Vintalu Visheshalu
-
ఆ ఏనుగు హెయిర్ స్టైల్ వేరేలెవెల్..!
ఫ్యాషన్ అంటే కేవలం మనుషుల మాత్రమేనా మేము కూడా తీసికిపోం అంటున్నాయి జంతువులు. ట్రెండీ ఫ్యాషన్‌ని మనుషులే కాదు జంతువుల కూడా ఫాలోఅవుతాయని ఈ వైరల్ వీడియోని చూశాక ఒప్పుకుంటారు. ఆ వీడియోలోని ఏనుగు స్టైల్ చూస్తే..వేరేలేవెల్ అని అంగీకరిస్తారు. మరీ ఇంతకీ ఇదంతా ఎక్కడ జరిగిందంటే..తమిళనాడులో మన్నార్గుడిలోని రాజగోపాలస్వామి ఆలయంలో ఏనుగు విలక్షణమైన హెయిర్‌స్టైల్‌తో చూడముచ్చటగా ఉంటుంది. ఆ ఏనుగు పేరు సెంగమాలం. ఆ ఏనుగుకి సంబంధించిన వీడియోని ఇండియా కల్చరల్ హబ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఆ వీడియోలో సెంగమాలం ఏనుగు మనుషుల జుట్టు మాదిరిగా 'బాబ్‌కట్ హెయిర్ స్టైల్'లో ఉంటుంది. చూస్తే మనుషుల హెయిర్‌స్టైల్ మాదిరిగానే ఉంటుంది ఆ ఏనుగు హెయిర్. అంతేగాదండోయ్ ఆ ఆలయానికి వచ్చే భక్తులకు ఈ ఏనుగే ప్రధాన ఆకర్షణగా ఉంటుందట. అయితే ఇంతలా ఏనుగు జుట్టు పట్ల కేర్ తీసుకుంటున్న దాని సంరక్షకుడిని మెచ్చుకోవాల్సిందే. ఈ మేరకు ఆ ఏనుగు సంరక్షకుడు ఎస్ రాజగోపాల్ మాట్లాడుతూ..ఈ సెంగమాలం జుట్టుని వేసవికాలంలో రోజుకి మూడుసార్లు, ఇతర సీజన్లలో కనీసం రోజుకి ఒకసారైనా.. కడుగుతామని చెబుతున్నారు. 2003లో ఆ ఏనుగుని కేరళ నుంచి తీసుకవచ్చారట. అప్పటి నుంచి ఈ ఆలయంలోనే నివాసిస్తోందట. దేవుని కైంకర్యాలకు ఈ ఏనుగుని వినియోగిస్తామని చెబుతున్నారు ఆలయ నిర్వాహకులు. మే నెలలో ఈ ఏనుగుకి చల్లదనం కల్పించడం కోసం ప్రత్యేకంగా దాదాపు రూ. 45 వేలు ఖరీదు చేసే షవర్‌ని కూడా ఏర్పాటు చేశామని చెబుతున్నారు ఆలయ నిర్వాహకులు. View this post on Instagram A post shared by India Cultural Hub (@indiaculturalhub) (చదవండి: జ్ఞాపకంగా మిగిలిన ఆ కుక్క కోసం .. ఏకంగా రూ. 19 లక్షలా..!) -
బీట్స్‌తో అదరగొట్టేసిన బుడ్డోళ్లు : 3 కోట్ల వ్యూస్, ఓ లుక్కేసుకోండి మరి!
‘బాల్యం బంగారు నిధి’ ఇది అందరం ఒప్పుకునే మాట. బాల్య స్మృతులు ఎవరికైనా చెప్పలేనంత ఉల్లాసాన్ని ఇస్తాయి. బాల్యం అనగానే అందమైన అనుభూతులు, అనుభవాలు ఒక్కసారిగా మనల్ని చుట్టుముడతాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించిన జ్ఞ్యాపకాలు ఒక్కసారిగా నిద్ర లేస్తాయి. చిన్నపుడు మనం చేసిన అల్లరి, చిలిపి చిలిపి చేష్టలు గుర్తొస్తాయి. బ్లాక్ బోర్డుపై రాసిన రాతలు, స్కూలు బెంచ్‌పై చెక్కుకున్నపేర్లు, అదేదో సినిమాలో అన్నట్టు నచ్చిన అమ్మాయిపై పేపర్ బాల్ విసరడం, అది మాస్టార్‌కు తగిలి, వీపు పగలడం ఇలా.. ఎన్నో..ఎన్నో గుర్తుకు వస్తాయి కదా. ఇపుడు మీరు చదవబోయే కథనం కూడా అలాంటి ఎన్నో అనుభవాలను గుర్తు చేస్తుంది. పుణేకు చెందిన విద్యార్థుల వీడియో ఒకటి నెట్టింట హల్చల్ చేస్తోంది.ప్రాజెక్ట్ అస్మి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో ఇపుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇప్పటికే ఇది 3 కోట్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. కమెంట్లు వెల్లువెత్తాయి. పూణేలోని ఒక పాఠశాల చెందిన బ్యాచ్ జామెట్రీ బాక్స్, బెంచె మీద వాయిస్తూ అద్భుతమైన సంగీతాన్ని సృష్టించారు. వాటర్ బాటిల్‌ను మాత్రమే ఉపయోగించి డ్రమ్ బీట్స్‌తో అదరగొట్టేశారు. ఒకరి తరువాత ఒకరు తమ టాలెంట్‌తో రెచ్చిపోయారు. దీంతో తరగతి గది ఒక చిన్న కచేరీ వేదికగా మారిపోయింది. దీంతో టీచర్లు కూడా అలా మైమరిచిపోయారు. చుట్టూ ఉన్న పిల్లలు, స్నేహితులు చప్పట్ల మోత మోగించారు. చదవండి: అప్పుడు వెడ్డింగ్ గౌను, ఇపుడు ఎంగేజ్మెంట్ రింగ్ : సమంత అంత పనిచేసిందా? View this post on Instagram A post shared by Project Asmi (@projectasmi_pune)అందుబాటులో ఉన్న వస్తువులను ఉపయోగించి విద్యార్థులు ఉత్పత్తి చేసే బీట్లు , రిథమ్‌లు భలే ఉంటాయి. వారి క్రియేటివిటీని మెచ్చుకోకుండా ఉండలేం. కల్మషం లేని లేత వయసులో వారి ప్రతిభను ,సృజనాత్మకతను గుర్తించి ప్రోత్సహిస్తే గొప్ప ప్రతిభావంతులుగా మారతారు. మరి ఈ బాల శివమణిలకు ఎలాంటి ప్రోత్సాహం లభిస్తుందో వేచి చూద్దాం. -
జ్ఞాపకంగా మిగిలిన ఆ కుక్క కోసం .. ఏకంగా రూ. 19 లక్షలా..!
కొందరూ యజమానులు తమ పెంపుడు కుక్కల కోసం ఎంత దూరమైనా.. వెళ్లిపోతారు. వాటికోసం ఎంత డబ్భైనా ఖర్చు చేస్తారు. అలానే గతంలో కొందరు యజమానులు తమ కుక్కలకు పుట్టిన రోజులు, పెళ్లిళ్లు జరిపించి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఓ యజమానురాలు తాను ఎంతో ఇష్టంగా పెంచుకున్న కుక్క దూరమైందని ఆమె ఏ చేసిందో తెలిస్తే మతిపోతుంది. మరీ ఇంతలానా అని అనుకోవడం ఖాయం. ఇంతకీ ఆ మహిళ ఏం చేసిందంటే..చైనాలోని హాంగ్జౌకు చెందిన జు అనే మహిళ 2011లో డోబర్మ్యాన్ అనే కుక్కను కొనుగోలు చేసి జోకర్ అని పేరు పెట్టుకుంది. దాన్ని ఎంతో ప్రేమగా చూసుకునేది. రాను రాను ఆ కుక్కతో ఆమెకు విడదీయరాని బంధం ఏర్పడింది. తన పాఠశాల విద్య నుంచి వృత్తి జీవితం వరకు తన పెంపుడు కుక్కతో పెనవేసుకున్న ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. అయితే ఆ కుక్క తొమ్మిదేళ్ల వయసులో ప్రాణాంత సార్కోమా బారిన పడింది. ఆ సమయంలోనూ జు తన కుక్కను తన కంటిపాపల కాచుకుంది. దానికి అనస్థీషియా లేకుండానే విజయవంతంగా శస్త్ర చికిత్స చేయించి మరీ రక్షించుకుంది. అయితే కాలక్రమంలో ఆ కుక్క పలు వ్యాధుల బారినపడటం మొదలైంది. అయినా తన శక్తిమేర దాని బాగోగులు చూసుకుంటూనే వచ్చింది జూ. కానీ ఆ కుక్క 2022లో గుండెపోటుతో అనూహ్యంగా మరణించింది. దీంతో పెంపుడు కుక్క పోయిందన్న దిగులతో గడపటం మొదలుపెట్టింది జూ. అలా ఆ కుక్క మరణం జూపై తీవ్ర ప్రభావం చూపింది. నిద్రలేని రాత్రులతో సతమతమయ్యేది. ఇక ఆమె ఆరోగ్యం నెమ్మదిగా క్షీణించటం మొదలైంది. ఇక లాభం లేదు ఇలా దుఃఖంలో మునిగిపోవడమే తప్ప బయటకి రాలేనని గ్రహించింది జు. దీనికి సరైన పరిష్కారం కనుగొని ఇదివరకటిలా హాయిగా జీవితాన్ని గడపాలనుకుంది. అందుకోసం బాగా ఆలోచించి.. క్లోనింగ్ ఒక్కటే మార్గమని డిసైడ్ అయ్యింది. క్లోనింగ్ ప్రక్రియతో జీవిని పోలిని జీవిని సృష్టిస్తారు శాస్త్రవేత్తలు. ఇదే తన బాధకు చక్కటి ఉపశమనం అని నమ్మి.. క్లోనింగ్ సౌకర్యాన్ని అందించే ఆస్పత్రిని సందర్శించి ఏకంగా రూ. 19 లక్షలు చెల్లించింది. ఆ ఆస్పత్రి వైద్యులు జు పెంపుడు కుక్క ఉదరం, చెవుల నుంచి కొద్ది మొత్తంలో చర్మాన్ని సేకరించి ఒక ఏడాదిలో అచ్చం అలాంటి కుక్కనే రూపొందించారు. వైద్యులు జుకి సమాచారం ఇవ్వడంతో ఆనందంగా ఆ చిన్న కుక్కను ఇంటికి తీసుకువెళ్లింది. దానికి లిటిల్ జోకర్ అని పేరుపెట్టుకుని పెంచుకుంటుంది. ఇది అచ్చం తన పెంపుడు కుక్క జోకర్ మాదిరిగానే ఉందని ఆనందంగా చెబుతోంది. ఈ కొత్త కుక్కరాకతో ఆ బాధ నుంచి తేరుకోగలుగుతున్నాని సంతోషంగా చెబుతోంది జు. మనిషి తన బాధకు ఉపశమనం కోసం ఎంత దూరమైన వెళ్తాడంటే ఇదేనేమో. అంతేగాదు మనం పెంచుకుంటున్న వాటిపై చూపించే ప్రేమ అంతకుమించి అన్నట్లు ఉంటే జులానే ఎంత డబ్భైనా ఖర్చు పెట్టేందుకు వెనుకాడరేమో కదూ. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట తెగ వైరల్‌గా మారింది.(చదవండి: నాలుగు పదుల వయసులోనూ అంతే అందంగా శ్రియ.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!) -
మానవ సేవే.. మాధవ సేవగా... మహ్మద్ నజీబ్ సేవలు!
మానవ సేవే మాధవ సేవ.. అనే నానుడిని ఒంటబట్టించుకున్నారు.. గోల్కొండ ప్రాంతానికి చెందిన మహ్మద్ నజీబ్. సరిగ్గా అదే తలంపుతో గత 18 ఏళ్లుగా పేదల కోసం నిరంతరాయం శ్రమిస్తూ.. నిరుపేదలకు, వలస కూలీలకు సేవలందిస్తున్నారు. తాను స్థాపించిన తెలంగాణ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఆర్గనైజేషన్ ద్వారా పేదల కుటుంబాల్లో తలెత్తే తగాదాలను పరిష్కరిస్తూ వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. మరోవైపు వలస కూలీలు, నిరుపేదలకు వైద్య సహాయం, నిత్యావసరాలు అందజేస్తున్నాడు. కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో మహ్మద్ నజీబ్ షేక్‌పేట ఫ్రెండ్స్ కాలనీలో ప్రత్యేక వంటశాలను ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ఉపాధి కోల్పోయిన వారికి ప్రతినిత్యం వంద కిలోల బియ్యంతో వంట చేస్తూ లేబర్ అడ్డాలు, ఆస్పత్రుల వద్ద భోజన ప్యాకెట్లు అందించారు. – గోల్కొండ నజీబ్ చిన్ననాటి స్నేహితులతో కలిసి గోల్కొండలోని షేక్ పేటలో నిరంతరాయంగా నిరుపేదలకు సేవలందిస్తున్నాడు మహ్మద్ నజీబ్. స్థానిక ప్రాంతంలో ఇంటింటికీ తిరిగి వారి సమస్యలను గుర్తిస్తూ.. తనకు తోచిన సహాయాన్ని అందిస్తున్నాడు. స్థానికులకు, పేదలకు అండగా నిలుస్తున్నాడు. ముఖ్యంగా లేబర్ అడ్డాల వద్ద ఒక్కపూట భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నాడు. కాలనీలో ప్రత్యేకంగా ఓ వంట శాలను సైతం ఏర్పాటు చేశాడు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి ప్రతినిత్యం భోజన ప్యాకెట్లను అందించాడు. పలువురు బాధితులకు ఆక్సిజన్ సిలిండర్లను ఉచితంగా అందించాడు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యుల సహాయంతో స్థానికులకు వైద్య సేవలను అందించాడు. కుటుంబ కలహాలు చక్కబెడుతూ.. టోలిచౌకీలోని తెలంగాణ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ప్రధాన కార్యాలయంలో స్థానికుల కుటుంబ తగాదాలు, భార్యా భర్తల కలహాలకు పరిష్కార వేదిక ఏర్పాటు చేశారు. దాదాపు 15 యేళ్లగా చిన్న చిన్న తగాదాలతో విడాకులు తీసుకోడానికి తనవద్దకు వచి్చన వారికి కౌన్సిలింగ్ ఇప్పించి వారి కలహాలకు పరిష్కారం చూపుతున్నాడు. ఇప్పటి వరకూ దాదాపు 350 మంది దంపతులకు కౌన్సిలింగ్ ఇప్పించి, వారిని ఏకం చేస్తున్నాడు. మరోవైపు నిరుపేద విద్యార్థులకు ఆర్గనైజేషన్ ద్వారా తామున్నామంటూ అండగా ఉంటూ ఫీజులకు తన వంతు సహాయం అందిస్తున్నాడు. చదువు మధ్యలో వదిలేసిన వారిని చదువు కొనసాగించేలా ప్రోత్సహిస్తున్నాడు. ప్రతి యేటా తాము 8 మంది నిరుపేద విద్యార్థులను దత్తత తీసుకుంటున్నామని, పదో తరగతి వరకూ ఉచితంగా చదువుకునేలా వారికి అండగా నిలబడుతున్నాడు. ప్రస్తుతం ఆర్గనైజేషన్ కార్యకలాపాలు తెలంగాణ జిల్లాలకు కూడా విస్తృతం చేస్తున్నట్లు నజీబ్ తెలిపారు. -
30 ఏళ్ల తండ్లాట...అమ్మను చూడాలని !
తల్లిని కలిసేందుకు ఓ తనయ ఆరాటపడుతోంది. 30 ఏళ్లుగా ఆమెకు దూరమై తల్లడిల్లిపోయింది. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ ఠాణాలో మీ అమ్మ ఉందంటూ భవానికి తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులు సమాచారం ఇచ్చారు. దీంతో భవాని ఆదివారం కోరుట్లలో ఉంటున్న తన బంధువులతో కలిసి అక్కడకు బయలుదేరి వెళ్లింది. వివరాల్లోకి వెళితే..జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన పసుల రాంరెడ్డి 1979లో పీపుల్స్‌వార్‌లో చేరారు. అప్పుడే అరెస్ట్ అయ్యారు. జైలు నుంచి విడుదలయ్యాక ఏడాదిపాటు ఇంటి వద్దే ఉండగా, కథలాపూర్ మండలం సిరికొండకు చెందిన వసంతతో వివాహం జరిగింది. ఏడాది వ్యవధిలోనే రాంరెడ్డి–వసంత దంపతులిద్దరూ పీపుల్స్‌వార్‌లోకి వెళ్లారు. అజ్ఞాతంలో ఉండగానే కూతురు జన్మించింది. ముంబైలో ఉండే తన అన్నసాయిబాబాకు కూతురు (భవాని)ని అప్పగించాడు రాంరెడ్డి. 2001లో ఉత్తర తెలంగాణ స్పెషల్ జోన్ కార్యదర్శి హోదాలో ఉన్న సమయంలో కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం మద్దిమల్ల సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో పసుల రాంరెడ్డి హతమయ్యాడు. అయినా అజ్ఞాతం వీడని వసంత శాంతక్క, మమతక్క పేర్లతో దండకారణ్యంలోని బస్తర్ డివిజన్ కమిటీ సభ్యురాలిగా కొనసాగారు. చదవండి: Amrutha Pranay Case Verdict : పీవోడబ్ల్యూ సంధ్య స్పందన ఇదే!మోకాళ్ల నొప్పులు, షుగర్ వంటి అనారోగ్య సమస్యలతో 2024 నవంబర్‌లో వసంత కాంకేర్ జిల్లా పోలీసులకు పట్టుబడ్డారు. ఆ తర్వాత కాంకేర్ పోలీసులు ఆమెతోపాటు మరో ఏడుగురు మావోయిస్టులు 2025 జనవరిలో లొంగిపోయినట్టు ప్రకటించారు. అప్పటి నుంచి కాంకేర్లోనే పోలీసుల అదీనంలో ఉంటోంది. ఛత్తీస్‌గఢ్ పోలీసులు ఆమె గురించి ఆరా తీస్తూ తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులకు విషయం చెప్పారు. రెండురోజుల క్రితం తెలంగాణ పోలీసులు భవాని ఆచూకీ తెలుసుకున్నారు. ఆమెకు తల్లి సమాచారం చెప్పడంతో ఛత్తీస్‌గఢ్‌కు బయలుదేరింది. ఒకట్రెండుసార్లు అమ్మను కలిశాను ఒకట్రెండు సార్లు అమ్మను కలిశా...చిన్నప్పుడు కోరుట్లలోనే ఓ చోట ఒకట్రెండు సార్లు అమ్మను కలిశా. అప్పుడు అమ్మానాన్న ఇద్దరూ అజ్ఞాతంలోనే ఉన్నారు. ఇప్పుడు నేను వెళితే నన్ను అమ్మ తప్పకుండా గుర్తుపడుతుంది. ఇన్నాళ్లు పెద్దనాన్న దగ్గర దత్త పుత్రికగానే పెరిగాను. కొన్నేళ్ల క్రితమే పెద్దనాన్న దంపతులు ఇద్దరూ చనిపోయారు. అమ్మ వస్తుందంటే బంధువులంతా సంతోషపడుతున్నారు. – భవాని -
ఇంధన స్పృహ కలిగిన ఇల్లులా ఆరోగ్యకరంగా మార్చేద్దాం..!
ఇంటిని మరింత పర్యావరణ అనుకూలంగా ఎలా మార్చుకోవాలి అని చేసే ఆలోచనల్లో లైటింగ్ ఒకటి. అందుకు సరైన ఉపకరణాలను వాడటం, సరైన వెంటిలేషన్‌ను నిర్ధారించడం వంటి సాధారణ మార్పులు, ఇంధన శక్తిని పొదుపు చేయడానికి పాటించాల్సిన పద్ధతులు పెద్ద తేడాను కలిగిస్తాయి. ఇంధన స్పృహ కలిగిన ఇల్లు ఆరోగ్యకరమైన వాతావరణానికి, మరింత సౌకర్యవంతమైన జీవనశైలికి దోహదం చేస్తుంది. పాతకాలం బల్బుల కంటే ఎల్ఈడీ లైట్లు 80 శాతం వరకు తక్కువ విద్యుత్తును ఉపయోగిస్తాయి. ఎక్కువ కాలం వెలుగునిస్తాయి. దీంతో బల్బులను త్వరగా మార్చనక్కర్లేదు. కరెంట్ బిల్లు కూడా తగ్గుతుంది.కరెంట్ వినియోగం ఎక్కువ ఉండే వంట గదిని పరిశీలించండి. ఏ ఎలక్ట్రికల్ వస్తువును ఉపయోగిస్తున్నాం, ఆ వస్తువు లేకుండా మరో విధంగా పనులు పూర్తి చేయగలమా, బామ్మల కాలం నాటి పద్ధతులను అమలు చేయగలమా.. అని ఆలోచన చేయడమే కాకుండా, ఆచరణలో పెట్టవచ్చు.రోజూ కరెంట్‌తో నడిచే పరికరాలను వారంలో రెండు, మూడుసార్లు విరామమిచ్చేలా ప్లాన్ చేసుకోవచ్చు.ఇంటికి కరెంట్ వాడకం ఎంత అవసరం అనేది ముందు ఒక అంచనా వేసుకోవాలి. గాలి, వెలుతురు ధారాళంగా ఉండే ఇంటిలో లైట్ల వాడకం అంతగా ఉండదు. దీని వల్ల కరెంట్ వినియోగాన్ని సగానికి సగం తగ్గించవచ్చు.ఇంటికి కరెంట్ వాడకం ఎంత అవసరం అనేది ముందు ఒక అంచనా వేసుకోవాలి. గాలి, వెలుతురు ధారాళంగా ఉండే ఇంటిలో లైట్ల వాడకం అంతగా ఉండదు. దీని వల్ల కరెంట్ వినియోగాన్ని సగానికి సగం తగ్గించవచ్చు.కరెంట్ వినియోగం ఎక్కువ ఉండే వంట గదిని పరిశీలించండి. ఏ ఎలక్ట్రికల్ వస్తువును ఉపయోగిస్తున్నాం, ఆ వస్తువు లేకుండా మరో విధంగా పనులు పూర్తి చేయగలమా, బామ్మల కాలం నాటి పద్ధతులను అమలు చేయగలమా.. అని ఆలోచన చేయడమే కాకుండా, ఆచరణలో పెట్టవచ్చు.గది నుంచి బయటకు వెళ్లేటప్పుడు లైట్లు, ఫ్యాన్లు ఆపివేయడం అలవాటు చేసుకోవాలి. ఈ విషయంలో కుటుంబ సభ్యులకూ అవగాహన కల్పించాలి. కుటుంబంలో ప్రతి ఒక్కరూ విద్యుత్తును ఆదాచేయడంలో ప్రాధాన్యాన్ని అర్థం చేసుకునేలా మన ప్రవర్తన ఉండాలి. సోలార్ విద్యుత్తును ఉపయోగించడం వల్ల ఇతర ఇంధన శక్తిని కొనుగోలును తగ్గించవచ్చు. సోలార్, గ్యాస్ ఆధారిత వాటర్ హీటర్లను ఉపయోగించడం వల్ల కూడా విద్యుత్తు వినియోగాన్ని తగ్గించినవారవుతారు. కార్బన్ ఫుట్ ప్రింట్స్‌ను తగ్గిస్తూ, చిన్న చిన్న మార్పులతో పర్యావరణ అనుకూలంగా ఉంటే డబ్బు, సమయాన్ని ఆదాచేయడమే కాదు రేపటి తరాలకు కూడా మేలు చేసినవారవుతారు. -ఎన్.ఆర్(చదవండి: -
భారీ కీటకం.. దాంతోనే వంటకం..!
చిన్న బొద్దింకను చూస్తేనే చాలామంది భయపడుతుంటారు. అలాంటిది పెద్ద బొద్దింకను చూస్తే ఇక పరుగులే! కాని, ఫొటోలో పెద్దసైజు బొద్దింకలా కనిపిస్తున్నది కీటకమే గాని, వియత్నాం ప్రజలు మాత్రం దీంతో రుచికరమైన వంటకాన్ని తయారు చేసుకుని ఆరగిస్తారు. దీని అతిపెద్ద ఆకారం, తలను చూసి, వియత్నాంలో అందరూ, దీనిని ‘స్టార్ వార్స్’ సినిమాల్లో విలన్ అయిన ‘డార్త్ వాడర్’గా పిలుచుకుంటారు. దాదాపు 30 నుంచి 35 సెంటీమీటర్లు పొడవు, ఒకటి నుంచి రెండు కిలోల బరువుతో ఉంటుంది ఈ కీటకం. వియత్నాం ఫుడ్మార్కెట్లో విక్రయిస్తున్న దీనిని ఈ మధ్యనే శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది ‘బాతినోమాస్’ జాతికి చెందిన జెయింట్ ఐసోపాడ్ అనే సముద్ర కీటకంగా నిర్ధారించారు. ఈ సముద్ర కీటకానికి సంబంధించిన మరో రెండు నమూనాలను పరిశోధకులు విశ్లేషణ కోసం సేకరించారు. మరిన్ని విషయాలను అధ్యయనం చేశాకనే వెల్లడించగలమని తెలిపారు. -
'యుద్ధాన్ని తలపించే పండుగ'..! కానీ అక్కడ అడుగుపెట్టారో..
శరవేగంగా పరుగులు తీసే గుర్రాలను అధిరోహించి, ఒకరిపై మరొకరు ఈటెలతో కలబడే ఆ దృశ్యాన్ని చూస్తే, అక్కడేదో యుద్ధం జరుగుతోందని ఎవరైనా పొరబడతారు. నిజానికి అది యుద్ధంకాదు, అక్కడి ప్రజలు జరుపుకొనే సంప్రదాయ పర్వదినం. ఇండోనేసియా తూర్పు ప్రాంతంలోని సుంబా దీవిలో జరిగే ఈ పండుగ పేరు ‘పసోలా’. ఏటా ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఈ పండుగను పంటకాలానికి ప్రారంభ సూచికగా జరుపుకొంటారు.పూర్వీకుల ఆత్మశాంతి కోసం, కుటుంబాల మధ్య అనుబంధాలను బలపరచుకోవడానికి, మూలాలను కాపాడుకోవడానికి ఈ పండుగ ఒక మార్గమని స్థానికులు చెబుతారు. ఈ పండుగలో ముఖ్యమైన ఘట్టం ఈటెల పోటీ. సత్తా ఉన్నవారంతా బరిలోకి దిగి, గుర్రాల మీద స్వారీ చేస్తూ, ప్రత్యర్థులతో కలబడతారు. ఎదురుగా దూసుకొచ్చే ఈటెలను తప్పుకోవడం ఒక ఎత్తయితే, గురిచూసి ఎదుటివారిని దెబ్బతీయడం మరో ఎత్తు. యుద్ధాన్ని తలపించే ఈ పోటీల్లో చాలామందికి గాయాలవుతుంటాయి.పసోలా అనే పదానికి సుంబా స్థానిక భాషల్లో ‘ఈటె విసరడం’ అని అర్థం. ఈ పోటీల్లో వినియోగించే ఈటెలను ‘హోలా’ అని పిలుస్తారు. ఈ పండుగ వెనుక పురాతన చరిత్ర ఉంది. స్థానిక పురాణాల ప్రకారం, పసోలా పండుగ ఆకాశంలో ఒకరితో ఒకరు పోరాడిన రెండు శక్తిమంతమైన ఆత్మల కథ నుంచి మొదలైందట! ఆ ఆత్మల సంఘర్షణ ఫలితంగా భూమిపై ఈటెల వర్షం కురిసిందట!. ఈ పౌరాణిక గాథ ప్రేరణతోనే ఈ పండుగ ప్రారంభమైంది. ఈ వేడుక కోసం గుర్రాలను పెంచడాన్ని గౌరవంగా, హోదాచిహ్నంగా భావిస్తుంటారు. పనికట్టుకుని ఈ పోటీలో పాల్గొనే పోటీదారులు తమ గుర్రాలను తామే పెంచుకుని, రోజుల తరబడి సాధన చేసి మరీ బరిలోకి దిగుతుంటారు. ఈ పోటీని చూడటానికి పెద్దసంఖ్యలో పర్యటకులు కూడా పోటెత్తుతారు. అడుగుపెడితే శిలైపోతారుభూమిపై ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో ఉత్తర టాంజానియాలో ఉండే నాట్రాన్ సరస్సు ఒకటి. ఇందులోని నీరు నెత్తుటిలా ఎర్రగా ఉంటుంది. సరస్సంతా నెత్తుటి మడుగులా కనిపిస్తుంది. ఈ సరస్సును దయ్యాలు సృష్టించాయని, ఆ సరస్సులోకి మనుషులు గాని, జంతువులు గాని దిగితే, రాళ్లుగా మారిపోతారని స్థానికులు చెబుతుంటారు. అందుకే, సూర్యాస్తమయం తర్వాత ఎవరూ అక్కడ తిరగడానికి సాహసించరు. శాస్త్రవేత్తలు ఈ సరస్సును పరిశీలించి, ఈ సరస్సు నీటిలో సోడియం కార్బొనేట్, నైట్రో కార్బొనేట్ ఎక్కువగా ఉండటంతో, ఇందులోని నీరు ప్రాణాంతకంగా మారిందని తేల్చారు. ఈ సరస్సులోకి మనుషులు సహా ప్రాణులేవైనా వెళ్తే, ఇలా రాళ్లలా గడ్డకట్టిపోవడానికి గల కారణాలను మాత్రం శాస్త్రవేత్తలు ఇంకా కనిపెట్టలేకపోయారు. (చదవండి: గిన్నిస్‌కెక్కిన మహిళల వేడుక..!) -
గిన్నిస్‌కెక్కిన మహిళల వేడుక..!
అందరూ మహిళలే జరుపుకొనే వేడుక ఇది. అత్యధిక సంఖ్యలో మహిళలు ఒకేచోట చేరి జరుపుకొనే కార్యక్రమంగా గిన్నిస్ బుక్‌లోకి ఎక్కిన అరుదైన వేడుక ఇది. ఈ వేడుకలో పాల్గొనడానికి పురుషులకు అనుమతి ఉండదు. తరతరాలుగా సాగుతున్న ఈ వేడుక కేరళ రాజధాని తిరువనంతపురం చేరువలోని అట్టుకల్ గ్రామంలో వెలసిన భగవతి అమ్మవారి ఆలయంలో జరుగుతుంది. ఏటా పదకొండు రోజుల పాటు జరిగే ఈ వేడుకలో లక్షలాది మంది మహిళలు పాల్గొంటారు.తిరువనంతపురం జిల్లా అట్టుకల్ గ్రామంలోని భగవతి అమ్మవారి ఆలయం చాలా పురాతనమైనది. అట్టుకల్ గ్రామంలో వెలసినందున ఈ అమ్మవారు ‘అట్టుకల్ భగవతి’గా ప్రసిద్ధి చెందింది. ఈ ఏడాది మార్చి 5 నుంచి 15 వరకు ఈ ఆలయంలో అట్టుకల్ భగవతి అమ్మవారి వేడుకలు జరుగుతున్నాయి. వేడుకల తొమ్మిదో రోజున లక్షలాది మంది మహిళలు ఇక్కడకు చేరుకుని, అమ్మవారికి పొంగలి నైవేద్యం సమర్పిస్తారు. ఈ కార్యక్రమాన్ని ‘అట్టుకల్ పొంగల్’ వేడుకగా పిలుస్తారు. తొమ్మిదో రోజున తిరువనంతపురం నగరంలోని అన్ని రహదారులూ అట్టుకల్ భగవతి అమ్మవారి ఆలయానికి వెళ్లే మహిళలతో కిటకిటలాడుతూ కనిపిస్తాయి. ఈ వేడుకల్లో పాల్గొనడానికి కేరళ నుంచే కాకుండా, ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన మలయాళీ మహిళలు పెద్దసంఖ్యలో ఇక్కడకు చేరుకుంటారు.ఇక్కడకు వచ్చే మహిళలు ఆలయ ప్రాంగణంలోను, ఆలయ పరిసరాల్లోని వీథుల్లోను ఇటుకలతో కట్టెల పొయ్యిలను ఏర్పాటు చేసుకుని, వాటి మీద పొంగలి, చక్కెరపొంగలి వండుతారు. ఆలయ ప్రధాన అర్చకుడు నిర్ణయించిన ముహూర్తానికి అందరూ ఒకేసారి పొయ్యిలు వెలిగించి వంట మొదలుపెడతారు. ముహూర్త సమయం ఆసన్నం కాగానే, అర్చకుడు గంట మోగిస్తాడు. అయితే, మహిళలు పొంగలి వండుతున్న ప్రదేశంలోకి ఆలయ అర్చకులు కూడా అడుగు పెట్టరు. ఈ వేడుకలో భాగంగా మహిళలందరూ తిరువనంతపురంలోని మనకాడు ప్రాంతంలో ఉండే శ్రీధర్మ శాస్త ఆలయం వరకు భారీ ఊరేగింపు జరుపుతారు. మొదటి రోజున ‘కప్పుకెట్టు’ కార్యక్రమంతో ఈ వేడుక మొదలవుతుంది. ఇందులో భాగంగా ‘కణ్ణగి చరిత’ను గానం చేస్తారు. ‘కణ్ణగి చరిత’గానం వరుసగా తొమ్మిది రోజుల పాటు జరుగుతుంది. చివరి రోజున ‘కురుత్తి తర్పణం’ పేరుతో తర్పణాలు విడిచిపెట్టడంతో ఈ వేడుకలు ముగుస్తాయి. వేడుక కొనసాగినన్ని రోజులూ అట్టుకల్ భగవతి అమ్మవారి ఆలయానికి చేరుకునే వీథులన్నీ రంగురంగుల అలంకరణలతో కనువిందు చేస్తాయి. ఈ వేడుకల సందర్భంగా వీథుల్లో ఏర్పాటు చేసే బహిరంగ వేదికలపై సంప్రదాయ నృత్య సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. అట్టుకల్ పొంగల్ వేడుకలలో 1997 సంవత్సరంలో 15 లక్షల మందికి పైగా మహిళలు పాల్గొనడంతో తొలిసారి గిన్నిస్‌బుక్ రికార్డుల్లో నమోదైంది. ఆ తర్వాత 2009లో 25 లక్షలకు పైగా మహిళలు పాల్గొనడంతో మరోసారి గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కింది. ఈ వేడుక ప్రశాంతంగా జరగడానికి వీలుగా కేరళ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేస్తుంది.(చదవండి: అంచనాలు నెరవేరకపోయినా..బంధం స్ట్రాంగ్‌గానే ఉండాలి..!) -
వాలుజడతో ఊరికే పేరుతెచ్చారు..! ఆ మహిళలెవరంటే..
ఈ రోజుల్లో జుట్టు పొడవుగా ఉండటం అత్యంత అరుదు. ఏవేవో ఫ్యాషన్లతో భుజాల వరకే ఉండేలా జుట్టు ఫ్రీగా వదిలేయడం ట్రెండ్‌గా మారింది. పైగా లాంగ్ జుట్టు మెయింటైన్ చేయడం మావల్ల కాదని చెప్పేస్తోంది నేటి యువత. అలాంటి ఈ కాలంలో పొడవు జుట్టుతో అందర్నీ ఆకర్షిస్తూ ప్రత్యేకంగా నిలుస్తున్నారు ఈ గ్రామం అమ్మాయిలు. అంతేగాదు ఆ వాలు జడతో తమ ఊరి పేరు వార్తల్లో నిలిచేలా చేశారు. అంతలా ఆ మహిళలందరి జుట్టు ఎలా పొడవుగా ఒత్తుగా ఉంది..? అందుకోసం వాళ్లే ఏం చేస్తారనే సందేహాలు కచ్చితంగా వస్తాయి. అయితే ఆ మహిళలున్న గ్రామంలో కనీస సదుపాయాలేం లేవు. కటిక పేదరికం. కేవలం ఆ పొడవాటి జుట్టు కారణంగా ప్రపంచంలోనే ప్రత్యేకమైన వ్యక్తులుగా నిలబెట్టింది అంతే..మరీ ఆమహిళలెవరు..? ఎక్కడుందా గ్రామం..? ఆ పొడవాటి కురుల సీక్రెట ఏంటి తదితరాల గురించి తెలుసుకుందామా..!.చైనాలోని గుయ్లిన్ నగరానికి వంద కిలోమీటర్ల దూరంలో హుయాంగ్లుయో అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలోని మహిళలు జుట్టే అత్యంత పొడవుగా ఉంటుంది. అలాంటి కురులు కేవలం అమ్మాయిలకే సొంతం కాదు..అమ్మమ్మలు, నానమ్మల వయసులో ఉన్న వారూ కూడా వాలుజడతో హోయలు పోతుంటారట..!.రెడ్ యావో తెగకు చెందిన ఈ మహిళలందరూ పొడవైన ఆరోగ్యకరమైన జుట్టుకి పేరుగాంచినవారు. వీళ్లంతా జుట్టుని పొడవుగా ఉంచుకోవడమే గాక అందంగా అలంకరించుకోవడంలోనూ ముందుంటారు. అయితే పెళ్లి కానీ అమ్మాయిలు స్కార్ఫ్‌తో జుట్టుకి హంగులద్దితే..పెళ్లైన మహిళలు తల ముందు భాగంలో పెద్ద బన్ మాదిరిగా హెయిర్‌స్టైల్ వేసుకుంటారట!. ఆ కురుల సీక్రెట్ ఏంటంటే..రెడ్ యావో మహిళలు తమ శిరోజాల సంరక్షణ కోసం సహజసిద్ధమైన వాటినే ఉపయోగిస్తారట. అదే వారి కేశ సంపద రహస్యమట. ఈ మహిళలంతా లాంగ్షెంగ్ రైస్‌తో తయారు చేసిన ప్రత్యేక షాంపూతో జుట్టుని శుభ్రం చేసుకుంటారట, అలాగే జుట్టుని నది నీటితోనే కడుగుతామని చెబుతున్నారు ఆ తెగ మహిళలు.తమ జుట్టు సంరక్షణలో భాగంగా పులియబెట్టిన బియ్యం నీటిని ఉపయోగిస్తారట. ఆ మహిళలంతా చెక్క దువ్వెనలనే ఉపయోగిస్తారట. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే..80 ఏళ్లకు చేరకున్న ఏ మహిళ జుట్టు కూడా తెల్లబడదట. ఈ చిట్కాల తోపాటు ప్రొటీన్లు అధికంగా ఉండే బీన్స్నూ తరచూ ఆహారంలో తీసుకుంటారట. ఇలా పొడవాటి జుట్టుతో పేరుతెచ్చుకున్నారు ఈ యావో మహిళలు. ఆ ప్రత్యేకతతోనే వారి గ్రామానికి గుర్తింపు కూడా వచ్చింది. గిన్నిస్‌లోనూ చోటు!ఈ యావో మహిళలు తమ పొడవాటి జుట్టుతో ప్రపంచం దృష్టిని ఆకర్షించడమే కాదు.. గిన్నిస్ రికార్డు కూడా సృష్టించారు. రెండేళ్ల క్రితం జరిగిన ‘Longji Long Hair Festival’లో భాగంగా.. గిన్నిస్ రికార్డే లక్ష్యంగా బరిలోకి దిగారు 256 మంది యావో మహిళలు. ఈ క్రమంలో అక్కడి ఓ నదీ తీరానికి చేరుకున్న వీరు.. ఒకరి వెనకాల మరొకరు నిల్చొని చెక్క దువ్వెనలతో తమ జుట్టును దువ్వుతూ.. 456 మీటర్ల (1,496 అడుగుల) మేర పొడవాటి చైన్‌గా ఏర్పడ్డారు. దీంతో ‘లాంగెస్ట్ హెయిర్ కోంబింగ్ చెయిన్’గా ఇది గిన్నిస్ రికార్డులకి ఎక్కింది. అంతేకాదు.. ఇందులో పాల్గొన్న మహిళలంతా ఎరుపు-నలుపు రంగులు కలగలిపి రూపొందించిన సంప్రదాయ దుస్తులు ధరించి.. ‘లాంగ్ హెయిర్ బల్లాడ్’ అంటూ పాటలు పాడుతూ మరీ పాల్గొనడం.. ప్రధాన ఆకర్షణగా నిలిచింది.అయితే ఈ తెగ తమ జీవన విధానాన్ని కాపాడుకోవటానికి చాలా సవాళ్లు ఎదుర్కొంటుంది. పెళ్లికాని స్త్రీ జుట్టును కిందకి వదులుగా ఉండగా ఏ పురుషుడైనా చూస్తే..అతడు ఆమెతో మూడేళ్లు కలిసి ఉండాల్సిందేనట. అయితే ప్రస్తుతం వారు ఆ ఆచారాన్ని పాటించటం లేదట. పర్యాటకుల ముందు తమ జుట్టుని ప్రదర్శించి డబ్బులు సంపాదించి బతుకుతున్నామని ఆ యావో తెగ మహిళలు ఆవేదనగా చెబుతున్నారు. View this post on Instagram A post shared by SheThePeople (@shethepeopletv) (చదవండి: డెన్మార్క్ రాణి 1800ల నాటి అరుదైన కిరీటం..! 140 ఏళ్లుగా..) -
వెక్కిరింపులను లెక్క చేయలే.... కానీ కొట్టాడు వరల్డ్ రికార్డ్!
లావుగా ఉన్నవాళ్లు సన్నగా రివటలా మారాలని ఆరాట పడుతూ ఉంటారు. అలాగే సన్నగా ఉన్నవాళ్లు కాస్తంత బొద్దుగా ఉంటే బావుండు అని నిట్టూరుస్తూ ఉంటారు. ఇక రింగు, రింగులు జుట్టు ఉన్నవాళ్లలో కొంతమంది స్మూత్ అండ్ సిల్కీ హెయిర్ చూసి మురిసిపోతుంటారు. నాకూ అలా ఉంటే బావుండు అని అనుకుంటూ ఉంటారు. ఇది సహజమే కానీ అసహజమైన, వింత సిండ్రోమ్‌తో బాధపడుతున్న భారతీయ బాలుడు తన పరిస్థితి గురించి బాధపడ లేదు..ఆత్మవిశ్వాసంతో గిన్నిస్ టైటిల్‌ను గెలుచుకోవడం విశేషం. ఎవరా బాలుడు? అతనికున్న సిండ్రోమ్ ఏంటి? తెలుసుకుందాం.మధ్యప్రదేశ్‌లోని రత్లాంకు చెందిన లలిత్ పాటిదార్ తనకున్న విపరీతమైన జుట్టుతో బాధపడేవాడు. అవమానపడేవాడు. కానీ దైర్యం కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాడు. ఇపుడు అతని జుట్టే అతడికి రికార్డు తెచ్చి పెట్టింది. చదరపు సెంటీమీటర్‌కు 201.72 వెంట్రుకలతో రికార్డు సృష్టించాడు. హైపర్ట్రికోసిస్ అనే అరుదైన వైద్య పరిస్థితి కారణంగా అతని ముఖంలో 95 శాతానికి పైగా వెంట్రులున్నాయి.మధ్య యుగాల నుండి ప్రపంచవ్యాప్తంగా నమోదైన దాదాపు 50 కేసుల్లో పాటిదార్ కూడా ఒకడని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది.అయితే మొదట్లో తాను సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, ఆ తరువాత అందరూ తనను అర్తం చేసుకున్నారని అన్నాడు. ఇపుడు చాలా మంది దయతో ఉంటారని చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఎవరైనా వెంట్రుకలను తొలగించుకోవాలని సూచించే వారికి ఇది మామూలే..దీని గురించి పెద్దగా పట్టించుకోను అని చెబుతాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వచ్చిన సందర్భంగా మాట్లాడుతూ ‘నేను ఎలా ఉన్నానో అలాగే ఉండటం నాకిష్టం...నా రూపాన్ని మార్చుకోవాలనుకోవడం లేదని’ చెప్పాడు."నాకు మాటలు రావడం లేదు, ఈ గుర్తింపు లభించడం చాలా సంతోషంగా ఉంది కాబట్టి నాకు ఏమి చెప్పాలో తెలియడం లేదు" అంటూ ఆనందం వ్యక్తం చేశాడు. View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords) మధ్యప్రదేశ్‌లోని రత్లాంకు చెందిన లలిత్ పాటిదార్ పుట్టినప్పటి నుండి అరుదైన ''వేర్వోల్ఫ్ సిండ్రోమ్'తో బాధపడుతున్నాడు. 'వేర్వోల్ఫ్ సిండ్రోమ్' లేదా హైపర్ట్రికోసిస్ తల నుండి కాలి వరకు జుట్టు ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితి చాలా అరుదుగా ఉండటం వల్ల మధ్య యుగాల నుండి కేవలం 50 మందికి మాత్రమే ఇది సోకిందట. లలిత్ శరీరం మొత్తం పూర్తిగా జుట్టుతో కప్పబడి ఉంది. లలిత్ పాటిదార్‌ను ఇది చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. స్కూల్లో పిల్లలు ఎగతాళి చేశారు. మంకీ బాయ్ అంటూ మరికొంతమంది ఏడిపించేవారు. "కొరుకుతాడేమో" అని భయపడేవారు. రాళ్ళు విసిరేవారు. మరికొంతమంది హనుమంతుడి అవతారంగా భావించేవారు. లలిత్ తండ్రి రైతు , అతని తల్లి గృహిణి. ప్రస్తుతం, ముఖం 95 శాతానికి పైగా వెంట్రుకలతో నిండిపోయి ఉన్న లలిత్‌కు తల్లితండ్రులు తొలుత గుండు చేయించారు. కానీ పరిస్థితిలో మార్పు లేదు. వైద్యుల దగ్గరికి తీసుకెళ్లారు. దీన్ని హైపర్ట్రైకోసిస్ అంటారని, ప్రస్తుతానికి దీనికి చికిత్స లేదని వైద్యులు చెప్పారు. అయితే వయసు పెరిగిన తరువాత ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవచ్చని చెప్పారు.లలిత్‌కు ఇన్స్టాగ్రామ్, తన యూట్యూబ్ ఛానెల్లో ఫాలోయింగ్‌కు కూడా బాగానే ఉంది. ఇన్‌స్టాలో 2 లక్షల 65 వేలు, యూట్యూబ్‌లో లక్షకు పైగా ఫాలోయర్లున్నారు. ఇటీవల ఇటలీలోని మిలన్ టెలివిజన్ షో లో కనిపించాడు. కుటుంబం ఇస్తున్న మద్దతు, ప్రోత్సాహతో ప్రపంచాన్ని చుట్టి రావాలని భావిస్తున్నాడు. విభిన్న సంస్కృతులను అన్వేషించాలనే కల సాకారం దిశగా సాగుతున్నాడు లలిత్. -
హెయిర్‌కట్‌లో తలపండింది
టోక్యో: శతాధిక వృద్ధులు సాధారణంగా త మ పని తాము చేసుకోవడానికి చాలా కష్టపడుతుంటారు. ఒంట్లో పటుత్వం తగ్గి పోయి లేచి నడవడానికి, గాజు వస్తువులను పగలకుండా జాగ్రత్తగా పట్టుకెళ్లడానికి ఎంతో కష్టపడుతుంటారు. ఇక కత్తెర పట్టుకుని జుట్టు కత్తిరించమంటే వాళ్లు చేసే కటింగ్ దెబ్బకు హెర్స్టయిల్ (Hair Style) ఎటు పోతుందో ఎవరూ చెప్పలేరు. అలాంటిది ఏకంగా 108 ఏళ్ల వయసులో కూడా ఓ బామ్మ ఎంచక్కా కత్తెరను ఒడుపుగా చురకత్తిలాగా ఝుళిపిస్తూ చక్కటి తలకట్టు తీర్చిదిద్దుతోంది. ఆమె పేరే షిట్సూయ్ హకోయ్‌షీ. 9 దశాబ్దాలుగా హెయిర్‌స్టయిల్ వృత్తిలో.. ఈశాన్య టోక్యోలోని టొచిగి జిల్లాలోని నకగవా పట్టణంలోని బామ్మ షిట్సూయ్కు బార్బర్ దుకాణం(Barber Shop) ఉంది. మొదటి ప్రపంచయుద్దకాలంలో అంటే 1916 నవంబర్ పదో తేదీన రైతు కుటుంబంలో ఈమె జన్మించారు. హెయిర్ కటింగ్ (Hair Cut) అంటే ఈమెకు చాలా ఇష్టం. ‘‘టోక్యోలో ఉద్యోగం ఉంది. కావాలంటే అక్కడికెళ్లి జాయిన్ అవ్వు’’అని స్నేహితురాలి తల్లి ఇచ్చిన సలహాను షిట్సూయ్ పాటించారు. టీనేజీలో ఉండగానే 14 ఏళ్ల వయసులోనే ఒంటరిగా టోక్యో సిటీకి వెళ్లి బార్బర్ అప్రైంటిస్గా చేరారు. 20 ఏళ్ల వయసులో బార్బర్‌గా లైసెన్స్ సంపాదించారు. 24 ఏళ్ల వయసులో జెరోను పెళ్లాడారు. తర్వాత భర్తతో కలిసి బార్బర్ షాప్ ప్రారంభించారు. వీళ్లకు ఇద్దరు సంతానం. 1937లో జపాన్‌పై చైనా జరిపిన యుద్ధంలో ఈమె భర్త ప్రాణాలు కోల్పోయారు. తర్వాత ఎనిమిదేళ్లకు అంటే 1945 మార్చి పదో తేదీన టోక్యోపై అమెరికా జరిపిన బాంబు దాడిలో ఈమె బార్బర్ దుకాణం పూర్తిగా ధ్వంసమైంది. దీంతో పిల్లలు, కట్టుబట్టలతో ఈమె నగరాన్ని వీడి టొచిగి జిల్లాలో ని వేరే ప్రాంతానికి తరలిపోయారు. తర్వాత ఎనిమిదేళ్లకు 1953లో సొంతూరు నకగవాకు చేరి అక్కడ తన పేరు మీద ‘రిహాట్సు హకోయ్‌షీ అని బార్బర్ దుకాణం ప్రారంభించారు. అప్పట్నుంచీ అదే దుకాణంలో దశాబ్దాలుగా కటింగ్ వృత్తిలోనే కొనసాగుతున్నారు. రిహాట్సు అంటే జపనీస్ భాషలో బార్బర్ అని అర్థం. కస్టమర్లే నా దేవుళ్లు 108 ఏళ్ల వయసులోనూ బార్బర్‌గా కొనసాగుతున్న ఈమెకు గత బుధవారం గిన్నిస్ ప్రపంచ రికార్డ్ (Guinness World Record) నిర్వాహకులు వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్‌ను అందజేశారు. ఇన్నాళ్లూ అమెరికాలో 107 ఏళ్ల వయసులోనూ బార్బర్‌గా కొనసాగిన ఆంటోనీ మాన్సినెల్లీ అనే తాతకు గిన్నిస్ ప్రపంచ రికార్డ్ సర్టిఫికేట్ ఉండేది. ఆయన 2018లో మరణించడంతో అప్పట్నుంచీ ఎవరికీ ఆ సర్టిఫికేట్ ఇవ్వలేదు. బామ్మ విషయం తెల్సి తాజాగా ఈమెకు ఆ రికార్డ్ కట్టబెట్టారు. చదవండి: గుడ్లు తేలేస్తున్న అమెరికా‘‘108 ఏళ్ల వయసు బామ్మ వణుకుతూ కటింగ్ ఎలా చేస్తుందో అన్న భయం, అనుమానం లేకుండా నామీద నమ్మకంతో వస్తున్న కస్టమర్లే నాకు దేవుళ్లు. వాళ్ల సంతోషమే నాకు అమితానందాన్ని ఇస్తుంది. వయసులో సెంచరీ దాటినా నేను నా వృత్తిని వదులుకోను. కత్తెరలను పక్కనబెట్టే ప్రసక్తే లేదు. ఓపిక ఉన్నంతకాలం కటింగ్ చేస్తా. ఈ ఏడాది 109వ పుట్టినరోజు జరుపుకోబోతున్నా. ఓపిక తగ్గితే 110 ఏళ్ల వయసులో కటింగ్‌ను ఆపేస్తా’’అని బామ్మ నవ్వుతూ చెప్పారు. -
ఆ వ్యక్తికి 16 మంది భార్యలు, 104 మంది పిల్లలు..!
ఈ రోజుల్లో పెళ్లిళ్లు చేసుకున్న ఒక్క రోజుల్లోనే పెటాకులు అవుతున్నాయి. కనీసం మూన్నాళ్లైన కలిసి ఉండటమే గగనం అన్నట్లుగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఓ వ్యక్తి పెళ్లిళ్లల్లో రికార్డు సృష్టించాడు. అతడి ఇల్లే ఓ గ్రామంలా తలిపించేలా ఉంటుందట. ఎవరా వ్యక్తి అన్ని పెళ్లిళ్లు ఎలా చేసుకున్నాడో చూద్దామా..!.ఆఫ్రికా దేశమైన టాంజానియాలోని ఒక చిన్న గ్రామంలో నివసించే కపింగా (మ్జీ ఎర్నెస్టో ముయినుచి కపింగా) అనే వ్యక్తి వరుస పెళ్లిళ్లతోనే వరల్డ్ ఫేమస్ అయిపోయాడు. ఈ ఆఫ్రికన్ వ్యక్తి సుమారు 20 పెళ్లిళ్లు చేసుకోగా.. కొన్ని కారణాలతో నలుగురు భార్యల్లో కొందరు చనిపోగా, కొందరు విడిచి వెళ్లిపోయారు. ప్రస్తుతం 16 మంది భార్యలు, 104 మంది పిల్లలు ఉన్నారు. అలాగే.. 144 మంది మనవళ్లు, మనవరాళ్ళు కూడా ఉన్నారు. అంతా ఒకేచోట ఆనందంగా కలిసి మెలిసి జీవిస్తున్నారు.చెప్పాలంటే అతడి ఇల్లే..ఓ గ్రామంలా మారిపోయింది. వాళ్లింట్లో వంటలు చేస్తే..ఏదో వేడుక జరుగుతుందేమో అన్నట్లు ఉంటుంది. ఎందుకంటే అంతమందికి భారీస్థాయిలో వంటలు చేయాల్సి ఉంటుంది. అయితే అంతా కలసే వండుకుని ఒకే చోట కూర్చొని తింటారట. మరీ కపింగ ఇన్ని పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నాడో తెలిస్తే మాత్రం విస్తుపోతారు..ఇన్ని పెళ్లిళ్లు ఎందుకంటే..కపింగ తన తండ్రి కోరిక మేరకు ఇన్ని పెళ్లిళ్లు చేసుకున్నాడట. తాను 1961లో మొదటి వివాహం చేసుకున్నానని, తన భార్య మొదటి బిడ్డకు జన్మనిచ్చిందని చెప్పుకొచ్చాడు. అప్పుడు తన తండ్రి నువ్వు ఒక్క పెళ్లి కాదు మరిన్ని పెళ్లిళ్లు చేసుకోవాలి, మన కుటుంబం పెద్దదిగా ఉండాలి అని చెప్పాడట. నువ్వు మరో పెళ్లి చేసుకుంటే..వచ్చే కట్నం డబ్బులు నీకే ఇస్తానని చెప్పాట. తండ్రి కోరిక మేరకు ఇన్ని పెళ్లిళ్లు చేసుకున్నాడట. అయితే అందులో ఐదు వివాహాలకు తన తండ్రే డబ్బు ఖర్చు పెట్టాడట. మిగతావి తానే చేసుకున్నానని చెప్పాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే..16 మంది భార్యల్లో ఏడుగురు కపింగ సోదరిమణులే. కానీ వాళ్లు అతడి భార్యలలాగే జీవిస్తున్నారు. వాళ్లంతా సవితి పోరు లేకుండా హాయిగా కలిసిమెలిసి ఉండటం విశేషం. మరీ ఇంతమంది ఆయన్నే ఎలా పెళ్లి చేసుకున్నారు అనే సందేహం కూడా వస్తోంది కదూ..? అయితే అందుకు అంతా చెబుతున్న కారణం ఒక్కటే..అది కపింగ మంచితనమేనట. అతడు చాలా మంచివాడని, అతడి భార్యగా ఉండటం అదృష్టంగా భావిస్తారట వారంతా. అలాగే తన కుటుంబ సభ్యులంతా ఎలాంటి గొడవులు లేకుండా ప్రశాంతంగా జీవించడానికి తన భార్యలే కారణమని అంటాడు కపింగ. ఏ సమస్య అయినా సాధ్యమైనంత వరకు తన వరకు రాకుండా పరిష్కరించుకుంటారని..ఒక్కోసారి తన వద్దకు వచ్చినా.. అక్కడితో సమస్యను పరిష్కరించి ఎలాంటి గొడవలు తలెత్తకుండా చూసుకుంటామని చెబుతున్నాడు. వారంతా స్వయం సమృద్ధి విధానంతో జీవిస్తున్నారని చెప్పాడు. మొత్తం కుటుంబం అంతా వ్యవసాయంపై ఆధారపి జీవిస్తుందట. అందరూ పంటలు పండిస్తూ, పశువులును మెపుతూ..తమ ఆహార అవసరాలను తీర్చుకుంటారట. అయితే కపింగా ఇంత పెద్ద కుటుంబ కారణంగా దాదాపు 50 మంది పేర్లే గుర్తుంటాయట. తక్కిన వారందర్నీ వాళ్ల ముఖం చూసి గుర్తుపట్టి మాట్లాడతానని చెబుతున్నాడు.(చదవండి: అతిలోక సుందరి శ్రీదేవి కూతురు ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!) -
స్వజనులకు అక్షర భిక్ష : సిడాం మారూమాస్టారు గురించి తెలుసా?
తాను వెలుగుతూ చుట్టూరా కమ్మిన చీకట్లను తరిమేయడమే దీపం సుగుణం. అలాంటివారే మారూ మాస్టారు. ఆదివాసీలను అభివృద్ధి పథంలో నడిపించడానికి అవసరమైన చైతన్యాన్ని వారిలో నింపారు. 1925 ఫిబ్రవరిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని గడల్ పల్లి ఏజెన్సీ గూడెంలో జన్మించిన సిడాం మారూ 1962లో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన తొలి ఆదివాసీ. రాజ్ గోండ్ తెగకు చెందిన ఆయన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని తమ జాతిలో వెనుక బాటుతనాన్ని పోగొట్టాలంటే కనీస అక్షర జ్ఞానం నింపాలని భావించారు. దీనికి తోడు అప్పటి నైజాం ప్రభుత్వంలో గిరిజన జాతులపై పరిశ ధన చేస్తున్న ఆంత్రొపాలజిస్ట్ ప్రొ.హైమండార్ఫ్ ప్రోత్సహించడంతో ఉపాధ్యాయ వృత్తి స్వీకరించారు. చదవండి: మొబైల్భూ వాస్తవాల విస్మరణే ప్రమాదానికి కారణం బాహ్య ప్రపంచమే తెలియని అదిమ తెగలైన రాజ్ గోండ్, పర్దాన్, నాయకపోడు, తోటి, కోయ గిరిజను లను చేరదీసి మాతృభాషలో బోధించేవారు. 1940లో నిజాం సాయుధ దళాలతో జరిగిన జోడె ఘాట్ పోరాటంలో క్షత గాత్రులైన తమ వారిని దాచిపెట్టి, అవసరమైన సపర్యలు చేసిన మానవీయుడు, దయా మయుడు. 1983లో ఉపాధ్యాయ వృత్తి నుండి పదవీ విరమణ పొందిన మారూ మాస్టారు వెనువెంటనే ఉట్నూరులోని సమగ్ర గిరిజనా భివృద్ధి సంస్థ (ఐటీడీఏ) తరఫున ఆదివాసీ అభివృద్ధి నిర్వాహకుడిగా నియమితులయ్యారు. ఐటీడీఏ ప్రవేశ పెట్టిన పలు పథకాలను, ప్రోత్సాహకాలను ఉపయోగించుకుని గిరిజనులందరూ అభివృద్ధి చెందాలని చైతన్యం కలిగించిన ఘనత ఆయనకే దక్కుతుంది. గిరిజనులకు అండగా నిలబడి గిరిజనాభివృద్ధిలో ఆదివాసు లను భాగస్వాములుగా చేస్తూ హైమండార్ఫ్ స్థాపించిన ‘రాయ్ సెంటర్ల’ను పునఃప్రారంభించడానికి తగు కృషి చేశారు మారూ మాస్టారు. తుదకు 2000, మార్చి 6న ప్రకృతి ఒడిలోకి చేరారు. ఆదివాసీల మదిలో మారూ జ్ఞాపకం మరువ లేనిది. – గుమ్మడి లక్ష్మీనారాయణ, సామాజిక రచయిత (నేడు మారూ మాస్టారు వర్ధంతి) -
ఒకే కులం పెళ్లిళ్లతోనూ వ్యాధులు
సాక్షి, హైదరాబాద్: ‘బంధువుల అమ్మాయే. అన్నీ కుదిరాయి. అందుకే చేసుకుంటున్నాం.. మా కులపువాళ్లే. అమ్మాయి బాగుంటుంది. సంబంధం ఖాయం చేశాం.. పెళ్లిళ్ల విషయంలో ఈ రకమైన మాటలు తరచూ వింటూనే ఉంటాం. అయితే ఈ రకంగా దగ్గరి చుట్టాలు, ఒకే కులంలో పెళ్లిళ్ల వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని అంటున్నారు సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు. కొన్ని కులాల వారికి కొన్ని రకాల వ్యాధులు వారసత్వంగా వస్తాయని గతంలో జరిగిన పరిశోధనల్లో తేలింది. సీసీఎంబీ (CCMB) శాస్త్రవేత్త డాక్టర్ కె.తంగరాజ్ బృందం ఇటీవల నిర్వహించిన అధ్యయనం కూడా ఈ విషయాన్ని నిర్ధారించింది.ఒకే కులం (Same Caste)లో ఎక్కువగా పెళ్లిళ్లు చేసుకోవడం (కులాలతో పాటు చిన్నచిన్న సమూహాలకు కూడా ఇది వర్తిస్తుంది) వల్లనే ఆయా కులాల వారికి కొన్ని రకాల జబ్బులు వారసత్వంగా వస్తున్నాయని ఈ అధ్యయనం చెబుతోంది. నాలుగు వేర్వేరు సమూహాలకు చెందిన 281 మంది జన్యు క్రమాలను పరిశీలించి ఈ నిర్ధారణకు వచ్చినట్టు తంగరాజ్ తెలిపారు. జబ్బులకు వాడే మందులు కొన్ని సమూహాల్లో ఎందుకు భిన్నమైన ప్రభావం చూపుతాయనే అంశాన్ని కూడా పరిశీలించామని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డాక్టర్ ప్రతీసా మచ్చ తెలిపారు.కీళ్లు, వెన్ను, లిగ్మెంట్లలో వాపు/మంటకు కారణమయ్యే స్పాండిలైటిస్‌కు ఒక నిర్దిష్ట జన్యుపరమైన మార్పుతో సంబంధం ఉందని చెప్పారు. HLA& B27:04 అని పిలిచే ఈ జన్యు మార్పు కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఒక ప్రాంతంలో ఒక సామాజికవర్గం వాళ్లలో ఈ స్పాండిలైటిస్ (spondylitis) ఎక్కువగా ఉందని గుర్తించినట్లు కిమ్స్ ఆసుపత్రి (KIMS Hospital) రుమటాలజిస్ట్ డాక్టర్ శరత్ చంద్రమౌళి వీరవల్లి వెల్లడించారు. కొన్ని కులాలు, సమూహాలకే ప్రత్యేకమైన వ్యాధుల జన్యు రూపాంతరాలను కూడా గుర్తించినట్లు వివరించారు. ఆయా సమూహాల్లోని వారు ఈ వ్యాధులకు వాడే ఔషధాలు ఇతరులలో కంటే భిన్నంగా పని చేస్తాయని సీసీఎంబీ శాస్త్రవేత్త డాక్టర్ దివ్య తేజ్ పేర్కొన్నారు. చదవండి: పాపం శిరీష.. ఆడపడుచు కపట ప్రేమకాటుకు బలైంది -
ఇంటి గుట్టు : దెబ్బకి రూ. 80 లక్షలు ఖతం, చివరికి!
మోసగాళ్లు మనకు తెలియకుండానే మన చుట్టూ వైఫైలా ముసిరేసి ఉంటారు. ఏ మాత్రం గుట్టు జారినా, ఆదమర్చి ఉన్నా భారీ నష్టం తప్పదు. అలా ఒక బాలిక అమాయకంగా ఇంట్లోని కొన్ని ఆర్థిక విషయాలు షేర్ చేసినందుకు గాను ఆమె కుటుంబం చిక్కుల్లోపడింది. ఇంటిగుట్టు లంకకు చేటు అన్నట్టు అయి పోయింది. 15 ఏళ్ల పాఠశాల విద్యార్థినిని బ్లాక్మెయిల్ చేసి రూ.80 లక్షలు దోచుకున్న వైనం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్టోరీ ఏంటంటే.. గురుగ్రామ్‌లో 9వ తరగతి చదువుతున్న బాలిక బాలిక గొప్పగా చెప్పిందో, అమాయకంగా చెప్పిందో కానీ తన అమ్మమ్మ ఖాతాలో భార మొత్తంలో సొమ్ము ఉందని ఫ్రెండ్స్‌కి చెప్పింది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం బాలిక అమ్మమ్మ( 75) తనకున్న ఆస్తిని అమ్మి తన ఖాతాలో రూ.80 లక్షలు జమ చేసింది. ఈ వివరాలతోపాటు, అమ్మమ్మ బ్యాంకు ఖాతాకు యాక్సెస్ కూడా తనకుందని తొలుత పదో తరగతి అబ్బాయికి చెప్పింది. అతను తన అన్నయ్యకు చెప్పాడు. వాడు తన స్నేహితుడికి చెప్పి ఆ డబ్బులు కొట్టేసేందుకు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే ఆ అమ్మాయికి బెదిరింపులు మొదలయ్యాయి. మార్ఫ్ చేసిన చిత్రాలతోఆమెను బ్లాక్మెయిల్ చేసి, వాటిని సోషల్ మీడియాలో లీక్ చేస్తామని, అలా చేయకుండా ఉండాలంటే, సొమ్మును ముట్టచెప్పాలని బాలికను బెదిరించారు. దీంతో బెంబేలెత్తిన బాలిక ఒకటీ రెండు సార్లు పలుదఫాలుగా నిందితుడు ఇచ్చిన ఫోన్ నంబర్లకు రూ. 80 లక్షలను బదిలీ చేసింది. ఇలా అమ్మమ్మ ఖాతాలోని మొత్తం డబ్బులన్నీ డిసెంబర్ 21 నాటికి స్వాహా అయిపోయాయి.అయినా బెదింపులు అగలేదు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో, క్లాస్‌లో ముభావంగా ఉన్న బాలికను గమనించిన టీచర్ గట్టిగా నిలదీయడంతో విషయమంతా టీచర్‌కు చెప్పింది. అలా అసలు సంగతి కుటుంబానికి చేరింది. దీంతో అమ్మమ్మ, ఇతర కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగు చూసింది. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మార్ఫింగ్ ఫోటోలతో బెదిరింపులకు పాల్పడ్డారు. వివిధ అకౌంట్ల ద్వారా, డబ్బును తమకు బదిలీ చేయించుకున్నారు. ఇలా కొట్టేసిన సొమ్మంతా దాదాపు పార్టీలకు ఖర్చు చేశారు.గత ఏడాది డిసెంబర్లో నమోదైన ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకూ ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు నవీన్ కుమార్ గత రెండు నెలలుగా పరారీలో ఉన్నాడని పోలీసులు మంగళవారం తెలిపారు. నవీన్ కుమార్ (28) గురుగ్రామ్‌లోని గర్హి హర్సారులోని న్యూ కాలనీ నివాసి. సోమవారం రాత్రి అతన్ని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించామని పోలీసు అధికారి రాంబీర్ సింగ్ తెలిపారు. అలాగే నిందితుడి నుంచి రూ.5.13 లక్షలు, బాధితురాలి ఏటీఎం కార్డును స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇప్పటివరకు రూ. 36 లక్షలు స్వాధీనం చేసుకున్నామని, దర్యాప్తు కొనసాగుతోందన్నారు. -
వారి కోసం జుకర్‌బర్గ్ ఫ్యావరెట్ హుడీ వేలం : మార్క్ డ్యాన్స్ వైరల్ వీడియో
మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ తనకెంతో ఇష్టమైన పాత హుడీని వేలం వేశారు. తద్వారా వచ్చిన సొమ్మును టెక్సాస్ పాఠశాల సంక్షేమం కోసం వినియోగించనున్నారు. బిజినెస్ ఇన్సైడర్ ప్రకారం, ఈ ప్రియమైన హూడీతోపాటు బిడ్ దక్కించుకున్న వ్యక్తికి జుకర్‌బర్గ్ స్వయంగా చేతితో రాసిన నోట్ కూడా దక్కింది. దీనిని ఫేస్బుక్ స్టేషనరీలో రూపొందించారట.2019లో తరచుగా ధరించే నల్లటి హూడీ లాస్ ఏంజిల్స్‌లో జరిగిన వేలంలో భారీ ధరకు అమ్ముడు బోయింది. జూలియన్స్ ఆక్షన్స్ వారి "స్పాట్లైట్: హిస్టరీ అండ్ టెక్నాలజీ" సిరీస్‌లో భాగంగా గత గురువారం ఈ వేలం నిర్వహించింది. దీనికున్న పర్సనల్ టచ్, క్రేజ్ అభిమానులను స్పష్టంగా ఆకట్టుకున్నాయి. దీంతో చాలా వేగంగా బిడ్డింగ్ జరిగింది. దాదాపు 22 బిడ్లు వచ్చాయి. చివరకు రూ.13 లక్షల కంటే ఎక్కువ ధర పలికింది. View this post on Instagram A post shared by Mark Zuckerberg (@zuck) ఇది తన ఆల్-టైమ్ ఫేవరెట్లలో ఒకటిగా అభివర్ణించారు జుకర్‌బర్గ్. , "నేను తొలినాళ్లలో దీన్ని ఎప్పుడూ ధరించేవాడిని. దాని లోపల మా అసలు మిషన్ స్టేట్మెంట్ కూడా ప్రింట్ అయి ఉంది" అని గుర్తు చేసుకున్నారు. ఈ హూడీ 2010 నాటిది. ఇదే ఏడాది జుకర్‌బర్గ్ టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యారు. ఈ వేలం ద్వారా వచ్చిన మొత్తం సొమ్మను టెక్సాస్‌లోని పాఠశాల పిల్లలకు మద్దతు ఇవ్వడానికి అంకితం చేస్తామని మార్క్ ప్రకటించారు. దీంతోపాటు పాటు ఆపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ ధరించిన సిగ్నేచర్ బో టై కూడా వేలంలో అమ్ముడైన ఇతర ప్రసిద్ధ వస్తువులలో ఒకటిగా దాదాపు రూ. 31 కోట్లకు బిడ్దక్కించుకుంది. దీని అసలు ధర వెయ్యి డాలర్లుమాత్రమే.మార్క్ డ్యాన్స్, భార్య ఫిదా మరోవైపు మార్చి 1న, భార్య ప్రిస్సిల్లా చాన్ పుట్టినరోజు సందర్భంగా జుకర్‌బర్గ్ డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. బ్లాక్ అండ్ వైట్ టక్సేడోలో పార్టీలో ఎంట్రీఇచ్చి టక్సేడోను చింపేసి మరీ, ఒక్క ఉదుటున స్టేజ్‌పైకి అద్భుతమైన నీలిరంగు జంప్‌సూట్‌లో పాట పాడి, డ్యాన్స్ చేశాడు. దీంతో చాన్ ఫిదా అయిపోయింది. తెగ వైరలవుతోంది. 2025 గ్రామీ అవార్డుల వేడుకలో బెన్సన్ బూన్ బ్యూటిఫుల్ థింగ్స్ ప్రదర్శన ఇస్తున్నప్పుడు ధరించిన జంప్‌సూట్ కూడా ఇలాంటిదేనట. -
ఆదిలాబాద్ కా అమితాబ్.. ఎంత పొడుగున్నాడ్రా బాబూ!
ఆదిలాబాద్ టౌన్: ఆదిలాబాద్ కా అమితాబ్ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. బడిలో చదివే విద్యార్థుల ఎత్తు సాధారణంగా 5 అడుగుల వరకు ఉంటుంది. కానీ ఒక విద్యార్థి ఏకంగా 6.8 అడుగుల ఎత్తుతో ఆకర్షణగా నిలిచాడు. ఆదిలాబాద్ పట్టణం (Adilabad Town) బొక్కల్‌గూడకు చెందిన వన్నెల సుజాత, వినోద్ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు హేమంత్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల (Govt School) నంబర్–2లో పదో తరగతి చదువుతున్నాడు.ఈ విద్యార్థి తాత నందు 6.5 అడుగుల ఎత్తు, తల్లి సైతం అంతే ఎత్తులో ఉంటారు. హేమంత్ చెల్లి పదో తరగతి చదువుతోంది. హేమంత్ (Hemanth) 7వ తరగతిలో 5 అడుగుల ఎత్తులో ఉండగా, 8వ తరగతిలో 6 అడుగులు, 9వ తరగతిలో 6.5, ప్రస్తుతం పదో తరగతిలో 6.8 అడుగుల ఎత్తుకు పెరిగాడు. దీంతో స్నేహితులతోపాటు ఇంటి చుట్టుపక్కల వారు, బంధువులు హేమంత్‌ను జూనియర్ అమితాబ్‌గా పిలుస్తున్నారు. చివరి బెంచీలో కూర్చుంటా..అందరికంటే పొడవుగా ఉండటంతో తరగతి గదిలో చివరి బెంచీలో కూర్చుంటాను. ఆటోలో కూర్చోవాలంటే ఇబ్బందిగా ఉంటోంది. పోలీసు ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాను. శుభకార్యాలకు వెళ్లినప్పుడు నాతో బంధువులు, మిత్రులు సెల్ఫీలు దిగుతున్నారు. – హేమంత్ఈఏపీ సెట్‌కు తొలిరోజు 5,010 దరఖాస్తులు సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఈఏపీ సెట్‌కు ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ శనివారం మొదలైంది. తొలి రోజు 5,010 దరఖాస్తులు వచ్చినట్టు సెట్ కోకన్వీనర్, జేఎన్టీయూహెచ్ రెక్టార్ కె.విజయ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఇంజనీరింగ్ విభాగానికి 3,116, అగ్రికల్చర్, ఫార్మసీ సెట్ విభాగానికి 1,891, రెండు విభాగాలకు రాసే వారి 3 దరఖాస్తులు వచ్చినట్టు వెల్లడించారు. ఓయూలో ముగిసిన పీహెచ్డీ దరఖాస్తుల స్వీకరణ ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పీహెచ్డీ ఎంట్రన్స్ టెస్ట్–2025 దరఖాస్తుల స్వీకరణ గడువు శనివారం ముగిసింది. కేవలం 456 సీట్లకు 9000 మంది దరఖాస్తు చేసుకున్నారు. రూ.2000 అపరాధ రుసముతో ఈ నెల 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సీట్ల సంఖ్యను పెంచి.. నెలరోజుల పాటు దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగించాలని తెలంగాణ డెమొక్రటిక్ స్టూడెంట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు జి.విజయ్ నాయక్ శనివారం పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ పాండురంగా రెడ్డికి వినతి పత్రం అందజేశారు. చదవండి: ఊరు, ఇల్లు వదిలి.. అక్కడ అందరిదీ అదే పరిస్థితికాగా, ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయోపరిమితి 65 ఏళ్లకు పెరిగినా.. పీహెచ్డీ సీట్ల సంఖ్యను పెంచేందుకు ఓయూ అధికారులు సుముఖంగా లేనట్లు కనిపిస్తోంది. దరఖాస్తుల స్వీకరణ గడువు శనివారంతో ముగిసినా పీహెచ్డీ సీట్ల పెంపుపై ఇంత వరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. -
నెస్ట్..ఆర్కిటెక్చర్లో బెస్ట్..!
గూడు.. మనుషుల నుంచి జంతువులు, పక్షుల వరకూ ఎంతో అవసరం. అయితే ఒక్కో జీవిది ఒక్కో తరహా నిర్మాణ శైలి. ఆయా జీవుల అవసరాలను తీర్చేదిగా నిర్మాణం ఉంటుంది. వీటిల్లో మరీ ముఖ్యంగా చెప్పుకోదగిన నిర్మాణ శైలి పక్షులదే.. వాటి నిర్మాణాలు పెద్ద పెద్ద ఆర్కిటెక్చర్లను సైతం ఆశ్చర్యపరిచేవిగా ఉంటాయి. అయితే నగరీకరణలో భాగంగా పక్షుల జాడలు, వాటి గూళ్ల సంఖ్య రాను రాను కనుమరుగవుతున్నాయి. నగర శివార్లు, పల్లెటూళ్లు, అడవులకే పరిమితమైన వీటి గూళ్లు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలోని హెచ్‌సీయూలో సందర్శకులను అబ్బురపరుస్తున్నాయి. నగరంలో నివసించే నేటి తరం యువతకు పక్షులను జూ లోనో, పార్కుల్లో సందర్శించి ఆనందించడం అలవాటు. ఇక వాటి గూళ్ల సంగతి, వాటి నిర్మాణ శైలి చాలా మందికి తెలియకపోవచ్చు. అలాంటి పక్షుల గూళ్లు పదుల సంఖ్యలో హెచ్‌సీయూ కేంద్రంగా కనిపిస్తుండడంతో ఆశ్చర్యానికి గురవుతున్నారు. అనేక రకాల పక్షి జాతులకు ఆవాసంగా మారిన గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ పక్షి గూళ్లకు నిలయంగా మారింది. ప్రస్తుతం ఈ క్యాంపస్‌లో దాదాపు 233 రకాల పక్షులు ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నాయి. దీంతో వాటి గూళ్లను విద్యార్థులు తమ ఫోన్లు, కెమెరాల్లో బంధిస్తున్నారు. క్యాంపస్‌లో వృక్ష సంపద పరిరక్షణే పక్షుల సంఖ్య పెరుగుదలకు కారణమని విద్యార్థులు, పలువురు సందర్శకులు అభిప్రాయపడుతున్నారు. (చదవండి: సైకిల్ సవారీ..ఆరోగ్యం, పర్యావరణంపై పెరుగుతున్న అవగాహన..!) -
అనంత్-రాధిక అంబానీ గ్రాండ్ వెడ్డింగ్ : మికా సింగ్ వ్యాఖ్యలు వైరల్
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ,నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani) రాధికా మర్చంట్ (Radhika Merchant) వివాహం అంగరంగ వైభవంగా కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. ప్రపంచంలోనే అతిఖరీదైన వివాహంగా పేరు గాంచింది. దీనిపై ప్రముఖ గాయకుడు మికా సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది జరిగిన ఈ కార్పొరేట్ వెడ్డింగ్‌పై మికాసింగ్ (Mika Singh) చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.2024లో జరిగిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ వేడుక చాలా మందికి ఒక ఆశీర్వాదకరమని వ్యాఖ్యానించారు. అనంత్, రాధికా అంబానీ గ్రాండ్ వెడ్డింగ్ పై విమర్శలను మికా సింగ్ ప్రస్తావించారు. వారిపెళ్లిపై ప్రశంసలు కురిపించాడు. అంతేకాదు తాను ఎందుకు భావిస్తున్నానో కూడా వివరించాడు. ఆ ఒక్క పెళ్లి వల్ల లక్షల మందికి ఉపాధిలభించిందని, అందుకే అది బ్లెస్సింగ్ అన్నానని చెప్పుకొచ్చాడు. అంతమాత్రాన తానేమీ చెంచిగిరీ చేయడం లేదంటూ వివరణ ఇచ్చాడు. ఇలాంటి గ్రాండ్ వెడ్డింగ్స్ అనేక ఉపాధి అవకాశాలను అందిస్తాయనేది జనం అర్థం చేసుకోలేకపోతున్నారని మికా సింగ్ వ్యాఖ్యానించాడు. క్యాటరర్లు, డెకరేటర్లు, ఫ్యాషన్ డిజైనర్లు, సంగీతకారులు, భద్రతా సిబ్బంది, మళ్లీ వీరినుంచిమరికొంతమందికి లాభం చేకూరుతుందన్నాడు. అంతేకాకుండా, అనేక మంది కళాకారులు, సెలబ్రిటీలు తమ తమ ప్రదర్శన ఇచ్చే అవకాశం పొందుతారంటూ ఉదాహరణలతో చెప్పుకొచ్చాడు. తద్వారా అంబానీ కుటుంబం ఆడంబర వివాహంతో డబ్బు వృధా చేసిందన్న వ్యక్తులకు ఆయన కౌంటర్ ఇచ్చాడు. ఇటువంటి గ్రాండ్ వెడ్డింగ్స్ వాటి నుండి సంపాదించే చాలా మందికి ఒక వరం అని పేర్కొన్నాడు.భారతదేశంలో అత్యంత ప్రియమైన గాయకులలో మికా సింగ్ ఒకరు. ఆయన తన ప్రత్యేకమైన స్వరం, ఆకట్టుకునే శైలితో అనేక మంది ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు. సుబా హోనే నా దే, ఆంఖ్ మారే, మౌజా హి మౌజా, పార్టీ తో బన్తీ హై లాంటి అత్యంత ప్రజాదరణ పొందిన పాటలతో పాపులరయ్యాడు. ఈ నేపథ్యంలోనే వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ల గ్రాండ్ వివాహ వేడుకలో ప్రదర్శనకు ఆహ్వానించారు.కాగా అనంత్ అంబానీ రాధిక మర్చంట్ల వివాహంగత ఏడాది జూలైలో ముంబై నగరంలో జియో కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. 2024లో జరిగిన అతిపెద్ద ఈవెంట్లలో ఒకటి. రెండు డెస్టినేషన్ ప్రీ-వెడ్డింగ్, ముంబైలో ఆరు రోజుల గ్రాండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అత్యంత ఘనంగా జరిగాయి. ప్రపంచ దేశాల ప్రముఖులతో పాటు, దేశీయంగా అనేక మంది వ్యాపార, రాజకీయ, సినీ, క్రీడా రంగ ప్రముఖులు హాజరైన సంగతి తెలిసిందే. -
జీనియస్ : 14 ఏళ్ల మానవ కాలిక్యులేటర్
పందొమ్మిదో ఎక్కం చెప్పమంటే తల గీరుకునే పిల్లలు ఉంటారు. చిన్న చిన్న కూడికలకు కాలిక్యులేటర్ వైపు చూసే వారూ ఉంటారు. ఇక పెద్ద లెక్కలంటే కాలిక్యులేటర్ కావాల్సిందే. కాని ఆర్యన్ నితిన్‌కు అది అక్కర్లేదు. ఎందుకంటే అతడే ఒక కాలిక్యులేటర్. అతని వయసు 14 ఏళ్లు. ఎంత పెద్ద నెంబర్లతో లెక్కలు ఇచ్చినా సరే అవలీలగా చేసేస్తాడు.ఆర్యన్ ది మహారాష్ట్ర. ఆరేళ్ల వయసు నుంచే మనసులో లెక్కలు వేయడం, సమాధానాలు కనుక్కోవడం చేసేవాడు. అతని ఉత్సాహం చూసి తల్లిదండ్రులు ప్రోత్సహించారు. ఆర్యన్ రోజూ ఐదారు గంటల΄ాటు కష్టమైన లెక్కలు సాధన చేసేవాడు. ఎవరు ఎంత పెద్ద లెక్క చెప్పినా మనసులోనే చేసి, టక్కున సమాధానం చెప్పేవాడు. దీంతో అతని ప్రతిభ గురించి అందరికీ తెలిసింది. 2021లో ‘మైండ్ స్పోర్ట్ ఒలింపియాడ్ మెంటల్ కాలిక్యులేషన్’ వరల్డ్ ఛాంపియన్షిప్ సాధించి, ఆ ఘనత పొందిన అతి చిన్న వయస్కుడిగా నిలిచాడు. 2022లో జర్మనీలో జరిగిన మెంటల్ కాలిక్యులేషన్ వరల్డ్ కప్‌లో పాల్గొని మొదటిస్థానంలో నిలిచాడు. అంత చిన్నవయసులో ఆ ఘనత సాధించిన వ్యక్తిగా నిలిచిపోయాడు. దీంతో గ్లోబల్ మెంటల్ కాలిక్యులేటర్స్ అసోసియేషన్(జీఎంసీఏ)లో అతణ్ని ఫౌండింగ్ బోర్డు సభ్యుడిగా చేర్చుకున్నారు. ఆ తర్వాత అనేక ప్రపంచ వేదికలపై తన సత్తా చాటాడు. 14 saal ke Aryan Shukla ne sirf 1 din mein banaye 6 Guinness World Record.Bharat ke Aryan Shukla ne apni kamaal ki pratibha dikhate hue ek hi din mein 6 Guinness World Record tod diye! Itni kam umar mein itni badi uplabdhi desh ke liye garv ki baat hai. Unki safalta naye yuvaon… pic.twitter.com/pA8dnoGj1O— Kashmir Watcher (@KashmirWatcher) February 19, 2025 గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించాలన్న ఆకాంక్షతో దుబాయ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఒకటి, రెండు కాదు.. ఒకేరోజు ఆరు ప్రపంచ రికార్డులను అతను సాధించాడు. 30.9 సెకండ్లలో 100 నాలుగు అంకెల నెంబర్లను కలిపి సమాధానం చెప్పడం, ఒక నిమిషం 9.68 సెకండ్లలో 200 నాలుగు అంకెల నెంబర్లను కలిపి సమాధానం చెప్పడం, 18.71 సెకండ్లలో 50 ఐదు అంకెల నెంబర్లను కలిపి సమాధానం చెప్పడం.. ఇలా అతను చేసిన మేధోవిన్యాసాలు చూసి గిన్నిస్ ప్రతినిధులు ఆశ్చర్యపోయారు. 2024లో మరోసారి మెంటల్ కాలిక్యులేషన్ వరల్డ్ కప్‌లో మొదటిస్థానంలో నిలిచాడు. క్రమం తప్పకుండా రోజూ సాధన చేస్తే ఎలాంటి కష్టమైన విషయమైనా మన సాధించగలమని, మొదలుపెట్టిన పనిని పూర్తి చేసే వదలకూడదని అంటున్నాడు ఆర్యన్. -
Maha Kumbh: 37 ఏళ్ల తర్వాత కలుసుకున్న స్నేహితులు..!
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన అతిపెద్ద ఆధ్యాత్మిక సంబరం మహా కుంభమేళా. ఇది ఎందరెందరో మహమహులు, సాధువులు, సెలబ్రిటీలు ప్రముఖులను ఒక చోట చేర్చి అంత ఒక్కటే అనే భావన కలగజేసిన గొప్ప కార్యక్రమం. ఈ కుంభమేళ సాధువులుగా మారిన గొప్ప గొప్ప మేధావులను పరిచయం చేసింది. యూట్యూబ్ పుణ్యమా అని సాదాసీదా వ్యక్తులు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం నేపథ్యంలో రాత్రికి రాత్రే సెలబ్రిటీ హోదాను అందుకున్నారు. అంతేగాదు ఈ వేడుక ఎన్నో గొప్ప విషయాలకు నెలవుగా మారింది. తాజాగా ఏళ్ల నాటి స్నేహబంధాన్ని హైలెట్ చేసింది. ఎప్పుడో చదువుకుని విడిపోయిన స్నేహితులను కలిపి నాటి జ్ఞాపకాలను గుర్తు చేసింది ఈ సంబరం. వాళ్లెరవంటే..వారే సంజీవ్ కుమార్ సింగ్, రష్మి గుప్తాలు. ఇద్దరు ఒకే కళాశాలలో డిగ్రీ చదువుకున్నారు. 1988 బ్యాచ్ విద్యార్థులు. ఎప్పుడో 37 ఏళ్ల క్రితం కలుసుకున్నారు. మళ్లీ ఇన్నేళ్లకు ఈ మహాకుంభమేళా కారణంగా కలుసుకున్నాం అని చెబుతున్నారు ఆ స్నేహితులు. సంజీవ్ కుమార్ అగ్నిమాపక అధికారిగా ఈ మహాకుంభమేళలో విధులు నిర్వర్తిస్తుండగా, అతడి స్నేహితురాలు రష్మి లక్నోలోని ఒక కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తోంది. ఈ మేరకు నాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ..తన స్నేహితుడు చాలా సైలెంట్ అని, మాట్లాడటం చాలా అరుదని అన్నారు. అయితే ఇప్పుడు మాత్రం అతడి వ్యక్తిత్వం పూర్తిగా భిన్నంగా ఉందంటూ నవ్వేశారామె. అనుకోకుండా ఇలా కలవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అలాగే తాను ఈ ఆధ్యాత్మిక వేడుకలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఇక్కడ ఏర్పాట్లు మాకు ఎంతగానే సహాయపడ్డాయని అన్నారు. ఇక సంజీవ్ కుమార్ రష్మిని ఎగతాళి చేస్తూ..రష్మీ, వాళ్ల గ్యాంగ్ తనతో మాట్లాడేందుకు తెగ ట్రై చేసేదంటూ మాట్లాడారు. అలాగే ఆమె చెప్పింది కూడా నిజేమనని, తాను నిజంగానే అప్పుడు అంతగా ఎవరితో ఫ్రీగా కలిసేవాడిని కానని అన్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కాగా, జనవరి 13న ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభమైన ఈ మహాకుంభమేళా ఫిబ్రవరి 26 శివరాత్రితో చివరి స్నానం ముగిసింది. ఈ మేళా అనేక లక్షలాదిమంది ప్రజలను ఒక చోట ఏకం చేసిన గొప్ప దైవ కార్యక్రమం.Pehle log Kumbh me kho jate the.Fire officer Sanjeev Kumar Singh 1988 ke baad MahaKumbh me apni classmate se mile.Such a cute conversation! pic.twitter.com/WQzSa35nsd— Swami (@Swami_65) February 26, 2025(చదవండి: అతి పిన్న వయస్కురాలైన ఐఏఎస్ అధికారిణి..! ఆమె వికాస్ దివ్యకీర్తి.) -
ఖరీదైన కారు చెత్త కుప్పలో... అసలు సంగతి తెలిసి విస్తుపోతున్న జనం
ప్రియురాలు అలిగితే ప్రియుడు గ్రహించి అలక తీర్చాలి. అది రూల్.అయితే పెళ్ళికి ముందు ఈ అలకలు ముద్దు..ముద్దుగా బాగానే ఉంటాయి. భార్యాభర్తలుగా మారిన తరువాతే అలకలు కాస్త చిరాకులు, పరాకులుగా, వివాదంగా మారిపోతాయి. అందుకే ‘‘అలుక సరదా మీకూ అదే వేడుక మాకూ..కడకు మురిపించి గెలిచేది మీరేలే’’ అంటూ కోప్పకుండానే తనమనసులోని మాట చెప్పేశాడు సినీకవి ఆరుద్ర. అలాగే అలిగిన భార్యను ఎలాగైనా బుజ్జగించాలనుకున్నాడో భర్త. తన ప్రేమసముద్రంలో లేచిన ప్రణయకలహానికి చెక్ పెట్టాలనుకున్నాడు. కానీ సీన్ సితార్ అయింది!అలిగిన తన భార్యకు వాలెంటైన్స్ రోజున ఖరీదైన బహుమతి ఇవ్వాలనుకున్నాడు. ఎలాగైన ఆమె ప్రేమను పొందాలనుకున్నాడు. బాగా ఆలోచిస్తే ఆమెకు కార్లంటే పిచ్చ ప్రేమ అని గుర్తొచ్చింది. అంతే క్షణం ఆలోచించకుండా లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. ప్రేమికుల రోజున 27 లక్షల రూపాయల విలువ చేసే ఎస్‌యూవీని గిఫ్ట్‌గా ఇచ్చాడు. అయితే అది ఆమెకు నచ్చలేదు. తిరస్కరించింది. దీంతో భర్తగారు బాగా హర్ట్ అయ్యాడు. వెంటనే లక్షల విలువైన కారును చెత్తకుప్పలో పడేశాడు. ఇంతకీ అంత ఖరీదైన కారు ఆమెకు ఎందుకు నచ్చలేదో తెలిస్తే.. ‘‘మొదట మగవారు వేస్తారు వేషాలు పెళ్ళి కాగానే చేస్తారు మోసాలు’’ అనిపించక మానదు.రష్యా స్థానిక మీడియా కథనాల ప్రకారం..రష్యా రాజధాని మాస్కో సమీపంలో మైటిష్చి పట్టణంలో ఓ జంటకు ఈ మధ్య విభేదాలొచ్చాయి. తగాదాలతో దూరంగా ఉంటున్నారు. దీంతో భార్యను ప్రసన్నం చేసుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో మరో పయత్నం చేశాడు. ఖరీదైన పోర్షేకారును కొనుగోలు చేశాడు. అయితే యాక్సిడెంట్లో స్వల్పంగా డ్యామేజీ అయినా కారది. అలాంటి దానికి రెడ్ రిబ్బన్ కట్టేసి మేనేజ్ చేద్దామనుకున్నాడు. ‘సీతతో అదంత వీజీ కాదన్నట్టు’ ఆమె ఈ విషయాన్ని ఇట్టే పసిగట్టేసింది. పైగా కార్ల లవర్ కదా అందుకే దాంట్లోని లోపాన్ని చటుక్కున గుర్తించింది. హన్నన్నా.. ఇంతటి అవమానమా? అంటూ మండిపడింది. అందుకే మరి ఛీ... పొమ్మంది. ఇక ఏం చేయాలో తెలియక ఖరీదైన ఆ పోర్షేకారును తీసుకుపోయి పెద్ద చెత్తకుప్పలో పడేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది వైరల్‌గా మారింది. అసలా కారును చెత్తలో ఎలా పడేశాడు? కంటైనర్‌లో ఈ కారు ఎలా పట్టింది అనేది నెటిజన్లు మధ్య చర్చకు దారి తీసింది. దాదాపు రెండు వారాలుగా, పోర్స్చే కారు ఆ ప్రదేశంలోనే ఉండిపోవడంతో ఇది స్థానికంగా ఆసక్తిని రేకెత్తించింది. ఫోటోలకు ఎగబడ్డారు. దీంతో ఆ ప్రదేశం టూరిస్ట్ ప్లేస్‌గా మారిపోయిందట. -
డీఆర్డీవో శాస్త్రవేత్తకు ఐదు కిడ్నీలు
ముంబై: రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో)లో పనిచేసే శాస్త్రవేత్త శరీరంలో ఇప్పుడు ఒకటీ రెండూ కాదు.. ఏకంగా ఐదు కిడ్నీలున్నాయి. పనిచేసేది మాత్రం ఒకే ఒక్కటి..! జనవరి 8వ తేదీన ఫరీదాబాద్‌లోని అమృత ఆస్పత్రి (Amrita Hospital) వైద్య బృందం ఆయనకు అరుదైన ఆపరేషన్ చేపట్టి ఐదో మూత్రపిండాన్ని అమర్చింది. దాదాపు నాలుగు గంటలపాటు సాగిన ఈ సర్జరీ ఎంతో సంక్లిష్టమైందని వైద్యులు తెలిపారు. మూడోసారి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ (Kidney Transplant) చేయడం ఎంతో అరుదైన విషయమన్నారు. దేశంలో అవయవ ట్రాన్స్‌ప్లాంటేషన్ సాంకేతికతలో ఇది కీలక మలుపని చెప్పారు.డీఆర్డీవో శాస్త్రవేత్త (DRDO Scientist) దేవేంద్ర బర్లేవర్(45) తీవ్రమైన కిడ్నీ వ్యాధితో 15 ఏళ్లపాటు ఇబ్బందిపడ్డారు. హైపర్‌టెన్షన్‌తో 2008లో రెండు మూత్రపిండాలు పనిచేయకుండా పోయాయి. దీంతో, ఆయనకు 2010లో, తిరిగి 2012లో సర్జరీ చేసి కిడ్నీలను మార్చారు. అవి ఫెయిలయ్యాయి. పుట్టుకతో ఉన్న రెండు కిడ్నీలు, ట్రాన్స్‌ప్లాంటేషన్‌తో అమర్చిన రెండు కలిపి మొత్తం నాలుగు మూత్రపిండాలున్నా ఆయన ఆరోగ్యం కుదుటపడలేదు. ఇదే సమయంలో 2022లో బర్లేవర్ కోవిడ్–19 బారినపడి తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. దీంతో, ఆయనకు డయాలసిస్ (dialysis) తప్పనిసరయ్యింది.ఈయన్ను పరీక్షించిన ఫరీదాబాద్‌లోని అమృత ఆస్పత్రి వైద్యులు మరోసారి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు సంసిద్ధత తెలిపారు. అదే సమయంలో, బ్రెయిన్‌డెడ్ అయిన ఓ రైతు కుటుంబం కిడ్నీ దానం చేసేందుకు ముందుకు వచ్చింది. అనుకోని ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు వైద్య బృందం సిద్ధపడింది. అయితే, పనిచేయని నాలుగు కిడ్నీల వద్దే మరో కిడ్నీని అమర్చడం వారికి సవాల్‌గా మారింది. వ్యాధి నిరోధకతకు సంబంధించిన ప్రత్యేక సంక్లిష్టతలను వారు ముందుగా దాటాల్సి వచ్చింది.ఇందులో భాగంగా, కొత్త కిడ్నీని రోగి శరీరం తిరస్కరించకుండా చేసేందుకు ముందుగా ఇమ్యునో సప్రెషన్ అనే ప్రత్యేక ప్రక్రియ చేపట్టామని బృందంలో ఒకరైన డాక్టర్ అహ్మద్ కమాల్ చెప్పారు. రోగికి ఇప్పటికే హెర్నియా శస్త్రచికిత్స చేసినందున స్థల పరిమితి కారణంగా ఐదో మూత్రపిండాన్ని శరీరంలో అమర్చడమనే ప్రధాన సవాల్‌ను కూడా ఎదుర్కొన్నామని మరో వైద్యుడు అనిల్ శర్మ తెలిపారు.చదవండి: చిన్నవయసులోనే గుండెపోటు.. ఎందుకొస్తుందో తెలుసా?ఎట్టకేలకు నాలుగు గంటల అనంతరం ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రక్రియను విజయవంతంగా ముగించారు. కొత్త కిడ్నీ చక్కటి పనితీరు కనబరచడంతో పది రోజుల అనంతరం బర్లేవర్‌ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. రెండు వారాల్లో ఆయన శరీరంలో క్రియాటినిన్ స్థాయిలు సాధారణ స్థాయికి చేరుకున్నాయి. డయాలసిస్ అవసరం కూడా లేకుండా పోయింది. తిరిగి సంపూర్ణ ఆరోగ్యవంతుడైనందుకు దేవేంద్ర బర్లేవర్ సంతోషం వ్యక్తం చేశారు. రోజువారీ దినచర్యను ఎటువంటి ఇబ్బందులు లేకుండా తానే సొంతంగా పూర్తి చేసుకోగలుగుతున్నట్లు చెప్పారు. -
Canada New Visa Rules : భారతీయ విద్యార్థులు, వర్కర్లకు పీడకల!
వలసదారుల విషయంలో డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా కఠిన చర్యలు ఆందోళన కొనసాగు తుండగానే కెనడా ప్రభ్తుత్వం కూడా షాకిస్తోంది. స్టడీ, వర్క్ వీసాలపై కొత్త రూల్స్‌ను అమలు చేయనుంది.. ఇటీవల తమ దేశంలోని ప్రవేశించిన అక్రమ వలసదారులను గుర్తించి, వారిని కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టిన అమెరికా బాటలోనే కెనడా కూడా నడుస్తోంది.కెనడా ప్రభుత్వం వలసదారుల నిబంధనల్లో భారీ మార్పులు తీసుకొచ్చింది. ఈ కొత్త వీసా నియమాలు భారతీయ విద్యార్థులు, ఉద్యోగులకు ఒక పీడకలగా మారవచ్చని నిపుణులు అంచనావేస్తున్నారు. ఈ కొత్త నియమాలు ఫిబ్రవరి నుండి అమల్లోకి వచ్చాయి . ఉద్యోగులు, వలసదారుల వీసా స్థితిని ఎప్పుడైనా మార్చడానికి కెనడియన్ సరిహద్దు అధికారులకు విచక్షణాధికారాలను ఇస్తున్నాయి.జనవరి 31 నుంచి అమల్లోకి వచ్చిన ఇమ్మిగ్రేషన్ అండ్ రెఫ్యూజీ ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్ ద్వారా బోర్డర్ అధికారులకు మరిన్ని అధికారాలు లభించాయి. ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్స్ (ఈటీఏ), టెంపరరీ రెసిడెంట్ వీసా (టీఆర్వీ) వంటి డాక్యుమెంట్లను రద్దు చేసే అధికారం అధికారులకు ఉంటుంది. అయితే, పర్మిట్లు, వీసాలను తిరస్కరించడానికి కొన్ని మార్గదర్శకాలు పాటించాలి. బస గడువు ముగిసిన తర్వాత వ్యక్తి కెనడాను విడిచిపెడతారని నమ్మకం లేకపోతే, గడువు ఉన్నప్పటికీ ప్రవేశాన్ని తిరస్కరించవచ్చు లేదా వారి అనుమతిని రద్దు చేయవచ్చు. తాజా చర్యలు భారతదేశం నుండి వచ్చిన వారితో సహా పదివేల మంది విదేశీ విద్యార్థులపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అప్పటికే కెనడాలో ఉంటున్న వారి అనుమతులు రద్దైన పక్షంలో విదేశీయులను పోర్ట్ ఆఫ్ ఎంట్రీ(ఎయిర్‌పోర్టు) నుంచే వెనక్కు పంపించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. భారతీయులను ఎక్కువగా వెళుతున్న దేశాల్లో కెనడా కూడా ఉంది. మరీ ముఖ్యంగా ఇటీవలి ట్రంప్ ఆంక్షల తరువాత కెనడాను ఎంచుకుంటున్న భారతీయ విద్యార్థులు, ఉద్యోగుల సంఖ్య మరింత పెరిగిందని చెప్పవచ్చు. ప్రభుత్వ డేటా ప్రకారం కెనడాలో సుమారు 4.2లక్షల మంది భారతీయులు ఉన్నత విద్యనభ్యిస్తున్నారు.ఇక భారతీయ టూరిస్టుల విషయానికి వస్తే 2024లో 3.6 లక్షల మంది భారతీయులకు టూరిస్టు వీసాలు జారీ చేసింది. అంతకుముందు 3.4 లక్షల మంది టూరిస్టు వీసాపై కెనడాను సందర్శించారు. మూడు నెలల క్రితమే (2024 నవంబర్), కెనడా స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ లేదా SDS వీసా ప్రోగ్రామ్‌ను రద్దు చేసిన విషయం విదితమే. -
రెండు గేదెల కోసం పెళ్లికి సిద్ధమైన మహిళ కట్ చేస్తే..! వైరల్ స్టోరీ
ఉత్తర ప్రదేశ్‌లోని లఖ్‌నవూలో విచిత్రమైన ఘటన జరిగింది. ప్రభుత్వ పథకాన్ని సొంతం చేసుకుని లబ్ది పొందాలని చూసింది మహిళ. కానీ ఆమె పథకం పారలేదు. గుట్టు రట్టు కావడంతో అడ్డంగా బుక్కైంది. ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అసలు స్టోరీ ఏంటంటే..దారిద్ర్య రేఖకు దిగవున ఉన్న ప్రజలకు సాయం చేసేందుకు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటాయి. వారికి ఆర్థికంగా ఊతమివ్వడంతోపాటు, సంక్షేమం కోసం కొన్ని పథకాలను అందుబాటులోకి తీసుకొస్తాయి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సామూహిక వివాహాలను నిర్వహిస్తోంది. ఇక్కడ పెళ్లి చేసుకునే జంటలకు రూ.35 వేల ఆర్థిక సాయం,ఇతర బహుమతులను కూడా ప్రకటించింది. అర్హులైన లబ్ధిదారులతో హసన్‌పూర్‌లోని ఒక కళాశాల ఆదివారం సామూహిక వివాహ వేడుక కళకళలాడుతోంది. అన్ని ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. 300 మందికి పైగా వధూవరులు, వారి కుటుంబాలు వేదిక వద్ద సిద్ధంగా ఉన్నాయి. ఇంతలో ఊహంచని పరిణామం ఎదురైంది.ఈ పథకాన్ని ఉపయోగించుకొని రూ. 35 కొట్టేయాలని చూసిన అస్మా , ఆమె సమీప బంధువు బావ జాబర్ అహ్మద్‌తో కలిసి ప్లాన్ చేసింది. బహుమతులలో భాగంగా వచ్చే డిన్నర్ సెట్, వధువు, వరుడి కోసం రెండు జతల బట్టలు, ఒక గోడ గడియారం, ఒక వానిటీ కిట్, వెండి మెట్టలు తదితర వస్తువులను పంచుకుని, బహుమతిగా వచ్చిన నగదుతో రెండు గేదెలను కూడా కొనాలని నిర్ణయించుకున్నారు. అయితే విషయం తెలుసుకున్న మహిళ అత్తింటివారు అక్కడికి చేరుకుని చివరి నిమిషంలో పెళ్లిని నిలిపివేశారు. దీంతో ఈ దొంగ పెళ్లితో వచ్చిన డబ్బులు ద్వారా గేదెలు కొనుక్కోవాలని ప్లాన్ బెడిసి కొట్టింది.అస్మా ఇప్పటికే వివాహం కావడమే ఇందుకు కారణం మూడేళ్ల క్రితమే నూర్ మొహమ్మద్‌ను వివాహం చేసుకుంది. ఇద్దరి మధ్యా ఉన్న గొడవల నేపథ్యంలో 6 నెలల నుండి అమ్మ గారి ఇంట్లోనే ఉంటోంది. వారి విడాకుల కేసు కోర్టులో పెండింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. మొదటి భర్త నుండి విడాకులు తీసుకోకుండానే రెండవ వివాహం చేసుకోవాలని నిర్ణయించడంతో విషయం తెలిసిన అత్తింటివాళ్లు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా ఆస్మా మామగారు ఆస్మా వివాహ ధృవీకరణ పత్రంతో సహా వేదిక వద్దకు వచ్చి అసలు విషయం అధికారులకు విన్నవించాడు. దీంతో అక్కడున్నవారంతా షాకయ్యారు. చివరికి ఇద్దరూ తప్పు ఒప్పుకున్నారు. దీంతో చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అశ్విని కుమార్ కేసును పోలీసులకు అప్పగించారు. ముఖ్యమంత్రి సామూహిక వివాహ పథకం నిబంధనలను ఉల్లంఘించినందుకు, అక్రమం, మోసం ద్వారా ప్రభుత్వ పనికి అడ్డు కున్నందుకు ఇద్దరిపై కేసు నమోదైంది. -
జంతురూపాల్లోని 'మనుషుల జూ'..!
జూలో రకరకాల జంతువులను ఉండటం మామూలే! కాని, తాజాగా అచ్చంగా జంతువులను తలపించే వేషాలతో కనిపించే మనుషుల ప్రదర్శనశాలను ఎక్కడైనా చూశారా? ఈ ఫొటోలో కనిపిస్తున్న కుక్క నిజమైన కుక్క కాదు. జపాన్‌కు చెందిన టోకో అనే వ్యక్తి ఒక అల్ట్రా రియలిస్టిక్ డాగ్ సూట్లో ఉన్న దృశ్యం. అతను ఒక ఇండోర్ జూను ప్రారంభించాడు. ‘మీరు ఎప్పుడైనా జంతువులాగా మారాలని కోరుకున్నారా? అయితే, ఇక్కడకు రండి’ అంటూ తన ఇంట్లోనే ఈ జూను ఏర్పాటు చేసుకున్నాడు. కేవలం నెలకు రెండుసార్లు మాత్రమే తెరిచే ఈ జూను చూడటానికి చాలామంది పోటీ పడుతున్నారు. పైగా దీని ఎంట్రీ ఫీజుతోపాటు, మీరు కూడా జంతువుల వేషం ధరించాలనుకుంటే, ఒక నెల ముందుగానే స్లాట్ బుక్ చేసుకోవాలి. ఉదయం, మధ్యాహ్నం ఇలా సెషన్ వ్యవధిని బట్టి ధర 49,000 యెన్లు (అంటే రూ. 27 వేలు) వరకు ఉంటుంది. త్వరలోనే మరికొన్ని జంతువుల వేషాలను కూడా ఏర్పాటు చేస్తానని టోకో చెబుతున్నాడు. (చదవండి: వామ్మో ఇదేం బిజినెస్? విలనీజం వ్యాపారమా..!) -
వామ్మో ఇదేం బిజినెస్? విలన్ కావాలా..!
‘ఎవరినైనా బెదిరించాలన్నా, గుండాయిజం, రౌడీయిజం వంటి విలనీ పనులు చేయాలన్నా సంప్రదించండి ‘విలన్ ఫర్ హైర్’. విలన్‌ను చావగొట్టి మీ గర్ల్‌ఫ్రెండ్ దగ్గర హీరోయిజం ప్రదర్శించాలనుకుంటున్నారా? ‘విలన్ ఫర్ హైర్’ను సంప్రదిస్తే, సులువుగా మీ కోరిక తీరిపోతుంది. మలేసియాలో ఈ సేవలు అందిస్తున్న షజాలీ సులేమాన్‌కు తగిన రుసుము చెల్లిస్తే, మీకోసం అతగాడు విలన్లా నటిస్తాడు. మీ గర్ల్‌ఫ్రెండ్ మీతో ఉన్నప్పుడు హఠాత్తుగా వచ్చి, ఆమెను అల్లరిపెడతాడు. అప్పుడు మీరు హీరోలా అతడితో కలబడి, అతడిని తరిమికొట్టి మీ గర్ల్‌ఫ్రెండ్ దృష్టిలో హీరోగా ఫోజు కొట్టవచ్చు. సులేమాన్ మరికొన్ని సేవలు కూడా అందిస్తున్నాడు. బెదిరించి తగాదాలను పరిష్కరించడం, సోషల్ మీడియాలోను, సమాజంలోను ఇబ్బందులు పడుతున్న వారి సమస్యలను తీర్చడం వంటి పనులను ‘విలన్’లా ప్రవేశించి ఇట్టే పూర్తిచేస్తాడు. ఈ పనులకు అతడు వసూలు చేసే మొత్తం పనిదినాల్లోనైతే, రూ.1,975, వీకెండ్స్లోనైతే రూ. 2,963 మాత్రమే! ఇతడి వ్యాపారం రోజురోజుకూ బ్రహ్మాండంగా సాగుతోంది. (చదవండి: జనరల్ మోటార్స్ డైట్..! దెబ్బకు బరువు మాయం..) -
నేను బాషా.. ఒక్కసారి రాస్తే 400 భాషల్లో రాసినట్టు!
మీకు ఎన్ని భాషలొచ్చు? తెలుగు, హిందీ, ఇంగ్లీషు.. ఇంకా? ఈ మూడేనా? నాలుగైదు భాషలు మాట్లాడేవారు మీ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా? మాట్లాడటం సరే, వాళ్లు ఆ భాషలు రాయగలరా? అసాధ్యం అనుకుంటున్నారా? ఆ అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించాడు చెన్నైకి చెందిన మహమూద్ అక్రమ్. అతను ఎన్ని భాషల్లో రాయగలడో తెలుసా? అక్షరాలా 400 భాషలు. అంతేకాకుండా, సుమారు 46 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు. ఈ ఘనతలతో అతను ఇప్పటికి మూడు ప్రపంచ రికార్డులు సాధించాడు.అక్రమ్ తండ్రి షిల్బీ మొళిప్పిరిన్. ఉద్యోగరీత్యా రకరకాల దేశాలు ప్రయాణించేవారు. ఆ సమయంలో అక్కడి స్థానిక భాష అర్థంకాక, వారితో మాట్లాడలేక ఇబ్బంది పడేవారు. దీంతో మెల్లగా ఆ భాషలు నేర్చుకోవడం మొదలుపెట్టి 16 భాషల్లో మాట్లాడే స్థాయికి వచ్చారు. తండ్రిని చూస్తూ పెరిగిన అక్రమ్ కూడా అలా రకరకాల భాషల మీద ఆసక్తి పెంచుకున్నాడు.. దాంతో తండ్రి అక్రమ్‌కు నాలుగేళ్ల వయసు నుంచే రకరకాల భాషల్లోకి పదాలు, వాటికి అర్థాలు నేర్పించేవారు. ఆరు రోజుల్లో మొత్తం ఇంగ్లీషు అక్షరాలు (English Letters) నేర్చుకున్న అక్రమ్, మూడు వారాల్లో తమిళంలోని 299 అక్షరాలను నేర్చేసుకుని ఆ చిన్నవయసులోనే అందర్నీ ఆశ్చర్యపరిచాడు.ఆరేళ్ల వయసొచ్చేసరికి తండ్రితో రకరకాల భాషల్లో మాట్లాడటమే కాకుండా తమిళ వాక్యాలను స్పష్టంగా చదవడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత రెండేళ్లలో మరో 50 భాషలు సాధన చేసి, వాటి మీద అవగాహన తెచ్చుకున్నాడు. కొడుకు ఆసక్తిని గమనించి, వివిధ భాషల పుస్తకాలు తెప్పించి, అతనికి ఇచ్చేవారు మొళిప్పిరిన్. కేవలం చదవడమే కాకుండా, ఆ భాషల్లో టైప్ చేయడం కూడా మొదలుపెట్టిన అక్రమ్, అతి చిన్నవయసులో వివిధ భాషలు టైప్ చేసి మొదటి ప్రపంచ రికార్డు సాధించాడు.10 ఏళ్ల వయసులో మన జాతీయ గీతం ‘జనగణమన’ను ఒక్క గంటలో 20 భాషల్లో రాసి రెండో ప్రపంచ రికార్డు సాధించాడు. 12 ఏళ్ల వయసు వచ్చేసరికి 400 భాషలు చదివి, రాసి, టైప్ చేస్తూ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. దీంతో మూడోసారి అతనికి ప్రపంచ రికార్డు సొంతమైంది. ఒక వాక్యాన్ని వీలైనన్ని ఎక్కువ భాషల్లో అనువాదం చేసే ప్రక్రియలో ఆరితేరిన అక్రమ్, అందుకుగానూ జర్మనీ దేశంలో ప్రతిష్టాత్మకమైన ‘జర్మనీ యంగ్ టాలెంట్ అవార్డు’ అందుకున్నాడు. అనువాదంలో అతని వేగం చూసి సీనియర్ అనువాదకులు సైతం ఆశ్చర్యపోయారు.చదవండి: డిస్నీని తలపించేలా... సరికొత్త థీమ్ పార్క్అయితే భాషల మీద ఇంత పట్టున్న అతనికి స్కూళ్ల నుంచి ప్రోత్సాహం రాలేదు. భాషల మీద కాకుండా కేవలం సబ్జెక్టుల మీదే దృష్టి పెట్టాలని అతణ్ని ఒత్తిడి చేశారు. దీంతో స్కూల్ మానేసి, ఓపెన్ స్కూల్ ద్వారా పరీక్షలు రాసి పాసయ్యాడు. ఆ తర్వాత అతని ప్రతిభ గుర్తించి, ఆస్ట్రియాలోని డనుబే ఇంటర్నేషనల్ స్కూల్ అతనికి స్కాలర్షిప్ ఇచ్చి మరీ తమ స్కూల్లో చేర్చుకుంది. ప్రస్తుతం అక్రమ్ యూకేలోని ఓపెన్ యూనివర్సిటీ నుంచి భాషావిభాగంలో ఒకేసారి రకరకాల డిగ్రీలు చేస్తున్నాడు. తన భాషా పరిజ్ఞానాన్ని మరింత విస్తరించుకోవాలన్న ఉత్సాహంతో ఉన్నాడు. -
ఒక్క సోలార్ బోట్ కోసం అధిక జీతమిచ్చే ఉద్యోగం, అన్నీ వదిలేశారు!
అధిక జీతం వచ్చే ఉద్యోగాలను వదిలివేసి వ్యాపారంలో స్థిరపడినవాళ్లను చూశాం. దేశానికి సేవ చేయాలన్న కతృనిశ్చయంతో ఐఏఎస్,ఐపీఎస్ ర్యాంకులను సాధించిన వారినీని చూశాం. కానీ సముద్రంపై శాశ్వతంగా ప్రయాణించేందుకు, జీవితాన్ని కొత్తగా ఆస్వాదించేం దుకు ఉద్యోగాలనూ, ఇంటినీ..అంతెందుకు సర్వస్వాన్ని వదిలేసిన ఫ్యామిలీ గురించి విన్నారా? రండి ముగ్గురు సభ్యులతో కూడిన ఇండియాకు చెందిన అరుదైన ఆ కుటుంబం గురించి తెలుసుకుందాం!రిటైర్డ్ నేవీ అధికారి కెప్టెన్ గౌరవ్ గౌతమ్, ఆయన భార్య మాజీ మీడియా ప్రొఫెషనల్ వైదేహి చిట్నావిస్, కుమార్తె కైయా రివా గౌతమ్. సౌరశక్తితో నడిచే పడవలో ప్రపంచాన్ని చుట్టిరావడానికి, పర్యటనల పట్ల తమకున్న మక్కువను కొనసాగించడానికి ఈ జంట తమ పూర్తికాల ఉద్యోగాలను విడిచిపెట్టారు. దాదాపు ప్రతి ఆస్తిని అమ్మేసుకున్నారు. తద్వారా తమ ఇల్లు కేవలం మ్యాప్‌లో ఏదో ఒక మూలన కాకుండా మొత్తం ప్రపంచమే చిరునామా అయ్యేలా చేసుకున్నారు. ది రివా ప్రాజెక్ట్ అనే ఇన్‌స్టా ఖాతాలో షేర్ అయిన వీడియో తాజాగా వైరల్‌గా మారింది. వారి అద్భుతమైన ప్రయాణం నెటిజనులను ఆశ్చర్యపరిచింది.ఈ ఆలోచన ఎలా వచ్చింది?భారత నావికాదళంలో సంవత్సరాలు గడిపిన గౌరవ్‌కి సముద్రంతో విడదీయలేని సంబంధం ఉంది. మరోవైపు, వైదేహి చాలా కాలంగా సరళమైన, అర్థవంతమైన జీవన విధానం గురించి కలలు కంటోంది. ఇంతలో 2015లో గౌతమ్ కొచ్చి నుండి నార్వేకు తిరిగి వచ్చే ఇండియన్ నావల్ సెయిల్ ట్రైనింగ్ షిప్ తరంగిణికి కమాండింగ్ ఆఫీసర్‌గా నియమితుడైనప్పుడు ప్రత్యామ్నాయ జీవనశైలి గురించి ఆలోచన వచ్చింది. భార్య ,కుమార్తెతో కలిసి సముద్రంపై ప్రయాణిస్తున్న సమయంలో పడవల మీద నివసిస్తున్న , ప్రయాణించే అనేక కుటుంబాలు తారపడ్డాయి. దీంతో వారి ఆలోచనలకు మరింత ప్రేరణ వచ్చింది. రెండు దశాబ్దాలకు పైగా స్థిర జీవితాన్ని గడిపిన తర్వాత, ఈ జంట చూడాల్సినవి, ఆస్వాదించ వలసినవి ఇంకా చాలా ఉన్నాయని భావించారు. దీనికితోడు ప్రపంచవ్యాప్తంగా COVID-19 మహమ్మారి సృష్టించిన బీభత్సం వారి కలలకు మరింత ఊపిరిపోసింది. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా తగ్గుతున్న బోటు ధరలు మరింత ఆకర్షించాయి. అంతే ఇక ఆలస్యం చేయదల్చుకోవలేదు వీరు. 2022లో గౌతమ్ నావీ వీఆర్ఎస్ తీసుకున్నాడు. వైదేహి కూడా మీడియా ఉద్యోగాన్ని వదులుకుంది. ఇలా మంచి జీతం ఉన్న ఉద్యోగాలను ఇద్దరూ వదిలేసి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. 12 ఏళ్ల కుమార్తెకు ఇంటి నుంచే విద్య నేర్పించాలని నిర్ణయించుకున్నారు. సముద్రం మీదే ప్రత్యామ్నాయ జీవితాన్ని ప్రారంభించారు. ఇందుకోసం తమకున్న దాదాపు ప్రతిదీ అమ్మేశారు. ఇంటి సామానును 6వేల కిలోల నుండి 120 కిలోలకు తగ్గించేశారు. పడవలో ఉంచుకోలేని వస్తువులను వెంట తీసుకెళ్లడం వృధా అనుకున్నారు. రెండు క్యాబిన్లు, వంటగది, తొమ్మిది కిలోల గ్యాస్ సిలిండర్, ఒక షవర్ , ఒక సెలూన్ కూడా ఈ ఇంటిలో అమరిపోయాయి. రివర్స్ ఆస్మాసిస్ మెషిన్ కూడా ఉంది. అది సముద్రపు నీటిని మంచినీటిగా మారుస్తుంది. అలా సాంప్రదాయ జీవనశైలిని విడిచిపెట్టి సౌరశక్తితో నడిచే 42 అడుగుల పడవ వాంకోవర్ రీవాలో నివసిస్తున్నారు. ప్రపంచంలోని వివిధ మూలల్లో ప్రయాణించడం వల్ల జీవితంపై అద్భుతమైన దృక్పథంతో ముందుకు సాగుతున్నారు.పడవపై ఎలా బతుకుతున్నారు?సంవత్సరంలో దాదాపు 70 శాతం సమయం ఏకాంత దీవుల వెలుపల లంగరు వేసి గడుపుతారు. మిగతా అన్నిసమయాల్లో పడవను నడపాల్సి ఉంటుంది కాబట్టి, వంతులవారీగా బోటు నడపటం, వంట చేయడం, విశ్రాంతి తీసుకోవడం, చదవడం, మరమ్మతులు చేసుకోవడం లాంటి పనులు చేసుకుంటారు. అప్పుడప్పు కేకులు కూడా చేసుకుంటారు. వంటలకు ఎక్కువ వేడి రాకుండా కుండల్ని వాడతారు.ఎక్కడికైనా వెళ్లి సముద్ర మీదే. అయితే వాతావరణం, నావిగేషన్ సమస్యలు వీరికి ఛాలెంజ్. మొదట్లో ఇబ్బంది పడినా కాలక్రమేణా, ఆ ప్రాంతంలో అందుబాటులో ఉన్న యాప్‌లు, వాతావరణ హెచ్చరిక వ్యవస్థల సహాయంతో వాతావరణాన్ని అంచనా వేయడంలో రాటు దేలారు. అంతేకాదు దాదాపు 30 ఏళ్ల(1988లో దీన్ని తయారు చేశారు) పడవ నిర్వహణ ఖర్చులు, చాలా తొందరగా తుప్పు పట్టడం లాంటి సవాళ్లు కూడా ఎదురైనాయి. రీవా 760-వాట్ల సోలార్ ప్యానెల్స్‌తో ఛార్జ్ చేయబడిన 800-AH బ్యాటరీ బ్యాంక్ ద్వారా నడుస్తూనే ఉంటుంది . దీనికి విండ్ జనరేటర్ కూడా అమర్చుకున్నారు. మలేషియాలోని పెనాంగ్‌లో ప్రారంభమైన వీరి సముద్రయానం లంకావీ (మలేషియా), థాయిలాండ్‌కు చేరారు. దారిలో అనేక అందమైన దీవుల్లో కొన్ని వారల పాటు ఉన్నారు. ఫుకెట్ పశ్చిమ తీరం వెంబడి మయన్మార్ సరిహద్దు వరకు అందమైన తీరాల వెంబడి వారాల తరబడి గడిపారు. సముద్రంలో స్నార్కెలింగ్ , డైవింగ్ చేస్తూ,కొత్త ఇల్లు రీవా అనే సెయిల్ బోట్లో సరికొత్త అనుభవాలతో గత రెండేళ్లుగా సంపూర్ణ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. ముఖ్యంగా డెక్ నుండి సూర్యాస్తమయాన్ని చూడటం కేయాకు అద్భుతమైన అలవాటుగా మారిపోయింది. వీలైనన్ని ఎక్కువ దేశాలను చూడడమే దీర్ఘకాలిక ప్రణాళిక.తూర్పు మలేషియా, థాయిలాండ్, కంబోడియా, ఫిలిప్పీన్స్లను కవర్ చేస్తూ మరింత తూర్పుకు ప్రయాణించి, తరువాత 17,500 దీవులతో కూడిన ఇండోనేషియాని చుట్టేయాలని ప్లాన్. అలాగే యూట్యూబ్ ద్వారా నౌకాయాన సాహసాలను డాక్యుమెంట్ చేస్తున్నారుట .“పడవలో జీవించడం సాధ్యమేనా?” అన్న ప్రశ్నకు వీరి జీవనమే సజీవ సాక్ష్యం. వీరి ఇన్‌స్టా పేజ్‌లోని వీడియోలను చూస్తూ ఉంటే.. సమయమే తెలియదు. (వీలైతే ఒకసారి చూడండి) View this post on Instagram A post shared by Sailing Yacht Reeva | 🇮🇳 | Gogo, VC & Kay (@the_reeva_project)ప్రయాణం, ముఖ్యంగా సమయం, గమ్యం ఇలాంటి సంకెళ్లేవీ లేకుండా హాయిగా స్వేచ్ఛగా చేసే ప్రయాణాలు జీవితంపై దృక్పథాన్ని కచ్చితంగా మారుస్తాయి. ఒక విశాలమైన అవగాహనను కలిగిస్తాయి. -
Maha Kumbh : అయ్యో తల్లీ! పుణ్యానికి పోతూ ఇదేం పనిరా కొడకా!
మహాకుంభమేళా(Maha Kumbh Mela) పవిత్ర త్రివేణి సంగమంలో మూడు మునుగులు మునిగితే సర్వపాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. మహాకుంభమేళా స్నానాన్ని రాజస్నానం (Holybath)గా పరిగణిస్తారు. ఇక్కడ స్నానం చేస్తే ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయనీ, పాపాలు తొలగి మోక్షం సిద్ధిస్తుందనీ భక్తుల నమ్మకం. అందుకే ఎన్నికష్టాలకోర్చి అయినా కుంభమేళాలో స్నానం చేయడానికి వెళతారు. అంతేకాదు 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళాకు వృద్ధులైన తల్లిదండ్రులను కూడా తోడ్కొని వెడతారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా సందర్భంగా ఇలాంటి దృశ్యాలెన్నింటినో మనం చూశాం కూడా. అయితే జార్ఖండ్‌లోని ఒక వ్యక్తి ఇందుకు భిన్నంగా, సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించాడు. 65 ఏళ్ల తల్లిని నిర్దాక్షిణ్యంగా ఇంట్లో వదిలి మహాకుంభమేళాకు వెళ్లాడు. దీంతో ఆకలి బాధకు తట్టుకోలేక, ఆ వృద్ధతల్లి నానా యాతన పడింది. మూడు రోజుల పాటు అటుకులను ఆహారంగా సేవించింది. ఆఖరికి అవి కూడా అయిపోవడంతో ప్లాస్టిక్‌ను తినేందుకు కూడా ప్రయత్నించింది. ఈ విషయం ఎలా బయటికి వచ్చింది.జన్మనిచ్చిన తల్లి, అనారోగ్యంతో బాధపడుతోందున్న కనికరం కూడా లేకుండా ఆమెను ఇంట్లో బంధించి భార్యా పిల్లలు, అత్తామామలను వెంటబెట్టుకొని మహా కుంభమేళాకు వెళ్లిపోయాడు. మూడు రోజులపాటు అటుకులతో కడుపు నింపుకుంది. ఉన్న కాసిన్ని అటుకులూ అయిపోవడంతో ఇక ఆకలి బాధకు తాళలేక ఆమె గట్టిగా కేకలు వేసింది. బిగ్గరగా రోదించడం మొదలు పెట్టింది. దీంతో ఇరుగుపొరుగు తక్షణమే స్పందించారు. చుట్టుపక్కల వారిచ్చిన సమాచారంతో పోలీసులొచ్చి తాళం పగులగొట్టి బాధితురాలిని బయటకు తెచ్చారు. ఆమెకు ఆహారం ఇచ్చి, సేద తీరిన తరువాత, చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాధితురాలి కుమార్తె చాందినీ దేవికి సమాచారం అందించారు.(వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? బెస్ట్ టిప్స్ ఇవే!)బాధితురాలు రామ్‌గఢ్ జిల్లా కేంద్రానికి చెందిన 65 ఏళ్ల సంజూదేవి. ఆమె కుమారుడు అఖిలేశ్ కుమార్ ప్రజాపతి. సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (CCL) ఉద్యోగి. అయితే తల్లికి ఇంట్లో భోజనం, తదితర ఏర్పాట్లన్నీ చేసే, తాము ప్రయాగ్ రాజ్ వెళ్లామని కుమారుడు అఖిలేశ్ వాదిస్తున్నాడు. అనారోగ్యంతో ఉందనే ఆమెను తమవెంట తీసుకెళ్లలేదని చెప్పాడు. మరోవైపు రామ్‌గఢ్ సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (SDPO) పరమేశ్వర్ ప్రసాద్ తల్లిని సీసీఎల్ క్వార్టర్ లోపల బంధించాడని ధృవీకరించారు. ఇదీ చదవండి: నీతా అంబానీ లుక్: వందేళ్లకు పైగా చరిత్ర, తయారీకి రెండేళ్లుకాగా మహా కుంభమేళా 40వ రోజు, సంగమంలో భక్తులు స్నానాలు ఉత్సాహంగా అప్రతిహతంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు జైలులో ఉన్న ఖైదీలు కూడా ఇక్కడ పవిత్ర స్నానాలు ఆచరించనున్నారు. ఇప్పటివరకు 58 కోట్లకు పైగా భక్తులు పవిత్ర గంగానదిలో స్నానం చేశారని జాతర నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ నెల 26వ తేదీవరకు మహా కుంభమేళా జరగనుంది. -
మూడు నెలల తరువాత.... గ్రేహౌండ్స్ దొరికిందహో!
పెంచుకున్న కుక్క కనిపించకపోతే ఏం చేస్తాం? తిరగాల్సిన చోటుకల్లా తిరుగుతాం. పోలీస్ కంప్లాయింట్ ఇస్తాం. అయినా ఫలితం లేకపోతే ప్రియమైన శునకాన్ని తలచుకొని బాధ పడడం తప్ప ఏంచేయగలం? కాని గురుగ్రామ్‌కు చెందిన దీపయాన్ ఘోష్, కస్తూరి దంపతులు మాత్రం ఏమైనా సరే, ఎక్కడున్నా సరే... తప్పిపోయిన తమ పెంపుడు శునకాన్ని వెదికి పట్టుకోవాల్సిందేనని గట్టిగా డిసైడైపోయారు.శునకం కనిపించని రోజు నుంచి వారికి నిద్ర, తిండి లేవు. కుక్క జాడ చెప్పిన వారికి యాభై వేల రివార్డ్ ప్రకటించడంతో సహా ఇంటింటికీ వెళ్లి శునకం ఆనవాళ్ల గురించి చెప్పడం, సీసీటీవీ ఫుటేజీలను విశ్లేషించడం, డ్రోన్ నిఘా...ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.‘ఇంత కష్టం అవసరమా?!’ అని ఎంతోమంది అన్నారు. అయినా సరే కుక్క కోసం వెదకడం ఆపలేదు. ఎట్టకేలకు వారి అలుపెరగని గాలింపుకు ఫలితం దక్కింది. తాజ్‌మహల్ సమీపంలోని అడవిలో సంచరిస్తున్న గ్రేహౌండ్స్‌ను కనుగొన్నారు. దీపయాన్, కస్తూరి దంపతులు సెలవు రోజుల్లో ఆగ్రాకు వెళ్లారు. వూఫ్, గ్రేహౌండ్స్ అనే పెంపుడు కుక్కలను కూడా వెంట తీసుకెళ్లారు. ఫతేపూర్ సిక్రీని సందర్శిస్తున్న సమయంలో....‘గ్రేహౌండ్స్ కనిపించడం లేదు’ అని తాము బస చేసిన హోటల్ నుంచి ఫోన్ వచ్చింది.ఎలాగైనా గ్రేహౌండ్స్ ఆచూకి కనుక్కోవాలని అనుకున్న దీపయాన్, కస్తూరి దంపతులు రెండు వారాలపాటు ఆగ్రాలోనే ఉండి పోస్టర్లు వేస్తూ, బ్యానర్లు కడుతూ ఎన్నో ప్రాంతాలు తిరిగారు. అయినా ఫలితం లేకుండాపోయింది. గురుగ్రామ్‌కు తిరిగి వచ్చిన తరువాత కూడా తరచు ఆగ్రాకు వెళ్లేవారు. ఆటోలపై, దుకాణాలు, మెట్రో స్టేషన్ల దగ్గర ‘కనిపించడం లేదు’ అనే ప్రకటనలు అంటించేవారు. వారి ప్రచారం సోషల్‌మీడియాకు కూడా చేరింది. దీంతో యానిమల్ రెస్క్యూ గ్రూప్‌లు, వాలెంటీర్లు కూడా రంగంలో దిగారు. ఒకానొక రోజు గ్రేహౌండ్‌ను చూసిన టూర్ గైడ్ ప్రశాంత్ జైన్ నుంచి దంపతులకు ఫోన్ వచ్చింది. అలా కథ సుఖాంతం అయింది. మూడు నెలల తరువాత గ్రేహౌండ్స్ తన పెంపుడు పేరెంట్స్ దగ్గరికి చేరుకుంది. (చదవండి: ట్రక్కులోనే పదేళ్లుగా జీవనం..కారణం తెలిస్తే విస్తుపోతారు..!) -
ట్రక్కులోనే పదేళ్లుగా జీవనం..కారణం తెలిస్తే విస్తుపోతారు..!
ట్రక్‌లోనే పదేళ్లుగా జీవనం సాగిస్తున్నాడు. తినడం పడుకోవడం అన్ని అందులోనే. ఇలా ఎందుకు చేస్తున్నాడో వింటే విస్తుపోతారు. బడుగు జీవులు వెతలు ఇలానే ఉంటాయోమో కథ అనిపిస్తుంది. అసలేం జరిగిందంటే..నాగ్‌పూర్ బుల్ధానా జిల్లాలోని సింద్ఖేడ్ రాజా తాలూకాలోని జానునా గ్రామానికి చెందిన ఏక్నాథ్ తుకారాం పవార్, అతని భార్య లలితా పవార్ గత పదేళ్లుగా తమ కుటుంబంతో కలిసి ట్రక్కులో ప్రయాణించడం, నివశించడం వంటివి చేస్తున్నారు. వారికి ముగ్గురు కుమార్తెలు. అయితే ఒక కుమార్తె మాత్రం గామ్రంలో బంధువుల వద్ద ఉంటున్నట్లు తెలిపాడు పవార్. విశేషం ఏంటంటే అతని భార్య కూడా ట్రక్కు నడపడంలో సహాయపడుతుంది. ఆ దంపతులు పూణే-నాగ్‌పూర్ మధ్య వస్తువులను రవాణా చేస్తుంది. కానీ ఆ ఆదాయంలో సగం డబ్బులు RTO, ట్రాఫిక్ పోలీసులకు ముట్టచెప్పాల్సిందే. అందువల్లే పవార్ కుటుంబం ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నట్లు వాపోయాడు పవార్. తన కుటుంబానికి రోజుకు రెండు పూటలా భోజనం కూడా పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నట్లు వెల్లడించాడు పవార్. ఇక తాను ఈ ట్రక్‌ని 2023లో మహీంద్రా నుంచి రుణంపై కొనుగోలు చేసినట్లు తెలిపాడు. ఇక ఆ రుణం నిమిత్తం ప్రతి నెల రూ. 68,500 దాక చెల్లించాల్సి ఉందని, అవన్నీ పోగా మిగిలేది ఏం ఉండదని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ నేపథ్యంలోనే తాను ఇలా ట్రక్‌లోనే నివాసం ఏర్పరుచుకున్నట్లు బాధగా చెప్పుకొచ్చాడు. దీనివల్ల కొద్దో గొప్పో డబ్బు ఆదా అవుతుందని చెప్పుకొచ్చాడు పవార్. (చదవండి: ఢిల్లీ మాజీ సీఎం లవ్ స్టోరీ..! కాబోయే అత్తగారి అంగీకారం కోసం..) -
ఒక్కో గ్రాము ధర రూ. 53 వేల కోట్లు, అంత ‘మ్యాటర్’ ఏముంది?
ప్రపంచంలో అత్యంత ఖరీదైంది అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది ప్లాటినం, వజ్రాలు, బంగారం వగైరా గుర్తొస్తాయి. కానీ వీటన్నింటికి మించి షాకింగ్ ధర పలికే వస్తువు ఒకటి ఉంది. దాని పేరు ఎప్పుడైనా విన్నారా? అంత రేటు పలకడానికి గల కారణాలు ఏంటి? భూమిలో పుడుతుందా? లేకపోతే ల్యాబ్‌లో తయారువుతుందా? తెలుసుకుందాం.ప్రపంచంలో అత్యంత ఖరీదైన పదార్థం పేరు యాంటీమాటర్ (Antimatter) దీని ఒక్కో గ్రాము ధర వింటే నిజంగా షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఏదో ఒకటీ, రెండు వేలు, కాదు, కోట్లు అంతకన్నా కాదు. ఏకంగా రూ. 53 వేల కోట్లు (62 ట్రిలియన్ డాలర్లు). ఒక్క గ్రాములో అతి తక్కువ పరిమాణంలో తయారీకి లక్షల సంవత్సరాల సమయం పడుతుంది. మిగతా ఖరీదైన పదార్థాల్లా దీనిని భూమి నుంచి తవ్వి తీయడానికి కుదరదు. దానిని సృష్టించడం, నిల్వ చేయడం అనేది అనేక సవాళ్లతో కూడుకొని ఉంటుంది. దాదాపు అసాధ్యమని చెప్పవచ్చు.. ఇది అందుబాటులోకి వస్తే అంతులేని శక్తి ఉత్పత్తికి అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.బంగారం, వజ్రాలు లేదా అరుదైన లోహాల మాదిరిగా కాకుండా, యాంటీమ్యాటర్‌ను భూమి నుండి తవ్వలేరు. దీనికి బదులుగా దీనిని అత్యంత నియంత్రిత వాతావరణంలో అణువు ,అణువును కలుపుతూ అత్యంత జాగ్రత్తగా తయారు చేయాలి. ఈ ప్రక్రియలో ఒక గ్రాములో కొంత భాగాన్ని సేకరించడానికి కూడా బిలియన్ల సంవత్సరాలు పట్టవచ్చు. విశ్వంలోని ఆటమ్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్లు, సబ్ ఆటమిక్ కణాలతో కూడిన ‘మ్యాటర్’తో ఆవిర్భవించింది. ప్రతి మ్యాటర్ కణాలకు ప్రతిబింబం లాంటి (Mirror image) యాంటీమ్యాటర్ కణాలు ఉంటాయి. మ్యాటర్ కణాలకు పాజిటివ్ ఛార్జ్ ఉంటే, యాంటీమ్యాటర్ కణాలకు నెగటివ్ ఛార్జ్ ఉంటుంది. దీని తయారీ చాలా క్లిష్టమైన ప్రక్రియ అంటున్నారు శాస్త్రవేత్తలు. ఒక్క గ్రాములో పదోవంతు తయారు చేయడానికి లక్షల సంవత్సరాలు పడుతుంది. ఫలితంగా ఒక్క గ్రాము యాంటీమ్యాటర్ తయారీకి రూ.53 వేల కోట్లు ఖర్చవుతుందని 1999లో నాసా శాస్త్రవేత్త హరోల్డ్ గెర్రిష్ అంచనా వేశారు. స్విట్జర్లాండ్‌లోని ది యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లిర్ రీసెర్చ్(CERN)లోని కణ భౌతిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ మైఖేల్ డోజర్ యాంటీమాటర్ నానోగ్రామ్లో 100వ వంతు భాగం తయారీకి దాదాపు ఒక కిలోగ్రాము బంగారం రేటు అంత ఖర్చవుతుందన్నారు.సాధారణ పదార్థంతో దాని పరస్పర చర్య అనేది ప్రధానమైన ఛాలెంజ్. ఎందుకంటే పదార్థం, యాంటీమ్యాటర్ కలిసినపుడు భారీ పేలుడు సంభవిస్తుంది. ఇలా ఒకదానికొకటి నాశనం చేసుకుంటాయి. ఈ సమయంలో అపారమైన శక్తి ఉత్పత్తి అవుతుంది. అలాగే తయారైన వెంటనే ఇది అదృశ్యమైపోతుందని నమ్ముతున్నారు. అందుకే యాంటీమ్యాటర్‌ను భద్రపర్చడం, దీనిపై అధ్యయనం చేయడం చాలా కష్టతరం. తయారీ తరువాత దీన్ని శూన్యంలో ఉంచాలి, సూపర్ కూల్డ్ అయస్కాంత క్షేత్రాలను ఉపయోగించి భద్రం చేయాలి. మ్యాటర్‌తో కలవకుండా యాంటీమ్యాటర్‌ను భద్రపరిచే ప్రయత్నాలు సాగాలి. ఇది కేవలం ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ క్షేత్రాల్లో మాత్రమే సాధ్యమని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సెర్న్ ఇప్పుడు యాంటీమ్యాటర్ తయారీకి ప్రయత్నిస్తోంది. అత్యాధునిక సాంకేతికతతో నియంత్రిత వాతావరణంలో దీనిని ఉత్పత్తి చేయడానికి, శాస్త్రవేత్తలు అపారమైన శక్తిని ఉపయోగించనున్నారు. CERNలో, పరిశోధకులు శక్తివంతమైన కణ యాక్సిలరేటర్లను ఉపయోగించి ప్రోటాన్లను ఇరిడియం లక్ష్యంతో ఢీకొట్టే ముందు అధిక వేగంతో ముందుకు నడిపిస్తారు. (దున్నకుండా.. కలుపు తీయకుండా.. రసాయనాల్లేకుండానే సాగు!)యాంటీ మ్యాటర్‌పై అధ్యయనాలుయాంటీ మ్యాటర్ అంతులేని శక్తిని ఉత్పత్తి చేస్తుంది కాబట్టి అంతరిక్ష పరిశోధనలకు దీనిని ఉపయోగించవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. యాంటీమాటర్ ఉత్పత్తిలో ఉన్న కష్టం, ఖర్చును దృష్టిలో ఉంచుకుని, శాస్త్రవేత్తలు ఈ అంతుచిక్కని పదార్ధంపై తీవ్ర పరిశోధనలను కొనసాగిస్తున్నారు.విశ్వం ప్రారంభంలో సమాన మొత్తంలో పదార్థం, యాంటీమాటర్ సృష్టించబడ్డాయని శాస్త్రవేత్తలు విశ్వాసం. అవి ఒకదానికొకటి పూర్తిగా నాశనం చేసుకుని ఉండి ఉంటే, ఎలాంటి మ్యాటర్ మిగిలి ఉండకపోతే నేడు మనం చూస్తున్న గెలాక్సీలు, నక్షత్రాలు , గ్రహాలు ఎలా ఉండేవి అనేది ప్రధానమైన ప్రశ్న. ఒకవేళ మనకు కనిపించకుండా యాంటీమ్యాటర్ గెలాక్సీలు దాగి ఉన్నాయా? దీన్ని అర్థం చేసుకోవడానికే ఈ పరిశోధనలు. ఇదీ చదవండి: మదర్స్ ప్రైడ్ : తల్లిని తలుచుకొని నీతా అంబానీ భావోద్వేగం -
పతి దేవుడిపై ప్రతీకారమా? బెంబేలెత్తుతున్న బట్టతల బంగారమ్స్!
కాదేదీ వైరల్‌కు అనర్హం అన్నట్టు ఉంటుంది సోషల్ మీడియా వ్యవహారం. ఎపుడు ఎలాంటి వీడియో వైరల్ అవుతుందో తెలియదు. అనేక సామాజిక అంశాలతోపాటు, ప్రేయసీ ప్రియుల చిలిపి తగాదాలు, భార్యభర్తల సరసాలు ,ఫైటింగ్‌లు లాంటి వీడియోలు నెట్టింట సందడి చేస్తూ ఉంటాయి. అలా తన పతిదేవుడిపై ఒక సతీమణి ప్రతీకారం తీర్చుకున్న వైనం వైరల్‌గా మారింది. ప్రతీకారం అంటే అదేదో హింసా, ప్రతి హింస అనుకునేరు. చదవండి మరి!తనకు చపాతి కావాలని అడిగాడు ఓ భర్త. ‘హే...పో.. ఇపుడెవరు చేస్తారు’ అంది భార్యామణి విసుగ్గా. నేనేమైనా మణులు, మాణిక్యాలు అడిగానా, చపాతియేగా..నాకోసం ఆ మాత్రం చేయలేవా అన్నాడు భర్త. అంతే క్షణాల్లో అక్కడి వాతావరణం మారిపోయింది. ముందు ఇల్లు పీకి పందిరేసినంత పనిచేసిన భార్య చివరికి చపాతీ తయారీకి రంగంలోకి దిగింది. ‘‘ఇగో.. నేను చపాతీ చేయాలంటే నువ్వు సాయం చేయాలి మరి అంది గోముగా.. ఓ..దానిదేముంది చేసేద్దాం అన్నాడు భార్యామణి అసలు ప్లాన్ తెలియని భర్త.అంతే కిచెన్ లోకి వెళ్లి గోధుమపిండి తీసుకొచ్చింది. బాగా పిసికి మెత్తగా పిండిని రెడీ చేసేసింది. ఆ తర్వాత ఇంటి పక్కన ఉన్న ఖాళి ప్రదేశంలో, చపాతీలు కాల్చేందుకు కట్టెల పొయ్యి సిద్ధం చేసింది. ఇది చూసి ఇంకా ఉత్సాహంతో రంగంలోకి దిగాడు భర్త. మాంచిగా మఠం వేసుకుని కూర్చున్నాడు. మరి చపాతీలు చేయడానికి పీట ఏది అని అడిగాడు.. దానికి ఆమె పీటా, గీటా లేదని చెప్పింది. ‘‘అదేమిటోయ్..పీట లేకుండా చపాతీ ఎలా చేసేది’’ అంటూ భార్యమీద గుర్రుమన్నాడు. అప్పుడు తన ప్లాన్‌ను పక్కాగా అమలు చేసే సమయం కోసం ఎదురు చూస్తున్న భార్యామణి అటు ఇటు చూసిన ఆమె మీ గుండుగా నున్న....గా, దాని మీద చేస్తాను అన్నది. ఓసి నీ దుంపదెగ ఇదేం పని హూంకరించాడు భర్త. అవన్నీ జాన్తా నహీ.. మీకు చపాతి కావాలా? వద్దా? అని ఆమె ప్రశ్నించింది. సరే అలానే కానివ్వూ అని అన్నాడు. అలా అనడం ఆలస్యం, ఇంక ఏ మాత్రం సంకోచించకుండా, నున్నటి అతగాడి గుండు మీద తన ప్రతాపన్నంతా చూపించింది (చాలా రోజులనుంచి బోడి గుండు మీదు కోపం ఉన్నట్టుంది పాపం..) చపాతీలు వత్తడం మొదలుపెట్టింది. భర్త చక్కగా పిండిలో ముంచి ఇవ్వడం, ఆమె గుండ్రంగా చపాతీ వత్తడి, ఆ తరువాత దాన్ని ఆయనగారు తీసి పెనం మీద కాల్చడం.. ఇందులో చూడవచ్చు. గతేడాది నవంబరులో షేర్ అయిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఫన్నీగా కమెంట్స్ చేశారు.అరే... ఇందేంది భయ్యా.. నవ్వి నవ్వి మేం పోతే ఎవరు గ్యారెంటీ అంటూ కామెంట్ చేస్తున్నారు. కిచెన్‌లో చపాతీలు తయారు చేయడానికి పీట కూడా లేదా? ఎంత బోడిగుండు అయితే మాత్రం భర్త తల మీద చపాతీలు చేస్తారా? రివెంజ్ ఇలా తీర్చుకుంటారా అన్నారు. అంతేకాదు కొంతమంది భార్యలు కూడా ఇదే ఫాలో అయితే బోడినెత్తి బంగారు బాబుల పరిస్థితి ఏంటి బాసూ అంటూ వ్యాఖ్యానించారు. మరికొందరేమో సోషల్ మీడియాలో హైప్ కోసం ఇలాంటి పనులు చేస్తున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. View this post on Instagram A post shared by GUAH BOCAH BOJONGGEDE (@katababa_) -
ఎవల్యూషన్ డే’ని జరుపుకొందాం!
ఇంగ్లిష్ నేచురలిస్ట్ ఛార్లెస్ డార్విన్ తన జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రకటించిన రోజు 1859 నవంబర్ 24. ఈ ఆధునిక వైజ్ఞానిక కాలానికి ఆ సిద్ధాంతం ఎంత ముఖ్యమో గ్రహించడానికి, ఆ శాస్త్రవేత్త మీద ఉన్న గౌరవం ప్రకటించుకోవడానికి 24 నవంబర్‌ను ‘ఎవ ల్యూషన్ డే’గా ప్రపంచ దేశాలన్నీ జరుపుకొంటున్నాయి. దీన్ని పెద్ద ఎత్తున మన దేశంలో కూడా జరపడం అవసరం. ఎందుకంటే వైజ్ఞానిక దృక్పథం దేశంలో బలహీనపడుతోంది. జీవ పరిణామ సిద్ధాంతం (థియరీ ఆఫ్ ఎవొల్యూ షన్) పనికిరానిదని మాట్లాడే రోజులొచ్చాయి. ఇలాంటి వాటిని అడ్డుకోవాలంటే, ప్రగతి శీల భావాలు గల వారంతా వైజ్ఞానిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుపుకోవాలి. ‘నిన్ను నువ్వు తెలుసుకో’ అని ధ్యానిస్తూ కళ్ళు మూసు కోవడం కాదు, నువ్వెవరు? ఎన్ని పరిణామాలు జరిగి, నువ్వు ఇలా మారావు అన్నది తెలుసుకుంటే, నీ కళ్ళు తెరు చుకుంటాయి. ఎన్నెన్ని మానవ జాతులు ఉద్భవించి అంతరించాయి? ఎన్ని వలసల తర్వాత నీ జాతి ఇప్పుడు నువ్వు ఉన్న ప్రాంతా నికి చేరింది వంటి విషయాలు క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే, జీవ పరిణామం గురించి పూర్తిగా తెలుసుకోవాలి. చీకట్లోనే జీవితం బాగుందనుకునే వారితో మనకు పేచీ లేదు. జీవితంలో వెలుగులు కావాలనుకునేవారు తప్పక వైజ్ఞానిక స్పృహ పెంచుకుంటారు. జీవ పరిణామం గురించి తెలుసుకుంటారు. మత మౌఢ్యాన్ని చావుదెబ్బ తీసిన డార్విన్ పరిణామ సిద్ధాంతం వెలువడిన ఆ రోజును గుర్తు చేసుకుంటారు.అర్థవంతమైన వైజ్ఞానిక కార్యక్రమాలు విద్యాసంస్థల్లోగానీ, పౌర సమాజాల్లోగానీ, కుటుంబాల్లోగానీ ఏ ఒక్కటైనా నిర్వహిస్తు న్నారా? లేదు కదా? అందుకే ఉపాధ్యాయులు, అధ్యాపకులు, సైన్స్ కార్యకర్తలు, బాధ్యతగల పౌరులు, వివేకవంతులైన అధికారులు, మరీ ముఖ్యంగా మహిళలు పూనుకుని దేశంలోకొనసాగుతున్న విషమ పరిస్థి తులను అర్థం చేసుకుని, ఎక్క డికక్కడ ఎవరికి వారు వైజ్ఞానిక దృక్పథాన్ని పెంపొందించే కార్యక్రమాలకు రూపకల్పన చేసుకోవాలి. వట్టి ఆలోచన లతో పని జరగదు. వాటిని ఆచ రణలో పెట్టాలి. విద్యా సంస్థల్లో పనిచేసే వారిపై బాధ్యత మరింతగాఉంది. విద్యార్థులకు జీవ పరి ణామంపై, డార్విన్‌పై సంద ర్భాన్ని బట్టి ఇంకా అనేక వైజ్ఞానిక అంశాలపై వ్యాస రచన, ఉపన్యాస పోటీలు పెడుతూ వారిలో వైజ్ఞానిక జిజ్ఞాస పెంచాలి. భావి భారత పౌరులు వారే గనక, మనం వారి మీదే శ్రద్ధ పెట్టాలి. వారిని హేతుబద్ధంగా ఆలోచింప జేయాలి. మానవ వాదులుగా తీర్చిదిద్దు కోవాలి. చేస్తున్న కార్యక్రమాలతో మనం మరొ కరికి స్ఫూర్తినిస్తూ ఉండాలి.– డా. దేవరాజు మహారాజువ్యాసకర్త కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత, బయాలజీ ప్రొఫెసర్‘ -
ఆ రోజు ఇల్లు కదలరు.. ముద్ద ముట్టరు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: తెలవారకముందే ఊళ్ల వెంట తిరుగుతూ పాత ఇనుప సామాగ్రి కొనుగోలు చేసి, వాటిని అమ్ముకుని పొట్టపోసుకునే ఆ కుటుంబాలు.. వారంలో ఒక రోజు మాత్రం ఇల్లు వదిలి బయటకు వెళ్లరు. ఆ రోజు ఇల్లు, వాకిలి కూడా ఊడ్చరు. పొయ్యి వెలిగించేది అసలే లేదు. రోజంతా వాళ్లు ఆధ్యాత్మిక చింతనలోనే గడుపుతారు. వాళ్లే లహరి కృష్ణ భక్తులు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రమన్నుకుచ్చ ప్రాంతంలో బుడగ జంగాల కులానికి చెందిన 110 కుటుంబాలున్నాయి. వారు దశాబ్దాలుగా శ్రీ లహరి కృష్ణ ఆధ్యాత్మిక చింతనలో గడుపుతున్నారు. ప్రతి ఇంటి ముందు లహరి కృష్ణకు సంబంధించిన జెండా ఒకటి రెపరెపలాడుతూ ఉంటుంది. ఈ సంప్రదాయంలో కొబ్బరికాయ (Coconut) కొట్టడం, అగరొత్తులు వెలిగించడం ఉండవు. ఏటా అక్టోబర్ 3న జెండా పండుగ నిర్వహిస్తారు. పండుగపూట శాకాహార భోజనం.. అదీ అందరూ ఒకే చోట చేస్తారు. ఆ 24 గంటలు ప్రత్యేకంవీరు శుక్రవారం (Friday) సాయంత్రం 6 గంటల నుంచి శనివారం (Saturday) సాయంత్రం 6 గంటల వరకు ప్రత్యేక దినచర్యను పాటిస్తారు. ఆ సమయంలో ఇంట్లో పొయ్యి వెలిగించరు. పిల్లల కోసం ముందు రోజు వండిన ఆహారంలో కొంత మిగిలించి శనివారం తినిపిస్తారు. పెద్దవాళ్లయితే ఆ రోజంతా ఏమీ తినరు. సిగరెట్, బీడీలు, మద్యం ముట్టరు. శనివారం కనీసం ఇళ్లు, వాకిళ్లు కూడా ఊడవరు. అందరూ శనివారం ఇంటి వద్దే ఉంటారు. చదవండి: ‘చెప్పు’కోలేని బాధలు.. అన్నదాత అవస్థలుఎంత పని ఉన్నా శనివారం సాయంత్రం 6 గంటల తర్వాతే బయటకు వెళతారు. శనివారం ఎవరైనా చనిపోయినా అంత్యక్రియలు కూడా చేయరు. గ్రామంలోని శ్రీ లహరి కృష్ణ స్తుతి ధ్యాన మందిరంలో శనివారం సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు ప్రార్థనలు చేస్తారు. ఆ తర్వాతే బయటకు వెళతారు. భగవద్గీత, బైబిల్, ఖురాన్.. ఇలా అన్నింటినీ పాటిస్తామని వీరు చెబుతున్నారు. అందరం నియమాలు పాటిస్తాంఇక్కడ ఉన్న వాళ్లందరూ పేద, మధ్య తరగతివారే. శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి శనివారం సాయంత్రం 6 గంటల వరకు ఇంట్లో పొయ్యి వెలిగించరు. లహరి కృష్ణ సమాజంలోని అన్ని కుటుంబాలు ఈ ఆచారాన్ని పాటిస్తాయి. – దాసరి శ్రీనివాస్, ధ్యానమందిరం నిర్వాహకుడు -
ఆ జంటకి వివాహమై 84 ఏళ్లు..!
వివాహమై 40 ఏళ్లు లేదా 60 ఏళ్లు అవ్వొచ్చు. మరీ ఎక్కువ కాలం ఇరువురు బతికుంటే దగ్గర దగ్గర 66 ఏళ్లు కూడా అవ్వొచ్చు. అంతేగానీ అన్నేళ్లు ఇరువురి జీవనయానం సాగించడం అంత ఈజీ కాదు. మధ్యలో ఎవరో ఒకరు కాలం చెందడం సర్వసాధారణం. అందులోనూ నేటి యువత పెళ్లై పట్టుమని రెండేళ్లు కూడా కలిసి ఉండటం లేదు. అలాంటి జంటల సంఖ్య వేళ్లతో లెక్కించలేనంత మంది ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో..దగ్గర దగ్గర సెంచరీకి సమీపం వరకు అన్నేళ్లు కలిసి సహచర్యం చేసిన జంటగా రికార్డు దక్కించుకుంది ఈ వృద్ధ జంట. వారిక ఏకంగా వందమంది పైగా మనవరాళ్లు, మనవళ్లు ఉన్నారు. ఇక ఆ వృద్ధ దంపతుల వయసు ఎంత ఉండొచ్చు, పెళ్లి ఎప్పుడైంది వంటి విశేషాల గురించి తెలుసుకుందామా..!.పెళ్లై 84 ఏళ్లు గడిచిన వృద్ధులుగా ఈ బ్రెజిలియన్ జంట నిలిచింది. సుదీర్ఘ కాలం అన్యోన్య దాంపత్య జీవితం గడిపిన జంటగా రికార్డు సృష్టించింది. ఆ దంపతుల పేర్లు మనోయల్ ఏంజెలిమ్ డినో, మరియా డి సౌసౌ డినో. వారి ప్రేమ కథ అత్యంత విచిత్రంగా జరిగింది. ఇద్దరు తమ కుటుంబాల పోషణ కోసం వ్యవసాయం చేస్తుండేవారు. ఇరువురు ఆ వ్యవసాయ వృత్తి ద్వారానే ఇరువురికి పరిచయం ఏర్పడింది. అయితే మళ్లీ విధి అనుకోకుండా మరోసారి ఎదురపడేలా చేసింది. ఇక అప్పుడే ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది. ఇక మనోయల్ కూడా తన మనసులోని మాటను మరియాకి చెప్పేశాడు. అందుకు సుమఖత వ్యక్తం చేసింది. అలా ఇద్దరు 1940లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఇద్దరూ పోగాకు చుట్టడాన్ని జీవనోపాధిగా చేసుకుని బతుకు సాగించేవారు. ఇప్పుడు మనోయల్ వయసు 105 ఏళ్ల, మరియాకి 101 ఏళ్లు. ప్రస్తుతం ఇరువురు విశ్రాంతి జీవితం గడుపుతున్నారు. ఇన్నాళ్లు తమ వైవాహిక జీవితంలో ఇంతలా కలిసి ఉండటానికి కారణం ఒక్కటే ప్రేమ. అది తమ ఇద్దరి మధ్య మరొకరు వచ్చి అగాథం సృష్టించ లేనంత నమ్మకం, ప్రేమ వంటివి స్ట్రాంగ్ ఉన్నాయని చెబుతోంది ఈ జంట. "ఇరువురం అనుకోకుండా భార్యభర్తలమయ్యాం. మంచో చెడో వివాహ బంధంతో ఒక్కటయ్యాం. కడదాక నిలుపుకోవాలనుకున్నాం. మా ఇరువరి మధ్య ఉన్న విడదీయరాని ప్రేమ కారణంగా సుదీర్ఘకాలం అన్యోన్యంగా ఉండగలగాం." అని అంటున్నారు ఈ దంపతులు. అంతేగాదు ఎలాంటి పొరపాటు, తప్పు జరిగినా దాన్ని లేవనెత్తడం, ఆరోపణలు చేసుకోవడం వంటి వాటికి తావివ్వకోపోడం వల్లే తమ బంధం దృఢంగా ఉందని అన్నారు. అదే తమ సుదీర్ఘకాల ఆరోగ్య రహస్యానికి కారణం కూడా అని చెబుతోంది ఈ వృద్ధ జంట. నిజమే కాదు వ్యక్తిగత జీవితం ఆహ్లాదంగా ఏంటేనే కదా..మానసిక, శారీరక ఆరోగ్యం బాగుండేది. -
పాతబస్తీ కుర్రాడు సైక్లింగ్‌లో ఇంటర్నేషనల్ లెవెల్..!
పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా.. ఇంటర్నేషనల్.. ఇటీవల వచ్చిన ఓ సినిమాలోని సూపర్‌హిట్ డైలాగ్.. అలాగే హైదరాబాద్ చార్మినార్‌లోని పాతబస్తీకి చెందిన ఓ విద్యార్థి పారా సైక్లింగ్‌లో నేషనల్ లెవెల్ దాటుకొని ఇంటర్నేషనల్‌కు చేరాడు. చిన్ననాటి నుంచి చదువుతో పాటు సమయం దొరికినప్పుడల్లా క్రీడలపై మక్కువ చూపుతుండేవాడు. జాతీయ స్థాయిలో పలు పతకాలు సాధించి ప్రస్తుతం థాయిలాండ్‌లో జరుగుతున్న 13వ ఏషియన్ పారా రోడ్ సైక్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్నాడు శాలిబండ సైక్లింగ్ క్లబ్ విద్యార్థి ఆశీర్వాద్ సక్సేనా.. పాతబస్తీ బేలా కాలనీకి చెందిన ఆశీర్వాద్ సక్సేనా కుటుంబం వ్యాపార రంగంలో ఉండగా చిన్ననాటి నుంచి క్రీడలంటే ఇష్టం ఉండటంతో కుటుంబ సభ్యులు ప్రోత్సహించారు. ఎప్పుటికప్పుడు తన కోచ్‌ల ద్వారా మెళకువలు నేర్చుకుంటూ సైక్లింగ్‌లో ప్రతిభ కనబర్చాడు. మెల్బోర్న్లోని డాకిన్ యూనివర్సిటీలో ఎక్సైర్సైజ్ అండ్ స్పోర్ట్స్ సైన్స్‌లో డిగ్రీ విద్యాభ్యాసం చేస్తూనే సైక్లింగ్‌లో రాణిస్తున్నారు. దేశ, విదేశాల్లో జరిగే సైక్లింగ్ పోటీల్లో పాల్గొంటున్నారు. ఓవైపు విద్యాభ్యాసం.. మరోవైపు సైక్లింగ్‌లో పాల్గొంటూ పతకాల వేట కొనసాగిస్తున్నాడు. థాయిలాండ్‌లో కొనసాగుతున్న 13వ ఏషియన్ పారారోడ్ సైక్లింగ్ ఛాంపియన్షిప్–2025లో పాల్గొనేందుకు నగరం నుంచి తన కోచ్‌లతో కలిసి వెళ్లాడు. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులు, రివార్డులు సాధించిన ఆశీర్వాద్ సక్సేనా థాయిలాండ్‌లో మెడల్ సాధిస్తాడని పలువురు క్రీడాభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 38వ జాతీయ ఆటల పోటీలలో..ఉత్తరాఖాండ్‌లో నిర్వహించిన 38వ జాతీయ పోటీల్లో 120 కిలోమీటర్ల మాస్ స్టార్ట్ రోడ్ రేస్ పోటీలో కాంస్యం గెలుచుకున్నారు. ఇంటర్నేషనల్ సైక్లిస్ట్ ఆఫ్ హైదరాబాద్‌గా.. రాష్ట్రం తరఫున కాంస్యం సాధించిన ఆశీర్వాద్ సక్సేనాను తెలంగాణ స్టేట్ సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి బి.విజయ్‌కాంత్‌రావు, కార్యనిర్వాహక కార్యదర్శి కె.దత్తాత్రేయ తదితరులు అభినందించారు. ఆశీర్వాద్ సక్సేనాను ఇంటర్నేషనల్ సైక్లిస్ట్ ఆఫ్ హైదరాబాద్‌గా పిలుస్తున్నామని కె.దత్తాత్రేయ పేర్కొన్నారు. యువ క్రీడాకారులకు రోల్ మోడల్‌గా.. అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించాలని నా కోరిక. విలువైన కాలాన్ని వృథా చేసుకోకుండా ఓ వైపు ఉన్నత విద్యాభ్యాసం చేస్తూనే.. మరోవైపు ఇష్టమైన సైక్లింగ్ పోటీల్లో పాల్గొంటున్నాను అని చెబుతున్నాడు ఆశీర్వాద్ సక్సేనాసాధించిన మెడల్స్..2019లో మహారాష్ట్రలో జరిగిన ఇండియన్ రోడ్ సైక్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలో కాంస్యం 2021లో జైపూర్‌లో ట్రాక్ సైక్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో వెండి, కాంస్య పతకాలు 2022లో గౌహతిలో ట్రాక్ సైక్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో రెండు వెండి పతకాలతో పాటు రెండు కాంస్య పతకాలు 2022లో న్యూఢిల్లీలో జరిగిన ఆసియా ట్రాక్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం 2024లో మెల్బోర్న్లో అండర్–23 విభాగంలో క్రిటేరియం సైక్లింగ్ రేస్‌లో కాంస్యం 2024లో కర్ణాటకలో జరిగిన నేషనల్ రోడ్ సైక్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం 2024లో చెన్నైలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో రెండు బంగారు పతకాలతో పాటు వెండి పతకం సాధించారు. (చదవండి: భారత నారీమణుల మరో అరుదైన సాహసం..ప్రమాదాలకు కేరాఫ్ అయినా..!) -
పూసల దండలు అమ్మే అమ్మాయి నగల షాపు ఓపెనింగ్‌కి గెస్ట్‌గా..!
ఈ ఫొటోలో ఉన్న అమ్మాయినిగుర్తు పట్టారా? కేరళలో ఒక నగల షాపుకు ఓపెనింగ్‌కు వచ్చింది. అంటే డబ్బు ఇచ్చి పిలిపించి ఆమె చేత ఓపెనింగ్ చేయించారు. తమాషా చూడండి. రోడ్డు మీద కూచుని పూసల దండలు అమ్మే అమ్మాయి బంగారు ఆభరణాల షోరూమ్‌కు రిబ్బన్ కత్తిరించడం. సోషల్ మీడియా గొప్పతనం అలా ఉంది. మీకర్థమైంది కదా.. ఈ అమ్మాయి మోనాలిసా. మెడలో పూసలు వేసుకుని తిరిగే అమ్మాయి అదే మెడలో ఖరీదైన నెక్లెస్‌ను కాసేపటి కోసమైనా ధరించగలనని ఊహిస్తుందా? అదే జరిగింది. అదే మేజిక్.కుంభమేళాకు పూసలమ్ముకోవడానికి వచ్చిన 16 ఏళ్ల మోని భోంస్లే తన అందమైన కళ్లతో ప్రపంచాన్నే ఆకర్షించింది. ఆమె ఫొటోలు సోషల్ మీడియా తోపాటు ప్రొఫెషనల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. ‘మోనాలిసా’ పేరుకు రాత్రికి రాత్రి ఇన్‌స్టాలో ఆమె ఫాలోయెర్లు కోట్లకు పెరిగారు. ఇండోర్‌లో నిరుపేద కుటుంబానికి చెందిన మోని భోంస్లే ఇప్పుడు సెన్సేషన్. ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ సినిమా కోసం ఆమె 21 లక్షల పారితోషికానికి సైన్ చేసిందని వార్త. ఇక ఇప్పుడు షోరూమ్‌ల ప్రాంరంభానికి కూడా ఆహ్వానాలు అందుకుంటోంది. కేరళ కోజికోడ్‌కు చెందిన జ్యువెలరీ షోరూమ్‌ను వాలెంటైన్స్ డే రోజున మోని భోంస్లే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించింది. దాని యజమాని బాబీ చెమ్మనూర్ ఒక ఖరీదైన నెక్లెస్‌ను కాసేపు మెడలో వేసి ఆమెను సంతోషపెట్టారు. ఆమెను చూడటానికి జనం విరగబడ్డారు. ఆమెరాకతో ప్రచారం బ్రహ్మాండంగా దొరికింది. బదులుగా ఆమెకు మంచి పారితోషికం లభించింది. విమానాలలో, లగ్జరీ కారుల్లో ఇప్పుడు మోని భోంస్లే తిరుగుతోంది. సోషల్ మీడియా ఎవరి జాతకాన్ని ఎలా మారుస్తుందో ఊహించలేము. టాలెంట్ ఉంటే జనానికి చేరడానికి సోషల్ మీడియా ఉంది. దానిని సరిగ్గా ప్రదర్శించాలి. అయితే ఇదే సోషల్ మీడియాలో మెజారిటీ సెంటిమెంట్స్‌కు వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే పాతాళానికి పడిపోతాము. కనుక ఆచితూచి వ్యవహరించాలి. ఇటీవల నంబర్ 1 యూట్యూబర్ రణ్వీర్ అహ్లాబాదియా మాట తూలి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. మరో విషయం ఏమిటంటే వ్యక్తిగత వివరాలు, చిరునామాలు వెల్లడి చేయకుండా సోషల్ మీడియాలో కేవలం మన టాలెంట్‌ను, కళను, ప్రతిభను చూపాలి. స్త్రీలు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. అదృష్టం కలిసొస్తే మోనాలిసా లాంటి ఫేమ్ పెద్ద కష్టం కాదు. View this post on Instagram A post shared by boche (@dr.boby_chemmanur) (చదవండి: కోళ్ల అందాల పోటీలు..!) -
కోళ్ల అందాల పోటీలు..!
కోడి పందేల్లోనే కాదు, అందాల పోటీల్లోనూ తగ్గేదేలే అంటున్నాయి కోళ్లు. కోళ్లకు అందాల పోటీలేంటని ఆశ్చర్యపోకండి, అందం ఎవరి సొంతం కాదని, కోడి పందేల మాదిరే, ఇరాక్‌లోని కుర్దిస్తాన్ జిల్లా, సులేమానిలో ఓ ప్రైవేటు సంస్థ ఇటీవల కోళ్లకు అందాల పోటీలను నిర్వహించింది. ఈ పోటీల్లో, దాదాపు వందకుపైగా కోళ్లు పోటీ పడగా, ఇరాక్‌కు చెందిన గరీబ్ మహమ్మద్ పెంచుకున్న కోడి, 96 పాయింట్లతో విజయం సాధించింది. కోడి శరీర పరిమాణం, రంగు, జాతి, ఈకల నాణ్యత, శరీర అకృతి ఇలా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని, పోటీ న్యాయనిర్ణేతలు దీనికి ఈ పాయింట్లను ఇచ్చారు. ఇక ఈ విషయమై మహమ్మద్ మాట్లాడుతూ ‘నేను నా రెండు కోళ్లను కేవలం ప్రదర్శన కోసం మాత్రమే పెంచాను. వాటి ఆరోగ్యం, ఆహారం విషయంలో మొదటి నుంచే చాలా జాగ్రత్తలు తీసుకున్నా. ఇంకా చెప్పాలంటే, నా పిల్లల కంటే నా కోడినే నేను ఎక్కువగా ప్రేమిస్తాను’ అని చెప్పాడు. (చదవండి: సునామీలో సర్వం కోల్పోయారు..కానీ ఆ అక్కా చెల్లెళ్లు ఐఏఎస్, ఐపీఎస్‌లుగా..) -
డొల్ల విలాస్
పైన పటారం, లోన లొటారం అంటే అచ్చం ఇలాగే ఉంటుంది. 1987లో ఉత్తర కొరియా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘ది ర్యుంగ్యాంగ్ హోటల్(The Ryungyang Hotel)’ అత్యంత ఖరీదైన నిర్మాణాల్లో ఒకటి. ‘ది హోటల్ ఆఫ్ డూమ్’( The Hotel of Doom) అని పిలిచే ఈ నిర్మాణం కోసం ప్రభుత్వం ఇప్పటి వరకు సుమారు ఆరువందల మిలియన్ల పౌండ్లు (అంటే రూ.6,330 కోట్లు) ఖర్చు చేసింది.తాజాగా, ఈ హోటల్‌కెళ్లిన యూట్యూబర్ కాకెరల్, ‘వెయ్యి అడుగుల ఎత్తు, 105 అంతస్తులతో పిరమిడ్ ఆకారంలో, బయటకు అందంగా కనిపించే ఈ హోటల్ లోపల అంతా డొల్ల్ల. చుట్టూ సిమెంట్ గోడలతో, చేసింది. అది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. నిజానికి, అతిథుల కోసం లగ్జరియస్ సదుపాయాలు, మూడువేల గదులతో డిజైన్ చేసిన ఈ హోటల్‌ను ఇప్పటి వరకు తెరవలేదు.వనరుల లోపం కారణంగా మధ్యలోనే ఈ నిర్మాణాన్ని ఆపేశారు. అప్పటి నుంచి కేవలం చూడటానికి మాత్రమే అందంగా కనిపిస్తుంది కాని, ఇప్పటి వరకు ఈ హోటల్ ఒక్క అతిథికి కూడా ఆతిథ్యం ఇవ్వలేదు. ఇంకా నిర్మాణ దశలో ఉన్న హోటల్ ఇలాగే ఉంటుందని కొందరు అంటుంటే, మరికొందరు, కేవలం చూడటానికే ఈ హోటల్‌ను నిర్మించినట్లు ఉన్నారని సెటైర్లు వేస్తున్నారు. -
ప్రపంచం అంతమయ్యేది అప్పుడే..! వెలుగులోకి న్యూటన్ లేఖ..
ఇంతవరకు ప్రపంచం అంతం ఫలానా టైంలో అంటూ ఏవేవో పుకార్లు హల్చల్ చేశాయి. వాటిపై సినిమాలు కూడా వచ్చాయి. కానీ అది నిజంగా ఎప్పుడని చెప్పేందుకు కచ్చితమైన ఆధారాలు కానరాలేదు. తాజాగా సరిగ్గా ఆ ఏడాదిలోనే ప్రపంచం అంతం అని చెప్పేందుకు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. అది కూడా సర్ హైజాక్ న్యూటన్ పరిశోధనలో బహిర్గతమవ్వడం విశేషం. నిజానికి దాన్ని ఆ శాస్త్రవేత్త ఎలా నిర్థారించారనేది కూడా పరిశోధనలో వివరించారు.చలనం, గురుత్వాకర్షణ నియమాలను రూపొందించడంలో ప్రసిద్ధి చెందిన సర్ ఐజాక్ న్యూటన్ 1704లో రాసిన ఓ లేఖలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇలా ప్రపంచం అంతం అవ్వడాన్ని ముందుగా అంచనా వేయడాన్ని డూమ్స్‌డే సిద్ధాంతం లేదా ప్రవచనం అని అంటారు. ఇక న్యూటన్ తన డూమ్స్‌డే ప్రవచనాన్ని బైబిల్ పొటెస్టంట్ వివరణ, బైబిల్ చరిత్ర తర్వాత జరిగిన సంఘటనలు, ఆర్మగెడానా యుద్ధం ఆధారంగా ఆ విషయాన్ని నిర్థారించినట్లు లేఖలో పేర్కొన్నారు. తాను చెప్పిన ఏడాది కంటే ముందే ప్రపంచం ముగిసిపోతుంది అనడానికి ఎలాంటి కారణాలు కనిపించడం లేదని ఆ లేఖలో తెలిపారు. ఇది కేవలం అంత్య సమయం అంచనా వేయడానికే గాక ఊహజనిత వ్యక్తుల తొందపాటు ఊహలను ఆపడం, వారి అంచనాలు సరైన కావని తేల్చి చెప్పేందుకే ఇలా దీనిపై పరిశోధన చేసి మరి గణించినట్లు లేఖలో వివరించారుఅదంతా 150 నవల నిడివి గల పుస్తకాల్లో పొందుపరిచినట్లు తెలిపారు. దానిలోని 1260, 1290, 2300 రోజుల సంఖ్యను ఉపయోగించి ఏ ఏడాది అంతమవుతుందనేది నిర్ణయించాడు న్యూటన్. దీనిలోని కొన్ని ముఖ్యమైన క్షణాల ముగింపు, ప్రారంభాన్ని సూచిస్తాయి. ఆ రోజులను సంవత్సరాలుగా నిర్ణయించాడు. తత్ఫలితంగా 800 ADని చర్చిని వదిలివేయడం అధికారికంగా ప్రారంభమైన తేదీగా నిర్ణయించారు. అదే పవిత్ర రోమన్ సామ్రాజ్యం స్థాపించబడిన సంవత్సరం. అంటే ప్రపంచం ఆరంభమైన 1,260 సంవత్సరాలకు మళ్లీ రీసెట్ అవుతుందని లేఖలో తెలిపారు. ఆదిమ సంవత్సర క్యాలెండర్ ప్రకారం పన్నెండు నుంచి ఒక సంవత్సరం ముప్పే రోజుల నుంచి ఒక నెల వరకు లెక్కడించడం జరుగుతుందని లేఖలో పేర్కొన్నారు.స్వల్పకాలిక జంతువుల రోజులను జీవించిన రాజ్యాల సంవత్సరాలకు గుర్తుగా ఉంచారు. 1260 రోజుల కాలం, ముగ్గురు రాజులు AC 800 పూర్తి విజయం సాధించిన తేదీలుగా నిర్ణయిస్తే ముగింపు కాలం ఏసీ 2060తో ముగుస్తుందట.ఇలాంటే డూమ్స్ డే అంచనాలను వేసిన ఏకైక వ్యక్తి న్యూటన్ మాత్రమే కాదు 1500 లలో నివసించిన ఫ్రెంచ్ జ్యోతిష్కుడు నోస్ట్రాడమస్, 2025 లో ఒక పెద్ద గ్రహశకలం భూమిని ఢీకొట్టవచ్చని లేదా గ్రహానికి ప్రమాదకరమైన సామీప్యతలోకి రావచ్చని అంచనా వేశారు.(చదవండి: కొత్త.. రుచుల కోకా కట్టుకున్నదీ పేట..) -
పిజ్జా సువాసన గల పెర్ఫ్యూమ్..!ఎక్కడ దొరకుతుందంటే..
పిజ్జా అంటే ఇష్టపడేవాళ్లకు నచ్చుతుందేమో ఈ పెర్ఫ్యూమ్. ఆహార పదార్థాల ఘుమ ఘుమల వాసనతో కూడిన ఫెర్ఫ్యూమ్ ఏం బాగుంటుందనే సందేహం అందిరలోనూ కలుగుతోంది. కానీ పిజ్జాలకు ప్రస్ధిగాంచిన డొమినోస్ మాత్రం వాలెంటైన్స్‌డే సందర్భంగా ఈ వెరైటీ పెర్ఫ్యూమ్ని విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. పైగా తన పిజ్జా కస్టమర్లకు ఇది కచ్చితంగా నచ్చుతుందని ధీమాగా చెబుతోంది. ఇది ఎక్కడ దొరుకుతుందంటే..ఈ వాలెంటైన్స్ డేకి పిజ్జా దిగ్గజం.. పెప్పరోని పిజ్జా లాంటి వాసన వచ్చే పెర్ఫ్యూమ్ను విడుదల చేసింది. పిజ్జా బాక్స్‌లో ఉన్న అనుభూతి కలుగుతుందట. ఈ ఫెర్ఫ్యూమ్ లాంఛ్‌కి సంబంధించిన వీడియోడని కూడా నెట్టింట షేర్ చేసింది డొమినోస్. అంటే ఇది పిజ్జా లాగిద్దామనే కోరిక పెంచుతుందేమో మరీ..!. ఇది తినాలనే కోరికను కలిగించేలా ఉంటుందే తప్ప ప్రేమికుల రోజున ఆహ్లాదాన్ని అందించి, ఒక్కటయ్యేలా ఫీల్‌ని ఎలా తెప్పిస్తుందని నెటిజన్లు సందేహాలు లేవెనెత్తారు. అయితే డొమినెస్ మాత్రం ఈ పెర్ఫ్యూమ్ని పెప్పరోని ప్యాషన్ పిజ్జా నుంచి ప్రేరణ పొందినట్లు తెలుపుతోంది. ఈ పెర్ఫ్యూమ్ స్పైసీ, పెప్పరీ నోట్స్ , వెచ్చని వుడీ అండర్టోన్లతో రూపొందించారట. ఇది పేరుకి తగిన విధంగా పిరమిడ్ ఆకారపు బాటిల్లో పిజ్జా ముక్కలను పోలి ఉంటుంది. అయితే ఇది కొనుగోలుకు అందుబాటులో లేదట. డొమినోస్ ఫిబ్రవరి 10 నుంచి 17 వరకు దీన్ని 65 మంది లక్కీ విన్నర్స్కి గిఫ్ట్‌గా ఇవ్వనుందట. వారంతా ఆ 30 ఎంఎల్ పిజ్జా సెంట్‌ని బహుమతిగా పొందుతారట. ఇది కేవలం యూకే, ఐర్లాండ్‌ల్లో ఉండే ప్రజలకే ఈ అవకాశం దక్కుతుందని పేర్కొంది. నెటిజన్లు మాత్రం ఇదేం వెర్రీ ఇలాంటి పెర్ఫ్యూమ్లను లాంఛ్ చేస్తారా..? అంటూ తిట్టిపోస్తున్నారు. అంతేగాదు డొమినెస్లో పనిచేసేవాడికి ఆ సువాసన ఎల్లప్పుడూ ఉచితంగానే దొరుకుతుంది కదా అని సెటైర్లు వేస్తున్నారు. View this post on Instagram A post shared by Luke Debono 🇲🇹 (@lukedebono1) (చదవండి: ట్రూ హార్ట్స్..వన్ హార్ట్..! 'కళ' కలిపిన ప్రేమ జంటలు..!) -
చరిత్ర గుర్తించని 500 ఏళ్ల నాటి రియల్ లవ్ స్టోరీ..!
చరిత్రలో విషాదకరంగా మిగిలిన ఎన్నోప్రేమ కథలను చూశాం. అయితే అవే కాకుండా మన చుట్టు పక్కలే జరిగిన యదార్థ ప్రేమ సంఘటనలు ప్రాచుర్యం లేక కాలగర్భంలో కలిసిపోతున్నాయి. వాటిని ఒక్కసారి పరికించి తెలుసుకునే యత్నం చేస్తే హృదయం ద్రవించిపోతుంది. అలాంటి రియల్ లవ్ స్టోరీ ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో జరిగింది. ఇది చరిత్ర గుర్తించని 500 ఏళ్ల నాటి యదార్ధ ప్రేమ గాథ. ఇవాళ ప్రేమికుల రోజు సందర్భంగా ఈ తరానికి తెలియకుండా మసకబారుతున్న శతాబ్దల నాటి ఆ అందమైన ప్రేమ కథ గురించి తెలుసుకుందాం.కదిరి నరసింహా దేవాలయంలో చిగురించి ఈ ప్రేమకథ. ఇరాన్ దేశం నుంచి మోహియార్ అనే యువకుడు వ్యాపారం నిమిత్తం భారతదేశానికి వచ్చాడు. వ్యాపార లావాదేవీల్లో భాగంగా అనంతపురం జిల్లాకు చేరుకున్నాడు. ఆ సమయంలో కదిరి నరసింహ దేశాలయంలో కార్తీకమాసం ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రంగరాయల కూతురైన చంద్రవదన స్వామివారిని దర్శనం కోసం వచ్చింది. అప్పుడు ఆ యువతిని చూసిన మెహియర్ తొలిచూపులోనే ప్రేమలో పడ్డాడు. చంద్రవదన కూడా పేరుకు తగినట్లుగా పున్నమి నాటి చంద్రుడిలా ముగ్ధమనోహరంగా ఉంటుంది. ఇక అప్పటి నుంచి మెహియర్ ఆమెను అనుసరిస్తూ..ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడకు వెళ్తుండేవాడు. దీన్ని గమనించిన చంద్రవదన కూడా ఆ యువకుడిని ప్రేమించడం మొదలుపెట్టింది. ఆమె కదిరి పట్టణం వాసుల గారాల పట్టి కావడంతో ఇరువురు కలుసుకోవడం అత్యంత కష్టంగా ఉండేది. దీంతో ఇద్దరు తమ స్నేహితుల ద్వారా ఒకరికొకరు సందేశాలు పంపుకునేవారు. చివరికి తమ ప్రేమ విషయం పెద్దలకు తెలియజేస్తారు. వారి సమ్మతితోనే పెళ్లిచేసుకోవాలనే భావిస్తారు. అందుకు పెద్దలు అంగీకరించారు. పైగా ఆ ప్రేమికులు ఇద్దరిని కలుసుకోనివ్వకుండా కట్టుదిట్టం చేస్తారు. దీంతో విరహవేదనను భరించలేక మెహియర్ పూర్తిగా నిద్రహారాలు మానేస్తాడు. అలా మెహియర్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించి మరణించాడు. తన కారణంగా ప్రాణాలు పోగొట్టుకున్న ప్రియుడిని తలుచుకుంటూ చంద్రవదన కూడా తుదిశ్వాస విడుస్తుంది. ఈ ఘటనతో కదిరి గ్రామం వాసుల ప్రజలు తామెంతో తప్పు చేశామని బాధపడతారు. కనీసం మరణంలోనైన ఇరువురు కలిసి ఉండాలని భావించి ఇరువురు సమాధులను ఒకచోటే ఏర్పాటు చేస్తారు గ్రామస్తులు. ఈ ప్రాంతంలోని అనేకమంది తమ పిల్లలకు మెహియార్ అనే పేరులు పెట్టుకుని ఆ అమర ప్రేమికులను ఇప్పటికీ తలుచుకుంటూనే ఉన్నారు. అంతేగాదు వారి సమాధిని దర్శిస్తే తమ ప్రేమ ఫలిస్తుందనేది ప్రేమికుల నమ్మకం కూడా. దీంతో ఈ సమాధులను దర్శించుకునేందుకు ప్రేమికుల తాకిడి కూడా గట్టిగానే ఉండేది. అయితే రాను రాను తర్వాతి తరాలకు తెలియకుండా మసకబారడం మొదలైంది. దాంతో సందర్శకుల తాకిడి నెమ్మదిగా తగ్గిపోయింది.(చదవండి: 'అంతులేని ప్రేమ కథ': 50 ఏళ్లు గర్ల్‌ఫ్రెండ్ కోసం నిరీక్షించాడు..! ట్విస్ట్ ఏంటంటే..) -
'అంతులేని ప్రేమ కథ': 50 ఏళ్లు గర్ల్‌ఫ్రెండ్ కోసం నిరీక్షించాడు..!
యధార్థ ప్రేమ కథ ఇది. ప్రియురాలు ఇచ్చిన మాటను నమ్మి పది, పన్నేండేళ్లు కాదు ఏకంగా జీవితాంతం ఎదురుచూస్తూనే ఉన్నారు. ఆఖరి శ్వాస వరకు అలానే ఉండిపోరు. ఆమె వస్తుందని చివరి శ్వాస వరకు ఎదరుచూసిన గొప్ప ప్రేమ పిపాసి.ఆ వ్యక్తే మహరాష్ట్రలోని ఖందేశ్‌కు చెందిన కళాతపస్వీ కెకీ మూస్. ఆయన తనకు ఎంతో ఇష్టమైన ఫోటోగ్రఫీ కోసం చాలీస్‌గావ్ అనే ఊరిలో మూస్ ఆర్ట్ గ్యాలరీని స్థాపించారు. ఈ ఆర్ట్ గ్యాలరీ ట్రస్టీ, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ కమలాకర్ సామంత్ ఆయన అంతులేని ప్రేమ కథను వివరించారు. ఆయనిచ్చిన సమాచారం ప్రకారం..1912 అక్టోబర్ 2న ముంబైలోని మలబార్ హిల్‌లో పిరోజా, మానెక్జీ ఫ్రాంజీ మూస్ అనే పార్సీ దంపతులకు కెకీ జన్మించారు. కెకీ పూర్తి పేరు కైకుసారో మానెక్జీ మూస్. వాళ్ల అమ్మ ఆయన్ను కెకీ అని పిలిచేవారు. ఆ తర్వాత ఆ పేరే ఆయన ఐడెంటిటీగా మారింది. చాలిస్గావ్ స్టేషన్‌కు సమీపంలో రాతితో నిర్మించిన ఒక బంగ్లాలో ఆయన నివసించారు.ముంబైలోని విల్సన్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక, ఉన్నత చదువుల కోసం ఇంగ్లండ్ వెళ్లారు. కానీ, తన సోడా వాటర్ ఫ్యాక్టరీ, లిక్కర్ షాపు బాధ్యతలను కెకీయే చూసుకోవాలని మానెక్జీ భావించారు. 1934-35 మధ్యలో మానెక్జీ చనిపోయిన తర్వాత, షాపు నిర్వహణ బాధ్యతలను కెకీ తల్లి పిరోజా తీసుకున్నారు. కొడుకు ఇంగ్లండ్ వెళ్లి ఉన్నత చదువులు చదివేందుకు ఒప్పుకున్నారు. 1935లో లండన్‌లోని బెన్నెట్ కాలేజ్ ఆఫ్ షెఫీల్డ్‌లో చేరారు. నాలుగేళ్ల కమర్షియల్ ఆర్ట్ కోర్సులో డిప్లొమా పూర్తి చేశారు. ఈ కోర్సులో ఫోటోగ్రఫీ కూడా ఒక సబ్జెట్. అది కూడా చదువుకున్నారు కెకీ. ఆ తర్వాత ఆర్ట్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్‌కు చెందిన రాయల్ సొసైటీలో గౌరవ సభ్యత్వం పొందారు. అమెరికా, జపాన్, రష్యా, స్విట్జర్లాండ్లను సందర్శించారు. అక్కడ చాలా ఫోటోగ్రఫీ ప్రదర్శనలను చూశారు. చాలామంది కళాకారులను కలిశారు. 1938లో భారత్‌కు తిరిగి వచ్చారు.ప్రేమ చిగురించింది..ఆయన ముంబైలో చదువుతుండగా నీలోఫర్ మోదీ అనే యువతితో ఆయనకు పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. చదువు పూర్తయిన తర్వాత చాలిస్‌గావ్‌లో ఉంటున్న తన తల్లిదండ్రులతో కలిసి ఉండాలని కెకీ మూస్ నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయం ఆయనకు, నీలోఫర్‌కు మధ్య విభేదాలకు కారణమయింది.కెకీ కుటుంబం ఆర్థికంగా మంచి స్థితిలోనే ఉన్నప్పటికీ, నీలోఫర్ సంపన్న కుటుంబానికి చెందిన వారు. దీంతో నీలోఫర్ తల్లిదండ్రులకు వారి ప్రేమ విషయం అంత నచ్చలేదు. అయినప్పటికీ వారిద్దరూ పెళ్లిచేసుకోవడానికి వారు అంగీకరించారు.అయితే, నీలోఫర్ ముంబై వదిలి చాలిస్‌గావ్‌లాంటి గ్రామీణ ప్రాంతానికి వెళ్లేందుకు ఆమె తల్లిదండ్రులు అంగీకరించలేదు. కెకీతో కలిసి చాలిస్గావ్ వెళ్లేందుకు నీలోఫర్ సిద్ధమైనప్పటికీ, ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. కెకీ ముంబై నుంచి చాలిస్గావ్ వెళ్లేటప్పుడు నీలోఫర్ ఆయనకు వీడ్కోలు పలికేందుకు విక్టోరియా స్టేషన్‌కు వచ్చారు. అది ఇప్పుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ మార్చారు. నీలోఫర్ కైకీకి వీడ్కోలు పలుకుతూ..ఆయన చేతిని తన చేతిలోకి తీసుకుని ఏదో ఒక రోజు తాను కచ్చితంగా పంజాబ్ మెయిల్లో చాలిస్గావ్ వస్తానని, తనతో కలిసి డిన్నర్ చేస్తానని మాటిచ్చారు. ఆ ఒక్క మాట కోసం ఆయన తన చివరి శ్వాస వరకు ఎదురుచూస్తూ ఉండిపోయారు. ఎంతలా ఎదురు చూశారంటే..ప్రియురాలి మాటలపై నమ్మకం ఉంచిన కెకీ మూస్, ఆ రైలు వచ్చినప్పుడు తన బంగ్లా కిటికీలు, తలుపులు అన్నీ తెరిచి ఉంచేవారు. రోజులో మిగిలిన భాగమంతా అవన్నీ మూసేసి ఉండేవి. రైలు వచ్చే సమయానికి దీపాలు వెలిగించేవారు. తోటలోని తాజా పూలతో బొకే తయారుచేసేవారు. తర్వాత తోటలో పువ్వులు లేని సమయంలో వాడిపోని అలంకరణ పూలతో పూలగుత్తులు తయారుచేశారు. ప్రతిరాత్రీ ఆయన ఇద్దరి కోసం భోజనం తయారుచేసేవారు. ఈ పద్ధతిలో ఆయన ప్రతిరోజూ తన ప్రియురాలికి స్వాగతం చెప్పేందుకు రెడీగా ఉండేవారు. అలా చివరి వరకూ ఆయన తన ప్రియురాలికిచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అలా పంజాబ్ మెయిల్ వచ్చి వెళ్లిపోయిన తర్వాతే ఆయన ప్రతిరోజూ డిన్నర్ చేసేవారు. తన చివరి డిన్నర్ డిసెంబరు 31, 1989 వరకు అలానే చేశారు. ఆ రోజూ కూడా పంజాబ్ మెయిల్ రైలు వెళ్లిపోయిన తర్వాతే భోజనం చేసి పడుకున్నారని, ఇక లేవలేదని సావంత్ చెప్పుకొచ్చారు.చిన్న ట్వీస్ట్ ఏంటంటే..కెకీ చనిపోయిన తర్వాత ఆయన ఇంట్లో తాను రెండు లేఖలను చూశానని సామంత్ తెలిపారు. వాటిలో ఒకటి ఆయన ప్రియురాలి నుంచి వచ్చింది. రెండోది కేకీ బంధువు హథిఖాన్‌వాలా నుంచి వచ్చిందని ఆర్ట్ గ్యాలీరీ ట్రస్టీ ఎగ్జిక్యూటివ్ సామంత్ తెలిపారు.ఆయన ప్రియురాలిని లండన్ పంపించివేశారని, అక్కడ ఆమె వివాహం చేసుకున్నారని లేఖలో హథిఖాన్‌వాలా కేకీకి తెలిపారు. అయితే కేకీ ఆ ఉత్తరాలను ఎప్పుడూ చదవలేదని సామంత్ చెప్పారు. ఎన్నింటిలో ప్రావిణ్యం ఉందంటే..కెకీ మూస్ ప్రపంచ ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్. పెయింటర్, సంగీత ప్రేమికుడు, గొప్ప శిల్పి. ఆయనకు పేపర్‌ను అనేక రకాలుగా మడిచి కళాకృతులుగా మార్చే ‘ఒరిగామి’ అనే ఆర్ట్ కూడా తెలుసు. అంతేగాదు మంచి రచయిత, అనువాదకుడు, తత్త్వవేత్త కూడా. అన్ని మత గ్రంథాలను అధ్యయనం చేశారు. ఇంగ్లిష్, ఫ్రెంచ్, జర్మన్, హిందీ, గుజరాతీ, ఉర్దు, మరాఠీ భాషలు వచ్చు. సొంత లైబ్రరీ నిర్మించాలన్న ఉద్దేశంతో దాదాపు 4వేల పుస్తకాలు సేకరించారు. ఉర్దూ కవిత్వమంటే ఆయనకు ఎంతో ఇష్టం. అలాగే ఇతర ఆర్టిస్టుల చెక్కశిల్పాలు, విగ్రహాలు, పురాతన వస్తువులు, పాత అరుదైన పాత్రలు, బొమ్మలు, పాత ఫర్నీచర్, నాణేలను ఆయన సేకరించారు. అనేక రకాల సంగీతానికి సంబంధించిన క్యాసెట్లు, గ్రామ్‌ఫోన్ రికార్డులు సేకరించడం కెకీకి ఒక హాబీ. హిందీ, మరాఠీ, గుజరాతీ, రాజస్థానీ, అలాగే పిల్లల పాటలకు సంబంధించి ఆయన దగ్గర పెద్ద కలెక్షనే ఉంది. View this post on Instagram A post shared by Yatin Pandit (@sculptor.yatinpandit) (చదవండి: చరిత్రలో అజరామరంగా నిలిచిపోయిన ప్రేమకథలు..!) -
Valentines Day 2025: చరిత్రలో అజరామరంగా నిలిచిపోయిన ప్రేమకథలు..!
ఫిబ్రవరి అనగానే ఠక్కున ప్రేమికుల రోజు గుర్తొచ్చేస్తుంది. అదీగాక ఆ నెలంతా కూడా హగ్ డే, కిస్ డే వంటివి వచ్చి.. చివరికి ప్రేమికుల రోజుతో ముగుస్తుంది. రొమాంటిక్ భావనను కలుగజేసే ఆ నెలలో ఉండే సందడి అంత ఇంత కాదు. ప్రేమికులు, వివిధ ప్రేమలు సినిమాలు, టీవీల పుణ్యమా అని వాటి గురించి తెలుసుకుని ఆశ్చర్యపోతున్నాం. కానీ వేల ఏళ్ల చరిత్ర కాలంలోనే హృదయాల్ని కదిలించే అందమైన ప్రేమ కథలు ఉన్నాయి. అవి వింటుంటేనే మనసు అదొలా అయిపోతుంటుంది. మరీ ఈ వాలెంటైన్స్‌డే సందర్భంగా చరిత్ర ముడిపడి ఉండి, అజరామరంగా నిలిచిపోయిన అందమైన లవ్ స్టోరీలను గురించి తెలుసుకుందామా..!మార్క్ ఆంటోనీ- క్లియోపాత్రా:చరిత్రకారులను బాగా ఆకర్షించిన ప్రేమ కథల్లో ఒకటి మార్క్ ఆంటోనీ- క్లియోపాత్రా కథ. జూలియస్ సీజర్ మరణం తరువాత, రోమన్ సామ్రాజ్యాన్ని ముగ్గురు వ్యక్తులు పరిపాలించారు. వారే మార్క్ ఆంటోనీ, ఆక్టేవియస్ సీజర్, లెపిడస్. మార్క్ ఆంటోనీ తూర్పు మధ్యధరాను శాసిస్తూ ఈజిప్టులో నివసిస్తున్నాడు. అతను ఈజిప్ట్ రాణి క్లియోపాత్రాతో కూడా ప్రేమలో పడ్డాడు. ఆంటోని తన భార్య ఫుల్వియా మరణం, తన తోటి పాలకుడు ఆక్టేవియస్ సీజర్‌పై పాంపే తిరుగుబాటు తదితరాల వల్ల ఆంటోనీ రోమ్కు వెళ్లవలసి వస్తుంది. అతను తన స్నేహితుడు ఎనోబార్బస్తో కలిసి ప్రయాణిస్తాడు. అయితే ఆంటోనీకి తన స్నేహితుడు ఆక్టేవియస్ సీజర్‌కి కొన్ని కారణాల వల్ల మనస్పర్థలు వస్తాయి. దీంతో వీటిని రూపుమాపుకునేలా సీజర్ సోదరి ఆక్టేవియస్ని రాజకీయ వివాహం చేసుకుంటాడు. ఈ వివాహంతో లెపిడస్‌తో సహా పాలకులు తిరుగుబాటుదారుడైన పాంపేతో శాంతి ఒప్పందం ఏర్పరుచుకుంటాడు ఆంటోని. అయితే ఆంటోని మాటతప్పి మళ్లీ క్లియోపాత్ర వద్దకు వెళ్లిపోతాడు. దీంతో విసిగిపోయిన ఆక్టేవియస్ సీజర్ తాము ఏర్పరచుకున్న ఒప్పందాన్ని రద్దుచేసుకుని మార్క్ ఆంటోని, క్లియోపాత్రలపై యుద్ధం చేసేందుకు దిగుతాడు. అయితే ఈ యుద్ధంలో ఆంటోని ఓటమిని చవి చూడాల్సి వస్తుంది. ఓపక్క తన ప్రాణ స్నేహితుడు ఎనోబార్బస్ సైతం ఈ కష్టకాలంలో వదిలి దూరంగా వెళ్లిపోతాడు. మరోవైపు క్లియోపాత్రకు ఆంటోని పెళ్లి చేసుకున్నట్లు తెలుసుకుని దూరం జరిగే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే క్లియో పాత్ర సైనికులు ఆంటోనికి సహకరించకుండా పారిపోవడం జరుగుతుంది. దీంతో ఆంటోనికి క్లియోపాత్ర తనను మోసం చేసిందన్న కోపం ఎక్కువవ్వుతుంటుంది. కానీ క్లియోపాత్ర అతడి ప్రేమను పరీక్షించే నిమిత్తం తన సహచర చెలికెత్తలతో తాను మరణించినట్లుగా వార్త పంపిస్తుంది. ఈ వార్త విని ఆంటోని కుంగిపోయి తన కత్తితో పొడుచుకుని చనిపోతాడు. వెంటనే అతడిని క్లియోపాత్ర పరిచారికలు అతడిని ఆమె వద్దకు తీసుకురావడం జరుగుతుంది. అక్కడ ఆంటోని ఆమె చేతిలోని ప్రాణాలు వదిలేస్తాడు. మరోవైపు ఆక్టేవియస్ సీజర్ దండయాత్ర చేసుకుంటూ రోమ్ వైపుకి వచ్చేస్తుంటాడు. దీంతో ఆమె ఒక విషపాముతో కరిపించుకుని మరీ ప్రాణాలు వదిలేస్తుంది. ఇక్కడ ఇరువురు ఎంతో గాఢంగా ప్రేమించుకునన్నారు చిన్న మనస్పర్థ ఒకరినొకరు దూరం చేసుకునేందుకు కారణమైంది. అయితే వారికి ప్రాణాలు కోల్పోయిన టైంలో తమది నిజమైన ప్రేమ అని గుర్తించడం బాధకరం.ముంతాజ్ మహల్- షాజహాన్: !అర్జుమంద్ బాను బేగంగా జన్మించిన ముంతాజ్ మహల్ యువరాజు ఖుర్రామ్(షాజహాన్ ) హృదయాన్ని దోచుకుంది. ఆమె కేవలం ఖుర్రామ్కి రాణి మాత్రమే కాదు నమ్మకమైన సలహాదారు, సహచరురాలు. అయితే ముంతాజ్ విషాదకరంగా 1631లో తన పద్నాలుగో బిడ్డకు జన్మినిస్తున్నప్పుడు ప్రాణాలు వదిలేస్తుంది. దీంతో షాజహాన్ ఏళ్ల తరబడి తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు. అలా ఆమె జ్ఞాపకార్థం కట్టించిన స్మారక చిహ్నమే తాజ్ మహల్. ఏడు వింతల్లో ఒకటిగా నిలవడమే గాక యునెస్కో గుర్తింపును కూడా పొందింది. ఏటా లక్షలాదిమంది ఈ మహల్‌ని చూసేందుకు రావడమే గాక శాశ్వత ప్రేమకు చిహ్నంగా కీర్తిస్తారు. రోమియో - జూలియట్:ఈ ప్రేమ కథ వెరోనా నగరంలో జరిగింది. ఇరువురి కుటుంబాల నేపథ్యం వేరు. దీంతో వీరిద్దరిని కలవనిచ్చేవారు కాదు బంధువులు. అయినప్పటికి వాళ్ల కళ్లుగప్పి కలుసుకుంటూనే ఉండేవారు. తమ ప్రేమను ఎలాగైన నిజం చేసుకోవాలని ఇరువురు ఆరాటపడ్డారు. అయితే రోమియో అనుకోకుండా జూలియట్ బంధువు టైబాల్ట్‌ను క్షణికావేశంలో చంపడం జరుగుతుంది. ఈ నేరం కారణంగా రోమియోను వెరోనా నగరం నుంచి బహిష్కరిస్తారు. దీంతో ఇరువురూ ఒకరినొకరు చూసుకోలేనంత అగాథం ఏర్పడుతుంది. అయితే రోమియోకి జూలియట్ చనిపోయినట్లు నమ్మించేలా ఆమె అచేతనంగా పడి ఉన్నట్లు చూపిస్తారు ఆమె బంధువులు. దీంతో జూలియట్ లేకుండా జీవించలేనంటూ ప్రాణం తీసుకుంటాడు. ఇంతలో మెల్కొన్న జూలియంట్ రోమియో చనిపోవడం దుఃఖంతో గట్టిగా విలపిస్తుంది. అలా ఏడుస్తూనే ప్రాణాలు వదిలేస్తుంది. అప్పడు గానీ వారి స్వచ్ఛమైన ప్రేమను గుర్తించరు అక్కడి ప్రజలు.షిరిన్- ఫర్హాద్: ఇది పర్షియన్ ప్రేమ కథ. అందమైన ఆర్మేనియన్ యువరాణి షిరిన్. ఆమె అందం ససానియన్ రాజు ఖోస్రో II దృష్టిని కూడా ఆకర్షించింది. అయితే ఫర్హాద్ శిల్పి, రాతికట్టడాలను నిర్మించడంలో నేర్పరి. ఇరువురి మధ్య హోదాల పరంగా చాలా వ్యత్యాసం ఉంది. అయినా వాటన్నింటిని పక్కన పెట్టి ఒకరినొకరు విడిచి ఉండలేనంత గాఢంగా ప్రేమించుకున్నారు. అయితే వీరిని ఎలాగైన విడదీయాలన్న ఉద్దేశ్యంతో యువరాజు ఖోస్రో ఫర్హాద్కి కష్టమైన పనులన్నీ అప్పగించేవాడు. అన్నింటిని అలవోకగా చేసేయడంతో చివరికి షిరిన్ చనిపోయినట్లు అబద్ధం చెబుతాడు. ఆ వార్త వినడంతోనే కుప్పకూలిపోతాడు ఫర్హాద్. ఆవేదనతో తమ ప్రేమను ఏ పర్వతంపై చెక్కాడా అక్కడకే వెళ్లి ఆత్మహత్య చేసుకుంటాడు. ఫర్హాద్ మరణవార్త విని అతడున్న చోటుకి పరిగెత్తుకుంటూ వెళ్తుంది షిరిన్. ఆమె కూడా అక్కడ నుంచే దూకి చనిపోతుంది.లైలా-మజ్నున్: పర్షియన్, అరబిక్ సాహిత్యంలో భావితరాల కోసం భద్రపరచబడిన గొప్ప ప్రేమ కథ లైలా-మజ్నులది. మజ్నుగా పిలిచే ఖైస్ కవి. అతడు సంపన్న కుటుంబానికి చెందిన లైలాతో ప్రేమలో పడతాడు. లైలా అందం, తెలివిలో ఆమెకు సాటిలేరెవ్వరూ. అయితే మజ్ను ప్రవర్తన విచిత్రంగా ఉంటుంది. అందువల్ల లైలాకు అతడు తగిన జోడి కాదని ఇరువురి కుటుంబాలు వారి ప్రేమను నిరాకరిస్తాయి. అయినా కూడా వాటిని లెక్కచేయకుండా తమ ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో చూపించాలాని భావిస్తారిద్దరు. విధి మరోలా వారిప్రేమను పరీక్షించింది. ఇక్కడ లైలా తండ్రి మరో సంపన్న వ్యక్తితో పెళ్లి చేసి పంపేస్తాడు. లైలా మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న విరహంతో పిచ్చి వాడైపోతాడు మజ్ను. అక్కడ లైలా పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. రాజభోగాల మధ్య ఉన్నా.. ముళ్లమీద కూర్చున్నట్లుగానే ఉంటుంది ఆమెకు. మనసు ఎల్లపుడూ కైస్ చుట్టూనే తిరుగుతుంటుంది. కొన్నేళ్లకు భర్తతో కలిసి ఆమె ఇరాక్ వెళ్లిపోతుంది. కొద్దిరోజులకే అక్కడ అనారోగ్యం బారినపడి లైలా కన్నుమూస్తుంది. లైలా మరణవార్త తెలుసుకున్న కైస్ మిత్రులు విషయం అతడికి చెప్పాలని ఎంతో ప్రయత్నిస్తారు. కానీ, కైస్ జాడ దొరకదు. కొద్దిరోజుల తర్వాత ఓ చోట కైస్ ఆచూకీని కనుగొంటారు. వాళ్లు అక్కడికి వెళ్లి చూడగా.. కైస్, లైలా సమాధి దగ్గర ప్రాణం లేకుండా పడి ఉంటాడు. లైలా కోసం పిచ్చివాడిలా తిరగటం వల్లే కైస్కు మజ్ను అనే పేరు వచ్చిందని అంటారు చరిత్రకారులు. ఎందుకంటే "మజ్ను లైల" అంటే లైలా కోసం పిచ్చివాడిలా తిరిగిన వాడు అని అర్థం వస్తుంది. వారిప్రేమ విషాదంగా ముగిసినా..ఇప్పటికీ ప్రేమికులు వారిని తలుచుకుంటూనే ఉంటారు. అలాగే "ప్రేమ" అనగానే ఆ ఇరువురే గుర్తు వచ్చేలా చిరస్మరణీయంగా నిలిచిపోయారు.(చదవండి: ప్రేమకు ప్రతిరూపమైన అమ్మను ప్రేమిద్దామిలా..!) -
జేడీ వాన్స్ పిల్లలకు ‘మోదీ మార్క్’ గిఫ్ట్‌లు
ప్రధాని నరేంద్ర మోదీ ఏఐ యాక్షన్ సమ్మిట్ కోసం ఫ్రాన్స్ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ అమెరికాలో అడుగుబెట్టారు. అలాగే మోదీ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుమారుని పుట్టిన రోజు వేడుకలకు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా జేడీ వాన్స్ పిల్లలకు, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు ఇచ్చిన బహుమతులు హాట్‌టాపిక్‌గా మారాయి. మోదీ మన భారతీయ సంస్కృతికి అద్దం పట్టేలా, పర్యావరణ హితమైనవి బహుమతులగా వారికి ఇవ్వడం విశేషం. మరీ ఆ గిఫ్ట్‌ల విశిష్టత ఏంటో చూద్దామా..!.టాయ్ ట్రైన్, ఆల్ఫాబెట్ సెట్‌ని అమెరికా ఉపాధ్యాక్షుడు జేడీ వాన్స్ పిల్లలకు ఇచ్చారు మోదీ. ఇక ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు డోక్రా ఆర్ట్‌వర్క్ - రాతి పనితో కూడిన సంగీతకారులను బహుమతిగా ఇచ్చారు. మోదీ పర్యావరణ అనుకూలంగా.. చెక్కతో చేసిన వర్ణమాల సెట్‌ని జేడీ వ్యాన్స్ కుమార్తె మిరాబెల్ రోజ్ వాన్స్‌కు బహుమతిగా ఇచ్చారు. ఇది పిల్లలకు మంచిగా అక్షరాలను గుర్తుపట్టేలా చేసి తొందరగా నేర్చుకునేందుకు దోహదపడుతుంది. ఇది ప్లాస్టిక్‌కి ప్రత్యామ్నాయంగా, హానికరమైన రసాయనాలు లేని బహుమతి. అంతేగాదు పర్యావరణ పరిరక్షణకు తాము పెద్ద పీట వేస్తాం అనేలా పరోక్షంగా చెప్పినట్లుగా ఉన్నాయి ఆ బహుమతులు. ఇక ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌కి ఇచ్చిన డోక్రా ఆర్ట్ వర్క్‌ని గిఫ్ట్‌గా ఇచ్చి మా దేశ సంస్కృతి, హస్త కళా నైపుణ్యం ఎట్టిదో తెలియజేస్తున్నట్లుగా ఉంది. చేతల ద్వారా తామెంటన్నది చెప్పడమే మన నాయకులు గొప్పతనం కాబోలు. కాగా ఫిబ్రవరి 10 నుంచి 12 వరకు మోదీ మూడు రోజులు ఫ్రాన్స్ పర్యటనలో ఉన్నారు. ఇక అక్కడ ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), వాణిజ్యం, శక్తి, సాంస్కృతిక సంబంధాలకు సంబంధించిన వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ప్రపంచ నాయకులు, ప్రపంచ టెక్ CEOల సమావేశం అయిన AI యాక్షన్ సమ్మిట్‌కు ఆయన సహ అధ్యక్షత వహించారు. ఫ్రాన్స్ పర్యటన అనంతరం బుధవారం సాయంత్రం అమెరికాలో పర్యటించారు. డోనాల్డ్ ట్రంప్ రెండొవసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ అమెరికాలో చేసిన తొలి పర్యటన ఇది. అక్కడ మోదీకి ప్రవాస భారతీయులు ఘనస్వాగతం పలికారు. ఈ నెల 12 నుంచి 13 వరకు మోదీ అమెరికాలో పర్యటించనున్నారు. అక్కడ బ్లెయిర్ హౌస్‌లోనే బస చేయనున్నట్లు సమాచారం. (చదవండి: ప్రేమకు ప్రతిరూపమైన అమ్మను ప్రేమిద్దామిలా..!) -
MahaKumbh : బ్రహ్మాండమైన వ్యాపారం నెలకు లక్షన్నర!
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కొనసాగుతున్న మహాకుంభమేళా 2025 ఉత్సాహంగా కొనసాగుతోంది. రికార్డు స్థాయి భక్తులతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న ఈ ఆధ్యాత్మిక ఉత్సవంలో అనేక ఆసక్తికరమైన విషయాలకు కేంద్రంగా మారుతోంది. రుద్రాక్ష మాలలు అమ్ముకునే మోనాలీసా, వేపపుల్లలు అమ్ముకునే ప్రేమికుడు..ఇలా చిన్న వ్యాపారులకు కూడా ఆదాయమార్గాలను విస్తృతం చేసింది. తాజాగా ఈ కోవలో నిలిచాడు చాయ్ వాలా. కుంభ్ చాయ్‌వాలా టీ కథా కమామిష్షు ఏంటో తెలుసుకుందామా?మన చాయ్‌వాలా పేరు శుభం ప్రజాపత్. అతని కేవలం వయస్సు 20 ఏళ్లే. కానీ అతడి ఐడియా మాత్రం అదిరింది. మహాకుంభమేళాను సందర్శించే భక్తులుకు టీ , వాటర్ బాటిళ్లు టీ అమ్మడం ద్వారా చక్కటి ఉపాధిని వెదుక్కున్నాడు. అంతేకాదు రోజుకు రూ. 5 వేలకు పైగా సంపాదిస్తున్నాడు. అంటే నెలకు లక్షా 50వేలు అన్నమాట. ఇది సంపాదన ఒక కార్పొరేట్ఉద్యోగి, ఐటీ ఉద్యోగి వేతనానికి ఏ మాత్రం తీసిపోదు.కుంభమేళా ప్రారంభానికి రెండు రోజుల ముందే టీ అమ్మడాన్ని మొదలు పెట్టాడు. ఒక్కో టీ 10 రూపాయలు చొప్పున విక్రయిస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నాడు. ఈ ఉత్సవం ముగియగానే తన పని తాను చేసుకుంటానని, ఈ నెల రోజుల వ్యాపారం బాగా వర్కవుట్ అయ్యిందని చెబుతున్నాడు శుభం ప్రజాపత్. తన చిన్న బిజినెస్ ఐడియా లక్షాధికారిని చేసిందంటూ సంతోషం వ్యక్తం చేశాడు. మొత్తానికి తనకు రెండు లక్షల రూపాయల దాకా ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాడు. (టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ, హీరో రాగ్ మయూర్‌తో వాలెంటైన్స్ డే స్పెషల్) View this post on Instagram A post shared by Shubham Prajapat (@madcap_alive)స్వయంగా కంటెంట్ క్రియేటర్ అయిన ప్రజాపత్ తాను టీ అమ్ముతున్న వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో క్లిప్‌లో ఒక చిన్న బండిపై చాయ్, వాటర్ బాటిళ్లు అమ్ముతున్నట్లు మనం చూడవచ్చు. ఉదయం, సాయంత్రం రద్దీ ఎక్కువగా ఉంటుందనీ మధ్యాహ్నం మాత్రం కాస్త విశ్రాంతి దొరుకు తుందని చెప్పుకొచ్చాడు. ప్రజాపత్ ఐడియాకు జనం ఫిదా అవుతున్నారు. మరో విధంగా చెప్పాలంటేకుంభ చాయ్‌వాలా ఇపుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాడు. ప్రపంచలోని అతిపెద్ద ఆ ఆధ్యాత్మిక సమావేశం కుంభమేళా కుంభమేళా. జనవరి 13న మొదలై ఫిబ్రవరి 26 వరకు జరగనున్న ఈ కుంభమేళాకు రోజు కోట్లాది మంది భక్తులు ,పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేయడానికి వస్తున్నారు. ఇప్పటి వరకు 50 కోట్లకు మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలు చేశారు. ఇటీవల రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబం ప్రయాగ్‌రాజ్‌లో పుణ్య స్నానాలు చేసిన సంగతి విదితమే. -
చిన్నారుల బర్డ్ వాక్: పక్షులతో గడిపే ఛాన్స్..!
పక్షులను చూడటం అంటే ప్రకృతితో మమేకమై గొప్ప ఆనందాన్ని పొందే అరుదైన క్షణం. ముఖ్యంగా చిన్నారులకు ఇది తెలియజేయడం అత్యంత ముఖ్యం. ఎందుకంటే వారిలా నిశితంగా గమనించడం పెద్దలకు కూడా సాధ్యం కాదు. ఎందుకంటే వారికి ప్రతీది అద్భుతంలా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే బర్డ్ ఫౌండేషన్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గ్రేట్ బ్యాక్‌యార్డ్ బర్డ్ కౌంట్ ఈవెంట్ పేరుతో బర్డ్ వాక్‌లు ఏర్పాటు చేసి చిన్నారులు వాటితో నేరుగా గడిపే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఏటా గ్రేట్ బ్యాక్‌యార్డ్ బర్డ్ కౌంట్ ఈవెంట్ ఫిబ్రవరిలో నాలుగు రోజులు నిర్వహిస్తారు. ఈ ఏడాది అలానే ఫిబ్రవరి 15, 16 తేదీల్లో భారతదేశంలోని మొత్తం ఎనిమిది నగరాల్లో ఎనిమిది బర్డ్ వాక్‌లు నిర్వహించనుంది. ఇది ఉదయం 7.30 గంటలకు ప్రారంభమవుతుంది. భారత్లోఇన ప్రధాన నగరాలైన బెంగళూరు (కర్ణాటక), దిమాపూర్ (నాగాలాండ్), హలోల్ (గుజరాత్), జైపూర్ (రాజస్థాన్), మంగళూరు (కర్ణాటక), రాంచీ (జార్ఖండ్), త్రివేండ్రం (కేరళ), ఉజ్జయిని (మధ్యప్రదేశ్) నగరాల్లో జరగనుంది. వీటిని ఎర్లీ బర్డ్ అండ్ అటవీ బర్డ్ ఫౌండేషన్ నిర్వహిస్తాయి. ఇది అనుభవజ్ఞులైన పర్యావరణవేత్తల నేతృత్వంలో ఈ బర్డ్ వాక్ జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా చిన్నారులకు పక్షులను నేరుగా వీక్షించి, గడిపే అరుదైన అవకాశం లభిస్తుంది. గ్రేట్ బ్యాక్‌యార్డ్ బర్డ్ కౌంట్ అనేది ఒక గ్లోబల్ సిటిజన్ సైన్స్ ప్రాజెక్ట్. ఈ పేరుతో ప్రతి ఏడాది ఫిబ్రవరిలో నాలుగు రోజులు ప్రజలు పక్షులను గమనిస్తారు. అలాగే శాస్త్రవేత్తలు ప్రపంచ పక్షుల జనాభా గురించి, వాటి విశేషాల గురించి పంచుకుంటారు. ఈ ఏడాది భారత్ అనేక నగరాల్లో దీన్ని నిర్వహించనుంది. ప్రస్తుతం నిర్వహించనున్న '8 సిటీస్ 8 బర్డ్ వాక్‌లు' మాత్రం చిన్న పిల్లల కోసం ఒక ప్రత్యేక ఎడిషన్. గతేడాది వైల్డ్‌లైఫ్ వీక్ సందర్భంగా, ఆరుగురు ప్రకృతి విద్యావేత్తల ఆధ్వర్యంలో అక్టోబర్ 6, 8, 2024 తేదీలలో మొత్తం ఆరు వేర్వేరు నగరాల్లో బర్డ్ వాక్‌లను నిర్వహించారు. (చదవండి: ప్రపంచంలో అత్యంత అవినీతి దేశాలివే..భారత్ ఎన్నో స్థానంలో ఉందంటే..) -
ప్రపంచంలోనే అత్యంత అవినీతి దేశాలివే..భారత్ ఎన్నో స్థానంలో ఉందంటే..
ప్రంపచంలోనే అత్యంత అవినీతి దేశాల జాబితాను ఏటా ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ విడుదల చేస్తుంది. దీన్ని నిపుణులు, వ్యాపారవేత్తల ప్రకారం.. ప్రభుత్వ రంగ అవినీతి స్థాయిల ఆధారంగా ఈ అవినీతి (పీపీఐ) ర్యాంకులు ఇస్తుంది. ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలో అవినీతి అనేది అతిపెద్ద ప్రమాదకరమైన సమస్యగా మారిందని పేర్కొంది. ఈ జాబితాలో డెన్మార్క్ అవినీతి రహిత దేశంగా తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానంలో ఫిన్లాండ్, సింగపూర్, న్యూజిలాండ్ దేశాలు ఉన్నాయి. అయితే భారత్ 96వ స్థానంలో ఉంది. ఈ అవినీతి సూచిక దాదాపు 180 దేశాలకు ర్యాంకులు ఇచ్చింది. ఈ అవినీతిని సున్నా నుంచి వంద మార్కుల స్కోరు ఆధారంగా నిర్థారిస్తుంది. సున్నాని అత్యంత అవినీతిని సూచించగా, వంద అనేది అవినీతి రహితం నిర్ణయించి ర్యాంకులు ఇవ్వడం జరగుతుంది.అయితే ఈ ఏడాది అవినీతి అవగాహన సూచిక (CPI) ప్రకారం..చాలా దేశల్లో ఈ విషయంలో మంచి మార్పు కనిపించిందని పేర్కొంది. ఇక ఆ జాబితా ప్రకారం 2024లో భారతదేశం మొత్తం స్కోరు 38 కాగా, 2023లో 39, 2022లో 40. అయితే గతేడాది 39 స్కోరుతో 93 స్థానంలో నిలివగా ఈ ఏడాది మరో మూడు స్థానాలకు పడిపోయింది. అలాగే భారత్‌కి పొరుగున్న ఉన్న దేశాలు పాకిస్తాన్ 135, శ్రీలంక 121, బంగ్లాదేశ్ 149వ స్థానాలతో త్యంత అవినీతి గల దేశాలుగా నలిచాయి. ఇక డ్రాగన్ కంట్రీ చైనా భారత్ కంటే తక్కువ అవినీతి గల దేశంగా 76వ స్థానంలో నిలిచింది. ఇక అమెరికా 69 పాయింట్ల నుంచి 65కి పడిపోయింది. ఇదే క్షీణతలో ఉన్న ఇతర పాశ్చాత్య దేశాలలో ఫ్రాన్స్ నాలుగు పాయింట్లుతో 67 మార్కులతో ఐదు స్థానాలకి పడిపోయి 25వ స్థానంలో నిలిచింది. ఇక జర్మని మూడు పాయింట్లు తగ్గి 75 స్కోరుతో 15వ స్థానంలో నిలిచింది. అలాగే దశాబ్దానికి పైగా అమెరికా, ఫ్రాన్స్, రష్యా, వెనిజులా వంటి దేశాలు అవినీతి సూచికలో అత్యంత చెత్త ప్రదర్శనను కనిబర్చినట్లు వెల్లడించింది. అలాగే ప్రధాన అవినీతి కేసుల్లో న్యాయవ్యవస్థ చర్యలు తీసుకోవడంలో విఫలమైనందున మెక్సికో కూడా ఐదు పాయింట్లు తగ్గి 26కి స్కౌర్ చేసిందని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ తెలిపింది. చివరిగా అత్యంత అవినీతి దేశాలుగా దక్షిణ సూడాన్ కేవలం ఎనిమిది పాయింట్లతో ఇండెక్స్‌లో అట్టడుగుకు పడిపోగా, సోమాలియా స్కోరు తొమ్మిదికి పడిపోయింది. గతంలో అత్యంత అవినీతి దేశంగా తొలి స్థానంలో ఉన్న సోమాలియా స్థానాన్ని దక్షిణ సూడాన్ ఆక్రమించిందివాటి తర్వాత స్థానాల్లో వెనిజులా 10, సిరియా 12 మార్కులతో అత్యంత అవినీతి దేశాల జాబితాలో నిలిచాయి. కాగా, 2024లో "ప్రపంచ అవినీతి స్థాయిలు అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ పేర్కొంది. 2012 నుంచి 32 దేశాలు అవినీతి స్థాయిలను గణనీయంగా తగ్గించుకున్నప్పటికీ, 148 దేశాలు అత్యంత అధ్వాన్నంగా ఉన్నట్లు వెల్లడించింది. అందువల్ల మంచి పురోగతి సాధించేలా మరింతగా ఆయా దేశాలు కృషి చేయాల్సి ఉందని పేర్కొంది ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ .(చదవండి: అరవై రోజుల అద్భుతం 'నవార'!) -
బిలియనీర్‌తో పెళ్లి అని చెప్పి, రూ.14 కోట్లకు ముంచేసింది : చివరికి!
నమ్మేవాళ్లుండాలే గానీ ఎంతటి మోసానికి పాల్పడవచ్చు. కానీ మోసం ఎంతోకాలం దాగదు. ఎప్పటికైనా చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం తప్పదు.చైనాకు చెందిన ఒక మహిళ స్టోరీలో అక్షరాలా ఇదే జరిగింది. పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారితో పెళ్లి అంటూ నాడకమాడి, బంధువులను నిలువునా ముంచేసింది. చివరికి ఆమె కుట్ర గుట్టు రట్టు అయింది. విచారించిన కోర్టు ఆమెకు జైలు శిక్ష విధించింది. ఇంతకీ ఆమె వలలో బంధువులు ఎలా పడ్డారు? ఈ స్కామ్ వెలుగులోకి ఎలా వచ్చింది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే మీరీ స్టోరీ చదవాల్సిందే!చైనాకు చెందిన మంగ్ (40) అనే మహిళ పెద్ద ప్లానే వేసింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం ఆమె ఒక చిన్న రియల్ ఎస్టేట్ ఏజెన్సీ నిర్వహించేది. కానీ అందులో నష్టాలు రావడంతో ఎలాగైనా డబ్బు సంపాదించాలని ప్లాన్ చేసింది. బిలియనీర్, రియల్ ఎస్టేట్ వ్యాపారితో పెళ్లి అంటూ బంధువులను నమ్మించింది. ఫ్యామిలీని సైతం మోసం చేయాలనుకుంది. మందస్తు పథకం ప్రకారం డ్రైవర్ జియాంగ్ను పావుగా ఎంచుకుంది. ఈ విషయంలో జియాంగ్ను కూడా బాగానే బుట్టలో వేసుకుంది. ప్రేమిస్తున్నట్టు నమ్మిచింది. తన వయస్సు కారణంగా వివాహం చేసుకోవాలని తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తున్నారని అందుకే పెళ్లి చేసుకుందామంటూ ఒప్పించింది. అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. ఇక ఆ తరువాత తన ప్లాన్‌ను పక్కాగా అమలు చేసింది. అనేక పెద్ద ప్రాజెక్టుల వెనుక రియల్టర్ అయిన తన భర్త జియాంగ్ ఉన్నాడని బంధువులను నమ్మించింది. తక్కువ ధరకే, అతి చౌకగా విలువైన ఆస్తులను దక్కించుకోవచ్చని ఆశపెట్టింది. అంతేకాదు మెంగ్ రూ.1.2 కోట్ల విలువైన ఒక చిన్న ఫ్లాట్‌ను కూడా కొనుగోలు చేసి, దానిని సగం ధరకు బంధువుకు విక్రయించింది.తనకు గొప్ప ధర వచ్చిందని బంధువులకు అబద్ధం చెప్పమని జియాంగ్ను కోరింది. మరో అడుగు ముందుకేసి, కొత్త నివాస భవనాల షోరూమ్‌లకు తీసుకెళ్లి, చదరపు మీటరుకు రూ. 61వేలవరకు తగ్గుతుందని ఆశచూపిచింది. దీంతో ఆమె మోసానని పసిగట్టలేని బంధువులు రూ.14 కోట్ల (1.6 మిలియన్ డాలర్లు) మేర డబ్బులను ముట్ట చెప్పారు.కనీసం ఐదుగురు బంధువులు ఫ్లాట్లను కొనడానికి ఆమెకు పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చారు. కొందరు మంచి ఆస్తికి మారాలనే ఆశతో ఉన్న ఫ్లాట్లను కూడా అమ్మేశారు.ఇక్కడే సమస్య మొదలైంది. సంవత్సరాలు గడుస్తున్నా, ప్రాపర్టీ బంధువులకు స్వాధీనం చేయలేదు మంగ్.ఇదీ చదవండి: అదానీ చిన్న కొడుకు పెళ్లికి, షాదీ డాట్ కామ్ అనుపమ్ మిట్టల్ గిఫ్ట్ ఏంటో తెలుసా?డిస్కౌంట్లో ఇవ్వడంలో ఇబ్బందులు ఉన్నాయని చెబుతూ దాట వేస్తూ వచ్చింది. ఆ తరువాత కొన్ని ఫ్లాట్లను అద్దెకు తీసుకుని, ఇవి మనవే అని వారికి చూపించింది. ఇలా కాలం గడుస్తున్నకొద్దీ, సాకులుచెబుతోంది తప్ప ఆస్తి తమ చేతికి రాకపోవడంతో ఏదో తప్పు జరిగిందని గ్రహించిన బంధువులలో ఒకరు, అసలు రియల్ ఎస్టేట్ వ్యాపారిని సంప్రదించాడు. దీంతో ఆమె అసలు స్కాం బైటపడింది. అవి అసలువి కాదని తేలిపోయింది. మెంగ్ నివసిస్తున్న ఫ్లాట్ ఆమెది కాదని వెల్లడైంది.దీంతో బాధితులంతా పోలీసులు ఆశ్రయించారు.ఈ కేసును విచారించిన కోర్టు మోసం చేసినందుకు మంగ్‌కు 12 సంవత్సరాల ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఫ్లాట్ల విషయంలో లీజు ఒప్పందాలపై సంతకం చేసినందుకు నకిలీ భర్త జియాంగ్‌కు కూడా ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే ఇతర బంధువుల ముందు అబద్ధం చెప్పిన మరో బంధువుకు కూడా ఐదేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. (ఎండలు పెరుగుతున్నాయి... జర జాగ్రత్త) -
అదానీ చిన్న కొడుకు పెళ్లికి, షాదీ డాట్ కామ్ అనుపమ్ మిట్టల్ గిఫ్ట్ ఏంటో తెలుసా?
బిలియనీర్,అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ(Gautam Adani) చిన్న కుమారుడు జీత్ అదానీ (Jeet Adani), వజ్రాల వ్యాపారి జైమిన్ షా కుమార్తె దివా జైమిన్ షా (Diva Jaimin Shah) ను ఈ నెల ఏడున పెళ్లాడాడు. అహ్మదాబాద్‌లో వీరి వివాహం వైభవంగా జరిగింది. ఈ సందర్బంగా గౌతమ్ అదానీ తన కుమారుడి వివాహ సమయంలో, వివిధ సామాజిక సమస్యలకుపయోగించేలా రూ. 10వేల కోట్లు విరాళంగా ప్రకటించడం విశేషంగా నిలిచింది. ఇందులో ఎక్కువ భాగం ఆరోగ్య సంరక్షణ, విద్య మరియు నైపుణ్యాభివృద్ధిలో భారీ మౌలిక సదుపాయాల కార్యక్రమాలకు నిధులు సమకూర్చనున్నారు. అంతకుముందు, జీత్ అదానీ ,దివా షా జంట ప్రతీ ఏడాది 500 మంది వికలాంగుల మహిళల వివాహానికి ఒక్కొక్కరికీ రూ. 10 లక్షలు విరాళంగా ఇస్తామని ప్రకటించారు. 21 మంది నూతన వధూవరులు (వికలాంగ మహిళలు), వారి భర్తలను కలిశారు.ఈ వివాహంలో మరో విశేషంగా కూడా ఉంది.అదేమిటంటే..!షాదీ.కామ్ వ్యవస్థాపకుడు, షార్క్ ట్యాంక్ ఇండియా ప్యానలిస్ట్ , అనుపమ్ మిట్టల్ (Anupam Mittal) జీత్ అదానీకి ఒక ఆసక్తికరమైన వివాహ బహుమతి (Wedding Gift) ఇచ్చాడు. మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో చాలా కాలంగా ఉండిపోయిన జీత్ ప్రొఫైల్‌ను తొలగించాడు.ఈ విషయాన్ని స్వయంగా అనుపమ్మిట్టల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన వివాహానికి కొన్ని రోజుల ముందు షార్క్ ట్యాంక్ 'బియాండ్ ది ట్యాంక్' విభాగంలో మిట్టల్‌తో సంభాషించాడు జీత్. ఈ సందర్భంగా మరో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు జీత్. చిన్న వయసులో తన పాఠశాల స్నేహితులు చిలిపిగా షాదీ డాట్ కామ్‌లో ఒక ఖాతా క్రియేటర్ చేశారనీ, అది ఇప్పటికీ అది అలాగే ఉందని, దయచేసి దాన్ని ఇప్పటికైనా తొలగించాలని అభ్యర్థించాడు. As promised, here’s a small wedding gift from me to you & Diva @jeet_adani1. We have had ur profile deleted from @ShaadiDotCom now that u have confirmed ur participation in @sharktankindia 🤗💜 pic.twitter.com/1rNMtWmAhf— Anupam Mittal (@AnupamMittal) February 8, 2025దీనికి అనుపమ్ సరేనని సమాధాన మిచ్చారు. ఈ సందర్బంగా అదానీ గ్రూపు ఉద్యోగుల్లొ ఐదు శాతం వికలాంగులుగా ఉండాలని ఆదేశించినట్టు కూడా వెల్లడించారు. వాగ్దానం చేసినట్లుగామీ దంపతులకు ఇది ఒక చిన్న వివాహ బహుమతి అంటూ మిస్టర్ మిట్టల్ ఎక్స్‌లో ఒకపోస్ట్ పెట్టారు. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను కూడా ఆయన జత చేశారు.జీత్ అదానీతో షార్క్ ట్యాంక్ "దివ్యాంగ్ స్పెషల్" ఎపిసోడ్వికలాంగుల కోసం పనిచేసే వ్యవస్థాపకులకు ఏమి చేయవచ్చనే దానికి సంబంధించిన ఒక ఎపిసోడ్ ఉండాలని జీత్ అదానీ సూచన మేరకు షార్క్ ట్యాంక్ ఇండియా "దివ్యాంగ్ స్పెషల్" ఎపిసోడ్ ప్రకటించింది. ఈ ఎపిసోడ్ కోసం రిజిస్ట్రేషన్లు ఫిబ్రవరి 15 వరకు అనుమతి ఉంటుంది. -
కనువిప్పు కలిగించే సలహ..! పోస్ట్ వైరల్
ప్రస్తుతం అందరివి బిజీ బిజీ జీవితాలే. క్షణం తీరిక లేకుండా సంపాదనే ధ్యేయంగా పరుగులు.కనీసం వేళకు తిండి తిప్పలు లేకుండా బతికేస్తున్నాం. పైగా లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నట్లు ఫోజులు కొడుతుంటాం. మన స్థాయి కంటే చిన్నవాళ్లు, చిన్న చితకా వ్యాపారాలు చేసుకునేవాళ్లు అద్భుతమైన సలహలిస్తుంటారు. వాటిని విన్నప్పుడు ఒక్క క్షణం నేనెందుకు ఇలా ఆలోచించలేకపోయానా..? అనిపిస్తుంది. మంచి ఆలోచనలనేవి ఉన్నత స్థితి నుంచి కాదు, అంతకుమించిన ఉన్నతమైన మనసు ఉన్నవారికేనని అర్థమవుతుంది. అలాంటి సందర్భమే ఎదురైంది ఈ మహిళకు. ఆ విషయాన్ని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా షేర్ చేసుకుంది.ముంబైకి చెందిన మహిళ(Mumbai woman) ఉబెర్ ఆటో బుక్ చేసుకుంది. అది వచ్చేలోపే అక్కడే కొబ్బరిబొండాలు అమ్ముకునే వ్యాపారి(Coconut Seller) వద్దకు వెళ్లి..కొబ్బరి బొండం ఇమ్మని అడుగుతుంది. అయితే ఆమె ఉబర్ఆటో వచ్చేస్తుందని తొందరగా కొబ్బరి బొండం కొట్టివ్వమని చెబుతుంది. దీంతో అతడు మేడమ్ ప్రజలంతా డబ్బు సంపాదించడానికే అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు గానీ ఆ సంపాదన కాసేపు నిశ్చంతంగా తినడానికి తాగడానికి అవకాశం ఇవ్వలేప్పుడు వేస్టే కథా మేడమ్ అంటాడు. దీంతో ఆ మహిళకి అతడి మాటలు ఏదో మంత్రం చల్లినట్లుగా అనిపిస్తాయి. నిజమే కదా..అనే భావన కలిగుతుంది ఆమెలో. తానెందుకు ఇలా ఆలోచించలేకపోయాను, ఒక సాధారణ వీధి వ్యాపారి చెబితేగానీ తెలుసుకోలేకపోయానా అని ఫీలవుతుంది. పని.. పని..అంటూ పరుగులు పెట్టేస్తాం. కానీ పనిని కాసేపు వదిలేసినా అలాగే ఉంటుంది. అంతేతప్ప ఏం కాదు. కనీస ప్రాథమిక అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వకపోతే మన ఆరోగ్యమే దెబ్బతింటుంది. ఆ తర్వాత పని కాదు కదా..మనల్ని చూసుకునేవాడు కావాల్సిన దుస్థితి వస్తుంది. అంతటి పరిస్థితి వచ్చేలోపే మేల్కొంటే మంచిది అంటూ ఆమె తన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. మరికొందరూ కూడా తమ అనుభవాలను షేర్ చేస్తూ..మన గురించి మనల్ని పట్టించుకోవడం మర్చిపోతున్నాం అంటూ తమకెదురైన అనుభవాలను పంచుకున్నారు. కాబట్టి మనం క్షణ తీరిక లేని బిజీ లైఫ్‌తో అనారోగ్యం పాలవ్వడం కంటే..ముందుగానే మేల్కొని కొద్ది సమయమైన మనకోసం కేటాయించడం బెటర్ కదూ..!.told bhaiya to cut my coconut fast because my uber was on the way & man casually said “itna paisa kyu kamate ho? kaam toh chalta rahega lekin khane peene ko time dena chahiye” nice grounding advice pic.twitter.com/wz66mFqnUn— gargi (@archivesbygargi) February 7, 2025 (చదవండి: పాప్ రాక్ ఐకాన్, గ్రామీ అవార్డు గ్రహితకు చేదు అనుభవం..!) -
పాప్ రాక్ ఐకాన్, గ్రామీ అవార్డు గ్రహితకు చేదు అనుభవం..!
ఎంత పెద్ద ఫేమస్ సింగర్ అయినా ఒక్కోసారి ఊహించని చేదు అనుభవాలు ఎదురవ్వుతుంటాయి. ముందుగా ప్లాన్ చేసుకుని, పర్మిషన్ తీసుకున్నా ఒక్కోసారి అవమానపాలుకాక తప్పదనేలా ఉంటాయి పరిస్థితులు. హుందాగా, నిజాయితీగా వ్యవహరించినా..అధికార దర్పం ముందు తలవంచక తప్పదేమో ఒక్కసారి. ఇదంతా ఎందుకంటే..నాలుగుసార్లు గ్రామీ అవార్డు గెలుచుకుని, పాప్ ఐకాన్‌గా పేరుగాంచిన సింగర్‌కి బెంగళూరులో అనుకోని పరిణామాన్ని చవిచూశాడు. ఏం జరిగిందంటే.. బ్రిటిష్ గాయకుడు-గేయ రచయిత ఎడ్ షీరన్ బెంగళూరులో చర్చి స్ట్రీట్‌లోని ఎంజీ రోడ్ మెట్రో స్టేషన్ ఎదురుగా ప్రదర్శన ఇచ్చేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఈ ప్రదేశంలో ఒకటికి మించి రెండు పాటలతో అలరించబోతున్నా అంటూ మొదలు పెట్టారాయన. షీరన్ ముందుగా మొటి పాట అనగానే ఒక పోలీసు ఎంట్రీ ఇచ్చి ప్రదర్శనను అడ్డుకున్నారు.ఆయన ప్రదర్శన జరగకుండా స్పీకర్లను కూడా డిస్కనెక్ట్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇదిలా ఉండగా, ఎడ్ షీరన్ మాత్రం ముందుస్తు ప్రణాళికతోనే ఈ ప్రదర్శన ప్లాన్ చేశామన్నారు. ఇలా రోడ్డుపై ప్రదర్శన ఇచ్చేందుకు పర్మిషన్ తీసుకున్నట్లు తెలిపారు. తామేమి అకస్మాత్తుగా అప్పటికప్పుడూ ఇలా ప్రదర్శన ప్లాన్ చేయలేదంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో వివరణ ఇచ్చారు. కాగా, షేప్ ఆఫ్ యు, థింకింగ్ అవుట్ లౌడ్, పర్ఫెక్ట్ అండ్ కాజిల్ ఆన్ ది హిల్ వంటి హిట్ పాటలకు పేరుగాంచిన పాప్ రాక్ ఐకాన్ ఎడ్ షీరన్. అతని ఆల్బమ్‌లు హాటకేక్లా ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్ది అమ్ముడైపోయాయి. ఆయన జనవరి 30 నుండి ఫిబ్రవరి 15 వరకు భారత్‌లో పర్యటించనున్నారు.A police officer pulled the plug when Ed Sheeran surprised everyone on Church Street😂😭😭😭 pic.twitter.com/cMIRoLC7Mk— Naai sekar (@snehaplsstop) February 9, 2025 (చదవండి: దటీజ్ సుధీర్..! దూషించే పదాన్నే లగ్జరీ బ్రాండ్‌గా మార్చి..) -
రహస్యగదిలో బంగారు నిధి
అమెరికాలోని ఒక పురాతన చర్చి లోపల ఉన్న రహస్యగదిలో శతాబ్దాల నాటి బంగారు నిధిని తాజాగా పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. చర్చి లోపలి గోడల్లో చిన్న అల్మరాలా కనిపించే ఒక గదిలో సుమారు 500 సంవత్సరాల నాటి పోలండ్, లిథువేనియా చక్రవర్తుల కిరీటాలు బయటపడ్డాయి. ఈ గదిలో నాణేలు, గొలుసులు, కిరీటాలు, శవపేటిక ఫలకాలు, రాజదండం వంటి ఇతర అమూల్యమైన వస్తువులు కూడా ఉన్నాయి.మొత్తం 59 పురాతన వస్తువులు, కళాఖండాలు ఇందులో ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. వీటితోపాటు, వస్తువులను చుట్టిన ఒక వార్తాపత్రిక ఉంది. ఇది జర్మనీపై బ్రిటన్ యుద్ధం ప్రకటించిన నాలుగు రోజుల తర్వాత, 1939 సెప్టెంబర్ 7వ తేదీ నాటిది. దీని ఆధారంగా ‘అప్పట్లో సైనిక దాడుల నుంచి రాజసంపదను కాపాడటానికి ఈ రహస్య గదిని నిర్మించి, ఇందులో వీటిని భద్రపరచి ఉండచ్చు’ అని పురావస్తు శాస్త్రవేత్త విద్మంతస్ బెజారస్ తెలిపారు. -
చుక్కలు పాడిన చక్కటి పాట..!
బిటిష్ రాక్ బ్యాండ్ ‘కోల్డ్ ప్లే’ వరల్డ్ టూర్‌తో హల్చల్ చేస్తోంది, మన దేశంలోనూ ప్రదర్శన ఇచ్చింది. ఒకప్పటి ‘యూనివర్శిటీ కాలేజ్ లండన్’ మిత్రులు ‘కోల్డ్ ప్లే’గా సంగీత ప్రస్థానాన్ని ప్రారంభించారు.సేఫ్టీ, యెల్లోలాంటి ఆల్బమ్‌లతో శ్రోతలకు దగ్గరయ్యారు. లైవ్ పెర్ఫార్మెన్స్లో తమదైన ప్రత్యేకత చాటుకున్నారు.ఇటీవల అహ్మదాబాద్‌కు చెందిన ఆటోడ్రైవర్ ‘కోల్డ్ ప్లే’ హిట్ సాంగ్ ‘స్కై ఫుల్ ఆఫ్ స్టార్స్’ పాడి నెటిజనుల చేత వారెవా అనిపించుకున్నాడు. కొందరైతే ‘కోల్డ్ ప్లే తదుపరి కచేరిలో ప్రత్యేక స్థానానికి ఇతడు అర్హుడు’ అని ప్రశంసించారు.‘నేను కోల్డ్ ప్లేకు వీరాభిమానిని’ అంటున్నాడు ఆటోడ్రైవర్. ‘స్కై ఫుల్ ఆఫ్ స్టార్స్’ మనం కూడా ఒకసారి పాడుకుందాం....కాజ్ యూ ఆర్ ఏ స్కై/ కాజ్ యూ ఆర్ ఏ స్కై ఫుల్ ఆఫ్ స్టార్స్ఐయామ్ గొన్నా గివ్ యూ మై హార్ట్/ కాజ్ యూ లైట్ అప్ ది పాఐ డోన్ట్ కేర్ కాజ్ యూ ఆర్ ఏ స్కై View this post on Instagram A post shared by Navendu (@chasing.nothing) (చదవండి: బ్రకోలి ఆరోగ్యానికి మంచిదని కొనేస్తున్నారా..?) -
Ma Illu ట్విన్స్ విజేత, శ్వేత అనాథలు కాదు అంగరంగ వైభవంగా పెళ్లి!
బంజారాహిల్స్: వాళ్లిద్దరూ కవలలు.. పదేళ్ల వయసున్నప్పుడే తల్లిదండ్రులను, ఆ కొద్ది రోజులకే తోబుట్టువు, సోదరుడిని కోల్పోయి అనాథలయ్యారు. దీంతో నా అనేవారు ఎవరూ లేకుండా పోయారు.. వీరిని ‘మా ఇల్లు’ ఆశ్రమం చేరదీసింది. మా ఇల్లు ఆశ్రమ నిర్వాహకులు గాదె ఇన్నారెడ్డి, గాదె పుష్పరాణి ఈ కవల సోదరీమణులను చేరదీయడమే కాకుండా విద్యాబుద్ధులను నేర్పించారు. అనాథలైన విజేత, శ్వేత ఆదర్శనగర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఉన్న ‘మా ఇల్లు’ ఆశ్రమంలో నిర్వాహకుల నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము చేయకుండా పెద్ద చదువుల్లో విశేషంగా రాణించారు. విజేత ఎమ్మెస్సీ సైకాలజీ చేసి బీఈడీ చేస్తూనే ఉద్యోగం పొందింది. చెల్లెలు శ్వేత ఎల్ఎల్బీ పూర్తిచేసి ప్రస్తుతం హైకోర్టులో లా ప్రాక్టీస్ చేస్తోంది. చిన్నప్పటి నుంచి చదువుల్లో చురుకుగా రాణించిన వీరిద్దరికీ ఆశ్రమ నిర్వాహకులు గాదె ఇన్నారెడ్డి, గాదె పుష్పరాణి దంపతులు తామే తల్లిదండ్రులై సొంత కూతుళ్ల కంటే ఎక్కువగా ప్రేమించారు. అయితే వీరికి వివాహం ఒక సమస్యగా మారింది. అనాథలైన ఈ కవలలను చేసుకోడానికి ఎవరు ముందుకొస్తారా అని ఇన్నారెడ్డి దంపదతులు ఎదురుచూస్తున్న సమయంలోనే వారికి అండగా మేముంటామంటూ ఇద్దరు ముందుకొచ్చారు. వారిద్దరి గుణగణాలను పరిశీలించిన ఇన్నారెడ్డి దంపతులు విజేత, శ్వేతలకు సరిజోడీ అని నిర్ణయించుకున్నారు. వరంగల్ జిల్లా ఈసుకొండ మండలం ఎల్కుర్తి హవేలీ గ్రామానికి చెందిన అల్లూరి రంజిత్‌రెడ్డి ఎంబీఏ పూర్తి చేసి ల్యాండ్ సర్వేయర్‌గా పనిచేస్తున్నాడు. విజేతను పెళ్లి చేసుకోడానికి ముందుకొచ్చాడు. ఇక అడ్వకేట్‌గా హైకోర్టులో పనిచేస్తున్న సురేష్ రెడ్డి అక్కడే పనిచేస్తున్న శ్వేతను పెళ్లి చేసుకోడానికి ముందుకొచ్చాడు. View this post on Instagram A post shared by Maa Illu Home🏡 (@maaillu) రంజిత్‌రెడ్డి–విజేత, సురేష్‌రెడ్డి–శ్వేతల వివాహం ఫిబ్రవరి 7న అంగరంగ వైభవంగా అనాథల మధ్యనే నిర్వహించనున్నారు. జనగామ జిల్లా జాఫర్ఘడ్ మండలం రేగడి తండాలోని ‘మా ఇల్లు’ ప్రాంగణంలోనే తాము వీరి పెళ్లి ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. దీనికి రంజిత్, సురేష్ అంగీకరించారు. విజేత, శ్వేత వివాహం సందర్భంగా ‘మా ఇల్లు’ ఆశ్రమంలో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. -
సడెన్‌గా పులి ఎంట్రీ..ఛేజ్ చేసేంత దూరంలో రైతు! ట్విస్ట్ ఏంటంటే..
ఒక్కోసారి ప్రమాదం ఎటు నుంచి వస్తుందో తెలియదు. మనం ప్రమాదకరమైన ప్రదేశంలోకి వెళ్లకపోయినా ఊహించిన విధంగా ప్రమాదం మనల్ని వెతుక్కుంటూ వస్తే అదృష్టం ఉంటే తప్ప బయటపడటం అంత ఈజీ కాదు. అలాంటి సందర్భమే ఎదురైంది ఈ రైతుకి. తప్పించుకునే అవకాశం లేని విత్కర పరిస్థితిని ఎదుర్కొన్నాడు. సరిగ్గా ఆ టైంలో జరిగిన గమ్మత్తైన తమాషా ఆ రైతుకి భూమ్మీద నూకలున్నాయనే దైర్యాన్ని ఇచ్చింది. ఏం జరిగిందంటే..ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని పిలిభిత్(Pilibhit)లో ఒక రైతు బైక్‌పై కూర్చొని మరో వ్యక్తితో ఏదో సీరియస్‌గా మాట్లాడుతుంటాడు. ఇంతలో గడ్డిపొదల నుంచి నెమ్మదిగా పులి(Tiger) నక్కి నక్కి వస్తుంటుంది. దీన్ని ఆ ఇరువురు వ్యక్తులు గమనించరు. అయితే పులి మాత్రం దాక్కుంటూ వారిని సమీపిస్తుంటుంది. అమాంతం దాడి చేసేంత దూరంలోకి సమీపించేత వరకు గమనించరు ఆరైతు, సదరు వ్యక్తి. ఆ తర్వాత అంత దగ్గరగా పులిని చూసి స్టన్నైపోతారు. ఆ తర్వాత వెంటనే తేరుకుని ఎలాగైనా తప్పించుకోవాలన్న ఉద్దేశ్యంతో బైక్‌ని వెనక్కి తిప్పేందుకు రెడీ అవుతాడు. చెప్పాలంటే పులి వారిపై దాడి చేసేంత దగ్గరలోనే ఉన్నారు వాళ్లు. కానీ ట్వీస్ట్ ఏంటంటే ఆ ఉన్నటుండి పులి దాడి చేయకుండా నెమ్మదిగా కూర్చొని అలా సేద తీరుతుంటుంది. నిజానికి దాడి చేసేలా సైలెంట్‌గా నక్కి వచ్చింది కాస్తా ఒళ్లు విరుచుకుంటూ కూర్చొంటుంది. దీంతో ఆ ఇద్దరు బతికిపోయంరా బాబు అనుకుంటూ అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోయారు. అందుకు సంబంధించిన వీడియోని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్ఎస్) అధికారి(Indian Forest Service (IFS)) షేర్ చేయడంతో నెట్టింట తెగ వైరల్‌గా మారింది.A farmer and a tiger encounter. This is what coexistence looks like. From Pilibhit. pic.twitter.com/4OHGCRXlgr— Parveen Kaswan, IFS (@ParveenKaswan) February 3, 2025 (చదవండి: రూ. 75 కోట్లు విలువ చేసే హోటల్ని జస్ట్ రూ. 875లకే అమ్మకం..!) -
రూ. 75 కోట్లు విలువ చేసే హోటల్ని జస్ట్ రూ. 875లకే అమ్మకం..!
కోట్లు ఖరీదు చేసే హోటల్ కచ్చితంగా అంతకు మించిన ధరలో అమ్ముడుపోతుంది. అది పక్కా..!. పోనీ అలా కాదనుకుంటే.. కనీసం దాని విలువకు దగ్గరదగ్గరగా లేదా కొద్దిపాటి తేడాతో మంచి ధరలోనే అమ్ముడవుతుంది. కానీ ఇక్కడ కోట్లు ఖరీదు చేసే హోటల్ జస్ట్ వందల రూపాయల్లోనే అమ్ముడైతే..ఎవ్వరికైనా ఏంటిది అనే డౌటు వచ్చేస్తుంది. ఇదేంట్రా బాబు అంత తెలివతక్కువగా ఎవడ్రా అమ్మింది అనుకుంటారు. కానీ అలా ఎందుకు అమ్ముతున్నారో వింటే శెభాష్ అని ప్రశంసించకుండా ఉండలేరు.ఇంతకీ అమ్మడానికి కారణం ఏంటంటే..అమెరికా కొలరాడోలోని డెన్వర్‌లో మాజీస్టే ఇన్ మోటెల్ హోటల్ విలువ ఏకంగా రూ. 75 కోట్లు ఉంటుంది. అంత ఖరీదుకే డెన్వర్ నగరం ఈ హోటల్ని కొనుగోలు చేసింది కూడా. అయితే ప్రస్తుతం దాన్ని నగరం కొద్దిపటి మరమత్తులు చేసి అమ్మేయాలనుకుంది. ఎంతకో తెలిస్తే కంగుతింటారు. కేవలం రూ. 875లకే అమ్మేస్తారట. కానీ వాళ్లుపెట్టే షరతులకు అంగీకరిస్తే అంత తక్కువ ధరలో అంత ఖరీదు చేసే హోటల్ని సొంత చేసుకోగలరని చెబుతున్నారు డెన్వర్ నగరం డిపార్ట్మెంట్ ఆఫ్ హౌసింగ్ స్టెబిలిటీ ప్రతినిధి డెరెక్ వుడ్బరీ. ఆ షరతులేంటంటే..దీన్ని 99 ఏళ్లపాటు ఆదాయ నిరోధిక గృహంగా ఉంచాలట. అలాగే నిరాశ్రయులకు సహాయ గృహంగా ఉండాలనే షరతులకు అంగీకరిస్తే గనుక ఈ హోటల్ని తక్కువ ధరకే అమ్ముతామని చెప్పారు డెన్వర్ హౌసింగ్ స్టెబిలిటీ ప్రతినిధి డెరెక్ వుడ్బరీ. ఈ హోటల్ని పునరుద్ధరించి నిరాశ్రయలుకు నివాసంగా మారుస్తున్నాని అంగీకరిస్తేనే.. ఇంత తక్కువ ధరకు కొనుగోలు చేయగలరన్నారు. మరీ ఇంతకు ఎవరూ దీన్ని పునరుద్ధరించి కొనుగోలు చేస్తారనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే చాలామంది అందుకోసం దరఖాస్తు చేసుకున్నారని, వాటిని సమీక్షిస్తున్నట్లు తెలిపారు వుడ్బరీ. ఆ ప్రతిపాదిత డెవలప్పర్ ఆమోదం నగర్ కౌన్సిలో చేతిలో ఉంటుందట. నిరాశ్రయులైనవారికి చక్కటి వసతిని కల్పించడమే లక్ష్యంగా ఈ వినూత్న డీల్‌ని తీసుకొచ్చినట్లు వివరించారు వుడ్బరీ. అంతేగాదు భవనాన్ని యథాతథంగా అమ్ముతామని కూడా చెబుతున్నారు. మరీ ఎవరు దీన్ని కొని ఈ మహత్తర కార్యక్రమానికి పూనుకుంటారనేది వేచి చేసి చూడాల్సిందే. (చదవండి: మానవ ఐవీఎఫ్ సాయంతో కంగారూ పిండాలు..!) -
ఎవరీ అనన్య రాజే సింధియా..? 400 గదులు, 560 కిలోల బంగారంతో..
భారతదేశంలో రాజులు, రాజుల కాలం ముగిసినప్పటికీ వారి వంశస్థులు తమ వాసత్వ సంపద్రాయాన్ని తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్నారు. అదే విధంగా జీవిస్తున్నాయి. అలా వారసత్వాన్ని ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న రాజవంశమే గాల్వియర్‌లోని సింధియా కుటుంబం. ఈ కుటుంబం రాజరికానికి పర్యాయ పదంగా ఉంటుంది. ఆ కుటుంబం వేరెవరో కాదు మన ప్రధాని మెదీ ప్రభుత్వంలోని మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కుటుంబమే. అలాంటి వ్యక్తి కుమార్తె అనగానే ఏ రేంజ్లోఉంటుదని సర్వత్రా కుతుహలంగా ఉంటుంది. అయితే ఆమె మాత్రం చాలా సాదాసీదాగా ఉంటుంది. ఆమె నివశించే రాజదర్బారు లాంటి ప్యాలెస్‌కి జీవనవిధానానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. మరీ ఆ విశేషాలేంటో చూద్దామా..!.ఆ రాకుమార్తె ఎవరంటే ..జ్యోతిరాదిత్య సింధియా(Jyotiraditya Scindia), మహారాణి ప్రియదర్శిని రాజే(Maharani Priyadarshini Raje)ల ముద్దుల తనయే అనన్య రాజే సింధియా(Ananya Raje Scindia,). అందంలో ఆమె తల్లిని మించి అందంగా ఉంటుందని అంతా అనుకుంటుంటారు. అంతేగాదు అనన్య ప్రపంచంలోని 50 మంది అందమైన మహిళల జాబితాలో చోటు దక్కించుకుంది కూడా. రాజవంశానికి చెందినదైనా..జనబాహుళ్యానికి దూరంగా ఉంటారు. పైగా సోషల్ మీడియాలో కూడా లోప్రొఫైల్ని కలిగి ఉంది. ఇక మంత్రి జ్యొతిరాదిత్య సింధియాకి కుమార్తె అనన్య తోపాటు కుమారుడు ప్రిన్స్ మహానార్యమన్ కూడా ఉన్నాడు. కుమార్తె ప్రిన్సెస్ అనన్య రాజే సింధియాకి తన రాజకుటుంబ వారసత్వానికి తగ్గట్టుగా సాహస క్రీడలు, గుర్రపుస్వారీ, ఫుట్‌బాల్ వంటి వాటి పట్ల మక్కువ. ఇక ప్రాథమిక విద్యను ఢిల్లీలోని బ్రిటిష్ స్కూల్లో పాఠశాలలో పూర్తి చేయగా, ఐలాండ్ స్కూల్ ఆఫ్ డిజైన్‌లో ఉన్నత విద్యను అభ్యసించింది. ఇంతటి విలాసవంతమైన కుటుంబంలో జన్మించినప్పటికీ తన కాళ్లపై తాను నిలబడాలన్న ఉద్దేశ్యంతో స్నాప్‌చాట్(Snapchat)లో ఇంటర్న్‌గా పనిచేసి, ఆ తర్వాత ఆపిల్ కంపెనీ(Apple)లో డిజైనర్ ట్రైనీగా పనిచేస్తుందామె. ఆమె 2018లో ప్రతిష్టాత్మక పారిస్ ఫ్యాషన్ ఈవెంట్ 'లే బాల్'లో పాల్గొన్నప్పుడే ప్రజల దృష్టిని ఆకర్షించింది. కేవలం 16 ఏళ్ల వయసులో తన సోదరుడు మహానార్యమన్తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంది. అయితే ఈ వేడుకలో ఆమె ధరించిన దుస్తులు ప్రశంసనీయంగానూ చర్చనీయాంశగానూ మారాయి. వాళ్లుండే ప్యాలెస్..సింధియా కుటుంబ రాజ నివాసం జై విలాస్ ప్యాలెస్. ఇవి వారి వారసత్వానికి చిహ్నం. ఈ అత్యద్భుత నిర్మాణానికి ఎవ్వరైన ఫిదా అవ్వుతారు. ఎందుకంటే సుమారు 12 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దాదాపు 400 గదులు కలిగిన విలాసవంతమైన ఫ్యాలెస్. ఇందులోని గ్రాండ్ దర్బార్ హాల్ దాని ఐశ్వర్యానికి ప్రధాన ఆకర్షణ. ఈ ప్యాలెస్ మొదటి అంతస్తు టస్కాన్ నిర్మాణ శైలిని, రెండో అంతస్తు ఇటాలియన్ డోరిక్ శైలి, మూడవ అంతస్తులో కొరింథియన్లో నిర్మించారు. దీని ఖరీదు వచ్చేసి..దగ్గర దగ్గర రూ. 4 వేల కోట్టు పైనే ఉంటుందట. దీన్ని 1874లో మహారాజా జయజీరావు సింధియా నిర్మించారు. అంతేగాదు ఈ ప్యాలెస్‌లో అత్యంత బరువైన 3,500 కిలోగ్రాముల షాన్డిలియర్ లైటింగ్ అత్యంత ఆకర్షణీయంగా ఉంటుందట. దీన్ని ప్యాలెస్ పైకప్పు తట్టుకోగలదో లేదని ఏకంగా పది ఏనుగుల చేత పదిరోజుల పాటు నడిపించి పరీక్షించారట. అలాగే గ్రాండ్ దర్బార్ హాల్లో 560 కిలోగ్రాముల బంగారంతో అలంకరించిన గోడ కళ్లు చెదరిపోయేలా ఉంటుందట. దీంతోపాటు ఇందులో ఉండే విలాసవంతమైన భోజనశాలలోని వెండిరైలు టేబుల్‌పై వంటలను వడ్డించడం అత్యంత ఆశ్చర్యానికి లోను చేస్తుంది. అంతేగాదు ఈ ప్యాలెస్‌లో ఉండే 35 గదులను రాజమాతా విజయ రాజే సింధియా, జివాజిరావ్ సింధియా జ్ఞాపకార్థం మ్యూజియంలుగా మార్చారు. దీన్ని హెచ్.హెచ్. మహారాజా జివాజిరావ్ సింధియా మ్యూజియం అని పిలుస్తారు ప్రజలు. గాల్వియర్‌లో తప్పక చూడాల్సిన పర్యాటక స్పాట్ కూడా ఇదే.(చదవండి: 140 కిలోల బరువుతో ఒబెసిటీతో బాధపడ్డాడు..ఇవాళ ఏకంగా 55 కిలోలు..!) -
‘‘వీళ్లు మనుషుల్రా..బాబూ..!’’ జేసీబీని ఎత్తికుదేసిన గజరాజు, వైరల్ వీడియో
సాధారణంగా సాధు జంతువులైనా, అడవి జంతులైనా వాటికి హాని కలుగుతుందన్న భయంతోనే ఎదుటివారిపై దాడి చేస్తాయి ఈ విషయంలో ఏనుగు ప్రధానంగా చెప్పుకోవచ్చు. అలా సహనం నశించి ప్రాణ భయంతో ఏనుగు తిరగబడిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఆహారం కోసం వచ్చి తనదారిన తాను పోతున్న అడవి ఏనుగును అనవసరంగా కావాలనే రెచ్చగొట్టారు తుంటరిగాళ్లు. వేలం వెర్రిగా వీడియోలను తీసుకుంటూ వేధించారు. ‘‘చూసింది.. చూసింది.. మనుషులురా..ఇక వీళ్లు.. మారరు.. అనుకున్నట్టుంది.. తనదైన శైలిలో ప్రతాపం చూపించింది. జేసీబీని ఎత్తి కుదేసింది. పశ్చిమ బెంగాల్లో ఫిబ్రవరి 1న జరిగిన ఈ సంచలన ఘటన సోషల్ మీడియా ఆగ్రహానికి కారణమైంది. పశ్చిమ బెంగాల్‌లోని జల్పైగురిలోని డామ్‌డిమ్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఆహారం కోసం ఒక పెద్ద ఏనుగు అపల్‌చంద్ అడవి నుండి బయటకు వచ్చింది. స్థానికులు దానిని వెంటాడారు. ఏనుగును వేధించి వెంబడించారు. అక్కడ ఉన్న వారిలో ఒకరు ఏనుగు తోక పట్టుకొని లాగారు. సహనం నశించిన అది చుట్టూ మూగినవారిపై దాడి చేసింది.. నిర్మాణ సామగ్రిని,సమీపంలోని వాచ్‌టవర్‌ను లక్ష్యంగా చేసుకుంది. జేసీబీపై తన ఆగ్రహాన్ని ప్రకటించింది. డ్రైవర్ ఎక్స్కవేటర్ బకెట్‌ను ఉపయోగించి దానిని ఎదుర్కొన్నాడు. దీంతో ఏనుగు పారిపోవడానికి అలా తిరిగిందో మళ్లీ జనం ఎగబడటం వీడియోలో రికార్డ్ అయింది. స్థానికులెవరికీ గాయాలు కాలేదు.కానీ ఏనుగుకి తొండంపై గాయాలైనాయి. దీంతో నెటిజనులు మండిపడుతున్నారు. ఏనుగుని గాయపర్చిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. TRAGIC THIS: In search of food but disturbed by human noise, a wild elephant attacked a JCB and a watchtower in Damdim (Dooars) today. In the chaos, the tusker also sustained injuries. pic.twitter.com/ZKlnRixaFN— The Darjeeling Chronicle (@TheDarjChron) February 1, 2025వన్యప్రాణులతో సహజీవనం చేయాలని, వాటి పట్ల దయతో వ్యవహరించాలనే అభిప్రాయాలను వ్యక్తం చేశారు చాలామంది. అలాగే అడవి జంతువులను కాపాడటానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంత క్రూరత్వాన్ని ప్రదర్శించిన వారిపైఅటవీ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, లేకపోతే కొన్ని సంవత్సరాల్లో ఇవి పుస్తకాల్లో మాత్రమే కనిపిస్తాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. "ఏనుగులను ఏమీ అనకపోతే వాటిదారిన అవి పోతాయి, వేధిస్తేనే తిరగబడతాయని మరొకొరు పేర్కొన్నారు. ఇదీ చదవండి: బాల్యంలో నత్తి.. ఇపుడు ప్రపంచ సంగీతంలో సంచలనం!మరోవైపు జేసీబీ డ్రైవర్ , ఆ సమయంలో అక్కడ ఉన్న స్థానికులు ఏనుగును వేధించారనే ఆరోపణలపై వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972లోని బహుళ సెక్షన్ల కింద వన్యప్రాణి కార్యకర్త తానియా హక్‌తో పాటు, మరికొందరు ఫిబ్రవరి 2న లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అధికారులు స్పందించారు. అడవి ఏనుగును రెచ్చగొట్టాడనే ఆరోపణలతో పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు.జేపీబీ యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. జేసీబీ క్రేన్‌తో ఏనుగును రెచ్చగొట్టి దాడి చేసినందుకు నిందితుడిని అరెస్టు చేసినట్లు పశ్చిమ బెంగాల్ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ దేబల్ రే తెలిపారు. ఏనుగును అడవిలోకి వదిలేశామని అన్నారు.బెంగాల్ ప్రస్తుతం దాదాపు 680 ఏనుగులకు నిలయంగా ఉంది. అడవి ఏనుగులు తరచుగా ఆహారం కోసం జల్పైగురి, నక్సల్బరి, సిలిగురి , బాగ్డోగ్రా వంటి ప్రాంతాలలో తిరుగుతుంటాయి. సాధారణంగా, స్థానికులు సురక్షితమైన దూరంలో ఉంటూ, వారితో ప్రేమగా, శాంతియుతంగా ఉంటారు. అయినా పశ్చిమ బెంగాల్ అడవులలో మానవ-ఏనుగుల సంఘర్షణ చాలా కాలంగా కొనసాగుతున్న సమస్య. దీనివల్ల పెద్ద సంఖ్యలో మానవ మరణాలు సంభవిస్తున్నాయి. పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ జూలై 2024 నాటి డేటా ప్రకారం, 2023-24లో పశ్చిమ బెంగాల్లో మానవ-ఏనుగుల సంఘర్షణ కారణంగా 99 మానవ మరణాలు సంభవించాయి.ఇది ఒడిశా ,జార్ఖండ్లతో పాటు దేశంలోనే అత్యధిక మరణాలలో ఒకటి. 2022-2023 మంత్రిత్వ శాఖ డేటా ఆధారంగా, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పశ్చిమ బెంగాల్లో వేటాడటం, విద్యుదాఘాతం, విషప్రయోగం రైలు ప్రమాదాలు వంటి మానవ ప్రేరిత కారకాల వల్ల తక్కువ సంఖ్యలో ఏనుగుల మరణాలు నమోదయ్యాయి. ఇక్కడ 2023లో మొత్తం ఏడు ఏనుగులు ప్రాణాలు కోల్పోయాయి. -
Damerla Ramarao అద్వితీయ చిత్రకళా తపస్వి
తెలుగు జాతి సాంస్కృతిక పునరుజ్జీవనానికి అతి పిన్న వయసులో విశిష్టమైన కృషి చేసిన తొలి కళా తపస్వి దామెర్ల రామారావు. బాల్యం నుంచే చిత్రకళ పట్ల నెలకొన్న గాఢమైన అభినివేశం ఆయన్ని అవిశ్రాంత కళా పిపాసిగా చేసింది. 1897, మార్చి 8న జన్మించిన రామారావు రెండు పదుల వయసు నిండకుండానే ముంబైలోని ‘జె. జె. స్కూల్ ఆఫ్ ఆర్ట్స్’లో చేరి చిత్రకళలో నైపుణ్యం సంపాదించారు. రాజమండ్రి కళాశాలకు ప్రిన్సిపాల్‌గా చేసిన ఆంగ్ల రచయిత ఆస్వాల్డ్ కూల్డ్రేకు రామారావు అంటే ఎంతో అభిమానం. అందుకే తాను రాసిన ‘సౌత్ ఇండియన్ అవర్’ అనే గ్రంథాన్ని తెలుగులో గొప్ప రచయితలైన కవికొండల వెంకటరావు, అడివి బాపిరాజులతో బాటుగా దామెర్ల రామారావు గారికి కూడా అంకిత మిచ్చారు. ప్రఖ్యాత కవి పండితులు మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి దామెర్లవారి గురించి ఇలా అన్నారు: ‘జీవముల వోసి, బొమ్మల జేసెనొకడు/బొమ్మలు గీసి జీవమును వోసేనొకడు/ రాముడాతడు, దామెర్ల రాము డితడు/ లేవు కాలావధులు చిత్ర లీలలందు.’ రవీంద్రనాథ్ టాగోర్‌ను కలిసిన పది నిమిషాల్లో విశ్వకవి చిత్రపటాన్ని గీసిచ్చారు. రామారావు ప్రతిభకు ఆశ్చర్యపోయిన టాగోర్ ‘ప్రపంచంలోకెల్లా గొప్ప చిత్రకరుడివి కాగలవు’ అని దీవించారట.అప్పటి వైస్రాయ్ లార్డ్ రీడింగ్ రామారావు ‘తూర్పు కనుమల్లో గోదావరి’ చిత్రాన్ని చూసి ముగ్ధుడై అప్పటికప్పుడు ఆ చిత్రం కొనేయడమే కాక, ‘స్వదేశీ ఉద్యమం జరుగుతున్న సమయంలో నేను స్వదేశీ చిత్రాన్ని కొంటు న్నాను చూడండి’ అని చమత్కరించారట. అశ్లీలతకు తావులేకుండా భారతీయ మహిళని తొలిసారిగా నగ్నంగా చిత్రించిన రామారావు నవ్యాంధ్ర చిత్రకళా స్థాపకులు. 1922లో రాజమండ్రిలో ‘ఆంధ్ర సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆర్ట్’ పేరిట చిత్రకళాశాలను స్థాపించారు. అప్పుడే ‘సత్యవాణి’ అనే చిత్రకారిణిని వివాహం చేసుకున్నారు. రామారావు చిత్రాలకు ఆయన భార్య సత్యవాణిగారే ‘మోడల్’గా ఉండేవారు. స్వదేశంలోనే కాక పారిస్, లండన్, టోరంటో వంటి అంతర్జాతీయ ప్రదర్శనల్లో కూడా రామారావు చిత్రాలు ఎన్నో ప్రశంసలు, పురస్కారాలు పొందాయ్. ఇంతటి ప్రతిభావంతుడు 28 ఏళ్ళ అతి చిన్న వయసులోనే గుంటూరు జిల్లాలో పర్యటిస్తూ మశూచి వ్యాధికి గురై 1925, ఫిబ్రవరి 6న అకాల మరణం చెందారు. రామారావు చిత్రించిన ‘సిద్ధార్థ రాగోదయం’, ‘పుష్పాలంకరణ’, ‘నంది పూజ’, ‘గోపికాకృష్ణ’, ‘బావి వద్ద’, ‘అజంత’, ‘ఎల్లోరా’, ‘పట్టిసీమ’, ‘మెయిడ్స్ ఆఫ్ కథియావాడ్’... వంటి అత్యద్భుత కళాఖండాల్ని ఎన్నింటి గురించి చెప్పుకున్నా తక్కువే. రామారావు స్మృతిలో రాజమండ్రిలో చిత్రకళా మందిరాన్ని, శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 1925 లోనే ఆ రెంటినీ సందర్శించిన మహాత్మా గాంధీజీ ఆ చిత్రాలని చూసి ముగ్ధులయ్యారు. ప్రస్తుతం రాజమండ్రిలోని గోదావరి స్టేషన్ వద్ద ఉన్న ‘దామెర్ల రామారావు మెమోరియల్ ఆర్ట్ గ్యాలరీలో ఎన్నో కళాఖండాలు ఉన్నాయి. అవన్నీ తెలుగువారు సంరక్షించు కోవలసిన విశేషమైన కళా సంపదలే. – గౌరవ్ ‘ సాంస్కృతిక కార్యకర్త (నేడు దామెర్ల రామారావు శతవర్ధంతి) -
మానవ ఐవీఎఫ్ సాయంతో కంగారూ పిండాలు..!
వాతవరణ మార్పులు, కాలుష్యం కారణంగా ఇప్పటికే పలు జంతు జాతులు అంతరించిపోతున్నాయి. పర్యావరణ ప్రేమికులు వాటిన సంరక్షించేందుకు పలు విధాలు ప్రయత్నిస్తున్నారు. ఆ నేపథ్యంలో తాజాగా శాస్త్రవేత్తలు ఆ అంతరించిపోతున్న జాతుల పరీరక్షణకు మార్గం సుగమం చేసేలా తొలిసారిగా మానవ ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) ఉపయోగించారు. దీని సాయంతో అంతరించిపోతున్న జాతుల పిండాలను విజయంతంగా సృష్టించి సరికొత్త పరిష్కారానికి నాంది పలికారు. ఇంతకీ ఈ ఐవీఎఫ్‌ని ఉపయోగించి ఏ జంతు పిండాలను సృష్టించారంటే..ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్తలు(Australian Scientists) తొలిసారిగా ఐవీఎఫ్‌ని ఉపయోగించి అంతరించిపోతున్న మార్సుపియల్ జాతి కంగారు పిండాలను(kangaroo embryos) విజయవంతగా సృష్టించారు. ఇలా మానవ ఐవీఎఫ్ సాయంతో జంతు పిండాలను ఉత్పత్తి చేయడం ఇదే తొలిసారి. ఆస్ట్రేలియాలో ఉండే ఈ మార్సుపియల్(marsupial species) అంతరించిపోతున్న జాతుల జాబితాలో ఉన్నాయి. ఈ జాతికి సంబంధించిన కోలాస్, టాస్మానియన్ డెవిల్స్, నార్తర్న్ హెయిరీ-నోస్డ్ వొంబాట్స్, లీడ్బీటర్స్ పోసమ్స్ వంటి కంగారు జాతులు అంతరించిపోతున్న దశలో ఉన్నట్లు చెబుతున్నారు పరిశోధకులు. ఆ జంతువులను పరిరక్షించడమే లక్ష్యంగా ఈ పరిశోధనకు శ్రీకారం చుట్టినట్లు క్వీన్స్‌ల్యాండ్ విశ్వవిద్యాలయ(Queensland University) పరిశోధకుడు డాక్టర్ ఆండ్రీస్ గాంబిని( Andres Gambini,) తెలిపారు. తమ పరిశోధనా బృందం మానవ IVFలో సాధారణంగా ఉపయోగించే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ (ICSI) ద్వారా 20 కి పైగా కంగారూ పిండాలను విజయవంతంగా ఉత్పత్తి చేసినట్లు తెలిపారు. ఈ పరిశోధన కోసం తమ బృందం ఇటీవలే మరణించిన కంగారూల నుంచి స్పెర్మ్, గుడ్డు కణాలను సేకరించినట్లు వివరించారు. ఈ ఐవీఎప్కి బూడిద రంగు కంగారులే అనువైనవని గాంబిని చెబుతున్నారు. ఎందుకంటే వాటి జనాభా కొన్ని ప్రాంతాల్లో విస్తృతంగా ఉనికిలో ఉండటం కారణంగా వాటి జన్యు పదార్థం సమృద్ధిగా అందుబాటులో ఉంటుంది. అలాగే ఈ ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ (ICSI) జాతుల పరిరక్షణకు, సంతానోత్పత్తి ప్రయత్నాలలో గణనీయమైన ప్రయోజనాన్ని అందించిందని చెప్పారు. దీనికోసం లక్షలాది స్పెర్మ్ సజీవంగా ఉండాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ పరిశోధన విజయవంతం కావడంతో పరిశోధకులు జన్యువైవిధ్యాన్ని ప్రవేశ పెట్టేలా మరణించిన జంతువుల నుంచి జన్యు పదార్థాన్ని సంరక్షించడానికి ఐవీఎఫ్‌ని ఉపయోగించాలని పరిశోధన బృందం చూస్తోంది. అలాగే ఈ సృష్టించిన జంతువులు పర్యావరణానికి అనుకూలంగా మనుగడ సాగించాలే చూడటానికి ఈ జన్యువైవిధ్యం తప్పనిసరని అంటున్నారు. అదీగాక ప్రస్తుతం ఆస్ట్రేలియాలో క్షీరదాల క్షీణత రేటు భయానకంగా ఉంది. ఇప్పటికే 38 జాతులు కనుమరుగైనట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ పరిశోధన సరికొత్త ఆశను అందిస్తోంది. (చదవండి: -
కుంగ్ ఫూ శిక్షణ..ఆత్మరక్షణ కుర్రకారులో భారీ క్రేజ్
ఆత్మ రక్షణ క్రీడలైన కుంగ్ ఫూ, మార్షల్ ఆర్ట్స్ పై నగర వాసులకు ఆసక్తి పెరుగుతోంది. నగరంలోని జీహెచ్ఎంసీ గ్రౌండ్స్ వేదికగా అభ్యాసన చేస్తున్నారు పలువురు క్రీడాకారులు. దీంతో పాటు పతకాలు సాధిస్తూ కొందరు.. స్ఫూర్తిగా మరికొందరు ఈ మార్షల్ ఆర్ట్స్ పట్ల ఆకర్షితులవుతున్నారు నగరవాసులు. అంతేకాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలువురు క్రీడాకారులు ప్రతిభను కనబరుస్తూ పతకాలు సాధిస్తున్నారు. – సనత్‌నగర్ నగరంలో ఇటీవలికాలంలో మార్షల్ ఆర్ట్స్ శిక్షణకు ఆదరణ పెరుగుతోంది. తల్లిదండ్రుల్లో ఈ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ పట్ల పెరుగుతున్న అవగాహనే ఇందుకు కారణం. పైగా చిన్నతనం నుంచి ఇటువంటి శిక్షణలో పాల్గొనడంతో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుందని విశ్లేషకులు చెబుతున్న మాట. దీంతో చిన్నారులు కూడా ఈ తరహా శిక్షణ తీసుకునేందుకు కఠోర దీక్షతో అభ్యాసన చేస్తున్నారు. అంతేకాకుండా జీహెచ్ఎంసీ గ్రౌండ్స్‌లో నిర్వహించే శిక్షణా శిబిరాలను సద్వినియోగం చేసుకుంటూ రాటుదేలుతున్నారు. ఆ‘శక్తి’ని గమనించి.. కోచ్‌లు సైతం పిల్లల్లోని ఆ‘శక్తి’ని గమనించి కుంగ్‌ఫూలో ఉన్నత శిక్షణను అందిస్తూ వివిధ పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నారు. బేగంపేట ఓల్డ్ పాటిగడ్డలోని జీహెచ్ఎంసీ గ్రౌండ్, బ్రాహ్మణవాడీ, మాసబ్ ట్యాంక్, విజయనగర్ కాలనీల్లో కుంగ్ ఫూ – మార్షల్ ఆర్ట్స్‌లో గ్రాండ్ మాస్టర్ కంటేశ్వర్, డిప్యూటీ గ్రాండ్ మాస్టర్ కళ్యాణ్, జీహెచ్ఎంసీ కోచ్ చందు నిరంతరం శిక్షణను అందిస్తున్నారు. 2010 జనవరి 1 నుంచి వీరు శిక్షణ కొనసాగిస్తుండగా ఇప్పటి వరకూ వందలాది మంది కుంగ్ ఫూలో శిక్షణ పొందారు. చదవండి: లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను అమ్మేసిన సోనాక్షి సిన్హా, లాభం భారీగానే! పలు పోటీల్లో... నగరంలో ఎల్బీ స్టేడియం, కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి స్టేడియం, సరూర్‌నగర్, బాలయోగి స్టేడియం తదితర ప్రాంతాల్లో ఎక్కడ పోటీలు జరిగినా ఇక్కడి చిన్నారులు పాల్గొంటూ ప్రతిభను కనబరుస్తున్నారు. ఒక్క నగరానికే పరిమితం కాకుండా రాష్ట్రంలోని వరంగల్, సిర్పూర్ కాగజ్ నగర్, బెల్లంపల్లి, మందమర్రి, ఖాజీపేటతో పాటు ఒడిస్సా, మహారాష్ట్ర, గోవా తదితర రాష్ట్రాల్లో జరిగిన జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని పతకాలను సాధించారు. నాలుగేళ్ల చిన్నారుల నుంచి.. మానసిక, శారీరక దృఢత్వం, ఏకాగ్రత కోసం నాలుగేళ్ల చిన్నారి నుంచి 23 ఏళ్ల యువకుల వరకూ ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. శిక్షణ తీసుకున్న వారిలో చాలామంది వెళ్లిపోగా, ప్రస్తుతం ఆయా కేంద్రాల వేదికగా 70 మంది వరకూ శిక్షణ పొందుతున్నారు. చిన్నతనం నుంచే కుంగ్ ఫూలో శిక్షణ పొందడం వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయని మాస్టర్లు పేర్కొంటున్నారు. ఇదీ చదవండి : లూపస్ వ్యాధి గురించి తెలుసా? చికిత్స లేకపోతే ఎలా?!కుంగ్ ఫూతో మేలు.. కుంగ్ ఫూ, మార్షల్ ఆర్ట్స్ ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తాయి. శారీరక, మానసిక దృఢత్వం పెరిగి, ఆత్మరక్షణతో పాటు ఆత్మస్థైర్యం పెంపొందుతుంది. మా చిన్నారులు ప్రతిభ కనబరుస్తూ.. పతకాలు సాధించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. – కంటేశ్వర్, కళ్యాణ్, చందు, కంగ్ ఫూ మాస్టర్లు మాస్టర్ల ప్రోత్సాహమే.. కుంగ్ ఫూలో నేను బ్లాక్ బెల్ట్ సాధించాను. మాస్టర్లు, కోచ్‌ల ప్రోత్సాహంతో ఇప్పటి వరకూ ఎన్నో పోటీల్లో పాల్గొన్నాను. మొత్తం 30 బంగారు, 25 వెండి, 15 కాంస్య పతకాలను సాధించానంటే.. అది వారి శిక్షణ ఫలితమే. – వాసు, కుంగ్ ఫూ క్రీడాకారుడు -
కొంబర శ్రీకృష్ణ స్వామి ఆలయానికి యాంత్రిక ఏనుగు సేవలు..!
దేవాలయాల్లో దేవుళ్లను గజవాహనంతో ఊరేగించడం వంటివి చేస్తారు. అంతేగాదు కొన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో అయితే ఏనుగులపై దేవుడిని ఊరేగిస్తారు. అందుకోసం మావటి వాళ్లు తర్ఫీదు ఇచ్చి దైవ కైంకర్యాలకు ఉపయోగించడం జరుగుతుంది. దీని కారణంగా ప్రకృతి ఓడిలో హాయిగా స్వేచ్ఛగా బతకాల్సిన ఏనుగులు బందీలుగా ఉండాల్సిన పరిస్థితి. దీనివల్లే కొన్ని ఏనుగులు చిన్నప్పుడు వాటి తల్లుల నుంచి దూరమైన సందర్భాలు ఉన్నాయి. అలాంటి సమస్య తలెత్తకుండా ఉండేలా లాభపేక్షలే జంతు హక్కుల సంస్థ పెటా ఇండియా ఒక చక్కని పరిష్కారమార్గం చూపించింది. ఇంతకీ ఆ సంస్థ ఏం చేస్తోందంటే..గజారోహణ సేవ కోసం ఏనుగుల బదులుగా యాంత్రిక ఏనుగుల(ఛMechanical elephant)ను తీసుకొచ్చింది పెటా ఇండియా. ఏనుగులు సహజ ఆవాసాలలోనే ఉండేలా చేసేందుకే వీటిని తీసుకొచ్చినట్లు తెలిపింది. ఇలా యాంత్రిక ఏనుగులను ఉపయోగించడం ద్వారా నిజమైన జంబోలు తమ కుటుంబాలతో కలిసి ఉండగలవని, పైగా నిర్బంధం నుంచి విముక్తి కలుగుతుందని పేర్కొంది పెటా ఇండియా. అలాగే ఆయుధాలతో నియత్రించబడే బాధల నుంచి తప్పించుకుని హాయిగా వాటి సహజమైన ఆవాసంలో ఉంటాయని పేర్కొంది. ఇక ఈ యాంత్రిక ఏనుగులను రబ్బరు, ఫైబర్, మెటల్, మెష్, ఫోమ్ స్టీల్‌తో రూపొందించినట్లు తెలిపింది. ఇవి నిజమైన ఏనుగులను పోలి ఉంటాయి. ఈ యాంత్రిక ఏనుగు తల ఊపగలదు, తొండం ఎత్తగలదు, చెవులు, కళ్లను కూడా కదిలించగలదు. అంతేగాదు నీటిని కూడా చల్లుతుందట. ఇది ప్లగ్-ఇన్ వ్యవస్థ ద్వారా పనిచేస్తుందట. దీనికి అమర్చిన వీల్‌బేస్ సాయంతో వీధుల గుండా ఊరేగింపులకు సులభంగా తీసుకెళ్లచ్చొట. తాజాగా ప్రఖ్యాత సితార్ విద్వాంసురాలు, ఈ ఏడాది గ్రామీ నామినీ అనౌష్కా శంకర్(Anoushka Shankar) పెటా ఇండియా(Peta India) సహకారంతో కేరళ త్రిస్సూర్‌లోని కొంబర శ్రీకృష్ణ స్వామి ఆలయాని(Kombara Sreekrishna Swami Temple)కి ఇలాంటి యాంత్రిక ఏనుగుని విరాళంగా సమర్పించారు. సుమారు 800 కిలోగ్రాముల బరువున్న ఈ ఏనుగును బుధవారం(ఫిబ్రవరి 05, 2025న ) ఆలయంలో ఆవిష్కరించారు. ఈ యాంత్రిక ఏనుగు పేరు కొంబర కన్నన్.ఇలా పెటా ఇండియా కేరళ(Kerala) ఆలయాలకి యాంత్రిక ఏనుగులను ఇవ్వడం ఐదోసారి. త్రిస్సూర్ జిల్లాలో మాత్రం రెండోది. ఇటీవల మలప్పురంలోని ఒక మసీదులో మతపరమైన వేడుకల కోసం కూడా ఒక యాంత్రిక ఏనుగును అందించింది. నిజంగా పెటా చొరవ ప్రశంసనీయమైనది. మనుషుల మధ్య కంటే అభయారణ్యాలలోనే ఆ ఏనుగులు హాయిగా ఉండగలవు. అదీగాక ఇప్పుడు ఏనుగుల సంఖ్య తగ్గిపోతున్న తరుణంలో ఇలాంటి ప్రత్యామ్నాయం ప్రశంసనీయమైనదని జంతు ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. Kombara Kannan, a 3-metre-tall mechanical elephant weighing 800 kilograms, was offered to Kombara Sreekrishna Swami Temple, in Thrissur district on Wednesday, by renowned sitarist Anoushka Shankar and PETA India.📹Thulasi Kakkat (@KakkatThulasi) pic.twitter.com/Cz0vD0NNHs— The Hindu (@the_hindu) February 5, 2025 (చదవండి: ఆ అమ్మాయి భలే అద్భుతం..అచ్చం కంప్యూటర్‌లా..!) -
చివరకు మిగిలేది! ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గుండెలు పగిలే స్టోరీ
ఆరోగ్యమే మహాభాగ్యము అను సామెత మన అందరికి తెలిసిందే. అయినా ఆరోగ్యాన్ని పెద్దగా పట్టించుకోం. ఆరోగ్యాన్ని మించిన సంపదలేదు..ఆరోగ్యమే ఐశ్వర్యం అన్న పెద్దల మాటను పెడిచెవిన పెట్టి మరీ సంపద వేటలో పరుగులు పెడుతూ ఉంటాం. న్యాయం, అన్యాయం,విలువలన్నీ పక్కన పెట్టేస్తాం. కానీ అనారోగ్యం చుట్టుముట్టినపుడు గానీ ఆరోగ్యం విలువ తెలిసిరాదు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఏ సిరిసంపదలూ వెనక్కి తీసుకు రాలేని అందనంత దూరం వెళ్లిపోతాం. ఏం పాపం చేశాననీ నాకీ అవస్థ అంటూ అంతులేని ఆవేదనలో కూరుకుపోతాం...అనారోగ్యంతో మరణమనే కత్తి అంచున వేలాడుతున్న వారి అవేదన ఇది. ఆ ఆవేదనలోంచే తోటి మనుషులకు నాలుగు మంచి ముక్కలు చెప్పాలనే ఆలోచన వస్తుంది. నాలాగా మీరు కాకండి, మీరైనా జాగరూకతతో మసలుకోండనే సందేశాన్నిస్తారు. అలాంటి వాటిలో ఒకటి మీరు చదవబోయే మరణ సందేశం...!ప్రపంచ ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్, రచయిత్రి "క్రిస్డా రోడ్రిగ్జ్" కేన్సర్‌తో బాధపడుతూ చనిపోయింది. బ్లాగర్ కూడా ఈమెను క్రిస్డా రోడ్రిగ్జ్, కిర్జాయ్డా రోడ్రిగ్జ్ అని కూడా పిలిచేవారు. 40 సంవత్సరాల వయసులో (2018, సెప్టెంబర్ 9న) కడుపు కేన్సర్‌తో ఆమె చనిపోయింది. అయితే చనిపోయే ముందు ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ తెలిపేలా ఒక వ్యాసం రాసింది. పది పాయింట్లతో ఆమె రాసిన ఈ వ్యాసం పలువుర్ని కదిలించింది. అనేకమందితో కంటతడి పెట్టించింది. డబ్బు, విలాసవంతమైన ఇల్లు, ఖరీదైన కార్లు అన్నీ ఉన్నాయి, కానీ అవేవీ తనను కాపాడలేకపోతున్నాయంటూ హృదయాలు మెలిపెట్టేలా కొన్ని జీవిత సత్యాలను తన వ్యాసంలో పేర్కొంది. ఎన్నో ఖరీదైన బట్టలున్నాయి. కానీ చివరికి ఆస్పత్రిలో బట్టలో తన దేహాన్ని చుడతారు. ఇదే జీవితం. ఈ జీవిత సత్యం చాలామందికి ఇంకా అర్థం కాలేదు. దయచేసి వినయంగా ఉండండి, ఇతరులతో దయగా ఉండండి. చేతనైంత సాయం చేయండి, నలుగురితో శభాష్ అనుపించుకోండి. ఎందుకంటేఅదే కడదాకా నిలిచేది. చివరకు మిగిలేది! అంటూ రాసుకొచ్చింది. వరల్డ్ కేన్సర్ డే సందర్భంగా ఆమె రాసిన పది పాయింట్లు నా గ్యారేజీలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు ఉంది, కానీ ఇప్పుడు నాకు వీల్‌చైరే ఆధారం.నా ఇంట్లో అన్ని రకాల బ్రాండెడ్ బట్టలు, ఖరీదైన బూట్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు నా శరీరం ఆసుపత్రి అందించిన చిన్న గుడ్డలో చుట్టబడి ఉంది.నా దగ్గర బ్యాంకులో చాలా డబ్బు ఉంది. కానీ ఇప్పుడు ఆ డబ్బుతో ఇపుడేమీ లాభం లేదువిలాసవంతమైన కోట లాంటి భవనం ఉంది. కానీ ఇప్పుడు నేను ఆసుపత్రి బెడ్ మీద నిద్రపోతున్నాను. ఫైవ్ స్టార్ హోటల్లో ఉండేదాన్ని. మరి ఇప్పుడు ఒక క్లినిక్ నుండి మరొక క్లినిక్‌కు తిరుగుతూ ఆసుపత్రిలోనేను వందలాది మందికి ఆటోగ్రాఫ్‌లపై సంతకం చేసాను కానీ ఇపుడు, వైద్య రికార్డులే నా సంతకం.నా జుట్టును అందంగా తీర్చిదిద్దుకోడానికి ఏడు రకాల సె లూన్లకు వెళ్లేదాన్ని. కానీ ఇప్పుడు - నా తలపై ఒక్క వెంట్రుక కూడా లేదు.ప్రైవేట్ విమానంలో ఎపుడు కావాలంటే అపుడు, ఎక్కడికైనా ఎగరగలను, కానీ ఇప్పుడు నాకు ఆసుపత్రి గేటు వరకు నడవడానికి ఇద్దరు సహాయకులు అవసరం.చాలా ఆహారం ఉంది. కానీ రోజుకు రెండు మాత్రలు, సాయంత్రం కొన్ని చుక్కల ఉప్పు నీరు ఇపుడిదే నా ఆహారంఈ ఇల్లు, ఈ కారు, ఈ విమానం, ఈ ఫర్నిచర్, ఈ బ్యాంకు, మితిమీరిన కీర్తి ఇవేవీ నాకు అక్కరకు రావు. ఇవేవీ నన్ను శాంతింపజేయవు. ఈ ప్రపంచంలో "మరణం తప్ప నిజమైనది మరేదీ లేదు."అన్నింటికన్నా అతి ముఖ్యమైన విషయం ఆరోగ్యం. ఉన్నదాంతోనే సంతోషంగా ఉండండి. కడుపునిండా భోజనం, పడుకోవడానికి స్థలం ఇంతకంటే ఏం కావాలి ఆరోగ్యంగా ఉండండి అంటూ సందేశాన్నిచ్చింది. డెత్ బెడ్‌పై తన జీవిత దృక్పథాన్ని మార్చుకుంది. భౌతిక ఆస్తుల అశాశ్వతతను వెలుగులోకి తెచ్చింది. ఆరోగ్యం, ప్రాథమిక అవసరాలు ప్రేమ, సంతృప్తి, విశ్వాసం యొక్క అమూల్య మైన విలువను నొక్కి చెప్పింది. డొమినికన్ రిపబ్లిక్కు చెందిన ఆమె న్యూజెర్సీలో ఉండేది. ఫ్యాషన్, స్టైల్, ఫిట్నెస్, పాజిటివిటీ, వెల్నెస్, స్ఫూర్తి లాంటి విషయాలపై రోజువారీ పోస్ట్‌ల ద్వారా అభిమానులతో పంచుకునేది. రోడ్రిగ్జ్ తొలిసారి 2017 నవంబరులో స్టేజ్ 4 స్టమక్ కేన్సర్ సోకినట్టు ప్రకటించింది.ఈ పోరాటంలో కూడా రెగ్యులర్ విషయాలతోపాటు తన అనుభవాలనూ పంచుకునేది. ఇవీ చదవండి: ‘నేనూ.. మావారు’ : క్లాసిక్ కాంజీవరం చీరలో పీవీ సింధుకేరళ ర్యాగింగ్ : ‘నా మేనల్లుడే..’వ్యాపారవేత్త చెప్పిన భయంకర విషయాలు -
స్టార్ డాక్టర్ కిల్లర్‌గా మారితే ఇంత ఘోరంగా ఉంటుందా..!
వైద్యుడంటే ప్రాణాలు కాపాడే నారాయణుడిగా భావిస్తారు. అందుకే అంతా "వైద్యో నారాయణో హరి:" అని అంటారు. అలాంటి వైద్య వృత్తికి కళంకం వచ్చేలా చేశాడో వ్యక్తి. ప్రాణాలు కాపాడతాడని ఆశతో వచ్చిన వాళ్లందరిని పొట్టనబెట్టుకున్నాడు. తామెందుకు చనిపోతున్నామో తెలియకుండానే ఎందరో అమాయకులు ప్రాణాలు గాల్లోకలిసిపోయాయి. కనీసం చిన్న క్లూ దొరక్కుండా పక్కాప్లాన్‌తో చంపేశాడు. సీరియల్ కిల్లర్‌కి మించిన కిరాతకుడు. ఒక్క హత్య మాత్రం అతడి ఆగడాలకు చెక్‌పెట్టి దొరికపోయేలా చేసింది. చివరికి ఆ దారుణాలు పశ్చాత్తాపంతో కుమిలిపోయి చనిపోయేలా చేసింది. అయితే అతడు ఎందుకు ఈ హత్యలన్నీ చేశాడన్నది అంతు చిక్కని మిస్టరీలా మిగిలిపోయింది.డాక్టర్ డెత్‌గా పిలిచే ఈ వైద్యుడి పేరు హెరాల్డ్ షిప్‌మ్యాన్. బ్రిటన్‌కి చెందిన వ్యక్తి. అతడికేసు పోలీసులకు అర్థంకానీ మిస్టరీలా మిగిలింది. అతడు పోలీసులకు పట్టుబడినప్పుడు 50 మంది రోగులు చనిపోయారని తెలియగా..దర్యాప్తులో మాత్రం ఏకంగా 200 మందిని హతం చేసినట్లు తేలింది. వారిలో అత్యంత చిన్న బాధితుడు నాలుగేళ్ల చిన్నారి కూడా ఉండడం అత్యంత విషాదకరం. అయితే అతడి టార్గెట్ అత్యంత వృద్ధులే. వారి అయితే ఎలాంటి అనుమానం రాకుండా చంపేయొచ్చనేది అతడి ఆలోచన కావొచ్చనేది పోలీసుల అనుమానం. ఇక ఈ హెరాల్డ్ షిప్మాన్ డాక్టర్ అయిన వెంటనే వెస్ట్ యార్క్‌షైర్‌లో ఉద్యోగం పొందాడు. అతను ప్రిమ్రోస్ అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆ దంపతులకు నలుగురు పిల్లలు కూడా. ఇంత మంచి జీవితాన్ని ఇలా ఎందుకు చీకటి మయం చేసుకున్నాడనేది అర్థంకానీ చిక్కుప్రశ్న.స్టార్ డాక్టర్ నుంచి కిల్లర్‌గా..1972లో, అతను 26 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు న్యుమోనియాతో బాధపడుతున్న నాలుగేళ్ల బాలికను చికిత్స పేరుతో హతం చేశాడు. బాలిక తల్లిని టీ తీసుకురమ్మని చెప్పి..హతమార్చాడు. అయితే ఆమె కూడా అనుమానించలేకపోయింది. ఎందుకంటే ఆమె అనారోగ్యంతోనే బాధపడటంతో ఆ ఆలోచనే ఆమెకు తట్లలేదు.ఎప్పుడైతే ఈ డాక్టర్ పట్టుబడ్డాడో అప్పుడామె తాను కూడా బాధితురాలినంటూ కోర్టు మందు ప్రత్యక్ష సాక్షిగా వాంగ్మూలం ఇచ్చింది. అతడు వైద్యుడిగా వెస్ట్ యార్క్‌షైర్‌లో ఉన్న సమయంలో అతని సహచరులు పెద్ద మొత్తంలో నొప్పి నివారిణి పెథిడిన్ కనిపించకుండా పోయిందని గమనించడం ప్రారంభించారు. అయితే ఇక్కడ హెరాల్డ్ మంచి డాక్టర్‌గా గుర్తింపు ఉండటంతో ఎవ్వరూ అతడిని అనుమానించే సాహసం చేయలేకపోయారు. ఈ డాక్టర్ మొదట అక్కడ పేషెంట్ల నమ్మకం పొందాక...తన ప్రణాళికను అమలు చేయడం మొదలు పెడతాడు. వృద్ధులనే టార్గెట్ చేసుకుని హత్యలకు పాల్పడుతాడు. ఒక్కొసారి వారిని ఇంటికి రమ్మని పిలచి మరీ హతమారుస్తుంటాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రోగికి కూడా వైద్యుడే తమను చంపుతున్నాడన్న విషయం తెలియదు. అయితే అతడితో చికిత్స పొందిన రోగులంతా చివరగా విపరీతమైన దగ్గుతో లేదా అంబులెన్స్‌కి ఫోన్ చేస్తూ మరణించినవారే..!. అలా 1998 వరకు ఇలాంటి దారుణాలకే పాల్పడుతూ వచ్చాడు.పట్టించిన కేసు..1998లో, అతను హైడ్ మాజీ మేయర్ కాథ్లీన్ గ్రండి (81)కి చికిత్స చేశాడు. ఆమె అత్యంత చురుకైన వ్యక్తి, మంచి ఆరోగ్యవంతురాలు, ధనవంతురాలు కూడా. అయితే ఆమె చెవులకు సంబంధించిన సమస్యతో అతడి వద్దకు వెళ్లింది. అతడిని సందర్శించిన నాలుగంటల్లోనే చనిపోయింది. ఇక్కడ కాథ్లీన్ గ్రండి కూతురు ఏంజెలా వుడ్రఫ్కి తన తల్లి మరణం సహజమైనది కాదనేది ఆమె అనుమానం. ఆ దిశగానే ఆలోచించడం మొదలుపెట్టింది. అయితే ఆమె తల్లి అంత్యక్రియలు పూర్తి అయ్యిన నెలకు ఆమె వీలునామా గురించి ఆరా తీసింది. అందులో మొత్తం ఆస్తి అంతా డాక్టర్ హెరాల్డ్‌కి కట్టబెట్టినట్లుగా ఉండటంతో వెంటనే ఆమె పోలీసులను ఆశ్రయించింది. అదీగాక ఇక్కడ వుడ్రప్ లాయర్ కావడంతో పోలీసులతో కలిసి తన తల్లి హత్య కేసుని చేధించడం చాలా తేలికయ్యింది. ఆ క్రమంలోనే డాక్టర్ హెరాల్డ్ పట్టుబట్టాడు. అతడి శస్త్రచికిత్స చేసే రూమ్‌లో టైప్రైటర్ని గుర్తించారు పోలీసులు. అలాగే వీలునామాలో కూడా కాథ్లీన్ గ్రండి సంతకాన్ని పోర్జరీ చేసినట్లు తేలుతుంది. మరో ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ వుడ్రఫ్ని డాక్టర్ హెరాల్డ్ ఆమె తల్లిని దహనం చేయమని కోరాడు. అయితే అందుకు వుడ్రఫ్ వ్యతిరేకించి తమ మతానుసారం ఖననం చేస్తుంది. ఎప్పుడైతే డాక్టరే నేరస్తుడని తేలిందో.. అప్పుడే వుడ్రఫ్కి ఈ సంభాషణ గుర్తుకొస్తుంది. ఆ రోజు హెరాల్డ్ ఎందుకని తన తల్లిని దహనం చేయమన్నాడన్న అనుమానంతో.. తన తల్లి సమాధి నుంచి అవశేషాలను వెలికి తీసి మరీ పోస్ట్‌మార్ట్ చేయిస్తుంది. నివేదికలో కాథ్లీన్ శరీరంలో ప్రాణాంతకమైన మార్ఫిన్ పెద్ద మొత్తంలో ఉన్నట్లు తేలుతుంది. దీంతో పోలీసులు సదరు వైద్యుడు హెరాల్డ్‌ని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారిస్తే 50 మంది రోగులను చంపినట్లు తేలుతుంది. కానీ పోలీసుల దర్యాప్తు ఆ సంఖ్య 200కి చేరుకుంటుంది. ఇంతమందిని పొట్టనబెట్టుకున్నాడా అని పోలీసులే విస్తుపోతారు. అయితే కోర్టు అతడు ఇంత మందిని హత్య చేసేందుకు దారితీసిన పరిస్థితులు ఏంటి..? అతడి మనోస్థితి ఏంటో చెప్పాల్సిందిగా మానసిక నిపుణులను కోరింది. అయితే మానసిక నిపుణులు ఒక్కొక్కరూ ఒక్కో కారణం చెప్పారు. ఒకరు అతడి తల్లి చిన్నతనంలో కేన్సర్‌తో బాధపడుతూ..ఆ నొప్పిని భరించలేక మార్ఫిన్ ఇంజెక్షన్లు తీసుకుందని అయినా ఫలితం లేక మరణించినట్లు తెలిపారు. ఆ ఘటనను ప్రత్యక్షంగా చూసి ఇలా చేస్తున్నట్లు చెప్పారు. మరికొందరూ నిపుణులు తనను తాను దేవుడిగా ఊహించుకుని మరణాన్ని శాసించాలన్న ఉద్దేశ్యంతో చేశాడని చెప్పుకొచ్చారు.అయితే హెరాల్డ్ మాత్రం కోర్టు ముందు హత్యలు చేసినట్లు ఒప్పుకున్నాడు కానీ ఎందుకు చేశాడన్నది వివరించలేదు. చివరికి ఆ కిరాతకు వైద్యుడు హెరాల్డ్‌కి 2000 సంవత్సరంలో జీవిత ఖైదు విధించింది కోర్టు. అయితే రెండేళ్లకే తన 58వ పుట్టిన రోజునాడు తన జైలు గదిలోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అయితే ఆ డాక్టర్ అందమైన తన జీవితాన్ని ఎందుకు చేజేతులారా నాశనం చేసుకున్నాడనేది ఎవరికీ అర్థకానీ మిస్టరీలా మిగిలిపోయింది.(చదవండి: 'రియల్ లైఫ్ పరాన్నజీవి'..ఏడేళ్లుగా ఇంటి పాత యజమాని..!) -
'రియల్ లైఫ్ పరాన్నజీవి'..ఏడేళ్లుగా ఇంటి పాత యజమాని..!
పరాన్నజీవులు గురించి విన్నాం. ఇతరులను ఆశ్రయించి బతికే వాటిని పరాన్నజీవులు అనిపిలుస్తాం. పందులు, ఇతర జంతువులు ఆశ్రయించి ఉండే బద్దేపురుగులు, వైరస్‌లను ఇలా పిలుస్తాం. అయితే మనుషుల్లో కూడా కొందూ ఇతరులపై ఆధారపడి జీవనం సాగించేవారిని కూడా ఇలా పోలుస్తు తిడుతుంటారు. కానీ అచ్చం అలానే రియల్ లైఫ్ పరాన్నజీవిలా జీవనం సాగిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. పైగా దొరికిపోయి కూడా అడ్డంగా బుకాయించే యత్నం చేసిందామె. ఈ విషయం కాస్తా కోర్టుదాక చేరుకుంటే గానీ ఆమె తిక్క కుదరలేదు. అసలేం జరిగిందంటే..తూర్పు చైనా(China)లోని జియాంగ్సు ప్రావిన్స్‌లో నివశిస్తున్న లీ అనే వ్యక్తి ఒక రోజుల తన ఇంటిని శుభ్రపరుస్తున్నాడు. సరిగ్గా ఆసమయంలోనే తన ఇంటి బేస్మెంట్(Basement)లో ఒక గది ఉండటం చూసి విస్తుపోతాడు. అక్కడ ఒక మనిషి జీవనం సాగిస్తున్నట్లు అన్ని వసతులు ఉంటాయి. ఇదేంటని ఆశ్చర్యపోతూ..క్షుణ్ణంగా పరిశీలించడం ప్రారంభించడం మొదలుపెడుతుంది. ఆ తర్వాత అక్కడ నిజంగానే ఒక వ్యక్తి ఉండటం చూసి ఆశ్చర్యపోతుంది. ఆమె ఎవరా అని ఆలోచించగా.. ఈ ఇంటి పాత యజామని(Former Homeowner) జాంగ్‌గా గుర్తించి కంగుతింటుంది. వెంటనే లీ తనకు ఈ ఇల్లుని కొనుగోలు చేసిన మాజీ యజమానురాలు జాంగ్ని గట్టిగా నిలదీస్తుంది. అయితే ఆమె తెలివిగా ఇంటి గురించి పూర్తి సమాచారం ఇచ్చానే గానీ కింద బేస్మెంట్ మీకు చెందుతుందని ఒప్పందంలో లేదంటూ మాట్లాడుతుంది. కానీ లీ తనకు అమ్మకం సమయంలో ఇంటి బేస్మెంట్ గురించి రహస్యంగా ఉంచి మళ్లీ ఇలా దబాయిస్తుందని మండిపడతాడు. పైగా ఇల్లు అమ్మేశానే కానీ బేస్మింట్ కాదని తేల్చి చెప్పింది పాత యజమానురాలు జాంగ్. పైగా విరామ సమయంలో ఇలా ఆ బేస్మెంట్లో సేదతీరుతానని కరాఖండీగా చెప్పింది. అయితే ఇక్కడ లీ గమనించకుండా జాంగ్ ఎలా ఆ బేస్మెంట్లోకి వెళ్లి వస్తుందన్నది అస్పష్టంగా ఉంది. ఈ స్టోరీ అచ్చం చైనాలో ఆస్కార్ అవార్డు గెలుచుకున్న చిత్రం పారాసైట్ కథలా ఉంది. ఈ మూవీలో కూడా ఒక వ్యక్తి బేస్మెంట్లో రహస్యంగా సంవత్సరాలు గడుపుతాడు. కాగా, దీనిపై చాలా సీరియస్‌గా ఉన్న లీ వెంటనే ఈ విషయమై కోర్టు(court)ని ఆశ్రయించి గట్టిగా పోరాడతాడు. చివరికి మాజీ ఇంటి యజమానిపైకేసు గెలిచి నష్టపరిహారం కూడా అందుకుంటాడు లీ.(చదవండి: ఈ డివైజ్‌తో చిన్నారులను నిద్రపుచ్చడం చాలా ఈజీ..!) -
ఆ పాటకు డ్యాన్స్ చేయడంతో పెళ్లి అర్థాంతరంగా ఆగిపోయింది..!
కాసేపట్లో పెళ్లితో కళకళలాడాల్సి వేదిక కాస్త ఒక్కసారిగా నిశబ్దమైపోయింది. పాపం వరుడు ఏదో సరదాగా ఎంటర్టైన్మెంట్ చేద్దాం అనుకుంటే..అదే తనకు ఊహించని బాధని, అవమానాన్ని మిగిల్చింది. ఏ పాటకు కాలు కదిపితే బాగుంటుందో సంమయనంతో ఆలోచిస్తే బాగుండేది. లేదంటే ఇలాంటి దుస్థితి పట్టేది కాదేమో. కొన్ని విషయాల్లో కామెన్ సెన్స్‌తో వ్యవహరించాలి. లేదంటే ఆ వరుడిలా చేదు అనుభవాన్ని ఎదుర్కొనక తప్పేదేమో..!. ఈ ఘటన న్యూఢిల్లీ(New Delhi)లో చోటు చేసుకుంది. వరుడు(Groom) ఊరేగింపుతో న్యూఢిల్లీలోని వివాహ మండపం వద్దకు చేరుకున్నాడు. అయితే అతడి స్నేహితులు నృత్యం చేయమని బలవంతం చేయడంతో ప్రసిద్ధ బాలీవుడ్ పాట(Bollywood Song) 'చోళీ కే పీఛే క్యా హై'కి డ్యాన్స్ చేశాడు. అందులోనూ సాక్షాత్తు వరుడు ఈ పాటకు డ్యాన్స్ చేయడంతో వధువు తండ్రికి చాలా అవమానంగా అనిపించింది. కాబోయే అల్లుడు తీరు ఇలా ఉందేంటని వెంటనే పెళ్లి(Wedding)ని అర్థాంతరంగా ఆపేసి వివాహ తంతుని రద్దుచేసుకుంది వధువు కుటుంబం. వరుడు చర్యలు కుటుంబ విలువలను అవమానించేలా ఉన్నాయని చెబుతూ వధువు కుటుంబం అక్కడ నుంచి నిష్రమించినట్లు సమాచారం. ఈ ఘటనతో వధువు కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. అయితే వరుడు ఇదంతా ఏదో ఫన్ కోసం అని వధువు తండ్రిని ఒప్పించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం..వధువు తండ్రికి వరుడు చేసిన పని చాలా ఆగ్రహం తెప్పించిందని, ఆయన అందుకే తక్షణమే పెళ్లిని నిలిపేసినట్లు చెబుతున్నారు బంధువులు. అలాగే తన కుమార్తెతో ఆ వరుడు కుటుంబం ఎలాంటి సంబంధాలు నెరకూడదని వధువు తండ్రి గట్టిగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు మాత్రం ఆ తండ్రి సరైన నిర్ణయం తీసుకున్నాడు. లేదంటే ఈ డ్యాన్స్ రోజు చూడాల్సి వచ్చేదంటూ వధువు తండ్రికే మద్దతిస్తూ పోస్టులు పెట్టారు. ఈ కథ మన చుట్టు ఉన్నవాళ్లు, స్నేహితులు ఫన్ అంటూ ఏదేదో చేయమంటారు. కానీ అది సరైనదా కాదా అని ఆలోచించి అడుగు వేయపోతే నష్టపోయేది మనమే. ఆ ఫన్ సంతోషం తెప్పించకపోయినా పర్లేదు..మన చేత కన్నీళ్లు పెట్టించేదిగా ఉండకూడదు.probably the funniest ad placement i’ve seen till date 😂 pic.twitter.com/a189IFuRPP— Xavier Uncle (@xavierunclelite) January 30, 2025(చదవండి: 'ది గ్రామఫోన్ గర్ల్': శాస్త్రీయ సంగీతాన్ని జస్ట్ మూడు నిమిషాల్లో..!) -
US Air Crash: పెళ్లి కావాల్సిన పైలట్, ఒక్కొక్కరిదీ ఒక్కో విషాదం!
అమెరికాలోని రోనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్ ( Ronald Reagan Airport)వద్ద జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 67 మంది ప్రాణాలు కోల్పోవడం ప్రపంచవ్యాప్తంగా కలకల రేపింది. పాతికేళ్లలో లేని విధంగా అమెరికాలో జరిగిన అత్యంత ఘోరమైన ప్రమాదంగా దీన్ని భావిస్తున్నారు. అమెరికన్ ఎయిర్‌లైన్స్ ప్రాంతీయ జెట్ - యుఎస్ ఆర్మీ బ్లాక్ హాక్ హెలికాప్టర్ ఢీకొన్న ప్రమాదంలో తొందరలో పెళ్లి కొడుకుగా ముస్తాబవ్వాల్సిన పైలట దుర్మరణం పాలయ్యాడు. ఒక్కొక్క మృతదేహాన్ని గుర్తిస్తున్న కొద్దీ అనేక హృదయ విదారక కథనాలు పలువురి మనసుల్ని కకావికలం చేస్తున్నాయి. ఫస్ట్ ఆఫీసర్ సామ్ లిల్లీ ,కెప్టెన్ జోనాథన్ కాంపోస్భారతీయ కుటుంబానికి చెందినయువతితో పాటు తన వివాహం కోసం ఎదురుచూస్తున్నఫస్ట్ ఆఫీసర్ సామ్ లిల్లీ మరణం వారి కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం సురక్షితమైన ల్యాండింగ్‌కు కొన్ని నిమిషాలముందు, ఆర్మీ హెలికాప్టర్‌ను ఢీకొట్టింది. దీంతో రెండు విమానాలు , విమానంలో ఉన్న ప్రతి ఒక్కరూ వర్జీనియాలోని పోటోమాక్ నదిలో పడిపోయారు. వీరిలో విమాన సిబ్బంది ఫస్ట్ ఆఫీసర్ సామ్ లిల్లీ (28) ,కెప్టెన్ జోనాథన్ కాంపోస్ కూడా ఉన్నారు. దీంతొ సామ్ తండ్రి ఆవేదన వర్ణనాతీంగా ఉంది.లిల్లీ తండ్రి తిమోతి లిల్లీ గురువారం ఫేస్బుక్ పోస్ట్‘‘సామ్ పైలట్ అయినప్పుడు నేను చాలా గర్వపడ్డాను..ఇప్పుసలు నిద్ర పట్టడంలేదు. చాలా బాధగా ఉంది, ఏడ్చే శక్తి కూడాలేదు. నేను వాడిన ఇక చూడలేనని తెలుసు నా గుండె బద్దలైపోతోంది." అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కెరీర్లో, వ్యక్తిగత జీవితంలో గొప్పగా రాణిస్తున్నాడు. త్వరలోనే పెళ్లి కూడా చేసు కోబోతున్నాడు. ఇంతలోనే ఇలా జరిగిపోయింది. తన జీవితంలో ఇంతకంటే బాధకరమైన రోజు మరొకటి ఉండదు అంటూ విలపించారు. ఆర్మీ పైలట్ ఘోరమైన తప్పు చేశాడంటూ 20 ఏళ్ల పాటు ఆర్మీలో హెలికాప్టర్ పైలట్‌గా పనిసిన తిమోతి వాపోయారు.అటు అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమాన కెప్టెన్ జోనాథన్ కాంపోస్ మరణంపై తోటి పైలట్లు సంతాపం ప్రకటించారు. కాంపోస్ 2022లో ఎయిర్‌లైన్‌కు కెప్టెన్ అయ్యాడని గుర్తు చేసుకున్నాడు. కాంపోస్ చాలా అద్భుతమైన వ్యక్తి అని, విమాన ప్రయాణాలంటే చాలా ఇష్టపడేవాడని, కుటుంబం అంటే ఎనలేని ప్రేమ అని కుటుంబం సభ్యుడొకరు కంట తడిపెట్టారు.ఇయాన్ ఎప్స్టీన్53 ఏళ్ల ఇయాన్ ఎప్స్టీన్ అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో విమాన సహాయకుడిగా ఉన్నాడు, ఈ ఘోర ప్రమాదంలో చనిపోవడంపై అతని సోదరి రాబీ బ్లూమ్ విచారాన్ని ప్రకటించారు. "నా సోదరుడు చాలా అద్భుతమైన వ్యక్తి. జీవితాన్ని ప్రేమించాడు. ప్రయాణాలంటే ఇష్టం. అందుకే తన ఉద్యోగాన్ని కూడా ప్రేమించాడు. అతను వెళ్ళిన ప్రతిచోటా స్నేహితులను తయారు చేసుకునేవాడు. ఇలా అర్థాంతరంగా కుటుంబానికి దూరం కావడం విషాదం అంటూ బ్లూమ్ చెప్పారు.ట్రిప్‌కు వెళ్లిన ఏడుగురు స్నేహితుల విషాదాంతంమైఖేల్ “మైకీ” స్టోవాల్ ,జెస్సీ పిచర్, ఇతర స్నేహితులతో కలిసి, కాన్సాస్కు విహారానికి వెళ్లారు. అక్కడ కొన్ని రోజుల గడిపి తిరిగి ఇంటికి తిరిగి వస్తూ, తిరిగి రాని లోకాలకు తరలిపోయారు.మైకీకి అజాత శత్రువు. అందర్నీ ప్రేమిస్తాడు. చాలా హ్యాపీగా జీవనం సాగించే మనషి, కొడుకుగా, తండ్రిగా చాలా మంచివాడు స్టోవాల్ తల్లి క్రిస్టినా స్టోవాల్ కన్నీరుమున్నీరైంది. పిచర్కు పెళ్లి అయ్యి ఏడాది మాత్రమే. కొత్త ఇల్లు కట్టుకోవాలనే ప్లాన్‌లో ఉన్నాడు. తనలాంటి కష్టం మరే తండ్రికి రాకూడదంటూ పిచర్ తండ్రి జేమ్సన్ పిచర్ చెప్పారు. ఇదీ చదవండి: US air crash: భారతీయ యువతి లాస్ట్ మెసేజ్ భర్త కన్నీరుమున్నీరుముగ్గురు యువ స్కేటర్లు , ఒక కోచ్ డెలావేర్కు చెందిన యూత్ స్కేటర్లు సీన్ కే, ఏంజెలా యాంగ్, కోచ్ అలెగ్జాండర్ “సాషా” కిర్సనోవ్ ఈ ప్రమాదంలో మరణించారని రాష్ట్ర సెనెటర్ క్రిస్ కూన్స్ ధృవీకరించారు.పుట్టిన రోజునే మరణించినఎలిజబెత్ కీస్ : ఎలిజబెత్ కీస్ ఒక న్యాయవాది,34వ పుట్టినరోజున ప్రమాదంలో తనకు దూరమైందని ఆమె భర్త డేవిడ్ సీడ్మాన్ చెప్పారు -
US air crash: భారతీయ యువతి లాస్ట్ మెసేజ్ భర్త కన్నీరుమున్నీరు
అమెరికన్ ఎయిర్‌లైన్స్ ప్రాంతీయ జెట్, యుఎస్ ఆర్మీ బ్లాక్ హాక్ హెలికాప్టర్ ఢీకొన్న ప్రమాదంలో మరణించిన వారిలో భారతీయు యువతి ఉండటం విషాదాన్ని నింపింది. 2001 తర్వాత అమెరికాలో జరిగిన అత్యంత ఘోరమైన విమాన ప్రమాదంలో భావిస్తున్న ఈ ఉదంతంలో 67 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.అమెరికా రోనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్ ( Ronald Reagan Airport)వద్ద జరిగిన ఘోర విమాన26 ఏళ్ల అష్రాహుస్సేన్ రజా (Ashra Hussain Raja) కూడా చనిపోయారు. దీంతో బాధితుడి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఆమె భర్త, హమాద్ స్నేహితుల మధ్య శోకసంద్రంలో మునిగిపోయారు. మరికొద్ది క్షణాల్లో ల్యాండ్ విమానం అవుతుందనగా ఈ ఘోరం జరిగింది.భారతీయ వలసదారుల కుమార్తె అయిన హుస్సేన్ రజా 2020లో ఇండియానా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రురాలైంది .ఆగస్టు 2023లో స్నేహితుడు హమాద్ను ప్రేమ వివాహం చేసుకుంది. వాషింగ్టన్ డీసీలో కన్సల్టెంట్‌గా (consultant in Washington, DC)ఉద్యోగం చేస్తున్నారని ఆమె మరణం తమకు తీరని లోటని ఆమె మామ డాక్టర్ హాషిమ్ రాజా(Dr.Hashim Raja) విషాద వదనంతో చెప్పారు. విద్యాపరంగా చాలా తెలివైనది. అద్భతుంగా వంట చేస్తుంది. నా కొడుకుకు ప్రాణ స్నేహితురాలు" అని అస్రా హుస్సేన్ మామ హషీమ్ రజా అన్నారు. వైద్యుడిగా చాలామందికి వైద్యం చేశాను, సలహాలిచ్చాను చాలా మరణాలను చూశాను. కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదంటూ భావోద్వేగానికి లోనయ్యారు.ఆమె అక్కడ ఒక ఆసుపత్రి కోసం టర్నరౌండ్ ప్రాజెక్ట్‌లో పని చేయడానికి నెలకు రెండుసార్లు విచితకు ప్రయాణించిందని చెప్పారు. తన కెరీర్లో రాణిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిందని గుర్తు చేసుకున్నారు. నైట్ షిప్ట్‌లలో మేల్కొని ఉండేందుకు తరచుగా తనకి ఫోన్ చేసేదని, అందరి కోసం ఆలోచించేదని .ఎవరికి ఏ కష్టం వచ్చినా వెంటనే స్పందించేది” అని ఆయన తెలిపారు. మరోవైపు భార్య అష్రా తనకు పంపిన మెసేజ్‌ను తలుచుకుంటూ భర్త హమాద్ రాజా కన్నీరు మున్నీరవుతున్నారు. “మేం 20 నిమిషాల్లో ల్యాండ్ అవుతున్నాం” అని ఆమె మెసేజ్ చేసిందని, ఆమె కోసం ఎయిర్‌పోర్ట్‌లో ఎదురు చూస్తుండగానే అంతా జరిగిపోయిందని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “ఇదంతా ఒక పీడకలలా ఉంది” అంటూ హమాద్ గుండెలవిసేలా రోదిస్తున్నారు. నిజానికి ఒక రోజు ఆమె రావాల్సి ఉంది.. కానీ ముందుగానే ప్లాన్ చేసుకుంది. ఇందుకేనేమో అంటూ కంటతడిపెట్టుకన్నారు. ఇలాంటి ప్రమాదాల గురించి వినడమేగానీ,తమ జీవితాల్లో ఇంత విషాదం ఉంటుందని కలలో కూడా ఊహించలేదంటూ విలపించారు. -
‘2023 ఓజీ40’ : గ్రహశకలాన్ని గుర్తించిన బాలుడు
నాసా వారి ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్ డిస్కవరీ ప్రాజెక్ట్(ఐఏడీపీ)లో ఇద్దరు క్లాస్మెట్లతో కలిసి పాల్గొన్న 14 సంవత్సరాల దక్ష్ మాలిక్ అంగారక గ్రహం, బృహస్పతిల మెయిన్ ఆస్ట్రాయిడ్ బెల్ట్ మధ్య గ్రహశకలాన్ని కనుగొన్నాడు. దీని కోసం ఆస్ట్రోనామికా అనే సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించుకున్నాడు.హార్డిన్ సిమన్స్ యూనివర్శిటికి చెందిన డాక్టర్ పాట్రిక్ మిల్లర్ పర్యవేక్షణలో ఈ ప్రాజెక్ట్ చేపట్టారు. తాత్కాలికంగా ఈ గ్రహశకలానికి ‘2023 ఓజీ40’ అని నామకరణం చేశారు. త్వరలో మాలిక్ పెట్టబోయే పేరే ఈ గ్రహశకలానికి శాశ్వతంగా ఉండిపోతుంది. గ్రహశకలానికి ప్రాథమిక పరీక్షలు నిర్వహించి ధ్రువీకరించడానికి నాసాకు నెలల సమయం పడుతుంది. ఆ తరువాత దానికి పేరు పెడతారు.ఇదీ చదవండి: Paris Fashion Week 2025 : అపుడు మంటల్లో.. ఇపుడు దేవతలా ర్యాంప్ వాక్!ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన మాలిక్ ‘శివనాడర్ స్కూల్’లో 9వ తరగతి చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచి మాలిక్‌కు అంతరిక్షం అంటే ఇష్టం. గ్రహాలు, సౌరకుటుంబం గురించి నేషనల్ జియోగ్రాఫిక్‌లో వచ్చిన డాక్యుమెంటరీలన్నీ చూసేవాడు. ఐఏడీపీలో ప్రతి సంవత్సరం ఆరువేలమందికి పైగాపాల్గొంటారు. వారిలో కొందరు కొత్త గ్రహశకలాలని కనుక్కోవడంలో విజయం సాధించారు. ‘ఐఏడీపీ’ వెబ్సైట్ ప్రకారం గ్రహశకలాన్ని కనుగొన్న ఆరవ భారతీయ విద్యార్థి దక్ష్ మాలిక్. ‘ఈ అన్వేషణ నాకు సరదాగా అనిపించింది. గ్రహశకలం కోసం వెదుకుతున్నప్పుడు నాసాలో పనిచేస్తున్నట్లు అనిపించింది. నా కల నిజమైంది’ అంటున్నాడు ఆనందంగా దక్ష్ మాలిక్.చదవండి : కీర్తి సురేష్ మెహిందీ లెహెంగా విశేషాలు, ఫోటోలు వైరల్ -
అంతరించిపోయిన ఐకానిక్ పక్షులకోసం అనంత్ అంబానీ కీలక నిర్ణయం
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీకి చెందిన వంతారా వన్య ప్రాణుల సంరక్షణలో మరో కీలక అడుగు వేసింది. ప్రపంచ వన్యప్రాణుల సంరక్షణను అభివృద్ధి చేయడంలో కృషి చేస్తున్న వంతారా బ్రెజిల్లో దాదాపు అంతరించి పోయినట్టు ప్రకటించిన ఐకానిక్ పక్షులను రక్షించేందుకు నడుంబిగించింది. బ్రెజిల్‌లోని కాటింగా బయోమ్ అడవిలో అంతరించిపోయిన 41 స్పిక్స్ మకావ్ (Cyanopsitta spixii) లకు పునరుజ్జీవం తెచ్చేందుకు రంగంలోకి దిగింది. ఇందుకు సంబంధించి వంతారా అనుబంధ సంస్థ గ్రీన్స్ జూలాజికల్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ (GZRRC), అసోసియేషన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ థ్రెటెండ్ పేరెట్స్ (ACTP)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.2000లో అంతరించిపోయినట్లు ప్రకటించినన స్పిక్స్ మాకా (సైనోప్సిట్టా స్పిక్సీ) అనే జాతిని పునరుద్ధరించే ప్రయాణంలో ఈ ఐకానిక్ పక్షులను బ్రెజిల్‌లోని వాటి స్థానిక ఆవాసాలకు తిరిగి పరిచయం చేయడమే ఈ చొరవ లక్ష్యం. ఇందులో GZRRC ప్రాజెక్ట్‌లో విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది.జర్మనీలోని బెర్లిన్‌లోని ఏసీటీపీ బ్రీడింగ్ సెంటర్ నుండి 41 స్పిక్స్ మకావ్‌లను బ్రెజిల్‌లోని బాహియాలోని విడుదల కేంద్రానికి విజయవంతంగా తరలించడం ద్వారా ఒక ప్రధాన మైలురాయిని సాధించిందిఅనంత్ అంబానీ నేతృత్వంలోని వన్యప్రాణుల సంరక్షణ ప్రాజెక్ట్ వంతారా. ఈ గ్లోబల్ రీఇంట్రడక్షన్ ప్రోగ్రామ్‌లో భాగంగా, వంతారా నిపుణులు ఏసీటీపికి మార్గదర్శకత్వం చేయడంతో పాటు కీలకమైన వనరులను అందిస్తారు. వీటిల్లో 2022లో 20 స్పిక్స్ మకావ్‌లను అడవిలోకి తిరిగి ప్రవేశపెట్టడం జరిగిందని, దీని ఫలితంగా 20 సంవత్సరాలలో తొలిసారి పిల్లలు పుటాయనీ, ఇది ప్రోగ్రామ్ పురోగతికి సామర్థ్యానికి నిదర్శనమని వంతారా ప్రకటించింది.బ్రెజిల్‌కు బదిలీకి ఎంపిక చేయబడిన 41 స్పిక్స్ మకావ్‌లను వాటి వంశపారంపర్యత, ఆరోగ్యం ఆధారంగా ఎంపిక చేశారు. ఇందులో 23 ఆడ, 15 మగ, 3 ఇంకా నిర్ధారించని చిన్న పిల్లలున్నాయి. ఈ సంవత్సరం విడుదలకు సిద్ధమవుతున్న బృందంలో కొన్ని చేరగా, మరికొన్ని దీర్ఘకాలిక పరిరక్షణ ప్రయత్నాలకు మద్దతుగా బ్రీడింగ్ ప్రోగ్రామ్‌లో చేర్చారు.. బదిలీకి ముందు, పక్షులు బెర్లిన్‌లోని ఒక బ్రీడింగ్ ఫెసిలిటీలో 28 రోజుల కంటే ఎక్కువ క్వారంటైన్లో ఉన్నాయి. అక్కడి అడవి పర్యావరణాన్ని ప్రభావితం చేసే ఏవైనా వ్యాధులకు లేవని నిర్దారించుకునేందుకు వీలుగా సమగ్ర పరీక్షలు నిర్వహించారు. జనవరి 28న, ఆ పక్షులు బెర్లిన్ నుండి చార్టర్డ్ విమానంలో బ్రెజిల్‌లోని పెట్రోలినా విమానాశ్రయానికి బయలు దేరి, అక్కడికి చేరుకున్న తర్వాత, వాటిని నేరుగా క్వారంటైన్ సౌకర్యానికి తరలించారు. ఈ బదిలీని ఇద్దరు పశువైద్యులు , ఏసీటీపిఒక కీపర్ జాగ్రత్తగా పర్యవేక్షించారు, వీరితో పాటు వంటారా GZRRC నుండి నిపుణుల బృందం కూడా ఉంది.స్పిక్స్ మకావ్స్ రీఇంట్రడక్షన్ ప్రాజెక్ట్‌కు వారి అద్భుతమైన కృషి చేసిన అనంత్ అంబానీ , వంతారాబృందానికి ACTP వ్యవస్థాపకుడు మార్టిన్ గుత్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అంతరించిపోయిన జాతుల రక్షణలోఆర్థిక సహాయంతో పాటు, నైపుణ్యం ఎంతో అమూల్యమైనదని కొనియాడారు.హాలీవుడ్ చిత్రం రియోలో ప్రముఖంగా కనిపించిన స్పిక్స్ మకా, బ్రెజిలియన్ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా 2019లో, బ్రెజిల్లో ఒక ప్రత్యేక విడుదల కేంద్రం స్థాపించారు. ఆ తర్వాత 2020లో జర్మనీ బెల్జియం నుండి 52 పక్షులను రవాణా చేశారు. 2022లో, 20 స్పిక్స్ మకావ్‌లను వాటి సహజ ఆవాసాలలోకి విడుదల చేయగా, ఏడు అడవి కోడిపిల్లలు జన్మించాయి. భారతదేశ వైవిధ్యమైన వన్యప్రాణుల వారసత్వాన్ని పునరుద్ధరించడానికి కూడా వంతారా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. కట్టడిలో ఉన్న ఖడ్గమృగాలను సురక్షితమైన ఆవాసాలలోకి తిరిగి ప్రవేశపెట్టడం, సంతానోత్పత్తి , ఆవాస పునరుద్ధరణ ద్వారా ఆసియా సింహాల జనాభాను బలోపేతం చేయడం వాటి సంతానోత్పత్తి కార్యక్రమం తర్వాత చిరుతలను భారతీయ అడవులకు తిరిగి తీసుకురావడం వంటివి ఉన్న సంగతి తెలిసిందే. -
ఉద్యోగులకు బంపర్ ఆఫర్ : తీసుకున్నోడికి తీసుకున్నంత!
ఏడాదికోసారి తమ ఉద్యోగులకు బోనస్‌లు, పారితోషికాలు ఇవ్వడం చాలా సర్వసాధారణం. కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు అద్భుతమైన బోనస్‌లు అందిస్తాయి. మరి కొన్ని కంపెనీలు అసాధారణమైన బహుమతులు, కానుకలు అందించిన సందర్భాలూ ఉన్నాయి. ఉద్యోగులు సైతం ఆశ్చర్యపోయేలా భారీ కానుకలిచ్చిన సూరత్ డైమండ్ కంపెనీ గురించి విన్నాం. అలా తమ కంపెనీ విజయంలో భాగస్వామ్యులైన ఉద్యోగులను గుర్తిస్తాయి. గౌరవిస్తాయి. అయితే చైనాకు చెందిన ఒక క్రేన్ కంపెనీ కనీవినీ ఎరుగని రీతిలో బంపర్ ఆఫర్ ప్రకటించింది. తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది కదా.. అయితే మీరీ కథనం చదవాల్సిందే.!చైనాకు చెందిన హెనన్ మైన్ క్రేన్ సంస్థ ఆసక్తికరమైన ఆఫర్ ప్రకటించి వార్తల్లో నిలిచింది. తమ కంపెనీ ఉద్యోగులకు వార్షిక బోనస్‌ను వైరైటీగా ప్రకటించింది. ఉద్యోగులందరికీ 70 కోట్లు రూపాయలను బోనస్‌గా ఆఫర్ చేసింది. ఇందులో ఒక ట్విస్ట్ ఉంది. ఒక గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేసిన కంపెనీ, ఏ ఉద్యోగికి ఎంత మొత్తం లభిస్తుందో నిర్ణయించడానికి ఒక పోటీ పెట్టింది. తాను ప్రకటించిన బోనస్ మనీ రూ.70 కోట్లు ఒక టేబుల్‌పై పర్చింది. దీంట్లో ఉద్యోగులు 15 నిమిషాల్లో ఎంత లెక్కపెడితే అంత తీసుకోవచ్చని తెలిపింది. 60 నుంచి 70 మీటర్ల టేబుల్ పై ఈ మొత్తాన్ని ఉంచి, ఉద్యోగులను 30 బృందాలుగా విభజించింది. ఒక్కో టీమ్ నుంచి ఇద్దరు మాత్రమే రావాల్సి ఉంటుంది. వీరిద్దరూ 15 నిమిషాల్లో ఎంత సొమ్ము లెక్కపెడతారో అంత మొత్తం ఆ టీంకు దక్కుతుందని ప్రకటించింది. దీంతో పోటీ మొదలైంది. చకచకా డబ్బులు లెక్కపెడుతూ ఉద్యోగులు నానా హైరానా పడ్డారు. అన్నట్టు ఏదైనా తప్పుగా లెక్కిస్తే... ఆ నగదును బోనస్ నుండి తీసివేస్తారు కూడా. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2023 జనవరిలోనూ ఇదే విధంగా హెనన్ మైన్ క్రేన్ సంస్థ వార్షిక టీం లంచ్‌లో తమ ఉద్యోగులకు రూ.70 కోట్లను ఇచ్చిదట. View this post on Instagram A post shared by Mothership (@mothershipsg)ఇదీ చదవండి: సినిమాను మించిన సింగర్ లవ్ స్టోరీ : అదిగో ఉడుత అంటూ ప్రపోజ్! హెనాన్ మైనింగ్ క్రేన్ కో. లిమిటెడ్ ద్వారా చైనీస్ సోషల్ మీడియా సైట్లు డౌయిన్ ,వీబోలో షేర్ చేసింది. అలాగే ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పోస్ట్ అయింది. వీడియోపై నెటిజన్లు విభిన్నమైన వ్యాఖ్యలను పోస్ట్ చేశారు. కొందరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయగా, మరికొందరు తమ కంపెనీలో పరిస్థితిని తలుచుకొని జోక్లువేశారు. “నా కంపెనీ కూడా ఇంతే.. కానీ డబ్బులు కాదు సుమా.. టన్నుల కొద్దీ పనిభారాన్ని ఇస్తుంది.” మరొకరు, ‘‘ ఇలాంటి పేపర్ పని నాకు కావాలి... కానీ కంపెనీ ప్లాన్ మరోలా ఉంది” అని ఇంకొకరు కామెంట్ చేశారు. “ఈ సర్కస్ బదులుగా కార్మికుల ఖాతాల్లో నేరుగా డబ్బుజమ చేయవచ్చుగా అది చాలా అవమానరమైనది. గ్రేట్ వాల్ వెనుకున్న చైనా ప్రపంచమే వేరు’’ అంటూ ఇంకొకరు నిట్టూర్చారు.చదవండి: Maha Kumbh Mela 2025: కలియుగ శ్రవణ్ కుమరుడు ఇతడు... -
MahaKumbh Mela 2025 - కలియుగ శ్రవణ్ కుమరుడు ఇతడు...
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా (Maha Kumbh Mela 2025 ) అనేక విశేషాలతో చర్చల్లో నిలుస్తోంది. రికార్డు స్థాయిలో మహా కుంభమేళాకు భక్తులు హాజరవుతున్నారు. పవిత్ర త్రివేణి సంగమం వద్ద స్నానాలు ఆచరిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ నివేదిక ప్రకారం, బుధవారం ఉదయం 6 గంటల వరకు 1.75 కోట్ల మంది ప్రజలు పవిత్ర స్నానాలు చేశారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం వేదికగా హృదయాలను కదిలించే వీడియోలు అనేకం నెట్టింట విశేషంగా నిలుస్తున్నాయి. అటు భక్తులను, ఇటు నెటిజన్లను విస్మయానికి గురిచేస్తున్నాయి.తాజాగా 65 ఏళ్ల వృద్ధుడు తన 92 ఏళ్ల తల్లిని ప్రతిరోజూ 50 కిలోమీటర్లు నడిచి ప్రయాగ్‌రాజ్‌లోని కుంభమేళాకు తీసుకువెళుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘కలియుగ్ శ్రవణ్ కుమార్’ అంటూ ఈ వీడియో సంచలనంగా మారింది. పదండి ఆ వివరాలు తెలుసుకుందాం.పురాణ గాథలోలని శ్రవణ కుమారుడి (జన్మనిచ్చిన, అంధులైన తల్లిదండ్రులను కావడిలో మోస్తూ ఎన్నో ప్రాంతాలు తిరిగి తన మరణం వరకు కూడా కంటికి రెప్పలా చూసుకున్న పురాణ పురుషుడు శ్రవణ కుమారుడు) నుంచి ప్రేరణ పొందాడో ఏమో గానీ, తన తల్లిని బండిమీద కూర్చోబెట్టి, స్వయంతా తాను లాగుతూ పవిత్ర మహాకుంభ మేళాకు తీసుకొని వచ్చాడు. యూపీలోని ముజఫర్ నగర్‌కు చెందినమాలిక్ (Malik) వయసు 65 ఏళ్లు కావడం విశేషం. ఆయన జబ్బీర్ దేవి వయసు 92 ఏళ్లు. తల్లి కోరిక నెరవేర్చాలన్న ధృఢ సంకల్పంతో బండిపై కూర్చోబెట్టి లాగుతూ కుంభమేళాకు తరలివచ్చాడు. ఇలా 13 రోజులు పాటు తల్లిని తీసుకెళ్లాలన్న కృతనిశ్చయంతో ఉన్నాడు. ముజఫర్ నగర్ నుంచి ప్రయాగరాజ్‌కు 780 కిలోమీటర్లు. త్రివేణి సంగమంలో కుంభ్ స్నానం చేయాలని తన తల్లి కోరిక తీర్చడం తన బాధ్యత అని చెప్పాడు. అతని సంకల్పం, సాహసం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తల్లి పట్ల అతనికున్న ప్రేమకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. ‘‘కలియుగ్ కా శ్రవణ్ కుమార్' అంటూ ప్రశంసిస్తున్నారు. ఈ యుగానికి గొప్పోడు అని కొందరు. "ప్రతీ తల్లి ఇలాంటి కొడుకును పొందాలని కోరుకుంటుంది"అని మరొకరు వ్యాఖ్యానించారు. ముసలి వయసులో తల్లిదండ్రుల పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్న వారికి ఈయన కథ ఆదర్శనీయం, ఆచరణీయం అంటున్నారు.Watch: In Bulandshahr, Uttar Pradesh, A man is walking with a cart, taking his 92-year-old mother to the Maha Kumbh in Prayagraj. They started their journey from Muzaffarnagar, fulfilling her wish to bathe at the Kumbh pic.twitter.com/2IstKkqMXY— IANS (@ians_india) January 28, 2025 -
యువ డిజైనర్‌గా రాణిస్తున్న ముప్పిడి రాంబాబు
కష్టే ఫలి.. కృషి ఉంటే ఏదైనా సాధ్యమే అని నిరూపిత మైన సత్యం. చిన్న తనం నుంచే అదే సూత్రాన్ని తూచ తప్పకుండా పాటిస్తూ.. కష్టపడి పనిచేయడానికి అలవాటుపడి యువడిజైనర్గా డాక్టర్ ముప్పిడి రాంబాబు గుర్తింపు సాధించాడు. బొమ్మల తయారీలో కళాకారుడు తన కళకు నైపుణ్యాన్ని జతచేసి అద్భుతాలు సృష్టిస్తున్నాడు. అంతే కాకుండా శిల్పకారుడు, రచయిత, అధ్యాపకుడుగానూ పనిచేస్తున్నాడు. శిల్పకారుల కుటుంబానికి చెందిన ముప్పిడి చెక్క, తాటి ఆకు, జనపనార, రాతి ఉత్పత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అనేక కళాకృతులను రూపొందించడంలో దిట్టగా పేరొందారు. ప్రస్తుతం రాయదుర్గంలోని ఎఫ్‌డీడీఐ హైదరాబాద్‌లో ఫ్యాకల్టీగా పనిచేస్తూ ఆర్ట్, క్రాఫ్ట్, డిజైన్ ప్రొడక్ట్ డిజైనింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, ఆర్కిటెక్చర్‌గా గుర్తింపు సాధించారు. – రాయదుర్గంపేద కళాకారుల ఆర్థికాభివృద్ధికి.. పేటెంట్ పొందిన డిజైన్లను పేద కళాకారుల ఆర్థికాభివృద్ధికి చేయూతను అందించాలనేదే నా తపన. మాది కళాకారుల కుటుంబం. కళాకారుల పరిస్థితులు నాకు బాగా తెలుసు. పేటెంట్ పొందిన డిజైన్లు ఉచితంగానే అందిస్తా. వాటి తయారీ గురించి వివరిస్తాను. నిర్మల్, కొండపల్లి బొమ్మల తయారీ దారులు కూడా నూతన డిజైన్లలో బొమ్మలు తయారు చేసేలా తగిన సూచనలు అందించాలన్న లక్ష్యంతో కృషి చేస్తున్నా.. – డాక్టర్ ముప్పిడి రాంబాబు, ఎఫ్‌డీడీఐ ఫ్యాకల్టీ రాయదుర్గం మంజూరైన పేటెంట్స్.. 2025లో టేబుల్‌టాప్ ఆర్టిక్రాఫ్ట్స్, ఫిల్లింగ్ 2024లో లెదర్, వుడ్బర్డ్ టాయ్, ఫిల్లింగ్, వుడ్ పెన్‌స్టాండ్, ఫిల్లింగ్, డాల్, లెదర్ వాల్ హ్యాంగింగ్, న్యూస్‌పేపర్ బాస్కెట్, డెకరేటివ్ యాక్సెసరీస్ ఫర్ టేబుల్‌టాప్ టాయ్స్, ట్రెక్కింగ్ బ్యాక్‌ప్యాక్, జ్యువెలరీ బాక్స్కేస్. పీహెచ్డీ పూర్తి చేసి.. ఆంధ్రప్రదేశ్‌లోని జంగారెడ్డిగూడెంలో నిరుపేద కళాకారుల కుటుంబంలో పుట్టి ఉన్నత విద్యను అభ్యసించారు. మొదటి, రెండో తరాలకు చదువులేదు. కానీ మూడో తరం వారు జీవనోపాధి కోసం చేతి వృత్తులు చేస్తున్నా, తండ్రి సూచన మేరకు పీహెచ్డీ పూర్తి చేశారు. రచయిత, కళాకారుడు, అసిస్టెంట్ ప్రొఫెసర్, హెచ్ఓడీ, అకడమిక్ కన్సల్టెంట్, జూట్బోర్డు ప్యానెల్ డిజైనర్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్, తెలుగు ఫిల్మ్ డైరెక్టర్, ప్రొడక్షన్ డిజైనర్ వంటి ఉద్యోగాలు చేశారు. కేంద్ర జూట్ బోర్డులో జైనర్‌గా పనిచేశాడు. ప్రస్తుతం ఎఫ్‌డీడీఐలో ఫ్యాకల్టీగా చేస్తున్నాడు. అవార్డులు, పురస్కారాలు.. 2024లో పీహెచ్‌డీలో గోల్డ్‌మెడల్ (పోట్టి శ్రీరాములు తెలుగు వర్శిటీ) 2023లో పికాక్ అవార్డు (తిరుపతి ఆర్ట్ సొసైటీ, ఎక్స్‌లెన్స్ ఇన్ రివ్యూ అవార్డు) 2018 జాతీయ సంజీవ్‌దేవ్ అవార్డు2017లో ప్రమోద్ కుమార్ చటర్జీ జాతీయ అవార్డు 2016లో విశిష్ట కళా సేవారత్న, రోటరీ యువజన అవార్డు, గురుబ్రహ్మ అవార్డు.వీటితో పాటు మరికొన్ని అవార్డులు.. పేటెంట్ల సాధనలో తనకంటూ ప్రత్యేకత సాధించిన ఎఫ్‌డీడీఐ ఫ్యాకల్టీ డాక్టర్ రాంబాబు -
హోటల్లో అంట్లు కడిగాడు,ఆత్మహత్యాయత్నం..కట్ చేస్తే.. రూ 500 కోట్లు
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రిటైలర్, నగల డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా టాప్ డిజైనర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆయన ఈసక్సెస్ అంత ఈజీగారాలేదు. సామాన్య నేపథ్యంనుంచి వచ్చి గ్లోబల్ ఐకాన్‌గా ఎదగడానికి చాలా కష్టాలుపడాల్సి వచ్చింది. విపరీతమైన డిప్రెషన్, ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తన సోదరి నుంచి 20వేల రూపాయల అప్పుగా తీసుకొని ప్రారంభించిన ప్రయాణం పాతికేళ్ల తరువాత నేడు రూ. 500కోట్లకు చేరింది. సబ్యసాచి అసలు ఎక్కడివాడు, ఆయన కరీర్ మొదలైన విషయాల గురించి తెలుసుకుందాం రండి!సబ్యసాచి 1974లో ఒక మధ్యతరగతి బెంగాలీ కుటుంబంలో జన్మించాడు.తల్లిదండ్రులు బంగ్లాదేశీయులు. అతని తండ్రి బంగ్లాదేశ్ నుండి భారతదేశానికి శరణార్థిగా వలస వచ్చారు. తండ్రి ఉన్ని మిల్లులో ఉద్యోగం కోల్పోవడంతో కుటుంబం కష్టాల్లో పడింది. అపుడు 15 ఏళ్ల వయస్సులో గోవాకు పారిపోయాడు సబ్యసాచి. అక్కడ వెయిటర్‌గా పనిచేశాడు ,గిన్నెలు కడిగాడు. అప్పుడే డిజైనర్ కావాలనే కల కన్నాడు. ఇందుకోసం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (NIFT)చదువు కోవాలనుకున్నాడు. కానీ అడ్మిషన్‌కు డబ్బులు లేవన్నారు. అయినా పట్టువీడలేదు. ఎలాగో అలా కష్టపడి అడ్మిషన్ తీసుకున్నాడు. 1999లో అహ్మదాబాద్‌లోని ప్రతిష్టాత్మక ఇండియాస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుండి పట్టభద్రుడయ్యాడు. ఆ తరువాత కొన్ని నెలల తర్వాత కేవలం ముగ్గురు సిబ్బందితో కోల్‌కతాలో తొలి స్టూడియోను ప్రారంభించాడు. అలా తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించాడు. అదీ సోదరి దగ్గర 20 వేల రూపాయలను అప్పుగా తీసుకొని మరీ. అలా ప్రస్థానం పాకిస్తాన్ ,యుఎఇ, ఇటలీ , దుబాయ్ ఫ్యాషన్ ప్రియులు ఇష్టపడే తొలి భారత గ్లోబల్ బ్రాండ్ ప్రస్తానానికి పునాది పడింది. ఇక అప్పటినుంచి అన్నీ అవార్డులు, రివార్డులు, ప్రశంసలే తప్ప వెనక్కి తీరిగి చూసింది లేదు.రేయింబవళ్లు కష్టపడి 2002లో లక్మే ఫ్యాషన్ వీక్‌లో తన తొలి కలెక్షన్‌ను ప్రదర్శించి, ఫ్యాషన్ మాస్ట్రోగా మారారు సబ్యసాచి ముఖర్జీ. సింగపూర్‌లో జరిగిన మెర్సిడెస్-బెంజ్ న్యూ ఆసియా ఫ్యాషన్ వీక్‌లో తొలి అంతర్జాతీయ అవార్డు (గ్రాండ్ విన్నర్ అవార్డు) గెలుచుకున్నాడు.డిప్రెషన్, ఆత్మహత్యాయత్నంతాను యుక్తవయసులో డిప్రెషన్‌కు గురయ్యానని, ఆత్మహత్య చేసుకునేందుకు కూడా ప్రయత్నించి విఫలమయ్యాడు.తీవ్రమైన నిరాశ నిస్పృహలతో ఆత్మహత్యకు కూడా ప్రయత్నించానని ఒక సందర్భంగా సబ్యసాచి వెల్లడించాడు. “నేను నిరాశకు లోనయ్యాను మరియు ఆత్మహత్యకు ప్రయత్నించాను. నేను అపస్మారక స్థితిలో ఉన్నాను. అమ్మ చెంపదెబ్బ కొట్టింది. జలుబు ఎంత సాధారణమో డిప్రెషన్ కూడా అంతే సాధారణం. మీరు డిప్రెషన్లో లేకుంటే, మీరు మామూలుగా లేరు అని అర్థం” అంటూ తన జర్నీని వివరించారు. అంతేకాదు తాను నిరాశను ఎదుర్కోకపోతే, ఫ్యాషన్ దిగ్గజంగా మారడానికి బదులుగా, వేరే కెరీర్ మార్గాన్ని అనుసరించేవాడినని పేర్కొన్నాడు. బహుశా శాన్ ఫ్రాన్సిస్కోలోని గూగుల్ వంటి కంపెనీలో పనిచేస్తూ ఉండేవాడినని చెప్పుకొచ్చాడు. చదవండి: పదేళ్ల తరువాత తొలిసారి : తన బాడీ చూసి మురిసిపోతున్న పాప్ సింగర్సబ్యసాచి ముఖర్జీ కెరీర్ మైలు రాళ్లుసబ్యసాచి ముఖర్జీ 2001లో ఫెమినా బ్రిటీష్ కౌన్సిల్ యొక్క మోస్ట్ ఔట్‌స్టాండింగ్ యంగ్ డిజైనర్ ఆఫ్ ఇండియా అవార్డుఅసాధారణ డిజైనర్ జార్జినా వాన్ ఎట్జ్డోర్ఫ్తో ఇంటర్న్‌షిప్ కోసం లండన్. 2002లో ఇండియన్ ఫ్యాషన్ వీక్‌లో పాల్గొన్న తర్వాత చాలా మీడియా దృష్టిని ఆకర్షించారు. 2003లో తొలి విదేశీ "గ్రాండ్ విన్నర్ అవార్డ్" గెలుచుకున్న తరువాత పారిస్‌లో జీన్-పాల్ గౌల్టియర్ , అజెడిన్ అలైతో వర్క్‌షాప్‌కు దారితీసింది.2004లో మయామి ఫ్యాషన్ వీక్‌లో ‘ ది ఫ్రాగ్ ప్రిన్సెస్ కలెక్షన్,’, భారతీయ వస్త్ర సౌందర్యం ప్రపంచానికి మరింత బాగా తెలిసి వచ్చింది.బ్లాక్ సినిమాకు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్‌గా జాతీయ అవార్డుప్రపంచవ్యాప్త గుర్తింపు2005లో ది నాయర్ సిస్టర్స్‌ను ప్రారంభించాడు. హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్, ఎంబ్రాయిడరీలు, బగ్రూ లాంటి కలెప్రేరణ పొందిన వసంత-వేసవి సేకరణ. అతని క్రియేషన్స్ ప్రసిద్ధ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వార్షిక బ్లాక్-టై ఛారిటీ డిన్నర్ ఫ్యాషన్ షోలో ప్రదర్శించడానికి ఆహ్వానం2006లో న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో సబ్యసాచి ప్రారంభ స్ప్రింగ్ సమ్మర్ కలెక్షన్ 07 విమర్శకుల ప్రశంసలు అందుకుంది. న్యూయార్క్, మిలన్ మరియు లండన్ అనే మూడు ప్రధాన ఫ్యాషన్ వారాల్లో పాల్గొన్న తొలి భారతీయ ఫ్యాషన్ డిజైనర్.సబ్యసాచి న్యూయార్క్ ,లండన్ ఫ్యాషన్ వీక్స్, అలాగే బ్రైడల్ ఆసియా 2007, లాక్మే ఇండియా ఫ్యాషన్ వీక్ , 2007లో భారతదేశంలో జరిగిన వోగ్ లాంచ్‌లకు హాజరయ్యాడు. 2008లో నగల కలెక్షన్కూడా షురూ చేశాడు. GAJA బ్రాండ్ సహకారంతో 2016 వోగ్ వెడ్డింగ్ షోలో ప్రారంభమైంది. బాలీవుడ్ నటి నేహా ధూపియాతో 2012లో ఒక క్యాలెండర్‌ను రూపొందించారు, ఆ తరువాతఫ్రెంచ్ లగ్జరీ పాదరక్షలు మరియు దుస్తులు డిజైనర్ క్రిస్టియన్ లౌబౌటిన్తో భాగస్వామిగా పనిచేశాడు.బ్రైడల్ కలెక్షన్‌తో పాపులర్2007లో తన తొలి బ్రైడల్ కలెక్షన్‌ను ఆవిష్కరించాడు,యు తన డిజైన్లతో వివాహ పరిశ్రమలో ఒక సంచలనం సృష్టించాడు. భారతీయ సంప్రదాయ వస్త్రాలు, చేనేత, చేతితో తయారు చేసిన తనదైన శైలితో డిజైనర్ వెడ్డింగ్ దుస్తులకు పేరుగాంచాడు.హై-ఎండ్ లగ్జరీ ఇండియన్ టెక్స్‌టైల్స్‌ను ఉపయోగించిన తొలివ్యక్గాపేరుతెచ్చకున్నాడు. బంధాని, గోటా వర్క్, బ్లాక్-ప్రింటింగ్ , హ్యాండ్-డైయింగ్ లాంటి వర్క్స్‌తో ట్రెండ్ క్రియేట్ చేశాడు.బాలీవుడ్ సినిమాలకుసబ్యసాచి సంజయ్ లీలా బన్సాలీ చిత్రం బ్లాక్‌కి కాస్ట్యూమ్ డిజైనర్‌గా అరంగేట్రం చేశారు. 2005లో ఒక ఫీచర్ ఫిల్మ్‌కి ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్‌గా జాతీయ అవార్డుతో సహా చిత్రానికి చాలా ప్రశంసలు అందుకున్నాడు. బాబుల్,లాగ చునారి మే దాగ్,రావణ్, గుజారిష్, పా,నో వన్ కిల్డ్ జెస్సికా,ఇంగ్లీష్ వింగ్లీష్,బ్లాక్ లాంటి అనేక సినిమాలకు కాస్ట్యూమ్ డిజైన్స్ అందించారు.ప్రముఖుల వివాహాలు నటి విద్యాబాలన్ ,అనుష్క శర్మ , విరాట్ కోహ్లీ, దీపికా పదుకొణె, రణవీర్ సింగ్, నిక్ జోనాస్ , ప్రియాంక, అలియా పీవీ సింధు వివాహ దుస్తులను సబ్యసాచి డిజైన్ చేశారు. ఇంకా శ్రీదేవి, కత్రినా కైఫ్, టబు, షబానా అజ్మీ, ఐశ్వర్య రాయ్ బచ్చన్,శ్రద్ధా కపూర్, సుస్మితా సేన్, కరీనా, నీతా అంబానీ, శ్లోకా, ఇషా, రాధిక అంబానీ సహసబ్యసాచి సెలబ్రిటీ క్లయింట్లే కావడం విశేషం. 25 సంవత్సరాల కృషి తర్వాత, సబ్యసాచి ముఖర్జీ బ్రాండ్ రూ. 500 కోట్ల విలువకు చేరింది. ఈ ఘనతను సాధించిన భారతదేశపు మొట్టమొదటి గ్లోబల్ బ్రాండ్‌గా ఎదిగింది. -
Punjab Kesari Lala Lajpat Rai స్వతంత్ర సంగ్రామ సింహం
లాలా లజపతిరాయ్ స్వతంత్ర సంగ్రామంలో తన ప్రాణాలను వదిలిన అమర జీవి. మొదట్లో దయానంద సరస్వతి ఏర్పాటుచేసిన ఆర్య సమాజ్ భావాల పట్ల ఆకర్షితులై అందులో చేరి సమాజ సేవ చేశారు. ఆయన మీద ఇటాలియన్ విప్లవకారుడైన జోసెఫ్ మ్యాజినీ ప్రభావం కూడా ఉంది. న్యాయవాద వృత్తిని విడిచి స్వాతంత్య్ర పోరాటంపై దృష్టి సారించారు. ఒకపక్క స్వాతంత్య్రోద్యమంలో పనిచేస్తూనే సామాజిక ఉద్యమాల్లోనూ పాల్గొన్నారు. అంటరానితనం నిర్మూలన కోసం మహాత్మా గాంధీ ‘హరిజన సేవక్ సంఘ్’ బ్యానర్ కింద పని ప్రారంభించారు. ప్రపంచంలోని ఇతర ముఖ్యమైన ఉద్యమాల మాదిరిగానే ఈ సామాజిక సంస్కరణ కూడా జాతీయ ఆమోదం కోసం గొప్ప పోరాటం చేయాల్సి ఉందని ఆయన ప్రకటించారు. లాలాజీ సేకరించిన కరువు నిధిలో కొంత భాగాన్ని అణగారిన వర్గాల అభ్యున్నతికి ఉపయోగించారు. కొన్ని ప్రాథమిక పాఠశాలలు కూడా ఈ ఫండ్ నుండి నిధులు అందు కున్నాయి. అనాథ పిల్లల కోసం ఆశ్రమాలను ఏర్పాటు చేసి వారికి నూతన జీవితాన్ని ప్రసాదించారు.భారత దేశంలో రాజ్యాంగ సంస్కరణలను అధ్యయనం చేయడానికి 1928లో బ్రిటన్ నుంచి వచ్చిన సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. పంజాబ్‌లోని లాహోర్‌లో జరిగిన ఆందోళనకు లజపతిరాయ్ నాయకత్వం వహించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మార డంతో పోలీసులు లాఠీచార్జి చేయడంతో ఈ ‘పంజాబ్ కేసరి’కి తీవ్రమైన దెబ్బలు తగిలాయి. ఆ సందర్భంగా ‘ఈ రోజు నా మీద పడిన దెబ్బలు, బ్రిటిష్ సామ్రాజ్య వాదం శవపేటికకు వేసిన చివరి మేకులు’ అని బ్రిటిష్ పోలీసులను హెచ్చరించారు. ఆ దెబ్బలతోనే చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆయన మృతి స్వాతంత్య్రోద్యమం తీవ్రమవ్వడానికి దారితీసింది.– డా. ఎ. శంకర్, రాజనీతిశాస్త్ర ఉపన్యాసకులు, హైదరాబాద్(నేడు లాలా లజపతిరాయ్ జయంతి) -
Mahakumbh Mela 2025: భారత్ యువకుడిని పెళ్లాడిన గ్రీకు అమ్మాయి
144 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ మహాకుంభమేళ ఆశ్చర్యకర ఘటనలకు, అద్భుతాలకు నిలయంగా మారింది. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు ఎందరెందరో దేశ విదేశాల నుంచి తరలివస్తున్నారు. అందులో ఎందరో ఉన్నత విద్యావంతులు బాబాలుగా మారిన వారిని వెలుగులోకి తెచ్చింది. అందరివీ వేరు దారులైన అంతా కలిసేది ఈఆధ్యాత్మిక సాగరంలోనే అని చాటిచెబుతోంది. ఈ మహాకుంభమేళలో రెండు వేర్వురు దేశాలకు చెందిన అమ్మాయి అబ్బాయి ఒక్కటయ్యేందుకు వేదికగా మారింది. వాళ్లెవరు..? మన హిందూ వివాహ పద్ధతిలోనే పెళ్లి చేసుకుంటున్నారు ఎందుకు..? తదితరాల గురించి తెలుసుకుందామా..!.మన భారత్‌కి చెందిన యువకుడి గ్రీకు అమ్మాయిని పెళ్లాడింది. అది కూడా మన హిందూ వైవాహిక సాంప్రదాయంలోనే వివాహం చేసుకోవడం విశేషం. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో ఆదివారం ఈ అద్భుతం చోటుచేసుకుంది. గ్రీకు యువతి పెన్లోప్ భారత్‌కు చెందిన సిద్ధార్థ్ అనే యువకుడిని వివాహం చేసుకుంది. అయితే వారిద్దరూ మన హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకోవాలని భావించి అత్యంత పుణ్యప్రదమైన ప్రయాగ్‌రాజ్‌లోని ఈ మహాకుంభమేళాని ఎంచుకున్నట్లు తెలిపారు ఇరువురు. ఇక గ్రీకు యువతి పెన్లోప్ కొన్నేళ్ల క్రితం సనాతనధర్మం సంప్రదాయాలను అవలంభిస్తోందని, శివుని భక్తురాలిగా మారిందని జూనా అఖారాకు చెందిన దర్వి చెప్పారు. ఇక సిద్ధార్థుడు కూడా మా భక్తుడే, ఆయన యోగాను వ్యాప్తి చేయడానికి, సనాతన సేవ చేయడానికి వివిధ విదేశాలకు వెళ్లి వచ్చినట్లు తెలిపారు. అలాగే వారి వారి వివాహ క్రతువు జూనా అఖారాకు చెందిన మహామండలేశ్వర్ స్వామి యతీంద్రానంద గిరి ఆధ్వర్యంలో జరిగింది. ఇక కన్యాదాన ప్రక్రియ వధువు తల్లి, ఆమె బంధువులు కలిసి నిర్వహించారు. ఈ పుణ్యప్రదమైన సమయంలోనే పెళ్లిచేసుకోవాలని ప్రగాఢంగా కోరుకున్నామని ఆ జంట తెలిపింది. ఇక పెన్లోప్ కూడా కొత్త సంస్కృతిని స్వీకరించడం పట్ల తాను ఉత్సాహంగా ఉన్నానని చెప్పారు. తానెప్పుడు భారతీయ వివాహం చూడలేదన్నారు. అందువల్ల తనకు ప్రతీది కొత్తగా ఉందన్నారు. ఈ జంట ఈ మహాకుంభమేళ అయ్యే వరకు ఇక్కడే ఉండి స్నానాలు ఆచరిస్తామని చెప్పారు. అలాగే రానున్న మౌని అమావాస్య జనవరి 29 పవిత్ర స్నానాలు ఆచరిస్తామని చెప్పారు. గ్రీకు యువతి పెన్లోప్ తల్లి కూడా తాము కూడా ఈ పుణ్యకార్యక్రమాన్ని మిస్ చేసుకోవాలని అనుకోవట్లేదని అన్నారు. ఈ మహాకుంభ మేళ ప్రారంభం నుంచి ఇక్కడే ఉన్నామని, పూర్తి అయ్యే వరకు ఇక్కడే ఉండేలా ప్లాన్ చేసుకుంటన్నట్లు తెలిపారు.(చదవండి: ఐఐటీ గ్రాడ్యుయేట్, టాటా స్టీల్ కంపెనీలో ఉద్యోగం..కట్‌చేస్తే ఇవాళ..!) -
రూ. కోటి జాబ్ కాదని..తొలి ప్రయత్నంలోనే సివిల్స్ : తండ్రి భావోద్వేగ క్షణాల్లో
ప్రతిష్టాత్మక యుపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ( UPSC ) పరీక్షలో విజయం సాధించడం అంటే సాధారణ విషయంకాదు. దానికి కఠోర సాధన పట్టుదల ఉండాలి. ఈవిషయంలో రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి కనిషక్ కటారియా కథ చాలా స్ఫూర్తివంతంగా నిలుస్తుంది.కోటి రూపాయల జీతం ఇచ్చే ఉద్యోగ ఆఫర్‌ను కాదని తన తొలి ప్రయత్నంలోనే 2018 UPSC పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంక్ (AIR) 1ని సాధించాడు. ఈ ప్రయాణంలో మరో విశేషం కూడా ఉంది అదేంటో తెలియాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే. (పాలక్ పనీర్, పనీర్ బటర్ మసాలా : రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ అదుర్స్!)ప్రతి ఏటా లక్షలాది మంది అభ్యర్థులు సివిల్స్‌కోసం ప్రిపేర్ అవుతారు. అందులో కొద్ది మంది మాత్రమే విజయం సాధిస్తారు. అలాంటి వారిలో ఒకరు రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి కనిషక్ కటారియా. ఐఐటీ బొంబాయి పూర్వ విద్యార్థి అయిన ఆయన కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ సంపాదించి తన రంగంలో అత్యుత్తమ ప్రతిభావంతుడిగా ఎదిగాడు. ఆ తరువాత దక్షిణ కొరియాలోని శామ్సంగ్ కంపెనీలో సంవత్సరానికి కోటి రూపాయల జీతంతో ఉద్యోగ ఆఫర్ కూడా వచ్చింది. అయితే, వ్యక్తిగత లాభాల కంటే దేశానికి సేవ చేయాలనే కోరిక అతనిలో బాగా నాటుకుపోయింది. అందుకే ఆ ఆఫర్‌ను మరీ తన కలలసాకారంకోసం పరీక్షకు సిద్ధం అయ్యాడు.ఇదీ చదవండి: అందం, ఆరోగ్యమే కాదు, బరువు తగ్గడంలో కూడా ‘గేమ్ ఛేంజర్’ ఇది!దృఢ సంకల్పం, క్రమశిక్షణతో కూడిన అతని ప్రయత్నం వృధాకాలేదు. 2018లో సివిల్ సర్వీసెస్ పరీక్షలో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ విజయంలో తన కృషి, పట్టుదలతోపాటు, కుటుంబ మద్దతు సహకారం చాలా ఉందని చెబుతాడు ఆనందంగా కనిషక్. స్పష్టమైన లక్ష్యం, సానుకూల మనస్తత్వంతో ఎలాంటి సవాళ్లనైనా అధిగమించివచ్చని నిరూపించాడు. తనలాంటి ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు.మరోవిశేషం.. కుటుంబానికి గర్వకారణమైన క్షణాలు కనిషక్ విజయగాథలో మరో ఆసక్తికర విషయం గురించి కచ్చితంగా చెప్పుకోవాలి. 2024 సెప్టెంబర్ 30ప రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో డివిజనల్ కమిషనర్‌గా పదవీ విరమణ చేశాడు కనిషక్ తండ్రి సన్వర్ మల్ వర్మ. తండ్రి రాజీనామా ఉత్తర్వులపై సంతకం చేసింది మాత్రం కనిషక్. ఈ ప్రత్యేకమైన క్షణాలు ఆ కుటుంబానికి గర్వించ దగ్గ క్షణాలుగామారాయి. అంతేకాదు. కుటుంబం అందించిన సేవ ,అంకితభాం మరింత ప్రత్యేకంగా నిలిచింది.వ్యక్తిగత శ్రేయస్సు, సంపద కంటే సేవకు ప్రాధాన్యత ఇవ్వాలనే అతని నిర్ణయం కనిషక్ను ప్రత్యేకంగా నిలిపింది. శామ్సంగ్లో డేటా సైన్స్‌లో అధిక జీతం వచ్చే ఉద్యోగాన్ని తిరస్కరించి, సమాజంలో అర్థవంతమైన మార్పును సృష్టించాలనే కోరికతో నడిచే సివిల్ సర్వీసెస్‌లో కెరీర్‌ను ఎంచుకోవడం విశేషం. దేశంకోసం దేశసేవకోసం ఆర్థికంగా గొప్ప అవకాశాన్నిఉద్యోగాన్ని వదులుకొని, అతను భవిష్యత్ తరాలకు ఒక ఉదాహరణగా నిలిచాడు. కృషి, అంకితభావం, స్పష్టమైన దృక్పథం ఉంటే ఏ కల కూడా సాధించలేనిది లేదని మరోసారి నిరూపించాడు. -
మాములు పెళ్లి వింత కాదు..! వరుడే పండితుడిగా మారి..
పెళ్లితంతులో పలు విచిత్రమైన ఘటనలు చోటు చేసుకున్న సందర్భాలు చూశాం. వధువు లేదా వరుడు విలక్షణంగా ఉండాలని చేసిన చిత్ర విచిత్రమైన పనులు చూశాం. కానీ ఇలాంటి వింతను ఏ పెళ్లితంతులో చూసి ఉండరు. వామ్మో వరుడికి మరీ ఇంతటి ఆత్మనిర్భరత అని విస్తుపోతారు. ఆఖరికి పెళ్లి విషయంలో ఇంతలానా అంటూ విస్తుపోయారు బంధువులు. పూజరి ఉన్నా సరే కాదని మరీ పెళ్లితంతు జరిపించాడు. ఎలాగో తెలుసా..!ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో చోటు చేసుకుంది. సహరాన్‌పూర్‌లోని రాంపూర్‌కు చెందిన వివేక్ కుమార్ అనే వ్యక్తి తన పెళ్లికి తానే పండితుడయ్యాడు. వధువు పక్కన కూర్చొని వరడే(Groom) తన వివాహా మంత్రాలు అతడే జపిస్తూ పెళ్లితంతుని విజయవంతంగా పూర్తి చేశాడు. ఇది చూసి అక్కడున్న వాళ్లందరికీ నోట మాటరాలేదు. మంత్రాలు చక్కగా వల్లిస్తూ(Chants Mantras) ప్రతి తంతుని అందరినీ ఆశ్చర్యపరిచేలా పూర్తి చేశాడు. ఈ వివాహ తంతుని చూస్తే ప్రధాని మోదీ(Prime Minister Narendra Modi) చెప్పిన ఆత్మనిర్భర్ భారత్ గుర్తుకొస్తుంది. దీని అర్థం స్వావలంబన భారతదేశం. దీన్ని ప్రధాని మోదీ 2020లో ప్రారంభించారు. భారతీయులు స్వతంత్రంగా స్వావలంబనగా ఉండటానికి ప్రోత్సహించే కార్యక్రమం ఇది. ఆయన ఉద్దేశ్యం ప్రకారం ఆత్మనిర్భర్ భారత్‌కి 'ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, వ్యవస్థ, వైబ్రెంట్ డెమోగ్రఫీ అనేవి ఐదు మూల సంభాలని ఆ దిశగా మనమంతా ఏ దేశంపై ఆధాపడకుండా ఎదగాలనేది ఆయన ఆంతర్యం. అందుకే మోదీ ఆత్మనిర్భర్ భారత్ అని నినదించారు. అందుకు అర్థం వచ్చేలా ఈ వరడు తన పెళ్లికి తానే పండితుడిగా మారి వివాహం చేసుకున్నాడు. మోదీ భారత్ తొందరలో ఆత్మ నిర్భర్‌గా మారుతుందని తరుచుగా అనేవారు. ఔను..! అనేలా ఈ వరుడు ఇలా చేతల్లో చూపించాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనం ఈ వ్యక్తి అని ఒకరు, తన పెళ్లిని అద్భుతంగా ఉండాలని ఇలా చేశాడంటూ మరొకరు కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు.Groom Becomes Priest: #Saharanpur Man Conducts His Own Wedding Rituals pic.twitter.com/keHAABXD77— Genzdigest (@Genzofficia_l) January 25, 2025 (చదవండి: అద్భుతమైన వెయిట్ లాస్ జర్నీ..! ఏకంగా 150నుంచి 68 కిలోలు..) -
చాలా కాస్ట్లీ గురూ!పావు కిలో ఉప్పు రూ.7500?!
ఉప్పులేని కూరలను, వంటలను అస్సలు ఊహించలేంకదా. అందుకే అన్నేసి చూడు.. నన్నేసి చూడు అంటుందట ఉప్పు. అలాగే ఇండియాలో కాస్త చవగ్గా దొరికే పదార్థం కూడా ఉప్పే. ఉప్పు ఆహారానికి రుచిని జోడించడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ఉప్పు ఎంత కీలక పాత్ర పోషించిందో మన అందరికీ తెలుసు. అయితే ఉప్పు పేరు చెబితేనే గూబ గుయ్యమనే మనే వార్త ఒకటి ఉంది. ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఉప్పు. ఒక గ్రాము ధర కొనాలంటేనే.. ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. ఏంటా ఉప్పు? తెలుసు కుందామా!పింక్ సాల్ట్....రాక్ సాల్ట్, బ్లాక్ సాల్ట్ ఇలా ఉప్పులో చాలా రకాలు ఉన్నాయి. ఒక్కో దాని బట్టి ఒక్కో రేటు ఉంటుంది. వీటన్నింటిలో నేను రాజు అంటోందిక కొరియన్ ఉప్పు. ప్రపంచంలో అత్యంత ఖరీదైనదిగా పేరుగాంచింది. 250 గ్రాముల కొరియన్ ఉప్పు ధర రూ.7,500 ( 100 డాలర్లు) దీన్ని ప్రత్యేక పద్ధతుల్లో కొరియన్ వెదురుతో తయారు చేస్తారట. అందుకే దీన్ని కొరియన్ బాంబూ ఉప్పు, ఊదారంగు వెదురు ఉప్పు, జుగ్యోమ్ అని కూడా అంటారు.కొరియన్ వెదురు ఉప్పు ఎలా తయారవుతుంది?పురాతన కాలం నుంచి కొన్ని శతాబ్దాల తరబడి కొరియన్ ఉప్పును వినియోగిస్తున్నారట. ఒక ప్రత్యకమైన పద్ధతుల్లో దీన్ని తయారు చేస్తారు. దీనికి పట్టే సమయం కూడా చాలా ఎక్కువే. వెదురు బొంగులలలో సాధారణ సముద్రపు ఉప్పు వేసి, వాటిని బంకమట్టితో మూసివేసిన తర్వాత, అధిక ఉష్ణోగ్రత వద్ద కాలుస్తారు. 800°C కంటే ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఉప్పును తొమ్మిది సార్లు కాల్చి, చివరిగా 1,000°C వద్ద రోస్టింగ్ చేస్తారు. ఇందుకు దాదాపుగా 50 రోజులు పడుతుంది. ఉప్పును వేయించిన ప్రతిసారీ, వెదురు లక్షణాలు పూర్తిగా ఉప్పులోకి శోషించబడేలా చల్లబరుస్తారు.అధిక ఉష్ణోగ్రతల వద్ద చాలా సార్లు వేడి చేయడంతోపాటు, దీని తయారీకి ప్రత్యేక ఫర్నేసులు, నైపుణ్యం కలిగిన వ్యక్తులు అవసరం. ఎందుకంటే దీనికి చాలా శ్రద్ధ ,అనుభవం కావాలి. అందుకే ఈ ఉప్పు ధర అంత కాస్ట్లీ. సాధారణ సముద్రపు ఉప్పుతో పోలిస్తే వెదురు ఉప్పుతో ప్రయోజనాలు చాలా మెండు.వెదురు ఉప్పు-ఆరోగ్య ప్రయోజనాలువెదురు ఉప్పులో పొటాషియం, కాల్షియం మెగ్నీషియంతో సహా 70కి పైగా అవసరమైన ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు: మంటను తగ్గిస్తుంది, కీళ్లనొప్పులు, గొంతు నొప్పి కి ఉపశమనంగా పనిచేస్తుంది.నోటి పూత, వాపు చిగుళ్ళకు చికిత్సలో పనిచేస్తుంది. నోటి పరిశుభ్రతకు చాలామంచిది.శరీరంలో pH స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది, క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని సమర్థవంతంగా తగ్గిస్తుంది.యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తుంది.డయాబెటిస్, హైపర్‌టెన్షన్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల నివారణలో పనిచేస్తుంది. ఇందులోని యాంటీ బాక్టీరియల్ లక్షణాల కారణంగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. టాక్సిన్ న్యూట్రలైజర్గా పనిచేసి మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.చర్మ ఆరోగ్యంలో కీలక పాత్ర. ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. అంతేకాదు ఒత్తిడిని దూరం చేస్తుంది. హార్మోన్లను సమతుల్యం చేయడం ద్వారా విశ్రాంతిని ప్రోత్సహిస్తుంది. గట్ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. ప్రపంచంలో ఉప్పు ధరఉత్పత్తి పద్ధతులు, రవాణా ఖర్చులు, మార్కెట్ డిమాండ్ వంటి కారణాల రీత్యా ప్రపంచవ్యాప్తంగా ఉప్పు ధరలు మారుతూ ఉంటాయి. ఖరీదైన ఉప్పు ఉత్పత్తి చేసే దేశాలు:ఘనాస్విట్జర్లాండ్బెల్జియంసరసమైన ఉప్పు ఉత్పత్తి చేసే దేశాలుభారతదేశంపాకిస్తాన్కజకిస్తాన్ఈజిప్ట్భారతదేశం లాంటి దేశాలలో, దాని పొడవైన, విస్తృత తీరప్రాంతం , ప్రభుత్వ రాయితీల కారణంగా ఉప్పు చవగ్గా లభిస్తుంది. అదేవిధంగా, చైనా, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఉప్పు గనులు, తీరప్రాంతం ఉన్న కారణంగా ఇక్కడ ఉప్పు ఉత్పత్తి ఎక్కువ.అమెరికాలో ఉప్పు అత్యంత ఖరీదైనది, కిలోకు సుమారు రూ. 300. ఐస్లాండిక్ ఉప్పు మరొక ఖరీదైన రకం. దీన్ని "లగ్జరీ సాల్ట్" అని పిలుస్తారు. ఇది ఐస్లాండ్లోని వాయువ్య ప్రాంతాలలో చేతితో తయారు చేస్తారు. చదవండి: పంచ్‌లో బెబ్బులి..కిక్ ఇస్తే.. ప్రత్యర్థులకు చుక్కలే ఎవరీ దేవి?చదివింది 10వ తరగతే..ముగ్గురు పిల్లలు : అట్టడుగు స్థాయినుంచి వ్యాపారవేత్తగా -
హైవే మధ్యలో రెండంతస్తుల ఇల్లు..! ఎక్కడంటే..
డెవలప్మెంట్లో భాగంగా నేషనల్ హైవేలను నిర్మిస్తుంటారు. ఒక్కోసారి వాటి కారణంగా ప్రదేశంలో మన బిల్డింగ్లు ఉంటే కోల్పోక తప్పదు. ప్రభుత్వం ఎంతోకొంత నష్టపరిహారం ఇచ్చి..తరలించడం జరగుతుంది. అయితే ఇక్కడొ తాత ప్రభుత్వం తరలి వెళ్లిపోయేందుకు ఎన్ని కోట్లు ఆఫర్ అందించినా సేమిరా అన్నడు ఫలితంగా ఏం జరిగిందో తెలిస్తే అవాక్కవ్వుతారు. పాపం ఆ తాత అలా మంకుపట్టు పట్టి ఉండకుండా బాగుండనని ఇప్పుడు బాధపడుతున్నాడు.అసలేం జరిగిందంటే..చైనాలోని జిన్క్సీలో ఉన్న హువాంగ్ పింగ్ రెండంతస్తులి ఇల్లు ప్రదేశంలో హైవే నిర్మిస్తున్నానరు. దాంతో చైన ప్రభుత్వం ఆ ప్రదేశాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయేలా డబ్బు ఆఫర్ చేసింది. ఎంతలా నచ్చచెప్పిన వినలేదు. ఏకంగా రెండు కోట్లు ఆఫర్ చేసినా తగ్గేదే లే..అన్నాడు. దాంతో ప్రభుత్వం అతడి ఇల్లు మినహా ఇరువైపులా హైవే నిర్మించేసింది. దీంతో అతడికి నిత్యం దుమ్ము, రణగొణధ్వనుల మద్య నెలకొన్న ఇల్లులా చికాకు తెప్పిస్తుంది. అబ్బా ఆ రోజు ఎందుకంతా పట్టు పట్టానా అని బాధపడుతున్నాడు. ఒక్కసారి టైమ్ వెనక్కెళ్లితే..చైనా ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్‌ని హాయిగా అందుకుంటానని బాధగా చెబుతున్నాడు. ప్రస్తుతం అతడి ఇల్లు ఎలా ఉందండి సరిగ్గా హైవే మధ్యలోఉన్న ఇల్లులా ప్రధాన ఆకర్షణగా ఉంది. పైగా చుట్టపక్కల నివాసితులు ఆ తాత ఇంటి వద్దకు వచ్చి పోటోలు తీసుకునే ఓ విచిత్రమైన ఇల్లులా అయిపోయింది. అంతేగాదు ఆ తాతను చైనాలో "స్ట్రాంగ్ నెయిల్ హౌస్ యజమాని" అని పిలుస్తారు. ఎందుకంటే నెయిల్ హౌస్ అనేది ఆక్రమిత ఇంటికి చైనీస్ పదం. అభివృద్ధికి ఆటంకం కలిగించే తమ ఆస్తి కోసం పోరాడే యజమానులను చైనాలో ఇలా పిలుస్తారు. కాగా, 2017లో, షాంఘైలో దాదాపు 14 సంవత్సరాలుగా ఒక ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన ఒక ప్రసిద్ధ "నెయిల్ హౌస్" చివరకు కూల్చివేశారు. తగినంత పరిహారం లేదని పేర్కొంటూ ఆ ఇంటి యజమానులు 2003 నుంచి తరలింపు ఆఫర్లను తిరస్కరించారు. కానీ చివరకు రూ. 3 కోట్ల పరిహారంతో మకాం మర్చాడానికి అంగీకరించినట్లు సమాచారం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లుకొడుతోంది. The stubborn old Chinese man who refused to sell his house for a government project now regrets his decision.Huang Ping, from Hunan province, hoped for more money but lost everything. The government built a road around his house, leaving it in the middle of a busy street. Now,… pic.twitter.com/it0rYe2fhd— Ibra ❄️ (@IbraHasan_) January 25, 2025 (చదవండి: ఇప్పుడు పుట్టి ఉంటే కచ్చితంగా ఆటిజం నిర్ధారణ అయ్యేది: బిల్‌గేట్స్) -
‘అంకుల్ ప్రైజ్’: అతడేం పనిచేస్తాడో తెలుసా..!
పొగడ్తలను ఇష్టపడని వారు చాలా అరుదు. పూర్వం రాజులు కూడా కేవలం తమని పొగడటానికి ప్రత్యేకంగా కొంతమందిని నియమించుకునేవారు. తాజాగా ఇదే తరహాలో జపాన్(Japan)లోని ఒక వ్యక్తి ‘అంకుల్ ప్రైజ్(Uncle Praise)’ పేరుతో తన సొంత స్ట్రీట్ జాబ్‌ను ప్రారంభించాడు. ప్రతిరోజూ టోక్యో నగర వీథుల్లో నిల్చొని, అతని దగ్గరకు వచ్చిన అపరిచితులను పొగుడుతూ డబ్బు సంపాదిస్తున్నాడు. ఒకానొక సమయంలో జూదానికి బానిసగా మారి, తన ఉద్యోగం, కుటుంబం రెండింటినీ కోల్పోయి, చాలాకాలం పాటు ఖాళీగా ఉండేవాడు. ఆ సమయంలో తిరిగి ఎవరూ తనని పనిలో చేర్చుకోకపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డాడు. అప్పుడే కొంతమంది స్ట్రీట్ ఆర్టిస్ట్‌లను చూసి, ‘అంకుల్ ప్రైౖజ్’ పేరుతో సొంత ఆలోచనతో ఇతరులను పొగిడే పనిని ప్రారంభించాడు. ఇతని కథనాన్ని ఈ మధ్యనే ఒక టీవీ షో ప్రసారం చేయటంతో ఫేమస్ అయ్యాడు. రోజుకు దాదాపు 150 యెన్ల నుంచి 10 వేల యెన్ల వరకు (రూ.82 నుంచి రూ. 5,500 వరకు) సంపాదించేవాడు. టీవీ షో ద్వారా ఫేమస్ అయిన తర్వాత ఇప్పుడు, విస్తృతంగా వ్యాపార పర్యటనలు చేస్తూ భారీగా సంపాదిస్తున్నాడు. (చదవండి: సర్వ ఆహార సమ్మేళనం -
అపుడు వాచ్‌మెన్‌గా, ఇపుడు దర్జాగా : శభాష్ రా బిడ్డా! వైరల్ స్టోరీ
పిల్లలు ప్రయోజకులైనపుడు ఆ తల్లితండ్రులు ఆనందంతో పొంగిపోతారు. తమ కష్టం ఫలించి కలలు నెరవేరాలని వేయి దేవుళ్లకు మొక్కుకుని, ఆశలు ఫలించాక వారికి కలిగే ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. అలాంటి ఊహించిన దానికంటే మరింత ఉన్నత స్థితికి చేరితే .. ఆ ఆనందానికి అవధులు ఉండవు. సుమతీ శతకకారుడు చెప్పినట్టు పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు పుట్టినపుడు కాదు, ప్రయోజకుడై తమకు గర్వంగా నిలిచినపుడు కలిగేది. అలాగే పిల్లలు కూడా అమ్మానాన్న కల నెరవేర్చాలని కలలు కంటారు. మంచి చదువు చదివి, ఉన్నతోద్యోగం సంపాదించాక కన్నవారిని ఆనందంగా అపురూపంగా చూసుకోవాలని పట్టుదలగా ఎదుగుతారు. తమ కలను సాకారం చేసుకొని పేరెంట్స్ కళ్లలో ఆనందం చూసి పొంగిపోతారు. అలాంటి ఆనందదాయకమైన స్ఫూర్తిదాయకమైన నిజజీవిత కథనం గురించి తెలుసుకుందాం.న్యూఢిల్లీకి చెందిన ఒక తండ్రికి ఇలాంటి అద్భుతమైన ఆనందమే కలిగింది. ఖగోళ శాస్త్రవేత్త ఆర్యన్ మిశ్రా తన సొంత తన తండ్రినీ, తల్లినీ లగ్జరీ హోటల్ ఐటీసీకి ఎలా తీసుకువచ్చాడో పంచుకున్నాడు. ఎక్స్( ట్విటర్)లో ఆయన షేర్ చేసిన ఈ స్టోరీ ఇంటర్నెట్ను విపరీతంగా ఆకర్షిస్తోంది. 20 లక్షలకు పైగా వ్యూస్‌ను దక్కించుకుంది.ఆర్యన్ తండ్రి ఐటీసీ హోటల్లో 1995- 2000 వరకు 25 సంవత్సరాలు వాచ్‌మెన్‌గా పనిచేశాడు. పాతికేళ్ల తరువాత అదే హోటల్‌కు భార్యతో కలిసి గెస్ట్‌గా రావడమే ఈ స్టోరీలోని విశేషం. దీనికి సంబంధించిన ఫోటోను కూడా ఆర్యన్ ట్వీట్ చేశారు. తరువాత విందు కోసం అతిథిగా పనిచేశాడు. వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నపుడు.. ఇదే హెటల్‌కి డిన్నర్‌కి వస్తానని బహుశా ఆయన ఊహించి ఉండడు. కానీ అతని కొడుకు మాత్రం తండ్రికి అంతులేని ఆనందాన్ని మిగిల్చాడు. బిడ్డల్ని పోషించేందుకు అహర్నిశలు శ్రమించే తల్లిదండ్రులకు ఇంతకంటే సంతోషం ఇంకేముంటుంది.ఈ స్టోరీ గురించి తెలుసుకున్న నెటిజన్లు సంతోషం వ్యక్తం చేశారు. తండ్రీ కొడుకులకు అభినందనలు తెలిపారు. తండ్రిని ఇంత బాగా సత్కరించినందుకు మరికొందరు మిశ్రాను ప్రశంసించారు. “మీ విజయోత్సాహంలో ఈ క్షణాలు చాలా గొప్పవి. మీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోండి” అని ఒక యూజర్ చెప్పారు.My father was a watchman at ITC in New Delhi from 1995-2000; today I had the opportunity to take him to the same place for dinner :) pic.twitter.com/nsTYzdfLBr— Aryan Mishra | आर्यन मिश्रा (@desiastronomer) January 23, 2025 “మీరు ఎవరో నాకు తెలియదు, కానీ ఇంత అందమైన కథ చదివినప్పుడు నా హృదయం ఆనందంతో నిండిపోయింది. చాలా సంతోషంగా ఉంది” అని ఒక రాశారు. మరొకరు ఒక హృదయ విదారక జ్ఞాపకాన్ని పంచుకుంటూ, “చాలా అందంగా ఉంది. నాకర్తవ్యాన్ని గుర్తు చేశారు. అపుడు ఎక్కువ ఖర్చు చేయలేకపోయాము. ఇప్పుడు నేను చేయగలను, కానీ విధి మరోలా ఉంది’’ అన్నారు. చాలా సంతోషం.. ఈ భగవంతుడు మీకుటుంబాన్ని చల్లగా చూడాలి అంటూ చాలామంది ఆశీర్వదించారు. -
Birthright citizenship : ట్రంప్ ఆర్డర్‌ను తోసిపుచ్చిన కోర్టు, ఎన్ఆర్ఐలకు భారీ ఊరట
అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత డోనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు తొలి షాక్ తగిలింది. ఆయన జారీ చేసిన తొలి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అమలు విషయంలో చుక్కెదురైంది. జన్మతఃపౌరసత్వ హక్కు రద్దు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను అక్కడి ఫెడరల్ కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. అంతేకాదు రాజ్యాంగ విరుద్ధ చర్యగా అభివర్ణించింది. దీంతో జన్మతః పౌరసత్వం చట్ట రద్దుతో బెంబేలెత్తుతున్న భారతీయులకు (NRI) భారీ ఊరట లభించింది. జన్మహక్కు పౌరసత్వాన్ని (birthright citizenship) రద్దు చేస్తూ డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వును గురువారం యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి నిలిపివేశారు. "ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైన ఉత్తర్వు" అని న్యాయమూర్తి జాన్ కఫ్నౌర్ పేర్కొన్నారు. అయితే ట్రంప్ దీనిపై "అప్పీల్" చేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.ట్రంప్ ఉత్తర్వు ఎవరికి వర్తిస్తుంది?ఫిబ్రవరి 19 తర్వాత ఆ ఉత్తర్వు తేదీ నుండి 30 రోజుల తర్వాత యుఎస్‌లో జన్మించిన వ్యక్తులకు మాత్రమే 14వ సవరణ యొక్క ఈ కొత్త వివరణ వర్తిస్తుంది.ట్రంప్ ఆదేశంఅమలులోకి వస్తే ఏటా 1.5 లక్షలకు పైగా నవజాత శిశువులకు పౌరసత్వం నిరాకరించబడుతుందని డెమొక్రాటిక్ నేతృత్వంలోని రాష్ట్రాలు నివేదించాయని రాయిటర్స్ తెలిపింది.ఇది భారతీయులను ఎలా ప్రభావితం చేస్తుంది?అమెరికా పౌరసత్వం పొందడానికి మార్గంగా ఉపయోగించే బర్త్‌రైట్ సిటిజెన్షిప్ రద్దు భారతీయ కుటుంబాలపై చాలా ప్రభావం పడుతుంది. ట్రంప్ ఆదేశం అమల్లోకి వస్తే, ఎన్ఆర్ఐ పిల్లలు అమెరికాలో ఉండేందుకు వేరే మార్గాలను వెతుక్కోవాల్సి వస్తుంది. దాదాపు 5.2 మిలియన్ల మంది భారత సంతతికి చెందిన ప్రజలు అమెరికాలో నివసిస్తున్నారు. అమెరికాలో భారతీయ అమెరికన్లు రెండో అతిపెద్ద వలసదారుల గ్రూప్‌గా ఉన్నారు. హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం గత సంవత్సరం ప్రచురించిన మరో నివేదిక ప్రకారం 2022 నాటికి అమెరికాలో 2.2 లక్షల మంది అనధికార భారతీయ వలసదారులు నివసిస్తున్నారని అంచనా వేసింది. ఇది 2018లో 4.8 లక్షలలో సగం కంటే తక్కువ.జనవరి 20న, 47వ యుఎస్ అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన ట్రంప్ వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు జన్మిస్తే స్వతహాగా లభించే పౌరసత్వాన్ని అందించే చట్టాన్ని రద్దు చేస్తూ ఆదేశాలు జారీచేశారు. అక్రమ వలసదారులకు అమెరికాలో జన్మించే పిల్లలకు లభించే జన్మతః పౌరసత్వాన్ని తమ ఫెడరల్ ప్రభుత్వం గుర్తించదని ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు.అమెరిక ఫస్ట్ అనే నినాదం కింద స్వదేశీయులకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఇమ్మిగ్రేషన్ విధానాల్లో విప్లవాత్మక మార్పులతీసుకొస్తానన్న వాగ్దానం చేసిన ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.ఈ ఉత్తర్వు ప్రకారం, పత్రాలు లేని తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలు ఆటోమేటిక్ పౌరసత్వానికి అర్హులు కారు.కాగా 1868 నుంచేఅమెరికాలో ఈ చట్టం అమల్లో ఉంది.దేశంలో అంతర్యుద్ధం అనంతరం 14వ రాజ్యాంగ సవరణ తర్వాత శరణార్ధుల పిల్లలకు జన్మతః పౌరసత్వాన్ని అందిస్తోంది. అమెరికా మాత్రమే కాదు.. దాదాపు 30 దేశాలు తమ దేశంలో జన్మించిన వారికి జన్మతః పౌరసత్వాన్ని అందిస్తున్నాయి. -
తలనే లాక్ చేశాడు..! తాళం మాత్రం భార్య చేతిలో..
ధూమపానం సేవించడం అనేది ఓ ఫ్యాషన్‌లా మారింది యువతకు. ఏదో సరదాగా ట్రై చేసి.. చివరికి దానికి అడిక్ట్ అయిపోతున్నారు. కొందరూ మాత్రం పొగరాయుళ్లుగా మారిపోవడం లేదు. మరికొందరికి మాత్రం అదొక బలహీనతలా మారిపోతోంది ఈ వ్యసనం. అయితే ఇలాంటి బలహీనతతో బాధపడుతున్న ఓ వ్యక్తి ఈ ధూమపాన అడిక్షన్ నుంచి బయటపడేందుకు ఎంతటి భయనాక నిర్ణయం తీసుకున్నాడో తెలిస్తే కంగుతింటారు. అయితే అతడు ఈ వ్యసనాన్ని జయించేందుకు ఇలాంటి నిర్ణయాన్ని ఆచరణలో పెట్టడం అనేది ప్రశంసించదగ్గ విషయం. ఆ నేపథ్యంలోనే ఆ వ్యక్తి సెన్సేషన్‌గా మారి వార్తల్లో నిలిచాడు కూడా. అతడెవరంటే..టర్కిష్కి చెందిన ఇబ్రహీం యుసెల్(Ibrahim Yucel) పొగ తాగడం మానేయాలని(Quit Smoking) గట్టిగా బీష్మించుకున్నాడు. కానీ ఎంతలా ఆ అలవాటుని వదులుకుందామన్నా..సాధ్యం కాలేదు. తన పిల్లల పుట్టిన రోజులప్పుడు, తమ పెళ్లిరోజు అప్పుడు.. ఇక ఈ రోజు నుంచి సిగెట్ మానేస్తానని ఒట్టు పెట్టుకోవడం..మళ్లీ ఏదో ఒక బలహీన క్షణంలో తెలియకుండానే తాగడం. ప్రతిసారి తన నిర్ణయాన్ని బ్రేక్ చేసేయ్యడం ఓ భయానక బలహీనతగా మారింది. ఇక లాభం లేదనుకుని ఏకంగా బోను(Cage) మాదిరిగా హెల్మెట్‌ని తయారు చేయించుకుని దాన్ని తలకు తగిలించుకుని లాక్ చేసేసుకున్నాడు. బయటకు కూడా మనోడు అలానే వెళ్తాడట. ఎందుకంటే ఎవర్ని చూసినా.. మళ్లీ నాలిక ఓ దమ్ము కొట్టు బ్రదర్.. అంటాదేమోనన్న భయంతో తలకు ఇలా ఇనుప ఊచల బోను మాదిరి హెల్మట్ ధరించుకుని వెళ్తున్నాడు. ఇలా వెళ్లడంతోనే యూసెల్ ఓ సెన్సేషన్ వ్యక్తిగా మారిపోయాడు. ఆ విషయం కాస్త దావనంలా వ్యాపించి మీడియా వరకు చేరడంతో వింత వ్యక్తిగా వార్తల్లో నిలిచాడు. పదకొండేళ్ల క్రితం మీడియాలో బోనులో తలను లాక్ చేసుకున్ని వ్యక్తి అంటూ పలు వార్తలు గుప్పుమన్నాయి. అయితే కేవలం భోజనం చేసేటప్పడూ లేదా ఏదైనా తినాలనుకున్నప్పుడూ మాత్రమే భార్య లాక్‌ని ఓపెన్ చేస్తుందట. ఆయన ఒకప్పుడు రోజుకి రెండు సిగరెట్ ప్యాకెట్లు హాంఫట్ చేసేవాడట. దీనివల్ల కలిగే అనారోగ్య ప్రమాదాల రీత్యా ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నాడు యూసెల్. ఈ వ్యసనం నుంచి బయటపడాని ప్రయత్నించిన ప్రతిసారి ఓడిపోవడంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు యూసెల్. మరీ యూసెల్ ఈ వ్యసనం నుంచి పూర్తిగా బయటపడ్డాడా..? లేదా అన్నది తెలియాల్సి ఉంది.కాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ(world Health Organisation) కూడా ప్రతి ఏడాది ఈ పొగాకు కారణం దాదాపు ఎనిమిది మిలియన్ల మంది మరణిస్తున్నట్లు చెబుతోంది. మధ్య తరగతి కుటుంబాల్లోనే ఈ వ్యసనానికి సంబంధించిన మరణాలు ఎక్కువగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. He quit because his father died of lung cancer. pic.twitter.com/RAWSVJvCXY— Clover Lavender (@AyoolaMatthee) November 7, 2024 (చదవండి: కామ్య... అఖండ ఖ్యాతి..! 17 ఏళ్లకే ఏడు పర్వతాలను అధిరోహించింది..!) -
ఆ రేంజ్ ధర పలికే ఇడ్లీలా..?
ఇడ్లీ(Idli) అనగానే చీప్ ధరలో దొరికే బ్రేక్‌ఫాస్ట్‌గా భావిస్తాం. అయితే ఈ సౌత్ ఇండియన్ వంటకం హోటల్ రేంజ్‌ని బట్టి ధరలు కూడా వేరేలెవల్లో ఉంటాయి. అయితే విలాసవంతమైన హోటల్లో దొరికే ఇడ్లీ టేస్ట్ మతిపోయేలా ఉంటుందనుకుంటున్నారా...?. అలా అనుకుంటే పొరపాటే. ఎందుకో ఈ వైరల్ వీడియోని చూస్తే మీకే తెలుస్తుంది. బెంగుళూరు వ్లాగర్(Bengaluru Vlogger) వీధుల్లో ఉండే హోటల్లో(roadside shop) దొరికే రూ. 5ల ఇడ్లీ నుంచి విలాసవంతమైన ప్యాలెస్‌లో దొరికే రూ. 5 వేల రూపాయల వరకు వివిధ ధరలు పలికే ఇడ్లీనే టేస్ట్ చేశాడు. పైగా వాటికి టేస్ట్‌కి రేట్స్ కూడా ఇచ్చాడు. ఆ వీడియోలో ముందుగా వీధులలో అమ్మే రూ. 5ల ఇడ్లీని తినేందుకు సాదాసీదాగా వెళ్లి టేస్టీ చేసి చూశాడు. రుచి అదుర్స్ అంటూ పదికి తొమ్మిదన్నర మార్కులు వేశాడు. ఆ తర్వాత ప్రముఖ రామేశ్వరం కేఫ్(Rameshwaram cafe)లోని రూ. 50ల ఇడ్లీని టేస్ చేయడానికి వెళ్లాడు. అయితే ఈ ఇడ్లీ టేస్ట్‌కి ఏడున్నర మార్కులు వేశాడు. తాజ్ హోటల్(Taj Hotel)లో ఇడ్లీని టేస్ట్ చేయగా అక్కడ దానిని చక్కగా ప్లేట్లో తీసుకురావడం తోపాటు నైఫ్, ఫోర్క్‌లు ఇచ్చారు. వాటితో అక్కడ ఇడ్లీని తినడం ఇబ్బందిగా అనిపించినా.. అలా తినక తప్పలేదు. అయితే అక్కడ టేస్ట్‌కి నాలుగున్నర మార్కులే వేశాడు. ఇక చివరగా ఓ లగ్జరీయస్ ప్యాలెస్‌లో ఇడ్లీ తినడానికి వెళ్లాడు. అక్కడ ఇడ్లీ ఖరీదు ఏకంగా రూ. 5వేల రూపాయలు. 23 క్యారెట్ల బంగారంతో చేసిన ఇడ్లీ ఇది. పాపం అన్ని డబ్బులు వెచ్చించినా..కొద్దిగా మాత్రమే తినగలిగాడు. ఇక నావల్ల కాదంటూ వదిలేశాడు. ఫైనల్‌గా రూ. 5 ఇడ్లీనే చాలా టేస్ట్‌గా ఉందని చెప్పడం విశేషం. అయితే నెటిజన్లు రుచి అనేది రేంజ్ హోటల్ని బట్టికాదు..చేసే విధానం పరిశుభ్రంగా ఉంటే ఆటోమేటిగ్గా రుచి బాగుంటుందని కొందరూ, మరీ రూ. 5 కోట్ల రూపాయల ఇడ్లీని ఎప్పుడూ తింటావ్ అని కామెంట్లు చేస్తూ పోస్ట్‌లు పెట్టారు. View this post on Instagram A post shared by Cassy Pereira (@cassiusclydepereira) (చదవండి: సోనాలి బింద్రే మెరిసే చర్మం రహస్యం..ఆ భారతీయ సంప్రదాయ మొక్క..! ) -
లడ్డూలిస్తా వదిలేయండి సార్.. చలాన్‌కు లడ్డూ లంచమా?!
ట్రాఫిక్, పోలీసులు అనగానే, ట్రాఫిక్ సిగ్నల్ జంప్, నిబంధనలను ఉల్లంఘన, చలాన్లు ఇవన్నీ గుర్తొస్తాయి కదా.. కానీ పెళ్లి, పెళ్లికూతురు, లడ్డూలు ఇలాంటివేమీ అస్సలు ఊహించం కదా. పంజాబ్‌లో ఇలాంటి అసాధారణ సంఘటన ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.పెళ్లి అంటేనూరేళ్ల పంట. ఆ అందమైనక్షణాలను కలకాలం గుర్తుండిపోయేలా పదిలపర్చుకోవాలని అందరూ భావిస్తారు. ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ దగ్గర్నుంచి హనీమూన్ దాకా ప్రతీదీ స్పెషల్‌గా ప్లాన్ చేసుకుంటారు. ఇందులో చిన్న చిన్న సర్‌ప్రైజ్‌ల వరకూ ఉంటాయి. మరికొన్ని వివాహాలలో మాంసాహారం లేదనో, వండ లేదనీ, మర్యాదలు బాగా జరగలేదు లాంటి ఆవేశకావేశాలు, కోపతాపాలు కామన్‌గా ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఆంచల్ అరోరాకు ఊహించని అనుభవం ఎదురైంది. పెళ్లి, హల్దీ వేడుక హడావిడిలో ట్రాఫిక్ సిగ్నల్‌ను జంప్ చేసేసింది. ఇది కాస్త పోలీసు (పంజాబీ) అధికారుల కంటబడింది. ఊరుకుంటారా మరి.. ట్రాఫిక్ ఉల్లంఘన అంటూ కారు ఆపారు. ఇక్కడే ఆసక్తికరమైన సంఘటన జరిగింది.దీంతో హల్దీ వేడుక ముస్తాబులో ఉన్న ఆంచల్.. చిరునవ్వుతో అధికారులను పలకరిస్తూ, "మేరీ హల్దీ హై, జాన్ దో (ఇది నా హల్దీ వేడుక, దయచేసి నన్ను వెళ్లనివ్వండి.)" అని వేడుకుంది.ఇది విన్న పోలీసుల మనసు కరిగింది. సరే పెళ్లి కదా అనుకొని ఆమెను వెళ్లనివ్వాలని ఎంచుకున్నారు. చలాన్ రద్దు చేయాలని కూడా నిర్ణయించుకున్నారు. అయితే పెళ్లి.. సరే.. కాస్త నోరు తీపి చేసి పోరాదా (ముహ్ మిథా కర్కే జానా”) అని అడిగారు సరదాగా. తప్పకుండా “లడ్డూ కా డబ్బా పక్కా” అని బదులిచ్చింది. దీంతో అక్కడున్న వారంతా నవ్వుల పువ్వులయ్యారు. షాదీ ముబారక్ చెప్పి ఆశీర్వాదాలు అందిస్తూ అక్కడినుంచి వెళ్లిపోయారు అధికారులు. దీనికి సంబంధించిన వీడియోను ప్రస్తుతం నెట్టింట తెగ సందడి చేస్తోంది. అంతేకాదు అదే పెళ్లి కొడుకు అయితే పరిస్థితి వేరేలా ఉండేది అంటూ నెటిజన్లు కామెడీగా స్పందించారు. లడ్డూ లంచం అని ఒకరు వ్యాఖ్యానించారు. ‘‘అదే అబ్బాయైతే.. పొట్టు పొట్టు కొట్టేవాళ్లు..("అభి లడ్కా హోతా తో నంగా కర్కే మార్తా యూజ్") పెళ్లి కొడుకైతే చలానా పక్కా ఇచ్చేవాళ్లు అంటూకే కా బ్యా హోతా తో.. పక్కా చలాన్ థా.") అంటూ కమెంట్ చేయడంతో మరికొంతమంది కూడా హా .. అవును అంటూ స్పందించడం విశేషం. View this post on Instagram A post shared by Jist (@jist.news) -
ఔరా! ఆ పుట్టగొడుగు.. ఐదు లక్షలట!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ అన్ని రంగాలతో పాటు ఆహార రంగంలోనూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. విభిన్న సంస్కృతుల సమ్మేళనంలో భాగంగా విభిన్న రకాల ఆహారానికీ నగరం కేంద్రంగా నిలుస్తోంది. ఇందులో భాగంగానే బంజారాహిల్స్‌లో నూతనంగా ప్రారంభమైన ఫుడ్‌స్టోరీస్ వేదికగా అక్షరాల రూ.5 లక్షల విలువ చేసే పుట్టగొడుగు (మష్రూమ్) అందరినీ ఔరా అనిపిస్తోంది. కాంటినెంటల్ ఫుడ్‌తో విభిన్న ప్రాంతాలకు చెందిన ఆహార పదార్థాలకు నెలవైన నగరంలో మొట్టమొదటి సారి ఈ రిషీ మష్రూమ్ సందడి చేస్తోంది. పారిస్‌కు చెందిన ఆర్కిటెక్చరల్ ఏజెన్సీ మల్హెర్బే ఏర్పాటు చేసిన ఈ ప్రముఖ ఫుడ్‌స్టోరీస్ దేశంలో రెండోది కావడం విశేషం. ఈ ఫుడ్‌స్టోరీస్ వేదికగా ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన డియోర్, మోయెట్–హెన్నెస్సీ, పారిస్ ఏరోపోర్ట్, గివెన్చీ వంటి బ్రాండ్లు సందడి చేస్తున్నాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న అరుదైన పండ్లు, సుగంధ ద్రవ్యాలు, లగ్జరీ జపనీస్ చాక్లెట్లు, గ్లోబల్ ప్యాంట్రీ, చీస్, మాంసాహార ఉత్పత్తులు ఆకర్షిస్తున్నాయి. ఫుడ్‌స్టోరీస్ కిచెన్ స్టూడియో ఫుడ్ లవర్స్‌ను అలరిస్తోందని సహ వ్యవస్థాపకురాలు అష్ని బియానీ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 8 వేలకు పైగా అత్యుత్తమ పదార్థాలను 4 గంటల్లోపు ఇంటికే డెలివరీ చేసే సేవలు ప్రారంభించామన్నారు. ఇదీ చదవండి: అమ్మ కోరిక తీర్చాలనే పట్టుదలతో టాప్‌లో నిలిచాడు : సక్సెస్ స్టోరీ -
రాగాల పల్లకిలో రాష్ట్రపతి చెంతకు..
జార్ఖండ్(Jharkhand )కు చెందిన ఈ పాతిక మందిలో ఎక్కువ మంది ఆదివాసీ అమ్మాయిలే. ఎవరూ ఎప్పుడూ ఢిల్లీకి వెళ్లలేదు. వీరికి ఢిల్లీకి వెళ్లే అవకాశం రావడమే కాదు రిపబ్లిక్ డే(Republic Day) వేడుకలలో పాల్గొని, రాష్ట్రపతి ముందు పైపర్ బ్యాండ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే అపూర్వ అవకాశం వచ్చింది.కర్తవ్యపథ్ దగ్గర ప్రదర్శన(Republic Day Parade ) ఇవ్వడానికి దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన మూడు పాఠశాలల్లో జార్ఖండ్‌లోని సింగ్భమ్ జిల్లా ‘కస్తుర్బాగాంధీ బాలికా విద్యాలయ’ ఒకటి. ట్యూన్స్ వాయించడంలో కచ్చితత్వం, ఏకరూపత కారణంగా ఈ పైపర్ బ్యాండ్ ఎంపికైంది. రాష్ట్ర్రపతి ముందు ప్రదర్శన ఇవ్వబోతున్న ఈ గర్ల్ బ్యాండ్ ఉత్సాహంగా ఉంది. ‘ఇది చాలా గొప్ప అవకాశం. జీవితంలో ఎప్పుడూ మరచి΄ోలేని అవకాశం’ అంటుంది బ్యాండ్ సభ్యులలో ఒకరైన పార్వతి మహతో. (చదవండి: డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం: స్టైలిష్ లుక్‌లో మెలానియా ట్రంప్) -
వైకే యాంటిక్ హోం మ్యూజియం: అబ్బురం, అద్భుతం
గతమెంతో ఘనం.. నేడు జీవనమే గగనం..అనే నానుడి అందరికీ తెలిసిందే..నగరంలోని వైకే యాంటిక్ హోంలో ఏర్పాటు చేసిన మ్యూజియం చూస్తే ఇదే అక్షర సత్యం అని అనిపించక మానదు.. మన పూర్వీకులైన తల్లిదండ్రులు, తాత ముత్తాతల జీవన శైలి మనకు అబ్బురంగానూ.. అద్భుతంగానూ అనిపిస్తుంది.. నేటి ఆదునిక పోకడలు అనారోగ్యాలు తెచ్చిపెడుతోంటే.. నాటి జీవన శైలివైపుకే మరలా అడుగులు పడు తున్నాయి.. వంట పాత్రల నుంచి ఆహార పదార్థాల వరకూ కొత్త ఒక వింత.. పాత ఒక రోత అనే నానుడి నుంచి.. ఆ పాత మధురం.. అనే రీతిలో నేటి తరం జీవన శైలి మారుతోంది.. ఇత్తడి, రాగి, మట్టి పాత్రలకు ఇటీవలి కాలంలో పెరుగుతున్న డిమాండే ఇందుకు నిదర్శనం.. – సాక్షి, సిటీబ్యూరోమన పూర్వీకులు వంట చేసుకోవడం మొదలుకుని తినడానికి వాడే గిన్నెలు, ప్లేట్లు, పాత్రలు, సంగీత పరికరాలు, పెద్ద పెద్ద శబ్ధాలు చేసే పరికరాలు.. ఇలా అన్నీ ఒకే చోట కనువిందు చేస్తే.. ఆ ప్రాంతం నుంచి వెనిక్కి రావడానికి మనుసు ఒప్పుకోదు. అలాంటి ప్రదేశాల్లో ఒకటి సికింద్రాబాద్‌లోని వైకే యాంటిక్ హోం మ్యూజియం. పిల్లలకు మన పండుగలు, సంస్కృతి, సంప్రదాయాలు తెలియజేయడం, పూర్వీకుల జీవన విధానంపై అవగాహన కల్పించడానికి ఇలాంటి ప్రదేశాలు ఎంతో తోడ్పడతాయి. దాదాపు 1400 సంవత్సరాల నాటి కాలంలో వినియోగంలో ఉన్న వస్తువుల నుంచి 20వ శతాబ్దం వరకూ అప్పటి జీవన విధానంలో వినియోగించిన అనేక పరికరాలు, వస్తువుల, ఆయుధాలు ఈ మ్యూజియంలో దర్శనమిస్తున్నాయి. మన పూర్వీకులకు చెందినవే కాకుండా ఇతర దేశాలకు చెందిన పలు రకాల చారిత్రక, సాంస్కృతిక వస్తువులు ఇక్కడ సందర్శనకు అందుబాటులో ఉంటాయి. సందర్శకులకు ప్రవేశం ఉచితం. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ మ్యూజియంలోకి అనుమతిస్తారు. 9963822339 లో ముందుగా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. తొలుత పది వస్తువులతోమాది కాకినాడకు సమీపంలోని సోమేశ్వరం. కుటుంబాన్ని చెన్నైకి తరలించే క్రమంలో మా అమ్మ పురాతన వస్తువులను వెంట తెచ్చుకుంది. వాటిని చూసినవారు చాలా బాగున్నాయని ప్రశంసించేవారు. దీంతో ఇలా అందరికీ మధురజ్ఞాపకాలను అందించే వస్తువులను సేకరించాలని నిర్ణయించుకున్నా. 50 ఏళ్ల నుంచి సికింద్రాబాద్‌లోని లోతుకుంటలో ఇంటినే మ్యూజియంగా మార్చాను. తొలుత 10 వస్తువులతో ప్రారంభమైన ప్రస్థానం ప్రస్తుతం వెయ్యికిపైగా వస్తువులకు చేరింది. – వై.కృష్ణమూర్తి, మ్యూజియం నిర్వాహకులు అమ్మ గుర్తుకొచ్చిందిమేం చిన్నప్పటి నుంచి వినియోగించే చాలా రకాల వస్తువులు ఇక్కడ కనిపిస్తున్నాయి. స్నానాలకు నీరు వేడిచేసే పాత్ర, పచ్చడి పెట్టుకునే పింగాణీ కుండలు, కంచు, ఇత్తడి సామాగ్రిని చూసిన వెంటనే అమ్మ గుర్తుకొచ్చింది. కాలంతో పాటు పాత్రలు మారిపోతున్నాయి. – సుభాషిణి, బేగంపేట్ -
హాసం రాజా ఆపాతమధురం -2 పుస్తకావిష్కరణ
ప్రముఖ పాత్రికేయులు, మ్యూజికాలజిస్ట్, హాసం సంపాదకులు స్వర్గీయ రాజా రాసిన ఆపాతమధురం-2 పుస్తకాన్ని ఆయన కుమార్తెలు శ్రేష్ఠ, కీర్తన ప్రచురించారు. ఈ పుస్తకావిష్కరణ సభ జనవరి 21, మంగళవారం సికింద్రాబాద్ లోని కిమ్స్ - సన్ షైన్ హాస్పిటల్ లోని భవనం శ్రీనివాసరెడ్డి ఆడిటోరియంలో జరిగింది. ఆపాతమధురం -2 పుస్తకాన్ని డాక్టర్ గురవారెడ్డి ఆవిష్కరించి తొలి ప్రతిని విశ్లేషకులు జె. మధుసూదన శర్మకు అందచేశారు. అనంతరం డాక్టర్ గురవారెడ్డి అధ్యక్షోపన్యాసం చేస్తూ, రాజా ఆధ్వర్యంలోని వచ్చిన హాసం పత్రిక వెబ్ సైట్‌ను పునరుద్ధరించాల్సిందిగా కోరారు. రాజా... తెలుగువారికి బినాకా గీత్ మాల అమీన్ సయానీ లాంటి వారనీ, ఆపాత మధురం తొలి భాగాన్ని, పామర్రులోని తన స్నేహితురాలు డాక్టర్ భార్గవితో కలిసి ప్రచురించానని తెలిపారు. అలాగే పుస్తకాలను ప్రచురించాలనే కోరిక నాకు బావ డాక్టర్ వరప్రసాద్ రెడ్డి నుండి అబ్బిందని తెలిపారు. రాజామరికొంతకాలం మనతో ఉండి ఉంటే 1971 వరకూ వచ్చిన పాటలను కూడా విశ్లేషించి ఉండేవారని తెలిపారు. కనీసం ఆ పనిని మధుసూదనశర్మ చేస్తే, దానిని పుస్తకంగా తీసుకొచ్చే బాధ్యతనుతాను స్వీకరిస్తానన్నారు. ఆత్మీయ అతిథి సి. మృణాళిని మాట్లాడుతూ, `రాజా పాటను సంగీతపరంగా, సాహిత్యపరంగా లోతైన విశ్లేషణ చేసేవారు. సంగీత దర్శకుల బాణీని, గీత రచయితల పదాలను జాగ్రత్తగా గమనించి, వాటిని గురించి వివరించేవారు. ఇలాంటి విశ్లేషణల కారణంగా మన పద సంపద పెరుగుతుంది. సాహిత్యాన్ని ఎంతో పరిశోధన చేయబట్టే ఆయన అంతలా దానిని వివరించే వారని అభిప్రయాపడ్డారు. ఓ పాటను అర్థం చేసుకోవడానికి, ఆస్వాదించడానికి శ్రవణ సంస్కారం అవసరం. అది ఆయన విశ్లేషణల ద్వారా మనలో మరింతగా పెరిగే ఆస్కారం ఉంది. ఏ యే లక్షణాలు పాటను గొప్పగా తీర్చిదిద్దుతాయనేది రాజా చెప్పగలిగేవారు. సహజంగా సంగీత దర్శకుడు, గీత రచయిత, గాయకుడు వారి పరిధిలోనే వాటిని గురించి చెప్పగలరు. కానీ రాజా ఆ ముగ్గురిని కలగలిపి లోతుగా విశ్లేషించేవారు. పాట మీద నిరంతరం పరిశోధన చేసిన రాజా లాంటి వారు బహు అరుదని పేర్కొన్నారు. పాటను విశ్లేషించే క్రమంలో ఆయన రసజగత్తులో పడిపోవడమే కాదు మనమూ అందులో పడిపోయేలా చేసేవారు. ఈ పుస్తకంలో ప్రతి పాటతో పాటు క్యూ ఆర్ కోడ్ పెట్టడం అనేది మంచి ప్రయత్నం. పాట గురించి చదవడంతో పాటు దానిని వినే ఆస్కారం కలిగించడం బాగుంది` అని అన్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ మాట్లాడుతూ : `పాట ఎప్పుడు పుట్టింది? ఎలా పుట్టింది? అనే వివరాలను `పాట అనే కార్యక్రమం ద్వారా అందించాలని అనుకున్నాను. అందుకు నాకు సంపూర్ణ సహకారం అందిస్తానని రాజా మాట ఇచ్చారు. కానీ దానిని నెరవేర్చకుండానే ఆయన మనల్ని విడిచి వెళ్ళిపోయారు`` అంటూ విచారం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇక్కడ మన మధ్య ఉన్న మధుసూదన శర్మ నెక్ట్స్ జనరేషన్ కు తన దగ్గర ఉన్న సమాచారాన్ని అందించాలని ఆర్.పి. పట్నాయక్ కోరారు. మ్యూజికాలజిస్ట్ రాజాతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని, ఈ పుస్తక ప్రచురణ కర్త డాక్టర్ వరప్రసాద్ రెడ్డి ఆహుతులకు తెలిపారు. రాజాకు సంగీతం పట్ల ఉన్న పట్టు తెలిసిన వ్యక్తిగా ఆయన సంపాదకత్వంలో హాసం పత్రికను ప్రారంభించానని, అయితే అనివార్య కారణంగా దానిని ఆపివేయాల్సి వచ్చిందని, చాలా మంది ఇప్పటికీ హాసం పత్రిక ఆగిపోవడానికి కారణాలు అడుగుతుంటారని, రాజీ పడలేని రాజా మనస్తత్త్వం కారణంగానే ఆ పత్రికను తాను ఆపేశానని, రాజా గారు లేని హాసం పత్రికను తీసుకురావడం తనకు ఇష్టం లేకపోయిందని వర ప్రసాదరెడ్డి తెలిపారు. ఇప్పటికీ హాసం ప్రచురణలు పేరుతో పుస్తకాలను ప్రచురిస్తున్నామని అన్నారు. రాజా రాసిన ఆపాతమధురం -2 పుస్తకాన్ని తీసుకురావడం కోసం అమెరికాలో ఉండే ఆయన కుమార్తెలు శ్రేష్ఠ, కీర్తన ఎంతో శ్రమించారని అంటూ వారిద్దరినీ వరప్రసాద్ రెడ్డి అభినందించారు.రాజాగారి తరహాలోనే ఆయన కుమార్తెలు తన మీద అభిమానంతో ఈ పుస్తకాన్ని తనకు అంకితం ఇవ్వడం పట్ల మధుసూదన శర్మ ధన్యవాదాలు తెలిపారు. ప్రముఖ గీత రచయిత భాస్కరభట్ల రవికుమార్ హాసం రాజాతో తనకున్న అనుబంధాన్ని తెలియచేశారు. ఈ పుస్తకం తీసుకు రావడానికి తమకు సహకరించి వారికి రాజా పెద్ద కుమార్తె శ్రేష్ట ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే మ్యూజికాలజిస్ట్ రాజా వెబ్ సైట్ ను తిరిగి ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. -
ప్రాంక్ చేసి నవ్విద్దాం అనుకుంటే..అదే చివరి నవ్వు అయిపాయే..!
సోషల్ మీడియ స్టార్డమ్ కోసం ఎలా పడితే అలా వీడియోలు చేసేస్తున్నారు. అసలు ఇది కరెక్టేనా సురక్షితంగానే చేస్తున్నామా అని కూడా ఆలోచించటం లేదు. వీడియో పోస్ట్ చేశామా..? వ్యూస్ వచ్చాయా..?, ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారనేది ముఖ్యం. ఇంకేమీ చూడటం లేదు. ఎలాంటిదైనా చేయడానికి రెడీ. ముఖ్యంగా ప్రాంక్ వీడియోలు మరింత ప్రమాదరకంగా మారాయి. అవతల వాడిని తక్కువ చేయడం లేదా వెధవిని చేస్తే పకాలించి నవ్వడం అనేదే ధ్యాసగా చేసేస్తున్నారు. ఇలాంటివి ఒక్కోసారి ప్రమాదాల తోపాటు శత్రుత్వాన్ని తెచ్చిపెడతాయి. ఇప్పుడిదంతా ఎందుకంటే..ఇలానే ఓ వ్యక్తి సరదాగా నవ్విద్దామని చేసిన ఫ్రాంక్ కాస్తా చిరునవ్వునే లాక్ చేసేసింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ వ్యక్తి షాపు ముందు హాయిగా కూర్చొని ఓ పవర్ఫుల్ గమ్(Superglue)ని తీసుకుని పెదాలపై వేసుకుంటాడు. ఆ తర్వాత వీడియో(Viral Video)లో చూడండి అన్నట్లుగా పెదాలను(Lips) దగ్గరకు చేసి ఉంచుతాడు. అవి లాక్ అవుతాయా లేదా టెస్ట్ చేద్దామనుకున్నాడు. కానీ నిజంగానే అతుక్కుపోవడంతో ఏం జరుగుతుందో అర్థ కాలేదు ఆ వ్యక్తికి. పాపం ఆ వ్యక్తి ఏమో హే..అతుక్కోలేదని ఎగిరి గంతేసి చెప్పి నవ్విద్దామనుకుంటే రివర్స్ అయిపోయింది. తనకు చిరునవ్వే లేకుండా చేస్తుందని అనుకోలేదు. పాపం పెదాలను ఎలా విడిపించాలో తెలియక ఏడ్చేశాడు. అయితే ఈ వీడియోని చూసిన నెటిజన్లు మాత్రం ఎలాంటివి చేస్తే మంచిది అనేది తెలియదా అని ఒకరూ, మంచి గుణపాఠం నేర్చుకున్నాడు. మళ్లీ చేయడు ఇలాంటివి అంటూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Badis TV (@badis_tv) (చదవండి: డొనాల్డ్ ట్రంప్ కుటుంబ వృక్షం: తల్లిదండ్రులు వలసదారులు..) -
ఆ డాక్టర్ డేరింగ్‌కి మతిపోవాల్సిందే..! వామ్మో మరీ ఇలానా..
ఓ డాక్టర్ తన భార్యకు భవిష్యత్తులో ప్రెగ్నెన్సీ రాకుండా ఉండేందుకు ఓ భయానక సాహసానికి ఒడిగట్టాడు. పైగా తన భార్య కోరికను తీర్చేందుకే ఇలా చేశానని చెబుతున్నాడు. ఆ ఘనకార్యం వింటే..అమ్మబాబోయే ఏం డాక్టర్‌వయ్యా బాబు అని మండిపడతారు.ఈ వింత ఘటన చైనా(China)లో చోటుచేసుకుంది. తైవాన్‌లోని తైపీకి చెందిన డాక్టర్ చెన్ వీ నోంగ్(Dr Chen Wei-nong) అనే సర్జన్ తనకు తానుగా వేసక్టమీ ఆపరేషన్(Dr Chen Wei-nong) చేసుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియోని డాక్యుమెంట్ రూపంలో నెట్టింట షేర్ చేశారు. దీంతో ఒక్కసారిగా ఆ సర్జన్(surgeon) నెట్టింట హాట్‌టాపిక్‌గా మారాడు. భవిష్యత్తులో ఇంక పిల్లలు పుట్టకూడదనే తన భార్య కోరికను నెరవేర్చేందుకు ఇలా చేశానని తెలిపాడు. అదే తాను తన భార్యకు ఇచ్చే అతిపెద్ద బహుమతి అని చెబుతుండటం విశేషం. ఆయన ఆ వీడియోలో తనకు తానుగా ఎలా వేసెక్టమీ ఆపరేషన్ చేసుకుంటున్నాడో కనిపిస్తుంది. నిజానికి ఈ సర్జరీ జస్ట్ 15 నిమిషాల్లో పూర్తి అవుతుంది. కానీ ఆయన స్వయంగా చేసుకోవడంతో ఒక గంట వ్యవధి తీసుకుని విజయవంతంగా తన సర్జరీని పూర్తి చేసుకున్నాడు. అంతేగాదు ఆ సర్జరీ చేసిన ప్రదేశంలో ఎంత పెయిన్ ఉంటుందో కూడా వివరించాడు. డాక్టర్ చెన్ వేసెక్టమీ ఆపరేషన్ పదకొండు దశలు గురించి ఆ వీడియోలో వివరంగా వెల్లడించారు. అంతేగాదు ఆ వీడియోలో మరసటి రోజు తాను పూర్తిగా కోలుకున్నట్లు కూడా తెలిపాడు. అయితే నెటిజన్లు ఈ వీడియోని చూసి ఆ డాక్టర్ డేరింగ్‌కి విస్తుపోయారు. ఎంత డాక్టర్ అయినా తనకు తాను స్వయంగా సర్జరీ చేసుకోవడం అంటే మాటలు కాదు. కచ్చితంగా ఈయన మంచి నైపుణ్యం గల సర్జన్ అయ్యి ఉండాలి అంటూ పోస్టులు పెట్టారు. కాగా, ఆ డాక్టర్ చెన్ దంపతులకు ఎంతమంది పిల్లలు అనేది తెలియాల్సి ఉంది. కానీ పిలల్లు పుట్టకుండా మహిళలే కాదు భర్తలు కూడా ఇలాంటి విషయంలో కాస్త ముందుకువచ్చి వారి బాధను తగ్గించే యత్నం చేయాలనే అవగాహన కల్పిస్తున్నట్లుగా ఉంది ఇతడి సాహసం. వాస్తవానికి చాలామటుకు మహిళలే పిల్లలు పుట్టకుండా(ట్యూబెక్టమీ) ఆపరేషన్ చేయిచుకుంటున్నారు. View this post on Instagram A post shared by 陳瑋農 整形外科 醫師。晶華診所院長。 (@docchen3) (చదవండి: అనారోగ్యానికి ‘ఆహారం’ కావద్దు!) -
అచ్చం రాజమౌళి మూవీ 'ఈగ' లాంటి చీమ..!
రాజమౌళి ‘ఈగ’కు ఎన్ని శక్తులు ఉన్నాయో, అన్ని శక్తులూ ఉన్నాయి ఫొటోలోని ఈ చీమకు. కందిరీగ జాతికి చెందిన దీని పేరు ‘ట్రామాటోముటిల్లా బైఫర్కా’. మృదువైన వెంట్రుకల కారణంగా దీనిని బ్రెజిలియన్ వెల్వెట్ చీమ అని కూడా అంటారు. లక్షన్నర జాతుల చీమలు, కందిరీగలు, ఈగలు, తేనెటీగల కంటే కారునలుపులో ఉంటుందిది. ఇది ప్రపంచంలోనే అత్యంత కారునలుపు చీమ, అత్యంత తీవ్రమైన నొప్పి పుట్టించే చీమ కూడా ఇదే! ఈ మధ్యనే దీని బాహ్య నిర్మాణాన్ని నిశితంగా పరిశీలించిన శాస్త్రవేత్తలు మరిన్ని ఆసక్తికర విషయాలను తెలిపారు. ‘బీల్స్టెయిన్ జర్నల్ ఆఫ్ నానోటెక్నాలజీ’ అధ్యయనం ప్రకారం ఈ చీమకు మెలనిన్తోపాటు, సూపర్ డార్క్ కలరింగ్ ప్లేట్లెట్లు ఎక్కువ. వీటి కారణంగానే దాని శరీరం ఉపరితలంపై పడిన కాంతితో 0.5 శాతం కంటే తక్కువ పరావర్తనం చెందుతుంది. ఈ చీమకు అతినీలలోహిత కాంతిని కూడా గ్రహించే శక్తి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. (చదవండి: బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వంటగది ఇంటీరియర్ డిజైన్..!) -
కళ్లు చెదిరే ఇన్‌స్టా రీల్ : 55.4 కోట్లతో రికార్డులు బద్దలు
సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌కు, లేదా ఒక వీడియోకు లేదా ఒక రీల్‌కు దక్కిన వ్యూస్, కామెంట్స్ ఆధారంగా దాని ప్రాధాన్యతను అంచనా వేస్తుంటాం సాధారణంగా. క్రియేట్ చేసినవాళ్లే ఆశ్చర్యపోయేలా మిలియన్ల వ్యూస్‌తో ప్రజాదరణ పొంది, రికార్డులను క్రియేట్ చేసే కొన్ని విశేషమైన వీడియోలను కూడా చూస్తుంటాం. ఇలా సరదాగా సృష్టించిన ఒక రీల్ రికార్డు దక్కించుకుంది. ప్రపంచంలో అత్యధికంగా చూసిన ఈ వైరల్ క్లిప్ నెట్టింట వైరల్‌గా మారింది. రండి.. ఆ రికార్డ్ స్టంట్ రీల్ కథాకమామిష్షు ఏంటో తెలుసుకుందాం.ఒకటీ రెండూ ఏకంగా 55.4 కోట్ల (554 మిలియన్ల) మంది ఆ రీల్‌ను వీక్షించారంటే మరి ప్రపంచ రికార్డు కాక మరేమిటి. అందుకే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. ఇంతకీ ఈ ఫీట్ సాధించింది ఎవరో తెలుసా? భారతదేశంలోని కేరళకు చెందిన ఫ్రీస్టైల్ ఫుట్‌బాల్ ఆటగాడు 21 ఏళ్ల ముహమ్మద్ రిజ్వాన్. ఈ స్టార్ ప్లేయర్ కంటెంట్ క్రియేటర్‌గా కూడా పాపులర్ అయ్యాడు. 2023 నవంబరులో ఈ రీల్ పోస్ట్ చేశాడు. అప్పటినుంచి ఇది వైరల్ అవుతూ రికార్డును కొట్టేసింది. మలప్పురంలోని కేరళంకుండు జలపాతం వద్ద చిత్రీకరించిన రీల్‌ను పోస్ట్ చేశాడు. ఈ రీల్లో ఒక జలపాతం వద్ద బంతిని బలంగా తంతాడు. దీంతో ఆ బంతి జలపాతం వెనుక ఉన్న రాళ్ల నుండి ఎగిరి పడుతుంది. అద్భుతమైన ఈ దృశ్యం చూసి రిజ్వాన్ కూడా ఆశ్చర్యపోయాడు. కేవలం క్రీడాకారులను మాత్రమే కాదు, కోట్లాదిమంది నెటిజనులను కూడా ఆకట్టుకుంది. అప్పటి నుండి, రీల్ ప్రజాదరణ పొందింది, 92 లక్షలకు పైగా (9.2 మిలియన్లు) లైక్‌లు మరియు 42,000 కంటే ఎక్కు లక్షల కొద్దీ లైక్స్, కామెంట్లను దక్కించుకుంది. ప్రపంచంలో అత్యధికంగా వీక్షించిన ఇన్స్టాగ్రామ్ రీల్‌తో అవార్డు కూడా పొందాడు. ఇదీ చదవండి: మార్కెట్లో విరివిగా పచ్చి బఠాణీ : పిల్లలుమెచ్చే, ఆరోగ్యకరమైన వంటకాలువిశేషం ఏమిటంటేఅతని రీల్ జర్మనీ, స్పెయిన్, ఫ్రాన్స్ జనాభా కంటే ఎక్కువ వీక్షణలను సాధించడం విశేషమే మరి. జర్మనీ, ఫ్రాన్స్ స్పెయిన్‌ల ఉమ్మడి జనాభా కంటే ఎక్కువ వ్యూస్ అంటూ నెటిజన్లను రిజ్వాన్‌ను పొగడ్తలతో ముంచెత్తారు.రిజ్వాన్ స్పందన“నేను దీన్ని ఎప్పుడూ ఊహించలేదు. ఇది స్నేహితులతో సరదాగా గడిపిన వీడియో. 10 నిమిషాల్లోనే, దీనికి 2లక్షలవీక్షణలు వచ్చాయి . నేను ఇంటికి చేరుకునే సమయానికి, అది మిలియన్‌కు చేరుకుంది.” అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశాడు.గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తింపురిజ్వాన్ అసాధారణ విజయాన్ని ఈ ఏడాది జనవరి 8న అధికారికంగా గుర్తించారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా రిజ్వన్ షేర్ చేశాడు. అదే జలపాతం వద్ద, ఒక చేతిలో వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్‌ను, మరో చేతిలో ఫుట్‌బాల్‌ను పట్టుకుని, తనను ఆదరించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. (బామ్మకు స్వీట్ సర్ప్రైజ్ : 20 లక్షలకు పైగా వ్యూస్) View this post on Instagram A post shared by muhammed riswan (@riswan_freestyle) కేవలం 21 సంవత్సరాల వయస్సులో, రిజ్వాన్ తన వైరల్ రీల్‌కు మాత్రమే కాకుండా తన అద్భుతమైన ఫ్రీస్టైల్ ఫుట్‌బాల్ నైపుణ్యాలకు కూడా ప్రపంచ సంచలన ఆటగాడు. ఆటలోని విన్యాసాలకు పరిమితం కాలేదు రిజ్వాన్ పర్వత శిఖరాలపై, కారు పైకప్పులపై మకా, నీటి అడుగున కూడా విన్యాసాలు చేయడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. ఫుట్‌బాల్‌తో పాటు, రిజ్వాన్ రోజువారీ వస్తువులతో కూడా సృజనాత్మక నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. -
బామ్మకు స్వీట్ సర్ప్రైజ్ : 20 లక్షలకు పైగా వ్యూస్
జైనబ్ రోష్నా దుబాయిలో ఉంటుందన్న మాటేగానీ కేరళలోని బామ్మ జ్ఞాపకాలు ఎప్పుడూ తనతోనే ఉంటాయి. ఆ జ్ఞాపకాలు హాయిగా ఉంటాయి, నవ్విస్తాయి. కొన్నిసార్లు భావోద్వేగానికి గురి చేస్తాయి. తనకు తీరిక దొరికినప్పుడల్లా బామ్మతో ఫోన్లో మాట్లాడుతుంది జైనబ్.‘ఇలా ఫోన్లో మాట్లాడుకోవడమేనా! నన్ను చూడడానికి ఎప్పుడు వస్తావు?’ అని అడుగుతుంది బామ్మ.‘నువ్వు దూరంగా ఉంటే కదా రావడానికి. నువ్వు ఎప్పుడూ నా కళ్ల ముందే ఉంటావు’ అని నవ్వుతుంది జైనబ్.‘నీ మాటలకేంగానీ... నువ్వు నన్ను చూడడానికి రావాల్సిందే’ అన్నది బామ్మ. అటు నుంచి నవ్వు మాత్రమే వినిపించింది! కట్ చేస్తే...ఆ రోజు బామ్మగారి బర్త్‌డే. తన ఊళ్లో ఆ రోజు కూడా బామ్మ అన్ని రోజులలాగే ఎప్పటిలాగే ఉంది. ‘నా బర్త్‌డేను జైనబ్ ఎంత ఘనంగా చేసేదో’ అంటూ గతాన్ని గుర్తు చేసుకుంది. ఇంతలో ఎవరో వస్తున్న అలికిడి వినిపించింది.ఎవరా అని చూస్తే... ఊహించని వ్యక్తి. నిజమా? భ్రమా!’ అనుకుంటుండగానే సంతోషంగా అరిచింది జైనబ్. స్వీట్ షాక్ నుంచి తేరుకున్న తరువాత... View this post on Instagram A post shared by ZAINAB ROSHNA | ZR✌🏻 (@zainabroshna) ‘నన్ను చూడడానికి వచ్చావా తల్లీ... ఒక్క మాటైనా చెప్పలేదు...’ అంటూ సంతోషంతో కళ్ల నీళ్ల పెట్టుకుంది బామ్మ. ‘ముందే చెబితే ఏం మజా ఉంటుంది! ఇలా వస్తేనే సర్ప్రైజింగ్గా ఉంటుంది’ అన్నది జైనబ్. ఆ రోజు వంద పండగలు ఒకేసారి వచ్చినంత సంతోషంగా ఫీల్ అయింది బామ్మ. ప్రేమగా, గారాబంగా మనవరాలిని ముద్దు పెట్టుకుంది. ‘గత ఏడాది మా అమ్మమ్మ పుట్టిన రోజున నా ఎమిరేట్స్ యూనిఫాం ధరించి వీడియో కాల్ చేశాను. నన్ను యూనిఫాంలో చూసి అమ్మమ్మ ఆశ్చర్యపడింది. కొత్త అమ్మాయిని చూసినట్లుగా ఉంది అని నవ్వింది. ఈ పుట్టిన రోజుకు మరింత సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను. అందుకే చెప్పకుండా వచ్చాను’ అని ఇన్‌స్టా పోస్ట్‌లో రాసింది జైనబ్.ఒక్క మాటలో చెప్పాలంటే... ఇది మామూలు సంఘటన. అయితే సోషల్ మీడియా లో బామ్మ, మనవరాళ్ల వీడియో ఎంతో సందడి చేస్తోంది. దుబాయి నుంచి వచ్చిన జైనబ్ బామ్మ గదిలోకి సంతోషంగా పరుగెత్తుతున్న దృశ్యాలు నెటిజనులను ఆకట్టుకున్నాయి.జైనబ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో క్లిప్ 2.3 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ వీడియో క్లిప్ నేపథ్యంలో అమ్మమ్మ, నానమ్మలతో తమకు ఉన్న విలువైన జ్ఞాపకాలు పంచుకున్నారు నెటిజనులు.‘అమ్మ దగ్గర కంటే అమ్మమ్మ దగ్గరే నాకు చనువు ఎక్కువ. ఈ వీడియో క్లిప్ చూసినప్పుడు మా అమ్మమ్మ గుర్తుకు వచ్చి కళ్లలో నీళ్లు తిరిగాయి. పెద్దవాళ్లు మన నుంచి ఏమీ కోరుకోరు. మనం వారికి ఒకసారి కనిపించినా పెద్ద బహుమతిగా ఫీలవుతారు’ అని స్నేహ అనే నెటిజన్ తన కామెంట్ పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో ఈ బామ్మ, మనవరాళ్ల వీడియో ఎంతో సందడి చేస్తోంది. దుబాయి నుంచి వచ్చిన జైనబ్ బామ్మ గదిలోకి సంతోషంగా పరుగెత్తుతున్న దృశ్యాలు నెటిజనులను ఆకట్టుకున్నాయి. జైనబ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో క్లిప్ 2.3 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. చదవండి: Maha Kumbh Mela 2025: ‘కండల బాబా’ స్పెషల్ ఎట్రాక్షన్, ఎవరీ బాహుబలిఅత్యధిక జీతాన్ని వద్దనుకొని.. ఇపుడు ఏడాదికి రూ. 30 లక్షలు -
Maha Kumbh Mela 2025: ‘కండల బాబా’ స్పెషల్ ఎట్రాక్షన్, ఎవరీ బాహుబలి
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న 2025 మహా కుంభమేళా(Maha Kumbh Mela2025) కు ప్రపంచవ్యాప్తంగా భక్తులు తరలివస్తున్నారు. జనవరి 13న ప్రారంభమైన ఈ మహా కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగనున్న ఈ ఆధ్యాత్మిక వేడుకకు కేవలం భారతీయులేకాదు, సాధువులు కూ విదేశీ ప్రముఖులు, సందర్శకులు పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. అయితే ఈ మహా కుంభమేళాలో రష్యాకు చెందిన "కండరాల బాబా" విశేషంగా నిలుస్తున్నాడు. ఈయన ఫోటోలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.కాషాయ దుస్తులు ధరించి, కండలుతిరిగిన దేహంతో కనిపిస్తున్న ఈయన స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాడు. భుజాన పెద్ద బ్యాగ్, మెడలో రుద్రాక్ష మాల, ముఖంలో కాంతివంతమైన తేజస్సు, ఏడు అడుగుల అందమైన రూపంతో ఈ సాధువు ఆకర్షిస్తున్నాడు. కెవిన్బుబ్రిస్కీగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ అయిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో త్వరగా వైరల్ అయ్యాయి.కండల బాబా అసలు పేరు ఆత్మ ప్రేమ్ గిరి మహారాజ్(Atma Prem Giri Maharaj) ఈ "కండల బాబా" రష్యాకుచెందిన వాడు. ఇపుడు నేపాల్‌లో నివసిస్తున్నాడు. అతను దాదాపు 30 సంవత్సరాల క్రితం హిందూ మతాన్ని స్వీకరించాడు. బలమైన శరీరంతో ఉండటంతో చాలా మంది అతనిని పరశురాముడి అవతారంగా పిలుస్తారట. ఆత్మ ప్రేమగిరి మహారాజ్ ఒకప్పుడు రెజ్లర్. తన బోధనా వృత్తిని విడిచి పెట్టి మరీ నేపాల్‌లో హిందూ మతాన్ని ప్రోత్సాహం కోసం కృషి చేస్తున్నారు.ఒకప్పుడు పైలట్ బాబా శిష్యుడిగా ఉన్న ప్రేమ్‌గిరి మహారాజ్ప్రస్తుతం జునా అఖారా సభ్యుడు. ఆత్మ ప్రేమ్ గిరి గంటల తరబడి వ్యాయామం చేయడానికి ఇష్టపడతాడట.కాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ప్రయాగ్‌రాజ్ పుణ్యక్షేత్రంలో మహాకుంభమేళాఅంగరంగ వైభవంగా జరుగుతోంది. పవిత్ర గంగా, యమున, సరస్వతి సంగమంలో స్నానాలు, "హర హర మహాదేవ" అనే భక్త కోటి నినాదాలతో మహాకుంభమేళా మార్మోగుతోంది.ఇదీ చదవండి: అత్యధిక జీతాన్ని వద్దనుకొని.. ఇపుడు ఏడాదికి రూ. 30 లక్షలు -
నిషాలో తూగడం...ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్
ప్రపంచం నలుమూలలా ఉన్న మానవ నాగరిక సమాజమంతటికి ఒక విషయం సర్వ సాధారణం : మత్తుపదార్ధం. కొన్ని పదార్ధాలు పవిత్రమైనవాటివిగా పరిగణింపబడతాయి, కానీ ఎక్కువ సార్లు, మనం కేవలం వేడుకలకో లేదా నిషా కోసమో తాగుతాం.మత్తులో స్పృహ తప్పడం మానవుల హక్కేమి కాదు. చాలా జంతువులు మత్తులో తూగడానికి ఎంతో శ్రమకోడుస్తాయి. తమిళనాడులోని బానేట్ మాకాక్‌లు అడవిలో దాచే అక్రమ సారాయి పీపాలను కొల్లగొట్టేవయితే, కరీబియన్ వెర్వేట్ కోతులు క్రమం తప్పక తప్పతాగి తూగుతుంటాయి. ఆ దీవిలో ఏడాది పొడుగునా సెలవల సందడి ఉండడంతో అక్కడ మత్తు పానీయాలకు ఏమి కొదవలేదు.పనికిమాలినట్టుగా అనిపించినా, వెర్వేట్ కోతుల తాగుడు అలవాట్లపై చేసిన ఒక శాస్త్రీయ అధ్యయనం, అవి అచ్చం మనుషుల్లా ప్రవర్తిస్తాయని చూపడం ఆశ్చర్యకరం. వాటిలో కొన్ని అతిగా తాగేవి ఉంటాయి - అవి త్వర త్వరగా, ఎక్కువ ఎక్కువ, తరచూ తాగుతుంటాయి. కొన్ని స్థిరంగా ఉండే తాగుబోతులు ఉంటాయి - అవి సరాసరి మద్యాన్ని సోడాగానీ, నీళ్లుగానీ కలపకుండా, క్రమం తప్పకుండా కొట్టేస్తాయి. కానీ చాలామటుకు కోతులు సామాజిక జీవనంలో భాగంగా తాగుతుంటాయి. అటువంటి కోతులు కాక్టైల్స్ ఇష్టపడతాయి. మరికొన్ని మద్యాన్ని అసలు తాకవు. అక్కడితో వాటికీ మనకీ పోలికలు ఆగవు. కొన్ని కోతులు తాగినప్పుడు నిషాలో బాగా మునిగిపోయి దూకుడుగా తయారవుతాయి, కొన్ని కఠినంగా దుర్భాషలాడతాయి, మరికొన్ని దిగాలుగా, ముభావంగా తయారవుతాయి. కానీ చాలామటుకు సంతోషంగా నిషాలో మునిగిపోతాయి…. బహుశా గులాబీ రంగు ఏనుగులను చూసిన భ్రమలో ఊగుతాయి.మామూలు నలుపురంగు ఏనుగులు కూడా కాస్త మద్యం ఎక్కువైత ఒళ్లు మర్చిపోయేంతగా విజ్రుoభిస్తాయి. జార్ఖండ్‌లో ఆశియా ఏనుగులు పాకల లోపల కాగుతున్న మద్యాన్నిగైకొనడానికి పాకలని నాశనం చేస్తాయని విషయం తెలిసినది. కొన్ని ఏళ్ల క్రితం, ఒక మత్తెక్కిన ఏనుగులగుంపు ఊరుమీద విరుచుకుపడి, విద్యత్ స్థంభాలను పాడగొట్టి తిరిగితూ, ఆ ప్రక్రియలో అవే విద్యుత్ షాకు తగిలి కాలిపోయాయి.పశ్చిమ దేశాలలో పిల్లులు పుదీనాలా ఉండే క్యాట్నిప్ అనే మొక్క మత్తులో మునిగిపోతాయి. పిల్లులు ఆ పుదీనా వంటి మొక్క కొమ్మల మీద పడి మూలుగుతూ, చోంగకారుస్తూ, మళ్ళీ మళ్ళీ దొర్లుతాయి. నేను కొంచం ఆ మొక్కను తెచ్చి ఇవ్వగానే, ముందెన్నడూ ఆ మొక్కని చూడని మా నాన్నగారి పిల్లి కూడా మతిపోయినట్టు ప్రవర్తించింది. కానీ కొద్ది నిముషాల తరవాత అది బాగా తేరుకుని మళ్ళీ హుందాగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఏళ్ల తర్వాత అమెరికా జంతు ప్రదర్శనశాలను సందర్శించే సమయంలో, మేము ఒక కౌగర్ క్యాట్నిప్తో నింపివున్న మేజోడు పట్టుకుని వెర్రివేషాలు వేయడం చూశాము. అన్ని జాతుల పిల్లులూ ఈ క్యాట్నిప్కు ఆకార్షితమవుతాయని స్పష్టంగా తెలుస్తోంది.రాకీ కొండలలో పెద్ద కొమ్ముల గొర్రెలు మత్తు కోసం, ఒక రకమైన బూజు గోకి తినడానికి, ఎంతో ప్రమాదకరమైన కొండ చరియలుఎక్కుతాయని తెలిసినది. మరి ఈమెన్లో మేకలైతే వారి కాపారులలాగే ఖట్ ఆకుల మత్తుకు బానిసలు.ఎంతో అందంగా మిఠాయిలా కనిపించి, ఎర్ర టోపీలతో, పైన కాస్త పంచదార చల్లినట్టు ఉండీ, యాక్షినిల కథలలో కనిపించే బొమ్మల్లో అమ్మాయాకంగా కనిపించే పుట్టగొగుల పేరు ఫ్లై ఆగారికస్ పుట్టగొడుగులు. నన్ను తినకండి అని హెచ్చరించే రంగులో ఉన్నాకూడా రెయిన్ డీర్లు వాటిని తిని మత్తులో గెద్దలంత ఎత్తు ఎగురుతాయి. ఎన్నో మత్తు పదార్ధాలను రెయిన్ డీర్ మూత్ర పిండాలు వడగొట్టగలవు కనుక, వాటి మూత్రం పుట్టగొడుగులు తినటం కాంటే స్పష్టంగా ఎంతో శక్తివంతమైన మత్తు పదార్థం. మరి మత్తు కోసం ప్రాకులాడే యూరోప్ మారియు ఉత్తర ఆసియాలో గొర్రెకాపరులు చేసేది అదే!ఎన్నో శాంతా క్లాస్ పుట్టుక కథలలో ఒకటైన కథ మనని సైబీరియా వైపుకు దారితీస్తుంది. ఒక సీతాకాలం మధ్యలో వచ్చే పండుగలో, ఒక నాటు వైద్యుడు, పోగాకమ్ముకున్న ఒక ముఖం ద్వారoగుండా ఫ్లై ఆగారిక్ నిండిన సంచీని మోస్తూ ఒక యూర్ట్ ( జూలుతో చేయబడ్డ గుండ్రటి డేరా) లోపలకి ప్రవేశిస్తాడు. ప్రజలు ఈ గొడుగుల నిషాలో పడ్డ వేళ, వారి ముఖము - ముఖ్యంగా వారి బుగ్గలు, ముక్కు, ఎర్రగా మారతాయి. శాంతా, అతని ఎర్ర ముక్కు రెయిన్ డీర్ రుడోల్ఫ్, ఆకాశంలో దీనిపై ఎగురుతున్నారన్న అంచనా వేసినందుకు ఏమి బహుమతులు లేవు!శతాబ్దాలా నుంచీ సమాజం ఈ పదార్ధాలను భయంకరమైన చెడుతో కూడిన వాటిగా పరిగణించి బహిష్కరించడానికి ప్రయత్నించింది. అయినా వాటిలో మునిగి తెలడం మన ఆచ్చారాలలో ఎంత బలంగా నాటుకుందో, అది అంతే బలంగా మన జన్యువులో కూడా నాటుకుని ఉండి ఉంటుంది. పిల్లలు కూడా ఆ అనుభూతి పొందడానికి కళ్ళుతిరిగి, కాలపై నిలబడడానికి తడబడేదాకా పదే పదే గుండ్రంగా తిరిగితారు. దెర్విషలు (సన్యాసులు) కూడా మనకుకి అతీతమైన ఆధ్యాత్మిక అనుభూతి పొందడానికి ఇటువంటి పద్దతే వాడతారు. పార్స్వ ఆలోచన అనే భావాన్ని పెంపొందించిన ఎడ్వర్డ్ డి బోనో ప్రస్తావన ఇక్కడే వస్తుంది. అతను మత్తుపదార్థాలు మనని పోతపోసిన ఆలోచనా విధానాలనుంచి బయటకులాగి, ఎంతో సృజనత్మాకంగా ఆలోచింపచేయగలదని అతను సూచించాడు. అదే గనక నిజమైతే, మనసుని మార్చేటువంటి ఈ మత్తు అనుభూతులతో, ఖచ్చితంగా ఈ పాటికి ప్రపంచంలో ఎన్నో కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు మారియు ప్రయత్నలు చూసుండేవాళ్ళం. రచన : జానకి లెనిన్ ఫోటోలు: సిద్దార్థ్ రావు -
నాగ సాధువుగా తొలి విదేశీయుడు..!
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా(Maha Kumbh 2025) జరుగుతోంది. దేశం నుంచే నుంచే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు కుంభమేళాకు తరలివస్తున్నారు. ఈ కుంభమేళలో ఎందరో విచిత్రమైన బాబాలు, వారి నేపథ్యం విస్తుగొలిపే విధంగా ఉండటం చూశాం. యావత్తు భారతావనిలో ఆద్యాత్మికత శోభ ఎంతగా తనలోకి మేధావులు, మహా మహులను ఆకళింపు చేసుకుని కాంతిలీనుతోందనేది ఈ మహోత్సవం ఎలుగెత్తి చాటుతోంది. తాజాగా అలాంటి మరో ఆశ్చర్యకర ఘటన వెలుగులోకి వచ్చింది. తొలిసారిగా ఓ విదేశీయుడు నాగసాధువుగా మారి ఈ కుంభమేళలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అతడు ఏ దేశస్తుడంటే..భారతదేశపు ప్రాచీన జునా అఖారాకు(Juna Akhara) చెందిన నాగసాధుగా దీక్ష పొందిన తొలి విదేశీయుడు. ఆ వ్యక్తి పేరు బాబా రాంపురి(Baba Rampuri,). అమెరికాకు చెందిన వ్యక్తి. చికాగోలోని పిల్లల వైద్యుడు డాక్టర్ స్టీఫెన్ ఎల్. గాన్స్కు జన్మించిన విలియం ఎ. గాన్స్ ఈ బాబా రాంపురి. అతడు భారతీయ తత్వశాస్త్రం పట్ల అమితంగా ఆకర్షితుడయ్యాడు. భారతీయ తత్వశాస్త్రాన్ని అర్థం చేసుకోవడంలో ప్రసిద్ధిగాంచిన అలాన్ వాట్స్ వంటి మహోన్నత వ్యక్తుల నుంచి ప్రేరణ పొంది 1969లో భారతదేశానికి వచ్చాడు.ఇక్కడ బాబా రాంపరి యోగా హరిపురి మహారాజ్ శిష్యుడయ్యాడు. అలా ఆయన భారత్‌లోని నిగూఢమైన నాగ సాధువులకు చెందిన జునా అఖారాలో నాగబాబాగా దీక్ష తీసుకున్నాడు. ఆ విధంగా ఆయన ఆది శంకరుల కాలంలోని యోగుల గురువు అయిన భవాన్ దత్తాత్రేయుడికి సంబంధించిన గౌరవనీయ వంశంలో దీక్ష పొందిన తొలి విదేశీయడుగా నిలిచాడు బాబా రాంపురి.అంతేగాదు ఆయన రాసిన "ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ సాధు: యాన్ ఆంగ్రేజ్ అమాంగ్ నాగ బాబాస్" పుస్తకంలో 1971లో అలహాబాద్ మహా కుంభమేళా సమయంలో తాను నాగసాధువుగా మారిన క్రమం గురించి చెప్పుకొచ్చారు. తన ఆత్మకథలో భారతదేశాన్ని ఉనికిలోని తీసుకరావాలని కలలు కంటున్నానని, ఈ ప్రదేశం మనసుకు శాంతినిచ్చే యోగా వంటి ఆధ్యాత్మికతకు నిలయం అని రాశారు. ఈ భూమి మీద వినిపించే శబ్దాలు, కనిపించే ముఖాలు అన్ని తనకు పరిచయమున్నట్లుగా అనిపిస్తుందని, ఈ దేశంతో ఏదో తెలియని రక్తసంబంధం ఉంది అంటూ ఆ పుస్తకంలో రాసుకొచ్చారు. ఇక బాబా రాంపురికి 2010 హరిద్వార్‌లో జరిగిన కుంభమేళాలో, బాబాకు జూనా అఖారా కౌన్సిల్లో శాశ్వత స్థానంతో సత్కారం లభించింది. అలాగే ఆయనకు 'అంతరాష్ట్రీయ మండల్ కా శ్రీ మహంత్' అనే బిరుదుని కూడా పొందారు. (చదవండి: 'ఇంజనీర్ బాబా': ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఫోటోగ్రఫీ వదిలి మరీ..) -
తొలితరం రాజకీయ దిగ్గజం : ఆసక్తికర సంగతులు
భారత స్వాతంత్య్రోద్యమ తొలితరం మేరునగధీరుల్లో మహదేవ గోవింద రనడే ఒకరు. 1943లో ఆయన శత జయంతి కార్యక్రమంలో డా‘‘ బీఆర్అంబేడ్కర్ మాట్లాడుతూ... ‘రనడే కేవలం ఆజానుబాహుడు మాత్రమే కాదు; విశాల భావాలు కలిగిన వారూ, ప్రజల పట్ల సమదృష్టిని కలిగిన వారు కూడా’ అని ప్రశంసించారు. ఓరిమి కలిగిన ఆశావాది.తన జీవిత కాలంలో‘వక్తృత్వోత్తేజక సభ’, ‘పూర్ణ సార్వజనిక సభ’, ‘మహారాష్ట్ర గ్రంథోత్తేజక సభ’, ‘ప్రార్థనా సమాజం’ లాంటి సంస్థలను స్థాపించారు. తన సాంఘిక, మత సంస్కరణల ఆలోచనలకు అనుగుణంగా ‘ఇందు ప్రకాష్’ అనే మరాఠీ–ఆంగ్ల దినపత్రికను నిర్వహించారు.మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా నిఫాడ్‌లో 1842 జనవరి 18న జన్మించారు. కొల్హాపూర్‌లోని ఒక మరాఠీ పాఠశాలలో చదివారు. తర్వాత ఓ ఆంగ్ల మాధ్యమ పాఠశాలకు మారారు. 14 ఏళ్ల వయసులో బాంబేలోని ఎల్ఫిన్స్టన్ కళాశాలలో చేరారు. బాంబే విశ్వవిద్యాలయం మొదటి విద్యార్థుల్లో ఆయనా ఒకరు. 1867లో ఎల్ఎల్బీ పట్టా పుచ్చు కున్నారు. 1871లో పూనాలో సబార్డినేట్ జడ్జిగా నియమితులయ్యారు. ఆయన రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడం గమనించిన ఆంగ్లేయులు 1895 దాకా ఆయనను బాంబే హైకోర్టుకు పంపే పదోన్నతికి అడ్డు పడుతూ వచ్చారు. ఆయన కొన్ని పాశ్చాత్య భావాలకు ప్రభావితులయ్యారు.అందరికీ విద్య, సమానత్వం, మానవత్వం వంటివి ఇందులో ప్రధాన అంశాలు. మత పరంగా హిందూమతంలో ఆయన చేయాలనుకున్న సంస్కరణలు ప్రార్థనా సమాజం స్థాపించడానికి ప్రేరణ. గోపాలకృష్ణ గోఖలే, బాల గంగాధర తిలక్ వంటి స్వాతంత్య్ర సమర యోధులకు రాజకీయ గురువుగా పేరు పొందారు. తుదకు 1901 జనవరి 16న తుదిశ్వాస విడిచారు. నేటి స్వేచ్ఛా భారతానికి దారులు వేసిన ఆయన చిరస్మరణీయులు.– యం. రాం ప్రదీప్; జేవీవీ సభ్యులు, తిరువూరు(రేపు మహాదేవ గోవింద రనడే జయంతి) -
మహాకుంభమేళలో అందమైన సాధ్వి..!
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని ప్రయాగ్‌రాజ్(Prayagraj)లో మహా కుంభమేళ(Maha Kumbh) అత్యంత అట్టహాసంగా జరుగుతోంది. ఈ వేడుకలో పాల్గొని గంగా స్నానాలు ఆచరించేందుకు తండోపతండాలుగా భక్తులు తరలివస్తున్నారు. ఎందరో ప్రముఖులు, ఉన్నత చదువులు చదివి ఆధ్యాత్మికతవైపు అడుగులు వేసి సన్యాసులగా మారిన మేధావులను కళ్లకు కట్టినట్లు చూపించింది. అంతేగాదు ఈ మహత్తర వేడుకలో పాల్గొని తరించేందుకు దేశవిదేశాల నుంచి భక్తుల లక్షలాదిమందిగా కదిలి రావడం విశేషం. తాజాగా ఈ వేడుకలో ఒక అందమైన సాధ్వి(beautiful sadhvi) తళుక్కుమంది. ఆమె అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. హీరోయిన్ రేంజ్లో అందంగా ఉన్న ఆ యువతి సాధ్వీగా జీవిస్తోందా..? అని అంతా విస్తుపోయారు. ఇది నెట్టింట హాట్‌టాపిక్‌గా మారి చర్చనీయాంశమైంది. అయితే ఆమె అంతా అనుకున్నట్లు సాధ్వి కాదని తేలింది. కేవలం అది గెటప్ అని ఆమె ఎలాంటి దీక్ష తీసుకోలేదని ఆ యువతే స్వయంగా చెప్పింది. ఆ అందమైన సాధ్వి పేరు హర్ష రిచారియా. ఆమె ఓ సోషల్ మీడియా ఇన్ఫ్టుయెన్సర్. గతంలో కూడా తాను ఇలా రీల్స్ద్వారా సనాతన ధర్మంలోని గొప్ప గొప్ప విశేషాలను ప్రజలకు తెలియజేశానని చెప్పుకొచ్చింది. అలానే ఈసారి ఈ కుంభమేళలో వారిలా సాధ్విగా గెటప్ వేసుకుని వారిని ఇంటర్వ్యూ చేసి..ఆధ్యాత్మికత గొప్పతనం గురించి తెలియజే యత్నం చేస్తున్నట్లు తెలిపింది. అందులో భాగంగానే ఈ గెటప్‌లో ఉన్నట్లు వివరణ ఇచ్చింది. అయితే ఆమె ఇలా సాధ్విలా కనిపించడంపై సోషల్‌మీడియా ట్రోల్‌కి గురయ్యింది. ఆధ్మాత్మికత అంటే నవ్వులాటగా ఉందా..?. ఆ వేషధారణలోనే తెలుసుకునే యత్నం చేయాలా అంటూ నెటిజన్లు తింటిపోశారు. (చదవండి: ఆ రెండు అస్సలు వదిలిపెట్టని రమ్యకృష్ణ.. అందుకే 50 ఏళ్లు దాటినా అంత ఫిట్‌గా..!) -
32 ఏళ్లు ద్వీపంలో ఒంటరిగా బతికాడు! సడెన్‌గా జనాల్లోకి తీసుకురాగానే..
ఒంటరితనంతో బాధపడుతుంటారు చాలామంది. దీన్నుంచి బయటపడేలే స్నేహితులు లేదా బంధువుల వద్దకు వెళ్లిపోతారు. కానీ ఓ వ్యక్తి ఏరికోరి మరి ఏకాంతంగా ఉండాలని మనిషే కానరాని ఓ దీవిలో ఉంటాడు. అక్కడే అలా ఒకటో, రెండో ఏళ్లు కాదు ఏకంగా ముప్పై ఏళ్లకు పైగా గడిపేశాడు. అయితే అకస్మాత్తుగా ఉన్నపళంగా జనాల మధ్యలోకి వెళ్లక తప్పలేదు. పాపం సడెన్‌గా అలా జనాల మధ్యలో జీవించాల్సి రావడంతో మనుగడ సాగించలేక అల్లాడిపోయాడు. చూస్తుండగానే ఆరోగ్యం క్షీణించి చనిపోయాడు. ఎవరా వింత వ్యక్తి అంటే..రాబిన్సన్ క్రూసోగా పిలిచే ఇటాలి(Italy)కి చెందిన మౌరో మొరాండి(Mauro Morandi,) ముప్పైళ్లకు పైగా ఒంటిరిగా బుడెల్లి ద్వీపంలో ఒంటిరిగా ఉండేవాడు. ఈ ద్వీపం ఇటలీకి రెండొవ ప్రపంచ యుద్ధ సమయం(World War II)లో ఆశ్రయంగా ఉపయోగపడింది. ఆ తర్వాత ఏ వ్యక్తి ఇక్కడ జీవనం సాగించ లేదు. అలా ఈ ద్వీపం జనసంచారం లేని నిర్మానుష్య ప్రదేశంగా మారింది. అయితే రాబిన్సన్ క్రూసోగా పిలిచే మౌరో మొరాండి 1989లో పాలినేషియాకు చెందిన ఒక మిషన్ కోసం వచ్చి..ఈద్వీపంలోని ఉండిపోవాలని నిర్ణయించకుంటాడు. అలా ఈ ద్వీపంలోనే ఒంటరిగా జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఆ ద్వీపం సమీపంలోని బీచ్‌లను శుభ్రంగా ఉంచేవాడు. అక్కడకు వచ్చే పర్యాటకులు పర్యావరణ వ్యవస్థ గురించి అవగాన కల్పించేవాడు. అతను అక్కడ ఒక ఇంటిని నిర్మించి తాత్కాలికి సౌర విద్యుత్‌ని ఏర్పాటు చేసుకున్నాడు. చలికాలంలో ఒక సాధారణ పొయ్యితో ఇల్లు వెచ్చగా ఉండేలా చేసుకునేవాడు. అతనిని రాబిన్సన్ క్రూసోగా ఎందుకు పిలిచేవారంటే.. రాబిన్సన్ క్రూట్జ్నేర్ నవలలో ఓ పాత్ర పేరు. ఆ కథలో రాబిన్సన్ అనే వ్యక్తి ఓడ ధ్వసం కావడంతో వెనిజులా నుంచి ట్రినిడాడ్ తీరంలోని నిర్మానుష్య ఉష్ణమండలం దీవికి వస్తాడు. అక్కడే 28 ఏళ్లు గడుపుతాడు.అచ్చం అలాగే ఈ ఇటాలియన్ వ్యక్తి మౌరో మొరాండి ఒంటిరిగా ఈ దీవిలో గడపడంతో అంతా ఆ పాత్ర పేరుతో పిలచేవారు. అయితే 2021లో, లా మాడలీనా జాతీయ ఉద్యానవన అధికారులు ఆ దీవిని పర్యావరణ కేంద్రంగా మార్చాలని ప్లాన్ చేశారు. దీంతో మౌరో మొరాండిని ఆ దీవి నుంచి బలవంతంగా ఖాళీ చేయించారు. దీంతో అతను ఇటలీలో సావర్డినియాలోని ఓ నగరంలో అపార్ట్మెంట్ అద్దెకు తీసుకుని జీవించడం ప్రారంభించాడు. అయితే అప్పటి వరకు ఏకాంతం అలవాటై నగరంలో ఈ రణగొణ ధ్వనుల మధ్య ఉండలేక అల్లాడిపోయాడు. అదీగాక వయసు రీత్యా వార్ధక్య రుగ్మతలు కూడా ఇబ్బంది పెట్టడంతో ఎంతకాలం జీవిచలేకపోయాడు. ఆ దీవి నుంచి వచ్చిన మూడేళ్లకే 85 ఏళ్ల వయసులో మరణించారు మౌరో మొరాండి.(చదవండి: 'ఇంజనీర్ బాబా': ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఫోటోగ్రఫీ వదిలి మరీ..) -
జపాన్‌లో ఇంత క్లీన్‌గా ఉంటుందా..!
ఏ దేశమైనా.. రోడ్లను ఎంత శుభ్రం చేసినా వాహనాలు, మనుషుల కారణంగా దుమ్ము లేకుండా ఉండదు. చెత్త లేకుండా చూడొచ్చు గానీ దుమ్ము లేకుండా అంటే కొంచెం కష్టమే. కానీ నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోని చూస్తే మాత్రం ఆ దేశంలో అంత క్లీన్‌గా ఉంటుందా అని నోరెళ్ల బెడతారు.భారతదేశానికి చెందిన ఒక ఇన్ఫ్లుయెన్సర్(Indian Influencer) జపాన్(Japan) పరిశుభ్రత(Cleanest)ను టెస్ట్ చేసింది. ఎందుకంటే జపాన్ కూడా ప్రపంచంలోని అత్యంత పరిశుభ్రమైన దేశాల్లో ఒకటిగా పేరుగాంచింది. ఆ నేపథ్యంలోనే ఈ ఇన్ఫ్లుయెన్సర్ అది నిజమా..? కాదా..? అని స్వయంగా టెస్ట్ చేసింది. అందుకోసం ఒక షాపులోకి వెళ్లి తెల్లటి సాక్సులు కొత్తవి కొనుగోలు చేసింది. వాటిని వేసుకుని బూట్లు లేకుండా ఆ పరిసర ప్రాంతాల్లో నడిచింది. బూట్లను చేతితో పట్టుకుని సమీపంలో ఉన్న జీబ్రా క్రాసింగ్‌లు, ఫుట్‌పాత్‌లు వద్ద కలియతిరిగింది. ఆ తర్వాత కూల్‌గా సాక్స్‌ని విప్పి..చూస్తే ఒక్క మరక లేకుండా క్లీన్‌గా కనిపించాయి. అయితే ఈ వీడియోని చూసిన నెటిజన్లు మాత్రం ఇదస్సలు నమ్మశక్యంగా లేదు. అసాధ్యం అని కామెంట్ చేస్తున్నారు. అందులోకి తెల్లటి సాక్స్‌లు ఎంతలా పరిసరాలను క్లీన్‌గా ఉంచినా.. వినియోగిస్తే మాత్రం మాసినట్లు కనిపిస్తాయి. అలాంటిది ఈ సాక్సులు మాత్రం కొన్నప్పుడూ ఎలా ఉందో అలానే ఉంది. కాబట్టి ఇది నమ్మగిన వీడియో కాదంటూ తిట్టిపోస్తున్నారు. ఇవన్నీ ఎలా ఉన్నా ఆ వీడియోలో చైనా రోడ్లు క్లీన్‌గానే కనిపించాయి. డెస్ట్ కనిపించనంత క్లీన్‌గా అనేది కొంచెం నమ్మశక్యం కానిదే. కానీ వాళ్లు చెత్త అనేది కనిపించకుండా పరిసరాలను అంతలా శుభ్రంగా ఉండేలా మెయింటైన్ చేస్తున్నందుకుగానూ తప్పకుండా ప్రశంసించాల్సిందే కదూ..!. View this post on Instagram A post shared by Simran Jain (@simranbalarjain) (చదవండి: మహాకుంభ మేళలో యోగమాతగా తొలి విదేశీ మహిళ..!) -
తల్లే కూతురు పెళ్లిని ఆపేసింది..! ట్విస్ట్ ఏంటంటే..
కూతురు పెళ్లి చేసుకుని ఆనందంగా భర్త, అత్తమామలతో ఉండాలని కోరుకుంటారు ఏ తల్లిదండ్రులైనా. అందుకోసం ఆచితూచి మరీ వెతికి వెతికి మంచి సంబంధం తెచ్చుకుంటారు. అన్నేళ్లుగా అపురూపంగా పెంచుకున్న కూతుర్ని ఇంకో ఇంటికి పంపించేటప్పుడూ.. అక్కడ కూడా అంతే ఆనందంగా సంతోషంగా జీవించాలని కోరుకుంటాం. అలా ఆలోచించే ఓ తల్లి తన కూతురు పెళ్లిని పెళ్లి పీటల మీదే అర్థాంతరంగా ఆపేసింది. ఆమె తీసుకున్న ఈ నిర్ణయాన్ని చూసి అక్కడ వేదికపై ఉన్నవారు, వరుడు తరుపు వారు కంగుతిన్నారు. అయితే ఆ తల్లి ఇలాంటి అనూహ్య నిర్ణయం ఎందుకు తీసుకుందో తెలిస్తే..ఆమెను అభినందించకుండా ఉండలేరు.ఎందుకంటే..ఈ అనూహ్య సంఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. ఇంకొద్దిసేపులో అంగరంగ వైభవంగా పెళ్లి జరగనుంది. సరిగ్గా ఆ సమయంలో వధువు తల్లి ఈ పెళ్లిని రద్దు చేసుకుంటున్నాం..ప్లీజ్ వెళ్లిపోండని వరుడిని, అతని కుటుంబ సభ్యులను వేడుకుంది. ఇదేంటి కరెక్ట్‌గా ఈ టైంలో ఇలా అంటుందని అంతా విస్తుపోయారు. కానీ అక్కడున్న కొంతమంది ఆమె సరైన నిర్ణయం తీసుకుందనే అనుకున్నారు. ఎందుకంటే సరిగ్గా పెళ్లితంతు సమయంలో కూడా వరుడు ఫుల్‌గా తాగి స్నేహితులతో కలిసి గొడవ చేశాడు. అక్కడున్న వారిని ఇబ్బందికి గురి చేశారు వరుడు, అతడి స్నేహితులు. దీంతో వధువు తల్లి ఇలాంటి షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడే అతడి ప్రవర్తన ఇలా ఉంది. భవిష్యత్తులో ఇంకెలా ఉంటుందనే భయంతో ఆ తల్లి ఇలాంటి నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు నిజంగా "ఇది చాలా ధైరవంతమైన నిర్ణయం. ఫైనాన్షియల్ పరంగా ఇంత ఖర్చు అయ్యిందే అనే ఆలోచనకు తావివ్వకుండా కూతురు భవిష్యత్తే ముఖ్యం అని ఇంత పెద్ద నిర్ణయం తీసుకుందా ఆ తల్లి, అందుకు ఎంతో ధైర్యం ఉండాలి కూడా అంటూ నెటిజన్లు ఆ తల్లి పై ప్రశంసలు జల్లు కురిపిస్తూ పోస్టులు పెట్టారు". View this post on Instagram A post shared by News For India (@news.for.india) (చదవండి: 'ఏది వడ్డించినా సంతోషంగా తింటా': మోదీ) -
దయ్యాల కోసం అద్దె చెల్లించడమా..!
అక్కడ దయ్యాలు, భూతాలు ఉన్నాయంటే ఆ వైపు కూడా వెళ్లరు చాలామంది. అలాంటిది ఓ వ్యక్తి కేవలం దయ్యాల కోసమే అద్దె చెల్లించాడు. ఈజిప్టులోని కైరో వెలుపల అతి పురాతనమైన మూడు పిరమిడ్లు ఉన్నాయి. వీటిని ఈజిప్ట్ ప్రభుత్వం అద్దెకిస్తోంది. వాటిల్లో ఒకటి, అతిపెద్దది, గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా. అక్కడ దాదాపు మూడువేలకు పైగా దయ్యాలు, భూతాలు ఉన్నాయని చాలామంది అంటుంటారు. ఇప్పుడు ఆ దయ్యాలను చూడటానికే ప్రముఖ యూట్యూబర్ జేమ్స్ డొనాల్డ్సన్ (మిస్టర్ బీస్ట్), వాటిని వంద గంటలకు అద్దెకు తీసుకున్నాడు. ‘బియాండ్ ది రికార్డ్స్’ పేరుతో భయంకర ప్రదేశాల్లోకి వెళ్లి, అక్కడ జరిగే విచిత్రమైన సంఘటనల వీడియోలు పోస్ట్ చేస్తుంటాడు. ఇప్పుడు తన భారీ అన్వేషణ కోసం ఈజిప్ట్‌లోని ఈ పిరమిడ్లను ఎంచుకున్నాడు.మరో వింత..ఈ విమానంలో ప్రయాణించాల్సిన పనిలేదు.. ‘ఈ వంద గంటల్లో స్నేహితులతో కలసి అక్కడ ఉండే అన్ని గదులు, సమాధులను చూసి, అక్కడే నిద్రించాలన్నది నా ప్లాన్. ఇందుకోసం, అవసరమైన అన్ని వస్తువులతో పాటు, పారానార్మల్ యాక్టివిటీ డివైజ్, ఇతర పరికరాలను తీసుకెళ్తున్నా’ అని చెప్పాడు. కొంతమంది ఇది సాధ్యం కాదని కొట్టి పారేస్తుంటే, తను మాత్రం త్వరలోనే వీడియోతో సమాధానం చెబుతానంటున్నాడు. భూమి నుంచి దూరంగా వెళ్లకుండా విమానంలో స్పెండ్ చేయడం గురించి విన్నారా..?. ఆ ఆలోచనే వెరైటీగా ఉంది కదూ..!. అలాంటి కోరిక ఉంటే వెంటనే ఉత్తర అమెరికాలో అలాస్కాకి వచ్చేయండి. శీతాకాలపు మంచు అందాల తోపాటు విమానంలో గడిపే అనుభూతిని సొంతం చేసుకోవచ్చు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మరి అదేంటో తెలుసుకుందామా..!ఆ వీడియోలో 1950ల నాటి విమానం(Airplane) వింటేజ్ డీసీ-6 విమానం విలక్షణమైన విమానహౌస్(Airplane House)గా రూపాంతరం చెందింది. ఇది ఒకప్పుడూ మారుమూల అలాస్కా(Alaska) గ్రామాలకు ఇంధనం, సామాగ్రిని సరఫరా చేసేది. ఇందులో రెండు బెడ్ రూమ్‌లు, ఒక బాత్రూమ్తో కూడిన వెకేషనల్ రెంటల్ హౌస్‌గా మార్చారు. చుట్టూ మంచుతో కప్పబడి ఉండే ప్రకృతి దృశ్యం మధ్యలో ప్రత్యేకమైన విమాన ఇల్లులో అందమైన అనుభూతి.ఇలా సర్వీస్ అయిపోయిన విమానాలను అందమైన టూరిస్ట్ రెంటల్ హౌస్‌లుగా తీర్చిదిద్ది పర్యాటకాన్ని ప్రోత్సహించొచ్చు అనే ఐడియా బాగుంది కదూ..!. చూడటానికి ఇది ప్రయాణించకుండానే విమానంలో గడిపే ఓ గొప్ప అనుభూతిని పర్యాటకులకు అందిస్తోంది. చెప్పాలంటే భూమి నుంచి దూరంగా వెళ్లకుండానే విమానంలో గడిపే ఫీలింగ్ ఇది. (చదవండి: మంచు దుప్పటిలో విలక్షణమైన ఇల్లు..ఒక్క రాత్రికి ఎంతో తెలుసా...!) -
లాస్ ఏంజెల్స్ కార్చిచ్చు : చిక్కుల్లో మాల్యా కొడుకు-కోడలు, అప్డేట్ ఇదే!
అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో చెలరేగిన మంటలు బీభత్సాన్ని సృష్టించాయి. ఈ దావానలంలో చిక్కుకుని ఇప్పటి వరకూ ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. 30వేల మందికిపైగా నిరాశ్రయులు కావడం ఆందోళన రేపుతోంది.పాలిసాడ్స్ అగ్నిప్రమాదం మాలిబు, శాంటా మోనికా మధ్య సముద్రతీర ప్రాంతాన్నిదహించివేస్తోంది. సీఎన్ఎన్ నివేదిక ప్రకారం, మంటలు 17 వేల ఎకరాలకు పైగా వ్యాపించాయి. వీటిని అదుపు చేసే ఆశలు కనిపించడంలేదు. ఇప్పటివరకు ఇదే అత్యంత వినాశకరమైన అగ్నిప్రమాదంగా భావిస్తున్నారు. ఒకేరోజు మూడు ప్రాంతాల్లో కార్చిచ్చు చెలరేగడంపై అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు.ఈ నేపథ్యంలో హాలీవుడ్ సెలబ్రిటీలు సహా చాలా మంది సంపన్నుల నివాసాలు మంటల్లో చిక్కుకున్నాయి. వీరిలో చాలామంది తన ప్రాణాలను కాపాడుకునేందుకు ఇళ్లను వీడుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మనీ లాండరింగ్ ఆరోపణలతో విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ మాల్యా,అతని భార్య జాస్మిన్ లాస్ ఏంజిల్స్‌లో ఇరుక్కున్న్టటు వార్తలొచ్చాయి. దీనిపై స్వయంగా సిద్దార్థ స్పందించాడు. ప్రస్తుతానికి తాను, తన భార్య జాస్మిన్, పెట్స్ సురక్షితంగా ఉన్నామని తెలిపాడు. అంతే కాదు, సహాయం కావాల్సిన వారు, దయ చేసి తమను సంప్రదించాల్సిందిగా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కోరాడు. సహాయం అలాగే అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపాడు. అటు జాస్మిన్ కూడా తన వంతుగా, విపత్తులో ప్రభావితమైన వారికి సహాయ సామగ్రి గురించి సమాచారాన్ని కూడా ఇచ్చింది. (బెంచింగ్ డేటింగ్ గురించి తెలుసా, ఇలా అయితే డేంజరే!)విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ , అతని భార్య జాస్మిన్ లండన్‌లో నివసిస్తున్నప్పటికీ, ఈ జంట లాస్ ఏంజిల్స్‌లో వెకేషన్లో ఉన్నారు. ఈ సమయంలో పాలిసాడ్స్ అగ్నిప్రమాదం సంభవించిందిమరోవైపు ఈ ప్రమాదంలో ప్రియాంక చోప్రా ,నోరా ఫతేహి కూడా ప్రభావితమయ్యారు. ప్రియాంక పాలిసాడ్స్ అగ్నిప్రమాదానికి సంబంధించిన భయంకరమైన వీడియోను పోస్ట్ చేసింది.అలాగే నోరా ఫతేహి తన అనుభవాన్ని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పంచుకుంది. "నేను LAలో ఉన్నాను , ఫారెస్ట్ మంటలు భయంకరంగా ఉన్నాయి. అసలు ఇలాంటిది ఇంతకుముందు చూడలేదు. ఐదు నిమిషాల క్రితం తరలింపు ఆర్డర్ వచ్చింది. కాబట్టి నేను త్వరగా నా సామాను అంతా సర్దుకుని ఇక్కడి నుండి ఖాళీ చేస్తున్నాను. నేను విమానాశ్రయం దగ్గరకు వెళ్లి అక్కడ విశ్రాంతి తీసుకుంటా’’ అంటూ వెల్లడించింది.కాగా విజయ్ మాల్యా , అతని మొదటి భార్య సమీరా త్యాబ్జీ మాల్యా కుమారుడే సిద్ధార్థ. గత ఏడాది జూన్‌లో తన చిరకాల ప్రేయసి జాస్మిన్ను పెళ్లాడాడు. విలాసవంతమైన హెర్ట్‌ఫోర్డ్‌షైర్ ఎస్టేట్‌లో చాలా కొద్దిమంది హితులు, సన్నిహితుల మధ్య వీరి పెళ్లి ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. (భరించలేని మోకాళ్ల నొప్పులకు.. సూపర్ ఫుడ్ ఈ లడ్డూ...అంతేనా!) -
‘‘ఇదెక్కడి పెళ్లి గోలరా నాయనా’’ వైరల్ వీడియో : ఎలిమినేట్ చేసేయండంటూ ఫైర్
కెనడాలో అర్థరాత్రి జరిగిన భారతీయ వివాహ వేడుకపై కెనడాకు చెందిన ఒక మహిళ విమర్శలు గుప్పించింది. ఆమె ఫ్రస్ట్రేషన్‌కు సంబంధించి సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. స్టోరీ ఏంటంటే..భారతీయ వివాహాలు, సందడిపై ఒక కెనడియన్ మహిళ పోస్ట్ చేసిన వీడియో క్లిప్ ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్లో జాత్యహంకార చర్చకు దారి తీసింది. సాడీ క్రోవెల్(Sadie Crowell) అనే యువతి తన ఇంటి పక్కన జరుగుతున్న ఒక భారతీయ పెళ్లి( Indian Wedding )కి సంబంధించిన హడావిడి, శబ్దాల గురించి విసుక్కుంటూ ఒక వీడియో పెట్టింది. అర్థరాత్రి ఇదేంగోలరా బాబు, నిద్ర రావడం లేదు ఆవేదన వ్యక్తంచేసింది. రాత్రినుంచీ ఒకటే మ్యూజిక్.. నిద్రే లేదు.. ఉదయం 9 అవుతున్నా.. ఆ సౌండ్స్ గోల ఆగ లేదంటూ విమర్శలు గుప్పించింది. పనిలో పనిగా తన బాల్కనీ నుండి పెళ్లి బరాత్‌కు సంబంధించిన వీడియోతీసి పోస్ట్ చేసింది. దీంతోఇది కాస్తా వైరల్ అయింది.ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. కొందరు ఆమె పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. ఇంకొందరు ఆమె తీరు ఫన్నీగా ఉందంటూ వ్యాఖ్యానించారు. మరికొందరు ఆమెపై ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు. మరో అడుగు ముందుకేసిన మరో యూజర్ వాళ్లని దేశంనుంచి తరిమేయాలంటూ కమెంట్ చేశారు. ముఖ్యంగా భిన్న సంస్కృతుల మధ్య గౌరవం, సామరస్యం ఉండాలని కొంతమంది వ్యాఖ్యానించడం గమనార్హం .సోషల్ మీడియాలోఇలాంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు రావడం బాధాకరమన్నారుకొందరు నెటిజన్లు. అభిప్రాయాలను స్వేచ్ఛగా పంచుకునేందుకు వేదికగా ఉపయోగపడుతున్న సోషల్ మీడియా విద్వేషాలను రెచ్చగొట్టే వేదికగా మారకూడదని హితవు పలకడం విశేషం.మరికొన్ని వ్యాఖ్యలు ఇలా ఉన్నాయ్"ఆ పరిస్థితిలో స్పానిష్ ప్రజలు పెద్ద బకెట్ల నీటిని కిటికీ నుండి విసిరేవారు" "నివాస ప్రాంతంలో ఈ రకమైన బిగ్గరగా చికాకు కలిగించడం అనుమతించబడుతుందా?" సామూహిక వలసలున్నపుసామూహిక బహిష్కరణ ఎందుకు జరగకూడదు?!“మాకా” (మేక్ కెనడా గ్రేట్ ఎగైన్) అనే కొత్త పాలసీని రూపొందించాలి’.“వీళ్లు (Indians) ఇక్కడికి మంచిగా బతకడానికి వచ్చారు కానీ, మన దేశానికి తగ్గట్టు మారాలి కానీ, వాళ్ల గోలను ఇక్కడ రుద్దకూడదు” Everyone will despise the Indians given enough time pic.twitter.com/8V42PLGLRW— Canadian Girl 🇧🇲 (@alwaysaracist) January 7, 2025 -
ప్రయాణించకుండానే విమానంలో నిద్రపోవచ్చు..!
భూమి నుంచి దూరంగా వెళ్లకుండా విమానంలో స్పెండ్ చేయడం గురించి విన్నారా..?. ఆ ఆలోచనే వెరైటీగా ఉంది కదూ..!. అలాంటి కోరిక ఉంటే వెంటనే ఉత్తర అమెరికాలో అలాస్కాకి వచ్చేయండి. శీతాకాలపు మంచు అందాల తోపాటు విమానంలో గడిపే అనుభూతిని సొంతం చేసుకోవచ్చు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మరి అదేంటో తెలుసుకుందామా..!ఆ వీడియోలో 1950ల నాటి విమానం(Airplane) వింటేజ్ డీసీ-6 విమానం విలక్షణమైన విమానహౌస్(Airplane House)గా రూపాంతరం చెందింది. ఇది ఒకప్పుడూ మారుమూల అలాస్కా(Alaska) గ్రామాలకు ఇంధనం, సామాగ్రిని సరఫరా చేసేది. ఇందులో రెండు బెడ్ రూమ్‌లు, ఒక బాత్రూమ్తో కూడిన వెకేషనల్ రెంటల్ హౌస్‌గా మార్చారు. చుట్టూ మంచుతో కప్పబడి ఉండే ప్రకృతి దృశ్యం మధ్యలో ప్రత్యేకమైన విమాన ఇల్లులో అందమైన అనుభూతి.ఇలా సర్వీస్ అయిపోయిన విమానాలను అందమైన టూరిస్ట్ రెంటల్ హౌస్‌లుగా తీర్చిదిద్ది పర్యాటకాన్ని ప్రోత్సహించొచ్చు అనే ఐడియా బాగుంది కదూ..!. చూడటానికి ఇది ప్రయాణించకుండానే విమానంలో గడిపే ఓ గొప్ప అనుభూతిని పర్యాటకులకు అందిస్తోంది. చెప్పాలంటే భూమి నుంచి దూరంగా వెళ్లకుండానే విమానంలో గడిపే ఫీలింగ్ ఇది. అయితే ఈ వీడియోని వీక్షించిన నెటిజన్లు వావ్ చాలా బాగుందని ఒకరూ, లోపల ఎలా ఉంటుందో చూడాలని యాంగ్జైటీగా ఉందని మరొకరూ పోస్టులు పెట్టారు. కాగా, ఈ ప్రత్యేకమైన విమాన ఇంటిలో బస చేయాలంటే ఒక్క రాత్రికి సుమారు రూ. 30 వేలు పైనే ఖర్చువుతుందట. View this post on Instagram A post shared by DEBORAH + TYLER | Alaska Adventures (@raarupadventures) (చదవండి: భారతదేశపు తొలి స్టంట్ విమెన్..ధైర్యానికి కేరాఫ్ అడ్రస్..!) -
పిడుగులాంటి వార్త..ఇలా అయితే కష్టమే..!
ప్రస్తుత జీవన విధానం, కాలుష్యం కారణంగా తొందరగా జుట్టు నెరిసిపోవడం, ఊడిపోవడం వంటి సమస్యలు సర్వ సాధారణమైపోయాయి. ఒక ఏజ్ వచ్చాక బట్టతల కూడా కామనే అనే స్థితికి వచ్చేశాం. ఒకప్పుడూ బట్టతల అంటే బాధపడిపోయేవారు. కానీ ఇప్పుడూ టేకీటీజీ అంటున్నారు. కటింగ్ చేయించుకునే బాధ తప్పుతుంది, ఏ చిరాకు ఉండదు అనే స్థైర్యాన్ని పెంపొందించుకుంటున్నారు. ఇప్పుడు అదికాస్త ఢమాల్ అనేలా ఓ పిడుగులాంటి వార్త వెలుగులోకి వచ్చింది. అదేంటో తెలిస్తే..వామ్మో ఇక జుట్టు ఉన్న మనిషి కనిపించడమే గగనమైపోదుందేమో అనిపిస్తుంది. ఈ వింత పరిస్థితి మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలోని మూడు గ్రామాల నివాసితులకు ఎదురైంది. గత కొన్ని రోజులగా అక్కడ ఉన్న మహిళలు, పురుషులు జుట్టు రాలిపోవడం అనే సమస్యను ఎదుర్కొంటున్నారట. ఒక్క వారం రోజుల్లోనే చాలమందికి బట్టతల వచ్చేసిందట. మొదట్లో కొద్దిగా జుట్టు రాలడం మొదలై.. ఒక్క వారంలోనే ఇలా బట్టతలగా మారిపోతుందట. ఇలా ఏ ఒక్కరికో ఇద్దరికో కాదు..దాదాపు అందరిది ఇదే పరిస్థితినే. ఇది దావానంలా వ్యాపించడంతో మూడు గ్రామాల ప్రజల్లో తీవ్ర భయాందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు రంగంలోకి దిగి ఈ గ్రామాన్ని సందర్శించారు. ఆరోగ్య శాఖ సర్వే ప్రకారం..అక్కడ సుమారు 50 మంది దాక ఈ సమస్యతో బాధపడుతున్నట్టు గుర్తించారు. ఈ సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందన్నారు అధికారులు. ఇక సామూహికంగా అందరికి జుట్టు ఎందుకు రాలుతుందని పరీక్షించేందుకు వాళ్ల చర్మం, వెంట్రుకల నమునాలను సేకరించినట్లు తెలిపారు. ఈ పరిస్థితికి కారణం కలుషిత నీరు, ఏవైనా ఆరోగ్య సమస్యలు అయ్యి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అలాగే దీని గురించి ఎవరూ ఆందోళన చెందొద్దని, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోనే యత్నం చేయమని సూచించారు. తాము ప్రజల నుంచి సేకరించిన చర్మం, వెంట్రుకలను పరీక్షించి ఈ పరిస్థితికి గల కారణాన్ని నిర్థారించి, పరిష్కారిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు అదికారులు.(చదవండి: పెళ్లి పాట్లు..!అంత ఈజీ కాదు మ్యాచ్ సెట్టవ్వడం..) -
పార్కింగ్ స్థలంలో కంపెనీ : కట్ చేస్తే..యూకే ప్రధానికంటే మూడువేల రెట్లు ఎక్కువ జీతం
నెలకు లక్షల్లో సంపాదిస్తేనే ఔరా అనుకుంటాం కదా. కానీ బ్రిటీష్ బిలియనీర్, మహిళా వ్యాపారవేత్త, అత్యధిక వేతనం పొందే మహిళగా నిలిచింది. 2024లో జీతం , డివిడెండ్లలో 150 మిలియన్ పౌండ్లను ( రూ.1,500 కోట్లకు పైగా) వేతనం అందుకుంది. అంటే రోజురు నాలుగు కోట్ల వేతనం అన్నమాట. అదీ 45 శాతం వేతన కోత తరువాత. ఆశ్చర్యంగా ఉంది కదూ. ఎవరీ డెనిస్.. ఆమె కంపెనీ ఏంటి తెలుసుకుందాం ఈ కథనంలో.57 ఏళ్ల డెనిస్ కోట్స్(denise Coates)కన్న కల చాలా పెద్దది. అందుకే ఆమె స్థాపించిన ఒక చిన్న కంపెనీ ఇపుడు ప్రపంచాన్ని ఏలుతోంది. 2000లో ఒక మామూలు కారు పార్కింగ్ స్థలంలో "బెట్365" (Bet365)అనే ఆన్లైన్ బెట్టింగ్ సంస్థను ప్రారంభించింది. బహుశా అపుడు ఆమె ఊహించి ఉండదు..వేల కోట్ల టర్నోవర్‌తో, 8,500 మంది ఉద్యోగులతో దిగ్గజంగా ఎదిగుతుందని. కట్ చేస్తే...ఆమె విజయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. డెనిస్ కోట్స్ బ్రిటన్‌లోని అత్యంత సంపన్న మహిళల్లో ఒకరిగా అవతరించారు. సంస్థలో ఆమె మెజారిటీ వాటా50 శాతానికి పైమాటే.ది గార్డియన్ నివేదిక ప్రకారం "బెట్365" కంపెనీ అంతకుముందు సంవత్సరంలో 3.4 బిలియన్ పౌండ్ల నుండి 3.7 బిలియన్ పౌండ్లకు ఆదాయ వృద్ధిని సాధించింది. ఈక్విటీ మార్కెట్ పరిస్థితుల మెరుగుదల మధ్య ఖర్చులను తగ్గింపు, పెట్టుబడి మదింపుల నుండి లాభాన్ని ఆర్జించింది. గత ఏడేళ్లలో ఆమె సంపద ఏకంగా రూ. 20 వేల కోట్లను దాటిపోగా, గత పదేళ్లలో ఆమె ఆర్జించిన మొత్తం దాదాపు రూ.24 వేల కోట్లు. మార్చి 2024తో ముగిసిన ఏడాది లో సంస్థ పన్నుకు ముందు 626 మిలియన్ పౌండ్ల లాభాన్ని సాధించింది. ఇది గత ఏడాదితోపోలిస్తే 60 మిలియన్ పౌండ్ల ప్రీ-టాక్స్ నష్టం నుండి గణనీయమైన పెరుగుదల.ఆన్లైన్ బెట్టింగ్స్ ఊపందుకున్న కోవిడ్-19 మహమ్మారి సమయంలో (2020) ఆమె ఆదాయం అత్యధికంగా రూ.4,690 కోట్లుగా నమోదైంది. కాగా ప్రపంచంలోని ప్రముఖ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ కంపెనీల్లో ఒకటి నిలిచిన Bet365 వ్యవస్థాపకురాలైన కోటస్ 1967, సెప్టెంబరు 26న ఇంగ్లాండ్‌లోని స్టోక్-ఆన్-ట్రెంట్‌లో జన్మించింది. షెఫీల్డ్ విశ్వవిద్యాలయంలో ఎకనామెట్రిక్స్ అభ్యసించింది. బెట్టింగ్ షాపులను నిర్వహించు కుటుంబ నేపథ్యంతో ఆమె ఈ కంపెనీని స్థాపించింది. ఆమె సోదరుడు జాన్ కోట్స్ సంస్థకు సంయుక్త సీఈఓగా(CEO), ప్రధాన వాటాదారుగా కొనసాగుతున్నారు. అంతేకాదు స్టోక్ సిటీ ఫుట్‌బాల్ క్లబ్ స్టేడియానికి బెట్365 పేరు పెట్టారంటేనే Bet365కంపెనీ ప్రాముఖ్యతను ఇట్టే అర్థం చేసుకోవచ్చు.విమర్శలు, వివాదాలు అయితే ఇంత ప్రాపులర్ అయిన సంస్థకు సంబంధించి మరో కోణం కూడా ఉంది. పేదప్రజల ఆశను సొమ్ము చేసుకుంటున్న కంపెనీ అంటూ సంస్థపై అనేక విమర్శలు భారీగానే ఉన్నాయి. ముఖ్యంగా తక్కువ ఆదాయం ఉన్న లక్షలాది మంది కష్టార్జితాన్ని ఈ సంస్థ కొల్లగొడుతోందని విమర్శకులు మండిపడుతున్నారు.మరోవైపు 2020లో డెనిస్ తండ్రి పీటర్ కోట్స్(Peter Coates) బ్రిటన్ ప్రధాని కెయిర్ స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ పార్టీకి రూ.25 లక్షలు విరాళంగా ఇవ్వడం రాజకీయ దుమారాన్ని రేపింది . అలాగే 2023లో కస్టమర్ల భద్రతా వైఫల్యం, మనీలాండరింగ్ లాంటి ఆరోపణలతో ఈ సంస్థ రూ.5.82 కోట్ల జరిమానా కూడా చెల్లించాల్సి వచ్చింది. -
ముగ్గు ఇలా కూడా పెట్టొచ్చా..! జస్ట్ కలర్స్‌తో..
సంక్రాంతి వచ్చిదంటే గుమ్మాలన్నీ రంగవల్లుల(Rangoli)తో కళకళలాడిపోతుంటాయి. వివిధ రకాల డిజైన్లతో కలర్ఫుల్గా తీర్చిదిద్దుతారు. ఈ పండుగలో ముగ్గులతో హడవిడి, సంబరమే కనిపిస్తుంది. పడుచులంతా చేరి అద్భుతమైన తన కళా నైపుణ్యాన్ని రంగరించిం మరీ తీర్చిదిద్దే పనిలో పడతారు. ఇంత కష్టపడి పెట్టిన ముగ్గు తొక్కకూడదని మగువలు పడే ప్రయాస అంతా ఇంతా కాదు.అయితే కొందరూ బియ్యపిండి, రాతిపిండితోనూ పెడతారు. చక్కగా ముగ్గుని తీర్చిదిద్దాక కలర్స్ వేసి మళ్లీ పై కోటింగ్‌లా ముగ్గు వేస్తారు. కానీ ఇక్కడొకామె పెట్టిన ముగ్గు చేస్తే నోటి మాట రాదు. అబ్బా చూస్తుండగానే ఎంత ఈజీగా పెట్టేసింది అనుకుంటారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆమె పెట్టిన ముగ్గు విధానం శతాబ్దల కాలం నాటిది. ఇది వరకు అంతా మట్టి ఇళ్లే ఉండేవి. వాటిని చక్కగా పెడతో అలికి ముగ్గులు పెట్టేవారు. అప్పుడు సున్నంతో ఇంటి చుట్టు గోడలకి అందమైన ముగ్గులను చేతితో భలే జిమ్మే వారు. అవి ఓ మోస్తారు ఆకారంలో సెట్ అయ్యి చూడటానికి భలే అందంగా కనిపించేవి. ఆ విధానంలోనే ఈ మహిళ ముగ్గుపెట్టింది.కాకపోతే దానికి కాస్త ఆధునిక విదానాన్ని జోడించింది. ఆ వీడియోలో మొదట మహిళ ఇంటి గుమ్మ ముందు పెట్టదలచుకున్న కలర్లన్నీ తీసుకుంది. ముందుగా ఓ పెద్ద రౌండ్లో ముగ్గు పొడి పెట్టింది. ఆ తర్వాత లయబద్ధంగా రకరకలా రంగులను ముగ్గు పొడి ఉన్న గుండ్ర భాగానికి నలువైపులా చక్కగా వీటిని సెట్ చేసింది.అంతే నాలుగు భాగాలుగా చేసి ఒక్కోదాన్ని ఒక్కోలా.. ఆకృతిలోకి వాటన్నిటిని నేలపై విరజిమ్మింది అది నెమలీ రెక్కలను విచ్చినట్లుగా చక్కగా రంగులు పరుచుకున్నాయి. అంతే ఆతర్వాత వాటి మధ్యలో ముగ్గుతో కొద్దిపాటి డిజైన్ వేసింది. చూస్తే వాటే ముగ్గు..ఏం పెట్టారబ్బా..అని అనకుండా ఉండలేరు.இந்த பெண்ணின் திறமையை பாருங்க .👌🏻 pic.twitter.com/jCB8vzr1By— Narasimman🇮🇳🕉️🚩 (@Narasim18037507) January 3, 2025 (చదవండి: చలికాలం తప్పక తీసుకోవాల్సిన సూప్ ..!) -
20 ఏళ్ల క్రితం అనాథల్నిచేసిన అమ్మ: వెతుక్కుంటూ వచ్చిన కూతురు, కానీ..!
ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డే...జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా కన్నతల్లి స్పర్శకోసం మనసు ఆరాట పడుతుంది. అలా చిన్నతనంలోనే కన్నతల్లికి దూరమైన యువతి ఇపుడు జన్మనిచ్చిన తల్లికోసం అన్వేషిస్తోంది. రెండు దశాబ్దాలక్రితం అనుకోని పరిస్థితుల్లో అమ్మకు దూరమైన, పిల్లల విద్యలో పరిశోధకురాలు స్నేహ భారతదేశానికి తిరిగి వచ్చింది. అసలేంటీ స్నేహ స్టోరీ తెలుసుకుందాం పదండి!స్నేహకు సుమారు ఏడాదిన్నర వయసుండగా ఆమె తల్లి వదిలేసివెళ్లిపోయింది. ఈమెతోపాటు నెలల పసిబిడ్డ సోము కూడా అనాధలైపోయారు. ఇది గమనించిన ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు ఆ ఇంటికి వచ్చి ఇద్దర్నీ స్థానిక అనాథ ఆశ్రమంలో చేర్పించారు. ఐదేళ్లపాటు అక్కడే పెరిగారు.అయితే స్పెయిన్ నుంచి భారత్‌కు వచ్చిన ఒక జంట వీరి పాలిట దైవాలుగా మారారు. అనాధ ఆశ్రమంలో ఉన్న ఐదేళ్ల స్నేహ , నాలుగేళ్ల సోము ఇద్దర్నీ స్పానిష్ జంట జెమా వైదర్, జువాన్ జోష్ 2010లో దత్తత తీసుకుని తమ దేశానికి తీసుకువెళ్లి పోయారు. వీరిని సొంత బిడ్డల్లా పెంచుకుని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం స్నేహ వయసు 21 ఏళ్లు కాగా, చిన్నారుల విద్యలో పరిశోధనలు చేస్తోంది.అయితే, ఇటీవలే వారి మూలాలు ఒడిశాలో ఉన్నాయని జెమా దంపతులు స్నేహకు తెలిపారు. దీంతో తనకు జన్మనిచ్చిన తల్లి ఆచూకీ ఎలాగైనా తెలుసుకోవాలని స్నేహ పెంపుడు తల్లి జెమాతో కలిసి గత నెల 19న భారత్ (భువనేశ్వర్)కు చేరుకుంది. స్థానిక హోటల్లో ఉంటూ నయాపల్లిలోని ఇంటి యజమాని వద్దకు వెళ్లి అక్కడ తల్లిదండ్రుల పేర్లను తెలుసుకుంది. తల్లి పేరు బనలతాదాస్, తండ్రి సంతోష్ అని తెలిసింది. ఈ వివరాలతో పోలీసుల సాయంతో అమ్మకోసం వెదుకులాట ప్రారంభించింది. అలాగే అనాధాశ్రమంలో ఉన్న వివరాలతో వాటిని దృవీకరించుకుంది. ఈ విషయంలో మహిళా విశ్వవిద్యాలయం రిటైర్డ్ టీచర్ సుధా మిశ్రా ఆమెకు సాయం అందించారు.ఈ విషయాన్ని స్థానిక పోలీస్ కమిషనర్ దేవ్ దత్తా సింగ్ దృష్టికి తీసుకురాగా ఆయన సానుకూలంగా స్పందించారు. పోలీసులు విచారణ చేయగా, బానాలత కటక్ లో ఉన్నట్లు గుర్తించారు. అయితే జనవరి 6న స్నేహ తిరిగి స్పెయిన్ కు వెళ్లాల్సి ఉండటంతో తల్లిని కలుసుకోవడం సాధ్యం కాలేదు. అయితే తాను మార్చిలో తిరిగి ఇండియాకు వచ్చి తల్లి ఆచూకీ కోసం ప్రయత్నాలను కొనసాగిస్తానని చెప్పింది స్నేహ. స్నేహ తల్లిదండ్రులను గుర్తించడానికి పోలీసులు , పంచాయతీ కార్యకర్తల సహాయం తీసుకుంటామని ఇన్స్పెక్టర్ అంజలి ఛోట్రే చెప్పారు.స్నేహ అసలు తల్లిదండ్రులు ఎవరు?ఒడిశాకు చెందిన బనలతా దాస్, సంతోష్ స్నేహ తల్లిదండ్రులు. వీరు నలుగురు పిల్లలతో కలిసి భువనేశ్వర్‌లోని నయాపల్లిలో అద్దె ఇంటిలో ఉండేవారు. వంట మనిషిగా పని చేసే ఆమె భర్త, ఏమైందో తెలియదు గానీ పిల్లలు సహా భార్యను వదిలివేసి వెళ్లిపోయాడు. దీంతో బానాలత ఒంటరిదైపోయింది. అటు నలుగురు పిల్లలతో, కుటుంబ పోషణా భారమైంది. దీంతో ఇద్దరి పిల్లల్ని వదిలేసి మరో కొడుకు, కూతుర్ని తీసుకొని ఎటో వెళ్లిపోయింది. స్నేహ మా ఇంటి వెలుగుస్నేహ చాలా బాధ్యతగల కుమార్తె. మంచి విద్యావంతురాలు. ఆమె మా ఇంటి వెలుగు,ఆమెమా జీవితం అంటూ స్నేహ గురించి ప్రేమగా చెప్పుకొచ్చింది దత్తత తల్లి జెమా. అంతేకాదు జీవసంబంధమైన తల్లిని తెలుకోవాలన్న ఆరాటపడుతున్న కుమార్తెతోపాటు ఒడిశాలోని భువనేశ్వర్ రావడం విశేషం. ప్రస్తుతం స్నేహ చేస్తున్న ప్రయత్నం నెట్టింట వైరల్‌వుతోంది. త్వరలోనే తల్లీబిడ్డలిద్దరూ కలవాలని కోరుకుంటున్నారు నెటిజన్లు -
నిజమైన ప్రేమ అంటే ఇది కదా..!
ఇటీవల రోజుల్లో దాంపత్యం అన్న మాట విలువలేనిదిగా అయిపోతోంది. ఎక్కడ చూసినా..విడాకులు కేసులే అధికమవుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ వృద్ధ జంటను చూస్తే భార్యభర్తల బంధం అంటే ఇది కదా అనిపిస్తుంది. ప్రేమ అనే ఒక్క పదం ఇరువురి మధ్య ఉంటే ఎలాంటి వైకల్యమైనా జయించొచ్చు అనిపిస్తుంది. ఈ ఏజ్‌లో తమ కాళ్లపై తాము నిలబడాలనే తపనతో ఆ జంట పడుతున్న పాట్లు చూస్తే..ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇంతకీ ఎవరంటే వారు..థానే రైల్వే స్టేషన్(Thane Station) వద్ద స్నాక్ అమ్ముకుని జీవించే వృద్ధ జంట(Elderly Couple). వారితో ఇన్స్టాగ్రామ్ వ్లాగర్(vlogger) సిద్ధేష్ లోకారే మాటలు కలిపి..ఆ సంభాషణను నెట్టింట వీడియో రూపంలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వృద్ధ జంట కథ నెట్టింట వైరల్‌గా మారింది. బీం రావు శోభ దంపతులతో వ్లాగర్ సిద్ధేష్ సంభాషిస్తూ..మీకు ఎప్పుడు పెళ్లి అయ్యిందని ప్రశ్నిస్తారు. వారు 1982లో పెళ్లై అయ్యిందని బదులిస్తారు. మూడు దశాబ్దాలకు పైగా కలిసే ఉన్నామని అంటారు. ఇక్కడకి ప్రతిరోజు వచ్చి స్నాక్స్ అమ్ముతామని, ఎవ్వరైన స్నాక్స్/స్వీట్లు కావాలని ఆర్డర్ చేస్తే ఇంటికి కూడా వెళ్లి డెలివరీ చేస్తామని చెప్పారు. బీంరావు తాను రెండేళ్ల వయసులో చూపుకోల్పోగా, భార్య శోభాకు ఒక చేయి సరిగా లేదు. అయినా ఇరువరు ఎంతో అన్యోన్యంగా ఉంటామని చెప్పారు. రోజువారీ పనులను ఎలా ఇరువురు చకచక చేసుకోగలరో కూడా వివరించారు. అంతేగాదు భీంరావు తనకు చూపులేకపోయినా తన భార్యకు వంట చేయడంలో సహకరిస్తారట. పైగా కూరగాయాలు కట్ చేయడంలో ఆయనకు ఎంతో నైపుణ్యం ఉందని భర్తపై ప్రశంసలు జల్లు కురిపిస్తోంది శోభా. ఆ జంటని వ్లాగర్ సిద్ధేష్ ప్రేమంటే ఏంటనీ అడగగా..వారు "ఒకరికొకరు" అని గొప్పగా సమాధానం ఇచ్చారు. యవతకు మీరిచ్చే సందేశం ఏంటని అడిగితే.." "కష్టపడితే దేన్నైనా పొందగలం". అలాగే నీ కోసం బతకడం కాదు ఇతరుల మేలు కోరితేనే జీవితానికి అసలైన అర్థం అని చెప్పారు". చివరిగా వ్లాగర్ మీకు ఏదైనా కావాలా అని అడగగా..ఒక స్టాల్ ఉంటే బాగుండునని, ఇంతలా నిలబడాల్సిన శ్రమ ఉండదని నవ్వుతూ చెబుతారు ఆ దంపతులు. ఈ వీడియో నెటిజన్లను కదలించింది. ప్రేమకు అసలైన నిర్వచనం ఆ దంపతులు అని ప్రశంసిస్తూ..పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Siddhesh Lokare🙋🏻♂️ (@sidiously_) (చదవండి: ఏజ్‌లో సెంచరీ కొట్టిన మరో బామ్మ..హెల్త్ సీక్రెట్ ఏంటంటే..) -
ప్రత్యేక ఫిబ్రవరి.. 823 ఏళ్లకోసారి మాత్రమే ఇలా!
ఈ ఏడాది ఫిబ్రవరికో ప్రత్యేకత ఉంది. 2025 ఫిబ్రవరి (February) నెలలో వారంలో ఏడు రోజులూ ఒక్కోటి నాలుగేసిసార్లు రానున్నాయి. 823 ఏళ్లకోసారి మాత్రమే ఇలా వస్తుందని గణిత శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రతి 176 సంవత్సరాలకోసారి ఫిబ్రవరిలో సోమ, శుక్ర, శనివారాలు మూడేసి రోజులు మాత్రమే వస్తాయని తెనాలి (Teanali) డిగ్రీ కాలేజి అధ్యాపకుడు ఎస్వీ శర్మ చెప్పారు. – తెనాలిమేక బండి.. ట్రెండ్ సెట్ చేసిందండీ! ఇప్పటి వరకూ మనం ఎండ్ల బండి, గుర్రం బండి చూశాం. కానీ, కోనసీమ జిల్లా మలికిపురం (Malikipuram) మండలం కేశనపల్లిలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి ఆవుల పాల ఉత్పత్తి, ఎండ్ల అందాల పోటీల్లో శనివారం మేక బండి అందరినీ ఆకర్షించింది. అంబాజీపేటకు చెందిన యర్రంశెట్టి శ్రీనివాస్ ట్రెండ్ సెట్ చేద్దామని ఎంతో శ్రమించి, రూ.7 వేలు వెచ్చించి ఈ బండిని రూపొందించారు. – మలికిపురంశునక వానర స్నేహం అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం తూర్పుపాలెంలో శునక వానర స్నేహం ఐదేళ్లుగా జాతి వైరాన్ని మరచి వర్ధిల్లుతోంది. ఐదేళ్ల క్రితం ఒక కొండముచ్చుల గుంపు ఈ ప్రాంతానికి వచ్చింది. ఇక్కడ శునకాలతో అలవాటు పడిన ఓ కొండముచ్చు తన గుంపును వదిలేసింది. గ్రామంలోని శునకాల గుంపుతోనే ఉంటోంది. – మలికిపురం'చుక్కలు' కాదు.. సమర సన్నాహాలుసముద్రం ఒడ్డున అంత జనం నిలబడి ఆకాశంలోని తారలను ఆసక్తిగా తిలకిస్తున్నట్టుగా ఉంది కదా ఈ చిత్రం. నిజానికి అవి నక్షత్రాలు కావు. యుద్ధ విమానాలు. విశాఖపట్నం (Visakhapatnam) ఆర్కే బీచ్‌లో శనివారం నావికాదళం అద్భుత విన్యాసాలు ప్రదర్శించింది. వీటిని ప్రత్యక్షంగా చూసేందుకు విశాఖ నగర వాసులు భారీగా బీచ్‌కు తరలివచ్చారు. దీంతో సముద్రతీరం జనసంద్రాన్ని తలపించింది. సాగర తీరంలో నేవీ విన్యాసాలను చూసి వైజాగ్ వాసులు అచ్చెరువొందారు. చదవండి: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సంక్రాంతికి మరో 52 అదనపు రైళ్లు -
నూటికి ఒక్క తండ్రికి దక్కుతుందేమో ఇలాంటి అదృష్టం..!
తండ్రి కొడుకులిద్దరూ ఒకే ఉద్యోగాలు చేయ్యొచ్చు. లేదా ఇద్దరూ ఒకే డిపార్ట్మెంట్లో పనిచెయ్యొచ్చు. ఇంకాస్త ముందుకెళ్తే తండ్రికి పై అధికారిగా కొడుకులు ఉన్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఇలా తండ్రి రిటైర్మెంట్ ఆర్డర్‌పై కొడుకు సంతకం చేసే అవకాశం ఎవ్వరికో గానీ దక్కదు. ఇది అలాంటి ఇలాంటి గౌరవం కాదు. ఎంత పుణ్యం చేసుకుంటే ఇలాంటి అదృష్టం దక్కుతుందో అనిపిస్తుంది. ఈ అరుదైన ఘటన రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాలో చోటు చేసుకుంది.బాంద్రాలోని నోఖా, బికనేర్‌లోని ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాల ఉపాధ్యాయుడు పనిచేస్తునన్న జోగరామ్ జాట్‌కి ఆ అరుదైన అదృష్టం, గౌరవం లభించాయి. అతడు పనిచేస్తున్న ప్రభత్వ హయ్యర్ సెకండరీ పాఠశాలలోనే కొడుకు శ్యామ్‌సుందర్ చౌదరి ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఈ తండ్రి కొడుకులిద్దరూ ఈ ప్రభుత్వ స్కూల్‌కి 2016లో ట్రాన్స్ఫర్ అయ్యారు. వీరిద్దరూ ఒకే పాఠశాలలో పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. జోగారామ్ 39 ఏళ్ల 2 నెలల 20 రోజులు ఉపాధ్యాయుడిగా పనిచేసి మంగళవారమే పదవీ విరమణ చేశారు. ఆ రిటైర్మ్ంట్ ఆర్డర్‌పై తన కొడుకే సంతకం చేయడంతో ఈ పదవీవిరమణ మర్చిపోలేని మధురాతి ఘట్టం ఆ తండ్రికి. జోగారామ్ కూడా ఇలాంటి అదృష్టం ఎవరికీ దక్కుతుందంటూ కళ్లు చెమర్చాడు. ఈ సమయంలో తనకు ఇంతకు మించి గౌరవడం ఇంకేముంటుందని భావోద్వేగం చెందాడు. ఈ మేరకు జోగరామ్ జాట్ మాట్లాడుతూ..తాను 1985ల ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చిందని, అక్టోబర్ 12న విధుల్లో జాయిన్ అయినట్లు చెప్పుకొచ్చారు. ఈ రోజు తన కొడుకు చేతుల మీదుగా పదవీవిరమణ చేయడం ఎంతో సంతోషంగా ఉందని, ఎన్నటికీ మర్చిపోలేని సంతోషకరమైన సందర్భం అని అన్నారు. అలాగే కొడుకు శ్యామ్ సుందర్ కూడా తన తండ్రి పదవీవిరమణ ఆర్డర్‌పై తానే సంతకం చేయడం అనేది మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉందన్నారు. ఇక శ్యామ్ సుందర్ 2011 అక్టోబరు 13న తనకు టీచర్‌న ఉద్యోగం వచ్చిందని చెప్పారు.ఆ తర్వాత జూలై20, 2015న కెమిస్ట్రీ స్కూల్ టీచర్ కెరీర్ ప్రారభించారు. అలా ఫిబ్రవరి 28, 2023న వైస్ ప్రిన్సిపాల్ అయ్యారు. ఆ తరువాత, అతను అక్టోబర్ 01, 2023 నుంచి తాత్కాలిక ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నాట్లు సమాచారం. అంతేగాదు శ్యామ్ సుందర్ చౌదరి పాఠశాలలో చేసిన కృషికి 2022లో రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయ గౌరవాన్ని కూడా పొందారు. కాగా, మరో గొప్ప విషయం ఏంటంటే.. పదవీ విరమణ తర్వాత, జోగారం జాట్ ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్ బాంద్రాకు రూ. 31000, ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్ కెడ్లికి రూ. 11000, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కెడ్లికి రూ. 5100 విరాళం అందించి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఇలాంటి అరుదైన గౌరవం, అదృష్టం నూటికి ఒక్క తండ్రికి దక్కుతుందేమో కదూ..!.(చదవండి: ఐఐటీ నిరాకరిస్తే..ఏకంగా ఎంఐటీ ఆహ్వానించింది..!) -
రైతుబిడ్డ సక్సెస్ స్టోరీ, యంగెస్ట్ ఐఐటీయన్, 24 ఏళ్లకే యాపిల్ ఉద్యోగం
అంకిత భావం, ఓర్పు పట్టుదలగా ప్రయత్నించాలే గానీ విజయం వంగి సలాం చేయాల్సిందే. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోడానికి పేదింటి రైతు బిడ్డ పడిన శ్రమ, చేసిన కృషి గురించి తెలుసుకుంటే ఈ మాటలు అక్షర సత్యాలు అంటారు. 13 ఏళ్లకే ఐఐటీ ర్యాంక్ సాధించి, 24 ఏళ్లకే యాపిల్ కంపెనీలో చేరిన సత్యం కుమార్ సక్సెస్ జర్నీ గురించి తెలుసుకుందామా!బిహార్(Bihar)కు చెందిన సామాన్య రైతు కుటుంబంలో జన్మించాడు సత్యం కుమార్ (Satyam Kumar). చిన్నప్పటి నుంచీ తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చకున్నాడు. అయితే పేదరికం కారణంగా చదువు చాలా కష్టంగామారింది. మేనమామ, స్కూలు టీచర్ సాయంతోదీక్షగా చదువుకున్నాడు. కేవలం 13 సంవత్సరాల వయస్సులో దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక ఐఐటీ జేఈఈ ర్యాంక్ సాధించిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. 2012లో, అతను ఆల్-ఇండియా ర్యాంక్ 8,137 సాధించి పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. అయితే, అతను మళ్లీ మళ్లీ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఒక సంవత్సరం తరువాత, అతను మళ్ళీ పరీక్ష మరియు పరీక్షలో ఎక్కువ ర్యాంక్ సాధించాడు.2013లో 13 ఏళ్ల వయసులో కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సీటు పొందిన సత్యం, 679 ర్యాంక్ సాధించి, ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు (మునుపటి రికార్డు సహల్ కౌశిక్ పేరిట ఉంది అతను 14 సంవత్సరాల వయస్సులో ఈ ఘనతను సాధించాడు). 2013లో ఐఐటీలో 679 ర్యాంక్ తో ఐఐటీ కాన్పూర్( IIT Kanpur) నుంచి 2018 సంవత్సరంలో బీటెక్ పూర్తి చేశాడు. ఇక్కడ చదువుకునే సమయంలోనే మూడు ప్రాజెక్ట్ లపై సత్యం కుమార్ వర్క్ చేసిన ప్రశంలందుకోవడం విశేషం.ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో సంయుక్త BTech-MTech కోర్సు, అమెరికాలోని ఆస్టిన్లోని టెక్సాస్ విశ్వవిద్యాలయం PhDని పూర్తిచేశాడు. ఆ తరువాత కేవలం 24 సంవత్సరాల వయస్సులో Appleలో ఉద్యోగం చేసాడు. అక్కడ, అతను ఆగస్టు 2023 వరకు మెషిన్ లెర్నింగ్ ఇంటర్న్‌గా పనిచేశాడు.అలాగే యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ లో గ్రాడ్యుయేట్ రీసెర్చ్ అసిస్టెంట్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ ఫేజెస్ స్పెషలైజేషన్‌తో పనిచేశాడు.రాజస్థాన్‌లోని కోటలోని మోడరన్ స్కూల్లో చదువుతున్న సమయంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పశుపతి సింగ్, సత్యం ప్రతిభను గుర్తించారు. అందుకే IIT ప్రవేశ పరీక్ష,కోచింగ్ ఖర్చులను వర్మ స్వయంగా భరించారని సత్యం మేనమామ మీడియాకు తెలిపారు. ఈ క్రమంలోనే భవిష్యత్తులో తన రాష్ట్రంలోని పేద విద్యార్థులకు చదువు నేర్పించాలని భావిస్తున్నాడు సత్యం. సత్యం సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా అనడంలో ఎలాంటి సందేహం లేదు. -
70 ఏళ్ల వయసులో బుగ్గల్ శిఖరంపైకి సాహస యాత్ర
ఆయన వయసు 70 ఏళ్లు.. సాధారణంగా ఈ వయసు వాళ్లు మహా అయితే తీర్థయాత్రలు చేస్తుంటారు. లేదంటే ఇంటికే పరిమితమై మనుమలు, మనుమరాళ్లతో కాలక్షేపం చేస్తుంటారు. కానీ డాక్టర్ ఏబీఆర్పీ రెడ్డి (Dr ABRP Reddy) మాత్రం తీవ్ర చలికి తట్టుకుని హిమాలయాల్లో సాహసోపేతమైన ట్రెక్కింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు.. అనుకోవడమే కాదు..ఆ యాత్రను పూర్తిచేసి వయసుతో పనిలేకుండా ఎలాంటి సాహసాన్ని అయినా చేయవచ్చని నిరూపించాడు. ఐటీ, యానిమేషన్ రంగంలో సీఈఓగా 25 ఏళ్లు పనిచేసిన అనుభవం ఉంది. 60 ఏళ్ల వయసులో ట్రైనింగ్ ప్రారంభించి మారథాన్ రన్నర్‌గా ఎదిగారు. హైదరాబాద్ వంటి వెచ్చని ప్రాంతంలో నివసిస్తున్నప్పటికీ చల్లని వాతావరణం ఏబీఆర్పీ రెడ్డికి కొత్తేమీ కాదు. గతంలో ఢిల్లీ, ఇంగ్లండ్‌లో కూడా నివసించారు. ఇప్పటికే ఐదుసార్లు హిమాలయాల్లో ట్రెక్కింగ్ చేసిన ఆయన కుమార్తె సింధు కూడా వెంట ఉంది. ట్రెక్కింగ్ చేయడానికి కూతురే తనకు ప్రేరణ అని ఏబీఆర్పీ రెడ్డి పేర్కొన్నారు. ఏటా 20 వేల మందికి పైగా ట్రెక్కింగ్ చేసేవారికి మార్గనిర్దేశం చేసే ఇండియా హైక్స్ బైక్ గ్రూప్‌లో ఆయన చేరారు. వారు గరిష్ట వయో పరిమితి 62 ఏళ్లుగా నిర్దేశించినప్పటికీ, ఏబీఆర్పీ రెడ్డి గుండె సంబంధిత అంశాలతో సహా ఇతర ఫిట్నెస్ ప్రమాణాలకు అనుగుణంగా ఉండడంతో ట్రెక్కింగ్ పూర్తి చేశారు. నెల రోజుల పాటు శిక్షణ.. ట్రెక్కింగ్ కోసం నెల రోజుల పాటు జిమ్‌లో శిక్షణ పొందాను. ఇందు కోసం రోజుకు 60 అంతస్తులు వేగంగా ఎక్కేవాడిని. ట్రెక్కింగ్ సమయంలో రాత్రి పూట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీ సెంటీగ్రేడ్‌కు చేరుకుంటాయి. దీంతో తీవ్రమైన చలిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇదే అత్యంత క్లిష్టమైన భాగం. తీవ్ర చలిని తట్టుకునేందుకు గూడారాల లోపల ఉండాలి. స్లీపింగ్ బ్యాగులను ఉపయోగించాలి. ఎత్తుకు చేరుకున్నప్పుడు వాతావరణ పీడనాన్ని ఎదుర్కోవాలి. తక్కు వ ఆక్సిజన్ కారణంగా ఆల్టిట్యూడ్ సిక్నెస్ రావచ్చు. ఈ స్ఫూర్తితో మరిన్ని సాహసాలునా కుమార్తె సింధు టెక్కింగ్ గ్రూపులో ఉండడం వల్ల అధిరోహణ, దిగే సమయంలో ఎన్నో సూచనలు చేసింది. మూడు రోజుల్లో మా బృందంలోని మొత్తం 24 మంది ట్రెక్కర్లు దయారా బుగ్గల్ అనే 12,000 అడుగుల ఎత్తు శిఖరాన్ని చేరుకున్నాం. శిఖరాన్ని చేరుకున్నప్పుడు ట్రెక్కింగ్‌లో ఎదుర్కొన్న కష్టాలను పూర్తిగా మరిచిపోయి సంబరాలు చేసుకున్నాం. అక్కడి నుంచి కిందికి దిగడం మొదలై నాల్గో రోజు సాయంత్రం బేస్ క్యాంప్‌కు చేరుకున్నాం. బేస్ క్యాంప్ డెహ్రాడూన్ నుంచి 180 కిలోమీటర్ల దూరంలో ఉంది. మొత్తం 12,000 అడుగుల ట్రెక్కింగ్ ఇచ్చిన స్ఫూర్తితో 2025లో 18,000 అడుగుల ఎత్తు ట్రెక్కింగ్‌కు సిద్ధం అవుతున్నాను. – డాక్టర్ ఏబీఆర్పీ రెడ్డి -
ఒళ్లు గగుర్పొడిచే తెలుగోడి విన్యాసం : శిక్షణ లేకుండా, ఎవరూ ట్రై చేయొద్దు!
సామాన్య వ్యక్తినుంచి అసామాన్య వ్యక్తిగా ఎదిగిన 'డ్రిల్ మ్యాన్' గుర్తు ఉన్నాడా? అబ్బరపరిచే సాహస విన్యాసాలకు మారుపేరు ఈ డ్రిల్ మ్యాన్. తాజాగా మరో ఒళ్లు గుగుర్పొడిచే సాహసంతో గిన్నిస్‌బుక్ రికార్డు సాధించాడు. ఆ సాహసం పేరే తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన క్రాంతి కుమార్ పనికెర అలియాస్ డ్రిల్‌మ్యాన్.57 విద్యుత్ ఫ్యాన్ బ్లేడ్ల నాలుకతో ఆపి, ఇన్క్రెడిబుల్ వరల్డ్ రికార్డ్ సాధించాడు. కేవలం ఒకే ఒక్క నిమిషాంలో ఈ ఫీట్ సాధించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అసాధారణమైన టైటిల్ కోసం అద్భుతమైన ప్రయత్నం డ్రిల్‌మ్యాన్ సాహసం ఇపుడు నెట్టింట వైరల్‌గా మారింది. హైస్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాన్ బ్లేడ్లను నాలుకతో ఆపివేసి దృశ్యం ప్రేక్షకులను అబ్బురపర్చింది. ఆశ్చర్యంతో కళ్లప్పగించి చూడటం అక్కడున్న ప్రేక్షకులు, న్యాయనిర్ణేతల వంతైంది. 60 సెకన్లు గడిచిన తర్వాత, లో షో డీ రికార్డ్ అనౌన్సర్ "ఆపు" అనేంత వరకు ఆయన ప్రయత్నం కొనసాగింది. ఈ విషయంలో గతంలో తాను సృష్టించిన రికార్డును తానే అధిగమించాడు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఈ ఫీట్‌ను మరోసారి నిర్ధారించుకున్న న్యాయనిర్ణేతలు డ్రిల్మాన్కు సర్టిఫికేట్ అందించారు. ఈ టైటిల్‌ను సాధించిన తర్వాత డ్రిల్‌మ్యాన్ భావోద్వేగానికి గురయ్యాడు.2024లో అరవై సెకన్లలో ఎన్ని ఫ్యాన్లు నాలుకతో ఆపగలరు అన్న టాస్క్‌లో నాలుకతో ఏకంగా 52 ఫ్యాన్లను ఆపి రికార్డు సాధించాడు. అంతేనా రెండడుగుల కత్తిని గొంతు లోకి దింపాడు. ఇదే కత్తికి కట్టిన తాడు సాయంతో 1944 కిలోలుండే వోక్స్ వ్యాగన్ వాహనాన్ని ఐదు మీటర్లు లాగాడు. ఇందులో ఎనిమిది మంది ఉండటం విశేషం. ఆ తర్వాత అరవై సెకన్లలో నాలుగు అంగుళాల 22 మేకులను ముక్కులోకి సుత్తితో కొట్టి మళ్లీ బయటకు తీశాడు. ఇతగాడి జైత్రయాత్ర ఇంకా ఉంది. సలసల కాగే వేడి నూనెలో చికెన్ ముక్కలను చేతితో బయటకు తీయడం అనేఫీట్లో. కేవలం 60 సెకన్లలో 17 చికెన్ ముక్కలను తీసి గిన్నిస్ రికార్డులను సృష్టించాడు . ఇలా గతంలోనే నాలుగు రికార్డులు సొంతం చేసుకున్నాడు. ప్రపంచంలోనే ఇలాంటి రికార్డులు నెలకొల్పిన వ్యక్తిగా నిలిచాడు క్రాంతి కుమార్. తాజా ఫీట్‌తో అతనిపై ప్రశంసల జల్లు కురుస్తోంది.Most electric fan blades stopped using the tongue in one minute 👅 57 by Kranthi Drillman 🇮🇳 pic.twitter.com/dsH8FULHxW— Guinness World Records (@GWR) January 2, 2025 -
గర్ల్‌ఫ్రెండ్‌ని ఇంప్రెస్ చేద్దాం అనుకుంటే ప్రాణమే పోయింది
కొందరు వెర్రితో చేసే పిచ్చి స్టంట్లు భయానకంగానూ, ప్రాణాంతకంగానూ ఉంటాయి. కనీసం ఇలాంటివి చేసే ముందు వికటిస్తే ఏమవుతుందో అనే ధ్యాస లేకుండా అనాలోచితంగా చేసేస్తారు. ఆ తర్వాత అందరూ చూస్తుండగానే వాళ్ల కథ విషాదాంతంగా ముగిసిపోతుంటుంది. అలాంటి ఘటనే ఇది.ఓ జూ సంరక్షకుడు గర్ల్‌ఫ్రెండ్(Girlfriend)ని ఇంప్రెస్ చేద్దాం అనుకుని చేసిన పనికి ప్రాణాలే పోగొట్టుకున్నాడు. ఈ ఘటన ఉజ్బెకిస్తాన్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..44 ఏళ్ల జూకీపర్(zookeeper) తన గర్ల్‌ఫ్రెండ్‌ని ఇంప్రెస్ చేద్దామన్న ఉద్దేశ్యంతో ఓ స్టంట్ చేయాలనుకున్నాడు. అందుకోసం తెల్లవారుజామున 5 గంటలకు సింహాల గుహ(Lion Den)కు చేరుకుని సెల్ఫీ వీడియో(Selfie Video) తీసుకుంటున్నాడు. ముందుగా మూడు పెద్ద సింహాలు ఉన్న బోనులోకి వెళ్లాడు. వాటిని నిశబ్దంగా ఉండండి అని సైగ చేస్తూ సెల్ఫీ వీడియో చిత్రీకరిస్తున్నాడు..ఇంతలో ఓ సింహం అనుహ్యంగా అతడి చేతిపై దాడిచేయడంతో.. జరగకూడని ఘోరం జరిగిపోయింది. చివరికీ ఆ సింహాల దాడిలో తీవ్రంగా గాయపడి మరణించాడు. అతడు సరదాగా చేసిన స్టంట్ కాస్తా తన చివరి క్షణాలను బంధించిన వీడియోగా మిగిలిందని పోలీసులు వెల్లడించారు. ఏదీ ఏమైనా క్రూర జంతువులతో చేసే స్టంట్ల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాల్సిందే.(చదవండి: షాలిని పాసీ అందమైన కురుల రహస్యం ఇదే..!) -
‘స్పీడ్ బ్రేకర్’ ప్రాణం పోసింది!
కొల్హాపూర్: వైద్యుడు నిర్లక్ష్యంగా ఓ రోగి చనిపోయాడని చెప్పినా ఒక స్పీడ్‌బ్రేకర్ (Speed Breaker) కారణంగా ఆ రోగి మళ్లీ బతికొచ్చిన వైనం మహారాష్ట్రలో (Maharashtra) చోటుచేసుకుంది. రెండు వారాల క్రితం జరిగిన ఈ వింత ఘటన తాలూకు వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. గత ఏడాది డిసెంబర్ 16వ తేదీన కొల్హాపూర్ జిల్లాలోని (Kolhapur District) కసాబా–బావడా ప్రాంతానికి చెందిన 65 ఏళ్ల పాండురంగ ఉల్పే అనే వ్యక్తికి గుండెపోటు రావడంతో వెంటనే హుటాహుటిన దగ్గర్లోని ఆస్పత్రిలో చేరారు.అయితే అప్పటికే ఆయన మృతిచెందినట్లు ఆ ఆస్పత్రిలోని వైద్యులు ప్రకటించారు. దీంతో మృతదేహాన్ని తిరిగి సొంతూరుకు తీసుకెళ్లేందుకు ఒక అంబులెన్సును సిద్ధంచేశారు. పాండురంగ పరమపదించారన్న వార్త అప్పటికే సొంతూరిలో పాకింది. వెంటనే బంధువులు, స్నేహితులు, తెల్సిన వాళ్లు ఇంటికి రావడం మొదలెట్టారు. అందరూ ఇంటి వద్ద వేచి చూస్తుండటంతో మృతదేహాన్ని త్వరగా ఇంటికి తరలించాలన్న ఆత్రుతలో అంబులెన్సుకు డ్రైవర్ వేగంగా పోనిచ్చాడు.మార్గమధ్యంలో రహదారిపై ఉన్న ఒక పెద్ద స్పీడ్‌బ్రేకర్‌ను చూడకుండా అలాగే వేగంగా పోనిచ్చాడు. దీంతో వాహనం భారీ కుదుపులకు లోనైంది. ఈ సమయంలో పాండురంగ శరీరం అటుఇటూ కదలిపోయింది. తర్వాత శరీరాన్ని స్ట్రెచర్‌పైకి సవ్యంగా జరిపేటప్పుడు పాండురంగ చేతి వేళ్లు కదలడం చూసి ఆయన భార్య హుతాశురాలైంది. వెంటనే అంబులెన్సుకు ఇంటికి బదులు దగ్గర్లోని మరో ఆస్పత్రికి పోనిచ్చి పాండురంగను ఐసీయూలో చేర్పించారు. ఆయన ఇంకా ప్రాణాలతో ఉన్నారని తేల్చిన అక్కడి వైద్యులు పాండురంగకు వెంటనే యాంజియోప్లాస్టీ చేశారు. రెండు వారాల తర్వాత ఆయన పూర్తిగా కోలుకుని సోమవారం ఇంటికొచ్చారు. దీంతో ఆశ్చర్యపోవడం అందరి వంతైంది. ‘‘ఆ స్పీడ్‌బ్రేకర్ లేకపోయి ఉంటే మా ఆయన ఇలా ఇంటికి కాకుండా నేరుగా శ్మశానానికే వెళ్లేవారు’’ అని పాండురంగ భార్య నవ్వుతూ చెప్పారు. బతికున్న రోగిని చనిపోయాడని సర్టిఫై చేసిన ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని పాండురంగ కుటుంబం నిర్ణయించుకుంది. త్వరలో ఆస్పత్రికి నోటీసులు పంపి కోర్టుకీడుస్తామని పేర్కొంది. -
సోషల్ మీడియా స్టార్ ‘రాణి కోతి’: యూట్యూబ్ ద్వారా లక్షలు : వైరల్ వీడియో
కుంచం అంత కూతురుంటే మంచం మీదే కూడు అనేది సామెత. అంటే ఇంట్లో చిన్న ఆడకూతురుంటే చాలు..ఆ ఇంట్లోని అన్ని పనుల్లో ఎంతో చేయూత అని. ఈ విషయంలో నేనేం తక్కువ అంటోంది ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ జిల్లాలోని ఖాగీపూర్ సద్వా గ్రామానికి చెందిన కోతి. అవును మీరు చదివింది నిజమే. కోతి ఇంట్లో అన్ని పనులు చకా చకా పెట్టేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఇంటర్నెట్ సంచలనంగా మారిన కోతి కథేంటో తెలుసుకోవాలని ఉంది కదా.. పదండి మరి!యూపీలోని రాయ్‌బరేలీ జిల్లాలోని సాద్వా గ్రామానికి చెందిన అశోక్ అనే రైతు ఇంట్లోని కోతిని చూస్తే ఔరా అనాల్సిందే. అందుకే దీనికి ముద్దుగా రాణి అని పిలుచుకుంటారు.ఇల్లంతా చలాకీగా తిరుగుతూ అన్ని పనులు చేసేస్తుంది. గిన్నెలు తోముతుంది. బట్టలు ఉతకడం, మాప్ పెట్టడం, మసాలాలు రుబ్బడం, పొలంలో సహాయం చేయడం ఇలా అన్ని పనులు చక్కబెట్టేస్తుంది. అంతేనా రాణి గారు శ్రద్ధగా గుండ్రంగా చపాతీలు చేసి ఇస్తుంది. ఇది చాలదన్నట్టు గ్రామంలోని ఇతర ఇళ్లల్లో ఆడవానికి కూడా పనిలో సహాయం చేస్తుంది. అందుకే దాదాపు ఎనిమిదేళ్ల నుంచి విలేజ్ డార్లింగ్‌లా మారిపోయింది. పుట్టింది కోతిగా అయినా.. మనిషిలానే చేస్తున్న పనులు, అందరికీ సాయం చేసే స్వభావం వల్ల ఊరందరికీ అభిమానంగా మారింది.యూట్యూబ్ ద్వారా లక్షల ఆదాయం రాణి వంటలు చేస్తున్న వీడియోను యజమాని ఆకాష్ పోస్ట్ చేయడంతో ఇంటర్నెట్ సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిపోయింది. రాణి పనులను, చేష్టలను డాక్యుమెంట్ చేయాలని నిర్ణయించుకోవడంతో అశోక్ అదృష్టం మారిపోయింది. యూట్యూబ్‌లో రాణి వీడియోల ద్వారా 5 లక్షల రూపాయలకు పైగా ఆర్జించామని అశోక్ పేర్కొన్నాడు. కోట్లాదిమంది తమ వీడియోను వీక్షించారని తెలిపాడు. ముంబై, కోల్‌కతా, వారణాసి ఇలా అనేక ఇతర ప్రాంతాల నుండి కూడా ప్రజలు ఆమెను చూడటానికి వస్తారట. అమెరికా, యూకే సౌదీ అరేబియా, బంగ్లాదేశ్, పాకిస్థాన్, నేపాల్, ఇరాన్, రష్యా, చైనా , అనేక ఇతర దేశాల వాళ్లు ఫోన్లు చేస్తారన్నాడు. ఎంత స్నేహశీలి అయినా, రాణిగారికి సొంత నిబంధనలు కూడా ఉన్నాయి. ఆమెకు నచ్చితేనే మనుషుల్ని దగ్గరకు రానిస్తుంది. తనకు నచ్చితే వారి ఒడిలో నిద్రపోతుంది కోపం వస్తే మాత్రం చిన్నగా మణికట్టును కొరుకుతుంది. రాణికి ఇష్టమైన ఆహారం, అరటిపండ్లు. వీటితోపాటు బఠానీలు, రొట్టెలు తినడం కూడా ఆమెకు చాలా ఇష్టం. #WATCH | यूपी के रायबरेली जिले में रानी नाम की बंदरिया का एक वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है। वीडियो में बंदरिया रोटी बनाने से लेकर बर्तन धोने समेत घर के काम करते दिख रही है। वीडियो देख हर कोई हैरान है।#Raibareli pic.twitter.com/3UWY4izZ6N— Hindustan (@Live_Hindustan) December 30, 2024 -
వారెవ్వా వెడ్డింగ్ అంటే ఇది..!
భారతీయ వివాహాలు అంటేనే లగ్జరీగా ఉంటాయి. ఖర్చులు, వేస్ట్ రెండూ అధికంగానే ఉంటాయి. పెళ్లి అనంగానే డెకరేషన్ దగ్గర నుంచి భోజనంలో పెట్టే యూజ్ అండ్ త్రో ప్లేట్లు,గ్లాస్లు, వడ్డించే భోజనం వరకు ఎంత చెత్త వస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతేవిధంగా వృధా కూడా చేస్తుంటాం. అవన్నీ పర్యావరణానికి నష్టమే. ముఖ్యంగా రిటర్న్ గిఫ్ట్‌ల పేరుతో ఇచ్చే బహుమతులు.. ప్యాకే చేసే పాలిథిన్ కవర్లు వంటి చెత్త ఎంతో వస్తుంది. ఇలా వాటన్నింటికీ చెక్‌పెట్టేలా పర్యావరణమే పరవశించి దీవించేలా వివాహం చేసుకుంది ఓ జంట. వారెవ్వా వెడ్డింగ్ అంటే ఇది కదా..! అని అంతా అనుకునేలా పర్యావరణ స్ప్రుహ కలిగించేలా పెళ్లి చేసుకుంది. మర్చంట్ నేవీలో చీఫ్ ఆఫీసర్ అశ్విన్ మాల్వాడే అతని భార్య, మార్కెటింగ్ ప్రొఫెషనల్ నుపుర్ అగర్వాల్ జీరో వేస్ట్ వెడ్డింగ్‌తో ఒక్కటయ్యారు. అందరిలో పర్యావరణం పట్ల బాధ్యతతో వ్యవహరించాలనే ఆలోచనకు నాందిపలికేలా సరికొత్త విధంగా వివాహం చేసుకున్నారు. ముంబైలోని వెర్సోవా బీచ్‌లో బీచ్ క్లీనప్ డ్రైవ్ కారణంగా.. ఇద్దరు ఒకరికొకరు పరిచయం అయ్యారు. అలా తొలిసారిగా కలుసుకున్న ఈ ఇద్దరు తమ అభిరుచులు కూడా ఒక్కటే కావడంతో వివాహంతో ఒక్కటవ్వాలనుకున్నారు. తమ అభిరుచికి అనుగుణంగా తమ వివాహం పర్యావరణహితంగా ఉండేలా ప్లాన్ చేశారు. అలానే తమ వెడ్డింగ్ డెకరేషన్లో మొత్తం పూలు, ఆకుపచ్చదనానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఊరేగింపులకు కర్బన ఉద్గారాలు తగ్గించేలా ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే భోజనాల్లో మిగిలిపోయిన ఆహారం పేదలకు పంపిణీ చేశారు. దీంతోపాటు వారి పెళ్లిలో వచ్చిన వ్యర్థాలను కంపోస్ట్ చేయడమే గాక ప్రతిగా సుమారు 300కు పైగా చెట్లను నాటారు. పర్యావరణ స్ప్రుహతో ఈ జంట చేసుకున్న వివాహం అందిరికీ స్ఫూర్తిగా నిలిచింది. View this post on Instagram A post shared by The Better India (@thebetterindia) (చదవండి: ఈ ఏడాది తిరుగులేదు అనేలా సంతోషభరితంగా సాగిపోవాలంటే..!) -
అక్కడ స్నాక్‌గా స్నేక్‌లు..!
మాములుగా మన దేశంలో చిరుతిండిగా వీధి స్టాల్స్‌లో సమోసాలు, బజ్జీలు, పకోడిలు నోరూరించేలా కనువిందు చేస్తుంటాయి. కానీ ఈ దేశంలో స్నాక్‌గా ఏం ఉంటాయో తెలిస్తే వామ్మో అని నోరెళ్లబెడతారు. మనిషికి అత్యంత హానికరమైన దాంతోనే వంటకం, అదే అక్కడ ఫేమస్ కూడా. ఇంతకీ ఏంటా రెసిపీ అంటే..ఫుడ్ వ్లాగర్లు(Food vloggers) ఇతర దేశాల్లో ఉండే వైవిధ్యభరితమైన వంటకాల విశేషాల గురించి చెప్పడమే గాక ఆసక్తిని రేకెత్తిస్తుంటారు. అలానే ఒక భారతీయ వ్లాగర్ తన ఇండోనేషియా(Indonesia) పర్యటనలో వీధి దుకాణల్లో అమ్మే ఫేమస్ వంటకాన్ని గురించి తెలసుకుని కంగుతిన్నాడు. చిరుతిండిగా క్రోబ్రా(cobra)తో చేసిని వంటకాన్నే తింటారట. ఆ వంటకం అంటే అక్కడ పడిచస్తారట. అందుకు తగ్గట్టుగానే వరుస దుకాణాల్లో బోనుల్లో అప్పటికప్పుడు తాజాపాముతో ఈ వంటకాన్ని రెడీ చేయడం తదితరాలను చూసి నోటి మాట రాలేందుంటూ అందుకు సంబంధించిన వీడియోని ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ముఖ్యంగా ఆ వంటకం కోసం క్యూలో నిలబడటం చూసి మతిపోయిందని ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు ఫుడ్ వ్లాగర్. అంతేకాదండోయ్ ఇండోనేషియ వాసులు కోబ్రాతో చేసిన వంటక తినడం వల్ల చర్మఆరోగ్యానికి, వ్యాధి నిరోధక శక్తినికి మంచిదని బలంగా నమ్ముతారట. ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవ్వడమే గాక దాదాపు 4 మిలియన్లు వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోని చూసిన నెటిజన్లు అక్కడ పప్పు, బియ్యంతో వంటలు ఎలా వండాలో నేర్పిస్తానని ఒకరూ, మనిషి కంటే ప్రమాదకరమైన జంతువు ఇంకొకటి లేదని మరొకరు రకరకాలుగా కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Akash Chaudhary (@kaash_chaudhary) (చదవండి: న్యూ ఇయర్ పార్టీ జోష్: ఫస్ట్ డే తలెత్తే హ్యాంగోవర్‌ని హ్యాండిల్ చేయండిలా..!) -
న్యూ ఇయర్ ట్రెండ్..ఈ రాత్రికి '12 గ్రేప్స్' ట్రై చేసి చూస్తారా..!
ప్రపంచమంతా కొత్త ఏడాదికి స్వాగతం పలికే సంబరాలకు సిద్ధమవుతోంది. కొన్ని దేశాలు కొత్త ఏడాదికి ఆహ్వానం పలికేశాయి కూడా. అయితే న్యూ ఇయర్ రాగానే మొదటగా ఈ పని చేయాలి, ఇలా ఉండాలంటూ రిజల్యూషన్స్ పనిలో పడ్డారు కొందరు. నెట్టింట కూడా ఈ చర్చే. అయితే కొత్త ఏడాదికి స్వాగతం పలకడం కోసం 12 ద్రాక్ష పండ్లను సిద్ధం చేసుకోండి అంటూ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఏంటిది వీటిని తింటే మంచి జరుగుతుందా? నిజమేనా అంటే..న్యూ ఇయర్(New Year)కి స్వాగతం పలుకుతూ..అర్థరాత్రి(Midnight) 12 ద్రాక్ష పండ్లు(12 grapes) తినడం అనేది స్పానిష్ సంప్రదాయం. వాళ్లు ఇలా తినడం వల్ల రాబోయే ఏడాదిలో అదృష్టాన్ని ప్రేమను పొందుతారనేది వారి నమ్మకం. శాస్త్రీయంగా ఇది నిజం అనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు గానీ.. రానున్న కొత్త ఏడాది నేపథ్యంలో ఈ ఆచారం తెగ వైరల్ అవుతోంది సోషల్ డియాలో. ముఖ్యంగా మహిళలు ఈ ఆచారాన్ని పాటించేందుకు రెడీ అవుతున్నాం అంటూ పోస్టులు పెడుతున్నారు. అంతేగాదు ఏడాదిలో అదృష్టాన్ని, ప్రేమను పొందేందుకు ఇది తప్పక ట్రై చేయండి అని పోస్టుల వెల్లువెత్తాయి. అంతేగాదు ఈ కొత్త ఏడాది 2025లో కొత్త భాగస్వామి కోసం ఎదురుచూస్తున్నవారు లేదా పెళ్లి చేసుకోవాలనుకునే వారు తప్పనిసరిగా 12 గ్రేప్స్ తినండి అంటూ ఓ ట్రెండ్ ఊపందుకుంది. 12 పండ్లే ఎందుకంటే..ఇది కేవలం సోషల్ మీడియా ట్రెండ్ మాత్రమే కాదు, స్పానిష్ సంప్రదాయంలో భాగం కూడా. దీన్ని "లాస్ డోస్ ఉవాస్ డి లా సూర్టే" అని పిలుస్తారు. దీని అర్థం '12 ద్రాక్షల అదృష్టం' అట. ఇలా ద్రాక్షలు తినే సంప్రదాయ 1800ల చివరలో ప్రారంభమైందట. అయితే ఇప్పుడు పాప్ కల్చర్‌లో భాగంగా మన దేశంలో కూడా ఈ ఆచారం ట్రెండ్ అవుతోంది. ఇక్కడ 12 ద్రాక్షల్లో ఒక్కొక్కటి కొత్త ఏడాదిలోని 12 నెలలను సూచిస్తాయి. ఇలా ఈ పన్నెండు తింటే.. ఏడాదంతా జీవితం సంతోషంగా సాగిపోతుందనేది వారి నమ్మకం. విచిత్రం ఏంటంటే సోషల్ మీడియాలో ఈ ట్రెండ్‌పై తమ అనుభవాలను కూడా చెప్పేస్తూ ఊదరగొట్టేస్తున్నారు. దీంతో అందరూ ఈ ట్రెండ్‌ని అడాప్ట్ చేసుకునేలా పడ్డారు. నిజానికి ఇలా చేస్తే మంచి జరుగుతుందో లేదో తెలియదు గానీ తేలికపాటి పండ్లే కాబట్టి నిరంభ్యంతరంగా ప్రయత్నించొచ్చు. కానీ చలికాలం కాబట్టి రాత్రి టైంలో అలా తింటే ఆరోగ్య పరంగా కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ఏ ఆచారమైన మన నమ్మకాల నుంచే వస్తాయి. హాని కలిగించని ఫన్నీ నమ్మకాలతో ఈ కొత్త ఏడాదిని సంతోషభరితంగా సెలబ్రెట్ చేసుకుని ఖుషీగా ఉందాం. (చదవండి: నర్సుల విశాల హృదయం..సేవతో కొత్త ఏడాదికి స్వాగతం..!) -
చిరుత ఎంట్రీతో..ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్ హోం ఆఫర్ ..!
న్యూ ఈయర్ సంబరాల వేళ కూడా ఆఫీన్ అంటే ప్చ్..! ఏంటిదీ అనే ఫీల్ వచ్చేస్తుంది. డిసెంబర్ 31తో ఈ ఏడాదికి ముగింపు పలికే కొత్త ఏడాదికి వెల్కమ్ చెప్పే సందడి టైంలో మనవాళ్లతో ఉంటే ఆ ఫీల్ వేరుకదూ..!. కానీ ఉద్యోగ బాధ్యతల రీత్యా వెళ్లాల్సిందే. కానీ చిరుత ఎంట్రీతో జాక్‌పాట్ లాంటి అవకాశం కొట్టేశారు టెక్కీ ట్రైనీ ఉద్యోగులు. ఎక్కడంటే..మైసూర్‌లోని ఇన్ఫోసిస్ క్యాంపస్ ఈ ఆఫర్‌ని ఇచ్చింది. డిసెంబర్ 31న ట్రైనీ ఉద్యోగులంతా ఇంటి నుంచే పనిచేసేలా వర్క్ ఫ్రమ్ హోం(Work From Home)ని అమలు చేసింది. మైసూర్(Mysuru) ఇన్ఫోసిస్ క్యాపస్‌లో చిరుత(leopard) ప్రవేశించడంతో ఈ నిర్ణయం తీసుకుంది టెక్కంపెనీ. ఈ నేపథ్యంలోనే క్యాంపస్ లోపలికి ఎవరినీ అనుమతించవద్దని భద్రతా బృందాన్ని కూడా ఆదేశించినట్లు తెలిపింది. అలాగే తన కంపెనీ ట్రైనీ ఉద్యోగులను ఈ రోజు(డిసెంబర్ 31న) ఇంటి నుంచే పనిచేయాల్సిందిగా కోరినట్లు పేర్కొంది టెక్ కంపెనీ. ఇదిలా ఉండగా, మంగళవారం ఇన్ఫోసిస్ మైసూరు క్యాంపస్‌లోకి చిరుత ప్రవేశించినట్లు అటవీ శాఖ అధికారులు ధృవీకరించారు. దీంతో ఆ చిరుతను పట్టుకునేందుకు టాస్క్‌ఫోర్స్ తెల్లవారుజామున 4 గంటలకే సంఘటనా స్థలానికి చేరుకుని కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించినట్లు ఫారెస్ట్ అధికారి ఐబీ ప్రభుగౌడ్ తెలిపారు. కాగా, ఇలా టెక్ కంపెనీ ఆవరణలో చిరుత ప్రవేశించడం తొలిసారి కాదు. గతంలో 2011లో ఇలానే చిరుత క్యాంపస్‌లోకి ప్రవేశించి కలకలం సృషించింది. (చదవండి: ట్రా'వెల్నెస్' టిప్స్..! ప్రయాణాల్లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..) -
అమెరికాలో మన బాస్మతి బియ్యం సంచి క్రేజ్ : నెట్టింట సందడి
సాధారణంగా మహిళలు ట్రెండ్‌కు తగ్గట్టు తమ హ్యాండ్ బ్యాగులు ఉండేలా జాగ్రత్తపడతారు. ఆఫీస్ వేర్ బ్యాగులు, పార్టీ వేర్ టినీ బ్యాగులు, లగ్జరీ హ్యాండ్ బ్యాగ్‌లు, హై-ఎండ్ డిజైనర్ పర్స్‌లు...ఇలా సమ యానుకూలంగా ఎవరి టేస్ట్‌కు తగ్గట్టు వారు ధరించడం ప్టైల్. ఆమెరికాకు చెందిన మహిళ ఒక సాధారణమైన బియ్యం సంచిని స్టయిలిష్‌గా టోట్ బ్యాగ్ (Tote bag) సెలూన్‌కు తీసుకొని వెళ్లిన వైనం నెట్టింట వైరల్ అవుతోంది.మెడ్రన్ దుస్తుల్లో ఉన్న ఒక మహిళ (US Woman) ఒక సెలూన్లో బాస్మతి బియ్యం (Basmati Rice) సంచిని టోట్గా తీసుకువెళ్లడం నెటిజనులను ఆకర్షిస్తోంది ఇండియాలోని ఒకబ్రాండ్కు చెందిన బాస్మతీ బియ్యం సంచిని డిజైనర్ బ్యాగ్‌లాగా ధరించింది. అమెరికాలో ట్రెండింగ్‌లో ఏమి ఉందో చూశారా.. అంటూ షేర్ అయిన ఈ వీడియో ఇప్పటికే ఇది 8 లక్షలకు పైగా వ్యూస్‌ను సాధించింది.‘‘భలే ఉంది, వాటే క్రియేటివిటీ , బోల్డ్ ఫ్యాషన్ ప్రయోగం, బాస్మతి ఉండగా, ఇక గూచి ఎందుకు, ‘‘అయ్యయ్యో.. నా దగ్గర ఉన్న చివరి బియ్యం బస్తా బ్యాగ్ విసిరేసా ..ముందే ఇది చూసి ఉంటేనా..’’ అంటూ రకరకాలుగా నెటిజన్లు ఫన్నీ కామెంట్లను పోస్ట్ చేశారు. రోజువారీ వస్తువులను ఇలా రీయూజ్ చేయడం బావుంది, ఇది పీక్ సస్టైనబిలిటీ - ఒక ప్రయోజనంతో కూడిన ఫ్యాషన్." అని మరికొంతమంది స్పందించారు. అలాగే మొత్తానికి మన జ్యూట్ బ్యాగులు అమెరికన్ల మనసు దోచుకుంటున్నాయి అన్నారు మరికొంతమంది నెటిజన్లు. -
'యూపీఎస్సీ చాట్ భండార్'..నాటి స్వాతంత్య్ర సంగ్రామాన్ని..!
ఎన్నో రకాల వీధి చాట్ భండార్ దుకాణాలు చూసుంటాం. కానీ ఇప్పుడు చెప్పబోయే చాట్ బండార్ మన భారతదేశ స్వాతంత్య్రం కోసం చేసిన సంగ్రామాన్ని గుర్తుచేస్తుంది. స్వతంత్ర్య భారతవని పోరుకి చిహ్నం అని చెప్పొచ్చు. ప్రస్తుతం అది ఆధునికంగా విస్తరించి మంచి లాభాదాయకమైన వ్యాపారంగా నిరాంటకంగా కొనసాగుతోంది. ఇంతకీ ఇదెక్కడ ఉంది? దీనికి యూపీఎస్సీ అనే పేరు ఎందుకు పెట్టారంటే..ఈ చాట్ భండార్ న్యూఢిల్లీలో(Delhi) యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్(UPSC) భవనం ఎదురుగా ఉంది. నిజానికి ఈ చాట్ దుకాణం పేరు "ప్రభు చాట్ భండార్" కానీ అందరూ యూపీఎస్సీ చాట్(UPSC Chaat Bhandar) అనే పిలుస్తారు. 1935లో బ్రిటిష్ పాలనా కాలం నుంచి నడుస్తున్న దుకాణం. దీని యజమాని నాథూ. ఆయన ఆ కాలంలో బ్రిటిష్ పోలీసుల చేత అనేక బెదిరింపులకు, వేధింపులకు గురయ్యేవాడు. అయినా ఇది నాదేశం.. అందుకోసం తన వంతుగా చేస్తున్న జీవన పోరాటంగా అని భావించేవాడు నాథూ. మంచి రోజులు రాకపోతాయనే అతడి ఆశ నెరవేరే రోజు రానే వచ్చింది. భారతదేశానికి స్వతంత్య్రం(Independence) రావడందాంతోపాటు తన దుకాణం కూడా కొంగొత్తగా రూపుదిద్దుకోవడం మొదలయ్యింది. అతడి దుకాణం ప్రభుత్వాధికారులు పనిచేసే సమీపంలో ఉండటంతో..వారే అతడి కస్టమర్లుగా ఉండేవారు. పైగా అనతికాలంలో ఆదాయ పన్ను చెల్లించే దుకాణాల లిస్ట్‌లో చేరిపోయింది. అంతలా లాభాలార్జిస్తూ దూసుకోపోతుంది. ప్రస్తుతం దీన్ని నాథూ మనవడు, కుమారుడు విజయవంతంగా నడుపుతున్నారు. ఈ దుకాణం గొప్పతనం దశాబ్దాల నుంచి అదే రుచి, నాణ్యతతో చాట్‌ని అందించడమే. అదీగాక ఇప్పుడు మరిన్ని విభిన్న రకాల చాట్లను కూడా జోడించారు. ఢిల్లీ ఎలా ఆధునికరించబడిందో.. అలానే ఈ దుకాణం కూడా కొద్దికొద్దీ మార్పులతో ఆధునిక దుకాణంలా రూపుదాల్చుతూ ఉంది. అందువల్లే ఢిల్లీలో ఈ దుకాణం సిటీ ఐకానిక్ ల్యాండ్‌మార్క్(Landmark)గా స్థిరపడిపోయింది. ఏవ్యాపారమైన కస్టమర్ నమ్మకాన్ని బలపర్చేలా నాణ్యతతో రాజీ పడకుండా చేస్తే దానికి తిరుగుండదు అనడానికి ఏళ్ల నాటి ఈ ఐకానిక్ చాట్ భండారే ఉదాహరణ కదూ..!.(చదవండి: Sudoku: ‘సుడోకు’ రావాలంటే గణితంతో పనిలేదు..! కేవలం..) -
‘బాహుబలి ఫ్యామిలీ’ నెట్టింట వైరల్, ఎవరీ గేమ్ ఛేంజర్!
ఒక భార్య, ఓ నలుగురో , ఐదుగురో కొడుకులు, కుమార్తెలు,20-30 మంది మనవలు మనవరాళ్లతో అలరారే కుటుంబాన్ని పెద్ద కుటుంబం అంటూ ఉంటాం. మరి 12 మంది భార్యలు, 102 మంది పిల్లలు , 578 మంది మనవళ్లు ఉన్న ఫ్యామిలీని ఏమని పిలవాలి? 12 మంది భార్యలా? 102 మంది సంతానమా అని నోరెళ్ల బెట్టకండి. నిత్యం ఆకలి , కరువుతో సతమతమయ్యే ఆఫ్రికా దేశాల్లో ఒకటైన ఉగాండాలో ఉందీ బాహుబలి ఫ్యామిలీ.తూర్పు ఉగాండాలోని ముకిజాకు చెందిన 70 ఏళ్ల ముసా హసహ్య కసేరా (MusaHasahyaKasera) ఈ జెయింట్ ఫ్యామిలీకి మూల పురుషుడు. ఈయనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ సందడి చేస్తోంది. 'దిఇండోట్రెక్కర్' అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ అయిన ఈ వీడియోకు ఒక్క రోజులోనే 8.6 లక్షలకు పైగా లైకులు వచ్చాయి.1972లో 17 ఏళ్ల వయస్సులో వివాహం చేసుకోవడంతో అతని పెళ్లిళ్ల పరంపర మొదలైంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 మందిని వివాహం చేసుకున్నాడు. వీరికి 102 మంది పిల్లలు పుట్టారు. అంటే ఒక్కో భార్యకు దాదాపు తొమ్మిది మంది. అంతేనా మరో 578 మంది వారసులకు తాత కూడా. దశాబ్దాలుగా, అతని కుటుంబం అలా విస్తరిస్తూ పోయింది. అతని పిల్లలు ఇప్పుడు 10 - 50 సంవత్సరాల వయస్సు వరకు ఉన్నారు. అతని భార్యలలో చిన్న ఆమెకు 35 ఏళ్ల వయస్సు. ఇపుడు ఈ సంతానం కడుపు నింపేందుకు నానా పాట్లు పడటమే కాదు, మనవలు,మనవరాళ్ల పేర్లు గుర్తు పెట్టుకోవడం కూడా కష్టంగా ఉందట ముసాకు. అందుకే ఒక రిజిస్టర్‌ను మెయింటైన్ చేస్తున్నారు.అతనికున్న ఆస్తల్లా శిథిలావస్థలో ఇల్లు. రెండు ఎకరాల భూమి. దీంతో ఇల్లు గడవక చాలా కష్టపడుతున్నామని వాపోయింది మూడో భార్య జబీనా. పిల్లలు, మనుమలు చేతికి వచ్చిన పని చేస్తారు. మరికొందరు కుటుంబం కోసం నీళ్లు కట్టెలు తీసుకురావడానికి వారి రోజులు గడుపుతారు. వీరందరూ కడుపు నిండా భోంచేయండం కూడా గగనమే. View this post on Instagram A post shared by Kailash Meena (@theindotrekker)మరోవైపు అతని ఆరోగ్యం క్షీణించడం, ఇంత పెద్ద ఇంటిని నిర్వహించడం కష్టంగా ఉండటంతో, అతని ఇద్దరు భార్యలు వెళ్లిపోయారు. టీచర్‌గా పనిచేస్తున్న అతని కుమారుడు షాబాన్ మాజినో(30) కుటుంబ నిర్వహణలో సహాయం చేస్తాడు.దీంతో నెటిజన్లు ఛలోక్తులతో సందడి చేస్తున్నారు. 'ప్రపంచంలో ఎక్కువ మంది పిల్లలను ఉత్పత్తి చేసిన వ్యక్తి' ఒకరు, “ఇస్కో పరివార్ క్యోం బోల్తే హో ...? జిల్లా ఘోషిత్ క్యోం నహీ దేతే.” (వీళ్లని కుటుంబమని అంటారేంటి...జిల్లాగా ప్రకటించాలి) అంటూ వ్యాఖ్యానించారు. బాహుబలి ఫ్యామిలీ, తాతగారు గేమ్ ఛేంజర్ అంటున్నారు. -
వామ్మో..! అలాంటి ఉద్యోగాలు కూడా ఉంటాయా..?
చాలా విచిత్రమైన ఉద్యోగాలు గురించి విన్నాం. వాటి జీతభత్యాలు కూడా అంతే స్థాయిలో విచిత్రంగా ఉంటాయి. కానీ ఇలాంటి వెరైటీ జాబ్ రిక్రూట్మెంట్ చూసి ఉండరు. ఆ జాబ్ క్వాలిఫికేషన్ చూస్తే..వామ్మో ఇవేం అర్హత పరీక్షలని నోరెళ్లబెడతారు. ఏంటా ఉద్యోగం అంటే..చైనాలో ఒక శ్మశానవాటికకి సంబంధించిన రుషన్ మునిసిపల్ బ్యూరో ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ సోషల్ సెక్యూరిటీ ఒక ఉద్యోగ ప్రకటన ఇచ్చింది. ఇది శ్మశానవాటికలోని మృతదేహాల నిర్వహణకు సంబంధించిన మేనేజర్ పోస్ట్. అందుకు సంబంధించిన క్యాలిఫికేషన్ గురించి చాలా వివరంగా పేర్కొంది. శ్మశానంలో ఉద్యోగం ఏంటి అనుకోకండి. చైనా వంటి దేశాల్లో అంత్యక్రియల నిర్వహణకు సంబంధించిన సిబ్బంది, ఉన్నతాధికారులు ఉంటారు. అక్కడ మృతదేహాలను మార్చురీలో భద్రపరచడం లేదా దహన సంస్కారాలు చేయడం వంటి కార్యకలాపాలు ఉంటాయి. ఈ జాబ్‌లో పనిచేసే పురుషులకు కనీస వయసు 45 ఏళ్లు. అలాగే జూనియర్ సెకండరీ స్కూల్ విద్యను పూర్తి చేసి ఉండాలి. ఇక అందుకోసం రూ.850లు పరీక్ష రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఇంటర్వ్యూ వివరాలు వింటే..మాటలు రావు. సుమారు పది నిమిషాల పాటు గడ్డకట్టే శీతల శవాగారంలో గడపాల్సి ఉంటుందట. ఈ పరీక్ష ఎందుకంటే ఇలాంటి చోట పనిచేస్తే వ్యక్తులో భయాన్ని, ఆందోళనల్ని నియంత్రణలో ఉంచుకోవాల్సి ఉంటుంది. అందుకోసమని ఈ అర్హత పరీక్ష అని సదరు అంత్యక్రియల డిపార్ట్మెంట్ వెల్లడించింది. అలాగే అభ్యర్థి మానసిక పరిస్థితికి అనుగుణంగా ఇంటర్న్‌షిప్ వ్యవధి ఉంటుందని వెల్లడించింది. అంతేగాదు చైనాలో ఈ శ్మశానవాటిక సేవల మార్కెట్ 2015లో రూ.18 వేల కోట్ల ఉండగా, అది 2022 నాటికి రూ. 3 లక్షల కోట్లకు విస్తరించింది. వాస్తవానికి సాధారణ సిబ్బంది కంటే ఈ శ్మశాన వాటికలో పనిచేసే వారి జీత భత్యాలే ఎక్కువగా ఉంటాయి. కానీ చైనా శ్మశాన వాటిక మేనేజర్ ఉద్యోగానికి ఇచ్చే వేతనం చాలా తక్కువ. ఈ పోస్ట్ గురించి నెట్టింట తెగ వైరల్ అయ్యింది. అక్కడ అలాంటి ప్రదేశంలో ఉద్యోగం చేసేందుకు ముందుకు రాకుండా చేసేది భయం కాదు ఇచ్చే వేతనమేనని నెటిజన్లు మండిపడుతూ పోస్ట్‌లు పెట్టారు. అందుకోసం పెట్టే పరీక్ష కూడా అమానుషమైనదని తింటిపోస్తూ పోస్టులు పెట్టారు.(చదవండి: డెంటిస్ట్ కాస్త ఐఏఎస్ అధికారిగా..! కానీ ఏడేళ్ల తర్వాత..) -
ప్రియురాలికి ఫ్లాట్, లగ్జరీ కారు, అడ్డంగా బుక్కైన ప్రియుడు!
మహారాష్ట్రలోని ఓ ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగి ఉన్నట్టుండి లగ్జరీ కార్లలో షికార్లు చేయడం మొదలు పెట్టాడు. దాదాపు 22 కోట్ల స్కామ్‌కు పాల్పడి, లగ్జరీ ఫ్లాట్, విలువైన ఆభరణాలు కొనుగోలు చేశాడు. అదీ తన ప్రేయసికోసం. ఏంటా అని ఆరాతీస్తే, ఆరు నెలల పాటు కొనసాగిన ఇతగాడి బండారం బయట పడింది. నెట్టింట హల్చల్ చేస్తున్న స్టోరీ వివరాలు..మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో నెలకు రూ.13వేల జీతంతో కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేసేవాడు హర్ష్ కుమార్ క్షీరసాగర్. లగ్జరీ లైఫ్‌పై మోజు పెంచుకున్న కుమార్ అడ్డదారి వెతుక్కున్నాడు. యశోదా శెట్టి అనే మహిళా ఉద్యోగితో చేతులు కలిపి దాదాపు రూ. 21 కోట్ల 59 లక్షల 38 వేలు కొట్టేశాడు.నకిలీ పత్రాలను ఉపయోగించి ఇండియన్ బ్యాంక్‌లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ పేరుతో ఖాతా తెరిచారు. తరువాత ఇద్దరూ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా భారీ కుంభకోణానికి తెర తీశారు. ఇలా వచ్చిన డబ్బులతో హర్ష్ కుమార్ తన ప్రియురాలికి విమానాశ్రయానికి ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్లో ఏకంగా 4 బీహెచ్‌కే ఫ్లాట్ గిఫ్ట్‌గా ఇచ్చాడు. అంతేనా..తగ్గేదేలే అంటూ బీఎండబ్ల్యూ కారు, బీఎండబ్ల్యూ బైక్, ఖరీదైన డైమండ్ ఆభరణాలు కొనుగోలు చేశాడు. దాదాపు ఆరు నెలల తరువాత వీరి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. హర్ష్‌కుమార్, యశోదా శెట్టి, ఆమె భర్త బీకే జీవన్ కలిసి బ్యాంకుకు ఫేక్ పత్రాలను సమర్పించి డబ్బులను డ్రా చేశారని విచారణలో తేలింది. ఈ డబ్బులను తమ వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయించు కున్నారని పోలీసులు గుర్తించారు.మహిళా కాంట్రాక్ట్ వర్కర్ భర్త రూ.35 లక్షల విలువైన ఎస్‌యూవీని కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది. ప్రస్తుతం ఈ కేసులో ప్రధాన నిందితుడు హర్ష్ కుమార్ అనిల్ క్షీరసాగర్ ఎస్‌యూవీతో పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.ఇదీ చదవండి: రిటైర్మెంట్ డిప్రెషన్ డేంజర్ బెల్స్ : ఏం చేయాలి?! -
క్వీన్ ఐశ్వర్య ‘ఐకానిక్ లెహంగా' ఆస్కార్ మ్యూజియానికి
అద్భుతమైన ఒక డిజైనర్ లెహంగా మరో అద్భుతాన్ని సాధించడం ఎక్కడైనా విన్నారా? నీతా లుల్లా రూపొందించిన లెహంగా అలాంటి ప్రత్యేకతను సంతరించుకుంది. బాలీవుడ్ జోధా అక్బర్ మూవీలో, స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ (Aishwarya Rai) పాత్ర కోసం నీతా లుల్లా డిజైన్ చేశారు. దీన్ని ఇపుడు ప్రపంచం మొత్తం ప్రత్యక్షంగా చూడగలిగేలా ప్రతిష్టాత్మక ఆస్కార్ మ్యూజియంలో కొలువు దీరింది. ఈ విషయాన్ని అకాడమీ తన అధికారిక ఇన్‌స్టా పోస్ట్ ద్వారా వెల్లడించింది. ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (AMPAS) అకాడమీ మ్యూజియం కలర్ ఇన్ మోషన్ ఎగ్జిబిషన్లో సినిమాలో క్వీన్ ఐశ్వర్య ధరించిన దుస్తులే కాకుండా ఆమె ఆభరణాలు కూడా బొమ్మపై రూపొందించారు. ఈ విషయాన్ని అకాడమీ తన అధికారిక ఇన్‌స్టా పోస్ట్ ద్వారా వెల్లడించింది.దీంతో ఈ లెహెంగాను రూపొందించిన నీతా లుల్లా నైపుణ్యం పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.A lehenga fit for a queen, designed for the silver screen.In JODHA AKBAR (2008), Aishwarya Rai Bachchan’s red wedding lehenga is a feast for the eyes: vibrant zardozi embroidery, centuries-old craftsmanship, and a hidden gem—quite literally. Look closely and you’ll spot a… pic.twitter.com/UfUYxTeP22— The Academy (@TheAcademy) December 24, 2024 > ఐకానిక్ రెడ్ లెహెంగా,నగల విశేషాలివేజర్దోజీ ఎంబ్రాయిడరీ , శతాబ్దాల నాటి హస్తకళా నైపుణ్యం ఈ లెహెంగాలో దాగి ఉంది. ఇదే విషయాన్ని అకాడమీ తన పోస్ట్‌లో పేర్కొంటూ, ప్రశంసింయింది. నటి ధరించిన ఆభరణాలు మరింత ఆకర్షణగా ఉన్నాయి. ఆమె ధరించిన నెక్లెస్ మధ్యలో నీలం రాళ్లతో భారతదేశ జాతీయ పక్షి నెమలి మరో ఎట్రాక్షన్.జోధా అక్బర్ (Jodha Akbar) "రాణికి సరిపోయే లెహంగా, వెండితెరపై ఎంతోమందిని ఆకర్షించింది ఇకపై ఆస్కార్ మ్యూజియంలో కొలువు దీరనుంది అని అకాడమీ తెలిపింది. కాగా 2008లో అశుతోష్ గోవార్కర్ దర్శకత్వంలో వచ్చి సూపర్ హిట్‌ను సొంతం చేసుకున్న చిత్రం ‘జోధా అక్బర్’. ఐశ్వర్య 'జోధా బాయి' పాత్రలో అందర్నీ ఆకట్టుకుంది. ఈ మూవీలో హీరోగా హృతిక్ రోషన్ నటించారు. వీరి రాయల్ లుక్‌కోసం రాజస్తానీ, మొఘల సంస్కృతుల మేళవింపుతో అసలు సిసలు బంగారం, విలువైన రాళ్లతో మొత్తం 400 కిలోల ఆభరణాలను తయారు చేయించారన. ఇందులో 200 కిలోల ఐశ్వర్య ప్రాతకోసం. ఈ మొత్తం ఆభరణాల తయారీకి 70 మంది కళాకారులు రెండేళ్ల పాటు శ్రమించారని చెబుతారు. -
రూ. 31 లక్షలు ఖర్చుపెట్టి మరీ యూట్యూబర్ ప్రయోగం : ఎందుకో ఊహించలేరు
భూమి ఫ్లాట్‌గా ఉందని నిరూపించడానికి యూట్యూబర్ అత్యంత సాహసానికి పూనుకున్నాడు. ఏకంగా రూ. 31 లక్షలతో యాత్ర చేశాడు. చివరికి ఏమైంది? ఆసక్తిగా ఉంది కదూ. పదండి అసలేమైందో ఈ కథనంలో తెలుసుకుందాం.భూమి బల్లపరుపుగా లేదా ఫ్లాట్‌గా ఉంటుందని గట్టిగా వాదన ఇప్పటిది కాదు. అయితే ఫ్లాట్‌గా ఉంటుందని గట్టిగా నమ్మేవాళ్లు ఎందరో ఉన్నారు. తాజాగా ఫ్లాట్ ఎర్త్ సిద్ధాంతాలపై పేరుగాంచిన యూట్యూబర్ జెరన్ కాంపనెల్లా (Jeron Campanella) భూమి ఆకారం గుండ్రంగా లేదు అని తేల్చాలను కున్నాడు. తన వాదనలను ధృవీకరించడానికి అంటార్కిటికాకు రూ. 31.4 లక్షల (37,000 డాలర్లు) ఖర్చుతో కూడిన యాత్ర చేశాడు.NEW: Flat Earther travels all the way to Antarctica to prove that the Earth is flat only to find out that it's not.Lmao.Flat Earth YouTuber Jeran Campanella went on a $35,000 trip to prove that there was "no 24-hour sun.""Sometimes you are wrong in life and I thought there… pic.twitter.com/8jvLWawB2J— Collin Rugg (@CollinRugg) December 18, 2024తన ప్రయాణానికి ముందు, కాంపనెల్లా అంటార్కిటికాలో ఉదయాస్తమాలు లేకుండా సూర్యుడు 24 గంటలూ ఉంటాడనే సిద్ధాంతాన్ని నమ్మలేదు. దక్షిణ ఖండానికి అతని పర్యటన ఈ నమ్మకాలను బద్దలు కొట్టింది.కాంపనెల్లా ప్రయాణం కొలరాడో పాస్టర్ విల్ డఫీ నేతృత్వంలో తన నమ్మకాన్ని పరీక్షించడానికి కాలిఫోర్నియా(California) నుంచి దాదాపు 14,000 కిలోమీటర్లు ప్రయాణించి అంటార్కిటాకు చేరాడు. అక్కడ మిడ్నైట్ సన్ని చూసి షాక్ అయ్యాడు. “అంటార్కిటికా ఓ మంచు గోడ, సూర్యుడు రోజూ ఉదయిస్తాడు, అస్తమిస్తాడు” అన్న తన నమ్మకం నిజంకాదని తేల్చుకున్నాడు. "కొన్నిసార్లు జీవితంలో తప్పు చేస్తాం," అంటూ కాంపనెల్లా తన పర్యటన తర్వాత ఒక వీడియోను షేర్ చేశాడు. తన తప్పును అంగీకరిస్తూ, ఫ్యాన్స్‌కు వివరణ ఇచ్చాడు "ఇలా చెప్పినందుకు నన్ను షిల్ అని పిలుస్తారని నాకు తెలుసు. అయినా నష్టంలేదు, నిజాయితీగా ఉండటం ముఖ్యం" అంటూ అసలు విషయాన్ని అంగీకరించాడు.ట్విస్ట్ ఏంటంటే...తన ఫ్లాట్ ఎర్త్ మ్యాప్ తప్పని తేలిందని అంగీకరించిన కాంపనెల్లా చేసిన మరో ప్రయోగం కూడా ఉంది. కాంపనెల్లా ప్రయాణం కొలరాడో పాస్టర్ విల్ డఫీ నేతృత్వంలోని ‘ది ఫైనల్ ఎక్స్పెరిమెంట్’ అనే కార్యక్రమంలో భాగమే ఈ పర్యటన. భూమి ఫ్లాట్‌గా ఉందని నమ్మే నలుగురు మిడ్నైట్ సన్ని ప్రత్యక్షంగా చూసేందుకు అంటార్కిటికాకు వెళ్లారు. చివరికి భూమి గోళాకారమని శాస్త్రీయంగా నిరూపించారు. ‘‘ఈ ప్రయోగంతో భూమి ఫ్లాట్‌గా ఉందనే వాదనకు ముగింపు పలకవచ్చు”అని డఫీ ధీమాగా చెప్పారు. దీంతో భూమి ఆకారాన్ని దాచడానికి ఎవరినీ అనుమతించరని ప్రచారంలో ఉన్న వాదనలకు కూడా చెక్‌పడింది. ఎలాంటి ఆంక్షలు లేకుండా ఎవరైనా అంటార్కిటికాను సందర్శించవచ్చని తేలింది.భూమి గోళాకారంలో అనడానికి నిదర్శనంగా అంటార్కిటికాలో దక్షిణ వేసవిలో సూర్యుడు అస్తమించడు. ఇక్కడ వేసవిలో సూర్యుడు 24 గంటలూ కనిపిస్తాడు. ఈ దృగ్విషయం, ధ్రువ ప్రాంతాలకు ప్రత్యేకమైనది. కాగా గతంలో భూమి గుండ్రంగా లేదని, బల్లపరుపుగా ఉందని నమ్మే ఓ అమెరికన్ పైలట్ తన అభిప్రాయం నిజమని నిరూపిస్తానంటూ ఈ రాకెట్ ప్రయోగం చేపట్టిన సంగతి గుర్తుందా? సొంతంగా తయారు చేసిన ఆవిరితో ప్రయాణించే రాకెట్ ద్వారా యాత్ర చేపట్టాడు. కానీ రాకెట్ ప్రయోగం విఫలం కావడంతో 64 ఏళ్ల 'మ్యాడ్' మైక్ హ్యూజ్ ప్రాణాలు పోగొట్టుకున్నాడు. -
‘స్వామీ.. ఎన్నాళ్లీ ఎదురు చూపులు, త్వరలో జంటగా’ : ఇన్ఫ్లూయెన్సర్పోస్ట్ వైరల్
బీర్‌బైసెప్స్‌గా పాపులర్ అయిన కంటెంట్ క్రియేటర్ రణవీర్ అల్లాబాడియా. భారతదేశంలోని అత్యంత ప్రముఖ యూట్యూబర్ పోడ్కాస్టర్కు ఒక మహిళా వీరాభిమాని ఉంది. సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్‌తో ఇంటర్నెట్ సంచలనంగా మారిన రణవీర్‌ను రోహిణి అర్జు అనే అమ్మాయి విపరీతంగా అభిమానిస్తుంది. దీనికి సంబంధించి అనేక రీల్స్,వీడియోలు గతంలో నెట్టింట్ హల్చల్ చేశాయి. తాజాగా మరో వీడియోను పోస్ట్ చేయడం విశేషంగా నిలిచింది.ఆ అభిమాని పేరే రోహిణి అర్జు. ఈమె ఆధ్యాత్మికత కంటెంట్ క్రియేటర్. పశువైద్యురాలు. అల్లాబాడియా పట్ల తనకున్న అభిమానాన్ని తెలియజేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా వీడియోలను పోస్ట్ చేసింది. తాజాగా "స్వామీ, నేను వేచి ఉన్నాను..."అంటూ అతనికి ప్రపోజ్ చేసింది. ‘‘ఎంతమంది వెక్కిరించినా, ఎగతాళి చేసినా,పిచ్చి అనుకున్నా, ఎక్కడ ఎలా, ఉన్నావనేదానితో సంబంధం లేకుండా నిన్ను ప్రేమిస్తూనే ఉంటా.. రణ్వీర్ అల్లాబాడియా.. నా స్వర్వస్వం నీవే’’ అంటే పోస్ట్ చేసింది. ఆమె శరీరంపై ‘రణవీర్’ టాటూను కూడా గమనించవచ్చు. అక్కడితో ఆగలేదు. మరొక పోస్ట్‌లో, "స్వామీ,మీ కోసం జీవితకాలం వేచి ఉన్నాను, చివరకు భార్యాభర్తలుగా త్వరలో మారబోతున్నాము" అని పేర్కొంది. అల్లాబాడియా ఫోటోలను అల్పాహారం చేయడం, బెడ్ మీడ పెట్టుకుని నిద్రపోవడం దాకా రీల్స్ చేసింది. దీంతో ఇది మరోసారి నెట్టింట చర్చకు దారి తీసింది. కొంతమంది రణవీర్‌కు ట్యాగ్ చేస్తుండగా, మరికొంతమంది ఈమెకు వెంటనే మానసిక చికిత్స కావాలంటూ వ్యాఖ్యానించారు. ఇది ఎరోటోమానియా అనే మానసిక రుగ్మత అని కొందరు, కేవలం ఆన్లైన్ క్రేజ్, డబ్బు కోసం చేస్తున్న పని అని మరికొందరు వ్యాఖ్యానించారు. గతేడాది సెప్టెంబరులో, అల్లాబాడియాకు, తనని తప్ప ఎవరినీ పెళ్లి చేసుకోనని ప్రకటించేసింది. ఫలితంతో సంబంధం లేకుండా తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. గతంలో కర్వా చౌత్ ఆచారాన్ని (పెళ్లైన మహిళలు, కొత్త పెళ్లికూతుళ్లు వ్రతం ఆచరించే) పాటిస్తున్న వీడియోను ఫోటోతో షేర్ చేయడం వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Dr. Rohini Arju (@rohiniiarju) -
గిరిజనుల ఐక్యతకు భారతీయ హార్న్‌బిల్
భారతదేశంలోని ఈశాన్యప్రాంతంలో ప్రతి డిసెంబర్లో నాగాలాండ్‌లోని రోలింగ్ కొండల మధ్య సుందరమైన కోహిమా ప్రాంతం నాగా తెగల సాంస్కృతిక వేడుకలకు కేంద్ర బిందువు అవుతుంది. అక్కడి గిరిజనులు తమ అరుదైన సంస్కృతిని ప్రదర్శించడానికి హార్న్‌బిల్ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. వివిధ తెగల మధ్య ఐక్యతకు, శాంతికి, సంస్కృతికి ప్రతీకగా పాతికేళ్లుగా ప్రతియేటా జరిగే ఈ వేడుకలో లక్షన్నరకు పైగా సందర్శకులు పాల్గొన్నారు. దీంతో ఈ వేడుక ప్రపంచమంతటినీ ఆకర్షించింది. పర్యాటకాన్ని ప్రోత్సహించడం, నాగా తెగల శక్తివంతమైన గుర్తింపును వెలుగులోకి తీసుకురావం ఈ వేడుక ముఖ్య ఉద్దేశ్యం. పండుగ సందర్భంగా ఇక్కడ ప్రతి తెగ దాని స్వంత సజీవ నృత్యాలు, పాటలు, ఆచారాలను ప్రదర్శించడమే కాదు నాగా వంటకాలు విభిన్న రుచులను అందిస్తాయి. స్థానిక కళాకారులు, హస్తకళాకారులు ప్రదర్శనలో భాగం అవుతారు. తద్వారా వారు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం కల్పిస్తుంది. చేతితో నేసిన వస్త్రాలు, సాంప్రదాయ ఆభరణాలు, వివిధ హస్తకళలతో నిండిన స్టాల్స్ పండుగకు వెళ్లేవారికి సాంస్కృతిక ్ర΄ాముఖ్యతతో కూడిన సావనీర్లను ఇంటికి తీసుకెళ్లడానికి సరైన అవకాశాన్ని అందిస్తాయి. నిర్దిష్ట తెగలు, వారి విలక్షణమైన సంప్రదాయాలకు నివాళులు అర్పిస్తూ ప్రత్యేక నేపథ్య సాయంత్రాలను ప్లాన్ చేయవచ్చు. ఉదాహరణకు కొన్యాక్ తెగ వారు వారి సంప్రదాయ పచ్చబొట్లు, పాటలు, కథలు వారి జీవన విధానంపై అవగాహన కలిగిస్తాయి. మరొక తెగ వారి ప్రాచీన నృత్యాల ద్వారా చారిత్రక కథలను వివరిస్తాయి.ఇదీ చదవండి: టీ లవర్స్ : టీ మంచిదా? కాదా? ఈ వార్త మీకోసమే!వివిధ తెగల మధ్య శాంతిఈ ఫెస్టివల్ తెగల మధ్య ఐక్యతను పెం΄÷ందిస్తుంది. గిరిజన సంఘర్షణల చుట్టూ తరచుగా గందరగోళ చరిత్ర ఉన్నందున, ఈ పండుగ వివిధ వర్గాల మధ్య అంతరాలను తగ్గిస్తుంది. భవిష్యత్ తరాలకు దేశీయ సంస్కృతుల పరిరక్షణకు భరోసానిస్తూ, నాగా యువకులు తమ మూలాలతో మళ్లీ కనెక్ట్ అవ్వడానికి ఇది ఒక వేదికగా మారుతుంది. వివిధ ΄ోటీలను నిర్వహించి గిరిజన యువతలో గర్వం, ప్రేరణను సృష్టిస్తుంది. రాత్రి సమయాల్లో జరిగే కచేరీలకు వివిధ ప్రాంతాల నుండి బ్యాండ్ లను ప్రదర్శిస్తారు. ప్రతి రోజు ఉత్సాహభరితమైన శ్రావ్యమైన పాటలతో ముగుస్తుంది. స్థానికులు, పర్యాటకులు, ప్రదర్శకులు కలిసి ఆనందాన్ని పొందడానికి వీలు కల్పిస్తుంది. పాతికేళ్లుగా హార్న్‌బిల్ ఫెస్టివల్ నాగా సంస్కృతిని పరిరక్షించడమే కాకుండా దాని అభివృద్ధిని కూడా వాగ్దానం చేస్తుంది. భవిష్యత్ తరాలకు ఈ విలువైన సంప్రదాయాలను వారసత్వంగా, భాగస్వామ్యం చేయడానికి మార్గం సుగమం చేస్తుంది. ఇలాంటి సంప్రదాయ వేడుకలు మన భారతీయ సంస్కృతిని ఇంకా సుసంపన్నం చేస్తూనే ఉన్నాయి అనడానికి హార్నబిల్ ఓ ఉదాహరణగా నిలుస్తుంది. View this post on Instagram A post shared by Hornbill Festival Nagaland (@hornbillfestivalofficial) -
150 ఏళ్ల నాటి మెట్లబావి వెలుగులోకి, వారసురాలి స్పందన
ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో అరుదైన మెట్లబావి (Stepwell) వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని చందౌసి ప్రాంతంలో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న తవ్వకాల్లో ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) బృందం గుర్తించింది. 46 ఏళ్ల తర్వాత రాష్ట్రంలోని సంభాల్ జిల్లాలో శివ-హనుమాన్ ఆలయాన్ని తిరిగి తెరిచిన నేపథ్యంలో దీన్ని గుర్తించారు.సంభాల్ జిల్లా కలెక్టర్ రాజేంద్ర పెన్సియా ఈ విషయాన్ని ధృవీకరించారు. 400 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 150 ఏళ్ల నాటి ‘బావోలి’ని కనుగొన్నట్లు ఆదివారం మీడియాకు వివరించారు. ఈ మెట్ల బావి చుట్టూ నాలుగు గదులతో కూడిన పాలరాతి నిర్మాణాలు, కొన్ని అంతస్తులు ఉన్నాయని వివరించారు. ‘ఈ అహ్-బావోలి తలాబ్ను బిలారి రాజు తాత కాలంలో నిర్మించినట్టుగా భావిస్తున్నామన్నారు. రెండు, మూడు అంతస్తులు పాలరాతితో, పై అంతస్తులు ఇటుకలతో నిర్మించారనీ తవ్వకం చుట్టూ నాలుగు గదులు ఉన్నాయని తెలిపారు. మొత్తం నలుగురు సభ్యుల బృందం సంభాల్‌లో,24 ప్రాంతాల్లో సర్వే చేశామని జిల్లా మేజిస్ట్రేట్ పెన్సియా తెలిపారు. ఐదు 'తీర్థాలు', 19 బావులను, కొత్త ఆలయాన్ని కూడా తనిఖీ చేశారు. ఈ సర్వే 8-10 గంటలపాటు జరిగిందన్నారు. (కీర్తి సురేష్ పెళ్లి చీర : స్పెషల్‌గా కీర్తి ఏం చేసిందో తెలుసా?)రాణి సురేంద్ర వాలా మనవరాలురాణి సురేంద్ర వాలా మనవరాలు శిప్రా స్పందించారు. ఇది తమ పొలం అని, వ్యవసాయం చేసేవారమని, పొలాల్లో ఒక మెట్టు బావి ఉందని చెప్పారు. అలాగే లోపల గదులుండేవని వ్యవసాయ పనుల సమయంలో ఇక్కడ ప్రజలు విశ్రాంతి తీసుకునేవారమని చెప్పారు. 1995లో తాము ఈ పొలాన్ని బదౌన్కి చెందిన అనెజాకు అమ్మేశాం. పొలం అమ్మేసిన తరువాత ఇక్కడికి మళ్లీ ఎపుడూ రాలేదని చెప్పారు. అలాగే ఆ భూమిని అతను ఎవరికి అమ్మిందీ తమకు తెలియదన్నారు. ప్రభుత్వం దీనిని సంరక్షించాలనుకుంటే, తమకెలాంటి అభ్యంతరం లేదని తెలిపారు.#WATCH | Sambhal, Uttar Pradesh: Rani Surendra Wala's granddaughter Shipra says, "This was our farm, farming was done here. There was a step well in the fields, inside which rooms were built, people used to rest in it during farming time. My father had sold the field to someone,… https://t.co/GPGizmZbBV pic.twitter.com/rJIt7oKDeY— ANI (@ANI) December 22, 2024 -
ఖో..ఖో : ఇంట్రస్టింగ్ స్టోరీ.. ఖో అంటే అర్థం ఏంటి?
ఇప్పుడు కొన్ని స్కూళ్లలో దీనిని మర్చిపోయారుకాని ఒకప్పుడు ప్రతి స్కూల్లో ఆడించేవారు. పిల్లలు ఉత్సాహంగా ఆడేవారు. ఖొఖొ ఆట ఆడటం సులువు కాబట్టి పిల్లలు స్కూళ్లలో, ఇంటి వద్ద, మైదానాల్లో ఆడవచ్చు. ఇది ఆడేందుకే కాదు, చూసేందుకూ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మరి ఖొఖొ చరిత్రేమిటో తెలుసా? ఖొఖొ దక్షిణాసియా సంప్రదాయ క్రీడ. క్రీ.పూ నాలుగో శతాబ్దం నుంచే ఈ ఆట ఆడి ఉంటారని చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. మహాభారతంలో కూడా ఖొఖొ ప్రస్తావన ఉందని కొందరి మాట. అప్పట్లో దీన్ని ‘ఖొ ధ్వని క్రీడ’ అని పిలిచేవారు. అంటే ‘ఖొ’ అని శబ్దం చేస్తూ ఆడే ఆట అని అర్థం.రకరకాల నియమాలు, విధానాలతో ఆడే ఈ ఆట 1914 నుంచి ఒక స్థిరమైన రూపాన్ని పొందింది. పుణెలోని డక్కన్ జింఖాన్ క్లబ్ వారు ఈ ఆటకు సంబంధించి నిబంధనలు ఏర్పాటు చేసి తొలి రూల్ బుక్ తయారుచేశారు. అనంతరం అనేక పోటీల్లో ఖొఖొ భాగమైంది. దక్షిణాసియా క్రీడాపోటీలు, ఖేలో ఇండియా, నేషనల్ గేమ్స్ ఆఫ్ ఇండియా వంటి వేదికలపై ఖొఖొ చోటు దక్కించుకుంది. ఆటలో ఒక జట్టుకు ఏడుగురు క్రీడాకారులు ఉంటారు. వారిలో ఒకరు పరిగెడుతూ ఉండగా మరో జట్టులోని వ్యక్తి అతణ్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. అతని వెళ్లే మార్గాన్ని బట్టి పరిగెత్తే వ్యక్తి మరో వ్యక్తిని తట్టి ‘ఖొ’ అంటాడు. వెంటనే అతను లేచి అవతలి జట్టు వ్యక్తి కోసం పరిగెడతాడు. అతని స్థానంలో అతనికి ‘ఖొ’ ఇచ్చిన వ్యక్తి కూర్చుంటాడు. ఇది ‘ఖొఖొ’ ఆడే విధానం. మొదట్లో మట్టి, ఇసుక వంటివి ఉన్నచోట ఖొఖొ ఆడేవారు. ప్రస్తుతం స్టేడియంలో ఏర్పాటు చేసిన కోర్టుల్లోనూ ఆడుతున్నారు. మనదేశంలో నస్రీన్ షేక్, సతీష్రాయ్, సారికా కాలె, పంకజ్ మల్హోత్రా, మందాకినీ మఝీ, ప్రవీణ్‌కుమార్ వంటివారు ఖొఖొ క్రీడాకారులుగా గుర్తింపు పొందారు. 2024 మార్చిలో జాతీయ ఖొఖొ ఛాంపియన్ షిప్‌పోటీలు నిర్వహించారు. అందులో మహారాష్ట్ర జట్లు స్త్రీ, పురుషుల విభాగాల్లో విజేతలుగా నిలిచాయి. ఖొఖొకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు ‘అంతర్జాతీయ ఖొఖొ సమాఖ్య’ 2025లో ‘ఖొఖొ ప్రపంచ కప్ పోటీలను నిర్వహించాలని అనుకుంటోంది. ఇందులో భారత ఖొఖొ సమాఖ్య కూడా భాగం కానుంది. దీంతోపాటు 2036లో జరిగే ఒలింపిక్స్‌లో ఖొఖొను కూడా చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఖొఖొ నేర్చుకోండి. ఈసారి మరింత ఉత్సాహంగా ఆడండి. -
సుదీర్ఘ రాత్రికి కారణమేమిటి?
ఈ ఏడాది డిసెంబర్ 21కి ఓ ప్రత్యేకత ఉంది. పగటి సమయం 8 గంటలూ, రాత్రి సమయం 16 గంటలూ ఉంటుందని అంటున్నారు. కానీ, పదమూడున్నర గంటలే ఉంటుందనేది నిపుణుల అభిప్రాయం.సాధారణంగా ప్రతిరోజూ మనకు 12 గంటల పగలు 12 గంటలు రాత్రి సమయం ఉంటుంది. అయితే రుతువులను బట్టి, భూమిపై ఉన్న ప్రాంతాన్ని బట్టి పగలు – రాత్రుల సమయంలో ఎక్కువ తక్కువలూ ఉంటాయి. భూమి ఇరుసు 23.4ని కోణంలో వంగి ఉండటం వలన సూర్యుని నుండి వెలువడే సూర్యకాంతి భూమిపైన సమానంగా కాకుండా వివిధ కాలాలలో వివిధ రీతుల్లో పడుతుంది. ఫలితంగా రాత్రి–పగలు సమయాల్లో ఒక్కోసారి ఎక్కువ తేడాలు వస్తాయి. దీన్నే ‘ఆయనాతం’ అంటారు.సంవత్సరంలో రెండుసార్లు అయనాతం ఏర్పడుతుంది. మొదటిది వేసవి కాలపు ఆయనాతం కాగా, రెండవది శీతాకాలపు ఆయనాతం. శీతాకాలపు ఆయనాతం డిసెంబర్ 19–23 తేదీల మధ్యలో ఏదో ఒక రోజు ఏర్పడుతుంది. ఈరోజు మనం చూసేది శీతాకాలపు అయనా తాన్నే. ఇదే సమయంలో ఆస్ట్రేలియా వంటి ప్రాంతాల్లో పగలు ఎక్కువగా ఉండి రాత్రి తక్కువగా ఉంటుంది. శీతకాల ఆయనాతంతో భూమి ఉత్తరాయణం ప్రారంభిస్తుంది. అంటే... సూర్యుడు ఉత్తర దిశ వైపుకు కదలడం ప్రారంభిస్తాడు. అదే క్రమంలో జనవరి నుండి పగలు సమయం క్రమంగా పెరుగుతూ రాత్రి సమయం క్రమంగా తగ్గుతుంది.చదవండి: పురాతన నిధిలో గ్రహాంతర పదార్థాలు..!అయనాతం వంటి వాటిని ఆసరా చేసుకుని కొంతమంది ప్రత్యేక పూజలు చేస్తామంటూ కల్లబొల్లి మాటలతో ప్రజలను మోసం చేసే అవకాశం ఉంది. గ్రహణం ఏర్పడడం, ఆయనాతం ఏర్పడడం, నెలలో ఒకసారి పౌర్ణమి, ఒకసారి అమావాస్య ఏర్పడడం... ఇవన్నీ ప్రకృతిలో చోటు చేసుకునే సహజ ప్రకియలు. శాస్త్రీయ సమాచారాన్ని అర్థం చేసుకుని మోసగాళ్ల పాలబడకుండా జాగ్రత్తగా ఉండాలి. మూఢనమ్మకాలను నిర్మూలించి శాస్త్రీయ సమాజం నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.– చార్వాక, సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ నేషనల్ కోఆర్డినేటర్ -
ఏడు ఆపరేషన్లు, ఏడు లక్షలు ఖర్చు, చివరికి ఏడడుగులు: ముద్దుగుమ్మల లవ్‌స్టోరీ
ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు అమ్మాయిల స్నేహం వీర ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. ఇందులో పెద్ద వింత ఏముంది అనుకుంటున్నారా? ఈ జంటలోఒక అమ్మాయి తన లింగాన్ని మార్చుకుని పెళ్లి చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో జరిగిన వివాహానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు ఒక అమ్మాయి ఏకంగా ఏడుసార్లు లింగ మార్పిడికి సంబంధించిన ఆపరేషన్లు చేయించుకుంది ఇందుకోసం ఏడు లక్షల రూపాయలు ఖర్చుపెట్టింది. అంతేకాదు ఇరు కుటుంబాల అంగీకారంతో అంగరంగ వైభవంగాజరిగిన పెళ్లి వేడుకలో ఏడడుగులు వేసింది. దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు నెట్టింట తెగవైరల్ అవుతున్నాయి.#UttarPradesh | Two girls got married, with one undergoing a gender change to become a man and taking on the role of the groom.This unique marriage has become the talk of the entire Kannauj district!What are your thoughts about this marriage? pic.twitter.com/w2Jskwytk2— Organiser Weekly (@eOrganiser) December 20, 2024 కన్నౌజ్‌లోని సరయామీరాలో ఉన్న డెవిన్ తోలా ప్రాంతానికి వీరిద్దరూ ఇటీవల కొన్ని రిలేషన్షిప్లో ఉన్నారట. వీరి పెళ్లికి కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పడంతో తన లింగాన్ని మార్చుకొని మరీ స్నేహితురాల్ని పెళ్లాడింది. గతేడాది ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో కూడా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. బదౌన్‌కు చెందిన ఓ యువతి టీచర్ గా పని చేసేందుకు బరేలీకి వచ్చింది. అక్కడ ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న మరో అమ్మాయితో పరిచయం ఏర్పడింది. అయితే పెళ్లి, లేదంటే చావు అన్న స్థితికి వచ్చారు. దీంతో కుటుంబ సభ్యుల చొరవతో లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకుని అన్ని అవరోధాలు అధిగమించిన తరువాత వివాహం చేసుకున్నారు. -
సినిమాని తలపించే ప్రేమకథ..వింటే కన్నీళ్లు ఆగవు..!
ఎన్నో ప్రేమ కథలు చూశాం. వాటిలో కొన్ని మాత్రం విషాదంగా ముగిసిపోతే..మరికొన్ని కన్నీళ్లు తెప్పించేస్తాయి. అలాంటి భావోద్వేగపు గాథే ఈ ప్రేమ జంట కథ. సుఖాల్లో ఉన్నప్పుడు ఉండే ప్రేమ.. కష్టాల్లో కనుమరుగైపోతుందంటారు పెద్దలు. కానీ ఈ జంట మాత్రం కష్టాల్లో అంతకు మించి..ప్రేమ ఉందని ప్రూవ్ చేసింది. విధికే కన్నుకుట్టి వారి ప్రేమను పరీక్షించాలనుకుందో, కబళించాలనుకుందో గానీ కేన్సర్ మహమ్మారి వారి ప్రేమను దూరం చేయాలనుకుంది. కానీ ఈ నేపాలీ జంట తమ ప్రేమ అత్యంత గొప్పదని నిరూపించుకుని కష్టమే కుంగిపోయేలా చేశారు.సృజన, బిబేక్ సుబేదిలు తమ జీవితాన్ని డాక్యుమెంట్ రూపంలో ఇన్‌స్టాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఆ జంట ప్రేమకథ అందరి దృష్టిని ఆకర్షించింది. బిబేక్ కేన్సర్‌తో భాదపడుతున్నాడు. కేన్సర్ ఫస్ట్ స్టేజ్ నుంచి ఫోర్త్స్టేజ్ వరకు తామెలా కష్టాలు పడుతుంది తెలియజేసింది. చెప్పాలంటే నెటిజన్లంతా సృజన కోసమైనా.. అతడు మృత్యవుని జయిస్తే బావుండనని కోరుకున్నారు. కానీ అలా జరగలేదు. బిబేక్ ఆ మహమ్మారి కారణంగా తనకెంతో ఇష్టమైన భార్యను కూడా గుర్తించలేని స్థాయికి వచ్చేశాడు సృజన పోస్ట్ చేసిన చివరి రీల్లో. అంతేగాదు ఇన్‌స్టాలో బిబెక్ 32వ పుట్టిన రోజుని సెలబ్రెట్ చేసిన విధానం అందర్నీ కంటతడి పెట్టిస్తుంది. ఎందుకంటే అప్పటికే అతడి పరిస్థితి అత్యంత అధ్వాన్నంగా ఉంది. ఏ పరిస్థితిలోనూ అతడి చేతిని వీడక ఎంతో ప్రేమగా చూసుకున్న సృజన తీరు అందరి మనసులను తాకింది. సృజన అధికారికంగా అతడు చనిపోయాడని ప్రకటించనప్పటికీ..నిశబ్ద వాతావరణంతో పరోక్షంగా బిబేక్ ఇక లేరనే విషయం వెల్లడించింది. డిసెంబర్ 1 నుంచి సృజన నుంచి ఎలాంటి వీడియో పోస్ట్ కాకపోయినా.. నెటిజన్లంతా సృజనకు ధైర్యం చెప్పడమేగాక, బిబేక్ లేకపోయినా.. మీప్రేమ ఎప్పటికీ నిలిచే ఉంటుంది. ఇలాంటి కాలంలో ఇంత గొప్ప ప్రేమలు కూడా ఉన్నాయని చూపించారంటూ సృజనను ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Crzana Subedi (@crzana_subedi_) (చదవండి: చిట్టి రచయితలు.. అందమైన కథలతో అలరిస్తున్నారు..) -
అతుల్ సుభాష్‌కు బిల్లు నివాళి..!
అతుల్ సుభాష్ అనే టెక్కీ బలవన్మరణం దేశవ్యాప్తంగా ప్రకంపనాలు సృష్టించింది. చట్టాలన్ని ఆడవాళ్లకేనా అనే అంశం కూడా తెరపైకి వచ్చింది. భార్య కుటుంబం పెడుతున్న తప్పుడు కేసులతో ఎంతోమంది అతుల్ సుభాష్ లాంటి భర్తలు వేధింపులకు గురవ్వుతున్నారనే వాదన వినిపిస్తోంది. మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన వైవాహిక చట్టాలు దుర్వినియోగం అవుతున్నాయని బాధిత భర్తలు ఆరోపిస్తున్నారు. చెప్పాలంటే ఆ టెక్కీ మరణం చర్చనీయాంసంగా మారడమే గాక బీటలు వారిపోతున్న వైవాహిక వ్యవస్థ, చట్టంలోని లోసుగులను లేవనెత్తింది. ప్రస్తుతంఈ విషయమే హాట్‌టాపిక్ మారింది. ఈ తరుణంలో ఢిల్లీ రెస్టారెంట్ చెందిన జంబోకింగ్ ఫ్రాంచైజీ ఆ టెక్కీ అతుల్‌కి వినూత్నంగా నివాళి ఆర్పించడం నెట్టింట వైరల్‌గా మారింది. హౌజ్ ఖాస్ అనే గ్రామంలోని జంబోకింగ్ ఫ్రాంచైజీ అవుట్‌లెట్‌కి ఓ వ్యక్తి వెళ్లాడు. అతను అక్కడ తినేసి తిరిగి వెళ్లేటప్పడూ అందుకున్న రసీదు అతడిని ఆకర్షించింది. అందులో "జస్టీస్ ఫర్ అతుల్ సుభాష్ అనే హ్యాష్ ట్యాగ్‌తో అతడి ఆత్మహత్యకు తాము ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం. అతని జీవితం అందిరిలానే అత్యంత ముఖ్యమైనది. మీకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం." అని రాసి ఉంది. అతడు వెంటనే ఆ రసీదుని ఫోటో తీసి తన స్నేహితుడికి పంపండంతో రెడ్డిట్‌లో వైరల్‌గా మారింది. ఆ జంబోకింగ్ ఫ్రాంచైజీని స్వామి సమర్థ్ ఫుడ్స్ నడుపుతోంది. అందర్ని కదలించిన ఆ టెక్కీ ఆవేదనను సహృద్భావంతో అర్థం చేసుకుని ఇలా వినూత్నంగా నివాళులర్నించడమే గాక అతడికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ.. అందరికీ అవగాహన కల్పిస్తున్నట్లుగా ఉంది. పైగా అందుకోసం ఇలా రసీదుని ఉపయోగించుకోవడమనేది ప్రశంసనీయం. అంతేగాదు సదరు వ్యక్తి ఈ విషయమై జంబోకింగ్ ఫ్రాంచైజీ యజమానిని ప్రశ్నించగా.. దానికి ఆ వ్యాపారి ప్రతీది వ్యాపారం కాదని తన దైన శైలి బదులిచ్చి అందరి మనసులను గెలుచుకున్నాడు. నెటిజన్లు కూడా.. ఆ వ్యాపారి విశాల హృదయాన్ని ప్రశంసించగా, ఇలా జొమాటా, స్విగ్గీలు కూడా చెయ్యొచు గదా అంటూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. (చదవండి: గట్ హెల్త్‌పై దృష్టి పెడదాం..ఆరోగ్యంగా ఉందాం..!) -
కెమిస్ట్రీ పాఠాన్ని ఇలా కూడా బోధిస్తారా? ఆ టీచర్ వేరే లెవల్!
ఉపాధ్యాయుల బోధనా పద్ధతులన్నీ.. విద్యార్థులకు విపులంగా అర్థం కావాడమే ప్రధాన అంశం. అందుకోసం ఒక్కొక్క టీచర్ ఒకో పంథాలో తమ క్లాస్‌ని చెబుతుంటారు. కొందరు టీచర్లు చెప్పే బోధనా పద్ధతి విద్యార్థులకు బోరింగ్ ఫీలింగ్ కలగుకుండా ఆ సబ్జెక్ట్‌పై ఆసక్తిని పెంచేలా ఉంటుంది. అచ్చం అలానే ఓ ఫిజిక్స్ ఉపాధ్యాయుడు విద్యార్థులకు రసాయన శాస్త్రంలోని ఓ కాన్సెప్ట్ క్లియర్‌గా అర్థం కావాలని ఎంతలా కష్టపడ్డాడో చూస్తే.. ఫిదా అవ్వాల్సిందే.ఎలా చెప్పారంటే..ప్రముఖ ఎడ్ టెక్కి చెందిన ఒక ఫిజిక్స్ ఉపాధ్యాయుడు విద్యార్థులకు కెమిస్ట్రీలోని చిరాలటీ కాన్సెప్ట్‌ని బోధిస్తున్నారు. చిరాలటీలో అణువులు ఒక చిరాల్ కేంద్రాన్ని కలిగి ఉంటాయి. అద్దంలో అతిగా ఇంపోజ్ కావు. కాకపోతే రసాయన చర్యలో ఎడమ, కుడిగా కుడి ఎడమ గానూ అద్దంలో కనిపించే చిత్రంలాగా కనిపిస్తుంది. అదే దీని ప్రత్యేకత. ఇది విద్యార్థులకు అర్థమయ్యేలా తన శరీర భంగిమలతో క్లియర్‌గా వివరించారు. చెప్పాలంటే తన బోధనలో యోగాని కూడా మిళితం చేసి చెబుతున్నట్లుగా వివరించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు ఆ ఉపాధ్యాయుడికి తన వృత్తిపై ఉన్న అభిరుచి, నిబద్ధతలను ప్రశంసిచగా, మరికొందరు ఇంతలా కష్టపడటం ఎందుకు త్రీడీ వస్తువులతో లేదా ఏదైనా ప్లాస్టిక్ వస్తువులను ఉదాహరణగా తీసుకుని చెబితే సరి అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు.Absolute cinema 🎥 pic.twitter.com/KkhZwOr9dD— Priyanka 🪷 (@Oyepriyankasun) December 14, 2024 (చదవండి: 20 ఏళ్లకే డాక్టర్, 22 ఏళ్లకు ఐఏఎస్ ఆఫీసర్..ఇవాళ ఏకంగా..!) -
పురాతన నిధిలో గ్రహాంతర పదార్థాలు..!
గ్రహాంతరవాసులు నిజంగా ఉన్నారా, లేరా? అనేది నేటికీ మిలియన్ డాలర్ల ప్రశ్న. అయితే, వారి ఉనికికి ఊతమిచ్చేలా మరో అంశం తెరపైకి వచ్చింది. కాంస్యయుగం నాటి పురాతన నిధిలో గ్రహాంతర పదార్థాలు ఉన్నాయని పరిశోధకుల పరీక్షల్లో తేలింది. 1963లో ఐబీరియన్ ద్వీపకల్పంలో కాంస్యయుగం నాటి నిధి బయటపడింది. దీనిని ‘ట్రెజర్ ఆఫ్ విల్లెనా’ అని పిలిచేవారు. ఇందులో ఎంతో విలువైన రాతి యుగం నాటి కంకణాలు, గిన్నెలు, సీసాలు, వివిధ ఆభరణాలు వంటి 66 వస్తువులు ఉన్నాయి. ఇటీవల ఒక కొత్త పరిశోధన బృందం ఈ వస్తువులపై పరీక్షలు జరిపింది. ఈ పురాతన నిధిలోని ఒక కళాఖండం అంతరిక్ష పదార్థాలతో తయారు చేసినట్లు ఈ బృందంలోని శాస్త్రవేత్తలు వెల్లడించారు. మిగిలిన వస్తువులు చాలా వరకు బంగారం, వెండితో తయారు చేశారని, వీటిలోని కేవలం ఓ కళాఖండంలోని పదార్థం మాత్రం భూమ్మీద ఎక్కడా లభించదని, ఇది ఇతర గ్రహాల్లో లభించే అవకాశం ఉందని తెలిపారు. కొంతమంది పురావస్తు శాస్త్రజ్ఞులు ఈ నిధి కాంస్యయుగం తర్వాతి కాలానికి చెందినదని చెబుతున్నారు. మరికొందరు నిపుణులు ఈ వస్తువులలోని ఇనుము ఉల్కల నుంచి వచ్చినదని చెబుతున్నారు. ఈ లోహానికి గ్రహాంతర మూలాలను నిగ్గుతేల్చడానికి మరిన్ని పరీక్షలు అవసరమని అంటున్నారు. (చదవండి: సీట్బెల్ట్తో కిడ్నీలకూ రక్షణ!) -
నెత్తురు చిందించకుండానే చక్కెర పరీక్ష..!
శరీరంలోని చక్కెర స్థాయి తెలుసుకోవాలంటే, నెత్తురు చిందించక తప్పదు. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న పరిజ్ఞానం మేరకు చక్కెర స్థాయి తెలుసుకోవడానికి కనీసం ఒక్క చుక్క నెత్తురైనా అవసరం. ఇంట్లో గ్లూకో మీటర్ ద్వారా చక్కెర స్థాయి తెలుసుకోవాలన్నా, సూదితో వేలిని పొడిచి నెత్తురు చిందించక తప్పదు. అయితే, అమెరికన్ కంపెనీ ‘నో లాబ్స్’ రూపొందించిన ఈ పరికరం ఉంటే, ఒక్క చుక్కయినా నెత్తురు చిందించకుండానే శరీరంలోని చక్కెర స్థాయిని వెంటనే తెలుసుకోవచ్చు. ‘నో యూ’ పేరుతో రూపొందించిన ఈ పరికరాన్ని జిగురు ఉన్న స్టిక్కర్ ద్వారా లేదా, బిగుతుగా పట్టే రబ్బర్ స్ట్రాప్ ద్వారా జబ్బకు, లేదా ముంజేతికి కట్టుకుంటే చాలు. క్షణాల్లోనే శరీరంలో చక్కెర స్థాయి ఎంత ఉందో, యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు సమాచారం అందిస్తుంది. ఈ పరికరం పనితీరును ఆహార ఔషధ నియంత్రణ సంస్థ ‘ఎఫ్‌డీఏ’ పరీక్షిస్తోంది. ఎఫ్‌డీఏ ఆమోదం లభించినట్లయితే, ఈ పరికరం అందరికీ అందుబాటులోకి వస్తుంది. (చదవండి: ఆ జత జాడీలతో ఓ కుటుంబం రాత్రికి రాత్రే కోట్లకు పడగలెత్తింది..!) -
ఆ జత జాడీలు అల్లావుద్దీన్ అద్భుత దీపంలా ఏం మాయ చేశాయి..!
అల్లావుద్దీన్ అద్భుత దీపం లాగానే, జత జాడీలు చైనాలోని ఒక కుటుంబాన్ని రాత్రికి రాత్రే కోటీశ్వరులను చేశాయి. ఫొటోలో కనిపిస్తున్న ఈ రెండు జాడీలు చైనాకు చెందిన ఒక కుటుంబంలో గత శతాబ్దంగా ఉంటున్నాయి. పాతబడిన ఈ జాడీలను పనికిరాని వస్తువులుగా భావించి, ఆ కుటుంబం వారు వాటిని ఒక మూలన పడేశారు. అయితే ఈ జాడీలే తమకు కోట్లు కురిపిస్తాయని వారు ఊహించలేదు. అయితే, ఒక పురావస్తు నిపుణుడి సలహాపై, ప్రస్తుతం ఈ జాడీలను వారు వేలంలో పెడితే, అప్పుడే తెలిసింది వారికి ఈ జాడీల ప్రాముఖ్యత! పదహారో శతాబ్దానికి చెందిన చక్రవర్తి జియాజియ్ హయాంలో ఈ జాడీలను తయారు చేసినట్లు గుర్తించి, వాటిని 9.6 మిలియన్ పౌండ్లకు (సుమారు రూ. 102 కోట్లు) కొనుగోలు చేశారు. అతి పురాతనమైన ఈ జాడీలను చైనీస్ మింగ్ రాజవంశం ఉపయోగించినట్లు ఆధారాలు ఉన్నాయి. ఇవి వీరి దగ్గరకు ఎలా వచ్చాయో తెలియదు గాని, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాతి నుంచి ఈ జాడీలు వారి ఇంటి వంటగదిలో నిరుపయోగంగా ఉంటున్నాయి. ఎగిరే చేపల డిజైన్‌తో ఎంతో ఆకర్షణీయంగా ఉండే ఈ జాడీలను వారు కేవలం ఇంట్లో అలంకరణకు మాత్రమే వాడేవారట! అందుకే అవి ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. (చదవండి: వామ్మో..!ఈ తిమింగలం వలస రికార్డు మాములుగా లేదుగా..!) -
వామ్మో..!ఈ తిమింగలం వలస రికార్డు మాములుగా లేదుగా..!
బలీన్ తిమింగలం జాతికి చెందిన ఒక మగ హంప్‌బ్యాక్ తిమింగలం వలస రికార్డు ఊహకందనిది. ఏకంగా మూడు మహా సముద్రాలు చుట్టొచ్చి.. రికార్డు క్రియేట్ చేసింది. ఈ మగ తిమింగలం దక్షిణ అమెరికా నుంచి ఆఫ్రికా వరకు సుమారు 8వేల మైళ్లకు పైగా ఈది ఆశ్చర్యపరిచింది. తన సహచర తిమింగలాన్ని వెతుక్కుఉంటూ ఇంత దూరం సముద్రంలో ఈది ఉండొచ్చని పరిశోధకులు తెలిపారు. ఈ తిమింగలం కదలికను శాస్త్రవేత్తల బృందం సుమారు 2013 నుంచి 2022 వరకు ట్రాక్ చేస్తూ వచ్చారు. ఇది దక్షిణ అమెరికాలోని కొలంబియా నుంచి ఆఫ్రికాలోని జాంజిబార్లోని తిమింగలలా సంతానోత్పత్తి ప్రదేశం వరకు ఈదుకుంటూ వెళ్లినట్లు తెలిపారు. తిమింగలాల జాతిలోనే అత్యంత అరుదైన జాతి ఈ హంప్‌బ్యాక్ తిమింగలం. ఈ తిమింగల వెనుక ఉన్న విలక్షణమైన మూపురం కారణంగానే వీటిని హంప్‌బ్యాక్ తిమింగలంగా అని పిలుస్తారు. ఇవి మహాసముద్రాల్లోనే ఉంటాయి. వాణిజ్యపరంగా కూడా అత్యంత ఖరీదైన తిమింగలం ఇది.అయితే వేట కారణంగా ఈ జాతి అంతరించిపోతున్నదశలో ఉంది. ఈ నేపథ్యంలోనే శాస్త్రవేత్తల బృందం హంప్‌బ్యాక్ తిమింగలాల తీరు, వలస విధానంపై అధ్యయనం చేస్తోంది. ఆ క్రమంలోనే ఈ మగ హంప్‌బ్యాక్ తిమింగలం కదలికలను ట్రాక్ చేస్తూ వచ్చారు పరిశోధకులు. తొలిసారిగా ఈ తిమింగలాన్ని 2013లో గుర్తించి ఫోటోలు తీశారు. ఆ తర్వాత మళ్లీ 2022లో జాంజిబార్ తీరంలో నైరుతి హిందూ మహాసముద్రంలో గుర్తించారు.మొదట్లో అదే తిమింగలమా కాదనే అనుమానం కలిగింది. అయితే దాని దాని జననేంద్రియ ప్రాంతంలో తీసిన ఫోటోల ఆధారంగా ఆ తిమింగలమే అని నిర్థారించారు శాస్త్రవేత్తలు. ఇంతకుముందు తాము ఎన్నో విలక్షణమైన తిమింగలాల శక్తిమంతంగా ఈదడం గుర్తించామని, కానీ అవి మధ్యలోనే దారితప్పేవని అన్నారు. అయితే ఈ తిమంగలం మాత్రం ఏదో వెతుకుతూ వచ్చినట్లుగా ఇంత దూరం ప్రయాణించడమే ఆశ్చర్యం కలిగించిందన్నారు. వాస్తవానికి ఇవి చాలా శక్తిమంతంగా ఈదగలవు. కానీ ఇంతలా రికార్డు స్థాయిలో ఈదుకుంటూ వెళ్లడమే ఈ మగ హంప్బ్యాగ్ తిమింగలం ప్రత్యేకత అని చెప్పారు. అయితే కచ్చితంగా ఇలా అంత దూరం ఎందుకు ప్రయాణం చేసిందనేది చెప్పలేమన్నారు. కానీ ఇందుకు వాతావరణ మార్పు, పర్యావరణ మార్పులు పాత్ర ఉండొచ్చని అన్నారు. అలాగే ఆహార అన్వేషణ కూడా అయ్యి ఉండొచ్చన్నారు. ఒక రకంగా తమ పరిశోధన మహాసముద్రాలను రక్షించుకోవాల్సిన ఆవశ్యకతను హైలెట్ చేసిందని పరిశోధక బృందం తెలిపింది. ఈ అధ్యయనం రాయల్ సొసైటీ ఓపెన్ సైన్స్ జర్నల్‌లో ప్రచురితమైంది. (చదవండి: ‘సౌత్ ఇండియన్ డైట్ ప్లాన్'తో అంతలా బరువు తగ్గొచ్చా..!) -
ఈ సైంటిస్ట్ జంట రూటే సెపరేటు! వెడ్డింగ్ కార్డు వేరేలెవెల్..!
శాస్త్రవేత్తలంటేనే అందరిలా కాకుండా విభిన్నంగా ఆలోచిస్తారు. అయితే వారి పరిశోధన వృత్తి వరకే పరిమితం కాకుండా అంతకు మించి ఉంటే.. ఈ సైంటిస్ట్ జంటలానే ఉంటుందేమో..!. ఇద్దరూ అగ్రికల్చర్ పరిశోధకులే..ఆ ఇష్టాన్నే తమ వివాహా ఆహ్వాన పత్రికలో కూడా చూపించి ఆశ్చర్యపరిచారు. అది పెళ్లి కార్డో, లేక రీసెర్చ్ పేపరో అర్థంకాకుండా భలే గందరగోళానికి గురి చేశారు. ఆలపాటి నిమిషా, ప్రేమ్ కుమార్ అనే వ్యవసాయ శాస్త్రవేత్తలిద్దరూ ఒకరినొకరు ఎంతగానో ఇష్టపడ్డారు. వివాహబంధంతో ఒక్కటవ్వాలనుకున్నారు. అయితే వారిద్దరి అభిరుచి పరిశోధనే. ఐతే నిమిషా ఐసీఏఆర్-ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (IARI)లో రీసెర్చ్ స్కాలర్ కాగా, ప్రేమ్ కుమార్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్)లో అసిస్టెంట్ మేనేజర్. ఈ నేపథ్యంలోన వారిద్దరూ తమ రీసెర్చ్‌పై ఉన్న ప్రేమతో పరిశోధనా పత్రం స్టైల్లో వివాహ కార్డుని డిజైన్ చేశారు. చూసేవాళ్లకు ఇది ఆహ్వాన పత్రిక.. రీసెర్చ్పేపరో అర్థం కాదు. క్షుణ్ణంగా చదివితేనే తెలుస్తుంది. అందులో వివరాలు కూడా రీసెర్చ్ పేపర్ తరహాలో ఉన్నాయి. అయితే వారి వివాహ బంధాన్ని కూడా కెమిస్ట్రీలోని స్థిర సమయోజనీయ బంధంతో వివరించడం అదుర్స్. అవసరానికి ఉపయోగ పడని ఆస్తి, ఆపదల నుంచి గట్టేకించుకోలేని విజ్ఞానం రెండూ వ్యర్థమే అంటారు పెద్దలు. కానీ వీళ్లిద్దరూ తమ వ్యవసాయ పరిజ్ఞానాన్ని అన్ని విధాలుగా ఉపయోగిస్తూ ఆదర్శంగా నిలవడమే గాక తమకు వ్యవసాయ పరిశోధనా రంగం పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. సైంటిస్ట్‌ల రూటే సెపరేటు అన్నట్లుగా ఆహ్వానపత్రిక వేరేలెవెల్లో ఉంది. మరో విశేషమేమిటంటే ఆ శాస్తవేత్తల జంట తమ వివాహ తేదిని కూడా ప్రపంచ మృత్తికా దినోత్సవం రోజునే ఎంచుకోవడమే. (చదవండి: డిప్రెషన్‌తో పోరాడుతూనే.. ఐఏఎస్ సాధించిన అలంకృత!) -
అలాంటిలాంటి పిల్లి కాదిది.. ఏకంగా ప్రధాని కార్యాలయంలో..!
బ్రిటిష్ పతాకాన్ని హోదా చిహ్నంగా మెడలో ధరించి, గంభీరంగా చూస్తున్న ఈ పిల్లి వాలకం గమనించండి. ఇది బ్రిటిష్ ప్రధాని కార్యాలయంలో ఉన్నతోద్యోగి. దీని హోదా ‘చీఫ్ మౌసర్ టు ది కేబినెట్ ఆఫీస్’. బ్రిటిష్ ప్రధాని కార్యాలయంలోనికి ఎలుకలు చొరబడకుండా కాపలా కాయడమే దీని పని. దీని కన్ను కప్పి పొరపాటున ఏ ఎలుకైనా సాహసించి ఈ కార్యాలయంలోకి చొరబడితే, ఇది వెంటనే పట్టి, పలారం లాగించేస్తుంది. లండన్‌లోని 10 డౌనింగ్ స్ట్రీట్‌లో ఉన్న బ్రిటిష్ ప్రధాని కార్యాలయంలోని ఉద్యోగులందరూ దీనిని అల్లారుముద్దుగానే కాదు, అత్యంత గౌరవంగా కూడా చూసుకుంటారు. బ్రిటిష్ ప్రభుత్వ కార్యాలయంలో పిల్లులను పెంచే పద్ధతి పదహారో శతాబ్ది నుంచి ఉండేది. ప్రధాని కార్యాలయంలో పెంచే పిల్లికి ‘చీఫ్ మౌసర్’ హోదాను అధికారికంగా ప్రకటించడం మాత్రం 1997లో జరిగింది. ఇప్పుడు ‘చీఫ్ మౌసర్’గా ఉన్న పిల్లి కోసం బ్రిటిష్ ప్రభుత్వం ఏటా 100 పౌండ్లు (రూ.10,597) ఖర్చు చేస్తోంది. (చదవండి: ఉద్యోగం కోల్పోతేనేం కుట్టు పనితో ఏకంగా..!)