International
-
పాక్ రైలు హైజాక్.. రెస్య్కూలో పాకిస్థాన్ ఆర్మీ ప్లాన్ సక్సెస్!
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్థాన్‌లో వేర్పాటువాద బలోచ్ మిలిటెంట్లు చెలరేగిపోయారు. ప్రయాణికుల రైలు జాఫర్ ఎక్స్‌ప్రెస్(Jaffar Express)పై దాడికి దిగి, హైజాక్ చేశారు. ఈ క్రమంలో భద్రతా సిబ్బందిని హతమార్చారు. దీంతో, రంగంలోకి దిగిన పాక్ భద్రతా బలగాలు.. 16 మంది ఉగ్రవాదాలను మట్టుబెట్టాయి. పాక్ సైనిక హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా బాంబు దాడులకు దిగాయి. అనంతరం, 104 మంది ప్రయాణికులను భద్రతా బలగాలను రక్షించాయి. రైలులో మిగిలిన ప్రయాణీకులను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అక్కడి అధికారులు తెలిపారు.ఇదిలా ఉండగా.. పాకిస్తాన్లో బలూచీ వేర్పాటువాదులు మంగళవారం ఏకంగా ఒక ప్రయాణికుల రైలునే హైజాక్ చేసేశారు. ఇది తమ పనేనని నిషేధిత బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ప్రకటించుకుంది. ‘500 మంది ప్రయాణికుల్లో కనీసం 30 మందిని కాల్చి చంపేశామని, 215 మందిని బందీలుగా పట్టుకున్నాం. మృతులతో పాటు బందీల్లో దాదాపుగా అంతా సైనికులే’ అని పేర్కొంది. దీంతో, బందీలను విడిపించేందుకు సైన్యం హుటాహుటిన రంగంలోకి దిగింది.🚨 TRAIN HIJACK IN PAKISTAN.Jaffar Express from Quetta to Peshawar HIJACKED after IED blast by Baloch rebels pic.twitter.com/d9HWcmP2PO— akhilesh kumar (@akumar92) March 12, 2025ఘటనా స్థలిని సైనిక హెలికాప్టర్లు పెద్ద సంఖ్యలో చుట్టుముట్టి బాంబు దాడులకు దిగాయి. దాంతో బీఎల్ఏ మండిపడింది. సైనిక చర్యను తక్షణం నిలిపేయకపోతే బందీలందరినీ చంపేస్తామంటూ పాక్ సర్కారును తీవ్రంగా హెచ్చరించింది. రాజకీయ ఖైదీలుగా నిర్బంధించిన బలూచీ నేతలు, కార్యకర్తలందరినీ 48 గంటల్లోపు బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేసింది. లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని స్పష్టం చేసింది. దాంతో సైనిక చర్యకు షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం తాత్కాలికంగా విరామం ప్రకటించింది.బలూచిస్తాన్‌తో పాటు పరిసర ప్రావిన్సుల్లో ఎమర్జెన్సీ విధించారు. ఘటనను కవర్ చేయకుండా మీడియాపై ప్రభుత్వం ఆంక్షలు విధించినట్టు చెబుతున్నారు. ముష్కరులతో ఎలాంటి సంప్రదింపులూ ఉండబోవని అంతర్గత శాఖ మంత్రి మొహసిన్ నక్వీ ప్రకటించారు. బందీల్లో దాదాపు 80 మందిని విడిపించినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మృతుల సంఖ్య 35 దాటిందన్నారు.#TrainHijack Jaffer Express hijack in Pakistan 🇵🇰 The Train 🚂 was on its way from Quetta to Peshawar when it was attached by the Beloch rebels about 150 passengers & 6 military 🎖️ personnel were made hostages #TrainHijack #TRAIN #Balochistan #PakistanTrainHijack #TrainHijack pic.twitter.com/h4rbGREMQT— X highlight*️⃣ (@Abu_officl) March 12, 2025గ్రేటర్ బలోచిస్థాన్ ఏర్పాటే లక్ష్యంపాకిస్థాన్‌లోని దాదాపు 44 శాతం భూభాగం తన సొంతమైన బలోచిస్థాన్ ప్రావిన్సులో చమురు, బొగ్గు, బంగారం, రాగి, సహజ వాయువు తదితర వనరులు పుష్కలంగా ఉన్నాయి. వీటి ఆదాయం పాక్ ఖజానా నింపుతోంది. కోటిన్నర జనాభా గల ఈ పర్వత రాష్ట్రంలో మాత్రం అత్యధిక పేదరికం ఉంది. 1947 నాటికి ఈ ప్రాంతం పలువురు స్థానిక పాలకుల అధీనంలో ఉండేది. వీరిలో శక్తిమంతుడైన అహ్మద్ యార్ ఖాన్ స్వతంత్ర బలోచ్ రాష్ట్రం కావాలని పట్టుబట్టారు. అలా చేస్తే బలోచిస్థాన్‌లో సోవియట్ యూనియన్ (రష్యా) తిష్ఠ వేస్తుందని బ్రిటిషర్లు ఆందోళన చెందారు. పాకిస్థాన్ సైన్యం బలోచ్ భూభాగంలోకి ప్రవేశించి ఒత్తిడి తీసుకురావడంతో 1948 మార్చి 27న అహ్మద్ యార్ ఖాన్ విలీనపత్రంపై బలవంతంగా సంతకం చేయాల్సి వచ్చింది. నాటి నుంచీ ఈ ప్రాంతంలో రగులుతున్న అసంతృప్తి నేటికీ చల్లారలేదు. ఈ నేపథ్యంలో 2000 సంవత్సరంలో పుట్టిందే ‘బలోచ్ లిబరేషన్ ఆర్మీ’ (బీఎల్ఏ). సహజ వనరులను కాపాడుకొని, గ్రేటర్ బలోచిస్థాన్ ఏర్పాటు చేసుకోవడమన్నదే వీరి లక్ష్యం. గత అయిదేళ్లుగా ఈ పోరాటం తన పంథా మార్చుకొని మిలిటెన్సీ బాట పట్టింది. సాయుధ పోరాటాలు చేస్తున్న వివిధ దళాలు ఏకమై ‘బలోచ్ నేషనల్ ఆర్మీ’ ఏర్పాటు చేశాయి. పాక్‌తోపాటు అమెరికా, బ్రిటన్ బీఎల్ఏను ఉగ్రసంస్థగా ప్రకటించాయి.ఇలా జరిగింది..దాదాపు 500 మంది ప్రయాణికులతో కూడిన జాఫర్ ఎక్స్‌ప్రెస్ మంగళవారం ఉదయం 9 గంటలకు బలూచిస్తాన్‌లోని క్వెట్టా నుంచి పెషావర్‌కు బయల్దేరింది. బొలాన్ జిల్లాలో కొండ ప్రాంతంలో కనుమ సమీపంలో గుదలార్, పెరో కున్రీ ప్రాంతాల మధ్య 8వ నంబర్ టన్నెల్ సమీపంలో బీఎల్ఏ సాయుధులు అప్పటికే రైలు పట్టాలను పేల్చేసి మాటు వేశారు. అక్కడికి చేరుకుని అతి నెమ్మదిగా వెళ్తున్న రైలు ఒక్కసారిగా పట్టాలు తప్పింది. వెంటనే బలూచీ సాయుధులు భారీ సంఖ్యలో రైలును చుట్టుముట్టారు. నేరుగా ఇంజన్‌పైకి కాల్పులు జరపడంతో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు.రైలు ఆగిపోగానే మొత్తం 9 బోగీల్లోకీ చొరబడ్డారు. వారికి, రైల్లోని భద్రతా సిబ్బందికి మధ్య కాసేపు కాల్పులు జరిగాయి. అనంతరం రైలును బీఎల్ఏ సాయుధులు తమ అధీనంలోకి తీసుకుని సమీపంలోని టన్నెల్లోకి తరలించారు. ప్రయాణికుల్లో సాధారణ పౌరులు, మహిళలు, చిన్నారులను ఒకవైపు, సైనికులను మరోవైపు విడదీశారు. అనంతరం సైనికుల్లో 20 నుంచి 30 మందిని కాల్చి చంపారు. సాధారణ పౌరులను వదిలేశారు. 215 మందిని బందీలుగా చేసుకున్నారు. వారిలో అత్యధికులు పోలీసు, యాంటీ టెర్రరిజం ఫోర్స్, ఐఎస్ఐకు, సైన్యానికి చెందినవారే ఉన్నారు. వారంతా సెలవులపై స్వస్థలాలకు వెళ్తున్నారు అని స్థానిక మీడియా పేర్కొంది. ఘటనా స్థలిలో మొబైల్ నెట్వర్క్ వంటివేమీ లేకపోవడంతో రైల్లోని సిబ్బందితో ఎలాంటి కాంటాక్టూ వీలవడం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దాడికి పాల్పడింది బీఎల్ఏలోని మజీద్ బ్రిగేడ్‌గా భావిస్తున్నారు. వారితో పాటు స్పెషల్ టాక్టికల్ ఆపరేషన్స్ స్క్వాడ్, ఫతే స్క్వాడ్ ప్రత్యేక విభాగాలు కూడా దాడిలో పాల్గొన్నట్టు బీఎల్ఏ ప్రకటించింది. -
జెలెస్కీ గ్రీన్‌సిగ్నల్.. పుతిన్ ప్లానేంటి?
జెద్దా: మూడేళ్లుగా కొనసాగుతున్న రష్యా–ఉక్రెయిన్ యుద్దానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి ఉక్రెయిన్ అంగీకరించింది. ఈ నేపథ్యంలో ఇరు పక్షాలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి.అమెరికా, ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ విషయమై సౌదీ అరేబియాలోని జెద్దా వేదికగా ఉన్నతాధికారుల స్థాయిలో చర్చలు జరిగాయి. ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పడమే లక్ష్యంగా చర్చించారు. ఈ క్రమంలో అమెరికా (USA) ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి ఉక్రెయిన్ అంగీకరించింది. ఈ నేపథ్యంలో, సైనిక సాయం, నిఘా భాగస్వామ్యానికి సంబంధించి తక్షణమే ఉక్రెయిన్‌పై విధించిన ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు అమెరికా తెలిపింది. ఇక ఖనిజాల తవ్వకానికి సంబంధించి సాధ్యమైనంత త్వరగా ఒప్పందానికి వచ్చేందుకు రెండు దేశాలు నిర్ణయానికి వచ్చాయి.ఈ సందర్బంగా అమెరికా తరఫున విదేశాంగ మంత్రి మార్కో రుబియో మాట్లాడుతూ.. ఉక్రెయిన్ కాల్పుల విరమణకు ఓకే చెప్పింది. ఇది యుద్దం ముగింపునకు కీలక పరిణామం. ఈ చర్చల సారాంశాన్ని రష్యాకు కూడా తెలియజేస్తాం. ఇప్పుడు బంతి పుతిన్ చేతిలో ఉంది. రష్యా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి’ అని చెప్పుకొచ్చారు. ఇక, ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందానికి సంబంధించి రష్యాతో అమెరికా మాట్లాడనుంది.🚨 BREAKING: Ukraine has agreed to a US proposal for a 30-day ceasefire, contingent on Russia’s acceptance.The US will also resume military aid to Ukraine and lift the pause on intelligence-sharing as part of the agreement.#VMNews pic.twitter.com/FN8QlYlE7C— Virgin Media News (@VirginMediaNews) March 11, 2025రష్యాపైకి ఉక్రెయిన్ డ్రోన్లు..మరోవైపు.. ఉక్రెయిన్ మంగళవారం రష్యాపైకి అతిపెద్ద డ్రోన్ల దాడికి దిగింది. రష్యాలోని 10 ప్రాంతాలపైకి దూసుకొచ్చిన 337 డ్రోన్లను కూల్చివేసినట్టు రష్యా మిలటరీ తెలిపింది. డ్రోన్ల దాడిలో ఒకరు చనిపోగా పదుల సంఖ్యల జనం గాయపడినట్లు రష్యా తెలిపింది. యుద్ధానికి ముగింపు పలికే లక్ష్యంతో ఉక్రెయిన్–అమెరికా మధ్య సౌదీ అరేబియాలోని జెడ్డాలో మంగళవారం చర్చలు మొదలవడానికి కొద్ది గంటల ముందు ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. తాజా దాడిపై ఉక్రెయిన్ స్పందించలేదు. అత్యధికంగా సరిహద్దుల్లోని కస్క్ ప్రాంతంలోకి వచ్చిన 126 డ్రోన్లను కూల్చినట్లు రష్యా మిలటరీ తెలిపింది. రాజధాని మాస్కో దిశగా వచ్చిన మరో 91 డ్రోన్లను ధ్వంసం చేశామంది. ఇంకా, సరిహద్దులకు సమీపంలోని బెల్గొరోడ్, బ్రయాన్‌స్‌్క, వొరొనెజ్‌తోపాటు సుదూర ప్రాంతాలైన కలుగ, లిప్‌ట్‌స్‌్క, నిజ్నీ నొవ్‌గొరోడ్, ఒరియోల్, రైజాన్‌లపైకి కూడా ఇవి వచ్చాయని వివరించింది. -
మనిషిని కుక్క షూట్ చేసింది!!
మెంఫిస్ సిటీ: కుక్క మనిషిని కరవడం వార్తకాదు.. మనిషే కుక్కను కరవడం వార్త అని గతంలో ఒక ఫేమస్ వాక్యం ఉండేది. ఇప్పుడు దానిని ‘‘మనిషి కుక్కను షూట్ చేయడంకాదు.. కుక్క మనిషిని షూట్ చేయడం వార్త’’ అని మార్చి రాసుకోవాలేమో. ఇలాంటి ఉదంతం సోమవారం తెల్లవారుజామున అమెరికాలో జరిగింది. టెన్నిస్సీ రాష్ట్రంలోని మెంఫిస్ సిటీ సమీప ఫ్రేసర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. జెరాల్డ్ కిర్క్వుడ్ అనే వ్యక్తి తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి బెడ్‌పై నిద్రిస్తుండగా తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఏడాది వయస్సున్న పిట్‌బుల్ జాతి పెంపుడు శునకం ఆ గదికి వచ్చింది. వీళ్లిద్దరూ నిద్రిస్తూ బెడ్ మీద ఒక గన్ను అలాగే వదిలేశారు. దాంట్లో బుల్లెట్లు లోడ్‌చేసి ఉన్నాయి. శునకం ఒక్క ఉదుటున బెడ్ మీదకు దూకింది. అది సరిగ్గా గన్ ట్రిగ్గర్‌పై దూకడంతో ట్రిగ్గర్ నొక్కుకుని గన్ పేలింది. దీంతో దూసుకొచి్చన బుల్లెట్ ఆ వ్యక్తి ఎడమ తొడను పైపైన చీలిస్తూ బయటకు దూసుకెళ్లింది. బుల్లెట్ గాయంతో జెరాల్డ్, అతని గర్ల్‌ఫ్రెండ్‌ల నిద్ర మొత్తం ఒక్క దెబ్బతో పోయింది. రక్తమోడుతున్న జెరాల్డ్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆయనకు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారు. శునకం కారణంగా గన్ పేలిన ఘటనపై బాధితుడిని మీడియా ప్రశ్నించింది. కుక్క దూకడంతో నిద్రలేచారా? బుల్లెట్ గాయంతో లేచారా? అని ప్రశ్నించగా రెండూ ఒకేసారి జరిగాయని ఆయన నవ్వుతూ చెప్పడం విశేషం. ఆ ఆయుధాన్ని అతని గర్ల్‌ఫ్రెండ్ తర్వాత తీసుకెళ్లింది. ఓరియో పేరున్న ఆ కుక్కపై పోలీసులు ఎలాంటి కేసు నమోదుచేయలేదు. -
నా ఐస్‌క్రీమ్ తినేసింది అమ్మను అరెస్ట్ చేయండి
జీవితంలో కొన్ని పనులు చేయకూడదంటారు. అందులో కొత్తది ఒకటి వచ్చి చేరింది. అదేంటంటే చిన్నారుల చేతుల్లోని ఐస్‌క్రీమ్‌ను పొరపాటున కూడా దొంగలించకూడదు. దొంగలిస్తే పోలీసులు ఖచ్చితంగా వస్తారు. భారత్‌లో వస్తారో లేదో తెలీదుగానీ అమెరికాలో మాత్రం ఖచ్చితంగా వస్తారు. అరెస్ట్చేస్తారో లేదో తెలీదుగానీ వారు అవాక్కవడం మాత్రం ఖాయం. ఇటు చిన్నారి తల్లి, అటు పోలీసులు సైతం కొద్దిసేపు నవ్వుకున్న సరదా ఉదంతం అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రంలోని మౌంట్ ప్లీసాంట్ పట్టణంలో గత మంగళవారం జరిగింది. అటు దొంగతనం.. ఇటు 911కు ఫోన్ ఇష్టంగా తింటున్న ఐస్‌క్రీమ్‌ను కన్న తల్లి గభాలున లాక్కుని తినేసే సరికి నాలుగేళ్ల బుడతడికి పట్టరాని కోపం వచ్చింది. ఏడ్వడం మానేసి తల్లికి ఎలాగైనా గుణపాఠం నేర్పాలని నిశ్చయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా, న్యాయం కోసం ఫోన్లైన్లో పోలీసుల తలుపు తట్టాడు. 911 నంబర్‌కు ఫోన్‌చేసి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పాడు.నాలుగేళ్ల పిల్లాడు చెబుతున్న దాంట్లో నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు ఇద్దరు మహిళా పోలీసులు రంగంలోకి దిగారు. అంతకుముందు పిల్లాడు, పోలీసుల మధ్య కొద్దిసేపు ఫోన్ సంభాషణ జరిగింది. ఇప్పుడా ఆడియో సంభాషణ రికార్డ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. చిన్నారి వాదన విన్న వారంతా తెగ నవ్వుకున్నారు.అమ్మను తీసుకెళ్లండి911 డిస్పాచ్ విభాగంలో ఉన్న పోలీసు ఒకరు ఈ పిల్లాడి ఫోన్‌కాల్‌కు స్పందించారు. సమస్య ఏంటని ప్రశ్నించారు. ‘‘మా అమ్మ చెడ్డదైపోయింది’’అని చెప్పాడు. సరేగానీ అసలేమైందని అధికారి అడగ్గా.. ‘‘వెంటనే వచ్చి మా అమ్మను బంధించండి’’అని సమాధానమిచ్చాడు. లాక్కుని ఐస్‌క్రీమ్ తింటున్న తల్లి.. పిల్లాడు పోలీసులకు ఫోన్‌చేయడం చూసి అవాక్కైంది. వెంటనే తేరుకుని పిల్లాడి నుంచి ఫోన్ లాక్కుని ‘‘ఫోన్ చేయాల్సిన పెద్ద విషయం ఏమీ లేదండి. మా అబ్బాయి వయసు కేవలం నాలుగేళ్లు మాత్రమే. వీడి ఐస్‌క్రీమ్ తిన్నాను. అందుకే మీకు ఫోన్‌చేసి ఉంటాడు’’అని చెప్పింది. వీళ్లు ఓవైపు మాట్లాడుతుంటే పిల్లాడు మాత్రం తన వాదనను కొనసాగించాడు.ఐస్‌క్రీమ్ లాక్కుని అమ్మ పెద్ద తప్పు చేసిందని పిల్లాడు అరవడం ఆ ఫోన్‌కాల్‌లో రికార్డయింది. విషయం అర్థమై నవ్వుకున్న పోలీసులు 911 నిబంధనల ప్రకారం పిల్లాడి ఇంటికెళ్లారు. పోలీసుల రాక గమనించి పిల్లాడు మళ్లీ వాళ్లకు నేరుగా ఫిర్యాదుచేశాడు. అమ్మను అరెస్ట్‌చేసి జైలుకు తీసుకెళ్లాలని డిమాండ్చేశాడు. ‘‘సరే. మీ అమ్మను నిజంగానే జైళ్లో వేస్తాం. నీకు సంతోషమేగా?’’అని పోలీసులు అడగ్గా.. ‘‘వద్దు వద్దు. నాకు కొత్త ఐస్‌క్రీమ్ ఇస్తే సరిపోతుంది’’అని అసలు విషయం చివరకు చెప్పాడు. దీంతో పిల్లాడి ఐస్ గోల అక్కడితో ఆగింది. అయితే రెండు రోజుల తర్వాత పోలీసులు మళ్లీ ఆ పిల్లాడి ఇంటికొచ్చారు. మళ్లీ ఎందుకొచ్చారబ్బా అని సందేహంగా చూస్తున్న పిల్లాడి చేతిలో పోలీసులు పెద్ద ఐస్‌క్రీమ్‌ను పెట్టారు. దాంతో చిన్నారి సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. ఈ ఐస్‌క్రీమ్ వృత్తాంతాన్ని పోలీసులు మీడియాకు వెల్లడించడంతో ఈ విషయం అందరికీ తెల్సింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు దుతర్తే అరెస్ట్
మనీలా: ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రొడ్రిగో దుతర్తే మంగళవారం అరెస్ట య్యారు. హాంకాంగ్ నుంచి వచ్చిన ఆయన్ను మనీలా లోని అంతర్జాతీయ విమా నాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో డ్రగ్స్ అక్రమ రవాణాదారులను చంపేయాలంటూ దుతర్తే ఇచ్చిన పిలుపుతో వేలాది మంది దారుణ హత్యకు గురవడం తీవ్ర వివా దాస్పదమైంది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ)ఆయనపై విచారణకు చర్యలు ప్రారంభించింది.అయితే, ఆ విచారణ నుంచి తప్పించుకునేందుకు ఐసీసీ నుంచి వైదొలగుతున్నట్లు అధ్యక్షుడిగా ఉన్న దుతర్తే ప్రకటించారు. 2022 ఎన్నికల్లో ఫెర్డినాండ్ మార్కోస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అనంతర పరిణామాల్లో దుతర్తేపై వచ్చిన ఆరోప ణలపై విచారణను తిరిగి ప్రారంభించనున్నట్లు 2023 జూలైలో ఐసీసీ ప్రకటించింది.జన హననా నికి పాల్పడ్డారంటూ వచ్చిన ఆరోపణలపై దుతర్తే కు వారెంట్లు జారీ చేసింది. ఈ వారెంట్లకు స్పందనగానే దుతర్తేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ తెలి పారు. దుతర్తేపై విచారణకు ఐసీసీకి సహక రిస్తామని అధ్యక్షుడు మార్కోస్ ప్రకటించారు. -
మినీ ఇండియా.. మారిషస్
పోర్ట్ లూయిస్: భారత్‌కు, గ్లోబల్ సౌత్‌కు మధ్య మారిషస్ ఒక వంతెన అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మారిషస్ కేవలం భాగస్వామ్య దేశం మాత్రమే కాదని, భారతదేశ కుటుంబంలో ఒక అంతర్భాగమని చెప్పారు. మారిషస్ అంటే ‘మినీ ఇండియా’ అని అభివర్ణించారు. ఆయన మంగళవారం మారిషస్ రాజధాని పోర్ట్ లూయిస్‌లో ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో మారిషస్ ప్రధాని డాక్టర్ నవీన్‌చంద్ర రామ్‌గూలమ్, వీణా దంపతులు, మంత్రివర్గ సభ్యులు సైతం పాల్గొన్నారు.భారత్, మారిషస్ మధ్య బలమైన చారిత్రక సంబంధాలు ఉన్నాయని మోదీ గుర్తుచేశారు.ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా(ఓసీఐ) కార్డులను రామ్‌గూలమ్ దంపతులకు మోదీ అందజేశారు. మారిషస్‌లోని ఏడో తరం భారతీయులకు కూడా ఈ కార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. అంతకుముందు రెండు రోజుల పర్యటన నిమిత్తం మారిషస్‌కు చేరుకున్న ప్రధాని మోదీకి చిరస్మరణీయమైన స్వాగతం లభించింది.రాజధాని పోర్ట్ లూయిస్‌లోని సర్ సీవూసాగర్ రామ్‌గూలమ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో మారిషస్ ప్రధాని నవీన్‌చంద్ర రామ్‌గూలమ్‌తోపాటు ఉప ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, నేషనల్ అసెంబ్లీ స్పీకర్, ప్రతిపక్ష నేత, విదేశాంగ మంత్రి, కేబినెట్ సెక్రెటరీ తదితరులు ఘన స్వాగతం పలికారు. మోదీని స్వాగతించడానికి మొత్తం మంత్రివర్గం తరలిరావడం గమనార్హం. మంత్రులు, అధికారులు సహా 200 మందికి ఆయన కోసం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. బిహారీ సంప్రదాయ స్వాగతం మారిషస్‌లో నివసిస్తున్న భారతీయులు ప్రధాని మోదీకి సాదర స్వాగతం పలికారు. మోదీ బస చేసిన హోటల్ వద్ద భారతీయ మహిళలు సంప్రదాయ బిహారీ సాంస్కృతిక సంగీతభరిత నృత్యం ‘గీత్ గవాయ్’తో ఆయనను స్వాగతించారు. అలాగే భోజ్‌పురి సంప్రదాయ గీతం ఆలపించారు. భారత త్రివర్ణ పతాకం చేతబూని ‘భారత్ మాతాకీ జై’ అని బిగ్గరగా నినదించారు. తనకు లభించిన అపూర్వమైన గౌరవ మర్యాదల పట్ల ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. మారిషస్ అధ్యక్షుడికి గంగాజలం బహూకరణ మారిషస్ అధ్యక్షుడు ధరమ్ గోకుల్‌కు ప్రధాని మోదీ అరుదైన కానుక అందజేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్‌రాజ్‌లో త్రివేణి సంగమం వద్ద జరిగిన మహా కుంభమేళా సమయంలో ఇత్తడి, రాగి పాత్రలో సేకరించిన పవిత్ర గంగజలాన్ని బహూకరించారు. బిహార్‌లో సాగు చేసిన సూపర్‌ఫుడ్ మఖానాతోపాటు మరికొన్ని బహుమతులు సైతం అందించారు. అలాగే ధరమ్ గోకుల్ భార్య బృందా గోకుల్‌కు బనారసీ చీరను కానుకగా ఇచ్చారు. గుజరాత్ కళాకారులు తయారు చేసిన సందేలి చెక్కపెట్టెలో ఈ చీరను అందజేశారు. అలాగే ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా(ఓసీఐ) కార్డును ధరమ్ గోకుల్ దంపతులకు అందించారు.దివంగత నేతలకు నివాళులు భారత్, మారిషస్ ప్రధానమంత్రులు మోదీ, నవీన్‌చంద్ర రామ్‌గూలమ్ సర్ సీవూసాగర్ రామ్‌గూలమ్ బొటానికల్ గార్డెన్‌ను సందర్శించారు. ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. మారిషస్ దివంగత నేత సీర్ సీవూసాగర్ రామ్‌గూలమ్ సమాధి వద్ద మోదీ పుష్పగుచ్ఛం ఉంచి ఘనంగా నివాళులల్పించారు. అలాగే మాజీ అధ్యక్షుడు, మాజీ ప్రధాని అనిరుధ్ జగన్నాథ్ సమాధి వద్ద నివాళులల్పించారు. వారిని స్మరించుకున్నారు.మోదీకి మారిషస్ అత్యున్నత పురస్కారం భారత ప్రధానమంత్రి మోదీని తమ దేశ అత్యున్నత పురస్కారంతో సత్కరించనున్నట్లు మారిషస్ ప్రధాని రామ్‌గూలమ్ ప్రకటించారు. మోదీకి ప్రతిష్టాత్మక ‘ద గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అండ్ కీ ఆఫ్ ద ఇండియన్ ఓషియన్’ అవార్డు అందజేస్తామని వెల్లడించారు. ఈ పురస్కారం అందుకోనున్న మొట్టమొదటి భారత ప్రధానిగా మోదీ రికార్డుకెక్కబోతున్నారు. -
పాక్‌లో బలూచ్ భగభగలు
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ఏకంగా రైలునే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎ ల్ఏ) తమ అధీనంలోకి తెచ్చుకోవడంతో బలూ చిస్తాన్ స్వయంప్రతిపత్తి అంశం మరోసారి తెరమీదకొచ్చింది. పాతికేళ్లుగా సాయుధ ఉద్య మపంథాను అనుసరిస్తున్న బీఎల్ఏ మూలాలు ఆ ప్రాంత ప్రజల అసంతృప్తి, ఆగ్ర హంలో ఉన్నాయి. బలవంతంగా తమను స్వతంత్ర పాక్‌లో కలిపేసి తమ అభివృద్ధిని కాల రాశారని బలూచ్ ప్రజలు భావిస్తుండటమే ఈ ఉద్యమం ఇంకా కొనసాగడానికి అసలు కారణం.ఎవరీ బలూచ్‌లు?పాకిస్తాన్‌లోని నైరుతి ప్రాంతాన్ని బలూచిస్తాన్‌గా పిలుస్తారు. ఇది పాక్‌లోని ఒక ప్రావిన్స్‌గా కొనసాగుతోంది. ఇక్కడ స్థానిక బలూచ్ తెగ ప్రజల పూర్వీకులు సమీప ఇరాన్, అఫ్గానిస్తాన్‌లోనూ స్థిరపడ్డారు. ఇరాన్‌కు ఆగ్నేయంగా, అఫ్గానిస్తాన్‌కు దక్షిణంగా ఈ సువిశాల ప్రాంతం విస్తరించి ఉంది. దాదాపు 3,50,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణమున్న బలూచ్ ప్రాంతం దేశంలోనే అతిపెద్ద ప్రావిన్స్ అయినప్పటికీ అభివృద్ధి విషయంలో ఆమడదూరంలో నిలిచిపోయింది. ఇక్కడ జనాభా కూడా అత్యల్పం. మొత్తం పాక్ విస్తీర్ణంలో బలూచ్ 44 శాతం ఉంటుంది. దశాబ్దాలక్రితం స్వతంత్ర ప్రాంతంగా కొనసాగిన బలూచిస్తాన్‌ను ఆ తర్వాత బ్రిటిషర్లు ఆక్రమించి స్థానిక కలాట్ సంస్థానం(ఖానేట్) పాలకుడు ఖాన్‌కు పరిపాలనా బాధ్యతలు అప్పగించారు.1948 మార్చి 27వ తేదీన బలూచిస్తాన్‌ను పాకిస్తాన్లో అధికారికంగా విలీనం చేశారు. ఈ విలీన ప్రక్రియను నాటి బలూచిస్తాన్ పాలకుల్లోని ఒక వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ వ్యతిరేకతే తదనంతరకాలంలో తీవ్ర నిరసనగా, వేర్పాటువాదంగా చివరకు బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ)గా అవతరించింది. 1948, 1958–59, 1962–63, 1973–77 కాలాల్లో బలూచ్ స్వతంత్య్ర ఉద్యమాలు కొనసాగిన నాటి పాకిస్తాన్ ప్రభుత్వాలు ఆ ఆందోళనలను ఉక్కుపాదంతో అణిచివేశాయి. ఈ కాలంలో వేలాది మంది బలూచ్ ప్రజలు అదృశ్యమయ్యారు.అక్కడి కీలక బలూచ్ నేతలు కొందరు దేశం వీడారు. కొందరు ముఖ్యనేతలు హత్యకు గురయ్యారు. 2003 ఏడాది నుంచి మళ్లీ బీఎల్ఏ ఆవిర్భావంతో స్వతంత్ర బలూచ్ కోసం పోరాటం ఉధృతమైంది. సాయుధ బాటలో పయనిస్తూ తరచూ పాకిస్తాన్ సైన్యం, ప్రభుత్వ ఆస్తులు, పౌరులపై దాడులకు తెగబడుతోంది. బలూచ్ ప్రజల స్వయంనిర్ణయాధికారం, పాకిస్తాన్ నుంచి విడివడి ప్రత్యేక ప్రాంతంగా ఏర్పడాలన్న లక్ష్యాలతో బీఎల్ఏ పోరాడుతోంది. ఉద్యమా న్ని అణచివేసే క్రమంలో తీవ్రస్థాయిల మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని పాకిస్తాన్‌పై అంతర్జాతీయంగా ఆరోపణలు వెల్లువెత్తాయి. అపార సంపదపర్వతమయ బలూచిస్తాన్‌లో అపార సహజసంపద సందప దాగి ఉంది. ఇక్కడ సహజవాయు నిక్షేపాలు ఎక్కువ. దక్షిణ పాకిస్తాన్లో అరేబియా సముద్రతీరం వెంట ఉన్న ఏకైక అతిపెద్ద గ్వాదర్ పోర్ట్ బలూచిస్తాన్‌లోనే ఉంది. సరకు రవాణాకు అనువైన ప్రాంతం. దీంతో చైనా ఈ ప్రాంతంపై కన్నేసింది. చైనా, పాకిస్తాన్ ఆర్థిక కారిడార్(సీపెక్)ను నిర్మించాలని చైనా తలపోయడం తెల్సిందే. ఈ సీపెక్ బలూచిస్తాన్ గుండా వెళ్తుంది.సీపెక్ ఈ ప్రాంత అభివృద్ధిని పెంచుతుందని పాకిస్తాన్ ప్రభుత్వం చెబుతుండగా తమ ప్రాంత సంపదను కొల్లగొట్టడమే ప్రభుత్వ లక్ష్యమని స్థానిక బలూచ్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అందుకే ఇక్కడ సీపెక్ సంబంధ ప్రాజెక్టులపై తరచూ దాడులుచేస్తున్నారు. ముఖ్యంగా చైనా సిబ్బందిని బీఎల్ఏ లక్ష్యంగా చేసుకుంది. దశాబ్దాలుగా పేదరికంలో మగ్గిపోవడానికి పాకిస్తాన్ ప్రభుత్వ అలసత్వం, నిర్లక్ష్యమే కారణమని బలూచ్ ప్రాంతవాసుల్లో ఒక అభిప్రాయం గూడుకట్టుకుపోయింది.ఇది బీఎల్ఏ సాయుధపోరుకు నైతిక, ఆర్థిక స్థైర్యాన్ని ఇస్తోంది. బీఎల్ఏకు పాక్ సైన్యానికి మధ్య జరుగుతున్న ఘర్షణల్లో ఇప్పటికే వందలాది మంది అమాయక ప్రజలు ప్రాణాలుకోల్పోయారు. దీంతో వేర్పాటువాదం బాటలో పయనిస్తున్న బీఎల్ఏను ఇప్పటికే అమెరికా, బ్రిటన్లు ఉగ్రసంస్థగా ప్రకటించాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పాక్‌లో రైలు హైజాక్
కరాచీ/ఇస్లామాబాద్: పాకిస్తాన్లో బలూచీ వేర్పాటువాదులు ఘోరానికి తెగబడ్డారు. మంగళవారం బలూచిస్తాన్ ప్రావిన్సులో ఏకంగా ఒక ప్రయాణికుల రైలునే హైజాక్ చేసేశారు. ఇది తమ పనేనని నిషేధిత బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ప్రకటించుకుంది. ‘‘500 మంది ప్రయాణికుల్లో కనీసం 30 మందిని కాల్చి చంపేశామని, 215 మందిని బందీలుగా పట్టుకున్నాం. మృతులతో పాటు బందీల్లో దాదాపుగా అంతా సైనికులే’’ అని పేర్కొంది. దీనిపై పాక్ ప్రభుత్వం ఇప్పటిదాకా అధికారికంగా స్పందించలేదు. బందీలను విడిపించేందుకు సైన్యం హుటాహుటిన రంగంలోకి దిగింది.ఘటనా స్థలిని సైనిక హెలికాప్టర్లు పెద్ద సంఖ్యలో చుట్టుముట్టి బాంబు దాడులకు దిగాయి. దాంతో బీఎల్ఏ మండిపడింది. సైనిక చర్యను తక్షణం నిలిపేయకపోతే బందీలందరినీ చంపేస్తామంటూ పాక్ సర్కారును తీవ్రంగా హెచ్చరించింది. రాజకీయ ఖైదీలుగా నిర్బంధించిన బలూచీ నేతలు, కార్యకర్తలందరినీ 48 గంటల్లోపు బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేసింది. లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని స్పష్టం చేసింది. దాంతో సైనిక చర్యకు షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం తాత్కాలికంగా విరామం ప్రకటించింది. తీసుకోవాల్సిన చర్యలపై మల్లగుల్లాలు పడుతోంది.బలూచిస్తాన్‌తో పాటు పరిసర ప్రావిన్సుల్లో ఎమర్జెన్సీ విధించారు. ఘటనను కవర్ చేయకుండా మీడియాపై ప్రభుత్వం ఆంక్షలు విధించినట్టు చెబుతున్నారు. ముష్కరులతో ఎలాంటి సంప్రదింపులూ ఉండబోవని అంతర్గత శాఖ మంత్రి మొహసిన్ నక్వీ ప్రకటించారు. కడపటి వార్తలు అందే సమయానికి బీఎల్ఏ సాయుధులపై పాక్ సైనిక హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా బాంబు దాడులకు దిగినట్టు సమాచారం.బందీల్లో దాదాపు 80 మందిని విడిపించినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మృతుల సంఖ్య 35 దాటిందన్నాయి. బలూచిస్తాన్ ప్రావిన్సు అఫ్గానిస్తాన్, ఇరాన్ సరిహద్దుల్లో ఉంటుంది. పాక్ నుంచి స్వాతంత్య్రం కోసం పలు స్థానిక తెగలతో కూడిన వేర్పాటువాద సంస్థలు దశాబ్దాలుగా పోరాడుతున్నాయి. వాటిలో బీఎల్ఏ అతి పెద్దది. దానిపై పాక్‌తో పాటు అమెరికా, బ్రిటన్లలో కూడా నిషేధముంది.ఇలా జరిగిందిదాదాపు 500 మంది ప్రయాణికులతో కూడిన జాఫర్ ఎక్స్‌ప్రెస్ మంగళవారం ఉదయం 9 గంటలకు బలూచిస్తాన్‌లోని క్వెట్టా నుంచి పెషావర్‌కు బయల్దేరింది. బొలాన్ జిల్లాలో కొండ ప్రాంతంలో కనుమ సమీపంలో గుదలార్, పెరో కున్రీ ప్రాంతాల మధ్య 8వ నంబర్ టన్నెల్ సమీపంలో బీఎల్ఏ సాయుధులు అప్పటికే రైలు పట్టాలను పేల్చేసి మాటు వేశారు. అక్కడికి చేరుకుని అతి నెమ్మదిగా వెళ్తున్న రైలు ఒక్కసారిగా పట్టాలు తప్పింది. వెంటనే బలూచీ సాయుధులు భారీ సంఖ్యలో రైలును చుట్టుముట్టారు. నేరుగా ఇంజన్‌పైకి కాల్పులు జరపడంతో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు.రైలు ఆగిపోగానే మొత్తం 9 బోగీల్లోకీ చొరబడ్డారు. వారికి, రైల్లోని భద్రతా సిబ్బందికి మధ్య కాసేపు కాల్పులు జరిగాయి. అనంతరం రైలును బీఎల్ఏ సాయుధులు తమ అదీనంలోకి తీసుకుని సమీపంలోని టన్నెల్లోకి తరలించినట్టు సమాచారం. ‘‘ప్రయాణికుల్లో సాధారణ పౌరులు, మహిళలు, చిన్నారులను ఒకవైపు, సైనికులను మరోవైపు విడదీశారు. అనంతరం సైనికుల్లో 20 నుంచి 30 మందిని కాల్చి చంపారు. సాధారణ పౌరులను వదిలేశారు. 215 మందిని బందీలుగా చేసుకున్నారు. వారిలో అత్యధికులు పోలీసు, యాంటీ టెర్రరిజం ఫోర్స్, ఐఎస్ఐకు, సైన్యానికి చెందినవారే.వారంతా సెలవులపై స్వస్థలాలకు వెళ్తున్నారు’’అని స్థానిక మీడియా పేర్కొంది. ఘటనా స్థలిలో మొబైల్ నెట్వర్క్ వంటివేమీ లేకపోవడంతో రైల్లోని సిబ్బందితో ఎలాంటి కాంటాక్టూ వీలవడం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దాడికి పాల్పడింది బీఎల్ఏలోని మజీద్ బ్రిగేడ్‌గా భావిస్తున్నారు. వారితో పాటు స్పెషల్ టాక్టికల్ ఆపరేషన్స్ స్క్వాడ్, ఫతే స్క్వాడ్ ప్రత్యేక విభాగాలు కూడా దాడిలో పాల్గొన్నట్టు బీఎల్ఏ ప్రకటించింది.ప్రయాణికుల్లో మహిళలు, పిల్లలు, పౌరులను వదిలేసినట్టు ప్రకటించింది. బీఎల్ఏ దాడుల నేపథ్యంలో క్వెట్టా, పెషావర్ మధ్య రైలు సేవలను కొంతకాలం నిలిపేశారు. గత అక్టోబర్‌లోనే పునరుద్ధరించారు. తర్వాత నెల రోజులకే క్వెట్టా రైల్వేస్టేషన్లో జరిగిన ఆత్మాహుతి దాడిలో కనీసం 26 మంది మరణించారు. బలూచీల దాడి ముప్పు నేపథ్యంలో ఈ ప్రాంతం గుండా వెళ్లే రైళ్లన్నీ పటిష్టమైన సాయుధ భద్రత నడుమ ప్రయాణిస్తుంటాయి. భారీ దాడికి బీఎల్ఏ పథక రచన చేస్తోందని కౌంటర్ టెర్రరిజం విభాగం గత మంగళవారమే ప్రభుత్వాన్ని హెచ్చరించినట్టు చెబుతున్నారు. -
రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద డ్రోన్ అటాక్
మాస్కో: ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడికి దిగిన కొన్ని గంటల వ్యవధిలోనే దానికి ఉక్రెయిన్ ప్రతీకారం తీర్చుకుంది. రష్యాపై అతిపెద్ద డ్రోన్ దాడి చేసింది. ఉక్రెయిన్. 337 డ్రోన్లతో ఉక్రెయిన్ మెరుపు దాడులకు దిగింది. ఈ ఘటనలో రష్యాకు చెందిన ముగ్గురు మృతిచెందగా 18 మంది తీవ్రంగా గాయపడినట్లు రష్యా వర్గాలు వెల్లడించాయి. ఉక్రెయిన్ దాడితో రష్యా అప్రమత్తమైంది. 337 డ్రోన్లలో 91 డ్రోన్లను కూల్చేసింది. ఒకవైపు శాంతి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామంటూనే రష్యా, ఉక్రెయిన్ దేశాలు పరస్పరం మెరుపు దాడులు చేసుకుంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ శాంతి చర్చలు జరిపారు. ఆ చర్చలు విఫలం కావడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చినట్లయ్యింది. రష్యా సైన్యం భీకర దాడులతో ఉక్రెయిన్‌పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. రాజధాని కీవ్ నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో పై వైమానిక దాడులకు తెగ బడింది. అయితే.. ఆ దాడుల్ని తమ దేశ వైమానిక దళం సమర్థవంతంగా అడ్డుకుంటోందని కీవ్ మేయర్ విటాలి కీచ్‌కోస్ తెలిపారు. తమకు పేలుడు శబ్దాలు ఎక్కువగా వినిపిస్తున్నాయని కీవ్(Kyiv)లోని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు తెలియరావాల్సి ఉంది. మరోవైపు.. సౌదీ అరేబియాలో ఉక్రెయిన్, అమెరికా అధికారులుశాంతి చర్చలు(జరపనున్నారు. ఈ నేపథ్యాన్ని పట్టించుకోకుండా రష్యా దాడుల ఉధృతిని పెంచింది. రెండు రోజుల కిందట ఖర్కీవ్ రీజియన్‌లోని డోబ్రోపిలియా నగంపై రష్యా జరిపిన క్షిపణుల దాడిలో విధ్వంసం చోటు చేసుకుంది. దాడుల్లో 14 మంది మరణించగా.. 37 మంది గాయపడ్డారు. ఈ దాడులతో రష్యా ఉద్దేశాల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ.. తమ పౌరుల ప్రాణాలను రక్షించుకునేందుకు ఎంతకైనా తెగిస్తామన్నారు. -
పాక్‌లో ట్రైన్ హైజాక్.. బందీలుగా 182 మంది..!
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌కు చెందిన ట్రైన్ హైజాక్ కలకలం రేపుతోంది. బలూచిస్థాన్ వేర్పాటు వాదులు పాక్ జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను (Jaffar Express) తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 182 మంది ప్రయాణికుల్ని బంధించారు. అదే సమయంలో 20 మంది పాక్ సైనికుల్నిచంపేశారు. తొలుత ఆరుగుర్ని పొ ట్టనపెట్టుకున్న వేర్పాటు వాదులు.. ఆపై మరో 14 మంది సైనికుల్ని చంపేశారు.పాకిస్థాన్‌లోని నైరుతి బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని క్వెట్టా నుండి పెషావర్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాకు తొమ్మిది బోగీలలో 450 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై వేర్పాటు వాదులు కాల్పులు జరిపారు. అనంతరం హైజాక్ చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.ట్రైన్ హైజాక్‌పై బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (Baloch Liberation Army) అధికారికంగా ప్రకటించింది. ఆ ప్రకటన మేరకు.. జాఫర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్లో ప్రయాణికుల్ని హైజాక్ చేశాం. వారిలో పాక్ సైన్యం, పోలీసులు, యాంటీ-టెర్రరిజం ఫోర్స్ (ఏటీఎఫ్), ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)యాక్టివ్ డ్యూటీ సిబ్బంది ఉన్నారు. వీరందరూ సెలవుపై పంజాబ్‌కు ప్రయాణిస్తున్నారు. ఈ విషయంలో పాకిస్థాన్ సైనిక జోక్యానికి ప్రయత్నిస్తే బందీలందరిని ఉరితీస్తామని హెచ్చరించింది. -
బెలూచిస్తాన్ ఎందుకు భగ్గుమంటోంది?
బెలూచిస్తాన్ , ఖైబర్ పక్తున్‌ఖ్వాల మీద పాకిస్తాన్ ప్రభుత్వం పట్టు కోల్పోయిందని ఫిబ్రవరి 18న అక్కడి మత, రాజకీయ నాయకుడు మౌలానా ఫజలుర్ రెహ్మాన్ ధ్వజ మెత్తారు. సాక్షాత్తు నేషనల్ అసెంబ్లీ సాక్షిగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అక్కడి పరిస్థితికి ప్రభుత్వం,సైన్యంతో పాటు ఐఎస్ఐ కూడా కారణమేనని ఆయన అన్నారు. ఈ మాటలు వినిపించినరెండో రోజునే, ఫిబ్రవరి 20న బెలూచిస్తాన్ మరొకసారి భగ్గుమంది. కామిల్ షరీఫ్, ఇషాన్ సర్వార్ బలోచ్ అనే ఇద్దరు తర్బత్ న్యాయ కళాశాల విద్యార్థుల నిర్బంధాన్ని నిరసిస్తూ ఈ ప్రదర్శనలు జరిగాయి. ఆ రెండు రాష్ట్రాలలోనూ ఆందోళనలు కొత్త కాదు. కానీ జాతీయ అసెంబ్లీలో ఒక ప్రముఖ సభ్యుడు ఈ స్థాయిలో హెచ్చరించడం కొత్త అంశమే.‘పాకిస్తాన్ ఒక విఫల రాజ్యం’ఇటీవలి కాలంలో బెలూచిస్తాన్ ఉద్యమం గొంతు పెరిగింది. కొద్దికాలం క్రితమే ఐక్యరాజ్య సమితి కార్యాలయం ఎదుట బెలూచ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ప్రదర్శన నిర్వహించిన సందర్భంగా దాని నాయకుడు రజాక్ బలోచ్ చెప్పిన మాటలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. పాకిస్తాన్ ఒక విఫల రాజ్యమనీ, అది బెలూచిస్తాన్సింధ్, ఆక్రమిత కశ్మీర్‌ల సంపదను అడ్డంగా దోపిడీ చేస్తూ బతుకీడుస్తున్నదనీ ఆరోపించారు. దీనికి చైనా తోడై పాక్ సైన్యానికి శిక్షణ ఇచ్చి, తన కనుసన్నలలో ఉంచుకున్నదని పెద్ద ఆరోపణే చేశారు. పాక్, చైనాలను బెలూచిస్తాన్ నుంచి తరిమేయడమే తమ లక్ష్యమని అన్నారు. స్వాతంత్య్రం కోసం పాకిస్తాన్ మీద పోరాడుతున్న బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ‘పకడ్బందీ’ దాడులు ఉధృతం చేసింది. 75 ఏళ్లుగా సాగుతున్న ప్రత్యేక దేశ పోరాటం మలుపు తిరిగిందని భావించే స్థాయిలో ఈ దాడులు ఉన్నాయి. బీఎల్ఏను పాకిస్తాన్ తో పాటు అమెరికా కూడా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. పాకిస్తాన్ లోని బెలూచిస్తాన్ ప్రాంతంతో పాటు ఇరాన్, అఫ్గాన్లలోని కొన్ని ప్రాంతాలు కలిపి బెలూచిస్తాన్అనే స్వతంత్ర రాజ్యం ఏర్పాటు చేయాలని బీఎల్ఏ కోరుతున్నది. ఇవాళ్టి బెలూచిస్తాన్ అంటే దేశ విభజనకు ముందు ఉన్న కలాత్ సంస్థానమే. దీనికి కూడా పాకిస్తా¯Œ లో లేదా భారత్‌లో కలవడానికి, లేదంటే స్వతంత్రంగా మనుగడ సాగించే వెసు లుబాటు ఇచ్చారు. కానీ జిన్నా ఎత్తు లతో ఇది అంతిమంగా పాక్‌లో విలీనం కావలసివచ్చింది. ఇదంతా ఎందుకు చెప్పడమంటే, భారత్, పాక్ రెండూ కూడా వలస పాలన ఇచ్చిన సమస్యలను నేటికీ ఎదుర్కొంటు న్నాయి. కశ్మీర్ సమస్యను పాక్ అనుకూలంగా మలుచుకోవాలను కుంటున్నది. కానీ బెలూచిస్తాన్ వ్యవహారాలకు భారత్ దూరంగా ఉంది. 1947 నుంచే వేర్పాటు బీజంనిజానికి 1947 నుంచే బెలూచిస్తాన్‌లో వేర్పాటువాదానికి బీజం పడింది. దీని రాజధాని క్వెట్టా. కోటీ యాభయ్ లక్షల జనాభా ఉన్న బెలూచిస్తాన్ ప్రకృతి సంపదల దృష్ట్యా కీలకమైనది. 1947 నుంచి పాకిస్తాన్ ఫెడరల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలోచ్ గిరిజన తెగ ఐదు తిరుగుబాట్లు చేసింది. వీటిలో చివరిది 2000 సంవత్సరంలో మొదలయింది. తమ ప్రాంత వనరులలో స్థానికులకు సింహభాగం ఉండాలన్న డిమాండ్‌తో ఈ తిరుగుబాటు తలెత్తింది. కశ్మీర్ వేర్పాటువాద పోరాటానికి మద్దతు ఇస్తామని బాహాటంగానే ప్రకటించే పాక్ పాలకులు బెలూచీలను దారుణంగా అణచివేస్తున్నారు.బెలూచీల అశాంతి తీవ్రరూపం దాల్చేటట్టు చేసినది పాక్–చైనా ఆర్థిక నడవా. 62 బిలియన్ డాలర్లతో దీనిని నిర్మిస్తున్నట్టు దశాబ్దం క్రితం చైనాప్రకటించింది. బెలూచిస్తాన్‌కు బంగారు బాతు వంటి గ్వదర్ డీప్ సీ పోర్టు నిర్మాణం చైనా చేతిలో పెట్టడం కూడా వారి తిరుగుబాటును తీవ్రం చేసింది. హత్యలే కాకుండా కొన్ని పోలీస్ స్టేషన్లను కూడా బెలూచ్ ఉగ్రవాద సంస్థలు లక్ష్యంగా చేసుకున్నాయి. జాతీయ రహదారులను దిగ్బంధనం చేశాయి. రైల్వే లైన్లను పేల్చి వేశాయి. ‘బీఎల్ఏకు దాడులు చేసే సామర్థ్యం బాగా పెరిగిందని ఈ ఘటనలు నిరూపిస్తున్నాయి. సున్నిత ప్రదేశాలతో పాటు, గహనమైన లక్ష్యాల మీద కూడా దాడి చేసే శక్తి అది సముపార్జించుకున్నది. వీటితో బీఎల్ఏకు విదేశీ సాయం ఉన్నదన్న అనుమానం పాకిస్తాన్ లో మరింత పెరిగింది’ అని పాకిస్తాన్ రాజకీయ, సైనిక వ్యవహారాల వ్యాఖ్యాత ఆయేషా సిద్దిఖీ వ్యాఖ్యానించారు. సాధారణంగా బెలూచిస్తాన్ ఉగ్ర వాదుల దాడులను పాకిస్తాన్ ఫెడరల్ ప్రభుత్వం ‘శత్రువుల’ పనిగా అభివర్ణిస్తూ ఉంటుంది. అయితే భారత వైమానిక దళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ ఉదంతం తరువాత, అంటే 2016 నుంచి బెలూచిస్తాన్ హింసలో భారత్ హస్తం ఉన్నదని కొత్త పల్లవి అందుకుంది. ఇప్పటికీ జాదవ్ పాకిస్తాన్ నిర్బంధంలోనే ఉన్నారు. ఇందుకే బెలూచిస్తాన్ లో హింసకు సంబంధించి భారత్ మీద పాక్ చేసే ఆరోపణలకు చైనా మీడియా విపరీతమైన ప్రాధాన్యం ఇస్తూ ఉంటుంది.పశ్చిమ ప్రాంతంలోనే ‘తెహ్రీక్ ఎ తాలిబన్ పాకిస్తాన్ సంస్థ కూడా పాక్ సైన్యాన్ని ముప్పుతిప్పలు పెడుతున్నది. చిరకాలంగా బెలూచిస్తాన్ ప్రజల పట్ల పాకిస్తాన్ ప్రభుత్వం అణచివేత వైఖరినే అవలంబిస్తున్నది. అక్కడి పౌరులను అపహరించి మళ్లీ వారి జాడ లేకుండా చేయడం స్థానిక ప్రభుత్వ నిఘా సంస్థలు చేస్తున్న పనేనని 2023 నాటి ఒక నివే దిక పేర్కొన్నది. కనిపించకుండా పోయినవారి కోసం, రాజ్యాంగేతర హత్యలకు వ్యతిరేకంగా గళం ఎత్తుతున్న ‘వాయిస్ ఆఫ్ బెలూచ్ మిసింగ్ పర్సన్స్’, ‘బెలూచ్ యాక్ జెహెతి కమిటీ’ సభ్యులను కూడా భద్రతా బలగాలు తీవ్రంగా హింసిస్తు న్నాయి. బెలూచిస్తాన్‌లో ఎన్నికలు ప్రహసనంగానే జరుగు తాయి. పౌర ప్రభుత్వాలు, వ్యవస్థలు, సైన్యం ఆ ఎన్నికలను తమకు అనుకూలంగా జరుపుకొంటూ ఉంటాయి. లేదంటే బెలూచిస్తాన్ ఏర్పాటును వ్యతిరేకించే స్థానిక జాతీయ పార్టీ లను గెలిపిస్తూ ఉంటారు. బెలూచిస్తాన్‌లో ఉండే బెలూచీలు, పష్తూన్ ప్రజల మధ్య సదా విభేదాలు రాజేయడానికి సైన్యం తన వంతు పాత్రను పోషిస్తూ ఉంటుంది.బుగ్తీని చంపిన తప్పిదంబెలూచిస్తాన్ లిబరేషన్ఆర్మీ మొన్నటి ఆగస్ట్‌లో చేసిన దాడులకు మరొక ప్రాధాన్యం ఉంది. అది బుగ్తీ తెగ ప్రము ఖుడు అక్బర్ ఖాన్ బుగ్తీ 18వ వర్ధంతి. పర్వేజ్ ముషార్రఫ్ ఆదేశాల మేరకు ప్రయోగించిన క్షిపణి దాడిలో రహస్య స్థావరంలోనే బుగ్తీ మరణించాడు. నిజానికి ఆయన మొదట పాకిస్తాన్ ఫెడరల్ ప్రభుత్వంలో మంత్రి. బెలూచిస్తాన్ ప్రావిన్స్‌కు గవర్నర్‌గా కూడా పని చేశాడు. తరువాత బెలూచీల సాయుధ తిరుగుబాటులో భాగస్వామి అయ్యాడు. జుల్ఫీకర్ అలీ భుట్టో ఉరితీత ఎంత తప్పిదమో, బుగ్తీని హతమార్చడం కూడా అంతే తప్పిదమని విశ్లేషకులు భావిస్తూ ఉంటారు. బుగ్తీని చంపడం బెలూచిస్తాన్ఉద్యమానికి అమ రత్వాన్ని ఆపాదించింది. 1970లో బెలూచిస్తాన్లిబరేషన్ ఆర్మీ ఆవిర్భవించినప్పటికీ, దూకుడు పెంచినది మాత్రం ఆయన మరణం తరువాతే.ఈ నేపథ్యంలో బెలూచిస్తాన్ ఉద్యమకారులు భారత్ వైపు ఆశగా చూడటం ఒక పరిణామం. వారి ప్రదర్శనలలో భారత్ అనుకూల ప్లకార్డులు ప్రదర్శించడం సాధారణమైంది. పాక్ ప్రస్తుత పరిస్థితులను బట్టి ఆ తుంటరి పిల్లాడికి బుద్ధి చెప్పవలసిన బాధ్యత, హక్కు భారత్‌కు ఉన్నాయని లండన్ కేంద్రంగా పనిచేసే బెలూచిస్తాన్ విముక్తి పోరాట సంస్థ కార్యకర్త ఒకరు అభిప్రాయపడటం విశేషం. డా.గోపరాజు నారాయణరావు సీనియర్ జర్నలిస్ట్ -
రాజా.. ఐ లవ్ యూ రాజా!
బూజు పట్టిన రాజరికాన్ని నేపాల్ ప్రజలు 19 ఏళ్ల క్రితమే వదిలించుకున్నారు. నాటి నాటకీయ పరిణామాలతో రాజు జ్ఞానేంద్ర షా (77) చేసేది లేక గద్దె దిగాడు. కిరీటం పక్కన పెట్టి, సింహాసం దిగి, రాజదండం వదిలేసి మాజీ అయ్యాడు. రాజభవనం ‘నారాయణ్ హితి ప్యాలెస్’ను ఖాళీ చేశాడు. సాధారణ పౌరుడిగా జీవనం ఆరంభించాడు. ఇదంతా పాత ముచ్చట. కొందరు నే’పాలితులు’ మళ్లీ ఇప్పుడు ‘రాజరికమే ముద్దు’ అంటున్నారు. రాజు పరిపాలనే కావాలని కోరుకుంటున్నారు. మాజీ రాజు జ్ఞానేంద్ర షా(Gyanendra Shah) ఇటీవలి కాలంలో దేశంలో పర్యటిస్తున్నారు. పశ్చిమ నేపాల్ తీర్థయాత్రలు ముగించుకుని రెండు నెలల అనంతరం ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు ఆదివారం పది వేల మంది మద్దతుదారులు ఘన స్వాగతం పలికారు. ‘దేశాన్ని మీరే కాపాడాలి’ అంటూ ఆయనను ఉద్దేశించి నినాదాలతో హోరెత్తించారు. ‘రాజు కోసం రాజభవనాన్ని ఖాళీ చేయాలి. రాజు మళ్లీ రావాలి. మాకు రాజరికమే(Monarchy) కావాలి. మా రాజు చిరకాలం జీవించాలి’ అని వారంతా గళమెత్తారు. హిందూ మతాన్ని మళ్లీ దేశ అధికారిక అభి‘మతం’గా మార్చాలని డిమాండ్ చేశారు. జ్ఞానేంద్ర ఎలాంటి వ్యాఖ్యలూ లేకుండానే వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగిపోయారు.జ్ఞానేంద్ర మామూలోడు కాదురాజభవనంలో తమ కుటుంబ సభ్యుల ఊచకోత దుర్ఘటన దరిమిలా.. 2002లో జ్ఞానేంద్ర షా నేపాల్ రాజు అయ్యారు. అప్పటినుంచి దేశ రాజ్యాంగాధినేతగా నామమాత్ర అధికారాలతో నెట్టుకొచ్చిన ఆయన.. 2005లో రాజకీయ, కార్యనిర్వహణాధికారాలను కూడా సొంతం చేసుకుని సంపూర్ణాధికారం చేజిక్కించుకున్నారు. ప్రభుత్వాన్ని, పార్లమెంటును రద్దు చేయడమే కాకుండా రాజకీయ నాయకులు, జర్నలిస్టులను జైళ్లలో పెట్టించారు. సమాచార వ్యవస్థలను స్తంభింపజేసి, అత్యయిక పరిస్థితి ప్రకటించారు. తన ఏలుబడికి వీలుగా సైన్యాన్ని రంగంలోకి దింపారు. ఈ ఘటనలు ప్రజల్లో ఆయన పట్ల తీవ్ర వ్యతిరేకతను ఎగదోశాయి. 2006లో దేశవ్యాప్తంగా ప్రజా నిరసనలు మిన్నుముట్టడంతో జ్ఞానేంద్ర సింహాసనం దిగారు. దేశంలో 240 ఏళ్లుగా కొనసాగుతున్న హిందూ రాజరికాన్ని రద్దు చేయాలని నేపాల్ పార్లమెంటు 2008లో నిర్ణయించడంతో ఆయన రాయల్ ప్యాలెస్ విడిచిపెట్టారు. అలా నేపాల్ 2008లో లౌకిక, గణతంత్ర రాజ్యమైంది. అయితే.. తమ గణతంత్ర రాజ్యం అనుకున్నంత ‘ఘన’తంత్రంగా లేదంటూ నేపాల్ ప్రజల్లో తాజాగా అసమ్మతి పెచ్చరిల్లుతోంది. దేశంలో రాజకీయ అస్థిరత వేళ్లూనుకుందని, అవినీతి అర్రులు చాచి విచ్చలవిడిగా పెరిగిందని, ఆర్థిక రంగం కుదేలైందని నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రాజరికం రద్దయిన 2008వ సంవత్సరం నుంచి ఇప్పటివరకు దేశంలో 13 ప్రభుత్వాలు మారడమే రాజకీయ అస్థిరతకు తార్కాణమని అసంతృప్తవాదులు మండిపడుతున్నారు. దేశం మరింత పతనావస్థకు దిగజారకుండా ఉండాలంటే రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలని వారు అభిలషిస్తున్నారు. అయితే ప్రస్తుతం దేశంలో రాజరిక వ్యవస్థకు మళ్లీ అవకాశం లేదని నేపాల్ ప్రధానమంత్రి కె.పి.శర్మ ఓలి సహా పలువురు రాజకీయ నేతలు అభిప్రాయపడుతున్నారు.మావోయిస్టు ప్రధానిగా ప్రచండ!ఇప్పుడు మనం చూస్తున్న హిమ రాజ్యం నేపాల్(Nepal) ఒకప్పుడు చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేది. ఆ చిన్న ముక్కలన్నిటిని రాజు పృథ్వీనారాయణ్ షా 1768లో ఏకీకృతం చేసి ‘నేపాల్ సామ్రాజ్యం’గా మార్చారు. 1800 సంవత్సరం నుంచి రాజప్రతినిధులు, ప్రధానమంత్రులు నియమితులై షా వంశ రాజుల పేరిట అధికారం చెలాయిస్తూ వచ్చారు. అప్పట్లో రాజు పదవి లాంఛనప్రాయం. తన పూర్వీకుల మాదిరిగా ఈ సంప్రదాయాన్ని పాటిస్తూనే రాజు త్రిభువన్ షా 1950లో ‘రాజకీయ పాత్ర’ను కూడా కొత్తగా తలకెత్తుకున్నారు. ఇక నాటి నుంచి 2006లో ‘రాజు పదవీచ్యుతి ఉద్యమం’ కొనసాగే వరకు షా వంశ రాజులు రాజకీయాధికారం కూడా చెలాయించారు. త్రిభువన్ షా కుమారుడు మహేంద్ర షా ఆధునిక నేపాల్ రూపశిల్పి. ‘హిందూ రాజరికం’ భావనకు కూడా ఆయనే మార్గదర్శి. తదనంతర కాలంలో ప్రజల నుంచి ఎదురైన నిరసనలను దృష్టిలో ఉంచుకున్న రాజు బీరేంద్ర షా 1990లో ‘సంపూర్ణ రాజరికం నుంచి రాజ్యాంగ రాజరికానికి’ నేపాల్ పరివర్తన చెందేందుకు అంగీకరించి, ప్రజలు ఎన్నుకున్న పార్లమెంటుతో అధికారం పంచుకోవడానికి సంసిద్ధుడయ్యాడు. ఇలా రాజీ కుదిరినా ప్రజల్లో అసమ్మతి సెగ మాత్రం చల్లారలేదు. 1990వ దశకం మధ్యలో దేశంలో మావోయిస్టుల తీవ్రవాదం విస్తరించింది. ‘ప్రచండ’గా సుప్రసిద్ధుడైన మావోయిస్టు ఉద్యమ నేత పుష్పకమల్ దహాల్ ఆ తర్వాత దేశ ప్రధానమంత్రి అయ్యాడు.రాజకుటుంబంలో రక్తపాతం!2001లో నేపాల్ రాజభవనంలో చోటుచేసుకున్న మారణకాండలో రాజు బీరేంద్ర, రాణి ఐశ్వర్య, మరో ఎనిమిది మంది రాజ కుటుంబీకులు హత్యకు గురయ్యారు. తాను ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకోవడానికి ఇంటి పెద్దలు అంగీకరించకపోవటంతో యువరాజు దీపేంద్ర ఆగ్రహించి మద్యం మత్తులో తన కుటుంబ సభ్యులను చంపడమే కాకుండా తానూ తుపాకితో కాల్చుకుని మరణించాడు. ఈ పరిణామం తర్వాత జ్ఞానేంద్ర షా రాజు అయినప్పటికీ ఆయన పదవీకాలం స్వల్పమే. జ్ఞానేంద్రకు తాజాగా ఖాట్మండు విమానాశ్రయం వద్ద స్వాగతం పలకాలని బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా సామాజిక మాధ్యమాల వేదికగా నేపాలీలకు పిలుపునివ్వడం కొసమెరుపు! దేశంలో ఎన్నికైన తొలి ప్రధానమంత్రి బి.పి.కొయిరాలాకు మనీషా స్వయానా మనవరాలు. ::జమ్ముల శ్రీకాంత్(Courtesy: CNN, The Times of India, WION, India Today, Al Zazeera) -
స్వర్గం భూమ్మీదకు వచ్చిందా?.. అందాల లోకం.. వారెవ్వా వనాటు
స్వర్గం ఎలా ఉంటుందో ఎవడికి తెలుసు?. ఎవరో వర్ణిస్తే కానీ ఊహించుకోవడం తప్పించి!. ఒకవేళ అది భూమ్మీద గనుక ఉంటే.. అది అచ్చం ‘వనాటు’(Vanuatu)లాగే ఉంటుందని లలిత్ మోదీ అంటున్నారు. ఐపీఎల్ సృష్టికర్త కారణంగా ఇప్పుడు ఈ దేశం పేరు తెగ వినిపించేస్తుండగా.. దాని గురించి వెతికే వాళ్ల సంఖ్యా ఒక్కసారిగా పెరిగిపోయింది.ఆర్థిక నేరగాడికి అభియోగాలు ఎదుర్కొంటున్న లలిత్ మోదీ 2010లో దేశం విడిచి లండన్ పారిపోయారు. అయితే ఆయన్ని వెనక్కి రప్పించే ప్రయత్నాలు భారత్ ముమ్మరంగా చేయగా.. ఆయన తెలివిగా వనాటు పౌరసత్వం పొందారు. అయితే ఈ విషయం తెలియడంతో ఆ దేశం ఆయన పౌరసత్వాన్ని రద్దు చేసింది. ఇది ఇక్కడితోనే ఆగలేదు. లలిత్ మోదీ పౌరసత్వాన్ని రద్దు చేసినట్లు వనాటు ప్రధాని జోథం నపాట్ స్వయంగా ప్రకటించారు. ఆ ప్రకటన వెలువడిన కాసేపటికే.. ఎక్స్ వేదికగా లలిత్ ఓ పోస్ట్ చేశారు.‘‘వనాటు ఒక అందమైన దేశం, స్వర్గంలా ఉంది. మీ పర్యటనల జాబితాలో దీన్ని చేర్చాల్సిందే’’ అని సందేశం ఉంచారు. దీంతో నెటిజన్స్ ఆయన కామెంట్ సెక్షన్లో సరదా కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వనాటు అందాల గురించి ఆరా తీస్తున్నారు.వనాటు.. ఎక్కడుంది?ఉత్తర ఆస్ట్రేలియాకు 1,750 కిలోమీటర్ల దూరంలో దక్షిణ పసిఫిక్ మహా సముద్రంలో ఉంది ఈ ద్వీప దేశం. మొత్తం 83 చిన్న చిన్న ద్వీపాల సముదాయంగా వై(Y) ఆకారంలో ఉంటుందీ దేశం. ఇందులో 65 ద్వీపాల్లో మాత్రమే ప్రజలు జీవిస్తున్నారు. ఎఫేట్ ఐల్యాండ్‌లో ఉండే పోర్టువిల్లా నగరం ఆ దేశ రాజధాని. పశ్చిమంగా ఫిజీ దేశం, ఇతర దిక్కుల్లో సాలామాన్ ద్వీపాలు, న్యూ కాలేడోనియా ఉన్నాయి. ఒకప్పుడు బ్రిటిష్ఫ్రెంచ్ సంయుక్త పాలనలో ఇది బానిస దేశంగా ఉండేది. 1980 జులై 30న వనాటు స్వాతంత్రం పొందింది. కరెన్సీ వనాటు వాటు. ప్రస్తుత జనాభా దాదాపు మూడున్నర లక్షలు. ‘‘దేవుడితో మేం నిలబడతాం’’ అనేది ఆ దేశపు నినాదం.అగ్నిపర్వతాలు.. భూకంపాల నేలఈ ద్వీప దేశంలో అగ్నిపర్వతాలు ఉన్నాయి. వీటిల్లో కొన్ని క్రియాశీలకంగా కూడా ఉన్నాయి. సంవత్సరంలో సుదీర్ఘంగా వేసవి వాతావరణంతో పొడిగా ఉంటుంది అక్కడ. అయితే నవంబర్-ఏప్రిల్ మధ్య వర్షాలు, తుపాన్లు సంభవిస్తుంటాయి. ఫసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌లో ఉండడం మూలంగా భూ కంపాలు షరామాములుగా మారాయి. అయితే కిందటి ఏడాది డిసెంబర్లో 7.3 తీవ్రతతో వచ్చిన భూకంపం ఆ దేశానికి తీవ్ర నష్టం కలిగించింది. ఈ భూకంపంలో 14 మంది చనిపోగా.. 265 మంది తీవ్రంగా గాయపడ్డారు. అందాల లోకం.. వనాటులో ఉన్న వృక్ష, జంతు సంపద అత్యంత అరుదైంది. ఈ భూమ్మీద ఎక్కడా కనిపించని జీవ జాతులు ఉన్నాయక్కడ. ఎటు చూసినా.. దట్టమైన అడవులు, జలపాతాలు, అందమైన సముద్రం.. నిర్మానుష్యమైన తీరాలు, కొన్ని ద్వీపాల్లో లాగున్లూ.. ఓ ప్రత్యేక అనుభూతిని పంచుతాయి. సహజ సౌందర్యం, జీవ వైవిధ్యం.. వనాటును ప్రపంచ పర్యాటక జాబితాలో ‘ప్యారడైజ్ ఆఫ్ ది ఎర్త్’గా నిలబెట్టాయి.టూరిజం కోసమే..టూరిజం, వ్యవసాయం ఇక్కడి ప్రజల ప్రధాన ఆదాయ వనరులు. అలాగే జనాభాలో గ్రామీణ జనాభా ఎక్కువ. 80 శాతం వ్యవసాయమే చేస్తుంటారు. కావా పంట ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతుంది. పర్యాటకం ద్వారా వచ్చే ఆదాయం ఆ దేశ జీడీపీలో 65 శాతంగా ఉంది. పర్యాటకం మీద ఆధారపడిన ప్రజలు కావడంతో.. పర్యాటకులను మర్యాదలతో ముంచెత్తారు. అలాగే.. సంప్రదాయాలకు అక్కడి ప్రజలు పెద్ద పీట వేస్తుంటారు. పెంటెకాస్ట్ ఐల్యాండ్‌లో స్థానికులు ల్యాండ్ డైవింగ్ క్రీడ నిర్వస్తుంటారు. బొంగులలాంటి నిర్మాణలను ఎత్తుగా పేర్చి.. చెట్ల తీగలతో సాయంతో బంగీ జంప్లా కిందకు దూకుతారు. ఎవరి తల భూమికి మొదట తాకితే వాళ్లు విజేతలు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు చేసే ఈ ప్రయత్నాల్లో.. పాపం ఒక్కోసారి ప్రాణాలు పొగొట్టుకుంటారు కూడా. పన్నులు లేవు, కానీ..వనాటులో ఎలాంటి పన్నులు విధించరు. ఈ కారణంగా అంతర్జాతీయ నియంత్రణ సంస్థలు ఈ దేశంపై ప్రత్యేక దృష్టి సారించాయి. అదే టైంలో.. వనాటు ఆర్థిక నేరాలకు అడ్డా కూడా. మనీలాండరింగ్‌కు సంబంధించిన చట్టాలు కూడా అక్కడ బలహీనంగా ఉండడమే ప్రధాన కారణం. ఆర్థిక నేరాలతో పాటు డ్రగ్స్.. ఆయుధాల అక్రమ రవాణాలకు ఇది అడ్డాగా మారింది. ఈ కారణంగానే పైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఈ దేశాన్ని గ్రే లిస్ట్‌లో చేర్చింది. అలాగే.. 2017లో వెలుగు చూసిన ప్యారడైజ్ పేపర్స్ లీక్.. అక్కడి అక్రమ సంపద వ్యవహారాలను బయటపెట్టింది. ఇక.. 2001 ఏప్రిల్‌లో అప్పటి ప్రధాని బరాక్ సోప్ ఫోర్జరీ కేసులో చిక్కుకున్నారు. భారత్‌కు చెందిన వ్యాపారవేత్త అమరేంద్ర నాథ్ ఘోష్‌కు వందల కోట్ల విలువ చేసే పైనాన్షియల్ గ్యారెంటీలను అనధికారికంగా కట్టబెట్టారని బరాక్‌పై అభియోగాలు వచ్చాయి. ఈ కారణంతో ఆయన అదే ఏడాది తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే.. ప్రపంచం దృష్టిలో ఏర్పడిన ఈ మచ్చని.. కఠిన చట్టాల ద్వారా తొలగించుకునే పనిలో ఉంది ఈ సుందర ద్వీప దేశం. -
శాంతి చర్చల వేళ.. ఎయిర్‌స్ట్రైక్స్‌తో భీకర దాడులు
కీవ్: శాంతి చర్చల వేళ రష్యా సైన్యం(Russia Military) భీకర దాడులతో ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతోంది. తాజాగా.. రాజధాని కీవ్ నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో పై వైమానిక దాడులకు తెగ బడింది. అయితే.. ఆ దాడుల్ని తమ దేశ వైమానిక దళం సమర్థవంతంగా అడ్డుకుంటోందని కీవ్ మేయర్ విటాలి కీచ్‌కోస్ తెలిపారు. అయినప్పటికీ.. తమకు పేలుడు శబ్దాలు ఎక్కువగా వినిపిస్తున్నాయని కీవ్(Kyiv)లోని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు తెలియరావాల్సి ఉంది. మరోవైపు.. సౌదీ అరేబియాలో ఉక్రెయిన్, అమెరికా అధికారులు శాంతి చర్చలు(Ukraine Peace Talks) జరపనున్నారు. ఈ నేపథ్యాన్ని పట్టించుకోకుండా రష్యా దాడుల ఉధృతిని పెంచడం గమనార్హం. రెండు రోజుల కిందట ఖర్కీవ్ రీజియన్‌లోని డోబ్రోపిలియా నగంపై రష్యా జరిపిన క్షిపణుల దాడిలో విధ్వంసం చోటు చేసుకుంది. దాడుల్లో 14 మంది మరణించగా.. 37 మంది గాయపడ్డారు. ఈ దాడులతో రష్యా ఉద్దేశాల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ అన్నారు. తమ పౌరుల ప్రాణాలను రక్షించుకునేందుకు ఎంతకైనా తెగిస్తామని ప్రకటించారాయన. ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్‌కు అమెరికా నిఘా సమాచార సహాయం నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజు నుంచే రష్యా తన దాడుల ఉధృతిని పెంచడం గమనార్హం. -
అమెరికా ఉత్పత్తులపై 15% టారిఫ్‌లు ప్రకటించిన చైనా
వాషింగ్టన్: చైనా ఉత్పత్తులపై 20 శాతం టారిఫ్‌లు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 4న చేసిన ప్రకటనకు చైనా బదులు తీర్చుకుంది. అమెరికా వ్యవసాయోత్పత్తులు ముఖ్యంగా సోయా, బీఫ్, పోర్క్, చికెన్ ఉత్పత్తులపై అదనంగా 15 శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఇప్పటికే మార్గమధ్యంలో ఉన్న ఉత్పత్తులపై ఈ నెల 12వ తేదీ వరకు టారిఫ్‌లను మినహాయించనున్నట్లు చైనా వాణిజ్య శాఖ తెలిపింది. ఈ ప్రకటనతో అమెరి కా పెట్టుబడిదారుల్లో భయాలు మొదలయ్యాయి. గతవారం మెక్సికో, కెనడాల దిగుమతులపై ట్రంప్ టారిఫ్‌లను విధించడం ఆయా దేశాలు అమెరికా ఉత్పత్తులపై తిరిగి టారిఫ్‌లను విధించాయి. -
కెనడా తదుపరి ప్రధానిగా మార్క్ కార్నీ
టొరంటో: కెనడా సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌గా గతంలో సేవలందించిన బ్యాంకింగ్ రంగ ప్రముఖుడు మార్క్ కార్నీను కెనడా ప్రధానమంత్రి పీఠం వరించింది. ప్రస్తుత ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో రాజీనామా చేస్తానని జనవరిలో ప్రకటించిన నేపథ్యంలో పాలక లిబిరల్ పార్టీ నూతన సారథి కోసం ఎన్నికలు నిర్వహించగా కార్నీ ఘన విజయం సాధించారు. దాంతో తదుపరి ప్రధానమంత్రిగా 59 ఏళ్ల కార్నీ త్వరలో బాధ్యతల స్వీకరించనున్నారు. ట్రంప్ సారథ్యంలోని అమెరికాతో కెనడా వాణిజ్యయుద్ధానికి దిగిన వేళ కెనడా ప్రధాని పగ్గాలు కార్నీ చేపడుతుండటం గమనార్హం. ఆదివారం లిబరల్ పార్టీ సారథ్యం కోసం జరిగిన ఓటింగ్‌లో కార్నీ 1,31,674 ఓట్లు సాధించారు. మొత్తం ఓట్లలో ఏకంగా 85.9 శాతం ఓట్లు కార్నీ కొల్లగొట్టడం విశేషం. గతంలో మహిళా ఉపప్రధానిగా సేవలందించిన క్రిస్టినా ఫ్రీలాండ్ రెండోస్థానంలో సరిపెట్టుకున్నారు. ఈమెకు కేవలం 11,134 ఓట్లు పడ్డాయి. అంటే మొత్తం ఓట్లలో కేవలం 8 శాతం ఓట్లు ఈమెకు దక్కాయి. గవర్నమెంట్ హౌస్ లీడర్ కరీనా గౌల్డ్(4,785 ఓట్లు) మూడో స్థానంతో, వ్యాపా ర అనుభవం ఉన్న నేత ఫ్రాంక్ బేలిస్(4,038) నాలుగో స్థానంతో సరిపెట్టు కున్నారు. మొత్తం 1,51,000 మందికిపైగా పార్టీ సభ్యులు ఓటింగ్‌లో పాల్గొన్నారు.పదవీ స్వీకారం ఎప్పుడు ?పార్టీ ఎన్నికల్లో గెలిచినా వెంటనే కార్నీ ప్రధాని పీఠంపై కూర్చోవడం కుదరదు. ట్రూడో ప్రధానిగా రాజీనామా చేసి గవర్నర్ జనరల్‌కు సమర్పించాలి. కెనడా ఒకప్పుడు బ్రిటన్ వలసరాజ్యం కావడంతో ప్రస్తుత బ్రిటన్ రాజు కింగ్ ఛార్లెస్–3 సమ్మతితో గవర్నర్ జనరల్.. కార్నీతో నూతన ప్రధానిగా ప్రమాణంచేయిస్తారు. అయితే అక్టోబర్ 20వ తేదీలోపు కెనడాలో సాధారణ ఎన్నికలు చేపట్టాల్సిఉంది. అందుకే కార్నీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించగానే ఎన్నికలకు పిలుపిచ్చే వీలుంది.ట్రంప్‌ను నిలువరిద్దాంపార్టీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించాక వందలాది మంది మద్దతుదారులనుద్దేశించి కార్నీ ప్రసంగించారు. అమెరికా దిగు మతి టారిఫ్‌ల పెంపు అంశాన్ని ప్రస్తావించారు. ‘‘ ఇకపై ఏమాత్రం నమ్మలేని దేశం(అమెరికా) మనకు గడ్డు పరిస్థితు లను తీసుకొచ్చింది. అయినాసరే మనం ఈ పరిస్థితిని దీటుగా ఎదుర్కోగలం. అమెరికా దిగుమతి టారిఫ్‌లకు దీటుగా మనం కూడా టారిఫ్‌లు విధిస్తాం. మమ్మల్ని అమెరికా గౌరవించేదాకా ఇవి కొనసాగుతాయి. అమెరికన్లు మా సహ జవనరులు, భూములు, నీళ్లు, ఏకంగా మా దేశాన్నే కోరుకుంటున్నారు. ఏ రూపంలోనూ కెనడా ఎప్పటికీ అమెరికాలో భాగం కాబోదు. ట్రంప్ గెలవకుండా నిలువరిద్దాం’’ అని వందలాది మంది మద్దతుదారులను ద్దేశించి కార్నీ ప్రసంగించారు.బ్యాంకర్ పొలిటీషియన్కెనడా, బ్రిటన్‌లోని సెంట్రల్ బ్యాంక్‌లకు సారథ్యం వహించి అపార బ్యాంకింగ్ అనుభవం గడించిన మార్క్ కార్నీ ఇప్పుడు కెనడా ప్రధానిగా కొత్త పాత్ర పోషించనున్నారు. బ్యాంక్ ఆఫ్ కెనడా గవర్నర్ హోదాలో 2008లో ఆర్థిక సంక్షోభం నుంచి కెనడాను గట్టెక్కేలాచేసి శెభాష్ అనిపించుకున్నారు. వలసలు, అధికమైన ఆహార, ఇళ్ల ధరలతో ప్రస్తుతం కెనడా సతమవుతున్న వేళ ట్రంప్ టారిఫ్ యుద్ధానికి తెరలేప డంతో కార్నీ తన బ్యాంకింగ్ అనుభవాన్ని పరిపాలనా దక్షతగా మార్చాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.హార్వర్డ్‌లో ఉన్నత విద్య: 1965 మార్చి 16వ తేదీన వాయవ్య కెనడాలోని ఫోర్ట్‌స్మిత్ పట్టణంలో కార్నీ జన్మించారు. తర్వాత ఆల్బెర్టా రాష్ట్రంలోని ఎడ్మోంటెన్‌లో పెరిగారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో 1988లో ఉన్నతవిద్య పూర్తిచేశారు. ఈయనకు ఐస్ హాకీ అంటే చాలా ఇష్టం. కాలేజీ రోజుల్లో ఐస్హాకీ బాగా ఆడేవారు. తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆర్థికశాస్త్రంలో పీహెచ్డీ సాధించారు. బ్రిటన్‌కు చెందిన ఆర్థికవేత్త డయానా ఫాక్స్‌ను పెళ్లాడారు. వీళ్లకు నలుగురు కుమార్తెలు. కెనడా పౌరసత్వంతోపాటు ఈయనకు ఐరిష్, బ్రిటిష్ పౌరసత్వం కూడా ఉంది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌కు గవర్నర్‌గా పనిచేసినకాలంలో తొలిసారిగా బ్రిటన్ పాస్‌పోర్ట్ సంపాదించారు. గోల్డ్‌మ్యాన్ శాక్స్‌లో దశాబ్దానికిపైగా పనిచేశారు. లండన్, టోక్యో, న్యూయార్క్, టొరంటోలో పనిచేశారు. తర్వాత 2003లో బ్యాంక్ ఆఫ్ కెనడాలో డిప్యూటీ గవర్నర్‌గా పనిచేశారు.3 శతాబ్దాల్లో తొలిసారిగా: 2013 నుంచి ఏడేళ్లపాటు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ గవర్నర్‌గా సేవలందించారు. 1694లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌ను స్థాపించగా గత 300 సంవత్సరాల్లో ఆ బ్యాంక్‌కు గవర్నర్‌గా ఎన్నికైన తొలి బ్రిటీషేతర వ్యక్తిగా 2013లో కార్నీ చరిత్ర సృష్టించారు. బ్రెగ్జిట్ వేళ బ్రిటన్ ఆర్థికసంక్షోభంలో కూరుకుపోకుండా బ్యాంకర్‌గా కార్నీ సమర్థవంత పాత్ర పోషించారు. 2020లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌ను వీడాక ఐక్యరాజ్యసమితిలో వాతావరణ మార్పులు, ఆర్థిక అంశాలపై ప్రత్యేక దౌత్యవేత్తగా సేవలందించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
లలిత్ మోదీ పాస్‌పోర్ట్ రద్దు
పోర్ట్ విలా: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) మాజీ వ్యవస్థాపకుడు లలిత్ మోదీకి ఇటీవల జారీ చేసిన పాస్‌పోర్ట్‌ను రద్దు చేయాలని పసిఫిక్ ద్వీప దేశం వనౌతు ప్రధానమంత్రి జొథమ్ నపట్ తమ అధికారులను ఆదేశించారు. పరారీలో ఉన్న ఈ నిందితుడు భారత్‌కు అప్పగింత నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆయన పేర్కొన్నారు. ఐపీఎల్ సారథిగా ఉన్న సమయంలో కోట్లాది రూపాయలను లంచంగా తీసుకున్నాడన్న ఆరోపణలపై దర్యాప్తు విభాగాలు విచారణ చేపట్టాయి. వీటి నుంచి తప్పించుకునేందుకు 2010లో దేశం వీడిన లలిత్ లండన్‌లో ఉంటున్నాడు. అయితే, ఇటీవల వనౌతు పాస్‌పోర్టు పొందిన లలిత్ మోదీ తన భారత పాస్‌పోర్టును లండన్‌లోని భారత హైకమిషన్ కార్యాలయానికి అప్పగిస్తూ దరఖాస్తు చేసుకున్నాడు. ఒకవేళ, ఈ దరఖాస్తును భారత ప్రభుత్వం ఆమోదిస్తే మోదీ లండన్‌లో చట్ట విరుద్ధంగా ఉంటున్న వ్యక్తి అవుతాడు. ఈ పరిణామాల నేపథ్యంలో వనౌతు ప్రధాని కార్యాలయం నుంచి సోమవారం తాజా ప్రకటన వెలువడటం గమనార్హం. లలిత్ పాస్‌పోర్టు దరఖాస్తు పరిశీలన సమయంలో ఇంటర్‌పోల్ వంటి అంతర్జాతీయ వ్యవస్థల నుంచి అతడిపై జారీ చేసిన ఎటువంటి నోటీసులు లేని విషయాన్ని అధికారులు గమనించారని చెప్పారు. అయితే, ఇటీవల అంతర్జాతీయ మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా లలిత్ పాస్‌పోర్ట్ రద్దు చేయాలని సిటిజన్‌షిప్ కమిషన్‌ను ఆదేశించినట్లు చెప్పారు. లలిత్ మోదీపై అలెర్ట్ నోటీసు ఇవ్వాలంటూ భారత్ ప్రభుత్వం చేసిన వినతులను సరైన ఆధారాల్లేవంటూ ఇంటర్‌పోల్ 24 గంటల్లో రెండుసార్లు తోసిపుచ్చిందని చెప్పారు. అయితే, అతడు భారత్‌కు అప్పగించకుండా తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్న విషయం స్పష్టమైనందునే పాస్‌పోర్టు రద్దుకు ఆదేశాలిచ్చినట్లు వనౌతు ప్రధాని వివరించారు. -
ఇంగ్లండ్ తీరంలో రెండు నౌకలు ఢీ
లండన్: ఇంగ్లండ్ తూర్పు తీరంలో ఆయిల్ ట్యాంకర్, సరుకు నౌక ఢీకొన్న ఘటనలో రెండు ఓడలకు మంటలు అంటుకున్నాయి. హల్ తీరానికి సమీపంలో సోమవారం ఉదయం 9.48 గంటల సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. రెండు నౌకల్లోని మొత్తం 37 మందిని రక్షించి ఒడ్డుకు తీసుకువచ్చినట్లు రవాణా శాఖ మంత్రి తెలిపారని స్థానిక ప్రజా ప్రతినిధి గ్రాహం స్టువార్ట్ చెప్పారు. వీరిలో తీవ్రగాయాలతో ఉన్న ఒకరిని ఆస్పత్రిలో చేర్పించారన్నారు. గ్రీస్ నుంచి వచ్చిన అమెరికాకు చెందిన ఎంవీ స్టెనా ఇమాక్యులేట్ పేరున్న ఆయిల్ ట్యాంకర్ గ్రీమ్స్‌బీ పోర్టులో లంగరేసి ఉంది. అదే సమయంలో, స్కాట్లాండ్ నుంచి నెదర్లాండ్స్‌లోని పోటర్‌డ్యామ్ వైపు వెళ్తున్న పోర్చుగల్ సరుకు నౌక సొలొంగ్ దానిని ఢీకొట్టింది. దీంతో, రెండు ఓడల్లో మంటలు చెలరేగాయి. సరుకు ఓడలో సోడియం సైనైడ్ అనే విషపూరిత రసాయన కంటెయినర్లు ఉన్నట్టు సమాచారం. బ్రిటన్ మారిటైం కోస్ట్‌గార్డ్ ఏజెన్సీ ఆ ప్రాంతానికి లైఫ్బోట్లను, రెస్క్యూ హెలి కాప్టర్‌ను పంపించింది. నౌకల్లో నుంచి బయటకు దూకిన వారిని లైఫ్బోట్లలో రక్షించి ఒడ్డుకు చేర్చారు. కాగా, స్టెనా ఇమాక్యులేట్ ఓడలో జెట్–ఏ1 ఇంధనం రవాణా అవుతోందని అమెరికాకు చెందిన మారిటైం మేనేజ్మెంట్ సంస్థ క్రౌలీ తెలిపింది. సరుకు నౌక ఢీకొట్టడంతో ట్యాంకర్ దెబ్బతిని ఇంధనం లీకైంది. దీంతో మంటలు వ్యాపించడంతోపాటు పలుమార్లు పేలుళ్లు సంభవించినట్లు వెల్లడించింది. ట్యాంకర్ నౌకలో ఉన్న మొత్తం 23 మంది సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు క్రౌలీ వివరించింది. అమెరికా సైన్యానికి అవసరమైన ఇంధనాన్ని ఈ సంస్థ సరఫరా చేస్తుంది. -
USA: భారత సంతతి సుదీక్ష అదృశ్యం.. బీచ్‌లో ఏం జరిగింది?
వర్జీనియా: అమెరికాలో చదువుతున్న భారత సంతతి విద్యార్థిని సుదీక్ష కోణంకి(20) మిస్సింగ్ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. కరేబియన్ దేశానికి విహారయాత్రకు వెళ్లిన సుదీక్ష ఓ బీచ్ వద్ద అదృశ్యమయ్యారు. దీంతో ఆమె కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. ఆమె ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వివరాల ప్రకారం.. భారత సంతతి విద్యార్థిని సుదీక్ష కోణంకి అమెరికాలోని వర్జీనియాలో నివాసం ఉంటోంది. అక్కడే పిట్స్బర్గ్ యూనివర్సిటీలో ఆమె చదువుకుంటున్నారు. అయితే, గత వారం ఆమె తన స్నేహితులతో కలిసి కరేబియన్ దేశానికి విహారయాత్రకు వెళ్లారు. ఐదుగురు అమ్మాయిలతో కలిసి డొమినికన్ రిపబ్లిక్‌లోని ప్రముఖ పర్యటక పట్టణమైన ప్యూంటా కానా ప్రాంతానికి చేరుకున్నారు. ఈ క్రమంలో మార్చి ఆరో తేదీన స్థానికంగా ఉన్న రియూ రిపబ్లికా రిసార్ట్ వద్ద బీచ్ వెంట నడుచుకుంటూ కనిపించారు. ఆ తర్వాత ఆమె తిరిగి రాకపోవడంతో స్నేహితులు ఆందోళనకు గురై పోలీసులను సంప్రదించారు.ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన స్థానిక పోలీసులు.. ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సముద్ర తీరం వద్ద, సముద్రం లోపల డ్రోన్లు, హెలికాప్టర్లతో గత నాలుగు రోజులుగా ఆమె కోసం వెతుకుతున్నారు. ఇప్పటివరకు ఏ ఆచూకీ లభించకపోవడంతో బహుశా ఆమె బీచ్‌లో కొట్టుకుపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మరోవైపు.. సుదీక్ష ఆచూకీ తెలియకపోవడంతో ఆమె పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు.Urgent missing college student on Spring Break in the Dominican Republic - Sudiksha Konanki - last seen in brown bikini in picture below 👇 pic.twitter.com/AMdYPngwVK— Glenda (@Glendaragnarson) March 10, 2025ఈ సందర్బంగా ఆమె తండ్రి కోణంకి సుబ్బరాయుడు తాజాగా మాట్లాడుతూ..‘తప్పిపోయిన సుదీక్ష కోసం పోలీసులు గాలిస్తున్నారు. రిసార్ట్ పరిసరాలు, సముద్రం వద్ద గాలింపు చర్యలు చేపట్టారు. అంతేకాకుండా కిడ్నాప్, మానవ అక్రమ రవాణా వంటి అవకాశాలను కూడా పరిశీలించాలని పోలీసులను కోరాం’ అని చెప్పుకొచ్చారు. La Defensa Civil y otras instituciones, continúan en la búsqueda de Sudiksha Konanki, la joven de nacionalidad india, quien desapareció la madrugada del jueves 6 de marzo mientras caminaba en una playa de Punta Cana, provincia de La Altagracia.Informan que también fueron… pic.twitter.com/ntQQxC738S— Noticias Telemicro (@NTelemicro5) March 9, 2025 -
Mark Carney: అమెరికాలో కెనడా విలీనం.. ఏనాటికీ కాబోదు
ఆర్థిక మేధావి, కెనడాకు కాబోయే ప్రధాని మార్క్ కార్నీ.. బాధ్యతలు చేపట్టకముందే అమెరికాతో కవ్వింపు చర్యలకు దిగుతున్నారా?!. రాబోయే రోజుల్లోనూ డొనాల్డ్ ట్రంప్‌తో ఢీ అంటే ఢీ అనేందుకు ఆయన సిద్ధమవుతున్నారా?. తాజా విక్టరీ స్పీచ్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలే ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. కెనడాను అమెరికాలో కలిపేసుకుంటామంటున్న అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump)నకు.. మార్క్ కార్నీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.అధికార లిబరల్ పార్టీ ఆదివారం మార్క్ కార్నీ(Mark Carney)ని తమ నూతన అధ్యక్షుడిగా ఎన్నుకుంది. సుమారు 86 శాతం సభ్యుల ఓట్లతో.. భారీ మెజార్టీతో ఆయనకు విజయం కట్టబెట్టింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విక్టరీ స్పీచ్‌లో కార్నీ ఏమన్నారంటే.. అమెరికా కెనడా కాదు. కెనడా ఏనాటికీ.. ఏ రూపంలోనూ అమెరికాలో భాగం కాబోదు. ఇతర దేశాలతో మేం(కెనడా) ఏ రకమైనా పోరాటం కోరుకోవడం లేదు. కానీ, .. అవతలివాళ్లు స్నేహ హస్తం వదులుకోవాలనుకుంటే మాత్రం.. మేమూ అందుకు సిద్ధంగానే ఉన్నాం. కాబట్టి.. అమెరికన్లు ఎలాంటి తప్పు చేయకూడదనే నేను కోరుకుంటున్నా. అది వాణిజ్యంలో అయినా.. హకీలో అయినా.. కెనడాదే పైచేయి అనే విషయం మరిచిపోకూడదు’’ అని అన్నారాయన.ఇదీ చదవండి: కెనడా కొత్త ప్రధాని.. మామూలోడు కాదండోయ్!ఈ క్రమంలో అమెరికాపై కెనడా ప్రతీకార సుంకాల(US Canada Tariff Hikes) విధింపు కొనసాగుతుందని ప్రకటించారాయన. ‘‘అమెరికన్లు మమ్మల్ని కాస్త గౌరవించాలి. వాణిజ్య ఒప్పందాలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా అమలు చేయాలి’’ అని కోరారు. అలాగే.. తన విజయ ప్రసంగంలో దేశ ఆర్థిక స్థితిగతుల గురించి మాట్లాడిన ఆయన.. కెనడాను ఎనర్జీ సూపర్ పవర్‌గా తీర్చిదిద్దుతానని, అందుకోసం ఎలాంటి కఠిన నిర్ణయాలకైనా సిద్ధమని ప్రతిజ్ఞ చేశారు.ఇదిలా ఉంటే కార్నీ తాజా వ్యాఖ్యలపై రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాతో కయ్యానికి కాలు దువ్వడం ఏమాత్రం మంచిది కాదని సూచిస్తున్నారు. ఏమాత్రం రాజకీయ, పాలనానుభవం లేని మార్క్ కార్నీ దూకుడుగా కాకుండా ఆచితూచీ అడుగులేయాలని సూచిస్తున్నారు. లేకుంటే.. పరిస్థితులు చేజారిపోయే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. -
కెనడా కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ
ఒట్టావా: కెనడాలో తొమ్మిదేళ్ల జస్టిన్ ట్రూడో(Justin Trudeau) పాలనకు తెరపడింది. ఆ దేశ నూతన ప్రధానిగా మార్క్ కార్నీ(Mark Carney) ఖరారు అయ్యారు. తాజాగా జరిగిన సమావేశంలో తమ కొత్త సారథిగా అధికార లిబరల్ పార్టీ కార్నీని ఎన్నుకుంది. ఏనాడూ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయని, కేబినెట్లో పనిచేయని ఆయన.. కెనడా 24వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. తీవ్ర ప్రజా వ్యతిరేకతతో జస్టిన్ ట్రూడో ఈ జనవరిలో ప్రధాని పదవి నుంచి వైదొలగనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లిబరల్ పార్టీకి కొత్త అధ్యక్షుడి ఎన్నిక అనివార్యమైంది. అయితే కొత్త నేత ఎన్నిక దాకా జస్టిన్ ఆ పదవిలో కొనసాగారు. ఇక కొత్త ప్రధానిగా బ్యాంక్ ఆఫ్ కెనడా మాజీ గవర్నర్ మార్క్ కార్నీ ఎన్నికయ్యారు . తాజాగా జరిగిన ఓటింగ్‌లో లిబరల్ పార్టీ సభ్యులు మొత్తం 1,50,000 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. కార్నేకు 131,674 ఓట్లు పొలవ్వగా.. క్రిస్టియా ఫ్రీలాండ్ 11,134, కరినా గౌల్డ్కు 4,785, ఫ్రాంక్ బేలిస్‌కు 4,038 ఓట్లు వచ్చాయి. అంటే కార్నేకు వచ్చిన ఓట్లు 86 శాతమన్నమాట.ఆర్థిక మేధావిగా పేరున్న మార్క్ కార్నీ సరిగ్గా డొనాల్డ్ ట్రంప్ సుంకాల ముప్పు వంటి సవాళ్లను ఎదుర్కొంటున్న వేళలో ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తుండడం గమనార్హం.ఎవరీ కార్నీ.. బ్యాక్‌గ్రౌండ్ ఇదే👉మార్క్ కార్నీ 1965లో ఫోర్ట్ స్మిత్‌లో జన్మించారు. హార్వర్డ్‌లో ఉన్నత విద్య అభ్యసించారు. గోల్డ్‌మన్ శాక్స్‌లో 13 ఏళ్లు పనిచేసిన ఆయన.. 2003లో బ్యాంక్ ఆఫ్ కెనడా డిప్యూటీ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. 2004లో ఆ బాధ్యతల నుంచి వైదొలగి.. కెనడా ఆర్థిక మంత్రి పదవిని చేపట్టారు. 👉2008 ఫిబ్రవరి 1న సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌గా నియమితులయ్యారు. సరిగ్గా అదే సమయంలో కెనడా ఆర్థిక సంక్షోభంలో కొట్టు మిట్టాడుతోంది. ఆ టైంలో ఆయన అనూహ్యంగా.. వడ్డీ రేట్లను సున్నాకు తగ్గించారు. 👉మూడు శతాబ్దాల చరిత్ర కలిగిన బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌కు గవర్నర్‌గా 2013లో కార్నీ ఎన్నికయ్యారు. తద్వారా ఆ సెంట్రల్ బ్యాంక్‌కు మొట్టమొదటి నాన్-బ్రిటిష్ గవర్నర్‌గా నిలిచారు. అంతేకాదు, జీ7లోని రెండు సెంట్రల్ బ్యాంకులకు నాయకత్వం వహించిన వ్యక్తిగానూ రికార్డుకెక్కారు. 2020లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌ను వీడిన ఆయన.. ఐరాస ఆర్థిక, వాతావరణ మార్పుల విభాగం రాయబారిగా సేవలందించారు. తాజా లిబరల్ పార్టీ నూతన అధ్యక్షుడి ఎన్నికల రేసులో నిలిచిన నలుగురిలో అత్యధికారంగా విరాళాలు సేకరించిన అభ్యర్థి కూడా ఈయనే కావడం గమనార్హం. -
నీవల్లే కరోనా!.. చైనాకు అమెరికా కోర్టు జరిమానా
వాషింగ్టన్: డ్రాగన్ కంట్రీ చైనాకు అమెరికా భారీ షాకిచ్చింది. కోవిడ్ మహమ్మారిని కప్పిపుచ్చడంతోపాటు, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్(పీపీఈ)పై గుత్తాధిపత్యం చెలాయించిందనే ఆరోపణలపై అమెరికా కోర్టు చైనాకు 24 బిలియన్ డాలర్ల జరిమానా విధించింది. కాగా, కోవిడ్ వ్యాప్తికి చైనా ప్రభుత్వమే కారణమంటూ 2020లో మిస్సోరిలో కేసు నమోదైంది. మహమ్మారికి కేంద్రంగా భావిస్తున్న వూహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, తదితర సంస్థలను బాధ్యులుగా ఇందులో పేర్కొన్నారు. అమెరికాకు సరఫరా కావాల్సిన పీపీఈ కిట్ల ఉత్పత్తి, కొనుగోలు, ఎగుమతి, దిగుమతులను చైనా ప్రభుత్వం అడ్డుకుందని అందులో ఆరోపించారు. విచారణ ముగించిన జడ్జి స్టీఫెన్ కోవిడ్ మహమ్మారికి కారణమై నష్టం కలిగించినందుకు చైనా ప్రభుత్వానికి 24 మిలియన్ డాలర్లు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. ఇదే సమయంలో చైనా చర్యల ఫలితంగా మిస్సోరికి పన్నుల రూపంలో 8 బిలియన్ డాలర్ల నష్టం కలిగిందని, పీపీఈ కిట్ల సరఫరా నిలిచినందుకు గాను మరో 122 మిలియన్ డాలర్ల మేర అదనంగా ఖర్చు చేయాల్సి వచి్చందని ఆయన తీర్పులో పేర్కొన్నారు. కోవిడ్‌కు చైనాను బాధ్యునిగా చేయడంలో ఇది చారిత్రక తీర్పు అని మిస్సోరి అటార్నీ జనరల్ ఆండ్రూ బెయిలీ పేర్కొన్నారు. మిసోరిలోని చైనా ఆస్తులను స్వా«దీనం చేసుకుని, నష్టాన్ని భర్తీ చేస్తామన్నారు. మిసోరి కోర్టు తీర్పుపై వాషింగ్టన్లో చైనా ఎంబసీ ప్రతినిధి తీవ్రంగా స్పందించారు. ‘ఈ తీర్పును మేం పట్టించుకోం. ఎలాంటి ప్రాతిపదిక లేని కేసు. అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా ఉన్న తీర్పు’అని పేర్కొన్నారు. -
స్వామి నారాయణ్ ఆలయంపై...విద్వేష దాడి
న్యూయార్క్/న్యూఢిల్లీ: అమెరికాలో హిందూ ఆలయాలను లక్ష్యంగా చేసుకొని దుండగులు రెచ్చిపోతున్నారు. కాలిఫోర్నియా రాష్ట్రంలో శాన్ బెర్నార్డినో కౌంటీలో ఉన్న చినో హిల్స్‌లోని ప్రఖ్యాత స్వామి నారాయణ్ మందిరంపై శనివారం గుర్తు తెలియని వ్యక్తులు దాడికి తెగబడ్డారు. ఆలయ గోడలపై భారత వ్యతిరేక రాతలు రాశారు. గ్రాఫిటీ రాతలతో అందవిహీనంగా మార్చే ప్రయత్నం చేశారు. ఇది ఖలిస్తానీల పనేనని భావిస్తున్నారు. చినో హిల్స్ లాస్ ఏంజెలెస్ కౌంటీకి సరిహద్దులోనే ఉంది. ఆలయాన్ని అపవిత్రం చేశారని బోచాసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ (బీఏపీఎస్) ఆవేదన వెలిబుచ్చింది. ‘‘ఆలయాలపై విద్వేషాన్ని హిందూ సమాజం గట్టిగా వ్యతిరేకిస్తోంది. ఈ విద్వేషాల వ్యాప్తిని చినో హిల్స్, దక్షిణ కాలిఫోర్నియాలోని హిందువులు కలసికట్టుగా అడ్డుకుంటారు’’ అని ‘ఎక్స్’లో పోస్టు చేసింది. ఈ ఘటనపై హిందూ అమెరికన్ ఫౌండేషన్ దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి దుండగులను కఠినంగా శిక్షించాలని ఎఫ్‌బీఐని, దాని డైరెక్టర్ కాశ్ పటేల్‌ను కోరింది. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని అమెరికా ప్రభుత్వానికి కోవలిషన్ ఆఫ్ హిందూస్ ఆఫ్ నార్త్ అమెరికా (కోహ్న) విజ్ఞప్తి చేసింది. ‘‘అమెరికాలో హిందువులపై ద్వేషభావం లేదని మీడియా, మేధావులు చెబుతున్నా వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. లాస్ ఏంజెలెస్‌లో ఖలిస్తాన్ రెఫరెండం పేరిట కొందరు డ్రామాలుడుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో స్వామి నారాయణ్‌పై ఆలయంపై దాడి ఆశ్చర్యం కలిగించలేదు’’ అని పేర్కొంది. కొన్నేళ్లలో అమెరికాలో 10 హిందూ ఆలయాలపై దాడులు జరిగాయని ఆవేదన వెలిబుచ్చింది. గతేడాది కాలిఫోర్నియాలోని శాక్రమెంటోలో, న్యూయార్క్‌లోని మెల్వీల్లేలో ఆలయాలపై దాడులు జరిగాయి. ‘హిందూస్ గో బ్యాక్’ అంటూ ఆలయాల గోడలపై రాతలు రాశారు.భారత్ ఖండన స్వామి నారాయణ్ ఆలయంపై దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ«దీర్ జైశ్వాల్ ఆదివారం డిమాండ్ చేశారు. అమెరికాలోని హిందూ దేవాలయాలకు తగిన రక్షణ కల్పించాలని కోరారు. స్వామి నారాయణ్ ఆలయాన్ని అపవిత్రం చేయడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఆలయాలపై అసహనం, విద్వేష చర్యలు అంగీకారయోగ్యం కాదని పేర్కొంది. దుండగులపై అమెరికా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. దాడిని యోగా గురు రాందేవ్ ఖండించారు. -
చైనా నుంచి మనూస్ ఏఐ
బీజింగ్: కొన్ని రోజుల క్రితం ‘డీప్‌సీక్’కృత్రిమ మేధ(ఏఐ) మోడల్‌ను తీసుకొచ్చి ప్రపంచ టెక్నాలజీ రంగంలో సంచలనం సృష్టించిన డ్రాగన్ దేశం చైనా మరో సంచలనానికి తెరతీసింది. ‘మనూస్’పేరిట మరో కృత్రిమ మేధ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే వాడుకలో ఉన్న అగ్రశ్రేణి ఏఐ వేదికలకు దీటుగా మనూస్‌ను రూపొందించారు. చైనాకు చెందిన స్టార్టప్ కంపెనీ ‘మొనికా’ఈ మనూస్‌ను అభివృద్ధి చేసింది. ‘ఆలోచనలు, చర్యలకు మధ్య వారధిగా పని చేస్తుంది. ఇది కేవలం ఆలోచించడమే కాదు, ఫలితాలు సాధించి చూపుతుంది’’అని మొనికా కంపెనీ వెల్లడించింది. ఈ నూతన ఏఐ ఏజెంట్ వినియోగదారులకు చక్కటి అనుభూతి ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని తెలియజేసింది. కొత్త వెబ్సైట్లను రూపొందించడం నుంచి విహార యాత్రలకు ప్లానింగ్ చేయడం దాకా ఎన్నో రకాల పనులను మనూస్ చక్కబెడుతుంది. స్టాక్ మార్కెట్‌ను విశ్లేషించడంలో బహు నేర్పరి. కేవలం ఒక ఆదేశం ఇచ్చేస్తే చాలు మనకు కావాల్సిన పనులు పూర్తిచేస్తుంది. మనూస్ తనంతట తాను ఆలోచించుకోగలదు. ప్లాన్ చేసుకొని దాన్ని అమలు చేయగలదు. స్వయం చాలితం అని చెప్పొచ్చు. మనూస్‌ను ఈ నెల 6వ తేదీన ఆవిష్కరించారు. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ఏమిటీ మనూస్? ఇదొక జనరల్ ఏఐ ఏజెంట్. వేర్వేరు రంగాలకు సంబంధించి సంక్లిష్టమైన, రియల్–వరల్డ్ పనులు పూర్తిచేయగలదు. సాధారణ ఏఐ చాట్‌బాట్స్ తరహాలో కాకుండా విభిన్నంగా పనిచేస్తుంది. ఇది పూర్తిస్థాయి అటనామిస్ సిస్టమ్. ప్రణాళిక, కార్యాచరణ, ఫలితాలు... అనే శ్రేణిలో పనిచేయగల సామర్థ్యం దీని సొంతం. ఉదాహరణకు గ్లోబల్ వార్మింగ్‌పై ఒక నివేదిక తయారు చేసి ఇవ్వాలని సూచించామనుకోండి. ఆ అంశంపై మనూస్ తనంతట తానే పరిశోధన సాగిస్తుంది. పేపర్‌పై నివేదికను సిద్ధం చేసి మనకు అందజేస్తుంది. -
గర్భిణులు పారాసిటమాల్ వాడితే... పిల్లల్లో ఏడీహెచ్‌డీ!
కొందరు పిల్లలు చదువుతో పాటు ఆటపాటలు, అల్లరిలోనూ చురుగ్గా ఉంటారు. మరికొందరు మరీ అతి చురుకుదనం చూపిస్తారు. ఏదైనా ఇట్టే చేయగలమనే ధీమా వాళ్లలలో తొణికిసలాడుతుంది. అలా శక్తికి మించిన పనులు చేసి సమస్యలు కొని తెచ్చుకుంటుంటారు. అలాంటి ఈ పిల్లలు దేనిపైనా ఎక్కువ సేపు దృష్టి పెట్టలేరు. ఆలోచన కంటే ఆవేశంతోనే పనులు చేస్తుంటారు. పర్యావసానాలను కూడా పట్టించుకోరు. ఇలాంటి వాళ్లు అటెన్షన్ డిఫిసిట్ హైపరాక్టివిటీ డిజార్టర్ (ఏడీహెచ్‌డీ)తో బాధపడుతున్నట్టు! పారాసిటమాల్గా పిలిచే అసిటమినోఫిన్ను గర్భిణులు అతిగా వాడితే పిల్లల్లో ముప్పు మూడింతలు పెరుగుతుందని తాజా అధ్యయనంలో తేలింది. తలనొప్పికి, జ్వరానికి పారాసిటమాల్ వాడటం మన దగ్గర పరిపాటి. ఇది జ్వరంతో పాటు ఓ మాదిరి ఒంటి నొప్పులను కూడా తగ్గిస్తుంది. కానీ నొప్పి గర్భంతో ఉన్నప్పుడు ఈ మాత్రను అతిగా వాడితే పుట్టబోయే పిల్లల మెదడు ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం పడుతున్నట్టు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ పరిశోధకుల తాజా అధ్యయనంలో వెల్లడైంది. గర్భంతో ఉన్న 307 మంది నల్లజాతి మహిళల్లో పారాసిటమాల్ వాడినప్పుడు ఒంట్లో రక్తప్రవాహ రేట్లు, రక్తంలో ఈ ఔషధ పాళ్లను గమనించారు. వాటిని అతిగా వాడిన వారికి పుట్టిన చిన్నారుల్లో మిగతా పిల్లలతో పోలిస్తే ఏడీహెచ్‌డీ ముప్పు మూడు రెట్లు అధికమని తేలింది. అమ్మాయిలైతే పదేళ్ల లోపు ఏడీహెచ్‌డీ బారిన పడే ముప్పు ఏకంగా ఆరు రెట్లు ఎక్కువని అధ్యయనకారులు తెలిపారు. కనుక తప్పని పరిస్థితుల్లో మాత్రమే పారాసిటమాల్ వాడాలని సూచించారు. అధ్యయన వివరాలు ‘నేచర్ మెంటల్ హెల్త్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. దశాబ్దాలుగా వాడకం ‘‘అసిటమినోఫిన్ను దశాబ్దాలుగా వాడుతున్నారు. గర్భిణుల్లో పిండం తాలూకు మెదడు, నాడీవ్యవస్థ ఎదుగుదలపై అసిటమినోఫిన్ ప్రభావంపై ఇంతవరకు ఎలాంటి పరిశోధనలూ జరగలేదు. తాజా పరిశోధన నేపథ్యంలో గర్భిణుల పారాసిటమాల్ వాడకంపై అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మిని్రస్టేషన్ (ఎఫ్‌డీఏ) విభాగం పునఃసమీక్ష జరపాల్సిన అవసరం ఏర్పడింది. దీనిపై అమెరికా ప్రభుత్వం ఆలోచించాలి’’ అని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్లో పిల్లల వైద్య నిపుణురాలు షీలా సత్యనారాయణ చెప్పారు. అయితే, ‘‘ప్రస్తుత పరిశోధన ఫలితాలతో బెంబేలెత్తాల్సిన పని కూడా లేదు. దీనిపై మరింత విస్తృత అధ్యయనం జరగాల్సి ఉంది’’ అని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం గర్భిణులకు పారాసిటమల్‌ను తప్పనిసరైతేనే, అదీ తక్కువ డోసులోనే వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. తాజా అధ్యయనం నేపథ్యంలో ఎఫ్‌డీఏతో పాటు యూరోపియన్ మెడికల్ ఏజెన్సీ, అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఒబ్్రస్టిటీíÙయన్స్, గైనకాలజిస్ట్స్, ది సొసైటీ ఆఫ్ ఓబ్స్ట్రిటీíÙయన్స్ అండ్ గైనకాలజిస్ట్స్ ఆఫ్ కెనడా, ది సొసైటీ ఆఫ్ మెటర్నల్ –ఫీటల్ తదితరాలు పునరాలోచనలో పడే వీలుంది. అయితే గర్భిణులు అసిటమినోఫిన్ వాడితే పిల్లలకు ఏడీహెచ్‌డీ వస్తుందని నిరూపణ కాలేదని ఎఫ్‌డీఏ అధికారులు 2015లో తేల్చడం గమనార్హం. – వాషింగ్టన్ -
గాజా అమ్మకానికి లేదు
ఎడిన్బర్గ్: గాజా స్ట్రిప్‌ను ఖాళీ చేయించి అందమైన పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతానన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై పాలస్తీనియన్లు ప్రతీకార చర్యలకు దిగారు. స్కాట్లాండ్లో ట్రంప్‌కు చెందిన టర్న్బెర్రీ గోల్ఫ్ రిసార్ట్‌ను ధ్వంసం చేశారు. శనివారం తెల్లవారుజామున నిరసనకారులు రిసార్ట్‌లోకి చొరబడ్డారు. గోల్ఫ్ హోల్స్‌ను నాశనం చేశారు. ఓపెన్ చాంపియ్íÙప్స్‌లో ఉపయోగించే వస్తువులు, ప్రదేశాలను పాడు చేశారు. అక్కడి పచ్చికబయళ్లపై ‘గాజా అమ్మకానికి లేదు’ అని తెల్లని పెయింట్‌తో రాశారు. రిసార్ట్ క్లబ్‌హౌస్ భవన గోడలపై ఎరుపు రంగు చల్లారు. ఇది తమ పనేనని ‘పాలస్తీనా యాక్షన్’ అనే సంస్థ ప్రకటించుకుంది. ‘‘గాజాపై ట్రంప్ వ్యాఖ్యలకు ప్రతీకారంగానే ఈ పని చేశాం. గాజాను తన సొంత ఆస్తిలా పరిగణిస్తామంటే ఒప్పుకోం. ఇది తెలియజేప్పేందుకు, ట్రంప్ ఆస్తికి భద్రత లేదని నిరూపించేందుకు రిసార్ట్‌పై దాడి చేశాం. గాజా స్ట్రిప్‌ను ఇజ్రాయెల్‌కు, అమెరికాకు వలసరాజ్యంగా మార్చే యత్నాలను అడ్డుకుంటాం’’ అని ప్రకటించింది. దాడిని పిల్లచేష్టగా రిసార్ట్ వర్గాలు కొట్టిపారేశాయి. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక గోల్ఫ్‌కోర్సుల్లో టర్న్బెర్రీ ఒకటి. ఇక్కడ నాలుగుసార్లు ఓపెన్ ఛాంపియన్íÙప్ జరిగింది. 2014లో ట్రంప్ కొనుగోలు చేసినప్పటి నుంచీ ఇక్కడ ఓపెన్ రొటేషన్‌ను అమలు చేయడం లేదు. -
ఐస్‌క్రీమ్‌లో పాము పిల్ల!
ఐస్‌క్రీమ్ అంటే కొందరికి చాలా ఇష్టం. బడలిక తర్వాత నచి్చన ఐస్‌క్రీమ్ తింటే ప్రాణం లేచొచినట్లు అనిపిస్తుంది. కానీ పొరపాటున ఈ ఐస్‌క్రీమ్ గనుక తింటే ప్రాణాలు పోవడం ఖాయం. ఇది స్నేక్ ఐస్‌క్రీం మరి! థాయిలాండ్‌లో మియాంగ్ రాచ్బురీ రాష్ట్రంలోని పార్క్ థో జిల్లాలో రేబాన్ నక్లెంగ్బూన్ అనే వ్యక్తి స్థానికంగా తన ఫేవరెట్ ‘బ్లాక్‌బీన్’ పాప్సికిల్ ఐస్‌క్రీం కొన్నాడు. ఆత్రంగా రేపర్ తీయగానే చచ్చిన పాము పిల్ల కనిపించడంతో ఠారెత్తిపోయాడు. దాన్ని ఫొటో తీసి ‘ఫేస్బుక్’లో పెట్టాడు. నలుపు, పలుసు రంగుల్లో ఉన్న పాము పిల్ల ఐస్‌క్రీమ్‌లో గడ్డకట్టుకుపోని కనిపిస్తోంది. ‘‘దాని కళ్లు తెరిచే ఉన్నాయి! ఇంకా బతికే ఉందా?’’ అంటూ పోస్టు పెట్టాడు. దాంతో ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది ఓ మాదిరి విషముండే గోల్డెన్ ట్రీ రకం పాము పిల్ల అని కొందరు నిర్ధారించారు. ఆ ఐస్క్రీంను ఏ అర్ధరాత్రో చిమ్మచీకట్లో రోడ్‌సైడ్ బండిపై కొని చప్పరిస్తే ఈపాటికి టపా కట్టేవాడంటూ కొందరు జోకులు పేల్చారు. ‘‘ఏ కోటిలో ఏ ఒక్కరినో ఇలాంటి అదృష్టం వరిస్తుంది. ఓసారి టేస్ట్ చేసి చూడు’’ అని ఇంకొదరు పోస్టులు పెట్టారు. – బ్యాంకాక్ -
గ్యాస్ పైప్‌లైన్‌లో నడిచొచ్చి.. వెనక నుంచి దాడి
కీవ్: యుద్ధంలో ఉక్రెయిన్ సేనలపై ఊహించని రీతిలో దాడిచేసేందుకు రష్యా బలగాలు ఒక గ్యాస్ పైప్‌లైన్ లోపలి నుంచి నడుచుకుంటూ వెళ్లిందని కథనాలు వెలువడ్డాయి. రష్యాలోని కరŠస్క్ రీజియన్‌లో ఈ యుద్ధ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. గత ఏడాది ఆగస్ట్‌లో ఉక్రెయిన్ సేనలు తొలిసారిగా రష్యా భూభాగాన్ని ఆక్రమించుకున్నాయి. రెండో ప్రపంచయుద్ధం తర్వాత రష్యా భూభాగంపై జరిగిన అతిపెద్ద దాడి ఘటన ఇదే. వ్యూహాత్మక సరిహద్దు పట్టణమైన సుడ్జా సహా 1,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఉక్రెయిన్ బలగాలు కైవసం చేసుకున్నాయి. వందలాది మంది రష్యా సైనికులను యుద్ధ ఖైదీలుగా బంధించాయి. దీంతో అమేయ సైనికశక్తిగా ఉన్న రష్యా దీనిని అవమానంగా భావించి ఏకంగా 50,000 మంది సైనికులతో భారీ ఎదురుదాడికి దిగింది. దీంతో వేలాది మంది ఉక్రెయిన్ సైనికులు వెనుతిరగాల్సిన పరిస్థితి తలెత్తింది. ఎలాగోలా సుడ్జా సిటీలో పోరాడుతున్న ఉక్రెయిన్ సైనికులను అన్నివైపులా నుంచి చుట్టుముట్టేందుకు ఆవలివైపుదాకా ఉన్న గ్యాస్‌పైప్‌లైన్ గుండా రష్యా సైనికులు వెళ్లారని యూరీ పోడోల్యాకా వెల్లడించారు. ఈయన ఉక్రెయిన్‌లో పుట్టి రష్యాకు అనుకూలంగా మాట్లాడే బ్లాగర్. సుడ్జా నగరంలో ఉక్రెయిన్ సేనలను వెనక వైపు నుంచి దాడిచేసేందుకు, అదును చూసి దెబ్బకొట్టేందుకు పైప్‌లైన్ లోపలే రష్యా సైనికులు రోజుల తరబడి గడిపారని ఈయన పేర్కొన్నారు. ఈ పైప్‌లైన్ పొడవు దాదాపు 15 కిలోమీటర్లు. యూరప్‌తో సత్సంబంధాలు తెగిపోకముందువరకు ఈ పైప్‌లైన్ గుండా గ్యాస్‌ను రష్యా సరఫరా చేసేది. ఇప్పుడు గ్యాస్ లేకపోవడంతో సైనికుల రాకపోకలు సాధ్యమయ్యాయని యూరీ చెప్పారు. మాస్క్‌లు ధరించిన సైనికులు పైప్‌లైన్ ద్వారా సుడ్జా నగరంలోకి ప్రవశించారని ‘టూ మేజర్స్’ అనే మరో యుద్ధ బ్లాగర్ చెప్పారు. రష్యా స్పెషల్ ఫోర్సెస్ బలగాలు పైప్‌లో నడిచివెళ్తున్న ఫొటోలను రష్యా టెలిగ్రామ్ చానెల్స్ అందరితో పంచుకున్నాయి. ‘‘శత్రుసేనల రాకను మేం కనిపెట్టాం. రాకెట్లు, శతఘ్నులతో దీటైన బదులిచ్చాం. రష్యాకు భారీ నష్టం జరిగింది’’ అని ఉక్రెయిన్ జనరల్ స్టాఫ్ తెలిపింది. అయితే ప్రాణనష్టం, ఎంత మంది రష్యా సైనికులు చనిపోయారనే విషయం వెల్లడికాలేదు. -
ఈ ఏడాది హెచ్1బీ వీసాలు కష్టమే
సాక్షి, అమరావతి: అమెరికా వీసాల్లో అత్యధిక డిమాండ్ ఉన్న హెచ్1బీ వీసాలు (H1B visas) ఈ ఏడాది పొందడం చాలా కష్టంగా తయారయ్యింది. అధిక నైపుణ్యంతో దీర్ఘకాలం పనిచేయడానికి ఉపయోగపడే హెచ్1బీ వీసాలు పొందడంలో మల్టీ నేషనల్ కంపెనీలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత హెచ్1బీ వీసాల జారీపై కఠిన ఆంక్షలు విధించింది. దీనితో నైపుణ్యం కలిగిన మానవ వనరులను బహుళజాతి కంపెనీలు ఇతర దేశాల నుంచి తెచ్చుకోలేక అష్ట కష్టాలు పడుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా అమెరికా ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 85,000 మందికి మించి హెచ్1బీ వీసాలు జారీ చేయకూడదన్న పరిమితిని విధించింది. మార్చి7న ప్రారంభమైన వీసాల జారీ ప్రక్రియ మార్చి 24తో ముగియనుంది. ఈ వీసాల కోసం ఇప్పటికే 4,23,028 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇందులో మూడు లక్షలకు పైగా దరఖాస్తులు తిరస్కరణకు గురి అవుతాయన్న అంచనాలను నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికా పాలసీ తాజాగా విడుదల చేసిన నివేదిక వెలువరించింది.కంపెనీలపై తీవ్ర ప్రభావంప్రస్తుత నిబంధనల ప్రకారం చూస్తే దరఖాస్తు చేసుకున్నవారిలో 20 శాతంకు మించి హెచ్1బీ వీసాలు వచ్చే అవకాశం కనిపించడం లేదు. విదేశాల్లో జన్మించిన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఇతర అధిక నైపుణ్యం కలిగిన నిపుణులను దీర్ఘకాలం పనిచేసే విధంగా ఈ వీసా ద్వారా కంపెనీలు నియమించుకుంటాయి. తాజా కఠిన నిబంధనల వల్ల 3 లక్షలకు పైగా నైపుణ్యం కలిగిన మానవ వనరులను అమెరికా కోల్పోతోందని, ఈ నిర్భంధ నిబంధనలు కంపెనీ యాజమాన్యాలకు తీవ్ర సమస్యలను తీసుకు వస్తున్నాయని ఫోర్బ్స్ తన నివేదికలో వ్యాఖ్యానించింది.ఇతర వీసాల జారీ సులభంహెచ్1బీ వీసాకంటే ఇతర వీసాలు మంజూరు సులభంగా ఉంటోందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. 2024లో దరఖాస్తు చేసుకున్న వారిలో సందర్శకులు కోటాలో జారీ చేసే బీ1/బీ2 వీసాలు 72 శాతం మందికి జారీ అయ్యాయి. వేసవి కార్మికులు, పరిశోధకుల కోటాలో జారీ అయ్యే జే1 వీసాలు 89 శాతానికి ఇమిగ్రేషన్ అధికారుల ఆమోదముద్ర పడింది. అమెరికాలో హెచ్1బీ వీసాలు కింద పనిచేసే ఉద్యోగులకు సగటున నెలకు భారతీయ కరెన్సీల్లో రూ.9 లక్షల నుంచి రూ.10 లక్షలపైనే వేతనం లభిస్తుంది. అందుకే ప్రతీ భారతీయుడు హెచ్1బీ వీసా కింద అమెరికాకు వెళ్లి పనిచేయాలనుకుంటాడు. అయితే మారిన పరిస్థితులు స్థానిక యువత ఆశలకు గండికొట్టిందని ఎంఎన్సీ కంపెనీలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
White House: గన్ తో సంచరిస్తున్న వ్యక్తి కాల్చివేత
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు నివాసముండే వైట్ హౌస్ కు కూతవేటు దూరంలో మారణాయుధాలతో సంచరిస్తున్న ఓ వ్యక్తిని బలగాలు కాల్చి చంపాయి. వైట్ హౌస్ ఎబ్లాక్ కు కూతవేటు దూరంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు. అతని వద్ద గన్ తో పాటు పలు మారణాయుధాలు ఉన్నట్లు గుర్తించిన అమెరికన్ సీక్రెట్ సర్వీస్ సిబ్బంది అతన్ని షూట్ చేసి చంపారు. భారత కాలమాన ప్రకారం ఈరోజు(ఆదివారం) ఉదయం అతను అనుమనాస్పద రీతిలో వైట్ హౌస్ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నాడు. దీన్ని గుర్తించిన యూఎస్ సీక్రెట్ సర్వీస్ సిబ్బంది.. అతనిపై ఒక్కసారిగా కాల్పులకు దిగి మట్టుబట్టాయి. అతను ఆత్మాహుతి దాడికి పాల్పడటానికి వచ్చినట్లు అనుమానిస్తున్నారు.తొలుత ఆతన్ని నివారించే క్రమంలో ఎదురుకాల్పులకు దిగేందుకు సిద్ధమయ్యారు. అంతే ఒక్కసారిగా అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ అతనిపై కాల్పులు జరిపారు. అతనికి తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన అతను మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు. ఈ ఘటనలో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఎవరూ గాయపడలేదని వైట్ హౌస్ వర్గాలు స్పష్టం చేశాయి. ఆ సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లో లేరని, ఫ్లోరిడాలో ఉన్నట్లు పేర్కొన్నాయి. అయితే అతనే ఏ ఉద్దేశంతో మారణాయుధాలతో అక్కడకు వచ్చాడనేది తెలియలేదన్నాయి, -
ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ వింత కోరిక.. ట్రంప్ అందుకు ఒప్పుకుంటారా?
వాషింగ్టన్: అమెరికాలోని అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐకు సారథ్యం వహిస్తున్న భారత సంతతికి చెందిన కాష్ పటేల్ తన నీడను తానే నమ్మడం లేదు. అందుకే తనకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మధ్య ఫోన్ కాల్స్ కనెక్ట్ చేసేందుకు ఎఫ్‌బీఐలో ఓ వ్యవస్థ ఉంది. దానికి బదులుగా నేరుగా ట్రంప్‌తో మాట్లాడే సదుపాన్ని కల్పించాలని ఆదేశించారు. అందుకు ట్రంప్ ఒప్పుకుంటారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కాష్ పటేల్ తన పనిమీద రాజకీయ ప్రమేయం ఉండకూడదని భావిస్తున్నారు. అందుకే జోబైడెన్ ప్రభుత్వ హయాం నుంచి ఎఫ్‌బీఐ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులు,ఏజెంట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.తాను ఎఫ్‌బీఐ ఆఫీస్‌లో ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు ట్రంప్‌తో నేరుగా మాట్లాడే అవకాశం ఉందా? ఉంటే సాధ్యసాధ్యాలను చూడాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా వచ్చీ రాగానే ఎఫ్‌బీఐ కార్యాలయం ఏడవ ఫ్లోర్‌లోని అధికారులను తొలగించారు. ఆ ఫ్లోర్లో డైరెక్టర్‌గా ఏదైనా నిర్ణయం తీసుకున్నా, దాన్ని అమలు చేయాలన్నా ఎఫ్‌బీఐ డైరెక్టర్ హోదాలో డిప్యూటీ అటార్నీ జనరల్‌తో మాట్లాడుతారు.డిప్యూటీ అటార్నీ జనరల్ ఇతర సీనియర్ అధికారులతో మంతనాలు జరిపి కార్యకలాపాలు నిర్వహిస్తారు. వారినే తొలగించి మరో ఫ్లోర్లో విధులు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు.సెక్యూరిటీ రిత్యా సీనియర్ ఎఫ్‌బీఐ అధికారులు తమ కార్యాలయాల్లోకి సెల్ఫోన్లను నిషేధించారు. తాజాగా,వైట్ హౌస్ స్విచ్‌బోర్డ్, సీఐఏ, ఇతర జాతీయ భద్రతా సంస్థలతో మాట్లాడేందుకు వీలుగా ట్రంప్‌తో మాట్లాడేలా సురక్షితమైన ల్యాండ్‌లైన్ వ్యవస్థ ఇప్పటికే చాలా మంది ఎఫ్‌బీఐ అధికారుల డెస్క్‌లపై ఉంది. బదులుగా కాష్ పటేల్ ట్రంప్‌తో నేరుగా మాట్లాడేలా చూడాలని కోరినట్లు వెలుగులోకి వచ్చిన మీడియా కథనాలు హైలెట్ చేస్తున్నాయి. అదనంగా, పటేల్ తన రక్షణ కోసం ఇప్పటికే ఎఫ్‌బీఐ ఏజెంట్లను నియమించినప్పటికీ, తన సొంత ప్రైవేట్ భద్రతా సిబ్బందిని నియమించుకోవాలని పరిశీలించినట్లు సమాచారం. పటేల్ ఎఫ్‌బీఐ ఏజెంట్లను పూర్తిగా విశ్వసించడం లేదని, కాబట్టే ప్రైవేట్ భద్రతా సిబ్బందిని నియమించుకోనున్నారు.కాగా,చరిత్రలో తొలిసారి ఎఫ్‌బీఐ తొలిడైరెక్టర్ జే. ఎడ్గార్ హూవర్ తన ఇంటి నుండి అధ్యక్షుడికి నేరుగా ఫోన్లో మాట్లాడేవారు. ఆ తర్వాత నుంచి ఎఫ్‌బీఐ, వైట్ హౌస్‌ల మధ్య ఓ ఫోన్ కాల్ వ్యవస్థ ఏర్పాటైంది. మళ్లీ ఇప్పుడు కాష్ పటేల్ ఆ సంప్రదాయానికి స్వస్తి పలకాలని భావిస్తున్నట్లు ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. -
ఐఎస్ఎస్ కమాండ్ బాధ్యతలు.. రష్యా వ్యోమగామికి అప్పగించిన సునీత
వాషింగ్టన్: కేవలం పది రోజుల మిషన్ కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కి వెళ్లి అనుకోని పరిస్థితుల్లో 9 నెలలపాటు అక్కడే ఉండిపోయిన భారత సంతతి అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) ఈ నెల 19న తిరుగు పయనం కానున్నారు. ఇందుకు సన్నాహకంగా ఆమె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) కమాండ్ బాధ్యతలను శనివారం రష్యా వ్యోమగామి అలెక్సీ ఒవ్చినిన్కు అధికారికంగా అప్పగించారు. ఈ నెల 12 లేదా 13వ తేదీన ప్రయోగించే స్పేస్ ఎక్స్ క్రూ–10 మిషన్‌లో నాసా (NASA) వ్యోమగాములు అన్నె మెక్ క్లయిన్, నికోల్ అయెర్స్తోపాటు జపాన్‌కు చెందిన టకుయా ఒనిషి, రష్యా వ్యోమగామి కిరిల్ పెస్కోవ్ ఉంటారు.ఐఎస్ఎస్లో కొత్త వారికి బాధ్యతలను అప్పగించే కార్యక్రమం మరో వారంపాటు కొనసాగనుంది. మార్చి 19వ తేదీన సునీతతోపాటు నాసాకే చెందిన బుచ్ విల్మోర్, నిక్ హేగ్, రష్యా వ్యోమగామి అలెగ్జాండర్ గొర్బునోవ్లు స్పేస్ ఎక్స్ క్రూ–10 మిషన్‌లో భూమికి తిరిగి రానున్నారు. నూతనంగా ఐఎస్ఎస్ కమాండ్ బాధ్యతలు చేపట్టిన ఒవ్చినిన్ ఏప్రిల్ వరకు అక్కడే ఉంటారు. గతేడాది జూన్‌లో బుచ్ విల్మోర్తో కలిసి సునీతా విలియమ్స్ బోయింగ్ స్టార్ లైనర్‌లో ఐఎస్ఎస్కు చేరుకోవడం, స్టార్ లైనర్‌లో సాంకేతిక సమస్యల కారణంగా అక్కడే ఇన్నాళ్లూ చిక్కుకుపోవడం తెలిసిందే.కొలంబియా వర్సిటీపై ట్రంప్ ఆగ్రహంవాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ షాకుల పరంపర తన, పర అనే తేడా లేకుండా కొనసాగుతోంది. క్యాంపస్‌లో యూదు వివక్షను, యూదు విద్యార్థులపై వేధింపులు, దాడులను అడ్డుకోవడంలో విఫలమైందంటూ న్యూయార్క్‌లోని ప్రఖ్యాత కొలంబియా యూనివర్సిటీపై అధ్యక్షుడు తాజాగా కన్నెర్రజేశారు. అందుకు శిక్షగా వర్సిటీకి అందుతున్న ప్రభుత్వ నిధుల్లో ఏకంగా 40 కోట్ల డాలర్ల మేరకు కోత పెడుతున్నట్టు ప్రకటించారు! గాజాపై యుద్ధంలో ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు నేపథ్యంలో గతేడాది పాలస్తీనా అనుకూల నిరసనలు, ఆందోళనలతో వర్సిటీ అట్టుడికిపోవడం తెలిసిందే. చదవండి: స్మగ్లింగ్.. కోడి గుడ్డేం కాదు!ఇలాంటి చట్టవిరుద్ధ నిరసనలకు వేదికలుగా మారే విద్యా సంస్థలు, వర్సిటీలకు నిధులు నిలిపేస్తానని గత వారమే ట్రంప్ హెచ్చరించారు. క్యాంపస్‌లో యూదు విద్యార్థులు నిరంతర వేధింపులు, వివక్ష, హింస ఎదుర్కొంటున్నా వర్సిటీ పాలక వర్గం చేష్టలుడిగిందని అమెరికా విద్యా శాఖ మంత్రి లిండా మెక్‌మోహన్ ఆరోపించారు. ‘‘దీన్ని సహించేది లేదు. కొలంబియాతో పాటు ఇతర వర్సిటీలకూ ఇదో హెచ్చరిక’’అని ఆమె చెప్పారు. పరిశోధనలు తదితరాలను ఈ నిధుల కోత తీవ్రంగా ప్రభావితం చేస్తుందని వర్సిటీ తాత్కాలిక ప్రెసిడెంట్ కత్రీనా ఆర్మ్‌స్ట్రాంగ్ ఆందోళన వెలిబుచ్చారు. -
వీడియో: న్యూయార్క్‌లో కార్చిర్చు మంటలు.. ఎమర్జెన్సీ విధింపు
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ నగరంలో కార్చిర్చు అంటుకుంది. ఎత్తుపడుతున్న మంటల కారణంగా నగరంపై దట్టమైన పొగ అలుముకుంది. తీవ్రమైన గాలుల కారణంగా దట్టమైన పొగ ఆకాశమంతటా వ్యాపిస్తోంది. ఫలితంగా ప్రధాన రహదారులపై వాహనాదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.న్యూయార్క్ నగరాన్ని కార్చిచ్చు పొగ కమ్మేస్తోంది. శనివారం లాంగ్ ఐలాండ్‌లోని హోంప్టన్స్‌లో ఈ మంటలు చెలరేగాయి. హోంప్టన్స్‌లో నాలుగు చోట్ల ఈ మంటలు పుట్టుకొచ్చాయి. మోరిచెస్, ఈస్ట్‌పోర్టు, వెస్ట్ హోంప్టన్స్తో సహా పలు ప్రాంతాలకు ఇవి వ్యాపించాయి. దీంతో, ఆ ప్రదేశాలు దట్టమైన పొగతో నిండిపోయాయి. ఈ క్రమంలో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది దీనిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మూడు చోట్ల మంటలు అదుపులోకి తీసుకురాగా.. హోంప్టన్స్‌లో 50 శాతం అగ్నికీలలను అదుపులోకి తెచ్చారు.BREAKING: New York Governor Kathy Hochul has declared a state of emergency as wildfires continue to spread across New York. pic.twitter.com/gQJsHAS3tU— The General (@GeneralMCNews) March 8, 2025కార్చిర్చు కారణంగా మంటలు ఎగిసిపడుతున్నాయి. మరోవైపు.. పెద్ద ఎత్తున గాలులు వీయడంతో దట్టమైన పొగ నగరమంతా వ్యాపించింది. అయితే, ఈ కార్చిచ్చు కారణంగా రెండు వాణిజ్య భవనాలు కాలిపోయాయి. ఈ నేపథ్యంలో న్యూయార్క్ గవర్నర్ హోచుల్ అక్కడ ఎమర్జెన్సీ ప్రకటించారు. స్థానికులను ఆ ప్రాంతం నుంచి తరలిస్తున్నట్లు తెలిపారు. మంటలను అదుపుచేసేందుకు హెలికాప్టర్లతో నీటిని చల్లుతున్నట్లు వెల్లడించారు. 🚨Evacuations ordered as multiple wildfires erupt near Long Island, New York pic.twitter.com/51rH3AbjNE— H. Gökhan Güleç (@gokhangulec) March 9, 2025 -
భారత్ వ్యతిరేక రాతలు.. అమెరికా టెంపుల్ ధ్వంసం
కాలిఫోర్నియా: అమెరికాలో హిందూ దేవాలయంపై దాడి జరిగింది. కొందరు దుండగులు భారతీయులకు వ్యతిరేకంగా రాతలు రాసి ఆలయంపై దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఆలయంపై దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.కాలిఫోర్నియాలోని చినోహిల్స్ ప్రాంతంలో ఉన్న BAPS హిందూ దేవాలయాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో BAPS పబ్లిక్ అఫైర్స్ సభ్యుడు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్బంగా.. దక్షిణ కాలిఫోర్నియాలోని ఆలయం ప్రహరీ గోడలపై భారతీయులకు వ్యతిరేకంగా, హిందువులకు వ్యతిరేకంగా రాతలు రాశారు. అనంతరం గట్టిగా నినాదాలు చేస్తూ ఆలయాన్ని ధ్వంసం చేశారని తెలిపారు. భారత సమాజం ఎల్లప్పుడూ శాంతి కోరుకుంటోందని, ద్వేషానికి వ్యతిరేకంగా నిలుస్తుందన్నారు. మానవత్వానికి విలువ ఇచ్చి, ఎవరిపై తాము దాడులు చేసే ఉద్దేశం లేదని వెల్లడించారు.Our response to media queries regarding vandalism at a Hindu Temple in California: 🔗 https://t.co/8H25kCdwhY pic.twitter.com/H59bYxq7qZ— Randhir Jaiswal (@MEAIndia) March 9, 2025ఈ నేపథ్యంలో భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు. రణధీర్ ట్విట్టర్ వేదికగా..‘కాలిఫోర్నియాలో ఒక హిందూ ఆలయంలో జరిగిన విధ్వంసానికి సంబంధించిన నివేదికలను మేము చూశాము. ఇటువంటి నీచమైన చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ చర్యలకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. దేవాలయాలకు తగిన భద్రత కల్పించాలని కోరుతున్నాం’ అని చెప్పుకొచ్చారు. In the face of another Mandir desecration, this time in Chino Hills, CA, the Hindu community stand steadfast against hate. Together with the community in Chino Hills and Southern California, we will never let hate take root. Our common humanity and faith will ensure that peace…— BAPS Public Affairs (@BAPS_PubAffairs) March 8, 2025 -
పాకిస్థాన్, భారత్ సరిహద్దులకు వెళ్లకండి.. అమెరికా పౌరులకు హెచ్చరిక
వాషింగ్టన్: పాకిస్థాన్ విషయంలో అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా పౌరులు ఎవరూ పాకిస్థాన్‌కు వెళ్లొద్దు అంటూ తాజాగా ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ఈ క్రమంలో పాకిస్థాన్‌లో ఉగ్రదాడులు జరిగే ప్రమాదం ఎక్కువ.. టెర్రరిస్టులు దాడులు జరిపే ప్రమాదం ఉందని హెచ్చరించింది.అమెరికా తమ దేశ పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. పాకిస్థాన్‌లో దాడులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వీలైనంత వరకూ ఆ దేశానికి వెళ్లకుండా ఉండడమే మంచిదంటూ పౌరులకు తాజాగా ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ఇదే సమయంలో.. పాకిస్థాన్ వెళ్లేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటే భారత సరిహద్దు ప్రాంతాలకు, బలూచిస్థాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లకు మాత్రం అస్సలు వెళ్లొద్దని హెచ్చరించింది. ఆయా ప్రావిన్స్‌లలో టెర్రరిస్టులు దాడులు చేసే అవకాశం ఉందని తెలిపింది. పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరగవచ్చని పేర్కొంది. ఇదే సమయంలో పాకిస్థాన్‌కు వెళ్లేవారూ ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.అలాగే.. మార్కెట్లు, రవాణా కేంద్రాలు తదితర ఏరియాలలో పౌరులను, పోలీసులను, సైనికులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని చెప్పింది. మరోవైపు.. పాక్ నుంచి భారత్‌లో అడుగుపెట్టేందుకు ఉన్న ఏకైక అధికారిక మార్గం వాఘా బార్డర్ మాత్రమేనని, సరిహద్దులు దాటి భారత్ లో అడుగుపెట్టాలంటే వీసా తప్పనిసరి అని పేర్కొంది. ముందు వీసా తీసుకున్నాకే బార్డర్ వద్దకు వెళ్లాలని, వాఘా బార్డర్ వద్ద వీసా పొందే అవకాశం లేదని వివరించింది.ఇదిలా ఉండగా.. పాకిస్థాన్ పౌరుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(trump) సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పాకిస్థాన్ నుంచి అమెరికాకు వచ్చే వారిపై నిషేధం విధించేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు. భద్రతా కారణాల రీత్యా.. పాక్ పౌరులపై ట్రావెల్ బ్యాన్ విధించనున్నట్టు సమాచారం. ఇక, డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడైన సమయంలోనూ కొన్ని ముస్లిం దేశాల పౌరులను అమెరికాలోకి అనుమతించడంపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.🇺🇸 The US warns against travel to Pakistan, citing terrorism risks. A "Do Not Travel" advisory applies to areas near the India-Pakistan border, the LoC, Balochistan, and Khyber Pakhtunkhwa due to threats of violence and armed conflict. pic.twitter.com/q2dLj1pkDa— Eye On News (@EyeOnNews24) March 9, 2025 -
కుల్‌భూషణ్ జాదవ్ కిడ్నాప్ వెనకున్న పాక్ మతపెద్ద హతం
ఇస్లామాబాద్: ఇరాన్లో భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ కిడ్నాప్‌లో పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐకు సహకరించాడనే ఆరోపణలు ఉన్న పాక్ మతపెద్ద ముఫ్తీ షా మిర్ హత్యకు గురయ్యారు. బలూచిస్థాన్‌లో గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపాడు. బలూచి ప్రాంతంలో మతపెద్ద అయిన ముఫ్తీ గతంలో రెండుసార్లు హత్యాయత్నం నుంచి తప్పించుకున్నారు.తుర్బాట్‌లోని స్థానిక మసీదులో ముఫ్తీ మిర్ రాత్రి ప్రార్థనలు ముగించుకుని వెళ్తుండగా.. బైక్‌పై వచ్చిన ముష్కరులు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ముఫ్తీ షా మిర్‌పై అనేకసార్లు కాల్పులు జరిపారని, తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన ఆయన.. శుక్రవారం మరణించినట్లు పేర్కొన్నారు.మత సంస్థ జమియత్ ఉలేమా-ఇ-ఇస్లాం (జేయూఐ)లో సభ్యుడైన ముఫ్తీ షా మీర్.. అక్కడి ప్రముఖ వ్యక్తుల్లో ఒకడిగా చలామణి అయ్యేవాడని.. ఆయుధాలు, మానవ అక్రమ రవాణా వంటి కార్యకలాపాలకు పాల్పడేవాడని జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. పాకిస్థాన్‌లోని పలు ఉగ్రవాద సంస్థలతో అతడిని సన్నిహిత సంబంధాలు ఉన్నాయని.. భారత భూభాగంలోకి అక్రమంగా చొరబడడానికి సాయం చేసే వాడని తెలిపాయి.కుల్‌భూషణ్ జాదవ్ కేసు.. అసలేం జరిగిందంటే..నావికాదళంలో బాధ్యతలు నిర్వర్తించి.. పదవీ విరమణ చేసిన కుల్‌భూషణ్ జాదవ్ ఇరాన్‌లోని చాబహార్ ప్రాంతంలో బిజినెస్ చేసేవారు. 2016లో ఆయన్ను ఇరాన్లో పాక్ ఐఎస్ఐ ఏజెంట్లు కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత బలూచిస్థాన్లోకి ఆయన ప్రవేశిస్తే అరెస్ట్ చేసినట్లు చూపారు. 2017 గూఢచర్యం ఆరోపణలపై పాకిస్థాన్ మిలిటరీ కోర్టు ఆయనకు మరణశిక్ష కూడా విధించింది. ఈ అంశంపై భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. ఆ మరణశిక్షను సవాల్ చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. నాటి నుంచి ఈ విచారణ కొనసాగుతూనే ఉంది. -
ఆస్ట్రేలియాలో మహిళలపై లైంగిక దాడి.. భారతీయ ప్రముఖుడికి 40 ఏళ్ల జైలు శిక్ష
సిడ్నీ: ఆస్ట్రేలియాలో ఐదుగురు మహిళలపై లైంగిక దాడికి పాల్పడిన నేరానికి గాను భారతీయ ప్రముఖుడు ఒకరికి న్యాయస్థానం 40 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 30 ఏళ్ల వరకు ఎలాంటి పెరోల్‌కు అవకాశం లేదని శుక్రవారం స్పష్టం చేసింది. దీంతో, ఘటన చర్చనీయాంశంగా మారింది.వివరాల ప్రకారం.. బాలేశ్ ధన్‌ఖడ్(43) మోసపూరిత ఉద్యోగ ప్రకటనలతో ఐదుగురు కొరియా మహిళలను ఆకర్షించి ప్రణాళిక ప్రకారం వారిని సిడ్నీలోని తన నివాసానికి రప్పించాడు. అక్కడ వారికి డ్రగ్స్ కలిపిన డ్రింక్స్ ఇచ్చి మత్తులో ఉండగా లైంగిక దాడికి పాల్పడినట్లు రుజువైందని డౌనింగ్ సెంటర్ డిస్ట్రిక్ట్ కోర్టు పేర్కొంది. తీర్పు వెలువడిన సమయంలో ధన్‌ఖడ్ కోర్టులోనే ఉన్నాడు. భవిష్యత్ లైంగిక సంతృప్తి కోసం అతను తన నేరాలను రికార్డు చేసి, వీడియోల రూపంలో భద్రపర్చు కోవడాన్ని జడ్జి మైకేల్ కింగ్ ప్రస్తావించారు.ఇక, బాధితులంతా 21–27 ఏళ్ల మధ్య వయ స్కులైన కొరియా మహిళలు. ఒక్కొక్కరికి వారి తెలివితేటలు, అందాన్ని బట్టి వేరుగా మార్కులు కూడా వేసేవాడని పోలీసులు తెలిపారు. బాధిత మహిళలతో జరిపిన చర్చలను సైతం రికార్డు చేశాడు. వారికి ఉద్యోగం అవసరం ఎంతుందనే దాన్ని బట్టి కుట్రను అమలు చేసేవాడు. చివరికి ఐదో బాధితురాలు 2018 అక్టోబర్‌లో ఫిర్యాదు చేయడంతో ఇతడి నేరాలకు పుల్‌స్టాప్ పడింది.పోలీసులు సిడ్నీ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌లోని ఇతడి కార్యాలయంపై దాడి చేసి డ్రగ్స్‌తోపాటు టేబుల్ క్లాక్ మాదిరిగా ఉన్న వీడియో రికార్డర్‌ను స్వాధీనం చేసు కున్నారు. అందులోనే అత్యాచారాల క్రమ మంతా నిక్షిప్తమై ఉండటం గమనార్హం. విచారణ జరిపిన కోర్టు ధన్‌ఖడ్ 39 నేరాలకు పాల్పడినట్లు గుర్తించింది. ఇందులో లైంగిక దాడికి సంబంధించిన నేరాలు 13 వరకు ఉన్నాయి. కోర్టు విధించిన జైలు శిక్షలో పెరోల్‌కు వీలులేని 30 ఏళ్ల కాలం 2053తో ముగియనుంది. మొత్తం 40 ఏళ్ల జైలు శిక్ష పూర్తయ్యే సరికి ధన్‌ఖడ్‌కు 83 ఏళ్లొస్తాయి.విద్యార్థిగా వెళ్లి...2006లో చదువుకునేందుకు ఆస్ట్రేలియా వెళ్లిన ధన్‌ఖడ్ భారతీయ ఆస్ట్రేలియన్లలో పేరున్న నాయకుడి స్థాయికి ఎదిగారు. భారతీయ జనతా పార్టీ అనే గ్రూపును నెలకొల్పారు. హిందూ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా అధికార ప్రతినిధిగా 2018లో అరెస్టయ్యే వరకు వ్యవహరించారు. ఏబీసీ, బ్రిటిష్ అమెరికన్ టొబాకో, టొయోటా, సిడ్నీ ట్రెయిన్స్ కంపెనీలకు డేటా విజువలైజేషన్ కన్సల్టెంట్‌గా సేవలందించారు. పలు సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ ప్రముఖుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.Indian community leader Balesh Dhankhar sentenced to 40 years in Australia for sexually assaulting five Korean women. Dhankhar lured victims with fake job ads, drugged and raped them and kept kept horrific spreadsheet detailing his crimes. Non-parole period set at 30 years.… pic.twitter.com/NcA4TUU3cq— Benefit News (@BenefitNews24) March 8, 2025 -
సిరియాలో మళ్లీ మారణహోమం.. 1000 మంది మృతి
బీరుట్: సిరియా అట్టుడుకుతోంది. మాజీ అధ్యక్షుడు అసద్ మద్దతుదారులు, ప్రభుత్వ భద్రతా దళాల మధ్య జరిగిన ఘర్షణల కారణంగా దాదాపు 1000 మంది మరణించారు. వీరిలో 750 మంది పౌరులు ఉన్నట్టు స్థానిక మీడియా సంస్థలు చెబుతున్నాయి.గత రెండు రోజులుగా సిరియాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ అధ్యక్షుడు బషర్ అల్-అసద్ మద్దతుదారులు, ప్రభుత్వ భద్రతా దళాల మధ్య జరిగిన ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు వర్గాల మధ్య ప్రతీకార దాడుల్లో భారీగా ప్రాణ నష్టం జరిగింది. అసద్ మద్దతుదారులు జాబ్లే నగరంలో భద్రతా సిబ్బందిని హత్య చేయడం కారణంగా ఈ ఘర్షణలు మొదలయ్యాయి. శుక్రవారం నుంచి ప్రభుత్వ దళాలు భారీ స్థాయిలో అసద్ తెగకు చెందిన అలావైట్లు అధికంగా ఉండే ప్రాంతాల్లో ప్రతీకార దాడులకు దిగాయి. అలవైట్లను ఊచకోత కోశారని స్థానికులు తెలిపారు.దీంతో, సిరియా మరోసారి అతలాకుతలమైంది. దాడుల నేపథ్యంలో మృతదేహాలు వీధుల్లో చెల్లాచెదురుగా పడి ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. బ్రిటన్‌కు చెందిన సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ ప్రకారం ప్రభుత్వ భద్రతా బలగాలకు చెందిన 125 మందితో పాటు అసద్‌కు మద్దతుగా పోరాడిన 148 మంది ప్రాణాలు కోల్పోయారు. తీరప్రాంత నగరం లటాకియా చుట్టుపక్కల ప్రాంతాలలో విద్యుత్ , తాగునీటిని నిలిపివేశారని, బేకరీలను మూసివేశారని అబ్జర్వేటరీ పేర్కొంది.ఇదిలాఉండగా.. 14 ఏళ్ల సిరియా సంక్షోభంలో ఇది భయంకరమైన మారణకాండ అని యుద్ధ నియంత్రణ సంస్థ ఒకటి తెలిపింది. అసద్‌ను పదవి నుంచి దించేసి తిరుగుబాటుదారులు అధికారాన్ని చేజిక్కించుకున్న మూడు నెలల తర్వాత డమాస్కస్‌లో ఏర్పడిన ఘర్షణలు నూతన ప్రభుత్వానికి సవాల్‌గా మారాయి. 🚨🇸🇾 THIS IS HAPPENING IN SYRIA!THE WEST CAUSED THIS! pic.twitter.com/oWbU2oOhVl— Jackson Hinkle 🇺🇸 (@jacksonhinklle) March 8, 2025 -
ఇజ్రాయెలీ సహా ఇద్దరిపై గ్యాంగ్ రేప్
సాక్షి, బళ్లారి: కర్ణాటకలోని చారిత్రక హంపి పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్‌కు చెందిన మహిళతోపాటు వారికి ఆతిథ్యమిస్తున్న స్థానిక మహిళపై దుండగులు దాడి చేసి తీవ్రంగా గాయపర్చడంతోపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అడ్డుకున్న ముగ్గురు పురుష పర్యాటకులపై దుండగులు దాడి చేసి, తీవ్రంగా కొట్టారు. తుంగభద్ర కాలువలోకి నెట్టివేయగా వీరిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు నలుగురు నిందితులను పట్టుకున్నారు. పరారీలో ఉన్న మరొకరి కోసం గాలింపు చేపట్టారు.గురువారం రాత్రి 11 గంటల సమయంలో గంగావతి సమీపంలోని సన్నాపుర వద్ద ఉన్న తుంగభద్ర కాలువ ఒడ్డున ఈ దారుణం చోటుచేసుకుంది. ఒడిశాకు చెందిన బిదాష్, మహారాష్ట్ర వాసి పంకజ్, అమెరికా పౌరుడు డానియెల్‌తోపాటు, ఇజ్రాయెల్ పర్యాటకురాలు, వీరికి ఆతిథ్యమిచ్చిన 29 ఏళ్ల స్థానిక మహిళ.. వీరంతా కలిసి తుంగభద్ర కాలువ ఒడ్డున గిటారు వాయిస్తూ సరదాగా కాలక్షేపం చేస్తున్నారు. అదే సమయంలో, కొందరు దుండగులు వీరి వద్దకు వచ్చి, పెట్రోల్ బంక్ ఎక్కడుందంటూ ప్రశ్నించారు. సనపూర్కు వెళ్లాలని బదులివ్వడంతో రూ.100 ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగారు. తెలుగు, కన్నడలో వారిని దూషించడం మొదలుపెట్టారు. దుండగుల్లో ఇద్దరు ఇజ్రాయెల్ మహిళతోపాటు ఆతిథ్యమిచ్చిన స్థానిక మహిళపైనా అత్యాచారానికి పాల్పడ్డారు మూడో వ్యక్తి ముగ్గురు పురుషులను తుంగభద్ర కాలువలోకి నెట్టివేశాడు. దీంతో, వీరిలో డానియెల్, పంకజ్‌లు ప్రాణాలతో బయటపడగా గల్లంతైన బిదాష్ మృతదేహం శనివారం ఉదయం కాలువలో దొరికింది. దుండగులు అంతటితో ఆగక స్థానిక మహిళను తీవ్రంగా కొట్టారు. ఆమె బ్యాగులో ఉన్న రెండు సెల్ఫోన్లు, రూ.9,500 నగదును దోచుకున్నారు. అనంతరం దుండగులు బైక్‌పై అక్కడి నుంచి పరారయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం బాధితుల ఫిర్యాదు మేరకు గంగావతి రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బాధిత మహిళలిద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని కొప్పాల్ ఎస్పీ రామ్ ఎల్ సిద్ధి చెప్పారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు నిందితులను గంగావతి పట్టణానికి చెందిన మల్లేశ్, చేతన్ సాయి, మోహన్, చన్నదాసర అనే వారిని పట్టుకున్నామన్నారు. ఐదో వ్యక్తిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా ఆరు పోలీస్ బృందాలను రంగంలోకి దించామని చెప్పారు. -
స్మగ్లింగ్.. కోడి గుడ్డేం కాదు!
కెనడా, మెక్సికో నుంచి అమెరికాలోకి అక్రమంగా తరలిస్తూ సరిహద్దుల్లో భారీగా పట్టుబడుతున్న ఉత్పత్తుల సంఖ్య కొద్ది నెలలుగా భారీగా పెరిగిపోయింది. అయితే అవేమిటో తెలుసా? ఎప్పట్లా ఫెంటానిలో, ఇతరేతర డ్రగ్సో కాదు. పౌల్ట్రీ ఉత్పత్తులు! ఆశ్చర్యంగా ఉన్నా నిజమిది. పైగా వాటిలోనూ సింహ భాగం గుడ్లే కావడం విశేషం!! నానాకష్టాలూ పడి డ్రగ్స్‌ను దేశం దాటించేకంటే స్మగ్లింగ్ నెట్వర్కులకు ఇదే మాంచి లాభసాటి బేరంగా కన్పిస్తోందట. అమెరికాను అతలాకుతలం చేస్తున్న గుడ్ల కొరత తీవ్రతకు ఈ ఉదంతం అద్దం పడుతోంది. కెనడా, మెక్సికోల నుంచి అమెరికాలోకి ఫెంటానిల్ తదితర డ్రగ్స్ విచ్చలవిడిగా స్మగ్లింగ్ అవుతుండటం పరిపాటి. అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఇది డొనాల్డ్ ట్రంప్‌కు పెద్ద ప్రచారాస్త్రంగా మారింది కూడా. కెనడాపై టారిఫ్‌ల యుద్ధానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా కూడా ఫెంటానిల్ నిలిచింది. కానీ కొద్ది నెలలుగా కెనడా నుంచి గుడ్లు తదితర పౌల్ట్రీ ఉత్పత్తుల స్మగ్లింగ్ డ్రగ్స్‌ను కూడా మించిపోయిందంటూ అమెరికా అధికారులే ముక్కున వేలేసుకుంటున్నారు. గుడ్లే అమెరికన్లకు ప్రధానమైన బ్రేక్‌ఫాస్ట్. ఉదయాన్నే ఆమ్లెట్లుగానో, మరో రూపంలో గుడ్లు తిన్నాకే వారికి రోజు మొదలవుతుంది. వారి బ్రేక్‌ఫాస్ట్ అవసరాలు కాస్తా బ్లాక్మార్కెటర్లకు కాసుల పంటగా మారుతుండటం విశేషం!డ్రగ్స్ కంటే 10 రెట్లు! 2024 అక్టోబర్‌తో పోలిస్తే ప్రస్తుతం కెనడా నుంచి డెట్రాయిట్ గుండా అమెరికాలోకి అక్రమంగా గుడ్లు తరలిస్తున్న వారి సంఖ్య 36 శాతం పెరిగినట్టు అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ గణాంకాలు చెబుతున్నాయి. ఇక మెక్సికో సరిహద్దులకు అతి సమీపంలో ఉండే శాన్‌డీగో వద్ద ఈ ఉదంతాలు ఏకంగా 158 శాతం పెరిగిపోవడం విశేషం. 2024 అక్టోబర్ నుంచి అమెరికా సరిహద్దులను దాటించే ప్రయత్నంలో పౌల్ట్రీ ఉత్పత్తులు పట్టుబడ్డ ఉదంతాలు 3,768కి పైగా నమోదయ్యాయి. ఇదే సమయంలో ఫెంటానిల్ పట్టుబడ్డ ఉదంతాలు కేవలం 352 మాత్రమే కావడం విశేషం. పెరుగుతున్న ఫ్లూ రిస్క్! బర్డ్ ఫ్లూ దెబ్బకు కొన్నేళ్లుగా ఉత్తర అమెరికా ఖండమంతా అతలాకుతలమవుతోంది. కెనడాలో దీని తీవ్రత తక్కువగా ఉన్నా అమెరికా బాగా ప్రభావితమైంది. అక్కడ రెండు మూడేళ్లుగా కోట్లాది కోళ్లను హతమార్చాల్సి వచ్చింది. ఇది క్రమంగా దేశవ్యాప్తంగా తీవ్ర గుడ్ల కొరతకు దారితీసింది. దాంతో గుడ్ల ధరలు చుక్కలనంటుతున్నాయి. డజనుకు 5 డాలర్ల మార్కును దాటేసి ఆల్‌టైం రికార్డు సృష్టించాయి. షికాగో, శాన్ఫ్రాన్సిస్కో వంటి పలు ప్రధాన నగరాల్లోనైతే డజను గుడ్లు ఏకంగా 9 నుంచి 10 డాలర్ల దాకా పలుకుతున్న పరిస్థితి! గుడ్ల సంక్షోభం చేయి దాటిపోయిందని స్వయానా అధ్యక్షుడు ట్రంపే అంగీకరించారు! ఈ ఏడాది చివరకల్లా గుడ్ల ధరలు కనీసం మరో 50 శాతం దాకా పెరగవచ్చని అంచనా. దాంతో కొద్ది నెలలుగా స్మగ్లర్ల కన్ను గుడ్లపై పడింది. కెనడా నుంచి అమెరికాలోకి వాటి అక్రమ రవాణా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోంది. అయితే దీనివల్ల బర్డ్ ఫ్లూతో పాటు ఇతరత్రా రోగాల రిస్కు పెరిగిపోతోందని అమెరికా ఆందోళన చెందుతోంది. కోళ్లు, గుడ్ల స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపేందుకు కెనడా, మెక్సికో సరిహద్దుల వద్ద నిఘాను మరింత కఠినతరం చేయాలంటూ ట్రంప్ సర్కారు తాజాగా ఆదేశాలు జారీచేసింది!అమెరికాలో అద్దెకు కోళ్లు గుడ్ల సంక్షోభం పుణ్యమా అని అమెరికాలో ఇప్పుడు కోడి పెట్టలను అద్దెకిచ్చే సరికొత్త వ్యాపారం పుట్టుకొచి్చంది. అది ఇప్పుడక్కడ యమా జోరుగా సాగుతుండటం విశేషం. డజను గుడ్లకు 5 నుంచి 10 డాలర్ల దాకా పెట్టాల్సి రావడం అమెరికన్లను కలవరపరుస్తోంది. దీనికి బదులు ఇంటి పెరళ్లలో కోడిపెట్టలను సాకేందుకు వాళ్లు మొగ్గుచూపుతున్నారు. దాంతో దేశవ్యాప్తంగా కోడిపెట్టలకు చెప్పలేనంత డిమాండ్ ఏర్పడింది. దీన్ని సొమ్ము చేసుకునేందుకు రెంట్ ద చికెన్ వంటి పేర్లతో ఏకంగా కంపెనీలే పుట్టుకొచ్చాయి. ఆర్నెల్ల ప్రాతిపదికన కోడిపెట్టలను అద్దెకిస్తున్నాయి. కనీస అద్దె ప్యాకేజీలు 300 డాలర్ల నుంచి మొదలవుతున్నాయి. ఇందులో భాగంగా రెండు పెట్టలతో పాటు వాటికి ఆర్నెల్ల పాటు కావాల్సిన దాణాను కూడా కంపెనీలే ఇస్తాయి. కోళ్ల గూడు కూడా సమకూరుస్తాయి. ఆరోగ్యకరమైన పెట్ట వారానికి ఐదారు దాకా గుడ్లు పెడుతుంది. ఆ లెక్కన రెండు కోళ్లు ఆర్నెల్లకు కనీసం 250 గుడ్లు పెడతాయన్నమాట. వాటిని మార్కెట్లో కొనాలంటే ప్రస్తుత రేట్లను బట్టి కనీసం 80 నుంచి 160 డాలర్లకు పైనే పెట్టాల్సి ఉంటుంది. కోళ్లను సాకడం ద్వారా ఏ రోజుకు ఆ రోజు తాజా గుడ్లు దొరుకుతుండటం అమెరికన్లను బాగా ఆకర్షిస్తోంది. అంతేగాక గుడ్లను పొదిగించి కోళ్ల సంఖ్యను ఇబ్బడిముబ్బడిగా పెంచుకుంటున్నారు. కాంట్రాక్టు ముగిశాక అవి వారికే సొంతమవుతున్నాయి. వాటిని అద్దెకిస్తూ సైడ్ వ్యాపారం చేస్తున్న వారికి కూడా కొదవ లేదు. దొరికితే జరిమానాలుఅమెరికాలోకి గుడ్లు, ఇతర ప్రాసెస్ చేయని పౌల్ట్రీ ఉత్పత్తుల రవాణా చట్టవిరుద్ధం. ఫ్లూ తదితర ఆందోళనలే ఇందుకు కారణం. వీటిని దేశంలోకి తరలించే ప్రయత్నంలో పట్టుబడితే 300 డాలర్ల దాకా జరిమానా విధిస్తారు. ‘‘ఇరు దేశాలకూ కొన్నేళ్లుగా నిద్ర లేకుండా చేస్తున్న ఫెంటానిల్ వంటి డ్రగ్స్ కంటే కూడా కెనడా నుంచి అమెరికాలోకి గుడ్ల అక్రమ రవాణాయే పెరిగిపోతోందంటే ఆశ్చర్యంగానే ఉంది. కానీ కళ్లెదుట కన్పిస్తున్న వాస్తవమిది’’ అన్నారు కెనడా చాంబర్ ఆఫ్ కామర్స్ పాలసీ చీఫ్ మాథ్యూ హోమ్స్. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మందగమనంలోకి అమెరికా!
వాషింగ్టన్: తీవ్ర అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి అడుగుపెట్టొచ్చని ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ అభిప్రాయపడ్డారు. వినియోగదారుల వ్యయంలో మందగమనం సంభవించే అవకాశముందని, ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులపై తీవ్ర అనిశ్చితి కొన సాగుతోందని వ్యాపార వర్గాల్లో అంచనాలు నెలకొన్నాయి. ఈ వార్తల నేపథ్యంలో ఫెడ్ చైర్మన్ వ్యా ఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో జరిగిన ఆర్థిక ఫోరంలో ఆయన చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు. → కొత్త ట్రంప్ ప్రభుత్వ విధానాలు ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అన్న అంశంపై స్పష్టత వచ్చే వరకు ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించడంలో ఏ మాత్రం తొందరపడబోదు. → కొత్త ప్రభుత్వం 4 ప్రధాన రంగాల్లో గణనీయమైన విధాన మార్పులను అమలు చేసే ప్రక్రియలో ఉంది. వాణిజ్యం, వలస, ద్రవ్య, నియంత్రణ విధానాల్లో మార్పులు చోటుచేసుకునే వీలుంది. ఈ మార్పులు, వాటి ప్రభావాలపై అనిశ్చితి తీవ్రంగా ఉంది. → పరిస్థితులు ఎలా మారుతున్నాయో అర్థం చేసుకోవడంపై మేము దృష్టి సారిస్తాము. మేము తొందరపడాల్సిన అవసరం లేదు. స్పష్టత కోసం ఎదురుచూడడానికే మేము మొగ్గు చూపిస్తాము. → ఆర్థిక వ్యవస్థ పటిష్ట స్థితిలో ఉంది. అయితే చోటుచేసుకుంటున్న పరిణామాలు భవిష్యత్తులో వ్యయాలు, అలాగే పెట్టుబడులపై ఎలా ప్రభావం చూపుతాయో వేచి చూడాలి. → కీలక సూచీలు స్థిరంగానే ఉన్నాయని. అయితే ద్రవ్యోల్బణం విషయంలో ఇంకా అస్పష్టత కొనసాగుతోంది. ఉపాధి కల్పనలో మాత్రం వృద్ధి ధోరణి కొనసాగుతోంది. → ద్రవ్యోల్బణం అంచనాలను మించిన వేగంతో తగ్గినా లేదా ఆర్థిక వ్యవస్థ బలహీనపడినా ద్రవ్య విధానంలో అవసరమైన మార్పులు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. → ఫిబ్రవరి నెలలో అమెరికా ప్రభుత్వం 1,51,000 ఉద్యోగాల వృద్ధిని నమోదుచేసింది. అయితే సెపె్టంబర్ నుంచి చూస్తే నెలకు సగ టున 1,91,000 ఉద్యోగ కల్పన జరుగుతోంది. మార్కెట్లపై ప్రతికూలతలు.. ట్రంప్ ప్రభుత్వం మెక్సికో, కెనడా వంటి ప్రధాన వ్యాపార భాగస్వాములపై భారీ దిగుమతి సుంకాలను ప్రకటించడం, అలాగే చైనా నుండి దిగుమతులపై సుంకాలను రెట్టింపు చేయడం వంటి పరిణామాలు మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో ఫెడరల్ రిజర్వ్ మార్చి 18–19 తేదీల్లో జరిపే తన పాలసీ సమావేశంలో 4.25%–4.50% శ్రేణిలో వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచే అవకాశం ఉంది. పాలసీ నిర్ణేతలు ఆవిష్కరించే కొత్త ఆర్థిక అంచనాలు.. ట్రంప్ ప్రభుత్వ తొలి రెండు నెలల విధానాలు, ఇవి ద్రవ్యోల్బణం, ఉపాధి, ఆర్థిక వృద్ధి, వడ్డీ రేట్ల మార్గాన్ని ఎలా ప్రభావితం చేశాయనే అంశంపై స్పష్టత నిచ్చే అవకాశం ఉంది. కాగా, మార్కెట్లో పెట్టుబడిదారులు ప్రస్తుతం అమెరికా ఆర్థిక వ్యవస్థలో మాంద్యం సంభవించే అవకాశం ఎక్కువగా ఉందని భావిస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఫెడ్ మూడు దఫాలుగా పావు శాతం (మొత్తం 0.75%) చొప్పున రేటు కోతలు ఉండే అవకాశం ఉందని భావిస్తుండడం గమనార్హం. -
ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి భీకర దాడి.. 14 మంది మృతి
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దిశగా ప్రయత్నాలు జరుగుతోన్న క్రమంలో కూడా రష్యా భీకర దాడులు కొనసాగుతూనే ఉంది. తాజాగా, ఉక్రెయిన్‌పై మరోసారి క్షిపణులతో విరుచుకుపడింది. డోబ్రాపిలియా ప్రాంతంపై జరిగిన మిస్సైల్ దాడిలో 14 మంది మృతి చెందారు. ఉక్రెయిన్ తూర్పు నగరం డోబ్రాపిలియా, ఖార్కివ్ ప్రాంతంలోని ఒక స్థావరంపై రాత్రిపూట రష్యా క్షిపణి, డ్రోన్ దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఐదుగురు పిల్లలు సహా 37 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది.కాగా, రెండు రోజుల క్రితం జెలెన్స్కీ సొంత పట్టణంలోని కూడా క్షిపణి దాడి జరిగిన సంగతి తెలిసిందే. రాత్రి సమయంలో క్రీవి రీహ్‌లోని ఓ హోటల్‌పై రష్యా క్షిపణిదాడిలో నలుగురు మృతి చెందారు. ఆ హోటల్లో తమ దేశ పౌరులతో పాటు అమెరికా, బ్రిటన్ జాతీయులు ఉన్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు తెలిపారు. ఈ ఘటనలో సుమారు 30 మంది గాయపడ్డారు. 112 షాహెడ్, డెకాయ్ డ్రోన్లను, రెండు బాలిస్టిక్ ఇస్కందర్ మిస్సైల్స్‌ను ప్రయోగించినట్టు ఉక్రెయిన్ వైమానికదళం ప్రకటించింది.యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఉక్రెయిన్‌కు అమెరికా మద్దతుగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ట్రంప్ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన తర్వాత ఆ దేశం పట్ల ఆయన కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఉక్రెయిన్‌కు మిలిటరీ, ఇంటెలిజెన్స్ సాయాన్ని కూడా అమెరికా నిలిపేసింది. మరో వైపు, ఉక్రెయిన్ భద్రత కోసం రష్యాను బెదిరించేందుకు అవసరమైతే తన అణ్వాయుధాలను నిరోధంగా వాడేందుకు సిద్ధమంటూ ఫ్రాన్స్ వివాదాస్పద ప్రతిపాదన చేసిన సంగతి విదితీమే.గత గురువారం బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో యూరోపియన్ యూనియన్ దేశాల తాజా శిఖరాగ్ర సమావేశం ఇందుకు వేదికైంది. రష్యా బారినుంచి యూరప్‌కు రక్షణ కల్పించేందుకు ఫ్రాన్స్ అణుపాటవాన్ని ఆయుధంగా ఉపయోగించేందుకు సిద్ధమని అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ సందర్భంగా ప్రకటించారు. సభ్య దేశాల నుంచి ఇందుకు భారీ స్పందన లభించింది. -
దక్షిణ కొరియా: జైలు నుంచి యోల్ విడుదల
సియోల్: మార్షల్ లా విధించిన కేసులో అభిశంసనకు గురై పదవి కోల్పోయి, జైలుపాలైన దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ జైలు నుంచి విడుదలయ్యారు. దేశంలో స్వల్పకాలిక మార్షల్ లా విధించిన అంశంలో అభియోగాలు ఎదుర్కొంటున్న ఆయన జనవరి చివరిలో అరెస్టయిన సంగతి తెలిసిందే. తనను జైలు నుంచి విడుదల చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై సియోల్ సెంట్రల్ జిల్లా కోర్టు సానుకూలంగా స్పందించింది. మాజీ అధ్యక్షుడికి జైలు జీవితం నుంచి విముక్తి కల్పించాలని నిన్న(శుక్రవారం) ఆదేశాలు జారీ చేసింది.కాగా, యూన్‌ను అరెస్టు చేయడం చట్టవిరుద్ధమని ఆయన తరఫు లాయర్లు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. అధికారికంగా అరెస్టును చూపకముందే దర్యాప్తు సంస్థ యూన్‌ను నిర్బంధించిందని తెలిపారు. యూన్‌పై విచారణ చేపట్టడం చట్టబద్ధమేనా? అనే దానిపై పలు సందేహాలు తలెత్తుతున్నాయని, వీటికి సమాధానాలు కనిపెట్టాల్సి ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది. అధ్యక్షుడిగా హోదాలో యూన్ గత ఏడాది స్వల్పకాలం పాటు మార్షల్ లా విధించిన సంగతి తెలిసిందే.దేశంలో అత్యవసర పరిస్థితులు లేకపోయినా మార్షల్ లా విధించడం దేశంపై తిరుగుబాటు చేయడమేనని ఆరోపిస్తూ పార్లమెంట్ సభ్యులు ఆయనను అభిశంసించారు. అభిశంసనపై రాజ్యాంగ కోర్టు విచారణ చేపట్టింది. ఒకవేళ అభిశంసన చెల్లదని కోర్టు తీర్పు ఇస్తే యూన్ తన పదవిని మళ్లీ దక్కించుకొనే అవకాశాలున్నాయి.అభిశంసన చెల్లుబాటు అవుతుందని ప్రకటిస్తే యూన్ అధికారికంగా పదవిని కోల్పోయినట్లే. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి రెండు నెలల్లోగా జాతీయ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. దక్షిణ కొరియాలో పదవిలో ఉండగా అరెస్టయిన మొట్టమొదటి అధ్యక్షుడిగా యూన్ రికార్డుకెక్కారు. దేశ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడికి పలు కేసుల నుంచి మినహాయింపు ఉంటుంది. కానీ, దేశ ద్రోహం, రాజ్యంపై తిరుగుబాటు వంటి కేసుల్లో ఎలాంటి మినహాయింపు ఉండదు. సాధారణ పౌరుల తరహాలోనే విచారణను ఎదుర్కోవాల్సిందే. నేరం నిరూపణ అయితే శిక్ష అనుభవించాల్సిందే. -
భారత్‌తో చాలా కష్టం.. వదిలిపెట్టే ప్రసక్తే లేదు: ట్రంప్ హెచ్చరిక
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌ను టార్గెట్ చేసి సంచలన ఆరోపణలు చేశారు. అమెరికాకు చెందిన వస్తువులపై భారత్ భారీ సుంకాలు విధిస్తోందని తెలిపారు. అందుకే తాము కూడా భారత్‌కు ప్రతీకార సుంకాలు విధిస్తామని ట్రంప్ వెల్లడించారు. వచ్చే నెల రెండో తేదీ నుంచి ప్రతీకార సుంకాల విధింపు ఉంటుందని స్పష్టం చేశారు.తాజాగా అధ్యక్షుడు ట్రంప్ వైట్‌హాస్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘పన్నులను తగ్గించడానికి భారత్ అంగీకరించింది. భారత్ అధిక సుంకాలు విధించే దేశం. అమెరికా వస్తువులపై భారత్ భారీగా సుంకాలు విధిస్తోంది. భారత్ వసూలు చేస్తోన్న టారిఫ్ ఇలాగే కొనసాగితే ఏ ఒక్క వస్తువును కూడా అక్కడ విక్రయించలేం. అధిక పన్నుల వల్ల భారత్‌కు ఏదైనా ఓ వస్తువును విక్రయించడం దాదాపు అసాధ్యంగా మారింది.#WATCH | Washington, DC: US President Donald Trump says, "...India charges us massive tariffs. Massive. You can't even sell anything in India...They have agreed, by the way; they want to cut their tariffs way down now because somebody is finally exposing them for what they have… pic.twitter.com/XwytKPli48— ANI (@ANI) March 7, 2025అమెరికా నుండి 100 శాతం కంటే ఎక్కువ ఆటో సుంకాలను వసూలు చేస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా ఇదే కొనసాగుతోంది. అందుకే మేము కూడా సుంకాలు విధించాలనే నిర్ణయానికి వచ్చాం. ఏప్రిల్ రెండో తేదీ నుంచి ప్రతీకార సుంకాలు ప్రారంభం అవుతాయి. ఫలితంగా తమ దేశంపై విధించిన టారిఫ్‌ను తగ్గించడానికి భారత్ అంగీకరించింది. నేను ఎవరికి నిందించడం లేదు. వ్యాపారం చేయడానికి ఇది వేరొక మార్గం మాత్రమే’ అని చెప్పుకొచ్చారు.అలాగే, యూరోపియన్ యూనియన్, చైనా, బ్రెజిల్, మెక్సికో, కెనడా వంటి దేశాలు కూడా అమెరికా వస్తువుల విషయంలో భారీగా సుంకాలు విధిస్తున్నాయి. ఇది చాలా అన్యాయం. మా దేశ ప్రయోజనాలను ఉపయోగించుకోవడాన్ని అమెరికా ఇకపై ఎంతమాత్రం కూడా సహించదు. ఇప్పుడు మా వంతు వచ్చింది. సుంకాల విధింపు విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం. ఏప్రిల్ 2న విధించే సుంకాలు.. అమెరికా దశను మార్చనున్నాయని వ్యాఖ్యానించారు.ఇదిలా ఉండగా.. అమెరికా ప్రతీకార సుంకాలపై భారత్ ఆచితూచి స్పందించింది. సుంకాలు, సుంకాలేతర అడ్డంకులను అధిగమించడానికి బహుళ రంగ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ) కింద అమెరికాతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటామని పేర్కొంది. ఇక, ట్రంప్ సుంకాల ప్రకటన స్టాక్ మార్కెట్లను కుదిపేసింది. -
ట్రంప్ కేబినెట్ మీటింగ్‌లో రచ్చ.. రచ్చ!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షతన జరిగిన తాజా కేబినెట్ సమావేశం రసాభాసా చోటు చేసుకుంది. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో(Marco Rubio), వైట్‌హౌజ్ సలహాదారు ఇలాన్ మస్క్‌లు ట్రంప్ సమక్షంలోనే వాగ్వాదానికి దిగారు.స్టేట్ డిపార్ట్మెంట్లలో ఉద్యోగులను తొలగించకపోవడాన్ని ప్రస్తావించిన మస్క్.. రుబియోపై చిందులు తొక్కారు. ట్రంప్ ఏరికోరి నియమించుకున్న వ్యక్తి.. కేవలం టీవీల్లో కనిపించడంపైనే దృష్టిసారిస్తున్నారంటూ సెటైర్లు వేశారు. అయితే.. అబద్ధాలు చెబుతున్నారంటూ మస్క్ మొహం మీదే రుబియో కౌంటర్లు ఇచ్చారు.స్టేట్ డిపార్ట్మెంట్ నుంచి 1,500 మంది ఉద్యోగులను ఇప్పటికే తొలగించామని(Layoffs). ఒకవేళ వాళ్లందరినీ తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకుని మరి తొలగించాలని మస్క్ భావిస్తున్నారేమోనని వెటకారంగా సమాధానం ఇచ్చారు. దీంతో.. ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. ఒకానొక టైంలో.. ట్రంప్ రుబియోకి మద్ధతుగా నిలిచినట్లు సమాచారం. ఇక.. ఈ కేబినెట్ సమావేశంలో పాల్గొన్న అధికారులంతా మస్క్‌పై ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. మస్క్ చర్యలతో రిపబ్లికన్లలోనూ అసహనం పెరిగిపోతోందని.. ఈ క్రమంలోనే వైట్‌హౌజ్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని చీఫ్ స్టాఫ్ సుసీ వైల్స్ మీటింగ్‌లో ప్రస్తావించారు. ఈ మేరకు గురువారం కేబినెట్ మీటింగ్‌లో జరిగిన అంశాలన్నింటిని ప్రస్తావిస్తూ న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ఇచ్చింది. అయితే..అలాంటిదేం లేదుకేబినెట్ మీటింగ్ హాట్ హాట్‌గా సాగిందన్న మీడియా కథనాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఖండించారు. శుక్రవారం ఓవెల్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘‘నేను అక్కడే ఉన్నా కదా. అక్కడ ఎలాంటి ఘర్షణ జరలేదు. మీరే(మీడియాను ఉద్దేశించి..) లేనిపోనివి సృష్టిస్తున్నారు. ఇలాన్, మార్కో ఇద్దరూ గొప్పవాళ్లే. వాళ్లు తమ విధులను అద్భుతంగా నిర్వర్తిస్తున్నారు’’ అని ట్రంప్ పొగడ్తలు గుప్పించారు.డోజ్ విమర్శలపై మస్క్అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్.. ప్రముఖ బిలియనీర్ ఇలాన్ మస్క్‌ను డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ(DOGE) సారథిగా నియమించారు. అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులే ‘డోజ్’ ప్రాజెక్టు లక్ష్యమని, తన ప్రభుత్వంలో సమర్థత పెంచేందుకు ఈ విభాగం కృషి చేస్తుందని ఆ టైంలో ట్రంప్ ప్రకటించారు. ప్రభుత్వ శాఖల్లో వృథా ఖర్చులకు కత్తెర, దుబారా ఖర్చులకు కోత, అవినీతి నిర్మూలన, ఫెడరల్ సంస్థలను పునర్మిర్మాణం.. ఇవన్నీ డోజ్ చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా.. ప్రభుత్వ శాఖల్లో భారీగా ఉద్యోగాల తొలగింపు చేపట్టారు. అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవం.. 2026 జులై 4వ తేదీలోపు మొత్తం ఫెడరల్ బ్రూరోక్రసీని ఇది ప్రక్షాళన చేయాల్సి ఉంది. ఆ తర్వాత డోజ్ దానికదే ఎక్స్పైరీ కానుంది.అయితే.. డోజ్ తీసుకునే తీవ్రమైన నిర్ణయాల వల్ల దేశ రక్షణ, మౌలిక సదుపాయాల కల్పన వంటి ప్రభుత్వం అందించే సేవలు నిర్వీర్యం అయ్యే అవకాశం ఉందని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలిక అభివృద్ధి కావాలంటే.. కొన్నింటిని వదులుకోవాలని మస్క్ తన చర్యలను సమర్థించుకుంటున్నారు. -
ఈ ఏడాదితో ఉత్తరాల బట్వాడా బంద్
కోపెన్‌హాగెన్: డెన్మార్క్‌లో ఉత్తరాల బట్వాడాను ఈ ఏడాది చివరికల్లా నిలిపివేయనున్నట్లు డెన్మార్క్, స్వీడన్ల ప్రభుత్వ తపాలా సేవల విభాగం ‘పోస్ట్‌నార్డ్’ప్రకటించింది. పార్సిల్ సేవలను మాత్రం యథా ప్రకారం కొనసాగిస్తామని తెలిపింది. ఈ ఏడాది రెండో అర్ధ భాగంలో డెన్మార్క్ వ్యాప్తంగా ఉన్న 1,500 తపాలా బాక్సులను తొలగిస్తామంది. తాజా పరిణామంతో పోస్ట్నార్డ్లోని 4,600 మంది ఉద్యోగులకు గాను 1,500 మంది తొలగింపునకు గురి కానున్నారు. స్వీడన్లో మాత్రం ఉత్తరాల బట్వాడాపై ఎటువంటి ప్రభావం ఉండదని పోస్ట్‌నార్డ్ వివరించింది. 2000వ సంవత్సరంతో పోలిస్తే ఉత్తరాల సంఖ్య 90 శాతం మేర పడిపోయిందని, ఇందులో 30 శాతం వరకు ఒక్క 2024లోనే ఉందని తెలిపింది. డెన్మార్క్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా డిజిటల్ మాధ్యమాల వైపు మళ్లడమే ఇందుకు ప్రధాన కారణమని వివరించింది. 2024లో పోస్టల్ ఫీజులను భారీగా పెంచడం ఇందుకు తోడైంది. డెన్మార్క్ పోస్టల్ విభాగానికి 400 ఏళ్ల ఘన చరిత్ర ఉందని పోస్ట్‌నార్డ్ డెన్మార్క్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కిమ్ పెడెర్సన్ చెప్పారు. ప్రస్తుతం చాలా తక్కువ సంఖ్యలోనే ఉత్తరాలు వస్తున్నందున, ఏమంత లాభదాయంగా లేదన్నారు. తమకు ఇప్పుడు ప్రధాన వనరు పార్సిల్ డెలివరీయేనన్నారు. ప్రజలు తమ ఉత్తరాలను పార్సిల్ల ద్వారా కూడా పంపుకోవచ్చని చెప్పారు. 2026 నుంచి ప్యాకేజీ విభాగంపైనే ప్రధానంగా దృష్టిపెడతామని చెప్పారు. సుదూర ప్రాంతాల్లోని వారికి ఉత్తరాలే తప్ప వేరే సమాచార మార్గం లేనందున పోస్ట్‌నార్డ్ నిర్ణయం సరికాదని డెన్మార్క్ ఎంపీ డ్రాగ్స్టెడ్ చెప్పారు. అయితే, ప్రైవేటు కంపెనీలు ఉన్నందున ఉత్తరాలను పంపించుకోవడం కష్టం కాదని మీడియా అంటోంది. సుదూరంగా ఉండే దీవుల్లోని వారికి, మారుమూల ప్రాంతాల్లోకి ఉత్తరాల బట్వాడాకు అంతరాయం కలగకుండా డెన్మార్క్ ప్రభుత్వం సంబంధిత మౌలిక వసతులను కొనసాగించనుంది. కాగా, జర్మనీ ప్రభుత్వ డచ్పోస్ట్ సైతం తపాలా సరీ్వసులను కుదిస్తూ 8 వేల మంది ఉద్యోగులపై వేటు వేసేందుకు చర్యలు ప్రారంభించింది. -
యూన్ సుక్ యోల్‌ను జైలు నుంచి విడుదల చేయండి
సియోల్: మార్షల్ లా విధించిన కేసులో అభిశంసనకు గురై పదవి కోల్పోయి, జైలుపాలైన దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కు భారీ ఊరట లభించింది. తనను జైలు నుంచి విడుదల చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై సియోల్ సెంట్రల్ జిల్లా కోర్టు సానుకూలంగా స్పందించింది. మాజీ అధ్యక్షుడికి జైలు జీవితం నుంచి విముక్తి కల్పించాలని శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. యూన్‌ను అరెస్టు చేయడం చట్టవిరుద్ధమని ఆయన తరఫు లాయర్లు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. అధికారికంగా అరెస్టును చూపకముందే దర్యాప్తు సంస్థ యూన్‌ను నిర్బంధించిందని తెలిపారు. యూన్‌పై విచారణ చేపట్టడం చట్టబద్ధమేనా? అనే దానిపై పలు సందేహాలు తలెత్తుతున్నాయని, వీటికి సమాధానాలు కనిపెట్టాల్సి ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది. అధ్యక్షుడిగా హోదాలో యూన్ గత ఏడాది స్వల్పకాలం పాటు మార్షల్ లా విధించిన సంగతి తెలిసిందే. దేశంలో అత్యవసర పరిస్థితులు లేకపోయినా మార్షల్ లా విధించడం దేశంపై తిరుగుబాటు చేయడమేనని ఆరోపిస్తూ పార్లమెంట్ సభ్యులు ఆయనను అభిశంసించారు. అభిశంసనపై రాజ్యాంగ కోర్టు విచారణ చేపట్టింది. ఒకవేళ అభిశంసన చెల్లదని కోర్టు తీర్పు ఇస్తే యూన్ తన పదవిని మళ్లీ దక్కించుకొనే అవకాశాలున్నాయి. అభిశంసన చెల్లుబాటు అవుతుందని ప్రకటిస్తే యూన్ అధికారికంగా పదవిని కోల్పోయినట్లే. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి రెండు నెలల్లోగా జాతీయ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. దక్షిణ కొరియాలో పదవిలో ఉండగా అరెస్టయిన మొట్టమొదటి అధ్యక్షుడిగా యూన్ రికార్డుకెక్కారు. దేశ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడికి పలు కేసుల నుంచి మినహాయింపు ఉంటుంది. కానీ, దేశ ద్రోహం, రాజ్యంపై తిరుగుబాటు వంటి కేసుల్లో ఎలాంటి మినహాయింపు ఉండదు. సాధారణ పౌరుల తరహాలోనే విచారణను ఎదుర్కోవాల్సిందే. నేరం నిరూపణ అయితే శిక్ష అనుభవించాల్సిందే. -
అథెనా కథ ముగిసింది
కేప్ కనవెరాల్: ఇంట్యూటివ్ మెషీన్స్ రెండో మిషన్ కూడా ఫెయిలయ్యింది. చంద్రుడిపైకి పంపిన ల్యాండర్ అథెనా పనిచేయకుండా పోయింది. టెక్సాస్‌కు చెందిన ఇంట్యూటివ్ మెషీన్స్ సంస్థ స్పేస్ ఎక్స్ రాకెట్ ద్వారా ఫిబ్రవరి 26న అథెనాను పంపించింది. ఇందులో 11 పేలోడ్లు, సైంటిఫిక్ పరికరాలు ఉన్నాయి. చంద్రుని దక్షిణ ధ్రువానికి 160 కిలోమీటర్ల దూరంలోని నిర్ణీత ప్రదేశంలో ఇది ల్యాండవ్వాల్సి ఉంది. కానీ, 250 మీటర్ల దూరంలో అతికష్టమ్మీద, అదీ ఇరుకైన గుంతలో దిగింది. తను దిగిన ప్రదేశాన్ని, పొజిషన్‌ను తెలపడంతోపాటు కొన్ని ప్రయోగాలకు సంబంధించిన పరికరాలను సైతం యాక్టివేట్ చేసినట్లు ఫొటోలను పంపించింది. వీటిని బట్టి చూస్తే ఇది ఇరుకైన గుంతలో పక్కకు ఒరిగి ఉన్నట్లు నాసా శాస్త్రవేత్తలు శుక్రవారం తేల్చారు. ల్యాండర్‌కు ఉన్న సౌర ఫలకాలున్న తీరు, గుంతలోని అతి శీతల పరిస్థితులను బట్టి చూస్తే, అథెనా బ్యాటరీలను రీఛార్జి చేయడం అసంభవమని గుర్తించారు. దీంతో, అథెనా పనిచేసే అవకాశాలు లేవని ప్రకటించారు. మిషన్ పూర్తయినట్లు ప్రకటించిన అధికారులు అది పంపించిన చిత్రాలను విశ్లేషించి పనిలో పడ్డారని ఇంట్యూటివ్ మెషీన్స్ తెలిపింది. అథెనా ఇంట్యూటివ్ రెండో మిషన్ కాగా, ఈ సంస్థ ఏడాది క్రితం పంపిన ఒడిస్సియస్ కూడా విఫలమైంది. -
రష్యాకు ట్రంప్ షాక్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాకు ఊహించని షాక్ ఇచ్చారు. ఉక్రెయిన్–రష్యా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం, శాంతి ఒప్పందం కుదిరేదాకా రష్యాపై భారీ స్థాయిలో ఆంక్షలు, టారిఫ్‌లు విధించాలని తీవ్రంగా యోచిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం సోషల్ మీడియాలో పోస్టు చేశారు. రష్యా, ఉక్రెయిన్ వెంటనే శాంతి చర్చలకు శ్రీకారం చుట్టాలని స్పష్టంచేశారు. ఆలస్యం కాకముందే ఆ పని ప్రారంభిస్తే బాగుంటుందని హితవు పలికారు. నిన్నటిదాకా రష్యా పట్ల సానుకూలంగా మాట్లాడిన ట్రంప్ హఠాత్తుగా స్వరం మార్చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే, రష్యాకు ట్రంప్ హెచ్చరికలు జారీ చేయడం కొత్తేమీ కాదు. ఈ ఏడాది జనవరిలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రష్యాను ఉద్దేశించి కఠిన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని నిలిపివేయకపోతే మరిన్ని ఆంక్షలు విధిస్తామని, రష్యా ఉత్పత్తులపై అధికంగా టారిఫ్‌లు వసూలు చేస్తామని తేల్చిచెప్పారు. ఆయన తన వైఖరికి కట్టుబడి ఉన్నట్లు తెలుస్తోంది. యుద్ధాన్ని ముగించే దిశగా రష్యాపై ఒత్తిడి పెంచడానికి ఆంక్షలు, టారిఫ్‌లను మరోసారి తెరపైకి తెచి్చనట్లు సమాచారం. ఉక్రెయిన్‌కు సైనిక సాయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ ట్రంప్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. యూరప్ దేశాలు వ్యతిరేకిస్తున్నా ఆయన వెనక్కి తగ్గడం లేదు. ఒకవైపు ఉక్రెయిన్ను, మరోవైపు రష్యాను ఏకకాలంలో దారికి తీసుకురావాలన్నదే ట్రంప్ వ్యూహంగా కనిపిస్తోంది. రష్యాపై కొత్తగా ఎలాంటి ఆంక్షలు విధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పుతిన్ ప్రభుత్వం వాటికి తలొగ్గుతుందా? అనేది చూడాలి. -
మళ్లీ అదే మాట !
న్యూయార్క్: అమెరికా ఉత్పత్తులపై విదేశాలు వసూలు చేస్తున్న టారిఫ్‌ల విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అసహనం వెళ్లగక్కారు. భారతదేశంలో అధికంగా టారిఫ్‌లు విధిస్తున్నారని మళ్లీ అసంతృప్తి వ్యక్తంచేశారు. నిజంగా అధిక సుంకాలు విధిస్తున్న దేశం భారత్ అని పేర్కొన్నారు. ఇది న్యాయబద్ధం కాదని చెప్పారు. తమకు న్యాయం జరగాలంటే అదే రీతిలో ప్రతిస్పందించక తప్పదని స్పష్టంచేశారు. ప్రతీకార సుంకాలు విధించబోతున్నామని, వచ్చే నెల 2వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని తేలి్చచెప్పారు. తమ ఉత్పత్తులపై విచ్చలవిడిగా టారిఫ్‌లు వసూలు చేస్తున్న దేశాల ఉత్పత్తులపైనా అదే స్థాయిలో టారిఫ్‌లు విధించబోతున్నామని ఉద్ఘాటించారు. ఇండియా, చైనాతోపాటు ఏ దేశమైనా సరే తమ ఉత్పత్తులు వాడుకుంటే భారీగా సుంకాలు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎవరినీ విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఇన్నాళ్లూ అమెరికాను దోచుకున్నారని, ఇకపై అది సాగనివ్వబోమని హెచ్చరించారు. ఆయన గతంలో కూడా ఇండియాను ‘టారిఫ్ కింగ్’, ‘బిగ్ అబ్యూసర్’ అని నిందించారు. ఇండియాతో అమెరికా వాణిజ్య లోటు 100 బిలియన్ డాలర్లుగా(రూ.8.70 లక్షల కోట్లు) ఉందని ట్రంప్ చెబుతున్నారు. దీన్ని తగ్గించాల్సిందేనని పట్టుబడుతున్నారు. అమెరికాకు గేమ్ ఛేంజర్ వైట్‌హౌస్ ఓవల్ ఆఫీసులో గురువారం కొన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై డొనాల్డ్ ట్రంప్ సంతకాలు చేశారు. అమెరికా పాల ఉత్పత్తులతోపాటు ఇతర వస్తువులపై కెనడాలో 250 శాతం టారిఫ్‌లు విధిస్తున్నారని ఆక్షేపించారు. కెనడా ఉత్పత్తులు ఇకపై తమకు అవసరం లేదని, ఒకవేళ దిగుమతి చేసుకున్నా భారీగా సుంకాలు విధిస్తామని స్పష్టంచేశారు. విదేశీ ఉత్పత్తులపై ఇప్పుడు విధిస్తున్న టారిఫ్‌లు తాత్కాలికమేనని, అసలైన మోత ఏప్రిల్ 2 నుంచి మోగబోతోందని, అందుకు సిద్ధంగా ఉండాలని వ్యాఖ్యానించారు. అమెరికాకు ఇదొక గేమ్ ఛేంజర్ కాబోతోందని వివరించారు. -
టారిఫ్ వార్.. ఎవరికి లాభం?
అన్నట్టుగానే భారత్‌పైనా సుంకాల మోతకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెర తీశారు. ఏప్రిల్ 2 నుంచి పరస్పర సుంకాలు తప్పవని పునరుద్ఘాటించారు. దీని ప్రభావం మనపై ఏ మేరకు ఉండనుందంటూ జోరుగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే అమెరికా మనకు అతి పెద్ద వాణిజ్య భాగస్వామి. అందుకే అగ్ర రాజ్యంతో టారిఫ్‌ల రగడకు తెర దించేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఇప్పటికే అమెరికాలో పర్యటిస్తున్నారు. ఇరు దేశాలకు ఆమోదయోగ్యమైన ద్వైపాక్షిక వర్తక ఒప్పందం (బీటీఏ)పై చర్చలు జరుపుతున్నారు. ఈలోగా పలు అమెరికా ఉత్పత్తులపై టారిఫ్‌లను వీలైనంతగా తగ్గిస్తూ భారత్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ తదితర ఉత్పత్తులపైనా టారిఫ్ కోతలు ప్రకటించే అవకాశం కన్పిస్తోంది. ఏ మేరకు సుంకాలు? సుంకమంటే ఒక దేశం మరో దేశం నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై విధించే పన్ను. భారత ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న సుంకాలు సగటున 4 నుంచి 5 శాతం మించడం లేదు. భారత్ మాత్రం అమెరికా ఉత్పత్తులపై సగటున 18 శాతం పై చిలుకు దిగుమతి సుంకాలు విధిస్తోంది. లగ్జరీ కార్లు, కెమికల్స్, ఎల్రక్టానిక్స్‌పై 125 శాతం, మద్యం మీదైతే ఏకంగా 150 శాతం దాకా వసూలు చేస్తోంది! ఈ తేడాలను సరిచేయకుంటే ఏప్రిల్ 2 నుంచి తామూ అంతే మొత్తం బాదుతామని ట్రంప్ బెదిరిస్తున్నారు. అమెరికాపై ప్రధానంగా ఆధారపడ్డ భారత ఎగుమతిదారులపై ఇది గట్టి ప్రభావమే చూపనుంది. ముఖ్యంగా మన ఇనుము, ఉక్కు, జౌళి ఎగుమతులపై ప్రభావం తీవ్రంగా ఉండనుంది. దిద్దుబాటు చర్యలేవీ తీసుకోని పక్షంలో 25 బిలియన్ డాలర్ల విలువైన భారత ఎగుమతులపై ప్రభావం పడవచ్చని అంచనా. అయితే మన జీడీపీలో అమెరికా ఎగుమతుల వాటా కేవలం 2.2 శాతమే. కనుక భారత్ మరీ అంతగా బెంబేలెత్తిపోవాల్సిన పని లేదన్నది ఆర్థికవేత్తల మాట. ‘‘భారత్ వంటి అతిపెద్ద మార్కెట్‌ను అమెరికా విస్మరించలేదు. అక్కడి ఈ కామర్స్ కంపెనీలు, బ్యాంకులు, ఆర్థిక సేవలు, టెక్నాలజీ సంస్థలకు భారత మార్కెట్ అంటే భారీ ఆసక్తి. సోషల్ నెట్వర్కింగ్ కంపెనీలకూ భారత్ ప్రధానమే’’ అని వారంటున్నారు. అమెరికాతో భారత్ వాణిజ్యమెంత? అమెరికాకు అతి పెద్ద ఎగుమతిదారుల్లో భారత్ ఒకటి. 2024లో ఆ దేశానికి 87.4 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేసింది. అమెరికా నుంచి 41.8 బిలియన్ డాలర్ల దిగుమతులు మాత్రమే చేసుకుంది. ఈ వాణిజ్య లోటునూ ట్రంప్ ప్రశి్నస్తున్నారు. దీన్ని పూడ్చాల్సిందేనని పట్టుబడుతున్నారు. మనకు మేలే! ట్రంప్ తెర తీసిన టారిఫ్ వార్ అంతిమంగా భారత్‌కే లబ్ధి చేకూరుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. చైనా, కెనడా, మెక్సికో తదితర దేశాలపై అమెరికా ఇప్పటికే సుంకాలను పెంచడం తెలిసిందే. బదులుగా అమెరికాపై ప్రతీకార సుంకాలు తప్పవని ఆ దేశాలు కూడా స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో ఆయా దేశాల నుంచి అమెరికాకు ఎగుమతులు బాగా తగ్గేలా కని్పస్తున్నాయి. ఇది భారత్‌కు సానుకూలంగా మారుతుందని, మనం మరిన్ని ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేసేందుకు వీలు కలుగుతుందని ఆర్థికవేత్తలు అంటున్నారు. ట్రంప్ తొలి హయాంలో కూడా చైనాపై సుంకాలు పెంచడంతో భారత్ బాగా లాభపడింది. ఈసారి కూడా అమెరికాకు మన మిర్చి, జౌళి తదితర ఉత్పత్తుల ఎగుమతులు బాగా పెరిగే అవకాశముంది. ఇప్పటికే చర్యలు అమెరికాపై విధిస్తున్న సుంకాల తగ్గింపుకు భారత్ ఇప్పటికే చర్యలు తీసుకుంటోంది... → ఇటీవలి బడ్జెట్లో స్మార్ట్ ఫోన్ దిగుమతులపై ప్రకటించిన 15–16 శాతం సుంకాల నుంచి అమెరికాను మినహాయించాలని కేంద్రం భావిస్తోంది.→ వైద్య పరికరాలు, లగ్జరీ మోటార్ సైకిళ్ల వంటి పలు అమెరికా ఉత్పత్తులపై టారిఫ్‌లను తగ్గించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.→ వాణిజ్య లోటును తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా అమెరికా నుంచి రక్షణ, చమురు తదితర ఉత్పత్తుల దిగుమతులను ఇతోధికంగా పెంచేందుకు ట్రంప్–మోదీ భేటీలో అంగీకారం కూడా కుదిరింది. → ఏఐజీ వంటి అమెరికా బీమా దిగ్గజాలకు లబ్ధి చేకూర్చేలా ఆ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 100 శాతానికి పెంచుతూ తాజా బడ్జెట్లో కేంద్రం నిర్ణయం తీసుకుంది.→ భారత ఔషధాలపై అమెరికా ఎలాంటి సుంకాలూ వసూలు చేయడం లేదు. కనుక అమెరికా ఔషధ దిగుమతులపై భారత్ విధిస్తున్న 10 శాతం సుంకాన్ని కూడా ఎత్తేయాలని ఫార్మా సంస్థలు సూచిస్తున్నాయి. → అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న పలు వ్యవసాయోత్పత్తులపై ఏకంగా 42 నుంచి 120 శాతం దాకా సుంకాలున్నాయి. వీటిని కూడా బాగా తగ్గించే అవకాశముంది. త్వరలో ఒప్పందం: భారత్ న్యూఢిల్లీ/వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుని తాజా ప్రకటనపై భారత్ ఆచితూచి స్పందించింది. అగ్ర రాజ్యంతో వాణిజ్య బంధాన్ని మరింత పటిష్టం చేసుకోవడమే తమ లక్ష్యమని పేర్కొంది. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ) ద్వారా టారిఫ్, టారిఫేతర అడ్డంకులను తగ్గించుకునేందుకు కృషి చేస్తున్నట్టు వివరించింది. దీన్ని ఇరు దేశాలకూ ఆమోదనీయ రీతిలో పరిష్కరించుకుంటామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్«దీర్ జైస్వాల్ శుక్రవారం ఒక ప్రకటనలో విశ్వాసం వెలిబుచ్చారు.సుంకాల తగ్గింపుకు భారత్ ఒప్పుకుంది: ట్రంప్ అమెరికాపై సుంకాలను భారీగా తగ్గించేందుకు భారత్ అంగీకరించినట్టు ట్రంప్ వెల్లడించారు. శుక్రవారం ఉదయం వైట్‌హౌస్ ఓవల్ కార్యాలయంలో ఈ మేరకు ప్రకటించారు. అమెరికాపై ఇన్నాళ్లుగా భారత్ విధిస్తున్న హెచ్చు సుంకాలను తాను బయట పెట్టడమే ఇందుకు కారణమని చెప్పుకొచ్చారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇరాన్‌కు డొనాల్డ్ ట్రంప్ లేఖ
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో అణు ఒప్పందంపై చర్చలు జరపాలనుకుంటున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఆయన ఇరాన్‌కు లేఖ రాశారు. ఆ లేఖలో మీరు మాతో చర్చలకు సన్నద్ధం అవుతారని ఆశిస్తున్నాను’అని పేర్కొన్నారు. శుక్రవారం ఫాక్స్ బిజినెస్ నెట్వర్క్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘ఇరాన్‌తో అణుఒప్పందం చేసుకునేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ఆ దిశగా ఇరాన్ చర్చలు జరపాలని కోరుకుంటున్నాను. ఈ ఒప్పందం సఫలమైతే ఆదేశానికే మంచిది. ఇక నేను రాస్తున్న లేఖకు ఇరాన్ సమాధానం ఇస్తుందనే అనుకుంటున్నాను. ప్రతిఫలంగా ఆదేశానికి అమెరికా ఏదో ఒకటి చేస్తోంది. ఎందుకంటే మరే ఇతర దేశంతో అణు ఒప్పందం కుదుర్చుకోవడం సాధ్యం కాకపోవచ్చనే అభిప్రాయాన్ని ట్రంప్ వ్యక్తం చేశారు. ఇక, ట్రంప్ రాసిన ఆ లేఖ ఇరాన్ సుప్రీం లీడర్ ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ ఇంటి అడ్రస్‌కు పంపినట్లు తెలుస్తోంది. అయితే ఆ లేఖపై వైట్ హౌస్ అధికారికంగా స్పందించాల్సి ఉంటుంది.మరోవైపు, అంతర్జాతీయ స్థాయిలో అణు ఆయుధాల ఒప్పందాలపై ప్రయత్నాలు జరుగుతున్నాయయని ఇదే విషయాన్ని ఇరాన్ రాయబారి కాజెం జాలాలితో చర్చించినట్లు శుక్రవారం రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. -
ట్రంప్ దెబ్బకు దిగొచ్చిన చైనా.. భారత్ వైపు చూపు
బీజింగ్: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత దిగుమతి సుంకాలను భారీగా పెంచిన సంగతి తెలిసిందే. ప్రధానంగా కెనడా, మెక్సికో ఉత్పత్తులపై 25 శాతం చొప్పున, చైనా ఉత్పత్తులపై అదనంగా 10 శాతం సుంకాలు విధించబోతున్నామని, మంగళవారం నుంచే ఇది అమల్లోకి వస్తుందని ట్రంప్ ప్రకటించారు. అమెరికాకు వస్తువులను ఎగుమతి చేసే దేశాలు సుంకాలు చెల్లించాల్సిందేనని తెలిపారు.దీనికి చైనా కూడా అంతే ఘాటుగా స్పందించింది. తమ దేశంలోకి దిగుమతి అయ్యే అమెరికా వస్తువులపై అదనంగా 15 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించింది. చికెన్, గోధుమలు, మొక్కజొన్న, పత్తి తదితర దిగుమతులపై ఈ టారిఫ్ వసూలు చేస్తామని, అలాగే జొన్న, సోయాబిన్, పోర్క్, బీఫ్, సముద్ర ఉత్పత్తులు, పండ్లు, కూరగాయాలు, పాడి ఉత్పత్తులపై అదనంగా 10 శాతం సుంకాలు విధించనున్నట్లు వెల్లడించింది.అయితే చైనా ప్రస్తుత చూపులు భారత్ వైపు పడ్డాయి. భారత్ తో గతంలో ఉన్న విరోధాన్ని పూర్తిగా పక్కన పెట్టేందుకు సిద్ధమైంది చైనా. భారత్ తో శత్రుత్వం కంటే మిత్రత్వమే మేలనే భావనకు వచ్చింది చైనా.-భారత్ తో కలిసి పని చేయాలని చూస్తోంది., ఈ మేరకు ఇప్పటికి ఓ మెట్టు దిగి భారత్ సహకారం కావాలంటోంది డ్రాగన్.ఇద్దరం కలిసి పని చేద్దాం: చైనా విదేశాంగ మంత్రిభారత్ తో కలిసి పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి స్పష్టం చేశారు. ఒకరిని ఒకరు కించ పరుచుకోవడం కంటే కలిసి పని చేస్తే అద్భుతాలు స్పష్టించవచ్చాన్నారు వాంగ్ యి. ఆ దేశ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ మీట్ తర్వాత వాంగ్ యి మాట్లాడుతూ.. ‘ ఢిల్లీ, బీజింగ్ కలిసే పని చేసే సమయం ఆసన్నమైంది. డ్రాగన్, ఎలిఫెంట్ డ్యాన్స్ కలిసి చేస్తే బాగుంటుంది. ఇరుదేశాలు ఒకరికొకరు సహకరించుకోవాల్సిన అవసరం ఉంది. సహకారంతో పోయేదేమీ ఉండదు. సహకారం ఇచ్చి పుచ్చుకుంటే మరింత బలోపేతం అవుతాం. ఇది దేశ ప్రజలకు, దేశాలకు మంచిది’ అని పేర్కొన్నారు.ఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగిన టీ20 విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్ తో వాంగ్ యి భేటీ అయ్యారు. అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 2020లో గల్వాన్ ఘటన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అప్పట్నుంచి నిన్న మొన్నటి వరకూ ఇరు దేశాలు పెద్దగా సమావేశం అయ్యింది కూడా తక్కువే. ఆపై 2024లో ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భేటీ తరువాత .ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కాస్త చల్లబడింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఉన్న చోట నుంచి ఇరు దేశాలు తమ బలగాలను వెనక్కి పిలపించడంతో అప్పట్నుంచీ సామరస్య వాతావరణం కనిపిస్తోంది. -
ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ట్రూడో కంటతడి
ఒట్టావా: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో(Justin Trudeau) తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ప్రధాని హోదాలో చివరి ప్రసంగంలో తాను తెచ్చిన పాలసీతోపాటు అమెరికాతో నెలకొన్న ‘సుంకాల ఉద్రిక్తత’లపైన మాట్లాడారు. ఈ క్రమంలో ఒక్కసారిగా కంటతడి పెడుతూ ప్రసంగించారు. తొమ్మిదేళ్లపాటు.. ప్రత్యేకించి కష్టకాలంలోనూ దేశ ప్రయోజనాలే ప్రాధాన్యంగా తాను పని చేశానంటూ ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు.ప్రజా వ్యతిరేకత పెరిగిపోవడంతో ట్రూడో ఈ జనవరిలో కెనడా ప్రధాని పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే పార్టీ కొత్త నేతను ఎన్నుకునే దాకా ఆయన ఆ పదవిలో కొనసాగుతానని ప్రకటించారు. అయితే ఈ మధ్యలోనే డొనాల్డ్ ట్రంప్(Donald Trump) అమెరికా అధ్యక్షుడిగా పదవి చేపట్టారు. కెనడాతో పాటు పలు దేశాలపై సుంకాలు విధించి వాణిజ్య యుద్ధానికి తెర తీశారు.ట్రంప్ చర్యలకు ప్రతిగా.. కెనడా కూడా అమెరికా ఉత్పత్తులపై సుంకాలు విధించింది. ప్రతీకార సుంకాల పరిణామాలపై ఇద్దరు నేతలు సుమారు గంటపాటు ఫోన్లో చర్చించారు. అనంతరం ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మళ్లీ ప్రధాని పదవిలో కొనసాగేందుకే ట్రూడో వాణిజ్య యుద్ధానికి కాలు దువ్వుతున్నారని అన్నారు. టారిఫ్ సంక్షోభాన్ని తన రాజకీయం కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు.అక్కడితో ఆగకుండా.. 51వ అమెరికా రాష్ట్రానికి గవర్నర్‌గా కొనసాగేందుకు ట్రూడో తహతహలాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు (కెనడాను అమెరికాలో విలీనం చేసి 51 రాష్ట్రంగా చేస్తామంటూ చేసిన ప్రకటనకు కొనసాగింపుగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు..). అయితే ట్రంప్ ఆరోపణలను తన చివరి ప్రసంగంలో ట్రూడో తోసిపుచ్చారు. కెనడా ప్రయోజనాల కోసం.. దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించేందుకే ప్రతీకార సుంకాలను విధించినట్లు తెలిపారాయన. ఇలాంటి ఆరోపణలు తనను కుంగదీయలేవని.. కడదాకా కెనడియన్ల కోసం కష్టపడతానని పేర్కొంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఇదిలా ఉంటే.. మార్చి 9వ తేదీన లిబరల్ పార్టీ కొత్త నేతను ఎన్నుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. "We got you, even in the very last days of this government": In a rare display, Canadian PM Justin Trudeau gets emotional in press conference while talking about his policies amid Trump tariff war #Canada #CanadaPM #JustinTrudeau #Trudeau #tariffs #tariffwar pic.twitter.com/XRneiCENNN— News18 (@CNNnews18) March 7, 2025 VIDEO CREDITS: News18 -
మరణశయ్యపై తల్లి.. కూతురి దుర్మార్గంపై కోర్టు కన్నెర్ర
కన్నతల్లి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే.. ఆ కూతురేమో దుర్మార్గంగా ఆలోచించింది. ఆస్తి కోసం బలవంతంగా ఆమెతో వీలునామాపై సంతకం చేయించుకుంది. అయితే సాక్ష్యంగా ఉంటుందని ఆ కూతురు తీయించుకున్న వీడియోనే.. ఈ బండారం మొత్తాన్ని బయట పెట్టింది. దీంతో కోర్టు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. చెంపపెట్టులాంటి తీర్పు ఇచ్చింది . యూకేలో ఓ వ్యక్తి మూడేళ్లపాటు చేసిన న్యాయ పోరాటం.. నాటకీయ పరిణామాల మధ్య ముగిసింది. సోదరుడిని మోసం చేసి ఆస్తి కొట్టేయాలని భావించిన ఓ మహిళకు పెద్ద షాకే తగిలింది. అతనికి 7 లక్షల పౌండ్ల విలువైన(మన కరెన్సీలో రూ.7 కోట్ల 86 లక్షల దాకా) విలువైన ఆస్తిపాస్తుల్లో సగం సోదరుడికి అప్పగించాలని కోర్టు ఆదేశించింది.కేసు ఇదే..మార్గరేట్ బేవర్స్టాక్(76) అనే మహిళ 2021 మార్చిలో కన్నుమూసింది. చనిపోయే టైంలో ఆమె తన ఆస్తి మొత్తం కూతురు లీసా పేరిట రాసింది. కొడుకు జాన్‌కు చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు. అయితే మతిమరుపు జబ్బుతో బాధపడుతున్న తన తల్లి.. సోదరికి మాత్రమే ఆస్తి ఎలా రాయగలిగిందని అతనికి అనుమానం వచ్చింది. ఆస్తిలో వాటా కోరుతూ.. సెంట్రల్ లండన్ కౌంటీ కోర్టులో పిటిషన్ వేశాడు.తన తల్లి 2014 నుంచే మతిమరుపు వ్యాధితో బాధపడుతోందని, ఆ వీలునామాపై అనుమానాలు ఉన్నాయని వాదించాడతను. అయితే తల్లి తన పేరిట రాసిన వీలుకు సంబంధించిన వీడియోను లీసా కోర్టులో ప్రవేశపెట్టింది. ఆ వీడియోను క్షుణ్ణంగా పరిశీలించిన న్యాయమూర్తి జేన్ ఇవాన్స్.. లీసాను గద్దించారు. అది బలవంతంగా చేయించుకున్నదేనని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఆ వీడియోలో ఆమె అతి కష్టంగా మాట్లాడుతోంది. పైగా పెన్నును ఆమెతో బలవంతంగా పెట్టించుకున్నట్లు కనిపిస్తోంది. వీలు కూడా ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసిన కాపీలా ఉంది అని జడ్జి అభ్యంతరాలు వ్యక్తం చేశారు.జడ్జి కన్నెర్ర చేయడంతో లీసా నిజం ఒప్పుకుంది. అది ఆమె చనిపోతున్న సమయంలో తీసిందని తెలిపింది. తల్లికి ఉన్న ఆ జబ్బును ఆసరా చేసుకుని ఆస్తి మొత్తం కాజేయాలని ప్రయత్నించినట్లు చెప్పింది. సాక్ష్యంగా ఉండాలని ఆ టైంలో వీడియో కూడా తీయించుకున్నట్లు తెలిపింది. దీంతో ఆస్తిలో సగం వాటా.. సోదరుడు జాన్‌కు అప్పగించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. అంతేకాదు.. జాన్‌కు అయిన కోర్టు ఖర్చులను కూడా లీసానే భరించాలని ఆదేశించింది. -
ట్రంప్ మార్క్ రాజకీయం.. పాకిస్థాన్‌కు భారీ షాక్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచి డొనాల్డ్ ట్రంప్(trump) సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచ దేశాలను టెన్షన్ పెడుతున్నారు. తాజాగా దాయాది దేశం పాకిస్థాన్, ఆఫ్గానిస్తాన్‌కు ఊహించని షాకిచ్చారు. రెండు దేశాల నుంచి అమెరికాకు వచ్చే వారిపై నిషేధం విధించేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు.డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. టారిఫ్‌ల పేరుతో పలు దేశాలను హెచ్చరించారు. అమెరికాలో అక్రమ వలసదారులను తరలించిన విషయం తెలిసిందే. ఇక, ఇప్పుడు భద్రతా కారణాల దృష్ట్యా అమెరికాలోకి ప్రవేశించే పలు దేశాల వారిపైనా నిషేధం విధించేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా పాకిస్థాన్ (Pakistan), అఫ్గానిస్థాన్(Afghanistan)లపై ట్రావెల్ బ్యాన్ విధించనున్నారు. వచ్చే వారం నుంచి ఇది అమలు కానున్నట్టు తెలుస్తోంది.డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడైన సమయంలోనూ కొన్ని ముస్లిం దేశాల పౌరులను అమెరికాలోకి అనుమతించడంపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అనేక పరిశీలన అనంతరం 2018లో అక్కడి సుప్రీంకోర్టు కూడా ఆ నిర్ణయాన్ని సమర్థించింది. అయితే, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జో బైడెన్ ప్రభుత్వం.. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసింది. దీంతో, ఆయా దేశాల పౌరులు.. అమెరికాలోకి వచ్చారు.🚨For those who were in celebration of #Trump statement ...!!US likely to impose travel ban on Pakistan,A new travel ban by US could ban people from #Afghanistan and #Pakistan from entering the #UnitedStates next week, pic.twitter.com/n21PxRh37z— Sardar Waleed Mukhtar (@waleedmukhtar_1) March 6, 2025ఇక, ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత పలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. ఇందులో అమెరికాలోకి ప్రవేశించే విదేశీయులను నుంచి జాతీయ భద్రతా ముప్పు పొంచి వుందా అన్న విషయాన్ని ముందే గుర్తించే కార్యనిర్వాహక ఆదేశంపైనా సంతకం చేశారు. దీని ప్రకారమే ఇప్పుడు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్టు అధికారులు చెబుతున్నారు.ఇదిలా ఉండగా, అంతకుముందు.. కాబూల్ విమానాశ్రయంపై 2021లో బాంబు పేలుళ్లు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఆత్మాహుతి దాడిలో 170 మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా అమెరికాకు చెందిన 13 మంది సైనికులు చనిపోయారు. అయితే, తాజాగా ఈ దాడులకు పాల్పడిన సూత్రధారిని పట్టుకున్నట్లు ట్రంప్ ప్రకటించారు. పాకిస్థాన్ సాయం వల్లే ఈ నిందితుడిని అరెస్ట్ చేయగలిగామని కూడా వివరించారు. అంతేకాకుండా పాకిస్థాన్‌కు కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. కాగా, పాకిస్థాన్‌కు కృతజ్ఞతలు చెప్పిన వెంటనే ఆ దేశ పౌరులపై బ్యాన్ విధిస్తూ ట్రంప్ షాకివ్వడం గమనార్హం. -
తహవూర్ రాణాకు బిగ్ షాక్
వాషింగ్టన్: 26/11 ముంబై ఉగ్రవాద దాడుల కీలక సూత్రధారి తహవూర్ రాణా(Tahawwur Rana)కు బిగ్ షాక్ తగిలింది. తనను భారత్‌కు అప్పగించవద్దంటూ వేసిన పిటిషన్‌ను అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించింది.ముంబై దాడుల కేసులో తహవూర్ రాణాను భారత్‌కు అప్పగించేందుకు(Extradition) అమెరికా ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. అయితే చికిత్సపై హామీకి భారత ప్రభుత్వం నిరాకరించింది. దీంతో.. ఈ కారణాన్ని చూపిస్తూ భారత్‌కు తన అప్పగింతను నిలిపివేయాలంటూ అమెరికా సుప్రీం కోర్టు(US Supreme Court)లో తహవూర్ పిటిషన్ వేశాడు. ‘‘ప్రాణాంతక జబ్బులతో పోరాడుతున్న నన్ను భారత్‌కు అప్పగించడమంటే మరణశిక్ష విధించడమే. నా అప్పగింత అమెరికా చట్టాలతో పాటు ఐరాస తీర్పుల ఉల్లంఘనే. కనుక అప్పగింతపై స్టే విధించండి’’ అని తహవూర్ పిటిషన్ పేర్కొన్నాడు. పాక్ సంతతికి చెందిన ముస్లిం వ్యక్తిని కావడంతో తనను కచ్చితంగా హింసిస్తారని, భారత్‌కు అప్పగిస్తే తాను బతికే అవకాశమే లేదని వాదించాడతను. అయితే తహవూర్ రాణా వాదనలను కోర్టు తోసిపుచ్చింది. అతని పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో త్వరలోనే తహవూర్‌ను అమెరికా భారత్‌కు అప్పగించే ఛాన్స్ కనిపిస్తోంది. ఎవరీ తహవూర్ రాణా..?పాక్ సంతతికి చెందిన కెనడా జాతీయుడైన తహవూర్ రాణా.. ప్రస్తుతం లాస్ఏంజెలెస్లోని మెట్రోపాలిటన్ జైల్లో ఉన్నాడు. 2009లో FBI అతన్ని అరెస్టు చేసింది. పాక్–అమెరికా ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీతో అతనికి దగ్గరి సంబంధాలున్నాయి. రాణాను భారతదేశానికి అప్పగించడానికి అమెరికా సుప్రీంకోర్టు జనవరి 25, 2024న ఆమోదం తెలిపింది. ఈ కేసులో రాణా తనను తప్పుగా దోషిగా ప్రకటించారని చెప్పి రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు. కానీ కోర్టు ఆ పిటిషన్‌ను తిరస్కరించింది.భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి అమెరికా పర్యటనలో.. తహవూర్ రాణాను భారత్‌కు అప్పగించే అంశంపై అధ్యక్షుడు ట్రంప్ స్వయం ప్రకటన చేశారు. ఇందుకుగానూ ట్రంప్‌కి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. దీంతో రాణా భారతదేశానికి వచ్చి న్యాయ విచారణ ఎదుర్కోవడం దాదాపు ఖాయమని భావించారంతా. -
పొద్దుపొద్దునే ఉల్కా పాతాన్ని తలపించేలా.. ముక్కలు చెక్కలైన రాకెట్
ప్రముఖ బిలీయనీర్ ఇలాన్ మస్క్‌కు చెందిన రాకెట్ సంస్థ స్పేస్ఎక్స్ ఎదురు దెబ్బ తగిలింది. స్టార్‌షిప్ రాకెట్ గగనతలంలో పేలిపోయి ముక్కలు చెక్కలు అయ్యింది. ఈ రాకెట్‌కు సంబంధించి ఇది ఎనిమిదో ప్రయోగం కాగా.. ఆ శకలాలు ఫ్లోరిడా, బహమాస్లలో పడడం విశేషం.చంద్రుడు, అంగారకుడిపైకి మానవ సహిత ప్రయోగాల కోసం.. స్టార్‌షిప్ సామర్థ్యాన్ని పరీక్షించడం, అలాగే డమ్మీ ఉపగ్రహాలను నిర్దిష్ట కక్ష్యలోకి వంటి అంశాలను పరీక్షించేందుకు ఈ ప్రయోగం నిర్వహించారు. ఈ ఉదయం టెక్సాస్ నుంచి స్పేస్ఎక్స్ స్టార్‌షిప్-8 స్పేస్‌క్రాఫ్ట్ ప్రయోగించారు. అయితే..స్పేస్‌లోకి ప్రవేశించిన వెంటనే అది పేలిపోయింది. ఆ శకలాలు దక్షిణ ఫ్లోరిడా.. అక్కడి నుంచి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న బహమాస్‌లోనూ పడ్డాయి. ఈ నేపథ్యంలో పలు విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. ఉల్కా పాతాన్ని తలపించేలా ఉన్న ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.Is that space X rocket disintegration #spacex pic.twitter.com/apEagPIqDB— Talha Mirza (@tmirza777) March 6, 2025“Never give up” Elon Musk Starship 8 debris pic.twitter.com/NseQxyEZWP— Tesla Owners Silicon Valley (@teslaownersSV) March 7, 2025 ఇదిలా ఉంటే.. స్టార్‌షిప్ రాకెట్ ప్రయోగం విఫలం కావడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. జనవరిలో ప్రయోగం జరగ్గా.. కరేబియన్ దీవులపైన రాకెట్ పేలిపోయింది. ఆ శకలాలు ట్రక్స్ అండ్ కైకోస్ దీవుల్లో పడ్డాయి. మొత్తంగా ఇప్పటిదాకా స్టార్‌షిప్ రాకెట్‌తో ఎనిమిది ప్రయోగాలు చేయగా.. మే 2021లో నిర్వహించిన ఎస్ఎన్ 15 టెస్ట్ ఫ్టైట్ ఒక్కటి మాత్రమే పాక్షికంగా సక్సెస్ అయ్యింది.ప్రపంచంలోనే అతిపెద్ద రాకెట్‌గా స్టార్షిప్గా ప్రస్తుతానికి గుర్తింపు ఉంది. 123 మీటర్ల ఎత్తు(403 అడుగులు)తో నాసా శాటర్న్-V రికార్డును బద్ధలు కొట్టింది. రాకెట్ రూపకల్పనకు రూ.830 కోట్ల రూపాయలను స్పేస్ఎక్స్ ఏజెన్సీ ఖర్చు చేసింది. అంగారకుడు, చంద్రుడిపైకి మానవ సహిత రాకెట్ ప్రయోగాల కోసం దీనిని తయారు చేశారు. -
Mr Trump: టారిఫ్ వార్‌లో వెనక్కి తగ్గినట్లే తగ్గి..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) టారిఫ్ వార్‌లో కాస్త వెనక్కి తగ్గారు. మెక్సికోతో పాటు కెనడాపై విధించిన దిగుమతి సుంకాలను ఏప్రిల్ 2వ తేదీ దాకా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే కొన్ని ఉత్పత్తులపై మాత్రం ఈ నిర్ణయం యధావిధిగా కొనసాగుతుందని, ప్రతీకార సుంకాలు విధించే ప్రణాళికలో ఎటువంటి మార్పు లేదని అన్నారాయన.కెనడా, మెక్సికోతోపాటు చైనాపై డొనాల్డ్ ట్రంప్ సుంకాలు విధించడం ఆయా దేశాలతో వాణిజ్య యుద్ధానికి కారణమైంది. ఈ ప్రభావం.. అమెరికా ఆర్థిక వ్యవస్థ, ద్రవ్యోల్బణంపైనా ప్రతికూల ప్రభావం చూపెట్టవచ్చనే హెచ్చరికలు జారీ అయ్యాయి. అయితే తన నిర్ణయంపై మార్కెట్ కుదేలు ప్రభావమేమీ లేదని ఆయన అంటున్నారు. కేవలం అమెరికా కార్ల తయారీదారుల కోసమేనని చెప్పారాయన. అయితే ఒకవైపు కెనడా వాణిజ్య ప్రతినిధులతో చర్చలు.. మరోవైపు మెక్సికో ప్రెసిడెంట్‌తో మాట్లాడిన తర్వాతే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.ఉత్తర అమెరికా వాణిజ్య ఒప్పందాల్లో భాగంగా.. అమెరికా-మెక్సికో-కెనడా మధ్య ఒప్పందం(USMCA) అమలులో ఉంది. తాజా నిర్ణయంతో ప్రస్తుతానికి ఆ రెండు దేశాల ఆటోమేకర్స్‌కు ట్రంప్ ఊరట ఇచ్చారు. మరోవైపు కెనడా నుంచి దిగుమతి అయ్యే 62 శాతం ఉత్పత్తులు కొత్త సుంకాలను ఎదుర్కొనాల్సిందేనని వైట్‌హౌజ్ ప్రతినిధి ఒకరు చెప్పారు. అయితే ఎనర్జీ ప్రొడక్ట్స్‌కు మాత్రం 10 శాతమే వర్తిస్తుందని తెలిపారు.కెనడా కూడా అమెరికాపై విధించిన సుంకాల విషయంలో వెనక్కి తగ్గింది. సుమారు 125 బిలియన్ డాలర్ల అమెరికా ఉత్పత్తులపై విధించిన రెండో దశ సుంకాల అమలును ఏప్రిల్ 2వ తేదీ దాకా వాయిదా ేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే.. అన్ని టారిఫ్‌లను ఎత్తేసే దిశగా ప్రయత్నాలుకొనసాగిస్తామని తెలిపింది.రాజకీయ దుమారంఅధికారంలోకి వచ్చిన వెంటనే.. ట్రంప్ పలు దేశాలపై భారీ స్థాయిలో సుంకాలు విధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పొరుగు దేశాలతో ట్రేడ్వార్కు బీజం వేశారు. అయితే ఇది క్రమంగా రాజకీయ మలుపు తిరిగింది. ట్రంప్‌తో చర్చలు నిర్మాణాత్మకంగా జరిగినప్పటికీ.. కెనడా-అమెరికాలు భవిష్యత్తులో వాణిజ్య యుద్ధంలో ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాన్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ట్రూడోకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కౌంటర్ ఇచ్చారు.అధికారంలో కొనసాగడానికి సుంకాల వివాదాన్ని ట్రూడో వినియోగించుకుంటున్నారని ఆరోపించారు. కెనడా ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న విషయాన్ని తెలుసుకోవాలని తాను ప్రయత్నించినప్పటికీ.. అక్కడ నుంచి ఎటువంటి సమాధానం రాలేదన్నారు. అయితే ఈ క్రమంలో ఆయన వ్యాఖ్యలు మళ్లీ దుమారం రేపాయి. 51వ రాష్ట్ర గవర్నర్‌గా కొనసాగేందుకు ట్రూడో తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అన్నారాయన. దీంతో కెనడా మండిపడింది. కెనడా ఏనాటికీ అమెరికాలో కలవబోదని కౌంటర్ ఇచ్చింది. కెనడాను అమెరికాలో విలీనం చేసి.. 51వ అమెరికా రాష్ట్రంగా మార్చకుంటామని.. అవసరమైతే ఆర్థిక-సైనిక శక్తులను ఉపయోగిస్తామని ట్రంప్ గతకొంతకాలంగా చెబుతున్న సంగతి తెలిసిందే. -
ట్రంప్‌కు కొత్త ట్విస్ట్.. వలసదారుల కోసం ఇంత ఖర్చు పెట్టారా?
వాషింగ్టన్: అక్రమ వలసదారులను సైనిక విమానాల్లో స్వదేశాలకు తిప్పి పంపేందుకు ఖర్చు తడిసి మోపెడవుతోందని అమెరికా గుండెలు బాదుకుంటోంది. వాటి వాడకాన్ని తాత్కాలికంగా నిలిపేస్తూ నిర్ణయం తీసుకుంది. వలసదారులతో చివరి విమానం అమెరికా నుంచి మార్చి 1న వెళ్లింది. తరవాత వాటిని ఇప్పటిదాకా షెడ్యూల్ చేయలేదు. ఈ విరామాన్ని పొడిగించడమో, తరలింపులను శాశ్వతంగా నిలిపివేయడమో చేయొచ్చని చెబుతున్నారు. గత జనవరిలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టగానే వలసదారులను వెనక్కి పంపే చర్యలకు శ్రీకారం చుట్టడం తెలిసిందే. కొందరిని స్వదేశాలకు, ఇతరులను గ్వాంటనామో బేలోని సైనిక స్థావరానికి పంపారు. ఈ విషయంలో అమెరికా ఎంత కఠినంగా ఉందో చెప్పేందుకు 30 సి–17, 12 సి–130 తరహా సైనిక విమానాలను వాడారు. అయితే అది చాలా ఖరీదైన వ్యవహారంగా మారింది. ఈ క్రమంలో భారత్‌కు వచ్చిన మూడు విమానాలకే ఏకంగా 30 లక్షల డాలర్లు ఖర్చయింది. గ్వాంటనామోకు తరలించడానికి ఒక్కో వ్యక్తిపై అమెరికా 20 వేల డాలర్లు ఖర్చు చేసింది. ఇది అమెరికా ఎయిర్‌లైన్స్ విమాన టికెట్ల కంటే ఏకంగా ఐదు రెట్లు ఎక్కువ. అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) కమర్షియల్ చార్టర్ ఫ్లైట్ కంటే కూడా చాలా ఎక్కువ!. దీంతో, దీంతో, ఈ ఖర్చుపై అమెరికాలో పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. -
హెయిర్‌కట్‌లో తలపండింది
టోక్యో: శతాధిక వృద్ధులు సాధారణంగా త మ పని తాము చేసుకోవడానికి చాలా కష్టపడుతుంటారు. ఒంట్లో పటుత్వం తగ్గి పోయి లేచి నడవడానికి, గాజు వస్తువులను పగలకుండా జాగ్రత్తగా పట్టుకెళ్లడానికి ఎంతో కష్టపడుతుంటారు. ఇక కత్తెర పట్టుకుని జుట్టు కత్తిరించమంటే వాళ్లు చేసే కటింగ్ దెబ్బకు హెర్స్టయిల్ (Hair Style) ఎటు పోతుందో ఎవరూ చెప్పలేరు. అలాంటిది ఏకంగా 108 ఏళ్ల వయసులో కూడా ఓ బామ్మ ఎంచక్కా కత్తెరను ఒడుపుగా చురకత్తిలాగా ఝుళిపిస్తూ చక్కటి తలకట్టు తీర్చిదిద్దుతోంది. ఆమె పేరే షిట్సూయ్ హకోయ్‌షీ. 9 దశాబ్దాలుగా హెయిర్‌స్టయిల్ వృత్తిలో.. ఈశాన్య టోక్యోలోని టొచిగి జిల్లాలోని నకగవా పట్టణంలోని బామ్మ షిట్సూయ్కు బార్బర్ దుకాణం(Barber Shop) ఉంది. మొదటి ప్రపంచయుద్దకాలంలో అంటే 1916 నవంబర్ పదో తేదీన రైతు కుటుంబంలో ఈమె జన్మించారు. హెయిర్ కటింగ్ (Hair Cut) అంటే ఈమెకు చాలా ఇష్టం. ‘‘టోక్యోలో ఉద్యోగం ఉంది. కావాలంటే అక్కడికెళ్లి జాయిన్ అవ్వు’’అని స్నేహితురాలి తల్లి ఇచ్చిన సలహాను షిట్సూయ్ పాటించారు. టీనేజీలో ఉండగానే 14 ఏళ్ల వయసులోనే ఒంటరిగా టోక్యో సిటీకి వెళ్లి బార్బర్ అప్రైంటిస్గా చేరారు. 20 ఏళ్ల వయసులో బార్బర్‌గా లైసెన్స్ సంపాదించారు. 24 ఏళ్ల వయసులో జెరోను పెళ్లాడారు. తర్వాత భర్తతో కలిసి బార్బర్ షాప్ ప్రారంభించారు. వీళ్లకు ఇద్దరు సంతానం. 1937లో జపాన్‌పై చైనా జరిపిన యుద్ధంలో ఈమె భర్త ప్రాణాలు కోల్పోయారు. తర్వాత ఎనిమిదేళ్లకు అంటే 1945 మార్చి పదో తేదీన టోక్యోపై అమెరికా జరిపిన బాంబు దాడిలో ఈమె బార్బర్ దుకాణం పూర్తిగా ధ్వంసమైంది. దీంతో పిల్లలు, కట్టుబట్టలతో ఈమె నగరాన్ని వీడి టొచిగి జిల్లాలో ని వేరే ప్రాంతానికి తరలిపోయారు. తర్వాత ఎనిమిదేళ్లకు 1953లో సొంతూరు నకగవాకు చేరి అక్కడ తన పేరు మీద ‘రిహాట్సు హకోయ్‌షీ అని బార్బర్ దుకాణం ప్రారంభించారు. అప్పట్నుంచీ అదే దుకాణంలో దశాబ్దాలుగా కటింగ్ వృత్తిలోనే కొనసాగుతున్నారు. రిహాట్సు అంటే జపనీస్ భాషలో బార్బర్ అని అర్థం. కస్టమర్లే నా దేవుళ్లు 108 ఏళ్ల వయసులోనూ బార్బర్‌గా కొనసాగుతున్న ఈమెకు గత బుధవారం గిన్నిస్ ప్రపంచ రికార్డ్ (Guinness World Record) నిర్వాహకులు వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్‌ను అందజేశారు. ఇన్నాళ్లూ అమెరికాలో 107 ఏళ్ల వయసులోనూ బార్బర్‌గా కొనసాగిన ఆంటోనీ మాన్సినెల్లీ అనే తాతకు గిన్నిస్ ప్రపంచ రికార్డ్ సర్టిఫికేట్ ఉండేది. ఆయన 2018లో మరణించడంతో అప్పట్నుంచీ ఎవరికీ ఆ సర్టిఫికేట్ ఇవ్వలేదు. బామ్మ విషయం తెల్సి తాజాగా ఈమెకు ఆ రికార్డ్ కట్టబెట్టారు. చదవండి: గుడ్లు తేలేస్తున్న అమెరికా‘‘108 ఏళ్ల వయసు బామ్మ వణుకుతూ కటింగ్ ఎలా చేస్తుందో అన్న భయం, అనుమానం లేకుండా నామీద నమ్మకంతో వస్తున్న కస్టమర్లే నాకు దేవుళ్లు. వాళ్ల సంతోషమే నాకు అమితానందాన్ని ఇస్తుంది. వయసులో సెంచరీ దాటినా నేను నా వృత్తిని వదులుకోను. కత్తెరలను పక్కనబెట్టే ప్రసక్తే లేదు. ఓపిక ఉన్నంతకాలం కటింగ్ చేస్తా. ఈ ఏడాది 109వ పుట్టినరోజు జరుపుకోబోతున్నా. ఓపిక తగ్గితే 110 ఏళ్ల వయసులో కటింగ్‌ను ఆపేస్తా’’అని బామ్మ నవ్వుతూ చెప్పారు. -
ఉక్రెయిన్ భద్రత కోసం అవసరమైతే అణ్వాయుధాలు!
బ్రస్సెల్స్: ఉక్రెయిన్ భద్రత కోసం రష్యాను బెదిరించేందుకు అవసరమైతే తన అణ్వాయుధాలను నిరోధంగా వాడేందుకు సిద్ధమంటూ ఫ్రాన్స్ వివాదాస్పద ప్రతిపాదన చేసింది. గురువారం బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో యూరోపియన్ యూనియన్ దేశాల తాజా శిఖరాగ్ర సమావేశం ఇందుకు వేదికైంది. రష్యా బారినుంచి యూరప్‌కు రక్షణ కల్పించేందుకు ఫ్రాన్స్ అణుపాటవాన్ని ఆయుధంగా ఉపయోగించేందుకు సిద్ధమని అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ సందర్భంగా ప్రకటించారు. సభ్య దేశాల నుంచి ఇందుకు భారీ స్పందన లభించింది. పోలండ్‌తో పాటు లిథువేనియా, లాతి్వయా వంటి పలు బాలి్టక్ దేశాలు ఈ ప్రతిపాదనను గట్టిగా సమరి్థంచాయి. యూరోపియన్ యూనియన్‌లో అణ్వాయుధ పాటమున్న దేశం ఫ్రాన్స్ ఒక్కటే కావడం విశేషం. ఫ్రాన్స్‌కున్న ఈ సానుకూలతను యూరప్ భద్రత కోసం ఉపయోగించేందుకు సిద్ధమని బుధవారం జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో కూడా మాక్రాన్ ప్రకటించారు. దీనిపై లోతుగా చర్చ జరగాలని ఈయూ భేటీలో ఆయన పునరుద్ఘాటించారు. దీనిపై రష్యా తీవ్రంగా స్పందించింది. మాక్రాన్ ప్రతిపాదన అత్యంత ప్రమాదకరమైనదని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్ అన్నారు. ‘‘శాంతి యత్నాలకు బదులు యుద్ధానికే ఫ్రాన్స్ మొగ్గుతోంది. ఉక్రెయిన్‌తో మా యుద్ధం కొనసాగాలనే ఆశిస్తోంది. మాక్రాన్ వివాదాస్పద వ్యాఖ్యలే ఇందుకు రుజువు’’ అని ఆయన ఆరోపించారు. -
ఈసారి జెలెన్స్కీ వెంట మాక్రాన్, స్టార్మర్!
పారిస్: అమెరికా అత్యున్నత పరిపాలనా పీఠం శ్వేతసౌధం సాక్షిగా అగ్రరాజ్యాధినేత ట్రంప్‌తో వాగ్వాదంలో తన దేశం తరఫున గట్టిగా వాదించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తాజాగా అనూహ్యంగా పట్టుసడలించారు. రష్యా దూకుడును అడ్డుకునేందుకు అమెరికా ఇన్నాళ్లూ చేసిన సైనిక, నిఘా సాయాన్ని హఠాత్తుగా నిలిపివేసిన వేళ జెలెన్స్కీ వైఖరిలో మార్పు రావడం గమనార్హం. ఒంటరిగా వచ్చిన జెలెన్స్కీ ఆనాడు ట్రంప్, జేడీ వాన్స్‌తో మాటల యుద్ధానికి దిగి దౌత్యమంటలు రాజేసిన నేపథ్యంలో అగ్రనేతల ఆగ్రహావేశాలను చల్లార్చేందుకు ఈసారి ఫ్రాన్స్, బ్రిటన్ అగ్రనేతలు రంగంలోకి దిగుతున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, బ్రిటన్ ప్రధాన మంత్రి కెయిర్ స్టార్మర్లు జెలెన్స్కీని అమెరికాను వెంటబెట్టుకుని తీసుకొచ్చి ట్రంప్‌తో సమాలోచనలు జరుపుతారని ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ భేటీ ఎప్పుడనేది ఇంకా నిర్ధారణకాలేదు. ‘‘ఉక్రెయిన్, అమెరికా సంప్రదింపుల బృందాలు తదుపరి భేటీ కోసం తమ వంతు కృషిచేస్తున్నాయి. ఈ కృషిలో పురోగతి కనిపిస్తోంది’’ అని గురువారం తెల్లవారు జామున జెలెన్స్కీ ఒక ప్రకటనచేశారు. బుధవారం ట్రంప్‌కు జెలెన్స్కీ ఒక లేఖ రాయడం, ఆ లేఖాంశాన్ని ట్రంప్ అమెరికా పార్లమెంట్ ఉభయసభల సంయుక్త సమావేశంలో బుధవారం ప్రస్తావించడం తెల్సిందే. ‘‘అమెరికా, ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరితే వెంటనే యురోపియన్ సైనిక బలగాలను ఉక్రెయిన్‌కు పంపే వీలుంది. రష్యా దూకుడుకు ఈ బలగాలు అడ్డుకట్టవేస్తాయి. డీల్ కుదిరాక బలగాల మోహరింపుపై వచ్చే వారం పారిస్‌లో ఈయూ దేశాల సైనిక చీఫ్‌లతో చర్చలు జరుపుతాం’’ అని మాక్రాన్ చెప్పారు. ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకే!అమెరికా, ఉక్రెయిన్ల మధ్య శాంతి ఒప్పందం కుదరకపోతే యుద్ధ పరిస్థితులు అనూహ్యంగా తలకిందులవుతాయని యూరోపియన్ యూని యన్ దేశాలు భావిస్తున్నాయి. అమెరికా నుంచి అన్ని రకాల సాయం నిలిచిపోతే, పెద్దన్న అమెరికాను కాదని ఈయూ దేశాలు ఉక్రెయిన్‌కు సాయం చేసే సాహసం చేయకపోతే తుదకు యుద్ధంలో రష్యాదే పైచేయి అవుతుంది. అప్పుడు తప్పని పరిస్థితుల్లో అమెరికాకు బదులు రష్యాతో ఉక్రెయిన్ శాంతి ఒప్పందం చేసుకునే అవకాశముంది. ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకు ఉక్రెయిన్ను అమెరికాకు దగ్గరచేయాలని ఈయూ దేశాలు తామే పెద్దరికం తీసుకుని జెలెన్స్కీని అమెరికా రప్పించి ‘శాంతి, ఖనిజ ఒప్పందం’ కుదిరేలా చేయాలని భావిస్తున్నాయి. అందులోభాగంగా మాక్రాన్, స్టార్మర్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. -
గుడ్లు తేలేస్తున్న అమెరికా
కనీవినీ ఎరగని కొరత. ఆకాశాన్నంటిన ధరలు. అంతంత పెట్టయినా కొందామంటే వాటిపైనా ఆంక్షలు. మొత్తమ్మీద అగ్ర రాజ్యం అక్షరాలా ‘గుడ్లు’ తేలేస్తోంది. తీవ్ర గుడ్ల కొరతతో అమెరికా కొద్ది నెలలుగా సతమతమవుతోంది. రోజులు గడుస్తున్న కొద్దీ సమస్య మరింత తీవ్రతరమవుతోందే తప్ప తెరిపిన పడే సూచనలే కన్పించడం లేదు...! దాంతో అమెరికన్లలో అత్యధికులకు ఉదయం పూట అల్పాహారమైన గుడ్లు ఒక్కసారిగా విలాస వస్తువుగా మారిపోయిన దుస్థితి! ఎందుకీ సమస్య? అమెరికాలో కొద్ది నెలల క్రితం మొదలైన గుడ్ల కొరత నానాటికీ పెరిగిపోతోంది. బర్డ్‌ఫ్లూగా పిలిచే హెచ్5ఎన్1 తీవ్రతే ఇందుకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. తొలుత కెనడాలో తలెత్తిన ఈ మహమ్మారి 2022లో అమెరికాలో ప్రవేశించింది. చూస్తుండగానే 50 రాష్ట్రాలకు విస్తరించింది. దీని వ్యాప్తిని అడ్డుకునేందుకు ఈ మూడేళ్లలో ఏకంగా 16 కోట్ల గుడ్లు పెట్టే కోళ్లను చంపేయాల్సి వచ్చింది. 2024లోనే 3 కోట్ల కోళ్లను చంపేశారు. వీటిలో 1.7 కోట్ల కోళ్లను కేవలం గత నవంబర్, డిసెంబర్ మాసాల్లోనే అంతమొందించారు. అలా 2025 జనవరి నాటికి అమెరికాలో గుడ్లు పెట్టే కోళ్ల సంఖ్య 30 కోట్లకు పరిమితమైంది. ఐదేళ్ల క్రితంతో పోలిస్తే ఇది ఏకంగా 11 శాతం తగ్గుదల! అలా మొదలైన గుడ్ల కొరత కొద్ది నెలలుగా తీవ్ర రూపు దాలి్చంది. కొద్ది రోజులుగా డజను గుడ్లు్ల ఏకంగా 5 డాలర్లకు చేరినట్టు బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ వెల్లడించింది. అంటే 435 రూపాయలు. ఒక్క గుడ్డు రూ.36 అన్నమాట. ఇది అమెరికా చరిత్రలోనే ఆల్‌టైం గరిష్టం! అంతేకాదు, షికాగో, న్యూయార్క్, శాన్ఫ్రాన్సిస్కో వంటి పలు పెద్ద నగరాల్లోనైతే డజను గుడ్ల ధర ఏకంగా 8 నుంచి 10 డాలర్ల దాకా ఎగబాకింది!! దాంతో గుడ్ల కొనుగోలుపై పరిమితి విధిస్తూ రెండు నెలల క్రితం తీసుకున్న నిర్ణయాన్ని పలు సూపర్మార్కెట్లు ఇప్పటికీ కొనసాగిస్తున్నాయి. కొన్నిచోట్ల అయితే ఒక్కో కస్టమర్‌కు గరిష్టంగా 2 గుడ్లే అమ్ముతున్నాయి! డెన్సీస్, వాఫుల్ హౌస్ వంటి రెస్టారెంట్ చెయిన్లు ఒక్కో గుడ్డుపై 50 సెంట్ల సర్‌చార్జీ కూడా వడ్డిస్తున్నాయి!ధరలు మరింత పైపైకే? సమీప భవిష్యత్తులో కూడా గుడ్ల ధరలు తగ్గే పరిస్థితి కన్పించకపోవడం అమెరికన్లను మరింత కలవరపెడుతోంది. కోళ్ల కొరతను అధిగమించడానికే కనీసం మరికొద్ది నెలలు పట్టవచ్చని చెబుతున్నారు. అప్పటిదాకా పరిస్థితి ఇంతేనని సమాచారం. గత జనవరిలోనే గుడ్ల ధరలు ఏకంగా 15 శాతం ఎగబాకాయి. గతేడాదితో పోలిస్తే ఇప్పటికే సగానికి సగం పెరిగిపోయాయి. ఇది ఇక్కడితో ఆగదని, ఈ ఏడాది గుడ్ల ధరలు కనీసం 40 శాతానికి పైగా పెరగవచ్చని అమెరికా వ్యవసాయ శాఖ అంచనా వేసింది! ట్రంప్ సర్కారు కూడా పరోక్షంగా అదే చెప్పింది. ‘‘ఏడాదిన్నరలోగా డజను గుడ్ల ధర ఎప్పట్లా 2 డాలర్ల లోపుకు దిగొచ్చేలా చర్యలు తీసుకుంటాం’’ అని వ్యవసాయ మంత్రి బ్రూక్ రోలిన్స్ చెప్పుకొచ్చారు! దాంతో గుడ్ల కొరతను అధిగమించేందుకు తుర్కియే వైపు చూస్తోంది. గతంలో కెనడా, నెదర్లాండ్స్, బ్రిటన్, చైనా నుంచీ అమెరికా గుడ్లను దిగుమతి చేసుకున్నా కొన్నేళ్లుగా ఒక్క తుర్కియేకే పరిమితమైంది. ఆ దేశం నుంచి ఈ ఏడాది కనీసం 42 కోట్ల గుడ్లను దిగుమతి చేసుకోవాలని భావిస్తోంది. అయినా పెద్దగా ఒరిగేదేమీ ఉండబోదని పరిశీలకులు పెదవి విరుస్తున్నారు. ఫ్లూ సమస్య ఇలాగే కొనసాగితే దాని తాలూకు లోటును, ఉత్పత్తి నష్టాలను భర్తీ చేసుకోవడానికే ఈ దిగుమతులు చాలవని చెబుతున్నారు.ఇవీ లెక్కలు..→ అమెరికాలో ఏటా సగటున 9,000 కోట్లకు పైగా గుడ్లు ఉత్పత్తవుతాయి. → ఫ్లూ కారణంగా మూడేళ్లలో 14 కోట్ల కోళ్లను చంపేయాల్సి వచ్చింది. → 2021లో 1.6 డాలర్లున్న డజను గుడ్ల ధర ఇప్పుడు 5 డాలర్లను దాటేసింది. → 2024లో తుర్కియే నుంచి 7 కోట్ల గుడ్లు దిగుమతి చేసుకున్నారు. → ఈసారి ఏకంగా 42 కోట్ల గుడ్లు దిగుమతి చేసుకోనున్నారు. ఇది దేశ చరిత్రలోనే అత్యధికం! → అయినా డిమాండ్‌ను తట్టుకోవడానికి ఇది ఏమాత్రమూ చాలదంటున్నారు.ట్రంప్ బిలియన్ డాలర్ ప్లాన్ గుడ్ల కొరతను అధిగమించి వాటి ధరలను నేలకు దించేందుకు బిలియన్ డాలర్ల ప్రణాళికను అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదిస్తున్నారు. అందులో ఏమున్నాయంటే... → బర్డ్‌ఫ్లూ వ్యాప్తిని అడ్డుకునేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు. → బర్డ్‌ఫ్లూ చికిత్స, వ్యాక్సిన్ల అభివృద్ధి తదితరాలకు 10 కోట్ల డాలర్లు → పౌల్ట్రీఫారాల యజమానులకు ఆర్థిక సాయానికి 40 కోట్ల డాలర్లు → దిగమతుల ద్వారా ప్రస్తుత డిమాండ్‌ను తట్టుకుని కొరతను అధిగమించడంబైడెన్ సర్కారు ఏం చేసింది? ఫ్లూపై పోరుకు బైడెన్ ప్రభుత్వం మూడేళ్లలో 150 కోట్ల డాలర్లు వెచ్చించింది. ఫ్లూ బారిన పడ్డ కోళ్లను అంతమొందిస్తూ వచ్చింది. ఈ వైరస్ మనుషులకు పాకకుండా చూసేందుకు 60 కోట్ల డాలర్లు కేటాయించింది. వ్యాక్సిన్ల వృద్ధి తదితరాలపై దృష్టి పెట్టింది. ఎంత చేసినా గుడ్ల కొరత నానాటికీ పెరుగుతూనే వచ్చింది. బైడెన్ ప్రభుత్వ అర్థంలేని చర్యల వల్లే సమస్య విషమించిందని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఆయన చర్యలతో పరిస్థితి ఎంతో కొంత అదుపులోకి రాగలదని పౌల్ట్రీ పరిశ్రమ వర్గాలు ఆశాభావంతో ఉండటం విశేషం.– సాక్షి, నేషనల్ డెస్క్ -
జైశంకర్ పర్యటనలో ఖలిస్థానీల అత్యుత్సాహం.. ఖండించిన యూకే
లండన్ : యూకే పర్యటలో భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ వాహనంపై ఖలిస్థానీ మద్దతుదారులు జరిపిన దాడి యత్నాన్ని యూకే ఖండించింది. ఈ సందర్భంగా బ్రిటన్ విదేశీ వ్యవహారాల శాఖ (FCDO) అధికారికంగా స్పందించింది."యూకే చాఠమ్ హౌస్ బయట భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ కారుపై దాడి యత్నాన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. యూకే శాంతియుత నిరసన హక్కును గౌరవిస్తుంది. కానీ ఇలా దాడులకు యత్నించడం, బెదిరించడం, ప్రజా కార్యక్రమాల్ని అడ్డుకోవడం సరైందని కాదని’ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.మరోవైపు లండన్ మెట్రోపాలిటన్ పోలీసు వర్గాలు సైతం జైశంకర్‌పై జరిగిన దాడి యత్నాన్ని ఖండించాయి. నిందితులపై చర్యలు తీసుకున్నామని పేర్కొంది. మా అతిథుల భద్రతను పర్యవేక్షించడం, వారి సంరక్షణ బాధ్యతలకు మేం పూర్తిగా కట్టుబడి ఉన్నామని మరో ప్రకటనలో స్పష్టం చేసింది. -
యూఏఈలో మరో ఇద్దరు భారతీయులకు మరణశిక్ష అమలు
దుబాయ్: యూఏఈలో మరో ఇద్దరు భారతీయులకు మరణశిక్ష అమలైంది. హత్య కేసులో కేరళకు చెందిన ఇద్దరికి మరణశిక్ష అమలు చేసినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖకు యూఏఈ అధికారులు తాజాగా స్పష్టం చేశారు.కేరళ రాష్ట్రంలోని కన్నూర్ కు చెందిన మహ్మద్ రినాష్, పీవీ మురళీధరన్ లకు మరణశిక్ష అమలు చేసిన విషయాన్ని భారత విదేశాంగ శాఖ దృష్టికి తీసుకొచ్చారు. వివరాల్లోకి వెళితే.. ట్రావెల్ ఏజెన్సీ ఏఐ ఎయిన్ లో పని చేసిన రినాష్.. ఓ హత్య కేసులో ఇరుక్కున్నాడు. యూఏఈకి చెందిన ఓ వ్యక్తిని హత్య చేసిన నేరం కింద మరణశిక్ష అమలు చేయగా,. మురళీధరన్ అనే వ్యక్తి భారత్ కు చెందిన ఓ వ్యక్తిని హత్య చేసిన కేసులో మరణశిక్షను అమలు చేశారు.వీరి హత్య కేసులో భాగంగా కావాల్సిన అన్ని న్యాయపరమైన ఏర్పాట్లు చేసినట్లు భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అయితే వారిపై ఉన్నవి హత్యానేరాలు కావడంతో మరణశిక్ష అమలు తప్పలేదని, వారి చివరి మజిలీలో భాగంగా కుటుంబ సభ్యుల్లో ఇద్దరి చొప్పున అక్కడికి వెళ్లేందుకు ఏర్పాటు చేసినట్లు విదేశాంగ అధికారులు పేర్కొన్నారు. ఫిబ్రవరి 28వ తేదీనే వీరికి మరణశిక్షను ఖరారు చేయగా, తాజాగా వారి శిక్షను అమలు చేశారు. ఇప్పటిరవకూభారత్ కు చెందిన 28 మంది యూఏఈలో మరణశిక్ష బారిన పడ్డారు. ఇటీవల మార్చి 3వ తేదీన ఒక మహిళకు కూడా మరణశిక్షను అమలు చేసిన సంగతి తెలిసిందే.యూఏఈలో భారతీయ మహిళకు మరణశిక్ష అమలు -
జైశంకర్‌పై ఖలిస్థానీ సానుభూతిపరులు దాడికి యత్నం.. ఖండించిన భారత్
ఢిల్లీ : లండన్ పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కారుపై ఖలిస్థానీ సానుభూతిపరులు దాడికి యత్నించడం కలకలం రేపుతోంది. అయితే, ఈ దాడిని భారత్ ఖండించింది. భద్రతా లోపంపై విదేశాంగ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది.మంత్రి జై శంకర్ బుధవారం రాత్రి లండన్‌లోని ఛాఠమ్ హౌస్‌లో నిర్వహించిన అధికారిక సమావేశాలకు హాజరయ్యారు. ఈ సమావేశాలు ముగించుకొని బయటకు వచ్చిన సమయంలో ఖలిస్థానీ మద్దతుదారులు ఆయన కారుపై దూసుకువచ్చారు. పలువురు భారత జాతీయ జెండాలను చించే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన లండన్ పోలీసులు వారిని అడ్డుకున్నారు. కారువైపు దూసుకొచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఘటనపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వేర్పాటువాదులు, తీవ్రవాదుల రెచ్చగొట్టే చర్యలను, ప్రజాస్వామ్య స్వేచ్ఛ దుర్వినియోగం కావడాన్ని మేం త్రీవంగా ఖండిస్తున్నాము. ఇలాంటి సందర్భాల్లో ఆతిథ్య దేశం వారి దౌత్యపరమైన బాధ్యతలను పూర్తిగా నెరవేర్చాలి. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుంటుందని మేం ఆశిస్తున్నాం’ అని ప్రకటనలో పేర్కొంది.🚨 Breaking: In London, a Khalistan protester tries to assault EAM S Jaishankar and shreds the Indian flag | Watch the video. pic.twitter.com/HRGcMAgDGt— Indian InSight (@IndianInsight_) March 6, 2025 -
నన్ను భారత్‌కు పంపొద్దు.. ప్లీజ్
వాష్టింగన్: 26/11 ముంబై ఉగ్రదాడుల నిందితుడు తహవూర్ రాణా ఆఖరి ప్రయత్నంగా అమెరికా సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. తనను భారత్‌కు అప్పగించొద్దంటూ ఓ అత్యవసర పిటిషన్ దాఖలు చేశాడతను.భారత్‌కు తనను పంపొద్దని.. అక్కడ తనను దారుణంగా హింసించే అవకాశాలు ఉన్నాయని.. తాను పాకిస్థాన్ మూలాలున్న ముస్లింను కావడమే అందుకు కారణమని పిటిషన్లో తహవూర్ ప్రస్తావించినట్లు సమాచారం. ఈ పిటిషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు అందాల్సి ఉంది. పాకిస్తాన్ సంతతికి చెందిన కెనడా పౌరుడైన తహవూర్ రాణా, 2008 ముంబై ఉగ్రవాద దాడుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఆ మరుసటి ఏడాది FBI అతన్ని అరెస్టు చేసింది. రాణాను భారతదేశానికి అప్పగించడానికి అమెరికా సుప్రీంకోర్టు జనవరి 25, 2024న ఆమోదం తెలిపింది. ఈ కేసులో రాణా తనను తప్పుగా దోషిగా ప్రకటించారని చెప్పి రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు. కానీ కోర్టు ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో.. 2008 ముంబై ఉగ్రవాద దాడుల ప్రధాన నిందితుల్లో ఒకరైన తహవూర్ రాణా(Tahavur Rana)ను భారత్‌కు అప్పగించడానికి అధ్యక్షుడు ట్రంప్ ఆమోదించారు. దీంతో ట్రంప్‌కి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. దీంతో రాణా భారతదేశానికి వచ్చి న్యాయ విచారణ ఎదుర్కోవడం ఖాయమని అంతా భావించారు. -
సొంత పౌరులపైనే ద.కొ. బాంబులు
సియోల్: దక్షిణ కొరియా సైన్యం శిక్షణలో(Military Drill Excercise) అపశ్రుతి చోటు చేసుకుంది. సొంత పౌరులపైనే యుద్ధ విమానం బాంబులు జారవిడిచింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఆపై పొరపాటున ఈ దాడి జరిగినట్లు చెబుతూ సైన్యం పౌరులను క్షమాపణలు కోరింది.గురువారం ఉదయం పోచియాన్(Pocheon)లో సైన్యం-వైమానిక దళం సంయుక్తంగా శిక్షణ కార్యక్రమం నిర్వహించాయి. కేఎఫ్-16 విమానం నుంచి నిర్దేశించిన లక్ష్యంలో ఎంకే-82 బాంబులను జార విడచాల్సి ఉంది. అయితే నిర్దేశిత లక్ష్యంలో కాకుండా.. జనావాసాలపైకి విమానం దూసుకెళ్లింది. మొత్తం ఎనిమిది బాంబులు వేసింది. దీంతో పలువురికి గాయాలుకాగా.. చికిత్స కోసం వాళ్లను ఆస్పత్రికి తరలించారు. వీళ్లలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారంజరిగిన ఘటనకు పశ్చాత్తాపం వ్యక్తం చేసిన సైన్యం.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. అలాగే బాధితులకు పరిహారం అందజేస్తామని, ఘటనపై దర్యాప్తు కోసం ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఇదిలా ఉంటే.. దక్షిణ కొరియా(South Korea) రాజధాని సియోల్‌కు 40 కిలోమీటర్ల దూరంలో పోచియాన్ ఉంది. దీనికి సమీపంలోనే ఉత్తర కొరియా సరిహద్దు ఉంది. త్వరలో అమెరికా-ద.కొ. సైన్యాల సంయుక్త ప్రదర్శన జరగాల్సి ఉంది. అయితే ఇందుకోసం గురువారం నుంచి పోచియాన్‌లో ఇరు దేశాల సైన్యాలు ప్రాక్టీస్ చేస్తాయని ఆ దేశ రక్షణ శాఖ ప్రకటించింది కూడా. -
ట్రంప్ సాయంతో కశ్మీర్ సమస్యను పరిష్కరిస్తారా?
ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొల్పాలనే ఉద్దేశంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దూకుడుగా అడుగులేస్తున్నారు . ఉక్రెయిన్, గాజా సంక్షోభాలకు ముగింపు పలికేందుకు కఠిన నిర్ణయాలే తీసుకుంటున్నారు. అయితే ఆయన సాయంతోనే సున్నితమైన కశ్మీర్ సమస్య(Trump Kashmir Issue)ను భారత్ పరిష్కరించుకోవచ్చు కదా!. ఇదే ప్రశ్న భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌కు ఎదురైంది.లండన్ చాథమ్ హౌస్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి జై శంకర్ హాజరయ్యారు. కశ్మీర్ పరిష్కారం కోసం మధ్యవర్తిత్వం వహించమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Trump)ను భారత ప్రధాని మోదీ కోరే ఉద్దేశమేదైనా ఉందా? అని ప్రతినిధులు ఆయన్ని అడిగారు. అయితే ఈ అంశంలో భారత్ ఇప్పటిదాకా స్వతంత్రంగానే వ్యవహరించిందని.. ఇక మీదటా ‘మూడో ప్రమేయం’ ఉండదని స్పష్టం చేశారాయన. కశ్మీర్ సమస్య పరిష్కారం దిశగా ఇప్పటిదాకా మేం(భారత్) ఒంటరి ప్రయత్నాలే చేశాం. మంచి అడుగులెన్నో వేశాం. ఇప్పటికే నిర్ణయాత్మక చర్యలెన్నో తీసుకున్నాం. అందులో మొదటి అడుగే ఆర్టికల్ 370(Article 370) తొలగింపు. కశ్మీర్ అభివృద్ధి, ఆర్థిక పురోగతి, సామాజిక న్యాయం.. ఇవి రెండో అడుగు. అత్యధిక ఓటింగ్ శాతం నమోదు అయ్యేలా ఎన్నికలు నిర్వహించడం మూడో అడుగు. అయితే..ఇంకా పరిష్కారం కాని అంశం.. దేశం అవతల ఉంది. అదే పాక్ ఆక్రమిత కశ్మీర్(Pak Occupied Kashmir). దానిని తిరిగి స్వాధీనం చేసుకోవడం మాత్రమే మిగిలి ఉంది. అది పూర్తైతే గనుక కశ్మీర్ సమస్య పరిష్కారం అయినట్లే. అందుకు నేను మీకు హామీ ఇస్తున్నా’’ అని జైశంకర్ అన్నారు. ‘పీవోకే’ భారత్‌లో అంతర్భాగమని, అది 1947 నుంచి పాక్ ఆక్రమణలో ఉందని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ ఎప్పటికప్పుడు చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కిందటి ఏడాది.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) విదేశీ భూభాగమేనని స్వయంగా పాకిస్థాన్ ప్రభుత్వం ఇస్లామాబాద్ హైకోర్టులో అంగీకరించింది. ఓ జర్నలిస్ట్ కిడ్నాప్ కేసులో హైకోర్టులో వాదనలు వినిపించిన అదనపు అటార్నీ జనరల్.. పీవోకే విదేశీ భూభాగమని, అక్కడ పాక్ చట్టాలు చెల్లవని తెలిపారు. -
ఇదే నా చివరి హెచ్చరిక.. ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) హమాస్‌పై భగ్గుమన్నారు. తమ అదుపులో ఉన్న మిగిలిన బందీలను తక్షణమే విడుదల చేయాలని.. లేకుంటే అంతు చూస్తానని హమాస్‌ను హెచ్చరించారు. ఈ క్రమంలో ఇదే తన చివరి హెచ్చరిక అని పేర్కొన్నారు. హమాస్(Hamas) విడుదల చేసిన ఎనిమిది మందితో వైట్హౌజ్తో తాజాగా ట్రంప్ సమావేశం అయ్యారు. అనంతరం ఆయన ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. ‘‘హలోనా? గుడ్‌బైనా?.. ఏదో మీరే ఎంచుకోండి. బందీలందరిని వెంటనే విడుదల చేయండి. అలాగే మీరు చంపిన వాళ్ల మృతదేహాలను తిరిగి అప్పగించండి. లేకుంటే మీ పని ఖతమే. మానసికంగా మూర్ఖులైనవాళ్లు మాత్రమే ఇలా మృతదేహాలను తమ వద్ద ఉంచుకుంటారు. అందుకే.. పని పూర్తి చేసేందుకు అవసరమైనవన్నీ ఇజ్రాయెల్‌కు పంపుతున్నా. నేను చెప్పింది చేయకుంటే.. ఒక్క హమాస్ సభ్యుడు కూడా మిగలడు. ‘‘మీరు చిధ్రం చేసిన కొందరు బందీలను నేను కలిశా. ఇదే మీకు నా చివరి హెచ్చరిక. గాజానుప్పుడే వీడండి. ఇదే మీకు చివరి అవకాశం. గాజా ప్రజల్లారా.. మీ కోసం అందమైన భవిష్యత్తు ఎదురు చూస్తోంది. ఒకవేళ బందీలను గనుక విడుదల చేయకుంటే.. అది మీకు దక్కదు. బందీలందరినిప్పుడే విడుదల చేయండి.. లేదంటే తర్వాత అనుభవించాల్సి ఉంటుంది అని పదే పదే హెచ్చరిక జారీ చేశారాయన. "'Shalom Hamas' means Hello and Goodbye - You can choose. Release all of the Hostages now, not later, and immediately return all of the dead bodies of the people you murdered, or it is OVER for you. Only sick and twisted people keep bodies, and you are sick and twisted! I am… pic.twitter.com/88EjVAyWAe— President Donald J. Trump (@POTUS) March 5, 20252023 అక్టోబర్ 7వ తేదీన గాజా యుద్ధం(Gaza War) మొదలైన సంగతి తెలిసిందే. తొలుత హమాస్ జరిపిన మెరుపు క్షిపణుల దాడుల్లో 1,200 మంది ఇజ్రాయిల్ పౌరులు మరణించారు. ఆ సమయంలోనే కొందరు ఇజ్రాయెల్ పౌరుల్ని, విదేశీయుల్ని హమాస్ ఎత్తుకెళ్లి తమ చెరలో బంధీలుగా ఉంచుకుంది. ఈ దాడికి ప్రతిగా ఇజ్రాయెల్ గాజాపై జరిపిన దాడుల్లో.. ఇప్పటిదాకా 46 వేల మంది పాలస్తీనా ప్రజలు మరణించారు. ఇందులో పిల్లలే ఎక్కువగా ఉన్నారు. అదే సమయంలో లక్షల మంది ప్రాణభయంతో గాజాను విడిచిపెట్టి పోయారు. అయితే ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి ముందు నుంచే హమాస్‌ను బందీల విడుదల విషయంలో హెచ్చరికలు జారీ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో పాలస్తీనా ఖైదీలు, యుద్ధ ఖైదీల విడుదలకు ఇజ్రాయెల్-హమాస్ పరస్పరం ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం అమలు నిదానంగా జరుగుతుండడం.. ఒకానొక దశలో హమాస్ బందీల విడుదలను నిలుపుదల చేయడంతో ట్రంప్ ఇలా చివరి హెచ్చరిక జారీ చేశారు. మరోవైపు.. గాజా నుంచి పాలస్తీనా ప్రజలను వెళ్లగొట్టి పునర్ నిర్మిస్తామని ట్రంప్ వ్యాఖ్యానించడం.. ఓ ఏఐ జనరేటెడ్ వీడియో పోస్ట్ చేయడం విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే. -
పుతిన్‌ను బుజ్జగిస్తూ మాతో కయ్యమా: ట్రూడో
టొరంటో: కెనడాపై అమెరికా ప్రభుత్వం టారిఫ్‌లు విధించడాన్ని మూర్ఖత్వంగా ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో అభివర్ణించారు. కెనడాపై వాణిజ్య యుద్ధానికి తెరలేపిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను బుజ్జగిస్తున్నారని వ్యాఖ్యానించారు. ట్రంప్ తాజాగా విధించిన 25 శాతం టారిఫ్‌లకు ప్రతీకారంగా అమెరికా వస్తువులపై 100 బిలియన్ డాలర్ల మేర టారిఫ్‌లు విధిస్తామని స్పష్టం చేశారు. ‘అమెరికా తన అత్యంత ఆత్మీయ, మిత్ర దేశంపై వాణిజ్య యుద్ధాన్ని మొదలుపెట్టింది. అదే సమ యంలో, రష్యాకు అనుకూలంగా మా ట్లాడుతోంది. ఒక అబద్ధాలకోరు, దుర్మా ర్గపు నియంత అయిన పుతిన్‌ను బుజ్జగించే పనులు చేస్తోంది’అని ట్రూడో నిప్పులు చెరిగారు. ‘అమెరికాకు 51వ రాష్ట్రంగా కెనడాను ఎన్నటి కీ కానివ్వం. డొనాల్డ్ అనే అమెరికన్‌కు నేరుగా ఈ విషయం స్పష్టం చేస్తున్నాను’అంటూ నేరుగా ట్రంప్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. -
సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌గా 13 ఏళ్ల బాలుడు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టెక్సాస్‌కు చెందిన 13 ఏళ్ల బాలుడు, క్యాన్సర్ విజేత డీజే డేనియల్ను సీక్రెట్ సర్వీస్ గౌరవ ఏజెంట్‌గా నియమించారు. కాంగ్రెస్ తొలి సంయుక్త సమావేశంలో డీజే విజయగాథను ట్రంప్ పంచుకున్నారు. ‘2018లో డీజేకు అరుదైన కేన్సర్ నిర్ధారణ అయ్యింది. ఐదు నెలలే బతు కుతాడని డాక్టర్లు చెప్పారు. కానీ.. పోలీసు ఆఫీసర్ కావాలన్న లక్ష్యం ఆయనకు పోరాడే స్థైర్యాన్నిచ్చింది. కేన్స ర్ను ఓడించిన డీజే తన కలను నిజం చేసుకోబోతున్నాడు. అతనికి పెద్ద గౌరవాన్ని ఇస్తున్నా. డీజేను యూఎస్ సీక్రెట్ సర్వీస్ గౌరవ ఏజెంట్‌గా చేయాలని డైరెక్టర్ సీన్ కరన్‌ను అడుగుతున్నా’ అని ప్రకటించారు. దీంతో సభంతా చప్పట్లతో హోరెత్తింది. సభ మొత్తం ‘డీజే... డీజే’ అని హోరెత్తగా గ్యాలరీలో అతని తండ్రి డీజేను గాల్లోకి ఎత్తాడు. సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ కరన్ ఆ బాలుడి దగ్గరకు వెళ్లి అధికారిక బ్యాడ్జీని అందజేశారు. -
అమెరికా ఈజ్ బ్యాక్
వాషింగ్టన్: ‘అమెరికా స్వర్ణయుగం’ ఇప్పుడే మొదలైందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టంచేశారు. ‘అమెరికా ఈజ్ బ్యాక్’ అని ఉద్ఘాటించారు. ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ కోసం తమ ప్రభుత్వం అవిశ్రాంతంగా శ్రమిస్తోందని స్పష్టంచేశారు. అమెరికాను మరోసారి గొప్ప దేశంగా మార్చబోతున్నామని చెప్పారు. అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మంగళవారం రాత్రి అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ట్రంప్ మొదటిసారిగా మాట్లాడారు. ఏకంగా ఒక గంట 40 నిమిషాలకుపైగా ప్రసంగించి సరికొత్త రికార్డు సృష్టించారు. తొలి జాయింట్ సెషన్ ఆఫ్ పార్లమెంట్లో గానీ, తొలి స్టేట్ ఆఫ్ ద యూనియన్ స్పీచ్‌లో గానీ అధ్యక్షుడు 100 నిమిషాలపాటు సుదీర్ఘంగా మాట్లాడడం అమెరికా చరిత్రలో ఇదే ప్రథమం. ఇప్పటిదాకా బిల్ క్లింటన్ పేరిట ఉన్న రికార్డును ట్రంప్ తిరగరాశారు. 2000 సంవత్సరంలో అప్పటి అధ్యక్షుడు బిల్ క్లింటన్ స్టేట్ ఆఫ్ ద యూనియన్ స్పీచ్‌లో ఒక గంట 28 నిమిషాల 49 సెకండ్ల పాటు ప్రసంగించారు. డొనాల్డ్ ట్రంప్ తన తాజా ప్రసంగంలో పలు కీలక అంశాలపై స్పందించారు. సరిహద్దు భద్రత, టారిఫ్‌లు, రష్యా–ఉక్రెయిన్ శాంతి ఒప్పందం, ఇంధన భద్రత, ధరల పెరుగుదల, అక్రమ వలసలు తదితర అంశాలపై తన వైఖరిని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పేశారు. పనామా కాలువను స్వా«దీనం చేసుకుంటామని, గ్రీన్‌ల్యాండ్‌పై నియంత్రణ సాధిస్తామని తేల్చిచెప్పారు. ట్రంప్ ప్రసంగం ఆయన మాటల్లోనే... ప్రతి దేశం మమ్మల్ని దగా చేస్తోంది ‘‘ఇండియాతోపాటు ఇతర దేశాలు అమెరికా ఉత్పత్తులపై అధికంగా సుంకాలు విధిస్తున్నాయి. ఇలా చేయడం ముమ్మాటికీ అన్యాయమే. యూరోపియన్ యూనియన్, చైనా, బ్రెజిల్, ఇండియా, మెక్సికో, కెనడా తదితర దేశాల టారిఫ్‌ల గురించి విన్నారా? ఇండియాలో అయితే అటో టారిఫ్‌లు 100 శాతానికి పైగా విధిస్తున్నారు. చాలాదేశాలు దశాబ్దాలుగా మా ఉత్పత్తులపై సుంకాల రూపంలో భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాయి. చైనా, దక్షిణ కొరియా వంటి దేశాలు సుంకాల మోత మోగిస్తున్నాయి. ఈ భూగోళంపై ఉన్న దాదాపు ప్రతి దేశం మమ్మల్ని దగా చేస్తోంది. ఇకపై ఈ దోపిడీ సాగడానికి వీల్లేదు. ఇప్పుడు మా వంతు వచి్చంది. మా ఉత్పత్తులపై సుంకాలు విధించే దేశాల ఉత్పత్తులపై మేము కూడా అదే స్థాయిలో సుంకాలు వసూలు చేస్తాం. వచ్చే నెల 2వ తేదీ నుంచే ఇవి అమల్లోకి వస్తాయి. ఆయా దేశాలు వారి ఉత్పత్తులను అమెరికాలో తయారు చేయకపోతే టారిఫ్‌లు చెల్లించాల్సిందే. ట్రంప్ పాలనలో కొన్ని సందర్భాల్లో టారిఫ్‌లు చాలాచాలా అధికంగా ఉంటాయని గుర్తుంచుకోవాలి. ఎవరైనా వారి మార్కెట్లలోకి మమ్మల్ని రానివ్వకపోతే మేము కూడా అదే పనిచేస్తాం. మా మార్కెట్లలోకి వారిని అడుగు పెట్టనివ్వం. జెలెన్స్కీ లేఖ ప్రశంసనీయం ఉక్రెయిన్‌తో ఘర్షణకు ముగింపు పలికి, శాంతిని కోరుకుంటున్నట్లు రష్యా నుంచి నాకు బలమైన సంకేతాలు అందాయి. శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ నుంచి నాకు ఈరోజే ఒక ముఖ్యమైన లేఖ అందింది. శాంతి సాధన కోసం సాధ్యమైనంత త్వరగా చర్చలు ప్రారంభం కావాలని ఆయన కోరుకుంటున్నారు. ఇప్పుడు ఉక్రెయిన్ ప్రజల కంటే మిన్నగా శాంతిని ఆకాంక్షిస్తున్నవారు ఎవరూ లేరని లేఖలో జెలెన్స్కీ పేర్కొన్నారు. ఇది నిశ్చయంగా శుభ పరిణామం. శాశ్వత శాంతి కోసం ట్రంప్ నాయకత్వంలో పని చేస్తామని జెలెన్స్కీ, ఆయన బృందం చెప్పారు. ఉక్రెయిన్‌కు అమెరికా అందిస్తున్న సాయాన్ని మర్చిపోలేమని వారు తెలిపారు. ఉక్రెయిన్ సార్వ¿ౌమత్వం, స్వాతంత్య్రాన్ని అమెరికా కాపాడుతుందని వారు ఆశిస్తున్నారు. అదే సమయంలో అరుదైన ఖనిజాల సరఫరాతోపాటు ఉక్రెయిన్ భద్రత విషయంలో ఒప్పందంపై ఏ సమయంలోనైనా సంతకం చేయడానికి సిద్ధంగా ఉన్నామని జెలెన్స్కీ నా దృష్టికి తీసుకొచ్చారు. జెలెన్స్కీ రాసిన లేఖ ప్రశంసనీయం. క్రూరమైన యుద్ధం వల్ల ఉక్రెయిన్, రష్యాలో ఇప్పటికే లక్షలాది మంది అన్యాయంగా బలైపోయారు. చాలామంది క్షతగాత్రులుగా మారారు. ఈ మారణకాండ ఆగిపోవాల్సిందే. మతిలేని యుద్ధాన్ని ఆపేయాల్సిన సమయం ఇదే. ఉక్రెయిన్‌లో ఘర్షణకు తెరదించడానికి నేను ఎంతగానో కష్టపడుతున్నా. రష్యా ప్రతినిధులతో ఇటీవలే చర్చలు జరిపాం. శాంతి కోసం సిద్ధంగా ఉన్నట్లు వారు బలమైన సంకేతాలిచ్చారు. ఇది నిజంగా ఎంతో అద్భుతంగా ఉంది కదా. కాశ్ పటేల్‌కు కృతజ్ఞతలు 2021 ఆగస్టులో అఫ్గానిస్తాన్ ఎయిర్‌పోర్టు వద్ద పేలుళ్లకు పాల్పడి 13 మంది అమెరికా సైనికులను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాది ముహమ్మద్ షరీఫుల్లాను అరెస్టు చేశామని తెలియజేయడానికి సంతోషిస్తున్నా. పాకిస్తాన్ సాయంతో అతడిని బంధించాం. అమెరికాకు తరలిస్తున్నాం. సత్వరమే చట్టప్రకారం విచారణ చేపట్టి, అతడిని శిక్షిస్తాం. ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. గతంలో అప్పటి పాలకులు న్యాయ వ్యవస్థను రాజకీయ ప్రత్యర్థులపై ఆయుధంగా వాడుకున్నారు. ఇప్పుడు న్యాయ వ్యవస్థపై విశ్వాసాన్ని కాశ్ పటేల్ పునరుద్ధరించారు. కాశ్ పటేల్ మున్ముందు గొప్ప పనులు చేయబోతున్నారు. అలాగే లింగ మార్పిడి చర్యలకు మేము వ్యతిరేకమే. లింగ మారి్పడిని శాశ్వతంగా నిషేధిస్తూ, దాన్ని నేరంగా పరిగణించే బిల్లును ఆమోదించాలని కాంగ్రెస్‌ను కోరుతున్నా. చిన్నారుల్లో క్యాన్సర్, ఆటిజం కేసులను తగ్గించడానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. మన పర్యావరణం నుంచి విషకారకాలను, ఆహార పదార్థాల అన్ని రకాల విష రసాయనాలను తొలగించి, చిన్నారులను ఆరోగ్యంగా, బలంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం. డ్రిల్ బేబీ డ్రిల్ అమెరికాలో ఇప్పుడు ధరల పెరుగుదలతోపాటు అనేక సమస్యలకు గత జో బైడెన్ ప్రభుత్వమే కారణం. బైడెన్ అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ద్రవ్యోల్బణ సమస్య వేధిస్తోంది. ఏ దేశానికీ లేని విధంగా మన కాళ్ల కింద ద్రవరూపంలో బంగారం ఉంది. ముడి చమురు, సహజ వాయువును వెలికితీస్తే ద్రవ్యోల్బణ సమస్య పరిష్కారమవుతుంది. బైడెన్ పాలనలో వందకుపైగా విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు మూసివేశారు. వాటిని మళ్లీ తెరవబోతున్నాం. ఇంధన వ్యయాన్ని తగ్గించడంపై దృష్టి పెట్టాం. నేను అధికారంలోకి రాగానే జాతీయ ఇంధన అత్యవసర పరిస్థితి విధించా. కాళ్ల కింద ఉన్న బంగారాన్ని తవ్వితీస్తే ఇంధన ఖర్చులు గణనీయంగా తగ్గిపోతాయి. ప్రజలకు మేలు జరుగుతుంది. దాన్ని డ్రిల్ బేబీ డ్రిల్ అంటారు. అమెరికా పౌరులందరికీ సామాజిక భద్రత కలి్పంచడమే మా ధ్యేయం. 300 ఏళ్ల వయసున్న వ్యక్తి కూడా ప్రభుత్వం నుంచి సాయం అందుకొనే విధానం తీసుకొస్తాం. అక్రమ వలసలపై మా వైఖరేమిటో ఇప్పటికే బయటపెట్టాం. అక్రమ వలసదార్లను బయటకు పంపిస్తాం. అందులో ఎలాంటి సందేహం లేదు. అక్రమ వలసను అరికట్టడానికి సరిహద్దులను దుర్భేద్యంగా మారుస్తాం’’ అని డొనాల్డ్ ట్రంప్ వివరించారు. ఆ దేశాలకు రాయితీలు బంద్ ‘‘పొరుగు దేశాల నుంచి ఫెంటానిల్ వంటి ప్రాణాంతక మాదక ద్రవ్యాలు అమెరికాలోకి అక్రమంగా వచ్చి పడుతున్నాయి. డ్రగ్స్ కారణంగా వేలాది మంది అమెరికా పౌరులు అకాల మరణం చెందుతున్నారు. కుటుంబాలు కూలిపోతున్నాయి. యువతీ యువకులు ప్రాణాలు కోల్పోతుండడం బాధ కలిగిస్తోంది. ఇలాంటి విషాదం ఎప్పుడూ చూడలేదు. అమెరికా నుంచి వందల బిలియన్ డాలర్ల సబ్సిడీలు పొందుతున్న దేశాలు చేస్తున్న నిర్వాకమిది. కెనడా, మెక్సికో దేశాలకు ఎన్నో రాయితీలు ఇస్తున్నాం. వందల బిలియన్ల డాలర్ల సొమ్ము ఖర్చు చేస్తున్నాం. ఇకపై ఇలాంటి త్యాగాలకు మేము సిద్ధంగా లేము. మాకు నష్టం కలిగిస్తున్న దేశాలకు ఎట్టిపరిస్థితుల్లోనూ రాయితీలిచ్చే ప్రసక్తే లేదు’’. గ్రీన్లాండ్ అమెరికాలో భాగం కావాల్సిందే ‘‘పనామా కాలువను మా అ«దీనంలోకి తీసుకోవడానికి మావద్ద ప్రణాళికలు ఉన్నాయి. మా జాతీయ భద్రతను మరింత పటిష్టం చేసుకోవడానికి పనామా కాలువను నియంత్రణలోకి తెచ్చుకోక తప్పదు. ఇప్పటికే ఆ ప్రక్రియ ప్రారంభమైంది. జిమ్మీ కార్టర్ ప్రభుత్వం కేవలం ఒక్క డాలర్‌కు పనామా కాలువను ఇతరులకు ఇచ్చేసింది. అప్పట్లో కుదిరిన ఒప్పందాలు పదేపదే ఉల్లంఘనకు గురవుతున్నాయి. ఇక మాది మేం తీసుకుంటాం. గ్రీన్లాండ్ సైతం అమెరికాలో భాగం కాక తప్పదు. ఒక మార్గంలో కాకపోతే మరో మార్గంలో గ్రీన్ల్యాడ్ను స్వా«దీనం చేసుకుంటాం. సొంత భవిష్యత్తును నిర్ణయించుకొనే హక్కు గ్రీన్లాండ్ ప్రజలకు ఉంది. అమెరికా పౌరులుగా మారాలనుకుంటే సాదర స్వాగతం పలుకుతాం. గ్రీన్లాండ్ ప్రజలను భద్రంగా చూసుకుంటాం’’. -
ఏనుగు మళ్లీ జూలు విదిలిస్తుందా?
వూలీ మమోత్.. భారీ ఆకారంతో, సింహం జూలును తలపించేలా తొండం నుంచి తోకదాకా దట్టమైన రోమాలతో భీకరంగా ఉండే ఏనుగు అది. అలాంటి ఏనుగును పునః సృష్టించేందుకు.. ఒక ‘ఎలుకంత’ ముందడుగు పడింది.తల నుంచి తోకదాకా నిండా దట్టమైన రోమాలతో కూడిన ఎలుక జీవం పోసుకుంది. అమెరికాకు చెందిన బయోటెక్నాలజీ సంస్థ ‘కొలోస్సల్ బయోసైన్సెస్’ శాస్త్రవేత్తలు చేసిన ఈ చిత్రమైన పరిశోధన ఏమిటో తెలుసుకుందామా... –సాక్షి, సెంట్రల్డెస్క్ధ్రువ ప్రాంత మంచులో దొరికిన ఆనవాళ్లతో..భూమ్మీద తిరుగాడి, కాలక్రమేణా అంతరించిపోయిన అరుదైన జీవులను పునః సృష్టి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ‘కొలోస్సల్ బయోసైన్సెస్’ శాస్త్రవేత్తలు వూలీ మమోత్ ఏనుగులకు తిరిగి ప్రాణం పోసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఉత్తర ధ్రువ ప్రాంతపు మంచులో దొరికిన వూలీ మమోత్ అవశేషాల్లోని జన్యువులను, ప్రస్తుతమున్న సాధారణ ఆసియన్ ఏనుగుల జన్యువులను పోల్చి చూశారు. మమోత్‌లలో దట్టమైన వెంట్రుకలకు కారణమైన జన్యువులను గుర్తించారు. దీనికి సంబంధించి తొలుత ఎలుకలపై ప్రయోగాలు చేపట్టారు. ‘‘అంతరించిపోయిన ఒకనాటి జీవులను పునః సృష్టించగలం అనేందుకు ఈ ఎలుకలు సజీవ సాక్ష్యం. భవిష్యత్తులో ఈ టెక్నాలజీతో వూలీ మమోత్‌లను పుట్టించి, ప్రకృతిలోకి వదిలిపెట్టగలం..’’అని కొలోస్సల్ సంస్థ చీఫ్ సైన్స్ ఆఫీసర్ బెత్ షాపిరో పేర్కొన్నారు.1 ధ్రువ ప్రాంతపు మంచులో దొరికిన వూలీ మమోత్ అవశేషాల నుంచి జన్యువులను సేకరించారు.2 ఇప్పుడున్న ఆసియా ఏనుగుల జన్యువులతో, వూలీ మమోత్ జన్యువులను పోల్చి తేడాలను గుర్తించారు.3 ఎలుక పిండ కణాలను తీసుకుని.. వాటిలో పైచర్మం, వెంట్రుకలు, వాటి పొడవు, మందం తదితర లక్షణాలను నియంత్రించే ఎనిమిది జన్యువుల్లో.. మమోత్‌ల జన్యువుల తరహాలో మార్పులు చేశారు.4 ఈ జన్యుమార్పిడి చేసిన పిండ కణాలను కొన్ని సాధారణ ఎలుకల గర్భంలో ప్రవేశపెట్టారు.5 నిండా దట్టమైన రోమాలతో, అతి శీతల వాతావరణాన్ని కూడా తట్టుకోగలిగిన ‘ఊలు ఎలుకలు’ జన్మించాయి. -
అంతరిక్షంలో ఉండటం కష్టం కాదు..
వాషింగ్టన్: అంతరిక్షంలో ఉండటం కష్టం కాదు, కానీ ఎప్పుడు భూమి మీదకు చేరుకుంటామో నాసా అధికారులకు కూడా తెలియకపోవడమే అసలైన కష్టమని వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అన్నారు. రాజకీయాలు జీవితంలో ఒక భాగమైనప్పటికీ... తను, విలియమ్స్ తిరిగి భూమిపైకి వెంటనే రాకపోవడానికి అవి కారణం కాదని విలియమ్స్ చెప్పారు. తన లాబ్రడార్ రిట్రీవర్స్తో తిరిగి ఆడుకోవడానికి వేచి చూస్తున్నానని తెలిపారు. స్పేస్ఎక్స్ క్యాప్సూల్స్‌లో మార్పు కారణంగా ఇప్పుడు మరో రెండు వారాలు అంతరిక్షంలో ఉండాల్సి వస్తోందని వెల్లడించారు. సహ వ్యోమగామి విల్మోర్తో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి మంగళవారం విలేకరులతో మాట్లాడారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని 2030 చివరిలో కాకుండా ముందుగానే రిటైర్ చేయాలని మస్క్ ఇటీవల చేసిన సూచనను విలియమ్స్ తోసిపుచ్చారు. ‘ఇప్పుడు కీలకమై న సమయంలో ఉన్నాం. ఐఎస్ఎస్ ని్రష్క మణకు ఇది సరైన సమయం కాదని నేను అనుకుంటున్నాను.’అని విలియమ్స్ అన్నా రు. ఇక ఇన్నాళ్లు అంతరిక్ష కేంద్రంలో ఉండటం కొంత ఆందోళన కలిగించినా.. తాము తిరిగి భూమిమీదకు ఎప్పుడు చేరుకుంటామో నాసా అధికారులకు కూడా తెలియకపోవడమే అసలైన కష్టమని ఆమె వ్యాఖ్యానించారు. గతేడాది జూన్‌లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన విల్మోర్, విలియమ్స్ వారం రోజుల్లో తిరిగి రావాల్సి ఉంది. కానీ.. స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యల కారణంగా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. గతేడాది క్రిస్మస్ వేడుకల ఫొటోలను విల్మోర్, విలియమ్స్ పంచుకోవడం, అందులో నీరసంగా కనిపించడంతో వారి ఆరోగ్యంపై ఆందోళనలు తలెత్తిన విషయం తెలిసిందే. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సైతం ఆందోళన వ్యక్తంచేశారు. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం వారిని వదిలేసిందని ఆయన ఆరోపించారు. అంతేకాదు.. తొందరగా తీసుకురావాలంటూ స్పేస్ఎక్స్ చీఫ్ మస్క్‌కు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన మస్క్ వీలైనంత తొందరగా తీసుకొస్తానని తెలిపారు. అయితే మస్క్ నుంచి ఎలాంటి ఆఫర్ రాలేదని నాసా ఉన్నతాధికారులు చెప్పారని బిడెన్ హయాంలోని నాసా మాజీ డిప్యూటీ అడ్మినిస్ట్రేటర్ పామ్ మెల్రాయ్ ఫిబ్రవరిలో వెల్లడించారు. దీనిపై స్పందించిన విల్మోర్ ఆ విషయంపై తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, టెక్ దిగ్గజం మస్్కపై తమకు గౌరవం, అభిమానం ఉన్నాయన్నారు. ‘మేం దేశానికి మద్దతునిస్తాం. దేశాధినేతలకు మద్దతునిస్తాం. వారికి కృతజ్ఞతలు’అని ప్రకటించారు. జనవరిలో ఇద్దరూ కలిసి స్పేస్ వాక్ చేశారు. -
ట్రంప్ ఎత్తుకు అరబ్ దేశాల పైఎత్తు
కైరో: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వా«దీనం ప్రతిపాదనకు అరబ్ దేశాలు చెక్ పెట్టాయి. ‘మిడిల్ ఈస్ట్ రివేరా’విజన్‌కు భిన్నంగా గాజా పునర్నిర్మాణ ప్రణాళికను విడుదల చేశాయి. 53 బిలియన్ డాలర్ల వ్యయంతో రూపొందించిన ఈ ప్రతిపాదనను అరబ్నాయకులు ఆమోదించా రు. యుద్ధానంతర ప్రణాళికను ఈజిప్టు ప్రతిపాదించింది, దీని ప్రకారం పాలస్తీనా అథారిటీ (పీఏ) పరిపాలన కింద గాజా పునర్నిర్మాణం జరుగుతుంది. గాజాను అమెరికా అ«దీన ప్రాంతంగా మార్చేందుకు ట్రంప్ చేసిన ప్రణాళికకు ఇది కౌంటర్. ట్రంప్ గాజా స్వా«దీన ప్రతిపాదనకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరోసారి మద్దతు తెలిపిన మరుసటి రోజే కైరోలో అరబ్ లీగ్ సదస్సు జరిగింది. ముగింపు సమావేశంలో ఈ గాజా పునర్నిర్మా ణం కోసం ‘సమగ్ర అరబ్ ప్రణాళిక’ను ఆయా దేశా ల నేతలు ప్రకటించారు. అంతేకాదు ఈ ప్రణాళికకు అంతర్జాతీయ మద్దతుకు పిలుపునిచ్చారు. భూభాగ పునర్నిర్మాణానికి నిధులు సమకూర్చడానికి ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రాజెక్టు కోసం అన్ని దేశాలు, ఆర్థిక సంస్థల నుంచి సహకారాన్ని స్వీకరిస్తామని పేర్కొన్నారు. 112 పేజీల డాక్యుమెంట్ పాలస్తీనియన్ల తరలింపు, గాజాను అమెరికా పునర్నిర్మించాలన్న ట్రంప్ ఆకాంక్షకు ప్రత్యామ్నాయంగా ఈజిప్టు, జోర్డాన్, గల్ఫ్ అరబ్ దేశాలు దాదాపు నెల రోజులుగా సంప్రదింపులు జరుపుతున్నాయి. గాజా నుంచి పాలస్తీనియన్లను సామూహికంగా తరలించడాన్ని అరబ్ దేశాలు తిరస్కరించాయి. తామే ఆ బాధ్యతలు తీసుకున్నాయి. ‘గాజా పునర్నిర్మాణ ప్రణాళిక’పేరుతో 112 పేజీల డాక్యుమెంట్‌ను రూపొందించాయి. గాజాను తిరిగి ఎలా అభివృద్ధి చేయనున్నారనే మ్యాప్‌లు, ఇల్లు, ఉద్యానవనాలు, కమ్యూనిటీ సెంటర్లకు సంబంధించిన ఏఐ జనరేటెడ్ చిత్రాలతో తయారు చేశారు. అలాగే వాణిజ్య నౌకాశ్రయం, టెక్నాలజీ హబ్, బీచ్ హోటళ్లు, విమానాశ్రయం కూడా ఉన్నాయి. స్వాగతించిన హమాస్..శిఖరాగ్ర సమావేశం ప్రణాళికను, సహాయక చర్యలు, పునర్నిర్మాణం, పాలనను పర్యవేక్షించడానికి తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు హమాస్ తెలిపింది. అంతేకాదు.. కమిటీలో తమ అభ్యర్థులను ఉంచబోమని ప్రకటించింది. అయితే పీఏ పర్యవేక్షణలో పనిచేసే కమిటీ విధులు, సభ్యులు, ఎజెండాకు తన సమ్మతిని తెలియజేయాల్సి ఉంటుంది. కమిటీలో ఉండబోయే వ్యక్తుల పేర్లను నిర్ణయించినట్లు ఈజిప్టు విదేశాంగ మంత్రి బదర్ అబ్దెలాటీ మంగళవారం రాత్రి తెలిపారు. పీఏకు నాయకత్వం వహిస్తున్న పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ మాట్లాడుతూ ఈజిప్టు ఆలోచనను తాను స్వాగతిస్తున్నానని, పాలస్తీనా నివాసితులను తరలించని ఇలాంటి ప్రణాళికకు మద్దతు ఇవ్వాలని ఆయన ట్రంప్‌ను కోరారు. పరిస్థితులు అనుకూలిస్తే అధ్యక్ష, పార్లమెంటరీ ఎన్నికలను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఎన్నికల ప్రణాళికను సైతం హమాస్ స్వాగతించింది. తిరస్కరించిన అమెరికా.. అరబ్ నాయకులు ఆమోదించిన గాజా పునర్నిర్మాణ ప్రణాళికను ట్రంప్ ప్రభుత్వం తిరస్కరించింది, ఈ భూభాగంలోని పాలస్తీనా నివాసితులను పునరావాసం కల్పిచి, అమెరికా యాజమాన్యంలోని ‘రివేరా’గా మార్చే తన పాత విజన్‌కే అమెరికా అధ్యక్షుడు కట్టుబడి ఉన్నారని తెలిపింది. గాజా ప్రస్తుతం నివాసయోగ్యంగా లేదని, శిథిలాలు, పేలని ఆయుధాలతో కప్పబడిన భూభాగంలో నివాసితులు జీవించలేరని జాతీయ భద్రతా మండలి ప్రతినిధి బ్రియాన్ హ్యూస్ మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రాంతంలో శాంతి, శ్రేయస్సును తీసుకురావడానికి మరిన్ని చర్చల కోసం తాము ఎదురు చూస్తున్నామన్నారు. తోసిపుచ్చిన ఇజ్రాయెల్.. ఈజిప్టు ప్రణాళికను ఇజ్రాయెల్ తోసిపుచ్చింది. కాలం చెల్లిన దృక్పథాలతో ఉందని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రక టనలో విమర్శించింది. పీఏఐ ఆధారపడటా న్ని తిరస్కరించింది. ప్రణాళిక హమాస్‌కు అధికారాలిచ్చేదిగా ఉందని ఆరోపించింది. హమా స్ సైనిక, పాలనా సామర్థ్యాలను నాశనం చే యడమే తమ లక్ష్యమని, ముందు హమాస్ సై నిక ఉపసంహరణకు అంగీకరించేలా చేయాల ని డిమాండ్ చేసింది. అది తప్ప మరేదీ తమకు ఆమోదయోగ్యం కాదని వెల్లడించింది. -
డొనాల్డ్ ట్రంప్‌కు భారీ షాక్..!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారీ షాక్ తగిలింది. 2 బిలియన్ డాలర్ల మానవతా సహాయాన్ని నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించాలని కోరుతూ ట్రంప్ దాఖలు చేసిన పిటిషన్ కొట్టి పారేసింది. మానవతా సహాయాన్ని నిలిపివేస్తూ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించిన కింద కోర్టు నిర్ణయాన్ని ఏకీభవించింది. ఇటీవల అంతర్జాతీయ అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్థికసాయం అందించే యూఎస్ ఎయిడ్ (USAID) సేవలను నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలువురు వాషింగ్టన్కు చెందిన యుఎస్ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్లపై విచారణ చేపట్టిన యుఎస్ జిల్లా కోర్టు న్యాయమూర్తి అమిర్ అలీ మానవతా సాయం నిలిపి వేయడాన్ని తప్పుబట్టారు. అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి ఏజెన్సీ (యూఎస్ఏఐడీ), రాష్ట్ర విభాగం అనుమతించిన గ్రాంట్లు, ఒప్పందాలపై పని చేసిన పాత చెల్లింపులను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ట్రంప్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ట్రంప్ పిటిషన్‌పై బుధవారం జరిగిన విచారణలో మానవతా సహాయంపై కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఏదైనా ఉంటే ఆ కోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది.ట్రంప్ నిర్ణయంతో ప్రతికూల ప్రభావం ట్రంప్ ప్రభుత్వం విదేశాలకు మానవతసహాయం అందించడాన్ని 90 రోజుల పాటు నిలిపిలించింది. స్వచ్ఛంద సంస్థలతో నిర్వహించే కార్యకలాపాల్ని స్తంభింపజేసింది. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా మలేరియా, ఎయిడ్, అభివృద్ధి సహాయం, శరణార్థుల సహాయం వంటి విభాగాలపై ప్రతీకూలం ప్రభావం చూపింది.మరోవైపు ట్రంప్ నిర్ణయాన్ని స్వచ్ఛంద సంస్థల నిర్వహకులు సైతం తప్పుబడుతున్నారు. మానవతా సహాయాన్ని నిలిపివేయడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లక్షల మందికి శాశ్వతమైన నష్టం కలిగే అవకాశం ఉంది. ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా రోగాలు, సంక్షోభాలు నివారించడంలో అమెరికా ఇచ్చే నిధులు కీలక పాత్ర పోషిస్తున్నాయి’ అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
‘అమెరికాతో ఎలాంటి యద్ధానికైనా మేం సిద్ధం’ : చైనా
బీజింగ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన దిగుమతి సుంకాల ప్రకటనపై చైనా (china) ధీటుగా బదులిచ్చింది. అమెరికాతో ఎలాంటి యుద్ధానికైనా మేం సిద్ధమని స్పష్టం చేసింది. అదే సమయంలో అమెరికా నుంచి చైనాలో దిగుమతయ్యే ఉత్పత్తులపై సుంకం విధిస్తున్నట్లు తెలిపింది. ట్రంప్ నిర్ణయంపై చైనా విదేశీ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ (Lin Jian) ఘాటు వ్యాఖ్యలే చేశారు. ట్రంప్ దిగుమతి సుంకం ప్రకటనపై అమెరికా మీడియా సంస్థ ది న్యూయార్క్ టైమ్స్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన మాట్లాడారు.‘అమెరికా ఎలాంటి యుద్ధాన్ని కోరుకున్నా చైనా చివరి వరకు పోరాడేందుకు సిద్ధంగా ఉంది. మరి అమెరికా ఎలాంటి యుద్ధాన్ని కోరుకుంటుంది. అది టారిఫ్, ట్రేడ్ వార్ ఇతర యుద్ధమైనా మేం చివరి వరకు పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై అమెరికాలోని చైనా రాయభార కార్యాలయం అధికారిక ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది.If war is what the U.S. wants, be it a tariff war, a trade war or any other type of war, we’re ready to fight till the end. https://t.co/crPhO02fFE— Chinese Embassy in US (@ChineseEmbinUS) March 5, 2025ట్రంప్ చైనా ఉత్పుత్తులపై అదనంగా 10 శాతం సుంకాలు విధించనున్నట్లు ప్రకటించారు. మంగళవారం నుంచి ఇది అమల్లోకి వస్తుందని చెప్పారు. ట్రంప్ నిర్ణయాన్ని ఖండిస్తూ పైవిధంగా వ్యాఖ్యానించింది. అమెరికా పార్లమెంట్లో ట్రంప్ అమెరికన్ కాంగ్రెస్ (పార్లమెంట్) జాయింట్ సెషన్లో డొనాల్డ్ ట్రంప్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. ప్రపంచంలోని పలు దేశాలు దశాబ్ధాలుగా అమెరికాలోని సుంకాలు వ్యతిరేకంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించాయి.ఇది సరైన పద్దతి కాదుసగటున యురోపియన్ యూనియన్,చైనా,బ్రెజిల్, ఇండియా, మెక్సికో, కెనడాలు మనం విధించే దిగుమతి సుంకాలకంటే ఆ దేశాలు మన దేశ ఉత్పతులపై విధించే దిగుమతి సుంకాలు ఎన్నో రెట్లు ఎక్కువ. ఇది సరైన పద్దతి కాదు. అమెరికా ఆటో మొబైల్ ఉత్పత్తులపై 100శాతం కంటే ఎక్కువ సుంకాల్ని విధిస్తోంది. చైనా కూడా అంతే మనం విధించే దిగుమతి సుంకాల కంటే రెండు రెట్లు ఎక్కువగా వసూలు చేస్తోంది. సౌత్ కొరియా నాలుగు రెట్లు వసూలు చేస్తున్నాయి. మనం ఎంత చెల్లిస్తున్నామో.. వాళ్లుకూడా అంతే చెల్లించాలి మనతో సన్నిహితంగా ఉంటున్న వారితో పాటు మనల్ని వ్యతిరేకిస్తున్న దేశాలు కూడా మన ఉత్పత్తుల మీద పన్నులు విధిస్తున్నాయి. ఇది అన్యాయం కాదా. ఇప్పుడు మన వంతు వచ్చింది. వారు మన ఉత్పత్తులపై ఎంత ట్యాక్స్ వేస్తారో. మనం కూడా అంతే వారి ఉత్పత్తులపై అంతే ట్యాక్స్ వేస్తున్నాం. అందుకే తక్షణమే అమెరికాకు దిగుమతి అయ్యే ఇతర దేశాల ఉత్పత్తులపై దిగుమతి సుంకం (ప్రతిగా విధించే పన్నులు) విధిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఏ దేశం ఉత్పత్తులపై ఎంత దిగుమతి సుంకం విధిస్తున్నారో సంబంధిత వివరాల్ని వెల్లడించారు.అమెరికా ఉత్పత్తులపై చైనా సుంకంఅమెరికా సుంకం విధించే దేశాల్లో చైనా ఉత్పతులున్నాయి. చైనా నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే ప్రతి ఉత్పత్తి 10 శాతం నుంచి 20 శాతం దిగుమతి సుంకం తప్పని సరిగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రతిగా చైనా సైతం అమెరికా ఉత్పతుత్తులపై దిగుమతి సుంకం విధిస్తున్నట్లు ప్రకటించింది. 10శాతం, 15శాతం దిగుమంది సుంకాన్ని విధిస్తున్నట్లు చైనా స్టేట్ కౌన్సిల్ టారిఫ్ కమిషన్ వెల్లడించింది. -
అమెరికాలో కాల్పుల కలకలం.. తెలుగు విద్యార్థి మృతి
వాషింగ్టన్: అమెరికాలో కాల్పులు కలకలం సృష్టించాయి. మిల్వాకీ కౌంటీ విస్కాన్సిన్ రాష్ట్రం మిల్వాకీ నగరంలో దుండగులు తెలంగాణలోకి రంగారెడ్డి జిల్లా కేశం పేటకు చెందిన ప్రవీణ్‌పై (27) కాల్పులు జరిపారు.దుండగుల జరిపిన కాల్పుల్లో ప్రవీణ్ మృతి చెందాడు. ఎంఎస్ సెకండియర్ చదువుతున్న ప్రవీణ్ మృతిపై సమాచారం అందుకున్న అతని కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
జెలెన్స్కీ నుంచి ముఖ్యసందేశం వచ్చింది: ట్రంప్
వాషింగ్టన్: అమెరికన్ కాంగ్రెస్ తొలిసారి ప్రసంగించిన ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump).. మరో కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ పంపిన ముఖ్యమైన సందేశాన్ని ప్రస్తావించారు. ఉక్రెయిన్ శాశ్వత శాంతిని కోరుకుంటోందని, చర్చలకు సిద్ధంగా ఉందని జెలెన్స్కీ స్పష్టం చేసినట్లు ట్రంప్ ఆ లేఖను చదివి వినిపించారు.అమెరికా కల పునరుద్ధరణ పేరిట మంగళవారం అమెరికా కాంగ్రెస్(US Congress)లో ఉభయ సభలను ఉద్దేశించి అధ్యక్షుడి హోదాలో ట్రంప్ తొలిసారి ప్రసంగించారు. ఈ సందర్భంగా మెక్సికో, కెనడాలపై విధించిన 25 శాతం టారిఫ్ అంశంతో పాటు ఉక్రెయిన్‌కు సైనిక సాయం నిలిపివేతపైనా స్పందించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ(Zelenskyy)తో వైట్‌హౌజ్‌లోని తన ఓవెల్ ఆఫీస్లోట్రంప్ జరిపిన చర్చలు విఫలమైన నేపథ్యం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్(JD Vance)లు జెలెన్స్కీ తీరుపై కెమెరాల సాక్షిగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఖనిజాల ఒప్పందంపై సంతకాలు చేయకుండానే జెలెన్స్కీ వెనుదిగారు. ఆ వెంటనే తన తీరును సమర్థించుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ఈ క్రమంలో.. ఐరోపా దేశాలు ఉక్రెయిన్‌కు బాసటగా నిలిచాయి. ఆ వెంటనే ఉక్రెయిన్‌కు మిలిటరీ సాయం ఆపేస్తున్నట్లు ప్రకటించారాయన.దీంతో కొన్ని గంటల్లోనే జెలెన్స్కీ దిగివచ్చారు. ట్రంప్‌తో చర్చలు జరిగిన తీరుపై పశ్చాత్తాపం వ్యక్తంచేశారు. తమ దేశ ఖనిజాలను అమెరికా తవ్వుకునేందుకు ఒప్పందానికి సిద్ధమేనన్నారు. ట్రంప్ బలమైన నాయకత్వంలో ముందుకు వెళ్లి రష్యాతో యుద్ధానికి ముగింపు పలికేందుకు వీలైనంత వేగంగా పనిచేస్తామని ప్రకటించారు. -
ఇది ఆరంభమే.. అసలు కథ ముందుంది: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు మంచి జరగాలనే ఉద్దేశంతోనే ప్రజలు తనను ఎన్నుకున్నట్టు ట్రంప్ చెప్పుకొచ్చారు. తాను అధికారంలోకి వచ్చిన ఆరు వారాల్లోనే వందకు పైగా సంతకాలు చేసినట్టు ట్రంప్ తెలిపారు.అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ తొలిసారి కాంగ్రెస్ సంయుక్త సెషన్లో ప్రసంగించారు. ఈ సందర్బంగా ట్రంప్ తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారో వివరించారు. ఈ క్రమంలో ట్రంట్ మాట్లాడుతూ..‘ఆరు వారాల్లో వందకు పైగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశాను. నాలుగేళ్లు, ఎనిమిదేళ్లలో సాధించిన దానికంటే ఎక్కువగా తాను ఈ 43 రోజుల్లోనే సాధించినట్టు అనిపిస్తోంది. అమెరికాలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ మళ్లీ తిరిగి వచ్చింది. ఈ పని చేయడానికి అమెరికా ప్రజలు నన్ను ఎన్నుకున్నారు.. చేసుకుంటూ పోతున్నాను. త్వరలోనే అమెరికన్ల కల నిజం కాబోతుంది. గతంలో కంటే మెరుగైన జీవితం వారికి లభిస్తుంది. ఇది ఆరంభం మాత్రమే. ఇంకా చేయాల్సింది చాలా ఉంది’ అంటూ వ్యాఖ్యానించారు. #WATCH | While addressing a joint session, US President Donald Trump says, " America is back. 6 weeks ago, I stood beneath the dome of this capitol and proclaimed the dawn of the golden age of America. From that moment on, there has been nothing but swift and unrelenting action… pic.twitter.com/5es6k7Idpg— ANI (@ANI) March 5, 2025ఇతర దేశాలు దశాబ్దాలుగా మనపై సుంకాలను విధిస్తున్నాయి. ఇప్పుడు ఆ ఇతర దేశాలపై వాటిని ఉపయోగించడం ప్రారంభించాల్సిన సమయం వచ్చింది. యూరోపియన్ యూనియన్, చైనా, బ్రెజిల్, భారత్, ఇతర దేశాలు మనం వసూలు చేసే దాని కంటే చాలా ఎక్కువ సుంకాలను మన నుండి వసూలు చేస్తాయి. ఇది చాలా అన్యాయం. భారత్ మన నుండి ఆటో సుంకాలను 100% వసూలు చేస్తుంది. ఇందులో భాగంగానే ఏప్రిల్ 2వ తేదీ నుంచి పరస్పర సుంకాలు ప్రారంభమవుతాయి. వారు మనపై ఎలాంటి సుంకాలు వేస్తారో.. మనం వాటిపై అంతే సుంకాలు విధిస్తాం అని చెప్పారు.#WATCH | While addressing a joint session of US Congress, US President Donald Trump says, " Other countries have used tariffs against us for decades and now it is our turn to start using them against those other countries. On average, the European Union, China, Brazil,… pic.twitter.com/7lRu4udKEN— ANI (@ANI) March 5, 2025అమెరికాలో ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నష్టాన్ని తిప్పికొట్టి అమెరికాను మళ్లీ రేసులోకి తీసుకురావడానికి నేను ప్రతిరోజూ పోరాడుతున్నాను. అలాగే, సరిహద్దుల నుంచి అక్రమ వలసలు కూడా ఆగిపోయాయి అంటూ కామెంట్స్ చేశారు. #WATCH | US President Donald Trump says, "Within hours of taking the oath of office, I declared a national emergency on our southern border. I deployed US military and border patrol to repel the invasion of our country and what a job they have done! As a result, illegal border… pic.twitter.com/Nn4xc97rj7— ANI (@ANI) March 5, 2025 ఇదిలా ఉండగా.. అంతకుముందు రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులు ట్రంప్‌కు ఘన స్వాగతం పలికారు. ట్రంప్ వస్తున్న సమయంలో అమెరికా, అమెరికా, అమెరికా అంటూ నినాదాలు చేశారు. దీంతో, సభా ప్రాంగణం హోరెత్తిపోయింది. #WATCH LIVE via ANI Multimedia | Republicans in Congress stand up and chant 'USA, USA' to a Democrat heckler during US President Donald Trump's Address. (Video Source: US Network Pool Via Reuters) pic.twitter.com/IV8hygCPpp— ANI (@ANI) March 5, 2025 -
అమెరికా దెబ్బకు జెలెన్స్కీ యూటర్న్.. ట్రంప్ బిగ్ ప్లాన్?
కీవ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump)తో జరిగిన వాగ్వాదంపై ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ మరోసారి స్పందించారు. ట్రంప్‌తో సంవాదం జరగడం నిజంగా విచారకరమని జెలెన్స్కీ చెప్పారు. విభేదాలు సరి చేసుకోవడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన తాజాగా ‘ఎక్స్’లో పోస్టుచేశారు.ఈ సందర్భంగా ట్రంప్‌తో చర్చలు జరగాల్సిన విధంగా జరగలేదని జెలెన్స్కీ అంగీకరించారు. ఉక్రెయిన్–అమెరికా మధ్య భవిష్యత్తులో పరస్పర సహకారం, కమ్యూనికేషన్ నిర్మాణాత్మకంగా ఉండేలా జాగ్రత్తపడతామని వెల్లడించారు. అమెరికా కోరుతున్న అరుదైన ఖనిజాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. దీనిపై ఒప్పందం కుదుర్చుకోవడానికి తమకు అభ్యంతరం లేదన్నారు. అయితే, ఉక్రెయిన్‌కు అందించే సైనిక సాయాన్ని నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రకటించిన కొన్ని గంటల్లోనే జెలెన్స్కీ (Volodymyr Zelenskyy) నుంచి ఈ స్పందన వచ్చింది.ఇదే సమయంలో యుద్ధాన్ని ముగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని జెలెన్స్కీ పేర్కొన్నారు. తొలిదశలో ఖైదీల విడుదలతో పాటు క్షిపణులు, దీర్ఘ శ్రేణి డ్రోన్లు, ఇంధన వనరులు, ఇతర మౌలిక సదుపాయాలపై బాంబు దాడులపై నిషేధం వంటి వాటికి రష్యా అంగీకరిస్తే తదుపరి దశల ద్వారా ముందుకు వెళ్లాలని అనుకుంటున్నామన్నారు. బలమైన తుది ఒప్పందం కోసం అమెరికాతో కలిసి పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.అమెరికా ఇచ్చిందెంత? 2022 జనవరి నుంచి 2024 డిసెంబర్ ఉక్రెయిన్‌కు 300 బిలియన్ డాలర్లకుపైగా సాయం అందించినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. యూరప్ దేశాలు మాత్రం 100 బిలియన్ డాలర్లే ఇచ్చాయని అన్నారు. కానీ, ఆమెరికా ఇచ్చింది 182.8 బిలియన్ డాలర్లేనని సాక్షాత్తూ ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అయితే, అందులో నిజం లేదని, అమెరికా నుంచి ఉక్రెయిన్‌కు అందిన సాయం 119.7 బిలియన్ డాలర్లు మాత్రమేనని జర్మనీకి చెందిన కీల్ ఇన్స్టిట్యూట్ స్పష్టంచేసింది. పుతిన్‌ను నిలువరించేది ఖనిజాల ఒప్పందం మాత్రమే: వాన్స్రష్యా అధ్యక్షుడు పుతిన్ దురాక్రమణ ప్రయత్నాలను నిలువరించగలిగేది యూఎస్– ఉక్రెయిన్ మధ్య కీలక ఖనిజాల ఒప్పందం మాత్రమేనని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పేర్కొన్నారు. ఇది మాత్రమే ఆచరణ సాధ్యమైన పరిష్కారమన్నారు. యుద్ధం ముగిశాక బ్రిటన్, ఫ్రాన్స్‌ల సారథ్యంలో ఏర్పాటయ్యే అంతర్జాతీయ బలగాలతో ఉక్రెయిన్‌కు ఎటువంటి భద్రతా ఉండదని వ్యాఖ్యానించారు. ఫాక్స్ న్యూస్ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వాన్స్.. గత 30, 40 ఏళ్లుగా ఎలాంటి యుద్ధాలు చేయని ఏవో కొన్ని దేశాలకు చెందిన 20 వేల బలగాల కంటే అమెరికాతో కీలక ఖనిజాల ఒప్పందం కుదుర్చుకుంటే ఉక్రెయిన్‌కు మెరుగైన భద్రత లభిస్తుందని చెప్పారు. భద్రతకు గ్యారెంటీ కావాలన్నా, రష్యా అధ్యక్షుడు పుతిన్ మరోసారి ఆక్రమించుకోరాదనుకున్నా ఉక్రెయిన్‌కు అమెరికా మాత్రమే ఆ గ్యారంటీ ఇస్తుందని తెలిపారు. -
సెర్బియా పార్లమెంట్లో గందరగోళం పొగబాంబులతో దాడి..
బెల్గ్రేడ్: బాల్కన్ దేశం సెర్బియా పార్లమెంట్ సమావేశం మంగళవారం వీధి పోరాటాన్ని తలపించింది. ప్రతిపక్ష సభ్యులు స్మోక్ బాంబులు విసరడంతో అవి తాకి ముగ్గురు ఎంపీలు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. విశ్వవిద్యాలయాలకు మరిన్ని నిధులు కేటాయించే విషయమై జరగాల్సిన ఓటింగ్‌ను ప్రతిపక్షాలు గట్టిగా వ్యతిరేకించాయి. ఈ సమావేశం అక్రమమని, ప్రధానమంత్రి మిలోస్ వుసెవిక్, ఆయన ప్రభుత్వం రాజీనామాను వెంటనే ధ్రువీకరించాలని డిమాండ్ చేశాయి. సమావేశం మొదలైన అరగంటలోనే ప్రతిపక్ష సభ్యుల ఈలలు, కేకలతో పార్లమెంట్ దద్దరిల్లింది. ఎంపీలు ముష్టిఘాతాలు కురిపించుకుంటున్నారు. ఆ తర్వాత పొగబాంబులు, కోడిగుడ్లు, వాటర్ బాటిళ్లను విసిరేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. ప్రతిపక్షం ఉగ్రవాద ముఠాగా మారిపోయిందని స్పీకర్ అనా బిర్నాబిక్ అభివర్ణించారు. అదే సమయంలో పార్లమెంట్ వెలుపల ప్రతిపక్షాల మద్దతుదారులు ర్యాలీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో చోటుచేసుకున్న ఘటన దేశంలో రాజకీయ సంక్షోభం తీవ్రతను చెప్పకనే చెబుతున్నాయి. వుసెవిక్ ప్రభుత్వం గద్దెదిగి, ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే విద్యార్థుల డిమాండ్‌కు అనుగుణంగా యూనివర్సిటీలకు నిధుల పెంపుపై చర్చ సాధ్యమని వామపక్ష నేత రదోమిర్ లజోవిక్ తేల్చి చెప్పారు. గతేడాది నవంబర్‌లో కాంక్రీట్ నిర్మాణం కూలి 15 మంది చనిపోయారు. దీంతోపాటు మరికొన్ని ఘటనలను ఉదహరిస్తూ అవినీతి పెరిగిపోయిందంటూ విద్యార్థులు భారీ నిరసనలు చేపడుతున్నారు. విద్యారంగానికి ఎక్కువ నిధులు తదితర డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిణామాలతో ప్రధాని వుసెవిక్ జనవరిలో తన పదవికి రాజీనామా చేశారు. అయితే, పార్లమెంట్ ఆమోదిస్తేనే ప్రధాని రాజీనామా అమలవుతుంది. అధ్యక్షుడు అలెక్జాండర్ వుసిక్కు చెందిన అధికార సెర్బియన్ ప్రోగ్రెసివ్ పార్టీకి పార్లమెంట్లో మెజారిటీ ఉండటంతో వుసెవిక్ ప్రభుత్వం కొనసాగుతోంది. -
అమెరికాపై టారిఫ్ యుద్ధం!
వాషింగ్టన్/బీజింగ్/మెక్సికో సిటీ/టొరంటో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన టారిఫ్‌ల యుద్ధం మరింత విస్తరిస్తోంది. ట్రంప్ సోమవారం వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. కెనడా, మెక్సికో ఉత్పత్తులపై 25 శాతం చొప్పున, చైనా ఉత్పత్తులపై అదనంగా 10 శాతం సుంకాలు విధించబోతున్నామని, మంగళవారం నుంచే ఇది అమల్లోకి వస్తుందని ప్రకటించారు. అమెరికాకు వస్తువులను ఎగుమతి చేసే దేశాలు సుంకాలు చెల్లించాల్సిందేనని తెలిపారు. ఫెంటానిల్ వంటి సింథటిక్ డ్రగ్స్‌కు అడ్డుకట్ట వేయడానికి, అక్రమ వలసలను నియంత్రించడానికి ఇలాంటి చర్యలు తప్పనిసరిగా అవసరమని సమర్థించుకున్నారు. చైనా ఉత్పత్తులపై ట్రంప్ ఇప్పటికే 10 శాతం సుంకాలు విధించారు. మరోవైపు చైనా, కెనడా, మెక్సికో సైతం ధీటుగా బదులిస్తున్నాయి. ప్రతీకార సుంకాలపై సై అంటున్నాయి. అమెరికాపై టారిఫ్‌ల యుద్ధం మొదలుపెట్టాయి. ఫలితంగా వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు తలెత్తడంతోపాటు ఆయా దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు అస్తవ్యస్తంగా మారిపోయి అంతిమంగా ప్రజలు కష్టాలపాలయ్యే ప్రమాదం కనిపిస్తోందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ట్రంప్ నిర్ణయంలో న్యాయం లేదు: కెనడా ప్రధాని ట్రంప్ ప్రారంభించిన సుంకాలయుద్ధంలో ఎంతమాత్రం న్యాయం లేదని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో అన్నారు. ట్రంప్ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. తమ ఉత్పత్తులపై అన్యాయంగా సుంకాల విధిస్తే, అమెరికాకు తగిన సమాధానం చెప్పక తప్పదని స్పష్టంచేశారు. కౌంటర్–టారిఫ్ చర్యలను ప్రకటించారు. మొదటి దశలో అమెరికా ఉత్పత్తులపై 25 శాతం సుంకాల విధిస్తామని పేర్కొన్నారు. అమెరికా ఎగుమతిదారులు 20.6 బిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఒకవేళ ట్రంప్ ప్రభుత్వం గనుక వెనక్కి తగ్గకపోతే తాము విధించే సుంకాలు స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం నుంచే అమల్లోకి వస్తాయని తేల్చిచెప్పారు. ఇక రెండో దశలో భాగంగా మరో 25 శాతం టారిఫ్‌లు విధిస్తామన్నారు. మూడు వారాల్లో 125 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా ఉత్పత్తులపై టారిఫ్‌లు వసూలు చేస్తామని జస్టిన్ ట్రూడో వెల్లడించారు. అమెరికా నుంచి దిగుమతి అయ్యే అటోమొబైల్స్, స్టీల్, అల్యూమినియంపై మున్ముందు మరిన్ని సుంకాలు విధిస్తామని తెలియజేశారు. అమెరికా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొనే దాకా టారిఫ్‌ల విషయంలో తమ నిర్ణయంలో మార్పు ఉండదని సంకేతాలిచ్చారు. అమెరికా మనసు మార్చుకొంటే తాము కూడా అదేబాటలో నడుస్తామని పరోక్షంగా సూచించారు. అనవసరమైన వాణిజ్య యుద్ధం ప్రజలకు మేలు చేయదని అభిప్రాయపడ్డారు. చైనా అదనపు సుంకాలు ట్రంప్ ప్రకటనపై చైనా ఘాటుగా స్పందించింది. తమ దేశంలోకి దిగుమతి అయ్యే అమెరికా వస్తువులపై అదనంగా 15 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించింది. చికెన్, గోధుమలు, మొక్కజొన్న, పత్తి తదితర దిగుమతులపై ఈ టారిఫ్ వసూలు చేస్తామని, అలాగే జొన్న, సోయాబిన్, పోర్క్, బీఫ్, సముద్ర ఉత్పత్తులు, పండ్లు, కూరగాయాలు, పాడి ఉత్పత్తులపై అదనంగా 10 శాతం సుంకాలు విధించనున్నట్లు వెల్లడించింది. అదనపు సుంకాలు ఇది ఈ నెల 10వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని చైనా కస్టమ్స్ టారిఫ్ కమిషన్ మంగళవారం పేర్కొంది. తమ ఉత్పత్తులపై విచ్చలవిడిగా టారిఫ్‌ల మోత మోగిస్తున్న అమెరికాపై ప్రపంచ వాణిజ్య సంస్థకు(డబ్ల్యూటీఓ)కు ఫిర్యాదు చేస్తామని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది. మరోవైపు సుంకాల విషయంలో అమెరికాతో చర్చలకు తలుపులు తెరిచే ఉన్నాయని తెలియజేసింది. ఇదిలా ఉండగా, 10 అమెరికా సంస్థలను విశ్వసనీయం కాని సంస్థల జాబితాలో చేర్చాలని చైనా నిర్ణయించింది. ఇందులో రక్షణ, ఏఐ, విమానయానం, ఐటీ రంగాలకు సంబంధించిన సంస్థలు ఉన్నాయి. చైనా ఉత్పత్తులపై అమెరికా ప్రభుత్వం రెండో దశలో భాగంగా అదనంగా 10 శాతం సుంకం విధించింది. ఇది మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. చైనా ఎగుమతి చేసే మొత్తం ఉత్పత్తుల్లో 15 శాతం అమెరికాకే వెళ్తుంటాయి. 2023లో ఇరుదేశాల మధ్య 575 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది. ఇందులో చైనా నుంచి అమెరికాకు 427.2 బిలియన్ డాలర్ల ఎగమతులు, అమెరికా నుంచి చైనాకు 147.8 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయి. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తొలినాళ్లలోనే చైనా ఉత్పత్తులపై 10 శాతం సుంకాలు విధించారు. తాజాగా మరో 10 శాతం వడ్డించారు. దీంతో ఇప్పటిదాకా సుంకాలు 20 శాతానికి చేరాయి. దీనిపై చైనా ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. చైనా ఉత్పత్తులపై 60 శాతం సుంకాలు విధిస్తానని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పదేపదే ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్లాన్ బి, సి, డి ఉన్నాయి: మెక్సికో ప్రెసిడెంట్ అమెరికా చర్యలకు ప్రతిచర్య కచ్చితంగా ఉంటుందని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ పేర్కొన్నారు. తమ వద్ద ప్లాన్ బి, సి, డి ఉన్నాయని ప్రకటించారు. తమ దేశ ఉత్పత్తులపై అమెరికా ప్రభుత్వం గనుక టారిఫ్‌లు పెంచితే ఏం చేయాలన్నదానిపై స్పష్టమైన ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు. అమెరికా, మెక్సికో మధ్య సహకారం ఇప్పటివరకైతే అద్భుతంగా ఉందని చెప్పారు. వాణిజ్యం, భద్రతాపరమైన అంశాలపై ఇటీవల ఇరుదేశాల అధికారుల మధ్య చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయని అన్నారు. తమ ఉత్పత్తులపై అమెరికాలో సుంకాలు విధించే పరిస్థితి ఉండదని అంచనా వేస్తున్నామని, ఒకవేళ అదే జరిగితే తాము కూడా తగిన రీతిలో ప్రతిస్పందిస్తామని స్పష్టంచేశారు. -
ఉక్రెయిన్ ఖనిజ కాంతులు
అమెరికా, ఉక్రెయిన్ దేశాల మధ్య జరిగిన ఖనిజాల ఒప్పందంపై సఫలీకృతం కాలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ మధ్య వైట్‌హౌస్‌లో జరిగిన వివాదాస్పద ఓవల్ ఆఫీస్ సమావేశం తర్వాత అమెరికా, ఉక్రెయిన్ మధ్య ఆశించిన ఖనిజాల ఒప్పందంపై సంతకాలు జరగలేదు.ప్రతిపాదిత పునర్నిర్మాణ పెట్టుబడి నిధి "ఖనిజాలు, హైడ్రోకార్బన్లు, చమురు, వాయు నిక్షేపాలను" సూచిస్తోంది. మరీ ముఖ్యంగా లౌడ్ స్పీకర్లు, కంప్యూటర్ హార్డ్ డ్రైవ్ లతో సహా హైటెక్ ఉత్పత్తుల తయారీకి కీలకమైన లోహాలపై ట్రంప్ ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది.ఓ వైపు రష్యాతో యుద్ధం.. మరో వైపు అమెరికాతో ఖనిజాల ఒప్పందం నేపథ్యంలో ఉక్రెయిన్ ఖనిజ సంపద ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. దాదాపు 15 ట్రిలియన్ డాలర్ల విలువైన ఖనిజ వనరులను కలిగి ఉన్నట్లు ఉక్రెయిన్ చెప్పుకుంటోంది. దీని ప్రకారం.. ఇది ఐరోపాలో అత్యంత ఖనిజ వనరులు కలిగిన దేశాలలో ఉక్రెయిన్ ఒకటి. ఇక్కడ లిథియం, టైటానియం, యురేనియం నిల్వలు అధికంగా ఉన్నాయి.ఖనిజ వనరుల సంపదఉక్రేనియన్ జియాలజికల్ సర్వే నుండి వచ్చిన డేటా ప్రకారం ఉక్రెయిన్ ప్రపంచంలోని ఖనిజ వనరులలో సుమారు 5% కలిగి ఉంది. వీటిలో అమెరికా కీలకమైనవిగా భావించే 50 పదార్థాలలో 23 ఉన్నాయి. ఉక్రెయిన్ వైవిధ్యమైన భౌగోళిక భూభాగం విలువైన ఖనిజాల విస్తృత శ్రేణికి నిలయంగా ఉంది.లిథియం నిల్వలుఉక్రెయిన్ ఐరోపాలో అతిపెద్ద లిథియం నిల్వలను కలిగి ఉంది. ఇది ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి నిల్వలలో ఉపయోగించే లిథియం-అయాన్ బ్యాటరీలకు కీలకమైన భాగం. క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్ వైపు మళ్లడం వల్ల లిథియంకు పెరుగుతున్న డిమాండ్ ఉక్రెయిన్ లిథియం నిక్షేపాల వ్యూహాత్మక ప్రాముఖ్యతను తెలిజేస్తోంది.టైటానియం నిల్వలుఏరోస్పేస్, సైనిక, వైద్య అనువర్తనాలకు కీలక లోహమైన టైటానియం నిల్వలు ఉక్రెయిన్‌లోనే అధికంగా ఉన్నాయి. ప్రపంచంలో వెలికితీస్తున్న టైటానియం ఖనిజంలో 7 శాతం ఇక్కడి నుంచే వస్తోంది.యురేనియం నిల్వలులిథియం టైటానియంతో పాటు , ఉక్రెయిన్ ఐరోపాలో అతిపెద్ద యురేనియం నిల్వలకు నిలయంగా ఉంది. ఇది అణుశక్తి ఉత్పత్తికి ఒక కీలక వనరు. ఇక్కడి యురేనియం నిక్షేపాలు ప్రపంచ ఇంధన అవసరాలకు సహకరిస్తూ శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడంలో గణనీయమైన పాత్ర పోషిస్తున్నాయి.భౌగోళిక, రాజకీయ, ఆర్థిక ప్రభావాలుఉక్రెయిన్ ఖనిజ సంపద వ్యూహాత్మక ప్రాముఖ్యత అతిశయోక్తి కాదు. డిఫెన్స్, హైటెక్, ఏరోస్పేస్, గ్రీన్ ఎనర్జీ వంటి పరిశ్రమలకు ఈ వనరుల అందుబాటు కీలకం. రష్యాతో కొనసాగుతున్న సంఘర్షణ, కీలకమైన ఖనిజాల కోసం ప్రపంచ పోటీ ఉక్రెయిన్ నిక్షేపాలపై ఆసక్తిని పెంచింది.సవాళ్లు.. అవకాశాలుఉక్రెయిన్ ఖనిజ సంపద గణనీయమైన అవకాశాలను అందిస్తుండగా, పరిగణించవలసిన సవాళ్లు కూడా ఉన్నాయి. ఈ ఖనిజాల వెలికితీత, ప్రాసెసింగ్ కు గణనీయమైన మూలధన పెట్టుబడి సాంకేతిక నైపుణ్యం అవసరం. అదనంగా, రష్యాతో కొనసాగుతున్న సంఘర్షణ మైనింగ్ కార్యకలాపాల స్థిరత్వం భద్రతకు ప్రమాదాలను కలిగిస్తుంది. ఈ సవాళ్లు ఉన్నప్పటికీ, అవసరమైన వనరుల ప్రధాన ప్రపంచ సరఫరాదారుగా ఉక్రెయిన్ సామర్థ్యం బలంగా ఉంది. ఈ దేశం తన ఖనిజ సంపదను సద్వినియోగం చేసుకునే సామర్థ్యం గణనీయమైన ఆర్థిక లాభాలను ఇస్తుంది. ప్రపంచ సరఫరా గొలుసుల వైవిధ్యతకు దోహదం చేస్తుంది. -
ఫోన్ లేకుంటేనే సూపర్ బ్రెయిన్!
మనిషి జీవితం ఇప్పుడు స్మార్ట్ ఫోన్‌తోనే నడుస్తోంది. అలాంటిది అది లేకుండా ఒక్కరోజైనా ఉండగలమా?. ఊహిస్తేనే భయంకరంగా ఉంది కదా. అంతలా అడిక్ట్ అయ్యాం మరి!. అయితే ఫోన్ వాడకం వీలైనంత తగ్గించుకోవాలని తరచూ నిపుణులు సూచిస్తుండడం చూస్తుంటాం. ఈ క్రమంలో తాజా పరిశోధనల్లో ఓ ఆసక్తికర విషయం వెలుగు చూసింది. స్మార్ట్ ఫోన్లను వీలైనంత తక్కువగా(Smart phone Less Use) ఉపయోగించడం వల్ల మెదడు అత్యంత చురుకుగా పని చేస్తుందట. జర్మనీకి చెందిన కోలోగ్నే, హెయిడెల్ బర్గ్ యూనివర్సిటీ సైంటిస్టులు సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. ఇందుకోసం త్రీడేస్ చాలెంజ్‌ను కొంతమందిపై ప్రయోగించారు. ఎంపిక చేసిన 18 నుంచి 30 ఏళ్లలోపు 25 మందిపై ఈ పరిశోధన నిర్వహించారు. సుమారు 72 గంటలపాటు(దాదాపు మూడు రోజులు) కేవలం అత్యవసర వినియోగానికి మాత్రమే వాళ్లకు ఫోన్‌కు అనుమతించారు. ఈ క్రమంలో సోషల్ మీడియా అడిక్షన్‌ను కూడా పరిశీలించారు. రీసెర్చ్‌కు ముందు.. తర్వాత ఆ వ్యక్తులకు ఎమ్మారై స్కాన్‌తో పాటు కొన్ని మానసిక పరీక్షలు నిర్వహించారు. పరిశోధనల్లో తేలింది ఏంటంటే.. ఫోన్ తక్కువగా వాడిన వాళ్లలో బ్రెయిన్ అత్యంత చురుకుగా ఉండడం. అంతేకాదు.. వ్యసనానికి సంబంధించిన ‘‘న్యూరోట్రాన్స్మిటర్ వ్యవస్థ’’కు సంబంధించిన మెదడు క్రియాశీలతలోనూ మార్పులను గమనించారట. తద్వారా ఫోన్‌కు ఎంత దూరంగా ఉంటే.. బ్రెయిన్ అంత ‘సూపర్’గా మారుతుందని ఒక అంచనాకి వచ్చారు. సుదీర్ఘంగా.. పదే పదే జరిపిన పరిశోధనలన (longitudinal Study) తర్వాతే తాము ఈ అంచనాకి వచ్చినట్లు చెబుతున్న పరిశోధకులు.. భవిష్యత్తులో మరింత స్పష్టత రావొచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సామ్ ఏం చెప్పిందంటే..ఇక్కడో ఆసక్తికరమైన సంగతి చెప్పాలి. ప్రముఖ నటి సమంత ఈ మధ్యే త్రీడేస్ చాలెంజ్‌ను సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేశారు. ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ పెట్టిన ఆమె.. మూడు రోజులు ఫోన్‌కు దూరంగా ఉన్నట్లు తెలిపారు. అంతేకాదు.. ఆ అనుభవాన్ని తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ‘‘మూడు రోజులపాటు ఫోన్ లేదు. ఎవరితో కమ్యూనికేషన్ లేదు. నాతో నేను మాత్రమే ఉన్నాను. మనతో మనం ఒంటరిగా ఉండడం కష్టమైన విషయాల్లో ఒకటి. భయంకరమైనది కూడా. కానీ, ఇలా మౌనంగా ఉండడాన్ని నేను ఇష్టపడతాను. మిలియన్‌సార్లు ఇలా ఒంటరిగా గడపమని చెప్పినా ఉంటాను. మీరు కూడా ఇలా ఉండటానికి ప్రయత్నించండి’’ అంటూ అభిమానులకు ఆమె సూచన ఇచ్చారు కూడా. -
Trump: చేతిపై కమిలిన గాయాలు.. కాళ్లు ఈడ్చుకుంటూ..!
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంగా ఉన్నారా? ఆరోగ్యంగా ఉంటే ఆయన ఆర చేతిపై చర్మం కమిలిన గుర్తులు ఎందుకు ఉన్నట్లు? కాళ్లు ఈడ్చుకుంటూ ఎందుకు నడుస్తున్నారు. ఇప్పుడు ఇవే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ సోమవారం మధ్యాహ్నం శ్వేతసౌధంలో తైవాన్ సెమీకండక్టర్ మ్యానిఫ్యాక్చరింగ్ కంపెనీ (టీఎస్ఎంసీ)గురించి మాట్లాడారు. మాట్లాడే సమయంలో ఆయన ఎడమ చేయి అరచేతిలో రెండు చోట్ల చర్మం ఎర్రగా కమిలిన గుర్తులు కనిపించాయి. మంగళవారం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రెండో సారి కుడి చేయి పైభాగంలో అలాంటి గుర్తులే ఉన్నాయి. గతవారం ప్రపంచాది నేతలతో జరిగిన సమావేశంలో ట్రంప్ చేతిపై ఇదే తరహాలో గుర్తులు కనిపించాయి.అంతేకాదు, కాళ్లు ఈడ్చుకుంటూ ట్రంప్ నడుస్తున్న వీడియోలు సైతం వెలుగులోకి వచ్చాయి. ఆ వీడియోల్లో అమెరికా అధ్యక్షుడు తన గోల్ఫ్ కార్ట్‌లో (వాహనం) నుండి ఇబ్బంది పడుతూ దిగారు. వాహనం నుంచి దిగిన తర్వాత కాళ్లు ఈడ్చుకుంటూ, కొన్ని సెకన్ల పాటు వణుకుతున్నట్లు కనిపించారు. Donald Trump moves his right leg like a piece of wood?#grok does not report issue about that.@realDonaldTrump #USA #trump #republicans @cnnbrk #potus pic.twitter.com/lQIA54BLMG— polemus (FR+EN) (@polemus) March 2, 2025ట్రంప్ చర్మంపై కమిలిన గుర్తులతో పాటు కాళ్లు ఈడ్చుకుంటూ నడుస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో కావడంతో ట్రంప్ ఆరోగ్యంపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. ఆ గుర్తులపై స్పందిస్తూ నెటిజన్లు.. ట్రంప్ డైమన్షియా సమస్యతో బాధపడుతున్నారని ఒకరంటే.. ట్రంప్‌కు ఆనారోగ్య సమస్యలు తలెత్తాయిని మరొకరు కామెంట్లు చేస్తున్నారు.అయితే, ట్రంప్ ఆరోగ్యంపై వస్తున్న వదంతుల్ని వైట్ హైస్ వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఖండించారు. అధ్యక్షునికి అనారోగ్య సమస్యలు లేవని,ఆరోగ్యంగానే ఉన్నారని స్పష్టం చేశారు. ‘అధ్యక్షుడు ప్రజల మనిషి. అతని నిబద్ధత తిరుగులేనిది. ఆయన చేతిపై గాయాలున్నాయి. ఎందుకంటే ఆయన నిరంతరం పని చేస్తూనే ఉన్నారు. కరచాలనం చేస్తున్నారు. ఫలితంగా ట్రంప్ చేయి కమిలిందని అన్నారు. కాళ్లు ఈడ్చుకుంటూ ఎందుకు నడుస్తున్నారనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. -
ట్రంప్ నిర్ణయం.. చైనా ప్రతీకారం
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. చైనాపై విధించే సుంకాలను 10 నుంచి 20 శాతానికి పెంచుతూ ప్రకటించారు. అమెరికా సుంకాలకు చైనా కూడా వేగంగా ప్రతీకారం తీర్చుకుంది. యూఎస్ దిగుమతి సుంకాలను 10 నుంచి 15 శాతానికి పెంచుతూ ప్రకటన జారీ చేసింది.చైనా తీసుకున్న నిర్ణయం సుమారు 25 సంస్థలపై ప్రభావాన్ని చూపనుంది. వ్యవసాయం, ఆహార ఉత్పత్తులకు సంబంధించిన వస్తువులపై చైనా సుంకాలను పెంచింది. మార్చి 10 నుంచి ఈ సుంకాలు వర్తించనున్నట్లు తెలుస్తోంది.అమెరికా నుంచి దిగుమతి అయ్యే చికెన్, గోధుమ, మొక్కజొన్న మరియు పత్తిపై అదనంగా 15 శాతం సుంకాన్ని.. సోయాబీన్స్, జొన్న, పంది మాంసం, గొడ్డు మాంసం, జల ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు, పాల దిగుమతులపై అదనంగా 10 శాతం సుంకాన్ని విధించనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడిస్తూ.. చైనా తన చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలను దృఢంగా కాపాడుకుంటుందని స్పష్టం చేసింది.చైనాపై ట్రంప్ సుంకాలుచైనా ఉత్పత్తులపైన ఇప్పటికే ఉన్న 10 శాతం సుంకాన్ని, 20 శాతానికి పెంచుతూ.. దీనికి సంబంధించిన సంబంధించిన ఉత్తర్వులపై సంతకం కూడా చేశారు. అక్రమ వలసలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను ఆపడంలో వారు విఫలమయ్యారని ఆరోపిస్తూ, ఇలాంటి వాటిని నిర్మూలించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.అమెరికా విధించిన సుంకాలు.. స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, వీడియోగేమ్ కన్సోల్లు, స్మార్ట్‌వాచ్‌లు, స్పీకర్లు, బ్లూటూత్ పరికరాల వంటి ఎలక్ట్రానిక్స్‌పై వర్తిస్తాయి. చైనా కూడా అమెరికా దిగుమతులపై సుంకాలు ప్రకటించడంతో.. ట్రంప్ వెనుకడుగు వేస్తారా?.. సుంకాల విషయంలో తగ్గేదేలే అన్నట్లు ముందుకు సాగుతారా? అనే విషయం తెలియాల్సి ఉంది. -
పుతిన్‌కు ట్రంప్ భారీ ఆఫర్.. అమెరికా ప్లాన్ ఏంటి?
వాషింగ్టన్: ఉక్రెయిన్-రష్యా యుద్ధం వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విస్టు మీద ట్విస్ట్ ఇస్తున్నారు. రష్యాకు పూర్తి మద్దుతుగా నిలుస్తూ ఉక్రెయిన్‌కు వరుస షాక్‌లు ఇస్తున్నారు. ఇందులో భాగంగా ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రష్యా (Russia)పై అమెరికా గతంలో విధించిన ఆంక్షలను తొలగించాలని ట్రంప్ నిర్ణయం తీసుకుంటున్నట్టు సమాచారం. ఈమేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభం తర్వాత నాటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. రష్యాపై పలు ఆంక్షలు విధించారు. పుతిన్‌ను కంట్రోల్ చేసేందుకు ట్రేడింగ్‌కు సంబంధించిన ఆంక్షలు పెట్టారు. ఇక, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఆ ఆంక్షలను తొలగించే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు మద్దతుగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే యుద్ధం ముగింపుతో పాటు మాస్కోతో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నారు.ఇందులో భాగంగా రష్యాకు చెందిన కొన్ని సంస్థలు, వ్యక్తులకు ఉపశమనం కల్పించే దిశగా ట్రంప్ సర్కారు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా జాబితాను సిద్ధం చేయాలని విదేశీ వ్యవహరాలు, ట్రెజరీ మంత్రిత్వ శాఖలను వైట్‌హౌస్ కోరినట్లు అంతర్జాతీయ కథనాలు వెల్లడించాయి. రాబోయే రోజుల్లో దీనిపై రష్యన్ ప్రతినిధులతో అమెరికా అధికారులు చర్చలు జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే, ఆంక్షలను తొలగించే క్రమంలో ప్రతిగా మాస్కో నుంచి వాషింగ్టన్ ఏం ఆశిస్తుందనే విషయాలు మాత్రమే తెలియాల్సి ఉంది. దీంతో, అమెరికా ప్లాన్ ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు.. రష్యాతో ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న వేళ జెలెన్స్కీకి ట్రంప్ వరుస షాక్‌లిస్తున్నారు. తాజాగా రష్యా (Russia)తో యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌కు అందించే మిలిటరీ సాయాన్ని అమెరికా నిలిపివేసింది. ఈ మేరకు వైట్‌హౌస్‌కు చెందిన ఓ అధికారి ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే, ఉక్రెయిన్‌తో ఖనిజాల ఒప్పందం విషయం సందర్బంగా ట్రంప్, జెలెన్స్కీ మధ్య వాగ్వాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. BREAKING: The U.S. is preparing to ease sanctions on Russia as President Trump pushes to restore ties and end the war in Ukraine - Reuters pic.twitter.com/D1b16R5WMT— Libs of TikTok (@libsoftiktok) March 3, 2025 -
ట్రంప్ చర్యపై వారెన్ బఫెట్ ఆందోళన
అమెరికా అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' (Donald Trump) కెనడా, చైనా, మెక్సికోలపై భారీ సుంకాలను విధించారు. ఈ ప్రకటన ''యుద్ధ చర్య'' అని బిలియనీర్, ప్రముఖ పెట్టుబడిదారు 'వారెన్ బఫెట్' (Warren Buffett) అని అన్నారు. సుంకాలు ప్రజలపైన ఎలాంటి ప్రభావం చూపుతాయనే విషయాన్ని కూడా వెల్లడించారు.సుంకాలు.. వస్తువులపై పన్నుగా పనిచేస్తాయని. ఇది ప్రజలు లేదా వినియోగదారులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని బెర్క్‌షైర్ హాత్వే సీఈఓ బఫెట్ అన్నారు. ఇప్పటి వరకు మా కంపెనీ అమెరికా ప్రభుత్వానికి గత 60 ఏళ్లలో 101 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ పన్ను చెల్లించిందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఏ కంపెనీ.. ఇంత పెద్ద మొత్తంలో పన్ను చెల్లించలేదని స్పష్టం చేశారు.అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత స్థితిపై వ్యాఖ్యానించడానికి నిరాకరించిన బఫెట్.. సుంకాల ఆర్థిక భారం వినియోగదారులపై పడుతుందని చెప్పారు. ఈ రోజు (మంగళవారం) నుంచి అమలులోకి వచ్చే కెనడా, మెక్సికో దిగుమతులపై 25% సుంకాలను విధించడంలో ట్రంప్ ముందుకు సాగుతున్నందున.. బఫెట్ ఈ వ్యాఖ్యలు చేశారు.చైనా దిగుమతులపై సుంకాలను 10 శాతం నుంచి 20 శాతానికి పెంచుతున్నట్టు ట్రంప్ వెల్లడించారు. ఈ చర్య బీజింగ్‌తో ఉద్రిక్తతలను పెంచానుందని నిపుణులు చెబుతున్నారు. చైనా కూడా సుంకాలతోనే ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేసింది. ఇవన్నీ గమనిస్తుంటే.. వాణిజ్య యుద్ధం జరుగుతుందా? అని పలువురు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: చైనా నెత్తిన ట్రంప్ పిడుగు.. సుంకాల విషయంలో తగ్గేదేలే!సుంకాలు అంతర్జాతీయ వాణిజ్యాన్ని దెబ్బతీస్తాయని.. వ్యాపారాలు, వినియోగదారులపై ఖర్చుల భారం పెరుగుతుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. సుంకాలతో విదేశీ ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడానికి కారణం.. దేశీయ తయారీని పెంచడమే అని ట్రంప్ సమర్ధించుకుంటున్నారు. అయితే విమర్శకులు ఇటువంటి విధానాల వల్ల ఎదురుదెబ్బలు తగిలే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. -
లక్షల మంది చిన్నారుల ప్రాణదాత అస్తమయం
కారణజన్ములు అత్యంత అరుదుగా పుడతారని ప్రపంచవ్యాప్తంగా విశ్వసిస్తారు. ఆ విశ్వాసాన్ని నిజంచేస్తూ లక్షలాది మంది పసిపాపల ప్రాణాలను నిలబెట్టిన జేమ్స్ క్రిస్టఫర్ హారిసన్ తుదిశ్వాస విడిచారు. రక్తంలోని ప్లాస్మాను 1,173 సార్లు దానంచేసి అందులోని అరుదైన యాంటీ–డి యాంటీబాడీతో దాదాపు పాతిక లక్షల మంది చిన్నారులను కాపాడిన ప్రాణదాతగా ఘన కీర్తులందుకున్న హారిసన్(88) గత నెల 17వ తేదీన ఆ్రస్టేలియాలోని న్యూ సౌత్ వేల్స్లో తుదిశ్వాస విడిచిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నర్సింగ్ హోమ్‌లో నిద్రలోని ఆయన శాశ్వత నిద్రలోకి జారుకున్నారని వైద్యులు తెలిపారు. ఆస్ట్రేలియాకు చెందిన హారిసన్‌ను అందరూ ‘మ్యాన్ విత్ ది గోల్డెన్ ఆర్మ్’అని గొప్పగా పిలుస్తారు. ఏమిటీ ప్రత్యేకత? మానవ రక్తంలో పాజిటివ్, నెగిటివ్ అని రెండు రకాల వర్గీకరణలు ఉన్నాయి. దీనిని రీసస్(ఆర్‌హెచ్)ఫ్యాక్టర్ అని కూడా అంటారు. ఆర్‌హెచ్ నెగిటివ్ రక్తమున్న మహిళ, ఆర్‌హెచ్ పాజిటివ్ ఉన్న వ్యక్తి కారణంగా గర్భం దాలిస్తే పుట్టబోయే బిడ్డకు ఆర్‌హెచ్ పాజిటివ్ ఉండే ఛాన్సుంది. దీంతో కొన్ని సార్లు ప్రాణాంతకమైన సమస్య తలెత్తుతుంది. తల్లి ఎర్ర రక్తకణాలు పుట్టబోయే బిడ్డ రక్తకణాలపై దాడిచేసి కొత్త వ్యాధిని సృష్టిస్తాయి. దీనినే హీమోలైటిక్ డిసీజ్ ఆఫ్ ది న్యూబార్న్(హెచ్డీఎన్)గా పిలుస్తారు. అంటే పుట్టబోయే/పుట్టిన బిడ్డలో ఎర్రరక్త కణాలు అత్యంత వేగంగా క్షీణించిపోతాయి.దీంతో బిడ్డకు రక్తహీనత సమస్య రావడం, గుండె వైఫల్యం చెందడంతోపాటు ప్రాణాలు పోయే అవకాశాలు చాలా అధికం. హెచ్డీఎన్ సమస్యతో ఆ్రస్టేలియాలో ప్రతి ఏటా వేలాది మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. అయితే జేమ్స్ హారిసన్లోని రక్తంలో అరుదైన యాంటీ–డీ యాంటీబాడీని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈయన రక్తం ప్లాస్మా నుంచి సేకరించిన యాంటీబాడీతో ఔషధాన్ని తయారుచేసి దానిని ఆర్‌హెచ్‌డీ సమస్య ఉన్న గర్భిణులకు ఇచ్చారు.దీంతో పిండస్థ దశలోని చిన్నారుల ప్రాణాలు నిలబడ్డాయి. ఇలా 1967వ సంవత్సరం నుంచి ఎప్పటికప్పుడు హారిసన్ తన ప్లాస్మాను దానం చేస్తూనే ఉన్నారు. ఆస్ట్రేలియాలో 81 ఏళ్లు దాటిన వాళ్లు ప్లాస్మా దానం చేయకూడదనే నిబంధన ఉంది. దాంతో ఆయన తన 82వ ఏట ప్లాస్మా దానాన్ని ఆపేశారు. అప్పటికే ఆయన 1,173 సార్లు ప్లాస్మాను దానంచేశారు. దాని సాయంతో ఒక్క ఆస్ట్రేలియాలోనే దాదాపు 24 లక్షల మంది పసిపాపలను కాపాడటం విశేషం. ఆరు దశాబ్దాలపాటు దానం 1936 డిసెంబర్ 27న హారిసన్ జన్మించారు. 14వ ఏట అంటే 1951 ఏడాదిలో హారిసన్‌కు ఛాతిలో పెద్ద శస్త్రచికిత్స జరిగింది. అప్పుడు పెద్దమొత్తంలో రక్తం అవసరమైంది. ఇతరుల రక్తదానంతో బతికానన్న కృతజ్ఞతాభావం ఆయనలో ఆనాడే నాటుకుపోయింది. బ్రతికినంతకాలం రక్తదానం చేయాలని నిర్ణయించుకున్నారు. నిబంధనల ప్రకారం 18 ఏళ్లు నిండిన తర్వాతే రక్తదానం ఇవ్వడం మొదలెట్టారు. ఇలా దాదాపు 60 ఏళ్లపాటు ప్లాస్మాను దానంచేశారు.ప్రతి రెండు వారాలకోసారి ప్లాస్మా దానమిచ్చారు. అత్యధిక సార్లు ప్లాస్మా దానం చేసిన వ్యక్తిగా 2005లో ఆయన ప్రపంచ రికార్డ్ సృష్టించారు. 2018 మే11వ తేదీన చివరిసారిగా ప్లాస్మా దానంచేశారు. న్యూ సౌత్ వేల్స్(ఎన్ఎస్డబ్ల్యూ) జాతీయ యాంటీ–డీ కార్యక్రమంలో వ్యవస్థాపక సభ్యునిగా హారిసన్ ఉన్నారు. ఇన్నేళ్లలో ఎన్ఎస్డబ్ల్యూ తయారుచేసిన యాంటీ–డీ ప్రతి బ్యాచ్‌లో ఒక్క డోస్ అయినా హారిసన్ది ఉండటం విశేషం.లక్షల ప్రాణాలు కాపాడి రికార్డ్ సృష్టించారని గతంలో మీడియా ఆయన వద్ద ప్రస్తావించగా నవ్వి ఊరుకున్నారు. ‘‘రికార్డ్ సృష్టించడం అంటూ ఏదైనా జరిగిందంటే అది కేవలం ఆ దాతృత్వ సంస్థ చేసిన విరాళాల వల్లే. ఇందులో నా పాత్ర ఏమీ లేదు’’అని నిగర్విలా మాట్లాడారు. నేనూ బతికా: కూతురు హారిసన్ మరణంపై ఆయన కూతురు ట్రేసీ మెలోషి ప్ మాట్లాడారు. ‘‘మా నాన్న ఇన్నిసార్లు దానం చేసి కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఆయన అందించిన యాంటీ–డీ డోస్‌తో ఎంతో మంది బ్రతికారు. అందులో నేను కూడా ఉన్నా’’అని ట్రేసీ అన్నారు. ఈ డోస్ పొందిన వారిలో హారిసన్ మనవళ్లు, మనవరాళ్లు కూడా ఉండటం విశేషం. 14 ఏళ్ల వయసులో ఆపరేషన్ వేళ తీవ్రస్థాయిలో రక్తం ఎక్కించుకోవడం వల్లే హారిసన్ ఈ అరుదైన లక్షణాన్ని సంతరించుకున్నారని కొందరి వాదన. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చైనా నెత్తిన ట్రంప్ పిడుగు.. సుంకాల విషయంలో తగ్గేదేలే!
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత 'డొనాల్డ్ ట్రంప్' (Donald Trump) తీసుకుంటున్న ఒక్కో నిర్ణయం.. ప్రపంచంలోని చాలా దేశాలను వణికిస్తున్నాయి. సుంకాల విషయంలో తగ్గేదేలే అంటూ ముందుకు దూసుకెళ్తున్న ట్రంప్.. చైనాకు మరో షాకిచ్చారు.20 శాతంచైనా ఉత్పత్తులపైన ఇప్పటికే ఉన్న 10 శాతం సుంకాన్ని, 20 శాతానికి పెంచుతూ.. దీనికి సంబంధించిన సంబంధించిన ఉత్తర్వులపై సంతకం కూడా చేశారు. అక్రమ వలసలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను ఆపడంలో వారు విఫలమయ్యారని ఆరోపిస్తూ, ఇలాంటి వాటిని నిర్మూలించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.ఎలాంటి మార్పు లేదుమెక్సికో, కెనడా దిగుమతులపై విదించనున్న 25 శాతం సుంకాల విషయంలో ఎలాంటి మార్పు లేదని ట్రంప్ స్పష్టం చేశారు. ఇవి మార్చి న్ నుంచి అమలులోకి వస్తాయి. కెనడా, మెక్సికోపై సుంకాలు మోపడం వల్ల ఆటోమొబైల్స్, నిర్మాణ సామగ్రి వంటి కీలక రంగాలకు సరఫరా గొలుసులు దెబ్బతింటాయి. దీంతో గృహాలకు వెచ్చించాల్సిన ఖర్చు భారీగా పెరిగిపోతుందని నిపుణులు చెబుతున్నారు.నిజానికి.. మెక్సికో, కెనడాపై 25 శాతం సుంకాలను ఫిబ్రవరి 4నుంచి విధించనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. కానీ ఆ దేశాధ్యక్షులు చర్చలు జరిపిన తరువాత.. సుంకాలను నెల రోజుల పాటు వాయిదా వేశారు. ఇచ్చిన గడువు ముగియడంతో.. అనుకున్న విధంగా సుంకాలు చెల్లించాల్సిందే, అని ట్రంప్ పేర్కొన్నారు.ట్రంప్ ఆదేశాలు.. దేశ ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయని కెనడా విదేశాంగ మంత్రి 'మెలనీ జోలీ' పేర్కొన్నారు. ట్రంప్ చర్యకు.. ప్రతిచర్యగా అమెరికా వస్తువులపై కూడా సుంకాలు విధిస్తున్నట్లు చెప్పారు. ఇదే బాటలో మెక్సికన్ అధ్యక్షురాలు 'క్లాడియా షీన్బామ్' కూడా నడుస్తున్నారు. కాబట్టి అమెరికా నుంచి దిగుమతి చేసుకునే.. పండ్లు, ఆల్కహాల్ వంటి వాటిపై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు పేర్కొన్నారు. -
శిథిలాల మధ్యే ఇఫ్తార్
ఖాన్ యూనిస్: ఏడాదికి పైగా సాగుతున్న యుద్ధం నేపథ్యంలో ఎటు చూసినా శిథిలాల నడుమే గాజావాసులకు రంజాన్ పవిత్ర మాసం మొదలైంది. చాలామంది ఆత్మియులను కోల్పోయారు. ఇళ్లు లేవు. సరైన తిండి లేదు. బతకుపై భరోసాయే లేదు. అయినా వారిలో ఆశ మాత్రం ఉంది.సగం కూలిన ఇళ్లలో, తాత్కాలిక గుడారాల్లోనే రంజాన్(Ramadan)ఉపవాసాలు పాటిస్తున్నారు. ఎన్నటికీ తిరిగిరాని తమ ఆత్మియులను పదేపదే తలచుకుంటూ ఇఫ్తార్(Iftar) టేబుళ్ల వద్ద కన్నీటి పర్యంతమవుతున్నారు. కూలగా మిగిలిన ఇళ్లకే దీపకాంతుల తోరణాలు కట్టి కోల్పోయిన వెలుగులను తిరిగి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.గాజాలో చరిత్రాత్మక ప్రార్థనా స్థలం గ్రేట్ ఒమారీ మసీదు శిథిలావస్థకు చేరింది. దాంతో మతపరమైన ప్రార్థనలకు కేంద్ర స్థలమంటూ కూడా లేకుండా పోయింది. చాలాచోట్ల ప్రార్థనా స్థలాలన్నీ విధ్వంసమయ్యాయి. అయినా కూలిన భవనాలు, శిథిలాల మధ్యే పాలస్తీనావాసులు ఎన్నో ఆశలతో జీవితాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పండుగ అంటే ప్రార్థనలు. రంజాన్ షాపింగ్. బంధువులతో వేడుక. ఈసారి అవన్నీ లేకపోయినా గతేడాదితో పోలిస్తే కాస్త మెరుగ్గా ఉందని గాజావాసులు అంటున్నారు! ‘‘తరువాత ఏం జరుగుతుందోనన్న భయం ఇంకా ఉంది. అయినా గతేడాది కంటే ఈసారి మెరుగే’’అని చెబుతున్నారు కొన్ని ప్రాంతాల్లో దుకాణాలు, వీధి వ్యాపారులు అడపాదడపా కనిపిస్తున్నా ఎవరిని చూసినా ఆర్థిక ఇబ్బందులే! నుసిరాత్‌లో హైపర్ మాల్ వంటి సూపర్ మార్కెట్లు తిరిగి తెరుచుకున్నాయి. కానీ దీర్ఘకాలంగా జీవనోపాధే కోల్పోయిన వారిలో కనీసం నిత్యావసర వస్తువులు కూడా కొనే సామర్థ్యం కూడా కన్పించడం లేదు! రంజాన్ ఏకం చేస్తోంది ధైర్యంగా మళ్లీ పాలస్తీనా గడ్డపై కాలు పెట్టగలిగినందుకే గర్వపడుతున్నామని గాజావాసులు చెబుతున్నారు. ప్రపంచంలోని అందరు పిల్లల్లాగే తమ చిన్నారులూ సగర్వంగా, ఆనందంగా జీవించాలని ఆశిస్తున్నారు. ‘‘ఈ రంజాన్ మాసం మా అందరినీ ఏకం చేసింది. ఇంతటి యుద్ధం మధ్య కూడా మాకు ఆనందాన్ని, ఆశను అందిస్తోంది. దాడుల్లేకుండా సురక్షితంగా జీవించడమే మా ఏకైక ఆకాంక్ష’’అని ఖాన్ యూనిస్‌కు చెందిన అబూ ముస్తఫా చెప్పుకొచ్చాడు.కువైట్ సాయం... దక్షిణ గాజా నగరం రఫాలో రంజాన్ ఉపవాసాలుంటున్న 5,000 మంది పాలస్తీనియన్లకు కువైట్ ఇఫ్తార్ భోజనాలు అందించింది. సూర్యాస్తమయం ప్రార్థన పిలుపుతో వారంతా మైళ్ల పొడవున శిధిలాల మధ్య ఏర్పాటు చేసిన బల్ల వద్ద గుమిగూడి అన్నం, చికెన్‌తో ఉపవాస దీక్షను విరమిస్తున్నారు. యుద్ధానికి ముందు ఆ వీధి రంజాన్ రోజుల్లో ఎంతగా కళకళలాడుతూ ఉండేదో ఇఫ్తార్ ఏర్పాట్లకు సహకరిస్తున్న మలక్ ఫదా భారంగా గుర్తు చేసుకున్నారు.‘‘నాటి రోజులే నాకిప్పటికీ స్ఫూర్తి! ఈ వీధికి యుద్ధానికి ముందు మాదిరిగా మళ్లీ జీవం పోయడమే నా లక్ష్యం’’అన్నారామె. ఇటు వ్యక్తిగతంగా, అటు సామూహిక నష్టాల నుంచి, యుద్ధం చేసిన గాయాల నుంచి కోలుకునేందుకు పాలస్తీనియన్లు ప్రయత్నిస్తున్నారు. ఏదేమైనా గాజాను వీడేదే లేదని రఫా వాసి మమ్దౌ అరాబ్ అబూ ఒడే కుండబద్దలు కొట్టాడు. ఏం జరిగినా తామంతా ఐక్యంగా ఉన్నామని, ఉంటామని, తమ దేశాన్ని విడిచి వెళ్లబోమని స్పష్టం చేశాడు. -
నన్ను మార్చడం ఈజీ కాదు
లండన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump)తో వాగ్యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్ష పదవికి తాను రాజీనామా(Resignation) చేయాలన్న వైట్‌హౌస్ అధికారులు, రిపబ్లికన్ సెనేటర్ల వ్యాఖ్యలపై జెలెన్స్కీ(Zelensky) మండిపడ్డారు. అమెరికాతో ఉక్రెయిన్ మళ్లీ చర్చలు జరపాలంటే జెలెన్స్కీ వైదొలగాలని, కొత్త అధ్యక్షుడు చర్చలకు రావాలని సెనేటర్ లిండ్సే గ్రాహం, హౌస్ స్పీకర్ మైక్జాన్సన్ సూచించారు. వీటిపై జెలెన్స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం లండన్‌లో యూరప్ దేశాల నాయకులతో కీలక శిఖరాగ్ర సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.‘‘ఉక్రెయిన్ నాయకున్ని నిర్ణయించుకునే హక్కు ఉక్రేనియన్లకు మాత్రమే ఉంది. మా దేశంలో నాయకత్వం స్థానం కావాలంటే గ్రాహం కూడా ఉక్రెయిన్ పౌరసత్వం తీసుకోవచ్చు. ఆయనకు నేను పౌరసత్వం ఇవ్వగలను. అప్పుడాయన మా దేశ పౌరుడు అవుతాడు. ఆయన వ్యాఖ్యలకు విలువా ఉంటుంది. అతడు ఉక్రెయిన్ పౌరునిగా చెప్పేది వింటాను’’అంటూ సూటి వ్యాఖ్యలు చేశారు.ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం ఇవ్వడానికి అంగీకరిస్తే అధ్యక్ష పదవి వీడేందుకు సిద్ధమని పునరుద్ఘాటించారు. అదే సమయంలో తనను మార్చడం అంత సులభం కాదని జెలెన్స్కీ స్పష్టం చేశారు. తాను గెలవకుండా ఉండాలంటే ఎన్నికల్లో పాల్గొనకుండా తనను అడ్డుకోవడమే మార్గమని ధీమా వ్యక్తం చేశారు.ఒప్పందానికి ఉక్రెయిన్ సిద్ధమే అమెరికాతో ఖనిజాల ఒప్పందం కుదుర్చుకోవడానికి ఉక్రెయిన్ సిద్ధంగా ఉందని జెలెన్స్కీ స్పష్టం చేశారు. వాళ్లు సరేనంటే ఇప్పటికిప్పుడు ఒప్పందంపై సంతకాలు చేస్తానన్నారు. ‘‘గతంలో జరిగిన వాటిని కొనసాగించాలన్నది మా విధానం. మేం నిర్మాణాత్మకంగా ఉన్నాం. అదే సమయంలో కొన్ని విషయాలను విశ్లేషించాల్సిందే. ఉక్రెయిన్ వైఖరి వినాలి. అది మాకు చాలా ముఖ్యం. అమెరికాతో మా సంబంధాలు కొనసాగుతాయని అనుకుంటున్నా.ఉక్రెయిన్ ప్రపంచంలో అతి పెద్ద దేశం కాకపోవచ్చు. కానీ తన స్వాతంత్య్రం కోసం అది చేస్తున్న పోరాటాన్ని అంతా చూస్తున్నారు. అమెరికా నుంచి ఏ అనుమానాలకూ తావు లేకుండా సాయం కొనసాగుతుందని ఆశిస్తున్నా. ఎందుకంటే మాకు సాయం నిలిపివేత అంతిమంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు మాత్రమే ఉపయోగపడుతుంది. అమెరికా, ఇతర ప్రపంచ ప్రతినిధులు పుతిన్‌కు అలాంటి సాయం చేయరని అనుకుంటున్నా’’అని చెప్పారు. -
ఉక్రెయిన్‌కు భారీ షాక్.. ట్రంప్ సంచలన నిర్ణయం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రష్యా (Russia)తో యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌కు షాకిస్తూ అమెరికా నుంచి అందే మిలటరీ సాయాన్ని నిలిపివేశారు. జెలెన్స్కీ ఖనిజాల ఒప్పందంపై అంగీకరించని నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకుంది.డొనాల్డ్ ట్రంప్ తనదైనా పంథాలో ముందుకు సాగుతున్నారు. అమెరికాకు వ్యతిరేకంగా ఎవరు ఉన్న వారిపై ఆంక్షలు, టారిఫ్‌లు విధిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌తో చర్చలు విఫలమైన నేపథ్యంలో జెలెన్స్కీకి ట్రంప్ ఊహించని షాకిచ్చారు. ఉక్రెయిన్‌కు అమెరికా అందిస్తున్న సైనిక, ఆర్థిక సహాయాన్ని నిలిపివేశారు. తాజా నిర్ణయంలో పైప్‌లైన్‌లో ఉన్న కోటి డాలర్ల విలువైన సైనిక పరికరాల అప్పగింత నిలిచిపోయింది. ఈ మేరకు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ సందర్భంగా వైట్‌హౌస్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. అధ్యక్షుడు ట్రంప్ శాంతిస్థాపనపై దృష్టిసారించారు. అమెరికా భాగస్వాములు కూడా ఆ లక్ష్యానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది. మేము మా సాయాన్ని నిలిపివేస్తున్నాం. ఇది ఒక పరిష్కారాన్ని చూపిస్తోందని అనుకుంటున్నాం. రష్యాతో శాంతి చర్చలకు ఉక్రెయిన్ అంగీకరించాలనే ఉద్దేశ్యంతోనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. ఇటీవల ఖనిజాల ఒప్పందంపై చర్చించడానికి ట్రంప్, జెలెన్స్కీ వైట్‌హౌస్ వేదికగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వాడీవేడి చర్చ జరిగింది. భవిష్యత్తులో తమపై రష్యా ఏదైనా దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పించాలని జెలెన్స్కీ ఒత్తిడి చేశారు. దీంతో, ట్రంప్ విరుచుకుపడ్డారు. సాయం అందించిన అమెరికాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఉక్రెయిన్ తీరు మూడో ప్రపంచ యుద్దానికి దారి తీస్తుందని హెచ్చరించారు. శాంతి ఒప్పందం చేసుకోవడం జెలెన్స్కీకి ఇష్టం లేదంటూ విమర్శలు గుప్పించారు. ఈ చర్చలు కాస్తా రసాభాసగా మారడంతో ఖనిజాల ఒప్పందంపై సంతకం చేయకుండానే జెలెన్స్కీ వైట్‌హౌస్ నుంచి వెళ్లిపోయారు. 🚨BREAKING: The Trump Administration has officially paused all U.S. military aid to Ukraine, abandoning our allies as they face a Russian invasion. RETWEET if you stand with President Zelenskyy against Donald Trump and Vladimir Putin! pic.twitter.com/C4LsP00NY7— Protect Kamala Harris ✊ (@DisavowTrump20) March 4, 2025మరోవైపు.. జెలెన్ స్కీ తాజాగా కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అమెరికాతో ఖనిజాల ఒప్పందం కుదుర్చుకోవడానికి ఉక్రెయిన్ సిద్ధంగా ఉందని జెలెన్స్కీ స్పష్టం చేశారు. వాళ్లు సరేనంటే ఇప్పటికిప్పుడు ఒప్పందంపై సంతకాలు చేస్తానన్నారు. గతంలో జరిగిన వాటిని కొనసాగించాలన్నది మా విధానం. మేం నిర్మాణాత్మకంగా ఉన్నాం. అదే సమయంలో కొన్ని విషయాలను విశ్లేషించాల్సిందే. ఉక్రెయిన్ వైఖరి వినాలి. అది మాకు చాలా ముఖ్యం. అమెరికాతో మా సంబంధాలు కొనసాగుతాయని అనుకుంటున్నా. ఉక్రెయిన్ ప్రపంచంలో అతి పెద్ద దేశం కాకపోవచ్చు. కానీ తన స్వాతంత్య్రం కోసం అది చేస్తున్న పోరాటాన్ని అంతా చూస్తున్నారు. అమెరికా నుంచి ఏ అనుమానాలకూ తావు లేకుండా సాయం కొనసాగుతుందని ఆశిస్తున్నా. ఎందుకంటే మాకు సాయం నిలిపివేత అంతిమంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు మాత్రమే ఉపయోగపడుతుంది. అమెరికా, ఇతర ప్రపంచ ప్రతినిధులు పుతిన్‌కు అలాంటి సాయం చేయరని అనుకుంటున్నా అంటూ వ్యాఖ్యలు చేశారు. -
ఉక్రెయిన్‌లో శాంతిస్థాపన...ఇక మా సారథ్యంలో: బ్రిటన్
లండన్/కీవ్/వాషింగ్టన్: అమెరికాకు బదులుగా ఇకపై ప్రపంచ పెద్దన్న పాత్రను పోషించేందుకు బ్రిటన్ సిద్ధమవుతున్నట్టు కన్పిస్తోంది. రష్యాతో ఘర్షణకు తెర దించి ఉక్రెయిన్‌లో శాంతి నెలకొనేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు ఇక బ్రిటన్ సారథ్యం వహిస్తుందని ఆ దేశ ప్రధాని కియర్ స్టార్మర్ ప్రకటించారు. అందుకోసం అవసరమైతే ఉక్రెయిన్‌కు సైనికంగా, ఆర్థికంగానే గాక అన్నివిధాలా దన్నుగా నిలుస్తామని పునరుద్ఘాటించారు. ‘‘ఈ ప్రయత్నాల్లో ఇతర దేశాలనూ కలుపుకుని సాగుతాం. ఇందుకు అమెరికా చాలా కీలకం’’ అని చెప్పారు. ఉక్రెయిన్ విషయమై స్టార్మర్ చొరవ తీసుకుని మరీ ఆదివారం యూరప్ దేశాలతో లండన్‌లో అత్యవసర భేటీ నిర్వహించడం తెలిసిందే. అందులో చర్చించిన అంశాలను సోమవారం ఆయన పార్లమెంటుకు వివరించారు. ఈ విషయంలో స్టార్మర్‌కు విపక్ష కన్జర్వేటివ్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించడం విశేషం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ వాగ్యుద్ధం ఇబ్బందికర పరిణామాలకు దారి తీసిందని స్టార్మర్ అన్నారు. అగ్ర రాజ్యంతో పటిష్టమైన సంబంధాలు బ్రిటన్‌కు చాలా ముఖ్యమని చెప్పారు. అమెరికా భరించబోదు రష్యాతో ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు కనుచూపు మేరలో కన్పించడం లేదంటూ జెలెన్స్కీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య ఆ దిశగా ఒప్పందం ఇప్పటికైతే సుదూరంలోనే ఉందన్నారు. వీటిపై ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు. ‘‘జెలెన్స్కీ చేసిన అత్యంత పనికిమాలిన ప్రకటన బహుశా ఇదే! ఆయనను అమెరికా ఇక ఎంతమాత్రమూ భరించబోదు’’ అని స్పష్టం చేశారు. ‘‘జెలెన్స్కీకి కావాల్సింది శాంతి కాదని మొదటినుంచీ చెప్తూనే ఉన్నా. అదే నిజమని మరోసారి తేలింది. అలాంటి వ్యక్తికి యూరప్ దేశాల సంఘీభావమా? అవి అసలు ఏమనుకుంటున్నాయి?’’ అంటూ మండిపడ్డారు. జెలెన్స్కీతో ట్రంప్ వాగ్యుద్ధం యాదృచ్ఛికమేమీ కాదని, పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగిందని జర్మనీ కాబోయే చాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ అనుమానం వెలిబుచ్చారు. -
ఆ సముద్ర ప్రవాహం... నెమ్మదిస్తోంది!
పర్యావరణ మార్పుల తాలూకు విపరిణామాలు ఊహాతీత వేగంతో ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ధ్రువాల వద్ద మంచు ఎన్నడూ లేనంత వేగంతో కరిగిపోతుండటం కొన్నేళ్లుగా మనమంతా చూస్తున్న భయానక పరిణామమే. ఇది మరో పెను ప్రమాదానికి కూడా దారి తీస్తోందని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. అంటార్కిటికాలో అత్యంత బలమైన సముద్ర ప్రవాహ గతి కొన్నేళ్లుగా క్రమంగా నెమ్మదిస్తూ వస్తోందని వెల్లడించింది. అంటార్కిటికా వద్ద భారీ మంచు ప్రమాదకర వేగంతో కరుగుతుండటమే ఇందుకు కారణమని వివరించింది. ప్రపంచ వాతావరణాన్ని క్రమబదీ్ధకరించడంలో ఈ ప్రవాహానిదే అతి కీలకపాత్ర. అంతేగాక మహాసముద్రాల ప్రవాహాల గతి కూడా చాలావరకు ఈ ప్రవాహ గతిమీదే ఆధారపడి ఉంటుంది. ‘‘లక్షలాది ఏళ్లుగా సమతుల్యంగా కొనసాగుతూ వస్తున్న అత్యంత సంక్లిష్టమైన ఈ ప్రవాహం కూడా పర్యావరణ మార్పుల దెబ్బకు గాడి తప్పుతుండటం అత్యంత ఆందోళనకరం. ఇదిలాగే కొనసాగితే మానవాళి ఊహాతీతమైన పర్యావరణ విపత్తులు ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని అధ్యయనం హెచ్చరించింది. ఏసీసీ... పెట్టనికోట! ప్రపంచ పర్యావరణ సమతుల్యతకు అంటార్కిటికా అత్యంత కీలకమైనది. అంటార్కిటిక్ సర్కంపొలార్ కరెంట్ (ఏసీసీ)గా పిలిచే అక్కడి మహాసముద్ర ప్రవాహం ఈ విషయంలో పెద్దన్న పాత్ర పోషిస్తుంటుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత బలమైన సముద్ర ప్రవాహం! పశ్చిమం నుంచి తూర్పుగా అంటార్కిటికా మహాసముద్రం పొడవునా సాగే ఈ ప్రవాహం ప్రపంచ వాతావరణాన్ని, ఇతర సముద్ర ప్రవాహాల గతిని నిత్యం నియంత్రిస్తూ ఉంటుంది. అంతేగాక ప్రధానంగా వేటాడే తత్వముండే ఇతర ప్రాంతాల్లోని సముద్ర జీవరాశులు అంటార్కిటికా జలాల్లోకి ప్రవేశించకుండా ప్రాకృతిక అడ్డుగోడలా కూడా ఏసీసీ నిలుస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే మానవాళి మనుగడకు ఇది పెట్టనికోట వంటిది. గ్లోబల్ వార్మింగ్ తదితరాల దెబ్బకు అంటార్కిటికాలోని అపారమైన మంచు కొన్నేళ్లుగా శరవేగంగా కరుగుతోంది. దాంతో అపార స్వచ్ఛ జలరాశి నిరంతరం సముద్రంలోకి పోటెత్తుతోంది. దాని దెబ్బకు అంటార్కిటికా మహాసముద్రంలో లవణీయత, నీటి సాంద్రత మార్పుచేర్పులకు లోనవుతున్నాయి. ఇదంతా అంతిమంగా ఏసీసీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దాని ప్రవాహ గతి నానాటికీ నెమ్మదిస్తూ వస్తోంది.ఇలా చేశారుఏసీసీ ప్రవాహ గతిలో మార్పు లపై ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్కు చెందిన పరిశోధకుల బృందం పరిశోధన చేసింది. అధ్యయనంలో భాగంగా పలు అంశాలపై సైంటిస్టులు లోతుగా దృష్టి పెట్టారు. ఆ్రస్టేలియాలోనే అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ జీఏడీఐ సాయంతో సముద్ర ప్రవాహాల్లో మార్పులు తదితరాలను కచి్చతంగా లెక్కగట్టారు. హెచ్చు రెజల్యూషన్‌తో కూడిన సముద్ర, యాక్సెస్–ఓఎం2–01 క్లైమేట్ మోడల్ సేవలను కూడా ఇందుకు వాడుకున్నారు. మహాసముద్ర ప్రవాహాలపై మంచు, స్వచ్ఛ జలరాశి ప్రభావం, తద్వారా వేడిని మోసుకుపోయే సామర్థ్యంలో హెచ్చుతగ్గులు తదితరాలను నిశితంగా పరిశీలించారు. అంతిమంగా ఇవన్నీ ఉష్ణోగ్రత, లవణీయత, పవనాల గతి తదితరాల్లో ఎలాంటి మార్పులకు కారణమవుతాయో గమనించారు. మంచు కరిగి సముద్రంలోకి చేరే అపార జలరాశి ఏసీసీ ప్రవాహాన్ని వేగవంతం చేస్తుందన్న గత పరిశోధనల ఫలితాలు సరికావని స్పష్టం చేశారు. అందుకు పూర్తి విరుద్ధంగా ఏసీసీ ప్రవాహ గతి బాగా నెమ్మదిస్తోందని తేల్చారు. తాజా పరిశోధన ఫలితాలను ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ లెటర్స్‌లో ప్రచురించారు. పెను విపత్తులే...! ఏసీసీ ఒకరకంగా ప్రపంచ వాతావరణ సమతుల్యతకు ఇంజిన్ వంటిదని అధ్యయన బృంద సభ్యుడైన అసోసియేట్ ప్రొఫెసర్ భిషగ్దత్త గయేన్ వివరించారు. ‘‘మహాసముద్రాలన్నింటికీ కన్వేయర్ బెల్ట్ మాదిరిగా ఏసీసీ పని చేస్తుంది. వేడిమి, కార్బన్ డయాక్సైడ్తో పాటు సముద్రంలోని జీవరాశుల మనుగడకు అత్యంత కీలకమైన పలు పోషకాలు తదితరాలు పసిఫిక్, అట్లాంటిక్, హిందూ తదితర మహాసముద్రాల మధ్య సజావుగా పంపిణీ అయ్యేలా చూస్తుంది. అది గనక పడకేసిందంటే జరిగే విపరిణామాలు అన్నీ ఇన్నీ కావు’’ అని ఆయన స్పష్టం చేశారు. అవేమిటంటే... → ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల్లో తీవ్రమైన హెచ్చుతగ్గులు → పలు ప్రాంతాల్లో అత్యంత వేడిమి, ఆ వెనకే అతి శీతల పరిస్థితులు → సముద్ర జలాల్లో లవణీయత పరిమాణం నానాటికీ తగ్గిపోవచ్చు → ఫలితంగా గ్లోబల్ వార్మింగ్ ప్రక్రియ మరింత వేగం పుంజుకోవచ్చు → ఇతర ప్రాంతాల సముద్ర జలాలకే పరిమితమైన నాచు, కలుపు మొక్కలు, మొలస్కా వంటి జీవులు అంటార్కిటికాలోకి ప్రవేశించవచ్చు. అదే జరిగితే అక్కడి జీవావరణ వ్యవస్థ దెబ్బ తింటుంది. ఇవి అంతిమంగా పెంగి్వన్ల వంటి స్థానిక జీవరాశుల ఆహార వనరులకు కూడా ఎసరు పెట్టవచ్చు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Oscar Awards 2025: భావోద్వేగాలకు జీవం
2024 సంవత్సరానికి ఆస్కార్ ఉత్తమ నటిగా నిలిచారు మైకీ మ్యాడిసన్ . సినిమా పేరు ‘అనోరా’. ధరించిన పాత్ర ‘వేశ్య’. హాలీవుడ్ కాని, ఇండియన్ సినిమాల్లోకానివేశ్య పాత్ర పోషించడం పట్ల తారలకు కొన్ని అభ్యంతరాలుంటాయి. అలాగే ఆ పాత్రలు పోషించిన వారందరూ ప్రశంసలు కూడా అందుకున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి వేశ్య పాత్ర వార్తల్లోకి వచ్చింది. ‘అనోరా’ గురించి, మైకీ మ్యాడిసన్ గురించి కథనం.వారికి ఆదివారం రాత్రి. మనకు సోమవారం తెల్లవారుజాము. కాని తారలకు, తారలను ప్రేమించే ప్రేక్షకులకు ఇది పడుతుందా?అమెరికా లాస్ ఏంజెలెస్‌లో జరిగిన 97వ అకాడమీ అవార్డ్స్ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు నిద్ర మానుకొని, మేల్కొని, వివిధ స్థానిక సమయాల ప్రకారం వీక్షించారు. విజేతలకు చప్పట్లతో శుభాకాంక్షలు తెలియజేశారు. తాము ఊహించిన సినిమాకో నటికో వస్తే తెగ ఉత్సాహం ప్రదర్శించారు. అయితే వీరందరూ కొంత ఊహించినా ఇంతగా ఎక్స్పెక్ట్ చేయని ఒక సినిమా ఆశ్చర్యపరిచింది. ‘ఉత్తమ చిత్రం’ పురస్కారంతో పాటు ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో ఐదు పురస్కారాలను సొంతం చేసుకుని హోరెత్తించింది. ఆ సినిమాయే ‘అనోరా’. 2024లో విడుదలైన ఈ చిత్రం అటు విమర్శకుల ప్రశంసలను, ఇటు బాక్సాఫీసు కాసుల రికార్డులనూ కొల్లగొట్టింది. భారతీయ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం జరిగిన ఆస్కార్ అవార్డు ప్రదానోత్సవంలో సైతం అదే పంథా కొనసాగించింది.ఎవరీ ‘అనోరా’?:నిజానికి ఇలాంటి కథలు మనకు ‘మొఘల్–ఏ–ఆజమ్’ నుంచి ఉన్నాయి. కథానాయకుడు వేశ్యను ప్రేమిస్తే సంఘం/పెద్దమనుషులు ఓర్వలేక విడగొట్టడం. కాని మొఘల్–ఏ–ఆజమ్‌లో కథానాయకుడి ప్రేమ నిజమైనది అయితే ‘అనోరా’లో కపటమైనది. అందుకే ఆ ప్రేమకు విక్టిమ్ అవుతుంది అనోరా. 23 ఏళ్ల ఈ అమ్మాయి న్యూయార్క్‌లోని ఓ క్లబ్లో స్ట్రిప్పర్‌గా పని చేస్తూ ఉంటుంది. ఒకరోజు ఈమెను క్లబ్ యజమాని రష్యాకు చెందిన ఇవాన్ అనే శ్రీమంతుల కుర్రవాడికి పరిచయం చేస్తాడు. చదువుకోవడానికి అమెరికాకు వచ్చిన ఈ కుర్రాడు బాధ్యత లేకుండా పార్టీల్లో, వీడియో గేమ్స్‌లో సమయం గడుపుతూ ఉంటాడు. అనోరా సాంగత్యం ఇష్టపడ్డ ఇవాన్ తరచూ ఆమెను తన బంగ్లాకు ఒక రాత్రి కోసం తీసుకువెళుతూ ఉంటాడు. ఆ తర్వాత హఠాత్తుగా ‘నాకు వారం రోజుల పాటు గర్ల్‌ఫ్రెండ్‌గా ఉండు. 15 వేల డాలర్లు ఇస్తాను’ అని క్లబ్‌కు వెళ్లకుండా ఆపేస్తాడు. ఆ వారంలో ఆమె మీద ప్రేమ పుట్టిందని చెప్పి, ఉక్కిరిబిక్కిరి చేసి, ఉరుకుల పరుగుల మీద పెళ్లి చేసుకుంటాడు.కష్టాలు మొదలుఅయితే ఇది పిల్లల ఆట కాదు. ఇద్దరు కలవడం వెనుక, కలిసి జీవించడం వెనుక ఎంత పెద్ద వ్యవస్థ ఇన్వాల్వ్ అయి ఉంటుందో మెల్లగా అనోరాకు తెలిసి వస్తుంది. ఇది క్లబ్లో తన ఇష్టానికి స్ట్రిప్పర్‌గా ఉండటం కాదని ‘పెళ్లి’ అనే వ్యవస్థ చుట్టూ అంతస్తు, సంఘ మర్యాద, వంశం... ఇలాంటివి అన్నీ ఉంటాయని అర్థమై హడలిపోతుంది. ఇవాన్‌ను ఈ పెళ్లి నుంచి బయటపడేయడానికి రష్యా నుంచి వచ్చిన ఇద్దరు మనుషులు ఈ యువ జంటను బెదిరిస్తారు. ‘గ్రీన్ కార్డు పొందడం కోసమే ఆమె నిన్ను పెళ్లి చేసుకుంది. ఆమె వేశ్య’ అని ఇవాన్ మనసును మార్చేస్తారు. ఈ మొత్తం వ్యవహారానికి బెదిరి అనోరాను వదిలి ఇవాన్ పారిపోతాడు. ఇవాన్‌ను వదిలి పెడితే 10 వేల డాలర్లు ఇస్తామనే బేరం పెడతారు రష్యా మనుషులు. ఈ పరిస్థితులు మానసికంగా అనోరాను బాధిస్తాయి.ఊరడించే బంధంఅయితే ఈ మొత్తం కథలో ఒక వ్యక్తి అనోరా పట్ల సానుభూతిగా ఉంటాడు. అతను ఇవాన్‌ను పెళ్లి నుంచి బయట పడేయడానికి రష్యా నుంచి వచ్చిన ఇగోర్. అనోరాకి అన్యాయం జరుగుతోందని ఆమె తన మానాన తాను బతుకుతుంటే ఇవాన్ డిస్ట్రబ్ చేశాడని అతనికి అనిపిస్తుంది. చివరకు అతను ఆమెకు స్నేహితుడిగా మారతాడు. అతనికి అనోరా తన సర్వస్వం అర్పించడానికి దగ్గరయ్యి ఆ కాస్త ఓదార్పుకు వెక్కివెక్కి ఏడ్వడంతో సినిమా ముగుస్తుంది. ఈ కథ మొత్తాన్ని తన భుజస్కందాల మీద అద్భుతంగా పోషించడం వల్ల, వివిధ భావోద్వేగాలను పలికించడం వల్ల ‘అనోరా’ పాత్ర పోషించిన మైకీ మాడిసన్‌కు ఉత్తమ నటి అవార్డు వచ్చింది. అవార్డు అందుకుంటూ ఆమె ‘సెక్స్ వర్కర్ కమ్యూనిటీకి కృతజ్ఞతలు’ అని చెప్పడం విశేషం.సినిమా విశేషాలు→ ఇది కల్పిత కథ కాదు, అలాగని పూర్తి వాస్తవ కథ కూడా కాదు. దర్శకుడు సీన్ బేకర్‌కి తన స్నేహితుడు చెప్పిన ఒక రష్యన్–అమెరికన్ జంట కథ ఆధారంగా పుట్టిందే ఈ కథ. 2000–2001 సమయంలో న్యూయార్క్‌లో సీన్ బేకర్ వీడియో ఎడిటర్‌గా పని చేస్తూ అనేక రష్యన్–అమెరికన్ జంటల పెళ్లి వీడియోలను ఎడిట్ చేశాడు. ఇవన్నీ కలిసి అతని మనసులో చెరగని ముద్ర వేశాయి. ఈ సినిమాకు రచనా సహకారం కోసం కెనెడియన్ రచయిత్రి, నటి ఆండ్రియా వెరన్ను సంప్రదించాడు దర్శకుడు. అందుకు కారణం ఆమె గతంలో సెక్స్ వర్కర్‌గా పని చేసి, ఆ అనుభవాలతో ‘మోడ్రన్ వోర్’ అనే స్వీయచరిత్ర రాసింది. బార్లలో ఆడిపాడే వారికి, వేశ్యావృత్తిలో ఉన్నవారికీ మనసుంటుందనీ, అదీ ఒక తోడు కోరుకుంటుందని చెప్పడానికే తాను ఈ సినిమా తీసినట్లు ఆయన వివరించారు. → కథలో ప్రధానమైన పాత్రను ధరించిన మైకీ మాడిసన్ ఆ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయింది. 25 ఏళ్ల మైకీ మాడిసన్ లాస్ ఏంజెలెస్‌లో పుట్టి శాన్ ఫెర్నాండ్ వ్యాలీలో పెరిగింది. యూదు కుటుంబానికి చెందిన మైకీ తల్లిదండ్రులిద్దరూ సైకాలజిస్టులు. ఈమెకు ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నలు.→ 2013లో తొలిసారి ‘రిటైర్మెంట్ అండ్ పనిష్ బాక్స్’ అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించే నాటికి మైకీ మాడిసన్ ఏడో తరగతి చదువుతోంది. సినిమాల వల్ల స్కూలుకు వెళ్లడం సాధ్యం కాకపోవడంతో ఆ తర్వాత ఆమె చదువంతా ఇంట్లోనే సాగింది. 2017లో హీరోయిన్గా తొలి చిత్రం ‘లిజా లిజా స్కైస్ ఆర్ గ్రే’ విడుదలైంది. అంతకుముందే 2016లో ‘బెటర్ థింగ్స్’ అనే కామెడీ డ్రామా సిరీస్‌లో టీనేజ్ యువతి పాత్ర పోషించింది. ఆ సిరీస్ విజయవంతమై 2022 దాకా నడిచింది. ఈ మధ్యలో ‘ఇంపోస్టర్స్’, ‘మాన్ స్టర్’, ‘నోస్టాల్జియా’ వంటి సిరీస్‌లలోనూ నటించి, మెప్పించింది. → 2019లో వచ్చిన ‘వన్స్ అపాన్ ఎ టైం ఇన్ హాలీవుడ్’ అనే సినిమా మైకీకి గుర్తింపు తెచ్చింది. అందులో ‘సూసన్’ పాత్రలో ఆమె నటన అందర్నీ ఆకట్టుకుంది. 77వ కాన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఈ చిత్రం ప్రశంసలు పొందింది. ఆ పై ‘స్క్రీమ్’, ‘లేడీ ఇన్ ది లేక్’ సినిమాల్లో నటించింది. → తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు, జయప్రద హీరో హీరోయిన్లుగా రూపొందిన ‘ప్రేమమందిరం’ కథ ‘అనోరా’ పోలికలతోనే ఉంటుంది. అందులో జయప్రద దేవదాసీల ఇంట్లోనే పుట్టిన అమ్మాయి పాత్ర పోషించగా అక్కినేని జమీందారు బిడ్డ పాత్ర పోషించారు.‘వన్స్ అపాన్ ఎ టైం ఇన్ హాలీవుడ్’, ‘స్క్రీమ్’ సినిమాలో మైకీ నటన చూసి తాను తీస్తున్న ‘అనోరా’లో ఈ అమ్మాయి బాగుంటుందని సీన్ బేకర్ భావించారు. అలా ఈప్రాజెక్టులోకి అడుగుపెట్టిన మైకీ సినిమాను తన భుజాల మీద మోసింది. వేశ్యగా, ప్రేమికురాలిగా, పెళ్లయిన మహిళగా, ప్రియుడి చేత మోసగింపబడ్డ యువతిగా... ఇన్ని రకాల హావభావాలను ఆ పాత్రలో పలికించి అందర్నీ మెప్పించింది. -
పెళ్లి ముద్దు,పిల్లలొద్దు ఎందుకంటే..అక్కడి యువత
పిల్లలను కనకూడదని యుక్తవయసులోనే నిర్ణయించుకుంటున్నవారి సంఖ్య రానురానూ పెరుగుతోంది. మన దేశంలో ఇప్పుడిప్పుడే కనిపిస్తోన్న ఈ పంధా... సింగపూర్‌లో ఓ రేంజ్లో విజృంభిస్తోంది. పిల్లలను కనే వయసు దాటిపోతున్నా అనేకమంది వివాహిత స్త్రీలు నిర్లిప్తంగా ఉంటూ చివరకు సంతానం లేకుండా మిగిలిపోతున్నారుగత 2024లో 40 నుంచి 49 ఏళ్ల మధ్య వయస్సున్న మహిళల్లో 15 శాతం మందికి పిల్లలు లేరని సింగపూర్‌కి చెందిన స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ గత ఫిబ్రవరి 18న, గణాంకాలను విడుదల చేసింది. ఇది 2004లో 7.1 శాతం కంటే రెట్టింపు కాగా, అయితే ఇది 2014లో ఈ సంఖ్య 11.2 శాతంగా ఉంది. సింగపూర్‌లోని ఇన్సి్టట్యూట్ ఆఫ్ పాలసీ స్టడీస్ సీనియర్ రీసెర్చ్ ఫెలో టాన్ పోహ్ లిన్ మాట్లాడుతూ పిల్లలు లేని జంటల నిష్పత్తిలో పెరుగుదలను ‘చాలా వేగంగా‘ సంభవిస్తోందని అంటున్నారు.ఈ పరిస్థితిని పురస్కరించుకుని అక్కడి మీడియా స్థానికులను ఇంటర్వ్యూలు చేస్తూ కారణాలను అన్వేషిస్తోంది. పిల్లలు వద్దనుకునేందుకు సింగపూర్ వాసులను ప్రేరేపిస్తున్నవి ఏమిటి? అని ఆరాతీస్తోంది...జీవనశైలి ప్రాధాన్యతలు, ప్రతికూల బాల్య అనుభవాలు పిల్లలను పెంచే అపారమైన బాధ్యత గురించిన భయం వంటి ఇతర కారణాల వల్ల తాము పిల్లల్ని కనకూడదనే నిర్ణయం తీసుకున్నామని పలువురు ఆ ఇంటర్వ్యూల్లో వెల్లడించారు.‘‘బిడ్డను కనడం చాలా పెద్ద బాధ్యత, పైగా వారు ఎలా మారతారో తెలీదు. నేను మరొక జీవితానికి నేను బాధ్యత వహించాలని అనుకోవడం లేదు’ అని ఓ యువతి చెప్పింది. ‘‘ పిల్లలు కాదు‘నేను నా స్వేచ్ఛను నా జీవితాన్ని నేను కోరుకున్న విధంగా జీవించగల సామర్థ్యాన్ని కూడా చాలా విలువైనదిగా భావిస్తున్నాను’’ అంటూ మరొకరు చెప్పారుు. తాము ప్రయాణాలు చేస్తూ ‘జీవితాన్ని అన్వేషించడం‘ తమ లక్ష్యాలుగా జంటలు వెల్లడిస్తున్నారు. పిల్లలను కలిగి ఉండటం వల్ల తాము చేయాలనుకున్న చాలా పనులను చేయలేమని, ఉద్యోగ సెలవులను కూడా తమ కోసం వినియోగించుకోలేమని చెబుతూన్నారు. సమాన అవకాశాలతో సాధికారత పొందడం, తమ విభిన్న ఆసక్తులను కొనసాగించడం కోసం సమయాన్ని వెచ్చించడానికి తాము ఇష్టపడుతున్నామని మహిళలు చెబుతున్నారు.పిల్లల చదువుల విషయంలో తమ స్నేహితులు ఎదుర్కొనే ఒత్తిళ్లను గమనించిన తర్వాత పిల్లల్ని కనదలచుకోలేదని, నేటి ప్రపంచంలో పిల్లలను పెంచడం మునుపటి కంటే చాలా క్లిష్టంగా ఉందని వీరు అంటున్నారు. ‘‘పిల్లలను కనడానికి కాదు...పెంపకంలో నాకు తెలియనిది చాలా ఎక్కువ. పిల్లవాడు బాగుంటాడా? నేను ఆల్ రైట్ పేరెంట్ అవుతానా?’’, అనే భయాలు తమని వెంటాడుతున్నాయని చెబుతున్నారు.ఇలా పెళ్లి ఓకే కానీ పిల్లల్ని వద్దనుకుంటున్న జంటల సంఖ్య వేగంగా పెరుగుతుండడంతో సింగపూర్ ప్రభుత్వం అనేక రకాల దిద్దుబాటు చర్యలు చేపడుతోంది. ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న కుటుంబాలకు ప్రోత్సహిస్తూ, సింగపూర్ వాసులు ఎక్కువ మంది పిల్లలను కనేలా చేయాలని, పెద్ద కుటుంబాలకు మద్దతు ఇవ్వడానికి నిర్ణయించుకుంది.గత ఫిబ్రవరి 18న తన బడ్జెట్ ప్రసంగంలో, ప్రధాన మంత్రి లారెన్స్ వాంగ్, కొత్త పెద్ద కుటుంబాల పథకంలో భాగంగా, ఫిబ్రవరి 18న లేదా ఆ తర్వాత జన్మించిన ప్రతి మూడవ తదుపరి సింగపూర్ బిడ్డకు కుటుంబాలు 16,000 డాలర్ల వరకు అదనపు మద్దతును అందిస్తామని ప్రకటించారు. Satyababu -
యూఏఈలో భారతీయ మహిళకు మరణశిక్ష అమలు
న్యూఢిల్లీ: నాలుగు ఏళ్ల చిన్నారి మృతి కేసులో భాగంగా ఓ భారత మహిళకు యూఏఈలో మరణశిక్ష అమలైంది. గత నెల 15వ తేదీన శిక్షను ఖరారు చేసినప్పటికీ, ఆ విషయాన్ని తాజాగా విదేశాంగ శాఖ.. ఢిల్లీ హైకోర్టు తెలిపింది. యూపీకి చెందిన షెహజాదీ ఖాన్ అనే మహిళ.. గత కొంతకాలంగా అబుదాబిలో ఉంటోంది. 33 ఏళ్ల షెషజాదీ ఖాన్.. యూపీలోని బాంద్రా జిల్లాకు చెందిన మహిళ. టూరిస్టు వీసా మీద నాలుగేళ్ల క్రితం అబుదాబి వెళ్లింది.2022లో ఆగస్టులో తన కొడుకును చూసుకునే బాధ్యతను ఆమెకు అప్పగించాడు. షెహజాదీ కేర్ గివర్ కింద ఆ బాధ్యతలు తీసుకుంది. 2022, డిసెంబర్ 7 వ తేదీన వ్యాక్సినేషన్ కు తీసుకెళ్లింది నాలుగేళ్ల బుడతడికి. అయితే అది కాస్తా విషాదాంతమైంది. ఆ బాబు చనిపోవడంతో కేసు షెహజాదీ పడింది. తన కుమారుడు మరణానికి ఆమె కారణమంటూ కేసు ఫైల్ చేశాడు. ఇలా కొంతకాలం కోర్టులో చుట్టూ తిరగ్గా ఆమెకు మరణశిక్ష ఖరారైంది. ఆమెకు మరణశిక్ష ఖాయమైందన్న తెలుసుకున్న కుటుంబ సభ్యులు లబోదిబోమన్నారు. ఆ క్రమంలోనే ఆమె తండ్రి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. అయితే యూఏఈ చట్టాల ప్రకారం ఆమె మరణశిక్ష అమలు కావడంతో ఆ విషయాన్ని విదేశాంగ శాఖ.. ఢిల్లీ హైకోర్టుకు స్పష్టం చేసింది.అక్రమంగా రవాణా చేసి.. ఆమె టూరిస్టు వీసా మీద వెళ్లి అక్కడ స్థిరపడాలనుకుంది షెహజాదీ. అయితే ఆమెను అక్కడికి తీసుకెళ్లేముందు అది టూరిస్టు వీసా అనే సంగతిని ఫైజ్, నాడియా దంపతులు ఆమెకు చెప్పలేదు. అలా వెళ్లి ఇరుక్కుపోయింది ఆమె.ఆమెను అక్రమంగా రవాణా చేసినందుకు ఫైజ్, నాడియా దంపతులపై కూడా కేసు నమోదు అయ్యింది. ఈ క్రమంలోనే వారి నాలుగేళ్ల కొడుకును షెహజాదీ చూసుకుంటోంది. కానీ ఆ బాబు ఆమె చేతుల మీదుగానే చనిపోవడంతో మరొక కేసు షెహజాదీకి చుట్టుకుంది. యూఏఈ చట్టాలు కఠినంగా అమలు చేయడంతో ఆమెకు మరణశిక్ష అమలు చేసింది అక్కడ కోర్టు.చివరి కోరికను అడగ్గా..మరణశిక్ష అమలుకు ముందు గత నెల 16వ తేదీన చివరి కోరిక ఏమటని అడగ్గా.. కుటుంబ సభ్యులతో మాట్లాడిన తెలిపింది. తాను నిర్దోషినని కుటుంబ సభ్యుల ముందు కన్నీటి పర్యంతమైంది. అదే చివరిసారి ఆమె కుటుంబంతో మాటలని తండ్రి అంటున్నారు. -
వారి కోసం జుకర్‌బర్గ్ ఫ్యావరెట్ హుడీ వేలం : మార్క్ డ్యాన్స్ వైరల్ వీడియో
మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ తనకెంతో ఇష్టమైన పాత హుడీని వేలం వేశారు. తద్వారా వచ్చిన సొమ్మును టెక్సాస్ పాఠశాల సంక్షేమం కోసం వినియోగించనున్నారు. బిజినెస్ ఇన్సైడర్ ప్రకారం, ఈ ప్రియమైన హూడీతోపాటు బిడ్ దక్కించుకున్న వ్యక్తికి జుకర్‌బర్గ్ స్వయంగా చేతితో రాసిన నోట్ కూడా దక్కింది. దీనిని ఫేస్బుక్ స్టేషనరీలో రూపొందించారట.2019లో తరచుగా ధరించే నల్లటి హూడీ లాస్ ఏంజిల్స్‌లో జరిగిన వేలంలో భారీ ధరకు అమ్ముడు బోయింది. జూలియన్స్ ఆక్షన్స్ వారి "స్పాట్లైట్: హిస్టరీ అండ్ టెక్నాలజీ" సిరీస్‌లో భాగంగా గత గురువారం ఈ వేలం నిర్వహించింది. దీనికున్న పర్సనల్ టచ్, క్రేజ్ అభిమానులను స్పష్టంగా ఆకట్టుకున్నాయి. దీంతో చాలా వేగంగా బిడ్డింగ్ జరిగింది. దాదాపు 22 బిడ్లు వచ్చాయి. చివరకు రూ.13 లక్షల కంటే ఎక్కువ ధర పలికింది. View this post on Instagram A post shared by Mark Zuckerberg (@zuck) ఇది తన ఆల్-టైమ్ ఫేవరెట్లలో ఒకటిగా అభివర్ణించారు జుకర్‌బర్గ్. , "నేను తొలినాళ్లలో దీన్ని ఎప్పుడూ ధరించేవాడిని. దాని లోపల మా అసలు మిషన్ స్టేట్మెంట్ కూడా ప్రింట్ అయి ఉంది" అని గుర్తు చేసుకున్నారు. ఈ హూడీ 2010 నాటిది. ఇదే ఏడాది జుకర్‌బర్గ్ టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యారు. ఈ వేలం ద్వారా వచ్చిన మొత్తం సొమ్మను టెక్సాస్‌లోని పాఠశాల పిల్లలకు మద్దతు ఇవ్వడానికి అంకితం చేస్తామని మార్క్ ప్రకటించారు. దీంతోపాటు పాటు ఆపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ ధరించిన సిగ్నేచర్ బో టై కూడా వేలంలో అమ్ముడైన ఇతర ప్రసిద్ధ వస్తువులలో ఒకటిగా దాదాపు రూ. 31 కోట్లకు బిడ్దక్కించుకుంది. దీని అసలు ధర వెయ్యి డాలర్లుమాత్రమే.మార్క్ డ్యాన్స్, భార్య ఫిదా మరోవైపు మార్చి 1న, భార్య ప్రిస్సిల్లా చాన్ పుట్టినరోజు సందర్భంగా జుకర్‌బర్గ్ డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. బ్లాక్ అండ్ వైట్ టక్సేడోలో పార్టీలో ఎంట్రీఇచ్చి టక్సేడోను చింపేసి మరీ, ఒక్క ఉదుటున స్టేజ్‌పైకి అద్భుతమైన నీలిరంగు జంప్‌సూట్‌లో పాట పాడి, డ్యాన్స్ చేశాడు. దీంతో చాన్ ఫిదా అయిపోయింది. తెగ వైరలవుతోంది. 2025 గ్రామీ అవార్డుల వేడుకలో బెన్సన్ బూన్ బ్యూటిఫుల్ థింగ్స్ ప్రదర్శన ఇస్తున్నప్పుడు ధరించిన జంప్‌సూట్ కూడా ఇలాంటిదేనట. -
ఆకర్షించే స్క్వేర్ వేవ్స్.. దగ్గరకు వెళ్తే అంతే సంగతులు
మీరు సముద్రంలో ఎప్పుడైనా చతుర్భుజాకారపు అలలను(Square Waves) గమనించారా? వాటి దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేశారా? అయితే ఆ అలల గురించి తెలిస్తే వణికిపోతారు. సముద్రంలో అత్యంత ప్రమాదకరమైన అలలలో చదరపు అలలు ప్రధానమైనవి. వీటిని స్క్వేర్ వేవ్స్, క్రాస్ సీ లేదా గ్రిడ్ వేవ్స్ అని కూడా అంటారు. ఇవి అత్యంత అరుదుగా ఏర్పడినప్పటికీ, ఎంతో శక్తివంతమైనవి. సముద్రంలో చాలావరకూ అలలు ఒడ్డుకు చేరుకున్నాక తీరప్రాంతానికి అడ్డంగా , సమాంతరంగా వీడిపోతాయి. అయితే ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలోని సముద్రాలలో నీటి ఉపరితలంపై చదరంగం బోర్డు లాంటి అలలు ఏర్పడటం అరుదుగా జరుగుతుంటుంది. పై నుండి ఈ అలను చూస్తే, చతురస్రాకారపు అలలను ఏర్పరిచేవిధంగా నీటి అడుగున ఏదో గ్రిడ్ ఉన్నట్లు అనిపిస్తుంది. సముద్ర తీరంలోని లైట్‌హౌస్(Lighthouse) లేదా కొండప్రాంతాల నుంచి సముద్రంపైకి డ్రోన్‌ను ఎగురవేసినపపుడు సముద్రంలో ఇటువంటి అలలను గుర్తించవచ్చు. One of the most dangerous wave in ocean the Square Waves. These are also known as cross-sea or grid waves. If you see them, get out of the water. Though rare, they are associated with strong and powerful rip tides. pic.twitter.com/davAmfTNbZ— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) March 2, 2025సముంద్రంలోని నీటి అడుగున జరుగుతున్న ఏ పరిస్థితుల కారణంగానూ ఈ అలలు ఏర్పడవు. సముద్రంలోని నీరు కదులుతున్న తీరుతెన్నులను అనుసరించి ఈ స్క్వేర్ వేవ్స్ ఏర్పడతాయి. రెండు సముద్రాల ఖండన సమయంలో ఈ విధమైన చదరపు తరంగాలు ఏర్పడతాయి. ఆ ప్రాంతంలోని వాతావరణ స్థితిగతుల(Weather conditions) కారణంగానూ ఇలాంటి అలలు ఏర్పడతాయి. రెండు వ్యతిరేక అలలు ఢీకొన్నప్పుడు, ఒక ప్రత్యేకమైన నమూనాలో అల ఉద్భవిస్తుంది. చతురస్రాకార అలల రూపం ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. అయితే ఆ అలులు ఎంతో ప్రమాదకరమైనవి.సముద్రంలో చతురస్రాకారను అలలు కనిపిస్తే, వీలైనంత త్వరగా అక్కడి నుంచి బయటపడాలని నిపుణులు సూచిస్తున్నారు. అనుభవజ్ఞులైన ఈతగాళ్లు కూడా ఇటువంటి అలలకు దూరంగా ఉండాలి. ఈ అలలు పడవ ప్రమాదాలకు దారితీస్తాయి. ఈ అలలు ప్రపంచవ్యాప్తంగా పలు బీచ్‌లలో కొద్ది నిమిషాల్లో కనిపించి అదృశ్యమవుతుంటాయి. చతురస్రాకార అలలు ఫ్రాన్స్‌లోని ఐల్ డి రేలో తరచూ కనిపిస్తుంటాయి. దక్షిణ పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రంలో కూడా ఇవి కనిపిస్తుంటాయి.ఇది కూడా చదవండి: World Wild Life Day: వన్యప్రాణులతోనే మానవ మనుగడ -
అమెరికాలో కాల్పుల కలకలం.. వీడియో వైరల్
లూసియానా: అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం చోటుచేసుకుంది. లూసియానా(Louisiana)లోని ఫ్రాంక్లిన్టన్లో జరిగిన మార్డి గ్రాస్ పరేడ్‌లో ఈ కాల్పుల ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కాల్పుల తర్వాత పరేడ్‌లో చోటుచేసుకున్న గందరగోళం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు ఇంకా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. ‘ఎక్స్’ హ్యాండిల్లో ఈ బ్రేకింగ్ న్యూస్(Breaking News) ప్రత్యక్షమయ్యింది. BREAKING🚨: Several individuals were injured in a shooting that took place during a parade in Franklinton, Louisiana, a small town located in Washington Parish. The incident disrupted what was intended to be a festive community event.— Officer Lew (@officer_Lew) March 3, 2025 ఇది కూడా చదవండి: 9,000 హార్స్పవర్ రైలు ఇంజిన్ సిద్ధం.. ఎంత మాల్ లాగుతుందంటే.. -
జాబిల్లిపై ల్యాండర్ల సందడి!
చంద్రుడిపై ‘బ్లూ ఘోస్ట్’ ల్యాండర్ ఆదివారం సాఫీగా దిగింది. ఈ ల్యాండర్ సృష్టికర్త, ఆపరేటర్ అమెరికాకు చెందిన ప్రైవేటు సంస్థ ‘ఫైర్ ఫ్లై ఏరోస్పేస్’. 1972లో అపోలో-17 మానవసహిత మిషన్ తర్వాత చంద్రుడిపై అమెరికా వ్యోమనౌక ఒకటి ‘సాఫ్ట్ ల్యాండింగ్’ కావడం ఇది రెండోసారి. అమెరికన్ ప్రైవేటు సంస్థ ‘ఇంట్యూటివ్ మెషీన్స్’ ప్రయోగించిన ‘ఒడిస్సియస్’ ల్యాండర్ (ఐఎం-1) సైతం నిరుడు ఫిబ్రవరిలో జాబిల్లి దక్షిణ ధృవంపై ఓ బిలంలో దిగింది. 1972లో చివరిసారిగా చంద్రుడిపై ఇద్దరు అమెరికన్ వ్యోమగాములు దిగి నడయాడిన 50 ఏళ్ల అనంతరం ‘ఒడిస్సియస్’ తొలి సాఫ్ట్ ల్యాండింగ్ ఘనత సాధించింది. అయితే దిగుతూనే ఓ కాలు విరిగి ల్యాండర్ ఒక పక్కకు ఒరిగినప్పటికీ దాన్ని కూడా సాఫ్ట్ ల్యాండింగ్ గానే శాస్త్రవేత్తలు పరిగణించారు. మనకు కనిపించే చంద్రుడి (ఇవతలి వైపు) ఈశాన్య ప్రాంతంలో ఘనీభవించిన లావాతో నిండిన ఓ ప్రాచీన, సువిశాల బిలం ‘మేర్ క్రిసియం’ ఉపరితలంపై నాలుగు కాళ్లతో ‘బ్లూ ఘోఃస్ట్’ ల్యాండర్ ఆదివారం దిగింది. కారు సైజులో ఉన్న ఈ ల్యాండర్ నిర్మాణానికి ‘నాసా’ నిధులు అందించింది. దీని జీవిత కాలం రెండు వారాలు. ఈ వ్యవధిలో అది చంద్రుడి ఉపరితలంపై నాసా నిర్దేశించిన సుమారు పది శాస్త్ర, సాంకేతిక ప్రయోగాలు చేపడుతుంది. ఇళ్లలో మనం వాడే వాక్యూమ్ క్లీనర్ తెలుసు కదా. అలాంటి ‘వాక్యూమ్’తో చంద్రధూళిని లోపలికి పీల్చుకుని ల్యాండర్ విశ్లేషిస్తుంది. చంద్రుడి ఉపరితలంపై పది అడుగుల లోతు వరకు డ్రిల్ చేసి ఉష్ణోగ్రతలను కొలుస్తుంది. ‘ఒడిస్సియస్’, ‘బ్లూ ఘోస్ట్’ రెండూ ప్రైవేటు సంస్థల ల్యాండర్లు కావడం మరో విశేషం. చంద్రబిలం చీకట్లోకి దూకనున్న ‘గ్రేస్’ హోపర్!‘ఇంట్యూటివ్ మెషీన్స్’ సంస్థ గత నెల 26న ప్రయోగించిన మరో ల్యాండర్ ‘అథీనా’ (ఐఎం-2) కూడా ఈ నెల 6న చంద్రుడి దక్షిణ ధృవం చెంత దిగబోతోంది. ‘స్పేస్ ఎక్స్’ సంస్థ రాకెట్ ఫాల్కన్-9తో కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి ‘అథీనా’తోపాటే ‘లూనార్ ట్రైల్ బ్లేజర్’ ఉపగ్రహాన్ని కూడా ప్రయోగించారు. ‘లాక్ హీద్ మార్టిన్’ సంస్థ తయారుచేసిన 200 కిలోల ఈ బుల్లి ఉపగ్రహం చంద్రుడికి దగ్గరగా ధ్రువకక్ష్యలో పరిభ్రమిస్తూ నీటి వనరుల మ్యాపింగ్ పనిలో నిమగ్నమవుతుంది. చంద్రుడి దక్షిణ ధృవానికి 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న అత్యంత ఎత్తైన పర్వతం ‘మాన్స్ మౌటన్’ వద్ద దిగనున్న 15 అడుగుల ల్యాండర్ ‘అథీనా’లో... మినీ రోవర్ ‘మాప్’ (మొబైల్ అటానమస్ ప్రాస్పెక్టింగ్ ప్లాట్‌ఫామ్), ‘గ్రేస్’ హోపర్ ఉన్నాయి. కంప్యూటర్ సైంటిస్టు గ్రేస్ హోపర్ పేరు దానికి పెట్టారు. చంద్రుడిపై ల్యాండర్ దిగిన పరిసరాల చుట్టూతా ఓ మైలు వ్యాసార్ధం పరిధిలో ‘గ్రేస్’… హైడ్రజీన్ ఇంధనం నింపిన తన థ్రస్టర్స్ సాయంతో గెంతుతూ అన్వేషిస్తుంది. ల్యాండర్ దిగే ప్రదేశానికి 400 మీటర్ల దూరంలో... ఎన్నడూ సూర్యకాంతి సోకని, శాశ్వతంగా చీకటిగా ఉండే 65 అడుగుల లోతైన ‘హెచ్ బిలం’లోకి ‘గ్రేస్’ లంఘించబోతోంది. గడ్డ కట్టిన నీటి కోసం బిలంలోని నేల ప్రాంతాన్ని శోధించడం దాని ప్రధాన లక్ష్యం. ఎందుకంటే ఈ పనిని చక్రాలతో కదిలే రోవర్ చేయలేదు! ‘గ్రేస్’ రోబో మూడు అడుగుల పరిమాణంలో ఉంటుంది. పరిసరాలు, పరిస్థితులను నిశితంగా పరిశీలించి, నిర్ణయం తీసుకుని, కార్యోన్ముఖం చేయగల (సిచ్యువేషనల్ అవేర్నెస్) కెమెరా, లిడార్ (లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్), నక్షత్రాల స్థానాన్ని గుర్తిస్తూ ముందుకు కదలడానికి ఉపయోగపగే ‘స్టార్ ట్రాకర్’ సాయంతో ‘గ్రేస్’ ఒక చోట నుంచి మరో చోటికి గెంతుతుంది. మొదట 20, తర్వాత 50, ఆ తర్వాత 100 మీటర్ల ఎత్తులో ఎగురుతుంది. ఈ మూడు గెంతుల్లో బిలం చేరుకుని దాని నేలపై వాలుతుంది. గడ్డకట్టిన నీటి ఆనవాళ్ల కోసం అన్వేషిస్తుంది. ముప్పావు గంట సేపు అక్కడ ఉండి, ఫొటోలు తీశాక మళ్లీ ‘గ్రేస్’ ఉపరితలంపైకి వస్తుంది. చంద్రుడిపై హోపర్ ప్రయోగం ఇదే ప్రథమం. రోవర్లు చేయలేని పనులను సుసాధ్యం చేసేందుకు తలపెట్టిన సాంకేతిక ప్రదర్శన ఇది. చైనా వచ్చే ఏడాది ‘చాంగే-7 మిషన్’తో చంద్రుడిపైకి ఇలాంటి హోపర్ పంపనుంది. ‘పెర్సెవరెన్స్’ రోవర్ వెంట అరుణగ్రహం అంగారకుడిపైకి నాసా పంపిన ‘ఇంజెన్యుటీ’ హెలికాప్టర్ ఆ గ్రహ వాతావరణంలో ఎగురుతూ పరిశోధనలు చేసిన సంగతి తెలిసిందే. చందమామపై ‘అథీనా’ ల్యాండర్ పనిచేసేది పది రోజులే. ‘నాసా’ రూపొందించిన పది శాస్త్రీయ పరికరాలను అందులో అమర్చారు. వీటిలో ఎక్కువ పరికరాలు చంద్రుడి దక్షిణ ధృవం సమీపంలో గడ్డకట్టిన నీరు, ఇతర వనరుల జాడను కనుగొనడానికి ఉద్దేశించినవి. ఈ అన్వేషణలో నీటి ఆధారాలేవైనా బయల్పడితే వాటిని చంద్రుడిపై భవిష్యత్తులో నిర్మించే మానవ ఆవాసాలకు వినియోగించుకోవాలనేది నాసా ఆలోచన. 14న చంద్రగ్రహణానికి ప్రత్యక్ష సాక్షులు!పరిస్థితులన్నీ సవ్యంగా సాగితే... ఈ నెల 14న చంద్రగ్రహణానికి ‘బ్లూ ఘోస్ట్’, ‘అథీనా’ ల్యాండర్లు ప్రత్యక్ష సాక్షులవుతాయి. గ్రహణ వేళలో భూమి ఛాయ చంద్రుడిని క్రమంగా కప్పివేయడాన్ని ల్యాండర్లు రెండూ వీక్షిస్తాయి. ఆ తర్వాత మరో రెండు రోజులకు చంద్రుడిపై ల్యాండర్లు దిగిన ప్రాంతంలో ‘14 రోజుల రాత్రి కాలం’ మొదలై క్రమంగా చీకట్లు ముసురుకుంటాయి. అప్పుడిక ల్యాండర్లు పనిచేయడానికి సౌరశక్తి ఉండదు. పైగా అక్కడ అతి శీతల వాతావరణం నెలకొంటుంది. అంటే... ల్యాండర్లు రెండూ డెడ్ అవుతాయి. 2030 కల్లా చంద్రుడిపైకి అమెరికన్లు!తమ ‘ఆర్టెమిస్’ కార్యక్రమంతో ఈ దశాబ్దం చివరికల్లా వ్యోమగాములను చంద్రుడిపైకి పంపాలని నాసా యోచిస్తోంది. వాస్తవానికి ‘ఐఎం-2 మిషన్’ను నాసా రూ.550 కోట్లకు కొనుగోలు చేసింది. ‘బ్లూ ఘోస్ట్’, ఐఎం-1, ఐఎం-2... ఇవన్నీ ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో కూడిన నాసా కమర్షియల్ లూనార్ పేలోడ్ సర్వీసెస్ (సీఎల్పీఎస్)లో భాగం. 2028 వరకు ఇలాంటి మిషన్స్ చేపట్టడానికి నాసా రమారమి రూ.25 వేల కోట్లు కేటాయిస్తోంది. ప్రైవేటు సంస్థలతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంటూ శాస్త్ర సాంకేతికతను వృద్ధి చేస్తోంది. (Credits: Sky News, NASASpaceflight.com, Space Intelligence, The Hindu, India Today, Space.com, Gizmodo, Scientific American, CNN)-జమ్ముల శ్రీకాంత్ -
డీల్ ఓకే.. ట్రంప్‌తో మరోసారి భేటీకి సిద్ధమే: జెలెన్స్కీ
కీవ్: ఉక్రెయిన్‌కు యూరోపియన్ యూనియన్ నేతల నుంచి మద్దతు వస్తున్న వేళ అధ్యక్షుడు జెలెన్స్కీ మరో కీలక ప్రకటన చేశారు. అమెరికా అధ్యక్షుడు ఆహ్వానిస్తే మరోసారి భేటీకి వెళ్తానని జెలెన్స్కీ చెప్పుకొచ్చారు. అమెరికాతో డీల్‌కు తాను సిద్ధంగా ఉన్నట్టు చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన ప్రకటనపై ట్రంప్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తాజాగా వీడియోలో మాట్లాడుతూ.. ‘అమెరికాతో మేము సత్సంబంధాలను కాపాడుకోగలం. తీవ్రమైన, నిజమైన సమస్యలను పరిష్కరించుకోవడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో మరోసారి భేటీ అయ్యేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. నిర్మాణాత్మక సంభాషణ కోసం ఆహ్వానిస్తే తప్పకుండా ట్రంప్‌ను కలుస్తాను. అలాగే, ఖనిజాల ఒప్పందంపై సంతకం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇరువర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే సంతకం చేస్తాను. ఇది భద్రతా హామీల వైపు మొదటి అడుగు అవుతుంది. భద్రతా హామీలు లేని కాల్పుల విరమణ ఉక్రెయిన్‌కు ప్రమాదకరం. మేము గత మూడు సంవత్సరాలుగా పోరాడుతున్నాము. అమెరికా మా వైపు ఉందని ఉక్రేనియన్ ప్రజలు తెలుసుకోవాలి. మాకు కావాల్సింది శాంతి. అంతులేని యుద్ధం కాదు. అందుకే భద్రతా హామీలు దీనికి కీలకమని మేము చెబుతున్నాం’ అంటూ కామెంట్స్ చేశారు.ఇటీవల డొనాల్డ్ ట్రంప్, జెలెన్స్కీ మధ్య వైట్‌హౌస్ వేదికగా జరిగిన చర్యల వాగ్వాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. అమెరికా, ఉక్రెయిన్ మధ్య ఖనిజాల ఒప్పందం ముందుకు సాగలేదు. జెలెన్స్కీపై ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. ఉక్రెయిన్ కారణంగా మూడో ప్రపంచ యుద్ధం వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రష్యాకు భూభాగాన్ని కోల్పోవడానికి ఉక్రెయిన్ సిద్ధంగా ఉండాలన్నారు. ఇకపై ఉక్రెయిన్‌కు సాయం చేసేది లేదని కుండబద్దలు కొట్టారు. As a result of these days, we see clear support from Europe. Even more unity, even more willingness to cooperate.Everyone is united on the main issue – for peace to be real, we need real security guarantees. And this is the position of all of Europe – the entire continent. The… pic.twitter.com/inGxdO8jQz— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) March 3, 2025 -
World Wild Life Day: వన్యప్రాణులతోనే మానవ మనుగడ
అంతరించిపోతున్న వన్యప్రాణులను సంరక్షించే ఉద్దేశంతో ప్రతి ఏటా మార్చి 3న ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం వెనుక ఉద్దేశ్యం ఏమిటంటే.. సహజ వనరుల ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం, వాటి పరిరక్షణకు పాటు పడాలనే భావనను పెంపొందించుకోవడం.ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం(World Wild Life Day) అనేది సమైక్యంగా వన్యప్రాణుల సంరక్షణ కోసం పాటుపడటాన్ని ప్రోత్సహిస్తుంది. గతంలో అంతర్జాతీయ వన్యప్రాణుల వాణిజ్యాన్ని నిషేధించే ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం తీసుకువచ్చింది. తద్వారా అంతరించిపోతున్న జాతులను రక్షించేందుకు చర్యలకు ఉపక్రమించింది. 2013, డిసెంబర్ 20న ఐక్యరాజ్యసమితి తన జనరల్ అసెంబ్లీలో ప్రతి ఏటా మార్చి 3న ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది.అంతర్జాతీయ వన్యప్రాణుల వ్యాపారాన్ని నిషేధించే ప్రతిపాదనపై ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ(United Nations General Assembly) 1973 మార్చి 3న సంతకం చేసింది. దీనికి గుర్తుగా అదేరోజున ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ దినోత్సవం నిర్వహణ ద్వారా అంతరించిపోతున్న జంతువులు, మొక్కలను సంరక్షించేందుకు ప్రేరణ కలుగుతుంది. ఈ దినోత్సవాన్ని మొదటిసారిగా2014, మార్చి 3న జరుపుకున్నారు.ప్రాముఖ్యతవన్యప్రాణులు అంతరించిపోవడం అనేది పర్యావరణ సమతుల్యతను మాత్రమే కాకుండా అభివృద్ధిని కూడా ప్రభావితం చేస్తుంది. అటవీ జంతువులు, మొక్కలు, వృక్షాల సంరక్షణ తప్పనిసరి. వాటిని సంరక్షించడం ద్వారా, మనిషి భూమిపై జీవితాన్ని సక్రమంగా కొనసాగించగులుగుతాడు. ఈ అంశాలను గుర్తించేందుకే వన్యప్రాణి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వన్యప్రాణుల సంరక్షణలో ఐక్యరాజ్యసమితి లక్ష్యాల దిశగా మనమంతా ముందుకు సాగాలి. వన్యప్రాణుల సంరక్షణకు పరిష్కారాలను కనుగొనాలి. అంతరించిపోతున్న జాతుల పరిరక్షణపై దృష్టి సారించాలి. వన్యప్రాణుల సంరక్షణకు వివిధ దేశాలు ఉమ్మడి ప్రయత్నాలు సాగించాలి. ఇది కూడా చదవండి: సోమనాథుని సన్నిధిలో ప్రధాని మోదీ పూజలు -
గగనాన్ని జయించినా..
సూళ్లూరుపేట: భారత క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహ ప్రయోగాల్లో ఇస్రో బాలారిష్టాలను దాటలేకపోతోంది. ఇప్పటికే 7 ఉపగ్రహాలను ప్రయోగించినా అనుకోని సాంకేతిక అవాంతరాలతో సత్ఫలితాలను సాధించలేకపోతోంది. భారత క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహ (ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం) వ్యవస్థలో ఇంకా తప్పటడుగులు పడుతూనే ఉన్నాయి. ఈ ఏడు ఉపగ్రహాల సిరీస్‌లో ఐఆర్ఎన్ఎస్ఎస్–1 ఉపగ్రహం సాంకేతిక లోపంతో పని చేయడం లేదు.దీనిస్థానంలో 2017 ఆగస్ట్ 31న ఐఆర్ఎన్ఎస్ఎస్–1హెచ్ పేరుతో చేసిన ప్రయోగం విఫలమైంది. మళ్లీ ఐఆర్ఎన్ఎస్ఎస్–1ఐ ఉపగ్రహాన్ని ప్రయోగించి ఐఆర్ఎన్ఎస్ఎస్–1ఏ స్థానంలో ప్రవేశపెట్టినప్పటికీ సొంత నావిగేషన్ వ్యవస్థ అందుబాటులోకి రాలేదు. ఇదిలావుండగానే ఈ నావిగేషన్ వ్యవస్థలో సెకండ్ జనరేషన్ శాటిలైట్ వ్యవస్థ పేరుతో నావిక్–01 ఉపగ్రహాన్ని 2023లో ప్రయోగించారు. ఈ ఏడాది జనవరి 31న నావిక్–02 ఉపగ్రహాన్ని ప్రయోగించారు. నావిగేషన్ ఉపగ్రహాల శ్రేణిలో కొన్నింటికి కాలపరిమితి ముగియనుండటంతో వాటి స్థానంలో నావిక్ ఉపగ్రహాలను ప్రవేశపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. నావిక్–02 ఉపగ్రహం జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ నుంచి జియో ఆర్బిట్‌లోకి ఇంకా చేరలేదు. ఉపగ్రహంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అపోజి ఇంధనాన్ని మండించేందుకు ఆక్సిడైజర్ వాల్‌్వలు తెరుచుకోకపోవడం వల్ల కక్ష్య దూరాన్ని పెంచలేకపోతున్నారు. ఈ ఉపగ్రహం కూడా విఫలమైనట్టుగానే ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీంతో భారతదేశానికి సొంత నావిగేషన్ వ్యవస్థ ఎప్పటికి అందుబాటులోకి వస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది.7 ఉపగ్రహాల అవసరాన్ని గుర్తించి..భారతదేశానికి పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నావిగేషన్ సిస్టం తయారు చేసుకోవడానికి ఏడు ఉపగ్రహాల అవసరాన్ని 2006లో ఇస్రో గుర్తించింది. దీనికి రూ.3,425 కోట్ల వ్యయం అవుతుందని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. దీనికి కేంద్రం ఆమోద ముద్ర వేసి బడ్జెట్లో నిధులు కూడా కేటాయించింది. భారత క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థలో మొత్తం ఏడు ఉపగ్రహాలకు రూ.1,000 కోట్లు, రాకెట్లకు రూ.1,125 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ చేపట్టారు. ఈ ఉపగ్రహ వ్యవస్థకు ప్రత్యేకంగా బెంగళూరు సమీపంలోని బైలాలు అనే ప్రాంతంలో రూ.1,300 కోట్లతో గ్రౌండ్ స్టేషన్ నిర్మాణం కూడా చేశారు.సొంత నావిగేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి 2006లోనే ప్రణాళికలు సిద్ధం చేసుకుని 2013 జూన్ 1న ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం (ఐఆర్ఎన్ఎస్ఎస్–1ఏ) ఉపగ్రహ ప్రయోగంతో శ్రీకారం చుట్టారు. 2014 ఏప్రిల్ 4న ఐఆర్ఎన్ఎస్ఎస్–1బీ, అక్టోబర్ 16న ఐఆర్ఎన్ఎస్ఎస్–1సీ, 2015 మార్చి 28న ఐఆర్ఎన్ఎస్ఎస్–1డీ, 2016 జనవరి 20న ఐఆర్ఎన్ఎస్–1ఈ, మార్చి 10న ఐఆర్ఎన్ఎస్ఎస్–1ఎఫ్, ఏప్రిల్ 28న ఐఆర్ఎన్ఎస్ఎస్–1జీ ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.ఇందులో 1ఏ ఉపగ్రహంలో సాంకేతిక లోపం తలెత్తడంతో దీని స్థానంలో 2017 ఆగస్ట్ 31న ఐఆర్ఎన్ఎస్ఎస్–1హెచ్ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. అది విఫలమైంది. తిరిగి 2018 ఏప్రిల్ 12న ఐఆర్ఎన్ఎస్ఎస్–1ఐ ఉపగ్రహాన్ని 1ఏ ఉపగ్రహం స్థానంలో రీప్లేస్ చేశారు. ఇందులో కొన్ని ఉపగ్రహాలకు కాల పరిమితి కూడా ముగియనుండటంతో నావిగేషన్ వ్యవస్థను బలోపేతం చేయడానికి సెకండ్ జనరేషన్ పేరుతో నావిక్–01 సిరీస్‌లో ఐదు ప్రయోగాలకు శ్రీకారం చుట్టగా.. వీటిలో రెండు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇందులో ఒకటి ఉపగ్రహం కక్ష్యలోకి వెళ్లినప్పటికీ దాన్ని భూమికి 36 వేల కిలోమీటర్ల దూరంలోని జియో ఆర్బిట్‌లోకి పంపే ప్రక్రియ సాంకేతిక లోపంతో ఆగిపోయింది. చిన్నచిన్న అవాంతరాలతో తప్పని ఇబ్బందులునావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థలోని 7 ఉపగ్రహాల్లో 3 ఉపగ్రహాలు భూమికి 36 వేల కిలోమీటర్లు ఎత్తులోని భూస్థిర కక్ష్యలో 34 డిగ్రీలు, 83 డిగ్రీలు, 130.5 డిగ్రీ తూర్పు రేఖాంశాల వద్ద కక్ష్యలో ఉండి పనిచేస్తాయి. మిగతా నాలుగు ఉపగ్రహాలు భూమధ్య రేఖలను ఖండించే భూస్థిర కక్ష్యలోనే 55 డిగ్రీలు, 115 డిగ్రీల తూర్పు భూమధ్య రేఖాతలానికి 31 డిగ్రీల వాలుతో ఉండే కక్ష్యలో 12 ఏళ్లపాటు సేవలందిస్తాయి.భూస్థిర కక్ష్యలో వివిధ స్థానాల్లో ఉండి పనిచేయడం ప్రారంభించి స్వదేశీ దిక్సూచి వ్యవస్థను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాల్లో లోపాలు తలెత్తడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భూమి, జల, వాయు మార్గాల స్థితిగతులు దిక్కులు తెలియజేయడం, ఆపద సమయాల్లో భూగోళానికి సంబంధించిన సమాచారం, వాహన చోదకులకు దిశానిర్దేశం, ఇంటర్నెట్తో అనుసంధానం, భారత విమానయాన, నౌకాయాన మార్గాలకు, సైనిక అవసరాలకు కూడా ఈ ఉపగ్రహ వ్యవస్థ అందుబాటులోకి తెచ్చేందుకు నావిగేషన్ సిరీస్ ఉపగ్రహాలను ప్రయోగిస్తూనే ఉన్నప్పటికీ చిన్న చిన్న అవాంతరాల వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే భారతదేశం అంచునుంచి సుమారు 1,500 కిలోమీటర్ల పరిధి వరకు ఈ సేవలు విస్తరించి పనిచేస్తుంది. -
బ్రిటన్ రాజు చార్లెస్-IIIతో జెలెన్స్కీ భేటీ
లండన్: ఉక్రెయిన్ అధ్యక్షు వ్లాదిమిర్ జెలెన్స్కీ (Ukrainian President Zelensky) లండన్‌లోని సాండ్రింగ్‌హామ్ హౌస్‌లో బ్రిటన్ రాజు చార్లెస్- IIIను కలుసుకున్నారు. అంతకుముందు ఆయన బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో భేటీ అయ్యారు. దీనికి సంబంధించి రాజకుటుంబం సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో ‘ఈ రోజు సాయంత్రం బ్రిటన్ రాజు చార్లెస్- III ఉక్రెయిన్ అధ్యక్షుడు @ZelenskyyUa ను సాండ్రింగ్‌హామ్ హౌస్‌కు స్వాగతించారు’ అని పేర్కొన్నారు.సాండ్రింగ్‌హామ్ హౌస్ అనేది ఇంగ్లాండ్‌లోని నార్ఫోక్లో ఉన్న ఒక ప్రైవేట్ నివాసం. ఇది సాంప్రదాయకంగా బ్రిటిష్ రాజకుటుంబం ఆధీనంలో ఉంటుంది. ఉక్రేనియన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీని 10 డౌనింగ్ స్ట్రీట్‌కు స్వాగతించారు. ఉక్రెయిన్‌కు బ్రిటన్ మద్దతు ఉంటుందని జెలెన్స్కీకి బ్రిటన్ రాజు చార్లెస్- III (UKs King Charles iii)హామీ ఇచ్చారని అల్ జజీరా నివేదించింది. This evening, His Majesty The King received the President of Ukraine, @ZelenskyyUa, at Sandringham House. 🇺🇦 pic.twitter.com/mhGr7C0BN4— The Royal Family (@RoyalFamily) March 2, 2025అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వైట్ హౌస్‌లో జెలెన్స్కీ జరిపిన చర్చలు ఉద్రిక్తతలకు దారితీశాయి. వాషింగ్టన్ పర్యటన అనంతరం జెలెన్స్కీ బ్రిటన్ రాజు చార్లెస్- IIIని కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది కూడా చదవండి: సోమనాథుని సన్నిధిలో ప్రధాని మోదీ పూజలు -
అమెరికాలో ట్విస్ట్.. జేడీ వాన్స్, మస్క్‌కు ఝలక్
వాషింగ్టన్: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ట్రంప్, జేడీ వాన్స్‌ల ఆవేశపూరిత సంభాషణ అనంతరం అమెరికా అంతటా ఉక్రెయిన్ అనుకూల నిరసనలు జరిగాయి. న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, బోస్టన్లలో వందలాది మంది ప్రజలు ఉక్రెయిన్‌కు మద్దతుగా రోడ్లపైకి వచ్చారు. ‘అమెరికా స్టాండ్స్ విత్ ఉక్రెయిన్’, ‘బి స్ట్రాంగ్ ఉక్రెయిన్’ ప్లకార్డులను ప్రదర్శించారు.హాలిడే కోసం వెర్మోంట్లోని వెయిట్స్ఫీల్డ్కు వచ్చిన వైస్ ప్రెసిడెంట్ వాన్స్, ఆయన కుటుంబానికి వ్యతిరేకంగా నిరసనకారులు ప్రదర్శన చేపట్టారు. మరోవైపు వీరికి వ్యతిరేకంగా, ట్రంప్, వాన్స్‌లకు అనుకూలంగా వెయిట్స్ఫీల్డ్లో కౌంటర్ నిరసనలు కూడా జరిగాయి. ఫెడరల్ ఉద్యోగుల తొలగింపుల నేపథ్యంలో ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా స్టోర్ల ముందు కూడా అమెరికా వ్యాప్తంగా ప్రజలు ఆందోళనలు నిర్వహించారు. Vermont's message to JD Vance: Not in our town, you fascist piece of shit. 😡😡😡😡😡👇 pic.twitter.com/Pk4QwFu3fv— Bill Madden (@maddenifico) March 1, 2025ట్రంప్‌పై నమ్మకం లేదు..ఇదిలా ఉండగా.. అధ్యక్షుడిగా డొనాల్ట్ ట్రంప్ దేశాన్ని ముందుకు నడిపించే విధానంపై ప్రజల్లో ఇప్పటికీ అనుకూల వైఖరి కంటే వ్యతిరేక వైఖరే ఎక్కువగా కనిపిస్తోంది. ట్రంప్‌పై ప్రజామోదం, పని తీరు, నిర్ణయాలు, దేశాన్ని ఆయన సరైన దిశగా నడిపిస్తున్నారా అంటే లేదనే ఎక్కువ మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తమ్మీద ట్రంప్ పని తీరుపై 52 శాతం మంది పెదవి విరిచారు. 48 శాతం మంది మాత్రమే ట్రంప్ పాలన బాగుందన్నారు. ఫిబ్రవరి మధ్యలో సర్వే చేపట్టినప్పుడు సైతం దాదాపు ఇదే ఫలితం రావడం గమనార్హం. ఉద్యోగులపై వేటు సహా ఆయన విధానాలకు సొంత రిపబ్లికన్లు 90 శాతం మంది సానుకూలత చూపగా, ప్రతిపక్ష డెమోక్రాట్లు 90 శాతం మంది వ్యతిరేకత తెలిపారు. స్వతంత్రుల్లో 59 మంది కూడా ట్రంప్ తీరు నచ్చలేదన్నారు. ట్రంప్ విధానాలు దేశాన్ని తప్పుడు మార్గంలో నడిపిస్తున్నాయని 45 శాతం మంది చెప్పగా సరైన దిశగానే దేశం సాగుతోందని 39 శాతం మంది బదులిచ్చారు. కాగా, శుక్రవారం వైట్‌హౌస్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో తీవ్ర వాదోపవాదం జరిగిన ముందు రోజే ఈ పోల్ ముగియడంతో, ఆ ప్రభావం దీనిపై కనిపించలేదు. Hundreds of protesters gathered in Waitsfield on Saturday morning to protest Vice President JD Vance, who is visiting Vermont with his family for a ski trip this weekend. pic.twitter.com/gICcSJBU2a— Vermont Public (@vermontpublic) March 1, 2025 -
అధిక వేడి వల్ల... ముందస్తు ముదిమి!
మెల్బోర్న్: రోజంతా వేడిమి పరిస్థితుల్లో పనిచేశాక అలసిపోయిన భావన కలగడం సహజం. అలసిపోతే పర్లేదు గానీ దానివల్ల ఆయుష్షు కూడా వేగంగా క్షీణిస్తుందట! పర్యావరణ ఒత్తిళ్లకు తలొగ్గి మన శరీరంలో చాలా మార్పులే జరుగుతాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. డీఎన్ఏలో మార్పులు జరగకపోయినా మారే ఉష్ణ పరిస్థితులకు తగ్గట్లు ఒంట్లో ఏ ప్రొటీన్ ఉత్పత్తి ఏ మేరకు పెరగాలో, ఏది ఎంతగా తగ్గాలో నిర్ణయాలు జరిగిపోతాయట. ఈ ఎపీజెనిటిక్స్ శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆ్రస్టేలియాలో జరిగిన తాజా అధ్యయనంలో తేలింది. అధిక ఉష్ణోగ్రతలు మనిషిపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశంపై మొనాష్ విశ్వవిద్యాలయంలోని రోంగ్బిన్ క్సూ, యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్లోని షుఆయ్ లీ సారథ్యంలోని అధ్యయన బృందం పరిశోధన చేసింది. అత్యధిక ఉష్ణోగ్రతలకు లోనైన వ్యక్తుల్లో వృద్దాప్య ఛాయలు త్వరగా కనిపిస్తాయని తేల్చారు. అంతేకాదు, దీర్ఘకాలం పాటు వేడిమి పరిస్థితుల ప్రభావానికి గురైతే వృద్ధుల ఆయుష్షు రెండేళ్లకు పైగా హరించుకు పోతుందని వెల్లడించారు! వాతావరణ మార్పుల ప్రభావం వాతావరణ మార్పుల వల్ల వేడి పెరిగేకొద్దీ మన శరీరం మరింత ఒత్తిడికి గురవుతుంది. ఈ ఒత్తిడే వృద్ధాప్యం త్వరగా రావడానికి ప్రధాన కారణంగా మారుతోంది. ముఖ్యంగా వడగాల్పులకు, వేడి వాతావరణానికి చిరునామాగా నిలిచే ఆ్రస్టేలియాలో కొన్నేళ్లుగా ఈ పరిస్థితులు పరిపాటిగా మారుతున్నాయి. ఉష్ణోగ్రత ప్రభావ మార్పులు అక్కడ మనుషులపై స్పష్టంగా కనిపించాయని అధ్యయనం పేర్కొంది. జెనటిక్ స్థాయిల పరిస్థితేంటి? తీసుకునే ఆహారానికి తగ్గట్లు శరీరంలో మార్పులు జరుగుతాయి. పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, దుంపల వంటి తేలిగ్గా జీర్ణమయ్యే సహజసిద్ద ఆహారం తీసుకుంటే ప్రోటీన్లు, విటమిన్లు తగిన మోతాదులో అంది శరీరంలో సానుకూల మార్పులు జరుగుతాయి. అలాగాక బాగా వేయించిన, ప్యాక్ చేసిన, నూనెలు అతిగా వాడిన, పూర్తి ప్రాసెస్డ్ ఆహారం తీసుకుంటే పోషకాలందక ఒంట్లో ప్రతికూల మార్పులు సంభవిస్తాయి. దాంతో వయసు మీద పడకుండా ఆపే సహజసిద్ధ సామర్థ్యం తగ్గుతుంది. వేడిమి సందర్భాల్లోనూ ఒంట్లోని జన్యు కణాలు విరుద్ధ రీతిలో స్పందిస్తాయి. ఫలితంగా ఏ సందర్భంలో ఏ రకం ప్రొటీన్‌ను ఎంత మోతాదులో ఉత్పత్తి చేయాలనే డీఎన్ఏ సీక్వెన్స్ దెబ్బ తింటుంది. ఇది శరీర భౌతిక క్రియలపై ప్రతికూల ప్రభావం చూపి ఆరోగ్య స్థితిని పాడుచేసే ప్రమాదముంది. వేడిమి వృద్దాప్య రేటును నిర్దేశించే జన్యు కణాలను అసంబద్ధంగా క్రియాశీలం చేస్తుంది. అలా ముందుగానే వృద్ధాప్యంలోకి జారిపోతాం. పరిశోధనల్లోఏం తేలింది? 68 ఏళ్ల పైబడిన 3,700 మందిపై సదరన్ కాలిఫోరి్నయా వ ర్సిటీలో పరిశోధన చేశారు. తక్కువ వయ సు వారిలో పోలిస్తే పెద్దవాళ్ల మీదే అత్యధిక ఉష్ణోగ్రత పరిస్థితులు అధిక ప్రభావం చూ పాయి. వయసు పెరిగేకొద్దీ వేడిని నియంత్రించుకునే సామర్థ్యమూ సన్నగిల్లుతోంది. దాంతో అనారోగ్యం బారిన పడటం, చనిపోవడం వంటివి జరుగుతున్నాయి. వృద్ధాప్య ఛాయలను నిర్ధారించే మూడు రకాలైన పీసీఫీనో ఏజ్, పీసీగ్రిమ్ ఏజ్, డ్యూన్డిన్ పేస్ జీవ గడియార పద్దతుల్లో వలంటీర్ల రక్త నమూనాలను పరిశీలించారు. 2010 నుంచి ఆరేళ్లపాటు వీళ్లంతా అధిక వేడి పరిస్థితులను ఎదుర్కొన్నప్పటి పరిస్థితులను పోలి్చచూశారు. అమెరికాలో ప్రామాణికమైన 32 డిగ్రీ సెల్సియస్ వరకు సాధారణ, 32–39 డిగ్రీలను మధ్యస్థ, 39–51 డిగ్రీల దాకా అతి తీవ్ర వేడిమిగా పరిగణించి వ లంటీర్ల డేటాతో సరిచూశారు. పీసీఫినో ఏజ్ ప్రకారం సుదీర్ఘకాలం వేడికి గురైతే 2.48 ఏళ్లు ముందుగానే వృద్ధాప్యం వస్తుందని తేలింది. పీసీగ్రిమ్ ఏజ్ పద్దతిలో 1.09 ఏళ్లు, డ్యూన్డిన్ పేస్ పద్ధతిలో 0.05 ఏళ్లు ముందుగా వృద్ధాప్యం వస్తుందని వెల్లడైంది. వేడికి, వయసుకు లింకేమిటి? వయసు మీద పడటం సహజ ప్రక్రియ. వృద్ధాప్య ఛాయలు బయట పడటం ఒక్కో మనిషిలో ఒక్కోలా ఉంటుంది. ఒత్తిళ్లు, షాక్ వంటి అనూహ్య ఘటనలు ఎదురైనప్పుడు శరీరంలో పెనుమార్పులు సంభవిస్తాయి. చాన్నాళ్లపాటు సరిగా నిద్ర పోకుంటే వృద్ధాప్య ఛాయలు త్వరగా రావడం ఖాయం. అత్యధిక వేడిమి పరిస్థితులు మనిషిలోని సత్తువను లాగేస్తాయి. జీవక్రియలను పూర్తిస్థాయిలో చేసే సామర్థ్యాన్ని శరీరం క్రమంగా కోల్పోతుంది. వయసు మీదపడే రేటు పెరుగుతుంది. వృద్ధాప్యంలో రావాల్సిన రోగాలు ముందే ముసురుకుంటాయి. -
గాజాకు సాయం ఆపేసిన ఇజ్రాయెల్
టెల్ అవీవ్: హమాస్‌తో కాల్పుల విరమణ తొలి దశ ఒప్పందం శనివారం ముగిసిన నేపథ్యంలో గాజాలోకి మానవతా సాయాన్ని నిలిపేస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఒప్పందాన్ని పొడిగించాలంటే తమ ప్రతిపాదనలకు హమాస్ ఒప్పుకుని తీరాలని షరతు విధించింది. అందుకు హమాస్ ససేమిరా అనడంతో గాజాలోకి నిత్యావసర వస్తువులు, ఔషధాలు, ఇతరత్రా సరకుల రవాణాను ఇజ్రాయెల్ బలగాలు ఆదివారం అడ్డుకున్నాయి. దాంతో మానవతా సాయానికి హఠాత్తుగా అడ్డుకట్టపడింది. దీనిపై హమాస్ ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘‘ సాయం ఆపేయం చౌకబారు బెదిరింపు చర్య. తద్వారా ఇజ్రాయెల్ యుద్ధ నేరానికి పాల్పడుతోంది. తొలి దశ కాల్పుల విరమణ నిబంధనలను ఉల్లంఘిస్తోంది’’ అని ఆరోపించింది. అమెరికా ఆదేశాల మేరకే గాజాకు సాయాన్ని ఆపేశామని ఇజ్రాయెల్ పేర్కొంది. రంజాన్ నేపథ్యంలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఏప్రిల్ 20 దాకా పొడిగించాలన్న అమెరికా అభ్యర్థనకు ఇజ్రాయెల్ అంగీకరించింది. ఆ మేరకు తొలి దశ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగిస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. ఒప్పందంలో తదుపరి దశకు వెళ్లకుండా తొలి దశను పొడిగించడాన్ని హమాస్ తప్పుబట్టింది. తమ బందీల్లో సగం మందిని హమాస్ విడుదల చేస్తేనే రెండోదశ కాల్పుల విరమణకు సిద్ధపడతామని ఇజ్రాయెల్ చెబుతోంది. రెండో దశ చర్చల వేళ మరింతమంది బందీలను వదిలేయాలని డిమాండ్ చేసింది. శాశ్వత కాల్పుల విరమణ ప్రకటించి, ఇజ్రాయెల్ గాజా నుంచి వెనుతిరిగితేనే మొత్తం బందీలను వదిలేస్తామని హమాస్ తేలి్చచెప్పింది. -
చందమామపై బ్లూ ఘోస్ట్
కేవ్ కెనావెరల్ (యూఎస్): చంద్రుడిపై మొట్టమొదటిసారిగా ఒక ప్రైవేట్ సంస్థకు చెందిన ల్యాండర్ సురక్షితంగా దిగి చరిత్ర సృష్టించింది. ఆదివారం అమెరికాలోని ఫైర్‌ఫ్లై ఏరోస్పేస్ సంస్థకు చెందిన బ్లూ ఘోస్ట్ ల్యాండర్ ఆటోపైలట్ విధానంలో నెమ్మదిగా చందమామపై దిగింది. చంద్రుని ఈశాన్య కొనవైపు పురాతన అగ్నిపర్వత సానువుల్లో ఇది దిగిందని ఫైర్‌ఫ్లై ఏరోస్పేస్ చీఫ్ ఇంజనీర్ విల్ కోగన్ ప్రకటించారు. ‘‘దశాబ్దకాలం క్రితం పురుడుపోసుకున్న మా అంకుర సంస్థ చరిత్ర సృష్టించింది. బ్లూ ఘోస్ట్ ల్యాండింగ్ పలు గండాలను తప్పించుకుంది. ఇప్పుడు చంద్రుని ఉపరితలంపై స్థిరంగా ఉంది’’ అని పేర్కొన్నారు. గతంలో పలు దేశాలకు చెందిన ప్రైవేట్ సంస్థలు చంద్రునిపై ల్యాండర్లను దింపేందుకు ప్రయతి్నంచి విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో అదుపు తప్పడం, క్రాష్ ల్యాండింగ్, కూలిపోవడం, ఒరిగిపోవడం వంటి అపశ్రుతులకు తావులేకుండా ఒక ప్రైవేట్ సంస్థ తొలి ప్రయత్నంలోనే విజయవంతంగా చంద్రునిపై ల్యాండర్‌ను దించడం ఇదే తొలిసారి. దేశాల్లో అమెరికా, రష్యా, చైనా, భారత్, జపాన్ మాత్రమే ఇప్పటిదాకా ఈ ఘనత సాధించాయి. బ్లూఘోస్ట్ ల్యాండయిన అరగంటకే చంద్రుని పరిసరాల ఫొటోలు తీసి అమెరికాలో ఆస్టిన్ నగరంలోని సంస్థ మిషన్ కంట్రోల్ కేంద్రానికి పంపింది. అమెరికాలో అరుదైన పేడపురుగు జాతి అయిన బ్లూ ఘోస్ట్ పేరును ఈ ల్యాండర్‌కు పెట్టారు. నాలుగు కాళ్ల ఈ ల్యాండర్ ఎత్తు 2 మీటర్లు. వెడల్పు 3.5 మీటర్లు. జనవరి 15న ఫ్లోరిడాలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి దీన్ని ప్రయోగించారు. ఇది చంద్రునిపై ధూళిని పరీక్షించనుంది. 10 అడుగుల లోతు రంధ్రం చేసి అక్కడి మట్టిని పరిశీలించనుంది. నాసా వ్యోమగాముల స్పేస్సూట్పై పేరుకుపోయే చంద్రధూళిని దులిపేసే పరికరం పనితీరును కూడా అక్కడ పరీక్షించనుంది. గురువారం మరో ల్యాండర్ హూస్టన్‌కు చెందిన ఇంట్యూటివ్ మెషీన్స్ సంస్థకు చెందిన నాలుగు మీటర్ల ఎత్తయిన ల్యాండర్‌ను గురువారం చంద్రునిపై దింపేందుకు కూడా శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. దక్షిణ ధ్రువానికి 100 మైళ్ల దూరంలో కిందివైపు దాన్ని ల్యాండ్ చేయాలని చూస్తున్నారు. గతేడాది ఇదే ప్రాంతంలో ఒక ల్యాండర్‌ను విజయవంతంగా దించినా దాని కాలు విరిగి పక్కకు ఒరిగి నిరుపయోగంగా మారింది. రెండేళ్ల క్రితం ఈ సంస్థ ఒక ల్యాండర్‌ను ప్రయోగించినా అది వేగంగా ఢీకొని చంద్రునిపై కూలిపోయింది. జపాన్‌కు చెందిన ఐస్పేస్ సంస్థ ల్యాండర్ కూడా త్వరలో చంద్రునిపై కాలుమోపనుంది. దీన్ని కూడా బ్లూఘోస్ట్తో పాటే ప్రయోగించారు. -
ట్రంప్‌పై అదే వ్యతిరేకత
వాషింగ్టన్: అధ్యక్షుడిగా డొనాల్ట్ ట్రంప్ దేశాన్ని ముందుకు నడిపించే విధానంపై ప్రజల్లో ఇప్పటికీ అనుకూల వైఖరి కంటే వ్యతిరేక వైఖరే ఎక్కువగా కనిపి స్తోంది. ట్రంప్‌పై ప్రజామోదం, పని తీరు, నిర్ణయాలు, దేశాన్ని ఆయన సరైన దిశగా నడిపిస్తున్నారా అంటే లేదనే ఎక్కువ మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తమ్మీద ట్రంప్ పని తీరుపై 52 శాతం మంది పెదవి విరిచారు. 48 శాతం మంది మాత్రమే ట్రంప్ పాలన బాగుందన్నారు. ఫిబ్రవరి మధ్యలో సర్వే చేపట్టినప్పుడు సైతం దాదాపు ఇదే ఫలితం రావడం గమనార్హం. ఉద్యో గులపై వేటు సహా ఆయన విధానాలకు సొంత రిపబ్లికన్లు 90 శాతం మంది సానుకూలత చూపగా, ప్రతిపక్ష డెమో క్రాట్లు 90 శాతం మంది వ్యతిరేకత తెలిపారు. స్వతంత్రుల్లో 59 మంది కూడా ట్రంప్ తీరు నచ్చలేదన్నారు. ట్రంప్ విధానాలు దేశాన్ని తప్పుడు మార్గంలో నడిపిస్తు న్నాయని 45 శాతం మంది చెప్పగా సరైన దిశగానే దేశం సాగుతోందని 39 శాతం మంది బదులిచ్చారు. 15 శాతం మంది ఏ సమాధానమూ చెప్పలేదు. దేశం ఎదుర్కొంటున్న అత్యంత తీవ్ర సమస్యల పై ట్రంప్ దృష్టి పెట్టడం లేదని 52 శాతం మంది, ప్రాధాన్యతలు బాగానే ఉన్నాయని 40 శాతం మంది అభిప్రాయం వెలిబుచ్చారు. మొత్త మ్మీద 18–34 ఏళ్ల గ్రూపులో 51 శాతం మంది ట్రంప్ పాలన సరిగా లేదని కుండబద్దలు కొట్టారు. అదే సమయంలో మహిళలు కూడా 57 శాతం మంది ట్రంప్ ప్రభుత్వంపై అసంతృప్తి వెలిబుచ్చారు. ఎస్ఎస్ఆర్ సంస్థ ఫిబ్రవరి 24–28వ తేదీల మధ్య దేశవ్యాప్తంగా ర్యాండమ్‌గా ఎంపిక చేసిన 2,212 మందితో సర్వే చేపట్టింది. ఆన్లైన్లో, టెలిఫోన్ ద్వారా లేదా లైవ్ ఇంటర్వ్యూ ద్వారా చేపట్టిన ఈ సర్వే కచ్చితత్వం మైనస్ 2.4 శాతం పాయింట్లు అటూఇటుగా ఉండొచ్చని సీఎన్ఎన్ పేర్కొంది. కాగా, శుక్రవారం వైట్‌హౌస్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో తీవ్ర వాదోపవాదం జరిగిన ముందు రోజే ఈ పోల్ ముగియడంతో, ఆ ప్రభావం దీనిపై కనిపించదు.అక్రమ వలసలు రికార్డు స్థాయిలో తగ్గాయి: ట్రంప్అమెరికాపై అక్రమ వలసల ఆక్రమణ ముగిసిందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ‘‘మెక్సికో సరిహద్దులో అక్రమ వలసలు ఫిబ్రవరిలో చరిత్రాత్మక స్థాయిలో తగ్గాయి. నా కఠిన నిర్ణయాల వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు. ‘‘నా పాలనలో మొదటి పూర్తి నెల అయిన ఫిబ్రవరిలో అతి తక్కువ సంఖ్యలో అక్రమ వలసదారులు అమెరికాలో ప్రవేశించడానికి ప్రయత్నించారు. మెక్సికో సరిహద్దులో కేవలం 8,326 మంది అరెస్టయ్యారు. వారందరినీ వెంటనే బహిష్కరించాం’’ అని తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు. బైడెన్ హయాంలో నెలకు 3ల క్షల మంది పై చిలుకు చొప్పున అక్రమంగా ప్రవేశించారని ఆరోపించారు. వలసలు గణనీయంగా తగ్గాయన్న ప్రకటనను వార్తా నివేదికలు తిప్పికొట్టాయి. ‘‘బైడెన్ అధికారంలో ఉన్న చివరి వారంలో రోజుకు సగటున 2,869 సరిహ ద్దు అరెస్టులు జరిగాయి. ట్రంప్ అధికారం చేపట్టాక తొలి వారంలో 7,287 అరెస్టులు నమోదయ్యాయి. అంటే రోజుకు సగటున 1,041. అంటే తగ్గుదల కేవలం 60 శాతమే. వైట్‌హౌస్ చెబుతున్నట్టు 95 శాతం కాదు’’ అని ఫాక్స్ న్యూస్ తెలిపింది. -
అమెరికా.. ఉక్రెయిన్ మధ్య సయోధ్య ఎలా?
లండన్: అధినేతలు డొనాల్డ్ ట్రంప్, జెలెన్స్కీ వాగ్యుద్ధంతో అమెరికా, ఉక్రెయిన్ సంబంధాలు అకస్మాత్తుగా దెబ్బతిన్న వైనం యూరప్‌ను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. వాటిని తిరిగి చక్కదిద్దే మార్గాల కోసం అవి మల్లగుల్లాలు పడుతున్నాయి. ఈ అంశంపై చర్చించేందుకు యూరప్ దేశాధినేతలు ఆదివారం లండన్‌లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇందుకు బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్ చొరవ తీసుకున్నారు. ‘సురక్షిత యూరప్ కోసం’ పేరిట జరిగిన ఈ శిఖరాగ్ర సమావేశంలో చర్చంతా అమెరికా, ఉక్రెయిన్ సంబంధాల చుట్టే తిరిగినట్టు సమాచారం. ఉక్రెయిన్‌కు మరిన్ని నిధులు అందించాలని నేతలు నిర్ణయానికి వచ్చారు. అవసరమైతే యూరప్ దేశాలన్నీ తమ సైన్యాన్ని కూడా ఉక్రెయిన్‌కు పంపేందుకు సిద్ధంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. ఈ కీలక భేటీలో జెలెన్స్కీతో పాటు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా పాల్గొన్నారు. తరానికోసారే! యూరప్ భద్రత కోసం ఖండంలోని దేశాలన్నీ ఒక్కతాటిపైకి రావాల్సిన అవసరముందని స్టార్మర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇలాంటి అవసరం, అవకాశం తరానికి ఒక్కసారి మాత్రమే వస్తాయని అన్నారు. ‘‘రష్యా బారి నుంచి ఉక్రెయిన్‌కు శాశ్వత రక్షణ కల్పించాలి. యూరప్‌లోని ప్రతి దేశం భద్రతకూ ఇది చాలా కీలకం’’ అని చెప్పారు. ‘‘ఇందుకు మూడంచెల మార్గముంది. ఉక్రెయిన్ను సాయుధంగా పటిష్టపరచాలి. దాని భద్రతకు యూరప్ మొత్తం పూచీగా ఉండాలి. ఇక ఉక్రెయిన్‌తో కుదిరే ఒప్పందాలను రష్యా అధ్యక్షుడు పుతిన్ మళ్లీ తుంగలో తొక్కకుండా చూసే బాధ్యతను అమెరికా తీసుకోవాలి’’ అని ప్రతిపాదించారు. అంతకుముందు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో స్టార్మర్ విడిగా భేటీ అయ్యారు. అందులో జెలెన్స్కీ కూడా పాల్గొన్నారు. రష్యా, ఉక్రెయిన్ కాల్పుల విరమణకు నిర్దిష్ట కార్యారణ ప్రణాళిక రూపొందించి అమెరికా ముందుంచాలని వారు నిర్ణయానికి వచ్చారు. ఈ ప్రయత్నంలో మిగతా యూరప్ దేశాలన్నింటినీ కలుపుకుని వెళ్తామని చెప్పారు. అంతకుముందు ఉక్రెయిన్‌కు 3.1 బిలియన్ డాలర్ల రుణం అందించేందుకు బ్రిటన్ అంగీకరించింది.ట్రంప్‌తోనూ మాట్లాడా: స్టార్మర్ శిఖరాగ్రం అనంతరం నేతలు మీడియాతో మాట్లాడారు. వీలైనంత త్వర లో మరోసారి సమావేశమై అన్ని అంశాలపైనా లోతుగా చర్చించుకోవాలని నిర్ణయించినట్టు స్టార్మర్ వెల్లడించారు. అమెరికా నమ్మదగ్గ భాగస్వామి కాదన్న విమర్శలను తోసిపుచ్చారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం యూరప్ భద్రతకు చాలా కీలకమని పునరుద్ఘాటించారు. ఈ విషయమై ట్రంప్‌తో శనివారం రాత్రి ఫోన్లో సుదీర్ఘంగా మాట్లాడినట్టు వివరించారు. ‘‘యూరప్ ఒకరకంగా నాలుగు రోడ్ల కూడలిలో నిలిచింది. కనుక ప్రతి అడుగూ ఆచితూచి వేయాల్సిన సమయమిది. పరిస్థితులన్నీ పూర్తిగా అదుపు తప్పేందుకు ఒకే ఒక్క తప్పుడు నిర్ణయం చాలు’’ అని హెచ్చరించారు. -
వైట్ హౌస్‌లో మాటల మంటలు.. డొనాల్డ్ ట్రంప్‌కు భారీ షాక్!
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు భారీ షాక్ తగిలింది. ట్రంప్ అధికారం నుంచి దిగిపోయే వరకు ఒక్క లీటరు అంటే ఒక్క లీటరు చమురు ఇవ్వబోమని అమెరికా సైన్యానికి ఇంధనం సరఫరా చేసే నార్వే దేశ చమురు, యుద్ధనౌకల్ని సరఫరా చేసే హాల్ట్బ్యాక్ బంకర్స్ (Haltbakk Bunkers) సంస్థ ఖరాఖండీగా చెప్పేసింది. వైట్ హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీల (Volodymyr Zelensky)మధ్య మాటలు మంటలు రేపాయి. ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్నాయి. ఇందుకు అమెరికా పెద్దన్నగా వ్యవరిస్తోంది. ఈ నేపథ్యంలో శ్వేతసౌధంలో అమెరికా, ఉక్రెయిన్ అధ్యక్షుల మధ్య బహిరంగంగా చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో రష్యా యుద్ధాన్ని ముగించాలంటే ఉక్రెయిన్‌లోని విలువైన ఖనిజాలను తమకు అప్పగించాలని ట్రంప్ పట్టుబట్టారు. భవిష్యత్‌లో రష్యా మరోసారి దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పిస్తారా?, అందుకు మీరు భరోసా ఇస్తారా జెలెన్ స్కీ ఎదురు ప్రశ్నవేశారు. జెలెన్స్కీ ఎదురు ప్రశ్నించడంతో ట్రంప్,జేడీ వాన్స్ లు నువ్వెంత అంటే నువ్వెంత అని అనుకునేలా మాటమాట పెరిగింది.WOW. After yesterday’s Oval Office ambush of President Zelensky, Haltbakk Bunkers, one of Norway’s leading marine fuel providers, announced that it will no longer refuel U.S. Navy vessels, urging other European firms to follow suit.The United States is weaker and more isolated… pic.twitter.com/D9w32n1xBA— Republicans against Trump (@RpsAgainstTrump) March 1, 2025 ఈ పరిణామంలో ప్రపంచ దేశాలు వ్లాదిమిర్ జెలెన్స్కీకి మద్దతు ఇస్తున్నాయి. ఇప్పటికే ఆయా దేశాలు జెలెన్స్కీకి బాసటగా నిలిచాయి. తాజాగా, నార్వేజియన్ దేశం మరో అడుగు ముందుకు వేసింది. చమురు నిల్వల్ని, యుద్ధ నౌకల్ని అమెరికాకు సరఫరా చేసే నార్వేజియన్ దేశ సంస్థ haltbakk బుంకెర్స్ కీలక ప్రకటన చేసింది. సముద్ర తీర ప్రాంతాల్లో పహారా కాస్తున్న అమెరికా సైనిక బలగాలకు సరఫరా చేసే ఇంధనాన్ని తక్షణమే ఆపేస్తున్నట్లు వెల్లడించింది. అందుకు వాషింగ్టన్లో శుక్రవారం అమెరికా, ఉక్రెయిన్ దేశాల దౌత్య సమావేశంలో జరిగిన వివాదమేనని తెలుస్తోంది. హల్ట్ బ్యాక్ బంకర్స్ తన ప్రకటనలో 2024లో అమెరికా సైనిక బలగాలకు సుమారు 30,00,000 లీటర్ల ఇంధనాన్ని సరఫరా చేసింది. వైట్ హౌస్‌లో దేశాధ్యక్షుల మధ్య జరిగిన వాగ్వాదంలో జెలెన్స్కీకి అండగా నిలుస్తోంది. అందుకే మా సంస్థ అమెరికా సైనిక బలగాలకు ఇంధన సరఫరా చేయడం వెంటనే ఆపివేయాలని నిర్ణయించుకుంది’ అని సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది. ఏమైందో ఏమో కొద్ది సేపటి తర్వాత ఆ పోస్టును డిలీట్ చేసినట్లు సమాచారం. -
Vivek Ramaswamy: పాదరక్షలు లేకుండా ఇంటర్వ్యూ.. ట్రోలింగ్ బారిన వివేక్ రామస్వామి
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి(Vivek Ramaswamy) తాజాగా ఒక వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఇటీవల చెప్పులు లేకుండా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీటిని చూసిన కొందరు రామస్వామిని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఆయనను అమెరికన్ వ్యతిరేకి అని, మొరటువాడని వ్యాఖ్యానిస్తున్నారు. కొందరైతే వివేక్ రామస్వామికి మద్దతు పలుకుతున్నారు. గత ఏడాది వివేక్ రామస్వామి ఒక లైవ్ స్ట్రీమింగ్ రికార్డింగ్(Live streaming recording) సమయంలో చెప్పులు లేకుండా ఇంటర్యూలో పాల్గొన్నారు. ఈ రికార్డింగ్ వివేక్ రామస్వామి ఇంట్లో జరిగింది. సోషల్ మీడియాలో దీని గురించి చర్చ జరుగుతోంది. కొందరు ‘వివేక్ రామస్వామి ఎప్పటికీ ఒహియో గవర్నర్ కాలేరు’ అని వ్యాఖ్యానించగా, మరికొందరు ‘అమెరికాలో ఇది ఆమోదయోగ్యం కాదని’ అన్నారు. మరికొందరు ‘ఇంటర్వ్యూ సమయంలో వివేక్ కనీసం సాక్స్ అయినా ధరించి ఉండాల్సిందని’ పేర్కొన్నారు. మరొక యూజర్ ‘వివేక్ రామస్వామి విద్యాభివృద్ధిపై ఉపన్యాసాలు ఇస్తారని, అయితే ఇంటర్వ్యూలో చెప్పులు లేకుండా కనిపించారని, ఇది చాలా అసభ్యకరమైనదని’ వ్యాఖ్యానించారు.వివేక్ రామస్వామికి సోషల్ మీడియాలో మద్దతు పలికినవారు కూడా ఉన్నారు. భారతదేశంతో పాటు దక్షిణ, తూర్పు ఆసియాలో ఇంట్లో పాదరక్షలు(Footwear) తొలగించడం సర్వసాధారణమని కొందరు కామెంట్ బాక్స్‌లో రాశారు. దాదాపు భారతీయులంతా తమ ఇళ్లలో చెప్పులు లేకుండా ఉంటారని ఒక యూజర్ పేర్కొన్నారు. ఇందులో తప్పేమీ లేదని, ఇది అక్కడి సంస్కృతిలో భాగమని పేర్కొన్నవారు కూడా ఉన్నారు. అయితే వివేక్ రామస్వామి ఈ చర్చకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు.ఇది కూడా చదవండి: చెఫ్ అవతారంలో సోనూసూద్.. దోశ రేటు రెట్టింపు చేసి.. -
Zelensky: నా దారి రహదారి.. ఎక్కడా తగ్గేదేలే..!
వాషింగ్టన్: అమెరికా(USA) అధ్యక్షుడితో భేటీ అంటే హంగామా కాస్త ఎక్కువగానే ఉంటుంది. అగ్రదేశాధ్యక్షుడు ముందు మిగతా దేశాధ్యక్షులు చాలా నెమ్మదిగా వ్యవరిస్తారనే భావన మనలో చాలామందికే ఉంటుంది. . మరి అందరి దేశాధినేతలు వలే ఉంటే చెప్పుకోవడానికి ఏముంటుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడి జెలెన్స్కీ(Zelensky) స్టైలే సెపరేటు.‘నలుగురు వెళ్లే దారిలో నేను వెళ్లను.. నా దారి రహదారి’ అనే ముక్కుసూటితనం జెలెన్స్కీలో కనిపిస్తూ ఉంటుంది. రష్యాతో యుద్ధం మొదలుకొని, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తో నిన్నటి చర్చల వరకూ జెలెన్స్కీ ప్రత్యేక పంథాలోనే వెళుతున్నారు. ఎక్కడా తగ్గేదే లే.. నా రూటే సెపరేట్ అన్న శైలి ఆయనలో కనిపిస్తోంది. ట్రంప్ తో భేటి అయ్యే క్రమంలో కూడా జెలెన్స్కీ సాధారణంగానే వచ్చారు. ఎక్కడ హంగు, ఆర్భాటం లేకుండా వైట్ వైస్ లో దర్శనమిచ్చారు. అయితే జెలెన్స్కీ కనీసం సూట్ కూడా ధరించకుండా ట్రంప్ తో భేటీ కావడంపై అక్కడ ఉన్న ఒక రిపోర్టర్ లో ఆసక్తిని పెంచింది. ఉండబట్టలేక అడిగేశాడు.సూట్ ధరించకపోతే నీకేమైనా నష్టమా?అయితే దీనికి కూడా జెలెన్స్కీ తనదైన స్టైల్ లోనే సమాధానమిచ్చారు. ‘సూట్ ధరించకపోతే నీకేమైనా సమస్యా.. లేక ఏమైనా నష్టమా? అంటూ జెలెన్స్కీ అనడంతో సదరు రిపోర్టర్ కాస్త కంగుతిన్నాడు. దాన్ని సరిచేసుకునే క్రమంలోనే ఆ రిపోర్టర్.. కాదు కాదు.. చాలా మంది అమెరికన్లలో ఒక భావన ఉంది. వైట్ హౌస్ ఆఫీస్ కి హాజరయ్యే క్రమంలో డ్రెస్ కోడ్ కు విలువ ఇవ్వరనే అమెరికన్లు అనుకుంటూ ఉంటారు అంటూ సర్దుకునే యత్నం చేశాడు రిపోర్టర్..ఆ రోజు వచ్చినప్పుడే సూట్ ధరిస్తా..దీనికి ప్రతిగా జెలెన్స్కీ స్పందిస్తూ.. ‘ నేను కచ్చితంగా సూట్ ధరిస్తా, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగిసిన క్షణమే నేను సూట్ ధరిస్తా. ఆ రోజు వచ్చినప్పుడు నేను సూట్ ను కచ్చితంగా వేసుకుంటాను. డ్రెస్ కోడ్ ను బట్టి వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేయొద్దు.. మీలాగ. థాంక్యూ’ అంటూ సమాధానమిచ్చారు.జెలెన్స్కీ మద్దతుగా నెటిజన్లు..జెలెన్స్కీ ఇచ్చిన సమాధానానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అసలు డ్రెస్ కోడ్ ను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం ఏంటని అంటున్నారు. అలా అయితే ట్రంప్ తొలి క్యాబినెట్ సమావేశానికి ఎలన్ మస్క్ సూట్ తో ఎందుకు రాలేదు.. కేవలం టీ షర్ట్ మాత్రమే ఎందుక ధరించారు అని ఒక నెటిజన్ ప్రశ్నించగా, అసలు మిమ్ముల్ని ఆ క్వశ్చన్ అడిగిన రిపోర్టర్ సూట్ ఎందుకు ధరించలేదో అడగండి’ అంటూ మరొకరు నిలదీశారు. ఇలా జెలెన్స్కీపై ఏ రకంగా చూసినా ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. అమెరికాతో పెట్టుకున్నప్పుడు భవిష్యత్ లో పరిస్థితులు ఎలా ఉంటాయో అని కొందరు ఆందోళన చెందుతున్నప్పటికీ ప్రస్తుతానికి జెలెన్స్కీకి మద్దతు మాత్రం పెద్ద ఎత్తులోనే లభిస్తూ ఉండటం విశేషం. Q: "Why don't you wear a suit?"Ukrainian President Zelenskyy: "I will wear costume after this war will finish." pic.twitter.com/FzJqjIAQHa— CSPAN (@cspan) February 28, 2025 WHY doesn’t THIS guy wear a suit? pic.twitter.com/ZAQHWYjIob— The Resistor Sister®️♥️🇺🇸 (@the_resistor) February 28, 2025 ట్రంప్ Vs జెలెన్స్కీ.. వెల్లువెత్తిన జోక్స్, మీమ్స్ట్రంప్ వర్సెస్ జెలెన్స్కీ.. అధ్యక్షుల వాగ్వాదం జరిగిందిలా! -
ట్రంప్ Vs జెలెన్స్కీ.. వెల్లువెత్తిన జోక్స్, మీమ్స్
ఓవైపు ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే ఇంకొకరు వచ్చి చుట్ట కాల్చుకోవడానికి నిప్పు కావాలని అడగాడట. ఉక్రెయిన్, రష్యా యుద్ధం.. మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదముందని ప్రపంచ దేశాలు ఓవైపు భయపడుతుంటే ఆ భయాలను తొలగించి యుద్ధాన్ని ఆపేందుకు, బదులుగా అత్యంత విలువైన ఖనిజాలపై అజమాయిషీ కోసం అమెరికా చేసిన ప్రయత్నం విఫలం కాగా ఆ ఘటనను మీమర్స్ తమ జోకులకు పెద్ద ముడి సరుకుగా వాడుకుంటున్నారు.శుక్రవారం శ్వేతసౌధంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు మధ్య భేటీ తొలుత మర్యాదపూర్వకంగా, తుదకు అమర్యాదపూర్వకంగా, పరస్పర హెచ్చరికలకు వేదికగా మారి అర్ధంతరంగా ముగిసిన విషయం తెల్సిందే. అమెరికాసహా అంతర్జాతీయ మీడియా సాక్షిగా జరిగిన ఈ రసాభాసా వాగ్వాద భేటీపై ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ తెగ వెల్లువెత్తుతున్నాయి. తారాస్థాయిలో వాగ్వాదం ఓవల్ ఆఫీస్‌లో అంతర్జాతీయ మీడియా ప్రతినిధుల సమక్షంలో ట్రంప్, జెలెన్స్కీ భేటీ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. చివర్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కలగజేసుకుని జెలెన్స్కీపై తీవ్ర అసహనం వ్యక్తంచేయడం, అందుకు ట్రంప్ వంతపాడటం, దీనికి దీటైన బదులిస్తూ జెలెన్స్కీ మాట్లాడం చూసిన వారెవరికైనా ట్రంప్, జెలెన్స్కీ కొట్టుకుంటారా అన్న అనుమానం వచ్చింది. వాస్తవంలో సాధ్యంకాని వాళ్ల పిడిగుద్దులు, డిష్యుండిష్యుం ఫైట్ సీన్‌ను కృత్రిమ మేథ సాధ్యం చేసింది. ఒరిజినల్ వీడియోతో ట్రంప్, జెలెన్స్కీ ఫైట్‌సీన్‌ను ఏఐలో సృష్టించి ఆన్లైన్లో షేర్చేశారు. ఆ వీడియో ఎడిటింగ్ మొదటి మూడు, నాలుగు సెకన్లు నిజంగానే కొట్టుకున్నారా అన్నంతగా కుదిరింది. ఇప్పుడీ వీడియో అన్ని సోషల్‌మీడియా యాప్స్‌లో వైరల్‌గా మారింది. ఇంకొక వీడియోను పూర్తి భిన్నంగా సృష్టించారు.Who made this video? 😂AI 😂 pic.twitter.com/r9UuE3Qr1g— War Intel (@warintel4u) March 1, 2025వాస్తవంలో ట్రంప్, జేడీ వాన్స్‌తో జెలెన్స్కీ వాగ్వాదానికి దిగితే ఏఐ వీడియోలో మాత్రం వీళ్లిద్దరినీ జెలెన్స్కీ చేతులు పట్టుకుని మరీ బతిమాలుతూ ‘మా దేశాన్ని కాపాడండి’’అని వేడుకుంటున్నట్లు రూపొందించారు. ఇందులో ‘ఇప్పటికి చేసిన సాయం చాలు, ఇక సాయం సంగతి మర్చిపో’అని ట్రంప్, వాన్స్‌లు జెలెన్స్కీ చేతులను దులిపేసుకుంటున్నట్లు ఏఐ వీడియో క్రియేట్‌చేశారు. ఇది కూడా తెగ నవ్వులు తెప్పిస్తోంది. అత్యంత విలువైన ఖనిజాలపై ఆధిపత్యం సంపాదించి అమెరికన్ పెత్తందార్లు వాటితో వేల కోట్లు గడించాలని భావించి, ఇప్పుడు భంగపడ్డారని తెలిపేలా ఒక వెయిటర్ ‘ఖనిజాల డీల్ రద్దయింది. సారీ. మీకు భోజనాలు లేవు’అంటూ బడా పారిశ్రామికవేత్తలకు చూపిస్తున్నట్లు పాతకాలంనాటి ‘ఫాల్టీ టవర్స్’సీరియల్ ఎపిసోడ్‌ను మీమ్స్‌లో వాడారు. భారతీయ ‘ట్రీట్మెంట్’ భారత్‌లో సాధారణ నిరుపేద కుటుంబంలో తల్లిదండ్రులు తమ పిల్లలను తమకు నచ్చినట్లు పెంచేందుకు ప్రయత్నిస్తుంటారు. వైట్‌హౌజ్‌లో ట్రంప్, జేడీ వాన్స్ సైతం జెలెన్స్కీని దాదాపు అలాగే మీడియాకు చూపేందుకు ప్రయత్నించారని నెటిజన్లు మరో మీమ్ సిద్ధంచేసి సామాజిక మాధ్యమాల్లోకి వదిలారు. రష్యాతో యుద్ధంలో ఇంత సాయపడిన మాకు శ్వేతసౌధంలో మీడియా సమక్షంలో అగ్రరాజ్య అధ్యక్షునికి కనీసం గౌరవం ఇవ్వరా?. ఒక్కసారైనా మా ప్రెసిడెంట్‌కు థాంక్యూ అని చెప్పారా? అని జెలెన్స్కీని వాన్స్ నిలదీస్తూ హెచ్చరించడం తెల్సిందే. ఈ సందర్భంలో వాన్స్, ట్రంప్ సగటు భారతీయ తల్లిదండ్రుల్లా అద్భుతమైన పాత్ర పోషించారని నెటిజన్లు వ్యాఖ్యలు చేస్తూ పోస్ట్‌లు పెట్టారు.Trump throws Zelensky out of the White House(meme collab with @drefanzor) pic.twitter.com/Mfu85ZHhAf— NautPoso memes 🇮🇪☘️ (@NautPoso) February 28, 2025 పొగుడుతూ పోస్ట్‌లు మరోవైపు జెలెన్స్కీని మీడియా ఎదుటే చక్రబంధంలో ఇరికించే ప్రయత్నంలో వాన్స్, ట్రంప్ దాదాపు సఫలమయ్యారని వీళ్లను పొగిడే వారి సంఖ్యా పెరిగింది. యుద్ధంలో వందల కోట్ల డాలర్లు ఇచ్చిన మాపై మీరు చూపించే మర్యాద ఇదేనా?. మీరు ఇదే ధోరణి కనబరిస్తే దౌత్యబంధం తెగిపోతుందని వాన్స్ హెచ్చరించి జెలెన్స్కీని ఒకింత సందిగ్ధంలో పడేశారని అమెరికన్ మీడియా ఆయనను పొగడ్తల్లో ముంచెత్తింది. అయితే జెలెన్స్కీని పొడిగే వారి సంఖ్యా అమాంతం పెరిగింది. ఇందులో సాధారణ ప్రజలతో పాటు దేశాధినేతలు ఉన్నారు.Always with the drama…Collab with @drefanzor pic.twitter.com/OwMNImIWpU— Lauren3ve (@Lauren3veMemes) March 1, 2025 యూరప్‌దేశాల అధినేతలు ఆయనకు ఫోన్‌చేసిమరీ తమ మద్దతు పలికినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. మిత్రదేశానికి ప్రతిఫలం ఆశించి సాయం చేస్తే ఆ సాయానికి అర్థమే ఉండదని, సహజ సంపదను కాజేసేందుకు కుట్ర పన్నిన అమెరికాను జెలెన్స్కీ సాక్షాత్తూ శ్వేతసౌధంలోనే కడిగిపారేశారని ఆయనను పొగుడుతూ పోస్ట్‌లు వెల్లువెత్తాయి. భవిష్యత్తులో రష్యా మళ్లీ దురాక్రమణకు దిగితే మాకు ఉండే రక్షణ ఏర్పాట్లు ఏమిటి?. ఆ విషయంలో మీరెలా మాకు సాయపడగలరు? అని జెలెన్స్కీ అడిగిన సూటి ప్రశ్నకు ట్రంప్, జేడీ వాన్స్ సరైన సమాధానం చెప్పలేకపోవడం తెల్సిందే. ఇద్దరు అగ్రనేతలు రెచ్చగొట్టినా జెలెన్స్కీ సంయమనం కోల్పోలేదంటూ మరో మీమ్ సందడిచేస్తోంది.Trump tossed Zelensky out 😂(w/@Fuknutz ) pic.twitter.com/1ES3d5l5zq— drefanzor memes (@drefanzor) February 28, 2025ప్రముఖ హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ నటించిన ఎయిర్‌ఫోర్స్ సినిమా సీన్లో పైఅధికారి ఇష్టమొచ్చినట్లు తిడుతున్నా టామ్ క్రూజ్ పట్టరాని ఆవేశంతో ఉన్నాసరే సంయమనం పాటించినట్లు జెలెన్స్కీ కూడా నిగ్రహంతో ఉన్నారని మీమ్ క్రియేట్ చేశారు. వైట్‌హౌజ్‌లో ముగ్గురు నేతల వాగ్వాదాన్ని ప్రత్యక్షంగా చూసి హుతాశురాలైన ఉక్రెయిన్ మహిళా రాయబారి ఒక్సానా మార్కరోవా తలపట్టుకోవడంపైనా ఒక మీమ్ బయటికొచి్చంది. మేక్ అమెరికా గ్రేట్ ఎగేన్(అమెరికాను మళ్లీ గొప్పగా చేద్దాం) నినాదాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కీలక నేతగా జెలెన్స్కీ ఎదిగారంటూ, భేటీలో ఎడముఖం పెడముఖంగా కూర్చున్న ట్రంప్, జెలెన్స్కీ ఫొటోను మరొకరు పోస్ట్‌చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్. -
ఎదురెదురుగా ఢీకొన్న రెండు బస్సులు.. 37 మంది మృతి
బొలివియా: బొలివియా దేశంలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రెండు బస్సులు ఢీకొన్న ప్రమాదంలో దాదాపు 37 మంది ప్రయాణీకులు మృతిచెందారు. అలాగే, మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఈ ప్రమాదంపై బొలివియా మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. బొలివియాలోని ఉయుని సమీపంలో బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 37 మంది మృతిచెందగా, మరో 30 మంది గాయపడ్డారు. అయితే, లాటిన్ అమెరికాలో అతిపెద్ద ఉత్సావాల్లో ఒకటైన ప్రఖాత ఒరురో కార్నివాల్‌కు బస్సులు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు, సహాయక బృందం చేరుకుంది. సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను బయటకు తీశారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్య సాయం అందిస్తున్నారు.ఈ ప్రమాదంలో డ్రైవర్లు ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడిన ఒక బస్సు డ్రైవర్‌కు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. వీరికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు నిర్వహించనున్నట్టు పోలీసులు తెలిపారు.Dos autobuses chocaron en Bolivia y dejaron al menos 37 muertos y decenas de heridos. El incidente ocurrió en horas de la madrugada de hoy, en una ruta en la región andina de Uyuni. pic.twitter.com/DkMSqx7562— Chikistrakiz (@chikistrakiz) March 1, 2025 -
ట్రంప్ వర్సెస్ జెలెన్స్కీ.. అధ్యక్షుల వాగ్వాదం జరిగిందిలా!
వాషింగ్టన్ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా అధ్యక్షుల వాగ్వాదానికి, పరస్పర ఆక్షేపణలకు, వాగ్బాణాలకు వైట్‌హౌస్ శుక్రవారం వేదికగా నిలిచింది. మీడియా సాక్షిగా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్షంగా ప్రసారమైన భేటీలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధినేత వొలొదిమిర్ జెలెన్స్కీ మధ్య సాగిన విమర్శలపర్వం సర్వత్రా చర్చనీయంగా మారింది. నిజానికి ఈ రగడకు అగ్గి రాజేసింది వారితో పాటు చర్చల్లో పాల్గొన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్. అలా ఒక్కసారిగా వేడెక్కిన పరిస్థితి కాస్తా చూస్తుండగానే అదుపు తప్పిపోయింది. చివరికి జెలెన్స్కీని ట్రంప్ వైట్‌హౌస్ వదిలి పొమ్మనడం, చర్చలకు అర్ధాంతరంగా ఫుల్స్టాప్ పెట్టి ఆయన వెనుదిరగడం దాకా వెళ్లింది! జెలెన్స్కీ వైట్‌హౌస్ సందర్శన రద్దవడమే గాక రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్‌కు అమెరికా దన్ను కొనసాగడం కూడా అనుమానంలో పడింది. వారి మధ్య వాగ్యుద్ధం ఎలా జరిగిందంటే... వాన్స్: (బైడెన్‌ను ఉద్దేశించి) నాలుగేళ్లుగా అమెరికా (తాజా మాజీ) అధ్యక్షుడు (బైడెన్) రష్యా అధినేత పుతిన్‌ను ఉద్దేశించి గట్టి మాటలు మాట్లాడుతూ వచ్చారు. అయినా పట్టించుకోకుండా ఉక్రెయిన్ౖపె దండెత్తిన పుతిన్ ఆ దేశాన్ని చాలావరకు నేలమట్టం చేశారు. ఇప్పుడిక దౌత్యమే శాంతికి మార్గం. నామమాత్రపు బెదిరింపులకు దిగుతూ, ఛాతీ చరుచుకుంటూ బైడెన్ చూపిన దారి పనికొచ్చేది కాదని తేలిపోయింది. దౌత్యానికి బాటలు వేసినప్పుడే అమెరికా మంచి దేశమని అనిపించుకోగలదు. ట్రంప్ సరిగ్గా అదే చేస్తున్నారు. జెలెన్స్కీ: నేనొకటి అడగొచ్చా? వాన్స్: తప్పకుండా. జెలెన్స్కీ: పుతిన్ మా దేశాన్ని ఆక్రమించాడు. నిజమే. 2014లోనూ అతనదే చేశాడు. క్రిమియాను ఆక్రమించాడు. మా ప్రజలను భారీగా పొట్టన పెట్టుకున్నాడు. అప్పుడెవరూ అతన్ని ఆపలేదు. ఇన్నేళ్లుగా కూడా ఆపడం లేదు. 2014లో ఒబామా, తర్వాత ట్రంప్, ఆ తర్వాత బైడెన్... ఏ అధ్యక్షుడూ పట్టించుకోలేదు. దేవుని దయవల్ల పుతిన్‌ను ఇప్పుడు బహుశా ట్రంప్ ఆపుతారేమో. ట్రంప్: 2015లోనా? జెలెన్స్కీ: 2014లో ట్రంప్: అవునా? అప్పుడు అధ్యక్షున్ని నేను కాదుగా. వాన్స్: అదే కదా! జెలెన్స్కీ: కావచ్చు. కానీ 2014 నుంచి 2022 దాకా కూడా మా దుస్థితి అలాగే కొనసాగుతూ వచ్చింది. సరిహద్దుల వెంబడి మా ప్రజలు నిస్సహాయంగా చనిపోతూనే వచ్చారు. ఈ దారుణాన్ని ఆపేవారే లేకపోయారు. పుతిన్‌తో చర్చలు జరిపాం. ఒక్కసారి కాదు. ఎన్నోసార్లు. అతనితో ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాం. (ట్రంప్‌నుద్దేశించి) మీరు కూడా 2019లో పుతిన్‌తో ఒప్పందం చేసుకున్నారు. (ఫ్రాన్స్ అధ్యక్షుడు) మాక్రాన్, (నాటి జర్మనీ చాన్సలర్) మెర్కెల్ కూడా. కాల్పుల విరమణ ఒప్పందాలూ కుదిరాయి. పుతిన్ వాటిని ఉల్లంఘించబోడనే మీరంతా మాకు హామీ ఇచ్చారు. కానీ ఏం జరిగింది? దానికతను తూట్లు పొడిచాడు. మావాళ్లను మరింతగా పొట్టన పెట్టుకున్నాడు. ఖైదీల మార్పిడి ఒప్పందాన్నీ తుంగలో తొక్కాడు. ఇదెక్కడి దౌత్యం? జేడీ! మీరేం మాట్లాడుతున్నారో, వాటికి అర్థమేమిటో మీకైనా తెలుస్తోందా?వాన్స్: మీ దేశంలో సాగుతున్న వినాశనానికి తెర దించగలిగే దౌత్యం గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నా. కానీ ఒక్కటి మాత్రం మీకు స్పష్టంగా చెప్పదలచుకున్నా. ఇలా ఓవల్ ఆఫీసులో కూర్చుని అమెరికా మీడియా సమక్షంలో మీరిలా వాదనకు దిగడం చాలా అమర్యాదకరం. మీకిప్పుడు రష్యాతో పోరాడేందుకు సరిపడా సైన్యమే లేదు. మరో దారిలేక పౌరులకు ఆయుధాలిచ్చి బలవంతంగా యుద్ధక్షేత్రంలోకి నెడుతున్నారు. అలాంటి ఘర్షణకు తెర దించేందుకు కృషి చేస్తున్నందుకు అధ్యక్షుడు ట్రంప్‌కు మీరు నిజానికి కృతజ్ఞతలు తెలపాలి. జెలెన్స్కీ: మాకెలాంటి సమస్యలున్నాయో కళ్లతో చూసినట్టే చెబుతున్నారు! మీరెప్పుడైనా ఉక్రెయిన్‌లో పర్యటించారా? వాన్స్: అవును. జెలెన్స్కీ: ఓసారి ఇప్పుడొచ్చి చూడండి. వాన్స్: ఉక్రెయిన్‌లో ఏం జరుగుతోందో చూశాను. కథలు కథలుగా విన్నాను. నిజానికి మీరు తరచూ దేశాధినేతలు తదితరులను మీ దేశానికి రప్పించుకుంటూ ఉంటారు. అవన్నీ ఫక్తు ప్రచార టూర్లు. మీకు సమస్యలున్నది నిజం కాదంటారా? సైన్యంలో చేరేందుకు జనమే లేకపోవడం నిజం కదా? జెలెన్స్కీ: అవును. మాకు సమస్యలున్నాయి. వాన్స్: అలాంటప్పుడు అమెరికాలో పర్యటిస్తూ, వైట్‌హౌస్‌లో ఓవల్ ఆఫీసులో కూర్చుని మరీ, అదీ అధ్యక్షుని సమక్షంలోనే మా యంత్రాంగంపై దాడికి దిగడం మర్యాదా? మీ దేశ వినాశనానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయతి్నస్తున్న మా ప్రభుత్వంపై నోరు పారేసుకోవడం సబబా?జెలెన్స్కీ: వరుసబెట్టి చాలా ప్రశ్నలే అడిగేశారు. అన్నింటినీ ఒక్కొక్కటిగా చర్చిద్దాం. వాన్స్: అలాగే కానిద్దాం. జెలెన్స్కీ: ముందుగా మీరొకటి అర్థం చేసుకోవాలి. యుద్ధ సమయంలో ఎవరికైనా సమస్యలే ఉంటాయి. రేపు మీకైనా అంతే. కాకపోతే ఇప్పుడు మీకది తెలియకపోవచ్చు. భవిష్యత్తులో అలాంటి పరిస్థితి వస్తే మీకూ తెలిసొస్తుంది. ట్రంప్: మున్ముందు మాకెలా అనిపిస్తుందో మీరేమీ మాకు చెప్పాల్సిన అవసరం. మేం కేవలం మీ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం. మీ పరిస్థితే మాకొస్తే ఎలా ఉంటుందో మాకు చెప్పే సాహసం చేయకండి. జెలెన్స్కీ: నేను మీకేమీ చెప్పడం లేదు. నాకు సంధించిన ప్రశ్నలకు బదులిస్తున్నానంతే. ట్రంప్: అలా కాదు. ఏం జరగాలో, ఎలా జరగాలో నిర్దేశించే పరిస్థితిలో మీరు ఎంతమాత్రమూ లేరు. వాన్స్: కానీ మీరు ఎంతసేపూ కేవలం మీకేం కావాలో మాకు నిర్దేశించే ప్రయత్నమే చేస్తూ వస్తున్నారు. ట్రంప్: మాకూ మీలాంటి పరిస్థితే వస్తే మాకెలా ఉంటుందో చెప్పే పరిస్థితిలో మీరు లేరు. ముందు అది తెలుసుకోండి. మేం బాగుంటాం. జెలెన్స్కీ: (మాలాంటి పరిస్థితే గనక వస్తే) ఎంతోమంది ప్రభావితం చేసేందుకు ప్రయతి్నంచడం మీకూ అనుభవంలోకి వస్తుంది. ట్రంప్: మేమెప్పుడూ శక్తిమంతంగా ఉంటాం.జెలెన్స్కీ: మళ్లీ చెబుతున్నా. అలాంటి పరిస్థితే వస్తే ఎలా ఉంటుందో అప్పుడు మీకూ అనుభవంలోకి వస్తుంది. ట్రంప్: ప్రస్తుతం మీ పరిస్థితి అస్సలు బాగా లేదు. ఇదంతా స్వయంకృతం. మీరు స్వయంగా కొనితెచ్చుకున్నదే. జెలెన్స్కీ: యుద్ధం మొదలైనప్పటి నుంచీ... ట్రంప్: (మధ్యలోనే అడ్డుకుంటూ) చెప్తున్నాగా. మీరు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు. మీ దగ్గర ప్రస్తుతం వాడేందుకు ఎలాంటి కార్డులూ లేవు. మేం దన్నుగా ఉన్నప్పుడే మీరు ఏమైనా చేయగలిగేది! జెలెన్స్కీ: నేనేమీ కార్డులు ప్లే చేయడం లేదు. సమస్య పరిష్కారానికి చాలా చిత్తశుద్ధితో ఉన్నా. మిస్టర్ ప్రెసిడెంట్! మీరది అర్థం చేసుకోవాలి. ట్రంప్: లేదు లేదు. ఎంతసేపూ మీరు కార్డులే ప్లే చేస్తున్నారు. లక్షలాది జీవితాలతో చెలగాటమాడుతున్నారు. అందరినీ మూడో ప్రపంచ యుద్ధ భయంలోకి నెడుతున్నారు. జెలెన్స్కీ: మీరేం మాట్లాడుతున్నారు! ట్రంప్: అవును. మీరు అందరినీ మూడో ప్రపంచయుద్ధం దిశగా నెట్టే జూదానికి దిగారు. అంతేకాదు! మీ ప్రవర్తన అమెరికా పట్ల అత్యంత అమర్యాదకరంగా ఉంది. కేవలం మాటలు చెప్పే ఎన్నో దేశాల కంటే మీకు అన్నివిధాలా దన్నుగా నిలిచింది మేమే. వాన్స్: అందుకు మీరు కనీసం ఒక్కసారన్నా కృతజ్ఞతలు తెలిపారా? జెలెన్స్కీ: ఒక్కసారి కాదు. ఎన్నోసార్లు చెప్పా! ఇప్పుడూ చెబుతున్నా. వాన్స్: నేననేది ఈ భేటీలో. ఇప్పటిదాకా మాపై, మా దేశంపై విమర్శలే తప్ప కృతజ్ఞతాపూర్వకమైన మాటలు ఒక్కటైనా మాట్లాడారా? గత అక్టోబర్‌లో పెన్సిల్వేనియాలో మా ప్రత్యర్థి పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసిన చరిత్ర మీది! జెలెన్స్కీ: నేనలా చేయలేదు.వాన్స్: ఇప్పటికైనా అమెరికాకు, మీ దేశాన్ని కాపాడేందుకు కృషి చేస్తున్న మా అధ్యక్షునికి కృతజ్ఞతగా కనీసం మంచి మాటలైనా చెప్పండి. జెలెన్స్కీ: మీరేమనుకుంటున్నారు? గొంతు చించుకు అరిస్తే సరిపోతుందా... ట్రంప్: (ఆగ్రహంగా మధ్యలోనే కలగజేసుకుంటూ) ఆయన (వాన్స్) గొంతు చించుకోవడం లేదు. అంత గట్టిగా మాట్లాడటం లేదు. వాస్తవమేమిటంటే, మీ దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.జెలెన్స్కీ: ఆయన అన్నదానికి నన్ను కనీసం సమాధానమైనా చెప్పనిస్తారా? ట్రంప్: చెప్పనిచ్చే సమస్యే లేదు. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడేశారు. ఓవైపు మీ దేశమే చాలా సమస్యల్లో ఉంది. జెలెన్స్కీ: అవును. నాకు తెలుసు. ట్రంప్: మీరు (యుద్ధం) గెలవబోవడం లేదు. ఈ ఆపద నుంచి బయట పడేందుకు మీకున్న ఏకైక అవకాశం మా దన్ను మాత్రమే. జెలెన్స్కీ: మిస్టర్ ప్రెసిడెంట్! మేమెవరినీ ఆక్రమించలేదు. మా దేశంలో మేం బతుకుతున్నాం. ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచీ మేం ఒంటరిగానే పోరాడుతున్నాం. అయినా సరే, మీ దేశం పట్ల మొదటినుంచీ కృతజ్ఞతగానే ఉన్నాం. ఇప్పుడు కూడా చెబుతున్నా. కృతజ్ఞతలు. ట్రంప్: కాల్పుల విమరణకు మీరు అంగీకరించి తీరాల్సిందే. మా సాయుధ సాయం లేకపోతే ఈ యుద్ధం రెండే రెండు వారాల్లో ముగిసిపోయేది. జెలెన్స్కీ: కాదు. మూడే రోజుల్లో. అలాగని పుతిన్ కూడా అన్నారు. ట్రంప్: ఏమో! అంతకంటే కూడా ముందే ముగిసేదేమో! ఇలాగైతే మీతో ఒప్పందం కుదుర్చుకోవడం చాలా చాలా కష్టం. వాన్స్: ఇప్పటికైనా కనీసం కృతజ్ఞతలు తెలపండి. జెలెన్స్కీ: ఒక్కసారి కాదు. ఎన్నోసార్లు చెప్పా. అమెరికా పౌరులకు కృతజ్ఞతలు. వాన్స్: మన మధ్య అభిప్రాయ భేదాలున్నాయని అంగీకరించండి. మీరు చేస్తున్నదే తప్పు. అలాంటప్పుడు వాటిని చర్చించుకుని పరిష్కరించుకోవాలి. అంతే తప్ప ఇలా అమెరికా మీడియా సాక్షిగా మాతో గొడవకు దిగడం చాలా తప్పు. ట్రంప్: కానీ నా ఉద్దేశంలో ఇదీ మంచిదే. ఏం జరుగుతోందో ఇప్పుడు అమెరికా ప్రజలంతా చూస్తున్నారు. వారికీ తెలియనీయండి. ఇది చాలా ముఖ్యం. అందుకే ఈ సంవాదాన్ని ఇంతసేపు కొనసాగించా. జెలెన్స్కీ అమెరికాకు కృతజు్ఞడై ఉండాల్సిందే. జెలెన్స్కీ: అవును. నేను కృతజు్ఞన్ని. ట్రంప్: మీ దగ్గర వాడటానికి ఇంకే కార్డులూ లేవు. మీరు నిండా మునిగారు. మీ జనం చనిపోతున్నారు. పోరాడేందుకు మీకు సైనికుల్లేరు. ఎలా చూసుకున్నా యుద్ధానికి తెర దించడమే మీకు మంచిది. కానీ మీరు చూస్తే కాల్పు విరమణే వద్దంటున్నారు! అది కావాలి, ఇది కావాలని పేచీకి దిగుతున్నారు! మీకొక్కటే చెప్పదలచుకున్నా. కాల్పుల విరమణకు ఇప్పుడే, ఇక్కడే ఒప్పుకుంటారా సరేసరి. మీ దేశంపై తూటాల వర్షం ఆగుతుంది. జన నష్టానికి తెర పడుతుంది. జెలెన్స్కీ: యుద్ధం ఆగాలనే మేమూ కోరుతున్నాం. కానీ అందుకోసం మేం కోరుతున్న హామీలు కావాలి. ఆ విషయం మీకిప్పటికే స్పష్టంగా చెప్పా. ట్రంప్: అంటే ఏమిటి మీరనేది? కాల్పుల విరమణ వద్దా? నాకైతే అదే కావాలి. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో మీరు కోరుతున్న ఒప్పందాల కంటే మీకు త్వరగా దక్కేది కాల్పుల విరమణే! జెలెన్స్కీ: కాల్పుల విరమణపై మీవాళ్లనే అడిగి చూడండి. మీకే తెలుస్తుంది!ట్రంప్: దానితో నాకు సంబంధం లేదు. అదంతా బైడెన్ అనే వ్యక్తి ఉండగా జరిగిన వ్యవహారం. కానీ అతనంత సమర్థుడు కాదు. జెలెన్స్కీ: అప్పుడాయన మీ దేశాధ్యక్షుడు. ట్రంప్: ఏం మాట్లాడుతున్నారు? బైడెన్ అనే కాదు. అంతకుముందు ఒబామా మాత్రం మీకేం సాయం చేశాడు? కేవలం కాగితాలిచ్చి సరిపెట్టాడు. నేనేమో మీకు శత్రువులపైకి ప్రయోగించేందుకు ఆయుధాలు సమకూర్చా. అందుకే చెప్తున్నా. మీరు నిజానికి మరింతగా కృతజు్ఞలై ఉండాలి. మీరిప్పుడు నిస్సహాయులు. మా దన్నే మీకు బలం. మేమే లేకపోతే మీకేమీ లేదు. పుతిన్ నన్ను గౌరవిస్తున్నాడంటే కారణం అధ్యక్షునిగా తొలి టర్ములో నా శైలిని దగ్గర్నుంచి గమనించాడు గనుకే.(రష్యా గనుక కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ఏమిటన్న ఒక రిపోర్టర్ ప్రశ్నను ట్రంప్‌కు వాన్స్ వినిపించారు)ట్రంప్: ఎందుకీ ఊహాజనిత ప్రశ్నలు? ఇప్పటికిప్పుడు మీ నెత్తిపై బాంబు పడితే? రష్యా ఒకవేళ ఉల్లంఘిస్తే ఏం జరుగుతుందో నాకైతే తెలియదు. బైడెన్‌తో చేసుకున్న ఒప్పందాన్ని రష్యా నిజంగానే ఉల్లంఘించింది. ఎందుకంటే అతనంటే వారికి గౌరవం లేదు. ఒబామా అన్నా అంతే. కానీ నా విషయం అలా కాదు. నేనంటే రష్యాకు, పుతిన్‌కు ఎంతో గౌరవం. ఒక్కటి చెప్తా వినండి. పుతిన్‌కు నేను చుక్కలు చూపించా! నేను చెప్పేదల్లా ఒక్కటే. ఒబామాతోనో, బుష్తోనో, చివరికి బైడెన్‌తో కూడా ఒప్పందాలను పుతిన్ ఉల్లంఘించి ఉండొచ్చు. నాకు తెలియదు. కానీ నాతో మాత్రం ఆయన అలా చేయలేదు. ఇప్పుడు కూడా ఒప్పందం చేసుకోవాలనే పుతిన్ అనుకుంటున్నాడు. (జెలెన్స్కీని ఉద్దేశించి) కానీ కాల్పుల విమరణకు ఒప్పుకునే ఉద్దేశం మీకేమాత్రం ఉందో లేదో నాకైతే తెలియదు. మిమ్మల్ని నేను బలశాలిగా, శక్తిమంతునిగా తీర్చిదిద్దా. అమెరికా దన్నే లేకపోతే మీకెన్నటికీ అంతటి శక్తి ఉండేదే కాదు. మీ ప్రజలు చాలా ధైర్యశాలులు. చివరిగా ఒక్కటే మాట. మాతో (ఖనిజ వనరుల) ఒప్పందం చేసుకుంటారా, సరేసరి! లేదంటే రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి యత్నాల నుంచి అమెరికా వైదొలగుతుంది. అప్పుడిక మీ పోరాటం మీదే. అదంత సులువని నేనైతే అనుకోను. ఎందుకంటే పోరాడేందుకు మీ దగ్గర ఏమీ లేదు. మాతో ఒప్పందం కుదుర్చుకుంటే మీరు చాలా మెరుగైన స్థితిలో ఉంటారు. కానీ ఏ దశలోనూ మీరు కాస్త కూడా కృతజ్ఞతపూర్వకంగా వ్యవహరించడం లేదు. ఇది ఎంతమాత్రమూ సరైన పద్ధతి కాదు. నిజంగా చెప్తున్నా. మీ తీరు అస్సలు సరికాదు. చూడాల్సిందంతా చూసేశాం. కదా! టీవీలకైతే ఇదంతా నిజంగా పండుగే! -
రక్షణ హామీలు కావాల్సిందే
న్యూయార్క్/వాషింగ్టన్: అమెరికాతో బలమైన బంధాన్ని ఆకాంక్షిస్తున్నామని ఉక్రెయిన్ అధినేత వొలొదిమిర్ జెలెన్స్కీ స్పష్టం చేశారు. రష్యాతో మూడేళ్లుగా సాగుతున్న యుద్ధంలో తమకు దన్నుగా నిలుస్తున్నందుకు అమెరికాకు, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపారు. జెలెన్స్కీకి కృతజ్ఞత లేదని, కాల్పుల విరమణకు ఒప్పుకోకుండా లక్షలాది మంది ఉక్రేనియన్ల ప్రాణాలను పణంగా పెడుతున్నారని శుక్రవారం చర్చల్లో ట్రంప్ తీవ్రంగా ఆక్షేపించడం తెలిసిందే. దాంతో వారి భేటీ అర్ధ్ధంతరంగా ముగియడమే గాక అమర్యాదకర పరిస్థితుల్లో జెలెన్స్కీ వైట్‌హౌస్‌ను వీడారు. తర్వాత శనివారం ఆయన ఎక్స్‌లో పలు పోస్టులు చేశారు. ‘‘అమెరికా ప్రజలకు, ముఖ్యంగా ట్రంప్‌కు, కాంగ్రెస్‌కు కృతజ్ఞతలు. ఉక్రెయిన్‌కు శాశ్వత శాంతి కావాలి. ఆ దిశగానే కృషి చేస్తున్నాం. ఈ విషయంలో ట్రంప్ మద్దతు మాకు చాలా కీలకం. యుద్ధానికి తెర దించాలని ఆయన కాంక్షిస్తున్నారు. కానీ మాకంటే శాంతికాముకులు ఇప్పుడు ఇంకెవరూ ఉండబోరు. ఇది మా స్వేచ్ఛ కోసం, ఇంకా చెప్పాలంటే ఉనికి కోసం జరుగుతున్న పోరు. అమెరికాతో ఖనిజాల ఒప్పందానికి సిద్ధంగా ఉన్నాం. ఇరు దేశాల ఆర్థిక, రక్షణపరమైన బంధాలను ఇది బలోపేతం చేయగలదు. కానీ మాకు కేవలం ఈ ఒప్పందాలు మాత్రమే చాలవు. ఉక్రెయిన్ రక్షణకు సరైన హామీలు లేకుండా కాల్పుల విరమణకు ఒప్పుకోవడం మా దేశాన్ని ముప్పులో పడేస్తుంది. రష్యా మరోసారి మాపై దురాక్రమణకు దిగకుండా కచ్చితమైన హామీలు కావాల్సిందే. అప్పటిదాకా రష్యాతో చర్చలకు అంగీకరించే ప్రసక్తే లేదు. అమెరికా పూర్తిగా మావైపే ఉందని ఉక్రేనియన్లందరికీ విశ్వాసం కలిగించడం ఇప్పుడు చాలా ముఖ్యం’’ అని జెలెన్స్కీ స్పష్టం చేశారు. ట్రంప్‌తో వాగ్యుద్ధం ఇరు పక్షాలకూ మంచి చేయలేదని అభిప్రాయపడ్డారు. -
స్టార్మర్తో జెలెన్స్కీ చర్చలు
లండన్: అమెరికా పర్యటనను అర్ధంతరంగా ముగించుకున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ షెడ్యూల్ కంటే ఒక రోజు ముందుగా శనివారమే బ్రిటన్ చేరుకున్నారు. ప్రధాని కియర్ స్టార్మర్ తన అధికార నివాసం 10, డౌనింగ్ స్ట్రీట్ వద్ద ఆయనకు స్వాగతం పలికారు. నేతలిద్దరూ ఆలింగనం చేసుకున్నారు. ఉక్రెయిన్‌కు బ్రిటన్ ఇకముందు కూడా అన్నివిధాలా అండగా నిలుస్తుందని స్టార్మర్ పునరుద్ఘాటించారు. మూడేళ్లుగా తమకు బ్రిటన్ అందిస్తూ వస్తున్న మద్దతుకు జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నేతలిద్దరూ సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా వైఖరిలో వచ్చిన పెను మార్పు, అధ్యక్షుడు ట్రంప్ వ్యవహార శైలి తదితరాలు ప్రస్తావనకు వచి్చనట్టు సమాచారం. ఆదివారం లండన్‌లో యూరప్ నేతల భేటీ జరగనుంది. అందులో జెలెన్స్కీ పాల్గొనే అవకాశముంది. ఉక్రెయిన్ యుద్ధం, యూరప్ భద్రతే ప్రధాన అజెండాగా భేటీ జరగనుంది. నిజానికి మార్చి 6న పారిస్‌లో యూరప్ శిఖరాగ్ర సదస్సు జరగనుంది. అంతకు కేవలం రెండు రోజుల ముందు స్టార్మర్ ఆహ్వానంపై యూరప్ దేశాధినేతలంతా లండన్‌లో భేటీ కానుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. -
జెలెన్స్కీకి యూరప్ బాసట
న్యూయార్క్: అధ్యక్షుల రగడలో యూరప్‌తో సహా పలు ప్రపంచ దేశాలు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి బాసటగా నిలిచాయి. దేశాధినేతలంతా శనివారం ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టులు పెట్టారు. వారందరికీ జెలెన్స్కీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు అమెరికా, యూరప్ దేశాల మధ్య పెరుగుతున్న అంతరానికి కూడా ఈ ఉదంతం అద్దం పట్టింది. రష్యా మాత్రం జెలెన్స్కీకి తగిన శాస్తే జరిగిందంటూ ఎద్దేవా చేసింది. ‘‘అంతటి వాగ్యుద్ధంలోనూ ట్రంప్, ఉపాధ్యక్షుడు వాన్స్ చూపిన సంయమనం అభినందనీయం. జెలెన్స్కీని వాళ్లు కొట్టకపోవడం నిజంగా అద్భుతమే’’ అని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జకరోవా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ట్రంప్, వాన్స్ వైఖరిని అమెరికా మంత్రులు పూర్తిగా సమర్థించుకున్నారు. ఈ మేరకు వారంతా పోటాపోటీగా ప్రకటనలు విడుదల చేశారు. అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి, సెనేటర్ జాక్ రీడ్ తదితరులు మాత్రం ట్రంప్, వాన్స్ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. జెలెన్స్కీని కించపరిచేలా వారు వ్యవహరించిన తీరు అమెరికాకే అవమానకరమని కృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు. ట్రంప్ ఎంతగా రష్యా వైపు, పుతిన్ వైపు మొగ్గినా అమెరికా ప్రజలు మాత్రం ఎప్పటికీ ఉక్రెయిన్‌కే దన్నుగా నిలుస్తారన్నారు. జెలెన్స్కీతో ట్రంప్, వాన్స్ వ్యవహరించిన తీరు నిజంగా సిగ్గుచేటని రీడ్ మండిపడ్డారు. తమ ప్రవర్తనతో అంతర్జాతీయంగా అమెరికా విశ్వసనీయతనే దెబ్బతీశారని ఆవేదన వెలిబుచ్చారు. దీన్ని ప్రపంచమంతా గమనిస్తోందన్నారు. ఆత్మగౌరవం ప్రదర్శించారు: ఉర్సులా ఉక్రెయిన్ ప్రజల ధైర్యాన్ని నిలబెట్టేలా జెలెన్స్కీ ఆత్మగౌరవం ప్రదర్శించారంటూ యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాండర్ లియన్ కొనియాడారు. ‘‘నిర్భయంగా, ధైర్యంగా, బలంగా ఉండండి. మీరు ఒంటరి కారు. శాశ్వత శాంతి కోసం మేమంతా మీతో కలిసి పని చేస్తాం’’ అని పేర్కొన్నారు. ‘‘రష్యా ఒక దురాక్రమణదారు. ఉక్రెయిన్ బాధితురాలు. మేం ఆ దేశానికి సాయం చేయడం, రష్యాపై ఆంక్షలు విధించడం అస్సలు తప్పు కాదు. అమెరికా, యూరప్ దేశాలు, కెనడా, జపాన్ తదితరాలన్నీ ఇకముందూ ఇదే వైఖరి కొనసాగిస్తాయి’’ అని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ అన్నారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి తెరదించే దౌత్య యత్నాలను తిరిగి పట్టాలెక్కించేందుకు తక్షణం ఈయూ–అమెరికా శిఖరాగ్ర భేటీ జరగాలని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ పిలుపునిచ్చారు. ఉక్రెయిన్‌కు, జెలెన్స్కీకి మీకు తామంతా అన్నివేళలా వెన్నుదన్నుగా నిలుస్తామని జర్మనీ కాబోయే చాన్స్‌లర్ ఫ్రెడరిక్ మెర్జ్ ప్రకటించారు. ఉక్రెయిన్‌పై రష్యా అక్రమంగా దండెత్తిందన్నది కాదనలేని వాస్తవమని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అన్నారు. లాతి్వయా, ఎస్తోనియా, ఫిన్లండ్, లగ్జెంబర్గ్, పోలండ్, హాలండ్ తదితర దేశాధినేతలు కూడా జెలెన్స్కీకి మద్దతుగా పోస్టులు చేశారు.మూడో ప్రపంచయుద్ధానికి బాటలు... ‘‘అమెరికా, ఉక్రెయిన్ మధ్య ఖనిజాల ఒప్పందం ముందుకు సాగలేదు. అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నిరంతరం అమెరికా ప్రజల ప్రయోజనాల పరిరక్షణకే పాటుపడతారు. ప్రపంచంలో అమెరికా స్థానాన్ని గౌరవించని వాళ్లు మానుంచి అనుచిత లబ్ధి పొందేందుకు వారెన్నటికీ అనుమతించబోరు. జెలెన్స్కీతో భేటీలో ట్రంప్ మాటతీరే ఇందుకు తాజా నిదర్శనం. యుద్ధానికి తక్షణం ముగింపు పలకాలని ఉక్రేనియన్లలో ఏకంగా 52 శాతం మంది కోరుతున్నట్టు గత నవంబర్‌లో జరిగిన సర్వే తేల్చింది. రష్యాకు భూభాగాన్ని కోల్పోవడానికి ఉక్రెయిన్ సిద్ధంగా ఉండాలి. లేదంటే ట్రంప్ హెచ్చరించినట్టు మూడో ప్రపంచ యుద్ధం తప్పదు. అది ఉక్రెయిన్‌లో మొదలవుతుంది. ఇజ్రాయెల్ మీదుగా ఆసియా దాకా పాకుతుంది. తర్వాత అంతటా విస్తరిస్తుంది’’ – వైట్‌హౌస్ ప్రకటన -
వీసా గోల్డెన్ చాన్సేనా?
గోల్డ్ కార్డ్ వీసా.. ప్రపంచవ్యాప్తంగా కొత్త చర్చకు దారితీసిన టాపిక్ ఇది. అత్యంత గౌరవంగా భావించే అమెరికా పౌరసత్వం (US Citizenship) కోసం ట్రంప్ సర్కార్ తెచ్చిన ఈ కొత్త విధానం ఎంత మందిని ఆకట్టుకుంటుంది? అమెరికన్ కంపెనీలు ఈ పథకాన్ని ఉపయోగించి భారతీయులు సహా విదేశీ విద్యార్థులను, ప్రతిభావంతులను నియమించుకోవచ్చని ట్రంప్ అన్నారు. ట్రంప్ కేవలం పౌరసత్వ కలను అమ్ముకోవడం ద్వారా లాభం పొందాలని కోరుకోవడం లేదు. అమెరికన్ కంపెనీలు మంచి నిపుణులను నియమించుకోవడానికి వీలవుతుందని అంటున్నారు. వ్యాపారం పరంగా ఈ ఆఫర్ అమెరికన్ కంపెనీలకు ఆకర్షణీయమేనా? భారతీయులకు ప్రయోజనం చేకూరుస్తుందా? ఒక కోటి గోల్డ్ కార్డులు అమ్మడం ద్వారా అమెరికా (America) అప్పులు తొలగిపోతాయని ట్రంప్ పేర్కొంటున్నారు. కానీ రూ.43.7 కోట్ల విలువైన వీసాను కొనగలిగే అతి ధనవంతులు అమెరికా వెలుపల ఎంతమంది ఉన్నారనేదే ఇక్కడ ప్రశ్న. మరోవైపు పౌరసత్వం సరే.. పన్ను నిబంధనలపై అనిశ్చితి కారణంగా గోల్డ్‌కార్డు (Gold Card)ను తీసుకునేవారు తక్కువగా ఉంటారని నిపుణులు అంటున్నారు. – సాక్షి, బిజినెస్ బ్యూరోట్రంప్ లక్ష్యం అంత సులభమేమీ కాదు..ఒక కోటి గోల్డ్ కార్డుల అమ్మకాలు అమెరికా రుణభారాన్ని తుడిచిపెట్టగలవని ట్రంప్ అంటున్నారు. కానీ ఏకంగా రూ.43.7 కోట్లు వెచ్చించగల స్తోమత ఉన్న ధనవంతులు అమెరికా వెలుపల ఎంత మంది ఉన్నారు? క్రెడిట్ స్విస్ గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ ప్రకారం 2022లో ప్రపంచవ్యాప్తంగా 5–10 మిలియన్ డాలర్ల సంపద పరిధిలోని ధనికుల సంఖ్య 51 లక్షలు. ఇందులో 10 మిలియన్ డాలర్లకుపైగా ఉన్నవారు 28లక్షల మంది. ఇలాంటప్పుడు ఒక కోటి మంది గోల్డ్‌కార్డ్ కొనుగోలుదారులను పొందడం సాధ్యమయ్యేదేనా? అన్న సందేహాలు వస్తున్నాయి. రష్యా, చైనా, ఆగ్నేయాసియా నుంచి ధనవంతులు డబ్బు సంచులతో అమెరికాకు వస్తారని ట్రంప్ ఆశిస్తున్నారేమోగానీ.. విదేశీ బిలియనీర్లు గోల్డ్ కార్డ్‌ను తీసుకుంటారా? అని ఇమిగ్రేషన్ నిపుణులే పేర్కొంటున్నారు. గోల్డ్కార్డ్పై తలెత్తుతున్న ప్రశ్నలెన్నో.. » ఈ కార్యక్రమం ద్వారా అమెరికన్ పౌరసత్వాన్ని అమ్మకానికి పెట్టడం, యోగ్యత కంటే డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వడం వంటివాటిని ప్రతిభావంతులైన నిపుణుల ఖర్చుతో ధనవంతుల అవసరాలను తీర్చడంగా చూడవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. » గోల్డ్ కార్డుల వల్ల బలమైన నియంత్రణ, తనిఖీలు లేనప్పుడు పెట్టుబడి అంశంతో కూడిన ఇమిగ్రేషన్ కార్యక్రమాలు మనీలాండరింగ్‌కు, విదేశాల ప్రభావానికి గురయ్యే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఇది రష్యన్ సామ్రాజ్యవాదులకు అమెరికా తలుపులు తెరుస్తుందా అని అడిగినప్పుడు ట్రంప్ ఉదాసీనంగా సమాధానమిచ్చారు. ‘అవును. నాకు కొందరు రష్యన్ సామ్రాజ్యవాదులు తెలుసు. వారు చాలా మంచి వ్యక్తులు’అని పేర్కొన్నారు. » ఉద్యోగాలను సృష్టించే సంస్థలలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేకుండా గోల్డ్ కార్డ్ వస్తే.. చాలా మంది ధనవంతులు యూఎస్ ఆర్థిక వ్యవస్థకు ఎటువంటి తోడ్పాటు ఏమీ ఇవ్వకుండా నివాసం ఉండవచ్చనే ఆందోళనలు ఉన్నాయి. » కెనడాలో ఇలాంటి కార్యక్రమాన్ని తక్కువ పెట్టుబడితోనే ప్రారంభించారు. కానీ అది విపరీతంగా దుర్వినియోగం కావడంతో రద్దు చేశారు. ముందున్న సవాళ్లు రెండు.. ప్రతినిధుల సభ కాంగ్రెస్‌లో.. వలస విధానంలో ఏదైనా ముఖ్య మార్పును అమెరికా ప్రతినిధుల సభ కాంగ్రెస్ ఆమోదించాలి. ప్రస్తుతం రిపబ్లికన్ పార్టీ కి ఉభయ సభలలో మెజారిటీ ఉంది. కానీ అమెరికన్ పౌరసత్వాన్ని అమ్ముకుంటున్నారన్న ఆరోపణల నేపథ్యంలో అందరు రిపబ్లికన్లు సమర్థించకపోవచ్చు. డెమొక్రాట్లు ఈ ప్రతిపాదనను దాదాపుగా వ్యతిరేకిస్తారు. కోర్టులలో..అమెరికాలో చాలా చట్టపరమైన సవాళ్లు వీసా కార్యక్రమాల నిర్వహణ నుంచే ఉత్పన్నమవుతాయి. ట్రంప్ గోల్డ్ కార్డ్ ఎలాంటి చట్టపర సవాళ్లను ఎదుర్కొంటుందో ఊహించడం కష్టమేనని నిపుణులు అంటున్నారు. భారతీయులు–గోల్డ్ కార్డ్..కాన్సులర్ ప్రాసెసింగ్ ఉపయోగించి 2022–23లో ఈబీ–5 కార్యక్రమం ద్వారా 631 మంది భారతీయులు మాత్రమే యూఎస్ గ్రీన్‌కార్డులను పొందారు. ఈ పథకానికి రూ.9.17 కోట్లు పెట్టుబడి మాత్రమే అవసరం. అలాంటిది రూ.43.7 కోట్లపైన చెల్లించి గ్రీన్‌కార్డ్ కొనాలనే ఆలోచన చాలా మంది భారతీయులకు ఆకర్షణీయంగా కనిపించే అవకాశం లేదని యూఎస్ న్యాయవాది, అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ సభ్యురాలు రవనీత్ కౌర్ బ్రార్ అభిప్రాయపడ్డారు. గోల్డ్ కార్డ్ వీసా అంటే? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ను ఈ వారమే ఆవిష్కరించారు. ఇది విదేశీ పెట్టుబడిదారులకు అమెరికా పౌరసత్వం పొందేందుకు రాచమార్గం. అమెరికా గ్రీన్కార్డ్కు ఖరీదైన ప్రత్యామ్నాయం కూడా. గోల్డ్ కార్డ్ కోరుకునేవారు యూఎస్ ప్రభుత్వానికి 5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.43.7 కోట్లు) చెల్లించాలి. ఈ వీసా విధివిధానాలు రెండు వారాల్లో వెలువడనున్నాయి. గోల్డ్ కార్డ్ హోల్డర్లు అమెరికా వెలుపల సంపాదించిన ఆదాయంపై పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. దేశీయంగా (యూఎస్‌లో) ఆర్జించే ఆదాయాలపై పూర్తి పన్నులు చెల్లించాల్సి ఉంటుందని ట్రంప్ స్పష్టం చేశారు. గోల్డ్‌కార్డుల విక్రయం ద్వారా పెద్ద పన్ను చెల్లింపుదారులు, ఉద్యోగ సృష్టికర్తలు అమెరికాకు సమకూరుతారని ట్రంప్ అన్నారు. అప్పుల భారం తగ్గించుకునేందుకు.. గోల్డ్ కార్డ్ విధానం అమెరికా రుణాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘మేం కోటి కార్డులు అమ్మితే 50 ట్రిలియన్ డాలర్లు (రూ.43,70,00,000 కోట్లు) సమకూరుతుంది. మాకు 35 ట్రిలియన్ డాలర్ల (రూ.30,59,00,000 కోట్లు) అప్పు ఉంది’’అని ఆయన పేర్కొన్నారు. అసాధారణ ప్రతిభ ఉన్న దరఖాస్తుదారులను స్పాన్సర్ చేయడం కోసం కంపెనీలను అనుమతించే నిబంధనలను గోల్డ్ కార్డ్‌లో చేర్చవచ్చని ట్రంప్ చెప్పారు. యాపిల్ వంటి సంస్థలు తాము నియమించుకోవాలనుకునే అగ్రశ్రేణి ప్రతిభావంతులకు గోల్డ్ కార్డులను స్పాన్సర్ చేయవచ్చన్నారు. ఆ రెండింటి మధ్య వ్యత్యాసం ఇదే.. ప్రస్తుత ఈబీ–5 వీసా స్థానంలో గోల్డ్ కార్డ్ రానుంది. యూఎస్ సిటిజన్‌షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్ నిర్వహించే ఈబీ–5 ఇమిగ్రెంట్ ఇన్వెస్టర్ ప్రోగ్రామ్‌ను 1990లో అమెరికా ప్రజాప్రతినిధుల సభ అయిన కాంగ్రెస్ రూపొందించింది. విదేశీ పెట్టుబడిదారుల ద్వారా అమెరికాలో ఉద్యోగ సృష్టి, మూలధన పెట్టుబడి ద్వారా ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు దానిని అమలు చేస్తున్నారు. ఈబీ–5 వీసా కోసం 10,50,000 డాలర్ల (రూ.9.17 కోట్లు) పెట్టుబడి అవసరం. ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాల్లో అయితే 8,00,000 డాలర్లు (రూ.6.99 కోట్లు) పెట్టుబడి పెట్టినా సరిపోతుంది. దీనికితోడు కనీసం 10 మంది అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించాలి. దీనిద్వారా సాధారణంగా 3–5 ఏళ్లలో గ్రీన్‌కార్డ్ అందుకోవచ్చు. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్న 2019లో ఈ పరిమితిని 9,00,000 డాలర్లకు (రూ.7.8 కోట్లకు) పెంచాలన్న ప్రయత్నం జరిగింది. కానీ ఫెడరల్ కోర్టు అడ్డుకుంది. అమెరికా ఏటా 10,000 ఈబీ–5 వీసాలను జారీ చేస్తోంది. ప్రతి దేశానికి గరిష్టంగా 7% వీసాలు ఇస్తారు. ఈబీ–5 వీసా కావాల్సినవారు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అదే కొత్త గోల్డ్ కార్డ్ అయితే ఒకసారి కొనుక్కుంటే చాలు. పెట్టుబడి, ఉద్యోగ కల్పన భారం ఉండదు. దశాబ్దంలో 3,800 మంది.. హెచ్–1బీ, ఈబీ–2, లేదా ఈబీ–3 వీసాలపై యూఎస్‌లో ఉన్న భారతీయ వలసదారులు గోల్డ్ కార్డ్ వీసా కోసం దరఖాస్తు చేసుకుని అక్కడి పౌరసత్వాన్ని అందుకోవచ్చు. వర్క్ వీసాలు, ముఖ్యంగా హెచ్–1బీ వీసాల కోసం భారత్ నుంచి అత్యధిక డిమాండ్ ఉంది. గోల్డ్ కార్డ్ వీసా హోల్డర్ల రాక వల్ల.. ఇతర వీసా హోల్డర్లు గ్రీన్‌కార్డుల కోసం వేచిఉండాల్సి వస్తుందనే ఆందోళన ఉంది. అమెరికాలో గ్రీన్‌కార్డ్ (శాశ్వత చట్టపర నివాస అనుమతి) కోసం వేచి ఉండే సమయం భారతీయులకు చాలా ఎక్కువ. కొన్నిసార్లు దశాబ్దాల సమయం పడుతోంది. అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులకు ఓ–1 వీసా మెరుగైన ప్రత్యామ్నాయమని.. దానిద్వారా సులభంగా ఈబీ–1 గ్రీన్కార్డ్లోకి మారవచ్చని ఇమిగ్రేషన్ నిపుణులు చెబుతున్నారు. ఇది ఇతర ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డ్ విభాగాల్లా కాకుండా తక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉంటుందని పేర్కొంటున్నారు. ఇక వ్యాపార సంస్థల యజమానులు, కీలక స్థానాల్లో ఉన్న ఉద్యోగులు ఎల్–1 వీసాను పరిగణించవచ్చు. ఈబీ–5 వీసా కోసం చూస్తున్నవారు ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో.. దానిని రద్దు చేయడానికి ముందే త్వరపడాలనే ఆత్రుత కనిపిస్తోంది. అయితే ఈబీ–5 వీసా రద్దు చేయాలంటే అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం అవసరమని ఇమిగ్రేషన్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గత దశాబ్దంలో దాదాపు 3,800 మంది భారతీయులు ఈబీ–5 వీసాతో అమెరికా వెళ్లారని అంచనా. 100కుపైగా దేశాల్లో సంపన్నులకు గోల్డెన్ వీసాలు ప్రపంచవ్యాప్తంగా 100కుపైగా దేశాలు సంపన్నులకు గోల్డెన్ వీసాలు ఇస్తున్నాయి. యూరప్, ఇతర ప్రాంతాల్లోని చాలా దేశాలు పెట్టుబడి కార్యక్రమాల ద్వారా పౌరసత్వాన్ని ఆఫర్ చేస్తున్నాయి. తమ దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదపడే వారికి మాల్టా పౌరసత్వాన్ని అందిస్తోంది. ఆ విధానం ఉత్తమమైనదని హ్యాన్లీ సిటిజన్‌షిప్ ప్రోగ్రామ్ ఇండెక్స్ పేర్కొనడం గమనార్హం. మాల్టా పౌరసత్వం పొందాలంటే కనీసం €6,00,000 యూరోల (రూ.5.45 కోట్లు) పెట్టుబడితోపాటు అక్కడ కనీసం 36 నెలల పాటు నివాసం ఉండాలి. లేదా 12 నెలలు అక్కడ నివసించిన తర్వాత €7,50,000 యూరోలు (రూ.6.82 కోట్లు) ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. హ్యాన్లీ ఇండెక్స్ టాప్–10 జాబితాలో ఆ్రస్టియా, గ్రెనాడా, యాంటీగ్వా అండ్ బాబూడా, నౌరూ, సెయింట్ కిట్స్ ఉన్నాయి. తమ లాభాలను పెంచుకోవాలని చూస్తున్న అంతర్జాతీయ వ్యాపారులకు ఇవి ఆకర్షణీయ పన్ను స్వర్గధామాలు (ట్యాక్స్ హెవెన్స్) కూడా. ఇక హ్యాన్లీ గ్లోబల్ రెసిడెన్స్ ప్రోగ్రామ్ ఇండెక్స్ జాబితాలో గ్రీస్ అగ్రస్థానంలో ఉంది. తరువాతి స్థానాన్ని స్విట్జర్లాండ్ కైవసం చేసుకుంది. సంపన్న భారతీయులకు ఇష్టమైన గమ్యస్థానంగా నిలిచిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కనీసం 5,45,000 డాలర్ల (రూ.4.76 కోట్లు) పెట్టుబడితో గోల్డెన్ వీసా రెసిడెన్స్ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తోంది. -
ట్రంప్‌తో వాగ్వాదం.. ఆపై జెలెన్స్కీ కీలక ట్వీట్
కీవ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీల మధ్య వైట్ హౌస్ వేదికగా జరిగిన చర్చలు పూర్తిగా విఫలం కావడమే కాదు.. ఆ చర్చ కాస్తా ‘ మూడో ప్రపంచ యుద్ధం’ అని ట్రంప్ నోట వచ్చే వరకూ వెళ్లింది. అంటే రష్యాతో శాంతి చర్చలకు తాము సిద్ధమంటూనే ట్రంప్ చెప్పిన ప్రతీ దానికి తలాడించలేదు జెలెన్ స్కీ. పూర్తిగా తమ భూభాగంపై ఎటువంటి కాల్పులు, బాంబుల మోత లేకుండా చూస్తామని అమెరికా తరఫున మీరు(ట్రంప్) మాటిస్తేనే మీతో వాణిజ్య ఖనిజాల ఒప్పందంపై సంతకం చేస్తామని కరాఖండీగా చెప్పేశారు జెలెన్ స్కీ.తమ భూ భాగంలో నివసిస్తే వేరే వాళ్ల పెత్తనం ఏమిటని జెలెన్ స్కీ కాస్త గట్టిగానే స్వరం వినిపించారు. ఇది ట్రంప్ కు నషాళానికి ఎక్కినట్లుంది. రష్యాతో శాంతి ఒప్పందం చేసుకోకపోతే మూడో ప్రపంచం యుద్ధం వచ్చినా రావొచ్చు అని ట్రంప్ హెచ్చరించారు. దాంతో వారి మధ్య చర్చ సంగతి పక్కన పెడితే, వాగ్వాదమే ఎక్కువ కనిపించింది.ఇలా వాదోపవాదాల నడుమనే ఎటువంటి ఒప్పందంపై సంతకం చేయకుండా వైట్ హౌస్ వీడారు జెలెన్ స్కీ. అయితే జెలెన్ స్కీ వైఖరి కచ్చితంగానే ఉందనే అభిప్రాయమో, ట్రంప్ పై కోపమో తెలీదు కానీ కొన్ని దేశాలు మాత్రం ఉక్రెయిన్ కు మద్దతు తెలిపాయి. కెనడా, బ్రిటన్ తో సహా పలు కీలక దేశాలు జెలెన్ స్కీకి జై కొట్టాయి.మీ సపోర్ట్ ఎప్పుడూ కీలకమే.. కానీ మాకు స్వేచ్ఛ కూడా అవసరంఅయితే ఇలా ట్రంప్ తో వాదించి వెళ్లిన జెలెన్ స్కీ గురించి ప్రపంచం అంతా చర్చించుకునే తరుణం ఇది. అగ్రదేశం, ఆ దేశ అధ్యక్షుడ్ని ఎదిరించి వాదించిన సిసలైన నాయకుడు అని, ‘వీడు మగడ్రా బుజ్జి’ అని సోషల్ మీడియా వరల్డ్ అనుకుంటున్న తరుణం.. అయితే ట్రంప్ తో వాగ్వాదం తర్వాత జెలెన్స్కీ.. తమకు యూఎస్ సపోర్ట్ అనేది కీలకమని మరోసారి స్పష్టం చేశారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ సపోర్ట్ చాలా కీలకమని వ్యాఖ్యానించారు. తన సోషల్ మీడియా హ్యాండిల్ ‘ఎక్స్’ వేదికగా జెలెన్ స్కీ ట్వీట్ చేశారు. ‘ మీ సపోర్ట్ మాకు అత్యంత కీలకం. ఇప్పటివరకూ రష్యాతో వార్ లో మాకు అందించిన ప్రతీ సహకారం మరువలేనింది. ఉక్రెయిన్ ప్రజలు మీకు ఎప్పుడూ రుణపడే ఉంటారు.ఇప్పుడు ట్రంప్ సపోర్ట్ మాకు అత్యంత కీలకం. ఆయన యుద్ధాన్ని ముగించాలని చూస్తున్నారు. యుద్ధాన్ని ముగించడానికి మా కంటే ఎక్కువ కోరుకునే వారు ఎవరూ ఉండరు. కానీ మేము యుద్ధంతోనే జీవనం సాగిస్తున్నాం. మా స్వాతంత్య్యం కోసం మేము చేస్తున్నా పోరాటం.. మా ప్రతీ ఒక్కరి ఆశయం, ఆశ కూడా మాకు స్వేచ్ఛగా మనుగడ సాగించడమే’ అని రాశారు. America’s help has been vital in helping us survive, and I want to acknowledge that. Despite the tough dialogue, we remain strategic partners. But we need to be honest and direct with each other to truly understand our shared goals.— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) March 1, 2025 It’s crucial for us to have President Trump’s support. He wants to end the war, but no one wants peace more than we do. We are the ones living this war in Ukraine. It’s a fight for our freedom, for our very survival.— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) March 1, 2025 -
బండి ఏదైనా.. మైలేజ్ పెంచే పొగ గొట్టం!
పెట్రోలు రేటేమో వంద రూపాయలు దాటేసింది..మోటర్‌సైకిల్ ఇచ్చే మైలేజీనేమో రోజురోజుకూ తగ్గిపోతోంది!రోజూ ఆఫీసుకెళ్లేందుకు జేబులు ఖాళీ అవుతున్నాయి! ఏం చేద్దాం?ఈ సమస్య మీది మాత్రమే కాదు.. మీలా చాలామంది ఎదుర్కొంటున్నదే! అయితే.. ఇంకొంత కాలం గడిస్తే.. మోటర్‌సైకిల్ మాత్రమే కాదు.. పెట్రోలు, డీజిల్ ఇంజిన్లు ఉన్న ప్రతి వాహనం మైలేజీ పెరుగుతుందని అంటోంది అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ(Pennsylvania State University)!. ఇందుకోసం వాహనాల పొగ గొట్టాల నుంచి వెలువడే వేడిని.. విద్యుత్తుగా మార్చేందుకు తామో అద్భుతమైన టెక్నాలజీని కనుక్కున్నట్లు ప్రకటించింది!. మీకు తెలుసా? మీరు వాడే వాహనం ఎంత ఇంధనం వృథా చేస్తోందో? సుమారు 75 శాతం. అంటే.. మీరు ఖర్చు పెట్టే వంద రూపాయల్లో 75 రూపాయలు పొగగొట్టం నుంచి వెలువడే పొగ, వేడి రూపంలో వృథా అవుతూంటుంది. అలాగే ఈ వాహనాలు మీ జేబులకు మాత్రమే కాదు.. కాలుష్యం రూపంలో ఆకాశంలోని ఓజోన్ పొరకూ చిల్లు పెట్టేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పెన్సిల్వేనియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు వాహనాల వేడిని విద్యుత్తుగా మారుస్తామన్న పరిశోధనకు ప్రాధాన్యం ఏర్పడింది. వేడిని విద్యుత్తుగా మార్చడం ఎలా? అని సందేహంగా ఉంటే.. థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్ల(Thermoelectric Generator) గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. క్లుప్తంగా టీఈజీ(TEG)లని పిలుద్దాం వీటిని! వాహనాల పొగగొట్టాలపై వీటిని అమరిస్తే చాలు.. అక్కడి వేడిని పీల్చుకుని విద్యుత్తుగా మారుస్తాయి. వేడి కారణంగా టీఈజీల్లోని ప్రత్యేక పదార్థంలో ఉండే ఎలక్ట్రాన్లు చైతన్యవంతమవుతాయి. ఆ తరువాత ఈ ఎలక్ట్రాన్లు చల్లగా ఉండే వైపునకు వెళ్లే ప్రయత్నం చేస్తాయి. ఎలక్ట్రాన్ల క్రమ ప్రవాహాన్నే కరెంట్ అంటామన్నది మీరు చిన్నప్పుడే చదువుకుని ఉంటారు. పెన్సిల్వేనియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన టీఈజీలను బిస్మత్ టెల్యురైడ్ అనే ప్రత్యేక పదార్థంతో తయారు చేశారు. ఇది ఎలక్ట్రాన్ల ప్రవాహాన్ని ప్రోత్సహించే పదార్థం. టీఈజీలు కొత్తవి కాదు కానీ...నిజానికి టీఈజీలు కొత్తవేమీ కాదు. చాలాకాలంగా ఉన్నవే. కాకపోతే పాతవాటితో సమస్యలు ఎక్కువ. వాటిని అధిమించేందుకు శాస్త్రవేత్తలు పైన చిత్రంలో చూపినట్లు ఉండే ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు. కంప్యూటర్లలో వేడిని తగ్గించేందుకు ఉపయోగించే హీట్‌సింక్ లాంటిదన్నమాట ఇది. నమూనా టీఈజీలతో పెన్సిల్వేనియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు కొన్ని ప్రయోగాలు కూడా నిర్వహించారు. టూవీలర్ ఎగ్జాస్ట్ పైపునకు ఈ గొట్టం తగిలించినప్పుడు 40 వాట్ల వరకూ విద్యుత్తు ఉత్పత్తి అయ్యింది. కార్లలో వాడినప్పుడు 56 వాట్లు, హెలీకాప్టర్ల పొగ గొట్టాలకు చేర్చినప్పుడు 146 వాట్ల వరకూ విద్యుత్తు ఉత్పత్తి అయ్యింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ టీఈజీలను వాహనాలపై ఏర్పాటు చేసుకోవడం చాలా సులువు. పెట్రోలు, డీజిల్ ఇంజిన్లలో అమర్చుకుని మొబైల్ ఫోన్ ఛార్జింగ్ వంటివి చేసుకోవచ్చు. హైబ్రిడ్ వాహనాల్లో ఏర్పాటు చేసుకుంటే.. మైలేజీని పెంచుకోవచ్చు. -
Comment X: ఎవర్రా బాబూ ఇది ఎడిట్ చేసింది!
వైట్‌హౌజ్ ఓవెల్ ఆఫీస్‌లో జరిగిన పరిణామాలు.. తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ అనుసరిస్తున్న వైఖరిని.. తమ సమక్షంలో చేసిన వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump_, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌లు తీవ్రంగా మండిపడ్డారు. దీంతో ఖనిజ సంపద ఒప్పందాల సంతకం చేయకుండానే జెలెన్స్కీ అమెరికా నుంచి వెనుదిరిగారు. ట్రంప్‌నకు ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణ చెప్పనని జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు వైట్‌హౌజ్(White House) తలుపులు మూసుకుపోయినట్లేనని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ మధ్యకాలంలో ఏఐ ఎడిట్లు ఎంతగా వైరల్ అవుతున్నాయో తెలిసిందే. గాజా విషయంలో అలాంటి ఓ వీడియోను ఎడిట్ చేసే.. ట్రంప్ విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో తాజా భేటీని.. దాదాపుగా తన్నుకున్నంత పనిగా మార్చేయగా.. అది చక్కర్లు కొడుతోంది.LMAO! Who created this video?😂 pic.twitter.com/Gr8Pnl2Nz6— War Intel (@warintel4u) February 28, 2025ఏరా బుడ్డి.. ఇలాగైతే ఎలా?బరువు తగ్గేందుకు చాలామంది రకరకాల మార్గాలను అనుసరిస్తుంటారు. అందులో చిత్తశుద్ధి ప్రదర్శించేది కొందరే. మరి మిగతా వారు?. ఓవైపు డైట్లు గట్రా అంటూనే.. ఇంకోవైపు నోటికి పని చెబుతుంటారు. పైగా ఏం చేసినా బరువు తగ్గడం లేదంటూ తెగ ఫీలైపోతుంటారు. అలాంటి వాళ్లను ప్రతిబింబించేలా ఈ బుడ్డోడి వీడియో అనే కామెంట్ వినిపిస్తోంది ఇప్పుడు. “I can't lose weight no matter what i do”Also me after 8 pm: pic.twitter.com/OpNxn3vKjB— NO CONTEXT HUMANS (@HumansNoContext) March 1, 2025 -
సునీతా విలియమ్స్ రాకకు సమయం ఆసన్నం
అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలిమ్స్, బుచ్ విల్మోర్ల రాకకోపం ఎదురుచూస్తున్నవారికి అమెరికాకు చెందిన నేషనల్ ఏరోనాటిక్స్, స్పేస్ అడ్మినిష్ట్రేషన్(నాసా) శుభవార్త చెప్పింది. వీరు అంతరిక్షం నుంచి 2025, మార్చి చివరిలో భూమికి తిరిగి రానున్నట్లు వెల్లడించింది. సాంకేతిక ఇబ్బందులు, మిషన్ రీషెడ్యూలింగ్ కారణంగా ఈ ఇద్దరు వ్యోమగాములు గత ఎనిమిది నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయారు.నాసా తాజాగా తెలిపిన వివరాల ప్రకారం క్రూ-10 మిషన్ మార్చి 12న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కు బయలుదేరుతుంది. ఈ మిషన్‌లో అన్నే మెక్‌క్లెయిన్, నికోల్ అయర్స్ (నాసా), టకుయా ఒనిషి (జపాన్ ఏరోస్పేస్ ఏజెన్సీ), కిరిల్ పెస్కోవ్ (రోస్కోస్మోస్) ఉన్నారు. వీరు అంతరిక్షంలోకి చేరుకున్నాక, క్రూ-9 మిషన్ (సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్, నిక్ హేగ్ అలెగ్జాండర్ గోర్బునోవ్‌లతో కూడినది) భూమికి తిరిగి వస్తుంది. క్రూ-10 మిషన్ మార్చి 12న ప్రారంభమవుతుందని, ఒక వారం పాటు ఐఎస్ఎస్లో ఉంటుందని బుచ్ విల్మోర్ తెలిపారు. దీని తరువాత ఆ వ్యోమగాములు మార్చి 19 నాటికి భూమికి తిరిగి వచ్చే అవకాశాలున్నాయి. నాసా, స్పేస్‌ఎక్స్‌లు ఈ మిషన్‌ను వేగవంతం చేశాయి.ఈ మిషన్‌లో జరుగుతున్న జాప్యంపై స్పేస్ఎక్స్ సీఈవో ఇలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేస్తూ, వ్యోమగాములను ఇంత కాలం ఐఎస్ఎస్లో వదిలివేయడం సరికాదని అన్నారు. కాగా ఈ మిషన్‌లో పోలాండ్, హంగేరీల వ్యోమగాములతో పాటు భారత సంతతికి చెందిన శుభాన్షు శుక్లాను కూడా ఐఎస్ఎస్కు పంపనున్నారు. ఈ మిషన్ విజయవంతమైతే శుభాన్షు ఐఎస్ఎస్కు వెళ్లిన మొదటి భారతీయునిగా నిలుస్తారు. మార్చి 19న సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమికి తిరిగి వచ్చే అవకాశాలున్నాయని నాసా పేర్కొంది. ఇది కూడా చదవండి: తప్పుడు స్పెల్లింగ్‌తో పట్టాలు.. లక్షల విద్యార్థులు లబోదిబో -
నెం. 14, మరోసారి తండ్రైన బిలియనీర్ : పేరేంటో తెలుసా?
టెస్లా సీఈవో, బిలియనీర్ ఎలాన్ మస్క్ మరో సారి తండ్రి అయ్యాడు. మస్క్ భార్య, అతని కంపెనీ న్యూరాలింక్‌లో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న షివోన్ జిలిస్‌తో కలిసి నాలుగో బిడ్డను స్వాగతించారు. ఇప్పటికే మస్క్‌కు 13 మంది పిల్లలున్నారు. దీంతో ఇపుడు మస్క్ సంతానం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.మస్క్ భార్య షివోన్ జిలిస్ ఈ విషయాన్ని ఎక్స్( ట్విటర్) ద్వారా వెల్లడించింది. ఇప్పటికే ఈ దంపతులు కవలలు (స్ట్రైడర్ , అజూర్) ఏడాది పాప ఆర్కాడియా ఉన్నారు. నాలుగో బిడ్డకు సెల్డాన్ లైకుర్గస్గా అపుడే పేరు కూడా పెట్టేయడం గమనార్హం. అందమైన ఆర్కాడియా పుట్టినరోజు సందర్బంగా తమ అద్భుతమైన కుమారుడు సెల్డాన్ లైకుర్గస్ రాక గురించి చెప్పడం ఆనందంగా ఉంది అంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌కు హార్ట్ సింబల్‌తో ఎలాన్ మస్క్ సమాధానమిచ్చాడు. గణనీయంగా క్షీణిస్తున్న జనాభాపై ఎపుడూ ఆందోళన వ్యక్తం చేసే మస్క్ సంతానోత్పత్తి ప్రాముఖ్యతపై దృష్టిపెట్టునట్టున్నాడు అంటోది సోషల్ మీడియా. జనాభా వృద్ధి చెందాలని భావించే మస్క్, ఇప్పటికే తన స్పెర్మ్‌ను స్నేహితులు, పరిచయస్తులకు దానం చేశాడనే వాదనలు కూడా చాలానే ఉన్నాయి. Discussed with Elon and, in light of beautiful Arcadia’s birthday, we felt it was better to also just share directly about our wonderful and incredible son Seldon Lycurgus. Built like a juggernaut, with a solid heart of gold. Love him so much ♥️— Shivon Zilis (@shivon) February 28, 2025కాగా షివోన్ జిలిస్‌తో తనకున్న నలుగురు పిల్లలతో పాటు, మస్క్‌కు మొదటి భార్య జస్టిన్ విల్సన్ ద్వారా ఐదుగురు పిల్లలు ఉన్నారు. వీరిలో కవలలు వివియన్ , గ్రిఫిన్‌తో పాటు, కై, సాక్సన్ , డామియన్ అనే ముగ్గురున్నారు. వీరి తొలి సంతానం బిడ్డ నెవాడా అలెగ్జాండర్ మస్క్ కేవలం 10 వారాల వయసులోనే మరణించాడు. -
దేవుడా.. ఇలా జరిగిందేంటి?.. ఉక్రెయిన్ రాయబారి ఆవేదన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ జెలెన్స్కీ మధ్య శాంతి చర్యలు విఫలమయ్యాయి. జెలెన్స్కీని ట్రంప్ బెదిరించే ప్రయత్నం చేశారు. జెలెన్స్కీ వైపు వేలెత్తి చూపిస్తూ ఉక్రెయిన్ (Ukraine) తీరు మూడో ప్రపంచయుద్ధానికి దారితీయవచ్చు అంటూ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ రాయబారి ఒక్సానా మార్కరోవా ఆందోళనకు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ట్రంప్, జెలెన్స్కీ మధ్య భేటీ వాగ్వాదానికి దారితీసింది. శాంతి చర్చలు కాస్తా రసాభాసగా మారాయి. రష్యా చేస్తున్న యుద్ధానికి తెర దించడానికి శాంతి ఒప్పందం కుదర్చడం, దానికి బదులుగా ఉక్రెయిన్‌లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతించాలని అమెరికా చేసిన ప్రతిపాదనపై చర్చించడానికి జెలెన్స్కీ శుక్రవారం శ్వేతసౌధానికి వచ్చారు. భవిష్యత్తులో తమపై రష్యా ఏదైనా దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పించాలని ఆయన ఒత్తిడి చేశారు. ఇది ట్రంప్‌నకు ఆగ్రహం తెప్పించింది. దీంతో, ట్రంప్.. జెలెన్స్కీ ప్రవర్తన మూడో ప్రపంచయుద్ధానికి దారితీయవచ్చు. బైడెన్ కారణంగానే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటూ మండిపడ్డారు.ఇక, ఇదంతా జరుగుతున్న సమయంలో ఇరు దేశాల రాయబారులు అక్కడే ఉన్నారు. దీంతో, అమెరికాలో ఉక్రెయిన్ రాయబారి ఒక్సానా మార్కరోవా ఆందోళనకు గురయ్యారు. ఇరువురి నేతల భేటీతో మంచి జరగుతుందని ఆశిస్తే ఇలా జరుగుతుందేంటీ? అన్నట్టుగా తల పట్టుకుని కూర్చున్నారు. ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది అన్నట్టుగా ఆమె హావభావాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.🇺🇦🇺🇸 Ukrainian Ambassador in the USA Oksana Markarova watches Zelensky in despair 🤷♂️🥹 pic.twitter.com/LUhjYc5vfb— Roberto (@UniqueMongolia) February 28, 2025 -
జెలెన్స్కీకి భారీగా పెరిగిన మద్దతు.. రష్యా స్పందన ఇదే..
కీవ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), జెలెన్స్కీ మధ్య శాంతి చర్చలు విఫలమయ్యాయి. వైట్‌హౌస్‌లో ఇరువురి మధ్య భేటీ రసాభాసగా, వాగ్వాదంతో ముగిసింది. దీంతో ఎలాంటి ఒప్పందం లేకుండానే జెలెన్స్కీ (Zelenskyy) వైట్‌హౌస్‌ను వీడారు. ఈ క్రమంలో పలు దేశాల నేతలు జెలెన్స్కీకి మద్దుతు తెలుపుతున్నారు. ఉక్రెయిన్‌కు అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు.ట్రంప్, జెలెన్స్కీ భేటీ అనంతరం యూరోపియన్ యూనియన్‌కు చెందిన నేతలు స్పందించారు. ఈ సందర్బంగా పోలిష్ ప్రధాన మంత్రి డొనాల్డ్ టస్క్ స్పందిస్తూ.. జెలెన్స్కీ మీరు ఒంటరి కాదు అంటూ చెప్పుకొచ్చారు. ఈ మేరకు సంఘీభావం తెలుపుతూ సందేశం విడుదల చేశారు.👉బ్రిటన్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ స్పందిస్తూ.. ఉక్రెయిన్‌కు మద్దుతు ఉంటుందన్నారు.👉ఇటలీ ప్రధాని జార్జియా మెలోని స్పందిస్తూ.. ఉక్రెయిన్ రక్షణ, భవిష్యత్తు గురించి చర్చించడానికి యూరోపియన్ దేశాలు, ఇతర మిత్రదేశాలతో అత్యవసర శిఖరాగ్ర సమావేశానికి పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ అండగా ఉండాలన్నారు.Russia illegally and unjustifiably invaded Ukraine. For three years now, Ukrainians have fought with courage and resilience. Their fight for democracy, freedom, and sovereignty is a fight that matters to us all.Canada will continue to stand with Ukraine and…— Justin Trudeau (@JustinTrudeau) February 28, 2025👉కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందిస్తూ.. రష్యా చట్టవిరుద్ధంగా, అన్యాయంగా ఉక్రెయిన్‌పై దాడి చేసింది. మూడు సంవత్సరాలుగా ఉక్రేనియన్లు ధైర్యంతో పోరాడుతున్నారు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సార్వభౌమాధికారం కోసం వారి పోరాటం మనందరికీ మేలు కొలుపు. న్యాయమైన, శాశ్వత శాంతిని సాధించడంలో ఉక్రేనియన్లకు కెనడా అండగా నిలుస్తుందన్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ నేతలకు జెలెన్స్కీ ధన్యవాదాలు తెలిపారు.ఇది కూడా చదవండి: జెలెన్స్కీతో ట్రంప్ వాగ్వాదం.. దద్దరిల్లిన వైట్‌హౌస్👉యూరోపియన్ యూనియన్ చీఫ్‌లు ఉర్సులా వాన్ డెర్ లేయెన్, ఆంటోనియో కోస్టా స్పందిస్తూ.. ఉక్రెయిన్ జెలెన్స్కీ ఎప్పుడూ ఒంటరి కాదు. మేము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మేమందరం మీతో న్యాయమైన, శాశ్వత శాంతి కోసం పని చేస్తూనే ఉంటాము. దైర్యంగా ఉండంటి అని అన్నారు.👉ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ స్పందిస్తూ.. రష్యా అనే దురాక్రమణతో ముందుకు సాగుతోంది. ఉక్రెయిన్‌కు అందరం అండగా ఉండాలి. ఉక్రెయిన్‌కు సాయం చేయడానికి, రష్యాపై ఆంక్షలు విధించడానికి ముందుకు రావాలన్నారు.👉మరోవైపు.. రష్యా మాత్రం ఉక్రెయిన్‌పై మరోసారి సెటైరికల్ కామెంట్స్ చేసింది. ట్రంప్, జెలెన్స్కీ వాడీవేడీ చర్చపై రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్ స్పందిస్తూ.. ఈ పరిణామం ఉక్రెయిన్‌కు చెంపదెబ్బ లాంటిదన్నారు. జెలెన్ స్కీకి ఇలా జరగాల్సిందే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.JD Vance and Trump just put Zelensky in his place. Wow. Watch this.pic.twitter.com/zndgjKEPKz— End Wokeness (@EndWokeness) February 28, 2025జరిగింది ఇదీ..ఇదిలా ఉండగా.. రష్యా చేస్తున్న యుద్ధానికి తెర దించడానికి శాంతి ఒప్పందం కుదర్చడం, దానికి బదులుగా ఉక్రెయిన్‌లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతించాలని అమెరికా చేసిన ప్రతిపాదనపై చర్చించడానికి జెలెన్స్కీ శుక్రవారం వైట్ హౌస్‌కి వచ్చారు. భవిష్యత్తులో తమపై రష్యా ఏదైనా దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పించాలని ఆయన ఒత్తిడి చేశారు. ఇది ట్రంప్‌నకు ఆగ్రహం తెప్పించింది. అనంతరం, అరుపులు, బెదిరింపులతో వాగ్వాదానికి దారితీసింది. ఉక్రెయిన్ (Ukraine) తీరు మూడో ప్రపంచయుద్ధానికి దారితీయవచ్చని.. జెలెన్స్కీ వైపు వేలెత్తి చూపిస్తూ ట్రంప్ కోపంగా చెప్పారు. కానీ, జెలెన్స్కీ మాత్రం ఉక్రెయిన్ ప్రజల కోసం ట్రంప్ బెదిరింపులకు లొంగకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం, జెలెన్స్కీని టార్గెట్ చేస్తూ ట్రంప్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. రష్యాతో శాంతి ఒప్పందానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సుముఖంగా లేరని అన్నారు. ఇదే సమయంలో పుతిన్ మాత్రం శాంతి కోసం ప్రయత్నిస్తున్నారని చెప్పుకొచ్చారు. -
Bangladesh: షేక్ హసీనా మాయం.. భారత్ సహకారం తుడిచివేత
ఢాకా: బంగ్లాదేశ్ ప్రభుత్వం(Government of Bangladesh) మాజీ ప్రధాని షేక్ హసీనాపై తీవ్ర వివక్ష చూపింది. దేశంలోని పాఠ్యపుస్తకాలలో ఆమె పేరును తొలగించింది. పాఠశాల పాఠ్యపుస్తకాలలో ప్రధాన మార్పులు చేసిన దరిమిలా ఈ వివరాలు వెలుగు చూశాయి. ఇదేవిధంగా పాకిస్తాన్ భారతదేశానికి లొంగిపోతున్నట్లు కనిపించే ఒక చారిత్రక ఫోటోను కూడా పాఠ్యాంశాల నుంచి తొలగించారు.గత సంవత్సరం బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న పలు అల్లర్ల దరిమిలా షేక్ హసీనా(Sheikh Hasina) బంగ్లాదేశ్ ప్రధానికి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తరువాత అక్కడ ఏర్పడిన నూతన ప్రభుత్వం పాఠశాల పుస్తకాలలో పలు మార్పులు చేసింది. వాటిలో భారతదేశానికి సంబంధించిన వివరాలలో కూడా మార్పులు చేసింది. షేక్ హసీనాకు సంబంధించిన అన్ని చిత్రాలు, అధ్యాయాలను పాఠ్య పుస్తకాల నుంచి పూర్తిగా తొలగించారు. ఇదేవిధంగా బంగ్లాదేశ్ స్వాతంత్ర్య ఉద్యమంలో భారతదేశం పాత్రను తొలగించనప్పటికీ, నాటి ప్రధాని ఇందిరా గాంధీతో పాటు ముజిబురహ్మాన్ ఉన్న ఫోటోలను తొలగించారు.పుస్తకాల వెనుక కవర్ పేజీపై షేక్ హసీనా విద్యార్థుల కోసం అందించిన సందేశాన్ని తొలగించారు. హసీనాపై తిరుగుబాటు జూలై 2024లో ప్రారంభమైంది. ఈ తిరుగుబాటుకు సంబంధించిన ఫొటోలను నూతన పాఠ్యపుస్తకాల వెనుక కవర్ పేజీపై ముద్రించారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం ఈ మార్పులను నేషనల్ కరికులం అండ్ టెక్స్ట్‌బుక్ బోర్డ్ (ఎన్‌సీటీబీ)చేసింది. ఇందుకోసం బంగ్లాదేశ్ విద్యా మంత్రిత్వ శాఖ 57 మందికి పైగా నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత మాధ్యమిక పాఠశాలలకు చెందిన 441 పుస్తకాలలో ఈ విధమైన మార్పులు చేశారు. 40 కోట్లకు పైగా కొత్త పుస్తకాలు ఇప్పటికే ముద్రితమయ్యాయి.డిసెంబర్ 1971లో భారత్, బంగ్లాదేశ్ స్వాతంత్ర్య సమరయోధులు(Freedom fighters) పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా పోరాటం సాగించారు. ఫలితంగా బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఏర్పాటయ్యింది. దీనిని వివరిస్తూ ఐదవ తరగతి పాఠ్య పుస్తకంలో ఒక అధ్యాయం ఉంది. దీనిలో ఒక చారిత్రక ఛాయాచిత్రం ఉంది. చిత్రంలో పాకిస్తాన్.. భారత్‌కు లొంగిపోవడాన్ని చూపుతుంది. పాకిస్తాన్ లెఫ్టినెంట్ జనరల్ అమీర్ అబ్దుల్లా ఖాన్ తమ లొంగుబాటు పత్రాన్ని భారత సైన్యం లెఫ్టినెంట్ జనరల్ జగ్జిత్ సింగ్ అరోరాకు అందిస్తున్నట్లుంది. అయితే ఈ ఫోటోను ఇప్పుడు పాఠ్య పుస్తకాల నుంచి తొలగించారు.ఆరో తరగతి ఇంగ్లీష్ పుస్తకంలో నాటి భారత ప్రధాని ఇందిరా గాంధీ, బంగ్లా ప్రధాని ముజిబురాహ్మాన్ సంయుక్తంగా ఉన్న ఫొటోను తొలగించారు. ఈ ఫొటో ఫిబ్రవరి 6, 1972 నాటిది. ఇంతేకాకుండా బంగ్లా జాతీయ జెండా, జాతీయ గీతాన్ని పుస్తకాల మొదటి పేజీ నుండి తొలగించి వెనుక భాగంలో ముద్రించారు. నిపుణుల బృందం పుస్తకాలలో జాతీయ జెండా, గీతం అవసరం లేదని భావించింది. వీటిని పూర్తిగా తొలగించాలా వద్దా అనేది తర్వాత నిర్ణయిస్తామని విద్యాశాఖాదికారులు తెలిపారు.ఇది కూడా చదవండి: నేటి నుంచి ప్రధాని మోదీ గుజరాత్ పర్యటన.. షెడ్యూల్ ఇదే.. -
రూ.7 వేల లక్షల కోట్ల కుబేరుడు.. 90 నిమిషాలే
వాషింగ్టన్: కేవలం 280 డాలర్లు (రూ.24,478) జమ చేయాల్సిన బ్యాంకు ఖాతాలో ఏకంగా 81 ట్రిలియన్ డాలర్లు(రూ.7,081,00000,0000000) జమ చేస్తే? సదరు ఖాతాదారుడు క్షణాల్లో కుబేరుడైపోతాడు. చిన్న చిన్న దేశాలనే కొనేసే స్థోమత వచ్చేస్తుంది. సాక్షాత్తూ కుబేరుడికే అప్పులు ఇచ్చేసినా ఆశ్చర్యం లేదు. కానీ, ఇక్కడ ఆ ఖాతాదారుడికి అంత భాగ్యం దక్కలేదు. అతడి కుబేరుడి హోదా 90 నిమిషాల్లోనే మటుమాయమైపోయింది. అమెరికాలో సిటీగ్రూప్ ఇన్‌కార్పొరేషన్‌కు చెందిన సిటీ బ్యాంకు సిబ్బంది గత ఏడాది ఏప్రిల్‌లో ఒక కస్టమర్ బ్యాంకు ఖాతాల్లో 280 డాలర్లకు బదులు ఆన్లైన్లో పొరపాటున 81 ట్రిలియన్ డాలర్లు జమచేశారు. ఇదంతా ఇద్దరు ఉద్యోగుల నిర్వాకం. తాము చేసిన తప్పును వారు గుర్తించలేకపోయారు. కానీ, మరో ఉద్యోగి 90 నిమిషాల్లో గుర్తించాడు. వెంటనే బ్యాంకు అధికారులకు అప్రమత్తం చేయడంతో సదరు లావాదేవీ ‘రివర్స్’అయిపోయింది. బ్యాంకు సొమ్ము భద్రంగా తిరిగి వచ్చేసింది. ఖాతాల్లో ఎక్కువ సొమ్మును జమ చేయడం లాంటి పొరపాట్లను బ్యాంకింగ్ పరిభాషలో ‘నియర్ మిస్’అంటారట! భారీ మొత్తంలో సొమ్ము ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు ఆన్లైన్లో బదిలీ అయితే హెచ్చరించే డిటెక్టివ్ కంట్రోల్ వ్యవస్థ బ్యాంకుల్లో ఉంటుంది. సిటీ బ్యాంకులో జరిగిన రూ.7,081 లక్షల కోట్ల లావాదేవీని ఈ వ్యవస్థ కనిపెట్టినట్లు సదరు బ్యాంకు ప్రతినిధి వెల్లడించారు. ఈ ఘటన వల్ల తమ బ్యాంక్‌కు గానీ, ఖాతాదారులకు గానీ ఎలాంటి నష్టం వాటిల్లలేదని చెప్పారు. సిటీ బ్యాంక్‌లో 2024లో 10 ‘నియర్ మిస్’ఘటనలు చోటుచేసుకున్నాయి. ఒక బిలియన్ డాలర్ల(రూ.8,740 కోట్లు) సొమ్ము పొరపాటున ఖాతాల్లోకి వెళ్లిపోయింది. 2023లో అయితే 13 నియర్ మిస్ ఘటనలు జరిగాయి. -
జెలెన్స్కీతో ట్రంప్ వాగ్వాదం.. దద్దరిల్లిన వైట్‌హౌస్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. వైట్‌హౌస్ వేదికగా ఇద్దరు నేతల మధ్య చర్చ వాడీవేడిగా జరిగింది. రష్యాతో యుద్ధంలో శాంతి ఒప్పందం కుదుర్చుకోవడం, ఉక్రెయిన్‌లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి ఒప్పందంపై సంతకం చేయకుండానే జెలెన్స్కీ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో, ఉక్రెయిన్‌పై ట్రంప్ సంచలన విమర్శలు చేశారు.ట్రంప్‌తో చర్చల కోసం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వైట్‌హౌస్‌కు వచ్చారు. రష్యా చేస్తున్న యుద్ధానికి తెర దించడానికి శాంతి ఒప్పందం కుదర్చడం, దానికి బదులుగా ఉక్రెయిన్‌లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతించాలని అమెరికా చేసిన ప్రతిపాదనపై చర్చించారు. ఈ క్రమంలో భవిష్యత్తులో తమపై రష్యా ఏదైనా దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పించాలని జెలెన్స్కీ.. ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌పై ఒత్తిడి చేశారు. ఈ సందర్బంగా ఇద్దరు నేతల మధ్య చర్చలు ప్రారంభమైన వెంటనే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. మీడియా ఎదుటే వాదులాడుకున్నారు.ట్రంప్ మాట్లాడుతూ.. ‘ఉక్రెయిన్ ప్రజల జీవితాలో మీరు చెలగాటం ఆడుతున్నారు. మీ ఆలోచనల కారణంగా మూడో ప్రపంచయుద్ధం వచ్చేలా ఉంది. మీరు చేస్తున్న పనులతో దేశానికి చాలా చెడ్డపేరు వస్తోంది. ఉక్రెయిన్ అతిపెద్ద సమస్యల వలయంలో చిక్కుకుంది. దీని నుంచి గట్టెక్కడం అసాధ్యం. చాలా విషయాలను ఇది క్లిష్ట తరం చేస్తుంది’ అని చెప్పుకొచ్చారు.Watching Trump and Vance gang up and bully Zelensky, I have never been so disgusted and ashamed to be an American in my life. 😡😡😡👇 pic.twitter.com/EjwPkTPAfW— Bill Madden (@maddenifico) February 28, 2025ఈ సందర్భంగా జెలెన్ స్కీ మాట్లాడుతూ..‘ఉక్రెయిన్ ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకోంది. మా దేశ భూభాగంలో మేము ఉంటున్నాం. మేము అక్కడ ఉండేందుకు మరొకరి అనుమతి తీసుకోవాలా?. మేము దృఢసంకల్పంతో ఉన్నాం. ఎవరికీ తలవంచే ప్రసక్తే లేదు. ఇన్ని రోజులు మాకు మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు’ అని చెప్పారు.ఈ క్రమంలో ట్రంప్ పక్కనే ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాట్లాడుతూ.. గట్టిగా మాట్లాడొద్దని జెలెన్స్కీకి హితవుపలికారు. రెండు దేశాల మధ్య యుద్ధానికి ముగింపు పలకాలంటే దౌత్యం అవసరమని చెప్పారు. వెంటనే జెలెన్స్కీ.. ‘ఎలాంటి దౌత్యం?’ అంటూ ఎదురు ప్రశ్నించారు. దీంతో వాన్స్ ఒకింత అసహనానికి గురయ్యారు. అధ్యక్షుడి కార్యాలయంలో ఇలా ప్రవర్తించడం సరికాదని అన్నారు.This is utterly repulsive!Trump and Vance just tried to humiliate Zelensky live on American TV, smugly demanding gratitude while openly mocking him like playground bullies counting favors. My respect for Zelensky—and my embarrassment as an American—just surged off the charts.… pic.twitter.com/0C4d03PDmi— Brian Krassenstein (@krassenstein) February 28, 2025మరోసారి ట్రంప్ కలగజేసుకుని.. రష్యాతో యుద్ధంలో అమెరికా మీకు ఎంతో సాయం చేసింది. మీకు మద్దతుగా నిలిచాం. ఆయుధాలు సమకూర్చాం. 350 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం చేశాం. మా సైనిక పరికరాలే లేకపోతే.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం రెండు వారాల్లో ముగిసిపోయేది. ఎంతో మంది ప్రజలు చనిపోతున్నారు. మీ దగ్గర సైనిక బలగం కూడా తగ్గిపోయింది. అయినా మాకు శాంతి ఒప్పందం వద్దంటున్నారు. యుద్ధమే చేస్తామంటున్నారు. తక్షణమే శాంతి ఒప్పందానికి అంగీకరించండి. అప్పుడే మీ దేశంపై బుల్లెట్ల మోత ఆగుతుంది. మరణాలు ఆగుతాయి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో, మరోసారి జెలెన్ స్కీ మాట్లాడుతూ.. అవును.. మీరు చెప్పింది నిజమే. రెండు రోజుల క్రితం ఇదే మాటలు పుతిన్ కూడా అన్నారు. శాంతి ఒప్పందం గురించి మీ గత ప్రభుత్వనేతలను అడగండి. ఏం చెబుతారో వినండి అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో జెలెన్స్కీ అమెరికాతో ఖనిజాల ఒప్పందంపై సంతకం చేయకుండానే అక్కడి నుంచి వెనుదిరిగారు.ఇక, వీరి భేటీ అనంతరం ట్రంప్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. రష్యాతో శాంతి ఒప్పందానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సుముఖంగా లేరని అర్థమైంది. రష్యా, ఉక్రెయిన్ మధ్య అత్యవసరంగా కాల్పుల విరమణ ఒప్పందం జరగాలని కోరుకుంటున్నాను. శాంతి ఒప్పందానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ సిద్ధంగా ఉన్నారు అంటూ రాసుకొచ్చారు. ఈ నేపథ్యంలో రష్యా-ఉక్రెయిన్ మధ్య పోరు ఎలా ఉంటుందో అనే ఆందోళన నెలకొంది. -
అధికార భాష ఆంగ్లం
వాషింగ్టన్: అగ్రరాజ్యంలో మెజార్టీ ప్రజలు మాట్లాడే భాష ఆంగ్లం. ప్రభుత్వ, ప్రభుత్వేతర వ్యవహారాల్లో ఉపయోగించే భాష ఆంగ్లమే. దేశంలో ఇతర భాషలు సైతం మాట్లాడేవాళ్లు కూడా ఉన్నారు. అమెరికా చరిత్రలో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఏ భాషకూ అధికార భాష హోదా లేదు. ఇంగ్లిష్‌కు ఇప్పుడు ఆ హోదా కల్పించాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకల్పించారు. ఇంగ్లిష్‌ను దేశమంతటా అధికార భాషగా గుర్తిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ట్రంప్ సంతకం చేయబోతున్నట్లు వైట్‌హౌస్ వర్గాలు తెలియ జేశాయి. అయితే, ఎప్పుడు సంతకం చేస్తారన్నది బయటపెట్టలేదు. అమెరికాలో కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే ఆంగ్లాన్ని అధికార భాషగా గుర్తించాయి. -
డ్రగ్ లార్డ్ క్వింటెరో అమెరికాకు తరలింపు
మెక్సికో సిటీ: డ్రగ్స్ ముఠాలపై ఉక్కుపాదం మోపా లన్న ట్రంప్ యంత్రాంగం ఒత్తిళ్లు మెక్సికో ప్రభుత్వంపై పనిచేశాయి. యూఎస్ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ(డీఈఏ) అధికారి హత్య కేసులో ఆరోపణలున్న కరడుగట్టిన డ్రగ్స్ ముఠా నాయకుడు రఫేల్ కారో క్వింటెరో సహా 29 మంది మాఫియా ముఖ్యులను మెక్సికో ప్రభుత్వం అమెరికాకు అప్పగించింది. మాదక ద్రవ్యాల మాఫియా ముఖ్యులను తమకు అప్పగించకుంటే మంగళవారం నుంచి అన్ని రకాల మెక్సికో దిగుమతులపై 25 శాతం సుంకాలను విధించక తప్పదన్న ట్రంప్ ప్రభుత్వం హెచ్చరికలతో మెక్సికో ప్రభుత్వ యంత్రాంగం మునుపెన్నడూ లేని విధంగా సహకరించేందుకు ముందుకు రావడం గమనార్హం. మెక్సికోలోని వే ర్వేరు జైళ్లలో ఉన్న డ్రగ్ మాఫి యా పెద్దతలలను గురు వారం రాజధాని మెక్సికో సిటీ లో విమానాలకు ఎక్కించారు. మొత్తం 29 మందిని అమెరికా వ్యాప్తంగా ఉన్న ఎనిమిది నగరాల్లోని జైళ్లకు తరలించారు. వీరిలో అమెరికా ప్రభుత్వం ఇటీవల విదేశీ ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించిన ఆరు గ్రూపులకు గాను ఐదు గ్రూపులకు చెందిన వారున్నారు. కారో క్వింటెరోతోపాటు సినలోలా కార్టెల్లోని రెండు గ్రూపులకు చెందిన ముఖ్యులు, 2022లో నార్త్ కరోలినాలో పోలీసు అధికారి హత్య కేసులో నిందితుడొకరు ఇందులో ఉన్నారని మెక్సికో అధికారులు వెల్లడించారు. డ్రగ్స్ అక్రమ రవాణా, హత్య తదితర నేరారోపణల కింద వీరిపై విచారణ జరపనున్నామని అమెరికా అటార్నీ జనరల్ పమేలా బోండి చెప్పారు. డ్రగ్స్ ముఠాలపై ఉక్కుపాదం మోపడం, అక్రమ వలసదా రులను నిలువరించడం, ప్రమాదకరమైన డ్రగ్ ఫెంటానిల్ ఉత్పత్తిని నిలిపివేయడం వంటివి మానుకో కుంటే టారిఫ్‌లు తప్పవని, సానుకూలంగా స్పందించిన పక్షంలో టారిఫ్‌ల అమలును వాయిదా వేస్తామని గతంలో ట్రంప్ హెచ్చరికలు చేశారు. -
పాకిస్తాన్లో మత సదస్సులో ఆత్మాహుతి దాడి
పెషావర్: వాయవ్య పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తూంక్వా ప్రావిన్స్‌లో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభానికి ముందు ఘోరం జరిగింది. నౌషేరా జిల్లా అకోరా ఖట్టక్ పట్టణంలో మతపరమైన సదస్సులో ఆత్మాహుతి దాడి చోటుచేసుకోవడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది గాయ పడ్డారు. శుక్రవారం సదస్సులో జుమ్మా ప్రార్థనలు జరుగుతుండగా ఓ దుండగుడు తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ ఘటనలో జమీయత్ ఉలేమా ఇస్లామ్ (జేయూఐ) అధినేత, మదర్సా– ఇ–హకానియా మసీదు నిర్వాహకుడు హమీదుల్ హక్ హక్కానీతోపాటు మరో నలుగురు అక్కడి కక్కడే మృతిచెందారు. హక్కానీ లక్ష్యంగానే ఈ దాడి జరిగినట్లు భావిస్తున్నామని స్థానిక ఐజీ జుల్ఫీకర్ హమీద్ చెప్పారు. 1968లో జన్మించిన హక్కానీ తన తండ్రి మౌలానా సమీ ఉల్ హక్ మరణం తర్వాత జేయూఐ అధినేతగా బాధ్యతలు చేపట్టారు. మతపెద్దగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రాణాపాయం ఉండడంతో పోలీసులు ఆయనకు ఆరుగురు సెక్యూరిటీ గార్డులతో రక్షణ కల్పిస్తున్నారు. అయినప్పటికీ ఆత్మాహుతి దాడిలో హక్కానీ మర ణించడం స్థానికంగా సంచలనం సృష్టించింది. ఆ త్మాహుతి దాడికి ఎవరు కారకులన్నది ఇంకా తెలియ రాలేదు. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
పట్టాలెక్కనున్న ఎఫ్‌టీయూ
న్యూఢిల్లీ: భారత్–యూరోపియన్ యూనియన్(ఈయూ) మధ్య చాలాఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందం(ఎఫ్‌టీయూ) త్వరలో పట్టాలకెక్కే దిశగా అడుగు ముందుకు పడింది. చరిత్రాత్మకంగా భావిస్తున్న ఈ ఒప్పందాన్ని ఈ ఏడాది ఆఖరు నాటికి కుదుర్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌డెర్ లెయెన్ నిర్ణయించారు. ఈ మేరకు ఒక డెడ్‌లైన్ విధించుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ ఉత్పత్తులపై సుంకాలు విధిస్తుండడంతో వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలకు నష్టం వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో భారత్, ఈయూ దేశాలకు ఎంతగానో ప్రయోజనం చేకూర్చే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని వీలైనంత త్వరగా కుదుర్చుకోవాలని మోదీ, ఉర్సులా ఒక అంగీకారానికి వచ్చారు. వారిద్దరూ శుక్రవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. నిజానికి ఇండియా, ఈయూ మధ్య ఈ ఒప్పందం కోసం గత 17 ఏళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇరుపక్షాల మధ్య జరుగుతున్న సంప్రదింపులు ఒక కొలిక్కి రావడం లేదు. 2013లో సంప్రదింపులు నిలిచిపోయాయి. 2022 జూన్‌లో పునఃప్రారంభమయ్యాయి. కానీ, ఆశించిన విధంగా ముందుకు సాగడం లేదు. కొన్ని అంశాలపై ఈయూ గట్టిగా పట్టుబడుతుండగా, ఇండియా సమ్మతించడం లేదు. కార్లు, వైన్, వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు రద్దు చేయాలని ఈయూ కోరుతుండగా, భారత ప్రభుత్వం తిరస్కరిస్తోంది. మోదీ, ఉర్సులా భేటీ కావడంతో ఇక ప్రతిష్టంభన తొలగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. కలసికట్టుగా పనిచేద్దాం భారత్, ఈయూ మధ్య సంబంధాలపై మో దీ, ఉర్సులా విస్తృతంగా చర్చించారు. ఇరుపక్షాల మధ్య రక్షణ సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని నిర్ణయించారు. ప్రధానంగా ఇండో–పసిఫిక్ ప్రాంతంలో ఉమ్మడి ప్రయోజనాలు కాపాడుకొనేలా కలసికట్టుగా పనిచేయాలని తీర్మానించారు. ఇండియాతో రక్షణ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలన్నదే తమ ఉద్దేశమని ఉర్సులా పేర్కొన్నారు. ఇండియా–ఈయూ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఒక కచి్చతమైన రోడ్‌మ్యాప్ రూపొందించుకోవాలని నిర్ణయించినట్లు మోదీ వెల్లడించారు. తదుపరి ఇండియా–ఈయూ శిఖరాగ్ర సదస్సు నాటికి రోడ్‌మ్యాప్ సిద్ధమవుతుందని అన్నారు. ఈ సదస్సు వచ్చే ఏడాది భారత్‌లో జరుగనుంది. మరోవైపు భేటీ తర్వాత మోదీ, ఉర్సులా ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. భారత్, ఈయూ మధ్య వ్యాపారం వాణిజ్యం, టెక్నాలజీ, పెట్టుబడులు, నవీన ఆవిష్కరణలు, గ్రీన్ ఎనర్జీ, భద్రత, నైపుణ్యాభివృద్ధి, రవాణా వంటి కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని, ఇరుపక్షాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చడమే లక్ష్యంగా ఒక ప్రణాళిక సిద్ధం చేయబోతున్నట్లు పేర్కొన్నారు. -
శరణమా.. రణమేనా?
వాషింగ్టన్: ఇటు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ. అటు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. దేశాధినేతలం అన్న విషయం కూడా మర్చిపోయి మీడియా సాక్షిగా వాగ్వాదానికి దిగారు. నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు. ఒకరినొకరు దుయ్యబట్టుకున్నారు. అచ్చం వీధి బాగోతాన్ని తలపించేలా పాత విషయాలన్నీ తిరగదోడుతూ, పరస్పరం దెప్పిపొడుచుకుంటూ రెచ్చిపోయారు. అంతర్జాతీయ స్థాయిలో ఎన్నడూ కనీవినీ ఎరగని ఈ దృశ్యాలకు వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీసు వేదికైంది. ఉక్రెయిన్‌లోని అపార ఖనిజ నిక్షేపాల్లో అమెరికాకు 50 శాతం వాటా ఇవ్వాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేయడం, బదులుగా రష్యా నుంచి తమ దేశానికి కచి్చతమైన రక్షణ హామీలు కావాలని జెలెన్స్కీ కోరడం తెలిసిందే. వాటిపై స్పష్టమైన ఒప్పందాల నిమిత్తం అగ్ర రాజ్యం చేరిన ఆయన శుక్రవారం వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో 45 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో తదితరులు పాల్గొన్న ఈ భేటీకి మీడియాను అనుమతించడమే గాక ప్రత్యక్ష ప్రసారం కూడా చేయడం విశేషం. భేటీ చాలాసేపటిదాకా ప్రశాంతంగానే సాగినా చివర్లో పూర్తిగా అదుపు తప్పింది. నేతలిద్దరి మాటల యుద్ధంతో రచ్చ రచ్చగా మారింది. చివరికి ఎటూ తేలకుండానే ముగిసింది. భేటీ అనంతరం జరగాల్సిన ట్రంప్, జెలెన్స్కీ సంయుక్త మీడియా భేటీ కూడా రద్దయింది! అంతేగాక, ‘జెలెన్స్కీ వైట్‌హౌస్ వీడి వెళ్లిపోవచ్చు’ అంటూ మీడియా సమక్షంలో ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. శాంతి ఒప్పందానికి సిద్ధపడితేనే తిరిగి తమతో చర్చలకు రావాలని సూచించారు. దాంతో ఎన్నో ఆశల నడుమ జెలెన్స్కీ చేపట్టిన అమెరికా యాత్ర ఆశించిన ఫలితం రాబట్టకపోగా వికటించిన్నట్టు కనిపిస్తోంది. అలా మొదలైంది... రష్యా–ఉక్రెయిన్ వివాదం విషయమై దశాబ్ద కాలంగా అమెరికా వ్యవహరిస్తున్న తీరును ఆక్షేపిస్తున్నట్టుగా జెలెన్స్కీ మాట్లాడటంతో పరిస్థితి వేడెక్కింది. అమెరికా మీడియా అంతా చూస్తుండగా అంత అమర్యాదకరంగా మాట్లాడటం సరికాదంటూ వాన్స్ జోక్యం చేసుకున్నా ఆయన వెనక్కు తగ్గలేదు. తమతో కుదుర్చుకున్న ఒప్పందాలన్నింటినీ రష్యా 2014 నుంచీ తుంగలో తొక్కుతూ వస్తున్నా అమెరికా సరైన రీతిలో జోక్యం చేసుకోలేదంటూ ఆక్షేపించారు. అధ్యక్షులు బరాక్ ఒబామా, ట్రంప్, బైడెన్ ఎవరూ తమకు చేయాల్సినంతగా సాయం చేయలేదని ఆరోపించారు. ఇప్పటికైనా ఖనిజ ఒప్పందానికి ప్రతిగా ఉక్రెయిన్ రక్షణకు అమెరికా స్పష్టమైన హామీ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ఆ క్రమంలో, ‘‘యుద్ధంలో అంతులేని నష్టాన్ని చవిచూడాల్సి వస్తే ఎలా ఉంటుందో అమెరికాకు తెలియదు. బహుశా మున్ముందు తెలిసొస్తుందేమో!’’ అన్న జెలెన్స్కీ వ్యాఖ్యలతో పరిస్థితి మరింత అదుపు తప్పింది. ట్రంప్ ఒక్కసారిగా తీవ్ర అసహనానికి లోనయ్యారు. జెలెన్స్కీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘అలాంటి పరిస్థితి మాకెప్పుడూ రాదు. ఎప్పటికీ తిరుగులేని శక్తిగానే ఉంటాం’’ అంటూ ఆగ్రహంగా బదులిచ్చారు. ‘‘ఉక్రెయిన్‌కు ఇన్నేళ్లుగా అన్నివిధాలా ఆదుకుంటూ వస్తున్నాం. ఈ యుద్ధంలో ఇప్పటికే 350 బిలియన్ డాలర్ల మేర సాయుధ, ఆర్థిక సాయం అందించాం. లేదంటే రష్యాతో యుద్ధం కొనసాగించడం మీ తరమయ్యేదే కాదు. పోరు రెండే వారాల్లో ముగిసిపోయేది’’ అంటూ దుయ్యబట్టారు. అయినా జెలెన్స్కీకి మాత్రం కనీస కృతజ్ఞత కూడా లేదంటూ విరుచుకుపడ్డారు. మీడియా ముందే తనతో గొడవకు దిగుతూ అమర్యాదకరంగా ప్రవర్తిస్తున్నారంటూ విమర్శించారు. ‘‘అమెరికా దన్ను లేనిదే మీరెందుకూ కొరగారు! మాకు షరతులు విధించే, మమ్మల్ని డిమాండ్ చేసే పరిస్థితిలో అసలే లేరు. అది గుర్తుంచుకోండి’’ అంటూ వేలు చూపిస్తూ మరీ జెలెన్స్కీని కటువుగా హెచ్చరించారు. ‘‘మీరు లక్షలాది ప్రాణాలను పణంగా పెడుతున్నారు. మూడో ప్రపంచ యుద్ధాన్ని తెచ్చిపెట్టేలా ప్రమాదకర జూదం ఆడుతున్నారు’’ అంటూ జెలెన్స్కీని ఆక్షేపించారు. మధ్యలో పదేపదే ఆయన భుజంపై కొట్టి మరీ ఆగ్రహం వెలిగక్కారు. రష్యాతో ఏ విషయంలోనూ రాజీ పడేదే లేదన్న జెలెన్స్కీ వ్యాఖ్యలను కూడా ట్రంప్ తీవ్రంగా ఖండించారు. ‘‘పుతిన్ ఒక ఉగ్రవాది. యుద్ధాల్లోనూ నిబంధనలుంటాయి. వాటన్నింటినీ కాలరాసిన పుతిన్ వంటి హంతకునితో ఎలాంటి రాజీ ఉండబోదు’’ అని జెలెన్స్కీ అన్నారు. అలా కుదరదని, యుద్ధానికి తెర దించాలంటే రష్యాతో చాలా విషయాల్లో రాజీ పడాల్సిందేనని ట్రంప్ కుండబద్దలు కొట్టారు. ‘‘ఇలాగైతే మాతో వ్యాపారం కష్టమే. అమెరికాతో ఖనిజ వనరుల ఒప్పందానికి అంగీకరిస్తారా, సరేసరి. లేదంటే మీకూ మాకూ రాంరాం’’ అంటూ తేల్చిపడేశారు. వాగ్వాదం పొడవునా నేతలిరువురూ పదేపదే వాగ్బాణాలు విసురుకున్నారు. కనీసం ఇప్పటికైనా అమెరికా చేస్తున్న దానికి కృతజ్ఞతలు చెప్పండంటూ వాన్స్ కల్పించుకోగా ట్రంప్ వారించారు. ‘‘పర్లేదు. ఈ డ్రామా నాకూ సరదాగానే ఉంది. జరుగుతున్నదేమిటో అమెరికా ప్రజలందరూ చూడాలి’’ అన్నారు.సాయానికి హామీ ఇవ్వలేం: ట్రంప్ జెలెన్స్కీతో భేటీకి ముందు ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్‌తో సహజ వనరుల ఒప్పందంపై ఆయన, తాను కాసేపట్లో సంతకాలు చేస్తామని ప్రకటించారు. యుద్ధం వీలైనంత త్వరగా ముగియాలన్నదే తన ఉద్దేశమన్నారు. అయితే, ‘‘ఉక్రెయిన్‌కు అమెరికా సైనిక సాయం కొనసాగుతుంది. కాకపోతే ఈ విషయంలో మానుంచి మరీ ఎక్కువగా ఆశించకూడదు’’ అని స్పష్టం చేశారు. యుద్ధాన్ని ముగించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కృతనిశ్చయంతో ఉన్నారంటూ మరోసారి ప్రశంసించారు. -
ఓటమి ఎఫెక్ట్.. పాకిస్థాన్ క్రికెటర్లు, బోర్డుకు ఝలక్!
ఇస్లామాబాద్: ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆతిథ్య పాకిస్థాన్ జట్టు ప్రదర్శన ఆ దేశ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. పాకిస్థాన్ ఆడిన రెండు మ్యాచుల్లో(భారత్, న్యూజిలాండ్) ఓటమిని చవిచూసింది. వర్షం కారణంగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్ రద్దు అయ్యింది. దీంతో, పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానానికి పరిమితమైంది. ఈ నేపథ్యంలో ప్లేయర్స్, పీసీబీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.మరోవైపు.. పాకిస్థాన్ టీమ్ ఆటతీరుపై రాజకీయ నాయకులు కూడా దృష్టి సారించారు. రిజ్వాన్ సేన దారుణ ఆటతీరు, పీసీబీ వ్యవహారాలను ప్రధాని షెహబాజ్ షరీఫ్ దృష్టికి తీసుకెళ్తామని ప్రధాని రాజకీయ, ప్రజా వ్యవహారాల సలహాదారు రాణా సనావుల్లా వెల్లడించారు. పార్లమెంట్లో జట్టు ప్రదర్శనపై చర్చించాలని ప్రధాని షెహబాబ్ను కోరుతామని అన్నారు. జట్టు ఓటమిపై ప్రధాని కూడా ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిపారు. ఈ సందర్బంగా సనావుల్లా మాట్లాడుతూ.. పాక్ క్రికెట్ జట్టు ఆట తీరుపై ప్రధాని వ్యక్తిగతంగా దృష్టిసారించాని కోరుతాం. జట్టు ఆటతీరు దారుణంగా ఉంది. పాక్ దారుణ ప్రదర్శనపై మంత్రివర్గంలో, పార్లమెంటులో ప్రస్తావించాలనుకుంటున్నాం. క్రికెట్ బోర్డు ఒక స్వతంత్ర సంస్థ. పాక్ బోర్డు తమ దగ్గర ఉన్న నగదును వేటికి ఎలా ఖర్చుపెడుతుందో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది. పీసీబీలోని కొందరు అధికారులు నెలకు ఐదు మిలియన్లకు వరకు అందుకుంటున్నారు. వారు తమకు నచ్చినట్లు చేయగలరు. కానీ, వారి బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలం అవుతున్నారు. గత దశాబ్ద కాలంగా మనం క్రికెట్లో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాం. ఆటగాళ్లకు ఇచ్చే ప్రోత్సాహకాలు సైతం భారీగా ఉన్నాయి. ఇవన్నీ జట్టు ప్రదర్శనపై ప్రభావితం చూపుతున్నాయి’ అని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో పాక్ జట్టు ఆట తీరుపై పార్లమెంట్లో వాడేవేడి చర్చ జరిగే అవకాశం ఉంది.ఇదిలా ఉండగా.. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ కథ ముగిసింది. ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవకుండానే(బంగ్లాదేశ్‌తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు) టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో జట్టు దారుణమైన ప్రదర్శన ఆ దేశ క్రికెట్ నిపుణులు, మాజీ ఆటగాళ్లలో ఆందోళనను రేకెత్తించింది. ఇలాంటి వైఫల్యాలకు జట్టు ఆటగాళ్ల ప్రదర్శన ఒక్కటే కారణం కాదని, పాక్ జట్టు దేశవాలీ వ్యవస్థ పూర్తిగా క్షీణించడం అని వారు చెబుతున్నారు. -
ట్రంప్‌కు మరో బిగ్ షాక్.. బెడిసికొడుతున్న నిర్ణయాలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు విషయంలో ట్రంప్ నిర్ణయాన్ని నిలిపివేస్తూ యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి విలియం అల్సప్ ఆదేశాలు జారీ చేశారు. ఫెడరల్ ఉద్యోగుల తొలగింపు ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని తీర్పు వెల్లడించారు.అమెరికాలో ఫెడరల్ ఏజెన్సీల్లో ఉద్యోగులను తొలగించాలన్న ప్రభుత్వ చట్టవిరుద్ధమైన ఆదేశాలపై పలు యూనియన్లు, న్యాయవాద సంఘాలు దావా వేశాయి. దీనిపై తాజాగా యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్బంగా డిస్ట్రిక్ట్ జడ్జి విలియం అల్సప్ కీలక తీర్పును వెల్లడించారు. అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాన్ని నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. పర్సనల్ మేనేజ్మెంట్ కార్యాలయానికి అలాంటి అధికారాలు లేవని స్పష్టంచేశారు. తొలగింపు ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పారు. దీంతో, ట్రంప్‌కు భారీ షాక్ తగిలినట్టు అయ్యింది.డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. అమెరికాలో అనవసర ఖర్చులను తగ్గించే ప్రణాళికలో భాగంగా ఫెడరల్ ఉద్యోగులను తొలగించాలని ట్రంప్ డోజ్ శాఖకు సూచించారు. ఈ మేరకు వివిధ శాఖల్లో ఉద్యోగులను తొలగించేందుకు ట్రంప్ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి మార్చి 13లోగా ప్రణాళికలను అందించాలని ఆదేశించారు. ఉద్యోగుల తొలగింపుతో పాటు ఉద్యోగ స్థానాన్ని కూడా పూర్తిగా తొలగించాలని అందులో పేర్కొన్నారు. వీటి ఫలితంగా రానున్న రోజుల్లో ప్రభుత్వ పనితీరులో విస్తృత మార్పులు రావచ్చని అంచనా వేస్తున్నారు. ఇక, ఉద్యోగుల తొలగింపునకు సంబంధించి డొనాల్డ్ ట్రంప్ ఇదివరకే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. 🚨Shocking: US judge temporarily blocks White House from ordering mass firing of federal workers pic.twitter.com/YFlzyBjiDS— EverthingEverything (@EverthingEv) February 28, 2025ఇదిలా ఉండగా.. ట్రంప్ నిర్ణయాల కారణంగా పలు విషయాల్లో ఆయనకు ఎదురుదెబ్బలు తగిలాయి. జన్మత:పౌరసత్వం, యూఎస్ఎయిడ్లో ఉద్యోగుల తొలగింపు, పలు నిర్ణయాలను కోర్టు తప్పుబట్టింది. ఈ క్రమంలో ట్రంప్ నిర్ణయాలకు వ్యతిరేకంగా కోర్టులు తీర్పులను వెల్లడించాయి.US judge temporarily blocks White House from ordering mass firing of federal workers Ruling deals blow to efforts by Donald Trump and Elon Musk to shrink government workforce Source - Financial Times— Prime View News (@primeviewnews) February 28, 2025 -
నేను అలా మాట్లాడానా?.. మాట మార్చిన ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట మార్చారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై ట్రంప్ పలుమార్లు విమర్శలు గుప్పించారు. జెలెన్స్కీని టార్గెట్ చేసి నియంత అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే, తాజాగా తాను అలా అనలేదంటూ ట్రంప్ ట్విస్ట్ ఇచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో తాజాగా బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సమావేశం అయ్యారు. అనంతరం, ఇరువురు నేతలు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఉక్రెయిన్ విషయంలో ట్రంప్ వ్యాఖ్యలపై ఓ విలేకరి ప్రశ్నించారు. ఇందుకు ట్రంప్ సమాధానం ఇస్తూ..‘నేను అలా అనలేదు కదా?. అలాంటా వ్యాఖ్యలు చేశానంటే నేనే నమ్మలేకపోతున్నాను. జెలెన్స్కీతో నాకు మంచి సంబంధాలున్నాయి. శనివారం మా ఇద్దరి మధ్య మంచి సంభాషణ జరుగుతుందని భావిస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చారు. దీంతో, అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు.ఇక, అంతకుముందు.. ట్రంప్, స్టార్మర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌లో శాంతి నెలకొనాలంటే సంబంధిత చర్చల్లో ఉక్రెయిన్ను, ఐరోపా దేశాల నేతలను భాగస్వాముల్ని చేయాలని ఆయన కోరారు. ఉక్రెయిన్‌పై రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో త్వరలో ట్రంప్ సమావేశం కానున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉక్రెయిన్ ప్రతినిధులెవ్వరూ లేకుండానే అమెరికా-రష్యా ప్రతినిధులు ఇటీవల చర్చించుకున్నప్పటి నుంచి ఇతర దేశాలు స్పందిస్తున్నాయి.ఇదిలా ఉండగా.. జెలెన్స్కీ ఓ నియంత అని, అందుకే ఆ దేశంలో ఎన్నికలు జరపడం లేదని ట్రంప్ మండిపడ్డారు. రష్యా తమ భూభాగాన్ని ఆక్రమించిందనే ఉక్రెయిన్ వాదనను తప్పుబట్టారు. కాస్త భూమితో పోయేదాన్ని యుద్ధం వరకూ తీసుకొచ్చారన్నారు. ఇప్పుడు ఎక్కువ భూమి సహా పెద్దసంఖ్యలో ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వచ్చిందని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. Trump last week: Zelenskyy is a “dictator”Trump today: “Did I say that?” pic.twitter.com/kiCRee8Tbh— The Recount (@therecount) February 27, 2025 -
నేపాల్‌లో భూకంపం.. భయంతో వణికిపోయిన ప్రజలు
ఖాట్మాండు: హిమాలయ దేశం నేపాల్‌లో భూమి కంపించింది. సింధుపల్చోక్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టార్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.1గా నమోదు అయినట్టు అధికారులు తెలిపారు. భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.వివరాల ప్రకారం.. నేపాల్‌లోని సింధుపల్చోక్ జిల్లాలోని భైరవకుండ వద్ద భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. అక్కడే భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. అయితే, రిక్టార్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.1గా నమోదు అయినట్టు చెప్పుకొచ్చారు. భూకంపం కారణంగా ప్రాణనష్టమేమీ జరగలేదని తెలిపారు. భూమి కంపించడంతో ఇళ్లలోని ప్రజలందరూ బయటకు పరుగులు తీశారు. ఇక, భారత్, చైనా, టిబెట్ సరిహద్దుల్లో కూడా స్వల్పంగా భూమి కంపించినట్టు అధికారులు చెబుతున్నారు. కాగా, నేపాల్ భూకంపం ప్రభావం మన దేశంలోని పలు ఉత్తరాది రాష్ట్రాల్లో కనిపించింది. బీహార్ రాజధాని పాట్నాతో పాటు పశ్చిమబెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కొన్నిచోట్ల ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. Un sismo de magnitud 5.5 sacudió hoy cerca de Kathmandu, Nepal. El sismo se sintió con fuerza en la India, Bután y Bangladesh. Sin embargo, no se reportan víctima ni daños. #earthquake pic.twitter.com/X49YtPaUrf— Centinela35 (@Centinela_35) February 28, 2025An earthquake with a magnitude of 5.5 on the Richter Scale hit Nepal at 2.36 IST today. (Source - National Center for Seismology) pic.twitter.com/OtockGLncO— ANI (@ANI) February 27, 2025 -
గాజా నుంచి వైదొలగబోం
ఖాన్ యూనిస్: గాజాలో శాంతిస్థాపన ప్రక్రియ మళ్లీ డోలాయమానంలో పడింది. గాజాలోని ఫిలడెల్ఫీ తదితర వ్యూహాత్మక ప్రాంతాల నుంచి తమ సైన్యం వైదొలగే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ గురువారం కుండబద్దలు కొట్టింది. ఆయుధాల స్మగ్లింగ్ తదితరాల నిరోధానికి ఇది తప్పనిసరి పేర్కొంది. నలుగురు ఇజ్రాయెలీ బందీల మృతదేహాలను హమాస్ రెడ్‌క్రాస్‌కు అప్పగించిన కొద్ది గంటల్లోనే ఇజ్రాయెల్ అధికారి ఒకరు ఈ మేరకు మీడియాకు వెల్లడించారు. దాంతో తొలి దశ కాల్పుల విరమణ ఒప్పందం శనివారం ముగియనున్న వేళ ఇజ్రాయెల్, హమాస్ మధ్య శాంతి చర్చలు అనుమానంలో పడ్డాయి. ఒప్పందం మేరకు ఫిలడెల్ఫీ తదితర ప్రాంతాల నుంచి వైదొలిగే ప్రక్రియకు ఇజ్రాయెల్ శనివారమే శ్రీకారం చుట్టాల్సి ఉంది. చర్చలు ముందుకు సాగాలంటే గాజా నుంచి ఇజ్రాయెల్ సైన్యం వైదొలగాల్సిందేనని హమాస్‌తో పాటు చర్చల మధ్యవర్తి ఈజిప్ట్ కూడా స్పష్టం చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. హమాస్ మాత్రం రెండో దశ కాల్పుల విరమణపై చర్చలకు సిద్ధమని ప్రకటించింది. తమ వద్ద బందీలుగా ఉన్న డజన్ల కొద్దీ ఇజ్రాయెలీలు విడుదలవ్వాలంటే చర్చలకు, ఒప్పందానికి కట్టుబడి ఉండటమే ఇజ్రాయెల్ ముందున్న ఏకైక మార్గమని పేర్కొంది. కాల్పుల విరమణ నుంచి వెనక్కి తగ్గే ఏ ప్రయత్నమైనా బందీలకు, వారి కుటుంబాలకు మరింత నష్టాన్ని కలిగిస్తుందని హెచ్చరించింది. మరోవైపు ఇజ్రాయెల్ చెరలో ఉన్న 600కు పైగా పాలస్తీనా ఖైదీలు కూడా గురువారం తెల్లవారుజామున విడుదలయ్యారు. దాంతో ఖాన్ యూనిస్‌లో ఆనందం నెలకొంది. ఆరు వారాల తొలి దశ కాల్పుల విరమణలో భాగంగా హమాస్ ఇప్పటిదాకా 25 మంది ఇజ్రాయెలీ బందీలను, 8 మృతదేహాలను అప్పగించింది. బదులుగా దాదాపు 2,000 మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేసింది. రెండో దశపై ఫిబ్రవరి తొలి వారంలోనే చర్చలు మొదలవ్వాల్సి ఉండగా ఇప్పటిదాకా ఎలాంటి పురోగతీ లేదు. హమాస్ తాజాగా అప్పగించిన నలుగురు ఇజ్రాయెలీల మృతుల్లో ఒకరు 2023 అక్టోబర్ 7న దాడిలోనే చనిపోయారు. మృతదేహాన్ని హమాస్ మిలిటెంట్లు గాజాకు తరలించారు. మిగతా ముగ్గురు సజీవంగా అపహరణకు గురయ్యారు. వారి మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది. హమాస్ వద్ద కనీసం మరో 59 మంది ఇజ్రాయెలీలు బందీలుగా ఉన్నట్టు చెబుతున్నారు. వారిలో 32 మందికి పైగా మరణించి ఉంటారని అనుమానిస్తున్నారు. -
భారత గ్రాడ్యుయేట్ల కోసం...గోల్డ్ కార్డు కొనండి
వాషింగ్టన్: హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ వంటి అత్యుత్తమ యూనివర్సిటీల్లో చదివే ప్రతిభావంతులైన భారత పట్టభద్రులకు ఉద్యోగాలిచ్చేందుకు గోల్డ్ కార్డ్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అమెరికా కంపెనీలకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. 50 లక్షల డాలర్లు (రూ.43.67 కోట్లు) చెల్లించి గోల్డ్ కార్డు కొనుగోలు చేస్తే అమెరికా పౌరసత్వమిస్తామని ఆయన తాజాగా ప్రకటించడం తెలిసిందే. ‘‘అమెరికాలోని అత్యున్నత వర్సిటీల్లో చదివే భారత్, చైనా, జపాన్ విద్యార్థులకు ఇక్కడి కంపెనీలు ఆకర్షణీయమైన జాబ్ ఆఫర్లు ఇచ్చి నిలుపుకునే అవకాశం ప్రస్తుత ఇమిగ్రేషన్ వ్యవస్థలో లేదు. దాంతో వారు స్వదేశాలకు వెళ్లి వ్యాపారాలు ప్రారంభించి బిలియనీర్లుగా ఎదుగుతున్నారు. వేలాదిమందికి ఉపాధి కల్పిస్తున్నారు. అలాంటి వారి కోసం అమెరికా కంపెనీలే ఇకపై గోల్డ్ కార్డు కొనుగోలు చేయొచ్చు. తద్వారా వారికి ఉపాధి కల్పించి అట్టిపెట్టుకోవచ్చు’’ అని పేర్కొన్నారు. గోల్డ్ కార్డు పథకం రెండు వారాల్లో అమల్లోకి రానుంది. -
యూఎస్ ఎయిడ్ కాంట్రాక్టుల్లో 90 శాతం రద్దు!
వాషింగ్టన్: అమెరికా అంతర్జాతీయ విదేశీ సహాయ నిధి (యూఎస్ ఎయిడ్)కు ఇప్పటికే మంగళం పాడిన డొనాల్డ్ ట్రంప్ సర్కారు, దానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 90 శాతానికి పైగా కాంట్రాక్టులను రద్దు చేస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. ఈ దెబ్బతో 6,200 కాంట్రాక్టుల్లో 54 బిలియన్ డాలర్ల విలువైన 5,800 పై చిలుకు ఒక్కసారిగా బుట్టదాఖలయ్యాయి. యూఎస్ ఎయిడ్ కాంట్రాక్టుల మొత్తం విలువ 60 బిలియన్ డాలర్లని సర్కారు వెల్లడించింది. యూఎస్ ఎయిడ్ రద్దును సవాలు చేస్తూ పలు స్వచ్ఛంద సంస్థలు ఇప్పటికే కోర్టుల తలుపులు తట్టాయి. సదరు కాంట్రాక్టులకు సంబంధించి నిలిపేసిన బిలియన్ల కొద్దీ డాలర్లను తక్షణం విడుదల చేయాల్సిందిగా డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి ఒకరు మంగళవారం తీర్పు ఇచ్చారు. కానీ దానిపై ట్రంప్ యంత్రాంగం బుధవారం సుప్రీంకోర్టుకు వెళ్లింది. దిగువ కోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు దన్నుగా నిలిచే యూఎస్ ఎయిడ్ కార్యక్రమాన్ని అమెరికా 60 ఏళ్లకు పైగా కొనసాగిçస్తున్న సంగతి తెలిసిందే.ఖాళీకి పావుగంటఉద్వాసన పలికిన, దీర్ఘకాలిక సెలవులపై పంపిన యూఎస్ ఎయిడ్ సిబ్బందికి తమ డెస్కులను ఖాళీ చేసేందుకు గురు, శుక్రవారాల్లో ప్రభుత్వం కేవలం 15 నిమిషాల గడువిచ్చింది. దాంతో సిబ్బంది ఒక్కొక్కరుగా సంస్థ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. తమ కార్యాలయాన్ని, డెస్కును చివరిసారిగా చూసుకుంటూ భారమైన మనసుతో నిట్టూర్చారు. ఇది తమను మరింతగా అవమానించడమేనని వాపోయారు. -
ఈయూపై 25 శాతం సుంకాలు
వాషింగ్టన్: అమెరికా సుంకాల దెబ్బ యూరోపియన్ యూనియన్ (ఈయూ)నూ తాకింది. ఈయూ దిగుమతులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. బుధవారం తొలి కేబినెట్ మీటింగ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ ప్రకటన చేశారు. ఈయూతో వాణిజ్యంలో అమెరికాకు అన్యా యం జరుగుతోందని ఆరోపించారు. ‘‘27 దేశాలున్న ఈయూ అమెరికా కార్లు, వ్యవసాయోత్పత్తులను అంగీకరించదు. కానీ మేం మాత్రం వారి నుంచి అన్నీ దిగుమతి చేసుకుంటున్నాం. అమెరికా వాహన దిగుమతులపై ఈయూ 10 శాతం సుంకం విధిస్తోంది. ఈయూ ప్యాసింజర్ కార్ల దిగుమతులపై మేం విధిస్తున్న దానికంటే ఇది 4 రెట్లు ఎక్కువ’’ అంటూ మండిపడ్డారు. అసలు అమెరికాను ఇరుకున పెట్టేందుకే ఈయూ పుట్టిందని ట్రంప్ ఆరోపించారు. గట్టిగా బదులిస్తాం: ఈయూట్రంప్ వ్యాఖ్యలపై ఈయూ కార్యనిర్వాహక విభా గమైన యూరోపియన్ కమిషన్ దీటుగా స్పందించింది. ‘‘మాది ప్రపంచంలోనే అతి పెద్ద స్వేచ్ఛా విపణి. అమెరికాకు ఈయూ వరం. చట్టబద్ధం, వి వక్షారహితం అయిన మా విధానాలను ఎదుర్కొనేందుకు సుంకాలను ఉపయోగిస్తే, స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక వాణిజ్యానికి అడ్డంకులు కలిగిస్తే ఈయూ గట్టిగా బదులిస్తుంది’’ అని కమిషన్ అధికార ప్రతినిధి ప్రకటించారు. అమెరికా, ఈయూ ఉద్రిక్తతలురెండు ప్రపంచ యుద్ధాలతో దెబ్బతిన్న ఐరోపా ఖండంలో ఘర్షణలకు తెర దించేందుకు 1993లో ఈయూ ఏర్పాటైంది. అమెరికా కూడా దీన్ని ఓ చరిత్రాత్మక విజయంగానే చూసింది. ఐరోపా సమైక్యతను దశాబ్దాలుగా ప్రోత్సహించింది. కానీ రెండింటి మధ్య కొంతకాలంగా విభేదాలు పెరిగిపోతున్నాయి. ట్రంప్ రాకతో ఉక్రెయిన్‌కు మద్దతు విషయంలో అమెరికా ఉన్నట్టుండి యూ టర్న్ తీసుకోవడంతో కూటమి దేశాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఉక్రెయిన్ యుద్ధంపై ఐరాస తాజా తీర్మానం విషయంలోనూ రష్యాకు అను కూలంగా అమెరికా నిలవడం నివ్వెరపరిచింది. ఈ యూపై సుంకాల ప్రకటనను ఈ విభేదాలకు కొనసాగింపుగా చూస్తున్నారు. అమెరికాలో పర్య టిస్తున్న ఈయూ విదేశీ విధాన వ్యవహారాల సారథి కాజా కలాస్ ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో భేటీ కావాల్సి ఉండగా సమయాభావం సాకుతో అది రద్దయింది! -
కొంచెం అతి ఖర్చుకు 100 కోట్ల మంది దూరం
ఆసియాలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్‌లో వినియోగదారుల వర్గం పెరగడం లేదు. సంపన్నుల సంపద మాత్రమే పెరుగుతోంది. ఏకంగా 100 కోట్ల మంది వద్ద వస్తువులు, సేవల మీద వెచ్చించేందుకు డబ్బు లేదు! బ్లూమ్ వెంచర్స్ సంస్థ నివేదిక ఈ మేరకు వెల్లడించింది. 143 కోట్ల జనాభాలో అత్యవసరం కాని వస్తువులు, సేవలపై, అంటే ఓ మాదిరి విలాసాలపై ఖర్చు చేసే ప్రజల సంఖ్య చాలా తక్కువని తెలిపింది. వెంచర్ క్యాపిటల్ నివేదిక ప్రకారం దేశంలో 13 నుంచి 14 కోట్ల మందే ‘వినియోగ వర్గం’గా ఉన్నారు. కనీసావసరాలకు మించి కొనుగోలు చేయగల సామర్థ్యం వీరికే ఉంది. ఈ వినియోగదారుల వ్యయంపైనే దేశ జీడీపీ ఎక్కువగా ఆధారపడి ఉందని నివేదిక పేర్కొంది. డిజిటల్ చెల్లింపుల సౌలభ్యంతో ఎక్కువ వెచ్చిస్తున్నా చాలావరకు అది అత్యవసర సేవల కోసమే ఉంటోందని తెలిపింది. కొత్త స్టార్టప్‌ల సేవలకు వారు డబ్బు వినియోగించడం లేదని తెలిపింది. భారత్‌లో వినియోగదారుల మార్కెట్ విస్తృతంగా విస్తరించడం లేదని, సంపన్నుల సంఖ్య పెరగడం లేదని, ఉన్నవారే మరింత సంపన్నుల వుతున్నా రని ఈ సర్వే మరోసారి తేల్చిందని నిపుణులంటున్నారు. ఈ మార్పు వ్యాపార ధోరణులను ప్రభావితం చేస్తోందని చెబుతున్నారు.మధ్యతరగతిపై రోకటిపోటు1990లో జాతీయాదాయంలో 34 శాతంగా ఉన్న భారతీయ సంపన్నుల వాటా ఇప్పుడు ఏకంగా 57.7 శాతానికి పెరిగింది. దిగువ సగం జనాభా వాటా 22.2 శాతం నుంచి 15 శాతానికి పడిపోయింది. ఆర్థిక పొదుపు కూడా క్షీణిస్తోంది. మెజారిటీ భారతీయుల రుణాలు పెరుగుతున్నాయి. ఆర్థికంగా ఎదుగుతున్న వినియోగదారులు కొనుగోళ్ల కోసం దాదాపుగా రుణాలపై ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో అరక్షిత రుణాల నిబంధనలను ఆర్బీఐ కఠినతరం చేయడం వారిని బాగా ప్రభావితం చేస్తోంది. వినియోగదారుల డిమాండ్‌కు ప్రధాన చోదకశక్తిగా ఉన్న మధ్యతరగతి కుంచించుకుపోతోంది. దేశంలో పన్ను చెల్లించే మధ్య తరగతిలో సగం మందికి దశాబ్దం కాలంగా వేతనాల్లో పెరుగుదల లేదు. పైపెచ్చు ద్రవ్యోల్బణంతో పోలిస్తే వారి ఆదాయాలు సగానికి పడిపోయాయి. ఈ ఆర్థిక మాంద్యం మధ్యతరగతి పొదుపును దాదాపుగా నాశనం చేసేసింది. భారతీయ కుటుంబాల నికర ఆర్థిక పొదుపు 50 ఏళ్ల కనిష్టానికి చేరిందని ఆర్బీఐ పదేపదే చెబుతోంది. దాంతో మధ్యతరగతి గృహ వ్యయాలతో ముడిపడ్డ ఉత్పత్తులు, సేవలకు మున్ముందు గడ్డుకాలమేనని నివేదిక సూచిస్తోంది.ఏఐ దెబ్బ...సాంకేతికత, యాంత్రీకరణ దెబ్బకు వైట్ కాలర్ ఉద్యోగాలు శరవేగంగా మాయమవుతున్నట్టు మార్సెలస్ నివేదిక హెచ్చరిస్తోంది. క్లరికల్, సెక్రటేరియల్ పోస్టులను క్రమంగా కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థలు భర్తీ చేస్తున్నాయి. దాంతో తయారీ రంగంలో పర్యవేక్షక ఉద్యోగాలూ తగ్గుతున్నాయి. ఏఐ తాలూకు ఈ దుష్ప్రభావం గురించి ఆర్థిక సర్వే–2025 కూడా పేర్కొంది. ఏఐ వల్ల ఉత్పాదకత పెరుగుతున్నా కార్మికులపై ఆధారపడే మన ఆర్థిక వ్యవస్థను ఇది దెబ్బ తీస్తుందని హెచ్చరించింది. వృద్ధిని కూడా ఇది దెబ్బ తీస్తుందని ఐఎంఎఫ్ హెచ్చరించింది. పరిస్థితిలో మార్పు రావాలంటే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు, విద్యా సంస్థల మధ్య సహకారం, సమగ్ర విధానం అవసరమని నివేదిక పేర్కొంది. ఉద్యోగాలపై ఏఐ ప్రభావం విషయంలో అలసత్వం చూపితే భారత్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
‘‘అయ్యా ట్రంప్.. ఇలాంటి బతుకులెందుకు?’’
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజన్‌పై అరబ్ దేశాలు భగ్గుమంటున్నాయి. తాజా ‘ట్రంప్ గాజా’ అంటూ ఆయన తన సోషల్ మీడియా అకౌంట్లో ఓ వీడియోను పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఊహాజనితమైన గాజా.. వాస్తవాలను ఏమాత్రం దాచిపెట్టలేదని.. అక్కడి ప్రజలు కోరుకునేది అలాంటి బ్రతుకులు కానేకాదని పలువురు మండిపడుతున్నారు.ఆకాశన్నంటే భవనాలు, లగ్జరీ ఓడలు, రాత్రిపూట బంగారు వర్ణంలో మెరిసి పోయే గాజా, నియంతృత్వ ధోరణిని ప్రతిబింబించేలా డొనాల్డ్ ట్రంప్(Donald Trump) బంగారు విగ్రహాలు, మధ్యలో ఏదో తింటూ కనిపించే ఇలాన్ మస్క్, డబ్బులు వెదజల్లే పిల్లలు, అటు పబ్‌లో డ్యాన్సర్లతో.. ఇటుపై ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహూతో ట్రంప్ చొక్కాల్లేకుండా సేదతీరుతున్న దృశ్యాలను.. వెరసి విలాసవంతమైన ప్రాంతంగా ఉన్న గాజా వీడియోను ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో షేర్ చేశారు.Holy Shlit. President Trump just posted Trump Gaza on his Truth Social account. 🤣🤣🤣 pic.twitter.com/o44mmbtyk8— Based DK (@Back_2TheMiddle) February 26, 2025అయితే ట్రంప్ గాజా పేరుతో విడుదలైన ఆ ఏఐ జనరేటెడ్(AI Generated Video) వీడియోపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అది గాజా ప్రజలను ప్రతిబింబించేలా ఎంతమాత్రం లేదని హమాస్ పొలిటికల్ బ్యూరో సభ్యుడు బసీమ్ నయీమ్ అన్నారు. ‘‘దురదృష్టవశాత్తూ.. ట్రంప్ మరోసారి గాజా ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ప్రవర్తించారు. గాజా ప్రజలు కోరుకుంటోంది ఛిద్రమైన ఈ ప్రాంత పునర్మిర్మాణం. అలాగే తమ తర్వాతి తరాలకు మంచి భవిష్యత్తు అందించాలని. అంతేగానీ బంధీఖానాల్లో ఉండాలని కాదు. మేం పోరాడేది బంధీఖానాల్లో పరిస్థితులు మెరుగుపడాలని కాదు. అసలు జైలు, జైలర్ లేకుండా చూడాలని’’ అని నయీమ్ అంటున్నారు.మరోవైపు ఈ వీడియోలో మస్క్, నెతన్యాహూ ప్రస్తావించడంపై కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. గాజాలో మానవతా సాయం కొనసాగుతున్న వేళ.. పాలస్తీనా ప్రజలు ఎదుర్కొంటున్న అసలైన సమస్యలను ట్రంప్ పక్కనపెట్టారంటూ పలువురు మండిపడుతున్నారు. 👉2023 అక్టోబర్ 07వ తేదీన హమాస్(Hamas) సంస్థను ఇజ్రాయెల్‌పై మెరుపు మిస్సైళ్ల దాడి జరిపింది. ఈ దాడుల్లో 1,200 మంది మరణించారు. అయితే ప్రతిగా హమాస్ ఆధీనంలో ఉన్న గాజాపై దాడులు జరుపుతూ వచ్చింది. ఇప్పటిదాకా ఈ దాడుల్లో 48,200 మంది పాలస్తీనా ప్రజలు మరణించగా.. ఇందులో పిల్లల సంఖ్యే అధికంగా ఉంది. మరోవైపు.. ఈ యుద్ధ వాతావరణంతో 90 శాతం గాజా ప్రజలు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ఇజ్రాయెల్ దాడులు కొనసాగడంతో గాజాకు అంతర్జాతీయ సాయం అందడం కూడా కష్టతరంగా మారగా.. ఆ సాయం అందక పలువురు చనిపోవడం గమనార్హం.👉ప్రస్తుతం ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పలు విరమణ ఒప్పందం అమల్లో ఉంది. ఒప్పందంలో భాగంగా తమ దగ్గర ఉన్న బంధీలను హమాస్.. పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ ఇచ్చి పుచ్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఒప్పందం పూర్తైతే హమాస్ పరిస్థితి ఏంటన్నది ఇప్పటికైతే ప్రశ్నార్థకమే. 👉మరోవైపు.. గాజా పునర్మిర్మాణం కోసం ట్రంప్ ఓ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. అక్కడ ఉన్న 21 లక్షల మంది పాలస్తీనా ప్రజలను ఇతర ప్రాంతాలకు పంపించేసి(వెలేసి).. గాజాను అతి సుందర విలాస ప్రాంతంగా తీర్చిదిద్దుతామని, ఆ బాధ్యతలు అమెరికానే తీసుకుంటుందని అంటున్నారాయన. దీనికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మద్ధతు ప్రకటించగా.. అరబ్ దేశాలు మండిపడుతున్నాయి. మరోవైపు.. గాజా సంక్షోభంలో మధ్యవర్తిత్వం వహిస్తున్న ఈజిప్ట్‌లో మార్చి 4వ తేదీన ప్రతినిధులు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో ట్రంప్ ప్రతిపాదనపైనా చర్చించే అవకాశం లేకపోలేదు.ఇదీ చదవండి: సారీ.. ఆయన కింద పని చేయలేం!