Gossips
-
సంతాన ప్రాప్తి కోసం కత్రినా కైఫ్ భక్తి మార్గం!
దేవుడు, పూజలు అనేవి చాలా పవిత్రమైనవి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎప్పుడో ఓసారి భక్తి మార్గంలోకి వెళ్తారు. అలా కొన్నాళ్లపాటు దేవాలయాలు, పూజలు అని చాలా బిజీ అయిపోతారు. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ కూడా అలానే చేస్తోంది.'ఛావా'తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న విక్కీ కౌశల్ ని.. కత్రినా కైఫ్ 2021లో పెళ్లి చేసుకుంది. వయసులో తన కంటే చిన్నవాడైనప్పటికీ కత్రినా అతడితో కొత్త జీవితం ప్రారంభించింది. పెళ్లి తర్వాత ఒకటి రెండు మూవీస్ చేసింది గానీ ప్రస్తుతానికైతే ఈమె చేతిలో కొత్త ప్రాజెక్టులేం లేవు.(ఇదీ చదవండి: సినిమాలో ఫైట్స్ నచ్చకపోతే నన్ను చితక్కొట్టండి: 'దిల్ రుబా' నిర్మాత)కొన్నాళ్ల క్రితం కుంభమేళాలో పాల్గొన్న కత్రినా కైఫ్.. త్రివేణి సంగమంలో పుణ్యస్నానమాచరించింది. భక్తులకు ప్రసాదం కూడా పంచిపెట్టింది. ఇది జరిగిన ఎన్నిరోజులు కాలేదు ఇప్పుడు కర్ణాటకలోని ప్రసిద్ధ కుక్కే సుబ్రమణ్యస్వామి దేవాలయంలో దర్శనమిచ్చింది. కుటుంబంతో కలిసి సర్ప సంస్కార పూజలో పాల్గొంది.అయితే కుక్కే సుబ్రమణ్యస్వామి దేవాలయాన్ని దర్శిస్తే పెళ్లి కాని యువతలు త్వరలో ఓ ఇంటివారవుతారని, సంతాన ప్రాప్తి కూడా కలుగుతుందని చాలామంది నమ్ముతారు. ఇప్పుడు కత్రినా కూడా ఈ దేవాలయాన్ని సందర్శించడం, ప్రత్యేక పూజలు చేయించడం లాంటివి చూస్తుంటే పిల్లల కోసం గుళ్లు, గోపురాలు తిరిగేస్తూ భక్తి మార్గంలోకి వెళ్లిపోయిందా అనిపిస్తుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ 'ఛావా'.. డేట్ ఫిక్సయిందా?) -
'కన్నప్ప'తో మంచు విష్ణు అంత రిస్క్ చేస్తారా?
మంచు విష్ణు 'కన్నప్ప' నుంచి తొలి టీజర్ రిలీజైనప్పుడు ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువొచ్చాయి. కానీ కొన్నాళ్ల ముందు విడుదల చేసిన మరో టీజర్ కి మాత్రం పర్లేదు బాగుందనే టాక్ వచ్చింది. దీనికి తోడు రెండు పాటలు కూడా వినసొంపుగా అనిపించాయి. ఇలా ఓ మాదిరి బజ్ ఏర్పడింది. ఇలా 'కన్నప్ప' గురించి కాస్తోకూస్తో అంచనాలు పెరుగుతున్న టైంలో మంచు విష్ణు రిస్క్ తీసుకున్నాడనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుత ట్రెండ్ లో భారీ బడ్జెట్ సినిమాలు చాలా వాటి ఓటీటీ డీల్స్ ముందే పూర్తవుతున్నాయి. తద్వారా పెట్టిన బడ్జెట్ కొంతమేర రికవర్ చేయొచ్చనేది నిర్మాతల ప్లాన్.(ఇదీ చదవండి: దళపతి విజయ్ పై పోలీసులకు ఫిర్యాదు)కానీ 'కన్నప్ప' విషయంలో మాత్రం మంచు విష్ణు రిస్క్ తీసుకోవాలని ఫిక్సయ్యాడట. మూవీ రిలీజ్ కి ముందు డీల్ కుదుర్చుకుంటే ఓటీటీలు ఇచ్చినంత తీసుకోవాలి. అదే రిలీజ్ తర్వాత మూవీ హిట్ టాక్ తెచ్చుకుంటే మనం డిమాండ్ చేయొచ్చని విష్ణు ప్లాన్ అట. మరి ఇందులో నిజమెంతో?కన్నప్పలో మంచు విష్ణుతో పాటు ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్ తదితరులు కీలక పాత్రలు పోషించారని టాక్. ఏప్రిల్ 25న థియేటర్లలోకి రానుంది. మరి బిగ్ స్క్రీన్ పై ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) -
ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ 'ఛావా'.. డేట్ ఫిక్సయిందా?
గత కొన్నిరోజులుగా ప్రేక్షకుల మధ్య డిస్కషన్ కి కారణమైన మూవీ 'ఛావా'. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ నటించిన ఈ పీరియాడికల్ సినిమాన ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తీశారు. ఫిబ్రవరిలో హిందీ వెర్షన్, మార్చి తొలివారంలో తెలుగు వెర్షన్ రిలీజైంది.(ఇదీ చదవండి: తమ్ముడి పెళ్లిలో సాయిపల్లవి డ్యాన్స్.. వీడియో వైరల్)హిందీలో ఎలా అయితే హిట్ టాక్ వచ్చిందో తెలుగులోనూ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో తొలి మూడు రోజులకే దాదాపు రూ.10 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. శుక్రవారం వరకు కొత్త మూవీస్ ఏం లేవు కాబట్టి ఎన్ని కోట్లు వస్తాయో చూడాలి?సరే ఈ సంగతులన్నీ పక్కనబెడితే 'ఛావా' మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ ఖరారైనట్లు తెలుస్తోంది. ఏప్రిల్ రెండో వారం నుంచి అంటే 11వ తేదీన అలా నెట్ ఫ్లిక్స్ లోకి రానుందని సమాచారం. మరి దక్షిణాది భాషల్లోనూ డబ్ చేస్తారా లేదా అనేది చూడాలి.(ఇదీ చదవండి: పెళ్లి రిసెప్షన్ లో ఫుల్ హ్యాపీగా సితార-నమ్రత-చరణ్) -
SSMB29.. ఒక్క వీడియోకే కథ అల్లేస్తున్నారు!
రాజమౌళి-మహేశ్ బాబు కాంబోలో ఓ సినిమా తీస్తున్నారు. దీని షూటింగ్ ప్రస్తుతం ఒడిశాలోని కోరాపుట్ కొండల్లో జరుగుతోంది. అయితే చిత్రీకరణ జరుగుతున్న టైంలో రహస్యంగా తీసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో లీకైంది. దీన్ని చూసిన చాలామంది ఏకంగా కథ ఇదే అని కొన్ని చెప్పేస్తున్నారు.లీకైన వీడియోలో మహేశ్ బాబు నడుచుకుంటూ వస్తుండగా.. డిఫరెంట్ గా ఉండే వీల్ ఛైర్ లో పృథ్వీరాజ్ కూర్చుని ఉంటాడు. కాసేపటికి మహేశ్ ని మోకాళ్లపై కూర్చోబెడతారు. వీడియో ఇంతవరకే ఉంది. కానీ పలువురు నెటిజన్స్ మాత్రం కథ ఏమై ఉంటుందా అని చెప్పి అల్లేస్తున్నారు.(ఇదీ చదవండి: ప్రభాస్ @ 'బక'.. ఇంతకీ దీని అర్థమేంటి?)పృథ్వీరాజ్ ఏదో నిధి కోసం వెతుకుతుంటాడు. ఈ క్రమంలోనే నడవలేని స్థితికి వెళ్తాడని.. దీంతో మహేశ్ బాబుని ఆ నిధి వెతికేందుకు ఒప్పిస్తాడని.. ఇలా నోటికొచ్చినదంతా మాట్లాడుతూ సోషల్ మీడియాలో డిస్కషన్లు పెట్టేస్తున్నారు. ఇది నిజమా కాదా అనే సంగతి పక్కనబెడితే సినిమా మాత్రం జంగిల్ అడ్వెంచర్ అని మాత్రం తెలుసు.రూ.1000 కోట్ల వరకు బడ్జెట్ తో ఈ సినిమాను తీస్తున్నారని.. ప్రస్తుతం ఒడిశాలో షూటింగ్ జరుగుతోందని.. త్వరలో వైజాగ్, శ్రీలంక, కెన్యా తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ జరగనుందని సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) -
ప్రభాస్ @ 'బక'.. ఇంతకీ దీని అర్థమేంటి?
ప్రభాస్ చేతిలో ఇప్పుడు బోలెడు సినిమాలున్నాయి. ప్రస్తుతానికైతే రాజాసాబ్, ఫౌజీ (వర్కింగ్ టైటిల్) ప్రాజెక్టులు చేస్తున్నాడు. దీని తర్వాత సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్' చేస్తాడు. వీటితో పాటు సలార్ 2, కల్కి 2.. ఇలా చాలానే ఉన్నాయి.ఇవి సరిపోవంటూ ఈ మధ్యే 'హనుమాన్' ఫేమ్ ప్రశాంత్ వర్మతోనూ ప్రభాస్ సినిమా ఒకటి ఓకే అయింది. దీని లుక్ టెస్ట్ కూడా అయిపోయిందని టాక్. ఈ ప్రాజెక్ట్ నుంచి ఇప్పుడు కొత్త అప్డేట్ వచ్చింది. 'బక' అనే టైటిల్ ని ఫిక్స్ చేశారని టాక్. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ షాకవుతున్నారు.(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 2 తెలుగు సినిమాలు)టైటిల్ చూడగానే మీకు కూడా విచిత్రంగా ధ్వనించి ఉంటుంది. అయితే మహాభారతంలోని బకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడుగా. అతడి కథనే ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్లు ప్రశాంత్ వర్మ రాశాడని, అందుకే సింపుల్ గా 'బక' అని పెట్టినట్లు తెలుస్తోంది. ఇది నిజమో కాదో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.ఇప్పటివరకు వచ్చిన పౌరాణిక, మైథలాజికల్ సినిమాలతో పోలిస్తే ఈ మూవీ భిన్నంగా ఉంటుందని, పూర్తిగా విజువల్ ఎఫెక్ట్ బేస్డ్ చిత్రమని అంటున్నారు. అలానే ఇది ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమైన సినిమా అని టాక్.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) -
కష్టాల 'రాజాసాబ్'.. అసలేం జరుగుతోంది?
ప్రభాస్ (Prabhas) చేస్తున్న వాటిలో కాస్త తక్కువ బజ్ ఉన్న సినిమా అంటే 'రాజాసాబ్'.(The Rajasaab Movie) ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ గురించి ప్రకటన వచ్చినప్పుడు తొలుత డార్లింగ్ ఫ్యాన్స్ వద్దన్నారు. కానీ తర్వాత వచ్చిన కొంత కంటెంట్ చూసి ఓ మాదిరి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ప్రస్తుతం మాత్రం ఏం జరుగుతుందో అస్సలు అర్థం కావట్లేదు.దర్శకుడు మారుతి.. హారర్ కామెడీ కథతో తీస్తున్న మూవీ 'రాజాసాబ్'. లెక్క ప్రకారం ఈ ఏప్రిల్ 10న థియేటర్లలోకి తీసుకొస్తామని ప్రకటించారు. కానీ ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు. దీంతో వాయిదా గ్యారంటీ. కొన్నాళ్ల ముందు టీజర్ గురించి అదిగో, ఇదిగో వచ్చేస్తుందని అన్నారు. కానీ దాని అప్డేట్ ఏంటో చెప్పట్లేదు.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' నటి)మరోవైపు ఇంకా మూడు పాటలు షూటింగ్ చేయాల్సి ఉందని, కానీ హీరోయిన్లు మాళవిక మోహన్, నిధి అగర్వాల్ (Nidhi Aggerwal) డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆలస్యమవుతూనే ఉంది. మరోవైపు బడ్జెట్ ప్రాబ్లమ్ కూడా ఉందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. గతేడాది చాలా ఫ్లాప్స్ వల్ల నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కాస్త ఇబ్బందుల్లో ఉందని, అందుకే 'రాజాసాబ్' లేట్ అవుతుందని అనుకుంటున్నారు.ఇవన్నీ పక్కనబెడితే ఇప్పటికే 'రాజాసాబ్' ఫుటేజ్ మూడున్నర గంటలు వచ్చిందని, పాటలు కూడా కలిపితే మరో 15 నిమిషాలు పెరుగుతుంది. కాబట్టి లింక్స్ మిస్ కాకుండా వాటిని ఎడిట్ చేయాల్సిన పెద్దపనే ఉందని అంటున్నారు. అలానే ఈ ఏడాది రాబోయే పండగల కోసం కొత్త మూవీస్ ఆల్రెడీ కర్చీఫ్ వేసేశాయి. ఇలా ఇన్ని కష్టాలు పడుతున్న 'రాజాసాబ్'.. ఈ ఏడాది రిలీజ్ అవుతుందా? లేదంటే వచ్చే ఏడాది పడుతుందా అని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: 'పుష్ప 2' దెబ్బకు ఫ్లాప్.. ఇన్నాళ్లకు ఓటీటీలోకి ఆ సినిమా) -
పెళ్లికి ముందే విడాకులు.. హైదరాబాద్ అబ్బాయితో తమన్నా కటిఫ్
మిల్కీ బ్యూటీ, హీరోయిన్ తమన్నాకి బ్రేకప్ అయిందట. గత కొన్నేళ్లుగా సహనటుడు విజయ్ వర్మతో ఈమె ప్రేమలో ఉంది. ఈ విషయాన్ని రహస్యంగా ఏం ఉంచలేదు. చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. కలిసి సినిమాలు చేశారు. అలాంటిది ఇప్పుడు వీళ్లిద్దరూ విడిపోయారని తెలిసి ఫ్యాన్స్ షాకవుతున్నారు.ముంబై ముద్దుగుమ్మ తమన్నా.. తెలుగు సినిమాతోనే హీరోయిన్ అయింది. హ్యాపీడేస్, ఆవారా, 100% లవ్, బాహుబలి తదితర చిత్రాల్లో నటించి బోలెడంత ఫేమ్ తెచ్చుకుంది. గత కొన్నేళ్లుగా హిందీలోనూ మూవీస్, వెబ్ సిరీసులు చేస్తూ వచ్చింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. మరి థియేటర్లలో?)అలా 'లస్ట్ స్టోరీస్ 2' సిరీస్ చేస్తున్న టైంలో తమన్నా-విజయ్ వర్మ మధ్య ఏదో ఉందనే రూమర్స్ వచ్చాయి. దీనికి బలం చేకూర్చేలా గోవాలో ఓ న్యూఇయర్ పార్టీలో వీళ్లిద్దరూ ముద్దు పెట్టుకున్న వీడియో ఒకటి వైరల్ అయింది. ఈ సిరీస్ లో కెమిస్ట్రీ కూడా తెగ వర్కౌట్ అయింది.ఆ తర్వాత నుంచి గత రెండు మూడేళ్లుగా జంట పక్షుల్లా తమన్నా-విజయ్ వర్మ ఎక్కడపడితే అక్కడ కనిపించారు. అలాంటిది కొన్నివారాల క్రితం వీళ్లిద్దరూ బ్రేకప్ చెప్పేసుకున్నారనే న్యూస్ ఇప్పుడు బయటకొచ్చింది. త్వరలో పెళ్లి చేసుకుంటారని ఆ మధ్య వార్తలొచ్చాయి. ఇప్పుడేమో బ్రేకప్ అని షాకిచ్చారు. రీసెంట్ టైంలో తమన్నా బయట ఒంటరిగానే కనిపిస్తోంది. దీనిబట్టి చూస్తే ఈ బ్రేకప్ వార్త నిజమేనేమో అనే సందేహం వస్తోంది. అలానే విడిపోవడానికి కారణం కూడా తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: కూతురిచ్చిన గిఫ్ట్.. రూ.6 కోట్లకు అమ్మేసిన నటుడు) -
కూతురిచ్చిన గిఫ్ట్.. రూ.6 కోట్లకు అమ్మేసిన నటుడు
బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగులోనూ ప్రభాస్ సరసన 'సాహో'లో హీరోయిన్ గా చేసింది. అయితే శ్రద్ధా ఎంతో ప్రేమతో బహుమతిగా ఇచ్చిన ఇంటి ఈమె తండ్రి ఏకంగా కోట్ల రూపాయలకు అమ్మేశాడు. బాలీవుడ్ సర్కిల్ లో ఈ విషయమే మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: దిగ్గజ హీరో శివాజీ గణేశన్ ఇల్లు జప్తు.. హైకోర్ట్ సంచలన ఆదేశం)బాలీవుడ్ సెలబ్రిటీలు ఓవైపు నటిస్తూనే రియల్ ఎస్టేట్ కూడా చేస్తుంటారు. అంటే ఓ బంగ్లా లేదంటే అపార్ట్ మెంట్ కొనడం, కొన్నిరోజుల తర్వాత దాన్ని లక్షలు లేదంటే కోట్ల రూపాయల లాభానికి అమ్మడం లాంటివి చేస్తుంటారు. అమితాబ్ ఈ విషయంలో ముందుంటాడు. ఇప్పుడు శ్రద్ధా కపూర్ తండ్రి శక్తి కపూర్ కూడా ఇదే దారిలో వెళ్తున్నాడేమో?ఎందుకంటే కొన్నాళ్ల క్రితం శ్రద్ధా కపూర్.. ముంబైలోని జుహూ ప్రాంతంలో సిల్వర్ బీచ్ హెవెన్ కో-ఆపరేటివ్ సొసైటీలో ఓ అపార్ట్ మెంట్ ని బహుమతిగా ఇచ్చింది. ఇప్పుడు దీన్నే రూ.6.11 కోట్లకు శక్తి కపూర్ విక్రయించారట. మూడు నెలల క్రితమే అంటే డిసెంబరులోనే ఈ డీల్ జరిగిపోయింది. ఇది జరిగిన కొన్నిరోజులకే పిరమాల్ మహాలక్ష్మి సౌత్ టవర్ లో మరో అపార్ట్ మెంట్ కొనుగోలు చేశారు. మరి ఇదెప్పుడో అమ్మేస్తారో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. మరి థియేటర్లలో?) -
ప్రభాస్ 'బ్రహ్మరాక్షస్'లో ట్రెండింగ్ హీరోయిన్?
సాధారణంగా ఫ్లాప్ వస్తే ఆ సినిమా హీరోయిన్లని పెద్దగా పట్టించుకోరు. కానీ ఓ బ్యూటీకి మాత్రం వరస అవకాశాలొస్తున్నాయి. చేతిలో ఇప్పటికే నాలుగు ప్రాజెక్టులుండగా.. ఇప్పుడు ప్రభాస్ కొత్త చిత్రంలోనూ ఛాన్స్ కొట్టేసిందని అంటున్నారు. ఇంతకీ ఎవరా బ్యూటీ?గతేడాది రిలీజైన 'మిస్టర్ బచ్చన్'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ ముద్దుగుమ్మ భాగ్యశ్రీ బోర్సే. దీనికి ముందు ఒకటి రెండు హిందీ చిత్రాల్లో నటించిందంతే. బచ్చన్ మూవీ ఫ్లాప్ అయినా సరే దుల్కర్ సల్మాన్ 'కాంత', విజయ్ దేవరకొండ 'కింగడమ్', రామ్ కొత్త మూవీలో ఈమెనే హీరోయిన్.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు)పై మూడు కాకుండా సూర్య-వెంకీ అట్లూరి కాంబోలో తీసే మూవీలోనూ భాగ్యశ్రీనే తీసుకోవాలని ఫిక్సయ్యారట. ఇలా చేతినిండా సినిమాలతో ఉన్న ఈమెని ఇప్పుడు ప్రభాస్ కోసం లుక్ టెస్ట్ చేశారట.రీసెంట్ గా ప్రశాంత్ వర్మ-ప్రభాస్ మూవీ ఓకే అయింది. ఇందులోనే హీరోయిన్ గా భాగ్యశ్రీని పరిశీలించారట. అందులో భాగంగానే శుక్రవారం లుక్ టెస్ట్ షూట్ కూడా జరిగిందట. దాదాపు ఓకే అని అంటున్నారు. ఒకవేళ నిజమైతే మాత్రం భాగ్యశ్రీ.. లక్ తోక తొక్కేసినట్లే.(ఇదీ చదవండి: మార్చిలో థియేటర్ మూవీస్.. హిట్ కొడితే చాలు!) -
రీఎంట్రీకి సిద్ధమైన స్టార్ హీరోయిన్ రంభ.. ఈసారైనా..?
అందం, అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన సీనియర్ హీరోయిన్ రంభ (Rambha Re-Entry) రీఎంట్రీకి రెడీ అవుతోంది. చాలాకాలంగా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆమె ఎట్టకేలకు కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఓ వార్త ఫిల్మీదునియాలో తెగ చక్కర్లు కొడుతోంది.సినిమా అంటే నాకెంతో ప్రేమ. వెండితెరకు తిరిగి రావడానికి ఇదే సరైన సమయం అనిపిస్తోంది. పర్ఫామెన్స్‌కు ప్రాధాన్యత ఉండే పాత్రల్ని ఎంపిక చేసుకోవాలనుకుంటున్నాను. కొత్త తరహా పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించేందుకు ఎదురుచూస్తున్నా.. అని రంభ పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే 2023లోనూ రంభ కమ్‌బ్యాక్ ఇస్తున్నట్లు చెప్పింది. కానీ ఏ సినిమాలోనూ కనిపించనేలేదు. ఈసారైనా ఆమె చెప్పింది నిజమైతే బాగుండంటున్నారు అభిమానులు. మరి ఎలాంటి రోల్‌తో రంభ రీఎంట్రీ ఇస్తుందో చూడాలి!రంభ జర్నీ..రంభ అసలు పేరు విజయలక్ష్మి. అమృత అనే పేరును స్క్రీన్ నేమ్‌గా మార్చుకుంది. ఆమె నటించిన మొదటి చిత్రం ఆ ఒక్కటి అడక్కు. ఇందులో ఆమె పేరు రంభ. తర్వాతి కాలంలో ఆమె రంభగానే కంటిన్యూ అయిపోయింది. తొలి ముద్దు, బంగారు కుటుంబం, ముద్దుల ప్రియుడు, హిట్లర్, అల్లుడా మజాకా!, బావగారు బాగున్నారా?, బొంబాయి ప్రియుడు, గణేష్, మూడుముక్కలాట.. ఇలా అనేక చిత్రాల్లో నటించింది. కన్నె పిట్టరో కన్ను కొట్టరో.. వంటి ఐటం సాంగ్స్‌లోనూ తళుక్కుమని మెరిసింది.సినిమాతెలుగుతోపాటు తమిళం, మలయాళ, హిందీ, కన్నడ, బెంగాలీ భాషల్లోనూ అనేక సినిమాలు చేసింది. ఆమె నటించిన చివరి చిత్రం ద ఫిలింస్టార్ (2011లో వచ్చిన మలయాళ మూవీ). 2010లో బిజినెస్మెన్ ఇంద్రకుమార్ పద్మనాథన్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు సంతానం. వివాహం తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పిన ఆమె కెనడాలో సెటిలైంది. కొంతకాలం తర్వాత బుల్లితెరపై తళుక్కుమని మెరిసింది. పలు డ్యాన్స్ రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరించింది.చదవండి: కూతురి ఫోటోల్ని డిలీట్ చేసిన ఆలియా భట్! ఆ కారణం వల్లే!ముగ్గురికి ఖరీదైన బహుమతులిచ్చా.. కానీ షారూఖ్ మాత్రం: సింగర్ -
కల్ట్ దర్శకుడు.. ఏడేళ్ల తర్వాత మళ్లీ తెలుగులో సినిమా!
తెలుగులో ప్రేమకథా సినిమాల లిస్ట్ తీస్తే అందులో 'తొలిప్రేమ', 'డార్లింగ్' కచ్చితంగా ఉంటాయి. వీటిని తీసిన దర్శకుడు కరుణాకరన్. కెరీర్ ప్రారంభం నుంచి తెలుగులోనే మూవీస్ చేశాడు. 2018 తర్వాత ఒక్క ప్రాజెక్ట్ చేయలేకపోయాడు. మళ్లీ ఇన్నాళ్లకు రీఎంట్రీ ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది.(ఇదీ చదవండి: కోట్ల రూపాయల మోసం కేసులో తమన్నా-కాజల్?)ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. ఇకపై కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ తీస్తానని కొన్నాళ్ల క్రితమే ప్రకటించారు. ఈ క్రమంలోనే కరుణాకరన్ తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నారట. తను ఎప్పుడూ తీసే ప్రేమకథా చిత్రమే ఇదని తెలుస్తోంది.దిల్ రాజు వారసుడు ఆశిష్ నే హీరోగా పెట్టి ఈ సినిమా తీయబోతున్నారని టాక్. ఆశిష్ కథ విని ఓకే చెప్పాడని, ఇంకా దిల్ రాజు స్టోరీ ఓకే చేయాల్సి ఉందని తెలుస్తోంది. ఒకవేళ దిల్ రాజు గ్రీన్ సిగ్నల్ ఇస్తే దాదాపు ఏడేళ్ల తర్వాత మరో తెలుగు సినిమా తీసినట్లు అవుతుంది. చివరగా మెగాహీరో సాయితేజ్ తో 'తేజ్ ఐ లవ్యూ' తీశాడు కరుణాకరన్. కానీ అది ఘోరంగా ఫెయిలైంది. (ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు) -
సొంతిల్లు ఖాళీ చేయనున్న హీరో.. కుటుంబంతో అద్దె ఇంట్లోకి!
బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) తన సొంతిల్లు మన్నత్‌ను వీడనున్నాడు. మన్నత్ (Mannat)ను వదిలేసి అద్దె ఇంట్లోకి షిఫ్ట్ కానున్నాడు. 25 ఏళ్లుగా కుటుంబంతో కలిసి నివసిస్తున్న ఇంటిని ఖాళీ చేయడానికి ప్రత్యేక కారణం ఉంది. మన్నత్ బంగ్లాను రెనోవేషన్ చేయనున్నారట. ఆ పనులు పూర్తయ్యేవరకు షారూఖ్ అద్దె అపార్ట్మెంట్లో ఉండనున్నారట!అద్దెకు నాలుగంతస్తులుతన కుటుంబంతోపాటు సిబ్బంది, సెక్యురిటీ.. ఇలా అందరికోసం బాంద్రాకు సమీపంలోని పూజా కాసా అపార్ట్మెంట్లో నాలుగంతస్తులను రెంట్‌కు మాట్లాడుకున్నారట! దీనికిగానూ నెలకు రూ.24లక్షలు అద్దె చెల్లించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మన్నత్ బంగ్లా పునరుద్ధరణ పనులు మే నెలలో ప్రారంభం కానున్నాయి. ఆ బంగ్లా మళ్లీ కొత్తగా తయారవ్వడానికి దాదాపు రెండేళ్లు పట్టే అవకాశం ఉంది.మూడేళ్లపాటు లీజుకుఇక షారూఖ్‌కు అపార్ట్మెంట్ అద్దెకిస్తోంది మరెవరో కాదు నిర్మాత వాసు భగ్నానీ. వాసు తనయుడు జాకీ భగ్నానీ (రకుల్ ప్రీత్ సింగ్ భర్త), కూతురు దీప్శిక దేశ్‌ముఖ్‌లు.. నాలుగు అంతస్తులను షారూఖ్‌కు మూడేళ్లపాటు లీజుకు ఇచ్చేందుకు అగ్రిమెంట్ చేయించుకున్నారట! అయితే అంతకాలంపాటు షారూఖ్ అక్కడే ఉంటారా? అన్నది ప్రశ్నార్థకమే! షారూఖ్ చివరగా 2023లో 'పఠాన్', 'జవాన్', 'డంకీ' సినిమాలతో వరుస బ్లాక్‌బస్టర్స్ అందుకున్నాడు. సల్మాన్ ఖాన్ 'టైగర్ 3'లో అతిథి పాత్రలో మెరిశాడు.చదవండి: తొమ్మిదేళ్ల బంధం.. విడాకులు కావాలన్న నటి! -
38 ఏళ్ల బంధానికి ఎండ్ కార్డ్.. నటుడు గోవిందా విడాకులు!
ఇండస్ట్రీలో పెళ్లి-విడాకులు అనేది చాలా కామన్. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం చాలా ఏళ్ల పాటు కలిసున్న కొందరు స్టార్ కపుల్స్ విడిపోతున్నారు. ఏఆర్ రెహమాన్, జీవీ ప్రకాశ్, హీరో జయం రవి.. ఇలా తదితరులు ఏళ్లకు ఏళ్ల బంధానికి ఎండ్ కార్డ్ వేశారు. ఇప్పుడు ఈ లిస్టులోకి మరో సీనియర్ నటుడు చేరినట్లు తెలుస్తోంది.అప్పట్లో బాలీవుడ్ లో టాప్ హీరోగా పేరు తెచ్చుకున్న గోవిందా.. ప్రస్తుతం పెద్దగా లైమ్ లైట్ లో లేడు. ఇతడే తన 38 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికేందుకు సిద్ధమయ్యాడట. గోవిందా, ఇతడి భార్య సునీత అహుజా.. గత కొన్ని రోజుల నుంచి వేర్వురుగా ఉంటున్నారట.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'తండేల్'.. ప్లాన్ మారిందా?)కొంతకాలంగా గోవిందా దంపతుల మధ్య విబేధాలు నడుస్తున్నాయని, దీంతో ఇక విడాకులు తప్పనిసరి అనుకున్నారని తెలుస్తోంది. మరోవైపు గోవిందా.. ఓ మరాఠీ నటితో రిలేషన్ షిప్ లో ఉన్నాడని, భార్య నుంచి విడిగా ఉండటానికి ఇది కూడా ఓ కారణమని అంటున్నారు. ఇప్పటివరకైతే ఈ జంట.. విడాకుల అంశంపై స్పందించలేదు. కానీ మీడియాలో మాత్రం టాక్ గట్టిగా వినిపిస్తోంది.కొన్నాళ్ల క్రితం ఇంటర్వ్యూలో మాట్లాడిన సునీత కూడా.. భర్త గోవిందాతో మాట్లాడి చాలా రోజులైందని చెప్పింది. ప్రస్తుతం తన కూతురు, కొడుకుతో కలిసి మాత్రమే ఉంటున్నానని పేర్కొంది. ఈమె చెప్పిన దానిబట్టి చూస్తుంటే విడిగా ఉంటున్నారని అర్థమైంది. త్వరలో విడాకుల విషయాన్ని అధికారికంగ ప్రకటిస్తారేమో చూడాలి. 1987లో వీళ్లిద్దరూ పెళ్లిచేసుకోగా.. 1988లో కూతురు పుట్టిన తర్వాతే పెళ్లి విషయాన్ని బయటపెట్టారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఏంటంటే?) -
ఓటీటీలోకి 'తండేల్'.. ప్లాన్ మారిందా?
నాగచైతన్య-సాయిపల్లవి జంటగా నటించిన సినిమా 'తండేల్'. ఈ నెల 7న థియేటర్లలో రిలీజైంది. హిట్ టాక్ తెచ్చుకుని రూ.100 కోట్ల కలెక్షన్స్ మార్క్ కూడా అందుకుంది. తాజాగా టీమ్ అంతా కలిసి సక్సెస్ పార్టీ కూడా చేసుకున్నారు. తండేల్ మూవీ రిలీజ్ రోజే పైరసీకి గురైంది. దీనిపై నిర్మాతలు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రస్తుతానికి థియేటర్లలో సినిమా రన్ అవుతోంది. కానీ ఇప్పుడు ఓటీటీ రిలీజ్ పై బజ్ వినిపిస్తోంది. అనుకున్న టైం కంటే ముందే డిజిటల్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.(ఇదీ చదవండి: సింగర్ పై 19 ఏళ్ల తర్వాత మరో కేసు పెట్టిన మొదటి భార్య!)తండేల్ మూవీ డిజిటల్ హక్కుల్ని నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. రీసెంట్ టైంలో 'పుష్ప 2' తప్పితే చాలా సినిమాల్ని ఈ ఓటీటీ సంస్థ.. నెల రోజులకు అటు ఇటుగా స్ట్రీమింగ్ చేసేస్తోంది. అలానే ఈ సినిమాని కూడా నెలకే ఓటీటీలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం మార్చి 6 నుంచే తండేల్.. ఓటీటీలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. లేదంటే మార్చి 14న రావొచ్చని మాట్లాడుకుంటున్నారు.తండేల్ విషయానికొస్తే.. శ్రీకాకుళంలోని మత్సలేశం అనే ఊరికి చెందిన కొందరు జాలర్లు.. గుజరాత్ తీరంలో చేపలు పడుతుండగా, అనుకోకుంగా పాకిస్థాన్ నేవి చేతికి చిక్కారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. తర్వాత పాకిస్థాన్ జైల్లో కొన్నాళ్ల పాటు ఉన్నారు. భారత ప్రభుత్వం జోక్యంతో తిరిగి ఇళ్లకు చేరారు. ఈ స్టోరీకి ప్రేమకథని జోడించిన డైరెక్టర్ చందూ మొండేటి.. తండేల్ తీశాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఏంటంటే?) -
ప్రభాస్ కి కండీషన్స్ పెట్టిన సందీప్ రెడ్డి వంగా?
ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. దాదాపు అందరూ హీరో ఒకటి తర్వాత ఒకటి అంటూ సినిమాలు చేస్తుంటే డార్లింగ్ హీరో మాత్రం ఒకేసారి రెండు మూడు మూవీస్ చేస్తున్నాడు. అయినా సరే టైమ్ సరిపోవట్లేదు. అలాంటిది ఇప్పుడు ప్రభాస్ కి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కొన్ని స్ట్రిక్ట్ కండీషన్స్ పెట్టాడట!బాహుబలి హిట్ తర్వాత ప్రభాస్ వరస సినిమాలు చేస్తున్నాడు. అలా సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, కల్కి 2898 ఏడీ చిత్రాల్ని రిలీజ్ చేశాడు. దేశవ్యాప్తంగా వేలకోట్ల వసూళ్లు కొల్లగొట్టాడు. ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ (వర్కింగ్ టైటిల్) ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు చిత్రాలూ ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. అందుకు తగ్గట్లే షూటింగ్ జరుగుతోంది.(ఇదీ చదవండి: నెలలోపే ఓటీటీలోకి అజిత్ కొత్త సినిమా.. అధికారిక ప్రకటన)మరోవైపు 'యానిమల్' తర్వాత డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. ప్రభాస్ తో 'స్పిరిట్' చేయాలి. లెక్క ప్రకారం జనవరి నుంచే షూటింగ్ ప్రారంభం కావాలి. కానీ ప్రభాస్ షూటింగ్స్ వల్ల స్పిరిట్ ఆలస్యమవుతూ వస్తోంది. అయితే ఒక్కసారి ఈ ప్రాజెక్ట్ మొదలుపెడితే మరొకటి చేయకూడదని సందీప్.. ప్రభాస్ కి చెప్పాడట.దీంతో చేతిలో ఉన్న రాజాసాబ్, ఫౌజీ చిత్రాల్ని పూర్తి చేసి.. మే నెల నుంచి ప్రభాస్ స్పిరిట్ సెట్స్ పైకి వస్తాడట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ అంతా పూర్తయిందని.. ఒక్కసారి ప్రభాస్ వస్తే ఆపకుండా షూటింగ్ చేసి పూర్తి చేస్తారని టాక్. ఈ మూవీలో ప్రభాస్.. పోలీస్ గా కనిపించబోతున్నాడని ఇదివరకే సందీప్ చెప్పాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఏంటంటే?) -
ఓటీటీలోకి వచ్చేస్తున్న డిజాస్టర్ సినిమా.. నెలలోపే?
రీసెంట్ టైంలో ఓ మాదిరి అంచనాలతో రిలీజై డిజాస్టర్ అనిపించుకున్న సినిమా లైలా. విశ్వక్ సేన్ హీరోగా నటించాడు. వైవిధ్యం కోసం అమ్మాయి గెటప్ కూడా వేశాడు. కానీ కంటెంట్ మరీ తీసికట్టుగా ఉండటంతో బాక్సాఫీస్ దగ్గర ఘోరమైన ఫెయిల్యూర్ గా నిలిచింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలోకి వచ్చేయబోతుందట.(ఇదీ చదవండి: సుకుమార్ చేయి వదలని ఐటమ్ బ్యూటీ.. వీడియో వైరల్)ఈ నగరానికి ఏమైంది, ఫలక్ నుమా దాస్ తదితర చిత్రాలతో కాస్త గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్.. ఈ మధ్య కాలంలో మాత్రం ప్రతి సినిమాతో నిరాశపరుస్తున్నాడు. గతేడాది రిలీజైన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గామి, మెకానిక్ రాకీ చిత్రాలు ప్రేక్షకుల్ని నిరాశపరిచాయి. 'లైలా' అయినా సరే హిట్ అవుతుందేమో అనుకుంటే ఘోరమైన డిజాస్టర్ గా నిలిచింది.వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న థియేటర్లలో 'లైలా' రిలీజైంది. ఉదయం తొలి ఆట నుంచి టాక్ తేడా కొట్టేసింది. దీంతో రెండో రోజు నుంచి ఈ సినిమాకు వెళ్లే వారే కరువయ్యారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓటీటీ రిలీజ్.. అనుకున్న టైం కంటే కాస్త ముందుకొచ్చిందని తెలుస్తోంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఏంటంటే?)లైలా సినిమా డిజిటల్ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. లెక్క ప్రకారం మార్చి 2వ వారంలో స్ట్రీమింగ్ అనుకున్నారు. కానీ ఇప్పుడు తొలి వారంలోనే ఓటీటీలో రిలీజ్ అవకాశముందని సమాచారం. అంటే మార్చి 7న లేదా అంతకంటే ముందే 'లైలా' డిజిటల్ రిలీజ్ ఉండొచ్చట.'లైలా' కథ విషయానికొస్తే.. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో సోనూ(విశ్వక్ సేన్)కి బ్యూటీ పార్లర్ ఉంటుంది. ఓ రోజు అనుకోకుండా పాతబస్తీ పహిల్వాన్, ఎస్ఐ శంకర్ కి సోనూ టార్గెట్ అవుతాడు. వాళ్ల నుంచి తప్పించుకునేందుకు లేడీ గెటప్ వేసుకుని లైలా అవతారమేస్తాడు. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'సంక్రాంతి' హిట్ సినిమా.. డేట్ ఫిక్సయిందా?) -
ఓటీటీలోకి 'సంక్రాంతి' హిట్ సినిమా.. డేట్ ఫిక్సయిందా?
ఈసారి సంక్రాంతికి థియేటర్లలో రిలీజై అనుహ్యంగా హిట్ అయింది వెంకటేశ్ మూవీ. పండగ పేరుతో 'సంక్రాంతికి వస్తున్నాం' అని ప్రేక్షకుల్ని పలకరించారు. అనుహ్యమైన విజయాన్ని అందుకున్నారు. ఎవరూ ఊహించని విధంగా ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లతో సరికొత్త రికార్డు సృష్టించింది.అయితే వెంకీమామ సినిమా ఓటీటీలోకి రావడానికి కంటే ముందే టీవీలో ప్రసారం చేస్తున్నట్లు ప్రకటించి షాకిచ్చారు. మార్చి 1న సాయంత్రం టీవీలో ప్రసారం చేస్తున్నట్లు చెప్పడంతో మరి ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని ఆడియెన్స్ మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్ప్పుడు స్ట్రీమింగ్ పై ఓ రూమర్ వినిపిస్తోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఏంటంటే?)మార్చి 1న టీవీలో ప్రసారమైన సమయానికే ఓటీటీలోనూ రిలీజ్ చేయాలని సదరు సంస్థ నిర్ణయం తీసుకుందట. దీనిబట్టి చూస్తే మార్చి 1నే సాయంత్రం జీ5 ఓటీటీలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 'సంక్రాంతి వస్తున్నాం' స్ట్రీమింగ్ కానుందని సమాచారం. కొన్నిరోజుల క్రితం సుదీప్ 'మ్యాక్స్' మూవీ కూడా ఇలానే టీవీ- ఓటీటీలో ఒకేసారి తీసుకొచ్చారు. మరి ఈ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.'సంక్రాంతి వస్తున్నాం' కథ విషయానికొస్తే.. అమెరికాలో సెటిలైన సత్య అనే బడా వ్యాపారవేత్తని తెలంగాణ సీఎం కేశవ.. హైదరాబాద్ తీసుకొస్తాడు. కానీ అతడిని పాండే గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది. ఈ విషయం బయటకు తెలిస్తే ప్రభుత్వం పరువు పోతుందనే భయంతో సీక్రెట్ ఆపరేషన్ కి సిద్ధమవుతారు. దీనికోసం మాజీ పోలీస్ వైడీ రాజు (వెంకటేశ్)ని ఒప్పించే బాధ్యతని ఇతడి మాజీ ప్రేయసి మీనాక్షి (మీనాక్షి చౌదరి) తీసుకుంటుంది. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: నటికి ఏడు సార్లు అబార్షన్ కేసులో మరోసారి నటుడిపై విచారణ) -
సంక్రాంతికి వస్తున్నాం.. హిందీ రీమేక్?
వెంకటేశ్ హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunam). ఈ సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ మూవీని బాలీవుడ్లో రీమేక్ చేయాలని చిత్ర నిర్మాత ‘దిల్’ రాజు ప్లాన్ చేస్తున్నారని, ఈ దిశగా ఆయన ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారనే టాక్ తెరపైకి వచ్చింది.ఈ హిందీ రీమేక్‌లో అక్షయ్ కుమార్(Akshay Kumar) అయితే బాగుంటుందని ‘దిల్’ రాజు భావిస్తున్నారట. కెరీర్లో ఇప్పటికే ఎన్నో దక్షిణాది సినిమాల హిందీ రీమేక్స్‌లో నటించిన అక్షయ్ కుమార్ మరి... ఈ రీమేక్ చిత్రానికీ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. -
హాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరో.. ఆటో డ్రైవర్‌గా?
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) హాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. సెవెన్ డాగ్స్ అనే అర్జెంటీనా సినిమాను హాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు. ఈ అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలోముఖ్య పాత్ర కోసం సల్లూ భాయ్‌ను సంప్రదించగా ఆయన పచ్చజెండా ఊపారట! ఈ క్రమంలోనే సినిమా షూటింగ్ సైతం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.దుబాయ్‌లో షూటింగ్!ఇందుకోసం సల్మాన్ ఖాన్ కొద్దిరోజుల క్రితమే దుబాయ్ పయనమయ్యాడు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్, సంజయ్ దత్‌లకు సంబంధించిన సన్నివేశాలపై చిత్రీకరణ జరుపుతున్నారంటూ కొన్ని వీడియో క్లిప్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. అందులో సల్మాన్ ఆటో డ్రైవర్ వేషంలో ఉన్నాడు. ఆటో దగ్గర సల్మాన్ నిల్చోగా అతడి పక్కనే సంజయ్ దత్ సూటూబూటు వేసుకుని ఠీవీగా కనిపిస్తున్నాడు. సల్మాన్ పాత్రకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. సినిమాకాగా సల్మాన్ ఖాన్ చివరగా టైగర్ 3 సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం సికందర్ మూవీ చేస్తున్నాడు. రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో కాజల్ అగర్వాల్, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సాజిద్ నడియాద్వాలా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది రంజాన్ సందర్భంగా రిలీజ్ కానుంది. ఈ చిత్రం రంజాన్ పండగకు విడుదల కానుంది. Bhai and Baba are in Saudi Arabia to shoot cameo for a Hollywood movie 🎥... #Salmankhan #Sanjaydutt #Sikandar pic.twitter.com/ZoTZ6mNae4— Adil Hashmi👁🗨 (@X4SALMAN) February 19, 2025MEGASTAR SALMAN KHAN in Saudi Arabia today #Sikandar #SalmanKhan pic.twitter.com/pUVl8WMvoc— Lokendra Kumar (@rasafi24365) February 19, 2025చదవండి: ఓటీటీలోకి ఎమర్జెన్సీ.. సింపుల్‌గా డేట్ చెప్పేసిన కంగనా -
డాకు మహారాజ్ బ్యూటీకి అన్యాయం? ఓటీటీలో ఆమె సీన్స్ కట్!
సంక్రాంతి హిట్ బొమ్మ డాకు మహారాజ్ (Daaku Maharaaj Movie) మరికొద్ది గంటల్లో ఓటీటీలోకి రానుంది. నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్లకు పైగా రాబట్టింది. థియేటర్లో అదరగొట్టిన ఈ చిత్రం శుక్రవారం (ఫిబ్రవరి 21న) ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది. అయితే ఇటీవల ఓటీటీ రిలీజ్ డేట్ పోస్టర్లో ఊర్వశి రౌతేలాను మిస్ చేయడంతో ఫ్యాన్స్ ఫైరయ్యారు. దీంతో మరో పోస్ట్‌లో ఊర్వశి రౌతేలా సహా డాకు మహారాజ్ మూవీలో నటించిన ప్రధాన పాత్రలు అందరూ ఉండేలా జాగ్రత్త తీసుకున్నారు.ఊర్వశికి అన్యాయం?ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) ఈ మూవీలో కేవలం ఐటం సాంగ్‌లో ఆడిపాడటమే కాకుండా ఓ కీలక పాత్రలోనూ నటించింది. ప్రతి ప్రమోషనల్ ఈవెంట్‌కూ హాజరైంది. సినిమా కోసం ఎంతో కష్టపడ్డ ఆమెకు మరోసారి భంగపాటు ఎదురుకానుందట! ఆమె నటించిన సీన్లు ఓటీటీలో కనిపించవంటూ ప్రచారం జరుగుతోంది. ఊర్వశి నటించిన సన్నివేశాలను నెట్‌ఫ్లిక్స్ నిర్దాక్షిణ్యంగా తొలగిస్తోందని రూమర్లు వ్యాపిస్తున్నాయి. ఈ ప్రచారంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా కోసం ఎంతో కష్టపడిందని, ప్రతి ప్రమోషన్‌కు హాజరైందని, అలాంటి తనకు ఎందుకింత అన్యాయం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. డాకు మహారాజ్అయితే ఆ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది. థియేటర్లో ఉన్న ఫుటేజ్ మొత్తాన్ని యథాతథంగా ఓటీటీలోనూ విడుదల చేస్తున్నారట. అంటే ఊర్వశితో బాలయ్య నటించిన సన్నివేశాలు, డ్యాన్స్ స్టెప్పులు ఓటీటీలోనూ చూడొచ్చన్నమాట! డాకు మహారాజ్ సినిమా విషయానికి వస్తే.. బాబీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, బాబీ డియోల్ ప్రధాన పాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందించాడు.చదవండి: 19 ఏళ్ల వయసులో బట్టతల.. భరించలేకపోయా: ఛావా నటుడు -
కథ బాగోలేదని ఛీ కొట్టిన హీరో.. దర్శకుడు ఏం చేశాడంటే?
పల్లెటూరి నుంచి వచ్చి ఎన్నో పాట్లు పడి సినిమా తీసి నిలదొక్కుకున్నవారెందరో. తమిళ దర్శకుడు సుశీంద్రన్ (Suseenthiran) కూడా ఇదే జాబితాలో ఉన్నాడు. సినిమా తీయాలన్న లక్ష్యంతో 18 ఏళ్ల వయసులో చెన్నైకి చేరుకున్నాడు. కష్టాలకు ఓర్చుకున్నాడు. ఎదురుదెబ్బలకు వణికిపోకుండా నిలబడ్డాడు. పన్నెండేళ్ల ప్రయత్నాల తర్వాత తొలి సినిమా తీశాడు. వెన్నెల కబడ్డీ కుజు దర్శకుడిగా అతడి తొలి చిత్రం. ఫస్ట్ సినిమా హిట్ కావడంతో మరుపటి ఏడాది కార్తీ- కాజల్‌తో కలిసి నాన్ మహాన్ అల్లా మూవీ తీశాడు. ఇది మరింత హిట్టు.సహజమైన కథలతో..అళగర్సామిన్ కుదిర, ఆదలాల్ కాదల్ సెవీర్, పాండ్య నాడు, జీవా, పాయుం పులి వంటి హిట్ చిత్రాలు తీశాడు. కొన్నిసార్లు అపజయాలతోనూ ప్రయాణం సాగించాడు. అయితే లేనిపోని హీరోయిజం, లాజిక్ లేని సీన్స్‌కు దూరంగా ఉంటూ తన కథలు సహజంగా ఉండేలా చూసుకున్నాడు. ఇతడు 2021లో శింబు (Silambarasan TR)తో ఈశ్వరన్ తీశాడు. నిజానికి ఈ కథ హీరో జై కోసం రాసుకున్నాడట!కథ బాలేదని ఛీ కొట్టిన హీరోకానీ శింబు తనతో ఓ సినిమా చేయమని కోరడంతో ఈ కథ అతడికి వినిపించాడు. అయితే కథ అస్సలు బాగోలేదంటూ శింబు ఉమ్మేశాడట! దీంతో కథను శింబుకు తగ్గట్లుగా మార్చేశానని దర్శకుడు సుశీంద్రన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు వార్త వైరలవుతోంది. ఇకపోతే ఈశ్వరన్ సినిమా బాక్సాఫీస్ వద్ద మెప్పించలేకపోయింది. శింబు విషయానికి వస్తే పాదు తల (2023) సినిమాలో చివరిగా కనిపించాడు. ప్రస్తుతం థగ్ లైఫ్ మూవీ చేస్తున్నాడు.చదవండి: యాంకర్ రష్మీతో రాజమౌళి లవ్!.. ఇదెప్పుడు జరిగింది? -
తెలుగమ్మాయిలకు ఛాన్స్ ఇవ్వనన్న నిర్మాతపై ట్రోలింగ్.. ఆయన రిప్లై ఇదే!
'టాలీవుడ్లో తెలుగు వచ్చిన అమ్మాయిలకన్నా తెలుగురాని అమ్మాయిలనే ఎక్కువగా ప్రేమిస్తుంటాం. తెలుగు వచ్చిన అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందో తర్వాత తెలిసింది. అందుకని ఇక మీదట తెలుగురానివారిని ఎంకరేజ్ చేయాలని నేను, డైరెక్టర్ సాయి రాజేశ్ (Sai Rajesh) నిర్ణయించుకున్నాం' అంటూ నిర్మాత ఎస్కేఎన్ (Producer SKN) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆయన చివరిగా నిర్మించిన సినిమా బేబీ. అందులో తెలుగమ్మాయి వైష్ణవి చైతన్యను హీరోయిన్గా పరిచయం చేయడంతో.. ఆమెకు బేబీ టీమ్‌కు మధ్య విభేదాలు వచ్చాయా? అన్న అనుమానాలు మొదలయ్యాయి.ఆరుగురు తెలుగమ్మాయిలను..నిజానికి ఎస్కేఎన్ దాదాపు ఆరుగురు తెలుగమ్మాయిలను హీరోయిన్స్‌గా మార్చాడు. 'ఈ రోజుల్లో' సినిమాతో రేష్మ రాథోడ్, ఆనంది, 'రొమాన్స్'తో మానస, 'టాక్సీవాలా'తో ప్రియాంక జవాల్కర్ (దీనికంటే ముందు కల వరం ఆయే సినిమా చేసింది కానీ గుర్తింపు రాలేదు), 'బేబి'తో వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya)ను హీరోయిన్గా వెండితెరకు పరిచయం చేశాడు. సంతోశ్ శోభన్‌తో తీస్తున్న సినిమాలో దేత్తడి హారికను కూడా కథానాయికగా పరిచయం చేస్తున్నాడు. ఇదే విషయాన్ని ఓ జర్నలిస్టు సోషల్ మీడియాలో ప్రస్తావిస్తూ.. ఎస్కేఎన్.. చాలామంది తెలుగు హీరోయిన్లకు తెరకు పరిచయం చేశారు. కవర్ డ్రైవ్ఫన్ కోసమో, ఫ్లోలోనో వివాదానికి దారితీసేలా స్టేట్మెంట్ పడేశారు. కానీ దాన్ని హీరోయిన్ వైష్ణవి చైతన్యకు ముడిపెట్టి చూడటం సరికాదేమో? అని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై ఎస్కేఎన్ స్పందిస్తూ.. హహ్హహ్హ.. ఈ మధ్య చాలామంది వినోదం కన్నా వివాదానికే మొగ్గు చూపుతున్నారు గురూజీ.. ఏం చేస్తాం చెప్పండి! అని రిప్లై ఇచ్చాడు. కాంట్రవర్సీ మీరే చేసి ఇప్పుడు కవరింగ్ దేనికో అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.చదవండి: లాజిక్ లేకపోయినా రాజమౌళి సినిమాలు సూపర్‌హిట్టు: కరణ్ జోహార్ -
అల్లు అర్జున్ను అన్‌ఫాలో చేసిన రామ్‌చరణ్
ఒకప్పుడు మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ అంతా ఒకే కుటుంబంలా ఉండేది. ఏ పండగ వచ్చినా అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకునేవాళ్లు. కానీ రానురానూ రెండు కుటుంబాల మధ్య దూరం పెరుగుతూ వస్తోంది. అది ఇటీవల తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలో హీరో రామ్‌చరణ్ (Ram Charan) ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)ను అన్‌ఫాలో చేసినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ వరుసకు బావ, బావమరిది అవుతారు. బంధువులుగా కంటే స్నేహితుల్లానే ఎక్కువగా కలిసిమెలిసి ఉండేవారు. అన్‌ఫాలో చేసిన చరణ్?సడన్‌గా ఏమైందో ఏమో కానీ బన్నీని రామ్‌చరణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేశాడు. రామ్‌చరణ్ అన్‌ఫాలో చేసినప్పటికీ అతడి భార్య ఉపాసన మాత్రం ఫాలో అవుతోంది. చరణ్ కంటే ముందు మెగా మేనల్లుడు, హీరో సాయిదుర్గ తేజ్ అల్లు అర్జున్ను అన్‌ఫాలో చేశాడు. బన్నీని వదిలేసిన చరణ్.. అల్లు శిరీష్ (Allu Sirish)ను మాత్రం ఫాలో అవుతుండటం గమనార్హం. అటు అల్లు అర్జున్ ఇన్‌స్టాగ్రామ్‌లో కేవలం తన భార్య స్నేహారెడ్డిని మాత్రమే అనుసరిస్తున్నాడు.దూరమవుతున్న బంధం?ఏపీ ఎన్నికల సమయం నుంచి అల్లు, మెగా కుటుంబాల మధ్య సరైన సత్సంబంధాలు లేవని తెలుస్తోంది. ఇటీవల తండేల్ (Thandel Movie) ఈవెంట్లోనూ అల్లు అరవింద్.. చరణ్ ఫస్ట్ సినిమా యావరేజ్ కంటే తక్కువే ఆడిందని కామెంట్స్ చేశాడు. ఒక్క వారంలోనే దిల్‌రాజు నష్టాలు చూశాడంటూ.. గేమ్ ఛేంజర్ సినిమా డిజాస్టర్ అన్న అర్థం వచ్చేలా మాట్లాడాడు. దీనిపై ట్రోలింగ్ జరగడంతో అల్లు అరవింద్ వివరణ ఇచ్చాడు. రామ్‌చరణ్ తన ఏకైక మేనల్లుడని, తనకు కొడుకులాంటివాడని పేర్కొన్నాడు. ఈ గొడవకు ఫుల్స్టాప్ పెట్టాలని కోరాడు.చదవండి: చరణ్‌కు ఆడపిల్ల పుడుతుందేమోనని భయంగా ఉంది: చిరంజీవి -
ఇండస్ట్రీ ప్లే బాయ్‌తో చెయ్యి కలపనున్న 'సాయి పల్లవి'
సాయిపల్లవికి నటిగా ప్రత్యేక గుర్తింపు ఉంది. వచ్చిన అవకాశాలన్నింటినీ ఒప్పేసుకోవడం ఈమె నైజం కాదు. కథ, అందులో తన పాత్ర నచ్చితేనే నటించడానికి పచ్చజెండా ఊపుతారు. అదీ తన పాత్రకు ప్రాధాన్యత ఉండాలి. ఇకపోతే గ్లామరస్‌గా ఉండకూడదు. అలాంటి పాత్రల్లో నటిస్తూనే వరుస విజయాలను అందుకుంటున్నారు. ఇటీవల శివకార్తికేయన్‌కు జంటగా అమరన్ చిత్రంలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. అదేవిధంగా తాజాగా నాగచైతన్య సరసన తండేల్ చిత్రంలో నటించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రస్తుతం హిందీలో రామాయణం చిత్రంలో సీత పాత్రలో నటిస్తున్నారు. కాగా తాజాగా మరో కోలీవుడ్ చిత్రం కోసం సాయిపల్లవి పేరు వినిపిస్తోంది. అదీ సంచలన నటుడు శింబుతో జత కట్టే విషయమై ప్రచారం జోరందుకుంది. శింబు ఇప్పుడు నటుడు కమలహాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో నటించిన థగ్‌లైఫ్ చిత్రంలో ప్రధాన పాత్రను పోషించారు. ఈ చిత్రం జూన్‌లో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. కాగా తాజాగా వరుసగా మూడు చిత్రాల్లో నటించడానికి శింబు సిద్ధం అవుతున్నారు. అందులో ఒకటి పార్కింగ్ చిత్రం ఫేమ్ రామ్‌కుమార్ దర్శకత్వం వహించనున్న చిత్రం. డాన్ పిక్చర్స్ పతాకంపై ఆకాశ్ భాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఇటీవల నటుడు శింబు పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు. అందులో శింబు చేతిలో ఉన్న పుస్తకంలో రక్తం మరకలు కలిగిన కత్తి ఉండడంతో ఇది యాక్షన్ ఎంటర్టెయినర్ కథా చిత్రంగా ఉంటుందని తెలుస్తోంది. సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేనా..ఈ చిత్రంలో కథానాయకిగా నటి సాయిపల్లవి నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా మరో ముఖ్య పాత్రలో నటుడు సంతానం నటించనున్నట్లు టాక్ వైరల్ అవుతోంది. హాస్య నటుడిగా పరిచయం అయ్యి ఆ తరువాత కథానాయకుడిగా రాణిస్తున్న సంతారం ఈ చిత్రం ద్వారా మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఇకపోతే శింబు నటించిన గత సినిమాలను పరిశీలిస్తే ఎక్కువగా హీరోయిన్‌తో రొమాంటిక్ సీన్స్ లేదా సాంగ్స్ ఉండటం సహజం. కోలీవుడ్ ప్లే బాయ్ అనే ట్యాగ్‌లైన్ కూడా ఆయనకు ఉంది. నయనతార,హన్సిక,ఆండ్రియా, హర్షిక,త్రిష,సనా ఖాన్ వంటి వారితో ఆయనకు ఎఫైర్స్ ఉన్నాయంటూ కోలీవుడ్‌లో వార్తలు కూడా వచ్చాయి. అయితే, సింబు సినిమాలో సాయి పల్లవి నటించడానికి సమ్మతించారా..? అన్నదే ప్రశ్నార్థకంగా మారింది. నిజంగా ఆమె అంగీకరించినట్లయితే అందులో ఆమె పాత్ర స్ట్రాంగ్ అయ్యి ఉంటుందని భావించవచ్చు. కాగా ఈ క్రేజీ కాంబినేషన్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. కాగా ఇది శింబు నటించనున్న 49వ చిత్రం అన్నది గమనార్హం. -
అల్లు అర్జున్‌తో నో.. ఎన్టీఆర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్త్రీ 2 సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 500 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు ఐటమ్ సాంగ్‌కు గ్రీన్ ఇచ్చేసిందట. చిత్రపరిశ్రమలో భారీ క్రేజ్ ఉన్న ఆమెకు ఐటమ్ సాంగ్స్‌లో నటించమని ఇప్పటికే భారీ ఆఫర్స్ వచ్చాయి. కానీ, ఆమె సున్నితంగానే వాటికి నో చెప్పింది. అయితే.. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ బాలీవుడ్ మూవీ వార్2లో ఆమె స్టెప్పులు వేయనుందని తెలుస్తోంది.‘సాహో’తో తెలుగు వారికి పరిచయమైన శ్రద్ధా కపూర్‌కు టాలీవుడ్లో కూడా భారీగానే అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలో ఆమె మంచి డ్యాన్సర్ కూడా.. అయితే, ‘పుష్ప2’లో ప్రత్యేక పాట కోసం చిత్ర యూనిట్ ఆమెను సంప్రదించినట్లు టాలీవుడ్లో ప్రచారం జరిగింది. రెమ్యునరేషన్ విషయంలో డీల్ సెట్ కాకపోవడంతో ఆమె నో చెప్పారని కూడ వార్తలు వచ్చాయి. ఫైనల్‌గా ఆ ఛాన్స్ శ్రీలీల దక్కించుకుంది. ఇప్పుడు వార్2 సినిమాలో శ్రద్ధా కపూర్ ఒక ఐటమ్ సాంగ్‌లో కనిపించనుందని గట్టిగానే వినిపిస్తుంది. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది. స్పై యాక్షన్ థ్రిల్లర్‌ను అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ కూడా చాలా స్పీడ్‌గా జరుగుతోంది.అల్లు అర్జున్ పుష్ప2 చిత్రానికి నో చెప్పిన శ్రద్ధా కపూర్.. ఎన్టీఆర్, హృతిక్‌తో కలిసి స్టెప్పులు వేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే సినీప్రియుల్ని ఉర్రూతలూగించేలా ఆ సాంగ్ ఉంటుందని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. త్వరలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉందని శ్రద్ధ సన్నిహిత వర్గాలు తెలిపాయి. -
సీనియర్ హీరోతో 'రష్మిక'కు గోల్డెన్ ఛాన్స్
కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్(Rajinikanth) మరోసారి బాలీవుడ్ చిత్రంలో నటించనున్నారా..? అన్న ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ప్రస్తుతం ఈయన లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. నటి శృతిహాసన్ ముఖ్యపాత్రను పోషిస్తున్న ఈ చిత్రం చివరి దశకు చేరుకుంది. తదుపరి నెల్సన్ దర్శకత్వంలో జైలర్– 2 చిత్రం చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాంటిది తాజాగా రజనీకాంత్ ఓ హిందీ చిత్రంలో నటించటానికి పచ్చజెండా ఊపినట్లు సమాచారం. విశేషం ఏమిటంటే ఇందులో కథానాయకగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నను(Rashmika Mandanna) నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే పలు హిందీ చిత్రాల్లో ఆమె నటించారు. తాజాగా సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న సికిందర్ చిత్రంలో రష్మిక నటిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ దర్శకుడు మురగదాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను మార్చి నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా తాజాగా సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న జంటగా మరో చిత్రంలో నటించటానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి దర్శకుడు అట్లీ( Atlee Kumar) తెరకెక్కించబోతున్నట్లు తెలిసింది. కాగా ఈ క్రేజీ చిత్రంలోనే రజనీకాంత్ కూడా ఒక ముఖ్యపాత్ర పోషించనున్నట్లు సమాచారం. ఈ పాత్రలో ముందుగా నటుడు కమల్ హాసన్ నటింపజేసే ప్రయత్నాలు జరిగినట్లు సమాచారం. అయితే, ఆయన నిరాకరించడంతో, ఇప్పుడు రజనీకాంత్ ను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అట్లీ ఇంతకుముందు రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన ఎందిరన్ (రోబో) చిత్రానికి సహాయ దర్శకుడిగా పని చేశారు. ఆ పరిచయంతో ఇప్పుడు తాను దర్శకత్వం వహించబోయే హిందీ చిత్రంలో రజనీకాంత్‌ను ముఖ్యపాత్రలో నటింపజేయనున్నట్లు తెలుస్తోంది. అలా సల్మాన్ ఖాన్, రజనీకాంత్, రష్మిక మందన్నలతో రేర్ కాంబినేషన్లో చిత్రాన్ని చేయడానికి అట్లీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీని షూటింగ్ ఈ ఏడాదిలోనే ప్రారంభం కాబోతున్నట్లు తెలిసింది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలవడ లేదు. -
'మీ తిట్లు విన్నాక ఆ పని పూర్తి చేశా..' ఇంతకీ టైటిల్ అదేనా?
ఏదైనా సినిమా ప్రకటిస్తే చాలు దాని టైటిల్ ఏంటి? హీరోయిన్ ఎవరు? షూటింగ్ ఎప్పుడు మొదలుపెడుతున్నారు? టీజర్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొద్దు? ఇలా రకరకాల ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు అభిమానులు. చిత్రయూనిట్ చెప్పేవరకు ఆగట్లేదు. టాప్ నిర్మాత నాగవంశీ (Suryadevara Naga Vamsi)ని కూడా ఇలాగే విసిగిస్తున్నారట. విజయ్ దేవరకొండ 12వ సినిమా (#VD12) టైటిల్ చెప్తావా? లేదా? అని ఏకంగా బండబూతులు తిడుతున్నారట.తిట్టు భరించాక..ఈ విషయాన్ని నాగవంశీ సోషల్ మీడియాలో వెల్లడించాడు. మీ అందరి తిట్లు భరించాక.. నేను దర్శకుడు గౌతమ్‌ను చాలా హింస పెట్టాక ఎట్టకేలకు ఓ టైటిల్ ఫిక్స్ చేశాం. అదేంటో అతి త్వరలోనే ప్రకటిస్తాం అన్నాడు. అప్పటివరకు ఎదురుచూస్తూ ఉండండి అన్నాడు. అయితే ఆ సినిమా టైటిల్ సామ్రాజ్యం అయి ఉంటుందని ప్రచారం జరుగుతోంది. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే!పోలీసాఫీసర్‌గా విజయ్?విజయ్ దేవరకొండ చివరగా ఫ్యామిలీ స్టార్ సినిమా చేశాడు. కల్కి 2898 ఏడీలో ముఖ్య పాత్రలో మెప్పించాడు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరితో ఓ మూవీ చేస్తున్నాడు. ఇది విజయ్ కెరీర్లో 12వ సినిమా. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌లో విజయ్ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ మూవీ మార్చి 28న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ సినిమా విడుదల ఆలస్యం కావచ్చని టాక్ వినిపిస్తోంది.#VD13 సినిమామరోవైపు విజయ్ తన పదమూడో సినిమాను ‘రాజావారు రాణిగారు’ ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇందులో విజయ్ పల్లెటూరి మాస్ కుర్రాడిగా కనిపించనున్నాడు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించనున్నారుపీరియాడిక్ మూవీలో విజయ్విజయ్ తన పద్నాలుగో సినిమాను శ్యామ్ సింగరాయ్ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్లో చేస్తున్నాడు. బ్రిటీష్ పాలనా కాలం నేపథ్యంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుంది. వాస్తవ చారిత్రక ఘటనల ఆధారంగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందనున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు.చదవండి: వరుణ్ సందేశ్ రాచరికం మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే? -
హీరోగా నటించనున్న తమన్? 22 ఏళ్ల తర్వాత..!
టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (Thaman S) మళ్లీ కెమెరా ముందుకు రానున్నాడు. ఈయన తొలిసారి నటుడిగా యాక్ట్ చేసిన చిత్రం బాయ్స్. సిద్దార్థ్, జెనీలియా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం 2003లో రిలీజై సక్సెస్ సాధించింది. ఈ మూవీలో తమన్.. మ్యూజికల్ బ్యాండ్‌లో ఒకరిగా నటించాడు. తర్వాత మాత్రం అతడు నటనపై కాకుండా సంగీతంపైనే దృష్టి పెట్టాడు. మిస్టర్ మజ్ను, బేబీ జాన్ సినిమాల్లో కేవలం ఏదో ఒక సీన్/పాటలో అలా కనిపించి ఇలా వెళ్లిపోయాడు. అయితే ఈసారి పూర్తి స్థాయిలో హీరోగా కనిపించేందుకు సిద్ధమవుతున్నాడట! హీరో అధర్వతో కలిసి తమిళంలో ఓ మూవీ చేయబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని మల్టీస్టారర్‌గా తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే!(చదవండి: కుటుంబంలో విషాదం.. పాడె మోసిన హీరో రానా)సంగీత దర్శకుడిగా..తమన్ తండ్రి అశోక్ డ్రమ్మర్, తల్లి సావిత్రి సింగర్. ఇంట్లో సంగీత నేపథ్యం వల్ల చిన్న వయసులోనే డ్రమ్స్ వాయించేవాడు. మ్యూజిక్ డైరెక్టర్‌గా మారడానికి ముందు దాదాపు 900 సినిమాలకు డ్రమ్మర్‌గా పని చేశాడు. బాయ్స్ మూవీలోనూ డ్రమ్స్ వాయించే కుర్రాడిగా కనిపించాడు. మళ్లీ మళ్లీ చిత్రంతో టాలీవుడ్‌కు సంగీత దర్శకుడిగా పరిచయమయ్యాడు తమన్. కిక్ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అలా తెలుగు, తమిళంలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా రాణిస్తున్నాడు. హిందీలోనూ రెండు చిత్రాలకు పని చేశాడు. వివిధ భాషల్లో కలుపుకుని వందకు పైగా చిత్రాలకు సంగీతం అందించాడు. తెలుగు, తమిళంలో పలు పాటలు ఆలపించాడు. అల వైకుంఠపురములో సినిమాకుగానూ ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు. ఇటీవల డాకు మహారాజ్, గేమ్ ఛేంజర్ చిత్రాలకు పని చేశాడు.చదవండి: చివరి కోరిక తీరకుండానే ప్రాణాలు వదిలేసిన నటుడు సాక్షి రంగారావు -
సెట్లో ఫోన్లు నిషిద్ధం.. మహేశ్‌బాబు సహా అందరితో అగ్రిమెంట్!
రాజమౌళి (SS Rajamouli) సినిమా అంటే అంచనాలు ఆకాశాన్నంటాల్సిందే! అందులోనూ తెలుగు సూపర్‌స్టార్ మహేశ్‌బాబు (Mahesh Babu)తో అంటే బాక్సాఫీస్‌ను బ్లాస్ట్ చేసేందుకు జక్కన్న ఏదో గట్టిగా ప్లాన్ చేశాడనే అర్థం. వీరిద్దరి కాంబోలో ఇటీవలే #SSMB29 సినిమా లాంచ్ చేశారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథ రెండు భాగాలుగా రానుంది. తొలి భాగం ప్రేక్షకుల ముందుకు రావడానికి కనీసం రెండేళ్లయినా పట్టొచ్చని టాక్! ఈ చిత్రంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) నటించనున్నట్లు ఒక వార్త తెగ వైరలవుతోంది.షూటింగ్ షురూ?!ఇప్పటికే తన సినిమా కోసం ఒక సింహాన్ని లాక్ చేసినట్లు ఓ పోస్ట్ పెట్టాడు రాజమౌళి. అంటే మహేశ్‌బాబును తన ప్రాజెక్ట్ కోసం లాక్ చేశానని చెప్పకనే చెప్పాడు. అలాగే షూటింగ్ షురూ అని కూడా హింట్ ఇచ్చాడు. ఈ పోస్టుకు మహేశ్‌బాబు స్పందిస్తూ.. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అని రిప్లై ఇచ్చాడు. ప్రియాంక చోప్రా.. ఫైనల్లీ అని కామెంట్ పెట్టింది. ఇదిలా ఉంటే తన సినిమా కోసం రాజమౌళి చాలా జాగ్రత్తపడుతున్నాడట! అగ్రిమెంట్ఎట్టి పరిస్థితుల్లోనూ కథ, షూటింగ్ క్లిప్స్, సినిమాలో నటించేవారి గురించి ఎలాంటి వివరాలు బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నాడట. ఈ విషయంలో చిత్రయూనిట్‌కు హెచ్చరికలు జారీ చేశాడట. నటీనటులు, సాంకేతిక నిపుణులతో నాన్ డిస్క్లోజ్ అగ్రిమెంట్ (NDA) చేయించినట్లు తెలుస్తోంది. మహేశ్‌బాబు, ప్రియాంక చోప్రాతోనూ ఈ ఒప్పందంపై సంతకం చేయించారట! ఈ అగ్రిమెంట్ ప్రకారం సినిమాకు సంబంధించిన ఏ చిన్న విషయాన్ని కూడా యూనిట్ సభ్యులు బయటకు చెప్పేందుకు వీల్లేదు. లీక్ చేశారంటే భారీ మూల్యం..దర్శకనిర్మాతల అనుమతి లేకుండా ఎవరైనా సమాచారాన్ని లీక్ చేస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదు. అలాగే హీరోతో సహా సెట్లో ఉన్న ఎవరూ ఫోన్లు తీసుకురావడానికి అనుమతి లేదని తెలుస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో తీస్తున్న సినిమా కాబట్టి ఆమాత్రం జాగ్రత్తలు పాటిస్తే తప్పేం కాదంటున్నారు సినీప్రియులు. జక్కన్న ప్లాన్ బానే ఉంది.. మరి ఆచరణ ఏమేరకు సాధ్యమవుతుందో చూడాలి! View this post on Instagram A post shared by SS Rajamouli (@ssrajamouli) చదవండి: గేమ్ ఛేంజర్ డిజాస్టర్‌పై స్పందించిన అంజలి.. బాధేస్తోందంటూ.. -
మహేశ్‌బాబు సినిమా కోసం 'ప్రియాంక చోప్రా' భారీ రెమ్యునరేషన్
మహేశ్‌బాబు(Mahesh Babu) - దర్శకధీరుడు రాజమౌళి SSMB29 భారీ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. అయితే, ఇందులో ప్రియాంక చోప్రా(Priyanka Chopra) కూడా నటిస్తున్నారు. ఆమె రెమ్యునరేషన్ గురించి నెట్టింట పెద్ద చర్చ నడుస్తుంది. ప్రియాంక చోప్రా సుమారు దశాబ్ధం పాటు బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా కొనసాగారు. అదే సమయంలో ఆమె హాలీవుడ్లో అవకాశాలు దక్కించుకుని పలు ప్రాజెక్ట్‌లలో నటించడమే కాకుండా నిర్మాతగా కూడా అక్కడ రాణిస్తున్నారు. ప్రస్తుతం ఆమె అమెరికాలో స్థిరపడ్డారు. అయితే సుమారు పదేళ్ల తర్వాత ఒక ఇండియన్ (తెలుగు) సినిమాలో ప్రియాంక నటిస్తుండటం విశేషం. ఆమె ఎప్పుడో 2015 సమయంలో ఒప్పుకున్న 'ది స్కై ఈజ్ పింక్' చిత్రం 2019లో విడుదలైంది. బాలీవుడ్లో ఇదే ఆమె చివరి సినిమా.భారీ రెమ్యునరేషన్బాలీవుడ్కు మించిన రెమ్యునరేషన్లు తెలుగు చిత్ర పరిశ్రమ ఇస్తుంది. టాలీవుడ్లో ఇప్పటివరకు అత్యధిక పారితోషికం కల్కి సినిమా కోసం దీపికా పదుకోన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఆమె ఏకంగా సుమారు రూ. 20 కోట్లు తీసుకున్నట్లు అప్పట్లో భారీగా వార్తలు వచ్చాయి. అయితే, SSMB29 ప్రాజెక్ట్ కోసం ప్రియాంక చోప్రా ఏకంగా రూ.25 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతుంది. కానీ, హాలీవుడ్ మీడియా మాత్రం సుమారు రూ. 40 కోట్లు వరకు ఉంటుందని కథనాలు ప్రచురించాయి. ఆమెకు అంత పెద్ద మొత్తంలో పారితోషికం ఇచ్చేందుకు నిర్మాత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట.అంత మొత్తం ఇవ్వడానికి కారణం ఇదేప్రియాంక చోప్రా మార్కెట్ బాలీవుడ్లో భారీగానే ఉంది. చాలా గ్యాప్ తర్వాత ఆమె నటించిన సినిమా వస్తుండటంతో హిందీ బెల్ట్‌లో మంచి బిజినెస్ చేసే ఛాన్స్ ఉంది. ఆపై హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కూడా ప్రియాంక అప్పీయరెన్స్ సినిమాకు ప్లస్ అవుతుంది. SSMB29 ప్రాజెక్ట్‌ను హాలీవుడ్ రేంజ్లో జక్కన్న ప్లాన్ చేశాడు. దీంతో సులువుగా అక్కడి మార్కెట్‌కు సినిమా రీచ్ అవుతుందని తెలుస్తోంది. ఈ లెక్కలన్నీ వేసుకునే ప్రియాంక చోప్రాకు భారీ మొత్తంలో ఆఫర్ చేసినట్లు టాక్. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ రెండు భాగాలుగా వస్తే.. అప్పుడు ఆమె రెమ్యునరేషన్ లెక్కలు మారిపోతాయి. ఏదేమైనా అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్గా ప్రియాంక చోప్రా రికార్డ్ క్రియేట్ చేశారని ఆమె అభిమానులు చెప్పుకుంటున్నారు.హాలీవుడ్లో ఫుల్ బిజీబాలీవుడ్లో ఎన్నో సూపర్‌హిట్ సినిమాలలో నటించిన ప్రియాంక 'క్వాంటికో' అనే టెలివిజన్ సిరీస్‌తో హాలీవుడ్ చిత్ర పరిశ్రమకు దగ్గరయ్యారు. ఆ తర్వాత బేవాచ్, ఏ కిడ్ లైక్ జాక్,లవ్ అగైన్,టైగర్, వుయ్ కెన్ బీ హీరోస్, ది వైట్ టైగర్ తదితర చిత్రాలలో నటించి ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా పలు షోలకు హోస్ట్‌గా వ్యవహరించి అక్కడి వారిని మెప్పించారు. హాలీవుడ్‌కి చెందిన ప్రముఖ పాప్ సింగర్ నిక్ జోనాస్‌ని ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెకు అదనపు గుర్తింపు లభించింది. -
సిండికేట్‌లో వెంకీమామ, బిగ్‌బీ, ఫహద్..? ఆర్జీవీ ఏమన్నారంటే?
ఒకప్పుడు ట్రెండ్ సెట్ చేసే సినిమాలు తీసిన రామ్‌గోపాల్ వర్మ (Ram Gopal Varma) రానురానూ గతి తప్పాడు. చౌకబారు సినిమాలు తీసుకుంటూ పోయాడు. కానీ ఈ మధ్యే వర్మకు తను చేసిన తప్పు అర్థమైంది. సత్య సినిమా (Satya Movie) రీరిలీజ్ సందర్భంగా తన సినిమాను తనే మరోసారి చూసుకున్నాడు. అంత అద్భుతాన్ని తెరకెక్కించిన తాను ఆ స్థాయి సినిమాలు ఎందుకు చేయలేకపోయానని బాధపడ్డాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడు.మాటిచ్చి కొత్త సినిమా ప్రకటించిన వర్మఇకమీదట సత్యలాంటి కంటెంట్ ఉన్న సినిమాలే చేస్తానని మాటిచ్చాడు. ఇది నిజమేనా? అని అందరూ అనుమానిస్తున్న సమయంలో ఆర్జీవీ కొత్త మూవీ ప్రకటించాడు. సిండికేట్ సినిమా తీయబోతున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించాడు. 70వ దశకంలో వీధి రౌడీల గ్యాంగ్స్ నుంచి మొదలుకుని ఐసిస్ వరకు ఎన్నో రకాల సంఘ వ్యతిరేక శక్తులను భారత్ చూసింది. కానీ గత పదిహేనేళ్లలో చెప్పుకోదగ్గ కొత్త గ్రూప్స్ లేవు. అతి భయంకరమైన జంతువు మనిషేఒకవేళ భవిష్యత్తులో కొత్త తరహా సంఘ వ్యతిరేక శక్తులు పుట్టుకొస్తే ఎలా ఉంటుందో సిండికేట్‌లో చూపించబోతున్నా అన్నాడు. ఓన్లీ మ్యాన్ కెన్ బి ద మోస్ట్ టెర్రిఫైయింగ్ యానిమల్ (అత్యంత క్రూరమైన మృగం మనిషి మాత్రమే) అని ఓ ట్యాగ్‌లైన్ కూడా జోడించాడు. ఇలా సిండికేట్‌ను ప్రకటించాడో లేదో నెట్టింట రూమర్లు మొదలయ్యాయి. తెలుగు నుంచి వెంకటేశ్ దగ్గుబాటి, హిందీ నుంచి అమితాబ్ బచ్చన్, మలయాళం నుంచి ఫహద్ ఫాజిల్‌ను సెలక్ట్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. సినిమాలో స్టార్స్మనోజ్ బాజ్‌పాయ్, అనురాగ్ కశ్యప్ కూడా ఈ మూవీలో భాగం కానున్నారని ప్రచారం జరిగింది. తాజాగా ఈ రూమర్లపై వర్మ స్పందించాడు. సిండికేట్ సినిమాలో భాగం కాబోయే నటీనటుల గురించి వస్తున్న ప్రచారమంతా ఫేక్. సమయం వచ్చినప్పుడు నేనే అన్ని వివరాలు చెప్తాను అని ట్వీట్ చేశాడు. There are all kinds of speculations going around the casting of SYNDICATE film which are all completely FALSE ..Will share the details when ready— Ram Gopal Varma (@RGVzoomin) January 25, 2025 చదవండి: ప్రియుడితో ఆరెంజ్ హీరోయిన్ 'రోకా'.. పెళ్లెప్పుడంటే? -
ఓటీటీలో 'పుష్ప2' స్ట్రీమింగ్ తేదీ ఇదేనా.. నెట్టింట వైరల్..?
'పుష్ప 2'(Pushpa 2) సినిమా థియేటర్లలో భారీ రికార్డ్స్ అందుకుంది. ప్రస్తుతం రీలోడెడ్ వర్షన్‌ను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇప్పటికే రూ.1850 కోట్ల గ్రాస్ కలెక్షన్ మార్క్‌ను దాటేసింది. అత్యధిక కలెక్షన్లు సాధించిన ఇండియన్ సినిమాల జాబితాలో రెండో స్థానంలో ఉంది. ఈ మేరకు నిర్మాతలు అధికారికంగా పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. మరోవైపు ఓటీటీ రిలీజ్ విషయంలో రూమర్స్ భారీగానే వస్తున్నాయి. పుష్ప2 విడుదల అయిన 56 రోజుల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే, ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. దీంతో పుష్ప2 ఓటీటీ స్ట్రీమింగ్ గురించి నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి.ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్(Netflix) సంస్థ.. 'పుష్ప 2' డిజిటల్ హక్కుల్ని భారీ ధరకు సొంతం చేసుకుంది. సుమారు రూ. 200 కోట్లకు ఈ చిత్రం రైట్స్‌ను దక్కించుకుందని సోషల్‌మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే, నాలుగు వారాలకే డీల్ మాట్లాడుకున్నట్లు ఓ న్యూస్ అయితే వైరల్ అయింది. కానీ, ఇప్పుడు ఏడు వారాల తర్వాత ఈ మూవీ స్ట్రీమింగ్కు రానుంది. అంటే జనవరి 29న లేదా 31న ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో ఎంట్రీ ఇవ్వడం గ్యారెంటీ అని తెలుస్తోంది. పుష్ప2 రీలోడెడ్ వర్షన్ 3:40 నిమిషాల నిడివి ఉంది. ఓటీటీలో ఈ కొత్త వర్షన్‌ను విడుదల చేయనున్నారు.పుష్ప 2 చిత్రం కేవలం 30 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1,800 కోట్లు గ్రాస్ పైగా కలెక్షన్లు సాధించింది. ఆపై బాహుబలి2 రికార్డ్స్‌ను దాటేసింది. కేవలం హిందీలో రూ.800 కోట్ల నెట్ వసూళ్లను సాధించిన ఏకైక తెలుగు సినిమాగా రికార్డ్స్ క్రియేట్ చేసింది. హిందీ నెట్ వసూళ్లలో తొలిసారి ఈ మార్క్ చేరిన చిత్రంగా నిలిచింది. బాలీవుడ్ మూవీ కూడా సాధించలేని రికార్డ్స్ పుష్ప2 క్రియేట్ చేసింది.సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పుష్ప చిత్రానికి సీక్వెల్‌గా 2024 డిసెంబర్ 5న విడుదలైంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్,రష్మిక మందన్నా జోడీగా నటించారు. ఫాహద్ ఫాజిల్, రావు రమేశ్, జగపతి బాబు, సునీల్, అనసూయ, జగదీశ్ వంటి నటీనటులు ఈ చిత్రంలో కీలకపాత్రలలో నటించారు. భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందించారు. -
దిల్ రాజు కోసం చరణ్ కీలక నిర్ణయం
'గేమ్ ఛేంజర్' బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలబడింది. దీంతో దిల్ రాజు (Dil Raju) కోసం చరణ్(Ram charan) ఒక కీలకనిర్ణయం తీసుకున్నారట. కొత్త ఏడాదిలో సంక్రాంతికి మూడు చిత్రాలు రిలీజ్ అయ్యాయి. కానీ విన్నర్‌గా వెంకటేశ్ (సంక్రాంతికి వస్తున్నాం) చిత్రం నిలిచింది. సినిమా విడుదలైన రెండో రోజే సుమారు 250కి పైగా స్క్రీన్స్‌ను పెంచారు. తర్వాత బాలకృష్ణ (డాకు మహారాజ్) కూడా మంచి కలెక్షన్సే అందుకుంది. ఇప్పుడు ఎటొచ్చి కూడా రామ్ చరణ్- దిల్ రాజు కాంబినేషన్లో వచ్చిన గేమ్ ఛేంజర్‌కు కష్టాలు తప్పలేదు. ఫైనల్‌గా నిర్మాతకు ఎన్ని కోట్లు నష్టం అనేది తేలాల్సి ఉంది. సుమారు రూ. 450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి అనుకున్నంత రిటర్న్ వచ్చేలా లేదని తేలిపోయింది.సుమారు పదేళ్ల క్రితం దిల్ రాజు బ్యానర్లో ఎవడు సినిమాలో రామ్ చరణ్ నటించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కూడా అనుకున్నంత సమయంలో పూర్తి కాలేదు. కానీ, సినిమా మాత్రం బాక్సాఫీస్ మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు గేమ్ ఛేంజర్ కూడా పూర్తి అయ్యేసరికి దాదాపు నాలుగేళ్లు పట్టింది. దీంతో బడ్జెట్ భారీగా పెరిగింది. అయినప్పటికీ ఖర్చు పెట్టే విషయంలో దిల్ రాజు ఎక్కడా కూడా తగ్గలేదు. సినిమాపై ఆయన పూర్తి నమ్మకంతోనే కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టారు. కానీ గేమ్ ఛేంజర్ రిజల్ట్ మరోలా అయింది. ఈ మూవీతో దిల్ రాజు ఏ మేరకు నష్టాలు భరించబోతున్నారనేది ఇంకా తేలాల్సి ఉంది. (ఇదీ చదవండి: జాతీయ అవార్డ్ విన్నింగ్ హీరో సినిమాకు నో చెప్పిన సాయిపల్లవి)ఈ సినిమాతో పాటు సంక్రాంతికి వస్తున్నాం చిత్రం కూడా ఆయన నిర్మించారు కాబట్టి కాస్త ఊరట కలిగించే అంశం అని చెప్పవచ్చు. అయితే, రామ్ చరణ్ కూడా దిల్ రాజుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనే ప్లాన్‌లో ఉన్నారట. ఆయన బ్యానర్లోనే మరో సినిమా చేయాలని ఆయన ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక మంచి కథతో గేమ్ ఛేంజర్ నష్టాన్ని పూరించాలని చరణ్ ఉన్నారట. కొద్దిరోజుల తర్వాత అధికారికంగా ప్రకటన కూడా రావచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం చరణ్ చేతిలో రెండు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. వీటిలో మొదట డైరెక్టర్ బుచ్చిబాబు సినిమా ఉంది. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఒక భారీ బడ్జెట్ సినిమా లైన్లో ఉంది. ఈ చిత్రాల తర్వాత తప్పకుండా దిల్ రాజుతో మూవీ ఉంటుందని సమాచారం. -
'గేమ్ ఛేంజర్' తర్వాత స్టార్ హీరో బయోపిక్ ప్లాన్ చేస్తున్న శంకర్
పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల జీవిత చరిత్రతో చిత్రాలు రూపొందాయి. ఇందిరాగాంధీ, జయలలిత, కామరాజర్, భారత క్రికెట్ క్రీడాకారుడు ఎంఎస్ ధోనీ వంటి ప్రముఖుల జీవిత చరిత్రతో చిత్రాలు రూపొందిన విషయం తెలిసిందే. కాగా ఇటీవల సంగీత దర్శకుడు ఇళయరాజా బయోపిక్‌ను తెరకెక్కించడానికి ప్రయత్నాలు జరిగాయి. నటుడు ధనుష్ ఈ చిత్రంలో ఇళయరాజాగా నటించనున్నట్లు ప్రకటించారు కూడా. అయితే ఈ చిత్రం ఇప్పుడు డ్రాప్ అయ్యిందనే ప్రచారం జరుగుతోంది. ఇకపోతే ఇప్పుడు నటుడు రజనీకాంత్ (Rajinikanth) బయోపిక్ గురించి చర్చ జరుగుతోంది. దీనికి కారణం దర్శకుడు శంకర్ (Shankar) చేసిన వ్యాఖ్యలే. ఆయన ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ (Game Changer) చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. చాలా ఏళ్ల పాటు తెరకెక్కిన ఈ చిత్రం అనుకున్నంత స్థాయిలో మెప్పించలేదు. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం తొలిరోజే డిజాస్టర్ టాక్‌ను తెచ్చుకుంది. అయితే, ఈ చిత్రం తర్వాత దర్శకులు శంకర్ మరో సినిమాపై అడుగులు వేస్తున్నారు.తన తదుపరి చిత్రం గురించి శంకర్ ఒక భేటీలో పేర్కొంటూ నటుడు రజనీకాంత్ బయోపిక్‌ను తెరకెక్కించాలన్న కోరికను వ్యక్తం చేశారు. కోలీవుడ్‌లో 50 ఏళ్లుగా కథానాయకుడిగా ఏకచత్రాధిపత్యాన్ని సాగిస్తున్న రజనీకాంత్ బయోపిక్ తెరకెక్కుతుందా..? అన్న చర్చ సామాజిక మాధ్యమాల్లో జరుగుతోంది. కాగా దర్శకుడు శంకర్ ఇప్పటికే రజనీకాంత్ హీరోగా శివాజీ, రోబో, 2.ఓ చిత్రాలను తెరకెక్కించిన విషయం తెలిసిందే. దీంతో ఈయన రజనీకాంత్ బయోపిక్‌ను చిత్రంగా చేస్తే కచ్చితంగా సక్సెస్ అవుతుందనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ( ఇదీ చదవండి: ఊహలకు మించి డాకు మహారాజ్ ఉంటుంది: బాలకృష్ణ)కాగా రజనీకాంత్ ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ చిత్రంలో నటిస్తున్నారు. తదుపరి నెల్సన్ దర్శకత్వంలో జైలర్– 2 చిత్రాన్ని సిద్ధం అవుతారని తెలుస్తోంది. అదేవిధంగా దర్శకుడు శంకర్ వెల్పారి చిత్రాన్ని తెర రూపం ఇవ్వడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రం గురించి గతంలో ప్రకటన కూడా వచ్చింది. అయితే, ఇందులో సూర్య, విక్రమ్‌లు నటించనున్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో ఈయన రజనీకాంత్ బయోపిక్ ఎప్పుడు తెరకెక్కిస్తారు ? అన్న ప్రశ్న తలెత్తుతోంది. దీనికి సమాధానం రావాలంటే కొంత కాలం ఆగాల్సిందే. -
గేమ్ ఛేంజర్ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్..
భారీ అంచనాల మధ్య వచ్చిన గేమ్ ఛేంజర్ మూవీ (Game Changer Movie)కి అంతటా మిక్స్డ్ టాక్ లభిస్తోంది. రామ్‌చరణ్ (Ram Charan) నటన బాగున్నప్పటికీ పాత కథే అవడంతో జనాలు బోరింగ్‌గా ఫీల్ అవుతున్నారు. పైగా ట్రైలర్లో చెప్పినట్లుగా అన్‌ప్రిడిక్టబుల్‌గా ఏదైనా ఉందా? అని చూస్తే ఒకటీ రెండు ట్విస్టులు మినహా కథ మొత్తం ఊహించినట్లే సాగుతోంది. దీంతో జనాలు గేమ్ ఛేంజర్‌పై పెదవి విరుస్తున్నారు.బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?అభిమానులు మాత్రం రామ్ చరణ్ నటన బాగుందని సంబరపడుతున్నారు. ఇండియన్ 2 డిజాస్టర్‌తో చతికిలపడ్డ శంకర్ ఈ చిత్రంతోనైనా కమ్‌బ్యాక్ ఇస్తాడనుకుంటే అది అయ్యే పనిలా కనిపించడం లేదు. దాదాపు రూ.400 -450 కోట్లు గుమ్మరించి తెరకెక్కించిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయినా అవుతుందా? అని పలువురూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఓటీటీ వివరాలుఇదిలా ఉంటే గేమ్ ఛేంజర్ ఓటీటీ పార్ట్నర్ షిప్ వివరాలు బయటకు వచ్చాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime Video) భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. థియేటర్లో రిలీజైన ఎనిమిది వారాల తర్వాత ఈ మూవీ డిజిటల్ ప్లాట్ఫామ్లో అందుబాటులోకి రానుంది. అయితే నెగెటివ్ టాక్ ఇలాగే కొనసాగితే మాత్రం ఓటీటీలో నెల రోజుల్లోనే రిలీజ్ కావడం ఖాయం!గేమ్ ఛేంజర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండిగేమ్ ఛేంజర్ సినిమా..రామ్ చరణ్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం గేమ్ ఛేంజర్. వినయ విధేయ రామ తర్వాత చరణ్- కియారా కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రమిది. శంకర్ దర్శకత్వం వహించగా అంజలి, ఎస్జే సూర్య, శ్రీకాంత్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషించారు. 2.45 గంటల నిడివితో జనవరి 10న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రిలీజైంది. దిల్‌రాజు బ్యానర్లో నిర్మితమైన 50వ సినిమా ఇది. అందుకే ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించారు.పాటల కోసమే కోట్లు ఖర్చుకేవలం పాటలకే కోట్లు ఖర్చుపెట్టారు. ఓ ఈవెంట్లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ఐదు పాటలకు రూ.75 కోట్లు ఖర్చయ్యాయి. కొన్ని విదేశాల్లో షూట్ చేశాం. ఒక్కో పాట పది రోజులకుపైగా చిత్రీకరించారు అని చెప్పుకొచ్చాడు. డిసెంబర్ 29న విజయవాడ బృందావన కాలనీలో ఉన్న వజ్రా మైదానంలో రామ్‌చరణ్ భారీ కటౌట్ ఆవిష్కరించారు. 256 అడుగుల ఎత్తుతో ఉన్న ఈ కటౌట్ దేశంలోనే అతి పెద్దదిగా చరిత్రకెక్కింది.పొరపాటు చేసిన చిత్రయూనిట్ప్రీరిలీజ్, ప్రమోషన్స్ అన్నీ పెద్ద ఎత్తున చేశారు కానీ రిలీజ్ రోజే చిన్న పొరపాటు చేశారు. సినిమాకు హైప్ ఇచ్చిన నానా హైరానా సాంగ్‌ను థియేటర్లలో ప్రదర్శించలేదు. సాంకేతిక సమస్యల కారణంగా పాటను యాడ్ చేయలేని మరో నాలుగు రోజుల్లో నానా హైరానా థియేటర్లో వేస్తామని చిత్రయూనిట్ వివరణ ఇచ్చింది. కానీ నాలుగురోజుల్లో సినిమా ఫలితం తేలిపోతుందని, ఆ తర్వాత పాటను యాడ్ చేస్తే ఉపయోగమేముంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన సిద్దార్థ్ మూవీ -
ఎన్టీఆర్ డ్రాగన్‌లో టొవినో?
ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ అనే ఓ పీరియాడికల్ యాక్షన్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటించనున్నారు. అలాగే ఈ సినిమాలోని ఇతర కీలకపాత్రల్లో మలయాళ నటులు టొవినో థామస్, జోజూ జార్జ్ నటించనున్నట్లు తెలిసింది. ఆల్రెడీ రుక్మిణీ వసంత్, టొవినో థామస్‌ల లుక్ టెస్ట్ కూడా పూర్తయిందని ఫిల్మ్‌నగర్ సమాచారం.ఈ సినిమా చిత్రీకరణ సంక్రాంతి తర్వాత ప్రారంభం కానుందని తెలిసింది. తొలి షెడ్యూల్‌ను కర్ణాటకలో ప్లాన్ చేశారట ప్రశాంత్ నీల్. ‘డ్రాగన్’ మూవీని 2026 జనవరి 9న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక... కెరీర్లో యాభైకిపైగా సినిమాల్లో నటించిన టొవినో థామస్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. 2023లో వచ్చిన ‘2018: ఎవ్రీ వన్ ఈజ్ ఏ హీరో, 2024లో వచ్చిన ‘ఏఆర్ఎమ్’ చిత్రాల్లో టొవినో థామస్ హీరోగా నటించగా, ఈ చిత్రాలు తెలుగులో అనువాదమై హిట్ మూవీస్‌గా నిలిచాయి. -
బిగ్‌బాస్ షోకి వెళ్లనున్న రామ్‌చరణ్!
హీరో రామ్‌చరణ్ (Ram Charan) మరోసారి బిగ్‌బాస్ షోకి వెళ్లనున్నాడు. మొన్న తెలుగు బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథిగా వచ్చి సందడి చేశాడు. ఇప్పుడు గేమ్ ఛేంజర్ (Game Changer Movie) చిత్ర ప్రమోషన్స్ కోసం హిందీ బిగ్‌బాస్ 18వ సీజన్‌కు వెళ్లనున్నాడట! వీకెండ్ కా వార్ ఎపిసోడ్లో చరణ్ స్టేజీపై కనిపించనున్నాడంటూ ప్రచారం ఊపందుకుంది.గేమ్ ఛేంజర్ చిత్రాన్ని హిందీలోనూ రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడి వారికి హైప్ ఎక్కించడం కోసం చరణ్ బిగ్‌బాస్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యాడని తెలుస్తోంది. హోస్ట్, స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan)తో ముచ్చటించి తన సినిమా ట్రైలర్‌ను చూపించనున్నారట! కాగా సల్మాన్- చరణ్ మధ్య ఇదివరకే స్నేహం ఉంది. (చదవండి: Game Changer: తగ్గిన రామ్ చరణ్ రెమ్యునరేషన్!)సల్మాన్ ఖాన్ నటించిన కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమాలోని ఏంటమ్మా పాటలో చరణ్, వెంకటేశ్ స్టెప్పులతో అదరగొట్టారు. సల్లూభాయ్ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు చరణ్ ఇంటికి పిలిచి ఆతిథ్యమిస్తుంటాడు. అటు చరణ్ ముంబై వెళ్లినప్పుడు కూడా సల్మాన్ తనను ఇంటికి ఆహ్వానిస్తుంటాడు. వీరిద్దరి కలయిక కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.గేమ్ ఛేంజర్ విషయానికి వస్తే శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్‌చరణ్, కియారా అద్వానీ హీరోయిన్లుగా నటించారు. అంజలి కీలక పాత్ర పోషించింది. ఎస్జే సూర్య విలన్‌గా నటించాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ జనవరి 10న విడుదల కానుంది.చదవండి: 'కలెక్టర్‌కి ఆకలేస్తోంది అంటా'... 'గేమ్ ఛేంజర్' ట్రైలర్ చూసేయండి -
ఓటీటీలో 'విడుదల 2' స్ట్రీమింగ్.. సంక్రాంతికి ప్లాన్
విజయ్ సేతుపతి, సూరి లీడ్ రోల్స్‌లో నటించిన ‘విడుదల 2’ సినిమా డిసెంబరు 20న విడుదలైంది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి రానుంది. వెట్రిమారన్ దర్శకత్వం వహించిన ‘విడుదల పార్ట్ 1’ చిత్రం 2023లో రిలీజ్ కాగా తమిళ్, తెలుగులో సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా వెట్రిమారన్ ‘విడుదల 2’ తెరకెక్కించారు. విజయ్ సేతుపతి, సూరి, మంజు వారియర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, భవానీ శ్రీ ముఖ్య తారలుగా నటించారు.విడుదలై 2 బాక్సాఫీస్ వద్ద ఊహించనంతగా మెప్పించలేదు. దీంతో పెద్దగా కలెక్షన్స్ కూడా సాధించలేకపోయింది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ5 ఓటీటీ భారీ ధరకు సొంతం చేసుకుంది. అయితే, ఈ మూవీ సంక్రాంతి కానుకగా ఓటీటీలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్‌లో ఉన్నారట. 2025 జనవరి 17వ తేదీన ‘విడుదల 2’ చిత్రాన్ని స్ట్రీమింగ్కు తీసుకొచ్చే ప్లాన్‌లో జీ5 ఉన్నట్లు సమాచారం. తమిళంతో పాటు తెలుగు వర్షన్స్ రెండూ ఒకే రోజు అందుబాటులోకి రానున్నట్లు టాక్. అయితే, ఈ విషయంలో 'జీ5' ఓటీటీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇప్పటి వరకు రూ. 50 కోట్ల మార్క్‌ను అందుకుంది.కథేంటంటే.. ప్రజాదళం నాయకుడు పెరుమాళ్(విజయ్ సేతుపతి) అరెస్ట్‌తో 'విడుదల -1' ముగుస్తుంది. కస్టడీలో ఉన్న పెరుమాళ్ విచారణతో పార్ట్ 2 ప్రారంభం అవుతుంది. పెరుమాళ్ అరెస్ట్ విషయం బయటకు తెలియడంతో అతన్ని మరో క్యాంపుకు తరలించి, అక్కడే ఎన్కౌంటర్ చేయాలని ప్లాన్ చేస్తారు. ఆ క్యాంపుకి అడవి మార్గం ద్వారానే వెళ్లాలి. కొమరన్(సూరి)తో కలిసి మరికొంత మంది పోలీసులు పెరుమాళ్‌ని తీసుకెళ్తారు.మార్గమధ్యలో పెరుమాళ్ తన ఫ్లాష్‌బ్యాక్ స్టోరీ చెబుతాడు. స్కూల్ టీచర్‌గా ఉన్న పెరుమాళ్ దళంలోకి ఎలా చేరాడు? జమిందారి వ్యవస్థ చేసే అరచకాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న కేకే(కిశోర్) పరిచయం పెరుమాళ్ జీవితాన్ని ఎలా మలుపు తిప్పింది? తను పని చేసే ఫ్యాక్టరీ యజమాని కూతురు మహాలక్ష్మి(మంజు వారియర్)తో ప్రేమాయణం ఎలా సాగింది? ప్రజాదళం ఆశయం ఏంటి? ప్రజల కోసం పెరుమాళ్ చేసిన పోరాటం ఏంటి? ప్రజాదళాన్ని అంతం చేసేందుకు ప్రభుత్వంతో కలిసి జమీందార్లు చేసిన కుట్ర ఏంటి? పార్ట్ 1లో జరిగిన రైలు ప్రమాదం వెనుక ఉన్న అసలు నిజం ఏంటి? పోలీసు కస్టడీ నుంచి పెరుమాళ్ తప్పించుకున్నాడా లేదా? సూరి తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
టాలీవుడ్ ప్రముఖ హీరో కుమారుడు.. సినిమా ఎంట్రీకి రెడీ
తెలుగు చిత్ర పరిశ్రమకు చిరంజీవి, బాలకృష్ణ ,నాగార్జున, వెంకటేష్ మూల స్థంబాలు అని చెప్పవచ్చు. ఇప్పటికే వారి వారసులు కూడా సినిమాలో ఎంట్రీ ఇచ్చేశారు. వారిలో చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ పాన్ ఇండియా రేంజ్ దాటి గ్లోబల్ రేంజ్‌కు చేరిపోయాడు. నాగార్జున కుమారులు నాగ చైతన్య, అఖిల్ సత్తా చాటుతున్నారు. బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇచ్చేందుకు హిట్ డైరెక్టర్‌తో రెడీగా ఉన్నాడు. అయితే, త్వరలో వెంకటేష్ కూడా తన వారసుడిని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.రామానాయుడి వారసులుగా వెంకటేష్, రానా, సురేష్ బాబు ఇండస్ట్రీలో రానిస్తున్నారు. ఇప్పుడు తర్వాతి జనరేషన్ నుంచి వెంకీ కుమారుడు అర్జున్ ఎంట్రీ గురించి తెరపైకి వచ్చింది. బాలకృష్ణ టాక్ షోలో తాజాగా పాల్గొన్న వెంకటేష్.. ఆయనతో అర్జున్ సినిమా ఎంట్రీ గురించి ఆఫ్‌స్క్రీన్‌లో చర్చించారట. తన కుమారుడిని కూడా త్వరలో సినిమా రంగానికి పరిచయం చేయాలని ఉన్నట్లు బాలయ్యతో వెంకీ తెలిపారట. అర్జున్ అమెరికాలో చదువుకొంటున్నాడని త్వరలో అక్కడి నుంచి ఇండియాకు రానున్నట్లు కూడా చెప్పాడని సమాచారం. ఈ క్రమంలో అర్జున్‌కు కూడా సినిమాలంటే ఆసక్తి ఉందని వెంకీ చెప్పుకొచ్చాడట. దీంతో వెంకటేష్ వారసుడిగా అర్జున్ ఎంట్రీపై వార్తలు నెట్టింట భారీగా వైరల్ అవుతున్నాయి. తొలి సినిమా తమ సొంత బ్యానర్లోనే తెరకెక్కించే అవకాశం ఉంది.వెంకటేష్ నలుగురు పిల్లల వివరాలు ఇవేవెంకటేష్కు ముగ్గురు కుమార్తెలు కాగా, అర్జున్ చివరి వాడు. పెద్ద కుమార్తె ఆశ్రిత అందరికీ సుపరిచితమే.. పెళ్లి తర్వాత ఫుడ్ వ్లాగర్‌గా ఆమె చాలామందికి తెలుసు. హైదరాబాద్ రేస్ క్లబ్ అధినేతగా కొనసాగిన సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డితో ఆశ్రిత వివాహం 2019లో జరిగిన సంగతి తెలిసిందే. ఆశ్రిత మామయ్య రఘురాంరెడ్డి ఖమ్మం ఎంపీగా ప్రస్తుతం ఉన్నారు. ఇక వెంకటేష్ రెండవ కుమార్తె హయ వాహిని ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ పూర్తి చేశారు. విజయవాడకు చెందిన డాక్టర్ కుమారుడితో ఆమె వివాహం కొద్దిరోజుల క్రితమే జరిగింది. మూడో కూతురు భావన హైదరాబాద్‌లోనే గ్రాడ్యువేషన్ చదువుతుంది. ఇక వెంకీ కుమారుడు అర్జున్ సినిమా ఎంట్రీ కోసం దగ్గుబాటి అభిమానులు ఎదురుచూస్తున్నారు. -
మహేశ్‌బాబు - రాజమౌళి సినిమాలో స్టార్ హీరోయిన్
మహేశ్‌బాబు - రాజమౌళి కాంబినేషన్ చిత్రంపై రూమర్స్ భారీగా వస్తూనే ఉన్నాయి. వారిద్దరూ కలిసి సినిమా తీస్తున్నట్లు ప్రకటన వచ్చిన సమయం నుంచి ఈ ప్రాజెక్టపై ప్రేక్షకులు అమితాసక్తిని చూపుతున్నారు. టైటిల్ వంటి తదితర వివరాల కోసం నెట్టింట ఆరా తీస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు అనే అంశం సోషల్‌మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.SSMB 29 పేరుతో ఈ ప్రాజెక్ట్ పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కనుంది. యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ 2025 మార్చి నుంచి ప్రారంభం కానుంది. అయితే, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో హీరోయిన్ను ఫైనల్ చేశారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా అయితే ఆ పాత్రకు న్యాయం చేయగలదని చిత్ర యూనిట్ భావించిందట. ఈ కథలో హీరోతో పాటు హీరోయిన్ పాత్రకు కూడా ఎక్కువ ప్రాధాన్యం ఉందని టాక్. అందుకే ఆమెను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఆమె పలు హాలీవుడ్ చిత్రాలలో కూడా నటించిన విషయం తెలిసిందే. ప్రియాంకా చోప్రాను డైరెక్టర్ రాజమౌళి పలుమార్లు కలిసినట్లు బాలీవుడ్ మీడియా కూడా వెల్లడించింది. ఈ సినిమాలో నటించేందుకు ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే, ఇండోనేషియా నటి 'చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్' ఈ చిత్రంలో నటిస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. చెల్సియా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో రాజమౌళిని ఫాలో అవుతుండడంతో ఆ వార్తలు నిజమేనని నమ్మారు. మరి ఆమె పాత్ర ఈ చిత్రంలో ఏ మేరకు ఉంటుందో తెలియాల్సి ఉంది.గ్లోబల్ లెవెల్లో భారీ బడ్జెట్‌తో రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపు పూర్తి అయినట్లు తెలుస్తోంది. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో ఎక్కువగా విదేశీ నటులు కనిపించనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. దుర్గా ఆర్ట్స్‌పై కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. -
పెళ్లై రెండు వారాలే.. కీర్తి సురేష్‌పై అప్పుడే మొదలైన రూమర్స్
కథానాయకిగా మంచి క్రేజ్‌లో ఉన్న నటి నటనకు విరామం ప్రకటించడం జరుగుతుందా..? అదీ పాన్ ఇండియా నటి, జాతీయ ఉత్తమ నటి అవార్డు గ్రహీత అలా చేస్తుందా..? అంటే అది జరిగే పని కాదు. అయితే నటి కీర్తి సురేష్ విషయంలో ఇప్పుడు అలాంటి ప్రచారమే జరుగుతుండడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అనతికాలంలోనే అగ్ర కథానాయికి స్థాయికి చేరుకున్న ఈమె, అంతేవేగంగా ఇండియన్ కథానాయకిగా ఎదిగింది . మహానటి చిత్రంలో దివంగత నటి సావిత్రిగా జీవించి జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకుంది ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రాల్లోనూ నటించి మెప్పించింది.కాగా వివాహం విషయంలో చాలా మంది నటీమణుల కంటే ముందుంది.తను 15 ఏళ్లుగా ప్రేమించిన ఆంటోనితో ఈనెల 12వ అగ్ని సాక్షిగా ఏడడుగులు వేసింది. అయితే భర్తతో హ నీమూన్‌కు కూడా వెళ్లకుండా తాను కథానాయకిగా నటించిన తొలి హిందీ చిత్రం 'మేరీ జాన్' చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంది. ఈ చిత్రం బుధవారం ప్రపంచవ్యాప్తంగా తెరపైకి వచ్చింది. కాగా ప్రస్తుతం ఈ భామ కొత్త చిత్రాలు అంగీకరించడం లేదని ప్రచారం హోరెత్తుతోంది. చేతిలో ఉన్న రివాల్వర్ రీటా, కన్నివెడి చిత్రాల షూటింగ్‌ను కూడా పూర్తి చేసింది. కాగా కొత్తగా పెళ్లి చేసుకున్న కీర్తీ సురేష్ కొంత కాలం భర్తతో సంసార జీవితాన్ని ఎంజాయ్ చేయాలని భావిస్తున్నట్లు, అందుకని నటనకు విరామం ఇవ్వనున్నట్లు.. తరువాత నటిగా రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం వైరల్ అవుతోంది. ఇందులో నిజం ఎంతో అన్నది తెలియాల్సి ఉంది. అయితే కీర్తీ సురేష్‌కు ప్రస్తుతం ఏ భాషలోనూ కొత్తగా అవకాశాలు లేవన్నది నిజం. -
'పుష్ప 2' ఓటీటీ రిలీజ్ ప్లాన్ మారిందా?
'పుష్ప 2' సినిమా థియేటర్లలో రిలీజై మూడు వారాలవుతున్నా సరే జోరు చూపిస్తోంది. ఇప్పటికే రూ.1500 కోట్ల గ్రాస్ కలెక్షన్ మార్క్ దాటేసింది. ఈ మేరకు నిర్మాతలు అధికారికంగా పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. మరోవైపు ఓటీటీ రిలీజ్ విషయంలో రూమర్స్ వస్తున్నాయి. ప్లాన్ మారిందని, అనుకున్న టైం కంటే ముందే స్ట్రీమింగ్ కానుందని అంటున్నారు.2021 డిసెంబరులో 'పుష్ప' సినిమా రిలీజైంది. థియేటర్లలో ఉండగానే.. నెలరోజులకే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పుడు కూడా అలానే చేయబోతున్నారా అనిపిస్తుంది. ఎందుకంటే సాధారణంగా ఓటీటీ రిలీజ్ దగ్గర్లో ఉందంటేనే వీడియో సాంగ్స్ యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తుంటారు. గత నాలుగైదు రోజుల్లో పుష్ప 2 టైటిల్ సాంగ్, కిస్సిక్, ఫీలింగ్స్ వీడియోలని రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: అల్లరి నరేశ్ 'బచ్చలమల్లి' ట్విటర్ రివ్యూ)ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ సంస్థ.. 'పుష్ప 2' డిజిటల్ హక్కుల్ని సొంతం చేసుకుంది. అయితే నాలుగు వారాలకే డీల్ మాట్లాడుకున్నట్లు ఓ న్యూస్ అయితే వైరల్ అవుతోంది. సంక్రాంతి ముందే అంటే జనవరి 9 లేదా 10వ తేదీల్లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. మరి వీటన్నింటిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగితే సరిపోతుందేమో?ప్రస్తుతం రూ.1500 కోట్ల వసూళ్ల మార్క్ దాటేసిన 'పుష్ప 2' సినిమాకు.. క్రిస్మస్, న్యూఇయర్ వీకెండ్ బాగా ప్లస్ అయ్యే అవకాశాలున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం 'బాహుబలి 2' రికార్డ్ గల్లంతవడం గ్యారంటీ. చూడాలి మరి ఏం జరుగుద్దో?(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు) -
భాష మారింది.. కీర్తి సురేశ్ రెమ్యునరేషన్ డబుల్?
'మహానటి' కీర్తి సురేశ్ తెలుగు ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అయిపోయింది. పేరుకే మలయాళీ గానీ టాలీవుడ్లోనే స్టార్ హీరోలతో వరస సినిమాలు చేసింది. రీసెంట్గా ఆంటోని తట్టిళ్ అనే బిజినెస్‌మ్యాన్ పెళ్లి చేసుకుంది. మరోవైపు ఈమె నటించిన తొలి హిందీ సినిమా 'బేబీ జాన్'.. వచ్చే వారం క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ కానుంది. ఇప్పుడు ఈ మూవీ కోసం డబుల్ రెమ్యునరేషన్ తీసుకుందనే టాక్ నడుస్తోంది.ప్రముఖ నిర్మాత సురేశ్, ఒకప్పటి హీరోయిన్ మేనక కూతురైన కీర్తి సురేశ్.. 'నేను శైలజ' సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. ఈ ఏడాది రిలీజైన ప్రభాస్ 'కల్కి'లో కారుకి వాయిస్ ఓవర్ ఇచ్చి ఎంటర్టైన్ చేసింది. ఈమె నటించిన 'బేబీ జాన్' అనే హిందీ మూవీలో నటించింది. తమిళ సినిమా 'తెరి' రీమేక్‌గా దీన్ని తెరకెక్కించారు.(ఇదీ చదవండి: రూ.10 టికెట్లో కూర్చుని 'పుష్ప 2' చూశా: నటి సంయుక్త)ఒరిజినల్ సినిమాలో సమంత కనిపించిన పాత్రలో ఇప్పుడు కీర్తి సురేశ్ నటించింది. సౌత్‌లో నటిస్తే రూ.2 కోట్లు ఈమెకు ఇస్తారు. కానీ 'బేబీ జాన్'లో నటించినందుకుగానూ రూ.4 కోట్లు పైనే పారితోషికం ఇచ్చారట. బహుశా అందుకేనేమో గ్లామర్ విషయంలోనూ తగ్గేదే లే అన్నట్లు పాటల్లో కనిపించింది!ఇదే సినిమాలో నటించిన మిగతా నటీనటులు రెమ్యునరేషన్ విషయానికొస్తే హీరో వరుణ్ ధావన్‌కి రూ.15 కోట్లు పైనే ఇచ్చారట. విలన్‌గా చేసిన జాకీ ష్రాఫ్‌కి కోటిన్నర, మరో హీరోయిన్గా చేసిన వామికా గబ్బికి కోటి రూపాయలు, కీలక పాత్ర చేసిన సన్యా మల్హోత్రాకు రూ.40 లక్షల పారితోషికం ఇచ్చారట. ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ ఈ చిత్రాన్ని నిర్మించగా.. ఇతడి శిష్యుడు కలీస్ దర్శకత్వం వహించాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు) -
బిగ్‌బాస్ విన్నర్‌గా నిఖిల్.. ప్రైజ్‌మనీతోపాటు ఏం సాధించాడంటే?
సరైనోడు, దమ్మున్నోడు, జెంటిల్మెన్.. ఇలాంటి ట్యాగులన్నీ నిఖిల్‌కు సరిగ్గా సరిపోతాయి. ఎంత కోపం వచ్చినా అది క్షణకాలం మాత్రమే! వంద రోజుల జర్నీలో అతడు కంట్రోల్ తప్పిన సందర్భాలను వేళ్లపై లెక్కపెట్టుకోవచ్చు. ఎవరెన్ని నిందలు వేసినా తనలో తను బాధపడ్డాడే తప్ప తిరిగి ఒక్కమాట కూడా అనలేదు. ఫిజికల్ టాస్కుల విషయానికి వస్తే అతడిని ఢీ కొట్టేవాడే లేడన్నంతగా రెచ్చిపోయాడు. నిందలు పడ్డ చోటే నిలబడ్డాడునిఖిల్ ఆటలో అడుగుపెడితే వార్ వన్‌సైడ్ అయిపోద్ది అన్న లెవల్లో ఆడాడు. ఈ క్రమంలో తనకు దెబ్బలు తగిలినా లెక్కచేయలేదు. కంటెస్టెంట్ల సూటిపోటి మాటల వల్ల హౌస్‌ను వీడాలనుకున్నాడు. కానీ తనను ప్రేమించిన ప్రేక్షకుల కోసం మాటలు పడ్డ చోటే నిలబడాలనుకున్నాడు. ఆటతోనే సమాధానం చెప్పాడు. వేలెత్తి చూపించినవారితోనే చప్పట్లు కొట్టేలా చేశాడు. (Bigg Boss 8: అవినాష్ ఎలిమినేట్.. రెమ్యునరేషన్ ఎంతంటే?)సంపాదన ఎంత?సీరియల్ యాక్టర్‌గా పేరు గడించిన నిఖిల్ బిగ్‌బాస్ ప్రియుల మనసు గెలుచుకుని ఏకంగా టైటిల్ విజేతగా నిలిచాడు. రూ.55 లక్షల ప్రైజ్‌మనీ అందుకున్నాడు. దీనితోపాటు మారుతి డిజైర్ కారు అదనపు బహుమతిగా లభించనుంది. ఇకపోతే నిఖిల్ వారానికి రూ.2.25 లక్షల పారితోషికం తీసుకున్నాడట! ఈ లెక్కన పదిహేనువారాలకుగానూ రూ.33,75,000 సంపాదించినట్లు తెలుస్తోంది. అంటే మొత్తంగా రూ. 88 లక్షలు వెనకేశాడు. చదవండి: కోరిక మిగిలిపోయిందన్న తేజ.. నాగార్జున బంపరాఫర్ -
ఆడు మగాడ్రా బుజ్జి.. గౌతమ్ కృష్ణ సంపాదన ఎంతంటే?
ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే వెతుక్కోవాలి, వేలెత్తిచూపించినవారే తలదించుకునేలా చేయాలి.. తిట్టినవారితోనే పొగిడించుకోవాలి.. ఇవన్నీ చేసి చూపించాడు గౌతమ్ కృష్ణ. బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్లో అతడు ఏం కోల్పోయాడో దాన్ని ఈ సీజన్లో తిరిగి సంపాదించాడు. అప్పుడు మూటగట్టుకున్న నెగెటివిటినీ తన మాటతీరుతో, ఆటతీరుతో కడిగిపారేశాడు.(Bigg Boss 8: నబీల్ ఎలిమినేట్.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?)అశ్వత్థామ ఈజ్ బ్యాక్ అన్నప్పుడు నవ్వినవాళ్లే ఈడు మగాడ్రా బుజ్జి అంటున్నారు! బిగ్‌బాస్ 8లో వైల్డ్‌కార్డ్‌గా వచ్చి వైల్డ్ ఫైర్‌లా మారాడు. టైటిల్ రేసులో ఉన్న నిఖిల్‌కు గట్టి పోటీనిచ్చాడు. గతంలో ఫైనల్స్‌కు రాకుండానే వెనుదిరిగిన గౌతమ్ ఇప్పుడేకంగా టాప్ 2లో చోటు దక్కించుకున్నాడు. వారానికి రూ.1.75 లక్షల చొప్పున సంపాదించాడు. అంటే బిగ్‌బాస్ హౌస్‌లో పారితోషికం రూపేణా పది వారాలకుగానూ దాదాపు రూ.17,50,000 వెనకేసినట్లు తెలుస్తోంది.(చదవండి: బిగ్‌బాస్: అందాల రాక్షసి ఎంత సంపాదించిందో తెలుసా?) -
బిగ్‌బాస్: అందాల రాక్షసి ఎంత సంపాదించిందో తెలుసా?
అందాల రాక్షసి.. బిగ్‌బాస్ ప్రేరణకు అంకితమిచ్చిన ట్యాగ్‌లైన్ ఇది. ఈ అందాల భామకు ముక్కు మీద కోపం. ఎవరైనా ఒక్క మాటంటే దానికి పది మాటలు తిప్పి కొడుతుంది. తనను చులకన చేస్తే బుసకొట్టిన పాములా లేస్తుంది. టాస్కుల్లో ప్రాణం పెట్టి ఆడుతుంది. మగవాళ్లకు బలమైన పోటీ ఇస్తుంది. బుద్ధిబలం కూడా మెండు.విపరీతమైన నెగెటివిటీకానీ నోటిదురుసే ఎక్కువ! సిగ్గు లేదా? క్యారెక్టర్‌లెస్? ఆ ముఖం చూడు.. ఇలాంటి మాటలన్నీ తన నోటి నుంచి వచ్చిన ఆణిముత్యాలే! మెగా చీఫ్ అయ్యాక నా మాటే శాసనం అన్నట్లుగా ప్రవర్తించింది. తిండి దగ్గర కూడా ఆంక్షలు పెట్టి అభాసుపాలైంది. విపరీతమైన నెగెటివిటీ మూటగట్టుకుంది. పారితోషికం ఎంతంటే?కానీ తప్పు ఎక్కడ జరుగుతుందో వెంటనే తనను తాను సరిదిద్దుకునే ప్రయత్నం చేసింది. అందుకే టాప్ 5లో నిలబడిన ఏకైక మహిళగా నిలిచింది. తనకు సూట్‌కేస్ ఆఫర్ చేసినా నిర్మొహమాటంగా నో చెప్పింది. ప్రేక్షకులు తనను ఎంతవరకు తీసుకెళ్తే అంతవరకు వెళ్తానని నిలబడింది. నాలుగో స్థానంలో వీడ్కోలు తీసుకుంది. ప్రేరణ వారానికి రూ.2 లక్షల చొప్పున పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన పదిహేనువారాలకుగానూ రూ.30 లక్షలు వెనకేసిందట!చదవండి: Bigg Boss 8: అవినాష్ ఎలిమినేట్.. రెమ్యునరేషన్ మాత్రం.. -
టాప్ 2కి మనీ ఆఫర్.. ఫైనల్‌గా నిఖిల్ విన్నర్!
బిగ్‌బాస్ ఫైనల్లో సూట్‌కేస్ ఆఫర్ చేయడమనేది గత కొన్నేళ్లుగా వస్తున్న ఆనవాయితీ! అయితే మధ్యలోనే టెంప్ట్ అయి సూట్‌కేస్ తీసుకున్నవాళ్లు చాలామందే ఉన్నారు. దీనివల్ల విన్నర్ ఫుల్ ప్రైజ్‌మనీ అందుకోలేకపోతున్నాడు. పైగా ఈసారి కంటెస్టెంట్లకు చాలా హింట్స్ వెళ్లాయి.సూట్‌కేస్ ఆఫర్అసలు సిసలైన పోటీ నిఖిల్, గౌతమ్ మధ్యే అని అందరికీ క్లారిటీ వచ్చేసింది. అందుకే టాప్ 5 మెంబర్స్‌కు సూట్‌కేస్ ఆఫర్ చేయలేదు. కానీ ఎవరూ మొగ్గు చూపలేదట.. తర్వాత ముగ్గురు మిగిలినప్పుడు టెంప్ట్ చేసే ప్రయత్నం చేయగా ఎవరూ తలొంచలేదట!అడుగు దూరంలో ఆగిపోయిన గౌతమ్చివరి ప్రయత్నంగా టాప్ 2 అంటే నిఖిల్, గౌతమ్‌లకు సూట్‌కేస్ ఆఫర్ చేసినప్పటికీ తీసుకోవడానికి ఇద్దరూ వెనకడుగు వేశాడు. దీంతో విన్నర్‌కు రూ.55 లక్షల ప్రైజ్‌మనీ అందింది. మరి ఈ మొత్తం అందుకున్న కంటెస్టెంట్ ఎవరనేది ఆల్రెడీ లీకైపోయింది. గెస్టుగా వచ్చిన రామ్‌చరణ్.. నిఖిల్ మళయక్కల్ను విన్నర్‌గా ప్రకటించినట్లు సమాచారం. దీంతో గౌతమ్ కృష్ణ రన్నరప్ స్థానంతో సరిపెట్టుకున్నాడు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్ ఫినాలేకు ముగ్గురు డుమ్మా.. ఆ కారణం వల్లేనా?
బిగ్‌బాస్ షో తమకు జీవితంలో వచ్చిన పెద్ద అవకాశం అని చాలామంది కంటెస్టెంట్లు చెప్తూ ఉంటారు. ప్రేక్షకులకు తమను దగ్గర చేసిన బిగ్‌బాస్ షోకు ఎప్పటికీ రుణపడి ఉంటామంటుంటారు. అయితే కొందరు మాత్రం ఈ రియాలిటీ షో వల్ల నెగెటివిటీ మూటగట్టుకున్నామని తిట్టిపోస్తుంటారు. ఇదంతా పక్కన పెడితే నేడు బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ గ్రాండ్ ఫినాలే.నెగెటివిటీ మూటగట్టుకున్న హరితేజఅంటే ఈ సీజన్ విజేతను తేల్చే ఆఖరి రోజు. ఇలాంటి పెద్ద ఈవెంట్‌కు ఎలిమినేట్ అయిన ప్రతి కంటెస్టెంట్ వస్తారు. అదేంటో కానీ ఈసారి ఏకంగా ముగ్గురు డుమ్మా కొట్టేశారు. వారే విష్ణుప్రియ, నయని పావని, హరితేజ. విచిత్రంగా సీజన్ 1లో సెకండ్ రన్నరప్‌గా నిలిచిన హరితేజ ఈ సీజన్లో మాత్రం వైల్డ్‌కార్డ్‌గా అడుగుపెట్టి నెలరోజులకే బయటకు వచ్చేసింది. విపరీతమైన నెగెటివిటీ మూటగట్టుకుంది. బహుశా అందుకే గ్రాండ్ ఫినాలేను లైట్ తీసుకుని ఉండవచ్చు!నిరూపించుకోలేకపోయిన నయనిఅటు నయని పావని.. ఏడో సీజన్లో వైల్డ్‌కార్డ్‌గా వచ్చి వారం రోజులకే ఎలిమినేట్ అయిపోయింది. ఈ సీజన్లో తన సత్తా చూపించాలనుకున్నప్పటికీ అన్నింటికీ ఏడ్చేస్తూ మూడువారాలకే హౌస్ నుంచి వచ్చేసింది. బహుశా ఈ బాధతోనే తను రాకపోయి ఉండొచ్చు. ఇక విష్ణుప్రియ.. విన్నర్ అయ్యేంత దమ్మున్నా ఆటపై ఫోకస్ పెట్టకుండా పృథ్వీపై మనసు పారేసుకుంది. గౌతమ్‌పై విష్ణు చిన్నచూపుఅతడు ఛీ కొట్టినా, చులకనగా చూసినా అతడు మాత్రమే కావాలంటూ పిచ్చిగా ప్రవర్తించింది. మనసులోని భావాలను నిర్మొహమాటంగా వ్యక్తపరిచిన ఆమె నిజాయితీ మెచ్చిన జనాలు ఆమెను దాదాపు 100 రోజులు హౌస్‌లో ఉండనిచ్చారు. అయితే గౌతమ్‌పై మొదటి నుంచీ ద్వేషం పెంచుకున్న ఆమె షో నుంచి వెళ్లేటప్పుడు కూడా అతడిని అవమానించింది.ఆ కారణం వల్లే?అసలు నువ్వేం ఆడావో చూస్తానంటూ గడ్డిపోచలా తీసిపారేసింది. కానీ ఇప్పుడేకంగా అతడు టైటిల్ రేసులో ఉన్నాడు. ఆ దృశ్యం చూడలేకే విష్ణు రాలేదని పలువురు నెటిజన్లు భావిస్తున్నారు. మరికొందరేమో తనపై వచ్చిన నెగెటివిటీ తట్టుకోలేకే ఈ ఈవెంట్‌కు డుమ్మా కొట్టి ఉండొచ్చని భావిస్తున్నారు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్ 8: ప్రేరణ, అవినాష్ ఎలిమినేట్!
బిగ్‌బాస్ రియాలిటీ షో మొదలై ఎనిమిదేళ్లు కావస్తోంది. కానీ ఇంతవరకు ఒక్క అమ్మాయి కూడా టైటిల్ గెలవలేదు. ఎలాగైనా సరే ఈసారి ట్రోఫీ అందుకుని చరిత్ర తిరగరాయాలని ప్రేరణ బలంగా కోరుకుంది. అందుకు తగ్గట్లుగానే ఎంతో కష్టపడింది. అబ్బాయిలతోనూ ధీటుగా పోరాడింది. తను పాల్గొన్న ప్రతి టాస్కులోనూ విజృంభించి ఆడింది. లేడీ ఫైటర్ అని పేరు తెచ్చుకుంది. టాప్ 3లో కూడా చోటు దక్కించుకోని ప్రేరణకానీ మైక్రో మేనేజ్మెంట్ వల్ల విమర్శలపాలైంది. అందరికీ ఓపికగా వంటచేసినప్పటికీ కిచెన్‌లో గొడవలు పడి నెగెటివిటీ మూటగట్టుకుంది. ప్రేరణ గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు అనే స్థాయి నుంచి ఈమె ఫైనల్‌కు అయినా వస్తుందా? అనే స్థాయికి పడిపోయింది. అందుకే టాప్3లో కూడా స్థానం దక్కించుకోలేదు.విజేత ఎవరు?ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో బిగ్‌బాస్ 8 గ్రాండ్ ఫినాలే షూటింగ్ సగం పూర్తయింది. మొదటగా ముక్కు అవినాష్‌ను ఎలిమినేట్ చేయగా నాలుగో స్థానంలో ప్రేరణను ఎలిమినేట్ చేసినట్లు తెలుస్తోంది. టాప్ 3లో నిఖిల్, నబీల్, గౌతమ్ కృష్ణ మిగిలారు. మూడో స్థానం నబీల్దే అన్న విషయం అందరికీ తెలుసు.. ఇక విన్నర్, రన్నర్ ఎవరనేది తెలియాలంటే రేపటివరకు ఆగాల్సిందే!మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలేకు అల్లు అర్జున్ రావట్లేదా?
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ వైల్డ్ కార్డ్స్ వచ్చాకే వైల్డ్ ఫైర్‌లా మారింది. మొత్తంగా 22 మంది కంటెస్టెంట్లు పాల్గొన్న ఈ సీజన్లో ఐదుగురు ఫైనల్స్‌కు వచ్చారు. నిఖిల్, నబీల్, ప్రేరణ, గౌతమ్, అవినాష్ టాప్ 5లో ఉన్నారు. అసలు సిసలు పోటీ మాత్రం ఇద్దరి మధ్యే నెలకొంది. గౌతమ్, నిఖిల్.. నువ్వా?నేనా? అన్న రీతిలో ఓటింగ్‌లో దూసుకుపోయారట! గెస్టుగా అల్లు అర్జున్వీరిలో ఒకర్ని విజేతగా ప్రకటించేందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాబోతున్నాడని ప్రచారం జరిగింది. నిజానికి గత సీజన్ ఫైనల్స్‌లోనూ మహేశ్‌బాబు అతిథిగా వస్తున్నాడని టాక్ నడిచింది. కానీ చివరికి ఆయన రానేలేదు. ఇక ఈ సీజన్లోనూ పుష్పరాజ్ వస్తున్నాడని వార్తలు వచ్చాయి. పుష్ప 2 సినిమా ప్రమోషన్స్ కోసమైనా వస్తాడేమోనని ఫ్యాన్స్ ఎదురుచూశారు. నాగార్జున చేతులమీదుగానే..కానీ అంతలోనే సంధ్య థియేటర్ ఘటనలో అరెస్టయ్యాడు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినప్పటికీ పోలీసులు బన్నీని రాత్రంతా జైల్లోనే ఉంచి శనివారం ఉదయం రిలీజ్ చేశారు. జైలు నుంచి విడుదలై ఇంటికి వచ్చిన అల్లు అర్జున్ను పరామర్శించేందుకు సెలబ్రిటీలు క్యూ కడుతున్నారు. ఇలాంటి సమయంలో బన్నీ బిగ్‌బాస్ షోకు వచ్చే అవకాశం కనిపించట్లేదు. దీంతో ఈసారి కూడా నాగార్జున చేతులమీదుగానే విన్నర్‌కు ట్రోఫీ ఇచ్చేయనున్నారన్నమాట!మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
కూతురిని కూడా ఇండస్ట్రీలోకి తెచ్చిన రవితేజ!?
తెలుగు హీరోలు చాలామంది తమ కొడుకుల్ని హీరోలుగా పరిచయం చేస్తారు గానీ కూతుళ్లని హీరోయిన్లని చేయడానికి ఇష్టపడరు. మిగతా విభాగాల్లో పనిచేసే విషయమై కూడా పెద్దగా ప్రోత్సహించారు. కానీ రవితేజ మాత్రం అలా కాదని నిరూపిస్తున్నాడు. ఎందుకంటే ఇతడి కూతురు దర్శకత్వం నేర్చుకుంటోందట.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 18 సినిమాలు)సినీ నేపథ్యం లేకుండా వచ్చి టాలీవుడ్లో స్టార్ హీరో అయ్యాడు రవితేజ. ఇతడికి కొడుకు మహాధన్, కూతురు మోక్షద ఉన్నారు. కొడుకు ఇదివరకే 'రాజా ది గ్రేట్' మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశాడు. ప్రస్తుతం ఓ దర్శకుడి దగ్గర సహాయకుడిగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. రవితేజ కూతురు కూడా ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తోందట.ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ తీస్తున్న ఓ సినిమాకు రవితేజ కూతురు మోక్షద.. అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తుందట. గతంలో రవితేజ కూడా ఇలానే సహాయ దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టాడు. తర్వాత నటుడు అయ్యాడు. బహుశా మోక్షద కూడా ఇలా మొదట దర్శకత్వంలో మెలకువలు నేర్చుకుని, నటి అవుతుందేమో చూడాలి?(ఇదీ చదవండి: మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చేసిన 'మెకానిక్ రాకీ') -
'బిగ్‌బాస్' ఫైనల్ చీఫ్ గెస్ట్‌గా స్టార్ హీరో.. భద్రత పెంచిన పోలీసులు
ఈ నెల 15వ తేదీన బిగ్‌బాస్ సీజన్–8 ఫైనల్ జరగనుంది. ఈ సీజన్ విన్నర్ రేసులో గౌతమ్,నిఖిల్,నబీల్,ప్రేరణ,అవినాష్ ఉన్నారు. బిగ్ బాస్‌లోకి మొత్తం 22మంది ఎంట్రీ ఇస్తే వారిలో ఈ ఐదుమంది మాత్రమే సుమారు 100 రోజులకు పైగా గెలుపు రేసులో ఉన్నారు. అయితే, డిసెంబర్ 15వ తేదీన జరగనున్న గ్రాండ్ ఫినాలే కోసం చీఫ్ గెస్ట్‌గా నేషనల్ అవార్డ్ విన్నర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రానున్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.ఇప్పటి వరకు జరిగిన బిగ్ బాస్ సీజన్లలో ముఖ్య అతిథిగా ఒక సెలబ్రెటీ రావడం సహజమే.. బిగ్ బాస్ రేసులో గెలిచిన వారికి చీఫ్ గెస్ట్ చేతుల మీదుగా ట్రోపీతో పాటు ప్రైజ్ మనీ చెక్‌ను కూడా అందిస్తారు. అయితే, గత సీజన్లో ముఖ్య అతిథిగా ఎవరూ రాలేదు. దీంతో హోస్ట్‌గా షోను నడిపించిన నాగార్జున చేతుల మీదుగానే పల్లవి ప్రశాంత్ ట్రోఫీ అందుకున్నాడు. దీంతో ఈ సీజన్లో తప్పకుండా సినీ సెలబ్రిటీని ముఖ్య అతథిగా తీసుకురావాలని మేకర్స్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ను బిగ్ బాస్‌కు రానున్నారని ప్రచారం జరుగుతుంది. పుష్ప2 విజయంతో బన్నీ విజయోత్సవంలో ఉన్నారు. ఇప్పటికే ఈ చిత్రం రూ. 1000 కోట్ల క్లబ్లో చేరిపోయింది. ఇప్పుడు ఆయన బిగ్ బాస్ ఫైనల్లో అతిథిగా పాల్గొంటే షో మరింత బజ్ క్రియేట్ చేయడం గ్యారెంటీ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బన్నీనే ముఖ్య అతిథిగా బిగ్‌బాస్‌కు వెళ్తే.. అన్నపూర్ణ స్టూడియో వద్ద భారీగా జనం వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది.బిగ్ బాస్ ఫైనల్ కోసం భారీ సెక్యూరిటీబిగ్బాస్ సీజన్–8 ఫైనల్ జరగనున్న నేపథ్యంలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అల్లర్లు, గొడవలకు తావులేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్ పోలీసులు సిద్ధమవుతున్నారు. అన్నపూర్ణ స్టూడియోలోని ఏడెకరాల్లో బిగ్‌బాస్ సెట్టింగ్ వేయగా..ఫైనల్ కూడా ఇక్కడే జరగనుంది. గత ఏడాది డిసెంబర్ 17వ తేదీన బిగ్‌బాస్ సీజన్–7 ఫైనల్ సందర్భంగా తలెత్తిన పరిణామాలు, గొడవలు, బస్సులపై రాళ్లు రువ్వడం తదితర అనుభవాల దృష్ట్యా ఈసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టారు. అన్నపూర్ణ స్టూడియో చుట్టూ 53 సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలని ఇప్పటికే పోలీసులు ఆయా పాయింట్లతో కూడిన జాబితాను అన్నపూర్ణ స్టూడియో, బిగ్‌బాస్ యాజమాన్యానికి అందజేశారు. ఫైనల్ రోజుకు ముందే 14వ తేదీన ఉదయమే వీటిని అమర్చుకోవాలని సూచించారు. -
హీరోయిన్ మీనాక్షి 'అద్దె' గోల.. రూమర్సా? నిజమా?
ప్రస్తుతం టాలీవుడ్లో ట్రెండింగ్ హీరోయిన్ అంటే మీనాక్షి చౌదరినే. ఎందుకంటే గత మూడు నెలల్లో ఈమె చేసిన నాలుగు సినిమాలు రిలీజయ్యాయి. వాటిలో ఒక్కటి బ్లాక్ బస్టర్ హిట్ కాగా.. మరొకటి యావరేజ్ అనిపించుకుంది. మరో రెండు ఫ్లాప్ అయ్యాయి. మూవీస్ రిజల్ట్ సంగతి పక్కనబెడితే ఈమె యాక్టింగ్‌కి మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు ఇవన్నీకాదు మరో విషయమై మీనాక్షి వార్తల్లో నిలిచింది.(ఇదీ చదవండి: జర్నలిస్టుపై దాడి.. మోహన్ బాబుపై పోలీస్ కేసు)తెలుగు సినిమాల్లో చాలావరకు ఉత్తరాది హీరోయిన్లే నటిస్తుంటారు. షూటింగ్ కోసమని హైదరాబాద్ వస్తే వీళ్ల కోసమని నిర్మాతలు పెట్టే ఖర్చు కూడా గట్టిగానే ఉంటుంది. ప్రస్తుతం తెలుగులో వరస అవకాశాలు అందుకుంటున్న మీనాక్షి.. రీసెంట్‌గానే హైదరాబాద్‌లో కొత్తగా ఓ ఫ్లాట్ కొనుక్కుందట. అయితే హైదరాబాద్‌లో షూటింగ్ జరిగినన్నీ రోజులు.. రోజుకు రూ.18 వేలు.. రెంట్లా డిమాండ్ చేస్తోందట.సొంతింట్లో ఉన్నాసరే నిర్మాతల దగ్గర నుంచి మీనాక్షి చౌదరి డబ్బులు డిమాండ్ చేస్తోందనే రూమర్స్ అయితే ప్రస్తుతం వినిపిస్తున్నాయి. మరోవైపు మీనాక్షి వరకు కొన్ని అవకాశాలు పక్కకెళ్లిపోతున్నాయట. త్వరలో 'విరూపాక్ష' దర్శకుడితో నాగచైతన్య ఓ సినిమా చేయబోతున్నాడు. ఇందులో హీరోయిన్గా తొలుత మీనాక్షినే అనుకున్నారట. ఇప్పుడు ఆ ఛాన్స్ వేరే వాళ్లకు వెళ్లిపోయినట్లు టాక్ వినిపిస్తుంది. ఈ రెండు విషయాలకు సంబంధం ఏమైనా ఉందా? లేదే ఇవన్నీ ఒట్టి పుకార్లు మాత్రమేనా అనేది తెలియాల్సి ఉంది!(ఇదీ చదవండి: హాస్పిటల్లో చేరిన ప్రముఖ నటుడు మోహన్ బాబు) -
కంగువ నష్టాలు.. సూర్య నుంచి నిర్మాతకు బిగ్ ఆఫర్
సినిమా రంగంలో చిత్రాలను నిర్మించి నష్టాల పాలైన నిర్మాతలే ఎక్కువగా ఉంటారనేది నిజమని చెప్పవచ్చు. ఇందులో లాభాలు పొందేది తక్కువ మందే. అది చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా తేడా ఉండదు. కానీ, భారీ చిత్రాలతో ఎక్కువ పొగొట్టుకుంటారు. ఈ క్రమంలో నిర్మాతల కష్టాల గురించి ఆలోచించే నటీనటులు చాలా తక్కువ. నటించామా.. పారితోషికం అందిందా అన్నట్లు చాలా మంది తీరు ఉంటుంది. అయితే నటుడు సూర్యలాంటి వారు అందుకు చాలా భిన్నంగా ఉంటారు. సూర్య నిర్మాత కూడా కావడంతో తన నిర్మాతలపై కొంచెం ఎక్కువ అభిమానం చూపిస్తారనే చెప్పాలి. అందుకు చిన్న ఉదాహరణ ఆయన ఇటీవల నటించిన చిత్రం కంగువనే కారణం. శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్‌రాజా భారీ ఎత్తున నిర్మించారు. కోలీవుడ్‌లో చాలా కాలం తరువాత 3డీ ఫార్మాట్లో రూపొందిన చిత్రం ఇది. నటుడు సూర్య ఈ చిత్రంలోని తన పాత్ర కోసం ప్రాణం పోశారనే చెప్పాలి. అయితే చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదనే విమర్శలను మూట కట్టుకుంది. సుమారు వెయ్యేళ్ల క్రితం జరిగే కథను ఈ కాలానికి ముడిపెట్టి రూపొందించడంతో ప్రేక్షకులు అర్థం చేసుకోలేకపోయారేమో. ఏదైమైనా ఈ చిత్రం విషయంలో నటుడు సూర్య ఒక మంచి నిర్ణయం తీసుకున్నట్లు తాజా సమాచారం.కంగువ చిత్రం నష్టాన్ని భర్తీ చేయడానికి నటుడు సూర్య నిర్మాత కేఈ జ్ఞానవేల్‌రాజాకు మరో చిత్రం చేయడానికి పచ్చ జెండా ఊపినట్లు టాక్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కంగువ చిత్రం నిర్మాత జ్ఞానవేల్ కోసమైనా బాగా ఆడాలని నటుడు సూర్య ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ వేదికపైనే చెప్పారన్నది గమనార్హం. ఆయన స్టూడియో గ్రీన్ సంస్థలో మరో చిత్రం చేయడానికి మంచి కథ కోసం చూస్తున్నట్లు తెలిసింది. అయితే దీనికి దర్శకుడు ఎవరన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తన 44వ చిత్రాన్ని పూర్తి చేసిన సూర్య ప్రస్తుతం ఆర్జే.బాలాజీ దర్శకత్వంలో తన 45వ చిత్రాన్ని చేస్తున్నారు. దీని తరువాత వెట్రిమారన్ దర్శకత్వంలో వాడివాసల్ చిత్రం చేస్తారని సమాచారం. ఇవన్నీ పూర్తి చేసిన తరువాత నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజాకు చిత్రం చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ త్వరలో రానున్నట్లు సమాచారం. -
విన్నర్ ప్రైజ్‌మనీ కంటే ఎక్కువే సంపాదించిన విష్ణు!
బిగ్‌బాస్ షో ప్రారంభమైన ప్రతిసారి జనాల్లో మెదిలే ప్రశ్న.. ఈసారైనా లేడీ కంటెస్టెంట్ గెలుస్తారా? అని! ఈ సీజన్లోనూ ఆ చర్చ జరిగింది. భారీ ఫ్యాన్ బేస్‌తో హౌస్‌లో అడుగుపెట్టిన విష్ణుప్రియకు ట్రోఫీ గెలిచే అవకాశం పుష్కలంగా ఉండేది. కానీ తన ఆటను చెడగొట్టుకోవడానికి ఎవరూ అక్కర్లేదు, తాను చాలు అన్నట్లే ప్రవర్తించింది.స్వచ్ఛతకు మారుపేరు విష్ణుగేమ్పై కాకుండా పృథ్వీపై ఫోకస్ చేసింది. తనకంట కూడా అతడే ఎక్కువ అని బాహాటంగానే ప్రకటించింది. భూతద్దం వేసి వెతికినా ఎక్కడా తనలో గెలవాలన్న కసి కనిపించలేదు. పృథ్వీ ఎలిమినేట్ అయ్యాక ఆటలో యాక్టివ్ అయింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే ఆమె నిర్మొహమాటంగా, నిజాయితీగా వ్యవహరించే తీరు మాత్రం జనాలకు బాగా నచ్చేసింది.విన్నర్ కంటే ఎక్కువ సంపాదనకానీ టైటిల్ గెలవాలంటే ఆ ఒక్కటే ఉంటే సరిపోదు కదా! లేడీ విన్నర్ అవాలనుందన్న విష్ణు ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదు. ఫలితంగా పద్నాలుగోవారం ఎలిమినేట్ అయింది. అయితే విన్నర్ కంటే ఎక్కువ సంపాదించేసింది. వారానికి సుమారు రూ.4 లక్షల చొప్పున పారితోషికం తీసుకుంటున్న ఈమె పద్నాలుగువారాలకు గానూ రూ.56 లక్షలు వెనకేసిందట! అంటే విన్నర్ ప్రైజ్‌మనీ కంటే కూడా విష్ణు ఎక్కువే సంపాదించింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్ 8లో చివరి ఎలిమినేషన్.. ఆమెపై వేటు!
బిగ్‌బాస్ 8 తెలుగు సీజన్ చివరికొచ్చేసింది. తర్వాత వారంలో ఫినాలే జరగబోతుంది. దీంతో ఈ వీకెండ్ జరగబోయే ఎలిమినేషన్ చివరిది. దీంతో ఎవరు బయటకెళ్లిపోతారా అని ప్రస్తుతం సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది. ప్రస్తుతం హౌసులోని పరిస్థితుల ప్రకారం ఇద్దరమ్మాయిలు డేంజర్ జోన్లో ఉన్నారు. వీళ్లలో ఒకరైనా స్టార్ కంటెస్టెంట్ ఈసారి ఎగ్జిట్ పక్కా అని అంటున్నారు.ఈ వారమంతా హౌసులో విభిన్న రంగాలకు చెందిన పలువురు వ్యక్తులు వచ్చి, హౌసులోని సభ్యులతో కాసేపు ముచ్చట్లు పెట్టి వెళ్లిపోయారు. ఈ వారం అవినాష్ తప్పితే మిగిలిన ఆరుగురు నామినేషన్లలో ఉన్నారు. వీరిలో నిఖిల్, గౌతమ్ ఏకంగా టైటిల్ రేసులో ఉన్నారు కాబట్టి వీళ్లిద్దరూ ఎలిమినేట్ అయ్యే అవకాశమే లేదు. ప్రేరణ కూడా టాప్-5 రేసులో ఉంది. దీంతో ఈమె కూడా బయటకెళ్లకపోవచ్చు.(ఇదీ చదవండి: విజయ్ దేవరకొండ పెళ్లి టాపిక్.. తండ్రి ఏమన్నారంటే?)వీళ్లు కాకుండా అంటే నబీల్, విష్ణుప్రియ, రోహిణి ఉంటారు. కొన్నాళ్ల ముందు వరకు చాలా బ్యాలెన్స్‌గా గేమ్ ఆడుతూ వచ్చిన నబీల్.. ఈ మధ్య కాస్త విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. అయితేనేం టాప్-5కి నబీల్ అర్హుడే అనిపిస్తుంది. ఓటింగ్ పరంగానూ ఇదే అనిపిస్తుంది. ఎందుకంటే చివరి రెండు స్థానాల్లో రోహిణి, విష్ణుప్రియ ఉన్నారు.పృథ్వీతో లవ్వాట తప్పితే విష్ణుప్రియ.. ఈ సీజన్ అంతా అంతంత మాత్రంగానే ఫెర్ఫార్మెన్స్ చేస్తూ వస్తోంది. ఈమెతో పోలిస్తే ఎంటర్టైన్, గేమ్స్ పరంగా రోహిణి చాలా బెటర్ అని చెప్పొచ్చు. ఓటింగ్ పరంగా చూసుకుంటే రోహిణి వెళ్లిపోయే అవకాశాలే ఎక్కువ. అదే గేమ్ లెక్కల బయటకు తీస్తే మాత్రం విష్ణుప్రియ.. ఈ వారం ఎగ్జిట్ అయిపోవడం గ్యారంటీ. లేదంటే బిగ్‌బాస్.. గతవారం తేజ, పృథ్వీని పంపినట్లు డబుల్ ఎలిమినేషన్ ఏమైనా ప్లాన్ చేసాడా అనేది చూడాలి?(ఇదీ చదవండి: 'పుష్ప2' టికెట్ల ధరలు తగ్గనున్నాయా.. కారణం ఇదేనా..?) -
చిరంజీవి కోసం ప్రభాస్ కాంప్రమైజ్ కానున్నాడా..?
సలార్, కల్కి 2898ఏడీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా 'రాజాసాబ్'. హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్న ఈ మూవీకి మారుతి దర్శకుడు. చాలావరకు ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తున్నట్లు చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు కూడా.. అయితే, ఇప్పుడు అనుకున్న సమయానికి ఈ చిత్రం విడుదల కాకపోవచ్చని తెలుస్తోంది. ఈమేరకు ఇండస్ట్రీలో వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి.‘రాజాసాబ్’ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. 2025 జనవరి సమయానికి ఈ చిత్రం షూటింగ్ కూడా పూర్తి అవుతుంది. కానీ, ఈ సినిమాలో ఎక్కువ సీన్స్‌కు VFX వర్క్‌తో లింక్ అయి ఉన్నాయట. దీంతో ఏప్రిల్ 10 నాటికి కూడా ఆ పనులు పూర్తి కావడం కాస్త కష్టమేనని తెలుస్తోంది. సమ్మర్‌కు విడుదల అవుతుందని అశించిన ప్రభాస్ ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురుకానుందని తెలుస్తోంది. అయితే, సంక్రాంతి కానుకగా ఒక సాంగ్‌ను విడుదల చేస్తున్నట్లు సమాచారం.చిరంజీవి కోసం ప్రభాస్ కాంప్రమైజ్చిరంజీవి 'విశ్వంభర' సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంటూ గేమ్ ఛేంజర్‌కు ఛాన్స్ ఇచ్చారు. అయితే, విశ్వంభర ఎప్పుడు విడుదల అవుతుందో మాత్రం వారు ప్రకటించలేదు. అయితే, వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల కానుందని నెట్టింట ఒక వార్త వైరల్ అవుతుంది. అదే డేట్‌కు ప్రభాస్ రాజాసాబ్ వస్తున్నట్లు ఇప్పటికే ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. కానీ, విశ్వంభర సినిమాను ప్రభాస్ అనుబంధ సంస్థ యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుండటంతో మెగాస్టార్‌కు పోటీగా ఆయన ఎట్టి పరిస్థితిల్లో బరిలోకి దిగడని తెలుస్తోంది. ఈ కారణం వల్ల రాజాసాబ్ ఏప్రిల్ 10న విడుదల కాకపోవచ్చని కూడా సమాచారం. ప్రభాస్ లిస్ట్‌లో ఇప్పటికే చాలా సినిమాలు ఉన్నాయి. కె.జి.ఎఫ్, సలార్ వంటి భారీ చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిలింస్‌తో ప్రభాస్ మూడు సినిమాలు చేయనున్నారు. 'సలార్2'తో ఈ ప్రయాణం మొదలవుతోందని ఆ నిర్మాణ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. 2026, 2027, 2028 సంవత్సరాల్లో ఆ సినిమాలు రానున్నట్లు కూడా తెలిపింది. ప్రభాస్ - ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో ఒక సినిమాతో పాటు ప్రభాస్ - లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో మరో సినిమా తెరకెక్కించాలని ఈ సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సందీప్ వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమా కూడా లైన్లో ఉన్న విషయం తెలిసిందే. -
టాలీవుడ్ హీరోయిన్ వీడియో!
హీరోయిన్ ప్రగ్య నగ్ర(#pragyanagra) పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆమెకు చెందినదిగా పేర్కొంటున్న ప్రైవేట్ వీడియో ఒకటి ఆన్లైన్లో లీకైంది. అందులో ఆమె ప్రియుడితో ఏకాంతంగా ఉంది. ప్రగ్య పేరు చెడగొట్టేందుకు ఎవరో దుండగులు డీప్ ఫేక్ సాయంతో ఈ వీడియో సృష్టించారని అభిమానులు అంటున్నారు. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.కాగా ప్రగ్య నగ్ర.. వరలరు ముఖ్యం అనే తమిళ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. నదికలిళ్ సుందరి యమున అనే మలయాళ మూవీలోనూ నటించింది. లగ్గం సినిమాతో ఇటీవలే తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.చదవండి: గౌతమ్‌ను ఈడ్చుకెళ్లిన నిఖిల్.. కావాలని కొడతావంటూ కామెంట్స్ -
'పుష్ప 2' కలెక్షన్స్.. హిందీలో బన్నీ బ్రాండ్ రికార్డ్!
అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమాకు తొలిరోజు ఎన్ని కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయనేది మరికాసేపట్లో తెలుస్తుంది. ఎంతొస్తుందనే విషయం పక్కనబెడితే ఇప్పుడు బాలీవుడ్లో బన్నీ తనదైన బ్రాండ్ రికార్డ్ సెట్ చేశాడు. తొలిరోజు కలెక్షన్స్‌తో ఏకంగా దిగ్గజ షారుఖ్ ఖాన్నే అధిగమించేశాడట. నార్త్ అంతా ఇప్పుడు ఇదే టాక్.(ఇదీ చదవండి: పుష్ప 2 'జాతర' సాంగ్ రిలీజ్ చేశారు!)తెలుగుతో పోలిస్తే 'పుష్ప 2'కి ఉత్తరాదిలో బీభత్సమైన హైప్ ఉంది. పాట్నాలో ఈవెంట్ జరగ్గా.. దానికి వచ్చిన లక్షలాది జనమే ఇందుకు బెస్ట్ ఉదాహరణ. అందుకు తగ్గట్లే నార్త్‌లో తొలిరోజు ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మరథం పట్టారు. అలా ఏకంగా హిందీ వెర్షన్‌కి తొలిరోజు రూ.67 కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయట.గతంలో షారుక్ 'జవాన్' మూవీకి రూ.64 కోట్ల నెట్ కలెక్షన్ వచ్చాయి. ఇప్పుడు దీన్ని దాటేసిన అల్లు అర్జున్.. బాలీవుడ్లో తన జెండాని మరింత బలంగా పాతేశాడు. ఓ రకంగా చెప్పాలంటే బాలీవుడ్‌ని ఇకపై బన్నీవుడ్ అని పిలొచ్చేమో! తొలిరోజే ఈ రేంజులో ఉందంటే.. వీకెండ్ అయ్యేసరికి తెలుగు సంగతి పక్కనబెడితే హిందీలో సగం రికార్డులు 'పుష్ప 2' దెబ్బకు గల్లంతవడం గ్యారంటీ.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 19 సినిమాలు) -
'పుష్ప 2' రెమ్యునరేషన్.. ఎవరికెంత ఇచ్చారు?
మరికొన్ని గంటల్లో 'పుష్ప 2' సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. హైప్ అయితే గట్టిగానే ఉంది. మరోవైపు టికెట్ రేట్ల గురించి కాస్తంత విమర్శలు వచ్చాయి గానీ ఆ ప్రభావం, బుకింగ్స్‌పై మాత్రం కనిపించట్లేదు. తొలి భాగం తీసేటప్పుడు ఓ తెలుగు సినిమాగానే రిలీజ్ చేశారు. కానీ తర్వాత తర్వాత నార్త్‌లోనూ దుమ్మురేపింది. దీంతో అంచనాలు, బడ్జెట్, మూవీ స్కేల్ అమాంతం పెరిగిపోయాయి. దీనికి తోడు నటీనటులు పారితోషికాలు కూడా గట్టిగానే ఉన్నాయండోయ్. ఇంతకీ ఎవరెవరు ఎంత తీసుకున్నారు?'పుష్ప' తొలి పార్ట్ రిలీజ్ ముందు వరకు బన్నీ అంటే తెలుగు రాష్ట్రాలు, మహా అయితే కేరళ వరకు తెలుసేమో! కానీ ఇది సృష్టించిన ప్రభంజనం దెబ్బకు ఉత్తరాదిలోనూ బన్నీ పేరు గట్టిగానే వినిపించింది. ఆ తర్వాత 'పుష్ప' మూవీకిగానూ జాతీయ అవార్డ్.. ఇలా రేంజ్ పెరుగుతూనే పోయింది. దీంతో సీక్వెల్ విషయంలో రెమ్యునరేషన్ బదులు లాభాల్లో షేర్ తీసుకోవాలని బన్నీ నిర్ణయం తీసుకున్నాడు. కట్ చేస్తే ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.1000 కోట్లు దాటేసింది. అలా రూ.270-80 కోట్ల మొత్తం బన్నీ పారితోషికంగా అందుకున్నాడట.(ఇదీ చదవండి: అల్లు అర్జున్ 'ప్లానెట్ స్టార్'.. ఆర్జీవీ ట్వీట్ వైరల్)బన్నీ తర్వాత డైరెక్టర్ సుకుమార్‌ది హయ్యస్ట్. తొలి పార్ట్ కోసం కేవలం దర్శకుడిగా పనిచేసిన ఇతడు.. సీక్వెల్‌కి వచ్చేసరికి తన సుకుమార్ రైటింగ్స్ సంస్థతో నిర్మాణంలోనూ భాగమయ్యాడు. అలా డైరెక్టర్ కమ్ నిర్మాతగా రూ.100 కోట్ల పైనే రెమ్యునరేషన్ అందుకున్నాడని తెలుస్తోంది. మిగిలిన నటీనటుల విషయానికొస్తే హీరోయిన్ రష్మికకు రూ.10 కోట్లు, ఫహాద్ ఫాజిల్‌కి రూ.8 కోట్లు, ఐటమ్ సాంగ్ చేసిన శ్రీలీలకు రూ.2 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇచ్చారట. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌కి రూ.5 కోట్లు పైనే పారితోషికం ఇచ్చారట.వీళ్లు కాకుండా సినిమాలోని ఇతర కీలక పాత్రలు చేసిన జగపతిబాబు, రావు రమేశ్, సునీల్, అనసూయ, అజయ్ తదితరులకు భారీ మొత్తంలోనే రెమ్యునరేషన్ ఇచ్చారట. ఈ లెక్కన చూసుకుంటే రూ.600 కోట్ల మేర మూవీకి బడ్జెట్ అయిందని అంటున్నారు. కానీ ఇందులో సగం బడ్జెట్, పారితోషికాలకే సరిపోయాయేమో అనిపిస్తోంది. ఎందుకంటే అంతమంది స్టార్స్ పనిచేశారు మరి!(ఇదీ చదవండి: 'పుష్ప 2'పై బీజేపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్) -
'పుష్ప 2'.. తమన్‌ని సైడ్ చేసేశారా?
మరో ఒకటి రెండు రోజుల్లో 'పుష్ప 2' థియేటర్లలోకి రాబోతుంది. రిలీజయ్యేంత వరకు అంతా టెన్షన్ టెన్షనే. ఫైనల్ మిక్స్ ఇప్పుడు పూర్తయినట్లు చెప్పారు. కొన్నిరోజుల క్రితం 'పుష్ప 2' బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో ఎంతలా రూమర్స్ వచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఆ విషయమై షాకింగ్ విషయం ఒకటి వైరల్ అవుతోంది.'పుష్ప' సినిమాలకు మ్యూజిక్ అంతా దేవిశ్రీ ప్రసాదే. అయితే పార్ట్-2 విషయంలో టైమ్ దగ్గర పడుతుండేసరికి తమన్, అజనీష్ లోక్‌నాథ్, శామ్ సీఎస్ తదితరులు కూడా పనిచేస్తున్నారని రూమర్స్ వచ్చాయి. కొన్నిరోజుల క్రితం బాలకృష్ణ 'డాకు మహరాజ్' టీజర్ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన తమన్.. తాను కూడా 'పుష్ప 2' కోసం పనిచేస్తున్నట్లు చెప్పాడు.(ఇదీ చదవండి: 'పుష్ప 3'.. అసలు ఉన్నట్టా? లేనట్టా?)కానీ ఇప్పుడు 'పుష్ప 2' ఫైనల్ మిక్సింగ్ అంతా పూర్తయిన తర్వతా ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది. సినిమా కోసం కేవలం దేవి, శామ్ సీఎస్ మాత్రమే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారని, మిగిలిన వాళ్లిచ్చిన ఔట్పుట్ ఉపయోగించుకోలేదని అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజముందనేది మరికొన్ని గంటల్లో తేలిపోతుంది. ఎందుకంటే సినిమా టైటిల్ కార్డ్స్‌లో పేర్లు పడతాయిగా!హైదరాబాద్‌లో మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా.. దాదాపు అందరూ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ గురించే ప్రస్తావించారు తప్పితే మరో మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడలేదు. ఇప్పుడొస్తున్న రూమర్స్ చూస్తే బహుశా నిజమే అనిపిస్తోంది.(ఇదీ చదవండి: 'బ్లాక్' సినిమా రివ్యూ (ఓటీటీ)) -
కోడలు శోభితకి నాగార్జున ఆ గిఫ్ట్ ఇవ్వబోతున్నాడా?
అక్కినేని వారి ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. రెండు రోజుల క్రితం మంగళస్నానాలు జరిగాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలని స్వయంగా శోభితనే ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. మరోవైపు పెళ్లి కోసం ఇప్పటికే ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. అదే టైంలో కాబోయే కోడలికి అక్కినేని ఫ్యామిలీ ఇవ్వబోయే బహుమతుల ఇవేనంటూ సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8: తేజ ఎలిమినేట్.. 8 వారాలకు ఎంత సంపాదించాడు?)నాగచైతన్య-శోభిత గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. పెద్దల్ని ఒప్పించి పెళ్లికి సిద్ధమయ్యారు. డిసెంబరు 4న అక్కినేని ఫ్యామిలీకి చెందిన అన్నపూర్ణ స్టూడియోలోనే వివాహం జరగనుంది. అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకకు టాలీవుడ్ నుంచి మెగా, దగ్గుబాటి కుటుంబ సభ్యులతో పాటు రాజమౌళి లాంటి అతికొద్ది మందే హాజరుకానున్నారని టాక్.రీసెంట్గా నాగార్జున.. రూ.2 కోట్లు విలువైన లెక్సెస్ కారు కొన్నారు. అయితే ఇది శోభితకి బహుమతిగా ఇవ్వడం కోసమే కొన్నారనే అనుకుంటున్నారు. దీనితో పాటు కొన్ని విలువైన బంగారు ఆభరణాల్ని కూడా శోభితకు అక్కినేని ఫ్యామిలీ బహుమతిగా ఇవ్వబోతున్నారట. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.(ఇదీ చదవండి: ధనుష్‌తో వివాదం.. విఘ్నేశ్ శివన్ మిస్సింగ్!) -
ఓటీటీలో 'అమరన్' స్ట్రీమింగ్ తేదీని లాక్ చేశారా..?
శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన సూపర్ హిట్ చిత్రం ‘అమరన్’. థియేటర్స్‌లో భారీ కలెక్షన్స్‌తో రికార్డ్స్ క్రియేట్ చేసిన ఈ మూవీ ఇప్పుడు నెట్‌ప్లిక్స్ ఓటీటీలోకి రానుంది. ఈమేరకు నెట్టింట ఒక వార్త ట్రెండ్ అవుతుంది. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్తో కలిసి నిర్మించారు. దీపావళి కానుకగా విడుదలైన లక్కీ భాస్కర్,క సినిమాలు ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేశాయి. అయితే, అమరన్ మాత్రం స్ట్రీమింగ్కు రాలేదు. దీంతో ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ భారీగా ఎదురుచూస్తున్నారు.భారీ అంచనాల మధ్య అక్టోబర్ 31న విడుదలై అమరన్ చిత్రాన్ని శివ్ అరూర్, రాహుల్ సింగ్ రాసిన “ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్” అనే పుస్తకంలోని “మేజర్ వరదరాజన్” చాప్టర్ ఆధారంగా తెరకెక్కించారు. అయితే, ఈ సినిమా విడుదలై ఇప్పటికే నాలుగు వారాలు దాటింది అయనప్పటికీ కలెక్షన్స్ పరంగా కొన్ని చోట్ల రానిస్తుంది. దీంతో ఓటీటీ విషయంలో ఆలస్యమైంది. అయితే, డిసెంబర్ 5న నెట్‌ప్లిక్స్‌లో అమరన్ విడుదల కానుందని తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ దాదాపు ఇదే తేదీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.అమరన్ చిత్రాన్ని సుమారు రూ. 120 కోట్లతో తెరకెక్కించారు. అయితే, ఇప్పటి వరకు రూ. 331 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి ఈ ఏడాదిలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన తమిళ చిత్రాల జాబితాలో అమరన్ చేరింది. శివకార్తికేయన్ కెరీర్లో టాప్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా అమరన్ నిలిచింది. -
హైదరాబాద్‌లోనే 'పుష్ప 2' ఈవెంట్.. కానీ ప్లాన్ ఛేంజ్!
పాట్నా, చెన్నై, కొచ్చి, ముంబయి.. ఇలా పాన్ ఇండియా సినిమాకు తగ్గట్లే దేశమంతా 'పుష్ప 2' టీమ్ తెగ తిరిగేస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈవెంట్ ఎక్కడ నిర్వహిస్తారా అనేది కాస్త సందేహంగా అనిపించింది. అయితే ఇప్పుడు వాటికి ఎండ్ కార్డ్ పడిందని తెలుస్తోంది. హైదరాబాద్‌లోనే ఈవెంట్ నిర్వహిస్తున్నప్పటికీ ప్లాన్‌లో చిన్న మార్పు జరిగినట్లు సమాచారం.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 28 సినిమాలు)డిసెంబరు 5న థియేటర్లలో రిలీజయ్యే 'పుష్ప 2'కి కావాల్సినంత బజ్ ఏర్పడింది. అయినా సరే టీమ్‌తో కలిసి దేశమంతా చుట్టేస్తున్న అల్లు అర్జున్.. హైప్‌ని ఇంకా పెంచేస్తున్నాడు. గతంలో 'దేవర' విషయంలో గందరగోళం జరిగిన దృష్ట్యా.. 'పుష్ప 2' హైదరాబాద్ ఈవెంట్‌కి అనుమతిస్తారా అనేది డౌట్‌గానే ఉండేది. యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ఉండొచ్చు అన్నారు. కానీ ఇది ఇప్పుడు మల్లారెడ్డి కాలేజీ గ్రౌండ్‌కి మారిందట.టీమ్ అధికారికంగా ప్రకటించినప్పటికీ.. ఇదే వేదిక ఫైనల్ అయిందని తెలుస్తోంది. ఇప్పటికే సెన్సార్ కూడా అయిపోయింది కాబట్టి డైరెక్టర్ సుకుమార్ కూడా ఈ వేడుకలో పాల్గొంటారని సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో? (ఇదీ చదవండి: చైతూ-శోభిత పెళ్లి సందడి.. హల్దీ ఫొటోలు వైరల్) -
'పుష్ప 2' నిడివి లాక్.. ఏకంగా అన్ని గంటలా?!
'పుష్ప 2' మరో పదిరోజుల్లో థియేటర్లలోకి రానుంది. చివరివరకు షూటింగ్ బిజీ నడుస్తూనే ఉంది. ఇది ఇప్పుడు పూర్తయిందని తెలుస్తోంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే రన్ టైమ్ (నిడివి) లాక్ చేసినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: విషాదం.. టాలీవుడ్ గీత రచయిత కన్నుమూత)'పుష్ప' తొలి భాగం 2 గంటల 59 నిమిషాల నిడివి. ఇప్పుడు రెండో భాగాన్ని అంతకు మించి నిడివితో రిలీజ్ చేయబోతున్నారు. ఏకంగా 3 గంటల 21 నిమిషాల నిడివి ఉండబోతుందని తెలుస్తోంది. కంటెంట్ ఉంటే ఈ రన్ టైమ్ పెద్ద సమస్య ఏం కాదు. ఎందుకంటే ఇంతే నిడివితో తీసిన 'యానిమల్'.. ఏ రేంజ్ బీభత్సం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇప్పుడు 'పుష్ప 2' కూడా భారీ నిడివితో ప్రేక్షకుల ముందుకు రాబోతుందనమాట. ఇప్పటికే సెన్సార్ పూర్తవ్వాలి. బహుశా ఒకటి రెండు రోజుల్లో దాన్ని కూడా అయిపోగొట్టేస్తారేమో చూడాలి. ఇదిలా ఉండగా డిసెంబరు 5న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. దక్షిణాదిలో పక్కనబెడితే ఉత్తరాదిలో మాత్రం భారీ అంచనాలే ఉన్నాయి. రూ.1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగిందని టాక్.(ఇదీ చదవండి: శివంగి మళ్లీ గెలుపు.. బిగ్‌బాస్ 8 తొలి ఫైనలిస్ట్ ఎవరంటే?) -
స్ట్రాంగ్ ఉమెన్.. ఆ తప్పుల వల్లే యష్మి ఎలిమినేట్!
యష్మి గౌడ.. స్ట్రాంగ్ ఉమెన్, టాప్ 5 కంటెస్టెంట్ అని అంతా అనుకున్నారు. ఆ రేంజ్లో ఉండేది యష్మి ఆట. తను టాస్క్‌లో దిగితే ఎలాగైనా గెలవాల్సిందే అన్నంత కసిగా ఆడేది. ఆడపులి అన్న సెల్ఫ్ ట్యాగ్ ఇచ్చుకున్న సోనియాకే చుక్కలు చూపించింది. తనలో ఫైర్ చూసి ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. కానీ తర్వాతి వారాల్లో యష్మి ఆట గాడితప్పింది.సంచాలక్‌గా వరస్ట్ప్లేయర్గా బెస్ట్ అనిపించుకున్నా సంచాలక్‌గా వరస్ట్ గేమ్స్ ఆడింది. ఎప్పుడైతే నిఖిల్‌పై ఆసక్తి చూపించడం మొదలుపెట్టిందో అప్పటినుంచి తన డౌన్‌ఫాల్ మొదలైంది. అతడిని ఎవరైనా నామినేట్ చేసినా ఈవిడే తెగ ఫీలైపోయేది. అతడితో డ్యాన్స్ చేయడం కోసం విష్ణుప్రియతో విపరీతంగా గొడవపడింది.నిఖిల్ చుట్టూ గేమ్తన కోసం గేమ్ ఆడటం మానేసి ఎవరికోసమో పాకరిల్లడమేంటని ఫ్యాన్స్ సైతం హర్టయ్యారు. ఫ్రెండ్‌లా అయినా ఉండరా అంటూ అతడి వెంట పడ్డ యష్మి ఈ వారం నామినేషన్లో మాత్రం అతడిపై ఏ ఫీలింగ్స్ లేవని ప్లేటు తిప్పేయడం మరింత షాక్‌కు గురిచేసింది. ఇలా మాట మార్చడాల వల్ల ఆమె తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంది. పారితోషికం ఎంత?చివరకు తన ఏడుపు కూడా ఫేక్ అని జనాలు ముద్ర వేసే స్థాయికి దిగజారిపోయింది. ఫైనల్‌గా ఈ వారం ఎలిమినేట్ అయింది. ఇకపోతే యష్మి.. ఒక్కవారానికిగానూ రూ.2.50 లక్షలు సంపాదించినట్లు తెలుస్తోంది. 12 వారాలకుగానూ ఆమె రూ.30 లక్షలు వెనకేసిందన్నమాట!మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
రెమ్యునరేషన్ పెంపు.. అంత పిచ్చోడిని కాదన్న హీరో!
సినిమా హిట్టయిందంటే చాలు చాలామంది రెమ్యునరేషన్ పెంచేస్తుంటారు. అలాంటిది బాలీవుడ్ హీరో రాజ్‌కుమార్ రావు రూ.50 కోట్లు పెట్టి తీసిన స్త్రీ 2 సినిమాతో రూ.700 కోట్లు సాధించాడు. ఇంతటి ఘన విజయం తర్వాత ఆ హీరో కూడా రేటు పెంచేశాడని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు అందుకుంటున్న పారితోషికానికి అదనంగా మరో రూ.5 కోట్లు అడుగుతున్నాడట! అంత తెలివితక్కువవాడిని కాదుఈ పుకార్లపై రాజ్‌కుమార్ స్పందించాడు. నా నిర్మాతలను కాల్చుకుతినేంత తెలివితక్కువవాడిని కాదు. బ్లాక్‌బస్టర్ సినిమా చేసినంతమాత్రాన నేనేమీ మారిపోను. డబ్బు కన్నా నాకు ప్యాషనే ముఖ్యం. ఛాలెంజ్, సర్ప్రైజింగ్ రోల్స్ చేస్తూ మిమ్మల్ని అలరిస్తూనే ఉంటా అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే స్త్రీ 2 సినిమాకుగానూ రాజ్‌కుమార్ రూ.6 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది.సినిమా..స్త్రీ 2 విషయానికి వస్తే.. రాజ్‌కుమార్ రావు, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. 2018లో వచ్చిన హిట్ మూవీ స్త్రీకి ఇది సీక్వెల్‌గా తెరకెక్కింది. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ కామెడీ చిత్రం ఆగస్టు 15న విడుదలవగా.. ప్రపంచవ్యాప్తంగా వందలకోట్లు వసూలు చేసింది. స్త్రీ 2 అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. చదవండి: వైల్డ్‌కార్డ్ విన్నరేంటి? ఇది అధర్మం కాదా?: అభయ్ నవీన్ -
ఓటీటీలో 'కంగువా' స్ట్రీమింగ్ అప్డేట్
కోలీవుడ్ టాప్ హీరో సూర్య నటించిన కంగువా సినిమా ఓటీటీలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. నవంబరు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ అనుకున్నంత స్థాయిలో మెప్పించలేదు. దీంతో సూర్య కెరీర్లో దారుణమైన నష్టాలను ఈ చిత్ర నిర్మాతలు లైకా ప్రొడక్షన్స్ వారు ఎదుర్కోనున్నారు. కంగువా సినిమా ఓటీటీ రైట్స్‌ను అత్యధిక ధరకు అమెజాన్ దక్కించుకుంది. దీంతో ఒక రకంగా చిత్ర నిర్మాతలను ఈ ఓటీటీ సంస్థే కాపాడినట్లు అయింది.కంగువా ఓటీటీ రైట్స్ దక్కించుకున్నట్లు గతంలోనే అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రకటించింది. సినిమా విడుదలైన నాలుగు వారాలకు ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానుంది. డిసెంబర్ 13న ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. సుమారు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 130 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు సమాచారం. అయితే, అమెజాన్ ప్రైమ్ మాత్రం రూ. 100 కోట్లకు కంగువా రైట్స్ దక్కించుకున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం ఉంది.కంగువా సినిమా ప్రారంభంలో 30 నిమిషాల పాటు చాలా బోరింగ్‌గా ఉందని ప్రచారం రావడంతో మూవీ నుంచి 12 నిమిషాల పాటు కొన్ని సీన్లు తొలగించారు. జ్యోతిక కూడా సినిమాపై ఇదే విమర్శ చేసింది. సూర్య,బాబీ డియోల్,దిశా పటాని నటించిన ఈ చిత్రాన్ని శివ దర్శకత్వం వహించారు. -
ఓటీటీలోకి రీసెంట్ తెలుగు బ్లాక్‌బస్టర్ సినిమా!
దుల్కర్ సల్మాన్.. పేరుకే మలయాళ హీరో కానీ తెలుగు హ్యాట్రిక్స్ హిట్స్ కొట్టాడు. 'మహానటి', 'సీతారామం' సినిమాలతో గుర్తింపు రాగా.. దీపావళికి రిలీజైన 'లక్కీ భాస్కర్'.. సక్సెస్‌తో పాటు రూ.100 కోట్ల కలెక్షన్స్ కూడా సాధించి పెట్టింది. ఈ మూవీ ఇప్పటికే థియేటర్లలో పలుచోట్ల ఆడుతోంది. ఇదలా ఉండగానే ఓటీటీ స్ట్రీమింగ్ కూడా ఫిక్సయినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: సుకుమార్ ఇంట్లో పనిమనిషికి ప్రభుత్వం ఉద్యోగం)దుల్కర్ సల్మాన్-మీనాక్షి చౌదరి నటించిన 'లక్కీ భాస్కర్'. 1990ల్లో జరిగిన బ్యాంక్ స్కామ్ కాన్సెప్ట్‌తో తీసిన సినిమా. 'సార్' చిత్రంతో ఆకట్టుకున్న వెంకీ అట్లూరి.. ఈసారి బ్యాంక్ కథతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. రిలీజ్‌కి ముందే ఈ మూవీ ఓటీటీ డీల్ క్లోజ్ అయింది. నెట్‌ఫ్లిక్స్ సంస్థ డిజిటల్ హక్కుల్ని దక్కించుకుంది.ఇకపోతే 'లక్కీ భాస్కర్' ఓటీటీ డీల్‌ని నెట్‌ఫ్లిక్స్ నాలుగు వారాల కోసమని మాట్లాడుకుందట. అలా అక్టోబరు 31న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం.. నవంబర్ 30న స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. దాదాపు ఇది కన్ఫర్మ్ అయినప్పటికీ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దీనితో పాటే థియేటర్లలో రిలీజైన 'క', 'అమరన్' కూడా త్వరలోనే ఓటీటీలోకి వచ్చే అవకాశముంది.(ఇదీ చదవండి: నా జీవితంలోని అద్భుతం నువ్వు.. 'బేబి' వైష్ణవి పోస్ట్ వైరల్) -
బిగ్‌బాస్: యష్మి ఎలిమినేట్!
బిగ్‌బాస్ షో నుంచి మరొకరు వెళ్లిపోయే సమయం వచ్చేసింది. ఈ వారం ప్రేరణ, పృథ్వీ, యష్మి, నిఖిల్, నబీల్ నామినేషన్స్‌లో ఉన్నారు. వీరిలో నిఖిల్ ఎప్పటిలాగే ఓటింగ్‌లో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. తర్వాతి స్థానంలో నబీల్ ఉన్నాడు. ప్రేరణ, పృథ్వీ, యష్మి చివరి స్థానాల్లో ఉన్నారు. అయితే ఈ వారం పృథ్వీ, యష్మిలలో ఒకరు వెళ్లిపోతారనే టాక్ నడిచింది. అనుకున్నట్లుగానే యష్మి ఎలిమినేట్ అయిందట! సండే ఎపిసోడ్ షూటింగ్ పూర్తవగా యష్మిని ఎలిమినేట్ చేసినట్లు సోషల్ మీడియాలో లీకులు మొదలయ్యాయి. టాస్కులు ఆడేందుకు యష్మి బాగానే కష్టపడింది. కానీ సంచాలక్‌గా ఉన్నప్పుడే లేనిపోని తప్పులన్నీ చేస్తుంటుంది. సంచాలక్ అంటే అంపైర్ తప్ప ఆటగాడు కాదని ఎన్నటికీ తెలుసుకోలేని యష్మి నిన్నటి గేమ్‌లో కూడా రోహిణి కుండలో ఇసుక నింపుతూ పృథ్వీకి సపోర్ట్ చేసింది. ఈ టాస్క్ వల్ల యష్మిపై మరింత నెగెటివిటీ ఏర్పడింది. ఫలితంగా దమ్మున్న కంటెస్టెంట్ బయటకు రాక తప్పలేదన్నమాట!చదవండి: గతేడాదే రోహిణి కాలికి ఆపరేషన్.. ఇప్పుడదే కాలితో ఆ ఇద్దరి అహాన్ని తొక్కిపడేసింది! -
ఓటీటీలోకి వచ్చేస్తున్న 'అలియా భట్' యాక్షన్ మూవీ
ఆలియా భట్ భారీ యాక్షన్ మూవీ జిగ్రా ఓటీటీలోకి రానుంది. ఆలియా భట్, వేదాంగ్ రైనా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్టోబరు 11న హిందీతో పాటు తెలుగులో కూడా విడుదలైంది. ఇందులో సత్య పాత్రలో ఆలియా భారీ యాక్షన్ సీన్స్‌లో దుమ్మురేపింది. అంకుర్ పాత్రలో వేదాంగ్ అద్భుతంగా నటించారు. అయితే, బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఈ చిత్రం మెప్పించలేదు.అక్కాతమ్ముళ్ల సెంటిమెంట్‌తో వాసన్ బాల దర్శకత్వంలో రూపొందిన జిగ్రా సినిమాను కరణ్ జోహార్, అపూర్వా మెహతా, ఆలియా భట్, షాహిన్ భట్, సోమెన్ మిశ్రా నిర్మించారు. అయితే, జిగ్రా ఓటీటీలో విడుదల కానున్నట్లు ప్రచారం జరుగుతుంది. డిసెంబర్ 6న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కథనాలు వస్తున్నాయి. హిందీతో పాటు దక్షిణాది భాషలు అన్నింటిలోనూ విడుదల కానుంది.జిగ్రా కోసం సుమారు రూ. 90 కోట్లు ఖర్చు చేశారు నిర్మాతలు. అయితే, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 30 కోట్ల లోపే కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది. జిగ్రాతో రూ. 60 కోట్లకు పైగానే నిర్మాతలు నష్టపోయినట్లు సమాచారం. జిగ్రా తర్వాత మరో రెండు సినిమాల్లో అలియా భట్ నటిస్తుంది. అల్ఫా, లవ్ అండ్ వార్ ప్రాజెక్ట్‌లలో ఆమె భాగం కానుంది. -
టాలీవుడ్ హీరోయిన్గా టీమిండియా క్రికెటర్ భార్య!
టీమిండియా స్పిన్నర్ చాహల్ గురించి క్రికెట్ ప్రేమికులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తనదైన బౌలింగ్, ఫన్ మూమెంట్స్‌తో మంచి పేరు తెచ్చుకున్నాడు. అటు ఐపీఎల్‌లోనూ చాలామంది స్టార్ క్రికెటర్లతో ఇతడికి మంచి బాండింగ్ ఉంది. కొన్నేళ్ల క్రితం ధనశ్రీ వర్మ అనే యూట్యూబర్‌ని ఇతడు పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఈమెనే తెలుగు సినిమాతో హీరోయిన్గా మారబోతుందని తెలుస్తోంది.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న 'బిగ్‌బాస్ 8' సోనియా.. పెళ్లెప్పుడంటే?)స్వతహాగా డ్యాన్సర్ అయిన ధనశ్రీ వర్మ.. పలు ఆల్బమ్ సాంగ్స్‌తో చాలా గుర్తింపు తెచ్చుకుంది. యూట్యూబ్‌లోనూ ఈమెకు మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు ఈమె తెలుగులో 'ఆకాశం దాటి వస్తావా' అనే సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు తీస్తున్న ఈ సినిమాతో కొరియోగ్రాఫర్ యష్ మాస్టర్.. హీరోగా పరిచయమవుతున్నాడు.చాన్నాళ్ల క్రితమే షూటింగ్ మొదలైంది. డ్యాన్స్ నేపథ్య కథతో తీస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా డ్యాన్స్ కచ్చితంగా రావాల్సిన హీరోయిన్ పాత్ర ఉంది. దాని కోసమే ధనశ్రీని అడగ్గా.. ఆమె ఓకే చెప్పేసిందని తెలుస్తోంది. ఈమెకు సంబంధించిన షూటింగ్ కూడా కొంతమేర జరిగినట్లు సమాచారం. ఏదేమైనా టీమిండియా క్రికెటర్ భార్య.. టాలీవుడ్లో హీరోయిన్ అంటే వినడానికే ఇంట్రెస్టింగ్గా ఉంది కదా!(ఇదీ చదవండి: మా నాన్నపై అసత్య ప్రచారం చేయొద్దు: ఏఆర్ రెహమాన్ కొడుకు) -
పృథ్వీ సేఫ్.. ఎంటర్టైనర్ అవుట్? అంతలోనే ట్విస్ట్
బిగ్‌బాస్ ఫ్యామిలీ వీక్ సంపూర్ణమైందన్నాడు కానీ ఇంకా కొనసాగుతూనే ఉంది. హౌస్‌లో వచ్చేవాళ్లు అయిపోయారు కానీ స్టేజీపైకి వచ్చి మాట్లాడేవాళ్లు ఇంకా మిగిలే ఉన్నారు. ఈ రోజు కంటెస్టెంట్ల ఇంటిసభ్యులతో పాటు స్నేహితులు కూడా వచ్చి విజయం నీదేనంటూ ధైర్యం చెప్పనున్నారు.పృథ్వీ సేఫ్కానీ ఈపాటికే ఆ పదిమందిలో ఒకరి ఎలిమినేషన్ కన్ఫామ్ అయిపోయింది. ఈ వారం అవినాష్, తేజ, గౌతమ్, పృథ్వీ, విష్ణుప్రియ, యష్మి నామినేషన్లో ఉన్నారు. పృథ్వీ వెళ్లిపోయే సూచనలున్నాయి, జంట పక్షులు విడిపోవడానికి సమయం ఆసన్నమైందని ఊరించారు కానీ అలాంటిదేమీ జరగలేదు. అంతెందుకు సండేవరకు ఆగకుండా నేటి ఎపిసోడ్‌లోనే పృథ్వీ సేవ్ అయ్యాడట!ఎంటర్టైనర్ గుడ్బైఅంటే తన ఓటు బ్యాంక్ బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మిగిలినవారిలో అవినాష్ డేంజర్ జోన్లో ఉన్నాడు. వైల్డ్‌కార్డ్ ఎంట్రీగా ఇచ్చిన ఇతడు నామినేషన్స్ అంటేనే జంకాడు. చివరకు అతడి భయమే నిజమైంది. గేమ్ ఆడి మెగా చీఫ్ అయినప్పటికీ ప్రేక్షకులు అతడిని బయటకు పంపించేందుకే మొగ్గుచూపారు. ఈ వారం ఎంటర్టైనర్ను ఎలిమినేట్ చేశారు.నబీల్ వల్ల బతికిపోయిన అవినాష్కానీ ఇక్కడే ట్విస్ట్ ఇచ్చారు. చివర్లో తేజ, అవినాష్ ఇద్దరూ మిగిలారు. నబీల్‌తో ఎవిక్షన్ షీల్డ్ బలవంతంగా వాడేలా చేశారు. దీంతో అతడు అవినాష్ కోసం ఎవిక్షన్ షీల్డ్ వాడటంతో అతడు సేవ్ అయిపోయాడట. అలా ఈ వారం నో ఎలిమినేషన్ అని తెలుస్తోంది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
'పుష్ప' కోసం శ్రీలీల రెమ్యునరేషన్.. ఒక్క పాట కోసం అన్ని కోట్లా..!
పుష్ప చిత్రంలో శ్రీలీల భాగమైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. ఈ చిత్రానికి ఆమె తీసుకున్న రెమ్యునరేషన్ గురించి నెట్టింట పెద్ద చర్చ జరుగుతుంది. డ్యాన్స్ విషయంలో అల్లు అర్జున్, శ్రీలీల.. ఇద్దరూ ఏమాత్రం తగ్గరు. అలాంటిది పుష్ప కోసం ఒక సాంగ్‌లో కనిపిస్తే.. ఆ క్రేజ్ గురించి చెప్పాల్సిన పని ఉండదు. 'పుష్ప2' చిత్రంలో 'కిస్సిక్..' అంటూ సాగే ఒక పాటలో ఈ ఇద్దరి డ్యాన్స్‌కు ఎవరైనా ఫిదా కావాల్సిందే.శ్రీలీల రెమ్యునరేషన్పుష్ప చిత్రంలో 'ఊ అంటామా మావ.. ఊ ఊ అంటావా' అని సమంత ఉర్రూతలూగించింది. ఇప్పుడు రెండో భాగంలో కూడా అదే రేంజ్ కొనసాగాలంటే సరైన హీరోయిన్ కావాల్సిందే. అందుకే శ్రీలీలను మేకర్స్ ఎంపిక చేసుకున్నారు. అయితే, పుష్ప2 స్పెషల్ సాంగ్ కోసం సుమారు రూ. 2 కోట్ల రెమ్యునరేషన్ శ్రీలీల తీసుకుందట. ఈ పాట కోసం 5రోజులు ఆమె కేటాయించారని టాక్. సుకుమార్-దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్లో ఇప్పటికే వచ్చిన ఐటమ్ సాంగ్‌లకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఇప్పుడు 'పుష్ప2'లోనూ అదిరిపోయేలా 'కిస్సిక్..' ఐటమ్ సాంగ్‌ను మేకర్స్ సిద్ధం చేశారని తెలుస్తోంది.ఒక సినిమాకు తీసుకునేంత రెమ్యునరేషన్ అడిగిన శ్రద్ధా కపూర్పుష్ప-2 ఐటెం సాంగ్ కోసం తొలుత శ్రీలీలను మేకర్స్ ఎంపిక చేయలేదట. బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రద్ధా కపూర్‌ను అనుకున్నారట. అయితే, స్త్రీ 2 సినిమాకి రూ.5 కోట్ల వరకూ రెమ్యూనరేషన్ తీసుకున్న శ్రద్ధా.. ఈ చిత్రంలోని ఐటెం సాంగ్ కోసం సుమారు రూ. 7 కోట్ల వరకు పారితోషికం అడిగినట్లు తెలుస్తోంది. దీంతో అనూహ్యంగా శ్రీలీల పుష్ప ప్రాజెక్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చేసింది. అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డిసెంబరు 5న ఈ చిత్రం విడుదల కానున్న సంగతి తెలిసిందే. -
'గేమ్ ఛేంజర్' కోసం బాలీవుడ్ కింగ్.. కడపకు రానున్న చరణ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- శంకర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా 'గేమ్ ఛేంజర్'. సంక్రాంతికి కానుకగా జనవరి 10న విడుదల కానున్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా విడుదలైన టీజర్ సినీ అభిమానులను మెప్పిస్తుంది. 'RRR'తో రామ్ చరణ్‌కు బాలీవుడ్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. దీంతో అక్కడి మార్కెట్‌పై 'గేమ్ ఛేంజర్' టీమ్ కన్నేసింది. అందుకు తగ్గట్లు అక్కడ ప్రమోషన్స్ కార్యక్రమాలను కూడా ప్రారంభించింది. ఈ క్రమంలోనే టీజర్‌ను లక్నో వేదికగా విడుదల చేశారు.ఆ ఈవెంట్ కోసం షారుఖ్ ఖాన్ట్రైలర్ విడుదల వేడుకను బాలీవుడ్లో చాలా గ్రాండ్‌గా జరపాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. ఆడియో లాంఛ్ ఈవెంట్‌ను కూడా ఘనంగానే ప్లాన్ చేస్తుంది. అయితే, ఈ కార్యక్రమంలో ఏదో ఒకదానిలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ పాల్గొననున్నారని తెలుస్తోంది. డైరెక్టర్ శంకర్ తన మూవీ ప్రమోషన్స్ కోసం గతంలో చాలా సార్లు హాలీవుడ్ స్టార్స్‌ను ఆహ్వానించిన సందర్భాలు ఉన్నాయనే విషయం తెలిసిందే. ఇప్పుడు బాలీవుడ్లో గేమ్ ఛేంజర్ మార్కెట్‌ను పెంచుకునేందుకు షారుఖ్‌ను రంగంలోకి దింపుతున్నట్లు ప్రచారం ఉంది. బాలీవుడ్ మీడియాతో చిట్చాట్లు నిర్వహించడంతో పాటు విడుదలకు ఇంకా సమయం ఉండటంతో అక్కడ మరిన్ని ప్రచార కార్యక్రమాలను నిర్వహించేందుకు రూట్ మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.కడపకు రామ్ చరణ్రామ్ చరణ్ కడప రానున్నారని సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. తాజా సమాచారం ప్రకారం నవంబర్ 18న జరుగనున్న 80వ దర్గా నేషనల్ ముషైరా ఘజల్ ఈవెంట్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమం గురించి పూర్తి వివరాలు చరణ్ టీమ్ వెల్లడిస్తుందని సమాచారం. గేమ్ ఛేంజర్ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మించారు. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో అంజలీ, కియారా అద్వానీ, యస్ జే సూర్య, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. -
'అమరన్' ఓటీటీ రిలీజ్ వాయిదా.. కారణం అదేనా?
దీపావళికి హడావుడి లేకుండా రిలీజై హిట్ కొట్టిన సినిమా 'అమరన్'. తమిళ హీరో శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించారు. మేజర్ ముకందన్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ మూవీ తీశారు. విడుదలకు ముందు తెలుగులో పెద్దగా హైప్ లేదు కానీ థియేటర్లోకి వచ్చిన తర్వాత మాత్రం అద్భుతమైన రెస్పాన్ వచ్చింది.ప్రస్తుతం రూ.250 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌కి చేరువలో 'అమరన్' ఉంది. దీంతో మూవీ టీమ్ ఆనందానికి అవధుల్లేవ్. ఎందుకంటే హిట్ అవుతుందని అనుకున్నారు. కానీ మరీ ఈ రేంజ్ సక్సెస్ అయితే ఊహించలేదు. దీంతో ఈ చిత్ర ఓటీటీ హక్కుల్ని సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు ప్లాన్ మార్చుకుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ సూపర్ హిట్ థ్రిల్లర్.. తెలుగులోనూ)లెక్క ప్రకారం నెలరోజుల్లోనే 'అమరన్' ఓటీటీలోకి రావాల్సింది. అంటే డిసెంబరు తొలివారంలో స్ట్రీమింగ్ అయ్యేది. కానీ ఇప్పుడు అద్భుతమైన సక్సెస్ కావడంతో మరో 1-2 వారాలు తర్వాత స్ట్రీమింగ్ చేయాలని నెట్‌ఫ్లిక్స్ అనుకుంటోందట. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం డిసెంబరు మూడో వారంలోనే ఓటీటీలోకి 'అమరన్' వచ్చే అవకాశముంది.అడివి శేష్ 'మేజర్' తరహా కథతోనే 'అమరన్' సినిమా తీసినప్పటికీ.. ముకుందన్ భార్య వైపు నుంచి స్టోరీ చెప్పడం, అలానే సాయిపల్లవి యాక్టింగ్ సినిమాని మరో లెవల్‌కి తీసుకెళ్లాయని చెప్పొచ్చు. ఈ సినిమా సక్సెస్ ఇప్పుడు సూర్య 'కంగువ' చిత్రానికి రిలీజ్ ముంగిట తలనొప్పిగా మారింది. థియేటర్లు అనుకున్నంతగా దొరకడం కష్టమే అనిపిస్తుంది.(ఇదీ చదవండి: తల్లిని కావాలని ఇప్పటికీ ఉంది: సమంత) -
బిగ్ బాస్ నుంచి హరితేజ ఎలిమినేట్.. కిరాక్ రెమ్యునరేషన్
బిగ్ బాస్ తెలుగు 8 పదో వారంలో డబుల్ ఎలిమినేషన్ జరిగింది. పలు అనారోగ్య కారణాలతో గంగవ్వ తనంతట తానే హౌస్ నుంచి బయటకు వస్తే.. ఆడియెన్స్ ఓట్ల కారణంగా హరితేజ ఎలిమినేట్ అయింది. స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన హరితేజ ప్రేక్షకుల అంచనాలకు తన ఆటతో రీచ్ కాలేకపోయింది. అక్టోబర్ 6న బిగ్ బాస్‌లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా హరితేజ ఎంట్రీ ఇచ్చింది. ఈ ఐదు వారాల్లో ఆమె సంపాదన ఎంతో చూద్దాం.బిగ్ బాస్ తెలుగు సీజన్ 1లో తనదైన ఆటతీరుతో సత్తా చాటిన హరితేజ ఈ సీజన్లో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కానీ, బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయినప్పటికీ చెడ్డపేరు లేకుండానే హుందాగా ఆట నుంచి నిష్క్రమించింది. హౌస్‌లో ఉన్నంతకాలం చలాకిగా కనిపించిన ఆమె ఆట తీరు బాగున్నప్పటికీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కావడంతో పెద్దగా ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ కాలేదని చెప్పవచ్చు. బహుషా ఈ కారణంతోనే ఆమె ఎలిమినేట్ అయ్యారని తెలుస్తోంది. ఈ వారం నామినేషన్ లిస్ట్‌లో నిఖిల్,ప్రేరణ, యష్మీ, విష్ణుప్రియ, పృథ్వీ, హరితేజ,గౌతమ్ ఏడుగురు ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఐదు వారాలపాటు హౌస్‌లో కొనసాగిన ఈ బ్యూటీ ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో అనే వార్త ఆసక్తిగా మారింది.రూ. 17 లక్షలు పైగానే..సోషల్‌మీడియాలో మంచి పాపులరాటీ ఉన్న హరితేజకు బిగ్ బాస్ ఒక వారానికి గాను రూ. 3.5 లక్షల రెమ్యునరేషన్ ఇచ్చారని తెలుస్తోంది. అంటే రోజుకు రూ. 50 వేల పారితోషకం ఆమె బిగ్‌బాస్ నుంచి అందుకుందని టాక్. బిగ్ బాస్‌లో అత్యధికంగా రెమ్యునరేషన్ అందుకునే వారి జాబితాలో హరితేజ ఒకరని చెప్పవచ్చు. బిగ్ బాస్‌లో తను ఐదు వారాలపాటు ఉన్నందుకు రూ. 17 లక్షలకు పైగానే రెమ్యునరేషన్ తీసుకున్నారని చెప్పవచ్చు. సీజన్1లో సెకండ్ రన్నరప్సీరియల్స్, సినిమాలతో పాపులర్ అయింది హరితేజ. బిగ్‌బాస్ మొదటి సీజన్లో అడుగుపెట్టి ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. గలగలా మాట్లాడే ఈమె సీజన్1లో గ్రాండ్ ఫినాలే వరకు చేరుకుని సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. ఈ షో తర్వాత సినిమాల్లో బిజీ అవడమే కాకుండా హోస్ట్‌గానూ అవతారమెత్తింది. ఫిదా మీ ఫేవరెట్ స్టార్‌తో, పండగ చేస్కో, సూపర్ సింగర్, లక్కీ ఛాన్స్.. ఇలా పలు షోలకు యాంకర్‌గా వ్యవహరించింది. అఆ, యూ టర్న్, అరవింద సమేత వీర రాఘవ, ప్రతిరోజు పండగే, హిట్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న హరితేజ ఇటీవలే రిలీజైన దేవర సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్‌గా మెప్పించింది. -
డబుల్ ఎలిమినేషన్.. గంగవ్వతోపాటు హరితేజ కూడా!
బిగ్‌బాస్ షో మొదలై రెండు నెలలపైనే అవుతోంది. వారాలు గడిచేకొద్దీ హౌస్‌లో జనాలు పలుచనవుతున్నారు. మున్ముందు వారాలు మరింత కఠినంగా ఉండనున్నాయి. ఇక ఈ వారం నిఖిల్, యష్మి, ప్రేరణ, విష్ణుప్రియ, గౌతమ్ కృష్ణ, పృథ్వీ, హరితేజ నామినేషన్స్‌లో ఉన్నారు. వీరిలో నిఖిల్, విష్ణు, గౌతమ్‌ల గురించి ఆలోచించాల్సిన పని లేదు. వారికి ఓట్లు గట్టిగానే పడుతున్నాయి. ప్రేరణ ఓటు బ్యాంక్ కూడా బాగానే పెరిగింది. మిగిలిందల్లా పృథ్వీ, యష్మి, హరితేజ.ఎవరు సేఫ్?ఈ ముగ్గురిలో ఎవరు సేఫ్ అవుతారు? ఎవరు ఎలిమినేట్ అవుతారు? అన్న ఉత్కంఠ నెలకొంది. అయితే హరితేజ ఎలిమినేషన్‌కే ఎక్కువ ఆస్కారం ఉంది. లేదు అనుకుంటే పృథ్వీ, యష్మిని బలి చేసే ఛాన్స్ ఉంది. కానీ బిగ్‌బాస్ భలే ట్విస్ట్ ఇచ్చాడు. వీళ్లందరినీ కాదని గంగవ్వను పంపించేశాడు.డబుల్ ఎలిమినేషన్ఆమె ఆరోగ్యం సహకరించకపోవడంతో తనను బయటకు పంపించక తప్పలేదు. దీంతో నామినేషన్స్‌లో ఉన్న మిగతావాళ్లు గండం గట్టెక్కిందని ఊపిరి పీల్చుకున్నారు. కానీ అంతలోనే బిగ్‌బాస్ మరో ట్విస్ట్ ఇచ్చాడు. ఎలిమినేషన్ ఇంకా పూర్తవలేదంటూ హరితేజను పంపించేశారు. అలా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ వల్ల గంగవ్వ, హరితేజ ఎలిమినేట్ అయ్యారు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
సూపర్ హిట్ డైరెక్టర్‌తో 'తారక్' పాన్ ఇండియా సినిమా
ఈ ఏడాదిలో ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 500 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు తారక్ చేతిలో రాబోయే సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానున్నాయి. ఈ క్రమంలో ఆయన దేవర2, వార్2, చిత్రాలతో పాటు ప్రశాంత్ నీల్‌తో కూడా ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా మరో స్టార్ డైరెక్టర్‌తో ఎన్టీఆర్ సినిమా చేసేందుకు రెడీగా ఉన్నారని తెలుస్తుంది.కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలిప్కుమార్తో తారక్ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు జైలర్ వంటి బ్లాక్ బస్టర్‌ను అందించిన దర్శకుడు నెల్సన్ దిలిప్‌కుమార్.. ఆయనతో సినిమా అంటే మామూలుగా ఉండదంటూ ఫ్యాన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. వరుస డిజాస్టర్ సినిమాలతో ఉన్న రజనీకాంత్‌కు జైలర్ సినిమాతో నెల్సన్ భారీ విజయానందించారు. ఏడాది క్రితం జైలర్‌తో బాక్సాఫీస్ వద్దకు వచ్చిన ఆయన ఇప్పటికీ ఎలాంటి సినిమా చేస్తారా..? అనే ప్రశ్నలు వస్తున్నాయి.నెల్సన్ దిలిప్‌కుమార్ డైరెక్ట్ చేసిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. డాక్టర్,జైలర్,బీస్ట్ వంటి సినిమాలు సత్తా చాటాయి. ఇప్పుడు తారక్‌తో ఆయన సినిమా చేయబోతున్నాడని వార్తలు వస్తుండంతో ఇరువురి ఫ్యాన్స్ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. రీసెంట్గా ఆయన నిర్మాతగా 'బ్లడీ బెగ్గర్' అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో కవిన్ హీరోగా మెప్పించాడు. ఈ సినిమా అనంతరం జైలర్ 2 సీక్వెల్ తెరకెక్కించేపనిలో నెల్సన్ ఉన్నాడు . ఈ ప్రాజెక్ట్ అనంతరం తారక్ కోసం నెల్సన్ ఒక బిగ్ ప్లాన్ వేయనున్నట్లు టాక్. -
Bigg Boss 8: ఈసారి ఆమె ఎలిమినేషన్ తప్పదేమో?
బిగ్‌బాస్ 8లో ప్రస్తుతం పదకొండో వారం నడుస్తోంది. ఈసారి గౌతమ్, నిఖిల్, యష్మీ, ప్రేరణ, పృథ్వీ, విష్ణుప్రియ, హరితేజ.. నామినేషన్స్‌లో ఉన్నారు. ఓవైపు హౌసులో మెగాచీఫ్ అయ్యేందుకు పోటీ నడుస్తోంది. ఇంతకీ మెగా చీఫ్ అయ్యిందెవరు? ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశముంది?మొన్నటివరకు హౌసులో కన్నడ బ్యాచ్ హవా నడిచింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారినట్లు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రతిసారి నిఖిల్, ప్రేరణ, యష్మి, పృథ్వీలలో ఒకరో ఇద్దరో నామినేట్ అయ్యేవారు. దీంతో ఒకరి ఫ్యాన్స్ మరొకరిని సపోర్ట్ చేస్తూ గండం నుంచి తప్పించేవాళ్లు. ఈసారి అందరూ నామినేషన్స్‌లో ఉండేసరికి ఎవరి ఓట్లు వాళ్లకే పడుతున్నాయి. ఇది గౌతమ్‌కి కలిసొచ్చింది.(ఇదీ చదవండి: పృథ్వీనే కొట్టాలనుకున్న విష్ణు.. యష్మి ఎంత పని చేసింది?)ఈ వారం ఓటింగ్‌లో గౌతమ్.. టాప్‌లో కొనసాగుతున్నాడట. రెండో ప్లేసులో నిఖిల్ ఉన్నట్లు తెలుస్తోంది. తర్వాత స్థానాల్లో వరసగా ప్రేరణ, పృథ్వీ, విష్ణుప్రియ ఉన్నారట. చివరి రెండు స్థానాల్లో అంటే డేంజర్ జోన్లో యష్మి, హరితేజ ఉన్నట్లు తెలుస్తోంది.గత రెండు వారాల నుంచి హరితేజ.. చివరి స్థానాల్లో ఉంటూ వస్తోంది. మెహబూబ్, నయని పావని ఎలిమినేట్ కావడంతో సేవ్ అవుతూ వచ్చింది. ఈసారి మాత్రం ఆ ఛాన్స్ లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే చివర్లో ఉన్న విష్ణుప్రియ గానీ యష్మీ గానీ ఎలిమినేట్ కాకపోవచ్చు. దీంతో హరితేజపై వేటు పడటం గ్యారంటీ అనిపిస్తుంది. మరి ఇదే జరుగుతుందా? బిగ్‌బాస్ మరేదైనా ప్లాన్ వేశాడేమో చూడాలి?(ఇదీ చదవండి: ప్రభాస్ 'రాజాసాబ్'కి పోటీగా 'ఇడ్లీ' సినిమా) -
'పుష్ప 2' కోసం తమన్.. 'కాంతార' మ్యూజిక్ డైరెక్టర్ కూడా?
'పుష్ప 2' మూవీ మరో నెల రోజుల్లో థియేటర్లలోకి రానుంది. లెక్క ప్రకారం చూసుకుంటే ఈ పాటికే పనులన్నీ పూర్తయిపోవాలి. కానీ ఐటమ్ సాంగ్ షూటింగ్ పెండింగ్ ఉంది. దీనికోసం సమంత, శ్రీలీల పేర్లు వినిపిస్తున్నాయి. ఒకటి రెండు రోజుల్లో దీని చిత్రీకరణ ఉండనుందని. ఇదలా ఉండగానే ఇప్పుడు మరో ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ ఈ మూవీ కోసం పనిచేస్తున్నారనే టాక్ బయటకొచ్చింది.'పుష్ప' సినిమాలకు దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. తొలి పార్ట్‌లోని పాటలు ఎంత హిట్టయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం అప్పట్లో కంప్లైంట్స్ వచ్చాయి. ఓవరాల్ సక్సెస్ వల్ల దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం ఆ తప్పు జరగకూడదనో ఏమో గానీ తమన్, అజనీష్ లోక్‌నాథ్‌ని బ్యాక్ గ్రౌండ్ కంపోజ్ చేసేందుకు తీసుకున్నారట.(ఇదీ చదవండి: 'దేవర'తో పాటు ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 15 సినిమాలు)తమన్ గురించి తెలుగోళ్లకు తెలుసు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంటే రెచ్చిపోతాడు. ఇక అజనీష్ విషయానికొస్తే 'కాంతార', 'మంగళవారం' లాంటి సినిమాలతో మనోళ్లు కాస్త పరిచయమే. వీళ్లిద్దరూ తోడయితే 'పుష్ప 2'కి ప్లస్ అనే చెప్పాలి. కానీ దేవి శ్రీ ప్రసాద్ ఉండగా కొత్తగా వీళ్లిద్దరిని ఎందుకు తీసుకున్నారా అనేది అభిమానుల్ని కాస్త కంగారు పెడుతోంది. బహుశా దేవిశ్రీ ప్రసాద్‌కి వర్క్ లోడ్ ఎక్కువ కావడం ఇలా చేశారేమో?డిసెంబరు 5న 'పుష్ప 2' మూవీ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. ఇప్పటికే సౌత్, నార్త్‌లో ఈ సినిమాపై బీభత్సమైన అంచనాలు ఉన్నాయి. ఏకంగా రూ.1000 కోట్ల కలెక్షన్ దాటేస్తుందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి?(ఇదీ చదవండి: అప్పుడు 'దసరా'.. ఇప్పుడు 'ది ప్యారడైజ్') -
డైరెక్టర్ క్రిష్ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారా?
ప్రేమలో పడటం, పెళ్లి చేసుకోవడం, విడాకులు తీసుకోవడం, మళ్లీ పెళ్లి చేసుకోవడం.. ఇలాంటి మాటలు సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. త్వరలో నాగచైతన్య కూడా ఇలానే మళ్లీ పెళ్లిచేసుకోబోతున్నాడు. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో కొత్త జీవితం ప్రారంభించబోతున్నాడు. ఇదలా ఉంచితే తెలుగు దర్శకుడు క్రిష్ కూడా మరోసారి వివాహం చేసుకోబోతున్నాడనే రూమర్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయాయి.(ఇదీ చదవండి: మొదటి భర్త గురించి అమలాపాల్ ఇన్‌డైరెక్ట్ కామెంట్స్)'గమ్యం', 'వేదం' తదితర సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న క్రిష్.. 2016లో రమ్య అనే డాక్టర్ని పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లు బాగానే ఉన్నారు కానీ మనస్పర్థలు వచ్చి 2021లో విడిపోయారు. అప్పటినుంచే సింగిల్‌గానే ఉంటున్న క్రిష్.. ఇప్పుడు కొత్త జీవితంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాడట. ఓ లేడీ డాక్టర్‌తో త్వరలో పెళ్లి జరగనుందని తెలుస్తోంది. వచ్చే వారం ఈ మేరకు నిశ్చితార్థం జరుపుకోనున్నారనే టాక్ వినిపిస్తుంది.క్రిష్ పెళ్లి చేసుకోబోయే మహిళకు ఇదివరకే పెళ్లయి విడాకులు తీసుకుందని, 11 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడని అంటున్నారు. మరి ఈ రూమర్స్ నిజమేనా అనేది తెలియాల్సి ఉంది. చివరగా 'కొండపొలం' మూవీతో పలకరించిన క్రిష్.. పవన్ 'హరిహర వీరమల్లు' సినిమా మొదలుపెట్టాడు. ఇది జరిగి ఏళ్లు గడిచిపోయింది. పవన్ ఎంతకీ ఈ మూవీ గురించి పట్టించుకోకపోవడంతో దర్శకుడిగా ఇతడు పక్కకు తప్పుకొన్నాడు. ప్రస్తుతం అనుష్కతో 'ఘాటీ' మూవీ చేస్తున్నాడు. ఇంతలోనే ఇలా క్రిష్ పెళ్లి రూమర్స్ రావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది.(ఇదీ చదవండి: డబ్బు లాక్కొని హీరోయిన్ని భయపెట్టిన బిచ్చగాడు) -
నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల పెళ్లి వేదిక అక్కడేనా..?
అక్కినేని ఫ్యామిలీలో పెళ్లి పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. నాగచైతన్య, నటి శోభితా ధూళిపాళ్ల త్వరలో పెళ్లి పీటలెక్కనున్న విషయం తెలిసిందే. ఆగష్టులో వారిద్దరి నిశ్చితార్థం జరగగా ఇప్పుడు పెళ్లి వేడుకకు ముస్తాబు అవుతున్నారు. శోభిత ఇంట్లో గోధుమరాయి పసుపు దంచడంతో పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.నాగచైతన్య-శోభితాల పెళ్లి డిసెంబర్ 4న జరగనుందని తెలుస్తోంది. అధికారికంగా అయితే ప్రకటించలేదు. ముందుగా డెస్టినేషన్ వెడ్డింగ్ అనుకున్నారట. కానీ, నాగార్జున ఆ ఆలోచనను విరమించుకొని రాజస్థాన్‌లోని ఓ మంచి ప్యాలెస్‌లో పెళ్లి చేద్దామని ఆలోచించారట. అయితే, ఇప్పుడు ఆ ప్లాన్‌ను కూడా నాగ్ వద్దనుకున్నారట. హైదరాబాద్‌లోనే తన కుమారుడి పెళ్లి చేయాలని ఆయన ఫిక్స్ అయ్యారట. అందుకు వేదికగా అన్నపూర్ణ స్టూడియోను ఎంపిక చేశారని సమాచారం. ఈ వేదికను సిద్ధం చేసేందుకు ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్‌కు పనులు కూడా అప్పగించారని తెలుస్తోంది.అక్కినేని ఫ్యాన్స్ మాత్రం ఎన్-కన్వెన్షన్ టాపిక్‌ను మరోసారి తెరపైకి తీసుకొస్తున్నారు. హైదరాబాద్‌లో ఎన్-కన్వెన్షన్ వేదికకు ప్రత్యేక స్థానం ఉంది. ఎందరో సెలబ్రీటిల శుభకార్యాలు అక్కడ జరిగాయి. కానీ, తమ హీరో పెళ్లి మాత్రం అక్కడ జరగకపోవడంతో అక్కినేని ఫ్యాన్స్ కాస్త హర్ట్ అవుతున్నారు. ఒకవేల ఆ వేదిక అందుబాటులో ఉంటే మరో ఆలోచన లేకుండా చైతూ-శోభిత పెళ్లి అక్కడే జరిగి ఉండేది. -
బిగ్‌బాస్: నయని రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ వైల్డ్‌కార్డులు వచ్చాకే అంతో ఇంత ఆసక్తికరంగా మారింది. అయితే వాళ్లు వచ్చిన మొదటివారం తప్ప తర్వాత వాళ్లే ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. మొదట మెహబూబ్ ఎలిమినేట్ అవగా ఇప్పుడు నయని పావని అవుట్ అయింది. ఆటపై కసి ఉన్నా ఎమోషన్స్‌పై కంట్రోల్ లేకపోవడంతో గేమ్ బోల్తా కొట్టింది. ఎంత సంపాదించిందంటే?పదేపదే ఏడుస్తూ ఉంటే చూడటానికి ప్రేక్షకులకు చిరాకు వేసింది. అలా తొమ్మిదోవారం ఎలిమినేట్ అయింది. వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ హౌస్‌లో నాలుగు వారాలు ఉంది. వారానికి రూ.1,50,000 చొప్పున మొత్తం రూ.6 లక్షల మేర సంపాదించినట్లు తెలుస్తోంది.అప్పుడు వారమే.. ఈసారి నెల!కాగా నయని గత సీజన్లోనూ వైల్డ్‌కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చింది. అప్పుడు కేవలం వారం మాత్రమే ఉండి వెళ్లిపోయింది. ఈ సీజన్లో ఎలాగైనా తనను తాను నిరూపించుకోవాలనుకుంది. ఆటపై బాగానే ఫోకస్ పెట్టింది. కానీ ప్రతి చిన్న విషయానికి గొడవపడుతూ ఏడవడం ఆమెకు మైనస్ అయింది. పైగా ఆటలో గెలిచింది లేదు కానీ గొడవల్లో మాత్రం ముందు ఉందన్న పేరు సంపాదించుకుంది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఓటీటీలో 'దేవర' ఎంట్రీ సమయం వచ్చేసిందా..?
ఎన్టీఆర్ బ్లాక్‌బస్టర్ సినిమా దేవర ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయినట్లు సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతుంది. దసరా సందర్భంగా సెప్టెంబర్ 27న విడుదలైన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 500 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమాతో డిస్ట్రిబ్యూటర్స్ కూడా భారీగా లాభ పడ్డారని నాగవంశీ తెలిపారు.దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన దేవర బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఓటీటీలో కూడా నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు డీల్ కుదుర్చుకుంది. థియేటర్లలో రిలీజైన ఆరు వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేయాలనే ఓప్పందం దేవర మేకర్స్‌తో ఉన్నట్లు సమాచారం. దీంతో నవంబర్ 8న తెలుగుతో పాటు హిందీ,తమిళ్,కన్నడ,మలయాళం భాషలలో స్ట్రీమింగ్కు తీసుకురావాలని నిర్ణయించారట. ఈమేరకు బలంగా వార్తలు వస్తున్నాయి.కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్, బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్, ప్రకాష్‌రాజ్ వంటి స్టార్స్ నటించారు. -
బిగ్‌బాస్ 8: నయని పావని ఎలిమినేట్.. ఆ కారణం వల్లే!
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ చూస్తుండగానే రెండు నెలలు గడిచిపోయాయి. వైల్డ్‌కార్డ్స్‌తో షోలో కాస్త వినోదాన్నయితే తీసుకొచ్చారు కానీ మరీ అంతగా రక్తి కట్టించలేకపోతున్నారు. హౌస్‌లో కంటెస్టెంట్ల ఆట, మాట చూస్తుంటే వరుసగా వైల్డ్కార్డ్సే తట్టాబుట్టా సర్దుకునేలా ఉన్నారు.నామినేషన్స్‌లో ఐదుగురుఈ తొమ్మిదోవారం తేజ, యష్మి, నయని పావని, హరితేజ, గౌతమ్ నామినేషన్స్‌లో ఉన్నారు. శక్తికి మించి ఆడిన తేజ అందరికన్నా ముందు సేవ్ అయిపోయాడు. యష్మికి ఆల్రెడీ ఫ్యాన్‌బేస్ ఉండటంతో పాటు తన టీమ్ కోసం నిఖిల్‌నే ఎదిరించడం ప్లస్ అయింది. అలా తనకు బాగానే ఓట్లు పడ్డాయి. గౌతమ్ కూడా తన శక్తి మేర ఆడుతున్నందున అతడు సైతం ఓటింగ్‌లో ముందువరుసలో ఉన్నాడు.హరితేజకు పూనకంమిగిలిందల్లా హరితేజ, నయని పావని. తమను ఎవరూ గుర్తించట్లేదని బాధపడుతున్న వీళ్లను నిజంగానే ప్రేక్షకులు కూడా గుర్తించడం లేదేమో! అందుకే ఓటింగ్‌లో చివరి స్థానంలో ఉన్నారు. బీన్ బ్యాగు టాస్కులో హరితేజ పూనకం వచ్చినట్లుగా ఆడి మెప్పించింది. ఆ కారణం వల్లే..ఇక నయని పావని ఆటలో కన్నా ఎప్పుడూ ఏడుస్తూనే కనిపించడం జనాలకు చిరాకు తెప్పిస్తోంది. ఈ క్రైయింగ్ బేబీ మాకొద్దంటూ ఈ వారం ఆమెను పంపించేశారు. ఇప్పటికే సండే ఎపిసోడ్ షూటింగ్ పూర్తవగా నయని పావనిని ఎలిమినేట్ చేసేశారట! చూస్తుంటే వైల్డ్‌కార్డులను బయటకు పంపించే ప్రక్రియ వచ్చేవారం కూడా కొనసాగేలా ఉంది.చదవండి: నాగ్ సీరియస్.. నిరూపిస్తే షో నుంచి వెళ్లిపోతానన్న గౌతమ్ -
'పుష్ప' ఐటమ్ సాంగ్.. ఒకరు కాదు ఇద్దరు!
మరో నెల రోజుల్లో 'పుష్ప 2' రిలీజ్ ఉంది. కానీ ఇప్పటికే షూటింగ్ పెండింగ్‌లోనే ఉంది. దాదాపు చిత్రీకరణ అంతా పూర్తయినప్పటికీ ఐటమ్ సాంగ్ కోసం సరైన బ్యూటీ దొరక్క దాన్ని అలా పక్కనబెట్టేశారు. తొలి భాగంలో 'ఊ అంటావా మావ' అని సమంత కేక పుట్టించగా.. ఇప్పుడు ఆ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరా అనేది భేతాళ ప్రశ్నగా మారిపోయింది. అయితే ఈసారి ఇద్దరు బ్యూటీస్‌తో పుష్పరాజ్ స్టెప్పులు వేయనున్నాడట.తొలి భాగంలో సమంత తనదైన హస్కీ మూమెంట్స్‌తో రచ్చ లేపింది. చేస్తే గీస్తే 'పుష్ప 2'లో అంతకుమించి ఉండాలి తప్పితే తగ్గకూడదనేది టీమ్ ప్లాన్. అందుకే తృప్తి దిమ్రి, శ్రద్ధా దాస్.. ఇలా చాలామంది బాలీవుడ్ బ్యూటీస్ పేర్లు వినిపించాయి. అన్నీ సెట్ అవుతున్నా రెమ్యునరేషన్ దగ్గర తేడాలొస్తున్నాయట. దీంతో అటు తిరిగి ఇటు తిరిగి మన హీరోయిన్ల దగ్గర మేటర్ ఆగిందట.(ఇదీ చదవండి: పెళ్లికి రెడీ అయిన 'పుష్ప' విలన్ జాలీరెడ్డి)మొన్నటివరకు శ్రద్ధా కపూర్ పేరు వినిపించింది. కానీ ఇప్పుడు లేటెస్ట్గా శ్రీలీల పేరు తెరపైకి వచ్చింది. ఈసారి ఐటమ్ సాంగ్‌లో సమంత-శ్రీలీల.. ఇద్దరు పుష్పరాజ్‌తో రచ్చ లేపేందుకు రెడీ అయిపోయారట. మరి ఒకరు కాదు ఇద్దరు అనేది నిజమా లేదా అనేది మరికొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చేస్తుందిలే!అల్లు అర్జున్, రష్మిక, ఫహాద్ ఫాజిల్, సునీల్ నటిస్తున్న 'పుష్ప 2'.. వచ్చే నెల అంటే డిసెంబరు 5న పాన్ ఇండియా రేంజులో థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే వచ్చిన పాటలు, టీజర్.. మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుని హైప్ ఎక్కడికో తీసుకెళ్లిపోయాయి. దీంతో సినిమాపై రూ.1000 కోట్ల అంచనాలు ఉన్నాయి. మరి 'పుష్ప 2' ఏం చేస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8లో ఎలిమినేషన్.. ఈసారి వేటు ఎవరిపై?) -
నటితో ప్రేమ.. పెళ్లికి సిద్ధమైన 'కలర్ ఫోటో' దర్శకుడు!
టాలీవుడ్లో మరో పెళ్లి భాజా మోగనుంది. 'కలర్ ఫోటో' సినిమాతో గుర్తింపు తెచ్చకున్న దర్శకుడు సందీప్ రాజ్.. త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడట. తన తొలి మూవీలోనే చిన్న పాత్ర చేసిన చాందిని రావ్ అనే అమ్మాయితోనే ఏడడుగులు వేయబోతున్నాడని తెలుస్తోంది.(ఇదీ చదవండి: త్వరలోనే నాగచైతన్య-శోభిత పెళ్లి.. ఆ ఫోటోను డిలీట్ చేసిన చైతూ!)షార్ట్ ఫిల్మ్స్‌తో నటుడు-దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన సందీప్ రాజ్.. ఇప్పుడు దర్శకుడు అయిపోయాడు. ఇతడితో పాటు చాందిని రావ్ కూడా షార్ట్ ఫిల్మ్ నటిగా కెరీర్ ప్రారంభించింది. సందీప్ డైరెక్టర్ అయిన తర్వాత ఇతడు తీసిన 'కలర్ ఫొటో', 'హెడ్స్ అండ్ టేల్స్' వెబ్ సిరీస్‌లో చాందిని నటించింది. అలా చాన్నాళ్లుగా వీళ్లిద్దరూ ఒకరికి ఒకరు పరిచయమే. ఎప్పుడు ప్రేమలో పడ్డారో గానీ ఇప్పుడు పెద్దల అంగీకారంతో ఒక్కటి అయ్యేందుకు రెడీ అయినట్లున్నారు.నవంబర్ 11న విశాఖపట్నంలో సందీప్ రాజ్-చాందిని నిశ్చితార్థం జరుగనుందని, డిసెంబరు 7న తిరుపతి పెళ్లి చేసుకోనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఇదంతా అనధికారిక సమాచారం మాత్రమే. సందీప్ రాజ్ వైపు నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఇకపోతే యాంకర్ సుమ కొడుకుతో 'మౌగ్లీ' అనే సినిమాని తీస్తున్నాడు సందీప్ రాజ్. కొన్నిరోజుల క్రితమే ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్) -
శ్రీలీల తప్పుకొంది.. పూజా హెగ్డేకి ఛాన్స్
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ చేస్తున్న మూవీ 'హే జవానీతో ఇష్క్ హోనా హై'. రమేష్ తురానీ దర్శకుడు. మెయిన్ హీరోయిన్గా మృణాల్ ఠాకూర్ చేస్తోంది. మరో హీరోయిన్గా శ్రీలీల నటించనున్నారనే టాక్ బాలీవుడ్లో వినిపించింది. కానీ శ్రీలీల ప్లేస్‌లో పూజా హెగ్డే నటించనున్నారనే టాక్ బీటౌన్‌లో తెరపైకి వచ్చింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ మిస్టరీ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులో)ఇతర సినిమాలతో బిజీగా ఉంటూ ఈ సినిమా షూటింగ్‌కు కాల్షీట్స్ కేటాయించలేని కారణంగా శ్రీలీల ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చిందట. ఈ సినిమా షూటింగ్ అనుకున్న సమయానికన్నా కాస్త ఆలస్యంగా మొదలవడంతో శ్రీలీల ఎగ్జిట్ అయ్యారని బాలీవుడ్ భోగట్టా. దాంతో పూజా హెగ్డే ఎంట్రీ అయ్యారట. ఈ సినిమాను వచ్చే ఏడాది అక్టోబరులో విడుదల చేయాలనుకుంటున్నారు.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్) -
బిగ్‌బాస్ 8: నయని సేఫ్, మెహబూబ్ ఎలిమినేట్!
బిగ్‌బాస్ హౌస్‌లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్టుగా ఎంట్రీ ఇచ్చేవారెప్పుడూ డేంజర్ జోన్లోనే ఉంటారు. ఎందుకంటే పాత కంటెస్టెంట్లపై జనాలకు ఓ అవగాహన ఉంటుంది. వారి బలాలు, బలహీనతలు.. ప్రతీది తెలుసు. పైగా హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లకు ఫ్యాన్ బేస్‌లు కూడా ఏర్పడుతుంటాయి. కానీ సడన్‌గా వైల్డ్ కార్డ్స్ దిగితే.. వీరు సత్తా చూపించినా సరే పాత కంటెస్టెంట్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేందుకు ప్రేక్షకులు మొగ్గు చూపిస్తారు. డేంజర్ జోన్లో వైల్డ్ కార్డ్స్అలాంటిది పర్ఫామెన్స్ ఏమాత్రం బెడిట్టినా ఎలిమినేషన్ అనే వాకిట్లో నిలబెట్టేస్తారు. ఈసారీ అదే జరిగింది. ఈ వారం విష్ణుప్రియ, పృథ్వీ, ప్రేరణ, నిఖిల్, మెహబూబ్, నయని పావని నామినేషన్లో ఉన్నారు. వీరిలో మెగా చీఫ్‌గా ఫెయిలైన మెహబూబ్, టాస్కులో పెద్దగా కనిపించని నయని డేంజర్ జోన్లో ఉన్నారు. ఇప్పటికే సండే ఎపిసోడ్ షూటింగ్ పూర్తవగా.. నయని పావనిని ఎలిమినేట్ చేేసినట్లు తొలుత వార్తలు వచ్చాయి. కానీ అంతలోనే మెహబూబ్ ఎలిమినేట్ అయినట్లు మరో వార్త వైరలవుతోంది. కమ్యూనిటీ ఓట్లు మనకు గట్టిగా పడతాయి అన్న మాటే అతడి ఎలిమినేషన్‌కు ప్రధాన కారణంగా మారింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
షూటింగ్లో ప్రభాస్.. రూ.150 కోట్లకు ఓటీటీ డీల్!
డార్లింగ్ ప్రభాస్ చకచకా ఒక్కో సినిమా పూర్తి చేస్తున్నాడు. ప్రస్తుతం 'రాజాసాబ్' చివరి దశ షూటింగ్లో ఉంది. డిసెంబరు కల్లా పూర్తి చేస్తారని తెలుస్తోంది. మరోవైపు హను రాఘవపూడితో చేస్తున్న మూవీ సెట్లోకి ప్రభాస్.. శుక్రవారం అడుగుపెట్టేశాడట. కానీ అంతకు ముందే ఓటీటీ డీల్ పూర్తయినట్లు అదిరిపోయే న్యూస్ ఒకటి బయటకొచ్చింది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8 ఎలిమినేషన్ ఓటింగ్.. డేంజర్ జోన్లో ఇద్దరు!)ప్రభాస్.. పాన్ ఇండియా హీరో అవడం మాటేమో గానీ రిజల్ట్‌తో సంబంధం లేకుండా తన గ్రాఫ్ పెంచుకుంటూ పోతున్నాడు. 'సలార్', 'కల్కి 2898' చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ అనిపించుకున్నాడు. ప్రస్తుతం 'రాజాసాబ్'తో పాటు ఫౌజీ (రూమర్ టైటిల్) చేస్తున్నాడు. మైత్రీ నిర్మాణంలో హను రాఘవపూడి తీస్తున్న ఈ సినిమాని రూ.150 కోట్లు ఇచ్చి ప్రముఖ ఓటీటీ సంస్థ డిజిటల్ హక్కుల్ని దక్కించుకుందట.రిలీజ్ వరకు అంటే రేటు కాస్త పెరగొచ్చు. అందుకే ముందు జాగ్రత్తగా రూ.150 కోట్లు ఇచ్చేసి ప్రభాస్ మూవీని ఓటీటీ సంస్థ కొనేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో ఇమాన్వి హీరోయిన్ అని ఇదివరకే ప్రకటించారు. బహుశా 2026లో ఇది థియేటర్లలో రిలీజ్ కావొచ్చు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 23 సినిమాలు) -
రామ్‌చరణ్‌కు జోడీగా..?
‘రంగస్థలం’ (2018) తర్వాత హీరో రామ్‌చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మించనున్నారు. రామ్‌చరణ్ కెరీర్‌లోని ఈ 17వ సినిమాను ఈ ఏడాది మార్చిలో ప్రకటించారు. అయితే ఈ సినిమా చిత్రీకరణను వచ్చే ఏడాది చివర్లోప్రారంభించాలనుకుంటున్నారని సమాచారం.అంతేకాదు... ‘రంగస్థలం’ సినిమాలో హీరోయిన్గా నటించిన సమంత ఈ సినిమాలోనూ హీరోయిన్గా చేస్తారని, ఆల్రెడీ సంప్రదింపులు జరిగాయని ఫిల్మ్‌నగర్ భోగట్టా. మరి... ‘రంగస్థలం’ తర్వాత రామ్‌చరణ్, సమంత మళ్లీ జోడీగా నటిస్తారా? లేదా అనే విషయంపై స్పష్టత రావడానికి మరికొంత సమయం పడుతుంది. -
బిగ్‌బాస్ 8: నాగమణికంఠ పారితోషికం ఎంతంటే?
బిగ్‌బాస్ షో నాకు ఎంత ముఖ్యమో మీకు తెలియదు, నా పెళ్లాంబిడ్డలు తిరిగి రావాలన్నా, అత్తామామ దగ్గర గౌరవం దక్కాలన్నా ఈ షో గెలవాలి అని నాగమణికంఠ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎవరైనా నామినేట్ చేస్తే చాలు ఆ వారమంతా తెగ టెన్షన్ పడిపోయేవాడు. తను హౌస్‌లో ఉండాలని తపించిపోయాడు. ప్రతి గేమ్‌లో తానే ఉండాలనుకున్నాడు. కానీ ఈ వారం సీన్ మారిపోయింది. హౌస్‌లో ఉండలేనన్నాడు. ఇంటికి వెళ్లిపోతానంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన మైండ్ పని చేయట్లేదన్నాడు.పారితోషికం..శరీరం కూడా సహకరించలేదన్నాడు. దీంతో డాక్టర్ దగ్గరకు కూడా పంపించగా వాళ్లు బాగానే ఉందని సర్టిఫికెట్ ఇచ్చేశారు. అయినా సరే మణి హౌస్‌లో సర్దుకోలేకపోయాడు. అతడు కోరుకున్నట్లుగానే ఈ వారం ఎలిమినేట్ అయ్యాడు. అతడి పారితోషికం విషయానికి వస్తే.. వారానికి రూ.1.20 లక్షల చొప్పున మేర సంపాదించినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ఏడువారాలకుగానూ రూ.8.40 లక్షలు వెనకేసినట్లు సమాచారం. -
టాప్ హీరో ఫ్యామిలీ నుంచి పూరీ జగన్నాథ్‌కు ఆఫర్
టాలీవుడ్లో మాస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా పూరీ జగన్నాథ్‌కు గుర్తింపు ఉంది. తమ హీరో ఒక్క సినిమా అయినా పూరీ డైరెక్షన్లో చేయాలని ప్రతి అభిమాని కోరుకుంటాడు. అయితే, లైగర్,డబుల్ ఇస్మార్ట్ వంటి వరుస ప్లాపులతో ఆయన ప్రస్తుతం సతమతం అవుతున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత ఆయన ఏ హీరోతో సినిమా చేస్తారా..? అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈసారి బలమైన కథతో పాటు ఇండస్ట్రీలో హిట్ కొట్టాలని ఆయన పక్కా ప్లాన్‌తో రానున్నారని టాక్.వరసు ప్లాపులతో ఉన్న దర్శుకుడితో సినిమా చేసేందుకు చాలామంది హీరోలు జంకుతారు. కానీ, పూరీ కాస్త డిఫరెంట్ ఒటమి వస్తే ఎలా నిలబడాలో తెలిసిన డైరెక్టర్.. అందుకే ఆయనకు అక్కినేని కుటుంబం నుంచి భారీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. అక్కినేని హీరోలకు కూడా ఈ మధ్య పెద్దగా హిట్లు పడలేదు. నాగార్జున (నా సామి రంగా), నాగ చైతన్య (కస్టడీ) సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసినా పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేదు. ఇక అఖిల్ చివరి సినిమా ఏజెంట్. ఈ చిత్రం వచ్చి రెండేళ్లు దాటుతుంది. ఆయనా, అతని నుంచి సినిమా ప్రకటన రాలేదు. అయితే, ఇప్పుడు పూరీ- అఖిల్ కాంబినేషన్లో సినిమా రానుందని ఎక్కువ ప్రచారం జరుగుతుంది. భారీ విజయం కోసం ఎదురుచూస్తున్న వారిద్దరూ కసితో ఒక ప్రాజెక్ట్‌ను తెరకెక్కించాలని ఉన్నారట. నాగార్జునకు శివమణి, సూపర్ వంటి సూపర్ హిట్లు ఇచ్చిన పూరీ ఇప్పుడు అఖిల్‌తో భారీ హిట్ కొట్టే ప్లాన్‌లో ఉన్నారట. ఇదే నిజమైతే ఈ భారీ ప్రాజెక్ట్‌కు రామ్ చరణ్ నిర్మాతగా ఉండే ఛాన్స్ ఉంది. -
ఓటీటీలోకి కార్తీ ఫీల్ గుడ్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
ఎన్టీఆర్ 'దేవర'తో పాటు ఓ తమిళ డబ్బింగ్ సినిమా రిలీజైంది. అదే 'సత్యం సుందరం'. తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన కార్తీ ఇందులో హీరోగా నటించాడు. ఫీల్ గుడ్ స్టోరీతో తీసిన ఈ మూవీకి అద్భుతమైన స్పందన వచ్చింది. చూసినోళ్లందరూ మెచ్చుకున్నారు. కానీ 'దేవర' వల్ల ఎక్కువమందికి చూడలేకపోయారు. ఇప్పుడు ఇది ఓటీటీలోకి వచ్చేయడానికి సిద్ధమైపోయింది.'96' సినిమాకు కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ చిత్ర దర్శకుడు ప్రేమ్ కుమార్ తీసిన లేటెస్ట్ మూవీ 'సత్యం సుందరం'. తమిళంలో మైయళగన్ పేరుతో రిలీజ్ చేశారు. తెలుగు వరకు వచ్చేసరికి టైటిల్ మార్చారు. ఓ రాత్రిలో జరిగే కథతో దీన్ని అద్భుతంగా తెరకెక్కించారు. ఈ మూవీ డిజిటల్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. లెక్క ప్రకారం దీపావళికి స్ట్రీమింగ్ అనుకున్నారు కానీ ఇప్పుడు ఓ వారం ముందే తీసుకొచ్చే ప్లాన్‌లో ఉన్నారట.(ఇదీ చదవండి: సాయిపల్లవి.. నన్ను అన్నయ్య అనేసరికి బాధపడ్డా: స్టార్ హీరో)అక్టోబర్ 25 నుంచే 'సత్యం సుందరం' సినిమా తెలుగులోనూ ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని అంటున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమా విషయానికొస్తే.. సత్యం (అరవింద స్వామి) అనే వ్యక్తి కొన్ని పరిస్థితుల వల్ల సొంతూరిని వదిలిపెట్టి వెళ్లిపోతాడు. చిన్నాన్న కూతురు పెళ్లి కోసం దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత తిరిగి వస్తాడు. ఆ పెళ్లిలో సుందరం (కార్తి) బావ అని తనని తాను పరిచయం చేసుకుంటాడు. ఆ తర్వాత వీళ్లిద్దరి జర్నీ ఎలా సాగిందనేదే స్టోరీ.ఈ సినిమాలో చెప్పుకోవడానికి పెద్ద కథేం ఉండదు. కానీ చిన్న అనుభూతుల్ని కూడా ఎంతో అందంగా చూపించిన విధానం, అలానే కుటుంబం, బంధాల్ని ఎష్టాబ్లిష్ చేసిన విధానం కన్నీళ్లు పెట్టిస్తుంది. మంచి ఫీల్ గుడ్ మూవీస్ ఇష్టమున్నవాళ్లు మాత్రం ఓటీటీలోకి వచ్చిన తర్వాత దీన్ని అస్సలు మిస్సవ్వొద్దు.(ఇదీ చదవండి: అరెస్ట్ న్యూస్.. వీడియో రిలీజ్ చేసిన బిగ్ బాస్ శేఖర్ భాషా) -
ఎలక్ట్రిక్ కారు కొన్న అమితాబ్.. ఎన్ని కోట్లంటే?
బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తన గ్యారేజీలోకి కొత్త కారు తీసుకొచ్చాడు. ఈ మధ్యే 82వ పుట్టినరోజు జరుపుకున్న ఈయన బీఎమ్‌డబ్ల్యూ ఐ7 బ్రాండెడ్ లగ్జరీ కారు కొనుగోలు చేశాడు. ఇది ఎలక్ట్రిక్ వాహనం. అద్భుతమైన డిజైన్‌తో ఆకట్టుకుంటున్న ఈ కారు ధర రూ.2.03 కోట్లు విలువ చేస్తోంది. ఇకపోతే బచ్చన్‌కు కార్ల మీద మక్కువ ఎక్కువ. ఈయన తొలిసారి కొన్న కారు ఫియాట్ 1100. కార్ల కలెక్షన్..తన తొలి సినిమా 'సాట్ హిందుస్తానీ (1969)' సక్సెస్ తర్వాత ఫియాట్ కారు కొన్నాడు.. అది కూడా సెకండ్ హ్యాండ్లో! అప్పటినుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఇండియన్ సినిమా గర్వించే స్థాయికి చేరుకున్నాడు. ఈయన గ్యారేజీలో ల్యాండ్ రోవర్ డిఫెండర్, రోల్స్ రాయిస్ ఫాంటమ్ సెవన్, లెక్సస్ ఎల్ఎక్స్ 570 కార్లు ఉన్నాయి. ఇవే కాకుండా మినీ కూపర్ కూడా ఉంది.చదవండి: పుష్ప క్రేజ్ మామూలుగా లేదుగా.. ఏకంగా 1600 కిలోమీటర్లు! -
ఓటీటీలో 'దేవర'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్సయిందా?
దసరాకు దాదాపు అరడజను సినిమాలు రిలీజయ్యాయి. కానీ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయాయి. దీంతో అప్పటికే థియేటర్లలో ఉన్న 'దేవర' హవా కాస్త కొనసాగింది. ఈ క్రమంలోనే రూ.500 కోట్ల కలెక్షన్ మార్క్ దాటేసినట్లు నిర్మాతలు కూడా అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు 'దేవర' ఓటీటీ రిలీజ్ ఇదేనంటూ సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 25 సినిమాలు)ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో తీసిన సినిమా 'దేవర'. యాక్షన్ ఎంటర్టైనర్ కథతో తెరకెక్కించారు. సెప్టెంబరు 27న థియేటర్లలో రిలీజైంది. తొలిరోజు మిక్స్డ్ టాక్ వచ్చింది. మెల్లమెల్లగా పాజిటివ్ టాక్ వచ్చి, పికప్ అయింది. అలా 16 రోజుల్లో రూ.500 కోట్ల మార్క్ అందుకుంది. ఇప్పుడు ఓటీటీ డేట్ ఫిక్స్ అయినట్లు ప్రచారం జరుగుతోంది.'దేవర' మూవీ డిజిటల్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. అయితే థియేటర్లలో రిలీజ్ కావడానికి ముందే ఆరు వారాల ఒప్పందం కుదిరిందట. ఈ లెక్కన నవంబరు 8 నుంచి ఓటీటీలో 'దేవర' స్ట్రీమింగ్ కానుందని అంటున్నారు. మరి ఇందులో నిజమేంటనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: ఆస్పత్రిలో ఉంటే ఎవరు సాయం చేయలేదు: చలాకీ చంటి) -
రజినీ 'వేట్టయన్'.. తొలిరోజు కలెక్షన్స్ ఎంత?
సూపర్‌స్టార్ రజినీకాంత్ సినిమా అంటే మినిమమ్ క్రేజ్ ఉంటుంది. ఈసారి తమిళనాడు వరకు ఓకే గానీ తెలుగులో పెద్దగా హడావుడి లేకుండానే 'వేట్టయన్' రిలీజైపోయింది. దసరా కానుకగా ఈ గురువారం థియేటర్లలోకి వచ్చింది. తొలిరోజే మిక్స్డ్ టాక్ వినిపించింది. వీకెండ్ గడిస్తేగాని అసలు టాక్ ఏంటనేది బయటపడదు.(ఇదీ చదవండి: రజనీకాంత్ "వేట్టయన్" మూవీ రివ్యూ)మరోవైపు 'వేట్టయన్' చిత్రానికి తొలిరోజు డీసెంట్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.70 కోట్ల వరకు వచ్చినట్లు టాక్. తమిళనాడులోనే రూ.22 కోట్లు, దేశంలో మిగిలిన చోట్లన్నీ కలిపి రూ.25 కోట్లు, ఓవర్సీస్లో రూ.23 కోట్లు వచ్చాయని సమాచారం. తెలుగు వరకు అయితే దాదాపు రూ.3 కోట్లు వరకు వచ్చిన సమాచారం.తెలుగులో అయితే 'విశ్వం', 'మా నాన్న సూపర్ హీరో', 'జనక అయితే గనక' లాంటి సినిమాలు రిలీజయ్యాయి. అలానే 'జిగ్రా', 'మార్టిన్' అనే డబ్బింగ్ చిత్రాలు కూడా తాజాగా థియేటర్లలో రిలీజయ్యాయి. వీటని దాటుకుని 'వేట్టయన్' తెలుగులో ఏ మేరకు వసూళ్లు సాధిస్తుందో చూడాలి. తొలిరోజు అయితే పర్లేదనిపించింది గానీ వీకెండ్ ముగిసేసరికి ఎన్ని డబ్బులు వస్తాయనే దానిబట్టి ఫలితం ఆధారపడి ఉంటుంది.(ఇదీ చదవండి: బొమ్మ పడలేదు.. కొత్త సినిమాలకు రిలీజ్ సమస్యలు!) -
సూపర్ హీరో పాత్రలో బాలకృష్ణ?
హీరో బాలకృష్ణ సూపర్ హీరోగా కనిపించబోతున్నారా? సోషల్ మీడియాలో దీని గురించి ఇప్పుడు చర్చ నడుస్తోంది. 'అఖండ' తర్వాత డిఫరెంట్ మూవీస్, పాత్రలు చేస్తున్న బాలయ్య.. ఇప్పుడు తర్వాత మూవీ కోసం సూపర్ హీరోగా కనిపిస్తారని అంటున్నారు. దసరా కానుకగా అక్టోబరు 11న దీనికి సంబంధించిన ప్రకటన రావొచ్చని అంటున్నారు.(ఇదీ చదవండి: 'మా నాన్న సూపర్ హీరో' సినిమా రివ్యూ)బాలకృష్ణ, సూపర్ హీరోగా కనిపిస్తారు సరే. కానీ దీన్ని డీల్ చేసే దర్శకుడు ఎవరు? కథ ఎలా ఉండబోతుంది లాంటి అంశాలపై ప్రస్తుతానికి సస్పెన్స్. రీసెంట్ టైంలో పురాణాల్లోని పలువురు సూపర్ హీరోలని బేస్ చేసుకుని సినిమాలు వస్తున్నాయి. 'హనుమాన్', 'కల్కి' ఈ తరహా చిత్రాలే.ఇప్పుడు బాలయ్య కూడా ఇలాంటి సినిమానే చేయబోతున్నారని తెలుస్తోంది. లేదంటే ఇదంతా కూడా కొడుకు మోక్షజ్ఞ నటించే సినిమాలోనా అనేది తెలియాల్సి ఉంది. మరి బాలయ్య సూపర్ హీరో అనేది నిజమా కాదా అనేది అధికారిక ప్రకటన వస్తే ఏం మాట్లాడలేం!(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. ఐదు డోంట్ మిస్) -
'పుష్ప 2' రిలీజ్ డేట్.. మళ్లీ మార్పు?
తెలుగు ప్రేక్షకులు 'పుష్ప 2' మూవీ కోసం తెగ ఎదురుచూస్తున్నారు. లెక్క ప్రకారం ఈపాటికే షూటింగ్ పూర్తయి, థియేటర్లలోకి వచ్చేయాలి. కానీ వాయిదా పడింది. ఈ ఏడాది డిసెంబరు 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. ఇప్పుడు ఆ తేదీలో కూడా చిన్నపాటి మార్పు చేశారట.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. ఐదు డోంట్ మిస్)అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో తీసిన 'పుష్ప' మూవీ 2021 డిసెంబరులో రిలీజైంది. ఎలాంటి అంచనాల్లేకుండా పాన్ ఇండియా వైడ్ రిలీజై, సెన్సేషన్ సృష్టించింది. దీంతో సీక్వెల్‌పై బీభత్సమైన అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో దర్శకుడు సుకుమార్.. ప్రతి విషయాన్ని చాలా కేర్ తీసుకోవడం మొదలుపెట్టారు. అలా దాదాపు మూడేళ్లు గడిచిపోయింది.ఆగస్టు 15న రిలీజ్ చేస్తామని ఈ ఏడాది ప్రారంభంలో ప్రకటించారు. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో డిసెంబరు 6కి ప్లాన్ మార్చారు. ఇప్పుడు ఒక్కరోజు ముందుకి రిలీజ్ డేట్ జరిపినట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. మరి ఇందుకు గల కారణాలు ఏంటి? బిజినెస్, ఓటీటీల లెక్కల పరంగా మార్పు చేశారా? మరేదైనా కారణముందా అనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: హీరో నారా రోహిత్ నిశ్చితార్థం ఆ హీరోయిన్ తో?) -
హీరో నారా రోహిత్ నిశ్చితార్థం ఫిక్సయిందా!
టాలీవుడ్ హీరో నారా రోహిత్ పెళ్లికి రెడీ అయ్యాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు కొడుకు అయిన రోహిత్.. 'బాణం' సినిమాతో నటుడిగా మారాడు. అడపాదడపా మూవీస్ చేస్తూనే ఉన్నాడు. కారణమేంటో తెలీదు గానీ ఇప్పటివరకు ఒంటరిగా ఉండిపోయాడు. తాజాగా పెళ్లి ఫిక్సయినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: రజినీకాంత్ 'వేట్టయన్' ట్విటర్ రివ్యూ)ఈనెల 13న హైదరాబాద్‌లోనే నిశ్చితార్థం జరగనుంది సమాచారం. కుటుంబ సభ్యులు అందరూ ఈ వేడుకకు హాజరవుతారని తెలుస్తోంది. ఇకపోతే నారా రోహిత్‌కి ప్రస్తుతం 40 ఏళ్లు. అంటే లేటు వయసులో వివాహానికి రెడీ అయ్యాడనమాట. అమ్మాయి ఎవరు? డీటైల్స్ ఏం బయటకు రాలేదుఇతడు హీరోగా నటించిన 'సుందరకాండ' అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. కొన్నాళ్ల ముందు ట్రైలర్ రిలీజ్ చేశారు. లేటు వయసులో పెళ్లి చేసుకోవడం అనే కాన్సెప్ట్‌పైనే ఈ మూవీ స్టోరీ ఉండటం విశేషం. ఇక నారా రోహిత్ నిశ్చితార్థం గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. ఐదు డోంట్ మిస్) -
అనుష్కపై మళ్లీ అవే రూమర్స్
ఇప్పటి వరకు తెలుగు, తమిళం భాషలకే పరిమితం అయిన అనుష్క తాజాగా మాలీవుడ్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నారు. అరుంధతి చిత్రంతో తన నటనా ప్రతిభను ప్రదర్శించిన ఈమె రుద్రమదేవి, బాహుబలి, భాగమతి చిత్రాలతో తనకు తానే చాటి అని చాటారు. అలాంటి అనుష్క నట జీవితం 'సైజ్ జీరో' చిత్రంతో ఒక్కసారిగా మారిపోయింది. ఆ చిత్రంలోని పాత్ర కోసం భారీగా బరువు పెంచిన అనుష్క ఆ తరువాత ఆ బరువును తగ్గించుకోవడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అయినప్పటికీ ఆ తరువాత 'సైలెన్స్' అనే చిత్రంలో నటించారు. ఆ చిత్రం పూర్తిగా నిరాశ పరచింది. ఇటీవల 'మిస్ శెట్టి మిస్టర్ పొలి శెట్టి' చిత్రంలో నటించి సక్సెస్‌ను అందుకున్నారు. కాగా ప్రస్తుతం మలయాళంలో 'కాత్తనార్' అనే చిత్రం చేస్తున్నారు. ఈమె నటిస్తున్న తొలి మలయాళ చిత్రం కావడం గమనార్హం. అదే విధంగా 'భాగమతి' చిత్రానికి సీక్వెల్లో నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అనుష్క పెళ్లికి సిద్ధం అవుతుందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈమె దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతున్నట్లు వీరి పెళ్లి పనుల్లో కుటుంబ సభ్యులు మునిగి తేలుతున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఇంతకు ముందు కూడా అనుష్క పెళ్లిపై పలుమార్లు ప్రచారం జరిగింది. అదేదీ నిజం కాలేదు. ఆమె కూడా ఇలాంటి వార్తలను పెద్దగా పట్టించుకోలేదని చెప్పవచ్చు. మరి తాజాగా జరుగుతున్న పెళ్లి ప్రచారంౖలో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది. -
బిగ్‌బాస్ ద్వారా ఆదిత్య ఎంత సంపాదించాడంటే?
బిగ్‌బాస్ ఎనిమిదవ సీజన్లో ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్ అన్నారు కానీ హౌస్మేట్ల గిల్లికజ్జాలు, సోదిముచ్చట్లు చూస్తుంటే ప్రేక్షకులకు కూడా అసహనం, చిరాకు అన్‌లిమిటెడ్‌గానే వస్తోంది. నెల రోజుల్లోనే మొహం మొత్తేస్తే కష్టమని భావించిన బిగ్‌బాస్ టీమ్ వైల్డ్‌కార్డ్ ఎంట్రీలను దింపుతోంది. ఎనిమిది మందిని హౌస్‌లోకి ఒకేసారి పంపించనుంది.ఆదిత్య ఓం అవుట్ఇందుకోసం పెద్దగా కంటెంట్ ఇవ్వని కంటెస్టెంట్లను డబుల్ ఎలిమినేషన్ ద్వారా బయటకు పంపించేయాలని ప్లాన్ చేశారు. అనుకున్నట్లుగానే సైలెంట్‌గా తన పని తాను చేసుకుపోతున్న మంచి మనిషి ఆదిత్య ఓంను వారం మధ్యలోనే ఎలిమినేట్ చేసేశారు. ఈయన నాలుగున్నర వారాలపాటు హౌస్‌లో ఉన్నాడు.ఎంత సంపాదించాడంటే?హీరోగా జనాలకు సుపరిచితుడైన ఆదిత్యను ఈ షోకి తీసుకువచ్చేందుకు భారీగానే ఆఫర్ చేశారట! వారానికి రూ.3 లక్షల పారితోషికం ఇచ్చారట! ఈ లెక్కన నాలుగున్నర వారాలకుగానూ దాదాపు రూ.14 లక్షలు అందుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన బేబక్క, బాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల కంటే కూడా ఆదిత్యే ఎక్కువ రెమ్యునరేషన్ అందుకున్నట్లు భోగట్టా!మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఓటీటీ రిలీజ్‌కు ఇండియన్ 3?
‘ఇండియన్ 3’ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కానుందా? అంటే అవుననే సమాధానాలే కోలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో 1996లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమా ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇరవైఎనిమిదేళ్ల తర్వాత ‘ఇండియన్’ సినిమాకు సీక్వెల్స్‌గా ‘ఇండియన్ 2, ఇండియన్ 3’ సినిమాలను తెరకెక్కించారు దర్శకుడు శంకర్. రెండు సీక్వెల్స్‌లోనూ కమల్‌హాసన్ హీరోగా నటించారు. ‘ఇండియన్ 2’ విడుదలైన ఆరు నెలల తర్వాత ‘ఇండియన్ 3’ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. ఈ ఏడాది జూలై 12న ‘ఇండియన్ 2’ థియేటర్స్‌లో విడుదలైంది. కానీ ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి సరైన స్పందన లభించలేదు. దీంతో ‘ఇండియన్ 3’ విడుదల మరింత ఆలస్యం అవుతుందని, వేసవిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే చాన్సెస్ ఉన్నాయని కోలీవుడ్‌లో టాక్ వినిపించింది. అయితే ‘ఇండియన్ 2’ సక్సెస్ కాని నేపథ్యంలో ‘ఇండియన్ 3’ సినిమాను డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందా? అని చిత్రయూనిట్ ఆలోచిస్తోందనే టాక్ కోలీవుడ్‌లో ప్రచారంలోకి వచ్చి0ది. మరి... తమిళ పరిశ్రమలో ప్రచారంలో ఉన్నట్లుగా ‘ఇండియన్ 3’ చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలవుతుందా? అనేది చూడాలి. ఇక ‘ఇండియన్ 3’ సినిమాను లైకాప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ పతాకాలపై సుభాస్కరన్ నిర్మించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే... నయనతార, సిద్ధార్్థ, మాధవన్, మీరా జాస్మిన్ లీడ్ రోల్స్‌లో నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘ది టెస్ట్’. శశికాంత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అయితే ఈ చిత్రం కూడా డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అవుతుందనే ప్రచారం కోలీవుడ్‌లో సాగుతోంది. ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. -
ఎన్టీఆర్-నీల్ మూవీ కోసం 'సాగరాలు' బ్యూటీ?
'దేవర' హిట్‌తో ఎన్టీఆర్ మంచి జోష్‌లో ఉన్నాడు. త్వరలోనే ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్లో పాల్గొంటాడు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి క్రేజీ అప్డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హీరోయిన్గా కన్నడ బ్యూటీని పరిశీలిస్తున్నారని, స్టోరీ కూడా ఇదేనని తెగ మాట్లాడేసుకుంటున్నారు.(ఇదీ చదవండి: నాలుగో పెళ్లికి సిద్ధమైన ప్రముఖ నటి.. డేట్ ఫిక్స్)ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ సినిమాని చాలా రోజుల క్రితమే ప్రకటించారు. కానీ ఇద్దరూ ఎవరి సినిమాలతో వాళ్లు బిజీగా ఉండటం వల్ల ఇన్నాళ్లు పట్టింది. నవంబరు నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. డిసెంబరు నుంచి తారక్ సెట్స్‌లోకి వస్తాడని తెలుస్తోంది. ఇకపోతే 'సప్త సాగరాలు దాటి' ఫేమ్ రుక్మిణి వసంత్.. హీరోయిన్గా అనుకుంటున్నారని టాక్ నడుస్తోంది.2019 నుంచి ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది రుక్మిణి. ప్రస్తుతానికి తమిళంలో ఒకటి, కన్నడలో రెండు చిత్రాలు చేస్తోంది. ఇప్పుడు తారక్ సరసన అనేసరికి ఈమె ఫ్యాన్స్ ఎగ్జైట్ అయిపోతున్నారు. ఇకపోతే ఈ సినిమా స్టోరీ బంగ్లాదేశ్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండనుందని తెలుస్తోంది. పూర్తిస్థాయి యాక్షన్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయట.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. ఆ మూడు స్పెషల్) -
ఆ తప్పే సోనియా కొంప ముంచింది! పారితోషికం లెక్కలివే!
తానే గొప్ప.. ఎదుటివాళ్లు తనముందు పిల్లబచ్చాలు.. అని విర్రవీగితే మొదటికే మోసం వస్తుంది. హౌస్‌లో చాలామందిని బయటకు పంపించేయాలని ఎదురుచూసింది ఆర్జీవీ బ్యూటీ సోనియా ఆకుల. కానీ నాలుగోవారానికే ఎలిమినేట్ అయ్యింది. అందుకుగల కారణాలు చాలానే ఉన్నాయి.గ్రూప్ గేమ్ఈ సీజన్లో కెప్టెన్సీకి బదులుగా చీఫ్స్ ఉంటారని బిగ్‌బాస్ ముందే వెల్లడించాడు. షో మొదలైన రెండు రోజుల్లోనే ఎవరి సత్తా ఏంటో తెలుసుకోవడం కష్టం కాబట్టి నిఖిల్.. తన ఫ్రెండ్ యష్మిని చీఫ్‌గా సెలక్ట్ చేశాడు. అందుకు సోనియా పెద్ద రాద్దాంతమే చేసింది. గ్రూప్ గేమ్ అంటూ నింద వేసింది.. కట్ చేస్తే వారానికే నిఖిల్‌ను అతడి గ్రూపులో నుంచి వెలేసి తనతో కొత్త టీమ్ ఏర్పాటు చేసుకుంది.విష్ణుతో వైరంచిన్నోడు పెద్దోడు అంటూ పృథ్వీ, నిఖిల్‌తోనే ఎక్కువ ముచ్చట్లు పెడుతూ సోఫాలో సెటిలైపోయింది. వారితో ఆమె ప్రవర్తించిన తీరుకు జనాలు తలకు జండూభామ్ రాసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిఖిల్‌తో స్నేహం ఎలా కుదిరింది? అని విష్ణుప్రియ క్యాజువల్‌గా అడిగిన పాపానికి అడల్ట్రేటెడ్ కామెడీ అంటూ ఆమెను నిందించింది.మితిమీరిన హగ్గులుకట్ చేస్తే నిఖిల్‌తో మితిమీరిన హగ్గులు, అతడిని అభ్యంతరకరంగా టచ్ చేయడం చూసి జనాలు చీదరించుకున్నారు. పైగా నిఖిల్‌ను గుప్పిట్లో పెట్టుకుని చక్రం తిప్పడం కూడా జనాలకు మింగుడుపడలేదు. ఈమె తన గేమ్ పాడుచేసుకోవడమే కాక నిఖిల్ గేమ్ కూడా చెడగొడుతోందని పేరు తెచ్చుకుంది. గేమ్‌లో వెనుకంజపైగా యష్మిని. ఎంతసేపూ నిఖిల్, పృథ్వీనే చూస్తే ఎలా అని సెటైర్లు వేసిన ఈమె మరి ఎంతసేపూ ఆ ఇద్దరినే వెంటేసుకుని తిరుగుతే జనాలేమనుకుంటారోనని కాస్తైనా ఆలోచించకపోవడం గమనార్హం. టాస్కుల్లోనూ పెద్దగా ఆడింది లేదు, కానీ ఆడినంత బిల్డప్ ఇచ్చింది.పారితోషికం ఎంతంటే?ఆడపులి అన్న ట్యాగ్‌కు కాస్తయినా న్యాయం చేయలేదు. వెరసి నాలుగోవారమే ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. ఈ నాలుగు వారాలకుగానూ సోనియా దాదాపు రూ.6 లక్షల పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
స్టైలిష్‌గా సామ్.. తన వాచ్ ధర ఎన్ని లక్షలో తెలుసా?
చాలాకాలం తర్వాత సమంత మళ్లీ హడావుడి మొదలుపెట్టేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో వరుస ఫోటోషూట్స్ షేర్ చేస్తోంది. తను నటించిన సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్‌ను లండన్‌లో ప్రీమియర్ ప్రదర్శించడమే ఇందుకు కారణం! లండన్‌లో జరిగిన వెబ్ సిరీస్ ప్రీమియర్‌కు సిటాడెల్ ఒరిజినల్ వర్షన్ హీరోయిన్ ప్రియాంక చోప్రాతో పాటు సమంత సైతం హాజరైంది.వాచ్ ధర..ఈ సందర్భంగా ఆమె చేతికి ధరించిన వాచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తన స్టైలిష్ లుక్‌ను రెట్టింపు చేసేలా ఉన్న ఈ వాచ్ ధర తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం. లగ్జరీ బ్రాండ్ బల్గరీకి చెందిన ఈ వాచ్ ధర రూ.45.5 లక్షలని తెలుస్తోంది. ఇది విన్న అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు.వెబ్ సిరీస్..సమంత సినిమాల విషయానికి వస్తే.. ఆమె ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ సిరీస్ 'సిటాడెల్: హనీ బన్నీ' నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. వరుణ్ ధావన్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సిరీస్‌కు రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. అలాగే సామ్ 'మా ఇంటి బంగారం' అనే సినిమాను నిర్మిస్తోంది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl)చదవండి: జయం రవితో అలాంటి రిలేషన్ లేదు'.. సింగర్ క్లారిటీ! -
చిరంజీవి కాదు.. చరణ్ వస్తున్నాడా?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర' చేస్తున్నారు. వచ్చే సంక్రాంతికి రిలీజ్ ఉంటుందని చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. అందుకు తగ్గట్లే షూటింగ్, గ్రాఫిక్స్ పనులన్నీ వేగంగా చేస్తున్నారు. ఎంత ఫాస్ట్‌గా చేస్తున్నా సరే అనుకోని అవాంతరాలు వస్తున్నాయి. తాజాగా చిరంజీవి.. చికెన్ గున్యా బారిన పడ్డారు. అయినా సరే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఈవెంట్‌కి హాజరైన తనకు దక్కిన పురస్కారాన్ని అందుకున్నారు.(ఇదీ చదవండి: ప్రముఖ ఫోక్ సింగర్‌పై అత్యాచార కేసు.. యువతి ఫిర్యాదు)ప్రస్తుతం చిరంజీవి కోలుకుంటున్నారని, పూర్తిగా సెట్ అవడానికి మరికాస్త టైం పట్టేలా ఉందని తెలుస్తోంది. దీంతో 'విశ్వంభర' సమాయానికి రెడీ అవ్వకపోవచ్చని అంటున్నారు. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం సంక్రాంతి రేసు నుంచి చిరు సైడ్ అవుతారు. ఇదే గనన జరిగితే 'గేమ్ ఛేంజర్'ని సంక్రాంతి రేసులోకి తీసుకురావాలని దిల్ రాజు భావిస్తున్నారట.ఇప్పటికే సంక్రాంతి రేసులో బాలయ్య, వెంకటేశ్, రవితేజ ఉన్నారు. చిరంజీవి వస్తే ఓకే. లేదంటే మాత్రం చరణ్ రెడీగా ఉన్నాడు. అంతలో శంకర్ కూడా అన్ని పనులు పూర్తి చేసుకోవడానికి టైమ్ దొరుకుతుంది. మరి సంక్రాంతికి చిరంజీవి వస్తాడా? రామ్ చరణ్ ఎంట్రీ ఇస్తాడా అనేది చూడాలి?(ఇదీ చదవండి: రెండోరోజు తగ్గిన దేవర కలెక్షన్స్.. బాలీవుడ్లో పెరిగిన క్రేజ్) -
'దేవర' రెమ్యునరేషన్స్.. ఎవరికి ఎంత ఇచ్చారు?
'దేవర' థియేటర్లలోకి వచ్చేశాడు. తారక్ నటవిశ్వరూపం, అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయాయని ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లయితే అరుపులతో దద్దరిల్లిపోతున్నాయి. వరల్డ్ వైడ్ వేల థియేటర్లలో రిలీజ్ కావడంతో తొలిరోజు వసూళ్లు గట్టిగానే రాబోతున్నాయని తెలుస్తోంది. సరే ఇదంతా పక్కనబెడితే 'దేవర'కి బడ్జెట్ ఎంత? రెమ్యునరేషన్స్ ఎవరికెంత ఇచ్చారనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ‘దేవర’ మూవీ రివ్యూ)'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ చేసిన సినిమా 'దేవర'. గతంలో తారక్‌తో 'జనతా గ్యారేజ్' తీసిన కొరటాల దీనికి దర్శకుడు. సముద్రం బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తీసిన ఈ చిత్రానికి దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ పెట్టారని తెలుస్తోంది. ఎన్టీఆర్ అన్న కల్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్‌తో కలిసి సంయుక్తంగా నిర్మించారు.పారితోషికాల విషయానికొస్తే 'దేవర'లో ద్విపాత్రాభినయం చేసిన ఎన్టీఆర్ దాదాపు రూ.60 కోట్లు తీసుకున్నాడని తెలుస్తోంది. హీరోయిన్గా చేసిన జాన్వీ రూ.5 కోట్లు, విలన్‌గా చేసిన సైఫ్ అలీ ఖాన్ రూ.10 కోట్లు, ఇతర కీలక పాత్రలు పోషించిన ప్రకాశ్ రాజ్ రూ 1.5 కోట్లు, శ్రీకాంత్ రూ.50 లక్షలు, మురళీశర్మ రూ.40 లక్షలు తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. కెప్టెన్ ఆఫ్ ద షిప్ అయిన దర్శకుడు కొరటాల శివ ఏకంగా రూ.30 కోట్ల వరకు అందుకున్నాడని సమాచారం.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 20 సినిమాలు) -
'దేవర' రికార్డ్.. రిలీజ్‌కి ముందే అన్ని కోట్ల వసూళ్లు!
తెలుగులో పెద్దగా ప్రమోషన్స్ చేయలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అనుకోని విధంగా రద్దయింది. ఇవన్నీ కాదన్నట్లు ట్రైలర్స్ చూసి సోషల్ మీడియాలో ట్రోలింగ్. దీంతో చాలామంది 'దేవర'పై తక్కువ అంచనాలు వేశారు. కానీ ఊహించని విధంగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. మన దేశం, ఓవర్సీస్లో విడుదలకి ముందే కోట్ల వసూళ్లు సాధిస్తోంది.(ఇదీ చదవండి: 'దేవర' ఓటీటీ.. ఆ రెండు హిట్ సినిమాల రూట్లో!)ఆదివారం రెండో ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్.. సోమవారం నుంచి టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. సౌత్ నార్త్ అనే తేడా లేకుండా షోలు హౌస్‌ఫుల్ అవుతున్నాయి. ప్రస్తుతం మన దేశంలో టికెట్స్ సేల్ ద్వారా రూ.18 కోట్ల మేర వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ఓవర్సీస్లోనూ ప్రీమియర్స్ పడకముందే రెండున్న మిలియన్ డాలర్ల మార్క్ దాటేసింది. అంటే దాదాపు రూ.17 కోట్లు అనమాట.సినిమా రిలీజ్‌కి మరో రోజు గ్యాప్ ఉన్న నేపథ్యంలో ఇండియా, ఓవర్సీస్లో రూ.20 కోట్ల సేల్ దాటేయడం పక్కా అనిపిస్తోంది. మరోవైపు తొలిరోజు కలెక్షన్స్‌లోనూ 'దేవర' రికార్డులు సృష్టించడం గ్యారంటీ. ఎందుకంటే అర్థరాత్రి 12, 1 గంట నుంచే తెలుగు రాష్ట్రాల్లో షోలు పడబోతున్నాయి. హిట్ టాక్ వస్తే మాత్రం 'దేవర'ని ఆపడం కష్టమవుతుంది.(ఇదీ చదవండి: ‘దేవర’ నిర్మాతలకు ఏపీ హైకోర్టు షాక్!) -
'భారతీయుడు' హీరోయిన్ విడాకులు.. భర్తకు ఇష్టం లేకపోయినా!
రాంగోపాల్ వర్మ 'రంగీలా' సినిమాతో దేశవ్యాప్తంగా హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ ఊర్మిళ మతోండ్కర్. హిందీతో పాటు తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి పేరు సంపాదించింది. ఇప్పుడు ఈమెనే విడాకుల కోసం అప్లై చేసింది. భర్తకు ఇష్టం లేకపోయినా సరే ఈమె విడిపోవాలని అనుకుంటోందట. ప్రస్తుతం ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.ముంబైలో పుట్టి పెరిగిన ఊర్మిళ.. బాలనటిగా ఇండస్ట్రీలోకి వచ్చింది. 'కర్మ' మూవీతో పరిచయమైంది. కొన్నాళ్ల తర్వాత హీరోయిన్గా మారింది. రాంగోపాల్ వర్మ తీసిన 'రంగీలా'.. ఈమెకు ఎక్కడలేని పాపులారిటీ తెచ్చిపెట్టింది. దీని తర్వాత జుదాయి, సత్య తదితర చిత్రాలతో స్టార్ అయిపోయింది. తెలుగు తమిళంలోనూ అంతం, గాయం, భారతీయుడు, అనగనగా ఒక రోజు లాంటి మూవీస్ చేసింది.(ఇదీ చదవండి: యూట్యూబర్ హర్ష సాయిపై కేసు పెట్టిన యువతి)పెళ్లి-ఫ్యామిలీ విషయానికొస్తే.. 2014లో ఓ పెళ్లిలో కశ్మీరి బిజినెస్‌మ్యాన్ మోసిన్ అక్తర్‌ని కలిసింది. అలా మొదలైన వీళ్ల పరిచయం రెండేళ్లు తిరిగేసరికి పెళ్లి అనే బంధంగా మారింది. ముంబైలోని ఊర్మిళ ఇంట్లో అతికొద్ది మంది సమక్షంలో ఈ పెళ్లి జరిగింది. ఇప్పటివరకు అంటే దాదాపు ఎనిమిదేళ్ల పాటు బాగానే ఉన్నారు. గత కొన్నాళ్ల నుంచి వేర్వేరుగా ఉంటున్నారు. నాలుగు నెలల క్రితం కోర్టులో విడాకుల కోసం ఊర్మిళ అప్లై చేసిందట. తాజాగా ఈ విషయం బయటపడింది. సినిమాల్లోకి కమ్‌బ్యాక్ ఇవ్వాలనుకుంటోందని, కానీ భర్త ఇది నచ్చకపోవడంతో విడాకులు తీసుకోవాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.2018లో చివరగా 'బ్లాక్ మెయిల్' సినిమాలో కనిపించిన ఊర్మిళ.. 2019లో రాజకీయాల్లోకి వెళ్లింది. తొలుత కాంగ్రెస్‌లో చేరి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయింది. తర్వాత ఏడాది శివసేన పార్టీలో చేరిపోయింది. అక్కడ కూడా అచ్చిరాకపోవడంతో తిరిగి సినిమాల్లోకి రావాలనుకుంటోంది. ప్రస్తుతం పలు రియాలిటీ షోలకు ఊర్మిళ జడ్జిగా వ్యవహరిస్తోంది.(ఇదీ చదవండి: 'వాళా' సినిమా రివ్యూ (ఓటీటీ)) -
ఆ హిట్ డైరెక్టర్‌తో రజనీకాంత్ సినిమా..!
జైలర్ సినిమా తర్వాత రజనీకాంత్ జోరు పెంచారు. గతంలో ఎప్పుడూ లేనంతగా వరుసగా సినిమాలు తీసేందుకు తన షెడ్యూల్స్ ఉంటున్నాయి. అక్టోబర్ 10న వేట్టైయాన్ విడుదల కానుంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.వెట్టైయాన్‌తో పాటు 'కూలీ' చిత్రాన్ని కూడా ఆయన పట్టాలెక్కించారు.లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్ పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. దాదాపు చిత్రీకరణ కూడా పూర్తి కావచ్చింది. ఈ సినిమా తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో 'జైలర్ 2' ప్రాజెక్ట్‌లో రజనీ ఎంట్రీ ఇస్తారు.ఈ సినిమాల తర్వాత కొత్తగా మరో ప్రాజెక్ట్‌కు రజనీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గతేడాదిలో '2018' సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న మలయాళ దర్శకుడు జూడ్ ఆంథనీ జోసెఫ్‌తో రజనీ సినిమా ఓకే అయిందని తెలుస్తోంది. తమిళంలో వేల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై జూడ్ ఆంథనీ జోసెఫ్ ఓ సినిమా చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో నటించమని మొదట శింబును సంప్రదించారట. అయితే, ఈ కథకు సూపర్‌స్టార్ రజనీకాంత్ మాత్రమే సెట్ అవుతారని మేకర్స్ అభిప్రాయానికి వచ్చారట. దీంతో ఇప్పటికే సినిమా కథను కూడా రజనీకి వినిపించారట. అయితే, త్వరలో చిత్ర యూనిట్ గుడ్‌న్యూస్ చెప్పే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. -
బిగ్‌బాస్ షోలో నమ్రత సోదరి ఎంట్రీ!
బిగ్‌బాస్ రియాలిటీ షో ప్రేక్షకులకు వినోదాన్ని పంచితే, కంటెస్టెంట్లకు పాపులారిటీని తెచ్చిపెడుతుంది. అందుకే తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, మరాఠీ, హిందీ భాషల్లో బిగ్‌బాస్ విజయవంతంగా ప్రసారమవుతోంది. ప్రస్తుతం తెలుగులో ఎనిమిదో సీజన్ నడుస్తుండగా హిందీలో 18వ సీజన్ అక్టోబర్ 6న ప్రారంభం కానుంది.ఒకప్పుడు హీరోయిన్గా..ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక ఓ కొలిక్కివచ్చిందట! ఈ జాబితాలో నటి శిల్ప శిరోద్కర్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈమె సూపర్‌స్టార్ మహేశ్‌బాబు భార్య నమ్రతకు సోదరి అన్న విషయం తెలిసిందే! భ్రష్టాచార్(1989) సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన శిల్ప.. కిషన్ కన్హయ్య, త్రినేత్ర, హమ్, ఖుదా గవా, ఆంఖెన్, గోపి కిషన్, మృత్యునాద్, బేవఫ సనం ఇలా ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. బిగ్‌బాస్ షోలో ఎంట్రీ?తెలుగులో బ్రహ్మ మూవీలో యాక్ట్ చేసింది. పెళ్లి తర్వాత సినిమాలకు చెక్ పెట్టేసిన ఆమె పదేళ్ల గ్యాప్ తర్వాత 2013లో మళ్లీ సీరియల్స్‌లో కనిపించింది. ఇప్పుడు బుల్లితెరకు సైతం దూరంగా ఉంటున్న శిల్ప.. నిజంగానే బిగ్‌బాస్ షోలో అడుగుపెడుతుందా? లేదా? అనేది చూడాలి!మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్ షోలో ప్రముఖ కమెడియన్?
తమిళ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ లాంచ్‌కు రెడీ అవుతోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలతో బిగ్‌బాస్ టీమ్ సంప్రదింపులు జరుపుతోంది. కొందరిని ఆల్రెడీ ఫైనలైజ్ చేయగా మరికొందరికి ఇంకా ఏ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మరోవైపు షోలోకి వచ్చే కంటెస్టెంట్లు వీళ్లేనంటూ పలువురి సెలబ్రిటీల పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి..తాజాగా ఆ జాబితాలో సీనియర్ నటుడు, కమెడియన్ సెంథిల్ పేరు వినిపిస్తోంది. కేవలం తమిళంలోనే కాదు దక్షిణాది చిత్ర పరిశ్రమలోనూ ఈయనకు గుర్తింపు ఉంది. ఎక్కువగా పాపులర్ కమెడియన్ గౌండమణితో కలిసి వెండితెరపై నవ్వులు పూయించేవాడు.సెంథిల్ జర్నీ..సెంథిల్ 1970వ దశకంలో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చాడు. మొదట్లో చిన్నాచితకా పాత్రలే చేసేవాడు. ఎప్పుడైతే కమెడియన్ గౌండమణితో కలిసి నటించడం మొదలుపెట్టాడో అప్పుడు తన దశ తిరిగిపోయింది. వీరి కాంబినేషన్లో వచ్చిన కరగట్టకరన్, మన్నన్, చిన్నతంబి, ఇండియన్.. వంటి ఎన్నో చిత్రాలు బ్లాక్బస్టర్లుగా నిలిచాయి. తెలుగులో తొలి ముద్దు, మనీ మనీ మోర్ మనీ వంటి పలు చిత్రాల్లో యాక్ట్ చేశాడు. దాదాపు 500 సినిమాల్లో యాక్ట్ చేసిన ఈయనను సినీప్రియులు ఎంతగానో ఇష్టపడతారు, గౌరవిస్తారు. అలాంటి ఈయన ఇప్పుడు బిగ్‌బాస్‌కు రాబోతున్నాడని వార్తలు వస్తుండటంతో అతడి అభిమానులు ఖుషీ అవుతున్నారు. మరి అతడి ఎంట్రీ నిజమేనా? కాదా? అనేది తెలియాలంటే అక్టోబర్‌లో తమిళ బిగ్‌బాస్ 8 ప్రారంభమయ్యేవరకు వేచి చూడాల్సిందే!మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఎన్టీఆర్ 'దేవర' నుంచి మరో ట్రైలర్?
ఎన్టీఆర్ 'దేవర' మూవీ రిలీజ్‌కి మరో ఆరురోజులే ఉంది. ఈ క్రమంలోనే ఇంటర్వ్యూలు, ప్రమోషనల్ కంటెంట్ బాగానే ఇస్తున్నారు. మరోవైపు ఆదివారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. రాజమౌళి, ప్రశాంత్ నీల్, త్రివిక్రమ్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలుస్తోంది. వీటన్నింటితో పాటు 'దేవర' టీమ్ మరో సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేసిందట.(ఇదీ చదవండి: తీస్తే 'దేవర' 8-9 గంటల సినిమా అయ్యేది: ఎన్టీఆర్)కొన్నిరోజుల క్రితం 'దేవర' ట్రైలర్ రిలీజ్ చేశారు. అయితే దీనికి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఈ మూవీపై కాస్త నెగిటివ్ ప్రచారం జరుగుతోంది. ఇలాంటి టైంలో మూవీపై హైప్ పెరగాలంటే మాస్ కంటెంట్ రావాలి. ఇందుకు తగ్గట్లే ఫుల్ యాక్షన్ సీన్స్‌తో ట్రైలర్ రెడీ చేశారని, దీన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లో రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.మరోవైపు 'ఆయుధ పూజ' సాంగ్ కూడా ఈ పాటికే రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ ఎందుకో వెనక్కి తగ్గారు. బహుశా థియేటర్లలో చూసి థ్రిల్ అవ్వాలని ఇలా ప్లాన్ చేశారేమో. ఇకపోతే 'దేవర'లో తారక్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా చేశాడు. అనిరుధ్ సంగీత దర్శకుడు కాగా కొరటాల దర్శకుడు. సెప్టెంబరు 27న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: ఎన్టీఆర్ నోట తమిళనాడు ఫేమస్ బిర్యానీ.. ఏంటంత స్పెషల్?) -
బిగ్‌బాస్ షోలో 'మహారాజ' నటి ఎంట్రీ?
తమిళ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. మొదటినుంచీ ప్రచారం జరుగుతున్నట్లే ఈసారి కమల్ హాసన్ స్థానంలోకి విజయ్ సేతుపతి హోస్ట్‌గా రాబోతున్నాడు. ఈ విషయాన్ని బిగ్‌బాస్ టీమ్ అధికారికంగా వెల్లడించింది. మరికొద్ది రోజుల్లో షో ప్రారంభం అవుతుండటంతో ఈసారి హౌస్‌లో అడుగుపెట్టే కంటెస్టెంట్లు వీళ్లేనంటూ పలువురి పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.ఆ జాబితాలో.. విజయ్ సేతుపతితో కలిసి మహారాజ మూవీలో యాక్ట్ చేసిన సచన నమిదాస్ పేరు కూడా ఉంది. ఈ ప్రచారంపై నటి ఇంతవరకు స్పందించలేదు. కాగా మహారాజ చిత్రంతో కెరీర్ ప్రారంభించిన సచన.. ప్రస్తుతం 1947 మూవీతో పాటు శివకార్తికేయన్ 23వ సినిమాలోనూ యాక్ట్ చేస్తోంది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Bigg Boss 8: ప్రేరణ ఇంట్లో విషాదం
బిగ్‌బాస్ 8 హౌస్ మరీ అంతలా కాకపోయినా ఓ మాదిరిగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే బేబక్క, శేఖర్ భాషా ఎలిమినేట్ కాగా మిగిలిన ఇంటి సభ్యులు కాస్త గట్టిగానే గొడవలు పడుతున్నారు. ఎవరికి వాళ్లే హైలైట్ అయ్యే పనిలో ఉన్నారు. ఇదంతా పక్కనబెడితే హౌసులో ఉన్న ప్రేరణ ఇంట్లో విషాదం. ఈమె భర్త వాళ్ల అమ్మమ్మ చనిపోయిందట. ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ప్రముఖ సింగర్ మనో ఇద్దరు కొడుకులు అరెస్ట్)గత వారం బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయిన శేఖర్ భాషాకు అంతకు రెండు రోజుల క్రితమే కొడుకు పుట్టాడు. ఈ విషయాన్ని శనివారం ఎపోసిడ్‌లో నాగార్జున చెప్పాడు. ఈ విషయం చెప్పిన దగ్గర నుంచి తనని బయటకొచ్చేస్తానని కెమెరాలకి చెప్పాడు. అవకాశముంటే తనని ఎలిమినేట్ అయ్యేలా చూడమని మిగిలిన హౌస్‌మేట్స్‌తోనూ అన్నాడు. అయితే ఈ ఫుటేజీని నిర్వహకులు ఎపిసోడ్లో చూపించలేదు. బయటకొచ్చిన తర్వాత శేఖర్ భాషా ఇదంతా చెప్పాడు.ఇక ప్రేరణ విషయానికొస్తే.. కొన్ని నెలల క్రితమే పెళ్లి చేసుకుంది. పేరుకే కన్నడ అమ్మాయి గానీ తెలుగు సీరియల్స్ చేస్తోంది. బిగ్‌బాస్ హౌస్‌లో ప్రస్తుతం టాప్-3లో కొనసాగుతోంది. అలాంటిది ఇప్పుడు ఈమె ఇంట్లో విషాదం నెలకొంది. ఈ విషయం మంగళవారం ఎపిసోడ్లో ఈమెకు చెప్పే అవకాశముంది. ఒకవేళ చెబితే ఈమె ఎలా రియాక్ట్ అవుతుందనేది చూడాలి. అలానే ఇంట్లో బాధతో గేమ్‌పై దృష్టి పెడుతుందా లేదంటే హౌస్ నుంచి బయటకు పంపే ప్లాన్ ఏమైనా చేస్తారా అనేది చూడాలి?(ఇదీ చదవండి: బిగ్‌బాస్ సొహెల్ ఇంట్లో విషాదం.. ఏమైంది?) -
ఎన్టీఆర్ 'దేవర'.. ఫ్యాన్స్‌కి ఒక బ్యాడ్ న్యూస్?
ప్రస్తుతం టాలీవుడ్లో 'దేవర' గురించి చర్చ నడుస్తోంది. ఎందుకంటే 'ఆర్ఆర్ఆర్' లాంటి అద్భుతమైన పాన్ ఇండియా మూవీ తర్వాత ఎన్టీఆర్ చేసిన సినిమా. అందున తెలుగు కంటే హిందీలో భారీగా ప్రమోషన్స్ చేస్తున్నారు. మరోవైపు తెలుగులో కూడా రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. సరిగ్గా ఇలాంటి టైంలో సోషల్ మీడియాలో ఓ విషయం వైరల్ అవుతోంది. ఇది గనక నిజమైతే అభిమానులకు బ్యాడ్ న్యూసే.(ఇదీ చదవండి: 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుమతిపై సందేహాలు)వారం క్రితం ఎన్టీఆర్ 'దేవర' ట్రైలర్ రిలీజైంది. మిశ్రమ స్పందన వచ్చింది. అంతకు ముందు రిలీజ్ చేసిన మూడు పాటల్ని కూడా తొలుత కాపీ ట్యూన్స్ అని ట్రోల్ చేశారు. కొన్నిరోజులకే అవే పాటల్ని రిపీట్స్‌లో వింటున్నారు. వీటిలో ఎన్టీఆర్-జాన్వీ కపూర్ డ్యాన్స్‌తో అదరగొట్టిన 'దావుదీ' అనే సాంగ్ కూడా ఉంది.సినిమాలో సిట్చూయేషన్ సెట్ కాక చివర్లో టైటిల్స్ పడ్డప్పుడు ఈ పాటని ప్లే చేస్తారని తొలుత టాక్ వచ్చింది. ఇప్పుడు ఈ సాంగ్‌ని పూర్తిగా థియేటర్ వెర్షన్ నుంచి తీసేశారని అంటున్నారు. ఒకవేళ ఇదే గనుక నిజమైతే తారక్ మాస్ డ్యాన్స్ చూడటం కష్టమే. ఎందుకంటే 'చుట్టమల్లే' పాటలోనూ తారక్ డ్యాన్స్ చేశాడు. కాకపోతే అవి సింపుల్ స్టెప్స్. ఫియర్ సాంగ్, ఆయుధ పూజ ఎలివేషన్ సాంగ్స్ కాబట్టి వీటిలో తారక్ డ్యాన్స్ ఉండదు. మరి సినిమాలో 'దావుదీ' ఉంటుందా లేదా అనేది చూడాలి?(ఇదీ చదవండి: జానీ మాస్టర్ కేసు.. బయటకొస్తున్న నిజాలు!?) -
'దేవర' ప్రీ రిలీజ్ అనుమతిపై సందేహాలు.. టాప్ 25 లిస్ట్‌లో సాంగ్స్
ఎన్టీఆర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘దేవర:పార్ట్ 1’ సెప్టెంబర్ 27న విడుదల కానుంది. విడుదల సమయం దగ్గరపడుతుండటంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ కార్యక్రమంలో తారక్ పాల్గొంటారు కాబట్టి ఆయన్ను చూసేందుకు భారీగా అభిమానులు తరలివస్తారు. తమ దేవర మాట్లాడే మాటలు ఎప్పుడెప్పుడు విందామా అని ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ కార్యక్రమాన్ని ఏపీ, తెలంగాణ ఎక్కడ నిర్వహించాలని మేకర్స్ పెద్ద ఎత్తున చర్చిస్తున్నారు.దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఔట్ డోర్లో నిర్వహించుకునేందుకు పోలీసుల నుంచి అనుమతి లభించలేదని తెలుస్తోంది. తారక్‌కు ఉన్న పాపులారిటీ వల్ల దేవర ఈవెంట్ కోసం భారీగా అభిమానులు వచ్చే అవకాశం ఉందని వారు ముందే హెచ్చరిస్తున్నారట. ఓపెన్ ప్రదేశాల్లో కార్యక్రమం పెడితే ఈసారి ఊహించిన దానికంటే ఎక్కువగానే అభిమానులు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు పోలీసులు తెలుపుతున్నారట. దీంతో లిమిటెడ్ పాస్‌లు ఇచ్చి హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో దేవర ప్రీ రిలీజ్ నిర్వహించాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట. అయితే ,ఈ విషయం గురించి మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. తారక్ ఫ్యాన్స్ మాత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీగా నిర్వహించాలని తమ ప్రయత్నాలు చేస్తున్నారు. సెప్టెంబర్ 22 (ఆదివారం) ఈ కార్యక్రమం జరిగే అవకాశం ఉంది.టాప్ 25 జాబితాలో నాలుగు 'దేవర' సాంగ్స్ఎన్టీఆర్- జాన్వీ కపూర్ జోడీకి అభిమానులు ఫిదా అవుతున్నారు. దేవర నుంచి విడుదలైన అన్నీ పాటలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. యూట్యూబ్‌లో భారీ వ్యూస్ రాబడుతూ నాలుగు పాటలు ట్రెండ్ అవుతున్నాయి. టాప్ 25 ట్రెండింగ్ జాబితాలో నాలుగు స్థానాలు దేవర పాటలే ఉన్నాయి. దావూదీ (తెలుగు) తొలి స్థానం, దావూదీ (హిందీ) 7వ స్థానం, చుట్టమల్లె (తెలుగు) 18వ స్థానం, దావూదీ (తమిళ్) 25వ స్థానంలో దూసుకుపోతున్నాయి. -
నాని 'సరిపోదా శనివారం' ఓటీటీ రిలీజ్ డేట్ లాక్?
నాని లేటెస్ట్ మూవీ 'సరిపోదా శనివారం'. దాదాపు 20 రోజులకు రూ.100 కోట్ల మార్క్ అందుకుంది. ఈ మేరకు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. సినిమా బాగుందనే టాక్ వచ్చినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు, తుపాన్ ధాటికి ఈ మూవీ పరిస్థితి దారుణం అయిపోయింది. తొలి వీకెండ్ ఓ మాదిరి వసూళ్లు వచ్చాయి కానీ తర్వాత పూర్తిగా తగ్గిపోయాయి. ఇలా థియేట్రికల్ రన్ దాదాపు చివరకొచ్చేసింది. ఈ క్రమంలోనే ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.శనివారం మాత్రమే కోపాన్ని ప్రదర్శించే ఓ వ్యక్తి కథతో తీసిన సినిమా 'సరిపోదా శనివారం'. నాని, ఎస్జే సూర్య సూపర్ యాక్టింగ్ చేశారు. కానీ వర్షాల వల్ల ఈ సినిమాని చాలామంది థియేటర్లలో చూడలేకపోయారు. అయితే డిజిటల్ హక్కులు సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు అనుకున్న టైం కంటే ముందే దీన్ని ఓటీటీలోకి తీసుకొచ్చే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు)ఆగస్టు 29న థియేటర్లలో రిలీజైన 'సరిపోదా శనివారం' సినిమా.. సెప్టెంబరు 26న ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని అంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం నాని మూవీ నెలలోపే ఓటీటీలోకి వచ్చేసినట్లు అవుతుంది. మరి ఇందులో నిజమెంత అనేది మరికొద్దిరోజుల్లో తెలిసిపోతుంది.'సరిపోదా శనివారం' స్టోరీ విషయానికొస్తే సూర్య(నాని)కి కోపమెక్కువ. కానీ తల్లి చెప్పడంతో శనివారం మాత్రమే కోపాన్ని చూపిస్తుంటాడు. పెద్దయిన తర్వాత కానిస్టేబుల్ చారులత (ప్రియాంక మోహన్)తో ప్రేమలో పడతాడు. ఇదలా ఉండగా దయానంద్ (ఎస్జే సూర్య) అనే సీఐ క్రూరుడు, మహా కోపిష్టి. ఇతడు సోకులపాలెం అనే ఊరి ప్రజల్ని తెగ హింసిస్తుంటాడు. అలాంటి దయాకి సూర్య ఎలా అడ్డు నిలబడ్డాడు? చివరకు ఏమైందంనేదే మిగిలిన కథ.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 16 మూవీస్.. ఆ మూడు కాస్త స్పెషల్) -
అతడే ఎలిమినేట్.. ముందే స్కెచ్చేసిన బిగ్‌బాస్!
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ లాంచింగ్ రోజు 14 మంది కంటెస్టెంట్లు హౌస్‌లో అడుగుపెట్టారు. విష్ణుపప్రియ, ఆదిత్య ఓం వంటివాళ్లు తప్ప మిగతా అందరూ జనాలకు పెద్దగా పరిచయం లేనివాళ్లే! కానీ రోజులు గడిచేకొద్దీ అందరూ సుపరిచితులైపోయారు. అంతలోనే ఎలిమినేషన్ దగ్గరకు రాగా బేబక్క ఇంటిని వీడింది..రెండో వారం నామినేషన్లో..మొదట్లో గమ్ముగా కూర్చున్న ఆమె వెళ్లిపోయేముందు మాత్రం తనలో ఫైర్ చూపించింది. ఇక రెండో వారం నాగమణికంఠ, కిర్రాక్ సీత, పృథ్వీ శెట్టి, నైనిక, శేఖర్ బాషా, విష్ణుప్రియ, ఆదిత్య, నిఖిల్ నామినేషన్లో ఉన్నారు. వీరిలో నిఖిల్, విష్ణుప్రియ అందరికంటే ముందు సేవ్ అవుతారనడంలో డౌటే లేదు. రోజురోజుకీ ఆట మెరుగుపర్చుకుంటున్న మణికంఠకూ బాగానే ఓట్లు పడుతున్నాయి. నైనికకు కూడా ఓట్లు పర్వాలేదనిపిస్తున్నాయి. సీతను కాపాడింది అదే!మిగిలిందల్లా ఆదిత్య, సీత, శేఖర్ బాషా, పృథ్వీ. ఈ నలుగురిలో ఈ వారం గేమ్‌లో రఫ్ఫాడించింది సీత. ఆమె డేంజర్ జోన్లో ఉన్నప్పటికీ తన గేమ్ ఆమెను కాపాడింది. పృథ్వీ.. గొడవలకు సై అంటూ దూకుతున్నాడు కాబట్టి.. ఆ కొట్లాటల కోసం మరికొన్నాళ్లు అలాగే కొనసాగించే ఛాన్స్ ఉంది. మిగిలింది బాషా, ఆదిత్య. కావాలనే..హౌస్‌లో అంతో, ఇంతో నవ్విస్తోంది బాషాయే! తన జోకులతో, పంచులతో చిరాకు పుట్టిస్తూనే చిరునవ్వు తెప్పిస్తున్నాడు. కానీ ఈ వారం అతడికి గేమ్స్ ఆడే అవకాశమే బిగ్‌బాస్ ఇవ్వలేదు. ఈ లెక్కన తనను పంపించేయాలని ముందే డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అటు ఆదిత్య.. హౌస్‌లో ఉన్నాడా? లేడా? అన్నట్లుగానే ఉన్నాడు. ఆదిత్య ఉన్నాడా? లేదా?ఈ వారమైనా కాస్త కనిపించమని నాగ్ చెప్పినా సరే ఎక్కడా యాక్టివ్‌గా ఉన్నట్లు కనిపించలేదు. దీంతో ఇతడిని ఎలిమినేట్ చేయడం ఖాయమని అంతా అనుకున్నారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆదిత్యను సేవ్ చేసి బాషాను ఎలిమినేట్ చేశారట!బాషా ఎలిమినేట్!త్వరలోనే అవినాష్ లేదా రోహిణి వంటి కమెడియన్స్‌ను వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా హౌస్‌లోకి పంపించాలన్నది బిగ్‌బాస్ ప్లాన్. ఇందుకోసమే తనకు తెలిసిన కామెడీతో నవ్విస్తున్న బాషాను బయటకు పంపిస్తున్నారట! మరి ఇదెంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
విజయ్ కుమారుడి డైరెక్షన్లో టాలీవుడ్ హీరో
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ తన తండ్రిలా యాక్టర్ కాకుండా డైరెక్టర్‌గా మారిన విషయం తెలిసిందే. ఆయన డైరెక్ట్ చేస్తున్న మొదటి సినిమాలో టాలీవుడ్ హీరోకు అవకాశం దక్కింది. విజయ్ అభిమానులు కూడా జేసన్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్లో తెరెక్కిస్తుంది.జాసన్ సంజయ్ తన డెబ్యూ మూవీని ఇప్పటికే అఫీషియల్‌గా ప్రకటించారు. యూత్‌ఫుల్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో సందీప్ కిషన్‌కు ఛాన్స్ దక్కినట్లు ప్రచారం జరుగుతుంది. ఇదే సమయంలో ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించనున్నారని సమాచారం. సుభాస్కరన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో ప్రధాన హీరో, హీరోయిన్లు ఎవరనేది తెలియాల్సి ఉంది.ఈ ప్రాజెక్ట్ గురించి నిర్మాత సుభాస్కరన్ మాట్లాడుతూ.. 'జాసన్ సంజయ్ దర్శకత్వంలో లైకాలో చిత్రాన్ని నిర్మించడం ఆనందంగా ఉంది. అతను మాకు కథ చెప్పినప్పుడు చాలా బాగా నచ్చింది. సినిమా ప్రేక్షకులను మెప్పించే అన్ని అంశాలు కథలో ఉన్నాయి. తమిళ చిత్రసీమలో పాపులర్ అవుతున్న పలువురు నటీనటులను ఈ సినిమా కోసం తీసుకుంటున్నాం. ఇప్పటికే వారితో చర్చలు కూడా జరుగుతున్నాయి.' అని ఆయన అన్నారు.ఈ క్రమంలో జేసన్ సంజయ్ మొదటి సినిమాలో విజయ్ సేతుపతి నటిస్తారని మొదట వార్తలు వచ్చాయి. అయితే, ఈ బిగ్ ప్రాజెక్ట్‌లో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటించడం దాదాపు ఖాయమైందని సమాచారం. కొన్ని నెలల క్రితం విడుదలైన 'రాయన్' చిత్రంతో ఆయన ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్నారు. అందులోని ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో సందీప్ కిషన్‌కు ఇలా ఛాన్స్ దక్కిందని చెప్పవచ్చు. -
విజయ్ సేతుపతికి ఊహించలేనంత రెమ్యునరేషన్ ఆఫర్ చేసిన 'బిగ్‌బాస్'
దేశవ్యాప్తంగా భారీ పాపులారిటీ తెచ్చుకున్న రియాలిటీ షో 'బిగ్‌బాస్'.. ఇప్పటికే తెలుగులో సీజన్-8 ప్రారంభమైంది. అక్టోబర్ 6 నుంచి తమిళ్లో సీజన్-8 మొదలుకానుంది. అయితే, ఇప్పటి వరకు హోస్ట్‌గా ఉన్న కమల్ హాసన్ ఈ సీజన్‌కు కాస్త బ్రేక్ ఇచ్చాడు. ఈసారి విజయ్ సేతుపతి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే చిన్న టీజర్‌ను కూడా విడుదల చేశారు. ఈ క్రమంలో బిగ్‌బాస్ కోసం విజయ్ సేతుపతి ఎంత రెమ్యునరేషన్ తీసుకోనున్నారని పెద్ద చర్చే జరుగుతుంది.విజయ్ సేతుపతి ఇటీవలే మహారాజ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు. సుమారు రూ.120 కోట్లకు పైగా ఈ చిత్రం కలెక్షన్లు రాబట్టింది. దీంతో తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఆయన మార్కెట్ కూడా పెరిగింది. ఈ విజయం తర్వాత బిగ్‌బాస్ తమిళ్ 8వ సీజన్ హోస్టింగ్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 100 రోజుల పాటు సాగే ఈ బిగ్ బాస్ సీజన్‌కు భారీ మొత్తంలోనే రెమ్యునరేషన్ తీసుకోనున్నట్లు సమాచారం. ప్రతి శనివారం, ఆదివారం మాత్రమే ఆయన బిగ్‌బాస్‌లో కనిపిస్తారు. అందుకుగాను సుమారు రూ. 60 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోనున్నారని ప్రచారం జరుగుతుంది. విజయ్ సేతుపతి ఒక్కో సినిమాకు రూ. 15 నుంచి రూ. 20 కోట్ల వరకు తీసుకుంటారు. ఏదైనా ఒక యాడ్‌లో నటిస్తే రూ. 1కోటి వరకు ఛార్జ్ చేస్తారని టాక్. బిగ్‌బాస్ స్ట్రీమింగ్ అవుతున్న సమయంలో చాలా యాడ్స్ వస్తుంటాయి. అలా చూస్తే విజయ్ సేతుపతికి ఇచ్చే రెమ్యునరేషన్ చాలా తక్కువే అని చెప్పవచ్చు. సేతుపతి మంచి నటుడే కాదు మంచి వక్త కూడా. బిగ్ బాస్ షోకి హోస్ట్ గా ఆయన ఎంపిక పర్ఫెక్ట్ అని అంటున్నారు అభిమానులు. మక్కల్ సెల్వన్ తదుపరి సీజన్లకు కూడా వ్యాఖ్యాతగా కొనసాగుతాడని, భవిష్యత్తులో రెమ్యునరేషన్ మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. కమల్ హాసన్ బిగ్‌బాస్ కోసం రూ. 120 కోట్ల వరకు రెమ్యునరేషన తీసుకునే వారని ప్రచారం ఉంది. -
ఆ ఆనవాయితీ రిపీట్! తనే ఎలిమినేట్ కానుందా?
బిగ్‌బాస్ షోలో ఓ ఆనవాయితీ ఉంది. అదేంటంటే.. కిచెన్‌లో అడుగుపెట్టారంటే చాలు వారు ఎలిమినేషన్‌కు దగ్గరవుతున్నట్లే! అలా వంటగదిలో గరిటె తిప్పిన ఎంతోమంది మొదటివారమే ఇంటికి వెళ్లిపోయారు. ఈసారి కూడా అదే రిపీట్ అయ్యేట్లు కనిపిస్తోంది. ఈ వారం నామినేషన్లో పృథ్వి, విష్ణుప్రియ, నాగమణికంఠ, బేబక్క, సోనియా, శేఖర్ బాషా ఉన్నారు. టాప్ ప్లేస్‌లో మణికంఠవచ్చిన మొదటిరోజు నుంచే తన గతాన్ని తవ్వి ఏడుస్తూ, జనాల్ని ఏడిపిస్తూ మణికంఠ ఓట్లు రాబట్టేశాడు. అంతేకాదు, సోషల్ మీడియా ఓటింగ్‌లో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. ఇంట్లో ఉన్న కన్నడ బ్యాచ్‌కు గట్టి పోటీనిచ్చేలా ఉందని సోనియాకు కూడా అంతో ఇంతో ఓట్లు గుద్దుతున్నారు. విష్ణుప్రియకు ఆల్రెడీ ప్రత్యేక ఫ్యాన్‌బేస్ ఉంది. చివరి స్థానంలో బేబక్కబాషా తన కామెడీతో జనాలకు పిచ్చెక్కిస్తున్నాడు. ఇవేం జోకులురా బాబూ అనుకుంటూనే, ఇలాంటివాడు హౌస్‌లో ఉండాలంటూ ప్రేక్షకులు ఓట్లు వేస్తున్నారు. మిగిలింది బేబక్క, పృథ్వి. ఈ ఇద్దరిలో పృథ్వి ముక్కుసూటిగా మాట్లాడుతూ మెప్పిస్తున్నాడు. బేబక్క వంటతో హౌస్మేట్స్ కడుపునింపినా ప్రేక్షకులకు ఏమాత్రం వినోదం ఇవ్వడం లేదు.తనే ఎలిమినేట్?దీంతో ఈమె హౌస్‌లో ఉన్నా, లేకున్నా ఒకటే అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో ఆమెకు తక్కువ ఓట్లు పోలైనట్లు తెలుస్తోంది. ఈ వారం తనే ఎలిమినేట్ అయినట్లు సమాచారం. మరి ఇందులో ఎంత నిజం ఉంది? ఎలిమినేషన్ జరిగిందా? లేదంటే వినాయక చవితి పండగ సందర్భంగా నో ఎలిమినేషన్ అని ట్విస్ట్ ఇచ్చారా? అనేది చూడాలి.చదవండి: ఏం చేస్తున్నారో అర్థమవుతోందా? మండిపడ్డ ఆలియా భట్ -
'దేవర' ట్రైలర్ విడుదలపై జూ ఎన్టీఆర్ ప్రకటన
జూ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబో నుంచి వస్తున్న సినిమా దేవర. వినాయకచవితి సందర్భంగా ట్రైలర్ విడుదల తేదీని తారక్ అధికారికంగా ప్రకటించారు. సెప్టెంబర్ 27న తెలుగుతోపాటు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచుతున్నాయి. అయితే, దేవర ట్రైలర్ ఎప్పుడు విడుదల అవుతుందా అని సోషల్ మీడియాలో భారీగా చర్చ జరుగుతున్న సమయంలో తారక్ గుడ్‌న్యూస్ చెప్పారు.తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సిస్లోనూ భారీ ఎత్తున రిలీజ్ కానున్న దేవర ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది. సెప్టెంబర్ 10న దేవర ట్రైలర్ చేస్తున్నట్లు తారక్ ప్రకటించారు. బాలీవుడ్లో దేవర మార్కెట్ పెంచుకునేందుకు ముంబైలో ఒక భారీ ఈవెంట్ ఏర్పాటు చేసి అక్కడ ట్రైలర్‌ను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. కాగా ఒవర్సీస్లో అడ్వాన్స్ బుక్కింగ్స్ దేవర అదరగొడుతుంది. ఇప్పటికే ఓవర్సీస్లో ప్రీ సేల్స్ స్టార్ట్ చేశారు. USA, కెనాడాలో టికెట్లు ఓపెన్ అయిన కొన్ని నిమిషాల్లోనే అమ్ముడుపోయాయి. ప్రీ సేల్స్ బుకింగ్స్ ద్వారానే ఇప్పటికి సుమారు రూ. 6 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కల్కి అడ్వాన్స్ కలెక్షన్స్ ను దేవర దాటేశాడు. ఇంకా రిలీజ్ కు 20 రోజుల ముందుగానే ఈ రికార్డ్స్‌ను తారక్ నమోదు చేశాడు .దేవర చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పకులు. ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటించారు. ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, నరైన్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. View this post on Instagram A post shared by Jr NTR (@jrntr) -
రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చిన డైరెక్టర్ హరీశ్ శంకర్!
హరీశ్ శంకర్ పేరు చెప్పగానే గుర్తొచ్చే సినిమా 'గబ్బర్ సింగ్'. ఎక్కువగా రీమేక్ కథలతో మూవీస్ తీస్తాడనే అపవాదు ఉన్న ఈ దర్శకుడు తీసిన లేటెస్ట్ సినిమా 'మిస్టర్ బచ్చన్'. రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రం.. ఆగస్టు 15న థియేటర్లలో రిలీజై ఘోరంగా ఫ్లాప్ అయింది. చాలా నష్టాలొచ్చాయి. ఈ క్రమంలోనే హరీశ్ శంకర్ తన వంతుగా కొంత రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చినట్లు తెలుస్తోంది.ప్రస్తుతానికి రెండు కోట్లు రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చారని, త్వరలో మరి కొంచె వెనక్కి ఇచ్చే అవకాశముందని సమాచారం. ఏదేమైనా ఇలా సినిమా నష్టపోతే ఇలా పారితోషికం వెనక్కి ఇచ్చి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లని ఆదుకోవడం మంచి విషయమే. మరోవైపు ఇదే సినిమాలో హీరోగా రవితేజ నుంచి ఇలాంటి రెస్పాన్స్ రాలేదు.(ఇదీ చదవండి: Bigg Boss 8: చావు వరకు వెళ్లొచ్చా.. ఏడిపించేసిన నాగ మణికంఠ!)'మిస్టర్ బచ్చన్' విషయానికొస్తే.. 2018 హిందీలో వచ్చిన 'రైడ్' అనే మూవీకి రీమేక్‌గా దీన్ని తీశారు. అయితే ఒరిజినల్ స్టోరీ సీరియస్‌గా ఉంటుంది. హరీశ్ శంకర్ మాత్రం కమర్షియల్ ఎలిమెంట్స్ అని చెప్పి పాటలు, ఫైట్స్ అని అదనంగా జోడించారు. దీంతో మూవీ కాస్త కిచిడి అయిపోయింది. అలానే మరీ ఎక్కువగా హీరోయిన్ భాగ్యశ్రీ అందాలని చూపించడం కూడా అసలు కథని పక్కదారి పట్టించిందనే విమర్శలు వచ్చాయి.ఇకపోతే 'మిస్టర్ బచ్చన్' ఓటీటీ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్ చేసుకోవచ్చు అనేలా అగ్రిమెంట్ చేసుకున్నారని టాక్. దీనిబట్టి చూస్తే వచ్చే వారం ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశముంది. లేదంటే వినాయక చవితి కానుకగా ఈ శనివారం నుంచి స్ట్రీమింగ్ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు.(ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాలకు మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం) -
'పుష్ప 2' ఓటీటీ హక్కులు.. ఏకంగా వందల కోట్లు?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2'తో బిజీగా ఉన్నాడు. షూటింగ్ చివరి దశలో ఉంది. మొన్నీమధ్య నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ ప్లానింగ్ అంతా చెప్పారు. సెప్టెంబరు-అక్టోబరు కల్లా మరో రెండు పాటలు రిలీజ్ అవుతాయని, అలానే ఎడిటింగ్ వర్క్ కూడా పూర్తవుతుందని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబరు 6న థియేటర్లలో రిలీజ్ పక్కా అని బల్లగుద్ది మరీ క్లారిటీ ఇచ్చారు.(ఇదీ చదవండి: అమ్మ చిరకాల కోరిక తీర్చిన ఎన్టీఆర్)ఇదలా ఉండగానే పుష్ప 2 మూవీ ఓటీటీ హక్కుల గురించి ఇప్పుడు అదిరిపోయే న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. ఇప్పటివరకు ఏ ఇండియన్ మూవీకి లేనంతగా అమ్మారట. ఏకంగా రూ.270 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ సంస్థ డిజిటల్ రైట్స్ దక్కించుకుందట. ఇప్పుడు ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది.మరో రెండురోజుల్లో 'పుష్ప 2' కొత్త షెడ్యూల్ మొదలవబోతుందట. ఇందులో భాగంగా అల్లు అర్జున్, ఫహాద్ ఫాజిల్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారని తెలుస్తోంది. మరోవైపు 'పుష్ప' పార్ట్ 3 కూడా ఉండొచ్చని మొన్నీమధ్యే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రావు రమేశ్ చెప్పుకొచ్చారు. రెండో భాగాన్నే దాదాపు మూడేళ్ల నుంచి తీస్తున్నారు. ఇక మూడో పార్ట్ అంటే అది ఎన్నేళ్లు అవుతుందో?(ఇదీ చదవండి: ఆరేళ్లు తీసిన క్రేజీ హారర్ సినిమా.. థియేటర్లలో రీ రిలీజ్) -
Bigg Boss 8: కంటెస్టెంట్ల జాబితా ఇదే! మాజీలు కూడా..
తెలుగు బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ నాలుగు రోజుల్లో వచ్చేయనుంది. ఈసారి ఎంటర్టైన్మెంట్కు లిమిటే లేదంటూ నాగ్.. బిగ్‌బాస్ ఫ్యాన్స్‌ను హుషారెత్తిస్తున్నాడు. సమయం ముంచుకువస్తున్నా ఇంకా ఫైనల్ లిస్టు మాత్రం పూర్తయినట్లు లేదు. ఇప్పటివరకైతే కింద ఉన్న కంటెస్టెంట్లు దాదాపు ఖాయమైనట్లు ప్రచారం జరుగుతోంది. అందులో..1. ఆదిత్య ఓం2. యష్మి గౌడ3. అంజలి పవన్4. నిఖిల్ మళియక్కల్5. అభిరామ్ వర్మ6. బెజవాడ బేబక్క7.అభయ్ నవీన్8. కిర్రాక్ సీత9. ఖయ్యూం అలీ10. నాగ మణికంఠ11. విష్ణుప్రియ12. ఆర్జే శేఖర్ భాషా13. సాహర్ కృష్ణన్14. కళ్యాణి15. విస్మయ శ్రీ16. నైనిక అనసురు 17. సోనియా ఆకుల ఉన్నారట!వీరు కాకుండా గత సీజన్లలోని కంటెస్టెంట్లను కూడా తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆర్జే చైతు (బిగ్‌బాస్ నాన్‌స్టాప్), ముక్కు అవినాష్ (బిగ్‌బాస్ 4)లతో సంప్రదింపులు జరిగినట్లు భోగట్టా. మరి ఫైనల్ లిస్టులో ఎవరెవరు ఉంటారో చూడాలి! -
సినిమా సూపర్ హిట్.. కానీ అద్దె ఇంట్లోకి స్టార్ హీరోయిన్
హీరోహీరోయిన్లు అనగానే.. వాళ్లకేంటి బోలెడన్ని డబ్బులున్నాయని అనుకుంటారు. అది నిజమే కానీ కొందరు హీరోయిన్లు చాలావరకు అద్దెకు ఉంటుంటారు. మన దగ్గర చాలామందికి సొంతిళ్లు ఉంటాయి. బాలీవుడ్లో మాత్రం రెంట్ కల్చర్ ఎక్కువే. ఇప్పుడు స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ అదే ఫాలో అయిపోయింది. స్టార్ హీరో ఇంటిని అద్దెకు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: కారు ప్రమాదం.. నెలలోనే కోలుకున్న యంగ్ కమెడియన్)ప్రభాస్ 'సాహో'లో హీరోయిన్గా చేసిన శ్రద్ధా కపూర్.. తాజాగా 'స్త్రీ 2' సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ మూవీ ఇప్పటికే రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇదలా పక్కనబెడితే శ్రద్ధా.. ఇప్పుడు ముంబైలోని జుహూ ప్రాంతంలో ఉన్న హీరో హృతిక్ రోషన్ ఇంటిని అద్దెకు తీసుకునే ప్లాన్‌లో ఉందట. బీచ్‌కి ఎదురుగా ఉంటే ఈ బిల్డింగ్‌లో హీరో అక్షయ్ కుమార్ అపార్ట్మెంట్ ఉండటం విశేషం.శ్రద్ధా కపూర్ ఇల్లు మారడానికి కారణం ఉంది. 1987లో శ్రద్ధా కపూర్ తండ్రి శక్తి కపూర్.. జుహూలోనే ఓ ఇంటిని కొన్నారు. దాన్ని ఇప్పుడు కాస్త విస్తరించి రీ మోడలింగ్ చేయాలనుకుంటున్నారు. అందుకే వేరే ఇంట్లో కొన్నాళ్ల పాటు అద్దెకు ఉండాలి. అలా ఇప్పుడు హృతిక్ ఇంట్లోకి శ్రద్ధా కపూర్ రానుందనమాట.(ఇదీ చదవండి: అల్లు అర్జున్‌పై నోరుపారేసుకున్న జనసేన ఎమ్మెల్యే) -
బిగ్‌బాస్ 8: ఆ హీరోయిన్‌తో పాటు డ్యాన్సర్ కూడా!
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ వారం రోజుల్లో షురూ కానుంది. సింగర్, మోడల్, డ్యాన్సర్, యాక్టర్.. ఇలా విభిన్న రంగాల నుంచి కంటెస్టెంట్ల ఎంపిక చేపట్టారు. ఇప్పటికే రీతూ చౌదరి, విష్ణుప్రియ, సౌమ్య రావు, ఏక్నాథ్ హారిక, యష్మి గౌడ, అంజలి పవన్, యాంకర్ శేఖర్ భాషా, యాదమ్మరాజు దాదాపు ఖరారయ్యారని ప్రచారం జరుగుతోంది.డ్యాన్సర్..తాజాగా ఓ డ్యాన్సర్ పేరు తెరపైకి వచ్చింది. తనే నైనిక. డ్యాన్స్ రియాలిటీ షో ఢీలో పాల్గొని తన టాలెంట్ చూపించింది. ఈవిడ అచ్చ తెలుగమ్మాయి. అలాగే ఓ మలయాళ హీరోయిన్ సైతం షోలోకి వచ్చేస్తోందట.. తనే విస్మయ శ్రీ. చూడటానికి క్యూట్‌గా కనిపించే ఈ బ్యూటీ.. తెలుగులో మైల్స్ ఆఫ్ లవ్, కృష్ణగాడు అంటే ఒక రేంజ్, నమో, దిల్సే చిత్రాల్లో నటించింది. ప్చ్, ఫలితం లేదుఇన్ని సినిమాలు చేసినా విస్మయకు టాలీవుడ్లో అంతగా గుర్తింపు రావడం లేదు. ఇంతలో బిగ్‌బాస్ ఆఫర్ వచ్చింది. దీనివల్ల జనాలకు మరింత దగ్గరవచ్చని భావించిందో ఏమో కానీ వెంటనే ఆఫర్ ఓకే చేసిందట. మరి ఈ బ్యూటీస్ షోలో ఏమేరకు మెప్పిస్తారో చూడాలి! -
విమానం కొన్న హీరో సూర్య.. రేటు రూ.100 కోట్లు పైనే?
హీరో సూర్య పేరుకే తమిళ హీరో గానీ తెలుగులోనూ మన స్టార్ హీరోల రేంజ్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం 'కంగువ' అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. కొన్నిరోజుల క్రితం ట్రైలర్ రిలీజ్ చేయగా.. రెస్పాన్స్ బాగానే వచ్చింది. ఇప్పుడు వ్యక్తిగతంగా మరోసారి వార్తల్లో నిలిచాడు.(ఇదీ చదవండి: బోల్డ్ సీన్స్ వైరల్.. నన్ను జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు: రుహానీ శర్మ)సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ పోతున్న సూర్య.. ఆస్తులు కూడా బాగానే కూడబెతున్నాడు. ఇతడి భార్య జ్యోతిక కూడా ప్రస్తుతం సినిమాల్లో నటిస్తోంది. సరే ఇదంతా పక్కనబెడితే తాజాగా సూర్య.. దాదాపు రూ.120 కోట్లు ఖరీదు చేసే దస్సాన్ ఫాల్కన్ 2000 మోడల్ ప్రైవేట్ జెట్ కొన్నాడని న్యూస్ వైరల్ అవుతోంది.సూర్య అనుకుంటే దీన్ని కొనేస్తాడేమో గానీ ఈ వార్తల్లో నిజం లేదని అతడి సన్నిహితులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో వినిపిస్తున్నవన్నీ కేవలం రూమర్స్ మాత్రమేనని కొట్టిపారేశారు. సరే ఇదలా వదిలేస్తే 'కంగువ' సినిమా.. అక్టోబరు 10న పాన్ ఇండియా వైడ్ థియేటర్లలో రిలీజ్ కానుంది. టైమ్ ట్రావెల్ పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించడం విశేషం.(ఇదీ చదవండి: 'మిస్టర్ బచ్చన్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయిందా?) -
'మిస్టర్ బచ్చన్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయిందా?
రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'మిస్టర్ బచ్చన్'. అప్పుడెప్పుడో 2018లో హిందీలో వచ్చిన 'రైడ్' అనే చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని దీన్ని తీశారు. కాకపోతే కమర్షియల్ హంగులు అని చెప్పి అసలు కథని సైడ్ చేయడంతో మూవీ ఫెయిలైంది. ఆగస్టు 15న థియేటర్లలో రిలీజైతే తొలిరోజే నుంచి ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.(ఇదీ చదవండి: హీరోయిన్ ప్రణీత బేబీ షవర్ సెలబ్రేషన్స్.. ఫొటోలు వైరల్)రిలీజ్‌కి ముందు దర్శకుడు హరీశ్ శంకర్ హైప్ పెంచేలా కామెంట్స్ చేశాడు. దీంతో సినిమాపై ఓ మాదిరి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఘోరమైన రిజల్ట్ కనిపించింది. హీరోయిన్ తప్పితే చూడటానికి సరైన కంటెంట్ లేదని ప్రేక్షకుల నుంచి విమర్శలు వచ్చాయి. అలానే సినిమాకు భారీ నష్టాలు తప్పవని ట్రేడ్ పండితుల అంచనా. ఈ క్రమంలోనే అనుకున్న టైమ్ కంటే ముందే ఓటీటీలోకి రాబోతుందని తెలుస్తోంది.'మిస్టర్ బచ్చన్' డిజిటల్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సినిమా ఫలితం పాజిటివ్‌గా వచ్చుంటే కాస్త లేటుగా ఆరు వారాల్లో స్ట్రీమింగ్కి వచ్చి ఉండేదేమో? కానీ రిజల్ట్ తేడా కొట్టేయడంతో థియేటర్లలో రిలీజైన నెలలోనే ఓటీటీలోకి తీసుకొచ్చేయబోతున్నారని తెలుస్తోంది. అంటే వినాయక చవితికి సెప్టెంబరు 6 లేదా 7న లేదంటే ఆ తర్వాత వారంలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. (ఇదీ చదవండి: షూటింగ్ లో గాయపడ్డ రవితేజ.. ఆరు వారాలు విశ్రాంతి) -
ఐటం సాంగ్‌లో శోభిత ధూళిపాళ.. చై ఒప్పుకుంటాడా?
నాగచైతన్య- శోభిత ధూళిపాళ.. ఇద్దరూ చాలాకాలంగా ప్రేమించుకుంటున్నారు. కానీ ఆ ప్రేమను ఎన్నడూ బయటపెట్టలేదు. తమ మధ్య ఏమీ లేదన్నట్లుగానే ప్రవర్తించారు. కలిసి షికార్లకు వెళ్లినా గుట్టుగా దాచారు. ఎట్టకేలకు ఈ దాగుడుమూతలకు స్వస్తి పలుకుతూ ఈ మధ్యే నిశ్చితార్థం చేసుకున్నారు. ఆగస్టు 8న ఇరు కుటుంబసభ్యులు తాంబూలాలు మార్చుకున్నారు. వీరి వివాహం ఈ ఏడాది చివర్లోనో లేదా వచ్చే ఏడాది మార్చిలోనో ఉందని ప్రచారం జరుగుతోంది.ఐటం సాంగ్ ఆఫర్అప్పటివరకు ఇద్దరూ తమ సినిమా పనులతో బిజీగా ఉండనున్నారు. తాజాగా శోభితకు బాలీవుడ్ నుంచి ఊహించని ఆఫర్ వచ్చిందట! మునుపెన్నడూ చేయని రోల్ ఇచ్చారట.. అదే ఐటం సాంగ్! రణ్వీర్ సింగ్ హీరోగా నటిస్తున్న డాన్ 3లో శోభితను భాగం చేయాలని దర్శకనిర్మాత ఫర్హాన్ అక్తర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట! ఐటం సాంగ్ చేయాలంటూ శోభితకు ఆయన ఆఫర్ ఇచ్చారంటూ ఓ వార్త నెట్టింట వైరలవుతోంది. శోభిత ఆన్సర్ ఏమై ఉంటుంది?ఈ క్రమంలో ఫర్హాన్ అక్తర్- శోభిత పలుమార్లు భేటీ కానున్నారని తెలుస్తోంది. ఇప్పటికే చర్చలు జరుగుతున్నట్లు భోగట్టా! మరి శోభిత.. ఐటం సాంగ్‌కు ఓకే చెప్తుందా? లేదా ఆఫర్ తిరస్కరిస్తుందా? అని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయినా శోభిత ఐటం సాంగ్ చేసేందుకు చై ఒప్పుకుంటాడా? అని మరికొందరు సందేహిస్తున్నారు. అసలు డాన్ 3లో శోభిత పాత్ర ఉందా? లేదా? అనే విషయంపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే!చదవండి: ఆడాళ్లకు మంచి లైఫ్ ఎక్కడుంది?: మంచు లక్ష్మి -
బిగ్‌బాస్ 8: తెరపైకి కొత్త కంటెస్టెంట్లు.. విచిత్రమేంటంటే?
బిగ్‌బాస్ షురూ అవుతుందంటే చాలు ఫ్యాన్స్ హంగామా మామూలుగా ఉండదు. ఎప్పుడెప్పుడు కొత్త ప్రోమో రిలీజ్ అవుతుందా? ఈసారి ఎవరెవరు వస్తారా? అని సోషల్ మీడియాలో తెగ ఆరా తీస్తుంటారు. గత సీజన్ పుణ్యమా అని జనాల్లో ఈ ఉత్సాహం మళ్లీ కనిపిస్తోంది. మరి ఈసారి ఎలా ఉంటుందనేది రానున్న రోజుల్లో తేలిపోనుంది.వచ్చే వారమే బిగ్‌బాస్ 8అయితే ఈసారి ఏయే కంటెస్టెంట్లు హౌస్‌లోకి వెళ్లనున్నారనేదానిపై ఇంతవరకు స్పష్టతర రాలేదు. వారం రోజుల్లో (సెప్టెంబర్ 1న) షో పెట్టుకుని ఇంతవరకు జాబితా ఫైనల్ చేయకపోవడం నిజంగానే విడ్డూరం! బిగ్‌బాస్ టీమ్ సెలక్ట్ చేసిన లిస్టులో కొందరి పేర్లు ఈపాటికే లీకయ్యాయి. అందులో కొందరైతే చాలామందికి తెలియను కూడా తెలీదు. ఏదేమైనా ఈ సీజన్లో పాల్గొనే కంటెస్టెంట్ల జాబితా ఇదేనంటూ నెట్టింట ఓ లిస్టు వైరలవుతోంది. దీని ప్రకారం.. సీనియర్ నటి సనా హౌస్‌లోకి రానుందట.ప్రచారంలో కొత్త పేర్లుకమెడియన్ యాదమ్మ రాజు, నటి అంజలి పవన్, యాంకర్ రీతూ చౌదరి, యాంకర్ సౌమ్య రావు, ఏక్నాథ్ హారిక, సింగర్ సాకేత్ కంటెస్టెంట్లుగా దాదాపు కన్ఫార్మ్ అయ్యారట! కృష్ణ ముకుంద మురారీ సీరియల్ ఫేమ్ యష్మి గౌడ కూడా బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టనుందని తెలుస్తోంది. యువసామ్రాట్, హర్షసాయి, విష్ణుప్రియ, బంచిక్ బబ్లూ, సోనియా సింగ్, బెజవాడ బేబక్క పేర్లు వినిపించినా ఇంతవరకు ఫైనల్ కాలేదని భోగట్టా!ఆమె తప్పుకుందా?నటుడు ప్రభాకర్, కిర్రాక్ ఆర్పీ, ఇంద్రనీల్, అనిల్ గీల, బుల్లితెర నటుడు రవితేజ, సెల్వరాజ్, మోడల్ సయ్యద్ రోహన్ అబుల్ పేర్లు వినిపిస్తున్నాయి. గత సీజన్ రన్నరప్ అమర్దీప్ భార్య తేజస్విని గౌడ కూడా షోలోకి వస్తుందని మొదటి నుంచి ప్రచారం జరిగింది. అయితే పారితోషికం దగ్గర చర్చలు విఫలం కావడంతో ఆమె ఈ సీజన్ నుంచి తప్పుకుందట. బహుశా నెక్స్ట్ సీజన్‌కు వద్దామని ఈసారి సైడ్ అయిపోయిందేమో!చదవండి: Chiranjeevi Birthday: సుప్రీమ్ హీరో.. మెగాస్టార్‌గా.. -
చై- శోభితల పెళ్లి ఎప్పుడంటే?
హీరో నాగచైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్లల నిశ్చితార్థం ఈ నెల 8న జరిగిన విషయం తెలిసిందే. అప్పట్నుంచీ వీరి వివాహం ఎక్కడ జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుంది? అనే చర్చ ఆరంభమైంది. కాగా నాగచైతన్య, శోభితల వివాహం ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది మార్చిలో రాజస్థాన్‌లో జరిగే అవకాశం ఉందనే టాక్ ప్రచారంలోకి వచ్చింది. ఈ ఇద్దరి సినిమా కాల్షీట్స్, వీరి కుటుంబంలోని ముఖ్య సభ్యులు అందుబాటులో ఉండే సమయం వంటి అంశాలు చర్చించుకుని పెళ్లి తేదీ, వివాహ వేదికపై ఇద్దరి కుటుంబ సభ్యులు ఓ స్పష్టతకు వస్తారట. మరి... ఈ ఏడాది చివర్లో నాగచైతన్యతో శోభిత ఏడడుగులు వేస్తారా? లేక వచ్చే ఏడాది మార్చిలో శోభిత మెడలో చైతన్య మూడు ముళ్లు వేస్తారా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు. ఇక ప్రస్తుతం నాగచైతన్య ‘తండేల్’ సినిమాతో బిజీగా ఉన్నారు. సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు చందు మొండేటి దర్శకుడు. -
రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేస్తున్న హరీశ్ శంకర్!
మిస్టర్ బచ్చన్.. ఎన్నో అంచనాల మధ్య ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ అందుకుంది. పాత రవితేజను చూస్తారంటూ ఊదరగొట్టిన డైరెక్టర్ హరీశ్ శంకర్ ఆడియన్స్ పల్స్ పట్టుకోవడంలో విఫలమయ్యాడు. ఇప్పటివరకు కేవలం రూ.12.6 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా ఫ్లాప్ దిశగా పయనిస్తోంది.దీంతో హరీశ్ శంకర్ ఓ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాడట! తాను తీసుకున్న పారితోషికాన్ని తిరిగిచ్చేయాలని ఫిక్స్ అయ్యాన్నాడంటూ ఓ వార్త ఫిల్మీదునియాలో వైరల్‌గా మారింది. మిస్టర్ బచ్చన్ పరాజయానికి బాధ్యత వహిస్తూ తనకు ఇచ్చిన రూ.15 కోట్లను నిర్మాతకు తిరిగిచ్చేస్తాడట! మరి ఇందులో ఎంత నిజముందనేది తెలియాల్సి ఉంది.సినిమా విషయానికి వస్తే.. ఉత్తర భారతదేశంలో జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా మిస్టర్ బచ్చన్ తెరకెక్కింది. రవితేజ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది. జగపతిబాబు కీలక పాత్రలో కనిపించాడు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా టీజీ విశ్వప్రసాద్ నిర్మించాడు. -
ప్రభాస్ కొత్త మూవీలో పాకిస్థాన్ నటి కూడా!
'కల్కి'తో హిట్ కొట్టిన ప్రభాస్.. కొత్త సినిమా కూడా మొదలుపెట్టేశాడు. 'సీతారామం' ఫేమ్ హను రాఘవపూడి దర్శకుడు. మొన్ననే పూజ జరగ్గా.. ఈ నెలలోనే షూటింగ్ ఉండొచ్చు. ఇక ఈ మూవీతో ఇమాన్వీ అనే కొత్తమ్మాయి టాలీవుడ్‌కి పరిచయం కానుంది. ఇందులోనే మరో హీరోయిన్‌కి కూడా ఛాన్స్ ఉందని, అందుకోసం పాక్ బ్యూటీని తీసుకుంటారని తెలుస్తోంది. ఇది రూమర్ కాదు, నిజమేనని సమాచారం.(ఇదీ చదవండి: ప్రధాని మోదీనే మించిపోయిన ప్రభాస్ హీరోయిన్)ప్రభాస్-హను మూవీ లాంచ్‌కి ముందు కొన్ని గాసిప్స్ వచ్చాయి. 'ఫౌజీ' అనే టైటిల్ పరిశీలిస్తున్నారని, ఇందులో పాన్ నటి సాజల్ అలే హీరోయిన్ అని అన్నారు. కట్ చేస్తే దిల్లీలో పుట్టి అమెరికాలో ఉంటున్న ఇమాన్వీ అనే అమ్మాయి.. ప్రభాస్‌తో కలిసి సినిమా లాంచింగ్ రోజు కనిపించింది. దీంతో పాక్ నటిది గాసిప్ అనుకున్నారు. కానీ ఈమె రోల్ కూడా ఉందని తెలుస్తోంది. కాకపోతే అనౌన్స్ చేసేవరకు అది గోప్యమేనట.2017లో వచ్చిన 'మామ్' సినిమాలో సాజల్.. శ్రీదేవి కూతురిగా నటించింది. అంతకుముందు కుచ్ అంఖహి, యాఖిన్ క సఫర్, హే దిల్ మేరా తదితర పాక్ సినిమాలు, టీవీ సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలా ఉంటే 1940 బ్యాక్ డ్రాప్ స్టోరీతో ప్రభాస్ సినిమా తీస్తున్నారని, ఇందులో సుభాష్ చంద్రబోస్ పాత్ర కూడా ఉంటుందని మాట్లాడుకుంటున్నారు. మరి వీటన్నింటిపై క్లారిటీ ఇస్తే ఫ్యాన్స్ హ్యాపీ అయిపోతారు!(ఇదీ చదవండి: హీరో కిరణ్ అబ్బవరం పెళ్లి సందడి మొదలు) -
ఆశ్రమంలో 'డబుల్ ఇస్మార్ట్' హీరోయిన్.. సన్యాసం ప్లాన్?
ఆగస్టు 15న థియేటర్లలో 'డబుల్ ఇస్మార్ట్' రిలీజైంది. ఎప్పటిలానే పూరీ జగన్నాథ్ మళ్లీ నిరాశపరిచాడు. రొటీన్ రొట్టకొట్టుడు స్టోరీతో విసుగెత్తించాడు. ఉన్నంతలో హీరోయిన్ కావ్య థాపర్ గ్లామర్ షో కాస్త ఎంటర్టైన్ చేసింది. తెలుగులో ఇదివరకే పలు సినిమాల్లో నటించింది. కానీ ఈమెకు బ్రేక్ అయితే రాలేదు. తాజాగా ఈమె తన పుట్టినరోజు వేడుకల్ని అనంత్ థామ్ అనే ఆశ్రమంలో సెలబ్రేట్ చేసుకుంది.(ఇదీ చదవండి: హీరో కిరణ్ అబ్బవరం పెళ్లి సందడి మొదలు)పుట్టినరోజుని ఆశ్రమంలో చేసుకోవడం పెద్ద విశేషమేం కాదు. కాకపోతే 'డబుల్ ఇస్మార్ట్' రిలీజ్‌కి ముందు ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన కావ్య థాపర్.. తాను జీవితంలో పెళ్లి చేసుకోనని క్లారిటీ ఇచ్చింది. ఇది జరిగిన కొన్నిరోజులకే ఇలా ఆశ్రమంలో కనిపించడం కాస్త ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అలానే ఇన్ స్టాలో స్వామిజీ తనకు తండ్రి లాంటి వారు అని చెబుతూ పెద్ద క్యాప్షన్ పెట్టింది.తన గురువు అనంత్ బాబా ఆశీస్సులు తీసుకుని కావ్య థాపర్... అక్కడే ఆశ్రమంలోని అనాథలకు, మిగతా వారికి భోజనం ఏర్పాటు చేసింది. ఆశ్రమంలో తన పుట్టిన రోజు వేడుకలు చేసుకున్న ఫోటోలు, వీడియోలు ఇన్ స్టాలో షేర్ చేసింది.పెళ్లి చేసుకోనని చెప్పడం, కుటుంబం ఉన్నా సరే ఆశ్రమంలో పుట్టినరోజు వేడుకల్ని సెలబ్రేట్ చేసుకోవడం లాంటివి చూస్తుంటే.. నటిగా కొన్నాళ్లపాటు చేసి, ఆ తర్వాత సన్యాసినిగా మారుతుందేమోనని అనిపిస్తుంది. తెలుగులో ఈ మాయ పేరేమిటో, ఏక్ మినీ కథ, ఈగల్, ఊరు పేరు భైరవకోన, డబుల్ ఇస్మార్ట్ మూవీస్ చేసింది. అలానే గోపీచంద్-శ్రీనువైట్ల కాంబోలో తీస్తున్న 'విశ్వం' చిత్రంలోనూ ఈమెనే హీరోయిన్.(ఇదీ చదవండి: పెళ్లి జరిగిన ఇంటిని రూ.25 కోట్లకు బేరం పెట్టిన స్టార్ హీరోయిన్) View this post on Instagram A post shared by Kavya Thapar (@kavyathapar20) -
కీర్తి సురేష్ 'రఘు తాత' సినిమా.. ఓటీటీలో డైరెక్ట్‌గా స్ట్రీమింగ్
మాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కి ఆ తర్వాత టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి కథానాయకిగా దుమ్ము రేపుతున్న నటి కీర్తి సురేష్. రెగ్యులర్ కమర్షియల్ పాత్రలతో పాటు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్‌లో పవర్ఫుల్ క్యారెక్టర్స్ కూడా ఆమె చేస్తుంటారు. ఆమె నటించిన కొత్త సినిమా రఘు తాత ఓటీటీలో డైరెక్ట్‌గా విడుదల కానుందన ప్రచారం జరుగుతుంది. కీర్తీ సురేష్ లీడ్ రోల్లో నటించిన ఈ సినిమాకు సుమన్ కుమార్ దర్శకత్వం వహించారు. ఆగష్టు 15న తమిళ్ వర్షన్ విడుదల అయింది.రవీంద్ర విజయ్, ఎమ్మెస్ భాస్కర్ ఆనంద్ సామి, దేవదర్శిని తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. హిందీ భాషకు వ్యతిరేకంగా తెరకెక్కిన ఈ చిత్రం కోలివుడ్ ప్రేక్షకులను మెప్పించింది. కాగా, రఘు తాత మూవీ ఓటీటీ హక్కులను జీ5 సంస్థ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళం,మలయాళం, కన్నడ స్ట్రీమింగ్ హక్కులను జీ5 మంచి ధరకు కొనుగోలు చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. సెప్టెంబర్ మొదటి వారం లేదా సెప్టెంబర్ 14న ఓటీటీలో తెలుగు వర్షన్ డైరెక్ట్‌గా విడుదల అవుతుందని సినీ వర్గాలు తెలుపుతున్నాయి.హిందీ భాషను నేర్చుకోవడం తప్పనిసరి అనే విధానాన్ని వ్యతిరేకించడంతోపాటు మహిళలపై జరుగుతున్న పలు సంఘటనలను ఖండిస్తూ సాగే ఫ్యామిలీ ఎంటర్టైయినర్గా రఘుతాత సినిమా ఉంది. హిందీకి వ్యతిరేకంగా ఈ సినిమాలో కీర్తి పోరాడుతుంది. మొదటి నుంచి హిందీ భాషను వ్యతిరేకిస్తూ వచ్చిన ఆమె ఫైనల్‌గా హిందీ ఎగ్జామ్ రాయాలని ఎందుకు పూనుకుంటుంది అనేది సినిమా. -
అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిన హీరో మోహన్ లాల్!
ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్ అస్వస్థతకు గురయ్యారట. ఈ మేరకు మలయాళ మీడియాలో వార్తలొస్తున్నాయి. తీవ్ర జ్వరం, శ్వాస సంబంధిత, కండరాల నొప్పితో బాధపడుతున్నారని.. దీంతో కుటుంబ సభ్యులు ఈయన్ని ఆస్పత్రిలో చేర్పించారట. ఐదు రోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారట.(ఇదీ చదవండి: చిరంజీవి సినిమాని శ్రీలీల రిజెక్ట్ చేసిందా?)ఈ క్రమంలోనే మోహన్ లాల్ హెల్త్ బులెటిన్ అని ఓ ఫొటో వైరల్ అవుతోంది. ఇలా అస్వస్థత అని వార్తలు రావడంతో అభిమానులు ఏమైందోనని కంగారు పడుతున్నారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్' సినిమాలో కీలక పాత్ర చేసిన మోహన్ లాల్.. ఇప్పటి జనరేషన్ తెలుగు ప్రేక్షకులకు కాస్త పరిచయమే.ప్రస్తుతం ఎల్ 2, బరోజ్ సినిమాలతో కాస్త బిజీ ఉన్న మోహన్ లాల్.. వీటి షూటింగ్ కోసం గుజరాత్ వెళ్లగా, అక్కడే అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. దీంతో తిరిగి ఊరికొచ్చేసి, ఆస్పత్రిలో జాయిన్ అయ్యారని అంటున్నారు. ఇందులో నిజమేంటనేది ఆయన క్లారిటీ ఇస్తే తప్ప బయటకు రాదు.(ఇదీ చదవండి: టాలీవుడ్ ఆశలన్నీ నాని 'శనివారం' పైనే..) -
చిరంజీవి సినిమాని శ్రీలీల రిజెక్ట్ చేసిందా?
టాలీవుడ్లోకి రాకెట్లా దూసుకొచ్చింది శ్రీలీల. తెలుగు మూలులున్నప్పటికీ కన్నడ సినిమాలతో నటిగా మారింది. 'పెళ్లి సందD'తో హీరోయిన్గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. గతేడాదిలో నెలకో మూవీతో ప్రేక్షకుల్ని పలకరించింది. అవన్నీ కూడా బాక్సాఫీస్ దగ్గర ఫెయిలయ్యాయి. దీంతో సైలెంట్ అయిపోయింది. అలాంటిది ఈమెకు మెగా ఛాన్స్ వస్తే నో చెప్పిందనే న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8 తెలుగు షోలో టాలీవుడ్ హీరో?)శ్రీలీల ప్రస్తుతం హిందీ, తెలుగులో తలో సినిమా చేస్తోంది. అయితే గతేడాది చేసిన సినిమాలన్నీ ఫెయిలవడంతో ఆలోచనలో పడిన శ్రీలీల.. ఈసారి ఆచితూచి మూవీస్ చేయాలని అనుకుంటోందట. అదలా ఉంచితే చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర' అనే సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలోకి రానుంది.చిరుతో పాటు ఇందులో ఆషికా రంగనాథ్, సురభి, ఈషా చావ్లా తదితరులు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఇందులో ఓ ప్రత్యేక గీతంలో డ్యాన్స్ చేసేందుకు శ్రీలీలని సంప్రదించారట. కానీ ఈమె నో చెప్పిందట. రెమ్యునరేషన్ ఎక్కువ ఇస్తామని చెప్పినా సరే మొహమాటం లేకుండా రిజెక్ట్ చేసిందని టాక్ వినిపిస్తోంది.(ఇదీ చదవండి: తంగలాన్ కోసం విక్రమ్ కష్టం.. మేకింగ్ వీడియో విడుదల) -
బిగ్‌బాస్ షోలో టాలీవుడ్ హీరో?
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ అతి త్వరలో ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 1 లేదా 8వ తేదీల్లో లాంఛ్ అవనుంది. ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు అన్నపూర్ణ స్టూడియోలో సెట్ ఏర్పాట్లు కూడా తుది దశకు చేరుకున్నాయి.అన్లిమిటెడ్ ఫన్..ఈసారి ఎంటర్టైన్మెంట్కు ఢోకా లేదు.. అన్లిమిటెడ్ ఫన్ గ్యారెంటీ అంటూ నాగ్ ప్రోమోలతో ఊదరగొడుతున్నాడు. ఈ క్రమంలో కంటెస్టెంట్ల లిస్టు ఒక్కొక్కటిగా బయటకు వస్తోంది. నయని పావని, కిర్రాక్ ఆర్పీ, రీతూ చౌదరి, కుమారి ఆంటీ, బర్రెలక్క.. ఇలా పలువురి పేర్లు నెట్టింట మార్మోగిపోతున్నాయి. తాజాగా ఓ టాలీవుడ్ హీరో పేరు కూడా వినిపిస్తోంది. అతడే కమెడియన్ కమ్ హీరో అభినవ్ గోమఠం.ఆఫర్ ఓకే?మస్త్ షేడ్స్ ఉన్నయ్‌రా నీలో... వంటి సెటైరికల్ డైలాగ్స్ వేయడంలో అభినవ్‌కు ఎవరూ సాటి రారు. తన ట్రేడ్ మార్క్ డైలాగ్‌తో వచ్చిన మస్తు షేడ్స్ ఉన్నయ్‌రా.. సినిమాలో హీరోగానూ నటించాడు. ఈ మధ్యే మై డియర్ దొంగ సినిమాలోనూ కనిపించాడు. తాజాగా అతడిని బిగ్‌బాస్ టీమ్ సంప్రదించినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిజంగానే అభినవ్ ఆఫర్‌ను ఓకే చేసి బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్తే ఫన్ గ్యారెంటీ అని చెప్పుకోవచ్చు! -
సూపర్ హిట్ మూవీ.. ఎవరి పారితోషికం ఎంతంటే?
స్త్రీ .. ఆరేళ్ల క్రితం వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. రాజ్‌కుమార్ రావు- శ్రద్దాకపూర్‌ల నటనకు జనాలు ఫిదా అయ్యారు. భయపెడుతూనే నవ్వించే ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేశారు. తాజాగా దీనికి సీక్వెల్‌గా స్త్రీ 2 తెరకెక్కింది. ఆగస్టు 15న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మరోసారి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల పైచిలుకు సాధించింది. ఈ క్రమంలో ఇందులో నటించిన తారల రెమ్యునరేషన్ ఎంతో చూసేద్దాం..హీరో రాజ్‌కుమార్ రావు రూ.6 కోట్ల పారితోషికం తీసుకోగా హీరోయిన్ శ్రద్ధా కపూర్ రూ.5 కోట్లు అందుకున్నట్లు తెలుస్తోంది. కీలకపాత్రలో మెప్పించిన పంకజ్ త్రిపాఠి రూ.3 కోట్ల మేర రెమ్యునరేషన్ తీసుకున్నారట. అపరశక్తి ఖురానా.. రూ.70 లక్షలు, అభిషేక్ బెనర్జీ రూ.55 లక్షలు అందుకున్నారు. అతిథి పాత్రలో కనిపించిన వరుణ్ ధావన్.. ఏకంగా రూ.2 కోట్లు అందుకున్నాడు. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మూడు రోజుల్లోనే రూ.135 కోట్లు వసూలు చేసింది.చదవండి: బాలీవుడ్ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘స్త్రీ 2’.. ఇంతకీ ఈ మూవీలో ఏముంది? -
అక్కడ షారూఖ్ ఖాన్.. ఇక్కడ మహేశ్ బాబు?
సూపర్‌స్టార్ మహేశ్ బాబు.. ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నాడు. పొగడాటి జుత్తు, ఒత్తయిన గడ్డంతో ఈ మధ్యే ఎయిర్‌పోర్ట్‌లో కనిపించాడు. ప్రీ ప్రొడక్షన్ జరుగుతోంది. షూటింగ్ వచ్చే ఏడాది నుంచి ఉండొచ్చు. ఇక రాజమౌళితో మూవీ అంటే ఏ హీరో అయినా సరే ఇది పూర్తయ్యేంత వరకు వేరే ప్రాజెక్ట్ ఏం చేయడానికి వీలు పడదు. కానీ మహేశ్ మాత్రం మరో క్రేజీ చిత్రంలో భాగం కానున్నాడని తెలుస్తోంది.2019లో హాలీవుడ్లో రిలీజైన 'ద లయన్ కింగ్'.. ప్రపంచవ్యాప్తంగా యాక్షన్ సినిమాలకు మించి వసూళ్లు సాధించింది. ఇప్పుడే ఈ సిరీస్‌లోని మరో మూవీ 'ముఫాసా'. ఈ ఏడాది డిసెంబరు 20న ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళ, హిందీ లాంటి బోలెడన్ని భాషల్లో రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: పొరపాటు తెలుసుకున్న 'మిస్టర్ బచ్చన్'.. నిడివి తగ్గించి)ఈ మూవీ కోసం చిత్ర నిర్మాతలు పెద్ద ప్లానే వేస్తున్నారు. ఇప్పటికే ప్రధాన పాత్ర ముఫాసాకు బాలీవుడ్లో షారూఖ్ ఖాన్‌తో డబ్బింగ్ చెప్పించారు. ఇతడి కొడుకులు ఆర్యన్, అబ్రామ్తోనూ సింబా, బుల్లి ముఫాసా పాత్రలకు డబ్బింగ్ చెప్పించారు. ఇప్పుడు తెలుగులో మహేశ్‌తో ముఫాసా పాత్రకు డబ్బింగ్ చెప్పించాలనుకుంటున్నారట.ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం తెలుగులో 'ముఫాసా'కి క్రేజ్ ఏర్పడచ్చు. అలానే తెరపై కనిపించనప్పటికీ ఓ కొత్త సినిమాతో ప్రేక్షకుల్ని మహేశ్ పలకరించే అవకాశముంటుంది. ఈ డబ్బింగ్ చెప్పేందుకుగానూ మంచి మొత్తమే ఆఫర్ చేశారట.(ఇదీ చదవండి: జాతీయ ఉత్తమ చిత్రంగా 'ఆట్టమ్'.. ఏంటి దీని స్పెషాలిటీ?) -
మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్, తంగలాన్.. ఫస్ట్ డే కలెక్షన్స్
స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా టాలీవుడ్లో సినిమాల జాతర జరిగింది. ముఖ్యంగా మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ చిత్రాల మధ్యే బిగ్ ఫైట్ నడిచింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ రెండు సినిమాలకు కూడా మిక్సిడ్ టాక్ వచ్చింది. ఏమాత్రం ప్రేక్షకులను మెప్పించేలా లేవని నెటిజన్ల నుంచి విమర్శలు అందుకున్నాయి. కోలీవుడ్ సినిమా 'తంగలాన్' కాస్త బాగుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. విక్రమ్ నటన కోసం అయినా సినిమా చూడాలంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.మిస్టర్ బచ్చన్ కలెక్షన్స్రవితేజ- హరీశ్ శంకర్ సినిమా మిస్టర్ బచ్చన్ బాక్సాఫీస్ వద్ద రూ.7.5 కోట్ల వసూళ్లు వచ్చినట్లు సమాచారం. ఈ కలెక్షన్లు అడ్వాన్స్ ప్రీమియర్ షోలతో కలిపి అని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. మొదటిరోజు సుమారు రూ. 10 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబడుతుందని అందరూ అంచనా వేశారు. కానీ మిస్టర్ బచ్చన్ ఆ మార్క్ అందుకోలేకపోయిందని తెలుస్తోంది. దాదాపు రూ. 35 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన మిస్టర్ బచ్చన్ ఆ టార్గెట్ రీచ్ అవుతాడా..? అనే సందేహాలు వస్తున్నాయి. సినిమా పట్ల దారుణమైన నెగటివ్ టాక్ రావడంతో బయర్స్‌కు నష్టాలు తప్పవని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పనోరమా స్టూడియోస్– టీ సిరీస్ సమర్పణలో టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.డబుల్ ఇస్మార్ట్ కలెక్షన్స్యంగ్ హీరో రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్‌గా డబుల్ ఇస్మార్ట్ చిత్రాన్ని డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించాడు. దాదాపు రూ. 60 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో విడుదలైన ఈ సినిమా కూడా అనుకున్నంత స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేదు. ఈ క్రమంలో మొదటిరోజు రూ. 12. 45 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే, ట్రేడ్ వర్గాలు మాత్రం రూ. 10.40 కోట్లు మాత్రమే కలెక్షన్లు వచ్చినట్లు పేర్కొన్నాయి. మొత్తానికి కలెక్షన్ల పరంగా మిస్టర్ బచ్చన్ కంటే ఇస్మార్ట్ శంకర్ కాస్త బెటర్ అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్ నిర్మించారు.తంగలాన్ కలెక్షన్స్ప్రయోగాత్మక పాత్రలతో మెప్పించే విక్రమ్ తాజాగా తంగలాన్ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటిరోజు రూ. 19.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. 1850ల్లో ఆంగ్లేయుల పాలనా కాలంలో జరిగే కథాంశంతో తెరకెక్కిన తంగలాన్ ఈ పోటీలో విజయం సాధించింది. సినిమా పట్ల పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు మరింతగా పెరిగే అవకాశం ఉంది. అన్ని వర్గాల సినీప్రియులకు తంగలాన్ థ్రిల్ చేస్తాడు. చెన్నైలో మొత్తం 592 స్క్రీన్లలో తంగలాన్ ప్రదర్శించారు. 81 శాతం టికెట్లు అమ్ముడుపోయాయి. తంగలాన్ తెలుగు వర్షన్ రూ. 2 కోట్ల వరకు రాబట్టింది. -
ఉన్న కార్లు అమ్మేసి కొత్త కారు కొన్న దళపతి విజయ్
సామాన్యుడు కాస్త ఆలోచిస్తాడేమో గానీ సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు కొత్త కార్లు కొంటున్నట్లే ఉంటారు. సోషల్ మీడియాలో అలాంటి వీడియో లేదా పోస్టులు కనిపిస్తుంటాయి. ఇప్పుడు తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ కూడా అలాంటి ఖరీదైన లగ్జరీ కారు కొనుగోలు చేశాడు. కానీ అంతకు ముందే తన దగ్గరున్న మరో రెండు కార్లని అమ్మేశాడట. ఇంతకీ ఏంటి సంగతి?తమిళ హీరోల్లో విజయ్‌కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ప్రస్తుతం 'ద గోట్' అనే మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత మరో సినిమా చేసి, రాజకీయాలకు అంకితమైపోతాడు. ఈ విషయాన్ని విజయ్ స్వయంగా కొన్నాళ్ల క్రితం క్లారిటీ ఇచ్చేశాడు. 'తమిళగ వెట్రి కళగం' పేరుతో రాజకీయ పార్టీని కూడా స్థాపించాడు.(ఇదీ చదవండి: మ్యూజిక్ డైరెక్టర్ లేని సినిమా.. అంతా కోడి అరుపుతోనే)కార్లు అంటే విజయ్‌కి చాలా ఆసక్తి. అలా 2012లోనే రోల్స్ రాయిస్ కారుని విదేశాల నుంచి తెప్పించాడు. అయితే దీనికి ట్యాక్స్ కట్టకపోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. రీసెంట్గా దీన్ని అమ్మకానికి పెట్టినట్లు వార్తలొచ్చాయి. అయితే దీనితో పాటు వోల్వో కారుని కూడా అమ్మేశాడట. బదులుగా లెక్సెస్ ఎల్ ఎమ్ కారు కొన్నాడు.తాజాగా విజయ్ ఇంటి నుంచి లెక్సెస్ కారు బయటకొస్తున్న వీడియోలు వైరల్ కావడంతో కొత్త కారు కొనడం నిజమని తేలిపోయింది. ఇకపోతే దీని ఖరీదు.. కోటిన్నర నుంచి రూ.2 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. కొత్త కారు కొనడం వరకు ఓకే గానీ పాత కార్లు ఇప్పుడు అంత అర్జెంట్‌గా ఎందుకు అమ్మేశాడనేది సందేహంగా మారింది!(ఇదీ చదవండి: సెన్సార్ బోర్డ్‌లో బ్యాన్.. నేరుగా ఓటీటీలోకి తెలుగు సినిమా) -
ఓటీటీలోకి వచ్చేందుకు 'రాయన్' ఫిక్స్ అయ్యాడా..?
కోలీవుడ్ స్టార్ ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రాయన్. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దుమ్మురేపిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. రాయన్ చిత్రాన్ని తెరకెక్కించిన తీరును చూసిన ప్రేక్షకులు ధనుష్ టాలెంట్‌కు ఫిదా అవుతున్నారు. ఇందులోని నటీనటులు అందరూ కూడా తమ అద్భుతమైన నటనతో ఇచ్చిపడేశారు. టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు వంటి వారు కూడా రాయన్ సినిమా చూసి ఫిదా అయ్యారు. జూలై 27న విడుదలైన రాయన్ ఇప్పటి వరకు సుమారు రూ. 140 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. త్వరలో ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది.రాయన్ సినిమా ఈనెల చివరి వారంలో ఓటీటీలోకి రానుందని వార్తలు వస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో రాయన్‌తో భారీ ఢీల్ సెట్ చేసుకుంది. థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల్లో ఓటీటీలో విడుదల చేయాలనే ఒప్పందం ఉన్నట్లు సమాచారం. దీంతో ఆగస్టు 30వ తేదీన రాయన్ స్ట్రీమింగ్కు రావచ్చని తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.రాయన్ సినిమాలో ధనుష్‌తో పాటు సందీప్ కిషన్, దుషరా విజయన్,ఎస్.జే సూర్య వంటి స్టార్స్ నటించారు. భారీ అంచనాలతో ఈ చిత్రాన్ని సన్‌పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించారు. ఇప్పిటికే బాక్సాఫీస్ వద్ద భారీగానే ఆ సంస్థ లాభాలు అందుకుంది. ఈ మూవీకి ఏఆర్ రహమాన్ సంగీతం ప్రధాన బలంగా నిలబడింది. భారీ విజయాన్ని అందుకున్న ధనుష్ తన తర్వాతి ప్రాజెక్ట్‌పై నిమగ్నమయ్యాడు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర సినిమాలో ఆయన నటిస్తున్నారు. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున,రష్మిక మందన్నా వంటి స్టార్స్ కూడా నటిస్తున్నారు. -
'బిగ్‌బాస్ 8' కొత్త హోస్ట్.. స్టార్ హీరో ప్లేసులో మరో హీరో?
మరికొన్ని రోజుల్లో బిగ్‌బాస్ కొత్త సీజన్ మొదలవుతుంది. తెలుగులో ఎప్పటిలానే నాగార్జున ఉన్నాడు. తమిళంలో మాత్రం కమల్ తప్పుకొన్నాడు. రీసెంట్‌గానే పోస్ట్ పెట్టడంతో ఆడియెన్స్ షాకయ్యారు. దీంతో నెక్స్ట్ హోస్ట్ ఎవరా అని మొన్నటి నుంచి సస్పెన్స్‌గానే ఉంది. తాజాగా ఈ విషయమై ఓ క్లారిటీ వచ్చేసినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: స్టార్ షట్లర్ శ్రీకాంత్‌తో ఆర్జీవీ మేనకోడలు నిశ్చితార్థం)బిగ్ బాస్ షో తెలుగు-తమిళంలో ఒకేసారి స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగులో ఈసారి సరికొత్తగా ఉండనుందని రీసెంట్గా రిలీజ్ చేసిన ప్రోమోతో చెప్పుకొచ్చారు. ఇక తమిళంలో మాత్రం కమల్ స్థానంలో విజయ్ సేతుపతి పేరుని పరిశీలిస్తున్నారు. హీరో శింబుని కూడా అనుకున్నారు. కానీ మూవీ కమిట్మెంట్స్ వల్ల కుదరలేదని, సేతుపతి ఫైనల్ అయ్యిందని అంటున్నారు.మరోవైపు విజయ్ సేతుపతి, శింబు కాదని ఏకంగా నయనతార హోస్టింగ్ చేయనుందనే రూమర్ కూడా వస్తోంది. సేతుపతి లేదా నయనతార.. వీళ్లెవరైనా సరే పాన్ ఇండియా క్రేజ్ ఉన్న సెలబ్రిటీలే. మరి వీళ్లలో బిగ్ బాస్ తమిళ కొత్త హోస్ట్‌గా ఎవరు ఫిక్స్ అవుతారనేది చూడాలి?(ఇదీ చదవండి: చైతూ-శోభిత లవ్ స్టోరీ.. సీక్రెట్ బయటపెట్టిన శోభిత చెల్లి!) -
చైతూ- శోభిత తొలిసారి అక్కడే కలుసుకున్నారా?
టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య.. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో నిశ్చితార్థం చేసుకున్నాడు. గురువారం ఉదయం ఈ శుభకార్యం జరిగింది. బహుశా ఈ ఏడాది చివర్లో పెళ్లి ఉండొచ్చు. ఎంగేజ్మెంట్ జరగడం మాటేమో గానీ శోభిత ఎవరు? తొలిసారి వీళ్లిద్దరూ ఎక్కడ కలిశారు? అసలు ఈమె ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.నాగచైతన్య విషయానికొస్తే.. నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చాడు. హీరోగా నిలదొక్కుకున్నాడు. అయితే హీరోయిన్ సమంతని ప్రేమించి 2017లో పెళ్లి చేసుకున్నాడు. కారణాలు తెలియవు కానీ వివాహ బంధంలో కలతలు రావడంతో 2021 అక్టోబరు 2న పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. ఇది జరిగిన దాదాపు మూడేళ్లకు నటి శోభిత ధూళిపాళ్లతో చైతూ నిశ్చితార్థం జరిగింది.(ఇదీ చదవండి: Samantha: హార్ట్ బ్రేక్ అయింది.. సమంత పోస్ట్ వైరల్)ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలిలో పుట్టిన శోభిత.. వైజాగ్‌లో పెరిగింది. అక్కడే చదువుకుంది. తండ్రి మర్చంట్ నేవీ ఇంజినీర్ కావడంతో ముంబయిలో స్థిరపడింది. బాలీవుడ్లో నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. తర్వాత తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నటించింది. తెలుగులో అడివి శేష్ 'గూఢచారి', 'మేజర్' సినిమాల్లో మాత్రమే నటించింది. హీరోయిన్గా కంటే నటిగానే ఈమె గుర్తింపు తెచ్చుకుంది. 'పొన్నియిన్ సెల్వన్' లాంటి పాన్ ఇండియా సినిమాలతో పాటు పలు వెబ్ సిరీసుల్లోనూ నటించింది. హాలీవుడ్‌లోనూ 'మంకీమ్యాన్' అనే సినిమాలో నటించింది.'మేజర్' షూటింగ్ జరుగుతున్న టైంలోనే చైతూ-శోభితకు పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది. కొన్నాళ్ల పాటు స్నేహితులుగా ఉన్న వీళ్లిద్దరూ గతేడాది ఓ రెస్టారెంట్‌కి వెళ్లారు. అయితే అక్కడి చెఫ్ పోస్ట్ చేసిన ఫొటోల వల్ల వీళ్ల డేటింగ్ బయటపడింది. ఇన్నాళ్లకు బంధాన్ని నిజం చేస్తూ నిశ్చితార్థం చేసుకున్నారు.(ఇదీ చదవండి: థియేటర్లో పెళ్లి చేసుకున్న మహేశ్ బాబు ఫ్యాన్!) -
నాగచైతన్య- శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం.. నిజమెంత?
టాలీవుడ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అంటూ కొన్ని గంటలుగా ఒక వార్త నెట్టింట ప్రచారం జరుగుతుంది. దీనిని బేస్ చేసుకుని కొన్న ప్రధాన వెబ్ సైట్లు కూడా వాటిని ప్రచురించడం ప్రారంభించాయి. అక్కినేని నాగచైతన్య- నటి శోభితా ధూళిపాళ్ల ఎంగేజ్ మెంట్ ఈ రోజు జరగనుంది అంటూ వార్తలు వస్తున్నాయి. అతికొద్ది మంది సమక్షంలో నేడు (ఆగష్టు 8) ఈ కార్యక్రమం జరగనుందని వైరల్ అవుతుంది. ఈ విషయంపై అధికారికంగా అక్కినేని వారి కుటుంబంతో పాటు శోభితా ఫ్యామిలీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.2017లో నటి సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నాగచైతన్య. అయితే, వారిద్దరి మధ్య విభేదాలు రావడంతో కొన్నేళ్లుగా దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో నటి శోభితా ధూళిపాళ్లతో నాగచైతన్య లవ్‌లో పడ్డారని చాలారోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కానీ, ఇప్పుడు వారిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని అందుకు సంబంధించిన మొదటి అడుగు నేడు పడుతుందని కొందరు చెబుతున్నారు.నాగచైతన్య- నటి శోభితా ధూళిపాళ్ల ప్రేమలో ఉన్నారని ఇప్పటికే పలుమార్లు వార్తలు వచ్చినా వాటిని వారిద్దరూ ఖండించలేదు. దీంతో అభిమానుల్లో కూడా నిజమే ఉంటుంది అనే భావన కలిగింది. ఇప్పుడు ఎంగేజ్మెంట్ జరగనుందని వార్తలు వస్తున్నాయి. నేడు ఈ కాకర్యక్రమం పూర్తి అయిన తర్వాత నాగార్జునే అధికారికంగా ఈ విషయాన్ని తెలుపుతారని సమాచారం. శోభితా ధూళిపాళ్ల పొన్నియిన్ సెల్వన్ ,ది నైట్ మేనేజర్ 2, గూఢాచారి,మేజర్,కురుప్ వంటి చిత్రాల్లో మెప్పించింది. కల్కి చిత్రంలో దీపికా పదుకొణ్కు తెలుగు డబ్బింగ్ కూడా చెప్పింది. ఆంధ్రప్రదేశ్ తెనాలికి చెందిన ఈ బ్యూటీ ముంబై యూనివర్సిటీ, హెచ్.ఆర్ కాలేజ్‌లో కామర్స్ అండ్ ఎకనామిక్స్ పూర్తి చేసింది. 2013 మిస్ ఇండియా అందాల పోటీల్లో రెండో స్థానం సొంతం చేసుకుంది.