Karnataka
-
నటి రన్యా రావు కేసులో భారీ ట్విస్ట్.. తరుణ్ రాజు అరెస్ట్
బెంగళూరు: కన్నడ సినీ నటి రన్యా రావు బంగారం స్మగ్లింగ్ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో ఆమె సవతి తండ్రి, డీజీపీ స్థాయి అధికారి కె.రామచంద్రరావు ప్రమేయంపై నిగ్గు తేల్చాలని కర్ణాటక ప్రభుత్వం అదనపు చీఫ్ సెక్రటరీ గౌరవ్ గుప్తాను ఆదేశించింది. ఈ మేరకు సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ అయినట్లు సీఎం కార్యాలయం మంగళవారం తెలిపింది.ఇక, అదే సమయంలో, కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో విధి నిర్వహణలో పోలీసు అధికారుల నిర్లక్ష్యం, లోటుపాట్లపైనా విచారణ చేపట్టాలని సీఐడీ విభాగాన్ని ఆదేశించింది. తక్షణమే దర్యాప్తు చేపట్టి, వారం లోగా నివేదిక అందించాలని స్పష్టం చేసింది. విచారణకు సహకరించాల్సిందిగా సంబంధిత పోలీసు విభాగాలను సీఎంవో కోరింది.రామచంద్రరావు ప్రస్తుతం కర్ణాటక స్టేట్ పోలీస్ హౌసింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ నెల 3వ తేదీన దుబాయ్ నుంచి బెంగళూరుకు చేరుకున్న రన్యా రావు వద్ద డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ)అధికారులు రూ.12.56 కోట్ల విలువైన బంగారు కడ్డీలను స్వా«దీనం చేసుకున్నారు. మరునాడు ఆమె ఇంట్లో మరికొంత బంగారం, డబ్బు స్వా«దీనం చేసుకోవడం తెలిసిందే. తరచూ దుబాయి వెళ్లి వస్తూ ఆమె బంగారాన్ని దొంగచాటుగా తీసుకువస్తోందని, విమానాశ్రయంలోని పోలీసు సిబ్బంది సోదాలు జరపకుండా ఆమెను పంపించి వేస్తున్నట్లు తేలింది. ఈ వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టించడంతో రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. కాగా, రన్యా రావు బంగారం స్మగ్లింగ్ వ్యవహారంతో మంత్రులకు సంబంధాలున్నట్లు వస్తున్న వార్తలన్నీ రాజకీయ పుకార్లేనని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కొట్టిపారేశారు. కేంద్ర విభాగాలు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. DRI Busts Smuggling Nexus: Ranya Rao’s associate, Tarun Raju, has been taken into custody as part of the ongoing smuggling investigation.#RanyaRao #TarunRaju #DRIProbe #SmugglingCase #BreakingNews #NewsX pic.twitter.com/7zE4CBQA3i— NewsX World (@NewsX) March 11, 2025హోటల్ యజమాని మనవడు అరెస్ట్ ఇదే కేసులో డీఆర్ఐ అధికారులు మంగళవారం బెంగళూరులోని అట్రియా హోటల్ యజమాని మనవడు తరుణ్ రాజును అరెస్ట్ చేశారు. అతడిని బెంగళూరులోని ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టులో హాజరు పరచగా ఐదు రోజుల కస్టడీకి అనుమతించిందని డీఆర్ఐ తెలిపింది. రన్యా రావు, తరుణ్ రాజులకు సన్నిహిత సంబంధాలున్నాయని, విదేశాల నుంచి బంగారాన్ని దొంగచాటుగా తేవడం వీరు కూడబలుక్కుని చేసిందేనని అంటోంది. రన్యా రావు వేరొకరిని పెళ్లి చేసుకోవడంతో వీరి మధ్య సంబంధాలు బెడిసి కొట్టినా చట్ట విరుద్ధ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారంది. దుబాయి నుంచి బంగారాన్ని తీసుకువచ్చేటప్పుడు రన్యా రావు తరుణ్ రాజుతో ఫోన్లో మాట్లాడినట్లు డీఆర్ఐ తెలిపింది. వీరిద్దరినీ వేర్వేరుగా, కలిపి సైతం విచారించినట్లు వివరించింది. అయితే, విచారణ సమయంలో అధికారులు తనను బెదిరించారని, మానసికంగా వేధించారని సోమవారం కోర్టు విచారణ సమయంలో రన్యా రావు ఆరోపించింది. తనను కొట్ట లేదు కానీ, పరుషంగా దూషించారని తెలిపింది. ఇష్టం లేకున్నా తనతో కొన్ని పత్రాలపై సంతకాలు చేయించారని రోదిస్తూ జడ్జికి ఫిర్యాదు చేసింది. -
అమ్మానాన్నలను మింగేసి.. ఆనందాలను చిదిమేసి.!
రోజూ ఒడిలో కూర్చోబెట్టుకొని గోరుముద్దలు తినిపించే అమ్మ ఎక్కడికెళ్లిందోనని ఆ చిన్నారి ఇంట్లోకి, బయటికి తిరుగుతోంది.. బయటకు వెళ్లిన నాన్న ఏదో ఒకటి తీసుకొచ్చి తినిపిస్తాడని ఆశగా అందరినీ అడుగుతోంది..ఎప్పుడూ ఎవరో ఒకరు తోడుంటారు కానీ, ఇప్పుడు అమ్మానాన్న ఇద్దరూ కనిపించకపోయే సరికి ఆ పసికందు బేలచూపులు చూస్తోంది..అయ్యో పాపం అన్నా అర్థం కాదు.. అందరూ ఎందుకు ఏడుస్తున్నారో తెలుసుకోలేదు..నా పుట్టిన రోజు అన్నారు కానీ, ఇంట్లో సందడే లేదన్నట్లుగా అందరి ముఖాల్లోకి చూస్తోంది..అవ్వాతాతలు కొత్త డ్రెస్సు చూపిస్తూ నెత్తీనోరు కొట్టుకుంటుంటే వాళ్ల చుట్టూనే తిరుగుతూ వచ్చీరాని మాటలు చెబుతోంది.. వచ్చీపోయే వారు ఎత్తుకుని లాలిస్తున్నారే కానీ, అమ్మానాన్నలను తీసుకురాలేకపోతున్నారు.. .. ఆదోని మండలం కుప్పగల్‌కు చెందిన పూజారి ఈరన్న, ఆదిలక్ష్మి దంపతుల ఒక్కగానొక్క కుమార్తె సుస్మిత పుట్టిన రోజు నేడు. దంపతులు ఇద్దరూ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఈ చిన్నారి తల్లిదండ్రుల ప్రేమను బస్సు కబళించింది. కంటికి రెప్పలా చూసుకునే అమ్మానాన్నలు..జీవితాంతం రక్షణగా నిలిచే సోదరుడు..నాన్నకు ఆసుపత్రిలో చూపించేందుకని వెళ్లారు..త్వరగా వస్తామని చెప్పారు, ఎంతకీ ఇంటికి రారు.. ఒక్క ఫోన్ లేదు, ఎక్కడున్నారో తెలియదు..ముగ్గురు ఆడ పిల్లలు, ఇంటి వద్ద ఎదురుచూస్తున్నారు.. ఇంకా ఎప్పుడు వస్తారో, తమ కోసం ఏమి తెస్తారోనని.! ఇంతలో వచ్చిన ఓ ఫోన్ కాల్‌తో గుండె ఆగినంత పనైంది.. ఆసుపత్రికి వెళ్లిన అమ్మానాన్న ఇక తిరిగిరారని, ఆటపట్టించే అన్న, తోడూనీడగా నిలిచే తోబుట్టువు మరి లేడని.. తెలిసిన క్షణాన ఆ ఇల్లు కన్నీటి సంద్రమైంది..ముగ్గురినీ పోగొట్టుకున్న ఆ ఇంట్లో నలుగురు ఆడపిల్లలు సంతానం.. ఒకరికి పెళ్లి కాగా, మరో ముగ్గురు దిక్కులేని వాళ్లయ్యారు... కర్ణాటక రాష్ట్రం మాన్వికి చెందిన హేమాద్రి, నాగరత్నమ్మ దంపతులు తమ కుమారుడు దేవరాజ్‌తో కలిసి ఆసుపత్రికి వెళ్తూ మృత్యుఒడి చేరారు. కర్ణాటక రాష్ట్రంలోని గంగావతి డిపోకు చెందిన బస్సు మంత్రాలయానికి 14 మంది ప్రయాణికులతో బయలుదేరింది. ఆదోని మండలం పాండవగల్ సమీపంలో కల్వర్టు వద్ద వేగాన్ని నియంత్రించుకోలేక రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. బస్సు పక్కనే ఉన్న పొలంలోకి దూసుకెళ్లి నిలిచిపోవడంతో అందులోని ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండు కుటుంబాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. – ఆదోని టౌన్ బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు ఐదుగురిని బలిగొన్న వైనం -
ఫాతిమా బేగం దర్గా ప్రారంభం
రాయచూరు రూరల్: సమాజ సేవకు హిందువులు ముందుంటారనేందుకు మైనార్టీలు లేని గ్రామంలో హిందువులే హజరత్ బీబీ ఫాతిమా బేగం దర్గాను ప్రారంభించడం హర్షణీయమైంది. జిల్లాలోని సిరవార తాలూకా మల్లట గ్రామ పంచాయతీ పరిధిలోని సిద్ద గర్జ్లో హిందు ముస్లింల సామరస్యతకు నిదర్శనంగా హిందువులే హిందూ సంప్రదాయంతో హజరత్ బీబీ విగ్రహావిష్కరణతో పాటు దర్గాను నిర్మించి ప్రారంభోత్సవం చేశారు. హిందువులు, మహిళలు కుంభ కలశాలతో వైభవంగా పండుగ వాతావరణంలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా సభ్యులు శివప్ప, సిద్దగర్జి, పూజారి హనుమయ్య తాతలున్నారు. -
ఊరూరా గ్రామ దేవత పూజలు
హుబ్లీ: జిల్లాలోని అణ్ణిగేరి పట్టణంలోని ఎండీహళ్లి ప్రభుత్వ ఫస్ట్‌గ్రేడ్ పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా ఆచరించారు. ఆ కళాశాల వాణిజ్య విభాగాధిపతి శోభ మాట్లాడుతూ ఓ ఇల్లు, ఓ దేశం సక్రమంగా నడపడంలో పురుషుడి(భర్త) పాత్ర ఎంత ఉంటుందో మహిళ(భార్య) పాత్ర కూడా అంతే ఉంటుందన్నారు. ఇంగ్లిష్ లెక్చరర్ విజయలక్ష్మి పాటిల్ మాట్లాడుతూ సమాజ ఆరోగ్యాన్ని కాపాడటంలో వారి సేవ అపారం అన్నారు. ఇలాంటి అనన్య సేవలను గుర్తించి ప్రోత్సహించాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ బుళ్లన్న మాట్లాడుతూ ప్రతి ఊరిలో గ్రామ దేవతగా మహిళా దేవతను పూజిస్తారన్నారు. అలాగే ప్రతి ఇంట్లో తల్లి పాత్ర ఎంతో కీలకం. అనాది కాలం నుంచి మాతృదేవోభవ అన్నది తమ ఇల్లు, మనస్సుల్లో నిక్షిప్తమైందన్నారు. ఆశా కార్యకర్త రత్న పల్లెదను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డాక్టర్ మోతీలాల్ రాథోడ్, విద్యా హడగలి, శ్రీనివాస్, రేణుక, అశ్విని, తదితరులు పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో కోడి శరభయ్య జాతర ● భక్తసాగరంగా హొస దరోజీ గ్రామం ● రథంపై ఉత్సవ మూర్తి ఊరేగింపు బళ్లారి రూరల్ : బళ్లారి జిల్లా సండూరు తాలూకాలోని హొస దరోజీలో సోమవారం సాయంత్రం భక్తిశ్రద్ధలతో కోడి శరభయ్య జాతర మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శనివారం జాతర ప్రారంభం కాగా ఆదివారం రాత్రి అగ్నిగుండం, సోమవారం సాయంత్రం రథోత్సవాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా కోడి శరభయ్య ఉత్సవ మూర్తిని రథంపై ప్రతిష్టించి ఊరేగించారు. ఇంటింటా పూజలు నిర్వహించారు. రథోత్సవంలో హళే దరోజీ, హొస దరోజి, పరిసర గ్రామాల ప్రజలు వేలాది మంది రథోత్సవాన్ని తిలకించారు. ముత్తగి గ్రామ పంచాయతీ అధ్యక్షురాలిగా ఉవక్క హుబ్లీ: జిల్లాలోని కలఘటిగి తాలూకా ముత్తగి గ్రామ పంచాయతీ అధ్యక్షురాలిగా ఉవక్క నాగప్ప లమాణి ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా ఆ తాలూకా టీపీ ఈఓ సావంత్, పీడీఓ రవికుమార్ వ్యవహరించారు. గ్రామ పంచాయతీ సభ్యులు రవి లమాణి, రాము, షణ్ముఖ, గోకుల్, ఇతర సభ్యులు ఈ సందర్భంగా ఎన్నికలో పాల్గొన్నారు. ఎస్ఐ గిరీష్ తమ సిబ్బందితో ఈ సందర్భంగా బందోబస్తు నిర్వహించారు. గ్యాంగ్ రేప్ కేసులో ముగ్గురికి జుడీషియల్ కస్టడీ రాయచూరు రూరల్: కొప్పళ జిల్లాలో ఇటీవల జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో ముగ్గురిని జుడీషియల్ కస్టడీకి అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం విదేశీ మహిళ, హోం స్టే యజమానిపై గ్యాంగ్ రేప్ కేసులో ముగ్గురిని గంగావతి కోర్టులో 14 రోజుల పాటు జుడీషియల్ కస్టడీకి ఆదేశించింది. గంగావతి తాలూకా సణాపుర చెరువు వద్ద తుంగభద్ర ఎడమ కాలువ పక్కన ఐదుగురు విదేశీయులు ఆకాశంలో నక్షత్రాలు వీక్షిస్తున్న సమయంలో మల్లేష్, చేతన్ సాయి, శరణ బసవ అనే నిందితులు ముగ్గురిని కాలువలోకి తోసి ఇద్దరు ఆడపిల్లలపై అత్యాచారం చేశారని ఆరోపిస్తూ పోలీసులు కోర్టులో హాజరు పరచడంతో , విచారించిన జడ్జి 14 రోజుల పాటు న్యాయాంగ బంధనంలో ఉంచాలని తీర్పునిచ్చారు. -
విద్యార్థులు సమాజ సేవ చేయాలి
రాయచూరు రూరల్: సమాజ సేవ చేయడానికి విద్యార్థులు ఆసక్తి కనబరచాలని స్కౌట్స్ రోవర్ జిల్లా సంచాలకుడు బసవరాజ్ బోరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన స్కౌట్స్ రోవర్ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రకృతి వైపరీత్యాలు, ఆరోగ్య, వైద్య అత్యవసర సేవలు ఇతరత్ర వాటిలో చురుకుగా పాల్గొనాలన్నారు. కార్యక్రమంలో కళాళాశాల ప్రిన్సిపాల్ యంకణ్ణ, శివయ్య, మహంతేష్, అంబన్న, మల్లన్న, దస్తగిరిసాబ్, ప్రాణేష్లున్నారు. పత్రికా రంగంలో విలువలు పెరగాలి బళ్లారిటౌన్: పత్రికా రంగంలో రాజీ రహిత ఆసక్తి, విలువలు పెరగాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి మీడియా సలహాదారుడు కేవీ ప్రభాకర్ పేర్కొన్నారు. ఆయన కర్ణాటక వర్కింగ్ జర్నలిస్ట్‌ల సంఘం ఆధ్వర్యంలో కొప్పళలోని పానగంటి కళ్యాణ మంటపంలో ఏర్పాటు చేసిన భక్తినిధి పురస్కార ప్రదాన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. నాడు విలేకరులు రాజకీయ నాయకులను కఠినంగా ప్రశ్నిస్తుండేవారన్నారు. అయితే నేడు కఠినంగా ప్రశ్నించే స్థాయిలో లేరన్నారు. వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు శివానంద తగడూరు మాట్లాడుతూ 1932లో స్థాపించిన కేయూడబ్ల్యూజే విలేకరుల సంక్షేమం కోసం అనేక పోరాటాలు చేపట్టి ప్రభుత్వం నుంచి ఎన్నో సదుపాయాలను సాధించిందన్నారు. కన్నడ సంస్కృతి శాఖ మంత్రి శివరాజ్ తంగడిగి, ఎమ్మెల్యే రాఘవేంద్ర హిట్నాల్, కొప్పళ వర్సిటీ కులపతి బీకే.రవి తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ ఏడాది దాదాపు 40 మంది వరకు పాత్రికేయులకు అవార్డులు అందించగా బళ్లారి నుంచి సీనియర్ పాత్రికేయుడు గురుశాంతకు అవార్డును అందజేశారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి హొసపేటె: అతి వేగంగా వస్తున్న గుర్తు తెలియని వాహనం పాదచారిని ఢీకొనడంతో తలకు తీవ్ర గాయమై రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మరణించిన ఘటన హరపనహళ్లిలో సోమవారం రాత్రి జరిగింది. మృతుడి పేరు, వివరాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. హరపనహళ్లి టౌన్‌లోని పద్మనాభ పెట్రోల్ బంకు పక్కన ఉన్న రహదారిపై జరిగిన ఈ ఘటనలో గుర్తు తెలియని వాహనం ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఘటనపై కేసు నమోదైనట్లు హరపనహళ్లి పోలీసులు తెలిపారు. మహిళా సమానత లేమి బాధాకరం హొసపేటె: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం కూడ్లిగి తాలూకాలోని కానాహొసహళ్లి విద్యానికేతన్ పాఠశాలలో ప్రపంచ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. శరణేశ్వర్ విద్యా శిక్షణ సంస్థ అధినేత్రి కేఎం.నిర్మలా శశిధర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శరణేశ్వర విద్యాసంఘం ఆధ్వర్యంలో విద్యార్థినుల తల్లులకు వివిధ క్రీడా పోటీలను ఏర్పాటు చేశారు. క్రీడా పోటీలను ప్రారంభించి ఆమె మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించినా సమాజంలో సమానంగా చూడకపోవడం బాధాకరమన్నారు. సమాజానికి మహిళల సహకారం ఎనలేనిది. ఒక ఇంట్లో ఒక సీ్త్ర బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తే ఇల్లు అందంగా ఉంటుంది. ఇంట్లో అక్క, చెల్లి, అమ్మ, భార్య, అత్తమామలు, మేనకోడళ్లను గౌరవించాలన్నారు. గ్రామీణ క్రీడల్లో గెలుపొందిన తల్లులకు విద్యానికేతన్ తరఫున బహుమతులు అందజేశారు. శరణేశ్వర విద్యాశిక్షణ వ్యవస్థాపక అధ్యక్షులు, జీఐపీ మాజీ సభ్యులు కానామడుగు కే.ఎం శశిధర్, నిర్వాహకుడు కేఎం.హర్షవర్థన్, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం
● బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు ● మృతుల స్వస్థలం మాన్వి రాయచూరు రూరల్: కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్ వద్ద కేఎస్ఆర్టీసీ బస్, ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో రాయచూరు జిల్లా మాన్వికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలైన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు.. గంగావతి నుంచి మంత్రాలయం వెళుతున్న గంగావతి డిపోకు చెందిన కేఎస్ఆర్టీసీ బస్, రాయచూరు నుంచి ఆదోనికి వెళుతున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. మృతులను బైక్‌పై వెళుతున్న హేమాద్రి(55), భార్య నాగరత్నమ్మ(48), కుమారుడు దేవరాజ్(25)లుగా పోలీసులు గుర్తించారు. మాన్వి పోలీస్ స్టేషన్లో హేమాద్రి మాజీ హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తుండగా, కుమారుడు దేవరాజ్ క్షౌ రిక వృత్తి నిర్వహిస్తున్నట్లు తెలిసింది. రాత్రి సమయంలో మృతదేహాలను తీసుకురావడంతో ఇంటి వద్ద కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. -
ఎస్సీ, ఎస్టీ కేసులకు త్వరలో ప్రత్యేక పోలీస్ స్టేషన్
హొసపేటె: ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసులను విచారించడానికి విజయనగరలో త్వరలో ప్రత్యేక పోలీసు స్టేషన్‌ను ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామని జిల్లాధికారి ఎంఎస్ దివాకర్ తెలిపారు. మంగళవారం నగరంలోని తన కార్యాలయ సభాంగణంలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల అత్యాచార నిరోధక చట్టం– 1995లోని నిబంధన 17 కింద జరిగిన జిల్లా స్థాయి అవగాహన, పర్యవేక్షణ కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. మూడు నెలల కాలంలో, అట్రాసిటీ చట్టం కింద మొత్తం 7 కేసులు నమోదయ్యాయి. వాటిలో కూడ్లిగి తాలూకాలో 3 కేసులు హొసపేటె, హరపనహళ్లి, హగరిబొమ్మనహళ్లి, హడగలి తాలూకాల్లో ఒక్కొక్క కేసు ఉన్నాయి. హరపనహళ్లి తాలూకాలో ఒకటి తప్ప మిగతా అన్ని కేసుల్లో ఛార్జిషీటు దాఖలు చేశారు. కేవలం 1 కేసు మాత్రమే దర్యాప్తులో ఉందని ఆయన అన్నారు. మొబైల్ వాడకంతో ప్రతికూల ప్రభావం జిల్లా ఎస్పీ శ్రీహరిబాబు మాట్లాడుతూ పీఓసీఎస్ఓ వంటి కేసులు పెరగడానికి ప్రధాన కారణం పిల్లలపై మొబైల్ ఫోన్ వాడకం ప్రతికూల ప్రభావం అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే బాల్య వివాహాలను ప్రోత్సహించడం దురదృష్టకరం అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు మహిళలు ప్రసవం కోసం వచ్చినప్పుడు అనేక బాల్య వివాహాలు వెలుగులోకి వస్తున్నాయి. నిర్ణీత వయస్సు కంటే ముందే బాలికలను బలవంతంగా వివాహం చేయడం నేరం అన్నారు. కుటుంబ అంగీకారంతో వివాహం జరిగినప్పటికీ పోక్సో కేసు నమోదు చేయడంలో రాజీ పడే అవకాశం లేదన్నారు. వివిధ విభాగాల భాగస్వామ్యంతో పోక్సో గురించి ప్రజలకు ఇప్పటికే అవగాహన పెంచారు. బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి, ప్రజల సహకారంతో బాల్య వివాహాల పద్ధతిని అరికట్టేందుకు సాధ్యమవుతుందని అన్నారు. జిల్లాధికారి దివాకర్ వెల్లడి -
దుర్గమ్మ తేరు.. భక్తజన హోరు
సాక్షి,బళ్లారి: నగర ఆదిదేవత, కోట్లాది మంది భక్తుల కొంగు బంగారం, కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారుగా ఖ్యాతి పొందిన కనక దుర్గమ్మ సిడిబండి రథోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. మంగళవారం నగరంలోని కనక దుర్గమ్మ ఆలయం వద్ద ముందుగా తీసుకుని వచ్చిన సిడిబండి రథానికి ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించారు. కౌల్‌బజార్ గాణగ సమాజానికి చెందిన ఆలయ ప్రముఖుల ఎద్దులను సిడిబండికి కట్టి ఆలయం చుట్టూ తిప్పారు. అమ్మవారి ఆలయానికి దేదీప్యమానంగా పూలు, విద్యుత్ దీపాలను అలంకరించడంతో పాటు కనక దుర్గమ్మకు బంగారు ఆభరణాలు అలంకరించారు. వేలాది మంది భక్తులు బారులు తీరడంతో ఎటుచూసిన ఆలయ పరిసరాలు భక్తజన సందోహంతో కిటకిటలాడాయి. ఆలయం ముందు సిడిబండికి పూజలు చేస్తూ టెంకాయలు కొడుతూ, అరటిపండ్లు విసురుతూ మొక్కులు తీర్చుకున్నారు. ఇంటింటా పండుగ వాతావరణం ప్రతి ఏటా మాదిరిగానే ఫాల్గుణ మాసంలో పౌర్ణమి కంటే ముందు వచ్చే మంగళవారం నాడు ఆనవాయితీగా నిర్వహించే సిడిబండి రథోత్సవం అంటే నగర వాసులకే కాకుండా జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల వాసులకు పండుగ. ఈ నేపథ్యంలో సిడిబండి రోజున నగరంలో ఇంటింటా పండుగ వాతావరణం నెలకొంది. అమ్మవారి ఆలయం చుట్టు మాత్రమే కాకుండా నగరంలోని పలు రోడ్లలో భక్తుల కోసం మజ్జిగ, అన్న ప్రసాదాలు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి బారులు తీరి దర్శనం చేసుకున్న భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. అనంతరం సాయంత్రం సిడిబండి రథోత్సవం తిలకించేందుకు లక్షలాది మంది జనం తరలిరావడంతో కనక దుర్గమ్మ ఆలయం నుంచి ఇటు రాయల్ సర్కిల్, అటు ఎస్పీ సర్కిల్, కప్పగల్ రోడ్డు, తాళూరు రోడ్డు ఇలా ప్రముఖ కాలనీలన్ని జనసందోహంతో నిండిపోయాయి. ఆలయం చుట్టు ఉన్న భవంతులపైకి జనం ఎక్కి సిడిబండి రథోత్సవాన్ని తిలకించారు. పెద్ద సంఖ్యలో జనం తరలి రావడంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కన్నుల పండువగా సిడిబండి రథోత్సవం ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు ఉదయం నుంచి బారులు తీరిన భక్తులు -
రాజధానిలో మంత్రుల మధ్య కోల్డ్‌వార్
రాయచూరు రూరల్: ప్రజలతో ఎన్నికై న ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రుల వద్ద మంత్రులిద్దరి మధ్య శీతల సమరం బట్టబయలైంది. సోమవారం రాత్రి బెంగళూరులో పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో రాయచూరు, కొడగు జిల్లాల ఇంచార్జి మంత్రులు శరణ ప్రకాష్ పాటిల్, ఎన్.ఎస్.బోసురాజుల మధ్య వాగ్వాదం జరిగింది. రాయచూరు పోలీస్ శాఖలో డీఎస్పీ బదిలీ కోసం రాయచూరుకు రవినాథ్ను బోసురాజు సిఫార్సు చేయగా పాటిల్ ప్రస్తుతమున్న డీఎస్పీ సత్యనారాయణను కొనసాగించాలని తమ అభిప్రాయాలను నేతల ముందుంచారు. దీనిపై పాటిల్ తాను జిల్లా ఇంచార్జి మంత్రిని, తన ఆదేశాలు అధికారులు తప్పకుండా పాటిస్తారని చెప్పినా కొడగు జిల్లా ఇంచార్జి మంత్రిగా ఉన్న బోసురాజు పదవులు, బదిలీల విషయంలో జోక్యం చేసుకోవడం, రాయచూరు జిల్లాకు చెందిన ప్రతి విషయంలో తలదూర్చడంపై ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, హోం మంత్రి పరమేశ్వర్లకు పాటిల్ వివరించారు. గతంలో ఏసీ మహబూబి బదిలీ విషయం, పార్టీ కార్యాలయంలో జరిగే కార్యక్రమాలకు దూరంగా ఉంచడం, జిల్లాధ్యక్షుడి నియామకాల్లో తనకు తెలియకుండా నిర్ణయం తీసుకున్నారని వారి దృష్టికి పాటిల్ తెచ్చారు. సమావేశంలో రాద్ధాంతం చూసిన జిల్లా శాసన సభ్యులు బసనగౌడ దద్దల్, హంపనగౌడ, బసనగౌడ తుర్విహాళ్, వసంత్ కుమార్, శరణేగౌడ బయ్యాపూర్ సమావేశం నుంచి నిష్క్రమించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇంచార్జి మంత్రుల మధ్య శీతల సమరం పార్టీ, ప్రభుత్వ పెద్దల దృష్టికి వివాదాంశం -
కూతురి స్మగ్లింగ్‌లో డీజీపీ పాత్ర ఉందా?
బనశంకరి: నటి రన్య రావు పెంపుడు తండ్రి, రాష్ట్ర పోలీసు గృహ నిర్మాణ సంస్థ డీజీపీ రామచంద్రరావు చిక్కుల్లో పడ్డారు. రన్యకు బెంగళూరు విమానాశ్రయంలో ప్రోటోకాల్ ఇవ్వడం గురించి విచారణ చేపట్టి వారంలోగా నివేదిక అందించాలని హోంశాఖను సర్కారు ఆదేశించింది. బంగారం స్మగ్లింగ్ లో ఆయన కుమ్మక్కయ్యారా, ప్రోటోకాల్ దుర్వినియోగానికి పాల్పడడం వెనుక ఆయన హస్తం ఉందా అనే దానిపై వారంలోగా విచారణ చేపట్టి నివేదిక అందించాలని ఆదేశించింది. నటి రన్య తన ప్రయాణాల్లో రామచంద్రరావు పేరును విరివిగా వాడుకున్నారు. రన్య కేసు శాసనసభ సమావేశాల్లో తీవ్ర చర్చకు రావడం తెలిసిందే. ప్రభుత్వం ఏం చేస్తోందంటూ ప్రతిపక్ష బీజేపీ మండిపడడంతో ప్రభుత్వం ఇరుకునపడింది. రన్య ప్రోటోకాల్‌పై నివేదిక మరోపక్క రన్య రావు ప్రోటోకాల్ దుర్వినియోగం పట్ల పోలీస్ కమిషనర్ దయానంద్‌కు డీసీపీ నివేదిక అందజేశారు. రన్య రావ్ అరెస్టైనరోజు ప్రోటోకాల్‌లో ఉన్న కానిస్టేబుల్ బసవరాజుకు ఆమె కాల్ చేసి విమానాశ్రయంలో టెరి్మనల్ వన్ వద్దకు రావాలని తెలిపింది. ఇప్పుడు రాలేను మేడం, వేరే ఆఫీసర్ వస్తున్నారు, రిసీవ్ చేసుకోవాలి అని బసవరాజు చెప్పాడు. నువ్వే రావాలి లేకపోతే, అప్పాజీ కి చెబుతానని రన్య హెచ్చరించినట్లు నివేదికలో ప్రస్తావించారు. పోలీస్ స్టిక్కర్ వాడొద్దు: హోంమంత్రి దొడ్డబళ్లాపురం: పోలీసులు, వారి కుటుంబ సభ్యులు సొంత వాహనాలపై పోలీస్ అనే స్టిక్కర్లు వేసుకోవడం మామూలే. ఇది ఏ మాత్రం మంచిది కాదని, ఇది కచ్చితంగా చట్టాన్ని , నిబంధనలను ఉల్లంఘించడమేనని హోంమంత్రి పరమేశ్వర్ చెప్పారు. 2022 ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఇలా స్టిక్కర్లు వేసుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని మంగళవారం అసెంబ్లీలో చెప్పారు. శ్రవణబెళగోళ ఎమెల్యే సీఎస్ బాలక్రిష్ణ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు తెలిపారు. రన్య అరెస్టు వెనుక...బనశంకరి: బంగారం దొంగరవాణా కేసులో నటి రన్య రావు పట్టుబడటం వెనుక ఆమె భర్త, ఢిల్లీలో అరెస్టైన ఇద్దరు స్మగ్లర్లు, పలువురు పెద్దలు ఉన్నట్లు తెలిసింది. ఇటీవల జతిన్ హుక్కేరి అనే వ్యక్తితో రన్యకు బెంగళూరులో ఆర్భాటంగా వివాహం జరిగింది. కానీ వారి మధ్య గొడవలు వచ్చాయి. రన్య పదేపదే విదేశాలకు వెళ్లడం గురించి భర్త ప్రశ్నించేవాడు. ఆయనే డీఆర్ఐకి సమాచారం ఇచ్చాడని తెలుస్తోంది. కొన్నిరోజుల కిందట ఢిల్లీలో డీఆర్ఐ అధికారులకు ఇద్దరు స్మగ్లర్లు దొరికారు. రన్య అనే యువతి కూడా బంగారం దొంగ రవాణా చేస్తోందని ఉప్పందించారు. దీంతో ఢిల్లీ నుంచి బెంగళూరు డీఆర్ఐ విభాగానికి అలర్ట్ వచ్చింది. 3వ తేదీ రాత్రి రన్య బెంగళూరు విమానాశ్రయంలో దిగగానే అదుపులో తీసుకున్నారు. రన్య అంటే పడని బంగారు వ్యాపారులు, ఓ మంత్రి కూడా సమాచారం ఇచ్చారని ప్రచారం సాగుతోంది. 28 సార్లు విదేశీ ప్రయాణం నటి రన్య కేసులో తరుణ్‌రాజు అనే వ్యక్తి అరెస్టు కావడం బెంగళూరులో చర్చనీయాంశమైంది. రన్య వెనుక తరుణ్‌రాజు ఉన్నాడని తెలుస్తోంది. బెంగళూరు కు బంగారం తెప్పించి హవాలా ద్వారా దుబాయికి డబ్బు పంపించేవారు. రన్య ఖర్చులన్నింటినీ తరుణ్‌రాజు చూసుకునేవాడు. ఐపీఎస్ అధికారి కూతురు కావడంతో రన్య ద్వారా సులభంగా బంగరాన్ని తెప్పించవచ్చని గుర్తించాడు. రన్య ఒక ఏడాదిలో 28 సార్లు విదేశీ పర్యటనలు చేసింది. గత 15 రోజుల్లో నాలుగుసార్లు దుబాయ్‌కి వెళ్లి వచ్చింది. ఐదోసారి దుబాయ్‌కి వెళ్లి వస్తుండగా జాతకం మారిపోయింది. -
డీఎస్పీ కనకలక్ష్మి అరెస్టు
బనశంకరి: బెంగళూరులో బోవి అభివృద్ధి మండలి అక్రమాల కేసులో నిందితురాలు, న్యాయవాది జీవా (33) ఆత్మహత్య కేసులో సీఐడీ డీఎస్పీ కనకలక్ష్మీని మంగళవారం సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. మండలికి సామగ్రి సరఫరా చేసే కాంట్రాక్టును ఎస్.జీవా నిర్వహించేది. గత ఏడాది నవంబరు 22 తేదీన తేదీన డెత్‌నోట్ రాసిన జీవా బనశంకరి రాఘవేంద్రలేఔట్లోని ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. అక్రమాలు జరిగాయన్న కేసులో జీవాను సీఐడీ డీఎస్పీ కనకలక్ష్మి పిలిపించి చిత్రహింసలకు గురిచేసిందని, రూ. 25 లక్షల లంచం ఇవ్వాలని డిమాండు చేసిందని మృతురాలి సహోదరి సంగీత ఆరోపించారు. జీవా రాసిన 10 పేజీలకు పైగా డెత్‌నోట్ తో సమేతంగా సంగీతా బనశంకరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసును పోలీస్ కమిషనర్ దయానంద్ ఆదేశంతో సిట్ విచారిస్తోంది. ఎట్టకేలకు కనకలక్ష్మిని అరెస్టు చేశారు. -
నటి రన్యారావు కేసులో కీలక మలుపు
సినీ నటి రన్యారావు కీలక నిందితురాలిగా ఉన్న బంగారం అక్రమ రవాణా కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగిస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంతో పాటు వీఐపీ ప్రొటోకాల్ దుర్వినియోగం.. అందులో ఆమె సవతి తండ్రి ప్రమేయం తేల్చేందుకు సీఎం సిద్ధరామయ్య ప్రత్యేక విచారణకు ఆదేశించారు.ఈ కేసులో పోలీసుల ప్రమేయం ఉందన్న ఆరోపణలు.. అలాగే తన విదేశీ పర్యటనల టైంలో వాళ్ల చేతుల్లో వేధింపులకు గురయ్యానన్న రన్యారావు ఆరోపణలపై సీఐడీ దర్యాప్తు జరపనుంది. వీలైనంత త్వరగా నిజనిర్ధారణలతో నివేదిక సమర్పించాలని దర్యాప్తు ఏజెన్సీని ప్రభుత్వం ఆదేశించింది.ఇక మరోవైపు.. నటి రన్యారావు వీఐపీ ప్రోటోకాల్‌ను దుర్వినియోగం చేస్తూ బంగారం అక్రమ రవాణా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కెంపగౌడ ఎయిర్‌పోర్టులో ప్రోటోకాల్ దుర్వినియోగం అంశంపైనా ప్రభుత్వం విడిగా మరో దర్యాప్తునకు ఆదేశించింది. ఈ బాధ్యతలను సీనియర్ ఐఏఎస్ అధికారి, అదనపు సీఎస్ గౌరవ్ గుప్తా అప్పగించింది. అలాగే.. ఈ అంశంలో ఆమె సవతి తండ్రి, డీజీపీ కె. రామచంద్రరావు పాత్రపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, అవసరమైతే ఆయన్ని విచారించాలని కోరింది. ఈ వ్యవహారంలో రామచంద్ర పాత్ర ఉందా? లేదా? అనేది తేల్చాలని గుప్తాకు వారం గడువు ఇచ్చింది ప్రభుత్వం. మార్చి 3వ తేదీన 14.8 కేజీల అక్రమ బంగారాన్ని దుబాయ్ నుంచి తీసుకొస్తూ.. బెంగళూరు ఎయిర్‌పోర్టులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్సీ(DRI) అధికారులకు చిక్కిన కన్నడ నటి రన్యారావు చిక్కారు. ఈ కేసు దర్యాప్తులో లోతుకు వెళ్లే కొద్దీ.. కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. -
బంగారు నగల అప్పగింత
● ఆటోడ్రైవర్ నిజాయతీ తుమకూరు: సుమారు 4 లక్షల రూపాయల విలువైన బంగారం నగలను ఓ మహిళ ఆటోలో మరిచిపోయి దిగిపోయింది. ఆటోడ్రైవర్ నిజాయతీతో ఆ మహిళకు తిరిగి అప్పగించాడు. తుమకూరు నగరంలోని హనుమంతపురకు చెందిన రవికుమార్ అనే ఆటోడ్రైవర్ మంచితనాన్ని అందరూ అభినందించారు. వివరాలు.. హాసన్ జిల్లా అరసికెరెకు చెందిన గాయత్రి అనే మహిళ ఓ బంధువుల ఇంట్లో వేడుక కోసం వచ్చింది. మళ్లీ బస్టాండుకు వెళ్లేందుకు నగరంలో ముగ్గురితో కలిసి రవికుమార్ ఆటోలో వచ్చింది. నగలు ఉన్న బ్యాగును ఆటోలో మరిచిపోయి బస్టాండులోకి వెళ్లింది. రవికుమార్ కొంతదూరం వెళ్లాక చూసుకుంటే బ్యాగు కనిపించింది. తిరిగి బస్టాండు వద్దకు వచ్చాడు, ఇంతలో మహిళ నగలు బ్యాగు లేదని పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడానికి బయల్దేరింది. ఆటోడ్రైవర్ నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడ మహిళ ఉండడంతో నగల బ్యాగును అప్పగించడంతో ఆమె ఆనందానికి అవధులు లేవు. నగల విలువు రూ.4 లక్షలని చెబుతూ ధన్యవాదాలు తెలిపింది. చక్కెర లారీ పల్టీ, ఇద్దరు మృతియశవంతపుర: బెళగావి జిల్లా రామదుర్గ తాలూకా హళగుత్తి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. చక్కెర లోడు లారీ పల్టీ కొట్టి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. సోమవారం ఉదయం బెళగావి నుంచి రామదుర్గ తాలూకాకు చక్కెర లోడ్ చేసుకొని వెళుతున్న లారీ వేగంగా వెళ్తూ అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బాలప్ప ముదకవి (28), యల్లప్ప చెన్ననవర్ (35) అనే హమాలీ కార్మికులు అక్కడికక్కడే మరణించారు. లారీ డ్రైవర్‌తో పాటు మరో కూలీకి తీవ్ర గాయాలై రామదుర్గ ప్రభుత్వ అస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రామదుర్గ పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేశారు. చక్కెర మూటల మధ్యలో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీశారు. ఆర్టీసీ బస్సు బోల్తా యశవంతపుర: బ్రేక్ ఫెయిలై కేఎస్ ఆర్టీసీ బస్సు పల్టీ పడిన ఘటన బెళగావి జిల్లా బైలహొంగల తాలూకా లింగదహళ్లి అరవళ్లి గ్రామం వద్ద సోమవారం జరిగింది. బస్సు వేగంగా వెళ్తున్న సమయంలో బ్రేకులు పడలేదు, అదుపు తప్పి రోడ్డు పక్కకు పల్టీలు కొట్టింది. 10 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. బైలహొంగల పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి క్రేన్ ద్వారా బస్సును యథాస్థానంలో ఉంచారు. ఆటోడ్రైవర్.. ఆఫీసర్ చైర్ యశవంతపుర: అతడో పెద్ద అధికారి, లేదా ఉద్యోగి కావాలనుకున్నాడు. కానీ విధి ఆటలో ఆటోడ్రైవర్‌గా మిగిలిపోయాడు. అయినా అతనిలోని కోరిక ఊరికే ఉండనివ్వలేదు. ఆటోలో పెద్ద చైర్‌ను అమర్చుకుని నడుపుతున్నాడు. బెంగళూరు ఆటో డ్రైవర్ ఒకరు తన సీటు స్థానంలో ఆఫీసు చైర్‌ను ఉపయోగించటం చూపరులను అబ్బురపరుస్తోంది ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రచారమవుతోంది. నెటిజన్లు ఆటో డ్రైవర్ స్ఫూర్తిని అభినందిస్తూ సందేశాలు పెట్టారు. కుర్చోవడానికి సులభంగా ఉందని అన్నారు. నిశ్చితార్థానికి వెళ్లి వస్తుండగా.. మైసూరు: నిశ్చితార్థానికి వెళ్లి వస్తున్న బస్సు బోల్తా పడగా డ్రైవర్ మృతి చెందగా, 35 మంది గాయపడ్డారు. చామరాజనగర జిల్లా హనూరు తాలూకా తెళ్ళనూరు– బండళ్ళి మార్గంలో జరిగింది. శాగ్య గ్రామానికి చెందిన యువకునికి కనకపుర సమీపంలో ఉన్న హనియూరుకు చెందిన యువతితో నిశ్చితార్థం జరిగింది. 70 మంది ఓ ప్రైవేటు బస్సును మాట్లాడుకుని వెళ్లారు. స్థానికుడు ప్రవీణ్ (32) డ్రైవర్‌గా వెళ్లాడు. వేడుక చేసుకుని సంబరంగా తిరిగి వస్తున్నారు. వేగంలో వెళ్తున్న బస్సు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. బస్సు ఫుట్‌బోర్డులో నిలబడి ఉన్న చాలా మంది కింద పడిపోయారు. డ్రైవర్ ప్రవీణ్ తీవ్ర గాయాలతో అక్కడే చనిపోయాడు. సునీల్ అనే వ్యక్తికి రెండు కాళ్లు నుజ్జయ్యాయి. బండహళ్ళి గ్రామస్తులు వచ్చి అందరినీ బయటకు తీశారు. హనూరు పోలీసులు కేసు నమోదు చేశారు. -
బెళగావిలో కన్నడ సంఘాల ధర్నా
శివాజీనగర: బెళగావిలో సోమవారం కన్నడ సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. మహారాష్ట్ర ఏకీకరణ సమితి(ఎంఈఎస్)ని నిషేధించాలని, మరాఠాలను పారదోలాలని పలు డిమాండ్లతో కన్నడ ఒక్కూట అధ్యక్షుడు వాటాళ్ నాగరాజ్ నేతృత్వంలో ధర్నా నిర్వహించారు. బెళగావిలోని రాణి చెన్నమ్మ సర్కిల్లో బైఠాయించి ఎంఈఎస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బస్సు కండక్టర్‌పై దాడి చేయడం హేయమని ధ్వజమెత్తారు. ఎంఈఎస్ కన్నడిగులపై దాడి చేస్తూ సామరస్యతకు భంగం కలిగిస్తోందన్నారు. బెళగావిలో ఏం జరుగుతుందో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదని ఆరోపించారు. సా.రా.గోవిందు, ఎల్.ఆర్.శివరామేగౌడ, రూపేశ రాజణ్ణ తదితరులు పాల్గొన్నారు. మాంగళ్య మహోత్సవం మండ్య: మండ్య జిల్లాలోని నాగమంగళ తాలూకాలోని ఆదిచుంనగిరి మఠంలో సోమవారం సామూహిక వివాహ వేడుకలను నిర్వహించారు. 10 నూతన జంటలకు పెళ్లి చేశారు. అలాగే 50 సంవత్సరాలుగా దాంపత్య జీవితంలో ఉన్న సుమారు 260 వృద్ధ జంటలకు ఘనంగా సన్మానించారు. ఉదయం నుంచి వివిధ హోమాలు, పూజలు, నిర్వహించారు. మఠాధిపతి నిర్మలానందనాథ స్వామీజీ, ఇతర స్వాములు పాల్గొని దంపతులను ఆశీర్వదించారు. గ్రేటర్ పరిధిలోకి పోలీసు శాఖ ● బిల్లు చర్చలో డిప్యూటీ సీఎం శివాజీనగర: కాంగ్రెస్ సర్కారు ఎంతో ప్రతిష్టగా భావిస్తున్న గ్రేటర్ బెంగళూరు బిల్లును డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోమవారం విధానసభలో ప్రవేశపెట్టారు. ఒక్కటిగా ఉన్న బెంగళూరు కార్పొరేషన్‌ను ప్రభుత్వం పాలనా సౌలభ్యం పేరుతో 7 పాలికెలుగా చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. నగర పరిధిలోని పోలీసులను గ్రేటర్ బెంగళూరు పరిపాలన కిందకు తీసుకొచ్చేందుకు యోచిస్తున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి గ్రేటర్ బెంగళూరు ప్రాధికార అధ్యక్షునిగా ఉంటారు, జిల్లా ఇన్చార్జి మంత్రి ఉపాధ్యక్షునిగా ఉంటారని చెప్పారు. పన్ను అంశాలను ప్రస్తావించారు. బీడీఏ అధ్యక్షుడు సభ్యునిగా ఉంటారు, సభ్యులు, అధికారులకు ఎక్కువ అధికారం ఇస్తామన్నారు. మౌలిక సదుపాయాల నిర్వహణ సహా పలు అంశాలపై మొత్తం 6 కమిటీలు ఉంటాయి. ఒక్కో పాలికె కనీసం 10 లక్షల కంటే అధిక జనసంఖ్య ఉండాలి. పాలికెల విభజనలో ఆదాయాన్ని సైతం పరిగణిస్తారు. బీబీఎంపీ సెంట్రల్, దక్షిణ, ఉత్తర ఇలా బెంగళూరు పేరే ఆ పాలికెలకు ఉంటుంది. ఏ ప్రైవేట్ వ్యక్తి పేరును ఉండదు అని తెలిపారు. -
దేవ దేవం.. ఘన రథోత్సవం
మైసూరు: ఇది రథోత్సవాల సమయం కావడంతో రాష్ట్రంలో ప్రధాన పుణ్యక్షేత్రాల్లో తేరు వేడుకలు రమణీయంగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా భక్త కోలాహలంతో ఆధ్యాత్మిక సంబరం మిన్నంటింది. మైసూరు జిల్లాలోని హుణసూరు తాలూకాలో ఉన్న బిళికెరె దగ్గర చరిత్ర ప్రసిద్ధ గద్దిగ కండగణ్ణేశ్వర స్వామి, మహాదేశ్వర స్వామి వారి జంట రథోత్సవం సోమవారం వేలాది మంది భక్తుల మధ్య సాగింది. ఆదిచుంచనగి సాంబసదాశివ స్వామి పాల్గొని పూజలు చేసి వేడుకలకు నాంది పలికారు. పెద్ద తేరు మీద కండగణ్నేశ్వర స్వామివారు, చిన్న తేరులో మహాదేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను ఆసీనులను చేశారు. ఈ సందర్భంగా నిప్పుల కొలిమిలో భక్తులు నడిచారు. అలాగే చిక్కమగళూరు సమీపంలోని హిరేమగళూరులో కోదండ రామచంద్రస్వామి ఆలయ తేరు ఉత్సవం ఘనంగా జరిగింది. మైసూరు క్యాతమారనహళ్లిలో హులియమ్మ జాతర, బెళగావి జిల్లా చిక్కోడి తాలూకా కెరూరులో అరణ్య సిద్ధేశ్వర జాతర ఉత్సవం వైభవంగా జరిగాయి. చెన్నబసవేశ్వర రథోత్సవం తుమకూరు: జిల్లాలోని గుబ్బి పట్టణంలో ఉన్న చరిత్ర ప్రసిద్ధ గోసల చన్నబసవేశ్వర స్వామి జాతర మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. బ్రహ్మ రథోత్సవానికి వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. మూల విరాట్‌తో పాటు ఉత్సవమూర్తులకు పూజలు చేసి రథంలో ప్రతిష్టించి తేరును లాగారు. మైసూరు సహా పలు జిల్లాల్లో తేరు ఉత్సవాల సందడి -
వీధి కుక్కలకు టీకాలు
కోలారు : నగరంలో వీధి కుక్కల నియంత్రణకు నగరసభ ముందుకు వచ్చింది. పశు సంవర్ధక శాఖ సహకారంతో నగరంలోని వీధి కుక్కలకు టీకాలు వేసే ప్రక్రియను ప్రారంభించింది. దీనిపై వివరణ ఇచ్చిన నగరసభ కమిషనర్ ప్రసాద్ పశు సంవర్ధక శాఖ సహకారంతో వీధి కుక్కలకు టీకాలు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. నగరం విస్తరిస్తున్న కొద్ది వీధి కుక్కల సంతతి కూడా పెరుగుతోంది. వీధి కుక్కలతో నగర ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటుండడాన్ని గుర్తించి వీధి కుక్కల బెడద నియంత్రణకు పూనుకున్నట్లు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్లు తెలిపారు. టీకా వేసిన కుక్కకు గుర్తు పెడుతున్నామన్నారు. నగరంలోని ప్రతి వార్డులోను కుక్కలకు టీకాలు వేస్తున్నట్లు తెలిపారు. టీకాలు వేయడం వల్ల కుక్క కరిచినా ఎలాంటి ప్రాణాపాయం ఉండబోదన్నారు. ఇప్పటికే 165 కుక్కలకు టీకాలు వేసినట్లు తెలిపారు. -
మౌలిక సౌకర్యాల కోసం ధర్నా
రాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించడంలో అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ గ్రామస్తులు ఆందోళన జరిపారు. సోమవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద శావంతగేర ప్రజలు మాట్లాడారు. ప్రభుత్వం త్వరలో చేపట్టనున్న జెడ్పీ, టీపీ, జీపీ ఎన్నికలను బహిష్కరిస్తామన్నారు. గ్రామాల్లో తాగునీరు, రహదారుల మరమ్మతు, మురికి కాలువల నిర్మాణాలు, మహిళా మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు కల్పించకుండా నిర్లక్ష్యం వహించడాన్ని ఖండిస్తూ అధికారికి వినతిపత్రం సమర్పించారు. కార్మికుల సమస్యలు పరిష్కరించండి రాయచూరు రూరల్: జిల్లాలోని లింగసూగూరు తాలూకా హట్టి బంగారు గనుల కంపెనీలో విధులు నిర్వహిస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ కార్యకర్తలు డిమాండ్ చేశారు. సోమవారం హట్టి బంగారు గనుల కంపెనీ కార్యాలయంలో ఎండీకి వినతిపత్రం సమర్పించిన అనంతరం అధ్యక్షుడు ఫక్రుద్దీన్ మాట్లాడారు. కార్మికులకు వైద్య పరీక్షలు చేపట్టాలని, 2020–21వ సంవత్సరపు పీఎల్బీ పరిహారం అందించాలన్నారు. 2023 నుంచి కార్మికులకు పదోన్నతి కల్పించాలన్నారు. ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న నర్సులను పర్మినెంట్ చేయాలని ఒత్తిడి చేశారు. ఆందోళనలో వెంకటేష్, శఫీ, అల్లాభకాష్,శ్రీధర్‌లున్నారు. సీ్త్రలకూ సమాన హక్కులు రాయచూరు రూరల్: సదృఢ సమాజ నిర్మాణం కోసం పురుషులతో పాటు సీ్త్రలకు కూడా సమాన హక్కులు ఉన్నాయని మాజీ శాసన సభ్యుడు పాపారెడ్డి పేర్కొన్నారు. సోమవారం పారా మెడికల్ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. మహిళల హక్కులు, విధులు, సమానత్వం, విద్యా, సామాజిక, ఆర్థిక రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు వీలుందన్నారు. మహిళల స్వేచ్ఛకు హద్దులుండాలన్నారు. కార్యక్రమంలో తిమ్మరాజ్, దండెప్ప, బాబురావ్, చంద్రశేఖర్‌లున్నారు. -
కుడి కాలువకు ఏప్రిల్ వరకు నీరందించండి
రాయచూరు రూరల్: నారాయణపుర కుడి కాలువ ఆయకట్టు చివరి భూములకు ఏప్రిల్ నెలాఖరు వరకు నీరందివ్వాలని కర్ణాటక రైతు సంఘం జిల్లాధ్యక్షుడు శివపుత్రప్ప పాటిల్ డిమాండ్ చేశారు. సోమవారం లింగసూగూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద ట్రాక్టర్లు, కొవ్వొత్తులతో చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. కాలువకు మార్చి 31 వరకు నీరు వదలడానికి అధికారులు తీసుకున్న నిర్ణయంతో చేతికొచ్చిన పంట నోటికి అందకుండా పోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. నీటి గేజ్ నిర్వహణ, సామర్థ్యాన్ని బట్టి ఆయకట్టు భూములకు నీరందేలా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చివరి భూములకు నీరు అందించడానికి శాశ్వత పరిష్కారం కనుగొనాలన్నారు. అనంతరం అధికారికి వినతిపత్రం సమర్పించారు. -
నేడు కనకదుర్గమ్మ సిడిబండి రథోత్సవం
బళ్లారి అర్బన్ : కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా కీర్తి పొందిన, నగర ప్రజల ఆరాధ్య దైవం కనకదుర్గమ్మ సిడిబండి రథోత్సవం మంగళవారం నిర్వహించేందుకు కనకదుర్గమ్మ ఆలయ కమిటీ, కౌల్‌బజార్ గాణిగ సమాజం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నగర ప్రజలకు శాంతి, ఆరోగ్యం కోసం ఏటా ఈ సిడిబండి ఉత్సవాలను కౌల్‌బజార్ గాణిగర సమాజ బాంధవులు ఆచరిస్తున్నారు. పురాతన కాలంలో బళ్లారిలో కలరా వ్యాధి వ్యాపించడంతో అమ్మవారు ఒకరికి కలలో వచ్చి సిడిబండికి దిష్టి బొమ్మను కట్టి ఆలయం చుట్టు ప్రదక్షణలు చేయమని చెప్పిందని సమాచారం. అప్పట్లో సిడిబండికి ఎద్దులను కట్టి ఒక మనిషిని కాడుమానికి వేలాడ కట్టి అమ్మవారి ఆలయం చుట్టు మూడు ప్రదక్షణలు చేస్తూ వచ్చారు. ఇప్పటి వరకు నగర ప్రజలు ఆరోగ్యంగా, శాంతియుతంగా ఉండేందుకు ఈ సిడిబండి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు గాణిగర సమాజ ప్రముఖులు రవికుమార్, రమేష్‌బాబు తెలిపారు. మొదట్లో మనిషిని సిడిబండికి కట్టి ఊరేగించేవారు. అయితే ఆ మనిషి చనిపోయిన తర్వాత అతని రూపంలో ఒక దిష్టిబొమ్మను తయారు చేసి సిడిబండి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యుద్ధవీరుడి దిష్టిబొమ్మతో మూడు ప్రదక్షణలు అప్పటి నుంచి యుద్ధవీరుడి దిష్టిబొమ్మను తామే స్వయంగా తయారు చేసి సిడిబండికి కట్టి అమ్మవారి ఆలయం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తున్నట్లు తెలిపారు. 1974లో ప్రభుత్వ దేవదాయ శాఖకు ఆలయ బాధ్యతలను అప్పగించినట్లు తెలిపారు. ఆలయ పూజారులుగా యాదవ్ బాంధవులకు వంశపారంపర్యంగా బాధ్యతలు అప్పగించి అమ్మవారికి పూజలు చేస్తున్నట్లు తెలిపారు. సిడిబండికి ఒక రోజు ముందు కౌల్‌బజార్ సజ్జన గాణిగర సమాజ బాంధవులు సిడిబండికి పులిబోనును కట్టి కౌల్‌బజార్ నుంచి మోతీ బ్రిడ్జి, మేదార వీధి, ఎస్పీ సర్కిల్ మీదుగా దుర్గమ్మ గుడి వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. సిడిబండి రోజున మధ్యాహ్నం యుద్ధ వీరుడి దిష్టిబొమ్మను ఆలయంలో పూజ చేసి సిడిబండికి కడుతున్నట్లు తెలిపారు. ఈ సిడిబండి రథోత్సవానికి బళ్లారి గాణిగర వంశపారంపర్యంగా దోణప్ప వీధిలోని రెండు ఎద్దులు, బళ్లారి గాణిగర సంఘం రెండు ఎద్దులు, సిరుగుప్ప గాణిగర సమాజం రెండు ఎద్దులను సిడిబండికి కట్టి ఊరేగింపుగా అమ్మవారి ఆలయం చుట్టు మూడు ప్రదక్షణలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఏటా అమ్మవారి భక్తుల సమక్షంలో కనకదుర్గమ్మ ఆలయం చుట్టు సిడిబండి రథోత్సవం నిర్వహించడంతో బళ్లారి ప్రజలు, భక్తులు ఆరోగ్యంగా, శాంతియుతంగా ఉంటున్నారని భక్తుల విశ్వాసం. ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు పురాతన కాలంలో వెలసిన కనకదుర్గమ్మ ఆలయ అభివృద్ధికి ఆలయ వంశపారంపర్య పూజారులు కృషి చేస్తున్నట్లు ఆలయ ప్రధాన ధర్మకర్త పీ.గాదెప్ప తెలిపారు. మొదట్లో అమ్మవారి రూపానికి మాత్రం పూజలు జరిగాయి. భక్తుల సహాయంతో వెండి ఆభరణాల అలంకరణలతో ప్రస్తుతం బంగారు ఆభరణాలతో పూజలు చేస్తున్నట్లు తెలిపారు. ఆలయం ముందు దుర్గాదేవి ఎత్తైన విగ్రహం, నరకాసుర విగ్రహాలను కూడా ప్రతిష్టించి పూజలు చేస్తున్నట్లు తెలిపారు. పర్యాటక శాఖ నుంచి రూ.14 కోట్లు మంజూరయ్యాయి. అందులో రూ.7.70 కోట్లు మొదట విడుదల చేయగా, 4 గోపురాలు, ప్రహరీగోడ, మండపాల పనులు పూర్తి అయ్యాయని దేవదాయ శాఖ అధికారి ఈఓ హనుమంతప్ప తెలిపారు. ప్రాంగణంలో రూ.90 లక్షలతో పుష్కరణి, ఆలయ హుండీలో రూ.90 లక్షలతో మరిన్ని పనులు జరుగుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.1.50 కోట్లతో ఆలయ ముందు అభివృద్ధి పనులు ముమ్మరంగా చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సిడిబండి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ నెల 11న మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు నగర ప్రజల ఆరాధ్య దైవం కనకదుర్గమ్మ సిడిబండి రథోత్సవాన్ని అమ్మవారి ఆలయం చుట్టు మూడు ప్రదక్షణలు, జోడి ఎద్దులతో సిడిబండి ఉత్సవం నిర్వహిస్తున్నట్లు ఈఓ తెలిపారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా అమ్మవారు ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి -
ఏపీఎంసీ, సబ్‌జైలులో ఉప లోకాయుక్త తనిఖీ
కోలారు: కర్ణాటక రాష్ట్ర ఉపలోకాయుక్త బీ.వీరప్ప సోమవారం నగరంలోని సబ్ జైలు, ఏపీఎంసీ మార్కెట్ యార్డును తనిఖీ చేశారు. అక్కడి అవ్యవస్థలను చూసి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీఎంసీ మార్కెట్ యార్డులో రైతులకు తాగునీటి వ్యవస్థ లేదు. చెత్తా చెదారం పేరుకు పోయింది. మార్కెట్లో కమీషన్ అధికంగా వసూలు చేస్తున్నారు. లోపల ఏం జరుగుతోందో అధికారులకు తెలియని పరిస్థితి నెలకొంది. స్వయం ప్రేరిత ఫిర్యాదు దాఖలు చేసుకుంటానన్నారు. సబ్ జైలును సందర్శించినప్పుడు సబ్ జైలు వసతి నిలయాల మధ్య ఉండడాన్ని చూసి సబ్‌జైలును నగరానికి దూరంగా తరలించాలని జైలు అధికారులకు సూచించారు. మార్కెట్, సబ్ జైలులో అపరిశుభ్ర వాతావరణ ఉండడంపై మండిపడ్డారు. సిబ్బంది కొరత ఉందని అధికారులు సాకులు చెప్పడంతో సిబ్బంది కొరత ఉందని మీరు భోజనం చేయకుండా మానేస్తున్నారా? అని ప్రశ్నించారు. కోలారు నగరసభ కమీషనర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఆ పార్టీల్లో మహిళలకు అవకాశం ఏదీ?
కోలారు : జేసీబీ(జేడీఎస్, కాంగ్రెస్, బీజేపీ) పార్టీ ల్లో మహిళలకు అవకాశం లేదు. అయితే కర్ణాటక రాష్ట్ర సమితి (కేఆర్ఎస్) పార్టీ పలు ఎన్నికల్లో మహిళలకు అధిక ప్రాధాన్యత నిచ్చిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రవి కృష్ణారెడ్డి అన్నారు. సోమవారం నగరంలోని టి.చెన్నయ్య రంగమందిరంలో మహిళా దినోత్సవంలో పాల్గొని ఆయన మాట్లాడారు. తండ్రి లేదా కుమారుడు రాజకీయాల్లో పెద్ద సాధన చేసి ఉంటే మాత్రమే అలాంటి ఇంటి ఆడపడచులకు జేసీబీ పార్టీల్లో అవకాశం ఉంటుందన్నారు. స్వతంత్ర ఆలోచనలు కలిగిన వారికి ఆ పార్టీల్లో స్థానం ఉండదన్నారు. ఆయా పార్టీల గాడ్ ఫాదర్లకు సేవలు అందించిన మహిళలకు ఆ పార్టీలో తగిన స్థానం ఇస్తారన్నారు. మహిళలకు తగిన అవకాశాలు కల్పించడానికి కేఆర్ఎస్ పార్టీ ఉత్తమ వాతావరణం కల్పించిందన్నారు. పార్టీలో మహిళలకు తగిన స్వాతంత్య్రం కల్పించామన్నారు. వారి యోగ్యతలకు అనుగుణంగా పార్టీలో టికెట్ ఇస్తారన్నారు. పోలీసుల నుంచి మహిళలకు తగిన రక్షణ లభించడం లేదన్నారు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళపైనే పోలీస్ అధికారి లైంగిక దౌర్జన్యానికి పాల్పడ్డాడు. రాష్ట్ర కార్యదర్శి ఇందిరా రెడ్డి మాట్లాడుతూ మహిళలు నేడు పోరుబాటలో పలు రంగాల్లో ఎంతో సాధన చేసిన వారున్నారు. మహిళలు ఇంటికి పరిమితం కాకుండా విపులంగా ఉన్న అవకాశాలను ఉపయోగించుకుని ముందుకు రావాలన్నారు. ఇదే సమయంలో పలువురు మహిళా సాధకులను సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు ఆశా వీరేష్, సమన్వయ కార్యదర్శి రంజనా, దీపా, జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
దైవ కార్యాలతో ప్రశాంతత సాధ్యం
మాలూరు: గ్రామీణ ప్రజలకు ఆలయాల్లో పూజా కార్యక్రమాల వంటి దైవ కార్యాల్లో పాల్గొనడం ద్వారా జీవితంలో నెమ్మది లభిస్తుందని మాజీ మంత్రి ఎస్ఎన్ కృష్ణయ్య శెట్టి తెలిపారు. సోమవారం మాస్తి ఫిర్కా రాజేనహళ్లి జీపీలోని సొణపనహట్టిలో భక్తుల సహకారంతో నూతనంగా నిర్మించిన గంగమ్మ దేవి నూతన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని విశేష పూజలు నిర్వహించిన అనంతరం మాట్లాడారు. ఆలయాల నిర్మాణానికి దాతలు ఇతోధికంగా సహకరించాలన్నారు. పూర్వీకులు నిర్మించిన ఆలయాలను జీర్ణోద్ధరణ చేయాలన్నారు. మన సంస్కృతి, సాంప్రదాయం, ఆచార, విచారాలకు అధిక ప్రాధాన్యత నిచ్చేవారు నూతన విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ఆలయంలో పలు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పూజల్లో పాల్గొనగా, భక్తులకు కృష్ణయ్య శెట్టి చీర, పంచ, కండువా, వాయనం అందించారు. -
ప్రసన్నలక్ష్మిది హత్యే
రాయచూరు రూరల్: రాయచూరు నగరంలోని వాసవినగర్‌లో నివాసముంటున్న ప్రసన్నలక్ష్మిని శనివారం రాత్రి కుటుంబ సభ్యులే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. భర్త జంబన గౌడ ప్రతి రోజు మద్యం తాగి వచ్చి కుటుంబ సభ్యులతో కలసి నానా హింసలు పెట్టేవాడన్నారు. పైగా విడాకుల కోసం ఏడాది నుంచి గొడవ పడేవాడన్నారు. 2008లో వివాహం చేసుకున్న సమయంలో 25 తులాల బంగారం, రూ.2 లక్షల వరకట్నం ఇచ్చారన్నారు. అక్క కూతురిని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో దానిని నిరాకరించడంతో అప్పటి నుంచి తమ కూతురిని చిత్రహింసలకు గురి చేసినట్లు తెలిపారు. కుటుంబ కలహాలపై వారం రోజుల క్రితం ప్రసన్నలక్ష్మిద పోలీసులకు ఫిర్యాదు చేసిందన్నారు. ఏం జరిగిందో ఏమో గత రాత్రి ప్రసన్నలక్ష్మి శవంగా మారిందన్నారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం లక్ష్మీపూర్‌కు చెందిన ప్రసన్నలక్ష్మికి జంబనగౌడతో రాయచూరు గీతా మందిరంలో 2008లో పెళ్లి జరిగిందన్నారు. ప్రసన్నలక్ష్మిని హత్య చేసిన భర్త, అత్త, మామ, కుమార్తెలపై చర్యలు తీసుకోవాలని ఒత్తిడి చేశారు. కుటుంబ సభ్యులే చంపి ఆత్మహత్యగా చిత్రించారు మృతురాలి తల్లిదండ్రులు, బంధువుల ఆరోపణ -
విద్యార్థులకు బ్యాగ్‌ల పంపిణీ
కోలారు : బెంగళూరు మార్వాడి యువ మంచ్ ఆధ్వర్యంలో సోమవారం తాలూకాలోని మాగొండి క్లస్టర్ పరిధిలోని పాఠశాలల్లోని 1000 మంది విద్యార్థులకు ఉచితంగా బ్యాగ్‌లను అందించారు. ఈ సందర్భంగా మంచ్ అధ్యక్షుడు స్నేహకుమార్ జాజూ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతం ద్వారా తల్లిదండ్రులను ప్రైవేటు పాఠశాలల వ్యామోహం నుంచి బయటకు తీసుకు రావాలన్నారు. విద్య సాధకుల సొత్తు అని నిరూపించాలన్నారు,. దాతలు అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని విద్యా ప్రగతి సాధించాలన్నారు. విద్యార్థులు సమాజం, దేశానికి అమూల్యమైన సేవలను అందించాలన్నారు. తోటి విద్యార్థులకు సహాయ సహకారాలు అందించాలన్నారు. ఫెడరేషన్ ఆఫ్ కర్ణాటక ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రకాష్ మాండోత్, ఉపాధ్యాయ గెళెయర బళగ అధ్యక్షుడు నారాయణస్వామి, ఉపాధ్యక్షుడు వీరణ్ణగౌడ, తదితరులు పాల్గొన్నారు. రత్నాచార్య అవార్డు ప్రదానం కోలారు: కోలారమ్మ ఆలయ అర్చకుడు, జిల్లా అర్చకుల సంఘం అధ్యక్షుడు సి.సోమశేఖర్ దీక్షిత్‌కు జాతీయ రత్నాచార్య అవార్డు, డాక్టర్ ఆఫ్ ఓరియంటల్ లర్నింగ్ ఆన్ ధర్మశాస్త్ర డాక్టరేట్ అవార్డు లభించింది. ఇండియన్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటెడ్ జ్యోతిష్య విద్యా పీఠం, విశ్వ సంస్కృత మహావిద్యాలయం కోల్‌కతా చిత్తరంజన్ అవిన్యూ మహా జత్తి సదన్ ఆడిటోరియంలో నిర్వహించిన డాక్టరేట్ ప్రదానోత్సవంలో సోమశేఖర్ దీక్షిత్‌కు ఈ అవార్డును అందించారు. కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, హెరిటేజ్ అధ్యక్షుడు డాక్టర్ గోపాలశాస్త్రి, కార్యదర్శి అమల కృష్ణ, ఉపాధ్యక్షుడు రవీంద్ర భట్టాచార్య, చైర్మన్ డాక్టర్ రామకృష్ణ, అఖిల కర్ణాటక అర్చకుల ఆగమికుల సంఘం ప్రధాన కార్యదర్శి కేఎస్ఎన్ దీక్షిత్ ఉన్నారు. -
రోడ్ల విస్తరణకు శ్రీకారం చుట్టరూ
రాయచూరు రూరల్: నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రోడ్ల విస్తరణకు శ్రీకారం చుట్టాలని కర్ణాటక దళిత సంఘర్ష సమితి డిమాండ్ చేసింది. సోమవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద అధ్యక్షుడు తిప్పేస్వామి మాట్లాడారు. నగరంలోని ఆశాపూర్ రోడ్డు ఇరుకుగా ఉన్నందున వాహన రాకపోకలకు ఇబ్బందికరంగా మారిందన్నారు. నగరసభ అధికారులు చర్యలు చేపట్టి ఆక్రమణలను తొలగించి, రోడ్ల విస్తరణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. రేపు రేణుకాచార్య జయంతిరాయచూరు రూరల్ : నగరంలో రేణుకాచార్య జయంతి, యుగ మానోత్సవాలు ఈ నెల 12న నిర్వహిస్తున్నట్లు జిల్లా వీరశైవ సమాజం అధ్యక్షుడు శరణ భూపాల్ నాడగౌడ వెల్లడించారు. సోమవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని మంగళవారపేట మఠం నుండి 8 గంటలకు రేణుకాచార్య సర్కిల్ వరకు సైకిల్ ర్యాలీ చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం వీరశైవ కళ్యాణ మంటపంలో జిల్లాధికార యంత్రాగం, జిల్లా పంచాయతీ, నగరసభ, .సాంఘీక సంక్షేమ శాఖ, వీరశైవ సమాజం ఆధ్వర్యంలో రేణుకాచార్య జయంతి, యుగ మానోత్సవాలను మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొంటారన్నారు. విలేకరుల సమావేశంలో శాంతమల్ల శివాచార్య, అభినవ రాచోటి శివాచార్య, వీర సంగన బసవ శివాచార్య, చంద్రశేఖర్, వీరయ్య స్వామి, శరణు సురగి మఠలున్నారు. కానిస్టేబుల్‌పై ఇసుక మాఫియా దాడి రాయచూరు రూరల్: అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్న వాహనాలను అడ్డుకున్న పోలీస్ కానిస్టేబుల్ౖపై దాడి చేసిన ఘటన మాన్విలో చోటు చేసుకుంది. సోమవారం మాన్వి తాలూకా చీకలపర్వి సమీపంలోని తుంగభద్ర నదీ తీరంలో నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా దానిని నియంత్రించిన పోలీస్ కానిస్టేబుల్ లక్ష్మణ్‌పై దేవరాజ్ దాడి చేయడంతో గాయపడ్డాడు. గాయపడిన పోలీస్ కానిస్టేబుల్ మాన్విలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడి చేసిన వారిపై మాన్వి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు ఎస్పీ పుట్టమాదయ్య తెలిపారు. ఇళ్ల మంజూరుకు వినతిరాయచూరు రూరల్: నగరంలో మురికి వాడల ప్రాంతాల్లో నివాసమున్న పేదల ఇళ్లకు ప్రమాణ పత్రాలను ఇచ్చి ఇళ్లను మంజూరు చేయాలని మురికి వాడల ప్రాంతాల క్రియా సేన సమితి అధ్యక్షుడు జనార్దన్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లాధికారి కార్యాలయంలో వినతిపత్రం సమర్పించి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నగరంలో వివిధ ప్రాంతాల్లో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. రూ.6 లక్షల్లో కేవలం స్లం బోర్డు అధికారులు రూ.3 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. సగానికే చేపట్టిన నిర్మాణాల్లో మిగిలిన భాగాన్ని పూర్తి చేయాలంటే ప్రభుత్వం నిధులు విడుదల చేయాలన్నారు. ప్రోత్సాహం లేక క్రీడాకారులు కనుమరుగు కోలారు: జిల్లాలో క్రీడాకారులకు సరైన ప్రోత్సాహం లేక ఎంతో మంది క్రీడాకారులు భవిష్యత్తు లేక కనుమరుగు అవుతున్నారని బెంగళూరు డీసీపీ డీ.దేవరాజ్ విచారం వ్యక్తం చేశారు. తాలూకాలోని తోరదేవండనహళ్లిలో నిర్వహించిన ప్రీమియర్ లీగ్– 2025 టోర్నమెంట్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో క్రీడాకారులను ప్రోత్సహించడానికి క్రీడామైదానాలు, శిక్షకుల ఆవశ్యకత ఉందన్నారు. ఎంతో మంది శ్రీమంతులు, మధ్య తరగతికి చెందిన వారు తమ పిల్లలను క్రీడల్లో చేర్పించడానికి బెంగళూరుకు వెళుతున్నారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యువకులకు సరైన ప్రోత్సాహం లేక వెనకడుగు వేస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో ప్రతి గ్రామ పంచాయతీలో పలు క్రీడలకు క్రీడామైదానాల నిర్మాణానికి ఉన్న అవకాశాన్ని యువకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలో పలు సంవత్సరాల క్రితం కొంతమంది రంజీ పోటీల్లో పాల్గొన్నారు. అయితే అంతర్జాతీయ స్థాయిలో ఆడలేదనే అసంతృప్తి మిగిలిందన్నారు. ప్రస్తుతం కోరగండనహళ్లిలో క్రికెట్ స్టేడియం నిర్మాణం జరగడంతో క్రికెట్‌పై ఆసక్తి కలిగిన యువకులు ఈ స్టేడియాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వరదేనహళ్లి వెంకటేష్, కిలారిపేట మణి, ముక్కడ్ వెంకటేష్, అనిల్‌కుమార్ పాల్గొన్నారు. -
డబ్బు కోసం గొడవ.. యువకుడికి గాయం
కోలారు: డబ్బు విషయంలో జరిగిన గొడవలో యువకుడిపై చాకుతో దాడి చేసి తీవ్రంగా గాయపరచిన ఘటన ఆదివారం రాత్రి నగరంలోని శారదా టాకీస్ వద్ద చోటు చేసుకుంది. భోవి నగర నివాసి సునీల్‌కుమార్ దాడిలో గాయపడిన యువకుడు. నగరానికి చెందిన రాహుల్, కృష్ణోజీరావ్లకు సునీల్ అనే వ్యక్తితో ఆర్థిక లేవాదేవీలు ఉండేవి. ఈ నేపథ్యంలో వీరి మధ్య ఆదివారం రాత్రి గొడవ ప్రారంభమైంది. ఆవేశానికి లోనైన రాహుల్, కృష్ణోజీరావ్లు సునీల్‌పై చాకుతో దాడికి దిగారు. ఈ సమయంలో సునీల్ కాలికి తీవ్ర గాయం కావడంతో అతనిని స్థానికులు ఎస్ఎన్ఆర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. రాహుల్ పరారీలో ఉండగా దాడిలో కృష్ణోజీరావ్కు కూడా స్వల్పంగా గాయాలయ్యాయి. కోలారు నగర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
మాటలతో హింసిస్తున్నారు.. బెదిరిస్తున్నారు: కోర్టులో రన్యారావు
బెంగళూరు: గోల్డ్ స్మగ్మింగ్ కేసులో భాగంగా ప్రస్తుతం డీఆర్ఐ కస్టడీలో ఉన్న కన్నడ నటి రన్యారావును ఈరోజు(సోమవారం) బెంగళూరు స్పెషల్ కోర్టులో హాజరుపరిచారు. తన మొహంపై గాయాలు కనిపిస్తున్న క్రమంలో ఆమెను కోర్టుకు తీసుకెళ్లారు డీఆర్ఐ అధికారులు. అయితే కస్టడీలో ఏమైనా భౌతిక దాడులు జరిగాయా అని కోర్టు ప్రశ్నించగా.. తనను శారీరకంగా ఏమీ ఇబ్బందులు గురి చేయడం లేదని, కానీ మాటలతో మానసికంగా హింసిస్తున్నారని కోర్టులో కన్నీటి పర్యంతమైంది. అయితే మానసికంగా మాటలతో హింసిస్తున్నారని ఆమె చెబుతున్న వాదనను డీఆర్ఐ ఖండించింది. అందులో ఎటువంటి వాస్తవం లేదని, తమ నిబంధనల మేరjo దర్యాప్తు చేస్తున్నామన్నారు. తమ దర్యాప్తును మొత్తం రికార్డు చేస్తున్నామని డీఆర్ఐ పేర్కొంది.వైరల్‌గా మారిన ఫోటోరన్యారావుకు చెందిన ఓ ఫోటో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.. ఆమె కంటి కింద గాయాలు, ఉబికిన మొహంతో ఆమె ఫోటోలో ఉంది. ఆమెను కస్టడీలో తీసుకుని విచారణ పేరుతో చిత్ర హింసలు పెట్టారా? అనే అనుమానం కలుగుతోంది. దీనిపై కర్ణాకట మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.ప్రధానంగా వైరల్ గా మారిన ఫోటోను ఉటంకిస్తూ మహిళా కమిషన్ చైర్మన్ నాగలక్ష్మీ చౌదరి అనుమానం వ్యక్తం చేశారు. ఆమెపై అధికారులు దాడికి పాల్పడ్డారా? అనే ప్రశ్న లేవనెత్తారు. అయితే దీనిపై తాము నేరుగా దర్యాప్తు చేసే అవకాశం లేదన్నారు. రన్యారావు తముకు ఏమైనా ఫిర్యాదు చేస్తే ఆమెకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు నాగలక్ష్మి,‘మాకు ఆమె లేఖ రూపంలో ఫిర్యాదు చేస్తే మేము సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆమె నుంచి ఫిర్యాదు అందిన పక్షంలో తమ పరిధిలో ఉన్న ఆయా విభాగాలను అప్రమత్తం చేస్తాం. సరైన రీతిలో దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఆమె ఏమైనా దాడికి గురయ్యిందా అనేది ఆమె ఫిర్యాదు రూపంలో ఇస్తేనే మేము ఏమైనా చేయగలం. ఒకవేళ ఆమె మమ్మల్ని సంప్రదించకపోతే దీనిపై కనీసం కామెంట్ కూడా చేయలేం’ అని మహిళా కమిషన్ చైర్ పర్సన్ నాగలక్ష్మి పేర్కొన్నారు. ఈ నేపధ్యంలోనే ఆమెను స్పెషల్ కోర్టులో హాజరుపరిచినట్లు తెలుస్తోంది. గత సోమవారం 12 కేజీలకు పైగా బంగారం కడ్డీలను తన బెల్ట్ లో పెట్టుకుని దుబాయ్ నుంచి అక్రమంగా తరలిస్తూ రన్యారావు పట్టుబడింది. బెంగూళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆమె అధికారులకు చిక్కింది. ప్రస్తుతం ఆమె మూడు రోజుల డీఆర్ఐ అధికారుల కస్టడీలో ఉంది. దీనిలో భాగంగా ఆమెను విచారిస్తున్న అధికారులు ఇందులో ‘కింగ్ పిన్’ ఎవరు అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. సజీవదహనమైన తల్లి, కుమారుడు..
కర్ణాటక: చిక్కబళ్లాపురం జిల్లా చింతామణి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. సొంతూరులో బంధువులను పలకరించి సంతోషంగా బెంగళూరుకు(Bangalore) వస్తున్న కుటుంబంలో విషాదం చిందింది. తల్లీ కుమారుడు సజీవ దహనమయ్యారు. చింతామణి సమీపంలోని కంచార్లపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని మదనపల్లి రోడ్డులో జోగ్యానహళ్లి–గోపల్లి మధ్య ఆదివారం ఉదయం 10 గంటలప్పుడు దుర్ఘటన జరిగింది. వారు ప్రయాణిస్తున్న బ్యాలెనో కారును ప్రైవేటు బస్సు ఢీకొనడంతో కారు మంటల్లో కాలిపోయింది. బంధువుకు కొడుకు పుట్టాడని.. వివరాలు.. ధనుంజయ రెడ్డి (Dhanunjaya Reddy)(30), ఆయన తల్లి కళావతి (52), ధనుంజయరెడ్డి భార్య శోభారాణి, కొడుకు మాన్విత్ రెడ్డి (3), శోభారాణి తల్లి మహాలక్ష్మీ కారులో బెంగళూరుకు బయల్దేరారు. ధనుంజయరెడ్డి కారు నడుపుతున్నారు. ఆయన తండ్రి గోపాల్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో కడప నగరంలోని రాఘవేంద్ర టౌన్ షిప్లో నివాసముంటూ ఆకాశవాణిలో ఉద్యోగం చేస్తున్నారు. ధనుంజయరెడ్డి, భార్య ఐటీ ఉద్యోగులు కాగా, బెంగళూరు మహదేవపురలో నివాసముంటున్నారు. కడపలో శోభారాణి అన్న సుబ్బారెడ్డికి కొడుకు పుట్టడంతో శనివారం అందరూ వెళ్లి చిన్నారిని చూసి సంతోషంగా గడిపారు. బెంగళూరుకు తిరిగి వస్తుండగా చింతామణి దగ్గర ఎదురుగా బెంగళూరు నుంచి తిరుపతికి వెళుతున్న శ్రీ భారతి ప్రైవేటు బస్సు వేగంగా కారును ఢీకొట్టింది. కారు రోడ్డు పక్కన పడి మంటల్లో చిక్కుకుంది. అప్పటికే కారులోని వారు బయటకు ఎగిరిపడ్డారు. ధనుంజయరెడ్డి, తల్లి కళావతికి మంటలు అంటుకుని సజీవ దహనమయ్యారు. మిగతా ముగ్గురికి గాయాలయ్యాయి. బస్సు కూడా బోల్తా పడింది. అందులోని కొందరికి చిన్న చిన్న గాయాలు అయ్యాయి. కారు పూర్తిగా దగ్ధం స్థానికులు చేరుకుని క్షతగాత్రులకు సాయం చేశారు. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేసేటప్పటికి కారు పూర్తిగా దహనమైంది. జిల్లా ఎస్పీ కుశాల్ చౌక్సి, డీఎస్పీ మురళీధర్, సీఐ వెంకటరమణప్ప తదితరులు పరిశీలించారు. మృతదేహాలకు చింతామణి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. శోభారాణి, కొడుకు మన్విత్, మహాలక్ష్మీలకు ప్రథమ చికిత్స నిర్వహించి బెంగళూరు ఆస్పత్రికి తరలించారు. ఆస్పతి దగ్గర బంధువుల రోదనలు మిన్నంటాయి. -
మాజీ మంత్రి కారు డ్రైవర్ అరెస్టు
దొడ్డబళ్లాపురం: జువెలరీ షాప్‌ల యజమానులు, పలువురు వ్యాపారులు, రాజకీయ నాయకుల నుంచి భారీగా నగలు, డబ్బు వసూలు చేసి మోసం చేసిన కిలేడీ ఐశ్వర్యగౌడ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. కాంగ్రెస్‌కు చెందిన మాజీ మంత్రి వినయ్ కులకర్ణి కారు డ్రైవర్ వీరేశ్ దళవాయిని అరెస్టు చేశారు. ఐశ్వర్యగౌడకు చెందిన బెంజ్ కారు వినయ్ కులకర్ణి ఇంటి ముందు లభించింది. దీంతో డ్రైవర్‌ను పోలీసులు విచారణ నిమిత్తం అరెస్టు చేశారు. వినయ్ కులకర్ణితో ఐశ్వర్యగౌడకు పరిచయం ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఇటీవల పోలీసులు గాలిస్తున్నప్పుడు ఆమె మహారాష్ట్రకు వెళ్లే ముందు ధార్వాడలోని వినయ్ కులకర్ణి ఇంటికి వచ్చింది. వెళ్లేటప్పుడు తన కారు అక్కడే వదిలి విమానంలో మహారాష్ట్రకు వెళ్లింది. కేసు కొలిక్కి వచ్చిందని త్వరలో ఛార్జ్ షీట్ సమర్పిస్తామని పోలీసులు తెలిపారు. -
జన్మదిన వేడుకల్లో విషాదం
హొసపేటె: జన్మదిన వేడుకల సందర్భంగా ఆలయానికి వెళ్లిన స్నేహితులు నదిలో ఈత కొట్టేందుకు దిగారు. వారిలో ముగ్గురు గల్లంతయ్యారు. ఈఘటన గదగ్ జిల్లా ముండరిగి తాలూకాలోని కోరలహళ్లి వంతెన సమీపంలో ఆదివారం జరిగింది. గదగ్ జిల్లా శిరహట్టికి చెందిన ఐదుగురు స్నేహితుల్లో ఒకరి జన్మదిన సందర్భంగా మాదలగట్టి ఆంజనేయుడి దర్శనానికి వెళ్లారు. దర్శనం అనంతరం ఈత కొట్టేందుకు తుంగభద్ర నదిలోకి దిగారు. ఈత కొట్టే సమయంలో శరణప్ప బడిగేర్ (34) నీటి ప్రవాహంలో కొట్టుకొని పోతుండగా కాపాడేందుకు వెళ్లిన స్నేహితులు మహేష్ బడిగేర్ (36), గురునాథ్ బడిగేర్ (38) కూడా గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం విజయనగర జిల్లా హువినహడగలి పోలీసులు స్థానిక మత్స్యకారుల సహకారంతో నదిలో గాలింపు చర్యలు చేపట్టారు.తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లి ముగ్గురు గల్లంతు -
బహుముఖ ప్రజ్ఞతో మహిళల రాణింపు
బళ్లారిఅర్బన్: మహిళలు బహుముఖ ప్రజ్ఞతో అన్ని చోట్ల తమదైన ప్రతిభ చాటుకున్నారని జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి కేజీ శాంతి అన్నారు. స్థానిక ఓ ప్రైవేట్ హోటల్లో శ్రీ మాతృ మహిళ మండలి సంఘంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని జడ్జి ప్రారంభించి మాట్లాడారు. భూమి నుంచి ఆకాశం వరకు అన్ని రంగాలలో మగవారి కన్నా తాము ఏమీ తక్కువ కాదంటూ మహిళలు నిరూపిస్తున్నారన్నారు. కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే తాము ఎ ఎంచుకున్న రంగంలో రాణిస్తున్నారన్నారు. జైలు సూపరింటెండెంట్ లతా మాట్లాడుతూ మహిళ లేని ఇల్లు అసంపూర్తిగా ఉంటుందన్నారు. ఓ కుటుంబం మహిళలపైనే ఆధారపడి ఉంటుందన్నారు. జిల్లా న్యాయసేవ ప్రాధికార న్యాయమూర్తి రాజేష్ హొసమని మాట్లాడుతూ మహిళలు తమకు అప్పగించిన పని పూర్తి అయ్యేదాక విరామం తీసుకోరని అన్నారు. సీ్త్ర మాతృ మహిళ సంఘం ఆధ్వర్యంలో వివిధ రంగాలలో సేవలు అందించిన సాధకులను ఘనంగా సన్మానించారు. . చివరిగా కీర్తి రెడ్డి సంగీత గాయనం, విశేషంగా విణుల విందు చేసింది. ఆ సంఘం అధ్యక్షురాలు పుష్పలతా చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
డ్రగ్స్ రహిత జిల్లా కోసం చేతులు కలపండి
సాక్షి,బళ్లారి: డ్రగ్స్ రహిత రాష్ట్రం, జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు తోడ్పాటునందించాలని జిల్లా పోలీసు అధికారులు పిలుపునిచ్చారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర పోలీస్ రన్– 2025 కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ శోభారాణి ఆదివారం నగరంలోని శ్రీకనక దుర్గమ్మ ఆలయం వద్ద ప్రారంభించారు. అంతకు ముందు పోలీసులకు, నగరవాసులకు యోగాపై అవగాహన కల్పించారు. అనంతరం పోలీసులు, విద్యార్థులు, నగర ప్రముఖులు ర్యాలీగా. రాయల్ సర్కిల్, మోతీ సర్కిల్, అంబేద్కర్ సర్కిల్, ఎస్పీ సర్కిల్, తాళూరు రోడ్డు వరకు వెళ్లి తిరిగి శ్రీకనక దుర్గమ్మ ఆలయం వద్దకు చేరుకున్నారు. ఎస్పీ మాట్లాడుతూ ఆరోగ్యం మన చేతుల్లో ఉందని, ప్రతి రోజు ఏదో ఒక వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రతి పౌరుడు సహకారం అందించాలన్నారు. ఐజీపీ లోకేష్ కుమార్,ఏఎస్పీ రవికుమార్, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. రాయచూరురూరల్: యువకులు దురలవాట్లకు లోను కావద్దని కలెక్టర్ నీతీస్ పిలుపునిచ్చారు. ఫిట్నెస్ ఫర్ ఆల్ పేరుతో జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ ఆధ్వర్యంలో నగరంలోని మహాత్మాగాంధీ క్రీడా మైదానంలో ఆదివారం ఏర్పాటు చేసిన 5కే రన్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. యువత మద్యం, మత్తు పదార్థాలకు బానిసై చెడు మార్గంలో పయనిస్తున్నారన్నారు. మంచి అలవాట్లను అలవర్చుకొని వ్యాయామం, యోగా చేస్తూ ఆరోగ్యాలను కాపాడుకోవాలన్నారు. ఎస్పీ పుట్టమాదయ్య, అసిస్టెంట్ కమిషనర్ గజానన, అడిషనల్ ఎస్పీ హరీష్, ఆరోగ్యశాఖ అధికారి సురేంద్రబాబు, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణ, వీరేష్, నాయక్, యంకప్ప, పోలీసు అధికారులు ఉమేష్ కాంబ్లే, దత్తాత్రేయ, సత్యనారాయణ, విద్యార్థులు పాల్గొన్నారు. మహాత్మా క్రీడా మైదానం నుంచి ఎస్పీ కార్యాలయం వరకు మారథన్ కొనసాగింది. నగరవాసులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. -
హంపీలో పోలీసు సబ్ డివిజన్‌ను పునరుద్ధరించాలి
సాక్షి,బళ్లారి: ప్రపంచ పర్యాటక కేంద్రంగా భాసిల్లుతున్న హంపీలో పర్యాటకుల రక్షణ, భద్రత కోసం పోలీసు సబ్ డివిజన్‌ను పునరుద్ధరించాలని గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి సూచిచారు. ఈమేరకు ఆదివారం ఆయన సామాజిక మాధ్యమాలకు వీడియో విడుదల చేశారు. కొప్పళ జిల్లా గంగావతి నియోజకవర్గం అనేగొంది సమీపంలోని కాలువ వద్ద ఇజ్రాయిల్ మహిళతో పాటు, స్థానిక హోంస్టే నడుపుతున్న మహిళపై దుండగులు దాడి చేసి, అత్యాచారం చేయడం, విదేశీ పర్యాటకులను కాలువలోకి తోయడం అందులో ఒక ఒడిసా వ్యక్తి మృతి చెందడం రాష్ట్రానికి మాయని మచ్చగా మిగిలిపోయిందన్నారు. ఈ దారుణ ఉదంతం తనను ఎంతగానో కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో యడియూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను ఉమ్మడి బళ్లారి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా ఉన్నప్పుడు హంపీలో పర్యాటకుల భధ్రతకు పోలీస్‌సబ్ డివిజన్‌ను ఏర్పాటు చేయించామన్నారు. ఒక డీఎస్పీ స్థాయి అధికారిని నియమించి 32 పోలీసు బృందాలను నియమించి 24గంటలూ హంపీ పరిసరాల్లో గస్తీ తిరిగేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. అనంతరం పోలీసు సబ్ డివిజన్‌ను ఎందుకు తొలగించారో అర్థం కావడం లేదన్నారు. పోలీసు గస్తీ కొరవడి పర్యాటక ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోతున్నాయన్నారు. తక్షణం సీఎం సిద్ధరాయమ్య స్పందించి హంపీలో పోలీసు సబ్ డివిజన్‌న పునరుద్ధరించి డీఎస్పీ స్థాయి అధికారి, సీఐలు, ఎస్ఐలను నియమించాలని, అనెగొందిలో పోలీసు స్టేషన్ ఏర్పాటు చేసి ప్రత్యేక పోలీసు సిబ్బందిని నియమించి పర్యాటకులకు భద్రత కల్పించాలన్నారు. విదేశీ పర్యాటకురాలిపై అత్యాచారం దారుణం హంపీలో పర్యాటకులకు భద్రత కల్పించాలి గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి -
మహిళలు ఆరోగ్యాలను కాపాడుకోవాలి
రాయచూరురూరల్: మహిళలు అరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాని అర్సీహెచ్ అధికారిణి నందిత సూచించారు. మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన జాతాను ఆదివారం నగరంలోని ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం వద్ద ఆమె ప్రారంభించి మాట్లాడారు. సమాజంలో ఆడపిల్లల పట్ల వివక్ష చూపరాదన్నారు. పురుషులతో సమానంగా ఆడ పిల్లలను చదివించాలన్నారు. వైద్యులు యశోధ, లక్ష్మి, సరోజ, సంధ్య, అంజు పాల్గొన్నారు. పచ్చదనం పెంపొందించాలిరాయచూరు రూరల్: పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించాలని అటవీ శాఖ అధికారి రాజేష నాయక్ పిలుపునిచ్చారు. రాయూరులోని కృష్ణగిరి కాలనీలో పక్షులకు నీరు పెట్టడం, మెక్కలు నాటడం తదితర కార్యక్రమాలను ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. నగరంలో వేసవిలో ఎండలు తీవ్రంగా ఉంటాయన్నారు. ఇళ్ల వద్ద మొక్కలు పెంచుకుంటే చల్లదనాన్ని ఆస్వాదించవచ్చన్నారు. ప్లాస్టిక్ బ్యాగులను పూర్తిగా నిషేధించాలన్నారు. రేఖ, హనుమంతాయ, అనితా హిరేమని, సరస్వతీ పాల్గొన్నారు. వైద్య రంగంలో నర్సుల సేవలు ప్రశంసనీయం రాయచూరు రూరల్: నర్సింగ్ విద్యకు కేంద్ర బడ్జెట్లో రూ.3520 కోట్ల నిధులు మంజూరు చేశారని భారతీయ నర్సింగ్ మండలి అధ్యక్షుడు టి. దీలిప్ అన్నారు. నవోదయ వైద్య కళాశాల ఆడిటోరియంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని నర్సింగ్, ఫిజియోథెరపీ, పార్మసీ, బీఈడీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలు అందించి మాట్లాడారు. కోవిడ్ సమయంలో నర్సులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి రోగులకు సేవలు అందించారన్నారు. పట్టాలు అందుకున్న నర్సులు రోగులకు మెరుగైన సేవలు అందించాలన్నారు. కళాశాల ట్రస్టీ యస్.రాజేంద్ర రెడ్డి, రిజిస్ట్రార్ శ్రీనివాస్, డీన్ దేవానంద, గిరిస్, దొడ్డయ్య, అరుణ్, విజయ్‌కుమార్, ఉమాకాంత్, కాజల్ శెట్టి పాల్గొన్నారు. 11న కర్ణాటక కేంద్రీయ వర్సిటీ స్నాతకోత్సవంరాయచూరు రూరల్: కర్ణాటక కేంద్రీయ విశ్వ విద్యాలయ స్నాతకోత్సవాన్ని ఈనెల 11న నిర్వహిస్త్నట్లు వైస్ చాన్సలర్ బుట్టు సత్యనారాయణ ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా 36 మందికి బంగారు పతకాలు, 824 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేస్తామని తెలిపారు. 2009లో ప్రారంభమైన వర్సిటీలో ఇప్పటివరకు 2800 మంది విద్యార్థులు విద్యను అభ్యసించారన్నారు. 175 మంది అధ్యాపకులు ఉన్నారన్నారు. వర్సిటీలో పరిసరాల పరిరక్షణకు రూ.1.21 కోట్లు వ్యయం చేసినట్లు తెలిపారు. సెమీ కండక్టర్ కోర్సులకు రూ.45 కోట్లతో పరికరాలు కోనుగోలు చేస్తామన్నారు. సమావేశంలో డాక్టర్ కోటా సాయి క్రిష్ణ, అర్.అర్.బిరదార్, రాజీవ్ జోషి, గణపతి, ప్రకాష్ పాల్గొన్నారు. ఆస్తి పన్ను బకాయిలు చెల్లించండి రాయచూరు రూరల్: ఆస్తి పన్ను బకాయిలు మూడు నెలల్లో చెల్లించాలని నగరసభ రెవెన్యూ అధికారి నరసింహారెడ్డి నగరవాసులకు సూచించారు. కోదండ రామాలయం వద్ద ఆదివారం ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. త్వరితగతిన ఇంటి, నీటి పన్నులు చెల్లించాలన్నారు. అక్రమ కట్టడాలపై పూర్తిస్థాయి విచారణ చేస్తామని తెలిపారు. -
ఉరవకొండ తేరు.. జన హోరు
ఉరవకొండ: ఓం నమఃశివాయ అంటూ భక్తులు శివనామస్మరణ చేస్తుండగా చంద్రమౌళీశ్వర మఠం రథోత్సవం వైభవం మిన్నంటింది. అనంతపురం జిల్లాలో ఉరవకొండ పట్టణంలోని గవిమఠం సంస్థానంలో ఆదివారం తేరు వేడుక ఘనంగా జరిగింది. హర హర మహదేవ శంభోశంకర అంటూ స్వామి వారి మహరథాన్ని ముందుకు లాగుతూ భక్తి పారవశ్యంతో మునిగారు. కర్ణాటకలోని పలు జిల్లాల నుంచి భక్తజనం, స్వామీజీలు తరలివచ్చారు. ఉదయం స్వామి వారి మూలవిరాట్‌కు విశేష పూజలు, అభిషేకాలు, మహా రుద్రాభిషేకాలు నిర్వహించారు. గవిమఠం 8వ పీఠాధిపతులు జగద్గురు చెన్నబసవరాజేంద్రస్వామి, ఉత్తరాధికారి డాక్టర్ కరిబసవరాజేంద్రస్వామి ఆధ్వర్యంలో చంద్రమౌళీశ్వరుని ఉత్సవ మూర్తిని భాజాభజంత్రీల మధ్య తేరులో ప్రతిష్టించారు. వేలాది భక్తులు శంభోశంకరున్ని స్మరిస్తూ ఘనమైన తేరును ఎదురు బసవణ్ణ గుడి వరకూ లాగారు. అక్కడ పూజలు చేసి మళ్లీ యథాస్థానానికి చేర్చారు. పెద్ద సంఖ్యలో ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు. -
న్యూ శ్రీ చైతన్య రాధాకృష్ణ కళాశాల అధినేతకు మాతృవియోగం
సాక్షి,బళ్లారి: బళ్లారిలోని న్యూ శ్రీ చైతన్య రాధాకృష్ణ పీయూ కళాశాల అధినేత పయ్యావుల రాధాకృష్ణ మాతృమూర్తి పయ్యావుల జానకమ్మ (88) మృతి చెందారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జానకమ్మ స్వగ్రామం ఏపీలోని రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాల్. ఆమె కుమారుడు రాధాకృష్ణ బళ్లారిలో ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేశారు. న్యూ శ్రీ చైతన్య కళాశాల ఏర్పాటు చేసి బళ్లారిలోని ఉంటున్నారు. జానకమ్మకు సోమవారం బళ్లారిలోని హరిశ్చంద్ర ఘాట్లోఅంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుమారుడు రాధాకృష్ణ తెలిపారు. జానకమ్మ భౌతికకాయానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. 19 రోజుల్లో రూ.46 లక్షల కానుకలుహుబ్లీ: శ్రీ సిద్దరూఢ స్వామి మఠం హుండీలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీ సిద్దరూఢ బ్యాంక్ మేనేజర్ సిబ్బంది భక్తుల సమక్షంలో ఈ నెల 5న లెక్కించారు. 19 రోజుల వ్యవధిలో భక్తులనుంచి రూ.46,73,931 కానుకలు లభించినట్లు అధికారులు తెలిపారు. కమిటీ చైర్మన్ బసవరాజ కళ్యాణశెట్టర్, వైస్ చైర్మన్ మంజునాథ మునవళ్లి, గౌరవ కార్యదర్శి సార్వమంగళ పాటక, ధర్మకర్త బాలు టి భగజికొండి, వసంత వై సాలగట్టి గీతా టీ.కలబుర్గి వినాయక ఘోర్ఖె, చెన్నవీర ఢీ ముంగురవాడి, సావిత్రి మడివాళర పాల్గొన్నారు. ఈత కొలను పునః ప్రారంభంహుబ్లీ: సాంకేతిక కారణాలతో మూడు, నాలుగు వారాల నుంచి మూసి వేసిన పాలికె ఆధ్వర్యంలోని ఈత కొలను ఎట్టకేలకు తిరిగి ప్రారంభమైంది. దీంతో ఈత ప్రియులు ఆనందం వ్యక్తం చేశారు. స్మార్ట్ యోజన ద్వారా రూ.3.50 కోట్లతో నిర్మించిన ఈత కొలనుకు జనాదరణ లేక ఆదాయం రాని కారణాలతో బంద్ చేశారు. ప్రస్తుతం ఎండకాలం కావడంతో స్మిమింగ్ పూల్ బంద్ చేయడంపై స్థానికుల నుంచి తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఈత కొలనును తిరిగి ప్రారంభించినట్లు పాలికె కమిషనర్ రుద్రేస్ గాలి తెలిపారు. వివాహిత అనుమానాస్పద మృతి రాయచూరురూరల్: జిల్లా కేంద్రంలోని వాసవీ నగర్లో నివాసముంటున్న ప్రపన్న లక్ష్మి అనే వివాహిత శనివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. నేతాజీ నగర్ పోలీస్ స్టేషన్ నేర పరిశోధన ఎస్ఐ లక్ష్మి తెలిపిన మేరకు... ప్రసన్న లక్ష్మి భర్త జంబన గౌడ మద్యం మత్తులో హింసలు పెట్టేవాడు. దీంతో ఏడాదిగా ఆమె మానసిక క్షోభకు గురవుతోంది. ఈక్రమంలో వారం రోజలు క్రితం భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతరాత్రి ప్రసన్న లక్ష్మి విగతజీవిగా మారింది. ఆత్మహత్య చేసుకుందా? హత్యకు గురైందా? అనేది దర్యాప్తులో తేలాల్సి ఉందని ఎస్ఐ తెలిపారు. సెల్ఫోన్లు కాదు.. సృజనకు చోటివ్వండి హొసపేటె: చిన్నారులకు సెల్ఫోన్లు ఇవ్వకుండా ఆడుకునేందుకు బొమ్మలు ఇవ్వాలని, తద్వారా వారిలో సృజనాత్మకత పెరుగుతుందని ముఖ్యమంత్రి మీడియా సలహాదారు కేవీ ప్రభాకర్ అన్నారు. బాలభవన్‌లో ఎమ్మెల్యే రాఘవేంద్ర హిట్నాల్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వివిధ పోటీలను ప్రారంభించి మాట్లాడారు. బిడ్డకు తినిపించేటప్పుడు కూడా తల్లి మొబైల్ ఫోన్లో చూపిస్తుందని, కాబట్టి పిల్లలు పెరిగి పెద్దవారై మొబైల్ ఫోన్‌కి అతుక్కుపోతారన్నారు. ఇది ఆరోగ్యకరమైన పరిణామం కాదన్నారు. పిల్లలు స్వతంత్రంగా ఆలోచించడం నేర్చుకున్నప్పుడు వారిలో సృజనాత్మకత వృద్ధి చెందుతుందన్నారు. పిల్లలు మొదటి సృజనాత్మక చర్య వారి స్వంత బొమ్మలను సృష్టించడంలో ప్రారంభం అవుతుందన్నారు. డబ్బు, మద్యం లేని రాజకీయాలు రావాలి కోలారు: డబ్బు, మద్యం లేని రాజకీయాలు రావాల్సి ఉందని జేడీయూ రాష్ట్ర అధ్యక్షుడు మహిమా జె.పాటిల్ అన్నారు. తాలూకాలోని కల్లండూరు గ్రామంలో డాక్టర్ నాగరాజ్ నివాసంలో డాక్టర్ నాగరాజ్ గెళెయర బళగను ఆదివారం ప్రారంభించి మాట్లాడారు. ఎన్నికల్లో నిష్పాక్షిత ఉంటేనే ఉత్తమ పాలన లభిస్తుందన్నారు. ఆ దిశగా ప్రజలు ఉత్తమ వ్యక్తులను ఎన్నుకోవాలన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడిచినా సమస్యలను నేటికి ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. వ్వవసాయం పూర్తిగా సేంద్రీయం కావాల్సి ఉందన్నారు. వచ్చే ఆగ్నేయ పదవీధర క్షేత్ర విధాన పరిషత్ ఎన్నికల్లో జేడీయు నుంచి డాక్టర్ నాగరాజ్ బరిలో ఉంటారని, ఆయన విజయానికి కృషి చేయాలన్నారు. కల్లండూరు డాక్టర్ కె నాగరాజ్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, బీజేపీ ఉపాధ్యక్షుడు తబల నారాయణప్ప పాల్గొన్నారు. -
చింత ధర ఘనం.. దిగుబడులు అఽథమం
సాక్షి,బళ్లారి: చింతతో నిశ్చింత అనే నానుడి రైతన్నలకు అచ్చి రావడం లేదు. మార్కెట్లో చింతపండు ధరలు భగ్గుమంటుండగా చెట్లలో మాత్రం కాయలు లేవు. దిగుబడి లేక అన్నదాతలు దిగాలు చెందుతున్నారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో రైతులు పొలాల వద్ద చింత చెట్లను నాటి పోషిస్తున్నారు. పంటలు సరిగా చేతికందకపోయినా చింత చెట్లు రైతులను ఆదుకునేవి. ఏటా చింత చెట్లు విరగ్గాసి అన్నదాతలకు కాసులు కురిపించేవి. అయితే ఈ ఏడాది చింతచెట్లకు పెద్దగా కాపు రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంద చెట్లకుగాను కేవలం పదిచెట్లకు కూడా కాపు రాలేదని, గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదని అన్నదాతలు అంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో చింతపండు ధర రూ.20 వేల నుంచి రూ.30వేల వరకు పలుకుతోంది. చింతగింజలతో కల్తీ చేసిన చింత పండు కేజీ రూ.200లోపు ఉండగా, మేలురకం చింత పండు కిలో రూ.300 వరకు ధర పలుకుతోందని, ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉంటుందని, వచ్చే ఏడాది సీజన్ వచ్చే వరకు చింత పండు దొరికే పరిస్థితులు ఉండవని వ్యాపారులు పేర్కొంటున్నారు. చింతచెట్లు ఉన్న తమకు ఎలాంటి ఆధాయం లభించడం లేదని, వ్యాపారులకు మాత్రమే లాభాలు వస్తున్నాయని అన్నదాతలు అంటున్నారు. గత ఏడాది చింత పండును కోల్డ్‌స్టోరేజీల్లో నిల్వ ఉంచిన వ్యాపారులు కూడా మంచి లాభాలు ఆర్జిస్తున్నారని రైతులు అంటున్నారు. కొండెక్కిన చింత పండు ధరలు క్వింటాలు రూ.20 వేల నుంచి రూ.30వేల పైమాటే -
దుష్ట సంస్కృతిపై మహిళలు గళమెత్తాలి
రాయచూరు రూరల్: సమాజంలో నెలకొన్న వరకట్నం, భ్రూణహత్యలు తదితర దుష్ట సంస్కృతిని అంతమొందించేందుకు మహిళలు ముందడుగు వేయాలని ప్రజాపిత బ్రహ్మ కుమారీ ఈశ్వరీయ విశ్వ విద్యాలయం సంచాలకురాలు స్మిత పిలుపు ఇచ్చారు. ఆ విశ్వ విద్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిహిళా దినోత్సవంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మహిళలు పురుషులతో సమానంగా రాణిస్తున్నారని, అంతరిక్ష యాత్రలు కూడా చేపట్టి ఆకాశంలో కూడా విజయకేతనం ఎగురవేస్తున్నారని కొనియాడారు. దానమ్మ, సురేఖ, లతా, డాక్టర్ వసుంధర పాటిల్ ,మంజుల, గోపాల్, చంద్రశేఖర్, మంజునాథ్, సుజాత, మేటిగౌడ, వీరహనుమాన్, రేఖ, మారుతీ పాల్గొన్నారు. -
లారీని ఢీకొన్న ఇన్నోవా.. ఐదుగురు దుర్మరణం
యశవంతపుర: ఇన్నోవా కారు వెనుక నుంచి లారీని ఢీకొన్న ఘటనలో ఐదుమంది మృతి చెందిన ఘటన చిత్రదుర్గ సిబార వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగింది. మృతులు బెంగళూరుకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. బీఎంటీసీ రిటైర్డ్ ఉద్యోగి శాంతమూర్తి (60), విద్యారణ్యపురవాసి రుద్రస్వామి(52), బెంగళూరు ఉత్తర తాలూకావాసి మల్లికార్జున (50) సహా మరో ఇద్దరు చనిపోయారు. వీరందరూ కారులో బెళగావి రేణుకా యల్లమ్మ ఆలయాన్ని దర్శించుకొని తిరుగు ప్రయాణమయ్యారు. సిబార వద్ద వేగంగా వెళ్తూ ముందున్న లారీని ఢీకొట్టడంతో ఐదు మంది అక్కడికక్కడే చనిపోయారు. ఇద్దరి మృతదేహాలు గుర్తు పట్టలేని విధంగా నుజ్జయ్యాయి. మరొకరికి తీవ్ర గాయాలు తగిలాయి. చిత్రదుర్గ రూరల్ పోలీసులు చేరుకుని మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బెంగళూరులోని కుటుంబసభ్యులు హుటాహుటిన చేరుకున్నారు. కొన్ని గంటల్లో ఇంటికి వస్తున్నామని చెప్పినవారు శవాలై కనిపించడంతో బోరున విలపించారు. చిత్రదుర్గ వద్ద ఘోర దుర్ఘటన మృతులు బెంగళూరువాసులు -
రన్ పోలీస్.. రన్
బనశంకరి: కర్ణాటక రాష్ట్ర పోలీస్ మారథాన్ ఆదివారం రాష్ట్రమంతటా ఉత్సాహంగా సాగింది. జిల్లా కేంద్రాల్లో పోలీసులు, ప్రజలు పరుగులో పాల్గొన్నారు. విధానసౌధ ముందు హోంశాఖమంత్రి పరమేశ్వర్ పరుగును ప్రారంభించారు. డ్రగ్స్ రహిత కర్ణాటక, సైబర్ నేరాల కట్టడి, ఆరోగ్య పరిరక్షణ, హసిరు బెంగళూరు అనే నినాదంతో మారథాన్‌ను నిర్వహించారు . 10 కి.మీ., 5 కి.మీ. విభాగాల్లో పోలీస్ అధికారులు సిబ్బంది, ప్రజలు వేలాదిగా పాల్గొన్నారు. విదానసౌధ నుంచి మొదలై కేఆర్.సర్కిల్, నృపతుంగరోడ్డు, కస్తూరిబారోడ్డు తదితర మార్గాల గుండా మళ్లీ సౌధకు చేరింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ అలోక్‌మోహన్, పోలీస్ కమిషనర్ బీ.దయానంద్, ఐపీఎస్‌లు పాల్గొన్నారు. శివమొగ్గ, మైసూరులో శివమొగ్గ: శివమొగ్గ నగరంలో వేలాదిగా మారథాన్‌లో పాల్పంచుకున్నారు. నమ్మ పోలీసు, నమ్మ హెమ్మె అనే నినాదంతో సాగింది. పోలీస్ మైదానంలో ప్రతిజ్ఞ ఆచరించారు. ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మైసూరులో వేలాది మంది పరుగులో పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉత్సాహంగా మారథాన్ -
మాజీ మంత్రి కారు డ్రైవర్ అరెస్టు
దొడ్డబళ్లాపురం: జువెలరీ షాప్‌ల యజమానులు, పలువురు వ్యాపారులు, రాజకీయ నాయకుల నుంచి భారీగా నగలు, డబ్బు వసూలు చేసి మోసం చేసిన కిలేడీ ఐశ్వర్యగౌడ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. కాంగ్రెస్‌కు చెందిన మాజీ మంత్రి వినయ్ కులకర్ణి కారు డ్రైవర్ వీరేశ్ దళవాయిని అరెస్టు చేశారు. ఐశ్వర్యగౌడకు చెందిన బెంజ్ కారు వినయ్ కులకర్ణి ఇంటి ముందు లభించింది. దీంతో డ్రైవర్‌ను పోలీసులు విచారణ నిమిత్తం అరెస్టు చేశారు. వినయ్ కులక ర్ణితో ఐశ్వర్యగౌడకు పరిచయం ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఇటీవల పోలీసులు గాలిస్తున్నప్పుడు ఆమె మహారాష్ట్రకు వెళ్లే ముందు ధార్వాడలోని వినయ్ కులకర్ణి ఇంటికి వచ్చింది. వెళ్లేటప్పుడు తన కారు అక్కడే వదిలి విమానంలో మహారాష్ట్రకు వెళ్లింది. కేసు కొలిక్కి వచ్చిందని త్వరలో చార్జ్‌షీట్ సమర్పిస్తామని పోలీసులు తెలిపారు. వీర వనితలే ఆదర్శం తుమకూరు: మహిళల సమస్యల పైన నిరంతరం పోరాడే మహిళలను గుర్తించి సన్మానించాలని సీనియర్ న్యాయవాది మరిచెన్నమ్మ అన్నారు. జిల్లా మహిళా న్యాయవాదులు ఆదివారం ఇక్కడ వనితా దినోత్సవాన్ని నిర్వహించారు. అనేకమంది మహిళలు అణచివేతకు గురవుతున్నారని, అలాంటివారికి మద్దతుగా పోరాటం చేయాలని అన్నారు. కిత్తూరు రాణి చెన్నమ్మ, అక్క మహాదేవి, సావిత్రిబాయి పూలె వంటివారిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. శిథిలాల కింద సమాధి ● భవనం కూలి నలుగురు వీధి వ్యాపారుల మృతి ● బేలూరులో దుర్ఘటన యశవంతపుర: హాసన్ జిల్లా బేలూరు పట్టణంలో విషాద సంఘటన జరిగింది. శిథిలమైన కట్టడం కూలిపోయి ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు మరణించారు. ఈ ఘటన ఆదివారం ఉదయం జరిగింది. మృతులు ఆశా, దీపు, మరో ఇద్దరి వివరాలు తెలియవలసి ఉంది. పట్టణంలోని నడిబోడ్డున ఉన్న పాత కట్టడంలో వీధి వ్యాపారం చేస్తూ అక్కడే ఉంటున్నారు. ఆ కట్టడం హఠాత్తుగా కూలిపోయింది. నలుగురూ శిథిలాల కింద చిక్కుకొని ప్రాణాలు వదిలారు. స్థానికులు, పోలీసులు జేసీబీల సాయంతో శిథిలాలను తొలగించి మృతదేహాలను బయటకు తీశారు. -
సంతోషం.. క్షణాల్లో బుగ్గి
చింతామణి: చిక్కబళ్లాపురం జిల్లా చింతామణి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సొంతూరులో బంధువులను పలకరించి సంతోషంగా బెంగళూరుకు వస్తున్న కుటుంబంలో విషాదం చిందింది. తల్లీ కుమారుడు సజీవ దహనమయ్యారు. చింతామణి సమీపంలోని కంచార్లపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని మదనపల్లి రోడ్డులో జోగ్యానహళ్లి–గోపల్లి మధ్య ఆదివారం ఉదయం 10 గంటలప్పుడు దుర్ఘటన జరిగింది. వారు ప్రయాణిస్తున్న బ్యాలెనో కారును ప్రైవేటు బస్సు ఢీకొనడంతో కారు మంటల్లో కాలిపోయింది. బంధువుకు కొడుకు పుట్టాడని.. వివరాలు.. ధనుంజయ రెడ్డి (30), ఆయన తల్లి కళావతి (52), ధనుంజయరెడ్డి భార్య శోభారాణి, కొడుకు మాన్విత్ రెడ్డి (3), శోభారాణి తల్లి మహాలక్ష్మీ కారులో బెంగళూరుకు బయల్దేరారు. ధనుంజయరెడ్డి కారు నడుపుతున్నారు. ఆయన తండ్రి గోపాల్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో కడప నగరంలోని రాఘవేంద్ర టౌన్ షిప్లో నివాసముంటూ ఆకాశవాణిలో ఉద్యోగం చేస్తున్నారు. ధనుంజయరెడ్డి, భార్య ఐటీ ఉద్యోగులు కాగా, బెంగళూరు మహదేవపురలో నివాసముంటున్నారు. కడపలో శోభారాణి అన్న సుబ్బారెడ్డికి కొడుకు పుట్టడంతో శనివారం అందరూ వెళ్లి చిన్నారిని చూసి సంతోషంగా గడిపారు. బెంగళూరుకు తిరిగి వస్తుండగా చింతామణి దగ్గర ఎదురుగా బెంగళూరు నుంచి తిరుపతికి వెళుతున్న శ్రీ భారతి ప్రైవేటు బస్సు వేగంగా కారును ఢీకొట్టింది. కారు రోడ్డు పక్కన పడి మంటల్లో చిక్కుకుంది. అప్పటికే కారులోని వారు బయటకు ఎగిరిపడ్డారు. ధనుంజయరెడ్డి, తల్లి కళావతికి మంటలు అంటుకుని సజీవ దహనమయ్యారు. మిగతా ముగ్గురికి గాయాలయ్యాయి. బస్సు కూడా బోల్తా పడింది. అందులోని కొందరికి చిన్న చిన్న గాయాలు అయ్యాయి. కారు పూర్తిగా దగ్ధం స్థానికులు చేరుకుని క్షతగాత్రులకు సాయం చేశారు. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేసేటప్పటికి కారు పూర్తిగా దహనమైంది. జిల్లా ఎస్పీ కుశాల్ చౌక్సి, డీఎస్పీ మురళీధర్, సీఐ వెంకటరమణప్ప తదితరులు పరిశీలించారు. మృతదేహాలకు చింతామణి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. శోభారాణి, కొడుకు మాన్విత్, మహాలక్ష్మీలకు ప్రథమ చికిత్స నిర్వహించి బెంగళూరు ఆస్పత్రికి తరలించారు. ఆస్పతి దగ్గర బంధువుల రోదనలు మిన్నంటాయి. కారును ఢీకొన్న ప్రైవేటు బస్సు కారు దగ్ధం, తల్లీ కుమారుడు మృతి భార్య, కొడుకు, అత్తకు గాయాలు కడప నుంచి బెంగళూరుకు వస్తుండగా చింతామణి వద్ద ఘోరం -
ఉత్సవాలకు అంకురార్పణ
బొమ్మనహళ్లి: బొమ్మనహళ్ళి నియోజకవర్గం హెచ్ఎస్ఆర్ లేఔట్ అగరలో ప్రసిద్ధ శ్రీనివాసస్వామి ఆలయం బ్రహ్మ రథోత్సవాలకు అంకురార్పణ చేశారు. ఈ నెల 14వ తేదీన రథోత్సవం జరుగుతుంది. ఆదివారం ధ్వజారోహణ, యాగశాలలో అగ్ని ప్రతిష్టాపన గావించారు. మూల విరాట్‌తో పాటు ఉత్సవమూర్తులకు ప్రత్యేక అలంకరణ చేశారు.రేపు వర్షసూచన బనశంకరి: మార్చి 11 నుంచి రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 11–12 తేదీల్లో కరావళి జిల్లాలు, దక్షిణ కర్ణాటకలో వర్షాలకు ఆస్కారం ఉందని వాతావరణశాఖ శాస్త్రవేత్త సీఎస్ పాటిల్ తెలిపారు. బంగాళాఖాతంలో మార్పుల వల్ల బెంగళూరు, మైసూరు, కోలారు, చిక్కబళ్లాపుర, రామనగర, హాసన్, చిక్కమగళూరు, మండ్య, శివమొగ్గ, దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లో 11 –12 తేదీల్లో వర్షాలు రావచ్చని తెలిపారు. అయితే ఉత్తర కర్ణాటక జిల్లాల్లో ఎండలు తీవ్రరూపం దాలుస్తాయని పేర్కొన్నారు. హంపీ దురాగతం.. మరొకరు అరెస్టు సాక్షి, బళ్లారి/ యశవంతపుర: హంపీ తుంగభద్ర నదీ తీరాన కొప్పళ జిల్లా గంగావతి సమీపంలోని సణాపురం వద్ద ఇజ్రాయెల్ మహిళ, స్థానిక మహిళపై సామూహిక అత్యాచారం చేసి, ఒక పర్యాటకున్ని కాలువలోకి తోసి హత్య చేసిన కేసులో మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు సాయిరామ్‌ను ఆదివారం తమిళనాడులో అరెస్ట్ చేసి తరలించారు. ఈ ఘటనపై హోంమంత్రి జీ పరమేశ్ బెంగళూరు మాట్లాడుతూ మల్లేశ్, చేతన్, సాయిరామ్ అనే వారు అరెస్టయ్యారని, మరో నిందితుని కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు తెలిపారు. -
ఇజ్రాయెలీ సహా ఇద్దరిపై గ్యాంగ్ రేప్
సాక్షి, బళ్లారి: కర్ణాటకలోని చారిత్రక హంపి పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్‌కు చెందిన మహిళతోపాటు వారికి ఆతిథ్యమిస్తున్న స్థానిక మహిళపై దుండగులు దాడి చేసి తీవ్రంగా గాయపర్చడంతోపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అడ్డుకున్న ముగ్గురు పురుష పర్యాటకులపై దుండగులు దాడి చేసి, తీవ్రంగా కొట్టారు. తుంగభద్ర కాలువలోకి నెట్టివేయగా వీరిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు నలుగురు నిందితులను పట్టుకున్నారు. పరారీలో ఉన్న మరొకరి కోసం గాలింపు చేపట్టారు.గురువారం రాత్రి 11 గంటల సమయంలో గంగావతి సమీపంలోని సన్నాపుర వద్ద ఉన్న తుంగభద్ర కాలువ ఒడ్డున ఈ దారుణం చోటుచేసుకుంది. ఒడిశాకు చెందిన బిదాష్, మహారాష్ట్ర వాసి పంకజ్, అమెరికా పౌరుడు డానియెల్‌తోపాటు, ఇజ్రాయెల్ పర్యాటకురాలు, వీరికి ఆతిథ్యమిచ్చిన 29 ఏళ్ల స్థానిక మహిళ.. వీరంతా కలిసి తుంగభద్ర కాలువ ఒడ్డున గిటారు వాయిస్తూ సరదాగా కాలక్షేపం చేస్తున్నారు. అదే సమయంలో, కొందరు దుండగులు వీరి వద్దకు వచ్చి, పెట్రోల్ బంక్ ఎక్కడుందంటూ ప్రశ్నించారు. సనపూర్కు వెళ్లాలని బదులివ్వడంతో రూ.100 ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగారు. తెలుగు, కన్నడలో వారిని దూషించడం మొదలుపెట్టారు. దుండగుల్లో ఇద్దరు ఇజ్రాయెల్ మహిళతోపాటు ఆతిథ్యమిచ్చిన స్థానిక మహిళపైనా అత్యాచారానికి పాల్పడ్డారు మూడో వ్యక్తి ముగ్గురు పురుషులను తుంగభద్ర కాలువలోకి నెట్టివేశాడు. దీంతో, వీరిలో డానియెల్, పంకజ్‌లు ప్రాణాలతో బయటపడగా గల్లంతైన బిదాష్ మృతదేహం శనివారం ఉదయం కాలువలో దొరికింది. దుండగులు అంతటితో ఆగక స్థానిక మహిళను తీవ్రంగా కొట్టారు. ఆమె బ్యాగులో ఉన్న రెండు సెల్ఫోన్లు, రూ.9,500 నగదును దోచుకున్నారు. అనంతరం దుండగులు బైక్‌పై అక్కడి నుంచి పరారయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం బాధితుల ఫిర్యాదు మేరకు గంగావతి రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బాధిత మహిళలిద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని కొప్పాల్ ఎస్పీ రామ్ ఎల్ సిద్ధి చెప్పారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు నిందితులను గంగావతి పట్టణానికి చెందిన మల్లేశ్, చేతన్ సాయి, మోహన్, చన్నదాసర అనే వారిని పట్టుకున్నామన్నారు. ఐదో వ్యక్తిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా ఆరు పోలీస్ బృందాలను రంగంలోకి దించామని చెప్పారు. -
ఎమ్మెల్యేలూ.. కాసేపు బజ్జోండి!
సాక్షి, ఏపీ సెంట్రల్ డెస్క్: ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలు తమ ఉద్యోగుల కోసం విలాసవంతమైన సౌకర్యాలు కల్పిస్తుంటాయి. ఆఫీస్‌కు రాగానే బ్రేక్‌ఫాస్ట్.. కాస్త బోర్ కొడితే సేదతీరడానికి పలు రకాల ఆటలు.. మధ్యాహ్న భోజనం.. ఆ తర్వాత కునుకు వస్తే నిద్ర పోవడానికి బెడ్లు.. మధ్యమధ్యలో టీ, కాఫీ, జ్యూస్‌లు.. ఇలా ఎన్నో రకాల సదుపాయాలు ఏర్పాటు చేస్తుంటాయి. కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ యూటీ ఖదీర్ కూడా ఇటువంటి ఆలోచనే చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా కర్ణాటక అసెంబ్లీలో శాసనసభ్యులకు పలు సదుపాయాలను అందుబాటులోకి తెచ్చారు. ఉదయం సభకు రాగానే బ్రేక్‌ఫాస్ట్.. మధ్యాహ్నం భోజనం.. ఆ తర్వాత కునుకు తీసేందుకు రిక్లైనర్ కుర్చీలు.. రిలాక్సేషన్ కోసం మసాజ్ కుర్చీలు ఏర్పాటు చేయించారు. ఈనెల 3 నుంచి మొదలైన కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు 21వ తేదీ వరకు జరగనున్నాయి. అయితే సమావేశాల సమయంలో చాలా మంది సభ్యులు మధ్యాహ్న భోజనం తర్వాత సభా కార్యక్రమాలకు గైర్హాజరవుతున్నారని స్పీకర్ ఖదీర్ గుర్తించారు. ఆ పరిస్థితిని నివారించేందుకు, హాజరుశాతాన్ని పెంచేందుకు గాను.. సభ్యులు మధ్యలో కాసేపు నిద్రపోవడానికి 15 రిక్లైనర్లను, రెండు మసాజ్ కుర్చీలను అద్దెకు తీసుకున్నారు. ఒక్క సమావేశాలప్పుడు తప్ప మిగతా సమయాల్లో వీటి ఉపయోగం ఉండనందున.. ప్రస్తుతం వాటిని కొనుగోలు చేయకుండా అద్దెకు మాత్రమే తీసుకున్నామని స్పీకర్ చెప్పారు. 15 రిక్లైనర్లను, రెండు మసాజ్ కుర్చీలను అధికార, విపక్ష లాంజ్లలో ఏర్పాటు చేశామన్నారు. మరిన్ని మసాజ్ కుర్చీలకు ప్రతిపాదన..స్పీకర్ ఖదీర్ మరో అడుగు ముందుకేసి శాసనసభ్యుల కోసం మరిన్ని మసాజ్ కుర్చీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మసాజ్ కుర్చీలతో పాటు సభ్యుల గదులకు స్మార్ట్ లాక్స్ ఏర్పాటు చేయడానికి రూ.3 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఖదీర్ తెలిపారు. స్మార్ట్ లాక్స్ ఏర్పాటు వల్ల సభ్యులకు భద్రత పెరగడంతో పాటు వారి గదుల్లోకి ఇతరులెవ్వరూ ప్రవేశించే అవకాశం ఉండదని చెప్పారు. ఎక్కువ గంటలు పని చేయడం వల్ల ఎమ్మెల్యేలు ఒత్తిడి ఎదుర్కొంటున్నారని వివరించారు. వారు చేస్తున్న పనికి ఇవి విలాసాలు కావని.. అవసరాలు మాత్రమేనని చెప్పారు. ఈ సౌకర్యాలకు ఎమ్మెల్యేలు పూర్తిగా అర్హులంటూ తన చర్యలను సమర్థించుకున్నారు. ఈ సదుపాయాల వల్ల సభ్యులు ఇక ఏ కారణంతోనూ బయటకు వెళ్లబోరని అన్నారు. కాగా, స్పీకర్ నిర్ణయాన్ని పలువురు మంత్రులు, అధికార కాంగ్రెస్ పార్టీ సభ్యులు సమర్థించగా.. బీజేపీ నేతలు విమర్శించారు. ఎమ్మెల్యేలు ఒత్తిడితో పని చేస్తారని, పైగా చాలా మంది సీనియర్ సిటిజన్లు ఉన్నందున ఇలాంటి ఏర్పాట్లు మంచివేనని అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే చెప్పారు. పాలనా సమస్యలపై దృష్టి పెట్టకుండా.. ఇలాంటి అనవసరమైన ఖర్చులు చేయడం ఏమిటంటూ బీజేపీ నేత సీటీ రవి విమర్శించారు. -
అన్నదాతలకు సున్నా బడ్జెట్
మండ్య: రాష్ట్ర బడ్జెట్లో మైనార్టీలను బుజ్జగించి, రైతులను నిర్లక్ష్యం చేశారంటూ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. నగరంలోని జేసీ సర్కిల్లో గుమికూడిన కార్యకర్తలు సీఎం సిద్దరామయ్య, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నేతలు మాట్లాడుతూ సిద్దరామయ్య బడ్జెట్లో ముల్లాలు, ముస్లిం ధార్మిక నాయకులకు గౌరవధనాన్ని రూ.6 వేలకు, సహాయకులకు రూ.5 వేలకు పెంచారన్నారు. మైనార్టీలు నివసించే కాలనీలు, బడావణెల అభివృద్ధికి వెయ్యి కోట్లు, అదనపు ఉర్దూ పాఠశాలల నిర్మాణానికి, వాటి అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించి మైనార్టీలను బుజ్జగించారని ఆరోపించారు. కాగా కొన్నిచోట్ల బడ్జెట్‌కు మద్దతుగా సంబరాలు చేసుకున్నారు. కోలారు నగరంలో కాంగ్రెస్ కార్యకర్తలు టపాసులు పేల్చారు. మహిళా సారథి ● చెత్త వాహనం డ్రైవర్‌గా నందిని ప్రతిభ చిక్కబళ్లాపురం: మహిళలు కష్టమైన డ్రైవింగ్ వంటి పనులను కూడా చేసేయగలరు అనడానికి చిక్కబళ్లాపురం తాలూకా తిప్పేనహళ్లి గ్రామ పంచాయతీ చెత్త తరలింపు వాహనం డ్రైవర్ నందినినే నిదర్శనం. ఆమె భర్త అనారోగ్యంతో 2 సంవత్సరాల కిందట మరణించాడు. ఇద్దరు పిల్లలు, కుటుంబ పోషణ కోసం ఆలోచించిన నందిని భర్త చేసే డ్రైవింగ్‌నే ఎంచుకుంది. ఓ స్వసహాయ సంఘం సాయంతో డ్రైవింగ్‌ను నేర్చుకొని లైసెన్స్ పొందింది. పంచాయతీ స్వచ్ఛవాహిని డ్రైవర్ సమర్థంగా పనిచేస్తోంది. ఆమెకు నెలకు రూ. 10 వేల వేతనం లభిస్తోంది. గ్రామపంచాయతీ వ్యాప్తిలోని ప్రతి పల్లెకు వాహనంలో వెళ్లి చెత్త సంగ్రహణ చేస్తుంది. గత 6 నెలల నుంచి ఉద్యోగం చేస్తోంది. ఈ సందర్భంగా పంచాయతీ అధ్యక్షురాలు శశి.. నందినిని ఘనంగ సత్కరించారు. అమ్మవారికి గంధ శోభ బొమ్మనహళ్లి: బెంగళూరు బొమ్మనహళ్ళి నియోజకవర్గం హెచ్ఎస్ఆర్ లేఔట్ పరంగిపాళ్యలో గ్రామ దేవత మారమ్మదేవికి శనివారం సిరిగంధం లేపనంతో అలంకరించి పూజలు చేశారు. ఉదయమే అమ్మవారికి అభిషేకం, అలంకారం నిర్వహించి భక్తులకు దర్శనాలను కల్పించారు. -
నవలి రిజర్వాయర్‌కు చర్యలు
రాయచూరు రూరల్: తుంగభద్ర డ్యాంలో పూడిక అధికంగా పేరుకుపోవడంతో వృథాగా వెళ్లిపోయే సుమారు 30 టీఎంసీల నీటిని నిలపడానికి కొప్పళ జిల్లా నవలి వద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెప్పారు. శనివారం కలబుర్గిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ విషయంలో త్వరలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంలతో భేటీ అవుతానని తెలిపారు. ఆ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో చర్చించామన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి రూ.15,000 కోట్ల నిధులను, భూస్వాధీనం కోసం రూ.9 వేల కోట్లను కేటాయించామన్నారు. రాష్ట్రంలో భూ గర్భ జలాల పెంపుదలకు నీటిపారుదల రంగానికి బడ్జెట్లో రూ.22 వేల కోట్ల నిధులు కేటాయించామని చెప్పారు. మహిళా రిజర్వేషన్లకు సిద్ధం రాష్ట్రంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని శివకుమార్ చెప్పారు. కలబుర్గి పీడీఏ మైదానంలో మహిళా దినోత్సవంలో మాట్లాడుతూ గల్లీ (పంచాయతీల) నుంచి ఢిల్లీ వరకు మహిళలకు అవకాశాలు దండిగా ఉన్నాయన్నారు. భూమాతల వంటి మహిళలకు ఉన్నత పదవులను అలంకరించేందుకు అవకాశం కల్పించాలన్నారు. కార్యక్రమంలో మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ప్రాజెక్టుకు రూ.15 వేల కోట్లు, భూ సేకరణకు రూ.9 వేల కోట్లు కేటాయింపు డిప్యూటీ సీఎం వెల్లడి -
ఘర్షణ కేసులో 9 మంది అరెస్ట్
హుబ్లీ: పాత హుబ్లీ తిమ్మసాగర రోడ్డులోని ఐటీఐ కళాశాల వద్ద డబ్బుల విషయంలో పరస్పరం దాడి చేసుకున్న కేసులో 9 మందిని పాత హుబ్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించి తిమ్మసాగర నివాసులు దీపక్ పూజార, రాఘవేంద్ర, అమర పూజార, శంకర్ జితూరి, విఘ్నేష్, కుశాల బెళంకర, సాగర్ లక్కుండితో పాటు ఓ బాలుడిని అరెస్ట్ చేశారు. నిందితులు రూ.5 వేల కోసం ఈనెల 5న రాత్రి 11.30 గంటలకు పరస్పరం దాడి చేసుకున్నారు. ఘటనపై పాత హుబ్లీ పోలీసు స్టేషన్లో పరస్పరం కేసులు నమోదయ్యాయి. కేసులను తీవ్రంగా పరిగణించిన పాత హుబ్లీ సీఐ ఎంఎన్ సింధూర, ఎస్ఐ సొన్నవర నేతృత్వంలోని బృందం నిందితులను అరెస్ట్ చేయడంలో సఫలీకృతులయ్యారు. పోలీస్ కమిషనర్ శశికుమార్ సదరు పోలీస్ బృందాన్ని ప్రశంసించారు. ఉత్తర కర్ణాటక వ్యతిరేక బడ్జెట్హుబ్లీ: సీఎం సిద్దరామయ్య ప్రతిపాదించిన బడ్జెట్ ఉత్తర కర్ణాటకకు వ్యతిరేకంగా ఉంది. తన రికార్డు స్థాయి బడ్జెట్లో సమగ్ర కర్ణాటక అభివృద్ధి ఉంటుందని ఆశించిన వారికి నిరాశ కలిగించిందని స్వర్ణగ్రూప్ సంస్థల ఎండీ, హుబ్లీ ధార్వాడ డెవలప్మెంట్ ఫోరం కోశాధికారి, ప్రవాసాంధ్ర ప్రముఖుడు డాక్టర్ సీహెచ్వీఎస్వీ ప్రసాద్ అభిప్రాయ పడ్డారు. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటనను ఆయన విడుదల చేశారు. రాష్ట్రంలో రెండో అతి పెద్ద నగరం, సుమారు 18 లక్షల మంది నివసించే హుబ్లీ– ధార్వాడ జంట నగరాలతో పాటు ఉత్తర కర్ణాటక అభివృద్ధిని సీఎం పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు. సీఎం ఉత్తర కర్ణాటకపై సవతి తల్లి ధోరణిని చూపారని మండిపడ్డారు. ఫోరం జంట నగరాల అభివృద్ధికి ప్రత్యేక నిధులతో పాటు వైద్యం, ఆరోగ్యం, విద్య, పరిశ్రమలు, సాగు నీటిపారుదల, రవాణా శాఖలకు, అలాగే కనీస సౌకర్యాల అభివృద్ధికి ప్రాధాన్యతను ఇచ్చే కార్యక్రమాలను ప్రకటించాలని ప్రభుత్వానికి బడ్జెట్‌కు ముందే విజ్ఞప్తి చేశామన్నారు. అయినా ఒక్క డిమాండ్ కూడా నెరవేర్చలేదన్నారు. ఇక మహదాయి పథకం అమలుకు ఈ సర్కారుకు మనసు లేదు. కేవలం కేంద్ర సర్కారు వైపు వేలెత్తి చూపుతూ కాలహరణం చేస్తున్నారని ప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు యూనిట్లలో స్తంభించిన విద్యుత్ ఉత్పత్తి రాయచూరు రూరల్: రాయచూరు థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం(ఆర్టీపీఎస్)లో నాలుగు యూనిట్లు మూతపడ్డాయి. ఇటీవల వేసవి కాలంలో ఎండల తీవ్రత అధికం అవుతుండడంతో ఒక పక్క విద్యుత్ కోత(లోడ్‌షెడ్డింగ్) లేదంటూ సర్కార్ పెద్దలు చెబుతున్నా ఆర్టీపీఎస్లో నాలుగు యూనిట్ల బంద్‌తో విద్యుత్ సరఫరాకు ఆటంకం ఎదురైంది. బాయిలర్ ట్యూబ్, బంకర్ లీకేజీల కారణంగా 210 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే 1, 2, 3, 6వ యూనిట్లను స్తంభింప చేశారు. దీంతో 840 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి కోత పడింది. మరో వైపు విజయపుర జిల్లాలోని ఆల్మట్టి డ్యాంలో అనుకున్నంత మేర నీటి నిల్వ లేదన్న విషయం తేటతెల్లమవుతోంది. ఇటీవలే ఒక టీఎంసీ నీటిని విడుదల చేశారు. నారాయణ పుర డ్యాం నుంచి నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో నదీ తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నది వద్దకు వెళ్లరాదని, పశువులను మేతకు నది లోపలకు విడవరాదని కేబీజీఎన్‌ఎల్ చీఫ్ ఇంజినీర్ సురేష్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఆర్టీసీ బస్సులోనే మెకానిక్ ఆత్మహత్య సాక్షి,బళ్లారి: కేఎస్ఆర్టీసీ బస్సులోనే బెళగావి ఆర్టీసీ డిపో–1 మెకానిక్ ఆత్మహత్య చేసుకున్న ఘటన బెళగావిలో శనివారం జరిగింది. అక్కడి హళే గాంధీనగర్‌కు చెందిన మెకానిక్ కేశవ్ కమడొళ్లి(57) కేఎస్ఆర్టీసీ బస్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఆర్టీసీ బస్సు డిపో వాషింగ్ విభాగంలో మెకానిక్‌గా విధులు నిర్వర్తిస్తుండేవారు. కేశవ్‌కు వెన్ను నొప్పి ఉన్నా అధికారులు టైర్లకు పంచర్లు వేసే బాధ్యతలు అప్పగించారు. డ్యూటీని మార్చాలని అసిస్టెంట్ సూపరింటెండెంట్ అనిల్ బాందేకర్కు, డిపో మేనేజర్ లింగరాజ్ లాఠికు విన్నవించుకున్నా పట్టించుకోకపోవడంతో పని ఒత్తిళ్లను తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మెకానిక్ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. విషయం తెలిసిన వెంటనే బెళగావి మార్కెట్ స్టేషన్ పోలీసులు బస్ డిపోకు చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడిని మానసిక అస్వస్థుడిగా చిత్రించిన ఆర్టీసీ అధికారుల తీరుపై మృతుని కుటుంబ సభ్యులు ఆక్రోశం వ్యక్తం చేశారు. ఏ ఆధారంగా మానసిక అస్వస్థుడని చెబుతారు, ఆరోగ్యం బాగోలేదు, డ్యూటీని మార్చవద్దని వేడుకున్నా పెడచెవిన పెట్టారని అధికారులపై మండిపడ్డారు. తమకు న్యాయం దొరికే వరకు బస్సు డిపో నుంచి మృతదేహాన్ని అంత్యక్రియలకు ఇంటికి తీసుకెళ్లబోమని భీష్మించారు. -
జిల్లా అభివృద్ధిపై పూర్తి నిర్లక్ష్యం
సాక్షి,బళ్లారి: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బళ్లారి జిల్లా అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని మాజీ మంత్రి శ్రీరాములు మండిపడ్డారు. ఆయన శనివారం తన నివాస గృహంలో విలేకరులతో మాట్లాడారు. పేరుకు మాత్రమే నాలుగు లక్షల కోట్లు బడ్జెట్ అని చెప్పుకుంటున్నా, ఏ వర్గానికి కూడా మేలు చేయలేదన్నారు. బడ్జెట్లో ముస్లింలకు పెద్దపీట వేసి నిధులు కేటాయించినందుకు తనకు వ్యక్తిగతంగా ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అయితే మిగిలిన వర్గాలను కూడా పట్టించుకుని ఉంటే బాగుండేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బడ్జెట్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధులు గ్యారెంటీలకు మళ్లించారని ఆక్రోశించారు. రూ.51 వేల కోట్లు గ్యారెంటీలకు ఖర్చు చేస్తున్నారన్నారు. అయితే శక్తియోజన కింద కేఎస్ఆర్టీసీ బస్సుల తీరు ఎలా ఉందో కూడా తెలుసుకోవడం లేదన్నారు. డొక్కు బస్సులతో జనం ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం స్వార్థపూరితమైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారన్నారు. జిల్లా వైపు కన్నెత్తి చూడని ఇన్‌ఛార్జి మంత్రి స్వార్థపూరితమైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సీఎం బడ్జెట్‌పై మాజీ మంత్రి శ్రీరాములు మండిపాటు మళ్లీ మంత్రి అయ్యేదాకా నియోజకవర్గానికి రారేమో? మాజీ మంత్రి, బళ్లారి గ్రామీణ ఎమ్మెల్యే బీ.నాగేంద్ర మంత్రి పదవి నుంచి వైదొలిగినప్పటి నుంచి నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదనే విమర్శలు ఉన్నాయన్నారు. జిల్లా అభివృద్ధి గురించి పట్టించుకునే నాథుడే లేకుండా పోయారన్నారు. మళ్లీ మంత్రి అయిన తర్వాతే నియోజకవర్గానికి, జిల్లాకు నాగేంద్ర వస్తారేమోనని ఎద్దేవా చేశారు. వ్యక్తిగతంగా చేసిన తప్పులకు మంత్రి పదవిని కోల్పోయి మళ్లీ మంత్రి పదవి కోసం ఆరాట పడుతున్నారని విమర్శించారు. జిల్లాలో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నా బడ్జెట్లో నిధుల కేటాయింపులో మాత్రం మొండిచేయి చూపారన్నారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి జిల్లా వైపు కన్నెత్తి చూడటం లేదన్నారు. హంపీ ఉత్సవాలకు కూడా ఇలా వచ్చి అలా వెళ్లిపోయారన్నారు. బళ్లారి జిల్లాకు రాని వ్యక్తికి ఎందుకు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పదవి ఇచ్చారని సీఎంను ప్రశ్నించారు. ఈసందర్భంగా మాజీ బుడా అధ్యక్షుడు పాలన్న, కార్పొరేటర్ గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా నీలగల్ బసవేశ్వర రథోత్సవం
రాయచూరు రూరల్: జిల్లాలోని సిరవార తాలూకా నీలగల్లో బసవేశ్వర రథోత్సవం వైభవంగా జరిగింది. శుక్రవారం సాయంత్రం వేలాది మంది భక్తుల సమక్షంలో రథోత్సవం నిర్వహించారు. ఏటా రథోత్సవాన్ని మఠాధిపతి పంచాక్షరి, శాంతమల్ల శివాచార్యల ఆధ్వర్యంలో జరిగింది. రథోత్సవానికి రాయచూరు, మాన్వి, సింధనూరు, దేవదుర్గ, కొప్పళ, బళ్లారి, లింగసూగూరు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వీడియో వైరల్.. యువకుడి అరెస్టు హుబ్లీ: కాలితో బైక్ స్టార్ట్ చేయడం ద్వారా పుష్ప సినిమా డైలాగ్ చెబుతూ రీల్ చేసిన యువకుడిని నగర తూర్పు ట్రాఫిక్ పోలీసులు అరెస్ట్ చేసి సదరు బైక్‌ను జప్తు చేశారు. గాంధీవాడ నివాసి ఈశ్వర తలంబరి (20) అరెస్ట్ అయిన యువకుడు. రోడ్డులో బైక్‌ను కాలితో స్టార్ట్ చేయడం ద్వారా పుష్ప సినిమా డైలాగ్ చెప్పిన రీల్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీన్ని పోలీసులు పసిగట్టి తక్షణమే ఈశ్వర్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఘటనపై తూర్పు ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. రెండు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలో వివిధ ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం పాలైన ఘటనలు శుక్రవారం జరిగాయి. రాయచూరు తాలూకా కెరెబూదూరు వద్ద యరగేరాకు చెందిన రామకృష్ణ(32) ద్విచక్ర వాహనంలో వెళుతుండగా వాహనం పల్టీ కొట్టడంతో అక్కడికక్కడే మరణించారు. రాయచూరు జిల్లా సింధనూరు తాలూకా పగడదిన్ని వద్ద జరిగిన బోలెరో, ఆర్టీసీ బస్సుల మధ్య జరిగిన ప్రమాదంలో బోలెరో వాహన డ్రైవర్ మంజునాథ్(21) మరణించాడు. బస్సు డ్రైవర్ అకస్మాత్తుగా బోలెరోని ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. సింధనూరు గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రవేశ శుల్కం దుర్వినియోగం.. ఎఫ్‌డీఏ అరెస్ట్ హుబ్లీ: నగరంలోని నృపతుంగ గుట్టలోకి ప్రవేశ శుల్కం రూపంలో వసూలు చేసిన డబ్బులను బ్యాంక్‌లో జమ చేయకుండా వంచించిన కేసుకు సంబంధించి డివిజనల్ అటవీ శాఖ కార్యాలయం ఎఫ్‌డీఏ విశ్వనాథ్‌ను అశోక్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈయన 2024 జనవరి 10 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 12 వరకు సదరు హుబ్లీ కార్యాలయంలో సేవలు అందించే వారు. అన్ని శాఖల నిర్వహణ చూసే వారు. సబ్ డివిజనల్ అటవీ అధికారి ఎంఎస్ రాయనగౌడర, కాపలా అటవీ సంరక్షకురాలు సుమిత్ర బొమ్మనవాడ సదరు గుట్టలో 2024 మార్చి 1 నుంచి 2025 జనవరి 31 మధ్య గడువులో మొత్తం రూ.15.57 లక్షల ప్రవేశ శుల్కాన్ని సేకరించారు. ఇందులో రూ.8.95 లక్షలను మాత్రమే విశ్వనాథ బ్యాంక్‌లో జమ చేశారు. మిగిలిన డబ్బులను దుర్వినియోగం చేసినట్లు సంబంధిత అటవీ శాఖ అధికారి రామలింగప్ప ఉప్పార పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తాలూకా కోర్టు నుంచి ఖైదీ పరారీ రాయచూరు రూరల్: మస్కి తాలూకా కోర్టు నుంచి ఖైదీ పరారైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ కేసులో నిందితుడిగా ఉన్న ముద్దాయి దొడ్డ దురుగేష్ పరారయ్యాడు. పోలీసులపై చెయ్యి చేసుకున్న దొడ్డ దురుగేష్, చిన్న దురుగేష్లను 20 రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరు పరిచారు. వారం రోజుల పాటు రిమాండ్ విధించడంతో చేయని తప్పులకు శిక్ష అనుభవించడం తగదంటూ కోర్టు ఆవరణ నుంచి దొడ్డ దురుగేష్ పరారు కావడంతో వెతకడానికి రెండు పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ పుట్టమాదయ్య వెల్లడించారు. -
దర్శక, నిర్మాత ముఖానికి మసి
యశవంతపుర: కన్నడ ఫిలిం చాంబర్లో గొడవలు తీవ్రమయ్యాయి. ప్రముఖ దర్శకుడు, నిర్మాత, మాజీ ఫిలిం చాంబర్ అధ్యక్షుడు నరసింహరాజు ముఖానికి కొందరు వ్యక్తులు మసి పూసి దాడి చేశారు. ఆయన బెంగళూరు హైగ్రౌండ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం రాత్రి నగరంలో ఉండగా కొందరు దుండగులు ఈ అకృత్యానికి పాల్పడినట్లు తెలిపారు. దీనికి బదులుగా ఫిలిం చాంబర్ అధ్యక్షుడు నరసింహులు, సా.రా గోవిందు.. నరసింహరాజుపై ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇరువైపుల నుంచి ఫిర్యాదుల ఆధారంగా కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. చాంబర్ మీద ఆధిపత్యం గురించి రెండువర్గాల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. విద్వేషాలను రెచ్చగొట్టే బడ్జెట్: విజయేంద్ర దొడ్డబళ్లాపురం: సీఎం సిద్దరామయ్య ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజల మధ్య మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర అన్నారు. శనివారంనాడు బెంగళూరు మల్లేశ్వరంలోని పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన ఆయన సిద్ధరామయ్య మైనారిటీలను తృప్తిపరిచే ప్రయత్నంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టారన్నారు. మదరసాలకు డబ్బులు ఇచ్చారని, మౌల్వీలకు గౌరవధనం పెంచారని, ముస్లింల వివాహాలకు రూ.50వేలు కానుక ప్రకటించిన సీఎంకి హిందువుల్లో పేదలు ఉన్నారన్న కనీస జ్ఞానం లేదా అని ధ్వజమెత్తారు. ఈ బడ్జెట్ సిద్దరామయ్య కాదు, మంత్రి జమీర్ అహ్మద్ తయారు చేయించినట్టు ఉందన్నారు. యువకులకు, మహిళలకు, నిరుద్యోగులకు, రైతులకు మొండిచేయి చూపించారన్నారు. ఎస్సీ, ఎస్టీలకు కేటాయించి నిధుల్లో రూ.25 వేల కోట్లను ఇతర అవసరాలకు మళ్లించారన్నారు. అప్పులు విపరీతంగా పెరిగాయన్నారు.టెన్త్ క్లాస్ ప్రేమ.. యమపాశమైంది హుబ్లీ: వారిద్దరు ఇంకా ముక్కుపచ్చలారని బాలలు. చదువుకునే వయసులో స్నేహాన్ని ప్రేమ అనుకున్నారు. తమ ప్రేమ పెద్దలకు తెలిసి దండించారు, కలిసి జీవించలేమనే అపరిపక్వ ఆలోచనలతో జీవితాన్నే అంతం చేసుకున్నాడు. ఇద్దరు కలిసి ఒకే తాడుతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన కలుబుర్గి జిల్లా కలబుర్గి తాలూకా మల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఆ గ్రామానికి చెందిన మాలప్ప (16), మరో మతానికి చెందిన బాలిక (16) ఈ అకృత్యానికి పాల్పడ్డారు. గ్రామంలోని పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నారు. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇళ్లలో తెలిసి బుద్ధిగా చదువుకోవాలని, ఇలాంటివి మరచిపోవాలని మందలించారు. దీంతో మనోవేదనకు గురై వీరు ఆ గ్రామ శివారు చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఏడ్రామి పోలీసులు మృతదేహాలను ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. చిన్న పిల్లల చర్య రెండు కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చింది.షబానా అజ్మికి లైఫ్‌టైమ్ అవార్డు దొడ్డబళ్లాపురం: 16వ బెంగళూరు అంతర్ రాష్ట్రీయ చలనచిత్రోత్సవంలో లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు సీనియర్ హిందీ నటి షబానా అజ్మిని వరించింది. 2024–25 వార్షిక 16వ బెంగళూరు అంతర్ రాష్ట్రీయ చలనచిత్రోత్సవంలో లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డుకు ఏర్పాటు చేసిన కమిటీ ముగ్గురి పేర్లను సూచించగా, వారిలో షబానాకు అవార్డు దక్కింది. ఈ మేరకు ఎక్స్‌లో సీఎం సిద్ధరామయ్య ఆమెకు అభినందనలు తెలిపారు. -
మగువే.. ఈ లోకానికి వెలుగు
తుమకూరు: ప్రతి ఒక్క పురుషుని విజయంలో మహిళ పాత్ర ఉందని, సోదరిగా, తల్లి, స్నేహితురాలిగా ప్రతి పురుషుని విజయాన్ని కాంక్షించేది మహిళేనని, మగువలు లేని ప్రపంచాన్ని ఊహించుకోవడం అసాధ్యమని వక్తలు కొనియాడారు. శనివారం బెంగళూరు, తుమకూరుతో పాటు రాష్ట్రమంతటా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళా ప్రగతిశీల సంఘాలు ర్యాలీలు, హక్కుల గురించి జాగృత ప్రదర్శనలు నిర్వహించాయి. మహిళా సేవామణులకు సన్మానోత్సవాలను జరిపారు. ఆటల పోటీలు తుమకూరులో మహాత్మాగాంధీ క్రీడాంగణంలో వనితలకు సరదాగా ఆటల పోటీలను నిర్వహించారు. మాజీ ఉప మేయర్ రూపా సహా యువతులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. రూపా మాట్లాడుతూ సీ్త్రలు అన్ని రంగాల్లో దూసుకెళుతున్నారన్నారు. ఆటల పోటీల విజేతలకు బహుమతులను అందజేశారు. అధికారులు రోహిత్ గంగాధర్, సీడీపీఓ సరోజమ్మ, బీసీఎం అధికారిణి నిర్మల, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. మహిళలు లేని ప్రపంచం అసాధ్యం రాష్ట్రమంతటా ఘనంగా మహిళా దినోత్సవం -
మహిళలు, పురుషులు ఒకే బండికి రెండు చక్రాలు
బళ్లారి టౌన్: మహిళలు పురుషులు ఇద్దరు కూడా ఒకే బండికి రెండు చక్రాల లాంటి వారని, ఇద్దరు సమానంగా కలిసి ప్రయాణిస్తే జీవితంలో లక్ష్యాన్ని సాధించవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవల ప్రాధికార అధ్యక్షురాలు కేజే.శాంతి పేర్కొన్నారు. జిల్లా న్యాయసేవా ప్రాధికారం, జిల్లా న్యాయవాదుల సంఘం, వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నగరంలోని తాళూరు రోడ్డులోని నూతన కోర్టు ఆవరణలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. సమాజంలో పురుషుల సాధనలో మహిళ పాత్ర కూడా ఉంటుందన్నారు. అదే విధంగా మహిళల సాధనలో కూడా పురుషుల సహకారం ఉంటుందన్నారు. ఇద్దరూ సమాజానికి రెండు కళ్లు లాంటి వారన్నారు. చట్టంలో మహిళలకు ఉన్న సదుపాయాలను తెలుసుకోవాలన్నారు. సమాజంలో బాల్య వివాహాలు, వరదక్షిణ, లైంగిక వేధింపులు, కుటుంబ దౌర్జన్యం, మానసిక శారీరక హింస వంటి పలు సమస్యలకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయన్నారు. మహిళలు వీటిపై అవగాహన పొందాలన్నారు. జిల్లా కుటుంబ న్యాయమూర్తి సిద్దలింగ ప్రభు, న్యాయమూర్తులు రాఘవేంద్ర గౌడ, బీజీ ప్రమోద, వాసుదేవ రాధాకాంత్ గుడి, రాజేష్ ఎస్ హొసమని, అపర్ణ, నశ్రత్ ముక్త అహ్మద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఏఐఎంఎస్ఎస్ ఆధ్వర్యంలో.. అఖిల భారత సాంస్కృతిక సంఘం, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శనివారం గాంధీభవన్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. ఏఐఎంఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షురాలు మంజుల మాట్లాడుతూ మహిళా దినోత్సవం చారిత్రక స్పూర్తి దినోత్సవం అన్నారు. నేడు మహిళల సమస్యలపై గళమెత్తాల్సిన పరిస్థితి ఉందన్నారు. 1918 మార్చి 8న అమెరికాలోని న్యూయార్క్‌లో గార్మెంట్ పరిశ్రమల్లో వేలాది మంది మహిళా కార్మికులు, మహిళలు ఎక్కువ కష్టపడి పని చేస్తున్నా తక్కువ వేతనాలు చెల్లించడం, వారికి వివిధ సెలవులపై నిర్బంధాన్ని నాడు వ్యతిరేకించి చేపట్టిన పోరాటాలతో ఈ మహిళా దినోత్సవం ప్రారంభం అయిందని గుర్తు చేశారు. ఆనాటి పోరాటాలే నేడు ప్రపంచ వ్యాప్తంగా మార్చి 8న మహిళలు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకునేందుకు దోహదపడిందన్నారు. మహిళల్లో మరింత చైతన్యం రావాలని పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ప్రమోద్, ఉపాధ్యక్షురాలు జే.శాంత, ఏఐఎంఎస్ఎస్ జిల్లాధ్యక్షురాలు కేఎం ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి హొసపేటె: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం విజయనగర నియోజకవర్గ ఎమ్మెల్యే హెచ్ఆర్ గవియప్ప నగరంలోని పునీత్ రాజ్‌కుమార్ జిల్లా స్టేడియంలో బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల సామాజిక హక్కుల పోరాటంపై జాగృతి పెంచే విధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఏటా మార్చి 8న జరుపుతారని అన్నారు. అనంతరం బైక్ ర్యాలీని పునీత్ రాజ్‌కుమార్ జిల్లా స్టేడియం నుంచి ప్రారంభించి హంపీలోని మహానవమి దిబ్బ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది, ప్రజాపిత బ్రహ్మకుమారి ఆశ్రమ సభ్యులు, వివిధ సంఘాల పదాధికారులు, నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. సదృఢ సమాజ నిర్మాణానికి ముందడుగు వేయాలి రాయచూరు రూరల్: సదృఢ సమాజ నిర్మాణం కోసం మహిళలు ముందడుగు వేయాలని హైకోర్టు న్యాయమూర్తి ఉమా పేర్కోన్నారు. శనివారం నగరంలోని జిల్లా న్యాయాలయ భవనంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జ్యోతి వెలిగించి మాట్లాడారు. వివేకతుల్యమైన చింతనలు, విలువలతో కూడిన సమాజంలో అభివృద్ధికి అనుగుణంగా సాగాలన్నారు. మహిళల హక్కులు, విధులు, సమానత్వాల మధ్య మహిళలను విధుల్లోకి తీసుకోక పోవడం విడ్డూరమన్నారు. లోక్ అదాలత్‌లో కేసులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మారుతి బగాదే, న్యాయమూర్తులు శ్రీకాంత్, ప్రభు సిద్దప్ప, సిద్దరామప్ప, సాత్విక్, సుధీన్ కుమార్, శ్వేతా సింగ్, హులిగప్ప, మల్లికార్జునలున్నారు. ఇద్దరూ కలిసి ప్రయాణిస్తే లక్ష్యం సాధ్యం జిల్లా ప్రధాన న్యాయమూర్తి కేజే.శాంతి -
రాష్ట్ర బడ్జెట్‌పై కదం తొక్కిన కమలదళం
సాక్షి,బళ్లారి: రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య 16వ సారి ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌పై బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. శనివారం జిల్లా బీజేపీ శాఖ, మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డిల ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరి బడ్జెట్‌పై నిరసన వ్యక్తం చేశారు. రాయల్ సర్కిల్ వద్ద మానవహారం, ధర్నా చేపట్టి అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన భూమిక పోషించిన బళ్లారి జిల్లాపై సీఎం శీతకన్ను చూపారన్నారు. పెండింగ్‌లో ఉన్న ఎన్నో అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేయలేదని మండిపడ్డారు. సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రికి నిధులేవీ? సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి నిధులు కేటాయించక పోవడం శోచనీయం అన్నారు. జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాలకు చెందిన వారికి సంజీవినిగా మారనున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు 16 ఏళ్లకు పైగా పూర్తి చేయలేదన్నారు. బడ్జెట్లో నిధులు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. ఈ ప్రాంతంలో విస్తారంగా పండించే మిర్చి పంటకు వ్యాపార కేంద్రం ఏర్పాటు చేయాలని రైతులు ఎన్నో ఏళ్లుగా ఆఽశలు పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే బడ్జెట్లో నిధుల కేటాయింపు గురించి ఊసే లేదన్నారు. ముస్లింలను బుజ్జగించేలా మాత్రమే ఈ బడ్జెట్ ఉందన్నారు. రైతులు, బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారికి అన్యాయం చేశారన్నారు. కొత్త ఇంజినీరింగ్ కళాశాలల ఊసే లేదు కొత్త ఇంజినీరింగ్ కళాశాలకు నిధుల కేటాయింపు చేయలేదన్నారు. ముఖ్యంగా తుంగభద్ర డ్యాంకు క్రస్ట్‌గేట్లు అమర్చేందుకు నిధుల ప్రస్తావన లేకపోవడం శోచనీయం అన్నారు. నవలి వద్ద సమాంతర జలాశయ నిర్మాణానికి కూడా నిధులు కేటాయించలేదన్నారు. నాలుగు లక్షల కోట్లు బడ్జెట్ ప్రకటించారు కాని, ఏ వర్గానికి కూడా మేలు చేసే విధంగా లేదన్నారు. గ్యారెంటీలకు నిధులు కేటాయించడంలో ఉన్న శ్రద్ధ అభివృద్ధి పనులపై ఎందుకు లేదని నిలదీశారు. గ్యారెంటీలకు నిధులిచ్చి మిగిలిన వర్గాల వారికి ఎందుకు అన్యాయం చేశారని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీల నిధులు కూడా గ్యారెంటీలకు మళ్లించి ఆ వర్గాల వారి కడుపు కొట్టారన్నారు. పార్టీ జిల్లాధ్యక్షుడు అనిల్ కుమార్, నాయకులు గణపాల్ ఐనాథరెడ్డి, గురులింగనగౌడ, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ముస్లింలకు పెద్దపీట వేశారని మండిపాటు అన్ని వర్గాలకు అన్యాయం చేశారని ఆగ్రహం మానవహారం, ర్యాలీలతో పెద్ద ఎత్తున ఆందోళన -
పర్యాటకుల్లో భయం..భయం
సాక్షి,బళ్లారి: హంపీ అంటేనే అదో అద్భుతమైన పర్యాటక కేంద్రంతో పాటు ప్రపంచంలోనే గొప్పగా నిర్మించిన స్మారకాల్లో ఒకటిగా ఖ్యాతి పొందింది. దేశ,విదేశాలకు చెందిన పర్యాటకులకు హంపీ అంటే ఒక అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా ఎంతో ఇష్టంగా వచ్చి హంపీ అందాలను వీక్షిస్తుంటారు. పర్యాటక ప్రాంతంతో పాటు మహిమాన్విమైన, సాక్షాత్తు శివుడే లింగరూపంలో ఉద్భవించారని ప్రతీతి ఉంది. అంతేకాకుండా అయోధ్యలో శ్రీరాముడు జన్మిస్తే హంపీ సమీపంలోని గంగావతి తాలూకా అనెగొంది పక్కనే అంజనాద్రిలో ఆంజనేయుడు జన్మించారని చరిత్ర ఆధారాలు ఉన్నాయి. కిష్కింధ, శ్రీరాముడు ఇక్కడికి వచ్చిన ఆనవాళ్లు, ఆంజనేయ స్వామిని కలిసినట్లు చరిత్ర ఆధారాలు తెలియజేస్తున్న నేపథ్యం ఉంది. దీంతో గంగావతి, హంపీ చుట్టుపక్కల ఎత్తైన కొండలు, పచ్చని వ్యవసాయ పొలాలు, తుంగభద్ర నదీ ప్రవాహాలతో హంపీ, గంగావతి ప్రపంచంలోనే పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న నేపథ్యంలో దేశ, విదేశాలకు చెందిన పర్యాటకులు వారం, పది రోజులు ఇక్కడే విడిది చేసి సేద తీరుతుంటారు. కుప్పలు తెప్పలుగా హోంస్టేలు అయితే పవిత్ర పుణ్యక్షేత్రం ఒక వైపు, ప్రపంచ టూరిజంగా ఖ్యాతి మరో వైపు ఉండటంతో ఇక్కడ కుప్పలు తెప్పలుగా హోంస్టేలు వెలశాయి. అంతేకాకుండా అక్రమంగా రిసార్టులు కూడా వెలియడంతో విపరీతమైన అసాంఘీక కార్యకలాపాలు, గంజాయి విక్రయం తదితరాలు చోటు చేసుకోవడంతో హంపీ చుట్టుపక్కల ఇటీవల భయాందోళన పరిస్థితులు ఏర్పడుతుండటంతో పర్యాటకులకు దడ పుట్టిస్తోంది. గత నెల 23న హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ అనన్యరావు తుంగభద్ర నదిలో ఈతకొట్టేందుకు వెళ్లి ప్రాణాలను పోగొట్టుకుంది. ఈ ఘటన మరవక ముందే మరో ఘోరమైన సంఘటన చోటు చేసుకోవడంతో దేశ, విదేశాలకు చెందిన పర్యాటకులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. హంపీకి, గంగావతికి పరిసరాలకు వీక్షించేందుకు వచ్చిన వారిపై స్థానికంగా ఉంటున్న కొందరు నిఘా ఉంచి వారిపై ఏదో రకంగా ఇబ్బందులు పడుతున్న సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. పటిష్ట భద్రత ఏదీ? అయితే రాష్ట్ర ప్రభుత్వం హంపీలో పటిష్టమైన భద్రత కల్పించకపోవడంతో అక్రమ రిసార్ట్లు నిఘా ఉంచకపోవడంతో కొందరు యువకులు తప్ప తాగి పర్యాటకులపై దాడులు, అత్యాచారాలు చేయడం వెలుగు చూస్తున్నాయి. ఈ ఘటనలతో దేశ, విదేశాలకు చెందిన పర్యాటకులు ఒంటరిగా తిరగడం ఎలా? అని భయాందోళన చెందుతున్నారు. పోలీసులు గట్టి గస్తీ విధించకపోవడంతో పాటు రాత్రిళ్లు అయినా పర్యాటకులు హంపీ, గంగావతి పరిసరాల్లో నిషేధిత ప్రాంతాల్లోకి ఎందుకు వెళుతున్నారో కూడా నిఘా ఉంచకపోవడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. హంపీ చుట్టుపక్కల వెలసిన రిస్టార్ట్లకు ఎన్ని అనుమతులు ఉన్నాయో కూడా ఎవరికీ అంతు చిక్కడం లేదు. రిసార్ట్లు, హోంస్టేలలో గంజాయి, మత్తు పదార్థాలు విక్రయిస్తున్నా పోలీసు అధికారులు, ప్రభుత్వ పెద్దలు గట్టి చర్యలు తీసుకోకపోవడంతో అనర్థాలకు దారి తీస్తున్నట్లు తెలుస్తోంది. తుంగభద్ర నదిలో తెప్పపై విహరిస్తున్న మహిళ హంపీ పరిసరాల్లో నిత్యకృత్యంగా అరాచకాలు యథేచ్ఛగా మత్తు పానీయాలు, గంజాయి విక్రయాలు మొన్న హైదరాబాద్‌కు చెందిన మహిళ నదిలో గల్లంతు నేడు విదేశీ పర్యాటకులపై దాడి, అత్యాచారంతో మరింత దడ -
తుంగభద్ర కాలువ వద్ద దారుణం.. అర్ధరాత్రి టూరిస్ట్ మహిళపై..
బెంగళూరు: కర్ణాటకలో అమానుష ఘటన చోటుచేసుకుంది. మన దేశానికి అపఖ్యాతి మూటగట్టుకునే విధంగా కొందరు మూకలు దారుణానికి ఒడిగట్టారు. భారత పర్యటనకు వచ్చిన ఇజ్రాయెల్ యువతి, మరో మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన బెంగళూరుకు 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొప్పల్‌లో చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఇద్దరు మహిళల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం వారికి ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది.వివరాల ప్రకారం.. కొప్పల్‌కు చెందిన మహిళ(29) పర్యాటకుల కోసం హోమ్ స్టే నిర్వహిస్తోంది. విదేశాల నుంచి వచ్చే టూరిస్టులకు తన ఇంట్లో ఆశ్రయం ఇస్తూ ఆదాయం పొందుతోంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఇజ్రాయెల్ నుంచి ఓ మహిళ, అమెరికా నుంచి వచ్చిన డేనియల్ సహా మరో ఇద్దరికి ఆశ్రయం కల్పించింది. దీంతో, వారంతా ఆమె ఇంట్లోనే ఉంటున్నారు. అయితే, గురువారం వారంతా డిన్నర్ చేసిన అనంతరం బయటకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు.Israeli Tourist, Homestay Owner Gang-Raped While Stargazing In Karnataka pic.twitter.com/DbtuOlGuxp— NDTV (@ndtv) March 8, 2025అనంతరం, సోనాపూర్ సమీపంలోని తుంగభద్ర కెనాల్ ఒడ్డుకు వెళ్లాలని నిర్ణయించారు. దీంతో, వారంతా గురువారం రాత్రి 11:30 గంటల సమయంలో తుంగభద్ర కాలువ వద్దకు వెళ్లారు. కాలువ ఒడ్డున కూర్చుని నక్షత్రాలను చూస్తూ మాట్లాడుకుంటుండగా గుర్తు తెలియని వ్యక్తులు కొందరు అక్కడికి వచ్చి వారిపై దాడి చేశారు. టూరిస్టులలోని ముగ్గురు మగవాళ్లను కాలువలోకి తోసేసి, ఇజ్రాయెల్ పౌరురాలితో పాటు హోమ్ స్టే యజమానిపై అత్యాచారం చేసి పారిపోయారు. కాలువలో పడ్డ డేనియల్, మహారాష్ట్రకు చెందిన పంకజ్ బయటకు రాగా, ఒడిశాకు చెందిన బిబాష్ జాడ మాత్రం తెలియరాలేదు. ఈ క్రమంలో టూరిస్టులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరు యువతులను ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు స్పష్టం చేశారు. -
ఎయిరిండియా నిర్వాకం.. ఐసీయూలో వృద్ధురాలు
ఎయిరిండియా విమానయాన సంస్థపై సంచలన ఆరోపణలు వెల్లువెత్తాయి. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఓ వృద్ధురాలికి వీల్‌ఛైర్ సేవలు నిరాకరించడంతో ఆమె కిందపడి గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెకు ఐసీయూలో చికిత్స అందుతుండగా.. ‘తప్పనిసరి పరిస్థితుల్లో..’ అంటూ ఆమె మనవరాలు జరిగిందంతా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యాన్ని ఆమె ఎండగట్టడంతో.. దెబ్బకు ఎయిరిండియా దిగొచ్చింది. రాజ్ పశ్రీచా(82) మాజీ సైనికాధికారి భార్య. తన కుటుంబ సభ్యులతో ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్లడానికి ఎయిరిండియా విమానంలో టికెట్ బుక్ చేసుకున్నారు. వృద్ధాప్య సమస్యలతో ఉన్న ఆమెకు వీల్‌ఛైర్ కోసం బుక్ చేసుకోగా.. అది కన్ఫర్మ్ అయ్యింది. అయితే గంటసేపైనా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఎవరూ పట్టించుకోలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె కుటుంబ సభ్యుల సాయంతో ముందుకు వెళ్లారు. కాలు జారి కిందపడి గాయపడ్డారు.ఆమె తలకు గాయం కాగా.. ముక్కు, నోటి నుంచి రక్తం కారింది. అయితే ఆ టైంలోనూ సిబ్బంది ఎవరూ సాయానికి ముందుకు రాలేదని, తామే మెడికల్ కిట్ కొనుక్కొచ్చి ఫస్ట్ ఎయిడ్ చేశామని మనవరాలు పరుల్ కన్వర్(Parul Kanwar) తెలిపారు. ఆపై కాసేపటికి వీల్‌ఛైర్ వచ్చిందని.. గాయాలతోనే ఆమెను బెంగళూరుకు తీసుకొచ్చామని తెలిపారు. అయితే.. ఈ మధ్యలో విమాన సిబ్బంది సాయం కోరగా.. బెంగళూరు ఎయిర్‌పోర్టులో ఆమెకు వైద్య సేవలు అందాయని, తలకు రెండు కుట్లు పడ్డాయని తెలిపారామె. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతుండగా.. ఎడమ వైపు భాగానికి పక్షవాతం సోకిందని, మెదడులో రక్తస్రావం జరిగిందేమోననే అనుమానాలను వైద్యులు వ్యక్తం చేశారని పరుల్ తెలిపారు. ఈ ఘటనను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆమె.. మనిషి జీవితానికి కొంచెమైనా విలువ ఇవ్వండి అంటూ ఎయిరిండియా సిబ్బందిని ఉద్దేశించి పోస్ట్ చేశారు. ఈ ఘటనపై డైరెక్టోరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA), ఎయిరిండియాలకు ఫిర్యాదు చేశామని, చర్యలకు కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారామె.అయితే పరుల్ పోస్టుపై ఎయిరిండియా స్పందించింది. ఆమె సోషల్ మీడియా ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్నామని బాధితురాలు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ఎయిరిండియా తెలిపింది. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఫోన్ నెంబర్, పూర్తి వివరాలను తమకు అందించాలని ఎయిరిండియా ఆమెను కోరింది. అయితే ఘటనపై దర్యాప్తు పూర్తైతేగానీ తాను ఎయిరిండియాతో సంప్రదింపులు జరపబోనని తేల్చారామె. -
పేదల సేవకు అంకితం కండి
రాయచూరు రూరల్: పట్టాలు పుచ్చుకున్న వైద్యులు ప్రామాణికంగా పేద ప్రజల సేవకు అంకితం కావాలని ముంబై క్యాండీ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ ఆనందరావు అన్నారు. శుక్రవారం నవోదయ వైద్య కళాశాల ఆడిటోరియంలో గ్రాడ్యుయేషన్ డేను ప్రారంభించి ఎంబీబీఎస్, దంత కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలు అందించి ఆయన మాట్లాడారు. చదివిన చదువును పేదలకు, సమాజానికి ఉపయోగించి కళాశాలకు మంచి పేరు తేవాలన్నారు. స్వయంకృషి, ప్రతిభతో పని చేయాలన్నారు. కళాశాల విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించడం అభినందనీయమన్నారు. నేటి ఆధునిక యుగంలో వైద్యం భవిష్యత్తుకు పునాది కావాలన్నారు. కళ్యాణ కర్ణాటకలో రాయచూరు నవోదయ వైద్య కళాశాలను ప్రారంభించి ఉన్నత విద్యా ప్రమాణాలకు నెలవుగా మార్చారన్నారు. ఉత్తమ సేవలతో గుర్తింపు పొందండి వైద్యులు, నర్సులు సమాజంలో ఉత్తమ సేవలు అందించి గుర్తింపు పొందాలని కర్ణాటక వైద్య మండలి అధ్యక్షుడు డాక్టర్ యోగానందరెడ్డి అన్నారు. గురువారం రాత్రి నగరంలోని నవోదయ వైద్య కళాశాల ఆవరణలో రీగల్–2025 ఉత్సవాలను ప్రారంభించి ఆయన మాట్లాడారు. నేటి విద్యార్థులు పదేళ్లు ముందుకు అలోచించి చదివితేనే విజయం సాధిస్తారన్నారు. వైద్యంలో విలువలు పాటిస్తూ రోగుల పట్ల మానవతను చూపాలన్నారు. కార్యక్రమంలో నవోదయ వైద్య కళాశాల ట్రస్టీ ఎస్.రాజేంద్రరెడ్డి, రిజిస్ట్రార్ శ్రీనివాస్, డీ.దేవానంద, గిరీష్, విజయ్‌కుమార్, ఆనంద్‌లున్నారు. -
మౌలిక వసతుల కల్పనకు వినతి
హొసపేటె: కొట్టూరు పట్టణంలోని కొన్ని వార్డుల్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆల్ ఇండియా దళిత హక్కుల ఉద్యమ సంస్థ(ఏఐడీఆర్‌ఎం) విజయనగర జిల్లా అధ్యక్షుడు కే.కొట్రేష్ పేర్కొన్నారు. పట్టణ పంచాయతీ కార్యాలయంలో చీఫ్ ఎ.నసరుల్లాకు వినతిపత్రం అందజేసి మాట్లాడారు. బీ.ఆర్.అంబేడ్కర్ కాలనీలో రక్షిత మంచినీటి సౌకర్యం కల్పించాలన్నారు. హౌసింగ్‌బోర్డు కాలనీ, జే.పీ.నగర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పరిసర ప్రాంతాల్లోని వార్డుల్లో మౌలిక వసతులు లేవన్నారు. ఇళ్ల పైకప్పు లేని వారికి పైకప్పులు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రతి వార్డులో మౌలిక వసతుల కల్పనకు నిర్ణీత గ్రాంట్‌ను మంజూరు చేయాలన్నారు. గతంలో అందజేసిన విజ్ఞప్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. లేనిపక్షంలో మరికొన్ని రోజుల్లో పట్టణ పంచాయతీ కార్యాలయం ఎదుట నిరవధిక నిరసన చేపడుతామని హెచ్చరించారు. వినతిపత్రం స్వీకరించిన ప్రధాన కార్యవర్గ మండలి సమావేశంలో తమ డిమాండ్లను అందించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తాలూకా యూనిట్ అధ్యక్షుడు తెగ్గినకేరి కొట్రేష్, సీపీఎం రాష్ట్ర మహిళా సమాఖ్య కార్యదర్శి కే.రేణుకమ్మ, ఏఐడీఆర్‌ఎం సభ్యులు ఎస్.ప్రకాష్, ఐ.గోపీనాథ్, జీ.కార్తీక్, మణికంఠ, అరుణ్, సాగర్, గోపీనాథ్, కే.నాగరాజ్, అరుణ్, ఝులన్, ప్రభు తదితరులు పాల్గొన్నారు. -
ఉత్తర కర్ణాటకకు నిరాశాదాయక బడ్జెట్
హుబ్లీ: పేదల పెన్నిధి, సమాజ్‌వాది నేతగా ఈసారి రికార్డు స్థాయిలో 16వ సారి రాష్ట్ర ఆర్థిక బడ్జెట్‌ను ప్రతిపాదించిన సీఎం సిద్ధరామయ్య బడ్జెట్‌పై ఉత్తర కర్ణాటక ప్రజలు ఎన్నో అశలు పెట్టుకోగా, ఈసారి నిరాశాదాయక బడ్జెట్ సమర్పించారని కర్ణాటక చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఎస్ఎఫ్ సంశిమఠ తెలిపారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఉత్తర కర్ణాటకకు ఒక్క ఫ్యాక్టరీ, భారీ పరిశ్రమను కూడా ప్రకటించలేదన్నారు. ఈ బడ్జెట్ కేవలం బెంగళూరు, మైసూరు, తుమకూరులకు మాత్రమే పరిమితమైందన్నారు. ఉత్తర కర్ణాటకకు ఏమీ ఇవ్వలేదన్నారు. ఈ బడ్జెట్‌ను తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. బెంగళూరుకు మాత్రమే పరిమితమైంది కార్యదర్శి రవీంద్ర బళిగార మాట్లాడుతూ రూ.4 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించినా కేవలం బెంగళూరుకు మాత్రమే పరిమితమైందన్నారు. రాష్ట్రంలో రెండో అతి పెద్ద జంట నగరాలైనా హుబ్లీ– ధార్వాడ ప్రజలను అసలు పట్టించుకోలేదని అసంతృప్తిని వెళ్లగక్కారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా పరిశ్రమల పరికరాల ఫ్యాక్టరీ, ఐటీబీటీ క్లస్టర్, పర్యాటక శాఖలకు ప్రాధాన్యతను ఇవ్వాలని కోరామన్నారు. అలాగే హుబ్లీ, ధార్వాడ ప్రత్యేక పాలికెలకు విడివిడిగా నిధులు కేటాయిస్తారని ఆశించామన్నారు. అయితే అలా ఇవ్వలేదన్నారు. కనీసం ప్రభుత్వ ఉద్యోగుల పన్నులు కూడా పెంచలేదన్నారు. మొత్తానికి ఈ బడ్జెట్ ఉత్తర కర్ణాటకకు నిరాశదాయక బడ్జెట్ అన్నారు. మిగులు బడ్జెట్ ప్రతిపాదన హర్షనీయం సంయుక్త కార్యదర్శి మహేంద్రసింగి మాట్లాడుతూ సిద్దూ గ్యారెంటీ పథకాలను కొనసాగిస్తూ మిగులు బడ్జెట్ ప్రతిపాదించడం హర్షనీయమన్నారు. ముస్లింలతో పాటు జైనులు, సిక్కులు, బౌద్ధులు, క్రైస్తవులు, మైనార్టీలకు రిజర్వేషన్లకు బదులుగా కేవలం ముస్లింలకు మాత్రమే రిజర్వేషన్లను కేటాయించారన్నారు. ప్రముఖ చార్టెర్డ్ అకౌంటెంట్ చెన్నవీర ముంగరవాడి మాట్లాడుతూ సిద్ధరామయ్య అన్ని వర్గాల మేలు కోసం కృషి చేశారన్నారు. చాలినంత నిధులను ఉచిత పథకాలకు కేటాయించారన్నారు. మిగిలిన వర్గాలకు న్యాయం చేసేందుకు ప్రయత్నించారన్నారు. సాధారణంగా చూస్తే ఇది మంచి బడ్జెట్. అయితే హుబ్లీ, ధార్వాడ విషయానికి వస్తే, ఉత్తర కర్ణాటకు కూడా ఏ కొత్త కార్యక్రమాన్ని ప్రకటించకపోవడంతో అభివృద్ధి ఆనవాలు లేకుండా చేయడం ఉత్తర కర్ణాటకకు బడ్జెట్లో నిరాశను కలిగించిందన్నారు. ఒక్క భారీ పరిశ్రమనూ ప్రకటించలేదు కర్ణాటక చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు -
ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తే చర్యలు
సాక్షి,బళ్లారి: నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలని జిల్లా ఎస్పీ శోభారాణి సూచించారు. ఆమె శుక్రవారం తన కార్యాలయంలో పలు సంఘ సంస్థల ప్రతినిధులతో మాట్లాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ముందుగా నగరంలోని తెలుగు సంస్కృతి సమితి కార్యదర్శి ప్రభాకర్, జిల్లా బలిజ సంఘం అధ్యక్షుడు కే.రమేష్ బుజ్జి ఆధ్వర్యంలో ఎస్పీని కలిసి అభినందించారు. జిల్లాకు తొలి మహిళా ఎస్పీగా పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ఎంతో శ్రమిస్తున్నందున తమ వంతు సహకారం అందిస్తామని ఆయా సంస్థల ప్రతినిధులు మాట్లాడారు. ట్రాఫిక్ సమస్యలపై కూడా ఆమె దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నగరంలో ట్రాఫిక్ సమస్య తన దృష్టికి వచ్చిందని, కొందరు మొబైల్లో మాట్లాడుతూ వాహనాలు నడుపుతున్నారని, అలాంటి వారిపై నిఘా ఉంచి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతిభద్రతల పర్యవేక్షణ, ట్రాఫిక్ సమస్యలు నియంత్రించడానికి శక్తివంచన లేకుండా పని చేస్తామన్నారు. ఎలాంటి సమస్యలు వచ్చినా నిర్భయంగా తమ దృష్టికి తెస్తే చట్టపరంగా వారికి అండగా నిలుస్తామన్నారు. బాలకృష్ణ, నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఘరానా దొంగ అరెస్టు
● రూ.11.25 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం హొసపేటె: చోరీ కేసులో నిందితుని బంధించి అతని వద్ద ఉన్న రూ.11.25 లక్షల విలువైన ఆభరణాలను పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకొని నిందితుడిని కోర్టులో హాజరు పరిచినట్లు జిల్లా ఎస్పీ శ్రీహరిబాబు తెలిపారు. శుక్రవారం ఆయన డీఎస్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గతనెల 25న నగరంలోని జాలేరా వీధిలోని ఓ ఇంటిలో సుమారు రూ.11.25 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాల చోరీ జరిగినట్లు తెలిపారు. ఈ విషయంపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని చోరీకి పాల్పడ్డ నిందితున్ని పట్టుకొనేందుకు ముమ్మరంగా గాలింపు చేపట్టారన్నారు. దొంగతనానికి పాల్పడ్డ నిందితుడు నగర శివార్లలో జంబునాథ రహదారి ఏరియాలో ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు పకడ్బందీగా నిందితుడిని పట్టుకొన్నట్లు తెలిపారు. హుబ్లీకి చెందిన మహమ్మద్ అలీ నాలబంది ఈ చోరీకి పాల్పడినట్లు ఆయన తెలిపారు. అదనపు జిల్లా ఎస్పీ సలీం పాషా తదితరులు పాల్గొన్నారు. కోల్పోయిన మొబైళ్ల అప్పగింత రూ.20.74 లక్షల విలువైన సుమారు 123 మొబైళ్లను గుర్తించి జిల్లా ఎస్పీ శ్రీహరిబాబు ఆధ్వర్యంలో శుక్రవారం వారసులకు అప్పగించారు. హొసపేటె సబ్ డివిజన్ పరిధిలో మొబైల్ ఫోన్ల చోరీకి గురైన వారు పిటిషనర్ ఇచ్చిన ఫిర్యాదుపై మొబైల్ ఫోన్లను గుర్తించేందుకు ఎస్పీ శ్రీహరిబాబు మార్గదర్శకత్వంలో అడిషనల్ ఎస్పీ సలీంపాషా సలహా సూచనల మేరకు డీఎస్పీ డాక్టర్ టి.మంజునాథ్ ఆధ్వర్యంలో వివిధ పోలీస్ స్టేషన్లలో మొబైళ్ల చోరీలపై కేసు నమోదు చేశారు. -
విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నుల పంపిణీ
బళ్లారి అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు ప్రత్యేక గుణాలు సంతరించుకొంటారని జోళదరాశి జేటీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రముఖ సంఘ సేవకులు తిమ్మప్ప జోళదరాశి తెలిపారు. కోట ఆజాద్ ప్రభుత్వ హైస్కూల్, శ్రీరాంపుర హైస్కూల్, మున్సిపల్ ప్రభుత్వ హైస్కూల్, తాలూకాలోని హలకుంది ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు శుక్రవారం ఉచితంగా పరీక్ష ప్యాడ్లతో పాటు పెన్నులను పంపిణీ చేసి ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తగినంత ప్రోత్సాహం అందిస్తే ఉన్నత శిఖరాలను చేరుకుంటారని ప్రశంసించారు. విద్యార్థులకు శాయశక్తుల తన సహాయ సహకారాలను అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. సీనియర్ విలేకరి మంజునాథ్, టీపీ ఈఓ మడిగిన బసప్ప, విశ్రాంత హెచ్ఎం గురురుద్రప్ప, ఆయా పాఠశాలల హెచ్ఎంలు ఆనంద్‌నాయక్, కెంచప్ప, ఉపాధ్యాయిని డాక్టర్ సిద్దేశ్వరి, ప్రముఖులు రూపనగుడి గోవింద, జనార్థన్ నాయక, దుర్గప్ప, సత్యనారాయణ, కొక్కరచేడు తిమ్మప్ప, కాయిపల్లె బసవరాజు, రూపనగుడి వెంకటేష్, నాగరాజ్, ప్రెస్ ఫోటోగ్రాఫర్ రుద్రమునిస్వామి, జోళదరాశి తిక్కన్న, చంద్రశేఖర్, మనోజ్, వినోద్, శెక్షావలి, కౌశిక్, శైలేంద్ర, సాయిబన్ని, సుధాకర్ హెగ్డె తదితరులు పాల్గొన్నారు. -
భిన్నత్వంలో ఏకత్వం.. అదే భారతీయం
హొసపేటె: అనేక రాష్ట్రాలతో కూడిన బహుత్వ భారతదేశంలో సంస్కృతి, భాష, ఆచార వ్యవహారాలు విభిన్నంగా ఉంటాయని, అదే భారతీయమని కన్నడ యూనివర్శిటీ పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు టీ.హెచ్.బసవరాజు అన్నారు. శుక్రవారం కన్నడ యూనివర్శిటీలో ఏర్పాటు చేసిన అనువాద శిక్షణ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. భారతదేశ వైవిధ్యాన్ని తెలుసుకోవాలంటే అనువాదం అవసరమని తెలిపారు. పోటీ ప్రపంచంలో ఆంగ్లం అనివార్యంగా నిలుస్తుందన్నారు. అనువాద కేంద్రం డైరెక్టర్ డాక్టర్ ఎ.మోహన్ కుంటార్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత
హొసపేటె: కూడ్లిగి తాలూకా కానాహొసళ్లిలోని ప్రభుత్వ మోడల్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన ఎకోక్లబ్–2025 కార్యక్రమాన్ని నిర్వహించారు. హెచ్ఎం.కోడిహళ్లి సురేష్ మాట్లాడుతూ నానాటికీ ఎండలు పెరిగి జీవరాశులకు ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణంపై చెడు ప్రభావం పడుతోందన్నారు. విద్యార్థులతో పాటు ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు మొక్కలు, చెట్లను ఎక్కువగా పెంచాలన్నారు. ప్లాస్టిక్ వాడకుండా ఉండేలా అవగాహన కల్పించాలన్నారు. ఉపాధ్యాయులు బీఎం.రాధామణి మాట్లాడుతూ మొక్కలు, చెట్లు ఎక్కువగా లేని కారణంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయన్నారు. వర్షాల ప్రభావం కూడా క్రమంగా తగ్గుతోందన్నారు. ఉపాధ్యాయులు జీవీ శివకుమార్, ఎల్.కృష్ణమూర్తి, ఫిర్దోస్, కేఎస్.స్నేహ పాల్గొన్నారు. సేవాదళ్ కార్యదర్శిగా నియామకం రాయచూరు రూరల్: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శిగా నగరానికి చెందిన రాధాకృష్ణరెడ్డి నియమితులయ్యారు. గురువారం పార్టీ కార్యాలయంలో సేవాదళ్ రాష్ట్ర పార్టీ చీఫ్ ఆర్గనైజర్ రామచంద్ర ఆదేశాలు జారీ చేశారు. పార్టీని బలోపేతం చేసి జెడ్పీ, టీపీ, నగరసభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి శ్రీకారం చుట్టాలన్నారు. చలివేంద్రం ప్రారంభం రాయచూరు రూరల్: వేసవి సమీపించడంతో యాదగిరిలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను నగరసభ అధ్యక్షురాలు లలిత అనాపురే ప్రారంభించారు. శుక్రవారం యాదగిరి నగరంలోని కోర్టు, బసవేశ్వర సర్కిల్, గంజ్ సర్కిల్, గాంధీ చౌక్, నగరసభ కాంప్లెక్స్‌ల్లో చలివేంద్రాలను ఆమె ప్రారంభించి మాట్లాడారు. వేసవిలో ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే ప్రజల దాహార్తిని తీర్చడానికి తోడు పక్షులకు నీటిని అందించడానికి చెట్లపై నీటి తొట్టెలను ఏర్పాటు చేశారన్నారు. నగరసభ కమిషనర్ ఉమేష్, లక్ష్మికాంత్, సభ్యులు విలాస్ పాటిల్, హనుమంతు, జేఈ అంబకేశ్వర, ఎస్ఐ శివపుత్ర, శరణమ్మ, మంజునాథ్, యేసుమిత్ర, మల్లులున్నారు. వీధి వ్యాపారాలకు అనుమతించాలి రాయచూరు రూరల్: జిల్లాలో ముస్లిం సోదరులకు రంజాన్ మాసంలో రోడ్లు, వీధుల్లో వ్యాపారాలు చేసుకోవడానికి వీలు కల్పించాలని మాజీ నగరసభ సభ్యుడు డిమాండ్ చేశారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ పుట్టమాదయ్యకు వినతిపత్రం సమర్పించి మాట్లాడారు. నగరంలో రాత్రి వేళలో నమాజు చేస్తున్నారన్నారు. విద్యుత్, నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని, కుక్కల బెడద నుంచి రక్షించాలన్నారు. ఆందోళనలో జెడ్పీ మాజీ సభ్యుడు బషీరుద్దీన్, నగరసభ ఉపాధ్యక్షుడు సాజిద్ సమీర్లున్నారు. విజ్ఞానం.. క్రమశిక్షణకు సోపానం రాయచూరు రూరల్: విద్యార్థుల్లో క్రమశిక్షణకు, వ్యక్తిత్వ వికాసానికి విజ్ఞానం సోపానమని ప్రముఖ విద్యావేత్త నాగరాజ్ వెల్లడించారు. శుక్రవారం కేఎస్‌హెచ్ హాస్టల్లో ఏర్పాటు చేసిన విజ్ఞాన వస్తు ప్రదర్శనను తిలకించి ఆయన మాట్లాడారు. విద్యార్థుల్లో విజ్ఞానంపై అవగాహనకు నాయకత్వ లక్షణాలు, చైతన్యం, ఆత్మ విశ్వాసం, ఇంగ్లిష్ అంశాలపై చర్చాగోష్టి నిర్వహించారు. మనోహర్, శశిభూషణ్, మల్లప్ప, సాదిక్, విద్యావతి, స్నేహలతలున్నారు. -
రేపు ధార్వాడలో భారీ ఉద్యోగ మేళా
హుబ్లీ: ప్రభుత్వ సూచనల మేరకు ఆదివారం ధార్వాడ కేసీడీ ఆవరణలో కౌసల్య రోజ్‌గార్ ఉద్యోగ మేళాను ఏర్పాటు చేశారు. ఈవిషయంలో వివిధ సన్నాహాలను జిల్లాధికారిణి దివ్యప్రభు శుక్రవారం స్వయంగా ఆ ఆవరణకు వెళ్లి పరిశీలించారు. కాగా గత నెల 25 నుంచి నిరుద్యోగుల నుంచి నమోదు ప్రక్రియ ఆన్లైన్ ద్వారా ప్రారంభమైంది. ఈనెల 7 వరకు కొనసాగింది. అంతేగాక ఆదివారం రోజు కూడా నిరుద్యోగులు తమ పేర్లను నమోదు చేసుకొనే అవకాశం ఉందన్నారు. 65 పరిశ్రమలు, 25 మానవ వనరుల సంస్థల ప్రతినిధులు ఈ మేళాలో తమకు కావాల్సిన ఉద్యోగార్థులను నియామకం చేసుకొంటారు. ఇందుకు సంబంధించి వచ్చే వారందరికీ అన్ని ఏర్పాట్లను కేసీడీ పర్యాటక విభాగం, డాక్టర్ గోకాక్ గ్రంథాలయ భవనంలో ఇంటర్వ్యూలకు ఏర్పాట్లు చేశారు. వంద మంది స్వచ్ఛంద కార్యకర్తలను నియమించారు. తాగునీరు, మరుగుదొడ్లు, వెయిటింగ్ రూంలను ఏర్పాటు చేశారు. ప్రక్రియ అంతా క్రమశిక్షణతో జరిగేలా అసిస్టెంట్ కమిషనర్‌ను నోడల్ అధికారిగా నియమించారు. జెడ్పీ సీఈఓ భువనేష్ పాటిల్ మాట్లాడుతూ మేళాలో సంస్థ సమాచారం తెలియజేస్తూ మైకుల ద్వారా ఆ రోజున ప్రచారం చేస్తామన్నారు. పోలీసు కమిషనర్ శశికుమార్ మేళాకు అవసరమైన భద్రత చర్యలు తీసుకొన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించరూ.. రాయచూరు రూరల్: జిల్లాలోని లింగసూగూరు తాలూకా హట్టి బంగారు గనుల కంపెనీలో విధులు నిర్వహిస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్్ చేశారు. శుక్రవారం హట్టి బంగారు గనుల కంపెనీ కార్యాలయంలో మేనేజర్‌కు వినతిపత్రం సమర్పించిన అనంతరం అధ్యక్షుడు ఫకృద్దీన్ మాట్లాడారు. కార్మికులకు వైద్య పరీక్షలు చేపట్టాలని, 2020–21లో పీఎల్బీ పరిహరం అందించాలన్నారు. 2023లో కార్మికులకు పదోన్నతి కల్పించాలన్నారు. ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న నర్సులను పర్మినెంట్ చేయాలని కోరారు. ఆందోళనలో వెంకటేష్, షఫీ, అల్లాభక్షి, శ్రీధర్‌లున్నారు. అశ్లీల ఫోటోల అప్లోడ్పై ఫిర్యాదుహుబ్లీ: సోషల్ మీడియాలో అశ్లీల ఫోటోలను అప్లోడ్ చేసిన ఆరోపణలపై ఓ వ్యక్తికి వ్యతిరేకంగా కేసు దాఖలైంది. పాత హుబ్లీకి చెందిన మహమ్మద్ సాదిక్‌పై సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేసు నమోదు చేసుకొన్నారు. హెల్మెట్ ధారణ.. ప్రాణాలకు రక్షణ రాయచూరు రూరల్: ద్విచక్ర వాహనంలో సంచరించే సమయంలో ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రాణాలను కాపాడుకోవాలని సిటీ కార్పొరేషన్ కమిషనర్ గురుసిద్దయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం పాత జిల్లాధికారి కార్యాలయం వద్ద హెల్మెట్ వాడకంపై జాగృతి జాతాను ప్రారంభించి ఆయన మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రమాదాల బారి నుంచి రక్షణకు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని వివిధ శాఖల ఉద్యోగులు, ిసిబ్బంది జాగృతి కల్గించారు. 9న భారీ రక్తదాన శిబిరం హుబ్లీ: హుబ్లీ–ధార్వాడ సమస్త బ్రాహ్మణ సమాజం ఆధ్వర్యంలో రాష్ట్రోత్థాన బ్లడ్‌బ్యాంక్ సహకారంతో ఆదివారం భవానీనగర్ రాఘవేంద్ర స్వామి మఠంలో భారీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు డాక్టర్ పవన్ జోషి తెలిపారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఉదయ 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రక్తదాన శిబిరం ఉంటుందన్నారు. ఈసారి రాఘవేంద్రస్వాముల 430వ వర్థంతి ఉత్సవాన్ని కూడా నిర్వహిస్తున్నామన్నారు. ఈసారి ఎక్కువ సంఖ్యలో దాతలు రక్తాన్ని దానం చేయవచ్చన్నారు. అనంతరం రక్తపరీక్ష శిబిరం కరపత్రాన్ని విడుదల చేశారు. ఈసందర్భంగా దత్తమూర్తి కులకర్ణి, కిరణ్ హెగ్డె, లక్ష్మణ్ కులకర్ణి పాల్గొన్నారు. -
రాష్ట్ర బడ్జెట్లో బళ్లారికి మొండిచేయి
సాక్షి,బళ్లారి: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన భూమిక పోషించిన బళ్లారి జిల్లాకు బడ్జెట్లో ముఖ్యమంత్రి సిద్దరామయ్య మొండిచేయి చూపారని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా అన్ని స్థానాల్లో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచారు. ఇక ఉమ్మడి బళ్లారి జిల్లా ప్రస్తావనకు వస్తే విజయనగర జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీదే హవా. అంతేకాకుండా ఉమ్మడి బళ్లారి జిల్లా నుంచి రాష్ట్రానికి పెద్ద మొత్తంలో పన్నుల రూపంలో సొమ్ము చెల్లిస్తుంటారు. అపారమైన ఇనుప ఖనిజ నిల్వలు, స్టీల్ ఇండస్ట్రీలు, పలు ఫ్యాక్టరీలు ఉన్నందున ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది కోట్ల రూపాయల ఆదాయం పన్నుల రూపంలో ప్రభుత్వానికి చేరుతుంది. అయినా పేదరిక నిర్మూలన, మంచినీటి సమస్య శాశ్వత పరిష్కారానికి, ఇళ్ల నిర్మాణాలకు, అర్ధంతరంగా ఆగిన పనులకు కూడా బడ్జెట్లో నిధులు కేటాయించపోవడంతో సిద్దూ బడ్జెట్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఎండుమిర్చి వ్యాపార కేంద్రం ఊసే లేదు ఈ ప్రాంతంలో విస్తారంగా మిర్చి పండిస్తున్నారు. తుంగభద్ర ఆయకట్టు కింద లక్షలాది ఎకరాల్లో మిర్చి పంట పండిస్తున్నారు. ఇక్కడ నుంచి సుదూరంలోని బ్యాడిగికి తరలించి రైతులు విక్రయిస్తుంటారు. ధరలు అమాంతంగా పడిపోవడంతో కనీసం రవాణా ఖర్చులు కూడా రైతులకు గిట్టడం లేదు. ఈనేపథ్యంలో జిల్లాలో అత్యాధునిక ఎండుమిర్చి వ్యాపార కేంద్రం ప్రారంభిస్తే రైతులకు ఎంతో మేలు చేస్తుందని ఆశలు పెట్టుకున్న రైతులకు బడ్జెట్లో నిధుల ప్రస్తావన లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక విమానాశ్రయం విషయానికి వస్తే సిరివార సమీపంలో గత బీజేపీ ప్రభుత్వ హయాంలో విమానాశ్రయ నిర్మాణానికి భూమిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పనులు ప్రారంభించి వదిలేశారు. ప్రతి బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని ఆశిస్తున్నారు. మాటల వరకే విమానాశ్రయ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పూర్తి కాని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ముఖ్యంగా బళ్లారి జిల్లాకే తలమానికంగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణాలు చేపట్టి 17 ఏళ్లు పైబడింది. నత్తనడక పనులు జరుగుతున్నాయి కాని పూర్తిగా నిధులు కేటాయించకపోవడంతో ఆస్పత్రి నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. నూతనంగా ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణంతో పాటు తుంగభద్ర డ్యాంకు కొత్త క్రస్ట్‌గేట్లను అమర్చడానికి కూడా నిధులు కేటాయించలేదు. వీటితో పాటు పరిశ్రమలు, వ్యవసాయ రంగానికి కూడా మొండిచేయి చూపారని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన నేతలు మినహా మిగిలిన అన్ని వర్గాల ప్రజలు, స్వచ్ఛంద సంస్థల వారు, ప్రజా సంఘాల వారు బడ్జెట్‌పై భిన్నస్వరాలు వినిపిస్తున్నారు. నెరవేరని అగ్ర నేత రాహుల్ గాంధీ హామీ అంతేకాకుండా అపారెల్ పార్కుకు కూడా నిధులు కేటాయించలేదు. గత బడ్జెట్లో నిధుల ప్రస్తావన చేసినా పనులు ప్రారంభించలేదు. ఈ బడ్జెట్లో కూడా ఆశలు పెట్టుకున్నారు. అపారెల్ పార్కు నిర్మాణం చేపడితే ఈ ప్రాంతంలో జీన్స్ రంగానికి మరింత మేలు చేసినట్లు అవుతుందని, స్వయంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ఎన్నికల ముందు ప్రచారంలో హామీ కూడా ఇచ్చారు. అలా రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీ కూడా సీఎం సిద్ధరామయ్యకు పట్టకపోవడం గమనార్హం. కళ్యాణ కర్ణాటక అభివృద్ధికి ప్రత్యేక మండలిని ఏర్పాటు చేశారు. అత్యంత వెనుక బడిన ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఉపాధి కల్పనకు చర్యలు తీసుకుంటామని ఆర్టికల్– 371(జే)ని కూడా అమలు చేశారు. నిధుల కేటాయింపులో హై–క పరిధిలో ఏడు జిల్లాలు ఉంటే వాటిలో కలబుర్గి జిల్లాకే అగ్రస్థానం కల్పించడంపై కూడా సీఎంపై విమర్శలు వినవస్తున్నాయి. ముఖ్యమంత్రి పద్దుపై వివిధ వర్గాల్లో భిన్నస్వరాలు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి నిధుల ప్రస్తావన ఏదీ? ఊసే లేని అపారెల్ పార్కు, ఎయిర్‌పోర్టు, ఇంజినీరింగ్ కాలేజీ -
రైతు వ్యతిరేక బడ్జెట్ ఇది
● యడియూరప్ప ధ్వజం దొడ్డబళ్లాపురం: కాంగ్రెస్ సర్కారు బడ్జెట్‌పై బీజేపీ నేత, మాజీ సీఎం యడియూరప్ప తీవ్ర విమర్శలు చేశారు. ఇది రాష్ట్ర అభివృద్ధికి వ్యతిరేకంగా ఉంది, కేవలం మైనారిటీలను మచ్చిక చేసుకోవడానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌గా అనిపిస్తోందని ఎక్స్‌లో ఆరోపించారు. ముస్లిం కాంట్రాక్టర్లకు మతం ఆధారంగా అవకాశాలు కల్పించడం రాజ్యాంగం ఆశయాలకు వ్యతిరేకమన్నారు. కళ్యాణ కర్ణాటక అభివృద్ధికి ఇచ్చింది శూన్యమన్నారు. గత బడ్జెట్లో పేర్కొన్న పనులు, పథకాల అమలుపై మౌనం ఎందుకన్నారు. గ్యారంటీల పేరుతో అభివృద్ధిని గాలికొదిలేశారన్నారు. బెంగళూరు మీద దృష్టి పెట్టలేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 2వేలమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, రైతులకు మొండిచేయి చూపించారని ధ్వజమెత్తారు. సిద్దరామయ్య 16వ బడ్జెట్ శివాజీనగర: దేశంలో అత్యధికసార్లు రాష్ట్ర బడ్జెట్‌ను ప్రకటించిన ఆర్థికమంత్రి/ సీఎంలలో ఒకరుగా సిద్దరామయ్య రికార్డు సృష్టించారు. తాజా బడ్జెట్ ఆయనకు 16వ పద్దు కావడం విశేషం. గుజరాత్ గత ఆర్థిక మంత్రి వజుభాయివాలా ఏకంగా 18 సార్లు బడ్జెట్లు ప్రవేశపెట్టి అరుదైన కీర్తిని పొందారు. మాజీ సీఎం రామకృష్ణ హెగ్డే 13 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. 1994లో తొలిసారిగా జనతాదళ్ సర్కారులో ఆర్థిక మంత్రిగా ఉన్న సిద్దరామయ్య తన తొలి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.మరో బాలింత మృత్యుఒడికి యశవంతపుర: ఉత్తర కర్ణాటకలో బాలింతల మరణాలు తగ్గడం లేదు. అప్పుడే పుట్టిన పసిబిడ్డలు శాశ్వతంగా అమ్మ ప్రేమకు దూరమవుతున్నారు. బెళగావిలోని బిమ్స్ ఆస్పత్రిలో బాలింత గురువారం రాత్రి చనిపోయింది. జిల్లాలోని గోకాక్ తాలూకా లగమేశ్వర గ్రామానికి చెందిన కీర్తి నేసరగి తుమ్మరగుడ్డి (23) మృతురాలు. మంగళవారం వైద్యులు సిజేరియన్ చేసి ప్రసవం చేశారు. అయితే కీర్తి తీవ్రమైన రక్తస్రావం జరిగి మరణించిందని వైద్యులు చెబుతున్నారు. రక్తస్రావం అవుతున్నా వైద్యులు సరైన చికిత్సలు అందించలేదని కుటుంబసభ్యులు ఆరోపిస్తూ ధర్నాకు దిగారు. బెళగావి ఎపిఎంసీ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు.ఎయిర్‌పోర్టులో 4 కేజీల బంగారం సీజ్ దొడ్డబళ్లాపురం: కెంపేగౌడ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు 4 కేజీల బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుని వద్ద ఈ బంగారం పట్టుబడింది. ప్రయాణికుడు అంగీ లోపలి భాగంలో బంగారం దాచుకుని వెళ్తుండగా తనిఖీలలో దొరికిపోయాడు. ఈ బంగారం విలువ రూ.3.44 కోట్లుగా కస్టమ్స్ అధికారులు తెలిపారు. ప్రయాణికున్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రన్య రావుకు కస్టడీ సంచలనాత్మక బంగారం స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రన్య రావుకు బెంగళూరు కోర్టు మరో 3 రోజుల పాటు డీఆర్ఐ కస్టడీకి అనుమతించింది. సోమవారం రాత్రి ఆమె బెంగళూరు విమానాశ్రయంలో 14 కేజీలకు పైగా బంగారంతో దొరికిపోవడం తెలిసిందే. అప్పటినుంచి డీఆర్ఐ ప్రశ్నిస్తోంది. రన్యరావు దుబాయ్, మధ్య ఆసియా, యూరప్ దేశాలకు తరచూ ప్రయాణించేదని గుర్తించారు. ఎందుకు ఆ టూర్లు అనేది ఆరా తీస్తున్నారు. మరోవైపు విచారణలో ఉన్న ఆమె ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఆమె స్వల్పంగా గాయపడినట్లు అందులో ఉండడం కలకలం రేపుతోంది. గోల్డ్ స్మగ్లింగ్‌లో తనను ఇరికించారని చెప్పినట్లు తెలిసింది. -
రూపాయి రాక –పోక
బనశంకరి: బడ్జెట్లో ప్రభుత్వానికి ఆదాయం ఎక్కడ నుంచి వస్తుంది, ఏరంగానికి ఎంత ఖర్చు అనేది చూస్తే.. రూపాయి రాక రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం 52 పైసలు, రుణం కింద 27 పైసలు, కేంద్ర పన్నుల కింద 13 పైసలు, కేంద్ర ప్రభుత్వం సహాయ ధనం 4 పైసలు, పన్నేతర ఆదాయంతో 4 పైసలు సమకూరుతుంది. రూపాయి వ్యయం ● రుణాల చెల్లింపులకు 18 పైసలు, ఇతర సామాన్య సేవలు 18 పైసలు, సాంఘిక సంక్షేమం 15 పైసలు, ఇతర ఆర్థిక సేవలు 14 పైసలు, వ్యవసాయం, నీటిపారుదల, గ్రామీణాభివృద్ధి 14 పైసలు, విద్య 10 పైసలు, ఆరోగ్యం 5 పైసలు ఇతర సామాజికసేవలు 3 పైసలు, నీటి సరఫరా , పరిశుభ్రతకు 3 పైసలు ఖర్చవుతుంది. -
నీటికుంటలో మృత్యుఘోష
చింతామణి: ఓ పొలంలోని నీటి కుంటలో ముగ్గురు యువ రైతులు ప్రాణాలు కోల్పోయారు. కరెంటు వైర్లు తగిలి వీరు మరణించారు. ఎలా జరిగిందనేది మిస్టరీగా ఉంది. ఈ దారుణం చింతామణి రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలోని ముంతకదిరేనహళ్లి గ్రామ శివార్లలో శుక్రవారం జరిగింది. మృతులు ముత్తకదిరేనహళ్లికి చెందిన లోకేష్ (32), రమేష్ (28) శ్రీకాంత్ (26). వివరాలు.. లోకేష్ ఇతరుల పొలాన్ని గుత్తకు తీసుకొని వ్యవసాయం చేసుకొనేవాడు. పంటల కోసం సంపు తవ్వుకుని నీటిని నింపాడు. పక్కన కరెంటు బాక్స్, మోటారు ఉన్నాయి. ఆ నీటిలోకి లోకేష్ దిగినప్పుడు వైర్లు తగలడంతో షాక్‌తో అక్కడే మరణించాడు. అదే మాదిరిగా ఇద్దరు... ఏం జరిగిందోనని పక్క తోటలో పని చేస్తున్న రమే ష్, శ్రీకాంత్‌లు వచ్చి చూడగా వారికి కూడా షాక్ కొట్టి నీటి కుంటలో పడిపోయారు. సాయంత్రమైనా ఇళ్లకు రాకపోవడంతో వారి కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది కలిసి కుంటలో వెతకడంతో ముగ్గురి శవాలు బయటపడ్డాయి. కుటుంబ సభ్యలు రోదనలు ఆకాశానికంటాయి. డీఎస్పీ మురళీదర్, సీఐ శివకుమార తదితరులు పరిశీలించారు. జరిగిన ఘటనను చూసినవారెవరూ లేకపోవడంతో, ప్రమాదం జరిగిన తీరుపై అనేక సందేహాలు వస్తున్నాయి. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కరెంటు వైర్లు తగిలి ముగ్గురు యువ రైతుల మృతి మిస్టరీగా సంఘటన -
పంచ గ్యారెంటీలకు రూ.51,034 కోట్లు
శివాజీనగర: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఐదు గ్యారెంటీ పథకాలకు బడ్జెట్లో రూ.51,034 కోట్ల నిధులు కేటాయించారు. గత బడ్జెట్లో రూ.52,000 కోట్లు కేటాయింగా ఈ పర్యాయం కోత వేశారు. శక్తి పథకానికి రూ.5,300 కోట్లు, గృహలక్ష్మి పథకానికి రూ. 28,608 కోట్లు, గృహజ్యోతి పథకానికి రూ.10,100 కోట్లు కేటాయించారు. అన్న భాగ్య పథకం కింద 5 కే.జీ. ఆహార ధాన్యానికి బదులుగా ఇస్తున్న సహాయ ధనం స్థానంలో 5 కే.జీ. బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు. ఇందు కోసం రూ.6,500 కోట్లు కేటాయించారు. యువనిధి పథకం కింద 2.59 లక్షల మంది యువత పేర్లు నమోదు చేసుకోగా రూ.286 కోట్లు నగదు బదిలీ చేయనున్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వటానికి ఈ యువతకు ఇండస్ట్రీ లింకేజ్ సెల్ కింద నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. మొత్తానికి గ్యారెంటీలకు నిధులను కోత పెట్టడం విమర్శలకు దారితీసింది. భార్య వేధింపులు, వకీలు ఆత్మహత్య యశవంతపుర: భార్య పెట్టే వేధింపులను తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన కలబురగిలో జరిగింది. పట్టణంలోని మాణికేశ్వరి కాలనీలో నివాసం ఉంటున్న న్యాయవాది బసవరాజ బిరాదార (47) మృతుడు. అతని సోదరుని ఫిర్యాదు మేరకు భార్య గీతాపై ఆర్జీ నగర పోలీసులు కేసు నమోదు చేశారు. అత్తమామలు ఇదే ఇంట్లో ఉండరాదని గీతా తరచూ గొడవపడేది. దీంతో విడాకుల కోసం ఇటీవల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయినప్పటికీ భార్య పెట్టే హింసను భరించలేక బసవరాజు ఉరి వేసుకున్నాడు. వేశ్యావాటికపై దాడి కలబురగి పట్టణంలోని వీరేంద్రపాటీల్ లేఔట్లో ఒక ఇంటిలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలిసి పోలీసులు దాడి చేశారు. ముగ్గురు నిర్వాహకులను అరెస్టు చేసి, ఇద్దరు మహిళలను రక్షించారు. బెంగళూరు వర్సిటీకి మన్మోహన్ పేరు దొడ్డబళ్లాపురం: బెంగళూరు సిటీ యూనివర్సిటీకి మాజీ ప్రధాని దివంగత మన్మోహన్ సింగ్ పేరును నామకరణం చేస్తున్నట్లు సీఎం సిద్ధరామయ్య తెలిపారు. విధానసౌధలో బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయం తెలిపారు. యాంటీ నక్సల్ పోలీసు దళం రద్దు రాష్ట్రంలో నక్సలైట్లు పూర్తిగా అంతమయ్యారని, అందువల్ల యాంటీ నక్సలైటు పోలీసు దళాన్ని రద్దు చేస్తున్నట్టు సీఎం తెలిపారు. మావోయిస్టుల పునర్వసతి కోసం రూ.10 కోట్లు కేటాయించామన్నారు. తమ ప్రభుత్వంలో ఆరుమంది నక్సల్స్ లొంగిపోయారని తెలిపారు. నక్సల్స్ పీడిత ప్రదేశాల్లో సదుపాయాల కల్పనకు రూ.19 కోట్లు కేటాయించామన్నారు. -
సీఎం సతీమణికి ఉపశమనం
బనశంకరి: మైసూరు నగరంలో అక్రమంగా ముడా స్థలాలను తీసుకున్నారనే కేసులో ముఖ్యమంత్రి సిద్దరామయ్య భార్య పార్వతి కి ఈడీ జారీచేసిన సమన్లను హైకోర్టు రద్దుచేసింది. దీంతో సిద్దరామయ్య కుటుంబానికి పెద్ద ఊరట కలిగింది. విచారణకు రావాలన్న సమన్లను రద్దు చేయాలని పార్వతి, మంత్రి బైరతి సురేశ్ వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు వేశారు. శుక్రవారం విచారించిన హైకోర్టు న్యాయమూర్తి ఎం.నాగప్రసన్న.. ఈడీ సమన్లను రద్దు చేస్తూ ఆదేశాలిచ్చారు. ముడా నుంచి తీసుకున్న 14 స్థలాలను 2024 అక్టోబరు 1న పార్వతి వెనక్కి ఇచ్చేశారని, కాబట్టి ఈడీ విచారణ పరిధిలోకి రారని, అక్రమంగా సంపాదిస్తే మాత్రమే ఈడీ తనిఖీ చేయవచ్చునని ఆమె తరఫు న్యాయవాది వాదించారు. ఈ కేసుతో మంత్రి బైరతి సురేశ్‌కు ఎలాంటి సంబంధం లేదని ఆయన తరఫు వకీళ్లు వాదించారు. ఈడీ సమన్లు రద్దు చేసిన హైకోర్టు ముడా ప్లాట్ల కేసులో మలుపు బి రిపోర్టుపై కృష్ణ సవాల్ ముడా స్కాంలో సీఎం సిద్దరామయ్య కుటుంబానికి క్లీన్చిట్ ఇస్తూ లోకాయుక్త సమర్పించిన దర్యాప్తు నివేదిక మీద ఫిర్యాదుదారు స్నేహమయికృష్ణ ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో అభ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. ముడా కేసుతో సంబంధం లేదని సీఎం దంపతులు, బావమరిది, మరో ముగ్గురికి లోకాయుక్త ఇటీవల క్లీన్చిట్ ఇవ్వడం తెలిసిందే. నేరారోపణలకు సరైన సాక్ష్యాలు లేవంటూ కోర్టులో బీ రిపోర్ట్‌ను సమర్పించింది. ఇప్పుడు కృష్ణ అభ్యంతరం చెబుతూ బెంగళూరు ప్రజాప్రతినిధుల ప్రత్యే కోర్టులో 39 పేజీల అర్జీ వేశారు. -
No Headline
● అభివృద్ధి, సంక్షేమ మంత్రం ● రూ. 19 వేల కోట్ల రెవెన్యూ లోటు సాక్షి, బెంగళూరు: అందరూ ఎదురుచూసిన రాష్ట్ర 2025–26 ఆర్థిక ఏడాది బడ్జెట్‌ను ముఖ్యమంత్రి సిద్దరామయ్య శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించారు. రూ. 4.09 లక్షల కోట్ల రికార్డు మొత్తంతో బడ్జెట్ తయారైంది. అభివృద్ధి కార్యక్రమాలకు, అన్ని వర్గాలకు పెద్దపీట వేసినట్లు చెప్పారు. సీఎం బడ్జెట్‌ను తీసుకుని రాగానే అసెంబ్లీలో కోలాహలం నెలకొంది. ఎమ్మెల్యేలు, మంత్రులు స్వాగతం పలికి ఫోటోలు తీసుకున్నారు. సిద్దరామయ్య అసెంబ్లీలో సుమారు గంటన్నరపాటు పద్దును చదివి వినిపించారు. ఈ అంశాలకు పెద్దపీట ● బడ్జెట్లో రూ. 3,11,739 కోట్ల మేర రెవెన్యూ ఖర్చులు కాగా, రూ. 71,336 కోట్లు పెట్టుబడి ఖర్చులు, రూ. 26,474 కోట్లు రుణాల చెల్లింపులు ఉన్నాయి. రూ. 19,262 కోట్ల మేర ఆదాయ లోటు ఉన్నట్లు అంచనా వేశారు. ● సంక్షేమ కార్యక్రమం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి అంశం, అభివృద్ధి ఆధారిత, నగరాభివృద్ధికి ప్రాధాన్యం, పెట్టుబడులు, ఉద్యోగ కల్పన, సుపరిపాలన అనే ఆరు ప్రముఖ అంశాలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్లో కార్యక్రమాలను రూపొందించినట్లు తెలిపారు. ● ఈ ఏడాది రాష్ట్ర ఆర్థికాభివృద్ధి దేశ ఆర్థికాభివృద్ధి రేటు కంటే అధికంగా ఉందన్నారు. దేశ జీడీపీలో కర్ణాటక 8.4 శాతం మేర భాగస్వామ్యం ఉందన్నారు. దేశ ఆర్థికాభివృద్ధి 6.4 శాతంగా ఉంటే కర్ణాకట ఆర్థికాభివృద్ధి 7.4 శాతంగా ఉందని చెప్పారు. ఐటీ, బీటీ, టూరిజానికి కొత్త విధానం ఉద్యోగాల కల్పనలో ఆసరాగా ఉన్న చిన్నతరహా పరిశ్రమలు, పర్యాటకం, ఐటీ బీటీ రంగాల కోసం కొత్త విధి విధానాలను అమలు చేయబోతున్నట్లు చెప్పారు. దీనివల్ల రాష్ట్రంలోకి పెట్టుబడులు పెరుగుతాయని బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. సుపరిపాలనలో సాంకేతికతను వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగులకు కౌన్సిలింగ్ ద్వారా బదిలీ విధానాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. 12 వేల బోరుబావులు వ్యవసాయ భాగ్య పథకం కింద 12 వేల బోరుబావులను మంజూరు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. డ్రిప్, స్ప్రిక్లింగ్ విభాగాల కోసం రూ. 440 కోట్ల సహాయ ధనాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. విజయపుర జిల్లా ముద్దేబిహాలలో వ్యవసాయ పరిశోధన కేంద్రం, బెళగావి జిల్లా అథణిలో వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. మైసూరులో ఫిల్మ్ సిటీ జర్నలిస్టుల పెన్షన్‌ను 12 వేల నుంచి రూ. 15 వేలకు పెంచుతున్నట్లు తెలిపారు. మైసూరులో ప్రభుత్వమే రూ. 500 కోట్లతో ఫిల్మ్ సిటీ నిర్మాణం చేపట్టబోతున్నట్లు సీఎం తెలిపారు. రాష్ట్రంలోని మల్టిప్లెక్స్, అన్ని థియేటర్లలో టికెట్ ధరలు ఒకేరీతిలో ఉండేలా, రూ. 200 కు మించకుండా ఉండేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధరలు ఒకేలా ఉంటాయి. -
విద్యాశాఖకు అధికం
● వ్యవసాయానికి స్వల్పం బనశంకరి: 2025– 26వ బడ్జెట్ సైజు రూ.4,09,549 కోట్లు. గత ఏడాది బడ్జెట్ రూ.3,71,383 కోట్లుగా ఉండింది. ప్రతి ఏటా బడ్జెట్ పరిమాణం పెరుగుతూ వస్తోంది. యథా ప్రకారం విద్యాశాఖకు అధిక కేటాయింపులు జరిగాయి. రైతాంగాన్ని నిరుత్సాహ పరుస్తూ తక్కువ కేటాయింపులు చేయడం గమనార్హం. రైతుల కోసం గణనీయమైన పథకాలను ఏవీ ప్రకటించలేదు. వివిధ శాఖలకు కేటాయించిన నిధులు (రూ.కోట్లలో) ● విద్యా శాఖ రూ.45,286 ● మహిళ, శిశు సంక్షేమ శాఖ రూ.34,955 ● విద్యుత్ రూ.26,896 ● గ్రామీణాభివృద్ధి శాఖ రూ.26,735 ● నీరావరి నీటిపారుదల శాఖ రూ.22181 ● నగరాభివృద్ధి, వసతి శాఖ రూ.21,405 ● పరిపాలన, రవాణా శాఖ రూ.20,625 ● ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ రూ.17,473 ● రెవెన్యూ శాఖ రూ.17,201 ● సాంఘిక సంక్షేమ శాఖ రూ.16,955 ● ప్రజాపనుల శాఖ రూ.11,841 ● ఆహారశాఖ రూ.8,275 ● వ్యవసాయ ఉద్యానవనశాఖ రూ.7,145 ● పశు సంవర్ధక, మత్య్సశాఖ రూ.3,977 ● ఇతరత్రా.. రూ.1,49,857 -
బెంగళూరుకు నిధుల వరద
బెంగళూరులో సిగ్నల్ రహిత రహదారుల అభివృద్ధి బనశంకరి: సీఎం సిద్దరామయ్య బడ్జెట్లో రాజధాని బెంగళూరు నగరానికి దండిగానే నిధులు కేటాయించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి గుండెకాయ లాంటి బెంగళూరులో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చినట్లు ప్రకటించారు. ప్రతి ఏటా నగరానికి అందించే రూ.3 వేల కోట్ల నిధులను ఈ ఏడాది రూ.7 వేల కోట్లకు పెంచారు. ఈ నిధులతో బీబీఎంపీ పరిధిలో అభివృద్ధి పనులు ప్రాధాన్యత ప్రకారం చేపట్టడానికి కొత్తగా ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు. ● బీబీఎంపీ కి రూ.40 వేల కోట్ల వ్యయంతో ఉత్తర–దక్షిణ, తూర్పు–పశ్చిమ సొరంగ మార్గం కారిడార్లను చేపట్టడానికి అనుకూలమయ్యేలా రూ.19 వేల కోట్ల గ్యారంటీని ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ● ట్రాఫిక్ రద్దీ నివారణ, సజావుగా రాకపోకల కోసం నగరంలోని ప్రధాన రోడ్లను సిగ్నల్ రహితం చేసేలా చర్యలు ● నమ్మమెట్రో మూడో దశ–3లో రూ.8,916 కోట్ల వ్యయంతో 40–50 కిలోమీటర్ల మేర మార్గాల నిర్మాణం. రానున్న రెండేళ్లలో మొత్తం 98.60 కిలోమీటర్లు అదనపు మార్గాలను నిర్మించడం లక్ష్యం. మెట్రోను దేవనహళ్లికి విస్తరణ. ● రాజకాలువల మిగులు స్థలాలను ఉపయోగించుకుని రూ.3 వేల కోట్ల వ్యయంతో 300 కిలోమీటర్లు అదనపు రోడ్లను అభివృద్ది చేయడం ● నగరంలో 460 కిలోమీటర్ల ఆర్టీరియల్, సబ్ ఆర్టీరియల్ రోడ్లను రూ.660 కోట్ల వ్యయంతో అభివృద్ధి ● 120 కిలోమీటర్ల పొడవుతో ఫ్లై ఓవర్, గ్రేడ్ సెపరేటర్ల నిర్మాణం. బ్రాండ్ బెంగళూరు పథకాలకు రూ.1,800 కోట్లు. ఆరోగ్య బెంగళూరు కోసం రానున్న మూడేళ్లలో రూ.413 కోట్లతో పథకాలు ● వరద ముంపు తప్పించడానికి భూగర్భ డ్రైనేజీ, ఎస్టీపీలను నిర్మించడానికి బీబీఎంపీ, బీడబ్ల్యూఎస్ఎస్బీ కి రూ.3 వేల కోట్ల ఆర్థిక సాయం ● కావేరి 5 వ స్టేజ్ ద్వారా బెంగళూరు చుట్టుపక్కల 110 గ్రామాల్లో నివసించే 50 లక్షల నివాసులకు జలం అందించడం ● బ్రాండ్ బెంగళూరు –హసిరు బెంగళూరు కింద రూ.35 కోట్ల వ్యయంతో 14 చెరువుల ప్రగతి. రూ 234 కోట్లతో వర్తూరు, బెల్లందూరు చెరువులు పునరుజ్జీవనం. ● ఇక బెంగళూరులో ఆస్తిపన్ను వసూలులో నూతన చర్యల ద్వారా వసూళ్లు గణనీయంగా పెరిగాయి. ఆన్లైన్ ద్వారా ఈ–ఖాతా వ్యవస్థకు మంచి స్పందన వస్తోంది. 2024–25లో రూ.4,556 కోట్ల ఆస్తి పన్ను వసూలు. ఏడాదికి రూ.7500 కోట్ల ఆస్తి పన్నును రాబట్టాలని అంచనా వేస్తున్నట్లు సీఎం తెలిపారు.సొరంగ మార్గం మీద సర్కారు దృష్టి ఏటా ఇచ్చే నిధులు రూ.7 వేల కోట్లకు పెంపు సొరంగ మార్గానికి రూ.19 వేల కోట్ల గ్యారంటీ మెట్రో రైలు విస్తరణ పథకాలు మరిన్ని ప్రాంతాలకు కావేరి జలాలు బడ్జెట్లో కేటాయింపులు -
రన్యారావుకు ఏమైంది.. వైరల్ గా మారిన ఫోటో..!
న్యూఢిల్లీ: బంగారం స్మగ్మింగ్ కేసులో భాగంగా ప్రస్తుతం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) కస్టడీలో ఉన్న కన్నడ నటి రన్యారావుకు చెందిన తాజా ఫోటో వైరల్ గా మారింది. ఆమె కంటి కింద గాయాలు, ఉబికిన మొహంతో ఆమె ఫోటోలో ఉంది. ఆమెను కస్టడీలో తీసుకుని విచారణ పేరుతో చిత్ర హింసలు పెట్టారా? అనే అనుమానం కలుగుతోంది. దీనిపై కర్ణాకట మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధానంగా వైరల్ గా మారిన ఫోటోను ఉటంకిస్తూ మహిళా కమిషన్ చైర్మన్ నాగలక్ష్మీ చౌదరి అనుమానం వ్యక్తం చేశారు. ఆమెపై అధికారులు దాడికి పాల్పడ్డారా? అనే ప్రశ్న లేవనెత్తారు. అయితే దీనిపై తాము నేరుగా దర్యాప్తు చేసే అవకాశం లేదన్నారు. రన్యారావు తముకు ఏమైనా ఫిర్యాదు చేస్తే ఆమెకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు నాగలక్ష్మి,‘ మాకు ఆమె లేఖ రూపంలో ఫిర్యాదు చేస్తే మేము సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆమె నుంచి ఫిర్యాదు అందిన పక్షంలో తమ పరిధిలో ఉన్న ఆయా విభాగాలను అప్రమత్తం చేస్తాం. సరైన రీతిలో దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఆమె ఏమైనా దాడికి గురయ్యిందా అనేది ఆమె ఫిర్యాదు రూపంలో ఇస్తేనే మేము ఏమైనా చేయగలం. ఒకవేళ ఆమె మమ్మల్ని సంప్రదించకపోతే దీనిపై కనీసం కామెంట్ కూడా చేయలేం’ అని మహిళా కమిషన్ చైర్ పర్సన్ నాగలక్ష్మి పేర్కొన్నారు.కాగా, విదేశాల నుంచి బంగారు కడ్డీలను తరలిస్తూ పట్టుబడ్డ కన్నడ నటి రన్యారావు.. తాను అమాయకరాలునని అంటోంది. తాను ట్రాప్ లో పడ్డానని, కావాలని ఇలా అక్రమంగా బంగారు కడ్డీలను తరలించలేదని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్((DRI)అధికారుల ముందు బోరుమంది.తాను నేరం చేసినట్లు ఒప్పుకుంటూనే, ఇది తాను కావాల్సి చేసిన పని కాదని అధికారుల ముందు చెప్పినట్లు తెలుస్తోంది. డీఆర్ఐ అధికారుల తాజా విచారణలో తాను దుబాయ్ తో పాటు, యూరప్, అమెరికా, మిగతా మిడిల్ ఈస్ట్ దేశాలను తిరిగి వచ్చినట్లు పేర్కొంది.ప్రస్తుతం డీఆర్ఐ విచారణ ఎదుర్కొంటున్న క్రమంలో రన్యారావుకు చెందిన ఎలక్ట్రానిక్స్ పరికరాలను అధికారాలు ముందుగా సీజ్ చేశారు. మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్ తదితర వస్తువుల్ని డీఆర్ఐ అధికారులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆమెకు ఎవరితో లింకులు ఉన్నాయనే కోణాన్ని కూడా పరిశీలిస్తున్నారు. 2024 నుంచి ఆమె జరిపిన ఫైనాన్షియల్ వ్యవహారాలపై కూడా ఆరా తీస్తున్నారు. అసలు ఈ రాకెట్ వెనుక మాస్టర్ మైండ్స్ ఎవరు అనే కోణంలో ప్రధానంగా దర్యాప్తు సాగుతోంది.కాగా, గత సోమవారం 12 కేజీలకు పైగా బంగారం కడ్డీలను తన బెల్ట్ లో పెట్టుకుని దుబాయ్ నుంచి అక్రమంగా తరలిస్తూ రన్యారావు పట్టుబడిన సంగతి తెలిసిందే. బెంగూళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆమె అధికారులకు చిక్కింది. ప్రస్తుతం ఆమె మూడు రోజుల డీఆర్ఐ అధికారుల కస్టడీలో ఉంది. దీనిలో భాగంగా ఆమెను విచారిస్తున్న అధికారులు ఇందులో ‘కింగ్ పిన్’ ఎవరు అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు.రన్యారావు కేసు.. వెలుగులోకి కొత్త విషయాలు -
నటి రన్యా రావు కేసు.. తండ్రి కూడా 'తేడా'నే!
విదేశాల నుంచి బంగారం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డిన కన్నడ నటి రన్యా రావు (Kannada Actor Ranya Rao) కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చాన్నాళ్లుగా ఆమె ఈ దందా సాగిస్తున్నట్టుగా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బంగారం అక్రమ రవాణాలో ఆమె కేవలం పాత్రధారి మాత్రమేనని సూత్రధారులు వేరే ఉన్నారని అనుమానిస్తున్నారు. రాజకీయ నేతల హస్తం కూడా ఉండొచ్చన్న వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వ్యవహారంలో ఎవరు ఉన్నా వదిలిపెట్టబోమని కర్ణాటక ప్రభుత్వం చెబుతోంది. పోలీసుల దర్యాప్తులో ఎవరి పేర్లు వెలుగులోకి వస్తాయోనని అందరూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.సవతి తండ్రిపైనా ఆరోపణలు రన్యా రావు అరెస్ట్ ఘటనలో తనకేం సంబంధం లేదని స్పష్టంచేసిన ఆమె సవతి తండ్రి కె.రామచంద్రరావు పైనా గతంలో ఆరోపణలున్నట్లు తాజాగా మీడియాలో వార్తలొచ్చాయి. ఐపీఎస్ అధికారి (IPS Officer) అయిన రామచంద్రరావు ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(కర్ణాటక రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్)గా సేవలందిస్తున్నారు. 2014లో మైసూరు సదరన్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పదవిలో ఉన్నప్పుడు హవాలా కేసులో ఈయన పాత్ర ఉందని ఆనాడు ఆరోపణలు వచ్చాయి.మైసూరులోని యెల్వాల్ నుంచి కేరళకు వెళ్తున్న బస్సును అడ్డగించిన పోలీసులు అందులోంచి రూ.20 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలొచ్చాయి. అయితే వాస్తవానికి ఆ బస్సు నుంచి రూ.2.07 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకుని రూ.20లక్షలు మినహా మిగతా కరెన్సీ పంచుకున్నారని ఒక వ్యాపారి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఉదంతంపై కేసు నమోదైంది. బస్సు వెళ్తున్న మార్గం వివరాలను వెల్లడించిన పోలీస్ ఇన్‌ఫార్మర్లతోపాటు రామచంద్రరావు వ్యక్తిగత గన్‌మెన్‌ను అరెస్ట్‌చేశారు. దీంతో రామచంద్రరావును ఈ పోస్ట్ నుంచి తప్పించి హెడ్‌క్వార్టర్స్‌కు ట్రాన్స్ఫర్చేశారు.తర్వాత రెండేళ్లకు మరో కేసులోనూ రామచంద్రరావు పేరు ప్రముఖంగా వినిపించింది. గ్యాంగ్స్టర్లు ధర్మరాజ్, గంగాధర్‌ల నకిలీ ఎన్కౌంటర్ కేసు (Fake Encounter Case)లో రామంచంద్రరావును సీఐడీ అధికారులు ప్రశ్నించారు.చదవండి: రన్యా రావు నాలుగు నెలలుగా ఇంటికి రాలేదు రన్యా రావుకు 3 రోజుల కస్టడీకర్ణాటకలోని బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం రాత్రి రూ.12.56 కోట్ల విలువైన బంగారు కడ్డీలు తెస్తూ రన్యా రావు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఆమెను మూడు రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) చేసిన విజ్ఞప్తిని ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు శుక్రవారం అనుమతించింది. -
చెల్లెలితో అన్న శారీరక సంబంధం
యశవంతపుర(కర్ణాటక): చెల్లెలితో అన్న శారీరకంగా కలవటంతో( sister) బిడ్డకు జన్మనిచ్చిన ఘటన ఉత్తర కన్నడ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ముండగోడ తాలూకా కుందర్గి గ్రామంలో ఈ ఘటన జరిగింది. అదే గ్రామానికి చెందిన 19 సంవత్సరాల వయసున్న యువకుడు 10వ తరగతి చదువుతున్న చెల్లెలు యల్లాపురలోని బంధువుల ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో యువకుడు తన చెల్లిని రెచ్చగొట్టి శారీరకంగా కలిసినట్లు పోలీసు విచారణలో బయట పడింది. అన్నతో 9 నెలల క్రితం శారీరకంగా కలిసినట్లు బాధితురాలు వైద్యులకు సమాచారం ఇచ్చింది. బడికి వెళుతున్న కూతురు ఒక్కసారిగా ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. జన్మనిచ్చిన శిశువులో ఆరోగ్య సమస్యలు ఉన్న కారణంగా మెరుగైన చికిత్స కోసం కారవార జిల్లా ఆస్పత్రికి తరలించారు. 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యయశవంతపుర: పదో తరగతి చదువుతున్న విద్యార్థిని అత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తరకన్నడ జిల్లా కారవారలో జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతూ బాలికల హాస్టల్లో ఉంటున్న విద్యార్థిని అక్కడే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తండ్రి లేని కారణంగా బాలిక బాలమందిరంలో చదువుకుంటోంది. ఆమె గదిలో ఒక్కరే ఉన్నప్పుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలాన్ని కారవార పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. -
డబ్బు ఇస్తేనే తల్లికి అంత్యక్రియలు
బెంగళూరు: తల్లి చనిపోయిందనే బాధ కూడా వారికి లేదు. తమ వాటా డబ్బు ఇస్తేనే అంత్యక్రియలకు అంగీకరిస్తామని కర్కోటక కుమారులు అమానుషంగా వ్యవహరించారు. దీంతో మృతురాలి కుమార్తెల బిడ్డలు తమ అవ్వ మృతదేహాన్ని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. తహసీల్దార్ జోక్యంతో అంత్యక్రియలు జరిగాయి. ఈ ఉదంతం చిక్కబళ్లాపురం జిల్లా గౌరిబిదనూరు తాలూకాలోని దొడ్డకురుగోడులో జరిగింది. గ్రామానికి చెందిన అనంతక్కకు నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు.భర్త మృతితో అనంతక్క మధుగిరి తాలూకా కడగత్తూరులో ఉన్న కుమార్తెల వద్ద ఉంటోంది. భర్తద్వారా ఆమెకు సంక్రమించిన భూమిని ప్రభుత్వం పరిశ్రమల కోసం సేకరించి రూ.93 లక్షలు అందజేసింది. ఆ మొత్తంలో 40 లక్షలు కుమార్తెలు తీసుకున్నారు. ఈక్రమంలో వృద్ధాప్యం కారణంగా అనంతక్క మంగళవారం తన కుమార్తె ఇంటిలోనే మృతి చెందింది. భర్త సమాధి పక్కనే తనను ఖననం చేయాలని అనంతక్క గతంలోనే కుమార్తెకు తెలియజేసింది.దీంతో మృతదేహాన్ని దొడ్డకురుగోడుకు తీసుకురాగా కుమారులు అడ్డుకున్నారు. తల్లి నుంచి కుమార్తెలు తీసుకున్న రూ.40లక్షలు తిరిగి ఇస్తేనే అంత్యక్రియలకు సహకరిస్తామని మొండికేశారు. దీంతో అనంతక్క మృతదేహాన్ని కుమార్తెలు, మనువరాండ్రు పోలీస్‌స్టేషన్ వద్దకు తీసుకెళ్లారు. రాత్రంతా మృతదేహం అక్కడే ఉంది. బుధవారం ఉదయం తహసీల్దార్ మహేపత్రి స్పందించి అనంతక్క కుమారులను పిలిపించి సర్ది చెప్పారు. అనంతరం మృతదేహాన్ని దొడ్డకురుగోడుకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. -
రన్యారావ్ పాత్రధారి మాత్రమే
బనశంకరి: బంగారం అక్రమ రవాణా కేసులో పట్టుబడిన నటి రన్యారావ్ కేసు కీలక మలుపు తిరిగింది. కిలో బంగారం రవాణాకు రన్యారావ్‌కు రూ.5 లక్షల కమీషన్ అందిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నటి పాత్రధారి కాగా అసలైన సూత్రధారి వేరే వ్యక్తి అని తెలిసింది. నటి రన్యారావ్‌ను డీఆర్ఏ అధికారులు తీవ్ర విచారణ చేపట్టగా నేను పాత్రధారి మాత్రమే అని, అసలు వ్యక్తి వేరేవారని తెలిపింది. రూ.17 కోట్లు విలువ చేసే బంగారం కొనుగోలు చేసే శ్రీమంతురాలు కాదు. ఈమె సీనియర్ పోలీస్ అధికారి పెంపుడు కూతురు కావడంతో ఆమెను ఈ దందాకు వాడుకుంటే చాలా సులభంగా బంగారం రవాణా చేయవచ్చనే అంచనాతో నటి రన్యారావ్‌ను బంగారం రవాణాకు వాడుకున్నారు. అక్రమ బంగారం రవాణాలో విమానాశ్రయంలోని కొందరు అధికారులు కూడా కుమ్మక్కైనట్లు అనుమానం వ్యక్తమైంది.డీఆర్ఐ అధికారులు ఈ కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు. బంగారం రవాణాలో రన్యారావ్‌కు రూ.4 లక్ష లనుంచి రూ.5 లక్షలు కమీషన్ ఇస్తున్నట్లు తెలిసింది. రన్యారావ్ బెంగళూరుకు తీసుకువచ్చిన బంగారం ఎవరికి ఇస్తుంది అనేదానిపై అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. గత రెండేళ్లుగా రన్యారావ్ వాడుతున్న బ్యాంక్ అకౌంట్ మొబైల్‌ను అదికారులు స్వా«దీనం చేసుకున్నారు. డీఆర్ఐ అధికారులు అసలు సూత్రధారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. వీడియో: కర్ణాటకలో దారుణం.. పెళ్లి పేరుతో మైనర్‌ను బలవంతంగా లాక్కెళ్లి.. -
వీడియో: కర్ణాటకలో దారుణం.. పెళ్లి పేరుతో మైనర్‌ను బలవంతంగా లాక్కెళ్లి..
బెంగళూరు: మన దేశంలో బాల్య వివాహాలపై ఎన్ని చట్టాల తెస్తున్నా ఎక్కడో ఒక చోట మైనర్లకు బలవంతపు పెళ్లిళ్లు చేస్తూనే ఉన్నారు. మైనర్లకు ఇష్టం లేని పెళ్లిళ్లు చేసి వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే కర్ణాటకలో చోటుచేసుకుంది. ఓ 14 ఏళ్ల బాలికకు పెళ్లి చేసి, ఆమెను బలవంతంగా కాపురానికి పంపే ప్రయత్నంలో ఒక పశువును లాక్కెళ్లినట్లు లాక్కెళ్లారు. భార్యను ఆమెను ఎత్తుకుని పరుగు తీశాడు. దీంతో, అక్కడున్న వారు.. ఆమెను కిడ్నాప్ చేశారని అనుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల ప్రకారం..తమిళనాడులోని హోసూర్ సమీపంలోని తొట్టమంజు పర్వత ప్రాంతంలోని తిమ్మత్తూర్ అనే చిన్న గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలిక.. స్థానిక పాఠశాలలో ఏడో తరగతి వరకు చదివి, ఆ తర్వాతి ఇంటి వద్దే ఉంటోంది. ఈ క్రమంలో ఆమెకు పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు భావించి.. కర్ణాటకలోని కాలికుట్టై పర్వత గ్రామానికి చెందిన మాదేష్(29)తో వివాహం జరిపించారు. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని ఎంత చెప్పినా తల్లిదండ్రులు పట్టించుకోలేదు. ఇక, ఇటీవలే వీరి వివాహం బెంగళూరులో జరిగింది. అనంతరం, సదరు బాలిక తన స్వగ్రామానికి వచ్చేసింది. ఈ క్రమంలో అత్తారింటికి వెళ్లేందుకు నిరాకరించింది."என்னை விடுங்க.." உயிரை வெறுத்து கதறிய சிறுமி.. குண்டுக்கட்டாக தூக்கி சென்ற இளைஞர் - ஷாக்கிங் வீடியோ#childmarriage #hosur #thanthitv pic.twitter.com/lheSh1UjZ8— Thanthi TV (@ThanthiTV) March 6, 2025అయితే, పెళ్లి తర్వాత అత్తారింటికి వెళ్లాలని పేరెంట్స్.. ఆమెకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఆమె వినలేదు. దీంతో, భర్త మాదేష్, అతడి కుటుంబ సభ్యులు బాలిక ఇంటి వచ్చారు. బలవంతంగా ఆమెను తమ ఇంటికి తీసుకెళ్లారు. ఓ గొర్రె పిల్లను బలవంతంగా బలికి తీసుకెళ్లినట్లు ఎత్తుకెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఆమె కేకలు వేస్తూ కన్నీరు పెట్టుకుంది. ఈ దృశ్యాలను కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. మరికొందరు ఆమెకు కిడ్నాప్ చేస్తున్నారని అనుకున్నారు. ఈ వీడియో పోలీసులకు చేరడంతో వారిపై పోక్సో చట్టం, బాల్య వివాహ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇక, బాధితురాలు ప్రస్తుతం తన అమ్మమ్మ ఇంట్లో ఉంటోంది. -
జుట్టు దొంగలు
బెంగళూరు: రాత్రిళ్లు వజ్రాభరణాల దుకాణాలు, ఏటీఎంలను కొల్లగొట్టి దొంగలు కోట్ల విలువైన నగదు, బంగారాన్ని కొట్టేసే ఘటనలు రోజు ఏదో ఒక రాష్ట్రంలో చూస్తున్నే ఉన్నాం. కానీ ఈసారి కొందరు దొంగలు తమ చోరకళలో వైవిధ్యం ప్రదర్శించారు. బంగారం కొట్టేస్తే దానిని నగదుగా, ఒక వేళ నగదును కొట్టేస్తే నేరుగా వాడుకునే వెసులుబాటు దొంగలకు ఉంది. కానీ చోరీ చేసిన దానిని వెంటనే నగదుగా వాడుకునే అవకాశం లేకపోయినా సరే కొందరు దొంగలు జుట్టుపై కన్నేశారు. జుట్టుపై అంటే వ్యక్తుల తలపై ఉండే జుట్టుపై కాదు. అప్పటికే మొక్కు రూపంలోనో, మరేదైనా కారణంగానో తలనీలాలను కత్తిరించగా వాటిని సేకరించిన ఓ వ్యాపారి తన గిడ్డంగిలో భద్రపరిచగా దానిని దొంగలు చోరీచేసి ఎత్తుకుపోయారు. కిలోల కొద్దీ జుట్టును చోరశిఖామణులు కొట్టేసిన ఘటన కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది. దాదాపు రూ.90 లక్షల నుంచి రూ.1 కోటి విలువైన జుట్టును కొట్టేసిన వార్త తెలిసి ఆ గోడౌన్ యజమాని లబోదిబోమని ఏడ్వడంతో జుట్టు దోపిడీ వార్త ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చోరీ విషయం తెల్సి పోలీసులు భారతీయ న్యాయసంహిత చట్టాల కింద కేసు నమోదుచేసి దర్యాప్తు మొదలెట్టారు. తెలిసిన వ్యక్తుల పనేనా? కోటి విలువైన సరుకు ఉందన్న పక్కా సమాచారంతోనే దొంగలు చోరీకి తెగబడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల చైనా నుంచి వచి్చన ఒక వ్యాపారి ఈ జుట్టును సరిచూసుకుని మార్కింగ్ వేసి మరీ వెళ్లారని యజమాని వెంకటస్వామి పోలీసులకు చెప్పారు. ఫిబ్రవరి 28 అర్ధరాత్రి పెద్దకారులో వచ్చిన ఆరుగురు దొంగలు వెంట తెచ్చుకున్న ఇనుపరాడ్లతో గోడౌన్ షట్టర్‌ను పగలగొట్టి తెరచి 27 సంచులను ఒక్కోటి ఎత్తుకెళ్లడం మొదలెట్టారు. ఇది గమనించిన సమీపంలోని ఓ వ్యక్తి ఆరాతీయగా ‘‘ఈ సరుకుంతా మాదే. వేరే చోటుకు తరలిస్తున్నాం’’అని దొంగలు తెలుగులో ఏమాత్రం అనుమానంరాని రీతిలో అతనికి చెప్పారని పోలీసులు తెలిపారు. హడావిడిగా కారులోకి ఎక్కించడం, జుట్టు రోడ్డపై చెల్లాచెదురుగా పడటం గమనించిన మరో వ్యక్తి వెంటనే హెల్ప్‌లైన్ 112కు ఫోన్‌చేసి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకోగా అప్పటికే దొంగలు ఉడాయించారు. లక్ష్మీపుర క్రాస్ ప్రాంతంలో కేశాల వ్యాపారులు ఎక్కువ. ఈ సరకు విషయం తెల్సిన వ్యక్తులే ఈ దొంగతనం చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అంతర్రాష్ట కేశాల వ్యాపారంలో ఉన్న వ్యక్తుల హస్తం ఈ చోరీలో ఉండొచ్చనే అనుమానాలు పోలీసులు వ్యక్తంచేశారు. 850 కేజీల జుట్టు ఉత్తర బెంగళూరు ప్రాంతానికి చెందిన 73 ఏళ్ల కె.వెంకటస్వామి అనే వ్యాపా రి తన గోడౌన్‌ను హెబ్బళ్ ప్రాంతం నుంచి లక్ష్మీపుర క్రాస్ అనే ప్రాంతానికి ఫి బ్రవరి 12వ తేదీన మార్చారు. ఇతను కే శాల వ్యాపారం చేస్తుంటారు. కడప, శ్రీ కాకుళం ఇలా ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లాల్లో ఊరూరు తిరిగి జనం దగ్గర జుట్టును కొందరు వ్యక్తులు డబ్బులకు సేకరించిన ఏజెంట్లకు విక్రయిస్తారు. ఆ ఏజెంట్లను జుట్టును వెంకటస్వామి వంటి వ్యాపారులకు విక్రయిస్తారు. అలా తన వద్దకు వచి్చన జుట్టును వెంకటస్వామి హైదరాబాద్‌లోని ఒక వ్యాపారికి విక్రయిస్తారు. ఆ వ్యాపారి బర్మాకు ఎగు మతి చేస్తారు. అది ఆ తర్వాత చైనాకు తరలిపోతుంది. అక్కడ అత్యంత నాణ్యమైన విగ్గులను తయారుచేస్తారు. భారతీయుల జుట్టుతో తయారైన విగ్గులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. అంతటి విలువైన 850 కేజీల జుట్టును ఏజెంట్ల నుంచి కొనుగోలు చేసి వెంకటస్వామి తన గోడౌన్లో 27 సంచుల్లో భద్రపరిచారు. -
వెన్నుపాము గాయానికి చికిత్స ముఖ్యం
హొసపేటె: వెన్నుపాము గాయం, వెన్నెముక క్షీణత లక్షణాలు గుర్తిస్తే వైద్యుడి నుంచి తగిన చికిత్స పొందాలని జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ అధికారి డాక్టర్ శంకర్ నాయక్ తెలిపారు. నగరంలోని తాలూకా ఆరోగ్య అధికారి కార్యాలయం ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన వెన్నుపాము గాయం, నిర్వహణ శిబిరాన్ని బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. మనిషి వీపులో నుంచి మెదడు నుంచి మలద్వారం వరకు మొత్తం 33 నోడ్లు ఉంటాయి. మధ్యలో తాడులాగా నడిచే నొప్పిని మనం వెన్నుపాము అంటాము. ఈ ఎముకల మధ్యలో రెండు ముఖ్యమైన ఇంద్రియ, మోటారు నరాలుంటాయి. ఇవి మెదడు నుంచి శరీరంలోని అన్ని భాగాలకు సందేశాలను ప్రసారం చేయడంలో, స్వీకరించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ నరాలకు సంభవించే ప్రమాదవశాత్తు సంఘటనల వల్ల, క్షయవ్యాధి వల్ల వెన్నుపాము దెబ్బతిన్నపుడు ఒక వ్యక్తి దిగువ శరీరం అన్ని విధులు ఆగిపోతాయి. దీనితో బాధపడేవారు మానసిక ఒత్తిడి లేదా బెడ్ సోర్స్, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లు, కీళ్ల వాపు, మలబద్ధకంతో బాధపడవచ్చు. ఈ శిబిరం లక్ష్యం వ్యాధి లక్షణాల గురించి, వెన్నుపాము గాయాలు ఉన్నవారికి అవసరమైన సంరక్షణ, వైద్య నిర్వహణ గురించి అవగాహన పెంచడం విజయనగర జిల్లాలో ఈ వ్యాధి బారిన పడిన రోగులకు ది అసోసియేషన్ ఆఫ్ పీపుల్ విత్ డిసేబిలిటీ సహకారంతో ఉచిత చికిత్స అందించి వారికి మెరుగైన భవిష్యత్తు కల్పించాలన్నారు. చికిత్స ఎటువంటి సమస్యలు లేకుండా విజయవంతంగా నిర్వహించారు. చాలా మంది ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నందున ఈ సంస్థ సామాజిక సేవల ద్వారా ఉచిత చికిత్సను అందిస్తుందని ఆయన తెలిపారు. వెన్నుపాము గాయాలు ఉన్నవారు వారి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈసందర్భంగా జిల్లా విద్యా ఆరోగ్య అధికారి దొడ్డమని తదితరులు పాల్గొన్నారు. డీహెచ్ఓ డాక్టర్ శంకర్ నాయక్ -
కారు బోల్తా... ఐదుగురికి గాయాలు
హొసపేటె: కొప్పళ జిల్లా గంగావతి తాలూకాలోని టోల్గేట్ దగ్గర కారు బోల్తా పడిన ఘటన గురువారం జరిగింది. ఓ ఇంట్లో అర్చకులు విధులు నిర్వహించి కారులో తమ స్వగ్రామానికి తిరిగి వెళుతున్న సమయంలో కారు అదుపు తప్పి పక్కనే ఉన్న పొలంలోకి బోల్తా పడింది. ప్రమాద సమయంలో కారులో ముగ్గురు పూజారులు, సహాయకుడు, డ్రైవర్ ఉన్నారు. ఈఘటనలో డ్రైవర్‌తో సహా ఐదుగురికి స్వల్ప గాయాలు కాగా అదృష్టవశాత్తు అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం సింధనూరు ఆస్పత్రిలో చేర్పించారు. ఎడమ కాలువకు ఏప్రిల్ వరకు నీరందించండిరాయచూరు రూరల్: తుంగభద్ర ఎడమ కాలువ, నారాయణపుర కుడి కాలువ ఆయకట్టు చివరి భూములకు ఏప్రిల్ నెలాఖరు వరకు నీరందివ్వాలని కర్ణాటక రైతు సంఘం జిల్లాధ్యక్షుడు శివపుత్ర పాటిల్ డిమాండ్ చేశారు. గురువారం జిల్లాధికారి కార్యాలయం వద్ద ఆయన ఆందోళన చేపట్టి మాట్లాడారు. ఎడమ కాలువకు మార్చి 31 వరకు నీరు వదలడానికి అధికారులు సమావేశంలో తీసుకున్న నిర్ణయంతో చేతికొచ్చిన పంట నోటికందకుండా పోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటి నిర్వహణలో గేజ్ నిర్వహణ, సామర్థ్యాన్ని బట్టి ఆయకట్టు భూములకు నీరందేలా అధికారులు జాగ్రత్తలు పాటించడం లేదన్నారు. నీరు అందించడానికి శాశ్వత పరిష్కారం చేపట్టడంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు ముందుకు రావాలన్నారు. తుంగభద్ర ఎడమ కాలువ ఆయకట్టులో చివరి భూములకు ఏప్రిల్ వరకు నీరందివ్వాలని కోరుతూ అదనపు జిల్లాధికారి శివానందకు వినతిపత్రం సమర్పించారు. గ్రామ పంచాయతీ అధ్యక్ష ఎన్నిక ఏకగ్రీవం శ్రీనివాసపురం : తాలూకాలోని రోణూరు గ్రామ పంచాయతీ నూతన అధ్యక్షురాలిగా ఆర్ ప్రమీలమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పదవికి బుధవారం ఎన్నిక జరిగింది. ప్రమీలమ్మ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి కేసీ మంజునాథ్ ప్రకటించారు. నూతన అధ్యక్షురాలు మాట్లాడుతూ సభ్యులందరి సహకారంతో పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తానని తెలిపారు. సమాజంలో మహిళలకు ప్రత్యేక స్థానం కోలారు: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కోలారు నగరంలోని పీసీ కాలనీలో ఉన్న తపాలా సూపరింటెండెంట్ కార్యాలయంలో పనిచేస్తున్న 45 మంది మహిళా సిబ్బందిని బుధవారం ఘనంగా సన్మానించారు. అనంతరం బ్యాడ్మింటన్, చెస్ పోటీలు నిర్వహించి విజేతలైన మహిళలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సూపరింటెండెంట్ వీఎస్ఎల్ నరసింహరావ్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. సమాజంలో మహిళలకు ప్రత్యేక స్థానం ఉందని, వారిని తగిన విధంగా గౌరవించాల్సి ఉందన్నారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారుల పర్యటన కోలారు : కోలారు జిల్లాలో కేసీ వ్యాలీ నీరు ప్రవహించే తాలూకాలోని సుగటూరు ఫిర్కా తూరాండహళ్లి గ్రామాన్ని కేంద్ర మాలిన్య నియంత్రణ మండలి ప్రాంతీయ డైరెక్టర్ జె చంద్రబాబు, రాష్ట్ర పరిసర నియంత్రణ మండలి అధికారి రాజులు గురువారం సందర్శించారు. టీఎన్ రవి అనే రైతులకు చెందిన తోటలో సాగులో ఉన్న టమాట, బీన్స్, క్యాప్సికం, వంకాయ, క్యారెట్ పంట ఉత్పత్తులను సేకరించారు. ల్యాబ్‌లో పరిశీలన జరిపిన అనంతరం నివేదిక అందిస్తామని అధికారులు తెలిపారు. ప్రాధ్యాపకురాలు డాక్టర్ బీజీ వాసంతి, చిన్న నీటి పారుదల శాఖ అసిస్టెంట్ ఇంజినీర్ శశికుమార్, సుగటూరు గ్రామ పంచాయతీ అధ్యక్షుడు భూపతి గౌడ, ప్రగతిపర రైతు రవి పాల్గొన్నారు. -
పీయూసీ విద్యార్థిని బదులు పరీక్ష రాసిన లా స్టూడెంట్
దొడ్డబళ్లాపురం: పీయూసీ విద్యార్థినికి బదులుగా పరీక్షరాస్తూ న్యాయ విద్యార్థిని పోలీసులకు పట్టుబడింది. ఈ ఘటన కలబుర్గి పట్టణంలోని మిలింద్ కళాశాలలో చోటుచేసుకుంది. ఈనెల 5న పొలిటికల్ సైన్స్ పరీక్షలు జరిగాయి. కలబుర్గి పట్టణంలోని మిలింద్ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో అర్చన అనే విద్యార్థిని బదులు సంపూర్ణ పాటిల్ అనే లా చదువుతున్న యువతి పరీక్షలు రాసింది. దళిత సేన కార్యకర్తలు ఈ విషయాన్ని గుర్తించి కళాశాలకు వెళ్లి ప్రశ్నించడంతో ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంపూర్ణ పాటిల్‌ను అరెస్టు చేశారు. ఈమె కాంగ్రెస్ కార్యకర్తగా తెలిసింది. -
గుభాళించిన కన్నడ పరిమళం
రాయచూరు రూరల్: రాయచూరులో గురువారం తాలూకా కన్నడ సాహిత్య పరిషత్ 6వ సమ్మేళనం జరిగింది. దీంతో నగరమంతా కన్నడ జెండాలు వెలిశాయి. వీధులన్ని కన్నడ సంఘాల కార్యకర్తలతో కిటకిటలాడాయి. తాలూకా కన్నడ సాహిత్య పరిషత్ సమ్మేళనం అధ్యక్షుడు అయ్యప్పయ్య హుడాను మహాత్మాగాంధీ క్రీడా మైదానం నుంచి పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరం వరకు ఊరేగించారు. ఊరేగింపులో పలు కళాబృందాలు, కళాకారులు తమ ప్రతిభకు తగ్గట్టుగా ప్రదర్శనలు చేశారు. సమ్మేళనం అధ్యక్షుడిని ఊరేగిస్తున్న సమయంలో కళాకారుడు ఉగ్ర నరసింహ స్వామి వేషధారణ ఆకట్టుకుంది. విద్యార్థులు సుమారు 1500 మీటర్ల పొడవైన కన్నడ జెండాను ప్రదర్శించారు. మహిళలు కుంభ కలశాలతో ఊరేగింపులో పాల్గొన్నారు. రాయచూరులో ఘనంగా తాలూకా కన్నడ సాహిత్య సమ్మేళనం కార్యకర్తలతో నగర వీధులు కేసరిమయం -
జిల్లా పీఈటీల సంఘం అధ్యక్షుడిగా యంకప్ప
రాయచూరు రూరల్: జిల్లా వ్యాయామ విద్యా ఉపాధ్యాయుల(పీఈటీ) సంఘం అధ్యక్షుడిగా యంకప్ప ఫిరంగి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. బుధవారం సాయంత్రం ఎన్నికల అధికారి కృష్ణకు నామినేషన్ అందించారు. వేరెవరూ నామినేషన్ వేయకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ప్రకటించారు. కాగా మూడోసారి జిల్లా పీఈటీల సంఘం అధ్యక్షుడిగా యంకప్ప ఎంపిక కావడం గమనార్హం. గ్యారెంటీలకు ఆ నిధుల మళ్లింపు తగదు రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభివృద్ధి పథకాలకు కేటాయించిన నిధులను పంచ గ్యారెంటీలకు వ్యయం చేయడం తగదని రాయచూరు జిల్లా జేడీఎస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. గురువారం అంబేడ్కర్ సర్కిల్లో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు విరుపాక్షి ఆధ్వర్యంలో జరిగిన నిరసన ప్రదర్శనలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ సర్కార్ ఎస్సీ, ఎస్పీ, టీఎస్పీలో దళితుల అభివృద్ధి కోసం కేటాయించిన రూ.39,121 కోట్లలో రూ.21,746 కోట్ల నిధులను వినియోగించారన్నారు. దళితుల అభివృద్ధి పేరుతో గృహలక్ష్మి పథకానికి రూ.7,882 కోట్లు వాడుకున్నారన్నారు. అనంతరం స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో మాజీ శాసన సభ్యులు వెంకట్రావ్ నాడగౌడ, రాజా వెంకటప్ప నాయక్, నేతలు శివశంకర్, మహంతేష్ పాటిల్, నరసింహ నాయక్, తిమ్మారెడ్డి, లక్ష్మిపతి, బుడ్డనగౌడ, బాబుదిన్ని, నరసప్పలున్నారు. గడ్డివాములకు నిప్పు.. రూ.2 లక్షల నష్టంరాయచూరు రూరల్: జిల్లాలోని లింగసూగూరు పట్టణంలో 15 గడ్డివాములకు నిప్పుంటుకున్న ఘటన గురువారం జరిగింది. ఆ పట్టణంలోని గోళిపేటలో పశువుల కోసం గడ్డివాములుగా పశుగ్రాసాన్ని నిల్వ చేసుకున్నారు. అకస్మాత్తుగా జరిగిన అగ్నిప్రమాదంలో గడ్డి వాములకు నిప్పుంటుకుంది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పడానికి పలు ఇబ్బందులు పడ్డారు. దాదాపు రూ.2 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు సమాచారం అందించారు. పీయూ పరీక్షలకు 95.63 శాతం విద్యార్థుల హాజరు హుబ్లీ: జిల్లాలో బుధవారం జరిగిన ద్వితీయ పీయూసీ రాజనీతి శాస్త్రం పరీక్షకు మొత్తం 7243 విద్యార్థులు నమోదు చేసుకోగా 6927 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 306 మంది గైర్హాజరయ్యారు. మొత్తం నమోదు చేసుకొన్న విద్యార్థుల్లో 95.63 శాతం విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు పీయూ శాఖ డీడీ సురేష్ ఓ ప్రకటనలో తెలిపారు. సంఖ్యాశాస్త్రం పరీక్షకు 4709 మంది విద్యార్థులకు గాను 4610 మంది పరీక్షలు రాశారు. 99 మంది పరీక్షకు గైర్హాజరయ్యారు. మొత్తం నమోదు చేసుకొన్న విద్యార్థుల్లో 97.89 శాతం విద్యార్థులు హాజరైనట్లు ఆయన ఓ ప్రకటనలో వివరించారు. రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి హొసపేటె: నగర శివార్లలోని జాతీయ రహదారిపై హొసపేటెలోకి ప్రవేశ సొరంగ మార్గంలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహన చోదకుడు స్థలంలోనే మృతి చెందాడు. కొప్పళకు చెందిన హెచ్ఎం.కొట్రేష్(30) అనే యువకుడు టీవీఎస్ ఎక్సెల్ బైక్‌పై మరియమ్మనహళ్లి నుంచి తిరిగి తాను ఉంటున్న ఇంటికి వెళ్తున్న సమయంలో మార్గంమధ్యలో ఎన్.హెచ్–50పై గుర్తు తెలియని వాహనాన్ని డ్రైవర్ అతివేగం, అజాగ్రత్తగా నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. తలకు బలమైన గాయాలు కావడంతో వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ మేరకు హొసపేటె ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకొన్నారు. ప్రమాదానికి కారకుడైన వాహనం డ్రైవర్‌పై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. -
సిద్దు బడ్జెట్‌పై గంపెడాశలు
హుబ్లీ: హుబ్లీలోని కర్ణాటక వైద్య కళాశాల(కిమ్స్) పరిశోధన సంస్థ ఉత్తర కర్ణాటకలోని పేద, మధ్య తరగతి ప్రజల పాలిట ఆరోగ్య సంజీవిని. ఏడెనిమిది జిల్లాల రోగులు మెరుగైన చికిత్స కోసం ఈ ఆస్పత్రినే ఆశ్రయిస్తారు. అయినా ప్రభుత్వం నుంచి మాత్రం అంతగా నిధులు రావడం లేదన్న ఆవేదన వ్యక్తమవుతోంది. శుక్రవారం నాటి రాష్ట్ర బడ్జెట్‌పై అందరూ ఆశలు పెట్టుకొన్నారు. ఆమేరకు కేఎంసీ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ ఎస్ఎఫ్ కమ్మార మాట్లాడుతూ రూ.515 కోట్లను అవసరమైన పనులకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు పలు పథకాలకు నిధులు ఇవ్వాలని కోరామన్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.417 కోట్లకు ప్రతిపాదించగా రూ.233 కోట్లు ఇచ్చారన్నారు. ఈసారి కూడా ఎక్కువ నిధులు కేటాయిస్తారన్న ఆశలు పెట్టుకొన్నారు. ఆస్పత్రి వైద్య సిబ్బందికి ప్రతి ఏటా సుమారు రూ.150 కోట్ల వేతనాలు చెల్లించాలి. వివిధ అభివృద్ధి పనుల కోసం రూ.515 కోట్ల నిధులను కేటాయిస్తే బాగుంటుందని డైరెక్టర్ అభిప్రాయపడ్డారు. మంత్రికి డిమాండ్లపై ఏకరువు వైద్య విద్యా మంత్రికి ప్రగతి పరిశీలన సమావేశంలో కూడా ఇక్కడి డిమాండ్లను ఏకరువు పెట్టామన్నారు. ఆమేరకు 200 పడకల ప్రాంతీయ క్యాన్సర్ కేర్ సెంటర్, లెవల్–2 ట్రామా కేర్ సెంటర్, ప్రత్యేక ఫ్యారా మెడికల్ కాలేజ్, అంతర్గత రోడ్ల నిర్మాణం. వసతి నిలయాల్లో జలనిరోధక, యూజీడీ లైన్ ఆధునీకరణ, 750 కేవీఏ జనరేటర్ అవసరం, కేంద్ర గ్రంథాలయ మరమ్మతులు, ఆధునీకరణ, ఆదర్శ విశ్రాంతి గృహ నిర్మాణం, అత్యాధునిక ఉపహార కేంద్రం, 3 టెస్లా ఎంఆర్ఐ యంత్రం, 160 సీటీ స్కాన్ యంత్రం, 240 పడకల మూత్ర పిండం, మూత్రకోశాల విభాగం అభివృద్ధి, చిన్నపిల్లల ఆస్పత్రి, 4, 5వ అంతస్తుల కట్టడ నిర్మాణానికి నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాధించామన్నారు. మొత్తం ఎనిమిది జిల్లాల రోగులు చికిత్సలకు వస్తారు. రోజూ 3 వేల మంది బయట రోగులుగా నమోదు అవుతున్నారు. 1000కి పైగా లోపల రోగులున్నారు. మరింత అభివృద్ది పనులు చేపట్టడానికి తగినన్ని నిధుల కేటాయింపునకు ఆస్పత్రి రోగులు ఎదురు చూస్తున్నారు. -
ఇడ్లీలో బొద్దింక.. హోటల్ సీజ్
దొడ్డబళ్లాపురం: ఇడ్డీలో బొద్దింక దర్శనమిచ్చిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. మను అనే యువకుడు తన స్నేహితులతో కలిసి బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రి వద్ద ఉన్న బ్రాహ్మీన్స్ కెఫెకు వెళ్లాడు. ఇడ్లీ ఆర్డర్ ఇవ్వగా సర్వర్ తీసుకొని వచ్చాడు. ప్లేట్లో బొద్దింక కనిపించడంతో షాక్ తిన్నాడు. యజమాని గోపాల్‌కు చెప్పినా లైట్‌గా తీసుకోమన్నాడు. దీంతో వీడియో తీసి సామాజిక మాధ్యమంలో అప్లోడ్ చేశాడు. బొమ్మసంద్ర మున్సిపల్ అధికారులు వచ్చి పరిశీలించి హోటల్ సీజ్ చేశారు. ఎమ్మెల్యే మునిరత్నకు వ్యతిరేకంగా ధర్నా దొడ్డబళ్లాపురం: దివంగత కన్నడ నటుడు డాక్టర్ రాజ్‌కుమార్‌ను అవమానిస్తూ వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కేపీసీసీ ప్రధాన కార్యదర్శి, ఎంఈఐ అధ్యక్షుడు ఎస్. మనోహర్ ఆధ్వర్యంలో కన్నడ చలనచిత్ర వాణిజ్య మండలి కార్యాలయం ముందు గురువారం ధర్నా చేపట్టారు. ఆందోళనకారులు మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి నేల, జలాల విషయంలో సమస్య వచ్చిన ప్రతిసారీ ముందుగా డాక్టర్ రాజ్‌కుమార్ పోరాటం ప్రారంభించేవారన్నారు. ఎన్నో ఉత్తమ చిత్రాల్లో నటించి ప్రజల మన్ననలు పొందిన రాజ్‌కుమార్ పేరు పలికే అర్హత మునిరత్నకు లేదన్నారు. రాజ్‌కుమార్ అవినీతిపరుడని చేసిన వ్యాఖ్యలు మునిరత్న అహంకారానికి నిదర్శనమన్నారు. తక్షణం మునిరత్నపై బీజేపీ వారు, కన్నడ వాణిజ్యమండలి వారు చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. గురురాఘవుడికి లక్ష పుష్పార్చన బనశంకరి: గురురాఘవేంద్రుడికి 430వ జయంతి సందర్భంగా లక్ష పుష్పార్చన కనుల పండువగా నిర్వహించారు. జయనగర ఐదో బ్లాక్ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో గురువారం గురురాఘవేంద్రుని జయంతి నేపథ్యంలో మఠం సీనియర్ వ్యవస్థాపకుడు ఆర్కే.వాదీంద్రాచార్య నేతృత్వంలో అర్చకుల బృందం స్వామివారికి లక్షపుష్పార్చన భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కన్నడనటి ప్రేమా పాల్గొని పూజలు చేపట్టారు. మంగళహారతి అనంతరం 20 వేల మంది భక్తులకు అన్నదానం చేశారు. కాంగ్రెస్‌కు దళితుల శాపం తగులుతుంది శివాజీనగర: సిద్దరామయ్య దళితులపై చూపిన శ్రద్ధ ఏమైంది? ప్రతిపక్షంలో ఉన్నపుడు దళితులపై ఉన్న శ్రద్ధ అధికారంలోకి వచ్చిన తరువాత కనుమరుగైందా? అని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు, ఎమ్మెల్యే బీ.వై.విజయేంద్ర ప్రశ్నించారు. ఎస్సీల నిధుల దుర్వినియోగ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున గురువారం బెంగళూరులోని ఫ్రీడం పార్కులో పోరాటం నిర్వహించారు. సమితి ఆహ్వానం మేరకు ధర్నాలో పాల్గొని మాట్లాడిన విజయేంద్ర, అహింద పేరుతో రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల కన్నీరు తుడుస్తానని చెప్పి ముఖ్యమంత్రి అసహాయకులయ్యారా? లేక దళితులపై ప్రేమ తగ్గిపోయిందా? అని నిలదీశారు. దళితుల కళ్లలో నీరు వస్తే ఆ శాపం మీ ప్రభుత్వానికి తాకకుండా ఉండదని హెచ్చరించారు. విధాన పరిషత్ ప్రతిపక్ష నాయకుడు చలవాది నారాయణస్వామి, రిపబ్లిక్ పార్టీ నాయకుడు డాక్టర్ ఎం.వెంకటస్వామి, రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు ఎన్.మహేశ్, పీ.రాజీవ్, మాజీ ఎమ్మెల్యే సంపంగి పాల్గొన్నారు. -
చిక్క తిరుపతి హుండీ ఆదాయం 49.09 లక్షలు
మాలూరు: చిక్కతిరుపతి ప్రసన్న వేంకటరమణస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. గత మూడునెలల్లో స్వామివారికి కానుకల రూపంలో రూ.49.09 లక్షల మేర ఆదాయం లభించింది. ఇంకా అన్నదాసోహ హుండీ లెక్కింపు మిగిలి ఉంది. హుండీలో నగదుతోపాటు బంగారు, వెండి, విదేశీ కరెన్సీ లభించింది. తమ కోరికలు తీర్చాలని భక్తులు రాసిన చీటీలుకూడా హుండీలో లభించాయి. ఉదయం స్వామి వారికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం తహసీల్దార్ ఎంవీ రూప, జిల్లా దేవదాయ శాఖ తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి, ఈఓటీ సెల్వమణి సమక్షంలో హుండీలను లెక్కించారు. అనంతరం హుండీ డబ్బును దేవాలయ బ్యాంకు ఖాతాలో జమ చేశారు. -
రాష్ట్రంలో బీహార్ తరహా పరిస్థితులు
●కేంద్రమంత్రి హెచ్డీ కుమారస్వామిదొడ్డబళ్లాపురం: రాష్ట్రంలోని పరిస్థితులు బీహార్‌ను తలపిస్తున్నాయని, రాబోవు రోజుల్లో రాష్ట్రంలో పాలన మరింత అధ్వానంగా తయారయ్యే సూచనలు కనిపిస్తున్నాయని కేంద్రమంత్రి హెచ్డీ కుమారస్వామి అన్నారు. చెన్నపట్టణ తాలూకా అక్కూరులో ఒక కార్యక్రమంలో హాజరైన ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల గురించి ఆలోచించే తీరిక ప్రజలకే లేదన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంట్రాక్టర్లకు ఎప్పటికప్పుడు బిల్లులు పాస్ చేయించేవాడినన్నారు. అప్పుడు కమిషన్, పర్సంటేజ్ మాట వినబడేది కాదన్నారు. -
నకిలీ మద్యం తయారీ అడ్డాపై దాడి
హుబ్లీ: ఓ తోటలోని ఇంట్లో నకిలీ మద్యం తయారు చేస్తున్న అడ్డాపై బెళగావి విభాగం జాయింట్ కమిషనర్ శాఖాధికారులు దాడి చేసి భారీగా నకిలీ మద్యం, సంబంధిత వస్తువులను స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్టు చేశారు. ఘటన గురించి ధార్వాడ జిల్లా ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ రమేష్ కుమార్ మీడియాకు వివరాలు అందించారు. సమీపంలోని చబ్బి వద్ద ఓ తోట ఇంట్లో నకిలీ మద్యం తయారు చేస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు ఈ దాడి చేశారు. ఇద్దరిని అరెస్టు చేసి నకిలీ మద్యం, తయారీకి వాడుతున్న వివిధ వస్తువులను స్వాధీనం చేసుకొన్నారు. రూ.5 లక్షల విలువ చేసే నకిలీ మద్యంతో పాటు అక్కడి వస్తువులను జప్తు చేశారు. హుబ్లీకి చెందిన సందీప్, అమృత్‌లను అరెస్టు చేశారు. మరో నిందితుడు వినాయక్ పరారయ్యాడు. అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు తెలిపారు. అతడు దొరికితే ఈ అక్రమ మద్యం గుట్టు రట్టవుతుందని భావిస్తున్నారు. సదరు తోట ఇంటి యజమానికి ఎరువుల అంగడి పెడతామని అద్దెకు తీసుకొన్నారు. ఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేపట్టినట్లు ఆయన తెలిపారు. 24 బాక్స్‌ల నకిలీ మద్యాన్ని పరీక్షల కోసం ధార్వాడ ల్యాబ్‌కు పంపించామన్నారు. ఇద్దరు నిందితుల అరెస్టు -
దొడ్డకేశవరెడ్డి ఎన్నికపై హర్షం
బళ్లారి అర్బన్: ప్రాథమిక సహకార గ్రామీణ వ్యవసాయ అభివృద్ధి బ్యాంక్ అధ్యక్షుడిగా కొర్లగుంది వీ.దొడ్డకేశవరెడ్డి మూడో సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈమేరకు ఆయన సదరు కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టిన వేళ ప్రముఖులు కేశవరెడ్డిని అభినందించారు. గత నెల 12 మంది డైరెక్టర్ల ఎన్నికల్లో కేశవరెడ్డి వర్గానికి చెందిన ఏడుగురు విజేతలయ్యారు. గురువారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఏకై క అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన దొడ్డ కేశవరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన దొడ్డ కేశవరెడ్డి మాట్లాడుతూ బ్యాంక్ ద్వారా రైతులకు లభించే వివిధ సౌకర్యాలు పథకాలను రైతులకు అందించడంలో చిత్తశుద్ధితో కృషి చేస్తానన్నారు. రైతుల తమ సమస్యలను తమ దృష్టికి తెస్తే వాటిని శాయశక్తులా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కాగా ఈసందర్భంగా దొడ్డ కేశవరెడ్డిని మాజీ ఎంపీ సన్నపక్కీరప్ప, కార్పొరేటర్ శ్రీనివాస్ మోత్కర్, ప్రముఖ న్యాయవాది బాదామి శివలింగనాయక, ఐహోళె నాగరాజు, జనతా బజార్ అధ్యక్షుడు వేమన్న, డైరెక్టర్ నరేష్కుమార్ తదితరులు అభినందించారు. కొళగల్లు హులియప్ప, కొర్లగుంది రాఘవరెడ్డి, జనతాబజార్ డైరెక్టర్ ప్రదీప్‌రెడ్డి, మర్రిస్వామిలతో పాటు కేశవరెడ్డి బంధుమిత్రులు, అభిమానులు విశేషంగా పాల్గొన్నారు. -
కసాప సేవలు అనన్యం
రాయచూరు రూరల్: 14 సార్లు జ్ఞానపీఠ అవార్డులందుకున్న కన్నడ భాషకు ప్రాణం పోసిన కన్నడ సాహిత్య పరిషత్ సేవలు అనన్యమని, కన్నడ భాషకు మరింత ఆదరణ లభించాలని 87వ అఖిల భారత సర్వ సమ్మేళనాధ్యక్షుడు గోరూరు చెన్నబసప్ప అభిప్రాయపడ్డారు. గురువారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కన్నడ భాషకు ఉన్న ఆదరణను మరింత ఇనుమడింప చేయాలన్నారు. గడినాడు ప్రాంతంలో సోదర భాషతో ఉన్న బాంధవ్యాలను పెంపొందించుకుని కన్నడ భాషకు ప్రాధాన్యత కల్పించాలన్నారు. ఇతర భాషల వారికి కన్నడను నేర్పాలన్నారు. రాష్ట్రంలో కేవలం 30 శాతం కన్నడ భాష ఉందని విచారం వ్యక్తం చేశారు. తాలూకా కన్నడ సాహిత్య సమ్మేళన అధ్యక్షుడు అయ్యప్పయ్య హుడా, శాంతమల్ల శివాచార్య, కసాప జిల్లాధ్యక్షుడు రంగణ్ణ పాటిల్, లోక్‌సభ సభ్యుడు కుమార నాయక్, తాలూకా అధ్యక్షుడు వెంకటేష్ బేవిన బెంచి, సురేష్, రేఖ, ప్రతిభా, రావుత్‌రావ్, తాయప్ప, ఆంజనేయలున్నారు. మహాత్మ గాంధీ క్రీడా మైదానంలో జాతీయ జెండాను కార్పొరేషన్ కమిషనర్ జుబిన్ మహపాత్రో, పరిషత్ జెండాను జిల్లాధ్యక్షుడు రంగణ్ణ పాటిల్, నాడజెండాను వెంకటేష్‌లు అవిష్కరించారు. -
అవినీతిపై లోకాయుక్త పంజా
బనశంకరి: అవినీతి అధికారులపై లోకాయుక్త పంజా విసిరింది. గురువారం వేకువ జామున బెంగళూరు నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏడు జిల్లాల్లో ఒకేసారి 8 మంది అవినీతి అధికారులపై దాడి చేసి కోట్లాది రూపాయల విలువ చేసే బంగారు, వెండి అభరణాలు, విలువైన వస్తువులు, ఆస్తిపాస్తులు స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు, కోలారు, కలబురిగి, దావణగెరె, విజయపుర, తుమకూరు, బాగల్కోటెతో పాటు 7 జిల్లాల్లో 30కి పైగా ప్రాంతాల్లో లోకాయుక్త అధికారులు ఒకేసారి దాడులు నిర్వహించి సోదాలు చేపడుతున్నారు. బెంగళూరు నగరంలో బీబీఎంపీ వలయ చీఫ్ ఇంజినీర్ టీడీ.నంజుండప్ప కార్యాలయం, నివాసంలో బీబీఎంపీ ఫైళ్లు, బంగారు ఆభరణాలు, నగదు, వివిధ వాణిజ్య కాంప్లెక్స్‌లతో పాటు వ్యవసాయ భూములకు సంబంధించిన రికార్డులు లభ్యమయ్యాయి. భారీగా ఆభరణాలు స్వాధీనం బీబీఎంపీ నాణ్యత నియంత్రణ, నాణ్యత హామీ విభాగ కార్యనిర్వాహక ఇంజినీర్ హెచ్‌బీ.కల్లేశప్ప ఇంటిలో భారీగా బంగారు ఆభరణాలు లభించాయి. రాజాజీనగర బెస్కాం ఇంజినీర్ నాగరాజ్‌కు చెందిన కృష్ణరాజపురం వద్ద ప్రియదర్శిని లేఔట్‌లోని ఇళ్లు, రాజాజీనగర బెస్కాం కార్యాలయం, అతడి బంధువు ఇంటిపై లోకాయుక్త అధికారులు దాడులు నిర్వహించారు. కొళ్లేగాల వద్ద 6 ఎకరాల భూమి, బెంగళూరులో ఒక ఇల్లు, రెండు స్థలాలు, కోలారు తాలూకా నరసాపురం వద్ద భూమి ఉన్నట్లు తనిఖీలో తేలింది. తుమకూరు జిల్లాలో.. తుమకూరు జిల్లా శిరా తాలూకా తావరకెరె పీహెచ్సీ వైద్యాధికారి జగదీశ్‌కు చెందిన తుమకూరు మంజునాథ్నగరలో కాంప్లెక్స్, శిరా తాలూకా యనహళ్లిలోని ఇంటిలో సోదాలు చేశారు. జగదీశ్ భార్య రూపా, సోదరుడు కాంతరాజ్ ఇంటిపై కూడా దాడి చేశారు. శిరా తాలూకా బరగూరులో తల్లి పేరుతో ఆస్తి ఉన్నట్లు లోకాయుక్త దాడిలో తెలిసింది. బాగల్కోటె పంచాయతీ రాజ్ శాఖ అకౌంటెంట్ మల్లేశ్ దుర్గద్కు చెందిన వీరాపుర రోడ్డులో ఉన్న ఇళ్లు, బీళగి తాలూకా తళ్లికేరిలోని ఇంటిపై లోకాయుక్త అధికారులు దాడి చేసి పరిశీలిస్తున్నారు. లోకాయుక్త డీఎస్పీ సిద్దేశ్ నేతృత్వంలో దాడి జరిగింది. కలబురిగిలో... ఈనెలలో ఉద్యోగ విరమణ చేయనున్న రాష్ట్ర రహదారుల అభివృద్ధి శాఖ అధికారి జగన్నాథ్‌కు లోకాయుక్త షాక్ ఇచ్చింది. కలబురిగిలోని ఓకళిక్యాంప్ లేఔట్‌లోని నివాసం, బెంగళూరులోని కార్యాలయం, ధన్నూర్ కే గ్రామంలోని ఇంటిలో దాడులు నిర్వహించారు. సుమారు 2 కిలోల బంగారు, వెండి, ఖరీదైన గడియారం, విలువైన వస్తువులు లభించాయి. లాకర్ బద్దలు కొట్టి పరిశీలించగా రికార్డులు, భారీగా నగదు లభ్యమైంది. ఆళందలో 30 ఎకరాల భూమి, బీదర్, బసవకళ్యాణలో ఆస్తి కలిగి ఉన్నట్లు తెలిసింది. కర్ణాటక గృహమండలి ఎఫ్‌డీఏ శివానంద కెంబావికి చెందిన విజయపుర నగరంలోని సుకోన్ కాలనీలోని నివాసం, ఆ జిల్లాలోని తిడగుంది గ్రామం వద్ద ఫాంహౌస్‌లో సోదాలు చేపట్టారు. కలబురిగిలో జిల్లా ఆహార సురక్షతాఅదికారి నాగరాజ్ ఇళ్లు, కార్యాలయంలో సోదాలు చేపట్టగా భారీ ప్రమాణంలో బంగారం, నగదు లభ్యమైంది. దావణగెరె నగర నిజలింగప్ప లేఔట్‌లోని జిల్లా సురక్షతా అధికారి డాక్టర్ నాగరాజ్ ఇల్లు, కార్యాలయం, ఫాంహౌస్‌తో పాటు అతడికి చెందిన 5 చోట్ల దాడి చేశారు. బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏడు జిల్లాల్లో ఏకకాలంలో దాడులు 8 మంది అధికారుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు కోట్ల విలువైన బంగారు, వెండి నగలు, నగదు లభ్యంలోకాయుక్త వలలో చిక్కిన అధికారులు టీడీ.నంజుండప్ప, బీబీఎంపీ వలయ చీఫ్ ఇంజినీర్, డీపీఏఆర్, బెంగళూరు హెచ్‌బీ.కల్లేశప్ప, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, బీబీఎంపీ బీ.నాగరాజ్, ఏఈఈ, బెస్కాం, కోలారు జగన్నాథ్, చీఫ్ ఇంజినీర్, ప్రజాపనుల శాఖ, కోలారు జీఎస్.నాగరాజు, ఫుడ్‌సేఫ్టీ అధికారి, దావణగెరె డాక్టర్ జగదీశ్, వైద్యాధికారి, తావరకెరె, తుమకూరు జిల్లా మల్లప్ప సాబణ్ణ, ఎఫ్‌డీఏ, పంచాయతీరాజ్‌శాఖ, బాగల్కోటె శివానంద శివశంకర్ కెంబావి, ఎఫ్‌డీఏ, గృహమండలి, విజయపుర -
డబ్బు ఇస్తేనే తల్లికి అంత్యక్రియలు
గౌరిబిదనూరు: తల్లి చనిపోయిందనే బాధ కూడా వారికి లేదు. తమ వాటా డబ్బు ఇస్తేనే అంత్యక్రియలకు అంగీకరిస్తామని కర్కోటక కుమారులు అమానుషంగా వ్యవహరించారు. దీంతో మృతురాలి కుమార్తెల బిడ్డలు తమ అవ్వ మృతదేహాన్ని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. తహసీల్దార్ జోక్యంతో అంత్యక్రియలు జరిగాయి. ఈ ఉదంతం చిక్కబళ్లాపురం జిల్లా గౌరిబిదనూరు తాలూకాలోని దొడ్డకురుగోడులో జరిగింది. గ్రామానికి చెందిన అనంతక్కకు నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. భర్త మృతితో అనంతక్క మధుగిరి తాలూకా కడగత్తూరులో ఉన్న కుమార్తెల వద్ద ఉంటోంది. భర్తద్వారా ఆమెకు సంక్రమించిన భూమిని ప్రభుత్వం పరిశ్రమల కోసం సేకరించి రూ.93 లక్షలు అందజేసింది. ఆ మొత్తంలో 40 లక్షలు కుమార్తెలు తీసుకున్నారు. ఈక్రమంలో వృద్ధాప్యం కారణంగా అనంతక్క మంగళవారం తన కుమార్తె ఇంటిలోనే మృతి చెందింది. భర్త సమాధి పక్కనే తనను ఖననం చేయాలని అనంతక్క గతంలోనే కుమార్తెకు తెలియజేసింది. దీంతో మృతదేహాన్ని దొడ్డకురుగోడుకు తీసుకురాగా కుమారులు అడ్డుకున్నారు. తల్లి నుంచి కుమార్తెలు తీసుకున్న రూ.40లక్షలు తిరిగి ఇస్తేనే అంత్యక్రియలకు సహకరిస్తామని మొండికేశారు. దీంతో అనంతక్క మృతదేహాన్ని కుమార్తెలు, మనువరాండ్రు పోలీస్‌స్టేషన్ వద్దకు తీసుకెళ్లారు. రాత్రంతా మృతదేహం అక్కడే ఉంది. బుధవారం ఉదయం తహసీల్దార్ మహేష్పత్రి స్పందించి అనంతక్క కుమారులను పిలిపించి సర్ది చెప్పారు. అనంతరం మృతదేహాన్ని దొడ్డకురుగోడుకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. అమానుషంగా కుమారుల తీరు రాత్రంతా ఠాణా వద్దనే మృతదేహం తహసీల్దార్ జోక్యంతో అంత్యక్రియలు -
సిద్దూ పద్దుకు వేళాయె
శివాజీనగర: ముఖ్యమంత్రి సిద్దరామయ్య శుక్రవారం రికార్డు స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యతను కల్పిస్తున్నారు. కాంగ్రెస్ ప్రణాళికల ప్రకారం ఐదు గ్యారెంటీ పథకాలను ముందుకు కొనసాగించటంతో పాటు మరిన్ని ప్రజోపయోగ పథకాలను చేర్చనున్నారు. అభివృద్ధి పథకాలకు ఆర్థికస్థితి కొరతపై అధికార పార్టీ ఎమ్మెల్యేల్లోని అసంతృప్తిని చల్లార్చేందుకు సీఎం మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారు. గ్రామీణ రోడ్ల అభివృద్ధికి పెద్దపీట గ్రామీణ రోడ్ల అభివృద్ధికి అధిక ప్రాధాన్యతను ఇస్తుండగా, విద్యా శాఖలో భవనాల నిర్మాణం, తరగతి గదుల సంఖ్య పెంపు, ఉపాధ్యాయ నియామకం, ఆరోగ్య రంగంలో ప్రాఽథమిక సేవల బలోపేతం, జిల్లా కేంద్రాల్లో సూపర్ స్పెషాలిటీ సదుపాయాల పెంపు, పరిశ్రమలకు పలు ప్రత్యేక రంగాల నిర్మాణంతో పాటు కొత్త పథకాలను ప్రకటించనున్నారు. కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయం గురించి బడ్జెట్లో ప్రస్తావించనున్న సీఎం న్యాయసమ్మత పన్ను వాటా కోసం మరింత ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తారు. మేకెదాటు, మహదాయి ప్రాజెక్టుల గురించి ప్రస్తావించనున్నారు. కళసా బండూరిపై ముందడుగు మహదాయి నదికి అడ్డంగా కళసా బండూరి వద్ద ఆనకట్ట నిర్మించి ఉత్తర కర్ణాటక భాగంలో తాగునీటిని సరఫరా చేయాలనే డిమాండ్ చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉంది. కేంద్ర ప్రభుత్వం గోవా రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసి, పర్యావరణ భద్రత నెపంతో నిరభ్యంతర పత్రం ఇవ్వకుండా ఆలస్యం చేస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. అందుకోసం బడ్జెట్లో గత ప్రభుత్వాలు కూడా కళసా బండూరి ప్రాజెక్ట్‌ను ప్రస్తావించినా కూడా సిద్దరామయ్య ప్రభుత్వం నిర్ణయాత్మకమైన అడుగు వేయటానికి సిద్ధమైంది. పాత మైసూరు భాగంలో మేకెదాటు ప్రాజెక్ట్ చాలా కాలంగా మరుగున పడింది. కొన్ని కొత్త పథకాలకు అవకాశం పాడి పరిశ్రమ, వ్యవసాయానికి అనుకూలమైన కొన్ని పథకాల ప్రస్తావన ఉంటుంది. యువనిధికి మరికొందరు పట్టభద్రుల చేరిక, గృహజ్యోతి పథకానికి పూర్తి స్థాయిలో సొమ్ము కల్పించటంతో పాటు అనేక నిర్ణయాలను సిద్దరామయ్య ప్రకటించనున్నారు. గ్రామీణ భాగంలో తాలూకా పంచాయతీ, జిల్లా పంచాయతీ ఎన్నికలు, బెంగళూరులో మహానగర పాలికెకు ఎన్నికలు జరిపే అవకాశం ఉండటంతో సిద్దరామయ్య ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నద్ధమయ్యారు. శాసనసభలో హైలెట్స్ నేడు రికార్డు స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సీఎం గ్యారెంటీలతో పాటు మరిన్ని కొత్త పథకాల జోడింపు?బనశంకరి: రాష్ట్రంలో మైక్రో ఫైనాన్స్ వేధింపుల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన బిల్లును గురువారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య తరపున మంత్రి హెచ్‌కే.పాటిల్ ప్రవేశపెట్టారు. ఎమ్మెల్యేలకు రీక్రియేషన్ కోసం కాఫీ, టీ వ్యవస్ధతో పాటు క్లబ్ వ్యవస్థ చేస్తామని స్పీకర్ యుటీ.ఖాదర్ తెలిపారు. రాష్ట్రంలో సినిమా టికెట్లను ఏకరూప పద్ధతిలో ధర నిర్ణయించి అమల్లోకి తెస్తామని హోంమంత్రి పరమేశ్వర్ తెలిపారు. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కర్ణాటక పథకం కింద చికిత్స వ్యయం పరిష్కరిస్తే పథకం 90 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరించే పరిస్థితి ఏర్పడుతుందని ఆరోగ్యశాఖ మంత్రి దినేశ్ గుండూరావ్ తెలిపారు. మలెనాడు, కరావళి జిల్లాల్లో సమస్యగా మారిన కోతి జ్వరానికి (కేఎఫ్‌డీ) వచ్చే ఏడాదిలోగా టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని గురువారం అసెంబ్లీలో మంత్రి ప్రకటించారు. తాగునీటికి రూ.10 కోట్లు నిధులు అందిస్తామని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ప్రియాంక్‌ఖర్గే తెలిపారు. కార్వారలో 450 పడకల సామర్థ్యంతో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని మరో రెండు నెలల్లో ప్రారంభిస్తామని వైద్యవిద్యా శాఖ మంత్రి శరణ్ ప్రకాశ్ పాటిల్ ప్రకటించారు. కొత్త యూనివర్శిటీలను విలీనం చేస్తామని, యూనివర్శిటీలను మూసివేత జరగదని డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ తెలిపారు. మెస్కాం టెండర్లలో అక్రమాలు జరిగితే పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఇంధన శాఖమంత్రి కేజే.జార్జ్ తెలిపారు. -
వేడుకగా పాదుకా పట్టాభిషేకం
రాయచూరు రూరల్: మంత్రాలయంలో గురు రాఘవేంద్రుల పాదుకా పట్టాభిషేక ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. గురువారం మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో మూల విరాట్‌కు పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగళ్ ప్రత్యేక పూజలు చేశారు. వారం రోజుల పాటు గురుసార్వభౌముల 404వ పట్టాభిషేక ఉత్సవాలు, రాయల 430వ వర్థంతి స్మరణోత్సవ వేడుకల్లో వందలాది భక్తుల సమక్షంలో రథోత్సవాలు జరిపారు. కాగా మంత్రాలయం గురు సార్వభౌమ అవార్డులను ఐఏఎస్ అధికారులు, కర్ణాటక దేవదాయ ధర్మాదాయ శాఖ అధికారి వెంకటేష్, న్యూఢిల్లీకి చెందిన మోహన్ కృష్ణ సింగ్, కర్ణాటక ప్రైవేట్ చానల్ రిపోర్టర్ రవికుమార్లకు సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగళ్ అందించారు. భక్తిశ్రద్ధలతో రాఘవేంద్రుని పట్టాభిషేకం బళ్లారి అర్బన్: కలియుగ కామధేనువు, కల్పవృక్షం రాఘవేంద్ర తీర్థ గురుసార్వభౌముల పట్టాభిషేకం, వర్థంతి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో సత్యనారాయణపేటలో వెలసిన రాఘవేంద్ర స్వామి మఠం, తేరు వీధిలోని రాఘవేంద్రుని సన్నిధిలో వివిధ పూజా కార్యక్రమాలతో వైభవంగా నిర్వహించారు. తెల్లవారు జామున విశేష పూజలు, అర్చనలు, ప్రత్యేక అలంకారాలు, మహా నైవేద్యం, మహా మంగళ హారతితో పాటు వివిధ పూజలను భక్తిప్రపత్తులతో నెరవేర్చారు. స్థానికులతో పాటు వివిధ చోట్ల నుంచి రాఘవేంద్రస్వామి భక్తులు విశేషంగా తరలి వచ్చి ఈ ప్రత్యేక వేడుకల్లో పాల్గొన్నారు. కాగా సత్యనారాయణపేట రాఘవేంద్రస్వామి సన్నిధిలో ఈనెల 1 నుంచి 6 వరకు నిత్యం సాయంత్రం 5.30 నుంచి రాత్రి 7 గంటల వరకు శ్రీమఠం, శ్రీమధ్వ సంఘం ఆధ్వర్యంలో వివిధ పండితులతో రాఘవేంద్ర విజయ ప్రవచనం ఆసక్తికరంగా సాగింది. ఈసందర్భంగా భక్తులకు విశేష తీర్థ ప్రసాదాల పంపిణీని కూడా నెరవేర్చారు. మంత్రాలయంలో ముగిసిన ఉత్సవాలు గురు సార్వభౌమ అవార్డులు ప్రదానం -
గోల్డ్ కేసులో ట్విస్ట్.. నటి రన్యారావు వెనక ఓ రాజకీయ నేత!?
కన్నడ నటి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. రన్యారావు బంగారం స్మగ్లింగ్ వెనక ఓ రాజకీయ నాయకుడి హస్తం ఉన్నట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. అందుకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య న్యాయసలహాదారు ఐఎస్ పొన్నన్ చేసిన వ్యాఖ్యలు అందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి.దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన రన్యారావు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. డైరెక్టరేట్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు (DRI) ఆమె ఇంట్లో జరిపిన సోదాల్లో భారీ ఎత్తున బంగారాన్ని గుర్తించారు. ఈ బంగారం ఎవరిది? అని ఆరా తీయగా.. ఆ గోల్డ్‌ను సదరు నేత కొనుగోలు చేసినట్లు పలు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. రన్యారావుతో ఆ రాజకీయ నాయకుడే స్మగ్లింగ్ చేయించినట్లు డీఆర్ఐ అధికారులు అనుమానిస్తున్నారు. రాజకీయ నాయకుడు,రన్యారావుల మధ్య ఒప్పందం జరిగింది. గోల్డ్‌ను దుబాయ్ నుంచి భారత్‌కు తీసుకు వస్తే కిలోలక్ష ఇస్తానని హామీ ఇచ్చారు. ఒప్పందం ప్రకారం.. స్మగ్లింగ్ కోసం నటి ఒక్క ఏడాదిలో దాబాయ్కు ౩౦ సార్లు వెళ్లింది. ట్రిప్‌కు 12 నుంచి 14 లక్షలు సంపాదించిన ప్రాథమిక విచారణలో తేలింది. ప్రస్తుతం డీఆర్ఐ అధికారులు బంగారం కొనుగోళ్ల సంబంధించిన రసీదులను సేకరించే పనిలో పడ్డారు.మరోవైపు రన్యారావు బంగారం స్మగ్లింగ్ వ్యవహారంలో రాజకీయనాయడి హస్తం ఉందనే ఆరోపణలపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య న్యాయసలహాదారు ఐఎస్ పొన్నన్ స్పందించారు.నటికి ఉన్న రాజకీయ పరిచయాలతో సంబంధం లేకుండా చట్టం తన పని తాను చేస్తుందని అన్నారు. ఈ కేసులో ఎవరి జోక్యం ఉన్నా దర్యాప్తులో భయటపడుతుందని చెప్పారు. -
బంగారం అక్రమ రవాణా చేసిన హీరోయిన్.. తండ్రి డీజీపీ.. మరి భర్త?!
కన్నడ హీరోయిన్ రన్యారావు (Ranya Rao) బంగారం అక్రమరవాణా కేసులో కటకటాలపాలైంది. 15 రోజుల్లో నాలుగుసార్లు దుబాయ్‌కు వెళ్లడం, అదికూడా ప్రతిసారి సేమ్ డ్రెస్ ధరించడంతో అధికారులకు అనుమానమొచ్చింది. సోమవారం (మార్చి 3న) ఆమెను బెంగళూరు ఎయిర్‌పోర్టులో తనిఖీ చేయగా 14 కిలోలకు పైగా బంగారంతో అడ్డంగా దొరికిపోయింది. దీంతో ఆమెను అరెస్టు చేసిన అధికారులు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఆమె భర్తను సైతం విచారిస్తున్నారు. ఇకపోతే రన్యా రావుకు కర్ణాటక డీజీపీ డాక్టర్ కె.రామచంద్రారావు సవతి తండ్రి అవుతాడు.పెళ్లయ్యాక మళ్లీ కలిసిందే లేదన్న డీజీపీఇప్పటికే ఈ విషయంపై డీజీపీ స్పందిస్తూ రన్యాకు నాలుగు నెలలకిందటే పెళ్లి జరిగిందని, అప్పటినుంచి తనను కలవలేదని పేర్కొన్నారు. కూతురు, అల్లుడు చేసే పనుల గురించి తనకెటువంటి విషయాలు తెలియదన్నాడు. ఈ క్రమంలో రన్యా భర్త ఎవరన్న వివరాలు బయటకు వచ్చాయి. రన్యా భర్త పేరు జతిన్ హుక్కేరి. ఈయన ఆర్కిటెక్ట్. బెంగళూరులో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ పట్టా పొందాడు. తర్వాత లండన్‌లో డిస్రప్టివ్ మార్కెట్ ఇన్నొవేషన్ కోర్సు చదివాడు. తండ్రి డీజీపీ, భర్త ఆర్కిటెక్ట్మొదట్లో బెంగళూరులోని పలు రెస్టారెంట్లకు డిజైనర్‌గా పని చేశాడు. లండన్‌లోనూ ఆర్కిటెక్ట్‌గా సేవలందించాడు. WDA & DECODE LLC సంస్థను స్థాపించడంతోపాటు దానికి క్రియేటివ్ డైరెక్టర్‌గానూ వ్యవహరిస్తున్నాడు. క్రాఫ్ట్ కోడ్ కంపెనీకి ఫౌండర్ కూడా ఇతడే! రన్యారావును పెళ్లి చేసుకున్నాక తనతో కలిసి పలుమార్లు దుబాయ్ ట్రిప్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఎయిర్‌పోర్టులో బంగారం స్మగ్లింగ్ చేస్తూ రన్యా దొరికిపోగా.. ఆమె ఇంటిని సైతం తనిఖీ చేశారు. ఈ సోదాలో రూ.2.06 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ.2.67 కోట్ల నగదు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.సినిమారన్యా రావు.. కిశోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ స్కూల్లో నటనపై శిక్షణ తీసుకుంది. మాణిక్య అనే కన్నడ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. ఇది ప్రభాస్ మిర్చి మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది. పటాస్ కన్నడ రీమేక్ పటాకిలో హీరోయిన్గా నటించింది. తమిళంలో వాఘా మూవీ చేసింది. ఎనిమిదేళ్లుగా వెండితెరకు దూరంగా ఉంటోంది.చదవండి: ఓటీటీలో శర్వానంద్ 'మనమే'.. అఫీషియల్ ప్రకటన -
ప్రముఖ గాయనితో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వివాహం, ఫోటోలు వైరల్
యువ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య (Tejasvi Surya)తన ప్రియురాలితో వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. చెన్నైకి చెందిన ప్రముఖ గాయని, శాస్త్రీయ సంగీతం, భరతనాట్య కళాకారిణి అయిన శివశ్రీ స్కంద ప్రసాద్ (Singer Sivasri Skanda prasad)ను సాంప్రదాయ బద్దంగా వివాహం చేసుకున్నారు. మార్చి 6, 2025న బెంగళూరులో జరిగిన ఒక సన్నిహిత, సాంప్రదాయ వేడుకలో వివాహం చేసుకున్నారు. ఈ వివాహ వేడుకకు పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు, బీజేపీ నేతలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వీరిలో కేంద్ర మంత్రి వి. సోమన్న, అన్నామలై, ప్రతాప్ సింహా, అమిత్ మాలవ్య, బి.వై. విజయేంద్ర ఉన్నారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. దీంతో పలువురు నెటిజనులు నూతన వధూవరులకు శుభాకాంక్షలు అందించారు.శివశ్రీ స్కంద ప్రసాద్ పసుపు కాంచీపురం పట్టు చీర, బంగారు ఆభరణాలలో కనిపించగా సూర్య వైట్ గోల్డెన్ కలర్ దుస్తులను ధరించారు. మరొక ఫోటోలో, వధువు ఎరుపు-మెరూన్ చీరలో, వరుడు ఆఫ్-వైట్ దుస్తులలో పెళ్లికళతో మెరిసారు.बेंगलुरु दक्षिण से सांसद श्री @Tejasvi_Surya जी एवं संगीत गायिका, भरतनाट्यम की प्रसिद्ध कलाकार शिवश्री स्कंदप्रसाद जी के शुभ विवाह समारोह में सम्मिलित होकर नवदंपत्ति को उनके मंगलमय दांपत्य जीवन के लिए शुभकामनाएँ व आशीर्वाद प्रदान किया। pic.twitter.com/S7n531yxmn— Arjun Ram Meghwal (@arjunrammeghwal) March 6, 2025 భక్తి , శాస్త్రీయ సంగీత అభిమానులకు సుపరిచితమైన శివశ్రీ, మణిరత్నం , AR రెహమాన్ కాంబోలో వచ్చిన పొన్నియిన్ సెల్వన్ మూవీలోని పాటతో చలనచిత్ర సంగీతంలోకి ఎంట్రీ ఇచ్చి అందర్నీ అలరించారు. అలాగే గత సంవత్సరం జనవరిలో అయోధ్యలో రామాలయం ప్రతిష్ట సందర్భంగా ఆమె విద్వత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కూడా దక్కించుకుంది. దీంతోపాటు PVA ఆయుర్వేద ఆసుపత్రి నుండి ఆయుర్వేద కాస్మోటాలజీలో డిప్లొమా కూడా పొందింది. అలాగే 'ఆహుతి' వ్యవస్థాపకురాలు ,డైరెక్టర్ కూడా. శివశ్రీ యూట్యూబ్ చానెల్‌కు 2 లక్షల మందికిపైగా, ఇన్‌స్టాగ్రామ్‌లో 1.13 లక్షలకు పైగా ఫాలోవర్లున్నారు. శివశ్రీ శాస్త్ర యూనివర్సిటీ నుంచి బయో ఇంజినీరింగ్, మద్రాస్ యూనివర్సిటీ నుంచి భరతనాట్యంలో ఎంఏ, మద్రాస్ సంస్కృత కాలేజీలో సంస్కృతంలో ఎంఏ చదివారు. ఇక తేజస్వి సూర్య వృత్తి రీత్యా న్యాయవాది, ప్రస్తుతం ఆయన బెంగళూరు సౌత్ నియోజకవర్గం నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీ తరపున వరుసగా రెండోసారి ఎంపీగా గెలుపొందారు. 2019, 2024 ఎంపీ ఎన్నికల్లో విజయం సాధించారు. 2020 నుంచి భారతీయ జనతా యువ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. దేశంలోనే అత్యంత పిన్న వయస్సు ఎంపీల్లో ఒకరిగా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Sivasri Skandaprasad (@sivasri.skanda) -
కన్నడ వర్ధమాన నటి రన్య రావు అరెస్ట్
చందనాన్ని స్మగ్లింగ్ చేస్తాడు. ఈ అందాల నటి నిజ జీవితంలో బంగారాన్ని దొంగ రవాణా చేయసాగింది. తరచూ విమానాల్లో ప్రయాణాలు, చుట్టరికాల మద్దతుతో హాలీవుడ్ సినిమా స్థాయిలో కేజీల కొద్దీ బంగారం బిస్కెట్లు, నగలను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. విధి వక్రించి అరెస్టయ్యింది.బనశంకరి: అరబ్ దేశాలనుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ పట్టుబడిన కన్నడ వర్ధమాన నటి, ఓ డీజీపీ బంధువు రన్య రావు విచారణలో డొంకంతా కదులుతోంది. ఆమె నుంచి ఇప్పటివరకు మొత్తం రూ.17.29 కోట్ల విలువైన పసిడి, నగదును సీజ్ చేశారు. ఈమె దుబాయ్ నుంచి 14.8 కేజీల బంగారాన్ని తీసుకొస్తూ సోమవారం రాత్రి బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయంలో దొరికిపోవడం తెలిసిందే. అప్పటినుంచి ఆమెను డీఆర్ఐ అధికారులు విచారిస్తున్నారు. ఇంటిలో బంగారం నిల్వలు బెంగళూరు ల్యావెల్లీ రోడ్డు నందవాణి మ్యాన్సన్ నివాసంలో నటి రన్య రావు నివసిస్తోంది. ఆమె నెలకు రూ.4.5 లక్షల అద్దె చెల్లిస్తున్నట్లు తెలిసింది. ఆ ఇంటిలో వెతికేకొద్దీ బంగారు బిస్కెట్లు, కడ్డీలు, ఆభరణాలు లభించాయి. మంగళవారం నుంచి సోదాలు నిర్వహించి రూ.2.06 కోట్ల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు. రూ.2.67 కోట్ల నగదు కూడా లభించింది. ఆమె నుంచి రూ.12.56 కోట్ల విలువచేసే 14.2 కిలోల విదేశీ బంగారం, రూ.4.73 కోట్ల విలువచేసే ఇతర ఆస్తులను జప్తు చేసుకున్నామని డీఆర్ఐ ప్రకటించింది. 14 రోజుల రిమాండు ప్రత్యేక ఆర్థిక నేరాల కోర్టులో రన్య ను హాజరుపరచగా 14 రోజుల జుడీషియల్ కస్టడీకి ఆదేశించింది. ఆమెను హెచ్ఆర్బీఆర్ లేఔట్‌లోని డీఆర్ఐ కేంద్రకార్యాలయంలో అధికారులు ప్రశ్నించారు. ఆమె బంగారం స్మగ్లింగ్ దందాకు కొందరు పోలీసులు, పారిశ్రామికవేత్తలు సహకారం అందించినట్లు అనుమానం వ్యక్తమైంది. తరచూ దుబాయ్ టూర్లు నటి రన్యారావ్ తరచూ దుబాయ్‌కి వెళ్లి వస్తోంది. వచ్చేటప్పుడు పెద్ద మొత్తంలో బంగారు నగలను ధరించి అక్రమంగా తీసుకువచ్చేది. కస్టమ్స్ , భద్రతా సిబ్బంది తనిఖీలు చేయకుండా డీజీపీ పేరును చెప్పేది. అనధికారికంగా పోలీస్ ఎస్కార్ట్ వాహనంలో ఇంటికి వెళ్లేది. తరచూ దుబాయ్‌కి వెళ్లి గుట్టుగా బంగారాన్ని తీసుకు వస్తుండడం వెనుక పెద్ద ముఠానే ఉండవచ్చని డీఆర్ఐ ఆ దిశగా దర్యాప్తు చేస్తోంది. ఇలా తరలిస్తోంది విమానం దిగగానే రన్యను డీఆర్ఐ అధికారులు తనిఖీ చేయగా గుట్టు రట్టయింది, 14 బంగారు బిస్కెట్లను తొడ భాగంలో గమ్‌తో అంటించి టేప్ చుట్టినట్లు గుర్తించారు. ఆ టేప్ పై క్రేప్ బ్యాండేజ్‌ను చుట్టుకుందని తెలిపారు. ఇలాగైతే స్కానర్ల తనిఖీలో దొరకనని అనుకుంది. శ్యాండల్‌వుడ్‌లో స్టార్‌గా ఎదగాలంటే ఆర్ అనే అక్షరంతో పేరు ఉండాలనుకుని ఆమె రన్య రావుగా పేరు మార్చుకుంది. ఆమె అసలు పేరు హర్షవర్ధిని యఘ్నేశ్, మాణిక్య సినిమా టైంలో రన్య అయ్యింది. ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు ఆర్ అక్షరం పేరుతో స్టార్లు అయ్యారని, తనకూ ఆర్ కలిసొస్తుందని భావించింది.ఒక్కొక్కరు ఎంత బంగారం తేవచ్చు..⇒ దుబాయి నుంచి భారత్ కు వచ్చే పురుష ప్రయాణికులు కస్టమ్స్ ఫీజు లేకుండా 20 గ్రాముల బంగారం, మహిళలైతే 40 గ్రాములు బంగారం తీసుకురావచ్చు. ⇒ ఒకవేళ పురుషులు 50 గ్రాములు తెస్తే 3 శాతం కస్టమ్స్ ఫీజును చెల్లించాలి. 50 గ్రాముల కంటే ఎక్కువైతే 6 శాతం, 100 గ్రాములకు మించితే 10 శాతం కస్టమ్స్ ఫీజును చెల్లించాలి. ⇒మహిళా ప్రయాణికులు 100 గ్రాములు బంగారానికి 3 శాతం, 100 గ్రాములు మించితే 6 శాతం కస్టమ్స్ రుసుమును చెల్లించాలి. 200 గ్రాముల కంటే ఎక్కువైతే 10 శాతం కస్టమ్స్ ఫీజు వేస్తారు. బంగారం కొనుగోలు చేసిన రసీదులను తప్పక చూపించాలి. హీరోయిన్ అరెస్ట్.. నాలుగునెలలుగా ఇంటికి రాలేదన్న తండ్రి డీజీపీ -
రూ.50 లక్షలు, బెంజ్ కారు కావాలి
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): ప్రేమించుకుని పెళ్లికి సిద్ధమయ్యారు. కానీ అత్యాశతో వరకట్నం కోసం కక్కుర్తి పడ్డారు. అలిగిన వరుడు, అతని తల్లితండ్రులు, బంధువులు పెళ్లి మండపం నుంచి పరారయ్యారు. ఈ వింత సంఘటన బెంగళూరులో వెలుగు చూసింది. న్యాయం చేయాలంటూ వధువు తండ్రి ఉప్పారపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కాలేజీ నుంచి ప్రేమ వధువరులు ఇద్దరూ కాలేజీ రోజుల నుంచి స్నేహితులు. ప్రేమలో పడి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ప్రస్తుతం ఫ్రాన్స్‌లో ఉద్యోగాలు చేస్తున్నారు. గత ఏడాది జూలై నెలలో ఇండియాకు వచ్చిన యువతి ప్రేమ గురించి తల్లిదండ్రులకు తెలిపింది. ఇరువైపుల పెద్దలు మాట్లాడి గతేడాది జూలైలో నిశ్చితార్థం చేశారు. మార్చి 2న 2025లో వివాహం కూడా నిశ్చయించారు. గత ఫిబ్రవరి 17న షాపింగ్ కోసం ఫ్రాన్స్ నుండి ఢిల్లీకి వచ్చిన యువతి ఓ హోటల్లో బస చేసింది. ప్రియుడు ప్రేమ్ కూడా వచ్చి యూరోపియన్ సంస్కృతి ప్రకారం పెళ్లికి ముందే ఇద్దరూ శారీరకంగా కలవాలని కథలు చెప్పి ఆమెను లొంగదీసుకున్నాడు. పొద్దున పెళ్లనగా గొడవ వివాహ వేడుకల కోసం ఫిబ్రవరి 28 నుంచి మార్చి 2 వరకూ బెంగళూరు గాందీనగర్‌లోని రైల్వే ఆఫీసర్స్ ఎన్‌క్లేవ్‌లోని నంది క్లబ్‌ని బుక్ చేశారు. 28న సంగీత్, మెహందీ వేడుకలను జరిపారు. మార్చి 1న రాత్రి వరుడు, తల్లితండ్రులు గొడవకు దిగారు. రూ.50 లక్షల నగదు, అర్ధ కేజీ బంగారం, ఒక బెంజ్ కారును కట్నంగా ఇవ్వాలని పట్టుబట్టారు. వధువు తండ్రి తన చేత కాదని చెప్పాడు. కొంతసేపటికి వరుని కుటుంబం మొత్తం పరారైంది. తెల్లవారితే జరగాల్సిన పెళ్లి జరగలేదు. ఫిర్యాదు మేరకు పోలీసులు వరుడు ప్రేమ్, అతని తల్లిదండ్రులు శివకుమార్, రాధలపై కేసు నమోదు చేసుకున్నారు. -
ఒక్కొక్కరు ఎంత బంగారం తేవచ్చు..
● దుబాయి నుంచి భారత్ కు వచ్చే పురుష ప్రయాణికులు కస్టమ్స్ ఫీజు లేకుండా 20 గ్రాముల బంగారం, మహిళలైతే 40 గ్రాములు బంగారం తీసుకురావచ్చు. ● ఒకవేళ పురుషులు 50 గ్రాములు తెస్తే 3 శాతం కస్టమ్స్ ఫీజును చెల్లించాలి. 50 గ్రాముల కంటే ఎక్కువైతే 6 శాతం , 100 గ్రాములకు మించితే 10 శాతం కస్టమ్స్ ఫీజును చెల్లించాలి. ● మహిళా ప్రయాణికులు 100 గ్రాములు బంగారానికి 3 శాతం, 100 గ్రాములు మించితే 6 శాతం కస్టమ్స్ రుసుమును చెల్లించాలి. 200 గ్రాముల కంటే ఎక్కువైతే 10 శాతం కస్టమ్స్ ఫీజు వేస్తారు. బంగారం కొనుగోలు చేసిన రసీదులను తప్పక చూపించాలి. -
ఐపీఎస్ రూపా బదిలీ
శివాజీనగర: తరచూ వార్తల్లో ఉండే సీనియర్ ఐపీఎస్, రాష్ట్ర అంతర్గత భద్రత ఐజీపీ డీ రూపా మౌద్గిల్‌ను ప్రభుత్వం బుధవారం బదిలీ చేసింది. రూపా, అదే శాఖలోని మరో ఐపీఎస్ వర్తిక కటియార్ మధ్య గొడవ చెలరేగింది. తన గదిలో దాఖలాలను చోరీ చేశారని రూపాపై వర్తిక సర్కారుకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. రెండురోజుల కిందట వర్తిక ను సర్కారు ప్రాధాన్యం లేని విభాగానికి బదిలీ చేసింది. ఇప్పుడు రూపాను కర్ణాటక పట్టు అమ్మకం మండలి ఎండీగా నియమించింది. రగడ కారణంగా ఇద్దరూ బదిలీలను అందుకోవాల్సి వచ్చింది. కామాంధ హెచ్ఎం అరెస్టు మైసూరు: ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులపై లైంగిక దాడికి పాల్పడిన ప్రధానోపాధ్యాయుడు గిరీశ్‌ను ఎట్టకేలకు జిల్లాలోని హెచ్డీ కోటె పోలీసులు అరెస్టు చేశారు. హెచ్డీ కోటె తాలూకా అగసనహుండిల ప్రభుత్వ పాఠశాల హెడ్మాస్టర్ గిరీశ్ చాలా మంది బాలికలపై లైంగిక దాడికి పాల్పడుతూ ఉన్నాడని తెలిసి పిల్లలు, తల్లిదండ్రులు స్కూలు ముందు ధర్నా చేశారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడంతో కామాంధుడు పరారయ్యాడు. పోలీసులు పోక్సో కేసు నమోదు చేసుకుని గిరీశ్ కోసం అన్వేషించారు. ఈ క్రమంలో హుబ్లీలో దాక్కున్న గిరీశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తల్లి, ముగ్గురు పిల్లలు జలార్పణం యశవంతపుర: ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన బెళగావి జిల్లా చిక్కోడిలో జరిగింది. చించోలి పట్టణానికి సమీపంలోని కృష్ణా నది పాయలోకి బుధవారం ఉదయం శారద డాలె (38), 8, 10, 14 ఏళ్ల వయస్సున్న పిల్లలతో కలిసి దూకింది. భర్త కుటుంబ పోషణను పట్టించుకోకుండా నిత్యం తాగి వచ్చి పోట్లాడేవాడు. దీంతో విరక్తి చెందిన ఆమె సామూహిక ఆత్మహత్యలకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. భర్త అశోక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు.హైకోర్టులో స్నేహమయి అప్పీల్ బనశంకరి: మైసూరు ముడా ఇళ్ల స్థలాల కేసులో సీఎం సిద్దరామయ్యపై సీబీఐ విచారణ జరపాలని హైకోర్టు ద్విసభ్య ధర్మాసనానికి ఫిర్యాదిదారు, సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణ అప్పీల్ చేశారు. సీబీఐ విచారణ అవసరం లేదని ఇటీవల ఏకసభ్య బెంచ్ తీర్పు ఇవ్వడం తెలిసిందే. వివిధ కేసులు, రాజ్యాంగ నిబంధనలను ప్రస్తావిస్తూ అప్పీల్‌ని దాఖలు చేశాడు. ఏనుగు దాడిలో ఒకరు బలి మైసూరు: ఇంటికి నడుచుకుంటూ వెళుతున్న ఓ వ్యక్తి అడవి ఏనుగు దాడిలో బలైన ఘటన చామరాజనగర జిల్లా గుండ్లుపేటె తాలూకా హాడినకణివె అనే అటవీ ప్రాంత కాలిబాటలో బుధవారం జరిగింది. తమిళనాడులోని మసనిగుడికి చెందిన కరియ (48) మృతుడు. గ్రామానికి వెళ్లే కాలిబాటలో నడుచుకుంటూ వస్తుండగా ఆకస్మికంగా అడవి ఏనుగు దాడి చేసి కరియను చంపేసింది. మిగతా ఇద్దరు పరారై తప్పించుకున్నారు. బండీపుర అటవీ అధికారులు స్థలానికి చేరుకుని పరిశీలించారు. -
సిద్దు సర్కారుపై బీజేపీ రణభేరి
శివాజీనగర: రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారెంటీ పథకాల పేరుతో ఎస్సీ ఎస్టీల నిధులను దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ ధర్నా నిర్వహించారు. బుధవారం నగరంలోని ఫ్రీడం పార్కులో బీజేపీ పక్ష నేత ఆర్.అశోక్, పార్టీ రాష్ట్రాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర, నాయకులు, కార్యకర్తలతో సభ జరిపారు. విజయేంద్ర మాట్లాడుతూ సిద్దరామయ్య సర్కారు శ్రమజీవులకు ఆర్థిక శక్తినిచ్చి వారిని అభివృద్ధిపరిచే పనులు చేయడం లేదన్నారు. ఒక మతం వారిని మెప్పించేందుకు ప్రయత్నిస్తూ ఇతరులకు అన్యాయం చేస్తోందన్నారు. పేదల కడుపు కొట్టడం మానుకోవాలన్నారు. -
రూ.23 లక్షల గంజాయి సీజ్
కోలారు: ఆటోలో తరలిస్తున్న గంజాయిని ముళబాగిలు రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు. జిల్లాలోని మాలూరు తాలూకా వెంకటరాజనహళ్లి గ్రామానికి చెందిన కృష్ణమూర్తి, (44), కడదనహళ్లి గ్రామానికి చెందిన మనోహర (26) పట్టుబడినవారు. వీరు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుంచి ఆటోలో గంజాయిని తీసుకువస్తున్నట్లు తెలిసి పోలీసులు దాడులు నిర్వహించారు. గంజాయి విలువ రూ. 23 లక్షలుగా అంచనా వేశారు. విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను విచారణ చేపట్టారు. నిలిచిన లారీని రెండు లారీలు ఢీ ● ముగ్గురు డ్రైవర్ల మృతి దొడ్డబళ్లాపురం: రోడ్డు పక్కన నిలిపి ఉన్న లారీని రెండు లారీలు వరుసగా వచ్చి ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మరణించిన ఘటన చిత్రదుర్గ తాలూకా సీబార గ్రామం వద్ద 48వ హైవేలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ తాడిపత్రికి చెందిన శేఖర్ (55), తమిళనాడు ధర్మపురికి చెందిన పెరియస్వామి (50), ఉత్తరప్రదేశ్ అలీగడ్‌కు చెందిన జబరుద్దీన్ (52) మృతులు. వస్త్రాల లోడ్‌తో వెళ్తున్న లారీ టైర్ పంక్చర్ కావడంతో రోడ్డు పక్కన నిలిపి టైర్ మారుస్తున్నారు. ఈ సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన రెండు లారీలు దీనిని ఢీకొట్టాయి. ఈ దుర్ఘటనలో మూడు లారీల డ్రైవర్లు గాయాలతో మరణించారు. ఓ లారీలోని కళింగర కాయలు చెల్లాచెదరుగా పడిపోయాయి. గంటపాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చిత్రదుర్గ రూరల్ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. చేజింగ్ చేసి గరుడ ముఠా క్రిమినల్ అరెస్టు యశవంతపుర: ఉడుపి జిల్లా మణిపాల్‌లో గరుడ గ్యాంగ్‌కు చెందిన మోస్ట్ వాటెండ్ క్రిమినల్ ఇసాక్‌ను బెంగళూరు గ్రామాంతర జిల్లా నెలమంగల పోలీసులు మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు. గరుడ గ్యాంగ్ పేరుతో ముఠా పెట్టుకుని కరావళిలో డ్రగ్స్ దందా, రౌడీయిజం, గొడవలకు పాల్పడుతున్నారు. గతేడాది ఉడుపిలో కత్తులతో పోట్లాటకు దిగి ప్రజల్లో భయాందోళన కలిగించారు. నడిరోడ్డుపై ప్రత్యర్థులపై దాడులకు పాల్పడేవారు. నెలమంగలకు చెందిన పలువురిని బెదిరించడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇసాక్ని పట్టుకోవడానికి వెళ్లగా కారులో పరారయ్యాడు. పోలీసులు చేజింగ్ చేసి పట్టుకున్నారు. ఈ చేజింగ్‌లో నాలుగు కార్లు, ఒక బైకును ఢీకొనడంతో దెబ్బతిన్నాయి. అప్పు ష్యూరిటీకి ఒత్తిడి.. మహిళ ఆత్మహత్య యశవంతపుర: అప్పు ఇవ్వడానికి ష్యూరిటీ సంతకం చేయాలని ఒత్తిడి చేయటంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన హాసన జిల్లా బేలూరు తాలూకా బిక్కూడు గ్రామంలో జరిగింది. జమున (44) మృతురాలు. వివరాలు.. ఆమెకు తెలిసిన సందీప్, ధనుశ్రీ దంపతులు రూ.10 లక్షలు అప్పు తీసుకోవాలనుకున్నారు. ఇందుకు పూచీకత్తుగా సంతకం చేయాలని జమునను ఒత్తిడి చేశారు. దీనికి జమున ఒప్పకోలేదు. సంతకం పెట్టకుంటే నీ కొడుకును హత్య చేస్తామని వారు బెదిరించటంతో జమున భయపడిపోయింది. ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకొంది. ఆమె ఇంట్లో డెత్‌నోట్ లభించింది. సందీప్, ధనుశ్రీలే కారణమని పేర్కొంది. దీంతో ఘరానా దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. ఆరు నెలల క్రితం జమున భర్త చనిపోయాడు, ఇప్పుడు వారి కుమారుడు సాత్విక్ (21) అనాథ అయ్యాడు. -
సిద్దూ బడ్జెట్‌పై ఆశల మోసులు
హుబ్లీ: సీఎం, రాష్ట్ర ఆర్థిక మంత్రి సిద్దరామయ్య ఈనెల 7న రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. సీఎం ప్రతిపాదించే 16వ రికార్డు స్థాయి బడ్జెట్‌పై వాణిజ్య నగరి హుబ్లీ, ధార్వాడ జిల్లా ప్రజలు కొండంత ఆశలు పెట్టుకున్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉత్తర కర్ణాటక ప్రాంతంలోని వ్యవసాయం, పరిశ్రమలు, కనీస వసతుల కల్పనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇవ్వాలని సీఎంను డిమాండ్ చేశారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రధాన కార్యదర్శి రవీంద్ర బలిగేర మాట్లాడుతూ హుబ్లీ ధార్వాడల మధ్య ప్రారంభమైన వివిధోద్దేశ ప్రదర్శన కేంద్రానికి రూ.2 కోట్ల ప్రత్యేక నిధులను కోరామన్నారు. ఎస్ఎంసీబీ. క్లస్టర్‌కు స్థలం మంజూరు చేశారు. అయితే ఒక ఎకరాకు రూ.98 లక్షల నుంచి రూ.కోటికి పెంచారు. ఈ బడ్జెట్లో ధర తగ్గించాలని డిమాండ్ చేశారు. జంట నగరాల మధ్య సంచరించే బీఆర్టీఎస్ సంస్థ చివరి దశలో ఉందని, దీనికి ప్రత్యామ్నాయంగా, మోనో రైలు, ట్రాన్స్ మెట్రో చేయడానికి బడ్జెట్ నిధులు కేటాయించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. టెక్స్టైల్ పార్క్‌కు తగిన నిధులు కేటాయిస్తూ స్టార్టప్ కంపెనీలకు ఎక్కువగా ప్రోత్సాహం అందించాలన్నారు. వ్యవసాయ పరికరాల కర్మాగారానికి సబ్సిడీ ఇవ్వాలి వ్యవసాయ ఆధారిత పరికరాల ఫ్యాక్టరీ స్థాపనకు సబ్సిడీ ఇవ్వాలి, ట్రక్ టర్మినల్ స్థలం కేటాయించారని, అందులో మెకానికల్, ఆటోమొబైల్‌కు అవకాశం కల్పించాలన్నారు. జంట నగరాల ప్రజలకు కనీస సౌకర్యాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి. ప్రభుత్వ కార్యాలయాల్లో కనీస వసతుల కల్పనకు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాలి. హుబ్లీ ధార్వాడ కార్పొరేషన్లు ప్రత్యేకం కావడం వల్ల ఈ రెండు కార్పొరేషన్లకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి. దీంతో ఈ రెండు పాలికెలు అభివృద్ధికి అవకాశం ఉంటుందని రవీంద్ర బలిగేర అభిప్రాయ పడ్డారు. ఇప్పటి వరకు ఎన్నో ఆశలు పెట్టుకున్న వాటిని ఈ బడ్జెట్లో నెరవేర్చాలని కోరారు. ఉత్తర కర్ణాటక పర్యాటక శాఖ అభివృద్ధికి అధిక ప్రాధాన్యతను ఇవ్వాలి. రాష్ట్ర అభివృద్ధి ఔద్యోగీకరణ చాలా అవసరం అన్నారు. బెంగళూరు తర్వాత అతివేగంగా హుబ్లీ ధార్వాడలు పెరుగుతున్నాయి. వీటికి అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చి తగిన పరిశ్రమలు స్థాపించాలి. ముఖ్యంగా బెంగళూరు, మైసూరులకు ఇచ్చే ప్రాధాన్యతకు జంట నగరాలకు కూడా ఇవ్వాలని జిల్లా ప్రజలు ముక్తకంఠంతో సిద్దూను డిమాండ్ చేస్తున్నారు. -
ఎంసీహెచ్‌తో వైద్య సేవల ఒప్పందం
రాయచూరు రూరల్: బాలింతలు, శిశు మరణాల తగ్గింపునకు నవోదయ వైద్య కళాశాల, ప్రభుత్వ తల్లీబిడ్డల ఆస్పత్రి(ఎంసీహెచ్) మధ్య ఒప్పందం కుదుర్చుకొని సంస్థ నుంచి వైద్యులను, సిబ్బందిని పంపుతున్నట్లు నవోదయ వైద్య కళాశాల ట్రస్టీ ఎస్.రాజేంద్రరెడ్డి వెల్లడించారు. బుధవారం నవోదయ కళాశాలలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గత 33 ఏళ్లుగా జిల్లా ప్రజలకు వైద్య పరంగా సేవలందిస్తున్నారన్నారు. జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో గర్భిణులు ప్రసవం కోసం వచ్చే వారికి 24 గంటలు వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. నవోదయ ఆస్పత్రిలో తాయి మడిలు కిట్లు అందించామన్నారు. నవోదయ విద్యార్థులు క్రీడల్లో, విద్యాభ్యాసంలో రాణించారన్నారు. నేటి నుంచి రీగల్ ఉత్సవాలు ఈనెల 6 నుంచి మూడు రోజుల పాటు నవోదయ వైద్య కళాశాలలో రీగల్– 2025 ఉత్సవాలకు కర్ణాటక మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు యోగానంద శ్రీకారం చుడతారన్నారు. 7న స్నాతకోత్సవాన్ని ముంబై క్యాండీ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ ఆనంద్‌రావ్ ప్రారంభిస్తారన్నారు. 8న భారతీయ నర్సింగ్ కౌన్సిల్ అధ్యక్షుడు దిలీప్ కుమార్ నర్సింగ్ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేస్తారన్నారు. సాయంత్రం ఇఫోరియ ఉత్సవాలు, నవోదయ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్య, ఆరోగ్య అంశాలపై ప్రచారం కోసం నవోదయ రేడియో స్టేషన్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాదిలో 3869 మందికి తల్లి మడిలు కిట్లతో పాటు రూ.3 వేల పారితోషికం అందించామన్నారు. 17,748 మందికి ఫిజియోథెరపి చేశామన్నారు. 136 ప్రాంతాల్లో ఉచిత ఆరోగ్య శిబిరాల్లో 28,591 మందికి వైద్య సేవలందించామన్నారు. శ్రీనివాస్, దేవానంద్లున్నారు. బాలింతలు, శిశు మరణాల తగ్గింపునకు చర్యలు నవోదయ వైద్య కళాశాల ట్రస్టీ ఎస్.రాజేంద్రరెడ్డి -
గ్యారెంటీలు.. విద్యుత్ ఉద్యోగులకు శాపాలు
రాయచూరు రూరల్: నగర, గ్రామీణ ప్రాంతాల్లో పంచ గ్యారెంటీల అమలుతో ఆర్టీసీ నష్టాల బాట పట్టగా, విద్యుత్ శాఖ పరిధిలోని నాలుగు విద్యుత్ సరఫరా మండలి(ఎస్కాం) సంస్థలకు కూడా షాక్ తగిలింది. సర్కార్ అమలు పరచిన శక్తి పఽథకం తరువాత విద్యుత్ శాఖ నిర్వీర్యం అవుతోంది. మహిళలకు ఉచిత బస్ ప్రయాణంతో ఆర్టీసీ నష్టాల బాటలోకి వెళ్లింది. అదే బాటలో ఎస్కాం సంస్థలు పయనిస్తున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ప్రభుత్వం ఉచిత గ్యారెంటీలకు వ్యతిరేకం అని చెప్పినా నిపుణుల అభిప్రాయాలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించలేదు. బస్ టికెట్ ధరలు ఒకటిన్నర శాతం పెంచారు. ఎస్కాంలు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఉద్యోగులకు పీఎఫ్, జీపీఎఫ్, ఇంధన వ్యయం, గ్రాచ్యుటీ, వేతన బకాయిలు, ఇతరత్ర కలిపి రూ.2,850 కోట్ల మేర నష్టాల బాటలో సంస్థలున్నాయి. మరో వైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఖజానాను భర్తీ చేయడం కోసం ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో నుంచి ఐదు శాతం ఇవ్వాలని ప్రతిపాదనలతో ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి లేఖ రాసినట్లు సమాచారం. రాష్ట్రంలో 2.5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులున్నారు. దీని కోసం ప్రత్యేక నిధిని స్థాపించడానికి ప్రతిపాదనలను రూపొందిస్తోంది. ఈ విషయంలో మంత్రులు, శాసన సభ్యులు, విధాన పరిషత్ సభ్యుల వేతనాల్లో నుంచి కూడా ఐదు శాతం కోత విధిస్తే పంచ గ్యారెంటీల అమలుకు అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చార్జీలు పెంచినా నష్టాల ఊబిలో కూరుకున్న ఎస్కాంలు ఉద్యోగుల వేతనాల్లో ఐదు శాతం చెల్లించాలని ప్రతిపాదన -
34 వేల ఎకరాల ఆలయ భూముల కబ్జా
సాక్షి, బెంగళూరు: వివిధ నిగమ మండళ్లకు గంగా కళ్యాణ యోజన కింద లబ్ధిదారులను సంఖ్యను పెంచాలి, లేదంటే ఈ కార్యక్రమాన్ని వదిలేయాలని పార్టీలకతీతంగా సభ్యులు బుధవారం విధానసభలో డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో డాక్టర్ చంద్రు లమాణి.. తాండాల అభివృద్ధి నిగమ మండలి ద్వారా గంగా కళ్యాణ యోజన కింద లబ్ధిదారులకు బోరుబావులు మంజూరు చేస్తున్నారని, ఇందుకోసం వేలాదిగా దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఆ దరఖాస్తులన్నింటినీ ఆమోదించలేదని ఎమ్మెల్యేలకు చెడు పేరు వస్తోందని, అంందుకే ఈ పథకం కింద లబ్ధిదారుల సంఖ్యను పెంచాలని కోరారు. ఈ డిమాండ్‌కు బీజేపీ నేతలు ఆర్.అశోక్, సునీల్ కమార్, అరగ జ్ఞానేంద్ర, సిమెంట్ మంజు తదితర సభ్యులు మద్దతు పలికారు. మంత్రి మహదేవప్ప మాట్లాడుతూ లబ్ధిదారుల సంఖ్యను పెంచుతామని హామీనిచ్చారు. అయితే గత ప్రభుత్వంలో బోరుబావులను తవ్వించడంలో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ప్రస్తుతం సుమారు 18 వేల బోరుబావులను తవ్వించేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. ఉభయ సభల్లో చర్చకు వచ్చిన పలు అంశాలు ● మన భూమి.. మన రోడ్డు పథకం ముగిసిపోయిందని, అందుకు ప్రత్యామ్నాయంగా కొత్త పథకాన్ని వచ్చే ఏడాది బడ్జెట్ సందర్భంగా ప్రస్తావిస్తామని గ్రామీణాభివృద్ధి మంత్రి ప్రియాంక్ ఖర్గే తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో నవలగుంద ఎమ్మెల్యే ఎన్.హెచ్.కోనరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. ● బర్డ్‌ఫ్లూ మనుష్యులకు సోకడం చాలా అరుదని, భయపడాల్సిన అవసరం లేదని వైద్యారోగ్య మంత్రి దినేశ్ గుండూరావు విధానసభలో తెలిపారు. ● గ్యారెంటీ పథకాలను కొనసాగిస్తామని, అలాగే అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపడతామని వ్యవసాయ మంత్రి ఎన్.చెలువరాయస్వామి విధానసభలో తెలిపారు. ప్రతిపక్షాలు మంచి సలహాలను ఇస్తే స్వీకరిస్తామన్నారు. ● గ్రామ పరిపాలన అధికారులకు ల్యాప్‌టాప్‌లను అందిస్తామని విధానపరిషత్‌లో రెవెన్యూ మంత్రి కృష్ణభైరేగౌడ తెలిపారు. ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేసే ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ● రైతులు, వినియోగదారులకు అనుకూలమైన విధంగా పాల ధరల పెంపుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని విధాన పరిషత్‌లో పశుసంవర్ధక మంత్రి వెంకటేశ్ తెలిపారు. ● మంగళూరు ప్రైవేటు కాలేజీ విద్యార్థి అదృశ్యంపై జిల్లా ఎస్పీ నేతృత్వంలో ఏడు బృందాలను ఏర్పాటు చేసినట్లు విద్యా శాఖ మంత్రి మధు బంగారప్ప తెలిపారు. విధానసభ జీరో అవర్‌లో స్పీకర్ యూటీ ఖాదర్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ● రాష్ట్రంలో 26 లక్షల నకిలీ భవన నిర్మాణ కార్మికుల కార్డులను గుర్తించినట్లు, వాటిని రద్దు చేసినట్లు కార్మిక శాఖ మంత్రి సంతోష్ లాడ్ విధానసభలో తెలిపారు. కుర్చీలాట జరుగుతోంది రాష్ట్రంలో సీఎం కుర్చీలాట జరుగుతోందని బీజేపీ ఎమ్మెల్యే సునీల్‌కుమార్ విధానసభలో విమర్శించారు. హోం మంత్రి ఢిల్లీకి వెళ్లి వచ్చి తానే సీఎం అవుతానని చెబుతారని, మరోవైపు డీసీఎం డీకే శివకుమార్ సీఎం కాబోతున్నట్లు ప్రకటిస్తారని హేళన చేశారు. గందరగోళం లేకుండా అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరవుతారో చెప్పాలని ఎద్దేవా చేశారు. లైవ్ గొడవ, అధికారి సస్పెండ్ విధానసభ కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారంలో ప్రతిపక్ష సభ్యులను చూపించకుండా నిర్లక్ష్యం ప్రదర్శించిన ఓ అధికారిని సస్పెండ్ చేశారు. కేవలం అధికార పక్షం సభ్యులనే చూపించడంపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. లైవ్‌లో తమను చూపించడం లేదని బీజేపీ ఎమ్మెల్యేలు గొడవ చేయడం తెలిసిందే. పథకం లబ్ధిదారుల సంఖ్యను పెంచాలి పార్టీలకు అతీతంగా విధానసభలో డిమాండ్లు పెంపునకు మంత్రి హామీ రాష్ట్ర దేవాదాయ శాఖ పరిధిలోని 34 దేవస్థానాలకు చెందిన 34 వేల ఎకరాల భూమిని ఆక్రమణకు గురైనట్లు గుర్తించినట్లు అందులో సుమారు 15,413 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి రామలింగారెడ్డి తెలిపారు. కాడుగొల్లలను ఎస్సీలలో చేర్పించేందుకు కేంద్ర ప్రభుత్వానికి సిఫారసులు చేసినట్లు , కేంద్రంకొన్ని వివరాలు కోరిందని, సాంఘిక సంక్షేమ శాఖతో చర్చించి ఆ వివరాలు సమర్పిస్తామని కన్నడ సాంస్కృతిక శాఖ మంత్రి శివరాజ తంగడిగి తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అభివృద్ధి పాలక మండలిలో జరిగిన అక్రమాలపై విచారణ జరుగుతోందని, నివేదిక అందిన తర్వాత నిందితులపై చర్యలు తీసుకుంటామని విధానసభలో మంత్రి మహదేవప్ప తెలిపారు. బనశంకరి: రాజధానిలో ఎంతో చర్చ జరుగుతున్న గ్రేటర్ బెంగళూరు పాలక బిల్లును అసెంబ్లీ జాయింట్ పరిశీలనా కమిటీ అధ్యక్షుడు రిజ్వాన్ హర్షద్ బుధవారం విధానసభలో సమర్పించారు. కమిటీ బెంగళూరులో పలు దఫాలుగా సమావేశాలు జరిపి ప్రజల నుంచి సలహాలను స్వీకరించింది. నివేదికలో ప్రముఖ అంశాలు... 2025 కి బెంగళూరులో ఒకటిన్నర కోట్ల ప్రజలకు నిలయంగా మారింది. 786 చదరపు కిలోమీటర్లలో విస్తరించింది. ఊహకు అందని విధంగా పెరిగింది, బీబీఎంపీని 7 నగర పాలికెలుగా విభజించాలి. పాలనా సౌలభ్యం, సత్వర అభివృద్ధి కోసం ఇది ఆవశ్యకం. గ్రేటర్ బెంగళూరు ప్రాధికార ఏర్పాటు నిర్దిష్ట కాలపరిమితిలో సాధ్యమా అనేది పరిశీలించాలి. ప్రాధికార సభ్యుల జాబితాలో కలెక్టర్, ఎస్పీలను చేర్చాలి. ప్రతి పాలికెలో వార్డులు సమానంగా ఉండాలి. ఒక్కో పాలికెలో వార్డులు 200 కు మించరాదు, 100 కంటే తక్కువ ఉండరాదు ప్రతి ఏడాది జూన్నెలలో సభ్యులు ఆస్తి ప్రకటన చేయాలి. ఒకరు ఒకవార్డులో మాత్రమే పోటీ చేయాలి. ఎన్నికల్లో గెలిచిన సభ్యుడు ఓటరు జాబితాలో మార్పులు చేసుకోరాదు. మార్పు చేస్తే సభ్యత్వం కోల్పోయేలా ఉండాలి. మేయర్, డిప్యూటీ మేయర్ పదవీకాలం 30 నెలలు ఉండాలి. నగర పాలికెలు విధించే పన్నులు, ఇతర సుంకాలు, వినియోగదారులు శుల్కం విషయంలో గ్రేటర్ జోక్యం చేసుకోరాదు. -
వేసవికి ముందే ఉ–కకు జల క్షామం?
రాయచూరు రూరల్: గత ఏడాది రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసినా వేసవిలో ఉత్తర కర్ణాటక(ఉ–క)కు జల క్షామం ఏర్పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. విజయపుర జిల్లాలోని ఆల్మట్టి డ్యాంలో ఆశించినంత మేర నీరు అందుబాటులో లేవనే విషయం తేటతెల్లమవుతోంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది జలాశయంలో నీటి నిల్వ తక్కువగా ఉంది. డ్యాం గరిష్ట మట్టం 519.60 మీటర్లు, 123.081 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉండగా ప్రస్తుతం 513.70 మీటర్లు, 52.424 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డెడ్ స్టోరేజీ 17.62 టీఎంసీలు పోను మిగిలిన 34.804 టీఎంసీల నీటిని ఈ నెలాఖరు వరకు కాలువలకు వదలాలి. గత ఏడాది 516.08 మీటర్లు, 73.838 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉండేది. ఈ ఏడాది డ్యాంలో 21.414 టీఎంసీల నీరు తక్కువగా ఉన్నాయి. ఏప్రిల్, మే, జూన్ వరకు ఆల్మట్టి జలాశయం నుంచి విజయపుర, బాగల్కోటె, యాదగిరి, కలబుర్గి, రాయచూరు జిల్లాల్లో తాగునీటి పథకాలకు ఇబ్బందులు కలిగే అవకాశాలున్నాయి. గతంలో రైతుల కోరిక మేరకు నీటి వాటా లభ్యత ఆధారంగా రబీ సీజన్లో వేసుకున్న పంటలకు నీటిని విడుదల చేస్తామని కేబీజీఎన్‌ఎల్ చీఫ్ ఇంజినీర్ సురేష్ వెల్లడించారు. ఆల్మట్టి డ్యాంలో తగ్గిన నీటి నిల్వలు తాగునీటి పథకాలకు తప్పని ఇబ్బందులు -
ఘనంగా అబ్బె తుమకూరు జాతర
రాయచూరు రూరల్: యాదగిరి తాలూకా అబ్బె తుమకూరు పండితారాధ్య రథోత్సవం, జాతర ఘనంగా జరిగింది. శనివారం రాత్రి ఆలయం వద్ద విశేష పూజలు జరిపి వేలాది మంది భక్తుల సమక్షంలో రథాన్ని లాగారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నేత్రపర్వంగా శరణ బసవేశ్వర రథోత్సవం హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా అమలాపుర గ్రామంలో వెలసిన శరణ బసవేశ్వర స్వామి వారి రథోత్సవం మంగళవారం సాయంత్రం అంగరంగ వైభవంగా జరిగింది. సాయంత్రం ఆలయం నుంచి సకల వాయిద్యాలతో పాటు పల్లకీలో శరణ బసవేశ్వర స్వామి విగ్రహాన్ని రథంపైకి తీసుకొచ్చి మూడు ప్రదక్షిణల అనంతరం రథంలో ప్రతిష్టించారు. స్వామి వారి రథం ఎక్కగానే తరలివచ్చిన భక్తులు, అమలాపుర గ్రామస్తులు శరణ బసవేశ్వరుని రథం పైకి అరటిపండ్లు విసిరి భక్తిని చాటారు. పలు గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ప్రముఖ సిద్ధాంతి కన్నుమూత బళ్లారిఅర్బన్: నగరంలో ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితుడిగా, ముఖ్యంగా సీతారామ ఆశ్రమం ట్రస్ట్ అధ్యక్షుడిగా ఆధ్యాత్మిక సేవలు అందిస్తున్న నేతి సీతారామయ్య శర్మ సిద్ధాంతి(73) మంగళవారం రాత్రి కన్నుమూశారు. హవంబావి రామనగర్ రెండో క్రాస్‌లోని ఆయన స్వగృహంలో అంతిమ దర్శనానికి బంధువులు ఏర్పాట్లు చేశారు. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా. హనుమంతపురం అగ్రహారం గడ్డిపాడులో 1952 జూలై 2న నేతి లక్ష్మీ నరసింహారావు, నేతి అలిమేలు మంగతాయారు దంపతులకు 6 మంది సంతానంలో రెండో కుమారుడుగా జన్మించారు. 1978లో బళ్లారి జిల్లా హొసపేటె తాలూకా దేవసముద్ర క్యాంప్‌లో శ్రీకోదండరామ దేవస్థానం ప్రధాన అర్చకులుగా ఇక్కడికి విచ్చేశారు. నృత్య ప్రదర్శనలో నాట్యకారుల ప్రతిభ గౌరిబిదనూరు: తమిళనాడులోని తంజావూరులో మంగళవారం రాత్రి బృహన్ నాట్యాంజలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బృహదీశ్వరాలయ ఆవరణలో జరిగిన నాట్య ప్రదర్శనలో పట్టణానికి చెందిన నాట్య కళాకారులు ప్రదర్శన ఇచ్చి ఆకట్టుకున్నారు. దిక్సూచి నాట్యాలయకు చెందిన హారిప్రియ, సృజన, మీనాక్షి, శుశ్మితశ్రీ,మానసలు పుష్పాంజలి, నటేశ కౌస్తుభం, లింగాష్ఠకం, శివపదం, ఽథిల్లాన నృత్యాన్ని ప్రదర్శించారు. వీరికి మృదంగంలో సతీశ్, వేణువు రమేశ్, ఒకల్ మిర్లాని, నషువాంగంలో హరిప్రియలు సహకరించారు. కార్యదర్శి ముత్తుకుమార్ పాల్గొన్నారు. క్షతగాత్రుడి మృతి మండ్య: మూడు నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న చామరాజనగర జిల్లా హనూరు తాలూకా మార్టళ్లి గ్రామానికి చెందిన అరుణ్ కుమార్ (20) అనే యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు.. గతేడాది నవంబర్ 1న రాత్రి 10.30 గంటల సమయంలో కనకపుర వైపు నుంచి స్వగ్రామానికి బైక్‌పై వెళుతుండగా ఎదురుగా వచ్చిన బైక్ ఢీ కొట్టింది.బైక్ వెనుక సీట్లో కూర్చొన్న అరుణ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని మైసూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తుండగా సోమవారం మృతి చెందాడని హలగూరు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. -
పెన్షన్ పెంచాలని ధర్నా
రాయచూరు రూరల్: రాష్ట్రంలో శ్మశానంలో విధులు నిర్వహించే కాటికాపరులకు బడ్జెట్లో పెన్షన్‌ను రూ.3 వేలకు పెంచాలని, వేతనాలు పెంచాలని కాటికాపరుల విమోచన సంఘం అధ్యక్షుడు వీరేష్ డిమాండ్ చేశారు. బుధవారం తాలూకా పంచాయతీ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో మాట్లాడారు. ఏళ్ల తరబడి కాటికాపరుల సమీక్ష చేపట్టడంలో అధికారులు విఫలం అయ్యారని ఆరోపించారు. వారికి రెండు ఎకరాల భూమితో ఇల్లు కట్టుకోడానికి నిధులు మంజూరు చేయాలన్నారు. స్వయం ఉపాధితో రూ.25 వేల సహాయధనం ఇవ్వాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. ఇరు వర్గాల ఘర్షణ.. వ్యక్తి హత్య రాయచూరు రూరల్: జిల్లాలోని మాన్వి తాలూకా మల్లినమడుగు గ్రామ పంచాయతీలో సర్కార్ నిధులతో చేపట్టిన పనుల పేరుకు బోర్డు పెట్టరా? అని అడిగినందుకు ఓ వ్యక్తి హత్యకు గురైన ఘటన సోమవారం సాయంత్రం జరిగింది. జీపీ సభ్యురాలు నాగమ్మ భర్త వెంకోబ రోడ్డు నిర్మాణ పనులు చేపడుతుండగా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. గొడవ విడిపించడానికి ప్రయత్నించిన వీరేష్(40)ను హత్య చేశారని మాన్వి సీఐ హిరేమఠ్ వెల్లడించారు. వెంకోబ వర్గీయులు కత్తులు, గొడ్డళ్లు, చాకులతో దాడి చేయడంతో ముగ్గురికి గాయాలయ్యాయన్నారు. గాయపడ్డ వారిని రిమ్స్ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఏబీసీడీ వర్గీకరణకు వినతి రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలపై ప్రభుత్వం స్పందించాలని దళిత ఐక్య పోరాట సమితి సంచాలకుడు మారెప్ప డిమాండ్ చేశారు. బుధవారం టిప్పుసుల్తాన్ ఉద్యానవనంలో చేపట్టిన ఆందోళనలో మాట్లాడారు. డాక్టర్ నాగ మోహన్ దాస్ కమిటీకి నివేదిక ఆధారంగా రూపొందించిన వినతిపత్రాన్ని సమర్పించారు. 30 ఏళ్ల నుంచి మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ చేయాలని పోరాడినా కాంగ్రెస్ సర్కార్ వర్గీకరణ చేయడంలో నిర్లక్ష్యం చేయడాన్ని ఖండించారు. మాదిగలకు విద్య, ఆర్థిక, ఉద్యోగ పరంగా ప్రాతినిథ్యం లేక పోవడం కారణమంటూ మాజీ మంత్రి మాధుస్వామి ఇచ్చిన నివేదికను పరిశీలించి న్యాయం చేయాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో హేమరాజ్, హులిగప్ప శ్రీనివాస్, ఈరణ్ణలున్నారు. సేవాతత్పరత అవసరం రాయచూరు రూరల్: ప్రతి ఒక్కరూ సేవాతత్పరతను పెంచుకోవాలని బాగల్కోటె ప్రభు స్వామి చరంతిమఠ పిలుపునిచ్చారు. బాగల్‌కోటలో జాతీయ స్వయం సేవక్ సంఘం సేవా భారతి ఆశ్రమాన్ని ప్రారంభించి భక్తులనుద్దేశించి ప్రసంగించారు. అవిభాజ్య విజయపుర, బాగలకోటె జిల్లాలో 1940 నుంచి సంఘ్ కార్యకలాపాలను నడిపిస్తున్నట్లు తెలిపారు. 2008 నుంచి సేవా భారతి ఆశ్రమంలో తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పిస్తున్నట్లు తెలిపారు. సమాజం చెడు మార్గం వైపు పయనిస్తున్న సమయంలో హిందూ సనాతన సంప్రదాయాలను బోధించడానికి ప్రతి ఒక్కరూ శ్రమించాలన్నారు. ఎన్ఎస్ఎస్ సంచాలకులు మంగేష్‌జీ భండే, బసవరాజ్ డంబల్, చిదంబర కర్మకర్, చంద్రశేఖర్ దొడ్డమని, సుభాష్ పాటిల్, రఘు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రంలో తనిఖీ హొసపేటె: నగరంలోని బళ్లారి రోడ్డులోని సంకలాపురలో అంగన్వాడీ కేంద్రాన్ని బుధవారం తహసీల్దార్ శృతి మల్లప్పగౌడ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రంలో ఆహార ధాన్యాలను పరిశీలించారు. అదే విధంగా పాఠశాలలో పరిశుభ్రత పాటించాలని, విద్యార్థులకు నాణ్యతమైన విద్యను బోధించాలని తెలిపారు. -
పెరిగిన కేఎంసీ ఆస్పత్రి సేవల ధరలు
హుబ్లీ: ఉత్తర కర్ణాటక జిల్లాల పేద వర్గాల పాలిట ఆరోగ్య కల్పకృక్షంగా మారిన కేఎంసీ ఆస్పత్రిలో మంగళవారం నుంచి సేవల ధరలను పెంచారు. దీంతో సామాన్య ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతోంది. బయట, లోపల రోగుల ఫీజులను పెంచారు. జనన, మరణ ధృవీకరణ పత్రం ఫీజులు పెంచారు. అయితే పెరిగిన ధరలు పేదలకు అంత భారం కావని డైరెక్టర్ డాక్టర్ కమ్మారా అభిప్రాయపడ్డారు. బీపీఎల్ కార్డుదారులకు యథా విధంగా సేవలు అందిస్తామన్నారు. కాగా బయట విభాగ ఫీజు రూ.10 నుంచి రూ.20కి పెంచారు. లోపల రోగుల నమోదుకు ప్రస్తుతం ఉన్న రూ.30ని రూ.50కి పెంచారు. ఎక్స్‌రే, స్కానింగ్, జనన, మరణ ప్రమాణ పత్రాల ధరలు కూడా పెంచారు. ఇంతకు ముందు రూ.5 ఉన్న ధరను ఏకంగా రూ.50కి పెంచారు. మొత్తానికి 8 ఏళ్ల తర్వాత తొలిసారిగా ధరలను పెంచామని డైరెక్టర్ తెలిపారు. ఈ ధరలను పెంచాలని ఏడాది నుంచి చర్చిస్తున్నామని, అనివార్యంగా ఈసారి పెంచామన్నారు. ఒక వేళ పేదలకు చెల్లించలేని స్థితి ఉంటే అలాంటి రోగులకు ఉచిత చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. నాణ్యమైన చికిత్స అందించడానికే కొద్ది మేర ధరలను పెంచామన్నారు. -
ప్రధాన నిందితుడి అరెస్ట్‌కు డిమాండ్
హుబ్లీ: అంగన్వాడీ పిల్లలు, బాలింతలు, గర్భిణులకు పంపిణీ చేయాల్సిన పౌష్టికాహారం కిట్లను అక్రమంగా నిలువ చేసిన ప్రధాన సూత్రధారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం హుబ్లీ ధార్వాడ తూర్పు అసెంబ్లీ క్షేత్రం బీజేపీ మహిళా మోర్ఛా కార్యకర్తలు దుర్గదబైలు సర్కిల్లో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా ఇన్చార్జి మంత్రి, పోలీస్ శాఖ అధికారుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్పొరేటర్, ఆ పార్టీ నేత శివు మెణసినకాయి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు, మహిళలకు అందజేయాల్సిన పౌష్టికాహారం సరుకులను అక్రమంగా సేకరించడమే కాకుండా నల్లబజార్లో వాటిని విక్రయించిన కాంగ్రెస్ కార్యకర్త బతుల్ కిల్లేదారను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఒత్తిడి చేశారు. మహిళా మోర్ఛా అధ్యక్షురాలు ప్రతిభ పవార్, మంజునాథ్ కాటకర, పూజా రాయకర్, పూర్ణిమా, అనురాధ, లక్ష్మీకాంత ఘోడ్ఖే తదితరులు పాల్గొన్నారు. కేఎస్ ఆర్టీసీ కార్యాలయంలో కేరళ అధికారులుదొడ్డబళ్లాపురం: కేరళ ఆర్టీసీ సంస్థ అధ్యక్షుడు, ఎండీ, అధికార బృందం బుధవారం బెంగళూరులోని కేఎస్ఆర్టీసీ సంస్థ కార్యాలయాన్ని సందర్శించింది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇటీవల తీసుకున్న నిర్ణయాలు, వాటి లాభాలు, ఆదాయం, లాభాలు తదితర అంశాలపై తెలుసుకున్నారు. అనంతరం కేఎస్ఆర్టీసీ 2యూనిట్‌ను సందర్శించి కొత్త ఎలక్ట్రిక్ బస్సులు, వాటి పనితీరు,లగ్జరీ బస్సులు పరిశీలించారు. చెరువులో వ్యక్తి మృతదేహం తుమకూరు: తల, చేతులు లేని కుళ్లిన మృతదేహం బుధవారం శిరా దొడ్డకెరెలో తేలుతూ కనిపించింది. పోలీసులు వచ్చి పరిశీలించారు. మృతుడికి 35 ఏళ్ల వయస్సుంటుందని నిర్ధారించారు. అనంతరం పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఎవరో చంపేసి మృతదేహాన్ని నీటిలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. -
మైనార్టీ విద్యార్థులకు సమాన ప్రాధాన్యత
హొసపేటె: కన్నడ యూనివర్సిటీలోని ఇతర విద్యార్థులతో సమానంగా మైనార్టీ విద్యార్థులకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని కన్నడ విశ్వవిద్యాలయం కులపతి డాక్టర్ డీవీ పరశివమూర్తి పేర్కొన్నారు. కన్నడ యూనివర్సిటీ, హంపీ మైనార్టీ పోస్ట్‌మెట్రిక్ బాలుర హాస్టల్‌ను బుధవారం ఆయన ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. దేశంలో మైనార్టీలకు అన్ని విధాలుగా సౌకర్యాలు ఉన్నాయన్నారు. కన్నడ విశ్వవిద్యాలయ విద్యార్థి సంక్షేమ అధికారి డాక్టర్ వెంకటగిరి దళవాయి, ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. పశువుల రవాణాకు బ్రేక్ మైసూరు: గూడ్స్ వాహనంలో అక్రమంగా పశువులను తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసిన అశోకపురం స్టేషన్ పోలీసులు నాలుగు పశువులను రక్షించారు. నగరంలోని శ్రీరాంపురం మానందవాడి రోడ్డులో గస్తీలో ఉండగా గూడ్స్ వాహనంలో పశువులను తరలిస్తున్నట్లు చూశారు. వాహనాన్ని ఆపి పరిశీలించగా, అందులో నాలుగు పశువులు కనిపించాయి. కబేళాకు తరలిస్తున్నట్లు డ్రైవర్, మరొకరు తెలిపారు. వెంటనే వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకున్నారు. గంజాయి, లాటరీలు సీజ్మండ్య: గంజాయి విక్రయిస్తున్న అగసనపురకు చెందిన ఉమేశ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మళవళ్లి తాలూకా నిడఘట్ట గేట్ వద్ద ఉండగా పట్టుకుని కొంత గంజాయిని సీజ్ చేశారు. అలాగే మళవళ్లి తాలూకా కిరుగావలు బస్టాండ్ సర్కిల్ వద్ద కేరళ రాష్ట్ర లాటరీ టికెట్లను టి.నరసీపుర తాలూకా హెగ్గూరికి చెందిన నాగేగౌడ అనే వ్యక్తి విక్రయిస్తుండగా అరెస్టు చేశారు. 36 కేరళ లాటరీ టికెట్లు, రూ. 4,200 నగదును స్వాధీనం చేసుకున్నారు. -
బంగారం అక్రమరవాణా.. నా కూతురిలా చేస్తుందనుకోలేదు: డీజీపీ
బంగారం అక్రమరవాణాతో అప్రతిష్ట మూటగట్టుకుంది కన్నడ హీరోయిన్ రన్యారావు (Ranya Rao). 14 కిలోలకు పైగా బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఆమెను బెంగళూరు విమానాశ్రయంలో సోమవారం అరెస్ట్ చేశారు. ఆమె డీజీపీ కూతురినని చెప్పడంతో పోలీసులు సైతం షాక్ అయ్యారు. అయితే రన్యా రావుకు కర్ణాటక డీజీపీ డాక్టర్ కె రామచంద్రారావు సొంత తండ్రి కాదు, సవతి తండ్రి అవుతాడు!మాకేదీ తెలియదుతాజాగా ఈ ఘటనపై డీజీపీ కె రామచంద్రరావు స్పందించారు. నాలుగు నెలల క్రితమే రన్యా పెళ్లి జరిగింది. అప్పటినుంచి ఇప్పటివరకు తను మమ్మల్ని కలవనేలేదు. తన గురించి కానీ, తన భర్త చేసే బిజినెస్ గురించి మాకేమీ తెలీదు. జరిగిన విషయం తెలిసి మేమంతా షాకయ్యాం.. అలాగే నిరాశచెందాం. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నారు. ప్రస్తుతం రన్యాను మార్చి 18 వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉంచనున్నారు.ఎవరీ రన్యా?రన్యా.. కర్ణాటకలోని చిక్కమంగళూరులో జన్మించింది. కిశోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ స్కూల్లో నటనలో మెళకువలు తెలుసుకుంది. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంది. డ్యాన్స్‌లోనూ శిక్షణ తీసుకుంది. ఈమెను దర్శకుడు, హీరో సుదీప్ వెండితెరకు పరిచయం చేశాడు. ఆయన డైరెక్ట్ చేసిన మాణిక్య చిత్రంలో సహాయ నటిగా యాక్ట్ చేసింది. ఇది ప్రభాస్ మిర్చి మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో హీరో దర్శన్‌తో కలిసి పని చేయాలనుందని తెలిపింది. తాను మంచి భోజన ప్రియురాలు అని, షాపింగ్ చేయడం అంటే ఇష్టమని పేర్కొంది. పటాస్ కన్నడ రీమేక్ పటాకిలో హీరోయిన్గా నటించింది. తమిళంలో వాఘా మూవీ చేసింది. ఎనిమిదేళ్లుగా వెండితెరకు దూరంగా ఉంటోంది.చదవండి: ఇంకా ఎందుకు బతికున్నావ్.. ఎలుకల మందు తిను అన్నారు: నటుడు -
తోట ఇంటిలో హత్యాకాండ
మైసూరు: గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో బాది వృద్ధ దంపతులను హత్య చేసిన ఘటన జిల్లాలోని హుణసూరు తాలూకా నాడప్పనహళ్లిలో మంగళవారం జరిగింది. గ్రామ నివాసులైన రంగస్వామిగౌడ (65), అతని భార్య శాంతమ్మ (52) హతులు. వివరాలు.. ఈ దంపతులకు గ్రామ పంచాయతీ సభ్యుడు దేవరాజ్‌తో పాటు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వారిద్దరే తోట ఇంట్లో నివాసం ఉంటున్నారు. దేవరాజ్ తన పొలంలో సొంఠిని నింపేందుకు బుట్టలు తీసుకు రమ్మని గణేష్ అనే కార్మికున్ని తోట ఇంటికి పంపాడు. అతడు వచ్చి చూడగా ఇంటిలో శాంతమ్మ మృతదేహం, పశువుల కొట్టంలో రంగస్వామిగౌడ శవం రక్తపు మడుగులో పడి ఉండడం చూసి కేకలు వేస్తూ పరుగులు తీశాడు. దేవరాజ్ వెంటనే వచ్చి బిళికెరె పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇన్స్పెక్టర్ లోలాక్షి, పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. వేలిముద్రలు, ఇతర ఆధారాల కోసం గాలించారు. ఈ హత్యాకాండతో గ్రామంలో భయాందోళన నెలకొంది. దక్షిణ వలయ ఐజీపీ బోరలింగయ్య, ఎస్పీ విష్ణువర్ధన్, డీఎస్పీ గోపాలకృష్ణ తోట ఇంటిని పరిశీలించి వివరాలు సేకరించారు. హంతకులు ఎవరు, ఎందుకు చంపారు అనేది మిస్టరీగా ఉంది. కడతేరిన రైతు దంపతులు మైసూరు జిల్లాలో ఘోరం -
పరారీలో అత్యాచారాల హెడ్ మాస్టర్
● విద్యాశాఖ అధికారుల సస్పెన్షన్ మైసూరు: జిల్లాలోని హెచ్డీ కోటె ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులపై లైంగిక దాడి జరిపిన ప్రధానోపాధ్యాయుడు గిరీష్ పరారీలో ఉన్నాడు. ఏదో ఒక సాకుతో తన గదిలోకి పిలుచుకుని విద్యార్థినులపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇతడు చాలామంది విద్యార్థినులపై అత్యాచారాలకు పాల్పడ్డాడని సమాచారం. పిల్లలు తల్లిదండ్రులకు చెప్పడంతో హెచ్డీ కోటె పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా, కామాంధుడు గిరీష్ పరారయ్యాడు. ఈ ఉదంతంలో విధి నిర్వహణలో లోపానికి పాల్పడినట్లు తేలడంతో బీఈఓ కాంతరాజు, సీఆర్పీ దీపా, ఈసీఓ జయరాం అనే ముగ్గురు అధికారులను డీడీపీఐ జవరేగౌడ సస్పెండ్ చేశారు. హెచ్‌డీకోటె పోలీసులు బీఈఓ కాంతరాజును అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఆ గ్రామానికి జిల్లాధికారి లక్ష్మీకాంతరెడ్డి, ఎస్పీ విష్ణువర్ధన్ వచ్చి గ్రామస్తులతో మాట్లాడారు. కీచక హెచ్ఎంని అరెస్టు చేసి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. మాదప్పకు శివరాత్రి కాసుల వర్షం మైసూరు: చామరాజనగర జిల్లా హనూరు తాలూకాలోని ప్రసిద్ధ మలెమహదేశ్వర బెట్టలో గత నెల 25 నుంచి మార్చి 1వ తేదీ వరకు శివరాత్రి మహోత్సవాలు వైభవంగా జరిగాయి. లక్షలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుని కానుకలు అందజేశారు. ఈ ఐదురోజుల్లో మలెమహదేశ్వరునికి రూ.3.37 కోట్ల ఆదాయం లభించింది. రుసుములు కట్టి 1298 మంది భక్తులు బంగారు రథోత్సవ సేవలు, 122 మంది వెండి రథోత్సవ సేవలు, ఇంకా వేలాది మంది ఇతరత్రా సేవలు చేయించారు. -
ఆనేకల్.. అవినీతి హల్చల్
బొమ్మనహళ్లి: బెంగళూరు నగర జిల్లా పరిధిలో ఉన్న ఆనేకల్ పట్టణ తాలూకా పంచాయతీ ఆఫీసు ముందు కర్ణాటక రిపబ్లికన్ సేనె నేతలు, కార్యకర్తలు ధర్నా చేశారు. తాలూకాఫీసులో లంచాలు, అవినీతి విచ్చలవిడి సాగుతున్నాయని ఆరోపించారు. ఆనేకల్ తాలూకాలో ఉన్న వివిధ గ్రామ పంచాయతీలలో అవినీతి యథేచ్ఛగా జరుగుతోందని, ఆఫీసుల్లో పేదలకు ఎలాంటి పనులు జరగడం లేదని అన్నారు. ఒక కార్యాలయం నుంచి మరో కార్యాలయానికి పేదలను చెప్పులు అరిగేలా తిప్పుతున్నారని, లంచాలకు అలవాటు పడిన అధికారులకు డబ్బులు ఇవ్వకపోతే పనులు చేయడం లేదని మండిపడ్డారు. ముఖ్యంగా ఆనేకల్ తాలూకాఫీసులో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు పెద్దపీట వేస్తూ, సామాన్య ప్రజలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అలాగే పురసభలు, గ్రామ పంచాయతీలలో పౌర కార్మికులకు, డీ గ్రూప్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, వేతనాలను పెంచాలని కోరారు. జిగని శంకర్, యల్లప్ప, చిన్నప్ప, మురళి తదితరులు పాల్గొన్నారు. -
మెట్రో బండి.. మేము రామండీ
బనశంకరి: అత్యాధునిక రవాణా వ్యవస్థ, సిగ్నల్స్, ట్రాఫిక్ జామ్‌ల బెడద లేకుండా సులభంగా గమ్యానికి చేరుకోవచ్చు అని నగరవాసులు సంతోషిస్తే, చార్జీల బాదుడు పిడుగులా పడింది. సిలికాన్ సిటీలో మెట్రో రైలు టికెట్ ధరల పెంపు (బీఎంఆర్సీఎల్) అనేది ప్రయాణికులపై చాలా ప్రభావం చూపించింది. గత నెలలో సుమారు 40 లక్షల మంది ప్రయాణికులు మెట్రో నుంచి దూరంగా ఉన్నారు. ఫిబ్రవరి 9వ తేదీన బీఎంఆర్‌సీల్ మెట్రో టికెట్ ధరలను కనిష్టంగా 33 శాతం నుంచి గరిష్టం 50గా శాతం పెంచింది. కొన్ని మార్గాల్లో అయితే కంగా 100 శాతం హెచ్చించింది. ప్రయాణికులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో మరీ ఎక్కువగా పెంచిన మార్గాల్లో కొంతమేర కోత కోసింది. రోజువారీగా తగ్గుదల ఇలా కానీ ప్రయాణికుల్లో ఆగ్రహం మాత్రం తగ్గడం లేదు. మెట్రోలో ప్రయాణించకుండా నిరసనను వ్యక్తం చేస్తున్నారు. జనవరిలో నిత్యం 8.02 లక్షల మంది ప్రయాణికులు మెట్రో రైళ్లలో ప్రయాణించేవారు, ఇప్పుడు 7.46 లక్షలకు తగ్గింది. జనవరిలో మెట్రోలో 2.49 కోట్ల మంది ప్రయాణిస్తే, ఫిబ్రవరిలో ఆ సంఖ్య 2.09 కోట్ల మందికి పరిమితమైంది. ప్రయాణికులు తగ్గినప్పటికీ చార్జీల పెంపు వల్ల మెట్రో ఆదాయం తగ్గకపోగా నష్టం కూడా రాలేదు. ఫిబ్రవరి 9 నాటికి నిత్యం ప్రయాణికుల సంఖ్య సరాసరి 8 లక్షలకు పైనే ఉండేది. ఫిబ్రవరి 23వ తేదీన 4.94 లక్షల మంది మాత్రమే రైలెక్కారు. ఇది ఏడాదిన్నర కాలంలోనే అత్యంత తక్కువమంది ప్రయాణికులు ప్రయాణించిన రోజు కావడం విశేషం. వృద్ధి నుంచి క్షీణతకు నమ్మమెట్రో చల్లఘట్ట–వైట్‌ఫీల్డ్ (గ్రీన్మార్గం) నాగవార– సిల్క్‌బోర్డు మార్గంలో పూర్తి స్థాయిలో రైళ్లు ప్రారంభం కావడంతో ప్రతి నెలా ప్రయాణికుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం టికెట్ ధరల పెంపుతో వారి సంఖ్య బాగా పడిపోయింది. 2023 డిసెంబరులో 2.13 కోట్ల మంది ప్రయాణం చేశారు. అది అలాగే కొనసాగింది. ఈ ఏడాది జనవరిలో 2.49 కోట్ల మంది మెట్రో సేవలను పొందారు. కానీ ఫిబ్రవరిలో టికెట్ ధరల పెంపుతో ఈ సంఖ్య 2.09 కోట్లకు క్షీణించింది. తీవ్రంగా చార్జీల పెంపు ఎఫెక్టు బెంగళూరువాసుల అసహనం తగ్గిన 40 లక్షల మంది ప్రయాణికులు తగ్గించాలని డిమాండ్లు మెట్రో టికెట్ ధరల పెంపుపై ఇప్పటికీ వ్యతిరేకత వస్తోంది. ధరలను తగ్గించాలని వివిధ సంఘాలు, పార్టీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. అంతేగాక రానున్నరోజుల్లో పోరాటం తీవ్రతరం చేయడం గురించి ప్రణాళిక రూపొందించారు. సోషల్ మీడియాలో నిత్యం చార్జీల వడ్డనపై చర్చ జరుగుతూనే ఉంది. మెట్రో చార్జీల సమస్య గురించి విధానసభలో చర్చ జరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ సహా బీజేపీ, జేడీఎస్ దీనిపై గతంలో గళమెత్తాయి. -
ఖర్గేతో డీకేశి మంతనాలు
శివాజీనగర: డిప్యూటీ సీఎం డీ.కే.శివకుమార్ సీఎం కావడం గ్యారెంటీ అని పార్టీ నేత వీరప్ప మొయిలీ చెప్పడంతో కాంగ్రెస్‌లో భారీ మార్పులు తప్పవా? అనే ప్రశ్న వినిపిస్తోంది. మరోవైపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను మంగళవారం బెంగళూరులోని సదాశివనగరలోని నివాసంలో శివకుమార్ కలవడం కుతూహలానికి దారితీసింది. భేటీ తరువాత మాట్లాడిన డీకే, నేను ఖర్గే ఇంటికి కాకుండా బీజేపీ ఆఫీస్‌కు వెళ్లాలా? ఖర్గే రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆయన గౌరవార్థం కలిశాను అని చెప్పారు. కొత్త కాంగ్రెస్ భవన్ ప్రారంభ తేదీ గురించి చర్చించినట్లు తెలిపారు. -
శ్రీనివాస రథోత్సవం
మైసూరు: జిల్లాలోని సాలిగ్రామ తాలూకా దొడ్డహనసోగె గ్రామంలోని శ్రీనివాస స్వామి బ్రహ్మరథోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. పవిత్ర కావేరి నది వద్ద వెలసిన ఆలయానికి చాలా చరిత్ర ఉంది. ఎమ్మెల్యే డీ.రవిశంకర్ రథానికి పూజలు చేయడం ద్వారా శ్రీకారం చుట్టారు. రథోత్సవం నేపథ్యంలో ఆలయంలో తెల్లవారుజాము నుంచే హోమాలు జరిగాయి. రథంలో శ్రీనివాస స్వామి వారిని ప్రతిష్టించి భక్తులు గోవింద.. గోపాల..అని నినాదాలు చేస్తూ లాగారు. మహిళా భక్తులు రథవీధిని శుభ్రం చేసి రంగురంగుల ముగ్గులు పెట్టి రథానికి స్వాగతం పలికారు. తహసీల్దార్ నరగుంద, ఇన్స్పెక్టర్ కృష్ణరాజు తదితరులున్నారు. నట్లు, బోల్టులకు రమ్య మద్దతు యశవంతపుర: సినిమా రంగం వాళ్లకు నట్లు బోల్టులను బిగిస్తానంటూ డీసీఎం డీకే శివకుమార్ చెప్పిన మాటలను కొందరు వ్యతిరేకిస్తే, కొందరు సమర్థిస్తున్నారు. ప్రముఖ నటి, కాంగ్రెస్ నాయకురాలు రమ్య.. డీకేని సమర్థిస్తూ సామాజిక మాధ్యమాలలో పోస్టు చేశారు. నట్లు, బోల్టులు సరి చేస్తామని చెప్పడంలో ఎలాంటి తప్పు లేదు. సినిమా రంగం ప్రజలపై మంచి ప్రభావం చూపిస్తుంది. గోకాక్ పోరాటానికి కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ మద్దతు ఇచ్చిన సంగతిని సినిమా రంగం మరువరాదని ఆమె ఇన్‌స్టా లో పోస్టు చేశారు. డీసీఎంది అహంకారం: యదువీర్ దొడ్డబళ్లాపురం: సినిమా పరిశ్రమకు చెందిన వాళ్ల నట్లు, బోల్టులు బిగిస్తానంటూ డీసీఎం డీకే శివకుమార్ అధికార మదాన్ని ప్రదర్శించారని మైసూరు బీజేపీ ఎంపీ యదువీర్ ఆరోపించారు. హాసన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన సినిమా ఆర్టిస్టులు ప్రైవేటు వ్యక్తులని, ఏ కార్యక్రమంలో పాల్గొనాలి, వద్దు అనేది వారి వ్యక్తిగతమన్నారు. నటీనటులు ఏ రాజకీయ పార్టీకి చెందినవారు కాదన్నారు. అలాంటి వారిని గౌరవం లేకుండా నిందించడం సబబు కాదన్నారు. ఎస్సీ,ఎస్టీల నిధులు ఇతర అవసరాలకు వినియోగించరాదని నిబంధనలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను గ్యారంటీ పథకాలకు మళ్లించిందని ఆరోపించారు. పాలనను గాలికి వదిలేసి ముఖ్యమంత్రి పదవి కోసం గుద్దులాడుకుంటున్నారని హేళన చేశారు. కారు– బైక్ ఢీ, ఫైనాన్స్ ఉద్యోగి మృతి మైసూరు: కారు, బైక్ ఢీకొని మైక్రో ఫైనాన్స్ ఉద్యోగి మరణించగా, మరొకరు గాయపడ్డారు. ఈ దుర్ఘటన మైసూరు–ఊటీ హైవేలో నంజనగూడు తాలూకా కళలె గేట్ వద్ద జరిగింది. చామరాజనగర జిల్లా గుండ్లుపేటె నివాసి మహేష్ (27), మంజుబుద్ధి (23), భారత్ ఫైనాన్సియల్లో పనిచేస్తున్నారు. అప్పులను వసూలు చేసేందుకు గుండ్లుపేటె తాలూకా చిక్కాటి గ్రామానికి బైక్‌లో వెళుతుండగా, ఎదురుగా వస్తున్న కారు అతివేగంగా వచ్చి ఢీకొంది. దీంతో బైక్ సవారులు తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మహేష్ మరణించినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. నంజనగూడు ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. నవ వివాహిత ఆత్మహత్య యశవంతపుర: నవ వివాహిత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరు జాలహళ్లిలో జరిగింది. దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరు తాలూకా కాణియూరు బాకిమారు గ్రామానికీ చెందిన పూజాశ్రీ (23)కి, బెళ్తగండి తాలూకాకు చెందిన ప్రకాశ్‌తో 10 నెలల క్రితం పెళ్లయింది. జీవనోపాధి కోసం రెండు నెలల క్రితం ఇద్దరూ బెంగళూరు జాలహళ్లిలోని బంధువు ఇంటికి వచ్చారు. పూజాశ్రీ అదే ఇంటిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియంలేదు. బాగలగుంట పోలీసులు భర్తను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
టమాటా సాస్.. ఆరోగ్యం లాస్
బనశంకరి: ప్లాస్టిక్ కవర్లు పెట్టి ఇడ్లీలు చేయడం, కూరగాయలు తాజాగా కనిపించేలా రంగులు వేయడం వద్దని సర్కారు ఇటీవల హెచ్చరించింది. ఇప్పుడు టమాటా సాస్ ప్రమాదకరమని రాష్ట్ర ఆహార సురక్షతా శాఖ నివేదికను విడుదల చేసింది. వీధి బండ్ల నుంచి ప్రముఖ రెస్టారెంట్ల వరకు టమాటా సాస్‌లను వాడుతుంటారు. ఇందులో బ్రాండెడ్ ఉత్పత్తులు వాడేవారు తక్కువ. టేబుళ్లపై కూడా ఉంచడం వల్ల వినియోగదారులు అదనంగా చల్లుకుంటారు. కానీ టమాటా సాస్‌లో ప్రమాదకర రసాయనాలు వాడుతున్నట్లు ఆహార సురక్షతా శాఖ నివేదికలో హెచ్చరించింది. ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదమని తెలిపింది. అధిక మొత్తంలో ఉప్పు, రసాయనాలు పెద్దల్లో బీపీ, పిల్లల్లో మానసిక అలజడి ఆహార సురక్షత శాఖ నివేదిక రసాయనాలు, కృత్రిమ రంగులు మార్కెట్లో నాసిరకం టమాసా సాస్ సరఫరా అవుతోందని ఫిర్యాదులు రావడంతో అధికారులు తనిఖీలు చేశారు. ఫిబ్రవరిలో శాంపిల్స్ సేకరించిన ల్యాబ్‌లలో పరీక్షించారు. సాస్‌లో సోడియం బెంజోయేట్ అనే రసాయం మితిమీరి వాడుతున్నారని, ఉప్పు ఎక్కువ మొత్తంలో ఉందని గుర్తించారు. ఎర్రగా నిగనిగలాడుతూ కనబడటానికి కృత్రిమ రంగులు వాడుతున్నారు. ఇవన్నీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని అధికారులు తెలిపారు. పెద్దల్లో బీపీ పెరగడం, నిస్సత్తువ, పిల్లల్లో కోపం, ఉద్రేకం వంటివి కలుగుతాయి. మానసిక అలజడి పెరుగుతుందని హెచ్చరించారు. సాస్ మాత్రమే కాదు బెల్లం, చిప్స్, బఠాణీలు కల్తీ అవుతున్నట్లు చెప్పారు. -
ప్రతిపక్షం.. లైవ్‌లో నిర్లక్ష్యం
శివాజీనగర: శానసభా కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారంలో విపక్ష సభ్యులను నిర్లక్ష్యం చేస్తున్నారు, వారివైపు కెమెరాలను ఫోకస్ చేయడం లేదని మంగళవారం విధానసభలో వాగ్వివాదం నెలకొంది. ఫలితంగా గందరగోళం ఏర్పడి సభను కొంతసేపు వాయిదా వేయాల్సి వచ్చింది. ఎందుకు చూపడం లేదు బడ్జెట్ సమావేశాలు రెండవరోజుకు చేరుకోగా, ప్రశ్నోత్తరాలు ముగిశాక బీజేపీ పక్ష నాయకుడు ఆర్.అశోక్, కర్ణాటక పబ్లిక్ కమిషన్‌లో కన్నడ భాష నగుబాటు అయ్యిందంటూ వాయిదా తీర్మానం కింద మాట్లాడబోయారు. బీజేపీ పక్ష ఉప నేత అరవింద బెల్లద్ స్పందిస్తూ అసెంబ్లీ సమావేశాల లైవ్‌లో మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. నిలబడి మాట్లాడుతున్నా లైవ్‌లో చూపించటం లేదు. ఇది సరికాదు. సోమవారమే చెప్పాం. ప్రభుత్వ ధోరణి సరికాదని ఘాటైన స్వరంతో అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్ కూడా ఇదే ఆరోపణ చేశారు. లైవ్ కాంట్రాక్టును ఓ కాంగ్రెస్ కార్యకర్తకు అప్పగించారని తెలిసిందని, ఇది సరికాదని బెల్లద్ చెప్పగా, అధికార పార్టీ సభ్యులంతా లేచి నిలబడి వ్యతిరేకించారు. వాగ్వివాదం పెరిగి ఆరోపణలు చేసుకున్నారు. కేకల మధ్యలో మాట్లాడిన మంత్రి ప్రియాంక ఖర్గే, పార్లమెంట్లో ఏమి చేశారో తెలుసు, తామేమీ కొత్తగా చేయలేదని అన్నారు. నట్లు లూజయ్యాయా? స్పీకర్ యూటీ ఖాదర్ స్పందిస్తూ, నేను చూస్తున్నాను. టెక్నికల్‌గా ఏమి సమస్య ఉందనేది గమనించి సరిచేస్తానని సర్దిచెప్పబోయారు. ప్రతిపక్ష సభ్యులు ఇప్పుడే అన్నింటినీ సరిచేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ సభ్యుడు సునీల్‌కుమార్ ఎక్కడైనా నట్లు బోల్ట్‌లు లూజయ్యాయా అని అనడంతో మళ్లీ వాగ్వివాదం నెలకొంది. స్పీకర్ చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. ఆర్.అశోక్ మాట్లాడుతూ ప్రతిపక్ష సభ్యులను నిర్లక్ష్యం చేయటం సరికాదని అన్నారు. గొడవ తగ్గకపోవడంతో స్పీకర్ సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. నేరాలు తగ్గాయి: హోంమంత్రి యశవంతపుర: సైబర్ క్రైమ్ మినహా రాష్ట్రంలో ఏడాది నుంచి నేరాల సంఖ్య బాగా తగ్గినట్లు హోంమంత్రి జీ పరమేశ్వర్ విధానసభలో తెలిపారు. మత్తు పదార్థాలతో జరిగే అనర్థాలపై బడులు, కళాశాల విద్యార్థులకు జాగృతి చేస్తున్నట్లు చెప్పారు. గంజాయి, హఫీము, మట్కా, దోపిడీలు, నాటుసారా, వాహన చోరీలు తదితరాలపై నిఘా పెట్టి చర్యలు తీసుకొంటున్నట్లు చెప్పారు. రాత్రి సమయంలో గస్తీని పెంచాం. డీఎస్పీ పోస్టుల నియామకం పరిశీలనలో ఉంటుందన్నారు. మావైపు కెమెరాలు ఫోకస్ చేయడం లేదు విధానసభలో బీజేపీ సభ్యుల ధ్వజం ఉభయ పక్షాల తీవ్ర వాగ్వాదం -
విహారానికి వెళ్లి అదృశ్యం
మైసూరు: చామరాజనగర జిల్లా గుండ్లుపేటె తాలూకా బండీపుర అటవీ ప్రాంతంలో రిసార్టు నుంచి బయటకు వెళ్లిన ఓ కుటుంబం అదృశ్యమైంది. బెంగళూరుకు చెందిన జె.నిశాంత్ (40), అతని భార్య చందన (35), వారి పదేళ్ల కుమారుడు కనిపించకుండాపోయారు. వివరాలు.. బండీపుర సమీపంలోని కంట్రీక్లబ్ రిసార్ట్‌లో ఈ కుటుంబం ఆదివారం రాత్రి బస చేసింది. సోమవారం మధ్యాహ్నం నుంచి కనిపించడం లేదు. నిశాంత్ లగేజ్ రిసార్ట్‌లోనే ఉంది. రిసార్ట్‌లో లగేజీని వదిలి ముగ్గురు కారులో బయటకు వెళ్లారు. బండీపుర మంగళ రోడ్డు వరకు వెళ్లినవారు అక్కడి నుంచి కనిపించకుండాపోయారు. జిల్లా ఎస్పీ డాక్టర్ బీటీ కవిత స్థలాన్ని పరిశీలించారు. గుండ్లుపేటె పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. నకిలీ ఐడీతో గది బుక్ నిశాంత్ బీబీఎంపీ ఉద్యోగి అని చెప్పుకుని నకిలీ ఐడీని అందించి గదిని బుక్ చేసుకున్నారు. నిశాంత్ భారీగా అప్పులు చేశాడని, ప్రస్తుతం ఏ పనీ చేయడం లేదని తెలిసింది. అప్పులిచ్చిన వారి వేధింపులకు భయపడి కుటుంబంతో కలిసి బండీపురకు వచ్చాడు. రుణదాతలు అపహరించి ఉంటారనే అనుమానంతో పోలీసులు గాలింపు చేపట్టారు. తమిళనాడు, కేరళ, మైసూరుతో పాటు పలు చోట్ల గాలిస్తున్నారు. కంట్రీక్లబ్ రిసార్టు, మిస్సయిన చోట పోలీసుల తనిఖీ బెంగళూరు కుటుంబం గుండ్లుపేటె వద్ద మిస్సింగ్ అప్పులవాళ్లు కిడ్నాప్ చేశారని అనుమానాలు -
విద్యారంగానికి 30 శాతం నిధులివ్వాలి
కోలారు : బడ్జెట్లో విద్యా రంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు మంగళవారం నగరంలోని తహసీల్దార్‌కార్యాలయం ముందు ప్రతిఘటన నిర్వహించారు. జిల్లా కార్యదర్శి సురేష్‌బాబు మాట్లాడుతూ విద్యారంగంలో నానాటికీ నాణ్యతా ప్రమాణాలు తగ్గిపోతున్నాయన్నారు. ప్రభుత్వాలు విద్య రంగాన్ని ర్లక్ష్యం చేయడంతో కార్పొరేట్ విద్య విస్తరిస్తోందన్నారు. ఫలితంగా రైతు, కార్మిక దళత, వెనుకబడిన వర్గాల విద్యార్థులు ఉన్నత విద్యను పొందలేక పోతున్నారన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేసేందుకు నిధులు పెంచాలన్నారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. జిల్లా ఉపాధ్యక్షుడు జీ శశికుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా సహ కార్యదర్శి హర్షిత తదితరులు పాల్గొన్నారు. -
జాతరకు వెళుతుండగా బోలెరో ఢీ
బొమ్మనహాళ్: కర్ణాటకలోని బళ్లారి తాలూకా సంగనకల్లు వద్ద చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో బొమ్మనహాళ్ మండలం నేమకల్లు గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామస్ధులు తెలిపిన వివరాల మేరకు.. నేమకల్లు గ్రామానికి చెందిన తిప్పేస్వామి, రత్నమ్మ దంపతుల కుమారుడు జి.నాగరాజు (19), వన్నూర, వనజాక్షి దంపతుల కుమారుడు కె.గణేష్(14) ఇద్దరు మంచి స్నేహితులు. ఇద్దరు తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో సహాయం చేస్తూ జీవనం సాగించేవారు. గ్రామం నుంచి సోమవారం సాయంత్రం జి.నాగరాజు, కె.గణేష్‌తో పాటు మరి కొంతమంది యువకులు కాలినడకన కర్ణాటకలోని గూళ్యం గ్రామంలో వెలసిన శ్రీగాదిలింగేశ్వర జాతరకు బయలుదేరారు. రాత్రి 9.30 గంటల సమయంలో కప్పగల్–సిరివార క్రాస్ వద్ద రోడ్డు పక్కన నడుచుకొంటూ వెళుతున్నారు. వెనుక నుంచి ఢీకొన్న బోలెరో వెనుక వైపు నుంచి వచ్చిన బొలెరో (కేఎ–34 సి–9845) నాగరాజు, గణేష్‌లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నాగరాజు, గణేష్‌లను తోటి గ్రామస్ధులు బళ్లారి విమ్స్‌కు అంబులెన్సులో తీసుకెళ్లగా పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్థారించారు. మృతుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కర్ణాటక పోలీసులు తెలిపారు. మంగళవారం నాగరాజు, గణేష్‌ల మృతదేహాలకు విమ్స్‌లో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను నేమకల్లు గ్రామానికి తీసుకొచ్చారు. మృతదేహాల వద్ద తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితుల రోదనలు అక్కడికి వచ్చిన వారందర్నీ కంటతడి పెట్టించింది. వైఎస్సార్సీపీ సర్పంచ్ పరమేశ్వర కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నేమకల్లు యువకుల మృతి గ్రామంలో విషాదఛాయలు -
భక్తిశ్రద్ధలతో నంజుండేశ్వర స్వామి జయంతి
కోలారు : శ్రీ కంఠ శివాచార్య గురు జయంతి మహోత్సవం కోలారు నగరంలోని ప్రసన్న శ్రీ నంజేడేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం శ్రీ మహాగణపతి ప్రార్థన, మహన్యాస పారాయణం, పంచామృత అభిషేకం, రుద్రాభిషేకం, విశేష అలంకరణ, మహామంగళారతి, తీర్థ ప్రసాద వినియోగం జరిగింది. వేద విద్యాంసుల ఆధ్వర్యంలో వేదమంత్ర పారాయణం జరిగింది. అన్ని శైవ దీక్షా కుటుంబాలు పూజా కార్యక్రమంలో పాల్గొన్నాయి. తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కోదండరామ స్వామికి పూజలు మాలూరు: సుమారు 200 సంవత్సరాల ఇతిహాసం కలిగిన లక్కూరు గ్రామంలోని పురాతన శ్రీ కోదండరామస్వామి దేవాలయాన్ని ఇటీవల గ్రామస్తులు జీర్ణోద్ధరణ చేసి నూతన విమాన గోపురం నిర్మించారు. ఈ సందర్భంగా మంగళవారం దేవాలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజాకార్యక్రమాలను నిర్వహించారు. వైఖానుస భాగవత్ శాస్త్రాను సారంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ నిర్వాహకులు అన్నదానం చేశారు. -
మహిళా దొంగ అరెస్టు
తుమకూరు: బస్సు ప్రయాణికుల నగలు, డబ్బు కొట్టేస్తున్న మహిళా దొంగను హుళియారు పోలీసులు బంధించి రూ.10.05 లక్షల విలువ చేసే బంగారు నగలను స్వాధీనపరచుకున్నారు. నిందితురాలు కొరటగెరె బోవి కాలనీకి చెందిన అలివేలమ్మ (25). జిల్లాలో చాలా చోట్ల అమాయక మహిళలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడినట్లు తెలిపింది. 2024 డిసెంబర్ 9న తిపటూరు తాలూకా గౌడనకట్టెకు చెందిన రాజేశ్వరి అనే మహిళ హుళియారు బస్టాండ్‌లో బస్సు ఎక్కుతుండగా అలివేలమ్మ నగలను దోచుకుంది. కేసు నమోదు చేసుకున్న హుళియారు పోలీసులు నిందితురాలిని గుర్తించి అరెస్టు చేశారు. -
ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
హుబ్లీ: ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన హావేరి తాలూకా దేవగిరిలో చోటు చేసుకుంది. మృతి చెందిన విద్యార్థిని ఉల్లాస్(22)గా గుర్తించారు. ఉల్లాస్ బెళగావి జిల్లా బైలహొంగలకు చెందిన విద్యార్థి. ఇంజినీరింగ్ నాలుగో సెమిస్టర్ చదువుతున్నాడు. పరీక్షల ఒత్తిళ్లతో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన స్థలాన్ని హావేరి గ్రామీణ పోలీసులు పరిశీలించారు. అనంతరం చెరువులో తేలిన ఉల్లాస్ మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టంకు తరలించారు. కాగా విద్యార్థి మృత దేహాన్ని హావేరి మున్సిపల్ చెత్త తరలించే వాహనంలో తీసుకు రావడంపై విద్యార్థి సంఘాలు తీవ్రఆగ్రహం వ్యక్తం చేశాయి. బైక్‌ల చోరునిఅరెస్ట్ హుబ్లీ: జిల్లాలోని కలఘటిగి తాలూకా హుణసికట్టి గ్రామంలో ఇంటి ఎదుట నిలిపిన ద్విచక్ర వాహనాన్ని చోరీ చేసి పరారైన నిందితుడిని కలఘటిగి పోలీసులు అరెస్ట్ చేశారు. కుందగోళ తాలూకా రామనకొప్పకు చెందిన విఠల్ బసప్ప కురడే (27) అరెస్ట్ అయిన నిందితుడు. అతడి వద్ద నుంచి సుమారు రూ.1.20 లక్షల విలువ చేసే రెండు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత నెల 22న ఇంటి ఎదుట నిలిపిన సుమారు రూ.62 వేల విలువ చేసే ద్విచక్ర వాహనం చోరీకి గురైందని హుణసికట్టి గ్రామానికి చెందిన భీమప్ప పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉన్నతాధికారుల సూచన మేరకు సీఐ శ్రీశైల కౌజలిగి, ఎస్ఐ కరివీరప్ప నేతృత్వంలోని బృందం గాలించి నిందితుడిని అరెస్ట్ చేశారు. నేత్రపర్వంగా అడ్డపల్లకీ ఉత్సవం హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా బయలుతుంబరగుద్ది గ్రామంలో మంగళవారం అడ్డ పల్లకీ ఉత్సవం, ధార్మిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉజ్జయిని సద్దర్మ పీఠం జగద్గురు శివాచార్య మాట్లాడుతూ అనాదిగా వస్తున్న మతాచారాలు, సంప్రదాయాలను పాటించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ఒక్కో పంచపీఠానికి ఒక్కో గోత్ర పురుషుడు ఉంటారన్నారు. ఉజ్జయిని పీఠంలో గోత్రపురుషుడు నంది. అంత నందీశ్వరుని నూతన రథోత్సవాన్ని నిర్వహించిన గ్రామస్తులు పునీతులయ్యారన్నారు. మూడు కోట్ల దేవుళ్లలో శివుడిని మహాదేవ అని అంటారన్నారు. సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. పిల్లలకు మంచి విద్య, నడవడిక నేర్పి వారిని సత్పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులపై ఉందన్నారు. గ్రామస్తులు, భక్తులు వేలాదిగా తరలివచ్చారు. వైభవంగా నందీశ్వర రథోత్సవం హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా బయలుతుంబరగుద్ది గ్రామంలో నందీశ్వర స్వామి రథోత్సవం సోమవారం సాయంత్రం అంగరంగ వైభవంగా జరిగింది. రథోత్సవం నేపథ్యంలో ఉదయం నుంచి హోమం, హవనాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హిరేమఠంలోని కూడ్లిగి ప్రశాంత సాగర స్వామికి కలశారోహణం జరిపారు. సకల వాయిద్యాలతో పల్లకీలో రథం దగ్గరకు తీసుకొచ్చి మూడుసార్లు ప్రదక్షణలు చేసి రథంలో ప్రతిష్టించిన అనంతరం రథోత్సవాన్ని ప్రారంభించారు. రథం పైకి ఎక్కి అరటి పండ్లు విసిరి భక్తిని చాటుకున్నారు. కానాహొసహళ్లి, రంగనాథనహళ్లి, సూరవ్వనహళ్లి, బెల్లకట్టెతో పాటు చుట్టు పక్కల గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. భక్తులే మఠానికి ఆస్తులు హుబ్లీ: దివంగత శివలింగేశ్వర స్వామి ఆస్తులు లేని మఠానికి భక్తులనే ఆస్తులుగా తీర్చిదిద్దాడని బొమ్మనహళ్లి విరక్త మఠం శివయోగేశ్వర స్వామీజీ తెలిపారు. కలఘటిగి తాలూకా బొమ్మగట్ట గ్రామంలోని శ్రీ అడవి సిద్దేశ్వర మఠం ఆవరణలో జాతర ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన దివంగత శివలింగేశ్వర స్వామి గురువందన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. శివలింగేశ్వర స్వామి ప్రేరణతో ఎటువంటి ఆస్తి లేని బొమ్మగట్ట అడవి సిద్దేశ్వర మఠం నేడు భక్తులతో రాష్ట్రానికే తలమానికంగా మారిందన్నారు. శివలింగేశ్వర స్వామి సమాజానికి నిరాడంబరమైన బతుకును కేవలం మార్గదర్శనం చూపి అనుసరించారన్నారు. హాసన జిల్లా చెంగడిహళ్లి విరక్త మఠం బసవ మహాంత స్వామి మాట్లాడుతూ సేవా మనోభావంతో పని చేస్తే సకాల కార్యాలు సిద్ధిస్తాయన్నారు. ప్రతి ఒక్కరు ఐక్యతతో ధార్మిక కార్యక్రమాలను నెరవేర్చాలని సూచించారు. ఉత్తరాధికారి ఇందుధర దేవరు మాట్లాడుతూ శివలింగేశ్వర స్వామి చూపిన బాటలో మనందరం నడవాలన్నారు. -
‘దళితుల నిధులను దారి మళ్లించిన సర్కార్’
కోలారు : దళితుల అభ్యున్నతికి రిజర్వు చేసిన నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం దారి మళ్లించి గ్యారెంటీ పథకాల అమలుకు వినియోగిస్తోందని బీజేపీ నాయకులు మండిపడ్డారు. నిధుల దారి మళ్లింపును నిరసిస్తూ మాజీ ఎంపీ మునిస్వామి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు చలపతి నేతృత్వంలో మంగళవారం నగరంలోని మెక్కె సర్కిల్ నుంచి ఊరేగింపుగా బస్టాండ్ వద్దకు చేరుకొని పంగనామాలు వేసిన చెంబులను ప్రదర్శించారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర మాజీ మంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ సిద్దరామ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారెంటీలను సక్రమంగా అమలు చేయలేక చతికిలబడిందన్నారు. దళితుల కోసం కేటాయించిన రూ. 34 వేల కోట్లను దారి మళ్లించి గ్యారంటీల కోసం ఖర్చు చేశారన్నారు. దళితుల పేరుతో అధికారంలోకి వచ్చి వారికే మోసం చేసిందన్నారు. మాజీ ఎంపీ మునిస్వామి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం దళితుల నిధులను లూటీ చేస్తోందని ఆరోపించారు. కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేయడం లేదన్నారు. 60 శాతం కమీషన్ డిమాండ్ చేస్తుండడం శోచనీయమన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే వై సంపంగి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందీష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వెంకటమునియప్ప తదితరులు పాల్గొన్నారు. -
చరిత్రకు సాక్ష్యం.. జఠంగి ఆలయం
సాక్షి,బళ్లారి: రాష్ట్రంలో చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన పవిత్ర పుణ్యక్షేత్రాలెన్నో భాసిల్లుతున్నాయి. మన పురాణాలు, ఇతిహాసాల ప్రకారం శివునికి అత్యంత అగ్రస్థానం ఉంది. మహావిష్ణువు అవతారమైన శ్రీరాముడు దేశంలో ఎన్నో ప్రాంతాల్లో స్వయంగా శివలింగాలను ప్రతిష్టాపన చేసి పూజలు చేసిన సందర్భాలు, అందుకు సంబంధించిన చరిత్ర ఆనవాళ్లు కూడా ఉన్నాయి. అలాంటి ఎంతో ఘనమైన చరిత్ర జఠంగి రామలింగేశ్వర స్వామి ఆలయానికి కూడా ఉంది. శివుడిని భక్తులు ఎంతో నియమనిష్టలతో సేవించి శివాలయాలను సందర్శించేందుకు ఇష్టపడేది మాఘ మాసం, కార్తీక మాసాల్లోనే. ఈ రెండు మాసాలు శివున్ని శివభక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఆ సమయంలో మహిమాన్విత ఆలయాలను సందర్శించి పునీతులవుతుంటారు. ప్రస్తుతం మాఘ మాసంలో శివాలయాలకు భక్తుల తాకిడి పెరుగుతోంది. సాక్షాత్తు శ్రీరాముడు ప్రతిష్టాపన చేసిన శివలింగమే శ్రీ జఠంగి రామలింగేశ్వర ఆలయం. ఈ ప్రాంతంలో ఉండటంతో భక్తులు ఎంతో భక్తిశ్రద్దలతో కొలుస్తూ శివుడిని ఆరాధిస్తున్నారు. రామేశ్వరాలయానికి చారిత్రక నేపథ్యం చారిత్రాత్మకమైన, మహిమాన్విత స్థలాలు చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన చిత్రదుర్గ, బళ్లారి జిల్లాల్లో శ్రీరాముడు ఈ ప్రాంతాలకు వచ్చినట్లు చరిత్ర ఆనవాళ్లు ఉన్నాయి. రామాయణ కథకు నిదర్శనంగా నిలిచే అపురూపమైన దృశ్యాలు, గుట్టలు, పర్వతాలు చిత్రదుర్గ జిల్లా మొళకాల్మూరు తాలూకా రామసాగర గ్రామంలో కొలువుదీరాయి. జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఉన్న బళ్లారికి నుంచి 20 కిలోమీటర్ల దూరంలోని రాంపుర గ్రామ సమీపంలోని జఠంగి రామేశ్వర ఆలయానికి చారిత్రాత్మక నేపథ్యం కలిగి ఉంది. ఈ గుట్ట(పర్వతానికి)కు రామ, లక్ష్మణ, సీతతో పాటు రావణాసురుడు వచ్చినట్లు కూడా చరిత్ర చెబుతోంది. రామాయణ పురాణ పుణ్య కథల వల్ల తేటతెల్లం అవుతున్న ఈ విశేష కథనం రామసాగర వద్ద జఠంగి రామేశ్వర కొండ సాక్షిగా నిలుస్తోంది. సముద్రం మట్టం నుంచి 3469 అడుగులు ఎత్తులో రెండు భారీ ఆకారపు కొండలు ఉన్నాయి. ఈ కొండలకు వందలాది సంవత్సరాల నుంచి జఠాయు పర్వతాలు అని పిలుచుకుంటారు. ఒక కొండ చివరి భాగంలో వేలాది సంవత్సరాల క్రితం నాటి సమాధి ఉంది. దీనిని జఠాయువు సమాధి అని పిలుస్తారు. గుహాకారంలో వెలసిన ఆలయం ఈ సమాధి కింద గుహాకారంలో రామేశ్వర ఆలయం ఉంది. జఠాయువు సమాధి ఉన్న కొండ ఎదురుగా మరో కొండలో 108 లింగాలు వెలిశాయి. జఠంగి రామేశ్వర ఆలయం కూడా ఉంది. జఠాయువు కోరిక మేరకు శ్రీరాముడే శివలింగాన్ని ప్రతిష్టాపించి ప్రాణప్రతిష్టాపన చేసినట్లుగా విశ్వసిస్తారు. కాశీ నుంచి శివలింగాన్ని తీసుకు రావడానికి శ్రీరాముడు భక్తుడు ఆంజనేయుడికి సూచిస్తారు. అయితే ఆంజనేయుడు శివలింగం తీసుకుని రావడానికి ఆలస్యం జరుగుతుంది. దీంతో ఈ ప్రాంతంలో లభ్యమైన ఉద్బవలింగానికి శ్రీరాముడు ప్రాణప్రతిష్టాపన చేస్తారు. ఈ క్రమంలో ఆంజనేయుడు తీసుకుని వచ్చిన లింగాన్ని ప్రతిష్టించిన తర్వాత 108 లింగాలు కూడా ప్రతిష్టాపించినట్లుగా ఇక్కడ ప్రతీతి. దేవాలయంలో నంది విగ్రహం ఎదురుగా భారీ ఆకారంలో దీపస్తంభం ఉండగా, శిలలతో నిర్మాణమైన అపురూపమైన దేవాలయం ఉంది. అలాగే చుట్టు పక్కల పలు దేవాలయాలు కూడా ఉన్నాయి. ఈనేపథ్యంలో జఠంగి రామేశ్వర కొండకు విశేషంగా భక్తులు తరలివచ్చి ప్రత్యేకంగా పూజలు చేస్తున్నారు. భక్తుల కొంగుబంగారం రామలింగేశ్వర స్వామి శ్రీరాముడు ప్రతిష్టించిన శివలింగమే మూలవిరాట్ సీతా రామ లక్ష్మణ ఆంజనేయ స్వామి నడయాడిన స్థలం -
వేతన బకాయిల కోసం ధర్నా
గౌరిబిదనూరు: వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నగర శివారులో హిందూస్థాన్ డిస్టలరీ కార్మికులు ధర్నా నిర్వహించారు. కార్మికుల సంఘం కార్యదర్శి అనిల్ కుమార్ మాట్లాడుతూ 109 మంది కార్మికలకు వేతన బకాయిలు చెల్లించకుండా యాజమాన్యం ఆస్తుల విక్రయించడానికి ప్రయత్నిస్తోందన్నారు. బకాయిలు విడుదల చేయడంతోపాటు పీఎఫ్ తదితర చెల్లింపులు చేయాలని, తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధ్యక్షుడు సిఎస్ మోహన్, నరసింహమూర్తి వెంకటేశప్ప, నాగరాజు, మూర్తి,బాలయ్య, నాగేశ్,నాగప్ప, నిరంజన్, మురళి పాల్గొన్నారు. పుట్టగొడుగులతో ఉపాధి హోసూరు: మహిళలు స్వయం ఉపాధి కోసం వ్యవసాయ శాఖ ద్వారా మహిళలకు పుట్టగొడుగుల ఉత్పత్తిపై శిక్షణ శిబిరం నిర్వహించారు. అంచెట్టి తాలూకా తళి నియోజకవర్గంలోని ఉరిగం గ్రామంలో మహిళా సంఘాల ప్రతినిధులతు శిక్షణ అందజేశారు. వ్యవసాయ శాఖ ఉపడైరక్టర్ మురుగన్ , అధికార్లు సెల్లయ్య, మణిగంటన్, గణేష్‌మూర్తి, వెంకటాచలపతి పాల్గొన్నారు. పుట్టగొడుగుల పెంపకం ద్వారా ఆదాయం గడించవచ్చని, మెలకువలు పాటించి ఎక్కువ దిగుబడులు పొందాలని సూచించారు. అడవి జంతువు దాడిలో గొర్రెలు మృతి క్రిష్ణగిరి: క్రిష్ణగిరి జిల్లా ఊత్తంగేరి సమీపంలో కొట్టంలో కట్టేసిన గొర్రెలపై ఏదో అడవి జంతువు చేసిన దాడిలో 11 గొర్రెలు మృతి చెందాయి. వివరాల మేరకు ఊత్తంగేరి సమీపంలోని నల్లవన్పట్టి గ్రామానికి చెందిన రఘుపతి, గొర్రెలను పోషిస్తున్నాడు. సోమవారం రాత్రి కొట్టులోకట్టేసి ఇంటికెళ్లాడు. మంగళవారం ఉదయం కొట్టువద్దకెళ్లే సరికి 11 గొర్రెలు గాయాలతో చనిపోయి ఉన్నాయి. రూ. 2 లక్షల నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని ఊత్తంగేరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ధృవీకరణ పత్రాల పంపిణీలో జాప్యంపై ఫిర్యాదు చింతామణి: జనన, మరణ పత్రాలు ఇవ్వడంలో అధికారలు జాప్యం చేస్తున్నారని చింతామణి లాయర్లు మంగళవారం తహసీల్దార్ సుదర్శన్ యాదవ్‌కు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ స్పందించి తక్షణమే సంబంధిత అధికారిని పిలిచి సర్టిఫికెట్ల పంపిణీలో జాప్యం చేయవద్దని ఆదేశించారు. లాయర్లు సంఘం పదాదికారులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రీషియన్ మృతి
మాలూరు : క్యాంటర్ లారీ ద్విచక్రవాహనాన్ని ఢీకొని వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈఘటన తాలూకాలోని చిక్కతిరుపతి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. బెంగుళూరు రూరల్ జిల్లా పణత్తూరు దిన్నెకు చెందిన చరణ్‌రాజ్ (22) ఎలక్ట్రీషియన్ పని చేస్తుంటాడు. ఎప్పటి లాగా పని ముగించుకుని చిక్కతిరుపతి గ్రామ పంచాయతీ కల్కెరె గ్రామానికి చెందిన శ్రీధర్‌తో కలిసి బైక్‌లో వెళ్తుండగా సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఎదురుగా వస్తున్న క్యాంటర్ ఢీకొంది. ఘటనలో చరణ్కాజ్ అక్కడికక్కడే మరణించాడు. గాయపడిన శ్రీధర్‌ను ఆస్పత్రికి తరలించారు. లక్కూరు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
కలబుర్గిలో రౌడీషీటర్ హత్య
రాయచూరు రూరల్: గుర్తు తెలియని వ్యక్తులు ఓ రౌడీషీటర్ని హత్య చేసిన ఘటన మంగళవారం కలబుర్గిలో చోటు చేసుకుంది. మృతుడిని భవాని నగర్‌కు చెందిన వీరేష్(40)గా సబ్ అర్బన్ పోలీసులు గుర్తించారు. వీరేష్‌పై రెండు రౌడీ కేసులు నమోదయ్యాయి. సోమవారం రాత్రి స్నేహితులతో కలసి వీరేష్ డిన్నర్ పార్టీకి వెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగి గొడవ జరిగింది. తెల్లవారు జామున 5 గంటల సమయంలో పరిశ్రమల కేంద్రం వైపు వెళుతుండగా దుండగులు దాడి చేసి కత్తులతో పొడిచి పరారయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టి హంతకుల కోసం గాలింపు చేపట్టినట్లు సీఐ సంతోష్ తెలిపారు. -
కన్నడ సాహిత్యంపై అవగాహన పెంచుకోవాలి
గౌరిబిదనూరు: కనకదాసు, పురంధర దాసులు కన్నడ సాహిత్య లోకానికి అనన్యమైన సేవలందించారని ఉపన్యాసకులు గిరిధర్ అన్నారు. కన్నడ సాహిత్య సుధ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ఒక షోరూమ్ ఆవరణలో కన్నడ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు జనార్ధనమూర్తి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కన్నడ సాహిత్యం గొప్పదనాన్ని వివరించారు. రాష్ట్ర జానపద అకాడమీ ప్రశస్తి పొందిన గొట్లగుంటె వెంకటరమణప్ప, సూర్య ప్రకాశ్, కుసుమా సూర్య ప్రకాశ్‌ను సన్మానించారు. కార్యదర్శి హెచ్ఎల్వీ వెంకటేశ్ పాల్గొన్నారు. -
అత్యుత్తమ సేవలకు వరించిన అవార్డు
కోలారు : కోలారు జిల్లా ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నందుకు ఆర్ ఎల్ జాలప్ప ఆస్పత్రికి జాతీయ ఆస్పత్రుల మాన్యతా మండలి అంతర్జాతీయ రోగుల సురక్షతా అవార్డు – 2025 లభించింది. ప్రపంచంలోని 70 దేశాల 250 ఆరోగ్య సేవా సంస్థల మధ్య జరిగిన పోటీలో కోలారు ఆర్ ఎల్ జాలప్ప ఆస్పత్రికి ఈ అవార్డు లభించింది. ఢిల్లీలోని భారత మంటపంలో నిర్వహించిన మండలి 12వ అంతర్జాతీయ రోగుల సురక్షతా సమావేశంలో ఈ అవార్డును ఆర్ఎల్ జాలప్ప ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జె. కృష్ణప్ప, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ కె దినేష్ కార్తీక్, డా రాజ్‌కుమార్‌కు ప్రదానం చేశారు. -
బెంగుళూరు ఎయిర్‌పోర్ట్‌లో కన్నడ నటి అరెస్ట్
బెంగుళూరు: బెంగుళూరు ఎయిర్‌పోర్టులో భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. కన్నడ హీరోయిన్ రాన్యారావును గోల్డ్ స్మగ్లింగ్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి బెంగుళూర్‌కు 14 కేజీల బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తుండగా డీఆర్ఐ అధికారులకు పట్టుబడ్డారు. రాన్యారావును అధికారులు ప్రశ్నిస్తున్నారు. కాగా, అధికారులకు తాను డీజీపీ కూతురినంటూ రన్యారావు చెప్పినట్లు సమాచారం.తరచుగా దుబాయ్ వెళ్లే రన్యారావు.. ఈసారి కూడా వెళ్లి మార్చి 3వ తేదీ రాత్రి తిరిగి దుబాయ్ నుంచి వచ్చింది. బెంగుళూరు ఎయిర్ పోర్ట్‌లో అనుమానంతో ఆమెను అధికారులు చెక్ చేయగా, స్మగ్లింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆమె దుస్తులలో 14.8 కిలోల బంగారం బయటపడింది. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ దాదాపు రూ.12 కోట్లు ఉంటుందని అంచనా. కాగా, కన్నడలో సుదీప్తో మాణిక్య సినిమాలో రాన్యా నటించింది. -
ప్రేమ పేరుతో CISF అధికారిణి వంచన.. ఐటీ ఉద్యోగి ఆత్మహత్య
యశవంతపుర: సీఐఎస్ఎఫ్ మహిళా అధికారి పెళ్లి పేరుతో తనను మోసం చేసిందంటూ ఆమె ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలోని బెళగావిలో వెలుగు చూసింది. సెల్ఫీ వీడియోను ఇన్‌స్టాలో పోస్టు చేసి సదరు వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఘటన చర్చనీయాంశంగా మారింది.వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజిపురకు చెందిన అభిషేక్ సింగ్(40).. చెన్నైలోని ఓ ఐటీ కంపెనీలో పని చేస్తున్నారు. ఈ క్రమంలో గుజరాత్ చెందిన మోనిక సింగ్‌తో అభిషేక్‌కు పరిచయం ఏర్పడింది. ఆమె బెళగావిలో సీఐఎస్ఎఫ్లో సహాయక కమాండెంట్‌గా పని చేస్తున్నారు. అయితే, ఆమె తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసిందని అభిషేక్ ఆరోపించారు. సోమవారం మంగళూరు రావ్ సర్కిల్లోని ఓ లాడ్జ్‌లో అభిషేక్ సింగ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.అంతకుముందు ఆయన రాసిన లేఖలో సదరు మహిళకు వివాహం అయినప్పటికీ, వివాహం కాలేదని నమ్మించి తన లైంగిక అవసరాలు తీర్చుకున్నారని ఆరోపించారు. పెళ్లి చేసుకుందామని అడిగితే బెదిరించి మానసికంగా హింసిస్తోందని వీడియోలో చెప్పాడు. ఈ సందర్భగా తాము సన్నిహితంగా ఉన్న ఫోటోలను కూడా పోస్టు చేశాడు. ఈ ఘటనపై బెళగావి నగర పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.A shocking incident has come to light in #Karnataka's #Mangaluru where a man from #UttarPradesh died by suicide, alleging he was exploited by a #CISF woman officer.The deceased, identified as #AbhishekSingh (40) from #Ghazipur, Uttar Pradesh, was found hanging in a lodge near… pic.twitter.com/QKuh3pcdOD— Hate Detector 🔍 (@HateDetectors) March 3, 2025 -
సిద్దరామయ్యకు ఝలక్.. కర్ణాటక సీఎంగా డీకే?
బెంగళూరు: కర్నాటక కాంగ్రెస్‌లో రాజకీయం ఆసక్తికరంగా మారింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను పదవి నుంచి తొలగిస్తున్నారనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ కూడా హింట్ ఇస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ త్వరలోనే సీఎంగా బాధ్యతలు చేపడతారని చెప్పుకొచ్చారు. దీంతో, కాంగ్రెస్ వర్గాల్లో చర్చ మొదలైంది.ఇక, వీరప్ప మొయిలీ వ్యాఖ్యలపై తాజాగా సీఎం సిద్ధరామయ్య స్పందించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ..‘నేను మరోసారి చెబుతున్నాను. సీఎం ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తుంది. మొయిలీ లేదా మరొకరు ఏం మాట్లాడారనేది ఇక్కడ ముఖ్యం కాదు. హైకమాండ్ నిర్ణయమే అంతిమం’అని సిద్ధరామయ్య సోమవారం అన్నారు. సీఎం మారతారని కాంగ్రెస్ నాయకులు బాహటంగా చర్చిస్తున్న విషయాన్ని సిద్ధూ దృష్టికి తేగా.. ‘నేను హైకమాండ్ అదేశాల మేరకే నడుచుకుంటాను’ అని ఆయన బదులిచ్చారు. -
రాష్ట్రం పురోగమిస్తోంది
శివాజీనగర: రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా ఉత్తమ సాధన కనబరిచిందని గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ అన్నారు. ప్రధాన రంగాలైన వ్యవసాయం, విద్య, ఆరోగ్య, నీటిపారుదలతో పాటు అభివృద్ధిలో కర్ణాటక ప్రత్యేక ఆదర్శాన్ని అనుసరిస్తోందని పేర్కొన్నారు. సోమవారం నుంచి బెంగళూరులోని విధానసౌధలో అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఆరంభమయ్యాయి. తొలిరోజు గవర్నర్ గెహ్లాట్ ఇరు సభలను ఉద్దేశించి విధానసభలో ప్రసంగించారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన ప్రసంగపాఠం కావడంతో సర్కారుకు అనుకూలంగా ప్రసంగం సాగింది. కాంగ్రెస్ మార్కు అయిన గ్యారెంటీ పథకాలను గవర్నర్ సమర్థించారు. రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడలేదన్నారు. గ్యారెంటీ పథకాల అమలుతో రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, అభివృద్ధి వెనుకబడిందనే ప్రతిపక్షాల ఆరోపణలకు గవర్నర్ ప్రసంగం ద్వారా సర్కారు సమాధానం ఇప్పించే యత్నం చేసింది. ప్రభుత్వం ప్రతి ఒక రంగంలో పురోగమిస్తోంది. రాష్ట్రానికి ఆదాయం పెరుగుతోంది. గ్యారెంటీల వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతోందని పలువురు జ్యోతిష్యం చెప్పారు. దీనిని ప్రభుత్వం అబద్ధం చేసిందని అన్నారు. ఆఖరి వ్యక్తి కన్నీరు తుడిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. గ్యారెంటీ పథకాల వల్ల అసమానతలు తగ్గుతున్నాయన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 1 ట్రిలియన్ డాలర్ స్థాయికి పెంచే ప్రయత్నం సాగుతోందన్నారు. జీఎస్టీ వసూళ్లలో కర్ణాటక దేశంలోనే 2వ స్థానంలో ఉందని తెలిపారు. సంక్షేమానికి ఏటా 90 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వ సాధనాలు గణనీయమైనవని గవర్నర్ వర్ణించారు. సంక్షేమ కార్యక్రమాల కోసం సంవత్సరానికి రూ. 90 వేల కోట్లను ఖర్చు చేస్తోంది. సామాజిక పింఛన్లు, రైతుల పంపుసెట్లకు ఉచిత విద్యుత్, వివిధ రంగాలకు సంక్షేమ కార్యక్రమాలు సాగుతున్నాయి. ప్రత్యక్ష, సబ్సిడీ ప్రోత్సాహక ధనం వల్ల కోట్లాది కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. ఈసారి మంచి వర్షాల వల్ల పంటలు బాగా పండాయి. ఖరీఫ్, రబీ సీజన్లలో 140 లక్షల టన్నుల వరకు వ్యవసాయ ఉత్పత్తులు రాగవలని అంచనా ఉంది. రైతు కుటుంబాల్లో ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయి. పంటలకు గిట్టుబాటు ధర లభిస్తోంది అని గవర్నర్ చెప్పారు. విద్యా శాఖలో 13 వేలకు పైగా పట్టభద్ర ఉపాధ్యాయుల ఉద్యోగాలను భర్తీ చేయడమైనది. ఉన్నత విద్యా శాఖలో 1088 అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలకు ఆదేశాలు ఇవ్వడమైనదని చెప్పారు. ప్రాంతీయ అసమానతలను తొలగించేందుకు నిధులను ఉదారంగా మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఇటీవల జరిపిన ప్రపంచ పెట్టుబడిదారుల సమ్మేళనం విజయవంతం కాగా, రికార్డుస్థాయిలో రూ. 10.27 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయన్నారు. అంతకుముందు గవర్నర్ అసెంబ్లీ ఆవరణకు చేరుకోగానే సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీకే శివకుమార్, మంత్రులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. గ్యారెంటీ పథకాలు ఆర్థిక ప్రగతికి అడ్డంకులు కాదు అసెంబ్లీలో ప్రసంగంలో గవర్నర్ గెహ్లాట్ బడ్జెట్ సమావేశాలకు నాంది -
వీడియో కాల్.. ఖాతా ఢమాల్
బనశంకరి: క్రెడిట్ కార్డు ఇస్తామని, లేదా బ్యాంక్ అధికారినంటూ వీడియో కాల్చేసి బ్యాంక్ అకౌంట్ వివరాలు తెలుసుకుని దోచేసిన సంఘటన నగరంలో జరిగింది. బెంగళూరు సీఈఎన్ పోలీస్‌స్టేషన్‌లో ఈ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. నాగరబావి సమీపంలోని కళ్యాణనగర హేమంత్‌కుమార్ ఇలాంటి కేసులో లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. వివరాలు.. బాధితుడు గత నెల 24 తేదీన పొరపాటున వేరే అకౌంట్ కు నగదు పంపించాడు. దీని పరిష్కారం కోసం గూగుల్‌లో బ్యాంక్ సహాయవాణి నంబర్ గాలించి ఓ నంబరుకు ఫోన్ చేశాడు. ఫోన్ స్వీకరించిన వ్యక్తి సహాయం చేస్తామని హేమంత్‌కుమార్‌కు ఓ లింక్ పంపించి డౌన్లోడ్ చేసుకుని బ్యాంకు ఖాతా వివరాలు తెలిపాలని చెప్పాడు. హేమంత్ సరేనని వివరాలు నమోదు చేశాడు. కొంతసేపటి తరువాత వీడియో కాల్ చేసిన గుర్తుతెలియని వ్యక్తి.. మీ డెబిట్‌కార్డు చూపించాలని అడగగా సరేనని చూపించాడు. బాధితుని ఖాతాకు రూపాయి పంపించి వచ్చిందా, లేదా అని అడిగారు. వచ్చిందని చెప్పగానే హేమంత్ బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.10.53 లక్షలను దుండగులు బదిలీ చేసుకున్నారు. గమనించిన హేమంత్‌కుమార్ ఫోన్ చేయగా ఎవరూ స్పందించలేదు. మోసపోయినట్లు తెలుసుకుని సెంట్రల్ సీఈఎన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఒకరికి రూ. 10 లక్షలు, మరొకరికి రూ. 85 వేలు మస్కా బెంగళూరులో సైబర్ వంచనలు బ్యాంకు సిబ్బంది పేరుతో మోసాలుక్రెడిట్కార్డు నెపంతో రూ.85 వేలు ఐటీ సిటీలో ప్యాలెస్ గుట్టహళ్లిలోని కస్తూరిబాయినగరవాసి టీకే ప్రవీణ్‌కుమార్‌కు క్రెడిట్ కార్డు ఇస్తామని మోసగించారు. జనవరి 31వ తేదీన ఫోన్ చేసిన ఓ వ్యక్తి పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారి అని చెప్పుకున్నాడు. మరిన్ని ఆఫర్లతో క్రెడిట్‌కార్డు ఇస్తామని, ఇప్పటికే వాడుతున్న క్రెడిట్‌కార్డు ఫోటో పంపిస్తే ఆన్లైన్లో నేరుగా ఇంటికి పంపిస్తామని తెలిపారు. నమ్మిన అతడు తన క్రెడిట్‌కార్డును వీడియో కాల్లో చూపించాడు. అంతే వివరాలు తెలుసుకున్న మోసగాళ్లు అతని క్రెడిట్ కార్డు ద్వారా రూ.85 వేలు జమచేసుకున్నారు. ప్రవీణ్‌కుమార్ సీఈఎన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
గవర్నర్‌ను నిలబెట్టి అవమానిస్తారా?
శివాజీనగర: శాసనసభా ఉభయ సభల సమావేశంలో తొలి రోజునే అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. గవర్నర్‌కు అవమానం జరిగిందంటూ ప్రతిపక్షాలు మండిపడ్డాయి. అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యుల మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. శాసనసభకు గవర్నర్ విధానసభ తూర్పు ద్వారం నుంచి లోపలికి వచ్చారు. సీఎం సిద్దరామయ్య మోకాళ్ల నొప్పుల వల్ల మెట్లు ఎక్కలేక చక్రాల కుర్చీలో అసెంబ్లీకి వచ్చారు, దీంతో కొంతసేపు ఆలస్యం కావటంతో గవర్నర్, సీఎం రాకకోసం అసెంబ్లీలో కొన్ని నిమిషాలు నిలబడే ఉన్నారు. ఇది బీజేపీ సభ్యుల కోపానికి కారణమైంది. బీజేపీ సభ్యులు చన్నబసప్ప, గురురాజ్‌లు గవర్నర్‌ను అవమానం చేస్తున్నారా అని కేకలు వేశారు. మంత్రి బోసురాజు, కాంగ్రెస్‌కు చెందిన బసవరాజ రాయరెడ్డిలు మీకు మానవత్వం లేదా, అన్నిటిలో రాజకీయం చేస్తున్నారా అని ప్రశ్నించారు. అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యుల మధ్య వాగ్వివాదం నెలకొని సభలో గందరగోళం మొదలైంది. ఈ దశలో సిద్దరామయ్య సభకు చేరుకుని గవర్నర్‌ను స్వాగతించారు. అయినా మాటల యుద్దం జరిగింది. గవర్నర్ సభాపతి స్థానానికి వెళుతుండగా పోలీస్ బ్యాండ్‌వారు జాతీయ గీతం వాయించగా గొడవ సద్దుమణిగింది. అసెంబ్లీ ఆవరణలో బీజేపీ సభ్యులు ప్లకార్డులు చేతబట్టి నిరసన తెలిపారు. వర్సిటీల మూసివేతపై ఫిర్యాదు బనశంకరి: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 9 యూనివర్శిటీలను మూసివేసేలా అశాసీ్త్రయ, అప్రజాస్వామ్య నిర్ణయాలను తీసుకుంది, దీనివల్ల దుష్పరిణామాలు తలెత్తుతాయి అని గవర్నర్ కు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. రాష్ట్రం లేదా దేశం అభివృద్ధికి పునాది ఉన్నత విద్యా వ్యవస్థ. బీజేపీ పార్టీ 2019–20లో అధికార అవధిలో రాష్ట్రవ్యాప్తంగా 10 నూతన యూనివర్శిటీలను ఏర్పాటుచేసింది. వేలాదిమంది విద్యార్థులు యూనివర్శిటీల్లో ఉన్నత విద్య చదువుతున్నారు. ఇలాంటి సమయంలో సిద్దరామయ్య ప్రభుత్వం 9 యూనివర్శిటీలను అశాసీ్త్రయంగా మూసివేసే కుట్రకు పాల్పడటం తగదని అన్నారు. ఆ నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని, విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని గవర్నర్‌ను కోరారు. సర్కారుపై ప్రతిపక్షాల ఆగ్రహం సభకు సీఎం రాక ఆలస్యంతో వివాదం ప్రముఖులకు సంతాపంశివాజీనగర: ఇటీవల దివంగతులైన ప్రముఖులు, మాజీ ప్రజాప్రతినిధులకు అసెంబ్లీలో నివాళులర్పించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఎంపీ ఎం.శ్రీనివాస్, జయవాణి మంచేగౌడ, శ్యామ్ బెనగల్, సాహితీవేత్త డిసోజ, జానపద గాయకురాలు సుక్రి బొమ్మగౌడ తదితరుల సేవలను గుర్తుచేసుకున్నారు. మన్మోహన్సింగ్ బాల్యం నుంచి మరణం వరకు ప్రముఖ ఘట్టాలను పలువురు సభ్యులు వివరించారు. వారి గౌరవార్థం సభ్యులు నిమిషం పాటు లేచి నిలబడి మౌనం పాటించారు. -
పచ్చిమాంసం తినరాదు
● బర్డ్‌ఫ్లూ మార్గదర్శకాలు బనశంకరి: రాష్ట్రంలో కోళ్లలో బర్డ్ ప్లూ జబ్బు బయటపడడంతో రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్‌ని ప్రకటించింది. ఆరోగ్యశాఖ మార్గదర్శకాలను ప్రకటించింది. ఎలాంటి పచ్చిమాంసం తినరాదు, మాంసాన్ని బాగా ఉడికించి ఆరగించాలి. బర్డ్‌ప్లూ కనబడిన ప్రదేశాల్లో మాంసం అమ్మరాదు. అక్కడికి మూడు కిలోమీటర్ల పరిధిలో ఎవరూ సంచరించరాదు. ఎవరికై నా బర్డ్ ప్లూ జ్వరం వస్తే పది కిలోమీటర్ల పరిధిలో నిఘా వేయాలి. పారిశుధ్య, నివారణ చర్యలను ముమ్మరం చేయాలి. ప్రజలెవరూ ఆ ప్రాంతంలో సంచరించరాదు అని నిషేధాజ్ఞల్లో హెచ్చరించారు. బీజేపీ ఎమ్మెల్యేపై కేసు యశవంతపుర: మంగళూరులో కాంగ్రెస్ నాయకుని దాడి చేశారంటూ అక్కడి బీజేపీ ఎమ్మెల్యే వేదవ్యాస్ కామత్‌తో పాటు 11 మంది కార్యకర్తలపై కేసు నమోదైంది. కాంగ్రెస్ నాయకుడు యశవంత్ ప్రభు ఆదివారం రాత్రి తనపై వారు దాడి చేశారని ఫిర్యాదు చేశాడు. ఎమ్మెల్యే వేదవ్యాస్ రెచ్చగొట్టడం వల్లనే దాడి జరిగిందని తెలిపాడు. కన్యాథాన్ పరుగు బొమ్మనహళ్లి: బెంగళూరుతో పాటు రాష్ట్రమంతటా మహిళా భద్రత కోసం కన్యాథాన్ పేరిట పరుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం ఉదయం నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీలో పరుగు సాగింది. సుమారు 10 కిలోమీటర్ల పరుగులో చిన్నారుల నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకూ పాల్గొన్నారు. ఎక్కువ మంది మహిళలు హాజరయ్యారు. ఇంటిలో బంగారం చోరీ మైసూరు: ఇంటిలో ఎవరూ లేని సమయంలో దొంగలు పడి బీరువాను బద్ధలు కొట్టారు. సుమారు రూ. 1.46 లక్షల విలువైన 73 గ్రాముల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. మైసూరులోని రాజీవ్నగరలో నివాసం ఉంటున్న నాగేష్ బాబు అనే వ్యక్తి బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. ఇంట్లో తల్లి ఒక్కరే ఉంటారు. ఆమె ఇటీవల బెంగళూరులో కుమారుని వద్దకెళ్లారు. సోమవారం ఇంటికి తిరిగి రాగా, ఇంటి తలుపులు, బీరువా పగలగొట్టి ఉన్నాయి. బంగారు నగలు కనిపించలేదు. వెంటనే ఉదయగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళా ఐపీఎస్‌ల రగడ.. వర్తిక బదిలీబనశంకరి: రాష్ట్ర అంతరిక భద్రతా విబాగ (ఐఎస్డీ) ఐజీపీ డీ.రూపా మౌద్గిల్‌పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేసిన డీఐజీ వర్తికా కటియార్‌ను ఐఎస్డీ నుంచి సివిల్ డిఫెన్స్ విభాగానికి సోమవారం ప్రభుత్వం బదిలీ చేసింది. రూపా సిబ్బందిని తన గదిలోకి పంపి కొన్ని రికార్డులను పెట్టిందని వర్తిక ఆదివారం ఆరోపించడంతో మహిళా ఐపీఎస్‌ల యుద్ధం బయటకు పొక్కింది. పోలీసు అధికారులు ఆ సిబ్బందిని విచారించగా ఐజీపీ డీ.రూపా ఆదేశాల ప్రకారం ఫైళ్లను గదిలో పెట్టామని ఒప్పుకున్నారు. ఈ నేపథ్యంలో వర్తిక బదిలీ అయ్యారు. ఆన్లైన్లో రూ.7.79 లక్షలు టోపీ మైసూరు: మైసూరు నగరంలో సైబర్ నేరాలు తగ్గడం లేదు. తరచూ ఎవరో ఒకరు మోసపోతున్నారు. షేరు మార్కెట్లో డబ్బులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి ఒకరి నుంచి రూ. 7.79 లక్షలను మోసగించారు. బాధితుని వాట్సాప్‌కు షేర్లలో లాభాలంటూ మెసేజ్ రావడంతో వారిని సంప్రదించాడు. దుండగులు మాయమాటలతో నమ్మించారు. దీంతో బాధితుడు విడతలవారీగా సుమారు 7.79 లక్షలను పెట్టుబడిగా పెట్టాడు. లాభం విత్ డ్రా చేసుకుందామని ప్రయత్నించగా వీలు కాలేదు. దీంతో కాల్ చేయగా అవతలి వైపు జవాబు రాలేదు. మోసపోయానని గమనించిన బాధితుడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
కమీషన్ల గోల భరించలేం
● సీఎంకు కాంట్రాక్టర్ల ఫిర్యాదుబనశంకరి: గత ప్రభుత్వం కంటే ప్రస్తుతం కమీషన్ల బెడద అధికమైందని, అధికారులు బిల్లుల మంజూరుకు డబ్బులు అడుగుతున్నారని రాష్ట్ర కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడు మంజునాథ్ ఆరోపించారు. సోమవారం విధానసౌధలో కాంట్రాక్టర్లు సీఎం సిద్దరామయ్య ను కలిసి పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరారు. గత బీజేపీ ప్రభుత్వం నుంచి పెండింగ్ బిల్లులు ఉన్నాయని, సుమారు రూ.30 వేల కోట్లు చెల్లించాల్సి ఉందని, అందులో ఏప్రిల్ నాటికి రూ.15 వేల కోట్లు విడుదలచేయాలని మనవిచేశారు. అనంతరం మంజునాథ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం కంటే ఇప్పుడు కమీషన్ల గోల పెరిగిందని ఆరోపించారు. సీఎం, మంత్రులు గురించి చెప్పడం లేదు, అధికారులు స్థాయిలో ఎక్కువైందని చెప్పారు. అధికారులకు సీఎం హెచ్చరించాలని డిమాండ్ చేశారు. కమీషన్లను అరికట్టకపోతే కాంగ్రెస్ నేతలు రాహుల్‌గాంధీ, మల్లికార్జునఖర్గేను కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. -
నటి రశ్మికకు బుద్ధి చెప్పాలి
దొడ్డబళ్లాపురం: ప్రముఖ నటి రశ్మిక మందన్నపై కన్నడ నేతలు గరం గరం అవుతున్నారు. ఆమెకు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి గాణిగ అన్నారు. సోమవారం అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన.. నటి రశ్మిక మందన్న కన్నడ చిత్రరంగం ద్వారా పరిచయమై అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు కన్నడనాటను మర్చిపోయిందన్నారు. గత ఏడాది చిత్రోత్సవానికి ఆహ్వానిస్తే తాను హైదరాబాద్‌లో బిజీగా ఉన్నానని, రాలేనని తెగేసి చెప్పిందని అన్నారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కన్నడ చిత్రరంగానికి నట్లు, బోల్టులు టైట్ చేస్తానని అనడంలో తప్పు లేదన్నారు. సినిమావారు నోరు మూసుకుని ఉంటే మంచిదని లేదంటే, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించడం గమనార్హం. కన్నడ సినిమాలకు ఇస్తున్న రాయితీలపై మరోసారి ఆలోచించాలని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి లేఖ రాస్తానని చెప్పారు. ఇదే నా లాస్ట్ వార్నింగ్, కన్నడ సినిమా వాళ్లు నోరు మూసుకుని ఉండాలి అని హెచ్చరించారు. ఎమ్మెల్యే రవి గాణిగ ధ్వజం సినీరంగంపైనా ఆగ్రహం -
ఎస్ఐ ఉద్యోగమని రూ. 45 లక్షల వసూలు
దొడ్డబళ్లాపురం: ఎస్ఐ పోస్టు ఇప్పిస్తామని నమ్మించి రూ.45 లక్షలు తీసుకుని మోసం చేసిన ఇద్దరు వంచకులను నెలమంగల తాలూకా దాబస్‌పేట పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక ఆరోగ్యభారతి ఆస్పత్రిలో డాక్టర్‌గా పని చేస్తున్న చంద్రశేఖర్, యోగేంద్ర అరైస్టెన నిందితులు. అనిల్‌కుమార్ అనే వ్యక్తి బంధువుకు ఎస్ఐ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.45 లక్షలు తీసుకున్నారు. ఎన్ని రోజులైనా ఉద్యోగం సంగతి తేలకపోవడంతో అనిల్‌కుమార్ ప్రశ్నించగా బెదిరించడం ప్రారంభించారు. దీంతో దాబస్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.వీలింగ్ పోకిరీల అరెస్టు దొడ్డబళ్లాపురం: రోడ్లపై ప్రమాదకరంగా వీలింగ్ చేసిన యువకులను పట్టుకుని బైక్‌లను సీజ్ చేశారు. నగరంలో రాజానుకుంట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. యలహంక తాలూకా మాదప్పనహళ్లిలో యువకులు బైక్‌లపై వీలింగ్ చేస్తూ వాహనదారులను భయాందోళనకు గురిచేశారు. విన్యాసాలు చేస్తూ వీడియోలు తీసుకున్నారు. వీడియోల ద్వారా యువకులు బెంగళూరు గంగమ్మ గుడి సర్కిల్ నివాసులుగా గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. డీకేశికి మొయిలీ మద్దతు బనశంకరి: డీకే.శివకుమార్ ముఖ్యమంత్రి కావడాన్ని ఎవరూ ఆపలేరని కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి వీరప్పమొయిలీ చెప్పడం చర్చనీయాంశమైంది. ఈ వ్యాఖ్యలపై సోమవారం సీఎం సిద్దరామయ్య స్పందిస్తూ హైకమాండ్ ఏమి చెబితే అది పాటిస్తానని స్పష్టం చేశారు. వీరప్ప మొయిలీ, ఇంకొకరు చెప్పడం ముఖ్యం కాదని, నాయకత్వమే ప్రధానమని అన్నారు. ఆదివారం కార్కళలో గోమఠేశ్వర ను సందర్శించిన వీరప్పమొయిలీ మాట్లాడుతూ డీకే కి మొదటిసారి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది నేనే, నేడు విజయవంతమైన నేత ఎదిగారు. ఇప్పుడు ఆయనే సీఎం కావాలని చెప్పారు. డీకే గోమఠేశ్వరుని తరహాలో ఎదగాలని, పార్టీ ఇబ్బందుల్లో ఉండగా బలోపేతం చేశారని పొగడ్తలతో ముంచెత్తారు. గతుకుల రోడ్లకు బలి తుమకూరు: జిల్లాలోని శిర– అమరాపురం రహదారిలో రోడ్డులో గతుకుల వల్ల ట్రాక్టర్ పైన నుంచి కిందపడిన వ్యక్తి మృతి చెందాడు. రాగలహళ్ళి గ్రామానికి చెందిన నరసింహయ్య (55) అనే వృక్తి ట్రాక్టర్ ట్రాలీలో కూర్చుని వస్తున్నాడు. డ్రైవర్ గతుకుల రోడ్డులో వేగంగా వెళ్లడంతో నరసింహయ్య ఎగిరి కిందపడిపోయాడు. తీవ్ర గాయాలై అక్కడే చనిపోయాడు. పట్టనాయకనహళ్ళి పోలీసులు వచ్చి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. -
రాయల వైభవం నాటక ప్రదర్శన
హొసపేటె: హంపీ ఉత్సవంలో ఆదివారం సాయంత్రం ఎంపీ ప్రకాష్ వేదికపై జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో బెంగళూరుకు చెందిన ఎర్త్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయనగర సామ్రాజ్యానికి చెందిన ప్రముఖ పాలకుడు శ్రీకృష్ణదేవరాయల గత వైభవంపై నృత్య ప్రదర్శనను ప్రదర్శించారు. ఏఎన్.కృష్ణ రాసిన శ్రీకృష్ణదేవరాయ నవల నుంచి ప్రేరణ పొంది ఈ నృత్య రూపకాన్ని రూపొందించారు. ఈ నృత్య రూపకంలో కృష్ణదేవరాయలు, చెన్నాంబిక మధ్య ప్రేమానురాగాలను, శ్రీకృష్ణదేవరాయలు తన పాలనలో దేవదాసి వ్యవస్థను రద్దు చేయడానికి తీసుకున్న చర్యలను తెలియజేశారు. సమ సమాజాన్ని నిర్మించడానికి కృషి చేయని సమాజం క్రూరమైన వ్యక్తుల సమూహం అని నమ్మిన కృష్ణదేవరాయలు, దేవదాసి చెన్నాంబికను మానవతతో వివాహం చేసుకుని, ఆమెకు మహారాణి బిరుదును ఎలా ఇచ్చారో ఈ రూపకంలో చూపించారు. ఎస్.బాలరాజ్ భావన దర్శకత్వంలో ఒక నృత్య రూపకం ఉద్భవించింది. నటి, మోడల్ రూపా రవిచంద్ర రూపక చిత్రానికి నృత్య దర్శకత్వం వహించి నటించారు.