Hanamkonda
-
అశ్విని(నాగరాణి) వెడ్స్ రాకేశ్..
అశ్విని బీఎస్సీ పూర్తి చేసి ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంది. ఆమె చిన్నప్పుడే తల్లిదండ్రులు అనారోగ్యంతో మృతి చెందడంతో ట్రస్ట్‌లో ఆశ్రయం పొందింది. ప్రస్తుతం అశ్వినితో రాకేశ్‌కు వివాహం చేస్తున్నారు. కాగా, ఇద్దరు యువతుల పెళ్లిళ్లలకు దాతలు రాంశేషు, చంద్ర, బొమ్మనేని రమాదేవి, ఎన్.మహేశ్‌రావు–లక్ష్మి, దుగ్యాల పాపారావు, ఎం.చంద్రశేఖర్–రాజ్యలక్ష్మి, వి.గీత–సుధాకర్‌రావు, మురార్అలీ–నషీమ్బర్వాని, సైఫా సురేశ్, సిటిజన్ క్లబ్, మిత్రుల సహకారంతో వివాహాలు చేస్తున్నట్లు ట్రస్ట్ నిర్వాహకులు వినోదమోహన్రావు తెలిపారు.● -
మానవ అక్రమ రవాణా నిర్మూలించాలి
వరంగల్: మానవ అక్రమ రవాణా నిర్మూలనకు ప్రతిఒక్కరూ నడుం బిగించాలని వరంగల్ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి (డీఆర్డీఓ) కౌసల్యాదేవి అన్నారు. డీఆర్డీఏ సమావేశ మందిరంలో మండలస్థాయి సిబ్బంది (సీసీ, ఏపీఎం)కి మానవ అక్రమ రవాణా అంశంపై మంగళవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆమె హాజరై మాట్లాడారు. కుటుంబం, సంఘంపరంగా ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండడం ద్వారా మానవ అక్రమ రవాణా నిర్మూలించవచ్చని పేర్కొన్నారు. మానవ అక్రమ రవాణా ద్వారా లైంగిక దోపిడీ, అవయవ దోపిడీ, శ్రామిక దోపిడీ, డ్రగ్స్ రవాణా లాంటి అసాంఘిక కార్యకలాపాలపై తరచూ ప్రజలను చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు. శిక్షకులు ఈశ్వర్, కిరణ్, కృష్ణమూర్తి మానవ అక్రమ రవాణా, సైబర్ ట్రాఫికింగ్, సంబంధిత చట్టాలు తదితర అంశాలను వివరించారు. కార్యక్రమంలో డీపీఎంలు దయాకర్, భవాని, అనిత, సరిత, వివిధ మండలాల ఏపీఎంలు వేణు, సురేశ్, మహేందర్, సీసీలు కొమురయ్య, సుజాత, పద్మ, శారద, శ్రీలత, రమేశ్, ఏకాంబరం, కట్టయ్య తదితరులు పాల్గొన్నారు. వరంగల్ డీఆర్డీఓ కౌసల్యాదేవి -
ఫీజుల కోసం ఫలితాల నిలిపివేత
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ అకడమిక్ డీన్‌కు ఇంకా 84 ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు ఫీజులు చెల్లించలేదు. దీంతో యూనివర్సిటీ పరిధిలోని ఆయా కాలేజీల విద్యార్థుల ఫలితాలు వెల్లడించడం లేదు. ఫలితంగా ఆయా విద్యార్థులు తాము ఉత్తీర్ణ సాధించామా?లేదా? ఏమైనా సబ్జెక్టుల్లో తప్పామనే అంశం తెలియక లబోదిబోమంటున్నారు. 53,728 మంది ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని డిగ్రీ కోర్సుల బీఏ, బీకాం, బీబీఏ బీఎస్సీ, బీసీఏ బి ఓకేషనల్ కోర్సులకు సంబంఽధించి మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ల పరీక్షల ఫలితాలు ఈనెల 4న విడుదల చేసిన విషయం విధితమే. అయితే యూనివర్సిటీలోని డీన్ అకడమిక్‌కు ఫీజులు చెల్లించకపోవడతో తొలుత 121 కళాశాలల ఫలితాలు నిలిపివేశారు. వారంలో కొన్ని ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు ఫీజులు చెల్లించాయి. దీంతో వాటి ఫలితాలు విడుదల చేశారు. కేయూ పరిధిలో 304 (ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ గురుకుల కళాశాలలు ఉండగా) అందులో మంగళవారం వరకు 84 ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు యూనివర్సిటీ డీన్ అకడమిక్‌కు వివిధ రకాల ఫీజులు చెల్లించలేదు. దీంతో ఆయా కళాశాల విద్యార్థుల ఫలితాల నిలిపివేత కొనసాగుతోంది. రీవాల్యుయేషన్ గడువు కూడా.. డిగ్రీ సెమిస్టర్ల పరీక్షల ఫలితాలు ఇచ్చాక 10 నుంచి 15 రోజులపాటు రీవాల్యుయేషన్‌కు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇప్పటికే ఫలితాలు విడుదల చేసిన కాలేజీల విద్యార్థులు దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఫలితాలు విడుదల కాని విద్యార్థులు రీవాల్యుయేషన్ కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు వారంలో ఈ గడువు కూడా ముగియబోతుంది. దీంతో విద్యార్థులు నష్టపోయే పరిస్థితి నెలకొని ఉంది. డిగ్రీ 2,4,6 సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లింపునకు షెడ్యూల్.. డిగ్రీ కోర్సుల 2, 4, 6వ సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లించేందుకు ఇటీవలే పరీక్షల విభాగం అధికారులు షెడ్యూల్ ఇచ్చారు. ఆయా సెమిస్టర్ల పరీక్షలు ఏప్రిల్ చివరి వారంలో నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ఫీజులు కూడా ప్రైవేట్ యాజమాన్యాల విద్యార్థులు చెల్లించాల్సింటుంది. అయితే 1,3,5 ఫలితాల కోసం నిరీక్షిస్తున్న విద్యార్థులు కూడా ఆయా సెమిస్టర్ల పరీక్షల ఫీజులు చెల్లించాల్సింటుంది. ఇంకా చెల్లించని 84 కళాశాలలు 53,728మంది విద్యార్థుల నిరీక్షణ ముగుస్తున్న రీవాల్యుయేషన్ గడువు మరోవైపు డిగ్రీ 2,4,6 సెమిస్టర్ల ఫీజు కూడా.. -
కుటుంబ వ్యవస్థపై ఫాతిమా మాత అనుగ్రహం
● ఓరుగల్లు పీఠాధిపతి, విశాఖ అగ్రపీఠాధిపతి ఉడుముల బాల ● ఫాతిమామాత ఉత్సవాలు ప్రారంభం కాజీపేట రూరల్: నేటి కుటుంబ వ్యవస్థ విధానంపై ఫాతిమా మాత అనుగ్రహం అవసరమని ఓరుగల్లు మేత్రాసనం పీఠాధిపతి, విశాఖ అగ్ర పీఠాధిపతి బిషప్ డాక్టర్ ఉడుముల బాల అన్నారు. కాజీపేట ఫాతిమానగర్‌లో మంగళవారం ఫాతిమా మాత తిరునాళ్ల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. కేథడ్రల్ చర్చిలో రాత్రి జరిగిన కుటుంబాల సంరక్షిణి మరియ మాత అంశంతో ఓరుగల్లు పీఠ కాపరి, విశాఖ అగ్ర పీఠ కాపరి బిషప్ ఉడుముల బాల తిరునాళ్ల ఉత్సవాలు ప్రారంభించి భక్తులను ఆహ్వానించారు. అనంతరం చర్చి సభ్యుల్లో రజిత, స్వర్ణ జుబిలి దంపతులను బిషప్ సన్మానించి ఆశీర్వదించారు. అనంతరం బిషప్ అందరికీ ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆశీర్వాదాలు ఇచ్చారు. కార్యక్రమంలో చర్చి ఫాదర్లు కాసు మర్రెడ్డి, ప్రకాశ్, ఆశీర్వాదం, చర్చీ కమిటీ పాల్గొంది. విద్యుత్ కాంతుల్లో కేథడ్రల్ చర్చి, ప్రాంగణ వీధులు జిగేల్మంటున్నాయి. ఫాతిమా చర్చిని సందర్శించిన వరంగల్ డీసీపీ సలీమా కాజీపేట ఫాతిమా కేథడ్రల్ చర్చిని వరంగల్ కమిషనరేట్ సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా చర్చి ప్రాంగణంలో కలియదిరిగారు. చర్చీ ఫాదర్లు, కమిటీ సభ్యులతో మాట్లాడి బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించారు. పోలీస్ శాఖ తరఫున సంపూర్ణ సహకారం ఉంటుందని హామీ ఇచ్చినట్లు కేథడ్రల్ చర్చి కమిటీ ప్రెసిడెంట్ బొక్క దయాసాగర్, ట్రెజరర్ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. కాజీపేట సీఐ సుధాకర్‌రెడ్డి తదితరులు ఆమె వెంట ఉన్నారు. ఫాతిమామాత ఉత్సవాల్లో సంగీత సాధన కాజీపేట ఫాతిమానగర్ పాస్ట్రల్ సెంటర్లో మంగళవారం తిరునాళ్ల ఉత్సవాల్లో భాగంగా సంగీత సాధన కార్యక్రమం జరిగింది. పునీత సెసిలిమా అకాడమీ డైరెక్టర్ ఫాదర్ నమిండ్ల సురేందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని పాస్ట్రల్ సెంటర్ డైరక్టర్ ఫాదర్ తాటికొండ జోసెఫ్, అరుణోదయ యూత్ డైరెక్టర్ ఫాదర్ పొలిమెర సురేశ్ ప్రార్థనలు చేసి ప్రారంభించి సందేశం ఇచ్చారు. ట్రైసిటీలోని 12 విచారణ చర్చీల నుంచి గాయకులు పాల్గొన్నారు. కార్యక్రమంలో కలపాల ప్రవీణ్, నల్ల ప్రణీల్, రవి, గాయని, గాయకులు పాల్గొన్నారు. -
గ్రూప్–1 ర్యాంకర్ తేజస్వినికి సన్మానం
శాయంపేట : మండలంలోని తహరాపూర్ గ్రామానికి చెందిన జిన్నా విజయపాల్ రెడ్డి హేమలత దంపతుల కూతురు తేజస్విని రెడ్డి సోమవారం విడుదలైన గ్రూప్–1లో ఫలితాల్లో 532.5 మార్కులు సాధించింది. దీంతో తేజస్వినిని గ్రామ మాజీ ఎంపీటీసీ కొమ్ముల భాస్కర్ మంగళవారం సన్మానించారు. కాగా, తేజస్విని రెడ్డి 2019లో మొదటి ప్రయత్నంలోనే గ్రూప్–2లో మండల పంచాయతీ అధికారి పోస్టు సాధించింది. మొదటి పోస్టింగ్ నేలకొండపల్లి, రెండో పోస్టింగ్ టేకుమట్ల, ప్రస్తుతం రేగొండలో ఉద్యోగం చేస్తోంది. ఉద్యోగం చేస్తూనే గ్రూప్–1కు సొంతంగా సన్నద్ధమైంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో గ్రూప్–1లో 532.5 మార్కులు సాధించానని, డిప్యూటీ కలెక్టర్ పోస్టును ఎంపిక చేసుకుంటానని తేజస్విని రెడ్డి తెలిపారు. నూతన ఆలోచనలతో ముందుకు సాగాలి ● లీడ్ బిడ్ మేనేజ్మెంట్ జీఎం శివభాస్కర్ హసన్‌పర్తి : ప్రతీ విద్యార్థి నూతన ఆలోచనలతో ముందుకు సాగాలని లీడ్ బిడ్ మేనేజ్మెంట్, ఆర్పీఎల్ జీఎం, ఇండియా సర్వీసెస్ జీఎం శివ భాస్కర్ నేతి అన్నారు. హసన్‌పర్తి మండలం అన్నాసాగరం శివారులోని ఎస్సార్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న వార్షిక మేనేజ్మెంట్ ఫెస్ట్ ‘వ్యూహ–2025’ మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. ఈకార్యక్రమానికి శివభాస్కర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని సూచించారు. కృత్రిమ మేధస్సు (ఏఐ) కొత్త మార్గాలు తెరుస్తోందన్నారు. ఎస్సార్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ దీపక్ గార్గ్ మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభను మెరుగు పరచడానికి ఇలాంటి వేదికలు దోహదపడుతాయన్నారు. విద్యార్థులు టెక్నాలజీ మేనేజ్మెంట్ వైపు దృష్టి సారించాలన్నారు. సాంకేతిక రంగంలో వస్తున్న మార్పుకనుగుణంగా నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవాలన్నారు. తొలుత ఎస్సార్ యూనివర్సిటీ చాన్స్‌లర్ ఎ.వరదారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం సమన్వయకర్త డాక్టర్ సుమన్, వివిధ విభాగాల అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు. 61 మహిళా శక్తి అద్దె బస్సులుహన్మకొండ: ఆర్టీసీ వరంగల్ రీజియన్‌కు 61 మహిళా శక్తి అద్దె బస్సులు కేటాయించారని ఆర్టీసీ ఆర్ఎం డి.విజయభాను తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఈ బస్సులను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ఇందిరా మహిళ శక్తి మిషన్–25ను సీఎం ప్రారంభించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా.. మండల మహిళా సమాఖ్యల ద్వారా ఆర్టీసీకి అద్దె బస్సులు అందిస్తున్నట్లు తెలిపారు. -
సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
జనగామ: స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో ఈ నెల 16న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశం హాల్లో కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్లు పింకేష్ కుమార్, రోహిత్ సింగ్, డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఆర్డీఓ వెంకన్నతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ 14వ తేదీ వరకు సీఎం పర్యటనకు సంబంధించిన పనులన్నీ పూర్తి చేయాలన్నారు. సభకు వచ్చే రూట్లు, వాహనాల పార్కింగ్ స్థలాలను గుర్తించడంతో పాటు రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉండాలన్నారు. కలెక్టర్ రిజ్వాన్‌బాషా మాట్లాడుతూ సీఎం పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో మున్సిపల్ కమిషనర్ రవీందర్, ఏసీపీ భీంశర్మ, డీఆర్డీఓ వసంత, డీఏంహెచ్ఓ మల్లికార్జున్‌రావు, డీపీఓ స్వరూప, గృహనిర్మాణ శాఖ పీడీ మాతృనాయక్, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ వేణుమాధవ్, అధికారులు పాల్గొన్నారు. సీఎం సభాస్థలి పరిశీలన స్టేషన్‌ఘన్‌పూర్: మండలంలోని శివునిపల్లిలో ఈనెల 16న నిర్వహించనున్న సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభకు సంబంధించిన సభాస్థలాన్ని అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సభా స్థలం వద్ద చేపడుతున్న పనులను పరిశీలించారు. సీఎం సభను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఆర్డీఓ డీఎస్ వెంకన్న, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఆర్ఐలు శ్రీకాంత్, సతీష్ ఉన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలి పనుల్లో వేగం పెంచండి ఎమ్మెల్యే కడియం శ్రీహరి కలెక్టరేట్లో సమీక్ష -
జీనోమ్ ప్రాజెక్టుతో వ్యాధుల గుర్తింపు
కేయూ క్యాంపస్ : జీనోమ్ ప్రాజెక్టు మానవుడి వ్యాధులకు కారణమైన జన్యువులను గుర్తించొచ్చని 2010లోనే వెల్లడైందని కాకతీయ యూనివర్సిటీ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి అన్నారు. మంగళవారం కాకతీయ యూనివర్సిటీలోని జువాలజీ విభాగం ఆధ్వర్యంలో ‘ఇన్నోవేటివ్ టెక్నిక్స్ ఇన్ అనిమల్ బయోటెక్నాలజీ, ఇమ్యూనాలజీ ఫర్ డిసిస్ ప్రివెన్షన్స్ అండ్ మేనేజ్మెంట్’ అనే అంశంపై మంగళవారం ఆ విభాగం సెమినార్‌హాల్‌లో నిర్వహిస్తున్న జాతీయ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. జాతీయ సదస్సుకు భారతదేశం నుంచి పరిశోధకులు, అకడమిషియన్లు పాల్గొని జంతు శాస్త్రాల పరిశోధన పురోగమనంపై చర్చించడాన్ని కొనియాడారు. అనంతరం బయో ఫార్మా డైరెక్టర్ గీతా శర్మ ‘డ్రగ్ డిస్కవరీ’ అనే అంశంపై మాట్లాడుతూ ఒక మాలిక్యుల్ డ్రగ్‌గా మార్కెట్లోకి రావడానికి తక్కువలో తక్కువ 10 సంవత్సరాలు పడుతుందన్నారు.అంతేకాకుండా 10 బిలియన్ డాలర్ల వరకు ఖర్చు అవుతుందన్నారు. కానీ బయో ఇన్ఫర్మాటిక్స్ అభివృద్ధి చెందిన నేపథ్యంలో ఖర్చు, సమయం రెండూ కలిసి రావడం పరిశోధన రంగంలో జరిగిన పురోగతిగా భావించొచ్చని తెలిపారు. ఈ జాతీయ సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ వై. వెంకయ్య మాట్లాడుతూ ఈ రెండు రోజుల జాతీయ సదస్సులో వందకు పైగా రీసెర్చ్ స్కాలర్స్, వివిధ వర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు తమ పరిశోధన పత్రాలు సమర్పించబోతున్నారన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధ్యక్షురాలిగా జూవాలజీ విభాగ అధిపతి జి. షమిత, విశిష్ట అతిథిలుగా సైన్స్ డీన్ జి. హన్మంతు, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్ ఈసం ఈసం నారాయణ, ప్రొఫెసర్ ఇస్తారి పాల్గొన్నారు. వీసీ, ఇతర అతిథులు జాతీయ సెమినార్‌కు వచ్చిన పరిశోధన పత్రాల సావనీర్‌ను ఆవిష్కరించారు. సదస్సు ఈనెల 12న ముగియనున్నది. కేయూలో జాతీయ సదస్సులో వీసీ ప్రతాప్ రెడ్డి -
మూల్యాంకన కేంద్రం పరిశీలన
కాళోజీ సెంటర్: వరంగల్ ఎల్బీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్ మూల్యాంకన కేంద్రాన్ని ఇంటర్ బోర్డు అధికారులు మంగళవారం సందర్శించారు. ఈ సంవత్సరం ఏర్పాటు చేసిన మూల్యాంకన కేంద్రంలో ఏర్పాట్లు, స్ట్రాంగ్‌రూంలు తదితర ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా క్యాంపు అధికారి, వరంగల్ జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ మాట్లాడుతూ వరంగల్ జిల్లాతోపాటు మహబూబాబాద్, ములుగు జిల్లాల మూల్యాంకన సిబ్బందికి శిక్షణ ఇచ్చి సోమవారం స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభించినట్లు వివరించారు. అలాగే, ఈనెల 22 నుంచి మొదటి స్పెల్‌లో తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్, పొలిటికల్ౖ సెన్స్, ఈనెల 24 నుంచి రెండో స్పెల్‌లో ఫిజిక్స్, ఎకనామిక్స్, 26 నుంచి మూడో స్పెల్‌లో కెమిస్ట్రీ, కామర్స్, 28న నాలుగో స్పెల్‌లో హిస్టరీ, బాటనీ, జువాలజీ సబ్జెక్టుల మూల్యాంకనం ప్రారంభించనున్నట్లు తెలిపారు. -
వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు ప్రోత్సహించాలి
మామునూరు: వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర పశువైద్య విశ్వవిద్యాలయ వీసీ జ్ఞాన ప్రకాశ్ అన్నారు. ఈమేరకు మంగళవారం ఖిలా వరంగల్ మండలం మామునూరు కృషి విజ్ఞాన కేంద్రంలో సీనియర్ శాస్త్రవేత్త, కోఆర్డినేటర్ రాజన్న ఆధ్వర్యంలో శాసీ్త్రయ సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై లబ్ధిదారులకు మేకలు, పవర్ వీడర్స్ పంపిణీ చేసి మాట్లాడారు. వేసవిలో పశువుల మేత నిమిత్తం పాతర గడ్డి తయారీ విధానంపై రైతులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. విస్తరణ అధికారి కిషన్ కుమార్, అటారీ ప్రతినిధి ఎఆర్. రెడ్డి, ఉమారెడ్డి, దిలీప్‌కుమార్, బాలాజీ, బ్యాంకు మేనేజర్ రాజు, జిల్లా మత్స్యశాఖ అధికారి నాగమణి, ఉద్యానశాఖ అధికారి సంగీత లక్ష్మి, డాక్టర్ అమ్రేశ్వరి, శాస్త్రవేత్తలు అరుణ్, సౌమ్య, రాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పశువైద్య విశ్వవిద్యాలయ వీసీ జ్ఞానప్రకాశ్ -
వరంగల్ డీసీసీబీని నంబర్ వన్‌గా నిలపాలి
● టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు హన్మకొండ : వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకును అన్ని డీసీసీబీల్లోకెల్ల నంబర్ వన్‌గా నిలపాలని తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంకు, వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు అన్నారు. అధికారులు శ్రద్ధగా పని చేసి బ్యాంకు అభివృద్ధి కృషి చేయాలని సూచించారు. ఈ మేరకు మంగళవారం హనుమకొండ నక్కలగుట్టలోని డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో డీసీసీబీ బ్రాంచ్ మేనేజర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బ్రాంచ్‌ల వారీగా ప్రగతిని సమీక్షించారు. అనంతరం చైర్మన్ రవీందర్ రావు మాట్లాడుతూ నాబార్డు సమీక్షలో వరంగల్ డీసీసీబీ ‘ఏ’ ర్యాంకు అవార్డు సాధించేలా బ్యాంకు అభివృద్ధికి కృషి చేయాలన్నారు. రుణమాఫీ లబ్ధి పొందిన రైతులకు త్వరిగతిన కొత్త పంట రుణాలు అందించాలన్నారు. ఐఆర్ఏసీ నామ్స్ మేరకు ఈ ఆర్థిక సంవత్సరం ముగింపులోపు మొండి బకాయిలు రాబట్టి నిరర్థక ఆస్తులు 2 శాతానికి తగ్గించాలని ఆదేశించారు. టర్నోవర్ రూ.2500 కోట్లకు చేరుకునేలా కృషి చేయాలన్నారు. సమావేశంలో డీసీసీబీ సీఈఓ వజీర్ సుల్తాన్, జనరల్ మేనేజర్ ఉషా, డీజీఎం అశోక్, ఏజీఎంలు మధు, గొట్టం స్రవంతి, బోడ రాజు, గంప స్రవంతి, కృష్ణ మోహన్, డీఆర్ ఓఎస్డీ విజయ కుమారి పాల్గొన్నారు. -
డంపింగ్ యార్డు తొలగించాలని ఫిర్యాదు
మడికొండ: మడికొండ–రాంపూర్ మధ్యలోని చెత్త డంపింగ్ యార్డును తొలగించాలని అడ్‌హక్ కమిటీ సభ్యులు రాంపూర్, మడికొండ గ్రామస్తులు మంగళవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డికి ఫిర్యాదు అందించారు. స్పందించిన చిన్నారెడ్డి హనుమకొండ కలెక్టర్‌కు, బల్దియా కమిషనర్‌కు ఫోన్ చేసి డంపింగ్ యార్డుపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని అడిగారు. దీనిపై కలెక్టర్ ప్రావీణ్య స్పందిస్తూ త్వరలోనే డంపింగ్ యార్డును తొలగిస్తామన్నారు. ఫిర్యాదు తిరిగి కలెక్టర్‌కు అందించాలని చిన్నారెడ్డి అడ్ హక్ కమిటీ సభ్యులకు సూచించారు. కార్యక్రమంలో మెట్టుగుట్ట చైర్మన్ పైడిపాల రఘుచందర్, బైరి లింగమూర్తి, వస్కుల శంకర్, కమిటీ సభ్యులు దువ్వ నవీన్, పొనగోటి వెంకట్రావు, గడ్డం మహేందర్, వినోద్, శివ, నిఖిల్, కిషన్, కరుణాకర్‌రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. -
ఎస్సైకి గ్రూప్–1 ఉద్యోగం
హసన్‌పర్తి: కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న మాధవ్‌గౌడ్ గ్రూప్–1కు ఎంపికయ్యారు. ఇటు ఎస్సైగా విధులు నిర్వహిస్తూనే.. అటు గ్రూప్స్‌కు సిద్ధమయ్యారు. సోమవారం విడుదలైన గ్రూప్–1 పరీక్ష ఫలితాల్లో మాధవ్‌గౌడ్ 505 మార్కులు సాధించారు. మెరిట్ మేరకు ఆయనకు డీఎస్పీ, డిప్యూటీ కలెక్టర్, ఆర్డీఓ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. మాధవ్‌గౌడ్ స్వస్థలం కొత్తపల్లిగోరి మండలం సుల్తాన్పూర్. తండ్రి మొగిలి పోస్టల్ ఉద్యోగి కాగా.. తల్లి గృహిణి. 2019 ఎస్సై బ్యాచ్‌కు చెందిన ఆయన వరంగల్ కమిషనరేట్ పరిధి జఫర్గడ్తో పాటు పలు పోలీస్ స్టేషన్లలో ఎస్సైగా విధులు నిర్వహించారు. ఇటీవల బదిలీపై కేయూ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ప్రస్తుతం భీమారంలోని సత్యసాయికాలనీ–5లో భార్యాపిల్లలతో ఉంటున్నారు. -
ఎల్ఆర్ఎస్పై అవగాహన కల్పించండి
మేయర్ గుండు సుధారాణి వరంగల్ అర్బన్: ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల క్రమబద్ధీకరణలో ఆర్పీల సేవలు కీలకం అని మేయర్ గుండు సుధారాణి అన్నారు. మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారులు, రిసోర్స్ పర్సన్లతో మేయర్ సమావేశమయ్యారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. 2020 ఆగస్టు 26కు ముందు రిజిస్ట్రేషన్ పూర్తయిన, లే–ఔట్, పాట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అవగాహన కల్పించాలని కోరారు. రెగ్యులరైజ్ చేసుకోవడానికి 25 శాతం రాయితీతో ఈ నెలాఖరు వరకే ప్రభుత్వం గడువు ఇచ్చిందని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బల్దియా ప్రధాన కార్యాలయం, కాజీపేట, కాశిబుగ్గ సర్కిల్ కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జీడబ్ల్యూఎంసీకి సంబంధించి మీ సేవ కేంద్రాల్లో కూడా చెల్లింపులు చేసుకునే వెసులుబాటు కల్పించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్ రాజేశ్వర్‌రావు, ఏసీపీలు ఏర్షాద్, రజిత, టీఎంసీ రమేశ్, కమ్యునిటీ ఆర్గనైజర్లు తదితరులు పాల్గొన్నారు. -
దమ్ముంటే అభివృద్ధిపై చర్చకు రావాలి..
హన్మకొండ చౌరస్తా: ‘పదేళ్లలో మీరు చేయలేని అభివృద్ధిని ఏడాదిలో మా ప్రభుత్వం చేసింది.. ఉట్టి మాటలు కాదు.. దమ్ముంటే వరంగల్ అభివృద్ధిపై చర్చకు రావాలి’ అని మాజీ మంత్రి హరీశ్‌రావుకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి సవాల్ విసిరారు. హనుమకొండలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులపై ఆయన మండిపడ్డారు. ఆరు గ్యారంటీల అమలు హరీశ్‌రావుకు కనిపించకపోవడం బాధాకరమన్నారు. తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువులాంటి వరంగల్‌ను పదేళ్ల పాలనలో విస్మరించింది బీఆర్ఎస్ సర్కార్ కాదా? అని ప్రశ్నించారు. వరంగల్‌ను ఆరు ముక్కలుగా చేసి అస్తవ్యస్తం చేశారన్నారు. పదేళ్లలో ఒక్క ఇల్లు ఇవ్వలేని వీళ్లు.. నేడు కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడేందుకు సిగ్గుండాలన్నారు. మళ్లీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని సభ పేరుతో జిల్లాలో అడుగుపెడుతున్నారని ప్రశ్నించారు. కబ్జాలకు పాల్పడిన ఏ ఒక్కరినీ వదిలేది లేదని హెచ్చరించారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ, మాస్టర్‌ప్లాన్ వంటి అనేక అభివృద్ధి పనులకు నిధులు మంజూరు కానున్నట్లు తెలిపారు. అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని అడిగేందుకు 15 ప్రశ్నలసు సిద్ధం చేశానని, ఆ ప్రశ్నలకు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ఎవరు సమాధానం చెప్పినా ఫర్వాలేదన్నారు. సమావేశంలో ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రామ్రెడ్డి, టీపీసీ సభ్యుడు బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, ఎస్సీ డిపార్ట్మెంట్ జిల్లా ప్రెసిడెంట్ పెరుమాండ్ల రామకృష్ణ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు నాయకులు పాల్గొన్నారు. హరీశ్‌రావుకు ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి సవాల్ -
బుధవారం శ్రీ 12 శ్రీ మార్చి శ్రీ 2025
– 8లోuముల్కలపల్లి యువకుడు ఉపేందర్.. డోర్నకల్: గ్రూప్–2 ఫలితాల్లో ముల్కలపల్లికి చెందిన మేకల ఉపేందర్ ప్రతిభ కనబర్చారు. గ్రామానికి చెందిన మేకల రమణయ్య–రమణమ్మ దంపతుల కుమారుడు ఉపేందర్ ప్రస్తుతం మహబూబాబాద్ కలెక్టరేట్లో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తూ గ్రూప్–2 పరీక్షలు రాశారు. మంగళవారం ప్రకటించిన ఫలితాల్లో ఉపేందర్ 423.119 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో టాప్–10లో 9వ స్థానంలో నిలిచారు. ప్రతిభ చాటిన ఉపేందర్‌ను గ్రామస్తులు అభినందించారు. కొందరు ఒకపక్క ఉద్యోగం చేస్తూనే ఉన్నతస్థాయికి వెళ్లాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడ్డారు. అనుకున్న లక్ష్యం సాధించారు. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన గ్రూప్–2 ఫలితాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు అభ్యర్థులు ర్యాంకులు సాధించారు. దీంతో వారి కుటుంబ సభ్యుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఉన్న సమయంలోనే ప్రణాళికాబద్ధంగా చదవడం, విషయాన్ని అర్థం చేసుకుని పోటీ పరీక్షల్లో రాయడం ద్వారా ర్యాంకులు సాధించవచ్చని ఆయా అభ్యర్థులు అంటున్నారు. – సాక్షి నెట్వర్క్ గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మారుమూల ఏజెన్సీ గ్రామం జంగుతండాకు చెందిన మూడు భద్రు కుమారుడు శ్రీకాంత్ గ్రూప్–2 ఫలితాల్లో ఎస్టీ కేటగిరీలో ప్రతిభ కనబరిచారు. ఎస్టీ కేటగిరీలో ప్రథమ, జోనల్ వైస్ ఓపెన్ కేటగిరీలో మూడో ర్యాంకు, రాష్ట్రస్థాయిలో 38వ ర్యాంకు సాధించినట్లు శ్రీకాంత్ తెలిపారు. గతంలో గ్రూప్–4 సాధించి రెవెన్యూ శాఖలో ఉద్యోగం చేస్తున్నట్లు, గ్రూప్–3 లో కూడా మంచి మార్కులు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. శ్రీకాంత్‌ను మాజీ సర్పంచ్ అరుణమంగీలాల్‌నాయక్, మాజీ ఎంపీటీసీ గీతాఅమరేందర్‌రెడ్డి, తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు సన్మానించారు. మహబూబాబాద్ అర్బన్: మానుకోట జిల్లా కేంద్రంలోని డోలి వెంకటేశ్వర్లు–పద్మ దంపతుల కుమార్తె డోలి సంధ్య గ్రూప్–2లో రాష్ట్రస్థాయిలో 205 ర్యాంకు సాధించారు. 600 మార్కులకు 382.4 మార్కులు వచ్చాయి. అత్యధిక మార్కులు సాధించడంలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అభినందించారు. కొడకండ్ల: మండల కేంద్రంలోని నిరుపేద పద్మశాలి కుటుంబానికి చెందిన ప్రణీత్ 388 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 138వ ర్యాంకు సాధించారు. సోమనారాయణ–నాగలక్ష్మి మూడో కుమారుడు ప్రణీత్ 2019 హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తిచేసిన తర్వాత హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకుని గ్రూప్స్ పరీక్షలు రాశారు. డిసెంబర్లో వెలువడిన గ్రూప్–4 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 58వ ర్యాంకు సాధించి ముషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. గ్రూప్–1 పరీక్షలో 380 మార్కులు సాధించగా.. గ్రూప్–2 ఫలితాల్లో 388 మార్కులతో రాష్ట్రస్థాయిలో 138వ ర్యాంకు సాధించాడు. ఈసందర్భంగా ప్రణీత్‌కు స్థానిక పద్మశాలి సంఘం నాయకులతోపాటు మిత్రులు అభినందనలు తెలిపారు. భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధి కాసీంపల్లి గ్రామానికి చెందిన శనిగరపు ప్రవీణ్‌కుమార్ రాష్ట్రస్థాయిలో 76వ ర్యాంకు సాధించారు. నిరుపేద కుటుంబానికి చెందిన శనిగరపు రాధ–భద్రయ్య దంపతుల రెండో కుమారుడు ప్రవీణ్‌కుమార్. తల్లి రాధ అంగన్వాడీ హెల్పర్‌గా, తండ్రి భద్రయ్య సింగరేణి సంస్థలో కాంట్రాక్టు స్వీపర్‌గా పనిచేస్తున్నారు. ప్రవీణ్‌కుమార్ బీటెక్ పూర్తి చేసి 2019లో పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం సాధించి గణపురం మండలంలోని కర్కపల్లిలో విధులు నిర్వహించారు. 2021లో వీఆర్ఓ ఉద్యోగం సాధించి 6 నెలలపాటు మహదేవపూర్ మండలం అంబటిపల్లిలో పనిచేశారు. అదే సంవత్సరంలో గ్రూప్–4 పరీక్షలో ప్రతిభ కనబర్చి హైదరాబాద్‌లోని జీఎస్టీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరారు. అదేశాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఓవైపు ఉద్యోగం చేస్తూనే 2024 డిసెంబర్లో జరిగిన గ్రూప్–2 పరీక్ష రాసి రాష్ట్రస్థాయిలో 76వ ర్యాంకు, కాళేశ్వరం జోన్ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. బచ్చన్నపేట : జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రానికి చెందిన చిమ్ముల రాజశేఖర్‌రెడ్డి గ్రూప్–2లో రాష్ట్రస్థాయిలో 8వ ర్యాంకు సాధించాడు. చిమ్ముల అరుణ– మల్లారెడ్డి దంపతులు గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. కూతురు ప్రస్తుతం జనగామ మండలంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నది. కుమారుడు చిమ్ముల రాజశేఖర్‌రెడ్డి గ్రూప్–2 ఫలితాల్లో 423.933 మార్కులు సాఽధించి రాష్ట్రస్థాయిలో 8 వ ర్యాంకు సాధించాడు. గతంలో రాజశేఖర్‌రెడ్డి వీఆర్ఓ, పంచాయతీ కార్యదర్శి పోస్టులకు కూడా ఎంపికయ్యాడు. రేగొండ: రేగొండ మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన మూలగుండ్ల భాగ్యమ్మ, సాంబరెడ్డి కుమారుడు ఉపేందర్ రెడ్డి చిన్నప్పటి నుంచి చదువులో ప్రతిభావంతుడు. గ్రూప్–2లో రాష్ట్ర స్థాయిలో 28వ ర్యాంకు సాధించాడు. ఉపేందర్ ప్రస్తుతం పలిమెల తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గతంలోనూ పంచాయతీ కార్యదర్శిగా నాలుగేళ్లపాటు సేవలందించాడు. ప్రస్తుతం గ్రూప్–2లో ప్రతిభ చూపడంతో తల్లిదండ్రులతోపాటు, స్నేహితులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ రూరల్ : ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న కూటికంటి శివ గ్రూప్ –2 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 25వ ర్యాంకు సాధించారు. 2020 బ్యాచ్ ఎస్సైగా ఉద్యోగం సాధించిన శివ 2022 జనవరి నుంచి మహబూబాబాద్ జిల్లా పోలీసు శాఖలో వివిధ విభాగాల్లో ఎస్సైగా పనిచేసి ప్రస్తుతం మహబూబాబాద్ టౌన్ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు. గిరిజన ఆణిముత్యం శ్రీకాంత్ న్యూస్రీల్మెరిసిన సంధ్యగ్రూప్– 2 ఫలితాల్లో ఓరుగల్లు అభ్యర్థుల ప్రతిభ పలువురికి మెరుగైన ర్యాంకులు ఉద్యోగం చేస్తూనే పోటీ పరీక్షకు సన్నద్ధం హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లా వాసులు ప్రణీత్ ప్రతిభ..రాణించిన రైతు బిడ్డకాసీంపల్లి వాసిరాజశేఖర్రెడ్డికి 8వ ర్యాంకుఎస్సై శివకు 25వ ర్యాంకు -
పూడిక మట్టి వేగంగా తరలించండి
హన్మకొండ కల్చరల్: భద్రకాళి చెరువు పూడికతీత మట్టి తరలింపు ప్రక్రియ వేగంగా జరగాలని హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు పి.ప్రావీణ్య, డాక్టర్ సత్యశారద అన్నారు. మంగళవారం భద్రకాళి చెరువు పూడికతీత పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో కలెక్టర్లు, వరంగల్ మున్సిపల్ కమిషనర్ అశ్వినితానాజీ వాకడేతో కలిసి పరిశీలించారు. మట్టి తరలింపు కోసంవేస్తున్న ఫార్మేషన్ రోడ్టు పనులు, వాహనాల కూపన్లను పరిశీలించారు. పూడికతీత మట్టిని ఎంత తరలించారనే వివరాలను నీటి పారుదలశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా కలెక్టర్లు మాట్లాడుతూ పూడికతీత మట్టిని బుధవారం నుంచి ప్రారంభించాలని, పనులు జరుగుతున్న ప్రాంతంలో విద్యుత్‌లైట్లు ఏర్పాటు చేయాలన్నారు. మట్టి తరలింపు వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. పనులు సజావుగా సాగేలా అధికారులు సమస్వయంతో కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్, సాగు నీటి పారుదలశాఖ ఈఈ శంకర్, డీఈ హర్షవర్ధన్, ‘కుడా’ పీఓ అజిత్‌రెడ్డి, ఈఈ భీంరావు, ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, ఇతరశాఖల అధికారులు పాల్గొన్నారు. హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారద భద్రకాళి చెరువు పూడికతీత పనుల పురోగతి పరిశీలన -
పులకించిన కొండపర్తి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మండల పరిధిలో దత్తత తీసుకున్న కొండపర్తి గ్రామానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ మంగళవారం రావడంతో గిరిజనుల్లో ఆనందం వెల్లివెరిసింది. ఆయన కూడా ఆదివాసీలతో మేమకమయ్యారు. రాష్ట్ర మంత్రి సీతక్కతో కలిసి గవర్నర్ కొండపర్తికి రావడంతో ఆదివాసీల నృత్యాలు, డోలువాయిద్యాలు, మంగళహారతులతో మహిళలు ఘనస్వాగతం పలికారు. ముందుగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి సీతక్కతో కలిసి గ్రామంలో ఏర్పాటు చేసిన కొమురంభీం, బిర్సాముండా విగ్రహాలను ఆవిష్కరించారు. పాఠశాలలోని డిజిటల్ క్లాస్ ప్రొజెక్టర్, కారంపొడి, మసాలా యూనిట్లతోపాటు కుట్టు మిషన్ కేంద్రాలను ప్రారంభించారు. మధ్యాహ్నం 12.10 గంటలకు కొండపర్తికి వచ్చిన గవర్నర్ 1.40 గంటల వరకు గ్రామస్తులతో గడిపారు. అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామానికి గవర్నర్ రావడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామస్తులు గవర్నర్ చేతుల మీదుగా బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం గవర్నర్‌ను మేడారం జాతర చైర్మన్ అరెం లచ్చుపటేల్, మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్, తాడ్వాయి మాజీ సర్పంచ్ ఇర్ప సునీల్‌దొర గజమాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్‌జీ, ఆర్డీఓ వెంకటేశ్, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ వీరభద్రం, అధికారులు పాల్గొన్నారు. గవర్నర్‌కు సన్మానం.. జిల్లా పర్యటనకు వచ్చిన గవర్నర్ ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని విశ్రాంతి తీసుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు మంత్రి సీతక్క కలెక్టర్ దివాకర పూలమొక్క అందించి శాలువాలతో సన్మానించి జ్ఞాపిక అందజేశారు. కొండపర్తిని దత్తత తీసుకోవడం గొప్ప విషయం: మంత్రి సీతక్క దట్టమైన అటవీ ప్రాంతంలోని కొండపర్తి గ్రామాన్ని గవర్నర్ దత్తత తీసుకోవడం గొప్ప విషయం అన్నారు. ఆ గ్రామాన్ని బయట ప్రపంచంతో సంబంధం లేకుండా అనుసంధానం చేస్తూ స్థానిక ఉత్పత్తులను అందించడం ద్వారా మహిళలు వ్యాపారవేతలుగా ఎదగాలన్నారు. 40 కంపెనీలు ‘దిశ’ స్వచ్ఛంద సంస్థ సహకారంతో జిల్లాలోని వంద పాఠశాలలను దత్తత తీసుకున్నట్లు వివరించారు. పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి : దాన కిశోర్, గవర్నర్ కార్యాలయ ప్రధాన కార్యదర్శి కొండపర్తిని అభివృద్ధి చేసి పర్యావరణ పరిరక్షణ గ్రామంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతోనే గవర్నర్ కార్యాలయ ప్రధాన కార్యదర్శి దాన కిశోర్ అన్నా రు. ప్రతీ కుటుంబానికి ఆదాయం చేకూరేలా ఐకమత్యంతో ముందుకుసాగాలని సూచించారు. మిర్చి, పసుపు, మసాలా యూనిట్లకు మార్కెటింగ్ పరంగా రాష్ట్ర వ్యాప్తంగా సౌకర్యం కల్పిస్తామన్నారు. అమ్మవార్లకు మొక్కుల చెల్లింపు కొండపర్తికి వచ్చిన గవర్నర్ మంత్రి సీతక్కతో కలిసి వనదేవతలను దర్శించుకున్నారు. అమ్మవార్ల గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు, గోవిందరాజు, పగిడిద్దరాజులను దర్శించుకున్నారు. గవర్నర్ 74 కిలోల ఎత్తు బంగారం (బెల్లం) అమ్మవార్ల మొక్కుగా సమర్పించారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ డాక్టర్ శబరీశ్, రీజినల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణారావు, డిప్యూటీ కమిషనర్ సంధ్యారాణి, అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత పాల్గొన్నారు.ఆదివాసీలతో మమేకమైన గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మకు గ్రామస్తుల ఘనస్వాగతం పలు ఉపాధి యూనిట్ల ప్రారంభోత్సవం పోలీసుల భద్రత నడుమ సాగిన పర్యటన -
ఎల్ఆర్ఎస్ను వినియోగించుకోవాలి
కాజీపేట అర్బన్: భూక్రయవిక్రయదారులు ఎ ల్ఆర్ఎస్ను వినియోగించుకోవాలని రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ వరంగల్ జిల్లా రి జిస్ట్రార్ ఫణీందర్ తెలిపారు. కాజీపేట ఫాతిమానగర్ వంద ఫీట్ల రోడ్డులోని వరంగల్ ఆర్ఓ కార్యాలయంలో సోమవారం ఎల్ఆర్ఎస్ విధివిధానాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా రిజిస్ట్రార్ హాజరై మాట్లాడుతూ.. మార్చి 31 వరకు.. 25 శాతం రాయితీని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎడిట్ ఆప్షన్ లేనందున మాడ్యూల్‌ను క్షుణ్ణంగా పరిశీలించాకే పూర్తి చేయాలన్నారు. ఎల్ఆర్ఎస్ పూర్తి చేసుకుని రిజిస్ట్రేషన్లకు రావాలని సూచించారు. డాక్యుమెంట్ రైటర్లు ఎల్ఆర్ఎస్–20 మాడ్యూల్‌పై భూక్రయవిక్రయదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా సబ్ రిజిస్ట్రార్లు, డాక్యుమెంట్ రైటర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు. ఈవీఎం స్ట్రాంగ్ రూంల తనిఖీహన్మకొండ అర్బన్: వరంగల్ ఏనుమాముల మార్కెట్ యార్టులో జిల్లాకు సంబంఽధించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (ఈవీఎంలు) భద్రపర్చిన స్ట్రాంగ్ రూములను హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య సోమవారం అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చేశారు. మూడు నెలలకోసారి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్వహించే త్రైమాసిక సాధారణ తనిఖీల్లో భాగంగా స్ట్రాంగ్ రూములను తనిఖీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఇంటర్ పరీక్షలకు 444 మంది గైర్హాజరువిద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో సోమవారం నిర్వహించిన ఇంటర్ సెకండియర్ ప రీక్షల్లో 444 మంది విద్యార్దులు గైర్హాజరయ్యా రు. జిల్లాలో మొత్తం 18,560 మంది పరీక్షలకు హాజరవ్వాల్సి ఉండగా.. అందులో 18,116 మంది మాత్రమే హాజరైనట్లు డీఐఈఓ గోపాల్ తెలిపారు. సుబేదారిలోని కాకతీయ బాలికల జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ ప్రావీణ్య సందర్శించారు. పరీక్షల తీరును పరిశీలించారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. పెన్సిల్ మొనపై ఐసీసీ ట్రోఫీహన్మకొండ: హనుమకొండ గోపాలపూర్‌కు చెందిన కళాకారుడు తాటికొండ శ్రీజిత్ పెన్సిల్ మొనపై ఐసీసీ చాంపియన్ షిప్ ట్రోఫీని రూపొందించాడు. ఐసీసీ చాంపియన్‌గా భారత్ నిలిచిన క్రమంలో శ్రీజిత్ 1.8 మిల్లీ మీటర్ల ఎత్తులో ఈ ట్రోఫీని తయారు చేశాడు. దీన్ని చెక్కడానికి 1.30 గంటల సమయం పట్టిందని కళాకారుడు చెబుతున్నాడు. తాను కెప్టెన్ రోహిత్ శర్మ వీరాభిమానినని, ఆయన కెప్టెన్సీలో టీమ్ స్పిరిట్‌తో బాగా ఆడి భారత్ ఐసీసీ చాంపియన్‌షిప్ కప్ దక్కించుకోవడం సంతోషంగా ఉందన్నారు. కేయూలో నేటి నుంచి జాతీయ సదస్సుకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని జువాలజీ విభాగం ఆధ్వర్యంలో ‘ఇన్నోవేటివ్ టెక్నిక్స్ ఇన్ అనిమల్ బయోటెక్నాలజీ, ఇమ్యునాలజీ ఫర్ డిసీస్ ప్రివెన్షన్ అండ్ మేనేజ్మెంట్’ అంశంపై ఈనెల 11, 12 తేదీల్లో రెండ్రోజులపాటు జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆచార్య వై.వెంకయ్య తెలిపారు. కామర్స్ విభాగంలో రెండ్రోజులపాటు..కాకతీయ యూనివర్సిటీలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాలలో ఈనెల 12, 13 తేదీల్లో రెండ్రోజులపాటు జాతీయ సదస్సును నిర్వహించనున్నట్లు సెమినార్ డైరెక్టర్, ప్రిన్సిపాల్ పి.అమరవేణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘న్యూ హారిజన్స్ ఇన్ కామర్స్ అండ్ బిజినెస్మేనేజ్మెంట్ అండ్ ఆపర్చునిటీస్’ అంశంపై సదస్సు జరుగుతుందని పేర్కొన్నారు. -
బతకడం కష్టంగా ఉంది..
హన్మకొండ అర్బన్: ‘భర్త మరణం తర్వాత నన్ను పోషిస్తారనే ఆశతో నాకున్న 26 గుంటల వ్యవసాయ భూమిని మనుమలు దాట్ల ప్రవీణ్, రాజ్‌కుమార్ పేరు మీద పట్టా చేయించిన. ప్రవీణ్ చనిపోవడంతో అతడి భార్య నా బాగోగులు చూడట్లేదు. దీంతో నాకు బతకడం కష్టంగా మారింది. ఆస్తి లేనందున నన్నెవరూ పట్టించుకోవట్లేదు. ప్రవీణ్ భార్య.. భూమిని అమ్మేందుకు ప్రయత్ని స్తోంది. మొత్తం 26 గుంటల భూమిని మళ్లీ నా పేరు మీదికి చేయిస్తే ప్రశాంతంగా గడుపుతా. నన్ను సాకిన వారికి ఆస్తి ఇస్తా.. అధికారులు చర్యలు తీసుకోవాలి’ అని కలెక్టర్‌కు మొర పెట్టుకుంది భీమదేవరపల్లి మండలం కొప్పూర్‌కు చెంది న వృద్ధురాలు దాట్ల దుర్గమ్మ. ఇలా.. ఒక్కొక్కరు ఒ క్కో సమస్యపై కలెక్టర్‌కు వినతి పత్రాలు అందజేశారు. తక్షణ చర్యలు తీసుకోవాలి.. ప్రజావాణి వినతుల పరిష్కారానికి జిల్లా అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని, వినతులు పెండింగ్‌లో ఉంచవద్దని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వారి సమస్యలపై వినతులు స్వీకరించారు. మొత్తం 114 వినతులు అధికారులకు అందగా.. వాటిని పరిశీలించి సంబంధిత శాఖలకు పంపించారు. గ్రీవెన్స్‌లో కలెక్టర్‌తోపాటు అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, డీఆర్ఓ వైవీ గణేశ్, ఆర్డీఓలు డాక్టర్ కన్నం నారాయణ, రమేశ్, డీఆర్డీఓ మేనశ్రీను తదిరుతలు ఉన్నారు. రోడ్డు కబ్జా చేస్తున్నారు.. హనుమకొండ 49వ డివిజన్లో కొందరు వ్యక్తులు రోడ్డు కబ్జా చేసి నిర్మాణం చేపట్టారు. కోర్టు ఉత్తర్వులు ధిక్కరించి పనులు చేస్తున్నారు. ఈవిషయంలో మున్సిపల్, టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తక్షణం చర్యలు తీసుకోవాలి. ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి. – జనార్దన్, పోస్టల్ కాలనీ వినడం..తీసుకోవడమే..వరంగల్ గ్రీవెన్స్‌లో 103 వినతులు వరంగల్: వరంగల్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో బాధితుల గోడు వినడం.. ఇచ్చిన దరఖాస్తులు తీసుకోవడం తప్ప సమస్యలు పరిష్కారం కావడంలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాధితులు తమ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో కలెక్టరేట్‌కు మళ్లీ మళ్లీ వచ్చి దరఖాస్తు చేసుకుంటున్నట్లు వాపోతున్నారు. పెండింగ్ లేకుండా చూడాలి: వరంగల్ కలెక్టర్ సమస్యల పరిష్కారానికి ప్రజావాణిలో అందిస్తున్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించి పెండింగ్ లేకుండా చూడాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, వరంగల్ ఆర్డీఓ సత్యపాల్‌రెడ్డి, డీఆర్డీఓ కౌసల్యదేవి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, హౌసింగ్ పీడీ గణపతిలతో కలిసి వినతులు స్వీకరించారు. గ్రీవెన్స్‌లో మొత్తం 103 దరఖాస్తులు రాగా వాటిని సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. ఎక్కువగా భూ సంబంధిత సమస్యలపై 53 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. న్యాయం చేయాలి.. పైడిపల్లి గ్రామంలో మా తల్లి చిలుక కాంత పేరున ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇంటిని నిర్మించుకున్నాం. ఆ ఇంటిని అన్న చిలుక బాబు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తూ నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు. మా వదిన భాగ్య ఇళ్లు నిర్మించుకోకుండానే తప్పుడు పత్రాలతో బిల్లులు తీసుకుంది. మాకు ఉన్న రెండు ఇళ్లు, ఆస్తిని కాజేయాలని చూస్తున్నారు. విచారణ జరిపి న్యాయం చేయాలి. – చిలుక సుధాకర్, పైడిపల్లి, వరంగల్ దరఖాస్తు రిజెక్ట్ చేశారు.. ఇందిరమ్మ ఇంటి కోసం దరఖా స్తు పెట్టుకుంటే రిజెక్ట్ అయ్యింది. ఆన్లైన్లో చూస్తే మూడో విడతలో మంజూరు చేసిన జాబితాలో పేరు వచ్చింది. కానీ రిజెక్ట్ అయిందని రిమార్కులో పేర్కొన్నారు. కారణం ఏంటని పరిశీలిస్తే ప్రభుత్వ ఉద్యోగి అని ఉంది. నేను అవుట్ సోర్సింగ్ స్వచ్ఛభారత్ ఆటోను నడుపుతా. ప్రభుత్వ ఉద్యోగిని కాదు. రిమార్క్‌ను తొలగించి ఇల్లు మంజూరు చేయాలి. – నాగార్జున, కరీమాబాద్ ఆస్తి లేనందున నన్నెవరూ పోషించట్లేదు.. నా భూమి నాకు ఇప్పించండి.. ప్రజావాణిలో కలెక్టర్ ప్రావీణ్యకు వృద్ధురాలి మొర.. 114 అర్జీలు స్వీకరించిన కలెక్టర్ -
‘వెల్నెస్’.. సేవల్లో డల్‌నెస్
హన్మకొండ చౌరస్తా: హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి ఆవరణలోని వెల్నెస్ సెంటర్లో కనీస వసతులు కరువయ్యాయి. అధికారులు, పాలకుల చిన్నచూపుతో నిత్యం రోగులు ఇబ్బందులు పడుతున్నారు. వెల్నెస్ సెంటర్‌కు వయస్సు పైబడిన వారే అత్యధికంగా వస్తుంటారు. ఇక్కడ వీరికి మౌలిక వసతులు కూడా అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. సెంటర్లోని టాయిలెట్లకు తాళం వేసి ఉన్న ఘటన మరవకముందే.. సోమవారం అంతర్గత సమస్యతో సెంటర్లో విద్యుత్ సరఫరా నిలిచింది. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన సీనియర్ సిటిజన్లు, జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సోమవారం ఓపీ ప్రారంభమైన 10 నిమిషాలకే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో అప్పటికే కొంతమందికి ఆన్లైన్లో ఓపీ చిట్టీలు ఇవ్వగా .. మరికొందరికి మాత్రం ఆఫ్‌లైన్‌లో చిట్టీలు ఇచ్చారు. కానీ.. విద్యుత్ సరఫరా లేక మందుల సరఫరా నిలిచిపోయింది. వైద్యులు సైతం అందుబాటులో లేక రోగులకు ఎదురు చూపులు తప్పలేదు. విద్యుత్ అంతరాయం ఏర్పడిన వెంటనే పరిష్కరించాల్సిన సెంటర్ నిర్వాహకులు ఒంటి గంట వరకు నిధానంగా పని కానిచ్చారు. ఇదే సాకుగా భావించిన కొందరు డాక్టర్లు విధులకు డుమ్మా కొట్టి వెళ్లిపోయారు. దీంతో వైద్య పరీక్షల కోసం వచ్చిన రోగులు వెనుదిరగక తప్పలేదు. అనంతరం 1 గంటకు సమస్య పరిష్కారమైంది. కానీ చాలామంది అప్పటికే ఇళ్లకు వెళ్లిపోయారు. ఈవిషయంపై వైద్య సిబ్బందిని ఆరా తీయగా.. బ్రేకర్లు పడిపోవడంతో వి ద్యుత్ సరఫరా నిలిచిందని, ఇన్వర్టర్ సైతం పాడైందని తెలిపారు. వెల్నెస్ సెంటర్లో అంతర్గత సమస్యతో నిలిచిన విద్యుత్ రోగుల ఎదురుచూపులు.. డాక్టర్ల డుమ్మా -
పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన కమిషనర్‌గా సన్‌ప్రీత్ సింగ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సూర్యాపేట జిల్లానుంచి బదిలీపై వచ్చిన ఆయన.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సాయుధ పోలీసులనుంచి గౌరవ వందనం స్వీకరించారు. డీసీపీలు, అదనపు డీసీపీలు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ కమిషనర్‌గా పూర్వ సీపీ అంబర్ కిషోర్ ఝానుంచి బాధ్యతలు స్వీకరించారు. అంబర్ కిషోర్ ఝా.. నూతన సీపీకి పూలబొకే అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ సన్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వందశాతం శాంతి భద్రతలను కాపాడుతామని, ప్రజలకు పోలీసులపై నమ్మకం కలిగేలా 24 గంటలు ప్రజల కోసం పనిచేస్తామన్నారు. ప్రధానంగా నేరాల నియంత్రణతోపాటు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు కృషి చేస్తామన్నారు. ప్రస్తుతం పోలీసులు ఎదుర్కొంటున్న సవాళ్లు అయిన సైబర్ క్రైం, మత్తు పదార్థాల కట్టడితోపాటు మత్తు పదార్థాలను వినియోగించేవారు, విక్రయించేవారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. రాబోయే రోజుల్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులను మరింత బలోపేతం చేస్తామన్నారు. అభినందనలు తెలిపిన వారిలో డీసీపీలు షేక్ సలీ మా, రాజమహేంద్ర నాయక్, అంకిత్ కుమార్, ఏఎస్పీ చైతన్య, అదనపు డీసీపీలు రవి, సురేశ్ కుమార్‌తోపాటు ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, ఆర్ఎస్సైలు, అధికారులు ఉన్నారు. 24 గంటలు అందుబాటులో ఉంటా.. నూతన సీపీ సన్‌ప్రీత్‌సింగ్ బాధ్యతల స్వీకరణ -
పీఆర్లో కారుణ్య నియామకాలు
హన్మకొండ:పంచాయతీరాజ్ శాఖలో ఎట్టకేలకు కారుణ్య నియామకాలు చేపడుతున్నారు. 2016 నుంచి ఎదురుచూస్తున్న కు టుంబాలకు ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ప్రభుత్వం 2024 మే నెలలోపు నమోదు చేసుకున్న వారికి ఉద్యోగాలివ్వాలని నిర్ణయించింది. ఈక్రమంలో అటెండర్ పోస్టులను జూనియర్ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్ చేసింది. జిల్లా ప్రజాపరిషత్ పరిధిలో ఉద్యోగం చేస్తూ విధుల్లో మృతిచెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగావకాశం కల్పిస్తుంది. జిల్లా ప్రజాపరిషత్‌లలో కేవలం అటెండర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో చేరేందుకు బీటెక్, డిగ్రీ, పీజీ వంటి ఉన్నత చదువులు చదివిన కుటుంబ సభ్యులు ముందుకు రాలేదు. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీ లేకపోవడం, ఉన్న పోస్టుల్లో గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ రెవెన్యూ సహాయకులను జిల్లా ప్రజాపరిషత్‌లో సర్దుబాటు చేయడంతో అవి భర్తీ అయ్యాయి. దీంతో కారుణ్య నియామకాల కోసం వారికి నిరీక్షణ తప్పలేదు. అటెండర్ టు జూనియర్ అసిస్టెంట్‌గా అప్‌గ్రేడ్ ఈక్రమంలో ప్రభుత్వం అటెండర్ పోస్టులను జూనియర్ అసిస్టెంట్ పోస్టులుగా అప్‌గ్రేడ్ చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. దీంతో హనుమకొండ జిల్లా ప్రజాపరిషత్‌లోని 58, వరంగల్‌లో 26 పోస్టులు అప్‌గ్రేడ్ కోసం ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వంనుంచి అమోదం లభించింది. వరంగల్ జిల్లా ప్రజాపరిషత్‌లో మరో 9 సూపర్ న్యూమరీ పోస్టులు మంజూరు చేసింది. ఈ మేరకు అధికారులు అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలన చేశారు. హనుమకొండకు సంబంధించి 46 మంది, వరంగల్‌కు 28 మంది హాజరయ్యారు. మిగతా వారు ఎప్పుడు వచ్చినా అవకాశం కల్పిస్తామని ఆయా జిల్లాల ప్రజాపరిషత్ అధికారులు తెలిపారు. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన అభ్యర్థుల జాబితాను కలెక్టర్ల ఆమోదం కోసం పంపారు. కలెక్టర్ నుంచి ఆమోదం లభించిన వెంటనే ఒకటి రెండు రోజుల్లో నియామక ఉత్తర్వులు అందించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. హనుమకొండ జిల్లాలో 58, వరంగల్ జిల్లాలో 35 పోస్టులు 2016 నుంచి ఎదురుచూపులు సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి రెండు రోజుల్లో ఉత్తర్వులు -
ఎల్ఆర్ఎస్ రాయితీకి గడువు నెలాఖరు
వరంగల్ అర్బన్: ఎల్ఆర్ఎస్పై ప్రభుత్వం కల్పిస్తున్న 25 శాతం రాయితీ సదుపాయాన్ని లేఔట్, నాన్ లేఔట్ పాట్ల యజమానులు, డెవలపర్లు, ప్లాట్ల యజమానులు సద్వినియోగం చేసుకోవాలని వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు సత్యశారద, పి.ప్రావీణ్య అన్నారు. సోమవారం హనుమకొండలోని ‘కుడా’ కార్యాలయంలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, సంబంధిత అధికారులతో కలిసి ఎల్ఆర్ఎస్పై లేఔట్ డెవలపర్లు, సర్వేయర్లు, యజమానులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్లు మాట్లాడుతూ.. 26 ఆగస్టు 2020 కు ముందు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కచ్చా లే ఔట్ చేసిన వారు, వాటిలో ప్లాట్లు తీసుకున్న ఎల్ఆర్ఎస్కు వచ్చిన దరఖాస్తుదారులు క్రమబద్ధీకరించుకోవాలని సూచించారు. ఈ నెలాఖరు (మార్చి 31) వరకే ప్రభుత్వం గడువు కల్పించినట్లు తెలిపారు. జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ.. ఎల్ఆర్ ఎస్‌కు సంబంధించి ఏ సమస్యలున్నా.. బల్దియా అధికారుల దృష్టికి తీసుకొస్తే సహకరిస్తారనన్నారు. ఎల్ఆర్ఎస్ డెవలపర్లు, ప్లాట్ల యజమానులు అడిగిన పలు సందేహాలను నివృత్తి చేశారు. సమావేశంలో ‘కుడా’ పీఓ అజిత్‌రెడ్డి, సిటీ ప్లానర్ రవీందర్, జిల్లా రిజిస్ట్రేషన్ అధికారి, సంబంధిత శాఖల అధికారులతో పాటు లేఔట్, నాన్ లేఔట్ యజమానులు డెవలపర్లు, టౌన్ ప్లానర్లు, లే ఔట్ రైటర్లు, బిల్డర్లు, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన పల్లిగింజ
సాక్షిప్రతినిధి, వరంగల్: పల్లిగింజ తిన్న చిన్నారికి అదే యమపాశమైంది.. గొంతులో గింజ ఇరుక్కుని శ్వాస ఆడక బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం నాయక్‌పల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుండెల వీరన్న–కల్పన దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు అక్షయ్ (18 నెలలు) ఉన్నాడు. గురువారం ఇంటి ఎదుట పల్లీలు ఆరబెట్టగా ఆడుకుంటున్న అక్షయ్ గింజ తిన్నాడు. దీంతో గింజ గొంతులో ఇరుక్కుని శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. గుర్తించిన తల్లిదండ్రులు వెంటనే వరంగల్ ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. చిన్నారి మృతదేహంమీద పడి తల్లిదండ్రులు, కుటుంబీకులు గుండెలవిసేలా రోదించారు. అప్పుడే నీకు నూరేళ్లు నిండిపోయాయ బిడ్డా అంటూ బోరున విలపించారు. -
వరంగల్ పోలీస్ కమిషనర్‌గా సన్‌ప్రీత్ సింగ్
17 నెలలకే అంబర్ కిషోర్ ఝా బదిలీ 2023 అక్టోబర్ 13న అంబర్ కిషోర్ ఝా వరంగల్ సీపీగా నియమితులయ్యా రు. 2009 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అంబర్ కిషోర్ ఝా ఇక్కడ 17నెలలు పనిచేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికలతోపాటు పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడంలో కీలకపాత్ర పోషించారు. నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నారు. తక్కువ సమయంలోనే ఆయనకు బదిలీ కాగా.. అంతే ప్రాధాన్యత గల మరో కమిషనరే ట్ సీపీగా నియమితులయ్యారు. క్రైం డీసీపీగా జనార్దన్ వరంగల్ పోలీస్ కమిషనరేట్ క్రైమ్ డీసీపీగా బెదరకోట జనార్దన్ నియమితులయ్యారు. ప్రస్తుతం టీజీ ఎన్పీడీసీఎల్లో చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్‌గా ఉన్న ఆయన 1989 ఎస్ఐ బ్యాచ్‌కి చెందిన వారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో వివిధ పోస్టుల్లో పోలీసు అధికారిగా పనిచేశారు. సుమారు మూడేళ్లుగా ఎన్పీడీసీఎల్లో చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. సూర్యాపేట ఎస్పీ నుంచి వరంగల్ కమిషనర్‌గా.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్‌సింగ్.. ప్రస్తుతం సూర్యాపేట జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. 2011 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఈయన 2012లో ములుగు ఏఎస్పీగా, వరంగల్ రూరల్ ఓఎస్డీగా పనిచేశారు. అనంతరం ఎల్బీ నగర్ డీసీపీగా, జగిత్యాల ఎస్పీగా కూడా విధులు నిర్వర్తించారు. రామగుండం సీపీగా అంబర్ కిషోర్ ఝా బదిలీ ● సూర్యాపేట ఎస్పీగా పనిచేస్తున్న సన్‌ప్రీత్ ● డీసీపీ రవీందర్ కూడా ట్రాన్స్ఫర్.. ఆయన స్థానంలో ఐపీఎస్ అంకిత్ ● క్రైం డీసీపీగా బెదరకోట జనార్దన్సాక్షి ప్రతినిధి, వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనర్‌గా సన్‌ప్రీత్ సింగ్ నియమితులయ్యారు. ప్రస్తుత సీపీ అంబర్ కిషోర్ ఝా పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్ పోలీస్ కమిషనర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈస్ట్ జోన్ డీసీపీగా అంకిత్‌కుమార్.. వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీగా ఉన్న రవీందర్‌ను సీఐడీకి బదిలీ చేసిన ప్రభుత్వం.. ఆయన స్థానంలో డీసీపీగా అంకిత్‌కుమార్‌ను నియమించింది. 2020 బ్యాచ్‌కు చెంది న అంకిత్‌కుమార్ గతంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో ట్రైనీ ఐపీఎస్‌గా పనిచేశారు. -
వివక్ష తగ్గినా వేధింపులున్నాయి..
కుటుంబాన్ని నడిపిస్తున్న మహిళామణులు104133మహిళలపై బహిరంగ ప్రదేశాల్లో వేధింపులు కొనసాగుతున్నాయి. పనులు చేస్తున్న మహిళలకు కార్యాలయాల్లో వేధింపులు కొంతమేర కొనసాగుతు న్నా.. సెల్ఫోన్లలో కొందరు అసభ్యపదజాలంతో పంపిస్తున్న మెసేజ్‌లతో ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం ఇంట్లో చెప్పలేక సతమతమవుతున్నారు. మానసికంగా ఇబ్బంది పెడుతున్న వారిలో తెలిసిన వారితోపాటు తెలియని వారు ఉన్న ట్లు పలువురు మహిళలు చెబుతున్నారు. నాడు వంటింటికే పరిమితమైన మహిళ.. నేడు విద్య, ఉద్యోగం, నచ్చిన రంగంలో ఎదుగుతూ పురుషులతో సమానంగా పనిచేస్తోంది. మహిళా దినోత్సవం నేపథ్యంలో ఆడ–మగ వివక్ష, పని ప్రదేశంలో వేధింపులు తదితర అంశాలపై ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ‘సాక్షి’ సర్వే నిర్వహించగా పలు విషయాలు వెలుగుచూశాయి. – సాక్షి నెట్వర్క్ 20073170110C623) మీరు ఎక్కువగా ఇబ్బంది పడుతున్న ప్రదేశం? (ఎ) సెల్ఫోన్లో వచ్చే మెసేజ్‌లతో.. బి) బస్టాప్‌లో సి) కాలేజీ లేదా ఆఫీస్‌లో2) మీ కాలేజీ – పని ప్రదేశంలో మహిళగా ఏమైనా వివక్ష ఎదుర్కొంటున్నారా..? ఎ) లేదు బి) ఉంది సి) చెప్పలేను 1) మీ ఇంట్లో ఆడ – మగ వివక్ష ఏమైనా ఉందా..? ఎ) ఉంది బి) లేదు సి) చెప్పలేనుA7837B4) మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వారిలో అత్యధికులు ఎవరు? ఎ) తెలియని వారు బి) తెలిసిన వారేషాంపిల్స్: 310 (గ్రేటర్వరంగల్ 60మంది, మిగతా ఐదు జిల్లాలు (వరంగల్, మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లి, ములుగు 50మంది చొప్పున) అన్ని వర్గాల మహిళలను పరిగణనలోకి తీసుకుని వారి అభిప్రాయాల సేకరణ. వారి సంకల్పం గొప్పది. ఆశయం ఉన్నతమైనది. హేళనలు, అవమానాలేమీ వారు చేసే పనులకు అడ్డంకి కాలేదు. ప్రతికూల పరిస్థితులెదురైనా, పురుషాధిక్య రంగమైనా వారు పట్టు వీడలేదు. అన్ని రంగాల్లోనూ మాదే పై చేయి అంటూ ముందుకు సాగుతున్నారు. చిన్నతనంలో వివాహమై భర్తను కోల్పోయిన ఒకరు కుటుంబానికి అండగా నిలబడితే.. మరొకరు పేదరికాన్ని పారదోలేందుకు నడుంకట్టారు. ఇంకొకరు విశ్వవేదికపైన జాతీయ జెండాను సగర్వంగా ఎగురవేశారు. నేడు(శనివారం) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సంకల్ప శక్తులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. హోటల్ నడుపుతూ.. పిల్లలను చదివిస్తూ.. చిట్యాల: మండల కేంద్రానికి చెందిన భీమారపు ఓదెలు హోటల్ నడుపుతూ జీవనం సాగించేవాడు. కట్టెల పొయ్యి కారణంగా అతడి చూపు దెబ్బతిన్నది. భార్య ప్రమీల 20 ఏళ్లుగా హోటల్ నడుపుతూ పిల్ల లను చదివిస్తోంది. గతేడాది పెద్దమ్మాయికి పెళ్లి చేసింది. మిగతా ఇద్దరు పీజీ, ఎంటెక్ చదువుతున్నారు. ఓదెలు కూరగాయలు కట్ చేసి వ్వడం, పిండి కలపడం వంటి పనుల్లో ఆమెకు సాయం చేస్తుంటాడు. తమ కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని వారు కోరుతున్నారు.● విభిన్న రంగాల్లో రాణిస్తూ ఆదర్శం ● పురుషులకు దీటుగా బాధ్యతలు నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవంసంగెం: వైకల్యం శరీరానికే కానీ మనస్సుకు కాదని నిరూపించింది సంగెం మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన దామెరుప్పుల రమాదేవి. ఆమెకు ఆర్నెళ్ల వయసులోనే జ్వరం వచ్చింది. కాళ్లు చచ్చుబడిపోయాయి. వైకల్యాన్ని జయించాలంటే చదువు ఒక్కటే మార్గమని.. నమ్మింది. ప్రస్తుతం పీహెచ్డీ చేస్తోంది. గత ఏడాది డిసెంబర్ 5, 6 తేదీల్లో కాంబోడియా దేశంలో ఇంటర్నేషనల్ త్రోబాల్ పోటీలకు మన దేశం తరఫున పాల్గొని మొదటి స్థానంలో నిలిచి గోల్డ్‌మెడల్ సాధించింది. చీకట్లో ‘వెన్నెల’ సాక్షి, మహబూబాబాద్: దంతాలపల్లి మండలం పెద్దముప్పారానికి చెందిన గొడిశాల మల్లయ్య సుగుణమ్మల కుమార్తె వెన్నెల. పుట్టిన ఎనిమిదేళ్లకే తండ్రి మరణించాడు. ఆతర్వాత వెన్నెలను నర్సింహులపేట మండల కేంద్రంలోని అక్కా, బావ తీగల వెంకన్న, సుజాత చేరదీసి చదివించా రు. పదోతరగతి చదివిన వెన్నెలకు మహబూబా బాద్ మండలం పర్వతగిరికి చెందిన నారమళ్ల సంపత్తో వివాహం జరిపించారు. చిన్నతనంలో నే ఇద్దరు ఆడపిల్లలకు తల్లయ్యింది. మిర్చి పంట కు తామర పురుగు సోకడంతో కుటుంబం అప్పు ల పాలయ్యింది. అప్పుల బాధతో భర్త సంపత్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో 19 ఏళ్లకే వెన్నెల వితంతువుగా మారింది. ఆరేళ్ల సాన్విక, మూడేళ్ల తన్వికతో పాటు తల్లి సుగుణమ్మ, అత్త, మామ పోషణ ఆమైపె పడింది. మహబూ బా బాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తూ కుటుంబ భారాన్ని మోస్తోంది. మూగజీవాల నేస్తం.. డాక్టర్ అనిత లింగాలఘణపురం: మండల కేంద్రంలో పశువైద్యురాలిగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ఆడెపు అనిత పాడి రైతులు, గొర్రెలు, మేకల పెంపకందారుల మన్ననలు పొందుతున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన అనిత 2019లో లింగాలఘణపురం పశువైద్యాధికారిగా విధుల్లో చేరారు. పశువైద్యశాల కు వచ్చే మూగ జీవాలకు వైద్యం చేస్తూనే.. వ్యవసాయబావులు దూరంగా ఉండి ఆస్పత్రికి రాలేని పశువుల వద్దకు స్వయంగా ద్విచక్రవాహనంపై వెళ్లి వైద్యం చేస్తున్నారు. పశువులకు కృత్రిమ గర్భధారణలో ప్రత్యేకత చాటుకున్నారు. 63 శాతం సక్సెస్ సాధించారు. పశువులు, గొర్రెలకు వ్యాక్సినేషన్‌ను నూటికి నూరు శాతం అమలు చేస్తూ రైతులు, గొర్రెలు, మేకల పెంపకందారులకు నేస్తంగా మారిపోయారు. చేయి చేయి కలిపి.. పేదరికాన్ని తరిమి ఏటూరునాగారం: మండలంలోని శివాపురంలో ట్రైకార్ సాయంతో ఐటీడీఏ ద్వారా పది మంది మహిళలు సమ్మక్క–సారలమ్మ డిటర్జెంట్ సబ్బుల తయారీ పరిశ్రమను నెలకొల్పారు. ట్రైకార్ నుంచి 60 శాతం సబ్సిడీ, బ్యాంకు నుంచి 30 శాతం రుణం తీసుకుని పరిశ్రమ నడుపు తున్నారు. తయారు చేసిన సబ్బులకు ఒక్కోదానికి రూ.10గా ధర నిర్ణయించి గిరిజన సహకార సంఘానికి(జీసీసీ) విక్రయిస్తున్నారు. రోజుకు సుమారు 4 వేల సబ్బులు తయారు చేస్తున్నారు. ఐదేళ్లుగా కోటిన్నర రూపాయల వ్యాపారం చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సబ్బుల తయారీలో ఆదర్శంగా నిలుస్తున్నారు. కట్టె కోత.. బాధ్యతల మోతకట్టెకోత మిల్లులో మగవారితో సమానంగా పని చేస్తోంది వరంగల్ నగరం నాగేంద్రనగర్‌కు చెందిన ఎండీ రజియా. భర్త అనారోగ్యం కారణంగా కుటుంబ భారం ఆమైపె పడింది. 15 ఏళ్లుగా నగరంలోని జగన్నాథం సామిల్లులో కట్టర్‌గా పనిచేస్తోంది. ముగ్గురు పిల్లల పెళ్లి చేయగా.. కూతురు కుటుంబంలో కలహాలు రావడంతో ఆమె తల్లివద్దే ఉంటోంది. వీరందరికీ రజియా పని చేస్తేనే భోజనం. సొంతిల్లు ఉంటే కొంత భారం తగ్గుతుందని రజియా అంటోంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, వరంగల్ సమాచార వారధిగా పత్రికల సేవలు భేష్‘సాక్షి’ గెస్ట్ ఎడిటర్, వరంగల్ జిల్లా రెండో అదనపు జడ్జి (పోక్సో కోర్టు) మనీషా శ్రవణ్ ఉన్నవ్ సంకల్పం ముందు చిన్నబోయిన వైకల్యం వరంగల్ లీగల్ : ప్రజలకు, అధికార యంత్రాంగానికి, ప్రభుత్వానికి సమాచార వారధిగా వార్తా పత్రిక లు నిలవాలని సాక్షి గెస్ట్ ఎడిటర్, వరంగల్ జిల్లా రెండో అదనపు జడ్జి (పోక్సో కోర్టు) మనీషా శ్రవణ్ ఉన్నవ్ అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా సాక్షి వరంగల్ యూనిట్ కార్యాలయానికి శుక్రవారం ఆమె గెస్ట్ ఎడిటర్‌గా వచ్చారు. ముందుగా జడ్జికి సాక్షి ఎడిషన్, బ్యూరో ఇన్చార్జులు వర్ధెల్లి లింగయ్య, గడ్డం రాజిరెడ్డి, లీగల్ రిపోర్టర్ జీవన్ పూలమొక్క అందించి స్వాగతం పలికారు. మొదట ఎడిటోరియల్ విభాగానికి చేరుకున్నారు. ఫీల్డ్ నుంచి రిపోర్టర్లు పంపిన కాపీలు డెస్క్‌కు ఎలా చేరుతాయో పరిశీలించారు. ఎడిటోరియల్ విభాగాన్ని పరిశీలించి సబ్ ఎడిటర్లు వార్తలు దిద్దుతున్న తీరును గమనించారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన కాపీలను చూసి కావాల్సిన అదనపు అంశాలు, సమాచారాన్ని తెప్పించుకోవాలని సూచించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వే రిపోర్ట్‌ను పరిశీలించి పేజీ లేఔట్‌పై తగిన సూచనలిచ్చారు. సర్వే అంశాలు బాగున్నాయని, వాటిని ఎలా నిర్వహించారో అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విజయవంతంగా ముందుకు సాగుతున్న మహిళలపై తెప్పించిన కథనాలను చూసి తగిన ఫొటోలు ఉన్నాయా.. లేవా? అని సరిచూసుకోవాలని, అక్షరదోషాలు లేకుండా దిద్దాలని సూచించారు. అనంతరం ఐటీ, ఏడీవీటీ, స్కానింగ్, సీటీపీ, ప్రొడక్షన్ విభాగాలను పరిశీలించారు. వాటి పనితీరును తెలుసుకున్నారు. నూతన టెక్నాలజీతో అన్ని రంగుల్లో పత్రిక వెలువడుతున్న తీరును చూసి బాగుందని కితాబిచ్చారు. ప్రజలకు ఉపయోగపడే వార్తలివ్వాలి.. పత్రికలో అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే వార్తలు ఇవ్వాలని మనీషా శ్రవణ్ ఉన్నవ్ అన్నారు. న్యాయసంబంధ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రచురించాలని, వీటిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. మహిళలను జర్నలిజంలో ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని ఆధారాలతో పరిశోధనాత్మక వార్తలు రాయాలని సూచించారు. మహిళా చైతన్యంలో పత్రికలు కీలకమని పేర్కొన్నారు. సాక్షి గెస్ట్ ఎడిటర్‌గా తనకు అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం సాక్షి సిబ్బంది ఆమెకు శాలువా అందించి సన్మానించారు. మహిళల ‘సౌర’ సాగు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఆమెకు అండగా.. పోకిరీల ఆట కట్టిస్తున్న ‘షీ’టీమ్ – 8లోuకూతుళ్లే మహారాణులు కొందరు ఒక్కరితో సరి.. ‘సాక్షి’ సర్వేలో మహిళల మనోగతం వార్తకు అనుగుణంగా శీర్షికలు ఉండాలి.. కచ్చితమైన సమాచారం ఉండేలా చూసుకోవాలి.. మహిళా దినోత్సవ కథనాలు బాగున్నాయని కితాబు -
బోధనలో ఏఐపై ఆధారపడొద్దు
● చైతన్య డీమ్డ్ వర్సిటీ వీసీ దామోదర్ ● ముగిసిన అంతర్జాతీయ సదస్సు విద్యారణ్యపురి: ఇంగ్లిష్ బోధనలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌పైనే పూర్తిగా ఆధారపడొద్దని చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ వీసీ జి.దామోదర్ అధ్యాపకులకు సూచించారు. హనుమకొండలోని కేడీసీలో ఇంగ్లిష్ విభాగం ఆధ్వర్యంలో ‘ట్రాన్స్ఫర్మేషన్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ ఇన్ మల్టీడిసిప్లీనరీ కాంటెక్ట్స్ ఇన్‌ది ఎరా’ అంశంపై అంతర్జాతీయ సదస్సు శుక్రవారం రాత్రి ముగిసింది. రెండురోజులుగా 167 పరిశోధన పత్రాలు సమర్పించారు. ఈసదస్సులో కేడీసీలోని ఇంగ్లిష్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ రాంభాస్కర్‌రాజు సంపా దకత్వంలో వెలువడిన ‘కరెంట్ రివ్యూ’ అనే జర్నల్ను చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ వీసీ దామోదర్ విడుదల చేశారు. సదస్సులో రాష్ట్ర ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.సురేందర్‌రెడ్డి, కెన్యా ప్రొఫెసర్ కుప్పు రామ్, కేడీసీ ప్రిన్సిపాల్ రాజారెడ్డి, సదస్సు కన్వీనర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ రాంభాస్కర్‌రాజు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రజనీలత, పింగిళి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.చంద్రమౌళి, కేయూ పాలకమండలి సభ్యుడు మల్లం నవీన్ అధ్యాపకులు, పరిశోధకులు పాల్గొన్నారు. -
మహిళలు ధైర్యంగా పోరాడాలి
● వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ ● కలెక్టరేట్లో ఘనంగా మహిళా దినోత్సవం హన్మకొండ అర్బన్: గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం మహిళలు విభిన్న రంగాల్లో ముందు వరుసలో నిలుస్తున్నారని, ఆయా రంగాల్లో సమస్యలు ఎదురైనప్పుడు మహిళలు మరింత ధైర్యంగా పోరాడాలని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ అన్నారు. శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్లో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ హనుమకొండ, వరంగల్ జిల్లా శాఖల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నిర్మలా గీతాంబ మాట్లాడుతూ.. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అన్నారు. ముఖ్య అతిథులు జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ, కలెక్టర్ ప్రావీణ్యను టీజీఓస్ నాయకులు.. శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించారు. ఈసందర్భంగా మహిళా ఉద్యోగులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన మహిళా ఉద్యోగులకు కలెక్టర్ ప్రావీణ్య చేతుల మీదుగా ప్రశంసపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో టీఎన్జీఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగన్మోహన్రావు, హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి తదితకెలె పాల్గొన్నారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షకు 534 మంది గెర్హాజరువిద్యారణ్యపురి: జిల్లాలో శుక్రవారం ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు 55 పరీక్ష కేంద్రాల్లో కొనసాగాయి. ఇంటర్ జనరల్, ఒకేషనల్ కోర్సులు కలిపి జిల్లాలో మొత్తం 19,815 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. అందులో 19,281 మంది హాజరయ్యారు. 534 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ గోపాల్ తెలిపారు. హనుమకొండలోని ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాలలో, కృష్ణవేణి జూనియర్ కళాశాలలో పరీక్ష కేంద్రాలను అడిషనల్ కలెక్టర్ వెంకట్‌రెడ్డి సందర్శించారు. వరంగల్ జిల్లాలో 245 మంది గైర్హాజరు కాళోజీ సెంటర్: వరంగల్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం 26 కేంద్రాల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు నిర్వహించారు. 5,152 జనరల్ విద్యార్థులకు 4,979 మంది, 885 మంది ఒకేషనల్ విద్యార్థులకు 813 మంది హాజరయ్యారని జిల్లా ఇంటర్ విద్యాధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. మొత్తం 245 మంది గైర్హాజరయ్యారని ఆయన పేర్కొన్నారు. పీజీ పరీక్షల్లో 10 మంది డీబార్ విద్యారణ్యపురి: కేయూ పరిధిలో పీజీ కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. శుక్రవారం నిర్వహించిన పరీక్షల్లో హనుమకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రంలో ఐదుగురు, మాస్టర్జీ డిగ్రీ కాలేజీ పరీక్ష కేంద్రంలో ఐదుగురు మొత్తం 10 మంది కాపీయింగ్ చేస్తూ స్క్వాడ్‌కు పట్టుబడ్డారు. వారిని డీబార్ చేసినట్లు పరీక్షల నియంత్రణాఽధికారి రాజేందర్ తెలిపారు. -
ఖండాంతరాలు దాటిన ప్రేమ
కేసముద్రం : కొలంబియా(Colombian) యువతి, కేసముద్రం యువకుడు ప్రేమించుకుని(love marriage) పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం(Kesamudram) స్టేషన్‌కి చెందిన సాయిచైతన్య ఆస్ట్రేలియాలో(Australia) ఓ కంపెనీలో ఈవెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. కొలంబియా దేశానికి చెందిన రియా అదే కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేస్తోంది. ఇద్దరు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించారు. వారి అంగీకారంతో గురువారం కేసముద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో హిందూ సంప్రదాయ పద్ధతిలో ఒక్కటయ్యారు. -
పెళ్లి వద్దని ఆత్మహత్యాయత్నం
● మానుకోట ఎస్సై సమాచారంతో కాపాడిన కాజీపేట జీఆర్పీ పోలీసులు ● తండ్రికి విద్యార్థిని అప్పగింత కాజీపేట రూరల్ : పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని ఓ విద్యార్థిని కాజీపేట జంక్షన్ రైల్వే యార్డులో గురువారం తెల్లవారు జామున ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా పోలీసులు అదుపులోకి తీసుకోని ఆమె తండ్రికి అప్పగించిన సంఘటన కాజీపేటలో జరిగింది. జీఆర్పీ కానిస్టేబుల్ ఆర్.కమలాకర్ తెలిపిన వివరాల ప్రకారం. మహబూబాబాద్ జిల్లాకు చెందిన నందిని హాస్టల్లో ఉంటూ బీటెక్ చదువుతోంది. ఇంటికి వచ్చిన నందినికి పెళ్లి చేస్తానని చెప్పడంతో తల్లి కూతుళ్ల మధ్య గొడవ జరిగింది. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని నందిని బుధవారం ఇంటి నుంచి వచ్చి కాజీపేట రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. అదే రోజు రాత్రి నందిని కాజీపేటలో ప్రయాణికుడి సెల్‌ఫోన్ నుంచి తండ్రికి ఫోన్ చేసి కాజీపేట రైల్వే స్టేషన్లో ఉన్నానని, రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పింది. అప్రమత్తమై తండ్రి మహబూబాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై సమాచారంతో కాజీపేట జీఆర్పీ పోలీసులు రైల్వే యార్డు ఆర్ఆర్ఐ సమీపంలో ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధంగా ఉన్న నందినిని గుర్తించి అదుపులోకి తీసుకోని జీఆర్పీ స్టేషన్‌కు తరలించారు. తండ్రిని పిలిపించి జీఆర్పీ అధికారుల ఆదేశాలనుసారం నందినిని తండ్రి అప్పగించినట్లు ఆయన తెలిపారు. మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి జైలు, జరిమానా మడికొండ : మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి కోర్టు జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది. మడికొండ ఇన్స్పెక్టర్ కిషన్ తెలిపిన వివరాల ప్రకారం.. కాజీపేట మండలం రాంపేట గ్రామానికి చెందిన మీరాల రాజు 2017, జూలై 22న సాయంత్రం అదే గ్రామానికి చెందిన ఓ మహిళ ఇంట్లోకి ప్రవేశించి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. అప్పటి ఎస్సై మధుప్రసాద్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయగా, విచారణలో భాగంగా గురువారం కానిస్టేబుల్ వి.రాజేష్ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టాడు. ప్రాసిక్యూషన్ తరఫున ఎస్.దుర్గబాయ్ వాదించగా నిందితుడిపై నేరం రుజువైంది. దీంతో హనుమకొండ మొదటి అదనపు న్యాయమూర్తి చింతాడ శ్రావణ స్వాతి నిందితుడికి ఏడాది జైలు శిక్షతో పాటు రూ.6,000ల జరిమానా విధించినట్లు ఇన్స్పెక్టర్ కిషన్ తెలిపారు. -
భళా.. ఇత్తడి హస్తకళ
సాక్షి, వరంగల్ : వరంగల్ జిల్లా రంగశాయిపేట ఇత్తడి హస్తకళకు దేశ రాజధానిలో ప్రత్యేక గుర్తింపు దక్కుతోంది. కాకతీయుల కాలం నాటి వెండి నగిషీలు తయారుచేసే పెంబర్తి హస్తకళకు దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు ఉంటే.. వాటి సరసన రంగశాయిపేట ఇత్తడి హస్తకళ పోటీపడుతోంది. అమృత్ మహోత్సవ్‌లో భాగంగా న్యూఢిల్లీలోని రాష్ట్రపతి నిలయంలో బుధవారం నుంచి జరుగుతున్న దక్షిణ భారత ఎగ్జిబిషన్లో రంగశాయిపేట ఇత్తడి హస్తకళ స్టాల్‌కు చోటు లభించింది. ఓ వైపు సాంస్కృతిక ప్రతిరూపాలను తెలిపే డిజైన్లు, మరోవైపు నేటి కాలానికి తగ్గట్టుగా మోడ్రన్ డిజైన్ విత్ ఎంబోజింగ్ వర్క్ ద్వారా విభిన్న హస్తకళ డిజైన్లు చేస్తుండడంతో వీటికి ప్రత్యేక గుర్తింపు లభించింది. నాబార్డు, డీసీహెచ్ మద్దతుతో వందలాది కుటుంబాలకు ఈ హస్తకళ నైపుణ్యంపై శిక్షణ ఇచ్చి భవిష్యత్ తరాలకు తెలిసే విధంగా రంగశాయిపేట ఇత్తడి హస్తకళ బంధం ముందుకెళ్తోంది. ‘రాగి లేదా ఇత్తడి లోహన్ని సన్నని షీట్లుగా కొట్టి, చక్కటి తీగగా కట్ చేస్తాం. చెక్క ఉపరితలంపై గుర్తించబడిన డిజైన్‌ను సుత్తి, ఉలి సాయంతో కోస్తాం. ఇత్తడి లేదా రాగి తీగను డిజైన్‌తో చెక్కబడిన భాగంలోకి సుత్తితో గుచ్చుతాం. ఆ తర్వాత రంపంతో కత్తిరించి డిజైన్‌లో కావల్సిన ప్రదేశాలలో జిగురుతో బిగిస్తాం. అత్యాధునిక పద్ధతులతో వివిధ డిజైన్లతో వస్తువులను తయారు చేస్తున్నాం. ఇంటిరియర్ వర్క్‌లో ఫ్లవర్ వాజెస్, వాల్ ప్యానెల్స్, డోర్ ప్యానెల్స్ చేస్తున్నాం.అలాగే దేవాలయం, దేవుళ్ల ఫొటోలతో కూడా ఎంబోజింగ్ వర్క్‌తో అది కూడా చేతి ద్వారా చేయడంతో ఆయా బొమ్మల ఆకారం స్పష్టంగా కనబడుతుంద’ని రంగశాయిపేట ఇత్తడి హస్తకళ బృంద సభ్యుడు ప్రణయ్ గురువారం ‘సాక్షి’కి వివరించారు. అలాగే వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. ‘రంగశాయిపేట ఇత్తడి హస్తకళలకు రాష్ట్రపతి నిలయంలో జరిగిన అమృత్ మహోత్సవ్ ఎగ్జిబిషన్ లో చోటు దక్కడం జిల్లాకు దక్కిన గుర్తింపు. మరోసారి చేతికళలకు నిలయమని దేశమంతటా తెలిసింది. ఈ హస్త కళాకారులు భవిష్యత్‌లో ఇత్తడితో విభిన్న డిజైన్లు చేసి ఆర్థికాభివృద్ధి చెందడంతో పాటు జిల్లాకు మంచి గుర్తింపు వచ్చేలా పనిచేయాల’ని ఆకాంక్షించారు. ● రాష్ట్రపతి భవన్లో ఈ కళకు ప్రత్యేక గుర్తింపు ● వరంగల్‌కు దక్కిన గౌరవంపై ప్రశంసలు ● ప్రత్యేక ఆకృతులతో ఆకట్టుకుంటున్న స్టాల్ -
ఉద్యోగుల ఆటా... పాట
హన్మకొండ అర్బన్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులకు క్రీడా సాంస్కృతిక పోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. గురువారం కలెక్టరేట్లోని టీజీఓ కార్యాలయంలో సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉద్యోగులు పాల్గొన్నారు. మహిళా దినోత్సవంలో భాగంగా శుక్రవారం కలెక్టరేట్లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు సంఘం రాష్ట్ర నాయకులు ఎన్నమనేని జగన్మోహన్రావు తెలిపారు. కార్యక్రమానికి వరంగల్ జిల్లా ప్రధాన జడ్జి నిర్మలా గీతాంబ, హనుమకొండ వరంగల్ కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారద, మున్సిపల్ కమిషనర్ అశ్వినితానాజీ పాల్గొంటారని పేర్కొన్నారు. -
ఏజే మిల్లు కార్మిక భవన స్థలం సర్వే
వరంగల్: వరంగల్ లక్ష్మీపురంలో ఉన్న ఏజే మిల్లు కార్మిక భవనం మ్యూటేషన్, రిజిస్త్రేషన్తో పాటు నిర్మాణ అనుమతులు రద్దు చేయాలని ఏజే మిల్లు భూముల పరిరక్షణ సమితి జేఏసీ, పలు సంఘాల నాయకులు ఆందోళనలు చేశారు. పలుమార్లు కలెక్టర్ సత్యశారద, కమిషనర్ వాకడేకు వినతిపత్రాలు సమర్పించి ల్యాండ్ సర్వే విభాగంతో సర్వే చేయించాలని కోరారు. ఈనేపథ్యంలో గురువారం ల్యాండ్ సర్వే శాఖ ఏడీ దేవరాజ్, డీఏ భుజంగరావు, సర్వేయర్ సందీప్ కార్మిక భవనం స్థలాన్ని రీ సర్వే చేశారు. జేఏసీ నాయకులు స్థలం వద్దకు వచ్చి ఏడీతో కాకుండా డీడీ నేతృత్వంలో సర్వే చేయించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ ఆదేశాలతోనే వచ్చామని అధికారులు తెలపడంతో నాయకులు సర్వేలో పాల్గొన్నారు. నాయకులు గంగుల దయాకర్, ఆకెన వెంకటేశ్వర్లు, పెరుమాళ్ల లక్ష్మణ్, డాక్టర్ కొనతం కృష్ణ, ఇనుముల శ్రీనివాస్, ఆరెళ్లి కష్ణ, జన్ను రమేశ్, కోమాకుల నాగరాజు, భాస్కర్ పాల్గొన్నారు. -
ఆర్టీఏపై విజిలెన్స్ నిఘా
ఖిలా వరంగల్ : వరంగల్ రవాణా శాఖ కార్యాలయంలో వాహనదారులకు అందించే సేవలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ప్రత్యేక నిఘా వేశారు. అధికారుల పనితీరు, వాహనదారులకు అందించే సేవలపై రహస్యంగా పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా వరంగల్ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అదనపు ఎస్పీ బాలకోటి ఆధ్వర్యంలో బుధవారం వరంగల్ రవాణాశాఖ కార్యాలయంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. జీరో కౌంటర్ల వద్ద అందజేస్తున్న సేవలు, వాహన ఫిట్నెస్, రిజిస్ట్రేషన్ విధానం, ఆన్లైన్ డ్రైవింగ్ పరీక్షలను స్వయంగా పరిశీలించారు. అనంతరం జీరో కౌంటర్లలో సోదాలు చేసిన అధికారులు ఇన్చార్జ్ ఆర్టీఓ శోభన్ బాబును కలిసి సేవలకు సంబంధించిన కొన్ని పత్రాలను అడిగి తీసుకున్నారు. దళారుల కార్యాలయాల్లో ఏమైనా వాహనదారులకు చెందిన ఫైల్స్ ఉన్నాయా.. అనే దానిపై ఆరా తీశారు. అధికారుల పనితీరు, రవాణాశాఖ అందజేస్తున్న సేవలపై ప్రత్యేక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.● తరచూగా ఆకస్మిక పరిశీలన, తనిఖీలు -
శరవేగంగా భూ సర్వే
ఖిలా వరంగల్ : మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. భూ సర్వేకు రైతుల సైతం సుముఖంగా ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 253 ఎకరాల భూ సేకరణకు రూ.205 కోట్ల నిధుల విడుదల చేసింది. కలెక్టర్ ఆదేశాలతో గురువారం తహసీల్దార్ బండి నాగేశ్వర్రావు ఆధ్వర్యంలో నక్కలపల్లి, గాడిపల్లి గ్రామ శివారులో శరవేగంగా భూ సేకరణకు సర్వే చేపట్టారు. రైతుల సహకారంతో తొలిరోజు 170 ఎకరాల భూ సర్వే చేసి హద్దులు గుర్తించారు. అనంతరం భూ నిర్వాసితుల నుంచి వ్యక్తిగత వివరాలను సేకరించారు. ఈసందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ రైతుల సహకారంతో తొలిరోజు నక్కలపల్లి–47, గాడిపల్లి శివారు పరిధిలో 123, మొత్తం 170 ఎకరాలు సర్వే చేశామని తెలిపారు. మిగిలిన 8 3 ఎకరాల భూమి మరో మూడ్రోజుల్లో పూర్తి చేసి సమగ్ర నివేదికను కలెక్టర్‌కు అందజేయనున్నట్లు త హసీల్దార్ తెలిపారు. అనంతరం సర్వేకు సహకరించిన రైతులకు తహసీల్దార్ నాగేశ్వర్రావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సర్వేలో ఆర్ఐ ఆనంద్‌కుమార్, సర్వేయర్ రజిత, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. సర్వేకు రైతుల సుముఖత ఎయిర్ పోర్ట్ రన్‌వేకు 253 ఎకరాలు సేకరణ -
‘పొలంబాట’తో సత్ఫలితాలు
హన్మకొండ: విద్యుత్ అధికారులు చేపట్టిన పొలంబాట కార్యక్రమం సత్ఫలితాలనిస్తోంది. రైతులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక విద్యుత్ సమస్యలు పరిష్కారమవుతున్నాయి. రైతులకు ఉత్తమ సేవలు అందించేందుకు టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం పొలంబాట కార్యక్రమాన్ని చేపట్టింది. డీఈ, ఏడీఈ, ఏఈ, ఇతర అధికారులతోపాటు జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్లు వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి నేరుగా సమస్యలు తెలుసుకుంటున్నారు. రైతులు తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. ఈసందర్భంగా విద్యుత్ ప్రమాదాల పట్ల అధికారులు వారికి అవగాహన కల్పిస్తున్నారు. ఆటోమేటిక్ స్టార్టర్ల వల్ల ఎదురయ్యే ఇబ్బందులు, కెపాసిటర్లు అమర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ రైతులను ప్రోత్సహిస్తున్నారు. వంగిన స్తంభాల, లూజ్ లైన్లు సరిచేయడం, మధ్య స్తంభాలు ఏర్పాటు, ట్రాన్స్ఫార్మర్ల గద్దెలు పెంచడం వంటి అనేక సమస్యలు పరిష్కారమవుతున్నాయి. పొలాల్లో లూజ్ లైన్లు, ఎత్తు తక్కువగా విద్యుత్ లైన్లు ఉండడంతో వరి కోతల సమయంలో హార్వెస్టర్లకు తగిలి విద్యుదాఘాతానికి గురవుతున్న సంఘటనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో లూజ్ లైన్లు, కిందకు ఉన్న లైన్ల ఎత్తును పెంచుతున్నారు. ఎత్తు పెంచేందుకు 9.1 మీటర్ ఎత్తున్న విద్యుత్ స్తంభాలు నాటుతున్నారు. పరిష్కారమవుతున్న విద్యుత్ సమస్యలు క్షేత్రస్థాయికి వెళ్తున్న ఎన్పీడీసీఎల్ అధికారులు విద్యుత్ వినియోగంపై రైతులకు అవగాహన హనుమకొండ జిల్లాలో 277, వరంగల్ జిల్లాలో 40 ‘పొలంబాట’ కార్యక్రమాలుహనుమకొండ జిల్లా (సర్కిల్)లో.. ఇప్పటివరకు 277 పొలంబాట కార్యక్రమాలు చేపట్టారు. 238 వంగిన స్తంభాలు, 703 లూజ్ లైన్లు సరి చేశారు. 1,179 మధ్యస్తంభాలు ఏర్పాటు చేశారు. ట్రాన్స్ఫార్మర్లు ఫెయిల్యూర్ కాకుండా ఎర్తింగ్ సరిగ్గా ఉండేలా ఏర్పాట్లు చేశారు. తక్కువ ఎత్తులో ఉన్న 128 ట్రాన్స్ఫార్మర్ల గద్దెల ఎత్తు పెంచారు. ప్రమాదకరంగా ఉన్న డబుల్ ఫీడింగ్, లో లెవెల్ లైన్ క్రాసింగ్లను తనిఖీ చేసి సరిచేస్తున్నారు. ఇప్పటివరకు 144 డబుల్ ఫీడింగ్, లో లెవెల్ లైన్ క్రాసింగ్లను మార్చారు. లైన్లు తక్కువ ఎత్తులో ఉన్న వాటి స్థానాల్లో 9.1 మీటర్ స్తంభాలు ఏర్పాటు చేస్తున్నారు. వరంగల్ జిల్లా (సర్కిల్) పరిధిలో.. ఇప్పటివరకు 40 పొలంబాట కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో 236 వంగిన స్తంభాలు, 739 లూజ్లైన్లు సరిచేశారు. 659 మధ్యస్తంభాలు ఏర్పాటు చేశారు. తక్కువ ఎత్తులోఉన్న 98 ట్రాన్స్ఫార్మర్ల గద్దెల ఎత్తు పెంచారు. ఇప్పటివరకు 76 డబుల్ ఫీడింగ్, 134 లో లెవెల్లైన్ క్రాసింగ్లను మార్చారు. హార్వెస్టర్ల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ప్రదేశాలతోపాటు తక్కువ ఎత్తులో లైన్ల స్థానాల్లో 9.1 మీటర్ స్తంభాలు ఏర్పాటు చేస్తున్నారు. -
11న వరంగల్ జిల్లాస్థాయి యువజనోత్సవాలు
వరంగల్: బొల్లికుంటలోని వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో ఈనెల 11న నిర్వహించనున్న వరంగల్ జిల్లాస్థాయి యువజనోత్సవాల్లో యువకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వరంగల్ జిల్లా యువ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. యంగ్ రైటర్స్, యంగ్ ఆర్టిస్ట్, ఫొటోగ్రఫీ, ఉపన్యాసం, సాంస్కృతిక జానపద నృత్యం (గ్రూప్), సైన్స్ ఎగ్జిబిషన్ (గ్రూప్, వ్యక్తిగత) అంశాల్లో పోటీలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పంచ ప్రాణ్ అంశంపై పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని చెప్పారు. గ్రూప్, ఫోక్‌డ్యాన్స్, ఫొటోగ్రఫీ కాంపిటీషన్లో పంచ్ ప్రాణ్ అంశం వర్తించదని వివరించారు. ఉత్సాహవంతులైన ఫొటోగ్రాఫర్లు తమ సెల్ఫోన్లు, తెచ్చుకున్న కెమెరాలతో పోటీ ప్రదేశంలో ఇచ్చిన థీమ్స్‌ను ఫొటోలు తీసి చూపిస్తారని పేర్కొన్నారు. ప్రతిభ కనబర్చిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ నగదు బహుమతితోపాటు ప్రశంసపత్రాలు అందజేస్తామని వెల్లడించారు. జిల్లాలోని యువజన సంఘాలు, కళాశాల విద్యార్థులు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, పూర్తి వివరాల కోసం 76758 24707/95733 93831 నంబర్లలో సంప్రదించాలని అన్వేశ్ సూచించారు. -
పంపులను వినియోగంలోకి తేవాలి..
మేయర్ గుండు సుధారాణి వరంగల్: మోటారు పంపులకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకురావాలని మేయర్ గుండు సుధారాణి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం కాకతీయ ఫిల్టర్ బెడ్ (కేయూసీ)ని మేయర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫిల్టర్ బెడ్లో ఇటీవల దెబ్బతిన్న నీటి సరఫరా మోటారు పంపులను పరిశీలించారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. వేసవి వచ్చినందున నీటి సరఫరాలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలన్నారు. ఫిల్టర్‌బెడ్‌లో 3 రోజు లుగా పని చేయకుండా ఉన్న మోటారును పరిశీలించి కాంట్రాక్టర్‌తో మాట్లాడి ముందస్తుగా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఫిల్టర్‌బెడ్‌లో పురాతన నీటి పంపింగ్ స్టేషన్‌ను మేయర్ పరిశీలించారు. ఫిల్టర్‌బెడ్ ఆవరణలోని రాణి రుద్రమ విగ్రహం ఉన్న ప్రాంతంలో గులక రాళ్లతో ఆకర్షణీయంగా తీర్చిదిద్ది హార్టికల్చర్ వారి సహకారంతో ఆ ప్రాంతంలో గ్రీనరీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఈఈలు మహేందర్, మాధవీలత, సంతోశ్‌బాబు, డీఈఈ రాజ్‌కుమార్, ఏఈలు హరికుమార్, సరిత పాల్గొన్నారు. -
పునరుద్ధరణ పనులు పూర్తి చేయండి
● బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే వరంగల్ : కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) ఆధ్వర్యంలో కొనసాగుతున్న కాకతీయ మ్యూజికల్ గార్డెన్ పునరుద్ధరణ పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ‘కుడా’ వైస్ చైర్మన్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. గురువారం వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సమీపంలోని కాకతీయ మ్యూజికల్ గార్డెన్ అభివృద్ధి పనుల పురోగతిని అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో కమిషనర్ పరిశీలించారు. కొనసాగుతున్న ఫౌంటెన్ పనుల్ని పరిశీలించి సమర్థ నిర్వహణకు సూచనలిచ్చారు. భద్రకాళి చెరువులో తీస్తున్న పూడికతీతను పరిశీలించారు. మూడు లక్షల క్యూబిక్ మీటర్ల పూడికతీతే లక్ష్యం కాగా.. ఇప్పటివరకు 50 వేల క్యూబిక్ మీటర్లు డీసిల్టేషన్ చేసినట్లు పేర్కొన్నారు. ఖిలా వరంగల్‌లోని ఏకశిల పార్కును కమిషనర్ సందర్శించారు. నగర ప్రజల సౌకర్యార్థం పార్కును మరింత అభివృద్ధి చేసి సౌకర్యాలు కల్పించేందుకు టాయిలెట్లు, కిచెన్, డైనింగ్ హాల్, ఓపెన్ థియేటర్, కాటేజీలతో పాటు చెరువు చుట్టూ బండ్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అ ధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట ‘కుడా’ పీడీ అజిత్‌రెడ్డి, ఈఈ భీంరావు పాల్గొన్నారు. -
అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కృషి
కేయూ క్యాంపస్: అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నూతనంగా ఎన్నికై న ‘అకుట్’ అధ్యక్షుడు ప్రొఫెసర్ బి.వెంకట్రామ్రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి కాకతీయ యూనివర్సిటీలోని సెనేట్హాల్లో అకుట్ నూతన కార్యవర్గం ఎన్నికై న సందర్భంగా నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. 2010లో నియమకమైన అసిస్టెంట్ ప్రొఫెసర్ల పదోన్నతులు లీగల్ సమస్యల వల్ల పెండింగ్‌లో ఉన్నాయని, వాటిపై కూడా దృష్టి సారిస్తామన్నారు. అకుట్ మాజీ జనరల్ సెక్రటరీ ఆచార్య మామిడాల ఇస్తారి మాట్లాడుతూ.. తమ హయాంలో పెండింగ్‌లో ఉన్న అధ్యాపకులు అనేక సమస్యలను వర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించామని పలు అంశాలను ఈసందర్భంగా ఆయన గుర్తు చేశారు. అధ్యాపకుల పదోన్నతులకు సంబంధించి పూర్తి ఎరియర్స్‌ను వచ్చేలా అకుట్ కృషి చేసిందన్నారు. ఆచార్యుల ఉద్యోగ విరమణ వయస్సును పెంపు కోసం పలుసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని ఇటీవలే ప్రభుత్వం ఉద్యోగ విరమణ వయస్సును పెంచిందన్నారు. అకుట్ నూతన జనరల్ సెక్రటరీ డాక్టర్ ఎల్పీ రాజ్‌కుమార్ నూతన కార్యవర్గ బాధ్యులు పాల్గొన్నారు. తొలుత అకుట్ నూతన కార్యవర్గం వీసీ ఆచార్య కె.ప్రతాప్‌రెడ్డిని, రిజిస్ట్రార్ వి.రామచంద్రంను మర్యాదపూర్వకంగా కలిశారు. పూల మొక్కలు అందజేశారు. ఈసందర్భంగా నూతన కార్యవర్గాన్ని అభినందించారు. ‘అకుట్’ నూతన అధ్యక్షుడు వెంకట్రామ్రెడ్డి -
ఇంటర్ పరీక్షల్లో 480 మంది గైర్హాజరు
విద్యారణ్యపురి: ఇంటర్ సెకండియర్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. హనుమకొండ జిల్లాలో 55 పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల రాకతో సందడిగా మారాయి. సెకండియర్ జనరల్ విభాగంలో 18,100 మంది విద్యార్థులకుగాను 17,659 మంది విద్యార్థులు హాజరుకాగా.. అందులో 441 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సుల్లో 869 మందికి గాను 830 మంది హాజరు కాగా.. వారిలో 39 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ గోపాల్ తెలిపారు. మొత్తం 480 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. కాగా.. హనుమకొండలోని వడ్డేపల్లి ప్రభుత్వ పింగిళి బాలికల జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని, ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని, రెజోనెన్స్ కళాశాలలో పరీక్ష కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి తనిఖీ చేశారు. వరంగల్ జిల్లాలో.. కాళోజీ సెంటర్: వరంగల్ జిల్లా వ్యాప్తంగా గురువారం 26 కేంద్రాల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయని జిల్లా ఇంటర్ విద్యాధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. మొదటి రోజు 4,838 మంది జనరల్ విద్యార్థులకు 4,718 మంది హాజరు కాగా.. 120 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. అదేవిధంగా 668 మంది ఒకేషనల్ విద్యార్థులకు 635 మంది హాజరుకాగా.. 33 మంది గైర్హాజరయ్యారని ఆయన తెలిపారు. -
భళా.. ఇత్తడి హస్తకళ
సాక్షి, వరంగల్ : వరంగల్ జిల్లా రంగశాయిపేట ఇత్తడి హస్తకళకు దేశ రాజధానిలో ప్రత్యేక గుర్తింపు దక్కుతోంది. కాకతీయుల కాలం నాటి వెండి నగిషీలు తయారుచేసే పెంబర్తి హస్తకళకు దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు ఉంటే.. వాటి సరసన రంగశాయిపేట ఇత్తడి హస్తకళ పోటీపడుతోంది. అమృత్ మహోత్సవ్‌లో భాగంగా న్యూఢిల్లీలోని రాష్ట్రపతి నిలయంలో బుధవారం నుంచి జరుగుతున్న దక్షిణ భారత ఎగ్జిబిషన్లో రంగశాయిపేట ఇత్తడి హస్తకళ స్టాల్‌కు చోటు లభించింది. ఓ వైపు సాంస్కృతిక ప్రతిరూపాలను తెలిపే డిజైన్లు, మరోవైపు నేటి కాలానికి తగ్గట్టుగా మోడ్రన్ డిజైన్ విత్ ఎంబోజింగ్ వర్క్ ద్వారా విభిన్న హస్తకళ డిజైన్లు చేస్తుండడంతో వీటికి ప్రత్యేక గుర్తింపు లభించింది. నాబార్డు, డీసీహెచ్ మద్దతుతో వందలాది కుటుంబాలకు ఈ హస్తకళ నైపుణ్యంపై శిక్షణ ఇచ్చి భవిష్యత్ తరాలకు తెలిసే విధంగా రంగశాయిపేట ఇత్తడి హస్తకళ బంధం ముందుకెళ్తోంది. ‘రాగి లేదా ఇత్తడి లోహన్ని సన్నని షీట్లుగా కొట్టి, చక్కటి తీగగా కట్ చేస్తాం. చెక్క ఉపరితలంపై గుర్తించబడిన డిజైన్‌ను సుత్తి, ఉలి సాయంతో కోస్తాం. ఇత్తడి లేదా రాగి తీగను డిజైన్‌తో చెక్కబడిన భాగంలోకి సుత్తితో గుచ్చుతాం. ఆ తర్వాత రంపంతో కత్తిరించి డిజైన్‌లో కావల్సిన ప్రదేశాలలో జిగురుతో బిగిస్తాం. అత్యాధునిక పద్ధతులతో వివిధ డిజైన్లతో వస్తువులను తయారు చేస్తున్నాం. ఇంటిరియర్ వర్క్‌లో ఫ్లవర్ వాజెస్, వాల్ ప్యానెల్స్, డోర్ ప్యానెల్స్ చేస్తున్నాం.అలాగే దేవాలయం, దేవుళ్ల ఫొటోలతో కూడా ఎంబోజింగ్ వర్క్‌తో అది కూడా చేతి ద్వారా చేయడంతో ఆయా బొమ్మల ఆకారం స్పష్టంగా కనబడుతుంద’ని రంగశాయిపేట ఇత్తడి హస్తకళ బృంద సభ్యుడు ప్రణయ్ గురువారం ‘సాక్షి’కి వివరించారు. అలాగే వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. ‘రంగశాయిపేట ఇత్తడి హస్తకళలకు రాష్ట్రపతి నిలయంలో జరిగిన అమృత్ మహోత్సవ్ ఎగ్జిబిషన్ లో చోటు దక్కడం జిల్లాకు దక్కిన గుర్తింపు. మరోసారి చేతికళలకు నిలయమని దేశమంతటా తెలిసింది. ఈ హస్త కళాకారులు భవిష్యత్‌లో ఇత్తడితో విభిన్న డిజైన్లు చేసి ఆర్థికాభివృద్ధి చెందడంతో పాటు జిల్లాకు మంచి గుర్తింపు వచ్చేలా పనిచేయాల’ని ఆకాంక్షించారు. ● రాష్ట్రపతి భవన్లో ఈ కళకు ప్రత్యేక గుర్తింపు ● వరంగల్‌కు దక్కిన గౌరవంపై ప్రశంసలు ● ప్రత్యేక ఆకృతులతో ఆకట్టుకుంటున్న స్టాల్ -
చెత్తకుప్పలుగా పాత రికార్డులు
కాజీపేట అర్బన్ : పాతఫైళ్లు, వ్యర్థాలతో జిల్లా చిట్స్ కార్యాలయం డంపింగ్ యార్డ్డును తలపిస్తోంది. కాజీపేట వంద ఫీట్ల రోడ్డులోని చిట్స్ జిల్లా కార్యాలయం, సహాయ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం ఆవరణలో ఉమ్మడి జిల్లాలోని వివిధ చిట్‌ఫండ్ కంపెనీలకు సంబంధించిన 12 ఏళ్ల టెంపరరీ రికార్డులు చెత్త కుప్పలుగా పడేశారు. ఇవి ఎండకు ఎండి, వానకు తడుస్తున్నాయి. ఈ రికార్డులను అధికారుల సమక్షంలో దగ్ధం చేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో అంతా వీడియో తీయాల్సి ఉంటుంది. కానీ ఎవరూ చొరవ తీసుకోకపోవడంతో కార్యాలయ ఆవరణ డంపింగ్ యార్డ్‌ను తలపిస్తోంది. కాగా, కార్యాలయంలోని కొందరు ఉద్యోగులు పాత రికార్డులే కదా వాటిని ఎవరికి తెలియకుండా అమ్మి సొమ్ము చేసుకుందామనే యత్నంలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఒకవేళ అమ్మితే పలు కీలకవిషయాలు బయట వ్యక్తులకు తెలిసే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. డంపింగ్ యార్డును తలపిస్తున్న చిట్స్ కార్యాలయం -
భూమానార్య శతక పుస్తకావిష్కరణ
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలోని తెలుగు విభాగంలో మదగాని విజయలక్ష్మి రచించిన తెలంగాణ మాండలిక భాషలో భూమనార్యశతకం పుస్తకాన్ని వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్‌రెడ్డి గురువారం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ మాండలికం ప్రధానంగా పల్లెలో వాడుక భాష సహజమైన వ్యవహారిక భాష ఈ భూమనార్యశతకం అని కొనియాడారు. తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి కేయూ తెలుగు విభాగం విశ్రాంత ఆచార్యులు అనుమాండ్ల భూమయ్య మాట్లాడుతూ..భూమనార్య మాట బుద్ది మాట మకుటంతో మదగాని విజయలక్ష్మి రాసిన భూనార్యశతకం ఒక విశేషమైనదన్నారు. ఈ సమావేశంలో తెలుగు విభాగం అధిపతి డాక్టర్ మామిడి లింగయ్య, డాక్టర్ చిర్రరాజు, గిరిజామనోహర్, సంగాల కోమల, స్వామి నాయక్, బేరి దేవేందర్, అభిరామ్, వేణు, ఎర్ర రాజు, ప్రసాద్, నిత్యానందం, విద్యార్థులు పాల్గొన్నారు. పాలక మండలి సమావేశం వాయిదా!కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పాలక మండలి సమావేశం ఈనెల 7న హైదరాబాద్‌లో జరగాల్సి ఉండగా.. వాయిదా పడినట్లు సమాచారం. పాలక మండలి సమావేశంలో చర్చించాల్సిన అంశాలు ఎజెండాను కూడా కాకతీయ యూనివర్సిటీ అధికారులు రూపొందించారు. ఈమేరకు పాలకమండలి సభ్యులకు ఆ సమాచారం కూడా అందించారు. అయితే గురువారం రాత్రి పాలకమండలి సమవేశం వాయిదా వేశామని, మళ్లీ ఎప్పుడు నిర్వహించేది తర్వాత సమాచారం అందిస్తామని వర్సిటీ అధికారులు పాలక మండలి సభ్యులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. -
గంజాయి సిగరేట్!
శుక్రవారం శ్రీ 7 శ్రీ మార్చి శ్రీ 2025– 8లోuహన్మకొండ చౌరస్తా: హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి ఆవరణలోని వెల్నెస్ సెంటర్లోని టాయిలెట్లకు తాళం వేసి ఉండడంతో గురువారం వెద్యచికిత్సకు వచ్చిన సీనియర్ సిటిజన్లు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డయాబెటిక్, బీపీ, గుండె సంబంధిత, ఇతర వ్యాధులతో బాధపడుతూ వెల్నెస్ సెంటర్‌కు ప్రతీ రోజూ సుమారు 300మంది వరకు వస్తుంటారు. వారికి కనీస వసతులు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్య పరీక్షలు, మందుల కోసం గంటల తరబడి నిరీక్షిస్తున్నామని వాపోయారు. ఈక్రమంలో ఒంటికి, రెంటికి వెళ్లాలంటే ఎక్కడికి వెళ్లాలో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. టాయిలెట్లకు తాళం వేసి ఉన్న విషయాన్ని వెల్నెస్ సెంటర్ ఇన్చార్జ్ డాక్టర్ సన్నీ దృష్టికి తీసుకెళ్లగా గురువారం మున్సిపల్ కార్పొరేషన్ నీరు సరఫరా కాకపోవడంతో సంపులో నీరు లేదని, అందుకే టాయిలెట్లకు తాళం వేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. ఖిలా వరంగల్: వరంగల్ శివనగర్‌లోని పలు కాలనీల్లో ప్రజలు దాహం..దాహం..అంటున్నారు. శివనగర్ వాటర్ సంపుహౌస్ నుంచి అంతర్గత రహదారుల మీదుగా వెళ్లే తాగునీటి పైపులైన్ ధ్వంసం కావడంతో నీటి సరఫరా నిలిచింది. వారం రోజులుగా తాగునీటి కోసం అరిగోస పడుతున్నామని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శివనగర్ పల్లవి ఆస్పత్రి నుంచి వాటర్ సంప్ హౌస్ మీదుగా మైసయ్యనగర్ మట్టికోట వరకు అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. దీనివల్ల అంతర్గత కాలనీలకు వెళ్లే తాగునీటి పైపులైన్లు ధ్వంసమయ్యాయి. మధ్యాహ్నం వేళల్లో దూర ప్రాంతానికి వెళ్లి నీళ్లు తెచ్చుకోవాలంటే భానుడి ప్రతాపంతో ప్రజలు జంకుతున్నారు. నీటి సమస్యను స్థానికులు కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి దృష్టికి తీసుకెళ్లారు. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నా.. ఇంటికి రెండు బిందెలు కూడా దొరకడం లేదని మహిళలు చెబుతున్నారు. అధికారులు స్పందించి నీటి ఎద్దడి తీర్చాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. కాజీపేట: దర్గాకాజీపేట శివారులోని రైల్వే ట్రాక్ సమీపంలో గురువారం సాయంత్రం ముగ్గురు యువకులు కూర్చుని సిగరేట్ పీల్చుతున్నారు. అటుగా ద్విచక్ర వాహనంపై వచ్చిన రైల్వే పోలీసులు ఆ యువకులను గుర్తించి ఏం చేస్తున్నారంటూ మందలించారు. ఆ యువకులు తాగుతున్న సిగరేట్లను అక్కడే పడేసి పారిపోయారు. తీరా ఆ సిగరేట్లను పరిశీలించిన పోలీసులు ఆశ్యర్యపోయారు. గంజాయి సిగరేట్లు అని తెలుసుకుని అవాక్కయ్యారు. సిగరేట్ మాదిరే తయారు చేసుకుని పీల్చు తుండడం బట్టి చూస్తే నగరంలో ఈ గంజాయి పొడి లభిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇలాంటి ఘటనలు వరంగల్, మడికొండ, కాజీపేట శివారులోని బహిరంగ ప్రదేశాలు, కళాశాలల మైదానాల్లో వెలుగుచూస్తున్నాయి. ఈగంజాయి సిగరే ట్లను అరికట్టకపోతే విద్యార్థులు, యువత తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. పోలీసులతో పాటు ఎకై ్సజ్ అధికారులు తీవ్రంగా పరిగణించి వరంగల్ నగర వ్యాప్తంగా తనిఖీలను చేపట్టాలని పలువురు కోరుతున్నారు. అలవాటు పడుతున్న యువతన్యూస్రీల్ -
రాములోరికి ‘గోటి తలంబ్రాలు’
హన్మకొండ కల్చరల్ : రాములోరి కల్యాణం.. కమనీయం.. రమణీయం..చూసిన కనులదే భాగ్యం.. భద్రాద్రిలో జరిగే వేడుకను తిలకించి..తరించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. వీరిలో ఓరుగల్లు మహిళలు పరిణయ వేడుకకు తలంబ్రాలను సిద్ధం చేయడానికి వరిగింజలను గోటితో ఒలిచి తమ భక్తిభావాన్ని చాటుకుంటున్నారు. గోటి తలంబ్రాలు.. శ్రీరామ నవమి రోజు భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణంలో ఉపయోగించే తలంబ్రాలకు ప్రత్యేకత ఉంది. వడ్ల గింజలను రోలులో దంచడంగాని లేక మిల్లులో మరపట్టించినవి కావు.. మహిళలు చేతిగోళ్లతో ఒక్కొక్క ధాన్యపు గింజను వలచిన బియ్యం. వీటినే గోటి తలంబ్రాలు అంటారు. ఎంతో పవిత్రంగా.. శ్రీరామనామ స్మరణతో ఎంతో పవిత్రంగా గోటితో తలంబ్రాలు ఒలుస్తారు. ఈ తలంబ్రాల కోసం విత్తనాల వడ్లను ప్రత్యేకంగా సాగు చేస్తారు. శ్రీరాముడి కల్యాణ తంతు జరుగుతున్నప్పుడు తలంబ్రాలతో పాటు సాగుచేయడానికి కావలసిన వడ్లను కూడా స్వామివారి పాదాల వద్ద పెడతారు. ఆ వడ్లనే తిరిగి సాగుచేయడానికి వాడుతారు. వీటిని కొందరు భక్తిభావంతో తమ పొలంలో కొంత భూమిని కేటాయించి సాగు చేస్తుంటారు. ప్రత్యేక ముడుపులుగా చేసి మందులు, ఎరుపులు వేయకుండా, కాళ్లతో తొక్కకుండా, పవిత్రంగా పండిస్తున్నారు. పంటపొలాల్లో కంకులను కూడా కత్తులతో కాకుండా శ్రీరామనామం జపిస్తూ చేతిలో వలుస్తారు. కొరియర్ ద్వారా.. వరి ధాన్యాన్ని తలంబ్రాలుగా ఒలిచేందుకు భద్రాచలం నుంచి శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి ప్రతినిధులు కొరియర్ ద్వారా పంపగా వరంగల్ బ్యాంక్‌కాలనీలోని ఏలిషాల సుజాత అందుకున్నారు. ఈ ధాన్యాన్ని కాలనీ మహిళలు నిత్యం నిష్టతో ఉండి భక్తిశ్రద్ధలతో శ్రీరామ కీర్తనలు ఆలపిస్తూ, శ్రీరామ స్మరణ చేస్తూ గోటితో ఒలిచి.. తలంబ్రాలుగా తయారు చేస్తున్నారు. ఈ నెల 8న శనివారం ఒలిచిన తలంబ్రాలను కొరియర్ ద్వారా భద్రాచలం రాములవారికి పంపిస్తారు. సీతారాముల కల్యాణానికి తలంబ్రాలు సిద్ధం చేయడం అత్యంత పవిత్రంగా భావిస్తున్నామని మహిళలు చెబుతున్నారు. చేతిగోళ్లతో ఒక్కో వరి గింజను ఒలిచి.. నవమి నాటికి అక్షింతల బియ్యం సిద్ధంమా ఇంట్లోనే తలంబ్రాలు చేస్తాం..ఫిబ్రవరి 15న భద్రాచలం నుంచి 2 కిలోల వడ్లను అందుకుని వలిచే కార్యక్రమాన్ని మా ఇంట్లో ప్రారంభించాము. ఈ నెల 8న శనివారం ఒలిచిన బియ్యాన్ని భద్రాచలానికి పంపిస్తాం. శ్రీసీతారాముల వారి విగ్రహాలను ప్రతిష్ఠించుకుని నియమ నిష్టలతో కాలనీ మహిళలతో కలిసి ఒలిచే కార్యక్రమం మా ఇంట్లో తలంబ్రాలుగా తయారు చేయడం సంతోషంగా ఉంది. – ఏలిషాల సుజాత, బ్యాంక్‌కాలనీ, వరంగల్ ఆనందంగా ఉందిశ్రీరామ నామాన్ని స్మరిస్తూ భక్తిభావంతో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉంది. భగవంతుని సేవ చేయడం వల్ల మాకు మంచి జరుగుతుందనే భావన. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా తోటి మహిళలతో స్నేహబంధాలు పెరుగుతాయి. – లావణ్య, బ్యాంక్‌కాలనీ, వరంగల్ధన్యులమయ్యాం..రాముల వారి కల్యాణంలో ముఖ్యమైన ఘట్టం తలంబ్రాలు.. ఈ అక్షింతలను కోటి తలంబ్రాలుగా చెబుతారు. గోటీ తలంబ్రాల కార్యక్రమంలో భాగస్తులైనందుకు ధన్యులమయ్యాం. -
హోలీ పండుగకు ప్రత్యేక రైళ్లు
కాజీపేట రూరల్ : హోలీ పండుగ సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం ఈనెల 9వ తేదీనుంచి చర్లపల్లి–దానాపూర్, చర్లపల్లి–ముజపర్పూర్ మధ్య ప్రత్యేక రైళ్లను కాజీపేట జంక్షన్ మీదుగా నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఛీప్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఎ.శ్రీధర్ గురువారం తెలిపారు. రైళ్ల వివరాలు.. ఈ నెల 9, 19వ తేదీన చర్లపల్లి–దానాపూర్ (07709) వెళ్లే ఎక్స్‌ప్రెస్ కాజీపేటకు 17:10 గంటలకు చేరుకుంటుంది. ఈ నెల 11, 21వ తేదీల్లో దానాపూర్–చర్లపల్లి (07710) వెళ్లే ఎక్స్‌ప్రెస్ మరుసటి రోజు 21:45 గంటలకు చేరుకుంటుంది. ఈ నెల 10, 15, 20వ తేదీల్లో చర్లపల్లి–ముజపర్పూర్ (07711) వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు కాజీపేటకు 17:10 గంటలకు చేరుతుంది. ఈ నెల 12, 17, 22వ తేదీల్లో ముజపర్పూర్–చర్లపల్లి (07712) వెళ్లే ఎక్స్‌ప్రెస్ మరుసటి రోజు 16:00 గంటలకు కాజీపేటకు చేరుతుంది. ఈ రైళ్లకు కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్కాగజ్నగర్, బల్లార్షా రైల్వే స్టేషన్లో హాల్టింగ్ కల్పించినట్లు శ్రీధర్ పేర్కొన్నారు. అలాగే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అజాంఘర్–చర్లపల్లి మధ్య దక్షిణ మధ్య రైల్వే వన్‌వే స్పెషల్ ట్రైన్స్ నడిపిస్తున్నట్లు ఆయన తెలిపారు. నేటినుంచి గార్లలో మణుగూర్‌కు హాల్టింగ్ కాజీపేట జంక్షన్ మీదుగా ప్రయాణించే సికింద్రాబాద్–మణుగూర్ (12745) ఎక్స్‌ప్రెస్, మణుగూర్–సికింద్రాబాద్ (12746) వెళ్లే మణుగూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు నేడు (శుక్రవారం) నుంచి 6 నెలల పాటు ప్రయోగాత్మకమైన హాల్టింగ్‌ను కల్పించినట్లు ఎ.శ్రీధర్ వివరించారు. నేటినుంచి కేవీలో అడ్మిషన్లుకాజీపేట అర్బన్ : కాజీపేట మండలం కడిపికొండ గ్రామంలోని పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయంలో 1వ తరగతిలో ప్రవేశానికి శుక్రవారం నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ గురువారం ప్రకటన విడుదల చేసింది. మార్చి 21వ తేదీ వరకు ఆన్లైన్లో kvso nineadmirrion.kvr.gov.in లేదా కేవీ సంఘటన్.ఎన్ఐసీ.ఇన్ అనే వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. -
ప్రజలకు పోలీసులు ఉన్నారనే ధైర్యం కలిగించాలి
సీపీ అంబర్ కిషోర్ ఝా వరంగల్‌క్రైం : పోలీసులు ఉన్నారు.. మనకు సహాయం చేస్తారనే దైర్యాన్ని ప్రజలకు ఇవ్వాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. గురువారం కమిషనరేట్ కార్యాలయంలో ఇంటర్ సెప్టర్, పెట్రోకార్, హైవే పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందితో సీపీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిర్యాదు వచ్చిన వెంటనే ఫిర్యాదుదారు వద్దకు చేరుకొని సమస్యను తెలుసుకొని, అక్కడే పరిష్కరించడం లేదా పోలీస్ స్టేషన్ అధికారి దృష్టికి తీసుకెళ్లాలన్నారు. విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా సిబ్బంది నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు. రాత్రి సమయంలో ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకానికి ఎక్కువగా పెట్రోలింగ్ విధులు నిర్వహించాలని, ఏదైనా సమస్య వచ్చిన వెంటనే ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలని సూచించారు. ఫిర్యాదుదారుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ తెలంగాణ పోలీస్ కీర్తీ ప్రతిష్టలు పెంచాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ రవి, పోలీస్ కంట్రోల్ రూం ఇన్స్పెక్టర్ విశ్వేశ్వర్, ఐటీకోర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
విద్యతోనే మహిళా సాధికారత : కేయూ వీసీ
కేయూ క్యాంపస్: విద్యతోనే మహిళా సాధికారత సాధ్యమవుతుందని కేయూ వీసీ కె.ప్రతాప్‌రెడ్డి అన్నారు. గురువారం కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వీసీ మాట్లాడుతూ.. మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారన్నారు. వివిధ పదవుల నిర్వహణలోనూ సమర్థంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారన్నారు. విశ్వవిద్యాలయంలో పరిపాలనా పదవుల్లోనూ మహిళలకే ప్రాధాన్యం ఉంటుందన్నారు. వరంగల్ కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. మహిళలు మల్టీటాస్కర్స్ అన్నారు. మహిళలు ధైర్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈసందర్భంగా కలెక్టర్ సత్యశారదను సన్మానించారు. మహిళా ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ భిక్షాలు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో కేయూ పాలక మండలి సభ్యురాలు డాక్టర్ బి.రమ, అసిస్టెంట్ ప్రొఫెసర్ టి.స్వప్న, పలువురు సిబ్బంది పాల్గొన్నారు. -
అస్తిత్వానికి ఆయువు పట్టు ఆంగ్ల భాష
విద్యారణ్యపురి: ఆంగ్ల భాష మన ఆస్తిత్వానికి ఆయువు పట్టువంటిదని విభిన్న భాషా సంస్కృతులను గౌరవించేదిగా ఇంగ్లిష్ విలసిల్లాలని కెన్యా మసింది ములురో యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రొఫెసర్ కుప్పు రామ్ అన్నారు. గురువారం హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంగ్లిష్ విభాగం ఆధ్వర్యంలో ‘ట్రాన్స్ఫర్మేషన్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ ఇన్ మల్టీ డిసిప్లీనరీ కాంటెక్ట్స్ ఇన్‌ది ఎరా’ అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సు గురువారం ప్రారంభమైంది. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన కెన్యా యూనివర్సిటీ ప్రొఫెసర్ కీలకోపన్యాసం చేశారు. టెక్నాలజీని ఉపయోగించుకుంటూ అధ్యాపకులు మెళకువలతో బోధించాలన్నారు. సదస్సులో 150 పరిశోధన పత్రాలు వచ్చాయి. ఓ జర్నల్ను ఆవిష్కరించారు. కేడీసీ ప్రిన్సిపాల్ జి.రాజారెడ్డి అధ్యక్షత వహించిన ఈ సదస్సులో హైదరాబాద్ ఇఫ్లూ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎంఈ.వేదశరణ్, కన్వీనర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ రాంభాస్కర్‌రాజు, పూర్వ విద్యార్థుల సంఘం కార్యదర్శి డాక్టర్ కె.సోమిరెడ్డి, స్టాఫ్ సెక్రటరీ రవీందర్, వైస్ ప్రిన్సిపాల్ రజనీలత, యూజీసీ గుర్తింపు పొందిన జర్నల్ ఎడిటర్ ఇన్ చీఫ్ డాక్టర్ ప్రశాంత్ మోతె పాల్గొన్నారు. కెన్యా ప్రొఫెసర్ కుప్పు రామ్ కేడీసీలో అంతర్జాతీయ సదస్సు -
22న పేరిణి నృత్య విశారద పరీక్షలు
హన్మకొండ కల్చరల్: ఈనెల 22న పేరిణి నృత్య విశారద పరీక్షలు 2024–25 నిర్వహించనున్నట్లు నటరాజ కళాకృష్ణ నృత్య జ్యోతి అకాడమీ నిర్వాహకులు ప్రముఖ పేరిణి నాట్య ఆచార్యులు గజ్జెల రంజిత్ కుమార్ తెలిపారు. ఈమేరకు గురువారం నృత్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పరీక్షలకు సంబంధించి నోటిఫికేషన్‌ను నాగార్జున స్కూల్ అధినేత ఆడెపు వెంకటేశ్వర్లుతో కలిసి ఆవిష్కరించారు. ఈసందర్భంగా రంజిత్ మాట్లాడుతూ.. వరంగల్ పేరిణి నృత్యాలయంలో 22న శనివారం థియరీ, 23న ఆదివారం ప్రాయోగికం పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే విధంగా అకాడమీలో 2023–24 సంవత్సరం పేరిణి నాట్యంలో ప్రత్యేక శిక్షణ పొందిన తొమ్మిది మంది యువ నాట్య ఆచార్యులను ప్రోత్సహించేందుకు రూ.1.50 లక్షలను చెక్కుల రూపంలో అందజేశారు. కార్యక్రమంలో సీహెచ్ నర్సంగరావు, సీహెచ్ లత, చాతరాజు నవ్యజ, పల్పాటి శ్రీజ, బండారు వైష్ణవి, తేజస్విని, మర్కాల లోహిత్, గురుదేవ్, సంతోశ్, రేగుల చందు, సాయికపిల్, తేజ పాల్గొన్నారు.తక్కువ ధరకే వ్యాక్సిన్లు తయారు చేయాలికేయూ క్యాంపస్: వాక్సిన్ల తయారీలో ప్రపంచాన్ని శాసించే స్థాయికి భారత్ ఎదిగిందని.. తక్కువ ధరకే వ్యాక్సిన్లు అందుబాటులో ఉండేలా కృషి చేయాలని కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం అన్నారు. కాకతీయ యూనివర్సిటీలో జువాలజీ విభాగంలో గత రెండ్రోజులుగా ‘యూసెస్ రీకాంబినెంట్ డీఎన్ఏ టెక్నాలజీస్ ఇన్‌హెల్త్ కేర్’ అంశంపై నిర్వహిస్తున్న సదస్సు గురువారం సాయంత్రం ముగిసింది. -
గంజాయి స్వాధీనం
నడికూడ : మండలంలోని చర్లపల్లి వద్ద నిషేధిత గంజాయిని గురువారం స్వాధీనం చేసుకున్నారు. పరకాల ఎస్సై రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. చర్లపల్లి గ్రామంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా బస్టాండ్ వద్ద స్కూటీపై ఇద్దరు అనుమానాస్పందగా కనిపించారు. వీరిని ఆపి తనిఖీ చేయగా 2.840 కేజీల గంజాయి రవాణా చేస్తు పట్టుబడ్డారు. అదుపులో తీసుకొని విచారించగా ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా, చిత్రకొండ నాగులూర్కు చెందిన పప్పల్ బాలయ్య, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచకు చెందిన ముదిగొండ ప్రశాంత్ పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.1,42లక్షల వరకు ఉంటుందని, నిందితులను అదుపులోకి తీసుకొని, పరకాల పోలీస్ స్టేషన్‌కు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఉత్సాహంగా సాంస్కృతిక పోటీలు
విద్యారణ్యపురి : హనుమకొండ ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ కళాశాలలో నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో యువ ఉత్సవ్–25 జిల్లా స్థాయి యువజనోత్సవం,సాంస్కృతిక ప్రతిభాపాటవ పోటీలు గురువారం ఉత్సాహంగా కొనసాగాయి. ముఖ్య అతిథిగా జిల్లా ట్రెజరీ ఆఫీసర్ ఎ.శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ.. యువతలో ఉన్నత సృజనాత్మక ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు. విద్యార్థులకు ఆర్ట్, ఫొటోగ్రఫీ, ఉపన్యాసం, జానపద నృత్యం, సైన్స్ ఎగ్జిబిషన్ తదితర పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులతోపాటు ప్రశాంసపత్రాలు అందజేశారు. ప్రిన్సిపాల్ డాక్టర్ బి.చంద్రమౌళి, కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ ప్రొఫెసర్ ఎస్.రాజన్న, ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ ఎస్.శ్రీధర్, నెహ్రూ యువ కేంద్ర సూపరింటెండెంట్ బి.దేవీలాల్, జిల్లా హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎస్.శ్రీనివాస్ పాల్గొన్నారు. అధ్యాపకులు సురేశ్, ఎం.అరుణ, ఎన్ఎస్ఎస్ అధికారులు కవిత, రామారత్నమాల, వి.మమత తదితరులు పాల్గొన్నారు. -
పెంపుడు కుక్క హఠాన్మరణం.. మంత్రి కొండా సురేఖ కన్నీరుమున్నీరు
సాక్షి, వరంగల్: తెలంగాణ మంత్రి కొండా సురేఖ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తమ పెంపుడు కుక్క గుండెపోటుతో మృతి చెందడంతో భావోద్వేగానికి లోనైనా మంత్రి.. కన్నీరుమున్నీరయ్యారు. గుండెపోటుతో చనిపోయిన హ్యాపీకి మంత్రి కొండా కుటుంబం.. అంతిమ సంస్కారాలు నిర్వహించారు. హ్యాపీ హఠాన్మరణంతో సురేఖ కుటుంబీకులు, సిబ్బంది కన్నీటి పర్యంతమయ్యారు.గత కొన్నాళ్లుగా హ్యాపీతో మధుర అనుభూతులను మంత్రి సురేఖ, స్టాఫ్ పంచుకున్నారు. 2021లో కూడా కొండా సురేఖకు చెందిన ఓ పెంపుడు కుక్క మృతి చెందితే ఆ సమయంలోనూ ఆమె తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Minister Konda Surekha breaks down in tears over sudden death of pet dog ‘Happy’pic.twitter.com/f87jhedaPA— Naveena (@TheNaveena) March 6, 2025 -
అభివృద్ధికి ప్రజలు సహకరించాలి
● పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి హన్మకొండ చౌరస్తా: నియోజకవర్గ అభివృద్ధికి ప్రజలు సహకరించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి కోరారు. 8, 10వ డివిజన్ల పరిధిలోని హనుమకొండ చౌరస్తా, టైలర్‌స్ట్రీట్, ఇందిరానగర్, రాయపుర ప్రాంతాల్లో బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ ఎన్నికల హామీలను అమలు చేస్తానని అన్నారు. చౌరస్తాలో ట్రాఫిక్ సమస్య, టైలర్స్ స్ట్రీట్, ఇందిరానగర్‌లో డ్రెయినేజీ సమస్యల పరిష్కారంతో పాటు అంతర్గత రోడ్ల నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు. రాయపురలో నిర్మాణంలో ఉన్న డ్రెయిన్ బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. -
కేడీసీలో నేటినుంచి అంతర్జాతీయ సదస్సు
విద్యారణ్యపురి: హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (కేడీసీ) ఇంగ్లిష్ విభాగం ఆధ్వర్యంలో గురు, శుక్రవారాల్లో అంతర్జాతీయ సదస్సు ఉంటుందని ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.రాజారెడ్డి, సదస్సు కన్వీనర్ అండ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ రాంభాస్కర్‌రాజు బుధవారం తెలిపారు. ‘ట్రాన్స్ఫర్మేషన్స్ ఇంగ్లిష్ లాంగ్వెజ్ అండ్ లిటరేచర్ ఇన్ మల్టీడిసిప్లినరీ కాంటెక్ట్స్’ ఇన్ ది కరెంట్ ఎరా’ అనే అంశంపై ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. చీఫ్ ప్యాట్రన్‌గా రాష్ట్ర ఉన్నత విద్య కమిషనర్ ఎ.శ్రీదేవసేన (ఐఏఎస్) కో ప్యాట్రన్స్‌గా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకృష్ణారెడ్డి, సెక్రటరీ ప్రొఫెసర్ శ్రీరాంవెంకటేష్ గౌరవ అతిథిగా కేయూ వీసీ కె.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రం, ఆర్ట్స్ డీన్ టి.మనోహర్, ఇతర అతిథులు హాజరుకానున్నారు. కెన్యానుంచి ప్రొఫెసర్ జి.కుప్పురం కీలకోపన్యాసం చేయనున్నారు. బంగ్లాదేశ్ నుంచి డాక్టర్ షేక్ మెహది హాసన్, హైదరాబాద్ చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ వీసీ జి.దామోదర్ పాల్గొంటారు. సదస్సులో వివిధ రాష్ట్రాలు, విదేశాలనుంచి 150 పరిశోధన పత్రాలు సమర్పించనున్నారు. కేడీసీ చరిత్రలో తొలిసారిగా అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ రాజారెడ్డి తెలిపారు. రాష్ట్ర ఉన్నత విద్య కమిషనర్ శ్రీదేవసేన రాక కెన్యా ప్రొఫెసర్ కీలకోపన్యాసం 150 పరిశోధనాపత్రాల సమర్పణ -
దరఖాస్తుల ఆహ్వానం
వరంగల్: హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్‌టీ)లో మూడు సంవత్సరాల చేనేత, టెక్స్టైల్ టెక్నాలజీ డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చేనేత, జౌళిశాఖ వరంగల్ జిల్లా సహాయ సంచాలకులు రాఘవరావు ఒక ప్రకటనలో కోరారు. 60 సీట్లు ఉన్న కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవడానికి పదో తరగతి ఉత్తీర్ణులై, జూలై 1 నాటికి బీసీ, ఓసీలు 23, ఎస్సీ, ఎస్టీలు 25 ఏళ్లు ఉండాలన్నారు. వివరాలకు ఓఎస్డీ హిమజాకుమార్ 90300 79242 నంబర్లో సంప్రదించాలని ఆయన సూచించారు. -
ఇంటర్ ప్రథమ పరీక్షలు ప్రారంభం
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షలు బుధవారం షురూ అయ్యాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల రాకతో పరీక్ష కేంద్రాల వద్ద సందడి నెలకొంది. జిల్లాలోని 55 కేంద్రాల్లో ఫస్టియర్ పరీక్షలు నిర్వహించారు. ఉదయమే 8–30గంటల వరకే ఎక్కువశాతంమంది విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోగా, తనిఖీ చేసి లోనికి అనుమతించారు. 5 నిమిషాల వరకు ఆలస్యంగా వచ్చిన వారిని కూడా అనుమతించారు. మొదటిరోజు తెలుగు, సంస్కృతం, హిందీ పరీక్షలు జరిగాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల జరిగిన పరీక్షల్లో జనరల్ విభాగంలో 19,412మంది విద్యార్థులకు 18,815మంది హాజరుకాగా 596మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సులకు సంబంధించి 1,134మందికిగాను 1,057మంది హాజరుకాగా 77 మంది గైర్హాజరయ్యారు. మొత్తంగా 20,546 మంది విద్యార్థులకుగాను 19,872మంది హాజరుకాగా, 673మంది గైర్హాజరాయ్యారని డీఐఈఓ ఎ.గోపాల్ తెలిపారు. హనుమకొండ అడిషనల్ కలెక్టర్ ఎ.వెంకటరెడ్డి వడ్డేపల్లిలోని ఎస్ఆర్ జూనియర్ కాలేజీ, నారాయణ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాలను తనిఽఖీ చేశారు. కేంద్రాల్లోని ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. డీఐఈఓ గోపాల్ కూడా పలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. హనుమకొండలోని కో ఎడ్యుకేషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రంలో ఓ ప్రైవేట్ కాలేజీ విద్యార్థి కాపీయింగ్ చేస్తుండగా హైదరాబాద్ ఇంటర్‌బోర్డు నుంచి వచ్చిన ఇద్దరు అబ్జర్వర్లు పట్టుకొని డీబార్ చేసినట్లు డీఐఈఓ గోపాల్ తెలిపారు. వరంగల్ జిల్లాలో కాళోజీ సెంటర్: వరంగల్ జిల్లా వ్యాప్తంగా 26 కేంద్రాల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. ప్రథమ సంవత్సరం పరీక్షకు 5,372 మంది జనరల్ విద్యార్థులకు 5,175 మంది హాజరు కాగా.. 197 మంది గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. 894 మంది ఒకేషనల్ విద్యార్థులకు 824 మంది హాజరుకాగా.. 70 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. వరంగల్ ఎల్బీ కళాశాల కేంద్రంలో సంస్కృతం పరీక్ష రాస్తున్న ఒక విద్యార్థిపై మాల్‌ప్రాక్టీస్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఎల్బీ కళాశాల సెంటర్‌ను పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, ఏసీపీ నందిరాంనాయక్, ఇన్స్పెక్టర్ గోపితో కలిసి పరిశీలించారు. సిబ్బందికి సూచనలు చేశారు. పోలీసుల సాయం.. మడికొండ: కాజీపేటలోని క్షేత్ర కళాశాలలో సెంటర్ పడిన ఓ విద్యార్థి.. మడికొండ మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ కళాశాలకు వచ్చాడు. పరీక్షకేంద్రం తెలియకపోవడం, అప్పటికే సమయం మించిపోవడంతో కంగారుపడుతుండగా గమనించిన మడికొండ ఇన్స్పెక్టర్ కిషన్ వెంటనే స్పందించారు.హెడ్ కానిస్టేబుల్ రాంచందర్‌ను పురమాయించి ద్విచక్ర వాహనంపై ఆ విద్యార్థిని సకాలంలో సరైన సెంటర్ చేర్చాడు. పోలీసులు చేసిన సాయానికి ఆ విద్యార్థి కృతజ్ఞతలు తెలిపాడు. -
సామాజికవర్గ స్థాయిలో కేసులు పరిష్కారం కావాలి
● వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ వరంగల్ లీగల్: సామాజికవర్గ స్థాయిలోనే కేసులు పరిష్కారమైతే కుటుంబం, సమాజానికి మేలు కలుగుతుందని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలాగీతాంబ అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయసేవా సదన్ బిల్డింగ్‌లో వరంగల్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పోలీస్స్టేషన్లు, కోర్టుల దాకా వివాదాలు తీసుకెళ్తే వ్యక్తుల మధ్య సంబంధాలు దెబ్బతింటాయని, ఇది సమాజానికి హానికరమన్నారు. ఈ విషయంలో సామాజికవర్గాల పెద్దలు పోషించాల్సి న పాత్ర గురించి చర్చించడానికి ఈనెల 15న రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్ హనుమకొండకు రానున్నారని తెలిపారు. ఉదయం 9 గంటలకు హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో జరిగే ఈ కార్యక్రమానికి అన్ని సామాజికవర్గాల కమ్యూనిటీ మీడియేటర్లు హాజరు కావాలని కోరారు. సమావేశంలో వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.సాయికుమార్, వరంగల్, హనుమకొండ జిల్లాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు తీగల జీవన్‌గౌడ్, ఎం.రమేశ్‌బాబు, వివిధ సామాజిక వర్గాల కమ్యూనిటీ మీడియేటర్లు పాల్గొన్నారు. -
గురువారం శ్రీ 6 శ్రీ మార్చి శ్రీ 2025
– 8లోuసరైన మోతాదులో అందని ప్రాణవాయువుప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు ప్రాణం పోసేందుకు ఎంజీఎం ఆస్పత్రిలోని ఏఎంసీ, ఐఎంసీ, క్యాజువాలిటీ, ఐసీఎస్‌యూ, ఆర్ఐసీయూ వంటి వార్డులు చాలా కీలకం. ఇలాంటి వార్డులను నిత్యం పర్యవేక్షిస్తూ వైద్యులున్నారా? ఎలాంటి ఔషధాలు అందుబాటులో ఉన్నాయి? ఆక్సిజన్ సరఫరా ఎలా ఉంది? డ్యూటీ వైద్యులు వస్తున్నారా? అనే విషయాలను ఆర్‌ఎంఓలు, సూపరింటెండెంట్లు నిత్యం పర్యవేక్షించాల్సి ఉంటుంది. కానీ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. హనుమకొండలోని పలు ఆస్పత్రుల తనిఖీఎంజీఎం : జిల్లాలో గర్భస్థ పూర్వ, పిండ లింగ నిర్ధారణ చట్టం (పీసీఅండ్పీఎన్డీటీ), మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) చట్టాల అమలు తీరు పరిశీలనలో భాగంగా డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య బుధవారం హనుమకొండలోని పలు ఆస్పత్రులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిబంధనలు ఉల్లంఘించిన వారి వివరాలు 181, 104, 1098 లేదా డయల్ 100కు తెలపాలని సూచించారు. వారిపై చర్యలు తప్పని హెచ్చరించారు. కార్యక్రమంలో పీఓఎంసీహెచ్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ మంజుల, విప్లవ్, తదితరులు పాల్గొన్నారు. ‘అకుట్’ అధ్యక్షుడిగా ప్రొఫెసర్ వెంకట్రామ్రెడ్డి కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (అకుట్) అధ్యక్షుడిగా ఫిజిక్స్ విభాగం ప్రొఫెసర్ బి.వెంకట్రామ్రెడ్డి, జనరల్ సెక్రటరీగా మ్యాథమెటిక్స్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎల్పీ రాజ్‌కుమార్ ఎన్నికయ్యారు. ఈనెల 4న జరిగిన ఎన్నికల్లో 75 మంది అధ్యాపకులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. బుధవారం లెక్కింపు ప్రక్రియ నిర్వహించగా ప్రొఫెసర్ వెంకట్రామ్‌రెడ్డికి 41, మల్లికార్జున్‌రెడ్డికి 32 ఓట్లు వచ్చాయి. ఒక ఓటు చెల్లలేదు. 8 ఓట్లతో వెంకట్రామ్రెడ్డి విజయం సాధించారు. జనరల్ సెక్రటరీ పదవికి డాక్టర్ ఎల్పీ రాజ్‌కుమార్‌కు 46 ఓట్లు, పి.శ్రీనివాస్‌కు 29 ఓట్లు వచ్చాయి. 17 ఓట్లతో రాజ్‌కుమార్ విజయం సాధించారు. విజయం సాధించిన ఇద్దరికి ఎన్నికల రిటర్నింగ్ అధికారి ధ్రువీకరణపత్రాలు అందించారు. ఇప్పటికే ఉపాధ్యక్షురాలిగా ప్రొఫెసర్ సవితాజ్యోత్స్న, జాయింట్ సెక్రటరీగా వి.రాము, ట్రెజరర్‌గా డాక్టర్ డి.రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బ్రిడ్జి విస్తరణకు నిధులు కేటాయించండిహసన్పర్తి: హనుమకొండ–కరీంనగర్ ప్రధాన రహదారిలోని చింతగట్టు బ్రిడ్జి విస్తరణకు నిధులు కేటాయించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు బుధవారం భారీ నీటిపారుదలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌లో కలిసి వినతిపత్రం సమర్పించారు. 40ఏళ్ల క్రితం ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారని, పలుచోట్ల దెబ్బతిన్నదని, వాహనాలరద్దీకి అనుగుణంగా విస్తరించాల్సి ఉందని పేర్కొన్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నట్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యే వెంట కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పింగిళి వెంకట్రామ్ నర్సింహారెడ్డి తదితరులు ఉన్నారు.అత్యవసర సమయాల్లో రోగికి అందించే ఆక్సిజన్ ఎంజీఎంలో సరిగ్గా అందట్లేదు. పైపులు గోడలకు వేలాడుతున్నా.. పట్టించుకునేవారు లేరు. కొందరు నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ ఖజానా దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఎంజీఎంకు వచ్చే పేద రోగులకు ఎంత మేర ఆక్సిజన్ అందుతుందో తెలియదు. అడిగేవారూ లేరు. ఫలితంగా కొందరు అధికారులు రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. – ఎంజీఎంఎంజీఎం ఆస్పత్రిలో వైద్యుల గైర్హాజరు, సమయపాలన పాటించకపోవడం రోగులకు ఓ సమస్య అయితే.. రోగులకు ప్రాణం పోసే ఆక్సిజన్ సరఫరాలో నిర్లక్ష్యం వహించడం మరో అవస్థ. ఆస్పత్రిలో పాలనాధికారులు, ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో సమస్యల్ని పట్టించుకోకపోవడం పేద ప్రజలకు శాపంగా మారింది. వరంగల్ కలెక్టర్ సత్యశారద కొన్ని నెలల క్రితం వరుసగా ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించి జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి ఆదేశాల మేరకు కొన్ని సమస్యలు పరిష్కరించేందుకు ఫిర్యాదుల పెట్టె, నిత్యం సమీక్షలు జరిపారు. ఓపీ వ్యవస్థను ప్రక్షాళన చేస్తామన్నారు. కానీ అత్యవసర సేవల్లో ఏ మాత్రం మార్పు లేదు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న వైద్యులు, వైద్యసిబ్బందిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో రోగులకు ప్రాణాలు పోసే ఆక్సిజన్ వంటి సరఫరా వ్యవస్థలు మరమ్మతులకు నోచుకోవట్లేదు. దీంతోపాటు ఆస్పత్రిలో ఎక్కడ చూసినా సమస్యలు దర్శనమిస్తున్నాయి. వామ్మో ఎంజీఎం ఆస్పత్రి అనేలా ఆస్పత్రి పాలన తయారైందన్న ఆరోపణలున్నాయి. అత్యవసరమా.. అంతే సంగతి! నిత్యం పదుల సంఖ్యలో ప్రాణాపాయస్థితిలో ఎంజీఎంకు బాధితులు వస్తుంటారు. వెంటిలేటర్‌తో పాటు ఆక్సిజన్ పడకలపై చికిత్స పొందుతుంటారు. శోకసంద్రంలో మునిగిపోతుంటారు. ప్రాణాలు పోసే ఏఎంసీ, ఐఏఎంసీ వంటి వార్డులకు ఆక్సిజన్ సరఫరా చేసే పైపులైన్ ఏర్పాటు చేసి 15 నుంచి 20 ఏళ్లు గడుస్తున్న క్రమంలో కనీసం వాటికి మరమ్మతులు చేపట్టకపోవడం వల్ల రోగికి అందాల్సిన ఆక్సిజన్ సరైన మోతాదులో అందని పరిస్థితి. ఓ క్రమ పద్ధతిలో ఉండాల్సిన ఆక్సిజన్ పైపులైన్ల నిర్వహణలో గోడకు వేలాడుతూ.. తీగలపై ఆధారపడి ఉండడమే ఇందుకు నిదర్శనం. వృథా.. వ్యథ! ఆక్సిజన్ సరఫరాలో ప్రత్యేక దృష్టి సారించకపోవడంతో రోగికి ప్రాణవాయివు అందకపోవడం ఓ సమస్య అయితే.. వాడాల్సిన పరికరాలు (ఆక్సిజన్ ప్రెజర్ రెగ్యులేటర్స్) వాడకపోవడం వల్ల ఎక్కువ ఆక్సిజన్ వాడకం వల్ల ప్రజాధనం దుర్వినియోగమవుతోందని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ల వద్ద నిర్వహణ సరిగ్గా లేక ప్రతీరోజు 500 నుంచి 600 పాయింట్స్ మాత్రమే వాడాలి. కానీ ప్రస్తుతం 900 నుంచి 1,100 పాయింట్స్ వినియోగిస్తున్నారు. అయితే దీని ద్వారా ఎవరైతే టెండర్లో ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారో సదరు కాంట్రాక్టర్ ధనార్జన సాగేందుకు ఆస్పత్రి సిబ్బంది మరమ్మతులు చేయకుండా, పరికరాలు అందించకుండా వ్యవహరిస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు.● హనుమకొండ జిల్లాలో 673 మంది, వరంగల్‌లో 267మంది గైర్హాజరు ● పలు కేంద్రాలను తనిఖీ చేసిన సీపీ, అడిషనల్ కలెక్టర్, విద్యాశాఖ అధికారులురాయపర్తిలోని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా బ్రాంచ్న్యూస్రీల్ -
బుధవారం శ్రీ 5 శ్రీ మార్చి శ్రీ 2025
హన్మకొండ: విద్యుత్ లైన్లకు నేరుగా కొక్కాలు తగిలించి, దొంగచాటుగా విద్యుత్ లైన్ల నుంచి వైరులాగి విద్యుత్ చౌర్యానికి పాల్పడడం చూశాం. గతంలో మీటర్ ఉత్పత్తిలో సాంకేతిక లోపంతో టీవీ రిమోట్ ద్వారా మీటర్ రీడింగ్‌ను నిలిపివేసిన ఘటనలూ చూశాం. ప్రస్తుతం వరంగల్ మహానగరంలో గతానికి భిన్నంగా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న ఘటనలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. టీజీ ఎన్పీడీసీఎల్ ఇంజనీర్లకు సవాల్ విసిరినట్లుగా సాగుతున్న విద్యుత్ చౌర్యం సాగుతున్న తీరు విద్యుత్ వర్గాల్లో కలకలం రేపుతోంది. ప్రధానంగా గృహ, వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న త్రీ ఫేజ్ మీటర్ల ద్వారా కొందరు వినియోగదారులు విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న ఘటనలు విస్తుగొలుపుతున్నాయి. చౌర్యం ఇలా.. విద్యుత్ లైన్ ద్వారా మీటర్లకు సర్వీస్ ద్వారా విద్యుత్ సరఫరా జరుగుతోంది. అదే మీటర్ నుంచి విద్యుత్ బయటకు వస్తుంది. మీటర్ లోపలకు వెళ్లి, బయటకు విద్యుత్ సరఫరా జరిగినప్పుడు మీటర్లో యూనిట్లు నమోదు అవుతాయి. విద్యుత్ మీటర్లో ఉండే ట్రాన్స్ఫార్మర్ ద్వారా విద్యుత్ మీటర్లోకి వెళ్లడం, మీటర్ నుంచి వినియోగానికి బయటకు రావడం జరుగుతుంది. ఇదే కరెంట్ ట్రాన్స్ఫార్మర్ నుంచి మీటర్‌లోని మదర్ బోర్డుకు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా జరుగుతోంది. దీంతో విద్యుత్ రీడింగ్ నమోదవుతుంది. త్రీ ఫేజ్‌లో ఏ ఫేజ్‌లో విద్యుత్ అధికంగా వినియోగమవుతుందో మదర్ బోర్డుకు వెళ్లే ఆ ఫేజ్ వైర్‌ను కట్ చేస్తున్నారు. దీంతో మీటర్లో యూనిట్లు తక్కువగా నమోదు అవుతున్నాయి. మదర్ బోర్డుకు వెళ్లే ఫేజ్వైర్ను కట్ చేయడం వల్ల కరెంట్ సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదు. దీన్ని గుర్తించాలంటే మీటర్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తేనే సాధ్యమవుతుంది. గుర్తించారిలా.. ఎన్పీడీసీఎల్లోని విద్యుత్ సర్వీస్‌ల ప్రత్యేక విభాగం నిరంతరం తనిఖీలు చేస్తుంటుంది. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం హనుమకొండ నయీంనగర్‌లోని ఓ ప్రైవేట్ హాస్టల్‌ను తనిఖీ చేయగా ఈవిద్యుత్ చౌర్యం సంఘటన వెలుగు చూసింది. టాంగ్ టెస్టర్ ద్వారా మూడు ఫేజ్‌లు పరీక్షించగా.. ఒక ఫేజ్‌లో విద్యుత్ మదర్ బోర్డుకు చేరడం లేదని గుర్తించారు. ఈ క్రమంలో ఎన్పీడీసీఎల్ ఆపరేషన్, డీపీఏ విభాగం వారు గ్రూపులుగా ఏర్పడి విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఈక్రమంలో హనుమకొండ అడ్వొకేట్స్ కాలనీలోని ప్రముఖ విద్యాసంస్థతోపాటు, హనుమకొండ చౌరస్తాలో బట్టల షాపు, అశోక హోటల్ సమీపంలోని బిర్యానీ సెంటర్‌తో పాటు మొత్తం 12 విద్యుత్ సర్వీసులు ఇదే విధంగా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నట్లు గుర్తించారు. దీంతోపాటు వరంగల్‌లో ఒక్కరికే చెందిన రెండు బేకరీల్లో విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నట్లు గుర్తించారు. విద్యుత్ చౌర్యానికి పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ట్యాంపరింగ్ చేస్తామని తిరుగుతున్న బృందాలు.. విద్యుత్ మీటర్ రీడింగ్ తగ్గిస్తామని ప్రత్యేకమైన నిపుణులు నగరం, పట్టణాల్లో తిరుగుతున్నారని విద్యుత్ అధికారులు తెలిపారు. రూ.10 వేలు ఇస్తే మీటర్ రీడింగ్ నమోదు కాకుండా చేస్తామని చెబుతున్నారని, ఇప్పటి వరకు విద్యుత్ చౌర్యానికి పాల్పడిన వారంతా డబ్బులు చెల్లించి ఆ ప్రత్యేక నిపుణులచే విద్యుత్ మీటర్ల టాంపరింగ్‌కు పాల్ప డినట్లు తెలుస్తోంది. విద్యుత్ విజిలెన్స్ విభాగం అధికారులు మీటర్ ట్యాంపరింగ్‌కు పాల్పడుతున్న వారి కోసం శోధిస్తున్నారు. తనిఖీలు విస్తృతం చేశాం... అత్యంత చాకచక్యంగా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారు. ఇది నేరం. రూ.10 వేలు ఇస్తే యూనిట్లు తక్కువగా నమోదయ్యేలా మీటర్లో మార్పులు చేస్తామని కొందరు తిరుగుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఇలాంటి వారిపై వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి విద్యుత్ చౌర్యానికి పాల్పడినా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం – జి.సాంబరెడ్డి, డీఈ, హనుమకొండ టౌన్ విద్యుత్ చౌర్యానికి పాల్పడిన మీటర్‌ను పరిశీలిస్తున్న విద్యుత్ అధికారులు నాలుగు రోజుల్లో హనుమకొండ నగరంలో 1119 సర్వీస్‌లు తనిఖీ చేశారు. ఇందులో 12 సర్వీస్‌లు విద్యుత్ చౌర్యానికి పాల్పడినట్లు గుర్తించారు. ఆపరేషన్ విభాగానికి చెందిన 57, డీపీఈకి చెందిన 15 ప్రత్యేక బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి.నగరంలో ఆధునిక సాంకేతికతతో విద్యుత్ చౌర్యంన్యూస్రీల్ తనిఖీల్లో గుర్తించి విస్తుపోతున్న ఎన్పీడీసీఎల్ అధికారులు ఇప్పటివరకు 12 కేసులు నమోదు దొంగతనం చేసేది త్రీ ఫేజ్ మీటర్ల వినియోగదారులే.. -
రేపటి నుంచి పదో తరగతి ప్రీఫైనల్స్
విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని టెన్త్ విద్యార్థులకు గురువారం నుంచి 15వ తేదీ వరకు ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈమేరకు అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులు టైంటేబుల్ విడుదల చేశారు. జిల్లాలోని డీసీఈబీ (డిస్ట్రిక్ట్ పరీక్ష బోర్డు) నుంచి ఎంఈఓ కార్యాలయాల్లో ప్రశ్నపత్రాలను అందుబాటులో ఉంచుతారు. అక్కడి నుంచి హెచ్ఎంలు తీసుకెళ్లాల్సి ఉంటుంది. కాగా.. హనుమకొండ జిల్లాలో టెన్త్ ప్రీ ఫైనల్ పరీక్షల్ని 12,010 మంది విద్యార్థులు రాయనున్నట్లు డీఈఓ వాసంతి, డీసీఈబీ సెక్రటరీ డాక్టర్ బి.రాంధన్ సోమవారం తెలిపారు. -
ఇళ్ల జాబితాలో అవకతవకలుంటే చర్యలు
● పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి ● ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులతో సమీక్ష హన్మకొండ చౌరస్తా: ‘ఇది ప్రజా ప్రభుత్వం. పేదల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లల్లో అవకతవకలు జరిగితే చర్యలు తప్పవు’ అని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి హెచ్చరించారు. హనుమకొండలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఇందిరమ్మ కమిటీభ్యులతో ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ పథకం అమలులో లీడర్ అయినా.. కేడర్ అయినా పైసలు వసూలు చేస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరైనట్లు తెలిపారు. కొందరు నాయకులు సమస్యాత్మక గొడవలు, భూపంచాయతీలపై ఆసక్తి చూపుతున్నట్లు.. అలాంటివి తన దృష్టికొస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాసరావు, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు పోతుల శ్రీమన్నారాయణ, మామిండ్ల రాజు, విజయశ్రీ రజాలీ, నాయకులు నాయిని లక్ష్మారెడ్డి, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాను అగ్రభాగాన నిలపాలి
హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య హన్మకొండ అర్బన్: ప్రభుత్వ ఉద్యోగులు సమన్వయంతో పని చేసి జిల్లాను అభివృద్ధిలో, సంక్షేమ పథకాల అమలులో అగ్రభాగాన నిలపాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులకు పిలుపునిచ్చారు. మంగళవారం హనుమకొండ జిల్లా టీఎన్జీఓస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో డైరీ ఆవిష్కరణ నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రావీణ్య పాల్గొని డైరీని ఆవిష్కరించారు. అనంతరం టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధిలో భాగస్వాములై కలెక్టర్ మార్గదర్శకంలో సంపూర్ణ సహకారాలు అందిస్తామన్నారు. అనంతరం హనుమకొండ సిటీ ఉద్యోగుల క్యాలెండర్, పంచాయతీ కార్యదర్శుల క్యాలెండర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీఎన్జీఓస్ నాయకులు బైరి సోమయ్య, వేణుగోపాల్, పనికెల రాజేశ్, శ్యాంసుందర్, రామునాయక్, మోయిజ్, ల క్ష్మీప్రసాద్, ప్రణయ్, పృధ్వీ, పంచాయతీ కార్యదర్శుల ఫోరం అధ్యక్ష, కార్యదర్శులు అశోక్, నరేశ్, నాయకులు రాజమౌళి, సురేశ్, రాజేశ్‌ఖన్నా, రాజ్యలక్ష్మి, సింధురాణి, పావని, శ్రీలత ఉన్నారు. విస్తృత అవగాహన కల్పించాలి దివ్యాంగులకు ఇస్తున్న సదరం ధ్రువీకరణ పత్రానికి బదులు ప్రత్యేక యూనిక్ డిజబిలిటీ ఐడెంటిఫికేషన్ కార్డు (యూడీఐడీ) జారీ నేపథ్యంలో విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో యూడీఐడీ మార్గదర్శకాలపై అధికారులతో కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఇందులో డీఆర్డీఓ మేన శ్రీను, డీఎంహెచ్ఓ అప్పయ్య, ఎంజీఎం సూపరింటెండెంట్ అంబి శ్రీనివాస్, జిల్లా సంక్షేమాధికారి జయంతి పాల్గొన్నారు. అర్హుల జాబితాను సిద్ధం చేయండి జిల్లాలో ‘మిషన్ వాత్సల్య’ పథకానికి అర్హులైన వారి జాబితాను సిద్ధం చేయాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో మిషన్ వాత్సల్య పథకం అర్హుల ఎంపికపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. తల్లిదండ్రులు లేని బాలబాలికలకు మొదటి ప్రాముఖ్యం ఇవ్వాలన్నారు. సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి జయంతి, బాల రక్షాభవన్ జిల్లా కో–ఆర్డినేటర్ సీహెచ్ అవంతి, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఇన్చార్జ్ ఆఫీసర్ ప్రవీణ్‌కుమార్, సీడబ్ల్యూజీ మెంబర్ సుధాకర్, ఎఫ్ఎంఎంఎస్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీకాంత్, ప్రొటెక్షన్ ఆఫీసర్ మౌనిక, శిశుగృహ ఇన్చార్జ్ మేనేజర్ మాధవి, సోషల్ వర్కర్లు శ్రీనివాసులు, సునీత, చైతన్య పాల్గొన్నారు. -
మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి
వరంగల్ కలెక్టర్ సత్యశారద వరంగల్: మహిళలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని కలెక్టర్ సత్యశారద సూచించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ (టీజీఓ) అసోసియేషన్ బాధ్యులు మంగళవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈసందర్భంగా కలెక్టర్‌తోపాటు ఉద్యోగులు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, టీజీఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్నమనేని జగన్ మోహన్‌రావు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాంరెడ్డి, ఫణికుమార్, అనురాధ, నీరజ, డీఆర్ఓ విజయలక్ష్మి, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, డీఆర్డ్డీఓ కౌసల్య, డీపీఓ కల్పన, ఉద్యోగ సంఘాల నాయకులు డాక్టర్ ప్రవీణ్‌కుమార్, రాజేశ్‌కుమార్, రాజకుమార్, రామ్‌కిషన్, వేణుగోపాల్, డాక్టర్ మౌనికరాజ్, డాక్టర్ షఫీ పాల్గొన్నారు. ‘నీట్’కు కేంద్రాలను గుర్తించాలి జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)–2025 నిర్వహణకు జిల్లాలో పరీక్ష కేంద్రాలను గుర్తించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. మే 4న జరిగే నీట్‌కు, కేంద్రాల ఎంపిక, కనీస సౌకర్యాల కల్పనపై మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల్లోని సుమారు 6,300 మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాయనున్నారని, ఇందుకోసం 20 గదుల విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు/కళాశాలలను గుర్తించాలని సూచించారు. సమావేశంలో డీసీపీ రవీందర్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, డీఈఓ జ్ఞానేశ్వర్, పరీక్షల కోఆర్డినేటర్ సుభాషిణి తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా శివపార్వతుల రథోత్సవం
మడికొండ: మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా మెట్టు రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం 6.30 గంటలకు శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక రథంపై ప్రతిష్టించి వైభవంగా రథోత్సవం నిర్వహించారు. మడికొండలోని ప్రధాన వీధుల్లో ఉరేగించారు. రథానికి భక్తులు ఎదురేగి నీళ్లు ఆరబోసి మంగళ హారతులతో స్వాగతం పలికారు. రథోత్సవంలో భాగంగా కోలాటం, గొల్లడప్పులు, భజన బృందాలు, చిరుతల రామాయణం, నృత్యాల మధ్య రథోత్సవం సాగింది. వేడుకల్లో ఆలయ కార్యనిర్వహణాధికారి కే.శేషుభారతి, అర్చకులు రాగిచేడు అభిలాష్శర్మ, పరశురాం విష్ణువర్ధనచార్యులు, సత్యనారాయణ శర్మ, మణిశర్మ, చైర్మన్ పైడిపాల రఘుచందర్, ధర్మకర్తలు బైరి రాజుగౌడ్, దండిగం శ్రీనివాస్, బోగి కేదారి, వస్కుల ఉమ, రోడ్డ దయాకర్, మాడిశెట్టి జ్ఞానేశ్వరి, కుర్ల మోహన్, తొట్ల రాజుయాదవ్ శ్రీనివాస్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
‘ఇందిరా మహిళా శక్తి’ని వేగంగా ఏర్పాటు చేయాలి
వరంగల్ అర్బన్: ఇందిరా మహిళా శక్తి యూనిట్లను వేగంగా ఏర్పాటు చేయాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే కమ్యునిటీ ఆర్గనైజర్లను ఆదేశించారు. మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో మెప్మా కమ్యూనిటీ ఆర్గనైజర్లతో ఇందిరా మహిళా శక్తి యూనిట్ల ఏర్పాటుపై నిర్వహించిన సమావేశంలో కమిషనర్ పాల్గొని సమర్థవంతంగా నిర్వహించేందుకు సూచనలిచ్చారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనలో వేగం పెంచండి ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనలో వేగం పెంచాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. క్షేత్రస్థాయిలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన పురోగతిపై మంగళవారం ప్రధాన కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ సమీక్షించారు. పన్ను వసూళ్లపై కమిషనర్ ఆగ్రహం పన్ను వసూళ్ల పురోగతి ఆశాజనకంగా లేదని బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో పన్నువసూళ్ల పురోగతిపై రెవెన్యూ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ సమర్థవంతంగా నిర్వహించేందుకు సూచనలిచ్చారు. ఆయా సమావేశాల్లో అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే అధికారులు, సిబ్బందితో సమీక్ష -
శిల్పకళ అద్భుతం..
ఖిలా వరంగల్: కాకతీయుల నిర్మాణ శైలి, నల్ల రాతితో రూపొందించిన శిల్ప కళ వెరీ అద్భుతం అని స్టేట్ ఆర్కియాలజీ ఆఫ్ మైసూర్ ఎ.దేవరాజ్, హైదరాబాద్ సర్కిల్ కేంద్ర పురావస్తు శాఖ డిప్యూటీ సూపరింటెండెంట్ హెచ్.దేశాయ్ అన్నారు. ఖిలా వరంగల్ కోటను వారు మంగళవారం సాయంత్రం సందర్శించారు. కాకతీయుల ఖ్యాతిని కొనియాడారు. వారి వెంట కేంద్ర పురావస్తుశాఖ కోట ఇన్చార్జ్ శ్రీకాంత్, టీజీ టీడీసీ కోట ఇన్చార్జ్ గట్టికొప్పుల అజయ్, సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ జాగిలాల పాత్ర కీలకం: సీపీవరంగల్ క్రైం: నేరాలకు పాల్పడిన నిందితులను పట్టుకోవడంలో పోలీస్ జాగిలాలు కీలకంగా నిలుస్తున్నాయని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు నూతనంగా వచ్చిన పోలీస్ జాగిలాలను సీపీ మంగళవారం పరిశీలించారు. గత నెలలో మొయినాబాద్‌లోని పోలీస్ జాగిలాల శిక్షణా కేంద్రంలో శిక్షణను పూర్తి చేసుకుని వచ్చిన ఐదు పోలీస్ జాగిలాలు వరంగల్ కమిషనరేట్ పోలీస్ డాగ్ స్క్వాడ్‌లో చేరి విధులు నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. పేలుడు పదార్థాలను పసిగట్టే ఈ ఐదు జాగిలాల్లో మూడు బెల్జియన్ మాలినోస్, రెండు గోల్డెన్ రీట్రీవర్ జాతులకు చెందినవి ఉన్నాయి. నూతనంగా వచ్చిన ఈ జాగిలాలకు సంబంధించిన పూర్తి వివరాలను సీపీకి హ్యాండ్లర్లు వివరించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ సురేశ్‌కుమార్, ఆర్ఐ శ్రీనివాస్, డాగ్ స్క్వాడ్ ఇన్చార్జ్ హెడ్ కానిస్టేబుల్ ప్రభాకర్, హ్యాండ్లర్లు రాజేశ్‌కుమార్, వెంకన్య, సురేశ్, దిలిప్ పాల్గొన్నారు. కెరీర్ కౌన్సెలింగ్ సెల్ డైరెక్టర్‌గా చిర్ర రాజు కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ ప్లేస్మెంట్ సెల్ అండ్ కెరీర్ కౌన్సెలింగ్ సెల్ నూతన డైరెక్టర్‌గా తెలుగు విభాగం కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ చిర్ర రాజు నియమితులయ్యారు. ఈమేరకు రిజిస్ట్రార్ వి.రామచంద్రం మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ పదవిలో రాజు ఏడాదిపాటు కొనసాగుతారు. ఆయన కేయూ పాలకమండలి సభ్యుడిగా కూడా ఉన్నారు. 30 ఏళ్లు దాటిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించాలిహసన్పర్తి: 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని డీఎంహెచ్ఓ అప్పయ్య ఆదేశించారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నట్లుగా నిర్ధారణ అయితే చికిత్స ప్రారంభించాలని సూచించారు. హసన్‌పర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఆశా డేను ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి డీఎంహెచ్ఓ అప్పయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యాధి నిరోధక టీకాలను వందశాతం విజయవంతం చేయాలన్నారు. బీపీ, షుగర్, క్యాన్సర్, టీబీ, కుష్ఠు వ్యాధిగ్రస్తులను ఎప్పటికప్పుడు గమనిస్తూ వారికి తగిన సేవలందించాలని సూచించారు. అసంక్రమిత వ్యాధులపై అవగాహన నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి భార్గవ్, వైద్యులు కృతిక, సురేశ్, హెల్త్ సూపర్వైజర్ లచ్చు, మేరీ, రుతమ్మ, ఫార్మసిస్ట్ అజిత, స్టాఫ్‌నర్స్ విజయకుమారి, హెల్త్ అసిస్టెంట్ సంతోశ్, ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
5
నిమిషాలు ఆలస్యమైనా అనుమతివిద్యారణ్యపురి: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు నిర్ధేశించిన సమయం ఉదయం 9గంటల తర్వాత ఐదు నిమిషాలు ఆలస్యమైనా విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఆ తర్వాత వచ్చినవారిని అనుమతించబోరు. ఈసారి పరీక్ష కేంద్రాన్ని గుర్తించేలా హాల్‌టికెట్లపై క్యూఆర్ కోడ్‌ను కూడా ముద్రించారు. ఈ మేరకు హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బుధవారంనుంచి ఇంటర్ ఫస్టియర్, 6వ తేదీ నుంచి సెకండియర్ విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి. మంగళవారం అన్ని పరీక్ష కేంద్రాల్లో సీటింగ్ అరేంజ్మెంట్ చేశారు. హనుమకొండ జిల్లాలో జనరల్, ఒకేషనల్ కలిపి మొత్తంగా 39,980మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరికోసం 55 సెంటర్లు ఏర్పాటు చేశారు. 55 మంది చీఫ్‌సూపరింటెండెంట్లను, 55 మంది డిపార్టుమెంటల్ ఆఫీసర్లను 1050మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ప్రైవేట్ జూనియర్ కళాశాలల కేంద్రాలకు 42మంది అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్లను నియమించారు. వరంగల్ జిల్లాలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కలిపి 12,321 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. వీరికి 26 పరీక్ష కేంద్రాలు సిద్ధం చేశారు. అన్నిచోట్లా నిఘా అన్ని సెంటర్లలో సీసీ కెమెరాల నిఘా ఏర్పాటుచేశారు. ప్రతి పరీక్ష కేంద్రంలో ప్రధాన ద్వారం వద్ద, ప్రిన్సిపాల్ గది, వరండా, ఒకవేళ పరీక్ష పూర్తయ్యాక వేరే గదిలోజవాబు పత్రాల ప్యాకింగ్ చేస్తే అక్కడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటిని హై దరాబాద్‌లోని ఇంటర్‌బోర్డ్ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించారు. సంబంధిత ఉన్నతాధికారులు అక్కడి నుంచే ప్రతీ పరీక్ష కేంద్రంలోకి వచ్చి వెళ్లేవారు ఎవరనేది పరిశీలించే అవకాశం ఉంది. సెంటర్ సమీపంలో 144 సెక్షన్, జిరాక్స్ సెంటర్ల మూసివేత ఉంటుంది. కేంద్రాల్లో వసతుల కల్పన పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు తాగునీటి సదుపాయం కల్పించారు. వైద్య ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉంటారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూస్తున్నారు. పరీక్షల సమయానికనుగుణంగా ఆర్టీసీ బస్సులను నడుపుతోంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 8–15 గంటలనుంచే లోనికి అనుమతిస్తారు. ఫోన్లు అనుమతించరు. ఫీజుల పేరుతో కళాశాల యాజమాన్యం హాల్‌టికెట్ ఇవ్వకుంటే.. టీజీబీఐఈ వెబ్సైట్ ద్వారా విద్యార్థులు నేరుగా డౌన్లోడ్ చేసుకునే అవకాశం క ల్పించారు. ఆ హాల్‌టికెట్‌పై ప్రిన్సిపాల్ సంతకం అవసరం లేదని, అలా ఎవరైనా హాల్‌టికెట్‌తో వచ్చినా అనుమతించాలని ఇప్పటికే డీఐఈఓ సంబంధిత చీఫ్ సూపరింటెండెంట్లను ఆదేశించారు. నేటినుంచి ఇంటర్ పరీక్షలు కేంద్రాల్లో అన్ని వసతులు పరీక్ష కేంద్రాల పరిసరాల్లో 163 చట్టం అమలు వరంగల్ క్రైం: కమిషనరేట్ పరిధిలో నేటి నుంచి 25వ తేదీ వరకు నిర్వహించే ఇంటర్మీడియెట్ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు పరీక్ష కేంద్రాల పరిఽధిలో 163 బీఎన్ఎస్ చట్టం అమలు చేస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. పరీక్ష కేంద్రాల నుంచి 500 మీటర్ల పరిధిలో గుంపులుగా ఉండడం, ర్యాలీలు, సభలు, ధర్నాలు, సమావేశాలు, ఊరేగింపులు చేయడం నిషేధమని పేర్కొన్నారు. పరీక్ష సమయాల్లో జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని, ఎవరైనా ఉత్తర్వులు అత్రికమిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
హోలీ పండుగకు ఆరు ప్రత్యేక రైళ్లు
కాజీపేట రూరల్ : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హోలీ పండుగ సందర్భంగా కాజీపేట జంక్షన్ మీదుగా చర్లపల్లి–హజ్రత్‌నిజాముద్దీన్ మధ్య అప్ అండ్ డౌన్ మార్గంలో ఆరు ప్రత్యేక రైళ్ల సర్వీస్‌లు నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఎ.శ్రీధర్ సోమవారం తెలిపారు. మార్చి 6,12, 16వ తేదీల్లో చర్లపల్లి–హజ్రత్‌నిజాముద్దీన్ (07707) ఎక్స్‌ప్రెస్ కాజీపేట జంక్షన్‌కు 22.45 గంటలకు చేరుతుంది. అదేవిధంగా తిరుగుప్రయాణంలో మార్చి 8,14,18వ తేదీల్లో హజ్రత్‌నిజాముద్దీన్–చర్లపల్లి (07708) ఎక్స్‌ప్రెస్ కాజీపేట జంక్షన్‌కు మరుసటి రోజు 07.30 గంటలకు చేరుకుంటుందని తెలిపారు. సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్, అండ్ జనరల్ కోచ్‌లతో ప్రయాణించే ఈ ప్రత్యేక రైళ్ల సర్వీస్‌లకు కాజీపేట, రామగుండం, మంచిర్యాల, సిర్పూర్కాగజ్నగర్, బల్హార్షా, చంద్రాపూర్, నాగ్‌పూర్, రాణి కమలాపతి, బీణా, ఝాన్సీ, ఆగ్రా, పల్వాల్ స్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యం కల్పించినట్లు శ్రీధర్ తెలిపారు. హ్యాండ్‌బాల్ పోటీలకు కేయూ మహిళా జట్టు కేయూ క్యాంపస్ : తమిళనాడులోని పెరియార్ యూనివర్సిటీలో కొనసాగుతున్న సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ హ్యాండ్‌బాల్ పోటీలకు కాకతీయ యూనివర్సిటీ మహిళా జట్టు పాల్గొంటుందని కేయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ వై.వెంకయ్య సోమవారం తెలిపారు. ఈజట్టులో ఎస్.భాగ్యశ్రీ, బి.శాంత, ఆర్.రేష్మ, బి.రమ్య (యూపీపీఈ కేయూ వరంగల్), బి.కావ్య, ఎం.త్రివేణి (టీజీఎస్డబ్ల్యూఆర్డీసీ వరంగల్ వెస్ట్), బి. మీనాక్షి, బి.నందిని(టీజీడబ్ల్యూఆర్డీసీ, కొత్తగూడెం), ఎం.కరీనా (టీటీడబ్ల్యూఆర్డీసీ, ఆసిఫాబాద్), ఎస్.నందిని ప్రభుత్వ (ఎస్ఆర్అండ్ బీజీఎన్ఆర్, ఖమ్మం), ఎస్.శివాని (యూసీఈటీడబ్ల్యూ, కేయూ), టి.స్నేహ, ఎ.శ్రీలేఖ, టి.నాన్సీ (వీసీపీఈ బొల్లికుంట), కె.సింధూజ (టీటీడబ్ల్యూఆర్డీసీ ఉట్నూరు), సీహెచ్ సునీత (యూసీపీఈ, ఖమ్మం) ఉన్నారు. వీరికి హనుమకొండలోని వాగ్దేవి డిగ్రీ, పీజీ కళాశాల పీడీ కె.మధుకర్ కోచ్ కమ్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారని వెంకయ్య పేర్కొన్నారు. -
వేసవి పనులు త్వరగా పూర్తి చేయాలి
హన్మకొండ : వేసవి ప్రణాళికలో భాగంగా మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం హనుమకొండలోని ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి 16 సర్కిళ్ల (జిల్లాలు) ఎస్ఈలు, డీఈలు, ఏడీఈలు, ఏఈలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డివిజన్లు, జిల్లాల వారీగా వేసవి ప్రణాళిక, ఇతర అంశాలపై సమీక్షించారు. సీఎండీ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ వేసవి ప్రణాళికలో భాగంగా మిగిలిపోయిన ఇంటర్ లింకింగ్, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. మార్చి, ఏప్రిల్ పరీక్షల సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా జరిగేలా సంబంధిత అధికారులను సమన్వయం చేసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ సర్వీస్‌ల మంజూరులో జాప్యం లేకుండా వేగవంతం చేయాలన్నారు. ట్రాన్స్ఫార్మర్ల రిపేర్లు, సరీసృపాల వల్ల షార్ట్ సర్క్యూట్ కాకుండా మోనోప్లాస్ట్లు పెట్టాలన్నారు. దీని ద్వారా చాలా వరకు అంతరాయాలను నివారించొవచ్చన్నారు. యూనిక్ పోల్ నంబర్ పనులు వేగవంతం చేయాలన్నారు. ఓల్టేజీని మరింత మెరుగుపరచడానికి లైన్లలో కెపాసిటర్ బ్యాంకులు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ డైరెక్టర్లు బి.అశోక్ కుమార్, టి.సదర్ లాల్, టి.మధుసూదన్, వి.తిరుపతి రెడ్డి, సీఈలు తిరుమల్ రావు, రాజు చౌహన్, అశోక్, బీకంసింగ్, వెంకటరమణ, జీఎంలు అన్నపూర్ణ, నాగప్రసాద్, శ్రీనివాస్, సత్యనారాయణ, మల్లికార్జున్, కృష్ణ మోహన్, వేణు బాబు, డీఈ అనిల్‌కుమార్, ప్రభావతి, తదితరులు పాల్గొన్నారు. టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి -
జాతీయ సమగ్రతను పెంపొందించడమే లక్ష్యం
● నెహ్రూ యువ కేంద్రం రాష్ట్ర డైరెక్టర్ అన్షుమాన్ ప్రసాద్‌దాస్ హన్మకొండ: యువతలో జాతీయ సమగ్రతను పెంపొందించడమే లక్ష్యంగా భారత ప్రభుత్వం యువజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో అంతర్ రాష్ట్ర యువ మార్పిడి కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని నెహ్రూ యువ కేంద్రం రాష్ట్ర డైరెక్టర్ అన్షుమాన్ ప్రసాద్ దాస్ అన్నారు. సోమవారం హనుమకొడలోని హరిత కాకతీయ హోటల్లో అంతర్ రాష్ట్ర యువ మార్పిడి కార్యక్రమం–కేరళ ముగింపు కార్యక్రమం జరిగింది. అన్షుమాన్ ప్రసాద్ దాస్ ముఖ్య అతిథిగా పాల్గొని కేరళ రాష్ట్ర యువతకు ప్రశంసపత్రాలు, జ్ఞాపికలు ప్రదానం చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రతీ యువజనుడు సామాజిక సేవా, స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలన్నారు. అవినీతి, మూఢ నమ్మకాలను నిర్మూలించేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్రం వరంగల్ డిప్యూటీ డైరెక్టర్ చితంల అన్వేశ్, నేషనల్ యూత్ అవార్డు గ్రహీతలు మండల పరశురాములు, ఆకులపల్లి మధు, నిట్ ప్రొఫెసర్ కోలా ఆనంద్ కిశోర్ పాల్గొన్నారు. కేయూ పీజీ పరీక్షలు షురూకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో పీజీ కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. రెండు పరీక్ష కేంద్రాల్లో ముగ్గురు కాపీయింగ్ చేస్తూ పట్టుబడగా.. మాల్ ప్రాక్టీస్ కింద బుక్ చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్ తెలిపారు. అదేవిధంగా లా మొదటి సెమిస్టర్ పరీక్షల్లో వరంగల్‌లో రెండు పరీక్ష కేంద్రాల్లో కలిపి కాపీయింగ్ చేస్తూ.. స్క్వాడ్‌కు ఆరుగురు పట్టుబడ్డారు. వారిని మాల్ ప్రాక్టీస్ కింద బుక్ చేసినట్లు తెలిపారు. -
బుల్లెట్, జావా బైక్‌ల ఢీ.. ముగ్గురి దుర్మరణం
● జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘటన భూపాలపల్లి రూరల్: బుల్లెట్, జావా బైక్‌లు ఢీకొని ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం రాంపూర్ సమీప అటవీ ప్రాంతంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు,గ్రామస్తులు, ప్రయాణికుల కథనం ప్రకారం.. మహాముత్తారం మండలం మీనాజీపేట గ్రామానికి చెందిన పింగిళి రవీందర్‌రెడ్డి (45), కొమ్మిడి నర్సింహారెడ్డి అలియాస్ లడ్డూ (35) భూపాలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామ శివారు పెర్కపల్లి బంధువుల వివాహానికి వెళ్లి తిరిగి మీనాజీపేటకు బుల్లెట్‌పై వస్తున్నారు. భూపాలపల్లి మండలం పంబాపూర్ గ్రామానికి చెందిన నర్సింగోజు సతీశ్(30) పంబాపూర్నుంచి జావా వాహనంపై కమలాపూర్ గ్రామంలోని అమ్మమ్మ ఇంటికి వచ్చే క్రమంలో రాంపూర్ గ్రామసమీపం.. మూల మలుపు వద్ద అటవీ ప్రాంతంలో రెండు బైక్‌లు వేగంగా ఎదురెదురుగా ఢీకొన్నాయి. తీవ్రగాయాలు కావడంతో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం 108 ద్వారా జిల్లా కేంద్రంలోని 100 పడకల ఆస్పత్రికి తరలించారు. మృతుడు పింగిళి రవీందర్‌రెడ్డికి భార్య, కుమారుడు, కొమ్మిడి నర్సింహారెడ్డికి భార్య, ఉండగా, నర్సింగోజు సతీశ్‌కు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భూపాలపల్లి సీఐ నరేశ్‌కుమార్ తెలిపారు. వారం క్రితమే సొంతూరుకు వచ్చిన సతీశ్.. సతీశ్ హైదరాబాద్‌లో కుల వృత్తి వడ్రంగి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కుటుంబ సభ్యులను కలిసేందుకు వారం రోజుల క్రితం భార్యాపిల్లలతో కలిసి తన సొంత గ్రామం పంబాపూర్‌కు వచ్చాడు. ముగ్గురి మృతితో రెండు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. -
10 రోజులు అప్రమత్తంగా ఉండాలి
● కలెక్టర్లకు సీఎస్ శాంతికుమారి ఆదేశాలు హన్మకొండ అర్బన్/వరంగల్: యాసంగి పంట సంరక్షణకు రాబోయే పదిరోజులు చాలా కీలకమని, అధికారులు అప్రమత్తంగా ఉంటూ.. సాగు నీరు, విద్యుత్ సరఫరాను అవసరమైన మేర పంటపొలాలకు అందేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం సీఎస్ శాంతికుమారి హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. యాసంగి నీటి లభ్యత, నీటి పారుదల శాఖ పనితీరు, పంటలకు విద్యుత్ సరఫరా, తదితర అంశాలపై కలెక్టర్లు, అధికారులతో సమీక్షించారు. యాసంగి పంటలకు రిజర్వాయర్ల నుంచి విడుదల చేసిన ప్రతీ నీటి చుక్కను వినియోగించుకోవాలని సూచించారు. హనుమకొండ, వరంగల్ కలెక్టరేట్లలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య, వరంగల్ కలెక్టర్ సత్యశారద, అధికారులు పాల్గొన్నారు. -
ఆర్ఆర్ఆర్ సదస్సులో మేయర్, కమిషనర్
వరంగల్ అర్బన్: రాజస్తాన్ రాష్ట్రం జైపూర్‌లో నిర్వహించిన జాతీయ సదస్సులో సోమవారం మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, సీఎంహెచ్ఓ రాజారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. బల్దియా వ్యాప్తంగా నిర్వహిస్తున్న రెడ్యూస్, రీయూస్, రీసైక్లింగ్ (ఆర్ఆర్ఆర్) విధానాల్ని నిర్వహిస్తున్న తీరుపై మేయర్ వివరించారు. ‘యూఎల్ బీ లో 3–ఆర్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సర్క్యూలర్ ఎకానమీ’ అంశంపై కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. -
ఎమ్మెల్సీ రేసులో సీపీఐ నేతలు?
సాక్షిప్రతినిధి, వరంగల్ : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీటుపై సీపీఐ నేతలు కన్నేశారు. ఈ ఎన్నికలకు గత నెల 24న షెడ్యూల్, సోమవారం నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ విడుదలైన రోజే సీపీఐ జాతీయ, రాష్ట్ర నేతల బృందం టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్‌ను హైదరాబాద్ గాంధీభవన్‌లో కలిసింది. నోటిఫికేషన్ ప్రకారం నామినేషన్ల ప్రక్రియ సోమవారం నుంచి ఈ నెల 10వ తేదీ వరకు కొనసాగనుండగా, 11న నామినేషన్ల పరిశీలన, 13న ఉపసంహరణ, 20న పోలింగ్, కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు. ప్రస్తుత బలాబలాలను పరిశీలిస్తే ఎన్నికలు జరిగే ఐదు స్థానాల్లో కాంగ్రెస్‌కు 4, బీఆర్ఎస్కు 1 ఎమ్మెల్సీ సీటు దక్కే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, చాడ వెంకట్ రెడ్డి, తక్కల్లపల్లి శ్రీనివాస్‌రావు, పల్లా వెంకట్‌రెడ్డి, కలవేని శంకర్, ఎం.బాల నర్సింహ, ఈటీ నర్సింహ తదితరుల బృందం టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్‌ను కలవడం చర్చనీయాంశంగా మారింది. రెండు సీట్ల ప్రతిపాదన.. టీపీసీసీ చీఫ్‌ని కలిసిన సీపీఐ బృందం తమ పార్టీకి రెండు ఎమ్మెల్సీ సీట్లను కేటాయించాలని వినతిపత్రం సమర్పించింది. ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో ఒకటి.. ఐదారు మాసాల్లో ఖాళీ అయ్యే స్థానాల్లో మరొటి ఇవ్వాలని అడిగినట్లు పార్టీ వర్గాల సమాచారం. రెండు సీట్లలో ఒకటి దక్షిణ తెలంగాణ, మరొటి ఉత్తర తెలంగాణకు ఇవ్వాలన్న ప్రతిపాదన చేసినట్లు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా అవకాశం ఉన్నా సీటు వదులుకున్న మునుగోడు.. ఉద్యమాల చరిత్ర కలిగిన చట్టసభల్లో ప్రాతినిథ్యం దక్కని వరంగల్ నియోజకవర్గాల నాయకుల పేర్లను పార్టీ నేతలు ప్రస్తావించినట్లు తెలిసింది. ఎంపీ ఎన్నికల సమయంలో సైతం వరంగల్ పార్లమెంట్ స్థానాన్ని అడిగిన సీపీఐ.. కాంగ్రెస్ నాయకత్వం సూచన మేరకు పట్టు వీడింది. ఎమ్మెల్సీ స్థానాల్లోనైనా వరంగల్‌కు చోటు ఇవ్వాలని సీపీఐ నేతలు భావిస్తున్నారు. ఎమ్మెల్సీ కోసం మొదలైన ప్రయత్నాలు... అలయెన్స్‌లో భాగంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ కోసం సీపీఐలో ప్రయత్నాలు ఎవరికీ వారీగా ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రధానంగా మునుగోడు నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత నెల్లికంటి సత్యంతోపాటు సీపీఐ రాష్ట్ర సహాయ కారద్యర్శి, వరంగల్‌కు చెందిన తక్కల్లపల్లి శ్రీనివాస్‌రావుల పేర్లు పార్టీ నాయకత్వం పరిశీలనలో ఉన్నాయి. వీరితో హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి కూడా ఎమ్మెల్సీగా తనకే అవకాశం ఇవ్వాలని నాయకత్వానికి కోరినట్లు తెలిసింది. ఏఐఎస్ఎఫ్ కార్యకర్త నుంచి ఆలిండియా అధ్యక్షుడిగా.. సీపీఐ ఉమ్మడి వరంగల్‌కు మూడు పర్యాయాలు కార్యదర్శిగా పనిచేసిన శ్రీనివాస్‌రావు కూడా గట్టిగా పట్టుపడుతున్నారు. కూనంనేని సాంబశివరావు తర్వాత రాష్ట్ర సహాయ కార్యదర్శిగా కీలక పోస్టులో ఉన్న శ్రీనివాస్‌రావు.. ఉద్యమ ప్రాంతం, వరంగల్‌నుంచి పార్టీ నేతలకు పెద్దగా అవకాశాలు రానందున తనకు చాన్స్ ఇవ్వాలని అడిగినట్లు తెలిసింది. సోమవారం టీపీసీసీ చీఫ్‌ను కలిసిన బృందం... సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇతర మంత్రులను కలవాలనుకున్నా సీఎం ఢిల్లీకి వెళ్లడంతో కుదరలేదు. మంగళవారం సీఎం, ఇతర మంత్రులను ఓ బృందం కలవనుండగా.. ఢిల్లీలో నేడు జరుగుతున్న సీపీఐ జాతీయ సభల్లో పాల్గొనడంతోపాటు కాంగ్రెస్ పెద్దలను కలిసేందుకు మరో బృందం బయలుదేరింది. ఈ బృందంలో తక్కల్లపల్లి శ్రీనివాస్‌రావుతోపాటు పలువురు ఉన్నారు. టీపీసీసీ చీఫ్‌ను కలిసిన కమ్యూనిస్టులు.. నేడు సీఎంను కలవనున్న బృందం రెండు విడతల్లో రెండు సీట్ల ప్రతిపాదన పరిశీలనలో వరంగల్, మునుగోడు నాయకులు వరంగల్ నుంచి తక్కల్లపల్లి శ్రీనివాసరావు పేరు -
అభ్యసన సామర్థ్యాలు పెంచాలి
జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్ శ్రీనివాస్ విద్యారణ్యపురి: విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంచాలని హనుమకొండ జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ ఎ.శ్రీనివాస్ కోరారు. జిల్లాలో 2024 డీఎస్సీ ద్వారా కొత్తగా నియమితులైన ఎస్జీటీలకు హనుమకొండలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మూడురోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం సోమవారం సాయంత్రం ముగిసింది. ముగింపు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పాఠ్యపుస్తకాల వినియోగం, తరగతి గదిలో బోధనకు సంబంధించి అభ్యసన సామర్థ్యాల, పాఠ్య ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక, వార్షిక ప్రణాళిక సమ్మెటివ్ మూల్యాంకనం, డిజిటల్ కంటెంట్‌ను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను పాఠశాలల్లో అమలు చేయాలని సూచించారు. సమావేశంలో రిసోర్స్ ఉపాధ్యాయులు పి.చంద్రయ్య, శ్రీపాల్‌రెడ్డి, శ్యాంసుందర్, పున్నం చందర్, డీఎల్‌ఎంటీ రఘు తదితరులు పాల్గొన్నారు. -
పదేళ్ల పాలనలో ఏం చేశారు?
హన్మకొండ చౌరస్తా : మామునూరు ఎయిర్ పోర్టుకు అనుమతులు తీసుకురాకుండా పదేళ్ల పాలనలో ఏం చేశారని బీజేపీ, బీఆర్ఎస్ నాయకులను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ప్రశ్నించారు. ఎయిర్‌పోర్ట్‌కు గ్రీన్‌సిగ్నల్ రావడంతో హర్షం వ్యక్తం చేస్తూ సోమవారం హనుమకొండలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తూ స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి మాట్లాడారు. వరంగల్‌ను డల్లాస్ చేస్తా, ఆక్సిజన్ పార్కు, అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ వంటి హామీలు ఇచ్చిన కేసీఆర్ పదేళ్ల పాలనలో నగర అభివృద్ధికి తట్టెడు మట్టి పోయలేదని విమర్శించారు. అభివృద్ధిని అడ్డుకునే నాయకులను తరిమికొట్టే రోజులు దగ్గర్లో ఉన్నాయని మండిపడ్డారు. ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యులు, ఉద్యోగుల నియామకం, వైద్యపరికరాల కొరతను పట్టించుకోని నాటి బీఆర్ఎస్ సర్కార్, కమీషన్ల కోసం జైలు స్థలం పేపర్లను మహారాష్ట్ర బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.వేల కోట్లు దండుకున్నారని ధ్వజమెత్తారు. కాజీపేట రైల్వే డివిజన్ హోదా సాధనకు ఈ నెల 9వ తేదీన ఎంపీ కావ్యతో కలిసి ఎమ్మెల్యేలంతా ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రిని కోరనున్నామని తెలిపారు. ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధికి రూ.6వేల కోట్ల నిధులు మంజూరు చేసిన ఏకై క సీఎం రేవంత్‌రెడ్డి అని వివరించారు. ఎయిర్‌పోర్టు స్థల సేకరణకు రూ.205 కోట్లు మంజూరు చేశారని, స్థల సేకరణలో రైతులను రెచ్చగొట్టేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని, అది సరైంది కాదని ఆమె ధ్వజమెత్తారు. అనంతరం ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కేఆర్ నాగరాజు మాట్లాడారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, కార్పొరేషన్ ఫ్లోర్ లీడ ర్ తోట వెంకటేశ్వర్లు, పీసీసీ సభ్యులు బత్తిని శ్రీని వాసరావు, బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, నాయకులు వీ సం సురేందర్‌రెడ్డి, పింగిళి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. నగర అభివృద్ధికి తట్టెడు మట్టిపోయలే.. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి రైతులను రెచ్చగొట్టడం సరికాదు: ఎంపీ కావ్య -
వీడని వృద్ధురాలి హత్య కేసు మిస్టరీ..
కాజీపేట: కాజీపేట 62వ డివిజన్ రహమత్‌నగర్ కాలనీలో గతేడాది డిసెంబర్ 14న జరిగిన వృద్ధురాలు కన్నె విజయ దారుణ హత్య కేసులో ఆధారాలు ఇంకా లభించడం లేదు. ఈ ఘటన వెలుగు చూసి 15 నెలలు గడుస్తున్నా.. నిందితులను గుర్తించడానికి ఒక్క ఆధారం కూడా పోలీసులు సంపాదించలేకపోయారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రహమత్ నగర్ కాలనీతో పాటు ప్రధాన రహదారులపై ఉన్న సీసీ కెమెరాలను జల్లెడ పట్టినా ఏ ఒక్క ఆధారం లభించడం లేదు. హత్య జరిగిన రోజు నుంచి దాదాపు 108 మందిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి వివిధ కోణాల్లో విచారించినా ఒక క్లూ కూడా లభించకపోవడం చర్చనీయాంశంగా మారింది. మృతురాలి కుటుంబ సభ్యులను కూడా పలుమార్లు అదుపులోకి తీసుకుని విచారించిన ఫలితం కనిపించలేదు. ఫలితంగా కేసు కొలిక్కి రాకపోవడంతో పోలీసులు తర్జనభర్జన పడుతున్నారు. హత్య జరిగిన రోజు విధుల్లో ఉన్న పోలీసులు కాలనీలో తనిఖీలు చేయకపోవడం వల్లే నిందితులు తప్పించుకున్నారనే ప్రచారం జరుగుతోంది. రోజులు గడుస్తున్నా నిందితులు పట్టుబడకపోవడంతో ఆ కేసు ఫైల్‌ను అటకెక్కించినట్లు పట్టణంలో ప్రచారం జరుగుతోంది. ● 15 నెలలు గడుస్తున్నా లభించని ఆధారం ● సీసీ కెమెరాల జల్లెడ పట్టినా దొరకని క్లూ.. -
మార్కెట్‌కు 48 వేల బస్తాల మిర్చి
వరంగల్: వరంగల్ ఏనుమాముల మార్కెట్‌కు 48 వేల మిర్చి బస్తాలు అమ్మకానికి వచ్చాయి. మహాశివరాత్రి పండుగతో పాటు మార్కెట్‌కు వరుసగా 5 రోజులు సెలవు ఉన్న నేపథ్యంలో సోమవారం లక్ష బస్తాల వరకు మిర్చి వస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. అయినా రైతులు 48 వేల వరకు అన్ని రకాల మిర్చిని అమ్మకానికి తీసుకొచ్చినట్లు యార్డు ఇన్‌చార్జ్‌లు తెలిపారు. కాగా, అంతకు ముందు ఈనెల 23న సుమారు 80వేల వరకు మిర్చి వచ్చింది. సోమవారం వచ్చిన మిర్చిలో తేజ రకం రూ.13,800 నుంచి 10,500, వండర్‌హాట్ రూ.16,600 నుంచి రూ.13,000, యూస్–341 రకం రూ.13, 600 నుంచి రూ.10, 000, దేశీ మిర్చి రూ.27,000నుంచి 20,000 వరకు ధరలు పలికాయి. కాగా, మార్కెట్‌కు మిర్చి భారీగా తరలిరావడంతో ధరలు తగ్గిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పెద్ద మొత్తంలో తీసుకొస్తే అదే పరిస్థితి ఉంటుందని భావించిన రైతులు సోమవారం మార్కెట్‌కు భారీగా తీసుకురాలేదని సమాచారం. -
మరింత చేరువగా ఆరోగ్య సేవలు
హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య హన్మకొండ అర్బన్: కలెక్టరేట్ ఐడీఓసీ భవనంలోకి వైద్య ఆరోగ్య కార్యాలయం ఉండడం ద్వారా ప్రజలకు మరింత చేరువగా వైద్య ఆరోగ్య శాఖ సేవలు అందనున్నాయని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. హనుమకొండ కలెక్టరేట్‌లోకి మార్చిన వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాన్ని సోమవారం కలెక్టర్ ప్రావీణ్య ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో వివిధ విభాగాలను పరిశీ లించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ అప్పయ్య, డిప్యూటీ డీఎంహెచ్ఓ విజయకుమార్, అడిషనల్ డీఎంహెచ్ఓ మదన్మోహనరావు, పీఓడీటీసీ కె.లలితాదేవి, హిమబిందు పాల్గొన్నారు. ఈజీఎస్ పనులు త్వరగా పూర్తి చేయండి జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా ఆయా మండలాల్లో చేపట్టిన నిర్దేశిత లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ఈజీఎస్, పంచాయతీరాజ్ శాఖ అధ్వర్యంలో చేపట్టిన పనుల పురోగతి, నిర్దేశిత లక్ష్యాల గడువుపై ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈజీఎస్ నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకునేలా అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో డీఆర్డీఓ పీడీ మేన శ్రీను, పంచాయతీరాజ్ శాఖ ఎస్ఈ శంకరయ్య, డీఈ శ్రీనివాసరావు, ఎంపీడీఓలు, పీఆర్ ఏఈలు, తదితరులు పాల్గొన్నారు. -
కాంట్రాక్ట్‌లు, ఉద్యోగాలు ఇప్పిస్తానని వైద్యుడి ఘరానా మోసం
జనగామ : ప్రభుత్వ ఉద్యోగాలు, బిల్డింగ్ కాంట్రాక్ట్ పనులు ఇప్పిస్తానని రూ. రూ.5.56 కోట్ల మేర వసూలు చేసి మోహం చాటేసిన వైద్యుడిని సోమవారం అరెస్ట్ చేసినట్లు జనగామ సీఐ దామోదర్‌రెడ్డి తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. జనగామ జిల్లా కేంద్రంలోని కేకే ఆస్పత్రి వైద్యుడు అబ్దుల్ రహీం సుల్తాన్.. రాజ టిప్పుసుల్తాన్ వారసుడితో పాటు ట్రస్ట్ చైర్మన్‌గా ప్రచారం చేసుకుని ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురి వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశాడు. ఆస్పత్రికి వచ్చే పేషెంట్లకు తాను టిప్పు సుల్తాన్ వారసుడినని పరిచయం చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో జిల్లా కేంద్రానికి చెందిన ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ ఎండి. వసీం అక్తర్‌తో స్నేహం ఏర్పరుచుకున్నాడు. టిప్పు సుల్తాన్ ట్రస్ట్‌కు కర్ణాటక ప్రభుత్వం నుంచి రూ.7 వందల కోట్లు వస్తున్నాయని, ఇందుకు జీఎస్టీ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుందని వసీం అక్తర్‌ను నమ్మించి అతడి వద్ద రూ.1.17 కోట్లు తీసుకున్నాడు. ఇందుకు బహుమానంగా నెలరోజుల్లో జనగామలో తాను నిర్మాణం చేసే మెడికల్ కళాశాల బిల్డింగ్, ఎలక్ట్రికల్ కాంట్రాక్టును ఇప్పిస్తానని చెప్పడంతో వసీం అక్తర్ పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చాడు. 2021లో ఈఎస్ఐ ఆస్పత్రిలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మేకల ఆనంద్‌కుమార్ వద్ద రూ.3.75లక్షలు, గాదెపాక రాజ్‌కుమార్ వద్ద రూ. 5.50 లక్షలు, సిద్ధార్థ వద్ద రూ.5.50 లక్షలు తీసుకున్నాడు. కేకే ఆస్పత్రిలో ఉన్న ఎక్స్‌రే మిషన్, 10 బెడ్లు, ప్రింటర్లు, కంప్యూటర్లు, ఇతర మెడికల్ పరికరాలను ఇస్తామని చెప్పి పట్టణానికి చెందిన మారబోయిన పాండు వద్ద 2023లో రూ.5లక్షలు తీసుకున్నాడు. అలాగే, హైదరాబాద్‌కు చెందిన ఎస్వీఎన్ చారి నుంచి రూ.1.70కోట్లు, ఏ.రాజు నుంచి రూ.50లక్షలు, 2014లో కరీంనగర్‌కు చెందిన సీహెచ్ అనిల్ వద్ద రూ.2 కోట్లు తీసుకుని మోసం చేశాడు. మొత్తం రూ.5కోట్ల56లక్షల75వేల మోసానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు డీసీపీ రాజమహేంద్రనాయక్ ఆదేశాల మేరకు ఏసీపీ చేతన్ నితిన్ పండరి పర్యవేక్షణలో సదరు వైద్యుడిని అరెస్ట్ చేసినట్లు సీఐ దామోదర్ రెడ్డి తెలిపారు. లాటరీ, ఉద్యోగాల పేరిట డబ్బులు అడిగితే ఇచ్చి మోసపోవద్దని సీఐ ప్రజలకు సూచించారు. రూ.5.56 కోట్ల మేర వసూలు వివరాలు వెల్లడించిన సీఐ దామోదర్‌రెడ్డి -
ఫిర్యాదుల వెల్లువ
మంగళవారం శ్రీ 4 శ్రీ మార్చి శ్రీ 2025ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పింగిలి శ్రీపాల్‌రెడ్డి గెలుపు– 8లోuసాక్షి ప్రతినిధి, నల్లగొండ/సాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ–టీఎస్ బలపరిచిన అభ్యర్థి, ఉమ్మడి వరంగల్‌కు చెందిన పింగిలి శ్రీపాల్‌రెడ్డి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డిపై 5,521 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో శ్రీపాల్‌రెడ్డికి 13,969 ఓట్లు రాగా, నర్సిరెడ్డికి 8,448 ఓట్లు వచ్చాయి. నర్సిరెడ్డి ఎలిమినేట్ కాకముందు గెలుపు కోటా ఓట్లు శ్రీపాల్‌రెడ్డికి కూడా లేవు. దీంతో నర్సిరెడ్డిని ఎలిమినేట్ చేసి, ఆయనకు వచ్చిన మొదటి ప్రాధాన్యత ఓట్లలో.. శ్రీపాల్‌రెడ్డికి వచ్చిన 2,870 రెండో ప్రాధాన్యత ఓట్లు కలిపారు. చివరికి శ్రీపాల్‌రెడ్డి 13,969 ఓట్లు సాధించారు. నల్లగొండలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఓట్లను లెక్కిస్తున్న సిబ్బందిఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ నల్లగొండ ఆర్జాలబావిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో సోమవారం నిర్వహించారు. ఉదయం 7 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. బండిల్స్ కట్టడం ఉదయం 11 గంటల వరకు కొనసాగింది. ఆ తరువాత ఓట్ల లెక్కింపు చేపట్టారు. సాయంత్రం 3 గంటలకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. దీంతో అధికారులు మొత్తం చెల్లిన ఓట్లలో సగానికి మించి ఒక్క ఓటును గెలుపు కోటాగా నిర్ణయించారు. మొత్తం 24,135 ఓట్లు పోలవగా 494 ఓట్లు చెల్లలేదు. 23,641 ఓట్లు మాత్రమే చెల్లుబాటు అయ్యాయి. దీంతో గెలుపు కోటాను 11,821గా నిర్ణయించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో శ్రీపాల్‌రెడ్డికి అత్యధికంగా 6,035 ఓట్లు వచ్చాయి. గెలుపు కోటాకు సరిపడా ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. చివరికి ద్వితీయ ప్రాధాన్యత ఓట్లతోనే శ్రీపాల్‌రెడ్డి విజయం సాధించారు. రౌండ్ రౌండ్‌కు ఉత్కంఠే.. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో చివరి వరకు ఉత్కంఠ నెలకొంది. 15వ రౌండ్ నుంచి ఉత్కంఠ మరింతగా పెరిగింది. శ్రీపాల్‌రెడ్డి ఆధిక్యంలో ఉన్నా ద్వితీయ స్థానంలో ఉన్న అలుగుబెల్లి నర్సిరెడ్డికి చేరువలో గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి రాగలిగినా సుందర్రాజు ఎలిమినేషన్‌తో ఇద్దరి మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడింది. ఆ తరువాత పులి సరోత్తంరెడ్డి, పూల రవీందర్, గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డిలను ఎలిమినేట్ చేసి ఓట్లు లెక్కించారు. అప్పటికి కూడా గెలుపు కోటా రాకపోవడంతో చివరకు అలుగుబెల్లి నర్సిరెడ్డిని కూడా ఎలిమినేషన్ చేసి ఓట్లు లెక్కించారు. ఆ తర్వాత శ్రీపాల్‌రెడ్డిని గెలిచినట్లుగా ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఎలిమినేషన్లో ఓట్లు పెరిగాయి ఇలా... మొదటి ప్రాధాన్యతలో ప్రధాన అభ్యర్థులైన పింగిలి శ్రీపాల్‌రెడ్డికి 6,035 ఓట్లు రాగా, అలుగుబెల్లి నర్సిరెడ్డికి 4,820 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డికి 4,437 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత పూల రవీందర్‌కు 3,115, బీజేపీ అభ్యర్థి సరోత్తంరెడ్డికి 2,289, సుందర్రాజుకు 2,040 ఓట్లు మాత్రమే వచ్చాయి. అతి తక్కువ ఓట్లు వచ్చిన వారిని ఎలిమినేట్ చేస్తూ ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. ఇలా 14వ రౌండ్ వరకు ఎలిమినేషన్ చేస్తూ ఓట్ల లెక్కింపు చేయగా శ్రీపాల్‌రెడ్డికి అప్పటివరకు 6,165 ఓట్లు రాగా, నర్సిరెడ్డికి 4,946 ఓట్లు వచ్చాయి. హర్షవర్ధన్‌రెడ్డికి 4,596 ఓట్లు, పూల రవీందర్‌కు 3,249 ఓట్లు వచ్చాయి. అంటే.. 14వ రౌండ్‌వరకు ఎలిమినేట్ అయిన అభ్యర్థులనుంచి మరో 130 రెండో ప్రాధాన్యత ఓట్లు శ్రీపాల్‌రెడ్డికి లభించాయి. ఈ రౌండ్ తరువాత సుందర్రాజును ఎలిమినేట్ చేసి ఓట్ల లెక్కింపు చేపట్టారు. ● 15వ రౌండ్లో శ్రీపాల్‌రెడ్డికి ఒక్కసారే 781 ఓట్లు పెరిగాయి. దీంతో ఆయన ఓట్లు 6,916కి చేరుకున్నాయి. రెండోస్థానంలో ఉన్న అలుగుబెల్లి నర్సిరెడ్డి కూడా 5,205 ఓట్లకు చేరుకున్నారు. హర్షవర్ధన్‌రెడ్డి 4,799 ఓట్లకు చేరుకోగా, పూల రవీందర్ 3,617 ఓట్లకు, సరోత్తంరెడ్డి 2,645 ఓట్లకు చేరుకున్నారు. ఈ రౌండ్లో అయిదుగురికి ఓట్లు పెరిగినప్పటికీ శ్రీపాల్‌రెడ్డి ఆధిక్యం కొనసాగుతూ వచ్చింది. ఆయన దరిదాపుల్లో మిగతా అభ్యర్థులు ఎవరూ లేరు. ● పులి సరోత్తంరెడ్డి ఎలిమినేషన్ తరువాత చేపట్టిన 16వ రౌండ్లోనూ శ్రీపాల్‌రెడ్డికి అదే స్థాయిలో ఓట్లు వచ్చాయి. ఈ రౌండ్లో 757 ఓట్లు పెరిగాయి. ఇక రెండో స్థానంలో ఉన్న నర్సిరెడ్డి, 5,660 ఓట్లకు చేరుకోగా, హర్షవర్ధన్‌రెడ్డి 5,309 ఓట్లకు, పూల రవీందర్ 3,992 ఓట్లకు చేరుకున్నారు. ● పూల రవీందర్ ఎలిమినేషన్ తరువాత 17వ రౌండ్లో శ్రీపాల్‌రెడ్డికి 1,348 ఓట్లు పెరిగి, 9,021 ఓట్లకు చేరుకున్నారు. ఇక రెండో స్థానంలో ఉన్న నర్సిరెడ్డి 6,448 ఓట్లకి చేరుకోగా, మూడో స్థానంలో ఉన్న హర్షవర్ధన్‌రెడ్డి 6,034 ఓట్లకు చేరుకున్నారు. ● హర్షవర్ధన్‌రెడ్డి ఎలిమినేషన్ తరువాత 18వ రౌండ్లో శ్రీపాల్‌రెడ్డికి 2,078 ఓట్లు పెరిగి, 11,099 ఓట్లకు చేరుకున్నారు. ఇక రెండో స్థానంలో ఉన్న నర్సిరెడ్డి 8,448 ఓట్లకు చేరుకున్నారు. బరిలో శ్రీపాల్‌రెడ్డి, నర్సిరెడ్డి మాత్రమే మిగిలారు. దీంతో నర్సిరెడ్డిని ఎలిమినేట్ చేసి ఆయనకు వచ్చిన మొదటి ప్రాధాన్యత ఓట్లలో శ్రీపాల్ రెడ్డికి వచ్చిన రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. ఇందులో వచ్చిన 2,870 ఓట్లు కలుపుకొని శ్రీపాల్‌రెడ్డి 13,969 ఓట్లు సాధించి గెలుపొందినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రకటించారు.న్యూస్‌రీల్ రెండో ప్రాధాన్యత ఓట్లతో తేలిన ఫలితం సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డిపై 5,521 ఓట్ల మెజారిటీ 19మంది బరిలో ఉన్నా ఐదుగురి మధ్యనే సాగిన పోటీ అభ్యర్థుల ఎలిమినేషన్ సమయంలో పెరిగిన ఉత్కంఠ -
ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం
రేపటి నుంచి ఎగ్జామ్స్ షురూ ● హనుమకొండ జిల్లాలో 39,980 మంది ● వరంగల్ జిల్లాలో 12,321 విద్యార్థులు ● కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘా ● నిమిషం నిబంధన, 144 సెక్షన్ అమలువిద్యారణ్యపురి: ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈనెల 5 నుంచి ఫస్టియర్, 6వ తేదీ నుంచి సెకండియర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. హనుమకొండ జిల్లాలో ఇంటర్ ఫస్టియర్, సెకండ్ ఇయర్, జనరల్, ఒకేషనల్ విద్యార్థులు మొత్తం 39,980 మంది పరీక్షలు రాయనున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 7, టీఎస్ రెసిడెన్షియల్ జూనియర్‌కళాశాల 1, టీఎస్ సోషల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాలలు 2, మోడల్ స్కూళ్లు 3, ప్రైవేట్ అండ్ అన్ ఎయిడెడ్ కళాశాలలు 42 మొత్తం 55 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 55 మంది చీఫ్ సూపరింటెండెంట్లను, 55 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను నియమించారు. ప్రైవేట్ జూనియర్ కళాశాలల పరీక్ష కేంద్రాలకు 42 మంది అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్లను నియమించారు. ఇన్విజిలేటర్లను 1,050 మందిని నియమించారు. సెల్ఫ్ సెంటర్లు లేవు. సమస్యాత్మక కేంద్రాలు కూడా లేవు. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగుతాయి. పకడ్బందీగా నిర్వహించేందుకు.. పరీక్షల్ని పకడ్బందీగా నిర్వహించేందుకు కేంద్రాన్ని బట్టి 3 నుంచి 5 వరకు సీసీ కెమెరాలను ఇంటర్ బోర్డు ఏర్పాటు చేసింది. ఆయా కెమెరాలు హైదరాబాద్‌లోని ఇంటర్ బోర్డ్ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించారు. జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. అదేవిధంగా విద్యార్థులకు మౌలిక వసతులు కల్పిస్తారు. కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లుంటే పరీక్షల సమయంలో వాటిని మూసేస్తారు. పోలీస్‌బందోబస్తు కొనసాగనుంది. ముందుగానే చేరుకోవాలి.. ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు ముందుగానే చేరుకోవాల్సి ఉంటుంది. నిర్ణీత సమయానికి ఒక్క నిమిషం లేటయినా.. అనుమతించరు. ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాల్ని అనుమతించరు. విద్యార్థులు ఆన్లైన్ నుంచి హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకున్నా.. ప్రిన్సిపాల్ సంతకం లేకపోయినా పరీక్షకు అనుమతిస్తారు. కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవి.. హనుమకొండ జిల్లాలో పరీక్షలకు సంబంధించి ఎలాంటి సమాచారం కావాలన్నా.. విద్యార్థులు ఈ నంబర్లలో సంప్రదించవచ్చు. చంద్రమౌళి, సూపరింటిండెంట్ 9491559360, పి.సుచిరిత, సీనియర్ అసిస్టెంట్ 9966440775, వికాస్, జూనియర్ అసిస్టెంట్ 9502743435లో సంప్రదించవచ్చు. వరంగల్ జిల్లాలో.. కాళోజీ సెంటర్: ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఇంటర్ విద్యాశాఖ వరంగల్ జిల్లా అధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. జిల్లాలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కలిపి 12,321 మంది పరీక్షలకు హాజరు కానున్నట్లు, వీరికి 26 పరీక్ష కేంద్రాలు సిద్ధం చేసినట్లు వివరించారు. జిల్లాలోని 26 పరీక్ష కేంద్రాల్లో 26 మంది ఛీఫ్ సూపరింటెండెంట్లు, 26 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, 8 మంది అదనపు సూపరింటెండెంట్లు, 3 ఫ్లయింగ్ స్క్వాడ్, నలుగురు సిట్టింగ్ స్క్వాడ్లు, 260 మంది ఇన్విజిలేటర్లు, 52 మంది ఏన్‌ఎంలు, పోలీస్ శాఖ సిబ్బందిని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వరంగల్ జిల్లాలోని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, ఏవైనా సందేహాలున్నా.. 92402 05555 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయవచ్చని సూచించారు. పకడ్బందీగా ఏర్పాట్లు.. ఇంటర్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. మూడు టీంలు ఫ్లయింగ్ స్క్వాడ్లు, నాలుగు బృందాల సిట్టింగ్ స్క్వాడ్లను నియమించాం. పరీక్షల నిర్వహణ పర్యవేక్షణకు డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీ ఉంటుంది. డీఐఈఓ కన్వీనర్‌గా, ఇద్దరు ప్రిన్సిపాళ్లు సభ్యులుగా ఉంటారు. హైపవర్ కమిటీ కూడా ఉంటుంది. కలెక్టర్ చైర్మన్‌గానూ, పోలీస్ కమిషనర్, ఇంటర్ విద్య ఆర్జేడీ డెక్, డీఐఈఓ, సీనియర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాళ్లు ఇద్దరు సభ్యులుగా ఉంటారు. విద్యార్థులు ఎలాంటి మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడినా చర్యలు తప్పవు. – ఎ.గోపాల్, డీఐఈఓ హనుమకొండ జిల్లాలో ఇలా.. ఫస్టియర్ జనరల్ : 18,397 ఒకేషనల్ : 1,146 సెకండియర్ జనరల్: 19,480 ఒకేషనల్ : 957 మొత్తం విద్యార్థులు : 20,437 వరంగల్ జిల్లాలో..ఫస్టియర్ జనరల్ : 4,967 ఒకేషనల్ : 848 సెకండియర్ జనరల్: 5,739 ఒకేషనల్ : 767 మొత్తం : 12,321 -
పోస్టల్ సేవలు ప్రియం..
కాజీపేట: ఉత్తరాలు, మనీ ఆర్డర్ల బట్వాడ నుంచి బ్యాంకింగ్ సేవల వరకు దశల వారీగా విస్తరించిన తపాలా శాఖ.. బుక్పోస్ట్లపై ధరలు పెంచింది. దీంతో వార, పక్ష, మాస ఆధ్మాత్మిక పుస్తకాల బట్వాడపై ధరలు భారీగా పెరగడంతో పాఠకులు ఆందోళనకు గురవుతున్నారు. బుక్ సర్వీస్ పేరుతో ఇంత కాలం అతి తక్కువ ధరకే కోరుకున్న పుస్తకాలు పాఠకుడికి అందించే సౌకర్యం ఉండేది. ఇటీవల ప్రస్తుతమున్న ధరలను రెంట్టింపు చేయడంతో పుస్తకాల రవాణా పాఠకుడికి భారంగా మారనుంది. మూడు రకాల బుక్ పోస్టులను ఒకే విభాగం కిందకు తెస్తూ ప్రింటెడ్ బుక్‌పోస్ట్, రిజిస్టర్ బుక్పోస్ట్గా మార్చి సేవల ధరలు పెంచింది. ఈ నేపథ్యంలోనే నాలుగు రకాలుగా ఉన్న పోస్టు కార్డులను ఒకే విభాగం కిందకు తీసుకొచ్చారు. రిజిస్టర్ బుక్‌పోస్ట్ కాలమ్‌ను గతేడాది డిసెంబర్ 18 నుంచి ఏకంగా సాఫ్ట్వేర్ నుంచి తొలగించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తపాలా ఉద్యోగులతో పాటు పాఠకులను ఆశ్యర్యానికి గురి చేసింది. ఈ నిర్ణయం దిన, వార, పక్ష, మాస పత్రికల బట్వాడపై తీవ్ర ప్రభావం చూపనుంది. పెరిగిన ధరలతో పోలిస్తే... పెరిగిన తపాలా ధరలతో పోలిస్తే ప్రైవేట్ కొరియర్ సేవలు మేలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న, మొన్నటి వరకు తక్కువ ధరకే సేవలు అందించిన తపాలా శాఖ.. ఆదాయం పెంచుకోవడం కోసం ఇలా చార్జీలు పెంచడం చర్చనీయాంశంగా మారింది. దీనికన్నా ప్రైవేట్ కొరియర్ సర్వీస్ సేవలే మేలని వినియోగదారులు అంటున్నారు. దేశంలో ఏ మారుమూల ప్రాంతం నుంచైనా పుస్తకాలు, వార, పక్ష పత్రికలు తెప్పించుకోవాలంటే 5 కిలోల బరువు ఉన్న పార్సిల్‌కు గతంలో రూ.80 చెల్లించేవారు. ప్రస్తుతం అదే బరువు ఉన్న పార్సిల్‌కు రూ.365 చెల్లించాల్సి వస్తోంది. రిజిస్టర్ బుక్ పోస్ట్ ద్వారా 200 పేజీల పుస్తకాన్ని జీఎస్టీతో కలిపి రూ.25కు పంపేవారు. ఇప్పుడు ఆ సర్వీస్‌ను తపాలా శాఖ రద్దు చేయడంతో తప్పని పరిస్థితుల్లో పుస్తకాన్ని రిజిస్టర్ పార్సిల్లో మాత్రమే అందుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రూ.100 విలువైన పుస్తకాన్ని పాఠకుడు పోస్టల్లో తెప్పించుకోవాలంటే రూ.80 చార్జీల కింద భరించాల్సి ఉంటుంది. ఇంత భారం భరించి పుస్తకాలు తెప్పించుకునే వారు ఎవరుంటారనే ప్రశ్న తలెత్తుతుంది. దిగుమతి సుంకంపై ఆందోళన.. శాంపిల్ పుస్తకాలపై 5 శాతం దిగుమతి విధించడం మరింత ఆందోళనకు గురి చేసే అంశం. ప్రాంతీయ భాషలో ముద్రించిన పుస్తకాలను విదేశీ భాషల్లోకి అనువాదం చేసి ప్రచురిస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో విదేశీ పబ్లిషర్లు ఆ పుస్తకాల కాంప్లిమెంటరీ కాపీలను పంపుతుంటారు. ఇలా విదేశాల నుంచి వచ్చే పుస్తకాలపై కేంద్ర ప్రభుత్వం తొలిసారి దిగుమతి సుంకం విధించింది. వాణిజ్య ప్రయోజనాలతో విక్రయించేందుకు ఉద్దేశించిన పుస్తకాలపై దిగుమతి విధించడం సమర్థనీయమే అయినా కాంప్లిమెంటరీగా పంపే పుస్తకాలపై సుంకం పేరిట అదనపు భారం మోపడం సరికాదనే వాదనలు వినపడుతున్నాయి.భారీగా పెరిగిన తపాలా ధరలు భారం కానున్న పుస్తకాల రవాణా తగ్గించాలని పాఠకుల డిమాండ్పుస్తకాలకు దూరం చేయడమే..ప్రభుత్వ నిర్ణయంతో పాఠకులు పుస్తకం చదివే అలవాటుకు దూరమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. మరిన్ని రాయితీలు ఇచ్చి ప్రోత్సహించాల్సిందిపోయి ధరలు పెంచడం బాధాకరం. ఈ నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి. – మోడెం రాజేందర్ గౌడ్, మడికొండ బుక్‌పోస్ట్ పాత ధర(రూ.) కొత్త ధర (రూ.) 100 గ్రాములు 22.00 28.00 కేజీ 27.00 92.00 2కేజీలు 43.50 163.00 3 కేజీలు 56.40 234.00 4 కేజీలు 67.00 304.00 5 కేజీలు 80.00 365.00 -
ఫోన్ చూస్తున్నావని మందలించినందుకు..
● పిల్లలను తీసుకుని వెళ్లిపోయిన గృహిణి మహబూబాబాద్ రూరల్ : ఓ గృహిణి తరచూ ఫోన్ చూస్తుండడంతో ఆగ్రహానికి గురైన భర్త మందలించడంతో ఆమె.. కుమారుడు, కుమార్తెను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ కాలనీకి చెందిన దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాగా, భార్య రోజూ తర చూ ఫోన్ చూస్తుండడంతో అలా ఎందుకు చేస్తున్నావని భర్త మందలించాడు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఆమె తన కుమారుడు, కుమార్తెను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె ఆచూకీ కోసం భర్త మహబూబాబాద్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సై కే.శివ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పెండ్యాల దేవేందర్ తెలిపారు. -
ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలి
● నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ చైర్మన్ శ్రీనివాసరావు హన్మకొండ: ప్రభుత్వం వెంటనే మానవహక్కుల కమిషన్, లోకాయుక్త చైర్మన్లను నియమించి ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ చైర్మన్ అయిలినేని శ్రీనివాసరావు కోరారు. ఆదివారం హనుమకొండ నయీంనగర్‌లో నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్(ఎన్జీఓ) రాష్ట్ర స్థాయి సమావేశం ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్, వరంగల్ జిల్లా చైర్మన్ డ్యాగల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ మానవ హక్కులకు ఎక్కడ భంగం కలిగినా తమ సంస్థ వెంటనే స్పందిస్తుందన్నారు. హక్కులకు భంగం కలిగించినా, సమాజానికి, పర్యావరణానికి, మానవ హక్కులకు ఎలాంటి నష్టం చేకూర్చినా అండగా నిలుస్తామని చెప్పారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజ్ చౌహాన్, సోషల్ మీడియా ఇన్చార్జ్ పరకాల సమ్మయ్య గౌడ్, ఉత్తర తెలంగాణ అధ్యక్షుడు ప్రశాంత్‌రావు, ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ మాటూరి రవీందర్‌గౌడ్, ప్రతినిధులు పాల్గొన్నారు. -
డ్రంకెన్‌డ్రైవ్‌లో పట్టుబడిన వారిపై గన్‌మెన్ దాడి
వరంగల్ : వరంగల్ బస్టాండ్ సమీపంలో ఆదివా రం సాయంత్రం నిర్వహించిన వాహన తనిఖీల సందర్భంగా ఎస్సై గన్‌మెన్ తమపై దాడికి పా ల్పడ్డాడని సంగెం మండలం కృష్ణానగర్‌కు చెందిన గోపతి శ్రీకాంత్, మేకల సాంబరాజు తెలిపారు. వారి కథనం ప్రకారం.. వివాహ వేడుకల్లో పాల్గొన్న అనంతరం బైక్‌పై వెళ్తుండగా పోలీసులు.. శ్రీకాంత్, మేకల సాంబరాజుకు బీత్ ఎనలైజర్ టెస్ట్ నిర్వహించారు. ఇందులో సాంబరాజుకు 109 శాతం వచ్చింది. దీనికి సంబంధించిన రశీదును ఇచ్చి కోర్టులో జరిమానా చెల్లించి వాహనం తీసుకెళ్లాలని ట్రాఫిక్ ఎస్సై యాదగిరి సూచించారు. ఈ క్రమంలో పోలీ సులు వాహనాన్ని తీసుకెళ్తున్న సమయంలో శ్రీకాంత్ తన సెల్ఫోన్లో ఫొటో తీశాడు. దీంతో ఎస్సై గన్‌మెన్ వచ్చి దుర్భాషలాడుతూ శ్రీకాంత్ చేయి చేసుకున్నాడు. ఫొటో తీస్తే కొడతారా అని సాంబరాజు ప్రశ్నించడంతో అతడిపై కూడా దాడి చేశాడు. ఇంత జరుగుతున్నా ఎస్సై స్పందించలేదని బాధితులు వాపోయారు. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుపడితే జరిమానా వేయాలే తప్ప భౌతికదాడికి పాల్ప డడం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరిపి సదరు గన్‌మెన్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని శ్రీకాంత్, సాంబరాజు కోరారు. -
గ్రీవెన్స్‌లో 873 వినతులు పెండింగ్
వరంగల్: కలెక్టరేట్లో ప్రతీ సోమవారం ని ర్వహిస్తున్న గ్రీవెన్స్‌లో కలెక్టర్, అధికారులకు ప్రజలు వినతులు సమర్పిస్తున్నారు. వినతులను కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులకు పంపిస్తారు. అధికారులు వినతులపై దృష్టిసారిస్తే క్షేత్రస్థాయిలోని సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలున్నాయి. ఇక్కడ సమస్యలు పరి ష్కారం కాకపోవడంతో మండల కేంద్రాల్లో వినతులు సమర్పిస్తున్నారు. జిల్లాలో ఫిర్యాదు చేస్తే ఏమవుతుంది.. మళ్లీ మావద్దకే వచ్చారంటూ మండలస్థాయి అధికారులు ఎగతాళి చేస్తున్నట్లు పలువురు బాధితులు వాపోతున్నారు. ప్రతీ వారం గ్రీవెన్స్‌లో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించి, సాధ్యం కాని వాటిపై ఫిర్యాదుదారులకు వివరంగా చెబితే మరో సారి వచ్చే అవకాశాలు ఉండవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈఏడాది జనవరి 1 నుంచి ఫిబ్రవరి 17 వరకు గ్రీవెన్స్‌లో 11,915 వినతులు సమర్పించారు. ఇందులో 11,042 వినతులను అధికారులు పరిష్కరించారు. వివిధ కారణాల వల్ల మరో 873 ఫిర్యాదులు అపరిష్కృతంగా పెండింగ్‌లో ఉన్నాయి. ఎందుకు పెండింగ్ ఉన్నాయో చెప్పరు? అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు వినతులపై స్పందిస్తున్నా కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా), పోలీసుశాఖలు పెద్దగా స్పందించకపోవడం విశేషం. ‘కుడా’కు 105 వినతులు రాగా మొత్తం పెండింగ్‌లోనే ఉన్నాయి. అదేవిధంగా ఈస్ట్‌జోన్ డీసీపీకి 96 వినతులు వచ్చాయి. 53 పరిష్కారం కాగా 43 పెండింగ్‌లో ఉన్నాయి. నర్సంపేట ఏసీపీ పరిధిలో వచ్చిన 50 ఫిర్యాదుల్లో 7 మాత్రమే పరిష్కారం కాగా మామునూరు ఏసీపీ పరిధిలో 34 వినతులు రాగా మొత్తం పెండింగ్‌లో ఉన్నాయి. ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయన్న దానిపై స్పష్టత లేకపోవడంతో బాధితులు మళ్లీ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసేందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. గ్రీవెన్స్‌లో వచ్చిన వినతులు, పరిష్కారమైనవి, పెండింగ్‌లో ఉన్న అర్జీల వివరాలు.. శాఖ వినతులు పరిష్కారం పెండింగ్ జీడబ్ల్యూఎంసీ 471 349 122 జెడ్పీ సీఈఓ 141 30 111 కుడా 105 00 105 డీసీపీ ఈస్ట్‌జోన్ 96 53 43 ఏసీపీ నర్సంపేట 50 7 43 ఏసీపీ మామునూరు 34 00 34 ఎంజీఎం 4,694 4,669 25 ఆర్సీఓ(బాలుర గురుకులం) 93 60 33 జిల్లా రిజిస్ట్రార్ 57 25 32 డీఆర్డీఓ 922 916 6 అంగన్వాడీ 357 353 4 ఆరోగ్యశ్రీ 7 4 3 డీపీఓ 463 460 3 వచ్చిన అర్జీలు 11,915.. పరిష్కారమైనవి 11,042 ‘కుడా’, పోలీస్ శాఖల నో రెస్పాన్స్ -
కూరగాయలకు ‘షేడ్ నెట్’
సోలోగా పాడేద్దాం.. వసంతోత్సవ వేడుకల ముగింపులో సంగీత విభావరిలో విద్యార్థులు వినూత్నంగా పాటలు పాడుతూ అలరించారు. నేను సోలోగా పాడుతా.. నువ్వు సోలోగా గీటార్ వాయించు అంటూ పోటీ పడ్డారు.నాతో పోటీనా..? స్ప్రింగ్‌స్ప్రీ–25 వేడుకల ముగింపులో భాగంగా చెస్‌లో నాతోనే పోటా అంటూ పోటీల్లో విద్యార్థులు తల పడ్డారు. నువ్వా..? నేనా? నేను వేసే ఎత్తుతో నువ్వు చిత్తు అంటూ ఆటలో మెదడుకు మేత పెట్టి పోటీల్లో విజయం సాధించారు.మహబూబాబాద్ రూరల్ : షేడ్‌నెట్ హౌస్‌లో కూరగాయల సాగు చేపడితే రైతులకు లాభదాయకంగా ఉంటుంది. తక్కువ పరిమాణంలో నీటి అవసరం ఉంటుంది. అలాగే, ఎండ, వానా, చలికాలల్లో నుంచి పంటకు రక్షణ కలుగుతుంది. దీంతో కూరగాయలు తాజాగా ఉంటాయి. ప్రధానంగా వేసవిలో ఈ సాగులో మెళకువలు పాటిస్తే అధిక దిగుబడులు, లాభాలు పొందొచ్చు. ఈ నేపథ్యంలో ఈ విధానంలో ఎలా సాగు చేపట్టాలి.. ఏ విత్తనాలు అనుకూలం.. ఏ ఎరువులు వేయాలనే వివరాలు ఉద్యానశాఖ అధికారి శాంతిప్రియ తెలిపారు. ఈ మేరకు ఆమె రైతులకు పలు సలహాలు, సూచనలు అందించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. నాటేందుకు అనువైన మొక్కలు.. లేత మొక్కలు 5 నుంచి 6 వారాల వయస్సు ఉన్నవి షేడ్‌నెట్‌లో సాగుకు అనుకూలంగా ఉంటాయి. అనువైన రకాలు.. టమాటలో సిన్జెంటా, హిమ్సోనా, హిమ్షేక్, ఇన్‌సోనా మొదలైనవి. చెర్రీ టమాటలో మొన్‌సాంట్, ఓల్వ్, రైస్, అంతేకాకుండా హరియాణా అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్చికల్చర్ రీసెర్చ్ వారు అభివృద్ధి చేసిన రకాలు కూడా అనువైనవి. ఎరువులు.. భూమి రకం, మొక్కను బట్టి ఎరువులు వాడుకోవాలి. ఉత్తమ ఫలితాల కోసం, దిగుబడుల కోసం 4 నుంచి 5 టన్నుల వరకు బాగా మాగిన ఎరువులు, 40 నుంచి 95 కేజీల నత్రజని, భాస్వరం, 40 నుంచి 45 కేజీల పొటాశ్ వేసుకోవాలి. సగం నత్రజని, పొటాశ్ ఎరువులతోపాటు మొత్తం భాస్వరం ఎరువు భూమి తయారు చేసేటప్పుడు వేయాలి. మేలైన పద్ధతులు.. ● సక్కరింగ్... మొక్కనుంచి కిందగా పెరిగే, గుబురుగా ఉండే కొమ్మలను తీసివేయాలి. కాండం సులువుగా పెరిగేలా చూసుకోవాలి. ● మొక్కకు ఊతమివ్వటం.. మొక్కలు నాటిన అనంతరం ట్వైన్ దారం/సన్నని ప్లాస్టిక్ వైరుతో గాని ఊతంగా కట్టాలి. భూమి నుంచి కనీసం 3 మీటర్ల ఎత్తు సమాంతరంగా వైర్లు కట్టుకుని, ఊతంగా వాడిన వైర్లు దానికి కట్టాలి. (ట్రెల్లిస్ పద్ధతి) పరాగ సంపర్కం.. షేడ్‌నెట్ హౌస్ ద్వారా కృత్రిమ పద్ధతిలో పరాగ సంపర్కం జరుగుతుంది. బ్రష్ ద్వారా పూల గుత్తుల మీద రుద్దడం ద్వారా (వారిని రెండుసార్లు చొప్పున) కాయలు కట్టడానికి తోడ్పాటు చేయాలి. డీ లీఫింగ్.. ఆకులు ఎక్కువగా భూమిని తాకినప్పుడు రకరకాల ఫంగస్ సోకే అవకాశం ఉంటుంది. అందుకే ఎక్కువగా ఆకులు ఉన్నప్పుడు తీసివేయడం ద్వారా చక్కని సూర్యరశ్మి, గాలితోపాటు ఫంగస్ కూడా అరికట్టొచ్చు. ఫ్రూట్ ఫ్రూనింగ్.. సైజు పూర్తిగా ఎదుగుదల కాని కాయలను తీసివేయడం ద్వారా నాణ్యమైన పెద్ద సైజు ఉన్న కాయలు దిగుబడిగా పొందొచ్చు. నీరుపారించడం... ● సాధారణంగా 4 నుంచి 6 రోజుల వ్యవధిలో నీరు పారించాలి. మొక్కల ఎదుగుదలకు, వాతావరణం పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నీరు పెట్టాలి. ● సకాలంలో ఎరువులు వేయడం, సస్యరక్షణ చర్యలు చేపట్టడం లాంటి పద్ధతులను అవలంబిస్తే సుమారు నాటిన 90 రోజులనుంచి కాపుకు వస్తుంది. సాగులో మెళకువలు పాటిస్తే అధిక లాభాలు ఉద్యాన శాఖ అధికారి శాంతిప్రియ -
అక్రమంగా తరలిస్తున్న పశువుల పట్టివేత
ఏటూరునాగారం : అక్రమంగా పశువులను తరలి స్తున్న రెండు వాహనాలను ఆదివారం తెల్లవారుజామున ములుగు జిల్లా ఏటూరునాగారంలో వై జంక్షన్ వద్ద్ద పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. ఎస్సై తాజొద్దీన్ కథనం ప్రకారం.. ఎస్పీ డాక్టర్ శబరీశ్, ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఆదేశాల మేరకు స్థానిక సీఐ అనుముల శ్రీనివాస్ సూచనల మేరకు సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా చర్ల నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా పశువులు తరలిస్తున్న రెండు కంటైనర్లు, ఒక డీసీఎం వాహనాన్ని తనిఖీ చేశామన్నారు. రహదారి కొనుగోలు అనుమతులు లేకుండా కిక్కిరిసి కట్టేసి ఆహారం (మేత), తాగునీటి సౌకర్యం లేకుండా నిబంధనలకు విరుద్ధంగా 60 పశువులను తరలిస్తుండడంతో పట్టుకున్నామన్నారు. లారీ డ్రైవర్లు, క్లీనర్లు ఎండి. ఈసా, మారపాక రాజు, ఎండి. అజిత్అలీఖాన్, జియాముద్దీన్, లకా వత్ బాలరాజు, సాంబశివుడిని అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. వారిపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతూ పశువులను రాంపూర్ గోశాలకు తరలిస్తున్నామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా మూగజీవాలను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై తాజొద్దీన్ హెచ్చరించారు. -
నేడు ఏనుమాముల మార్కెట్ పునఃప్రారంభం
వరంగల్: ఏనుమాములలోని వరంగల్ వ్యవసాయ మార్కెట్ నేడు(సోమవారం) పునఃప్రారంభం కా నుంది. ఐదు రోజులు వరుస సెలవులు రావడంతో మార్కెట్లో నిలిచిన క్రయవిక్రయాలు తిరిగి ప్రారంభిస్తున్నట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. పెద్ద ఎత్తున మిర్చి తరలివచ్చే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. 9న ఉమ్మడి జిల్లా స్థాయి చెస్ పోటీలు వరంగల్ స్పోర్ట్స్: వరంగల్ జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి ఓపెన్ టు ఆల్ చెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు టోర్నమెంట్ నిర్వహణ కార్యదర్శి పి. కన్నా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. హనుమకొండ ప్రభుత్వ కాకతీయ డిగ్రీ కళాశాల ఆవరణలో నిర్వహించే టోర్నమెంట్లో గెలుపొందిన క్రీడాకారులకు నగదు పురస్కారంతో పాటు బహుమతులు, ప్రశంస పత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు. పోటీలో పాల్గొనే క్రీడాకారులు పేర్లు నమోదు, ఇతర వివరాలకు 90595 22986 నంబర్లో సంప్రదించాలని కోరారు. రేపటి నుంచి స్కూల్ అసిస్టెంట్లకు శిక్షణ కాళోజీ సెంటర్ : 2024 –డీఎస్సీ ద్వారా ఎంపికై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ ఉన్నత పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న స్కూల్ అసిస్టెంట్లు, భాషా పండితులకు ఈనెల 4 నుంచి 6 వరకు వరంగల్‌లో శిక్షణ నిర్వహించనున్నట్లు వరంగల్ డీఈఓ జ్ఞానేశ్వర్ తెలిపారు. హనుమకొండ, వరంగల్, ములుగు, భూపాలపల్లి, మహబూబాద్, జనగామ జిల్లాల్లో విధులు నిర్వర్తిస్తున్న 602 స్కూల్ అసిస్టెంట్లు శిక్షణలో పాల్గొనాలని ఆయన సూచించారు. వరంగల్‌లోని రంగశాయిపేట ప్రభుత్వ హైస్కూల్లో ఇంగ్లిష్ స్కూల్ అసిస్టెంట్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ పీడీలు, పీఈటీలకు, వరంగల్ కరీమాబాద్‌లోని జీహెచ్‌ఎస్‌లో తెలుగు స్కూల్ అసిస్టెంట్లు, భాషాపండితులు, బయో సైన్స్ స్కూల్ అసిస్టెంట్లకు, వరంగల్ శంభునిపేట జీహెచ్‌ఎస్‌లో సాంఘిక శాస్త్రం, గణితం, హిందీ స్కూల్ అసిస్టెంట్లు, హిందీ భాషా పండితులకు శిక్షణ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందన్నారు. శిక్షణకు హాజరయ్యే ఉపాధ్యాయులు తాము బోధించే సబ్జెక్ట్ బుక్స్ వెంట తీసుకొచ్చుకోవాలని డీఈఓ జ్ఞానేశ్వర్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు మడికొండ : రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం మడికొండ శివారులో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. జనగామ జిల్లా చిల్పూరు మండలం నష్కల్ గ్రామానికి చెందిన కన్కెగంటి రాజు తన కుమారుడు అఖిల్‌తో కలిసి ఆటోలో కాజీపేటకు వచ్చి తిరిగి గ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో మడికొండ పోలీస్ స్టేషన్ సమీపంలోని నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ ఆఫీస్ వద్ద వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి 108 వాహనానికి సమాచారం అందించగా చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. -
వసంతోత్సవానికి వీడ్కోలు..
● నిట్‌లో ముగిసిన ‘స్ప్రింగ్ స్ప్రీ–25’ కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్‌లో మూడు రోజులపాటు నిర్వహించిన వసంతోత్సవం ‘స్ప్రింగ్‌స్ప్రీ–25’ వేడుకలు ఆదివారం ముగిశా యి. దేశవ్యాప్తంగా వివిధ ఇంజనీరింగ్ కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులు సంస్కృతీసంప్రదాయలను పరస్పరం పంచుకోవడంతో పాటు వివిధ రకాల కళలను ప్రదర్శించారు. ముగింపు వేడుకల్లో పోలరాయిడ్, స్ట్రీట్ ఫొటోగ్రఫీ, క్యూ ఫ్యాక్టర్, థింక్ డ్రాప్ రివీల్, పిక్చర్ ఫజిల్, సోలో ఐడల్, నుక్కడ్ నాటక్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. రాత్రి సింగర్ నిఖిల్ డిసౌజా పాటలతో హోరెత్తించారు. అటాక్.. నుక్కడ్ నాటక్..నేటి సమాజంలో చోటు చేసుకుంటున్న సామాజిక రుగ్మతలపై ధైర్యంగా పోరాడేందుకు, ప్రజలను చైతన్య పరిచేందుకు కల్చ రల్ ఫెస్ట్‌లో అటాక్ నుక్కడ్.. నాటక్ పేరిట నాటక ప్రదర్శన నిర్వహించారు. ఇదీ ఎంతో ఆకట్టుకుంది. -
సస్యరక్షణతో అధిక దిగుబడి
చెన్నారావుపేట : ప్రస్తుతం మామిడి కాయలు పూత, పిందె దశలో ఉన్నాయి. ఈ దశలో రైతులు చేపట్టే యాజమాన్యం పైనే పంట దిగుబడి ఆధారపడి ఉంటుంది. తెలిసి తెలియక ఈ దశలో రైతులు పొరపాట్లు చేస్తే దిగుబడి నాణ్యతపై ప్రభావం చూపుతుందని వరంగల్ ఉద్యాన శాఖ అధికారి (టెక్నికల్) రాకేశ్ తెలియజేశారు. మామిడిలో పూత నుంచి గోళికాయ దశ వరకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని ఉద్యాన శాఖ అధికారి సూచనలు చేశారు. తేనె మంచు పురుగులు, చెట్ల మొదళ్లలో, బెరళ్లలో దాగి ఉంటాయని, పూత సమయానికి ఇవి చెట్టు పై ఎగబాకి పూత గుత్తులను ఆశించి నష్టపరుస్తాయని వివరించారు. ● పూత, కాయ దశ : ఈ దశలో తేనెమంచు పురుగులు, పక్షికన్ను తెగులు, బూడిద తెగులు, మసి తెగులు విపరీతంగా ఆశిస్తాయి. నివారణకు మోనోక్రోటోపాస్ లీటర్ నీటికి 1.6 మిల్లిలీటర్లను మాంకోజెబ్ లీటర్ నీటికి 2 గ్రాములు కలిపి పిచికారీ చేసుకోవాలి. ● పచ్చి పూత దశ : ఆంత్రక్రోస్, బూడిద తెగులు, మసి తెగులు వ్యాపిస్తాయి. నివారణకు బుప్రోఫెజిన్ 25 శాతం ఎస్సీ 1.5 మిల్లిలీటర్ నీటిలో కలిపాలి. అలాగే హెక్సాకొనోజోల్ 2 మిల్లిలీటర్లను అజాడిరక్టిన్ 1500 పీపీఎం 2.మిల్లిలీటర్లను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ● నల్లపూత దశ : తేనె మంచు పురుగు, తామర పురుగులు, బూడిద తెగులు, పక్షి కన్ను తెగులు ఆశిస్తాయి. నివారణకు బుప్రోఫెజిన్ 20 శాతం, ఎసిఫేట్ 50 శాతం డబ్ల్యూపీ 1 గ్రాము, లీటర్ నీటిలో, థయోఫినేట్ మిథైల్ 1 గ్రాము లేదా కార్బెండజిమ్ 12 శాతం మాంకోజెబ్ 63 శాతం డబ్ల్యూపీ 1.5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ● గోళిదశ నుంచి నిమ్మకాయ దశ: ఈ దశలో తొడమ కుళ్లు తెగులు ఆశిస్తుంది. నివారణకు డైనైపురాన్ 20శాతం ఎస్జీ 0.2 గ్రాములు లీటర్ నీటికి ఆజాక్సిస్ట్రోబిన్ 23 ఎస్సీ 1 మిల్లిలీటర్లు లేదా టెబ్యూకోనజోల్ 50 శాతంను ట్రిప్లాక్సిస్ట్రోబిన్ 25 శాతం డబ్ల్యూజీ గ్రాము.. లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఎరువుల వాడకం.. ● 10 సంవత్సరాలు పైబడిన చెట్లకు రెండోసారి ఎరువులు, యూరియా కేజీ, పొటాశ్ 750 గ్రాముల చొప్పున భూమిలో వేసి ఫిబ్రవరి, మార్చి నెలలో నీటి తడులను 15 రోజుల కొకసారి ఇవ్వాలి. డ్రిప్ సౌకర్యం ఉన్న రైతులు ప్రతీ రోజు చెట్టుకు 60–90 లీటర్ల నీటిని ఇవ్వాలి. కాయలకు కవర్లు తొడగడం.. మామిడి కాయలు పెద్ద నిమ్మకాయ సైజు దశలో ఉన్నప్పుడే వాటికి కవర్లు వాడాలి. నాణ్యమైన కాయలు పొంది ఎగుమతి చేయడంతో అఽధిక ధర లభిస్తుంది. అలాగే, పండు ఈగ, కాయ తొలుచు పురుగులను నివారించొచ్చు. మామిడి కాయలను ఎక్కువ కాలం చెట్టుపై నిల్వచేసి మంచి ధర వచ్చినప్పుడు అమ్మడానికి వీలవుతుంది. కాయలు వృద్ధి చెందే దశలో జాగ్రత్తలు.. నీటి వసతిలేని మామిడి రైతులు 20 గ్రాముల యూరియా, లీటర్ నీటికి లేదా 10 గ్రాములు మల్టీ–కేను లీటర్ నీటికి లేదా 10 గ్రాములు, 19:19:19 లీటర్ నీటికి చొప్పున కలిపి ఆకులు తడిచేలా కాయలతో ఉన్న చెట్లకు మాత్రమే పిచికారీ చేయాలి. 15 రోజుల వ్యవధిలో 2–3 సార్లు పిచికారీ చేయడం ఉత్తమం. ఖాధర్, బెంగళూరు, నీలం రకంపై వచ్చే ఎండబొబ్బ, బెంగళూరు, నీలం రకాల్లో కీలు కాయలను నివారించడానికి 20 గ్రాములు పొడిసున్నం లీటర్ నీటికి కలిపి కాయలపై పిచికారీ చేయాలి. ఇవి పాటించాలి తెల్లపూత దశలో అనగా పూలు వచ్చే దశలో రసాయన మందులను పిచికారీ చేయకూడదు. ఎందుకంటే పరాగ సంపర్కానికి దోహదపడే ఈగలు, తేనేటీగలు చనిపోవడం, వాసనకు పూల దగ్గరకు రాకుండా ఉండడం జరుగుతుంది. పంటను ఆశించే పురుగులు, తెగుళ్ల నివారణకు చర్యలు చేపట్టాలి ఉద్యానశాఖ అధికారి (టెక్నికల్) రాకేశ్ -
పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించాలి
● బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే వరంగల్ అర్బన్ : పారిశుద్ధ్య పనులను సక్రమంగా నిర్వహించాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. నగర పరిధిలో కొనసాగుతున్న శానిటేషన్ నిర్వహణ పనులను ఆమె ఆదివారం ఉదయం 5 గంటలకు 3వ డివిజన్, హనుమకొండ అశోకా జంక్షన్, అంబేడ్కర్ జంక్షన్ ప్రధాన రహదారి ప్రాంతంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెత్త తరలించే ట్రాక్టర్ డ్రైవర్ లాగ్ బుక్, రహదారిని శుభ్రం చేసే స్వీపింగ్ మిషన్ల లాగ్ బుక్ పరిశీలించారు. -
నేడు వరంగల్ కలెక్టరేట్లో గ్రీవెన్స్
వరంగల్: కలెక్టరేట్ సమావేశ మందిరంలో నేడు(సోమవారం) ఉదయం 11 గంటలకు గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం వినతులు సమర్పించేందుకు కలెక్టరేట్ కు రావాలని కలెక్టర్ సూచించారు. హనుమకొండ ప్రజావాణి రద్దు హన్మకొండ అర్బన్ : నేడు(సోమవారం) హనుమకొండ కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ ప్రావీణ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి అర్జీలు ఇచ్చేందుకు కలెక్టరేట్‌కు రావొద్దని సూచించారు. శ్రీపాదరావుకు ఘన నివాళిహన్మకొండ అర్బన్/వరంగల్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతిని పురస్కరించుకొని ఆదివారం హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టరేట్లలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్‌గా ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, రెండు జిల్లాల డీఆర్ఓలు వైవీ.గణేష్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి పీజీ కోర్సుల సెమిస్టర్ పరీక్షలుకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి పీజీ కోర్సుల ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈనెల 3 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ బీఎస్ఎల్.సౌజన్య ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం మొదటి పేపర్, 5న రెండోపేపర్, 7న మూడో పేపర్, 10న నాలుగో పేపర్, 12న ఐదో పేపర్, 15న ఆరో పేపర్ పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటాయని పేర్కొన్నారు. మొత్తం 4,914 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా.. 25 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. నేడు కలెక్టరేట్‌లోకి డీఎంహెచ్ఓ కార్యాలయంహన్మకొండ అర్బన్: ఊరు చివరనున్న హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ఎట్టకేలకు కలెక్టరేట్ ఐడీఓసీ భవనంలోకి మారనుంది. ఇంతకాలం ఉన్న అడ్డంకులు తొలగించుకుని కలెక్టరేట్ రెండో అంతస్తులో కేటాయించిన ఎస్ 14, 16, 17 గదుల్లోకి రానుంది. అధికారికంగా సోమవారం కలెక్టర్ ప్రావీణ్య కార్యాలయాన్ని ప్రారంభించనుండగా.. ఇప్పటికే పాత డీఎంహెచ్ఓ కార్యాలయం నుంచి సామగ్రి తరలించారు. అలాగే ఈనెల 4న క్షేత్రస్థాయిలో వైద్యాధికారులతో నిర్వహించే సమాశాన్ని కూడా కలెక్టరేట్ చేపట్టనున్నట్లు డీఎంహెచ్ఓ వైద్యాధికారులకు సమాచారం పంపించారు. అరుణాచలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సుహన్మకొండ: అరుణాచలం గిరిప్రదక్షిణకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సు నడుపుతున్నట్లు ఆర్టీసీ వరంగల్–1 డిపో మేనేజర్ వంగల మోహన్‌రావు ఆదివారం తెలిపారు. ఈనెల 12న మధ్యాహ్నం 3 గంటలకు హనుమకొండ జిల్లా బస్‌స్టేషన్ నుంచి రాజధాని ఏసీ బస్సు బయల్దేరి 14న అరుణాచలం చేరుకుంటుందన్నారు. 15న జోగులాంబ అమ్మవారి శక్తిపీఠం దర్శనం అనంతరం హనుమకొండకు చేరుకుంటుందని పేర్కొన్నారు. చార్జీ పెద్దలకు రూ.6వేలు, పిల్లలకు రూ.4,500గా నిర్ణయించినట్లు వివరించారు. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి సమాచారం కోసం 99592 26047, 94941 07944 నంబర్లలో సంప్రదించాలని ఒక ప్రకటనలో కోరారు. -
ఎయిర్పోర్ట్ క్రెడిట్ రేవంత్‌కు దక్కదు
హన్మకొండ: వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ క్రెడిట్ వీసమెత్తు కూడా సీఎం రేవంత్‌రెడ్డికి దక్కద ని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. ఆదివారం హనుమకొండ బాలసముద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడు తూ.. ఎయిర్ పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని స్వాగతిస్తూ కృతజ్ఞతలు తెలిపిన ఆయన.. విమానాశ్రయాన్ని తాను తీసుకొచ్చానని రేవంత్‌రెడ్డి చెప్పుకోవడం తెలంగాణ ప్రజలను, ఉద్యమాన్ని, ఉద్యమకారులను కించపర్చడమేనన్నారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఎయిర్ స్ట్రిప్డ్గా ఏర్పాటు చేశారని, తాను స్కూల్ విద్యార్థిగా ఉన్నప్పుడు 1976, 1978 కాలంలో వాయుదూత్ సర్వీస్ నడిచేదన్నారు. 1980లో మూతపడిందని, అప్పు డు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకుంటే మామునూ రు ఎయిర్పోర్ట్ మరోలా ఉండేదన్నారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు అప్పటి కేంద్ర మంత్రి ప్రపుల్ పటేల్‌కు లేఖ రాస్తే శంషాబాద్‌కు 150 కిలోమీటర్ల వరకు విమానాశ్రయం పెట్టొద్దని జీఎంఆర్‌తో 25 ఏళ్లకు ఒప్పందం చేసుకున్నట్లు జవాబు ఇచ్చారన్నా రు. తెలంగాణ ఆవిర్భావం కాగానే కేసీఆర్ విమానాశ్రయం ఏర్పాటుకు కృషి చేశారని, ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ కొట్లాట చూస్తుంటే నవ్వొస్తున్నద ని ఎద్దేవా చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్సీ రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ సుధీర్‌కుమార్, నాయకులు నాగుర్ల వెంకటేశ్వర్లు, పులి రజనీకాంత్, నయీముద్దీన్ పాల్గొన్నారు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ -
కోతుల బీభత్సం
ఖిలా వరంగల్ : వరంగల్ 34వ డివిజన్ శివనగర్‌లో ని డాక్టర్ రవీందర్, వాసవిలేన్లో కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. రహదారిపై తిష్టవేసి విద్యార్థులు, మహిళలు, వృద్ధులపై దాడులు చేస్తున్నారు. ఇళ్లలోకి చొరబడి బియ్యం, పప్పులు, ఇతర ఆహార పదార్థాల ను చెల్లాచెదురు చేస్తున్నాయని కాలనీల వాసులు వాపోతున్నారు. ఆదివారం ఉదయం డాక్టర్ రవీందర్ హాస్పిటల్ లేన్‌లో రిటైర్డ్ ఉపాధ్యాయుడు బత్తుల సత్యం ఇంట్లో కోతులు గుంపుగా ప్రవేశించేందుకు సిద్ధపడ్డాయి. వాటిని కొట్టే క్రమంలో కోతులు సత్యంపై దాడి చేసి గాయపరిచాయి. ఇటీవల ఇదే ఏరియాలో పారిశుద్ధ్య కార్మికురాలు, మరో ఇద్దరు స్థానికులపై దాడి చేసి గాయపరిచాయని చెబుతున్నారు. నగరపాలక సంస్థ అధికారులు స్పందించి కోతులను పట్టి నగరానికి దూరంగా వదిలేయాలని కోరుతున్నారు. రిటైర్డ్ ఉపాధ్యాయుడిపై దాడి -
సోమవారం శ్రీ 3 శ్రీ మార్చి శ్రీ 2025
– 8లోuదేవాదుల ప్రాజెక్టు పెండింగ్ పనులు 2026 మార్చిలోపు వందశాతం పూర్తి చేసి.. అదే నెలలో సోనియాగాంధీ చేతుల మీదుగా ప్రారంభిస్తాం. సమ్మక్క సారక్క బరాజ్ ఎన్ఓసీ కోసం ఛత్తీస్‌గఢ్ సర్కారును ఒప్పిస్తాం. ధరలు పెరగడం వల్ల ఇరిగేషన్ ప్రాజెక్టుల భూసేకరణకు ఇబ్బందిగా మారింది. అయినా వెంటనే చేపట్టి దేవాదుల పూర్తి చేస్తాం. – 2024 ఆగస్టు 31న ములుగు జిల్లా కన్నాయిగూడెంలో సమీక్ష సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్న మాటలివి.●జేసీఆర్ దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు వివరాలు లిఫ్టు చేయాల్సిన నీరు : 60.00 టీఎంసీలు వ్యవసాయానికి నీరు : 56.71 టీఎంసీలు తాగునీటి వినియోగం : 2.97 టీఎంసీలు పారిశ్రామిక నీటి సరఫరా : 0.32 టీఎంసీలు ఇందుకు అవసరమైన విద్యుత్ : 495.55 మెగావాట్లు స్థిరీకరించిన ఆయకట్టు : 5,56,722 ఎకరాలు సాగులోకి వచ్చిన ఆయకట్టు : 3,16,634 ఎకరాలు 2005–06లో ప్రాజెక్టు అంచనా వ్యయం : రూ.6016 కోట్లు 2008–09లో సవరించిన అంచనా వ్యయం : రూ.9427.73 కోట్లు 2016–17లో సవరించిన వ్యయం : రూ.13445.44 కోట్లు సవరించిన వ్యయ ప్రతిపాదనలు : రూ.14729.98 కోట్లు అయిన మొత్తం ఖర్చు : రూ.14,188 కోట్లు ప్రతిపాదనల్లో తాజా అంచనా వ్యయం : రూ.17,500 కోట్లుధర్మసాగర్లో దేవాదుల ఎత్తిపోతల పథకం రిజర్వాయర్ ● ఇరవయ్యేళ్లయినా అసంపూర్తిగానే ప్రాజెక్టు ● కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మంత్రుల పర్యటన ● హామీలు, ఆదేశాలు.. అయినా పూర్తికాని భూసేకరణ ● రూ.6వేల కోట్ల నుంచి రూ.17,500 కోట్లు.. పెరిగిన అంచనా వ్యయందేవాదుల ఆయకట్టు మ్యాప్సాక్షిప్రతినిధి, వరంగల్: ఏడాదిలో 300 రోజులు 60 టీఎంసీల నీటిని వినియోగించుకుని తొమ్మిది జిల్లాల్లో 5.57 లక్షల ఎకరాలకు నీరందించే జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం.. ఇరవయ్యేళ్లయినా అసంపూర్తిగానే ఉంది. మూడో దశలో భూసేకరణ చేపట్టని కారణంగా సుమారు ఆరేళ్లుగా పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రాజెక్టు 91 శాతం వరకు పూర్తయినట్లు నీటిపారుదల శాఖ అధికారులు చెబుతుండగా.. కీలకమైన 9 శాతం పనులు పూర్తి చేయడానికి భూసేకరణ ప్రధాన అడ్డంకిగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, ధనసరి సీతక్క, ఉన్నతాధికారులు 2024 ఆగస్టులో ప్రాజెక్టును పరిశీలించారు. సమీక్ష నిర్వహించి వెంటనే భూసేకరణ చేపట్టి పూర్తి చేస్తామని ప్రకటించినా.. ఆదిశగా అడుగులు పడలేదు. ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్.. జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని అప్పటి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని 2004లో శ్రీకారం చుట్టింది. తొమ్మిది జిల్లాల్లో సుమారు 5.57 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించే ఈ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ఎక్సర్సైజ్ మూడోదశను దాటించలేకపోతున్నది. హనుమకొండ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, ములుగు జిల్లాలతోపాటు కరీంనగర్, సిద్దిపేట, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల పరిధి 37 మండలాలకు చెందిన 5,56,722 ఎకరాలకు నీరందించడం లక్ష్యం కాగా.. ఇప్పటి వరకు 3,16,634 ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చింది. మరో 2,40,088 ఎకరాల ఆయకట్టుకు నీరందాల్సి ఉంది. భూసేకరణే సమస్య.. ప్రాజెక్టు భూసేకరణకు సంబంధించి రైతులు ఎక్కువ పరిహారం డిమాండ్ చేయడం, కోర్టు కేసులు వంటివి అడ్డంకిగా మారాయి. ఫలితంగా ప్రాజెక్టు అంచనా వ్యయం విపరీతంగా పెరుగుతోంది. మొత్తం 33,224 ఎకరాలకు 30,268 ఎకరాలు సేకరించగా.. జనగామ నియోజకవర్గంలో 945 ఎకరాలు, పాలకుర్తిలో 826, గజ్వేల్‌లో 230, నర్సంపేటలో 131, వర్ధన్నపేటలో 168 ఎకరాలు.. ఇలా 2,957 ఎకరాల సేకరణ జరగాల్సి ఉంది. పెరిగిన అంచనా వ్యయం 2004లో రూ.6,016 కోట్లున్న అంచనా వ్యయం 2020 జూన్ నాటికే రూ.14,729.98 కోట్లకు పెరిగింది. మూడు దశల్లో 16 ప్యాకేజీల్లో చేపట్టిన ప్రాజెక్టు నిర్మాణ పనులకు రూ.14,188 కోట్లు ఖర్చయినట్లు అధికారులు వెల్లడించారు. 2024 ఆగస్టు 31న ములుగు జిల్లా కన్నాయిగూడెంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జిల్లా మంత్రులు, ఇరిగేషన్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన తర్వాత భూసేకరణతో పాటు ప్రాజెక్టు పూర్తి చేయడానికి మరోసారి అంచనాలు పెంచి నిధులు మంజూరు చేసేందుకు కృషి చేస్తామని ప్రకటించారు. అయితే ఈమేరకు అధికారులు రూ.17,500 కోట్లతో ప్రతిపాదనలు పంపగా.. పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అయితే పెరిగిన ధరలకు అనుగుణంగా రేట్లు పెంచడం.. లేదంటే రైతులను ఒప్పించడం.. ఏదో ఒకటి జరిగితేనే భూసేకరణ ముందుకు సాగి.. ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉంది. న్యూస్రీల్భూసేకరణ ప్రక్రియ జరుగుతోంది.. ప్రభుత్వ మార్గదర్శకాలు, కలెక్టర్ ఆదేశాల మేరకు భూసేకరణ ప్రక్రియ జరుగుతోంది. జనగామ జిల్లాలో 200 మంది రైతులకు టోకెన్లు ఇచ్చాం. మిగతా ప్రాంతాలు, గ్రామాల్లోనూ మాట్లాడుతున్నాం. 2026 మార్చి నాటికి పూర్తి చేయడం లక్ష్యంగా రైతులను సంప్రదించి భూసేకరణ చేస్తున్నారు. – సుధాకర్, ఎస్ఈ, దేవాదుల ప్రాజెక్ట్ ప్రాజెక్టు వెంటనే పూర్తి చేయాలి.. దేవాదుల ప్రాజెక్టును వెంటనే పూర్తి చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసినా.. ఇరవయ్యేళ్లవుతున్నా అసంపూర్తి ప్రాజెక్టుగానే ఉంటున్నది. అలాగే రెండువేల ఎకరాల ఆయకట్టుకు నీరందించే నక్కలతూముకు కాల్వలు నిర్మించి నీటిని సరఫరా చేయాలి. – బొడ్డు ప్రతాప్, రైతు, ధర్మసాగర్ -
ఫోన్ చూస్తున్నావని మందలించినందుకు..
● పిల్లలను తీసుకుని వెళ్లిపోయిన గృహిణి మహబూబాబాద్ రూరల్ : ఓ గృహిణి తరచూ ఫోన్ చూస్తుండడంతో ఆగ్రహానికి గురైన భర్త మందలించడంతో ఆమె.. కుమారుడు, కుమార్తెను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ కాలనీకి చెందిన దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాగా, భార్య రోజూ తర చూ ఫోన్ చూస్తుండడంతో అలా ఎందుకు చేస్తున్నావని భర్త మందలించాడు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఆమె తన కుమారుడు, కుమార్తెను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె ఆచూకీ కోసం భర్త మహబూబాబాద్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సై కే.శివ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పెండ్యాల దేవేందర్ తెలిపారు. -
ఆకట్టుకున్న సాంస్కృతిక ఉత్సవం
● ప్రతిబింబించిన తెలంగాణ, కేరళ రాష్ట్రాల సంస్కృతి హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయ ప్రాంగణంలో ఆదివారం తెలంగాణ, కేరళ రాష్ట్రాల సాంస్కృతిక ఉత్సవం ఘనంగా నిర్వహించారు. జాతీయ సమైక్యతను పెంపొందించేందుకు ఇంటర్ స్టేట్ యూత్ ఎక్చేంజ్ ప్రోగ్రాంలు జరుపుతున్నారు. కేరళకు చెందిన కళారూపాలు కొల్కలి, ముటిపాటు, తిరువతిర తదితర సంప్రదాయ జానపద నృత్య ప్రదర్శనలు అలరించాయి. తెలంగాణ సంస్కృతికి ప్రతీకలైన బతుకమ్మ, బోనాల విశిష్టతను తెలియజేస్తూ యువతులు ప్రదర్శనలిచ్చారు. జన్ను భరత్, భాస్కర్ సారథ్యంలో డప్పులతో ప్రదర్శన, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ వారి బతుకమ్మ, పింగిళి మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థుల బోనాలు, పోతురాజు, హనుమకొండ వాగ్దేవి కాలేజీ విద్యార్థి అమ్మవారి వేషధారణ, కేయూ మహిళా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల కోలాట ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వరంగల్ నెహ్రూ యువ కేంద్ర, యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆయా కార్యక్రమాలు నిర్వహించారు. స్పాన్సర్లుగా కూరపాటి హాస్పిటల్స్, లయన్స్ ఇంటర్నేషనల్ 320 ఎఫ్, అభయ హాస్పిటల్స్, ముక్తి లేజర్ ఫైల్స్ క్లినిక్ వ్యవహరించాయి. కేయూ ప్రొఫెసర్ మల్లారెడ్డి, డాక్టర్ కూరపాటి రమేశ్, డాక్టర్ గౌతమ్, నెహ్రూ యువ కేంద్ర డిప్యూటీ డైరెక్టర్ అన్వేశ్ చింతం, వరంగల్ జిల్లా బాలల సంక్షేమ సమితి చైర్పర్సన్ వసుధ, జాతీయ యువజన అవార్డు గ్రహీత జక్కి శ్రీకాంత్ ముఖ్య అతిథులుగా పాల్గొని కళాకారులకు బహుమతులు ప్రశంసపత్రాలు అందజేశారు. -
టీజీఓస్ ఆధ్వర్యాన మహిళా దినోత్సవం
వరంగల్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించాలని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్(టీజీఓస్) వరంగల్, హనుమకొండ జిల్లాల బాధ్యులు ఆదివారం నిర్ణయించారు. రెండు జిల్లా ల కలెక్టర్లు డాక్టర్ సత్యశారద, ప్రావీణ్య అనుమతి తో ఈనెల 4, 5 తేదీల్లో వేడుకలు నిర్వహించనున్నారు. 4న వరంగల్ కలెక్టరేట్లో మహిళా ఉద్యోగులకు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని మెడికవర్ ఆస్ప త్రి సహకారంతో ఏర్పాటు చేస్తున్నారు. అదేరోజు మధాహ్నం 2 గంటలకు హనుమకొండ ఐడీఓసీ లోని టీజీఓ భవన్లో మహిళా గెజిటెడ్ అధికారుల కు క్రీడాపోటీలు నిర్వహించనున్నారు. 5వ తేదీన హనుమకొండ సమీకృత కలెక్టరేట్లో అంతర్జాతీ య మహిళా దినోత్సవాన్ని జరుపుకోనున్నారు. -
– వివరాలు 8లోu
సింగర్ గీతామాధురి పాటకు కేరింతలు కొడుతున్న విద్యార్థులురంగులద్దుతున్న విద్యార్థులునిట్ వరంగల్ నిర్వహిస్తున్న ‘స్ప్రింగ్‌స్ప్రీ–25’ వేడుకలు రెండోరోజు శనివారం కలర్ఫుల్గా సాగాయి. దేశవ్యాప్త వివిధ ఇంజినీరింగ్ కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులు తమ సంస్కృతీ సంప్రదాయాల ప్రదర్శనలతో పోటీ పడ్డారు. గీతామాధురి, మ్యాడ్–2 రాకతో ప్రోషో అదిరిపోయింది. కొరియో నైట్‌లో విద్యార్థులు స్టెప్పులతో సందడి చేశారు. ఈ వేడుకలు ఆదివారం ముగియనున్నాయి. – కాజీపేట అర్బన్ -
క్యాన్సర్‌పై జాగ్రత్త అవసరం
వరంగల్ లీగల్: క్యాన్సర్‌పై జాగ్రత్త అవసరమని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ సూచించారు. వరంగల్ కోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వరంగల్ సహకారంతో అవగాహన, వ్యాధి స్క్రీనింగ్ టెస్ట్‌లను నిర్వహించారు. ముఖ్య అతిథిగా నిర్మలా గీతాంబ హాజ రై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. మంచి ఆహారపు అలవాట్లు, నిత్యం వాకింగ్, మద్యపానం, పొగాకుకు దూరంగా ఉంటే క్యాన్సర్‌ను జయించవచ్చని సూచించారు. అనంతరం వైద్యులు న్యాయవాదులకు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్‌లు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తులు మనీష శ్రావణ్ ఉన్నమ్, న్యాయసేవాధికార సంస్థల కార్యదర్శులు సాయికుమార్, క్షమాదేశ్‌పాండే, జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు తీగల జీవన్‌గౌడ్, మాతంగి రమేశ్‌బాబు, ప్రతిమ హాస్పిటల్ డాక్టర్ సుమిత్ర తిప్పాని, చౌకత్, ఉద్యోగులు, న్యాయవాదులు పాల్గొన్నారు. మహిళా న్యాయమూర్తులకు క్రీడా పోటీలు ఈనెల 8న జరిగే మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వరంగల్ ఆధ్వర్యంలో శనివారం మహిళా న్యాయమూర్తులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబతోపాటు న్యాయమూర్తులు మనీష శ్రావణ్ ఉన్నమ్, క్షమా దేశ్‌పాండే, శ్రావణ స్వాతి ఉల్లాసంగా పాల్గొని చెస్, షటిల్ ఆడారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ ఉచిత వైద్య శిబిరం ప్రారంభం -
భద్రకాళి చెరువు పనులపై బడా నాయకుల కన్ను?
క్యూబిక్ మీటర్‌కు రూ.162.56 నుంచి రూ.71.83కు తగ్గింపు● పట్టుబట్టి రేట్లు తగ్గించినట్లు ప్రచారం ● అనుకూల కాంట్రాక్టర్‌కు కట్టబెట్టే యత్నం ● అందుకే.. టెండర్ల దశలోనే బాలారిష్టాలు ● మరోసారి 5వ తేదీ వరకు టెండర్ల తేదీ పొడిగింపు సాక్షిప్రతినిధి, వరంగల్: భద్రకాళి చెరువులో పూడికతీత, మట్టి తరలింపు పనులకు మహూర్తం కుదరడం లేదు. యాభై ఏళ్ల తర్వాత పూడిక తీసేందుకు సుమారు మూడున్నర నెలల క్రితం చెరువు నుంచి నీళ్లు ఖాళీ చేశారు. వెంటనే టెండర్ ద్వారా చెరువు నుంచి పూడిక మట్టి తవ్వకం, లోడింగ్, తరలింపు పనులు చేపట్టేందుకు నిర్ణయం జరిగింది. ఈమేరకు జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి కొండా సురేఖ, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు, ఎమ్మెల్యేలతో సమీక్ష కూడా నిర్వహించారు. నీటి పారుదల శాఖ ద్వారా మొత్తం రూ.13,00,09,046 వ్యయంతో రెండు పనులకు రెండు నెలల వ్యవధిలో రెండు పర్యాయాలు టెండర్లు పిలిచినా పనులు ఖరారు కాలేదు. అయితే ఇతర కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం వెనుక అసలు మతలబు.. కొందరు ప్రజాప్రతినిధులు తమ అనుచరులు, అనుకూలురైన కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించే క్రమంలో ప్రయత్నాలు చేస్తుండడమేనన్న ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలో మొదట మట్టి తవ్వకం, తరలింపు పనులకు క్యూబిక్ మీటర్ ధర రూ.162.56 ప్రకటించిన అధికారులు.. సవరణ, సాంకేతిక కారణాల పేరిట క్యూబిక్ మీటరుకు రూ.71.83లుగా ఖరారు చేశారన్న చర్చ జరుగుతోంది. రేట్ల తగ్గింపుపై అనుమానాలు.. భద్రకాళి చెరువు పూడిక పనుల ఖరారులో ఆలస్యం కావడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే రెండుసార్లు టెండర్లు పిలిచినా అధికారులు.. మొదట ఇద్దరు టెండర్లు వేస్తే తక్కువ కోట్ చేశారని రద్దు చేశారు. ఆతర్వాత క్యూబిక్ మీటర్‌కు రూ.162.56 ఉన్న ఽరేటును రూ.71.83లు తగ్గించి.. నాన్ యూజ్ ఫుల్ సాయిల్‌గా గుర్తించి జీఎస్టీ, మెటీరియల్ కాస్ట్ తొలగిస్తున్నట్లు ప్రకటించారు. కాంట్రాక్టర్లు తక్కువ కోట్ చేశారని మొదట టెండర్లు రద్దు చేసిన అధికారులు.. క్యూబిక్ మీటర్‌కు రూ.90.73 (సగానికి పైగా) తగ్గించడం పథకం ప్రకారమేనన్న చర్చ జరుగుతోంది. ఓ వైపు కొందరు ప్రజాప్రతినిధులు ఈ పనులపై కన్నేసి అనుకూలురకు ఇప్పించే ప్రయత్నంలో భాగంగానే ఇదంతా జరుగుతోందనే ప్రచారం ఉండగా.. మరోవైపు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారి బంధువుకు కావాలని పట్టుపడుతున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. వేసవి ఎండలు ముదురుతున్న నేపథ్యంలో.. ఖాళీ అయిన భద్రకాళి చెరువు కారణంగా నగరంలో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. త్వరితగతిన పనులు పూర్తి చేసేందుకు హైదరాబాద్ నుంచి జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను అప్రమత్తం చేస్తుండగా.. కలెక్టర్లు సైతం ఇరిగేషన్ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే పనుల చేజిక్కించుకునేందుకు కొందరు ప్రజాప్రతినిధుల ప్రయత్నాలు, ఒత్తిళ్ల కారణంగా టెండర్ల ఖరారులో ఆలస్యం జరుగుతోందన్న ప్రచారం బాగా జరుగుతోంది. సెలవుల వల్ల గడువు పొడిగింపు.. పూడికతీతలో వచ్చే నల్లమట్టి కొనుగోలుకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఈనెల 5 వరకు పొడిగించాం. మొదట ఫిబ్రవరి 17 నుంచి 28 వరకు సమయం ఇచ్చాం. అయితే వరుస సెలవులు రావడంతో డీడీలు తీసుకునే చివరి తేదీని ఫిబ్రవరి 28 నుంచి ఈనెల 5 వరకు పొడిగించాం. మట్టి కావాల్సిన వ్యక్తులు 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. – ఎం.శంకర్, ఈఈ, నీటిపారుదలశాఖ నక్కలగుట్ట డివిజన్వాయిదాల టెండర్లు.. భద్రకాళి చెరువులో పూడికతీత, మట్టి తరలింపు పనులకు జనవరి 5, 10 తేదీల్లో టెండర్లు పిలిచారు. పూడిక తవ్వడం, లోడింగ్ పనులకు రూ.3,49,11,446 కేటాయించారు. అలాగే పూడిక మట్టిని తరలించేందుకు క్యూబిక్ మీట రుకు రూ.162.56 చొప్పున 5.85 లక్షల క్యూబి క్ మీటర్లకు రూ.9,50,97,600 చెల్లించేలా.. మరో టెండర్ పిలిచారు. ఈపనుల కోసం కాంట్రాక్టర్లు వ్యూహాత్మకంగానే ముందుకు రాలేద న్న చర్చ జరుగుతోంది. ఈసమయంలో మట్టి తవ్వకం, లోడింగ్ పని కంటే.. పూడిక మట్టి తరలించే పనికి సంబంధించిన టెండర్ నోటిఫికేష న్లో నిబంధనలు కఠినంగా ఉన్నాయని కాంట్రాక్టర్లు ఆసక్తి చూపట్లేదని అధికారులు చెప్పుకొచ్చారు. పూడికతీత, లోడింగ్, తరలింపు పనులను అత్యవసరంగా భావించిన అధికారులు రెండోసారి టెండర్లు పిలిచినా ఫలితం లేదు. ఇదే సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఫిబ్రవరి 28న టెండర్ల దాఖలుకు చివరి తేదీగా మరోసారి టెండర్లు పిలిచారు. తాజాగా మార్చి 5 వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగించారు. -
ఆర్ఆర్ఆర్ సదస్సుకు మేయర్, కమిషనర్
వరంగల్ అర్బన్: ‘చెత్త రెడ్యూస్, రీ యూజ్, రీసైక్లింగ్(ఆర్ఆర్ఆర్) సిటీస్–2.0’పై రాజస్తాన్ రాజధాని పింక్ సిటీ జైపూర్‌లో ఈనెల 2 నుంచి 12వ రీజినల్ సదస్సు జరగనుంది. ఈ మేరకు వరంగల్ నగర మేయర్ మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, సీఎంహెచ్ఓ రాజారెడ్డికి ఆహ్వానం అందింది. జీడబ్ల్యూఎంసీ పరిధి 66 డివిజన్ల వ్యాప్తంగా అమలవుతున్న వివిధ అభివృద్ధి పనులు, చెత్త శుద్ధీకరణ, స్వచ్ఛ వరంగల్ కార్యక్రమాలపై సదస్సులో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించనున్నారు. రీసెర్చ్ స్కాలర్స్ హాస్టల్ జేడీగా సాంబశివరావుకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని వివేకానంద రీసెర్చ్‌స్కాలర్స్ హాస్టల్ జాయింట్ డైరెక్టర్‌గా డాక్టర్ అంకశాల సాంబశివరావు నియమితులయ్యారు. ఈమేరకు శనివారం కేయూ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం ఉత్తర్వులు జారీ చేశారు. కేయూ వీసీ ఆచార్య కె.ప్రతాప్‌రెడ్డి చేతుల మీదుగా నియామక ఉత్తర్వులను సాంబశివరావు అందుకున్నారు. -
భూతగాదాల్లో తలదూర్చొద్దు..
పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా వరంగల్ క్రైం: భూతగాదాల్లో తలదూర్చొదని పోలీస్ కమిషనర్ అంబర్కిశోర్ ఝా పోలీసులకు సూచించారు. నెలవారీ సమీక్షలో భాగంగా శనివారం కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న చైన్ స్నాచింగ్ కేసులను త్వరగా పరిష్కరించి నేరస్తులను పట్టుకోవాలని చెప్పారు. బెయిల్‌పై బయటకు వచ్చి వాయిదాలకు రాని నేరస్తులను కనిపెట్టి వారిని కోర్టులో హాజరు పర్చాలన్నారు. నిందితుల అరెస్ట్‌లో నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. రాత్రి వేళ్లల్లో నిరంతరం పెట్రోలింగ్ చేపట్టాలని ఆదేశించారు. టెన్త్, ఇంటర్ పరీక్షల దృష్ట్యా విద్యార్థులు సరైన సమయంలో సెంటర్లకు చేరేలా ట్రాఫిక్ సమస్యలు రాకుండా చూడాలన్నారు. అనంతరం పోలీస్స్టేషన్ల వారీగా సమీక్షించిన సీపీ.. ఆస్తి, ఫోక్సో, మిస్సింగ్, గంజాయి, రోడ్డు ప్రమాద కేసుల స్థితిగతులపై తెలుసుకున్నారు. డీసీపీ షేక్ సలీమా, రవీందర్, రాజమహేందర్‌నాయక్, ఏఎస్పీ చైతన్, మనన్భట్తో పాటు ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
ఎంజీఎంలో కార్మికుల ఆందోళన
ఎంజీఎం: పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ శనివారం ఎంజీఎంలో కార్మికులు ఆందోళనకు దిగారు. ఆస్పత్రిలో సెక్యురిటీ కాంట్రాక్ట్ టెండర్ దక్కించుకున్న సంస్థకు బిల్లులు నాలుగు నెలలుగా రావడంలేదని.. ప్రస్తుతం ఆ సంస్థ తమకు వేతనాలు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందని కార్మికులు వాపోయారు. వెంటనే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం కార్మిక సంఘాల నాయకులు వరంగల్ కలెక్టర్ సత్యశారదను కలిసి సమస్యను వివరించారు. స్పందించిన ఆమె.. నాలుగు రోజుల్లో కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు చెల్లించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో కార్మికులు ఆందోళన విరమించి విధుల్లో చేరారు. -
మామునూరు ఎయిర్పోర్ట్ వద్ద ఉద్రిక్తత
● పోటాపోటీగా ప్రధాని మోదీ, రేవంత్‌రెడ్డి ఫ్లెక్సీలకు క్షీరాభిషేకాలు ● బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల మధ్యతోపులాటఖిలా వరంగల్: మామునూరు విమానాశ్రయం పునరుద్ధరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. రాష్ట్ర ప్రభుత్వం 253 ఎకరాల భూ సేకరణకు రూ.205 కోట్ల నిధులు విడుదల చేసిన నేపథ్యంలో శనివారం ఎయిర్పోర్ట్ వద్దకు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు చేరుకున్నారు. బీజేపీ శ్రేణులు పీఎం మోదీ ఫ్లెక్సీకి, కాంగ్రెస్ శ్రేణులు సీఎం రేవంత్‌రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఒకరి వేదికపైకి ఒకరు చొచ్చుకురావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎయిర్పోర్ట్ అభివృద్ధి తమ వల్లే అని ఇరు పార్టీల నేతలు పరస్పరం దూషణలతో తోపులాడుకున్నారు. పోలీ సులు చేరుకుని ఇరువర్గాలను పంపించి ఎయిర్పోర్ట్ వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ఉద్యోగుల సమస్యలకు త్వరలో పరిష్కారం
హన్మకొండ అర్బన్: ఉద్యోగుల సమస్యలు సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చినట్లు టీఎన్జీఓస్ కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్ తెలిపారు. హైదరాబాద్ నాంపల్లి టీఎన్జీఓస్ భవన్లో శనివారం హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సభ్యులు కేంద్ర సంఘం నేతలను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈసందర్బంగా మారం జగదీశ్వర్ మాట్లాడుతూ.. సీఎం దృష్టికి ఉద్యోగుల సమస్యలు తీసుకెళ్లినట్లు తెలిపారు. త్వరలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారని, సీఎంపై పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేన్ మాట్లాడుతూ.. ఆకుల రాజేందర్ నాయకత్వంలో హనుమకొండ జిల్లా యూనియన్ బలోపేతానికి, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ మాట్లాడుతూ.. కేంద్ర సంఘం సహకారంతో జిల్లా స్థాయి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్‌లను ఘనంగా సన్మానించారు. జిల్లా కార్యదర్శి బైరి సోమయ్య, అసోసియేట్ అధ్యక్షుడు పుల్లూరు వేణుగోపాల్, కోశాధికారి ఫనికెల రాజేశ్, గౌరవ అధ్యక్షులు శ్యాంసుందర్, రామునాయక్, రాజీవ్ ఇతర నాయకులు ఉన్నారు. -
‘యూడీఐడీ’పై అవగాహన కల్పించాలి
ఆదివారం శ్రీ 2 శ్రీ మార్చి శ్రీ 2025వీసీలో సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ వరంగల్: ఆన్లైన్లో యూడీఐడీ కార్డుల దరఖాస్తుపై దివ్యాంగుల కు అవగాహన కల్పించాలని సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ సూచించారు. యూడీఐడీ, సోలార్ విద్యు త్ ప్లాంట్ల డీపీఆర్‌పై కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీఆర్డీఓలు, ప్రభు త్వ ప్రధాన ఆస్పత్రుల పర్యవేక్షకులు, సంక్షేమ శాఖ అధికారులతో శనివారం ఆమె హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా సెర్ప్ సీఈఓ మాట్లాడుతూ యూడీఐడీ పోర్టల్, ఆన్లైన్, మీసేవ కేంద్రాల్లో యూనిక్ డిజబిలిటీ ఐడీ(యూడీఐడీ) కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. గతంలో జారీ చేసిన సదరం సర్టిఫికెట్లకు యూడీఐడీ కార్డులు మంజూరు చేసినట్లు వివరించారు. దివ్యాంగులు కచ్చితమైన చిరునామాతో www. swaral ambanacard.gov.inలో దరఖాస్తు చేసుకుంటే చీఫ్ మెడికల్ ఆఫీసర్ లాగిన్లోకి వెళ్తుందని తెలిపారు. సెల్‌ఫోన్‌కు వచ్చిన షెడ్యూల్ మెసేజ్ ప్రకారం దివ్యాంగులు మెడికల్ క్యాంపునకు హాజరై తే ప్రత్యేక వైద్యులు పరిశీలించి వైకల్య శాతాన్ని నిర్ణయిస్తారని, ఆ తర్వాత సర్టిఫికెట్ మంజూరు చేస్తారని చెప్పారు. సర్టిఫికెట్ల జారీకి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. వీసీలో కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ప్రధాన ఆస్పత్రుల సూపరింటెండెంట్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. న్యూస్‌రీల్ -
బాలికల గురుకులంలో కమిషనర్ రాత్రిబస
మడికొండ: గ్రేటర్ వరంగల్ 46వ డివిజన్ మడికొండ శివారులోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే గురువారం రాత్రి సందర్శించారు. విద్యార్ధుల హాజరు రిజిస్టర్, కళాశాల రికార్డులను ప రిశీలించారు. ప్రిన్సిపల్ ఉమామహేశ్వరి, బోధన సిబ్బందితో సమావేశమై వివరాలు అడిగి తెలు సుకున్నారు. విద్యార్ధుల స్టడీ అవర్స్ కొనసాగుతుండగా విద్యార్థులతో మాట్లాడి భోజనం, రోజువారీ దినచర్య, మెనూ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి రా త్రి భోజనం చేశారు. పాఠశాలలోనే నిద్రించారు. కమిషనర్ వెంట ఉప కమిషనర్ ప్రసన్నరాణి, వైస్ ప్రిన్సిపల్ మాలిక తదితరులు ఉన్నారు. -
ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమవ్వాలి
● జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న హన్మకొండ: ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధంగా ఉండాలని ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఈదురు వెంకన్న పిలుపునిచ్చారు. గురువారం హనుమకొండ బస్‌స్టేషన్‌లో ఆర్టీసీ కార్మికులు ప్రదర్శన నిర్వహించారు. ఈసందర్భంగా ఈదురు వెంకన్న మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం జాప్యం చేస్తోందన్నారు. యాజమాన్యానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పెడచెవిన పెడుతోందని.. ఇప్పటికే యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చామన్నారు. ఏక్షణమైనా సమ్మెకు వెళ్లొచ్చని.. కార్మికులంతా సమాయత్తం కావాలన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ వరంగల్ రీజియన్ జయశ్రీ, కన్వీనర్ ఎం.శ్రీనివాస్, వైస్ చైర్మన్ సీహెచ్.యాకస్వామి, నాయకులు జి.ఎస్.పాణి, బి.జనార్దన్, ఎ.మురళి, టీ.శ్రీనివాస్, జి.అశోక్, ఎ.యాదగిరి, ఆర్.మొగిలి, మంద శ్రీనివాస్, ఎం.రవీందర్, పసునూరి రవీందర్, వెంకటేశ్వర్లు, సునీత, సంపత్, పద్మ, రజిత, సవిత, మంజుల, ఎం.శ్రీను పాల్గొన్నారు. -
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే..
ఖిలా వరంగల్: వరంగల్ భట్టుపల్లి రహదారిపై ఎస్ఆర్ స్కూల్ సమీపాన ఈనెల 20న డాక్టర్ గాదె సుమంత్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో మిస్టరీ వీడింది. డాక్టర్ భార్యే ప్రధాన సూత్రదారి అని తేల్చారు. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను ప్రియుడితో కలిసి ఏఆర్ కానిస్టేబుల్ సహకారంతో హత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితులు గాదె ఫ్లోరా, ప్రియుడు సంగారెడ్డికి చెందిన ఎర్రోళ్ల శామ్యూల్, ఏఆర్ కానిస్టేబుల్ మంచుకూరి రాజ్‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వరంగల్ మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ నందిరామ్‌నాయక్.. ఇన్స్పెక్టర్ వెంకటరత్నం, ఎస్సై సురేశ్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. హత్యకు రూ. లక్ష అడ్వాన్స్.. తన భర్త సుమంత్‌రెడ్డిని పక్కాగా హతమార్చేందుకు 15 రోజుల క్రితం ఫ్లోరా తన ప్రియుడు శామ్యూల్‌కి రూ.లక్ష అడ్వాన్స్ అందజేసింది. శామ్యూల్ రూ.50వేలు తన దగ్గర ఉంచుకుని, రూ.50వేలు ఏఆర్ కానిస్టేబుల్ రాజ్‌కుమార్‌కు ఇచ్చాడు. అడ్వాన్స్ ముట్టడంతో ఏఆర్ కానిస్టేబుల్ విధులకు మూడు రోజులు సెలవు పెట్టాడు. ఈనెల 20వ తేదీన సంగారెడ్డిలో సుత్తి కొనుగోలు చేసి రాజ్‌కుమార్‌కు చెందిన బైక్‌పై ఇద్దరు నేరుగా కాజీపేట చేరుకున్నారు. సీసీ కెమెరాలు, జన సంచారం లేని చీకటి ప్రదేశాన్ని హత్యకు స్పాట్‌గా ఎంచుకున్నారు. రాత్రి 10.30కి సుమంత్‌రెడ్డి క్లినిక్ బంద్ చేసి తన కారులో కడిపికొండ బ్రిడ్జి మీదుగా భట్టుపల్లి నుంచి వరంగల్‌లోని ఇంటికి బయలుదేరాడు. ఈక్రమంలో సుమంత్‌రెడ్డి ప్రయాణించే కారు వెంబడిస్తూ శ్యామ్యూల్, రాజ్‌కుమార్ బైక్‌పై బయలుదేరారు. భట్టుపల్లి దాటిన తర్వాత ఎస్ఆర్ స్కూల్ సమీపాన చిన్న బ్రిడ్జి వద్దకు రాగానే శామ్యూల్ సుత్తితో కారుఇండికేటర్పై కొట్టాడు. దీంతో భారీ శబ్ద రావడంతో సుమంత్‌రెడ్డి కారు రో డ్డు పక్కన నిలిపి వెనక వైపు వెళ్లి పరిశీలిస్తుండగా.. శామ్యూల్, రాజ్‌కుమార్ కలిసి సుమంత్‌రెడ్డి తల, మెడపై విచక్షణారహితంగా సుత్తితో కొట్టారు. దీంతో తీవ్రరక్తస్రావంతో సుమంత్‌రెడ్డి పడిపోగా చని పోయాడనుకొని భావించిన నిందితులిద్దరు ఘట నా స్థలి నుంచి బైక్‌పై సంగారెడ్డికి పరారయ్యారు. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు.. సుమంత్ రెడ్డి హత్యాయత్నంపై తండ్రి ఆరోగ్య సుధాకర్ రెడ్డి వరంగల్ మిల్స్‌కాలనీ పీఎస్‌లో ఫి ర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి ద ర్యాప్తు ప్రారంభించారు. ఇన్స్పెక్టర్ వెంకటరత్నం, టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ రంజిత్‌కుమార్, మిల్స్‌కాలనీ ఎస్సై సురేశ్, కానిస్టేబుల్ బావుసింగ్, చంద్రశేఖర్, వెంకన్న, రాజు, జలేందర్, ఎండీ గౌస్, ఎఎఓ సల్మాన్ ఐటీకోర్ కానిస్టేబుల్ నగేశ్ నాలుగు బృందాలుగా ఏర్పడి సీసీ ఫుటేజీతోపాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గురువారం నిందితులను సంగారెడ్డిలోని ఆదర్శకాలనీ కొండాపూర్‌లో ఏర్రోళ్ల శామ్యూల్, గాదె ఫ్లోరా, ఏఆర్ కానిస్టేబుల్ మంచుకూరి రాజ్‌కుమార్ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ నందిరామ్ నాయక్ తెలిపారు.ఏఆర్ కానిస్టేబుల్‌తో ఒప్పందం.. వరంగల్ చేరిన అనంతరం కూడా ఫ్లోరా.. శామ్యూల్‌తో ఫోన్లో మాట్లాడేది. భర్త లేని సమయంలో శామ్యూల్‌ను ఇంటికి పిలిపించుకునేది. ఈ విషయం తెలుసుకున్న సుమంత్‌రెడ్డి భార్యను మందలించేవారు. దీనికి తనకు విడాకులు ఇవ్వాలని ఫ్లోరా డిమాండ్ చేసింది. ఇందుకు సుమంత్ రెడ్డి నిరాకరించడంతో ఈ విషయంపై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో ఫ్లోరా, ప్రియుడి శామ్యూల్.. సుమంత్‌రెడ్డిని ఎలాగైనా కడతేర్చాలని నిర్ణయించుకున్నారు. శామ్యూల్ ఈ విషయాన్ని తన స్నేహితుడు ఏఆర్ కానిస్టేబుల్ రాజ్‌కుమార్‌కు వివరించాడు. సుమంత్‌రెడ్డి హత్యకు సహకరిస్తే సంగారెడ్డిలో భవనం నిర్మించి ఇస్తానని ఫ్లోరా చెప్పగా..రాజ్‌కుమార్ ఒప్పుకున్నాడు. భర్తపై హత్యాయత్నం వీడిన డాక్టర్ సుమంత్‌రెడ్డిపై హత్యాయత్నం కేసు మిస్టరీ.. నిందితులు భార్య ఫ్లోరా, ప్రియుడు శామ్యూల్, సహకరించిన ఏఆర్‌కానిస్టేబుల్ రాజ్‌కుమార్ అరెస్ట్ వివరాలు వెల్లడించిన వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ వివాహేతర సంబంధమే కారణం.. వరంగల్‌కు చెందిన గాదె ఆరోగ్య సుధాకర్‌రెడ్డి కుమారుడు డాక్టర్ సుమంత్‌రెడ్డి, వరంగల్‌లోని షిర్డీ సాయినగర్‌కు చెందిన ఫ్లోరా 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. తమ బంధువులకు చెందిన విద్యా సంస్థలను చూసుకునేందుకు భార్య ఫ్లోరాతో కలిసి సుమంత్‌రెడ్డి 2018లో వరంగల్ నుంచి సంగారెడ్డికి వెళ్లారు. అక్కడ సుమంత్‌రెడ్డి స్థానిక పీహెచ్సీలో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తుండగా, తన భార్య ఫ్లోరా బంధువుల విద్యా సంస్థల్లో పర్యవేక్షణతోపాటు ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. బరువు తగ్గడానికి సంగారెడ్డిలోని సిద్ధు జిమ్సెంటర్కి వెళ్తుండేది. ఈ క్రమంలో సంగారెడ్డిలోని ఆదర్శకాలనీ కొండాపూర్‌కు చెందిన జిమ్ సెంటర్ కోచ్ ఏర్రోళ్ల శామ్యూల్ పరిచమయ్యాడు. ఆ పరిచయం ఇద్దరి మధ్య ప్రేమ వివాహేతర సంబంధానికి దారితీసింది.ఈ విషయం సుమంత్‌రెడ్డికి తెలియడంతో గొడవ జరిగింది. సంగారెడ్డి నుంచి షిఫ్ట్ అయితే గొడవలు తగ్గుతాయని భావించిన సుమంత్‌రెడ్డి వరంగల్‌కు చేరారు. 2019లో ఫ్లోరా జనగామ జిల్లా పెంబర్తి సోషల్ వెల్ఫేర్ కళాశాలలో అధ్యాపకురాలిగా విధులు నిర్వహిస్తుండేది. ఆ కాలేజీ గతేడాది వరంగల్ రంగశాయిపేటకు మారడంతో విధులు ఇక్కడే నిర్వహిస్తుండగా.. సుమంత్‌రెడ్డి వరంగల్ హంటర్ రోడ్డు గ్రీన్వుడ్స్కూల్ సమీపాన వాసవికాలనీలో భార్యతో కలిసి నివాసం ఉంటున్నారు. సుమంత్‌రెడ్డి ప్రస్తుతం కాజీపేటలో ప్రైవేట్ ఆస్పత్రి నడుపుకుంటున్నాడు. -
ఏటీబీ(ఎనీటైం బ్యాగ్)
ప్లాస్టిక్ వాడకం విరివిగా పెరిగి భూమి కలుషితం కావడంతో పాటు ప్లాస్టిక్ సంచులలో తీసుకునే ఆహార పధార్థాలతో రకరకాల వ్యాధులు ప్రబలుతున్నాయి. ఈ తరుణంలో గుడ్డ సంచులను ఏటీబీ మిషన్ద్వారా తీసుకునే పరికరం రూపొందించాడు 10వ తరగతి విద్యార్థి రిషిక్. రూ.5 నాణెం మిషన్‌లో వేస్తే గుడ్డ సంచి వచ్చేలా తయారు చేశాడు. మిషన్‌లో 500 బ్యాగులు ఉంచేలా నిర్మించాడు. దీంతో పాటు మిషన్ లోపల ప్లాస్టిక్‌తో నష్టాలు, గుడ్డ సంచుల వల్ల లాభాలు, పర్యావరణ హితం కోరే విధంగా వివరించేలా స్పీకర్లు ఏర్పాటు చేశాడు. దీనిని బస్టాండ్ సెంటర్లు, కూరగాయాల మార్కెట్లు, రద్దీ ప్రదేశాలలో ఏర్పాటు చేస్తే ఫలితం ఉంటుందని వివరించాడు. ఒక్కో మిషన్‌కు రూ. 25 వేల ఖర్చు అవుతుంది. పరికరం తయారీకి కేంద్ర మంత్రిత్వశాఖ నిధులు మంజూరు చేయడానికి అంగీకరించింది. -
చెట్టును ఢీకొన్న కారు.. ఒకరి దుర్మరణం
మంగపేట: కారు అదుపు తప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో మంగపేట మండల కేంద్రానికి చెందిన కిరాణా వ్యాపారి బొల్లా ప్రసాద్(44) అక్కడికక్కడే దుర్మరణం చెందగా, కారులో ఉన్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం గురువారం తెల్ల వారుజామున తాడ్వాయి మండల పరిధిలో జరిగింది. తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి కథనం ప్రకారం.. ప్రసాద్ తన మిత్రులతో కలిసి జిల్లాలోని వెంకటాపురం(ఎం) మండలం పాలంపేటలోని రామప్ప ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలకు బుధవారం రాత్రి కారులో వెళ్లారు. దైవదర్శనం అనంతరం ఇంటికి వస్తున్న క్రమంలో తాడ్వాయి మండల పరిధిలోని జలగలంచ తోగు గుంపుల మధ్య అడవి జంతువు అడ్డుగా రావడంతో దానిని తప్పించే క్రమంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో కారు నడుపుతున్న ప్రసాద్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. కారులో అతడి తోపాటు ఉన్న మంగపేటకు చెందిన బట్టలషాపు యజమాని శిద్ధశెట్టి శ్రీనివాస్, టీజీ ఎన్పీడీసీఎల్ మంగపేట ఏఈ రామసుబ్బరాయశర్మ, గుర్రం వెంకటేశ్ తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి ఘటనా స్థలికి చేరుకుని ప్రసాద్ మృతదేహంతోపాటు క్షతగాత్రులను 108లో ఏటూరునాగారం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. మృతుడి తమ్ముడు బొల్లా సురేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
సైన్స్ టాలెంట్ టెస్టులో విష్ణువర్ధన్‌కు ద్వితీయ స్థానం
మహబూబాబాద్ అర్బన్ : సైన్స్ టాలెంట్ టెస్టులో మహబూబాబాద్ మండలం మాధావపురం జెడ్పీహెచ్ఎస్ పదో తరగతి విద్యార్థి నక్క విష్ణువర్ధన్ రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానం సాధించారు. ‘నిత్య జీవితంలో సైన్స్ ఉపయోగాలు’ అనే అంశంపై ఈ 18వ తేదీన హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయిలో సైన్స్ టాలెంట్ టెస్టు నిర్వహించారు. ఇందులో ధ్వని అనే పాఠంతో నాటి రేడియో నుంచి.. నేటి సెల్‌ఫోన్ వరకు పని చేస్తున్నాని, విద్యుత్ పాఠంతో చీకటిగా ఉన్న భూగోళాన్ని వెలుతురుగా మార్చి ప్రతి ఇంటిలో వెలుగులు నిండాయని, న్యూటన్ గమన నియమాల ద్వారా రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపగలుగుతామని, బేర్నౌలి సూత్రం ద్వారా రైట్ సోదరులు విమానాన్ని కనుగొన్నారని, ఆక్సిజన్ కనుగొనడం ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను బతికించగలుగుతామనే, తదితర అంశాలను క్షుణ్ణంగా వివరించారు. దీంతో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచాడు. ఈ నెల 25వ తేదీన హైదరాబాద్‌లో ఎస్సీఈఆర్ డైరెక్టర్ రమేశ్ చేతుల మీదుగా విష్ణువర్ధన్ బహుమతి అందుకున్నాడు. కాగా, భౌతికశాస్త్రం ప్రణాళిక ప్రకారం చదివితే సులువుగా నేర్చుకొవచ్చని ఉపాధ్యాయులు తెలిపారని విష్ణువర్ధన్ చెప్పాడు. పాఠాలు విన్న తర్వాత ఇంటికెళ్లి చదువుతానన్నాడు. దీంతో భౌతికశాస్త్రం సులువుగా అర్థమవుతోందన్నాడు. -
ప్రయోగాల పాఠశాల..
నూతన ఆవిష్కరణలతో ముందుకెళ్తున్న నాచినపల్లి ప్రభుత్వ పాఠశాల దుగ్గొండి: సైన్స్.. పుస్తకంలోని పాఠం కాదు. సమాజంలోని మూఢ నమ్మకాలను దూరం చేసే శాస్త్రం. విద్యార్థుల్లోని ఆలోచన శక్తిని పెంచడంతోపాటు నూతన ఆవిష్కరణల వైపు వారి దృష్టిని మరల్చడం.. ప్రశ్నించే తత్వం అలవర్చడ సైన్స్ లక్ష్యం. సరిగా ఇదే లక్ష్యంతో వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని నాచినపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ముందుకెళ్తోతుంది. నూతన ఆవిష్కరణలకు వేదికగా నిలుస్తూ కార్పొరేట్‌కు దీటుగా విద్యార్థులను తీర్చిదిద్దుతోంది. పాఠశాల సైన్స్ ఉపాధ్యాయులు సుధీర్‌కుమార్, వెలిదండి సుమలత ప్రోత్సాహంతో విద్యార్థులు రూపొందించిన ఆవిష్కరణలు రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నాయి. ఇంటింటా ఇన్నోవేటర్ పోటీల్లో ఈజీ ప్యాడీ ఫిల్లింగ్ మిషన్ జిల్లా ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుని విలేజ్ ఇన్నోవేటర్ అవార్డును సొంతం చేసుకుంది. ఇదే పాఠశాల నుంచి ఏటీబీ.. ఏనీటైం బ్యాగ్ మిషన్ కేంద్ర మంత్రిత్వశాఖ నిర్వహించే స్టూడెంట్ ఇన్నోవేషన్ మారథాన్‌లో జాతీయస్థాయి గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలో నేడు జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఆ పాఠశాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనంనేడు సైన్స్ దినోత్సవం విద్యార్థుల ఎగ్జిబిట్లతో కార్పొరేట్‌కు దీటుగా దేశవ్యాప్త గుర్తింపు పొందుతున్న స్కూల్ సైన్స్ ఉపాధ్యాయులు సుధీర్‌కుమార్, సుమలత ప్రోత్సాహంతో విద్యార్థుల ఆవిష్కరణలు -
ఈజీ ప్యాడీ ఫిల్లింగ్ మిషన్..
వ్యవసాయంలో రోజురోజుకూ కూలీల ఖర్చు పెరగడంతో పాటు కొరత ఏర్పడుతోంది. దీంతో సమస్యను అధిగమించడానికి పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థి దినేశ్ తన పరిజ్ఞానంతో ఈజీ ప్యాడీ ఫిల్లింగ్ మిషన్‌ను తయారు చేశాడు. మొదట ఓ స్టాండ్ తయారు చేసి స్టాండ్‌కు గిన్నెలు అమర్చిన బెల్టును విద్యుత్ మోటారుకు అనుసంధానించాడు. మోటారు ఆన్‌చేయగానే బెల్టు తిరగడంతో ధాన్యం బస్తాలలో నిండుతుంది. ఒక వ్యక్తి మాత్రమే అవసరమవువుతారు.. ఈజీప్యాడీ ఫిల్లింగ్ మిషన్‌ను చూపుతున్న విద్యార్థి దినేశ్ -
కుమారుడి కళ్లెదుటే కనిపించని లోకాలకు..
బైక్‌ను ఢీకొన్న లారీ.. తల్లిదండ్రులు దుర్మరణం● గుండెలవిసేలా రోదించిన కుటుంబీకులు.. ● మల్లంపల్లిలో ఘటనములుగు : కుమారుడి కళ్లెదుటే తల్లిదండ్రులు దుర్మరణం చెందారు. బైక్‌పై తల్లిదండ్రులు ముందు వెళ్తున్నారు. కుమారుడు వారికి కొద్ది దూరంలో వెనుక నుంచి మరో బైక్‌పై వస్తున్నాడు. ఈ క్రమంలో ఓ లారీ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో తల్లిదండ్రులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ దృశ్యాన్ని చూసిన కుమారుడు గుండెలవిసేలా రోదించాడు. ఇక తనకు దిక్కెవరంటూ తల్లిదండ్రుల మృతదేహాలపై పడి బోరున విలపించాడు. ఈ ఘటన గురువారం ములుగు జిల్లా మల్లంపల్లిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేట గ్రామానికి చెందిన దంపతులు షేక్ మహమూద్(58), షేక్ సైనా(45)తమ కుమారుడు షబ్బీర్‌తో కలిసి రెండు బైక్‌లపై పని నిమిత్తం ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ వెళ్లారు. అక్కడి నుంచి శివరాత్రి సందర్భంగా రామప్ప వెళ్లారు. అనంతరం స్వగ్రామం బుధరావుపేటకు వస్తున్నారు. మల్లంపల్లి నుంచి వెళ్తున్న క్రమంలో మల్లంపల్లి– నర్సంపేట జాతీయ రహదారిపై నర్సంపేట వైపు నుంచి వస్తున్న లారీ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో షేక్ మహమూద్, షేక్ సైనా అక్కడికక్కడే దుర్మరణం చెందారు. దీనిపై సమాచారం అందుకున్న ఎస్సై ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి బావమరిది గఫూర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వరావు తెలిపా రు. కాగా, తన కల్లెదుటే తల్లిదండ్రులు దుర్మరణం చెందడంతో కుమారుడు షబ్బీర్ కన్నీరుమున్నీరుగా రోదించాడు.గంటలో ఇంటికి చేరేవారు.. ఖానాపురం: రెక్కాడితే కానీ డొక్క నిండని కుటుంబం. ఇతర ప్రాంతాలకు వెళ్లి వ్యాపారం చేసుకునే ఆ కుటుంబంలో పెనువిషాదం చోటుచేసుకుంది. మరో గంటలో ఇంటికి చేరుకోవాల్సిన తరుణంలో మృత్యువు కబలించింది. వ్యాపారం పూర్తయిన అనంతరం ఇంటిబాట పట్టిన దంపతులు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో కుటుంబం బోరున విలపించింది.. ఖానాపురం మండలం బుధరావుపేటకు చెందిన షేక్ మహమూద్, షేక్ సైనా దంపతులు రెడీమేడ్ దుస్తుల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. జీవనోపాధి నిమిత్తం నెల రోజుల క్రితం ఆసిఫాబాద్‌కు వెళ్లారు. అక్కడి నుంచి శివరాత్రి సందర్భంగా రామప్ప వెళ్లారు. వ్యాపారం ముగిసిన అనంతరం బైక్‌పై మల్లంపల్లికి వచ్చి కూరగాయలు కొనుగోలు చేసి ఇంటికి వస్తున్నారు. ఈ క్రమంలో ములుగు జిల్లా మల్లంపల్లి మండల శివారులోని నర్సంపేట జాతీయ రహదారిపై లారీ.. బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో మహమూద్ లారీ చక్రాల కింద నలిగిపోగా రోడ్డు పక్కన సైనా విగత జీవిలా పడింది. ఈ దంపతులకు నలుగురు సంతానం. కుమారుడు, కుమార్తెకు వివాహం కాగా మరో కుమార్తె, కుమారుడికి కావాల్సి ఉంది. తల్లిదండ్రులు మృతి చెందడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో రోదిస్తున్న తీరు పలువురిచేత కన్నీరు పెట్టించింది. -
కల్పనాచావ్లా సైన్స్ క్లబ్..
పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయురాలు సుమలత విద్యార్థులతో కల్పనాచావ్లా పేరిట సైన్స్ క్లబ్‌ను ప్రారంభింపజేసి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల నుంచి నూతన ఆలోచనలు స్వీకరిస్తూ వాటి ద్వారా నూతన ఆవిష్కరణలకు రూపం ఇస్తున్నారు. గ్రామంలో ప్లాస్టిక్ నివారణ, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. మూఢనమ్మకాలు, కరోనా కల్లోలం వంటి సైన్స్ నాటికలు ప్రదర్శించి జాతీయస్థాయిలో బహుమతులు అందుకున్నారు. ఇదే విధంగా ఆకాశవాణి వరంగల్ కేంద్రంలో విద్యార్థులు ప్రతీ నెలా కార్యక్రమాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. పాఠశాల స్థాయి నుంచి శాసీ్త్రయ దృక్పథం కలిగిన విద్యార్థులను తయారు చేయడంలో పాఠశాల ముందు వరుసలో నిలుస్తోది. -
నైపుణ్యాలతో విద్యావకాశాలు
● కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి కేయూ క్యాంపస్ : నైపుణ్యాలతోనే విద్యార్థులకు విద్యావకాశాలు లభిస్తాయని కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రతాప్‌రెడ్డి అన్నారు. గురువారం కేయూ సెనేట్ హాల్లో ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ ఎన్.ప్రసాద్ అధ్యక్షతన ‘ఎక్స్‌ప్లోరింగ్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ ఇన్ ది యూఎస్ ’ అనే అంశంపై నిర్వహించిన సమావేశంలో వీసీ ప్రతాప్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు అంకితభావం, పట్టుదల, మార్పుకు సిద్ధంగా ఉండడం లాంటి అంశాలతో లక్ష్యం సాధించొచ్చన్నారు. వర్సిటీలో అకడమిక్‌తో పాటు పూర్తి స్థాయి నైపుణ్యాల పెంపు దిశగా పనిచేస్తున్నామని వివరించారు. అనంతరం హైదరాబాద్‌లోని యూఎస్ కన్సలేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ మాట్లాడుతూ అమెరికాలో విద్యార్థులకు అద్భుత విద్యావకాశాలు ఉన్నాయన్నారు. టీచింగ్‌లో నూతన టెక్నాలజీ వినియోగం పెరిగిందన్నారు. అమెరికాలో ఉన్నత విద్యతో విద్యార్థి జీవితం మారుతుందన్నారు. టెక్నాలజీ సాయంతో స్కిల్, టాలెంట్ పెంచుకోవాలన్నారు. సమావేశంలో రిజిస్ట్రార్ వి.రామచంద్రం, ఓఎస్డీ పి.మల్లారెడ్డి, పాలక మండలి సభ్యులు రాము, చిర్ర రాజు, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఎన్.రమణ, భిక్షాలు, బయో టెక్నాలజీ విభాగాధిపతి శాసీ్త్ర, తదిరులు పాల్గొన్నారు. ‘అకుట్’ జనరల్ సెక్రటరీ పదవికి ఇద్దరు పోటీ ● ముగిసిన నామినేషన్ల ఉపసంహరణకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ అధ్యాపకుల సంఘం (అకుట్) ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం సాయంత్రం ముగిసింది. అధ్యక్ష పదవికి ఫిజిక్స్ విభాగం ప్రొఫెసర్ బి.వెంకట్రామ్రెడ్డి, జీయాలజీ విభాగం ప్రొఫెసర్ ఆర్.మల్లికార్జున్‌రెడ్డి పోటీ పడుతున్నారు. జనరల్సెక్రటరీ పదవికి బయోటెక్నాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ పి.శ్రీనివాస్, మ్యాథమెటిక్స్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎల్పీ.రాజ్‌కుమార్ బరిలో నిలిచారు. పరిపాలనాభవనంలోని సెనేట్హాల్లో మార్చి 4న ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు. 5న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు. కేయూ పరిధిలో 77 మంది అధ్యాపకులు ఓటర్లుగా ఉన్నారు. -
ఆ అధికారులపై చర్యలు ఉండేనా?
● స్టేషన్లలో పంచాయితీలకే ప్రాధాన్యం ● డీజీపీకి ఫిర్యాదుల వెల్లువ ● వివాదంగా మారుతున్న కమిషనరేట్ పరిధి కొందరు అధికారులు తీరు వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న కొంతమంది పోలీస్ అధికారులపై వస్తున్న ఆరోపణలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అక్రమార్జనే ధ్యేయంగా చేస్తున్న పనులు వివాదాస్పదమవుతున్నాయి. బాధితులకు అండగా ఉండాల్సిన వీరు అక్రమార్కులకు దన్నుగా నిలుస్తున్న సందర్భాలు వెలుగు చూస్తున్నాయి. భూ పంచాయితీల్లో జోక్యంపై ఉన్నతాధికారులు హెచ్చరించినా కొందరిలో మార్పు రావడం లేదు. దీంతో ఏకంగా బాధితులు నేరుగా రాష్ట్ర డీజీపీ జితేందర్‌ను కలిసి గోడు వెల్లబోసుకుంటున్నారు. తాజాగా మామునూరు స్టేషన్ ఇన్స్పెక్టర్ ఒంటేరు రమేశ్‌పై డీజీపీకి ఫిర్యాదు అందింది. కొన్ని రోజుల క్రితం ఆత్మకూరు ఇన్స్పెక్టర్ సంతోశ్ తనను పోలీస్‌స్టేషన్‌కు రావొద్దని ఇష్టారీతిన దూషించినట్లు పేర్కొంటూ ఓ బాధితుడు డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఓ సీనియర్ ఇన్స్పెక్టర్ భూ కబ్జాకు పాల్పడి, తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ మరో బాధితుడు సీఎం నిర్వహించే ప్రజావాణికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా నిఘా విభాగం అధికారులతో విచారణ చేయిస్తున్నారు. కొందరు అధికారులకు స్వర్ణయుగం వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాకు మిస్టర్ కూల్‌గా పేరుంది. దీన్ని ఆసరాగా.. అవకాశంగా తీసుకుంటున్న కొంతమంది పోలీస్ అధికారులు భూ పంచాయితీలు చేస్తూ జేబులు నింపుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరి అక్రమాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినా సకాలంలో చర్యలు ఉండకపోవడం, వారిని కట్టడి చేయకపోవడం వల్ల చివరికి ఫిర్యాదులు డీజీపీ వరకు వెళ్తున్నట్లు ప్రచారం సాగుతోంది. పోస్టింగ్‌ను అడ్డుపెట్టుకొని అడ్డుగోలుగా సంపాదిస్తున్న అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కమిషనరేట్‌లో కొంతమందికి ప్రస్తుతం సర్ణయుగం నడుస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సరిహద్దు వివాదం.. కమిషనరేట్‌కు మచ్చ? ఈనెల 20న రాత్రి అమ్మవారిపేట, భట్టుపల్లి మధ్య యువవైద్యుడిపై జరిగిన హత్యాయత్నం ఘటనలో మిల్స్‌కాలనీ, మడికొండ పోలీస్ స్టేషన్ల అధికారులు, కాజీపేట, వరంగల్ ఏసీపీలు సరిహద్దు విషయంలో పడిన గొడవ వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు మాయని మచ్చగా మారినట్లు ప్రచారం సాగుతోంది. బాధితుడు రక్తపుమడుగులో ఉండగానే ఈ పరిధి తమది కాదంటే తమది కాదని అధికారులు వాగ్వాదానికి దిగడంతోపాటు ఎవరూ సరైన సయయంలో స్పందించలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చివరికి ఓ బెల్ట్‌షాప్ యజమానిని నువ్వు ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం కోనుగోలు చేస్తావని పోలీసులు తెలుసుకొని సరిహద్దు సమస్యను పరిష్కరించుకోవడం ఆ అధికారుల పనితీరుకు అ ద్దం పడుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చర్యలు ఎందుకు ఉండట్లేదు? వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న కొంతమంది అధికారులు నిబంధనల గీతను దాటుతున్నా ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆరోపణలు రావడం సహజమైనప్పటికీ విచారణలో నిజం తెలిసినా వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ అధికారులు కాస్త ముదురు... పరకాల సబ్ డివిజన్ పరిధిలో భూ పంచాయితీలకు వేదికై న ఓ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ వాటికే ప్రాధాన్యం ఇచ్చినా.. బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని సమాచారం. అదే సబ్ డివిజన్ పరిధిలో ఓ ఇన్స్పెక్టర్ తన మద్యం మామూళ్లను పెంచుకుని దుకాణాల యజమానులకు ఫోన్లు చేసి హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. సదరు అధికారి తీరుపై ఇప్పటికే ఫిర్యాదులు అందాయి. దీంతోపాటు ఇటీవల విధుల్లో చేరిన కొత్త కానిస్టేబుళ్లను నోటికి వచ్చినట్లు తిడుతున్నట్లు సమాచారం. మామునూరు సబ్ డివిజన్ పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న ఓ అధికారి మామూళ్లను పెంచడం, ఇన్స్పెక్టర్కు పంచడం, పంచాయితీల్లో దండుకొని వాటాలు పంచడంలో ఘనాపాటిగా పేరుంది. ఇన్స్పెక్టర్ సైతం భూపంచాయితీల్లో మునిగిపోగా, సదరు సబ్ ఇన్స్పెక్టర్ అందినకాడికి దండుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వరంగల్ సబ్ డివిజన్ పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్‌కు భూ పంచాయితీల్లో పెట్టింది పేరు. నిత్యం వందలాది ఫిర్యాదులు. ఏ ఫిర్యాదును ముట్టుకున్నా భూ వివాదమే. దీంతో ఓ అడుగు ముందుకేసి సదరు ఇన్స్పెక్టర్ వాటి పంచాయితీలకు మొదటి ప్రాధాన్యం.. ఆ తర్వాతే లా అండ్ ఆర్డర్ అన్నట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. హనుమకొండ సబ్ డివిజన్ పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్లో సదరు ఇన్స్పెక్టర్ నిబంధనలు ఎలా ఉన్నా భూ పంచాయితీల్లో తనకు నచ్చని వర్గంపై కేసు నమోదు చేయడం, మరో వర్గాన్ని భయబ్రాంతులకు గురిచేయడం అలవాటుగా మార్చుకున్నట్లు సమాచారం. ప్రభుత్వానికి నివేదికలు కొంతమంది పోలీస్ అధికారులపై స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలు ఉన్నప్పటికి వారు చేస్తున్న దందాలపై నిఘా వర్గాల ద్వారా ప్రభుత్వానికి నివేదికలు అందుతున్నట్లు సమాచారం. అక్రమాలకు పాల్పడే అధికారులపై చర్యలు తీసుకోకపోవడంపై కొంతమంది ఆ శాఖ అధికారులే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. కొంతమంది ఎమ్మెల్యేలు సైతం ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. రాష్ట్ర ఉన్నతాధికారుల సూచనల మేరకు భూ పంచాయితీల్లో తలదూరుస్తున్న అధికారులపై చర్యలు తీసుకుంటారా..లేదా అన్నది వేచి చూడాల్సిందే. -
సంస్కృతీ సంప్రదాయాలు తెలుసుకోవాలి
● అంతర్రాష్ట్ర యువజన సమ్మేళనంలో కలెక్టర్ ప్రావీణ్య హన్మకొండ: రాష్ట్ర సంస్కృతీ సంప్రదాయాలతో పాటు రాష్ట్రాభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో తెలుసుకోవాలని హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. గురువారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో తెలంగాణ–కేరళ అంతర్రాష్ట్ర యువజన సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ పి.ప్రావీణ్య జ్యోతి వెలిగించి సమ్మేళనం ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాల వారు ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాలను తెలుసుకునేందుకు ఇదొక మంచి అవకాశమన్నారు. కేరళ యువత.. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను, ఇక్కడి యువత కేరళ సంస్కృతీ సంప్రదాయాలను తెలుసుకోవాలని సూచించారు. తాను కూడా కేరళ రాష్ట్రాన్ని పలుమార్లు సందర్శించానని కలెక్టర్ గుర్తు చేశారు. జిల్లా పర్యటనకు వచ్చిన కేరళ యువతకు డ్రెస్, టోపీలతో కూడిన కిట్లను ఆమె అందించారు. కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేశ్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మేన శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
పార్కుల్లో దోమల నివారణకు ఫాగింగ్ చేపట్టండి
బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే వరంగల్ అర్బన్: పార్కుల్లో దోమల నివారణకు ఫాగింగ్ చేపట్టాలని బల్ది యా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అధికారుల్ని ఆదేశించారు. గురువారం వరంగల్ నగర పరిధి టెలికాం కాలనీ, ఎల్బీనగర్ పార్క్, క్రిస్టియన్ కాలనీలో బల్దియా నిర్వహిస్తున్న నర్సరీని కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సమర్థవంతంగా నిర్వహించేందుకు పలు సూచనలిచ్చారు. పార్కులో వర్షాకాలం నీరు నిలుస్తోందని ఎల్బీనగర్ స్థానికులు కమిషనర్ దృష్టికి తీసుకురాగా.. సమస్యను పరిష్కరించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. 20వ డివిజన్లో తిలక్‌రోడ్డు విస్తరణ పనుల్ని ఆమె పరిశీలించారు. ఈతనిఖీల్లో అధికారులు లక్ష్మారెడ్డి, ఈఈ శ్రీనివాస్, హార్టికల్చర్ అసిస్టెంట్లు ప్రిన్సీ, అనూహ పాల్గొన్నారు. పన్ను వసూళ్లలో పురోగతి అవసరం.. ఆస్తి, నీటి పన్నుల వసూళ్లలో పురోగతి అవసరమని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. బల్దియా పరిధి 21వ డివిజన్ ఎల్బీనగర్లో కొనసాగుతున్న పన్ను వసూళ్ల తీరును క్షేత్రస్థాయిలో కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆమె వెంట డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి, రెవెన్యూ అధికారి షహజాదీ బేగం, ఆర్ఐ సోహైల్ తదితరులు పాల్గొన్నారు. -
యువతలోని ప్రతిభ వెలికితీసేందుకు
యువతలోని ప్రతిభ, సృజనాత్మకతను వెలికితీసేందుకు వేదికగా స్ప్రింగ్ స్ప్రీ–25 నిలువనుంది. సంగీతం, నృత్యం, కళలు, వినోదం పలు రంగాల్లోని ప్రతిభను వెలికితీసేందుకు కల్చరల్ ఫెస్ట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. విద్యార్థుల్లో నూతనోత్తేజాన్ని నింపేందుకు సినీనటుడు బ్రహ్మానందం ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నారు. – డి.శ్రీనివాసాచార్య, నిట్ డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ కలర్ఫుల్గా కల్చరల్ ఫెస్ట్నాటి ఆర్ఈసీ 1978లో ప్రారంభమైన స్ప్రింగ్‌స్ప్రీ నేడు దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద కల్చరల్ఫెస్ట్గా పేరుగాంచింది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల సంస్కృతీసంప్రదాయాలను పంచుకునే వేదికగా ఏర్పాటు చేసిందే ఈ వేడుక. నిట్‌లో 41 వసంతోత్సవ వేడుకలను స్ప్రింగ్‌స్ప్రీ–25గా జరుపుకుంటున్నాం. మూడు రోజుల పాటు కల్చరల్ఫెస్ట్ను కలర్ఫుల్గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాం. – బిద్యాధర్ సుబుదీ, నిట్ డైరెక్టర్ ● -
గ్రేటర్ వరంగల్
(హనుమకొండ – వరంగల్)శుక్రవారం శ్రీ 28 శ్రీ ఫిబ్రవరి శ్రీ 20257కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌లో ప్రతీ ఏడాది మాదిరిగా విద్యార్థులే నిర్వాహకులుగా మూడు రోజులపాటు వసంతోత్సవం (స్ప్రింగ్ స్ప్రీ–25) నిర్వహించనున్నారు. ఈనెల 28 నేటి(శుక్రవారం) నుంచి మార్చి 1, 2 తే దీల్లో నిర్వహించే కల్చరల్ ఫెస్ట్‌కు అన్ని ఏర్పాట్లు చేశారు. నిట్‌లో ప్రపంచంలోని పలు ప్రాంతాల విద్యార్థులు చదువుతున్నారు. భిన్నత్వంలో ఏకత్వంలా నిలుస్తున్న ఈక్యాంపస్లో వివిధ దేశాల సంప్రదాయాలను పరస్పరం పంచుకునేందుకు 1978లో వసంతోత్సవం ప్రారంభమై.. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద కల్చరల్ ఫెస్ట్గా పేరుగాంచింది. దేశవ్యాప్త ఇంజనీరింగ్ కళాశాలల నుంచి విద్యార్థులు ఈ వేడుకకు హాజరుకానున్నారు. తొలిరోజు: శుక్రవారం సాయంత్రం అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో హాస్యనటుడు, గిన్నిస్ వరల్డ్ రికార్డు గ్రహీత, పద్మశ్రీ బ్రహ్మానందం విద్యార్థులతో చిట్‌చాట్. రెండో రోజు: శనివారం ప్రోషోలో భాగంగా ఇండియన్ రాక్‌బ్యాండ్ వార్డెక్స్ ఫ్యూజన్ మ్యూజిక్‌తో అలరించనున్నారు. డైరెక్టర్ కట్స్‌లో సినీ డైరెక్టర్లతో చిట్‌చాట్. అల్యూర్లో భాగంగా ఫ్యాషన్ షో, నుక్కడ్ నాటక ప్రదర్శన మూడో రోజు: ముగింపులో భాగంగా ఆదివారం పాపులర్ సింగర్ అమిత్ త్రివేది హిందీ, ఇంగ్లిష్ సంగీత విభావరి. నిపుణులతో బైక్‌స్టంట్స్. ఈసారి థీం లేదు: స్ప్రింగ్ స్ప్రీ వేడుకలను ప్రతీ ఏడాది ప్రత్యేక థీంతో నిర్వహించేవారు. 2022లో సృష్టిగా, 2023లో కళాధ్వనిగా, 2024లో రాసంగేన్ థీం (ఇతి వృత్తం) తో నిర్వహించారు. ఈసారి అదేపేరుతో స్ప్రింగ్ స్ప్రీ–25ను నిర్వహించాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. నేటి నుంచి నిట్‌లో ‘స్ప్రింగ్ స్ప్రీ–25’ మార్చి 2 వరకు నిర్వహణ దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద కల్చరల్ ఫెస్ట్ హాజరుకానున్న పలు ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు ప్రారంభించనున్న హాస్యనటుడు బ్రహ్మానందం -
ఘనంగా రుద్రేశ్వరుడి నాగవెల్లి
హన్మకొండ కల్చరల్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వేయిస్తంభాల ఆలయంలో రుద్రేశ్వరస్వామి రుద్రేశ్వరీ అమ్మవారికి బుధవారం రాత్రి కల్యాణం నిర్వహించారు. మూడో రోజు గురువారం నాగవెల్లి నిర్వహించారు. ఉదయం 7 గంటలకు ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేద పండితులు మణికంఠశర్మ, అర్చకుడు సందీప్, ప్రణవ్ శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను నూతనవస్త్రాలతో అలంకరించి పూజలు చేశారు. వందలాది మంది భక్తులు పాల్గొని స్వామివారిని, అమ్మవారిని దర్శించుకున్నారు. నేడు అన్నపూజ.. శుక్రవారం ఉదయం రుద్రేశ్వరస్వామికి 51 కిలోల పెరుగన్నంతో అన్నపూజ, అనంతరం భక్తులకు మహాన్నదానం జరుగుతుందని ఆలయ ఈఓ అనిల్‌కుమార్ తెలిపారు. తెలుగు బీఓఎస్ చైర్మన్‌గా శంకరయ్యకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ తెలుగు విభాగం ఇన్చార్జ్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్‌గా ఆ విభాగం కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మంథిని శంకరయ్య నియమితులయ్యారు. ఈమేరకు గురువారం కేయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో తెలుగు విభాగం బీఓఎస్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ప్రొఫెసర్ ఏటూరు జ్యోతి మృతి చెందడంతో వేకెన్సీ ఏర్పడిన విషయం తెలిసిందే. ఆస్థానంలో శంకరయ్యను నియమించారు. ఉత్తర్వులను వీసీ ఆచార్య ప్రతాప్‌రెడ్డి చేతుల మీదుగా శంకరయ్య అందుకున్నారు. నాటక పోటీల విజేతలకు బహుమతుల ప్రదానంహన్మకొండ కల్చరల్: హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో సహృదయ సంస్థ ఆధ్వర్యంలో నాలుగురోజులుగా నిర్వహించిన తెలుగు భాష ఆహ్వాన నాటక పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. బుధవారం రాత్రి 11 గంటలకు సంస్థ అధ్యక్షుడు గన్నమరాజు గిరిజామనోహరబాబు అధ్యక్షతన జరిగిన ముగింపు కార్యక్రమంలో నాటక పోటీల విజేతలకు అందించారు. గుంటూరుకు చెందిన అమరావతి ఆర్ట్స్ వారు ప్రదర్శించిన ‘చిగురు మేఘం’ నాటకానికి మొదటి, కొలకలూరుకు చెందిన శ్రీసాయి ఆర్ట్స్ వారు ప్రదర్శించిన ‘జనరల్ బోగీలు’ నాటకానికి ద్వితీయ బహుమతి అందించారు. ఉత్తమ నటుడు, నటి, క్యారెక్టర్ నటుడు, హాస్యనటుడు, రచన, దర్శకుడు, సంగీతం, రంగాలంకరణ తదితర విభాగాల్లో విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో సహృదయ సభ్యులు మల్యాల మనోహర్, కుందావజ్జుల కృష్ణమూర్తి, వనం లక్ష్మీకాంతారావు, ఎన్వీఎన్ చారి, జూలూరు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా ‘ఎమ్మెల్సీ’ పోలింగ్
సాక్షిప్రతినిధి, వరంగల్/విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు పోలింగ్ కొనసాగింది. టీచర్లు, అధ్యాపకులు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 11,189 మంది ఓటర్లు ఉండగా 10,401 మంది ఓటు హక్కును వినియోగించుకోగా, మొత్తంగా 92.95శాతం పోలింగ్ నమోదైంది. హనుమకొండ జిల్లాలోని 15 పోలింగ్ కేంద్రాల్లో కలిపి 5,215 మంది ఓటర్లు ఉండగా.. 4,780 మంది (91.66శాతం) తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నల్లగొండ జిల్లా కేంద్రంలో మార్చి 3న జరగనుంది. హనుమకొండలోని యూనివర్సిటీ లా కాలేజీ, కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పోలింగ్ కేంద్రాల్లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రావీణ్య పోలింగ్ సరళని పరిశీలించారు. వివిధ పోలింగ్ కేంద్రాలను అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి అడిషనల్ కలెక్టర్ వెంకట్‌రెడ్డి పరిశీలించారు. హనుమకొండలోని యూనివర్సిటీ లా క ళాశాల పోలింగ్ కేంద్రంలో అభ్యర్థి పింగిళి శ్రీపాల్‌రెడ్డి ఓటుహక్కును వినియోగించుకున్నారు. కేడీసీలో నాలుగు పోలింగ్ కేంద్రాలు హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నాలుగు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అశోక్ సెంటర్ నుంచి బస్టాండ్ రోడ్డులో ఈ కళాశాల ఉంది. కళాశాల సమీపంలో రహదారికి ఇరువైపులా కొంత దూరం వరకు అభ్యర్థుల మద్దతుదారులు టెంట్లు వేసుకొని పోలింగ్ చిట్టీలు రాసిచ్చారు. ఈ మార్గం సాధారణంగానే నిత్యం రద్దీగా ఉంటుంది. అభ్యర్థుల మద్దతుదారులు, ఓటర్లతో మరింత రద్దీగా కనిపించింది. వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. వివిధ పోలింగ్ కేంద్రాలను టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులు అలుగుబెల్లి నర్సిరెడ్డి, పూల రవీందర్, పులి సరోత్తంరెడ్డి, పింగిలి శ్రీపాల్‌రెడ్డి, సుందర్రాజు యాదవ్, యోల చంద్రమోహన్ వేర్వేరుగా సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. పట్టభద్రుల్లో కొరవడిన చైతన్యం పట్టభద్రుల్లో చైతన్యం కొరవడడంతో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గింది. హనుమకొండ జిల్లాలోని నాలుగు మండలాలైన భీమదేవరపెల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్, వేలేరు మండలాల్లో 4,585 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉండగా.. 1,780 మంది ఓటర్లు (38.82శాతం) ఓటు వేశారు. పరిశీలించిన సీపీ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన పలు పోలింగ్ కేంద్రాలను సీపీ అంబర్ కిషోర్ ఝా సందర్శించారు. హసన్‌పర్తి, ఎల్కతుర్తి మండల కేంద్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో పోలింగ్ సరళిని పరిశీలించారు. బందోబస్తు ఏర్పాట్లపై ఏసీపీలు, ఇన్స్పెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. వరంగల్ జిల్లాలో.. సాక్షి, వరంగల్ : వరంగల్ జిల్లాలోని 13 మండలాల్లో 2,352 మంది ఓటర్లకు గానూ 2,214 మంది (94.13 శాతం) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కలెక్టర్ డాక్టర్ సత్య శారద.. సెంట్రల్ డీసీపీ షేక్ సలీమాతో కలిసి వరంగల్ పట్టణంలోని ఇస్లామియా కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. శాయంపేటలో పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్స్‌కు సీల్ వేస్తున్న సిబ్బంది హనుమకొండ, వరంగల్ జిల్లాలో ఉత్సాహంగా ఓటేసిన ఉపాధ్యాయులు నల్లగొండలోని స్ట్రాంగ్‌రూమ్‌కు బ్యాలెట్ బాక్సుల తరలింపు పలు కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారులు, సీపీ ఉమ్మడి జిల్లాలో జిల్లాల వారీగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ వివరాలు.. జిల్లా ఓటర్లు పోలైన ఓట్లు శాతం జనగామ 1,002 945 94.31 హనుమకొండ 5,215 4,780 91.66 వరంగల్ 2,352 2,214 94.13 మహబూబాబాద్ 1,663 1,571 94.47 జేఎస్ భూపాలపల్లి 329 308 93.62 ములుగు 628 583 92.83 -
గురువారం శ్రీ 27 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
– 8లోuరాత్రి వేయిస్తంభాల గుడి వద్ద స్వామివారి దర్శనానికి బారులుదీరిన భక్తులుమెట్టుగుట్టలో రామలింగేశ్వరస్వామివారి దర్శనానికి బారులుదీరిన భక్తులు, రాత్రి స్వామివారి కల్యాణం జరిపిస్తున్న అర్చకులువేయిస్తంభాల గుడిలో రుద్రేశ్వరస్వామి, రుద్రేశ్వరిల కల్యాణం జరిపిస్తున్న అర్చకులు, హాజరైన భక్తులువేయిస్తంభాల ఆలయంలో లింగానికి హారతినిస్తున్న ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరులు మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం మహానగరం శివనామస్మరణతో మార్మోగింది. ఉదయం నుంచే భక్తులు శివాలయాలకు తరలివెళ్లి అభిషేకాలు, అర్చనలు, పూజలు చేశారు. మారేడు పత్రి, పూలు, పండ్లు, టెంకాయలు స్వామివారికి సమర్పించారు. గతేడాది కంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయాల్లోని క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. హనుమకొండలోని చారిత్రాత్మక శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయం, స్వయంభూ శ్రీసిద్ధేశ్వరస్వామి దేవాలయం, ఖిలా వరంగల్‌లోని స్వయంభూ శంభులింగేశ్వరస్వామి దేవాలయం, స్టేషన్‌రోడ్డు, కాశిబుగ్గలోని కాశీవిశ్వేశ్వరాలయాలు, మడికొండలోని మెట్టుగుట్ట రామలింగేశ్వరస్వామి తదితర ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. రాత్రి స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. జాగరణ చేసిన భక్తుల కోసం ఆలయాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. – హన్మకొండ కల్చరల్ వరంగల్ కాశీవిశ్వేరుని ఆలయంలో దర్శనానికి క్యూలో ఉన్న భక్తులు -
అధికారి అత్యుత్సాహం
వరంగల్ అర్బన్: బదిలీ అయిన బల్దియా అధికారి అత్యుత్సాహంతో కులగణన దరఖాస్తుల ‘ఆన్లైన్’ నమోదు తలకిందులైంది. వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్ 15 నుంచి నెలాఖరు వరకు కులగణన పూర్తి చేయాలని ఆదేశించింది. కానీ, బల్దియా యంత్రాంగం జనవరి 10 వరకు ఇంటింటా కులగణన చేపట్టింది. అయినప్పటికీ ఐదు శాతం ఇళ్లలో సర్వే చేయలేదనే విమర్శలున్నాయి. సేకరించిన డేటాను ‘ఆన్లైన్’ నమోదు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కానీ, కాశిబుగ్గ డిప్యూటీ కమిషనర్ బదిలీ అధికారి కృష్ణారెడ్డి రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారుల ఆదేశాలను పెడచెవిన పెట్టారు. ఎలక్షన్స్ డివిజన్లకు బదులుగా రెవెన్యూ వార్డుల ఆధారంగా వివరాలు నమోదు చేయాలని కంప్యూటర్ ఆపరేటర్లు, బీటెక్ విద్యార్థులకు హితోబోధ చేశారు. దీంతో వారు దరఖాస్తుల ఆధారంగా వివరాలు ఆన్లైన్ చేశారు. ఈక్రమంలో కాశిబుగ్గ సర్కిల్ పరిధిలోని కులగణన కాస్త ఆగమాగం, అస్తవ్యస్తంగా మారింది. వివరాలకు పొంతన లేకుండా పోవడంతో రాష్ట్ర పురపాలక శాఖ బల్దియా ఉన్నతాధికారులపై కన్నెర్రజేసింది. ప్రభుత్వ ఉన్నతాధికారులకు లేఖలు రాశారు. ఈ తప్పిదాల కారణంగా అధికారులు తలలు పట్టుకున్నారు. చివరగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా అనుమతి తీసుకొని దరఖాస్తులను ఎన్నికల డివిజన్ల వారీగా మళ్లీ నమోదు చేశారు. బల్దియా అదనపు కమిషనర్, ఇద్దరు డిప్యూటీ కమిషనర్లు, ఐటీ ఇన్చార్జ్, 20 మంది ఆపరేటర్లు వారం రోజులుగా రాత్రి, పగలు హైదరాబాద్‌లో మకాం వేసి వాస్తవ వివరాలను నమోదు చేశారు. రవాణా, ఇతర వ్యయాలు బల్దియాకు అదనంగా భారమయ్యాయి. ఉన్నతాధికారులకు ఫిర్యాదు? కాశిబుగ్గ డిప్యూటీ కమిషనర్ కృష్ణారెడ్డి ఇటీవల హైదరాబాద్ శివారులోని కొంపెల్లి మున్సిపల్ కమిషనర్‌గా బదిలీపై వెళ్లారు. ఆయనకు వరంగల్ బల్దియా నుంచి కమిషనర్ లాస్ట్ పే సర్టిఫికెట్ (ఎల్పీసీ) ఇవ్వలేదు. చేసిన తప్పిదాలకు రాష్ట్ర పురపాలక శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఆయనపై చర్యలు తీసుకుంటారని చర్చ జరుగుతోంది. ఆన్లైన్ సమగ్ర కుల గణన నమోదులో తప్పిదాలు డివిజన్లకు బదులు రెవెన్యూ వార్డుల వారీగా డేటా ఎంట్రీ వారం రోజులుగా శ్రమించి సరిచేసిన అధికారులు, ఉద్యోగులు బదిలీపై వెళ్లిన సదరు డిప్యూటీ కమిషనర్‌పై చర్యలకు రంగం సిద్ధం -
బెల్ట్‌షాపులపై టాస్క్‌ఫోర్స్ దాడులు
ఖిలా వరంగల్: బెల్ట్‌షాపులపై టాస్క్‌ఫోర్స్ అధికారులు బుధవారం దాడులు చేసి రూ.1,21,540 విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ మధుసూదన్ తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బార్లు, వైన్ షాపులు వేసివేశారు. దీంతో ముందుగానే వరంగల్ సాకరాశికుంటకాలనీలోని పలువురు తమ ఇళ్లలో భారీగా మద్యం నిల్వ చేసి విక్రయిస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్ ఏసీపీకి విశ్వసనీయ సమాచారం అందింది. ఆయన ఆదేశాల ప్రకారం టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ శ్రీధర్‌గౌడ్ ఆధ్వర్యంలో మద్యం నిల్వ చేసిన ఇళ్లు, బెల్ట్‌షాపులపై దాడులు చేశారు. సాకరాశికుంటకు చెందిన ఎనుగందుల శంకర్, ఎనుగందుల సృజన వద్ద రూ.65,790 విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నారు. శివ వైన్స్ ఓనర్ పరారీలో ఉండగా.. సాకరాశికుంటకు చెందిన చింత రాధిక వద్ద రూ.55,750 విలువైన మద్యాన్ని పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి, మిల్స్‌కాలనీ ఇన్స్పెక్టర్ వెంకటరత్నంకు అప్పగించినట్లు టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ తెలిపారు. రూ.1.21 లక్షల విలువైన మద్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు -
‘స్వచ్ఛ సర్వేక్షణ్’లో ముందంజ
వరంగల్ అర్బన్: స్వచ్ఛ సర్వేక్షణ్–2024–25 సిటిజన్ ఫీడ్ బ్యాక్‌లో వరంగల్ నగరం ముందంజలో దుసుకెళ్తోంది. దేశవ్యాప్తంగా వంద నగరాల్లో వరంగల్ నాలుగో స్థానంలో నిలిచినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రకటించింది. మార్చి 5 వరకు సిటిజన్ ఫీడ్‌బ్యాక్, డాక్యుమెంటేషన్, ఓడీఎఫ్, క్షేత్రస్థాయిలో పరిశీలన తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. అనంతరం స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకు ఫలితాలను కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ అధికారికంగా పూర్తిస్థాయిలో వెల్ల డిస్తుంది. దేశవ్యాప్తంగా 10 లక్షల్లోపు జనాభా ఉన్న నగరాల్లో ఇప్పటి వరకు సిటిజన్ ఫీడ్‌బ్యాక్ వివరాలు తెలిపారు. ప్రస్తుతం 2011 జనాభా లెక్కల ప్రకారం సిటిజన్ ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో 8,02,969 మంది ఉండగా 54,325 మంది నగర పరిశుభ్రతపై ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. రెండోస్థానంలో గ్రేటర్ విశాఖలో 8,02,947 మందికి 49,412 మంది, మూడోస్థానంలో మహారాష్ట్రలోని పింపిరి చించివాడ్‌లో 8,02,811 మందికి 47,790 మంది తమ అభిప్రాయాలు వెల్లడించారు. నాలుగో స్థానంలో గ్రేటర్ వరంగల్‌లో 8,09,930 మందికి 33,833 మంది వివరాలు తెలిపారు. మెరుగైన ర్యాంకు సాధిస్తాం : గుండు సుధారాణి, నగర మేయర్ స్వచ్ఛ సర్వేక్షణ్–2024–25 సిటిజన్ ఫీడ్‌బ్యాక్ విభాగం (పౌరుల అభిప్రాయం) జాతీయస్థాయిలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌కు నాలుగో స్థానం దక్కినందుకు మేయర్ గుండు సుధారాణి హర్షం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా టాప్–100 యూఎల్బీలు సిటిజన్ ఫీడ్ బ్యాక్‌లో సాధించిన స్కోరు ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ర్యాంకుల్లో గ్రేటర్ వరంగల్ ఉత్తమ ఫలితాలు సాధించిందని ఆమె పేర్కొన్నారు. మార్చి 5 వరకు ప్రజలు వారి అభిప్రాయాలు వ్యక్తం చేసేందుకు అవకాశం ఉందని తెలిపారు. ఇందుకోసం ప్రజారోగ్య సిబ్బంది ప్రత్యేక చొరవ చూపి నగరవాసులను ఇందులో భాగస్వామ్యం చేసి మొదటిస్థానం దక్కేలా ప్రణాళికాబద్ధంగా కృషిచేయాలని సూచించారు. ఇదే స్ఫూర్తి కొనసాగించాలి: అశ్విని తానాజీ వాకడే, గ్రేటర్ వరంగల్ కమిషనర్ వరంగల్ నగర ప్రజలు ఇదే స్ఫూర్తి కొనసాగించాలని బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే కోరారు. సిటిజన్ ఫీడ్‌బ్యాక్‌లో నగరానికి నాలుగో స్థానం దక్కడంతో కమిషనర్ హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు. ఈ విభాగంలో మొదటి స్థానం వచ్చేందుకు అభిప్రాయాలు తెలియజేయాలని సూచించారు. తద్వారా స్వచ్ఛ సర్వేక్షణ్–2024–25లో ఉత్తమ ర్యాంకు సాధనకు ఫీడ్‌బ్యాక్ దోహదం చేసే అవకాశం ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. సిటిజన్ ఫీడ్‌బ్యాక్ టాప్–100లో వరంగల్‌కు నాలుగో స్థానం ప్రజలు తమ అభిప్రాయాలు వెల్లడించేందుకు గడువు మార్చి 5 -
టీచర్ల ఎమ్మెల్సీ పోలింగ్‌కు రెడీ
విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. గురువారం ఉద యం 8 గంటల నుంచి ఓటింగ్ ప్రక్రియ మొదలుకానుంది. హనుమకొండ జిల్లాలో 5,215 మంది, వరంగల్‌లో 2,352 మంది ఉపాధ్యాయ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ మేరకు బుధవారం హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో పోలింగ్ మెటీరియల్‌ను సంబంధిత సిబ్బందికి పంపిణీ చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య పర్యవేక్షించారు. సామగ్రిని తీసుకున్న సిబ్బంది వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు బస్సుల్లో వెళ్లిపోయారు. అంతకుముందు పోలింగ్ నిర్వహణపై కలెక్టర్ ప్రావీణ్య సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. రూట్, జోనల్ ఆఫీసర్లు, పీఓలు, ఏసీఓలు, మైక్రోఅబ్జర్వర్లు ఎన్నికలను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్‌లను జాగ్రత్తగా సీల్ చేయాలని తెలిపారు. ఏమైనా సమస్యలు తలెత్తితే జోనల్ అధికారిని సంప్రదించాలని సూచించారు. వరంగల్ జిల్లాలో.. వరంగల్ జిల్లాకు సంబంధించి కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యశారద సందర్శించారు. సకాలంలో నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకునేలా పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు. ఆమెవెంట అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, సంబంధిత అధికారులు ఉన్నారు. సరిహద్దు జిల్లాలో ఓటర్లు ఇప్పుడు ఇక్కడే.. ● మెదక్, నిజామాబాద్, అదిలాబాద్, కరీంనగర్ టీచర్స్ నియోజకవర్గానికి సంబంధించి హనుమకొండ జిల్లాలో 166 మంది ఓటర్లు ఉన్నారు. ● మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి సంబంధించి 4,585 మంది ఓటర్లున్నారు. ● ఒక్కో పోలింగ్ కేంద్రంలో పీఓ, ఏపీఓ, మైక్రోఅబ్జర్వర్‌ను నియమించారు. ● గతంలో కరీంనగర్ జిల్లాలో ఉన్న ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్, వేలేరు మండలాలు ప్రస్తుతం హనుమకొండ జిల్లా పరిధికి రావడంతో ఆయా మండలాల్లోని పోలింగ్ కేంద్రాల నిర్వహణ ఈ జిల్లా నుంచే ఉంటుంది. జిల్లాల వారీగా ఓటర్ల జాబితా వివరాలునేడు ఓటు హక్కు వినియోగించుకోనున్న ఉపాధ్యాయులు పోలింగ్ మెటీరియల్ పంపిణీ కేంద్రాలకు తరలివెళ్లిన సిబ్బంది ఎన్నికలను సక్రమంగా నిర్వహించాలి : హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య పోలింగ్ సమయం : ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్ణీత సమయానికి వచ్చిన వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. పోలింగ్ ముగిశాక బ్యాలెట్ బాక్స్‌లను నల్లగొండ జిల్లాకేంద్రంలోని స్ట్రాంగ్‌రూమ్‌కు తరలిస్తారు. -
కాళోజీ కళాక్షేత్రంలో వసతులు కల్పించాలి
హన్మకొండ కల్చరల్: కాళోజీ కళాక్షేత్రంలో వసతులు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర నాటక కళా కారుల సమాఖ్య అధ్యక్షుడు ఆకుల సదానందం అన్నారు. సహృదయ సంస్థ ఆధ్వర్యంలో హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో నాలుగు రోజులు గా జరుగుతున్న తెలుగుభాషా ఆహ్వాన నాటక పోటీలు బుధవారం ముగిశాయి. సంస్థ అధ్యక్షుడు గన్నమరాజు గిరిజామనోహరబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆకుల సదానందం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ‘జనరల్ బోగీలు’, ‘రుతువు లేని కాలం’ నాటక ప్రదర్శనలు అలరించాయి. టెంపుల్ డ్యాన్స్ నిర్వాహకురాలు కాట్రగడ్డ హిమాన్సీ చౌదరికి సహృదయ రంగస్థల పురస్కారం ప్రదానం చేశారు. కార్యక్రమంలో డాక్టర్ ఎం.రాధాకృష్ణ, కోలాహలం రాంకిశోర్, మల్యాల మనోహర్, కుందావజ్జుల కృష్ణమూర్తి, వనం లక్ష్మీకాంతారావు, ఎన్వీఎన్ చారి, జూలూరు నాగరాజు పాల్గొన్నారు. -
ఇక చకచకా నాన్ లే అవుట్ భూముల క్రమబద్ధీకరణ
ఉమ్మడి జిల్లాలో ఇలా..మొత్తం దరఖాస్తులు 1,58,097 ఆమోదించినవి 10,840పెండింగ్ 1,47,257 సాక్షిప్రతినిధి, వరంగల్: అనుమతి లేని లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్)కు ఎట్టకేలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం.. తక్షణమే అమలు చేసేలా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ మేరకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, కుడా వైస్ చైర్మన్‌తో పాటు మున్సిపల్ కమిషనర్లు, జిల్లాల ఉన్నతాధికారులకు మార్గదర్శకాల ఉత్తర్వులు కూడా అందాయి. చీఫ్ సెక్రటరీ శాంతికుమారి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. మార్చి నాటికి దాదాపుగా ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పూర్తి చేయాలన్న లక్ష్యంతో అధికార యంత్రాంగం ముందుకు సాగాలని సూచించారు. దరఖాస్తుల క్రమబద్ధీకరణకు అంతా సిద్ధం.. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేసేందుకు అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. మొదటగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వివిధ నిబంధనల ప్రకారం ఆన్లైన్లోనే వడపోసేందుకు రంగం సిద్ధం చేశారు. ఆయా ఆస్తులు నిషేధిత జాబితాలో ఉన్నాయా? దరఖాస్తుదారుడు పూర్తిస్థాయిలో పత్రాలు సమర్పించాడా? లేదా? అన్న అంశాలను పరిశీలిస్తారు. ఉమ్మడి జిల్లాలోని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు 9 మున్సిపాలిటీలు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు రెవెన్యూ, నీటిపారుదల, టౌన్‌ప్లానింగ్, పంచాయతీ అధికారులు కార్యాచరణ రూపొందించారు. దరఖాస్తుదారులకు సమాచారం ఇస్తూ.. ఆ ప్లాటు, స్థలం వద్దకు రమ్మని జీపీఎస్ ద్వారా పరి శీలిస్తున్నారు. ఇదిలా ఉండగా నాలాలు, చెరువులు, కుంటలు, వారసత్వ సంపద, శిఖం, దేవాదాయ, ఇనాం భూముల వంటివి పరిశీలించి అభ్యంతరాలు ఉంటే నమోదు చేసుకుని ఉన్నతాధికారులకు రిపోర్టు చేస్తామని చెబుతున్నారు. చివరగా మరో సారి వాటిపై ఉత్తర ప్రత్యుత్తరాలు, పత్రాల పరి శీలన చేసినా అభ్యంతరాలు అలాగే ఉంటే వాటిని తిరస్కరించి సమాచారం ఇస్తామంటున్నారు. అర్హత ఉన్న దరఖాస్తులను వెంటనే పరిశీలించి కావా ల్సిన పత్రాలతోపాటు ఫీజు చెల్లించేలా నోటీసు జారీ చేసి.. దరఖాస్తులు సరైనవి అయితే క్రమబద్ధీకరించి ఉత్తర్వులు జారీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. అందరికీ సమాచారం అందేలా ఏర్పాట్లు... ఉమ్మడి వరంగల్‌లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సహా 9 మున్సిపాలిటీలు, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) 2020లో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తులు స్వీకరించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఈ కార్యక్రమం 2020 అక్టోబర్ 31 వరకు కొనసాగగా, రూ.1000 ఫీజును ఆన్లైన్లో చెల్లించి వివరాలను నమోదు చేసుకున్నారు. మొత్తంగా 1,58,097 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 10,840 దరఖాస్తులు పరిశీలించిన అధికారులు అప్పట్లోనే కొన్నింటిని క్రమబద్ధీకరణ చేయగా.. 1,47,257 వివిధ స్థాయిల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ఆ తర్వాత ఈ ప్రక్రియకు బ్రేక్ పడగా.. రాష్ట్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వుల నేపథ్యంలో అధికార యంత్రాంగం మళ్లీ ఎల్ఆర్ఎస్ అమలుకు కదిలింది. ఈసారైనా నిబంధనల ప్రకారం చకచకా క్రమబద్ధీకరణ పూర్తి చేయాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.కార్పొరేషన్/మున్సిపాలిటీల వారీగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల వివరాలు జిల్లా మున్సిపాలిటీ మొత్తం ఆమోదం వివిధ స్థాయిల్లో గ్రేటర్వరంగల్ కార్పొరేషన్ 1,00,989 2,756 98,233 హనుమకొండ పరకాల 3,194 06 31,88 వరంగల్ నర్సంపేట 5,219 411 4,808 వర్ధన్నపేట 524 10 514 మహబూబాబాద్ మహబూబాబాద్ 12,201 566 11,635 డోర్నకల్ 872 241 631 మరిపెడ 2,629 63 2,566 తొర్రూరు 10,299 606 9,693 జేఎస్ భూపాలపల్లి భూపాలపల్లి 3,795 1214 2,581 జనగామ జనగామ 18,375 4,967 13,408 కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, ఉన్నతాధికారులకు మార్గదర్శకాలు మార్చి వరకు ప్రక్రియ పూర్తి చేసేలా ఆదేశాలు తాజా ఉత్తర్వులతో మళ్లీ కదలిక.. ఇప్పటికై నా పూర్తి చేయాలంటున్న దరఖాస్తుదారులు వేగం పెంచుతాం.. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ఫీల్డ్ సర్వేలో జాప్యం జరుగుతోంది వాస్తవమే. దరఖాస్తుదారులనుంచి స్పందన లేక, స్థానికంగా లేకపోవడం వల్ల ఆలస్యమవుతోంది. ప్రభుత్వంనుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచుతాం. – బల్దియా ఇన్చార్జ్ సీపీ రవీందర్ రాడేకర్ ఎవరూ కాల్ చేయలేదు హంటర్ రోడ్డులో నా ఖాళీ స్థలం ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసి మూడేళ్లు దాటింది. ఇప్పటివరకు ఎవరూ ఫోన్ చేయలేదు. ఫీజులు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నా. ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్ ఇస్తే బిల్డింగ్ పర్మిషన్ తీసుకోవాలని వేచి చూస్తున్నా. – కక్కెర్ల అశ్వంత్, శివనగర్ -
ముగిసిన టీచర్ల ఎమ్మెల్సీ ప్రచారం
సాక్షిప్రతినిధి, వరంగల్/విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 4 గంటలకు ముగిసింది. చివరి రోజు అభ్యర్థులు సుడిగాలి పర్యటనలు చేశారు. ఎక్కడికక్కడ తమ మద్దతుదారులతో విలేకరుల సమావేశాలు ఏర్పాటుచేసి ఈసారి అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. ప్రచారానికి తెరపడడంతో ఇక ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రలోభాలకు తెరలేపారన్న చర్చ జోరుగా సాగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లానే కీలకం.. ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులకు ఉమ్మడి వరంగల్ జిల్లా కీలకంగా మారింది. మిగతా జిల్లాలతో పోలీస్తే ఇక్కడే ఓటర్లు అధికంగా ఉన్నారు. ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో మొత్తంగా 25,797మంది ఓటర్లు ఉండగా, వీరిలో ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 11,189మంది ఉన్నారు. అభ్యర్థులు కొద్దిరోజులుగా ఓ వైపు ఎన్నికల ప్రచారం నిర్వహించుకుంటూనే రాత్రివేళ విందులు ఏర్పాటు చేశారు. ఒక్కో ఓటుకు రూ.2వేలు, ఆపైన డబ్బుల పంపిణీకి రంగం చేసుకున్నారన్న చర్చ కూడా ఉపాధ్యాయ వర్గాల్లో నడుస్తోంది. పోటీ ఎక్కువగా ఉండటంతో మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలిచే పరిస్థితి లేదని, రెండో ప్రాధాన్యత ఓటు కీలకంగా మారనుండడంతో అభ్యర్థులు దీనిపైనా దృష్టి పెట్టారు. మొదటి ఓటు కాకపోయినా రెండో ప్రాధాన్యత ఓటు అయినా తనకు వేయాలని ప్రచారం నిర్వహించారు. ఎప్పుడూ లేనంతగా ఉత్కంఠ నెలకొన్న ఈ పోరులో విజేత ఎవరన్నది మార్చి 3న తేలనుంది. ఆరుగురు.. అమీతుమీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు ఉన్నప్పటికి ఆరుగురి మధ్యే పోటీ నెలకొందన్న ప్రచారం జరుగుతోంది. ● ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా 2019లో గెలుపొందిన అలుగుబెల్లి నర్సిరెడ్డి మరోసారి టీఎస్‌యూటీఎఫ్ మద్దతుతో బరిలో నిలిచారు. టీచర్ల, అధ్యాపకుల అనేక సమస్యలను పరిష్కరించానని, మరోసారి గెలిపిస్తే మిగతా సమస్యలను పరిష్కరిస్తానని హామీలు ఇస్తూ ప్రచారం కొనసాగించారు. ● 2013లో పీఆర్టీయూ మద్దతుతో పూల రవీందర్ ఎమ్మెల్సీగా గెలుపొంది 2019 వర కు కొనసాగారు. ఈసారి ఉపాధ్యాయ సంఘా ల జాక్టో, ఎస్టీయూ, బీసీ సంఘాల మద్దతుతో బరిలో నిలిచారు. తాను గతంలో ఎమ్మెల్సీగా అనేక సమస్యలను పరిష్కరించానని, బహుజన బిడ్డను మరోసారి గెలిపించాలని ఓట్లు అభ్యర్థించారు. తెలంగాణ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కూడా మద్దతు ప్రకటించింది. ● గతంలో పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగిన పులి సరోత్తంరెడ్డి బీజేపీ మద్దతుతో పోటీలో ఉన్నారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు ఈటల రాజేందర్, లక్ష్మణ్ తదితరులు కూడా సరోత్తంరెడ్డి కోసం వివిధ జిల్లాల్లో ప్రచారం నిర్వహించారు. ఈయనకు టీపీయూఎస్ మద్దతు ప్రకటించింది. ● ఉపాధ్యాయ సంఘాల్లో అధిక సభ్యత్వం కలిగిన పీఆర్టీయూ టీఎస్నుంచి ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పింగిళి శ్రీపాల్‌రెడ్డి తన మద్దతుదారులతో ఉమ్మడి మూడు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడిగా తాను పరిష్కరించిన ఉపాధ్యాయుల పలు సమస్యలను తెలియజేస్తూ తనకు అవకాశం ఇవ్వాలని ఓట్లను అభ్యర్థించారు. ● మరో అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, టీపీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి కూడా తన మద్దతుదారులతో విస్తృతంగా ప్రచారం చేశారు. ● కుడా మాజీ చైర్మన్, ఓ ప్రైవేట్ విద్యాసంస్థల అధినేత ఎస్.సుందర్‌రాజ్‌యాదవ్ కూడా ఎన్నికల బరిలో ఉన్నారు. ఈసారి ప్రైవేట్ హైస్కూళ్ల టీచర్లు, కళాశాలల అధ్యాపకులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఆయన బీసీ సంఘాల మద్దతు కూడగట్టేందుకు యత్నిస్తూనే పలు ప్రైవేట్ యాజమాన్యాల మద్దతుతో గెలిపించాలని అభ్యర్థించారు. జిల్లాలో ఉపాధ్యాయ ఓటర్ల వివరాలుఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రలోభాలు? రేపు పోలింగ్.. ఉత్కంఠ పోరులో విజేత ఎవరో ఆరుగురు అభ్యర్థుల మధ్య ప్రధానంగా పోటీ ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయ మొత్తం ఓటర్లు 11,189పోలింగ్‌కేంద్రాలు 7227న పోలింగ్, 3న లెక్కింపు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈనెల 27న ఉదయం 8నుంచి సాయంత్రం 4గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ జరగనుంది. ఉమ్మడి వరంగల్ పరిధిలోని ఆరు జిల్లాల్లో మొత్తం 72 పోలింగ్సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. మార్చి 3న ఓట్ల లెక్కింపు నల్లగొండ జిల్లాకేంద్రంలో నిర్వహించనున్నారు. -
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణవరంగల్ క్రైం: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ తెలిపారు. వేయిస్తంభాల ఆలయ పరిసర ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలు లేవని పేర్కొన్నారు. భక్తులు సాధ్యమైనంత వరకు త్వరగా చేరుకుని దర్శనం చేసుకోవాలని ఆయన సూచించారు. ములుగు రోడ్డు నుంచి వేయిస్తంభాల ఆలయానికి వచ్చే వాహనాలు అలంకార్ జంక్షన్ వరకు, హనుమకొండ చౌరస్తా నుంచి వచ్చే వాహనాలను అమృత జంక్షన్ వరకు మాత్రమే అనుమతిస్తామని పేర్కొన్నారు. ములుగు రోడ్డు నుంచి వచ్చే ఆటోలు, ద్విచక్రవాహనాలు బాలాంజనేయస్వామి దేవాలయం మీదుగా వెళ్లాలని, కాపువాడ రోడ్డుకు ఇరు వైపులా ఎలాంటి పార్కింగ్ చేయరాదని, ఈమార్గంలో తోపుడు బండ్లకు కూడా అనుమతి లేదని స్పష్టం చేశారు. హనుమకొండ చౌరస్తా నుంచి వచ్చే వాహనాలు అమృత జంక్షన్ నుంచి యాదవనగర్ మీదుగా వెళ్లాలని, ట్రాఫిక్ ఆంక్షలు ఈనెల 26న ఉద యం 3 గంటల నుంచి 27న మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగుతాయని ఏసీపీ పేర్కొన్నారు. -
బోగస్ మాటలు కట్టిపెట్టండి
వరంగల్: అబద్ధాలు చెప్పి కేంద్రంలో బీజేపీ, బోగస్ మాటలు చెప్పి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాయని కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికైనా ఆ మాటలు కట్టిపెట్టి రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్ చేశారు. మంగళవారం ఏనుమాములలోని వరంగల్ వ్యవసాయ మార్కెట్‌ను నర్సంపేట, భూపాలపల్లి, వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్వేలు సుదర్శన్‌రెడ్డి, వెంకటరమణారెడ్డి, నరేందర్‌తో కలసి సందర్శించారు. మిర్చి రైతులతో మాట్లాడి కొనుగోళ్లు, ధర తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘రేవంత్‌రెడ్డి... ఇప్పటికై నా బుద్ధి తెచ్చుకో, అబద్ధాలు మాట్లాడడం మానుకో రైతు బంధు ఇవ్వలేదు. రుణమాఫీ 50 శాతం పూర్తి కాలేదు. ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి వస్తే మిర్చి క్వింటాకు రూ.15 వేలకు తగ్గకుండా చూస్తామన్న హామీ ఎక్కడికి పోయింది’ అని అన్నారు.రూ. 25వేలు పెట్టి కొనుగోలు చేసేంత వరకు రైతుల పక్షాన అందోళలు చేస్తామని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, వెంకటరమణారెడ్డి, నరేందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏప్రాంతంలో ఎలాంటి పంటలు వేస్తారు, ఏ మేర కు సాగు చేస్తారన్న విషయాలు కాంగ్రెస్ ప్రభుత్వంలోని నేతలకు తెలియకపోవడంతో ఈ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. మంత్రులు సురేఖ, సీతక్క, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కనాడు రైతుల గురించి, ఏనుమాముల మార్కెట్లో జరుగుతున్న వ్యవహరంపై మాట్లాడలేదన్నారు. కుంభకోణాలతో పాటు ధాన్యం, సీసీఐ కొనుగోళ్లలో మీ పాత్ర స్పష్టంగా ఉంటోందని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు నాగుర్ల వెంకటేశ్వర్లు, చింతం సదానందం, టి.రమేశ్‌బాబు, వాసుదేవరావు, కేతిరి రాజశేఖర్, సుభాష్, చిలువేరు పవన్ తదితరులు పాల్గొన్నారు. మిర్చి రైతులకు న్యాయం చేయాలి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు -
28న సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించాలి : డీఈఓ
విద్యారణ్యపురి: జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఈనెల 28న జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించాలని హనుమకొండ డీఈఓ డి.వాసంతి హెచ్ఎంలు, ఉపాధ్యాయులను ఆదేశించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, క్వి జ్, సైన్స్ సెమినార్లు, సైన్స్ పుస్తక ప్రదర్శన, సై న్స్ పరికరారాలు, సైన్స్ ప్రయోగాలు, సైన్స్ అ భ్యసన సామగ్రి, ప్రాజెక్టుల ప్రదర్శన నిర్వహించాలని పేర్కొన్నారు. శాస్త్రవేత్తలతో ఉపన్యాసాలు, విజ్ఞానమేళాలు ఏర్పాటు చేయాలని కోరారు. వివరాల కోసం జిల్లా సైన్స్ అధికారి ఎస్.శ్రీనివాస్‌స్వామి 9490112848 నంబర్లో సంప్రదించాలని ఆమె సూచించారు. నూతన ఎస్జీటీలకు శిక్షణ విద్యారణ్యపురి: డీఎస్సీ–2024లో ఎస్జీటీలుగా నియమితులైన వారికి ఈనెల 28 నుంచి మార్చి 3 వరకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఉపాధ్యాయులకు అభ్యసన సామర్థ్యాల సాధన, లెర్నింగ్ అవుట్‌కం, లెసెన్ప్లాన్, వర్క్‌షీట్స్ తదితర అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హనుమకొండ జిల్లాలో 75 మంది టీచర్లకు హనుమకొండ లష్కర్‌బజార్‌లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఉదయం 9 నుంచి సాయంత్రం 4–30 గంటల వరకు శిక్షణ కొనసాగనుందని జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ ఎ.శ్రీనివాస్ తెలిపారు. నలుగురు రిసోర్స్పర్సన్లు తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్‌పై కూడా శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా వరంగల్ జిల్లాలో 163 మంది ఎస్జీటీలకు శుంభునిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 12 మంది రిసోర్స్పర్సన్లు శిక్షణ ఇవ్వనున్నారు. 4 నుంచి కేయూ ఎంసీఏ మొదటి సెమిస్టర్ పరీక్షలుకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఎంసీఏ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలు మార్చి 4 నుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి ఆసింఇక్బాల్ మంగళవారం తెలిపా రు. మార్చి 4, 6, 11, 13, 17 తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని వారు పేర్కొన్నారు. కొనసాగుతున్న నాటక పోటీలు హన్మకొండ కల్చరల్: హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో తెలుగు భాషా ఆహ్వాన నాటక పోటీలు కొనసాగుతున్నాయి. వరంగల్ సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్షుడు గన్నమరాజు గిరిజామనోహరబాబు ఆధ్వర్యంలో మూడో రోజు మంగళవారం చీరాలకు చెందిన విష్ణు బొట్ల, కందాళం ఫౌండేషన్ అధ్యక్షుడు అప్పాజ్యోసుల సత్యనారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి నాటక ప్రదర్శన ప్రారంభించారు. ఇందులో భాగంగా ‘సారీ రాంగ్ నంబర్’, ‘వీడేం మగాడండి బాబు’ నాటక ప్రదర్శనలు అలరించాయి. విశిష్ట అతిథులుగా మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, మీరా సంగీత మండలి బాధ్యుడు వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ముగిసిన మహారుద్రయాగంహన్మకొండ కల్చరల్: మహాశివరాత్రి సందర్భంగా భద్రకాళి దేవాలయంలో మహారుద్రయాగం, గ్రహముఖం, శ్రీరుద్రపునఃశ్చరణ, శివపంచాక్షరీ, జపహోమార్చన, అభిషేకాలు మంగళవారం ముగిశాయి. జాగరణ చేసే భక్తుల కోసం బుధవారం రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈఓ శేషుభారతి తెలిపారు. -
టీచర్ గౌరవం పెంచే అభ్యర్థిని గెలిపించండి
నయీంనగర్: ఉపాధ్యాయ సమస్యలు తెలిసి నిజాయితీతో పనిచేసే వారికి, టీచర్ గౌరవం పెంచే అభ్యర్థికి ఓటువేయాలని ఎమ్మెల్సీ కోదండరాం ఉపాధ్యాయులను కోరారు. ఈ మేరకు మంగళవారం హనుమకొండలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వరంగల్–ఖమ్మం–నల్లగొండ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి పన్నాల గోపాల్‌రెడ్డికి మద్దతు తెలిపి మాట్లాడారు. ప్రస్తుతం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. అయితే డబ్బులకు ఆశపడి ఓటు అమ్ముకుంటే రాబోయే రోజుల్లో ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కావన్నారు. విద్యాశాఖలోని అన్ని స్కూళ్లలో పనిచేసే ఉపాధ్యాయులకు గ్రీన్ చానల్ ద్వారా జీతాలు ఇవ్వాలని, పెన్షన్ ఉద్యోగి హక్కు అని తెలిపారు. పన్నాల గోపాల్‌రెడ్డి నాలుగు దశాబ్దాలుగా ఉపాధ్యాయ సమస్యల పరిష్కార ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారన్నారు. వారి సమస్యలు బలంగా లేవనెత్తి ఉపాధ్యాయులకు న్యాయం చేకూర్చారన్నారు. అభ్యర్థి పన్నాల గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు ఇచ్చే తాయిలాలకు అమ్ముడుపోకుండా, జాతి నిర్మాతలైన ఉపాధ్యాయుల గౌరవం పెంచేలా నిజాయితీ, నిబద్ధత కలిగిన వారిని ఎన్నుకోవాలని కోరారు. సమావేశంలో రాజేంద్రప్రసాద్, నాగేశ్వర్ యాదవ్, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు ఓటును అమ్ముకోవద్దు ఎమ్మెల్సీ కోదండరాం -
మహాశివరాత్రికి ముస్తాబు
మహాశివరాత్రి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించడానికి గ్రేటర్ వరంగల్ పరిధిలోని శివాలయాలు ముస్తాబయ్యాయి. హనుమకొండలోని వేయిస్తంభాల ఆలయం, వరంగల్ కోటలోని స్వయంభూ శ్రీశంభులింగేశ్వరస్వామి ఆలయం, మడికొండలోని మెట్టు రామలింగేశ్వరస్వామి దేవస్థానం, ఐనవోలులోని మల్లికార్జునస్వామి ఆలయం, వరంగల్ కాశిబుగ్గలోని శ్రీకాశీవిశ్వేశ్వర శ్రీరంగనాథస్వామి తదితర ఆలయాల్లో బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. విద్యుత్ దీపాలతో అలంకరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా జిల్లా యంత్రాంగం, దేవాదాయశాఖ, నగర కార్పొరేషన్ ఆధ్వర్యంలో బారికేడ్లు, మంచినీటి వసతి, చలువ పందిళ్లు తదితర అన్ని ఏర్పాట్లు చేశారు. – హన్మకొండ కల్చరల్ -
ఐలోనిలో ప్రత్యేక పూజలు..
ఐనవోలు: మండల కేంద్రంలోని శ్రీమల్లికార్జునస్వామి ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా రెండోరోజు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి సమర్పించే నిత్య పూజలతోపాటు గవ్యాంత, వాస్తుపూజలు, పర్యగ్నికరణ, రుద్రహోమం, ప్రాతరౌపాసన బలిహరణలు నిర్వహించారు. లింగోధ్భవ కాలంలో స్వామిని అభిషేకించే 108 కలశాలను స్థాపించారు. కాగా, స్వామి, అమ్మవార్లను భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకున్నారు. మాడ వీధుల్లో ఉదయం అశ్వవాహన సేవ, సాయంత్రం శేషవాహన సేవ నిర్వహించగా భక్తులు భజనలు చేస్తూ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ అద్దంకి నాగేశ్వరరావు, ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్, ముఖ్య అర్చకులు శ్రీనివాస్, మధుకర్ శ ర్మ, వేద పండితులు విక్రాంత్ వినాయక్ జోషి, అర్చకులు నంద నం భానుప్రసాద్ శర్మ, నందనం మధుశర్మ, పాతర్లపాటి నరేశ్ శర్మ, ఉప్పుల శ్రీనివాస్, మడికొండ దేవేందర్, జూనియర్ అసిస్టెంట్ కిరణ్‌కుమార్, ఆలయ సిబ్బంది పాల్లొన్నారు. బందోబస్తు ఏర్పాట్ల పర్యవేక్షణ.. మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో పాటు పెద్దపట్నం వద్ద తొక్కిసలాట జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మామునూరు ఏసీపీ తిరుపతి, పర్వతగిరి సీఐ రాజగోపాల్ మంగళవారం బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఎస్సై శ్రీనివాస్‌కు సూచించారు. -
నీటిఎద్దడి లేకుండా చూడాలి
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద వరంగల్ అర్బన్: వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూడాలని, ఏ మాత్రం నిర్లక్ష్యం వహించిన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని వరంగల్ కలెక్టర్ సత్య శారద ఇంజనీర్లను ఆదేశించారు. గ్రేటర్ వరంగల్ 34వ డివిజన్ శివనగర్‌లో కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి మంగళవారం తనిఖీ చేశారు. చివరి ఇంటి వరకు నీటి సరఫరా జరుగుతున్న తీరును కలెక్టర్ స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల స్ట్రాం వాటర్ డ్రైన్ నిర్మాణ పనులు పూర్తికావడంతో నీటి సరఫరా పునరుద్ధరించినట్లు తెలిపారు. గతంలో నీటి సరఫరాలో సమస్య ఉండేదని, ప్రస్తుతం నీటి సరఫరా బాగుందని స్థానికులు రాజమణి, సక్కుబాయి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిరోజు నీటి సరఫరాను పర్యవేక్షిస్తున్న ఏఈ హరికుమార్‌ను కలెక్టర్ ప్రశంసించారు. వేసవిలో నీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకు ముందు దేశాయిపేటలోని ఫిల్టర్‌బెడ్‌ను కలెక్టర్ సందర్శించారు. నీటి సరఫరా తీరుతోపాటు ధర్మసాగర్ నుంచి ఫిల్టర్‌బెడ్‌కు ఎంత రా వాటర్ చేరుతోంది, నీటి శుద్ధీకరణకు ఎంత నిష్పత్తిలో రసాయనాలు కలుపుతారు అని అధికారులను అడి గి తెలుసుకున్నారు. ఎస్ఈ ప్రవీణ్‌చంద్ర, సీఎంహెచ్ఓ రాజారెడ్డి, ఎంహెచ్ఓ రాజేశ్, ఈఈ శ్రీనివాస్, డీఈ రాజ్‌కుమార్, శానిటరీ సూపర్వైజర్ భాస్కర్, ఏఈలు హరికుమార్, మొజామిల్ పాల్గొన్నారు. -
ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధికి కృషి
నయీంనగర్/జనగామ రూరల్ : ఉపాధ్యాయ, అధ్యాపకుల సమస్యల పరిష్కారంతోపాటు ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తానని, తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని వరంగల్–ఖమ్మం–నల్లగొండ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ఉపాధ్యాయులను కోరారు. మంగళవారం హనుమకొండ ప్రెస్ క్లబ్లో, జనగామ జిల్లాకేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సిట్టింగ్ ఎమ్మెల్సీగా టీచర్ల సమస్యలపై తాను చేసిన పోరాటం, పరిష్కరించిన సమస్యలను గ్రహించాలని కోరారు. తాను గెలిచిన వెంటనే ముఖ్యమైన ఉపాధ్యాయ, అధ్యాపకుల, ప్రైవేట్ టీచర్ల పది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ధన రాజకీయాలకు, నిబద్ధతకు మధ్య ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. ఉపాధ్యాయులను కులం, మతం పేరుతో విభజించాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఆయా కార్యక్రమాల్లో మాణిక్‌రెడ్డి, సదానందం, సదాశివారెడ్డి, తాడూరు సుధాకర్, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రంజిత్ కుమార్, టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, వివిధ సంఘాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చంద్రశేఖర్ రావు, వెంకటేశ్, ఎన్ఎన్ రాజు, అంకూషావలి, చిక్కుడు శ్రీనివాస్, లక్ష్మయ్య, శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి -
శివ పూజకు వేళాయె..
● కాళేశ్వరాలయంలో ఏర్పాట్లు పూర్తి ● నేడు శ్రీశుభానంద–ముక్తీశ్వరుల కల్యాణం కాళేశ్వరం: ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా శివ పూజకు సర్వం సిద్ధం చేశారు. దేవస్థానఅధికారులు ఆలయంతో పాటు గోదావరి తీరం వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం స్వామివారి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలతో శివరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రత్యేక పూజలతో.. మహదేవపూర్ టస్సర్ కాలనీకి చెందిన దేవాంగ కులస్తులు నేసిన పట్టువస్త్రాలను ఉత్సవ మూర్తులకు ధరింపజేసి పూజలు ప్రారంభించారు. కల్యాణ మండపంలో ఉదయం 10గంటలకు మంగళవాయిద్యాలతో దీపారాధన, గణపతి పూజ స్వస్తిపుణ్యాహవచనం, రక్షాబంధనం, దీక్షావస్త్రధారణ, ఋత్విగ్వర్ణన మత్సంగ్రహణం, 11గంటలకు దేవతాహ్వానం నవకలశారాధన, నవగ్రహారాధన, 12గంటలకు మండప దేవతారాధన, వషభధ్వజ పటాదివాసం పూజలు చేశారు. సాయంత్రం 4 గంటలకు అగ్ని ప్రతిష్ఠ, రుద్రహవనం, రాత్రి 8 గంటలకు పుర వీధుల గుండా ఉత్సవ విగ్రహాల ఊరేగింపు, ఎదురుకోలు సేవ కార్యక్రమం నిర్వహించారు. 8.30గంటలకు కళాకారులతో సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఈఓ మహేశ్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, స్థానిక నాయకులు శ్రీనివాసరెడ్డి, అశోక్, రాజబాపు తదితరులు పాల్గొన్నారు. శుభానంద–ముక్తీశ్వరుల కల్యాణానికి ఏర్పాట్లు.. మహాశివరాత్రి సందర్భంగా బుధవారం సాయంత్రం 4.35గంటలకు శ్రీముక్తీశ్వరస్వామి–శ్రీశుభానందదేవిల కల్యాణం వైభవోపేతంగా నిర్వహించనున్నారు. ఈకార్యక్రమానికి తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి భక్తులు భారీగా తరలి రానున్నారు. కల్యాణంతో పాటు అర్ధరాత్రి లింగోద్భవపూజకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గోదావరి వద్ద జల్లు స్నానాలు, మహిళలు దుస్తులు మార్చుకునే గదులు, మూడు చోట్ల పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. మంగళవారం కాటారం సబ్‌కలెక్టర్ మయాంక్‌సింగ్ ఏర్పాట్లు పరిశీలించారు. 300 మందితో ఎస్పీ కిరణ్‌ఖరే ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. -
టీచర్ గౌరవం పెంచే అభ్యర్థిని గెలిపించండి
నయీంనగర్: ఉపాధ్యాయ సమస్యలు తెలిసి నిజాయితీతో పనిచేసే వారికి, టీచర్ గౌరవం పెంచే అభ్యర్థికి ఓటువేయాలని ఎమ్మెల్సీ కోదండరాం ఉపాధ్యాయులను కోరారు. ఈ మేరకు మంగళవారం హనుమకొండలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వరంగల్–ఖమ్మం–నల్లగొండ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి పన్నాల గోపాల్‌రెడ్డికి మద్దతు తెలిపి మాట్లాడారు. ప్రస్తుతం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. అయితే డబ్బులకు ఆశపడి ఓటు అమ్ముకుంటే రాబోయే రోజుల్లో ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కావన్నారు. విద్యాశాఖలోని అన్ని స్కూళ్లలో పనిచేసే ఉపాధ్యాయులకు గ్రీన్ చానల్ ద్వారా జీతాలు ఇవ్వాలని, పెన్షన్ ఉద్యోగి హక్కు అని తెలిపారు. పన్నాల గోపాల్‌రెడ్డి నాలుగు దశాబ్దాలుగా ఉపాధ్యాయ సమస్యల పరిష్కార ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారన్నారు. వారి సమస్యలు బలంగా లేవనెత్తి ఉపాధ్యాయులకు న్యాయం చేకూర్చారన్నారు. అభ్యర్థి పన్నాల గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు ఇచ్చే తాయిలాలకు అమ్ముడుపోకుండా, జాతి నిర్మాతలైన ఉపాధ్యాయుల గౌరవం పెంచేలా నిజాయితీ, నిబద్ధత కలిగిన వారిని ఎన్నుకోవాలని కోరారు. సమావేశంలో రాజేంద్రప్రసాద్, నాగేశ్వర్ యాదవ్, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు ఓటును అమ్ముకోవద్దు ఎమ్మెల్సీ కోదండరాం -
ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధికి కృషి
నయీంనగర్/జనగామ రూరల్ : ఉపాధ్యాయ, అధ్యాపకుల సమస్యల పరిష్కారంతోపాటు ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తానని, తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని వరంగల్–ఖమ్మం–నల్లగొండ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ఉపాధ్యాయులను కోరారు. మంగళవారం హనుమకొండ ప్రెస్ క్లబ్లో, జనగామ జిల్లాకేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సిట్టింగ్ ఎమ్మెల్సీగా టీచర్ల సమస్యలపై తాను చేసిన పోరాటం, పరిష్కరించిన సమస్యలను గ్రహించాలని కోరారు. తాను గెలిచిన వెంటనే ముఖ్యమైన ఉపాధ్యాయ, అధ్యాపకుల, ప్రైవేట్ టీచర్ల పది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ధన రాజకీయాలకు, నిబద్ధతకు మధ్య ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. ఉపాధ్యాయులను కులం, మతం పేరుతో విభజించాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఆయా కార్యక్రమాల్లో మాణిక్‌రెడ్డి, సదానందం, సదాశివారెడ్డి, తాడూరు సుధాకర్, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రంజిత్ కుమార్, టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, వివిధ సంఘాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చంద్రశేఖర్ రావు, వెంకటేశ్, ఎన్ఎన్ రాజు, అంకూషావలి, చిక్కుడు శ్రీనివాస్, లక్ష్మయ్య, శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి -
సరోత్తంరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి
వరంగల్ చౌరస్తా : బీజేపీ బలపర్చిన వరంగల్–ఖమ్మం–న ల్లగొండ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సరోత్తంరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం వరంగల్ హంటర్ రోడ్డులోని సత్యం కన్వెన్షన్ హాల్లో పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అధ్యక్షతన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఏజెంట్లతో సమావేశంలో నిర్వహించారు. ఈ సమావేశానికి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, వరంగల్ జిల్లా ఇన్చార్జ్ తూళ్ల వీరేందర్ గౌడ్ ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా మూడున్నర దశాబ్దాలకు పైగా అనుభవమున్న వ్యక్తి అని, ఉపాధ్యాయ సమస్యలు సరోత్తంరెడ్డికి తెలుసని పేర్కొన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కష్టాలు, కన్నీళ్లే మిగిలాయన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పెసరు విజయ్ చందర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జ్‌లు కపిలవాయి రవీందర్, మల్లాడి తిరుపతిరెడ్డి, జిల్లా ఎన్నికల కన్వీనర్ బైరి మురళీకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి బాకం హరిశంకర్ పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి -
ఐలోనిలో ప్రత్యేక పూజలు..
ఐనవోలు: మండల కేంద్రంలోని శ్రీమల్లికార్జునస్వామి ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా రెండోరోజు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి సమర్పించే నిత్య పూజలతోపాటు గవ్యాంత, వాస్తుపూజలు, పర్యగ్నికరణ, రుద్రహోమం, ప్రాతరౌపాసన బలిహరణలు నిర్వహించారు. లింగోధ్భవ కాలంలో స్వామిని అభిషేకించే 108 కలశాలను స్థాపించారు. కాగా, స్వామి, అమ్మవార్లను భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకున్నారు. మాడ వీధుల్లో ఉదయం అశ్వవాహన సేవ, సాయంత్రం శేషవాహన సేవ నిర్వహించగా భక్తులు భజనలు చేస్తూ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ అద్దంకి నాగేశ్వరరావు, ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్, ముఖ్య అర్చకులు శ్రీనివాస్, మధుకర్ శ ర్మ, వేద పండితులు విక్రాంత్ వినాయక్ జోషి, అర్చకులు నంద నం భానుప్రసాద్ శర్మ, నందనం మధుశర్మ, పాతర్లపాటి నరేశ్ శర్మ, ఉప్పుల శ్రీనివాస్, మడికొండ దేవేందర్, జూనియర్ అసిస్టెంట్ కిరణ్‌కుమార్, ఆలయ సిబ్బంది పాల్లొన్నారు. బందోబస్తు ఏర్పాట్ల పర్యవేక్షణ.. మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో పాటు పెద్దపట్నం వద్ద తొక్కిసలాట జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మామునూరు ఏసీపీ తిరుపతి, పర్వతగిరి సీఐ రాజగోపాల్ మంగళవారం బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఎస్సై శ్రీనివాస్‌కు సూచించారు.