఫిరాయింపులపై కాంగ్రెస్ అధికారం ఉన్నచోట ఒకలా... లేనిచోట మరోలా వ్యవహరిస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది అర్యమ సుందరం వాదించారు.స్పీకర్‌కు కోర్టు ఆదేశాలివ్వడానికి అవకాశం లేదుస్పీకర్ కార్యదర్శి తరఫు న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ వాదిస్తూ.. ‘ఫిరాయింపులపై గతేడాది జూలై మొదటి వారంలో స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తే 9వ తేదీ నాటికే కోర్టులో పిటిషన్ వేశారు. మరోవైపు ఫిరాయింపులపై ఫిర్యాదు అందగానే స్పీకర్ స్పందించారు.. నోటీసులు ఇచ్చారు. వారి నుంచి రిప్లై రాగానే నిర్ణయం తీసుకుంటారు. అసలు స్పీకర్ నిర్దిష్ట సమయంలో నిర్ణయం తీసుకోవాలని లేదు. రాజ్యాంగబద్ధంగా అత్యంత ఉన్నతమైన పదవుల్లో స్పీకర్ పదవి ఒకటి. ఈ పదవిలో ఉన్న స్పీకర్‌కు కోర్టు ఆదేశాలు జారీ చేయడానికి అవకాశం లేదు..’ అని చెప్పారు. దీంతో ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ‘స్పీకర్‌కు కోర్టు ఆదేశాలు జారీ చేయడానికి అవకాశం లేదూ అంటే.. న్యాయమే డిసైడ్ చేస్తుంది ఆగండి..’ అంటూ వ్యాఖ్యానించింది. నోటీసుల జారీకి ఆదేశాలిచ్చింది. ప్రతివాదుల తరఫు న్యాయవాదులు కూడా వీరికి నేరుగా నోటీసులు ఇవ్వొచ్చని తెలిపింది. ఈనెల 25న ఐటెం నంబర్–1గా కేసును విచారిస్తామని స్పష్టం చేసింది. -
ప్రైవేట్ ఆస్పత్రులలో మెడిసిన్ కొనుగోలు.. రాష్ట్రాలకు సుప్రీం చివాట్లు
ఢిల్లీ : ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం పేదలకు అందని ద్రాక్షాగా మారింది. ఇదే అంశంపై సుప్రీం కోర్టు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను చివాట్లు పెట్టింది. సామాన్యులకు వైద్య సంరక్షణ,మౌలిక సదుపాయాలు కల్పిస్తూ భరోసా ఇవ్వడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడింది. వైద్యాన్ని సామాన్యులకు దూరం చేయడమేకాదు.. వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రులలో చేరేలా పరోక్షంగా సులభతరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీపై సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ప్రైవేట్ ఆస్పత్రులు తాము నిర్వహించే మెడికల్ షాపుల్లోనే మెడిసిన్లు, ఇంప్లాంట్స్, ఇతర మెడికల్ కేర్ ఉత్పుత్తులు కొనుగోలు చేయాలని పేషెంట్లను, వారి కుటుంబ సభ్యులను ఒత్తిడి చేస్తున్నాయని పిల్లో పేర్కొన్నారు. అంతేకాదు, రోగులకు అమ్మే మెడిసిన్లను సైతం వాస్తవ ధరకంటే అత్యధిక ధరకు విక్రయిస్తున్నారని హైలెట్ చేశారు. ఫలితంగా రోగులు దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర,రాష్ట్రాలు ప్రైవేట్ ఆస్పత్రులపై నియంత్రణ, దిద్దుబాటు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యాయని ఆరోపిస్తూ.. తమ ఫార్మసీలలో మాత్రమే మెడిసిన్ కొనుగోలు చేయాలని ఒత్తిడి చేయకుండా ప్రైవేట్ ఆస్పత్రులకు ఆదేశాలు జారీ చేయాలని పిల్లో కోరారు. ఆ పిల్‌పై ఇవాళ సుప్రీం కోర్టు జస్టిస్ సూర్యకాంత్, ఎన్కే సింగ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా మేము మీతో ఏకీభవిస్తున్నాము.. అయితే దీన్ని ఎలా నియంత్రించాలి? అని జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు.The Supreme Court is hears a Public Interest Litigation (PIL) challenging the practice of hospitals and in-house pharmacies compelling patients to purchase medicines exclusively from their designated pharmacy.Bench: Justice Surya Kant and Justice N. Kotiswar Singh pic.twitter.com/jS3RLmZBwJ— Bar and Bench (@barandbench) March 4, 2025 ఈ సందర్భంగా తమ ఫార్మసీలలోనే మెడిసిన్ తీసుకోవాలని పేషెంట్లపై ఒత్తిడి చేసే ఆస్పత్రులపై తగు చర్యలు తీసుకునేలా ఆయా రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేశారు. బహిరంగ మార్కెట్లో మెడిసిన్ తక్కువ ధరలో దొరికినప్పుడు అక్కడే కొనుగోలు చేసుకోవచ్చు. అలా కాకుండా హాస్పిటల్‌కు చెందిన ఫార్మసీలలో మెడిసిన్ కొనుగోలు చేయాలని పేషెంట్లపై ఒత్తిడి చేయొకూడదని సూచించింది.మరోవైపు, కేంద్ర ప్రభుత్వానికి ప్రైవేట్ హాస్పిటల్స్, వైద్య సంస్థలు పౌరులను దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు చర్యలు తీసుకునే అవసరాన్ని నొక్కిచెప్పింది. ఇప్పటికే ప్రైవేటు ఆస్పత్రులకు చెందిన ఫార్మసీలలో మెడిసిన్ కొనుగోలు అంశంపై సుప్రీం కోర్టు ఒరిస్సా, ఆరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, బీహార్, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్,రాజస్థాన్‌లకు నోటీసులు జారీచేసింది. దీనిపై ఆయా రాష్ట్రాలు సుప్రీంలో కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేశాయి.మెడిసిన్ ధరలు కేంద్రం జారీ చేసిన ధర నియంత్రణ ఆదేశాలపై ఆధారపడ్డాయని, అత్యవసర మెడిసిన్ సైతం అందుబాటులో ఉండేందుకు ధరలు నిర్ణయించబడ్డాయని తెలిపాయి. హాస్పిటల్ ఫార్మసీల నుండి మందులు కొనుగోలు చేయాలని పేషెంట్లపై ప్రైవేట్ ఆస్పత్రులు బలవంతం చేయడంలేదు’కేంద్రం సైతం సుప్రీం కోర్టుకు వివరణ ఇచ్చింది. -
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీతో మరోసారి రేవంత్ భేటీ
ఢిల్లీ : కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి సమావేశమయ్యారు. 2024 25 సంవత్సరానికి సంబంధించి సేకరించిన ధాన్యం బకాయిలు రూ. 1, 468.94 కోట్లను విడుదల చేయాలని కేంద్రమంత్రికి వినతిపత్రం సమర్పించారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద సరఫరా చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు రూ. 343. 27 కోట్లను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక సీఎంఆర్ డెలివరీ గడువును పొడిగించాలని కేంద్రమంత్రిని రేవంత్ కోరారు. సీఎం రేవంత్ వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. కేంద్ర మంత్రులను కలుస్తూ తెలంగాణకు సంబంధించిన సమస్యలను విన్నవిస్తున్నారు. తమ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని కేంద్ర మంత్రులకు విన్నవిస్తున్నారు.నిన్న సీఆర్ పాటిల్‌తో భేటీ..కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న(సోమవారం) భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించి పలు ప్రాజెక్టులపై కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ చర్చించారు. సీఎం వెంట తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఉన్నారు. దేవాదుల ఎత్తిపోతల పథకం, భీమా ఎత్తిపోతల పథకం, ఎస్సారెస్పీ స్టేజి -2కు సంబంధించి భూసేకరణ, వివాదాలు 18,189 కోట్ల రూపాయల పెండింగ్ పనులు గురించి రేవంత్ చర్చించినట్లు తెలుస్తోంది.ప్రధానంగా కృష్ణా జలాల అంశంపై కేంద్ర జలశక్తి మంత్రికి వివరించారు. దీనిపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. కృష్ణా జలాలను ఏపీ అన్యాయంగా తరలించుకుపోతోందని, ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమావేశం అనంతరం పేర్కొన్నారు. కృష్ణా నదీ జలాల వివాదంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్నారు. -
తృటిలో తప్పిన ఘోర రైలు ప్రమాదం.. బోగీలు రెండుగా విడిపోయి..
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో(Uttar Pradesh) ఘోర రైలు ప్రమాదం తృటిలో తప్పింది. ప్రయాణిస్తున్న రైలు బోగి రెండుగా విడిపోయాయి. 200 మీటర్ల మేర ప్రయాణించాయి. బోగి విడిపోవడంపై అప్రమత్తమైన రైల్వే అధికారులు వెంటనే ఆ రైలు ఆపేయడంతో పెను ప్రమాదం తప్పింది.పోలీసుల సమాచారం మేరకు..బీహార్ నుంచి ఒడిశాలోని పురి ప్రాంతానికి నందన్ కానన్ ఎక్స్‌ప్రెస్ (Nandan Kanan Express ) బయలుదేరాల్సి ఉంది. అయితే, మార్గం మధ్యలో ఉత్తర ప్రదేశ్‌లో పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ్ స్టేషన్ (Pandit Deen Dayal Upadhyaya (DDU) లో నందన్ కానన్ ఎక్స్‌ప్రెస్ బోగీ విడిపోయింది. #WATCH | Chandauli, Uttar Pradesh: The coupling of the Nandan Kanan Express broke near the Pandit Deen Dayal Upadhyaya (DDU) Junction, splitting it into two parts. pic.twitter.com/QjqUHN7tfe— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 4, 2025ట్రైన్ ఆరు బోగీలు విడిపోయి 200 మీటర్లు ముందుకు వెళ్లిపోయాయి. మిగతా 15 బోగీలు వెనకే ఉన్నాయి. బోగీలు విడిపోవడంతో రైల్లోని ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ప్రాణ భయంతో కేకలు వేశారు. దీంతో అప్రమత్తమైన రైల్వే సిబ్బంది ట్రైన్‌ను నిలివేశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రయాణికుల్ని సురక్షితంగా మరో కోచ్‌కు తరలించారు. అనంతరం, రైలు బోగీ విడిపోవడంపై రైల్వే అధికారులు ఆరా తీశారు. ఈ క్రమంలోనే రైలు కప్లింగ్ విరిగిపోయిన విషయాన్ని గుర్తించారు. సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి దాన్ని మళ్లీ అతికించారు. -
పాకిస్థానీ అనడం నేరమేమీ కాదు: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: వ్యక్తిగత దూషణకు సంబంధించిన ఓ కేసులో దేశ సర్వోన్నత న్యాయం మంగళవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మియాన్-టియాన్, పాకిస్థానీ అనడం నేరమేమీ కాదని, అలా అనడం వల్ల మతపరమైన మనోభావాలు దెబ్బ తిన్నాయన్న వాదన అర్ధరహితమని వ్యాఖ్యానించింది.జార్ఖండ్‌లో పని చేసే ఓ ప్రభుత్వ ఉద్యోగి.. ఆర్టీఐ దరఖాస్తు వెరిఫికేషన్‌లో భాగంగా ఓ వ్యక్తిని సంప్రదించారు. అయితే ఆ టైంలో మతం ప్రస్తావన తెచ్చి ఆ వ్యక్తి.. సదరు ఉద్యోగిని దుర్భాషలాడాడు. దీంతో తన విధులకు ఆటంకం కలిగించాడంటూ ఆ ఉద్యోగి పోలీసులను ఆశ్రయించాడంతో కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో నిందితుడికి జార్ఖండ్ హైకోర్టులో ఊరట దక్కలేదు. దీంతో సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. మియాన్-టియాన్, పాకిస్థానీ అని సంబోధించడం ద్వారా తన మనోభావాలు దెబ్బన్నాయని ఫిర్యాదుదారు అంటున్నారు. ముమ్మాటికీ అలాంటి వ్యాఖ్యలు అప్రస్తుతం. అయినప్పటికీ.. అది మతపరమైన మనోభావాలు దెబ్బతీయడం ఏమాత్రం కాదని స్పష్టం చేస్తూ ఆ వ్యక్తికి ఊరట కలిగించింది. -
ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు.. ప్రభుత్వానికి,ఈసీకి.. సుప్రీం నోటీసులు
సాక్షి, ఢిల్లీ: నేడు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై విచారణ జరిగింది. బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ, ఎన్నికల సంఘం, ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఫిరాయింపుల అంశంపై మార్చి 22 లోగా నోటీసులకు సమాధానం ఇవ్వాలని సుప్రీం ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 25 కి వాయిదా వేసింది. మంగళవారం మధ్యాహ్నం జరిగిన విచారణలో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకునేందుకు రీజనబుల్ టైమ్ అంటే ఎంతో చెప్పాలని ప్రశ్నించింది. రీజనబుల్ టైమ్ అంటే గడువు ముగిసే వరకా ?. ప్రజాస్వామ్య విధానాలు ఏం కావాలి. ఎంత సమయం కావాలో చెప్పండి. ఆపరేషన్ సక్సెస్ , పేషంట్ డెడ్ అనే తీరు సరికాదు’అని బీఆర్ గవాయి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తరఫున సీనియర్ న్యాయవాది అర్యమ సుందరం తన వాదనలు వినిపించారు. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేసే ఎత్తుగడలు అనుసరిస్తున్నారు. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడమంటే రాజ్యంగమిచ్చిన విధులను నిర్వహించడంలో విఫలమైనట్లేనని అన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు విచారణను వాయిదా వేసింది. గత విచారణలోగత విచారణ సందర్బంగా అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకునేందుకు రీజనబుల్ టైమ్ అంటే ఎంతో చెప్పాలని సుప్రీంకోర్టు కోరింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు గత తీర్పుల ప్రకారం రీజనబుల్ టైమ్ అంటే మూడు నెలలు మాత్రమేనని బీఆర్ఎస్ వాదనలు వినిపించింది. ఈ నేపథ్యంలో రీజనబుల్ టైం ఎంతో చెప్పాలంటూ కోర్టు తెలంగాణ స్పీకర్‌ను ప్రశ్నించింది.ఇక, తెలంగాణలో పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత చర్యలు తీసుకునేలా స్పీకర్‌ను ఆదేశించాలని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, పాడి కౌశిక్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఇటీవలే స్పీకర్ నోటీసులు ఇచ్చారు. బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం బాలరాజు సహా పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు.మరోవైపు.. గత వాదనల్లో.. తెలంగాణ స్పీకర్ (Telangana Speaker) తీరుపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తగిన సమయం.. సరైన సమయం.. అంటూ స్పీకర్ చెబుతూ కాలయాపన చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. మహారాష్ట్ర తరహాలో ఎమ్మెల్యేల పదవీకాలం ముగిసేదాకా ఆగుతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్లపై పూర్తి వాదనలు విన్నాకే ‘ఆ సరైన సమయం’పై తామే ఓ నిర్ణయం తీసుకుంటామని, అవసరమైతే స్పీకర్‌కు సూచనలు చేయడానికి ఉన్న అవకాశాలను కూడా పరిశీలిస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడనుందా అనే ఆసక్తి నెలకొంది.ఇంతకు ముందు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అయ్యాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. పార్టీ ఫిరాయింపులపై లిఖిత పూర్వక సమాధానం చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. -
కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో రిత్విక్ చౌదరీ, యూకీ బాంబ్రీ
న్యూఢిల్లీ: అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) డబుల్స్ ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్ ప్లేయర్, భారత డేవిస్‌కప్ జట్టు సభ్యుడు బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ తన కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకున్నాడు. సోమవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో 24 ఏళ్ల రిత్విక్ తొమ్మిది స్థానాలు ఎగబాకి 65వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. సాంటియాగోలో జరిగిన చిలీ ఓపెన్ ఏటీపీ–250 టోర్నిలో కొలంబియాకు చెందిన నికోలస్ బరియెంతోస్తో కలిసి ఆడిన రిత్విక్ డబుల్స్ టైటిల్ గెలిచాడు.దాంతో అతని ర్యాంక్ మెరుగైంది. మరోవైపు భారత్‌కే చెందిన యూకీ బాంబ్రీ కూడా తన కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకున్నాడు. అలెక్సీ పాపిరిన్ (ఆ్రస్టేలియా)తో కలిసి దుబాయ్ ఓపెన్ ఏటీపీ–500 టోర్నీలో యూకీ డబుల్స్ టైటిల్ గెలిచాడు. ఫలితంగా తాజా ర్యాంకింగ్స్‌లో యూకీ ఐదు స్థానాలు పురోగతి సాధించి 39వ ర్యాంక్‌లో నిలిచాడు. భారత దిగ్గజం రోహన్ బోపన్న ఒక స్థానం మెరుగుపర్చుకొని 21వ ర్యాంక్‌లో ఉన్నాడు.మెక్సికోలో జరిగిన అకాపుల్కో ఓపెన్ ఏటీపీ–250 టోర్నిలోసెమీఫైనల్ చేరుకున్న భారత ప్లేయర్ శ్రీరామ్ బాలాజీ మరోసారి కెరీర్ బెస్ట్ 61వ స్థానానికి చేరుకున్నాడు. భారత ఇతర ప్లేయర్లు అర్జున్ ఖడే 87వ స్థానంలో, జీవన్ నెడుంజెళియన్ 93వ స్థానంలో ఉన్నారు. బెంగళూరు ఓపెన్ ఏటీపీ–125 చాలెంజర్ టోర్నిలో డబుల్స్ టైటిల్ సాధించిన హైదరాబాద్ ప్లేయర్ అనిరుధ్ చంద్రశేఖర్ ఏకంగా 30 స్థానాలు మెరుగుపర్చుకొని 109వ ర్యాంక్‌లో నిలిచాడు. రామ్‌కుమార్ రామనాథన్ 19 స్థానాలు ఎగబాకి 167వ ర్యాంక్‌లో, సాకేత్ మైనేని 24 స్థానాలు పురోగతి సాధించి 220వ ర్యాంక్‌లో నిలిచారు. -
అతి తెలివి కుర్రాళ్లు!
న్యూఢిల్లీ: దేశమంతటా రచ్చ అయిన ‘ఇండియా హాజ్ గాట్ టాలెంట్’ యూట్యూబ్ షో వివాదం తాలూకు మంటలు ఇంకా చల్లారడం లేదు. ఆ షోలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసి ప్రముఖ యూట్యూబర్ రణ్వీర్ అలహాబాదియా చిక్కుల్లో పడటం తెలిసిందే.మెదడులోని చెత్తనంతా వాంతి రూపంలో బయట పెట్టుకున్నారంటూ సుప్రీంకోర్టు ఆయనకు తీవ్రంగా తలంటింది కూడా. ఈ వ్యవహారంలో రణ్వీర్తో పాటు సదరు షో హోస్ట్ సమయ్ రైనా కూడా పలు కోర్టు కేసులు ఎదుర్కొంటున్నారు. ఇంతటి రగడకు కారణమైన ఆ వివాదాస్పద ఎపిసోడ్‌పై ఇటీవల కెనడాలో నిర్వహించిన ఒక షోలో సమయ్ వ్యంగ్యాస్త్రాలు విసిరి తాజాగా మరోసారి సుప్రీంకోర్టు ఆగ్రహానికి గురయ్యారు.‘‘బాగా ఫన్నీగా ఏవేవో చెప్పి నవ్విస్తానని అనుకుంటున్నారేమో! బీర్‌బైసెప్స్ (రణ్వీర్ అలహాబాదియా)ను ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి! బహుశా నా టైం బాగా లేనట్టుంది. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి. నా పేరే సమయ్’’ అని ప్రేక్షకులను ఉద్దేశించి రైనా వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈ షో టికెట్లు కొనడం ద్వారా నా కోర్టు ఖర్చులను భరించినందుకు కృతజ్ఞతలు’’ అంటూ ముక్తాయించారు. సోమవారం అలహాబాదియా పిటిషన్‌పై విచారణ సందర్భంగా రైనా తాజా వ్యాఖ్యలను సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రత్యేకంగా ప్రస్తావించి మరీ వాటిపై కన్నెర్ర చేసింది.‘‘ఈ అతి తెలివి కుర్రాళ్లు తమకే అన్నీ తెలుసనుకుంటారు. మనల్ని బహుశా పనికిరాని పాత తరంగా భావిస్తారేమో తెలియదు! వీళ్లలో ఒకరు కెనడాకు వెళ్లి మరీ ఆ పనికిమాలిన ఎపిసోడ్‌ను మరోసారి పనిగట్టుకుని ప్రస్తావించారు. ఈ కోర్టు న్యాయపరిధి ఎంతటిదో, తలచుకుంటే ఎలాంటి చర్యలు తీసుకోగలదో బహుశా వీళ్లకు తెలిసినట్టు లేదు’’ అంటూ న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తీవ్రంగా హెచ్చరించారు.‘‘కాకపోతే ఎంతైనా వాళ్చ్లు కుర్రాళ్లు. మేం అర్థం చేసుకోగలం. అందుకే అలాంటి చర్యలేవీ తీసుకోదలచలేదు’’ అని స్పష్టం చేశారు. చేసిన తప్పులకు వాళ్లు ఇప్పటికైనా పశ్చాత్తాపపడుతున్నారని ఆశిస్తున్నట్టు చెప్పారు. హక్కులతో పాటే బాధ్యతలు అలహాబాదియాకు కూడా ఈ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ గట్టిగా చురకలు వేశారు. ‘‘కొందరు గిరాకీ లేని వ్యక్తులు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పేరిట పనికిరాని వ్యాసాలు రాసి వదులున్నారని మాకు తెలుసు. వారిని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా బాగా తెలుసు. ప్రాథమిక హక్కులు తమ సొత్తని ఎవరైనా భావిస్తే పొరపాటు.మన దేశంలో ఎవరికైనా సరే, బాధ్యతలతో పాటు హక్కులు వర్తిస్తాయి. హక్కులను ఆస్వాదించాలంటే వాటితో పాటుగా రాజ్యాంగం కల్పించిన బాధ్యతలను నిర్వర్తించి తీరాల్సిందే. దీన్ని అర్థం చేసుకోని వారిని ఎలా డీల్ చేయాలో మాకు తెలుసు’’ అని హెచ్చరించారు. రణ్వీర్ యూట్యూబ్ షోపై విధించిన నిషేధాన్ని ఈ సందర్భంగా ధర్మాసనం ఎత్తేసింది. ఇకపై నైతిక ప్రమాణాలకు లోబడి పద్ధతిగా వ్యవహరించాలని హెచ్చరించింది. ఈ మేరకు హామీ పత్రం సమర్పించాల్సిందిగా ఆదేశించింది. -
మా ప్రయోజనాలు కాపాడండి: సీఎం రేవంత్
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా, గోదావరి నదీ జలాలకు సంబంధించి తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. కృష్ణా నదీ పరీవాహకంలో సుమారు 70శాతం తెలంగాణలోనే ఉండగా.. 30 శాతం మాత్రమే ఏపీలో ఉందని వివరించారు. అందువల్ల కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయబద్ధమైన 70శాతం వాటా కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. గోదావరి నదికి సంబంధించి తెలంగాణ వాటా నికర జలాలు తేల్చిన తర్వాతే.. ఏపీ ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకోవాలని కేంద్ర మంత్రి ని కోరారు. సోమవారం సాయంత్రం ఢిల్లీలో కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. కృష్ణా పరీవాహక ప్రాంతం తెలంగాణలో ఎక్కువగా ఉన్నప్పటికీ... కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) పక్షపాతంతో ఏపీకి 66శాతం, తెలంగాణకు 34శాతం నీటి కేటాయింపులు చేసిందని కేంద్ర మంత్రికి తెలిపారు. ఈ కేటాయింపుల వల్ల ఎన్నో ఏళ్లుగా తెలంగాణ నష్టపోతోందని.. ఈ ఏడాది సైతం ఏపీ కేటాయించిన మొత్తానికి మించి నీరు తరలించుకుపోయిందని వివరించారు. ఇక ముందు ఏపీ ఇలా వాటాకు మించి జలాలను తరలించుకు పోకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణా ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు సంబంధించి వెంటనే టెలిమెట్రీ యంత్రాలను ఏర్పాటు చేయాలని.. అవసరమైతే అందుకయ్యే మొత్తాన్ని తామే భరిస్తామని కేంద్ర మంత్రికి తెలియజేశారు.ఈ ప్రాజెక్టులకు అనుమతులు ఇప్పించండిపాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ను 2022లోనే సమర్పించినా.. అనుమతుల్లో ఆలస్యం చేస్తున్నారని కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు సీఎం రేవంత్ వివరించారు. అదే సమయంలో న్యాయస్థానాల పరిధిలో ఉన్న అప్పర్ భద్ర ప్రాజెక్టుకు మాత్రం అనుమతులు ఇచ్చారన్నారు. సీతారామ ఎత్తిపోతల, సమ్మక్క సాగర్ బ్యారేజీలకు మాత్రం అనుమతులు ఇవ్వలేదని చెప్పారు. ఈ మూడు ప్రాజెక్టులకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), సాంకేతిక సలహా మండలి (టీఏసీ) నుంచి అవసరమైన అనుమతులు ఇప్పించాలని కేంద్ర మంత్రిని కోరారు.ఏపీ తీరు చట్టవిరుద్ధంఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం గోదావరి–బనకచర్ల అనుసంధాన పథకానికి రూపకల్పన చేసిందని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ వివరించారు. ఆ పథకానికి కేంద్ర జల సంఘం, గోదావరి నది యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ), కేఆర్ఎంబీల నుంచి ఎటువంటి అనుమతి పొందలేదని తెలిపారు. అపెక్స్ కౌన్సిల్లోనూ ఈ ప్రాజెక్టుపై ఎటువంటి చర్చ జరగలేదన్నారు. గోదావరిలో తెలంగాణకు సంబంధించి నికర జలాల వాటాలు తేల్చాలని.. రాష్ట్రం చేపడుతున్న ప్రాజెక్టులకు వెంటనే అనుమతులు ఇవ్వాలని కోరారు. పాలమూరు– రంగారెడ్డి, సీతారామ ఎత్తిపోతల, మోదికుంట వాగు, చనాకా కొరట బ్యారేజీ (డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్), చిన్న కాళేశ్వరం (ముక్తేశ్వర) ఎత్తిపోతల పథకాలకు ‘సత్వర సాగునీటి ప్రయోజన పథకం (ఏఐబీపీ)’, ‘పీఎంఆర్పీ 2024’ కింద తగిన ఆర్థిక సాయం అందజేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగా మౌలిక వసతుల అభివృద్ధి కింద 50 సంవత్సరాల వడ్డీలేని రుణాలను ఇవ్వాలని అభ్యర్థించారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించి తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తామని, ఈ క్రమంలో ఏర్పడే ముంపునకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు ఇప్పించాలని కోరారు. -
ఐఆర్సీటీసీ, ఐఆర్ఎఫ్సీకి నవరత్న హోదా
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో మరో రెండు ప్రభుత్వరంగ సంస్థలు నవరత్న హోదా సాధించాయి. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ), ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ)లకు నవరత్న హోదా కల్పిస్తున్నట్లు కేంద్రం చెప్పింది. దీంతో నవరత్న హోదా పొందిన 25వ కంపెనీగా ఐఆర్సీటీసీ, 26వ కంపెనీగా ఐఆర్ఎఫ్సీ అవతరించాయని డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సోమవారం వెల్లడించింది. కంపెనీల ఆర్థిక పనితీరు, నిర్వహణ ఆధారంగా నవరత్న, మహారత్న హోదాలను కేంద్రం మంజూరు చేస్తుంది. -
అయోధ్య రామమందిరంపై ఉగ్రదాడికి ఐఎస్ఐ కుట్ర.. భగ్నం చేసిన భారత్
గాంధీనగర్: అయోధ్య రామమందిరంపై ఉగ్రదాడి చేసేందుకు ప్రయత్నించిన పాకిస్థాన్(Pakistan) ఐఎస్ఐ ఉగ్రదాడిని భారత్ భగ్నం చేసింది. గుజరాత్, హర్యానా యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ జాయింట్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ జాయింట్ ఆపరేషన్‌లో భాగంగా హర్యానాలో ఉగ్రవాది రెహ్మాన్‌ను అరెస్ట్ చేసింది. పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ(ISI)తో సంబంధాలున్న ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్‌లో పట్టుబడ్డాడు. భద్రతా సంస్థల సమాచారం మేరకు.. ఐఎస్ఐ సంస్థ అబ్దుల్ రెహ్మాన్ ద్వారా అయోధ్య రామ్ మందిరంపై దాడి చేయించేందుకు ప్లాన్ చేసింది. ఉగ్రదాడిలో భాగంగా అబ్దుల్ రెహ్మాన్ రామమందిరంపై రెక్కీ నిర్వహించాడు. సమాచారాన్ని సేకరించి ఐఎస్ఐకి చేరవేర్చాడు. అనంతరం, అబ్దుల్ రెహ్మాన్ ఫైజాబాద్ నుంచి ట్రైన్లో మొదట ఫరీదాబాద్ చేరుకున్నాడు. ఫరీబాదాబాద్‌లో హ్యాండ్ గ్రనేడ్లను సేకరించాడు. వాటిని తీసుకుని ట్రైన్ ద్వారా అయోధ్య వెళ్లాల్సి ఉంది. అనంతరం ఆ హ్యాండ్ గ్రనేడ్‌తో రామమందిరంపై దాడి చేసేలా ప్లాన్ వేశాడు. అంతకంటే ముందే దేశ భద్రతా సంస్థలు అందించిన సమాచారంతో గుజరాత్ ఏటీఎస్, ఫరీదాబాద్ ఏటీఎస్ స్క్వాడ్ అబ్దుల్ రెహ్మాన్‌ను అదుపులోకి తీసుకున్నాయి. అయోధ్యరామ మందిరంపై ఉగ్రదాడిని భగ్నం చేశాయి. -
సుప్రీం కోర్టులో రణవీర్ అల్హాబాదియాకు ఊరట
ఢిల్లీ : తల్లిదండ్రుల గురించి, శృంగారం పైన ప్రశ్నించి వివాదాల్లో చిక్కుకున్న ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియాకు సుప్రీం కోర్టులో (supreme court) ఊరట దక్కింది. వివాదాస్పద వ్యాఖ్యలతో ఆగిపోయిన పాడ్ కాస్ట్ ‘ది రణ్వీర్ షో’తో పాటు ఇతర షోలను తిరిగి ప్రారంభించుకోవడంతో పాటు వాటిని ప్రసారం చేసుకోవచ్చని తెలిపింది.‘ఇండియాస్ గాట్ లాటెంట్’ (India's Got Latent) వేదికగా యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియా (Ranveer Allahbadia) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దీంతో అల్హాబాదియా వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా పలు కేసులు నమోదయ్యాయి. అల్హాబాదియా చేస్తున్న షోలు సైతం ఆగిపోయాయి. అయితే, అల్హాబాదియా తాను ఇంటర్వ్యూలు, షోలు చేసుకునే అవకాశం కల్పించాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అంతేకాదు,తాను చేస్తున్న షోలపై సుమారు 280 మంది ఆధారపడ్డారని, షోలు ఆగిపోవడం వల్ల వారికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పిటిషన్లో పేర్కొన్నారు ఆ పిటిషన్‌పై సుప్రీం కోర్టు న్యాయమూర్తులు సూర్యకాంత్, ఎన్.కోటీశ్వర్ సింగ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. అల్హబాదియా పిటిషన్‌పై కేంద్రం తరఫు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా (Solicitor General Tushar Mehta) తన వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా తాను ఉత్సుకతతో అల్హాబాదియా షోను చూశానని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. ఆ షో అసభ్యంగా మాత్రమే కాదు.. వక్రంగా ఉందని వ్యాఖ్యానించారు. హాస్యం, అసభ్యత, వక్రబుద్ధి మధ్య గణనీయమైన వ్యత్యాసం ఉందని నొక్కి చెప్పారు.ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీం ద్విసభ్య ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. వాక్ స్వాతంత్ర్యం ప్రాథమిక హక్కు, అశ్లీలత విషయంలో స్పష్టమైన సరిహద్దు ఉండాలని పునరుద్ఘాటించింది. ఈ సందర్భంగా అల్హాబాదియాకు సుప్రీం కోర్టు చురకలంటించింది. భావప్రకటనా స్వేచ్ఛకు పరిమితులు ఉన్నాయని, అసభ్య పదజాలం వాడటం హాస్యం కాదని మందలించింది. అల్హాబాదియా షోలు చేసుకోవచ్చని, నైతికంగా, మర్యాద ఉండాలని సూచించింది.👉చదవండి : హాస్యం పేరిట అల్హాబాదియా నీచపు వ్యాఖ్యలు -
రైతులకు శుభవార్త..రూ.5కే శాశ్వత విద్యుత్ కనెక్షన్.. ఎక్కడంటే?
రైతులకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతులకు శాశ్వత విద్యుత్ కనెక్షన్‌ను కేవలం రూ.5 మాత్రమే అందిస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం మోహన్ యాదవ్ ప్రకటించారు. మధ్యప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ పథకాన్ని త్వరలో అమలు చేయనుంది.ఈ సందర్భంగా సీఎం మోహన్ యాదవ్ మాట్లాడుతూ... మధ్యప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యం రైతులను ప్రోత్సహించడం. వారి జీవితాలను మెరుగుపరచడం. విద్యుత్ సమస్యలు లేకుండా, సాగునీటి అవసరాలను తీర్చేందుకు సౌర (సోలార్) పంప్‌లను ఏర్పాటు చేయబోతున్నాం. వచ్చే మూడు సంవత్సరాల్లో 30 లక్షల సోలార్ పంప్‌లను రైతులకు అందించేందుకు ప్రణాళిక రూపొందించామని చెప్పారు. రైతుల నుండి సౌర విద్యుత్‌ను ప్రభుత్వం కొనుగోలు చేయబోతుంది. తద్వారా రైతులు అదనపు ఆదాయాన్ని పొందే అవకాశముంది.కాంగ్రెస్ పాలనలో గ్రామాల్లో సరైన రోడ్లు, విద్యుత్, మౌలిక సదుపాయాలు లేకుండా ఇబ్బంది పడ్డాం. కానీ, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది’ అని వ్యాఖ్యానించారు. -
కాలం చెల్లిన వాహనాలకు ఇంధనం బంద్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో కాలుష్యాన్ని కట్టడి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. కాలం చెల్లిన వాహనాలకు ఇంధనం విక్రయించకుండా నిబంధన విధించింది. ఇది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. పెట్రోల్ వాహనాలు 15 ఏళ్లు, డీజిల్ వాహనాలు పదేళ్లు దాటితే ఇంధనం విక్రయించే ప్రసక్తే లేదని శనివారం తేల్చిచెప్పింది. వాహనాల గడువు తీరిపోయిందో లేదో తెలుసుకొనేందుకు పరికరాలు ఏర్పాటు చేసుకోవాలని పెట్రోల్, డీజిల్ పంపుల యజమాన్యాలకు సూచించింది. కాలుష్య నియంత్రణ(Pollution control)పై శనివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.కాలం చెల్లిన వాహనాల(old vehicles)కు ఇంధనం విక్రయించకూడదని నిర్ణయించినట్లు ఢిల్లీ పర్యావరణ శాఖ మత్రి మంజీందర్ సింగ్ సిర్సా వెల్లడించారు. ఈ విషయాన్ని త్వరలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయు శాఖకు తెలియజేస్తామని పేర్కొన్నారు. గడువు తీరిపోయిన వాహనాలు రోడ్లపైకి రాకుండా నిరోధించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టంచేశారు.ఢిల్లీలో 425కుపైగా ఇంధన బంకులు ఉన్నాయి. నగరంలో కాలం చెల్లిన వాహనాలు 55 లక్షలు ఉన్నట్లు అంచనా. ఇందులో 66 శాతం ద్విచక్ర వాహనాలు, 54 శాతం నాలుగు చక్రాల వాహనాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఈ ఏడాది డిసెంబర్ నాటికి మొత్తం ప్రజారవాణా బస్సుల్లో 90 శాతం సీఎన్జీ బస్సులనే ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. -
వాహనదారులకు అలర్ట్.. ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త రూల్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో కాలుష్యాన్ని కట్టడి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. కాలం చెల్లిన వాహనాలకు ఇంధనం విక్రయించకుండా నిబంధన విధించింది. ఇది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది.కాగా, పెట్రోల్ వాహనాలు 15 ఏళ్లు, డీజిల్ వాహనాలు పదేళ్లు దాటితే ఇంధనం విక్రయించే ప్రసక్తే లేదని శనివారం తేల్చి చెప్పింది. వాహనాల గడువు తీరిపోయిందో లేదో తెలుసుకునేందుకు పరికరాలు ఏర్పాటు చేసుకోవాలని పెట్రోల్, డీజిల్ పంపుల యాజమాన్యాలకు సూచించింది. కాలుష్య నియంత్రణపై శనివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కాలం చెల్లిన వాహనాలకు ఇంధనం విక్రయించకూడదని నిర్ణయించినట్లు ఢిల్లీ పర్యావరణ శాఖ మత్రి మంజీందర్ సింగ్ సిర్సా వెల్లడించారు. ఈ విషయాన్ని త్వరలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయు శాఖకు తెలియజేస్తామని పేర్కొన్నారు.గడువు తీరిపోయిన వాహనాలు రోడ్లపైకి రాకుండా నిరోధించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టంచేశారు. ఢిల్లీలో 425కుపైగా ఇంధన బంకులు ఉన్నాయి. నగరంలో కాలం చెల్లిన వాహనాలు 55 లక్షలు ఉన్నట్లు అంచనా. ఇందులో 66 శాతం ద్విచక్ర వాహనాలు, 54 శాతం నాలుగు చక్రాల వాహనాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఈ ఏడాది డిసెంబర్ నాటికి మొత్తం ప్రజా రవాణా బస్సుల్లో 90 శాతం సీఎన్జీ బస్సులనే ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. -
Delhi: ఆ వాహనాలకు ఇంధనం బంద్..!
ఢిల్లీ : నిత్యం తీవ్ర వాయు కాలుష్యం(Delhi Pollution)తో కొట్టిమిట్టాడే ఢిల్లీలో కాలుష్య నివారణ చర్యలకు శ్రీకారం చుట్టింది తాజా బీజేపీ ప్రభుత్వం. ఢిల్లీలో కాలుష్య నియంత్రణ చర్యలను బీజేపీ ప్రభుత్వం ప్రారంభించింది. ఢిల్లీలో కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా ఈరోజు(శనివారం) సమీక్ష నిర్వహించారు పర్యావరణ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా.ఈ సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది ఢిల్లీ ప్రభుత్వం. పాత వాహణాలపై ఆంక్షలు, స్మోగ్ నిరోధక చర్యలు తప్పనిసరి చేయడంతో పాటు పబ్లిక్ ట్రాన్స్ ఫోర్ట్ కు ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని నిర్ణయించింది. ఢిల్లీలోని అన్ని ఎత్తైన భవనాలు, హోటళ్లు, వాణిజ్య సముదాయాలు వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి యాంటీ స్మోగ్ గన్ లను ఏర్పాటు చేయడాన్ని తప్పనిసరి చేయాలని నిర్ణయం తీసుకున్నఆరు. ఢిల్లీలో కొన్ని పెద్ద హోటళ్లు, కొన్ని పెద్ద కార్యాలయం సముదాయాలు, ఢిల్లీ విమానాశ్రయం, పెద్ద నిర్మాణ స్థలాలకు వెంటనే యాంటీ స్మోగ్ ఎక్స్ ని ఇన్ స్టాల్ చేయడాన్ని తప్పనిసరి చేయనున్నారు.వాహనాలకు 15 ఏళ్లు దాటితే..ఇక 15 ఏళ్లు దాటిన వాహనాలకు ఢిల్లీ బంకుల్లో ఇంధనం నిలిపివేయనున్నారు. 15 ఏళ్ల పైబడిని వాహనాలకు మార్చి 31 తర్వాత బంకుల్లో ఇంధనం పోయకూడదంటూ ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
మణిపూర్ సంక్షోభం.. కేంద్రం కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: సంక్షోభంలో ఉన్న మణిపూర్‌కు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. జనసంచారంపై ఉన్న ఆంక్షలను ఎత్తేయాలని.. మార్చి 8వ తేదీ నుంచి ఆ రాష్ట్రంలో సాధారణ స్థితి నెలకొల్పాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇవాళ జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో హోం శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) సంబంధిత ఆదేశాలను జారీ చేశారు.మార్చి 8వ తేదీ నుంచి మణిపూర్(Manipur)లో అన్ని రోడ్లపై ప్రజలు స్వేచ్ఛగా తిరగాలి. ఎవరైనా జనసంచారానికి ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకోండి అని అమిత్ షా మణిపూర్ అధికార యంత్రాంగానికి సూచించారు. మణిపూర్‌లో రాష్ట్రపతి విధింపు తర్వాత.. అక్కడి శాంతి భద్రతలపై జరిగిన తొలి సమీక్షా సమావేశం ఇదే కావడం గమనార్హం.ఈ సమావేశానికి మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా(Ajay Kumar Bhalla), ఇతర ఉన్నతాధికారులు, సైన్యం.. పారామిలిటరీ తరపున ప్రతినిధులు హాజరయ్యారు. 2023 మే నుంచి ఈ ఈశాన్య రాష్ట్రంలో తెగల వైరంలో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొనేలా ప్రయత్నాలను కేంద్రం ఇప్పుడు ముమ్మరం చేసింది.దాదాపు రెండేళ్లుగా జాతుల మధ్య వైరంతో రగులుతున్న మణిపుర్లో కల్లోల పరిస్థితుల నేపథ్యంలో.. ఇటీవల ఫిబ్రవరి 13వ తేదీన సీఎం బీరెన్ సింగ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ రాష్ట్రపతి పాలన విధించిన కేంద్ర ప్రభుత్వం అధికారాలన్నింటినీ అక్కడి గవర్నర్‌కు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కల్లోల పరిస్థితులను ఆసరాగా చేసుకుని భద్రతా బలగాలకు చెందిన ఆయుధాలను కొందరు ఎత్తుకెళ్లారు. ఈ నేపథ్యంలో.. అక్కడి ప్రజలకు గవర్నర్ అజయ్ కుమార్ భల్లా కీలక విజ్ఞప్తి చేశారు. తమ వద్ద ఉన్న అక్రమ ఆయుధాలు, పేలుడు పదార్థాలను ఏడు రోజుల్లోగా అప్పగించాలని అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిర్ణీత సమయంలోగా ఆయుధాలను తిరిగి ఇస్తే ఎలాంటి చర్యల ఉండవని.. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
బద్రీనాథ్: భారీగా విరిగిపడ్డ మంచుచరియలు.. చిక్కుకున్న కార్మికులు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో (Uttarakhand) హిమపాతం భారీ బీభత్సం సృష్టిస్తోంది. గత కొన్ని రోజులుగా భారీగా మంచుకురుస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం చమోలి-బద్రినాథ్ (Badrinath) జాతీయ రహదారిపై భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో మంచులో ((Avalanche) 57మంది రోడ్డు నిర్మాణ కార్మికులు కూరుకుపోయారు.మంచు చరియలు విరిగిపడడంతో అప్రమత్తమైన సహాయకబృందాలు 10 మంది కార్మికులను రక్షించాయి. సమాచారమందుకున్న పోలీసులు, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మిగిలిన కార్మికుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ఈ గాలింపు చర్యల్లో ఎస్డీఆర్ఎఫ్,ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. जनपद चमोली में माणा गांव के निकट BRO द्वारा संचालित निर्माण कार्य के दौरान हिमस्खलन की वजह से कई मजदूरों के दबने का दुःखद समाचार प्राप्त हुआ।ITBP, BRO और अन्य बचाव दलों द्वारा राहत एवं बचाव कार्य संचालित किया जा रहा है।भगवान बदरी विशाल से सभी श्रमिक भाइयों के सुरक्षित होने की…— Pushkar Singh Dhami (@pushkardhami) February 28, 2025మంచు చరియలు కింద రోడ్డు నిర్మాణ కార్మికులు చిక్కుకున్నట్లు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఎక్స్ వేదికగా ధృవీకరించారు. మంచు చరియల కింద చిక్కుకున్న కార్మికులు సురక్షితంగా బయట పడాలని ప్రార్థించారు.చమోలి జిల్లా మనా గ్రామ సమీపంలో బోర్డర్ రోడ్డు ఆర్గనైజేషన్ (బ్రో) చేపడుతున్న నిర్మాణ పనులలో చాలా మంది కార్మికులు మంచు చరియల కింద చిక్కుకున్నారనే విచారకరమైన సమాచారం అందింది. నిర్మాణ కార్మికులను రక్షించేందుకు ఐటీబీపీ, బ్రో రెస్క్యూ బృందాలతో పాటు ఇతర రెస్క్యూ టీమ్‌లు సహాయక చర్యలను నిర్వహిస్తున్నాయి. కార్మికులందరూ సురక్షితంగా ఉండాలని నేను ఆ దేవుణ్ని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్లో పేర్కొన్నారు. -
ఆప్ నెత్తిన కాగ్ మరో పిడుగు
న్యూఢిల్లీ: గత ఆప్ ప్రభుత్వానికి సంబంధించి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(CAG) మరో నివేదికను విడుదల చేసింది. ఆరోగ్య భద్రత, మౌలిక వసతుల కల్పనలో గత సర్కార్ పూర్తి నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించిందని, కరోనా సమయంలోనూ నిధులను సక్రమంగా వినియోగించలేకపోయిందని సంచలన విషయాలు వెల్లడించింది.గత ఆరేళ్లుగా ఢిల్లీ ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగాల్లో తీవ్ర అవినీతికి పాల్పడిందనేది ఆ నివేదిక సారాంశం. ఆప్ ప్రతిష్టాత్మకంగా భావించిన మొహల్లా క్లినిక్స్‌లో తగినంత మౌలిక సదుపాయాలు లేకపోవడం దగ్గరి నుంచి అత్యవసర నిధులను వినియోగించకపోవడం దాకా ఎన్నో వివరాలను కాగ్ తన నివేదికలో పొందుపరిచింది. అంతేకాదు..ఢిల్లీ వ్యాప్తంగా చాలా ఆస్పత్రుల్లో అత్యవసర సేవలు అందట్లేదన్న విషయం గురించి ప్రముఖంగా కాగ్ ప్రస్తావించింది. ఢిల్లీలో ఉన్న 27 ఆస్పత్రుల్లో 14 హాస్పిటల్స్‌లో ఐసీయూ సదుపాయం లేదని వెల్లడించింది. 16 ఆస్పత్రుల్లో బ్లడ్ బ్యాంకులు లేవని తెలిపింది. ఎనిమిది ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సరఫరా సదుపాయం లేదని తెలిపింది. పదిహేన్నింటిలో మార్చురీ సదుపాయాల్లేవని తెలిపింది. 12 ఆస్పత్రులకు ఆంబులెన్స్ సదుపాయాలు లేవని వెల్లడించింది. ఇక ఆప్ ప్రభుత్వం అప్పట్లో మొహల్లా క్లినిక్స్(Mohallah Clinics) ఏర్పాటును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వెయ్యికి పైగా ఏర్పాటు చేయాలని భావించినా.. అందులో 2023 నాటికి సగం మాత్రమే పూర్తి చేయగలిగిందని తెలిపింది. అయితే వాటిలోనూ సరైన సౌకర్యాలు, వైద్య సదుపాయాలు లేవని తెలిపింది. మొహల్లా క్లినిక్స్‌తో పాటు ఆయుష్ డిస్పెన్సరీల్లో మౌలిక వసతులు సరిగా లేవని పేర్కొంది. విద్యుత్ సదుపాయం, చెకప్ టేబుల్స్, చివరికి టాయిలెట్స్ సదుపాయాలు కూడా లేవని తెలిపింది. వీటికి తోడు అదనంగా సిబ్బంది కొరత కూడా ఉందని నివేదించింది. ఇక.. అత్యవసర సేవల కోసం వినియోగించాల్సిన నిధుల్ని కూడా ఆప్ పక్కన పెట్టిందని కాగ్ తన నివేదికలో వెల్లడించింది. మరీ ముఖ్యంగా కరోనా టైంలో.. రూ.200 కోట్ల నిధులను, వైద్య సిబ్బంది కోసం కేటాయించిన మరో రూ.30 కోట్లను, అత్యవసర ఔషధాలతో పాటు పీపీఈ కిట్ల కోసం కేటాయించిన ఇంకో రూ.83 కోట్లను వినియోగించకుండా పోయిందని తెలిపింది. ఆస్పత్రులకు సంబంధించి కొత్త ప్రాజెక్టుల విషయంలో కాలయాపనతో భారం పెరిగిందని, దీనివల్ల ఢిల్లీలోని ఇతర ఆస్పత్రుల నిర్వహణపై ప్రభావం పడిందని కాగ్ తెలిపింది. ఇదిలా ఉంటే.. ఈ కాగ్ నివేదిక ఇవాళ ఢిల్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.మరోవైపు.. మద్యం విధానంపై కాగ్ రూపొందించిన నివేదిక అంశం ఎన్నికల ముందు పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. 2021-22లో తీసుకొచ్చిన మద్యం విధానం కారణంగా ఢిల్లీ ప్రభుత్వానికి రూ.2,000 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు కాగ్ తేల్చింది. కొత్త మద్యం విధానం కారణంగా అప్పటి ప్రభుత్వం రూ.941.53 కోట్ల ఆదాయం కోల్పోయిందని, లైసెన్సు ఫీజుల కింద మరో రూ.890.15 కోట్లు నష్టపోయిందని, ఇక.. లైసెన్సుదారులకు మినహాయింపుల రూపంలో మరో రూ.144 కోట్లు కోల్పోయినట్లు వెల్లడించింది. ఈ నివేదికను తాజాగా బీజేపీ ప్రభుత్వం(BJP Government) అసెంబ్లీలో ప్రవేశపెట్టి అందులోని అంశాలను బయటపెట్టగా, ఆప్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగింది. దీంతో ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌గా కొనసాగుతున్నాయి. -
ఢిల్లీ అసెంబ్లీ గేట్ వద్ద ఆప్ ఎమ్మెల్యేల నిరసన
న్యూఢిల్లీ: ఆప్‌కు చెందిన ప్రతిపక్ష నేత ఆతిశీ సహా సస్పెండైన ఎమ్మెల్యేలు గురువారం ఢిల్లీ అసెంబ్లీ గేట్ వద్దే ధర్నాకు దిగారు. వారంతా అసెంబ్లీ ఆవరణలోకి వెళ్లేందుకు ప్రయతి్నంచగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, గేటు వెలుపలే నిరసన చేపట్టారు. మంగళవారం అసెంబ్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రసంగం సమయంలో ఆప్ సభ్యులు అంతరాయం కలిగించారు. సీఎం కార్యాలయంలో ఉన్న భగత్ సింగ్, అంబేడ్కర్ చిత్రపటాలను బీజేపీ ప్రభుత్వం తొలగించడంపై ప్లకార్డులతో నిరసనకు దిగారు. దీంతో, ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానం మేరకు ఆప్‌కు చెందిన 22 మంది ఎమ్మెల్యేలకుగాను సభలో ఉన్న 21 మందిని మూడు రోజులపాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ విజేంద్ర గుప్తా ప్రకటించారు. అనంతరం ఆప్ ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీ ప్రాంగణంలో నిరసన తెలిపారు. తిరిగి గురువారం అసెంబ్లీ ప్రారంభమవగానే ఆవరణలోకి వచ్చేందుకు ఆప్ ఎమ్మెల్యేలు ప్రయతి్నంచగా సెక్యూరిటీ సిబ్బంది గేటు వద్దే వారిని అడ్డుకున్నారు. దీనిపై ఆతిశీ మండిపడ్డారు. బీజేపీ నియంతృత్వ పోకడలకు హద్దే లేకుండా పోతోందన్నారు. అసెంబ్లీ గేటు వెలుపలే పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఆమె ధర్నాకు దిగారు. అంబేడ్కర్ ఫొటోలున్న ప్లకార్డులను చేబూని ‘జై భీం, బీజేపీ నియంతృత్వం చెల్లదు’అంటూ కంజర వాయిస్తూ నినాదాలు చేశారు. ‘అసెంబ్లీలో జై భీం అని నినాదాలు చేసినందుకే మమ్మల్ని మూడు రోజుల పాటు సస్పెండ్ చేశారు. ఈ రోజు, మమ్మల్ని అసెంబ్లీ ప్రాంగణంలోకి కూడా అడుగుపెట్టనివ్వలేదు. ఇది చాలా తప్పు. ప్రతిపక్షం గొంతు మీరెలా నొక్కుతారు? యావత్తూ ప్రతిపక్షాన్ని అసెంబ్లీకి దూరంగా ఎలా ఉంచుతారు?’అని ఆప్ ఎమ్మెల్యే కుల్దీప్ కుమార్ ప్రశ్నించారు.మాకు సమయమివ్వండి..: రాష్ట్రపతికి ఆప్ లేఖ శాసన సభ్యులను అసెంబ్లీ ఆవరణలోకి రాకుండా అడ్డుకోవడంపై ఆప్‌నకు చెందిన ప్రతిపక్ష నేత, మాజీ సీఎం ఆతిశీ గురువారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ రాశారు. ‘రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్, షహీద్ భగత్ సింగ్‌ల చిత్రపటాలను బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల నుంచి తొలగించింది. ఈ చర్య ఈ ఇద్దరు మహనీయులకే కాదు, దళితులు, వెనుకబడిన, అణగారిన వర్గాల వారికీ అవమానం. ఈ చర్యను ఆప్ వ్యతిరేకించింది. అసెంబ్లీలో దీనిపై ప్రస్తావించేందుకు ప్రయత్నించిన ఆప్ ఎమ్మెల్యేలను స్పీకర్ మూడు రోజులపాటు అప్రజాస్వామికంగా సస్పెండ్ చేశారు’అని ఆ లేఖలో ఆతిశీ వివరించారు. ‘గురువారం, అసెంబ్లీ గేటు వద్ద భారీ బారికేడ్లు, పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసిన బీజేపీ ప్రభుత్వం శాసనసభ్యులను అసెంబ్లీ ఆవరణలోకి రానివ్వలేదు. ప్రజలెన్నుకున్న ప్రజాప్రతినిధులును శాసనసభలోకి రానివ్వకపోవడం అప్రజాస్వామికం. తీవ్రమైన ఈ విషయంలో మీరు తక్షణమే జోక్యం చేసుకుని, 28వ తేదీన మీతో మాట్లాడేందుకు ఆప్ ఎమ్మెల్యేలకు సమయం ఇవ్వగలరు’అని అందులో కోరారు. -
వైఎస్ జగన్ పరువు నష్టం కేసు విచారణ వాయిదా
ఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి.. తనపై తప్పుడు కథనాలు రాసిన ఈనాడు, ఆంధ్రజ్యోతిలపై వేసిన పరువునష్టం కేసు విచారణ జూలై 16వ తేదీకి వాయిదా పడింది. అమెరికాలో ఆదానీ గ్రూపు పై దాఖలైన కేసులో భాగంగా వైఎస్ జగన్‌పై ఈనాడు, ఆంధ్రజ్యోతిలు తప్పుడు కథనాలు ప్రచురించాయి. దీనిపై వైఎస్ జగన్ రూ. 100 కోట్ల పరువు నష్టం కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టగా, ఈ కేసు ఢిల్లీ హైకోర్టు పరిధిలోకి రాదని ఉషోదయ పబ్లికేషన్స్ అప్లికేషన్ దాఖలు చేసింది. ఆ అప్లికేషన్ కు కౌంటర్ దాఖలు చేస్తామని వైఎస్ జగన్ తరుపు న్యాయవాది దయ కృష్ణన్ హైకోర్టుకు తెలిపారు. దాంతో తదుపరి విచారణ జూలై 16 కు వాయిదా వేసింది ఢిల్లీ హైకోర్టు. -
‘అతడికి ఉరిశిక్ష సరైందే’.. ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్
ముంబై: మహారాష్ట్ర పూణేలోని ఓ పోలీస్ స్టేషన్‌కు కూత వేటు దూరంలో దారుణం జరిగింది. నిలిపి ఉన్న బస్సులో నిందితుడు.. యువతిపై దారుణానికి ఒడిగట్టాడు . ఈ దుర్ఘటనపై మహారాష్ట్ర అధికార శివసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ అధినేత డిప్యూటీ సీఎం అజిత్ పవార్లు ఈ తరహా దారుణాలకు పాల్పడే నిందితుల్ని ఉరితీయాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. బస్సులో జరిగిన దుర్ఘటనపై మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ తరుణంలో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గానికి చెందిన పార్టీ నేతలు గురువారం స్వర్గేట్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన బాట పట్టారు. మహా ప్రభుత్వం మహిళల భద్రత కంటే ఉచితాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ తరుణంలో బస్సు దుర్ఘటనపై ఏక్నాథ్ షిండే స్పందించారు. పుణే ఘటన చాలా దురదృష్టకరం. నిందితులు ఎవరైనా ఉపేక్షించబోం. అలాంటి వారిని ఉరితీయాలి’అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు అజిత్ పవార్ సైతం దారుణంపై మీడియాతో మాట్లాడారు. స్వర్గేట్ బస్ స్టేషన్లో జరిగిన అత్యాచార ఘటన అత్యంత దురదృష్టకరం, బాధాకరం, అవమానకరమైనది. నిందితుడు చేసిన నేరం క్షమించరానిది. ఇలాంటి నేరస్తులకు మరణశిక్ష తప్ప మరొకటి ఉండదు. దారుణంపై సమాచారం అందుకున్న వెంటనే నిందితుల్ని అరెస్ట్ చేయాలని పూణే పోలీసు కమిషనర్‌ను ఆదేశించినట్లు చెప్పారు. ఇంటికి వెళ్లేందుకు.. బస్సు కోసం ఎదురు చూస్తూపూణేలోని నిత్యం రద్దీగా ఉండే స్వర్గేట్ బస్టాండ్‌లో యువతిపై నిందితుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సతారా జిల్లాలోని ఫల్తానా ప్రాంతానికి చెందిన యువతి మంగళవారం తెల్లవారుజామున పోలీస్ స్టేషన్‌కు 100 మీటర్ల దూరంలో ఉన్న స్వర్గేట్ బస్టాండ్‌లో బస్సు కోసం వేచిచూస్తోంది. అసలే ఆలస్యం అవుతుంది. బస్సులు కనిపించడం లేదని యువతి ఆందోళనకు గురైంది. ఆ సమయంలో బాధితురాలికి సమీపంలో దత్తాత్రేయ రాందాస్ గాడే (36) కనిపించాడు. బస్సులు రాకపోకల గురించి ఆరా తీసింది. సమీపంలో ఓ ఉన్న బస్సును చూపిస్తూ.. ఆ బస్సు మీ ఊరు వెళుతుందని నమ్మించే ప్రయత్నించాడు. ప్లాట్‌ఫారమ్ మీదకు రావాల్సిన బస్సు ఆక్కడ ఎందుకు ఆగి ఉంది? ఆగి ఉంటే లైట్లు ఎందుకు ఆర్పేశారు? అని ఇలా ప్రశ్నించింది. దీంతో గాడే.. బస్సులో ప్రయాణికులు ఉన్నారని, అందరూ నిద్రలో ఉండడం వల్ల లైట్లు ఆర్పేశారు. కావాలంటే మీరే చూడండి అంటూ యువతిని నమ్మించాడు. గాడే మాటల్ని నమ్మిన యువతి బస్సు దగ్గరికి వెళ్లింది. ప్రయాణికులు ఉన్నారా? లేరా? అని చూసేందుకు బస్సు డోర్ ఓపెన్ చేసింది. వెంటనే నిందితుడు యువతిని బస్సు లోపలికి లాక్కెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. తనపై జరిగిన దారుణాన్ని తన స్నేహితురాలికి చెప్పడంతో ఈ దుర్ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడిపై పలు కేసులు బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు 8 బృందాలుగా విడిపోయి గాలింపులు చర్యలు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. పోలీసుల గాలింపు చర్యల్లో బస్సులో యువతిపై అత్యాచారానికి పాల్పడింది 36ఏళ్ల దత్తాత్రయ రాందాస్ గాడే అని నిర్ధారించారు. గాడేపై గతంలో దొంగతనం, దోపిడీ, చైన్ స్నాచింగ్ కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఆ కేసుల్లో జైలు శిక్షను అనుభవించి 2019లో నుండి బెయిల్‌పై జైలు నుంచి విడుదలయ్యాడు. తాజాగా, మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. -
రేవంత్.. మెట్రో అడ్డుకున్నట్టు నిరూపించే దమ్ముందా?: కిషన్‌రెడ్డి సవాల్
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోవాలి. నిజంగా రేవంత్‌కు ధైర్యం ఉంటే తాను మెట్రోను అడ్డుకున్నా అనే విషయం నిరూపించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలు మెట్రోపై ప్లానింగ్ ఉందా? అని ప్రశ్నించారు.కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డివి గాలి మాటలు. బెదిరింపు రాజకీయాలకు నేను భయపడను. నేను మెట్రోను అడ్డుకున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నిజంగా రేవంత్‌కు దమ్ము, ధైర్యం ఉంటే ఇది నిరూపించాలి. ఇలాంటి బ్లాక్ మెయిల్ రాజకీయాలను మానుకోవాలి. సీఎం స్థాయి వ్యక్తి అవగాహన లేక మాట్లాడుతున్నారు. ఇలాంటి వ్యక్తి తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉండటం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో.. ప్రధాని నరేంద్ర మోదీని అడిగి.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు ప్రజలకు హామీలు ఇచ్చారా?. హామీల, పథకాల అమలు విషయంలో మాపై తోసేసి చేతులు దులుపుకుంటున్నారు. దమ్ములేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పథకాలకు అవసరమైన వనరులు సమకూర్చుకోవాల్సిన బాధ్యత సీఎంకు లేదా?. ప్రధానికి కాగితం ఇవ్వగానే పనులు అయిపోతాయా? అని ప్రశ్నించారు.అంతకుముందు, ప్రధానితో సమావేశానంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..‘హైదరాబాద్‌లో మెట్రో రెండోదశ ప్రాజెక్టును కేంద్ర క్యాబినెట్ వద్దకు వెళ్లకుండా కిషన్‌రెడ్డే అడ్డుకున్నారు. తన మిత్రుడు కేసీఆర్ పదేళ్లలో చేయని పని ఇప్పుడు చేస్తే రేవంత్‌రెడ్డికి పేరొస్తుందనే అలా చేశారు. నాకు రాష్ట్ర ప్రయోజనాల కంటే పేరు ముఖ్యం కాదు. కావాలంటే అనుమతులు, నిధులు తెప్పించి ఆ పేరును కిషన్‌రెడ్డినే తెచ్చుకోమనండి. నేను కూడా ఆయన పేరే ఊరూరా ప్రచారం చేస్తా. సన్మానిస్తాం అన్నారు. అలాగే, తెలంగాణ అభివృద్ధికి అవసరమైన ఐదు ప్రాజెక్టులకు సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విన్నవించాం. వాటికి అనుమతులు, నిధులు తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లదే. లేకపోతే వారిద్దరూ గుజరాత్‌కో.. ఇంకో రాష్ట్రానికో వెళ్లిపోవాలి. తెలంగాణలో వారికి తిండి దండగ’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. -
చేయూత ఇవ్వండి.. ప్రధాని మోదీకి సీఎం రేవంత్ వినతులు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర పురోభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తమ సహకారాన్ని, ఆర్ధిక చేయూతను అందించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో మెట్రోరైలు ఫేజ్–2కు అనుమతులు, రీజనల్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రైల్, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులకు నిధుల మంజూరు, సెమీ కండక్టర్ మిషన్‌కు అనుమతి విషయంలో సానుకూలంగా స్పందించాలని కోరారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చించేందుకు మంగళవారం రాత్రి ఢిల్లీకి వచ్చిన సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్‌బాబు తదితరులు బుధవారం ఉదయం మోదీని ఆయన అధికారిక నివాసంలో కలిశారు. సుమారు గంటన్నర పాటు జరిగిన ఈ భేటీలో.. రాష్ట్ర ప్రాజెక్టులకు రావాల్సిన అనుమతులు, నిధుల విషయమై వినతులు సమరి్పంచారు. వీటిపై ప్రధాని సానుకూలంగా స్పందించినట్టు భేటీ అనంతరం ముఖ్యమంత్రి తెలిపారు. టన్నెల్ ప్రమాదంపై ప్రధాని ఆరా.. సీఎంతో భేటీ సందర్భంగా ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం, సహాయక చర్యలపై ప్రధాని మోదీ ఆరా తీశారు. టన్నెల్లో ప్రమాదానికి కారణాలను తెలుసుకున్నారు. గత పదేళ్లుగా టన్నెల్ పనులు నిలిచిపోవడంతో.. నీటì ఊటలు పెరిగి, మట్టి వదులు కావడంతో ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమికంగా అంచనా వేశామని సీఎం వివరించారు. ప్రమాదంలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు అన్ని చర్యలు చేపట్టామని.. నిత్యం ఇద్దరు, ముగ్గురు మంత్రులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 12శాఖల అధికారులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని వివరించారు. చిక్కుకున్న వారిని బయటికి తెచ్చేందుకు కేంద్రం తరఫున అవసరమైన అన్ని రకాల సహాయం అందిస్తామని ప్రధాని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కాగా ఈ భేటీలో బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలు చర్చకు రాలేదు. వీటిపై పూర్తిస్థాయి నివేదికలు అందాకే ప్రధానితో చర్చించాలనే ఉద్దేశంతోనే ఈ అంశాలను ప్రస్తావించనట్టు తెలిసింది. ప్రధానికి సీఎం చేసిన వినతులు ఇవీ.. – హైదరాబాద్ మహా నగరంలో మెట్రో రైలు సౌకర్యాన్ని అన్ని ప్రాంతాలకు అందుబాటులోకి తేవడానికి ఉద్దేశించిన హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్–2కు అనుమతులివ్వాలి. గత ప్రభుత్వం పదేళ్లుగా హైదరాబాద్‌లో మెట్రో విస్తరణపై దృష్టి సారించలేదు. నగరంలో ఫేజ్–2 కింద రూ.24,269 కోట్ల అంచనా వ్యయంతో 76.4 కిలోమీటర్ల పొడవైన ఐదు కారిడార్లను ప్రతిపాదించాం. ఈ ప్రాజెక్టును వెంటనే అనుమతించాలి. – రీజనల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగంలో ఇప్పటికే 90శాతం భూసేకరణ పూర్తయినందున.. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని కూడా వెంటనే మంజూరు చేయాలి. ఉత్తర భాగంతో పాటే దక్షిణ భాగం పూర్తయితే ఆర్ఆర్ఆర్ను పూర్తిగా సద్వినియోగం చేసుకోగలం. దక్షిణ భాగం భూసేకరణకు అయ్యే వ్యయంలో 50శాతం భరించేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉంది. ఆర్ఆర్ఆర్కు సమాంతరంగా రీజనల్ రింగ్ రైలు ప్రాజెక్టు ప్రతిపాదన ఉంది. ఈ రైలు పూర్తయితే తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల్లోని రైలు మార్గాలతో అనుసంధానం సులభం అవుతుంది. ఈ మేరకు రీజనల్ రింగ్ రైలుకు అనుమతి ఇవ్వాలి. సముద్ర మార్గం లేని తెలంగాణకు వస్తువుల ఎగుమతులు, దిగుమతులు సులువుగా చేసేందుకు రీజనల్ రింగు రోడ్డు సమీపంలో డ్రైపోర్ట్ అవసరం. ఆ డ్రైపోర్ట్ నుంచి ఏపీలోని సముద్ర పోర్టులను కలిపేందుకు గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు, దానికి ఆనుకొని రైలు మార్గం మంజూరు చేయాలి. – తెలంగాణ సంస్కృతి, ఆధ్యాత్మీకత మూసీ నదితో ముడిపడి ఉంది. రాజధాని హైదరాబాద్ నగరం మధ్యలో ప్రవహిస్తున్న దృష్ట్యా.. మూసీ పునరుజ్జీవనానికి సహకరించాలి. ఈసా, మూసా నదుల సంగమంలో ఉన్న బాపూఘాట్ అభివృద్ధి, మూసీ ప్రక్షాళనకు 27 ఎస్టీపీల నిర్మాణం, మూసీ రిటైనింగ్ వాల్స్, కరకట్టల నిర్మాణం, మూసీ–గోదావరి నదుల అనుసంధానంతో కలిపి మొత్తంగా ప్రాజెక్టుకు రూ.20 వేల కోట్లు ఆర్థిక సాయం అందజేయాలి. బాపూఘాట్ వద్ద గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం 222.7 ఎకరాల రక్షణ భూములను బదిలీ చేసేందుకు సహకరించాలి. – రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు 61 ఐపీఎస్ కేడర్ పోస్టులు రాగా.. 2015లో రివ్యూ తర్వాత మరో 15 పోస్టులు అదనంగా వచ్చాయి. సైబర్ నేరాలు, డ్రగ్స్ కేసులు పెరగడం, రాష్ట్రంలో పెరిగిన పట్టణాలు, ఇతర అవసరాల దృష్ట్యా తెలంగాణకు అదనంగా 29 ఐపీఎస్ పోస్టులు మంజూరు చేయండి – సెమీ కండక్టర్ల పరిశ్రమ ఏర్పాటుకు అనువైన పరిస్థితులు తెలంగాణలో ఉన్నందున ఇండియా సెమీ కండక్టర్ మిషన్ ప్రాజెక్టును రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు అనుమతించాలి. -
నిర్మాత కేదార్ మరణంపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి,ఢిల్లీ : టాలీవుడ్ నిర్మాత కేదార్ సెలగంశెట్టి (Kedar Selagamsetty) మరణంపై సీఎం రేవంత్‌రెడ్డి (cm revanth reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. దుబాయ్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బిజినెస్ పార్ట్నర్ ఫ్రెండ్ కేదార్ చనిపోవడం వెనక మిస్టరీ ఏమిటి? అంటూ ఆయన ప్రశ్నించారు. కేటీఆర్ దానిపైన ఎందుకు విచారణ కోరడం లేదు? రాడిసన్ కేసులో కేదార్ నిందితుడుగా ఉన్నారని రేవంత్ అన్నారు.‘‘కేసులతో సంబంధం ఉన్నవారు వరుసగా చనిపోవడం వెనుక ఉన్న మిస్టరీ ఏమిటి? ముందు సంజీవరెడ్డి, తర్వాత రాజలింగం, ఇప్పుడు కేదార్.. వారి మరణాల వెనకాల మిస్టరీ ఉంది. దీనిపైన కేటీఆర్ ఎందుకు విచారణ కోరలేదు ఫిర్యాదులు వస్తే దర్యాప్తు చేస్తాం’’ అని రేవంత్ చెప్పారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆయన అధికారిక నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ఉదయం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ముఖ్యమంత్రి .. ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం జరిగిన మీడియా చిట్‌చాట్‌లో రేవంత్ మాట్లాడారు.ప్రధాని మోదీతో సీఎం రేవంత్ చర్చప్రధాని మోదీతో ఐదు అంశాలపై చర్చించినట్లు సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో జరిపిన చిట్‌చాట్‌లో తెలిపారు. ప్రధానంగా హైదరాబాద్ మెట్రో రైల్ పేజ్ 2 విస్తరణ, దక్షిణభాగానికి రీజినల్ రింగ్ రోడ్డు అనుమతి, రీజినల్ రింగ్ రైల్వే ఏర్పాటు, మూసి పునరుజ్జీవన ప్రాజెక్టుకు ఆర్ధిక సహాయం, మూసి గోదావరి లింకు కోసం ఆర్థిక సహాయం, రాష్ట్రంలో పెరిగిన పట్టణాలు, ఇతర అవసరాల దృష్ట్యా తెలంగాణకు అదనంగా 29 ఐపీఎస్ పోస్టులు మంజూరు చేయాలని పీఎం మోదీని కోరినట్లు చెప్పారు. ఎస్ఎల్బీసీ ప్రమాదంపై ప్రధాని మోదీ ఆరాఇక శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (slbc) సొరంగ మార్గంలో ప్రమాదంపై ప్రధాని మోదీ ఆరా తీశారు. సొరంగంలో గల్లంతైన ఎనిమిది మందిని కాపాడే చర్యలు గురించి ఆరా తీసినట్లు రేవంత్ చిట్‌చాట్‌లో చెప్పారు. 11 శాఖలు సమన్వయంతో రెస్క్ ఆపరేషన్స్ చేస్తున్నామని, సొరంగంలో గల్లంతైన ఎనిమిది మందిని కాపాడే చర్యలు కొనసాగిస్తూనే.. ప్రమాదానికి కారణాలేంటి, దీని నుంచి ఎలా బయటపడాలనే కోణంలో ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోందని బదులిచ్చామన్నారు. -
Jammu and Kashmir: ఆర్మీ వాహనంపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పుల కలకలం సృష్టిస్తున్నాయి. పెట్రోలింగ్ చేస్తున్న ఆర్మీ జవాన్ల వాహనంపై ఉగ్రవాదులు నాలుగు రౌండ్లు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.బుధవారం జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా సుందర్ మానీ బల్లా రోడ్డు, ఫాల్ గ్రామం సమీపంలో మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న ఆర్మీ జవాన్ల వాహనంపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని డిఫెన్స్ అధికార ప్రతినిథి తెలిపారు.ఉగ్రవాదుల కాల్పులపై సమాచారం అందుకున్న వెంటనే ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నామని డిఫెన్స్ అధికార ప్రతినిథి వెల్లడించారు. అనంతరం, ఉగ్రవాదుల ఏరివేతకు సెర్చ్ ఆపరేషన్‌ను మొదలు పెట్టినట్లు చెప్పారు. ప్రస్తుతం, ఉగ్రవాదుల కోసం సుందర్ బానీ ఏరియా మొత్తాన్ని ఆర్మీ జవాన్లు జల్లెడ పడుతున్నారు. -
ఆప్ సర్ప్రైజ్.. ఎంపీగా కేజ్రీవాల్?
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత సైలెంట్ అవుతారని భావించిన మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal).. పార్టీ కన్వీనర్ హోదాలో క్రమం తప్పకుండా పార్టీ మీటింగ్‌లకు హాజరవుతూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఆయన రాజ్యసభకు వెళ్లబోతున్నారంటూ ఓ ప్రచారం తెర మీదకు వచ్చింది.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోర పరాజయం చవిచూసింది. మాజీ సీఎం కేజ్రీవాల్ కూడా ఓడిపోవడంతో ఢిల్లీ రాజకీయాలకు ఆయన శాశ్వతంగా దూరం అవుతారని, అందుకు ‘లిక్కర్ స్కామ్’ అవినీతి మరకే కారణమని విశ్లేషణలు నడిచాయి. ఈ కారణంగానే ప్రతిపక్ష నేతగా అతిషీని ఎంపిక చేశారని కూడా చర్చ జరిగింది. ఈ క్రమంలో..పంజాబ్ లూథియానా వెస్ట్ నియోజకవర్గ ఉప ఎన్నికకు ఆప్ ఆశ్చర్యకరరీతిలో అభ్యర్థిని ఎంపిక చేసింది. కిందటి నెలలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గురుప్రీత్ గోగి మృతి చెందారు. దీంతో.. రాజ్యసభ ఎంపీ సంజీవ్ అరోరాను ఆ అసెంబ్లీ ఉప ఎన్నికకు అభ్యర్థిగా ఈ ఉదయం ప్రకటించింది ఆప్. సంజీవ్ అరోరా(Sanjeev Arora) 2022లో ఆప్ తరఫున పంజాబ్ రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన పదవీకాలం 2028తో ముగియనుంది. దీంతో అరోరాను అసెంబ్లీకి పంపి.. ఆ ఎంపీ సీటును కేజ్రీవాల్‌కు అప్పజెప్పబోతున్నారన్నది ఆ ప్రచార సారాంశం. లూథియానా వెస్ట్ ఉప ఎన్నికకు ఈసీ ఇంకా షెడ్యూల్ ప్రకటించలేదు. అయితే ఆర్నెల్ల లోపు ఎన్నిక నిర్వహించాలన్న నిబంధన ప్రకారం.. జులై 11లోపు ఈ ఉపన్నిక జరిగే అవకాశం ఉంది.అందుకేనా సమీక్షలు!ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత.. పంజాబ్ ఆప్ కేడర్‌తో కేజ్రీవాల్ వరుసబెట్టి సమావేశాలు జరిపారు. ఒకానొక టైంలో.. భగవంత్ మాన్‌ను తప్పించి కేజ్రీవాల్ పంజాబ్ సీఎం అవుతారంటూ ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. అయితే ఆ చర్చల సారాంశం.. బహుశా రాజ్యసభ స్థానం కోసమే అయి ఉంటుందని ఇప్పుడు జోరుగా చర్చ నడుస్తోంది. -
ప్రధాని మోదీతో రేవంత్ భేటీ.. మెట్రో, ఆర్ఆర్ఆర్పై చర్చ
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం సమావేశం ముగిసింది. సుమారు గంటన్నర పాటుగా ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ సహా మంత్రి శ్రీధర్ బాబు, చీఫ్ సెక్రటరీ శాంత కుమారి, తెలంగాణ డీజీపీ జితేందర్ కూడా పాల్గొన్నారు. ప్రధాని మోదీతో సమావేశం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. తెలంగాణలో చేపట్టిన పలు ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. మెట్రో ఫేజ్-2 లైన్ ఎయిర్పోర్ట్ పొడిగింపు, దానికి కావాల్సిన ఆర్థిక సహాయం అనుమతులు, మూసీ నది సుందరీకరణ నిధులు, కేంద్రం నుంచి వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నిధులు, తెలంగాణకు ఐటీఐఆర్, ఐఐఎం, రీజనల్ రింగ్ రోడ్డుకు అనుమతులు, ఆర్థిక సహాయం గురించి చర్చించినట్టు తెలుస్తోంది. -
అరగంటలో 350 కిలోమీటర్ల జర్నీ!
న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి జైపూర్(రాజస్థాన్) మధ్య దూరం 300 కిలోమీటర్లు ఉంటుంది. అంతటి దూరాన్ని నిమిషాల్లో చేరుకోగలిగితే ఎలా ఉంటుంది?.. ఇలాంటి హైస్పీడ్ ప్రయాణం కోసం కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ తొలి అడుగు వేసింది. ఐఐటీ మద్రాస్ ఆలోచనతో భారత తొలి హైపర్‌లూప్ టెస్ట్ ట్రాక్ సిద్ధమైంది. హైపర్‌లూప్(Hyperloop) అనేది అత్యంత అధునాతనమైన రవాణా వ్యవస్థ. గంటకు వెయ్యి కిలోమీటర్ల ప్రయాణం ఈ రవాణా వ్యవస్థ లక్ష్యం. సుదుర గమ్యాలను నిమిషాల వ్యవధిలో చేరుకునేలా చేయడమే దీని ఉద్దేశం. అందుకే దీన్ని రవాణా వ్యవస్థలో హైపర్‌లూప్‌ను గేమ్ ఛేంజర్‌గా భావిస్తున్నారు. వందేభారత్ తర్వాత బుల్లెట్ రైల్ మీద దృష్టిసారించిన భారతీయ రైల్వే(Indian Railways) ఇప్పుడు మరో ఘనత వైపు అడుగులేస్తోంది. భారత తొలి హైపర్‌లూప్ టెస్ట్ ట్రాక్ వివరాలను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్(Ashwini Vaishnaw) మీడియాకు తెలియజేశారు. ఐఐటీ మద్రాస్ సహకారంతో 422 మీటర్ల దూరం ఉన్న ట్రాక్‌ను రూపొందించారు. ఈ హైపర్‌లూప్ ప్రాజెక్టు వాస్తవరూపం దాలిస్తే అరగంటలోపే ఢిల్లీ నుంచి జైపూర్‌కు చేరుకోవచ్చన్నమాట. The hyperloop project at @iitmadras; Government-academia collaboration is driving innovation in futuristic transportation. pic.twitter.com/S1r1wirK5o— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) February 24, 2025రోడ్డు, రైలు, నీరు, వాయు రవాణా మార్గాల తర్వాత ఫిఫ్త్ ట్రాన్స్‌పోర్టేషన్‌గా హైపర్లూర్ను చెబుతుంటారు. వాక్యూమ్ ట్యూబ్స్‌లో పాడ్స్ ద్వారా ప్రయాణమే హైపర్‌లూప్. గొట్టాల్లాంటి ఆ నిర్మాణాల్లో గాలి నిరోధకత.. పాడ్లను అధిక వేగంతో ప్రయాణించేలా చేస్తుంది. 2013లో ఇలాన్ మస్క్ ప్రచారంతో దీని గురించి ఎక్కువ చర్చ నడిచింది. అమెరికా, చైనా ఇలా చాలా దేశాలు ఈ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నాయి. ప్రధాన నగరాలను అనుసంధానించడం కోసమైనా హైపర్‌లూప్ టెక్నాలజీ వినియోగంలోకి తేవాలని యూఏఈ సైతం భావిస్తోంది. -
మాజీ ఎంపీ సజ్జన్ కుమార్‌కు జీవిత ఖైదు
న్యూఢిల్లీ: 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో మాజీ ఎంపీ సజ్జన్ కుమార్(Sajjan Kumar)కు జీవితఖైదు పడింది. అల్లర్లలో తండ్రీకొడుకుల హత్య కేసులో ఆయన ప్రమేయాన్ని నిర్దారించిన ఢిల్లీ ప్రత్యేక న్యాయస్థానం.. ఇదివరకే దోషిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయనకు శిక్ష ఖరారు చేస్తూ స్పెషల్ జడ్జి కావేరీ భవేజా ఆదేశాలు జారీ చేశారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్యానంతరం ఒక పెద్ద గంపు మారణాయుధాలతో విరుచుకుపడింది. సిక్కులను లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున లూటీలు, గృహదహనాలకు పాల్పడింది. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల(Anti Sikh Riots)లో భాగంగా నవంబర్ 1న సరస్వతి విహార్ ప్రాంతంలో అల్లరిమూక.. జస్వంత్ సింగ్, ఆయన కుమారుడు తరుణ్ దీప్ సింగ్‌ను హతమార్చింది. ఆపై ఆ ఇంట దోపిడీకి పాల్పడింది. ప్రత్యక్ష సాక్షి, జస్వంత్ భార్య ఫిర్యాదుతో కేసు నమోదు అయ్యింది.సజ్జన్ కుమార్ కేవలం ఈ అల్లర్లలో పాల్పొనడమే కాకుండా ఆ గుంపునకు నాయకత్వం వహించాడని, ఇందుకు తగిన సాక్ష్యాలు లభించాయని పేర్కొంటూ ఫిబ్రవరి 12వ తేదీ స్పెషల్ కోర్టు ఆయన్ని దోషిగా తేల్చింది. సజ్జన్ కుమార్‌కు మరణశిక్ష విధించాలన్న జస్వంత్ భార్య పిటిషన్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ఆయనకు జీవితఖైదు(Life Imprisonment) విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉంటే.. పంజాబీ బాఘ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు. అయితే 2015లో అమిత్ షా(Amit Shah) చొరవతో అప్పట్లో ఈ కేసును సిట్ దర్యాప్తు చేసింది. మరోవైపు.. 2021, డిసెంబర్ 16వ తేదీన సజ్జన్ కుమార్‌పై కోర్టు అభియోగాలను నమోదు చేసింది. ఎవరీ సజ్జన్ కుమార్?ఢిల్లీలో ఓ బేకరీ ఓనర్ అయిన సజ్జన్ కుమార్‌కు.. సంజయ్ గాంధీతో దగ్గరి సంబంధాలు ఏర్పడ్డాయి. అలా ఢిల్లీ కౌన్సిలర్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. 1980లో ఔటర్ ఢిల్లీ నుంచి లోక్‌సభకు తొలిసారి గెలిచారు. 1991, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున అదే స్థానానికి ఆయన ఎన్నికయ్యారు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక ఓట్లు (8,55,543)పోలైన నేతగా రికార్డు సృష్టించారు. అయితే.. 2018లో సిక్కుల ఊచకోత కేసులో దోషిగా కోర్టు ప్రకటించడంతో ఆయన కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వచ్చింది.సజ్జన్‌కు శిక్ష-ఎప్పుడు ఏం జరిగిందంటే.. 1991: అల్లర్లలో జస్వంత్, తరుణ్ దీప్ సింగ్‌ల హత్యపై కేసు నమోదు1994: జులై 8 సరైన ఆధారాలు లేవని చెబుతూ సజ్జన్ కుమార్ విచారణకు ఢిల్లీ కోర్టు నిరాకరణ2015 ఫిబ్రవరి 12: సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం2016 నవంబర్ 21: మరింత దర్యాప్తు అవసరమని కోర్టుకు తెలిపిన సిట్2021 ఏప్రిల్ 06: సజ్జన్ కుమార్ అరెస్ట్2021 మే 5 : సజ్జన్‌పై పోలీసుల ఛార్జ్‌షీట్ నమోదు2021, జులై 26: ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం2021, అక్టోబర్ 1: కోర్టులో వాదనలు ప్రారంభం2021, డిసెంబర్ 16: సజ్జన్ కుమార్‌పై అభియోగాలు నమోదు చేసిన కోర్టుజనవరి 31, 2024: సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో తుది వాదనలు విన్న కోర్టు2024, నవంబర్ 8: వాదనలు పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ప్రత్యేక కోర్టు2025, ఫిబ్రవరి 12: సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో సజ్జన్ కుమార్‌ను దోషిగా తేల్చిన ఢిల్లీ కోర్టు2025, ఫిబ్రవరి 25: సజ్జన్ కుమార్‌కు జీవితఖైదు ఖరారునానావతి కమిషన్ నివేదిక ప్రకారం.. 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లలో మొత్తం 2,733 మంది మరణించారు. మొత్తం 587 ఎఫ్ఐఆర్లలో కేవలం 28లో మాత్రమే 400 మందికి శిక్షలు పడ్డాయి. ఇప్పటికే యావజ్జీవంఇక ఢిల్లీ కంటోన్మెంట్(Delhi Cantonment)లో జరిగిన మరో సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో ఆయనకు గతంలోనే యావజ్జీవ కారాగార శిక్ష పడింది. 1984 సిక్కు అల్లర్ల కేసులో సజ్జన్ కుమార్‌ను దోషిగా నిర్దారిస్తూ 2018లో ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది . ఆయనకు యావజ్జీవ జైలుశిక్ష పడడంతో.. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. -
ప్రభుత్వానికి రూ.2వేల కోట్ల నష్టం.. ఢిల్లీ మద్యం పాలసీపై కాగ్ రిపోర్ట్
ఢిల్లీ : దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంతో ప్రభుత్వానికి రూ.2002 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు కాగ్ నివేదిక తెలిపింది. ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీ ప్రభుత్వం కాగ్ నివేదికను ప్రవేశపెట్టింది. తాజా కాగ్ నివేదికతో కోర్టు విచారణ మరింత బలోపేతం అవుతుందని బీజేపీ వర్గాలు అంటున్నాయి.కాగా, నవంబర్ 2021 నుంచి సెప్టెంబర్ 2022 వరకు నూతన మద్యం విధానం కొనసాగింది. కుంభకోణం వెలుగు చూడడంతో నూతన మద్యం విధానం రద్దయ్యింది. ఈ లిక్కర్ స్కామ్‌లో అరవింద్ కేజ్రీవాల్ , మనీష్ సిసోడియా, కవిత సహా పలువురు కీలక నేతలు జైలు శిక్షను అనుభవించారు. -
సుప్రీంకోర్టులో వైఎస్సార్సీపీ నేతలకు ఊరట
సాక్షి, ఢిల్లీ: టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, జోగి రమేష్, దేవినేని అవినాష్ సహా 24 మందికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. విచారణ జరిపిన జస్టిస్ సుధాంశు దులియా ధర్మాసనం.. షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు.. విచారణకు సహకరించాలని ఆదేశించింది. ఏపీ ప్రభుత్వం తరువు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా.. బెయిల్‌ను వ్యతిరేకించగా, ఈ కేసుపైనే ఎందుకు స్పెషల్ అటెన్షన్ అంటూ సిద్ధార్థ లూత్రాను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ.. ఇది రాజకీయపరమైన కేసు అని.. పాస్ పోర్ట్‌ను ఇప్పటికే సరెండర్ చేశామన్నారు. దాడికి పాల్పడ్డ 30 మందికి ఏపీ హై కోర్టు ఇప్పటికే రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. టీడీపీ ఆఫీస్‌పై దాడి జరిగిన రోజు అక్కడ లేరు. వీళ్ల ప్రమేయంపై ఎలాంటి ఆధారాలు లేవు’’ అని కపిల్ సిబల్ పేర్కొన్నారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి, న్యాయవాది అల్లంకి రమేష్ హాజరయ్యారు. -
రీజనబుల్ టైం అంటే మూడు నెలలే..! సుప్రీం కోర్టులో బీఆర్ఎస్ వాదన
న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల(Telangana Defected MLAs) వ్యవహారంపై సుప్రీం కోర్టు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన తమ పది మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ బీఆర్ఎస్ పార్టీ వేర్వేరుగా రెండు పిటిషన్లను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా.. రీజనబుల్ టైం అంటే ఎంతో కచ్చితంగా చెప్పాలంటూ తెలంగాణ స్పీకర్‌ను కోరింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యల కోసం రీజనబుల్ టైం కోసం స్పీకర్ ఎదురు చూస్తున్నారని అసెంబ్లీ కార్యదర్శి తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి మరోసారి సుప్రీం కోర్టుకు తెలిపారు. అయితే.. సుప్రీంకోర్టు గత తీర్పుల ప్రకారం రీజనబుల్ టైమ్ అంటే మూడు నెలలు మాత్రమేనని బీఆర్ఎస్ వాదించింది. ఈ నేపథ్యంలో ఆ రీజనబుల్ టైం ఎంతో చెప్పాలంటూ కోర్టు తెలంగాణ స్పీకర్‌ను ప్రశ్నిస్తూ.. విచారణ వాయిదా వేసింది. మార్చి 4వ తేదీన బీఆర్ఎస్ పిటిషన్లపై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం మరోసారి విచారించనుంది.ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రావు సహా 10 మంది విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేయడం లేదంటూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి పిటిషన్ వేశారు. అలాగే.. ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు అమలు చేయడం లేదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మరో పిటిషన్ వేశారు. ఈ రెండు పిటిషన్లను కలిపి ద్విసభ్య ధర్మాసనం విచారిస్తోంది.ఆ పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా తెలంగాణ స్పీకర్‌ను ఆదేశించాలని బీఆర్ఎస్ సుప్రీం కోర్టును అభ్యర్థిస్తోంది. ఈ క్రమంలో గత వాదనల్లో.. తెలంగాణ స్పీకర్(Telangana Speaker) తీరుపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తగిన సమయం.. సరైన సమయం.. అంటూ స్పీకర్ చెబుతూ కాలయాపన చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. మహారాష్ట్ర తరహాలో ఎమ్మెల్యేల పదవీకాలం ముగిసేదాకా ఆగుతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్లపై పూర్తి వాదనలు విన్నాకే ‘ఆ సరైన సమయం’పై తామే ఓ నిర్ణయం తీసుకుంటామని, అవసరమైతే స్పీకర్‌కు సూచనలు చేయడానికి ఉన్న అవకాశాలను కూడా పరిశీలిస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడనుందా అనే ఆసక్తి నెలకొంది.నిబంధనల ప్రకారం పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారని గత విచారణలో అసెంబ్లీ కార్యదర్శి తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి కోర్టుకు తెలిపారు. అయితే సుప్రీం కోర్టు జోక్యం తర్వాతే స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు జారీ అయ్యాయని బీఆర్ఎస్ అంటోంది. -
ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌గా విజేందర్ గుప్తా
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌గా అధికార బీజేపీ శాసనసభ్యుడు విజేందర్ గుప్తా ఎన్నికయ్యారు. కొత్తగా కొలువుదీరిన ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి మొదలయ్యాయి. సెషన్ ప్రారంభానికి ముందు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా బీజేపీ ఎమ్మెల్యే అర్వీందర్ సింగ్ లవ్లీతో ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేయించారు. అత్యంత సీనియర్ ఎమ్మెల్యే అయిన లవ్లీ నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరితో ప్రమాణం చేయించారు. అనంతరం, మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన గుప్తా పేరును స్పీకర్ పదవికి ప్రతిపాదిస్తూ సీఎం రేఖా గుప్తా, మంత్రి రవీందర్ ఇంద్రజ్ రెండు తీర్మానాలను ప్రవేశపెట్టగా, వీటిని మంత్రులు పర్వేశ్ వర్మ, మంజిందర్ సింగ్ బలపరిచారు. మూడువాణి ఓటుతో తీర్మానాలను సభ ఆమోదించిందని ప్రొటెం స్పీకర్ అర్వీందర్ సింగ్ లవ్లీ ప్రకటించారు. దీంతో, సీఎం రేఖా గుప్తా, ప్రతిపక్ష నేత ఆతిశీ వెంట రాగా కొత్త స్పీకర్ కుర్చీలో ఆసీనులయ్యారు. స్పీకర్ విజేందర్ గుప్తాకు సీఎం రేఖా గుప్తా శుభాకాంక్షలు తెలపగా, ఆప్‌కు చెందిన ప్రతిపక్ష నేత ఆతిశీ మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశారు. దళిత, సిక్కు వ్యతిరేక పార్టీ ఢిల్లీ అసెంబ్లీకి సారథ్యం వహించడం దురదృష్టకరమంటూ వ్యాఖ్యానించారు. సీఎం కార్యాలయంలో బీఆర్ అంబేడ్కర్, భగత్ సింగ్‌ల ఫొటోలను తీసేయడం చూస్తే బీజేపీ దళిత వ్యతిరేక వైఖరి తేటతెల్లమవుతోందని ఆరోపించారు. దీంతో, సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. అధికార, ప్రతిపక్ష సభ్యుల పోటాపోటీ నినాదాలతో సభ 15 నిమిషాలపాటు వాయిదా పడింది. ఢిల్లీ సీఎం కార్యాలయంలో బీఆర్ అంబేడ్కర్ చిత్రపటాన్ని తొలగించవద్దని అనంతరం ఆప్ చీఫ్ కేజ్రీవాల్ ‘ఎక్స్’లో బీజేపీని కోరారు. ప్రధాని మోదీ ఫొటో పెట్టి, అంబేడ్కర్ ఫొటోను తీసేయడం కోట్లాది మంది ఆయన అనుచరుల మనస్సులను గాయపరిచినట్లేనన్నారు.ఆరు భాషల్లో ఎమ్మెల్యేల ప్రమాణంసెషన్ ప్రారంభానికి ముందు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా బీజేపీ ఎమ్మెల్యే అర్వీందర్ సింగ్ లవ్లీతో ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేయించారు. అత్యంత సీనియర్ ఎమ్మెల్యే అయిన లవ్లీ నూతన ఎమ్మెల్యేలందరితో ప్రమాణం చేయించారు. వీరు హిందీ, ఇంగ్లిష్, సంస్కృతం, ఉర్దూ, మైథిలి, పంజాబీ భాషల్లో ప్రమాణం చేయడంతో అసెంబ్లీలో భాషాపరమైన వైవిధ్యం ప్రతిఫలించింది. -
‘ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ’ నగారా
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. ఏపీ, తెలంగాణలో 10 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 29న ఖాళీ అయ్యే ఈ స్థానాలకు గాను మార్చి 3న నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ఈసీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. అదే నెల 20న ఎన్నికలు జరుగుతాయని పేర్కొంది. అదేరోజు ఓట్ల లెక్కింపు ఉంటుంది. కాగా ఏపీలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు కూడా ఇదే సమయంలో ఎన్నికలు జరుగుతాయని ఈసీ ప్రకటించింది. మార్చి 24 లోపు ఈ ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తి అవుతుందని తెలిపింది. తెలంగాణలో మండలి ఎన్నికల సందడిసాక్షి, హైదరాబాద్: శాసనమండలిలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల కోటా స్థానాలకు జరగనున్న ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ముగియనుంది. మరోవైపు శానసమండలిలో ఎమ్మెల్యేల కోటాలో వచ్చే నెల 29న ఖాళీ అయ్యే ఐదు స్థానాల్లో ఎన్నికకు సంబంధించి సోమవారం షెడ్యూల్ విడుదలైంది. 40 మంది సభ్యులు ఉన్న శాసనమండలిలో 8 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుండటంతో రాష్టంలో రాజకీయ సందడి జోరందుకుంది. టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ముమ్మర ప్రచారం జరుగుతోంది. మంగళవారం చివరిరోజు కావడంతో పార్టీలు ఆఖరి నిమిషంలో చేయాల్సిన ప్రయత్నాలతో పాటు, పోలింగ్‌కు అవసరమైన సన్నద్ధత, ఓటర్లను ఆకర్షించే ఎత్తుగడలపై దృష్టి పెట్టాయి. ఇక ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయ్యే ఐదు స్థానాల్లో ఎవరికి ఎన్ని సీట్లు దక్కే అవకాశం ఉందనే దానిపై కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం వర్గాలో చర్చ జరుగుతోంది. రిటైరవుతున్నది వీరే.. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన శాసనమండలి ఎన్నికల షెడ్యూల్ ప్రకారం మార్చి 29న ఎమ్మెల్యే కోటాలో ఐదుగురు ఎమ్మెల్సీలు రిటైర్ అవుతున్నారు. వీరిలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, శేరి సుభాష్ రెడ్డి, యెగ్గె మల్లేశం (ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్నారు)తో పాటు ఎంఐఎంకు చెందిన మీర్జా రియాజుల్ హసన్ ఎఫెండీ ఉన్నారు. ఎమ్మెల్యే కోటాలో ఒక్కో ఎమ్మెల్సీ ఎన్నికకు 24 మంది శాసనసభ్యుల మద్దతు అవసరం ఉంటుంది. అసెంబ్లీలో ప్రస్తుతం కాంగ్రెస్‌కు 65, బీజేపీకి 8, ఎంఐఎంకు 7, సీపీఐకి ఒక ఎమ్మెల్యే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్కు 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ న్యాయపోరాటం చేస్తోంది. ఎంఐఎం మద్దతుతో కాంగ్రెస్ మూడు స్థానాలను సునాయాసంగా దక్కించుకునే అవకాశముంది. మరోవైపు బీఆర్ఎస్లో కొనసాగుతున్న 28 మంది ఎమ్మెల్యేలతో ఒక ఎమ్మెల్సీ పదవి కచి్చతంగా దక్కుతుంది. ఐదో ఎమ్మెల్సీ పదవి ఎన్నికలో బీఆర్ఎస్ను వీడిన ఎమ్మెల్యేలు, బీజేపీ శాసనసభ్యులు అత్యంత కీలకంగా మారనున్నారు. గతంలో బీఆర్ఎస్ మద్దతుతో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సీటు ను దక్కించుకున్న ఎంఐఎం ప్రస్తుతం ఎలాంటి వైఖరి అనుసరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. టీచర్, గ్రాడ్యుయేట్ కోటా ఈ ముగ్గురు.. శాసనమండలిలో మార్చి 29న ఉపాధ్యాయ కోటాలో ‘మెదక్ –ఆదిలాబాద్– నిజామాబాద్ –కరీంనగర్’ఎమ్మెల్సీ కూర రఘోత్తమ్‌రెడ్డి (పీఆర్టీయూ), ‘వరంగల్– ఖమ్మం –నల్లగొండ’ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి (స్వతంత్ర), పట్టభద్రుల కోటాలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి (మెదక్– నిజామాబాద్ –ఆదిలాబాద్– కరీంనగర్) రిటైర్ అవుతున్నారు. ఈ మూడు స్థానాల్లో ఎన్నికకు సంబంధించి ఈ నెల 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. ‘మెదక్ –నిజామాబాద్ –ఆదిలాబాద్– కరీంనగర్’పట్టభద్రుల స్థానంలో 56 మంది, ‘మెదక్ –నిజామాబాద్ –ఆదిలాబాద్– కరీంనగర్’ఉపాధ్యా య స్థానంలో 15, ‘వరంగల్ –ఖమ్మం– నల్లగొండ’ఉపాధ్యాయ స్థానంలో 19 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పట్టభద్రుల కోటా స్థానంలో కాంగ్రెస్, బీజేపీ తరఫున అభ్యర్థులు పోటీలో ఉండగా, బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉంది. ఆగస్టులో మరొకటి ఖాళీ హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా నుంచి మండలికి ఎన్నికైన ఎంఎస్ ప్రభాకర్ రావు పదవీ కాలం ఆగస్టు 6న పూర్తవుతోంది. బీఆర్ఎస్ నుంచి మండలికి ఎన్నికైన ప్రభాకర్ ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్నారు. గవర్నర్ కోటాలో మండలికి నామినేట్ అయిన బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్, గోరటి వెంకన్న వచ్చే ఏడాది నవంబర్‌లో రిటైర్ అవుతారు. మండలిలో స్థానిక సంస్థల కోటాలో 14 మంది సభ్యులకు గాను 2028లో ఏకంగా 12 మంది పదవీ కాలం పూర్తవుతుంది. మొత్తంగా 2027లో 9, 2028లో 14 మంది, 2029లో ఐదుగురు, 2030లో ఇద్దరేసి ఎమ్మెల్సీల చొప్పున రిటైర్ అవుతారు. ప్రస్తుతమున్న మండలి సభ్యుల్లో గవర్నర్ కోటాలో నామినేట్ అయిన అమేర్ అలీఖాన్ (కాంగ్రెస్), ప్రొఫెసర్ కోదండరాం (టీజేఎస్) ఆరేళ్ల పదవీ కాలం 2030లో పూర్తి చేసుకుంటారు. -
ఉద్యోగానికి ‘ఇంటర్న్’ బాట
సాక్షి, ఎడ్యుకేషన్: దేశంలోని యువతకు ఉద్యోగ సాధన కోసం అవసరమయ్యే క్షేత్రస్థాయి నైపుణ్యాలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం గత ఏడాది అమల్లోకి తెచ్చిన ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్ స్కీమ్ (పీఎంఐఎస్)కు ఆదరణ లభిస్తోంది. పదో తరగతి, ఇంటర్మిడియెట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ వంటి కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ఆన్ జాబ్ ట్రైనింగ్ అవకాశం కల్పించడంతోపాటు నెలకు రూ.5 వేలు చొప్పున స్టైపెండ్ కూడా అందించడం ఈ పథకం ప్రత్యేకత. ఏడాది పాటు ఉండే ఈ ఇంటర్న్‌షిప్‌ను పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల్లోనూ పూర్తి చేసే అవకాశం ఉండటం గమనార్హం. దీనివల్ల తగిన నైపుణ్యాలు సమకూరి, మంచి ఉద్యోగంలో స్థిరపడేందుకు అవకాశం ఉంటుంది.28,141 మందికి శిక్షణ కేంద్రం గతేడాది బడ్జెట్లో ఆమోదం లభించి, అక్టోబర్ నుంచి అమల్లోకి వచ్చిన పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ తొలి దశలో 28,141 మందికి ఇంటర్న్‌షిప్ అవకాశాలు లభించాయి. ఈ స్కీమ్ కింద దేశంలో ఏటా 1.25 లక్షల మంది యువతకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా భాగస్వామ్య సంస్థల నుంచి 1.27 లక్షల ఆఫర్లు వచ్చాయి. వాటి కోసం 6.21 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. 82,077 మందిని కంపెనీలు ఎంపిక చేసుకుని ఇంటర్న్‌షిప్ ఆఫర్ చేశాయి. అయితే 28,141 మంది మాత్రమే ఆఫర్లను తీసుకుని ఆయా సంస్థల్లో శిక్షణకు హాజరయ్యారు.24 రంగాల సంస్థల్లో అవకాశాలుపీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్‌లో భాగంగా 24 రంగాలకు చెందిన సంస్థలు అభ్యర్థులకు ఇంటర్న్‌షిప్‌ను అందిస్తున్నాయి. బీఎఫ్ఎస్ఐ, హాస్పిటాలిటీ, ఆటోమోటివ్, ఎఫ్ఎంసీజీ, మ్యాన్యుఫ్యాక్చరింగ్ రంగాలకు చెందిన ప్రముఖ సంస్థలు కూడా ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ వంటి ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలతోపాటు హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ వంటి బ్యాంకింగ్ రంగ సంస్థలు, పలు ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఉండటం గమనార్హం.ట్రెయినీలకు స్టైఫండ్ కూడా.. పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ కింద ఎంపికై వివిధ సంస్థల్లో చేరినవారికి కేంద్ర ప్రభుత్వం స్టైఫండ్ ఇస్తుంది. తొలి దశలో 28,141 మంది ఇంటర్న్ ట్రైనీల బ్యాంకు ఖాతాల్లో వన్ టైమ్ గ్రాంట్ కింద రూ.4.38 కోట్లు, 2024 డిసెంబర్ వరకు రూ.1.3 కోట్ల స్టైఫండ్‌ను జమ చేసినట్లు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ ప్రకటించింది.పీఎంఐఎస్‌కు అర్హతలివీ.. పీఎం ఇంటర్న్‌షిప్ పథకం కోసం దరఖాస్తు చేసుకునేవారు 21 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య వయసులో ఉండాలి. వారి కుటుంబ వార్షికాదాయం రూ. 8 లక్షల లోపు ఉండాలి. ఎలాంటి ఉద్యోగం లేని యువతకు వారి విద్యార్హతలకు తగినట్టుగా ఏడాది పాటు ఆన్ జాబ్ ఆన్ ట్రైనింగ్/ఇంటర్న్‌షిప్ కల్పిస్తారు. ఐదేళ్ల వ్యవధిలో కోటి మంది యువతకు దేశంలోని టాప్–500 కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైనవారికి నెలకు రూ.5 వేలు స్టైపెండ్ ఇస్తారు. ఇందులో రూ.4.5 వేలను కేంద్ర ప్రభుత్వం, మరో రూ.500ను ఆయా సంస్థలు సీఎస్ఆర్ కింద భరిస్తాయి.విస్తృతం చేయాలి.. పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్‌ను టాప్–500 సంస్థలకేకాకుండా ఇతర సంస్థలకు కూడా విస్తరింపజేయాలి. దీనివల్ల ఔ త్సాహికులు తమ సమీప ప్రాంతాల్లోని సంస్థల్లో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం మెరుగవుతుంది. సుదూర ప్రాంతాల్లోని సంస్థల్లో ఇంటర్న్ ట్రైనీగా అవకాశం లభించినా.. నివాస ఖర్చులు, ఇతర కోణాల్లో ఆసక్తి చూపని పరిస్థితి ఉంది. మరోవైపు విద్యార్థులు కూడా వ్యక్తిగత హద్దులు ఏర్పరచుకుని మెలగడం కూడా సరికాదని, అవకాశమున్న చోటికి వెళ్లాలని గుర్తించాలి. – టి.మురళీధరన్, టీఎంఐ నెట్వర్క్ చైర్మన్ఏపీలో 4,973, తెలంగాణలో 7,913 మందికి చాన్స్జాతీయ స్థాయిలో అమలు చేస్తున్న ఈ స్కీమ్‌లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో 4,973 మందికి, తెలంగాణలో 7,913 మందికి ఇంటర్న్‌షిప్ ఆఫర్లు వచ్చాయి. మొత్తంగా తమిళనాడుకు చెందినవారికి అత్యధికంగా 14,585 మందికి ఇంటర్న్‌షిప్ ఆఫర్ లభించింది. మహరాష్ట్ర (13,664 ఆఫర్లు), గుజరాత్ (11,690 ఆఫర్లు), కర్ణాటక (10,022 ఆఫర్లు), ఉత్తరప్రదేశ్ (9,027) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.మొత్తం 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి 1,27,508 ఆఫర్లు అందుబాటులో ఉన్నట్టు పేర్కొన్న కంపెనీలు.. 82,077 మందిని ఇంటర్న్‌షిప్ కోసం ఎంపిక చేశాయి.రెండో దశకు దరఖాస్తులు షురూ..⇒ పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ రెండో దశ దరఖాస్తుల ప్రక్రియ కూడా మొదలైంది. ఇందులో 1,26,557 అవకాశాలు అందుబాటులో ఉంచారు. వీటిలో ఆంధ్రపదేశ్‌కు 4,715; తెలంగాణకు 5,357 కేటాయించారు. అభ్యర్థులు https://pminternship.mca.gov.in/login/ వెబ్సైట్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలి. తమ అర్హతలు, ఆసక్తి ఉన్న రంగాలను ఎంచుకోవాలి.⇒ఈ స్కీమ్‌లో అర్హతల వారీగా అవకాశాల సంఖ్యను సైతం పేర్కొన్నారు. డిగ్రీ పూర్తిచేసిన వారికి 36,901, టెన్త్ చదివిన వారికి 24,696, ఐటీఐ ఉత్తీర్ణులకు 23,269, డిప్లొమా ఉత్తీర్ణులకు 18,589; ఇంటర్మిడియెట్ / 12వ తరగతి ఉత్తీర్ణులకు 15,412 అవకాశాలను అందుబాటులో పెట్టారు. రెండో దశలో అభ్యర్థులకు ఇవి అందుబాటులో ఉంటాయి. -
నషాళానికి పొలిటికల్ మిర్చి ‘ఘాటు’
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి ప్రతినిధి, గుంటూరు/కొరిటెపాడు: మిర్చి రైతులను కూటమి సర్కార్ అనే తెగులు పట్టిపీడిస్తోంది. నష్టాల్లో కూరుకుపోయిన రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వ పెద్దలు ఎవరికి వారు యమునా తీరు అన్నచందంగా వ్యవహరిస్తున్నారు. మిర్చి క్వింటాల్‌కు మద్దతు ధర రూ.11,781 కంటే తక్కువగా ఉంటే కేంద్రం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతుండగా.. కేంద్రం మార్కెట్ ఇంటర్వెన్షన్ (ఎంఎస్ఐ) కింద రూ.11,781 మద్దతు ధర నిర్ణయించిందంటూ కేంద్ర మంత్రి, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ చెబుతున్నారు. వీరిద్దరి మాటల్లో ఎవరి మాట నమ్మాలి.. అసలు కేంద్రం ఎంతకు ఒప్పుకుందనే విషయంపై మాత్రం స్పష్టత లేకుండా పోయింది. తద్వారా మిర్చి రైతులను కూటమి సర్కార్ అయోమయంలోకి నెడుతుందనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. సీఎం ఒకలా.. మంత్రి మరోలాఈ నెల 21న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రూ.10,025 కంటే ఒక్క రూపాయి కూడా పెంచేది లేదని ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్’ (ఐసీఏఆర్) కేంద్రమంత్రికి తేల్చి చెప్పింది. ఈ నెల 22న సీఎం చంద్రబాబు మిర్చి రైతులు, వ్యాపారులు, ఎగుమతిదారులు, అధికారులతో సమీక్ష నిర్వహించి ‘ప్రభుత్వం నిర్దేశించిన ధర క్వింటాల్‌కు రూ.11,781 కంటే తక్కువగా ఉంటే కేంద్రం ద్వారా కొనుగోలుకు చేసేలా చర్యలు తీసుకుంటాం’ అంటూ డొంకతిరుగుడు సమాధానమిచ్చా రు.గుంటూరు ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని మాత్రం ఓ అడుగు ముందుకేసి ‘మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం (ఎంఎస్ఐ) ద్వారా క్వింటాల్‌కు రూ.11,781 మద్దతు ధరను కేంద్రం నిర్ణయించింది. 25 శాతం ఉత్పత్తిని కొనుగోలు చేస్తుంది. అవసరమైతే కొనుగోలు మొత్తాన్ని పెంచే అవకాశం ఉంది. రైతులకు ఇది కేవలం ఊరట కాదు–బలమైన అండ’ అంటూ ఆయన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ద్వారా ప్రకటించారు. సీఎం మాటలు ఒకలా ఉంటే.. కేంద్ర మంత్రి చేస్తున్న ట్వీట్లు మరోలా ఉన్నాయి. ఇంత జరుగుతున్నా కేంద్రం నుంచి మాత్రం ఏవిధమైన స్పష్టత రాకపోవడంతో ఎవరి మాటను నమ్మాలో తెలియక రైతులు అయోమయానికి గురవుతున్నారు.ఐసీఏఆర్ నుంచి స్పష్టత లేదుమద్దతు ధర రూ.11,781గా నిర్దేశించినట్టు గానీ.. 25 శాతం పంటను కొనుగోలు చేస్తామని, అవసరాన్ని బట్టి మరింత పెంచుతామనే విషయాలపై ఏవిధమైన అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ విషయంపై ఐసీఏఆర్ సెక్రటరీ, డైరెక్టర్ జనరల్ హిమాన్షు పటాక్‌ను ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా.. ‘ఇటీవలే కేంద్ర మంత్రి అధ్యక్షతన సమావేశం జరిగింది. రైతులకు మేలైన గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఏపీలో సీఎం చంద్రబాబు కూడా సమావేశం నిర్వహించారు.ఆయన సమావేశం తర్వాత కూడా దీనిపై ఎలాంటి పురోగతి లేదు’ అని ఆయన బదులిచ్చారు. రూ.11,781 మద్దతు ధర ప్రకటించారా అని ప్రశ్నించగా.. సమాధానాన్ని దాటవేశారు. అధికారి మాటలను బట్టి చూసినా పెంపునకు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన కేంద్రం నుంచి రాలేదనేది స్పష్టమవుతోంది. రూ.10,025 కంటే ఒక్క రూపాయి పెంచాలన్నా.. కేబినెట్ ఆమోదం కావాల్సిందే. కేబినెట్ ఆమోదించకుండా రైతులను గందరగోళానికి గురిచేసే ప్రకటనలు ఇవ్వడంపై కూటమి నేతలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.హడావుడి తప్ప.. అడుగులేవీ?మిర్చి రైతులను ఆదుకుంటామని హడావుడి చేసిన కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయకపోవడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది క్వింటాల్ మిర్చికి గరిష్టంగా రూ. 28 వేలు రాగా.. ఈ ఏడాది రూ.13,500 దాటలేదు. అందులోనూ పది శాతం మిర్చికి మాత్రమే గరిష్ట ధర వస్తుండగా, మిగిలిన సరుకు రూ.ఐదారు వేలు దాటడం లేదు. ప్రభుత్వం ప్రకటించిన ధరకు విక్రయిస్తే రైతుకు ఎకరానికి రూ.లక్షకు పైగా నష్టం రావడం ఖాయంగా కనపడుతోంది. ప్రస్తుతం గుంటూరు మార్కెట్ యార్డులో రకం, నాణ్యతను బట్టి క్వింటాల్‌కు రూ.5 వేల నుంచి రూ.13 వేల వరకు ధర పలుకుతోంది.గతేడాది ఫిబ్రవరిలో క్వింటాల్‌కు రూ.20 వేలు నుంచి రూ.28 వేలు పలికింది. గత ఐదేళ్లలో సగటు ధర రూ.22 వేలు తగ్గలేదు. గరిష్టంగా తేజ, 341, నంబర్–5 రకాలకు రూ.27 వేలు వరకూ, బ్యాడిగ రకానికి రూ.30 వేల వరకూ పలికింది. ప్రస్తుతం తేమ శాతం, తాలు సాకులు చూపి ధరలను మరింత తగ్గించేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం మార్కెట్లోకి వచ్చి కొనుగోళ్లు ప్రారంభిస్తే ధరలు పెరుగుతాయని రైతులు చెబుతున్నారు. కనీస మద్దతు ధర క్వింటాల్‌కు కనీసం రూ.20 వేలు ప్రకటించాలని, అలా అయితేనే పెట్టుబడులు వస్తాయని రైతులు స్పష్టం చేస్తున్నారు.రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర నష్టంఒకటిన్నర ఎకరాల్లో డీలక్స్ రకం మిర్చి సాగు చేశాను. తామర పురుగు, నల్లి, పచ్చదోమ, తెల్లదోమ మిర్చి పంటకు ఆశించడంతో ఎకరాకు రూ.2.50 లక్షల వరకు ఖర్చయ్యింది. మొత్తం కలిపి రూ.3.75 లక్షల వరకు ఖర్చు వచ్చింది. 15 క్వింటాళ్లు ఎరుపు కాయలు, మరో ఐదు క్వింటాళ్లు తెలుపు కాయలు వచ్చాయి. ఎరుపు కాయలు క్వింటా రూ.11 వేలు, తెలుపు కాయలు క్వింటా రూ.4 వేలు ధర పలికింది. దీంతో మొత్తం రూ.1.85 లక్షలు చేతికి వచ్చాయి. వీటిలో కమీషన్ వ్యాపారి ఎంత తీసుకుంటాడో తెలీదు. మొత్తమ్మీద ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు నష్టం వస్తుంది. – కె.శివప్ప, రైతు, దొడ్డిమేకల, కర్నూలు జిల్లాగిట్టుబాటు ధర కల్పించాలిపంటకు రకరకాల తెగుళ్లు వ్యాపిస్తున్నాయి. ముఖ్యంగా నల్లతామర, నల్లి, పచ్చ దోమ, తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉంది. దీంతో పురుగు మందులు పిచికారీ చేసేందుకు లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది. పురుగు మందుల ధరలు, కూలీ రేట్లు పెరిగిపోయాయి. పంటకు తెగుళ్లు సోకడంతో దిగుబడి తగ్గి నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. మిర్చికి గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – తులసీనాయక్, రైతు, గాడితండా, పల్నాడు జిల్లాధర పలికితేనే పెట్టుబడి వస్తుందినాలుగు ఎకరాల్లో పంట వేశాను. గతేడాది 25 క్వింటాళ్లు వచ్చిన పంట దిగుబడి తెగుళ్లు, వాతావరణంలో మార్పుల కారణంగా ఈ ఏడాది 15 క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితులు లేవు. గత ఏడాది క్వింటా రూ.27 వేలు పలికిన తేజ రకం కాయలకు ఇప్పుడు రూ.12 వేలు వేశారు. ఇవే ధరలు కొనసాగితే ఆత్మహత్యలు చేసుకోవడమే మార్గం. కనీసం క్వింటాల్ రూ.20 వేలకు కొంటేనే గట్టెక్కగలం. –భుక్యా శ్రీను నాయక్, రైతు, రేమిడిచర్ల, పల్నాడు జిల్లా -
స్కిల్ లేని పట్టభద్రులకు ఉద్యోగాలు నిల్!
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: ఏం చదివామన్నది కాదు.. ఎలా చదివామన్నది చాలా ముఖ్యం. డిగ్రీ వస్తే చాలదు నైపుణ్యం కూడా ఉండాల్సిందే. లేకపోతే ఉద్యోగాలు రావని ఓ శాస్త్రీయ అధ్యయనం వెల్లడిస్తోంది. ప్రపంచంలోనే అత్యధికంగా యువత ఉన్న దేశం మనది. కానీ, దేశంలోని గ్రాడ్యుయేట్లలో 42.6 శాతం మందికే ఉద్యోగం పొందడానికి అర్హత ఉందని నివేదికలు చెబుతున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన మెర్సర్ మెటిల్ అనే కన్సల్టెన్సీ సంస్థ ‘ఇండియా గ్రాడ్యుయేట్ స్కిల్స్ ఇండెక్స్–2025’ అధ్యయనంలో పట్టభద్రుల నైపుణ్యాలకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.2023లో ఉద్యోగాలకు అర్హత కలిగిన గ్రాడ్యుయేట్ల సంఖ్య 44.3 శాతం కాగా.. 2024లో 1.7 శాతం పడిపోయి 42.6 శాతానికి తగ్గిపోయింది. కొత్తగా పట్టభద్రులైన వారి నుంచి అంచనాలు అధికంగా ఉండటం వల్ల ఈ కొరత ఏర్పడిందని నివేదికలో తేలింది. 30కి పైగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 2,700కి పైగా క్యాంపస్‌లలో సుమారు 10 లక్షల మంది విద్యార్థులపై అధ్యయనం చేసినట్లు ఈ సంస్థ పేర్కొంది. అత్యంత సమర్థత ఉన్న పట్టభద్రుల్లో ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ కాలేజీలు వరుసగా టాప్–3లో ఉన్నాయి. అలాగే.. అత్యధిక అర్హత కలిగిన గ్రాడ్యుయేట్లు ఉన్న టాప్ 10 రాష్ట్రాల్లో దక్షిణ భారతదేశం నుంచి ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ 10స్థానంలో ఉండటం విశేషం. ఉత్తరాది రాష్ట్రాలదే హవా... ⇒ దేశంలో కనీసం 50 % మంది గ్రాడ్యుయేట్లు ఉపా«ది పొందగల రాష్ట్రాలు కేవలం 4 ఉన్నాయి. ఓవరాల్ పర్ఫార్మెన్స్లో రాజస్తాన్‌కు టాప్10లో చోటు దక్కలేదు. కానీ, సాంకేతిక అర్హతలున్న రాష్ట్రాల్లో ఢిల్లీ, ఉత్తరాఖండ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ తర్వాత 48.3 శాతంతో రాజస్తాన్ 5వ స్థానంలో నిలిచింది. ⇒ నాన్–టెక్నికల్ విభాగంలో అర్హత కలిగిన గ్రాడ్యుయేట్లు అత్యధిక సంఖ్యలో ఉన్న రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ (54%), ఢిల్లీ (54%), పంజాబ్ (52.7%) ఉన్నాయిమొక్కుబడిగా చదవొద్దు..సంప్రదాయ డిగ్రీ కోర్సులు చేసినా, అంతగా నైపుణ్యాలు నేర్చుకోకుండా, కొత్త కోర్సులు చేయకుండా ఇంజనీరింగ్ చదివినా వెంటనే ఏదో ఉద్యోగం వచ్చేస్తుందని ఆశిస్తే ఇబ్బందే. కమ్యూనికేషన్, ఇన్‌డెప్త్ డొమైన్ నాలెడ్జి, టెక్నాలజీ, మేనేజ్మెంట్ (ఫోర్ పిల్లర్స్) వంటి వాటిపై పట్టుసాధించి ఇండస్ట్రీ సర్టిఫికేషన్ పొందగలిగితే నాన్–టెక్‌లో ఉన్నా నైపుణ్యంతోపాటు మంచి ప్యాకేజీ పొందగలరు. – రమణ భూపతి, క్వాలిటీ థాట్‌గ్రూప్ చైర్మన్, ఎడ్టెక్ కంపెనీనైపుణ్యాలు ఉండాల్సిందే..నాన్–టెక్ గ్రాడ్యుయేట్స్ అంశంపై గత 15 ఏళ్లుగా మేము పనిచేస్తున్నాం. ఆధునిక సాంకేతికత విశ్వవ్యాప్తం కావడంతో... భారత్‌లో విదేశీ కంపెనీలు ఇబ్బడిముబ్బడిగా గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు (జీసీసీ) ఏర్పాటు చేస్తున్నాయి. అందువల్ల తగిన శిక్షణ పొందడంతోపాటు అవసరమైన డొమైన్లలో నైపుణ్యాలు ఉంటే నాన్ టెక్ గ్రాడ్యుయేట్స్‌కూ మంచి అవకాశాలు లభిస్తాయి. – ఎస్.లావణ్యకుమార్, సహవ్యవస్థాపకుడు, స్మార్ట్‌స్టెప్స్ -
వివాదంలో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా?
ఢిల్లీ : సీఎం రేఖా గుప్తా (Delhi cm Rekha Gupta) వివాదంలో చిక్కుకున్నారా? అంటే అవుననే అంటున్నారు ప్రతిపక్ష ఆమ్ ఆద్మీ పార్టీ (aam aadmi party)నేతలు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను సీఎం రేఖా గుప్తా అవమానించారని ఆరోపిస్తున్నారు. ఇంతకీ ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏం జరిగింది?ఢిల్లీ సీఎం కార్యాలయంలో బీజేపీ ప్రభుత్వం స్వాతంత్య్ర సమరయోధులైన అంబేద్కర్, భగత్ సింగ్ ఫొటోల్ని తొలగించిందని, ఆ ఫొటోల స్థానంలో మహాత్మా గాంధీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోదీ ఫొటోలను ఉంచినట్లు ఆప్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.ఆప్‌నేత, ఢిల్లీ మాజీ సీఎం అతిషీ మర్లేనా ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి కార్యాలయంలో ఫొటోల్ని పోస్ట్ చేశారు. ఆ సోషల్ మీడియా పోస్ట్‌లో తాను సీఎంగా ఉన్న సమయంలో అంబేద్కర్, భగత్ సింగ్ ఫొటోలు ఉన్నాయని, నూతన సీఎంగా బాధత్యలు చేపట్టిన రేఖాగుప్తా ఆ ఫొటోల్ని తొలగించి వాటి స్థానంలో రాష్ట్రపతి, ప్రధాని ఫొటోలు పెట్టారని పేర్కొన్నారు.बीजेपी को दलितों और सिखों से है गहरी नफ़रत‼️सरकार में आते ही बाबा साहेब और भगत सिंह जी की तस्वीर हटवाई। pic.twitter.com/9loyTc7R1w— AAP (@AamAadmiParty) February 24, 2025 ఇదే అంశంపై అతిషీ మర్లేనా మీడియాతో మాట్లాడారు. బీజేపీ దళిత వ్యతిరేకి. తాజాగా,ఘటనతో ఆధారాలతో సహా భయట పడింది. తమ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా ఉన్నప్పుడు ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాల్లో భగత్ సింగ్,అంబేద్కర్ ఫొటోలు పెట్టేలా ఆదేశాలు జారీ చేశారు. అధికారంలోకి వచ్చిన బీజేపీ యాంటీ దళిత్ ఎజెండాతో ముందుకు సాగుతుంది. అంబేద్కర్,భగత్ సింగ్ ఫొటోల్ని తొలగించిందని విమర్శలు గుప్పించారు.ఆప్‌కు భయం పట్టుకుందిఆ ఆరోపణల్ని సీఎం రేఖాగుప్తా స్పందించారు. తన కార్యాలయంలో అంబేద్కర్, భగత్ సింగ్ ఫొటోలు ఉన్నాయంటూ ఆప్ చేస్తున్న ఆరోపణల్ని ఖండించారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో నాడు పెండింగ్‌లో ఉన్న 14 కాగ్ నివేదికలను సభలో ప్రవేశపెడతామని ఆదివారం సీఎం రేఖాగుప్తా ప్రకటించారు. ఆ ప్రకటనకు ఆప్ భయపడిందని, ప్రజల్ని మభ్య పెట్టేలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మండిపడ్డారు. మీరెన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా.. కాగ్ నివేదికపై అసెంబ్లీలో చర్చ జరిగి తీరుతుందన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రభుత్వ అధిపతి ఫొటో పెట్టకూడదా? దేశ రాష్ట్రపతి ఫొటో పెట్టకూడదా? జాతిపిత గాంధీజీ ఫొటో పెట్టకూడదా? భగత్ సింగ్, అంబేద్కర్ మన మార్గదర్శకులు. అందుకే ఢిల్లీ ముఖ్యమంత్రిగా, ప్రభుత్వ అధిపతిగా, మేం వారి ఫొటోలు పెట్టేందుకు స్థలం కేటాయించాం. ఆప్ నేతలు చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పడం నా పని కాదు.నేను ప్రజలకు జవాబుదారీగా ఉంటానని స్పష్టం చేశారు. -
మహాకుంభమేళా ముగింపు.. ఆవిష్కృతం కానున్న మరో అద్భుత ఘట్టం
లక్నో: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా (Kumbh Mela 2025)లో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఆకాశంలో ఏడు గ్రహాలు బుధ, శుక్ర, మంగళ, బృహస్పతి, శని, యూరేనస్, నెప్ట్యూన్లు ఒకే సరళరేఖపై రానున్నట్లు తెలుస్తోంది.ఈ గ్రహాల సమన్వయం నెగటివ్ గ్రహ ప్రభావాలను తగ్గించి, ప్రపంచంలో శాంతి, సమర్థత, సంపద తీసుకురానుందని ఆధ్యాత్మిక వేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ అసాధారణ ఖగోళ సంఘటన కుంభమేళా తుది పవిత్ర స్నానానికి మరింత ప్రత్యేకతను ఇవ్వనుంది.మహాశివరాత్రిపై గ్రహ ప్రభావంజ్యోతిష్యులు ఆచార్య హరికృష్ణ శుక్లా గ్రహాల కదలికల ప్రాముఖ్యత గురించి మాట్లాడారు. సూర్యుడు, చంద్రుడు మకర రాశిలో ఉండగా, శని కుంభ రాశిలో ఉండగా, బృహస్పతి వృషభ రాశిలో ఉండటం మహాకుంభమేళా ప్రారంభమైంది. కుంభమేళా చివరి రోజు ఫిబ్రవరి 26న గ్రహాల శక్తివంతమైన సమన్వయంతో జరగనుంది. ఆరోజు చంద్రుడు, బుధుడు, సూర్యుడు శని కుంభ రాశిలో ఉండగా, శుక్రుడు, రాహు మీన రాశిలో ఉండగానే బృహస్పతి వృషభ రాశిలో ఉండనుంది. ఈ గ్రహాల మార్పుతో ఫిబ్రవరి 28న గ్రహాలు ఒకే సరళరేఖ వైపు పయనిస్తాయని అన్నారు. ఫలితంగా ప్రతికూలతలు తొలిగి శుభపరిణామాలు జరుగుతాయని శుక్లా తెలిపారు. గ్లోబల్ మార్పుఫిబ్రవరి 26, 2025న గ్రహాల సమన్వయంతో ప్రపంచంలో ప్రతికూలతలు తగ్గే అవకాశం ఉందని జ్యోతిష్యులు ఆచార్య హరికృష్ణ మాట్లాడుతూ.. 2019 నుండి ప్రపంచాన్ని అనేక ప్రతికూల పరిస్థితులు పట్టిపీడిస్తున్నాయి. కోవిడ్-19 ,ప్రస్తుత రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచం దేశాల్లో అనేక ఇబ్బందులు ఏర్పడ్డాయి. అయితే, గ్రహాల మార్పులతో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు. శాంతి, స్థిరత్వం కొనసాగే అవకాశం ఉందని అన్నారు. -
ఢిల్లీ అసెంబ్లీ: ప్రతిపక్షనేతగా అతిషి.. చరిత్రలో తొలిసారిగా..
ఢిల్లీ: ఆప్‌నేత, ఢిల్లీ మాజీ సీఎం అతిషి అసెంబ్లీ ప్రతిపక్షనేతగా ఎన్నికయ్యారు. ఢిల్లీలో ప్రతిపక్ష నేతగా ఒక మహిళా ఎన్నిక కావడం ఇదే ప్రథమం. కీలక పదవిని చేపట్టిన తొలి మహిళా నేతగా ఆమె చరిత్రలో నిలిచారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఒక మహిళా ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వహించనున్న అతిషి.. ఢిల్లీ మహిళా సీఎంతో తలపడనున్నారు.ఆదివారం నిర్వహించిన ఆప్ శాసనసభా పక్ష సమావేశంలో అతిషిని ప్రతిపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కీలక పదవి కోసం ఎమ్మెల్యే సంజీవ్ ఝా ఆమె పేరును ప్రతిపాదించారు. తనను విశ్వసించినందుకు ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్‌కు, శాసనసభా పక్షానికి అతిషి కృతజ్ఞతలు తెలిపారు.బలమైన ప్రతిపక్షం ప్రజల గొంతుకకు ప్రతీకగా నిలుస్తోందని అతిషి అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల మొదటి సెషన్ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు జరగనున్న సమావేశాల్లో గత ఆప్ ప్రభుత్వ పనితీరుపై కాగ్ నివేదికను సభలో ప్రవేశపెట్టనున్నట్లు బీజేపీ పేర్కొంది.ఫిబ్రవరి 5న జరిగిన ఎన్నికల్లో 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత హస్తిన అసెంబ్లీపై కాషాయ జెండా ఎగిరింది. కేజ్రీవాల్‌పై అవినీతి మరకలు, పదేళ్ల పాలన నేపథ్యంలో ఆప్‌పై ప్రభుత్వ వ్యతిరేకత అందుకు తోడయ్యాయి. దీంతో ఫలితాల్లో బీజేపీ ఏకంగా మూడింట రెండొంతుల మెజారిటీ సాధించింది. 70 అసెంబ్లీ స్థానాలకు గాను 48 స్థానాలను బీజేపీ కైవసం చేసుకోగా ఆప్ 22 సీట్లకు పరిమితమైంది. మెజారిటీ మార్కుకు 14 స్థానాల దూరంలో నిలిచి తన పురిటిగడ్డ అయిన ఢిల్లీలో తొలిసారి ఓటమిని రుచిచూసింది. -
ప్రధాని మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీ-2 గా ఆర్బీఐ మాజీ గవర్నర్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ప్రిన్పిపల్ సెక్రటరీ-2గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మాజీ గవర్నర్ శక్తికాంత్ దాస్ నియమితులయ్యారు. శక్తికాంత్ దాస్.. ప్రధాని మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీ2గా నియమించడానికి క్యాబినెట్ కమిటీ ఆమోద ముద్ర వేసింది., ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ (DoPT) శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తాతా ఉత్తర్వులు ప్రకారం ప్రధాని మోదీ పదవీకాలంతో సమానంగా లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ శక్తికాంత్ దాస్ ఈ పదవిలో కొనసాగనున్నారు. అయితే పికె మిశ్రా సెప్టెంబర్ 11, 2019 నుండి ప్రధానమంత్రికి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు.భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నర్ గా సేవలందించిన శక్తికాంత్ దాస్.. గతేడాది డిసెంబర్ రెండో వారంలో తన పదవికి వీడ్కోలు పలికారు.2018 నుంచి ఆయన ఆర్బీఐ గవర్నర్ గా ఉన్నారు. ఆర్బీఐ గవర్నర్ గా ఉర్జిత్ పటేల్ హఠాత్తుగా వైదొలిన క్రమంలో ఆ బాధ్యతల్ని శక్తికాంత్ దాస్ చేపట్టారు. 1980 తమిళనాడు క్యాడర్ కు ఐఏఎస్ అధికారి అయిన శక్తికాంత్ దాస్.. ఢిల్లీ సెయింట్ స్టెఫెన్స్ కాలేజ్ నుంచి మాస్టర్ డిగ్రీ చేశారు. అనంతరం బర్మింగమ్ యూనివర్శిటీ నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో పీజీ పూర్తి చేశారు. 2016లో మోదీ ప్రభుత్వం ‘ పెద్ద నోట్ల రద్దు’ చేస్తూ నిర్ణయం తీసుకున్న సందర్భంలో ఆయన ఎకానామిక్ అఫైర్స్ సెక్రటరీగా ఉన్నారు. -
ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలకు రంగం సిద్ధం.. కాగ్ రిపోర్ట్ సైతం..?
ఢిల్లీ: ఢిల్లీ రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారి అసెంబ్లీ సమావేశం కానుంది. ఈ నెల 24వ తేదీన అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 24,25,27 వ తేదీల్లో ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. 24వ తేదీన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంతో పాటు, అదే తేదీ మధ్యాహ్నం 2 గంటలకు స్పీకర్ ఎన్నిక జరుగనుంది. 25వ తేదీన లెఫ్టినెంట్ గవర్నర్ అసెంబ్లీలో ప్రసంగం ఉటుంది. ఇక 27వ తేదీ గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చర్చ జరుగనుంది.మరొకవైపు 25వ తేదీన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వంలో పెండింగ్ లో ఉంచిన కాగ్ రిపోర్ట్ ను సైతం అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 25, 27 తేదీల్లో కాగ్ రిపోర్ట్ పై చర్చించే అవకాశాలు కనబడుతున్నాయి. తాము అసెంబ్లీ తొలి సెషన్ లోనే కాగ్ రిపోర్ట్ ను అసెంబ్లీలో ప్రవేశపెడతామని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కాగ్ రిపోర్ట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వ నిధులను గత పాలకు దుర్వినియోగం చేశారని, ఎక్సైజ్ పాలసీలో అవతవకలు జరిగాయని కాగ్ నివేదిక పేర్కొన్న తరుణంలో దానికి ప్రాధాన్యత సంతరించుకుంది.గతంలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీజేపీ.. కాగ్ నివేదికపై పదే పదే పట్టుబట్టింది. కానీ అది చివరకు అసెంబ్లీకి రాలేదు. దాంతో ప్రస్తుత బీజేపీ సర్కారు కాగ్ నివేదికను అసెంబ్లీ సాక్షిగా బహిర్గతం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. -
‘మిర్చి’కి మద్దతివ్వలేం!
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: మిరప రైతులను ఆదుకునే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు నెపం వేసుకుంటూ చేతులెత్తేస్తున్నాయి. మద్దతు ధర పెంచలేమని, పాత మద్దతు ధరతో 25 శాతానికి మించి పంట కొనలేమని కేంద్రం తేల్చి చెప్పగా, ఇందులో రాష్ట్రం బాధ్యత ఏమీ లేదని చంద్రబాబు ప్రభుత్వం సన్నాయి నొక్కులు నొక్కుతోంది. మిర్చి పంట కొనుగోలు విధాన నిర్ణయంపై మీనమేషాలు లెక్కిస్తూ కాలయాపన చేస్తోంది. రాష్ట్రంలో కొంత కాలంగా మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈనెల 19న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు మిర్చి యార్డు వేదికగా ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో రూ.21–27 వేలు పలికిన మిర్చి ధర ఇప్పుడు రూ.8–11 వేలకు పడిపోయిందని రైతులు గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో మొద్దు నిద్ర వీడిన కూటమి ప్రభుత్వ పెద్దల్లో కంగారు మొదలైంది. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ‘మూడు లేఖలు రాశాను.. ఎంపీల ద్వారా ఒత్తిడి తెచ్చాను’ అంటూ పరోక్షంగా నెపాన్ని కేంద్రంపై నెట్టారు. హుటాహుటిన ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌తో కలిసి ఢిల్లీ వెళ్లారు. వ్యవసాయ శాఖ కార్యదర్శితో భేటీ అయ్యి, వర్చువల్‌గా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ సంబంధిత అధికార యంత్రాంగంతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఢిల్లీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, వర్చువల్‌గా మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొని రాష్ట్రంలో పరిస్థితిని వివరించారు. మద్దతు ధర రూ.11,600 ఇవ్వాలని రాష్ట్రం కోరగా, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసర్చ్ (ఐసీఏఆర్) మాత్రం రూ.10 వేలకు మించి ఇవ్వలేమని స్పష్టం చేసిందని తెలిసింది. ఇప్పుడెలా?కనీస మద్దతు ధర పెంచడంతో పాటు ప్రైస్ డెఫీషియన్సీ పేమెంట్ (పీడీపీ) పథకం కింద పంట దిగుబడుల్లో 75 శాతం కేంద్రమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రం కోరింది. సేకరణకయ్యే ఖర్చు మొత్తాన్ని కేంద్రమే భరించాలంది. ఇప్పటికప్పుడు నిబంధనల మేరకు 25 శాతానికి మించి మిరపను గతంలో నిర్ధేశించిన కనీస మద్దతు ధర రూ.10,025 కంటే ఎక్కువతో కొనుగోలు చేయలేమని కేంద్రం తేల్చి చెప్పినట్లు, ఇందుకు అయ్యే ఖర్చులో 50ః50 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సిoదేనని కూడా స్పష్టం చేసినట్లు సమాచారం.ఇతర ప్రతిపాదనలేవీ కూడా తమ పరిధిలో లేవని, వాటిని ఆమోదించాలంటే తక్షణమే కేంద్ర కేబినెట్ భేటీ జరగాల్సి ఉంటుందని తేల్చి చెప్పినట్లు తెలిసింది. దీంతో ఏం చేయాలో.. ఎలా ముందుకెళ్లాలో తెలియక రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఈ నేపథ్యంలో శనివారం గుంటూరు మిర్చి యార్డు రైతులు, ట్రేడర్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం మంత్రి శివరాజ్ చౌహాన్‌తో సమావేశం ముగిసిన అనంతరం కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు. క్వింటాకు రూ.11,600 చొప్పున సేకరణకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్‌లో 25 శాతం ఉన్న సీలింగ్‌ను ఎత్తివేసేందుకు కేంద్రం ఒప్పుకుందని చెప్పుకొచ్చారు. -
ప్రజాప్రతినిధులపై దాడులు జరుగుతుంటే పోలీసులేం చేస్తున్నారు?
సాక్షి, నూఢిల్లీ : తిరుపతి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక సందర్భంగా జరిగిన ఘటనలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) స్పందించింది. ప్రజాప్రతినిధులపై దాడి జరుగుతుంటే అక్కడున్న పోలీసులు ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది. దాడికి పాల్పడ్డ వారి పేర్లు ఎఫ్ఐఆర్లో ఎందుకు చేర్చలేదని నిలదీసింది. ఈ ఘటనపై 4 వారాల్లో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి శుక్రవారం నోటీసులిచ్చింది. తిరుపతి ఘటనపై వైఎస్సార్సీపీ తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి 18న ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. ‘ఫిబ్రవరి 3న తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో పాల్గొనేందుకు నేను, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం బస్సులో వెళ్తున్నాం. మాతో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు కూడా ఉన్నారు. వేరే పార్టీకి చెందిన కొందరు మా బస్సును అడ్డగించారు. రాడ్లతో బస్సు అద్దాలు ధ్వంసం చేసి లోపలకు చొరబడ్డారు. నాపైన, ఎమ్మెల్సీ, కార్పొరేటర్లపైన భౌతిక దాడికి పాల్పడ్డారు. చొక్కాలు చించి మరీ భయభ్రాంతులకు గురి చేశారు. ఈ ఘటన అంతా పోలీసుల సాక్షిగానే జరిగింది. ఇది మానవ హక్కుల ఉల్లంఘనే’ అంటూ ఎంపీ గురుమూర్తి ఆ ఫిర్యాదులో తెలిపారు.ఎఫ్ఐఆర్లో ఎంపీ ఫిర్యాదు చేసిన వారి పేర్లేవి?ఈ ఫిర్యాదును పరిశీలించిన ఎన్హెచ్ఆర్సీ రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఈ ఘటనకు సంబంధించిన వార్తలు కూడా న్యూస్ ఛాన్నెళ్లు, పత్రికల్లో కూడా వచ్చాయి. దాడికి పాల్పడ్డ వారి పేర్లను ప్రస్తావిస్తూ తిరుపతి ఎస్పీకి ఎంపీ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇచ్చారు. అయితే ఎస్వీయూ పోలీసు స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ నంబర్ 18/2025లో ఎంపీ ప్రస్తావించిన పేర్లు లేవు. ప్రజా ప్రతినిధులు వెళుతున్న బస్సుకు పోలీసు ఎస్కార్ట్ ఇవ్వాలని రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్‌ను సైతం ఎస్పీకి ఇచ్చారు. అయినా వారికి పోలీసులు సరైన భద్రత ఎందుకు కల్పించలేదు?’ అంటూ ప్రభుత్వాన్ని నిలదీసింది. ఎఫ్ఐఆర్లో నిందితుల పేర్లు ఎందుకు చేర్చలేదో, ప్రస్తుతం ఆ ఎఫ్ఐఆర్పై జరిపిన విచారణ, పూర్తి సమాచారం, ఆధారాలతో సహా నివేదిక ఇవ్వాలంటూ సీఎస్, డీజీపీలకు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. -
మణిపూర్‌లో ఏం జరిగిందో మీకు తెలుసు!
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆరె కటిక (ఖటిక్) కులస్తులను షెడ్యూల్డ్ కులాల జాబితాలో చేర్చాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. మణిపూర్‌లో జరిగిన అల్లర్లను ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ప్రస్తావించింది. కులాల జాబితాలో సవరణలు చేసే అధికారం కేవలం పార్లమెంట్‌కు మాత్రమే ఉంటుంది కాబట్టి.. పార్లమెంట్‌నే ఆశ్రయించాలని సూచించింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఆరె కటిక కులస్తులను ఎస్సీల జాబితాలో చేర్చాలని కోరుతూ తెలంగాణ ఆరె కటిక (ఖటిక్) అసోసియేషన్ జనవరి 8న సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది.ఇందులో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చింది. కొన్ని రాష్ట్రాల్లో ఆరె కటిక కులస్తులు ఎస్సీ సామాజిక వర్గంలో ఉండగా, మరికొన్ని రాష్ట్రాల్లో వెనుకబడిన తరగతుల (ఓబీసీ) వర్గంలో ఉన్నారని ఆరె కటిక అసోసియేషన్ కోర్టుకు తెలిపింది. దీంతో వేరే రాష్ట్రానికి చెందిన అమ్మాయి లేదా అబ్బాయితో పెళ్లి జరిగినప్పుడు రిజర్వేషన్ల విషయంలో సమస్యలు ఎదురవుతున్నాయని పిటిషన్లో పేర్కొంది. శుక్రవారం జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. సీనియర్ న్యాయవాది రహీమ్, రాజు సోంకర్‌లు పిటిషనర్ తరఫున వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతుండగా.. ‘అసలు మీ పిటిషన్ విచారణకు ఎలా సమర్థనీయం?’అని జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రశ్నించారు. ‘మణిపూర్‌లో ఏం జరిగిందో మీకు తెలుసు కదా? అక్కడ మైతేయి కులస్తులకు సంబంధించిన కేసులో హైకోర్టు నిర్ణయం తర్వాత ఏం జరిగింది? మణిపూర్‌లో ఎలా అల్లర్లు జరిగాయో చూశారు కదా?’అంటూ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే రిట్ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని, హైకోర్టుకు వెళ్లేందుకు అవకాశం కల్పించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. అందుకు సైతం ధర్మాసనం అభ్యంతరం తెలుపుతూ..‘కులాల జాబితాను సవరించడం, కొత్త చట్టాలను రూపొందించడం పార్లమెంట్ చేస్తుంది. హైకోర్టుకు వెళ్లినా మీకు పరిష్కారం దొరకదు. కాబట్టి పార్లమెంట్‌ను ఆశ్రయించండి’ అని చెప్పింది. దీంతో పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు సీనియర్ న్యాయవాది రహీమ్ చెప్పగా కేసును ముగిస్తున్నట్టు ధర్మాసనం పేర్కొంది. -
ఏపీ ప్రభుత్వానికి NHRC కీలక ఆదేశాలు
ఢిల్లీ: తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల అక్రమాల అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో జరిగిన అక్రమాల విచారణ జరపాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి జాతీయ మానవ హక్కుల సంఘం ఆదేశాలు జారీ చేసింది.సీనియర్ ర్యాంక్ అధికారితో విచారణ జరిపి యాక్షన్ టేకెన్ రిపోర్టు నాలుగు వారాల్లో పంపాలని ఆదేశించింది. ఈ సందర్భంగా ఎన్హెఆర్సీ పలు ప్రశ్నలు సంధించింది. హైకోర్టు ఆదేశాలున్నప్పటికీ తగిన భద్రత ఎందుకు కల్పించలేదు? ఎఫ్ఐఆర్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పేరు ఎందుకు చేర్చలేదు? అని డీజీపీని ప్రశ్నించింది. ఈ ఘటనకు సంబంధించిన దర్యాప్తు నివేదిక పరిస్థితిని అందించడంతో పాటు.. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో దాడులతో మానవ హక్కులకు భంగం వాటిల్లిన ఘటనపై స్పందించాలని డీజీపీకి సూచించింది.కాగా, తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో జరిగిన దాడులు, మానవ హక్కుల ఉల్లంఘనపై ఇటీవలే జాతీయ మానవ హక్కుల సంఘానికి తిరుపతి ఎంపీ గురుమూర్తి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై స్పందించిన జాతీయ మానవ హక్కుల సంఘం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు డీజీపీ నుంచి వివరణ కోరింది. -
భారత్‌కు అమెరికా సాయం.. బంగ్లాకు మళ్లిందా?
న్యూఢిల్లీ: అమెరికా 21 మిలియన్ డాలర్ల సాయం వ్యవహారం.. కొత్త మలుపు తిరిగింది. ఆ సాయం భారత సార్వత్రిక ఎన్నికలను ప్రభావితం చేసేందుకేనన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో బీజేపీ-కాంగ్రెస్‌లు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ లోపు ఆ సాయాన్ని బంగ్లాదేశ్‌కు మళ్లించారంటూ ఓ జాతీయ మీడియా సంస్థ నుంచి కథనం వెలువడంది. దాని ఆధారంగా బీజేపీ-కాంగ్రెస్‌లు పరస్పర ఆరోపణలతో మండిపడుతున్నాయి.భారత్‌లో ఓటింగ్ శాతం పెంపు కోసం ఇచ్చిన ఆ నిధులను బంగ్లాదేశ్‌లో ఓ ప్రాజెక్టు వినియోగించారన్నది ఆ కథనం సారాంశం. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్(Jairam Ramesh) దీనిని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసి.. బీజేపీ, ఆ పార్టీ అనుకూల మీడియాపై విరుచుకుపడ్డారు. దానిని షేర్ చేస్తూ ప్రతిపక్ష కాంగ్రెస్ బీజేపీపై నిప్పులు చెరుగుతోంది. అయితే.. ఆ కథనాన్ని ఫేక్ అంటూ బీజేపీ ఖండించింది. Lies first mouthed in Washington. Lies then amplified by BJP's Jhoot Sena.Lies made to be debated on Godi media.Lies now thoroughly exposed. Will the Liars apologise? pic.twitter.com/nY7iP4jmnN— Jairam Ramesh (@Jairam_Ramesh) February 21, 2025 FAKE NEWS ALERT 🚨‼️The Indian Express story discusses $21 million in funding to Bangladesh in 2022. However, the article misrepresents the reference to a $21 million funding tranche intended to ‘promote’ voter turnout in India.What Indian Express conveniently sidesteps is… pic.twitter.com/niOaWXivm5— Amit Malviya (@amitmalviya) February 21, 2025భారత్‌లో ఎవరినో గెలిపించడానికి గత అధ్యక్షుడు జో బైడెన్ 21 మిలియన్ డాలర్ల(రూ.182 కోట్ల నిధులు) కేటాయించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఆరోపించిన సంగతి తెలిసిందే. ఓటింగ్‌ను పెంచడంద్వారా భారత ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు బైడెన్ ప్రయత్నించారని ట్రంప్ విమర్శించారు. అందుకే డోజ్ దానిని రద్దు చేసిందని సమర్థించుకున్నారు. ఈ ట్రంప్ వ్యాఖ్యలపై భారత్‌లో దుమారం రేగింది.విదేశీ సంస్థల చేతుల్లో రాహుల్ గాంధీ(Rahul Gandhi) కీలుబొమ్మలా మారారని బీజేపీ ధ్వజమెత్తగా.. ట్రంప్‌వి అర్థం లేని ఆరోపణలని కాంగ్రెస్ తిప్పికొట్టింది. ట్రంప్ వ్యాఖ్యలతో 2024 ఎన్నికల్లో విదేశీ శక్తులు పని చేస్తున్నాయని అప్పట్లో ప్రధాని మోదీ చేసిన ఆరోపణలు నిజమని తేలిందని బీజేపీ పేర్కొంది. విదేశీ శక్తులతో కలిసి రాహుల్ గాంధీ.. భారత్ వ్యూహాత్మక, భౌగోళిక ప్రయోజనాలను దెబ్బతీయాలని చూశారని బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ విమర్శించారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలు అర్థం లేని ఆరోపణలేనని కాంగ్రెస్ కొట్టిపారేసింది. యూఎస్ ఎయిడ్ ద్వారా దశాబ్దాలుగా భారత్‌లోని ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలకు అందిన సాయంపై శ్వేత పత్రాన్ని కేంద్రం విడుదల చేయాలని ఆ పార్టీ నేత జైరాం రమేశ్ డిమాండు చేశారు.ఇతర దేశాలకు ఇచ్చే నిధుల్లో కోత విధిస్తూ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డోజ్ విభాగం ఫిబ్రవరి 16న జాబితా ప్రకటించింది. అందులో భారత్‌లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు ఉద్దేశించిన నిధులను రద్దు చేసినట్లు ప్రకటించింది. డోజ్ నిర్ణయం.. భారత్‌లో రాజకీయ వివాదానికి దారి తీసింది. -
మహా కుంభమేళాకు ఒక్కసారిగా పోటెత్తిన భక్తజనం
లక్నో: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం.. మహా కుంభమేళా మరో ఐదురోజుల్లో ముగియనుంది. చివరి వారాంతం కావడంతో ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు ఒక్కసారిగా పోటెత్తారు. ఇవాళ 40వ రోజు ఉదయం రికార్డు స్థాయిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించిట్లు అధికారులు ప్రకటించారు.కుంభమేళా ముగుస్తుండడంతో ప్రయాగ్‌రాజ్(Prayagraj) సంగమంకు భక్తుల తాకిడి ఒక్కసారిగా పెరిగింది. మేలా ప్రాంతంలో హోటల్స్, ధర్మశాలలు కిక్కిరిసిపోయాయి. గురువారం సాయంత్రం గణాంకాల ప్రకారం.. మొత్తంగా 58 కోట్ల మంది పుణ్యస్నానాలు పూర్తి చేసుకున్నారని అధికారులు ప్రకటించారు. శని, ఆది వారాల్లో భక్తుల తాకిడి మరింత అధికంగా ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా.. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు.గత వారంగా కుంభమేళా భక్తుల సంఖ్య👇ఫిబ్రవరి 13, గురువారం: 80 లక్షల 46 వేలుఫిబ్రవరి 14 శుక్రవారం: 94 లక్షల 98 వేలుఫిబ్రవరి 15 శనివారం: కోటి 36 లక్షల మందిఆదివారం: కోటి 49 లక్షల మందిసోమవారం: కోటి 35 లక్షల మందిమంగళవారం : కోటి 26 లక్షల మందిబుధవారం: కోటి 19 లక్షల మందిగురువారం: కోటి 55 లక్షల మంది..ఇక.. కుంభమేళా(KumbhmelaI నిర్వహణపై రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. జనవరి చివరి వారంలో మౌనీ అమవాస్య సందర్బంగా జరిగిన తొక్కిసలాట 30 మంది మరణించిన సంగతి తెలిసిందే. దీంతో రాబోయే రద్దీని నియంత్రించేలా అధిక సిబ్బందిని నియమించారు. మరోవైపు.. పరిసరాలను, సంగమ నీటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకుంటున్నారు. ఇప్పటికే వీఐపీ పాస్‌లను రద్దు చేసిన అధికారులు.. వాహనాల రాకపై కూడా కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు.రైల్వే శాఖ కీలక నిర్ణయంమహా కుంభమేళా(Maha Kumbh Mela) ముగుస్తుండడంతో భక్తులు అధిక సంఖ్యలో ప్రయాగ్‌రాజ్ వెళ్తున్నారు. రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా పలు స్టేషన్లలో ప్రత్యేక హోర్డింగ్‌లను ఏర్పాటు చేయించింది. సురక్షిత ప్రయాణం కోసం తాము సూచించే మార్గదర్శకాలను పాటించాలని అందులో విజ్ఞప్తి చేస్తోంది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట చోటు చేసుకుని 18 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. -
అంత మాత్రానికే జీవితం ముగిసినట్లు కాదు
న్యూఢిల్లీ: వివాహ బంధం ముగిసినంత మాత్రాన జీవితమే అయిపోయినట్లు కాదని, ముందున్న భవిష్యత్తు గురించి ఆలోచించాలని విడాకుల జంటను ఉద్దేశించి దేశ సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఓ విడాకుల కేసు విచారణ సందర్భంగా జంటను ఉద్దేశించి జస్టిస్ పీబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ నేతృత్వంలోని బెంచ్(SC Bench) ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.‘‘ఈ కేసులో విడాకులు తీసుకోవాలనుకుంటున్న జంటది(Divorce Couple) చిన్నవయసే. ఇలాంటి వాళ్లకు బోలెడంత భవిష్యత్తు ఉంటుంది. ఆ భవిష్యత్గు గురించి వాళ్లు ఆలోచించుకోవాలి. వివాహ బంధం ముగిసినంత మాత్రాన..వాళ్ల జీవితాలు అయిపోయినట్లు కాదు. వాళ్లు కొత్త జీవితాలను ప్రారంభిస్తూ ముందుకు సాగాలి’’అని న్యాయమూర్తులు సూచించారు .ఈ కేసులో వివాహం జరిగినా ఏడాదిలోపే ఆమె తిరిగి పుట్టింటికి పెళ్లడం దురదృష్టకరం. విడాకుల తర్వాతైనా ప్రశాతంగా జీవించండి అని ఆ జంటకు సూచించింది ధర్మాసనం.కేసు నేపథ్యం..2020 మే నెలలో మహారాష్ట్ర(Maharashtra)కు చెందిన యువకుడికి, మధ్యప్రదేశ్‌కు చెందిన యువతికి వివాహం జరిగింది. అయితే అత్తింటి వేధింపులతో కొన్ని నెలలకే తిరగకముందే ఆమె పుట్టింటికి చేరింది. భర్త, అతని కుటుంబ సభ్యులపై ఆమె ఫిర్యాదు చేసింది. బదులుగా ఆ భర్త కూడా ఆమెపై ఫిర్యాదు చేశాడు. అలా.. మొత్తం 17 కేసులు నమోదు అయ్యాయి.అలా చేస్తే సాగదీయడమే!వీళ్ల విడాకుల వ్యవహారం సుప్రీం కోర్టు(Supreme Court)కు చేరింది. అయితే ఇలా పోటాపోటీగా కేసులు వేయడం.. విడాకుల వ్యవహారాన్ని సాగదీయడమే అవుతుందని ఇరుపక్షాల లాయర్లతో ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీంతో కేసులు ఉపసంహరించుకుంటామని వాళ్లు తెలిపారు. అదే సమయంలో ఆ జంట కలిసి జీవించే పరిస్థితులు లేవని.. ఆర్టికల్ 142 ప్రకారం విస్తృత అధికారాన్ని ఉపయోగించి విడాకులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో కోర్టు విడాకులు మంజూరు చేసింది.వివాహ బందం కోలుకోలేని విధంగా విచ్ఛినమైతే.. ఆరు నెలలు కూడా ఆగాల్సిన అవసరం లేదు. కొన్ని షరతులతో ఆ నిరీక్షణ గడువును ఎత్తేయొచ్చు. ఈ కారణం కింద వారి ఆ పెళ్లి రద్దు చేసి విడాకులు మంజూరు చేయడం సుప్రీం కోర్టుకు సాధ్యమే. ఇందుకు ఆర్టికల్ 142 కింద కోర్టుకు అధికారం ఉంటుంది::: జనవరి 06 2025 రాజ్యాంగ ధర్మాసనం తీర్పు -
ఢిల్లీ కొత్త సీఎంకు ‘ఏడు’ సవాళ్లు.. రూపు ‘రేఖ’లు మారేనా?
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. గురువారం మధ్యాహ్నం రామ్‌లీలా మైదానంలో భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య వైభవంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణం చేశారు. అదే వేదికపై మంత్రులుగా మరో ఆరుగురితోనూ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రమాణం చేయించారు. 26 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చింది.కొత్త ప్రభుత్వం ఏర్పడిన రోజే మంత్రులకు శాఖలు కూడా ఏర్పాటు చేశారు. మంత్రివర్గ తొలి కూర్పులో వివిధ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించారు. మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో పర్వేశ్ వర్మ, కపిల్ మిశ్రా, మంజిందర్ సింగ్ సిర్సా, ఆశీశ్ సూద్, రవీందర్ ఇంద్రజ్ సింగ్, పంకజ్ సింగ్ ఉన్నారు. రేఖా గుప్తాకు కేంద్ర ప్రభుత్వం జెడ్ కేటగిరీ భద్రత కల్పించింది.మరోవైపు, బీజేపీ కొత్త ప్రభుత్వానికి ఢిల్లీలో పలు సవాళ్లు ఎదురుకానున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన పలు హామీలు తీర్చాల్సి ఉంది. రాబోయే ఐదేళ్ల కాలంలో బీజేపీ ప్రభుత్వం హామీల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది. రేఖా గుప్తా ప్రభుత్వం ముందున్న సవాళ్లు ఇవే...1. మహిళలకి నెలకు రూ.2500 ఉచిత ఆర్థిక సహాయం, గర్భిణులకు 21 వేల రూపాయల ఆర్థిక సహాయం. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడం.2. యమునా నది ప్రక్షాళన 3. వాయు కాలుష్య నిర్మూలన 4. మెరుగైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయడం 5. 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు హామీలు సహా సంక్షేమ పథకాల అమలు 6. మహిళల భద్రత 7. దేశ రాజధానిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడం. -
అన్ని వర్గాలకు నచ్చే విధంగా... ఢిల్లీ కేబినెట్ కూర్పు
న్యూఢిల్లీ: ఢిల్లీలో దాదాపు 26 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ తాజాగా ఏర్పాటైన రేఖా గుప్తా ప్రభుత్వంలో అన్ని ప్రధాన వర్గాలకు ప్రాతినిథ్యం కల్పించింది. ముఖ్యమంత్రి రేఖా గుప్తా(50) బనియా వర్గానికి చెందిన ఎమ్మెల్యే. మంత్రులుగా పర్వేశ్ వర్మ, ఆశిష్ సూద్, మంజిందర్ సింగ్ సిర్సా, కపిల్ మిశ్రా, రవీందర్ ఇంద్రజ్ సింగ్, పంకజ్ సింగ్ ప్రమాణం చేశారు. వీరిలో పర్వేశ్ వర్మ జాట్ నేత. సీఎం పదవికి పోటీ పడిన వారిలో ఈయన ముందు వరుసలో ఉన్నారు. రవీందర్ ఇంద్రజ్ సింగ్ దళిత నేత కాగా, మజిందర్ సింగ్ సిర్సా సిక్కు నేత . కపిల్ మిశ్రా, పంకజ్ సింగ్‌లు పూర్వాంచల్ ప్రాంత వాసులు. ఆశిష్ సూద్ బీజేపీ పంజాబీ నేతల్లో ప్రముఖుడిగా ఉన్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయ తీరాలకు చేర్చిన ఆయా వర్గాల వారికి సంతుష్టి కలిగించేందుకు బీజేపీ పెద్దలు యత్నించినట్లు చెబుతున్నారు.కేబినెట్లో జాట్ వర్గం నేత ఢిల్లీ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో న్యూఢిల్లీ సీటు నుంచి ఆప్ చీఫ్, మాజీ సీఎం కేజ్రీవాల్‌పై ఘన విజయం సాధించడం ద్వారా ఒక్కసారిగా తెరపైకి వచ్చారు పర్వేశ్ వర్మ(47). ఢిల్లీ సీఎం కుర్చీ కోసం పోటీ పడిన బీజేపీ నేతల్లో ఈయన కూడా ఉన్నారు. 2014 ఎన్నికల్లో పశ్చిమ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన పర్వేశ్ వర్మ పేరు జాతీయ రాజకీయాల్లో వినపడింది. అయితే, మూడుసార్లు సీఎంగా పనిచేసిన కేజ్రీవాల్‌ను ఓడించిన తర్వాత ఈయన పేరు ఒక్కసారిగా మారుమోగింది. ఢిల్లీలోని జాట్ నేతల్లో ప్రముఖంగా ఉన్నారు. గురువారం సీఎం రేఖా గుప్తాతోపాటు మంత్రిగా ప్రమాణం చేసిన వారిలో పర్వేశ్ వర్మ ఒకరు. మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడే పర్వేశ్. కేజ్రీవాల్‌పై పోటీ చేస్తానంటూ బహిరంగంగా ప్రకటించిన ఫైర్ బ్రాండ్ నేత. అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌కు గట్టి పోటీ ఇచ్చేది తానేనంటూ ముందుకు వచ్చారు. ఇటీవలి ఎన్నికల్లో నాలుగు వేల ఓట్ల తేడాతో కేజ్రీను ఓడించారు. కాగా, మూడు పర్యాయాలు సీఎంగా పనిచేసిన షీలా దీక్షిత్‌ను ఇదే న్యూఢిల్లీ నియోజకవర్గంలో 2013లో కేజ్రీవాల్ ఓడించడం గమనార్హం. 1977లో పుట్టిన పర్వేశ్ వర్మ రాజకీయాలపై ఆసక్తి పెంచుకుని 1991లో ఆర్ఎస్ఎస్లో బాల్ స్వయంసేవక్‌గా చేరారు. బీజేపీ యువ మోర్చాలో చేరి నేషనల్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడి స్థాయికి ఎదిగారు. బీజేపీ ఢిల్లీ విభాగం ప్రధాన కార్యదర్శిగాను పనిచేశారు. ఫోర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఎంబీఏ డిగ్రీ చేసిన వర్మ తన తండ్రి నెలకొల్పిన రాష్ట్రీయ స్వాభిమాన్ అనే ఎన్జీవో ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. 2013లో మెహ్రౌలీ నుంచి మొదటి సారిగా ఎమ్మెల్యే అయ్యారు. అనంతరం ఢిల్లీ పశ్చిమ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 2014, 2019 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు. 2019 ఎన్నికల్లో ఏకంగా 5.78 లక్షల ఓట్ల తేడాతో పర్వేశ్ వర్మ సాధించిన విజయం ఒక రికార్డుగా ఉంది.దంత వైద్యుడు.. పూర్వాంచల్ నేత పంకజ్ కుమార్ సింగ్ రేఖా గుప్తా ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణం చేసిన మరో ఎమ్మెల్యే పంకజ్ కుమార్ సింగ్(48). వృత్తి రీత్యా దంతవైద్యుడైన పంకజ్ కుమార్ గుప్తా పూర్వాంచల్ ప్రాంతానికి చెందిన నేత. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా వికాస్పురి నుంచి పోటీ చేసి, ప్రత్యరి్థపై 12వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ఢిల్లీ బీజేపీ పూర్వాంచల్ మోర్చా ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు పంకజ్ కుమార్. ఢిల్లీలో ఉండే ఉత్తరప్రదేశ్, తూర్పు ప్రాంతం బిహార్, జార్ఖండ్ వారిని పూర్వాంచల్ వాసులుగా పిలుస్తుంటారు. ఢిల్లీలోని పలు నియోజకవర్గాల్లో వీరిదే పైచేయి. బిహార్‌లోని బోధ్‌గయలో ఉన్న మగధ్ యూనివర్సిటీ నుంచి 1998లో డెంటల్ సర్జరీలో ఇగ్రీ చేశారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో మున్సిపల్ కార్పొరేషన్ నేతగా పనిచేశారు. మరికొద్ది నెలల్లో బిహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న వేళ బీజేపీ ఈయనకు కేబినెట్లో స్థానం కల్పించడం గమనార్హం. ఒకప్పుడు మోదీ విమర్శకుడు.. నేడు హిందుత్వ వీరాభిమాని ఢిల్లీ మంత్రిగా గురువారం ప్రమాణం చేసిన కపిల్ మిశ్రా(44) ఒకప్పుడు ఆప్ సభ్యుడు. ప్రధాని మోదీని, బీజేపీ, ఆర్ఎస్లను తీవ్రంగా విమర్శించిన వివాదాస్పద నేతగా ఉన్నారు. అటువంటి వ్యక్తి పూర్తిగా మారిపోయారు. నేడు హిందుత్వకు వీరాభిమాని అయ్యారు. కపిల్ మిశ్రాను కేబినెట్లో తీసుకోవడాన్ని బీజేపీ వ్యూహాత్మక చర్యగా భావిస్తున్నారు. 2010లో ఢిల్లీలో కామన్వెల్త్ గేమ్స్ జరిగిన సమయంలో కపిల్ మిశ్రా అవినీతి వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఆప్ వ్యవస్థాపకుల్లో ఒకరైన కుమార్ విశ్వాస్‌కు సన్నిహితుడిగా భావిస్తారు. ఢిల్లీ వర్సిటీ నుంచి సోషల్ వర్క్‌లో ఎంఏ చేసిన మిశ్రా 2015లో ఆప్ తరఫున కరవల్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించడం ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కేజ్రీవాల్ కేబినెట్లో జల వనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే, కేజ్రీవాల్, కుమార్ విశ్వాస్ మధ్య విభేదాలు తలెత్తడంతో కపిల్ మిశ్రా కూడా కేజ్రీకి దూరమయ్యారు. అనంతరం కుమార్ విశ్వాస్, కపిల్ మిశ్రాలు కేజ్రీతోపాటు ఆప్ మరో నేత సత్యేందర్ జైన్లకు వ్యతిరేకంగా అవినీతి ఆరోపణలు చేశారు. 2017లో మంత్రి పదవి కోల్పోయారు. అయినప్పటికీ, ఆప్ ఎమ్మెల్యేగా ఉంటూనే కేజ్రీవాల్‌పై విమర్శలు మాత్రం మానలేదు. 2019లో ఆయనపై ఆప్ బహిష్కరణ వేటు వేసింది. 2019లోనే బీజేపీలో చేరారు కపిల్ మిశ్రా. బీజేపీ ఢిల్లీ విభాగం ఉపాధ్యక్ష పదవిని చేపట్టారు. 2020 ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్‌పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం, బీజేపీ, హిందుత్వకు అనుకూలంగా ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడటం మొదలైంది. 2020 ఢిల్లీ అల్లర్ల సమయంలో విద్వేష ప్రసంగాలు చేశారంటూ ఆయనపై ఆరోపణలొచ్చాయి. తాజాగా బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణం చేసిన నేపథ్యంలో గతంలో ఆయన ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్, బీజేపీల తీరును ఎండగడుతూ ఆయన చేసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. ఇటీవలి ఎన్నికల్లో ఆప్ నేత మనోజ్ కుమార్ త్యాగిపై 23 వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు.పంజాబీ నేత ఆశిష్ సూద్ ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడైన ఆశిష్ సూద్(58) ఢిల్లీలోని బీజేపీ పంజాబీ నేతల్లో ఒకరు. తాజా ఎన్నికల్లో జనక్‌పురి నుంచి 18 వేల ఓట్ల తేడాతో ఎమ్మెల్యేగా గెలుపొంది గురువారం రేఖా గుప్తా కేబినెట్లో మంత్రిగా ప్రమాణం చేశారు. సంస్థాగత వ్యవహారాల్లో నిపుణుడిగా పేరున్న సూద్ ప్రస్తుతం బీజేపీ గోవా వ్యవహారాలతోపాటు జమ్మూకశ్మీర్ సహ ఇన్చార్జిగా ఉన్నారు. ఏబీవీపీ జాతీయ కార్యదర్శిగాను పనిచేశారు. 2003లో బీజేపీ యువమోర్చా జనరల్ సెక్రటరీగా పనిచేసిన ఈయన, ఆ తర్వాత రెండేళ్లకే జాతీయ ఉపాధ్యక్షుడి స్థాయికి ఎదిగారు. 2009లో ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా, ఆ తర్వాత రాష్ట్ర విభాగం ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2012లో దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికయ్యారు. ఆర్ఎస్ఎస్తోపాటు బీజేపీ అగ్ర నాయకులకు ఆశిష్ సూద్ ఎంతో నమ్మకస్తుడని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వ్యాపారవేత్త అయిన ఈయన కామర్స్‌లో డిగ్రీ చేశారు. దళిత వర్గం నేత రవీందర్ రేఖా గుప్తా సారథ్యంలోని ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణం చేసిన రవీందర్ ఇంద్రజ్ సింగ్(50) కేబినెట్లో దళిత వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. బీజేపీ ఎస్సీ మోర్చాలో కీలక సభ్యుడిగా ఉన్న రవీందర్ ఇటీవలి ఎన్నికల్లో మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఢిల్లీ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఓపెన్ లెరి్నంగ్(ఎస్‌వోఎల్) నుంచి బీఏ పట్టా అందుకున్న రవీందర్‌కు ఢిల్లీ బీజేపీలో దళిత నేతగా మంచి పేరుంది. ఇటీవలి ఎన్నికల్లో బావన ఎస్సీ రిజర్వుడ్ స్థానంలో ఆమ్ఆద్మీ పార్టీ నేత జై భగవాన్ ఉప్కార్ను 31 వేల ఓట్ల తేడాతో మట్టి కరిపించారు. నార్త్ ఢిల్లీ నియోజకవర్గంలో బీజేపీకి మద్దతు కూడగట్టడంలో రవీందర్ కీలకంగా వ్యవహరించారు. మొదట్నుంచీ బావన నియోజకవర్గంతోనే ఆయనకు ఎక్కువగా అనుబంధం ఉంది. ఈయన తండ్రి ఇంద్రజ్ సింగ్ గతంతో నరేల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఎన్నికల కమిషన్‌కు సమరి్పంచిన అఫిడవిట్‌ను అనుసరించి ఈయన ఆస్తులు రూ.7 కోట్లు కాగా, ఎటువంటి క్రిమినల్ కేసులు లేవు.సిక్కుల ప్రతినిధి మంజిందర్ సింగ్ సిర్సా ఢిల్లీ రాజకీయ ముఖచిత్రంలో బాగా వినిపించే పేరు మంజిందర్ సింగ్ సిర్సా(53). కోవిడ్ మహమ్మారి ప్రబలంగా ఉన్న సమయంలో ఆక్సిజన్ లాంగార్స్ నిర్వహించి చురుగ్గా వ్యవహరించిన సామాజిక కార్యకర్తగా సిక్కు నేతగా సిర్సాకు మంచి పేరుంది. తాజాగా రేఖా గుప్తా ప్రభుత్వంలో మంత్రిగా మాతృభాష పంజాబీలో ప్రమాణం చేశారు. సిక్కు వర్గం మద్దతు కూడగట్టేందుకే ఈయనకు బీజేపీ మంత్రి వర్గంలో స్థానం కల్పించినట్లు పరిశీలకులు చెబుతున్నారు. తాజా ఎన్నికల్లో ఆప్‌కు చెందిన ధన్వతి చండేలాపై 18 వేల పైచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు. రాజౌరీ గార్డెన్ స్థానం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మజీందర్ సింగ్ శిరోమణి అకాలీదళ్‌ను వీడి 2021లో బీజేపీలో చేరారు. 2013లో మొదటిసారిగా రాజౌరీ గార్డెన్ సీటును గెలుచుకున్నారు. 2013 నుంచి 2019 వరకు ఢిల్లీ సిక్కు గురుద్వారా యాజమాన్య కమిటీ(డీఎస్‌జీఎంసీ)కి సుదీర్ఘకాలం ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అనంతరం డీఎస్జీఎంఎంసీకి అధ్యక్షుడిగా 2019–2022 మధ్య సేవలందించారు. ఎన్నికల సంఘానికి సమరి్పంచిన అఫిడవిట్లో తనకు రూ.188 కోట్ల ఆస్తులు, భార్య సత్విన్దర్ కౌర్ సిర్సాకు కూడా రూ.71 కోట్ల ఆస్తులున్నట్లు వెల్లడించారు. మంజిందర్‌పై ఒక ఎఫ్ఐఆర్, నాలుగు పరువు నష్టం కేసులు నమోదై ఉన్నాయి. -
42.6% మంది పట్టభద్రులే ఉద్యోగాలకు అర్హులు
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: ప్రపంచంలోనే అత్యధికంగా యువత ఉన్న దేశం మనది. కానీ, దేశంలోని గ్రాడ్యుయేట్లలో 42.6 శాతం మందికే ఉద్యోగం పొందడానికి అర్హత ఉందని నివేదికలు చెబుతున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన మెర్సర్ మెటిల్ అనే కన్సల్టెన్సీ సంస్థ ‘ఇండియా గ్రాడ్యుయేట్ స్కిల్స్ ఇండెక్స్–2025’అధ్యయనంలో పట్టభద్రుల నైపుణ్యాలకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. 2023లో ఉద్యోగాలకు అర్హత కలిగిన గ్రాడ్యుయేట్ల సంఖ్య 44.3 శాతం కాగా.. 2024లో 1.7 శాతం పడిపోయి 42.6 శాతానికి తగ్గిపోయింది. కొత్తగా పట్టభద్రులైన వారి నుంచి అంచనాలు అధికంగాఉండటం వల్ల ఈ కొరత ఏర్పడిందని నివేదికలో తేలింది. 30కి పైగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 2,700కి పైగా క్యాంపస్‌లలో సుమారు 10 లక్షల మంది విద్యార్థులపై అధ్యయనం చేసినట్లు ఈ సంస్థ పేర్కొంది. అత్యంత సమర్థత ఉన్న పట్టభద్రుల్లో ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్‌కాలేజీలు వరుసగా టాప్–3లో ఉన్నాయి.అలాగే.. అత్యధిక అర్హత కలిగిన గ్రాడ్యుయేట్లు ఉన్న టాప్ 10 రాష్ట్రాల్లో దక్షిణ భారతదేశం నుంచి ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ 10స్థానంలో ఉండటం విశేషం. ఉత్తరాది రాష్ట్రాలదే హవా... » దేశంలో కనీసం 50% మంది గ్రాడ్యుయేట్లు ఉపాధి పొందగల రాష్ట్రాలు కేవలం 4 మాత్రమే ఉన్నాయి. » ఓవరాల్ పర్ఫార్మెన్స్లో రాజస్తాన్‌కు టాప్ 10లో చోటు దక్కలేదు. కానీ, సాంకేతిక అర్హతలున్న రాష్ట్రాల్లో ఢిల్లీ, ఉత్తరాఖండ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ తర్వాత 48.3 శాతంతో రాజస్తాన్ 5వ స్థానంలో నిలిచింది. » నాన్–టెక్నికల్ విభాగంలో అర్హత కలిగిన గ్రాడ్యుయేట్లు అత్యధిక సంఖ్యలో ఉన్న రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ (54%), ఢిల్లీ (54%), పంజాబ్ (52.7%) ఉన్నాయి నైపుణ్యాలుఉండాల్సిందే.. ఎస్.లావణ్యకుమార్, సహవ్యవస్థాపకుడు, స్మార్ట్‌స్టెప్స్ నాన్–టెక్ గ్రాడ్యుయేట్స్ అంశంపై గత 15 ఏళ్లుగా మేము పనిచేస్తున్నాం. ఆధునిక సాంకేతికత విశ్వవ్యాప్తం కావడంతో... భారత్‌లో విదేశీ కంపెనీలు ఇబ్బడిముబ్బడిగా గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు (జీసీసీ) ఏర్పాటు చేస్తున్నాయి. అందువల్ల తగిన శిక్షణ పొందడంతోపాటు అవసరమైన డొమైన్లలో నైపుణ్యాలు ఉంటే నాన్ టెక్ గ్రాడ్యుయేట్స్‌కూ మంచి అవకాశాలు లభిస్తాయి. కోవిడ్ అనంతర పరిస్థితుల్లో ఆన్లైన్లో డిగ్రీలు, ఇంజనీరింగ్ కోర్సులు పూర్తిచేసిన వారికి కొన్ని విషయాల్లో ఎదురయ్యే సవాళ్లను అధిగమించాలంటే తగిన నైపుణ్యాలు తప్పనిసరి. » 2023తో పోలిస్తేౖటైర్–1, టైర్–3 కళాశాలలకు చెందిన పట్టభద్రుల ఉపాధి సామర్థ్యం స్వల్పంగా తగ్గింది. టైర్–1 విషయానికొస్తే.. ఈ సంఖ్య 2023లో 49.1శాతం కాగా.. 2024లో 48.75 శాతంగా ఉంది. » టైర్–3 లో 44% నుంచి 43.6 శాతానికి పడిపోయింది. టైర్–2 కళాశాలల్లో ఎక్కువ క్షీణత కనిపించింది. 2023లో 47.5% మంది గ్రాడ్యుయేట్లు ఉద్యోగానికి అర్హులుగా ఉంటే.. 2024లో అది 46.2 శాతానికి తగ్గింది. » ఉద్యోగానికి అర్హులైన గ్రాడ్యుయేట్ విభాగంలో మహిళలు (42%) పురుషుల (43%) కంటే పెద్దగా వెనుకబడి లేరని స్పష్టమవుతోంది. -
‘మఫ్లర్ మేన్’ మాటపై నిలబడతారా?
చెప్పులో రాయి, చెవిలో జోరిగ, కంటిలోని నలుసు, కాలిలోని ముల్లు, ఇంటిలోని తగువు.. సామెత మనకందరికీ తెలిసిందే. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) పరిస్ధితి ప్రస్తుతం ఇలాగే ఉంది. హస్తిన అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడి.. అధికారాన్ని కోల్పోయిన ‘మఫ్లర్ మేన్’కు సొంత పార్టీలోనే సెగ తగులుతోంది. ఒకప్పుడు అండగా నిలబడిన నాయకులే ఇప్పుడు ఆయనకు చుక్కలు చూపిస్తున్నారు. సొంత పార్టీలో ఉంటూనే అధినాయకుడిపై విరుచుకుపడుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్ (Swati Maliwal).. కేజ్రీవాల్‌కు కంట్లో నలుసులా మారారు.తనపై కేజ్రీవాల్ నివాసంలో దాడి జరిగిందని గతేడాది మే నెలలో స్వాతి మలివాల్ ఆరోపించారు. ఈ వ్యవహారంలో తనకు అండగా నిలబడలేదన్న అక్కసుతో కేజ్రీవాల్‌ను టార్గెట్ చేశారు. అప్పటి నుంచి సమయం దొరికినప్పుడల్లా ఆయనపై విరుచుకుపడుతూ ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా లేఖాస్త్రం సంధించి మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) అధికారం కోల్పోయి ప్రతిపక్షంగా మిగిలింది. ఈ నేపథ్యంలో శాసనసభలో ప్రతిపక్ష నాయకుడి పదవి దళితుడికి ఇవ్వాలని స్వాతి మలివాల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కేజ్రీవాల్‌కు ఆమె లేఖ రాశారు.మీకు ఇదే మంచి అవకాశం‘ఢిల్లీ శాసనసభలో ప్రతిపక్ష నేతను ఎన్నుకునే సమయం ఆసన్నమైంది. మీరు(కేజ్రీవాల్) మాట నిబడేందుకు ఇది మీకు మంచి అవకాశం. విపక్ష నేతగా దళిత ఎమ్మెల్యేను నియమించండి. ఇది రాజకీయ నిర్ణయం మాత్రమే కాదు.. సామాజిక న్యాయం, సమాన ప్రాతినిధ్యం కోసం బలమైన ముందడుగు అవుతుంద’ని కేజ్రీవాల్‌కు రాసిన లేఖలో స్వాతి మలివాల్ పేర్కొన్నారు. దళితుడిని ఉప ముఖ్యమంత్రి చేస్తానని పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ ఇచ్చిన హామీని ఇప్పటివరకు నిలబెట్టుకోలేదని ఆమె గుర్తు చేశారు. కాగా, ఢిల్లీ ప్రతిపక్ష నాయకుడిగా ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకా ఎవరినీ ఖరారు చేయలేదు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్, మనీశ్ సిసోడియాతో సహా అగ్రనేతలు ఓటమి పాలయిన సంగతి తెలిసింది. మాజీ సీఎం ఆతిశీ మాత్రం ఒడ్డున పడ్డారు.బీజేపీ సీఎం ప్రమాణ స్వీకారానికి మలివాల్ఇదిలావుంటే దేశ రాజధాని ఢిల్లీలో గురువారం కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. నూతన ముఖ్యమంత్రి రేఖా గుప్తాతో పాటు ఆరుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాంలీలా మైదానంలో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డీసీఎంలు హాజరయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు వచ్చినట్టు ఎక్కడా కనబడలేదు. అయితే ‘ఆప్’ ఎంపీ స్వాతి మలివాల్ మాత్రం ప్రమాణ స్వీకారం హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్‌తో ఆసక్తిగా ముచ్చటిస్తూ ఆమె కనిపించారు. రేఖా గుప్తాతో కరచాలనం చేసి స్వయంగా అభినందలు కూడా తెలిపారామె.చదవండి: ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?ఆమ్ ఆద్మీ పార్టీలోనే ఉంటాకాగా, కేజ్రీవాల్‌తో విభేదాల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీని వదిలిపెట్టి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారని వచ్చిన ఊహాగానాలపై స్వాతి మలివాల్ స్పందించారు. ఈ విషయంపై ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. ‘నేను ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీని. ఈ పార్టీలోనే కొనసాగుతాను. ప్రశ్నలను సంధించినందుకు నన్ను రాజీనామా చేయంటున్నారు. నేనేం తప్పులేదు. రాజీనామా ఎందుకు చేయాల’ని ఆమె ఎదురు ప్రశ్నించారు. -
Delhi: మంత్రులకు శాఖల కేటాయింపు
ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు(గురువారం) మధ్యాహ్నం ఆమెతో పాటుగా మంత్రులు కూడా ప్రమాణం స్వీకారం చేశారు. వారితో లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ప్రమాణ స్వీకారం చేయించారు. ఢిల్లీలో మంత్రులుగా పర్వేష్ వర్మ, రవీందర్ కుమార్, , మంజిందర్ సింగ్ సిర్సా, ఆశిష్ సూద్, కపిల్ మిశ్రా, పంకజ్ కుమార్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి రేఖా గుప్తాతో పాటు మంత్రుల సైతం ప్రమాణ స్వీకారం చేశారు. అయితే నేటి సాయంత్రం మంత్రులకు శాఖలు కేటాయించారు. ఢిల్లీలో మంత్రులకు శాఖల కేటాయింపురేఖా గుప్తా ముఖ్యమంత్రి: హోమ్, ఫైనాన్స్, విజిలెన్స్ ప్లానింగ్పర్వేష్ వర్మ డిప్యూటీ సీఎం : విద్య, రవాణా, ప్రజా పనుల విభాగంమంజీందర్ సింగ్ సిరస : వైద్యం, పట్టణ అభివృద్ధి, పరిశ్రమలురవీంద్ర కుమార్: సోషల్ జస్టిస్, కార్మిక శాఖకపిల్ మిశ్రా :టూరిజం, కల్చర్, వాటర్ఆశిష్ సూద్: పర్యావరణం, రెవెన్యూ, ఆహార పౌరసరఫరలుపంకజ్ కుమార్ సింగ్: న్యాయశాఖ, గృహ నిర్మాణం శాఖ -
ఢిల్లీ సీఎం రేఖాగుప్తా ప్రమాణ స్వీకారంలో అనుకోని అతిథి!
ఢిల్లీ : కొత్త సీఎం రేఖాగుప్తా (Rekha Gupta Takes Oath) ప్రమాణ స్వీకారంలో అనుకోని అతిథి ప్రత్యక్షమయ్యారు. ఎవరా? ఆ అనుకోని అతిథి అనుకుంటున్నారా? అదేనండి ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్. ఆప్ అధికారంలో ఉండగా.. ఆ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై విమర్శలు చేసి రెబల్ మహిళా నేతగా మారిన స్వాతి మాలివాల్. గురువారం బీజేపీ సీఎం రేఖ గుప్తా ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏర్పాటు చేసిన స్టేజీ మీద కాంగ్రెస్ ఢిల్లీ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్‌తో ముచ్చటిస్తూ తారసపడ్డారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి, తర్వాత జరుగుతున్న వరుస రాజకీయ పరిణామాలతో ఆప్ ఇమేజ్ డ్యామేజీ అయ్యేందుకు పరోక్షంగా స్వాతి మాల్ కారణమవుతున్నారు. గతేడాది మేలో ఆప్‌లో అంతర్గతంగా కొనసాగుతున్న కుమ్ములాటలపై చర్చించేందుకు కేజ్రీవాల్ తనని ఆహ్వానించారని, అలా వెళ్లిన తనపై కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ దాడి చేశారని ఆరోపించారు. ఆ తర్వాత అక్టోబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమిని తన సొంత పార్టీ ఆమ్ ఆద్మీ మోసం చేసి ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసిందన్నారు. కాబట్టే ఆప్‌కు కేవలం రెండు శాతం ఓట్లు పడినట్లు కేజ్రీవాల్‌పై ఎదురుదాడికి దిగారు. VIDEO | AAP Rajya Sabha MP Swati Maliwal (@SwatiJaiHind) attends Delhi CM oath-taking ceremony at Ramlila Maidan. (Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/z9kXxTo9GX— Press Trust of India (@PTI_News) February 20, 2025ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ నివాసం ఎదుట యమునా నది శుద్ధి చేయాలనే హామీని నెరవేర్చలేదని ఆరోపిస్ స్వాతి మలివాల్ ఆందోళన చేపట్టారు. స్వాతి మాలివాల్‌ను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల ఫలితాల్లో ఆప్ ఓటమినిపై పరోక్షంగా స్పందించారు. కేజ్రీవాల్‌ను టార్గెట్ చేస్తూ ఎక్స్ వేదికగా మహాభారతంలోని ద్రౌపది వస్త్రాభరణం ఫోటోను షేర్ చేశారు. (ఢిల్లీ పీఠమెక్కిన మహిళా ముఖ్యమంత్రులు, రికార్డ్ ఏంటంటే..!)pic.twitter.com/kig39RQYmD— Swati Maliwal (@SwatiJaiHind) February 8, 2025 ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ఆప్ ఓటమికి కేజ్రీవాల్ కారణమని అన్నారు. ఒక వ్యక్తి అహంకారంతో పనిచేయాలని చూస్తే ప్రజలు ఇలాగే బుద్ధి చెబుతారు. కేజ్రీవాల్ విషయంలో అది ఈరోజే జరిగింది’అని వ్యాఖ్యానించారు. గొప్ప విజన్‌తో రాజకీయాల్లోకి వచ్చాం. ఆప్‌లో అదే విధంగా పనిచేశాం. కానీ నాయకత్వం ప్రజాస్వామ్యాన్ని నమ్మకపోవడం, అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయగలమని అనుకోవడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని మండిపడ్డారు. ఇదే సమయంలో, ఆప్ వీడి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారా? అని ప్రశ్నిస్తే. నేనెందుకు రాజీనామా? చేయాలి. నేను ఏమైనా తప్పుచేశానా? అని ప్రశ్నించారు. ఆప్ ఎంపీగానే కొనసాగుతానని స్పష్టం చేశారు. ప్రశ్నించినందుకే రాజీనామా చేస్తారా? అని ద్వజమెత్తారు. (ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?)#WATCH | Rajya Sabha MP Swati Maliwal greets Delhi CM-designate Rekha Gupta as she arrives at Ramlila Maidan to attend her oath ceremony. pic.twitter.com/y6jSJLCaRO— ANI (@ANI) February 20, 2025 ఇలా కేజ్రీవాల్‌ను రాజకీయంగా దెబ్బతీస్తున్న స్వాతిమాల్ తాజాగా, బీజేపీ ఎమ్మెల్యే రేఖాగుప్తా ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారానికి హాజరై చర్చాంశనీయంగా మారారు. -
జాగ్రత్త.. అలాంటి కంటెంట్ ప్రసారం చేయొద్దు
న్యూఢిల్లీ: ఓటీటీ, సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారమ్‌లు కఠిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. మరీ ముఖ్యంగా అశ్లీల కంటెంట్‌ను మితిమీరి ప్రసారం చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, ఇలాంటి ఫిర్యాదులకు చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ మేరకు బుధవారమే కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఓ నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది.ఓవర్ ది టాప్(OTT) ఫ్లాట్‌ఫారమ్‌లు, సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారమ్‌లు ఐటీ రూల్స్ (2021) నైతిక విలువలు(Code of Ethics) పాటించాల్సిందే. అలాగే చిన్నారులకు 'ఏ' రేటెడ్ కంటెంట్ అందుబాటులో లేకుండా చూడాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ‘‘ఓటీటీ ప్లాట్ ఫామ్ లు, సోషల్ మీడియాలోని అశ్లీల, అసభ్యకరమైన కంటెంట్‌పై ఫిర్యాదులు వస్తున్నాయి. అలాంటి ఫిర్యాదులకు కఠిన చర్యలు తప్పవు. .. ఐటీ రూల్స్ లోని 2021 కోడ్ ఆఫ్ ఎథిక్స్ ను తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది. ఈ నిబంధనలు మితిమీరి ఏ కంటెంట్‌ను ప్రసారం చేయొద్దు’’ అని కేంద్రం హెచ్చరించింది. అలాగే వయసు ఆధారిత కంటెంట్ అందుబాటులో ఉండాలని, స్వీయనియంత్రణ కలిగి ఓటీటీలు నైతిక విలువలను పాటించాలని ఆదేశించింది. సంబంధిత శాఖ సలహాదారు కాంచన్ గుప్తా ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా తెలియజేశారు.Advisory to OTT platforms against nisitha, indecency and obscenity:Ministry of Information & Broadcasting has issued an advisory to online curated content publishers (OTT platforms) and self-regulatory Bodies of OTT platforms, to ensure strict adherence to India’s laws and the… pic.twitter.com/xMjddk9ns0— Kanchan Gupta 🇮🇳 (@KanchanGupta) February 20, 2025ఇటీవల ఇండియాస్ గాట్ లాటెంట్ షోలో ప్రముఖ యూట్యూబర్ రణ్ వీర్ అల్హాబాదియా (Ranveer Allahbadia) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఇటు పార్లమెంట్ లోనూ చర్చ జరగ్గా..అటు సుప్రీం కోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సమయంలో యూట్యూబ్‌లాంటి ఫ్లాట్ఫారమ్లలో అభ్యంతరకర కంటెంట్‌పై నియంత్రణ ఉండాలంటూ సర్వోన్నత న్యాయస్థానం పిలుపు ఇచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఇప్పుడు హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. -
30 ఏళ్ల క్రితం.. ఢిల్లీ సీఎం ఫొటో షేర్ చేసిన కాంగ్రెస్ నేత
న్యూఢిల్లీ: ఢిల్లీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన బీజేపీ ఎమ్మెల్యే రేఖా గుప్తాకు ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత అల్కా లాంబా(Alka Lamba) ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. రాజకీయాలకు పక్కనపెట్టి రేఖతో ఉన్న స్నేహబంధాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు.1995లో ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (DUSU) అధ్యక్షురాలిగా కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ తరఫున ఆల్కా లాంబా ప్రమాణం చేశారు. ప్రధాన కార్యదర్శిగా ఏబీవీపీ తరఫున రేఖా గుప్తా ప్రమాణం చేశారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. రేఖాకు అభినందనలు తెలియజేశారామె.రేఖా గుప్తా ముఖ్యమంత్రి అని తెలియగానే 30 ఏండ్లు వెనక్కి వెళ్లా. విద్యార్థి సంఘాల నేతలుగా మేం ప్రమాణ స్వీకారం చేసిన రోజు నాకు ఇంకా గుర్తు. సిద్ధాంతపరంగా మాకు ఎప్పుడూ పడేది కాదు. కానీ, ఏడాది పాటు మేం కలిసి పని చేసిన రోజులు ఇంకా నాకు గుర్తున్నాయి అని అన్నారామె.ఇక యమునా నది(Yamuna River) ప్రక్షాళన ప్రధాన హామీగా బీజేపీ ఢిల్లీ ఎన్నికలకు వెళ్లి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఆ అంశంపై దృష్టిసారించాలని ఆల్కా లాంబా సీఎం రేఖా గుప్తాకు సూచించారు. ఢిల్లీకి నాలుగో మహిళా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేఖా గుప్తాకు అభినందనలు. యమునా మాత శుభ్రమవుతుందని, యమునా పుత్రులంతా ఇక సురక్షితంగా ఉంటారని మేం ఆశిస్తున్నాం అంటూ ట్వీట్ చేశారామె.1995 की यह यादगार तस्वीर - जब मैंने और रेखा गुप्ता ने एक साथ शपथ ग्रहण की थी- मैंने @nsui से दिल्ली विश्वविद्यालय छात्र संघ (DUSU) #अध्यक्ष पद पर जीत हासिल की थी और रेखा ने #ABVP से #महासचिव पद पर जीत हासिल की थी- रेखा गुप्ता को बधाई और शुभकामनाएँ.दिल्ली को चौथी महिला… pic.twitter.com/csM1Rmwu9y— Alka Lamba 🇮🇳 (@LambaAlka) February 19, 2025 -
ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ సీఎం పదవిపై ఉత్కంఠకు తెరదించింది. ఫలితాలు వెలువడిన పది రోజుల తర్వాత ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా రేఖ గుప్తాను నియమించింది. నేడు (ఫిబ్రవరి 20న) రాంలీలా మైదానంలో బీజేపీ రెండో మహిళా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.70 సీట్లలో 48 స్థానాలను గెలుచుకోవడం ద్వారా మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించడమే కాదు ఢిల్లీలో 27 సంవత్సరాల తర్వాత బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. ముఖ్యమంత్రి పదవికి యువ నాయకురాలిని ఎంపిక చేయడం విశేషం. ఈ సందర్భంగా రేఖా గుప్తా ఆస్తులపై నెట్టింట చాలా ఆసక్తి నెలకొంది.ఎన్నికల కమిషన్‌కు దాఖలు చేసిన అఫిడవిట్లో, రేఖ గుప్తా 2023-2024 ఆర్థిక సంవత్సరంలో తన ఆదాయం రూ. 6,92,050గా, భర్త మనీషా గుప్తా ఆదాయం రూ.97,33,570 గా ప్రకటించారు.కుటుంబం నికర విలువ రూ. 5.3 కోట్లుగా ఉందని అఫిడవిట్లో పేర్కొన్నారు.రేఖ గుప్తా నికర ఆస్తుల విలువరేఖ గుప్తా ఆస్తులు మొత్తం ఆస్తులు: రూ.5.31 కోట్లు రేఖ గుప్తాపై లోన్లు ఇంకా ఇతర అప్పులు: రూ.1.20 కోట్లు రేఖ గుప్తా వార్షిక ఆదాయం 2023-24: రూ.6.92 లక్షలు 2022-23: రూ.4.87 లక్షలు 2021-22: రూ.6.51 లక్షలు 2020-21: రూ.6.07 లక్షలు 2019-20: రూ.5.89 లక్షలు రేఖ గుప్తా భర్త మనీష్ గుప్తా ఆదాయం 2023-24: రూ.97.33 లక్షలు 2022-23: రూ.64.56 లక్షలు 2021-22: రూ.23.13 లక్షలు రేఖ గుప్తాకి మారుతి XL6 (2020 మోడల్) కారు ఉంది, దీని విలువ దాదాపు రూ.4.33 లక్షలు ఉంటుందని అంచనా.రేఖా గుప్తాకు నాయకత్వ లక్షణాలు ఎలా వచ్చాయి? హర్యానాలోని జింద్ జిల్లా నంద్‌గఢ్ గ్రామంలో జూలై 19, 1974న జన్మించిన రేఖా గుప్తా తండ్రి బ్యాంకు అధికారిగా పనిచేశారు. 1976లో, గుప్తాకు రెండేళ్ల వయసులో కుటుంబం ఢిల్లీకి వెళ్లింది. రాజధాని నగరంలోనే తన విద్యను పూర్తి చేసింది. ఇక్కడే ఆమె భవిష్యత్ రాజకీయ జీవితానికి పునాది వేసింది.విద్యార్థి దశలోనే ఆగుప్తా రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా ఉన్నప్పుడు, ఆమె రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) విద్యార్థి విభాగం అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP)లో చేరారు. విద్యార్థి రాజకీయాల్లో ఆమె చురుగ్గా ఉంటూ 1996-1997లోఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం (DUSU)అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.రేఖ గుప్తా బీజేపీలో రాజకీయ జీవితం 2000లో ప్రారంభంలో ప్రారంభమైంది. పార్టీ యువజన విభాగం, భారతీయ జనతా యువ మోర్చా (BJYM)లో చేరి, ఢిల్లీ యూనిట్లో కార్యదర్శిగా బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించారు. ఆ తరువాత 2004 నుండి 2006 వరకు BJYM జాతీయ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆమె రాజకీయ నైపుణ్యం, లక్షణాలు 2007లో ఉత్తర పితంపురా నియోజకవర్గానికి కౌన్సిలర్‌గా చేశాయి. అంతేకాదు 2007 నుండి 2009 వరకు MCDలో మహిళా సంక్షేమం మరియు శిశు అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలిగా పనిచేశారు. ఇంకా ఢిల్లీ బీజేపీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి ,పార్టీ జాతీయ కార్యనిర్వాహక సభ్యురాలు సహా అనేక ఇతర కీలక పదవులను కూడా ఆమె చేపట్టారు. -
ఆనాడు మార్షల్స్ ఈడ్చుకెళ్లిన నేత.. నేడు ఢిల్లీ స్పీకర్!
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణం చేయబోతున్నారు. దాదాపు 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతోంది. ఈ క్రమంలో రేఖా గుప్తాతో పాటుగా మరో ఆరుగురు నేతలు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఇక, ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌గా బీజేపీ నుంచి రోహిణి ఎమ్మెల్యే విజేందర్ గుప్తాకు అవకాశం ఇచ్చారు. అయితే, గతంలో(2015) విజేందర్‌ను సభ నుంచి మార్షల్స్ ఎత్తుకెళ్లిన ఘటనను బీజేపీ నేతలు గుర్తు చేసుకుంటున్నారు.రోహిణి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజేందర్ గుప్తా మూడోసారి ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో స్పీకర్‌గా తనకు అవకాశం ఇవ్వడంపై విజేందర్ గుప్తా స్పందించారు. ఈ క్రమంలో విజేందర్ మాట్లాడుతూ.. ‘నాకు స్పీకర్ స్థానం ఇచ్చినందుకు పార్టీకి ధన్యవాదాలు. సభకు సంబంధించి నా బాధ్యతలను నేను సక్రమంగా నిర్వర్తిస్తాను. గత ఆప్ ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన కాగ్ నివేదికలను నేను సభ ముందుకు తీసుకువస్తాను’ అని తెలిపారు.అయితే, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు విజేందర్ గుప్తా, ఇతర బీజేపీ ఎమ్మెల్యేలు ఆప్ సర్కార్ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆప్ ప్రభుత్వం కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) నివేదికలను సమర్పించకుండా అడ్డుకుంటోందని ఆరోపిస్తూ గతంలో కోర్టును ఆశ్రయించారు. కాగ్ నివేదికలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.VIDEO | Delhi: BJP leader Vijender Gupta (@Gupta_vijender) says, “I am thankful to the party for giving me the responsibility of Speaker of Delhi Assembly. I will fulfill my responsibility… I hope we will have healthy discussions in the House.”(Full video available on PTI… pic.twitter.com/8SsH8GEmNT— Press Trust of India (@PTI_News) February 20, 20252015లో ఏం జరిగింది?నవంబర్ 30, 2015న ఢిల్లీ అసెంబ్లీలో ఆప్, బీజేపీ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. నాటి ఆప్ ఎమ్మెల్యే అల్కా లంబా(ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్నారు), ఓపీ శర్మపై విజేందర్ గుప్తా అవమానకర వ్యాఖ్యలు చేశారని అధికార పార్టీ నేతలు వ్యాఖ్యలు చేశారు. దీంతో, సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో అప్పటి అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయెల్.. విజేందర్ గుప్తాను బయటకు పంపించి వేశారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో విజేందర్‌ను సభ నుంచి మార్షల్స్ బయటకు ఎత్తుకెళ్లారు. ఈ సందర్భంగా విజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆప్ నేతల పట్ల స్పీకర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇక, ఇప్పుడు విజేందర్కు స్పీకర్ అవకాశం రావడంతో ఆనాటి పరిస్థితులను బీజేపీ నేతలు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. I remember that day when then LOP of Delhi assembly @Gupta_vijender ji was dragged out of the assembly not once but many times. Now he will become the Delhi assembly speaker. AAP will taste its karma. Many congratulations to Mr Gupta. pic.twitter.com/fwGsUxF10k— Prof Sayantan Ghosh (@sayantan_gh) February 20, 2025 -
ఢిల్లీ పీఠమెక్కిన మహిళా ముఖ్యమంత్రులు, రికార్డ్ ఏంటంటే..!
డిల్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ ఎట్టకేలకు ముఖమంత్రిని ప్రకటించింది. ఫలితాలు వెలువడిన పది రోజుల తర్వాత ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాను ఎంపిక చేసింది.నేడు (ఫిబ్రవరి 20న) బీజేపీకి రెండో మహిళా ముఖ్యమంత్రిగా ఆమె ఢిల్లీ పీఠానెక్కనున్నారు. దివంగత సుష్మా స్వరాజ్ తర్వాత, బీజేపీ ఢిల్లీకి రేఖ గుప్తాను మహిళా ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది ముఖ్యమంత్రి పదవికి యువ మహిళా నాయకురాలిని ఎంపిక చేయడం విశేషంగా నిలిచింది. రికార్డులురెండు దశాబ్దాల క్రితం సుష్మా స్వరాజ్ ఢిల్లీకి బీజేపీ తరపున తొలి మహిళా ముఖ్యమంత్రి అయ్యారు. మరో మహిళా ముఖ్యమంత్రి కాంగ్రెస్‌కు చెందిన షీలా దీక్షిత్ - మూడు దశాబ్దాల పాటు ఢిల్లీని పాలించి రికార్డు సాధించారు. ఇపుడు ఆప్‌కి చెందిన అతిషి నుండి రేఖా గుప్తా మరో మహిళా ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించనున్నారు. మహిళా సీఎంల విషయంలో ఢిల్లీదే రికార్డ్. పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, జమ్మూ & కాశ్మీర్ ,తమిళనాడు బిహార్, పంజాబ్, రాజస్థాన్ లాంటి కొన్ని రాష్ట్రాలకు మాత్రమే మహిళా ముఖ్యమంత్రులు ఉన్నారు.రేఖ గుప్తా హర్యానాకు చెందినవారు. కానీ రేఖకు కేవలం 2 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, ఆమె కుటుంబం ఢిల్లీకి వచ్చింది. న్యాయవాదిగా కెరీర్ ఆరంభించారు. తాజా ఎన్నికల్లో బీజేపీ తరపున ఆమె తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అంతేకాదు ఇపుడు ఢిల్లీ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టనున్నారు. షాలిమార్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన రేఖ గుప్తా ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి కానున్నారు. గత దశాబ్దంలో అమలు చేయని వాగ్దానాలు చేసిన నేపథ్యంలో ఢిల్లీ పాలన ఆమెకు కత్తిమీద సామే. 70 సీట్లలో 48 స్థానాలను గెలుచుకోవడం ద్వారా మూడింట రెండు వంతుల మెజారిటీతో గెలిచిన సంగతి తెలిసిందే.ఢిల్లీ పీఠమెక్కిన మహిళా మణులుదేశరాజధాని నగరంఢిల్లీ సీఎం పీఠాన్ని ఇప్పటివరకు ముగ్గురు అధిరోహించారు. ఇపుడు ఈ జాబితాలో నాలుగోవారిగా రేఖా గుప్తా చేరారు.సుష్మా స్వరాజ్ (బీజేపీ) బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. చాలా స్వల్పకాలమే ఆమె సీఎంగా ఉన్నారు. 1998లో సుష్మా స్వరాజ్ ఢిల్లీకి తొలి మహిళా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి చరిత్ర సృష్టించారు. 1998 అక్టోబరు- 1998 డిసెంబరు వరకు ఆమె బాధ్యతలను నిర్వహించారు.షీలా దీక్షిత్, (కాంగ్రెస్)కాంగ్రెస్‌కు చెందిన షీలా దీక్షిత సుదీర్ఘ కాలం ఢిల్లీ సీఎంగా పనిచేసిన ఘనతను దక్కించుకున్నారు. 1998 డిసెంబరు- 2013 డిసెంబరు వరకు ఆమె సీఎంగా సేవలందించారు. అతిషి మార్లెనా సింగ్ (ఆప్)8వ ముఖ్యమంత్రిగా సెప్టెంబరు, 2024 - నుంచి ఫిబ్రవరి 2025 పనిచేశారు.రేఖా గుప్తా(బీజేపీ)రేఖా గుప్తా ఢిల్లీ తొమ్మిదో ముఖ్యమంత్రిగా ఫిబ్రవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. -
ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా, మంత్రుల ప్రమాణం..
Delhi CM Rekha Gupta Oath Ceremony Live Updates..👉ఢిల్లీకి తొమ్మిదో ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో పాటుగా మంత్రులు కూడా ప్రమాణం స్వీకారం చేశారు. వారితో లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ప్రమాణ స్వీకారం చేయించారు. #WATCH | BJP's first-time MLA Rekha Gupta takes oath as the Chief Minister of Delhi. Lt Governor VK Saxena administers her oath of office. With this, Delhi gets its fourth woman CM, after BJP's Sushma Swaraj, Congress' Sheila Dikshit, and AAP's Atishi. pic.twitter.com/bU69pyvD7Y— ANI (@ANI) February 20, 2025 👉ఢిల్లీలో మంత్రులుగా పర్వేష్ వర్మ, రవీందర్ ఇంద్రజ్ సింగ్, మంజిందర్ సింగ్ సిర్సా, ఆశిశ్ సూద్, కపిల్ మిశ్రా, పంకజ్ కుమార్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు.#WATCH | BJP's Parvesh Sahib Singh takes oath as minister in CM Rekha Gupta-led Delhi Government. pic.twitter.com/0ertQiFXHO— ANI (@ANI) February 20, 2025 #WATCH | BJP's Kapil Mishra takes oath as a minister in CM Rekha Gupta-led Delhi Government. pic.twitter.com/PVDlRfsq1U— ANI (@ANI) February 20, 2025 BJP's Parvesh Sahib Singh, Ashish Sood, Manjinder Singh Sirsa and Ravinder Indraj Singh take oath as ministers in CM Rekha Gupta-led Delhi Government. pic.twitter.com/pzOXHgqXu1— ANI (@ANI) February 20, 2025 👉ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం.. వారికి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. #WATCH | Along with Delhi's new cabinet, led by CM Rekha Gupta, Prime Minister Narendra Modi greets the crowd at Ramlila Maidan. pic.twitter.com/jiy2AbWjUd— ANI (@ANI) February 20, 2025 👉ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, ఎన్డీయే నేతల హాజరయ్యారు. 👉 యమునా నది సందర్శనకు ఢిల్లీ సీఎం, మంత్రులుఢిల్లీలో కీలక పరిణామం..యమునా నది ప్రక్షాళనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కొత్త ప్రభుత్వంయమునా నది సందర్శనకు ఢిల్లీ సీఎం, మంత్రులుప్రమాణ స్వీకారం అనంతరం యమునా నది తీరానికి వెళ్ళనున్న సీఎం, మంత్రులు 👉రామ్‌లీలా మైదానానికి చేరుకున్న రేఖా గుప్తా.. ఆమెకు స్వాగతం పలికిన బీజేపీ నేతలు, కార్యకర్తలు. #WATCH | Delhi CM-designate Rekha Gupta and BJP leader Parvesh Sahib Singh greet each other at Ramlila Maidan in Delhi. Parvesh Sahib Singh will also take oath today as part of her council of ministers. pic.twitter.com/k41QI69r4n— ANI (@ANI) February 20, 2025👉ఈ సందర్భంగా రేఖా గుప్తా మాట్లాడుతూ..‘ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు సీఎంను అవుతానని నాకు తెలియదు. 48మంది ఎమ్మెల్యేల్లో ఒకరిగా బీజేపీ శాసన సభాపక్ష సమావేశానికి వెళ్లాను. కానీ పర్వేశ్‌వర్మ నా పేరు ప్రతిపాదించిన తర్వాతే తెలిసింది. నేను ముఖ్యమంత్రిని కాబోతున్నాను అని చెప్పుకొచ్చారు. అలాగే మార్చి ఎనిమిది నాటికి ఢిల్లీలోని మహిళలకు నెలకు రూ.2500 అందజేస్తామని తెలిపారు. ప్రధాని మోదీ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. అలాగే ఈ పదవికి నన్ను ఎంపిక చేసినందుకు మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సమయంలో శీష్‌మహల్‌ను మ్యూజియంగా మారుస్తామని వెల్లడించారు.#WATCH | Delhi CM-designate Rekha Gupta shows a victory sign and accepts the greetings of people as she leaves from her residence. pic.twitter.com/LDCQZAICBb— ANI (@ANI) February 20, 2025 👉ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌గా విజేందర్ గుప్తాకు అవకాశం. ఈ సందర్బంగా విజేందర్ గుప్తా మాట్లాడుతూ.. బీజేపీ హైకమాండ్‌కు ధన్యవాదాలు. స్పీకర్ స్థానం నాకు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. నా బాధ్యతలను నేను నెరవేరుస్తాను అని అన్నారు. అయితే, గతంలో సభ జరుగుతున్న సమయంలో మార్షల్స్.. విజేందర్ గుప్తాను బయటకు ఎత్తుకెళ్లారు. అధికార ఆప్ నేతలపై కామెంట్స్ చేయడంతో ఆయనను బయటకు తీసుకెళ్లారు. VIDEO | Delhi: BJP leader Vijender Gupta (@Gupta_vijender) says, “I am thankful to the party for giving me the responsibility of Speaker of Delhi Assembly. I will fulfill my responsibility… I hope we will have healthy discussions in the House.”(Full video available on PTI… pic.twitter.com/8SsH8GEmNT— Press Trust of India (@PTI_News) February 20, 2025 👉రామ్‌లీల మైదానం వద్ద బీజేపీ కార్యకర్తలు సందడి చేస్తున్నారు. మరోవైపు.. రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు బీజేపీ నేతలు అక్కడికి చేరుకుంటున్నారు. #WATCH | Delhi swearing-in ceremony | BJP Mahila Morcha workers rejoice at Ramlila Maidan ahead of the swearing-in ceremony of CM-designate Rekha Gupta. pic.twitter.com/Hr8gMubHzo— ANI (@ANI) February 20, 2025 👉 ఇక, సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్, ఆతిశీల తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్న నాలుగో మహిళగా ఆమె నిలవనున్నారు. అలాగే, బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్, ఉమాభారతి, వసుంధర రాజే, ఆనందీబెన్ పటేల్‌ల తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టనున్న ఐదో మహిళగా, దేశంలో విభిన్న పార్టీల నుంచి సీఎం పదవి చేపట్టనున్న 18వ మహిళగా రేఖా గుప్తా నిలవనున్నారు.#WATCH | Delhi CM designate Rekha Gupta says, "It is a miracle, it is a new motivation and a new chapter. If I can be the CM, this means ways are open for all the women... Anyone who has been corrupt will have to give an account of each and every rupee..." pic.twitter.com/F1GUVRELVp— ANI (@ANI) February 20, 2025 #WATCH | Swearing-in ceremony of Delhi CM-designate Rekha Gupta and her council of ministers to take place at Ramlila Maidan today. Visuals from the venue. pic.twitter.com/d6acoUYOSr— ANI (@ANI) February 20, 2025మోదీకి థ్యాంక్స్: రేఖా గుప్తా భర్త👉రేఖా గుప్తా భర్త మనీష్ గుప్తా మాట్లాడుతూ.. రేఖా గుప్తా ఢిల్లీ ముఖ్యమంత్రి అవుతారని మేము ఎప్పుడూ అనుకోలేదు. ఇది ఒక అద్భుతంలా అనిపిస్తుంది. పార్టీ మాకు ఇంత గౌరవం ఇవ్వడం మాకు సంతోషకరమైన విషయం అని ఆనందం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. #WATCH | Delhi CM-designate Rekha Gupta's husband, Manish Gupta says, "...We never thought that she (Rekha Gupta) would become the Chief Minister of Delhi. It seems like a miracle... It is a matter of happiness for us that the party has given us so much respect..." pic.twitter.com/I7rX6X9PaW— ANI (@ANI) February 20, 2025 👉ఢిల్లీ ముఖ్యమంత్రితో పాటుగా నేడు మరో ఆరుగురు మంత్రులుగా ప్రమాణం చేస్తారు. వీరిలో పర్వేష్ వర్మ, అశిశ్ సూద్, మన్జిందర్ సింగ్ సిర్సా, రవీందర్ ఇంద్రాజ్ సింగ్, కపిల్ మిశ్రా, పంకజ్ కుమార్‌సింగ్ ఉన్నారు. Delhi swearing-in ceremony | Parvesh Sahib Singh, Ashish Sood, Manjinder Singh Sirsa, Ravinder Indraj Singh, Kapil Mishra and Pankaj Kumar Singh to take oath as Ministers today. pic.twitter.com/1Gbvkq9xK7— ANI (@ANI) February 20, 2025👉అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ హైకమాండ్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాను ఎంపిక చేసింది. 26 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారం సాధించిన బీజేపీ.. తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన అభ్యర్థికి సీఎంగా అవకాశం దక్కింది. అయితే, దేశంలో మెజార్టీ రాష్ట్రాల్లో(సొంతంగా 15 రాష్ట్రాల్లో.. మరో ఆరు రాష్ట్రాల్లో మిత్రపక్షాలు) బీజేపీ అధికారంలో ఉన్నది. కానీ, ఏ రాష్ట్రంలోనూ మహిళా సీఎం లేరు. మహిళలకు బీజేపీ సముచిత స్థానం ఇవ్వడం లేదనే ఆరోపణలు ఇదివరకే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రేఖా గుప్తాకు అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది.#WATCH | NSG (National Security Guard) commandos, Delhi Police personnel and RAF (Rapid Action Force) personnel deployed on security at Ramlila Maidan. Delhi CM-designate Rekha Gupta and her new cabinet ministers will take oath here today. pic.twitter.com/9WMgoncQtb— ANI (@ANI) February 20, 2025రేఖా గుప్తా రాజకీయం ప్రస్థానం ఇలా.. 👉హర్యానాలోని జులానాలో 1974 జులై 19న జన్మించిన రేఖా గుప్తా.. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని దౌలత్‌రామ్ కళాశాలలో బీకాం చదివారు. ఆ సమయంలోనే (1992) ఏబీవీపీ ద్వారా విద్యార్థి రాజకీయాల్లో ప్రవేశించారు. 1995-96లో ఢిల్లీ వర్సిటీ విద్యార్థి సంఘం కార్యదర్శిగా పని చేశారు. 1996-97లో అధ్యక్షురాలిగా సేవలందించారు. మేరఠ్‌లోని చౌధరీ చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్ర పట్టా పుచ్చుకున్నారు. కొంతకాలం న్యాయవాదిగా పని చేశారు. 1998లో మనీశ్ గుప్తాను వివాహం చేసుకున్నారు. 2007లో ఉత్తర పీతంపుర మున్సిపల్ కౌన్సిలర్‌గా విజయం సాధించారు. అనంతరం దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆరెస్సెస్‌తో ఆమెకు సన్నిహిత సంబంధాలున్నాయి. సంఘ్ మహిళా సంబంధిత కార్యక్రమాల్లో ఆమె చురుకుగా పాల్గొనేవారు. ప్రస్తుతం భాజపా మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా ఉన్నారు.మోదీకి కృతజ్ఞతలు👉ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనను ఎంపిక చేసిన వెంటనే ప్రధాని మోదీకి రేఖా గుప్తా కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీలోని ప్రతి పౌరుడి సంక్షేమం, సాధికారత, సర్వతోముఖాభివృద్ధికి విశ్వాసం, నిజాయితీ, అంకిత భావంతో పని చేస్తానని వెల్లడించారు. రేఖా గుప్తాకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రస్తుత ముఖ్యమంత్రి ఆతిశీ, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ శుభాకాంక్షలు తెలిపారు. -
ఢిల్లీ సీఎం రేఖా గుప్తా
న్యూఢిల్లీ: పదకొండు రోజుల సస్పెన్స్‌కు తెర పడింది. ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరో తేలిపోయింది. కొన్నాళ్లుగా ముఖ్యమంత్రులుగా కొత్త ముఖాలకు అవకాశమిస్తున్న ఆనవాయితీని ఢిల్లీ విషయంలోనూ బీజేపీ అధిష్టానం కొనసాగించింది. అంతటితో ఆగకుండా ఓ మహిళకు పట్టం కడుతూ బుధవారం అనూహ్య నిర్ణయం తీసుకుంది. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన 50 ఏళ్ల రేఖా గుప్తాను సీఎంగా ఎంచుకుంది. సుష్మా స్వరాజ్ (బీజేపీ), షీలా దీక్షిత్ (కాంగ్రెస్), ఆతిశి (ఆప్) తర్వాత ఆమె ఢిల్లీకి నాలుగో మహిళా సీఎం కానున్నారు. మదన్‌లాల్ ఖురానా, సుష్మ, సాహెబ్‌సింగ్ వర్మ తర్వాత రాష్ట్రానికి మొత్తమ్మీద నాలుగో బీజేపీ సీఎం కూడా. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రస్తుతం మహిళలెవరూ సీఎంగా లేరు. దాంతో ఆ పార్టీ నుంచి ఏకైక మహిళా ముఖ్యమంత్రిగానూ రేఖ నిలవనున్నారు. దేశవ్యాప్తంగా చూస్తే మమతా బెనర్జీ తర్వాత రెండో మహిళా సీఎం అవుతారు. గురువారం సాయంత్రం రాంలీలా మైదానంలో అట్టహాసంగా జరిగే బహిరంగ సభలో రేఖ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలతో పాటు సినీ, పారిశ్రామిక ప్రముఖులు కూడా పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొననున్నారు. రేఖకు అమిత్ షా అభినందనలు తెలిపారు. రాజధాని ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఆమె నాయకత్వంలో నూతన బీజేపీ ప్రభుత్వం రేయింబవళ్లూ కృషి చేస్తుందని ఆశాభావం వెలిబుచ్చారు. తాజా మాజీ సీఎం ఆతిశితో పాటు ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కూడా రేఖకు అభినందనలు తెలిపారు.పర్వేశ్ అనుకున్నా...ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించి ఆప్ పదేళ్ల పాలనకు తెర దించడం తెలిసిందే. రాష్ట్రంలో 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అధికారం చేపట్టబోతోంది. మాజీ సీఎం సాహెబ్‌సింగ్ వర్మ కుమారుడు పర్వేశ్ వర్మకు సీఎంగా చాన్స్ దక్కుతుందని తొలుత భావించారు. కేజ్రీవాల్‌ను ఓడించి జెయింట్ కిల్లర్‌గా నిలవడంతో ఆయన పేరు మార్మోగింది. కానీ క్రమంగా పలువురు ఇతర నేతల పేర్లు తెరపైకి వచ్చాయి. ఈసారి మహిళకే అవకాశమని కొద్ది రోజులుగా బీజేపీ నేతలే చెబుతుండటంతో రేఖ పేరు ప్రముఖంగా విన్పించింది. చివరికదే నిజమైంది. బుధవారం సాయంత్రం ఢిల్లీ బీజేపీ శాసనసభా పక్ష భేటీ జరిగింది. రేఖను శాసనసభా పక్ష నేతగా పర్వేశ్ వర్మ తదితర సీనియర్లు ప్రతిపాదించగా ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అనంతరం ఎల్పీ భేటీకి పరిశీలకులుగా వచ్చిన బీజేపీ అగ్ర నేతలు రవిశంకర్ ప్రసాద్ తదితరులతో కలిసి రేఖ రాజ్‌నివాస్‌కు వెళ్లారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వెలిబుచ్చారు.‘‘నాకు అవకాశమిచ్చినందుకు ప్రధాని మోదీకి, బీజేపీ నాయకత్వానికి, అగ్ర నేతలకు కృతజ్ఞతలు. ఢిల్లీ సమగ్రాభివృద్ధికి సంక్షేమానికి పూర్తి నిజాయితీతో, చిత్తశుద్ధితో కృషి చేస్తా. నగరాన్ని నూతన శిఖరాలకు తీసుకెళ్తా’’– రేఖా గుప్తా..అలా కలిసొచ్చింది! రేఖా గుప్తాను వరించిన అదృష్టంకలిసొచ్చిన బనియా సామాజికవర్గంఏబీవీపీతో రాజకీయ ప్రస్థానం మొదలుఎమ్మెల్యేగా తొలిసారి నెగ్గిన రేఖా గుప్తాను ఢిల్లీ సీఎంగా ఎంచుకోవడం ద్వారా బీజేపీ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎంతోమంది సీనియర్లున్నా చాలా సమీకరణాలు ఆమెకు అనుకూలించాయి. మహిళ కావడంతో పాటు వైశ్య (బనియా) సామాజికవర్గం కూడా కలిసొచ్చింది. ఆప్ అధినేత కేజ్రీవాల్‌ది కూడా బనియా సామాజికవర్గమే. ఇక ఆ పార్టీకి చెందిన మహిళా నేత ఆతిశి తాజా మాజీ సీఎం. రేఖ ఎంపిక వెనక ఈ రెండు అంశాలనూ బీజేపీ అధిష్టానం దృష్టిలో ఉంచుకున్నట్టు కన్పిస్తోంది. పార్టీ పట్ల తిరుగులేని విధేయత వీటికి తోడైంది.మహిళల్లో మరింత ఆదరణ కోసం...ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో పురుషుల కంటే మహిళలే అధికంగా ఓట్లేశారు. పురుషుల ఓట్లపై అధికంగా ఆధారపడ్డ ఆప్ పరాజయం పాలవగా మహిళల ఆదరణే తమకు అధికారం అందించిందని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. అందుకే మహిళను సీఎం చేసి వారి రుణం తీర్చుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. బీజేపీ నుంచి 9 మంది మహిళలు పోటీ చేయగా నలుగురు గెలిచారు.ఆరెస్సెస్‌తో బంధం50 ఏళ్ల రేఖ వివాదాలకు సుదూరం. ఆర్ఎస్ఎస్తో ఆమెది సుదీర్ఘ అనుబంధం. 1974 జూలై 19న హరియా ణాలో జన్మించారు. ఢిల్లీలోని దౌలత్‌రామ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేస్తుండగానే ఏబీవీపీలో చేరారు. ఢిల్లీ వర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికలతో ఏబీవీపీ అభ్యర్థిగా రాజకీయ అరంగేట్రం చేశారు. విద్యార్థి సంఘం కార్యదర్శిగా, అధ్యక్షురాలిగా పనిచేశారు. తర్వాత న్యాయ విద్య అభ్యసించి కొంతకాలం అడ్వొకేట్‌గా ప్రాక్టీస్ చేశారు. 2002లో బీజేపీలో చేరి యువజన విభాగం జాతీయ కార్యదర్శి సహా పలు హోదాల్లో పని చేశారు. మూడుసార్లు ఢిల్లీ కౌన్సిలర్‌గా గెలిచారు. సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్డీఎంసీ) మేయర్‌గా సేవలందించారు. మహిళలు, చిన్నారుల సంక్షేమానికి కృషి చేశారు. బాలికల విద్య కోసం సుమేధ యోజన ప్రారంభించారు. 2022లో ఢిల్లీ మేయర్ పదవికి పోటీ పడి ఆప్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ చేతిలో ఓడారు. ప్రస్తుతం రేఖ బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలు. అసెంబ్లీ ఎన్నికల్లో షాలిమార్‌బాగ్ నుంచి 29,595 వేల ఓట్ల మెజార్టీతో ఆప్ అభ్యర్థిపై గెలిచారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఢిల్లీ కొత్త సీఎంగా రేఖా గుప్తా
ఢిల్లీ: ఢిల్లీ కొత్త సీఎం ఎన్నికపై ఉత్కంఠకు తెరపడింది. ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా (Delhi Cm Rekha Gupta) ఎంపికయ్యారు. సీఎంగా బీజేపీ (bjp) ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. డిప్యూటీ సీఎంగా పర్వేష్ వర్మ, స్పీకర్‌గా విజేందర్ గుప్తా ఎన్నికయ్యారు. సీఎంగా రేఖా గుప్తా రేపు(గురువారం) మధ్యాహ్నం 12:35 గంటలకు రామ్‌లీలా మైదానంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేఖాగుప్తాతో పాటు మరో ఆరుగురు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు.26 ఏళ్ల కలను సాకారం చేసుకుంటూ దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ (BJP) ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. సీఎం ఎంపికపై బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఢిల్లీ బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. సమావేశంలో 47 మంది ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎంపీలు పాల్గొన్నారు. ఢిల్లీ సీఎం అభ్యర్థి ఎంపికపై పరిశీలకులుగా మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్, పార్టీ జాతీయ కార్యదర్శి ఓం ప్రకాష్ ధన్‌ఖడ్‌లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలు రేఖా గుప్తాను సీఎంగా ఎన్నుకున్నారు. ఢిల్లీకి 4వ మహిళా సీఎంగా రేఖ గుప్తా2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ.. సీఎంగా ఆ పార్టీ షాలిమార్ బాగ్ ఎమ్మెల్యే రేఖ గుప్తాను ఎంపిక చేసింది. ఢిల్లీలో బీజేపీ నుంచి చివరగా 1998లో సుష్మా స్వరాజ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. బీజేపీ తరుఫున ఢిల్లీ సీఎంగా సుష్మా స్వరాజ్ తర్వాత రేఖ గుప్తా నియమితులయ్యారు. ఇప్పటి వరకు ముగ్గురు మహిళలు ఢిల్లీ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్ కాగా, కాంగ్రెస్ నుంచి షీలా దీక్షిత్,ఆప్ నుంచి అతిషీ మర్లేనా సీఎంలుగా సేవలందించారు. తాజాగా రేఖ గుప్తా ఢిల్లీకి నాలుగవ మహిళా సీఎంగా పనిచేయనున్నారు. రేఖ గుప్తా రాజకీయ ప్రస్థానంఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఎంపికైన యాబైఏళ్ల రేఖా గుప్తా (Who is Rekha Gupta) బీజేపీ సీనియర్ నేతగా కొనసాగుతున్నారు. ఆమె ఢిల్లీలోని షాలిమార్ బాగ్ (ఉత్తర-పశ్చిమ) నియోజకవర్గం నుండి 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 68,200 ఓట్లతో విజయం సాధించారు. రేకా గుప్తా విద్యార్థి దశ నుంచి నాయకత్వ లక్షణాలు, సామాజిక సేవ, ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. యూనివర్సిటీలో అనుబంధ డౌలత్ రామ్ కాలేజీలో చదువుకుంటున్న సమయంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషద్, ఆర్ఎస్ఎస్లో యాక్టీవ్ మెంబర్‌గా పనిచేశారు. ఢిల్లీలో మూడుసార్లు మున్సిపల్ కౌన్సిలర్‌గా,ఒకసారి మేయర్‌గా సేవలందించారు. 1996-97లో ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షురాలిగా పనిచేశారు. 2003-2004 మధ్య బీజేపీ యువ మోర్చా ఢిల్లీ కార్యదర్శిగా పనిచేశారు. 2004-2006 మధ్య ధర్మేంద్ర ప్రధాన్ అధ్యక్షతన బీజేపీ యువ మోర్చా జాతీయ కార్యదర్శిగా పనిచేశారు.2007లో ఉత్తరీ పితాంపుర, ఢిల్లీ నగర పంచాయతీ కౌన్సిలర్‌గా గెలుపొందారు2007-2009 మధ్య రెండు వరుస సంవత్సరాల పాటు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మహిళా సంక్షేమం, బాల అభివృద్ధి కమిటీ ఛైర్ పర్సన్‌గా వ్యవహరించారు2009లో ఢిల్లీ రాష్ట్ర మహిళా మోర్చా బీజేపీ జనరల్ సెక్రటరీగా పనిచేశారు2010లో బీజేపీ జాతీయ ఎగ్జిక్యూటివ్ సభ్యురాలిగా ఎన్నియ్యారు2023 ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో తన ప్రత్యర్థి,ఆప్ నేత షెల్లీ ఒబెరోయి చేతిలో ఓడిపోయారు. 2025లో తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారానికి ముమ్మర ఏర్పాట్లురామ్ లీలా మైదానంలో ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుత సమాచారం మేరకు.. రామ్ లీలా మైదానంలో మూడు వేదికలను సిద్ధం చేయనున్నారు. ఒక వేదికపై ఢిల్లీ కొత్త సీఎం, ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, లెఫ్టినెంట్ గవర్నర్ వీ.కే. సక్సేనా, రెండో వేదికను మత గురువులు కోసం, మూడో వేదికపై బీజేపీ, దాని మిత్రపక్ష పార్టీలకు చెందిన 200 పైగా ఎంపీలు, ఎమ్మెల్యేల కోసం సిద్ధం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి ఆప్ అధినేత,మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, అలాగే కాంగ్రెస్ ఢిల్లీ శాఖాధ్యక్షుడు దేవేందర్ యాదవ్‌లను సైతం ఆహ్వానించిన వారిలో ఉన్నట్లు తెలుస్తోంది. -
విమర్శలు తప్ప.. కేటీఆర్ చేసిందేమీలేదు: మల్లు రవి
సాక్షి, ఢిల్లీ: రేవంత్ రియల్ హీరో అని.. ఆయనను విమర్శించడం తప్ప రైతు దీక్షలో కేటీఆర్ చేసిందేమీ లేదంటూ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, అమలు చేయకుండా మోసం చేశాడంటూ కేటీఆర్ ఆరోపణలు చేశారు. కేటీఆర్ వారి ప్రభుత్వ హయాంలో 10 ఏళ్లు అమలు చేయకుండా ప్రజలను ఏవిధంగా ఇబ్బందులపాలు చేశారో చెప్పినట్లే ఉంది. కాంగ్రెస్‌ను, సీఎం రేవంత్‌ని విమర్శిస్తూ అస్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుంది’’ అని మల్లు రవి విమర్శలు గుప్పించారు.‘‘రైతు భరోసా 12 వేలు, రెండు లక్షల వరకు రుణమాఫీ, ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంపు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500కే గ్యాస్ ఇలా మేము ఇచ్చిన హామీలను అమలు చేశాం. మేము చేసింది వాస్తవం, మీరు చేయనిది వాస్తవం. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో 7 లక్షల మంది విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచాం. కార్పొరేట్ విద్యను 56 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ హాస్టళ్ల నిర్మాణం చేపట్టింది వాస్తవం. కాంగ్రెస్ హయాంలో రేవంత్ రియల్ హీరో అని.. ఆయనను విమర్శించడం తప్ప రైతు దీక్షలో కేటీఆర్ చేసిందేమీ లేదంటూ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి వ్యాఖ్యానించారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. ప్రజలకు ఏం చెప్పమో మొదటి ఏడాదిలోనే చేసి చూపించాం’’ అని మల్లు రవి పేర్కొన్నారు.బీఆర్ఎస్ 10 ఏళ్లలో 7 లక్షల కోట్ల అప్పు చేస్తే వాటికి రూ.6500 కోట్ల రూపాయలు వడ్డీలు కడుతున్నాం. పేదలకు ఇచ్చిన మాటను నిలుపుకునేందుకు తల తాకట్టు పెటైనా నెరవేర్చాలనే సంకల్పంతో రేవంత్ పనిచేస్తున్నారు. ఓటమిని జీర్ణించుకోలేక అవాకులు చెవాకులు పేలుతున్నారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాలని బీఆర్ఎస్ నేతలకు సూచిస్తున్నాం. ఇష్టారీతిన మాట్లాడితే కేటీఆర్ మీదకు ప్రజలు తిరగబడతారు. రాష్ట్రంలో అనవసరంగా ఖర్చులు చేసింది కేసీఆర్. వందేళ్లు పనిచేసే సచివాలయాన్ని కూల్చేసి కట్టారు. కేసీఆర్ హయాంలో స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం కూడా లేదు. మా హయాంలో ప్రజల పాలన నడుస్తుంది’’ అని మల్లు రవి చెప్పారు. -
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట.. కేంద్రంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం
ఢిల్లీ : కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులు పోటెత్తడంతో గత శనివారం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో (New Delhi Railway Station Stampede) తొక్కిసలాట జరిగింది. ఆ దుర్ఘటనపై కేంద్రం, భారతీయ రైల్వే శాఖపై ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. రైల్వే కోచ్‌లో నిర్ధిష్ట ప్రయాణికుల సంఖ్య కంటే ఎక్కువ మందిని ఎందుకు అనుమతిస్తున్నారని ప్రశ్నించింది. ట్రైన్ టికెట్లు ఎందుకు ఎక్కువగా అమ్ముతున్నారని మండిపడింది. ఇదే అంశంపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట దుర్ఘటనపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)పై ఇవాళ (ఫిబ్రవరి 19) విచారణ చేపట్టింది. విచారణ సమయంలో పైవిధంగా స్పందించింది. కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులు పోటెత్తడంతో గత శనివారం (ఫిబ్రవరి 17,2025) రాత్రి జరిగిన తొక్కిసలాటలో 18 మంది మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ దుర్ఘటనపై దాఖలైన పిల్‌పై ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ డీకే ఉపాధ్యాయ్, జస్టిస్ తుషార్ రావు ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. విచారణ సమయంలో పరిమితికి మించి టికెట్లను ఎందుకు అమ్ముతున్నారని అటు కేంద్రాన్ని, ఇటు రైల్వే శాఖను ప్రశ్నించింది.ఈ సందర్భంగా రైల్వే ప్రమాదాల్ని నివారించేందుకు ఢిల్లీ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం కేంద్రం,రైల్వే శాఖకు పలు సూచనలు ఇచ్చింది.రైల్వే చట్టం సెక్షన్ 147 ప్రకారం, ఒక కోచ్‌లో ప్రయాణికుల సంఖ్య పరిమితి ఉండాలి. ఈ చట్టం ప్రకారం పరిమితికి మించి ప్రయాణికుల్ని అనుమతిస్తే 1,000 రూపాయల జరిమానా,అలాగే ఆరు నెలల జైలు శిక్ష విధించవచ్చు.ఈ చర్యలు తీసుకోకపోతే ప్రస్తుతం ఉన్న చట్టాల్ని అమలు చేయండి. టిక్కెట్లు అమ్మే ప్రక్రియను కట్టుదిట్టం చేయండి. భవిష్యత్‌లో రైల్వే ప్రమాదాల్ని నివారించవచ్చు. జస్టిస్ ఉపాధ్యాయ్ మాట్లాడుతూ.. రద్దీ సమయాల్లో కొంతమేర పరిమితి మించినా, ఆ స్థాయిలో ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలి. ఈ అంశంపై నిర్లక్ష్యం చేస్తే ఈ తరహా దుర్ఘటనకు దారి తీస్తుంది’ అని అన్నారు. రైల్వే శాఖ తరుఫున ప్రముఖ అడ్వకేట్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టులో తన వాదనల్ని వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను మార్చి 26కి వాయిదా వేసింది. -
ఢిల్లీ సీఎం ఎంపిక.. ప్రధాని సహా బీజేపీ అగ్రనేతల భేటీ
సాక్షి,ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సీఎం ఎవరనే సస్పెన్స్‌కు కొన్ని గంటల్లో తెరపడనుంది. సీఎం ఎవరన్నది ఖరారు చేసేందుకు బుధవారం(ఫిబ్రవరి 19) ఉదయం ప్రధాని మోదీ నివాసంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశమైంది. సీఎం ఎవరన్నది ఈ సమావేశంలో ఖరారు చేస్తారు. ఖరారు తర్వాత సీఎం ఎవరన్నది సాయంత్రం నిర్వహించే మీడియా సమావేశంలో ప్రకటించనున్నారు.అనంతరం రాత్రి 7 గంటలకు ఢిల్లీ బీజేఎల్పీ భేటీలో ఎమ్మెల్యేలు తమ నేతను ఎన్నుకోనున్నారు. బీజేఎల్పీ సమావేశానికి పరిశీలకులుగా పార్టీ సీనియర్ నేతలు రవిశంకర్ ప్రసాద్, ఓపి దంకర్‌ను అధిష్టానం నియమించింది. బీజేఎల్పీ నేతను ఎన్నుకునేందుకుగాను వీరు ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతారు. బీజేఎల్పీ నేతను ఎన్నుకున్న తర్వాత పార్టీ ముఖ్య నేతలు లెఫ్టినెంట్ గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరనున్నారు. సీఎం రేసులో పర్వేష్ వర్మ(న్యూ ఢిల్లీ),రేఖా గుప్తా (షాలిమార్ బాగ్), విజేందర్ గుప్తా (రోహిణి), సతీష్ ఉపాధ్యాయ్ (మాల్వియా నగర్), ఆశిష్ సూద్ (జనక్‌పురి), పవన్ శర్మ (ఉత్తమ్ నగర్),అజయ్ మహావార్ (ఘోండా) ఉన్నారు. అయితే ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేష్ వర్మ సీఎం రేసులో ముందున్నారు. జాట్ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో పర్వేష్వర్మకు సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువున్నాయని సమాచారం.ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిచిన వారిలో పదిమంది జాట్ ఎమ్మెల్యేలుండడం పర్వేష్‌కు కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు.కాగా గురువారం 11 గంటలకు ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణస్వీకారం చేయనున్నారు.రామ్ లీలా మైదానంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది.27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాణ స్వీకారం కోసం రామ్‌లీలా మైదానంలో మూడు వేదికలు ఏర్పాటు చేశారు. మొత్తం 150 మంది ముఖ్య అతిథులకు ఆహ్వానం పలికారు.ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం పంపారు. ప్రమాణస్వీకారానికి లక్ష మందికిపైగా హాజరయ్యే అవకాశం ఉంది. -
CEC appointment hearing: వాయిదా కోరిన కేంద్రం.. సరికాదన్న పిటిషనర్ లాయర్
న్యూఢిల్లీ: ఎన్నికల కమిషనర్ల నియామక ప్యానెల్‌పై విచారణను వాయిదా వేయాలని కేంద్రం కోరింది. అయితే దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అభ్యంతరం వ్యక్తం చేయగా.. ధర్మాసనం జోక్యం చేసుకుంది. ఎన్నికల కమిషనర్ల నియామక ప్యానెల్ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించడం, ఆ స్థానంలో ప్రత్యేక చట్టం ద్వారా కేంద్ర మంత్రిని కేంద్రం నియమించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటిని జస్టిస్ సూర్యకాంత్,ఎన్ కోటీశ్వర్ సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం అత్యవసర విచారణ చేపట్టింది.అయితే విచారణ ప్రారంభమైన కాసేపటికే.. రాజ్యాంగ ధర్మాసనం ముందు తాను హాజరు కావాల్సి ఉందని చెబుతూ సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా విచారణ వాయిదా వేయాలని కోరారు. అయితే ప్రతీ కేసు విచారణ వాయిదా కోరడం సరికాదని పిటిషనర్ అసోషియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫామ్స్ తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎస్జీ కాకుంటే.. 17 మంది లా ఆఫీసర్లు ఉంటారని, అలాంటప్పుడు వాయిదా కోరడం సరికాదని అన్నారు. ఈ తరుణంలో ధర్మాసనం జోక్యం చేసుకుంది. సోలిసిటర్ జనరల్ ఎప్పుడు అందుబాటులో ఉంటారో చెప్పాలని ధర్మాసనం కోరింది.ఇదిలా ఉంటే.. ప్రతిపక్షాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న వేళ.. కొత్త సీఈసీగా జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఉదయం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి(Chief Election Commissioner)గా జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. జాతి నిర్మాణానికి తొలి అడుగు ఓటు అని, ఎన్నికల సంఘం ఎప్పుడూ ఓటర్లకు మద్ధతుగా నిలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. నూతన సీఈసీగా జ్ఞానేశ్వర్ ఎంపికపై విపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సీఈసీ ఎంపికపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుండగానే.. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా లు అర్ధరాత్రి వేళ నిర్ణయం తీసుకోవడం సరికాదని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించడం తెలిసిందే.వివాదం ఏంటంటే..2023లో సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం కేంద్ర ఎన్నికల సంఘం నియామకాలపై స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అందులో సీఈసీ, ఈసీల ఎంపిక కోసం ఏర్పాటు చేసే ప్యానెల్లో భారత ప్రధాన న్యాయమూర్తిని చేర్చాలని పేర్కొంది. అంటే.. ప్రధానితో పాటు ప్రతిపక్ష నేత, సీజేఐ ఆ ప్యానెల్లో ఉండాలి. కేంద్రం కొత్త చట్టం చేసేంత వరకు ఈ విధానం పాటించాలని స్పష్టం చేసింది. అయితే కేంద్రం ఆ తీర్పును పట్టించుకోకుండా సీజేఐని మినహాయించింది. సీజేఐ బదులుగా కేంద్ర మంత్రిని చేర్చింది. ఈ మేరకు 2023లోనే ఓ కొత్త చట్టం(Chief Election Commissioner and Other Election Commissioners Act, 2023) తీసుకొచ్చింది. అయితే కొత్త చట్టం ప్రకారం నియామకాలు చేపడుతున్నట్లు కేంద్రం చెబుతున్నప్పటికీ.. ఈ చట్టం రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉందని, ఈసీ నియామకాల్లో ప్రభుత్వ జోక్యం ఎక్కువయ్యేలా ఉందని, అన్నింటికి మంచి అది ప్రజా స్వామ్యానికి ప్రమాదమని చెబుతూ పలువురు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కాబట్టి సీజేఐనే కొనసాగించాలని కోరుతున్నారు. దీంతో సుప్రీం కోర్టు ఇవాళ ఈ అంశంపై అత్యవసర విచారణ జరపనుంది. ఇదిలా ఉంటే.. మార్చి 15, 2024 కొత్త చట్టం ప్రకారం కేంద్రం చేపట్టిన ఈసీ నియామకాలపై స్టే విధించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించడం విశేషం. అయినప్పటికీ ప్రతిపక్షాలు సహా కొన్ని సంస్థలు న్యాయ స్థానాలను ఆశ్రయిస్తూనే ఉన్నాయి. -
రణ్‌వీర్‌కు సుప్రీం చీవాట్లు
న్యూఢిల్లీ: యూట్యూబ్‌లో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఇన్ఫ్లూయెన్సర్ రణ్వీర్ అలహాబాదియా అలియాస్ బీర్బైసెప్స్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడి వ్యాఖ్యలు వక్రబుద్ధితో కూడినవంటూ మండిపడింది. ‘ఇండియాస్ గాట్ లాటెంట్’ పేరుతో యూట్యూబ్‌లో కమెడియన్ సమయ్ రైనా నిర్వహించిన షోలో రణ్వీర్ చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం కావడం తెలిసిందే. దీనిపై మహారాష్ట్ర, అసోంల్లో కేసులు నమోదయ్యాయి.ఆయన వ్యాఖ్యలను కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘మీ మనసులో ఉన్న నీచమైన ఆలోచనలను షోలో వెళ్లగక్కారు. మీరు వాడిన పదజాలం కుమార్తెలు, తోబుట్టువులు, తల్లిదండ్రులే గాక మొత్తంగా ఈ సమాజమే అవమానంగా భావించేలా ఉంది. ఇది అశ్లీలత కాకపోతే మరేమిటి? మీపై నమోదైన కేసులను ఎందుకు కొట్టివేయాలి? దేశవ్యాప్తంగా పలుచోట్ల మీపై నమోదవుతున్న ఎఫ్ఐఆర్లను ఎందుకు కలపాలి?’’ అని న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్‌ల ధర్మాసనం నిలదీసింది.చౌకబారు ప్రచారం కోసం మీరు ఇలాంటివి చేస్తే, ఇలాగే చీప్ పబ్లిసిటీ కావాలనుకునేవారు బెదిరింపులకు పాల్పడతారంటూ ధర్మాసనం తలంటింది. వాక్ స్వాతంత్య్రం ఉందని సమాజ సహజ విలువలు, సూత్రాలకు విరుద్ధంగా మాట్లాడేందుకు ఎవరికీ లైసెన్సు లేదని స్పష్టం చేసింది. అతడు వాడిన భాషను మీరు సమర్థిస్తున్నారా? అని లాయర్ అభినవ్ చంద్రచూడ్‌ను ప్రశ్నించగా, వ్యక్తిగతంగా తనకూ అసహ్యం కలిగించాయంటూ ఆయన బదులిచ్చారు. ఆసే్ట్రలియా టీవీ ప్రోగ్రామ్‌లో ఓ నటుడి డైలాగ్‌ను కాపీ కొట్టి అలహాబాదియా ఈ వ్యాఖ్యలు చేసిన విషయం తమకూ తెలుసునని ధర్మాసనం పేర్కొంది. ‘ఇలాంటి కార్యక్రమాలను ప్రసారం చేసేటప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకుంటారు. పెద్దలకు మాత్రమే అనే హెచ్చరిక కనిపిస్తుంది. ఆ్రస్టేలియా కార్యక్రమాన్ని కాపీ చేసిన ‘ఇండియాస్ గాట్ లాటెంట్’నిర్వాహకులు ఈ జాగ్రత్తలేవీ తీసుకోలేదు’అని ధర్మాసనం తెలిపింది. ఇకపై కేసులొద్దు అలహాబాదియాకు చంపుతామంటూ బెదిరింపులు వస్తున్నాయని, ఈ ఒక్క అంశంపైనే చాలా చోట్ల కేసులు నమోదయ్యాయంటూ లాయర్ అభినవ్ చంద్రచూడ్ తెలపడంతో అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. ఆయనను ప్రస్తుతానికి అరెస్టు చేయరాదంటూ పోలీసులను ఆదేశించింది. అదేవిధంగా, ఇదే అంశంపై ఇకపై కేసులు నమోదు చేయవద్దని స్పష్టం చేసింది. ఇకపై ఆ యూట్యూబ్ షోను ప్రసారం చేయరాదని స్పష్టం చేసింది. కొంతకాలంపాటు ఇతర షోల్లో పాల్గొనవద్దని అలహాబాదియాకు స్పష్టం చేసింది.పాస్‌పోర్ట్‌ను థానే పోలీసులకు ఇవ్వాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని, మహారాష్ట్ర, అసోం పోలీసులకు విచారణలో సహకరించాలని అతడిని ఆదేశించింది. తనపై నమోదైన పలు ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలని, వాటన్నిటిపై ఒకే చోట విచారణ జరపాలంటూ అలహాబాదియా వేసిన పిటిషన్‌పై కేంద్రం, మహారాష్ట్ర, అసోం రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. మహారాష్ట్ర సైబర్ పోలీసులు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు.వివాదాస్పద కామెడీ షోకు సంబంధించిన మొత్తం 18 ఎపిసోడ్లను తొలగించాలని యూట్యూబ్‌ను కోరారు. ఖర్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరుకావాలంటూ అలహాబాదియాకు ముంబై పోలీసులు సమన్లు ఇచ్చారు. అయితే, అతడు తమతో టచ్‌లో లేడని ముంబై పోలీసులు తెలిపారు. అలహాబాదియాపై ఇండోర్, జైపూర్లలోనూ కేసులు నమోదయ్యాయి. ఆప్ నేత సత్యేందర్ జైన్‌పై విచారణకు రాష్ట్రపతి అనుమతిన్యూఢిల్లీ: మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్(60)ను విచారించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అనుమతి మంజూరు చేశారు. ఆయనపై ఆరోపణలకు తగు ఆధారాలున్నందున దర్యాప్తునకు అనుమతివ్వాలంటూ హోం శాఖ రాష్ట్రపతిని కోరింది. ఈ మేరకు ఆమె భారతీయ నాగరిక్ సురక్షా సంహితలోని సెక్షన్ 218 ప్రకారం అనుమతించారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ మేరకు సమాచారంతో ఈడీ కోర్టులో తాజాగా సప్లిమెంటరీ చార్జిషీటు దాఖలు చేయనుంది. హవాలా లావాదేవీల ఆరోపణలపై మంత్రిగా ఉన్న జైన్‌ను ఈడీ 2022 మేలో అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు. -
ప్రజాస్వామ్య దేవాలయమిది
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం ప్రజాస్వామ్య దేవాలయంగా పరిఢవిల్లుతోందని మంగళవారం ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ)గా పదవీ విరమణ చేసిన రాజీవ్ కుమార్ వ్యాఖ్యానించారు. 2022 మే 15వ తేదీన సీఈసీగా బాధ్యతలు చేపట్టి అత్యంత కీలకమైన లోక్‌సభ ఎన్నికలు, జమ్మూకశీ్మర్ అసెంబ్లీ ఎన్నికలుసహా పలు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలను సీఈసీ హోదాలో సమర్థవంతంగా నిర్వహించిన రాజీవ్ మంగళవారం సాయంత్రం రిటైర్ అయ్యాక నిర్వాచన్ సదన్ కార్యాలయ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ‘‘ నా దృష్టిలో కేంద్ర ఎన్నికల సంఘం ఒక ప్రజాస్వామ్య దేవాలయం.గత 75 ఏళ్లుగా ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తూ ప్రజాస్వామ్యాన్ని సమున్నత శిఖరాలపై నిలిపింది. తీరా ఎన్నికలప్పుడే ఎన్నికల ప్రక్రియపై పలు పార్టీలు, నేతలు అనుమానాలు వ్యక్తం చేయడమనేది కేవలం ఈసీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు, మొత్తం ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేసేందుకు వేసే ఎత్తుగడలు. ఎన్నికలకు సంబంధించి చాన్నాళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసుల విచారణ కోర్టులో ప్రత్యక్ష ప్రసారాలు కావడం కొన్నిసార్లు అపనమ్మకాలకు దారితీయొచ్చు’’ అని వ్యాఖ్యానించారు. ఆర్థికభారం కావొద్దు ‘‘అనుచిత ఉచిత వాగ్దానాలు, స్థాయికి మించిన వాగ్దానాలు చేస్తున్న రాజకీయ పార్టీల పట్ల ఈసీ ఎప్పటికప్పుడు అప్రమత్త ధోరణితో వ్యవహరించాలి. కేంద్ర, రాష్ట్రాలకు ఆర్థికభారం కాకుండా ఉచిత పథకాలు, హామీలు ఇస్తే మంచిది. ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున ఇంతకు మించి మాట్లాడను’’అని ఆయన అన్నారు. ‘‘ ఎగ్జిట్ పోల్స్ అనేవి అంచనాలను అమాంతం పెంచేసి వాస్తవ పరిస్థితుల నుంచి ఓటర్లను దూరంగా తీసుకెళ్తాయి. ఈ విషయంలో మీడియా మరీముఖ్యంగా ఎల్రక్టానిక్ మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఎగ్జిట్ పోల్స్‌పై మాకు పూర్తి అజమాయిషి, నియంత్రణ లేదు.అందుకే ఈ ఎగ్జిట్ పోల్స్ చేపట్టే సంస్థలే స్వీయనియంత్రణ కల్గిఉండాలి. సర్వేకు శాంపిల్ సైజు ఎంత? అసలు ఎంత విస్తృత స్థాయిలో సర్వే చేశారు?. సర్వే ఫలితాలు వాస్తవ ఫలితాలను ఏ మేరకు ప్రతిబింబిస్తాయి?. అనేవి చూసుకోవాలి’’ అని రాజీవ్ అన్నారు. ‘‘ కొత్త సారథి నాయకత్వంలో ఈసీ మరింతగా సమర్థవంతంగా ఎన్నికలు చేపట్టాలని ఆశిస్తున్నా. భారతీయ ప్రజాస్వామ్యం పటిష్టతకు ఓటర్లు, రాజకీయపార్టీలు తమ వంతు కృషిచేయాలి.ఈ బాధ్యతలను భుజాలకెత్తుకున్న ఓటర్లందరికీ నా శుభాకాంక్షలు’’ అని అన్నారు. 2020 ఏప్రిల్–ఆగస్ట్ కాలంలో పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డ్ చైర్మన్‌గా ఉన్న రాజీవ్ అదే ఏడాది సెపె్టంబర్ ఒకటిన ఎలక్షన్ కమిషనర్‌గా ఈసీలో చేరారు. 2022 మే 15న 25వ సీఈసీగా బాధ్యతలు చేపట్టారు. సీఈసీగా ఆయన అన్ని రకాల ఎన్నికలను నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికలు, 31 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికలు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు, రాజ్యసభ ఎన్నికలు సమర్థవంతంగా చేపట్టారు.నేడే సీఈసీగా జ్ఞానేశ్ బాధ్యతల స్వీకరణకేంద్ర ఎన్నికల సంఘానికి నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేశ్ కుమార్ నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. 2024 జనవరిలో కేంద్ర సహకార మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా రిటైర్ అయిన జ్ఞానేశ్ ఆ తర్వాత రెండు నెలలకే కేంద్ర ఎన్నికల సంఘంలో ఎలక్షన్ కమిషనర్‌గా కొత్త పాత్రలో కొలువుదీరారు. ఈసీ సభ్యుల నియామకానికి సంబంధించి మోదీ సర్కార్ తీసుకొచ్చిన కొత్త చట్టం అమల్లోకి వచ్చాక సీఈసీగా బాధ్యతలు చేపడుతున్న తొలి వ్యక్తి జ్ఞానేశ్ కావడం విశేషం. కేంద్ర సహకార మంత్రి అమిత్ షాకు అత్యంత ఆప్తునిగా పేరొందారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దుచేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని అమలుచేయడంలో జ్ఞానేశ్ కీలకపాత్ర పోషించారు. సీఈసీగా జ్ఞానేశ్ 2029 జనవరి 27వ తేదీన రిటైర్ అవుతారు. -
ఐదేళ్లలో వాణిజ్యం రెట్టింపు
న్యూఢిల్లీ: వచ్చే ఐదేళ్లలో ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని రెట్టింపు స్థాయికి పెంచుకోవాలని భారత్, ఖతార్ నిర్దేశించుకున్నాయి. ప్రస్తుతం 14 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్యాన్ని 28 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ మేరకు ద్వైపాక్షిక చర్చల్లో పలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఇరు దేశాల మధ్య సంబంధాన్ని ‘వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి పెంచుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు భారత ప్రధాని మోదీ, ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్–థానీ(Qatar Emir Sheikh Tamim bin Hamad Al Thani) మధ్య మంగళవారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఐదు ఒడంబడికలపై సంతకాలుఆర్థిక భాగస్వామ్యం, సహకారం, యువజన వ్యవహారాలు, క్రీడలు, పురాతన వస్తువుల నిర్వహణ తదితర అంశాల్లో ఐదు ఒడంబడికలపై ఇరు దేశాధినేతలు సంతకాలు చేశారు. ఇరు దేశాల మధ్య ద్వంద్వ పన్నుల విధానం నివారణ ఒప్పందం పొడిగింపుపైనా సంతకాలు జరిగాయి. ‘‘ ఖతార్‌తో ద్వైపాక్షిక బంధాన్ని వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచాం. వాణిజ్యం, ఇంధన భద్రత, పెట్టుబడులు, సాంకేతికత, ఇరు దేశస్తుల మధ్య సత్సంబంధాలు తదితర అంశాల్లో పరస్పర భాగస్వామ్య ధోరణిని ఇక మీదటా కొనసాగిస్తాం’’ అని ఇరు దేశాల మధ్య చర్చల వివరాలను భారత విదేశాంగ శాఖ కార్యదర్శి అరుణ్‌కుమార్ ఛటర్జీ తర్వాత మీడియాకు చెప్పారు.‘‘ వ్యూహాత్మక భాగస్వామ్యం అంటే అన్ని అంశాలు ఇమిడి ఉంటాయి. ముఖ్యంగా భద్రత సంబంధ అంశం తలెత్తినప్పుడు ప్రత్యేకంగా దీనిపై రెండు దేశాలు ఉమ్మడి ఎజెండా రూపొందిస్తాయి’’ అని ఛటర్జీ చెప్పారు. విస్తృత స్థాయి ద్వైపాక్షిక చర్చల తర్వాత మోదీ, అమీర్ తమీమ్‌లు సంయుక్త ప్రకటన విడుదలచేశారు. ‘‘ సీమాంతర ఉగ్రవాదం సహా అంతర్జాతీయంగా అన్ని రూపాల్లో ఉన్న ఉగ్రవాదాన్ని తుదముట్టిద్దాం. విభేదాలను ద్వైపాక్షిక చర్చలు, బహుముఖ మార్గాల ద్వారా సామరస్యంతో రూపుమాపుదాం’’ అని ఆ ప్రకటనలో భారత్, ఖతార్ పేర్కొన్నాయి.పెరగనున్న పెట్టుబడులుఒప్పందంలో భాగంగా భారత్‌లో మౌలిక వసతులు, నౌకాశ్ర యాలు, నౌకల నిర్మాణం, ఇంధనం, పునరు త్పాదక ఇంధన రంగం, స్మార్ట్ సిటీ లు, ఫుడ్ పార్క్‌లు, అంకుర సంస్థలతోపాటు కృత్రిమ మేథ, రోబోటిక్స్, మెషీన్ లెర్నింగ్ వంటి నూతన సాంకేతికత రంగాల్లో ఖతార్ పెట్టుబడుల ప్రాధికార సంస్థ పెట్టుబడులను మరింత పెంచుతుంది. అంతర్జాతీయ వివాదా లకు శాంతియుత పరిష్కారాలను చర్చలు, దౌత్యం ద్వారా మాత్రమే సాధించగలమని ఇరు దేశాలు వ్యాఖ్యానించాయి.గత ఏడాది మోదీ ఖతార్‌లో పర్యటించినప్పుడు ఏకంగా 78 బిలియన్ డాలర్ల ద్రవరూప సహజ వాయువు దిగుమతిపై ఒప్పందం కుదుర్చుకున్నారు. 2048 ఏడాదిదాకా మార్కెట్ ధరల కంటే తక్కువకే భారత్‌కు ఖతార్ నుంచి ఏటా 75 లక్షల మెట్రిక్ టన్నుల ఎల్ఎన్జీ దిగుమతి అయ్యేలా ఒప్పందం కుదుర్చు కున్నారు. ఫిబ్రవరి 17 నుంచి రెండ్రోజుల పర్యటన కోసం ఖతార్ అమీర్ షేక్ తమీమ్ భారత్‌కు విచ్చేసిన విషయం తెల్సిందే. తమీమ్ భారత్‌లో పర్యటించడం ఇది రెండోసారి. గతంలో 2015లో ఆయన భారత్‌కు వచ్చారు. -
కూటమికి ఏక్నాథ్ షిండే దూరం..? పొమ్మనలేక, పొగపెడుతున్న..
ముంబై : ఎన్నికల్లో గెలిచి, అధికారంలోకి వచ్చి మూడు నెలలు అయ్యిందో లేదో .. మహారాష్ట్ర అధికార మహాయుతి కూటమిలో లుకలుకలు మరోసారి బయటపడ్డాయి. దీంతో కూటమి చీలిపోతుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇంతకీ మహా రాజకీయాల్లో ఏం జరుగుతోంది.మహారాష్ట్ర రాజకీయాలు గందరగోళంగా మారాయి.మహాయుతి కూటమి పార్టీల ఎమ్మెల్యేలకు,ఎంపీలకు వై కేటగిరీ భద్రతను తొలగిస్తున్నట్లు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. భద్రత తగ్గింపులో కూటమిలో ఎన్సీపీ అజిత్ కుమార్ వర్గం కంటే.. శివసేన ఏక్నాథ్ షిండే వర్గం నేతలే ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. 2022లో ఏక్నాథ్ షిండే బీజేపీతో చేతులు కలిపారు. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం 44 మంది ఎమ్మెల్యేలకు , 11 లోక్‌సభ ఎంపీలకు ‘వై’ కేటగిరి భద్రతను అందించింది. తాజాగా, ఆ భద్రతను తొలగించింది. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆధ్వర్యంలో భద్రతా సమీక్షా కమిటీ జరిగింది. భద్రతా కమిటీ సమీక్షల ఆధారంగా.. ప్రజాప్రతినిధులకు వైకేటగిరి భద్రతను తొలగిస్తున్నట్లు సీఎం ఫడ్నవీస్ వెల్లడించారు. ఇందులో ఎలాంటి రాజకీయ పరమైన జోక్యం లేదని స్పష్టం చేశారు.అయినప్పటికీ మహాయుతి కూటమిలో మనస్పర్ధలు ఉన్నాయని, సీఎం దేవేంద్రఫడ్నవీస్ షిండేని దూరం పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకు ఊతం ఇచ్చేలా ఇటీవల అయితే, దావోస్ పర్యటనకు ముందు సీఎం ఫడ్నవీస్ ఎన్సీపీ,బీజేపీకి చెందిన నేతల్ని రాయ్‌గఢ్ రాయ్‌గఢ్, నాసిక్‌లకు ఇన్‌ఛార్జులుగా నియమించారు. అందులో శివసేన నేతలు లేకపోవడంపై ఆ పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇన్‌ఛార్జ్‌ల నియామకానికి బ్రేకులు పడ్డాయి. ఈ పరిణామాల వేళ..షిండే నేతృత్వంలోని ఎమ్మెల్యేలకు భద్రతను కుదించాలని నిర్ణయించుకోవడం గమనార్హం.మహాయుతి కూటమి లుకలుకలపై శివసేన (యూబీటీ)ఎంపీ ప్రియాంక చతుర్వేది స్పందించారు. మహాయుతి కూటమి ప్రేమికుల దినం జరుపుకుంటోంది అంటూ ఎక్స్ వేదికగా సెటైర్లు వేశారు. -
రెండో పెళ్లితో ‘చిక్కుల్లో’ ఐపీఎస్.. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా..
జైపూర్ : రెండో వివాహం ఓ సీనియర్ ఐపీఎస్ అధికారిని చిక్కుల్లో పడేసింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారి సీనియర్ ఐపీఎస్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఓ ఐపీఎస్ అధికారి హోదా తగ్గించింది. ఈ నిర్ణయంతో సీనియర్ ఐపీఎస్ అధికారిగా హోదాతో పాటు తీసుకునే పేస్కేలు సైతం తగ్గింది. కొత్తగా విధుల్లో చేరిన ఐపీఎస్ ఎంత వేతనం తీసుకుంటారో.. అంతే వేతనం సదరు సీనియర్ ఐపీఎస్ అధికారికి అందుతుంది.పలు నివేదికల ప్రకారం.. రాజస్థాన్ కేడర్ ఐపీఎస్ అధికారి పంకజ్ కుమార్ చౌదరి జైపూర్‌లో కమ్యూనిటీ పోలీసింగ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా పని చేస్తున్నారు. అయితే పంకజ్ కుమార్ మొదటి భార్య నుంచి విడాకులు తీసుకోకుండా రెండో వివాహం చేసుకున్నారు. ఈ వివాదంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ పంకజ్ కుటుంబ సభ్యులు రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టుకు చేరింది. విచారణ చేపట్టిన దేశ అత్యున్నత న్యాయస్థానం తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని పంకజ్ కుమార్ మీడియాకు వెల్లడించారు.ఈ తరుణంలో ఐపీఎస్ అధికారి పంకజ్ కుమార్ వివాహంపై రాజస్థాన్ రాష్ట్ర ఉన్నాతాధికారులు విచారణ చేపట్టారు. విచారణలో పంకజ్ కుమార్ దోషిగా తేల్చారు. విచారణ అనంతరం మూడు సంవత్సరాల పాటు ప్రస్తుతం ఉన్న తన డిజిగ్నేషన్‌ను తగ్గించారు. లెవల్ 11 సీనియర్ పే స్కేల్ నుండి లెవల్ 10 జూనియర్ పే స్కేల్‌కు కుదించారు. ఈ పేస్కేల్ కొత్తగా విధుల్లోకి చేరిన ఐపీఎస్‌లకు కేటాయిస్తారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా, 2009 బ్యాచ్ ఐపీఎస్ అధికారి పంకజ్ చౌదరి. ప్రస్తుతం,జైపూర్‌లో కమ్యూనిటీ పోలీసింగ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా పని చేస్తున్నారు. హోదా తగ్గించడంతో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (లెవల్ 10)గా కొనసాగనున్నారు. -
కీలక ఫైళ్ల గల్లంతు.. గుజరాత్ హైకోర్టుకు తాత్కాలిక చీఫ్ జస్టిస్!
న్యూఢిల్లీ: పలు కేసులకు సంబంధించిన ఫైల్స్ గల్లంతు అయిన వ్యవహారం గుజరాత్ హైకోర్టు(Gujarat High Court)ను కుదిపేస్తోంది. మరోవైపు చీఫ్ జస్టిస్ సునీతా అగర్వాల్‌ను బదిలీ చేయాల్సిందేనంటూ తోటి జడ్జిలు, అడ్వొకేట్లు డిమాండ్ లేవనెత్తారు. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. విమర్శల నేపథ్యంలో ఆమెను సెలవులపై వెళ్లగా.. జస్టిస్ అనిరుధ్ వైష్ణవ్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమించింది.గుజరాత్ హైకోర్టు పరిధి నుంచి పలు కేసులకు సంబంధించిన ఫైల్స్ మాయం(Files Missing) కావడంపై జడ్జి సందీప్ భట్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది న్యాయవ్యవస్థలోని పారదర్శకతను, నమ్మకాన్ని దెబ్బ తీసే అంశమని ఆందోళన వ్యక్తం చేశారాయన. ఈ క్రమంలో న్యాయ ప్రక్రియలకు సత్వర సంస్కరణలకు అవసరమని అభిప్రాయపడ్డారు. అంతేకాదు.. ఫైళ్ల మాయంలో హైకోర్టు రిజిస్ట్రార్ ఏటీ ఉక్రాణి పాత్రపైనా ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే.. ఇది ఊహించని పరిణామానికి దారి తీసింది.జస్టిస్ సందీప్ భట్ రోస్టర్‌ను మార్చేస్తూ చీఫ్ జస్టిస్ సునీతా అగర్వాల్(Chief Justice Sunitha Agarwal) ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం తీవ్ర అభ్యంతరాలకు కారణం కావడం మాత్రమే కాదు పలు అనుమానాలకూ దారి తీసింది. గుజరాత్ హైకోర్టు అడ్వొకేట్ అసోషియేషన్స్ సోమవారం అత్యవసరంగా సమావేశమై చీఫ్ జస్టిస్ నిర్ణయంపై చర్చించాయి. మరోవైపు.. హైకోర్టు జడ్జిలు, లాయర్లు జస్టిస్ సందీప్ భట్‌కు సంఘీభావం ప్రకటించారు. అయితే.. చీఫ్ జస్టిస్ సునీతా అగర్వాల్ ఇలా జడ్జిల విధులకు అడ్డుపడడం ఇదే తొలిసారేం కాదు. ఇంతకు ముందు.. నలుగురు జడ్జిల విషయంలోనూ ఆమె ఇలాగే ప్రవర్తించారు. అలాగే.. న్యాయవాదులతోనూ ఆమె వ్యవహరించే తీరుపైనా తీవ్ర విమర్శలు ఉన్నాయితాజాగా.. మొన్న శుక్రవారం(ఫిబ్రవరి 14)న అక్రమ కట్టడాలకు సంబంధించిన దాఖలైన పిల్‌పై వాదనలు జరిగాయి. చీఫ్ జస్టిస్ సునీతా అగర్వాల్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఆ పిల్‌ను విచారించింది. ఆ టైంలో జీహెచ్సీఏఏ అధ్యక్షుడు, సీనియర్ లాయర్ బ్రిజేష్ త్రివేదికి చీఫ్ జస్టిస్‌కి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తమ వాదనలు పూర్తిగా వినాలంటూ తీవ్ర స్వరంతో ఆయన చీఫ్ జస్టిస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే ఆమె అవేం పట్టనట్లు గాల్లో చూస్తూ ఉండిపోయారు. దీంతో ఆయన మరోసారి వ్యాఖ్యలు చేయడంతో.. ఆమె మందలించారు. ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది కూడా. ఈ పరిణామాలన్నింటిని దృష్ట్యా దీంతో ఆమెను మరో న్యాయస్థానానికి బదిలీ చేయాలంటూ జడ్జిలు, లాయర్లు డిమాండ్ లేవనెత్తారు. ఈ అంశంపై మంగళవారం మరోసారి జీహెచ్సీఏఏ జనరల్ బాడీ అత్యవసర సమావేశం నిర్వహించాలనుకుంది. కానీ ఈలోపు.. అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. చీఫ్ జస్టిస్ సునీతా అగర్వాల్ సెలవులపై వెళ్లగా.. ఆమె స్థానంలో జస్టిస్ బీరెన్ అనిరుధ్ వైష్ణవ్‌ను తాత్కాలిక చీఫ్ జస్టిస్‌గా నియమించింది. ఫిబ్రవరి 18వ తేదీ నుంచి మార్చి 2వ తేదీదాకా ఆయన ఆ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 223 ప్రకారం ఈ నియామకం చేపట్టినట్లు న్యాయ విభాగం(నియామకాల) కేంద్ర సంయుక్త కార్యదర్శి జగన్నాథ్ శ్రీనివాసన్ పేరిట నోటిఫికేషన్ విడుదలైంది.ఆ పెద్దావిడ పిటిషన్‌తో..జయశ్రీ జోషి(71) 2020లో రాధాన్పూర్ కోర్టులో ఓ కేసు నమోదు చేసింది. అయితే అందుకు సంబంధించిన ఫైల్ కనిపించకుండా పోయిందని హైకోర్టును ఆమె ఆశ్రయించారు. ఈ పిటిషన్ జస్టిస్ సందీప్ భట్ బెంచ్ విచారణ జరిపి.. కనిపించకుండా పోయిన ఆ ఫైల్స్ ఆచూకీ కనిపెట్టాలంటూ దర్యాప్తునకు ఆదేశించింది. ఈ క్రమంలో..2024 డిసెంబర్లో ఈ పిటిషన్‌కు సంబంధించి సమగ్రమైన నివేదిక అందించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అప్పుడే.. సూరత్ కోర్టుకు సంబంధించిన 15 కేసుల ఫైల్స్ కనిపించకుండా పోయాయనే విషయం వెలుగు చూసింది. కొసమెరుపు ఏంటంటే.. ఆ టైంలో సంబంధిత అధికారిగా, ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న రిజిస్ట్రార్ ఏటీ ఉక్రాణి ఉండడం గమనార్హం. సూరత్ కోర్టులో ఆరేళ్లపాటు పని చేసి.. బదిలీ మీద కోర్టుకు వచ్చారు. ప్రస్తుతం ఫైల్స్ మాయం అయిన వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరుగుతోంది.ఎవరీ సునీతా అగర్వాల్ఉత్తర ప్రదేశ్‌కు చెందిన జస్టిస్ సునీతా అగర్వాల్.. గతంలో అలహాబాద్ కోర్టులో జడ్జిగా పని చేశారు. కరోనా లాక్డౌన్ సమయంలో మానవ హక్కుల గురించి చర్చ ద్వారా ఆమె వార్తల్లో ప్రముఖంగా నిలిచారు. ఆహారం పంచుతున్న కొందరిని పోలీసులు అరెస్ట్ చేయగా.. వాళ్లందరినీ విడుదల చేయాలని ఆమె ఆదేశించారు. అంతేకాదు.. యూపీలో పని చేసే చోట్ల లైంగిక వేధింపుల కట్టడికి ఏర్పాటు చేసిన కీలక కమిటీలోనూ ఆమె సభ్యురాలిగా పని చేశారు. -
నేడు ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంలో విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: కారు గుర్తుపై గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేల కేసుపై మంగళవారం దేశ సర్వోన్నత న్యాయస్థానం మరోసారి విచారించనుంది. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై త్వరగా చర్యలు తీసుకోవాలని కోరుతూ జనవరి 15న బీఆర్ఎస్ సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్లపై ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్‌లు స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ)ను దాఖలు చేశారు. మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎం.సంజయ్‌కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరెకపూడి గాంధీలపై బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్ రావు తదితరులు రిట్ పిటిషన్ దాఖలు చేశారు.ఈ రెండు పిటిషన్లపై ఈనెల 10న సుప్రీం కోర్టు విచారించింది. విచారణ సమయంలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం.. రాజకీయ పారీ్టల హక్కులకు ఇబ్బంది కలుగుతుంటే చూస్తూ ఊరుకోం’అంటూ జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ల ధర్మాసనం పేర్కొంది. అనంతరం ఈనెల 18కి విచారణను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. -
20న ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణం?
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై పది రోజులుగా ఉత్కంఠ కొనసాగుతోంది. దీనికి అతిత్వరలో తెరపడనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 20వ తేదీన సాయంత్రం 4.30 నిమిషాలకు కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను బీజేపీ 48 స్థానాలను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.కొత్త సీఎంను బీజేపీ పెద్దలు ఇంకా ఎంపిక చేయలేదు. బీజేపీ శాసనసభాపక్ష భేటీ నిర్వహించలేదు. మార్చి 8న ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు వెళ్లివచ్చారు. సోమవారం బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగాల్సి ఉండగా.. ఢిల్లీలో కొత్తగా నిర్మించిన ఆర్ఎస్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవం, ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట నేపథ్యంలో ఈ భేటీ వాయిదా పడింది. బుధవారం శాసనభాపక్షం సమావేశం కానున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి ఎంపికతోపాటు మంత్రివర్గ కూర్పుపై ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు తెలియజేశాయి. -
ఢిల్లీని కుదిపేసిన భూకంపం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ, చుట్టుపక్కల ప్రాంతాలతోపాటు బిహార్‌లోని సివాన్‌లో సోమవారం ఉదయం భూమి తీవ్రంగా కంపించింది. రిక్టర్ స్కేలుపై ప్రకంపనల తీవ్రత 4.0గా నమోదైంది. ప్రకంపనల కేంద్రం ఎర్రకోటకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధౌలా కువాన్లోని ఝీల్ పార్క్ ఏరియాలో ఉన్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. భూమికి ఐదు కిలోమీటర్ల లోతులో ఉదయం 5.36 గంటల సమయంలో కంపనలు సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ(ఎన్సీఎస్) తెలిపింది. ఈ ప్రాంతంలో భూమి కంపించిన సమయంలో పెద్దపెద్ద శబ్దాలు వినిపించినట్లు స్థానికులు తెలిపారు. భూమికి 5 నుంచి 10 కిలోమీటర్ల లోతులో సంభవించే భూకంపాలను సాధారణ భూకంపాలుగా పరిగణిస్తారు. వీటి తీవ్రత ఎక్కువగా ఉన్న సందర్భాల్లో ఎక్కువ నష్టం సంభవించేందుకు అవకాశముంటుంది. ఝీల్ పార్క్ ప్రాంతంలో ఏటా కనీసం రెండుమూడుసార్లు భూమి కంపిస్తుంటుందని స్థానికులు తెలిపారు. 2015లో ఇక్కడ సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.3గా నమోదైంది. ప్రకంపనలతో భయపడిన ఢిల్లీ, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్ ప్రాంతాల్లోని బహుళ అంతస్తుల భవనాల్లోని జనం భూకంపం వచ్చిందంటూ రోడ్లపైకి చేరుకున్నారు. ఇంత తీవ్రమైన భూకంపం ఇంతకు ముందెన్నడూ తాము చూడలేదని పలువురు తెలిపారు. భారీగా శబ్దాలు రావడంతో ఎంతో భయపడిపోయామని చెప్పారు. భూకంపంతో ఎవరూ గాయపడలేదని, ఆస్తినష్టం సంభవించినట్లు సమాచారం లేదని అధికారులు తెలిపారు. ఢిల్లీ, సమీప ప్రాంతాల్లో సంభవించిన భూ ప్రకంపనలతో ఆందోళన చెందవద్దని ప్రధాని మోదీ ప్రజలను కోరారు. తదుపరి ప్రకంపనలు సంభవించే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ‘ఎక్స్’లో సూచించారు. అధికారులు పరిస్థితులను గమనిస్తున్నారన్నారు. బిహార్‌లోనూ ప్రకంపనలుబిహార్లోని పలు ప్రాంతాల్లో సోమవారం ఉదయం భూమి కంపించింది. ముఖ్యంగా శివాన్ చుట్టుపక్కల జిల్లాల్లో భూ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 4గా నమోదైంది. శివాన్‌లో ఉదయం 8 గంటల సమయంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలను గుర్తించామని ఎన్సీఎస్ తెలిపింది. భూకంపం కారణంగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించినట్లు ఎటువంటి సమాచారం లేదని అధికారులు తెలిపారు. సివాన్‌లో ప్రకంపనలతో భయకంపితులైన జనం ముందు జాగ్రత్తగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.తరచూ ఎందుకు?ఢిల్లీలో భూకంపాలు అసా ధారణమేం కాదు. ఢిల్లీ ప్రాంతం క్రియా శీల భూకంప జోన్ పరిధిలోకి వస్తుంది. హిమాలయాలకు దగ్గరగా ఉండటంతోపాటు ప్రపంచంలో అత్యంత భూకంప చురుకైన ప్రాంతాలలో ఒకటిగా ఉంది. కశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు విస్తరించి ఉన్న ఆవలి హిమాలయ పర్వతాలకు ఇవతలి వైపు హిమాలయాలకు మధ్య నెలకొన్న ఒత్తిడి( మెయిర్ బౌండరీ థ్రస్ట్–ఎంబీటీ) అత్యంత క్రియాశీలకంగా పనిచేస్తోంది. ఢిల్లీ–హరిద్వార్ రిడ్జ్, మహేంద్రగఢ్–డెహ్రాడూన్ ఫాల్ట్, మొరాదాబాద్ ఫాల్ట్, సోహ్నా ఫాల్ట్, యమునా నదీ రేఖతో సహా అనేక భూకంప అనుకూల ప్రాంతాలు దేశరాజధాని భూభాగానికి సమీపంలో ఉన్నాయి. దీంతో భూకంపాల తీవ్రత అధికం. ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రకారం ఢిల్లీ భూకంప జోన్–4లో ఉంది. జోన్–4 అంటే భూకంపాల ప్రమాదం ఎక్కువ ఉంటుందని అర్థం. ఇలాంటి జోన్లో భూకంపాలు సాధారణంగా రిక్టర్ స్కేల్‌పై ఐదు లేదా ఆరు తీవ్రతతో వస్తాయి. అప్పు డప్పుడు ఏడు లేదా 8 తీవ్రతతో సంభవిస్తాయి. అయితే ఈ జోన్ పరిధి∙నిరంతరం మారు తూ ఉంటుంది. రిక్టర్ స్కేల్‌పై నాలుగుగా నమోదైనాసోమవారం రిక్టర్ స్కేల్‌పై కేవలం 4 తీవ్రతతో సంభవించినప్పటికీ దాని ప్రభావం మాత్రం తీవ్రంగా కనిపించింది. అందుకు కారణం ఉంది. అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్న ప్రాంతాల్లో బలమైన ప్రకంపనలు వస్తాయి. భూకంపం పుట్టిన ప్రదేశంలో దాని శక్తి తీవ్రంగా ఉంటుంది. దూరం ఎక్కువయ్యే కొద్దీ ప్రకంపనలు బలహీ నమవు తాయి. నేల రకం వంటి స్థానిక భౌగోళిక పరిస్థితులు కూడా కదలికల్లో హెచ్చు తగ్గులకు కారణ మవుతాయి. ఢిల్లీ–ఎన్సీఆర్ విషయానికొస్తే భూఉపరి తలానికి ఐదు కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది. ఇది నగరం అంతటా బలమైన ప్రకంపనలను సృష్టించింది. సాధారణంగా హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్ వంటి ఉత్తర ప్రాంతాల్లో సంభవించే భూకంపాల వల్ల ఢిల్లీలో స్వల్ప కదలికలు న మోదవుతాయి. అయితే, సోమవారం æ భూకంప కేంద్రం ఢిల్లీ సమీపంలో ఉండటంతో ఢిల్లీ–ఎన్సీఆర్లో మరింత తీవ్రమైన ప్రకంపనలు వచ్చాయి.– సాక్షి, నేషనల్ డెస్క్ -
మత్స్య ఎగుమతుల్లో ఏపీ టాప్
సాక్షి, న్యూఢిల్లీ: మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలిచింది. రాష్ట్రం నుంచి 2019–24 మధ్య 15.74లక్షల టన్నుల మత్స్య సంపదను ఎగుమతి చేశారు. దీనిద్వారా రూ.90,633కోట్ల ఆదాయం వచ్చింది. ఈ మేరకు ఇటీవల లోక్‌సభలో కేంద్ర మత్స్య, పశుసంవర్థక శాఖ మంత్రి రాజీవ్‌రంజన్ సింగ్ ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ 2019–24 మధ్య ఏపీలో మత్స్య ఉత్పత్తులు, ఎగుమతులు రికార్డు స్థాయిలో పెరిగాయని చెప్పారు.మత్స్య రంగానికి, రైతులకు నాటి వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకమే ఇందుకు కారణమని ప్రకటించారు. 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో రూ.65,312 కోట్ల విలువైన సుమారు 11లక్షల టన్నులు మత్స్య సంపద మాత్రమే ఎగుమతి అయినట్లు తెలిపారు. వైఎస్ జగన్ హయాంలో అనూహ్యంగా 15.74 లక్షల టన్నుల మత్స్య ఉత్పత్తులు ఎగుమతులు చేసినట్లు వివరించారు. అదేవిధంగా మత్స్య ఉత్పత్తిలో ప్రపంచంలో భారతదేశం రెండో స్థానంలో ఉందని ఆయన చెప్పారు. జగన్ ప్రభుత్వ ప్రోత్సాహంతో పెరిగిన ఆక్వా సాగు రాష్ట్రంలో 2019–24 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వ ప్రోత్సాహంతో ఆక్వా సాగు గణనీయంగా పెరిగింది. ఆక్వా రంగ సుస్థిరాభివృద్ధి కోసం ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ, ఏపీ ఫిష్, ఏపీ సీడ్ యాక్టులను తీసుకొచ్చారు. రైతులకు సబ్సిడీపై విద్యుత్‌ను అందించడం, ధరలు పతనం కాకుండా చూడటం వంటి అనేక చర్యలు చేపట్టారు. ఫలితంగా రాష్ట్రంలో 1.75లక్షల మంది రైతులు ఆక్వాసాగు చేస్తున్నారు. ఐదేళ్లలో మత్స్య ఉత్పత్తులు 39 లక్షల టన్నుల నుంచి 51 లక్షల టన్నులకు పెరిగాయి. రొయ్యల దిగుబడులు 4.54లక్షల టన్నుల నుంచి 9.56 లక్షల టన్నులకు పెరగడం విశేషం. -
దివ్యాంగుల కోటాలో ఉద్యోగం .. ఆపై హుషారైన స్టెప్టులేసి..
భోపాల్ : ఓ ప్రభుత్వ అధికారిణి హుషారైన స్టెప్పులేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పార్టీల్లో డ్యాన్స్‌లు వేయడం,వాటిని వీడియోల రూపంలో పంచుకోవడం ఈ రోజుల్లో సర్వసాధారణం. అయితే, ట్రెజరీ విభాగంలో ఉన్నతాధికారిగా విధులు నిర్వహిస్తున్న ఆమె చేసిన డ్యాన్స్ వీడియోపై వివాదం చెలరేగింది. దీంతో ఆమె ప్రభుత్వ ఉద్యోగ నియామకంపై, రాష్ట్ర ప్రభుత్వ నిర్వహించే ఉద్యోగాల నియామకాలపై అనేక అనుమానాలు,ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంతకీ ఆ హుషారైన స్టెప్పులేసిన ఆ అధికారిణి ఎవరు? ఎందుకు వివాదంలో చిక్కుకున్నారు.ఇటీవల,మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ పార్టీకి ఉజ్జయిని ట్రెజరీ,అకౌంట్స్ విభాగంలో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రియాంకా కదమ్ (Priyanka Kadam)హాజరయ్యారు. ఆ పార్టీలో బ్రేక్ డ్యాన్స్ సైతం వేశారు. ఆమె డ్యాన్స్‌పై ఇతర గెస్ట్‌లు ఆహోఓహో అంటూ ఆమెపై ప్రశంసలు కురిపించారు. డ్యాన్స్ చేస్తుండగా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోనే ఇప్పుడు వివాదంగా మారింది.మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPPSC) నిర్వహించిన 2022 పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో ప్రియాంకా కదమ్ బోన్ డిజేబుల్ సర్టిఫికెట్తో దివ్యాంగుల కోటా కింద ఆమె ప్రభుత్వ ఉద్యోగం సంపాదించారని నేషనల్ ఎడ్యుకేటెడ్ యూత్ యూనియన్ నాయకుడు రాధే జాట్ ఆరోపణలు చేశారు. తాను దివ్యాంగురాలినని చెప్పుకునే ప్రియాంకా కదమ్ డ్యాన్స్ ఎలా చేశారని ప్రశ్నించారు. ఆమె దివ్యాంగంపై అనుమానం వ్యక్తం చేశారు. 45% दिव्यांग अधिकारी का डांस फ्लोर पर धमाल..MPPSC भर्ती 2022 में दिव्यांग कोटे से चयनित प्रियंका कदम के डांस वीडियो वायरल होने से विवाद खड़ा हो गया है. नेशनल एजुकेटेड यूथ यूनियन ने भर्ती में धांधली का आरोप लगाया, जिसके बाद निष्पक्ष जांच की मांग उठ रही है.#viral #trending… pic.twitter.com/bs5rLMs7Ad— NDTV India (@ndtvindia) February 14, 2025 అంతేకాదు, ఈ పరీక్షలో దివ్యాంగుల కోటాలో ఎంపికైన అభ్యర్థులకు మరోసారి పరీక్షలు నిర్వహించి, సర్టిఫికెట్లను అందించేలా భోపాల్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) వైద్యులను ఆదేశించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయంపై మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు స్పందించలేదు.అయితే, తనపై వస్తున్న ఆరోపణల్ని ప్రియాంక కదమ్ ఖండించారు. తన నియామకంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని స్పష్టం చేశారు. 2017లో తాను బాత్రూమ్లో జారిపడ్డానని, దీంతో తనకు అవాస్కులర్ నెక్రోసిస్ అనే సమస్య తలెత్తినట్లు చెప్పారు. అవాస్కులర్ నెక్రోసిస్ వ్యాధి కారణంగా రక్త సరఫరా లోపం తలెత్తి ఎముకలు బలహీనమవుతాయి.బోన్ సంబంధిత సమస్యల కారణంగా 45 శాతం దివ్యాంగురాలిగా ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. అయితే తాను నడవగలనని, కొంతమేర డ్యాన్స్ కూడా చేయగలనని స్పష్టం చేశారు. నేను మీకు సాధారణంగా కనిపించవచ్చు. కానీ నా శరీరంలో ఇంప్లాంట్స్ వల్లే నడవగలుగుతున్నాను. కొన్ని నిమిషాలు డ్యాన్స్ కూడా చేయగలుగుతున్నాను. డ్యాన్స్ చేస్తే కొన్నిసార్లు శరీరంలో నొప్పులు తలెత్తుతాయి. మెడిసిన్ తీసుకుంటే తగ్గిపోతుంది’ అని స్పష్టం చేశారు. -
‘ముగ్గురు సీఎంలను చూస్తాం’
ఢిల్లీ: ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచినా ఇంకా సీఎం ఎవరు అనే దానిపై సస్సెన్స్ కొనసాగుతూనే ఉంది. ఢిల్లీ సీఎం((Delhi Next CM))పై తర్జన భర్జనలు పడుతున్న బీజేపీ.. ఇంకొంత సమయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. దీనిపై ప్రతిపక్ష ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) సెటైర్లు వేస్తోంది. ఢిల్లీ సీఎం జాప్యంపై ఆప్ నేత గోపాల్ రాయ్ ఎద్దేవా చేశారు. బీజేపీ సీఎంను ప్రకటించడాన్ని అటుంచితే, ఈ ఐదేళ్లలో ముగ్గురు సీఎంలను ఢిల్లీ చూడాల్సి వస్తోందంటూ జోస్యం చెప్పారు. గతంలో ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఇదే జరిగిందంటూ గతాన్ని తోడే యత్నం చేశారు.బీజేపీ ఢిల్లీలో అధికారంలోకి((Delhi Assembly Elections)) వచ్చి 10 రోజులైనా ఇప్పటివరకూ సీఎంను ప్రకటించ లేదంటి వారి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని విమర్శించారు. తమకు ప్రజలు ఏదైతే ప్రతిపక్షం ఉండమనే మ్యాండేట్ ఇచ్చారో దాన్ని తప్పకుండా పాటిస్తామన్నారు గోపాల్ రాయ్. ఢిల్లీలో ఇప్పటికే కరెంట్ కష్టాలు మొదలయ్యాయని, సీఎం ఎవరైనా ఆ కష్టాలను ఎదుర్కోక తప్పదన్నారు.కాగా, ఢిల్లీ కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? అనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. బీజేఎల్పీ భేటీ నేపథ్యంలో ఇవాళ సాయంత్రంలోపు స్పష్టమైన ప్రకటన వెలువడొచ్చని అంతా భావించారు. అయితే చివరి నిమిషంలో ఆ భేటీని వాయిదా వేస్తూ బీజేపీ పెద్ద ట్విస్ట్ ఇచ్చింది.ఇవాళ జరగాల్సిన బీజేఎల్పీ(BJLP) సమావేశాన్ని వాయిదా వేసింది ఆ పార్టీ. ఢిల్లీ స్టేషన్ తొక్కిసలాట ఘటనకు సంఘీభావంగానే సమావేశాన్ని వాయిదా వేసినట్లు ప్రకటించింది. తిరిగి.. ఫిబ్రవరి 19న ఈ భేటీని నిర్వహించనున్నట్లు తెలిపింది. అయితే అదే తేదీన సీఎంతో పాటు కేబినెట్ కూర్పుపైనా ఓ ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. ఈలోపు రేపు మరోసారి సీఎం అభ్యర్థిపై అధిష్టానం సమాలోచనలు జరపనున్నట్లు సమాచారం.బీజేపీ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం.. 19వ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన బీజేఎల్పీ జరగనుంది. ఆ భేటీలో సీఎం అభ్యర్థి పేరు ప్రకటన ఉంటుంది. ఆ తర్వాత కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు సరాసరి లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గరకు వెళ్తారు. బీజేఎల్పీ నేత, కేబినెట్ పేర్లు ఉన్న వివరాలు అందజేసి ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని ఎల్జీని కోరనున్నారు.ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరగ్గా.. 8వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 70 స్థానాల్లో బీజేపీ 48, ఆప్ 22 గెలుచుకున్నాయి. సుమారు మూడు దశాబ్ధాల తర్వాత ఢిల్లీ పీఠం కమలం కైవసం చేసుకుంది. అయితే..సీఎం ఎంపికలో ఆచీచూతీ వ్యవహారించాలని బీజేపీ భావిస్తోంది. ఈ మేరకు జేపీ నడ్డా నాయకత్వంలో అంతర్గత సంప్రదింపులు సైతం జరిపింది. అదే సమయంలో.. ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు వెళ్లడంతో ఎంపిక ఆలస్యమైంది. ఈలోపు ఢిల్లీ విషాదంతో.. మరోసారి ఆ భేటీ వాయిదా పడింది. ఇక 19వ తేదీన జరగబోయే బీజేఎల్పీ సమావేశానికి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో పాటు పార్టీ జాతీయ కార్యదర్శులు సైతం హాజరు కానున్నట్లు తెలుస్తోంది. అలాగే బీజేపీ పాలిత ప్రాంతాల్లో మాదిరే.. ఢిల్లీకి ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు(Delhi Deputy CMs) ప్రతిపాదనను అధిష్టానం సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు సమాచారం. -
ఇంకెన్ని పిటిషన్లు వేస్తారు?.. ప్రార్థనా స్థలాల అంశంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ : ప్రార్థన స్థలాలకు సంబంధించిన అంశంలో కొత్త పిటిషన్లు దాఖలు చేయడంపై సుప్రీంకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. సోమవారం ప్రార్థనా స్థలాల చట్టం 1991 కింద దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టే సమయంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇలాంటి పిటిషన్లకు ఒక ముగింపు ఉండాలి’ అని వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై దాఖలైన కొత్త పిటిషన్లను విచారణ చేపట్టదని స్పష్టం చేశారు.అయితే అదనపు అంశాలను జతచేస్తూ కొత్తగా పిటిషన్ దాఖలు చేయడం అనుమతించింది. కానీ ఇప్పటివరకు దాఖలు చేసిన కొత్త పిటిషన్లపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కాంగ్రెస్, మజ్లిస్‌తో పాటు ఇతర రాజకీయ పార్టీలు 1991 ప్రార్థనా స్థలాల చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. పిటిషన్ల తరుఫున సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ తన వాదనల్ని వినిపిస్తున్నారు.ఇక విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. గతంలో కొత్త పిటిషన్లు దాఖలు చేయడానికి అనుమతించామని, కానీ ఇలాంటి వ్యాజ్యాలకు ఒక పరిమితి ఉండాలని గుర్తు చేసింది. ప్రార్థన స్థలాలకు సంబంధించిన కొత్త పిటిషన్లు దాఖలు చేస్తే.. అందులో కొత్త అంశాలను జోడించాలని, అలా అయితేనే వాటిని విచారణ చేపడతామని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ మొదటి వారానికి వాయిదా వేసింది. -
Driver Neelam: ఆటో డ్రైవర్ సీట్లో ఆమె.. సలాం కొట్టాల్సిందే!
కుటుంబం అనే బండిలో అందరిలా ఆమె ప్యాసింజర్ సీట్లో కూర్చోవాలనుకోలేదు. పరిస్థితుల ప్రభావంతో.. తన బతుకు బండికి తానే సారథిగా మారింది. ‘ఇలాంటి పనులు మగాళ్లే చేయాలమ్మా..’ అని తోటి మహిళలే సూటిపోటి మాటలు అంటున్నా.. మగవాళ్లు వంకర చూపులు చూస్తున్నా.. ఆమె మాత్రం తన గమ్యం వైపు దూసుకుపోతోంది. అందుకే ఆ డ్రైవర్ గాథ ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశమైంది.ఆమె పేరు నీలమ్(Neelam). ఢిల్లీలో బిజీ రోడ్లపై ఆటో డ్రైవర్‌గా కనిపిస్తోంది. నిత్యం మెట్రోలో వెళ్లే ఓ ఉద్యోగిణి.. ఎందుకనో ఆ ఆటో ఎక్కాల్సి వచ్చింది. ‘‘ఆటోను నడిపేది ఓ మహిళనా?’’ అని తొలుత ఆమె కూడా అందరిలా ఆశ్చర్యపోయింది. ఈ పనినే ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందని నీలమ్‌ను కుతూహలంతో అడిగిందామె. అక్కడి నుంచి జీవితం ఒకసారి నీలమ్ ఎదుట గిర్రున తిరిగింది.అందరిలాగే పెళ్లై కోటి ఆశలతో అత్తింటి అడుగు మోపిందామె. కానీ, ఆ ఇంట అడుగడుగునా ఆమెకు వేధింపులే (Domestic Violence) ఎదురయ్యాయి. చివరకు.. కట్టుకున్నవాడు కూడా ఆ వేధింపులను మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. ఓపిక ఉన్నంతకాలం భరించిన ఆమె.. అది నశించడంతో చంటి బిడ్డతో సహా బయటకు వచ్చేసింది. బయటకు వచ్చాక కష్టాలు స్వాగతం పలికాయి. చేయడానికి ఆమెకు ఏ పని దొరకలేదు. సొంతంగా ఏదైనా చేయాలని అనుకున్నా.. పుట్టింటి వాళ్ల ఆర్థిక స్థితి అంతంత మాత్రమే. అందుకనే.. ఇలా ఆటో నడుపుతున్నట్లు నవ్వుతూ చెప్పిందామె.కానీ, ఆ మహిళా ఆటో డ్రైవర్(Woman Auto Driver) పెదాలపై నవ్వు కంటే ఆమె గొంతులో దిగమింగుకుంటున్న బాధ, కళ్లలో కూతురికి బంగారు భవిష్యత్తు అందించాలని పడుతున్న ఆరాటం రెండూ కనిపించాయి. అందుకే నీలమ్ కథను ఆ మహిళ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సమాజంలో మార్పును స్వాగతించేవాళ్లెందరో నీలమ్ నిర్ణయాన్ని అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు. -
అవును.. మా మనోభావాలు దెబ్బతిన్నాయ్!
అక్రమ వసలదారుల్ని స్వస్థలాలకు చేర్చే విషయంలో అమెరికా వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కాళ్లకు సంకెళ్లు, చేతులకు బేడీలు వేసి.. కనీస వసతులేవీ కల్పించకుండా యుద్ధ విమానాల్లో తరలించడంపై ఆయా దేశాలు మండిపడుతున్నాయి. అయితే చిరకాల మిత్రుడైన భారత్ విషయంలో అగ్రరాజ్యం ఇందుకు మినహాయింపేం ఇవ్వడం లేదు. ఈ క్రమంలో.. ఇటు రాజకీయంగానూ కేంద్రం తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది.తాజాగా.. ఆదివారం 112 మందితో కూడిన అమెరికా యుద్ధ విమానం అమృత్‌సర్‌లో దిగింది. అయితే వాళ్లను తీసుకొచ్చే క్రమంలో అమెరికా ఎంబసీ అధికారులు వ్యవహరించిన తీరు విమర్శలకు కారణమైంది. మతపరమైన మనోభావాలు దెబ్బతిన్నాయని సిక్కు సంఘాలు అమెరికాపై మండిపడుతున్నాయి. దాదాపు వారం పాటు క్యాంపులో ఉంచాక వాళ్లను భారత్‌కు తరలించింది అమెరికా. అయితే.. అమృత్సర్ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ పూర్తయ్యాక వాళ్లను అక్కడే నేలపై కూర్చోబెట్టారు. వాళ్లలో కొంత మంది సిక్కుల తలకు టర్బన్(దస్తర్) లేకుండా కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ(SPGC) మండిపడుతోంది.అమెరికాలో అక్రమ వలసదారుల పేరిట నిర్బంధించినప్పటి నుంచే వాళ్లలో కొందరి నుంచి తలపాగాలు తొలగించినట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన ఎస్పీజీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అమృత్సర్ ఎయిర్‌పోర్టుకు ప్రత్యేక బస్సును, అందులో టర్బన్లను పంపించింది. ఈ విషయమై అమెరికా అధికారులతో చర్చిస్తామని ఎస్జీపీసీ ప్రధాన కార్యదర్శి గురుచరణ్ సింగ్ గెర్వాల్ చెబుతున్నారు. మరోవైపు.. శిరోమణి అకాలీదళ్ కూడా ఈ వ్యవహారంపై మండిపడుతోంది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకుని.. ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని కోరుతోంది.చెత్త కుప్పలో పడేశారు!‘‘కిందటి ఏడాది నవంబర్ 27వ అక్రమంగా అమెరికా బార్డర్ దాటుతున్న నన్ను.. అధికారులు నిర్బంధించారు. రెండు వారాల కిందట నన్నో క్యాంప్‌నకు తరలించారు. అక్కడ నాతో పాటు మరికొందరిని రకరకాలుగా హింసించారు. సరైన భోజనం కూడా పెట్టలేదు. భారత్‌కు తరలించే ముందు.. టర్బన్ తొలగించాలని ఒత్తిడి తెచ్చారు. అది మతపరమైందని చెప్పినా వినకుండా బలవంతంగా తొలగించి.. చెత్తకుండీలో పడేశారు. వాటితో ఎవరైనా ఉరేసుకుంటే బాధ్యత ఎవరిదంటూ.. మాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే దారిలో విమానంలోనూ సైనికులు మాతో దురుసుగా ప్రవర్తించారు. కాళ్లకు సంకెళ్లు, చేతులకు బేడీలు వేశారు. రెండు పూటలా చిప్స్, ఫ్రూటీలు ఇచ్చారంతే. బాత్రూం వెళ్లడానికి కూడా మేం ఇబ్బందిడ్డాం. నేను నా కుటుంబం కోసం రూ.50 లక్షలు అప్పు చేసి అమెరికా వెళ్లాను. రిస్క్ లేకుండా తీసుకెళ్తానంటూ నాకు తెలిసిన ఏజెంట్ చెప్పాడు. కానీ, పనామా అడవుల(Panama Jungles) గుండా వెళ్తున్నప్పుడు దారిలో.. ఎన్నో మృతదేహాలను చూశాం. వాళ్లు మాలాగే దొడ్డిదారిన అమెరికా వెళ్లే క్రమంలో అలా అయ్యారని తెలిసి భయంతో వణికిపోయాం. చివరకు ఎన్నో కష్టాలు పడి సరిహద్దు వరకు చేరినా పట్టుబడ్డాం అని 23 ఏళ్ల జతిందర్ సింగ్ చెబుతున్నాడు.ఇంతకుముందు గురుద్వారాలోనూ అక్రమ వలసదారుల(Illegal Immigrants) కోసం అధికారులు తనిఖీలు జరిపారు. ఆ టైంలోనూ సిక్కు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇదిలా ఉంటే.. ఇప్పటిదాకా మూడు బ్యాచ్‌లుగా.. మూడు విమానాల్లో 332 మంది అక్రమ వలసదారులు అమెరికా నుంచి భారత్‌కు చేరుకున్నారు. -
ఢిల్లీ సీఎం ప్రకటనపై బిగ్ ట్విస్ట్
న్యూఢిల్లీ, సాక్షి: ఢిల్లీ కాబోయే ముఖ్యమంత్రి (Delhi Next CM) ఎవరు? అనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. బీజేఎల్పీ భేటీ నేపథ్యంలో ఇవాళ సాయంత్రంలోపు స్పష్టమైన ప్రకటన వెలువడొచ్చని అంతా భావించారు. అయితే చివరి నిమిషంలో ఆ భేటీని వాయిదా వేస్తూ బీజేపీ పెద్ద ట్విస్ట్ ఇచ్చింది.ఇవాళ జరగాల్సిన బీజేఎల్పీ(BJLP) సమావేశాన్ని వాయిదా వేసింది ఆ పార్టీ. ఢిల్లీ స్టేషన్ తొక్కిసలాట ఘటనకు సంఘీభావంగానే సమావేశాన్ని వాయిదా వేసినట్లు ప్రకటించింది. తిరిగి.. ఫిబ్రవరి 19న ఈ భేటీని నిర్వహించనున్నట్లు తెలిపింది. అయితే అదే తేదీన సీఎంతో పాటు కేబినెట్ కూర్పుపైనా ఓ ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. ఈలోపు రేపు మరోసారి సీఎం అభ్యర్థిపై అధిష్టానం సమాలోచనలు జరపనున్నట్లు సమాచారం. బీజేపీ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం.. 19వ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన బీజేఎల్పీ జరగనుంది. ఆ భేటీలో సీఎం అభ్యర్థి పేరు ప్రకటన ఉంటుంది. ఆ తర్వాత కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు సరాసరి లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గరకు వెళ్తారు. బీజేఎల్పీ నేత, కేబినెట్ పేర్లు ఉన్న వివరాలు అందజేసి ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని ఎల్జీని కోరనున్నారు.అందుకే ఆలస్యం!ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు(Delhi Assembly Elections) పోలింగ్ జరగ్గా.. 8వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 70 స్థానాల్లో బీజేపీ 48, ఆప్ 22 గెలుచుకున్నాయి. సుమారు మూడు దశాబ్ధాల తర్వాత ఢిల్లీ పీఠం కమలం కైవసం చేసుకుంది. అయితే.. సీఎం ఎంపికలో ఆచీచూతీ వ్యవహారించాలని బీజేపీ భావిస్తోంది. ఈ మేరకు జేపీ నడ్డా నాయకత్వంలో అంతర్గత సంప్రదింపులు సైతం జరిపింది. అదే సమయంలో.. ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు వెళ్లడంతో ఎంపిక ఆలస్యమైంది. ఈలోపు ఢిల్లీ విషాదంతో.. మరోసారి ఆ భేటీ వాయిదా పడింది. ఇక 19వ తేదీన జరగబోయే బీజేఎల్పీ సమావేశానికి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో పాటు పార్టీ జాతీయ కార్యదర్శులు సైతం హాజరు కానున్నట్లు తెలుస్తోంది. అలాగే బీజేపీ పాలిత ప్రాంతాల్లో మాదిరే.. ఢిల్లీకి ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు(Delhi Deputy CMs) ప్రతిపాదనను అధిష్టానం సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు సమాచారం.ప్రమాణం ఎప్పుడంటే..ఆ మరుసటిరోజు(ఫిబ్రవరి 20న) రామ్ లీలా మైదానం(Ram Leela Maidan)లో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించాలనుకుంటోంది. ఎన్టీయే పాలిత ప్రాంతాలకు ఇప్పటికే ఆహ్వానం వెళ్లింది. గురువారం సాయంత్రం 4గం.30ని. సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముహూర్తం ఖరారైంది. మోదీ, అమిత్ షా సహా బీజేపీ అగ్ర నేతల సమక్షంలో సీఎం, మంత్రి వర్గం ప్రమాణం చేయనుంది. ఈ మేరకు కార్యక్ర కో ఆర్డినేటర్లుగా వినోద్ తావ్డే,తరుణ్ చుగ్‌లను బీజేపీ హైకమాండ్ నియమించింది.ఇక.. ఢిల్లీ సీఎం రేసులో పర్వేష్ వర్మ(న్యూ ఢిల్లీ), రేఖా గుప్తా (షాలిమార్ బాగ్), విజేందర్ గుప్తా (రోహిణి), సతీష్ ఉపాధ్యాయ్ (మాల్వియా నగర్), ఆశిష్ సూద్ (జనక్‌పురి), పవన్ శర్మ (ఉత్తమ్ నగర్), అజయ్ మహావార్ (ఘోండా)ర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. జనాల్లో ‘క్లీన్ ఇమేజ్’ ఉన్న నేతకే ఢిల్లీ పగ్గాలు అప్పగించాలని అధిష్టానం ఓ అంచనాకి వచ్చినట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: వద్దని తిరిగి వెళ్లిపోతుండగా ప్రాణం పోయింది!! -
ఢిల్లీ సీఎం సస్పెన్స్‌కు నేడు తెర!
న్యూఢిల్లీ: ఢిల్లీ కొత్త సీఎం సస్పెన్స్‌కు నేడు తెర పడనుంది. సోమవారం మధ్యాహ్నాం ఢిల్లీ బీజేపీల్పీ(Delhi BJPLP) సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల, పార్టీ జాతీయ కార్యదర్శుల సమక్షంలో జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కాబోయే ముఖ్యమంత్రిని ప్రకటించనున్నారు. ఈ మేరకు అధిష్టానం అంతర్గత సంప్రదింపులు సైతం పూర్తి చేసినట్లు తెలుస్తోంది.ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు(Delhi Assembly Elections) పోలింగ్ జరగ్గా.. 8వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 70 స్థానాల్లో బీజేపీ 48, ఆప్ 22 గెలుచుకున్నాయి. సుమారు మూడు దశాబ్ధాల తర్వాత బీజేపీ అధికారం చేపట్టబోతోంది. ఇవాళ సీఎం అభ్యర్థి ప్రకటన తర్వాత.. ప్రమాణ స్వీకారం ఎప్పుడుంటుంది అనే దానిపై స్పష్టత రానుంది.ఇక నేటి సమావేశంలో కొత్త సీఎం, మంత్రివర్గం కూర్పుపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో పలువురి పేర్లు వినిపిస్తున్నా.. మాజీ సీఎం కేజ్రీవాల్‌ను (Arvind Kejriwal) ఓడించిన పర్వేష్ వర్మ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే.. అశీశ్ సూద్, రేఖా గుప్తాల పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. బీజేపీ పాలిత ప్రాంతాల్లో మాదిరే.. ఢిల్లీకి ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు(Delhi Deputy CMs) ఉండనున్నట్లు సమాచారం. మొత్తంగా ఫిబ్రవరి 19 లేదా 20వ తేదీన నూతన ప్రభుత్వం కొలువుదీరే అవకాశం ఉన్నట్లు , రామ్‌లీలా మైదానంలో ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు బీజేపీ వర్గాల సమాచారం. -
ఢిల్లీ భూకంపంలో భయపెట్టే శబ్దాలు..!కారణమిదే..
న్యూఢిల్లీ:దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం(ఫిబ్రవరి17) తెల్లవారుజామున వచ్చిన భూకంపానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.0 పాయింట్లుగా నమోదైంది. ఇది తక్కువ తీవ్రత కలిగిన భూకంపమే అయినప్పటికీ ఢిల్లీ వాసుల కాళ్ల కింద భూమి కదిలిపోయేలా చేసింది.అరుదైన శబ్దాలతో వారిని భయభ్రాంతులకు గురి చేసింది. వారిని ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీసేలా చేసింది. తక్కువ తీవ్రత కలిగిన భూకంపం ఇంత ప్రభావం చూపడానికి శాస్త్రవేత్తలు వెల్లడించార. భూకంప కేంద్రం భూ ఉపరితం నుంచి అతి తక్కువగా కేవలం 5 కిలోమీటర్ల లోతులో ఉండడమే ఇందుకు కారణమని విశ్లేషిస్తున్నారు.సాధారణంగా తక్కువ లోతులో సంభవించే భూకంపాలు ఎక్కువలోతులో వచ్చేవాటికంటే తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. భూ ప్రకంపనలు వేగంగా భూఉపరితలాన్ని చేరుకోవడమే ఇందుకు కారణం.భయంకర శబ్దాలు ఎందుకు వస్తాయి..తక్కువ లోతులో సంభవించే భూకంపాలు వింత,భయంకర శబ్దాలకు కారణమవుతాయని జియాలజిస్టులు వివరిస్తున్నారు. ఈ భూకంపాల వల్ల కలిగే ప్రకంపనలు భూమిపైకి వేగంగా చేరుకుని గాలిలో కలిసినపుడు శబ్దాలు ఉద్భవిస్తాయి. భూకంపాల నుంచి వెలువడే తొలి తరంగాలను ‘పీ’ వేవ్స్‌గా పిలుస్తారు. ఇవి వాతావరణంలో కలిసినపుడు శబ్దాలు వస్తాయి. భూఉపరితలం ధృడంగా ఉండి ఈ తరంగాలను గట్టిగా అడ్డుకున్నప్పుడు శబ్దాలు మరింత ఎక్కువగా వినిపిస్తాయి. ఢిల్లీలో జరిగింది కూడా ఇదే కావచ్చనే వాదన వినిపిస్తోంది. -
భారతీయ విద్య భేష్
సాక్షి, న్యూఢిల్లీ: మనకు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు దేశంలో విద్యా వ్యవస్థ అంచెలంచెలుగా విస్తరిస్తూ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. ముఖ్యంగా గత పదేళ్ల ఎన్డీఏ హయాంలో విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇవ్వడంవల్ల గ్రామస్థాయి నుంచి దేశ రాజధాని వరకు ఈ పురోగతి సాధ్యమైనట్లు తెలిపింది.స్వాతంత్య్రం వచ్చే సమయానికి 0.4 శాతంగా ఉన్న ‘గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో’ (జీఈఆర్).. 2021–22 నాటికి ఏకంగా 71 రెట్ల పెరుగుదలతో 28.4 శాతానికి చేరినట్లు తెలిపింది. ఇక క్యూఎస్ (క్వాక్వారెల్లి సైమండ్స్) వరల్డ్ ర్యాంకింగ్స్‌తో దీనిని పోల్చుకుంటే భారత విద్యా వ్యవస్థ 318 శాతం పెరుగుదలను నమోదు చేసిందని, ఇది జీ–20 దేశాల్లోనే అత్యధిక వృద్ధి, పురోగతి అని కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది.ఎస్‌పీయూల ద్వారా 3.25 కోట్ల మందికి విద్య..దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు నాణ్యమైన విద్యను విస్తరించడం, అందించడంపై ‘నీతి ఆయోగ్’ ఫిబ్రవరి 10న ఓ నివేదిక విడుదల చేసింది. ఇందులో.. స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీలు (ఎస్పీయూ) 3.25 కోట్ల మంది విద్యార్థులకు సేవలు అందిస్తున్నట్లు పేర్కొంది. 2035 నాటికి ఈ సంఖ్యను రెట్టింపు చేసే లక్ష్యంతో నూతన విద్యా విధానం(ఎన్ఈపీ) ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు వివరించింది. నిజానికి.. 1857లో కలకత్తా, ముంబై, మద్రాసులలో తొలి విశ్వవిద్యాలయాలు స్థాపించినప్పటి నుంచి దేశంలోని ఉన్నత విద్యావ్యవస్థ గణనీయంగా విస్తరించింది.1947లో స్వాతంత్రం వచ్చేనాటికి దేశంలో ఉన్న విశ్వవిద్యాలయాలు, కళాశాలల ద్వారా 2.38 లక్షల మంది విద్యార్థులు మాత్రమే విద్యను అభ్యసిస్తున్నారు. అప్పట్లో విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల హాజరు నమోదు కేవలం 14 శాతం ఉండడంతో ఆ రోజుల్లో విద్యా వ్యవస్థ ఆందోâýæనకరంగా ఉండేది. నాటి నుంచి నేటివరకు ప్రభుత్వాల చర్యల కారణంగా విద్యా రంగం చెప్పుకోదగ్గ స్థాయిలో పురోగతి సాధించింది. దీంతో ప్రస్తుతం విద్యార్థుల హాజరు నమోదు 81 శాతానికి పెరిగినట్లు నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది.ఎస్‌పీయూల ద్వారా పురోగతి..ఎస్‌పీయూల ద్వారా దేశంలో విద్య అత్యధిక పురోగతి సాధించిందని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. 2011–12లో వీటిల్లో 2.34 కోట్ల మంది విద్యార్థులుండగా.. 2021–22 నాటికి అది 3.24 కోట్లకు చేరుకుందని తెలిపింది. వీరిలో ఓబీసీలు 80.9 శాతం మంది, ఎస్సీలు 76.3% మంది ఉన్నారు. అలాగే, ఉన్నత విద్యాసంస్థల్లో దాదాపు 16 లక్షల మంది విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో 68% మంది లెక్చరర్లు/అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు.రీడర్లు/అసోసియేట్ ప్రొఫెసర్లు 10 శాతం మంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరోవైపు.. ప్రపంచస్థాయి పరిశోధనలకు ప్రభుత్వాల సహకారం కూడా గణనీయంగా పెరిగింది. 2017లో 3.5%ఉండగా.. 2024లో 5.2 శాతానికి పెరిగింది. ఇక 2035 నాటికి 50 శాతం ‘గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో’ (జీఈఆర్) లక్ష్యంగా అడుగులు వేస్తున్నాం’ అని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. -
ఎయిర్‌పోర్ట్స్.. మాలా‘మాల్’!
ప్రీమియం రిటైల్ స్టోర్స్.. లగ్జరీ బొటిక్స్.. డైనింగ్ ఏరియాలు.. వెల్నెస్ సెంటర్లు.. స్పాలు.. కాఫీ షాపులు.. రెస్టో బార్లు.. 24 గంటలూ కిటకిటలాడే జనాలు... ఇవన్నీ ఏదైనా భారీ షాపింగ్ మాల్లో ప్రత్యేకతలు అనుకుంటున్నారా? ఎయిర్‌పోర్టుల నయా అవతారం ఇది. విమానయాన కార్య కలాపాల నుంచి వచ్చేది అంతంతమాత్రమే కావడంతో ప్రయాణికులకు ప్రపంచస్థాయి షాపింగ్ అనుభవాన్ని అందిస్తూ.. ఆదాయాలను దండిగా పెంచుకుంటున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ప్రధాన విమానాశ్రయాలన్నీ ఇప్పుడు షాపింగ్ మాల్స్(shopping mall) కు ఎక్కువ.. ఎయిర్‌పోర్టుల(airport)కు తక్కువ అనే రేంజ్లో నడుస్తున్నాయి!! – సాక్షి, బిజినెస్ డెస్క్దేశీయంగా ఎయిర్‌పోర్టుల నిర్వహణలో దిగ్గజ సంస్థ జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్. భారత్‌లో అతిపెద్ద విమానాశ్రయం ఢిల్లీతోపాటు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కూడా ఈ కంపెనీ చేతిలోనే ఉంది. ప్రయాణికుల రాకపోకల్లో ఇవి రికార్డులు సృష్టిస్తున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్లో ఢిల్లీ ఎయిర్‌పోర్టు 2 కోట్ల మందికిపైగా ప్రయాణికుల ట్రాఫిక్‌తో దుమ్మురేపింది.తొలి తొమ్మిది నెలల్లో ఒక్క ఢిల్లీ ఎయిర్‌పోర్టు ద్వారా లభించిన మొత్తం ఆదాయం రూ.3,775 కోట్లు. ఇందులో విశేషం ఏముందంటారా? తాజా లెక్కల్ని లోతుగా పరిశీలిస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే! ఆదాయంలో విమాన (ఏరో) కార్యకలాపాల వాటా 20 శాతమే. మరో 57 శాతం విమానయేతర కార్యకలాపాలు (నాన్–ఏరో) సమకూర్చిపెట్టాయి. అంటే రిటైల్, డ్యూటీ–ఫ్రీ సేల్స్, అద్దెలు, ప్రకటనలు, ఆహార–పానీయాల విక్రయం తదితర మార్గాల్లోనే లభించాయి. దీన్నిబట్టి చూస్తే.. ఢిల్లీ ఎయిర్‌పోర్టు ఇప్పుడో భారీ మాల్ కింద లెక్క!ఏరో ‘మాల్స్’ కిటకిట..: ఒకవైపు నగరాల్లోని భారీ మాల్స్‌లో రిటైల్ గిరాకీ తగ్గుముఖం పడుతోంది. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ తాజా నివేదిక ప్రకారం... దేశంలోని 8 ప్రధాన నగరాల షాపింగ్ మాల్స్‌లో రిటైల్ స్థలాల లీజింగ్ గతేడాది 10శాతం తగ్గిపోవడం గమనార్హం. అదే ఎయిర్‌పోర్టుల్లోని మాల్స్ మాత్రం కిటకిటలాడి పోతున్నాయి. జీఎంఆర్‌కు ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి వాణిజ్య అద్దెల రూపంలో ఏకంగా రూ.597 కోట్లు (2024 డిసెంబర్‌తో ముగిసిన 9 నెలల కాలంలో) లభించడం విశేషం. ప్రయాణికుల రద్దీ చూస్తే.. దేశీ ట్రాఫిక్‌లో 17 శాతం, అంతర్జాతీయ ట్రాఫిక్‌లో 28 శాతంతో ఢిల్లీ ఎయిర్‌పోర్టు టాప్‌లో ఉంది.ఎయిర్‌పోర్టు ఆదాయంలో 28 శాతం రిటైల్, డ్యూటీ–ఫ్రీ షాపుల ద్వారా, 18 శాతం అద్దెల ద్వారా లభించగా, మరో 10 శాతం ఆహార–పానీయాల అమ్మకం ద్వారా తోడైంది. ఢిల్లీ ఎయిర్‌పోర్టు డ్యూటీ–ఫ్రీ షాపుల్లో ఒక్కో ప్రయాణికుడి సగటు ఖర్చు రూ.1,026 కావడం గమనార్హం.ప్రపంచవ్యాప్తంగా ఇదే ట్రెండ్..ఎయిర్‌పోర్టుల విమాన సంబంధ ఆదాయాల్లో.. ల్యాండింగ్ ఫీజులు, విమానాల పార్కింగ్ చార్జీలు, ప్రయాణికుల సెక్యూరిటీ ఫీజులు, విమానాల టెర్మినల్ స్పేస్ అద్దెలు, గేట్లు, సర్వీసులకు సంబంధించి వినియోగ ఫీజులు కీలకమైనవి. అయితే అంతపెద్ద ఏరియాలో కార్యకలాపాలను నిర్వహించేందుకు ఈ ఆదాయం ఏ మూలకూ సరిపోదు. అందులోనూ ఎయిర్‌పోర్టు ప్రాజెక్టులు భారీ పెట్టుబడులు, వ్యయ ప్రయాసలతో కూడుకున్నవి. అందుకే ఎయిర్‌పోర్టులను ఫైవ్‌స్టార్ మాల్స్‌గా మార్చేస్తూ సొమ్ము చేసుకుంటున్నాయి కంపెనీలు. ప్రపంచవ్యాప్తంగా ఎయిర్‌పోర్టులన్నీ నాన్–ఏరో బిజినెస్‌లపైనే ఫోకస్ చేస్తున్నాయి.సింగపూర్ చాంగి ఎయిర్‌పోర్టుకు కూడా 55 శాతం ఆదాయం నానో–ఏరో కార్యకలాపాల ద్వారానే వస్తోంది. రిటైల్, డ్యూటీ–ఫ్రీ, ఫుడ్–బేవరేజ్ షాపులకు అధిక స్పేస్ కేటాయిస్తుండటంతో ఎయిర్‌పోర్టులు మాల్స్‌ను తలపిస్తున్నాయి. దీంతో షాపింగ్ స్పేస్ పెరిగిపోయి విమానాశ్రయాలు ఇరుకైపోయాయంటూ ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు కూడా వెల్లువెత్తుతున్నాయి.అంతర్జాతీయంగా ఎయిర్‌పోర్టుల నాన్–ఏరో ఆదాయం సగటున 40–50 శాతం కాగా.. మన దగ్గర దానికి మించి ఉండటం విశేషం. ఆదాయం కోసం మాల్ సదుపాయాలను విస్తరించినప్పటికీ.. ప్రయాణికుల సౌకర్యాలను మరింత మెరుగ్గా ప్లాన్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం దుబాయ్, చాంగి ఎయిర్‌పోర్టులను ఆదర్శంగా తీసుకోవాలని అంటున్నారు.భారత్‌లో అతిపెద్ద మాల్.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో..28 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం (బిల్టప్ ఏరియా)తో దేశంలోనే అతిపెద్ద మాల్ ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని జీఎంఆర్ ఏరోసిటీలో ఏర్పాటవుతోంది. 2027 మార్చి కల్లా ఈ మెగా మాల్ అందుబాటులోకి వస్తుందని అంచనా. దీని అండర్ గ్రౌండ్లో 8,000కుపైగా కార్లు పార్క్ చేయొచ్చట! వరల్డ్ మార్క్ ఏరోసిటీ పేరుతో 2.5 బిలియన్ డాలర్లతో చేపట్టిన ఫేజ్–2 విస్తరణ ప్రాజెక్టులో భాగమిది.భారత్‌లో తొలి ‘ఏరోట్రోపోలిస్ (విమానాశ్రయం చుట్టూ నిర్మిస్తున్న మెట్రోపాలిటన్ ఏరియా)’గా కూడా ఇది రికార్డు సృష్టించనుంది. భారతీ రియల్టీ సంస్థ ఈ ప్రాజెక్టును చేపడుతోంది. ఫేజ్–2లో మొత్తం 35 లక్షల చదరపు అడుగుల లీజింగ్ స్పేస్ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఏరోసిటీలోని 11 స్టార్ హోటళ్లలో 5,000 గదులు ఉండగా.. విస్తరణ తర్వాత 15 హోటళ్లు, 7,000 గదులకు పెరగనున్నాయి. కాగా ప్రస్తుతం కొచ్చిలో ఉన్న లులు ఇంటర్నేషనల్ మాల్ 25 లక్షల చదరపు అడుగుల బిల్టప్ ఏరియాతో అతిపెద్ద మాల్గా ఉంది.హైదరాబాద్‌లోనూ..హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్న జీఎంఆర్ ఏరోసిటీలో కూడా 20 ఎకరాల్లో భారీ మాల్ నిర్మాణంలో ఉంది. మొత్తం విస్తీర్ణం 8 లక్షల చదరపు అడుగులు. 100కు పైగా దేశ, విదేశీ దిగ్గజ బ్రాండ్ స్టోర్లు సహా అతిపెద్ద ఎంటర్టైన్మెంట్ స్పేస్‌గా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడ 2,000 సీట్ల సామర్థ్యంలో ఐనాక్స్ 11 స్క్రీన్ల థియేటర్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ ఏడాదే ఇది అందుబాటులోకి వస్తుందని అంచనా.68.8 బిలియన్ డాలర్లు.. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఎయిర్‌పోర్టు రిటెయిలింగ్ మార్కెట్ అంచనా ఇది. ఏటా 6.9 శాతం వృద్ధి చెందుతుందని లెక్కలేస్తున్నారు. 2023లో ఇది 43.2 బిలియన్ డాలర్లుగా ఉంది.విమాన ప్రయాణికుల జోరు ఇది.. (కోట్లలో)ఎయిర్ ట్రాఫిక్ 2024 2023 వృద్ధి(%)దేశీయ 16.13 15.20 6.11అంతర్జాతీయ 6.45 5.79 11.4 -
ఆ అసత్యాలపై బదులేది బాబూ?
సాక్షి, న్యూఢిల్లీ: తిరుపతి లడ్డూ విషయంలో అసత్యాలు చెప్పినందుకు అత్యున్నత న్యాయస్థానం మందలించడంపై ఏపీ సీఎం చంద్రబాబు నుంచి ఇంతవరకూ సమాధానమే లేదని బీజేపీ సీనియర్ నేత, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ సుబ్రమణియన్ స్వామి మండిపడ్డారు. ఈమేరకు తిరుపతి లడ్డూ కల్తీ కేసు విచారణ సందర్భంగా గతేడాది సెప్టెంబర్ 30న సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ స్వామి ఆదివారం తన ఎక్స్ ఖాతాలో మూడు పోస్టులు చేశారు. తిరుపతి లడ్డూ వివాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబును కోర్టు తీవ్రంగా మందలించిందని, కల్తీ నెయ్యిని వాడారనేందుకు ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవని న్యాయస్థానం స్పష్టం చేసిందని గుర్తు చేశారు. ‘ఆ అసత్యాలపై ఇప్పటికీ చంద్రబాబు నుంచి సమాధానం లేదు. ఆయన నిర్లక్ష్యంపై మోదీ ఎందుకు చర్యలు తీసుకోరు? బాబు ఎప్పడు బీజేపీని వదిలేస్తారు?’ అని ఎక్స్‌లో స్వామి ప్రశ్నలు సంధించారు.సుప్రీంలో పిల్ దాఖలు చేసిన స్వామి..: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతు కొవ్వులను కలిపారన్న ఆరోపణలపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు సుప్రీం కోర్టు పర్యవేక్షణలో ఓ కమిటీని నియమించాలని కోరుతూ సుబ్రమణియన్ స్వామి గతేడాది సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయడం తెలిసిందే. ల్యాబ్ నివేదికపై పూర్తిస్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్ధించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి, టీటీడీ ఈవోలను ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ కేసులో సుబ్రమణియన్ స్వామి స్వయంగా (పార్టీ ఇన్ పర్సన్) వాదనలు వినిపించారు. ఏ నివేదిక ఆధారంగా రాద్ధాంతం చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారో.. దాన్ని రూపొందించేందుకు ఉపయోగించిన నెయ్యి ఎక్కడిది? టీటీడీ తిరస్కరించిన నెయ్యిలో అది ఉందా? నివేదిక వెనుక రాజకీయ పార్టీల దురుద్దేశాలున్నాయా? అనే విషయాలను తేల్చాలని స్వామి తన పిటిషన్లో సుప్రీంకోర్టును అభ్యర్థించారు.దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలన్న కోర్టు..లడ్డూ తయారీకి జంతువుల కొవ్వుతో కూడిన నెయ్యిని వాడారంటూ దాఖలైన పిటిషన్‌పై సెప్టెంబర్ 30న విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. తిరుపతి లడ్డూ తయారీకి జంతువుల కొవ్వుతో కూడిన నెయ్యిని వాడారంటూ ప్రభుత్వం చేసిన వాదనను నిరూపించేందుకు ఖచ్చితమైన ఆధారాలు లేవంటూ.. ఆ ఆరోపణలను తీవ్రంగా తప్పుబట్టింది. ఏపీ ప్రభుత్వం సమర్పించిన ల్యాబ్ నివేదికను పరిశీలించిన సుప్రీంకోర్టు.. పరీక్ష కోసం పంపిన నెయ్యిని తిరస్కరించారని, లడ్డూల తయారీకి దాన్ని ఉపయోగించలేదని పేర్కొంది. -
తొక్కిసలాట జరిగినా మారలేదు..!మళ్లీ గందరగోళమే..
న్యూఢిల్లీ:దేశ రాజధాని న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో తొక్కిసలాట జరిగి 18 మంది మృతి చెందిన తర్వాత కూడా పరిస్థితి మారలేదు. మరుసటి రోజు ఆదివారం(ఫిబ్రవరి16) కూడా రైల్వేస్టేషన్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.దీనికి కారణం సీట్ల కోసం ప్రయాణికులు ముందు వెనుకా చూసుకోకుండా మిగిలిన వారిని తోసుకుంటూ వెళ్లి రైళ్లు ఎక్కడమే కారణం.శనివారం సాయంత్రం తొక్కిసలాట జరిగిన చోటుకు దగర్లోనే ప్లాట్‌ఫాం నంబర్ 16 దగ్గర బీహార్ సంపర్క్ క్రాంతి రైలు కోసం ప్రయాణికులు మళ్లీ ఎగబడ్డారు.భారీ లగేజ్ పట్టుకుని ఒకరిని ఒకరు తోసుకుంటూ ఎలాగైనా రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తూ బీభత్సం సృష్టించారు. ఒక ముసలావిడనైతే ఎమర్జెన్సీ కిటికి నుంచి రైలులోకి నెట్టడానికి ప్రయత్నించగా ఆమె అందులో ఇరుక్కుపోయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రైలు డోర్ దగ్గర ఆ ముసలావిడ ఎక్కలేని పరిస్థితి ఉండడం వల్లే ఆమెను ఎమర్జెన్సీ కిటికీ నుంచి నెట్టారు.ఇంతేకాకుండా దర్బంగా వెళ్లే రైలు ప్లాట్‌ఫాంపైకి రాగానే రైలులోకి ఎక్కేందుకు రిజర్వేషన్లేని, రిజర్వేషన్ కన్ఫామ్ కాని ప్రయాణికులు ఒక్కసారిగా ఎగబడ్డారు.ఎమర్జెన్సీ కిటీకిలో నుంచి లగేజ్‌లను విసురుతూ సీట్లు ముందుగానే ఆపేందుకు ప్రయత్నించారు.ఈ క్రమంలోనే అడ్డొచ్చిన వారిని నెట్టివేయడం గందరగోళానికి దారి తీసింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో అక్కడ రైల్వేప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్)కు సంబంధించిన ఒక్క పోలీసు లేకపోవడం న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో ఉన్న దారుణమైన పరిస్థితులను అద్దం పడుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ తొక్కిసలాటకు కుంభమేళ రైలు, టికెట్ల విక్రయమే కారణమా?
న్యూఢిల్లీ : రైల్వేస్టేషన్లో (New Delhi Railway Station Stampede) జరిగిన తొక్కిసలాటలో 18మంది ప్రయాణికులు మరణించారు. కుంభమేళా భక్తుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలు ప్రకటన, ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే భక్తుల కోసం టికెట్ల అమ్మకాలు పెరగడం ఈ విషాద సంఘటనకు దారితీసిన కారణాలని ఢిల్లీ పోలీసుల విచారణలో పలు నివేదికల ప్రకారం, రైల్వే అధికారులు ప్రయాగ్‌రాజ్ కోసం ప్రతి గంటకు సుమారు 1,500 జనరల్ టిక్కెట్లను జారీ చేస్తున్నారు.విచారణ ప్రకారం.. శనివారం రాత్రి, ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే రైలు ఎక్కేందుకు వందల మంది ప్రయాణికులు 14 ప్లాట్‌ఫామ్‌పై ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో న్యూఢిల్లీ నుండి దర్భంగాకు నడిచే స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కేందుకు పక్కనే ఉన్న ప్లాట్‌ఫామ్ 13 వద్ద ప్రయాణికులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. అయితే, స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్ బయల్దేరి సమయం కంటే ఆలస్యంగా అర్ధరాత్రి బయల్దేరుతున్నట్లు అనౌన్స్ చేశారు. ఆ అనౌన్స్తో ప్రయాణికులు ప్లాట్‌ఫారమ్‌పైనే ఉండిపోయారు.ఓ వైపు కిక్కరిసిన ప్రయాణికులు ఉండగా.. రైల్వే అధికారులు టికెట్ల అమ్మకాన్ని కొనసాగించారు. దీంతో అదనపు టిక్కెట్ల అమ్మకాల ఫలితంగా 14 ప్లాట్‌ఫామ్ మీద ప్రయాణికుల సంఖ్య అంతకంతకూ పెరగడం ప్రారంభమైంది. ఫలితంగా రద్దీ పెరిగి ప్రజలు నిలబడటానికి ఖాళీ స్థలం లేకుండా పోయింది.అదే సమయంలో పెరుగుతున్న రద్దీ, టిక్కెట్ల అమ్మకాలను పరిగణనలోకి తీసుకున్న రైల్వే అధికారులు రాత్రి 10 గంటల ప్రాంతంలో ప్లాట్‌ఫామ్ 16 నుండి ప్రయాగ్‌రాజ్‌కు ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. ఈ ప్రకటన విన్న వెంటనే, ప్లాట్‌ఫామ్ 14లో జనరల్ టిక్కెట్లు ఉన్న ప్రయాణికులు ఫుట్ ఓవర్‌బ్రిడ్జి దాటి ప్లాట్‌ఫామ్ 16 వైపు పరుగెత్తారు’. పరిగెత్తే సమయంలో ఓవర్ బ్రిడ్జిపై కూర్చున్న ప్రయాణీకులను తొక్కుకుంటూ వెళ్లే ప్రయత్నం చేశారు. అప్పుడే ఓ ప్రయాణికుడు అదుపుతప్పి జారిపడ్డాడు. ఇదే తొక్కిసలాటకు దారి తీసినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనను ధృవీకరిస్తూ, ఉత్తర రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ హిమాన్షు శేఖర్ ఉపాధ్యాయ్ మాట్లాడుతూ.. ఈ సంఘటన జరిగిన సమయంలో పాట్నాకు వెళ్తున్న మగధ ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫారమ్ 14పై ఉండగా, జమ్మూకు వెళ్తున్న ఉత్తర సంపర్క్ క్రాంతి ప్లాట్‌ఫారమ్ 15పై ఉంది. 14 నుండి 15 వరకు వస్తున్న ఒక ప్రయాణీకుడు జారిపడి మెట్లపై పడిపోయాడు. దీని కారణంగా తొక్కిసలాట జరిగింది. దీనిపై ఉన్నత స్థాయి కమిటీ దర్యాప్తు చేస్తోంది’ అని అన్నారు. తొక్కిసలాటను అదుపులోకి తెచ్చేందుకు రైల్వే పోలీసులు భారీ మొత్తంలో మొహరించారు. కానీ జనసమూహాన్ని నియంత్రించలేకపోయారు. ఆదివారం సైతం తొక్కిసలాటపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విషాదం జరగడానికి ముందు ఏం జరిగిందో తెలుసుకునేందుకు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తామని తెలిపారు. ఈ తొక్కిసలాటకు దారితీసిన ప్రధాన కారణాన్ని దర్యాప్తు చేయడమే మా ప్రధాన లక్ష్యం. ఆ సమయంలో సీసీటీవీ ఫుటేజ్, రైల్వే అధికారులు చేసిన ప్రకటనల డేటాను సేకరిస్తాము’ అని పోలీసు వర్గాలు చెప్పినట్లు వార్తా సంస్థ పిటిఐ తెలిపింది.కాగా, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటనలో 18 మంది బాధితులు మరణించారు. వారిలో తొమ్మిది మంది మహిళలు, ఐదుగురు పిల్లలు, నలుగురు పురుషులు ఉన్నారు. గాయపడిన వారు ప్రస్తుతం లోక్ నాయక్ జై ప్రకాష్ (ఎల్ఎన్జెపి) ఆసుపత్రి, లేడీ హార్డింజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. -
వరుస రైలు ప్రమాదాలు.. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు షాక్!
ఢిల్లీ: న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ (Delhi Railway Station) కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులు పోటెత్తడంతో శనివారం రాత్రి తొక్కిసలాట (stampede) జరిగింది. ఈ తొక్కిసలాటలో 18 మంది మరణించగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 11 మంది మహిళలు, నలుగురు చిన్నారులున్నారు. ఈ నేపథ్యంలో రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (#AshwiniVaishnawResignNow) వెంటనే రాజీనామా చేయాలనే డిమాండ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.కుంభమేళాకు వెళ్లేందుకు ఢిల్లీ రైల్వేస్టేషన్లో ప్రయాణికులు భారీ సంఖ్యలో వచ్చారు. కుంభమేళాకు వెళ్లేందుకు రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను నడిపింది. ఈ క్రమంలో 14వ నంబరు ప్లాట్‌ఫాంపై ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ నిలిచి ఉండడంతో భక్తులు అక్కడకు చేరుకున్నారు. ఇదే సమయంలో స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆలస్యం కావడంతో వాటి కోసం వచ్చిన ప్రయాణికులు అదే సమయంలో 12, 13, 14 నంబరు ప్లాట్‌ఫాంలపై ఉన్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడ రద్దీ పెరిగిపోయి తొక్కిసలాటకు దారితీసింది. దీంతో, 18 మంది మృతిచెందారు.Reportedly 21 people lost lives in the Delhi railway station stampede !who's taking responsibility for this ? This is not mismanagement? #RailwayMinisterResign #STAMPEDE #Delhi#NewDelhiRailwaystation#delhirailwaystation #MahakumbhStampede #trainaccident #Railway pic.twitter.com/oxrtomGkKL— sustainme.in®️ (@sustainme_in) February 16, 2025 See the crowd⚠️Each & every human is stuck to another like a garland woven togetherStampede is bound to happen at the slightest hint of chaos & panicIndian Railways for you 🤷#NewDelhiRailwaystation #STAMPEDE#trainaccident #ResignRailwayMinister pic.twitter.com/DKnrE8TYTS— Sudiksha (@Su_diksha) February 16, 2025ఈ నేపథ్యంలో రైలు ప్రమాదాలపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. అశ్విని వైష్ణవ్ రైల్వే శాఖ మంత్రి అయినప్పటి నుంచే రైలు ప్రమాదాల సంఖ్య పెరిగిందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. రైలు ప్రమాదాల్లో ఇప్పటికే చాలా మంది చనిపోయారని అంటున్నారు. రైలు ప్రమాదాలకు బాధత్య వహించి రైల్వే మంత్రి (#AshwiniVaishnawResignNow) వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ట్యాగ్(#ResignRailwayMinister) ట్విట్టర్లో ట్రెండింగ్‌లో నిలిచింది. भारतीय रेलवे 21वी सदी के सबसे अच्छे दौर से गुजर रही है। और सबसे बड़ा योगदान रील मंत्री का है। #STAMPEDE #ResignRailwayMinister #NewDelhiRailwaystation pic.twitter.com/lUXGTLCF5Y— Sunand Sarkar Kushwaha (@TheSunandSarkar) February 16, 2025 ఇక, ఇదే సమయంలో అశ్విని వైష్ణవ్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో గత కొన్నేళ్లలో జరిగిన రైలు ప్రమాదాల గురించి కూడా పోస్టులు పెడుతున్నారు. ఆయన రైల్వే శాఖకు మంత్రి అయ్యాకే ప్రమాదాలు ఎక్కువగా జరిగాయని కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు.. 1956లో అరియలూర్‌లో జరిగిన రైలు ప్రమాదం తర్వాత ప్రమాదానికి బాధత్య వహిస్తూ నాటి రైల్వే మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేశారని గుర్తు చేస్తున్నారు. తన హయాంలో ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా ఎందుకు రాజీనామా చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. 1956 :: Ariyalur Train Accident Railway Minister Lalbahadur Shastri Resigned Taking Moral Responsibility ( Photo - The Hindu ) pic.twitter.com/rtUy9TdcGD— indianhistorypics (@IndiaHistorypic) February 15, 2025 Not again Indian Railways 💔Sealdah bound Kanchenjungaa Express hit by a goods train near New Jalpaiguri, More Details awaited, Wishing for everyone's safety 🙏 #trainaccident #indianrailways pic.twitter.com/ALkidHnESb— Trains of India (@trainwalebhaiya) June 17, 2024 Railway Minister Lal Bahadur Resigned Taking Moral Responsibility of The Train Accident In 1956 pic.twitter.com/xJF8PDKPys— indianhistorypics (@IndiaHistorypic) February 15, 2025 ज्यादा लोग बिहार के हैं #AshwiniVaishnawMustResign #AshwiniVaishnawResignNow pic.twitter.com/mh1uW2gpJl— Magadh Updates (@magadh_updates) February 16, 2025 -
న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ తొక్కిసలాట ఘటన.. ద్విసభ్య కమిటీ విచారణ ప్రారంభం
New Delhi Railway Station Stampede Live Updates:న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో పెను విషాదం జరిగింది. ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతున్న మహాకుంభమేళా (Kumbh Mela)లో పాల్గొనేందుకు వెళ్తున్న భక్తులతో కిక్కిరిసిన న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో (New Delhi Railway Station) తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో మొత్తం 18 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. 30మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 2:00pmతొక్కిసలాటకు కారణాలేంటి?ప్రయాగ్ రాజ్‌కు వెళ్లే ప్రత్యేక రైళ్ల ఆలస్యం కారణంగా ఫ్లాట్‌ఫామ్‌పై వేల సంఖ్యలో వేచి చూస్తున్న ప్రయాణికులురద్దీ గమనించకుండా గంటలోనే 1500 జనరల్ టికెట్లను అమ్మిన రైల్వే శాఖ అప్పటికే ఫ్లాట్‌ఫామ్‌లపై ఉన్న రద్దీకి తోడు కొత్తగా టికెట్లు ఇవ్వడంతో పెరిగిన రద్దీ 16వ నెంబర్ ఫ్లాట్‌ఫామ్ పైకి స్పెషల్ ట్రైన్ వస్తుందని రైల్వే అనౌన్స్మెంట్ అనౌన్స్మెంట్ విని 14,14,15 ప్లాట్ ఫామ్‌లో ఉన్న ప్రయాణికులు 16వ ప్లాట్ ఫామ్ పైకి పరుగులు పరుగులు తీయడంతో ఒకరిపై ఒకరు పడి తొక్కిసలాట శని, ఆదివారాలు సెలవు దినం కావడంతో కనీ విని ఎరుగని స్థాయిలో పెరిగిన రద్దీ ఈనెల 26వ తేదీతో మహాకుంభమేళా ముగుస్తుండడంతో ఎలాగైనా అక్కడికి చేరుకోవాలని భక్తులు ఆత్రుత సరైన మేనేజ్మెంట్ లేక చేతులెత్తేసిన రైల్వే శాఖ పోలీసులు ఫలితంగా 18 మంది ప్రయాణికుల మృతి 50 మందికి పైగా గాయాలుప్రస్తుతం రైల్వేస్టేషన్లో సాధారణ పరిస్థితి. యధావిధిగా ట్రైన్ ఆపరేషన్స్12:06pmన్యూఢిల్లీ రైల్వేస్టేషన్ తొక్కిసలాట ఘటనపై ద్విసభ్య కమిటీ విచారణ ప్రారంభమైంది. ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేసిన రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. ద్విసభ్య కమిటీలో నార్తన్ రైల్వేకు చెందిన నర్సింగ్ దేవ్,పంకజ్ గంగ్వార్‌లను సభ్యులుగా చేర్చింది. 11:40amఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటనపై ఢిల్లీ పోలీసు అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో కుంభమేళాకు ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినట్లు ప్రకటన, కుంభమేళాకు వెళ్లే రైళ్ల జనరల్ భోగి టికెట్ల అమ్మకమే ప్రధాన కారణమని సమాచారం. 10:40amఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (#AshwiniVaishnawResignNow) వెంటనే రాజీనామా చేయాలనే డిమాండ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.9:40amఢిల్లీ దుర్ఘటన.. యూపీ పోలీసుల అప్రమత్తంఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటనతో ఉత్తర ప్రదేశ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జీల వద్ద భారీ ఎత్తున బందుబస్తు పటిష్టం చేశారు. రైల్వే స్టేషన్లలో హై అలర్ట్ ప్రకటిస్తున్నారు. 8:50amతొక్కిసలాటకు ప్రభుత్వ అసమర్థతే కారణంన్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోవడం నన్ను కలచివేస్తోంది. మృతులకు సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.ఈ ఘటన మరోసారి రైల్వే విభాగం వైఫల్యాన్ని, ప్రభుత్వ అసమర్ధతకు అద్దం పడుతోంది ప్రయాగ్‌రాజ్‌కు వెళ్తున్న భక్తుల విపరీతమైన సంఖ్యను దృష్టిలో ఉంచుకుని, స్టేషన్లో మెరుగైన ఏర్పాట్లు చేయాల్సింది. ప్రభుత్వంతో పాటు పరిపాలన యంత్రాంగం కూడా నిర్లక్ష్యం, అసమర్ధతే ప్రయాణికుల ప్రాణాలు తీసింది. కుంభమేళాకు భక్తులు భారీగా వస్తారని తెలిసినా ప్రయాణికులకు కనీస సౌకర్యాలు ఎందుకు కల్పించలేదు’ అని ప్రశ్నల వర్షం కురిపించారు. नई दिल्ली रेलवे स्टेशन पर भगदड़ मचने से कई लोगों की मृत्यु और कईयों के घायल होने की ख़बर अत्यंत दुखद और व्यथित करने वाली है।शोकाकुल परिवारों के प्रति अपनी गहरी संवेदनाएं व्यक्त करता हूं और घायलों के शीघ्र स्वस्थ होने की आशा करता हूं।यह घटना एक बार फिर रेलवे की नाकामी और सरकार…— Rahul Gandhi (@RahulGandhi) February 16, 2025 మృతులకు ఎక్స్ గ్రేషియాఢిల్లీ తొక్కిసలాట మృతులకు కేంద్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు, తీవ్రంగా గాయాపడిన వారికి రూ.2.5లక్షలు,స్వల్పంగా గాయపడిన వారికి ఒక లక్ష ఎక్స్ గ్రేషియా ఇచ్చింది. ప్రధాని మోదీ ద్రిగ్భ్రాంతిన్యూఢిల్లీ రైల్వే స్టేషన్ పెను విషాదంపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా ద్రిగ్భాంతిని వ్యక్తం చేశారు. ‘న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఘటనతో ఆందోళనకు గురయ్యాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నారు’ అని ట్వీట్లో పేర్కొన్నారు. Distressed by the stampede at New Delhi Railway Station. My thoughts are with all those who have lost their loved ones. I pray that the injured have a speedy recovery. The authorities are assisting all those who have been affected by this stampede.— Narendra Modi (@narendramodi) February 15, 2025మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి : రాష్ట్రపతి శనివారం రాత్రి న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట గురించి తెలిసి చాలా బాధపడ్డాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. Deeply anguished to know about the loss of lives in a stampede at New Delhi Railway station. I extend my heartfelt condolences to the bereaved families and pray for speedy recovery of those injured.— President of India (@rashtrapatibhvn) February 16, 2025 పరిస్థితి అదుపులోనే ఉంది : అశ్విని వైష్ణవ్రైల్వే స్టేషన్లో పరిస్థితిని అదుపు చేసేందుకు అదనపు భద్రతా బలగాలను మోహరించినట్లు, నాలుగు ఫైర్ ఇంజన్లు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నాయని అధికారులు తెలిపారు. పరిస్థితి అదుపులోనే ఉందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. Situation under control at New Delhi railway station (NDLS) Delhi Police and RPF reached. Injured taken to hospital. Special trains being run to evacuate sudden rush.— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) February 15, 2025 న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన దుర్ఘటనపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా విచారం వ్యక్తం చేశారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. చీఫ్ సెక్రటరీ, పోలీస్ కమిషనర్‌తో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తేవాలని, సహాయక సిబ్బందిని నియమించాలని సీఎస్‌ను ఆదేశించాం. ఘటనా స్థలంలో ఉండి సహాయక చర్యలను నియంత్రించాలని సీఎస్ అండ్ సీపీని ఆదేశించాం. నిరంతరం కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నాను’ అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. There has been an unfortunate incident at New Delhi Railway Station. Have spoken to Chief Secretary & Police Commissioner and asked them to address the situation. CS has been asked to deploy relief personnel. Have instructed CS & CP to be at the site and take control of…— LG Delhi (@LtGovDelhi) February 15, 2025ప్రయాణికులు మా మాట వినలేదున్యూఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట దుర్ఘటనపై మరో ప్రత్యక్ష సాక్షి ఐఏఎఫ్ సార్జెంట్ అజిత్ మీడియాతో మాట్లాడారు. ‘రైల్వే స్టేషన్లో మాకు ట్రై సర్వీస్ కార్యాలయం ఉంది. నేను నా డ్యూటీ ముగించుకుని తిరిగి వస్తుండగా ప్రయాణికులు కిక్కిరిపోయారు. దీంతో నేను ముందుకు వెళ్లలేకపోయాను. గుమిగూడొద్దని నేను ప్రయాణికులకు చెప్పి చూశా. రైల్వే అధికారులు సైతం ప్రయాణికులు గుమిగూడకుండా ఉండేలా చూసేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. కానీ ప్రయాణికులు ఎవరూ వినలేదు’అని తెలిపారు. "Administration working hard to prevent any mishap, but no one was listening": Eyewitness IAF sergeant recounts NDLS stampedeRead @ANI Story | https://t.co/XPLjbQzxn3#Stampede #Crowdsurge #NDLS pic.twitter.com/wpGCdXoNcr— ANI Digital (@ani_digital) February 16, 2025 విషాదంపై ప్రత్యక్ష సాక్షి ఏమన్నారంటే? న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఘటనపై ప్రత్యక్ష సాక్షి రవి మాట్లాడుతూ.. సుమారు 9.30 గంటల సమయంలో అనుకుంటా. కుంభమేళాకు వెళ్లే రైళ్లు ఫ్లాట్‌ఫారమ్స్ మారనప్పటికి కిక్కిరిసిన 13వ నంబర్ ప్లాట్‌ఫారమ్‌లోని ప్రయాణికులు 14, 15 ప్లాట్‌ఫారమ్‌లో రైళ్లను చూసి అటువైపు పరిగెత్తారు.రద్దీ విపరీతంగా ఉండటంతో పరిస్థితిని అదుపు చేయలేకపోవడంతో విషాదకరమైన తొక్కిసలాటకు దారితీసింది -
‘పీఎం–ఈ–డ్రైవ్’ పథకంతో ఈవీ రంగానికి ప్రోత్సాహం
సాక్షి, న్యూఢిల్లీ: ముంచుకొస్తున్న పర్యావరణ ముప్పును అరికట్టేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని కార్ల కంపెనీలు మాత్రమే ఈవీలను తయారు చేసేవని, ప్రస్తుతం అన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తూ పర్యావరణ పరిరక్షణకు సహకరిస్తున్నాయని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ ఇటీవల పార్లమెంట్లో తెలిపింది. ఈవీ రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం ‘ప్రధాన మంత్రి–ఈ–డ్రైవ్’ అనే పథకాన్ని అందుబాటులోకి తెచ్చిoదని తెలిపింది. ఈ పథకం ద్వారా ఈ–కార్లకు జీఎస్టీ, పన్ను, పర్మిట్‌లో మినహాయింపు వంటి అనేక ప్రయోజనాలు అందిస్తున్నట్లు చెప్పింది. 2030 నాటికి ప్రైవేటు ఎలక్ట్రిక్ కార్లలో 30శాతం, ద్విచక్ర వాహనాలు, మూడు చక్రాల వాహనాలలో 80శాతం వృద్ధిని సాధించే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్లు పేర్కొంది. ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసిన వారికి ఏ విధమైన అవాంతరాలు ఏర్పడకుండా ఉండేందుకు ఛార్జింగ్ పాయింట్లను, ఛార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేసినట్లు వివరించింది. ఆంధ్రప్రదేశ్‌లో 1,266, తెలంగాణలో 1,289.. ‘ఫాస్టెర్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్’(ఎఫ్ఏఎంఈ) సబ్సిడీ పథకం కింద దేశవ్యాప్తంగా 4,523 ఛార్జర్లు ఉండగా, 251 ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. ‘ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్’(ఓఎంసీఎస్) పథకం కింద దేశవ్యాప్తంగా 20,035 ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులో ఉన్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఎఫ్ఏఎంఈ పథకం కింద 354 ఛార్జర్లు ఇన్స్టాల్ జరగగా, 20 ఛార్జింగ్ స్టేషన్లు, ఓఎంసీఎస్ కింద రాష్ట్రవ్యాప్తంగా 912 ఛార్జింగ్‌స్టేషన్లు ఉన్నాయి. ఇక తెలంగాణలో ఎఫ్ఏఎంఈ కింద 238 ఛార్జర్లు ఇన్స్టాల్ చేయగా, ఒకే ఒక్క ఛార్జింగ్ స్టేషన్ ఉండగా, ఓఎంసీఎస్ కింద 1,051 స్టేషన్లు అందుబాటులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా 16.14లక్షల ఈవీలు.. దేశవ్యాప్తంగా ఎఫ్ఏఎంఈ పథకం సెకెండ్ ఫేజ్‌లో 16,14,737 లక్షల ఈవీలు ఉన్నట్లు కేంద్రం తెలిపింది. వీటిలో టూవీలర్లు 14, 28,009లక్షలు, త్రీవీలర్లు 1,64,180, ఫోర్ వీలర్లు 22,548 ఉన్నట్లు తెలిపింది. ఈసంఖ్యను రానున్న రోజుల్లో పెంచేదిశగా తాము ప్రోత్సహిస్తున్నట్లు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ వివరించింది. -
భారత్‌కు మెటా ‘ప్రాజెక్ట్ వాటర్వర్త్’
అంతర్జాతీయంగా డిజిటల్ కనెక్టివిటీని పెంచేందుకు సోషల్ మీడియా దిగ్గజం మెటా(Meta) నడుం బిగించింది. ప్రపంచంలోనే అతిపొడవైన సముద్రగర్భ కేబుల్ ప్రాజెక్ట్ ‘ప్రాజెక్ట్ వాటర్వర్త్’(Waterworth)కు శ్రీకారం చుట్టింది. ఐదు ప్రధాన ఖండాలను కలుపుతూ 50,000 కి.మీ. దూరం సముద్రగర్భంలో కేబుల్స్ వేయనుంది. ఈ దశాబ్దం చివరి నాటికి ఈ ప్రాజెక్టుతో భారత్‌ను అనుసంధానించనుంది.న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా డిజిటల్ కనెక్టివిటీని పెంచేందుకు సోషల్ మీడియా దిగ్గజం మెటా సాహసోపేత కార్యక్రమానికి నడుం బిగించింది. ప్రపంచంలోనే అతి పొడవైన సముద్రగర్భ కేబుల్ ప్రాజెక్ట్ ‘ప్రాజెక్ట్ వాటర్వర్త్’కు శ్రీకారం చుట్టింది. ప్రాజెక్టులో భాగంగా ఈ దశాబ్దం చివరి నాటికి ఈ ప్రాజెక్టుతో భారత్‌ను అనుసంధానించనున్నట్టు మెటా శనివారం ప్రకటించింది. కంపెనీకి అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా భారత్‌ను ఈ సందర్భంగా అభివర్ణించింది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే భారత్ ప్రపంచ డిజిటల్ హబ్‌గా అవతరిస్తుంది. ఈ ప్రాజెక్ట్ కోసం ఎంత మొత్తం వ్యయం కానుందనేది కంపెనీ వెల్లడించలేదు.భూమి చుట్టు కొలత కంటే ఎక్కువ ప్రాజెక్ట్ వాటర్‌వర్త్‌లో భాగంగా ఐదు ప్రధాన ఖండాలను కలుపుతూ 50,000 కిలోమీటర్ల దూరం సముద్ర గర్భంలో కేబుల్స్ వేస్తారు. ఇది భూమి చుట్టు కొలత కంటే ఎక్కువ. సముద్రంలో 7,000 మీటర్ల లోతు వరకు ఈ కేబుల్స్ వేస్తారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా 13న విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఈ ప్రాజెక్ట్‌ను కూడా చేర్చారు. నమ్మకమైన సంస్థల సహకారంతో హిందూ మహాసముద్రంలో సముద్రగర్భ కేబుల్స్ నిర్వహణ, మరమ్మతు, రుణం సమకూర్చాలని భారత్ భావిస్తోంది. అధునాతన సాంకేతికతతో.. ‘మెటా తన అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన భారతదేశంలో పెట్టుబడులు పెడుతోంది. భారత్, అమెరికా ఇతర ప్రదేశాలను అనుసంధానించడానికి ప్రపంచంలోనే అతి పొడవైన, అత్యధిక సామర్థ్యం, సాంకేతికంగా అధునాతనమైన సముద్ర కేబుల్ ప్రాజెక్ట్‌ను చేపట్టింది’అని మెటా ప్రతినిధి శనివారం తెలిపారు. ఇంటర్నెట్ కార్యకలాపాలకు సముద్రగర్భ కేబుల్స్ ముఖ్యమైనవి. ఈ కేబుల్స్ వివిధ దేశాలను అనుసంధానిస్తాయి. స్థానిక టెలికం కంపెనీలు తమ వినియోగదారులకు ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించడానికి సముద్రగర్భ కేబుల్స్‌తో కనెక్ట్ అవుతాయి. ‘భారత్‌లో డిజిటల్ సేవలకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఈ పెట్టుబడి ఆర్థిక వృద్ధి, స్థిర మౌలిక సదుపాయాలు, అందరికీ డిజిటల్ సేవలు అందాలన్న మెటా నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది. భారత్‌లో అభివృద్ధి చెందుతున్న డిజిటల్ వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది’అని మెటా ప్రతినిధి వివరించారు. -
ఇప్పటికిప్పుడు బీసీ కోటా అసాధ్యం!
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో ఇప్పటికిప్పుడు బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలు సాధ్యం కాదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల అమలుకు పార్లమెంట్ ఆమోదం తప్పనిసరని, వచ్చే నెల తొలివారంలో అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని తెలిపారు. పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించే బాధ్యతను రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్ బాధ్యత తీసుకోవాలని సవాల్ చేశారు.రాష్ట్రంలో సమగ్రంగా కులగణన చేపట్టామని, అది దేశానికే ఒక రోడ్ మ్యాప్‌గా నిలుస్తుందని పేర్కొన్నారు. కులగణనలో సేకరించిన వివరాల ఆధారంగానే కమిషన్ లేదా అధికారులతో కమిటీ వేసి భవిష్యత్తులో ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. శనివారం ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాం«దీతో భేటీ అయిన సీఎం రేవంత్‌రెడ్డి.. అనంతరం అక్కడి తుగ్లక్‌రోడ్డులోని తన నివాసంలో మీడియాతో చిట్‌చాట్ చేశారు. వివరాలు ఆయన మాటల్లోనే... ‘‘మేం చేపట్టిన కులగణనలో బీసీలు ఆరు శాతం పెరిగారు. కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వేలో 4 కేటగిరీలు మాత్రమే చూపారు. అందులో బీసీలు 51 శాతం, ఎస్సీలు 18 శాతం, ఎస్టీలు 10 శాతంకాగా.. మిగతా వాళ్లను ఓసీలుగా చూపారు. మేం చేసిన సర్వేలో మొత్తం ఐదు కేటగిరీలుగా విభజించాం. మా సర్వే ప్రకారం హిందూ, ముస్లిం బీసీలంతా కలిసి 56 శాతం ఉన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం తీసుకొచ్చి, పార్లమెంట్ ఆమోదానికి పంపిస్తాం.కేసీఆర్ సర్వేలో ఎస్సీల్లో 82 కులాలున్నాయని చెప్పారు. కానీ ఉన్నవి 59 కులాలే. స్పెల్లింగ్ తప్పుగా ఎంట్రీ అయినా దాన్ని మరో కులంగా చూపారు. లేని కులాలను ఇప్పుడు చూపెట్టాలంటే నేను ఎక్కడి నుంచి తేవాలి? ఎవరు ఏమనుకున్నా, ఎలాంటి విమర్శలు చేసిన నేను పట్టించుకోను. ప్రధానిపై తప్పుడు వ్యాఖ్యలు చేయలేదు.. 1994లో ప్రధాని మోదీ లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని నేను చెప్పాను. నేను చేసిన వ్యాఖ్యలను కూడా అంగీకరించాను. కాకపోతే తేదీ, సమయం విషయంలో కొంత తేడా వచి్చంది. కిషన్‌రెడ్డి చెప్పింది నేను అంగీకరిస్తున్నా.. ప్రధానిపై తప్పుడు వ్యాఖ్యలు చేయలేదు. ఆయన హోదాను తగ్గించలేదు. అగౌరవపరిచే విధంగా మాట్లాడలేదు. రాహుల్ గాందీయే నా బాస్.. కాంగ్రెస్ సీఎంగా నేను ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సూచన మేరకు నడుచుకుంటా. ఆయన మార్గదర్శకాలను తప్పకుండా పాటిస్తా. ఎవరు ఏమనుకున్నా, ఎలాంటి విమర్శలు, ఫిర్యాదులు చేసినా పట్టించుకోను. కేవలం రాహుల్ గాంధే నా బాస్. ఆయన చెప్పినట్టు నడుచుకుంటా. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ నాపై అనేక ఫిర్యాదులు, విమర్శలు వచి్చనా పట్టించుకోలేదు. రాహుల్ ఆదేశాల మేరకు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం ఏర్పాటు చేశాం. పీసీసీ, మంత్రివర్గ విస్తరణ అంశాల్లో కొందరు నాపై అబద్ధపు ప్రచారాలు, ఊహాగానాలు వ్యాప్తిచేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు..’’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.శనివారం సంత్ సేవాలాల్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి సీఎం రేవంత్ పూలమాల వేసి నివాళులు అరి్పంచారు. బంజారా జాతికి ఆధ్యాత్మిక మార్గదర్శిగా సంత్ సేవాలాల్ మహరాజ్ నిలిచారని కొనియాడారు.ఫిరాయింపులపై సుప్రీంకోర్టు ఆదేశాలు పాటిస్తాం.. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఎలా వస్తుందో చూడాల్సి ఉందని.. ఈ విషయంలో అత్యున్నత న్యాయ స్థానం ఆదేశాలను పాటిస్తామని రేవంత్ చెప్పారు. కేటీఆర్ తానే కోర్టు అన్నట్టుగా మాట్లాడుతున్నారని, కోర్టు తీర్పు రాకముందే తీర్పులు ఇచ్చేస్తున్నారని విమర్శించారు. న్యాయ ప్రక్రియకు లోబడే ఈ విషయంలో ముందుకు వెళతామని తెలిపారు. అయితే దానం నాగేందర్ ఒక పార్టీలో గెలిచి మరో పార్టీ గుర్తుపై పోటీచేసిన రుజువులున్నాయి కదా అని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా... ‘గతంలో సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏ పార్టీలో గెలిచారు? ఏ పార్టీలో మంత్రులుగా పనిచేశారు? నేను ఈ అంశంపై ఫిర్యాదులు చేసినా ఏం జరిగింది?’అని రేవంత్ పేర్కొన్నారు. -
రాజధానిలో ఘోరం
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఘోరం జరిగింది. మహాకుంభమేళాకు వెళ్లేందుకు వచ్చిన భక్తులతో కిక్కిరిసిన న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో తొక్కిసలాట జరిగి 15 మంది ప్రాణాలు కోల్పోయారు. 10 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటిన సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని వార్తలొచ్చాయి. శనివారం రాత్రి 9.55 గంటలకు 13, 14వ నంబర్ ప్లాట్‌ఫామ్‌ల వద్ద ఈ తొక్కిసలాట జరిగింది. ఘటనాస్థలిలో భక్తుల బ్యాగులు, దుస్తులు, చెప్పులు చెల్లాచెదురుగా పడ్డాయి. భయంతో జనం తమ చిన్నారులను భుజాలపైకి ఎత్తుకుని, బ్యాగులు పట్టుకుని పరుగెడుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. తొక్కిసలాటకు కారణాలపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన వెల్లడి కాలేదు. అయితే ఢిల్లీ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లాల్సిన రెండు రైళ్లు ఆలస్యంగా రావడంతో అప్పటికే వేచిఉన్న భక్తులు త్వరగా ఎక్కేందుకు ప్రయత్నించడం, కిక్కిరిసిన జనం కారణంగా తొక్కిసలాట జరిగినట్టు వార్తలొచ్చాయి. ఊపిరాడక స్పృహ తప్పిన కొందరిని సమీప ఆస్పత్రులకు తరలించారు. దాదాపు 12 మందిని లోక్‌నాయక్ జైప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. విషయం తెలిసిన వెంటనే అగి్నమాపక సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చినట్టు ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ చీఫ్ అతుల్ గార్గ్ చెప్పారు. ఘటనపై రైల్వే డీసీపీ కేపీఎస్ మల్హోత్రా ట్లాడారు. ‘‘14వ నంబర్ ప్లాట్‌ఫామ్ ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆగి ఉన్నప్పుడు పెద్ద సంఖ్యలో ప్రయాణికులు అక్కడ వేచి ఉన్నారు. అదే సమయానికి రావాల్సిన స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లు ఆలస్యంగా నడుస్తున్నాయి. వాటిని ఎక్కాల్సిన ప్రయాణికులు 12, 13, 14వ నంబర్ ప్లాట్‌ఫామ్‌లపై వేచి ఉన్నారు. దీంతో ప్లాట్‌ఫామ్‌లపై జనం ఊహించనంతగా పెరిగిపోయి చివరకు 14వ నంబర్ ప్లాట్‌ఫామ్, 16వ నంబర్ ప్లాట్‌ఫామ్ ఎస్కలేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. కమర్షియల్ మేనేజ్మెంట్ ఇన్స్పెక్టర్(సీఎంఐ) తెలిపిన వివరాల ప్రకారం రైల్వేస్ ప్రతి గంటకు 1,500 టికెట్లు విక్రయించింది. ఊహించనంతగా ప్రయాణికులు వచ్చారు.అందుకే పరిస్థితి అదుపు తప్పింది’’ అని డీసీపీ మల్హోత్రా చెప్పారు. ఘటనపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. పరిస్థితి ఇప్పుడు అదుపులోనే ఉంది. ఘటనాస్థలికి వెంటనే రైల్వే పోలీస్, ఢిల్లీ పోలీస్, సీఆర్పీఎఫ్ బలగాలు వెంటనే చేరుకున్నాయి. వారాంతం కావడంతో అధికంగా వచ్చిన భక్తుల రాకపోకల కోసం అదనపు రైళ్లను నడుపుతున్నాం’’ అని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌చేశారు. -
రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ భేటీ
న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)తో శనివారం భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్.. రాష్ట్ర రాజకీయాలు, తాజా పరిణామాలతో సహా పలు కీలకాంశాలపై రాహుల్‌తో సుమారు 45 నిమిషాలపాటు చర్చించారు. పీసీసీ నూతన కార్యవర్గం, కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవులు, ఎమ్మెల్యేల ప్రత్యేక సమావేశాలు.. తదితర అంశాలతో వీళ్ల మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అలాగే.. కులగణన, ఎస్సీ వర్గీకరణ పూర్తి చేసిన నేపథ్యంలో వాటి గురించి రాహుల్‌కు సీఎం రేవంత్ వివరించినట్లు సమాచారం. తెలంగాణలో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో దానికి ముఖ్యఅతిథిగా రావాలని రాహుల్‌ను రేవంత్ కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఏఐసీసీ(AICC) అగ్రనేతలతో భారీ బహిరంగ సభలకు తెలంగాణ కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. పొలిటికల్ మైలేజ్ వచ్చేలా.. సూర్యాపేటలో బీసీ కులగణన, మెదక్‌లో ఎస్సీ వర్గీకరణ భారీ సభలు నిర్వహించాలనుకుంటోంది. ఇదిలా ఉంటే.. రేవంత్ విషయంలో అధిష్టానం అసంతృప్తిగా ఉందని, ఈ కారణం చేతనే రాహుల్ గాంధీతో ఆయనకు గ్యాప్ నెలకొందనే ప్రచారం నడిచింది. అయితే.. అదంతా ఉత్త ప్రచారమేనని తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) కొట్టిపారేయగా, తాజాగా రాహుల్‌తో భేటీ అనంతరం సీఎం రేవంత్ కూడా స్వయంగా ఖండించారు. -
రాష్ట్ర కాంగ్రెస్ కొత్త ఇన్చార్జ్గా మీనాక్షి నటరాజన్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ను మారుస్తూ ఏఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. దీపాదాస్ మున్షీని తప్పించి, ఆమె స్థానంలో మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan)కు బాధ్యతలను కట్టబెట్టింది. ఈ మేరకు ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధానకార్యదర్శి కేసీ వేణుగోపాల్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఇక పార్టీ సీనియర్ నేత కొప్పుల రాజుకు జార్ఖండ్ వ్యవహారాల ఇన్చార్జ్ బాధ్యతలు కట్టబెట్టారు. వీరితోపాటే మరో ఏడుగురు సీనియర్ నేతలను వివిధ రాష్ట్రాలకు ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. పూర్తిస్థాయి పర్యవేక్షణ కోసమే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచి్చన కొద్దిరోజులకే ఇన్ చార్జ్‌గా ఉన్న మాణిక్‌రావ్ థాక్రేను గోవాకు పంపిన ఏఐసీసీ, కేరళ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న దీపాదాస్ మున్షీకి రాష్ట్ర బాధ్యతలను అదనంగా కట్టబెట్టింది. అప్పటి నుంచి ఆమె పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా ఉంటున్నారు. అయితే పారీ్టనేతలకు ఆమె అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని, ప్రభుత్వంతో పార్టీని సమన్వయం చేయడంలో విఫలమయ్యారనే విమర్శలొచ్చాయి. ఇటీవల కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీ.. పార్టీలో నెలకొన్న అసంతృప్తిని తట్టిలేపింది. ఆమె సారథ్యంలో సీఎల్పీ భేటీ నిర్వహించి సరిదిద్దే ప్రయత్నం చేసినా,.. ఈ అంశం ఏఐసీసీకి చేరింది. ఆమెస్థానంలో పూర్తిస్థాయి నేతకు బాధ్యతలు కట్టబెట్టాలని నిర్ణయించారు. రాహుల్ టీమ్ నుంచే.. మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్‌లోని బిర్లాగ్రామ్ నాగ్డాలో జన్మించారు. ఆమె బయోకెమిస్ట్రీలో పీజీ, న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ చేశారు. 1999లో ఎన్ఎస్యూఐ నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2002–2005 వరకు మధ్యప్రదేశ్ యువజన కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పనిచేసిన ఆమెను, 2008లో ఏఐసీసీ కార్యదర్శిగా రాహుల్‌గాంధీ ఎంపిక చేశారు. అప్పటి నుంచి రాహుల్ టీమ్‌లో ఉన్న ఆమె 2009లో మంద్సౌర్ నుంచి ఎంపీగా పోటీ చేసి.. 1971 నుంచి అక్కడ గెలుస్తున్న లక్ష్మీనారాయణ్ పాండేను ఓడించారు. అనంతరం 2014, 2019 ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు.అయినా రాహుల్ టీమ్‌లో కొనసాగిన ఆమె భారత్ జోడోయాత్ర, న్యాయ్‌యాత్రలో క్రియాశీల పాత్ర పోషించారు. 2023 ఆగస్టు 6న ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఆమెను తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పరిశీలకురాలిగా నియమించారు. భూదా న్ పోచంపల్లి నుంచి పాదయాత్ర చేసి కార్యకర్తలను ఉత్తేజపరిచారు. తాజాగా ఆమెకు రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ బాధ్యతలు కట్టబెట్టారు. అయితే.. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ అంశంపై చర్చించేందుకే సీఎం రేవంత్‌రెడ్డి హడావుడిగా ఢిల్లీ వచ్చారనే ప్రచారం జరిగింది. ఆయన ఢిల్లీ చేరే సమయానికే ఏఐసీసీ నుంచి కొత్త ఇన్చార్జ్పై ప్రకటన వెలువడింది. జార్ఖండ్‌కు కొప్పుల రాజు రాహుల్ టీమ్‌కే చెందిన కొప్పుల రాజును జార్ఖండ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్గా ఏఐసీసీ నియమించింది. 15 ఏళ్లుగా పార్టీ మేనిఫెస్టో, విధాన రూపకల్పన, పార్టీపరంగా కేంద్రంపై లేవనెత్తాల్సిన అంశాలపై ప్రధాన సలహాదారుగా ఉన్న ఆయనకు జార్ఖండ్ బాధ్యతలు కట్టబెట్టారు. ఆయన గత ఎన్నికల్లో ఏపీలోని నెల్లూరు నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఆయన ఓడిపోయారు. -
కొత్త సీఈసీగా జ్ఞానేశ్ కుమార్?
ఢిల్లీ: భారత ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఫిబ్రవరి 18న పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో కొత్త ఎన్నికల కమిషనర్ ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది. కాగా, నూతన సీఈసీని ఎన్నుకునేందుకు ఫిబ్రవరి 17న ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ భేటీ కానుంది. ఈ కమిటీలో ప్రధాని మోదీ, కేంద్ర న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘల్, ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సభ్యులుగా ఉన్నారు.ఈ కమిటీ సభ్యులు కొత్త సీఈసీని ఎంపిక చేయనున్నారు. నూతన సీఈసీగా జ్ఞానేశ్ కుమార్‌ను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న జ్ఞానేశ్ కుమార్.. కేరళ కేడర్‌కు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. కాగా, మంగళవారం రిటైర్డ్ కానున్న రాజీవ్ కుమార్ సీఈసీగా మే 15, 2022న బాధ్యతలు స్వీకరించారు. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సహా అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు రాజీవ్ కుమార్ ఆధ్వర్యంలోనే జరిగాయి.ఎన్నికల కమిషనర్.. బీజేపీకి అనుకూలంగా పని చేస్తున్నారంటూ రాజీవ్ కుమార్‌పై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది చివరిలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ఈ ఎన్నికలు కొత్త సీఈసీ ఆధ్వర్యంలోనే జరగనున్నాయి.ఇదీ చదవండి: ఢిల్లీ సీఎం ఎంపికలో సర్ప్రైజింగ్ నిర్ణయం! -
ఢిల్లీ సీఎం ఎంపికలో సర్ప్రైజింగ్ నిర్ణయం!
దేశ రాజధాని రీజియన్‌లో దాదాపు.. మూడు దశాబ్దాల తర్వాత బీజేపీ అధికారం కైవసం చేసుకుంది. అయితే ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో తొందరపాటు పనికి రాదని భావిస్తోంది. ఇందుకు గత అనుభవాలతో పాటు ప్రస్తుత సామాజిక పరిస్థితులు కారణాలుగా తెలుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ ప్యాకేజీల సర్ప్రైజ్లను ఇవ్వబోతుందని సంకేతాలు అందుతున్నాయి.ఢిల్లీకి 1991లో పాక్షిక రాష్ట్ర హోదా దక్కింది. 1993లో జరిగిన ఢిల్లీ తొలి ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. అయితే.. ఐదేళ్ల కాలంలో రాజకీయ ఒత్తిళ్లు, ప్రజల అసంతృప్తి నడుమ ముగ్గురు ముఖ్యమంత్రులను(మదన్ లాల్ ఖురానా, షాహిబ్ సింగ్ వర్మ, సుష్మా స్వరాజ్) మార్చాల్సి వచ్చింది. ఆపై అధికారం కోసం మళ్లీ ఇన్నేళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. ఈ తరుణంలో.. సుదీర్ఘ కాలం తర్వాత దక్కిన అధికారాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలనుకుంటోంది.సర్ప్రైజ్ తప్పదా?ఈ మధ్య గెలిచిన రాష్ట్రాల్లో సీఎం అభ్యర్థుల ఎంపిక విషయంలో బీజేపీ నిర్ణయాలు రాజకీయ వర్గాల అంచనాలను సైతం బోల్తా కొట్టించాయి. మధ్యప్రదేశ్‌కు మోహన్ యాదవ్, రాజస్థాన్‌కు భజన్ లాల్ శర్మ, ఛత్తీస్‌గఢ్‌కు విష్ణుదేవ్ సాయ్‌లను ఎంపిక చేయడమే ఇందుకు నిదర్శనం. ఇందులో.. రాజస్థాన్ విషయంలో ఏకంగా తొలిసారి ఎమ్మెల్యేగా నెగ్గిన భజన్ లాల్‌కు సీఎం పగ్గాలు ఇవ్వడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో ఢిల్లీ విషయంలోనూ ఇలాంటి సర్ప్రైజ్ నిర్ణయం వెలువడే అవకాశం లేకపోలేదు. అదే ఫార్ములా!ఢిల్లీ కోసం ఇద్దరు డిప్యూటీ సీఎంల ఫార్ములాను బీజేపీ తెరపైకి తెస్తోంది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్‌లలో ఇదే పద్ధతిని అవలంభిస్తోంది. అలాగే.. ఢిల్లీని బీజేపీ మినీ ఇండియాగా భావిస్తోంది. బీజేపీ విజయంలో పంజాబీలు, సిక్కులు, పూర్వాంచలీస్, ఉత్తరాఖండీస్, వైశ్యాస్, జాట్.. ఇలా అన్ని వర్గాల ప్రజలు భాగమయ్యారని బీజేపీ భావిస్తోంది. కాబట్టి డిప్యూటీ సీఎంల ఎంపికలోనూ సామాజిక సమీకరణను ప్రముఖంగా పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తోంది.రేసులో ఎవరంటే..ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేష్ వర్మ పేరు ఈ రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. ఢిల్లీ బీజేపీ మాజీ ఛీప్‌లు విజేందర్ గుప్తా, సతీష్ ఉపాధ్యాయలతో పాటు సీనియర్ నేతలు మంజిదర్ సింగ్ సిర్సా, పవన్ శర్మ, అశిష్ సూద్ మహిళా నేతలు రేఖా గుప్తా, శిఖా రాయ్ పేర్లు ప్రస్తావనకు వస్తున్నాయి. ఇక.. కొత్తగా ఎమ్మెల్యేలుగా నెగ్గిన కర్ణెయిల్ సింగ్, రాజ్‌కుమార్ భాటియా పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే.. హ్యాట్రిక్ ఎంపీ మనోజ్ కుమార్ తివారీ(సింగర్), కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా పేరును సైతం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో జాతీయ నాయకత్వం ఇప్పటికే ఢిల్లీ బీజేపీ వర్గాలతో సంప్రదింపులు జరుపుతోంది. సీఎం రేసుతో పాటు కేబినెట్ కోసం పలువురి పేర్లతో కూడిన జాబితాను పరిశీలిస్తోంది. అవినీతి ప్రభుత్వంగా పేర్కొంటూ ఆప్‌ను బీజేపీ గద్దె దించింది. ఈ క్రమంలో సీఎం అభ్యర్థి విషయంలో కుల సమీకరణాలతో పాటు ‘క్లీన్ ఇమేజ్’ను పరిగణనలోకి తీసుకుంటోందని సమాచారం. ప్రస్తుతం బీజేపీ అగ్రనేత, ప్రధాని మోదీ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన తిరిగి రాగానే బీజేపీ అగ్రనేతలతో సమావేశమై ఈ అంశంపై చర్చించనున్నారు. అలాగే.. సోమ, లేదంటే మంగళవారాల్లో బీజేఎల్పీ సమావేశం జరగనుంది. ఆ భేటీ తర్వాత సీఎం ఎవరనేదానిపై స్పష్టమైన ప్రకటన వెలుడే అవకాశం ఉంది. ఈ నెల 19 లేదంటే 20వ తేదీ ఢిల్లీ నూతన సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగే అవకాశాలు ఉన్నాయన్నది తాజా సమాచారం. -
రఘురామ ‘క్వాష్’ విచారణ వాయిదా
న్యూఢిల్లీ, సాక్షి: ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ, ఆయన మనుషులు గతంలో ఇంటెలిజెన్స్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడినందుకు కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రఘురామ వేసిన క్వాష్ పిటిషన్‌పై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరిగింది.శుక్రవారం(ఫిబ్రవరి 14) జస్టిస్ జెకె మహేశ్వరి, జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. అయితే బాధితుడు ఫరూక్ భాషా తరఫున వకాలత్ దాఖలు చేయడానికి ఆయన లాయర్ సమయం కోరారు. దీంతో.. అందుకు రెండు వారాల గడువు ఇచ్చింది కోర్టు. అలాగే.. ఈ పిటిషన్‌పై విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.నరసాపురం ఎంపీగా ఉన్న టైంలో.. విధుల్లో ఉన్న ఏపీ ఇంటెలిజెన్స్ పోలీస్ ఫరూక్ భాషపై రఘురామ, ఆయన తనయుడు భరత్ కలిసి దాడి చేశారనే అభియోగాలు ఉన్నాయి. 2022 జులైలో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో.. విధి నిర్వహణలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన కానిస్టేబుల్ ఫరూక్‌ను బలవంతంగా ఎత్తుకెళ్లి రఘురామ మనుషులు ఆయన నివాసంలోనే చితకబాదారు. ఆపై అనుమానితుడిగా పోలీసులకు అప్పగించారు. అయితే..రఘురామ, ఆయన మనుషులు తనను చిత్రహింసలకు గురి చేశారని ఫరూక్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో జులై 4వ తేదీన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో రఘురామ, ఆయన తనయుడు, రఘురామ పీఏ, సీఆర్పీఎఫ్ సిబ్బంది తదితరులపై కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో ఊరట కోసం తెలంగాణ హైకోర్టులో రఘురామ క్వాష్ వేయగా చుక్కెదురైంది. ఆ వెంటనే ఆయన సుప్రీంను ఆశ్రయించారు. -
అనుచిత వ్యాఖ్యల దుమారం.. యూట్యూబర్‌కు దక్కని ఊరట
న్యూఢిల్లీ: ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియా సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ సహా తన పిటిషన్లను అత్యవసరంగా విచారించాలన్న విజ్ఞప్తిని సీజేఐ బెంచ్ తిరస్కరించింది. ఇండియాస్ గాట్ లాటెంట్ వేదికగా ఓ కంటెస్టెంట్‌ను ఉద్దేశించి రణవీర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో అతనిపై కేసులు నమోదు అయ్యాయి. అయితే..ఆ ఎఫ్ఐఆర్లు అన్నింటిని ఒకే దగ్గరికి చేర్చేలా ఆదేశాలివ్వాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశాడతను. అలాగే.. గువాహతి పోలీసులు ఈ వ్యవహారంలో ఇప్పటికే అతనికి సమన్లు జారీ చేశారు. దీంతో అరెస్ట్ చేస్తారనే భయంతో అతను ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా వేశాడు. ఈ పిటిషన్లన్నీ ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు వెళ్లాయి. దీంతో ఆయన విచారణకు తేదీని నిర్ణయించారు. అయితే.. ఈ పిటిషన్లను అత్యవసరంగా విచారించాలన్న రణవీర్ తరఫు లాయర్ విజ్ఞప్తిని సీజేఐ బెంచ్ తోసిపుచ్చింది. ఈ విషయంలో కోర్టు రిజిస్ట్రీని సంప్రదించాలని సూచించింది.బీర్‌బైసెప్స్ యూట్యూబ్ ఛానెల్‌తో రణవీర్ అల్హాబాదియాకు మంచి ఫాలోయింగ్ ఉండేది. అయితే స్టాండప్ కమెడియన్ సమయ్ రైనా నిర్వహిస్తున్న ఇండియాస్ గాట్ లాటెంట్ షోలో పాల్గొన్న రణవీర్.. ఓ అభ్యర్థిని ఉద్దేశించి దారుణమైన కామెంట్లు చేశాడు. అతని తల్లిదండ్రుల శృంగారం గురించి ప్రస్తావించడంతో పెను దుమారం రేగింది.మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో పాటు పలువురు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు, తోటి యూట్యూబర్లు సైతం రణవీర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. వాక్ స్వతంత్రం పేరిట అతను సమాజం అంగీకరించని వ్యాఖ్యలు చేశాడంటూ మండిపడ్డారు. ఈ క్రమంలో చివరకు అతను క్షమాపణలు చెప్పాడు. అయినప్పటికీ ఈ వ్యవహారం మాత్రం చల్లారడం లేదు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నోటీసులు ఇవ్వడంతో యూట్యూబ్ అతని వ్యాఖ్యలు ఉన్న వీడియోను తొలగించింది. అయినప్పటికీ అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఈ వ్యాఖ్యల ఎఫెక్ట్‌తో.. అతనికున్న 16 మిలియన్ల ఫాలోవర్ల(అన్ని ప్లాట్‌ఫారమ్‌లు కలిపి) సంఖ్య క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇప్పటికే అతనిపై పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. మరోవైపు.. ఈ వ్యవహారం పార్లమెంట్‌కు సైతం చేరింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా.. కంటెంట్ నియంత్రణపై ప్రభుత్వం దృష్టిసారించాలని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి చెందిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ లేఖ రాయబోతోంది. మరోవైపు సమయ్ రైనా, ఇండియాస్ గాట్ లాటెంట్ నిర్వాహకులందరి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. మహారాష్ట్ర సైబర్ విభాగం ఈ షో సభ్యులపై కేసు నమోదు చేసింది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన జాతీయ మహిళా కమిషన్.. ఈ నెల 17వ తేదీన తమ ఎదుట హాజరు కావాల్సిందిగా రణవీర్ అల్హాబాదియా, సమయ్ రైనాలకు నోటీసులు జారీ చేసింది. -
న్యాయ వ్యవస్థపై ఒత్తిళ్లు లేవు
న్యూఢిల్లీ: భారతదేశం ఏకైక రాజకీయ పార్టీ ఆధిపత్యం చెలాయించే దేశంగా మారిపోతోందన్న వాదనను సుప్రీంకోర్టు(Supreme Court) మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్( DY Chandrachud) తిరస్కరించారు. దేశంలో ప్రాంతీయ పార్టీలు సైతం బలంగా ఉన్నాయని చెప్పారు. తాను సీజేఐగా పనిచేసినప్పుడు రాజకీయ పార్టీల నుంచి, ప్రభుత్వ వర్గాల నుంచి తనపై ఎలాంటి ఒత్తిళ్లు రాలేదని స్పష్టంచేశారు. ఇండియాలో న్యాయ వ్యవస్థ చట్టపరిధిలోనే పనిచేస్తోందని ఉద్ఘాటించారు. న్యాయ వ్యవస్థపై ఒత్తిళ్లు ఉన్నట్లు తాను భావించడం లేదన్నారు. తాజాగా బీబీసీ ‘హర్డ్టాక్’ఇంటర్వ్యూ(BBC Hard Talk interview)లో జర్నలిస్టు స్టీఫెన్ సకర్ అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. పలు అంశాలను ప్రస్తావించారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వ ఆధిపత్యం కింద ఇండియా ఏక పార్టీ రాజ్యంగా మారుతోందన్న వాదనను తాను అంగీకరించలేనని పేర్కొన్నారు. ఈ మేరకు 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు న్యూయార్క్ టైమ్స్ పత్రికలో వెలువడిన సంపాదకీయాన్ని ఖండించారు.అందులో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. ప్రాంతీయ పార్టీలతోపాటు రాష్ట్రస్థాయిలో రాజకీయాలకు ప్రాధాన్యం పెరుగుతోందని చెప్పడానికి 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని అన్నారు. ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే అధికారంలో ఉన్నాయని, దేశంలో ప్రాంతీయ ఆకాంక్షలు, గుర్తింపునకు ప్రాధాన్యం నానాటికీ పెరుగుతోందని వివరించారు. సుప్రీంకోర్టు పట్ల ప్రజల విశ్వాసంసొంత పార్టీ నాయకులను రక్షించుకోవడానికి, రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి న్యాయ వ్యవస్థపై అధికార పార్టీ ఒత్తిడి పెంచుతోందని ఆరోపించడం సరైంది కాదని జస్టిస్ చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. అలాంటి ఒత్తిళ్లేవీ తనకు ఎదురు కాలేదన్నారు. పరువు నష్టం కేసులో గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పు కారణంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ అనర్హతకు గురయ్యారని, ఆ తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించిందని గుర్తుచేశారు.ఆయన పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగే అవకాశం కల్పించిందని అన్నారు. పౌరుల స్వేచ్ఛా స్వాతంత్య్రాలను ఇండియా కోర్టులు స్థిరంగా పరిరక్షిస్తున్నాయని చెప్పారు. ఎన్నో కేసుల్లో నిందితులకు బెయిల్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేశారు. ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడేందుకే కోర్టులు ఉన్నాయని, ఈ విషయాన్ని సుప్రీంకోర్టు ఎన్నోసార్లు స్పష్టం చేసిందని వివరించారు. కొన్ని కేసుల్లో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చని, అయినప్పటికీ పౌరుల స్వాతం్రత్యాన్ని కాపాడే విషయంలో సుప్రీంకోర్టు ముందు వరుసలో ఉంటోందని పేర్కొన్నారు. అందుకే ప్రజలు సుప్రీంకోర్టు పట్ల సంపూర్ణ విశ్వాసం చూపుతున్నారని వెల్లడించారు.లింగ వివక్ష, వారసత్వ జాడ్యం లేదుభారత న్యాయ వ్యవస్థపై ఆగ్రవర్ణ హిందూ పురుషులు పెత్తనం చెలాయిస్తున్నారని, ఇక్కడ కూడా వారసత్వ జాడ్యం కనిపిస్తోందన్న అభిప్రాయాన్ని జస్టిస్ చంద్రచూడ్ ఖండించారు. న్యాయ వ్యవస్థలో లింగ వివక్ష భారీగా తగ్గిపోయిందని అన్నారు. దేశవ్యాప్తంగా జిల్లా కోర్టుల్లో కొత్తగా చేరుతున్న వారిలో 50 శాతానికిపైగా మహిళలే ఉంటున్నారని గుర్తుచేశారు. కొన్ని రాష్ట్రాల్లో ఈ సంఖ్య 60 నుంచి 70 శాతం ఉందన్నారు. న్యాయ విద్య మహిళలకు చేరువవుతోందని తెలిపారు. లా స్కూళ్లలో మహిళల ప్రవేశాలు పెరుగుతున్నాయని, వారు ఉన్నత స్థానాలకు చేరుకుంటున్నారని చెప్పారు.న్యాయవాదులు, న్యాయమూర్తులు వారసత్వంగా కోర్టుల్లో చేరుతున్నట్లు తాను అనుకోవడం లేదన్నారు. తన తండ్రి వై.వి.చంద్రచూడ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారని గుర్తుచేశారు. సీజేఐగా ఉన్నంత కాలం కోర్టులో అడుగుపెట్టొద్దంటూ తన తండ్రి తనకు చెప్పారన్నారు. దీంతో హార్వర్డ్ లా స్కూల్లో మూడేళ్లు చదివానని, తన తండ్రి రిటైర్ అయిన తర్వాతే మొదటిసారి కోర్టులో అడుగుపెట్టానని వెల్లడించారు.ఇండియాలో చాలామంది లాయర్లు, జడ్జిలకు ఎలాంటి న్యాయ నేపథ్యం లేదన్నారు. అయోధ్య రామమందిరం, ఆర్టీకల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వంటి కీలక అంశాలపై నిబంధనల ప్రకారమే తీర్పులు ఇచ్చినట్లు జస్టిస్ చంద్రచూడ్ స్పష్టంచేశారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రత, రాజకీయ వాస్తవికతల మధ్య చక్కటి సమతుల్యత పాటిస్తూ నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. అది మర్యాదపూర్వక కలయిక గత ఏడాది వినాయక చవితి సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ నివాసంలో నిర్వహించిన వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా హాజరైన సంగతి తెలిసిందే. సీజేఐ ఇంటికి ప్రధానమంత్రి రావడం అత్యంత అరుదు. ఈ ఉదంతం అప్పట్లో తీవ్ర వివాదాస్పదంగా మారింది. ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించాయి. సీజేఐని ప్రభావితం చేసేందుకు మోదీ ప్రయత్నిచారని మండిపడ్డాయి. ఈ అంశంపై జస్టిస్ చంద్రచూడ్ స్పందించారు.ప్రధాని మోదీ మర్యాదపూర్వకంగానే తన నివాసానికి వచ్చారని చెప్పారు. దీనిపై అతి విశ్లేషణ అవసరం లేదని అన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లోని వ్యక్తుల మధ్య ఉండే కనీస మర్యాదలను అర్థం చేసుకొనేటంత పరిపక్వత మన వ్యవస్థకు ఉందని వ్యాఖ్యానించారు. ఇలాంటి మర్యాదపూర్వకమైన కలయికల ప్రభావం కేసుల విచారణపై ఎంతమాత్రం ఉండదన్నారు.ప్రధాని మోదీ తన నివాసానికి రాక ముందు, వచ్చిన తర్వాత కూడా సుప్రీంకోర్టు ఎన్నో తీర్పులు వెలువరించిందని, ఇందులో ప్రభుత్వానికి ప్రతికూలంగా వచ్చిన తీర్పులు సైతం ఉన్నాయని గుర్తుచేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థ న్యాయ వ్యవస్థ పాత్ర పార్లమెంట్లో ప్రతిపక్షం పోషించే పాత్రలాంటిది కాదని జస్టిస్ చంద్రచూడ్ వివరించారు. కేసులను విచారించడం, చట్టబద్ధమైన పాలన కొనసాగేలా చూడడం మాత్రమే న్యాయ వ్యవస్థ బాధ్యత అని తేల్చిచెప్పారు. -
ఫస్ట్ క్లాస్ జర్నీలో ‘హౌస్ అరెస్ట్’.. వీడియో వైరల్
మహా కుంభ మేళా ఇంకా కొన్ని రోజుల్లో ముగుస్తున్న నేపథ్యంలో అక్కడకు భక్తుల తాకిడి విపరీతంగా పెరిగిపోతోంది. ఒకసారి మహా కుంభ మేళా వెళ్లి అక్కడ పుణ్య స్నానం రావాలనేది భక్తుల తాపత్రయం. ఈ క్రమంలోనే ఎవరికి దొరికిన వాహనాల్లో వారు ప్రయాగ్ రాజ్ కు పయనం అవుతున్నారు. అయితే ఇక్కడ ఎక్కువ మంది రైలు మార్గంలోనే ప్రయాగ్ రాజ్‌కు చేరుకుంటున్నారు. ఇందులో కొందరు టికెట్ తీసుకుని వెళ్లేవారైతే, కొందరు టికెట్ లేకుండానే అక్కడకు వెళుతున్నారు.తాజాగా ఓ ప్రయాణికుడు ట్రైన్ లో ఫస్ట్ క్లాస్ టికెట్ బుక్ చేసుకున్నాడు. రైలు ఎక్కాడు. అతనికి కేటాయించిన క్యాబిన్లోకి వెళ్లిపోయాడు. అంతా బానే ఉంది. ఫస్ట్ క్లాస్ టికెట్ కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదనుకున్నాడు సదరు ప్రయాణికుడు. కానీ ఒకానొక సందర్భంలో లేచి క్యాబిన్ డోర్ ఓపెన్ చేశాడు. అంతే ఫస్ట్ క్లాస్ ఏసీ కంపార్ట్మెంట్ కాస్తా జనరల్ బోగీల కనిపించింది. దాన్ని వీడియోలో బంధించాడు. కనీసం బాత్రూమ్కు వెళ్లే దారి కూడా లేకపోవడంతో 16 గంటల పాటు ఫస్ట్ క్లాస్ క్యాబిన్ లోనే ‘హౌస్ అరెస్టు’ అయినట్లు ఆ ప్రయాణికుడు తెలిపాడు. దీన్ని ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా 26 మిలియన్ వ్యూస్ వచ్చాయట. View this post on Instagram A post shared by Piyushh Agrawal (@piyushhagrawal) -
మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన
ఢిల్లీ: మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. గవర్నర్ నివేదిక ఆధారంగా రాష్ట్రపతి పాలనకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల తొమ్మిదిన ముఖ్యమంత్రి పదవికి బీరెన్ సింగ్ రాజీనామా చేయడంతో కేంద్రం.. రాష్ట్రపతి పాలన విధించింది మణిపూర్‌లో గిరిజన జాతుల మధ్య హింస నేపథ్యంలో శాంతిభద్రతలు దిగజారాయి. దీంతో రాజకీయంగా అనిశ్చితి ఏర్పడింది. రెండు జాతుల మధ్య రేగిన వైరం.. ఎంతటి హింసకు దారి తీసిందో తెలిసిందే.. ఇప్పటికీ ఇదే విషయంలో మణిపూర్ రగులుతూనే ఉంది. ఈ హింసకు మూల కారణమైన కుకీ, మైతేయ్ తెగల మధ్య వైరం ఇప్పుడు యావత్ ప్రపంచం దృష్టి నిలిపేలా చేసింది. అయితే, ఈ అల్లర్ల వెనుక బీరేన్ సింగ్ ఉన్నారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఎట్టకేలకు మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు.దాదాపు రెండేళ్లనాడు హత్యలూ, అత్యాచారాలూ, గృహదహనాలతో అట్టుడికి ప్రపంచవ్యాప్తంగా మన దేశ పరువు ప్రతిష్ఠలను మంటగలిపిన ఆ రాష్ట్రం ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. 2023 మే 3న రాష్ట్రంలో ప్రధాన తెగలైన మెయితీలకూ, కుకీలకూ మధ్య రాజుకున్న ఘర్షణలు చూస్తుండ గానే కార్చిచ్చులా వ్యాపించగా అధికారిక లెక్కల ప్రకారమే 260 మంది ప్రాణాలు కోల్పోయారు.60,000 మంది ఇప్పటికీ తమ స్వస్థలాలకు వెళ్లలేక సహాయ శిబిరాల్లో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. భద్రతా బలగాల పహారా కొనసాగుతున్నా మెయితీలు, కుకీలు ఒకరి ప్రాబల్య ప్రాంతాల్లోకి మరొకరు ప్రవేశించే సాహసం చేయటం లేదు. అందువల్ల నిరుపేదల జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింది. మణిపూర్ హింసాకాండ సాధారణమైనది కాదు. అనేకచోట్ల మహిళలను వివస్త్రలను చేసి, వారిపై అత్యాచారాలకు పాల్పడిన ఉదంతాలు దిగ్భ్రాంతికి గురిచేశాయి.ఇదీ చదవండి: మణిపూర్ శాంతిస్తుందా? -
‘ఢిల్లీలో కరెంట్ కష్టాలు.. ప్రజలు ఇన్వెర్టర్లు కొంటున్నారు’
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ(BJP) ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం 70 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 48 స్థానాలో అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇక ఆప్ 22 స్థానాలతో ప్రతిపక్ష పాత్రకే పరిమితమైంది. ఢిల్లీలో అప్పుడే కరెంట్ కష్టాల్లో మొదలయ్యాయంటూ ఆప్ నేత, మాజీ ముఖ్యమంత్రి అతిషి(Atishi) ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన మూడు రోజుల్లోనే ఢిల్లీలో కరెంట్ కష్టాలు ఆరంభం అయ్యాయంటూ సెటైర్లు వేశారు. బీజేపీకి ఎలా పరిపాలించాలో తెలియడం లేదు. ప్రధానంగా పరిస్థితిని బట్టి కరెంట్ సదుపాయాన్ని ప్రజలకు పూర్తి స్థాయిలో ఇవ్వడంలో బీజేపీ అప్పుడే విఫలమైంది. దీనిపై నాకు ఇప్పటికే చాలా ఫిర్యాదులొచ్చాయి. చాలా ఏరియాల నుంచి పలు ఫిర్యాదులు నా దృష్టికి వచ్చాయి. ప్రజలు అప్పుడే కరెంట్ ఉంటుందనే నమ్మకం కోల్పోయారు. వారు ఇన్వెర్టర్లు కొనుగోలు చేయడం ఇప్పటికే ఆరంభించారు. . ఢిల్లీని యూపీ తరహాలో మార్చబోతున్నారు అనడానికి ఇదే ఉదాహరణ’ అని ఆమె విమర్శించారు.ఢిల్లీలో అధికారం చేజిక్కించుకున్న బీజేపీ.. ఇంకా అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేయలేదు. ప్రధాని మొదీ అమెరికా పర్యటన అనంతరం ఢిల్లీ సీఎంను ప్రకటించే అవకాశం ఉంది. ఢిల్లీ సీఎంగా బీజేపీ ఇంకా ఎంపిక చేయకుండానే, పూర్తి స్థాయి పరిపాలన బాధ్యతలు తీసుకోకుండానే ఆప్ విమర్శలు చేయడాన్ని కూడా పలువురు తప్పుబడుతున్నారు. -
సిక్కుల ఊచకోత కేసులో దోషిగా మాజీ ఎంపీ
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో మాజీ ఎంపీ సజ్జన్ కుమార్‌ను కోర్టు దోషిగా తేల్చింది. బుధవారం రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టగా.. స్పెషల్ జడ్జి కావేరీ భవేజా ఆయన్ని ఈ కేసులో దోషిగా ప్రకటించారు. అయితే శిక్ష ఖరారుపై వాదనలను మాత్రం ఫిబ్రవరి 18వ తేదీకి వాయిదా వేశారు. 1984 నవంబర్ 1న సరస్వతి విహార్ ప్రాంతంలో తండ్రీకొడుకుల హత్య కేసులో ఆయన ప్రమేయం ఉన్నట్టు అభియోగాలు ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించి పంజాబీ బాఘ్ పోలీసులు కేసు నమోదు చేసుకు దర్యాప్తు చేశారు కూడా. అయితే ఆ తర్వాతి కాలంలో ఈ ఘటనను సిట్ దర్యాప్తు చేసింది. మరోవైపు.. 2021, డిసెంబర్ 16వ తేదీన సజ్జన్ కుమార్‌పై కోర్టు అభియోగాలను నమోదు చేసింది. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్యానంతరం ఒక పెద్ద గంపు మారణాయుధాలతో విరుచుకుపడింది. సిక్కులను లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున లూటీలు, గృహదహనాలకు పాల్పడింది. ఈ క్రమంలో సరస్వతి విహార్ ప్రాంతంలో అల్లరిమూక.. జస్వంత్ సింగ్, ఆయన కుమారుడు తరుణ్ దీప్ సింగ్‌ను హతమార్చింది. అయితే.. సజ్జన్ కుమార్ కేవలం ఈ అల్లర్లలో పాల్పొనడమే కాకుండా ఆ గుంపునకు నాయకత్వం వహించాడని కోర్టు ఇవాళ్టి ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందుకు తగిన సాక్ష్యాలు లభించాయని తెలిపింది. ఈ తీర్పును ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ (డీఎస్‌జీఎంసీ) ప్రధాన కార్యదర్శి జగ్దీప్ సింగ్ కహ్లాన్ స్వాగతించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా సిట్‌ను ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఢిల్లీ కంటోన్మెంట్లో జరిగిన మరో సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో ఆయనకు గతంలోనే యావజ్జీవ కారాగార శిక్ష పడింది. 1984 సిక్కు అల్లర్ల కేసులో సజ్జన్ కుమార్‌ను దోషిగా నిర్దారిస్తూ 2018లో ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది . ఆయనకు యావజ్జీవ జైలుశిక్ష పడడంతో.. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు.ఢిల్లీలో ఓ బేకరీ ఓనర్ అయిన సజ్జన్ కుమార్‌కు.. సంజయ్ గాంధీతో దగ్గరి సంబంధా ఏర్పడ్డాయి. అలా ఢిల్లీ కౌన్సిలర్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. 1980లో ఔటర్ ఢిల్లీ నుంచి లోక్‌సభకు తొలిసారి గెలిచారు. 1991, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున అదే స్థానానికి ఆయన ఎన్నికయ్యారు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక ఓట్లు (8,55,543)పోలైన నేతగా రికార్డు సృష్టించారు. అయితే.. 2018లో సిక్కుల ఊచకోత కేసులో దోషిగా కోర్టు ప్రకటించడంతో ఆయన కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. -
ఉచితాలపై సుప్రీం కోర్టు సీరియస్ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, సాక్షి:ఉచితాలపై సుప్రీం కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికల సమయంలో ఉచితాలను ప్రకటించడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. రాజకీయ పార్టీలు ప్రజలను పరాన్న జీవులుగా మార్చేస్తున్నాయని మండిపడింది.పట్టణాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలని దాఖలైన ఓ పిటిషన్‌ను జస్టిస్ గవాయ్, జస్టిస్ ఆగష్టీన్ జార్జ్ మసీహ్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఉచితాలపై వ్యాఖ్యానించింది. ఉచితంగా రేషన్, ఉచితంగా నగదు అందుతున్నందున ప్రజలు పని చేయడానికి ఇష్టపడం లేదని వ్యాఖ్యానించింది. ఉచితాలతో ఏ పని చేయకుండా ప్రజలు ఆహారం, డబ్బు సంపాదిస్తున్నారని పేర్కొంది.‘‘ఇలా అంటున్నందుకు క్షమించాలి. ఇలాంటి వ్యక్తులను(ఉచితాలను అందుకుంటున్న వాళ్లను) సమాజ పురోగతిలో భాగం చేయకుండా.. పరాన్నజీవుల తరగతిని మనం సృష్టించడం లేదా?. ఎన్నికల సమయంలో ఉచితాలను ప్రకటించడం వల్ల.. పని చేసేందుకు జనం ఇష్టపడడం లేదు. ఎలాంటి పనులు చేయకుండానే ఉచితంగా రేషన్ వాళ్లకు అందజేస్తున్నారు’’ అని జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు.అయితే పట్టణాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కలిపించే అంశం కేంద్రం పరిశీలనలో ఉందని అటార్నీ జనరల్ వెంకటరమణి కోర్టుకు తెలిపారు. ఈ అంశం పరిశీలనకు కేంద్రం ఎంత సమయం తీసుకుంటుందో వివరణ ఇవ్వాలని ఆటార్నీ జనరల్‌ను ఆదేశించిన బెంచ్.. పిటిషన్ విచారణను ఆరువారాల పాటు వాయిదా వేసింది. ఇదిలా ఉంటే.. ఉచితాల(freebies)పై దేశ సర్వోన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేయడం ఇదేం కొత్త కాదు. కిందటి ఏడాది డిసెంబర్‌లోనూ ఇదే తరహాలో తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దేశంలో 81 కోట్ల మంది ఉచితంగా రేషన్, సబ్సిడీల కింద రేషన్ అందుకుంటున్నారనే విషయం కోర్టు దృష్టికి వెళ్లింది. ‘‘ఇలా ఎంత కాలం ఉచితాలు ఇస్తూ పోతారు? వాళ్లకు ఉపాధి కల్పించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేమా?’’ అని జస్టిస్ సూర్యకాంత, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం ఆనాడు వ్యాఖ్యానించింది. ‘సుప్రీం’కే వెళ్లండి: ఢిల్లీ హైకోర్టుఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా.. ఆప్, బీజేపీ, కాంగ్రెస్‌లు పోటాపోటీగా ఉచితాల హామీలు ఓటర్లపై గుప్పించాయి. అయితే ఇది అవినీతి చర్యల కిందకే వస్తుందని మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఎన్ ధింగ్రా ఢిల్లీ హైకోర్టు(Delhi High Court)లో ఓ పిటిషన్ వేశారు. అయితే బుధవారం ఈ పిటిషన్‌ను పరిశీలించిన ఉన్నత న్యాయస్థానం.. సుప్రీం కోర్టుకు వెళ్లాలని పిటిషనర్‌కు సూచించింది.ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారం.. ఉచితాలు ప్రకటించడం అవినీతి కిందకే వస్తుందని మాజీ న్యాయమూర్తి ధింగ్రా తన పిటిషన్లో పేర్కొన్నారు. మూడు పార్టీలు పోటాపోటీగా ప్రజలకు లంచం ఎర వేశాయి. ఈ వ్యవహారంపై ఈసీని దర్యాప్తునకు ఆదేశించాలని, అలాగే అలాంటి ప్రకటనలు చేసిన వాళ్లు రాజ్యాంగం ప్రకారం అనర్హులుగా ప్రకటించాలని ఆయన కోరారు. అదేవిధంగా.. ఓటర్ల వివరాలను సేకరించడం, వాటిని థర్డ్ పార్టీకి ఇవ్వడం అడ్డుకోవాలని ఆయన తన పిటిషన్లో ప్రస్తావించారు. అయితే.. పిటిషన్‌ను పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు.. సుప్రీం కోర్టులో ఇదే తరహా పిటిషన్‌పై విచారణ జరుగుతున్నందున అక్కడికే వెళ్లాలని ఆయనకు సూచించింది. -
షీనా బోరా కేసు.. ఇంద్రాణీ ముఖర్జీకి చుక్కెదురు
న్యూఢిల్లీ: షీనా బోరా కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణీ ముఖర్జీకి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. విదేశాలకు వెళ్లే విషయంలో ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం కోర్టు కొట్టిపారేసింది. అదే సమయంలో ఈ కేసు విచారణ ఆలస్యం అవుతుండడంతో ట్రయల్ కోర్టుపై అసహనం వ్యక్తం చేసింది.ఇంద్రాణీ ముఖర్జీ విదేశాలకు వెళ్లకుండా.. గతంలో బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ ఆదేశాలను కిందటి ఏడాది నవంబర్‌లో సుప్రీం కోర్టులో ఇంద్రాణీ ముఖర్జీ సవాల్ చేశారు. ఆ పిటిషన్‌ను విచారణ జరిపిన జస్టిస్ ఎంఎం సుందరేష్, రాజేష్ బిందాల్ ధర్మాసనం.. ఇవాళ కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. అదే సమయంలో.. కేసు విచారణ జాప్యం అవుతుండడం దృష్టికి రావడంతో ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఏడాదిలోపు ఈ కేసుకు సంబంధించిన విచారణను పూర్తి చేయాలని ట్రయల్ కోర్టుకు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.సీబీఐ వాదనఇది ఎంతో సున్నితమైన కేసుప్రస్తుతం ఈ కేసు విచారణ మధ్యలో ఉందిఇప్పటికే 96 మంది సాక్ష్యులను విచారించాం ఇలాంటి సమయంలో ఆమెకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతులు ఇవ్వడం సరికాదు. ఇంద్రాణీ తరఫు వాదనలు ఈ కేసులో సుప్రీం కోర్టు ఆమె బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇంకా 96 మంది సాక్ష్యులను విచారించాల్సిన అవసరం ఉంది. ట్రయల్ కోర్టులో విచారణ జరపాల్సిన బెంచ్ నాలుగు నెలల కూడా ఖాళీగానే ఉందికాబట్టి ఈ కేసు విచారణ మరింత ఆలస్యం అయ్యే అవకాశాలే ఉన్నాయి కాబట్టి మా క్లయింట్‌కు విదేశాలకు వెళ్లేందుకు ఊరట ఇవ్వాలి సీబీఐ వాదనలతో ఏకీభవించిన ద్విసభ్య ధర్మాసనం.. ఇంద్రాణీ ముఖర్జీ పిటిషన్‌ను కొట్టేస్తూ తీర్పు ఇచ్చింది. షీనా బోరా కేసు: ట్విస్టుల మీద ట్విస్టులు, పోలీస్ డైరీలో ఏముందంటే..ముంబై మెట్రో వన్ అనే కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున షీనా బోరా(22) 2012, ఏప్రిల్ 24న అదృశ్యమైంది. మళ్లీ ఆమె కనిపించనే లేదు. శవంగా తేలడంతో పోలీస్ దర్యాప్తు మొదలైంది. షీనా బోరా హత్యకేసులో కీలకసూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటోంది ఆమె కన్నతల్లి ఇంద్రాణీ ముఖర్జీ. తన రెండో భర్త సంజీవ్‌ఖన్నాతో కలిసి ఇంద్రాణీ ఈ హత్యకు కుట్రపన్నినట్లు ఇప్పటివరకు జరిగిన పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో అరెస్టైన ఆమె.. సుప్రీం కోర్టు బెయిల్ ఇవ్వడంతో ఆరేళ్ల తర్వాత బయటకు వచ్చారు. అయితే తన బిడ్డను తాను చంపుకోలేదని, ఆమె ఇంకా బతికే ఉందంటూ ఇంద్రాణీ మొదటి నుంచి వాదిస్తూ వస్తుండడం గమనార్హం.షీనా బోరా కేసు టైం లైన్ఏప్రిల్ 24, 2012: షీనా బోరా కనిపించకుండా పోయింది2015, ఆగష్టు 21: ఇంద్రాణీ ముఖర్జీ డ్రైవర్ శ్యామ్వర్ రాయ్ అరెస్ట్.. నేరం ఒప్పుకోలు2015, ఆగష్టు 25: షీనా బోరా హత్య కేసులో ఇంద్రాణీ ముఖర్జీ అరెస్ట్ఆగష్టు 26, 2015: షీనా మాజీ భర్త సంజీవ్ ఖన్నా కోల్‌కతాలో అరెస్ట్2015, సెప్టెంబర్ 1: షీనా అసలు తండ్రిని తననేంటూ సిద్ధార్థ్ దాస్ ప్రకటన2015, సెప్టెంబర్ 18: షీనా బోరా కేసు సీబీఐకి అప్పగింత2015, నవంబర్ 19: పీటర్ ముఖర్జీ అరెస్ట్.. ఇంద్రాణీ, సంజీవ్, శ్యామ్వర్ మీద ఛార్జ్‌షీట్ దాఖలుఫిబ్రవరి 16, 2016: ఛార్జ్ షీట్లో పీటర్ ముఖర్జీ పేరు నమోదుజనవరి-ఫిబ్రవరి 2017: ఈ కేసులో విచారణ ప్రారంభంఅక్టోబర్ 2019: ఇంద్రాణీ, పీటర్ ముఖర్జీలకు విడాకులు మంజూరుమార్చి 2020: పీటర్ ముఖర్జీకి బెయిల్ మంజూరుమే 18, 2022: ఇంద్రాణీ ముఖర్జీకి బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు.. ఆరేళ్ల తర్వాత బయటకుఫ్రిబవరి 12, 2025: విదేశీ పర్యటనకు తనను అనుమతించాలని ఇంద్రాణీ దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత.. ట్రయల్ ఏడాదిలోపు పూర్తి చేయాలని కింది కోర్టుకు సుప్రీం కోర్టు ఆదేశం -
45 కోట్ల ‘మహా’ కుంభ్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రయాగ్‌రాజ్(Prayagraj)లో జరుగుతున్న కుంభమేళాకి భక్తులు ఊహించని స్థాయిలో పోటెత్తుతున్నారు. కుంభమేళా(Kumbh Mela) జరిగే 45 రోజుల్లో మొత్తంగా 45 కోట్ల మంది భక్తులు పవిత్ర గంగా నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారని ప్రభుత్వం అంచనా వేయగా, కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఆ సంఖ్య దాటిపోయింది.ఈ నెల 11 నాటికే కుంభమేళాకు వచ్చిన భక్తుల సంఖ్య 45 కోట్లకు చేరిందని, మహా కుంభమేళా చరిత్రలో అతిపెద్ద మతపరమైన సమావేశాలలో ఇది ఒకటిగా మారిందని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, గొప్ప ఆచారాలు, అత్యాధునిక సాంకేతిక సమ్మిళితంగా, ఈ కుంభమేళా జనసమూహ నిర్వహణ, పారిశుధ్యం, డిజిటల్ సౌకర్యాలలో కొత్త ప్రమాణాలను నెలకొల్పిందని ప్రకటించింది. నేడు నో వెహికిల్ జోన్‌గా మేళా ప్రాంతం.. కాగా బుధవారం మాఘ పూర్ణిమ(Magha Purnima) సందర్భంగా కోట్ల మంది భక్తులు అమృత్ స్నానాలను ఆచరించే అవకాశం ఉందని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. మాఘ పూర్ణిమ స్నానం, గురు బృహస్పతి పూజతో సంబంధం కలిగి ఉండటం, గంధర్వుడు స్వర్గం నుండి పవిత్ర సంగమానికి దిగుతాడనే నమ్మకానికి ప్రసిద్ధి చెందడంతో ఈ స్నానమాచరించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు రానున్నారు.ఈ నేపథ్యంలో మాఘ పూర్ణిమ స్నానం సమయంలో జనసమూహ నిర్వహణను నిర్ధారించడానికి , రాష్ట్ర ప్రభుత్వం నెల 11 ఉదయం 5 గంటల నుంచే మేళా ప్రాంతాన్ని ’వాహనాలు నిషేధించబడిన ప్రాంతం’(నో వెహికిల్ జోన్’)(No Vehicle Zone)గా ప్రకటించింది. అవసరమైన, అత్యవసర సేవలను అందించే వాహనాలను మాత్రమే అనుమతిస్తుంది. మాఘ పూర్ణిమ తర్వాత ఈ నెల 26 శివరాత్రి రోజున అధిక సంఖ్యలో భక్తులు స్నానమాచరిస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. 7 లక్షల మందికి పైగా వైద్య సేవలు.. ఇక మేళాకు వచ్చే భక్తులకు విస్తృతమైన ఆరోగ్య సంరక్షణ సేవల ద్వారా 7 లక్షలకు పైగా యాత్రికులు వైద్య సంరక్షణ పొందారని యూపీ ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో 23 అల్లోపతి ఆసుపత్రులలో 4.5 లక్షలకు పైగా వ్యక్తులకు చికిత్స అందించామని, 3.71 లక్షలకు పైగా పాథాలజీ పరీక్షలు చేయించుకున్నారని తెలిపింది. -
ఈడీ విచారణ జరిపించాల్సిందే: ఎంపీ మిథున్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద ఆర్థిక కుంభకోణమైన మార్గదర్శి కుంభకోణంపై ఈడీ విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ ఎంపీ పి.వి.మిథున్‌రెడ్డి డిమాండ్ చేశారు. లోక్‌సభ వేదికగా మార్గదర్శి కుంభకోణాన్ని బయటపెట్టినందుకే బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తమపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రమేష్ సివిల్ కాంట్రాక్టులు కావాలంటే చంద్రబాబుతో మాట్లాడుకోవాలే తప్ప తమపై ఆరోపణలు చేయడం తగదని పేర్కొన్నారు. సీఎం రమేష్ బీజేపీలో ఉన్న టీడీపీ కోవర్టు అని, ఆయన బీజేపీ కోసం పనిచేయడం లేదని చెప్పారు.మంగళవారం లోక్‌సభ జీరో అవర్‌లో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన ప్రసంగానికి ఎంపీ మిథున్‌రెడ్డి అడ్డుపడ్డారు. సీఎం రమేష్ అస్పష్టమైన ఆరోపణలు చేస్తున్నారని ఆక్షేపించారు. అంతకుముందు సీఎం రమేష్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో మద్యం పాలసీని 2019–2024 మధ్య మార్చారన్నారు. మద్యం ప్రైవేట్ షాపుల నుంచి ప్రభుత్వ షాపుల వైపు మళ్లిందని, ఐదేళ్లలో మొత్తం రూ.లక్షకోట్ల అమ్మకాలు జరిగాయని చెప్పారు. ఈ లావాదేవీలన్నీ నగదు ద్వారానే జరిగాయని, ఒక్క డిజిటల్ చెల్లింపు లేదని ఆరోపించారు. అన్ని మద్యం షాపుల ఉద్యోగులు కాంట్రాక్ట్ ప్రాతిపదికనే ఉన్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం రూ.30 వేలకోట్ల మద్యం కుంభకోణం చేసిందని ఆరోపించారు. ఇది రూ.2,500 కోట్ల ఢిల్లీ మద్యం కుంభకోణం కంటే 10 రెట్లు పెద్ద కుంభకోణమన్నారు. ఈ ఆరోపణలను ఖండిస్తూ వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి సీఎం రమేష్ వైఖరిపై మండిపడ్డారు. లోక్‌సభ వేదికగా మార్గదర్శి కుంభకోణాన్ని బయటపెట్టినందుకే ప్రతీకారంగా బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తమపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని మిథున్‌రెడ్డి సభ దృష్టికి తీసుకొచ్చారు. ఆర్గానిక్ వ్యవసాయానికి కేంద్రం ప్రోత్సాహంఏపీలో 2021–22 నుంచి మూడేళ్లలో 21.56 లక్షల మెట్రిక్ టన్నుల ఆర్గానిక్ ఎరువుల ఉత్పత్తి జరిగిందని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్‌నాథ్ ఠాకూర్ తెలిపారు. పరంపరాగత్ కృషి వికాస్ యోజన (పీకేవీవై) కింద కేంద్రం ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోందని వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి మంగళవారం లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఏపీలో 2021–22లో 25,006 మెట్రిక్ టన్నులు, 2022–23లో 2,72,572 మెట్రిక్ టన్నులు, 2023–24లో 18,58,652 మెట్రిక్ టన్నుల ఆర్గానిక్ ఎరువుల ఉత్పత్తి జరిగిందని కేంద్రమంత్రి పేర్కొన్నారు. ఏపీలోని 13,321 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తికేంద్రం ప్రవేశపెట్టిన ‘స్వామిత్వ’ పథకంలో భాగంగా ఏపీలో 13,321 నోటిఫైడ్ జనావాస గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తయిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. తిరుపతి జిల్లాలో 1045 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తయిందని తిరుపతి వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి లోక్‌సభలో మంగళవారం అడిగిన ప్రశ్నకు కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ సమాధానమిచ్చారు. స్వామిత్వ పథకం అమలు కోసం 2020 డిసెంబర్ 8న ఉప్పదం కుదుర్చుకుందని, 2025 పిబ్రవరి 11నాటికి రాష్ట్రంలోని 26జిల్లాల్లో ఈ మొత్తం డ్రోన్ సర్వే నిర్వహించామని తెలిపారు. ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ (ఐఈసీ) కార్యకలాపాలు, స్టేట్ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్స్ (ఎస్పీఎంయూ) ఏర్పాటు కోసం రాష్ట్రానికి రూ.26.7 లక్షలు విడుదల చేశామన్నారు. ఆస్తి కార్డు ఫార్మాట్ రాష్ట్రం ద్వారా ఇంకా ఖరారు చేయని కారణంగా..వాటిని ఇంకా తయారు చేయలేదని పేర్కొన్నారు. -
దేశాభివృద్ధికి జీడీపీ అద్దంపడుతోంది
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 5.4 శాతం వృద్దిరేటుతో దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పథంలో పయనిస్తోందని లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) చెప్పారు. సాధారణ బడ్జెట్‌పై చర్చలో భాగంగా మంగళవారం లోక్‌సభలో విత్తమంత్రి హోదాలో నిర్మల ప్రసంగించారు. ‘‘ ప్రజల చేతుల్లో నగదు నిల్వలు ఉండేలా బడ్జెట్‌ను రూపొందించాం. కేంద్రప్రభుత్వం తెచ్చే రుణాల్లో 99 శాతం నిధులను మౌలిక వసతుల కల్పనలో భాగంగా మూల ధన వ్యయాల కోసమే ఖర్చుచేస్తున్నాం. తద్వారా భవిష్యత్ సంపదను సృష్టిస్తున్నాం.ద్రవ్యోల్బణం కట్టడికి మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. అందుకే ఇప్పటికీ రిటైల్ ద్రవ్యోల్బణం రెండు నుంచి ఆరు శాతం మధ్యే తచ్చాడుతోంది. ఆహార వస్తువులకు సంబంధించి ద్రవ్యోల్బణం సైతం మధ్యస్థాయిలోనే కట్టడిలో ఉంది. 2024–24 ఆర్థిక సంవత్సరానికి మూడేళ్ల ముందువరకు భారత జీడీపీ వృద్ధి రేటు సగటున 8 శాతంగా నమోదైంది’’ అని మంత్రి అన్నారు. అయితే గత నాలుగేళ్లలో ఎన్నడూలేని విధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థికాభివృద్ధి 6.4 శాతంగా నమోదుకావచ్చన్న విశ్లేషణలు వెలువడటం తెల్సిందే. ఇటీవల పార్లమెంట్లో ఆర్థి కశాఖ ప్రవేశపెట్టిన ఆర్థికసర్వే సైతం తదుపరి ఆర్థికసంవత్సరంలో వృద్ధిరేటు 6.3 శాతం నుంచి 6.8శాతం మధ్యలో కదలాడవచ్చని పేర్కొనడం విదితమే.‘‘ గత 12 త్రైమాసికాల్లో కేవలం రెండు త్రైమా సికాల్లోనే భారత వృద్ధిరేటు 5.4 శాతం లేదా అంతకంటే తక్కువకు పడిపోయింది. సెప్టెంబర్‌తో ముగిసిన రెండో తైమాసికంలో వృద్ధిరేటు గత యేడు త్రైమాసికాల కనిష్టమైన 5.4 శాతానికి పడి పోయింది. అయితే ఆ తర్వాత ఆర్థిక పునాదులు బలపడటంతో వృద్ధిరేటు మళ్లీ పుంజుకుంది. ఇకపై భారత్ వేగంగా అభివృద్ధిచెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుంది. జీడీపీలో మొత్తం సేవలు, వస్తూత్పత్తుల విలువ ఏకంగా 61.8 శాతానికి పెరిగింది. 2002–03 సంవత్సరం నుంచి చూస్తే ఇది ఈస్థాయికి పెరగడం ఇదే తొలిసారి. వచ్చే ఆర్థికసంవత్సరంలో మౌలికవసతుల కల్పన కోసం చేసే మూల ధన వ్యయం రూ.15.48 లక్షల కోట్లకు చేరుకోనుంది.ఇది జీడీపీలో 4.3 శాతానికి సమానం. కొత్త ఆర్థికసంవత్సరంలో ఆర్థిక లోటును రూ.15.68 లక్షల కోట్లకు పరిమితంచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ఇది జీడీపీలో 4.4 శాతానికి సమానం.అంతర్జాతీయంగా ఎన్నో అంతర్యుద్ధాలు, యుద్ధ భయాలు, ఆర్థిక అస్థిర పరిస్థితుల మధ్య నూతన బడ్జెట్‌ను తీసుకొచ్చాం. గత పదేళ్లలో యావత్ ప్రపంచంలో ఎన్నో మార్పులు వచ్చాయి. భారత్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. వీటన్నింటినీ సరిచూసుకుంటూ జాతీయ ప్రయోజనాలకు పట్టంకడుతూ బడ్జెట్ కేటాయింపులు చేశాం’’ అని మంత్రి అన్నారు. -
ఈవీఎంలలో డేటాను చెరిపేయొద్దు
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్(ఈవీఎం)లలో పోలింగ్‌కు సంబంధించిన సమాచారం(డేటా), ఎన్నికల గుర్తుల లోడింగ్ యూనిట్లలో సమాచారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు(Supreme Court) కీలక ఆదేశాలు జారీచేసింది. ఎన్నికలు పూర్తయ్యాక ఓడిన అభ్యర్థి అభ్యర్థన మేరకు ఈవీఎంల వెరిఫికేషన్‌లో భాగంగా ఆయా ఈవీఎంలలోని డేటాను చెరిపేయడం, రీలోడ్ చేసే సంస్కృతిని మానుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం ఈసీకి సూచించింది. సింబల్ లోడింగ్ యూనిట్(ఎస్ఎల్యూ)ను తనిఖీ చేయాల్సి ఉందని పేర్కొంది. ఈవీఎంలలో మెమొరీని, ఎస్‌ఎల్‌యూలను తనిఖీచేసేందుకు అవకాశం ఇవ్వాలని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) అనే ఎన్జీవో సంస్థ, ఓడిన అభ్యర్థి సర్వ్ మిట్టెర్ వేసిన పిటిషన్‌ను మంగళవారం విచారించిన సందర్భంగా సుప్రీంకోర్టు పై విధంగా ఆదేశాలిచ్చింది. డేటాను ఎందుకు తొలగిస్తున్నారు?ఈసీ జారీచేసిన ఈవీఎం వెరిఫికేషన్ ప్రామాణిక నిర్వహణ విధానం(ఎస్ఓపీ) అనేది ఈవీఎం–వీవీప్యాట్ కేసులో 2024 ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా లేదంటూ ఏడీఆర్ ఈ పిటిషన్‌ను దాఖలుచేసింది. ఈ కేసును విచారిస్తూ ధర్మాసనం ‘‘ ఎన్నికలయ్యాక అభ్యర్థి వచ్చి ఈవీఎంలోని మెమొరీని, మైక్రో కంట్రోలర్లను, ఎస్‌ఎల్‌యూలను ఇంజనీర్‌ను పిలిపించి తనిఖీచేయించాలని కోరితే ఈసీ ఆ ఈవీఎంలలో డేటాను వెరిఫికేషన్‌లో భాగంగా తొలగించకూడదు. అసలు మీరెందుకు డేటాను తొలగిస్తున్నారు?. పాత డేటాను అలాగే ఉంచండి. వెరిఫికేషన్ పేరిట డేటాను చెరిపేసి మళ్లీ అదే డేటాను రీలోడ్ చేయకూడదు. రీలోడింగ్ విధానాన్ని మానేయండి. ఎన్నికలయ్యాక ఇన్నాళ్లూ డేటాను తొలగించేందుకు మీరు అవలంభించిన విధానంపై వివరణ ఇవ్వండి.ఈ విషయంలో స్పందన తెలిపేందుకు మీకు 15 రోజుల గడువు ఇస్తున్నాం. కేసు విచారణను వచ్చే నెల మూడో తేదీతో మొదలయ్యే వారంలో విచారిస్తాం’’ అని కేంద్ర ఎన్నికల సంఘానికి ధర్మాసనం సూచించింది. ఈవీఎంల వెరిఫికేషన్ కోసం ఒక విధానాన్ని తీసుకు రావాలంటూ గతంలో మాజీ హరియాణా మంత్రి, ఐదుసార్లు ఎమ్మెల్యే కరణ్ సింగ్ దలాల్, హరియాణా అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థి లఖాన్ కుమార్ సింగ్లాలు వేసిన మరో పిటిషన్‌ను ధర్మాసనం కొట్టేసింది. గతంలో కరణ్ ఇలాంటి పిటిషన్ వేశారని గుర్తుచేసింది. బ్యాలెట్ పేపర్ విధానంలోకి మళ్లుదామంటూ వేసిన పిటిషన్‌నూ గత ఏడాది ఏప్రిల్‌లో కోర్టు కొట్టేసింది.రూ.40 వేల ఫీజును తగ్గించండిఓడిన అభ్యర్థి ఒకవేళ ఈవీఎంలను తనిఖీ కోసం అభ్యర్థిస్తే అందుకోసం ఆయనపై వేసే ఫీజు భారాన్ని తగ్గించాలని కోర్టు సూచించింది. ఎన్నికల ఫలితాలొచ్చాక 45 రోజులపాటు సింబల్ లోడింగ్ యూనిట్లను, ఈవీఎంలతోపాటే స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరచాలి. ‘‘అభ్యర్థి వచ్చి అడిగితే ఇంజనీర్‌తో ఈవీఎంలను వెరిఫై చేయించాలి. ఇందుకు ఏకంగా రూ.40,000 ఖర్చు అవుతుందా?. అంత ఫీజును అభ్యర్థిపై వేస్తారా?. ఇది చాలా ఎక్కువ మొత్తం. దీనిని తగ్గించండి’’ అని ఈసీ తరఫున హాజరైన న్యాయవాది మణీందర్ సింగ్‌ను ధర్మాసనం కోరింది. ‘‘ ఈవీఎంల వెరిఫికేషన్ పద్దతి అనేది కోర్టు ఆదేశాలకు అనుగుణంగా లేదు. ఈవీఎం సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్‌లో ఏదైనా మతలబు ఉందో లేదో తెల్సుకునే స్వేచ్ఛ ఉండాలి’’ అని ఏడీఆర్ తరఫు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదించారు. -
ఇంధన రంగంలో ఇన్వెస్ట్ చేయండి
న్యూఢిల్లీ: భారత ఇంధన రంగం(Energy Sector)లో గణనీయంగా వ్యాపార అవకాశాలు ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) తెలిపారు. వచ్చే అయిదేళ్లలో భారీ స్థాయిలో పునరుత్పాదక ఇంధనానికి మారాలని భారత్ లక్ష్యంగా నిర్దేశించుకున్న నేపథ్యంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని అంతర్జాతీయ ఇన్వెస్టర్లను ఆయన ఆహ్వానించారు. ఇండియా ఎనర్జీ వీక్ 2025లో (ఐఈడబ్ల్యూ 25) వర్చువల్‌గా పాల్గొన్న సందర్భంగా ప్రధాని ఈ విషయాలు తెలిపారు. 2030 నాటికి వార్షికంగా 5 మిలియన్ టన్నుల హరిత హైడ్రోజన్, 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాలను సాధించాలన్న లక్ష్యాలు, చమురు .. గ్యాస్ నిక్షేపాలను వెలికితీసేందుకు బిడ్డింగ్ ప్రకటించడం మొదలైనవి దేశీయంగా ఇంధన రంగానికి దన్నుగా నిలుస్తాయని ఆయన చెప్పారు.వనరులను సమర్ధంగా వినియోగించుకోవడం, కొత్త ఆవిష్కరణలను రూపొందించేలా ప్రతిభావంతులను ప్రోత్సహించడంపై భారత్ మరింతగా దృష్టి పెడుతోందని తెలిపారు. ఆర్థికంగాను, రాజకీయంగానూ దేశం పటిష్టంగా ఉందని ప్రధాని వివరించారు. వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు రాబోయే రెండు దశాబ్దాలు చాలా కీలకమని, వచ్చే అయిదేళ్లలో దేశం అనేక మైలురాళ్లను అధిగమిస్తుందని ఆయన పేర్కొన్నారు. గత పదేళ్లలో 10వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థాయి నుంచి దేశం అయిదో స్థానానికి చేరిందని చెప్పారు. ఈఈఎస్ఎల్ ఒప్పందాలు.. ఐఈడబ్ల్యూ సందర్భంగా ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) తమ 15వ ఫౌండేషన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ సంస్థలతో రూ. 500 కోట్ల విలువ చేసే అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇండొనేషియా–మలేషియా–థాయ్‌ల్యాండ్ గ్రోత్ ట్రయాంగిల్ జాయింట్ బిజినెస్ కౌన్సిల్ (ఐఎంటీ–జీటీ జేబీసీ), గ్రీన్ గ్రోత్ ఏషియా ఫౌండేషన్ (జీజీఏఎఫ్), ఐఐటీ హైదరాబాద్ వీటిలో ఉన్నాయి. విద్యుత్ ఆదా చేసే లైటింగ్, పునరుత్పాదక ఇంధనం, ఎలక్ట్రిక్ మొబిలిటీ, కూలింగ్ సాంకేతికతలు మొదలైన వాటి రూపకల్పనకు ఎంవోయూలు తోడ్పడనున్నాయి. -
ఢిల్లీలో ఆప్ ఓటమి.. నెక్ట్స్ పంజాబే : స్వాతి మలివాల్
ఢిల్లీ : పంజాబ్‌లో ఇసుక తవ్వకాలు, బదిలీ పోస్టింగ్‌లలో భారీ అవినీతి జరుగుతుందని ఆమ్ ఆద్మీ ఎంపీ స్వాతి మలివాల్ ఆ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై విమర్శలు గుప్పించారు. కొంతమంది పంజాబ్‌ను తమ వ్యక్తిగత ఏటీఎంలా భావిస్తున్నారు. పరిస్థితుల్ని సరిదిద్ధకపోతే ఢిల్లీలాగే పంజాబ్‌ను కూడా కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఢిల్లీలో ఓటమి తర్వాత పంజాబ్‌లో ప్రభుత్వ మార్పు, ఆప్ నేతలతో కేజ్రీవాల్ సమావేశం వంటి పరిణామల నేపథ్యంలో మలివాల్ మీడియాతో మాట్లాడారు. ‘కేజ్రీవాల్ తన గూండా బిభవ్ కుమార్‌ను భగవంత్ మాన్ ముఖ్య సలహాదారుగా నియమించారు. పంజాబ్‌లో దోచుకున్న మొత్తాన్ని ఢిల్లీకి తరలిస్తున్నారు. పంజాబ్ ఇసుక మాఫియా గుప్పిట్లో ఉంది. రాష్ట్ర ప్రభుత్వ విభాగాలలో బదిలీ పోస్టింగ్‌ల విషయానికి వస్తే ప్రతి దశలోనూ అవినీతి జరుగుతుందని దుయ్యబట్టారు. ఢిల్లీ ఓటమి తర్వాత పంజాబ్‌లో ఆప్ సీఎం,ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడాన్ని కూడా మలివాల్ ప్రశ్నించారు. ఈ అత్యవసర సమావేశం కారణంగా పంజాబ్ ఆప్ ఎమ్మెల్యేలు గందరగోళం, కోపంతో ఉన్నారు. ఢిల్లీలో ఓటమి తర్వాత కేజ్రీవాల్ పంజాబ్‌పై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకి క్రేజీవాల్ పంజాబ్‌కి ఏం చేశారు?అని ప్రశ్నించారు. -
ఒళ్లు కనిపించేలా దుస్తులు.. ఢిల్లీ కోర్టు కీలక తీర్పు
న్యూఢిల్లీ:ఒళ్లు కనిపించేలా పబ్లిక్ ప్లేసుల్లో చిన్న దుస్తులు వేసుకోవడంపై ఢిల్లీ తీస్‌హజారీ కోర్టు తాజాగా కీలక తీర్పు చెప్పింది. అదేమీ నేరం కాదని స్పష్టం చేసింది. బార్లో చిన్న దుస్తులు వేసుకుని డ్యాన్సులు చేసిన ఏడుగురు బార్ డ్యాన్సర్లపై ఉన్న కేసును కొట్టేసింది. ఇక ముందు కేవలం డ్యాన్సులు చేసినందుకు కాకుండా డ్యాన్సుల వల్ల ప్రజలకు ఏమైనా ఇబ్బందులెదురైతేనే చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించింది.ఢిల్లీలోని ఓ బార్లో యువతులు చిన్న దుస్తులు వేసుకుని అశ్లీల నృత్యాలు చేశారని అదే సమయంలో బార్ వైపు వెళ్లిన ఓ కానిస్టేబుల్ గతేడాది పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఆ డ్యాన్సుల వల్ల ప్రజలకు ఏమైనా ఇబ్బందులెదురయ్యాయ అన్నదానిని పోలీసులు నిరూపించలేకపోయాడని కోర్టు పేర్కొంది.పోలీసుల ఫిర్యాదు,వాంగ్మూలాలకు ఎలాంటి విలువ లేదని తెలిపింది. పోలీసులు ప్రవేశపెట్టిన సాక్షులు కూడా బార్‌కు ఎంజాయ్ చేయడానికి వెళ్లామే తప్ప తమకు ఏమీ తెలియదని చెప్పారని కోర్టు పేర్కొంది.