Maharashtra
-
జట్కా మటన్ అంటే ఏంటి, ఎక్కడ దొరుకుతుంది?
హలాల్ గురించి మాంసం ప్రియులకు తెలిసే ఉంటుంది. ముస్లింల దుకాణాల్లో హలాల్ చేసిన మాంసాన్ని విక్రయిస్తుంటారు. అయితే గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా హలాల్ వ్యతిరేక ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో హిందూ మాంసం దుకాణదారులను ఒక తాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నం మొదలైంది. ఖాతిక్ సమాజానికి చెందిన హిందువులు నిర్వహిస్తున్న జట్కా మాంసం (jhatka mutton) దుకాణాలను ప్రోత్సహించేందుకు కొత్తగా మల్హార్ సర్టిఫికేషన్ (Malhar certification) అందుబాటులోకి తెచ్చారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ కూడా ప్రారంభించారు.మల్హార్ సర్టిఫికేషన్ కింద నమోదు చేసుకోవడానికి ఒక పోర్టల్‌ను ప్రారంభించినట్లు మహారాష్ట్ర మత్స్యకార, ఓడరేవుల శాఖ మంత్రి నితేష్ రాణే (Nitesh Rane) సోమవారం ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జట్కా మటన్, చికెన్ విక్రేతలు అందరూ మల్హార్ సర్టిఫికెట్ పొందాలని ఆయన సూచించారు. హిందువులు మల్హార్ సర్టిఫికేషన్ ఉన్న దుకాణాల నుంచి మాత్రమే మటన్, చికెన్ కొనుగోలు చేయాలని సోషల్ మీడియా పోస్ట్‌లో కోరారు."ఈ రోజు మహారాష్ట్రలోని హిందూ సమాజం కోసం మేము ఒక ముఖ్యమైన అడుగు వేశాం. ఈ చొరవ హిందువులకు హిందూ ఆచారాల ప్రకారం లభించే జట్కా మాంసాన్ని విక్రయించే మటన్ దుకాణాలకు ప్రవేశం కల్పిస్తుంద"ని అని మంత్రి నితేష్ రాణే అన్నారు. వినియోగదారులను ధృవీకరించబడిన జట్కా మాంసం విక్రేతలతో అనుసంధానించడానికి వీలుగా MalharCertification.com అనే కొత్త వెబ్‌సైట్‌ను ప్రారంభించినట్టు ప్రకటించారు.మల్హార్ సర్టిఫికేషన్ అంటే?హిందూ మాంసం విక్రేతలందరినీ ఒకే వేదిక కిందకు తీసుకురావడానికి మల్హార్ సర్టిఫికేషన్ విధానాన్ని తెరపైకి తెచ్చారు. జట్కా మాంసం దుకాణాలను ఖాతిక్ సమాజానికి చెందిన హిందువులు మాత్రమే నిర్వహిస్తున్నారని మల్హార్ సర్టిఫికేషన్ నిర్ధారిస్తుంది. హిందువులు, సిక్కులకు హలాల్ రహిత మాంసం విక్రయించాలన్న లక్ష్యంతో దీన్ని అందుబాటులోకి తెచ్చారు. అంతేకాదు హిందూ మత సంప్రదాయాల ప్రకారం మేక, గొర్రె మాంసాన్ని శుభ్రంగా, లాలాజల కాలుష్యం లేకుండా.. మరే ఇతర జంతు మాంసం కలపకుండా విక్రయించేందుకు మల్హార్ సర్టిఫికేషన్ ఉపయోగపడుతుంది.వెబ్సైట్లో ఏముంది?జట్కా మటన్, చికెన్ విక్రేతలను ప్రామాణికంగా గుర్తించే ప్రక్రియే మల్హార్. హిందూ మతాచారాల ప్రకారమే మేక, గొర్రెలను వధించి మాంసాన్ని సంగ్రహిస్తారు. ఇది పరిశుభ్రంగా, లాలాజల రహితంగా ఉంటుంది. ఇందులో ఎటువంటి ఇతర జంతువుల మాంసం కలవదు. ఖాతిక్ సమాజానికి చెందిన హిందువులు మాత్రమే ప్రత్యేకంగా జట్కా మాంసాన్ని విక్రయిస్తారు. మల్హార్ నిర్ధారించిన దుకాణాల్లో మాత్రమే మటన్ కొనాలని మేము పోత్సహిస్తున్నామని మల్హార్ సర్టిఫికేషన్ వెబ్సైట్ పేర్కొంది.జట్కా మాంసాన్ని ఎందుకు ఇష్టపడతారు?హిందూ సంప్రదాయాలను పాటించే వారు జట్కా మాంసాన్ని ఇష్టపడతారు. మాంసం వినియోగానికి ఇది నైతిక పద్ధతి అని నమ్ముతారు. ఎందుకంటే జట్కా విధాననంలో జంతువుకు ఎక్కువ బాధ లేకుండా వెంటనే వధిస్తారు. హలాల్ మాంసంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో హలాల్ రహిత ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో గత సంవత్సరం నవంబర్‌లో ఎయిర్ ఇండియా.. హిందూ, సిక్కు ప్రయాణికులకు హలాల్ రహిత ఆహారాన్ని అందించి వార్తల్లో నిలిచింది. ఇప్పుడు మహారాష్ట్రలో మల్హార్ సర్టిఫికేషన్‌తో హలాల్ రహిత మాంసాన్ని విక్రయించేందుకు చొరవ చూపారు. దీనిపై మరాఠీల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచిచూడాలి. -
విమానంలో 322 మంది.. 8 గంటల జర్నీ తర్వాత వెనక్కి!
న్యూఢిల్లీ, సాక్షి: ముంబై-న్యూయార్క్ ఎయిరిండియా విమానం. ఎనిమిది గంటల ప్రయాణం తర్వాత.. ఎలా వెళ్లిందో అలాగే తిరిగి వెనక్కి వచ్చేసింది. దీంతో ప్రయాణికులంతా కంగారు పడ్డారు. మరోవైపు అధికారులు హడావిడిగా వాళ్లందరినీ దించేసి.. బాంబు స్క్వాడ్‌ను పిలిపించి తనిఖీలు చేయించారు. చివరకు తమకు వచ్చిన సమాచారంగా తేల్చారు. 303 మంది ప్రయాణికులు, 19 మంది సిబ్బంది ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 777 విమానం గత అర్ధరాత్రి 2గం. ముంబై నుంచి న్యూయార్క్‌కు బయల్దేరింది. సుమారు 15 గంటల తర్వాత జాన్ ఎఫ్ కెనడీ ఎయిర్‌పోర్టుకు అది చేరుకోవాల్సి ఉంది. అయితే విమానంలో బాంబు ఉందనే సమాచారం రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో అజర్బైజాన్ దాకా వెళ్లిన విమానానికి.. వెనక్కి రప్పించారు.#AirIndia pic.twitter.com/kZ7cEau7sI— NDTV (@ndtv) March 10, 2025ముంబైలో ఈ ఉదయం 10.20 గం. ప్రాంతంలో ఎయిరిండియా విమానం దిగగానే.. ప్రయాణికులను దించేసి బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు చేయించారు. చివరకు బెదిరింపు కాల్‌గా నిర్ధారించుకున్నారు. రద్దైన విమానం మంగళవారం ఉదయం 5గం. రీషెడ్యూల్ చేసినట్లు ప్రకటించింది. అసౌకర్యానికి ప్రయాణికులకు క్షమాపణ చెప్పిన ఎయిరిండియా.. వాళ్ల భద్రతే తమకు ముఖ్యమని తెలిపింది. ఈ ప్రయాణంలో వాళ్లకు అన్ని రకాల వసతులు కల్పిస్తామని తెలిపింది. మరోవైపు.. ఈ ఘటనపై ఎయిరిండియా ఫిర్యాదుతో అధికారులు దర్యాప్తు చేపట్టారు. -
రాహుల్ గాంధీ ధారావి పర్యటపై సెటైర్లు
ముంబై: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత తాజాగా ముంబైలోని ధారావి ప్రాంతంలో పర్యటించారు(Dharavi Visit). అయితే ఈ పర్యటనలో కాంగ్రెస్ నేతలెవరూ కనిపించకపోవడంపై శివసేన నేత, మాజీ ఎంపీ సంజయ్ నిరుపమ్(Sanjay Nirupam) వ్యంగ్యాస్త్రాలు సంధించారు.గురువారం ధారావిలోని ఛామర్ స్టూడియోను సందర్శించిన రాహుల్ గాంధీ(Rahul Gandhi).. డిజైనర్ సుధీర్ రాజ్బర్ & టీంను కలిశారు. ఆపై సోషల్ మీడియాలో రాజ్బర్ బృందాన్ని అభినందనలతో ముంచెత్తారు కూడా.Sudheer Rajbhar of Chamar Studio encapsulates the life and journey of lakhs of Dalit youth in India. Extremely talented, brimming with ideas and hungry to succeed but lacking the access and opportunity to connect with the elite in his field. However, unlike many others from his… pic.twitter.com/VOtnA9yqSD— Rahul Gandhi (@RahulGandhi) March 6, 2025 అయితే ఒక కాంగ్రెస్ నేతగా కాకుండా.. యూట్యూబర్‌లాగా రాహుల్ ధారావిలో పర్యటించారంటూ సంజయ్ నిరుపమ్ ఎద్దేవా చేశారు. అంతేకాదు.. ముంబై కాంగ్రెస్ యూనిట్ డబ్బుల్లేక దివాళా తీసిందని సెటైర్లు కూడా వేశారు. ముంబైలో కాంగ్రెస్‌కు ఓట్లు మాత్రమే కాదు.. డబ్బులు కూడా లేకుండా పోయాయి. చాలాకాలంగా ముంబై కాంగ్రెస్ కార్యాలయం కరెంట్ బిల్లులు చెల్లించడం లేదు. ఆ బకాయిలు రూ. 5 లక్షల దాకా పేరుకుపోయాయి. అందుకే.. కావాలనే రాహుల్ కాంగ్రెస్ నేతలను కలవకుండా వెళ్లిపోయారు. ఒక కాంగ్రెస్ నేతలా కాకుండా.. యూట్యూబర్‌లాగా ఆయన పర్యటన సాగింది. గతంలో నేను ముంబై కాంగ్రెస్ యూనిట్ చీఫ్‌గా నాలుగేళ్లపాటు పని చేశా. కానీ, ఏనాడూ ఇంత ఘోరమైన పరిస్థితులు మాత్రం లేవు’’ అని సంజయ్ నిరుపమ్ అన్నారు.బాల్‌థాక్రే పిలుపుతో రాజకీయాల్లోకి అడుగు పెట్టిన సంజయ్ నిరుపమ్.. ఆ తర్వాత కాంగ్రెస్‌తోనూ అనుబంధం కొనసాగించారు. ఒకసారి శివసేన నుంచి, ఒకసారి కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు వెళ్లారు. 2009-14 మధ్య కాంగ్రెస్ నుంచి లోక్‌సభ ఎంపీగా పని చేశారు. అయితే కిందటి ఏడాది ఏప్రిల్‌లో క్రమశిక్షణ చర్యల కింద కాంగ్రెస్ ఆయనపై ఆరేళ్లపాటు సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో ఆయన కాంగ్రెస్‌కు రాజీనామా చేసి.. షిండే శివసేన వర్గంలో చేరారు. -
నేనేమీ ఆ మాజీ సీఎం మాదిరి కాను: మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్
ముంబై: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండేల మధ్య ‘వర్గపోరు’కు దాదాపు ఫుల్ స్టాప్ పడినట్లే కనబడుతోంది. ఇటీవల ఏక్ నాథ్ షిండే మాట్లాడుతూ.. తనను తేలిగ్గా తీసుకోవద్దని, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చిన విషయాన్ని మర్చిపోవద్దనే విషయాన్ని మరిచిపోవద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయం ఎవరికి అర్థం కావాలో వారికి అర్ధమైతే బాగుంటుందనే కూడా ఏక్ నాథ్ షిండ్ చెప్పుకొచ్చారు. తాను సీఎం ఉండగా శంకుస్థాపన చేసిన ప్రాజెక్టును ఫడ్నవీస్ ఆపేసారనే ఆరోపణల నేపథ్యంలో ఏక్ నాథ్ షిండే కాస్త ఘాటుగా స్పందించారు.అయితే దీనికి ఫడ్నవీస్ ఇంచుమించు తెరదించినట్లే కనబుడుతున్నారు. తనకెందుకు వచ్చిన గొడవో ఏమిటో అనుకున్నారో కానీ శంకుస్థాపనుల, ఆరంభించిన ఏ ప్రాజెక్టును ఆపడం లేదన్నారు ఫడ్నవీస్. గవర్నర్ కు ధన్యవాదాలు తీర్మానంలో భాగంగా మహారాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడిన ఫడ్నవీస్.. ‘ నేనేమీ మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేను కాను. తలపెట్టిన ప్రాజెక్టులను ఆపిన ఘనత ఉద్ధవ్ ది. నేను అటువంటి సీఎం ను కాను అన్ని ప్రాజెక్టులు పట్టాలెక్కుతాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. షిండే హయాంలో ఉండగా కొన్ని ప్రాజెక్టులు చేపట్టాం. అది మేమంతా(షిండే, అజిత్ పవార్) కలిసి తీసుకున్న నిర్ణయం. ఆ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లే బాధ్యత మా అందరిపైనా ఉంది’ అంటూ పేర్కొన్నారు.మాపై ప్రజలు పెద్ద బాధ్యత ఉంచారుగతేడాది మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమ మహాయుతి కూటమికి భారీ సీట్లు ఇచ్చి అధికారాన్ని ఇచ్చారన్నారు. అందుచేతు ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని, బాధ్యతను నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు వెళతామని, భవిష్యత్ తరాలకు మంచి చేయడమే తమ ముందున్న లక్ష్యమన్నారు ఫడ్నవీస్. నన్ను తేలిగ్గా తీసుకోవద్దు.. ఏక్నాథ్ షిండే స్ట్రాంగ్ వార్నింగ్ -
మరాఠీయే ముంబై భాష
ముంబై: ముంబైలో మరాఠీ భాష తప్పనిసరేం కాదన్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) నాయకుడు సురేష్ భయ్యాజీ జోషి వ్యాఖ్యలపై ప్రతిపక్ష ఎంవీయే కూటమి మండిపడింది. మరాఠీ ముంబై భాష అంటూ గురువారం దక్షిణ ముంబైలోని హుతాత్మ చౌక్ వద్ద నిరసన నిర్వహించింది. ఈ నిరసనలో శివసేన (యూఈటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, కాంగ్రెస్ నాయకులు విజయ్ వడేట్టివార్, భాయ్ జగ్తాప్, నితిన్ రౌత్ మరియు ఎన్సీపీ(ఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ సహా పలువురు ఎంవీయే కూటమి నాయకులు పాల్గొన్నారు. అమరవీరుల స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి, మరాఠీ ముంబై భాష అని నొక్కి చెబుతూ నినాదాలు చేశారు. బుధవారం ఘట్కోపర్లో జరిగిన ఒక కార్యక్రమంలో జోషి మాట్లాడుతూ.... ‘ముంబైకి ఒకే భాష అంటూ ఏమీ లేదు. ముంబైలోని ప్రతి ప్రాంతానికి భాష మారుతూ ఉంటుంది. ఉదాహరణకు ఘట్కోపర్లో గుజరాతీ ఎక్కువగా మాట్లాడతారు. కాబట్టి మీరు ముంబైలో నివసిస్తున్నంత మాత్రాన మరాఠీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు‘ అన్నారు. దీనిపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రతిపక్షాలు కూటమి అగ్రనేతలతో కలిసి నిరసన చేపట్టారు నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు...జోషి తన వ్యాఖ్యలపై ప్రతిపక్షాల విమర్శలకు బదులుగా జోషి‘వారు నా వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకున్నారు. మరాఠీ మహారాష్ట్ర భాష, ముంబై భాష కూడా. ఈ విషయంలో ద్వంద అభిప్రాయాలేమీ లేవు. అనేక భాషలు మాట్లాడే ప్రజలు ముంబైలో సామరస్యంగా జీవిస్తారు.మరాఠీ నా మాతృభాష. అందుకు నేను గర్విస్తున్నాను. బయటిప్రాంతాల ప్రజలు కూడా మరాఠీని అర్థంచేసుకోవాలన్నదే నా అభిప్రాయం.’అని ముక్తాయించారు. ఎంవీయే అగ్రనేతలు -
చెట్లను నరుకుతూ హరితహారాలెందుకు?
సోలాపూర్–ధూళే నేషనల్ హైవేపై సర్వీసు రోడ్డును నిర్మిస్తున్న ఎన్హెచ్ఏ ఓవైపు ‘హరితహారం’ఏర్పాట్లు ..మరోవైపు చెట్ల నరికివేత పనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తుల్జాపూర్ నాక వాసులు సోలాపూర్: ఒకవైపు పట్టణవ్యాప్తంగా ‘హరితహారం’కోసం ఏర్పాట్లు జరుగుతుండగా మరోవైపు తుల్జాపూర్లో అందుకు భిన్నంగా చెట్ల నరికివేత జరుగుతోంది. దీంతో ఎస్ఎంసీ వైఖరి ఏమిటో అంతుబట్టడం లేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సోలాపూర్ – ధూళే నేషనల్ హైవేపై సోలాపూర్– తలే ఇప్పర్గా మార్గంలో నేషనల్ హైవే అథారిటీ సర్వీసు రోడ్డును నిర్మిస్తోంది. ప్రతి ఏడాది తుల్జాపూర్లో జరిగే కోజగిరి పూర్ణిమ వేడుకల కోసం వేలాది భక్తులు ఈ మార్గం గుండానే కాలినడకన ప్రయాణిస్తారు. అలాగే పండరీపూర్‌లో జరిగే ఆషాఢ ఏకాదశి ఉత్సవాల కోసం వేలాది మంది వార్కారీలు, భక్తులు సాధుసంతుల పల్లకీలతో ఇదే మార్గంలో పాదయాత్రగా వెళుతుంటారు. వీరంతా మార్గమధ్యంలో ఈ చెట్లనీడనే సేదతీరతారు. ఇప్పుడా సౌకర్యం ఉండబోదంటూ స్థానికులు ఆవేదన చెందుతున్నారు. కాగా సర్వీసు రోడ్డు పనుల కోసమే చెట్లను నరికివేస్తున్నామని, పూర్తైన అనంతరం తిరిగి మొక్కలు నాటుతామని సోలాపూర్ జాతీయ రహదారుల ప్రాజెక్టు డైరెక్టర్ రాకేష్ జవాడే తెలిపారు. -
ఔరంగజేబ్‌ను పొగిడిన ఎస్పీ ఎమ్మెల్యే సస్పెన్షన్
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీలో మొఘల్ చక్రవరి ఔరంగజేబ్‌పై పొగడ్తలు కురిపించిన సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అబూ ఆసిమ్ అజ్మీపై సస్పెన్షన్ వేటుపడింది. ఈ నెల 26వ తేదీ వరకు కొనసాగే ప్రస్తుత బడ్జెట్ సమావేశాల నుంచి ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్లు బుధవారం స్పీకర్ ప్రకటించారు. ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా అయిన అజ్మీ మంగళవారం..‘ఔరంగజేబ్ హయాంలో భారతదేశ సరిహద్దులు అఫ్గానిస్తాన్, మయన్మార్ వరకు విస్తరించాయి. అప్పట్లో ప్రపంచ జీడీపీలో మన జీడీపీ వాటా 24 శాతం వరకు ఉంది. అది భారత్‌కు స్వర్ణయుగమైంది’అని పేర్కొన్నారు. ఔరంగజేబ్, ఛత్రపతి శంభాజీ మహారాజ్ మధ్య జరిగిన యుద్ధాన్ని ఆయన రాజకీయ పోరాటంగా అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలపై ఉభయసభలు దద్దరిల్లాయి. డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే తీవ్రంగా స్పందించారు. ‘అజ్మీ ఉద్దేశ పూర్వకంగానే శివాజీని, సంభాజీని అవమానించారు. ఔరంగజేబ్‌ను పొగిడారు. అటువంటి అజ్మీ ద్రోహి, అసెంబ్లీలో కూర్చునే అర్హత ఆయనకు లేదు’అని నిప్పులు చెరిగారు. ‘ఔరంగజేబ్ క్రూరమైన చర్యలను ఎదుర్కొంటూ సంభాజీ ప్రదర్శించిన ధైర్యసాహసాలను వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. మతం మార్చుకోవాలంటూ సంభాజీని ఔరంగజేబ్ 40 రోజుల పాటు చిత్రహింసలకు గురిచేశాడు. అతడు హిందువులను మాత్రమే కాదు, ఇతర మతస్తులను సైతం చంపించాడు’అని చెప్పారు. ఔరంగజేబ్‌ను పొగడటం అంటే ఛత్రపతి శివాజీని, ఆయన కుమారుడు సంభాజీని అవమానించడమేనని సభ్యులు ఆరోపించారు. అజ్మీని సస్పెండ్ చేసి, దేశ ద్రోహం కింద కేసు నమోదు చేయాలని అధికార పక్ష సభ్యులు డిమాండ్ చేశారు. అజ్మీని మిగతా కాలం సమావేశాల నుంచి సస్పెండ్ చేయాలంటూ బుధవారం మంత్రి చంద్రకాంత్ పాటిల్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది.నా వ్యాఖ్యలను వక్రీకరించారు: అజ్మీ‘ఔరంగజేబ్‌ను గురించి నేను చెప్పిన విషయాలన్నీ చరిత్రకారులు, వివిధ రచయితలు పేర్కొన్నవే. శివాజీ, సంభాజీకి ఇతర మహనీయులకు వ్యతిరేకంగా నేనెలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. అయినప్ప టికీ, నా వ్యాఖ్యలు ఎవరికైనా మనస్తాపం కలిగించి ఉంటే వాటిని వెనక్కి తీసుకుంటాను’అని పేర్కొంటూ అజ్మీ ఓ వీడియో విడుదల చేశారు. తను పేర్కొన్న విషయాల్లో ఎలాంటి తప్పు లేకున్నా వాటిని వక్రీకరించారని ఆరోపించారు. ‘సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించరాదనే ఉద్దే శంతో అసెంబ్లీ వెలుపల మాట్లాడానని, అయినప్ప టికీ తనను సస్పెండ్ చేశారు’అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.అజ్మీని మా దగ్గరికి పంపించండి: యూపీ సీఎం యోగి‘ఔరంగజేబ్‌ను ప్రశంసించిన ఎస్పీ ఎమ్మె ల్యే అజ్మీని ఉత్తరప్రదేశ్‌కు పంపించండి. ఇటు వంటి వాళ్లని ఏం చేయాలో మా రాష్ట్ర ప్రజలకు తెలుసు’ అని సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొ న్నారు. ఔరంగజేబ్‌ని హీరో అంటూ పొగిడిన అజ్మీకి దేశంలో ఉండే అర్హతుందా అని ప్రశ్నించారు. అజ్మీ వ్యాఖ్య లపై వైఖరిని వెల్లడించాలని ఎస్పీని డిమాండ్ చేశారు. అజ్మీని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. -
మహారాష్ట్ర మంత్రి ధనంజయ్ ముండే రాజీనామా
ముంబై: మహా రాజకీయాల్లో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆహార, పౌరసరఫరా శాఖల మంత్రి ధనంజయ్ ముండే(Dhananjay Munde) తన పదవులకు రాజీనామా చేశారు. ఓ సర్పంచ్ హత్య కేసులో ఆయన అనుచరుడు అరెస్ట్ కాగా.. తీవ్రమైన ఆరోపణలు రావడంతో ధనంజయ్ రాజీనామా చేయాల్సి వచ్చింది.గత డిసెంబర్లో బీడ్ జిల్లా మస్సాజోగ్ గ్రామ సర్పంచ్ సంతోష్ దేశ్‌ముఖ్ దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ కేసుకు సంబంధించి.. మంత్రి ధనంజయ్ ముండే అనుచరుడు వాల్మీక్ కరాద్ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ధనంజయ్ పాత్రపైనా ఆరోపణలు వెల్లువెత్తాయి.రాజకీయ విమర్శలు తీవ్రతరం కావడంతో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్(Devendra Fadnavis), ఎన్సీపీ చీఫ్.. డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌తో భేటీ అయి చర్చించారు. సీఎం ఫడ్నవిస్ సూచన మేరకు ధనంజయ్ రాజీనామా చేసినట్లు సమాచారం. ఆపై ఆ లేఖను ఆమోదించిన ఫడ్నవిస్.. గవర్నర్ ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు పంపించారు.ధనంజయ్ ఎవరంటే..ధనంజయ్ పండిత్రావ్ ముండే.. కేంద్ర మాజీ మంత్రి, దివంగత గోపినాథ్ ముండేకు దగ్గరి బంధువు. గతంలో ఈయన బీజేపీలో పని చేశారు. బీజేవైఎం యువ విభాగానికి అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు. శాసన మండలిలో ప్రతిపక్ష నేత హోదా కూడా చేపట్టారు. ఆపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(NCP)లో చేరారు. ధనంజయ్ 2019, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పార్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. కూటమి ప్రభుత్వంలోని ఫడ్నవిస్ కేబినెట్లో కీలక మంత్రిత్వ శాఖలతో పాటు బీడ్ జిల్లాకు సంరక్షణ మంత్రిగా ఉన్నారు.గతంలో ఈయన ఓ వివాదంలోనూ చిక్కుకున్నారు. ప్రముఖ గాయని రేణు శర్మ 2021జనవరిలో ఆయనపై అత్యాచార కేసు పెట్టారు. దీంతో ప్రతిపక్షాలు ఆయన రాజీనామాకు పట్టుబట్టాయి. అయితే ఆ ఆరోపణలు తోసిపుచ్చిన ఆయన.. సంచలన ప్రకటన చేశారు. రేణు శర్మ సోదరి కరుణా శర్మతో తాను సహజీవనంలో ఉన్నానని, తమకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, ఈ విషయం తన భార్య, కుటుంబ సభ్యులకూ తెలుసని ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ తర్వాత రేణు శర్మ ఆయనపై పెట్టిన కేసును వెనక్కి తీసుకున్నారు. -
నీటి కష్టాలు : పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తగ్గుతున్న నీటి మట్టాలు
సాక్షి, ముంబై: ముంబైకి నీటి సరఫరా చేసే జలాశయాల్లో నీటి నిల్వలు గణనీయంగా తగ్గుతున్నాయి. ముంబైలో గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగుతున్నాయి. దీంతో ముంబైకి నీటి సరఫరా చేసే ఏడు జలాశయాల్లో నీటిమట్టాలు వేగంగా అడుగంటుతున్నాయి. బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు అందించిన వివరాల మేరకు ముంబైకి సరఫరా అయ్యే నీటి జలాశయాల్లో నీటి నిల్వలు 50.06 శాతానికి పడిపోయాయి. ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో నీటి ఇక్కట్టు తప్పేటట్టు లేదని భావిస్తున్నారు. ఈనేపథ్యంలో బీఎంసీ అ«ధికారులతోపాటు ముంబైకర్లలో ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ప్రస్తుత నీటి నిల్వల ప్రకారం నాలుగైదు నెలలపాటు నీటి సరఫరా చేయాల్సిరానుంది. అయితే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తగ్గుతున్న నీటి మట్టాల కారణంగా ఇబ్బంది పడాల్సిరానుందని చెబుతున్నారు. జూన్‌లో వర్షాలు కురవకపోతే నీటి సమస్య మరింత జఠిలమయ్యే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ముంబైకి నీటి సరఫరా చేసే జలాశయాల్లో కేవలం 50.06 శాతం మాత్రమే నీటి నిల్వలున్నాయి. వైతర్ణా, మోడక్‌సాగర్, తాన్సా, మధ్య వైతర్ణా, భాత్సా, విహార్, తులశీ మొదలగు ఏడు జలాశయాల నుంచి ముంబైకి నీటి సరఫరా జరుగుతోంది. ముంబైలో సుమారు 1.30 కోట్ల జనాభా ఉంది. వీరికోసం ప్రతీరోజు 4,450 మిలియన్ లీటర్ల నీరు డిమాండ్ ఉండగా 3,850 మిలియన్ లీటర్ల నీరు సరఫరా చేస్తున్నారు. వివిధ కారణాలవల్ల 25 శాతం నీటి లెక్కలు తేలడంలేదు. కాగా, ప్రతీ వ్యక్తికి వివిధ అవసరాల కోసం సుమారు 150 లీటర్ల నీరు అవసరముంటుంది. కానీ లీకేజీ వల్ల పూర్తిగా సరఫరా చేయలేకపోతోంది. అయినప్పటికీ నగరంలో ఇప్పటికీ 20 లక్షల మందికి నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. వీరంతా మురికి కాల్వలు శుభ్రం చేయడం, ఆటో, ట్యాక్సీలు నడుపుకొంటూ, ఇళ్లలో పాచి పనులు చేస్తూ జీవనం సాగించేవారున్నారు. ఇలాంటి వారికే నీటి సరఫరా సరిగా అందడంలేదు. చదవండి: ఏసీలు కూడా పేలే అవకాశం : ఎలా గుర్తించాలి? ముఖ్యమైన జాగ్రత్తలుమోడక్సాగర్లో అత్యల్పం ముంబైకి నీటి సరఫరా చేసే ఏడు జలాశయాల్లో మోడక్‌సాగర్ జలాశయంలో అత్యల్పంగా నీటి మట్టాలున్నాయి. మోడక్‌సాగర్ జలాశయం సామర్థ్యం 1,28,925 ఎమ్మెల్డీలుండగా ప్రస్తుతం 25,972 ఎమ్మెల్డీలు అంటే కేవలం 20.1 శాతానికి నీటి నిల్వలు చేరుకున్నాయి. ఇక తాన్సా జలాశయం సామర్థ్యం 1,45,080 ఉండగా ప్రస్తుత నీటి నిల్వలు 62,161 ఎమ్మెల్డీలకు అంటే 42.8 శాతానికి చేరుకున్నాయి. మరోవైపు ముంబైకి నీటి సరఫరా జలాశయాల్లో అతిపెద్ద జలాశయమైన అప్పర్ వైతర్ణాలో అత్యధికంగా 69.4 శాతం నీటి నిల్వలున్నాయి. అప్పర్వైతర్ణా జలాశయం సామర్థ్యం 2,27,07 ఎమ్మెల్డీలు ఉండగా ఈ జలాశయంలో నీటి నిల్వలు 1,57,50 ఎమ్మెల్డీల అంటే 69.4 శాతానికి చేరుకున్నాయి. ఇది సంతృప్తికరమైన విషయమని చెప్పవచ్చు. మరోవైపు గత సంవత్సరం వర్షాలు కురిసినప్పటికీ జలాశయాల్లో నీరు అనుకున్నంతగా చేరలేదు. దీంతో నీటి నిల్వలు పడిపోయాయి. ప్రస్తుతం అందిన వివరాల మేరకు ముంబైకి నీటి సరఫరా అయ్యే జలాశయాల్లో కేవలం 50.06 శాతం ఉండటంతో కోత విధించే అవకాశాలుండవని కానీ ఉష్ణోగ్రతలు ఇతర పరిణామాల వల్ల రాబోయే రోజుల్లో పరిస్థితి మారకపోతే నీటి కోత విధించే అవకాశాలున్నాయని బీంఎసీ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా బీఎంసీ అందించిన వివరాల మేరకు ఒక శాతం నీటిని సుమారు రెండు నుంచి మూడు రోజులపాటు సరఫరా చేసేందుకు అవకాశం ఉంది. ఈ ప్రకారం నెలకి సుమారు 10 నుంచి 15 శాతం నీరు సరఫరా చేస్తారు. ఈ లెక్కన 50 శాతం నీటిని సుమారు నాలుగు నుంచి ఐదు నెలలపాటు చేయవచ్చని భావిస్తున్నారు. కానీ ప్రస్తుతం పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో నీటి నిల్వలు ఆవిరయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. వీటన్నింటి నేపథ్యంలో రాబోయే రెండు నెలల్లో నీటి నిల్వలను దృష్టిలో ఉంచుకుని నీటి విధించాలా లేదా అనేది నిర్ణయం తీసుకోనున్నట్టు చెప్పవచ్చు. అయితే ఆ తర్వాత జూన్‌లో వర్షాలు కురవనట్టయితే ఇబ్బందిగా మారే అవకాశాలున్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
థానే తెలుగు మహాసభ ఆధ్వర్యంలో శ్రీరామనవమి ఉత్సవాలు
థానే: థానే తెలుగు మహాసభ ఆధ్వర్యంలో శ్రీరామ నవమి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు సంబంధించిన పత్రాలు, ఆహ్వాన పత్రికలను ఆదివారం ఆవిష్కరించారు. థానే తెలుగు మహాసభ స్వర్ణోత్సవాలు (50 సంవత్సరాలు) జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో శ్రీరామనవమి ఏర్పాట్లతోపాటు ఇటీవలే నిర్వహించిన శ్రీ శ్రీనివాస కల్యాణోత్సవాలకు సంబంధించి థానే లోకపురంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాల్లో పలు విషయాలపై చర్చించారు. ఏప్రిల్ 6వ తేదీ వాగ్లే ఇస్టేట్ డిసూజా వాడిలోని సెయింట్ లారెన్స్ స్కూల్ హాల్లో నిర్వహించనున్నట్టు ప్రకటించారు. మొదటిసారిగా థానే తెలుగు మహాసభ ఆధ్వర్యంలో నిర్వహించనున్న శ్రీసీతారామ కల్యాణోత్సవాల కోసం పంచలోహాల ఉత్సవ విగ్రహాలను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అయితే ఈ నిర్ణయం తీసుకున్న వెంటనే ఉత్సవ విగ్రహాలను థానే తెలుగు మహాసభకు అందించేందుకు కేవీ రమణ దంపతులు ముందుకు రావడం విశేషం. మరోవైపు సీతమ్మవారికి బంగారు మంగళసూత్రం తయారుచేసి ఇచ్చేందుకు గుండా మాధురి శ్రీనివాస్ దంపతులు ముందుకురాగా పట్టువ్రస్తాలను జయశ్రీ రమేశ్ తూము దంపతులు అందించేందుకు ముందుకొచ్చారు. పానకం వడపప్పు ప్రసాదాన్ని విజయ బులుసు దంపతులు అందిచేందుకు ముందుకు వచ్చారు. తెలుగు బ్రాహ్మణ సంఘం శ్రీసీతారామ కల్యాణోత్సవాలలో వచ్చే వారందరికీ భోజనాలు అందించేందుకు ముందుకు వచ్చింది. దీనిపై సభ్యులందరూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇటీవలే శ్రీ శ్రీనివాస కల్యాణోత్సవాలు నిర్వహించడంలో కృషి చేసిన వారందరినీ అభినందించారు. 1974లో ఏర్పాటైన థానే తెలుగు మహాసభ గత కొన్ని సంవత్సరాలపాటు ఎలాంటి కార్యక్రమాలు చేయలేదు. అయితే ఇటీవలే జరిగిన ఎన్నికల అనంతరం నూతనంగా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఏవీ గుప్తా, కార్యదర్శి శివకుమార్‌ల టీమ్ నేతృత్వంలో మరోసారి వివిధ కార్యక్రమాలు నిర్వహించడం ప్రారంభించారు. ఇందులో బాగంగా ఇప్పటికే అత్యంత ఘనంగా శ్రీనివాస కల్యాణోత్సవాలు జరిపిన అనంతరం మరింత ఉత్సాహంగా శ్రీరామ నవమి ఉత్సవాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం నిర్వహించిన సమావేశాల్లో థానే తెలుగు మహాసభ అధ్యక్షుడు ఏవీ గుప్తా, గౌరవ అధ్యక్షుడు బీవీహెచ్ ప్రసాద్, ఉపాధ్యక్షుడు ఎన్.జగదీశ్ రావు, కార్యదర్శి శివకుమార్, కోశాధికారి పద్మజ, మంజుల, ఎంఎస్ కిశోర్, జగన్నాథరావు, జయశ్రీ తూము, రమణి, తదితరులు పాల్గొన్నారు. -
కేంద్ర మంత్రి కుమార్తెకు పోకిరీల వేధింపులు
జల్గావ్: తన కుమార్తెను వేధించారంటూ కేంద్ర యువజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రక్షా ఖడ్సే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహారాష్ట్రలో శాంతి భద్రతలపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. జల్గావ్ జిల్లా ముక్తాయ్‌నగర్‌లో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న తన కుమార్తెను అక్కడ కొందరు యువకులు వేధించారని.. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మంత్రి వెల్లడించారు.“ప్రతి ఏడాది మహాశివరాత్రి సందర్భంగా మా ప్రాంతంలో సంత్ ముక్తాయ్ యాత్ర జరుగుతుంది. రెండు రోజుల క్రితం నా కూతురు యాత్రకు వెళ్లింది. కొందరు యువకులు ఆమెను వేధించారు. వారిపై ఫిర్యాదు చేసేందుకు నేను పోలీస్ స్టేషన్‌కు వెళ్లాను' అని మీడియాకు కేంద్ర మంత్రి ఖడ్సే చెప్పారు. అడ్డుకున్న భద్రతా సిబ్బందిపైనా ఆ యువకులు దురుసుగా ప్రవర్తించారు. గుజరాత్ పర్యటన నుంచి నేను ఇంటికి రాగానే నా కుమార్తె ఈ విషయం చెప్పింది. కేంద్ర మంత్రి కుమార్తెకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే.. సాధారణ మహిళల సంగతి ఏంటో అర్థం చేసుకోవచ్చంటూ కేంద్ర మంత్రి ఖడ్సే వ్యాఖ్యానించారు.రక్షా ఖడ్సే మామ ఏక్నాథ్ ఖడ్సే మాట్లాడుతూ.. ఈ యువకులపై గతంలోనూ పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. వారు కరుడుగట్టిన నేరస్థులు. మహారాష్ట్రలో నేరస్థులకు పోలీసులంటే భయమే లేదు. రోజురోజుకు మహిళలపై నేరాలు పెరుగుతున్నాయి. బాధిత మహిళలు ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదు. వారి తల్లిదండ్రులు కూడా తమ కుమార్తెల పేర్లు బయటకు రాకూడదని భావిస్తున్నారు. వేరే మార్గం లేకనే ఫిర్యాదు చేశాం’’ అని ఏక్నాథ్ ఖడ్సే తెలిపారు.పోలీస్ స్టేషన్‌కు వెళితే రెండు గంటలు మమ్మల్ని కూర్చోబెట్టారని.. అమ్మాయిల విషయం కావడంతో ఆలోచించుకోవాలంటూ పోలీసులు మాకు సలహా ఇచ్చారు. వేధింపులకు పాల్పడ యువకులకు రాజకీయ నాయకుల అండ ఉంది. డీఎస్పీ, ఐజీతో కూడా చెప్పాను’’ అని ఖడ్సే తెలిపారు. -
హరహర మహాదేవ! ఘనంగా శివరాత్రి వేడుకలు
సాక్షి, ముంబై: ముంబైలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు ఆలయాలకు పోటెత్తారు. పశ్చిమ అంధేరితోపాటు నగరంలోని పలుప్రాంతాల్లో శివాలయాలన్నీ మహాదేవుడి నామస్మరణతో మార్మోగిపోయాయి. అంధేరి వెస్ట్‌లోని ఆరంనగర్, వర్సోవా, ఇతర ప్రాంతాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అభిషేకాలు, విశేష పూజలతో ఆధ్యత్మిక సౌరభాన్ని వెదజల్లాయి. భక్తులు శివ భజనలు, శివ తాండవ స్తోత్రాలు, ఇతర భక్తి గీతాలతో ఆది దేవుణ్ణి స్మరిస్తూ రాత్రంతా జాగరణ చేశారు. గురు వారం తెల్లవారుజామున ప్రత్యేకపూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం వివి ధ ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి, భక్తులకు మహాప్రసాదాలను అందించారు. వర్లీ, శివకృప క్రీడా మండల్ ఆధ్వర్యంలో... వర్లీ, నెహ్రూనగర్‌లో బుధవారం మహాశివరాత్రి సందర్భంగా శివ మహాపూజ, సత్యనారాయణ మహాపూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మండల్ ఆధ్వర్యంలో గత 36 సంవత్సరాలుగా శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని, ఇకపై ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలను విస్తృతంగా చేపడతామని మండల్ నిర్వాహకులు తెలిపారు. బ్రహ్మకుమారీ సంస్థ ఆధ్వర్యంలో... ప్రముఖ ఆధ్యాత్మిక సంస్ధ ‘ప్రజాపితా బ్రహ్మకుమారి ఈశ్వరీయ విద్యాలయ్’ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. లోయర్‌పరేల్, దీపక్ టాకీస్ సమీపంలో ఉన్న పద్మావతి భవనం ఆవరణలో బుధవారం ఉదయం, సాయంత్రం వివిధ భక్తి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు పలు ఆధ్యాత్మిక సేవా సంస్ధలు, తెలుగు సంఘాల ప్రముఖులు, పదాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమాల ముఖ్య అతిథి, ఆంధ్ర మహాసభ సాంస్కృతిక శాఖ మాజీ ఉపాధ్యక్షురాలు రాధా మోహన్ శివరాత్రి ఉత్సవ పతాకాన్ని ఆవిష్కరించారు. అనేక సంవత్సరాలుగా బ్రహ్మకుమారి సంస్ధ చేపడుతున్న వివిధ సేవా కార్యాక్రమాలను గురించి రాధా మోహన్ ప్రశంసించారు. ఈ సందర్భంగా వేడుకలకు హాజరైన భక్తులందరినీ ఆధ్యాత్మిక గురువులు, మాతాజీలు బి.కే.శీతల్ బేన్, బి.కే.పుష్పబేన్, బి.కే.అరుణబేన్ ఆశీర్వదించారు. వారికి ప్రసాదాలు పంపిణీ చేసి కానుకలు అందజేశారు. అనంతరం సాయంత్రం జరిగిన ప్రవచన కార్యక్రమంలో యూబీటీ శివసేన ఎమ్మెల్సీ, రాష్ట్రపతి అవార్డు గ్రహిత సునీల్ శిందే, ప్రభాదేవి–దాదర్ నియోజక వర్గం ఎమ్మెల్యే మహేశ్ సావంత్ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో సంస్ధ ఆర్గనైజింగ్ ఇన్చార్జ్ డా.నాయిని రవి, తెలుగు డాక్టర్స్ అసోసియేషన్ (టీడీఎస్) అధ్యక్షుడు డా.ఎన్.ఎం.తాటి, మాజీ అధ్యక్షుడు డా.కే.ఆర్.దుస్సా, పదాధికారులు, సభ్యులు డా.స్వాతి, డా.వేముల గోదావరి, డా.పల్లాటి రాజు, డా. ఆడెపు, డా.ఎల్.ఎన్.గుడ్డేటి, డా.వేముల సుదర్శన్, డా.ఆర్.ఆర్.అల్లే, డా.శ్రీనివాస్, డా.వెంకటేశ్, ఆంధ్ర మహాసభ ట్రస్టీలు, కార్యవర్గ పదాధికారులు ఏక్నాథ్ సంగం, వాసాల శ్రీహరి (వంశీ), నడిమెట్ల ఎల్లప్ప, వేముల మనోహర్, యాపురం వెంకటేశ్, షేర్ల ప్రహ్లాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఘోర ప్రమాదం.. జాలర్లను రక్షించిన సైన్యం
ముంబై: అరేబియా సముద్రంలో ఘోర ప్రమాదం తప్పింది. శుక్రవారం ఉదయం జాలర్లతో వెళ్లిన ఓ బోటు మంటల్లో చిక్కుకుంది. అయితే భారత సైన్యం సకాలంలో స్పందించడంతో అందులో ఉన్నవాళ్లంతా ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు.శుక్రవారం వేకువజామున రాయ్‌గఢ్ జిల్లా అక్షి అలీబాగ్ వద్ద సముద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మంటలు చెలరేగి బోటు నుంచి పొగ వస్తుండడం గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీలు సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించాయి. బోటులో చిక్కుకున్న జాలర్లను క్షేమంగా బయటకు తెచ్చాయి.బోటు 80 శాతం కాలిపోగా.. 20 మంది జాలర్లు ప్రమాదం నుంచి బయటపడినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గురైన బోటు సాాకరక్షి గ్రామానికి చెందిన రాకేష్ మూర్తికి చెందిందిగా నిర్ధారించారు. ప్రమాదానికి గల కారణాలపై స్పష్టత రానప్పటికీ. . షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు.#WATCH | Maharashtra: The fishing boat of one Rakesh Gan caught fire 6-7 nautical miles from the coast in Raigad district in In Akshi Alibaug, around 3-4 am. Indian Coast Guard and Indian Navy rescued all 18 crew members from the boat safely: Raigad SP(Video: Raigad Police) pic.twitter.com/6f4MFm0aQn— ANI (@ANI) February 28, 2025अलीबाग में मछली पकड़ने वाली नाव में लगी आग...20 नाविकों को बचाने की कोशिश जारी... @lokmattimeseng @DGPMaharashtra #alibaug @RaigadPolice pic.twitter.com/1oEwgCFGSU— Visshal Singh (@VishooSingh) February 28, 2025 -
సైబర్ వల : ఎంత ప్రచారం చేస్తున్నా, మోసపోతున్న అమాయకులు
గుర్తు తెలియని వ్యక్తులకు బ్యాంకు అకౌంట్ వివరాలు, ఆధార్, పాన్ కార్డు నంబర్లు, ఓటీపీల వంటి వ్యక్తిగత వివరాలు ఇవ్వకూడదని పదేపదే పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ అనేక మంది అమాయకులు సైబర్ మోసగాళ్ల చేతిలో సులభంగా మోసపోతున్నారు. ఆ తరువాత అసలు విషయం తెలుసు కుని లబోదిబోమంటున్నారు. గడచిన మూడు నెలల్లో వెలుగుచూసిన సంఘటనలలో రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఏకంగా రూ.1,085 కోట్ల మేర మోసపోయినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ మూడు నెలల్లో నేషనల్ సైబర్ క్రైం రిపోరి్టంగ్ పోర్టల్ (ఎన్సీసీఆర్పీ) హెల్ప్‌లైన్ నంబరుకు 64 వేలకుపైగా ఫిర్యాదులు వచ్చాయి. దీన్ని బట్టి సైబర్ మోసగాళ్లు ఏ స్ధాయిలో రెచ్చి పోతున్నారో ఇట్టే అర్ధమవుతోంది. ముంబై మినహా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అప్రమత్తమైన సైబర్ డిపార్టుమెంట్ పోలీసులు మరికొందరని రూ.119 కోట్లు మోసపోకుండా కాపాడడంలో సఫలీకృతమయ్యారు. విస్తృతంగా ప్రచారం చేస్తున్నా... సైబర్ నేరగాళ్ల వలలో పడొద్దంటూ వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా అనునిత్యం ప్రభుత్వం హెచ్చరిస్తోంది.మీ బంధువులు అనారోగ్యంతో అస్పత్రిలో చేరారని, మీ పిల్లల్ని ఏదో కేసులో నేరం కింద పోలీసులు అరెస్టు చేశారని, బ్యాంకు మేనేజర్లు , సీబీఐ, కస్టమ్ డిపార్టుమెంట్ ఇలా రకరకాల శాఖల నుంచి, అలాగే కేవైసీ చేయాలని, ఏటీఎం కార్డు బ్లాక్ అయిందని ఇలా రకరకాల వంకలతో సైబర్ నేరగాళ్లు ఫోన్లు చేస్తున్నారు. అయితే ఇలాంటి ఫోన్లు వస్తే స్పందించవద్దని, ఏ బ్యాంకు సిబ్బందీ ఇలా ఫోన్లో వివరాలు అడగరనే సందేశాలను గత కొద్ది రోజులుగా టెలికామ్ డిపార్టుమెంట్ ద్వారా వినిపిస్తున్నారు. అయినప్పటికీ అనేకమంది అమాయకులు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు.కొందరు ఆలస్యంగానైనా మేలుకుని 1930 నంబరుకి ఫిర్యాదు చేస్తున్నారు. ఈమేరకు పోగొట్టుకున్న సొమ్మును పూర్తిగా కాకపోయినా కొంతమేర అయినా పోలీసులు కాపాడగలుగుతున్నారు. లేదంటే బ్యాంక్ ఖాతాలోంచి మొత్తం డబ్బులు ఖాళీ అయ్యే ప్రమా దం ఉంటుంది. ఇలాంటి సైబర్ మోసాలను అరికట్టేందుకు ఇటీవల న్యూ ముంబైలోని మహాపే ప్రాంతంలో అత్యాధునిక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో 150పైగా సిబ్బంది, 24 గంటలు విధులు నిర్వహిస్తారు. 1930 హెల్ప్‌లైన్ నంబరుకు ప్రతీరోజు సగటున ఏనిమిది వేల వరకూ ఫిర్యాదులు వస్తుంటాయి. కంట్రోల్ రూం సిబ్బంది ఈ ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తారని, సా«ధ్యమైనంత వరకు అమాయకులు మోసపోకుండా ప్రయత్నిస్తుంటారని మహారాష్ట్ర సైబర్ డిపార్టుమెంట్ సూపరింటెండెంట్ సంజయ్ లాట్కర్ తెలిపారు. విదేశీ సిమ్‌కార్డులతో మరింత చిక్కు: సంజయ్ లాట్కర్ ఇదిలాఉండగా సైబర్ మోసగాళ్లు ఒకసారి వినియోగించిన ఫోన్ నంబర్లను మరోసారి వాడరు. వీటిని ఎలాగోలా సంపాదించిన కొందరు నేరగాళ్లు యువతి, యువకులు, మహిళలను మీ ఫోటోలను అశ్లీలంగా మార్చి సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరించి డబ్బులు గుంజుతున్నారు. బాధితులు ఈ నంబర్లు గురించి తెలిపేందుకు వీల్లేకపోవడంతో ఏమీతోచక కొందరు, పరువు పోతుందన్న భయంతో కొందరు, ఇలా వేలాది మంది పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఆగిపోతున్నారు. గడచిన మూడు-నెలల్లో 1930 హెల్ప్‌లైన్ నంబరుకు వచి్చన 28,209 ఫిర్యాదుదారులు కంప్లైంట్ చేసిన 2,713 మొబైల్ నంబర్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. మిగతా నంబర్ల గురించి ఆమాత్రం సమాచారం కూడా లేదు. దీన్ని బట్టి సైబర్ నేరగాళ్లు విదేశీ సిమ్ కార్డుల ద్వారా ఫోన్ చేస్తున్నారని, ఒకసారి వాడిన సిమ్ కార్డును మరోసారి వినియోగించడం లేదని తెలుస్తోంది. దీంతో నేరగాళ్లందరినీ పట్టుకోవడం సాధ్యం కావడం లేదని సంజయ్ లాట్కర్ తెలిపారు. -
పూణే అత్యాచార కేసు.. నిందితుడు రామ్‌దాస్ అరెస్ట్
పూణే: మహారాష్ట్రలోని పూణే అత్యాచార కేసులో నిందితుడు దత్తాత్రేయ్ రామ్‌దాస్ గాదేను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. దారుణ ఘటన తర్వాత 75 గంటల గాలింపు అనంతరం నిందితుడు పోలీసులకు చిక్కాడు. నిందితుడి కోసం పోలీసులు 13 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.వివరాల ప్రకారం.. పూణేలోని స్వర్గేటు బస్టాండ్ వద్ద 26 ఏళ్ల యువతిపై బస్సులో అత్యాచారానికి పాల్పడిన దత్తాత్రేయ్ రామ్‌దాస్ పోలీసులకు చిక్కాడు. 75 గంటల గాలింపు చర్యల అనంతరం నిందితుడు రామ్‌దాస్‌ను శుక్రవారం తెల్లవారుజామున శ్రీరూర్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం, పోలీసు స్టేషన్‌కు తరలించారు. అత్యాచార ఘటన తర్వాత నిందితుడు పరారీలో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడి ఆచూకీ చెప్పిన వారికి రూ.లక్ష రివార్డు అందజేస్తామని పోలీసుశాఖ సైతం తెలిపింది.Pune rape case -; Accused, Dattatray Ramdas Gade, has been arrested by Pune Crime Branch from a village in Shirur Tehsil of Pune district#punecrime #Rape #maharshtra @PuneCityPolice pic.twitter.com/G8PdSUGHO8— Indrajeet chaubey (@indrajeet8080) February 28, 2025 జరిగింది ఇదీ..పూణేలో అత్యంత రద్దీగా ఉండే బస్ స్టేషన్లలో ఒకటైన స్వర్గేట్లో మంగళవారం ఉదయం అత్యాచార చోటు చేసుకుంది. తన స్వగ్రామానికి వెళ్లేందుకు బస్‌స్టేషన్‌కు చేరుకున్న యువతితో నిందితుడు మాటలు కలిపాడు. అక్క అని సంబోధిస్తూ నమ్మించాడు. గ్రామానికి వెళ్లే బస్సు మరో చోట ఉందని చెప్పి బస్ స్టేషన్లోనే దూరంగా ఎవరూ లేని చోట ఆగి ఉన్న మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్ దగ్గరకు ఆమెను తీసుకెళ్లాడు.బస్సులోకి వెళ్లేందుకు యువతి తటపటాయించడంతో లోపల ప్రయాణికులు ఉన్నారని.. నిద్రలో ఉండటంతో వాళ్లు లైట్లు వేసుకోలేదని నమ్మించాడు. బస్సులోకి యువతి ప్రవేశించగానే తలుపు వేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు దత్తాత్రేయ రామదాస్ (36)గా పోలీసులు గుర్తించారు. అతడిపై అనేక కేసులు ఉన్నాయని, 2019 నుంచి బెయిల్ మీద ఉన్నాడని తెలిపారు. రామదాస్‌ను పట్టుకొనేందుకు ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అత్యాచారం జరిగిన ప్రాంతానికి 100 మీటర్ల దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉండటం గమనార్హం. -
దారి చూపే చుక్కాని
‘ఆడపిల్లలకు పెద్ద చదువులు ఎందుకు?’ అనుకునే కాలం. ‘ఆడపిల్లలకు సైన్స్ కష్టం’ అనుకునే కాలం. ఎన్నో అనుమానాలు, అవమానాలు, అడ్డంకులను అధిగమించి ఆ తరం మహిళలు సైన్స్‌లో సత్తా చాటారు. ‘ఇండియన్ విమెన్ సైంటిస్ట్స్ అసోషియన్’ ను స్థాపించారు. గోల్డెన్ జూబ్లీ పూర్తి చేసుకున్న ఈ సంస్థ ఈ తరం మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది.‘కొందరు మహిళలు సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదు. మేము మాత్రం అలా ఎప్పుడూ భయపడలేదు. మమ్మల్ని మేము నిరూపించుకోవడానికి ఎంతో కష్టపడ్డాం’ అంటుంది 91 సంవత్సరాల డా.సుధా పాధ్యే. ‘ఇండియన్ విమెన్ సైంటిస్ట్స్ అసోసియేషన్’ వ్యవస్థాపకులలో ఆమె ఒకరు. ల్యాబ్‌లో 76 ఏళ్ల డాక్టర్ భక్తవర్ మహాజన్ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ ‘ఇండియన్ విమెన్ సైంటిస్ట్స్ అసోసియేషన్’కు దేశవ్యాప్తంగా పదకొండు శాఖలు ఉన్నాయి. రెండు వేలమంది సభ్యులు ఉన్నారు. ముంబైలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో నిర్వహించే రకరకాల కార్యక్రమాల్లో పిల్లలు, మహిళలు ఉత్సాహంగా పాల్గొంటారు.ఇంటిపనికి, వృత్తిపనికి మధ్య సమన్వయం చేసుకోలేని ఎంతోమంది మహిళలకు, కొత్తగా వృత్తిలోకి వచ్చిన మహిళలకు ఆర్గనైజేషన్‌కు సంబంధించి డే కేర్ అండ్ హెల్త్ కేర్ సెంటర్, చిల్డ్రన్స్ నర్సరీ, 160 పడక ల విమెన్స్ హాస్టల్ అండగా ఉంటుంది.‘ఈ సంస్థ మాకు రెండో ఇల్లు’ అంటుంది అసోసియేషన్ మాజీ అధ్యక్షురాలు డా.రీటా ముఖోపాధ్యాయ.ముప్ఫై తొమ్మిది ఏళ్ల డా. సెరెజో శివ్‌కర్ నుంచి 81 ఏళ్ల డా.సునీత మహాజన్ వరకు శాస్త్రవేత్తల మధ్య ఎంతో వయసు తేడా ఉండవచ్చు. అయితే సైన్స్ అద్భుతాల పట్ల ఉన్న ఆసక్తి, గౌరవం సభ్యులందరినీ ఒకేతాటిపై తీసుకువచ్చింది.‘కొద్దిమంది మా సంస్థ విలువను గుర్తించడానికి ఇష్టపడక పోవచ్చు. ఆడవాళ్లు కాలక్షేప కబుర్లు చెప్పుకునే కార్యాలయం అని వెక్కిరించవచ్చు. అయితే అలాంటి వారు మా సంస్థ కార్యక్రమాలను దగ్గరి నుంచి చూపినప్పుడు వారిలో తప్పకుండా మార్పు వస్తుంది’ అంటుంది డా. రీటా ముఖోపాధ్యాయ.‘ఇండియన్ విమెన్ సైంటిస్ట్స్ అసోసియేషన్ ఏం సాధించింది?’ అనే ఏకైక ప్రశ్నకు ఎన్నో స్ఫూర్తిదాయకమైన జవాబులు ఉన్నాయి.సైన్స్ అంటే భయపడే అమ్మాయిలలో ఆ భయాన్ని పోగొట్టి సైన్స్‌ను ఇష్టమైన సబ్జెక్ట్ చేయడం నుంచి కుటుంబ బాధ్యతల భారం వల్ల ఉద్యోగం వదులుకోవాలనుకున్న వారికి అండగా నిలబడి పరిష్కార మార్గం చూపడం వరకు ఈ సంస్థ ఎన్నో చేసింది ‘ఇండియన్ విమెన్ సైంటిస్ట్స్ అసోసియేషన్’ అనేది ఎన్నో తరాల మహిళా శాస్త్రవేత్తల అనుభవ జ్ఞానసముద్రం. ఈ తరానికి దారి చూపే చుక్కాని.ఎన్నో అనుభవాలు, మరెన్నో జ్ఞాపకాలుఅసోసియేషన్ బిల్డింగ్‌లోకి అడుగు పెడితే ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. ఎందరో మహిళా శాస్త్రవేత్తలు, ఎన్నో అనుభవాలు, విలువైన జ్ఞాపకాలకు ఈ భవనం చిరునామా. ఇక్కడికి వస్తే కాలం వెనక్కి వెళ్లవచ్చు. ముందున్న కాలాన్ని చూడవచ్చు. స్థూలంగా చె΄్పాలంటే ‘ఇండియన్ విమెన్ సైంటిస్ట్స్ అసోసియేషన్’ సైన్స్ పట్ల ఈ తరంలో ఆసక్తిని, అనురక్తిని రేకెత్తించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది.– డా. సెరెజో శివ్‌కర్, శాస్త్రవేత్త -
పుణె బస్టాండ్‌లో దారుణం
పుణె: మహారాష్ట్రలోని పుణెలో మంగళవారం ఉదయం స్వార్గేట్ జంక్షన్ బస్టాండ్‌లో ఆగిఉన్న ప్రభుత్వ బస్సులో 26 ఏళ్ల మహిళను ఒక పాత నేరస్తుడు రేప్ చేసి పారిపోయాడు. మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్‌కు చెందిన అత్యంత రద్దీగా ఉండే బస్‌జంక్షన్‌లలో ఒకటైన స్వార్గేట్ బస్టాండ్‌లో ఈ దారుణం చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. విషయం తెల్సుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిందితుడిని 36 ఏళ్ల దత్తాత్రేయ రాందాస్ గాడేగా గుర్తించారు. గతంలో ఇతనిపై దొంగతనం, దోపిడీ, చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి. ఘటనపై పోలీసులు, బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం తెల్లవారుజామున 5.45 గంటలకు సతారా జిల్లాలోని ఫల్టణ్ పట్టణానికి వెళ్లే బస్సు ఎక్కేందుకు బాధిత మహిళ ఈ బస్టాండ్‌లోని ఒక ప్లాట్‌ఫామ్ వద్ద వేచిచూస్తోంది. అదే సమయానికి అక్కడికి వచ్చిన నిందితుడు ‘సోదరీ’ అంటూ ఆమెతో మాటలు కలిపాడు. తాను బస్ కండక్టర్‌ను అని, మీరు ఎక్సాలిన బస్సు సమీపంలో ఆగి ఉందని చెప్పి, సమీపంలో ఆగి ఉన్న ‘శివ్ షాహీ’ ఏసీ బస్సును చూపించాడు. అది మీరు వెళ్లాల్సిన రూట్లో వెళ్తుందని చెప్పి ఆ బస్సు ఎక్కాలని ఆమెకు సలహా ఇచ్చాడు. అతని మాటలు నమ్మిన ఆమె ఎవరూ లేని ఆ బస్సు ఎక్కింది. లైట్లు ఆఫ్ చేసి, చిమ్మచీకటిగా ఉన్న బస్సును ఎక్కేందుకు తొలుత ఆమె తటపటాయించింది. బస్సులో ప్రయాణికులు నిద్రిస్తుండటంతో లైట్లు ఆర్పివేశారని, నచ్చజెప్పి బస్సులో లోపలిదాకా వెళ్లేలా చేశాడు. వెంటనే వెనకాలే వచ్చిన అతను బస్సు తలుపు మూసేసి, ఆమెను రేప్‌చేసి పారిపోయాడని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ స్మార్థనా పాటిల్ చెప్పారు. ఘటన జరిగినప్పుడు బస్టాండ్‌లో ఎన్నో బస్సులు, ఎంతో మంది ప్రయాణికులు ఉన్నారు. మహిళ తనకు జరిగిన అన్యాయంపై వెంటనే ఎవరికీ ఫిర్యాదు చేయలేదు. ఫల్టణ్కు వెళ్లే బస్సు ఎక్కి మార్గమధ్యంలో తన స్నేహితురాలికి ఫోన్‌చేసి ఘోరాన్ని వివరించింది. ఆమె సలహామేరకు బాధితురాలు వెంటనే బస్సు దిగి సమీప పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేసింది. దీంతో పోలీసులు భారతీయ న్యాయ సంహిత చట్టం కింద కేసు నమోదుచేశారు. నిందితుడిని అరెస్ట్చేసేందుకు పోలీసులు ఎనిమిది బృందాలను ఏర్పాటుచేసి వేట మొదలెట్టారు. పోలీస్‌స్టేషన్‌కు ఈ బస్టాండ్ కేవలం 100 మీటర్ల దూరంలో ఉంది. నిందితుడు గతంలో ఒక కేసులో బెయిల్ సంపాదించి 2019 ఏడాది నుంచి బయటే ఉన్నాడు.విపక్షాల విమర్శలు‘‘ఏమాత్రం భయం లేకుండా అసాంఘిక శక్తులు స్వైర విహారం చేస్తున్నాయి. పుణెలో నేరాలను అరికట్టడంలో హోం శాఖ బాధ్యతలు చూస్తున్న సీఎం విఫలమయ్యారు’’ అని ఎన్సీపీ(ఎస్పీ) నాయ కురాలు, ఎంపీ సుప్రియా సూలే విమర్శించారు. -
మెట్రో–3 భూగర్భ రైళ్లకు తగ్గిన ఆదరణ
దాదర్: ముంబైలోని పశ్చిమ ఉప నగరాలతో ఉత్తర–దక్షిణ ప్రాంతాలను కలిపే మెట్రో–3 భూగర్భ రైళ్లకు ప్రయాణికుల ఆదరణ కరువైంది. ప్రయాణికులు రాక ఆదాయం లేకపోవడంతో మంబై మెట్రో రైలు వికాస్ కార్పొరేషన్ (ఎంఎంఆర్‌వీసీ) అందోళనలో పడింది. మెట్రో– 3 మార్గానికి ప్రారంభంలో ప్రయాణికులు నుంచి మంచి స్పందన వ్యక్తమైంది. అయితే క్రమ క్రమంగా ప్రయాణికుల సంఖ్య తగ్గిపోతున్నట్లు అధికారుల దృష్టికి వచి్చంది. మెట్రో అధికారులు ఈ పరిస్థితికి కారణాలను అన్వేషిస్తున్నారు. రెండు, మూడు దశలు పూర్తైతే! రాష్ట్రంలోనే అత్యధిక పొడవైన భూగర్భ మెట్రో రైలు మార్గమైన మెట్రో–3 ప్రాజెక్టు మొదటి దశ మార్గాన్ని గతేడాది అక్టోబరులో ప్రారంభించారు. ప్రస్తుతం ఈ మెట్రోరైళ్లు రోజుకు 162 ట్రిప్పులు తిరుగుతున్నాయి. ప్రారంభం నుంచి నవంబరు ఆరో తేదీ దాకా ఈ మార్గం మీదుగా ఏకంగా 6.33 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ఇక రెండో నెల గడిచిన తరువాత ఈ సంఖ్య 5.64 లక్షలకు పడిపోయింది. దీన్ని బట్టి మొదటి రెండు నెలల్లో మొత్తం 11.97 లక్షలమంది ఈ రైళ్లలో రాకపోకలు సాగించారు. రోజువారీగా చూస్తే మొదటినెలలో రోజుకు సగటున 20, 426 మంది ప్రయాణికులు, ఆ తరువాతి నెలలో రోజుకు 18,810 మంది మాత్రమే రాకపోకలు సాగించారు. ఆ తరువాత నెమ్మది నెమ్మదిగా ఈ సంఖ్య మరింత తగ్గడం మొదలైంది. రోజురోజుకూ ప్రయాణికుల సంఖ్య తగ్గిపోతుండటంతో ఆదాయానికి భారీగా గండిపడుతోంది. ప్రయాణికులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో మొదట్లో ఎంతో ఆసక్తి కనబర్చిన ప్రయాణికులు ఇప్పుడెందుకు ముఖం చాటేస్తున్నారో అర్ధం కావడం లేదని అధికారులు అంటున్నారు. మెట్రో రైలు దిగిన ప్రయాణికులకు బయట బెస్ట్ బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు సరిగా అందుబాటులో ఉండడం లేదని ప్రయాణికుల సంఖ్యలో తగ్గుదలకు ఇది కూడా ఒక కారణం కావచ్చని అంచనా వేస్తున్నారు. రెండో, మూడో దశ రైలు మార్గం పనులు పూర్తయితే ప్రయాణికుల సంఖ్య పెరగవచ్చని భావిస్తున్నారు. మేలోగా మూడు దశల ముగింపు! రూ.37,275 కోట్ల వ్యయంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మెట్రో–3 భూగర్భ రైలు మార్గం నిర్మాణాన్ని చేపట్టాయి. ఇందులో భాగంగా జేవీఎల్ఆర్ నుంచి బాంద్రా–కుర్లా–కాంప్లెక్స్ (బీకేసీ) వరకు రూ.14,200 కోట్లతో నిర్మించిన మొదటి దశ భూగర్భ రైలు మార్గాన్ని గతేడాది అక్టోబరు ఏడున ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. 12.69 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గంలో పది రైల్వే స్టేషన్లు ఉన్నాయి. రెండో దశ మార్గాన్ని మార్చి చివరలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఆఖరుదైన మూడో దశ మార్గాన్ని మే నెలాఖరులోగా పూర్తిచేసి ప్రజలకు అంకితం చేయాలని ఎంఎంఆర్‌వీసీ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. గడువు దగ్గరపడుతుండటంతో వందలాది అధికారులు, ఇంజనీర్లు, కారి్మకులు, కూలీలు రోజుకు మూడు షిప్టుల్లో విశ్రాంతి లేకుండా విధులు నిర్వహిస్తున్నారు. -
డిస్నీని తలపించేలా... సరికొత్త థీమ్ పార్క్
సాక్షి, ముంబై: ముంబై, నవీ ముంబై నగరాల్లోని చిన్నారులకు త్వరలోనే ఒక గొప్ప వినోద అనుభవం లభించనుంది. మిక్కీ మౌస్, మిన్నీ మౌస్, డోనాల్డ్ డక్, గూఫీ వంటి ప్రసిద్ధ కార్టూన్ పాత్రలను ప్రత్యక్షంగా చూసే అవకాశంతో పాటు, థ్రిల్లింగ్ రైడ్లను ఆస్వాదించే అవకాశం కల్పించేందుకు కొత్త థీమ్ పార్క్ ఏర్పాటు కానుంది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్) గ్రోత్ హబ్’ప్రాజెక్టులో భాగంగా నవీ ముంబైలో 200 హెక్టార్ల విస్తీర్ణంలో ఒక భారీ థీమ్ పార్క్ నిర్మాణం కోసం ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీఏ) ప్రణాళికలు రూపొందించింది. ఎంఎంఆర్‌లో పర్యాటక వృద్ధి కోసం... పరిశ్రమ, పర్యాటకం, విద్య, మౌలిక సదుపాయాలు, గృహనిర్మాణం, ఆరోగ్యం, ఓడరేవుల అభివృద్ధికి సంబంధించి ఎంఎంఆర్‌ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెమ్మార్డీయే గ్రోత్ హబ్ ప్రాజెక్టుకింద పలు ప్రణాళికలను రూపొందించింది.ఇందులో భాగంగా పర్యాటక కేంద్రంగా అలీబాగ్ అభివృద్ధి, ముంబైలోని చారిత్రక కోటల పరిరక్షణతో పాటు దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు నవీ ముంబైలో డిస్నీల్యాండ్ తరహాలో భారీ థీమ్ పార్క్‌ను నిరి్మంచాలని ప్రతిపాదించింది.ఇదీ చదవండి: వరుడి ముద్దు : రెడ్ లెహెంగాలో సిగ్గుల మొగ్గైన పెళ్లికూతురుమొదటిసారిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో... ప్రస్తుతం ముంబై, నవీ ముంబై, థానేలతో పాటు ఎంఎంఆర్ పరిధిలో అనేక రిసార్టులు, థీమ్ పార్కులు, వాటర్ పార్కులు ఉన్నాయి. అయితే మొట్టమొదటి సారిగా ప్రభుత్వం, ఎమ్మెమ్మార్డీఏ సంయుక్త ఆధ్వర్యంలో ఆకర్షణీయమైన రిసార్టులు, యానిమేషన్ స్టూడియోలు, రైడ్ జోన్లు, వాటర్ పార్క్, ఇతర ఆధు నిక సదుపాయాలతో నిర్మిస్తున్న ఈ థీమ్ పార్కు రాష్ట్ర పర్యాటక రంగంలో పెద్ద మైలురాయి కాగలదని అధికారులు అంచనా వేస్తున్నారు. (BirdFlu భయమేల చికెన్‌ను తలదన్నే గింజలు గుప్పెడు చాలు) -
నన్ను తేలిగ్గా తీసుకోవద్దు.. ఏక్నాథ్ షిండే స్ట్రాంగ్ వార్నింగ్
ముంబై: తనకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis) తో ఎటువంటి విభేదాలు లేవని గతవారం వ్యాఖ్యానించిన డిప్యూటీ సీఎం ఏక్‌నాత్ షిండే(Eknath Shinde). తాజాగా తనను తేలిగ్గా తీసుకోవద్దంటూ సుతిమెత్తగా హెచ్చరించారు. అయితే ఈ హెచ్చరిక నేరుగా ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కు కాకపోయినా, షిండే ఇలా వ్యాఖ్యానించడం వెనుక ఆంతర్యం ఏమిటో అనేది రాజకీయ వర్గాల్లో మరోసారి హాట్ టాపిక్ అయ్యింది.ఈరోజు(శుక్రవారం) ఏక్ నాథ్ షిండే మీడియాతో మాట్లాడుతూ.. ‘ నా గురించి తెలుసు. నేను పార్టీలో సామాన్య కార్తకర్తని. నేను అలాగే భావిస్తాను. అదే సమయంలో బాలా సాహెబ్ కు కూడా కార్యకర్తనే. నన్ను గతంలో తేలిగ్గా తీసుకున్న ప్రభుత్వం ఏమైందో మీకు తెలుసు.’ అంలూ హెచ్చరించారు. మహారాష్ట్ర అసెంబ్లీలో షిండే నేతృత్వంలోని శివసేనకు 57 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఫడ్నవీస్ ప్రభుత్వానికి సూచాయాగా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తనను తేలిగ్గా తీసుకోవద్దంటూనే గత ప్రభుత్వాన్ని కూల్చిన సందర్భాన్ని షిండే తాజాగా గుర్తు చేసుకోవడమే రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఇది ఫడ్నవీస్ ను పరోక్షంగా హెచ్చరించినట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాను తలుచుకుంటే ప్రభుత్వాన్ని కూల్చే అవకాశం లేకపోలేదనే సంకేతాలు పంపినట్లు అయ్యిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఫడ్నవీస్ సమావేశాలకు షిండే డుమ్మా..మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ నేతృత్వంలో జరిగే పలు సమావేశాలకు షిండే తరుచు గైర్హాజరు కావడంతో వారి మధ్య విభేదాలున్నాయనే దానికి అద్దం పడుతోంది. షిండే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమోదించిన రూ. 900 కోట్ల ప్రాజెక్టును ప్రస్తుత సీఎం ఫడ్నవీస్ నిలిపివేయడంతో వీరి మధ్య అగ్నికి ఆజ్యం పోసిందనే వాదన తెరపైకి వచ్చింది. జల్నాలో తాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆమోదించిన ప్రాజెక్టును సీఎం హోదాలో ఉన్న ఫడ్నవీస్ ఆపడమే షిండేకు కోపం తెప్పించినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఫడ్నవీస్ క్యాబినెట్ సమావేశాలకు షిండే దూరంగా ఉన్నట్లు సమాచారం.2022లో ఇలా..మూడేళ్ల క్రితం ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు షిండే. 40 మంది ఎమ్మెల్యేలతో బయటకొచ్చేశారు. ఫలితంగా మహా వికాస్ అగాడీ ప్రభుత్వం కూలిపోయింది. ఆ తరుణంలో బీజేపీకి మద్దతు ఇచ్చి ముఖ్యమంత్రి అయ్యారు షిండే.ఇక 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే నేతృత్వంలోని మహాయుతి 232 మంది ఎమ్మెల్యేలను సొంతం చేసుకుంది. బీజేపీ(BJP) 132 సీట్లు గెలవగా, శివసేన 57 మంంది ఎమ్మెల్యేలను, ఎన్సీపీ 41 మంది శాసనసభ స్థానాలను కైవసం చేసుకుంది. దాంతో సీఎం పదవి అనేది ఫడ్నవీస్ ను వరించింది. ఆ సమయంలో తనుకు ఇవ్వబోయే డిప్యూటీ సీఎం పదవిని షిండే తిరస్కరించారు. కొన్ని బుజ్జగింపుల తర్వాత దానికి కట్టుబడ్డారు షిండే.గతవారం అలా.. ఇప్పుడు ఇలాతనకు ఫడ్నవీస్ తో ఎటువంటి విభేదాలు లేవని షిండే గతవారం వ్యాఖ్యానించారు. మా మధ్య ఎటువంటి కోల్డ్ వార్ నడవడం లేదన్నారు షిండే. తాము కలిసి కట్టుగానే అభివృద్ధిని అడ్డుకుంటున్న వారిపై యుద్ధం చేస్తామన్నారు.అయితే తాజాగా షిండే స్వరంలో కాస్త మార్పు కనిపించింది. ‘నేను విధాన సభలో తొలి ప్రసంగం ఇచ్చినప్పుడు రెండొందలపైగా సీట్లు వస్తాయని ఫడ్నవీస్ అన్నాను. మాకు 232 సీట్లు వచ్చాయి. నన్ను తేలిగ్గా తీసుకోవద్దనే విషయం ఎవరిని ఉద్దేశించి చెప్పానో వారికి అర్ధమైతే చాలు’ అంటూ ముక్తాయించారు ఏక్‌నాత్ షిండే -
అర్ధరాత్రిళ్లు మేసేజ్‌లు.. అశ్లీలతే అవుతుంది!
పరిచయం లేని మహిళలకు అర్ధరాత్రిళ్లు మెసేజ్‌లు పంపడం.. అశ్లీలత కిందకే వస్తుందని ముంబై సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో ఓ మాజీ కార్పొరేటర్‌కు అశ్లీల సందేశాలు పంపాడనే కేసులో ఓ వ్యక్తికి కింది కోర్టు విధించిన శిక్షను సమర్థించింది.‘‘మీరంటే ఇష్టం, మీరు చూడడానికి బాగున్నారు, అందంగా ఉన్నారు, మీకు వివాహం అయ్యిందా? లేదా?, మీరు సన్నగా ఉన్నారు!!..’’ అంటూ.. తెలియని మహిళలకు అర్ధరాత్రిళ్లు సందేశాలు పంపడం సరికాదు. ఈ చర్య అశ్లీలత(Obscene) కిందకే వస్తుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఉన్నవాళ్లు, వాళ్ల భాగస్వాములు ఇలాంటి వాటిని తట్టుకోలేరు. ప్రత్యేకించి.. ఒకరికొరు పరిచయం లేని సమయంలో అస్సలు భరించలేరు’’ అని అడిషనల్ సెషన్స్ జడ్జి డీజీ ధోబ్లే వ్యాఖ్యానించారు.అయితే రాజకీయ వైరంతోనే ఆమె తనపై తప్పుడు కేసు పెట్టిందని ఆ వ్యక్తి వాదించగా.. కోర్టు ఆ వాదనను తోసిపుచ్చింది. ఏ మహిళ తెలిసి తెలిసి తప్పుడు కేసుతో తన పరువును పణంగా పెట్టాలనుకోదని వ్యాఖ్యానించింది. ఈ కేసులో నిందితుడు బాధిత మహిళకు వాట్సాప్ ద్వారా అసభ్యకరమైన సందేశాలు పంపినట్లు ప్రాసిక్యూషన్ రుజువు చేసిందని, కాబట్టి నిందితుడు ట్రయల్ కోర్టు విధించిన శిక్షకు అర్హుడు అని సెషన్స్ కోర్టు స్పష్టం చేసింది.ముంబై బోరివాలీ ఏరియాకు చెందిన మాజీ కార్పొరేటర్‌కు.. 2016 జనవరిలో నార్సింగ్ గుడే అనే వ్యక్తి వాట్సాప్ సందేశాలు పంపాడు. ‘‘మీరు చూడడానికి బాగుంటారు.. మీరంటే ఇష్టం. మీకు పెళ్లైందా?’’ అంటూ అర్ధరాత్రిళ్లు మెసేజ్‌లు పంపాడు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదుచేయడంతో కేసు నమోదు చేసుకుని నార్సింగ్‌ను అరెస్ట్ చేశారు ఆరేళ్ల తర్వాత.. మేజిస్ట్రేట్ కోర్టు నార్సింగ్‌ను దోషిగా నిర్ధారించి.. మూడు నెలల శిక్షను విధించింది. అయితే ఈ శిక్షను అతను సవాల్ చేయగా.. తాజాగా ట్రయల్ కోర్టు తీర్పును సెషన్స్ కోర్టు సమర్థించింది. -
ఫడ్నవీస్-శిందేల మధ్య కోల్డ్‌వార్? ఠండా ఠండా కూల్ కూల్?!
ముంబై: గార్డియన్ మంత్రి పదవి మొదలుకొని ప్రత్యేక వైద్య విభాగాలకు వేర్వేరుగా సమీక్షా సమావేశాలు, పర్యవేక్షణ ప్రాజెక్టుల కోసం ’వార్‌రూమ్’ల వరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఆయన డిప్యూటీ ఏక్నాథ్ షిండే మధ్య భిన్నాభిప్రాయాల కోల్డ్‌వార్ జరుగుతున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. గతేడాది నవంబర్‌లో అసెంబ్లీ ఫలితాల తరువాత రాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్‌ను ఎంపిక చేసింది బీజేపీ అధిష్టానం. గత ప్రభుత్వ ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే ఈసారి డిప్యూటీ సీఎం పదవితో సరిపెట్టుకోవలసి వచి్చంది. ఇందుకోసం రెండు వర్గాల మధ్య పలు ఒప్పందాలు, రాజీ చర్చలు జరిగాయి. ముఖ్యమంత్రిగా ఉన్న రెండున్నరేళ్లలో శిందే నాయకత్వం, అభివృద్ధి సంక్షేమ నిర్ణయాల వల్లే బీజేపీ, శివసేన, ఎన్సీపీ(ఏపీ)ల మహాయుతి కూటమి ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించిందని ఆయన మద్దతుదారులు భావిస్తున్నారు.డిప్యూటీ సీఎం పదవిని స్వీకరించేందుకు శిందే మొదట్లో విముఖత వ్యక్తంచేశారని, అయితే ఫడ్నవీస్ నేతృత్వంలోని ప్రభుత్వంలో భాగం కావాలంటూ ఆయన సహచరులు, బీజేపీ అగ్రనేతలు ఒప్పించారని శివసేన నేతలు పేర్కొంటున్నారు. అందువల్లే మంత్రుల ప్రమాణ స్వీకారం పూర్తైనా వారికి శాఖల కేటాయింపునకు దాదాపు వారం రోజుల సమయం పట్టిందని చెబుతున్నారు. ప్రత్యేకంగా వ్యవహరించడం వెనుక... అయితే ఫడ్నవీస్, శిందేలిద్దరూ తమ విభేదాలున్నాయన్న వార్తలను ఖండిస్తున్నారు. తాము పరస్పర సహాకారం, సమైక్యతతో వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఈమధ్యకాలంలో పలు సందర్భాల్లో రాయ్‌గఢ్, నాసిక్ జిల్లాల సంరక్షక మంత్రులుగా అదితి తట్కరే, గిరీష్ మహాజన్‌ల నియామకంపై శివసేన(శిందే) అసంతృప్తి వ్యక్తంచేసింది. దీంతో ఈ నియామకాలు వాయిదా పడ్డాయి. ఇంతేకాక ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ‘వార్ రూమ్‘తో పాటు, డిప్యూటీ సీఎంలు అజిత్‌పవార్, శిందేలిద్దరూ తమ పారీ్టల మంత్రులు నిర్వహించే శాఖలు, వారు సంరక్షక మంత్రులుగా ఉన్న జిల్లాల పరిధిలోకి వచ్చే ప్రాజెక్టులను ట్రాక్ చేయడానికి మానిటరింగ్ యూనిట్లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధితో పాటు మెడికల్ ఎయిడ్ సెల్‌ను కూడా శిందే ఏర్పాటు చేశారు. అలాగే రాష్ట్రంలో 2027 కుంభమేళా సన్నాహాల గురించి చర్చించేందుకు నాసిక్ రీజినల్ డెవలప్మెంట్ అథారిటీ (ఎన్ఆర్డీఏ) సహా ఫడ్నవీస్ ఏర్పాటు చేసిన అనేక సమావేశాలకు శిందే దూరంగా ఉన్నారు. తాజాగా ఫడ్నవీస్ పరిశ్రమల శాఖ సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం శిందే మరో సమావేశాన్ని ఏర్పాటుచేశారు. దీనికి తోడు 20 మంది శివసేన ఎమ్మెల్యేల భద్రత తగ్గింపు కూడా శివసేనలో మరింత అసంతృప్తిని రాజేసింది. ఎంపీల మద్దతు కోసమే బీజేపీ మౌనం: సీనియర్ జర్నలిస్ట్ ప్రకాష్ అకోల్కర్ ఈ పరిస్థితిపై సీనియర్ జర్నలిస్ట్ ప్రకాష్ అకోల్కర్ మాట్లాడుతూ ఇద్దరు నేతల మధ్య ‘ప్రచ్ఛన్న యుద్ధం‘ కొనసాగుతుందని అన్నారు. ‘అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని శిందే భావించారు. కానీ బీజేపీకి బంపర్ మెజారిటీ రావడంతో అది సాధ్యపడలేదు. దీంతో సహజంగానే శిందే కొంత అసంతృప్తితో ఉన్నారు. రాష్ట్ర బీజేపీలో ఫడ్నవీస్ వ్యతిరేకులు శిందేకు మద్దతునిస్తున్నారు. బీజేపీ కేంద్ర నాయకత్వానికి శిందే పార్టీలోని ఏడుగురు ఎంపీల మద్దతు అవసరం. అందుకే ఈ వ్యవహారాలపై ఆ పార్టీ నాయకత్వం పెద్దగా స్పందించడం లేదు’అని అకోల్కర్ పేర్కొన్నారు. ఇదీ చదవండి: చీటింగ్ కేసులోమంత్రికి రెండేళ్ల జైలు శిక్షబహిరంగంగా ఒప్పుకోలేని పరిస్థితి: రత్నాకర్ మహాజన్ ‘సంకీర్ణ ప్రభుత్వంలో భిన్నాభిప్రాయాలున్నా ఐక్యంగా కొనసాగాల్సిన అవసరముంటుంది. రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా అంతర్గత పోరు గురించి ఎవరూ బహిరంగంగా మాట్లాడలేరు. గత ఎన్నికల కంటే బీజేపీ బలం రెండింతలు పెరిగింది. అందుకే ప్రభుత్వ ఏర్పాటులో మెజారిటీ వాటా ఆశించింది. దాన్ని దక్కించుకోగలిగింది ’అని మహారాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రత్నాకర్ మహాజన్ అన్నారు. అవన్నీ ఊహాగానాలు: ఏక్నాథ్ శిందే కాగా తామిద్దరి మధ్య విబేధాలున్నట్లు వస్తున్న వార్తలను ఏక్నాథ్ శిందే ఖండించారు. మంగళవారం జరిగిన పార్టీ సమావేశంలో మాట్లాడుతూ.. మహాయుతి సంకీర్ణంలో ‘ప్రచ్ఛన్న యుద్ధం‘ అవాస్తవం. అంతా ‘ఠండా ఠండా కూల్ కూల్’. మేం కలిసికట్టుగా అభివృద్ధి నిరోధకులపై యుద్ధం చేస్తున్నాం’’అని పేర్కొన్నారు. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి లాగా పదవుల కోసం వెంబడించడం లేదా అధికారాన్ని దోచుకోవడం మహాయుతి ఎజెండాకు వ్యతిరేకం. ఎవరేమన్నా రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు సాగడం, ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం’అని ఉద్ఘాటించారు. మీడియా సెల్ ఏర్పాటులో తప్పేంలేదు: ఫడ్నవీస్ సచివాలయంలో మీడియా సెల్ ఏర్పాటుపై విలేకరుల ప్రశ్నకు సీఎం ఫడ్నవీస్ స్పందిస్తూ, ‘ప్రజలకు సహాయం చేయడమే దాని లక్ష్యం. కాబట్టి అలాంటి సెల్ ఏర్పాటులో తప్పు లేదు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను కూడా ఇలాంటి సెల్‌ను ఏర్పాటు చేసాను.‘ అని తెలిపారు. -
చీటింగ్ కేసులోమంత్రికి రెండేళ్ల జైలు శిక్ష
నాసిక్: 30 ఏళ్ల నాటి చీటింగ్, ఫోర్జరీ కేసుకు సంబంధించి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మాణిక్‌రావు కొకాటేకు నాసిక్ జిల్లా కోర్టు రెండేళ్ల జైలు శిక్ష, యాభైవేల జరిమానా విధించింది. ఈ కేసులో మంత్రి సోదరుడు సునీల్ కోకాటేను కూడా దోషిగా పేర్కొంటూ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. కోకాటే సోదరులు 1995లో తాము తక్కువ ఆదాయ వర్గానికి (ఎల్ఐజీ) చెందినవారమని పేర్కొంటూ ముఖ్యమంత్రి విచక్షణ కోటా కింద ఇక్కడి యోలకర్ మాలలోని కాలేజీ రోడ్డులో రెండు ఫ్లాట్లను పొందారు. దీనిపై మాజీ మంత్రి, దివంగత టీఎస్ ఢిఘోల్ ఫిర్యాదు మేరకు అప్పట్లో సర్కార్వాడ పోలీస్ స్టేషన్లో కోకాటే సోదరులు, మరో ఇద్దరిపై చీటింగ్, ఫోర్జరీ కే సు నమోదైంది. దీనిపై సుదీర్ఘ విచారణ అనంతరం కొకాటే సోదరులకు శిక్ష, జరిమానా విధించిన కోర్టు మరో ఇద్దరిని నిర్దోషులుగా విడుదల చేసింది. కాగా ఈ కేసులో తనకు బెయిల్ లభించిందని, ఉత్తర్వులపై పైకోర్టులో అప్పీలు చేస్తానని మంత్రి కొకాటే తెలిపారు. -
అంగరంగ వైభవంగా శివాజీ జయంతి, ఊయల వేడుకలు
సోలాపూర్: హైందవ స్వరాజ్య స్థాపకుడు, బహుజనుల పాలకుడు, జనతా రాజా శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా శ్రీ శివ జన్మోత్సవ మధ్యవర్తి మహా మండల్ ఆధ్వర్యంలో ఊయల వేడుకను ఘనంగా నిర్వహించారు. మంగళవారం అర్థరాత్రి సోలాపూర్ బస్టాండ్ సమీపంలోని శివాజీ మహారాజ్ చౌక్ వద్ద జరిగిన ఈ వేడుకలకు సోలాపూర్ పట్టణం, జిల్లా వ్యాప్తంగా 25 వేల మందికి పైగా మహిళలు హాజరయ్యారు. సంప్రదాయబద్ధంగా దుస్తులు ధరించి ఊయల గేయాలు పాడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమం జరుగుతున్నంతసేపూ బాణాసంచా వెలుగులతో , ఛత్రపతి శివాజీ మహారాజ్ కీ జై అనే నినాదాలతో శివాజీచౌక్ పరిసరాలు మార్మోగాయి. వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటుచేశారు. శివాజీ మహారాజ్ జీవితం యువతకు స్ఫూర్తిదాయకం ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు బుధవారం దత్తనగర్ లోని సీపీఎం పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సీపీఎం మాజీ కార్పొరేటర్ వెంకటేశ్ కొంగారి మాట్లాడుతూ... ప్రజాస్వామ్య బద్దంగా అన్ని కులాలు, వృత్తుల వారికి ఆత్మగౌరవాన్ని అందించే లౌకిక వ్యవస్థతో పాటు హైందవ స్వరాజ్యం ఏర్పాటు కోసం అహరి్నశలు కృషిచేసిన మహనీయుడు ఛత్రపతి శివాజీ అన్నారు. దౌర్జన్యం, బానిసత్వాన్ని పారద్రోలేందుకు విదేశీయులపై దండయాత్ర చేసి స్వయం ప్రతిపత్తి గల రాజ్యాన్ని స్థాపించిన శివాజీ మహారాజ్ మహారాష్ట్రతో పాటు యావత్ భారతదేశానికి ప్రేరణగా నిలిచారని కొనియాడారు. శివాజీ మహారాజ్ వ్యక్తిత్వం ,ఆయన భావజాలాన్ని నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవలసిన అవసరముందని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కామిని ఆడం, శేవంత దేశముఖ్, శకుంతల పానీబాతే, రంగప్ప మారెడ్డి, మురళీధర్ సుంచు, బాలకృష్ణ మల్యాల, వీరేంద్ర పద్మ, అభిజిత్ నీకంబే, అనిల్ వాసం, విజయ్ హర్సూర్ తదితరులు పాల్గొన్నారు.ఛత్రపతి స్ఫూర్తితోసమాజ ఐక్యత కోసం కృషిచేయాలి ఛత్రపతి శివాజీ మహరాజ్ ధైర్యసాహసాలు, ఆదర్శాలను స్ఫూర్తిగా తీసు కుని సమాజంలో ఐక్యతను నెలకొల్పేందుకు ప్రయతి్నంచాలని కలెక్టర్ కుమార్ ఆశీర్వాద్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని బుధవారం జిల్లా కలెక్టరేట్ నుంచి రంగుభవన్ చౌక్‌లోని చత్రపతి శివాజీ మహారాజ్ ఉద్యానవనం వరకు ‘జై శివాజీ జై భారత్’పేరిట పాదయాత్ర నిర్వహించారు. శివాజీ మహారాజ్ 395 వ జయంతి సందర్భంగా మహారాష్ట్రలోని మొత్తం 36 జిల్లాలలో జై శివాజీ జై భారత్ పాదయాత్ర నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు కలెక్టర్ కుమార్ ఆశీ ర్వాద్ జ్యోతి ప్రజ్వలన చేసి, శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుర్పించారు. అనంతరం జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు. జై శివాజీ,జై భారత్ పాదయాత్ర మరాఠా సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని పే ర్కొన్నారు. ఈ యాత్ర ద్వారా శివాజీ భావాజాలాన్ని రాష్ట్రమంతటా వ్యాప్తిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ కులదీ ప్ జంగం, పట్టణ పోలీస్ కమిషనర్ ఎం రాజ్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ మౌనిక సింగ్ ఠాకూర్, మనీషా కుంబార్ జిల్లా పరిపాలన విభాగానికి చెందిన అధికారులు, ఉద్యోగులు, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. -
రవీంద్ర నాట్య మందిర్ పునఃప్రారంభం
ముంబై: కళాకారులు, రంగస్థలనటులకు ప్రీతిపాత్రమైన రవీంద్ర నాట్య మందిర్ ఆడిటోరియం, పీఎల్ దేశ్‌పాండే మహారాష్ట్ర కళా అకాడమీ తిరిగి ప్రారంభం కానున్నాయి. పునరుద్ధరణ పనులు పూర్తైన నేపథ్యంలో ఫిబ్రవరి 28న జరిగే పునఃప్రారంభ కార్యక్రమానికి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు ఏక్నాథ్ శిందే, అజిత్ పవార్లు హాజరుకానున్నారని ఈ సందర్భంగా అకాడమీ కొత్త చిహ్నం ఆవిష్కరణ కూడా జరుగుతుందని ఓ అధికారి తెలిపారు. ‘రీఓపెన్’ఆర్ట్స్’ కమ్యూనిటీకి కొత్త ఉదయం– మంత్రి ఆశిష్ షెలార్ ఈ సందర్భంగా సాంస్కృతిక వ్యవహారాల మంత్రి ఆశిష్ షెలార్ మాట్లాడుతూ, మహారాష్ట్రలో అభివృద్ధి చెందుతున్న థియేటర్, ఆర్ట్స్ కమ్యూనిటీకి ఈ కార్యక్రమం ‘కొత్త ఉదయాన్ని‘ తెస్తుందని అన్నారు. అకాడమీతో తరతరాలుగా కళాకారులను, వారిలోని ప్రతిభకు మెరుగులద్దుతూనే ఉన్నామని , దీన్ని మరింత విస్తృతంగా కొనసాగిస్తామని స్పష్టంచేశారు. పునరుద్ధరించిన రవీంద్ర నాట్య మందిర్‌లో అధునాతన సౌండ్ సిస్టమ్స్, రిఫైన్డ్ ఇంటీరియర్స్, రెండు చిన్న థియేటర్లు, ఐదు ఎగ్జిబిషన్ హాళ్లు, ఆరి్టస్టుల కోసం 15 రిహార్సల్ రూమ్‌లు, గ్రాండ్ ఓపెన్–ఎయిర్ స్టేజ్, వర్చువల్ చిత్రీకరణ, సౌండ్ రికార్డింగ్, డబ్బింగ్, సౌండ్ మిక్సింగ్ కోసం స్టూడియోలు ఏర్పాటు చేశామని ఉన్నాయని మంత్రి తెలిపారు. అకాడమీలో త్వరలో వివిధ కళారూపాలకు సంబంధించి 20 సరి్టఫికెట్, డిప్లొమా కోర్సులను కూడా ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. -
శివాజీ వారసుడిపై అభ్యంతరకర కంటెంటా?
ముంబై: వికీపీడియాపై మరాఠాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తమ ఆరాధ్య దైవం ఛత్రపతి శివాజీ వారసుడైన ఛత్రపతి శంభాజీ మహారాజ్ గురించి అభ్యంతకర కంటెంట్‌ను పోస్ట్ చేయడమే అందుకు కారణం. శంభాజీ జీవిత వృత్తంగా తెరకెక్కిన ఛావా(Chhaava) చిత్రం థియేటర్లలలో ఉండగానే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. శివాజీ తనయుడు, మరాఠా సామ్రాజ్యపు రెండో ఛత్రపతి అయిన శంభాజీ మహరాజ్(Sambhaji Maharaj) గురించి వికీపీడియాలో అభ్యంతరకర సమాచారం పోస్ట్ అయ్యింది. ఈ విషయం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ దృష్టికి వెళ్లింది. దీంతో కంటెంట్ తొలగింపు దిశగా చర్యలు చేపట్టాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఈ నేపథ్యంలో ముంబై సైబర్ సెల్ వికీపీడియా(Wikipedia)కు నోటీసులు జారీ చేసింది. ఆ కంటెంట్‌ను తొలగించకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొంది. మరోవైపు సున్నితమైన ఇలాంటి అంశాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సీఎం ఫడ్నవిస్ అభిప్రాయపడ్డారు. ఎవరైనా ఎడిట్ చేయగలిగే వికీపీడియాలో.. ఎడిటోరియల్ నియంత్రణ లేకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. వికీపీడియాకు కిందటి ఏడాది కేంద్ర ప్రభుత్వం సైతం నోటీసులు జారీ చేసింది. కచ్చితత్వం లేని సమాచారం ఉందన్న ఫిర్యాదుల మేరకు నోటీసులు ఇచ్చింది. మరాఠా సామ్రాజ్య పాలకుడు శంభాజీ మహారాజ్ జీవిత కథను.. ‘ఛావా’ పేరిట భావోద్వేగపూరిత చిత్రంగా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తీర్చిదిద్దాడు. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుని.. కలెక్షన్ల పరంగా సంచలనాలు సృష్టిస్తోంది. ‘ఛావా’లో శంభాజీగా విక్కీ కౌశల్ (Vicky Kaushal) జీవించేయేగా.. శంభాజీ భార్య యేసుబాయిగా రష్మిక, జౌరంగజేబుగా అక్షయ్ ఖన్నా ఆకట్టుకున్నారు. -
తుల్జా భవాని ఆలయంలో మళ్లీ గోముఖ తీర్థ జలధారలు
సోలాపూర్: మహారాష్ట్రవాసుల ఆరాధ్య దైవం శ్రీ తుల్జా భవాని మాత ఆలయంలో పవిత్ర గోముఖ తీర్థంనుంచి జలధారలు మళ్లీ జాలువారుతున్నాయి. అనేక సంవత్సరాలుగా గోముఖ తీర్థానికి నీటిప్రవాహం నిలిచిపోవడంతో ఆవేదన చెందిన భక్తులు ప్రస్తుతం నీటిబుగ్గ పునఃప్రారంభం కావడంతో ఆనందం వ్యక్తంచేస్తున్నారు. పవిత్ర కాశీ పుణ్యక్షేత్రం నుంచి తుల్జాపూర్ భవానీ ఆలయంలోని గోముఖతీర్థంలోకి గంగా ప్రవాహం వస్తుందని భక్తులు విశ్వసిస్తారు. గోముఖం నుంచి తీర్థ గుండం లోకి 24గంటలపాటు ఈ సహజ నీటి ధార జాలవారుతుంది. అందుకే కాశీకి వెళ్లలేకపోయినా ఇక్కడ పుణ్యస్నానం ఆచరిస్తే దుంఖాలు, పాపాలు నశిస్తాయని భావిస్తారు. అందుకే వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులతో ఈ తీర్థం నిత్యం కిటకిటలాడుతుంటుంది. అయితే గత 35 ఏళ్లుగా ఈ సహజ నీటిధార ఆగిపోయింది. వ్యర్థాల కారణంగా ఆనాడు ఆగిపోయిన సహజ నీటిధార ప్రస్తుతం మళ్లీ దానంతటదే పునఃప్రారంభం కావడంతో భక్తులు సంబరాల్లో మునిగిపోయారు. ఈ నీటిప్రవాహం ఆలయం చుట్టుపక్కల ఉన్న బాలఘాట్ కొండల నుంచి వస్తుందని భావించినా, ఎంతమంది ఎన్నిరకాలుగా ప్రయతి్నంచినా ఇంతవరకూ జలధార మూలం అంతుచిక్కలేదని ఆలయ కమిటీ సీఈవో, తహసిల్దార్ మాయ మానే తెలిపారు. భక్తుల కొంగుబంగారం భవానీదేవి.. కోరిన కోర్కెలు తీర్చే తుల్జాపూర్ శ్రీ భవాని దేవి రాష్ట్ర వాసుల ఇలవేల్పు. చరిత్ర కారుల అభిప్రాయం ప్రకారం ఈ ఆలయాన్ని 17 లేదా 18 శతాబ్దాల్లో నిరి్మంచారు. సభా మందిరానికి పశి్చమ దిశలో గర్భగుడి, అక్కడ తూర్పుముఖంగా వెండి సింహాసనంపై శ్రీ తుల్జా భవాని దేవి మూలమూర్తిని ప్రతిష్టించారు. అమ్మవారిని మహిషాసుర మర్దిని మణిహార రూపంగా భక్తులు భావిస్తారు. ఏడాదిలో మూడుసార్లు అమ్మవారి విగ్రహాన్ని గర్భగుడి నుంచి తరలించి మంచికి(మంచం)పై అధిరోహింపచేస్తారు. వ్యర్థాల వల్లే ఆటంకం భక్తుల విశ్వాసాన్ని కాపాడేందుకు ఆలయ కమిటీ సాయి ఫ్రేమ్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఆధ్వర్యంలో గోముఖ తీర్థం నిర్వహణ పనులు చేపట్టింది. ఇంజనీర్ సూరజ్ జాదవ్ మార్గదర్శకత్వంలో సైట్ మేనేజర్ అమోల్ సురువసే పర్యవేక్షణలో కారి్మకులు గోముఖంపై భాగం వద్ద రాతితో కొడుతుండగా ఒక్కసారిగా నీరు ఉబికి వెలుపలికివచి్చంది. గోముఖ రంధ్రంలో వ్యర్థాలు, చెత్త కూరుకుపోవడంతో ఇంతకాలం నీటిధార నిలిచిపోయిందని సూరజ్జాదవ్ తెలిపారు. రంధ్రానికి చుట్టుపక్కల ఉన్న వ్యర్థాలను తొలగించిన తర్వాత నీటి ప్రవాహం మళ్లీ ప్రారంభమైందని పేర్కొన్నారు. గోముఖ తీర్థమే ప్రధాన ఆకర్షణ తుల్జాపూర్ లోని తుల్జా భవాని ఆలయ ప్రాంగణంలో కల్లోల తీర్థం , సభా మందిరం వంటివి ఉన్నా గోముఖ తీర్థమే ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఆవునోరు రూపంలో ఉన్న రంధ్రం నుంచి జాలువారే నీటిధారను భక్తులు సాక్షాత్తూ పవిత్ర గంగా జలంగా భావించి పుణ్యస్నానాలాచరిస్తారు. -
శివాజీ జయంతి : మహిళామణుల బుల్లెట్ స్వారీ
సోలాపూర్: హైందవ స్వరాజ్య స్థాపకుడు చత్రపతి శివాజీ మహరాజ్ జయంతి సందర్భంగా శ్రీ శివ జన్మోత్సవ మధ్యవర్తి మహా మండల్ ఉత్సవ కమిటీ తరపున అధ్యక్షుడు సుశీల్ బందపట్టే నేతృత్వంలో శివ శోభాయాత్ర నిర్వహించబడింది. ఆదివారం ఉదయం చత్రపతి సంభాజీ మహారాజ్ చౌక్ వద్దకు శోభాయాత్రలో పాల్గొనేందుకు మహిళలు ద్విచక్ర వాహనాలతో తరలివచ్చారు. మహా మండల్ తరఫున మహిళలకు కాషాయ రంగుతో కూడిన శాలువాలు అందజేశారు. ఈ సందర్భంగా చత్రపతి సంభాజీ మహారాజ్ చౌక్ వద్ద సంబాజీ మహారాజ్ విగ్రహానికి పూజలు నిర్వహించి బైకుల ద్వారా శోభాయాత్ర నిర్వహించారు. ఈ యాత్ర చత్రపతి సంభాజీ మహారాజ్ చౌక్ నుంచి ప్రారంభమై.. చత్రపతి శివాజీ మహారాజ్ చౌక్, మెకానిక్ చోక్, నవిపేట్, రాజువాడే చోక్, చిల్లర చౌపాడ్ తదితర మార్గాల గుండా షిండే జోక్ వరకు నిర్వహించారు. శివ జయంతి నిమిత్తంగా మహిళలు చీరలు, తలపై కాషాయరంగు తలపాగాలు ధరించి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. వీధుల్లో మహిళల బైకు ర్యాలీని తిలకించేందుకు ప్రజలు ఆసక్తి చూపారు. కాగా షిండే చౌక్‌లో ఊరేగింపు ముగిసిన అనంతరం శివజన్మోత్సవ సన్ మధ్యవర్తి మహా మండల్ వారు మహిళలచే హారతి నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు చేసిన చత్రపతి శివాజీ మహరాజ్ నామస్మరణలతో పరిసరాలు దద్దరిల్లాయి. ప్రతి సంవత్సరం శివ జయంతి నిమిత్తంగా వివిధ తరహాలో శోభాయాత్ర చేపట్టాలని మహిళలు ఆకాంక్షను వ్యక్తం చేశారు. శివ జన్మోత్సవ మధ్యవర్తి మహా మండల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ పద్మాకర్ కాలే, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సుశీల్ బందుపట్టే, పురుషోత్తం భరడే, ప్రకాష్ ననార్వే, అంబదాస్ షెలేక్ దేవిదాస్ గులే, మహేష్ హనీమే చాల్లే, బాలాసాహెబ్ పూనేకర్ తదితరులతోపాటు శివ దినోత్సవం మధ్యవర్తి మహా మండల్ సభ్యులు పెద్ద సంఖ్యలు పాల్గొన్నారు.ఇదీ చదవండి: Delhi Earthquake : డబ్బు కాదు భయ్యా.. బతకాలంటే దమ్ముండాలే! -
ఫ్యాషన్ స్ట్రీట్‌కు నయా లుక్
దాదర్: దక్షిణ ముంబైలోని ప్రముఖ ఫ్యాషన్ స్ట్రీట్‌కు కొత్త లుక్ ఇవ్వాలని బహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) నిర్ణయం తీసుకుంది. అందుకు అవసరమైన నూతన ప్రణాళిక రూపొందించి సిద్ధంగా ఉంచింది. సలహాదారుల కమిటీ సమరి్పంచిన నివేదిక ప్రకారం ఈ ప్రతిపాదనకు తుది మెరుగులు దిద్దే పనులు కూడా పూర్తయ్యాయి. త్వరలో టెండర్ల ప్రక్రియ ప్రారంభిస్తామని బీఎంసీ అదనపు కమిషనర్ (సిటీ) అశ్వినీ జోసీ తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తికాగానే ప్రత్యక్షంగా పనులు ప్రారంభమవుతాయని ఆయన చెప్పారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా.. నగరంలో ప్రధాన రైల్వే స్టేషన్లైన చర్చిగేట్–చత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ (సీఎస్ఎంటీ) మధ్య ఈ ఫ్యాషన్ స్ట్రీట్ ఉంది. దీనికి కూత వేటు దూరంలో ఆజాద్ మైదానం ఉంది. ఇక్కడ నేటి యువతను ఆకర్శించే అనేక కొత్త డిజైన్లతో కూడిన దుస్తులు, డ్రెస్ మెటీరియల్స్ లభిస్తాయి. దీంతో ఈ మార్కెట్ నగరంతోపాటు పశి్చమ, తూర్పు ఉప నగరాలు, శివారు ప్రాంతాల్లో ఎంతో గుర్తింపు పొందింది. ఇక్కడ రకరకాల దుస్తులతోపాటు, చేతి గడియారాలు, హ్యాండ్ బ్యాగులు, లగేజీ బ్యాగులు, బెల్టులు, బూట్లు తదితర ఫ్యాషనబుల్ వస్తువులు చౌక ధరకే లభించడంతో నిత్యం వేల సంఖ్యలో జనాలు వస్తుంటారు. అంతేగాకుండా దేశ నలుమూలలు, వివిధ రాష్ట్రాల నుంచి నగరానికి వచి్చన పర్యాటకులు ఫ్యాషన్ స్ట్రీట్‌ను తప్పకుండా సందర్శిస్తారు. వివిధ పనుల నిమిత్తం ముంబైకి వచి్చన వారు కూడా ఇక్కడికి వచ్చి తమకు నచ్చిన దుస్తులు, సామాగ్రి కొనుగోలు చేస్తారు. అన్ని రకాల, ఆధునిక ఫ్యాషన్ దుస్తులు లభించడంతో ఇక్కడికి పేదలతోపాటు, మధ్యతరగతి, ధనిక అని తేడా లేకుండా అన్ని వర్గాల వారు వస్తుంటారు. ఇక్కడికి వచ్చిన వారు ఖాళీ చేతులతో తిరిగి వెళ్లరు. ముఖ్యంగా నేటి యువత ఆధునిక ఏసీ షాపింగ్ మాల్స్‌ల కంటే ఫుట్‌పాత్‌పై వెలసిన ఈ ఫ్యాషన్ స్ట్రీట్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.లైసెన్సులు లేకుండానే వ్యాపారం..ప్రస్తుతం ఇక్కడ 6/8 లేదా 8/8 చదరపుటడుగులతో కూడిన చిన్న చిన్న టేలాలు, షాపులు ఇలా 250–300 వరకు ఉన్నాయి. ఇందులో లైసెన్స్‌గల షాపులు 112 ఉన్నాయి. మిగతా దుకాణాలన్నీ టెంపరరీ కావడంతో షట్టర్లు, డోర్లు, విద్యుత్ దీపాలు లేవు. చార్జింగ్ లైట్లతోనే వ్యాపారాలు కొనసాగిస్తారు. ఇక్కడ నిత్యం లక్షల రూపాయల లావాదేవీలు జరుగుతాయి. రాత్రుల్లు దొంగల నుంచి తమ వస్తువులను కాపాడుకునేందుకు అందులో పనిచేసే వారు లేదా యజమానులు అక్కడే నిద్రపోతుంటారు. ఇలాంటి చరిత్రగల ఫ్యాషన్ స్ట్రీట్ త్వరలో సింగపూర్, యూరోప్ దేశాల తరహాలో కొత్త హంగులు, విద్యుత్ దీపాలతో దర్శనమివ్వనుంది. షాపింగ్‌లకు వచ్చే కస్టమర్లకు ఇక్కడ తాగునీరు, మరుగుడొడ్లు లేవు. దీంతో షాపింగ్‌కు వచి్చన వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అయితే ఆధునీకీకరించే ఈ ప్రాజెక్టులో కస్టమర్లకు అవసరమైన కనీస వసతులు, అల్పాహార స్టాళ్లు, సేదతీరేందుకు బెంచీలు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. అధునిక సీసీ కెమెరాలతో భద్రతకు సైతం ప్రాధాన్యత ఇవ్వనున్నారు. -
మధ్యవర్తిత్వంతో వివాదాలు పరిష్కరించుకోవాలి
ముంబై: అన్ని రకాల వివాదాలను కోర్టురూమ్ల దాకా తీసుకురావాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా చెప్పారు. కొన్ని వివాదాలు కోర్టురూమ్ల్లో విచారణకు సరిపడవని అన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా వాటిని పరిష్కరించుకోవాలని సూచించారు. మధ్యవర్తులతో చాలాసార్లు అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో సృజనాత్మక పరిష్కారాలు లభిస్తాయని, మనుషుల మధ్య బంధాలు బలపడతాయని వెల్లడించారు. వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వం కూడా ఒక చక్కటి మార్గమని పేర్కొన్నారు. శనివారం నాగపూర్‌లో మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ(ఎంఎన్‌ఎల్‌యూ) మూడో స్నాతకోత్సవంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా మాట్లాడారు. ప్రతి కేసునూ చట్టపరమైన అంశం అనే కోణంలో చూడొద్దని, వాటిని మానవీయ కథనాలుగా పరిగణించాలని చెప్పారు. మన దేశంలో కక్షిదారులకు న్యాయ సహాయం అందించే వ్యవస్థ చాలా బలంగా ఉందన్నారు. ప్రపంచంలో ఇలాంటిది బహుశా ఎక్కడా లేకపోవచ్చని వ్యాఖ్యానించారు. మన దగ్గర కక్షిదారులందరికీ ఏదోరకంగా న్యాయ సహాయం లభిస్తోందన్నారు. ఏవైనా వివాదాలు తలెత్తగానే కోర్టుల్లో వ్యాజ్యాలు, విచారణల వరకూ వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. మధ్యవర్తుల ద్వారా పరిష్కరించుకోవడం ఉత్తమం అని వివరించారు. అక్కడ కొన్నిసార్లు అవును లేదా కాదు అనే మాటలతోనే వివాదాలు పరిష్కారమవుతుంటాయని గుర్తుచేశారు. మధ్యవర్తిత్వం అనే మార్గాన్ని ఎంచుకోవడం ద్వారా మనుషుల మధ్య, వ్యాపార సంస్థల మధ్య సంబంధాలు బలపడతాయని జస్టిస్ సంజీవ్ ఖన్నా ఉద్ఘాటించారు. -
అనుచిత వ్యాఖ్యల దుమారం.. యూట్యూబర్‌కు దక్కని ఊరట
న్యూఢిల్లీ: ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియా సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ సహా తన పిటిషన్లను అత్యవసరంగా విచారించాలన్న విజ్ఞప్తిని సీజేఐ బెంచ్ తిరస్కరించింది. ఇండియాస్ గాట్ లాటెంట్ వేదికగా ఓ కంటెస్టెంట్‌ను ఉద్దేశించి రణవీర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో అతనిపై కేసులు నమోదు అయ్యాయి. అయితే..ఆ ఎఫ్ఐఆర్లు అన్నింటిని ఒకే దగ్గరికి చేర్చేలా ఆదేశాలివ్వాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశాడతను. అలాగే.. గువాహతి పోలీసులు ఈ వ్యవహారంలో ఇప్పటికే అతనికి సమన్లు జారీ చేశారు. దీంతో అరెస్ట్ చేస్తారనే భయంతో అతను ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా వేశాడు. ఈ పిటిషన్లన్నీ ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు వెళ్లాయి. దీంతో ఆయన విచారణకు తేదీని నిర్ణయించారు. అయితే.. ఈ పిటిషన్లను అత్యవసరంగా విచారించాలన్న రణవీర్ తరఫు లాయర్ విజ్ఞప్తిని సీజేఐ బెంచ్ తోసిపుచ్చింది. ఈ విషయంలో కోర్టు రిజిస్ట్రీని సంప్రదించాలని సూచించింది.బీర్‌బైసెప్స్ యూట్యూబ్ ఛానెల్‌తో రణవీర్ అల్హాబాదియాకు మంచి ఫాలోయింగ్ ఉండేది. అయితే స్టాండప్ కమెడియన్ సమయ్ రైనా నిర్వహిస్తున్న ఇండియాస్ గాట్ లాటెంట్ షోలో పాల్గొన్న రణవీర్.. ఓ అభ్యర్థిని ఉద్దేశించి దారుణమైన కామెంట్లు చేశాడు. అతని తల్లిదండ్రుల శృంగారం గురించి ప్రస్తావించడంతో పెను దుమారం రేగింది.మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో పాటు పలువురు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు, తోటి యూట్యూబర్లు సైతం రణవీర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. వాక్ స్వతంత్రం పేరిట అతను సమాజం అంగీకరించని వ్యాఖ్యలు చేశాడంటూ మండిపడ్డారు. ఈ క్రమంలో చివరకు అతను క్షమాపణలు చెప్పాడు. అయినప్పటికీ ఈ వ్యవహారం మాత్రం చల్లారడం లేదు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నోటీసులు ఇవ్వడంతో యూట్యూబ్ అతని వ్యాఖ్యలు ఉన్న వీడియోను తొలగించింది. అయినప్పటికీ అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఈ వ్యాఖ్యల ఎఫెక్ట్‌తో.. అతనికున్న 16 మిలియన్ల ఫాలోవర్ల(అన్ని ప్లాట్‌ఫారమ్‌లు కలిపి) సంఖ్య క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇప్పటికే అతనిపై పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. మరోవైపు.. ఈ వ్యవహారం పార్లమెంట్‌కు సైతం చేరింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా.. కంటెంట్ నియంత్రణపై ప్రభుత్వం దృష్టిసారించాలని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి చెందిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ లేఖ రాయబోతోంది. మరోవైపు సమయ్ రైనా, ఇండియాస్ గాట్ లాటెంట్ నిర్వాహకులందరి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. మహారాష్ట్ర సైబర్ విభాగం ఈ షో సభ్యులపై కేసు నమోదు చేసింది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన జాతీయ మహిళా కమిషన్.. ఈ నెల 17వ తేదీన తమ ఎదుట హాజరు కావాల్సిందిగా రణవీర్ అల్హాబాదియా, సమయ్ రైనాలకు నోటీసులు జారీ చేసింది. -
సైలెంట్‌గా మాజీ మంత్రి కొడుకు బ్యాంకాక్ ట్రిప్.. విమానం గాల్లో ఉండగా ట్విస్టులు
ఆయనో మాజీ మంత్రి తనయుడు. అతన్ని ఎవరో కిడ్నాప్ చేశారంటూ ఓ ఆగంతకుడు పోలీసులకు సమాచారం అందించాడు. అతని తండ్రి అధికార పార్టీకి చెందిన నేత కావడంతో పోలీసులే స్వయంగా కిడ్నాప్ చేసి నమోదు చేసి రంగంలోకి దిగారు. ఆపై ఆ మాజీ మంత్రి సీన్లోకి రావడంతో అధికార యంత్రాగమే దిగి వచ్చింది. పాపం.. ఆ బాబుగారి సీక్రెట్ బ్యాంకాక్ ప్లాన్ ‘గాల్లో ఉండగానే’ బెడిసి కొట్టింది. ముంబై: శివసేన(షిండే వర్గం) నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి తానాజీ సావంత్ కుమారుడు రిషిరాజ్ సావంత్ కిడ్నాప్‌నకు గురయ్యారనే వ్యవహారం సోమవారం రాత్రి మహారాష్ట్రలో కలం రేపింది. పోలీసుల ద్వారా సమాచారం అందుకున్న తానాజీ.. హుటాహుటిన కమిషనర్ ఆఫీస్‌కు చేరుకుని పరిస్థితి సమీక్షించారు. ఎంక్వైరీ చేసిన పోలీసులు అతనొక ప్రైవేట్ ఛార్ట్‌లో అండమాన్ వైపు వెళ్తున్నాడనే సమాచారం తెలుసుకున్నారు. ఎవరో ఇద్దరు బలవంతంగా తన కొడుకును ఎత్తుకెళ్తున్నారని ఆయన మీడియా ముందు వాపోయారు. ఆ వెంటనే డీజీసీఏకు ఈ కేసు గురించి సమాచారం అందించారు. బ్యాంకాక్ వైపు వెళ్తున్న ఆ ప్రైవేటు విమానం.. పుణెకు తీసుకురావాలని పైలట్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. తొలుత పైలట్లు అదొక తప్పుడు సమాచారం అనుకున్నారట. సాధారణంగా మెడికల్ ఎమర్జెన్సీ లేదంటే సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు మాత్రమే అలా వెనక్కి రావడానికి పైలట్లకు అవకాశం ఉంటుంది. అయినప్పటికీ ఎందుకైనా మంచిదని ఎయిర్పోర్ట్ అధికారుల నుంచి ధృవీకరణ చేసుకుని వెనక్కి తిప్పారు. అలా.. అండమాన్ దాకా వెళ్లిన విమానం అలాగే వెనక్కి వచ్చేసింది.పుణే ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండ్ కాగానే విమానంలో ఉన్న ముగ్గురు షాక్ తిన్నారు. తమకు తెలియకుండానే తిరిగి రావడంతో రిషిరాజ్, అతడి స్నేహితులు.. పైలట్లపై మండిపడ్డారు. అయితే తాము కేవలం ఆదేశాలు మాత్రమే పాటిస్తామని పైలట్లు చెప్పడంతో ఏం చేయలేకపోయారు. ఆ వెంటనే సీఐఎస్ఎఫ్ సిబ్బంది విమానంలోకి వెళ్లి వాళ్లను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. తన కుటుంబానికి తెలియకుండా రిషిరాజ్ ఇద్దరు స్నేహితులతో ‘బిజినెస్ ట్రిప్’ ప్లాన్ చేశాడట. విషయం తెలిసి పోలీసులు, ఆ మాజీ మంత్రి ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకోకుండా తన కొడుకును బలవంతంగా వెనక్కి రప్పించారంటూ అధికారులపై ఆ మాజీ మంత్రి అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. మరోవైపు మరోవైపు పోలీసుల అత్యుత్సాహం, తానాజీ అధికార దుర్వినియోగంపై ఉద్దవ్ శివసేన మండిపడింది. ఎక్కడైతే రిషిరాజ్ కిడ్నాప్‌నకు గురయ్యారని హడావిడి జరిగిందో.. అదే సింగాద్ రోడ్ పీఎస్‌లో ఈ వ్యవహారంపై యూబీటీ శివసేన ఫిర్యాదు చేసింది. -
హాస్యం పేరిట నీచపు వ్యాఖ్యలు.. కేంద్రం నోటీసులతో స్పందించిన యూట్యూబ్
న్యూఢిల్లీ: ఓ కామెడీ షోలో ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియా చేసిన వ్యాఖ్యల దుమారం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. ఇప్పటికే అతనిపై పలు రాష్ట్రాల్లో కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తాలని శివసేన ఉద్దవ్ వర్గం భావిస్తోంది. అయితే ఈలోపు.. కేంద్ర నోటీసులు ఇవ్వడంతో యూట్యూబ్ అతని అభ్యంతరకర వ్యాఖ్యల వీడియోను తొలగించేసింది.ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియా(Ranveer Allahbadia) ఓ పాపులర్ షోలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. వాక్ స్వాతంత్య్రాన్ని దుర్వినియోగ పరచారని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్రంగా స్పందించారు. అదే సమయంలో మరికొందరు రాజకీయ నేతలు కూడా నీచపు వ్యాఖ్యలు చేశాడంటూ అల్హాబాదియాపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అంతేకాదు.. పాడ్‌కాస్ట్‌లపై నిషేధం విధించాలంటూ పలువురు డిమాండ్ చేశారు. మరోవైపు.. అతనిపై పలుచోట్ల ఫిర్యాదులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ వీడియోను తొలగించాలని యూట్యూబ్‌కు కేంద్రం నోటీసులు పంపింది.కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ సీనియర్ సలహాదారు కంచన్ గుప్తా(Kanchan Gupta) యూట్యూబ్ ఆ వీడియోను డిలీట్ చేసిన విషయాన్ని ఎక్స్ ద్వారా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే యూట్యూబ్ ఈ చర్యలు తీసుకుందని ఆమె పేర్కొన్నారు. ప్రధాని అతనికి అవార్డు ఇచ్చారుమరోవైపు.. ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతానని యూబీటీ శివసేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది చెబుతున్నారు. హాస్యం పేరిట అనుచిత వ్యాఖ్యలతో హద్దులు దాటడం.. ఏ భాషలోనైనా సహించేది లేదు. ఇన్ఫర్మేషన్ & బ్రాడ్‌కాస్టింగ్ మంత్రిత్వ శాఖ పానెల్ వద్ద చర్చిస్తాం. ప్రధాని మోదీ అతనికి(రణవీర్ అల్హాబాదియా) అవార్డుఇచ్చారు. సమాచార ప్రసార మంత్రిత్వశాఖ కమిటీలో సభ్యుడిగా కూడా అవకాశం ఇచ్చారు. అలాంటి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతమాత్రం సమంజసం కాదు అని ఎక్స్‌లో పోస్ట్ చేశారామె.సమయ్ రైనా నిర్వహించే ‘ఇండియా గాట్ లాటెంట్’ అనే షోలో రణవీర్ అల్హాబాదియా పాల్గొన్నారు. ఓ కటెంటెస్ట్ను ఉద్దేశించి.. ‘‘నీ తల్లిదండ్రులు శృంగారంలో పాల్గొంటే జీవితాంతం చూస్తూ ఉండిపోతావా?. లేకుంటే.. ’’ అంటూ అతి జుగుప్సాకరమైన ప్రశ్నను సంధించాడు. ఆ వీడియో నెట్టింటకు చేరడంతో అతనిపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. రాజకీయ నేతలతో పాటు సినీ ప్రముఖులు సైతం అతని తీరును తీవ్రంగా ఖండించారు.సారీ చెప్పినా.. ‘‘నా వ్యాఖ్యలు అనుచితమైనవే కాదు.. హాస్యమైనవీ కాదు.. హాస్యం నా బలం కాదు.. నేనిక్కడ ఉన్నది క్షమాపణలు చెప్పేందుకే’’ అని ఎక్స్‌లో రణవీర్ క్షమాపణలు చెప్పాడు. అయినప్పటికీ.. అతనిపై విమర్శలు మాత్రం చల్లారడం లేదు. రణవీర్‌తో పాటు ఇండియాస్ గాట్ లాటెంట్ షో నిర్వాహకులు, న్యాయనిర్ణేతలపైనా కేసులు నమోదు అయ్యాయి. రణవీర్ అల్హాబాదియా ఎవరంటే.. 31 ఏళ్ల వయసున్న రణవీర్ అల్హాబాదియాకు వివాదాలు కొత్తేఆం కాదు. ఇతనొక ప్రముఖ యూట్యూబర్. బీర్‌బైసెప్స్ అనే యూట్యూబ్ ఛానెల్ ఉంది. దానికి ఒక కోటి ఐదు లక్షల మంది దాకా సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు. ఇక.. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ 4.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఎన్నో పాపులర్ యూట్యూబ్ ఛానెల్స్‌ను అతను సహ వ్యవస్థాపకుడిగా నడిపిస్తున్నాడు. అంతేకాలు.. పలువురు పొలిటికల్ లీడర్ల మీద అతను పేల్చిన జోకులు విమర్శలు సైతం దారి తీశాయి.ఏమిటీ షో ఉద్దేశం ఇండియాస్ గాట్ లాటెంట్ అనేది ఒక కామెడీ షో. తమలోని హాస్యకోణాన్ని కొత్తగా ప్రదర్శించుకోవాలనుకునేవాళ్లకు అవకాశం ఇచ్చేందుకు ప్రముఖ హాస్యనటుడు సమయ్ రైనా ఏర్పాటు చేసిన వేదిక ఇది. కేవలం హాస్యం మాత్రమే కాదు.. పాటలు పాడడం, డ్యాన్సులు.. ఇలా ఎన్నో టాలెంట్లను ఇక్కడ ప్రదర్శించొచ్చు. అయితే ఇది రెగ్యులర్ తరహాలో ఉండదు. అందుకే అంతటి ఆదరణను చురగొంది. అదే సమయంలో అక్కడి కంటెస్టెంట్లు చేసే వ్యాఖ్యలు, జడ్జిల కామెంట్లు అభ్యంతరకంగా ఉండడంతో పలు వివాదాల్లోనూ ఈ షో చిచ్కుకుంది. -
ముంబైలో క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
సాక్షి, ముంబై: ముంబై నగరంలో గత కొన్ని రోజులుగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. జనవరిలో కొన్ని రోజులపాటు వర్షపాతం నమోదైనప్పటికీ, ఇప్పుడు ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతున్నాయి. దీని వల్ల ముంబై వాసులు విపరీతమైన వేడిని ఎదుర్కొంటున్నారు. జనవరిలో ముంబైలో గరిష్ట ఉష్ణోగ్రతలు 30 నుంచి 34 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయి. అయితే ఫిబ్రవరి ప్రారంభమైనప్పటి నుంచి ఈ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం 34 డిగ్రీల సెల్సియస్‌ను దాటి వెళ్లింది. ముంబై శివారు ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. శనివారం శాంటా క్రూజ్ ప్రాంతంలో గరిష్ట ఉష్ణోగ్రత 34.5 డిగ్రీలుగా నమోదైంది. వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, రాబోయే కొన్ని రోజుల్లో ఉష్ణోగ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, గరిష్ట ఉష్ణోగ్రత 33 నుంచి 36 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా పగటి వేళ వేడి తీవ్రంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే రాత్రిపూట ఉష్ణోగ్రతలో కూడా స్వల్ప పెరుగుదల ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ మార్పుల కారణంగా ముంబై ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. వేడి తీవ్రత పెరగడంతో బయటికి వెళ్లే ప్రజలు సౌకర్యవంతంగా ఉండటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. శరీరాన్ని తేమగా ఉంచుకునేందుకు పుష్కలమైన నీరు తాగాలని, పొడి వాతావరణం కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ఎండ వేడికి అధికంగా గురికాకుండా చూడాలని సూచించారు. రాష్ట్రంలోని కొంకణ్, మధ్య మహారాష్ట్ర, మరాఠ్వాడా ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. హైడ్రేట్‌గా ఉండేలా చూసుకోవాలి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని, బయటకు వెళ్లే వ్యక్తులు హైడ్రేట్‌గా ఉండేలా చూసుకోవడం, గాలి పీల్చుకునే తేలికపాటి బట్టలు ధరించడం, ఎండ వేడికి ఎక్కువగా గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎండ తీవ్రత కారణంగా పిల్లలు, వయసైన వారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అని అధికారులు తెలిపారు. -
మహారాష్ట్ర ఎన్నికల్లో భారీ అక్రమాలు
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ఎన్నికల్లో భారీ అవకతవకలు(irregularities)చోటుచేసుకున్నాయని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)ఆరోపించారు. రాష్ట్రంలోని వయోజనుల కంటే నమోదైన ఓటర్లే ఎక్కువమంది ఉన్నారన్నారు. అయిదేళ్ల క్రితం కంటే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల మధ్య ఐదు నెలల కాలంలో ఎక్కువ మంది పేర్లను జాబితాలో చేర్చారని చెప్పారు. 2024లో జరిగిన లోక్‌సభ ఎన్ని కలు, అసెంబ్లీ ఎన్నికలనాటి ఓటరు జాబి తాను ఇవ్వాలంటూ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్‌లు, శివసేన(యూబీటీ), ఎన్సీపీ(ఎస్పీ)లు కోరినా ఈసీ ఇప్పటి వరకు స్పందించలేదని ఆయన తెలిపారు. దీనిపై తాము చట్ట ప్రకారం ముందుకెళతామని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ శుక్రవారం ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్, ఎన్సీపీ(ఎస్పీ)నేత సుప్రియా సూలేలతో కలిసి మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో చాలా మంది ఓటర్ల పేర్ల తొలగింపు లేక బదిలీ చేశారని, వీరిలో ఎక్కువ మంది దళితులు, గిరిజనులు, మైనారిటీ వర్గాల వారే ఉన్నారని రాహుల్ వివరించారు. కొత్తగా చేర్చిన ఓటర్ల కంటే తొలగింపునకు గురైన పేర్లే ఎక్కువగా ఉన్నాయని ప్రతిపక్ష పార్టీలు అనుమానిస్తున్నాయని ఆయన చెప్పారు.5 నెలల్లోనే 39 లక్షల కొత్త ఓటర్లు‘మహారాష్ట్ర ఎన్నికలకు(Maharashtra election)సంబంధించి ఈసీని పలు ప్రశ్నలు అడిగాం. 2019 విధాన సభ ఎన్నికలు, 2024 లోక్‌సభ ఎన్నికల మధ్యలో ఐదేళ్ల వ్యవధిలో మహారాష్ట్రలో 32 లక్షల ఓటర్ల పేర్లను చేర్చారు. అయితే, 2024 లోక్‌సభ ఎన్నికలు, 2024 అసెంబ్లీ ఎన్నికలకు గాను కేవలం ఐదు నెల్ల వ్యవధిలో ఏకంగా 39 లక్షల కొత్త ఓటర్ల పేర్లు చేరాయి’అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత అంత స్వల్ప వ్యవధిలో అంత ఎక్కువ మంది ఓటర్లను కొత్తగా ఎలా చేర్చారు? ఈ 39 లక్షల మంది ఓటర్లు ఎవరు? 39 లక్షల మంది హిమాచల్ ప్రదేశ్ మొత్తం జనాభాతో సమానం. అయిదేళ్లలో కంటే కేవలం ఐదు నెలల్లో మహారాష్ట్రలో ఈసీ ఎక్కువ మంది ఓటర్లు ఎందుకు చేర్చింది?’అని ఆయన ప్రశ్నించారు. కొత్త ఓట్లు బీజేపీ ఖాతాలోకేమహారాష్ట్రలో వయోజనుల జనాభా 9.54 కోట్లు. అసెంబ్లీ ఎన్నికల నాటికి ఓటర్ల సంఖ్య 9.7 కోట్లు. మహారాష్ట్రలోని మొత్తం వయోజనుల కంటే నమోదైన ఓటర్లు ఎక్కువ మంది ఉండటం ఎలా సాధ్యమని ఆయన సందేహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాల ఓటు బ్యాంకు యథాతథంగా ఉండగా కొత్తగా చేరిన ఓటర్లలో ఎక్కువ మంది బీజేపీకే ఓటేశారన్నారు. ఉదాహరణకు కంతీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సాధించిన మెజారిటీ కొత్తగా చేరిన ఓటర్ల సంఖ్యతో సమానంగా ఉందని ఆయన వివరించారు. అదేవిధంగా, లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో మూడు ప్రధాన ప్రతిపక్షాలకు పడిన ఓట్ల సంఖ్యలో ఎలాంటి తగ్గుదల నమోదు కాలేదని కూడా ఆయన చెప్పారు. తమ ప్రశ్నలకు ఈసీ ఎందుకు బదులివ్వడం లేదన్నారు. పారదర్శకంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఈసీకుందన్నారు. లేకుంటే తమ తదుపరి చర్య న్యాయస్థానాలను ఆశ్రయించడమేనని స్పష్టం చేశారు.అలాగైతే కేంద్రానికి బానిస అన్నట్లే..శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ...‘ఈసీ సజీవంగా, సొంతంగా పనిచేయగలిగి ఉంటే రాహుల్ గాంధీ సంధించిన ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. లేదంటే కేంద్ర ప్రభుత్వానికి అది బానిసగా మారినట్లే భావించాల్సి ఉంటుంది. ప్రభుత్వ సంకెళ్ల నుంచి ఈసీ బయటకు రావాలి’అని అన్నారు. ఎన్నికల్లో గెలిచాక కూడా తమ పార్టీకి చెందిన మల్షిరాస్ ఎమ్మెల్యే ఉత్తమ్ జన్కార్ మళ్లీ ఎన్నికలు జరపాలని, ఈసారి బ్యాలెట్‌ను వాడాలని డిమాండ్ చేయగా, ప్రభుత్వం అక్కడికి పోలీసులను పంపించిందని ఎన్సీపీ(ఎస్పీ)నేత సుప్రియా సూలే ఆరోపించారు.అన్ని గణాంకాలను వెల్లడిస్తాం: ఈసీమహారాష్ట్ర ఎన్నికల్లో అవకత వకలు జరిగాయంటూ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేసిన పలు ఆరోపణలపై ఈసీ స్పందించింది. పూర్తి గణాంకాలతో లిఖిత పూర్వకంగా సమాధానమిస్తామని స్పష్టం చేసింది. -
మరింత పటిష్టంగా ముంబై–పుణే ఎక్స్‌ప్రెస్ హైవే
దాదర్: ముంబై–పుణే నగరాల మధ్య ప్రయాణం మరింత వేగవంతం, సురక్షితం కానుంది. ఈ మార్గం మీదుగా రాకపోకలు సాగించే ఇరు నగరాల ప్రయాణికులకు, వాహనాలకు మరింత భద్రత కలి్పంచేందుకు మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎమ్మెస్సార్డీసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా 90 కిలోమీటర్ల పొడవైన ముంబై–పుణే ఎక్స్‌ప్రెస్ వే మెయింటెనెన్స్ పనులు, మరమ్మతులు సకాలంలో జరిగేందుకు, అలాగే టోల్ వసూళ్ల వ్యవస్ధను మరింత మెరుగుపరిచేందుకు రంగం సిద్ధం చేస్తోంది. టోల్ వసూళ్లు పారదర్శకంగా జరిగేలా హైటెక్ సిస్టంను ప్రవేశ పెట్టటంతోపాటు, ప్రత్యేకంగా ఇంజనీర్ల బృందాన్ని కూడా నియమించనుంది. టోల్– ఆపరేట్–ట్రాన్స్ఫర్ సిస్టంను అమలుచేసేందుకు ఓ ప్రైవేటు కంపెనీకి బాధ్యతలు అప్పగించనుంది. అందుకు అవసరమైన టెండర్లను ఆహ్వనించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అదనపు భారం తగ్గించేందుకే... ముంబై–పుణే నగరాలను అనుసంధానం చేసే ఎక్స్‌ప్రెస్ వే 24 గంటలు వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రహదారిపై 3+3 లేన్లు, అక్కడక్కడ సర్వీస్ లేన్లు ఉన్నప్పటికీ అవి ఎటూ సరిపోవడం లేదు. దీంతో వాహన యజమానులు, డ్రైవర్లు అసౌకర్యానికి గురికాకుండా ఎక్స్‌ప్రెస్ వే పై ఎప్పటికప్పుడు మరమ్మతు పనులు చేపట్టడంతోపాటు మార్గ మధ్యలో ఉన్న వంతెనల స్ట్రక్చర్, ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, క్రాస్ ఓవర్ బ్రిడ్జిల మెయింటెనెన్స్ పనులతోపాటు రహదారి వెంబడి ఉన్న వివిధ రకాల ఏరో మార్క్‌లు (గుర్తులు), దూరాన్ని సూచించే బోర్డుల ఏర్పాటు పనులను కాంట్రాక్టు దక్కించుకున్న కంపెనీకి ఎమ్మెస్సార్టీసీ అప్పగించనుంది. చదవండి: Ma Illu ట్విన్స్ విజేత, శ్వేత అనాథలు కాదు అంగరంగ వైభవంగా పెళ్లి!దేశ ఆర్థిక రాజధాని ముంబై–విద్యా, ఉద్యోగాలతోపాటు వివిధ కళలకు నిలయమైన పుణే నగరాల మధ్య నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో ఈ రెండు నగరాల మధ్య వందల సంఖ్యలో ఆర్టీసీ బస్సులు, ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లు, ప్రైవేటు లగ్జరీ బస్సులు, ట్యాక్సీలు, ప్రైవేటు పికప్ వాహనాలు ఇలా ఎన్ని రవాణా వాహనాలున్నా అవి ప్రయాణికుల సంఖ్యకు సరిపోవడం లేదు. వీటితోపాటు సరుకులను చేరవేసే భారీ వాహనాలు, ట్యాంకర్లు, కంటైనర్లు, ట్రెయిలర్ల సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. ఫలితంగా ఎక్స్‌ప్రెస్ వే పై వాహనాల భారం అదనంగా పడుతోంది. ఈ నేపథ్యంలో ఎక్స్‌ప్రెస్ వే మెయింటెనెన్స్, మరమ్మతు పనులను వేగవంతం చేయాలని ఎమ్మెస్సారీ్టసీ నిర్ణయించింది. లాభాలు...టోల్ నాకాల వద్ద పండుగలు, సెలవులు, ఉత్సవాల సమయంలో పొడుగాటి క్యూల వల్ల వృథా అవుతున్న విలువైన సమయం హైటెక్ యంత్రాలవల్ల ఆదా కానుంది. సరైన మెయింటనెన్స్‌తో రోడ్డు ప్రమాదాల సంఖ్య చాలా వరకు తగ్గనుంది.ఎక్స్‌ప్రెస్ వే జీవిత కాలం మరింత పెరగనుంది. వాహనాలకు భద్రత కూడా లభించనుంది. -
ఘనంగా ‘శ్రీ వీర తపస్వి’ ఆత్మజ్యోతి, రథోత్సవ యాత్ర
సోలాపూర్: శ్రీ వీరతపస్వి చెన్నవీర శివాచార్య మహాస్వామిజీ 69వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉత్తరఖసుబాలోని హొటగిమఠంలోచిటుగుప్పాకు చెందిన గురులింగ శివాచార్య మహాస్వామి గురువారం తెల్లవారుజామున రెండు గంటల పది నిమిషాలకు ఆత్మజ్యోతిని ప్రజ్వలింప చేసి శ్రీ వీరతపస్వికి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో వడంగిలికి చెందిన పండితారాధ్య శివాచార్య, మగ నగిరికి చెందిన విశ్వ రాధ్య శివాచార్య, చెడుగుప్పాకు చెందిన ఉత్తరాధికారి శివాచార్య మహా స్వామీజీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం బృహన్మఠ్ అధ్యక్షుడు చెన్నయోగి రాజేంద్ర శివచార్య తన శిరస్సుపై ఆత్మజ్యోతిని ప్రతిష్టింపచేసుకుని ఊరేగింపుగా తరలివెళ్లారు. ఊరేగింపు సందర్భంగా భక్తులు ‘శ్రీ వీర తపస్వి చెన్నవీర శివాచార్య మహారాజ్‌కి జై, తపో రత్న యోగి రాజేంద్ర శివాచార్య మహారాజ్ కీ జై’అంటూ నినాదాలు చేశారు. పవిత్ర జలకలశాలతో జ్యోతికి స్వాగతం ఊరేగింపులో ముందు వరుసలో శ్రీ వీరతపస్వి చిత్రపటంతో పువ్వులతో అలంకరించిన ట్రాక్టర్ వాహనం, బ్యాండ్ మేళాలు, పల్లకీలు, విద్యార్థుల బృందాల వెంటరాగా రథం బ్యాండ్ బాజా భజంత్రీలు, వివిధ గ్రామాల నుండి వచ్చిన పల్లకీలు, విద్యార్థుల బృందాలు వెంటరాగా మల్లికార్జున మందిర్ నుంచి వివిధ మార్గాల మీదుగా మజిరేవాడి వద్దకు చేరుకున్న ఎడ్లబండి రథానికి మహిళలు రంగు రంగుల ముగ్గులు, పవిత్ర జల కలశాలతో స్వాగతం పలికారు. చదవండి: నీతా అంబానీకి ముఖేష్ అంబానీ సర్ప్రైజ్ గిప్ట్హొటగికి చేరుకున్న అనంతరం ఊరేగింపు ముగిసింది. ఈసందర్భంగా గ్రామస్తులు జ్యోతికి గ్రామస్తులు మంగళహారతులు పట్టారు. పలువురు ప్రముఖ శివాచార్యులు ధార్మిక ప్రసంగాలు చేసి భక్తులకు మార్గదర్శనం చేశారు. సాయంత్రం నాలుగు గంటలకు రథోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ రథోత్సవంలో నాగంసూర్కు చెందిన శ్రీకాంత్ శివచార్య మహాస్వామీజీ, శిఖర్ సింగన్ పూర్‌కు చెందిన సిద్ధలింగ శివాచార్య, సిద్ధన కెరకికి చెందిన రాచోటేశ్వరలతోపాటు బృహన్మఠ్ ఆధ్వర్యంలోని బోరామని ,దోత్రి ,దర్గాహలి, ఖానాపూర్ , బోరేగావ్, శతాందుధాని, సారాం బరి, హోటగి గ్రామాలకు చెందిన ఉపాధ్యాయులు బోధనేతర సిబ్బంది పెద్దఎత్తున పాల్గొన్నారు. రథోత్సవ మార్గాలలో భక్తులకు దాతలు ప్రసాదాలను పంచారు. శ్రీ సిద్దేశ్వర సహకార ఫ్యాక్టరీ తరపును చెరకు రసం పంపిణీ చేశారు. చదవండి : Ma Illu ట్విన్స్ విజేత, శ్వేత అనాథలు కాదు అంగరంగ వైభవంగా పెళ్లి! -
మహారాష్ట్రలో 70 లక్షల ఓటర్లను కలిపారు
న్యూఢిల్లీ: గత ఏడాది జూన్‌లో లోక్‌సభ ఎన్నికలు జరిగినప్పుడు మహారాష్ట్రలో ఉన్న ఓటర్ల సంఖ్య హఠాత్తుగా నవంబర్ నెల వచ్చేసరికి 70 లక్షలు పెరిగిందని లోక్‌సభలో విపక్షనేత రాహు ల్ గాంధీ వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో భాగంగా సోమవారం లోక్‌సభలో ఆయన మాట్లాడారు. ‘‘మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమగ్రతపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. అదే రాష్ట్రంలో జూన్‌లో లోక్‌సభ ఎన్నికల వేళ ఉన్న ఓటర్ల సంఖ్యకు నవంబర్‌లో ఎలా 70 లక్షల ఓటర్లు పెరుగుతారు?. గత ఐదేళ్లలో పెరిగిన ఓట్ల కంటే కూడా ఈ సంఖ్య ఎక్కువ. మొత్తం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఓటర్ల సంఖ్యకు సమాన స్థాయిలో ఓటర్లను కలిపారు. ఇందులో మతలబు ఏంటో కేంద్ర ఎన్నికల సంఘం తేల్చాలి. ఈసీ దీనిపై స్పష్టతనివ్వాలి’’అని రాహుల్ డిమాండ్‌చేశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత షిర్డీలోని ఒక భవంతి అడ్రస్‌తో దాదాపు 7,000 ఓట్లను కలిపారని రాహుల్ చెప్పారు. -
మావోయిస్టుల దుశ్చర్య.. ఇన్ఫార్మర్ నెపంతో దారుణ హత్య
ముంబై: మహారాష్ట్రలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. పోలీసుల ఇన్ఫార్మర్ నెపంతో పౌరుడు సుఖ్రామ్ మాడవిని దారుణంగా హత్య చేశారు. అనంతరం, ఆయన మృతదేహం వద్ద మావోయిస్టులు లేఖను విడిచిపెట్టి వెళ్లారు. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.వివరాల ప్రకారం.. గడ్చిరోలిలో మావోయిస్టులు ఘాతుకానికి ఒడిగట్టారు. భమ్రాగడ్ తహసీల్‌లో ఉన్న కియర్ గ్రామంలో సామన్య పౌరుడు సుఖ్రామ్ మాడవిని హత్య చేశారు. అనంతరం, అతడి మృతదేహం వద్ద లేఖను విడిచిపెట్టి వెళ్లారు. ఈ లేఖలో మాడవిని పోలీసుల ఇన్ఫార్మర్ని అని తెలిపారు. పెంగుండ ప్రాంతంలో పోలీసు క్యాంప్ ఏర్పాటుకు అతడు సహకరించాడని పేర్కొన్నారు. మావోయిస్టుల కదలికలపై పోలీసులకు సమాచారం అందించినట్టు తెలిపారు.ఇదిలా ఉండగా.. మావోయిస్టుల చర్యపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణ పౌరుడైన సుఖ్రామ్ మాడవిని ఇన్ఫార్మర్ నెపంతో హత్య చేయడం దారుణమన్నారు. కాగా, ఈ ఏడాదిలో మావోయిస్టులు ఓ వ్యక్తిని హత్య చేయడం ఇదే మొదటిసారని అన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్త చేపట్టినట్టు చెప్పుకొచ్చారు. మరోవైపు.. ఇటీవలి కాలంలో ఎన్కౌంటర్ల కారణంగా భారీ సంఖ్యలో మావోయిస్టులు చనిపోయిన విషయం తెలిసిందే. దాదాపు 40 మందికి పైగా మావోయిస్టులు మృత్యువాతపడ్డారు. -
స్పేస్–ఎక్స్ ఉపగ్రహాల తయారీలో తెలుగుతేజం
సోలాపూర్: భారతదేశంలో తొలిసారిగా బెంగళూరుకు చెందిన ఫిక్సెల్ కంపెనీ ఇటీవలే అంతరిక్షంలోకి మూడు ఉపగ్రహాలను పంపింది. ఈ ఉపగ్రహాల తయారీ బృందంలో తెలుగబ్బాయి నీరజ్ గాడి కూడా ఉండటం తమకు గర్వకారణమని స్థానిక తెలుగుప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం ‘మన్‌కీ బాత్’లో ఈ విషయాన్ని ప్రస్తావించి అభినందనలు తెలియజేశారని సంతోషం వ్యక్తంచేస్తున్నారు. జనవరి 15న విజయవంతంగా... భారతదేశ చరిత్రలో కేంద్ర ప్రభుత్వ సంస్థ’ ఇస్రో’ మాత్రమే అంతరిక్షంలోకి పంపింది. అయితే తొలిసారిగా బెంగళూరుకు చెందిన ప్రైవేటు కంపెనీ ఫిక్సెల్ ఆధ్యర్యంలో జనవరి 15న అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి ప్రఖ్యాత స్పేస్–ఎక్స్ కంపెనీకి చెందిన మూడు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపారు. ఈ ప్రాజెక్టులో పట్టణానికి చెందిన నీరజ్ గాడి ప్రొడక్షన్ మేనేజర్‌గా వ్యవహరించారు. ఘన వారసత్వానికి ధీటుగా విజయం.. రాజస్థాన్ లోని బిట్స్పిలానీలో బి. ఇ.(మెకానికల్), ఫ్రాన్స్ లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పూర్తిచేసిన నీరజ్ గాడి 2022లో ఫిక్సెల్ కంపెనీలో ప్రొడక్షన్ ఇంజనీర్ గా చేరారు. నీరజ్ గాడి పట్టణంలో ప్రసిద్ధిగాంచిన షాప్ యాక్ట్ కన్సల్టెంట్, అశ్విని సహకార రుగ్నాలయ మాజీ డైరెక్టర్ రామచంద్ర గాడి మనవడు. నీరజ్ తండ్రి ముంబైలోని యూ నియన్ బ్యాంక్ అఫ్ ఇండియా ప్రధాన కార్యాలయంలో ఉన్నత స్థాయి అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. సీనియర్ పాత్రికేయుడు వేణుగోపాల్ గాడి నీరజ్‌కు బాబాయి అవుతారు. జనార్ధన్ గాడి తనయుడు అలాగే పట్టణంలో సీనియర్ పాత్రికేయుడైన వేణుగోపాల్ గాడి సోద రుని కుమారుడు. ఉపగ్రహాలతో సూక్ష్మ శాస్త్రీయ సమాచారం ఫిక్సెల్ కంపెనీ‘ హైపర్ స్పెక్ట్రల్ పిక్చర్‘కు సంబంధించిన అంశాలపై పనిచేస్తుంది. కాగా ఈ కంపెనీ పంపిన ఉపగ్రహాలు భూమిపై ఉన్న వివిధ వస్తువుల ఫోటోలను తీస్తాయి. సుమారు 200 రకాల రంగుల్లో చిత్రాలను వీటి ద్వారా సంగ్రహించవచ్చు. దీని ద్వారా చెట్లు, పంటలు, నేల, గాలి, నీరు మొదలైన అంశాలపై గురించి సూక్ష్మశాస్త్రీయ సమాచారాన్ని పొందవచ్చు. -
లక్ష కోట్లు చెల్లించండి.. సీఎం ఫడ్నవీస్ ప్రభుత్వానికి అల్టిమేటం!
ముంబై : ప్రభుత్వం తమతో పనులు చేయించుకుని సుమారు రూ.లక్ష కోట్ల విలువైన బకాయిలను చెల్లించడం లేదని మహరాష్ట్ర స్టేట్ కాంట్రాక్టార్ అసోసియేషన్ (ఎంఎస్‌సీఏ) ఆరోపించింది. సీఎం ఫడ్నవీస్ ప్రభుత్వం పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, లేదంటే వారం రోజుల తర్వాత ఆందోళన చేపడతామని కాంట్రాక్ట్ అసోసియేషన్ సభ్యులు అల్టిమేట్టం జారీ చేశారు.జూలై 2024 నుండి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (పిడబ్ల్యుడి) నుండి చెల్లించని బిల్లులు దాదాపు రూ. 46,000 కోట్లకు చేరాయని ఎంఎస్సిఎ ప్రెసిడెంట్ మిలింద్ బోస్లే పేర్కొన్నారు. తద్వారా 4 లక్షల కాంట్రాక్టర్లు, 4 లక్షల కార్మికులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు. మా ఆందోళనలను పరిష్కరించడానికి బదులుగా, ప్రభుత్వం ప్రచారం కోసం ఉచితాలపై దృష్టి పెట్టింది’ అని భోస్లే ఆరోపించారు.ముంబై సర్కిల్లోని మూడు డివిజన్లలో రూ.600 కోట్ల బిల్లులు చెల్లించలేదని ముంబై కాంట్రాక్టర్ల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ దాదా ఇంగలే పేర్కొన్నారు. చాలా మంది చిన్న కాంట్రాక్టర్లు, నిరుద్యోగ యువత అభివృద్ధి ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టారు. అయితే చెల్లింపులు ఆలస్యం కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.వివిధ శాఖల వద్ద మొత్తం రూ.1,09,300 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని సంఘం పేర్కొంది. కాంట్రాక్టర్ల సంఘం ప్రకారం, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (రూ. 46,000 కోట్లు), జల్ జీవన్ మిషన్ (రూ. 18,000 కోట్లు), గ్రామీణాభివృద్ధి (రూ. 8,600 కోట్లు), నీటిపారుదల శాఖ (రూ. 19,700 కోట్లు), పట్టణాభివృద్ధికి రూ.17,000 కోట్లు చెల్లించాల్సి ఉంది. .ప్రభుత్వం హామీ కాంట్రాక్టర్ల ఆగ్రహంపై గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి యోగేష్ కదమ్ స్పందించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి కారణంగా నిధుల పంపిణీ ఆలస్యమైందని, చెల్లింపులు జరగలేదనే ఆరోపణలను తోసిపుచ్చారు. వచ్చే బడ్జెట్ సెషన్లో నిధుల్ని విడుదల చేస్తామన్నారు. విడతల వారీగా పెండింగ్ బిల్లులను క్లియర్ చేసేందుకు ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోందని పబ్లిక్ వర్క్స్ మంత్రి శివేంద్ర రాజే బోస్లే హామీ ఇచ్చారు. -
అలాంటి దుస్తులతో రావొద్దు: ముంబై సిద్ధివినాయక ఆలయ ట్రస్ట్
ఇటీవలి కాలంలో ఫ్యాషన్ పేరుతో రకరకాల దుస్తులు మార్కెట్లోకి వస్తున్నాయి. వీటిని యువత ధరిస్తున్నారు. అయితే సంప్రదాయవాదులు ఇటువంటి దుస్తులను వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా ఆలయాల్లోకి ఇటువంటి దుస్తులు ధరించి రావడం తగినది కాదని వారంటున్నారు. ఈ నేపధ్యంలో ముంబైలోని ప్రసిద్ధ సిద్ధివినాయక ఆలయంలో డ్రెస్ కోడ్‌ను అమలు చేయబోతున్నది.ముంబైలోని సిద్ధివినాయక ఆలయంలో వచ్చే వారం నుండి డ్రెస్ కోడ్ అమలుకానుంది. పొట్టి స్కర్టులు లేదా శరీరాన్ని బహిర్గతం చేసే దుస్తులు ధరించి, ఆలయానికి ఎవరైనా రావడాన్ని నిషేధిస్తున్నట్లు ఆలయ కమిటీ ప్రకటించింది. శ్రీ సిద్ధివినాయక గణపతి ఆలయ ట్రస్ట్ (ఎస్ఎస్జీటీటీ) ఆలయానికి వచ్చేవారి కోసం డ్రెస్ కోడ్‌ను ప్రకటించింది. భక్తులు తప్పనిసరిగా శరీరాన్ని కప్పి ఉంచే దుస్తులను ధరించాలని ఎస్ఎస్జీటీటీ తెలిపింది. భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించాలని పేర్కొంది.ఇకపై చిరిగినట్లు కనిపించే ప్యాంట్లు, పొట్టి స్కర్టులు లేదా శరీర భాగాలు కనిపించే దుస్తులు ధరించిన భక్తులను ఆలయంలోనికి అనుమతించబోమని ట్రస్ట్ పేర్కొంది. ఆలయంలో పూజల సమయంలో క్రమశిక్షణ లేకపోవడం, కొందరు అభ్యంతరకరమైన దుస్తులు ధరించి రావడంపై పలువురు భక్తులు ఆందోళన వ్యక్తం చేశారని ట్రస్ట్ పేర్కొంది. ఆలయ పవిత్రతను కాపాడటానికే డ్రెస్ కోడ్‌ను అమలు చేయాలని నిర్ణయించినట్లు ఆలయ ట్రస్ట్ పేర్కొంది.ఇది కూడా చదవండి: ఆ లోపాలే తొక్కిసలాటకు కారణం: మల్లికార్జున ఖర్గే -
కాళ్ల నుంచి మెడ దాకా.. నరకం!
గులియన్ బ్యారీ సిండ్రోమ్(Guillain Barre Syndrome) (జీబీఎస్).. మహారాష్ట్రలోని పుణేలో తాజాగా కలకలం సృష్టిస్తున్న వ్యాధి. దీని బారినపడి 110 మంది ఆస్పత్రులపాలయ్యారని.. మహారాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ఒకరు ఈ వ్యాధితో మరణించారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఏదైనా వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకాక పోస్ట్ వైరల్ లేదా పోస్ట్ బ్యాక్టీరియల్ వ్యాధిగా కనిపించే ఈ సమస్య కాళ్లు చచ్చుబడిపోవడంతో ప్రారంభమవుతుంది. చిత్రంగా బాధితుల వైటల్స్... అంటే నాడి, రక్తపోటు వంటివన్నీ సాధారణంగానే ఉంటాయి. కానీ కాళ్ల దగ్గర్నుంచి క్రమంగా పైవైపునకు శరీరం అచేతనమవుతూ వస్తుంది. అలా ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తే శ్వాస తీసుకోలేక బాధితులు మృతిచెందే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ వ్యాధి లక్షణాలు, రోగ నిర్ధారణ, చికిత్స పద్ధతుల గురించి వివరాలివీ..కలుషిత నీటి వాడకంతో మొదలు..గతంలో జీబీఎస్ వ్యాధి చాలా అరుదుగా కనిపించేది. ప్రతి లక్ష మందిలో కేవలం ఒకరిద్దరికే ఈ వ్యాధి వచ్చేది. ఇప్పుడు వందలాది మందిని ప్రభావితం చేస్తోంది. ఇటీవల దీని విస్తృతి పెరిగింది. ఇది ఏ వయసువారిలోనైనా రావచ్చు. అయితే పుణేలో అనేక మంది కలుషితమైన నీటిని వాడటంతో ఈ వ్యాధి ప్రబలినట్లు తేలింది. సాధారణంగా పోస్ట్ వైరల్/బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ వ్యాధి వస్తుంటుంది. అక్కడి నీళ్లలో నోరో వైరస్, క్యాంపైలో బ్యాక్టీరియా ఉందని.. ఆ వైరస్, బ్యాక్టీరియాల ప్రభావంతో వ్యాధినిరోధక శక్తి బాధితుల నరాలపై ఉన్న మైలీన్ పొరను దెబ్బతీయడంతో ఈ ఆటోఇమ్యూన్ వ్యాధి వచ్చినట్లు ప్రాథమిక నివేదికల్లో తేలింది. బాధితులు అచేతనం కావడం ఎందుకంటే... మనిషి ప్రతి అవయవాన్నీ మెదడు నియంత్రిస్తుంటుంది. మెదడు నుంచి దేహంలోని ప్రతి భాగానికీ ఆదేశాలందించే నరాలపై మైలీన్ అనే పొర ఉంటుంది. సొంత వ్యాధినిరోధక వ్యవస్థలోని యాంటీబాడీస్ తమ సొంత మైలీన్ పొరను దెబ్బతీసినప్పుడు మెదడు నుంచి వచ్చే సిగ్నల్స్ అందకపోవడంతో అవయవాలు చచ్చుబడి అచేతనమవుతాయి.ఇవీ లక్షణాలు..⇒ మెదడు నుంచి కాళ్ల వరకు పొడవుగా ఉండే కాలి నరాలు ప్రభావితమై కాళ్లు చచ్చుబడిపోతాయి.⇒ అచేతనం కావడం కింది నుంచి ప్రారంభమై పైకి పాకుతుంది. దాంతో వీపు భాగం, చేతులు, మెడ కండరాలు ఇలా దేహమంతా పూర్తిగా అచేతనమవుతుంది.⇒ గొంతు కండరాలు అచేతనమైతే రోగి మాట్లాడలేడు. మింగడమూ కష్టమవుతుంది. ముఖంలోని కండరాలు అచేతనమైతే కళ్లు కూడా మూయలేడు.⇒ అచేతనమయ్యే ఈ ప్రక్రియ ఛాతీ, కండరాలు, ఊపిరితిత్తులను పనిచేయించే డయాఫ్రమ్ కండరాల వరకు వెళ్లినప్పుడు ఊపిరితీసుకోవడం కష్టమవుతుంది. ఈ జబ్బును పూర్తిగా ప్రమాదకరంగా మార్చే అంశమిదే.వేర్వేరుగా తీవ్రత స్థాయికండరాలు అచేతనం కావడంలోని ఈ తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కొందరిలో స్వల్పంగా ఉంటే మరికొందరిలో తీవ్రత ఎక్కువగా ఉంటుంది. తీవ్రత స్వల్పంగా ఉంటే నడక కష్టమవుతుంది. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే బాధితులు పూర్తిగా మంచానికే పరిమితమవుతారు. చాలా మందిలో తమ ప్రమేయం లేకుండా జరిగిపోయే కీలకమైన జీవక్రియలు చాలా అరుదుగా మాత్రమే ప్రభావితమవుతాయి. కొందరిలో అవి కూడా ప్రభావితమైనప్పుడు గుండె స్పందనలు వేగంగా లేదా మెల్లగా మారడం, బీపీ హెచ్చుతగ్గులకు గురికావడం, ముఖం నుంచి వేడి ఆవిర్లు వస్తున్నట్లు అనిపించడం, బాగా చెమటలు పట్టడం జరగవచ్చు.ఎప్పుడు ప్రమాదకరమంటే...వ్యాధి మొదలయ్యాక క్రమంగా 7 నుంచి 14 రోజులపాటు తీవ్రం కావచ్చు. మైలీన్ పొర మళ్లీ యథాస్థితికి వస్తే బాధితుడు క్రమంగా కోలుకో వడం మొదలవుతుంది. ఇలా కోలుకోవడమ న్నది రోజుల వ్యవధి నుంచి ఆరు నెలలలోగా జరగవచ్చు. జీబీ సిండ్రోమ్ లక్షణాలే కనిపించే మరికొన్ని జబ్బులు శరీరంలో పొటాషియం లేదా కాల్షియం పాళ్లు తగ్గితే జీబీఎస్‌లో కనిపించే లక్షణాలే కనిపి స్తాయి. అయితే అవి భర్తీ కాగానే అచేతనత్వం తగ్గిపోతుంది. ఇక శరీరంలో అకస్మాత్తుగా క్రియాటినిన్ పాళ్లు పెరిగిపోవడం, డిఫ్తీరియా, హెచ్ఐవీ, లింఫోమా వంటి జబ్బుల్లోనూ జీబీ సిండ్రోమ్‌లోని లక్షణాలే కనిపిస్తాయి.నిర్ధారణ ఇలా..గులియన్ బ్యారీ సిండ్రోమ్ వంటి లక్షణాలతోనే మరికొన్ని ఇతర సమస్యలు వ్యక్తం కావడంతోపాటు పొటాషియం, కాల్షియం వంటి ఖనిజ లవణాలు తగ్గడం లేదా పెరగడం వల్ల కూడా ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయి. కాబట్టి జీబీ సిండ్రోమ్ నిర్థారణ చాలా స్పష్టంగా జరగాలి. అందుకే రోగుల్లో తొలుత సాధారణ రక్తపరీక్ష చేసి అందులో పొటాషియం, కాల్షియం పాళ్లను, క్రియాటినిన్ మోతాదులను పరిశీలిస్తారు. అవన్నీ సక్రమంగా ఉన్నప్పుడు నర్వ్ కండక్షన్ పరీక్షల ద్వారా జీబీ సిండ్రోమ్‌ను నిర్ధారణ చేస్తారు. అయితే ఈ పరీక్షతో వ్యాధి తీవ్రత తెలియదు. కొన్నిసార్లు వెన్ను నుంచి నీరు తీసే ‘సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్’(సీఎస్ఎఫ్) పరీక్ష కూడా అవసరం కావచ్చు.చికిత్స..ఈ జబ్బులో రోగి తన రోజువారీ పనులను సొంతంగా చేసుకోలేని పరిస్థితికి చేరుకుంటే ఈ కింది చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఇమ్యూనోగ్లోబ్యులిన్ చికిత్స: శరీర బరువు ఆధారంగా వారికి తగిన మోతాదులో 5 రోజులపాటు ఇమ్యూనోగ్లోబ్యులిన్ ఇంజెక్షన్లను ఇవ్వడమన్నది ఒక చికిత్స ప్రక్రియ. ఇవి దేహంలో మైలీన్ షీత్‌ను ధ్వంసం చేసే యాంటీబాడీస్‌ను బ్లాక్ చేయడం ద్వారా పరిస్థితిని చక్కదిద్దుతాయి. ప్లాస్మా ఎక్సే్చంజ్ చికిత్స: ఈ చికిత్స ప్రక్రియలో శరీరం బరువునుబట్టి ప్రతి కిలోగ్రాముకూ 250 ఎంఎల్ ప్లాస్మాను రక్తం నుంచి తొలగిస్తారు. అందులో ఐదు విడతలుగా రోజు విడిచి రోజు రక్తంలోని ప్లాస్మాను తీసేయడం ద్వారా ప్లాస్మాలోని యాంటీబాడీస్‌ను తొలగించడం జరుగుతుంది. ఈ రెండు చికిత్సల్లో ఇమ్యూనోగ్లోబ్యులిన్ చికిత్స చాలా ఖరీదైనది. దానితో పోలిస్తే ప్లాస్మా ఎక్సే్చంజ్ చికిత్స దాదాపు సగం ఖర్చులోనే అవుతుంది. మరణాలు 5 శాతం లోపే..ఈ వ్యాధి సోకిన వారిలో 70 శాతం మంది పూర్తిగా కోలుకుంటారు. మరో 10 శాతం మందిలో చెప్పుకోదగ్గ పురోగతి ఉండదు. కేవలం 3 శాతం నుంచి 5 శాతం రోగులు మెరుగైన చికిత్స ఇప్పించినప్పటికీ మృతువాత పడే అవకాశాలున్నాయి. యువకులు, టీనేజీ పిల్లలు వేగంగానే కోలుకుంటారు. పైగా దీని ఉనికేలేని తెలుగు రాష్ట్రాల వారిలో ఆందోళన అక్కర్లేదు. కాకపోతే కలుషితమైన నీరు, ఆహారం వాడకపోవడం అన్ని విధాలా మేలని గుర్తించాలి. – ఫ్యామిలీ హెల్త్ డెస్క్ -
శరద్ పవార్‌కు అనారోగ్యం
పుణే: సీనియర్ నేత, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) వ్యవస్థాపకుడు శరద్ పవార్(84) అనారో గ్యం బారినపడ్డారు. తీవ్రమైన దగ్గు కారణంగా మా ట్లాడటం కష్టంగా మారిన నేపథ్యంలో వచ్చే 4 రో జుల్లో ఆయనకున్న కార్యక్రమాలన్నీ రద్దయ్యాయి. ఆరోగ్యం బాగోలేకున్నా ఆయన గురువారం పుణే లోని వసంత్‌దాదా షుగర్ ఇన్స్టిట్యూట్లో ప్రసంగించారు. ఆ సమయంలో తరచూ దగ్గుతూనే 18 నిమిషాల ప్రసంగాన్ని ముగించారు. ‘శరద్ పవార్ జీ ఎడతెగని దగ్గుతో ఇబ్బంది పడుతున్నారు. అందుకే, వచ్చే నాలుగు రోజుల్లో ఆయన పాల్గొనే కార్యక్రమాలన్నీ రద్దయ్యాయి’అని శనివారం ఎన్సీపీ (ఎస్పీ) అధ్యక్షుడు ప్రశాంత్ జగ్తాప్ చెప్పారు. -
పూణేలో కొత్త వైరస్ కలకలం.. 71కి చేరిన కేసులు
పూణే: మహరాష్ట్రలో కొత్త వైరస్ వ్యాప్తి తీవ్ర కలకలం సృష్టించింది. పూణేలో అరుదైన న్యూరోలాజికల్ డిజార్డర్ గులియన్ బారే సిండ్రోమ్ (GBS) కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా మరో ఆరు కేసులు నమోదు కావడంతో బాధితుల సంఖ్య 71కి చేరుకుంది. వీరిలో 14 మందికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. వైరస్ కారణంగా బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ఆరోగ్య శాఖ ర్యాపిడ్ ఫోర్స్ టీమ్‌ను ఏర్పాటుచేసింది.పూణేలో కొత్త వైరస్ వ్యాప్తి అక్కడ ప్రజలకు వణికిస్తోంది. గులియన్ బారే సిండ్రోమ్ (GBS) బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ వైరస్బారినపడిన వారి సంఖ్య తాజాగా 71కి చేరుకుంది. బాధితుల్లో 47 మంది పురుషులు, 24 మంది మహిళలు ఉండగా.. వీరిలో 14 మందికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. వీరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఇక, ఈ వ్యాధి వల్ల శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ నరాలపై దాడి చేస్తుంది. దీంతో, పక్షవాతం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తమైన మహారాష్ట్ర ఆరోగ్యశాఖ ఒక పరిశోధనా టీమ్‌ను ఏర్పాటు చేసింది. అయితే, జీబీఎస్‌కు చికిత్స లేదు. దీని బారినపడిన వ్యక్తులు కోలుకునేందుకు చాలా సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు.జీబీఎస్ అంటే ఏమిటి?గులియన్ బారే సిండ్రోమ్ (GBS) అనేది అరుదైన నాడీ సంబంధిత వ్యాధి. ఇది శరీరంలోని రోగనిరోధక వ్యవస్థపై దాడి చేస్తుంది. దీని కారణంగా నరాల బలహీనత, తిమ్మిరి లేదా పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గులియన్-బారే సిండ్రోమ్ అరుదైనది వ్యాధి. మాయో క్లినిక్ ప్రకారం.. గులియన్-బారే సిండ్రోమ్ లక్షణాలు కనిపించడానికి కనీసం ఆరు వారాల ముందు శ్వాసకోశ సంబంధిత లక్షణాలు కనిపిస్తాయి.లక్షణాలు ఇలా..బాధితులకు మెట్లు ఎక్కడం, నడవడం కష్టమవుతుంది.నరాల బలహీనత, కాళ్లు, చేతులు, ముఖం, శ్వాస కండరాలు బలహీనమవుతాయి.నరాలు దెబ్బతినడం వల్ల మెదడులో అసాధారణ సంకేతాలు వస్తాయి.అసాధారణ హాట్బీట్, రక్తపోటు మార్పులు, జీర్ణక్రియ సమస్యలు, మూత్రాశయ నియంత్రణలో సమస్యలు కూడా ఉంటాయి. -
ఎల్గార్ కేసులో విల్సన్, ధావలెకు బెయిల్
ముంబై: ఎల్గార్ పరిషత్– మావోయిస్టుల లింకు కేసులో పరిశోధకుడు రొనా విల్సన్, ఉద్యమకారుడు సుధీర్ ధావలె దాదాపు ఆరేళ్ల అనంతరం శుక్రవారం జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. వీరిద్దరికీ ఈ నెల 8వ తేదీన బాంబే హైకోర్టు బెయిలిచ్చింది. ‘వీరు 2018 నుంచి జైలు జీవితం గడుపుతున్నారు. వీరిపై ఇప్పటికీ ఆరోపణలను నమోదు చేయలేదు. ఈ కేసులో 300 మంది సాక్ష్యులను విచారించాల్సి ఉందని ఎన్ఐఏ అంటోంది. ఈ దృష్ట్యా కేసు విచారణ కనీస భవిష్యత్తులో ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదు’అని ఈ సందర్భంగా న్యాయస్థానం వ్యాఖ్యానించింది. విల్సన్, ధావలెలు శుక్రవారం ఎన్ఐఏ కోర్టులో బెయిల్‌కు సంబంధించిన లాంఛనాలు పూర్తి చేసి తలోజా జైలు నుంచి విడుదలయ్యారు. 2017 డిసెంబర్ 31వ తేదీన పుణేలో జరిగిన ఎల్గార్ పరిషత్ సమావేశంలో చేసిన రెచ్చగొట్టే ప్రసంగాలే ఆ తర్వాత కోరెగావ్–భీమాలో హింసాత్మక ఘటనలకు దారి తీసినట్లు కేసు నమోదైంది. వీరికి మావోయిస్టులతో సంబంధాలున్నట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఉద్యమకారులు, విద్యావేత్తలు సహా14 మందిని అరెస్ట్ చేశారు. వరవరరావు, సుధా భరద్వాజ్, ఆనంద్ తెల్తుండే, అరుణ్ ఫెరీరా తదితర 8 మంది విడుదలయ్యారు. మహేశ్ రౌత్ పెట్టుకున్న బెయిల్‌కు వ్యతిరేకంగా ఎన్ఐఏ వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉండటంతో ఆయన జైలులోనే ఉన్నారు. స్టాన్ స్వామి అనే క్రైస్తవ ప్రబోధకుడు జైలులోనే 2021లో చనిపోయారు. -
ఆటో డ్రైవర్ కిరాతకం.. మహిళపై అత్యాచారం
ముంబై: ఇరవై ఏళ్ల మహిళపై అత్యంత దారుణంగా అత్యాచారానికి పాల్పడిన ఆటో డ్రైవర్ును ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా నలసోపరా నివాసి అయిన మహిళ మంగళవారం అర్థరాత్రి గోరేగావ్‌లోని రైల్వే స్టేషన్ సమీపంలో కనిపించింది. అయితే ఒక ఆటోను బుక్ చేసుకున్న ఆ మహిళకి ఆటో డ్రైవర్ మాయ మాటలు చెప్పి అర్నాలా బీచ్‌కు తీసుకెళ్లాడు. తొలుత ఒక హోటల్‌కు తీసుకెళ్లదామని ప్లాన్ చేసిన ఆటో ్డ్రైవర్.. ఆ మహిళ వద్ద సరైన గుర్తింపు ాకార్డులు లేకపోవడంతో హోటల్ రూమ్ ఇవ్వలేదు. ాదాంతో అక్కడ్నుంచి ఆ మహిళని నేరుగా బీచ్‌కు తీసుకెళ్లాడు. ఆ మహిళ ఇంటికి సరిగ్గా 12 కి.ీమీ ఉంటుందని పోలీసులు తమ ివిచారణలో వెల్లడైనట్లు పేర్కొన్నారు.ప్రైవేట్ పార్ట్స్ లో సర్జికల్ బ్లేడ్, రాళ్లుఆ ుమహిళపై అత్యాచారానికి పాల్పడిన అనంతరం నిందితుడిగా భావిస్తున్న ఆటో డ్రైవర్.. ఆమె ప్రైవేట్ పార్ట్స్‌లో సర్జికల్ బ్లేడ్ తో పాటు రాళ్లను చొప్పించినట్లు గుర్తించారు. ఈ ఘటన తర్వాత తనకు విపరీతమైన నొప్పి రావడంతో ఆమె స్థానిక పోలీసుల్ని సంప్రదించింది. దాంతో సదరు మహిళని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లగా, సర్జికల్ బ్లేడ్, రాళ్లతో సహా ఇతర వస్తువులను ఆమె ప్రైవేట్ భాగాలలో బలవంతంగా చొప్పించినట్లు వెల్లడైంది. వైద్యులు విజయవంతంగా వస్తువులను తొలగించినట్లు పోలీసులు తెలిపారు. ఆ ఆటో డ్రైవర్ ను శుక్రవారం అదుపులోకి తీసుకుని అత్యాచారం కేసు నమోదు చేశారు.ఆ మహిళపై గతంలో రెండుసార్లు అత్యాచారంఅయితే ఆ మహిళపై గతంలో కూడా అత్యాచారం జరిగిన విషయాన్ని ఆమె తండ్రి తమకు చెప్పినట్లు ోపోలీసులు పేర్కొన్నారు. 2023లో ముంబై నిర్మలా నగర్ శివాజీ నగర్లో ఆమె అత్యాచారానికి గురైన విషయాన్ని పోలీసులు తెలిపారు.ఆమె మానసిక పరిస్థితి బాగాలేకనే..!ఆ మహిళ మానసిక పరిస్థితిపై కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమె మానసిక పరిస్థితి బాగా లేకనే ఆమె పలుమార్లు అత్యాచారానికి ుగురై ఉండవచ్చినదే పోలీసుల అనుమానం. -
సైఫ్ పూర్వీకుల రూ.15 వేల కోట్ల ఆస్తుల పరిస్థితేంటి?
భోపాల్: బ్రిటిషర్లకాలంలో ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్ ప్రాంతాల్లో పటౌడీ సంస్థానాన్ని పాలించిన హమీదుల్లాహ్ రాజకుటుంబానికి చెందిన రూ.15,000 కోట్ల విలువైన ఆస్తులు ఎవరి పరం కానున్నాయనే ప్రశ్న తలెత్తింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పూర్వీకులకు చెందిన ఈ ఆస్తులు ఇప్పుడు ఎవరికి చెందుతాయనే అంశం మరోసారి తెరమీదకొచ్చింది. సైఫ్ వాళ్ల నానమ్మ.. పటౌడీ సంస్థానానికి అసలైన వారసురాలని సీనియర్ న్యాయవాది జగదీశ్ ఛవానీ వాదిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ వాదన దీనికి భిన్నంగా ఉంది. ‘‘ స్వాతంత్య్రం వచ్చేనాటికి భోపాల్ కేంద్రంగా పాలిస్తున్న పటౌడీ సంస్థానానికి ముహమ్మద్ హమీదుల్లాహ్ చివరి నవాబ్‌గా ఉన్నారు. ఆయన తదనంతరం ఆయన పెద్దకుమార్తె అబీదా సుల్తాన్ బేగమ్‌కు ఈ ఆస్తులు దక్కుతాయి. అయితే స్వాతంత్య్రం వచ్చాక విభజన సమయంలో ఆమె పాకిస్తాన్‌కు వలసవెళ్లారు. ఈ లెక్కన ఇప్పుడు వారసులు భారత్‌లో లేరు. అందుకే శత్రు ఆస్తుల చట్టం కింద ఆ ఆస్తులన్నీ ఇప్పుడు కేంద్ర హోం శాఖ పరిధిలోని భారత శత్రు ఆస్తుల సంరక్షణ సంస్థ(సీఈపీఐ) పర్యవేక్షణలోకి వస్తాయి’’ అని మోదీ సర్కార్ చెబుతోంది. ప్రభుత్వ వాదనను లాయర్ ఛవానీ కొట్టిపారేశారు. ‘‘ పెద్దకుమార్తె అబీదా పాకిస్తాన్‌కు వెళ్లిన తర్వాత 1960లో హమీదుల్లాహ్ మరణించారు. దాంతో ఆస్తి వారసత్వంగా తనకే వస్తుందని రెండో కుమార్తె సాజిదా సుల్తాన్ బేగమ్ భారత ప్రభుత్వాన్ని కోరారు. అందుకు సమ్మతిస్తూ 1962 జనవరి 10న కేంద్రం ఒక ఉత్తర్వు జారీచేసింది. ఈ లెక్కన సాజిదా అసలైన వారసురాలు. ఆమె నుంచి వారసత్వంగా సాజిదా కుమారుడు మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ(టైగర్ పటౌడీ) ఆయన తదనంతరం సైఫ్ అలీ ఖాన్ ఆ ఆస్తులకు హక్కుదారు అవు తారు’’ అని ఛవానీ వాదించారు. తమ ఆస్తులను శత్రు ఆస్తులుగా లెక్కకట్టొద్దని, మోదీ ప్రభుత్వం తెచ్చిన శత్రు ఆస్తుల(సవరణ, ధృవీకరణ) చట్టాన్ని సవాల్ చేస్తూ టైగర్ పటౌడీ భార్య, అలనాటి బాలీవుడ్ నటి షర్మిలా ఠాకూర్ 2015లో మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై గత ఏడాది డిసెంబర్ 13న జస్టిస్ వివేక్ ఆగ్రావాల్ విచారణ చేపట్టారు. సైఫ్ తల్లి షర్మిలా వేసిన పిటిషన్‌ను ప్రభుత్వ న్యాయవాది తప్పుబట్టారు. ఇప్పుడు శత్రు ఆస్తుల చట్టం,1968 లేదు. దాని స్థానంలో 2017లో కొత్త చట్టమొచ్చింది. ఏమైనా ఫిర్యాదులుంటే సంబంధిత అప్పీలేట్ అథారిటీ ముందు గోడు వెళ్లబోసుకోండి’’ అని సూచించారు. దీనిపై జడ్జీ స్పందిస్తూ.. ‘‘ వాస్తవాలను పరిగణించాక సైఫ్ కుటుంబం ముంబైలోని సీఈపీఐ ఆఫీస్‌లో అప్పీల్ చేసుకునేందుకు 30 రోజుల గడువు ఇస్తున్నాం’’ అని జడ్జి వ్యాఖ్యానించారు. ఆరోజు జడ్జి ఇచ్చిన గడువు ఇప్పడు ముగిసిపోయింది. గడువులోపు సైఫ్ కుటుంబం ముంబై సీఈపీఐ ఆఫీస్‌లో అప్పీల్ చేయలేదు. జనవరి 16వ తేదీన కత్తిపొట్లకు గురై ఆస్పత్రి పాలైన సైఫ్ బాగోగులు చూడటంలోనే వాళ్ల కుటుంబానికి ఉన్న పుణ్యకాలం గడిచిపోయింది. ఇప్పుడు వాళ్లకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుందా? లేదా అనేదే అసలు ప్రశ్న. ‘‘ దాడి జరిగిందన్న కారణం చూపి హైకోర్టు గడువు పొడిగించాలని కోరతాం’’ అని న్యాయవాది చెప్పారు. -
సైఫ్‌పై నిజంగానే దాడి జరిగిందా? యాక్టింగా?
నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో మహారాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. చివరకు నిందితుడు పట్టుబడడంతో ప్రతిపక్షాల విమర్శలకు పుల్‌స్టాప్ పడింది. అయితే ఈ ఘటనపై తాజాగా మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణే సంచలన వ్యాఖ్యలు చేశారు.ఘటన జరిగాక ఐదు రోజులకు నటుడు సైఫ్ ముంబై లీలావతి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అయితే ఈ పరిణామం ఆధారంగా నితేష్ రాణే తన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే దాడి జరిగిందా? లేక ఆయన నటించారా? అని ప్రశ్నించారాయన. పనిలో పనిగా ప్రతిపక్షాలను ఆయన తిట్టిపోశారు.పుణేలో జరిగిన ఓ ఈవెంట్లో రాణే మాట్లాడుతూ.. ఆస్పత్రి నుంచి ఆయన బయటకు వచ్చేటప్పుడు చూశా. ఆయన్ని నిజంగానే పొడిచారా? లేకుంటే నటిస్తున్నారా? అనే అనుమానం కలిగింది నాకు అని అన్నారు. అలాగే ఈ విషయంలో ప్రతిపక్షాలు చేసిన రాద్ధాంతం కూడా నాకు అలాగే అనిపించింది. కేవలం ఖాన్ కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే వాళ్లు స్పందిస్తారా?.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై స్పందించరా? అని ప్రశ్నించారాయన.సుప్రియా సూలే.. సైఫ్ అలీ ఖాన్ గురించి ఆందోళన వ్యక్తం చేశారు. షారూక్ కొడుకు గురించి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ గురించి బాధపడ్డారు. కానీ, ఓ హిందూ నటుడి కష్టాల గురించి ఆమె ఏనాడైనా ఆలోచించారా?. అన్నారు.గతంలో బంగ్లాదేశీయులు ముంబై ఎయిర్‌పోర్టు వరకే పరిమితమయ్యారు. ఇప్పుడు ఏకంగా ఇళ్లలో చొరబడుతున్నారు. బహుశా వాళ్లు ఆయన్ని(సైఫ్)ను తీసుకెళ్లడానికే వచ్చి ఉంటారేమో! అని రాణే సెటైర్ వేశారు.మహా మాజీ ముఖ్యమంత్రి నారాయణ రాణే తనయుడే ఈ నితీశ్ నారాయణ రాణే. శివసేనతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి.. కాంగ్రెస్, ఆపై బీజేపీలో చేరారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కనకవల్లి నియోజకవర్గం నుంచి గెలుపొంది హ్యాటట్రిక్ ఎమ్మెల్యే ఘనత అందుకున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు.నితీశ్ నారాయణ రాణేకు వివాదాలూ కొత్తేం కాదు. 2009లో మరాఠీ చిత్రం ‘జెండా’లో తన తండ్రి నారాయణ రాణే పాత్రను అభ్యంతరకంగా చూపించారంటూ నిరసనలకు దిగి తొలిసారి ఆయన మీడియాకు ఎక్కారు. ఆపై ఓ చిరువ్యాపారిపై హత్యాయత్నం చేశారనే కేసు నమోదు అయ్యింది. 2013లో ముంబైని గుజరాతీలు విడిచివెళ్లిపోవాలంటూ మోదీకి వ్యతిరేకంగా ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది. అదే ఏడాదిలో గోవాలో ఓ టోల్‌బూత్‌ను ధ్వంసం చేసిన కేసులో అరెస్టయ్యారు. 2017లో ఓ ప్రభుత్వ అధికారిపైకి చేపను విసిరిన కేసులో, 2019లో ఓ అధికారిపై దాడి చేసిన కేసులో అరెస్టై జైలుకు కూడా వెళ్లారు. తాజాగా.. కిందటి నెలలో కశ్మీర్‌ను మినీ పాకిస్థాన్‌గా అభివర్ణించి విమర్శలు ఎదుర్కొన్నారు. ఆపై కేరళ అంటే అందరికీ ఇష్టమేనంటూ మాట మార్చారు. -
ఈడీకి రూ. లక్ష ఫైన్
ముంబై: బాంబే హైకోర్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక వ్యక్తిపై అనవసరంగా మనీలాండరింగ్ కేసును చేపట్టినందుకు ఈడీని మందలించింది. ఈ కేసులో హైకోర్టు ఈడీకి లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది.ఎటువంటి బలమైన కారణం లేకుండా రియల్ ఎస్టేట్ డెవలపర్‌పై మనీలాండరింగ్ దర్యాప్తు చేపట్టిన నేపధ్యంలో బాంబే హైకోర్టు ఈడీకి జరిమానా విధించింది. ఈ సందర్భంగా కేంద్ర సంస్థలు చట్ట పరిధిలో పనిచేయాలని హైకోర్టు పేర్కొంది. పౌరులు అనవసరంగా వేధింపులకు గురికాకుండా ఉండేందుకు చట్ట అమలు సంస్థలకు సందేశం పంపాల్సిన అవసరం ఉందని జస్టిస్ మిలింద్ జాదవ్‌తో కూడిన సింగిల్ బెంచ్ పేర్కొంది.వివరాల్లోకి వెళితే రాకేష్ జైన్ అనే రియల్ ఎస్టేట్ డెవలపర్(Real estate developer)పై నిబంధనల ఉల్లంఘన, మోసం ఆరోపణలపై ఒక ఆస్తి కొనుగోలుదారు కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదు విలే పార్లే పోలీస్ స్టేషన్లో నమోదైంది. దీని ఆధారంగా రాకేష్ జైన్‌పై మనీలాండరింగ్ కేసును నమోదు చేసి, ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఈ కేసు ఆగస్టు 2014 నాటిది. ఈడీ దాఖలు చేసిన ప్రాసిక్యూషన్‌పై ప్రత్యేక కోర్టు 2014 ఆగస్టులో నోటీసు జారీ చేసింది. తాజాగా మంగళవారం (జనవరి 21) ఈ కేసులో రాకేష్ జైన్‌పై ప్రత్యేక కోర్టు జారీ చేసిన నోటీసును హైకోర్టు రద్దు చేసింది.జస్టిస్ జాదవ్ మాట్లాడుతూ ఇప్పుడు తనముందున్న కేసు.. మనీ లాండరింగ్ నిరోధక చట్టం(Anti-Money Laundering Act) అమలు ముసుగులో వేధింపులకు సంబంధించిన కేసుగా కనిపిస్తోందన్నారు. ఈ కేసులో ఫిర్యాదుదారునితో పాటు ఈడీ కూడా దురుద్దేశంతో చర్యలు చేపట్టిందని స్పష్టంగా తెలుస్తున్నదన్నారు. ఇందుకు కఠినమైన శిక్ష విధించాలన్నారు. ఈడీ వంటి కేంద్ర సంస్థలు చట్ట పరిధిలోనే వ్యవహరించాలని, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ఇలా పౌరులను వేధించడం తగదని సూచించింది.ఇది కూడా చదవండి: Delhi Elections-2025: 12 ఎస్సీ సీట్లు.. విజయానికి కీలకం -
బద్లాపూర్ కస్టడీ డెత్.. ఆ ఐదుగురే కారణం
ముంబై: మహారాష్ట్రలో సంచలన రేపిన బద్లాపూర్ స్కూల్ లైంగికదాడి ఘటనలో నిందితుడి లాకప్ మరణంపై మేజిస్ట్రేట్ విచారణ పూర్తయింది. నిందితుడు అక్షయ్ షిండే లాకప్ డెత్‌కు ఐదుగురు పోలీసు అధికారులు బాధ్యులని తేలింది. నకిలీ ఎన్కౌంటర్లో పోలీసులే తమ కుమారుడు అక్షయ్‌ను చంపేశారని తండ్రి అన్నా షిండే ఫిర్యాదుపై ముంబై హైకోర్టు జస్టిస్ రేవతి మొహితె డెరె, జస్టిస్ నీలా గోఖలేల ధర్మాసనానికి సోమవారం సీల్డు కవర్లో దర్యాప్తు నివేదికను మేజిస్ట్రేట్ సమర్పించారు. నివేదిక తమకు అందిందని ధర్మాసనం తెలిపింది. థానె క్రైం బ్రాంచి సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ సంజయ్ షిండే, అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ నీలేశ్ మోరె, హెడ్ కానిస్టేబుళ్లు అభిజీత్ మోరె, హరీశ్ తావడెతోపాటు ఒక పోలీస్ డ్రైవర్‌ను కూడా కస్టడీ మరణానికి కారణమని అందులో పేర్కొన్నారని చెప్పింది. దీని ఆధారంగా ఈ ఐదుగురిపై కేసులు నమోదు చేసి, దర్యాప్తు జరపాలని ఆదేశించింది. ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక(ఎఫ్ఎస్ఎల్) నివేదికను బట్టి చూస్తే మృతుడి తండ్రి ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలున్నాయని అభిప్రాయ పడింది. ఈ నివేదిక ప్రతిని అన్నా షిండేకు, ప్రభుత్వానికి అందజేయాలని ధర్మాసనం ఆదేశించింది. అసలు ప్రతి, ఆధారాల పత్రాలు, సాక్ష్యుల వాంగ్మూలాలు తమ వద్దే ఉంటాయని స్పష్టం చేశారు. విచారణ చేపట్టేదెవరో రెండు వారాల్లో తమకు తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. బద్లాపూర్ స్కూల్లో అటెండర్‌గా పనిచేసే అక్షయ్ షిండే(24)స్కూల్ టాయిలెట్లో ఇద్దరు బాలికపై లైంగిక దాడి చేసినట్లు ఆరోపణలు రావడంతో గతేడాది ఆగస్ట్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెప్టెంబర్ 23న అతడు చనిపోయాడు. అక్షయ్ భార్య ఇచ్చిన ఫిర్యాదుపై ప్రశ్నించేందుకు తలోజా జైలు నుంచి తీసుకొస్తుండగా పోలీసుల నుంచి తుపాకీ లాక్కుని కాల్పులు జరిపాడని, ఇన్స్పెక్టర్ సంజయ్ షిండే జరిపిన ఎదురు కాల్పుల్లో అతడు మృతి చెందాడని పోలీసులు ప్రకటించారు. ఆ సమయంలో వీరితోపాటు నీలేశ్ మోరె, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, డ్రైవర్ ఉన్నారు. -
సైఫ్ అలీఖాన్‌పై దాడి.. పారిపోవాలనుకున్నాడు
ముంబై: దొంగతనం కోసం బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఇంట్లో చొరబడి పెనుగులాటలో ఆయనను పొడిచి పారిపోయిన బంగ్లాదేశ్‌కు చెందిన నిందితుడు షరీఫుల్ ఇస్లాం షెహ్జాద్ మొహమ్మద్ రోహిల్లా అమీన్ ఫరీక్ దాడి తర్వాత తన స్వదేశానికి వెళ్లిపోవాలని భావించాడు. పోలీసులు విచారణలో ఇలాంటి పలు అంశాలు తాజాగా వెల్లడయ్యాయి. గత గురువారం దాడిలో గాయపడిన సైఫ్ స్వల్ప శస్త్రచికిత్స తర్వాత కోలుకుంటున్న విషయం తెల్సిందే. విదేశీయులు, పాస్‌పోర్ట్ చట్టాల కింద కేసు నమోదు తాను ఏడు నెలల క్రితం బంగ్లాదేశ్ నుంచి వచ్చినట్లు షరీఫుల్ ఒప్పుకున్నాడు. అతని ఒరిజినల్ బర్త్ సర్టిఫికేట్‌నూ పోలీసులు సంపాదించారు. దాంతో అతని బంగ్లాదేశ్‌లోని ఘలోకతి జిల్లావాసిగా రూఢీఅయింది. అక్రమంగా భారత్‌లో చొరబడ్డ నేరానికి అతనిపై విదేశీయుల చట్టం, పాస్‌పోర్ట్ చట్టం కింద సైతం కేసు నమోదుచేశారు. భారతీయ పాస్‌పోర్ట్ సంపాదించేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. దీంతో ఎలాగైనా డబ్బు బాగా సంపాదించి స్వదేశం వెళ్లిపోవాలని ప్లాన్ వేశాడు. అందుకే ఐదునెలలు ముంబైలో హౌస్‌కీపింగ్ వంటి చిన్నాచితకా పనులు చేసిన అతను వాటిని పక్కనబెట్టి దొంగతనాలకు సిద్ధమయ్యాడు. ఇందులోభాగంగానే సైఫ్ ఇంట్లో చొరబడ్డాడు. అయితే తాను దాడి చేసింది బాలీవుడ్ నటుడిపై అనే విషయం తనకు టీవీల్లో వార్తల్లో చూసేదాకా తెలియదని పోలీసు విచారణలో ఫరీఫుల్ చెప్పాడు. సీసీటీవీ ఫుటేజీలోని తన ఫొటో న్యూస్‌ఛానెళ్లలో ప్రసారం కావడంతో భయపడిపోయాడు. సెలబ్రిటీపై దాడి నేపథ్యంలో పోలీసులు ఎలాగైనా తనను పట్టుకుంటారని భయపడి మళ్లీ బంగ్లాదేశ్‌కు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఈలోపే పోలీసులు పట్టుకోగలిగారు.ఎలా పట్టుకోగలిగారు? వర్లీలో గతంలో తాను పనిచేసిన పబ్ ప్రాంగణంలో జనవరి 16న నిద్రించిన నిందితుడు ఆరాత్రి హఠాత్తుగా మాయమై నేరుగా సైఫ్ ఇంట్లోకి వచ్చి దాడి చేసి తర్వాత బాంద్రా రైల్వేస్టేషన్‌కు వెళ్లాడు. తర్వాత దాదర్‌కు, ఆ తర్వాత వర్లీకి వెళ్లాడు. చివరకు థానే ప్రాంతంలో ఉన్నప్పుడు పోలీసులకు పట్టుబట్టాడు. సైఫ్ ఇంటి సమీప ప్రాంతాల్లోని అన్ని సీసీటీవీ కెమెరాలను చూసినా ఇతను ఏ దిశగా వెళ్లాడనే బలమైన క్లూ పోలీసులకు దొరకలేదు. దీంతో పాత సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా జనవరి 9వ తేదీన అంధేరీ వద్ద బైక్‌పై వెళ్తున్న వీడియోలో ఇతడిని గుర్తించారు. బైక్ యజమానిని ప్రశ్నించగా బైక్‌పై వెళ్లింది తనకు తెల్సిన ఒక నిర్మాణరంగ మేస్త్రీ దగ్గర పనిచేసిన కూలీ అని సమాధానమిచ్చాడు. దీంతో పోలీసులు ఆ మేస్త్రీని విచారించారు. గతంలో చిన్నాచితకా పనుల కోసం వర్లీ ప్రాంతంలోని మేస్త్రీ దగ్గరకు వచ్చి పని ఉంటే చెప్పాలని తన ఫోన్‌నంబర్ ఇచ్చి ఫరీఫుల్ తర్వాత థానె వెళ్లిపోయాడు. ఈ విషయం పోలీసులకు తెల్సి మేస్త్రీని విచారించగా షరీఫుల్ మొబైల్ నంబర్‌ను అందజేశాడు. తాజాగా శనివారం షరీఫుల్ వర్లీ సెంచురీ మిల్ వద్ద బుర్జీపావ్, వాటర్ బాటిల్ కొన్నప్పుడు ఈ నంబర్‌తో చేసిన గూగుల్‌పే లావాదేవీతో ఫోన్ లొకేషన్‌ను పోలీసులు పసిగట్టారు. అయితే అప్పటికే అతను థానెలోని దట్టమైన మడ అడవుల్లోకి పారిపోయాడని తెల్సి వేట మొదలెట్టారు. చిట్టచివరకు ఆదివారం తెల్లవారుజామున హీరానందానీ ఎస్టేట్ దగ్గరి లేబర్క్యాంప్ సమీప అడవిలో పట్టుకోగలిగారు. ఆరోజు ఘటన తర్వాత దొరక్కుండా తప్పించుకునేందుకు షరీఫుల్ వెంటనే దుస్తులు మార్చేశాడు. అయితే వెంట తెచ్చుకున్న బ్యాక్‌ప్యాక్ సైతం ఒకరకంగా ఇతడిని పట్టించింది. ఆ ప్రాంతంలో అదే బ్యాక్‌ప్యాక్ వేసుకున్న, అదే పోలికలున్న వ్యక్తులను విచారించి షరీఫుల్‌ను పోల్చుకోగలిగారు. దాడి రోజున ఏం జరిగిందో తెల్సుకునేందుకు నిందితుడిని సద్గురుశరణ్ బిల్డింగ్‌లోని సైఫ్ ఫ్లాట్‌కు తీసుకెళ్లి పోలీసులు అతనితో సీన్ రీక్రియేషన్ చేయించే వీలుంది. -
అది సైఫ్ అలీఖాన్ ఇల్లు అని తెలీదు: అజిత్ పవార్
ముంబై: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan)పై జరిగిన దాడి ప్రత్యేకంగా టార్గెట్ చేసిన దాడి కాదని స్పష్టం చేశారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్(Ajit Pawar). అతనొక దొంగ అని, కేవలం దొంగతనం కోసమే సైఫ్ ఇంటికి వెళ్లినట్లు పేర్కొన్నారు. ఆ దొంగ బంగ్లాదేశ్‌కు చెందిన వ్యక్తి అని, అతను దొంగతనంలో భాగంగానే ఆ ఇంట్లో చొరబడినట్లు తెలిపారు. అసలు అది సైఫ్ ఇల్లు అనే విషయం ఆ దొంగకు తెలీదన్నారు. కానీ ప్రతిపక్ష పార్టీలు తమ ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ దాడి జరిగిందని వ్యాఖ్యానించడం సరైంది కాదన్నారు. ముంబైలో లా అండ్ ఆర్డర్ విఫలమైందంటూ ప్రత్యర్థి పార్టీలు పదే పదే ఆరోపణలు చేయడం తగదన్నారు.‘అతను బంగ్లాదేశ్ నుంచి ముంబైకి వచ్చాడు. తొలుత కోల్‌కతాకు చేరుకుని ఆ తర్వాత ముంబై(Mumbai)కి వచ్చాడు. దొంగతనం కోసం ఒక ఇంటిని ఎంచుకున్నాడు. అది సైఫ్ అలీఖాన్ ఇల్లు అనే విషయం అతనికి తెలీదు. ఈ ఘటనను అడ్డుపెట్టుకుని మాపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు చేయడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం’ అని అజిత్ పవార్ మండిపడ్డారు.కాగా, సైఫ్ అలీఖాన్‌పై దాడికి పాల్పడింది బంగ్లాదేశీయుడని ముంబై పోలీసులు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. గత అర్ధరాత్రి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే నిందితుడి పేరు విజయ్ దాస్ అని ముందుగా ప్రచారం జరిగింది. దీంతో ఈ ఉదయం మీడియా సమావేశం నిర్వహించిన ముంబై డీసీపీ జోన్ 9 దీక్షిత్ గెడం పూర్తి వివరాలు వెల్లడించారు.నిందితుడి పేరు మహ్మద్ షరీఫుల్ షెహజాద్. విజయ్ దాస్‌గా అందరికీ తన పేరును చెప్పుకుంటున్నాడు. ఆరు నెలల కిందట నకిలీ పత్రాలతో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్‌లోకి చొరబడ్డాడు. నగరంలో మారు పేర్లతో తిరుగుతూ చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాడు. కొన్నాళ్లుగా నగరంలోని ఓ బార్లో వెయిటర్‌గా పని చేస్తున్నాడు. దొంగతనం కోసమే నటుడు సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి చొరబడ్డాడు. ఇందుకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలను స్వాధీనం చేసుకున్నాం.కొన్ని రోజుల పాటు ఓ హౌస్ కీపింగ్ ఏజెన్సీలో పని చేశాడు. ఆ టైంలోనే సైఫ్ ఇంటికి వెళ్లినట్లు అనుమానాలున్నాయి. ప్రస్తుతం ఖర్ పోలీస్ స్టేషన్లో అతని విచారణ జరుగుతోందని తెలిపారాయన. కాగా.. సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి చేసిన నిందితుడిని ముంబై పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. థానే కాసర్వదవల్లి ఎస్టేట్‌లోని మెట్రో నిర్మాణ స్థలంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు.‘‘జనవరి 16వ తేదీ తెల్లవారుజామున 2 గంటలకు సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగ్గా, దానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిందతుడ్ని అరెస్ట్ చేశారు. -
బ్రిటీష్ సింగర్ నోట ‘జై శ్రీరామ్’.. వీడియో వైరల్
బ్రిటిష్ సింగర్ క్రిస్ మార్టిన్ నోట ‘‘జై శ్రీరాం’’ అనే పదం వినిపించింది. ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్న ఆయన శనివారం సాయంత్రం నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో తన బ్యాండ్ ‘కోల్డ్‌ప్లే’ బృందంతో ప్రదర్శన ఇచ్చారు. ఫిక్స్ యూ, ఏ స్కై ఫుల్ ఆఫ్ స్టార్స్‌తో యువతను ఉర్రుతలూగించారు. ఈ క్రమంలో.. ప్రదర్శన ముగించే సమయానికి క్రిస్ మార్టిన్(Chris Martin) అక్కడున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై చూపించిన అభిమానానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి పట్టుకున్న ఫ్లకార్డుపై జై శ్రీరాం అని ఇంగ్లీష్‌లో రాసి ఉంది. అది చూసి ఆయన ‘‘జై శ్రీరామ్’’(Jai Shreeram) అనడంతో స్టేడియం మారుమోగిపోయింది. ఆపై ఆ పదం అర్థం ఏంటని? అక్కడున్నవాళ్లను అడిగి తెలుసుకున్నారు. When Chris Martin said ‘Jai Shri Ram’ at Mumbai concert... the crowd went wild!#ChrisMartin #MumbaiConcert #ColdplayInIndia #JaiShriRam pic.twitter.com/yNeB6FcMOF— India Today NE (@IndiaTodayNE) January 19, 2025బూమ్ బూమ్ బుమ్రా పేరు కూడా.. ప్రదర్శన ఇచ్చే టైంలో ఉన్నట్లుండి మార్టిన్ నోట జస్ప్రీత్ బుమ్రా పేరు ప్రస్తావన కూడా వచ్చింది. ‘‘ఆగండి.. ప్రదర్శన అయిపోలేదు. చివరగా జస్ప్రీత్ బుమ్రా వచ్చి పాల్గొంటాడట’’ అని మార్టిన్ మైకులో చెప్పాడు. దీంతో అభిమానులు బుమ్రా నినాదాలతో హోరెత్తిపోయారు. అయితే అలాంటిదేం అదేం జరగకపోయినా.. క్రిస్ మార్టిన్ నోట బుమ్రా పేరు రావడంతో క్రికెట్ అభిమానులు మాత్రం ఖుషీ అయ్యారు.Coldplay's Mumbai concert on Saturday was unforgettable for music lovers and cricket fans. During the performance, Chris Martin surprised the audience by mentioning India's star bowler, Jasprit Bumrah.#ColdplayMumbai #Coldplay #JaspritBumrah #ChrisMartin #MusicConcert pic.twitter.com/TMz2wscdkm— Mid Day (@mid_day) January 19, 2025ఇదిలా ఉంటే.. హాలీవుడ్ స్టార్ డకోటా జాన్సన్(Dakota Johnson), క్రిస్ మార్టిన్ ప్రియురాలు. ఈ ఇద్దరూ భారత్ సందర్శనకు వచ్చారు. తాజాగా.. ముంబైలోని ప్రసిద్ధ శ్రీ భూల్‌నాథ్ ఆలయాన్ని ఈ జంట దర్శించుకుంది. ఆధ్యాత్మిక సందర్శన కోసం సాంప్రదాయ భారతీయ దుస్తుల్లో కనిపించారు. క్రిస్ బ్లూ కుర్తాలో మెడపై రుద్రాక్ష మాలతో కనిపించాడు. Dakota Johnson telling her wishes in ear of Shri Nandi Maharaj. Amazing how foreign nationals come to India and try following our culture and traditions! #Coldplay #ChrisMartin #DakotaJohnson pic.twitter.com/0Dz19yXg5c— Priyanshi Bhargava (@PriyanshiBharg7) January 18, 2025 ఆలయంలో నంది చెవిలో మార్టిన్ తన మనసులోని కోరికను వినిపించగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతకు ముందు.. మార్టిన్, జాన్సన్‌లు ముంబైలో ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. -
సైఫ్‌పై దాడి.. నిందితుడు బంగ్లాదేశీ: ముంబై పోలీసులు
ముంబై: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడికి పాల్పడింది బంగ్లాదేశీయుడని ముంబై పోలీసులు అధికారికంగా ప్రకటించారు. గత అర్ధరాత్రి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే నిందితుడి పేరు విజయ్ దాస్ అని ముందుగా ప్రచారం జరిగింది. దీంతో ఈ ఉదయం మీడియా సమావేశం నిర్వహించిన ముంబై డీసీపీ జోన్ 9 దీక్షిత్ గెడం పూర్తి వివరాలు వెల్లడించారు. నిందితుడి పేరు మహ్మద్ షరీఫుల్ షెహజాద్. విజయ్ దాస్‌గా అందరికీ తన పేరును చెప్పుకుంటున్నాడు. ఆరు నెలల కిందట నకిలీ పత్రాలతో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్‌లోకి చొరబడ్డాడు. నగరంలో మారు పేర్లతో తిరుగుతూ చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాడు. కొన్నాళ్లుగా నగరంలోని ఓ బార్లో వెయిటర్‌గా పని చేస్తున్నాడు. దొంగతనం కోసమే నటుడు సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి చొరబడ్డాడు. ఇందుకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలను స్వాధీనం చేసుకున్నాం. కొన్ని రోజుల పాటు ఓ హౌస్ కీపింగ్ ఏజెన్సీలో పని చేశాడు. ఆ టైంలోనే సైఫ్ ఇంటికి వెళ్లినట్లు అనుమానాలున్నాయి. ప్రస్తుతం ఖర్ పోలీస్ స్టేషన్లో అతని విచారణ జరుగుతోందని తెలిపారాయన. కాగా.. సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి చేసిన నిందితుడిని ముంబై పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. థానే కాసర్వదవల్లి ఎస్టేట్‌లోని మెట్రో నిర్మాణ స్థలంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు. ‘‘జనవరి 16వ తేదీ తెల్లవారుజామున 2 గంటలకు సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగింది. ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. 30 ఏళ్ల మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ అనే వ్యక్తిని నిందితుడిగా గుర్తించాం. అతడిని నిన్న(శనివారం) అరెస్ట్ చేశాం. దొంగతనం చేయాలనే ఉద్దేశంతో అతడు సైఫ్ నివాసంలోకి వెళ్లాడు. అతడిని న్యాయస్థానం ఎదుట హాజరు పరిచి కస్టడీ కోరుతాం. దీనికి సంబంధించిన తదుపరి విచారణ చేపడతాం. ప్రాథమిక విచారణలో అతడిని బంగ్లాదేశీయుడిగా గుర్తించాం. నిందితుడు అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించాడు. భారత్ వచ్చాక విజయ్ దాస్‌గా పేరు మార్చుకున్నాడు. ఆరు నెలల క్రితం ముంబయి వచ్చాడు. భారతీయుడని చెప్పడానికి అతడి వద్ద సరైన ఆధారాలు లేవు’’ అని తెలిపారు.#WATCH | Saif Ali Khan Attack case | Mumbai: DCP Zone 9 Dixit Gedam says, "There is primary evidence to anticipate that the accused is a Bangladeshi. He does not have valid Indian documents. There are some seizures that indicate that he is a Bangladeshi national...As of now, we… pic.twitter.com/aV22IhKF30— ANI (@ANI) January 19, 2025ఇదిలా ఉంటే.. బాంద్రాలోని సైఫ్ నివాసంలో గురువారం (జనవరి 16) తెల్లవారుజామున 2.30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. సైఫ్, అతడి కుటుంబసభ్యులు నిద్రలో ఉండగా.. దుండగుడు సైఫ్ చిన్న కుమారుడు జేహ్ గదిలోకి వెళ్లాడు. దుండగుడిని చూసిన జేహ్ కేర్‌టేకర్ కేకలు వేయగా సైఫ్ అక్కడికి చేరుకొన్న సమయంలో పెనుగులాట జరిగింది. ఈక్రమంలో సైఫ్ గాయపడ్డారు. ఆరుచోట్ల కత్తి గాయాలయ్యాయి. దీంతో కుటుంబసభ్యులు ఆయన్ని హుటాహుటిన లీలావతి ఆస్పత్రికి తరలించారు. శస్త్రచికిత్స అనంతరం ఆయన క్షేమంగా ఉన్నారని వైద్యులు ప్రకటన విడుదల చేశారు. ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి మార్చారు. ప్రస్తుతం సైఫ్ లీలావతి ఆస్పత్రిలోనే ఉన్నారు. దాడి ఘటనపై కేసు నమోదు చేసుకున్న ముంబయి పోలీసులు దాదాపు 20 బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపులు చేపట్టారు. దాదాపు మూడు రోజుల తర్వాత అతడిని అరెస్ట్ చేశారు. -
సైఫ్‌పై దాడి ఘటన.. అనుమానితుడి అరెస్ట్
దుర్గ్: నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించి ఆయనపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన దర్యాప్తులో కీలక పరిణామం సంభవించింది. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ రైల్వే స్టేషన్‌లోని ఓ రైలులో ఉన్న అనుమానితుడిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబైలోని లోకమాన్య తిలక్ టెరి్మనస్(ఎలీ్టటీ)నుంచి కోల్‌కతా వెళ్లే జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న అతడిని ఆకాశ్ కైలాశ్ కనోజియా(31)గా గుర్తించారు. సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో అనుమానితుడొకరు జ్ఞానేశ్వరి ట్రెయిన్లో ఉన్నట్లు ముంబై పోలీసులు శనివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో దుర్గ్ రైల్వే పోలీసులను అలెర్ట్ చేశారు. అనుమానితుడి సెల్ ఫోన్ లొకేషన్‌తోపాటు అతడి ఫొటోను షేర్ చేశారు. వెంటనే స్పందించిన దుర్గ్ పోలీసులు ముందుగానే అతడిని పట్టుకునేందుకు రాజ్‌నంద్‌గావ్ స్టేషన్ పోలీసులను అప్రమత్తం చేశారు. అయితే, రాజ్‌నంద్‌గావ్‌లో ఆగిన సమయంలో అక్కడి పోలీసులు అనుమానితుడిని గుర్తించలేకపోయారు. దీంతో, ఆ రైలు చేరుకునే సమయానికి దుర్గ్ రైల్వే స్టేషన్లో రెండు బృందాలను సిద్ధం చేశారు. మొదటి జనరల్ బోగీలో ఉన్న ఆకాశ్‌ను వెంటనే గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. అతడి ఫొటోను ముంబై పోలీసులకు పంపి నిర్థారణ చేసుకున్నారు. గురువారం తెల్లవారు జామున సైఫ్‌పై కత్తితో దాడి చేసిన అనంతరం భవనంమెట్ల మార్గం గుండా దిగుతున్న నిందితుడి ముఖం సీసీ ఫుటేజీలో స్పష్టంగా రికార్డవడం తెలిసిందే. ముంబై పోలీసులు విమానంలో రాయ్‌పూర్ వెళ్లి ఆకాశ్ కైలాశ్‌ను కస్టడీకి తీసుకుంటారని అధికారులు తెలిపారు. -
Saif Ali Khan: హైప్రొఫైల్ కేసులో ఇంత అలసత్వమా?
ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో ముంబై పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఘటన జరిగి రెండ్రోజులు గడిచినప్పటికీ.. ఇప్పటికీ నిందితుడి ఆచూకీ కనిపెట్టలేకపోయారు. మరోవైపు.. నిందితుడు మాత్రం పక్కాగా తప్పించుకుంటూ తిరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. సైఫ్ అలీఖాన్(Saif Ali Khan)పై దాడి కేసులో ముంబై పోలీసుల(Mumbai Police)పై ఇటు సినీవర్గాల, అటు రాజకీయ వర్గాల నుంచి విపరీతమైన ఒత్తిడి నెలకొంది. ఘటన జరిగి 50 గంటలు దాటిపోయినా.. నిందితుడిని, అతనితో సంబంధం ఉన్నవాళ్లెవరినీ పోలీసులు ట్రేస్ చేయలేకపోయారు. సెలబ్రిటీల విషయంలోనే ఇలా ఉంటే.. మా పరిస్థితి ఏంటని? సాధారణ ప్రజలు సైతం ప్రశ్నిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు సోషల్‌మీడియాలో ముంబై పోలీసులపై విమర్శలు వెల్లువెత్తుతుండగా.. మరోవైపు నిందితుడు తప్పించుకుంటున్న తీరూ పోలీసులను మరింత ఇబ్బందికి గురి చేస్తోంది.తాజాగా సైఫ్‌పై దాడి చేసిన దుండగుడి(Saif Attacker)కి సంబంధించిన మరో ఫొటో బయటకు వచ్చింది. దాడి జరిగిన రోజు.. తల కవర్ అయ్యేలా బ్లాక్ టీ షర్ట్ వేసుకున్నట్లుగా ఫొటోలను తొలుత మీడియాకు పోలీసులు విడుదల చేశారు. ఆపై కొన్నిగంటల వ్యవధిలో విడుదల చేసిన ఫుటేజీలో బ్లూ షర్ట్ కనిపించింది. ఇప్పుడు తాజాగా రిలీజ్చేసిన ఫొటోల్లో పసుపు రంగు దుస్తుల్లో కనిపించాడు. బాంద్రా రైల్వే స్టేషన్ సమీపంలోని దొరికిన సీసీటీవీ ఫుటేజీ దృశ్యాలుగా తెలుస్తోంది. దీంతో.. అక్కడ రైలెక్కి నగరంలోని మరో చోటుకి నిందితుడు పారిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు ఘటన జరిగిన కొన్ని గంటలకు ఓ దుకాణానికి వెళ్లి హెడ్‌ఫోన్స్ కొన్న వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది.Mumbai, Maharashtra: Officers from the Crime Branch visited the Kabutarkhana area in Dadar and collected CCTV footage from a mobile shop named "Iqra" from where he purchased headphones after attacking actor Saif Ali Khan pic.twitter.com/ILxBjsD7eZ— IANS (@ians_india) January 18, 2025ఈ క్రమంలో ముంబైలోని అన్ని రైల్వే స్టేషన్ల వెంట సీసీకెమెరాలను జల్లెడ పడుతున్నారు. ప్రస్తుతానికి నిందితుడి కోసం గాలింపు చేపడుతున్న బృందాల సంఖ్యను 35కి పెంచారు.ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం.. దుండగుడ్ని తొలిగా చూసింది సైఫ్ ఇంట పని చేసేవాళ్లు. దీంతో బాంద్రా పోలీసులు వాళ్ల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. నిందితుడి గురించి ఆనవాళ్లను వాళ్ల నుంచి సేకరించారు. సుమారు 35-40 ఏళ్ల మధ్య వయసు ఉండొచ్చని, ఐదున్నర అడుగుల ఎత్తు, ఛామనఛాయ రంగు ఉన్నట్లు వెల్లడించారు. ఇక.. దాడిపై సైఫ్ భార్య కరీనా కపూర్(Kareena Kapoor)తో పాటు ఇతర కుటుంబ సభ్యుల నుంచి కూడా పోలీసులు వాంగ్మూలం సేకరించారు. అది అరెస్ట్ కాదు!సైఫ్‌పై దాడి ఘటన కేసులో ముంబై పోలీసులు ఇప్పటికే వందకుపైగా మందిని విచారించారు. క్రిమినల్ రికార్డులు ఉన్న మరికొందరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఓ కార్పెంటర్‌ను పోలీసులు విచారణ కోసం తీసుకొచ్చారు. అయితే సైఫ్ కేసులో నిందితుడు అరెస్ట్ అయ్యాడంటూ.. మీడియా హడావిడి చేసింది. అయితే అతను కేవలం అనుమానితుడు మాత్రమేనని, కేవలం విచారణ జరిపి వదిలేశామని, ఈ కేసులో ఇంతదాకా ఎలాంటి అరెస్ట్ చేయలేదని, అలాంటిది ఏమైనా ఉంటే తామే స్వయంగా ప్రకటిస్తామని ముంబై పోలీసులు స్పష్టత ఇచ్చారు. మరోవైపు ఈ కేసులో వస్తున్న విమర్శలను సీఎం దేవంద్ర ఫడ్నవీస్ ఖండించారు. పోలీసులు అన్నికోణాల్లో.. అన్నివిధాలుగా దర్యాప్తు చేస్తున్నారని, త్వరలోనే నిందితుడిని పట్టుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.FIR ప్రకారం..ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్(54)పై బుధవారం అర్ధరాత్రి దాటాక 2గం.30ని. ప్రాంతంలో ఆయన నివాసంలోనే దాడి జరిగింది. ఈ ఘటనపై ఆయన కుటుంబం బాంద్రా పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. ఎఫ్ఆర్లో వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.దుండగుడు ఆ రాత్రి సైఫ్ చిన్నకొడుకు జెహ్ గదిలోకి ప్రవేశించాడు. వెంటనే.. ఆ చిన్నారి సహాయకురాలు సాయం కోసం కేకలు వేసింది. ఆ అరుపులతో గదిలోకి వచ్చిన సైఫ్‌కి దుండగుడికి మధ్య పెనుగులాట జరిగింది. ఈ క్రమంలో తన దగ్గర ఉన్న పదునైన కత్తితో సైఫ్‌ను ఆరుసార్లు పొడిచాడు. ఆ వెంటనే మరో ఇద్దరు సహాయకులపైనా దుండగుడు హాక్సా బ్లేడ్‌తో దాడి చేసి పారిపోయాడు.రక్తస్రావం అయిన సైఫ్‌ను తనయుడు ఇబ్రహీం, ఇతర కుటుంబ సభ్యులు ఓ ఆటోను పిలిపించి.. లీలావతి ఆస్పత్రికి తరలించారు. అర్ధరాత్రి 3గం. టైంలో సైఫ్‌ను ఆస్పత్రిలో చేర్పించారు. వెన్నెముకకు దగ్గరగా కత్తి ముక్క దిగడంతో సర్జరీ చేసి దానిని తొలగించారు. ఆయనకు ప్రాణాపాయం తప్పిందని వైద్యులు ప్రకటించారు.ఇదీ చదవండి: ముంబైలో దాడులకు గురైన సెలబ్రిటీలు వీళ్లే! -
దుండగుడి కోసం వేట
ముంబై: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై దాడికి పాల్పడిన దుండగుడిని పట్టుకునేందుకు ముంబై పోలీసులు వేట ముమ్మరం చేశారు. ప్రత్యేకంగా 35 పోలీసు బృందాలు ఆగంతకుడి కోసం గాలిస్తున్నాయి. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుగుతోందని, ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని ఉన్నతాధికారులు తెలిపారు. దర్యాప్తుపై హోం శాఖ బాధ్యతలు కూడా చూస్తున్న సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మీడియాతో మాట్లాడారు. ‘పోలీసుల దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. ఇప్పటికే చాలా ఆధారాలు లభించాయి. దుండగుడిని త్వరలో వారు పట్టుకుంటారు’అని తెలిపారు. ఇందుకు సంబంధించి వారిస్ అలీ సల్మానీ అనే ఓ కార్పెంటర్‌ను ప్రశ్నిస్తున్నట్లు అంతకుముందు ముంబై పోలీసులు ప్రకటించారు. ఘటనకు ముందు రెండు రోజులపాటు అతడు సైఫ్ ఫ్లాట్‌లోనే పనులు చేశాడన్నారు. విచారణ అనంతరం అతడికి దాడితో సంబంధం లేదని తేలడంతో వదిలేశామన్నారు. ఆగంతకుడికి ఎలాంటి నేర ముఠాలతోనూ సంబంధం లేదని అందిన ఆధారాలను బట్టి తెలుస్తోందని పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీని బట్టి అతడు 1.37 గంటల సమయంలో మెట్ల ద్వారా ఇంట్లోకి చేరుకున్నట్లు వెల్లడైందన్నారు. అతడుదొంగతనానికి వెళ్లింది సైఫ్ ఇంట్లోకి అనే విషయం కూడా అతడికి తెలిసుండకపోవచ్చని చెప్పారు. కాగా, సైఫ్‌పై దాడి ఘటనతో అండర్ వరల్డ్ గ్యాంగ్‌లకు సంబంధం లేదని మహారాష్ట్ర హోం శాఖ ఉప మంత్రి యోగేశ్ కదమ్ స్పష్టం చేశారు. బెదిరింపులు వచ్చినట్లుగా సైఫ్ అలీ ఖాన్ సైతం ఎన్నడూ పోలీసులకు చెప్పలేదని, భద్రత కల్పించాలని కోరలేదని కూడా మంత్రి తెలిపారు. ఆయన అడిగితే భద్రత నిబంధనల మేరకు కలి్పంచి ఉండేవారమన్నారు. దాడి ఘటనకు చోరీ యత్నం మాత్రమే కారణమని వివరించారు. ఇలా ఉండగా, సైఫ్ ఇంట్లో చోరీకి యతి్నంచిన దుండగుడే ఈ నెల 14వ తేదీన బాలీవుడ్ మరో స్టార్ నటుడు షారుఖ్ ఖాన్ నివాసం వద్ద రెక్కీ కూడా నిర్వహించినట్లు ముంబై పోలీసులు అనుమానిస్తున్నారు. సైఫ్ కోలుకుంటున్నారు: ఆస్పత్రి వర్గాలు తీవ్ర కత్తి పోట్లకు గురైన సైఫ్ అలీ ఖాన్ కోలుకుంటున్నారని లీలావతి ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. శుక్రవారం ఆయన కొద్దిసేపు నడిచారని, వెన్నెముకకు తీవ్ర గాయమైనందున బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించామని పేర్కొంది. ఆయనకు ఎలాంటి సమస్యా లేకుంటే మూడు రోజుల్లో డిశ్చార్జి చేస్తామని న్యూరో సర్జన్ డాక్టర్ నితిన్ డాంగే చెప్పారు. ‘ఓ వైపు రక్తమోడుతూనే ఆయన ఆస్పత్రి లోపలికి సింహంలా నడుచుకుంటూ వచ్చారు. పక్కన కుమారుడు ఆరేడేళ్ల తైమూర్ మాత్రమే ఉన్నాడు’’ అంటూ గురువారం వేకువజామున సైఫ్ చూపిన గుండెనిబ్బరాన్ని మెచ్చుకున్నారు డాక్టర్ డాంగే. నేను, సైఫ్ అలీ ఖాన్.. గురువారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో రక్తంతో తడిచిన కుర్తాతో తాను తీసుకెళ్లిన వ్యక్తి నటుడు సైఫ్ అలీ ఖాన్ అనే విషయం లీలావతి ఆస్పత్రికి వెళ్లేదాకా తనకు తెలియదని ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రాణా చెప్పారు. ఆస్పత్రి గేటు వద్దకు వెళ్లాక అక్కడి గార్డుతో.. స్ట్రెచర్ తీసుకురా, నేను..సైఫ్ అలీ ఖాన్‌ను అని ఆయన చెప్పాకనే ఆ విషయం తెలిసిందని రాణా శుక్రవారం ముంబైలో మీడియాకు తెలిపారు. ‘సైఫ్ ఉంటున్న సద్గురు శరణ్ అపార్టుమెంట్ సమీపం నుంచి వెళ్తుండగా ఒక మహిళ, మరికొందరు తన ఆటోను ఆపారు. అనంతరం రక్తంతో తడిచిన కుర్తాతో ఓ వ్యక్తి ఆటోలో కూర్చున్నారు. ఆయనతోపాటు 8 ఏళ్ల బాలుడు, ఓ యువకుడు, మహిళ కూర్చున్నారు. మొదట వాళ్లు హోలీ ఫ్యామిలీ ఆస్పత్రికి వెళ్లాలనుకున్నారు. కానీ, సైఫ్ లీలావతి ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. దీంతో, అక్కడికే ఆటోను పోనిచ్చాను. అక్కడికెళ్లాక సైఫ్ ఆస్పత్రి గేట్ వద్ద గార్డును పిలిచారు. దయచేసి స్ట్రెచర్ తీసుకురా..నేను, సైఫ్ అలీ ఖాన్ అని అన్నారు. అప్పుడు సమయం దాదాపు మూడైంది. ఏడెనిమిది నిమిషాల్లో అక్కడికి చేరుకున్నాం’అని రాణా వివరించారు. అప్పటి దాకా ఆయన సైఫ్ అలీ ఖాన్ అనే సంగతి గమనించలేదని చెప్పారు. -
నిలకడగా సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యం
ముంబై: బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రముఖ నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత సైఫ్ అలీ ఖాన్(54)పై గుర్తుతెలియని దుండగుడు కత్తితో దాడికి దిగాడు. ఈ ఘటనలో నటుడికి తీవ్రగాయాలయ్యాయి. మహారాష్ట్ర రాజధాని ముంబైలో సంపన్నులు నివాసం ఉండే బాంద్రా వెస్ట్ ప్రాంతంలో ఉన్న సద్గురు శరణ్ భవనం 12వ అంతస్తులో సైఫ్ సొంత ఫ్లాట్‌లో గురువారం తెల్లవారుజామున 2 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సమయంలో ఇంట్లో సైఫ్ భార్య కరీనాకపూర్ ఖాన్‌తో కుమారులు, ఇతర కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. దుండగుడి దాడిలో గాయపడి రక్తమోడుతున్న సైఫ్‌ను ఆయన పెద్ద కుమారుడు ఇబ్రహీం, పనిమనుషులు వెంటనే ఆటోలో సమీపంలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర చికిత్స ప్రారంభించడంతో ప్రాణాపాయం తప్పింది. రెండు బలమైన కత్తిపోట్లు సహా మొత్తం ఆరు చోట్ల గాయాలయ్యాయని డాక్టర్లు చెప్పారు. వెన్నుముక నుంచి 2.5 అంగుళాల కత్తి మొనను ఆపరేషన్ ద్వారా తొలగించారు. సైఫ్‌కు ఎలాంటి ప్రాణాపాయం లేదని, ప్రస్తుతం కోలుకుంటున్నారని తెలిపారు. సైఫ్‌పై దాడిపట్ల బాలీవుడ్ నటులతోపాటు పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కత్తితో దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు భద్రత కల్పించాలని కోరారు. మరోవైపు ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వ పాలనలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, ప్రజల ప్రాణాలకు భద్రత లేకుండాపోయిందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రత్యేక బృందాలతో గాలింపు సైఫ్‌పై దాడి ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే బాంద్రా పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలానికి చేరుకున్నారు. గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశారు. రాత్రిపూట ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించడంతోపాటు దొంగతనం కోసం వచ్చి హత్యాయత్నానికి పాల్పడడంతో సెక్షన్ 331(4), సెక్షన్ 311 కింద కేసు పెట్టారు. సాక్ష్యాధారాల కోసం సీసీటీవీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. సైఫ్‌పై దాడి తర్వాత దుండగుడు మెట్లు దిగి పారిపోయినట్లు గుర్తించారు. వీపున తగిలించుకున్న ఓ బ్యాగ్‌తో అతడు పారిపోతున్న దృశ్యాలు ఆరో అంతస్తులో తెల్లవారుజామున 2.33 గంటల సమయంలో రికార్డయ్యాయి. స్థానికంగా మొబైల్ ఫోన్ల డేటాను పోలీసులు వడపోశారు. దుండుగుడి ఆచూకీ కనిపెట్టడానికి పది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అతడి ఫోటోను విడుదల చేశారు. దుండగుడి దాడిలో సైఫ్ పనిమనిషికి సైతం గాయాలయ్యాయి. దుండగుడితో జరిగిన పెనుగులాటలో ఆమె స్వల్పంగా గాయపడ్డారు. బాధితురాలి నుంచి పోలీసులు ఫిర్యాదు స్వీకరించారు. స్టేట్మెంట్ రికార్డు చేశారు. అసలేం జరిగింది? దొంగతనం కోసమే దుండగుడు సైఫ్ ఫ్లాట్‌లోకి ప్రవేశించినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. సైఫ్, కరీనా దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి తమ ఫ్లాట్‌లో నిద్రిస్తున్న సమయంలో అలికిడి వినిపించింది. అప్పటికే సైఫ్ చిన్నకుమారుడు జహంగీర్ గదిలో మాటువేసిన దుండగుడి కదలికలను పనిమనిషి గమనించి బిగ్గరగా కేకలు వేసింది. అలారం మోగించింది. దాంతో అతడు ఆమెపై కత్తి దూశాడు. ఈ శబ్దాలు వినిపించి నిద్రనుంచి మేల్కొన్న సైఫ్ అలీ ఖాన్ ఆ గదిలోకి వచ్చి దుండగుడిని అడ్డుకొనేందుకు ప్రయతి్నంచాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య చాలాసేపు పెనుగులాట జరిగింది. వాగ్వాదం చోటుచేసుకుంది. సైఫ్‌ను దుండగుడు కత్తితో విచక్షణారహితంగా పొడిచి తక్షణమే మెట్ల మార్గం గుండా పరారయ్యాడు. ఫైర్ ఎగ్జిట్ ద్వారా అతడు సైఫ్ ఫ్లాట్‌లో ప్రవేశించినట్లు పోలీసులు చెప్పారు. సైఫ్ కుమారుడి గదిలో నాలుగు గంటలపాటు నిశ్శబ్దంగా నక్కి ఉండి, అవకాశం కోసం ఎదురు చూశాడని, అర్ధరాత్రి దాటిన తర్వాత దొంగతనానికి ప్రయతి్నంచాడని తెలిపారు. కారు అందుబాటులో లేకపోవడంతో సైఫ్‌ను ఆయన కుమారుడు, సహాయకులు ఆటోలో ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన బాధితుడికి న్యూరో సర్జన్ డాక్టర్ నితిన్ డాంగే, కాస్మోటిక్ సర్జన్ డాక్టర్ లీనా జైన్, అనస్థీషియాలజిస్టు డాక్టర్ నిషా గాంధీ శస్త్రచికిత్స చేశారు. ఆరు చోట్ల గాయాలైనట్లు తెలిపారు. మెడ, వెన్నుముక భాగంలో సర్జరీ చేశారు. ఎడమ చెయ్యి, మెడ కుడి భాగంలో రెండు లోతైన గాయాలున్నాయని చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, త్వరలో పూర్తిస్థాయిలో కోలుకుంటారని వెల్లడించారు. నిప్పులు చెరిగిన ప్రతిపక్షాలు మహారాష్ట్రలో శాంతి భద్రతలు దారుణంగా క్షీణిస్తున్నాయని ఎన్సీపీ(శరద్ పవార్ అధ్యక్షుడు శరద్ పవార్ ఆరోపించారు. బాంద్రాలో ఇటీవలే ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడని, ఇప్పుడు సైఫ్‌పై దాడి జరిగిందని చెప్పారు. ఇవన్నీ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయని తెలిపారు. హోంశాఖ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వద్దే ఉందని, శాంతిభద్రతల పరిరక్షణపై ఇకనైనా దృష్టి పెట్టాలని సూచించారు. ముంబైలో ఎవరికీ రక్షణ లేదని శివసేన(ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ విమర్శించారు. -
సైఫ్‌పై దాడి.. ఘాటుగా స్పందించిన సీఎం ఫడ్నవిస్
నటుడు సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడి ఘటన గురించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ స్పందించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, అన్ని వివరాలను ఎప్పటికప్పుడు పోలీసులు వెల్లడిస్తున్నారని చెప్పారు. అయితే.. ఈ ఘటన ఆధారంగా ప్రతిపక్షాలు చేస్తున్న తీవ్ర విమర్శలకు ఆయన అంతే ఘాటుగా బదులిచ్చారు. మహారాష్ట్రలో శాంతి భద్రతలు నానాటికీ క్షీణిస్తున్నాయని, వరుసగా ప్రముఖులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందని ప్రతిపక్షాలు ఫడ్నవిస్ ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. మరోవైపు.. ఈ విమర్శలకు సినీ ప్రముఖుల గొంతు కూడా తోడైంది. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నాం ఎమర్జెన్సీ చిత్ర ప్రత్యేక ప్రదర్శనకు హాజరైన సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఆ చిత్ర నటి కంగనా రనౌత్‌తో మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంలో ఆయన్ని సైఫ్‌పై దాడి గురించి మీడియా ప్రశ్నించింది. దేశంలో ఉన్న మెగాసిటీ(Megacities)ల్లో ముంబై అత్యంత సురక్షితమైన నగరం. నగరంలో ఈ మధ్యకాలంలో కొన్ని ఘటనలు జరిగిన మాట వాస్తవం. వాటిని అంతే తీవ్రంగా మేం వాటిని భావించి దర్యాప్తు జరిపిస్తున్నాం. అలాగని.. ఏదో ఒక ఘటనను పట్టుకుని ముంబై ఏమాత్రం సురక్షితం కాదని అనడం సరికాదు. ఇది ముంబై ప్రతిష్టను దెబ్బ తీసే అంశం. ముంబైను మరింత సురక్షితంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది’’ అని అన్నారు. మహారాష్ట్ర హోం శాఖ ప్రస్తుతం ఫడ్నవిస్ వద్దే ఉంది.#WATCH | Mumbai: Maharashtra CM Devendra Fadnavis on the attack on actor Saif Ali Khan says, “Police have provided all the details. What kind of attack this was, the motive behind it, and the intention are all before you.”#SaifAliKhan #DevendraFadnavis #Mumbai pic.twitter.com/L7hGKE8XnE— Organiser Weekly (@eOrganiser) January 16, 2025ముంబై మహానగరంలో అత్యంత విలాసవంతమైన ఏరియాగా బాంద్రాకు ఓ పేరుంది. వీవీఐపీలు ఉండే ఈ ఏరియాలో కట్టుదిట్టమైన పోలీస్ పహారా కనిపిస్తుంటుంది కూడా. అలాంటి ప్రాంతంలో..గత అర్ధరాత్రి అలజడి రేగింది. ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) ఇంట్లోకి చొరబడి చోరీకి యత్నించాడు ఓ దుండగుడు. ఈ క్రమంలో జరిగిన సైఫ్‌పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆయన్ని లీలావతి ఆస్పత్రికి తరలించారు. రెండు కత్తిపోట్లు లోతుగా దిగడం, వెన్నెముకకు దగ్గరగా కత్తికి దిగడంతో ఆయనకు శస్త్ర చికిత్స జరిగింది. అయితే ఆయనకు ప్రమాదం తప్పిందని, రెండ్రోజుల తర్వాత డిశ్చార్జి చేసే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రమాదంలో సైఫ్‌తో పాటు ఆయన ఇంట్లో పని చేసే మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. ఆమెకు చికిత్స అందించి వైద్యులు ఇంటింకి పంపించేశారు. మరోవైపు ఘటనపై కేసు నమోదు చేసుకున్న బాంద్రా(Bandra Police) పోలీసులు.. నిందితుడిని దాదాపుగా గుర్తించినట్లు తెలుస్తోంది. అతన్ని పట్టుకునేందుకు ఏడు బృందాలను రంగంలోకి దింపాయి.ఊహాజనిత కథనాలొద్దుఈ ఘటనపై మీడియా, అభిమానులు సంయమనం పాటించాలని సైఫ్ టీం కోరుతోంది. ‘‘సైఫ్ ఇంట్లో చోరీకి యత్నం జరిగింది. ఈ క్రమంలో ఆయనపై దాడి జరిగింది. సైఫ్ భార్య కరీనా కపూర్, ఇతర కుటుంబ సభ్యులు సురక్షితంగా ఉన్నారు. ఆయనకు గాయాలయ్యాయి. శస్త్రచికిత్స జరిగి ఆయన కోలుకుంటున్నారు. కాబట్టి.. అంతా సంయమనం పాటించాలి. కల్పిత కథనాలు రాయొద్దు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాళ్లు అందించే సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు అందజేస్తాం’’ అని ఆయన టీం తెలిపింది. -
‘సెలబ్రిటీలకే ఇలా జరిగితే సామాన్యుల గతేంటి?’
ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడి.. యావత్ దేశాన్ని ఒక్కసారిగా దిగ్భ్రాంతి గురి చేసింది. అటు సినీ, ఇటు ఇతర రంగాల ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు. అయితే ఇప్పుడి ఘటన మహారాష్ట్రలో రాజకీయ అలజడికి కారణమైంది.సైఫ్ అలీఖాన్ దాడి ఘటనను ప్రస్తావిస్తూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాలయంటూ దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఉద్దవ్ సేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘‘సెలబ్రిటీలకే భద్రత కరువైనప్పుడు ముంబైలో సామాన్యుల సంగతి ఏంటి?’’ అంటూ ట్వీట్ చేశారామె.ముంబైలో వరుసగా ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి. మరో హై ప్రొఫైల్ వ్యక్తిపై దాడి జరగడం నిజంగా నగరానికి సిగ్గుచేటు. ముంబై పోలీసులు, హోం మంత్రిత్వ శాఖ పని తీరును ఈ ఘటన కచ్చితంగా ప్రశ్నిస్తుంది అని అన్నారామె. ఈ క్రమంలో సీనియర్ నేత బాబా సిద్ధిఖీ హత్య ఉదంతంతో పాటు సల్మాన్ ఖాన్ ఇంటిపై జరిగిన దాడి ఘటనను ఆమె ప్రస్తావించారు.My comment on the latest murderous attack in Mumbai. https://t.co/a2aD1ymRGr pic.twitter.com/MohkfAN01d— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) January 16, 2025బాబా సిద్ధిఖీ కుటుంబం న్యాయం కోసం ఎదురు చూస్తోంది. సల్మాన్ ఖాన్ ఇక లాభం లేదనుకుని ఇంటినే బుల్లెట్‌ఫ్రూఫ్‌గా మార్చేసుకున్నారు. ఇప్పుడు ప్రముఖులు ఉండే బాంద్రాలో సైఫ్‌పై దాడి జరిగింది. అలాంటప్పుడు ముంబైలో ఇంకెవరు సురక్షితంగా ఉంటారు?.. ఆయన త్వరగా కోలుకోవాలి అని ఆమె అన్నారు.మరోవైపు.. పవార్ ఎస్పీపీ సైతం ఈ పరిణామంపై స్పందించింది. సైఫ్ అలీ ఖాన్ లాంటి ప్రముఖ వ్యక్తిపై ఆయన ఇంట్లోనే దాడి చేసినప్పుడు.. సామాన్యుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతాయని ఆ పార్టీ ప్రతినిధి క్లైడ్ కాస్ట్రో ట్వీట్ చేశారు.Attack on Saif Ali Khan is a cause for concern because if such high profile people with levels of security can be attacked in their homes, then what could happen to common citizens?Fear of law seems to be at a low in Maharashtra due to leniencies in the past couple of years— Clyde Crasto - क्लाईड क्रास्टो 🇮🇳 (@Clyde_Crasto) January 16, 2025సైఫ్‌పై జరిగిన దాడిని కాంగ్రెస్ పార్టీ ఖండించింది. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. కాంగ్రెస్ ఎంపీ వర్షా గైక్వాడ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘‘ ముంబైలో ఏం జరుగుతోంది?. ప్రముఖులుండే నివాసాల మధ్య.. అదీ అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఒక నటుడి ఇంట్లోనే దాడి జరగడం శోచనీయం. ఇలాంటప్పుడు సామాన్యుడు ఈ ప్రభుత్వం నుంచి ఇంకేం ఆశిస్తాడు? అని అన్నారామె. తుపాకీ మోతలు, దొంగతనాలు, కత్తిపోట్లు.. ముంబైలో నిత్యకృత్యం అయిపోయాయి. అసలు ముంబైలో ఏం జరుగుతోంది?. వీటికి ప్రభుత్వం నుంచి సమాధానాలు రావాలి అని అన్నారామె.एक पद्मश्री विजेता लोकप्रिय अभिनेता जो एक हाइ प्रोफाइल सोसायटी में बांद्रा जैसे सुरक्षित माने जाने वाले इलाके में रहते हैं, उनके घर में घुसकर कोई उनको चाकू मारकर चला जाता है, ये कितनी भयानक घटना है! महाराष्ट्र में कानून व्यवस्था की आए दिन धज्जियां उड़ रही है। बांद्रा में एक नेता… pic.twitter.com/EV13yNkQnq— Prof. Varsha Eknath Gaikwad (@VarshaEGaikwad) January 16, 2025అయితే.. తీవ్ర విమర్శల వేళ బీజేపీ స్పందించింది. ఘటనను రాజకీయం చేయొద్దని.. పోలీసులు దర్యాప్తు కొనసాగుతోందని అన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యే రామ్ కదమ్ మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనకు పోలీసులే బాధ్యత వహించాలని అన్నారాయన. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, బాధ్యులెవరైనా ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని, పోలీసులు ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారాయన.ఇక.. మీడియా, అభిమానులు సంయమనం పాటించాలని సైఫ్ టీం కోరుతోంది. ‘‘సైఫ్ ఇంట్లో చోరీకి యత్నం జరిగింది. ఈ క్రమంలో ఆయనపై దాడి జరిగింది. సైఫ్ భార్య, ఇతర కుటుంబ సభ్యులు సురక్షితంగా ఉన్నారు. ఆయనకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరుగుతోంది. కాబట్టి.. అంతా సంయమనం పాటించాలి. కల్పిత కథనాలు రాయొద్దు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాళ్లు అందించే సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు అందజేస్తాం’’ అని ఆయన టీం తెలిపింది.గురువారం తెల్లవారుజామున బాంద్రా(Bandra)లోని సైఫ్ నివాసంలో 2-2.30 గంటల మధ్యలో ఈ ఘటన చోటుచేసుకుంది. సైఫ్, ఆయన కుటుంబసభ్యులు నిద్రలో ఉండగా.. ఇంట్లోకి చొరబడిన దుండగుడు దొంగతనానికి యత్నించాడు. అది గమనించిన సైఫ్ అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. దాడి చేసి పరారైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇంట్లో పని చేసే మరో మహిళకూ గాయాలైనట్లు సమాచారం. వీరిద్దరినీ లీలావతి ఆస్పత్రికి తరలించారు. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజీలో ఎలాంటి ఆధారాలు దొరకలేదని తెలుస్తోంది. ఈ ఉదయం స్నిఫర్ డాగ్స్ సహకారంతో ఏడు బృందాలు దుండగుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇంట్లో పని మనిషి సహకారంతోనే దుండగుడు లోపలికి ప్రవేశించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో అతడ్ని విచారించే అవకాశం కనిపిస్తోంది.మరోవైపు.. సైఫ్‌కు ఆరు కత్తిపోట్లు అయ్యాయని, రెండు లోతుగా దిగాయని, వెన్నుపూస అతిసమీపంలో మరో గాయం కావడంతో సర్జరీ అవసరం పడిందని లీలావతి ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. 3గం. సమయంలో సైఫ్‌ను ఆస్పత్రికి తెచ్చారు. ఆయనకు తీవ్ర రక్త స్రావం జరిగింది. సర్జరీ జరిగాక ఎప్పటికప్పుడు ఆయన హెల్త్‌బులిటెన్ విడుదల చేస్తామని, ఊహాజనిత కథనాలు ఇవ్వొద్దని వైద్యులు మీడియాను కోరారు. 54 ఏళ్ల సాజిద్ అలీఖాన్ పటౌడీ అలియాస్ సైఫ్ అలీ ఖాన్.. బాలీవుడ్ యాక్టర్‌గా సుపరిచితుడే. ప్రముఖ క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, నటి షర్మిలా ఠాగూర్ల తనయుడు ఈయన. 1993లో పరంపర చిత్రంతో ఆయన హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ఇటీవల ఎన్టీఆర్ దేవర చిత్రంతో టాలీవుడ్లోకి డెబ్యూ ఇచ్చి అలరించారు. -
ద్విగుణీకృతమైన సాగర పాటవం
ముంబై: భారత్ తిరుగులేని సాగరశక్తిగా ఆవిర్భవిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వెలిబుచ్చారు. మన దేశం అంతర్జాతీయంగా అత్యంత విశ్వసనీయ భాగస్వామిగా మారిందని అభిప్రాయపడ్డారు. రెండు యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి, జలాంతర్గామి ఐఎన్ఎస్ వాఘ్షీర్ను బుధవారం ముంబై నావల్ డాక్ యార్డులో ఆయన జాతికి అంకితం చేశారు. ఆత్మనిర్భర్ భారత్ కింద చేపట్టిన కార్యక్రమాల ఫలితంగా రక్షణ ఉత్పత్తి, సముద్ర జలాల రక్షణ, ఆర్థిక వృద్ధి వంటి రంగాల్లో భారత్ తిరుగులేని ప్రగతి సాధిస్తోందని ఈ సందర్భంగా అన్నారు. సాగర జలాలను డ్రగ్స్, అక్రమ ఆయుధాలు, ఉగ్రవాదం వంటి జాఢ్యాల నుంచి కాపాడేందుకు అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ప్రయత్నాల్లో భారత్ మరింత చురుకైన భాగస్వామిగా మారాలని ఆకాంక్షించారు. ‘‘మూడు యుద్ధనౌకలు ఒకేసారి అందుబాటులోకి రావడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం. నౌకా నిర్మాణ వ్యవస్థను బలోపేతం చేస్తుండటమే ఇందుకు కారణం. గత పదేళ్లలో మా హయాంలో 40 నౌకలు సైన్యానికి అందుబాటులోకి వచ్చాయి. వాటిలో ఏకంగా 39 భారత్‌లోనే తయారవడం విశేషం. ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో నావికా దళానికి దేశీయ చిహా్నలను రూపొందించుకున్నాం. రూ.1.5 లక్షల కోట్లతో మరో 60 యుద్ధ నౌకల నిర్మాణం జరుగుతోంది. సాగరగర్భంలో దాగున్న అపారమైన అవకాశాలను ఒడిసిపట్టే ప్రయత్నమూ జోరుగా సాగుతోంది. మన పరిశోధకులు 6,000 మీటర్ల లోతు దాకా వెళ్లే సముద్రయాన్ ప్రాజెక్టు ఊపందుకుంది’’ అని వివరించారు. ఇండో పసిఫిక్ ప్రాంతం భాగస్వామ్య దేశాలన్నింటికీ సమాన స్థాయిలో అందుబాటులో ఉండాలని అభిప్రాయపడ్డారు. రెండు నెలల క్రితం జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి అధికారం నిలబెట్టుకున్నాక మోదీ మహారాష్ట్రలో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా మహాయుతి ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మధ్యాహ్న భోజనం చేశారు.ఐఎన్ఎస్ నీలగిరి → ప్రాజెక్ట్ 17ఏ స్టెల్త్ ఫ్రి గేట్ కల్వరీ శ్రేణిలో ప్రధాన యుద్ధనౌక.→ శత్రువును ఏమార్చే అత్యాధునిక స్టెల్త్ టె క్నాలజీ దీని సొంతం.→ గత యుద్ధ నౌకల కంటే అధునాతన రాడార్ టెక్నాలజీ ఉంది. → ఎండీఎల్, నావికా దళానికి చెందిన వార్‌షిప్ డిజైన్ బ్యూరో దీన్ని సంయుక్తంగా నిర్మించాయి. → ఐఎన్ఎస్ నీలగిరి 75 శాతం దేశీయంగా నిర్మితమైంది.→ ఎంహెచ్–60ఆర్ శ్రేణి హెలికాప్టర్లు కూడా దీన్నుంచి కార్యకలాపాలు సాగించగలిగేలా అధునాతన సౌకర్యాలు, పరిజ్ఞానంతో తీర్చిదిద్దారు.ఐఎన్ఎస్ సూరత్ → ప్రాజెక్ట్ 15బి స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ శ్రేణి ప్రాజెక్టులో నాలుగో, చివరి యుద్ధ నౌక. → ఇది నౌకాయాన చరిత్రలోనే అత్యంత భారీ, సంక్లిష్ట నిర్మాణంతో కూడిన యుద్ధ నౌక. → అత్యాధునిక ఆయుధ, సెన్సర్ వ్యవస్థలు, అధునాతన నెట్వర్క్ కేంద్రిత యుద్ధ పాటవం దీని సొంతం. → దీన్ని మజ్గావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (ఎండీఎల్) నిర్మించింది. → 80% దేశీయంగా∙తయారవడం విశేషం.ఐఎన్ఎస్ వాఘ్షీర్ → ప్రాజెక్ట్ 75 స్కార్పియన్ శ్రేణిలో ఆరో జలాంతర్గామి. → దీని నిర్మాణంలో ఫ్రాన్స్‌కు చెందిన నేవల్ గ్రూప్ కూడా పాలుపంచుకుంది. → యాంటీ సర్ఫేస్, యాంటీ సబ్‌మరైన్ పోరాటాలు రెండింట్లోనూ ఉపయుక్తంగా ఉండేలా దీన్ని రూపొందించారు. → నిఘా సమాచార సేకరణలో కూడా ఇది చురుగ్గా పాలుపంచుకోనుంది. → అత్యాధునిక ఎయిర్–ఇండిపెండెంట్ ప్రొపల్షన్ టెక్నాలజీ దీని సొంతం. → డీజిల్, విద్యుత్‌తో నడిచే అత్యంత వైవిధ్యమైన, శక్తిమంతమైన, భారీ జలాంతర్గాముల్లో ఇదొకటి. → దీనిలో అధునాతన సోలార్ వ్యవస్థ, యాంటీ షిప్ మిసైళ్లు, వైర్ గైడెడ్ టార్పెడోలను మోహరించారు. → భావి సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా అప్‌గ్రేడ్ చేసుకునే వెసులుబాటు.#WATCH | Mumbai: On the commissioning of three frontline naval combatants, PM Narendra Modi says, "...It is a matter of pride that all three frontline naval combatants are Made in India. Today's India is emerging as a major maritime power in the world." pic.twitter.com/DisB0t8oDY— ANI (@ANI) January 15, 2025 #WATCH | Mumbai, Maharashtra: Prime Minister Narendra Modi dedicates three frontline naval combatants INS Surat, INS Nilgiri and INS Vaghsheer to the nation(Source: ANI/DD) pic.twitter.com/0PI3kxlVT4— ANI (@ANI) January 15, 2025 -
46 ఏళ్ల ‘పవార్’ రాజకీయానికి బీజేపీ చెక్ పెట్టింది: అమిత్ షా
ముంబై: ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ లక్ష్యంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో 1978 నుంచి శరద్ పవార్.. అస్థిర, వెన్నుపోటు రాజకీయాలు చేశారు. మహారాష్ట్రలో బీజేపీ విజయంతో పవార్ రాజకీయాలకు ముగింపు పలికినట్టు అయ్యిందన్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఆదివారం షిర్డీలో పర్యటించారు. ఈ సందర్బంగా అమిత్ షా మాట్లాడుతూ..‘మహారాష్ట్రలో 1978లో శరద్ పవార్ భిన్నమైన రాజకీయాలను మొదలుపెట్టారు. అస్థిర, వెన్నుపోటు రాజకీయాలకు తెరలేపారు. కానీ, 2024 ఎన్నికల్లో ప్రజలు వాటిని తిరస్కరించారు. అదేవిధంగా ఉద్ధవ్ ఠాక్రే కుటుంబ రాజకీయాలకు కూడా ప్రజలకు ముగింపు పలికారు. కుట్రపూరిత రాజకీయాలు కూడా తిరస్కరణకు గురయ్యాయి. వాళ్లిద్దర్నీ మహారాష్ట్ర ప్రజలు ఇంటికి సాగనంపారు. బీజేపీతో పాటు నిజమైన శివసేన, ఎన్సీపీలను గెలిపించారు. వారి ఓటమితో మహారాష్ట్రలో అస్థిర రాజకీయాలకు ముగింపు పడిందన్నారు.ఉద్ధవ్ థాక్రే మమ్మల్ని మోసం చేశాడు. 2019లో ఆయన బాలాసాహెబ్ సిద్ధాంతాన్ని విడిచిపెట్టారు. ఈరోజు మీరు ఆయనకు తన స్థానాన్ని మీరే చూపించారు. ఆయన ద్రోహం ప్రజలకు అర్థమైంది. రాష్ట్రంలో బీజేపీ సాధించిన పెద్ద విజయానికి పార్టీ కార్యకర్తలే కారణం. అందరి శ్రమతోనే ఘన విజయం అందుకున్నాం అంటూ వ్యాఖ్యలు చేశారు.ఇదే సమయంలో ముఖ్యమంత్రిగా, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేసిన శరద్ పవార్.. అనేక సహకార సంస్థలకు నేతృత్వం వహించారు. కానీ, రైతుల ఆత్మహత్యలను మాత్రం ఆయన ఆపలేకపోయారు. బీజేపీ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోంది. రైతుల సంక్షేమం కోసమే మోదీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది’ అంటూ కీలక కామెంట్స్ చేశారు.#WATCH | Maharashtra: Union Home Minister Amit Shah says, "... The victory (of BJP) in Maharashtra ended the politics of instability and backstabbing started by Sharad Pawar in 1978. Uddhav Thackeray betrayed us, he left the ideology of Balasaheb in 2019. Today you have shown him… pic.twitter.com/BzACZ9bOSJ— ANI (@ANI) January 12, 2025ఇదిలా ఉండగా.. ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. దీంతో, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే, ఎన్సీపీ నేత అజిత్ పవార్, శివసేన నాయకుడు ఏక్నాథ్ షిండే డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేశారు. -
పండుగ వేళ భయానక రోడ్డు ప్రమాదాలు.. 14 మంది మృతి
ముంబై/డెహ్రాడూన్: ఉత్తరాఖండ్, మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాద ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదాల కారణంగా 14 మంది మృతిచెందారు. మరో 20 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. పౌరీ జిల్లాలోని దహల్చోరి ప్రాంతంలో బస్సు అదుపు తప్పి 100 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న రెస్క్యూ టీం ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 22 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.VIDEO | Uttarakhand: Five people feared dead as bus meets with an accident in Pauri. More details awaited.(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/F9RQzVuvpP— Press Trust of India (@PTI_News) January 12, 2025ఈ ప్రమాదంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.మరోవైపు.. మహారాష్ట్రలోని నాసిక్‌లోని ద్వారకా సర్కిల్ వద్ద ఆదివారం రాత్రి టెంపో-ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో ఎనిమిది మంది మృతిచెందారు. ఈ ఘటనంఓ మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో టెంపో వాహనంలో 16 మంది ప్రయాణిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. వీరంతా పుణ్యక్షేత్రాలు దర్శించుని ఇంటికి వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్టు సమాచారం. #WATCH | Maharashtra | Visuals from the Nashik Mumbai Highway flyover where 6 people lost their lives in an accident between a pickup and a mini truck.5 other people are injured out of which 2 are in critical condition. The injured are being treated at the district hospital:… pic.twitter.com/RIYbwNCxFd— ANI (@ANI) January 12, 2025 -
స్థానిక ఎన్నికల్లో ఒంటరి పోరు
నాగ్‌పూర్: మహారాష్ట్రలోని ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)లో లుకలుకలు మరోసారి ప్రస్ఫుటమయ్యాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంపై కూటమి నేతలు పరస్పరం దుమ్మెత్తి పోసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎంవీఏలోని కీలక భాగస్వామ్య పార్టీ శివసేన(ఉద్ధవ్) సంచలన ప్రకటన చేసింది. రాష్ట్రంలో మరికొద్ది నెలల్లో జరిగే స్థానిక ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. ఉమ్మడిగా ఉండి పోటీ చేస్తే కూటమి భాగస్వామ్య పక్షాల కార్యకర్తలకు అవకాశాలు రావడం లేదని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల్లో సంస్థాగతంగా బలోపేతం అవ్వాల్సిన విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఒంటరిగా బరిలోకి దిగాలని నిర్ణయించామన్నారు. ముంబై, థానె, నాగ్‌పూర్ తదితర మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు జిల్లా పరిషత్, పంచాయతీ ఎన్నికల్లో సైతం సొంతంగానే బరిలోకి దిగాలనే నిర్ణయానికి తమ పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే సానుకూలంగా ఉన్నట్లు రౌత్ వివరించారు. ప్రతిపక్ష ఇండియా కూటమి, మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) రూపంలోని మైత్రి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు మాత్రమే పరిమితమని రౌత్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ తీరు సరికాదు ఎంవీఏ, ఇండియా కూటమిలోనీ ముఖ్య భాగస్వామ్య పక్షమైన కాంగ్రెస్ పార్టీ సభ్య పార్టిలకు ఏమాత్రం సహకరించడం లేదని రౌత్ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంపై కాంగ్రెస్ పార్టీ నేత విజయ్ వడెట్టివార్ భాగస్వామ్య పక్షాలను నిందిస్తున్నారని తెలిపారు. ఏకాభిప్రాయం, సర్దుకుపోవడం వంటి వాటిపై విశ్వాసం లేని వారికి కూటమిలో కొనసాగే అర్హత లేదని రౌత్ విమర్శించారు. ఇక ఇండియా కూటమి విషయానికొస్తే..లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఒక్క దఫా కూడా సమావేశం కాలేకపోయిందన్నారు. ఇండియా కూటమికి కన్వినర్‌ను కూడా నియమించుకోలేకపోవడం మంచి విషయం కాదన్నారు. ఎవరికీ మంచిది కాదు: ఎన్సీపీ(శరద్) శివసేన (ఉద్ధవ్) పార్టీ నిర్ణయంపై ఎంవీఏ భాగస్వామ్య పక్షమైన ఎన్సీపీ(శరద్) స్పందించింది. ‘ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే అది శివసేన(ఉద్ధవ్) పార్టీ ఇష్టం. మేం అడ్డుకోబోం. బలవంతంగా ఎవరినీ కలుపుకోం. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా మేం కలిసి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది సరైన నిర్ణయంగా మేం భావించడం లేదు. కానీ, ఈ నిర్ణయం ప్రభావం ఎంవీఏ కూటమిలోని మూడు భాగస్వామ్య పక్షాల గెలుపు అవకాశాలపైనా పడుతుంది’అని ఆ పార్టీ నేత జితేంద్ర ఔహద్ చెప్పారు. మేం పట్టించుకోం: సీఎం ఫడ్నవీస్ స్థానిక ఎన్నికల్లో సొంతంగానే పోటీ చేయాలన్న శివసేన(ఉద్ధవ్) నిర్ణయాన్ని బీజేపీకి చెందిన సీఎం ఫడ్నవీస్ తోసిపుచ్చారు. ‘ఎంవీఏ కూటమి పోటీలో ఉన్నా లేకున్నా మేం పట్టించుకునేది లేదు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కట్టుబడి ఉంటాం. వచ్చే అన్ని ఎన్నికల్లోనూ ప్రజలు మాకే మద్దతుగా ఉంటారనే నమ్మకం మాకుంది’అని ఆయన చెప్పారు. ఇటీవలి కాలంలో శివసేన(ఉద్ధవ్) వర్గం బీజేపీ వైపు మొగ్గు చూపుతోందంటూ వస్తున్న వార్తలపై ఆయన స్పందిస్తూ..రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చునంటూ వ్యాఖ్యానించారు. -
శ్వాస సంబంధ వ్యాధులపై నిఘా
న్యూఢిల్లీ: శ్వాస సంబంధమైన అన్ని రకాల వ్యాధులపై ఓ కన్నేసి ఉంచాలని, హ్యూమన్ మెటా న్యుమోవైరస్(హెచ్ఎంపీవీ) వ్యాప్తిని నివారించేందుకు ప్రజల్లో అవగాహన పెంచాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. దేశంలో ఇప్పటికే హెచ్ఎంపీవీ సంబంధిత ఐదు కేసులు బయటపడగా, మంగళవారం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో రెండు హెచ్ఎంపీవీ అనుమానిత కేసులను వైద్యులు గుర్తించారు. సోమవారం కర్ణాటక, తమిళనాడు, గుజరా త్లలో ఐదుగురు చిన్నారులకు హెచ్ఎంపీవీ పాజిటివ్‌గా గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పరిస్థితిని సునిశితంగా పరిశీలిస్తోందని, ఎలాంటి భయాందోళనలకు ప్రజలు గురి కావాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా భరోసా ఇచ్చారు.చైనాలో ఒక్కసారిగా హెచ్ఎంపీవీ కేసులు పెరగడంతో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సలిల శ్రీవాస్తవ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులతో వర్చువల్‌గా సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. ఇప్పటి వరకు అందిన డేటా ప్రకారం చూస్తే ఇన్‌ఫ్లూయెంజా లైక్ ఇల్నెస్(ఐఎల్ఐ), సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇల్నెస్(ఎస్ఏఆర్ఐ) సహా అన్ని రకాల శ్వాస సంబంధ ఇన్ఫెక్షన్ల కేసుల్లో అనూహ్యమైన పెరుగుదల కనిపించలేదని ఆమె వివరించారు. అదీకాకుండా, ప్రపంచ దేశాల్లో 2021 నుంచే ఈ వ్యాధి ఉన్నందున ప్రజలు భయపడాల్సిన అవసరం కూడా లేదన్నారు. ప్రస్తుత శ్వాసకోశ సంబంధ వ్యాధుల్లో నమోదైన పెరుగుదలపై ఆమె మాట్లాడుతూ.. ఏటా ఈ సీజన్లో ఇలా కేసులు పెరగడం మామూ లేనన్నారు. అయితే, శ్వాస సంబంధమైన అన్ని రకాల వ్యాధుల పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాలని ఆమె రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులను కోరారు. నాగ్‌పూర్‌లో రెండు అనుమానాస్పద కేసులు..మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో హెచ్ఎంపీవీ అనుమానాస్పద కేసులు రెండింటిని గుర్తించారు. 7, 14 ఏళ్ల బాధితులిద్దరికీ స్థానిక ప్రైవేట్ ఆస్ప త్రిలో అవుట్ పేషెంట్ విభాగంలో చికిత్స చేసి, ఇంటికి పంపించివేశారు. ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారు. అనుమానితుల నుంచి సేకరించిన నమూ నాలను నాగ్‌పూర్‌లోని ఎయిమ్స్‌కు, పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించామని జిల్లా కలెక్టర్ విపిన్ ఇటంకర్ చెప్పారు. హెచ్ఎంపీవీ కేసులంటూ వచ్చిన వార్తలు అబద్ధమన్నారు. నాగ్‌పూర్‌లో హెచ్ఎంపీవీ కేసులు లేవని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని వెల్లడించారు. -
అలరించిన ‘సుస్వరాల హరివిల్లు’
దాదర్: ఆంధ్ర మహాసభ, స్వరమాధురి సంగీత సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో దాదర్‌లోని ఈఎన్ వైద్య సభాగృహంలో ‘సుస్వరాల హరివిల్లు’పేరిట నిర్వహించిన సంగీత విభావరి కార్యక్రమం ఘనంగా జరిగింది. స్వరమాధురి సంగీత సంస్థ సహాకారంతో ఈ సుస్వరాల హరివిల్లు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, తెలుగు భాష, సంస్కృతుల వ్యాప్తిలో ఇది తొలి అడుగుగా భావిస్తున్నామని ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు మాదిరెడ్డి కొండారెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ముంబైలో ఉన్న తెలుగు సంఘాలన్నింటినీ ఏకం చేసి తెలుగు భాష, సంస్కృతులను మరింతగా వ్యాప్తిచేసేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. గత 13 ఏళ్లుగా తమ సంస్థ గుడ్ మ్యూజిక్, గుడ్ కల్చర్ అనే స్ఫూర్తితో ముందుకు సాగుతోందని..స్థానిక గాయనీ గాయకులకు సంగీత శిక్షణ సత్ఫలితాలను సాధిస్తున్నామని స్వరమాధురి సంగీత సంస్థ అధ్యక్షుడు అశ్వినీ కుమార్ పేర్కొన్నారు. ఆంధ్ర మహాసభలో తొందర్లోనే ఏసీ ఆడిటోరియాన్ని నిరి్మస్తామని మహాసభ ధర్మకర్తల మండలి చైర్మన్ మంతెన రమేష్ పేర్కొన్నారు. ఆకట్టుకున్న ‘ఆణిముత్యాలు’ ఈ సంగీత విభావరిలో నాటి నుంచి నేటి వరకు ముఖ్యంగా గత 65 ఏళ్లలో వచ్చిన తెలుగు సినిమాలలోని 20 ఆణిముత్యాల్లాంటి పాటలను గాయనీ గాయకులు ఆలపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో సోని కొమాండూరి, స్వరమాధురి గాయనీగాయకులు శశికిరణ్, ప్రణవ్ శేషసాయి, వంశీ సౌరబ్, గిరిజా ద్విభాష్యం, డా స్రవంతి, మయాఖ, మాహి, సుజాత తమదైన శైలిలో పాటలుపాడి ప్రేక్షకులను ఊర్రూతలూగించారు. వీరికి ఆర్టి రాజన్, విక్కి ఆదవ్, ప్రణవ్ కుమార్, రోషన్ కాంబ్లే, రమేష్ కాలే, బాలా జాధవ్, వినీత్ వాద్యసహకారం అందించారు. కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ ఆంధ్ర మహాసభ ప్రధాన కార్యదర్శి యాపురం వెంకటేశ్వర్ స్వాగతం పలకగా కల్పన గజ్జెల, తాండవకృష్ణ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. సంధ్య పోతురి వందన సమర్పన చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల చైర్మన్ మంతెన రమేష్ కార్యదర్శి కస్తూరి హరిప్రసాద్, సభ్యులు సంగం ఏక్నాథ్, భోగ సహాదేవ్, ద్యావరశెట్టి గంగాధర్, గాలి మురళి, ఆంధ్ర మహసభ అధ్యక్షుడు మాదిరెడ్డి కొండారెడ్డి, ఉపాధ్యక్షుడు తాళ్ల నరేష్, గాజెంగి వెంకటేశ్వర్, ప్రధాన కార్యదర్శి యాపురం వెంకటేశ్వర్, కోశాధికారి వేముల మనోహర్, సంయుక్త కార్యదర్శులు కటుకం గణేష్ , అల్లె శ్రీనివాస్, మచ్చ సుజాత, కొక్కుల రమేష్, ప్రహ్లాద్, క్యాతం సువర్ణ, చిలివేరి గంగాదస్, పీచుక రత్నమాల, చిలుక వినాయక్, మహిళ శాఖ అధ్యక్షురాలు మంచికంటి మేఘమాల, ఉపాధ్యక్షురాలు వి శ్యామల రామ్మోహన్, కార్యదర్శి పిల్లమారపు పద్మ, కార్యవర్గ సభ్యులు గాలి స్వర్ణ, తాళ్ల వనజ, భోగ జ్యోతిలక్షి్మ, బెహరా లలిత, స్వరమాధురి సంగీత సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు గిరిజా ద్విభాష్యం, అ«ధ్యక్షుడు అశ్వనీ కుమార్, ప్రధాన కార్యదర్శి కల్పన గజ్జల, తాండవకృష్ణ , రమణిరావు, ఈశ్వర్, జగన్నాధరావు, జికె మోహన్, హరీష్ , పోతురి సంధ్య తదితరులు పాల్గొన్నారు. -
ముగ్గుల పోటీలు, ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు
సాక్షి, ముంబై: దాదర్ నాయ్‌గావ్‌లోని ‘పద్మశాలీ యువక సంఘం’మహిళా మండలి ఆధ్వర్యంలో సోమవారం మహిళలకు ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు నిర్వహించారు. మండలి కార్యదర్శి చెరిపల్లి పరమేశ్వరి, కోశాధికారి పేర్ల గీతాంజలి ప్రారంభించిన ఈ పోటీలకు రితిక దేశ్‌ముఖ్ న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. మహిళలు, బాలికలు ఎంతో ఉత్సాహంగా పోటీలలో పాల్గొన్న అందమైన రంగవల్లులను తీర్చిదిద్దారు. పోటీల విజేతలకు సంక్రాంతి ( జనవరి 14వ తేదీ) రోజున జరిగే కార్యక్రమంలో బహుమతులు ప్రదానం చేయనున్నట్లు సంఘం ప్రధాన కార్యదర్శి మహేశ్వరం చంద్రశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా మండలి ఉపాధ్యక్షురాలు జిల్ల శారద, కార్యదర్శి చెరిపల్లి పరమేశ్వరి, సహకార్యదర్శులు బిట్ల సోని, కోశాధికారి పేర్ల గీతాంజలి, ఏలే తేజశ్రీ అడ్డగట్ల ఐశ్వర్య, చెదురుపు పద్మ, దొంత ప్రభావతి, ఇదం పద్మ, కైరంకొండ లక్షి్మ, కండ్లపెల్లి కవిత, కస్తూరి సావిత్రి, మహేశ్వరం సాక్షి, పగుడాల రోహిణి, ధర్మకర్తల మండలి చైర్మన్ కోడి చంద్రమౌళి, ట్రస్టీ తిరందాసు సత్యనారాయణ, కార్యవర్గ అధ్యక్షులు గంజి సీతారాములు, ప్రధాన కార్యదర్శి మహేశ్వరం చంద్రశేఖర్, దోర్నాల మురళీధర్, పుట్ట గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
భారత్‌లో పెరుగుతున్న హెచ్ఎంపీవీ కేసులు
న్యూఢిల్లీ: హెచ్ఎంపీవీ(HMPV)కేసులతో పెద్దగా భయపడాల్సిన అవసరం లేదంటున్నప్పటికీ ఈ కేసుల సంఖ్య భారత్‌లో క్రమేపీ పెరగడం మాత్రం ఆందోళన కల్గిస్తోంది. ఇప్పటివరకూ దేశ వ్యాప్తంగా 8 కేసులు నమోదయ్యాయి. నిన్న(సోమవారం) ఒక్కరోజే నాలుగు కేసులు నమోదు కాగా, నేటి(మంగళవారం) ఉదయానికి ఆ సంఖ్య డబుల్ అయ్యింది. తాజాగా మరో నాలుగు కేసులు చేరడంతో అమ్మో హెచ్ఎంపీవీ ఏం చేస్తుందనే భయం మాత్రం జనాల గుండెల్లో భయం పుట్టిస్తోంది.తాజాగా మహారాష్ట్రలో కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని నాగ్‌పూర్‌లో మరో రెండు కేసులు నమోదు కావడంతో ఈ కేసుల సంఖ్య భారత్‌లో ఎనిమిదికి చేరింది. ఇప్పటివరకు కర్ణాటక, గుజరాత్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈ కేసులు నమోదు కాగా, అది ఇప్పుడు మహారాష్ట్రకు పాకడంతో కాస్త కలవరం ఎక్కువైంది.హెచ్ఎంపీవీపై కర్ణాటక ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలుజనసందడి ప్రదేశాల్లో అనవసరంగా తిరగరాదని, అప్పుడప్పుడు చేతులను సబ్బు, శానిటైజర్‌తో కడుక్కోవాలని, జ్వరం, దగ్గు, జలుబు ఉన్నవారు బయట తిరగకుండా ఇంట్లోనే ఉండి, చికిత్స పొందాలి.వారు టవల్, దుస్తులను వేరుగా ఉంచుకోవాలి.బహిరంగ స్థలాల్లో తిరిగేటప్పుడు మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలిబహిరంగ స్థలాల్లో ఉమ్మివేయరాదు. జలుబు, దగ్గు ఉంటే సొంత వైద్యం మానుకుని వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలి. ఇల్లు, చుట్టు ప్రక్కల ప్రదేశాల్లో కార్యాయాల్లో శుభ్రతను కాపాడుకోవాలి.పోషకాహారాన్ని సేవించాలి, పిల్లలు, వయో వృద్ధుల పట్ల జాగ్రత్త వహించాలి. వైద్య నిపుణులు ఏమంటున్నారంటే..హెచ్ఎంపీవీ విషయంలో జరుగుతున్న ప్రచారం హడలెత్తిస్తోందని... కానీ మరీ అతిగా భయాందోళన అవసరం లేదని వైద్య నిపుణులు అంటున్నారు. గత యాభై, ఆరవై ఏళ్లుగా ఈ వైరస్ వ్యాప్తిలో ఉందని.. ఇది కరోనా(Corona Virus) తరహాలో మహమ్మారిలా మారే ప్రమాదం లేదని వారు చెబుతున్నారు..మాస్కులు, శానిటైజర్లు వంటివి వినియోగించడం, పరిశుభ్రత పాటించడం ద్వారా ఈ వైరస్‌కు దూరంగా ఉండవచ్చని అంటున్నారు. అలాగని నిర్లక్ష్యం వహించవద్దని, తగిన అప్రమత్తతతో మసలుకోవాలని స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.కేసుల నమోదుతో ఆందోళనచైనా(China)లో హెచ్ఎంపీవీ కేసులు తీవ్రస్థాయిలో నమోదవుతున్నాయన్న ప్రచారం.. దానికితోడు మన దేశంలోనూ ఆరు కేసులు నమోదయ్యాయన్న వార్తలతో జనంలో భయాందోళన వ్యక్తమవుతోంది. బెంగళూరు, మన దేశానికి సంబంధించి వైరస్ వ్యాప్తి అధికంగా లేకపోయినా, పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరగకపోయినా.. ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియాలో దీనిపై ఆందోళనకర ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో మరీ భయపడాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వైరస్ లక్షణాలు, ప్రస్తుత పరిస్థితి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేస్తున్నారు.మహమ్మారిగా మారే ప్రమాదం లేదుఇది కోవిడ్ మాదిరిగా మహమ్మారిగా మారే ప్రమాదం అసలే లేదు. ప్రపంచవ్యాప్తంగా 50, 60 ఏళ్లకుపైగానే ఇది వ్యాప్తిలో ఉంది. దీనివల్ల కేసులు పెరగొచ్చునేమోగానీ తీవ్రత అంత ఉండకపోవచ్చు. మనుషుల్లో యాంటీబాడీస్‌తోపాటు తగిన మేర రోగ నిరోధక శక్తి ఉంటే ఈ వైరస్ పెద్దగా ప్రభావం చూపదు. సాధారణ ఫ్లూ మాదిరిగానే ఉంటుంది. ఫ్లూ వ్యాక్సిన్ ద్వారా ఈ వైరస్ కేసులు సీరియస్ కాకుండా రక్షణ ఉండవచ్చు. – ప్రొఫెసర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ మెడిసిన్, గాంధీ ఆస్పత్రి -
‘మహా’ వ్యాఖ్యలు... మర్మమేమిటో?!
మహారాష్ట్రలో రాజకీయ పునరేకీకరణకు రంగం సిద్ధమవుతోందా? కొద్ది రోజులుగా రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఈ దిశగా చర్చ జోరందుకుంటోంది. బీజేపీ సారథ్యంలోని అధికార మహాయుతి కూటమికి చేరువయ్యేందుకు విపక్ష శివసేన (ఉద్ధవ్), ఎన్సీపీ (శరద్ పవార్) ప్రయత్నం చేస్తున్నాయన్న వార్తలు సర్వత్రా ఆసక్తి కలిగిస్తున్నాయి. ఆ పార్టీల నేతల తాజా వ్యాఖ్యలు ఈ దిశగా సంకేతాలేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గత నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ)కి మహాయుతి ఘోర ఓటమి రుచి చూపించడం తెలిసిందే. శివసేనను కొన్నేళ్ల క్రితం నిలువునా చీల్చిన ఏక్నాథ్ షిండే వర్గం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నుంచి విడిపోయిన అజిత్ పవార్ వర్గం మహాయుతి భాగస్వాములుగా బీజేపీతో అధికారం పంచుకుంటున్నాయి. తామే అసలైన పార్టీలమంటూ ఇప్పటికే గుర్తింపు కూడా దక్కించుకున్నాయి. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవి చేపట్టగా షిండే, అజిత్ ఆయనకు డిప్యూటీలుగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్‌తో కలిసి ఎంవీఏ కూటమిగా ఎన్నికల్లో పోటీ చేసిన ఉద్ధవ్ సేన, శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ భారీ ఓటమితో కుదేలయ్యాయి. ఒకరకంగా ఉనికి కోసం పోరాడాల్సిన పరిస్థితికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో రెండు పార్టీల అభిమానులు, కార్యకర్తల నుంచి వస్తున్న విజ్ఞప్తులు ఆసక్తి కలిగిస్తున్నాయి. విడిపోయిన పార్టీలు మళ్లీ కలిసి పోవాలంటూ కొద్ది రోజులుగా వారు గట్టిగా కోరుతున్నారు! ఈ నేపథ్యంలో శివసేన (ఉద్ధవ్) అధికారిక పత్రిక ‘సామ్నా’ తమ ప్రత్యర్థి అయిన ఫడ్నవీస్‌ను ప్రశంసల్లో ముంచెత్తడం ప్రాధాన్యం సంతరించుకుంది. గడ్చిరోలీ జిల్లాలో నక్సలిజం అంతానికి ఆయన బాగా కృషి చేస్తున్నారని సామ్నా తాజా సంచిక సంపాదకీయంలో పేర్కొంది. ‘‘గడ్చిరోలీలో పలు అభివృద్ధి పనులకు సీఎం ఫడ్నవీస్ శ్రీకారం చుట్టారు. గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపడానికి ఎంతో కృషి చేస్తున్నారు. గడ్చిరోలీకి నూతన గుర్తింపును ఇవ్వాలని ఫడ్నవీస్ భావిస్తే స్వాగతిస్తాం’’ అని చెప్పుకొచ్చింది. ‘‘నక్సల్స్ ప్రభావిత జిల్లాలో నూతన అభివృద్ధి శకానికి శ్రీకారం చుట్టిన ఫడ్నవీస్ నిజంగా ప్రశంసలకు అర్హుడు’’ అని పేర్కొంది! మరోవైపు పార్టీని చీల్చి ప్రస్తుత దుస్థితికి కారకుడైన షిండేపై సంపాదకీయం విమర్శలు గుప్పించింది. ఆయన గతంలో ఇన్చార్జి మంత్రి హోదాలో గడ్చిరోలీలో మైనింగ్ లాబీల ప్రయోజనాల పరిరక్షణకే పని చేశారని ఆరోపించింది. లోగుట్టు ఏమిటో?! ఉద్ధవ్ సేన ఉన్నట్టుండి బీజేపీ అనుకూల వైఖరి ప్రదర్శిస్తుండటం ఆసక్తికరంగా మారింది. గత నెల 17న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం ఫడ్నవీస్‌ను పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే ప్రత్యేకంగా కలుసుకున్నారు కూడా! ఎన్సీపీ (శరద్ పవార్) ఎంపీ సుప్రియా సూలే సైతం ఫడ్నవీస్‌ను అభినందించారు. రాష్ట్ర ప్రగతి కోసం ఆయన మిషన్ మోడ్‌లో పని చేస్తున్నారంటూ ప్రస్తుతించారు. ప్రధాన రాజకీయ ప్రత్యర్థులు బీజేపీ సీఎంను ఇలా ఆకాశానికెత్తుతుండటం యాదృచ్ఛికమేమీ కాదన్న అభిప్రాయాలు రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. అవి ఎన్డీఏ వైపు చూస్తున్నాయనేందుకు బహుశా ఇది సంకేతమని విశ్లేషకులు అంటున్నారు. హిందూత్వవాదమే మూల సిద్ధాంతంగా పుట్టుకొచ్చిన శివసేన రాష్ట్రంలో అధికారం కోసం ఐదేళ్ల కింద అనూహ్యంగా తన బద్ధ విరోధి కాంగ్రెస్‌తో జట్టుకట్టడం తెలిసిందే. అప్పటినుంచే పార్టీ పతనం ప్రారంభమైందన్నది పరిశీలకుల మాట. ఈ నేపథ్యంలో ఉనికిని కాపాడుకోవడానికి హిందూత్వవాది అయిన బీజేపీతో స్నేహం తప్పు కాదని ఉద్ధవ్ వర్గం నేతల్లో కొందరంటున్నారు. కానీ అది ఆత్మహత్యా సదృశమే కాగలదని, పార్టీ ఎదుగుదల అవకాశాలు శాశ్వతంగా మూసుకుపోతాయని మరికొందరు వాదిస్తున్నారు. పైగా ఎన్డీఏలో చేర్చుకుని ఉద్ధవ్ సేనకు చేజేతులారా కొత్త ఊపిరి పోసే పని బీజేపీ ఎందుకు చేస్తుందని ప్రశి్నస్తున్నారు. మాది మనసున్న పార్టీ: రౌత్ సామ్నా సంపాదకీయాన్ని పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, శివసేన (ఉద్ధవ్) నేత సంజయ్ రౌత్ సమ రి్థంచుకున్నారు. తాము విపక్షంలో ఉన్నప్పటికీ గడ్చిరోలీ జిల్లాకు సీఎం మంచి పనులు చేస్తున్నారు గనుక ప్రశంసిస్తున్నామని చెప్పుకొచ్చారు. ‘‘మాది చాలా పెద్ద మనసున్న పార్టీ. ప్రజలకు మంచి చేస్తే మా ప్రత్యర్థులనైనా ప్రశంసిస్తాం’’ అన్నారు.ఎన్సీపీల విలీనం! ఎన్సీపీలో చీలిక నేపథ్యంలో కొన్నేళ్లుగా ఉప్పూ నిప్పుగా ఉంటున్న బాబాయి శరద్ పవార్, అబ్బాయి అజిత్ దగ్గరవుతున్న సంకేతాలు కొద్ది రోజులుగా ప్రస్ఫుటమవుతున్నాయి. విభేదాలకు స్వస్తి పలికి ఇద్దరూ కలిసిపోవాలని అజిత్ తల్లి ఇటీవలే పిలుపునివ్వడం తెలిసిందే. వారిద్దరూ కలిసి పని చేయాలని కోరుకుంటున్నట్లు ఆమె చెప్పారు. అందుకు తగ్గట్టే డిసెంబర్ 12న శరద్ జన్మదినం సందర్భంగా అజిత్ ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. దాంతో రెండు ఎన్సీపీలు కలిసిపోతాయంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. అది అతి త్వరలోనే జరగవచ్చని పవార్ కుటుంబ అభిమానులు చెప్పుకుంటున్నారు. శరద్ తమకు దేవుడని, పవార్ కుటుంబం ఒక్కటైతే చాలా సంతోషిస్తామని అజిత్ వర్గం ఎంపీ ప్రఫుల్ పటేల్ అన్నారు. శరద్ తన వర్గాన్ని అజిత్ పార్టీలోనే కలిపేసి ఎన్డీయే గూటికి చేరినా ఆశ్చర్యం లేదని మరికొందరు అంచనా వేస్తున్నారు. ఫడ్నవీస్‌కు శరద్ కూతురు సుప్రియ ప్రశంసలు అందులో భాగమేనని వారంటుండగా మరికొందరు ఈ వాదనను కొట్టిపారేస్తున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
బర్డ్ ఫ్లూతో పులులు, చిరుత మృతి
నాగ్‌పూర్: మహారాష్ట్రలోని నాగ్‌పూర్ సమీపంలోని గోరేవాడ రెస్క్యూ సెంటర్లో మరణించిన మూడు పులులు, ఒక చిరుత మృతికి బర్డ్‌ఫ్లూ కారణమని తేలింది. డిసెంబర్ చివరణ మృతి చెందిన వన్య మృగాలు ఏవియన్ ఫ్లూ హెచ్5ఎన్1 బారిన పడ్డాయని అధికారులు ధ్రువీకరించారు. దీంతో మహారాష్ట్ర అంతటా రెడ్ అలర్ట్ ప్రకటించారు. మనుషుల మీద దాడి నేపథ్యంలో డిసెంబర్లో వీటిని చంద్రాపూర్ నుంచి గొరేవాడకు తరలించారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 20న ఒక పులి, 23న రెండు పులులు మృతి చెందాయి. నమూనాలను భోపాల్‌లోని ఐసీఏఆర్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (నిషాద్)కు పంపించారు. ల్యాబ్ ఫలితాల్లో బర్డ్‌ఫ్లూతో జంతువులు మృతి చెందినట్లు నిర్ధారించారు. హెచ్5ఎన్1 వైరస్ మూలాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. బర్డ్ ఫ్లూ సోకిన జంతువులను వేటాడటం లేదా ముడి మాంసం తినడం వల్ల బర్డ్ ఫ్లూ వచ్చి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ మృతుల నేపథ్యంలో కేంద్రంలో ప్రస్తుతం ఉన్న 25 చిరుతలు, 12 పులులకు పరీక్షలు నిర్వహించారు. అన్ని ఆరోగ్యంగా ఉన్నట్లు తేలింది. -
దిగ్గజ శాస్త్రవేత్త చిదంబరం కన్నుమూత
న్యూఢిల్లీ: ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త, భారత అణ్వస్త్ర పరీక్షల్లో కీలక భూమిక పోషించిన శాస్త్రజ్ఞుడు డాక్టర్ రాజగోపాల చిదంబరం తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తెల్లవారుజామున 3.20 గంటలకు ముంబైలోని జస్లోక్ ఆస్పత్రిలో కన్నుమూశారని అణు శక్తి మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. 88 ఏళ్ల చిదంబరం 1974లో, 1998లో భారత్ చేపట్టిన అణు పరీక్షల్లో ప్రధాన పాత్ర పోషించారు. చిదంబరం మృతి వార్త తెల్సి ప్రధాని మోదీ తీవ్ర దిగ్భాంతి వ్యక్తంచేశారు. ‘‘భారత అణు కార్యక్రమ పితామహుల్లో ఒకరైన చిదంబరం దేశ శాస్త్రసాంకేతికత, వ్యూహాత్మక శక్తిసామర్థ్యాల మెరుగు కోసం అవిశ్రాంతంగా కృషిచేశారు. ఆయన చేసిన సేవలను యావత్ భారతావని, భవిష్యత్ తరాలు చిరకాలం గుర్తుంచుకుంటాయి’’అని మోదీ అన్నారు. భారత ప్రభుత్వానికి ప్రధాన శాస్త్రీయ సలహదారుగా 17 సంవత్సరాలపాటు కీలక సేవలు అందించారని శాస్త్రసాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ స్మరించుకున్నారు. ఆయన అసాధారణ శాస్త్రీయ మేథస్సు భారతదేశానికి ఎంతో సాయపడిందని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే అన్నారు. అణు భౌతిక శాస్త్రంలో కృషి 1936 నవంబర్ 12నలో తమిళనాడులోని చెన్నైలో జన్మించిన చిదంబరం మీరట్‌లోని సనాతన్ ధర్మ్ పాఠశాలలో, చెన్నైలోని మైలాపూర్ స్కూల్లో చదువుకున్నారు. తర్వాత చెన్నైలోని ప్రెసిడెన్సీ కాలేజీలో డిగ్రీ పూర్తిచేశారు. బెంగళూరులో ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో పీజీ చదివారు. అణుకార్యక్రమాల్లో పాల్గొంటూనే దాదాపు 60 సంవత్సరాలపాటు ప్రభుత్వంలో వేర్వేరు హోదాల్లో పనిచేసే అరుదైన వ్యక్తి చిదంబరం. 1962లో బాబా అణు పరిశోధనా కేంద్రం(బార్క్)లో చేరి అంచెలంచెలుగా ఎదిగి ఆ తర్వాత 1990లో బార్క్‌కు ఛైర్మన్ అయ్యారు. 1990–1993వరకు ఛైర్మన్‌గా ఉన్నారు. 1993–2000 కాలంలో కేంద్ర అణుఇంధన మంత్రితి్వశాఖకు కార్యదర్శిగా కొనసాగారు. 2001–2018 కాలంలో భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారుగా ఉన్నారు. అంతర్జాతీయ అణుఇంధన సంస్థ(ఐఏఈఏ) గవర్నర్ల బోర్డ్‌కు 1994–95కాలంలో ఛైర్మన్‌గా సేవలందించారు. సొంతంగా ప్లుటోనియం తీసుకొచ్చి.. 1967 నుంచి భారత అణుపరీక్షలకు సంబంధించి ప్రాజెక్టుల్లో పనిచేయడం మొదలెట్టారు. 1974లో భారత్ తొలిసారిగా ఆపరేషన్ స్మైలింగ్ బుద్ద పేరిట అణుపరీక్షలు చేపట్టింది. ఆ మిషన్‌లో అణుశాస్త్రవేత్తగా కీలక భూమిక పోషించారు. ముంబై నుంచి ఫ్లుటోనియంను ఈయనే స్వయంగా రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌కు తీసుకొచ్చారు. 1998లో ఆపరేషన్ శక్తిపేరిట పోఖ్రాన్–2 అణుపరీక్షల సమయంలోనూ చిదంబరం న్యూక్లియర్ ఎనర్జీ బృందానికి సారథ్యం వహించారు. నాటి రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ) చైర్మన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్తో కలిసి పోఖ్రాన్ అణుపరీక్షను స్వయంగా పర్యవేక్షించారు. ఆనాడు 1998 మే 11 నుంచి మే 13వ తేదీ వరకు ఐదుసార్లు అణుపరీక్షలు జరిగాయి. దేశం కోసం అవిశ్రాంతంగా కృషిచేసినందుకు గుర్తింపుగా ఆయనకు భారత ప్రభుత్వం 1975లో పద్మ శ్రీతో, 1999లో పద్మవిభూషణ్‌తో సత్కరించింది. దేశవ్యాప్తంగా పలు విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లనూ పొందారు. జాతీయ, అంతర్జాతీయ సైన్స్ అకాడమీల్లో సభ్యునిగా ఉన్నారు. ఎందరో యువ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు ఈయన స్ఫూర్తిదాతగా నిలిచారు. చిదంబరంకు భార్య చెల్లా, కుమార్తెలు నిర్మల, నిత్య ఉన్నారు. Deeply saddened by the demise of Dr. Rajagopala Chidambaram. He was one of the key architects of India’s nuclear programme and made ground-breaking contributions in strengthening India’s scientific and strategic capabilities. He will be remembered with gratitude by the whole…— Narendra Modi (@narendramodi) January 4, 2025 -
ఇండియా- పాకిస్థాన్ మ్యాచ్‌లో మాఫియా డాన్ హత్యకు ప్లాన్!
క్రికెట్ స్టేడియంలో వేలాది మంది ప్రత్యక్షంగా మ్యాచ్ వీక్షిస్తుండగా ఒక మనిషిని చంపాలనుకోవడం సాధ్యమా? అదికూడా అంతర్జాతీయ స్థాయిలో పేరుమోసిన మాఫియా డాన్‌ను మట్టుబెట్టాలంటే మామూలు విషయమా? కానీ అలాంటి సాహసం చేసిందో మహిళ. ఆమె ఎవరు?, ఆమె చంపాలనుకున్న మాఫియా డాన్ ఎవరు?, అందుకు అతడిని చంపాలకుందనే వివరాలు తెలియాలంటే జర్నలిస్ట్ హుస్సేన్ జైదీ రాసిన ‘మాఫియా క్వీన్ ఆఫ్ ముంబై’ పుస్తకం చదవాల్సిందే.ఇంతకీ ఈ పుసక్తంలో ఏముంది?అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం (Dawood Ibrahim) పేరు అందరూ వినేవుంటారు. భారతదేశ వ్యవస్థీకృత నేర చరిత్రలో అత్యంత క్రూరుడిగా అతడు గుర్తింపు పొందాడు. 1993 బాంబే వరుస పేలుళ్లకు (Mumbai Serial Blasts) ప్రధాన సూత్రధారిగా దావూద్‌పై ఆరోపణలు ఉన్నాయి. అంతర్జాతీయ ఉగ్రవాద ముఠాలతో చేతులు కలిపి భారత వాణిజ్య రాజధాని ముంబై మహానగరంలో అతడు సాగించిన మారణహోమం ఎంతో మంది అమాయకులను బలిగొంది. అండర్‌వరల్డ్ కార్యకలాపాలు, మత్తుపదార్థాల రవాణా వంటి అరాచకాలతో చెలరేగిన అతడికి ఎంతో మంది శత్రువులయ్యారు. దావూద్ శత్రువుల్లో సప్నా దీదీ కూడా ఒకరు. అయితే ఈమె గురించి బయట ప్రపంచానికి పెద్దగా తెలియదు. ‘మాఫియా క్వీన్ ఆఫ్ ముంబై’ (Mafia Queens of Mumbai) పుస్తకంలో సప్నా దీదీ గురించి రాశారు.ఎవరీ స్వప్నా దీదీ?ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చిన వచ్చిన దేవతగా సప్నా దీదీని జర్నలిస్ట్ హుస్సేన్ జైదీ వర్ణించాడు. దావూద్ ఇబ్రహీం శత్రువైన ముంబై గ్యాంగ్‌స్టర్ హుస్సేన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా సప్నా దీదీ గురించి రాశాడతను. ప్రతీకారం తీర్చుకోవడానికి నేరుగా ముంబై అండర్‌వరల్డ్ చీకటి ప్రపంచంలోకి మెరుపులా దూసుకొచ్చిన వీర వనితగా పేర్కొన్నాడు.సప్నా దీదీ (Sapna Didi) ముంబైలోని సాంప్రదాయ ముస్లిం కుటుంబంలో జన్మించింది. ఆమె అసలు పేరు అష్రాఫ్. చాలా చిన్న వయస్సులోనే గ్యాంగ్‌స్టర్ మెహమూద్ ఖాన్‌తో ఆమెకు పెళ్లి జరిగింది. తన భర్తకు అండర్ వరల్డ్‌తో ఉన్న లింకులు ఆమెకు తెలియవు. దుబాయ్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన భర్తను ముంబై విమానాశ్రయంలో తన కళ్ల ముందే కాల్చి చంపడంతో ఆమె ప్రపంచం తలక్రిందులైంది. తన జీవితంలో ఎదురైన అతిపెద్ద షాక్ నుంచి బయటపడేందుకు సమాధానాల కోసం వెతుకుతుండగా ఆమెకు నిజం తెలిసింది. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ఆదేశాల మేరకే అతడి గ్యాంగ్ తన భర్తను పొట్టనపెట్టుకుందని తెలుసుకుంది. దావూద్ మాట విననందుకు ఈ దారుణానికి ఒడిగట్టారని తెలుసుకుని ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది.డీ-కంపెనీ ఆగడాలకు చెక్ముంబైలో దావూద్ ఇబ్రహీంకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న హుస్సేన్ జైదీని అష్రాఫ్ కలిసింది. దావూద్‌ను అంతమొందిచాలన్న తన లక్ష్యం గురించి చెప్పి, సహాయం చేయాలని అతడిని అర్థించింది. కొద్దిరోజుల్లోనే తుపాకీ కాల్చడం నేర్చుకుని రంగంలోకి దిగింది. దావూద్ పతనమే ధ్యేయంగా కొన్ని నెలల పాటు హుస్సేన్ జైదీతో కలిసి పనిచేసింది. నేపాల్ ద్వారా భారత్‌లోకి డీ-కంపెనీ పంపుతున్న అక్రమ ఆయుధాలను అడ్డుకున్నారు. పలు రకాలుగా డీ-కంపెనీ ఆగడాలకు చెక్ పెట్టారు. గ్యాంగ్‌స్టర్‌గా మారిన తర్వాత తన పేరును స్వప్నా దీదీగా మార్చుకుంది. బురఖా తొలగించి జీన్స్, షర్ట్ ధరించింది. బైక్ నడపడం, సులువుగా గన్ హ్యాండిల్ చేయడం వంటివి సులువుగా చేసేది. ముంబై దావూద్ వ్యాపారాలకు దెబ్బకొడుతున్న వ్యక్తిగా స్వప్నా దీదీ మెల్లమెల్లగా గుర్తింపు పొందింది. దీంతో దావూద్ అనుచరుల్లో భయం మొదలైంది.దావూద్ హత్యకు ప్లాన్మరోవైపు హుస్సేన్ జైదీతో ఆమె సంబంధాలు క్షీణించినప్పటికీ దావూద్‌ను చంపాలన్న నిర్ణయాన్ని మాత్రం ఆమె మార్చుకోలేదు. 1990 ప్రారంభంలో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య షార్జాలో జరిగిన వన్డే మ్యాచ్‌లో దావూద్‌ను హతమార్చేందుకు ప్లాన్ వేసింది. దావూద్ తరచుగా వీఐపీ ఎన్‌క్లోజర్ నుంచి క్రికెట్ మ్యాచ్‌లను చూసేవాడు. అతడు బహిరంగంగా కనిపించిన కొన్ని సందర్భాలలో ఇదీ ఒకటి. స్టేడియంలో ప్రేక్షకుల మధ్య దావూద్ హత్యకు ప్లాన్ చేసింది స్వప్న. తన అనుచరులను స్టేడియంలోకి పంపించి గొడుగులు, సీసాలు పగులగొట్టి దావూద్‌ను మట్టుబెట్టాలని అనుకుంది. ముందుగా దావూద్ అనుచరులపై దాడి చేసి గొడవ సృష్టించాలని, సందట్లో సడేమియాలా డాన్‌ను చంపాలని పథక రచన చేసింది.చదవండి: పదే పది నిమిషాలు.. "ఇదెక్కడి టార్చర్ భయ్యా..!"22 సార్లు కత్తితో పొడిచి హత్యదురదృష్టవశాత్తు ఆమె ప్లాన్ గురించి ముందే దావూద్ ఇబ్రహీంకు తెలిసిపోయింది. దీంతో దావూద్ తన అనుచరులతో ఆమెను దారుణంగా హత్య చేయించాడు. 1994లో ముంబైలోని తన నివాసంలో సప్నా దీదీని 22 సార్లు కత్తితో పొడిచి మర్డర్ చేశారు. దావూద్ ఇబ్రహీంకు భయపడి ఇరుగుపొరుగు వారెవరూ ఆమెను కాపాడటానికి ముందుకు రాలేదు. ఆస్పత్రికి తరలించే లోగా ఆమె ప్రాణాలు విడిచింది. ప్రస్తుతం ఆమె పేరు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. పెద్ద మాఫియాడాన్‌కు వ్యతిరేకంగా తెగువ చూపిన సప్నా దీదీ ఫొటో ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం. -
‘స్పీడ్ బ్రేకర్’ ప్రాణం పోసింది!
కొల్హాపూర్: వైద్యుడు నిర్లక్ష్యంగా ఓ రోగి చనిపోయాడని చెప్పినా ఒక స్పీడ్‌బ్రేకర్ (Speed Breaker) కారణంగా ఆ రోగి మళ్లీ బతికొచ్చిన వైనం మహారాష్ట్రలో (Maharashtra) చోటుచేసుకుంది. రెండు వారాల క్రితం జరిగిన ఈ వింత ఘటన తాలూకు వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. గత ఏడాది డిసెంబర్ 16వ తేదీన కొల్హాపూర్ జిల్లాలోని (Kolhapur District) కసాబా–బావడా ప్రాంతానికి చెందిన 65 ఏళ్ల పాండురంగ ఉల్పే అనే వ్యక్తికి గుండెపోటు రావడంతో వెంటనే హుటాహుటిన దగ్గర్లోని ఆస్పత్రిలో చేరారు.అయితే అప్పటికే ఆయన మృతిచెందినట్లు ఆ ఆస్పత్రిలోని వైద్యులు ప్రకటించారు. దీంతో మృతదేహాన్ని తిరిగి సొంతూరుకు తీసుకెళ్లేందుకు ఒక అంబులెన్సును సిద్ధంచేశారు. పాండురంగ పరమపదించారన్న వార్త అప్పటికే సొంతూరిలో పాకింది. వెంటనే బంధువులు, స్నేహితులు, తెల్సిన వాళ్లు ఇంటికి రావడం మొదలెట్టారు. అందరూ ఇంటి వద్ద వేచి చూస్తుండటంతో మృతదేహాన్ని త్వరగా ఇంటికి తరలించాలన్న ఆత్రుతలో అంబులెన్సుకు డ్రైవర్ వేగంగా పోనిచ్చాడు.మార్గమధ్యంలో రహదారిపై ఉన్న ఒక పెద్ద స్పీడ్‌బ్రేకర్‌ను చూడకుండా అలాగే వేగంగా పోనిచ్చాడు. దీంతో వాహనం భారీ కుదుపులకు లోనైంది. ఈ సమయంలో పాండురంగ శరీరం అటుఇటూ కదలిపోయింది. తర్వాత శరీరాన్ని స్ట్రెచర్‌పైకి సవ్యంగా జరిపేటప్పుడు పాండురంగ చేతి వేళ్లు కదలడం చూసి ఆయన భార్య హుతాశురాలైంది. వెంటనే అంబులెన్సుకు ఇంటికి బదులు దగ్గర్లోని మరో ఆస్పత్రికి పోనిచ్చి పాండురంగను ఐసీయూలో చేర్పించారు. ఆయన ఇంకా ప్రాణాలతో ఉన్నారని తేల్చిన అక్కడి వైద్యులు పాండురంగకు వెంటనే యాంజియోప్లాస్టీ చేశారు. రెండు వారాల తర్వాత ఆయన పూర్తిగా కోలుకుని సోమవారం ఇంటికొచ్చారు. దీంతో ఆశ్చర్యపోవడం అందరి వంతైంది. ‘‘ఆ స్పీడ్‌బ్రేకర్ లేకపోయి ఉంటే మా ఆయన ఇలా ఇంటికి కాకుండా నేరుగా శ్మశానానికే వెళ్లేవారు’’ అని పాండురంగ భార్య నవ్వుతూ చెప్పారు. బతికున్న రోగిని చనిపోయాడని సర్టిఫై చేసిన ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని పాండురంగ కుటుంబం నిర్ణయించుకుంది. త్వరలో ఆస్పత్రికి నోటీసులు పంపి కోర్టుకీడుస్తామని పేర్కొంది. -
మహారాష్ట్ర: సంజయ్ రౌత్‌పై కార్యకర్తల దాడి?
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం చోటుచేసుకుంది. శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్‌పై కార్యకర్తలు దాడి చేసినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే నివాసంలోనే ఆయనపై దాడి జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై సోషల్ మీడియా కథనాలు చర్చనీయాంశంగా మారాయి.ముంబైలోని బాంద్రాలో ఉన్న మాతోశ్రీలో ఉద్దవ్ థాక్రేతో సంజయ్ రౌత్ సమావేశమాయ్యారు. ఈ సమావేశం సందర్భంగా కొంత మంది పార్టీ కార్యకర్తలు సంజయ్‌తో వాగ్వాదానికి దిగినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో రౌత్.. వైఖరి, ఆయన వ్యాఖ్యల వల్లే పార్టీ తీవ్రంగా నష్టపోయినట్టు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓటమి చెందినట్టు కార్యకర్తలు చెప్పారు. దీంతో, వాగ్వాదం తలెత్తింది. ఇందులో భాగంగానే సంజయ్ రౌత్‌పై థాక్రే మద్దతుదారులు దాడి చేసినట్టు సమాచారం. అంతేకాకుండా, సంజయ్ రౌత్‌ను కొన్ని గంటల పాటు ఓ గదిలో ఉంచి తాళం వేసినట్టు తెలుస్తోంది.ఇక, సంజయ్ రౌత్‌పై దాడికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, దాడి ఘటన వార్తలపై ఉద్దవ్ థాక్రే కానీ, సంజయ్ రౌత్ గానీ ఇప్పటి వరకు స్పందించలేదు. దీంతో, ఈ ఘటనపై మహారాష్ట్రలో మరింత చర్చ జరుగుతోంది.ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో జరగబోయే బీఎంసీ ఎన్నికలపై ఉద్దవ్ థాక్రే కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బీఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు పార్టీ నేత ఆనంద్ దూబే చెప్పుకొచ్చారు. కాంగ్రెస్, శరద్ పవార్ ఎన్సీపీతో పొత్తు ఉండదని స్పష్టం చేశారు.There are multiple reports that Shiv Sena (UBT) workers have beaten Sanjay Raut by locking him in a room in Matoshree.Do you support this action of Shiv Sena workers ? pic.twitter.com/deVAEWRuCj— Megh Updates 🚨™ (@MeghUpdates) January 1, 2025 -
ఐస్‌క్రీమ్ బిర్యానీ...!
మీరు సరిగ్గానే చదివారు. ఐస్ క్రీమ్ బిర్యానీనే. బిర్యానీ అంటేనే మసాలా. ఇక ఐస్‌క్రీమ్.. తీపి. ఈ రెండింటికీ అభిమానులు ఎంతో మంది. అలాంటిది ఆ రెండు డిషెస్‌ను కలిపితే.. రుచెలా ఉంటుంది? రుచి సంగతి తెలియదు కానీ.. ఈ బిర్యానీని ముంబైకి చెందిన మహిళా కంటెంట్ క్రియేటర్ హీనా కౌసర్ తయారు చేశారు. వీడియోను ఇన్‌స్ట్రాగామ్‌లో షేర్ చేశారు. ఫొటోలో ఉన్న విధంగానే... హుండీలో బిర్యానీ... మధ్యలో స్ట్రాబెర్రీ ఐస్క్రీ స్కూప్. రెండు హుండీలను పట్టుకుని ఆమె వీడియోలో కనిపిస్తున్నారు. సాధారణంగా మసాలాలతో బంగారు వర్ణంలో ఘుమఘుమలాడే బిర్యానీ.. ఐస్‌క్రీమ్ రంగును పులుముకుని గులాబీ రంగులో మెరిసిపోతోంది. ఆ వీడియో ఇప్పుడు వైరలవుతోంది. ఆహార ప్రియులను విస్మయానికి గురిచేస్తోంది. హీనా సృజనాత్మకత ప్రత్యేకమైనదే అయినప్పటికీ, ఈ ప్రయోగం చాలా మంది ఆహార ప్రియులను అయోమయానికి గురిచేసింది. కంటెంట్ క్రియేటర్ హీనా బేకింగ్ అకాడమీని కూడా నడుపుతున్నారు. తన అకాడమీలో ఏడు రోజుల బేకింగ్ కోర్సు పూర్తయిన సందర్భంగా జరిగిన వేడుకల్లో భాగంగా ఈ ఫ్యూజన్ డిష్‌ను తయారు చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆరెస్సెస్ చీఫ్‌పై జ్యోతిర్మఠ్ శంకరాచార్య ఆగ్రహం
రాష్ట్రీయ స్వయంసేవక్ చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) పై జ్యోతిర్మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మందిర్-మసీద్ వివాదాలను ఉద్దేశించి భగవత్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. భగవత్‌కు హిందువుల మనోభావాలపై పట్టింపు లేనట్లు ఉందని అన్నారాయన. ఈ మేరకు ఓ జాతీయ ఛానెల్‌తో ఆయన మాట్లాడుతూ..‘‘అయోధ్య రామమందిర నిర్మాణం తర్వాత ఇలాంటి వివాదాలను రాజేసి తాము కూడా హిందూ నాయకులం కావచ్చని కొందరు వ్యక్తులు భావిస్తున్నారని మోహన్ భగవత్ అన్నారు. కానీ, సాధారణ హిందువులు అలా ఏనాడూ అనుకోరు. దేశంలో ఎన్నో ఆలయాలను కూల్చేశారు. ఇది జగమెరిగిన సత్యం. ఆయనకు(మోహన్ భగవత్‌కు) హిందువుల నొప్పేంటో పట్టన్నట్లు ఉంది. హిందువుల ప్రస్తుత దుస్థితి ఆయనకు అర్థం కావడం లేదు. ఆయన మాటలతో ఆ విషయం స్పష్టమైంది’’ అని అవిముక్తేశ్వరానంద సరస్వతి అన్నారు.భగవత్ ఏమన్నారంటే..ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ పుణే(Pune)లో జరిగిన ‘ఇండియా ది విశ్వగురు’ అనే కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ‘‘ఇటీవల కాలంలో మందిర్-మసీద్ వివాదాలు గణనీయంగా పెరగడం ఆందోళనకరం. అయోధ్య రామమందిర నిర్మాణం తర్వాత ఇలాంటి వివాదాలను రాజేసి తాము కూడా హిందూ నాయకులం కావచ్చని కొందరు వ్యక్తులు భావిస్తున్నారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ప్రతిరోజూ కొత్త వివాదం తీసుకొస్తున్నారు. వీటిని ఎలా అంగీకరించమంటారు?.. .. ఇది కొనసాగకూడదు. కలిసిమెలిసి ఎలా ఉంటామో భారత్ చూపించాలి. ప్రస్తుతం దేశం రాజ్యాంగం ప్రకారం నడుస్తోంది. దీనిలో ప్రభుత్వాన్ని నడిపే ప్రజాప్రతినిధులను వారే ఎన్నుకొంటారు. ఎవరో ఒకరి ఆధిపత్యం చేసే రోజులు ఎప్పుడో పోయాయి. ప్రతిఒక్కరూ తమను తాము భారతీయులుగా చెప్పుకొంటున్నప్పుడు ఆధిపత్యం భాష ఎందుకు..? ఎవరు మైనార్టీ..? ఎవరు మెజార్టీ..? ప్రతిఒక్కరూ సమానమే. ఎవరి ఇష్టమైన భగవంతుడి ఆరాధనను వారు పాటించడమే ఈ దేశ ఆచారం. కాకపోతే నిబంధనలు, చట్టాలకు లోబడి సామరస్యంగా జీవించడం అవసరం. అలాగే.. కలుపుగోలు సమాజాన్ని మనకు మంచింది. మన దేశం సామరస్యంగా ఉంటుందని ప్రపంచానికి చాటాల్సిన అవసరం ఉంది. మేం హిందువులం కాబట్టే రామకృష్ణ మిషన్(Rama Krishna Mission) లో కూడా క్రిస్మస్ వేడుకలు చేసుకొంటాం. మనం చాలాకాలంగా సామరస్యంగా ఉంటున్నాం. దీనిని మనం ప్రపంచానికి అందించాలనుకొంటే.. ఓ ఉదాహరణగా నిలవాలి’’ అని అన్నారు.👉ఇదిలా ఉంటే.. భగవత్ వ్యాఖ్యలపై జగద్గురు స్వామి రామభద్రచార్య సహా పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. భగవత్ తమ అనుచరుడి కాదని మండిపడ్డారు. ఆయన ఎంతోమంది భస్వాసురులను సృష్టించారని.. వాళ్లే ఆరెస్సెస్ నెత్తిన చెయ్యి పెడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. 👉మరోవైపు.. రాజకీయంగానూ ఈ వ్యాఖ్యలపై చర్చ నడిచింది. సామరస్యం పాటించాలని భగవత్ బీజేపీనే కోరుతున్నారని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఎద్దేవా చేశారు. యోగి ఆదిత్యానాథ్‌కు ఆయన(మోహన్ భగవత్) గనుక సూచిస్తే.. ఏ సర్వేలు. వివాదాలు ఉండవని అఖిలేష్ అన్నారు. మరోవైపు.. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ స్పందిస్తూ.. మోహన్ భగవత్‌ది ద్వంద్వ ధోరణి అని మండిపడ్డారు.ఇదీ చదవండి: ఈ పుణ్య క్షేత్రాల నగరం గురించి తెలుసా? -
Shyam Benegal: శ్యామ్ బెనగళ్‌కు తుది వీడ్కోలు
ముంబై: సీనియర్ సినీ దర్శకుడు శ్యామ్ బెనగళ్ అంత్యక్రియలు అధికార లాంఛనాలతో మంగళవారం ముగిశాయి. జాతీయ పతాకం, పూలమాలలతో కప్పిన ఆయన పారి్థవ దేహాన్ని మధ్యాహ్నం 3 గంటల సమయంలో దాదర్‌లోని శివాజీ పార్క్ శ్మశాన వాటికకు తీసుకొచ్చారు. పోలీసులు త్రీ గన్ సెల్యూట్ అనంతరం విద్యుత్ దహన వాటికలో దహనం చేశారు. అనంతరం పూజారులు పూజలు చేశారు. బెనగళ్‌కు కడసారి వీడ్కోలు పలికిన వారిలో భార్య నీరా, కుమార్తె పియాతోపాటు సినీ రంగానికి చెందిన నసీరుద్దీన్ షా, రంజిత్ కపూర్, కుల్‌భూషణ్ కర్బందా, ఇలా అరుణ్, గుల్జార్, జావెద్ అక్తర్, బొమన్ ఇరానీ, కునాల్ కపూర్ ఉన్నారు. ఈ సందర్భంగా నటుడు నసీరుద్దీన్ షా..‘శ్యామ్ సాహబ్, నేను, నా సర్వస్వం మీవే. మీకు రుణపడి ఉన్నాను. ఇంతకు మించి నేనేమీ చెప్పలేను’అంటూ ఉది్వగ్నం చెందారు. సినీ నిర్మాత గోవింద్ నిహలానీ కూడా తనేమీ మాట్లాడలేకపోతున్నానన్నారు. ‘14న 90వ బర్త్‌డేనాడు బెనగళ్ సార్ ఆఫీసుకు వెళ్లి బర్త్‌డే పాట పాడాం. గతంలో ఎప్పుడూ మేం ఆయనకు పుట్టిన రోజు వేడుక చేయకపోవడంతో ఆయన చాలా ఆశ్చర్యపోయారు. త్వరలోనే మరో సినిమాకు ప్లాన్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. అదే ఆయన చివరి చూపవుతుందని అస్సలు ఊహించలేదు’అని దర్శకుడు శ్యామ్ కౌశల్ విచారం వ్యక్తం చేశారు. ‘సినీ రంగంలో బెనగళ్ విప్లవం సృష్టించారు. మళ్లీ మరొకరు అలాంటిది చేయలేకపోయారు’అని సినీ రచయిత గుల్జార్ పేర్కొన్నారు. శ్యామ్ బెనగళ్ అనారోగ్యంతో ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. -
పుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లిన లారీ
పుణే: ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపై లారీ దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోగా ఆరుగురు గాయాలపాలయ్యారు. మహారాష్ట్రలోని పుణే నగరంలో ఆదివారం అర్ధరాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని అమరావతికి చెందిన కార్మికులు వారి కుటుంబాలతోపాటు రెండు రోజుల క్రితం ఉపాధి కోసం పుణేకు వచ్చారు. వఘోలి ప్రాంతంలోని కెస్నాడ్ ఫటా ఫుట్‌పాత్‌పై వీరంతా నిద్రిస్తున్నారు. అర్ధరాత్రి 12.55 గంటల సమయంలో అదుపు తప్పిన ఓ ట్రక్కు ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపైగా దూసుకెళ్లింది. ఘటనలో రెండేళ్లలోపు ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు చనిపోగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ గజానన్ టొట్రేను పోలీసులు అదుపులోకి తీసుకుని, ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఘటన సమయంలో అతడు మద్యం మత్తులో ఉన్నట్లు భావిస్తున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. -
తప్పతాగి ఫుట్‌పాత్‌పైకి ఎక్కించి.. పుణేలో ఘోరం
ముంబై: పుణేలో అర్ధరాత్రి ఘోరం జరిగింది. ఫుల్‌గా మద్యం సేవించిన ఓ వ్యక్తి ఫుట్‌పాత్‌పైకి ట్రక్కుతో దూసుకెళ్లాడు. ఈ ఘటనలో ఫుట్‌పాత్ నిద్రిస్తున్న ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరారు. ఆదివారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన చోటు చేసుకుంది.సుమారు ఒంటి గంట సమయంలో ఓ వ్యక్తి వాహనం నడుపుతూ వాఘోలి చౌక్ ఏరియాకు చేరుకున్నాడు. హఠాత్తుగా తన బండికి అక్కడే ఉన్న ఫుట్‌పాత్‌పైకి పోనిచ్చాడు. ఈ ఘటనలో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ముగ్గురు మృతి చెందారు. మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని.. నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రాణాలు పోవడానికి కారణమైనందుకు మోటార్ వెహికిల్స్ యాక్ట్‌తో పాటు బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.మృతుల్లో.. ఏడాది, రేండేళ్ల వయసున్న చిన్నారులు, విశాల్ పన్వర్(22) ఉన్నారు. అమరావతిలో నిర్మాణ పనుల కోసం వచ్చిన కూలీలు.. కేశ్నాథ్ ఫాటా ఏరియాలో ఫుట్‌పాత్‌పై పడుకున్నారని, వాళ్లపై నుంచి ట్రక్కు దూసుకెళ్లిందని, వాహనం నడిపిన వ్యక్తి బాగా తాగి ఉన్నాడని పోలీసులు వెల్లడించారు.#महाराष्ट्र के पुणे में भयानक सड़क हादसा..नशे में धुत #डंपर ड्राइवर ने फुटपाथ पर सो रहे 9 लोगों को कुचला, 3 की मौत#Maharashtra #Pune #accident #footpath #Dumper #drunkdriving pic.twitter.com/y71i5EtaAQ— mishikasingh (@mishika_singh) December 23, 2024Pune: Dumper Truck Driver Claims Three Lives, Injures Nine In Wagholi Near Kesnand Phata In a tragic incident on Pune’s Wagholi area near Kesnand phata, a speeding dumper truck ran over 12 people sleeping on a footpath, killing three and injuring nine. The accident, reportedly… pic.twitter.com/K6T09Om7v4— Pune Pulse (@pulse_pune) December 23, 2024 -
రోడ్డుకు రెండు దిక్కులా బారికేడ్లు ఎందుకు?
దాదర్: ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగితే ఇరు దిక్కుల మార్గంపై బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను ఎందుకు అడ్డుకుంటున్నారని బాంబే హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది. దీనివల్ల సామాన్య వాహన చోదకులు ఇబ్బందులు పడటమే కాకుండా అంబులెన్స్‌లు, ఫైరింజన్లు, పోలీసు వ్యాన్లు తదితర అత్యవసర సేవలు అందించే వాహనాలు ట్రాఫిక్‌లో ఇరుక్కుంటాయని పేర్కొంది. అప్పటికే జరగాల్సిన ప్రాణ, ఆస్తి నష్టం జరిగిపోతే అందుకు బాధ్యులెవరని పోలీసులను నిలదీసింది. మరోసారి ఇలా బారికేడ్లు ఏర్పాటుచేసి ఇరు దిక్కుల రోడ్లను మూసివేస్తే ఊరుకునేది లేదని, సంబంధిత పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. చుట్టూ తిరిగి వెళ్లాలి.. సాధారణంగా ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగితే బారికేడ్లు ఏర్పాటుచేసి ప్రమాదం జరిగిన రోడ్డును మూసివేస్తారు. కానీ ఇటీవల కాలంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ బారికేడ్లు అడ్డంగా పెట్టి ఇరు దిక్కుల రోడ్లను మూసివేస్తున్నారు. దీంతో గత్యంతరం లేక వాహన చోదకులు చాలా చుట్టూ తిరిగి వెళ్తుంటారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు వెంటనే తరలించినప్పటికీ మృతుల పంచనామా పనులు పూర్తయ్యేంత వరకు రోడ్డును మూసి ఉంచుతారు. ట్రాఫిక్ జామ్ కారణంగా అంబులెన్స్‌లు కూడా సకాలంలో సంఘటన స్థలానికి చేరుకోలేక పోతున్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. అప్పటికే కొన ఊపిరితో ఉన్న క్షతగాత్రులు వెంటనే వైద్యం అందక ప్రాణాలు వదులుతారని ఆందోళన వ్యక్తంచేసింది. ప్రమాదం జరిగిన రోడ్డును మూసి వేయాలి కానీ అనేక సందర్భాల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటుచేసి రెండు దిక్కుల వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నారని, ఇలా ఎందుకు చేస్తున్నారని కోర్టు ప్రశ్నించింది. వందల వాహనాలు వెనక్కి ఇటీవల పశ్చిమ ఎక్స్‌ప్రెస్ వేపై ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక దహిసర్ పోలీసులు రెండు దిక్కులా బారికేడ్లు పెట్టి రాకపోకలను నిలిపివేశారు. మరో సంఘటనలో 2024, నవంబరు 8వ తేదీన పావస్కర్ రోడ్డుపై ప్రమాదం జరిగింది. ఇరు దిక్కులా బారికేడ్లు ఏర్పాటుచేసి వాహనాలను నిలిపివేశారు. ఫలితంగా వందలాది వాహనాలను వెనక్కి పంపించారు. ఫలితంగా అందులో ప్రయా ణిçస్తున్న వేలాది మంది సామాన్యులు, వ్యాపారులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిపై కైలాస్ చోగ్లే బాంబే హైకోర్టులో ప్రజా వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తులు జస్టిస్ బి.పి.కులాభావాల, జస్టిస్ సోమశేఖర్ సుందర్సేన్ల ధర్మాసనం విచారణ జరిపింది. రోడ్డు ప్రమాదం జరిగిన చోట లేదా పంచనామా, దర్యాప్తు జరుగుతున్న చోట బారికేడ్లు ఏర్పాటు చేయాలని, దర్యాప్తు పనులు పూర్తికాగానే వాటిని వెంటనే తొలగించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించాలని సూచించింది. లేదంటే చర్యలు తప్పవని న్యాయమూర్తుల ధర్మాసనం హెచ్చరించింది. -
ముంబై పడవ ప్రమాదం: అమ్మను కాపాడుకోలేక పోయా.. గౌతమ్ గుప్తా
సాక్షి, ముంబై: ముంబై గేట్ వే ఆఫ్ ఇండియా సమీపంలో జరిగిన పడవ ప్రమాదం ఘటనలో అనేక మంది తమ ఆతీ్మయులను బంధుమిత్రులను కోల్పోగా మరికొందరు సురక్షితంగా బయటపడ్డారు. పర్యాటకులతో బయల్దేరిన నీల్కమల్ అనే పడవను నేవీ బోట్ ఢీ కొట్టిన ఘటనలో నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులతోపాటు మొత్తం 13 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన ముంబైతోపాటు దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో బయటపడ్డ కొందరు మీడియాకు తెలిపిన వివరాలు అక్కడి పరిస్థితి ఎంత హృదయవిదారకంగా ఉన్నాయో చెబుతున్నాయి. చావు దగ్గరికి వెళ్లి బయటిపడిన వారు చెప్పిన వివరాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం. ప్రమాదంలో 14 నెలల చిన్నారి.. పడవ ప్రమాదంలో వైశాలి అడకణేతోపాటు వారి కుటుంబీకులు సురక్షితంగా బయటపడ్డారు. ముంబై కుర్లాలో నివసించే వైశాలి తన 14 నెలల కుమారుడిని రక్షించుకునేందుకు ప్రయతి్నంచింది. అనంతరం ఆమె సోదరుడు అంటే చిన్నారి మేనమామ తన భుజంపై ఆ పాపను సుమారు 30 నిమిషాలపాటు సముద్రం నీటిలో ఈదుతూ బయటపడ్డట్టు తెలిపింది. ‘నాతోపాటు మొత్తం ఎనిమిది మంది పడవలో ఎలిఫెంటా బయల్దేరాం. అయితే పడవలో బయల్దేరిన కొద్ది సేపటికి ఒక్కసారిగా ఓ నేవీ స్పీడ్ బోట్ వేగంగా చక్కర్లు కొడుతూ మా పడవను వేగంగా ఢీ కొట్టింది. ఢీ కొట్టిన తర్వాత అసలేం జరుగుతుందనేది ఎవరికీ అర్థం కాలేదు. పడవ నడిపేవారు వెంటనే వారి వద్ద ఉన్న లైవ్జాకెట్లను అందరికీ అందించారు. కానీ చాలామంది ఉండటంతో కొందరికి మాత్రమే జాకెట్లు అందాయి. ఇది జరిగిన కొంత సమయానికి ఒకవైపు పడవ సముద్రంలోకి ఒరగడం ప్రారంభమైంది. దీంతో పడవ క్రమంగా మునగసాగింది. అరుపులు పెడ»ొబ్బలతో పడవలోని పరిసరాలు భయాందోళనలు రేకేత్తించాయి. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే మేమందరం సముద్రంలో పడిపోసాగాం. కొందరు పడవలోనే ఉండిపోయారు. అయితే తాము సముద్రంలో పడిపోగానే పడవను పట్టుకున్నాం. చావు ముందు ఉన్నాం. ఏం చేయాలో తెలియడంలేదు. నా చేతిలో 14 నెలల బాబు ఉన్నాడు. ఎలాగైనా బాబును బతికించుకోవాలని మనసులో అనుకున్నాను. అంతలోనే నా అన్న బాబుని తన భుజం పైకెత్తుకున్నారు. నీళ్లలో ఉండి ఒక చేత్తో పడవను మరో భుజంపై నా బాబును ఇలా సుమారు 30 నిమిషాలపాటు అలాగే ఉన్నాడు. ఇక మా మరణం తప్పదని అనుకునే సమయంలోనే రెండు మూడు పడవలు మావైపు వచ్చాయి. అనంతరం ఆ బోటులోని వారు మమ్మల్ని సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. ఇంకా ఐదు నిమిషాలు ఆలస్యమై ఉంటే మేమంతా చనిపోయేవాళ్లం’ అంటూ కన్నీరుమున్నీరయ్యారు. మరోవైపు ఈ ఘటనలో ఓ ఇద్దరు విదేశీయులు కూడా తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా పలువురిని కాపాడినట్టు వైశాలి మీడియాకు తెలిపారు. అమ్మను కాపాడుకోలేక పోయా: గౌతమ్‌గుప్తా ఈ పడవ సంఘటన సమయంలో అసలేం జరిగిందనేది ఈ ఘటనకు సంబంధించిన వీడియో తీసిన గౌతమ్‌గుప్తా మీడియాకు తెలిపారు. ఈ ఘటన అనంతరం ఆయన తీసిన వీడియో ద్వారానే అందరికీ ప్రమాదం విషయం తెలిసింది. ముంబైలో నివసించే గౌతమ్ గుప్తా తన తల్లి రామాజీదేవి, చెల్లి రీతాలతో కలిసి ఎలిఫెంటా వెళ్లేందుకు నీల్కమల్ పడవలో బయల్దేరారు. పడవ పైభాగంలో కూర్చున్న గౌతమ్ పడవలో నుంచి సముద్ర ప్రయాణం దృశ్యాలని వీడియోతోపాటు ఫొటోలు తీశారు. అంతలోనే ఓ స్పీడ్ బోట్ సముద్రంలో చక్కర్లు కొట్టడం గమనించారు. ఆ స్పీడ్ బోటును వీడియో తీయసాగారు. ‘ఒక్కసారిగా వేగంగా ఆ పడవవైపు బోట్ రావడం చూశాను. కానీ అసలు ఊహించలేదు. ఆ స్పీడ్ బోటు వేగంగా మేమున్న పడవనే వేగంగా ఢీ కొడుతుందను కోలేదు. ఈ సంఘటన అనంతరం మేం ముగ్గురం నీటిలో పడిపోయాం. అనంతరం ఇతర బోటులోని కొందరు నన్ను మా చెల్లి రీతాను సురక్షితంగా బయటికి తీశారు. కానీ మా అమ్మ గురించి మాత్రం తెలియరాలేదు’ అంటూ బోరుమన్నారు. ప్రమాదంలో తెలంగాణ వాసి మృతి పడవ ప్రమాదంలో కొందరు తెలుగువారు కూడా ఉన్నారని తెలిసింది. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అందించిన వివరాల ప్రకారం ఈ ప్రమాదంలో తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌కు చెందిన నేవీ ఉద్యోగి ప్రవీణ్‌కుమార్ శర్మ (34) మృతి చెందారు. ప్రవీణ్ కుమార్ శర్మ నేవీలో బోట్ మెకానిక్‌గా 14 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. జీవితంలో పడవ ఎక్కను ఘటనలో పలువురు తెలుగువారు మరణం అంచుల దాకా వెళ్లొచ్చి..ఎలిఫెంటా గుహలకు వెళ్లడానికి బోట్ ఎక్కాను. కానీ అదృష్టవశాత్తు బయటపడ్డానని అనిల్‌కుమార్ (35) ఓ మరాఠీ పత్రికకు తెలిపారు. ముంబైలో ఓ పని ఉండటంతో వచ్చానని, ఈ సందర్భంగా ఎలిఫెంటా కేవ్స్ చూద్దామని బయల్దేరినట్లు చెప్పారు. పడవ బయల్దేరిన కొద్ది సేపటికే ప్రమాదం జరిగిందని, అయితే అదృష్టం కొద్దీ బయటపడ్డానన్నారు. ఇక భవిష్యత్‌లో తానెప్పుడూ పడవ ఎక్కనని చెప్పారు. -
మీరూ ఏదో ఒకరోజు సీఎం అవుతారు
నాగ్‌పూర్: మీరు ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుంటారని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్నుద్దేశిస్తూ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ వ్యా ఖ్యానించారు. గురువారం నాగ్‌పూర్‌లో మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలనుద్దేశిస్తూ గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా సీఎం ఫడ్నవిస్ మాట్లాడారు. సభలో ఉన్న అజిత్ పవార్, మరో డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేలనుద్దేశిస్తూ ప్రసంగించారు. ‘‘ తెల్లవారుజామునే నిద్రలేచే అజిత్ పవార్ అప్పట్నుంచే ప్రజాసేవకు అంకితమవుతారు. ఫైళ్లు తిరగేస్తారు. నేను మాత్రం మధ్యాహ్నం 12 గంటల నుంచి పని మొదలుపెడతా. అయితే ఏక్నాథ్ షిండే మాత్రం అర్ధరాత్రిదాకా పనిచేస్తారు. చాన్నాళ్లుగా డిప్యూటీ సీఎం పదవిలో ఉంటూ అజిత్ పవార్‌కు ‘శాశ్వత ఉపముఖ్యమంత్రి’ పేరు స్థిరపడిపోయింది. కానీ నేను మాత్రం ఒక్కటే ఆశిస్తున్నా. అజిత్ ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి పదవిలో కూర్చుంటారు’’ అని ఫడ్నవిస్ అన్నారు. ఎన్సీపీ చీఫ్ అయిన అజిత్ పవార్ ఈనెల ఐదో తేదీన ఆరోసారి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించడం తెల్సిందే. ఎప్పట్నుంచో ముఖ్యమంత్రి కుర్చీపై కన్నేసిన అజిత్ ఆ లక్ష్యసాధనలో భాగంగా బాబాయి శరద్‌పవార్ సారథ్యంలోని ఎన్సీపీని చీల్చి బీజేపీతో చేతులు కలిపిన విషయం విదితమే. పార్టీని చీల్చినా సరే మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తనవైపే రావడంతో కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంతో ఎన్సీపీ పార్టీ గుర్తు, ఎన్నికల చిహ్నం రెండూ అజిత్‌కే దక్కాయి. ఇటీవల లోక్‌సభ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ అజిత్ వర్గమే అత్యధిక స్థానాల్లో గెలిచి తమదే అసలైన ఎన్సీపీ అని నిరూపించుకుంది. -
భారీస్థాయిలో సిద్ధేశ్వర అగ్రికల్చరల్ షో, క్యాట్ అండ్ డాగ్ షో కూడా
సోలాపూర్: పట్టణంలోని ఓం మైదానంలో డిసెంబర్ 21 నుంచి డిసెంబర్ 25 వరకూ వ్యవసాయ ప్రదర్శన నిర్వహించనున్నట్లు శ్రీ సిద్దేశ్వర దేవస్థానం ట్రస్ట్ చైర్మన్ ధర్మరాజు కాడాది తెలిపారు. స్మార్ట్ ఎక్స్ పో గ్రూప్ నేతృత్వంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ, ఆత్మా, జిల్లా పరిషత్ విభాగం సహకారంతో ఐదు రోజుల పాటు నిర్వహించనున్న ఈ వ్యవసాయ ప్రదర్శనలో భాగంగా 300 స్టాల్స్‌ను ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. మంగళవారం నిర్వహించిన సమావేశంలో వ్యవసాయ ప్రదర్శనకు సంబంధించిన విశేషాలను గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వ్యవసాయ పరిశోధన కేంద్రం, సోలాపూర్ దానిమ్మ పరిశోధన కేంద్రం, జొన్న పరిశోధన కేంద్రం, వ్యవసాయ విజ్ఞాన కేంద్రం సోలాపూర్ , మోహల్ డివిజన్, సిల్క్ ఖాదీ గ్రామద్యోగ్ పరిశ్రమలు, పశుసంవర్ధక, సామాజిక అటవీ, జాతీయ బ్యాంకులు, నాబార్డ్, చక్కెర కర్మాగారాల సహకారంతో ఈ ప్రదర్శనను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కొత్త వ్యవసాయ సాంకేతిక ఉత్పత్తులు, వ్యవసాయ యాంత్రికీకరణ, పాల ఉత్పత్తి, సెరికల్చర్, తేనెటీగల పెంపకం, అగ్రి బిజినెస్,వర్టికల్ ఫారి్మంగ్, ఆధునిక వ్యవసాయ పనిముట్లకు సంబంధించి వివరణాత్మక సమాచారాన్ని రైతులు సులభంగా పొందగలుగుతారని చెప్పారు. ఈ వ్యవసాయ ప్రదర్శనలో సోలాపూర్‌కు గర్వకారణమైన ఖిలార్ ఎద్దులు, ఆవులతోపాటు ప్రపంచంలోనే అరుదైన, అత్యంత పొట్టి రకమైన పుంగనూరు దేశీయ ఆవులను కూడా ప్రదర్శించనున్నట్లు ధర్మరాజు కాడాది పేర్కొన్నారు. సోలాపూర్, నాసిక్, పుణే రైతులు ఉత్పత్తి చేసిన దాదాపు 500 రకాల అరుదైన దేశవాళీ విత్తనాల ప్రదర్శన, విక్రయాలను చేపట్టనున్నట్లు తెలిపారు.క్యాట్, డాగ్ షో అలాగే డిసెంబర్ 22న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు క్యాట్, డాగ్ షో పోటీలు సాయంత్రం విజేతలకు బహుమతి ప్రదానం జరుగుతుందని, డిసెంబర్ 23న రాష్ట్రస్థాయి దేశవాళీ ఆవులు, ఎద్దుల ప్రదర్శన, పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేస్తామని వివరించారు. అదేరోజున పుష్ప ప్రదర్శన కూడా జరుగుతుందని ధర్మరాజు కాడాది వివరించారుప్రదర్శనకు సంబంధించిన ఇతర విశేషాలు.. 300 కు పైగా కంపెనీల హాజరు ప్రముఖ కంపెనీల ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు, వాహనాల ప్రదర్శన. భయనా నుంచి ప్రత్యేకంగా తీసుకువస్తున్న ఆరు కిలోల కోడి ప్రపంచంలోనే అతి పొడవైన దేశీయ మిరపకాయల ప్రదర్శన ప్రత్యేక హాలులో ఆర్గానిక్ ఫార్మింగ్, యానిమల్, బర్డ్, ఫ్లవర్ ఎగ్జిబిషన్ రైస్ ఫెస్టివల్, వ్యవసాయ సాహిత్య ప్రదర్శన -
పర్యాటక పడవను ఢీకొట్టిన నేవీ బోట్
ముంబై: ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాన్ని వీక్షించేందుకు బయల్దేరిన ప్రయాణికులు అనూహ్యంగా పడవ ప్రమాదంలో జలసమాధి అయ్యారు. 13 మంది ప్రాణాలను బలితీసుకున్న ఈ ఘోర పడవ ప్రమాదం దేశ ఆర్థిక రాజధాని ముంబై సమీపంలోని అరేబియా సముద్రజలాల్లో బుధవారం మధ్యాహ్నం నాలుగుగంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. ముంబై పోలీసులు, భారతీయ నావికాదళం తెలిపిన వివరాల ప్రకారం దాదాపు 100మందికిపైగా పర్యాటకులతో ‘నీల్కమల్’ పర్యాటక పడవ ముంబైలో ‘గేట్ వే ఆఫ్ ఇండియా’ నుంచి బయల్దేరి ఎలఫెంటా ఐలాండ్‌కు వెళ్తోంది. కరంజా ప్రాంతానికి రాగానే శరవేగంగా వచ్చిన భారత నేవీకి చెందిన ఒక బోట్ ఈ పడవను ఢీకొట్టింది. దీంతో పర్యాటకుల పడవ మునిగిపోయింది. తప్పించుకునే వీలులేక 13 మంది ప్రాణాలు కోల్పోయారు. నీటలో పడ్డ ప్రయాణికులను రక్షించేందుకు నావికా, తీర గస్తీ దళాలు రంగంలోకి దిగాయి. 99 మందిని ఈ దళాల సహాయక బృందాలు కాపాడాయి. నాలుగు నేవీ హెలికాప్టర్లు, 11 నావల్ క్రాఫ్ట్‌లు, ఒక తీర గస్తీ బోటు, మూడు మెరైన్ పోలీస్ బోట్లు ముమ్మర గాలింపు చర్యల్లో నిమగ్నమయ్యాయి. మొత్తంగా 99 మందిని కాపాడినట్లు వార్తలొ చ్చాయి. గాయపడిన వారిని వెంటనే దగ్గర్లోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరణించిన వారిలో ఒక నేవీ అధికారి, ఇద్దరు నేవీక్రాఫ్ట్ కొత్త ఇంజన్ సంబంధిత నిపుణులు ఉన్నట్లు ఇండియన్ నేవీ తెలిపింది. కొత్త ఇంజన్‌ను నేవీక్రాఫ్ట్కు బిగించి పరీక్షిస్తున్న సమయంలో బోట్ అదుపుతప్పి మెరుపువేగంతో ప్రయాణించి అటుగా వెళ్తున్న పర్యాటక పడవను ఢీకొట్టిందని నేవీ ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. 101 మందిని కాపాడినట్లు మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు.Mumbai boat accident VIDEO । बोटींच्या अपघाताचा EXCLUSIVE थरारक व्हिडीओ #NDTVMarathi #MumbaiBoatAccident #gatewayofindia pic.twitter.com/aQsaWhGRCs— NDTV Marathi (@NDTVMarathi) December 18, 2024VIDEO CREDITS: NDTV Marathi एलिफंटाकडे जाणारी प्रवासी बोट उलटली;बचावकार्य युद्धपातळीवर सुरु #gatewayofindia #eliphanta #Inframtb @TheMahaMTB pic.twitter.com/Oo3DtaKxp5— Gayatri Shrigondekar (@GShrigondekar) December 18, 2024 -
‘మీరు చెప్పిందల్లా చేయడానికి కీలు బొమ్మను కాను!’
ముంబై: ఎన్సీపీ అధినేత, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్‌కు భారీ షాక్ తగిలింది. మంత్రి పదవి దక్కకపోవడంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న సీనియర్ నేత ఛగన్ భుజ్‌బల్.. బహిరంగంగా అసంతృప్తి వెల్లగక్కారు. ఇప్పుడు ఈ అంశం మహా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.ఛగన్(77) ఓబీసీ సామాజిక వర్గపు బలమైన నేత. మొన్నటి ఎన్నికల్లో యోలా నుంచి ఘన విజయం సాధించారాయన. ఇక మహాయుతి కూటమిలో ఎన్సీపీ-అజిత్ వర్గం తరఫున ఆయనకు మంత్రి పదవి దక్కవచ్చనే ఖాయమని చర్చ నడిచింది. అయితే అలా జరగలేదు. పైగా రాజ్యసభకు పంపిస్తాం.. రాజీనామా చేయండి అంటూ ఓ ప్రతిపాదన చేశారు. దీంతో అవమాన భారంతో రగిలిపోతున్నారాయన.నాసిక్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నేను మంత్రివర్గంలో ఉండాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కూడా కోరుకున్నారు. కానీ, కొందరి వల్ల అది జరగలేదు. మంత్రి పదవి దక్కకపోవడం కంటే.. నాకు ఎదురైన అవమానమే నన్ను ఎక్కువగా బాధిస్తోంది’’ అని ఆవేదనపూరితంగా మాట్లాడారాయన.ఈ క్రమంలో పార్టీలో ఇంతకు ముందు ఎదురైన చేదు అనుభవాలను ఆయన ప్రస్తావించారు. లోక్‌సభ ఎన్నికల్లో నాసిక్ నుంచి నేను పోటీ చేయాలని మోదీ, అమిత్ షా పట్టుబట్టారు. అందుకు నెలపాటు ప్రిపేర్ అయ్యాను. తీరా ఎన్నికలొచ్చేసరికి.. నాకు సీటు ఇవ్వలేదు. రాజ్యసభ సీటు ఇవ్వమని కోరాను. కానీ, సునేత్రా.. నితిన్ పాటిల్ పేర్లు పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నా. నా అనుభవం రాజ్యసభలో పనికి వస్తుందని చెబితే.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలన్నారు. తీరా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాక ఇప్పుడు రాజ్యసభ సీటు ఇస్తామంటున్నారు. అందుకోసం నితిన్ పాటిల్‌ను రాజీనామా చేయిస్తారట... నేనేం వాళ్ల చేతుల్లో కీలు బొమ్మను అనుకుంటున్నారా?. వాళ్లు నిల్చోమంటే నిల్చుని.. కూర్చోమంటే కూర్చోని.. రాజీనామా చేయమంటే రాజీనామా చేస్తే నా నియోజకవర్గ కార్యకర్తలు నా గురించి ఏమనుకుంటారు?’’ అని మండిపడ్డారాయన. అయితే ఈ క్రమంలో ఎక్కడా ఆయన అజిత్ పవార్ పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం.బుధవారం తన నియోజకవర్గంలో నేతలు, కార్యకర్తలతో చర్చించిన తర్వాత తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారాయన. అయితే రెండు, మూడేళ్లు ఎమ్మెల్యేగా పని చేసిన తర్వాతే రాజ్యసభ సభ్యత్వం గురించి ఆలోచిస్తానని ఆయన చివర్లో చెప్పడం కొసమెరుపు. రాజకీయాల్లోకి రాకముందు ఛగన్ భుజ్‌బల్.. మార్కెట్లో కూరగాయలు, పండ్లు అమ్ముకునే చిరువ్యాపారి. శివసేన ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి, బాల్ థాక్రే సిద్ధాంతాలకు ఆకర్షితుడై అందులో చేరాడు. కార్పొరేటర్ స్థాయి నుంచి మేయర్ స్థాయికి ఎదిగారు. ఆపై శివసేన తరఫున ఎమ్మెల్యేగానూ రెండుసార్లు నెగ్గారు. కాంగ్రెస్ వేటు వేయడంతో శరద్ పవార్ ఎన్సీపీని స్థాపించగా.. భుజ్‌బల్ అందులో చేరారు. గతంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా, పలు శాఖలకు మంత్రిగానూ ఆయన పని చేశారు. -
వివాహబంధంతో ఒక్కటైన 37 జంటలు
సోలాపూర్: సోలాపూర్ రూరల్ అసెంబ్లీ సెగ్మెంట్ శాసనసభ్యుడు సుభాష్ దేశ్‌ముఖ్ నేతృత్వంలో లోకమంగల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామూహిక వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. బీజాపూర్ రోడ్డు వైపునున్న డీఈడీ కళాశాల మైదానంలో పట్టణంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల సమక్షంలో 37 జంటలు వివాహబంధంతో ఒక్కటయ్యాయి. ఈ సందర్భంగా సాంప్రదాయబద్ధంగా ముస్తాబైన వధూవరులను గుర్రపు బగ్గీల్లో, బ్యాండ్ బాజాలతో ఊరేగించారు. ఈ వివాహ వేడుకల్లో ఎమ్మెల్యే సుభాష్ దేశముఖ్, మాజీ ఎంపీ జయసిద్ధేశ్వర మహాస్వామి, లోకమంగల్ ఫౌండేషన్ అధ్యక్షుడు రోహన్ దేశముఖ్, మనీష్ దేశముఖ్, పంచాక్షరి శివాచార్య మహాస్వామిజీ, శ్రీకాంత్ శివచార్య మహాస్వామి, సిద్ధ లింగ మహాస్వామి లతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఇకపై ప్రతిగ్రామంలో నిర్వహిస్తాం: ఎమ్మెల్యే సుభాష్ దేశ్‌ముఖ్ భవిష్యత్తులో లోకమంగల్ ఫౌండేషన్ దక్షిణ సోలాపూర్ రూరల్ అసెంబ్లీ సెగ్మెంట్ లోని ప్రతి గ్రామంలో సామూహిక వివాహాలను నిర్వహించాలని సంకల్పించినట్లు సుభాష్ దేశ్‌ముఖ్ వెల్లడించారు. వివాహం చేసుకోదలచిన జంటలు ముందస్తుగా తమ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామపంచాయితీ మెంబర్ల ద్వారా లోక్‌మంగల్ ఫౌండేషన్‌ను సంప్రదించాలని కోరారు. ఒక్కో గ్రామం నుంచి కనీసం ఐదు జంటలు లేదా అంతకుమంచి ఎందరు ముందుకు వచ్చినా వారిని వివాహబంధంతో ఒక్కటి చేస్తామని, వివాహ వేడుకల నాడు గ్రామప్రజలందరికీ విందును కూడా ఏర్పాటుచేయనున్నట్లు వివరించారు. -
ఏ–332 ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులు మళ్లీ మొదలు
దాదర్: కుర్లాలో ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన ఏ–332 బెస్ట్ బస్సు తిరిగి రోడ్డెక్కింది. గతవారం ప్రమాదం నేపథ్యంలో కుర్లా బస్ డిపోలో ఈ బస్సుకు గత ఐదారు రోజుల నుంచి మరమ్మతులు జరుగుతున్నాయి. పనులు పూర్తి, పరీక్షలు సఫలం కావడంతో తిరిగి ఈ బస్సు రాకపోకలు సాగించేందుకు అధికారులు అనుమతినిచ్చారు. గత సోమవారం రాత్రి 9.35 గంటల ప్రాంతంలో పశ్చిమ దిశలో కుర్లా రైల్వే స్టేషన్ నుంచి అంధేరీ దిశగా బయలుదేరిన ఏ–332 నంబరు ఎలక్ట్రిక్ ఏసీ బస్సు ఎల్బీఎస్ రోడ్డుపై అదుపు తప్పింది. అడ్డువచ్చిన అనేక వాహనాలను ఢీ కొడుతూ వేగంగా ముందుకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందగా, 42 మంది తీవ్రంగా గాయపడ్డారు. బెస్ట్ అధికారులు, పోలీసులు వెంటనే రంగంలోకి దిగి తగిన చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గురైన బస్సును కుర్లా బస్ డిపోకు తరలించారు. ముందు జాగ్రత్త చర్యగా మరుసటి రోజు అంటే మంగళవారం రోజున కుర్లా రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరే బస్సులన్నింటినీ నిలిపివేశారు. ఇప్పటికే బెస్ట్ సంస్ధలో బస్సుల కొరత తీవ్రంగా ఉండటంతో సాధారణ మరమ్మతుల నిమిత్తం డిపోకి వచ్చిన బస్సులను సాధ్యమైనంత త్వరగా మరమ్మతులు పూర్తిచేసి పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు తనిఖీల అనంతరం గత వారం రోడ్డు ప్రమాదానికి గురైన ఏ–332 బస్సును కూడా వెంటనే రోడ్డెక్కించారు. ఈ విషయం తెలుసుకున్న అనేక మంది ప్రయాణికులు కుర్లా స్టేషన్ బస్టాండ్‌లో ఆగి ఉన్న బస్సును చూడడానికి గుమిగూడారు. గత సోమవారం రాత్రి ప్రమాడానికి గురైన బస్సు ఇదేనంటూ చర్చించుకున్నారు. కొందరైతే ఈ బస్సులో ఎక్కేందుకు ముఖం చాటేశారు. -
మహారాష్ట్రలో కొలువుదీరనున్న కేబినెట్.. శివసేన నుంచి ముగ్గరు ఔట్!
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహాయుతి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయగా.. షిండే, పవార్ డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేశారు. కాగా, నేడు మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో ఎవరికి ఏయే శాఖలు దక్కుతాయనే సస్పెన్స్ నెలకొంది.మహారాష్ట్రలోని నాగపూర్‌లో నేడు మంత్రివర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో కూటమిలో ఉన్న పార్టీలకు ఏయే శాఖలు దక్కుతాయనే ఉత్కంఠ నేతల్లో నెలకొంది. కేబినెట్లో ఎక్కువ స్థానాలు బీజేపీకి దక్కే అవకాశం ఉంది. ఇక, శివసేన నుంచి 13 మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కుతాయనే చర్చ నడుస్తోంది.ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన నుంచి పలువురు కొత్త ముఖాలు మంత్రివర్గంలో చేరే అవకాశం ఉంది. సంజయ్ శిర్సత్, భరత్ గోగావాలే, ప్రకాష్ అబిత్కర్, యోగేష్ కదమ్, ఆశిష్ జైస్వాల్, ప్రతాప్ సర్నాయక్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇదే సమయంలో గత ప్రభుత్వంలో శివసేన నుంచి మంత్రులుగా ఉన్న దీపక్ కేసర్కర్, తానాజీ సావంత్, అబ్దుల్ సత్తార్‌తో సహా కొంత మందికి కేబినెట్లో స్థానం లేనట్టుగా సమాచారం.మరోవైపు.. కూటమిలోని ఎన్సీపీకి చెందిన అదితి తట్కరే, బాబాసాహెబ్ పాటిల్, దత్తాత్రే భరణే, హసన్ ముష్రిఫ్, నరహరి జిర్వాల్లు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఇక, బీజేపీ నుంచి నితేష్ రాణే, శివేంద్ర రాజే, గిరీష్ మహాజన్, మేఘనా బోర్దికర్, పంకజా ముండే, జయకుమార్ రావల్, మంగళ్ ప్రభాత్ లోధాకు కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉంది.ఇక, మహాయుతి ప్రభుత్వంలో కాషాయ పార్టీకి 20 కేబినెట్ బెర్త్‌లు కేటాయించబడినప్పటికీ అన్ని స్థానాలను భర్తీ చేయడంలేదని తెలుస్తోంది. రానున్న రోజుల్లో కొత్త వారికి ఛాన్స్ ఇచ్చేందుకు ఆయా స్థానాలను వదిలేస్తున్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. మరోవైపు.. మహారాష్ట్ర కేబినెట్ విస్తరణలో భాగంగా బీజేపీకి హోంశాఖ.. శివసేనకు హౌసింగ్ మంత్రిత్వ శాఖను అప్పగించే అవకాశం ఉన్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
మళ్లీ మళ్లీ వెలుస్తున్న అక్రమ ఫ్లెక్సీలు, బ్యానర్లు : అడ్డుకట్ట వేసేదెలా?
దాదర్: ముంబై రహదారులపై ఎక్కడ చూసినా అక్రమ బ్యానర్లు, ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి. తొలగించిన కొద్ది రోజులకే మళ్లీ వెలుస్తున్నాయి. దీంతో ఇలాంటి అక్రమ బ్యానర్లు, ప్లెక్సీలు, కటౌట్లు, ప్రవేశ ద్వారాలు, పార్టీ జెండాలపై ఉక్కుపాదం మోపాలని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) నిర్ణయించింది. ఇందుకు బాధ్యులైనవారికి భారీ జరిమానా విధించడంతోపాటు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం తమ ప్రియనేతలకు శుభాకాంక్షలు తెలిపేందుకు అక్రమంగా ఏర్పాటు చేసిన సుమారు రెండు వేల బ్యానర్లు, ఫ్లెక్సీలను బీఎంసీ సిబ్బంది తొలగించారు. వీటిలో వేయికిపైగా రాజకీయ పార్టీలకు సంబంధించినవి కాగా మిగిలినవి వివిధ ధార్మిక, మత, ప్రవచన కార్యక్రమాలు, విద్యా సంస్ధల ప్రకటనలకు సంబంధించినవి. ఈ అక్రమ బ్యానర్లు, ప్లెక్సీలు తొలగించిన కొద్దీ మళ్లీ వెలుస్తున్నాయి.ప్రధాన రహదారులు, జంక్షన్లు మొదలుకుని గల్లీలను సైతం వదలకుండా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఒకవేళ తొలగించినా మరుసటి రోజు మళ్లీ ప్రత్యక్షమవుతున్నాయి. ఎవరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు..? ఎవరి పేరిట, ఏ పార్టీ పేరుతో ఏర్పాటు చేస్తున్నారో బ్యానర్‌ను చూసి తెలుసుకోవచ్చు. కానీ వాటిని ఎవరు ఏర్పాటు చేస్తున్నారో మాత్రం తెలియడం లేదు. గిట్టని వారు లేదా ప్రతిపక్ష పార్టీలు ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేందుకు వీటిని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసినవారు రెడ్ హ్యాండెడ్‌గా దొరికితే తప్ప చర్యలు తీసుకోలేని పరిస్ధితి. దీంతో ఏంచేయాలో దిక్కుతోచక బీఎంసీ సిబ్బంది తలపట్టుకుంటున్నారు. అక్రమమా? సక్రమమా? ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముంబైలో రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్ధుల ప్లెక్సీలు, బ్యానర్లు, బోర్డులు, పార్టీ జెండాలు విపరీతంగా వెలిశాయి. ఎన్నికలకు రెండు రోజుల ముందు ప్రచారాన్ని నిలిపివేయాల్సి రావడంతో వాటన్నింటిని తొలగించారు. పదుల సంఖ్యలో ట్రక్కుల్లో వాటిని డంపింగ్ గ్రౌండ్లకు తరలించారు. కాగా ఫలితాలు వెలువడిన తరువాత గెలిచిన పార్టీ అభ్యర్ధి లేదా ఇండిపెండెంట్ అభ్యర్ధుల అభిమానులు, కార్యకర్తలు, శుభాకాంక్షలు తెలియజేసే ప్లెక్సీలు, బ్యానర్లను మళ్లీ ఏర్పాటు చేశారు. వీటిలో 30 శాతం అనుమతి తీసుకుని ఏర్పాటు చేయగా 70 శాతం అక్రమంగా ఏర్పాటు చేసినవి. దీంతో ముంబై రోడ్లన్నీ వికారంగా తయారయ్యాయి. వీటిలో అనుమతి తీసుకుని ఏర్పాటుచేసినవేవో, అక్రమమైనవేవో గుర్తించడం బీఎంసీ సిబ్బందికి కష్టతరమవుతోంది. వందలాది ట్రక్కులు, టిప్పర్ల వినియోగం... ఇదిలాఉండగా ఇటీవల కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులుగా ఏక్నాథ్ శిందే, అజీత్ పవార్లు ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో శుభాకాంక్షలు తెలియజేసే బ్యానర్లు, ఫ్లెక్సీలను మళ్లీ విచ్చలవిడిగా ఏర్పాటు చేశారు. ప్రమాణస్వీకారానికి ముందే కాబోయే ముఖ్యమంత్రి ఏక్నాథ్ అంటూ కొందరు, అజిత్ పవార్ అంటూ మరికొందరు బ్యానర్లు ఏర్పాటుచేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన సంగతి తెలిసిందే. కానీ ఢిల్లీ అధిష్టానం అధికారికంగా ఫడ్నవీస్, శిందే, అజిత్ పవార్ల పేర్లు ఖరారు చేయడంతో మూడు పారీ్టల కార్యకర్తలు, అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ శుభాకాంక్షలు తెలియజేసే బ్యానర్లు, ఫ్లెక్సీలు, రోడ్ల మధ్యలో విద్యుత్ పోల్స్, రెయిలింగ్స్‌కు పార్టీ జెండాలను ఏర్పాటు చేశారు. దీంతో వీటిని తొలగించి డంపింగ్ గ్రౌండ్లకు తరలించాలంటే బీఎంసీ సిబ్బందికి వందల సంఖ్యలో ట్రక్కులు, టిప్పర్లను వినియోగించాల్సిన పరిస్ధితి వచ్చింది. అక్రమంగా ఏర్పాటుచేసే బ్యానర్లు, ప్లెక్సీలు, కటౌట్లు, ప్రవేశ ద్వారాలవల్ల బీఎంసీ ఆదాయానికి కూడా గండిపడుతోంది. -
తీవ్ర వాయుకాలుష్యం : 1,200 బేకరీలకు బీఎంసీ నోటీసులు
దాదర్: పరిశ్రమలు, బేకరీలకు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) పరిపాలన విభాగం నోటీసులు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా బేకరీ బట్టీలలో ఇంధనం, ఎలక్ట్రిక్ లేదా గ్యాస్‌కు బదులుగా కలపను వినియోగిస్తున్నట్లు తనిఖీల్లో బయటపడటంతో 1,200పైగా బేకరీ యజమానులకు నోటీసులు జారీచేసినట్లు అధికారులు తెలిపారు. గత కొద్ది రోజులుగా ముంబైలో గాలి నాణ్యత వేగంగా క్షీణిస్తోంది. దీంతో ముంబైకర్లు వివిధ శ్వాససంబంధ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో భవన నిర్మాణ సైట్లు భవన నిర్మాణ కాంట్రాక్టర్లకు బీఎంసీ అధికారులు 18 రకాల సూచనలతో కూడిన నియమావళిని జారీచేసింది. వాటిని కచి్చతంగా పాటించాల్సిందేనని నిర్ధేశించింది. కానీ బేకరీల నిర్వాహకులు నియమాలను బేఖాతరు చేస్తున్నట్లు వెలుగులోకి రావడంతో బీఎంసీ కమిషనర్ భూషణ్ గగ్రాణీ (అడ్మిన్) ఆదేశాల మేరకు అధికారులు తనిఖీలు చేపట్టారు. రూల్స్‌కు విరుద్ధంగా వ్యవహరించిన అనేక మంది బిల్డర్లు, కాంట్రాక్టర్లకు నోటీసులు కూడా జారీచేసింది. అదేవిధంగా బేకరీలలో బ్రెడ్లు, కేక్‌లు, బిస్కెట్లు, ఇతర తినుబండారాల తయారీకి కలప వాడుతున్నట్లు తేలడంతో వీటిపై చర్యలు తీసుకుంది. పదిహేను రోజుల క్రితమే హెచ్చరిక... ముంబైలో రెండువేలకుపైగా బేకరీలున్నాయి. వీటిలో రోజుకు దాదాపు 130 కేజీల కలపను వినియోగిస్తున్నారు. వీటినుంచి వెలువడే దట్టమైన పొగవల్ల గాలి నాణ్యత క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలో కలప వాడకాన్ని నిలిపివేయాలంటూ బేకరీ యజమానులను గత పదిహేను రోజుల కింద బీఎంసీ హెచ్చరించింది. దీనికి బదులుగా గ్యాస్, ఇంధనం, కరెంటును వినియోగించాలని సూచించాలని లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. అయినప్పటికీ 1,200పైగా బేకరీల్లో నియమోల్లంఘన జరుగుతున్నట్లు తనిఖీల్లో బయటపడడంతో నోటీసులు జారీచేశారు. నోటీసులకు మాత్రమే పరిమితం... బేకరీల్లో కలపను వినియోగించకూడదని బీఎంసీ 2007లోనే ఆదేశాలు జారీచేసింది. బట్టీలలో కలపకు బదులుగా సీఎన్జీని వినియోగించాలని సూచించింది. ప్రభుత్వాలు మారడంతో బీఎంసీ కూడా ఈ విషయాన్ని అంతగా పట్టించుకోవడం మానేసింది. ఇదేకాకుండా ముంబైలో ఉన్న అన్ని బేకరీల వివరాలు బీఎంసీ వద్ద లేవు. లైసెన్స్డ్ బేకరీల కన్నా అక్రమంగా నడుపుతున్న బేకరీలే అధికమని తేలింది. ఈ నేపథ్యంలో బీఎంసీ కేవలం నోటీసుల జారీకి మాత్రమే పరిమితమైందని ఆరోపణలొస్తున్నాయి. దట్టమైన పొగను వెలువరించే బేకరీలతోపాటు జవేరీ బజార్, కాల్బాదేవి, గిర్గావ్ ప్రాంతాల్లో వెండి, బంగారు, గిల్టు నగలు తయారుచేసే ఫ్యాక్టరీలు వందల సంఖ్యలో ఉన్నాయి. వీటిలో వేలాది మంది కార్మికులు పనిచేస్తారు. నగలు తయారీలో బొగ్గు, రసాయనాల వినియోగం వల్ల కాలుష్యం ఏర్పడుతోంది. దీంతో స్ధానికుల నుంచి అనేక ఫిర్యాదులు వచ్చాయి. దీన్ని సీరియస్‌గా తీసుకున్న బీఎంసీ అధికారులు బంగారు, వెండి నగలు తయారుచేసే ఫ్యాక్టరీ యజమానులకు కూడా నోటీసులు జారీ చేశారు. గాలి నాణ్యత మెరుగు పడేవరకు ఇలాంటి చర్యలు తప్పవని తెలిపారు. -
‘ఈవీఎంలను ఊరేగించి గుడి కట్టండి’
ముంబై: ఈవీఎంల చుట్టూ వివాదాలు నడుస్తున్న వేళ.. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ విషయాన్ని సుప్రీం కోర్టులో తేల్చుకోవాలని ఎంవీఏ కూటమి భావిస్తోంది. ఈలోపు.. మహాయుతి ప్రభుత్వం అవకాశం దొరికినప్పుడల్లా విమర్శలతో విరుచుకుపడుతోంది. సీఎం ఎన్నిక జాప్యంపై ఎద్దేవా చేసిన థాక్రే సేన.. ఇప్పుడు ఈవీఎంలకు గుడి కట్టండంటూ అధికార కూటమికి సలహా ఇస్తోంది.ముంబైలో కాకుండా నాగ్‌పూర్‌లో మంత్రి వర్గ విస్తరణకు మహాయుతి ఏర్పాట్లు చేసింది. ఈ పరిణామంపై థాక్రే శివసేన నేత సంజయ్‌రౌత్ స్పందించారు. ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయం ముందు ఈవీఎంలకు గుడి కట్టుకోండంటూ సలహా ఇచ్చారాయన.‘‘సీఎం ఉరేగింపు కంటే ముందు.. వాళ్లు ఈవీఎంలను ఊరేగిస్తే బాగుంటుంది. ఆపై నాగ్‌పూర్‌లోని ఆరెస్సెస్ కార్యాలయం ఎదుట ఈవీఎంలకు వాళ్లు గుడి కట్టుకుంటే బాగుంటుంది. ఈ మేరకు కేబినెట్ తొలిభేటీలో నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నా’’ అంటూ సెటైర్లు వేశారు. #WATCH | Mumbai: Shiv Sena (UBT) MP Sanjay Raut says, "...First of all, the procession of the Chief Minister will be taken out there (in Nagpur). I think that before taking out the procession of the CM, they should take out a procession of EVMs and in the first cabinet they… pic.twitter.com/0ue8Labe5v— ANI (@ANI) December 14, 2024 ‘‘ప్రభుత్వం ఏర్పడి దగ్గర దగ్గర నెలకావొస్తోంది. ఇప్పటికీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో కొలువు దీరలేకపోయింది. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోంది. అయినా కొత్త ప్రభుత్వానికి పట్టనట్లు ఉంది. కనీసం సీఎం అయినా దీనికి సమాధానం ఇస్తారేమో’’ అని రౌత్ అన్నారు.1991 తర్వాత నాగ్‌పూర్‌లో మహా కేబినెట్ విస్తరణ జరుగుతుండడం ఇదే. ఆ టైంలో రాజకీయ సంక్షోభం ఏర్పడ్డ తర్వాత.. డిసెంబర్లో ఛగన్ భుజ్‌బల్, మరికొందరితో గవర్నర్ సుబ్రహ్మణ్యం మంత్రులుగా ప్రమాణం చేయించారు.ఇదీ చదవండి: బ్యాలెట్ కోసం చైతన్యం.. వారిని వణికిస్తోందిగా! -
కిలో మునక్కాయలు రూ. 400, కూరగాయల ధరలకు రెక్కలు
దాదర్: మహారాష్ట్రవ్యాప్తంగా పప్పు దినుసులు, కూరగాయలు ఇతర నిత్యవసర సరుకుల ధరలకు రెక్కలు వచ్చాయి. మొన్నటి వరకు స్ధిరంగా ఉన్న పప్పు దినుసులు, ఉల్లి, వెల్లుల్లి, టమాటా, ఆకుకూరలు, ఇతర కూరగాయల ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఒకపక్క మహాయుతి ప్రభుత్వం లాడ్కి బహిన్ పథకం ప్రవేశపెట్టి అక్కచెల్లెళ్లను సంతోషపెడుతూనే మరోపక్క నిత్యవసర సరుకుల ధరలు అందుబాటులో లేకుండా పోయినా ఎలాంటి చర్యలు తీసుకోకుండా వారిని ఇబ్బంది పెడుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొన్నటి వరకు నియంత్రణలో ఉన్న ధరలు ఇప్పుడు భారీగా పెరిగిపోవడంతో వీటిని కొనుగోలు చేసేందుకు సాధారణ, మధ్యతరగతి ప్రజలు వెనుకాడుతున్నారు. కోస్తే కాదు..కొనాలన్నా కన్నీళ్లే... ముంబైసహా ఇతర ప్రధాన నగరాలన్నిటిలోనూ ప్రస్తుతం ఇదే పరిస్ధితి కొనసాగుతోంది. న్యూ ముంబైలోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ) హోల్‌సేల్ మార్కెట్లో కేజీ ఉల్లి ధర రూ.40–60 ఉండగా ఇప్పుడది ఏకంగా రూ.80–100 ధర పలుకుతోంది. నాణ్యతను బట్టి కేజీ రూ.110–120 ధర కూడా పలుకుతోంది. అదేవిధంగా రూ.10–15 ధర పలికిన వివిధ ఆకు కూరలు ఇప్పుడు రూ.30–40 ధర పలుకుతున్నాయి. రాష్ట్రంలోని హోల్‌సేల్ మార్కెట్లోకి ఉల్లి దిగుమతి తగ్గిపోవడంతో సరుకు కొరత ఏర్పడింది. దీనికితోడు ఇటీవల కురిసిన అకాల వర్షాలకు ఉల్లి, వెల్లుల్లితోపాటు కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. ఫలితంగా ధరలు అందుబాటులో లేకుండా పోయాయాని వ్యాపారులు చెబుతున్నారు. కూడా అపార నష్టం వాటిల్లింది. దీని ప్రభావం ధరలపై పడుతోందని వ్యాపారులు అంటున్నారు.వంటనూనెలదీ ఇదే దారి... కూరగాయలు, పప్పుదినుసులతోపాటు వంటనూనెధరలు కూడా విపరీతంగా పెరిగాయి. మొన్నటి వరకు రూ.100–120 ధర పలికిన లీటరు వంటనూనె ప్యాకెట్ ఇప్పుడు ఏకంగా రూ.165 ధర పలుకుతోంది. అలాగే రూ.90 ధర పలికిన పామాయిల్ ఇప్పుడు రూ.130 పలుకుతోంది. సామాన్యులు తినే సాధారణ బియ్యం, గోధుమలు, పప్పుదినుసులు, ఆఖరుకు కొబ్బరికాయల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో ఏం తిని బతకాలంటూ పేద, మధ్యతరగతి ప్రజలు వాపోతున్నారు. -
ఆ 35 నిమిషాలు : సాధారణమా? రాజకీయమా?
సాక్షి, ముంబై: ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ జన్మదినోత్సవాలను ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు కార్యకర్తలు ఘనంగా జరుపు కున్నారు. పవార్ 85వ జన్మదినాన్ని పురస్కరించుకుని గురువారం ముంబైతోపాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీతోపాటు అనేక మంది ప్రముఖులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా జన్మదినోత్సవం రోజున శరద్ పవార్ ఢిల్లీలోనే ఉండటంతో ఎన్సీపీ నేతలు, కార్యకర్తలతోపాటు అనేక పార్టీల నేతలు ఢిల్లీలోని ఆయన నివాసంలో స్వయంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. స్వయంగా కలిసి..శుభాకాంక్షలు శరద్ పవార్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్సీపీ (ఎస్పీ) అధ్యక్షుడు మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన వెంట అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్, కుమారుడు పార్థ్ పవార్‌లతోపాటు ఎన్సీపీ (ఏపీ) సీనియర్ నేతలు ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజ్‌బల్, సునీల్ తట్కరే తదితరులున్నారు. వీరందరూ పవార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సమయంలో శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే కూడా అక్కడే ఉన్నారు. ఎన్సీపీ రెండుపార్టీలుగా చీలిపోయిన తర్వాత శరద్ పవార్‌తో అజిత్‌పవార్ భేటీ కావడం ఇదే తొలిసారి. మంచి చెడులు మాత్రమే చర్చించాం: అజిత్‌పవార్ అజిత్ పవార్‌తోపాటు అనేక మంది ఎన్సీపీ (ఏపీ) సీనియర్ నేతలు శరద్ పవార్‌తో భేటీ కావడం అనేక చర్చలకు ఊతమిచ్చింది మళ్లీ వీరిద్దరూ ఒకటికానున్నారా అనే అంశంపై పెద్ద ఎత్తున ఊహాగానాలు కొనసాగుతున్నాయి. అయితే అలాంటిదేమిలేదని తమ కుటుంబ పెద్ద అయిన శరద్‌పవార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకే వెళ్లామని మంచిచెడులు, బాగోగుల గురించి మాత్రమే మాట్లాడుకున్నామని చెప్పారు. అయితే సుమారు 35 నిమిషాలపాటు అజిత్ పవార్, శరద్ పవార్ల మధ్య చర్చలు కొనసాగాయని, ఈ చర్చల్లో రాజకీయ అంశాలతోపాటు ప్రస్తుత రాజకీయ పరిణామాలపై కూడా చర్చలు జరిగి ఉండవచ్చని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా అయిదు దశాబ్దాలకుపైగా రాజకీయ అనుభవంతో రాజకీయ చాణక్యుడిగా గుర్తింపుపొందిన శరద్ పవార్ జీవిత విశేషాలను గురించి క్లుప్తంగా..... తల్లినుంచే రాజకీయ వారసత్వం పవార్, ఆయన కుటుంబీకులు రెండుతరాలుగా రాజకీయాల్లో కొన సాగుతున్నారు. ప్రస్తుతం మూడో తరం కూడా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ ప్రజాదరణతో రాజకీయాలను కొనసాగిస్తున్నారు. మొదటగా శరద్ పవార్ తల్లి శారదాబాయి పవార్ పుణే జిల్లా లోకల్బోర్డ్ సభ్యురాలుగా ఎన్నికవ్వడంతో పవార్ కుటుంబ రాజకీయ ప్రస్థానం ఆరంభమైంది. ఆ విధంగా తల్లి నుంచే శరద్‌పవార్‌కు రాజకీయ వారసత్వం లభించింది. అనంతరం ఇంతింతై అన్నట్లుగా పవార్ రాష్ట్రంతో పాటు దేశ రాజకీయాలలో కీలకపాత్ర పోషించే స్థాయికి ఎదిగారు. బారామతి ఎంపీగా ఏడు సార్లు...శరద్‌పవార్ బారామతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఏడుసార్లు విజయం సాధించారు. దీంతో ఆయనకు ఈ నియోజకవర్గం కంచుకోటలా మారింది. 1984 నుంచి 1991, 1995, 1997, 1998, 1999తో పాటు 2004లోనూ ఈ నియోజకవర్గంలో పవార్‌దే విజయం. దీంతో ఆయన ఈ లోక్‌సభ నియోజకవర్గానికి మకుటంలేని మహారాజుగా మారారు. కాగా 2009లో పవార్ తన కుమార్తై సుప్రియా సూలేను బారామతి లోక్‌సభ స్థానం నుంచి పోటీచేయించారు. ఆయన మాడా లోక్‌సభ సెగ్మెంట్ నుంచి పోటీచేసి విజయం సాధించారు. కేంద్రరాజకీయాల్లోకి... పవార్ 1991లో రాష్ట్ర రాజకీయాల నుంచి కేంద్ర రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఇటు రాష్ట్ర రాజకీయాలలో కీలకపాత్ర పోషిస్తూనే అటు కేంద్రంలో ఒక్కో మెట్టు ఎక్కసాగారు. ఈ నేపథ్యంలో 1993లో మరోమారు ఆయన్ను రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి వరించింది. తదనంతరం 1995లో మరోసారి అసెంబ్లీలో ప్రతిపక్షనాయకుని పాత్రను పోషించారు. ఆ తరువాత కేంద్రరాజకీయాలలో చురుకుగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. 1998 మార్చి 22న లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుని పాత్ర పోషించే అవకాశం లభించింది. ఈ నేపథ్యంలో మరోసారి కాంగ్రెస్‌పై తిరుగుబాటు ప్రకటించి 1999 మే 20న పార్టీని వీడారు. నెలరోజుల్లోనే 1999 జూన్‌లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)ని స్థాపించారు. అనంతరం 1999 అక్టోబరు ఏడవ తేదీన మరోసారి ఎంపీగా విజయం సాధించారు. 2004 ఎన్నికల అనంతరం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. లక్ష మెజార్టీతో అజిత్ పవార్ గెలుపు... ఎన్సీపీ రెండుగా చీలిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా జరిగిన లోకసభ ఎన్నికల్లో ఎన్సీపీ(ఎస్పీ)తరపున బారామతి ఎంపీగా సుప్రియా సూలే గెలిచారు. ఎరద్పవార్ కుమార్తై ఎన్సీపీ (ఎస్పీ) పార్టీ నుంచి విజయం సాధించింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఎన్సీపీ (అజిత్ పవార్) పార్టీ రాష్ట్రవ్యాప్తంగా మంచి ఫలితాలు సాధించింది. ముఖ్యంగా అజిత్‌పవార్ లక్షకుపైగా ఓట్లతో విజయం సాధించి బారామతి అసెంబ్లీ నియోజకవర్గంలో శరద్‌పవార్ ప్రాభవానికి చెక్‌పెట్టారు. 50 ఏళ్లకుపైగా రాజకీయాల్లో.. మొట్టమొదటిసారిగా 1967లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బారామతి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అప్పటినుంచి వెనుతిరిగి చూడలేదు. తరువాత తరువాత అసెంబ్లీతో పాటు లోక్‌సభ నియోజకవర్గంపై కూడా పట్టుసాధించారు. 1972లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించారు. ఇదే సంవత్సరం ఆయనకు మంత్రి మండలిలో స్థానం లభించింది. 1978 జూలై 12వ తేదీన నలుగురు మంత్రులతో కలసి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. జూలై 17వ తేదీన మంత్రి పదవికి రాజీనామా చేసి ఇతర పార్టీలతో కలిసి ‘పురోగామి లోక్‌షాహీ ఆఘాడీ’(పులోద్)ను ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్ర రాజకీయ చరిత్రలో అతి పిన్నవయసు ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కారు. రెండేళ్ల అనంతరం 1980లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బారామతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మళ్లీ విజయం సాధించారు. అయితే ఆ ఎన్నికల్లో ఓటమి పాలై 1981 జులై 31 వరకు ప్రతిపక్షనాయకుని పాత్రకు పరిమితమయ్యారు. 1984లో మొట్టమొదటి సారిగా బారామతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 1986లో మరోసారి కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌లో చేరిన అనంతరం 1988లో జూన్ 25వ తేదీన రెండోసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 1991 జూన్ వరకూ ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. -
ఆర్బీఐ ఆఫీసుకు బాంబు బెదిరింపు.. పోలీసులు అలర్ట్
ఢిల్లీ: దేశంలో బాంబు బెదిరింపుల కాల్స్, మెయిల్స్ తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సైతం ఇలాంటి బెదిరింపులు రావడం ఆందోళన కలిగించింది. ముంబైలోని ఆర్బీఐ కార్యాలయాన్ని పేలుడు పదార్థాలతో పేల్చేస్తామంటూ బెదిరింపు రావడం కలకలం సృష్టించింది.వివరాల ప్రకారం.. ముంబైలోని ఆర్బీఐ కార్యాలయాన్ని పేలుడు పదార్థాలతో పేల్చేస్తామంటూ శుక్రవారం ఓ మెయిల్ వచ్చింది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధికారిక ఈ-మెయిల్ ఐడీకి ఈ బెదిరింపు రావడం గమనార్హం. అయితే, సదరు మెయిల్లో బెదిరింపులు రష్యన్ భాషలో వచ్చినట్లు పోలీసులు తెలిపారు.దీంతో, వెంటనే అప్రమత్తమైన ముంబై పోలీసులు ఆర్బీఐ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఈ మేరకు ఘటనపై పలు సెక్షన్ల కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మెయిల్ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు.ఇక, ఇటీవలి కాలంలో బెదిరింపు కాల్స్, మెయిల్స్ సంఖ్యలో పెరిగింది. ఇవాళ ఉదయం ఢిల్లీలోని దాదాపు 16 పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. గడిచిన నాలుగు రోజుల్లోనే ఢిల్లీలోని పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం ఇది రెండో సారి. మరోవైపు.. పలు విమాన సర్వీసులకు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ ఏడాది బాంబు బెదిరింపుల సంఖ్య ఏకంగా 900పైగానే ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. Mumbai | A threatening email was received on the official website of Reserve Bank of India. The email was in Russian language, warned to blow up the bank. A case has been registered against unknown accused in Mata Ramabai Marg (MRA Marg) police station. Investigation into the…— ANI (@ANI) December 13, 2024 -
సర్కారు ఓకే : మరి 26 ఏళ్లుగా నిలిచిపోయిన భర్తీల మాటేంటి?
దాదర్: ప్రమాణస్వీకారం తంతు పూర్తికావడంతో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు ఏక్నాథ్ శిందే, అజీత్ పవార్, మంత్రాలయలోని తమ తమ క్యాబిన్లలో ఆసీనులయ్యేందుకు సిద్ధమైతున్నారు. ఇందుకోసం మంత్రాలయ సామాన్య పరిపాలన విభాగం ఆయా శాఖల మంత్రుల క్యాబిన్లను సిద్ధంగా ఉంచింది. అయితే ముఖ్యమంత్రి, ఉప ముఖ్య మంత్రులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాల్సిన అంటెండర్లు, బంట్రోతుల కొరత తీవ్రంగా ఉంది. ప్రస్తుతం సామాన్య పరిపాలన విభాగంలో కేవలం 30 మంది పర్మినెంట్ అటెండర్లు ఉన్నారు. కొరతను దృష్టిలో ఉంచుకుని మూడు, నాలుగో శ్రేణి ఉద్యోగులను భర్తీ కోసం తరుచూ ప్రతిపాదనలు అందుతున్నప్పటికీ సామాన్య పరిపాలన విభాగం ఈ అంశంపై నిర్లక్ష్యం వహిస్తోంది. 1998కి ముందు 120 మంది... ఈ నెల 15వ తేదీలోపు మంత్రివర్గ విస్తరణ చేప ట్టే అవకాశాలున్నాయి. ఆ తరువాత నాగ్‌పూర్ లో 16వ తేదీ నుంచి 21వ తేదీ మధ్య ప్రత్యేక శీతాకాల అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాలు పూర్తికాగానే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులుసహా ప్రమాణ స్వీకారం చేసిన కొత్త మంత్రులందరూ మంత్రాలయలో విధులకు హాజరయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో అటెండర్లు, బంట్రోతుల అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. 1998 ముందు సామాన్య పరిపాలన విభాగంలో 120 మంది అటెండర్లు, బంట్రోతులు, సిపాయిలు ఉండేవారు. ఎవరైనా పదవీ విమరణ చేస్తే వారి స్థానంలో ఇతరులను నియమించడం, పదోన్నతులు కల్పించడం ద్వారా భర్తీ ప్రక్రియ పూర్తిచేసేవారు. కాని 1998 తరువాత ఉద్యోగాల భర్తీ ప్రక్రియ, పదోన్నతులు నిలిపివేయడం, అప్పటి నుంచి ఇప్పటి దాకా అనేక మంది పదవీ విరమణ చేయడం, సిపాయి పోస్టులను రద్దు చేయడంతో ప్రస్తుతం పర్మినెంట్, కాంట్రాక్టు అంతాకలిపి 40 మంది అటెండర్లు మాత్రమే ఉన్నారు. వీరిని సామాన్య పరిపాలన విభాగం వివిధ శాఖలకు కేటాయించింది. ఇప్పుడైనా ఆమోదం లభించేనా? ముఖ్యంగా సామాన్య పరిపాలన విభాగం ఈ పోస్టులను భర్తీ చేస్తుంది. కా ముఖ్యమంత్రికి ఇద్దరు సూపర్వైజర్లు, ఒక బంట్రోతు, ఉప ముఖ్యమంత్రులకు ఒక సూపర్వైజర్, ఒక బంట్రోతు చొప్పున, క్యాబినెట్‌లోని మంత్రులందరికి ఒక బంట్రోతు, ఒక అటెండర్ చొప్పున సామాన్య పరిపాలన విభాగం కేటాయిస్తుంది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఉభయ సభల్లో అధికార పార్టీకి 8 మంది, ప్రతిపక్ష పార్టీకి 8 మంది ఇలా 16 మంది అటెండర్లను సామాన్య పరిపాలన విభాగం సమకూర్చి ఇస్తుంది. కానీ గత 26 ఏళ్లుగా భర్తీ ప్రక్రియ చేపట్టకపోవడం, పదోన్నతులు నిలిపివేయడంతో అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు కొనసాగిన మహాయుతి కూటమి ప్రభుత్వంలో ఆరేడుగురు మంత్రులు అటెండర్లు, బంట్రోతులు లేకుండానే విధులు నిర్వహించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించిన మహాయుతి ప్రభుత్వం ఇప్పుడైనా భర్తీ ప్రక్రియకు ఆమోదం తెలుపుతుందని మంత్రాలయ సిబ్బంది భావిస్తున్నారు. -
ఫస్ట్ డే డ్యూటీకి వెళ్లింది.. అంతలోనే అంతులేని విషాదం
19 ఏళ్ల అఫ్రీన్ షా ఎంతో హుషారుగా తన జీవితంలో తొలి రోజు ఉద్యోగానికి వెళ్లింది. కానీ అదే ఆమెకు చివరి రోజు అవుతుందని ఆమె ఊహించలేదు. అఫ్రీన్ షా కుటుంబ సభ్యులు కూడా అనుకోలేదు. మొదటి రోజు డ్యూటీ ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చే సమయంలో ఆటోలు దొరక్కపోవడంతో తండ్రి అబ్దుల్ సలీంకు అఫ్రీన్ ఫోన్ చేసింది. కుర్లా స్టేషన్‌కు వెళ్లమని కూతురికి ఆయన సలహా ఇచ్చాడు. కొద్దిసేపటి తర్వాత ఆయనకు మరోసారి ఫోన్ వచ్చింది. అర్జెంటుగా ఆస్పత్రికి రావాలని ఫోన్ చేశారు. అతడు ఆస్పత్రికి వచ్చే చూసేసరికి కూతురు నిర్జీవంగా కనిపించడంతో సలీం కుప్పకూలిపోయారు. అపురూపంగా పెంచుకున్న తన కుమార్తె మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా రోదించాడు.కన్నిస్ అన్సారీ(55) అనే నర్సు నైట్ షిప్ట్ డ్యూటీ చేసేందుకు బయలుదేరి అనూహ్యంగా పప్రాణాలు కోల్పోయింది. వీరిద్దరితో పాటు మరో ఐదుగురిని బస్సు రూపంలో మృత్యువు కబళించింది. ముంబై మహానగరంలోని కుర్లా ప్రాంతంలో సోమవారం రాత్రి జరిగిన బస్సు ప్రమాదం ఏడుగురిని బలిగొంది. 42 మందిని గాయాలపాల్జేసింది. కుర్లా రైల్వే స్టేషన్ - అంధేరి మధ్య నడిచే రూట్ నంబర్ 332 బృహన్ ముంబయి ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్పోర్ట్ (బెస్ట్) బస్సు అదుపుతప్పి విధ్వంసం సృష్టించడంతో ఈ ఘోరం జరిగింది. కుర్లా వెస్ట్‌లోని అంజుమన్-ఇ-ఇస్లాం స్కూల్ సమీపంలో నిన్న రాత్రి 9.30 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.డ్రైవర్ తప్పిదం వల్లే..బస్సు డ్రైవర్ సంజయ్ మోర్(43) తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వేగంగా దూసుకొచ్చిన బస్సు.. పోలీసు వ్యాను, కార్లు, టూవీలర్లు, తోపుడు బండ్లతో సహా 22 వాహనాలను ఢీకొట్టింది. చివరకు గోడను ఢీకొని ఆగిపోయింది. ప్రమాద తీవ్రత చూసిన వారంతా ఉగ్రదాడిగా భయపడి పరుగులు తీశారు. ‘ప్రమాదానికి గురైన వాహనాల జాబితాను సిద్ధం చేశాం. 22 వాహనాలను బస్సు ఢీకొట్టినట్టు మా దృష్టికి వచ్చింది. బస్సు డ్రైవర్ సంజయ్ మోర్ మరిన్ని వాహనాలను ఢీకొట్టాడో, లేదో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామ’ని ముంబై జోన్ 5 పోలీస్ డిప్యూటీ కమిషనర్ గణేష్ గవాడే మీడియాతో చెప్పారు.బస్సు కండిషన్లోనే ఉందిబస్సు బ్రేకులు ఫెయిల్ కావడం వల్లే ప్రమాదం జరిగిందన్న వార్తలను గవాడే తోసిపుచ్చారు. బస్సు మంచి కండిషన్లో ఉందని, డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే దుర్ఘటన జరిగిందన్నారు. డిసెంబర్ 1 నుంచి డ్రైవర్ సంజయ్ మోర్ బెస్ట్ బస్సు నడుపతున్నాడని, గతంలో అతడు మాన్యువల్ మినీ బస్సు నడిపేవాడని వెల్లడించారు. ప్రయాణికులతో కూడిన బస్సును నడిపేందుకు అవసరమైన శిక్షణ తీసుకున్నాడా, లేదా విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు. కాగా, డ్రైవర్‌ను డిసెంబర్ 21 వరకు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ కుర్లా కోర్టు ఆదేశాలిచ్చింది.చదవండి: 150 అడుగుల బోరుబావిలో బాలుడు..‘ప్రమాదానికి కారణమైన బస్సులో ఎటువంటి సాంకేతిక లోపం లేదు. యాక్సిలరేట్ ఇచ్చిన తర్వాత వేగాన్ని నియంత్రించడంలో డ్రైవర్ విఫలమయ్యాడు. భయాందోళనకు గురై బ్రేక్‌కు బదులుగా యాక్సిలరేటర్ తొక్కాడు. అతడు మొదట ఆటోరిక్షాను ఢీకొట్టాడు. ఆ తర్వాత పోలీసు వాహనం, ద్విచక్ర వాహనాలు, తోపుడు బండ్లను ఢీకొట్టాడు. గోడను ఢీకొట్టిన తర్వాత మాత్రమే బస్సు ఆగింద’ని డీసీపీ గణేష్ గవాడే తెలిపారు. డ్రైవర్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని, సంబంధిత శాఖలు విచారించి నివేదిక సమర్పించాక తదుపరి చర్యలు చేపడతామన్నారు. సంజయ్ మోర్ మద్యం సేవించి బస్సు నడిపాడా లేదా అన్నది నిర్ధారించేందుకు అతడికి పోలీసులు వైద్య పరీక్షలు చేయించారు. ప్రమాదంపై విచారణకు జరిపేందుకు ఫోరెన్సిక్, రీజినల్ ట్రాన్స్‌ఫోర్ట్ కార్యాలయ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.ప్రత్యక్ష సాక్షులు ఏమన్నారంటే?బస్సు ప్రమాదాన్ని చూసి ప్రత్యక్ష సాక్షులు భయాందోళన చెంతారు. సహాయక చర్యల్లో పాల్గొని బాధితులను ఆస్పత్రులకు తరలించడంలో సాయపడ్డారు. ప్రత్యక్ష సాక్షి జైద్ అహ్మద్ (26) మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను రైల్వే స్టేషన్‌కు వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరుతుండగా పెద్ద శబ్ధం వినిపించింది. వెంటనే సంఘటనా స్థలానికి పరిగెత్తాను. పాదచారులతో పాటు ఆటోరిక్షా, మూడు కార్లు, ఇతర వాహనాలను బస్సు ఢీకొట్టింది. నా కళ్ల ముందు కొన్ని మృతదేహాలను చూశాను. ఆటోరిక్షాలో ఉన్న ప్రయాణికులను రక్షించి బాబా ఆసుపత్రికి తీసుకెళ్లాం. మరో మూడు చక్రాల వాహనం కూడా క్షతగాత్రులకు సహాయం అందించింద’ని తెలిపాడు.సీఎం ఫడ్నవీస్ దిగ్భ్రాంతిముంబై బస్సు ప్రమాదంపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు. క్షతగాత్రుల చికిత్సకు అయ్యే ఖర్చును బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్పోర్ట్ (బెస్ట్) భరిస్తుందన్నారు. -
ఆర్టీసీ బస్సు బీభత్సం.. జనాలపైకి దూసుకెళ్లి..
ముంబై: కుర్లాలోని ఎస్జీ బార్వేరోడ్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిలవ్వడంతో పాదచారులపై దూసుకెళ్లినట్లు సమాచారం. మృతులను శివమ్ కశ్యప్ (18), కనీజ్ ఫాతిమా (55), అఫీల్ షా (19), అనమ్ షేక్ (20)లు మరణించారు. 29మంది గాయపడ్డారు. ఐదారు ఆటోలు, 10 ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. సోమవారం సాయంత్రం 9.30 గంటల సమయంలో హౌసింగ్ కాలనీలో బృహన్ ముంబయి ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్పోర్ట్ (బెస్ట్)కు చెందిన కుర్లా- అంధేరి రైల్వే స్టేషన్ మధ్య నడిచే రూట్ నంబర్ 332 బస్సుగా గుర్తించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు బస్సు డ్రైవర్ సంజయ్ మోర్(43)ని అరెస్ట్ చేశారు. సహాయక చర్యల్ని ముమ్మరం చేపట్టారు. ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బస్సు బ్రేకులు ఫెయిలవ్వడంతో జరిగిన ప్రమాద తీవ్రతను చూసిన స్థానికులు ఉగ్రదాడి తరహాలో ఉండడంతో భయాందోళనకు గురయ్యారు. పలువురు ప్రాణ భయంతో పారిపోయారు. పరిస్థితిని అదుపు చేసేందుకు క్విక్ రెస్పాన్స్ టీమ్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది రంగంలోకి దిగారు.బృహన్ ముంబయి ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్పోర్ట్ (బెస్ట్)కు చెందిన బస్సు కుర్లా స్టేషన్ నుంచి అంధేరికీ వెళ్తుండగా బ్రేక్‌లు ఫెయిల్ కావడంతో ప్రమాదం జరిగినట్టు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. అయితే ఆ బస్సు డ్రైవర్ సంజయ్ మోర్ కాంట్రాక్ట్ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. బస్సు ప్రమాదానికి గల కారణాల్ని గుర్తించేందుకు ఆర్టీఓ అధికారి రవి గైక్వాడ్ నిపుణుల బృందం రంగంలోకి దిగింది.జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ సత్యనారాయణ చౌదరి స్వయంగా కుర్లా పోలీస్ స్టేషన్లో డ్రైవర్‌ను విచారించారు. సంజయ్ మోర్‌ను వైద్య పరీక్షల నిమిత్తం జేజే ఆస్పత్రికి తరలించి విచారణ చేపట్టారు. ఇదీ చదవండి : నా డెత్ లేఖ సుప్రీం కోర్టుకు చేరాలి -
మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా నర్వేకర్
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా బీజేపీకి చెందిన రాహుల్ నర్వేకర్ ఏకగ్రీవ ఎన్నికకు రంగం సిద్ధమైంది. నర్వేకర్ ఆదివారం సీఎం ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంలు షిండే, అజిత్‌లతో కలిసి అసెంబ్లీ కార్యదర్శి జితేంద్ర భోలెకు నామినేషన్ పత్రాలను అందజేశారు. స్పీకర్ పదవికి పోటీ పడరాదన్న ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) నిర్ణయంతో నర్వేకర్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. సోమవారం అసెంబ్లీలో బలపరీక్ష అనంతరం స్పీకర్ ఎన్నికపై నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశముంది. అనంతరం గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ శాసనసభ, శాసనమండలి సభ్యులతో జరిగే ఉమ్మడి సమావేశంలో ప్రసంగిస్తారు. అదేవిధంగా, ప్రొటోకాల్ ప్రకారం డిప్యూటీ స్పీకర్ పదవిని తమ కూటమిలోని పార్టీలకు వదిలేయాలని ఎంవీఏ నేతలు ఆదివారం సీఎం ఫడ్నవీస్‌ను కలిసి కోరారు. ప్రతిపక్ష నేత పదవిని కూడా ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇటీవలి ఎన్నికల్లో అసెంబ్లీలోని 288 సీట్లకుగాను మహాయుతి 230 స్థానాలను గెల్చుకోవడం తెల్సిందే. ముంబైలోని కొలాబా నుంచి మళ్లీ ఎన్నికైన రాహుల్ నర్వేకర్ గత 14వ అసెంబ్లీ స్పీకర్‌గా రెండున్నరేళ్లపాటు కొనసాగారు. ఆ సమయంలో శివసేన, ఎన్సీపీ చీలిక వర్గాల వ్యవహారంపై మహాయుతి ప్రభుత్వానికి అనుకూలంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శివసేన(షిండే)కు 11 మంత్రి పదవులు!మహారాష్ట్రలో మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది. అతిత్వరలో విస్తరణ ఉంటుందని మహాయుతి ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కూటమిలో కీలక భగస్వామి అయిన శివసేన(షిండే)కు 11 మంత్రి పదవులు దక్కనున్నట్లు సమాచారం. ఆ పార్టీ నేత ఏక్నాథ్ షిండే ఇప్పటికే ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. కీలక శాఖలు ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నారు. శివసేన(షిండే) నుంచి మంత్రులుగా ప్రమాణం చేసేవారిలో ఆరుగురు మాజీ మంత్రులే ఉంటారని సమాచారం. కొత్తగా ఐదుగురికి మంత్రి యోగం పట్టబోతున్నట్లు తెలుస్తోంది. కనీసం 13 మంత్రి పదవులు కావాలని శివసేన(షిండే) డిమాండ్ చేయగా 11 పదవులకు బీజేపీ అంగీకరించినట్లు సమాచారం. -
కేజ్రీవాల్ తలవంచడు..!
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పుష్ప–2 సినిమా మేనియా నడుస్తోంది. అదిప్పుడు రాజకీయాలనూ ప్రభావితం చేస్తోంది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇప్పుడు ‘తగ్గేదే లే’అంటున్నారు. తాజాగా ఆయన పుష్ప అవతారమెత్తారు. ‘కేజ్రీవాల్.. ఝుకేగా నహీ’అనే ట్యాగ్ లైన్ తో ఆప్ రిలీజ్ చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘కేజ్రీవాల్ కుంభకోణాల సాలీడు గూడు’అంటూ బీజేపీ రిలీజ్ చేసిన పోస్టర్‌కు ఆప్ ఇచ్చిన కౌంటర్ ‘టాక్ ఆఫ్ ద టౌన్’గా మారింది. ఎన్నికలకు రెండు నెలల ముందే బీజేపీ వర్సెస్ ఆప్ పోస్టర్ వార్ చలి కాలంలోనూ పొలిటికల్ హీట్ పెంచుతోంది. బీజేపీ పోస్టర్లో ఏముంది?ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం మోసాల కు పాల్పడుతోందంటూ బీజేపీ శనివారం పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్లో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీ నర్ కేజ్రీవాల్‌ను హైలైట్ చేసింది. మద్యం విధానంలో కుంభకోణం ఆరోపణలు, మొహల్లా క్లినిక్, హవాలా, భద్రత, రేషన్, పానిక్ బటన్, శీష్ మహల్, మందులు, ఢిల్లీ జల్ బోర్డ్, క్లాస్రూమ్, సీసీటీవీ స్కామ్‌లను ప్రస్తావిస్తూ. ’కేజ్రీవాల్ కుంభకోణాల సాలెగూడు’అని ట్యాగ్‌లైన్ పెట్టింది.కేజ్రీవాల్ పుష్ప అవతార్బీజేపీ పోస్టర్‌కు ఆదివారం ఆమ్ ఆద్మీ పార్టీ.. పాన్ ఇండియా సినిమా పుష్ప రేంజ్లో కౌంటర్ ఇచ్చింది. పుష్ప పోస్టర్లో హీరో అల్లు అర్జున్ ముఖాన్ని తీసేసి ఆ స్థానంలో కేజ్రీవా ల్ ఫేస్ పెట్టారు. ఒక చేతిలో ఆ పార్టీ గుర్తు చీపురు పట్టుకున్నట్లు చూపించారు. ’కేజ్రీవా ల్ ఝుకేగా నహీ (కేజ్రీవాల్ తలవంచడు)’ టైటిల్ పెట్టారు. పోస్టర్ కింద ‘కేజ్రీవాల్ ఫోర్త్ టర్మ్ కమింగ్ సూన్’అంటూ ట్యాగ్‌లైన్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఆప్ ఇదే పోస్టర్‌ను ప్రచార అస్త్రంగా మార్చుకునే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయి. 1998 నుంచి బీజేపీ ఢిల్లీలో అధికారానికి దూరంగా ఉంది. 2015 నుంచి ఇక్కడ ఆప్ సొంతంగా అధికారంలో ఉంది. -
ఎక్కడా లేని ఈవీఎంలు మనకెందుకు?
షోలాపూర్: అమెరికా, ఇంగ్లాండ్ వంటి అభివృద్ధి చెందిన దేశాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారని, మన దగ్గర మాత్రం ఈవీఎంలు ఎందుకని ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ ప్రశ్నించారు. ఈవీఎంలను పక్కనపెట్టి కేవలం బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహించాలని దేశ ప్రజలు కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈవీఎంల కారణంగా ఎన్నికల్లో అక్రమాలు, అవకతవకలు జరుగుతున్నట్లు అనుమానాలు ఉన్నాయని చెప్పారు. మహారాష్ట్రలో నాసిక్ జిల్లా మర్కద్వాడీ గ్రామంలో బ్యాలెట్ పేపర్లతో రీపోలింగ్ జరపాలని పోరాడుతున్న ప్రజలను శరద్ ఆదివారం కలుసుకున్నారు. వారికి సంఘీభావం ప్రకటించారు. మర్కద్వాదీ గ్రామస్థులు గొప్ప ఉద్యమం ప్రారంభించారని, మొత్తం దేశానికే సరైన దశాదిశ చూపుతున్నారని శరద్ పవార్ ప్రశంసించారు. గ్రామస్థులపై పోలీసులు నమోదు చేసిన కేసుల వివరాలు తనకు ఇవ్వాలని, ముఖ్యమంత్రి, రాష్ట్ర ఎన్నికల సంఘం, ప్రధానమంత్రి, కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తానని శరద్ పవార్ పేర్కొన్నారు. మమతా బెనర్జీ సమర్థ నేత విపక్ష ఇండియా కూటమి సారథ్య బాధ్యతలను పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీని అప్పగించాలన్న ప్రతిపాదనకు శరద్ పవార్‡మద్దతు పలికారు. ఆమె సమర్థత కలిగిన నాయకురాలు అని చెప్పారు. ఇండియా కూటమిని ముందుకు నడిపించడానికి సిద్ధంగా ఉన్నానని మమతా బెనర్జీ ప్రకటించిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: రైతులపై టియర్‌గ్యాస్.. ‘ఢిల్లీ చలో’లో హైటెన్షన్ -
మహారాష్ట్రలో బిగ్ ట్విస్ట్.. యూబీటీ ఎమ్మెల్యేల సంచలన నిర్ణయం
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ‘మహావికాస్ అఘాడీ’ కూటమి ఎమ్మెల్యేలు నేడు జరగాల్సిన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు బహిష్కరించనున్నారు. దీంతో, వారి నిర్ణయం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ కూటమి ఎమ్మెల్యేలు కీలక నిర్ణయం తీసుకున్నారు. నేడు జరగాల్సిన ప్రమాణ స్వీకారోత్సవాన్ని ప్రతిపక్ష కూటమి ఎమ్మెల్యేలు బహిష్కరించనున్నారు. ఈ మేరకు విషయాన్ని యూబీటీ ఎమ్మెల్యే ఆధిత్య థాక్రే వెల్లడించారు. ఈ సందర్బంగా థాక్రే మాట్లాడుతూ.. నేడు మహారాష్ట్ర అసెంబ్లీలో యూబీటీ ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేయడం లేదు. ఎన్నికల సందర్బంగా ఈవీఎంల విషయంలో మాకు అనేక అనుమానాలు ఉన్నాయి.ఈ క్రమంలోనే అందుకు నిరసనగా నేడు ప్రమాణస్వీకారం చేయడం లేదు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని అంతం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఫలితాలపై ప్రజలు సంతృప్తిగా లేరు. ఈవీఎంల విషయంలోను తప్పు జరిగింది. ప్రజలిచ్చిన తీర్పు అయితే వారంతా సంతోషంగా ఉండేవారు. అలా జరగలేదు కాబట్టే ఎక్కడా విజయోత్సవాలు కనిపించడం లేదని ఆరోపించారు.మరోవైపు.. ఆధిత్య థాక్రే వ్యాఖ్యలపై మహాయుతి కూటమి నేతలు కౌంటర్ అటాక్ ఇచ్చారు. ప్రతిపక్ష కూటమి నేత చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నాం. అవసరమైతే న్యాయస్థానాన్ని, ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాలి అంటూ సూచనలు చేశారు. కాగా, మహారాష్ట్ర అసెంబ్లీలో నేడు ఎమ్మెల్యేలుగా దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్‌తో సహా పలువురు ప్రమాణం చేశారు. -
మహారాష్ట్రలో ట్విస్ట్.. శివసేన ఎమ్మెల్యే వ్యాఖ్యల అర్థమేంటి?
ముంబై: మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం ఏర్పాటైంది. మహారాష్ట్రలో 11 రోజుల ఉత్కంఠకు తెరదీస్తూ ముఖ్యమంత్రిగా, దేవేంద్ర ఫడ్నవీస్ ఉపముఖ్యమంత్రులుగా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో షిండే వర్గం శివసేన ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.శివసేన ఎమ్మెల్యే భరత్ గోగవాలే తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ముందే డిసెంబరు 11-16 మధ్య క్యాబినెట్ విస్తరణ ఉంటుంది. శివసేన నేతలకు కీలక శాఖలు వచ్చే అవకాశం ఉంది. మహాయుతి ప్రభుత్వంలో తనకు హోంశాఖను అప్పగించాలని మాజీ సీఎం ఏక్నాథ్ షిండే డిమాండ్ చేశారు. ప్రభుత్వం దీనిపై ఆలోచన చేస్తోంది. షిండే సీఎంగా ఉన్న సమయంలో ప్రస్తుత సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు హోంశాఖ అప్పగించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే, ఎమ్మెల్యే భరత్.. షిండేకు అత్యంత సన్నిహితుడు కావడం విశేషం.ఇక, గత మహాయుతి ప్రభుత్వంలో శివసేనకు ఉన్న శాఖలను మార్చేందుకు కూటమిలో ప్రయత్నాలు జరుగుతున్నాయని మరో శివసేన ఎమ్మెల్యే ఆరోపించారు. కాగా శిందే నేతృత్వంలోని మునుపటి ప్రభుత్వంలో మాదిరిగానే ఎన్సీపీ తమ దగ్గరున్న ఆర్థికశాఖను, బీజేపీ హోంశాఖను నిలబెట్టుకునే అవకాశాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. శివసేనకు పట్టణాభివృద్ధి, రెవెన్యూ శాఖలు దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం.ఇదిలా ఉండగా.. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత జరిగిన మహాయుతి తొలి సమావేశంలోనే ముఖ్యమంత్రి బీజేపీ నుంచి ఉండేందుకు షిండే అంగీకరించారని ఫడ్నవీస్ పేర్కొన్న విషయం తెలిసిందే. వ్యక్తిగతంగా షిండేతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. అయితే, గత ప్రభుత్వంలో రెండున్నరేళ్ల పాటు సీఎం పదవిలో కొనసాగిన షిండే.. డిప్యూటీ సీఎం బాధ్యతలను తీసుకునేందుకు నిరాకరించినట్లు వార్తలు వచ్చాయి. -
పులికి మరో ప్రాణం బలి
ముంబై: ఇటీవలి కాలంలో గ్రామాల్లో పులుల సంచారం ఎక్కువైంది. పంట పొలాల్లోకి వస్తున్న పులులు.. ప్రజలపై దాడులు చేస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రలో పులి దాడిలో ఓ గర్భిణి మరణించింది. దీంతో, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.వివరాల ప్రకారం.. తెలంగాణ సరిహద్దుల్లోని మహారాష్ట్ర ప్రాంతంలో శనివారం ఉదయం పులి దాడి ఘటన వెలుగు చూసింది. పులి దాడిలో ఓ గర్భిణి మృతిచెందినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. ఇటీవల కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం గన్నారం గ్రామానికి చెందిన మోర్లె లక్ష్మి (21) పులి దాడిలో మరణించిన విషయం తెలిసిందే. నజ్రుల్ నగర్ విలేజ్ నంబర్ 13–11 మధ్య తన సొంత పత్తి చేలో పత్తి తీస్తుండగా.. ఉదయం 7 గంటల సమయంలో అడవి నుంచి వచ్చిన పులి ఆమెపై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన లక్ష్మిని స్థానికులు దవాఖానకు తరలిస్తుండగా మృతిచెందింది. లక్ష్మిపై పులి దాడి చేయటాన్ని గుర్తించిన తోటి కూలీలు.. గట్టిగా కేకలు వేసి సమీప గ్రామస్తులకు సమాచారం అందించారు. దీంతో కొందరు వ్యక్తులు కర్రలతో వచ్చి పులిని బెదిరించటంతో లక్ష్మిని వదిలి అది అడవిలోకి పారిపోయింది.మరో ఘటనలో సిర్పూర్ (టీ) మండలం దుబ్బగూడకు చెందిన రైతు సురేష్‌పై శనివారం(నవంబర్30) పులి దాడి చేసి గాయపరిచింది. సురేష్ పొలంలో పనిచేస్తుండగా పులి ఒక్కసారిగా దాడి చేసింది. పులి గాట్లతో సురేష్ తీవ్రంగా గాయపడ్డాడు. సురేష్‌ను చికిత్స కోసం సిర్పూర్(టీ) ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
‘వినియోగం’ గణనీయంగా తగ్గింది!
దాదర్: ముంబైలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గిపోయింది. గత వారం దాకా ఉక్కపోతతో సతమతమైన ముంబైకర్లకు ఇప్పుడు చలి కారణంగా కొంతమేర ఊరట లభించినట్లైంది. పగలు కొంత ఉక్కపోత భరించలేకపోయినప్పటికి రాత్రుల్లో వాతావరణంలో ఆకస్మాత్తుగా మార్పులు జరుగుతున్నాయి. ఫలితంగా ఇళ్లలోని ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వినియోగం చాలా శాతం వరకు తగ్గింది. దీంతో ముంబైలో గత వారం కిందట మూడు వేల మెగావాట్ల విద్యుత్ వినియోగం జరగ్గా ఇప్పుడది 2,500 మెగావాట్లకు పడిపోయింది. చలికాలం ప్రారంభంలోనే సుమారు 500 మెగావాట్ల వరకు విద్యుత్ వినియోగం తగ్గిపోయింది. మరికొద్ది రోజుల్లో ఇది 1,500 మెగావాట్లకు చేరడం ఖాయమని అధికారులు భావిస్తున్నారు. వేసవికాలంలో 4,550 మెగావాట్లపైనే.... వేసవి కాలంలో ఎండలు మండిపోవడంతో ఉదయం 10 గంటల తరువాత ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జనాలు జంకుతారు. ఇళ్లల్లో, కార్యాలయాల్లో, వ్యాపార, వాణిజ్య సంస్ధల్లో పనిచేసే ఉద్యోగులు ఉక్కపోత భరించలేక సతమతమవుతారు. నిరంతరంగా ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు పనిచేసినప్పటికీ వాతావరణం చల్లబడదు. దీంతో వేసవి కాలంలో ముంబైలో విద్యుత్ వినియోగం ఏకంగా 4,500 మెగావాట్లకు పైనే చేరుకుంటుంది. ఏటా విద్యుత్ వినియోగం రికార్డులను బ్రేక్ చేస్తూనే ఉంటుంది. వేసవి కాలం మినహా మిగిలిన సీజన్లలో విద్యుత్ వినియోగం ఒక్కసారిగా తగ్గిపోతుంది. ఇళ్లు, షాపులు, కార్యాలయాల్లో విశ్రాంతిలేకుండా ఫ్యాన్లు, ఏసీలు పనిచేయడంతో రెండు రోజుల కిందట విద్యుత్ వినియోగం 2,500 మెగావాట్లకు చేరుకుంది. టాటా పవర్ నుంచి 382 మెగావాట్లు, అదాణీ డహాణు విద్యుత్ కేంద్రం నుంచి 288 మెగావాట్లు, ముంబై ఎక్చేంజ్ నుంచి 1,971 మెగావాట్లు విద్యుత్ సరఫరా జరిగింది. ముంబైలో భిన్నంగా... ఇదిలాఉండగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గిపోయినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా డిమాండ్ భారీగా పెరిగిపోయింది. ప్రస్తుతం శీతాకాలం ప్రారంభమైనప్పటికీ అనేక జిల్లాల్లో వాతావరణం ఇంకా వేసవి ఎండలు తలపిస్తున్నాయి. రోజు ఏకంగా 31,001 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరుగుతోంది. పెద్ద మొత్తంలో విద్యుత్ వినియోగం పెరిగిపోవడంతో మహానిరి్మతి కంపెనీ నుంచి 6,252 మెగావాట్లు, ప్రైవేటు కంపెనీల నుంచి 8,728 మెగావాట్లు, ఎక్చేంజి నుంచి సుమారు 8 వేల మెగావాట్లు విద్యుత్ సేకరించి ఈ డిమాండ్‌ను పూరిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని వివిధ ప్రధాన నగరాలతో పోలిస్తే ముంబైలో విద్యుత్ వినియోగం అధికంగా ఉంటుంది. ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార, వాణిజ్య సంస్ధలు అధికంగా ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. వీటితోపాటు జంక్షన్ల వద్ద, ప్రధాన రహదారులపై, పర్యాటక ప్రాంతాల్లో వాణిజ్య, వ్యాపార ప్రకటనల బోర్డులు, హోర్డింగులు అడుగడుగున ఉంటాయి. వీటిలో కొన్ని ఎల్రక్టానిక్, డిజిటల్ బోర్డులుంటాయి. రాత్రుల్లో వాటికి విద్యుత్ సరఫరా చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సాధారణ బోర్డులకు ప్లడ్ లైట్లు వెలుగుతాయి. దీంతో రాత్రి వాతావరణం చల్లిబడినప్పటికి విద్యుత్ వినియోగం పగలు మాదిరిగానే జరుగుతుంది. అయితే కొద్ది నెలల కిందట ఘాట్కోపర్లోని చడ్డానగర్ జంక్షన్ వద్ద భారీ హోర్డింగ్ కూలడంతో సుమారు 17 మంది చనిపోగా 30 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటనతో అక్రమంగా ఏర్పాటు చేసిన హోర్డింగులు, బోర్డుల అంశం తెరమీదకు వచి్చంది. వివిధ రంగాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో కళ్లు తెరచిన ప్రభుత్వం, బీఎంసీ పరిపాలన విభాగం తనిఖీలు ప్రారంభించింది. అక్రమంగా ఏర్పాటుచేసిన హోర్డింగులు, సైన్ బోర్డులతోపాటు వాటికి విద్యుత్ సరఫరా చేస్తున్న కనెక్షన్లను కూడా తొలగిస్తున్నారు. ఆ ప్రకారం ముంబైలో కొంత శాతం విద్యుత్ వినియోగం తగ్గాలి. కానీ ఇవేమీ విద్యుత్ వినియోగంపై ఎలాంటి ప్రభావం చూపడం లేదు. -
నేను అడిగాకే.. డిప్యూటీ సీఎంగా షిండే ఒప్పుకున్నారు: ఫడ్నవీస్
ముంబై: తాను అడిగితేనే శివసేన అధినేత ఏక్నాథ్ షిండే డిప్యూటీ సీఎంగా ఉండటానికి అంగీకరించారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. వ్యక్తిగతంగా షిండేతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి రెండు రోజుల ముందే షిండేతో భేటీ అయ్యానని, అప్పుడే ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉండేందుకు అంగీకరించారని వెల్లడించారు. ఓ జాతీయ మీడియాకు శుక్రవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫడ్నవీస్ ఈ వ్యాఖ్యలు చేశారు.కాగా దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. 11 రోజుల ఉత్కంఠకు తెరదీస్తూ ముఖ్యమంత్రిగా, దేవేంద్ర ఫడ్నవీస్ ఉపముఖ్యమంత్రులుగా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో ఫడ్నవీస్ ఆయన ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత జరిగిన మహాయుతి తొలి సమావేశంలోనే ముఖ్యమంత్రి బీజేపీ నుంచి ఉండేందుకు షిండే అంగీకరించారని ఫడ్నవీస్ పేర్కొన్నారు. ‘అయితే షిండే ప్రభుత్వంలో భాగం కాకూడదని, కూటమి సజావుగా సాగేందుకు సమన్వయ కమిటీకి నేతృత్వం వహించాలని శివసేనలోని ఒక వర్గం భావించింది. తమ పార్టీ నుంచి ముఖ్యమంత్రి కావాలని శివసేన నేతలు కోరుకునేవారు. కానీ, మా మనసులో ఎలాంటి సందేహం లేదు. వ్యక్తిగతంగా షిండేతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. నేను ఆయనను కలిసిన తర్వాత ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉండటానికి అంగీకరించారు’ అని తెలిపారు.అయితే గత ప్రభుత్వంలో రెండున్నరేళ్ల పాటు సీఎం పదవిలో కొనసాగిన షిండే.. డిప్యూటీ సీఎం బాధ్యతలను తీసుకునేందుకు నిరాకరించినట్లు వార్తలు వచ్చాయి. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునేందుకు షిండే అంగీకరించడంతో ఆ ఊహాగానాలకు చెక్ పడింది. -
మహారాష్ట్ర ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ నేత కాళిదాస్ కొలాంబ్కర్
ముంబై: బీజేపీ సీనియర్ నేత కాళిదాస్ కొలాంబ్కర్ మహారాష్ట్ర అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణస్వీకారం చేశారు. మహారాష్ట్ర రాజ్‌భవన్‌లో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్.. కొలాంబ్కర్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో కాళిదాస్ కొలాంబ్కర్ ప్రమాణస్వీకారం చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన 288 మంది ఎమ్మెల్యేలతో కొలాంబ్కర్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. డిసెంబర్ 7 నుంచి 15వ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మూడు రోజులపాటు జరగనున్న ఈ ప్రత్యేక సమావేశాల్లో సెంబ్లీకి శాశ్వత స్పీకర్‌ను, డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు. త్వరలో నూతన అసెంబ్లీ కొలువుదీరనుంది.#WATCH | Mumbai: BJP leader Kalidas Kolambkar takes oath as the Maharashtra Assembly Protem Speaker at Maharashtra Raj Bhawan administered by state Governor CP Radhakrishnan in the presence of Maharashtra CM Devendra Fadnavis. pic.twitter.com/IHSA6Ube6z— ANI (@ANI) December 6, 2024కాగా మహారాష్ట్రలో ఎట్టకేలకు దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహాయుతి కూటమి నూతన ప్రభుత్వం కొలువుదీరింది. ఫలితాలు వెలువడిన 12 రోజుల తర్వాత ఎట్టకేలకు ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ఉపముఖ్యమంత్రులుగా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఆజాద్ మైదానంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవాల వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మోంశాఖమంత్రి అమిత్ షా సహా బీజేపీ కూటమి అధికారంలో ఉన్న 22 రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు, ప్రముఖ నేతలు, బాలీవుడ్ నటీనటుటు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు హాజరయ్యారు. -
కట్టడి చేస్తున్నా...కేసులు పెరుగుతున్నాయ్!
దాదర్: ప్రాణాంతక హెచ్ఐవీ వ్యాధిని నియంత్రించేందుకు ప్రభుత్వం, ఎయిడ్స్ కంట్రోల్ బోర్డు (ఏసీబీ)అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినప్పటికీ ముంబైలో ఎయిడ్స్ రోగుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ముంబై జిల్లా ఎయిడ్స్ నియంత్రణ కమిటీ ఏటా నిర్వహిస్తున్న వైద్య పరీక్షల్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు మూడు వేల మంది హెచ్ఐవీ రోగులన్నుట్లు తేలింది. ప్రస్తుతం ముంబైలో 40,658 హెచ్ఐవీ రోగులున్నట్లు ముంబై జిల్లా ఎయిడ్స్ నియంత్రణ కమిటీ స్పష్టం చేసింది. దీంతో ఎయిడ్స్ కంట్రోల్ బోర్డు, వైద్య శాఖ, ప్రభుత్వ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు హెచ్ఐవీ రోగుల సంఖ్య తగ్గించేందుకు గత అనేక సంవత్సరాలుగా ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. ఇందుకోసం పెద్ద ఎత్తున జనజాగృతి కార్యక్రమాల చేపడుతోంది. నేటి ఆధునిక యుగంలో కొత్తకొత్త మందులు మార్కెట్లోకి వచ్చాయి. రోగులు కూడా ఆయుర్వేదం జోలికి పోకుండా ఆధునిక మందులు, మాత్రలను వాడుతున్నారు. అయినా ముంబైలో ఏటా మూడు వేలమందికి వ్యాధి నిర్ధారణ జరగడం ఆందోళన కల్గిస్తోంది. ఏటా నిర్వహిస్తున్న వైద్య పరీక్షల్లో బయటపడుతున్న కొత్త రోగుల్లో 75 శాతం 15–49 ఏళ్ల మధ్య వయసున్న వారున్నారు. వీరిలో 31 శాతం మహిళలున్నారు. అనేక సందర్భాల్లో రక్షణ ప్రమాణాలు పాటించకుండా లైంగిక సంబంధాలు కొనసాగించడం, అక్రమ సంబంధాల వల్ల ఈ వ్యాధి సోకుతోందని వైద్య పరిశీలనలో తెలిసింది. హెచ్ఐవీ గురించి భారీగా అవగాహన సదస్సులు, జనజాగృతి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ పెద్ద మొత్తంలో ఎయిడ్స్ కేసులు బయటపడుతుండటంతో ముంబై జిల్లా ఎయిడ్స్ నియంత్రణ కమిటీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. తగ్గిన వివక్ష... హెచ్ఐవీ రోగులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా కొద్ది సంవత్సరాల నుంచి నియంత్రణ కమిటీ కొత్త విధానాలను అమలు చేస్తోంది. రోగులు ఉన్నచోటే పరీక్షలు నిర్వహించడం, వ్యాధి ఏ దశలో ఉందో గుర్తించడం, ఒక్క ముంబైలోనే 20కి పైగా కేంద్రాల ద్వారా ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడం, రోగులకు ఉచితంగా మందులు లభించేలా ఏర్పాటు చేసినట్లు ముంబై జిల్లా ఎయిడ్స్ నియంత్రణ కమిటీ అదనపు డైరెక్టర్ డా.విజయ్‌కుమార్ కారంజ్కర్ తెలిపారు. మరోవైపు ప్రభుత్వం రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేస్తుంది. గతంలో వారు చికిత్స పొందుతున్న ఆస్పత్రుల్లోనే మందులు ఇచ్చేందుకు స్వతంత్రంగా కౌంటర్లు ఏర్పాటు చేసింది. ఎలాంటి ఆహారం, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధి నియంత్రణలోకి వస్తుందనే విషయంలో మార్గదర్శనం చేస్తున్నారు. సమయానికి మందులు, మంచి ఆహారం తీసుకుంటే ఎప్పటిలాగే జీవనం సాగిస్తారని రోగులకు మనోధైర్యాన్ని నూరిపోస్తున్నారు. గతంలో హెచ్ఐవీ రోగులంటేనే వారి కుటుంబసభ్యులు, ప్రజలు కూడా చిన్న చూపు చూసేవారు. వారి పట్ల బేధభావం ప్రదర్శించేవారు. వారు వాడే దుస్తులు, వస్తువులను వేరుగా ఉంచడంతోపాటు పడుకునేందుకు ప్రత్యేకంగా గది కేటాయించేవారు. కానీ ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టిన జనజాగృతి కార్యక్రమాలవల్ల ప్రజల్లో అవగాహన వచ్చింది. దీంతో ఇలాంటి ఘటనలు కూడా గణనీయంగా తగ్గిపోయాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. -
అమృత ఫడ్నవీస్ : ఆయనతో పెళ్లంటే మొదట్లో భయపడింది, కానీ
తెలుగు పంచాంగం ప్రకారం రోజులో కొంత సమయాన్ని ‘అమృత ఘడియలు’ అంటారు.కొందరికి మాత్రం ఆత్మీయులు దగ్గర ఉంటే ఎప్పుడూ అమృత ఘడియలే. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్‌కు అమృత భార్య మాత్రమే కాదు... ఆత్మీయ నేస్తం. ప్రముఖ రాజకీయ నాయకుడి భార్యగానే కాదు...‘మల్టీ టాలెంటెడ్ స్టార్’గా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది అమృత ఫడ్నవీస్... ‘మీరు ఎప్పుడూ ఇంత ఉత్సాహంగా ఎలా ఉండగలుగుతున్నారో మాకు తెలుసు’ అంటారు సన్నిహితులు దేవేంద్ర ఫడ్నవీస్‌తో సరదాగా. ఆ రహస్యంలో ‘అమృత’ పేరు దాగి ఉంది. దేవేంద్ర భార్య అయిన అమృత మల్టీటాలెంట్కు మారుపేరు. నిత్య ఉత్సాహానికి కేరాఫ్ అడ్రస్. ఫైనాన్స్, మ్యూజిక్, యాక్టింగ్, స్పోర్ట్స్... పలు రంగాల్లో ప్రతిభ చాటుకున్న అమృత ఫడ్నవీస్ సామాజిక సేవాకార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటుంది.నాగ్‌పూర్‌కు చెందిన అమృత డిగ్రీ వరకు అక్కడే చదువుకుంది. పుణేలో ఎంబీఏ చేసింది. యాక్సిస్ బ్యాంక్‌లో ఎగ్జిక్యూటివ్ క్యాషియర్‌గా ఆమె ఉద్యోగ ప్రస్థానం మొదలైంది. అమృతకు చిన్నప్పటి నుంచి శాస్త్రీయ సంగీతం అంటే ఇష్టం. తన గానంతో శ్రోతల ప్రశంసలు అందుకునేది. ప్రకాష్ ఝా సినిమా ‘జై గంగా జల్’లో ఒక పాట కూడా పాడింది. సామాజిక సందేశంతో కూడిన పాటలను రూపొందించడంలో ముందు ఉండే అమృత నది కాలుష్యం నుంచి గృహహింస వరకు ఎన్నో అంశాలపై పాటలు ఆలపించింది. స్త్రీ సాధికారతను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక పాటలు రూపొందించింది. ఆపదలో ఉన్న ప్రజలు, అణగారిన వర్గాల పిల్లల సహాయం కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది.అమృత ప్రతిభలో పాటే కాదు ఆట కూడా ఉంది. స్టేట్–లెవెల్ టెన్నిస్ ప్లేయర్‌గా అండర్–16 టోర్నమెంట్స్‌లో ఆడింది. ‘సోషల్ మీడియా స్టార్’గా కూడా బాగా పాపులర్ అయిన అమృతకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1.1 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. సామాజిక కోణంలో ఆమె ఇన్స్పైరింగ్ పోస్ట్‌లకు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. కెరీర్, కుటుంబాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్న అమృత దేవేంద్ర ఫడ్నవీస్‌కు అక్షరాలా ఆత్మీయ బలం.పెళ్లికి మొదట్లో భయపడింది!దేవేంద్ర–అమృత వివాహం ప్రేమ వివాహం అనుకుంటారు చాలా మంది. కాని వారిది పెద్దలు కుదిర్చిన పెళ్లి. అమృత తండ్రి శరద్ రానడే, తల్లి చారులత... ఇద్దరూ వైద్యులే. అయితే తమలాగే కూతురు కూడా డాక్టర్ కావాలని వారు అనుకోలేదు. కుమార్తెకు స్వేచ్ఛ ఇచ్చారు. ఇక పెళ్లి విషయానికి వస్తే... పెళ్లికి ముందు దేవేంద్ర, అమృత ఒకరికొకరు అపరిచితులు. వీరిని ఒక కామన్ ఫ్రెండ్ శైలేష్ జోగ్లేక్ ఇంట్లో పెళ్లి కోసం తీసుకువచ్చారు పెద్దలు. అప్పటికే దేవేంద్ర శాసనసభ్యుడు అయ్యాడు.‘రాజకీయ నాయకుడిని పెళ్లి చేసుకోవడం గురించి మొదట్లో భయపడ్డాను. అయితే ఆయన నిరాడంబర వ్యక్తిత్వంతో నాలో భయం ఎగిరిపోయింది. నా అభిప్రాయం మారిపోయింది’ అని భర్త దేవేంద్ర గురించి చెబుతుంది అమృత.చాలామంది రాజకీయనాయకులలాగే దేవేంద్ర కూడా గంభీరంగా కనిపిస్తాడు. ఆయన సరదాగా ఉండేలా, అదేపనిగా నవ్వేలా చేయడం అంటే ఆషామాషీ కాదు. అయిననూ... శ్రీమతి అమృత భర్త దేవేంద్రను నవ్విస్తూ ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన పెదాలపై కనిపించే నవ్వు... అమృత సంతకం! -
కొలువుదీరిన ప్రభుత్వం.. మంత్రి పదవులపై కొనసాగుతున్న సస్పెన్స్
సాక్షి ముంబై: మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహాయుతి కూటమి నూతన ప్రభుత్వం కొలువుదీరింది. ఫలితాలు వెలువడిన 12 రోజుల తర్వాత ఎట్టకేలకు ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్.. ఉపముఖ్యమంత్రులుగా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఆజాద్ మైదానంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవాల వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖమంత్రి అమిత్ షా సహా.. బీజేపీ కూటమి అధికారంలో ఉన్న 22 రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు, ప్రముఖ నేతలు, బాలీవుడ్ నటీనటుటు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు హాజరయ్యారు.ఈ నేపథ్యంలో ఎవరెవరిని మంత్రి పదవులు వరించనున్నాయనే విషయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎంగా ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంలుగా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ ఇలా ముగ్గురే ప్రమాణ స్వీకారం చేయడంతో మంత్రి పదవులపై సస్సెన్స్ కొనసాగుతోంది. అయితే అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన బీజేపీకి సుమారు 20 నుంచి 25 మంత్రి పదవులు దక్కే అవకాశం ఉండగా.. శివసేన (షిండేే) పార్టీకి సుమారు 10 నుంచి 12 అదేవిదంగా ఎన్సీపీ (ఏపీ)కి 8 నుంచి 10 మంత్రి పదవులు లభిస్తాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పదవుల ఆశిస్తున్న వారందరు లాబీ యింగ్ ప్రారంభించారు.ఇదిలా ఉండగా తాను ముఖ్య మంత్రిని కానందుకు మనస్తాపానికి గుర య్యానన్న మాటలను మహారాష్ట్ర ఉప ముఖ్య మంత్రి షిండే కొట్టిపారేశారు. 2022లో శివసేనను నుంచి బయటకు వచ్చినపుడు తనవెంట ఉన్నది 39 మంది ఎమ్మెల్యేలని, నేడు, పార్టీకి 57 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, అసలు శివసేన ఎవరిదో దీన్ని బట్టే తెలి సిపోతోందని ఎద్దేవా చేశారు. ప్రమాణ స్వీకా రోత్సవం అనంతరం శివసేన ప్రధాన కార్యా లయం ఆనంద్ ఆశ్రమానికి వచ్చినప్పుడు ఆయనకు ఘన స్వాగతం లభించింది. వందలాది మంది పార్టీ కార్యకర్తలు ప్లకార్డులు చేతబూని నినాదాలు చేస్తూ ఆయన్ను స్వాగతించారు.< -
షిండే శకం ముగిసింది.. ఆయన మళ్లీ సీఎం కాలేరు: సంజయ్ రౌత్
ముంబై: మహారాష్ట్రలో పది రోజుల ఉత్కంఠకు తెరపడింది. కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ నేడు(గురువారం) సాయంత్రం 5:30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దక్షిణ ముంబయిలోని ఆజాద్ మైదాన్‌లో ప్రమాణ స్వీకారోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఈ క్రమంలో శివసేన అధినేత ఏక్నాథ్ షిండేను మరోసారి సీఎం చేయకపోవడంపై ఉద్దవ్ వర్గం ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏక్నాథ్ షిండే పాలన శకం ముగిసిందని, ఆయన ఇంకెప్పుడూ మహారాష్ట్రకు సీఎం కాలేడని అన్నారు. ఈ మేరకు గురువారం విలేకరులతో సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ షిండేను పావులా ఉపయోగించుకొని ఇప్పుడు పక్కన పెట్టిందని ఆరోపించారు. ‘షిండే శకం ముగిసిపోయింది. రెండేళ్లు మాత్రమే సీఎంగా ఉన్నారు. ఇప్పుడు అతని వాడుక ముగిసింది. అతడిని పక్కన పడేశారు. షిండే మళ్లీ ఈ రాష్ట్రానికి సీఎం కాలేడు. తమతో జతకట్టే పార్టీలను బలహీనపరిచేందుకు, కూల్చివేయడానికి బీజేపీ తన రాజకీయ వ్యూహాన్ని ఉపయోగిస్తోంది’ అని ఆరోపించారు.షిండే పార్టీని కూడా విచ్ఛిన్నం చేయగలరని సంజయ్ రౌత్ విమర్శించారు. రాజకీయాల్లో బీజేపీ వ్యూహం ఇదేనని, తమతో పనిచేసే వారి పార్టీని విచ్ఛిన్నం చేసి ఆ పార్టీని లేకుండా చేస్తుందని మండిపడ్డారు. మెజారిటీ ఉన్నప్పటికీ మహాయుతి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 15 రోజులు ఎందుకు పట్టిందన్న ప్రశ్నకు బదులిస్తూ.. పాలక కూటమిలో చీలిక మొదలైందని.. ఈ సమస్య రేపటి నుంచి ఇంక పెద్దదవుతుందని అన్నారు.‘ఈరోజు నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ రాష్ట్రానికి సీఎం అవుతారు. ఆయనకు మెజారిటీ ఉంది కానీ, 15 రోజుల పాటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయారు . అంటే వారి పార్టీ లేదా మహాయుతిలో ఏదో లోపం ఉందని అర్థం. ఇప్పుడు కాకపోయిన రేపు అయినా బయటపడుతుంది. వారు మహారాష్ట్ర, దేశ ప్రయోజనాల కోసం పని చేయడం లేదు. తమ స్వార్థంతో కలిసి వచ్చారు.. కానీ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎన్నికల ఫలితాలకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చారు. ఫలితాలను ఇప్పటికీ వారు అంగీకరించడం లేదు.’ అని పేర్కొన్నారు.కాగా ముంబయిలో బుధవారం జరిగిన రాష్ట్ర భాజపా కోర్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ పేరును ఖరారు చేశారు.ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టనుండటం ఇది మూడోసారి కానుంది. కొత్త ప్రభుత్వంలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉంటారని, వారు కూడా గురువారం తనతోపాటు మంత్రులుగా ప్రమాణం చేస్తారని ఫడ్నవీస్ ప్రకటించారు. అయితే ఆ ఇద్దరిలో ప్రస్తుతానికి ఒక్కరిపైనే అధికారికంగా స్పష్టత వచ్చింది.తాను డిప్యూటీ సీఎంగా మరోసారి బాధ్యతలు నిర్వర్తించనున్నట్లు ఎన్సీపీ అగ్ర నాయకుడు అజిత్ పవార్ ప్రకటించారు. ఆయనతోపాటు ప్రస్తుతం మహారాష్ట్ర ఆపద్ధర్మ సీఎంగా ఉన్న శివసేన అధినేత ఏక్నాథ్ షిండే కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉంటారని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ఇంకా ప్రకటన వెలువడలేదు. -
దేవేంద్ర ఫడ్నవీస్ అనే నేను..
ముంబై: మహారాష్ట్రలో ఎట్టకేలకు కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఉత్కంఠకు తెరదించుతూ ఉప ముఖ్యమంత్రులుగా శివసేన (షిండే) నేత ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ(అజిత్ పవార్) నాయకుడు అజిత్ పవార్ ప్రమాణం చేశారు. వారితో గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ముంబై ఆజాద్ మైదాన్‌లో గురువారం సాయంత్రం అశేష జనవాహిని సమక్షంలో అట్టహాసంగా జరిగిన ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. సీఎం, డిప్యూటీ సీఎంలు మినహా మంత్రులెవరూ ప్రమాణం చేయలేదు. ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ప్రమాణం చేయడం ఇది మూడోసారి. వచ్చే వారం మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు మహాయుతి వర్గాలు తెలిపాయి. మహారాష్ట్రలో నవంబర్ 23న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడగా, 15 రోజుల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు కావడం గమనార్హం. ముఖ్యమంత్రి పదవిపై ప్రతిష్టంభన తొలగకపోవడం, కీలక శాఖలపై మిత్రపక్షాలు పట్టుబట్టడంతో ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం జరిగింది. బీజేపీ అధిష్టానం జోక్యం చేసుకొని మిత్రపక్షాలను ఒప్పించడంతో కథ సుఖాంతమైంది. మరోసారి ముఖ్యమంత్రి పదవి ఆశించిన ఏక్నాథ్ షిండే ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకున్నారు. ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణం చేయడం పట్ల ఆయన భార్య, గాయకురాలు అమృత ఆనందం వ్యక్తం చేశారు. ఇదొక అద్భుతమైన రోజు అని చెప్పారు. ఫడ్నవీస్‌పై బాధ్యత మరింత పెరిగిందని వ్యాఖ్యానించారు. #WATCH | Shiv Sena's Eknath Shinde takes oath as Deputy CM of Maharashtra pic.twitter.com/G33WOBOLbw— ANI (@ANI) December 5, 2024హాజరైన ప్రముఖులు కేంద్ర మంత్రులు అమిత్ షా, జె.పి.నడ్డా, రాజ్‌నాథ్æ, గడ్కరీ, శివరాజ్ చౌహాన్, నిర్మలా సీతారామన్, జ్యోతిరాదిత్య సింధియా, అశ్వినీ వైష్ణవ్, ఎస్.జైశంకర్ హాజరయ్యారు. ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్(ఉత్తరప్రదేశ్), పుష్కర్‌సింగ్ ధామీ(ఉత్తరాఖండ్), నాయబ్‌సింగ్ సైనీ(హరియాణా), భూపేంద్ర పటేల్(గుజరాత్), ప్రమోద్ సావంత్(గోవా), హిమంతబిశ్వ శర్మ(అస్సాం), విష్ణుదేవ్ సాయి(ఛత్తీస్‌గఢ్), భజన్‌లాల్ శర్మ(రాజస్తాన్), మోహన్ యాదవ్(మధ్యప్రదేశ్), మోహన్‌చరణ్ మాఝీ(ఒడిశా), పెమా ఖండూ(అరుణాచల్‌ప్రదేశ్), ఎన్.బీరేన్‌సింగ్(మణిపూర్), మాణిక్ సాహా(త్రిపుర), నితీశ్ కుమార్(బిహార్), కాన్రాడ్ సంగ్మా(మేఘాలయా), నిఫియూ రియో(నాగాలాండ్), ప్రేమ్‌సింగ్ తమాంగ్(సిక్కిం), ఎన్.రంగస్వామి(పుదుచ్చేరి), ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ప్రముఖ పారిశ్రామికవేత్తలు ముకేశ్ అంబానీ, అనిల్ అంబానీ, నోయల్ టాటా, కుమార మంగళం బిర్లా, బాలీవుడ్ సినీ ప్రముఖులు షారుక్ ఖాన్ సల్మాన్ ఖాన్, మాధురీ దీక్షిత్, విద్యా బాలన్, క్రికెట్ దిగ్గజం టెండూల్కర్‌తోపాటు వివిధ దేశాల దౌత్యవేత్తలు హాజరయ్యారు. శివసేన(యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్, మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే, మహా నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రేను ఆహా్వనించినప్పటికీ హాజరు కాలేదు. కొత్త సీఎం, డిప్యూటీ సీఎంలకు ప్రధాని మోదీ ‘ఎక్స్’లో అభినందనలు తెలియజేశారు. #WATCH | PM Narendra Modi congratulates Shiv Sena chief Eknath Shinde on taking oath as Maharashtra Deputy CM(Source: DD News) pic.twitter.com/dHQEzx4KFM— ANI (@ANI) December 5, 2024స్థిరమైన ప్రభుత్వం అందిస్తాంరాబోయే ఐదేళ్లపాటు స్థిరమైన ప్రభుత్వాన్ని ప్రజలకు అందిస్తామని సీఎం ఫడ్నవీస్ చెప్పారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తన నేతృత్వంలో రాజకీయాల్లో ఇకపై స్పష్టమైన మార్పును చూస్తారని చెప్పారు. ఎన్నికల్లో ప్రజలు తమకు భారీ మెజార్టీ కట్టబెట్టారని, వారి ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. సామాజిక, మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక రంగాల్లో వేగవంతమైన అభివృద్ధిని కొనసాగిస్తామని వివరించారు. ఈ నెల 7న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమవుతాయని, 9న స్పీకర్‌ను ఎన్నుకుంటామని ఫడ్నవీస్ వెల్లడించారు. #WATCH | PM Modi congratulates Devendra Fadnavis on taking oath as Maharashtra CM pic.twitter.com/LNVURj7pBQ— ANI (@ANI) December 5, 2024బాధ్యతలు చేపట్టిన ఫడ్నవీస్ మహారాష్ట్ర 20వ ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులుగా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ బాధ్యతలు స్వీకరించారు. ప్రమాణ స్వీకారం అనంతరం గురువారం సాయంత్రం వారు రాష్ట్ర సచివాలయం ‘మంత్రాలయ’కు చేరుకొని సంబంధిత ద్రస్తాలపై సంతకాలు చేశారు. అధికార బాధ్యతలు చేపట్టారు. ఓ రోగికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించాలన్న ప్రతిపాదనకు ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు. ఫడ్నవీస్ సీఎం హోదాలో తొలి కేబినెట్ సమావేశం నిర్వహించారు. #WATCH | Maharashtra CM-designate Devendra Fadnvais arrives at Shree Mumbadevi Temple in Mumbai, ahead of his swearing-in ceremony later today. pic.twitter.com/Rt2HsJjeDd— ANI (@ANI) December 5, 2024షిండే రాజకీయ ప్రసంగం ప్రమాణ స్వీకార వేదికపై రాజకీయ ప్రసంగాలు చేయడం సంప్రదాయ విరుద్ధం. కానీ, షిండే మాత్రం ఆ సంప్రదాయాన్ని లెక్కచేయలేదు. గవర్నర్ రాధాకృష్ణన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించడం ప్రారంభించగానే, ఫార్మాట్లోని ‘నేను’ అని చదివి వెంటనే రాజకీయ ప్రసంగం మొదలుపెట్టారు. మోదీ, బాల్ ఠాక్రే, రాష్ట్ర ప్రజలను పొగడడం ప్రారంభించారు. గవర్నర్ వెంటనే జోక్యం చేసుకొని షిండేను అప్రమత్తం చేశారు. దాంతో ఆయన ఫార్మాట్ ప్రకారం ప్రమాణం చేశారు. డిప్యూటీ సీఎంగా ప్రమాణ పత్రాన్ని చదివారు. -
సీఎంగా హ్యాట్రిక్ కొడుతున్న బ్యాక్ బెంచర్
ముంబై: ఏబీవీపీ కార్యకర్తగా బీజేపీలో ప్రస్థానం ఆరంభించిన దేవేంద్ర ఫడ్నవీస్ పార్టీ పట్ల విధేయత, అంకితభావం, పట్టుదలతో ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. ఆయన 1970 జూలై 22న మహారాష్ట్రలోని నాగపూర్‌లో జన్మించారు. తండ్రి దివంగత గంగాధర్ ఫడ్నవీస్ జనసంఘ్, బీజేపీలో కీలక నాయకుడిగా వ్యవహరించారు. దేవేంద్ర 1989లో ఏబీవీపీలో చేరారు. 22 ఏళ్ల వయసులో నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్‌గా గెలిచారు. 1997లో 27 ఏళ్ల పిన్న వయసులోనే నాగపూర్ మేయర్‌గా ఎన్నికై రికార్డు సృష్టించారు. తొలిసారిగా 1999 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి గెలిచారు. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గత నెలలో జరిగిన ఎన్నికల్లో నాగపూర్ సౌత్‌వెస్ట్ స్థానం నుంచి ఎన్నికయ్యారు. రెండు సార్లు ముఖ్యమంత్రిగా, ఒకసారి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ఫడ్నవీస్‌పై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకపోవడం విశేషం. మహారాష్ట్రలో మనోహర్ జోషీ తర్వాత రెండో బ్రాహ్మణ ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతికి ఎదురుదెబ్బ తగిలినప్పటికీ ఫడ్నవీస్ నిరుత్సాహపడలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమిని విజయపథంలో నడిపించారు. సున్నిత మనస్కుడు ఫడ్నవీస్ పాఠశాలలో చదువుకునేటప్పుడు బ్యాక్ బెంచర్ అని ఆయన గురువు సావిత్రి సుబ్రమణియం చెప్పారు. ఫడ్నవీస్ ఎనిమిది నుంచి పదో తరగతి దాకా సరస్వతి విద్యాలయలో చదువుకున్నారు. తన విద్యార్థి అయిన ఫడ్నవీస్ చిన్నప్పుడు సున్నిత మనస్కుడిగా ఉండేవాడని, అందరినీ చక్కగా గౌరవించేవాడని, ఇతరులకు చేతనైన సహాయం చేసేవాడని, చాలా మర్యాదస్తుడని సావిత్రి సుబ్రమణియం తెలిపారు. చదువులో సగటు విద్యారి్థగానే ఉండేవాడని అన్నారు. అసాధారణమైన విద్యార్థి కానప్పటికీ బాగానే చదివేవాడనని వెల్లడించారు. బాగా పొడగరి కావడంతో తరగతిలో చివర వరుసలో కూర్చొనేవాడని పేర్కొన్నారు. -
సల్మాన్ ఖాన్‌కు మళ్లీ బెదిరింపులు
ముంబై: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు ఎదురయ్యాయి. బుధవారం రాత్రి ముంబైలోని దాదర్ ప్రాంతంలో సల్మాన్ సినిమా షూటింగ్లో ఉండగా, ఓ వ్యక్తి సెట్లోకి ప్రవేశించాడు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయి పేరును ప్రస్తావిస్తూ బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. షూటింగ్లో ఉన్న ఇతర సిబ్బంది అతడిని బంధించారు. పోలీసులు రంగంలోకి దిగి సదరు గుర్తు తెలియని వ్యక్తిని అరెస్టు చేశారు. ప్రస్తుతం శివాజీ పార్కు పోలీసులు అతడిని విచారిస్తున్నారు. కృష్ణ జింకలను వేటాడిన కేసులో దోషిగా తేలిన సల్మాన్‌కు గతంలో లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్ నుంచి పలుమార్లు హెచ్చరికలు వచ్చిన సంగతి తెలిసిందే. -
Maha Yuti: మీడియా ముందే సెటైర్లు.. ఇంతలోనే సర్దుకుపోయారా?!
ముంబై : మహా రాజకీయంలో మరో సస్పెన్స్‌కు శుభం కార్డు పడింది. ‘నేను డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానో? లేదో?’ అంటూ బాంబు పేల్చిన ఏక్నాథ్ షిండే మళ్లీ వెనక్కి తగ్గారు. రేపు (డిసెంబర్5) మహరాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్‌తో పాటే డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని శివసేన నేతలు ప్రకటించారు.మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి ఘనం విజయం సాధించింది. అనంతరం, మహా ముఖ్యమంత్రి ఎవరు? అనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతూ వచ్చింది. సీఎం పదవి కోసం చివరి నిమిషం వరకు శివసేన నుంచి షిండే, బీజేపీ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ పోటీ పడ్డారు. అయితే బీజేపీ అధిష్టానం తమ నేత దేవేంద్ర ఫడ్నవీస్ వైపే మొగ్గు చూపుంది. ఫడ్నవీస్‌ను ముఖ్యమంత్రిని చేయాలని నిర్ణయించింది. బీజేపీ అధిష్టానం బుధవారం దేవేంద్ర ఫడ్నవీస్‌ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, ఈ వరుస పరిణామలపై అలబూనిన షిండే.. ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణ స్వీకారం అనంతరం డిప్యూటీ సీఎంగా ప్రమాణం స్వీకారం చేస్తారా? అన్న అనుమానాలు నెలకొన్నాయి. అందుకు బుధవారం మహాయుతి కూటమి ఏర్పాటు చేసిన మీడియా సమావేశం వేదికైంది. నూతన ప్రభుత్వ ఏర్పాటుకై గవర్నర్ రాధాకృష్ణన్‌ను ఆహ్వానించారు. అనంతరం మహాయుతి కూటమి నేతలు దేవేంద్ర ఫడ్నవీస్,ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్లు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ల మధ్య జరిగిన చర్చ అనేక అనుమానాలకు దారి తీసింది. సీఎం పదవికి నేనే సిపారసు చేశాప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఏక్నాథ్ సిండే మాట్లాడుతూ.. ‘‘సీఎం పదవికి ఫడ్నవీస్‌ను నేనే సిపారసు చేశా. గతంలో నన్ను సీఎంగా ఫడ్నవీస్ సిఫారసు చేశారు. మహాయుతిలో ఎవరూ ఎక్కువా కాదు..తక్కువా కాదు. మహారాష్ట్ర కోసం మేమందరం కలిసి పనిచేస్తున్నాం’’ అని షిండే వ్యాఖ్యానించారు. బాంబు పేల్చిన షిండేఅనంతరం, రేపు మీరు డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేస్తున్నారా? అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు షిండే బదులిస్తూ.. రేపు ప్రమాణ స్వీకారం చేస్తారో, లేదో చెప్పకుండా..సాయంత్ర వరకు వేచి ఉండండి ’ అంటూ బాంబు పేల్చారు.అజిత్ పవార్‌పై షిండే సెటైర్లు షిండే అలా మాట్లాడడంతో పక్కనే ఉన్న అజిత్ పవార్ కలగ జేసుకుని సాయంత్రం నాటికి షిండే గురించి మాకు తెలుస్తుంది. కానీ నేను ఎదురు చూడను. రేపే డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానంటూ చమత్కరించారు. దీంతో అప్పటి వరకు సీరియస్‌గా సాగిన మీడియా కాన్ఫరెన్స్ కాస్తా.. అజిత్ పవార్ వ్యాఖ్యలతో ఉన్న వారంతా ఒక్కసారిగా భళ్లున నవ్వడంతో వాతావరణం సందడిగా మారింది. అయితే.. అజిత్ కామెంట్లకు షిండే సెటైర్లు వేశారు. అజిత్ దా(అజిత్ పవార్)కి ఉదయం, సాయంత్రం ప్రమాణ స్వీకారం చేసిన అనుభవం ఉంది.. రెండు సార్లు ఎలా ప్రమాణం చేయాలో ఆయనకు తెలుసు అని అన్నారు. షిండే అలా అనడంతో అక్కడున్న వారంతా పెద్దగా నవ్వడం మొదలుపెట్టారు. #WATCH | Mumbai: When asked if he and NCP chief Ajit Pawar will also take oath as Deputy CMs tomorrow, Shiv Sena chief Eknath Shinde says, "Wait till evening..."Replying to Shinde, NCP chief Ajit Pawar says, "Sham tak unka samaj aayega, I will take it (oath), I will not wait."… pic.twitter.com/ZPfgg6Knco— ANI (@ANI) December 4, 2024 -
చేజారిన సీఎం పదవి.. స్పందించిన ఏక్నాథ్ షిండే
ముంబై : ముఖ్యమంత్రి పదవి చేజారడంపై మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌షిండే స్పందించారు. మహాయుతి కూటమిలో ఎవరూ ఎక్కువ కాదు.. ఎవరూ తక్కువ కాదు అని వ్యాఖ్యానించారు.మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఫడ్నవీస్‌తో పాటు శివసేన నేతృత్వంలోని ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ నేతృత్వంలోని అజిత్ పవార్లు డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం స్వీకారం చేయనున్నారు.ఈ తరుణంలో మహరాష్ట్రలో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మహాయుతి కూటమి నేతలు దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండేలు బుధవారం మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆహ్వానించారు. గవర్నర్ వద్ద ప్రమాణ స్వీకారానికి సంబంధించిన కార్యచరణను పూర్తి చేశారు. షిండేకి నా కృతజ్ఞతలుఅనంతరం,ఏక్నాథ్ షిండే,దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. ‘ఏక్నాథ్ షిండేకి నా కృతజ్ఞతలు. మంగళవారం షిండేతో భేటీ అయ్యాను. ఈ భేటీలో మంత్రి వర్గంలో కొనసాగాలని కోరా. దానికి ఆయన అంగీకరించారు. ముఖ్యమంత్రిగా నేను బాధ్యతలు చేపట్టినా.. నిర్ణయాలు కలిసే తీసుకుంటాం’ అని అన్నారు. ఎవరూ ఎక్కువా కాదు.. తక్కువా కాదు‘‘సీఎం పదవికి ఫడ్నవీస్‌ను నేను సిపారసు చేశా. గతంలో నన్ను సీఎంగా ఫడ్నవీస్ సిఫారసు చేశారు. మహాయుతిలో ఎవరూ ఎక్కువా కాదు..తక్కువా కాదు. మహారాష్ట్ర కోసం మేమందరం కలిసి పనిచేస్తున్నాం’’ అని షిండే వ్యాఖ్యానించారు. ‘ముఖ్యమంత్రిగా రెండున్నరేళ్లు విజయవంతంగా పూర్తి చేసినందుకు చాలా సంతోషంగా ఉంది.. గత 2.5 ఏళ్లలో మహాయుతి కూటమి నేతృత్వంలోని మేం ముగ్గురం, మా బృందం కలిసి రాష్ట్రాభివృద్ధి కోసం చేసిన కృషి అమోఘం.. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. మేం తీసుకున్న నిర్ణయాలపై మేం సంతోషంగా ఉన్నామని తెలిపారు. బాంబు పేల్చిన షిండేరేపు మీరు డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేస్తున్నారా? అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు షిండే బదులిస్తూ.. రేపు ప్రమాణ స్వీకారం చేస్తారో, లేదో చెప్పకుండా..సాయంత్ర వరకు వేచి ఉండండి ’ అంటూ బాంబు పేల్చారు.చమత్కరించిన అజిత్ పవార్షిండే అలా మాట్లాడడంతో పక్కనే ఉన్న అజిత్ పవార్ కలగ జేసుకుని సాయంత్రం నాటికి షిండే గురించి మాకు తెలుస్తుంది. కానీ నేను ఎదురు చూడను. రేపే డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానంటూ చమత్కరించారు. దీంతో అప్పటి వరకు సీరియస్‌గా సాగిన మీడియా కాన్ఫరెన్స్ కాస్తా.. అజిత్ పవార్ వ్యాఖ్యలతో ఉన్న వారంతా ఒక్కసారిగా భళ్లున నవ్వడంతో వాతావరణం సందడిగా మారింది. -
మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్
ముంబై: మహారాష్ట్రలో పది రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ (54) పేరు ఖరారైంది. బీజేపీ శాసనసభాపక్షం బుధవారం ముంబైలో సమావేశమై ఆయన్ను తమ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. అడ్డంకులన్నీ తొలగిపోవడంతో ఆయన గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటు ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు కూడా ప్రమాణం చేయనున్నారు. వారిలో ఎన్సీపీ చీఫ్ అజిత్ పేరు ఖరారైంది. ఆపద్ధర్మ సీఎం, శివసేన చీఫ్ ఏక్నాథ్ షిండే మాత్రం డిప్యూటీ సీఎం పదవి తీసుకోవడంపై ఏ విషయమూ తేల్చకుండా సస్పెన్స్ కొనసాగిస్తున్నారు. డిప్యూటీగా ప్రభుత్వంలో చేరాల్సిందిగా ఫడ్నవీస్ ఆయన్ను కోరారు. బీజేపీ అధిష్టానం పరిశీలకులుగా వచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం బీజేపీ కోర్ కమిటీ సమావేశమైంది. సీఎంగా ఫడ్నవీస్ పేరును ఖరారు చేశారు. అనంతరం విధాన్ భవన్లో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. శాసనసభాపక్ష నేతగా ఫడ్నవీస్ పేరును బీజేపీ సీనియర్ నాయకుడు చంద్రకాంత్ పాటిల్ ప్రతిపాదించగా ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. వారికి ఫడ్నవీస్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం అభివృద్ధిని పరుగులు పెట్టిస్తుందని నిర్మల పేర్కొన్నారు. ఫడ్నవీస్‌ను ప్రతిపాదిస్తున్నా: షిండేఅనంతరం ఫడ్నవీస్ నేతృత్వంలో షిండే, అజిత్ సహా మహాయుతి కూటమి నేతలు గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్‌తో సమావేశమయ్యారు. నూతన ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. బీజేఎల్పీ నేతగా ఫడ్నవీస్ ఎన్నికైనట్లు లేఖ అందజేశారు. కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహా్వనించారు. గురువారం సాయంత్ర 5.30కు ఆజాద్ మైదాన్‌లో కార్యక్రమం ఉంటుందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ‘‘సీఎంతో పాటు ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారు’’ అని తెలిపాయి. అనంతరం షిండే, అజిత్‌లతో కలిసి ఫడ్నవీస్ మీడియాతో మాట్లాడారు. ‘‘మా కొత్త ప్రభుత్వం ముందు ఎన్నో సవాళ్లున్నాయి. కలిసుంటే క్షేమంగా ఉంటాం. ప్రధాని మోదీతో ఏదైనా సాధ్యమే. సీఎం పదవి కేవలం సాంకేతిక సర్దుబాటే. మహాయుతి పక్షాలన్నీ కలిసికట్టుగా పని చేస్తాయి. షిండే, అజిత్ తోడ్పాటుతో ప్రభుత్వాన్ని సజావుగా నడిపిస్తాం’’ అన్నారు. తనను సీఎంగా ఎంపిక చేసినందుకు మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. రెండున్నరేళ్లపాటు సీఎంగా చేశానని, అందుకు సంతృప్తిగా ఉన్నానని షిండే పేర్కొన్నారు. ‘‘నాడు నన్ను సీఎం పదవికి ఫడ్నవీస్ ప్రతిపాదించారు. నేడు ఆయనను ఆ పదవికి నేను ప్రతిపాదిస్తున్నా. మేమంతా బృందంగా కలిసికట్టుగా పని చేస్తాం’’ అన్నారు.పరస్పర ఛలోక్తులు మీడియా భేటీలో మహాయుతి నేతలు పరస్పరం ఛలోక్తులు విసురుకున్నారు. డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారా అని విలేకరులు ప్రశ్నించగా సాయంత్రం దాకా వేచి చూడండని షిండే బదులిచ్చారు. అజిత్ కల్పించుకుని తాను మాత్రం కచ్చితంగా ప్రమా ణం చేస్తానని అనడంతో గొల్లుమన్నారు. ‘‘అవునవును. ప్రమాణ స్వీకారాల్లో దాదా (అజిత్)కు చాలా అనుభవముంది. ఉదయం, సాయంత్రం ప్ర మాణం చేసిన అనుభవముంది’’ అనడంతో మరో సారి నవ్వు లు విరిశాయి. 2019లో అజిత్ తెల్లవారుజామున డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయడం తెలిసిందే. పదవి తీసుకోండి షిండేపై సొంత ఎమ్మెల్యేల ఒత్తిడి ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకోవాలంటూ షిండేపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఒత్తిడి తెచ్చారు. బుధవారం షిండేతో భేటీలో వారు స్పష్టం చేశారు. ఫడ్నవీస్ రాజీనామాతో ఖాళీ అయిన డిప్యూటీ సీఎం పోస్టును షిండే తీసుకుంటే పొత్తు ధర్మాన్ని గౌరవించినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వంలో చేరితే పార్టీనీ బలోపేతం చేసుకోవచ్చన్నారు. -
‘మహా’ పాలిటిక్స్‌లో మరో ట్విస్ట్.. మంత్రి పదవుల కోసం కొత్త ఫార్ములా!
ముంబై: మహారాష్ట్రలో పొలిటికల్ సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. రేపు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండగా.. మంత్రి పదవులపై చర్చ నడుస్తోంది. మహాయుతి కూటమిలో ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు దక్కుతాయనేది ఆసక్తికరంగా మారింది. ఎన్నికల్లో గెలిచిన సీట్ల ప్రకారం.. ప్రతీ ఆరుగురు ఎమ్మెల్యేలకు గాను ఒక మంత్రి దక్కే అవకాశం ఉన్నట్టు పార్టీలో చర్చ నడుస్తోంది.మహారాష్ట్రలో మహాయుతి కూటమిలో రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా బీజేపీ, శివసేన, ఎన్సీపీలకు ఎన్ని మంత్రి పదవులు వస్తాయనే చర్చ నడుస్తోంది. పార్టీ వర్గాల ప్రకారం.. 6-1 ఫార్ములాను అమలు చేసే యోచనలో పార్టీ పెద్దలు ఉన్నారని సమాచారం. మూడు పార్టీల నుంచి ప్రతీ ఆరుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి ఇస్తారని తెలుస్తోంది.ఈ లెక్క ప్రకారం మహారాష్ట్రలో అత్యధిక స్థానాల్లో(132) బీజేపీ విజయం సాధించడంతో కాషాయ పార్టీలో 20-22 మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఏక్నాథ్ షిండే శివసేనకు 12, అజిత్ పవార్ ఎన్సీపీకి 9-10 పదవులు దక్కే చాన్స్ ఉన్నట్టు సమాచారం. అయితే, శాఖలపై కూడా చర్చ జరుగుతోందని సమాచారం. కీలక శాఖలు బీజేపీకే దక్కే చాన్స్ ఉంది. దీంతో, శివసేన, ఎన్సీపీలకు ఏయే శాఖలు ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. -
‘మహా’రాజకీయాల్లో కీలక పరిణామం!
ముంబై : మహరాష్ట్ర కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? అనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతుంది. ఈ తరుణంలో మహా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మహరాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో డిప్యూటీ సీఎం దేవంద్ర ఫడ్నవీస్ భేటీ అయ్యారు. ఫడ్నవీస్‌తో భేటీ తర్వాత ఏక్నాథ్ షిండే ముంబైకి బయలుదేరారు. తొలిసారి భేటీమహరాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన మొదలైన తర్వాత ఫడ్నవీస్, షిండేల మధ్య ఇదే తొలి సమావేశం. అయితే, డిసెంబర్ 5న మహరాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరగనుంది. దీంతో తదుపరి భవిష్యత్ కార్యచరణపై చర్చించేందుకు ఏక్నాథ్ షిండే నివాసానికి వెళ్లినట్లు స్థానిక మీడియా,మహాయుతి కూటమి నేతలు చెబుతున్నారు. మోదీ నిర్ణయం శిరోధార్యంమహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విషయం సాధించింది. దీంతో ముఖ్యమంత్రి పదవి కోసం ఫడ్నవీస్,షిండేలు పోటీ పడ్డారు. అయితే, బీజేపీ అగ్రనేతలతో జరిగిన సమావేశం తర్వాత ఏక్నాథ్ షిండే వెనక్కి తగ్గారు. మహాముఖ్యమంత్రి ఎవరు? అనేది ప్రధాని మోదీ నిర్ణయిస్తారని ప్రకటించారు. మోదీ నిర్ణయమే తమకు శిరోధార్యమని బహిరంగంగా వెల్లడించారు. #WATCH | Mumbai: BJP leader Devendra Fadnavis arrives at Varsha bungalow to meet Maharashtra caretaker CM Eknath Shinde pic.twitter.com/hjruFEswbj— ANI (@ANI) December 3, 2024 -
బీజేపీ ప్లాన్ అదే.. షిండే ముందున్న మార్గమిదే: అథవాలే
ఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయాల్లో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. బీజేపీ నుంచే సీఎం పదవి ఖరారు కావడం మహాయుతి కూటమిలో చిచ్చురాజేసిందనే చర్చ నడుస్తోంది. ముఖ్యమంత్రి పదవి విషయంలో బీజేపీ నిర్ణయంపై ఏక్నాథ్ షిండే అసమ్మతితో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కూటమిలో ఉన్న కారణంగా బయటకు ఆయన ఒకే చెబుతున్నా.. లోలోపల మాత్రం తీవ్ర కలత చెందారని పలువురు కామెంట్స్ చేశారు.మహారాష్ట్రలో ఉత్కంఠ కొనసాగుతున్న వేళ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా చీఫ్, కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే.. ఏక్నాథ్ షిండేపై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా అథవాలే ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్రలో బీజేపీ నిర్ణయంతో షిండే కలత చెందారన్నది వాస్తవమే. అయినప్పటికీ బీజేపీ తన నిర్ణయాన్ని మార్చుకునే ప్రసక్తే లేదు. ఇప్పటికే రెండున్నరేళ్లపాటు ఆయన సీఎంగా కొనసాగారని గుర్తు చేశారు.అయితే, గతంలో మహారాష్ట్రలో ప్రభుత్వం కూలిపోయిన సమయంలో బీజేపీకి ఎక్కువ ఎమ్మెల్యేల బలం ఉన్నప్పటికీ సీఎం పీఠాన్ని షిండేకు అప్పగించారు. అప్పుడు అధిష్ఠానం నిర్ణయాన్ని గౌరవించి దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా కొనసాగారు. కానీ, ఇప్పుడు సీఎం పదవిని వదులుకునేందుకు బీజేపీ సిద్ధంగా లేదు. ఎందుకంటే.. ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించడంతోపాటు పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఇది సరైన సమయమని హైకమాండ్ భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.ఈ కారణంగానే మహారాష్ట్ర సీఎం విషయంలో బీజేపీ తన నిర్ణయాన్ని మార్చుకునే పరిస్థితులు లేవన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో షిండే ఉపముఖ్యమంత్రి పదవిని తీసుకోవడం మంచిదని సూచించారు. లేదంటే మహాయుతి కూటమి చైర్మన్‌గా.. అది కూడా నచ్చకపోతే కేంద్ర ప్రభుత్వంలో స్థానం కోరుకోవడమే తన ముందున్న మార్గం అంటూ సూచించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి.ఇదిలా ఉండగా.. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ తదుపరి ముఖ్యమంత్రి కావడం దాదాపు ఖాయమైనట్లు సమాచారం. అయితే, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక, ఈనెల 5న సీఎం, డిప్యూటీ సీఎంల ప్రమాణ స్వీకారం ఉంటుందని ఇప్పటికే బీజేపీ నేతలు లీకులు ఇచ్చారు. #WATCH | Delhi: On the question of Maharashtra CM, Union Minister Ramdas Athawale says, "I believe in the meeting that is going to take place tomorrow, BJP observers will listen to all the MLAs and the name of Devendra Fadnavis can be announced tomorrow...Eknath Shinde does not… pic.twitter.com/52QJ0bMn07— ANI (@ANI) December 3, 2024 -
మహరాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్.. డిప్యూటీ సీఎంగా షిండే!
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. సీఎం ఎంపికపై మహాయుతి కూటమి మధ్య గత పదిరోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడినట్లే కనిపిస్తోంది. మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఖాయమైనట్లు సమాచారం. ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న ఏక్నాథ్ షిండే డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టబోతున్నట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. ఇక డిసెంబరు 5న మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం జరగనున్నట్లు తెలుస్తోంది. ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు కూడా చకచకా జరిగిపోతున్నాయి. ఈసారి కూడా ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉండనుండగా.. షిండేతో పాటు ఎన్సీపీ నేత అజిత్ పవార్ అదే రోజున ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.అయితే కేబినెట్ కూర్పు ఇంకా పూర్తి కాని కారణంగా.. ఆ రోజు సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంలు మాత్రమే ప్రమాణం చేయనున్నట్లు సమాచారం. మరోవైపు బుధవారం బీజేపీ శాసనసభాపక్ష నేతల సమావేశం జరగనుంది. ఇందులో కొత్త సీఎంను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతికూటమి భారీ విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. కూటమిలోని బీజేపీకి 132 సీట్లు, షిండే శివసేనకు 57, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి 41 సీట్లు దక్కాయి. ఈ నేపథ్యంలో అత్యధిక సీట్లు సాధించిన బీజేపీనే ఈసారి సీఎం పదవి చేపట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ సీఎం పదవి వదులుకునేందుకు ఏక్నాథ్ షిండే సుముఖంగా లేనట్లు శివసేన వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే సీఎం పదవి, శాఖల కేటాయింపుపై మహాయుతి కూటమి మధ్య గత కొంతకాలంగా ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇక అనేక రోజుల చర్చల తర్వాత షిండే మహాయుతి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. -
కాలుష్య భూతం: ముందు నోటీసులు.. ఆ తర్వాత చర్యలు!
దాదర్: దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో వాయు నాణ్యత క్షీణిస్తుండడంతో బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) పరిపాలన విభాగం అప్రమత్తమైంది. పరిస్ధితులు మరింత చేయి దాటకముందే తగిన జాగ్రత్తలు తీసుకోవడం ప్రారంభించింది. అందులో భాగంగా భవన నిర్మాణాలు చేపడుతున్న కాంట్రాక్టర్లు, బిల్డర్లకు, వాయు కాలుష్యాన్ని సృష్టిస్తున్న పరిశ్రమలకు నోటీసులు జారీ చేయనుంది. అంతేగాకుండా భవన నిర్మాణాలు జరిగేచోట కూలీలు సామూహికంగా వంట చేసుకోవడం, రాత్రుళ్లు చలి కాచుకునేందకు మంటలు వేసుకోవడాన్ని కూడా నిషేధించనుంది. పరిస్థితి చేయి దాటకముందే... దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యంవల్ల ఏస్థాయిలో ఉందో తెలియంది కాదు. అయితే గత కొద్దిరోజులుగా ముంబైలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కారణాలేవైనా రోజురోజుకూ వాయు కాలుష్యం పెరిగిపోతుండటంతో వాయు నాణ్యత క్షీణిస్తోంది. ముంబై సహా తూర్పు, పశ్చిమ ఉప నగరాల్లో అనేక చోట్ల నూతన భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. వీటిలో కొన్ని నివాస భవనాలు కాగా మిగతావి షాపింగ్ మాల్స్, మల్టీఫ్లెక్స్‌లు వంటి నిర్మాణాలున్నాయి. ఈ నిర్మాణాల వద్ద వాయు కాలుష్య నివారణకు సంబంధించిన నియమాలు పాటించడం లేదని బీఎంసీ దృష్టికి వచ్చింది. దీంతో నియమాలు పాటించనివారికి మొదటి హెచ్చరికగా ముందుగా నోటీసులు జారీ చేయనున్నారు. ఇచ్చిన గడువులోపు తగిన జాగ్రత్తలు తీసుకోని పక్షంలో సైట్‌కు సీలువేసి పనులు నిలిపివేస్తారు. అనంతరం సంబంధిత కాంట్రాక్టర్లు, బిల్డర్లపై తగిన చర్యలు తీసుకుంటారు. పలుకారణాలతో వాయుకాలుష్యం.. భవన నిర్మాణాలు జరుగుతున్న చోట వేలాది మంది కూలీలు, కార్మికులు పనులు చేస్తారు. వీరంతా గ్రూపులుగా ఏర్పడి ఉదయం, రాత్రుళ్లలో అక్కడే వంట చేసుకుంటారు. ఇందుకోసం వీరు కిరోసిన్ స్టౌ లేదా వంట గ్యాస్ సిలిండర్లను వాడరు. సైటువద్ద వృథాగా పడి ఉన్న కలపను వినియోగిస్తారు. ఈ కలప నుంచి భారీగా వెలువడే పొగ కాలుష్యాన్ని సృష్టిస్తోంది. అదేవిధంగా ప్రస్తుతం చలికాలం కావడంతో ఉదయం, రాత్రి వేళల్లో వాతావరణం చల్లగా ఉంటుంది. చలి బారి నుంచి తట్టుకునేందుకు నగరంలోని మురికివాడల్లో, ఫుట్‌పాత్‌లు, రోడ్లపక్కన నివసించే పేదలు చలిమంట కాచుకుంటారు. చెత్త కాగితాలు, నిరుపయోగంగా పడి ఉన్న వాటర్ బాటిళ్లు, ప్లాస్టిక్ చెత్త, కట్టెలు, గడ్డి తదితర సామాగ్రిని ఈ మంటలో వేస్తారు. వాహనాల నుంచి వెలువడే పొగ వల్ల కాకుండా వాయునాణ్యత క్షీణించేందుకు ఇవి కూడా కారణాలవుతున్నాయి. అదేవిధంగా నగరంలో దాదాపు 50 వేలకుపైగా పాత కాలం నాటి బేకరీలున్నాయి. అందులో 24 గంటలు బ్రెడ్లు, పావ్‌లు, కేక్‌లు తయారవుతూనే ఉంటాయి. వీటి తయారీకి బేకరీ నిర్వాహకులు కలపనే వినియోగిస్తారు. వీటినుంచి వెలువడే దట్టమైన పొగ గాలి స్వచ్చతను దెబ్బతీస్తోంది. ప్రతీ వార్డులో వాటర్ స్ప్రింక్లర్... ఈ నేపథ్యంలో బీఎంసీ నూతన నిర్మాణాలు జరుగుతున్న చోట దుమ్ము, ధూళీ వెలువడకుండా చూసుకునే బాధ్యత సంబంధిత కాంట్రాక్టర్లు, బిల్డర్లేదనని హెచ్చరించింది. ఇందుకోసం ప్రతీ వార్డులో 5 నుంచి 9 వేల లీటర్ల నీరు వెదజల్లే వాటర్ స్ప్రింక్ర్లను అందుబాటులో ఉంచింది. ఈ స్ప్రింక్లర్లు రోడ్లపై గాలిలో ఎగురుతున్న దుమ్ము, ధూళిని నియంత్రిస్తాయి. ఫలితంగా కొంత శాతం కాలుష్యం నియంత్రణలోకి వస్తుందని బీఎంసీ భావిస్తోంది. అంతేకాకుండా రెడీ మిక్స్ కాంక్రీట్ ప్లాంట్లను మూసివేసే యోచనలో కూడా ఉంది. వాయు కాలుష్య నివారణ కోసం కొత్తగా అమలు చేయనున్న నియమాలు నిర్మాణ పనులు జరుగుతున్న భవనం చుట్టూ 35 అడుగుల ఎత్తున్న ఇనుప రేకులతో ప్రహరీ గోడను నిర్మించాలి.భవనానికి ఏర్పాటు చేసిన వెదురు బొంగుల కంచెకు జూట్ వస్త్రం లేదా ఆకుపచ్చ బట్ట చుట్టాలి. నిర్మాణాలు జరుగుతున్న సైట్ల వద్ద వాటర్ స్ప్రింక్లర్లను కచ్చితంగా అందుబాటులో ఉంచాలి. రోజుకు 4 లేదా5 సార్లు నీటిని స్ర్పింకిల్ చేయాలి.కూలీలు, కార్మికులు కచ్చితంగా ముఖానికి మాస్క్, కళ్లద్దాలు ధరించాలి. భవన నిర్మాణాలు జరుగుతున్న చోట కాపలగా ఉండే సెక్యూరిటీ గార్డులు చలికాచుకునేందుకు ఎలక్ట్రిక్ గ్యాస్ పొయ్యి కొనివ్వాలి. -
సీఎం పదవిపై వీడని ఉత్కంఠ.. వేర్వేరు నగరాల్లో ముగ్గురు నేతలు
మహారాష్ట్ర సీఎం ఎవరూ.. గత పది రోజులుగా దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం ఇదే. నవంబర్ 23న వెలువడిన మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాల్లో మహాయుతి కూటమి స్పష్టమైన మెజార్టీ సాధించినప్పటికీ ఇంకా ముఖ్యమంత్రి ఎంపిక, ప్రభుత్వ ఏర్పాటు తేలడం లేదు. ముఖ్యంగా సీఎం పదవిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. మహాయుతి కూటమి నేతలు దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్‌లతో కలిసి ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షాతో చర్చలు జరిపినప్పటికీ సీఎం పీఠముడి వీడటం లేదు. ఓవైపు సీఎం పదవిపై ఉత్కంఠ కొనసాగుతుండగా.. మరోవైపు ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారోత్సవానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. వేదిక, గ్యాలరీ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అయితే ఎవరు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారన్నది మాత్రం ప్రశ్నగానే మిగిలిపోయింది. ప్రభుత్వ ఏర్పాటుపై ఇప్పటి వరకు మహాయుతి నేతలుగవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కూడా కలవలేదు. నిజానికి బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్, శివసేనకు చెందిన ఏక్నాథ్ షిండే, ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ మంగళవారం వేర్వేరు నగరాల్లో ఉన్నారు.జ్వరం, గొంతు నొప్పితో శుక్రవారం సాయంత్రం సొంతూరికి వెళ్లిన ఏక్‌నాథ్‌షిండే ఆదివారం సాయంత్రం ముంబైకు రాకుండా థానే వెళ్లారు. శాఖల కేటాయింపుపై మహాయుతి భేటీని రద్దు చేసుకున్నారు. ఇక దేవేంద్ర ఫడ్నవీస్ ముంబైలో ఉండగా.. ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ బీజేపీ అగ్రనేతలను కలిసేందుకు సోమవారం ఢిల్లీకి వెళ్లారు.మరోవైపు నేడు విధాన్ భవన్లో బీజేపీ శాసనసభా పక్షం సమావేశం కానుంది. ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలు తమ నాయకుడిని ఎన్నుకోవాలని భావిస్తున్నారు. ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవికి ముందంజలో ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, ఆయన పేరును ప్రకటించడంలో జాప్యం అనేక ఊహాగానాలకు తావిస్తోంది. బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం తర్వాత మహాయుతానికి చెందిన ముగ్గురు నేతలు భేటీ అయ్యే అవకాశం ఉంది. ప్రమాణస్వీకారానికి సమయం లేకపోవడంతో రేపు గవర్నర్‌తో సమావేశం అయ్యే అవకాశం ఉంది.ముంబై సమవావేశాలకు షిండే తరుచూ గైర్హాజరు అవ్వడంపై అనేక అనుమానాలు లేవనెత్తడంతో.. ప్రభుత్వ ఏర్పాటులో తాను అడ్డంకి కాబోనని, ముఖ్యమంత్రి పదవిపై తుది నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షాపైనే వదిలేశానని షిండే స్పష్టం చేశారు. ఇక మహారాష్ట్ర కొత్త సీఎం డిసెంబర్ అయిదున ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు రాఫ్ట్ర భీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బావంకులే వెల్లడించారు. సీఎం ఎవరనేది ఇంకా అధికారికంగా ప్రకటించకున్నా దేవేంద్ర ఫడ్నవీస్‌కే ఎక్కువ అవకాశం దక్కుతుందని అంతా భావిస్తున్నారు. మరోవైపు కొత్త సీఎం ఎవరో ఈనెల 4న జరిగే భేటీలో వెల్లడిస్తామని బీజేపీ సీనియర్ నేత తెలిపారు.ఈ ఉదయం విధాన్ భవన్లో బీజేపీ శాసనసభా పక్షం సమావేశం కానుంది, ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలు తమ నాయకుడిని ఎన్నుకోవాలని భావిస్తున్నారు. ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవికి ముందంజలో ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, అత్యున్నత పదవికి బిజెపి తన ఎంపికను ప్రకటించడంలో జాప్యం ఊహాగానాలకు ఆస్కారం ఇచ్చింది. బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం తర్వాత మహాయుతానికి చెందిన ముగ్గురు నేతలు భేటీ అయ్యే అవకాశం ఉంది. రేపు ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా గవర్నర్‌తో సమావేశం అయ్యే అవకాశం ఉంది. -
బ్యాలెట్ కోసం చైతన్యం.. వారిని వణికిస్తోందిగా!
మర్కర్‌వాడీ అంటే కేవలం 1900 ఓట్లున్న కుగ్రామం. మహారాష్ట్ర సోలాపూర్ జిల్లాలో మల్షిరాస్ తహసీలులో ఉంటుందా పల్లె! ఎంత చిన్న పల్లె అయితేనేం.. ఇవాళ దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పాలకులలో వణుకు పుట్టిస్తోంది. బండారం బయటపడుతుందేమోననే భయాన్ని రేకెత్తిస్తోంది. ఆ చిన్న గ్రామంలోని ప్రజల్లో ఈవీఎంల పట్ల పుట్టిన అనుమానం.. తమ ‘తీర్పు’ను తామే బ్యాలెట్ పేపర్ల ద్వారా మరోసారి క్రాస్ చెక్ చేసుకోవాలని సంకల్పించిన చైతన్యం.. అధికారవర్గాలకు జడుపు తెప్పించింది. ప్రజలు స్వచ్ఛందంగా అలాంటి పోలింగును ప్లాన్ చేసుకోగా.. ఏకంగా మూడు రోజుల పాటూ పోలీసులు పెద్దసంఖ్యలో- ఆ చిన్న పల్లెలో మోహరించి- కర్ఫ్యూ ప్రకటించడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారుతోంది.వివరాల్లోకి వెళితే..ఈ మర్కర్‌వాడీ గ్రామం మల్షిరాస్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఇటీవి మహా ఎన్నికల్లో ఆ నియోజకవర్గం నుంచి ఉత్తమ్రావ్ జన్ఖడ్ 13,147 ఓట్ల మెజారిటీతో గెలిచారు. నేషలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్) కు చెందిన ఆయన, బిజెపి అభ్యర్థి సిటింగ్ ఎమ్మెల్యే రామ్ సత్పుతే ని ఓడించారు. విజయం దక్కినా సరే ఆయన మర్కర్‌వాడీ గ్రామంలో పోలింగుమీద అనుమానం ఉండిపోయింది. ఆ గ్రామంలో తనకు ప్రజాబలం దండిగా ఉన్నదని, గత ఎన్నికల్లో తనకు ఆ గ్రామంలో చాలా మంచి మెజారిటీ వచ్చిందని ఈ సారి మాత్రం ఓట్లు తగ్గాయని ఆయనకు అనుమానం వచ్చింది. 1900 ఓట్ల ఆ చిన్న గ్రామంలో ఈసారి 1003 ఓట్లు బిజెపికి పడగా, ఎన్సీపీ (ఎస్పీ) జన్ఖడ్ కు కేవలం 843 ఓట్లు దక్కాయి. అందుకే ఆయన అంతా ఆశ్చర్యపోయారు. .గెలిచిన అభ్యర్థి మాత్రమే కాదు.. ఆ గ్రామస్తులకు కూడా అదే ఆశ్చర్యం కలిగింది. జన్ఖడ్ కు ఆ పల్లెలో పాపులారిటీ ఎక్కువనేది అక్కడి వారి మాట. కేవలం పాపులారిటీ మాత్రమే కాదు. ఆయనకు అక్కడ కులబలం కూడా మెండు! ఉత్తమ్రావ్ జన్ఖ్- ధన్‌గఢ్ కులానికి చెందిన వారు. ఆ పల్లెలో అధికసంఖ్యాకులు ఆ కులం వారే. వారందరికీ కూడా అనుమానం వచ్చింది. దాంతో అంతా కలిసి తహసీల్దార్ దగ్గరకు వెళ్లి రీఎలక్షన్ పెట్టాలని డిమాండ్ చేశారు. వారి విజ్ఞప్తిని యన తోసిపుచ్చడంతో.. ఈవీఎంలలో ఏదో మతలబు జరిగిఉండొచ్చునని, అందుకే బిజెపికి ఎక్కువ ఓట్లు పడ్డాయని అనుమానించిన గ్రామస్తులు తామే స్వయంగా బ్యాలెట్ పేపర్ తో మాక పోలింగ్ లాగా మంగళవారం నాడు పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. వారు సన్నాహాలు చేసుకునేలోగా ప్రభుత్వ వర్గాలకు వణుకు పుట్టింది.మోడీ సర్కారు తెచ్చిన కొత్త నేర చట్టాల్లోని భారతీయ నాగరిక్ సురక్ష సంహితలోని 163 సెక్షన్ ప్రకారం ఆ చిన్న గ్రామంలో కర్ఫ్యూ విధించారు. మంగళవారు వాళ్లు పోలింగ్ ప్లాన్ చేసుకోగా గురువారం వరకు కర్ఫ్యూ ఉంటుందని ప్రకటించి.. యాభై మంది సాయుధ పోలీసుల్ని మోహరించారు.మేం వేసిన ఓట్లు ఎలా మళ్లిపోయాయో చెక్ చేసుకోవడానికే ఈ ప్రయత్నం చేస్తున్నామని.. అధికారులు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా సరే.. పోలింగ్ నిర్వహించి తీరుతామని వారు పట్టుదలగా ఉన్నారు.ఆలోచన పుట్టిస్తున్న చైతన్యం..చిన్న పల్లె లోని ప్రజల్లో పుట్టిన చైతన్యం దేశ ప్రజలందరినీ ఇప్పుడు ఆలోచింపజేస్తోంది. వారేీ ప్రభుత్వాన్ని రీపోలింగ్ అడగడం లేదు. మాక పోలిగ్ తరహాలో తమలో తాము నిర్వహించుకోవాలనుకున్నారు. ఈవీఎంలో వచ్చిన ఓట్లకు, తాము బ్యాలెట్ ద్వారా ఓటు చేస్తే రాగల ఓట్లకు తేడాలను గమనించాలనుకున్నారు. ఈవీఎంల సత్యసంధతను పుటం వేయాలనుకున్నారు. అయితే ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం నిరపాయకరమైన వారి ప్రయత్నాన్ని మాత్రం అడ్డుకుంటోంది.ఒకవేళ ఈ ప్రయత్నాన్ని ఆపుచేయించాలని భావించినా సరే.. నలుగురు వ్యక్తులు ఒకచోట గుమికూడరాదు అని చెప్పే 144 సెక్షన్ విధిస్తే సరిపోయేదానికి ఏకంగా మూడురోజుల పాటు కర్ఫ్యూ పెట్టడం అంటే ఆందరికీ ఆశ్చర్యమే. చిన్న పల్లె మర్కర్‌వాడీ యంత్రాంగాన్ని అంతగా వణికిస్తూంటే.. ఈవీఎం ల విషయంలో సమ్ థింగ్ ఈజ్ ఫిషీ అని దేశం అనుకోకుండా ఎలా ఉంటుంది?.. ఎం.రాజేశ్వరి -
గేమ్ ప్లాన్ : బీఎంసీ ఎన్నికల్లో బీజేపీ ‘మిషన్–150’
దాదర్: ఇటీవల జరిగిన అసెంబీ ఎన్నికల్లో బీజేపీకి ఊహించని విధంగా ఎక్కువ స్థానాలు రావడంతో త్వరలో జరగనున్న బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలపై ఇప్పటి నుంచే దృష్టి సారించింది. అందుకు దేవేంద్ర ఫడ్నవీస్ (బీజేపీ), ఏక్నాథ్ శిందే (శివసేన), అజిత్ పవార్ (ఎన్సీపీ) నేతృత్వంలోని మహాయుతి కూటమి మొత్తం 227 స్థానాల్లో 150కి పైగా గెలుచుకోవాలనే ఉద్దేశంతో ‘మిషన్–150’ పేరుతో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. 25 ఏళ్లుగా బీఎంసీలో ఏకచత్రాధిపత్యం చెలాయిస్తున్న ఉద్ధవ్ ఠాక్రే–శివసేనను ఈసారి ఎలాగైనా గద్దె దింపాలని మహాయుతి కూటమి లక్ష్యంగా పెట్టుకుంది. నెల, రెండు నెలల్లో ఎన్నికలు! బీఎంసీ ఎన్నికలు 2025, జనవరి లేదా ఫిబ్రవరిలో జరిగే అవకాశాలున్నాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్ వర్గాలు సూచన ప్రాయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో మహాయుతి కూటమి వర్గాలు కొంత దూకుడుగా ప్రవర్తిస్తున్నాయి. వాస్తవంగా బీఎంసీ కార్యనిర్వాహక పాలన గడువు 2022 మార్చిలో ముగిసింది. ఫలితంగా ఇదివరకే ఎన్నికలు జరగాలి. కానీ అనేక సార్లు వివిధ కారణాలవల్ల జాప్యం జరుగుతూ వచ్చింది. దీంతో 2022 మార్చి నుంచి ఇప్పటి వరకు బీఎంసీలో కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్లు లేకపోవడంతో అనేక అభివృద్ధి పనులు కుంటుపడ్డాయి. ఆనేక శాఖల్లో కార్యకలాపాలు, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు, ఇతర పనులు మందకొడిగా సాగుతున్నాయి. దీంతో బీఎంసీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయా? అని కళ్లలో వత్తులేసుకుని ఎదురు చూస్తున్నారు. చివరకు అసెంబ్లీ ఎన్నికల పర్వం ఇటీవల పూర్తికావడంతో ఇక అన్ని పార్టీల దృష్టి బీఎంసీ ఎన్నికలపై పడింది. భారీ మెజార్టీ సాధించిన మహాయుతి కూటమి ఇంతవరకు కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయనేలేదు. అప్పుడే బీఎంసీ ఎన్నికల్లో భారీ సీట్లు రాబట్టుకోవాలని మిషన్–150 పేరుతో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. 2017లో 227 స్థానాలకు జరిగిన బీఎంసీ ఎన్నికల్లో అప్పట్లో శివసేన–బీజేపీ కలిసి పోటీ చేశాయి. ఆ సమయంలో శివసేన–84, బీజేపీ–82, కాంగ్రెస్–31, ఎన్సీపీ–9 మంది కార్పొరేటర్లు గెలిచారు. కానీ ఇప్పుడు జరిగే బీఎంసీ ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ప్రధాన పార్టీలైన శివసేన, ఎన్సీపీ రెండుగా చీలిపోయి నాలుగు పార్టీలుగా అవతరించాయి. శివసేన ఉద్ధవ్ ఠాక్రే, ఏక్నాథ్ శిందే వర్గంగా, ఎన్సీపీ శరద్ పవార్, అజిత్ పవార్ వర్గంగా ఏర్పడ్డాయి. దీంతో బీఎంసీ ఎన్నికల్లో ఎవరి వర్గం కార్పొరేటర్లు ఆ వర్గం నుంచి పోటీచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రెండున్నరేళ్ల కిందట శిందే శివసేనతో తెగతెంపులు చేసుకుని బయటపడ్డారు. ఆ సమయంలో శిందే వెంట పెద్ద సంఖ్యలో కార్పొరేటర్లు కూడా బయట పడ్డారు. దీంతో ఈ సారి జరిగే బీఎంసీ ఎన్నికల్లో శివసేన కొంత బలహీన పడినట్లు తెలుస్తోంది. యూబీటీకి మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్, ఎన్సీపీ (ఎస్పీ)లు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో చతికిల పడిపోయాయి. దీని ప్రభావం బీఎంసీ ఎన్నికల్లో కచి్చతంగా చూపే ప్రమాదం లేకపోలేదు. దీంతో బీజేపీ చేపట్టిన మిషన్–150 కచ్చితంగా సఫలీకృతమవుతుందని తెలుస్తోంది. మరోపక్క మహా వికాస్ అఘాడీ కూడా ఏదో ఒక కొత్త వ్యూహం లేదా కొత్త పంథాతో ఎన్నికలకు ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేయనుంది. దీంతో ఈ ఎన్నికలు కూడా అసెంబ్లీ లాగే మహాయుతి, మహా వికాస్ అఘాడీ మధ్య హోరాహోరీగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకు మాజీ, సిట్టింగ్ కార్పొరేటర్లతో మంతనాలు జరిపేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. ఎలాంటి ప్రచార అస్త్రాలతో ప్రజల ముందుకు వెళ్లాలని వ్యూహం రచిస్తున్నాయి. బీఎంసీ ఎన్నికల్లో కులాలవారీగా, మహిళలకు ఇలా వేర్వేరుగా రిజర్వేషన్లు ఉంటాయి. దీంతో ఏ వార్డు ఏ కులానికి, మహిళకు లేదా పురుషుడికి రిజర్వేషన్ అవుతుందో తెలియని పరిస్థితి ఉంటుంది. ఆ తరువాతే గెలిచే సత్తా ఉన్న అర్హులైన అభ్యర్థులను బరిలోకి దింపాల్సి ఉంటుంది. దీంతో గతంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రొగెస్ రిపోర్టు పరిశీలించాలి. -
గుడ్ న్యూస్ : ముంబైలో 300 కొత్త లోకల్ రైళ్లు, మెగా టెర్మినల్
ముంబై, సాక్షి: ముంబై రైల్వే ప్రయాణికుల కోసం కేంద్ర ప్రభుత్వం భారీ పథకాలకు ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా 300 కొత్త అదనపు లోకల్ రైళ్లను ప్రవేశపెట్టడంతో పాటు వసాయ్‌లో భారీ రైల్వే టెరి్మనల్‌ను నిర్మించనున్నట్లు బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు. ఈ కార్యక్రమాలకు ఆమోదం తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌లకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ముంబై సెంట్రల్ అలాగే వెస్ట్రన్ సబర్బన్ రైల్వే లైన్లలో ప్రతిరోజు 3,200 రైళ్లు నడుస్తున్నాయి. వీటిలో సెంట్రల్ రైల్వేలో 40 లక్షల మంది, పశి్చమ రైల్వేలో 35 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. అయితే, భవిష్యత్‌లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రద్దీని తగ్గించేందుకు, ప్రయాణికుల సౌకర్యాన్ని మెరుగుపరచడానికి కొత్త లోకల్ రైళ్లు ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. వసాయ్‌లో మెగా టెర్మినల్ ముంబై రైల్వే హబ్‌లపై ఉన్న భారాన్ని తగ్గించేందుకు వసాయ్ ప్రాంతంలో ఒక మెగా రైల్వే టెర్మినల్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఇది సబర్బన్ అలాగే సుదూర రైళ్లకు సర్వీసులు అందించడమే కాకుండా, ప్రయాణికుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ముఖ్యమైన ఇతర అభివద్ధి పథకాలు: తూర్పు భారతదేశంతో కనెక్టివిటీ: ముంబై పోర్ట్ కనెక్టివిటీ మెరుగుపరచడానికి ప్రత్యేక కారిడార్‌ను రూపొందించనున్నారు. కీలక టెర్మినల్స్: విస్తరణ: పరేల్, ఎల్టీటీ, కల్యాణ్, పన్వేల్ టెరి్మనల్స్ సామర్థ్యాన్ని పెంచి ప్రయాణికుల అవసరాలను తీర్చనున్నారు. సెంట్రల్ అలాగే బాంద్రా టెర్మినల్స్: అభివృద్ధి: పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ హబ్‌ల సామర్థ్యాన్ని విస్తరించనున్నారు. జోగేశ్వరి, వసాయ్ టెర్మినల్స్: ఈ కొత్త టెరి్మనల్స్ సబర్బన్ ప్రయాణాలను మరింత సులభతరం చేయనున్నాయి. వచ్చే ఐదేళ్లలోపు పూర్తి కానున్న ఈ ప్రాజెక్టులు ముంబై నగరానికి రైల్వే కనెక్టివిటీలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి దోహదపడతాయి. ఈ అభివృద్ధి లక్షలాది మంది ప్రజల జీవన ప్రమాణా లను మెరుగుపరచడంతో పాటు ముంబైని తూర్పు రాష్ట్రాలకు మరింత సమీపంగా తీసుకువస్తాయి. ఈ చర్యలు ముంబై మహానగరాన్ని ఒక శక్తివంతమైన రైల్వే కేంద్రంగా మార్చడమే కాకుండా, ప్రజల కోసం మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
పెరిగిన ఏసీ రైళ్ల ట్రిప్పులు.. ప్రయాణికులకు తిప్పలు!
దాదర్: పశ్చిమ రైల్వే మార్గంలో ఏసీ లోకల్ రైళ్ల 13 ట్రిప్పులు పెంచడంతో సామాన్య ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏసీ లోకల్ రైళ్ల కారణంగా నాన్ ఏసీ రైళ్ల ట్రిప్పులు తగ్గిపోయాయి. రైల్వే అధికారులు అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయంతో సాధారణ ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముంబైకర్ల ప్రయాణం ఠండా, ఠండా, కూల్ కూల్‌గా సాగాలనే ఉద్దేశంతో తొలుత సెంట్రల్ రైల్వే మార్గంలో ఏసీ లోకల్ రైళ్లను ప్రవేశపెట్టారు. మొన్నటి వరకు ఫాస్ట్ మార్గంలో పరుగులు తీసిన ఏసీ లోకల్ రైళ్లు ఇప్పుడు స్లో మార్గంలో కూడా సేవలందిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.సెంట్రల్ రైల్వే మార్గంలో ఏసీ లోకల్ రైళ్లకు ప్రయాణికుల నుంచి వస్తున్న విశేష స్పందనను దృష్టిలో ఉంచుకుని పశ్చిమ మార్గంలో కూడా ప్రవేశ పెట్టారు. ప్రారంభంలో చార్జీలు చాలా ఎక్కువ ఉండటం వల్ల గిట్టుబాటు కాకపోయేది. దీంతో ప్రయాణికులు ఏసీ లోకల్ రైళ్లలో ప్రయాణించేందుకు కొంత వెనకడుగు వేశారు. దీనిపై దృష్టిసారించిన రైల్వే అధికారులు ప్రయాణికుల సంఖ్య తగ్గడానికి గల కారణాలను వెలికి తీశారు. ఏసీ చార్జీలు ఫస్ట్ క్లాస్ కంటే చాలా ఎక్కువ ఉండటమేనని గుర్తించారు. దీంతో అనేక మంది ఏసీ లోకల్ రైళ్లలో ప్రయాణించేందుకు ముఖం చాటేస్తున్నట్లు తేలింది. దీనిపై విచారణ జరిపిన అధికారులు చార్జీలు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు కొద్ది నెలల కిందట చార్జీలు తగ్గించడంతో ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఫలితంగా ఉదయం, సాయంత్రం పీక్ హవర్స్‌లో రద్దీ కారణంగా డోరు మూసుకోలేని పరిస్థితి ఎదురవుతోంది. ముఖ్యంగా ఏసీ లోకల్ రైళ్లు డోరు మూసుకోనిదే ముందుకు కదలవు. గత్యంతరం లేక ప్లాట్‌ఫామ్‌పై విధులు నిర్వహిస్తున్న రైల్వే పోలీసులు, ఆర్పీఎఫ్ సిబ్బంది జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రయాణికులను బలవంతంగా లోపలికి నెడుతున్నారు. ఇది రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో జరుగుతున్నదే. దీన్ని సీరియస్‌గా తీసుకున్న రైల్వే అధికారులు ఏసీ రైళ్ల సంఖ్య పెంచాలని నిర్ణయించారు. ఉదయం, సాయంత్రం రద్దీ కొంతమేర తగ్గుతుందని భావించారు. ఆ ప్రకా>రం గత బుధవారం నుంచి 13 ఏసీ లోకల్ రైళ్లను పెంచారు. దీంతో ప్రస్తుతం వాటి సంఖ్య 96 నుంచి 109కి చేరింది. ఏసీ రైళ్ల సంఖ్య పెరగడంతో రద్దీ కొంతమేర తగ్గింది. కానీ ఏసీ రైళ్ల కారణంగా నాన్ ఏసీ లోకల్ రైళ్ల సంఖ్య తగ్గిపోయింది. గతంలో కూడా ఇలాగే ఏసీ లోకల్ రైళ్ల ట్రిప్పులు పెంచడతో నాన్ ఏసీ రైళ్ల తగ్గిపోయింది. ఫలితంగా సాధారణ లోకల్ రైళ్లలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. పెంచిన ఏసీ లోకల్ రైళ్లను ఫాస్ట్ మార్గంలో నడుపుతున్నారు. 13 ట్రిప్పుల్లో ఆరు ట్రిప్పులు విరార్–చర్చిగేట్ స్టేషన్ల మధ్య, భాయిందర్–చర్చిగేట్ మధ్య మూడు ట్రిప్పుల చొప్పున, ఒక ట్రిప్పు చర్చిగేట్–విరార్ (డౌన్) మధ్య ఇలా మొత్తం 13 ట్రిప్పులు పెరిగాయి. -
Maharashtra: సీఎం పదవి బీజేపీకే
ముంబై/పుణే: మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమిలో సీఎం పదవిపై పడ్డ పీటముడి క్రమంగా వీడుతోంది. వారం రోజులుగా నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడ్డట్టే కన్పిస్తోంది. ముఖ్యమంత్రిగా తననే కొనసాగించాలని పట్టుబడుతూ వచ్చిన శివసేన చీఫ్ ఏక్నాథ్ షిండే ఎట్టకేలకు అలకపాన్పు వీడి డిప్యూటీ సీఎం పదవికి సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కూటమి భాగస్వామి అయిన ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ తాజా వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. సీఎం పదవి బీజేపీదేనని ఆయన శనివారం తేల్చేశారు. శివసేన, ఎన్సీపీ నుంచి చెరో ఉప ముఖ్యమంత్రి ఉంటారన్నారు. ఇటీవల ఢిల్లీలో బీజేపీ అధిష్టానం సమక్షంలో జరిగిన భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులన్నది త్వరలో తేలుతుందన్నారు. డిసెంబర్ 5న కొత్త సర్కారు కొలువుదీరే అవకాశముందని ఆయన వివరించారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమవుతోందన్న విపక్షాల విమర్శలను అజిత్ కొట్టిపారేశారు. ‘‘మహారాష్ట్రలో ఇలా జరగడం కొత్త కాదు, అనూహ్యమూ కాదు. 1999లో ప్రభుత్వ ఏర్పాటుకు ఏకంగా నెల రోజులు పట్టింది’’ అని గుర్తు చేశారు. కొత్త ప్రభుత్వ ప్రమాణస్వీకార తేదీని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బావంకులే కూడా ధ్రువీకరించారు. 5న సాయంత్రం ఐదింటికి సౌత్ ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో కార్యక్రమం జరుగుతుందంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ దిగ్గజం దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం కావడం లాంఛనమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన గతంలో రెండుసార్లు సీఎంగా చేయడం తెలిసిందే. మహాయుతి సర్కారులో ఫడ్నవీస్, అజిత్ పవార్ ఇద్దరూ ఉప ముఖ్యమంత్రులుగా కొనసాగిన విషయం తెలిసిందే. నవంబర్ 23న వచ్చిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహాయుతి కూటమి ఘనవిజయం సాధించడం తెలిసిందే. 288 స్థానాలకు గాను మహాయుతికి ఏకంగా 233 వచ్చాయి. బీజేపీ 132. శివసేన 57, ఎన్సీపీ 41 స్థానాలు నెగ్గాయి. అయితే సీఎం ఎవరు కావాలన్న దానిపై అప్పటినుంచీ ప్రతిష్టంభన నెలకొంది. సీఎం అభ్యరి్థ, ప్రభుత్వ కూర్పు తదితరాలపై మంగళవారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సమక్షంలో ఫడ్నవీస్, షిండే, పవార్ చర్చలు జరిపారు. అంతకుముందు షిండే మీడియాతో మాట్లాడుతూ సీఎంగా ఎవరుండాలన్న దానిపై నిర్ణయాధికారాన్ని బీజేపీకే వదిలేసినట్టు చెప్పడం తెలిసిందే. కానీ ఢిల్లీ భేటీ అనంతరం ముంబై రావాల్సిన ఆయన నేరుగా సతారా జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్లిపోవడం, శుక్రవారం ముంబైలో జరగాల్సిన మహాయుతి భేటీ రద్దవడం అనుమానాలకు తావిచ్చింది. షిండే అలకపాన్పు ఎక్కినట్టు వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో ప్రమాణస్వీకారం తదితరాలపై అ టు అజిత్, ఇటు బావంకులే నుంచి తాజాగా స్పష్ట త రావడంతో ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అ యినట్టేనని భావిస్తున్నారు. మహాయుతి భేటీ ఆదివారం జరుగుతుందని తాజా సమాచారం.సేనలో అసంతృప్తి! తాజా పరిణామాలపై శివసేన నేతలు అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. రెండేళ్లకు పైగా సీ ఎంగా చేసిన షిండేకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వ డమంటే స్థాయిని తగ్గించడమేనని వారంటున్నా రు. షిండేను పక్కన పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన సన్నిహితుడు, పార్టీ సీనియర్ నేత సంజయ్ సిర్సత్ ఆరోపించారు. తమకు హోం శాఖ ఇచ్చి తీరాలని శనివారం పీటీఐతో మాట్లాడుతూ ఆయనన్నారు. షిండే దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతూ స్వగ్రామంలో విశ్రాంతి తీసుకుంటున్నారని ఆయన సన్నిహిత వర్గాలు స్పష్టతనిచ్చాయి. మహాయుతి కూటమి సాధించిన అనూ హ్య, అసహజ విజయమే ప్రభుత్వ ఏర్పాటులో ఆలస్యానికి దారి తీస్తోందని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. కూటమిలో కీచులాటలతో విసిగే షిండే సొంతూరి బాట పట్టారని ఎద్దే వా చేశారు. ‘‘2019లో ఎంవీఏ ప్రభుత్వాన్ని ఏర్పా టు చేయకుండా అడ్డుకునేందుకు మోదీ రాష్ట్రపతి పాలన విధించారు. ఈసారి ఫలితాలు వెల్లడైన వారం దాటినా ఏ పార్టీ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావడం లేదు. అయినా రాష్ట్రపతి పాలన ఊసే లేదు’’ అంటూ దుయ్యబట్టారు. -
Maharashtra: వీడని ‘పీఠ’ముడి.. కానీ ఆరోజే సీఎం ప్రమాణ స్వీకారం!
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి విషయంలో అధికార మహాయుతి కూటమిలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. సీఎం ఎంపిక, డిప్యూటీ పదవులు, కేబినెట్ బెర్త్‌ల పంపకాలపై మిత్రపక్షాల మధ్య చర్చలు ఓ పట్టాన కొలిక్కి రావడం లేదు. ఓవైపు మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ నెలకొనగా.. మరోవైపు సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకార తేదీలను బీజేపీ ఖరారు చేసింది.ఈ మేరకు శాసనసభా పక్ష నేతను ఎన్నుకునేందుకు పార్టీ ఎమ్మెల్యేలు సోమవారం (డిసెంబర్ 2) సమావేశమవుతారని బీజేపీ వర్గాలు తెలిపాయి. కొత్తగా ఎంపికైన నేత గురువారం (డిసెంబర్ 5) ముంబైలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు పేర్కొన్నాయి.అయితే మహారాష్ట్ర కొత్త సీఎంగా బీజేపీ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖరారైనట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీంతో అసంతృప్తి చెందిన తాత్కాలిక ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే.. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మహాయుతి కూటమి సమావేశాన్ని రద్దు చేసుకొని తన స్వగ్రామానికి వెళ్లారని ప్రచారం జరుగుతోంది. నేపథ్యంలో తాజా పరిణామం చోటు చేసుకుంది.అయితే ఈ ఊహాగాలను శివసేన కొట్టిపారేసింది. షిండే అస్వస్థతతో ఉన్నారని, ఆయన శనివారం తిరిగి ముంబై చేరుకుంటారని తెలిపింది. ‘షిండే అలగలేదు. అతను అనారోగ్యంతో ఉన్నారు. సీఎం పదవి విషయంలో మనస్తాపం చెంది ఆకస్మిక పర్యటనకు వెళ్లాడని ప్రచారం చేయడం సరికాదు. ఆయన ఎప్పుడూ వెనకడుగు వేయరు. రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి కోసం పోరాడతానని చెప్పారు. చదవండి: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా తెరపైకి కొత్త పేరుసమావేశాలు భౌతికంగానే కాదు.. వీడియో కాన్ఫరెన్స్, మొబైల్ కమ్యూనికేషన్ ద్వారా కూడా జరుగుతాయి. షిండే చెప్పినట్లుగా త్వరలోనే మహారాష్ట్ర మంత్రివర్గం ఖరారు అవుతుంది. 60 మంది ఎమ్మెల్యేలు కలిసి షిండేను ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని కోరాం. దీనిపై ఆయనే నిర్ణయం తీసుకుంటారు. లాడ్లీ బెహన్ యోజనను ప్రవేశపెట్టినందున అతను ప్రభుత్వంలో కొనసాగడం చాలా ముఖ్యం. ప్రభుత్వంలో అతని ఉనికి ముఖ్యం. మరోసారి, దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ మధ్య సమావేశం జరుగుతుంది. మంత్రివర్గ విస్తరణపై కూలంకషంగా చర్చిస్తాం’’ అని తెలిపారు. కాగా ప్రభుత్వ ఏర్పాటుపై శుక్రవారం ముంబైలో బీజేపీ, ఎన్సీపీ, శివసేన భేటీ కావాల్సి ఉండేది. కానీ షిండే అందుబాటులో లేకపోవడంతో ఈ సమావేశం వాయిదా పడింది.కాగా నవంబర్ 23న వెలువడిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహాయుతి కూటమి 233 స్థానాలను కైవం చేసుకుంది. బీజేపీ రికార్డు స్థాయిలో 132 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. శివసేన 57 చోట్ల, ఎన్సీపీ 41 చోట్ల విజయం సాధించింది. అయితే ఫలితాలు వెలువడి వారం రోజులు గడుస్తున్నా తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో కూటమి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే సీఎం పీఠాన్ని దేవేంద్ర ఫడ్నవీస్ తీసుకుంటున్న నేపథ్యంలో ఏక్‌నాథ్‌షిండే ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు హోం శాఖ వంటి కీలక పోర్ట్‌ఫోలియోలపై పట్టుబడుతున్ట్లు తెలుస్తోంది. గతంలో ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ఉన్న్పుడు హోంమంత్రిత్వ శాఖను కూడా ఆయనే నిర్వహించారు. -
మహారాష్ట్రలో ప్రతిష్టంభన.. ముఖ్యమంత్రిగా తెరపైకి కొత్త పేరు!
ముంబై: మహారాష్ట్ర మహాయుతి కూటమిలో కొత్త ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన నెలకొంది. కూటమి నుంచి ముఖ్యమంత్రి ఎవరు? మంత్రుల స్థానాలపై చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. దీంతో, ప్రభుత్వ ఏర్పాటు మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో బీజేపీ సీఎం అభ్యర్థిగా తెరపైకి కొత్త పేరు వచ్చినట్టు తెలుస్తోంది. మురళీధర్ మోహోల్‌ను ముఖ్యమంత్రిని చేయాలనే ప్రతిపాదన చేసినట్టు సమాచారం. మరోవైపు.. మహాయుతి కూటమిలో శివనసే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను పక్కన పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని శివసేన నేతలు ఆరోపిస్తున్నారు. ఇక, 24 గంటల్లో షిండే కీలక ప్రకచేస్తారనే చర్చ మహారాష్ట్ర రాజకీయాల్లో వినిపిస్తోంది. ఇదే సమయంలో షిండే అనారోగ్యంతో ఉన్నారని మరికొందరు నేతలు చెబుతున్నారు. కాగా, షిండే మాత్రం ఆయన స్వగ్రామం సతారాకు వెళ్లినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో, షిండే ఎలాంటి ప్రకటన చేస్తారనేది హాట్ టాపిక్‌గా మారింది.Baby , don't say may be...Is Murlidhar Mool going to be new CM of maharashtra ...? pic.twitter.com/RDneu9aQC5— amit (@GandhiSoul2) November 30, 2024మహాయుతి కూటమి ప్రభుత్వ ఏర్పాటు ప్రతిపాదన ఇలా ఉండవచ్చని తెలుస్తోంది. బీజేపీ-132+ షిండే సేన-57+ అజిత్ పవార్-41+ ఇతరులు= 235. ప్రభుత్వం ఏర్పాటైతే బీజేపీ నుంచి ముఖ్యమంత్రి పదవి, కూటమి నుంచి ఇద్దరు డిప్యూటీ ముఖ్యమంత్రులు అనే ప్రతిపాదన ఇప్పటి వరకు వినిపిస్తోంది. ఇక, కూటమి ప్రభుత్వం షిండే హోం మంత్రి పదవి అడిగారని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కాగా, ఇందుకు బీజేపీ ఒప్పకోలేదనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
‘మహా’ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం
పుణె: ఇటీవల ముగిసిన మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమరంలో గతంలో ఎన్నడూలేనంతటి స్థాయిలో అధికార, నగదు దుర్వినియోగ పర్వం ఆవిష్కృతమయిందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పారీ్ట(ఎన్సీపీ–ఎస్పీ) చీఫ్ శరద్‌పవార్ ఆరోపించారు. ఇంతటి దుర్వినియోగం గతంలో ఏ పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లోనూ జరగలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఈవీఎంల దుర్వినియో గం జరిగిందంటూ కురువృద్ధుడు, 95 ఏళ్ల సామాజిక కార్యకర్త డాక్టర్ బాబా అధవ్ చేపట్టిన నిరసన కార్యక్రమ వేదికను సందర్శించి మద్దతు ప్రకటించిన సందర్భంగా శనివారం శరద్ పవార్ మాట్లాడారు. సంఘ సంస్కర్త జ్యోతిరావ్ ఫూలే నివాసమైన ఫూలేవాడలో అధవ్ ఈ నిరసన దీక్ష చేపట్టారు. ‘‘స్థానిక ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, నగదు పంపిణీ చూస్తుంటాం. కానీ ఈసారి శాసనసభ ఎన్నికల్లో జరిగిన దుర్వినియోగం మరే పార్లమెంట్ ఎన్నికల్లోనూ కనిపించలేదు. ఇవి చూసి ప్రజల్లో అసహనం పెరిగిపోయింది. అందుకే ఇలా బాబా అధవ్ మాదిరిగా జనం నిరసనలకు దిగారు. సామాజిక సిద్ధాంతకర్త జయప్రకాశ్ నారాయణ్ గతంలో పిలుపు ఇచి్చనట్లు ప్రజలంతా నేడు ఐక్యంగా పోరాడాలి. సామాజిక ఉద్యమం ఉధృతంగా కొనసాగించాల్సిన తరుణమిది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య పునాదులను పెకలించివేస్తున్న పెడపోకడలను అడ్డుకుందాం’’అని అన్నారు. ఈవీఎంలపై దేశమంతటా చర్చ ‘‘దేశంలో ఈవీఎంల దుర్వినియోగంపై చర్చ జరుగుతోంది. ఈ అంశాన్ని పార్లమెంట్లో విపక్షాలు ప్రస్తావించాలనుకున్న ప్రతిసారీ ప్రభుత్వం వీళ్లకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు. పార్లమెంట్ ఉభయసభలు వారంలో ఆరు రోజులు జరిగితే కనీసం ఒక్కరోజు కూడా విపక్షనేతలకు మాట్లాడే అవకాశం దక్కట్లేదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై మోదీ సర్కార్ ఎలా దాడిచేస్తోందో ఇక్కడే తెలుస్తోంది. ఈవీఎంలలో అదనంగా ఓట్లను ఎలా జతచేస్తారో కొందరు నాకు ఒక ప్రజెంటేషన్ ద్వారా చూపించారు. కానీ వీటిని నిరూపించే బలమైన సాక్ష్యాలు మన దగ్గర లేవు. అయితే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలను చూశాక వీటిని నమ్మక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఓడిన నేతల్లో ఏకంగా 22 మంది రీకౌంటింగ్ అడుగుతున్నారంటే ఈవీఎంలలో ఏదో తప్పు జరుగుతోందని అర్థమవుతోంది. బాలాసాహెబ్ థోరట్లాంటి కాంగ్రెస్ నేతలు ఆరోపించినట్లుగా చివరి రెండు గంటల్లో ఏకంగా 7 శాతం పోలింగ్ జరిగిందంటే నమ్మశక్యంగా లేదు. థోరట్ ఒక్కరేకాదు చాలా మంది ఇలాంటి ఎన్నో ఉదాహరణలను చూపిస్తున్నారు. ఈ అంశంపై కాంగ్రెస్ ఒక సమావేశాన్ని సైతం ఏర్పాటుచేసింది. దీనిపై విపక్షాల ఇండియా కూటమి ఒక ఉమ్మడి నిర్ణయం తీసుకోవడంపై చర్చ జరిగింది. సోమవారం దీనిపై కొన్ని ఉమ్మడి నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. దాదాపు 15 శాతం ఓట్లను ముందే ఈవీఎంలలో సెట్ చేసి ఉంచుతారని కొందరు చెబితే నేను నమ్మలేదు. కానీ తాజా ఫలితాలను చూశాక ఈ ఆరోపణల్లో ఎంతోకొంత నిజం ఉందని గత ఐదు రోజులుగా నాక్కూడా అనిపిస్తోంది’’అని శరద్‌పవార్ అన్నారు. వీవీప్యాట్లను లెక్కించాలి: ఉద్ధవ్‌ఠాక్రే అధవ్‌కు మంచినీళ్లు ఇచ్చి దీక్షను విరమింపజేసిన సందర్భంగా శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడారు. ‘‘బూత్‌లో ఓటు పోలయిందని అందరికీ తెలుసు. కానీ ఈవీఎంలో ఏ పార్టీ తరఫున అది రిజిస్టర్ అయిందో ఎలా తెలియాలి?. అందుకే ఎన్నికల్లో అన్ని వీవీప్యాట్ రశీదులను లెక్కించాల్సిందే. పోలింగ్ రోజు చివరి గంటలో ఏకంగా 76 లక్షల ఓట్లు పోలయ్యాయని చెబుతున్నారు. ఈ లెక్కన ప్రతి పోలింగ్‌కేంద్రంలో ఆఖర్లో ఏకంగా వేయి మంది ఓటేశారని అర్థం. మరి చివరిగంటలో ప్రతిపోలింగ్కేంద్రం బయట అంతమంది క్యూ వరసల్లో లేరు’’అని ఉద్ధవ్ అన్నారు. -
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. 10 మంది మృతి
ముంబై : మహరాష్ట్రలో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. బస్సు బోల్తాపడి 10 ప్రయాణికులు మరణించారు. పలువురి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. బస్సు ప్రమాదంపై పోలీసులు తెలిపిన వివరాల మేరకు... మహరాష్ట్ర స్టేట్ రోడ్డు ట్రాన్స్ పోర్ట్ కార్పేషన్(ఎంఎస్ఆర్టీసీ)కు చెందిన బస్సు శుక్రవారం మధ్యాహ్నం భండారా నుండి సకోలి మీదుగా గోండియా అనే ప్రాంతానికి వెళ్తుంది.ఆ సమయంలో ఓ మలుపు వద్ద ఆర్టీసీ బస్సుకు అకస్మాత్తుగా ఓ ద్విచక్ర వాహనదారుడు ఎదురుగా వచ్చాడు. ఆకస్మిక పరిణామంతో అప్రమత్తమైన బస్సు డ్రైవర్ ప్రమాదం జరగకుండా బస్సును పక్కకి తిప్పాడు. దీంతో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో బస్సులో ఉన్న 35 మంది ప్రయాణికుల్లో 10 మరణించారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రాణ భయంతో బస్సు డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. బస్సు ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు, తోటి వాహనదారులు ప్రయాణికుల్ని రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు.ప్రమాద బాధితులకు ఎక్స్ గ్రేషియాబస్సు ప్రమాదంపై మహరాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే విచారం వ్యక్తం చేశారు. ప్రమాద బాధితులకు తక్షణమే రూ.10లక్షలు ఎక్స్‌గ్రేషియా అందించాలని రవాణా శాఖకు ఆదేశాలు జారీచేశారు. మృతుల కుటుంబ సభ్యులకు మహరాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంపై ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ..‘గోండియా జిల్లాలోని సడక్ అర్జున్ సమీపంలో శివషాహి ఆర్టీసీ బస్సు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ప్రయాణికుల మరణం నన్ను కలచి వేస్తుంది. మరణించిన వారికి నా నివాళి’అని తెలిపారు. ‘ఈ ఘటనలో గాయపడిన ప్రయాణికులకు మెరుగైన వైద్య సేవల కోసం అవసరమైతే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను' అని ఫడ్నవీస్ ట్వీట్లో పేర్కొన్నారు. गोंदिया जिल्ह्यातील सडकअर्जुनीनजीक शिवशाही बसचा दुर्दैवी अपघात होऊन काही प्रवाशांचा मृत्यू झाल्याची घटना अतिशय दुर्दैवी आहे. मृतांना मी भावपूर्ण श्रद्धांजली अर्पण करतो. त्यांच्या कुटुंबीयांच्या दु:खात आम्ही सहभागी आहोत.या घटनेत जे लोक जखमी झाले, त्यांना खाजगी रुग्णालयात उपचार…— Devendra Fadnavis (@Dev_Fadnavis) November 29, 2024 -
‘మహా’ రాజకీయం: ఏక్నాథ్ షిండే అలకపాన్పు
ముంబై: మహారాష్ట్రలో నూతన ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. కొత్త ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై ఉత్కంఠకు తెరపడడం లేదు. ఎన్నికల ఫలితాలు విడుదలై వారం రోజులవుతున్నా ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా స్పష్టత రావడం లేదు. శుక్రవారం జరగాల్సిన మహాయుతి కీలక సమావేశం అనూహ్యంగా రద్దయ్యింది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అడుగులు చర్చనీయాంశంగా మారాయి. సతారా జిల్లాలోని తన సొంత గ్రామానికి ఆయన చెప్పాపెట్టకుండా వెళ్లిపోవడం రకరకాల ఊహాగానాలకు తావిస్తోంది. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన(షిండే) నాయకుడు ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ(అజిత్) నేత అజిత్ పవార్ గురువారం రాత్రి ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతోపాటు కేంద్ర మంత్రి జె.పి.నడ్డాతో సమావేశమయ్యారు. మంత్రివర్గం కూర్పు, మంత్రి పదవుల పంపకంపై వారు చర్చించినట్లు వార్తలొచ్చాయి. ఫడ్నవీస్, షిండే, అజిత్ పవార్ ఢిల్లీ పర్యటన ముగించుకొని శుక్రవారం ఉదయం ముంబైకి చేరుకున్నారు. శుక్రవారం ముగ్గురు నేతల మధ్య కీలక సమావేశం జరగాల్సి ఉంది. నూతన ముఖ్యమంత్రి ఎంపికతోపాటు మంత్రి పదవుల పంపకాన్ని ఖరారు చేస్తారని ప్రచారం జరిగింది. కానీ, ఏక్నాథ్ షిండే ఆకస్మికంగా తన సొంత గ్రామానికి వెళ్లిపోవడంతో చర్చలు ఆగిపోయాయి. తాజా పరిణామాల పట్ల షిండే అసంతృప్తితో ఉన్నారని, అందుకే అలకబూని మిత్రపక్షాలతో చర్చలు కొనసాగించడానికి ఇష్టపడడం లేదని తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ మరింత పెరిగిపోయింది. మహాయుతి సమావేశం ఆదివారం జరుగనున్నట్లు శివసేన(షిండే) వర్గాలు తెలియజేశాయి. కొత్త ముఖ్యమంత్రి వచ్చేవారం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని వివరించాయి. తమ పార్టీ నేత ఏక్నాథ్ షిండేలో ఎలాంటి అసంతృప్తి లేదని, ఆయన శనివారం ముంబైకి తిరిగి వస్తారని శివసేన నాయకుడు ఉదయ్ సామంత్ చెప్పారు. ఢిల్లీలో షిండే తమ పార్టీ డిమాండ్లను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు. దీనిపై అమిత్ షా అతిత్వరలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చిస్తారని వెల్లడించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన(షిండే), ఎన్సీపీ(అజిత్) పారీ్టలు మహాయుతి పేరిట కూటమిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ 132, శివసేన(షిండే) 57, ఎన్సీపీ(అజిత్) 41 సీట్లు గెలుచుకున్నాయి. సీఎం కుర్చీ కోసం మూడు పార్టీల ముఖ్యనేతలు పోటీపడ్డారు. కానీ, మిత్రపక్షాలకు సీఎం పదవి ఇచ్చేందుకు బీజేపీ అధిష్టానం అంగీకరించడం లేదు. దాంతో కనీసం మంత్రి పదవుల్లోనైనా ఎక్కువ వాటా సొంతం చేసుకోవాలని శివసేన(షిండే), ఎన్సీపీ(అజిత్) ఆరాటపడుతున్నాయి. మిత్రపక్షాలకు 20 మంత్రి పదవులు ఇవ్వడానికి బీజేపీ పెద్దలు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో తమకే ఎక్కువ పదవులు కావాలని ఎన్సీపీ(అజిత్) పట్టుబడుతోంది. మరోవైపు బీజేపీ శాసనసభాపక్షం ఇప్పటికీ సమావేశం కాలేదు. తమ నాయకుడిని ఎన్నుకోలేదు. షిండే అడుగులు ఎటువైపు? మరోసారి సీఎం పదవి తనకే ఇవ్వాలని ఏక్నాథ్ షిండే తొలుత డిమాండ్ చేశారు. బీజేపీ అగ్రనాయకత్వం బుజ్జగించడంతో మెత్తబడ్డారు. ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకోవడానికి అంగీకరించినట్లు తెలిసింది. కానీ, కీలకమైన హోంశాఖను తనకే అప్పగించాలని షరతు పెట్టారు. షిండే మనసు మార్చుకుంటున్నట్లు ఆయన పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉప ముఖ్యమంత్రితో సరిపెట్టుకోవడం ఆయనకు ఇష్టం లేదని అంటున్నాయి. ఇదిలా ఉండగా, ఉప ముఖ్యమంత్రి పోస్టుపై శివసేన(షిండే)లో రెండు రకాల వాదనలు వినిపిస్తాయి. ఈ పదవి తీసుకోవాలని ఒక వర్గం చెబుతుండగా, అవసరం లేదని మరో వర్గం వ్యతిరేకిస్తోంది. ఇప్పటిదాకా ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నాయకుడు ఉప ముఖ్యమంత్రి కావడం ఏమిటని శివసేన(షిండే) ఎమ్మెల్యే సంజయ్ సిర్సాత్ ప్రశ్నించడం గమనార్హం. పెద్ద పదవిలో ఉన్న వ్యక్తి చిన్న పదవిలో ఇమడలేరని ఆయన చెప్పారు. ఉప ముఖ్యమంత్రి పదవిలో షిండే కూర్చొనే అవకాశం లేదని అన్నారు. కూటమి ధర్మాన్ని తన తండ్రి గౌరవిస్తారని, వ్యక్తిగత ఆకాంక్షలకు ఆయన ప్రాధాన్యం ఇవ్వబోరని ఏక్నాథ్ షిండే తనయుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే స్పష్టంచేశారు. ఇప్పుడు ఏక్నాథ్ షిండే ఎటువైపు అడుగులు వేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఆయన కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీతో జట్టుకట్టినా ప్రభుత్వ ఏర్పాటుకు వారి బలం సరిపోదు. రెండు రోజుల్లో సీఎం ఎంపిక: షిండే మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై అమిత్ షా, జె.పి.నడ్డాతో సానుకూల చర్చలు జరిగాయని ఏక్నాథ్ షిండే చెప్పారు. ఆయన శుక్రవారం ఉదయం ఢిల్లీలో ముంబైకి బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడారు. కొత్త సీఎం ఎంపికపై ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ముంబైలో మహాయుతి కీలక సమావేశం జరగబోతోందని, చర్చలు కొనసాగుతాయని అన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు తాను అవరోధం కాబోనని, ప్రధాని మోదీ, అమిత్ షాల నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టంచేశారు. మహాయుతి కూటమి పారీ్టల మధ్య చక్కటి సమన్వయం ఉందని వివరించారు. అతి త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఏక్నాథ్ షిండే ప్రకటించారు. పదవుల వెంట పడడం తమకు ఇష్టం లేదన్నారు. -
పదవుల కోసం పాకులాడం: ఏక్నాథ్ షిండే
ముంబై : మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? అనే అంశంపై అధికార మహాయుతి కూటమిలో చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే భేటీ అయ్యారు.ఈ ఇద్దరి మధ్య భేటీ సానుకూలంగా జరిగిందని ఏక్నాథ్ షిండే మీడియాకు వెల్లడించారు.‘అమిత్‌షాతో రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి,ప్రమాణ స్వీకారం వంటి అంశాలపై చర్చించాం. మిత్రపక్షాల మధ్య మంచి సమన్వయం ఉంది. మహారాష్ట్ర సీఎం ఎవరు? అనేది రెండు రోజుల్లో స్పష్టత వస్తుంది.ఈ అంశంపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. మహా సీఎం ఎంపికపై కసరత్తు పూర్తయిన వెంటనే వివరాల్ని వెల్లడిస్తాం. మహారాష్ట్ర ప్రజలు తమను భారీ మెజారిటీతో మరోసారి గెలిపించారు. ప్రజల ఆదేశాల్ని గౌరవించడమే ప్రాధాన్యత. పదవుల కోసం పాకులాడం’ అని ఏక్నాథ్ షిండే వెల్లడించారు. కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి భారీ విజయాన్ని సాధించింది. బీజేపీ 132 సీట్లు సొంతం చేసుకోగా.. షిండే శివసేనకు 57, అజిత్ పవార్ ఎన్సీపీకి 41 సీట్లు దక్కాయి. ఆ నిర్ణయం కమలం పెద్దలదేమహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార మహాయుతి కూటమి విజయం సాధించింది. దీంతో మహారాష్ట్ర సీఎంగా ఎవరిని నియమించాలనే నిర్ణయాన్ని మహాయుతి కూటమిలో అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ,ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన మహా సీఎం నిర్ణయాన్ని బీజేపీ పెద్దలకే అప్పగిస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించారు. ఈ క్రమంలో అమిత్ షాతో ఏక్నాథ్ షిండే భేటీ జరిగింది. ఈ భేటీ అనంతరం మహరాష్ట్ర సీఎం ఎవరు? ఏ కూటమికి ఎన్ని మంత్రి పదవులుతో పాటు ఇతర అంశాలపై రెండు రోజుల్లో స్పష్టత రానుంది. -
ఈసారి ఎవరిది పీఠం? ‘మహా’కూటముల్లో బీఎంసీ ఎన్ని‘కలవరం’
దాదర్: త్వరలో జరగనున్న బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలు ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే (యూబిటీ)– శివసేనకు, కాంగ్రెస్‌కు పెద్ద సవాలుగా మారనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ ఆఘాడీ (ఎంవీఏ) ఘోర పరాజయం చెందడంతో వచ్చే బీఎంసీ ఎన్నికల్లో పరిస్థితి ఏమిటన్న ఆందోళన ఆ పార్టీ వర్గాల్లో మొదలైంది. రాష్ట్రంలో మొత్తం 288 స్ధానాలకు ఈ నెల 20వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా 23వ తేదీన ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో దేవేంద్ర ఫడ్నవీస్ (బీజేపీ), ఏక్నాథ్ శిందే (శివసేన), అజిత్ పవార్ (ఎన్సీపీ) నేతృత్వంలోని మహాయుతి కూటమి భారీ విజయం సాధించింది. మహా వికాస్ ఆఘాడి కూటమి అతి తక్కువ స్ధానాలతో ఘోర పరాజయం పాలైంది. దీంతో ఎంవీఏలో కలవరం మొదలైంది. 2022లోనే ముగిసిన గడువు... బీఎంసీ కార్యనిర్వాహక వర్గం గడువు 2022, మార్చితో ముగిసింది. ఈమేరకు 2022, ఫిబ్రవరిలోనే ఎన్నికలు జరగాలి. కానీ ఏక్నాథ్ శిందే తిరుగుబాటుతో రెండున్నరేళ్ల కిందట ఉద్ధవ్ ఠాక్రే నేతత్వంలోని ఏవీఏ ప్రభుత్వం కుప్పకూలడం, ఆ తరువాత మహాయుతి కూటమి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడం, ఈ ఏడాది మేలో లోక్‌సభ ఎన్నికలు, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలు.. ఇలా వరుసగా ఏదో ఒక అడ్డంకులు ఎదురు కావడంతో బీఎంసీ ఎన్నికలు తరుచూ వాయిదా పడుతూ వస్తున్నాయి. రెండున్నరేళ్ల నుంచి ఎన్నికలు జరగకపోవడంతో బీఎంసీలో కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయ ర్ ఇలా ప్రజాప్రతినిధులెవరు లేరు. దీంతో గత్యంతరం లేక అడ్మిన్ ఆధ్వర్యంలో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల పర్వం పూర్తికావడంతో జనవరి లేదా ఫిబ్రవరిలో బీఎంసీ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. దీంతో ప్రధాన, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్ని ఇప్పటి నుంచే సమాయత్తమవుతున్నాయి. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘార పరాజయాన్ని చవిచూసిన ఎంవీఏ కూటమిలో శివసేన(యూబీటీ)కి చెందిన కొందరు మాజీ కార్పొరేటర్లు శివసేన(శిందే) వర్గంలో చేరేందుకు సిద్ధమైతున్నట్లు తెలిసింది. అదేవిధంగా మైనార్టీ వర్గాలు మినహా కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్లు కొందరు బీజేపీ లేదా శిందే వర్గంలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీఎంసీ ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఎంవీయే, కాంగ్రెస్, శివసేన(యూబీటీ), మరోవైపు గత 25 ఏళ్లుగా బీఎంసీలో ఏకఛత్రాధిపత్యం చలాయిస్తున్న ఉద్ధవ్ సేనను గద్దె దించేందుకు బీజేపీ, శివసేన(శిందే)లు ఈసారి తీవ్రంగా శ్రమించాల్సిఉంటుంది. మళ్లీ ఫిరాయింపులు? ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎంవీఏను ముఖ్యంగా ఉద్ధవ్ సేనను గట్టి దెబ్బ తీశాయి. శివసేనతో తెగతెంపులు చేసుకున్న తర్వాత ఏక్నాథ్ శిందేతోపాటు 40 మంది మాజీ కార్పొరేటర్లు కూడా పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఆ తరువాత మరికొంత మంది శిందే వర్గంలో చేరేందుకు సిద్ధమయ్యారు. కానీ లోక్‌సభ ఎనికల్లో మహాయుతికి ఆశించినంత మేర ఫలితాలు రాకపోవడం, ఏంవీఏకు ఊహించిన దానికంటే ఎక్కువ లోక్‌సభ స్ధానాలు సాధించడంతో జంపింగులు పూర్తిగా నిలిచిపోయా యి. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏంవీఏ ఘోరంగా చతికిలపడటం, మహాయుతి విజయ ఢంకా మోగించడంతో మళ్లీ ఫిరాయింపులు మొదలేయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎమ్మెన్నెస్.. అవకాశమే లేదు! 2017లో జరిగిన బీఎంసీ ఎన్నికల్లో శివసేన–84, బీజేపీ–82, కాంగ్రెస్–31, ఎన్సీపీ–9, ఎమ్మెన్నెస్–7, సమాజ్‌వాది పార్టీ–1, ఇండిపెండెంట్లు–14 మంది కార్పొరేటర్లు గెలిచారు. వీరందరి సహకారంతో బీఎంసీ ఐదేళ్లపాటు సజావుగా కార్యకలాపాలు సాగించింది. కానీ ఇప్పుడు రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. రెండున్నరేళ్ల కిందట ముఖ్యమంత్రి పదవిపై నెలకొన్న విభేదాల వల్ల బీఎంసీలో కూటమిగా ఉన్న శివసేన, బీజేపీ రెండుగా చీలిపోయాయి. దీంతో బీఎంసీలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని బీజేపీ స్పష్టంచేసింది. ఆ తరువాత ఎమ్మెన్నెస్‌కు చెందిన ఏడుగురు కార్పొరేటర్లను తమ పార్టీలోకి లాక్కొవడంలో శివసేన సఫలీకృతమైంది. దీంతో ఎమ్మెన్నెస్‌కు ఒక్క కార్పొరేటర్ కూడా లేకుండా పోయారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎమ్మెన్నెస్ ఒక్క సీటును కూడా సాధించలేదు. దీంతో జనవరి లేదా ఫిబ్రవరిలో జరి గే బీఎంసీ ఎన్నికల్లోనూ ఎమ్మెన్నెస్ పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని, మహాయుతి, శివసేన(యూబీటీ)ల మధ్యే ప్రధానపోటీ జరగనుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ అంతంతమాత్రమే... కేంద్రంలో అధికారం లేదు. రాష్ట్రంలో రెండున్నరేళ్లకే అధికారాన్ని కోల్పోవల్సి వచ్చింది. ఇప్పుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఘోర పరాజయం పాలైంది. దీంతో అనేక మంది నాయకులు, మాజీ కార్పొరేటర్లు బీజేపీ, శివసేన(శిందే)ల్లో చేరే ప్రమాదం లేకపోలేదు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టి బీఎంసీ ఎన్నికలకు సీట్ల పంపకంలో కాంగ్రెస్‌కు చాలా తక్కువ స్ధానాలు లభించే అవకాశాలున్నాయి. దీంతో కాంగ్రెస్‌కు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగానే మారనున్నాయి. -
షిర్డీలో రాష్ట్రేతర తెలుగు సమాఖ్య తొమ్మిదో సర్వసభ్య సమావేశాలు
సాక్షి, ముంబై: రాష్ట్రేతర తెలుగు సమాఖ్య తొమ్మిదో సర్వసభ్య సమావేశాలు ఈసారి షిర్డీలో జరగనున్నాయి. షిర్డీలోని శాంతికమల్ హోటల్లో ఈ నెల 30, డిసెంబర్ 1వ తేదీల్లో రెండు రోజులపాటు జరగనున్న ఈ కార్యక్రమాల్లో సర్వసభ్య సమావేశాలతోపాటు వివిధ సాంస్కతిక, సాహిత్య కార్యక్రమాలు, మహారాష్ట్రతోపాటు ఇరత రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న తెలుగు శిక్షణా కార్యక్రమాల గురించి చర్చించనున్నారు. ఈ కార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య మంత్రి సత్యయాదవ్, తెలంగాణ సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్యఅతిథులుగా, మండలి బుద్ద ప్రసాద్, తెలంగాణ సాంస్కృతిక విభాగం సంచాలకులు మామిడి హరికృష్ణ, సినీ నటుడు సాయికుమార్ గౌరవఅతిథులుగా హాజరుకానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దేశంలోని 12 రాష్ట్రాల నుంచి 350 మంది సభ్యులు, 100 మంది కళాకారులు, రచయితలతోపాటు మహారాష్ట్ర తెలుగు సాహిత్య అకాడమి సభ్యులు కూడా పాల్గొననున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలకు స్థానిక తెలుగు సంఘాలతోపాటు షిర్డీ తెలుగు సంఘం అధ్యక్షుడు మాండవరాజా ఎంతగానో సహకరిస్తున్నారని వెల్లడించారు. ఊరేగింపుతో ప్రారంభం... రాష్ట్రేతర తెలుగు సమాఖ్య కార్యక్రమాలను రెండు కిలోమీటర్ల ఊరేగింపుతో ప్రారంభించనున్నారు. నవంబరు 30వ తేదీ శనివారం ఉదయం 9 గంటలకు శ్రీ సాయినివాస్ హోటల్ మెగా రెసిడెన్సీ నుంచి సభా ప్రాంగణం వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర తెలుగు ఫ్లకార్డులతో ఊరేగింపు జరగనుంది. వివిధ సాహిత్య, సామాజిక కార్యక్రమాల నిర్వహణ రాష్ట్రేతర తెలుగు సమాఖ్య 2015లో ఏర్పాటైంది. ఈ సమాఖ్య వివిధ రాష్ట్రాలలో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకూ 18 జాతీయ సదస్సులు, వివిధ నగరాలలో స్థానిక సంస్థల సహకారంతో ప్రతి ఏటా అనేక సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సేవా కార్యక్రమాలు, విద్యా సంబంధిత కార్యక్రమాలను చేపడుతోంది. అలాగే ఆంగ్ల భాషా ప్రభావంతో మాతృభాషకు దూరమవుతున్న పిల్లలకు తెలుగు భాష నేర్పేందుకు కూడా కృషిచేస్తోంది. అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో స్థిరపడ్డ తెలుగు కవులు, కళాకారులు, సామాజిక కార్యకర్తలకు ఆయా రాష్ట్రాలతోపాటు వారి స్వరాష్ట్రాలలో గుర్తింపు తీసుకువచ్చే ప్రయత్నం చేయడం, తెలుగు రాష్ట్రాల్లో అందించే పురస్కారాలు వీరికి కూడా అందించేందుకు కృషి చేయడం, రాష్ట్రేతర ప్రాంతాలలో మాతృభాష పరిరక్షణ, తెలుగేతర రాష్ట్రాలలో ప్రభుత్వాలు తెలుగువారికోసం స్థలాలు కేటాయించేలా కృషిచేయడం వంటి ఆశయాలతో ముందుకు వెళుతోంది. ఈ నేపథ్యంలో షిర్డీతోపాటు మహారాష్ట్రలోని తెలుగు సంఘాల ప్రతినిధులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్రేతర తెలుగు సమాఖ్య అధ్యక్షుడు ఆర్ సందుర్ రావు, ప్రధాన కార్యదర్శి పివిపిసి ప్రసాద్‌లు ఓ ప్రకటనలో తెలిపారు. -
‘మా నగరానికి ఏమైంది’ : కాలుష్యంపై నెటిజన్ల ఆగ్రహం
సాక్షి, ముంబై: దేశరాజధాని ఢిల్లీ తీవ్ర వాయు కా లుష్యంతో ఇప్పటికే సతమత మవుతుండగా, ఇప్పు డు ముంబై కూడా అదే సమస్యను ఎదుర్కొంటోంది. గత కొన్ని రోజులుగా నగరంలో వాయునాణ్యత క్షీణిస్తుండటంతో పర్యావరణవేత్తలు, ముంబైవాసు లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘మా నగరా నికి ఏమైంది? దీనికి బాధ్యులెవరు?‘అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై ప్రశ్నలు సంధిస్తున్నారు. పరిస్థితిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. బహిరంగప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి ముంబైలోని అత్యంత కాలుష్య ప్రాంతాలుగా గుర్తించిన బాంద్రా – కుర్లా కాంప్లెక్స్, బైకుల్లా, శివ్డీ, కొలాబా, శివాజీనగర్ ప్రాంతాల్లో గాలి నాణ్యత క్రమేపీదిగజారుతుండటంతో ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలనెదుర్కొంటున్నారు. గుండె జబ్బులు, ఆస్తమా, శ్వాసకోశ సమస్యలు, గొంతు నొప్పి, జలుబు, జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని డాక్టర్లు చెబుతున్నారు. కాలుష్య నియంత్రణకు సూచనలు.. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకుంటే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.నగరంలో కాలుష్య నియంత్రణకు పలు సూచనలు చేస్తున్నారుపరిశ్రమల నుంచి వెలువడే వాయు మలినాలను తగ్గించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవడం. ట్రాఫిక్ నియంత్రణ ద్వారా వాహన కాలుష్యాన్ని తగ్గించడం. పెద్ద ఎత్తున మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించడం. కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కఠినమైన నిబంధనలు అమలు చేయడం. -
పోలింగ్ ముగిశాక 7 శాతం ఓటింగ్ ఎలా పెరిగింది?
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయం ముగిసిపోయాక ఏకంగా 7 శాతం పోలింగ్ ఎలా పెరిగిందో భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) చెప్పాలని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే డిమాండ్ చేశారు. నవంబరు 20వ తేదీన వివిధ సమయాల్లో విడుదల చేసిన పోలింగ్ శాతంలో తేడాలుండటం ఈసీ పనితీరును ప్రశ్నార్థకం చేస్తోందన్నారు. పటోలే గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నవంబరు 20న సాయంత్రం ఐదు గంటలకు 58.22 శాతం పోలింగ్ శాతం నమోదైందని ఈసీ వెల్లడించిందని, అయితే రాత్రి 11:30 గంటలకు మరో 7.83 శాతం పోలింగ్ అదనంగా నమోదైనట్లు తెలిపిందని, ఇంత భారీ వ్యత్యాసానికి కారణాలేమిటేది ఈసీ తెలుపాలని డిమాండ్ చేశారు. ఈ అసాధారణ పెరుగుదల ఎన్నికల ప్రక్రియ పారదర్శకతను ప్రశ్నార్థకం చేసిందని పటోలే అన్నారు. ‘ఇది ప్రజల ఓట్లను కొల్లగొట్టడమే. దీనిపై న్యాయపోరాటం చేస్తాం. వీధుల్లోకి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తాం’ అని పటోలే పేర్కొన్నారు. రాత్రి 11:30 గంటల దాకా పోలింగ్ జరిగిన కేంద్రాల ఫోటోలను ఈసీ విడుదల చేయాలన్నారు. ఎవరు గెలిచారు, ఎవరు ఓడారనేది ఇక్కడ సమస్య కాదని, ప్రజాస్వామ్యాన్ని బతికించడమే ముఖ్యమని పేర్కొన్నారు. -
కాంగ్రెస్ అతి విశ్వాసమే కొంపముంచింది: మిత్రపక్షం శివసేన
ముంబై: మహారాష్ట్రలో కాంగ్రెస్ అతి విశ్వాసమే అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ కూటమి ఓటమికి కారణమని మిత్ర పక్షం శివసేన ఆరోపించింది. ఎంవీయేలో సీట్ల పంపకాల విషయంలో కాంగ్రెస్ ప్రదర్శించిన వైఖరి.. కూటమి విజయావకాశాలను దెబ్బతిశాయని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు శివసేన(యూబీటీ) సీనియర్ నేత, మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ప్రతిపక్ష నేత అంబాదాస్ దాన్వే మాట్లాడుతూ.. ఉద్ధవ్ ఠాక్రేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా పేర్కొంటూ మహా వికాస్ అఘాడి ఎన్నికలకు వెళ్లాల్సిందని అన్నారు."లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత హర్యానా, జమ్మూ కాశ్మీర్లో మాదిరిగానే మహారాష్ట్రలోనూ కాంగ్రెస్‌కు మితిమీరిన ఆత్మవిశ్వాసం ఉంది. ఇదే ఫలితాల్లో ప్రతిబింబించింది. సీట్ల పంపకాల చర్చల సమయంలో కాంగ్రెస్ వైఖరి మమ్మల్ని బాధించింది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉద్దవ్‌ను ప్రకటించాల్సి ఉండేది. అలా చేయకపోవడం మా అవకాశాలను దెబ్బతీసింది. అలా చేసి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవి.’ దాన్వే పేర్కొన్నారు.కాగా ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రకు సంబంధించిన 48 స్థానాల్లో మహా వికాస్ అఘాడి అత్యధికంగా 30 చోట్ల గెలుపొందింది. మిత్ర పక్షాలతో పోలిస్తే కాంగ్రెస్ ఎక్కువగా 13 స్థానాల్లో విజయం సాధించింది. ఇదే జోష్ మీదున్న కాంగ్రెస్.. రాష్ట్ర ఎన్నికలకు ముందు సీట్ల భాగస్వామ్య చర్చల సమయంలో గట్టిగా బేరసారాలు చేసింది. ఇది కూటమిలో ఘర్షణకు దారితీసింది. చివరకు 103 స్థానాల్లో పోటీ చేసినా కేవలం 16 మాత్రమే గెలుపొందింది. 89 స్థానాల్లో పోటీ చేసిన సేన (యూబీటీ) 20 స్థానాల్లో విజయం సాధించింది. మూడో మిత్రపక్షమైన శరద్ పవార్ ఎన్సీపీ 87 స్థానాల్లో పోటీ చేసి 10 స్థానాల్లో విజయం సాధించింది.మరోవైపు శనివారం వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సారథ్యంలోని పాలక మహాయుతి కూటమి అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. బీజేపీ 132 చోట్ల విజయం కేతనం ఎగురవేసి అతిపెద్ద పార్టీగా అవతరించింది. షిండే శివసేన 57 స్థానాల్లో గెలుపొందగా.. అజిత్‌పవార్ ఎన్సీపీ41 చోట్ల విజయం సాధించింది. -
పోలీస్‌స్టేషన్‌లో టూ వీలర్ల కుప్పలు : ఆధారాలు చూపిస్తే మీవే!
సోలాపూర్: సోలాపూర్ రూరల్ పోలీస్ స్టేషన్లో వ్యర్థంగా పడిఉన్న వాహనాలను పక్షంరోజుల్లోగా రుజువులు చూపించి తీసుకువెళ్లాలని, లేని పక్షంలో వాటిని స్క్రాప్ కింద పరిగణించి తగిన చర్యలు తీసుకుంటామని సోలాపూర్ తాలూకా పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాహుల్ దేశ్‌పాండే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘స్టేషన్ ఆవరణలో నాలుగు ఫోర్‌వీలర్లు, 67 ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. వీటి యజమానులు అవసరమైన పత్రాలు చూపించి తమ తమ వాహనాలను గుర్తించి తీసుకువెళ్లాలని కోరారు. లేకుంటే వాటిని పాడుబడిన వాహనాలుగా గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదీ చదవండి : ఎన్నికల పోరులోతగ్గేదెలా : ఓటమనేదేలేకుండా..విజయఢంకా! -
ఎన్నికల పోరులోతగ్గేదెలా : ఓటమనేదేలేకుండా..విజయఢంకా!
రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దేశ ఆర్థిక రాజధాని ముంబై పరిధిలో కొందరు అభ్యర్ధులు మొదటిసారి ఎన్నికల బరిలోకి దిగి విజయ దుందుభి మోగించారు. కొందరు హ్యాట్రిక్ సాధించి అందరిని ఆశ్చర్య పరిచారు. మరికొందరు ఓటమనేదే లేకుండా వరుసగా విజయం సాధిస్తూ రికార్డులు సృష్టించారు. వీరిలో కొందరు ఐదు, ఆరు సార్లు విజయం సాధించగా ఒకరైతే ఏకంగా తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సష్టించారు. ఇలా అనేక మంది ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రజల ఆదరణతో అనేక పర్యాయాలు గెలుస్తున్నారు. ఆ ఎమ్మెల్యేలెవరు, ప్రజల్లో వారికున్న క్రేజ్, ఆదరణ ఎలాంటిదో ఓసారి పరిశీలిద్దాం. వడాలాలో కాలీదాస్ విజయఢంకా... బీజేపీ నేత కాలీదాస్ కోళంబ్కర్ వడాల అసెంబ్లీ నియోజక వర్గం నుంచి వరుసగా తొమ్మిదిసార్లు గెలిచి రికార్డు సృష్టించారు. 72 ఏళ్ల కాలీదాస్ తనకు ఇవే చివరి ఎన్నికలని, ఈసారి గెలిస్తే తన పేరు గిన్నిస్‌బుక్‌లో నమోదవుతుందని విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో ఆ నియోజక వర్గ ప్రజలు భారీగా ఓట్లువేసి ఆయన్ను గెలిపించారు. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్)కు చెందిన స్నేహల్ జాధవ్, శివసేన(యూబీటీ) అభ్యర్థి శ్రద్ధా జాధవ్ గట్టిపోటీ ఇచ్చినప్పటికీ కాలీదాస్ 24 వేల ఓట్ల అధిక్యంతో గెలిచారు. ఈ సారి కాలీదాస్ను ఎలాగైనా ఓడించాలని ఇరువురు అభ్యర్ధులు తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. కాలీదాస్ 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై పోటీచేసి గెలిచారు. 2009, 2014లో కాంగ్రెస్ టిక్కెటుపై ఇదే వడాలా నియోజక వర్గం నుంచి పోటీచేసి విజయ ఢంకా మోగించారు. మలబార్హిల్లో ఏడోసారి మంగల్ ప్రభాత్ లోధా జయకేతనం మలబార్ హిల్ అసెంబ్లీ నియోజక వర్గంలో మంగళ్‌ప్రభాత్ లోధా ఏడో సారి విజయం సాధించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. బీజేపీ తరపున బరిలోకి దిగిన లోధా తన ప్రత్యర్థి, శివసేన(యూబీటీ)అభ్యర్ధి భేరులాల్ చౌధరీపై 6,8091 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. రాష్ట్రంలో అత్యంత ధనిక అసెంబ్లీ నియోజకవర్గంగా పేరుగాంచిన మలబార్ హిల్‌లో గెలవడం అంత సులువు కాదు. ఇక్కడ ముఖ్యమంత్రి అధికార నివాసమైన వర్షా బంగ్లాతోపాటు అనేకమంది ఉన్నత వర్గాల నివాసాలు, ధనవంతుల బంగ్లాలుంటాయి. ఇక్కడ సామాన్యులతోపాటు గుజరాతి, జైన్, మార్వాడి వర్గాల ఓటర్ల సంఖ్య అధికంగా ఉంది. లోధా, చౌధరి ఇరువురు జైన్ సమాజానికి చెందినవారు. దీంతో గుజరాతీ, జైన్, మార్వాడి ఓట్లు తమకే దక్కుతాయన్న ఆలోచనతో ఇరువురు ఎన్నికల బరిలోకి దిగారు.లోధాను ఓడించాలని మహావికాస్ ఆఘాడీకి చెందిన బడా నాయకులు తీవ్రంగా ప్రయత్నించారు. ఎట్టకేలకు లోధా విజయకేతనం ఎగురవేశారు. వరుసగా ఐదుసార్లు ఫడ్నవీస్, ఛగన్ భుజబల్ విజయదుందుభి...‘నేను మళ్లీ వస్తాను’అంటూ విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేసిన ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దక్షిణ–పశ్చిమ నాగ్‌పూర్ అసెంబ్లీ నియోజక వర్గంలో ఏకంగా ఆరు సార్లు విజయ కేతనం ఎగురవేశారు. తనకు ప్రత్యర్థిగా నిలిచిన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి ప్రపుల్ గుడధేను 39,710 ఓట్ల ఆధిక్యంతో ఓడించారు. ఎన్సీపీ అజీత్ పవార్ వర్గానికి చెందిన ఛగన్ భుజబల్ యేవ్లా అసెంబ్లీ నియోజక వర్గంలో వరుసగా ఐదుసార్లు విజయదుందుభి మోగించారు. తన ప్రత్యర్ధి ఎన్సీపీ (ఎస్పీ) అభ్యర్థి మాణిక్‌రావ్ శిందేను 26,400 ఓట్ల అధిక్యంతో భుజబల్ ఓడించారు.నాలుగుసార్లుగా ఏక్నాథ్ శిందే, జితేంద్ర అవ్హాడ్ విజయం.. ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే 2009 నుంచి విజయ ఢంకా మోగిస్తూ వస్తున్నారు. థానేలోని కోప్రి–పాచ్పాఖాడీ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేసి విజయం సాధిస్తున్నారు. రెండున్నరేళ్ల కిందట ఉద్ధవ్ శివసేన నుంచి బయటకు వచ్చి బీజేపీతో కలిసి మహాయుతి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. పార్టీలో చీలిక తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలెలా ఉండనున్నాయనే అంశం అందరిలోనూ ఉత్కంఠ రేపాయి. ఈ నేపథ్యంలో తన పంథాను కొనసాగిస్తూ శివసేన(శిందే) అభ్యర్ధి కేదార్ దిఘేపై ఘన విజయం సాధించారు. దీంతో వరుసగా నాలుగుసార్లు ఆయన ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించినట్లైంది. ముంబై ఉప నగరమైన ముంబ్రా–కల్వా అసెంబ్లీ నియోజక వర్గంలో గురుశిష్యులు నజీబ్ ముల్లా , జితేంద్ర అవ్హాడ్ మధ్య పోరు హోరాహోరీగా జరిగింది. చివరకు ఎన్సీపీ (ఎస్పీ)అభ్యర్థి జితేంద్ర అవ్హాడ్‌ను నాలుగోసారి విజయం వరించింది. 2023లో ఎన్సీపీ రెండుగా చీలిపోవడంతో ఎస్పీ వర్గం నుంచి అవ్హాడ్‌కు అభ్యరి్ధత్వం లభించింది. దీంతో ఆగ్రహానికి గురైన నజీబ్ ఆయనకు ప్రత్యర్థిగా ఎన్నికల బరిలో దిగారు. దీంతో ఒకేపార్టీకి చెందిన గురు, శిష్యుల మధ్య పోటీ ఎలా ఉండబోతుందని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. ముఖ్యంగా ఇక్కడ ముస్లీం ఓటర్ల సంఖ్య అధికం. దీంతో ముల్లా విజయం ఖాయమని భావించారు. కాని గత 15 ఏళ్ల నుంచి అవ్హాడ్ చేసిన అభివద్ధి పనులే ఆయనకు విజయం చేకూర్చాయి. విక్రోలీ, కలీనా, దిండోషీ, శివ్డీల్లో హ్యాట్రిక్ విక్రోలీ అసెంబ్లీ నియోజక వర్గంలో మహా వికాస్ ఆఘాడి కూటమి, శివసేన(యూబీటీ) అభ్యర్ధి సునీల్ రావుత్ మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించారు. తమ అభ్యర్ధులను గెలిపించుకునేందుకు ఉద్ధవ్ ఠాక్రే , ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే . హోరాహోరీగా ప్రచారం చేసినప్పటికీ . చివరకు ఓటర్లు శివసేన(శిందే)అభ్యర్థి సువర్ణ కరంజేకు పట్టం కట్టారు. కలీనా అసెంబ్లీ నియోజక వర్గంలో మహా వికాస్ ఆఘాడి కూటమి యూబీటీ అభ్యర్ధి సంజయ్ పోతి్నస్ హ్యాట్రిక్ సాధించారు. తన ప్రత్యర్ధి అయిన బీజేపీ అభ్యర్ధి అమర్జీత్ సింగ్‌ను భారీ అధిక్యంతో ఓడించారు. ఒక్కడ ఎమ్మెన్నెస్, వంచిత్ ఆఘాడీ పార్టీ సహా మొత్తం 16 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నప్పటికీ పోత్నీస్ జయకేతనం ఎగరేశారు.దిండోషీ అసెంబ్లీ నియోజక వర్గంలో శివసేన(యూబీటీ)అభ్యర్థి సునీల్ ప్రభు భారీ మెజారిటీతో హ్యాట్రిక్ సాధించారు. తన ప్రత్యర్థి శివసేన(శిందే) అభ్యర్థి సంజయ్ నిరుపమ్‌ను 6,058 ఓట్ల తేడాతో ఓడించారు. శివ్డీ అసెంబ్లీ నియోజక వర్గంలో యూబీటీ అభ్యర్ధి అజయ్ చౌధరి హ్యాట్రిక్ సాధించారు. ఎమ్మెన్నెస్ అభ్యర్థి బాలా నాంద్‌గావ్కర్, బీజేపీ రెబల్ అభ్యర్ధి నానా అంబోలే ఇరువురినీ ఓడించి 7,140 ఓట్ల అధిక్యంతో గెలుపొందారు. బాలా నాంద్గావ్కర్ను గెలిపించేందుకు స్వయంగా రాజ్ ఠాక్రే ప్రత్యేకంగా అక్కడ ఓ సభ నిర్వహించారు. అయినప్పటికీ ఓటర్లు ఆయన్ను తిరస్కరించారు.న్యూముంబైలోని బేలాపూర్‌లో బీజేపీ అభ్యర్ధి మందా మాత్రే, ఎన్సీపీ (ఎస్పీ) వర్గం అభ్యర్ధి సందీప్ నాయిక్ల మధ్య హోరాహోరీ పోరు జరిగింది.ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇద్దరినీ తీవ్ర ఉత్కంఠకు గురిచేసింది. చివరి రౌండ్ వరకు ఇద్దరూ దాదాపు సమానంగా ఉన్నారు. కానీ చివరి రౌండ్ ముగిసే సరికి కేవలం 377 ఓట్ల తేడాతో మందా మాత్రే విజయం సాధించారు. -
ప్రధాని మోదీ హత్యకు ప్లాన్ అంటూ బెదిరింపు కాల్.. మహిళ అరెస్ట్
ముంబై: ఈ మధ్యకాలంలో బెదిరింపు కాల్స్ ఎక్కువయ్యాయి. రాజకీయ ప్రముఖులు, స్కూల్స్, ఎయిర్‌పోర్టులు, మాల్స్ లక్ష్యంగా ప్రతిచోట బెదిరింపులకు పాల్పడుతున్నారు. తాజాగా ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకే బెదిరింపులు వచ్చాయి. ప్రధాని హత్యకు ప్లాన్ చేస్తున్నట్లు ఓ మహిళ ముంబై పోలీసులకు ఫోన్ చేసి ఈ బెదిరింపులకు పాల్పడింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.గురువారం ఉదయం ముంబై పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ప్రధాని హత్యకు ప్లాన్ చేసినట్లు ఓ మహిళ బెదిరించారు. అందుకు ఓ ఆయుధాన్ని సైతం సిద్ధం చేసుకున్నట్లు తెలినింది.దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. ఫోన్‌కాల్‌ను ట్రేస్ చేయగా.. 34 ఏళ్ల మహిళ ఈ బెదిరింపులకు పాల్పడినట్లు తేలింది. కేసు నమోదు చేసుకున్న అంబోలీ పోలీసులు.. వెంటనే దర్యాప్తు చేపట్టారు. బెదిరింపులకు పాల్పడిన మహిళను అదుపులోకి తీసుకున్నారు. సదరు మహిళపై గతంలో ఏం కేసులు లేవని, ఆమె మానసిక అనారోగ్యంతో బాధపడుతుండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా.. ఇటీవల బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను బెదిరిస్తూ ముంబయి ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్‌రూమ్‌కు వరుసగా బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. -
మంత్రి పదవులపై మల్లగుల్లాలు
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ఘన విజయంతో అధికారపీఠాన్ని కైవసం చేసుకున్న మహాయుతి కూటమి పార్టీలు అధికార పంపిణీపై మాత్రం మల్లగుల్లాలు పడుతున్నాయి. అయితే సీఎం పదవిపై స్పష్టత వచి్చనట్లు తెలుస్తోంది. ఫడ్నవిస్‌కు సీఎం పదవి ఇవ్వడంలో అడ్డంకులన్నీ తొలగిపోయినట్లు సమాచారం. కీలక పోర్ట్‌ఫోలియోలపై మూడు పార్టీలూ కన్నేయడంతో నేరుగా కూర్చుని మాట్లాడుకునేందుకు శివసేన, ఎన్సీపీ సారథులు బీజేపీ అధిష్టానంతో చర్చలు జరిపారు. గురువారం ఢిల్లీకి చేరుకున్న ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్, శివసేన చీఫ్ ఏక్నాథ్ షిండేలు మహారాష్ట్ర బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్‌తో కలిసి బీజేపీ అగ్రనేత అమిత్‌షాను కలిశారు. కృష్ణమీనన్ మార్గ్‌లోనిæషా నివాసంలో చర్చలు జరిపారు. సామాజిక సమీకరణాలతోనే పోస్ట్‌లు సామాజిక సమీకరణాలను బట్టే మంత్రి పదవులను కట్టబెట్టాలని బీజేపీ యోచిస్తోంది. బీజేపీలోని ఓబీసీ లేదా మరాఠా నేతకే సీఎం పదవి కట్టబెట్టాలని చూస్తోందని తొలుత వార్తలొచ్చాయి. అన్ని పార్టీల్లో మరాఠా వర్గానికి చెందిన వాళ్లే అత్యధికంగా ఎమ్మెల్యేలుగా గెలిచినా ఆర్ఎస్ఎస్ లాబీయింగ్ బలం పనిచేస్తే బ్రాహ్మణ వర్గానికి చెందిన ఫడ్నవిస్‌కే మళ్లీ సీఎం పీఠం దక్కుతుందని ఢిల్లీలోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అజిత్, షిండే డిప్యూటీ సీఎంలుగా ఉంటారని వార్తలొచ్చాయి. అయితే సీఎం, డిప్యూటీ సీఎం పదవులపై ఇంతవరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ఎవరేం కోరుతున్నారు? పోర్ట్‌ఫోలియోలపై ఎవరికివారు కరీ్చఫ్ వేసేస్తున్నారు. తమ పార్టీకి ఈ శాఖలే కావాలని పట్టుబడుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం పట్టణాభివృద్ధి, వ్యవసాయం, ఆరోగ్య శాఖలు తమకు కేటాయించాలని ఏక్నాథ్ షిండే కోరుతున్నారు. కీలకమైన ఆర్థిక శాఖ తమకు ఇవ్వాలని ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ వర్గం డిమాండ్చేస్తోంది. అయితే మెజారిటీ సీట్లు గెలిచిన తమ వద్దే కీలకమైన శాఖలను అట్టిపెట్టుకోవాలని బీజేపీ భావిస్తోంది. గెలిచిన ప్రతి ఆరు సీట్లకు ఒక కేబినెట్ పోస్ట్ చొప్పున మంత్రి పదవులను పంచాలని ఒక సూత్రప్రాయ అంగీకారానికి వచ్చినట్లు వార్తలొచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమిలో బీజేపీ 132, శివసేన(షిండే) 57, ఎన్సీపీ( అజిత్ పవార్) 41 చోట్ల గెలిచాయి. ఒక్కో పార్టీ గెలిచిన సీట్ల సంఖ్యను బట్టి కేబినెట్ పోస్టులు కేటాయించాలని భావిస్తున్నారు. ఇన్నాళ్లూ సీఎంగా చేసిన షిండే ఇకపై డిప్యూటీ సీఎం పదవి చేబడితే పట్టణాభివృద్ధి శాఖతోపాటు మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ శాఖనూ తన వద్ద అట్టిపెట్టుకోవాలని చూస్తున్నారు. రెవిన్యూ, వ్యవసాయం, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, పరిశ్రమలు, సామాజిక న్యాయ శాఖలను తమ పార్టీకే కేటాయించాలని డిమాండ్చేస్తున్నారు. అజిత్ డిమాండ్లు ఏంటి ? డిప్యూటీ సీఎం పోస్ట్‌తోపాటు ఆర్థికశాఖ తనకే ఇవ్వాలని ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కోరుతున్నట్లు వినికిడి. అయితే కీలకమైన ఆర్థికశాఖతోపాటు ప్రణాళిక శాఖను తన వద్దే ఉంచేసుకోవాలని బీజేపీ ఆశిస్తోంది. వ్యవసాయం, ఆహార, పౌర సరఫరాలు తదితర శాఖలు తమకు కేటాయించాలని అజిత్ అడుగుతున్నారని తెలుస్తోంది. బీజేపీ మాటేంటి? కూటమిలో అత్యధిక సీట్లు గెలిచినందున కీలకమైన ఏ శాఖనూ కూటమి పార్టీలకు ఇచ్చేది లేదని బీజేపీ పట్టుదలగా ఉందని తెలుస్తోంది. హోం, గృహ, పట్టణాభివృద్ధి, ఆర్థికం, నీటిపారుదల, విద్యుత్, నైపుణ్యాభివృద్ధి శాఖలు తమ ఆధ్వర్యంలోనే కొనసాగాలని బీజేపీ ఆశిస్తోంది. గెలిచిన ప్రతి ఆరు సీట్లకు ఒక కేబినెట్ పోస్ట్ చొప్పున మంత్రి పదవులను పంచాలన్న సూత్రాన్ని అమలుచేస్తే బీజేపీకి 21 లేదా 22, శివసేనకు 10 లేదా 12, ఎన్సీపీకి 8 లేదా 9 మంత్రి పదవులు దక్కుతాయి. -
Maharashtra: తొలిసారిగా అసెంబ్లీకి 78 మంది..
సాక్షి ముంబై: రాష్ట్రంలో ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 78 మంది తొలిసారిగా విజయం సాధించారు. దీంతో ఈ 78 మంది మొదటిసారిగా అసెంబ్లీ మెట్లు ఎక్కనున్నారు . మహారాష్ట్రలోని మొత్తం 288 స్థానాలకుగాను ఒక విడ తలా నవంబరు 30వ తేదీ ఎన్నికలు జరగగా నవంబరు 23వ తేదీ ఫలితాలు వెలువడ్డ సంగతి. తెలిసిందే. ఈ ఎన్నికల్లో బీజేపీ, శివసేన (షిండే), ఎన్సీపీ (ఏపీ)ల మహాయుతి కూటమి చారిత్రాత్మక విజయం సాధించింది. బీజేపీకి 1152, శివసేన (షిండే)కు 57, ఎన్సీపీ (ఏపీ)కి 41 స్థానాలను దక్కించుకున్నాయి. కాగా ఈసారి గెలుపొందిన అభ్యర్థులలో 78 మంది మొదటిసారిగా విజయం సాధించి అసెంబ్లీకి వెమెట్లెక్కనున్నారు. వీరిలో బీజేపీ నుంచి 33 మంది, శివసేన (ఉంటే) నుంచి 14 మంది, ఎన్సీపీ (ఏపీ)కి చెందిన ఎనిమిది మంది. శివసేన (యూబీటి)కి చెందిన 10 మంది, కాంగ్రెస్ నుంచి ఆరు. ఎన్సీపి (ఎస్పీ)కి చెందిన నలుగురు అభ్యర్థులున్నారు. వీరితోపాటు చిన్న పార్టీలకు చెందిన మరో ఇద్దరు అభ్యర్థులతోపాటు ఒక ఇండిపెండెంటు కూడా ఉన్నారు. ఈ ఎన్నికల్లో మహాయుతి, మహావికాస్ అఘాడికి చెందిన నేతలు తమ వారసులను బరిలోకి బరిలోకి దింపినప్పటికీ ప్రజలు అందరికీ పట్టంకట్టలేదని స్పష్టమైంది. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసిన వారసులలో లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కూతుడు శ్రీ జయా చవాన్ నాందేడ్ జిల్లా బోకర్ అసెంబ్లీ సియోజకవర్గం నుంచి తొలిసారిగా పోటీ లేని విజయం సాధించారు. మరోవైపు మాజీ మంత్రి బాబన్ రాన్ పాచ్‌పుతే సుమారుడు విక్రమ్ శ్రీగోంధా నుంచి మాజీ ఎంపీ హరిభావు జూవలే కుమారుడు అమోల్ జావలే రావేర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారిగా పోటీవేసి విజయం సాధించారుఇదిలా ఉండగా ఆర్వీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ వ్యక్తిగత సహాయకుడైన సుమిత్ వాంఖడ, అదుల బాబా భోస్లే కరాడ్ నుంచి విజయం సాధించారు. అదే విధంగా శిసేన(షిండే) పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే అనీల్ బాబర్ కుమారుడు సహాస్ బాబర్ ఖానాపూర్ నియోజకవర్గం నుంచి గెలుపొందగా ఎంపీ సందీపన్ భూమరే కుమారుడు విలాస్ భూమరే పైఠన్ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్చే చిమణరావ్ పాటిల్ కుమారుడు అమోల్ పాటిల్ ఎరండోల్ నియోజకవర్గం నుంచి తొలిసారిగా విజయం సాధించారు.ఇక ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ కుమార్తె సనా మాలిక్ ముంబైఓలని అణుశక్తినగర్ నుంచి తొలిసారిగా పోటీ చేసి విజయం సాధించారు. వీరితోపాటు కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రి వర్షా గైక్వాడ్ సోదరీ జ్యోతి గైక్వాడ్ కూడా ధారావీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారిగా గెలుపొందారు. వీరితోపాటు మాజీ ఉపముఖ్యమంత్రి, దివంగత ఆర్ ఆర్ పాటిల్ కుమారుడు ఎన్సీపీ(ఎస్పీ) పార్టీ తరపున తాస్ గావ్ నియోజకవర్గం నుంచి తొలిసారిగా పోటీ చేసి గెలుపొందారు. మరోవైపు తూర్పు బాంద్రా అసెంబ్లీ నుంచి శివసేన(యూబీటీ) తరపున ఉద్దవ్ ఠాక్రే బంధువైన వరుణ్ దేశామ్ మొదటిసారిగా విజయం సాధించారు.ముంబై నుంచి తొమ్మిది మంది..ఈ ఎన్నికల్లో ముంబై నుంచి తొమ్మిది. అభ్యర్థులు తొలిసారిగా విజయం సాధించిన వీరిలో మాహిం అసెంబ్లీ నియోజకవర్గం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇక్కడి నుంచి మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధక్షుడు రాజ్ కాక్రే కుమారుడైన అమిత్ ఠాక్రే తొలిసారిగా బరిలోకి దిగగా శివసేన(షిండే) నుంచి సదా సర్వస్కర్, శివసేన(యూబీటీ) నుంచి మహేష్ సావంత్ పోటీ చేశారు. వీరిద్దరి మధ్య భారీగా ఓట్లు చీలి మహేష్ సావంత్ విజ సాధించారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు, -
ఈవీఎంలు ఉంటే ఏదైనా సాధ్యమే!
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి బంపర్ లక్కీ డ్రాలో గెలిచిందని శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) పత్రిక సామ్నా విమర్శించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లు ఉంటే ఏదైనా సాధ్యమే నని పేర్కొంది. సామ్నా ఎడిటో రియల్‌లో ఈ మేరకు ధ్వజమెత్తింది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఇటీవల భారత్‌లో చాలావేగంగా ఓట్ల లెక్కింపు పూర్తయిందని, అమెరికాలో ఇది చాలా ఆలస్యమైందని పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై సామ్నా స్పందిస్తూ భారత్‌లో ఈవీఎంల పనితీరుతో సామాన్యులూ నిర్ఘాంతపోయారని పేర్కొంది. అంతేకాకుండా ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చని ఎలాన్ మస్క్ స్వయంగా కొన్ని నెలల కిందట చెప్పిన విషయాన్ని ప్రస్తావించింది. మొత్తం 288 సీట్లలో మహాయుతి బంపర్ లక్కీ డ్రాలో ఏకంగా 230 సీట్లను ఎలా నెగ్గగలిగింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికితే అవన్నీ ఈవీఎంల దగ్గరే ఆగిపోతున్నాయని వ్యాఖ్యానించింది. ఏకంగా 95 నియోజకవర్గాల్లో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు మధ్య తేడాలున్నాయని పేర్కొంది. అలాగే బ్యాటరీలు పూర్తి చార్జింగ్‌తో ఉండటం ఈవీఎంలపై పలు అనుమానాలను రేకెత్తిస్తోందని తెలిపింది. -
తుది అంకానికి చేరిన ‘మహా’ హైడ్రామా.. సీఎంగా ఫడ్నవిస్?
ముంబై/థానే: ఎవరికీ మెజారిటీరాని, హంగ్ సందర్భాల్లో కనిపించేంత ఉత్కంఠను కొనసాగించిన ‘మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరు?’ అంశానికి నేటితో తెరపడనుంది. గతంలో ముఖ్యమంత్రిగా, ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా సేవలందిస్తున్న మహారాష్ట్ర బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించడం దాదాపు ఖాయమైంది. మహాయుతి కూటమిని శాసనసభ ఎన్నికల పర్వంలో విజయతీరాలకు చేర్చినందుకు మళ్లీ తననే సీఎంగా చేయాలని పట్టుబట్టిన శివసేన చీఫ్, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కాస్తంత మెత్తబడ్డారు. దీంతో ఫడ్నవిస్ పట్టాభిషేకానికి అవరోధాలు దాదాపు తొలగిపోయాయి. నేడు ఢిల్లీలో బీజేపీ అగ్రనేత అమిత్ షాతో ఏక్నాథ్ షిండే భేటీ తర్వాత కేబినెట్ కూర్పుపై తుది నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కూటమి ధర్మాన్ని పాటిస్తూ మళ్లీ తనకే సీఎం పదవి ఇవ్వాలని పట్టుబట్టిన షిండే బుధవారం పట్టు సడలించారు. నూతన సీఎం ఎంపికపై ప్రధాని మోదీ, బీజేపీ అగ్రనేత అమిత్‌షాల నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని బుధవారం షిండే చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూర్చాయి. దీంతో ఫడ్నవిస్ సారథ్యంలో బీజేపీ సర్కార్ కొలువుతీరడం దాదాపు ఖాయమైంది. ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ చీఫ్ అజిత్‌పవార్‌లు ఉప ముఖ్యమంత్రి పదవులు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 30 లేదా డిసెంబర్ ఒకటో తేదీన ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమం ఉండొచ్చని అజిత్ పవార్ బుధవారం చెప్పారు.2, 3 గంటలే నిద్రపోయా‘‘మహాయుతికి ఘన విజయం అందించిన మహారాష్ట్ర ఓటర్లకు కృతజ్ఞతలు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం విస్తృతంగా తిరిగా. ఎన్నికల ప్రచారం వేళ రోజుకు కేవలం 2,3 గంటలే నిద్రపోయా. ప్రజల కోసం నేరుగా పనిచేయడంలో నేను ఇప్పటికీ కార్యకర్తనే. నా దృష్టిలో సీఎం అంటే కామన్‌మ్యాన్. నేనేమీ అసంతృప్తిలో లేను. మేం పోరాటం చేశాం. ఇక్కడ ఏడ్వాల్సిన అవసరం లేదు. పాపులర్ అవ్వాలని సీఎంగా చేయలేదు. ప్రజల సంక్షేమం కోసమే పదవిలో కొనసాగా’’ అని షిండే వ్యాఖ్యానించారు. బీజేపీ అగ్రనాయకత్వం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని షిండే ప్రకటించడం ఆనందంగా ఉందని బీజేపీ మహారాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాంకులే చెప్పారు. ‘‘ విపక్షాల పుకార్లను పటాపంచలు చేస్తూ షిండే చక్కటి నిర్ణయం తీసుకున్నారు. ఆయనను చూసి గర్వపడుతున్నా. సీఎంగా ఆయన అద్భుతంగా పాలించారు’’ అని బవాంకులే పొగిడారు. షిండే మహాయుతి ప్రభుత్వానికి కన్వీనర్‌గా ఉంటారని వార్తలొచ్చాయి. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో తాజా ఎన్నికల్లో మహాయుతి కూటమి 230 సీట్లను కైవసం చేసుకుని ఘన విజయం సాధించడం తెల్సిందే. బీజేపీ 132, శివసేన(షిండే) 57, ఎన్సీపీ(అజిత్‌పవార్) 41 చోట్ల గెలిచాయి.మా వైపు స్పీడ్ బ్రేక్ లేదన్న షిండేఘన విజయం తర్వాత ఐదు రోజులకు తొలిసారిగా బుధవారం థానేలోని స్వగృహంలో 60 ఏళ్ల షిండే మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘‘ కొత్త సీఎం విషయంలో మోదీ, అమిత్ షాల నిర్ణయంతో ఏకీభవిస్తా. ఈ ఎంపిక ప్రక్రియలో నేను అవరోధంగా ఉండబోను. బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నాకు, శివసేనకు సమ్మతమే అని నిన్ననే వాళ్లతో ఫోన్ సంభాషణల్లో స్పష్టం చేశా. రెండోదఫా అవకాశం దక్కదని తెల్సి నిరాశచెందానన్న వార్తల్లో నిజం లేదు. వాస్తవానికి సీఎంగా నా ప్రభుత్వానికి బీజేపీ మద్దతు పలికిందన్న విషయం మర్చి పోవద్దు. కొత్త సీఎం వ్యవహారంలో శివసేన నేతల్లో ఎలాంటి కోపతాపాలు, అసహనం లేవు. గురువారం ఢిల్లీలో అమిత్ షాను నేను, ఫడ్నవిస్, అజిత్‌పవార్ కలవ బోతున్నాం. ఆ సమావేశంలో కీలక నిర్ణయాలు ఖరారవుతాయి’’ అని అన్నారు. ‘‘ కొత్త ప్రభుత్వం కొలువు తీరే అంశం గురువారంతో తేలిపోనుంది’’ అని షిండే అన్నారు. నవంబర్ 30 లేదా డిసెంబర్ ఒకటో తేదీన సీఎం ప్రమాణస్వీకారం ఉంటుందని ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ చెప్పారు. -
మహారాష్ట్రలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బీజేపీ ఓపెన్ ఆఫర్!
ముంబై: మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పదవిపై ఉత్కంఠ నెలకొంది. మహాయతి కూటమిలో సీఎం ఎవరు అనేది ఢిల్లీ బీజేపీ పెద్దల చేతిలోకి వెళ్లింది. మరోవైపు.. మహాయుతి కూటమి భారీ విజయం నేపథ్యంలో బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్ చేస్తున్నారు. హస్తం పార్టీలో గెలిచిన నేతలు బీజేపీలో చేరాలని తాజాగా కాషాయ పార్టీ నేత మాట్లాడటం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.మహారాష్ట్ర బీజేపీ నేత ఆశిశ్ దేశ్ ముఖ్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో బీజేపీ కూటమి భారీ మెజార్టీతో విజయం సాధించింది. కాంగ్రెస్ కూటమిని ప్రజలు తిరస్కరించారు. వారి ఓటమిని ప్రజలే శాసించారు. గతంతో పోలిస్తే మహారాష్ట్రలో కాంగ్రెస్ మరింత బలహీనపడింది. హస్తం పార్టీకి మరిన్ని ఓట్లు తగ్గాయి. ఆ పార్టీకి భవిష్యత్ లేదు. ఇంత జరుగుతున్నా ఇంకా అదే పార్టీలో ఉంటే కాంగ్రెస్ నేతల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మిగులుతుంది. అందుకే కాంగ్రెస్ నేతలు ఇప్పటికైనా బీజేపీలో చేరాలి. ఎన్నికల్లో గెలిచిన 16 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరండి అని సూచించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా హాట్ టాపిక్ అయ్యాయి.ఇదిలా ఉండగా.. ఆశిశ్ దేశ్ ముఖ్ మాజీ కాంగ్రెస్ నేత. పలు కారణాలతో ఆయనను కాంగ్రెస్ పార్టీ గతేడాది పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీంతో, ఆయన బీజేపీలో చేరారు. ఈ క్రమంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఆశిశ్ బరిలోకి దిగారు. నాగాపూర్ లోని సావ్నర్ స్థానంలో విజయం సాధించారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరాలని ఆయన పిలుపునిచ్చారు. -
‘మహా’ సీఎంకు లైన్ క్లియర్.. మిగిలింది అధికారిక ప్రకటనే!
ఢిల్లీ: మహాయుతి కూటమి నుంచి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠ దాదాపు వీడిపోయింది. సీఎం పదవిపై తనకు ఎలాంటి ఆశలు లేవని.. బీజేపీ అగ్రనేతలు మోదీ, అమిత్ షా చేతుల్లోనే తుది నిర్ణయం ఉందని ఆపద్ధర్మ సీఎం ఏక్నాథ్ షిండే ప్రకటించారు. దీంతో తొలి నుంచి రేసులో ఉన్న దేవేంద్ర ఫడ్నవిస్‌కు దాదాపు లైన్ క్లియర్ అయ్యింది.మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనేదానిపై ఇక మిగిలింది అధికార ప్రకటనే!. రేపు(గురువారం) ఎన్డీయే కీలక సమావేశం జరగనుంది. దీనికి ఫడ్నవిస్, షిండే, అజిత్ పవార్లకు ఆహ్వానం అందింది. కుదిరితే ఈ భేటీ అనంతరం లేకుంటే సాయంత్రం మహారాష్ట్ర సీఎంపై అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సంకేతాలు అందుతున్నాయి.ఇదీ చదవండి: మోదీ చెప్పాల్సింది చెప్పా.. నిర్ణయం ఆయనదే!షిండే ఫిట్టింగ్తోనే..నవంబర్ 23వ తేదీన వెలువడిన ఫలితాల్లో మహాయుతి కూటమి భారీ విజయం సాధించింది. 288 స్థానాలకుగానూ.. 237 సీట్లు గెల్చుకుంది. ఇందులో బీజేపీ 132, షిండే శివసేన 57, ఎన్సీపీ(అజిత్ పవార్) 41, ఇతరులు 7 సీట్లు ఉన్నాయి. ఫలితాలు వెలువడిన టైంలో.. ఫడ్నవిస్ పేరు సీఎం రేసులో ప్రముఖంగా వినిపించింది. ఆ వెంటనే షిండే, అజిత్ పవార్లు తామూ రేసులో ఉన్నామంటూ ముందుకొచ్చారు. సంఖ్యా బలానికి, సీఎం పదవికి సంబంధం లేదని, ఎవరు సీఎం అవుతారనేది చర్చించాకే ప్రకటిస్తామని ఏక్నాథ్ షిండే సైతం అన్నారు. దీంతో అసెంబ్లీ గడువు ముగిసినా.. సస్పెన్స్ కొనసాగుతూ వచ్చింది. ఈలోపు ఢిల్లీ పెద్దలు మూడు పార్టీల నేలతో చర్చలు జరిపారు. డిప్యూటీ సీఎం పదవికి అజిత్ పవార్ అంగీకారం తెలిపి.. ఫడ్నవిస్‌కు మద్దతుగా నిలిచారు. అయితే షిండే మాత్రం ఈ విషయంలో అస్సలు తగ్గలేదు. ఫడ్నవిస్‌ను బీజేపీ సీఎంగా ఎంచుకోవడంపై అసంతృప్తితో రగిలిపోయారు. అందుకు తగ్గట్లే.. ఆయన వర్గీయులు కూడా షిండేనే సీఎంగా ప్రకటించాలంటూ పెద్ద ఎత్తున్న సోషల్ మీడియాలో క్యాంపెయిన్ నడిపించారు. ఈలోపే బీజేపీ అగ్రనేతల సంప్రదింపులతో షిండే మెత్తబడ్డారు. ఫలితంగానే.. బీజేపీ సీఎం పదవి తీసుకుంటే తనకేం అభ్యంతరం లేదని ఆయన చెప్పడంతో ఫడ్నవిస్‌కు లైన్ క్లియర్ అయినట్లైంది. -
నాన్‌వెజ్ తినొద్దని వేధించి..
ఎయిరిండియా పైలట్ అనుమానాస్పద కలకలం రేపింది. దీనికి ఆమె బాయ్ ఫ్రెండే కారణమని బంధువులు ఆరోపించారు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు..ఎయిరిండియాలో పైలట్‌గా పనిచేస్తున్న 25ఏళ్ల సృష్టి తులి ఈనెల 25న ముంబైలోని అంధేరీ ఈస్ట్‌లోని ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఆదిత్య పండిట్ తరచూ ఆమెను వేధించేవాడని, ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించేవాడని సృష్టి కుటుంబం ఆరోపించింది. నాన్ వెజ్ తినవద్దు అంటూ కట్టడి చేసేవాడని తెలిపింది. అతనే హత్య చేసి ఉంటాడని ఫిర్యాదు చేశారు. దీంతో నవంబర్ 26న కేసు నమోదు చేసిన పోలీసులు పండిట్‌ను అరెస్టు చేశారు. కోర్టు అతడిని నవంబర్ 29 వరకు పోలీసు కస్టడీకి పంపింది. పోలీసుల సమాచారం ప్రకారం ఆమె మృతదేహానికి సమీపంలో లేదా ఆమె ఫ్లాట్‌లో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. సృష్టి కమర్షియల్ పైలట్. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆమె గత ఏడాది జూన్ నుంచి ఉద్యోగ నిమిత్తం ముంబైలో నివసిస్తోంది. రెండేళ్ల క్రితం కమర్షియల్ పైలట్ లైసెన్స్ కోసం శిక్షణ పొందుతున్న సమయంలో సృష్టి, పండిట్లు ఢిల్లీలో కలిశారు. ఆ పరిచయం ప్రేమగా మారింది. అయితే ఈ ట్రైనింగ్‌లో ఆదిత్య పండిట్ పైలట్‌గా ఎంపిక కాలేదు.ఘటనకు ముందు దాదాపు ఐదు నుంచి ఆరు రోజుల పాటు పండిట్ సృష్టితో కలిసి అంధేరి ఫ్లాట్‌లో ఉన్నాడు. సోమవారం (నవంబర్ 25) అర్ధరాత్రి దాటిన తర్వాత అతను కారులో ఢిల్లీకి బయలుదేరాడు. ఈ సమయంలో సృష్టి అతనికి ఫోన్ చేసి, ఆత్మహత్య చేసుకుంటానని చెప్పింది. అతడు ముంబైకి తిరిగి వచ్చేసరికి డోర్ లాక్ చేసి ఉంది. ఎంత పిలిచినా తీయకపోవడంతో ఆమె స్నేహితురాలు ఉర్వి పంచల్‌ను సంప్రదించి, కీమేకర్ సాయంతో తలుపు తెరిచారు. కానీ అప్పటికే కేబుల్ వైర్‌తో ఉరి వేసుకుంది. అంధేరీ ఈస్ట్‌లోని సెవెన్ హిల్స్ ఆసుపత్రికి తరలించగా, ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.సృష్టి మామ ఆరోపణలు'పండిట్‌ను సృష్టి చాలా గాఢంగా ప్రేమించింది. కానీ అతడు ఆమెను బాగా వేధించేవాడు. బహిరంగంగా దుర్భాషలాడేవాడు. మాంసాహారం తినడం మానేయాలని కూడా ఒత్తిడి చేశాడు. ఆమె పట్ల పండిట్ అసభ్యంగా ప్రవర్తించడం ఇతర బంధువులు కూడా చూశారు. అలాగే ఒక పార్టీలో మాంసాహారం తిన్నందుకు అందరిముందూ అరిచాడు. ఆమె కారును పాడు చేసి, రోడ్డుపై ఒంటరిగా వదిలేసివెళ్లిపోయాడు. ఇటీవల పండిట్ సోదరి నిశ్చితార్థం ఫంక్షన్‌కు సృష్టి వెళ్లలేకపోవడంతో దాదాపు 10 రోజుల పాటు మాట్లాడలేదు. దీంతో సృష్టి మానసికంగా కృంగి పోయింద'ని సృష్టి మామ ఆరోపించారు.