Mulugu
-
బాండ్ మొక్కజొన్న విత్తన శాంపిళ్ల సేకరణ
వెంకటాపురం(కె): వెంకటాపురం, వాజేడు, కన్నాయిగూడెం మండలాల్లో మంగళవారం వ్యవసాయశాఖ అధికారులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బాండ్ మొక్కజొన్న విత్తనాల శాంపిళ్లను సేకరించారు. మండల పరిధిలోని గత కొంతకాలంగా మొక్కజొన్న బీటీ విత్తన సాగు జరుగుతుందనే రైతుల ఆందోళన నేపథ్యంలో విత్తనాలు, ఆకులను ఏటూరునాగారం ఏడీఏ అవినాష్ వర్మ ఆధ్వర్యంలో సేకరించారు. సేకరించిన విత్తనాలను సీజ్ చేసి పరీక్షల కోసం హైదరాబాద్ ల్యాబ్‌కు పంపించినట్లు మండల వ్యవసాయశాఖ అధికారి నవీన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వాజేడు వ్యవసాయశాఖ అధికారి మహేష్, ఏఈవోలు శ్యామ్, జాఫర్, హరీశ్, కల్యాణి తదితరులు పాల్గొన్నారు. ‘విజయ్, నాగరాజును విడుదల చేయాలి’ ములుగు: జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం తిమ్మంపేట గ్రామానికి చెందిన ఇల్లందుల విజయ్, తీగారం గ్రామానికి చెందిన నాగరాజును పోలీసులు వెంటనే విడుదల చేయాలని పౌరహక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యర్శులు గడ్డం లక్ష్మణ్, నారాయణరావు పోలీసులను మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. మంగళవారం ఉదయం 10గంటల సమయంలో వాజేడు సమీపంలో పోలీసులు ఇరువురిని అదుపులోకి తీసుకున్నారని వివరించారు. విజయ్, నాగరాజులను గుట్టల చుట్టూ తిప్పుతూ ఎన్కౌంటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. తక్షణమే స్థానిక ఎమ్మెల్యే సీతక్క చొరవ తీసుకొని వారిని విడిపించాలని డిమాండ్ చేశారు. గొత్తికోయగూడేల్లో చేతిపంపుల మరమ్మతు ఏటూరునాగారం: మండల పరిధిలోని గొత్తికోయగూడేల్లో మంగళవారం చేతి పంపులను మరమ్మతు చేసి తాగునీటిని అందజేసినట్లు పంచాయతీ కార్యదర్శి రమాదేవి తెలిపారు. సాక్షిలో ‘వేసవి ముందే వెతలు’ శిర్షీకన కథనం వెలువడింది. ఈ మేరకు పంచాయతీ అధికారులు స్పందించి గంటలకుంట గిరిజనగూడెంలో నీటి ఎద్దడిని తీర్చేందుకు చేతి పంపులకు మరమ్మతులు చేపట్టారు. తాగునీటికి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. అంతేకాకుండా ఎలిశెట్టిపల్లి, అల్లంవారిఘణపురం, వీరాపురం తదితర గ్రామాల్లో నల్లాలు, చేతి పంపులు మరమ్మతు చేయించి తాగునీటి సౌకర్యం కల్పించినట్లు పంచాయతీ కార్యదర్శులు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలిఏటూరునాగారం: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని జేవీవీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి మల్లయ్య, ప్రధాన కార్యదర్శి గడ్డి శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మంగళవారం మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా హాజరై కస్తూర్బా గాంధీ స్వచ్చంధ సంస్థ అధ్యక్షురాలు కొమరిగిరి సామ్రాజ్యాన్ని సన్మానించారు. అలాగే అంగన్వాడీలు, ఐకేపీ సభ్యులు, టీచర్లను సన్మానించి మెమెంటోలను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మహిళలు ఆకాశమే హద్దుగా ఎదగాలన్నారు. కుటుంబ, విద్యాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలన్నారు. -
పులకించిన కొండపర్తి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మండల పరిధిలోని దత్తత తీసుకున్న కొండపర్తి గ్రామానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ మంగళవారం రావడంతో గిరిజనుల్లో ఆనందం వెల్లివెరిసింది. రాష్ట్ర మంత్రి సీతక్కతో కలిసి గవర్నర్ కొండపర్తికి రావడంతో ఆదివాసీల నృత్యాలు, డోలువాయిద్యాలు, మంగళహారతులతో మహిళలు ఘనస్వాగతం పలికారు. ముందుగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి సీతక్కతో కలిసి గ్రామంలో ఏర్పాటు చేసిన కొమురంభీం, బిర్సాముండా విగ్రహాలను ఆవిష్కరించారు. పాఠశాలలోని డిజిటల్ క్లాస్ ప్రొజెక్టర్, కారంపొడి, మసాలా యూనిట్లతోపాటు కుట్టు మిషన్ కేంద్రాలను ప్రారంభించారు. మధ్యాహ్నం 12.10 గంటలకు కొండపర్తికి వచ్చిన గవర్నర్ 1.40 గంటల వరకు గ్రామస్తులతో గడిపారు. అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామానికి గవర్నర్ రావడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామస్తులు గవర్నర్ చేతుల మీదుగా బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం గవర్నర్‌ను మేడారం జాతర చైర్మన్ అరెం లచ్చుపటేల్, మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్, తాడ్వాయి మాజీ సర్పంచ్ ఇర్ప సునీల్‌దొర గజమాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్‌జీ, ఆర్డీఓ వెంకటేశ్, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ వీరభద్రం, అధికారులు పాల్గొన్నారు. గవర్నర్‌కు సన్మానం.. జిల్లా పర్యటనకు వచ్చిన గవర్నర్ ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని విశ్రాంతి తీసుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు మంత్రి సీతక్క కలెక్టర్ దివాకర పూలమొక్క అందించి శాలువాలతో సన్మానించి జ్ఞాపిక అందజేశారు. పోలీసుల భారీ బందోబస్తు కొండపర్తిలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ భద్రతా చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఎస్పీ డాక్టర్ శబరీశ్ పర్యవేక్షణలో డీఎస్పీ రవీందర్, పస్రా సీఐ రవీందర్, ఎస్ఎస్ తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి సోమవారం సాయంత్రం నుంచే కొండపర్తి గ్రామాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి గవర్నర్ కాన్వాయ్‌తో రోడ్డు మార్గాన రావడంతో పోలీసులు పస్రా నుంచి కొండపర్తి వరకు అడుగడుగునా కట్టుదిట్టమైన భారీ భద్రత చర్యలు చేపట్టారు. మేడారానికి గవర్నర్ దర్శనానికి వెళ్లిన సందర్భంగా కొండపర్తి నుంచి మేడారం వరకు సైతం బందోబస్తు ఏర్పాటు చేశారు.ఆదివాసీలతో మమేకమైన గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మకు ఘనస్వాగతం పలు ఉపాధి యూనిట్ల ప్రారంభోత్సవం భారీ పోలీసు భద్రత నడుమ సాగిన పర్యటనఅమ్మవార్లకు మొక్కులు మేడారం సమ్మక్క – సారలమ్మల గద్దెల వద్ద గవర్నర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు, గోవిందరాజు, పగిడిద్దరాజులను దర్శించుకున్నారు. గవర్నర్ 74కిలోల ఎత్తు బంగారం (బెల్లం) అమ్మవార్లకు మొక్కుగా సమర్పించారు. పూజలు నిర్వహించిన అనంతరం దేవాదాయశాఖ అధికారుల ఆధ్వర్యంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు గవర్నర్‌కు పట్టువస్త్రాలను కానుకగా అందించారు. -
రాజశేఖర్‌రెడ్డికి 8వ ర్యాంక్
బచ్చన్నపేట : జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రానికి చెందిన చిమ్ముల రాజశేఖర్‌రెడ్డి గ్రూప్–2లో రాష్ట్రస్థాయిలో 8వ ర్యాంకు సాధించాడు. చిమ్ముల అరుణ– మల్లారెడ్డి దంపతులు గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. కూతురు ప్రస్తుతం జనగామ మండలంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నది. కుమారుడు చిమ్ముల రాజశేఖర్‌రెడ్డి గ్రూప్–2 ఫలితాల్లో 423.933 మార్కులు సాఽధించి రాష్ట్ర 8వ ర్యాంక్ సాధించాడు. గతంలో రాజశేఖర్‌రెడ్డి వీఆర్ఓ, పంచాయతీ కార్యదర్శి పదవులకు కూడా ఎంపికయ్యాడు. ఉన్నతమైన లక్ష్యంతో కష్టపడి చదివి రాష్ట్ర ర్యాంక్ సాధించడం పట్ల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
కరకట్ట ఎత్తు పెంచడంలో ప్రభుత్వం విఫలం
ఏటూరునాగారం: గోదావరి కరకట్ట ఎత్తు పెంచడంలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు గండేపల్లి సత్యం అన్నారు. బీజేపీ మండల అధ్యక్షుడు చక్రవర్తి ఆధ్వర్యంలో నాయకులు మంగళవారం ఏటూరునాగారం నుంచి రామన్నగూడెం వరకు ఉన్న గోదావరి కరకట్ట శిథిలమైన ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం సత్యం మాట్లాడుతూ 20ఏళ్ల క్రితం గోదావరి జంపన్నవాగు వరద నీరు గ్రామంలోకి వచ్చి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఈ విషయాన్ని గుర్తించిన అప్పటి ప్రభుత్వం ఏటూరునాగారం నుంచి రామన్నగూడెం వరకు కరకట్ట నిర్మాణం చేపట్టిందన్నారు. క్రమంగా అది కొట్టుకుపోవడం దానికి తోడు కరకట్ట పక్కనే ఇసుక క్వారీలు ఏర్పాటు చేయడంత్లో కరకట్ట పరిస్థితి పూర్తి అధ్వానంగా తయారైందని తెలిపారు. ఈ విషయాన్ని గుర్తించిన అప్పటి సీఎం కేసీఆర్ 2022లో కరకట్టను పరిశీలించి ఎత్తు పెంచుతామని హామీ ఇచ్చి మరిచారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జియోట్యూబ్స్ వేయడానికి రూ.70లక్షలు కేటాయించిందని తెలిపారు. కానీ గతంలో మరమ్మతుల కోసం రూ.6.5లక్షలు ఖర్చు చేసిన అధికారులు అప్పటి వరకే తాత్కాలిక పనులు చేసి చేతులు దులుపుకున్నారని వివరించారు. రానున్న వర్షాకాలం నాటికై నా కరకట్ట ఎత్తు పెంచితే గ్రామాల్లోకి వరదలు రాకుండా ఉంటాయని తెలిపారు. బీజేపీ గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు సత్యం -
ప్రణీత్ ప్రతిభ..
కొడకండ్ల: మండల కేంద్రంలోని నిరుపేద పద్మశాలి కుటుంబానికి చెందిన ప్రణీత్ 388 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 138వ ర్యాంకు సాధించారు. సోమనారాయణ–నాగలక్ష్మి మూడో కుమారుడు ప్రణీత్ 2019 హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తిచేసిన తర్వాత హైదరాబాద్‌లోని కోచింగ్ తీసుకుని గ్రూప్స్ పరీక్షలు రాశారు. డిసెంబర్లో వెలువడిన గ్రూప్–4 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 58వ ర్యాంకు సాధించి ముషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. గ్రూప్–1 పరీక్షలో 380 మార్కులు సాధించగా.. గ్రూప్–2 ఫలితాల్లో 388 మార్కులతో రాష్ట్రస్థాయిలో 138వ ర్యాంకు సాధించాడు. -
కష్టపడ్డారు..
బుధవారం శ్రీ 12 శ్రీ మార్చి శ్రీ 2025గ్రూప్– 2 ఫలితాల్లో ఓరుగల్లు అభ్యర్థుల ప్రతిభ– 8లోuముల్కలపల్లి యువకుడు ఉపేందర్.. డోర్నకల్: గ్రూప్–2 ఫలితాల్లో ముల్కలపల్లికి చెందిన మేకల ఉపేందర్ ప్రతిభ కనబరిచారు. గ్రామానికి చెందిన మేకల రమణయ్య–రమణమ్మ దంపతుల కుమారుడు ఉపేందర్ ప్రస్తుతం మహబూబాబాద్ కలెక్టరేట్లో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తూ గ్రూప్–2 పరీక్షలు రాశారు. మంగళవారం ప్రకటించిన ఫలితాల్లో ఉపేందర్ 423.119 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో టాప్–10లో 9వ స్థానంలో నిలిచారు. ప్రతిభ చాటిన ఉపేందర్‌ను గ్రామస్తులు అభినందించారు. ● ఉద్యోగం చేస్తూనే పోటీ పరీక్షకు సన్నద్ధం ● పలువురికి మెరుగైన ర్యాంకులు ● హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లావాసులుకొందరు ఒకపక్క ఉద్యోగం చేస్తూనే ఉన్నతస్థాయికి వెళ్లాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడ్డారు. అనుకున్న లక్ష్యం సాధించారు. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన గ్రూప్–2 ఫలితాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు అభ్యర్థులు ర్యాంకులు సాధించారు. దీంతో వారి కుటుంబ సభ్యుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఉన్న సమయంలోనే ప్రణాళికాబద్ధంగా చదవడం, విషయాన్ని అర్థం చేసుకుని పోటీ పరీక్షలు రాయడం ద్వారా ర్యాంకులు సాధించవచ్చని ఆయా అభ్యర్థులు అంటున్నారు. – సాక్షి నెట్వర్క్భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాసింపల్లి గ్రామానికి చెందిన శనిగరపు ప్రవీణ్‌కుమార్ రాష్ట్రస్థాయిలో 76వ ర్యాంకు సాధించారు. నిరుపేద కుటుంబానికి చెందిన శనిగరపు రాధ–భద్రయ్య దంపతుల రెండో కుమారుడు ప్రవీణ్‌కుమార్. తల్లి రాధ అంగన్వాడీ హెల్పర్‌గా, తండ్రి భద్రయ్య సింగరేణి సంస్థలో కాంట్రాక్టు స్వీపర్‌గా పనిచేస్తున్నారు. ప్రవీణ్‌కుమార్ బీటెక్ పూర్తి చేసి 2019లో పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం సాధించి గణపురం మండలంలోని కర్కపల్లిలో విధులు నిర్వహించారు. 2021లో వీఆర్ఓ ఉద్యోగం సాధించి 6 నెలలపాటు మహదేవపూర్ మండలంలోని అంబటిపల్లిలో పనిచేశారు. ఆ సంవత్సరంలోనే గ్రూప్–4 పరీక్షలో ప్రతిభ కనబరిచి హైదరాబాద్‌లోని జీఎస్టీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేశారు. అదే శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఓవైపు ఉద్యోగం చేస్తూనే 2024 డిసెంబర్లో జరిగిన గ్రూప్–2 పరీక్ష రాసి రాష్ట్రస్థాయిలో 76వ ర్యాంకు, కాళేశ్వరం జోన్ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. మూడు శ్రీకాంత్‌ను సన్మానిస్తున్న మాజీ ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులుగూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మారుమూల ఏజెన్సీ గ్రామం జంగుతండాకు చెందిన మూడు భద్రు కుమారుడు శ్రీకాంత్ గ్రూప్–2 ఫలితాల్లో ఎస్టీ కేటగిరీలో ప్రతిభ కనబరిచారు. ఎస్టీ కేటగిరీలో ప్రథమ, జోనల్ వైస్ ఓపెన్ కేటగిరీలో మూడో ర్యాంకు, రాష్ట్రస్థాయిలో 38వ ర్యాంకు సాధించినట్లు శ్రీకాంత్ తెలిపారు. గతంలో గ్రూప్–4 సాధించి రెవెన్యూ శాఖలో ఉద్యోగం చేస్తున్నట్లు, గ్రూప్–3 లో కూడా మంచి మార్కులు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. శ్రీకాంత్‌ను మాజీ సర్పంచ్ అరుణమంగీలాల్‌నాయక్, మాజీ ఎంపీటీసీ గీతాఅమరేందర్‌రెడ్డి, తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు సన్మానించారు. న్యూస్రీల్కాసింపల్లి వాసి -
మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యం
గోవిందరావుపేట: మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. మండల పరిధిలోని పస్రా, కోటగడ్డ గ్రామాలలో కోటి రూపాయలతో పలు అభివృద్ధి పనులకు మంగళవారం మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ జిల్లాను అన్ని రంగాల్లో అబివృద్ధి చేయడమే లక్ష్యమని, ఇప్పటికే ములుగు జిల్లాకు రూ.500 కోట్లకు పైగా నిధులు కేటాయించగా పనులు జరిగాయన్నారు. ములుగులో ఇప్పటికే మెడికల్ కాలేజీ, గిరిజన యూనివర్శిటీకి భూమిని కేటాయించడం, ఏటూరునాగారం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు, మల్లంపల్లి మండలం ఏర్పాటు, జిల్లా కేంద్రంలో మోడ్రన్ బస్టాండ్, ఏటూరునాగారంలో బస్‌డిపో మంజూరు చేశామని తెలిపారు. మహిళల అభ్యున్నతికి పలు రకాల కార్యక్రమాలను చేపట్టి కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకుసాగుతుందన్నారు. మహిళా గ్రూపులకు స్వయం ఉపాధియే లక్ష్యంగా, ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాలడుగు వెంకటకృష్ణ, పన్నాల ఎల్లారెడ్డి, పీఆర్ ఈఈ అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చదువుతోనే మార్పు ప్రతీఒక్కరి తలరాత మార్చేది చదువేనని మంత్రి సీతక్క అన్నారు. చల్వాయి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో కలెక్టర్ దివాకర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దిశా ఫౌండేషన్ వారి సెల్ఫ్ ఇంగ్లిష్ లర్న్ టూ రీడ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరై మాట్లాడారు. విద్యార్థులు సాంకేతిక రంగాల్లో రాణించేందుకు ఇంగ్లిష్ నేర్చుకోవాలన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క పస్రా, కోటగడ్డ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన -
కరాటేలో విశాల్‌సాయి ప్రతిభ
ఏటూరునాగారం: రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో విశాల్స్థాయి ప్రతిభ చూపి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై నట్లు కోచ్ ఎండీ హుస్సేన్ తెలిపారు. ఈ సందర్భంగా విశాల్సాయితో పాటు కరాటే పోటీల్లో ప్రతిభ చూపిన వారిని ఆయన సోమవారం అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రస్థాయి కరాటే పోటీలు ఆదివారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నిర్వహించారని తెలిపారు. ఈ పోటీలకు ఏటూరునాగారం కరాటే అకాడమికి చెందిన క్రీడాకారులు హాజరై ప్రతిభ కనబర్చారని వివరించారు. సబ్ జూనియర్ విభాగంలో వసంత విశాల్‌సాయి 40 కిలోల విభాగంలో బంగారు పతకం సాధించగా ఊరుగొండ అఖిలేష్, భూక్య అభిమార్ 25 కిలోల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించారని వివరించారు. బంగారు పతకం సాధించిన విశాల్‌సాయి జూన్ 14వ తేదీన ఉత్తరాఖండలోని డెహ్రాడూన్‌లో నిర్వహించనున్న జాతీయ స్థాయి పోటీలకు హాజరుకానున్నట్లు హుస్సేన్ తెలిపారు. అలాగే అలువాల విఘ్నశ్రీ, అభిరామ్ బ్రాస్ పతకాన్ని సాధించారు. ఈ కార్యక్రమంలో మణిదీపిక, స్వాతిక, గణేశ్లతో పాటు కరాటే మాస్టర్ అబ్బు పాల్గొన్నారు. -
మంగళవారం శ్రీ 11 శ్రీ మార్చి శ్రీ 2025
ఈ ఫొటోలోని వ్యక్తి పేరు కుర్సం పుష్పలత. మంగపేట మండలం చెరుపల్లి గ్రామం. తన భర్త రాజు రెండు నెలల క్రితం ధాన్యం తూర్పాల పడుతుండగా చేయి ఫ్యాన్‌లో పడి విరిగిపోయింది. ఇంటికి పెద్దదిక్కు పనిచేయకుండా ఉండడంతో ఇల్లు గడవడం కష్టంగా మారింది. ఐటీడీఏ నుంచి ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని.. గత నెలలో కూడా గిరిజన దర్బార్‌లో వినతి అందజేసినా ఫలితం లేకుండా పోయింది.. అధికారులు ఇప్పటికై నా ఆదుకోవాలని కోరుతూ మళ్లీ గ్రీవెన్స్‌లో వినతి పత్రం అందజేసింది.న్యూస్‌రీల్ -
రామప్ప ఒగరుకాల్వకు బుంగ
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని రామప్ప సరస్సు ప్రధాన కాల్వ ఒగరుకాల్వకు అదివారం రాత్రి బుంగపడింది. ప్రధాన తూము సమీపంలోనే బుంగపడి పక్కనే ఉన్న పంటపొలాల్లోకి నీరంతా చేరడంతో కొంతమేర మునిగిపోయాయి. సమాచారం తెలుసుకున్న నీటి పారుదల శాఖ ఈఈ నారాయణ, డీఈ రవీందర్‌రెడ్డి, ఏఈ జయంతిలు బుంగ పడిన ప్రదేశాన్ని సోమవారం పరిశీలించారు. ఈ క్రమంలో ఒగరుకాల్వకు నీటి సరఫరాను నిలిపివేశారు. తొందరలోనే బుంగ పడిన ప్రదేశానికి మరమ్మతులు చేపట్టి కాల్వ ద్వారా ఆయకట్టు పంట పొలా లకు సాగునీరు అందిస్తామని వెల్లడించారు. పాఠశాలలో డిజిటల్ ప్రొజెక్టర్ ఏర్పాటు ఎస్ఎస్ తాడ్వాయి: మండల పరిధిలోని కొండపర్తి ఎంపీపీఎస్ పాఠశాలలోని తరగతి గదిలో డిజిటల్ ప్రొజెక్టర్ ఏర్పాటు చేశారు. మారుమూల గిరిజన గ్రామంలో గిరిజనులకు నాణ్యమైన ఇంగ్లిష్ విద్యను అందించాలనే సంకల్పంతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దత్తత గ్రామం కావడంతో పాఠశాలలో ప్రొజెక్టర్ ఏర్పాటు చేశారు. నేడు (మంగళవారం) ఈ డిజిటల్ ప్రొజెక్టర్‌ను గవర్నర్ ఆవిష్కరించనున్నట్లు పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. వీరవనిత సావిత్రిబాయి పూలే ములుగు: మహిళలను చైతన్యపరిచిన వీరవనిత సావిత్రిబాయి పూలే అని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చింతనిప్పుల భిక్షపతి అన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట సోమవారం సావిత్రిబాయి పూలే 128వ వర్ధంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భిక్షపతి మాట్లాడుతూ దేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలిగా, సామాజిక కార్యకర్తగా, సంఘ సేవకురాలిగా ఆమె పనిచేశారని తెలిపారు. సమాజంలోని మూఢనమ్మకాలపై నిరంతరం పోరాటం చేశారని ఆమె సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జన్ను రవి, పౌడాల ఓం ప్రకాశ్, ఎండీ అహ్మద్‌పాషా, ఓరుగంటి అనిల్, గందె రాజు, గందె మధు, గాజె రాజు, మాదారపు రాజు, షర్పోద్ధీన్, నరేష్, పైడిమల్ల భరత్ తదితరులు పాల్గొన్నారు. ఇంటి చుట్టూ ఉచ్చుతీగలు కాటారం: మండలంలోని గూడూరులో ఓ ఇంటి చుట్టూ వన్యప్రాణుల వేటకు ఉపయోగించే ఉచ్చు తీగలను పలువురు గుర్తు తెలియని దుండగులు అమర్చిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సదాశివ్ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఓ శుభకార్యానికి వెళ్లి రాత్రి వచ్చి ఇంట్లో నిద్రకు ఉపక్రమించారు. కుటుంబ సభ్యులు ఉదయం లేచి చూసే సరికి ఇంటి ముందు ఉచ్చు తీగ అమర్చి సమీపంలోని విద్యుత్ స్తంభానికి తీగలను తగిలించి ఉంది. ఆ స్తంభానికి విద్యుత్ సరఫరా లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై–2 శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఎవరైనా హత్యాయత్నానికి ప్రయత్నించారా, లేక గ్రామ శివారులో ఉండటంతో వన్యప్రాణుల వేట కోసం ఉచ్చుతీగ బిగించి ఉంటారా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితుల నుంచి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
ఆంగ్లంలో మెళకువలు నేర్చుకోవాలి
వెంకటాపురం(ఎం): ఉపాధ్యాయులు ఆంగ్లంలో మెళకువలు నేర్చుకుని విద్యార్థులకు బోధించాలని జిల్లా సమగ్ర శిక్ష సెక్టోరల్ అధికారి అర్షం రాజు పేర్కొన్నారు. మండల పరిధిలోని జవహర్‌నగర్ మోడల్ స్కూల్లో దిశా ఫౌండేషన్ సహకారంతో జిల్లాలోని 54ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లిష్ బోధించే ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తుండగా ఆయన సో మవారం హాజరై ఉపాధ్యాయులను ఉద్దేశించి మా ట్లాడారు. విద్యార్థులకు వీడియో పాఠాల ద్వారా బోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రతీ పాఠశాలకు వీడియో పాఠాల మెమోరీ కార్ట్స్, వర్క్‌బుక్‌లు, ప్లాష్కార్డులు, బోధనోపకరణాలు అందజేయనున్నట్లు తెలిపారు. వీడియో పాఠాల ద్వారా విద్యార్థులు 80 రోజుల్లోనే ఇంగ్లిష్‌లో మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దిశా ఫౌండేషన్ ప్రతినిధులు ఐశ్వర్య, ప్రతిభ, ముబీన్‌లు పాల్గొన్నారు.జిల్లా సమగ్ర శిక్ష సెక్టోరల్ అధికారి రాజు -
రాష్ట్రస్థాయికి జంతుశాస్త్ర పరిశోధన ప్రాజెక్ట్ ఎంపిక
ములుగు: ఇంపాక్ట్ ఆఫ్ సాయిల్ ఆర్థోపోర్డ్స్ ఇన్ చిల్లీ క్రాప్ ఇన్ జాకారం విలేజ్ ఆఫ్ ములుగు డిస్ట్రిక్ అంశంపై చేసిన పరిశోధన రాష్ట్ర స్థాయికి ఎంపిక కాగా ఖైరతాబాద్‌లో ప్రదర్శించినట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కొప్పుల మల్లేశం తెలిపారు. జిజ్ఞాస స్టూడెంట్ స్టడీస్ ప్రాజెక్టు పోటీలలో జంతుశాస్త్ర విద్యార్థుల ప్రాజెక్టు రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు వివరించారు. ఈ మేరకు సోమవారం జంతుశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో పరిశోధక విద్యార్థులు పాలెం పునీత, పల్లెపు శృతి, బైరి కావ్య, సయ్యదబీబీ, రబియాలను ప్రిన్సిపాల్ అభినందించారు. మొదటి స్థానంలో నిలిచిన వారికి రూ.25వేలు, ద్వితీయ స్థానంలో నిలిచిన వారికి రూ.18వేలు, తృతీయ స్థానంలో నిలిచిన వారికి రూ.10వేలు బహుమతిగా అందుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ బాలయ్య, అకాడమీ కో ఆర్డినేటర్ భాస్కర్, న్యాక్ కో ఆర్డినేటర్ కవిత, అధ్యాపకురాలు సరిత, నాగమణి, శిరీష, రాధిక, అనిల్‌కుమార్, ఉదయశ్రీ, విజిత, జగదీశ్, శ్రీను, మౌలానా, అనిత, రమేష్, లక్ష్మీ, షరీఫా తదితరులు పాల్గొన్నారు. -
పశువుల అక్రమ రవాణాను అరికట్టడంలో విఫలం
ములుగు: పశువుల అక్రమ రవాణాను అరికట్టడంలో అధికారులు విఫలం చెందారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శీలమంతుల రవీంద్రచారి అధ్యక్షతన సోమవారం నిర్వహించిన సమావేశంలో బలరాం మాట్లాడారు. జిల్లాలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయన్నారు. ఎక్కడ చూసినా అశాంతి కనిపిస్తుందని తెలిపారు. గంజాయి అమ్మకాలు, సేవించడం విపరీతంగా పెరిగిపోతుందన్నారు. పట్టణం నుంచి పల్లెలకు గంజాయి సరఫరా మొదలయ్యిందని వివరించారు. యువత మత్తులో మునిగి తేలుతుందన్నారు. ఎప్పుడో బుద్ధిపుట్టినప్పుడు సోదాలు చేయడం తప్పా సంకల్పంతో పనిచేసే అధికారులే లేరని వాపోయారు. మంత్రి సీతక్క గ్రామాల్లో పర్యటించడం తప్పా జరుగుతున్న తతంగాలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికై నా అధికారులతో తరుచుగా సమావేశాలు ఏర్పాటు చేసి గంజాయి. పశువుల అక్రమ రవాణాను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ భూక్య జవహర్, ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్, జిల్లా ఉపాధ్యక్షుడు జినుకల కృష్ణాకర్‌రావు, రవీందర్‌రెడ్డి, రాజ్‌కుమార్, రవిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.బీజేపీ జిల్లా అధ్యక్షుడు బలరాం -
సైక్లింగ్ పోటీల్లో క్రీడాకారుల ప్రతిభ
ములుగు: ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఖేలో ఇండియా సైక్లింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ చూపారు. కోచ్ శ్రీరాంనాయక్ ఆధ్వర్యంలో 24మంది పోటీలలో పాల్గొనగా అండర్–14 విభాగంలో క్రీడాకరులు ఐశు సిల్వర్, బ్రాంజ్, దివ్య బ్రాంజ్, నవీన్ సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ సాధించారు. అండర్–16 విభాగంలో సాయి చరణ్ గోల్డ్, వర్షిణి రెండు సిల్వర్ మెడల్స్, అండర్–18 విభాగంలో కుశ్వంత్ రెండు గోల్డ్ మెడల్స్, చక్రవర్తి రెండు గోల్డ్ మెడల్స్ సాధించగా జిల్లాకు మొత్తంగా 12 మెడల్స్ వచ్చాయి. ఈ మేరకు సోమవారం జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్, డీవైఎస్ఓ తుల రవీందర్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కోశాధికారి ఎలగందుల మోహన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కొమురవెళ్లి హరినాథ్‌లు క్రీడాకారులతో పాటు కోచ్‌ను శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం క్రీడాకారులకు సైకిళ్లను అందిస్తానని వివరించారు. -
గవర్నర్ పర్యటనకు సర్వం సిద్ధం
ములుగు: గవర్నర్ జిష్టుదేవ్ వర్మ పర్యటనకు సర్వం సిద్ధం చేసినట్లు, కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ టీఎస్.దివాకర సూచించారు. ఈ మేరకు మంగళవారం గవర్నర్ దత్తత గ్రామం ఎస్ఎస్ తాడ్వాయి మండల పరిధిలోని కొండపర్తికి వస్తున్న క్రమంలో ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, అదనపు కలెక్టర్లు మహేందర్‌జీ, సంపత్‌రావు, డీఎస్పీ రవీందర్‌తో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో సోమవారం కలెక్టర్ మాట్లాడారు. గవర్నర్ కొండపర్తిని పరిశీలించిన అనంతరం మేడారం వనదేవతలను దర్శించుకుంటారన్నారు. పర్యటన పూర్తి అయ్యేంత వరకు ఎక్కడా లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. ప్రణాళికతో విధులు నిర్వహించి అధికారులు గవర్నర్ పర్యటనను విజయవంతం చేయాలని ఆదేశించారు. షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు ఉండేలా చూసుకోవాలన్నారు. అతిథిగృహంలో గదులను శుభ్రం చేయాలని, శానిటేషన్ పనులు చేపట్టాలన్నారు. పోలీసు శాఖ తరఫున కట్టుదిట్టమైన భద్రత చేపట్టాలని కోరారు. ఈ సమావేశంలో ఆర్డీఓ వెంకటేశ్, ఎంపీడీఓలు, తహసీల్దార్లు ఎంపీఓలు పాల్గొన్నారు.కలెక్టర్ టీఎస్.దివాకర -
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
● వీసీలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఏటూరునాగారం: పంటలు కాపాడేందుకు అధికా రులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు సో మవారం రాత్రి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సూచించారు. హైదరాబాద్ నుంచి మంత్రులు సోమవారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించగా జిల్లా తరఫున కలెక్టర్ దివాకర హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు మా ట్లాడుతూ చుక్క నీరు వృథా కాకుండా సమర్థవంతంగా పంటలకు నీరు ఇవ్వాలన్నారు. రబీ పంటలను కాపాడేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. చెరువులు, నీటి వనరులపై ఇరిగేషన్ శాఖతో సమావేశాలు నిర్వహించి నీటి పంటలకు పూర్తి స్థాయిలో అందేలా చూడాలన్నారు. ఓసీలో బ్లాస్టింగ్లతో ఇళ్లు ధ్వంసంగణపురం: మండలంలోని ఓసీ–3 ప్రాజెక్టులో నిత్యం పేలుస్తున్న బాంబులతో తమ ఇళ్లు ధ్వంసం కావడంతో పాటు తీవ్రంగా దుమ్ము ధూళి బయటకు వచ్చి తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నామని పరుశరాంపల్లి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఓసీ–3 ప్రాజెక్టుకు వెళ్లే ప్రధాన రహదారిపై సోమవారం ఉదయం నుంచే ఆందోళనకు దిగారు. ఓసీ–3 ఓపెన్ కాస్టు గనిలో రోజు బొగ్గు తవ్వకాలకు ఉపయోగిస్తున్న భారీ బాంబులతో తమ ఇండ్లు పగుళ్లు పట్టడంతో పాటు గని నుంచి పెద్దఎత్తున దుమ్ము ఇండ్లలోకి చేరుకుంటుందని ఆరోపించారు. సింగరేణి అధికారులు వెంటనే తమ గ్రామాన్ని నిర్వాసిత గ్రామంగా ప్రకటించి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకపోతే పనులు అడ్డుకుంటామని హెచ్చరించారు. గ్రామస్తుల ఆందోళనతో పెద్దఎత్తున గనిలోకి వెళ్లి వచ్చే బొగ్గు లారీలు రోడ్డుపై నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న సింగరేణి అధికారులు, పోలీసులు ఆందోళన వద్దకు చేరుకొని గ్రామస్తులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ తమకు ఖచ్చితమైన హామీ ఇస్తే తప్ప ఆందోళన విరమించమని భీష్మించుకొని కూర్చున్నారు. దీంతో సింగరేణి భూపాలపల్లి ఏరియా జీఎం రాజేశ్వర్‌రెడ్డి ఆందోళన వద్దకు వచ్చి తమకు లిఖిత పూర్వకంగా రాసిస్తే సీఎండీ దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. -
తీసుకున్న భూమికి పరిహారం అందించాలి
వాజేడు మండల పరిధిలోని చెరుకూరు గ్రామంలో జాతీయ రహదారి పక్కన పట్టా నంబర్ 106/3లో మా నాన్న కోరం శ్రీనివాస్‌రావు, సోదరుడు యుగేంధర్‌కు 2.18 ఎకరాల భూమి ఉంది. 2013–14లో అప్పుడు ఉన్న సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డు చేసినప్పుడు భూమిని తీసుకున్నారు తప్పా పరిహారం ఇవ్వలేదు. ఇప్పుడు అదే దారి రహదారి అయ్యింది. పట్టా భూమి తీసుకోవడం తప్పా ఎలాంటి పరిహారం చెల్లించలేదు. ఈ విషయంపై అధికారులు విచారణ చేపట్టి పరిహారం అందేలా చూడాలి. – కోరం మనోజ్, చెరుకూరు, వాజేడు పసుపు కుంకుమ కింద ఇచ్చిన భూమిని పట్టా చేయాలి.. నాకు ముగ్గురు కుమారులు, ఒక కూతురు. నాకున్న భూమిని ముగ్గురు కుమారులకు సమానంగా పంచి ఇచ్చాను. సర్వే నంబర్ 128/ఏ లోని 34గుంటలు, 128/బి సర్వే నంబర్లోని 34గుంటలను నాపేరు పైనే ఉంచుకున్నాను. అందులో నుంచి 128/బిలో భూమిని కుమార్తె రజితకు పసుపు కుంకుమల కింద ఇచ్చాను. ఆ భూమిని నా కుమారులు బుద్దె రవి, బుద్దె శంకర్లు తమ పేర్ల మీద దొంగపట్టా చేసుకోవాలని చూస్తున్నారు. – బుద్దె పాపయ్య, బండారుపల్లి, ములుగు● -
విన్నవించాం.. పరిష్కరించండి
ప్రజావాణి, గిరిజన దర్బార్‌లో ప్రజల వినతులు● స్వీకరించిన అధికారులు ● కలెక్టర్, పీఓ లేకపోవడంతో నిరాశతో వెనుదిరిగిన ప్రజలుగిరిజన దర్బార్‌లో.. మంగపేట మండలానికి చెందిన తొలెం నర్సయ్య 25 గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులు చేసేందుకు పెసా గ్రామ సభల ద్వారా వీడీసీలు స్థానిక ఆదివాసీలకు ఇప్పించాలని కోరారు. వాజేడు మండలం గుమ్మడిదొడ్డి గ్రామానికి చెందిన పాయం రాందాస్ రైస్ మిల్లు మంజూరు చేయాలని వేడుకున్నారు. ఏటూరునాగారం మండలం శివాపురం ప్రాంతానికి చెందిన కృష్ణవేణి నిరుద్యోగిగా ఉన్నానని కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పించాలని విన్నవించారు. వెంకటాపురం మండలం బోదాపురం ప్రాంతానికి చెందిన ఇరుప అనిత మినీ అంగన్వాడీ సెంటర్లో టీచర్‌గా ఉద్యోగం ఇప్పించాలని మొరపెట్టుకున్నారు. ఏటూరునాగారం మండలం ఆకులవారిఘణపురం ప్రాంతానికి చెందిన తోలెం హైమ కంటింజెంట్ వర్కర్‌గా విధులు నిర్వర్తించడానికి అనుమతి ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓ సురేష్‌బాబు, మేనేజర్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. అడవి పందుల నుంచి చేతికి వచ్చిన పంటలను రక్షించాలని కోరుతూ ములుగు మండలంలోని చిన్నగుంటూరుపల్లి, పులిగుండం, పొట్లాపూర్, బండారుపల్లి, పత్తిపల్లి, మదనపల్లి, జగ్గన్నపేట, పంచోత్కులపల్లి గ్రామాలకు చెందిన సుమారు 40 మంది రైతులు కర్షక సంక్షేమ సలహా సంఘం ఆధ్వర్యంలో తమగోడును కలెక్టరేట్‌కు వచ్చారు. గుంపులు గుంపులుగా వస్తున్న అడవిపందులు మొక్కజొన్న, వరి, మిర్చి పంటలను నాశనం చేస్తున్నాయని వాపోయారు. వాటి బారి నుంచి పంటలను కాపాడుకోవడానికి బ్యాంకు ద్వారా సబ్సిడీ కింద సోలార్ ఫెన్సింగ్ రుణం అందించాలని కోరారు. లేని పక్షంలో అడవి పందులు గ్రామాల్లోకి రాకుండా అటవీశాఖ తరఫున తగిన చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. అడవి పందుల నుంచి పంటలను రక్షించాలి -
సోమవారం శ్రీ 10 శ్రీ మార్చి శ్రీ 2025
ఏజెన్సీ గ్రామాల్లో తీవ్రమైన నీటిఎద్దడి ● ప్రతీ ఎండాకాలంలో తప్పనితిప్పలు ● గోదావరి, వాగునీరే గిరిజనులకు ఆధారం ● పట్టించుకోని అధికారులు, పాలకులు ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి పకల మహేశ్. ఏటూరునాగారం మండలం వీరాపురం. కూలి పనులు, వ్యవసాయ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తాగునీటి కోసం ప్రతిరోజూ రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న జంపన్నవాగుకు కాలినడకన వెళ్తున్నాడు. వాగులో చెలిమల నుంచి నీటిని తోడుకుని కావడితో నీటి బిందెలను మోసుకుంటూ ఇంటికి చేరుకుంటాడు. ఇలా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం కావడితో నీటిని తెస్తేగాని ఇంట్లో వారి దాహం తీరదు.ఏటూరునాగారం: ఏజెన్సీలో వంద కిలోమీటర్ల మేర గోదావరి ప్రవహిస్తున్నా వేసవికి ముందే నీటి ఎద్దడి మాత్రం తప్పడం లేదు. ప్రజలు, రైతులు నానాటికీ భగీరథ ప్రయత్నాలను ప్రతీ వేసవికాలంలో చేయడం ఆనవాయితీగా వస్తోంది. మిషన్ భగీరథ పథకం ఉన్నప్పటికీ తాగునీరు రాకపోవడంతో వాగులపైనే గిరిజనులు ఆధారపడుతున్నారు. పాలకులు, ప్రభుత్వాలు మారినా గిరిజనుల తలరాతలు, ఏజెన్సీవాసుల తాగు, సాగునీటి కష్టాలు తీరడం లేదు. న్యూస్‌రీల్ -
మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి
ములుగు: రాష్ట్రంలోని మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని, మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. కలెక్టరేట్ ఆవరణలోని సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ దివాకర, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, డీడబ్ల్యూవో శిరీషతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500లకే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ మహిళా క్యాంటిన్ వంటి పథకాలతో పాటు మరిన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. 37శాతం మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు వెల్లడించారు. ఎక్కడా లేని విధంగా రూ.21,635 కోట్లతో మహిళా సంఘాల గ్రూపులకు నిధులు కేటాయించి పలు పథకాల్లో భాగస్వాములను చేశామన్నారు. డ్వాక్రా మహిళలకు ప్రతినెలా రూ.5లక్షలు ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ సిబ్బంది చేసిన నృత్య ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. ఆయా శాఖలలో ఉత్తమ విధులు నిర్వహించిన మహిళా ఉద్యోగులకు మంత్రి ప్రశంస పత్రాలను అందించారు. పాటల పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పనులపై సమీక్ష రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ దివాకర, డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను అధికారులు పరిశీలించాలన్నారు. జాతీయ రహదారి 100 కిలో మీటర్లు, గోదావరి పరివాహకం 100కిలో మీటర్లు ఉన్నందున పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకోవచ్చని తెలిపారు. ఐటీడీఏ ద్వారా చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. అదే విధంగా రామప్ప, లక్నవరం కెనాల్ భూ సేకరణ విషయంలో జంగాలపల్లి, కాసిందేవిపేట రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం తరఫున న్యాయపరమైన పరిహారం అందిస్తామని రైతులు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో ఆర్డీఓ వెంకటేశ్, ఆర్అండ్బీ, పీఆర్, ట్రైబల్ వెల్ఫేర్, నేషనల్ హైవే, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్ శాఖల ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. పోలీస్ కాన్ఫరెన్స్ హాల్ ప్రారంభం జిల్లాను యాక్సిడెంట్, డ్రగ్ ఫ్రీ జిల్లాగా మార్చుకుంటామని మంత్రి సీతక్క అన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో పోలీస్ కాన్ఫరెన్స్ హాల్‌ను ఎస్పీ డాక్టర్ శబరీశ్, కలెక్టర్ దివాకరతో కలిసి ఆదివారం ప్రారంభించి మాట్లాడారు. అతి వేగం, మద్యం మత్తులో ఉండి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని వివరించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి సీతక్క -
న్యాయ కళాశాల ఏర్పాటుకు ఉద్యమిస్తాం
వెంకటాపురం(కె): ఏజెన్సీలో న్యాయ కళాశాల ఏర్పాటు చేయకపోతే ఉద్యమిస్తామని గొండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి అన్నారు. మండల కేంద్రంలోని కాఫెడ్ స్వచ్చంధ సేవా సంస్థ కార్యాలయం ఆవరణలో న్యాయ కళాశాల ఏర్పాటుపై ఆదివారం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలో న్యాయ కళాశాల ఏర్పాటు న్యాయమైన డిమాండ్‌గా ఉందన్నారు. న్యాయ కళాశాల సాధించుకునే వరకు ఉద్యమించాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదిమ తెగలను విస్మరిస్తుందన్నారు. దేశంలో అత్యధికంగా అన్యాయానికి గురైంందని ఆదిమ తెగలేనని వివరించారు. ఈకార్యకమంలో నాయకులు పాయం సత్యానారాయణ, కొర్స నర్సింహామూర్తి, ఉయిక శంకర్, మైపతి అరుణ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి సాయి -
‘గ్రావెల్’ మాఫియా
హనుమకొండ జిల్లా దామెర మండలంలో యంత్రాలతో యథేచ్ఛగా మొరం తవ్వకాలు, తరలింపుసాక్షిప్రతినిధి, వరంగల్ : అధికారులు, రాజకీయ నాయకుల అండదండలతో అనుమతుల పేరిట సహజ వనరుల్ని అడ్డంగా దోచుకుంటున్నారు అక్రమార్కులు. అర్ధరాత్రి సమయంలో భారీ యంత్రాలతో గుట్టలు, ప్రభుత్వ భూముల్లో మొరం(గ్రావెల్) తవ్వేస్తూ కాసులవేట సాగిస్తున్నారు. గ్రేటర్ వరంగల్ చుట్టూ ఉన్న దామెర, హసన్‌పర్తి, గీసుకొండ, శాయంపేట, ధర్మసాగర్ తదితర మండలాల్లో గ్రావెల్ మాఫియాకు అడ్డు లేకుండా పోయింది. కొందరు మొరం వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి టెంపరరీ పర్మిట్ల(టీపీ)తో పట్టా భూములు, గుట్టలు, ప్రభుత్వ భూముల నుంచి మొరం తవ్వేస్తున్నారు. చాలాచోట్ల శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాకతీయ కాల్వ గట్లను తవ్వుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. దోపిడీ సాగుతోందిలా.. గ్రావెల్ మాఫియా టీఎస్ఎంఎంసీ రూల్స్ 1966–9(4) ప్రకారం పట్టాభూములు, రైతుల పేరిట రెండు నెలల గడువుతో తాత్కాలిక అనుమతులు పొందుతూ ఇష్టారాజ్యంగా మొరం దందా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతి పొందిన భూమిలో ఏరియాను బట్టి 8–12 అడుగులలోపు లోతు మాత్రమే తవ్వాల్సి ఉంది. అలా చేస్తే రెండున్నర హెక్టార్లలో సుమారు 7–8 వేల మెట్రిక్ టన్నుల గ్రావెల్ మాత్రమే వస్తుందని మైనింగ్‌శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే గ్రావెల్ మాఫియా అందుకు భిన్నంగా 15–30 అడుగుల లోతు వరకు తవ్వి లారీలు, టిప్పర్ల ద్వారా పెద్ద మొత్తంలో మొరం తరలిస్తున్నారు. ఇందుకు సుమారు రెండున్నర హెక్టార్ల కోసం రూ.1.50 లక్షల వరకు రాయల్టీ చెల్లిస్తూ.. రూ.కోట్లల్లో సంపాదిస్తున్నారు. కళ్లెదుటే ఈ అక్రమం జరుగుతున్నా.. ఏ శాఖ కూడా ఆపే ప్రయత్నం చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కంచికి చేరిన కోమటిపల్లి గుట్ట దందా.. హసన్‌పర్తి మండలం భీమారం శివారు 340 సర్వే నంబర్లో సుమారు 57 ఎకరాల్లో గుట్ట విస్తరించి ఉంది. అయితే ఇక్కడ అందుబాటులో ఉన్న భూమిని గతంలో కొంత గిరిజన గురుకుల కళాశాల, హోటల్ మేనేజ్మెట్ కళాశాల, ఇంటర్నేషనల్ స్డేడియం ఏర్పాటుకు కేటాయించాలని ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఇందులో గిరిజన కశాశాలతో పాటు హోటల్ మేనేజ్మెంట్ కాలేజీకి ఐదెకరాల చొప్పున స్థలం కూడా కేటాయించారు. ఇదిలా ఉండగా.. ఓవైపు కళాశాలలకు కేటాయించిన సర్కార్ మరోవైపు 340/1 సర్వే నంబర్ పేరిట రెండున్నర హెక్టార్ల(3.260) భూమిని కె.నవీన్‌రావు పేరిట క్వారీకి అనుమతి ఇచ్చింది. 2017 జూలై 25 నుంచి 5 సంవత్సరాల పాటు నిబంధనల ప్రకారం క్వారీ నిర్వహించేలా 4097/ క్యూఎల్‌అండ్1/ డబ్ల్యూజీఎల్/2017 ద్వారా ఈ అనుమతులు ఇచ్చారు. క్యూబిక్ మీటర్‌కు రూ.30ల చొప్పున 29,90,900 క్యూబిక్ మీటర్లకు అగ్రిమెంట్ కుదుర్చుకుని గుట్టంతా ఖాళీ చేసినా ఎవరూ పట్టించుకోలేదు. రూ.లక్షల ప్రజాధనం పక్కదారి పట్టినా.. ఈ దందాలో తెరవెనుక ఓ ప్రజాప్రతినిధి కూడా స్లీపింగ్ పార్టనర్‌గా ఉండటం వల్ల అప్పట్లో పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు మొరం తరలింపులో నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటాం. అక్రమంగా మొరం తరలిస్తున్నట్లు మా దృష్టికి రాలేదు. ఎవరైనా అనుమతులు తీసుకొని మాత్రమే మొరం తవ్వకాలు చేపట్టాలి. – జ్యోతివరలక్ష్మీదేవి, తహసీల్దార్, దామెర అంతా అనధికారమే! కొంత అనుమతి తీసుకుని గుట్టలను కరిగించడమే కాదు.. అసలు అనుమతులు లేకుండానే తవ్వకాలు చేపట్టడం ఉమ్మడి వరంగల్‌లో పరిపాటిగా మారింది. వరంగల్, జనగామ, మహబూబాబాద్, జేఎస్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో మొరం, మట్టి దందా జోరుగా సాగుతోంది. ఈ అక్రమ తవ్వకాల గురించి సమాచారం తెలిసినా అధికారులు ‘మాములు’గా తీసుకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండలం జంగిలిగొండలోని ప్రభుత్వ భూమిలో గతంలో తవ్వకాలు జరుగుతుండగా అధికారులు అడ్డుకుని హద్దులు ఏర్పాటు చేసినా ఆగడం లేదు. ములుగు జిల్లా ములుగు పంచాయతీ శివారు 837 సర్వే నంబర్లోని సుమారు 200 ఎకరాల భూమిని గిరిజన విశ్వవిద్యాలయానికి కేటాయించగా.. అక్రమార్కులు మట్టి తవ్వకాలు ఆపడం లేదు. వరంగల్ నగరానికి సమీపాన ఉన్న ప్రాంతాల్లో వందలాది ట్రాక్టర్ల ద్వారా మొరం తరలిస్తున్నారు. ఇక్కడ ఒక్కో ట్రాక్టర్‌కు రూ.1500 నుంచి రూ.2500 చొప్పున సుమారు 500 ట్రిప్పుల మొరానికి రూ.7.50 లక్షల నుంచి రూ.12.50 లక్షలు ఆర్జిస్తున్నారు. జనగామ జిల్లా జనగామ మండలం వడ్లకొండ ఎన్నె చెరువు పక్కన 5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గుట్టను రాత్రి పూట పదుల సంఖ్యలో టిప్పర్ల ద్వారా తవ్వి మట్టిని తరలించారు. చంపక్‌హిల్స్ గుట్టల్లోనూ మట్టిని తోడేస్తున్నారన్న ఫిర్యాదులున్నాయి. వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని కొనాయమాకులు, వంచనగిరి ప్రాంతంలోని ఎస్సారెస్పీ కాల్వ పక్కన, కాల్వల నిర్మాణ సమయంలో అధికారులు వాటికి ఇరువైపులా బ్యాంకింగ్ పేరుతో పోసిన కట్టల మొరాన్ని తరలించి సొమ్ము చేసుకున్నారు. యథేచ్ఛగా మొరం తవ్వకాలు అనుమతి ఒకచోట, తవ్వకాలు మరోచోట కాల్వగట్లు, గుట్టలనూ వదలని అక్రమార్కులు ‘మామూలు’గా తీసుకుంటున్న అధికారులు -
చట్టం చేసే వరకు ఉద్యమాలు ఆగవు
ఎస్ఎస్ తాడ్వాయి: ఏజెన్సీ ప్రాంతంలో జీవో నంబర్ 3ను చట్టం చేసేంత వరకు ఉద్యమాలు ఆగవని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర మహిళా జాయింట్ సెక్రటరీ బోదెబోయిన స్వాతి అన్నారు. మండల పరిధిలోని మేడారంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా విస్తృత స్థాయి సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాతి మాట్లాడుతూ ఆదివాసీ గ్రామాల్లో యువతకు సమావేశాలు ఏర్పాటు చేసి వారిని చైతన్యం చేసి సమస్యల పరిష్కారానికి ఉద్యమించేలా తయారుచేయాలన్నారు. కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా కన్వీనర్ పర్షిక సతీష్, ఇర్ప బాలాజీ, ఆదివాసీ విద్యార్థి సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షులు బోదెబోయిన సురేష్, మంగపేట మండల అధ్యక్షులు కుర్శం శివశంకర్, సున్నం నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర మహిళా జాయింట్ సెక్రటరీ స్వాతి -
హేమాచలక్షేత్రంలో సండే సందడి
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆదివారం సెలవురోజు కావడంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులతో పాటు వివిధ సుదూర ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్లు, ప్రైవేట్ బస్సులు, ఆటోలలో ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామివారి తిలతైలాభిషేకం పూజలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు స్వామివారికి భక్తుల గోత్రనామాలతో పూజలు జరిపించి ఆలయ పురాణం స్వామివారి విశిష్టతను వివరించారు. సంతాన ప్రాప్తి కోసం వచ్చిన దంపతులకు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందజేసి ఆశీర్వచనం ఇచ్చారు. స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. -
రిజర్వు జోన్‌గా ప్రకటించాలి
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని పాలంపేట పరిధిలో గల కేన్ మొక్కల ప్రాంతాన్ని కన్జర్వేషన్ రిజర్వు జోన్‌గా ప్రకటించాలని నర్సాపూర్‌కు చెందిన ఎండి.అబ్దుల్ రజాక్ అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో నిర్వహించిన ప్రజావాణిలో వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 51 ఎకరాల కేన్ ప్రాంతం అధికారుల నిర్లక్ష్యంతో అన్యాక్రాంతం అవుతుందన్నారు. జీవవైవిధ్య పరిరక్షణ ప్రాంతంగా పిలవబడే కేన్ ప్రాంతం చుట్టూ ట్రెంచ్ కొట్టి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్నారు. కేన్ ప్రాంతాన్ని ‘కేనోపి వాక్’ పేరుతో టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేసి భావితరాలకు అందించాలని ఆయన వినతిపత్రంలో పేర్కొన్నారు. -
బాల్యవివాహాల నియంత్రణ ప్రతీఒక్కరి బాధ్యత
ఏటూరునాగారం: బాల్య వివాహాల నియంత్రణ ప్రతీఒక్కరి బాధ్యతని జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఓంకార్ అన్నారు. మండల కేంద్రంలో బాల్య వివాహాల నిషేధ చట్టంపై శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2006చట్టం ప్రకారం 18ఏళ్లు నిండని అమ్మాయిలు, 21ఏళ్లు నిండని అబ్బాయిలకు వివాహం చేయడం చట్టరీత్యా నేరమన్నారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే చైల్డ్ హెల్ప్ లైన్ 1098 లేదా 112కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధికారి హరికృష్ణ, సిబ్బంది రాజు, సుదర్శన్, కన్నాయిగూడెం, మంగపేట, ఏటూరునాగారం అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లు పాల్గొన్నారు.జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఓంకార్ -
సైక్లింగ్ పోటీల్లో ప్రతిభ చూపాలి
ములుగు: నేడు హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీల్లో అత్యంత ప్రతిభ చూపి ములుగు జిల్లాకు మంచిపేరును తీసుకురావాలని సైక్లింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాదం ప్రవీణ్‌కుమార్ సూచించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని సంక్షేమ భవన్లో జిల్లా యువజన క్రీడల శాఖ కార్యాలయం ఎదుట 24మంది సైక్లింగ్ క్రీడాకారులకు శుక్రవారం సుమారు రూ.10వేలు విలువ చేసే టీ షర్టులను ఆయన అందజేశారు. రాష్ట్రస్థాయిలో విజయం సాధించే క్రీడాకారులకు తనవంతుగా సైకిళ్లను బహుమతిగా అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీవైఎస్ఓ తుల రవి, కోచ్ శ్రీరాంనాయక్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కోశాధికారి ఎలగందుల మోహన్ పాల్గొన్నారు. ఓఎస్డీ గీతే మహేశ్ బాబాసాహెబ్ బదిలీ ములుగు: ములుగు ఓఎస్డీ గీతే మహేశ్ బాబాసాహెబ్ ప్రమోషన్‌పై రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీగా శుక్రవారం బదిలీ అయ్యారు, 2024 మార్చి 15న ఏటూరునాగారం ఏఎస్పీగా ఆయన బాధ్యతలు తీసుకున్నారు. అక్కడ నుంచి ములుగు ఓఎస్డీగా బదిలీ అయ్యారు. ఆయన హయాంలో 15 మంది ఆయా కేటగిరీల్లో పనిచేస్తున్న మావోయిస్టు పార్టీ కమాండర్లు, దళసభ్యులు, మిలిషియా సభ్యులు 12మంది లొంగిపోగా ముగ్గురు సానుభూతి పరులు పట్టుబడ్డారు. కొండాయి బ్రిడ్జికి రూ.16 కోట్లు మంజూరు ఏటూరునాగారం: 2023లో కూలిపోయిన కొండాయి బ్రిడ్జి ప్రాంతంలో నూతనంగా హైలెవల్ బ్రిడ్జి నిర్మించేందుకు ఆర్అండ్బీ శాఖ ద్వారా శుక్రవారం రూ.16 కోట్లు మంజూరు అయినట్లు ఆర్అండ్బీ అధికారులు తెలిపారు. అయితే గతంలో రూ.9 కోట్లు మంజూరు కాగా బ్రిడ్జి పొడువు, ఎత్తు పెంచడంతో ఎస్టీమేట్ కూడా పెరిగినట్లు అధికారులు తెలిపారు. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు చేపడుతామని అధికారులు వివరించారు. విద్యుత్ అంతరాయానికి సహకరించాలి ములుగు రూరల్: విద్యుత్ అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని విద్యుత్‌శాఖ డీఈ నాగేశ్వరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం 9నుంచి 12 గంటల వరకు 33/11 కేవీ ఉపకేంద్రంలో మరమ్మతుల కారణంగా ములుగు, పత్తిపల్లి, మల్లంపల్లి, రాంచంద్రాపురం, పస్రా, గోవిందరావుపేట, వెల్తుర్లపల్లి, వెంకటాపురం(ఎం), ఎస్ఎస్ తాడ్వాయి, మేడారం, ఏటూరునాగారం, కమలాపూర్, కన్నాయిగూడెం, వాజేడు, మంగపేట, రాజుపేట, ఆలుబాక, మల్లూరు గ్రామాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు. రైస్‌మిల్ సీజ్ ములుగు: రూ.2,16,98,407 విలువ గల ధాన్యాన్ని యాజమాన్యం పక్కదారి పట్టించినట్లుగా గుర్తించి మల్లంపల్లి మండల పరిధిలోని రామచంద్రాపురంలో గల ఉమ బిన్ని రైస్‌మిల్‌ను సీజ్ చేసినట్లు సివిల్ సప్లయీస్ డీఎం రాంపతి తెలిపారు. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్లు నితీష్, రాంచందర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రమేష్‌తో కలిసి శుక్రవారం ఆయన రైస్ మిల్‌ను తనిఖీ చేశారు. 2023–24 వార్షిక కాలానికి రైస్‌మిల్ 604.628 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీఎంఆర్ రూపేణ అందించాల్సి ఉండగా ఇప్పటి వరకు అందించలేదని తెలిపారు. దీంతో మిల్లు యజమాని భూక్య ఉమాదేవిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. -
వివక్ష తగ్గినా వేధింపులున్నాయి..
కుటుంబాన్ని నడిపిస్తున్న మహిళామణులు104133మహిళలపై బహిరంగ ప్రదేశాల్లో వేధింపులు కొనసాగుతున్నాయి. పనులు చేస్తున్న మహిళలకు కార్యాలయాల్లో వేధింపులు కొంతమేర కొనసాగుతు న్నా.. సెల్ఫోన్లలో కొందరు అసభ్యపదజాలంతో పంపిస్తున్న మెసేజ్‌లతో ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం ఇంట్లో చెప్పలేక సతమతమవుతున్నారు. మానసికంగా ఇబ్బంది పెడుతున్న వారిలో తెలిసిన వారితోపాటు తెలియని వారు ఉన్న ట్లు పలువురు మహిళలు చెబుతున్నారు. నాడు వంటింటికే పరిమితమైన మహిళ.. నేడు విద్య, ఉద్యోగం, నచ్చిన రంగంలో ఎదుగుతూ పురుషులతో సమానంగా పనిచేస్తోంది. మహిళా దినోత్సవం నేపథ్యంలో ఆడ–మగ వివక్ష, పని ప్రదేశంలో వేధింపులు తదితర అంశాలపై ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ‘సాక్షి’ సర్వే నిర్వహించగా పలు విషయాలు వెలుగుచూశాయి. – సాక్షి నెట్వర్క్ 200731701101) మీ ఇంట్లో ఆడ – మగ వివక్ష ఏమైనా ఉందా..? ఎ) ఉంది బి) లేదు సి) చెప్పలేనుC78372) మీ కాలేజీ – పని ప్రదేశంలో మహిళగా ఏమైనా వివక్ష ఎదుర్కొంటున్నారా..? ఎ) లేదు బి) ఉంది సి) చెప్పలేను 623) మీరు ఎక్కువగా ఇబ్బంది పడుతున్న ప్రదేశం? (ఎ) సెల్ఫోన్లో వచ్చే మెసేజ్‌లతో.. బి) బస్టాప్‌లో సి) కాలేజీ లేదా ఆఫీస్‌లోAB4) మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వారిలో అత్యధికులు ఎవరు? ఎ) తెలియని వారు బి) తెలిసిన వారేషాంపిల్స్: 310 (గ్రేటర్వరంగల్ 60మంది, మిగతా ఐదు జిల్లాలు (వరంగల్, మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లి, ములుగు 50మంది చొప్పున) అన్ని వర్గాల మహిళలను పరిగణనలోకి తీసుకుని వారి అభిప్రాయాల సేకరణ. వారి సంకల్పం గొప్పది. ఆశయం ఉన్నతమైనది. హేళనలు, అవమానాలేమీ వారు చేసే పనులకు అడ్డంకి కాలేదు. ప్రతికూల పరిస్థితులెదురైనా, పురుషాధిక్య రంగమైనా వారు పట్టు వీడలేదు. అన్ని రంగాల్లోనూ మాదే పై చేయి అంటూ ముందుకు సాగుతున్నారు. చిన్నతనంలో వివాహమై భర్తను కోల్పోయిన ఒకరు కుటుంబానికి అండగా నిలబడితే.. మరొకరు పేదరికాన్ని పారదోలేందుకు నడుంకట్టారు. ఇంకొకరు విశ్వవేదికపైన జాతీయ జెండాను సగర్వంగా ఎగురవేశారు. నేడు(శనివారం) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సంకల్ప శక్తులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. హోటల్ నడుపుతూ.. పిల్లలను చదివిస్తూ.. చిట్యాల: మండల కేంద్రానికి చెందిన భీమారపు ఓదెలు హోటల్ నడుపుతూ జీవనం సాగించేవాడు. కట్టెల పొయ్యి కారణంగా అతడి చూపు దెబ్బతిన్నది. భార్య ప్రమీల 20 ఏళ్లుగా హోటల్ నడుపుతూ పిల్ల లను చదివిస్తోంది. గతేడాది పెద్దమ్మాయికి పెళ్లి చేసింది. మిగతా ఇద్దరు పీజీ, ఎంటెక్ చదువుతున్నారు. ఓదెలు కూరగాయలు కట్ చేసి వ్వడం, పిండి కలపడం వంటి పనుల్లో ఆమెకు సాయం చేస్తుంటాడు. తమ కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని వారు కోరుతున్నారు.● విభిన్న రంగాల్లో రాణిస్తూ ఆదర్శం ● పురుషులకు దీటుగా బాధ్యతలు నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవంసంగెం: వైకల్యం శరీరానికే కానీ మనస్సుకు కాదని నిరూపించింది సంగెం మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన దామెరుప్పుల రమాదేవి. ఆమెకు ఆర్నెళ్ల వయసులోనే జ్వరం వచ్చింది. కాళ్లు చచ్చుబడిపోయాయి. వైకల్యాన్ని జయించాలంటే చదువు ఒక్కటే మార్గమని.. నమ్మింది. ప్రస్తుతం పీహెచ్డీ చేస్తోంది. గత ఏడాది డిసెంబర్ 5, 6 తేదీల్లో కాంబోడియా దేశంలో ఇంటర్నేషనల్ త్రోబాల్ పోటీలకు మన దేశం తరఫున పాల్గొని మొదటి స్థానంలో నిలిచి గోల్డ్‌మెడల్ సాధించింది. చీకట్లో ‘వెన్నెల’ సాక్షి, మహబూబాబాద్: దంతాలపల్లి మండలం పెద్దముప్పారానికి చెందిన గొడిశాల మల్లయ్య సుగుణమ్మల కుమార్తె వెన్నెల. పుట్టిన ఎనిమిదేళ్లకే తండ్రి మరణించాడు. ఆతర్వాత వెన్నెలను నర్సింహులపేట మండల కేంద్రంలోని అక్కా, బావ తీగల వెంకన్న, సుజాత చేరదీసి చదివించా రు. పదోతరగతి చదివిన వెన్నెలకు మహబూబా బాద్ మండలం పర్వతగిరికి చెందిన నారమళ్ల సంపత్తో వివాహం జరిపించారు. చిన్నతనంలో నే ఇద్దరు ఆడపిల్లలకు తల్లయ్యింది. మిర్చి పంట కు తామర పురుగు సోకడంతో కుటుంబం అప్పు ల పాలయ్యింది. అప్పుల బాధతో భర్త సంపత్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో 19 ఏళ్లకే వెన్నెల వితంతువుగా మారింది. ఆరేళ్ల సాన్విక, మూడేళ్ల తన్వికతో పాటు తల్లి సుగుణమ్మ, అత్త, మామ పోషణ ఆమైపె పడింది. మహబూ బా బాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తూ కుటుంబ భారాన్ని మోస్తోంది. మూగజీవాల నేస్తం.. డాక్టర్ అనిత లింగాలఘణపురం: మండల కేంద్రంలో పశువైద్యురాలిగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ఆడెపు అనిత పాడి రైతులు, గొర్రెలు, మేకల పెంపకందారుల మన్ననలు పొందుతున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన అనిత 2019లో లింగాలఘణపురం పశువైద్యాధికారిగా విధుల్లో చేరారు. పశువైద్యశాల కు వచ్చే మూగ జీవాలకు వైద్యం చేస్తూనే.. వ్యవసాయబావులు దూరంగా ఉండి ఆస్పత్రికి రాలేని పశువుల వద్దకు స్వయంగా ద్విచక్రవాహనంపై వెళ్లి వైద్యం చేస్తున్నారు. పశువులకు కృత్రిమ గర్భధారణలో ప్రత్యేకత చాటుకున్నారు. 63 శాతం సక్సెస్ సాధించారు. పశువులు, గొర్రెలకు వ్యాక్సినేషన్‌ను నూటికి నూరు శాతం అమలు చేస్తూ రైతులు, గొర్రెలు, మేకల పెంపకందారులకు నేస్తంగా మారిపోయారు. చేయి చేయి కలిపి.. పేదరికాన్ని తరిమి ఏటూరునాగారం: మండలంలోని శివాపురంలో ట్రైకార్ సాయంతో ఐటీడీఏ ద్వారా పది మంది మహిళలు సమ్మక్క–సారలమ్మ డిటర్జెంట్ సబ్బుల తయారీ పరిశ్రమను నెలకొల్పారు. ట్రైకార్ నుంచి 60 శాతం సబ్సిడీ, బ్యాంకు నుంచి 30 శాతం రుణం తీసుకుని పరిశ్రమ నడుపు తున్నారు. తయారు చేసిన సబ్బులకు ఒక్కోదానికి రూ.10గా ధర నిర్ణయించి గిరిజన సహకార సంఘానికి(జీసీసీ) విక్రయిస్తున్నారు. రోజుకు సుమారు 4 వేల సబ్బులు తయారు చేస్తున్నారు. ఐదేళ్లుగా కోటిన్నర రూపాయల వ్యాపారం చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సబ్బుల తయారీలో ఆదర్శంగా నిలుస్తున్నారు. కట్టె కోత.. బాధ్యతల మోతకట్టెకోత మిల్లులో మగవారితో సమానంగా పని చేస్తోంది వరంగల్ నగరం నాగేంద్రనగర్‌కు చెందిన ఎండీ రజియా. భర్త అనారోగ్యం కారణంగా కుటుంబ భారం ఆమైపె పడింది. 15 ఏళ్లుగా నగరంలోని జగన్నాథం సామిల్లులో కట్టర్‌గా పనిచేస్తోంది. ముగ్గురు పిల్లల పెళ్లి చేయగా.. కూతురు కుటుంబంలో కలహాలు రావడంతో ఆమె తల్లివద్దే ఉంటోంది. వీరందరికీ రజియా పని చేస్తేనే భోజనం. సొంతిల్లు ఉంటే కొంత భారం తగ్గుతుందని రజియా అంటోంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, వరంగల్ సమాచార వారధిగా పత్రికల సేవలు భేష్‘సాక్షి’ గెస్ట్ ఎడిటర్, వరంగల్ జిల్లా రెండో అదనపు జడ్జి (పోక్సో కోర్టు) మనీషా శ్రవణ్ ఉన్నవ్ సంకల్పం ముందు చిన్నబోయిన వైకల్యం వరంగల్ లీగల్ : ప్రజలకు, అధికార యంత్రాంగానికి, ప్రభుత్వానికి సమాచార వారధిగా వార్తా పత్రిక లు నిలవాలని సాక్షి గెస్ట్ ఎడిటర్, వరంగల్ జిల్లా రెండో అదనపు జడ్జి (పోక్సో కోర్టు) మనీషా శ్రవణ్ ఉన్నవ్ అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా సాక్షి వరంగల్ యూనిట్ కార్యాలయానికి శుక్రవారం ఆమె గెస్ట్ ఎడిటర్‌గా వచ్చారు. ముందుగా జడ్జికి సాక్షి ఎడిషన్, బ్యూరో ఇన్చార్జులు వర్ధెల్లి లింగయ్య, గడ్డం రాజిరెడ్డి, లీగల్ రిపోర్టర్ జీవన్ పూలమొక్క అందించి స్వాగతం పలికారు. మొదట ఎడిటోరియల్ విభాగానికి చేరుకున్నారు. ఫీల్డ్ నుంచి రిపోర్టర్లు పంపిన కాపీలు డెస్క్‌కు ఎలా చేరుతాయో పరిశీలించారు. ఎడిటోరియల్ విభాగాన్ని పరిశీలించి సబ్ ఎడిటర్లు వార్తలు దిద్దుతున్న తీరును గమనించారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన కాపీలను చూసి కావాల్సిన అదనపు అంశాలు, సమాచారాన్ని తెప్పించుకోవాలని సూచించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వే రిపోర్ట్‌ను పరిశీలించి పేజీ లేఔట్‌పై తగిన సూచనలిచ్చారు. సర్వే అంశాలు బాగున్నాయని, వాటిని ఎలా నిర్వహించారో అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విజయవంతంగా ముందుకు సాగుతున్న మహిళలపై తెప్పించిన కథనాలను చూసి తగిన ఫొటోలు ఉన్నాయా.. లేవా? అని సరిచూసుకోవాలని, అక్షరదోషాలు లేకుండా దిద్దాలని సూచించారు. అనంతరం ఐటీ, ఏడీవీటీ, స్కానింగ్, సీటీపీ, ప్రొడక్షన్ విభాగాలను పరిశీలించారు. వాటి పనితీరును తెలుసుకున్నారు. నూతన టెక్నాలజీతో అన్ని రంగుల్లో పత్రిక వెలువడుతున్న తీరును చూసి బాగుందని కితాబిచ్చారు. ప్రజలకు ఉపయోగపడే వార్తలివ్వాలి.. పత్రికలో అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే వార్తలు ఇవ్వాలని మనీషా శ్రవణ్ ఉన్నవ్ అన్నారు. న్యాయసంబంధ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రచురించాలని, వీటిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. మహిళలను జర్నలిజంలో ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని ఆధారాలతో పరిశోధనాత్మక వార్తలు రాయాలని సూచించారు. మహిళా చైతన్యంలో పత్రికలు కీలకమని పేర్కొన్నారు. సాక్షి గెస్ట్ ఎడిటర్‌గా తనకు అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం సాక్షి సిబ్బంది ఆమెకు శాలువా అందించి సన్మానించారు. మహిళల ‘సౌర’ సాగు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఆమెకు అండగా.. పోకిరీల ఆట కట్టిస్తున్న ‘షీ’టీమ్ – 8లోuకూతుళ్లే మహారాణులు కొందరు ఒక్కరితో సరి.. ‘సాక్షి’ సర్వేలో మహిళల మనోగతం వార్తకు అనుగుణంగా శీర్షికలు ఉండాలి.. కచ్చితమైన సమాచారం ఉండేలా చూసుకోవాలి.. మహిళా దినోత్సవ కథనాలు బాగున్నాయని కితాబు -
మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్‌పోస్టర్లు
మంగపేట: మండల కేంద్రంలోని పలు ప్రాంతాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా తెలంగాణ ట్రైబల్ యూత్ అసోసియేషన్ పేరుతో గురువారం రాత్రి వాల్‌పోస్టర్లు వెలిశాయి. కోమటిపల్లి క్రాస్ రోడ్డు, పలు ప్రధాన కూడళ్లతో పాటు కమలాపురంలోని పలు ప్రాంతాల్లో సైతం పోస్టర్లు వెలిశాయి. శాంతియుత జీవనం మనహక్కు, అనుమానితుల సమాచారమిద్దాం.. పోలీసులకు సహకరిద్దాం.. అని తదితర నినా దాలు వాల్ పోస్టర్లలో ఉన్నాయి. మరి కొన్ని పోస్టర్లలో మా వోయిస్టులు, ఆది వాసీ గిరిజనుల ఫొటోలు ముద్రించి ఉన్నాయి. వాల్ పోస్టర్లు గురువారం రాత్రే వెలిశాయని,ఎవరు అంటించారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. -
చట్టాలపై అవగాహన తప్పనిసరి
ములుగు: మహిళా చట్టాలపై తప్పనిసరి అవగాహన కలిగి ఉండాలని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం మహర్షి డిగ్రీ కళాశాల ఆవరణలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మహేందర్ మాట్లాడుతూ దశాబ్దాలుగా సామాజిక వెనుకబాటుతనం కారణంగా మహిళలు నేటికీ వివక్షత ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత న్యాయ సలహా ఎలా పొందాలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బానోత్ స్వామిదాస్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ రాచర్ల రాజ్‌కుమార్, ఏజీపీ బాలుగు చంద్రయ్య, మహర్షి విద్యాసంస్థల చైర్మన్ తుమ్మ పిచ్చిరెడ్డి పాల్గొన్నారు.చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మహేందర్ -
విద్యార్థినికి అభినందనలు
భూపాలపల్లి అర్బన్: ఇన్స్పైర్ అవార్డు సాధించిన జిల్లా కేంద్రంలోని సింగరేణి ఉన్నత పాఠశాల విద్యార్థిని మాచర్ల ఆశ్రితను పాఠశాల యాజమాన్యం గురువారం అభినందించింది. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మారుతి మాట్లాడుతూ.. గత నెలలో కేంద్ర ప్రభుత్వం సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ, సైన్స్ టెక్నాలజీ విభాగంలో నిర్వహించిన ఇన్స్పైర్ అవార్డులో పాఠశాల విద్యార్థిని ఎంపికై నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రూ.10వేల నగదు ప్రోత్సాహకాన్ని అందించినట్లు తెలిపారు. ఈ మేరకు పాఠశాల ఆవరణలో ఆశ్రితకు పూలగుచ్ఛంతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జాన్సీరాణి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. రవాణాలో జాగ్రత్తలు పాటించాలి భూపాలపల్లి అర్బన్: ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులను ప్రైవేట్ వాహనాల్లో తరలిస్తున్న సమయంలో జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి సూచించారు. ఈ మేరకు జిల్లాలోని కస్తూర్బాగాంధీ, మోడల్ స్కూళ్ల స్పెషల్ అధికారులు, ప్రిన్సిపాళ్లతో గురువారం జూమ్ మీటింగ్ నిర్వహించి మాట్లాడారు. విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు రవాణా చేసే సందర్భాలలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తప్పనిసరిగా ఒక ఉపాధ్యాయురాలు లేదా ఉపాధ్యాయుడిని ఎస్కార్ట్‌గా విద్యార్థులతో పంపాలని, దూర ప్రాంతం ఉన్న పాఠశాలలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని డీఎంను ఆదేశించారు. -
నిలిచిన ఇసుక తరలింపు
ఏటూరునాగారం: మండల కేంద్రానికి సమీపాన గల సంఘంపాయ, గోదావరి శివారులో కొనసాగుతున్న ఇసుక క్వారీ ప్రారంభమైన నాలుగు రోజులకే నిలిచిపోయింది. క్వారీ నిర్వాహకులు ఇసుకను తరలించడానికి నెల రోజుల నుంచి రోడ్లను వేశారు. ఈ క్రమంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇసుక తరలింపునకు నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానంలో రెవెన్యూ అటవీ మైనింగ్ శాఖలకు బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వేబిల్లులలో ఉన్న క్వాంటిటీ కంటే ఎక్కువ ఇసుకను తరలిస్తున్న లారీలను సీజ్ చేయాలని ఆదేశాలలో పేర్కొంది. క్వారీ నుంచి వచ్చిన ఓవర్ లోడ్ లారీలను గమనించి సీజ్ చేయాలని లేదా ఎంత ఎక్కువ ఇసుక లారీలో ఉందో దానికి తగ్గ ఫైన్ ట్రెజరీకి చెల్లించే విధంగా విధానాన్ని రూపకల్పన చేసింది. నూతన విధానం అమలయ్యాక ఆయా క్వారీల నుంచి వస్తున్న లారీలను పోలీస్ రెవెన్యూ శాఖ అధికారులు ఓవర్ లోడ్ లారీలను నిలిపివేస్తూ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో ఈ నెల 1న ఏటూరునాగారం ఇసుక క్వారీ ప్రారంభమైంది. రెండు రోజులు క్వారీ ఆన్లైన్ డీడీలు తీసుకోవడానికి అనుకూలంగా ఉన్నప్పటికీ మూడు రోజుల నుంచి క్వారీకి సంబంధించిన వేబిల్లుల నిర్వహణ ఆన్లైన్ నుంచి తొలగిపోయింది. అయితే ఈ మూడు రోజులుగా వారి యాజమాన్యం పాత వేబిల్లుల ప్రకారం కొనసాగించింది. రెండు రోజుల క్రితం ఏటూరునాగారం క్వారీ నుంచి వెళ్తున్న లారీలను రెవెన్యూ పోలీస్‌శాఖ అధికారులు గమనించి అధిక లోడ్‌తో వెళ్తున్నాయని ఒక లారీని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అటవీ శాఖ అధికారులు జోక్యం చేసుకొని ఇసుక క్వారీ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ ప్రాంతం ఫారెస్ట్ ఏరియా పరిధిలో ఉందంటూ ఇసుక తరలింపు నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు గురువారం నుంచి క్వారీలో ఇసుక తరలింపు పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఇసుక క్వారీ ఫారెస్ట్ ఏరియా పరిధిలో ఉందంటూ అటవీశాఖ ఆదేశాలు -
భక్తులకు మెరుగైన వైద్యసేవలు
రేగొండ: కొడవటంచ జాతర బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు మెరుగైన వైద్యం అందేలా వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని జిల్లా వైద్యాధికారి మధుసూదన్ అన్నారు. ఈనెల 9నుంచి ప్రారంభమయ్యే కోటంచ జాతర సందర్భంగా గురువారం మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతర సమయంలో వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. అత్యవసర వైద్యానికి జాతరలో రెండు ఆంబులెన్స్‌లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జాతీయ సంక్రమిక వ్యాధుల నియంత్రణ కార్యక్రమంలో భాగంగా బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులను గుర్తించి, వారికి చికిత్స అందించి వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. -
విద్యార్థులు మేధాశక్తిని పెంపొందించుకోవాలి
ఏటూరునాగారం: విద్యార్థులు మేధాశక్తి పెంపొందించుకోవాలని హనుమకొండ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ వాసం శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాలలో రెండు రోజులు జాతీయస్థాయిలో వర్క్‌షాప్ నిర్వహించారు. రెండోరోజు గురువారం నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఆన్లైన్ సెమినార్‌కి ముఖ్యఅతిథిగా శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. ‘ఆన్ ఇంటరాక్షన్ విత్ కెరియర్ గైడెన్స్ సెల్’, ‘కోఆర్డినేషన్ కాంపౌండ్స్’ అనే అంశాల మీద విద్యార్థినులకు అవగాహన కల్పించారు. చదువుతో పాటు సమాజంపై విజ్ఞానం పెంచుకోవాలన్నారు. అనంతరం జంతుశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఆన్లైన్ వెబ్ నాట్కి గెస్ట్‌గా సంగారెడ్డి డిగ్రీ కళాశాల డాక్టర్ సుప్రభాపాండ మాట్లాడారు. ‘ఇన్బార్ ఎర్రర్స్ ఆఫ్ మెటబాలిజం’ అనే అంశం పైన చర్చించారు. కళాశాలలో పోటీలను నిర్వహించే విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీవాణి, రీజినల్ కోఆర్డినేటర్ హరిసింగ్, ములుగు జిల్లా సమన్వయకర్త శ్రీనివాస్ రెడ్డి, గిరిజన బాలుర పాఠశాల ప్రిన్సిపాల్ రాజు పాల్గొన్నారు.అసోసియేట్ ప్రొఫెసర్ శ్రీనివాస్ -
డబుల్ ట్రబుల్
ఏటూరునాగారం: నిరుపేదల సొంతింటి కల నెరవేరడం లేదు. డబుల్ బెడ్రూం ఇళ్లు వస్తాయని ఆశపడిన పేదలకు నిరాశే మిగులుతోంది. నిల్వ నీడ లేక గుడిసెల్లోనే పేదల జీవితాలు మగ్గుతున్నాయి. ఎన్నో ఏళ్ల నుంచి కంటున్న కలలు సాకారం అవుతాయన్న వారి కళ్లలో మిగిలిపోయిన కట్టడాలే కానొస్తున్నాయి. జిల్లాలోని 9మండలాల్లో ఇళ్లు లేని నిరుపేదలకు 2016లో కేసీఆర్ ప్రభుత్వం 1238 డబుల్ బెడ్రూం ఇళ్లను మంజూరు చేసింది. ఒక్కో ఇల్లుకు రూ.5.30లక్షల చొప్పున నిధులు సమకూర్చి కాంట్రాక్టర్లకు నిర్మాణాల బాధ్యతలు అప్పగించింది. కానీ సకాలంలో కాంట్రాక్టర్లు పనులు పూర్తి చేయలేదు. దీంతో అధికారులు బిల్లులు ఇవ్వకపోవడంతో డబుల్ బెడ్రూం ఇళ్లు 60 శాతం మాత్రమే పూర్తి చేశారు. 40శాతం పనులు వివిధ దశల్లో.. మిగతా 40శాతం ఇళ్లు గోడలు పూర్తికాకుండా, అసంపూర్తిగా పిల్లర్లు, మెట్లు కూలిపోయి వివిధ దశల్లో ఇళ్ల నిర్మాణాలు ఆగిపోయాయి. డబుల్ బెడ్రూం ఇళ్లు వస్తాయని పాత ఇళ్లను తొలగించి నిరుపేదలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఉన్నతాధికారులు దృష్టిసారించకపోవడంతో అవి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగానే మిగిలిపోయాయి. మంగపేట మండలం బోరునర్సాపురంలో 20 ఇళ్లు మంజూరు కాగా ఒక్కటి కూడా పూర్తి కాలేదు. 20 ఇళ్లను కేవలం పునాదులు వేసి వదిలేశారు. దాంతో ఇంటి వద్ద బర్కాలు కట్టుకొని లబ్ధిదారులు కాలం వెళ్లదీయాల్సి వస్తోంది.అసంపూర్తిగా ఇళ్ల నిర్మాణం గుడిసెల్లోనే జీవిస్తున్న పేదలు ఎదురుచూస్తున్న లబ్ధిదారులు -
హామీలు నెరవేర్చాలని సీఎంకు పోస్టు కార్డులు
ములుగు: ఎన్నికల ముందు సీఎం రేవంత్‌రెడ్డి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మల్లంపల్లి మండల ఉద్యకారులు గురువారం సీఎంకు పోస్టు కార్డులు పంపారు. 220 చదరపు గజాల స్థలం, ఇంటి నిర్మాణానికి రూ. 10లక్షలు, రూ.2,500ల పెన్షన్ అందించాలని పోస్టు కార్డులో విన్నవించి రాశారు. ఈ కార్యక్రమంలో ద్రోణాచారి, మాచర్ల ప్రభాకర్, రాజేశ్వర్‌రావు, హరినాధ్, బోయిని రవి, రేణుకుంట్ల సురేష్, చిదరం సంతోష్, లిండాద్రి, మనోహరస్వామి, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సమర్థంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ
భూపాలపల్లి రూరల్: అధికారులు సమన్వయంతో పనిచేసి, రైతులకు ఇబ్బందులు లేకుండా యాసంగి ధాన్యం కొనుగోలు ప్రక్రియను సమర్థంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ సూచించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో యాసంగి (రబీ) 2024–25 కాలానికి ధాన్యం కొనుగోలు కమిటీ సమావేశం నిర్వహించారు.ఽ ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు ప్రక్రియ, పంట కోత, గున్నీలు, పరికరాల లభ్యత టార్పాలిన్లు, కేలిబర్స్, పాడీ క్లీనర్లు సిద్ధంచేయాలని సూచించారు. రైతులకు గిట్టుబాటు ధర అందించే విధానాలు, పంట కోత అనంతరం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేసే చర్యలపై సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ -
1,806మంది హాజరు.. 47మంది గైర్హాజరు
● ప్రారంభమైన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ములుగు: ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 10పరీక్ష కేంద్రాల్లో 1,853 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 1,806 మంది హాజరయ్యారు. 47మంది గైర్హాజరు అయ్యారు. ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు శాఖ తరఫున భారీ బందోబస్తు నిర్వహించారు. జనరల్ విభాగంలో 1,645 మంది గాను 1,604 మంది, ఒకేషనల్ విభాగంలో 208 మందికి 202 మంది హాజరయినట్లు ఇంటర్ విద్యాశాఖ అధికారి చంద్రకళ తెలిపారు. 1,370 ఎకరాల్లో సర్వే పూర్తి ములుగు: మొక్కజొన్న పంటను సాగు చేసి ఆర్థికంగా నష్టపోయిన వెంకటాపురం(కె) మండలానికి చెందిన 616 మంది రైతులకు సంబంధించిన 1,370 ఎకరాల్లో సాగు చేసిన పంటను సర్వే చేసినట్లు ఏడీఏ సురేష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతుల జాబితాను గ్రామ పంచాయతీలు, తహసీల్దార్ కార్యాలయాల్లో వారం రోజుల పాటు ప్రదర్శించనున్నట్లు వెల్లడించారు. జాబితాలో ఎవరైనా అనర్హులు ఉంటే వారి పేర్లను వ్యవసాయ శాఖ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎవరైనా అర్హుల పేర్లు జాబితాలో లేకపోతే సంబంధిత గ్రామాల ఏఈఓల దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. పంట నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం అందేలా చూస్తామని వివరించారు. పశు వైద్యశిబిరం వాజేడు: మండల పరిధిలోని జగన్నాథపురం, చీకుపల్లి గ్రామాల్లో గురువారం వెంకటాపురం(కె) సహాయ సంచాలకులు డాక్టర్ వేణు పర్యవేక్షణలో పశు వైద్యశిబిరం నిర్వహించారు. వివిధ వ్యాధులతో బాధ పడుతున్న పశువులను వైద్యులు శ్రీనిధి, హరీశ్‌రెడ్డి పరీక్షించి మందులను అందించారు. దూడలకు నట్టల నివారణ మందులను తాగించారు. ఈ సందర్భంగా డాక్టర్ వేణు మాట్లాడుతూ వేసవి కాలంలో పశువుల పట్ల తీసుకో వాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ శిబిరంలో జిల్లా గోపాలమిత్ర సూపర్ వైజర్ లక్ష్మణ్, కుమారస్వామి, ఖాజాఖాన్. కృష్ణ, రాంబాబు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఆన్లైన్ ఫైలింగ్‌పై అవగాహన అవసరం భూపాలపల్లి అర్బన్: కేసుల ఆన్లైన్ ఫైలింగ్ నమోదుపై న్యాయవాదులు అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి నారాయణబాబు తెలిపారు. జిల్లా కోర్టులో గురువారం న్యాయవాదులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిజిటల్ లిటరసీ అనేది చాలా ముఖ్యమన్నారు. కేసుల ఈ ఫైలింగ్ విధానం తెలిసినప్పుడు దేశ వ్యాప్తంగా ఎక్కడైన కేసులను వేసుకునే వీలుంటుందని తెలిపారు. విలువైన సమయం, డబ్బులు పొదుపు అవుతాయని, ప్రయాణ భారం తగ్గుతుందని తెలిపారు. రిసోర్స్ పర్సన్లు అఖిల్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా సీనియర్ జడ్జి, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జయరాంరెడ్డి, ఏఓ అనితావని, న్యాయవాదులు పాల్గొన్నారు. -
పులికాదు.. అడవి పిల్లి
రేగొండ: కొత్తపల్లిగోరి మండల కేంద్రంలోని శివార్లలోని పంట పొలాల్లో పులి సంచరిస్తున్నట్లు వదంతులు వచ్చాయని, అది అడవి పిల్లి (వైల్డ్ క్యాట్) అని చెల్పూర్ ఇన్చార్జ్ రేంజ్ అధికారి నరేష్ తెలిపారు. కొత్తపల్లిగోరి శివారు పంచరాయిలో ఉన్న పంట పొలాల్లో పులి సంచరిస్తున్నట్లు బుధవారం సాయంత్రం సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది. దీంతో అటవీ అధికారులు గురువారం ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. పంట పొలాలు, బొక్కి చెరువు సమీపంలో క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ ప్రాంతంలో లభించిన పాదముద్రలను పరిశీలించిన అధికారులు ఆ పాదముద్రలు అడవి పిల్లివని నిర్ధారించారు. వన్యప్రాణులు కనబడితే తమ దృష్టికి తీసుకు రావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ములుగు ఎఫ్ఆర్ఓ శంకర్, ఎఫ్ఎస్ఓ గౌతమి పాల్గొన్నారు. -
రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్ఓ గోపాల్‌రావు అన్నారు. మండల కేంద్రంలోని పీహెచ్‌సీని ఆయన గురువారం ఆకస్మికంగా సందర్శించి అటెండెన్స్, రోగుల ఓపీ రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఆస్పత్రిలో డిప్యూటేషన్‌పై పని చేస్తున్న సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ వేసవి ఎండల తీవ్రతతో ఎండ దెబ్బకు గురై ఆస్పత్రి వచ్చిన వారికి సకాలంలో వైద్య సేవలందించాలని ఆదేశించారు. గ్రామాలను సందర్శించి ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. విటమిన్ లోపం ఉన్న వారిని గుర్తించేందుకు ఫీల్డ్ సర్వే నిర్వహించాలన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదన్నారు. ఆయన వెంట వైద్యాధికారులు చిరంజీవి, మౌనిక ఉన్నారు.డీఎంహెచ్ఓ గోపాల్‌రావు -
హైకోర్టును ఆశ్రయించిన హరిబాబు?
భూపాలపల్లి: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భూపాలపల్లి పట్టణానికి చెందిన నాగవెల్లి రాజలింగమూర్తి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కొత్త హరిబాబు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే.. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ కోర్టుకు వెళ్లిన భూపాలపల్లి పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి గత నెల(ఫిబ్రవరి) 19న రాత్రి తన ఇంటికి వెళ్తున్న క్రమంలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. పోలీసులు ఫిబ్రవరి 23న ఏడుగురు నిందితులను అరెస్ట్ చూపించారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. ఈ నెల 1వ తేదీన ఏ9గా ఉన్న పుల్ల నరేష్‌ను సైతం అదుపులోకి తీసుకొని అరెస్ట్ చూపించారు. ఏ8గా ఉన్న భూపాలపల్లి మున్సిపాలిటీ మాజీ వైస్‌చైర్మెన్, బీఆర్ఎస్ నాయకుడు కొత్త హరిబాబు, ఏ10గా ఉన్న పుల్ల సురేష్ కోసం పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న హరిబాబు ఇటీవల హైకోర్టును ఆశ్రయించి, ముందస్తు బెయిల్ కోసం అప్పీల్ చేసుకున్నట్లు సమాచారం. అయితే బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 10న వాదనలు జరుగనున్నట్లు తెలిసింది. ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు రాజలింగమూర్తి హత్య కేసులో ఏ8గా అతడిపై కేసు నమోదు -
వాతావరణం
జిల్లాలో ఉదయం ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం ఎండ, ఉక్కపోతగా ఉంటుంది. రాత్రి చల్లగాలులు వీస్తాయి.సత్వర వైద్యం అందుతోంది.. ఆవులు అనారోగ్యానికి గురైతే సంచార వైద్య సేవలు అందిస్తున్నారు. ఆస్పత్రి సమయ వేళల్లో అయితే పశువులను దవాఖానకు తీసుకెళ్లేందుకు వీలుంటుంది కాని మేతకు వెళ్లిన సమయంలో అనారోగ్యానికి గురైతే 1962 సిబ్బంది సకాలంలో వైద్యం అందించి పశువులను కాపాడుతున్నారు. – జంగిలి రవితేజ, పశుపోషకుడు, ప్రేమ్‌నగర్ జిల్లాకు మరో అంబులెన్స్ అవసరం జిల్లాలోని 9 మండలాల్లో సంచార వైద్యం అందించేందుకు ఒకే అంబులెన్స్ ఉంది. దీంతో సమాచారం అందిన ప్రతీ కేసుకు వైద్యం అందించడం కష్టంగా మా రుతోంది. జిల్లాకు మరో అంబులెన్స్ ఏ ర్పా టు చేయడంతో పాటు సిబ్బందిని నియమించాలని ప్రభుత్వానికి నివేదికలు అందించాం. గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాం. – చంద్రశేఖర్, 1962 జిల్లా కోఆర్డినేటర్ -
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య
ములుగు: ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందుతుందని అకాడమిక్ మానిటరింగ్ అధికారి(ఏఎంఓ) మల్లారెడ్డి అన్నారు. 2024 డీఎస్సీలో ఉద్యోగం సాధించిన 120మంది ఉపాధ్యాయులకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం చివరి రోజు శిక్షణ శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలను బలోపేతం చేయడంతో పాటు ప్రతీ పాఠశాలలో సరిపడా ఉపాధ్యాయులు ఉండేలా చర్యలు తీసుకోవడం శుభపరిణామం అన్నారు. విద్యార్థుల సామర్య్థాలను పెంచి ములుగు జిల్లాను రాష్ట్రంలో మొదటిస్థానంలో నిలపాలన్నారు, ప్రభుత్వ పరీక్షల నియంత్రణాధికారి అప్పని జయదేవ్ మాట్లాడుతూ నూతన ఉపాధ్యాయులు వైవిధ్యంగా ముందుకు సాగుతూ విద్యార్థులను అన్ని అంశాల్లో ముందుండేలా చూడాలన్నారు. వారిలో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించి వృత్తి ధర్మాన్ని నెరవేర్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్లు రాజేశ్‌కుమార్, ఆడిచర్ల రాజయ్య, మహేందర్, మధు, దిలీప్, సురేందర్, రాంబాబు పాల్గొన్నారు.ఏఎంఓ మల్లారెడ్డి -
సైబర్ నేరాలపై అప్రమత్తం
ములుగు రూరల్: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైం డీఎస్పీ సందీప్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం మండల పరిధిలోని జంగాపల్లిలో సైబర్ క్రైం కో ఆర్డినేషన్ సెంటర్ ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిజిటల్ అరెస్ట్, జాబ్ ప్రాడ్, సైబర్ స్టాకింగ్, సైబర్ స్లేవరి, మల్టీలెవల్ మార్కెటింగ్ ప్రాడ్ వంటి నేరాలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఎవరైనా సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని లేదా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. సైబర్‌క్రైం. జీఓవీ. ఇన్ పోర్టల్‌లో రిపోర్టు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సైబర్ క్రైం ఇన్స్పెక్టర్ యాసిన్, జంగాలపల్లి సీసీ భీమా, ములుగు సీసీ చంద్రమౌళి, సిబ్బంది శ్రీకాంత్, ఉమామహేశ్వర్, తేజస్వీ, శ్వేతపాల్ తదితరులు పాల్గొన్నారు.డీఎస్పీ సందీప్‌రెడ్డి -
2024 14,332
2021నుంచి 2025 ఫిబ్రవరి వరకు పశువులకు అందిన వైద్యం2,011నకిలీ పురుగు మందులు.. నకిలీ పురుగు మందులు విక్రయిస్తున్న ముఠా ను బుధవారం అరెస్టు చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. డిగ్రీ ఫలితాల నిలిపివేత కేయూ అకాడమిక్ డీన్‌కు ఫీజు చెల్లించకపోవడంతో 121 ప్రైవేట్ డిగ్రీ కళాశాలల పరీక్ష ఫలితాలను అధికారులు నిలిపివేశారు. – 8లోuములుగు రూరల్: మూగజీవాలకు సత్వర వైద్యం అందించేందుకు గత ప్రభుత్వం చేపట్టిన సంచార వైద్యం సత్ఫలితాలు ఇస్తోంది. పశుపోషకులు జీవాలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురైనా రైతులు 1962 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించి వైద్యసేవలు పొందేందుకు అవకాశం కల్పించింది. రైతులు ఫోన్లో అందించిన సమాచారం మేరకు రైతులు కోరిన ప్రాంతానికి వెళ్లి పశువులకు అత్యవసర వైద్యసేవలు అందిస్తున్నారు. సంచార వాహనాల్లో పశువులు, గేదెలు, గొర్రెలు, మేకలు వైద్యానికి సంబంధించిన మందులను అందుబాటులో ఉంచుకొని గ్రామీణ ప్రాంతాలలో వైద్యసేవలు అందిస్తున్నారు. దీంతో ములుగు నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో పశుమరణాలు తగ్గుముఖం పట్టాయి.జిల్లాలో పశువైద్య కేంద్రాల వివరాలుజిల్లాలోని తొమ్మిది మండలాల్లో పశువైద్య కేంద్రాలు 15 ఉన్నాయి. అదే విధంగా పశువైద్య ఉప కేంద్రాలు 16, ఏరియా ఆస్పత్రులు ములుగు, ఏటూరునాగారం, వెంకటాపురం(కె)లో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 12మంది వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు విధులు నిర్వర్తిస్తున్నారు.2021 6,846వాజేడు, వెంకటాపురం(కె) మండలాలకు లేవు.. జిల్లాలోని వెంకటాపురం(కె), వాజేడు మండలాల్లోని పశువులకు సంచార వైద్యం అండదం లేదు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ నియోజకవర్గానికి అత్యవసర వైద్య సేవలు అందించేందుకు అంబులెన్స్‌లను ఏర్పాటు చేసి సిబ్బందిని కేటాయించారు. వాజేడు, వెంకటాపురం(కె) మండలాలు ఖమ్మం జిల్లా నుంచి విడిపోయి ములుగు జిల్లాలో కలిశాయి. అప్పటి నుంచి ఈ రెండు మండలాలకు 1962 సేవలు అందడం లేదు. వాజేడు, వెంకటాపురం(కె) మండలాలకు సైతం సంచార వైద్య సేవలు అందించాలని పశుపోషకులు కోరుతున్నారు. 2025 ఫిబ్రవరి వరకుపశుపోషకులకు ఉపయోగం.. ములుగు నియోజకవర్గంలోని ఏడు మండలాల పరిధిలో సంచార వైద్యం సత్ఫలితాలు ఇస్తుంది. మండల కేంద్రాల్లో పశువైద్య కేంద్రాలు, గ్రామాలలో పశువైద్య ఉప కేంద్రాలు ఉన్నప్పటికీ సంచార వైద్యం పశుపోషకులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. ఆస్పత్రి పనివేళలతో సంబంధం లేకుండా మూగజీవాలకు సంచార వైద్య సేవలు అందుతున్నాయి. 2022 7,044 2023 7,012 -
సింగరేణి బకాయిలు చెల్లించాలి
భూపాలపల్లి అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం నుంచి సింగరేణికి రావాల్సిన పెండింగ్ బకాయిలు చెల్లించాలని బీఎంఎస్ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బీఎంఎస్ ఆధ్వర్యంలో బుధవారం ఏరియాలోని కేటీకే 5వ గనిలో గేట్ మీటింగ్ ఏర్పాటు చేసి కార్మికులతో మాట్లాడారు. 2024 డిసెంబర్ నాటికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సింగరేణి సంస్థకు రూ.35 వేల కోట్ల బకాయిలు ఉన్నట్లు తెలిపారు. ఈ బకాయిలు చెల్లించకపోవడంతో సింగరేణి ఆర్థికంగా దెబ్బతిన్నట్లు ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.25వేల కోట్ల బకాయిలు ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బొగ్గు కొనుగోలు చేసిన డబ్బులను కూడా ఇవ్వడం లేదన్నారు. కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో రాజకీయ నాయకులు జోక్యం చేసుకొని మోసపూరిత హామీలతో కార్మికులను మోసం చేశారని గుర్తు చేశారు. ఈ నెల 8వ తేదీన ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో సింగరేణి స్థితిగతులపై జనరల్‌బాడీ సమావేశం నిర్వహించి భవిష్యత్ పోరాటాలపై నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాంచీ నాయకులు సుజేందర్, మల్లేష్, రాజు, రమేష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. మహిళలకు క్రీడాపోటీలుభూపాలపల్లి అర్బన్: ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సింగరేణి ఆధ్వర్యంలో బుధవారం లేడీస్ క్లబ్ మహిళలకు క్రీడాపోటీలను నిర్వహించా రు. ఇల్లంద్ క్లబ్లో త్రో బాల్, బాంబ్ ఇన్ సి టీ, బాల్ పాసింగ్ నిర్వహించారు. క్రీడాపోటీల ప్రారంభోత్సవానికి ఏరియా సేవా అధ్యక్షురా లు సునీతరాజేశ్వర్‌రెడ్డి, క్లబ్ కార్యదర్శి రమణివెంకటరామిరెడ్డి, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. -
‘పది’ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
ములుగు: మార్చి 21నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరిగే పదో తరగతి వార్షిక పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ సీహెచ్.మహేందర్‌జీ అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్లోని తన ఛాంబర్లో ఆయా శాఖల అధికారులతో బుధవా రం సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలో 3,134 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా 21పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. జిల్లాను రెండు రూట్లుగా విభజించినట్లు తెలిపారు. ఒక్కో పరీక్ష కేంద్రానికి సిట్టింగ్ స్క్వాడ్, చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారులను నియమించినట్లు తెలిపారు. విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి ముందస్తుగా శిక్షణ ఇ వ్వాలన్నారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో తాగునీరు, మ రుగుదొడ్లు, విద్యుత్ వంటి మౌలిక వసతులు క ల్పించాలన్నారు. విద్యార్థులతో పాటు ఎగ్జామ్ ప్యా డ్, పెన్, పెన్సిల్, రబ్బర్, హాల్ టికెట్లు మాత్రమే అనుమతించాలని ఆదేశించారు. సెంటర్‌కు ఇద్దరు కానిస్టేబుళ్లు బందోబస్తు విధుల్లో ఉండాలన్నారు. వైద్యశాఖ తరఫున ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని పేర్కొన్నారు. ఆర్టీసీ తరఫున విద్యార్థులను తరలించడానికి బస్సులు ఏర్పాటు చేయాలన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు నడుస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ సదానందం, డీఎంహెచ్ఓ గోపాల్‌రావు, విద్యుత్ డీఈ నాగేశ్వర్రావు, ఏఎంవీఐ వినోద్‌రెడ్డి, ఆర్టీసీ కంట్రోలర్ బైకాని మోహన్, ఎస్టీఓ సురేశ్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సురేందర్, ప్రభుత్వ పరీక్షల సహాయ నియంత్రణాధికారి అప్పని జయదేవ్, తదితరులు పాల్గొన్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించాలి ప్రత్యేక బృందాలు క్షేత్ర స్థాయిలో పరిశీలించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించేలా తగిన చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ సీహెచ్.మహేందర్‌జీ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. 2022లో దరఖాస్తు చేసుకున్న వారికి అప్పటి మార్కెట్ వాల్యూ ప్రకారం ఫీజు ఉంటుందన్నారు. మార్చి 31వ తేదీ వరకు ఫీజు చెల్లించే వారికి 25శాతం తగ్గింపు ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్లాట్ల యజమానులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి దేవ్‌రాజ్, జిల్లా ఇరిగేషన్ అధికారి అప్పలనాయుడు, తహసీల్దార్ విజయభాస్కర్, ఎంపీఓలు, ఆర్ఐలు, కార్యదర్శులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ మహేందర్‌జీ -
సైన్స్‌పై అవగాహన తప్పనిసరి
ఏటూరునాగారం: సైన్స్‌పై విద్యార్థులు తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని కాకతీయ విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ విభాగం ప్రొఫెసర్ రమారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని గిరిజన గురుకుల బాలికల డిగ్రీ కళాశాలలో సైన్స్ వర్క్‌షాపును బుధవారం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సాంకేతిక విజ్ఞానం విద్యార్థులకు అవసరం అన్నారు. కంప్యూటర్, సైన్స్‌పై పూర్తిస్థాయిలో అవగాహన ఉండడంతో పాటు అధ్యాపకులు బోధించిన ప్రతీ విషయాన్ని ఏకాగ్రతతో ఒంట పట్టించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన విద్యాసంస్థల సమన్వకర్త శ్రీనివాస్‌రెడ్డి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రేణుక, అధ్యాపకులు నవీన్, వెంకటయ్య, జ్యోతి, జీవవేణి, గిరిజన డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీవాణిలతో పాటు అధ్యాపకులు పాల్గొన్నారు.ప్రొఫెసర్ రమారెడ్డి -
ఇంటర్ పరీక్షలు షురూ..
పరీక్ష కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్ దివాకర ములుగు: జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా నిర్వహించారు. హాల్‌టికెట్, పరీక్ష సామగ్రితో కేంద్రాలకు వచ్చిన విద్యార్థులను ముందుగా గేటు వద్ద అధికారులు తనిఖీ చేసి లోపలికి అనుమతినిచ్చారు. ఇతరులు లోపలికి వెళ్లకుండా కేంద్రాల చుట్టూ పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. పరీక్షలకు 2,023 మంది హాజరుకావాల్సి ఉండగా 112 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విభాగంలో 1,773 మందికి గాను 1,679 మంది హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 250మందికి 238 మంది హాజరయ్యారు. కలెక్టర్ ఆకస్మిక తనిఖీ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ దివాకర ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. కేంద్రంలో విద్యార్థుల కోసం తాగునీరు, మరుగుదొడ్లు, ఇతర వసతులు, వైద్యశాఖ తరఫున ఆరోగ్య శిబిరం ఏర్పాటుపై ఆరా తీశారు. సీసీ కెమెరాల పనితీరు ఎలా ఉందని అడిగారు. మాస్ కాపియింగ్‌కు ఆస్కారం లేకుండా పారదర్శకంగా పరీక్షలు జరిగేలా చూడాలన్నారు. ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు అనుమతి ఇవ్వకూడదన్నారు. జవాబు పత్రాలను పోలీసుల భద్రత నడుమ నిర్దేశిత కేంద్రానికి తరలించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి చంద్రకళ ఉన్నారు, తొలిరోజు ప్రశాంతం -
టెన్త్ విద్యార్థులు ఒత్తిడిని అధిగమించాలి
ఏటూరునాగారం: పరీక్షలు రాసే టెన్త్ విద్యార్థులు ఒత్తిడిని అధిగమించడంతో పాటు ఏకాగ్రతతో చదివి పరీక్షలు ప్రశాంతంగా రాయాలని ఎడ్యుకేషనల్ కౌన్సిలర్లు డాక్టర్ బరుపాటి గోపి, అంబటి శ్రీధర్‌రాజు అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పీఆర్ఆర్ యూనిటీ, చారిటీ ట్రస్టు ఆధ్వర్యంలో టెన్త్ విద్యార్థులకు మోటీవేషన్ క్లాస్ బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 21నుంచి టెన్త్ పరీక్షలు మొదలు కానున్నట్లు తెలిపారు. పరీక్షలను ఏ విధంగా రాయాలి, ప్రశ్నా పత్రం అర్ధం చేసుకునే విధానం వంటి తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. టెన్త్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ట్రస్ట్ ద్వారా ప్రోత్సాహక బహుమతులు ఇస్తామని ట్రస్టు ఇన్చార్జ్ మడుగూరి నాగేశ్వర్రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ మల్లయ్య, హెడ్మాస్టర్ సాంబశివరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.ఎడ్యుకేషనల్ కౌన్సిలర్లు గోపి, శ్రీధర్‌రాజు -
సమస్యలు పరిష్కరించాలని మంత్రి సీతక్కకు వినతి
ములుగు: తాము ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బాదం ప్రవీణ్‌కుమార్, పెరుమాండ్ల తిరుపతి సీ్త్ర, శిశు సంక్షేమశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ సీతక్కను కోరారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో మంత్రిని వారు మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందించి సమస్యలపై చర్చించారు. అక్కడి నుంచి మంత్రి సీతక్క సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ కమిషనర్‌కు ఫోన్ చేసి గతంలో మాదిరిగా బియ్యం డెలివరీకి సహకరించండి, ఒక జిల్లా బియ్యాన్ని వేరే జిల్లాలకు డెలివరీ చేయడానికి మిల్లర్లు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ మేరకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. దీంతో కమిషనర్ సానుకూలంగా స్పందించినట్లు రెండు జిల్లాల అధ్యక్షులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కోశాధికారి మోహన్, రైస్ మిల్లర్లు వాసుదేవారెడ్డి, ఆరె విజేందర్, భూపాలపల్లి జిల్లా కార్యదర్శి యాంసాని సంతోష్, కోశాధికారి రవీందర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. 12నుంచి కల్యాణ మహోత్సవం ములుగు రూరల్: మండల పరిధిలోని కొత్తూరు దేవునిగుట్ట శ్రీలక్ష్మీనర్సింహస్వామి జాతర తేదీలను ఆలయ కమిటీ చైర్మన్ వీరపనేని కిషన్‌రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 12నుంచి 14వ తేదీ వరకు స్వామివారి కల్యాణ మహోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 12వ తేదీన స్వామి వారికి అభిషేకం పూజలు, 13న ఉదయం 11.30గంటలకు స్వామివారి కల్యాణం, 14న హోమం, పూర్ణ హారతి, మొక్కులు సమర్పించుట, బండ్లు తిరుగు కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. స్వామి వారి కల్యాణ మహోత్సవానికి హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇసుక లారీ పట్టివేత ఏటూరునాగారం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం నుంచి వీరాపురం క్వారీ నుంచి ఇసుకను తరలిస్తుండగా చిన్నబోయినపల్లి రెవెన్యూ అధికారులు జూనియర్ అసిస్టెంట్ గంపల శంకర్, పోలీస్ లక్ష్మణ్‌నాయక్‌లు పట్టుకున్నారు. బుధవారం చిన్నబోయినపల్లి వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా లారీ కేపాసిటీకి మించి ఇసుక తరలిస్తుండడంతో అధికారులు పట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారన్నారు. ఇసుక తరలింపులో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెవెన్యూ. పోలీస్ అధికారులు సమష్టిగా ఔట్ చెక్ పోస్ట్ చిన్న బోయినపల్లి వద్ద ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. దరఖాస్తుల ఆహ్వానంవరంగల్: హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్‌టీ)లో మూడు సంవత్సరాల చేనేత, టెక్స్టైల్ టెక్నాలజీ డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చేనేత, జౌళిశాఖ జిల్లా సహాయ సంచాలకులు రాఘవరావు ఒక ప్రకటనలో కోరారు. 60 సీట్లు ఉన్న కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవడానికి పదో తరగతి ఉత్తీర్ణులై, జూలై 1 నాటికి బీసీ, ఓసీలు 23, ఎస్సీ, ఎస్టీలు 25 ఏళ్లు ఉండాలన్నారు. వరంగల్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ మొదటి వారంలోగా హైదరాబాద్‌లోని శ్రీపొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. వివరాలకు ఓఎస్డీ హిమజాకుమార్ 90300 79242 నంబర్లో సంప్రదించాలని ఆయన సూచించారు. -
నాలుగేళ్లు సాగుచేస్తే రూ.40వేల ఆదాయం
ఏటూరునాగారం: కంకవనాలను సాగు చేసి నాలుగేళ్లపాటు సంరక్షిస్తే రైతులకు సంవత్సరానికి రూ.40వేలు ఆదాయం వస్తుందని సెర్ప్ సీసీ నర్సింహారావు అన్నారు. మంగళవారం మండల పరిధి లోని శివాపురం గ్రామంలో జగదాంబ గ్రామైక్య సంఘానికి ఆయన కంకవనాల సాగుపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆమోదితమైన ఓ కంపెనీ ద్వారా 15 గుంటలు పట్టా భూమి ఉన్న మహిళా రైతుకు 60 కంక మొక్కలను ఉచితంగా అందిస్తారని తెలిపారు. ఆ తర్వాత ప్రతిరోజూ మొక్కకు నీరుపట్టి సంరక్షించినందుకు రూ.15 నాలుగేళ్లపాటు అందిస్తారని చెప్పారు. నాలుగు ఏళ్ల వరకు వనాలను కాపాడితే మొక్కలు ఇచ్చిన కంపెనీ వారు కర్రను తీసుకెళ్లి రూ.40వేలు ఇస్తారని తెలిపారు. ఇలా పంట దిగుబడి వచ్చినన్ని రోజులు కొనుగోలు చేస్తారని వివరించారు. రైతుకు ఉపాధి హామీ కార్డు ఉంటే మొక్కల సంరక్షణ, నాటడం, మట్టి పనులు చేసినందుకు కూలి డబ్బులు కూడా వస్తాయని తెలిపారు. గ్రామంలోని మహిళలు, రైతులు కంకవనం(వెదురు) పంటపై దృష్టి సారించాలని కోరారు. కార్యక్రమంలో వీఓఏ ప్రశాంతి, గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు ఎట్టి రమ, సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. సెర్ప్ సీసీ నర్సింహారావు కంకవనం సాగుపై అవగాహన -
పరీక్ష కేంద్రాల వద్ద హడావుడి పనులు
పరీక్ష కేంద్రం వద్ద చెత్తాచెదారం, చిందరవందరగా ఉన్న నాపరాళ్లు ఏటూరునాగారం: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద పరీక్షల ప్రారంభానికి ఒకరోజు ముందు మంగళవారం కాంట్రాక్టర్లు హడావుడిగా పనులు మొదలు పెట్టారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంట ర్ మొదటి, ద్వితీయ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. విద్యార్థులకు కావా ల్సిన విద్యుత్, ఫ్యాన్లు, కిటికీలు, తాగునీటి వసతులకు సంబంధించిన పనులను పరీక్షలకు ఒకరోజు మిగిలి ఉండగా కాంట్రాక్టర్లు మొదలు పెట్టారు. దీంతో కళాశాల ఆవరణలో నాపరాళ్లు చిందరవందరగా పడిఉన్నాయి. దీంతో విద్యార్థులు ఇబ్బంది పడే అవకాశం ఉందని వారి తల్లిదండ్రులు వాపోతున్నారు.అధ్వానంగా నాపరాళ్లు, చెత్తా చెదారం -
ప్రశాద్ ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలి
వెంకటాపురం(ఎం): ప్రపంచ వారసత్వ సంపద గల రామప్ప ఆలయ పరిసర ప్రాంతాల్లో చేపడుతున్న ప్రశాద్ ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ దివాకర టీఎస్ సూచించారు. ప్రాజెక్టు పనులను మంగళవారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మే నెలలో హైదరాబాద్‌లో ప్రపంచ సుందరి పోటీలు జరుగనున్న నేపథ్యంలో పలు దేశాలకు చెందిన మహిళలు పర్యాటక స్థలాల ను పర్యటించే అవకాశం ఉందన్నారు. రామప్పకు వచ్చే విదేశీ పర్యాటకులకు అన్ని వసతులు కల్పించే విధంగా అధికారులు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రశాద్ స్కీం పనులు ఏప్రిల్ 20లోపు పూర్తి చేసి, రామప్ప పరిసర ప్రాంతాలను సుందరీకరించాలని తెలిపారు. కాకతీయ కట్టడాల గురించి ప్రపంచానికి చాటిచెప్పే విధంగా విదేశీ పర్యాటకులకు అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్రంలో తొలి సారిగా ప్రపంచ సుందరి పోటీలు జరుగుతున్న నేపథ్యంలో ఆయా దేశాలకు చెందిన సుందరీమణులను పర్యాటక ప్రదేశాలకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రపంచ దేశాలకు చెందిన పర్యాటకులను ఆకట్టుకునేలా రామప్పలో ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ములుగు ఆర్డీఓ వెంకటేశ్, డీపీఓ ఒంటేరు దేవరాజ్, అసిస్టెంట్ టూరిజం ప్రమోషన్ ఆఫీసర్ కుసుమ సూర్యకిరణ్, ఇంజనీరింగ్ అధికారులు ధనరాజ్, విజయ్‌కుమార్, తహసీల్దార్ గిరిబాబు, ఎంపీడీఓ రాజు, ఎంపీఓ శ్రీనివాస్ పాల్గొన్నారు.కలెక్టర్ దివాకర టీఎస్ -
పరిహారం అందేనా?
గోవిందరావుపేట: చల్వాయిలోని తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) 5వ బెటాలియన్ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు 10 ఏళ్లు గడిచినా నేటికీ పరిహారం అందలేదు. తెలంగాణ ప్రభుత్వం బెటాలియన్ నిర్మాణానికి 105 ఎకరాలు లాక్కొని పరిహారం కూడా చెల్లించకుండా సుమారు 60 మంది కుటుంబాలను రోడ్డున పడేసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూములు కోల్పోయిన రైతులు సుమారు ఐదు సంవత్సరాలపాటు ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు చేశారు. బెటాలియన్ గేటు ఎదుట రిలే నిరాహార దీక్షలు సైతం కొనసాగించినా ఫలితం లేకుండా పోయింది. ఇలా పోరాటం చేసిన పలువురు రైతులపై పోలీసు కేసులు నమోదు కావడంతో జైలుకు సైతం వెళ్లారు. నేటికీ కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. -
ఆత్మహత్యాయత్నం..
బెటాలియన్ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులు తమకు న్యాయం చేయాలని అధికారులు, ప్రభుత్వం, నాయకులను కోరినా.. ఫలితం లేకుండా పోయింది. దీంతో వివిధ రూపాల్లో ఆందోళనలు చేశారు. చివరకు చల్వాయి గ్రామ పంచాయతీ ఆవరణలో ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో మహిళా రైతులు సైతం ఉండడం గమనార్హం. దీంతో అప్పటి అధికారులు, పోలీసులు న్యాయం చేస్తామని నచ్చజెప్పడంతో రైతులు తమ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.పరిహారం కోసం వాటర్ ట్యాంక్ ఎక్కిన రైతులు(ఫైల్) -
లబ్ధికోసమే రాజకీయ నాయకుల మద్దతు ?
భూ నిర్వాసితులు చేపట్టిన ధర్నాలు, రాస్తారోకోలు, రిలే నిరాహార దీక్షలకు పలువురు రాజకీయ నాయకులు మద్దతు ప్రకటించినా.. అది కేవలం వారి రాజకీయ లబ్ధికోసమేనని రైతులు ఆరోపిస్తున్నారు. రాజకీయ నాయకులు నిజంగా తమ కోసం పోరాడితే ఎప్పుడో న్యాయం జరిగేదని రైతులు పేర్కొంటున్నారు. ప్రధాన పార్టీలోని నాయకులు సీతక్క, ప్రొఫెసర్ కోదండరాం, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీ మంత్రి దివంగత అజ్మీరా చందూలాల్ వంటి వారు.. రైతులకు పరిహారం వచ్చేవరకు అండగా ఉంటామని చెప్పి మాయమాటలతో పబ్బం గడిపారని, కేసుల పాలై కోర్టు చుట్టూ తిరుగుతున్నా.. ప్రస్తుతం పట్టించుకునేవారే లేరని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ట్రాఫిక్ జాంలో 108 అంబులెన్స్
వెంకటాపురం(కె): మండల పరిధిలోని కొండాపురం గ్రామ సమీపంలో మంగళవారం 108 అంబులెన్స్ వాహనం ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయింది. ఎదిర వైద్యశాల నుంచి అత్యవసరంగా ఓ పేషెంట్‌ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏరి యా ఆస్పత్రికి తరలించేందుకు వెళ్లి వెంకటాపురం వస్తున్న క్రమంలో కొండాపురం గ్రామసమీపంలో ఇసుక లారీల మధ్యలో సుమారు అరగంటపాటు అంబులెన్స్ ఇరుక్కుపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం నుంచి ఇసుక లారీలు పెద్ద సంఖ్యలో వెంకటాపురం మండలం మీదుగా వెళ్తుండడంతో ఇసుక లారీల మధ్యలో 108 వాహ నం ఇరుక్కుపోయింది. అంబులెన్స్‌లో పేషెంట్ ఉన్నప్పుడు ఇలా ట్రాఫిక్ జాంలో ఇరుక్కుంటే పరిస్థితి ఏంటని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికై నా ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి సారించాలని కోరుతున్నారు. -
హామీ ఇచ్చి మోసం చేశారు..
మా తాతల నాటినుంచి వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాం. ఉన్న పలంగా వచ్చి ఇది ప్రభుత్వ భూమి, ఇక్కడ బెటాలియన్ నిర్మాణం చేపడుతున్నాం.. అని భూమిని లాక్కొని, మా మీద కేసులు నమోదు చేసి జైలుకి పంపారు. ఉద్యోగం కల్పిస్తాం.. భూమికి బదులు భూమిస్తాం.. అని మోసం చేశారు. ఇప్పటికై నా భూములు కోల్పోయిన రైతులకు హామీ మేరకు పరిహారం ఇవ్వాలి. రైతులపై ఉన్న కేసులను ఎత్తేయాలి. – జంపాల అనిల్, భూ నిర్వాసితుడు కేసు కోర్టులో ఉంది చల్వాయి బెటాలియన్ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతుల కేసు ప్రస్తుతం కోర్టులో కేసు ఉంది. కోర్టు ఉత్తర్వుల మేరకు మేము ముందుకెళ్తాం. – సృజన్ కుమార్, తహసీల్దార్, గోవిందరావుపేట -
విద్యార్థులు వ్యసనాలకు దూరంగా ఉండాలి
ములుగు రూరల్: విద్యార్థులు చెడువ్యసనాలకు దూరంగా ఉండాలని డీఎస్పీ రవీందర్ అన్నారు. ఈ మేరకు మాదక ద్రవ్యాల నియంత్రణపై మండలంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల సరఫరా లేదా తోటి విద్యార్థులు అలవాటుపడినట్లు తెలిస్తే పోలీస్‌లకు, యాంటీ డ్రగ్ కమిటీకి లేదా పాఠశాల ప్రిన్సిపాల్‌కు విషయం చెప్పాలని అన్నారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. విద్యార్థులు లక్ష్యాలను ఎంచుకొని కష్టపడి చదవాలని సూచించారు. పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా ఉండాలని చెప్పారు. అనంతరం ఇంటర్మీడియట్ విద్యార్థులకు డీఎస్పీ చేతుల మీదుగా హాల్ టికెట్లను అందించారు. కార్యక్రమంలో సీఐ శంకర్, ఎస్సై వెంకటేశ్వరరావు, సీడీపీఓ ఓంకార్, ప్రిన్సిపాల్ ఝాన్సీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
కొడవటంచ జాతరకు ఏర్పాట్లు
భూపాలపల్లి అర్బన్: కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఈ నెల 9వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తిచేసి భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్‌శర్మ ఆదేశించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో రెవెన్యూ, పంచా యతీరాజ్, విద్యుత్, వైద్య, ఆర్టీసీ, ఆర్డబ్ల్యూఎస్, సింగరేణి, ఆర్అండ్బీ, సమాచార, దేవాదాయ శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సమయంలో ప్రత్యేక విధు ల నిర్వహణకు గ్రామ సిబ్బందిని డిప్యూట్ చేసి, పారిశుద్ధ్యం, పరిశుభ్రత పనులు చేపట్టాలని ఆదేశించారు. దేవాలయాన్ని విద్యుద్దీకరణ చేయడంతో పాటు పూలతో అందంగా ముస్తాబు చేయాలన్నా రు. బ్రహ్మోత్సవ రోజుల్లో భక్తుల సౌకర్యార్ధం గ్రామంలో వీధిలైట్లు ఏర్పాట్లు చేయాలని సూచించారు. చెరువు వైపు, పార్కింగ్ స్థలాలు, భక్తులు ఉండే జాతర స్థలాలలో తాత్కాలిక లైట్లు, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. జాతరకు వచ్చే కొడవటంచ బైపాస్, రేపాక, కొడవటంచ రోడ్, గుడెపల్లి–కొడవటంచ దారుల్లో అడ్డంగా ఉన్న ముళ్లపొదలు తొలగించి, మొరం పోసి గుంతలు పూడ్చాలన్నారు. జాతర రోజుల్లో మిషన్ భగీరథ తాగునీరు సరఫరా చేయాలని, నీళ్ల ట్యాంకుల దగ్గర ఇంకుడుగుంతలు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మహిళల సౌకర్యార్ధం స్నాన ఘట్టాల వద్ద బట్టలు మార్చుకునే గదులు, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తుల రద్దీని అనుసరించి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పారు. భక్తుల సౌకర్యార్ధం 108 అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచాలని, భూపాలపల్లి డిపోతో పాటు ఇతర జిల్లాల నుంచి నిరంతరం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ డీఎంకు సూచించారు. కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులతో సమీక్ష -
రంజాన్‌కు ఏర్పాట్లు పూర్తి చేయాలి
ములుగు: రంజాన్ మాసం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ మహేందర్‌జీ సూచించారు. ఈ మేరకు మంగళవారం జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి సీహెచ్ రవీందర్‌రెడ్డితో కలిసి ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. మసీదులు, ఈద్గాల వద్ద తాగునీరు, పారిశుద్ధ్య సమప్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రంజాన్, హోలీ పండుగల సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. రంజాన్ పండుగ రోజు ములుగు ఈద్గాలో సుమారుగా 5 వేల మంది ప్రార్థనలకు హాజరవుతారని తెలిపారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని అధికారులు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. కార్యక్రమంలో ముస్లిం మతపెద్దలు రహమతుల్లా బేగ్, హజీ అబ్దుల్లాహ్ బిన్ అహ్మద్, సయ్యద్ షకిల్, రియాజ్ మీర్జా బేగ్, కుత్బోద్దీన్, అబ్దుల్‌రబ్ తదితరులు పాల్గొన్నారు. -
సిబ్బంది అంకితభావంతో పనిచేయాలి
వెంకటాపురం(ఎం): విద్యుత్ సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని టీజీఎన్పీడీసీఎల్ ఆపరేషన్–2 సీఈ రాజ్ చౌహాన్ తెలిపారు. మంగళవారం లైన్మెన్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని వెల్తుర్లపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్‌ను సందర్శించి సిబ్బంది సేవలను గుర్తిస్తూ వారిని శాలువా లతో సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజ్ చౌహాన్ మాట్లాడుతూ.. నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ సరఫరాను వినియోగదారులకు అందించాలన్నారు. వినియోగదారుల సమస్యలను ఎప్పటికపుడు పరిష్కరించాలని చెప్పారు. సమ్మర్ యాక్షన్‌లో భాగంగా మెరుగైన విద్యుత్ సరఫరా చేసేందుకు సిబ్బందికి పలు సూచనలు అందించారు. ఆనంతరం వెల్తుర్లపల్లి సబ్‌స్టేషన్‌లో ఫెయిల్ అయిన పవర్ ట్రాన్స్ఫార్మర్ స్థానంలో నూతన ట్రాన్స్ఫార్మర్ను అమర్చారు. కార్యక్రమంలో భూపాలపల్లి డీఈ సదానందం, ములుగు ఏడీఈ ఆపరేషన్ వేణుగోపాల్, ఏడీఈ కన్స్ట్రక్షన్స్ సందీప్ పటేల్, ఏఈలు రమేశ్, బెనర్జీ, సబ్ ఇంజనీర్ సాంబరాజు పాల్గొన్నారు.రాజ్ చౌహాన్ -
‘పది’లో ఉత్తమ ఫలితాలు సాధించాలి
● ఏటీడీఓ దే శీరాం ములుగు రూరల్: ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఐటీడీఓ దేశీరాం అన్నారు. ఈ మేరకు సోమవారం మండలంలోని జగ్గన్నపేట ఆశ్రమ బాలికల పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన సంక్షేమశాఖ ఆ ధ్వర్యంలో తెలుగు, హిందీ, ఇంగ్లిష్ బోధనకు 160 మంది నిపుణులకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. పది ఫలితాల్లో విద్యార్థులు నిపుణుల సలహాలతో మెరుగైన ఫలితాలు సా ధించాలని సూచించారు. కార్యక్రమంలో ఏసీ ఎంఓ రవీందర్, వాగ్యనాయక్, సుగుణ, పాఠశాల ప్రిన్సిపాల్ విజయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. అన్నారం అడవిలోకి పులి కాటారం: మండలంలోని ప్రతాపగిరి అటవీ ప్రాంతం నుంచి అన్నారం అటవీ ప్రాంతంలోకి పులి ప్రవేశించినట్లు తెలుస్తొంది. మూడు రోజుల క్రితం మహదేవపూర్ మండలం ఏన్కపల్లి అటవీ నుంచి ప్రతాపగిరి సమీపంలోకి పులి వచ్చినట్లు అటవీశాఖ అధికారులు పాదముద్రలు గుర్తించారు. గాలింపు చర్యల్లో భాగంగా ఆదివారం పులి ప్రతాపగిరి అటవీ నుంచి మర్రివాగు మీదుగా నస్తూర్‌పల్లి అటవీ ప్రాంతంలోకి ప్రవేశించినట్లు పులి పాదముద్రల ద్వారా నిర్ధారణకు వచ్చారు. నస్తూర్‌పల్లి అడవి నుంచి వీరాపూర్ మీదుగా అన్నారం గుట్ట ప్రాంతంలోకి పులి చేరినట్లు అధికారులు ఆనవాళ్లు గుర్తించారు. -
ఎయిడ్స్‌పై అవగాహన ఉండాలి
గోవిందరావుపేట: ఎయిడ్స్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని వైఆర్జీ కేర్ లింక్ వర్కర్స్ స్కీం సంస్థ వర్కర్ తప్పెట్ల కిషన్, ఐసీటీసీ కౌన్సిలర్ వెంకటేశ్వర్లు అన్నారు. మండల పరిధి లోని చల్వాయి గ్రామంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు ఎయిడ్స్‌పై అవగాహన కల్పించారు. అనంతరం 44 మందికి హెచ్ఐవీ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హెచ్ఐవీ నాలుగు విధాలుగా సోకుతుందన్నారు. సురక్షితం కాని లైంగిక సంబంధాలు, కలుషితమైన సూదులు, పరీక్షించని రక్త మార్పిడి, హెచ్ఐవీ తల్లి నుంచి పుట్టబోయే బిడ్డకి ఈ నాలుగు మార్గాల ద్వారానే వస్తుందని వివరించారు. గర్భిణులు తప్పకుండా ఆస్పత్రుల్లోనే ప్రసవం అయ్యేలా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు. -
టోర్నీ విజేతలకు అభినందనలు
ములుగు: ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నీ విజేతగా నిలిచిన ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులను సోమవారం ప్రిన్సిపాల్ కొప్పుల మల్లేశం ట్రోఫీ అందించి అభినందనలు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం ఏర్పాటు అభినందన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు అందరూ అంకితభావంతో వాలీబాల్ ఆడి విజయం సాధించారని తెలిపారు. కళాశాల ఫిజికల్ డైరెక్టర్ సోమన్న మాట్లాడుతూ విద్యార్థులు అందరూ సమన్వయంతో ఆడి ట్రోఫీతో పాటు రూ.20వేల నగదు బహుమతిని గెలవడం సంతోషంగా ఉందన్నారు. టీం సభ్యులు అయిన వసంతరావు, ఉదయ్‌కుమార్, బద్రి, సాగర్, మహేష్, శివ, నరసింహా, తిరుపతి, బన్నీ, శశి, నర్సింగరావు, శ్రీకాంత్‌లను అధ్యాపక బృందం సభ్యులు అభినందించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు కవిత, భాస్కర్, నాగమణి, సరిత, శిరీష, రాధిక, అనిల్‌కుమార్, ఉదయశ్రీ, విజేత, శంకర్, తేజోలత, శ్రీను, మహ్మద్ మౌలానా, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
ములుగు: రేపటి నుంచి 20వ తేదీ వరకు జిల్లాలో జరగనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ దివాకర తెలిపారు. ఈ మేరకు ఆయన జిల్లా ఇంటర్మీడియట్ అధికారి చంద్రకళతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దివాకర మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 3,793 మంది విద్యార్థులు పరీక్ష రాయనుండగా వారి కోసం 10కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులు నడిపించేందుకు అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. పరీక్షల సమయాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూసుకోవాలని ట్రాన్కో అధికారులకు సూచనలు చేసినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల చుట్టు పక్కల 144 సెక్షన్‌ను పకడ్బందీగా అమలు చేయాలని, జిరాక్స్ సెంటర్లు తెరుచుకోకుండా చూడాలన్నారు. తాగునీటి విషయంలో ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు. వైద్యారోగ్య శాఖ తరఫున ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు విధులు నిర్వహించడంతో పాటు అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. మాస్ కాపీయింగ్‌కు తావులేకుండా సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉంటారని కలెక్టర్ వివరించారు.కలెక్టర్ టీఎస్.దివాకర -
యాసంగి పంటల సంరక్షణకు చర్యలు
ములుగు: యాసంగి పంటల సంరక్షణకు అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. రాబోయే 10 రోజుల పాటు అధికారులు అప్రమత్తంగా ఉంటూ నీటి సరఫరాను పర్యవేక్షించాలన్నారు. వ్యవసాయానికి విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించారు. రిజర్వాయర్ నుంచి విడుదల చేసే నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్ దివాకర అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అధికారులు నడుచుకోవాలన్నారు. రోజు వారీగా చెరువులు, ప్రాజెక్టులు, రిజర్వాయర్ నుంచి విడుదల అవుతున్న నీటి పరిమాణాన్ని పర్యవేక్షించాలని ఆదేశించారు.వీసీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి -
జాతీయ లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి
ములుగు: న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీన జిల్లా కేంద్రంలోని కోర్టులో నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ డాక్టర్ శబరీశ్ సోమవారం ఒక ప్రకటనలో సూచించారు. రాజీమార్గమే రాజమార్గంగా భావించి కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. శాంతిమార్గంతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని వివరించారు. యాక్సిడెంట్లు, చీటింగ్ కేసులు, దొమ్మి కేసులు, వివాహం, దొంగతనాలు, కరోనా సమయంలో నమోదైన కేసులు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల పరిష్కారానికి ఫిర్యాదుదారులు, నిందితులు ఇద్దరూ కోర్డుకు హాజరై సమన్వయంతో రాజీ పడాలని తెలిపారు. ఇతర వివరాలకు ఆయా పోలీస్ స్టేషన్ల ఎస్సైలు, కోర్టు కానిస్టేబుళ్లను సంప్రదించాలని సూచించారు. నేడు విద్యుత్ వినియోగదారుల సదస్సు వెంకటాపురం(కె): నేడు మండలంలో నిర్వహించే విద్యుత్ వినియోగదారుల సదస్సును వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్ వేణుగోపాల చారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సులో విద్యుత్ పునరుద్ధరణ, కాలిపోయిన మీటర్లు మార్చుట, లోవోల్టేజీ హెచ్చు తగ్గులు లోపాలు ఉన్న మీటర్లు మార్చడం వంటి సమస్యలను పరిష్కరించుకోవచ్చని సూచించారు. నేడు ఉదయం 10.30గంటల నుంచి ఒంటిగంట వరకు సదస్సు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మహిళా ఉద్యోగులు, సిబ్బందికి క్రీడా పోటీలు ములుగు: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ప్రభుత్వ శాఖలలో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగులు, సిబ్బందికి ఈ నెల 5, 6వ తేదీల్లో క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమశాఖ అధికారి కూచన శిరీష సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్లో ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు షటిల్, టెన్నికాయిట్, లెమన్ స్పూన్, మ్యూజికల్ చైర్, టగ్ ఆఫ్ వార్, స్కిప్పింగ్, అంత్యాక్షరి, క్యారమ్, చెస్, సింగింగ్ విభాగంతో పాటు ఇండోర్, ఔట్‌డోర్ పోటీలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు. కరాటే పోటీల్లో విద్యార్థినుల ప్రతిభ ఎస్ఎస్ తాడ్వాయి: మేడారంలో ఈనెల 2న నిర్వహించిన సూర్య షోటోకాన్ కరాటే రాష్ట్రస్థాయి పోటీల్లో మండలంలోని కాటాపూర్ జెడ్పీ పాఠశాల, తాడ్వాయిలోని కసూర్తిబా పాఠశాల విద్యార్థినులు ప్రతిభ చాటారు. ఈ పోటీల్లో కాటాపూర్ పాఠశాలకు చెందిన నందుప్రియ ప్రథమ బహుమతి సాధించగా రక్షిత ద్వితీయ బహుమతి సాధించినట్లు పాఠశాల హెచ్ఎం బాణాల సుధాకర్ తెలిపారు. అదే విధంగా తాడ్వాయిలోని కేజీబీవీ విద్యార్థినులు కూడా కరాటే పోటీల్లో ప్రతిభ చూపి సర్టిఫికెట్లు, మెడల్స్ సాధించినట్లు హెచ్ఎం కేశవరావు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థినులను సోమవారం అభినందించారు. ఈ కార్యక్రమంలో కేబీబీవీ స్పెషల్ ఆఫీసర్ పుష్పలీల, ఉపాధ్యాయులు చక్రు నాయక్, సమ్మయ్య, పాపారావు, కరాటే మాస్టర్ నాని స్వామి, జైపాల్, విజయ, విద్యార్థులు పాల్గొన్నారు. -
అడవిలో ఫైర్‌లైన్స్
● కార్చిచ్చుతో అడవి ఆహుతి కాకుండా అటవీశాఖ చర్యలు ● ఫారెస్ట్‌లో నిప్పుపెట్టొదని అధికారుల సూచనఏటూరునాగారం: ఏజెన్సీలోని దట్టమైన అడవిలో వేసవి వచ్చిందంటే కార్చిచ్చు ఏర్పడి వందలాది ఎకరాల్లోని చెట్లు కాలిపోతున్నాయి. అదే విధంగా అడవిలో ఎండిన ఆకులకు బాటసారులు, పశువుల కాపరులు, పర్యాటకులు వేసే నిప్పుతో ముప్పు వాటిల్లుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లాలోని పలువురు కూలీలతో అటవీశాఖ అధికారులు సోమవారం ఫైర్‌లైన్స్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా అడవికి ముప్పు వాటిల్లకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టారు. ఫైర్‌లైన్స్ విధానం మార్చి నెలలో చెట్లకు ఆకులు రాలిపోయి ఉగాదితో కొత్త చిగురు వస్తుంది. చెట్ల నుంచి రాలిపోయిన ఆకులను వందల మీటర్ల పొడువునా ఫైర్‌లైన్ ఏర్పాటు చేసి అటవీశాఖ అధికారులు నిప్పు పెడుతున్నారు. దీనివల్ల ఒకే లైన్ మాదిరిగా మంట అంటుకుని ఎండిన ఆకులను సైతం బూదిద చేస్తుంది. ఈ క్రమంలో ఇతర ఆకులకు నిప్పు అంటుకున్నప్పటికీ అడవిలోకి మంటలు వెళ్లనివ్వకుండా ఫైర్‌లైన్స్ నియంత్రిస్తాయి. అడవిలోకి మంటలు వ్యాప్తి చెందకుండా.. పర్యాటకులు, బాటసారులు వేసిన నిప్పు రవ్వలతో ఆకులు అంటుకున్నప్పటికీ మంటలు భారీగా అడవిలోకి వ్యాప్తి చెందకుండా ఉండే అవకాశం ఉంటుందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఏటూరునాగారం సౌత్ రేంజ్ అధికారి అబ్దుల్ రెహమాన్ ఆధ్వర్యంలో సిబ్బందితో పాటు పలువురు కూలీలతో సోమవారం ఫైర్‌లైన్స్ కార్యక్రమం చేపట్టారు. అడవిలో ఎండిన ఆకులకు సైతం నిప్పుపెట్టి బూడిద చేశారు. ఏజెన్సీలోని అడవుల్లో ఉన్న ఎండిన ఆకులను ప్రతిరోజూ ఫైర్‌లైన్స్ ద్వారా నిప్పు పెట్టి నియంత్రిస్తున్నట్లు సిబ్బంది చెబుతున్నారు. అడవుల్లో ఎవరూ నిప్పుపెట్టొదని అటవీశాఖ అధికారి అబ్దుల్ రెహమాన్ కోరారు. -
వన్యప్రాణుల రక్షణ అందరి బాధ్యత
ఏటూరునాగారం: వన్యప్రాణులను రక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఏటూరునాగారం అటవీశాఖ సౌత్ రేంజ్ అధికారి అబ్దుల్ రెహమాన్ అన్నారు. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా మండల పరిధిలోని కస్తూర్బాగాంధీ, జెడ్పీహెచ్ఎస్లో సోమవారం విద్యార్థులకు వన్యప్రాణులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవుల్లో ఉండే జంతువులను రక్షించుకోవాలన్నారు. అడవులను మరింత పెంచడానికి ప్రతీ విద్యార్థి మొక్కలను నాటాలని సూచించారు. వన్యప్రాణుల కోసం అటవీశాఖ ద్వారా అడవుల్లో నీటి గుంతలు, సాసర్ప్లేట్లు, చెక్‌డ్యామ్‌ల ద్వారా నీటిని అందించాలని వివరించారు. వాటి రక్షణకు సీసీ కెమెరాలను అమర్చుతున్నట్లు వివరించారు. విద్యార్థులు వారి ఇంటి ఆవరణలో మొక్కలను నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ నరేందర్, సిబ్బంది పాల్గొన్నారు.సౌత్ రేంజ్ అధికారి అబ్దుల్‌రెహమాన్ -
మంగళవారం శ్రీ 4 శ్రీ మార్చి శ్రీ 2025
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/సాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ–టీఎస్ బలపరిచిన అభ్యర్థి, ఉమ్మడి వరంగల్‌కు చెందిన పింగిలి శ్రీపాల్‌రెడ్డి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డిపై 5,521 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో శ్రీపాల్‌రెడ్డికి 13,969 ఓట్లు రాగా, నర్సిరెడ్డికి 8,448 ఓట్లు వచ్చాయి. నర్సిరెడ్డి ఎలిమినేట్ కాకముందు గెలుపు కోటా ఓట్లు శ్రీపాల్‌రెడ్డికి కూడా లేవు. దీంతో నర్సిరెడ్డిని ఎలిమినేట్ చేసి, ఆయనకు వచ్చిన మొదటి ప్రాధాన్యత ఓట్లలో.. శ్రీపాల్‌రెడ్డికి వచ్చిన 2,870 రెండో ప్రాధాన్యత ఓట్లు కలిపారు. చివరికి శ్రీపాల్‌రెడ్డి 13,969 ఓట్లు సాధించారు. నల్లగొండలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఓట్లను లెక్కిస్తున్న సిబ్బందిఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ నల్లగొండ ఆర్జాలబావిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో సోమవారం నిర్వహించారు. ఉదయం 7 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. బండిల్స్ కట్టడం ఉదయం 11 గంటల వరకు కొనసాగింది. ఆ తరువాత ఓట్ల లెక్కింపు చేపట్టారు. సాయంత్రం 3 గంటలకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. దీంతో అధికారులు మొత్తం చెల్లిన ఓట్లలో సగానికి మించి ఒక్క ఓటును గెలుపు కోటాగా నిర్ణయించారు. మొత్తం 24,135 ఓట్లు పోలవగా 494 ఓట్లు చెల్లలేదు. 23,641 ఓట్లు మాత్రమే చెల్లుబాటు అయ్యాయి. దీంతో గెలుపు కోటాను 11,821గా నిర్ణయించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో శ్రీపాల్‌రెడ్డికి అత్యధికంగా 6,035 ఓట్లు వచ్చాయి. గెలుపు కోటాకు సరిపడా ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. చివరికి ద్వితీయ ప్రాధాన్యత ఓట్లతోనే శ్రీపాల్‌రెడ్డి విజయం సాధించారు. రౌండ్ రౌండ్‌కు ఉత్కంఠే.. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో చివరి వరకు ఉత్కంఠ నెలకొంది. 15వ రౌండ్ నుంచి ఉత్కంఠ మరింతగా పెరిగింది. శ్రీపాల్‌రెడ్డి ఆధిక్యంలో ఉన్నా ద్వితీయ స్థానంలో ఉన్న అలుగుబెల్లి నర్సిరెడ్డికి చేరువలో గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి రాగలిగినా సుందర్రాజు ఎలిమినేషన్‌తో ఇద్దరి మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడింది. ఆ తరువాత పులి సరోత్తంరెడ్డి, పూల రవీందర్, గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డిలను ఎలిమినేట్ చేసి ఓట్లు లెక్కించారు. అప్పటికి కూడా గెలుపు కోటా రాకపోవడంతో చివరకు అలుగుబెల్లి నర్సిరెడ్డిని కూడా ఎలిమినేషన్ చేసి ఓట్లు లెక్కించారు. ఆ తర్వాత శ్రీపాల్‌రెడ్డిని గెలిచినట్లుగా ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఎలిమినేషన్లో ఓట్లు పెరిగాయి ఇలా... మొదటి ప్రాధాన్యతలో ప్రధాన అభ్యర్థులైన పింగిలి శ్రీపాల్‌రెడ్డికి 6,035 ఓట్లు రాగా, అలుగుబెల్లి నర్సిరెడ్డికి 4,820 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డికి 4,437 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత పూల రవీందర్‌కు 3,115, బీజేపీ అభ్యర్థి సరోత్తంరెడ్డికి 2,289, సుందర్రాజుకు 2,040 ఓట్లు మాత్రమే వచ్చాయి. అతి తక్కువ ఓట్లు వచ్చిన వారిని ఎలిమినేట్ చేస్తూ ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. ఇలా 14వ రౌండ్ వరకు ఎలిమినేషన్ చేస్తూ ఓట్ల లెక్కింపు చేయగా శ్రీపాల్‌రెడ్డికి అప్పటివరకు 6,165 ఓట్లు రాగా, నర్సిరెడ్డికి 4,946 ఓట్లు వచ్చాయి. హర్షవర్ధన్‌రెడ్డికి 4,596 ఓట్లు, పూల రవీందర్‌కు 3,249 ఓట్లు వచ్చాయి. అంటే.. 14వ రౌండ్‌వరకు ఎలిమినేట్ అయిన అభ్యర్థులనుంచి మరో 130 రెండో ప్రాధాన్యత ఓట్లు శ్రీపాల్‌రెడ్డికి లభించాయి. ఈ రౌండ్ తరువాత సుందర్రాజును ఎలిమినేట్ చేసి ఓట్ల లెక్కింపు చేపట్టారు. ● 15వ రౌండ్లో శ్రీపాల్‌రెడ్డికి ఒక్కసారే 781 ఓట్లు పెరిగాయి. దీంతో ఆయన ఓట్లు 6,916కి చేరుకున్నాయి. రెండోస్థానంలో ఉన్న అలుగుబెల్లి నర్సిరెడ్డి కూడా 5,205 ఓట్లకు చేరుకున్నారు. హర్షవర్ధన్‌రెడ్డి 4,799 ఓట్లకు చేరుకోగా, పూల రవీందర్ 3,617 ఓట్లకు, సరోత్తంరెడ్డి 2,645 ఓట్లకు చేరుకున్నారు. ఈ రౌండ్లో అయిదుగురికి ఓట్లు పెరిగినప్పటికీ శ్రీపాల్‌రెడ్డి ఆధిక్యం కొనసాగుతూ వచ్చింది. ఆయన దరిదాపుల్లో మిగతా అభ్యర్థులు ఎవరూ లేరు. ● పులి సరోత్తంరెడ్డి ఎలిమినేషన్ తరువాత చేపట్టిన 16వ రౌండ్లోనూ శ్రీపాల్‌రెడ్డికి అదే స్థాయిలో ఓట్లు వచ్చాయి. ఈ రౌండ్లో 757 ఓట్లు పెరిగాయి. ఇక రెండో స్థానంలో ఉన్న నర్సిరెడ్డి, 5,660 ఓట్లకు చేరుకోగా, హర్షవర్ధన్‌రెడ్డి 5,309 ఓట్లకు, పూల రవీందర్ 3,992 ఓట్లకు చేరుకున్నారు. ● పూల రవీందర్ ఎలిమినేషన్ తరువాత 17వ రౌండ్లో శ్రీపాల్‌రెడ్డికి 1,348 ఓట్లు పెరిగి, 9,021 ఓట్లకు చేరుకున్నారు. ఇక రెండో స్థానంలో ఉన్న నర్సిరెడ్డి 6,448 ఓట్లకి చేరుకోగా, మూడో స్థానంలో ఉన్న హర్షవర్ధన్‌రెడ్డి 6,034 ఓట్లకు చేరుకున్నారు. ● హర్షవర్ధన్‌రెడ్డి ఎలిమినేషన్ తరువాత 18వ రౌండ్లో శ్రీపాల్‌రెడ్డికి 2,078 ఓట్లు పెరిగి, 11,099 ఓట్లకు చేరుకున్నారు. ఇక రెండో స్థానంలో ఉన్న నర్సిరెడ్డి 8,448 ఓట్లకు చేరుకున్నారు. బరిలో శ్రీపాల్‌రెడ్డి, నర్సిరెడ్డి మాత్రమే మిగిలారు. దీంతో నర్సిరెడ్డిని ఎలిమినేట్ చేసి ఆయనకు వచ్చిన మొదటి ప్రాధాన్యత ఓట్లలో శ్రీపాల్ రెడ్డికి వచ్చిన రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. ఇందులో వచ్చిన 2,870 ఓట్లు కలుపుకొని శ్రీపాల్‌రెడ్డి 13,969 ఓట్లు సాధించి గెలుపొందినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రకటించారు.న్యూస్రీల్ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పింగిలి శ్రీపాల్‌రెడ్డి గెలుపు రెండో ప్రాధాన్యత ఓట్లతో తేలిన ఫలితం సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డిపై 5,521 ఓట్ల మెజారిటీ 19మంది బరిలో ఉన్నా ఐదుగురి మధ్యనే సాగిన పోటీ అభ్యర్థుల ఎలిమినేషన్ సమయంలో పెరిగిన ఉత్కంఠ -
జలుబు, నిమ్ముతో పసికందు మృతి
● ప్రభుత్వాస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యమని తల్లిదండ్రుల ఆరోపణ వాజేడు: దగ్గు, జలుబు, నిమ్ముతో ఇబ్బంది పడుతున్న పసికందుకు ఆస్పత్రి సిబ్బంది వ్యాక్సిన్ ఇవ్వకపోవడంతో మృతి చెందినట్లు బాధిత తల్లిదండ్రులు గోగు బాలకృష్ణ, భారతి తెలిపారు. మండల పరిధి గుడిసెల కాలనీలో ఆదివారం జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గోగు బాలకృష్ణ, భారతి దంపతుల స్వగ్రామం చండ్రుపట్ల. వీరికి మూడో సంతానమైన కూతురుకు(55 రోజులు) దగ్గు, జలుబుతో పాటు నిమ్ము చేరగా వాజేడు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకొచ్చారు. శిశువుకు 45 రోజులకు వేయాల్సిన వ్యాక్సిన్ ఇవ్వకుండా వారం తర్వాత రమ్మని చెప్పగా తిరిగివెళ్లిపోయారు. అప్పటికే నిమ్ము ఎక్కువైంది. దీంతో ఏటూరునాగారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరీక్షలు చేసిన వైద్యులు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా స్థానిక ఆర్ఎంపీకి చూపించగా సిరప్ ఇచ్చి పంపించాడు. అయినా పసికందు ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో ఆదివారం వాజేడు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే పాప మృతి చెందినట్లు వైద్యాధికారి మధుకర్ తెలిపారు. ఈ విషయంపై ఆయనను వివరణ కోరగా వారం రోజుల ముందు ఇక్కడికి వచ్చారని, ఆ సమయంలో పాపకు నిమ్ము ఎక్కువ ఉండడంతో ప్రథమ చికిత్స చేసి.. మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి వెళ్లాలని సూచించినట్లు తెలిపారు. వ్యాక్సిన్ అందక పాప మృతి చెందలేదని, వ్యాధుల ముందస్తు నివారణకు వ్యాక్సిన్ వేస్తామని వివరించారు. -
మార్క్‌ఫెడ్ ద్వారా మిర్చి కొనుగోలు చేయాలి
ములుగు రూరల్: మిర్చి పంటను మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కన్వీనర్ ఎండీ అమ్జద్ పాషా అన్నారు. మండలంలోని కాశిందేవిపేట, దేవగిరిపట్నం గ్రామాల్లో మిర్చి కల్లాలను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో సుమారు 20 వేల ఎకరాల్లో మిర్చి సాగు అవుతుందన్నారు. ఎకరా విస్తీర్ణంలో మిర్చి పంట సాగుకు సుమారు రూ.లక్షన్నర నుంచి రూ.రెండు లక్షల వరకు పెట్టుబడితో సాగు చేస్తే గిట్టుబాటు ధర లేక రైతులు అప్పులపాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చి పంటకు నల్లి, వేరుకుళ్లు రావడంతో పంట పూర్తిగా దిగుబడి తగ్గిందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థ అయిన మార్క్‌ఫెడ్ ద్వారా మిర్చి పంటను కొనుగోలు చేసి క్వింటాకు రూ.25 వేలు చెల్లించి రైతులను ఆదుకోవాలని అన్నారు. లేనిపక్షంలో మిర్చి రైతులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు తోట భాస్కర్, నర్సింహరావు, శ్రీకాంత్, నరేష్, ప్రభాకర్, మహేందర్, మల్లేష్, మొండయ్య, చాంద్‌పాషా తదితరులు పాల్గొన్నారు.ఎండీ అమ్జద్ పాషా -
‘మావోయిస్టు’ రహిత జిల్లా లక్ష్యం
ఏటూరునాగారం: మావోయిస్టు రహిత జిల్లాగా మార్చడమే తమ లక్ష్యమని ఎస్పీ శబరీశ్ తెలిపారు. ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 2001 సంవత్సరంలో ఏటూరునాగారం పోలీస్ స్టేషన్‌పై అప్పటి పీపుల్స్‌వార్ నక్సల్స్ ట్రాక్టర్లలో డైరెక్షన్ మైన్స్ అమర్చి దాడి చేశారని, ఈ ఘటనలో ఒక సాధారణ పౌరుడు, ఫారెస్ట్ అధికారి, ముగ్గురు పోలీసులు మరణించారు. పోలీస్ స్టేషన్ భద్రత చర్యల్లో భాగంగా పోలీస్ స్టేషన్ ముందు నుంచి వెళ్లే 163 ప్రధాన రహదారి మూసివేసి వాహనాల రాకపోకలను ఐటీడీఏ గెస్ట్‌హౌజ్ ఎదురు నుంచి ఏటూరునాగారం వైపు మళ్లించినట్లు తెలిపారు. ఈ మధ్యకాలంలో జరిగిన వరుస పోలీస్ ఎదురుకాల్పుల్లో సీపీఐ మావోయిస్టు ముఖ్య నాయకులతోపాటు జేఎండబ్ల్యూపీ డివిజనల్ కమిటీకి చెందిన ఏటూరునాగారం–మహాదేవపూర్ ఏరియా కమిటీ చెందిన దళం, ఇల్లందు– నర్సంపేట దళం పూర్తిగా లేకుండా పోయిందని తెలిపారు. జిల్లాలో సీపీఐ మావోయిస్టు పార్టీ కదలికలు పూర్తిగా అంతరించిపోయినందున సామాన్య ప్రజల సౌకర్యార్థం 25 ఏళ్ల తర్వాత ఏటూరునాగారం పోలీసులు జాతీయ రహదారికి అడ్డుగా ఉన్న గేట్లు తెరచి వాహనాల రాకపోకలను పునరుద్ధరించినట్లు తెలిపారు.ఎస్పీ శబరీశ్ -
ఎత్తిపోతలు.. ఎప్పటికో..!
దేవాదుల ప్రాజెక్టు పెండింగ్ పనులు 2026 మార్చిలోపు వందశాతం పూర్తి చేసి.. అదే నెలలో సోనియాగాంధీ చేతుల మీదుగా ప్రారంభిస్తాం. సమ్మక్క సారక్క బరాజ్ ఎన్ఓసీ కోసం ఛత్తీస్‌గఢ్ సర్కారును ఒప్పిస్తాం. ధరలు పెరగడం వల్ల ఇరిగేషన్ ప్రాజెక్టుల భూసేకరణకు ఇబ్బందిగా మారింది. అయినా వెంటనే చేపట్టి దేవాదుల పూర్తి చేస్తాం. – 2024 ఆగస్టు 31న ములుగు జిల్లా కన్నాయిగూడెంలో సమీక్ష సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పిన మాటలివి.దేవాదుల మూడో దశకు భూసేకరణే అసలు సమస్య●● ఇరవయ్యేళ్లయినా అసంపూర్తిగానే ప్రాజెక్టు ● కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మంత్రుల పర్యటన ● హామీలు, ఆదేశాలు.. అయినా పూర్తికాని భూసేకరణ ● రూ.6వేల కోట్ల నుంచి రూ.17,500 కోట్లు.. పెరిగిన అంచనా వ్యయం -
ఆర్చరీ జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
కాటారం: మండలకేంద్రానికి చెందిన రామిళ్ల రాజశేఖర్ కుమార్తె రామిళ్ల అనయ ఆర్చరీ విభాగంలో రాణిస్తుంది. తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని కొల్లూర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీల్లో ప్రతిభ కనబరిచింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి అనయ మూడో స్థానంలో నిలిచి బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది. దీంతో నిర్వాహకులు జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈ నెల 17న గుంటూరులో జరగబోయే జాతీయస్థాయి పోటీల్లో అనయ పాల్గొననుంది. ఈ కార్యక్రమంలో మాస్టర్ గేమ్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు రామారావు, తెలంగాణ ఆ ర్చరీ అసోసియేషన్ అధ్యక్షుడు రా జు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ పవ న్ కళ్యాణ్ పాల్గొని మెడల్ అందజేశారు. అనయను కోచ్ శ్రీనివాస్, అభిషేక్ అభినందించారు. -
సర్వం సిద్ధం
పరీక్ష కేంద్రాలు ఇవే.. ● వాజేడులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ● ములుగు ప్రభుత్వ కళాశాల ● ఏటూరునాగారం ప్రభుత్వ జూనియర్ కళాశాల ● ఏటూరునాగారంలోని ప్రభుత్వ గిరిజన గురుకుల బాలుర కళాశాల ● గోవిందరావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ● మంగపేట ఎక్కెటి సరోజిని శేషారెడ్డి ప్రభుత్వ కాలేజీ ● జాకారంలోని గిరిజన గురుకుల బాలుర కళాశాల ● బండారుపల్లిలోని మోడల్ స్కూల్ ● తాడ్వాయి ప్రభుత్వ జూనియర్ కళాశాల ● వెంకటాపురం(ఎం) ప్రభుత్వ జూనియర్ కళాశాలకళాశాలలో పరీక్షలను తనిఖీ చేస్తున్న డీఐఈఓ చంద్రకళ (ఫైల్)ఏర్పాట్లు పూర్తి చేశాం.. ఈనెల 5 నుంచి 20వ తేదీ వరకు జిల్లాలోని 10 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించే పరీక్షలకు ఏర్పాటు పూర్తి చేశాం. బోర్డు నిబంధనల ప్రకారం పరీక్షలు నిర్వహించేందుకు ఆయా కళాశాలల నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశాం. ప్రత్యేక అధికారులు, స్క్వాడ్ కూడా ఉంటుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల సహకారం తీసుకుంటాం. విద్యార్థులు సమయంలోపే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. – చంద్రకళ, జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారిణిఏటూరునాగారం: మార్చి 5వ తేదీ నుంచి నిర్వహించనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. జిల్లాలోని 9 మండలాల్లో పది పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు.. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా విద్యుత్ దీపాలు, బెంచీలు, తాగునీటి వసతికి చర్యలు చేపట్టారు. పరీక్ష కేంద్రాలకు చేతి గడియారంతో సహా ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్ఫోన్ల అనుమతించేతి లేదని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థి పరీక్ష రాయలేని స్థితిలో ఉంటే బోర్డు అధికారులు ముందస్తుగా దరఖాస్తు చేసుకున్న వారికి సహాయకులను ఏర్పాటు చేసుకునేందుకు అనుమతించనున్నారు. సీసీ కెమెరాల నిఘా.. కేంద్రాల్లో సీసీ కెమెరాల నిరంతర పర్యవేక్షణలో పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలు రాసే కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి దాని ద్వారా బోర్డు అధికారులు పర్యవేక్షణ చేసేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా విద్యార్థులను పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతనే పరీక్ష గదిలోకి అనుమతించనున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసుల బందోస్తు ఏర్పాటు చేసి అనుమతి లేని వ్యక్తులు లోనికి రాకుండా తగు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇంటర్ విద్యార్థుల వివరాలు బాలిక బాలురు ఇంటర్ ఫస్ట్ ఇయర్ 832 877 ఇంటర్ సెకండ్ ఇయర్ 802 833 ఒకేషనల్ ఫస్ట్ ఇయర్ 170 71 ఒకేషనల్ రెండో సంవత్సరం 152 56 మొదటి సంవత్సరం మొత్తం విద్యార్థులు 1,950 ద్వితీయ సంవత్సరం మొత్తం విద్యార్థులు 1,843ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి ఈనెల 5 నుంచి వార్షిక పరీక్షలు జిల్లాలో 10 కేంద్రాల ఏర్పాటు -
గర్భిణులకు వైద్య పరీక్షలు నిర్వహించాలి
ములుగు: ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లో వారంలో ఒకరోజు గర్భిణులకు వైద్య పరీక్షలు నిర్వహించి తగిన సూచనలు చేయాలని డీఎంహెచ్ఓ గోపాల్‌రావు అన్నారు. ఈ మేరకు శనివారం జిల్లా ఆరోగ్యశాఖ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మాతృ మరణాలు, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పనితీరుపై మిడ్‌లెవల్ హెల్త్ ప్రొవైడర్స్, సూపర్వైజర్లు, ఆరోగ్య కార్యకర్తలు, ఫార్మసిస్టులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. గర్భిణులకు సకాలంలో చికిత్సలను అందిస్తూ పోషకాహార ప్రాముఖ్యతను వివరించాలన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు జరిగేలా చూడాలన్నారు. ఎనిమియా ముక్త్ భారత్ కార్యక్రమంలో ఆరు నెలల నుంచి 59నెలల మధ్య పిల్లలకు ఐరన్, ఫోలిక్ సిరప్, పింక్ బ్ల్యూ, రెడ్ ఐరన్ మాత్రలను అందించాలన్నారు. అసంక్రమిత వ్యాధులు బీపీ, షుగర్, క్యాన్సర్లపై ఈ నెల చివరి వారం వరకు స్క్రీనింగ్ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. తక్కువ పనితీరును కనబర్చిన కేంద్రాలు ఇకపై పనితీరును మెరుగుపరుచుకోవాలని సూచించారు. టీబీ కేసులను ఎప్పటికప్పుడు నిర్ధారించి చికిత్స అందించాలన్నారు. నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై శాఖాపరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వేసవికాలంలో వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యలపై పీహెచ్‌సీలు, సబ్ సెంటర్ల వారీగా ముందస్తు కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. ఈ సమీక్షలో డిప్యూటీ డీఎంహెచ్ఓ విపిన్‌కుమార్, ఐటీడీఏ డిప్యూటీ డీఎంహెచ్ఓ క్రాంతికుమార్, ప్రోగ్రాం అధికారులు శ్రీకాంత్, పవన్‌కుమార్, చంద్రకాంత్, రణధీర్ తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ గోపాల్‌రావు -
ఎట్టకేలకు తెరుచుకున్న గేట్లు
● 25 ఏళ్ల తర్వాత వీడిన సంకెళ్లు ఏటూరునాగారం : ఏటూరునాగారం పోలీస్ స్టేషన్‌కు భద్రతపరంగా 25 ఏళ్ల క్రితం జాతీయ రహదారిపై వేసిన గేట్లను శనివారం తొలగించారు. 2001లో అప్పటి పీపుల్స్ వార్ నాయకులు మందుగుండు సామగ్రితో ఏటూరునాగారం పోలీస్‌స్టేషన్‌ను పేల్చి వేసే ప్రయత్నం చేశారు. ఆ ఘటనలో ఐదుగురు పోలీసులు మృతి చెందారు. అలాంటివి పునరావృతం కాకుండా ఉన్నత స్థాయి అధికారులు పోలీస్ స్టేషన్ ఎదుట ఉన్న జాతీయ రహదారిపై రెండువైపులా గేట్లు ఏర్పాటు చేసి రాకపోకలు నిలిపివేశారు. దీంతో ఐటీడీఏ పీఓ గెస్ట్ హౌస్ మీదుగా భారీ వాహనాలు వెళ్తూ ప్రయాణికులకు ప్రాణ సంకటంగా మారాయి. వాహనాలు వెళ్లడానికి మళ్లించిన రహదారి గుంతల మయమై ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ఘటనపై సాక్షిలో పలుమార్లు ప్రయాణికుల అవస్థలు పడుతున్న తీరు ప్రచురించబడ్డాయి. ఆర్టీసీ బస్సులు, లారీలు, ఇతర వాహనాలను ప్రధాన రోడ్డు వెంట వెళ్లడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి సీతక్క ఆదేశంతో తొలగిన గేట్లు ప్రయాణికులు పడుతున్న అవస్థలను గమనించిన మంత్రి సీతక్క సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం నుంచి పోలీసులకు ఆదేశాలు రావడంతో ఎట్టకేలకు మూసి వేసిన గేట్లను తొలగించారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇర్సవడ్ల వెంకన్న, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రఘు, గౌస్, వసంత శ్రీనివాస్, ఖలీల్ పాల్గొన్నారు. పోలీసుల చొరవతోనే.. ● ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఏటూరునాగారంలో 25 ఏళ్ల నుంచి మూసి ఉన్న పోలీస్ స్టేషన్ ప్రధాన రోడ్డు పోలీసుల చొరవతోనే తెరుచుకుందని ఏఎస్పీ శివం ఉపాధ్యాయ శనివారం విలేకరులకు తెలిపారు. ఉన్నతాధికారులు, జిల్లా ఎస్పీ శబరీశ్ ఆదేశాల మేరకు గేట్లు ఎత్తివేసి వాహనాల రాకపోకలకు అవకాశం కల్పించామన్నారు. దీనివల్ల చుట్టూ తిరిగివెళ్లే ఇబ్బందులు తొలగిపోయాయని ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్, ఎస్సై తాజొద్దీన్ పాల్గొన్నారు. -
విద్యార్థుల అభ్యున్నతికి హెచ్ఎంలు కృషిచేయాలి
ములుగు: విద్యార్థుల అభ్యున్నతికి ఆయా పాఠశాలల హెచ్ఎంలు కృషి చేయాలని పాఠశాల విద్యాశాఖ వరంగల్ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి ఆదేశించారు. ఈ మేరకు డీఈఓ పాణిని అధ్యక్షతన కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యాశాఖను బలోపేతం చేయడానికి హెచ్ఎంలు కీలక పాత్రను పోషించాలన్నారు. విద్యార్థుల స్థాయిని బట్టి ఏ, బీ, సీ గ్రూపులుగా విభజించి ప్రత్యేక బోధన అందించాలన్నారు. వార్షిక పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చేలా చూడాలన్నారు. డేటా క్యాప్చర్ అతంటికేషన్ ఫాంలో హెచ్ఎంలు యూడైస్‌లో సరైన సమాచారాన్ని నింపితే పాఠశాల అవసరాలకు అవసరమైన ప్రభుత్వ నిధులు ముంజూరయ్యే అవకాశం ఉంటుందని వివరించారు. ఉన్నతాధికారులు అడిగే సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. పాఠశాలల వారీగా రికార్డులను విధిగా నిర్వహించేలా చూడాలని ఆదేశించారు. ఎప్ఎల్ఎన్, లిప్ కార్యక్రమంలో 40శాతం బోధన ద్వారా, 60శాతం విద్యార్థులకు ప్రాక్టీస్ ద్వారా సాధన చేయించాలన్నారు. రోజువారీగా ఎంతమంది విద్యార్థులు హాజరయ్యేది, వారి కోసం వడ్డించే మధ్యాహ్న భోజన వివరాలను ఉదయం 11గంటల వరకు యాప్‌లో అప్డేట్ చేయాలని ఆదేశించారు. ప్రతీ విద్యార్థికి అపార్ ఐడీ జనరేట్ చేసి అందించాలన్నారు. పాఠశాలలు, కాంప్లెక్స్, ఎంఆర్సీలకు విడుదల చేసిన నిధులను నిబంధనల మేరకు ఖర్చు చేసి రికార్డుల్లో నమోదు చేయాలన్నారు. మౌలిక వసతుల కల్పనపై సరైన వివరాలను ఆన్లైన్ చేయాలన్నారు. 10వ తరగతి ఫ్రీ ఫైనల్ పరీక్షలో ఈ దఫా రెండు పరీక్షలకు ఓఎంఆర్ షీట్లను అందిస్తున్నామని తెలిపారు. వార్షిక పరీక్షలో ఉత్తమ ఫలితాలు వచ్చేలా పదో తరగతి విద్యార్థులను సిద్ధం చేయాలన్నారు. ఈ సమావేశంలో డీఈఓ పాణిని, డీసీఈబీ సెక్రటరీ సూర్యనారాయణ, సమగ్రశిక్ష కోఆర్డినేటర్లు రాజు, మల్లారెడ్డి, రమాదేవి, సాంబయ్య, సైకం శ్రీనివాస్‌రెడ్డి, ఏసీజీఈ అప్పని జయదేవ్, ఎంఈఓలు, హెచ్ఎంలు పాల్గొన్నారు. పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి -
రామప్పను దర్శించిన కేరళీయులు
వెంకటాపురం(ఎం) : మండలంలోని రామప్ప ఆలయాన్ని కేరళకు చెందిన 27 మంది శనివారం సందర్శించారు. అంతర్రాష్ట్ర యువజన సమ్మేళన కార్యక్రమంలో భాగంగా కేరళకు చెందిన యువకులు రామప్ప ఆలయాన్ని సందర్శించి రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టతను టూరిజం గైడ్ విజయ్‌కుమార్ వివరించారు. అనంతరం లక్నవరం సరస్సును సందర్శించి వేలాడే వంతెన, ప్రకృతి అందాలను తిలకించినట్లు నెహ్రూ యువకేంద్రం సూపరింటెండెంట్ దేవీలాల్ తెలిపారు. రామప్పను సందర్శించిన విదేశీయుడు.. రామప్ప దేవాలయాన్ని అమెరికాకు చెందిన మార్క్ మెక్ లహ్ సందర్శించారు. ఈ సందర్భంగా రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకోగా పూజారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ విశిష్టతను గైడ్ విజయ్‌కుమార్ వివరించగా రామప్ప టెంపుల్ బ్యూటిఫుల్ అంటూ కొనియాడారు. నందీశ్వరుడి అందాలను సెల్ఫోన్లో బంధించుకున్నారు. రామప్పను సందర్శించిన పర్యాటకులు అమెరికన్‌తో ఫొటోలు దిగుతూ ఆనందం వ్యక్తం చేశారు. -
హేమాచలక్షేత్రంలో భక్తుల సందడి
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి శనివారం భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయంలో సందడి వాతావరణం నెలకొంది. ఉదయాన్నే భక్తులు వివిధ ప్రాంతాల నుంచి కార్లు, ఆటోలలో హేమాచల క్షేత్రానికి చేరుకున్నారు. ఆలయ ప్రాంతంలోని చింతామని జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిలతైలాభిషేకం పూజలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. సంతాన ప్రాప్తికి వచ్చిన దంపతులకు పూజారులు నాభిచందన ప్రసాదం అందజేశారు. -
ప్రతీ దివ్యాంగుడికి యూడీఐడీ నంబర్ తప్పనిసరి
ములుగు: జిల్లాలోని ప్రతీ దివ్యాంగుడికి యూడీఐడీ నంబర్ కేటాయించాలని కలెక్టర్ టీఎస్.దివాకర సూచించారు. ఈ మేరకు శనివారం రాష్ట్ర సెర్ఫ్ సీఈఓ దివ్య శనివారం కలెక్టర్లతో సదరం సర్టిఫికెట్లు, యూనిక్ డిజబిలిటీస్ ఐడీ జారీ, సోలార్ పవర్ ప్లాంట్లపై వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించగా జిల్లా తరఫున కలెక్టర్ దివాకర, అదనపు కలెక్టర్ సంపత్‌రావు పాల్గొన్నారు. ఈ కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ జిల్లా ఆస్పత్రి, గ్రామీణాభివృద్ధి అధికారి కార్యాలయ పరిధిలో పనిచేసే డేటా ఎంట్రీ ఆపరేటర్లకు, మీ సేవ కేంద్రాల నిర్వాహకులకు, పంచాయతీ కార్యదర్శులు, సీసీ, ఎంపీడీఓలు, ఏడీఎంలకు యూడీఐడీ దరఖాస్తుల నమోదుపై అవగాహన, శిక్షణ అందించాలన్నారు. సదరం సర్టిఫికెట్ నుంచి యూడీఐడీ జనరేట్ చేసిన తర్వాత ఎవరికై నా కార్డు అందకపోతే వెంటనే రిపోర్ట్ చేయాలన్నారు. ప్రతీ దివ్యాంగుడికి వైద్యులు అందించిన వైకల్య శాతంతో కూడిన సదరం సర్టిఫికెట్ యూడీఐడీ వివరాలు పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. వివరాలను సంపూర్ణంగా నమోదు చేసుకున్న తర్వాతనే దివ్యాంగులకు స్పీడ్ పోస్ట్ ద్వారా ఐడీలు అందుతాయని వివరించారు. దివ్యాంగులు యూడీఐడీ కార్డు కోసం మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ జగదీశ్వర్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులు లక్ష్యంతో చదవాలి ప్రతీ విద్యార్థి లక్ష్యంతో చదవాలని కలెక్టర్ టీఎస్.దివాకర సూచించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ట్రాన్స్‌ఫార్మ్ స్కూల్స్, క్వాల్కమ్తో కలిసి విద్యాశాఖ సమన్వయంతో జిల్లాలోని 6 మండలాల పరిధిలో గల 20 పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న బాలబాలికలకు శనివారం కెరీర్ ఫెయిర్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై మాట్లాడారు. విద్యార్థి దశలో పదో తరగతి కీలకమన్నారు. జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగాలంటే కమిట్మెంట్, కాన్ఫిడెన్స్, ఫ్లెక్సీబుల్ ఈ మూడు విషయాలు దృష్టిలో పెట్టుకుని ముందుకుసాగాలన్నారు. కష్టపడితే ఏదైనా సాధించవచ్చని వివరించారు. కార్యక్రమంలో ట్రాన్స్‌ఫార్మ్ స్కూల్స్ ప్రతినిధులు, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. కలెక్టర్ టీఎస్.దివాకర -
ఫాస్టాగ్‌తో అటవీశాఖకు ఆదాయం
● ఎఫ్ఆర్ఓ అబ్దుల్ రెహమాన్ ఏటూరునాగారం: జిల్లాలో నూతనంగా ప్రారంభించిన ఫాస్టాగ్ చెక్‌పోస్టుతో అటవీశాఖకు ఆదాయం వస్తుందని అటవీశాఖ రేంజ్ అధికారి అబ్దుల్‌రెహమాన్ తెలిపారు. శనివారం ఉదయం నుంచి ఫాస్టాగ్ చెక్‌పోస్టు నుంచి వాహనాలు వెళ్తుండగా ఆయన పర్యవేక్షించి మాట్లాడారు. మండలంలోని స్థానిక వాహనాలకు ఫాస్టాగ్ నుంచి మినహాయింపు కల్పించినట్లు తెలిపారు. ఇందుకోసం స్థానిక వాహనదారులు వారి ఫోర్‌వీల్ వాహనాల ఆర్సీ పేపర్స్, ఆధార్ కార్డులను అటవీశాఖ కార్యాలయంలో అందజేస్తే వారికి ఫాస్టాగ్ నుంచి మినహాయింపు ఉంటుందని వివరించారు. వాహనాల నుంచి ఆన్లైన్ పేమెంట్ జరగడం వల్ల అన్ని రకాలుగా సౌకర్యంగా ఉంటుందన్నారు. వాహనదారులు విధిగా ఫాస్టాగ్‌ను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌బీటీ, బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు. -
33కేవీ విద్యుత్‌లైన్ పనులు ప్రారంభం
ములుగు: వేసవిలో వినియోగదారులకు విద్యుత్‌ను నిరంతరం సరఫరా చేయడమే లక్ష్యంగా 33కేవీ విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపడుతున్నట్లు విద్యుత్ శాఖ డీఈఈ పులుసం నాగేశ్వర్రావు తెలిపారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో ప్రేమ్‌నగర్ సమీపంలోని షిర్డీసాయి బాబా ఆలయం నుంచి పత్తిపల్లి సబ్‌స్టేషన్ వరకు ఏర్పాటు చేసిన అంతర్గత విద్యుత్ లైన్ పనులను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏడీఈ వేణుగోపాల్, ఏఈ హరీశ్ తదితరులు పాల్గొన్నారు. ఎంఎన్ఓ అవతారమెత్తిన స్వీపర్ వెంకటాపురం(కె): మండల కేంద్రంలోని పీహెచ్సీలో ఎంఎన్ఓ పోస్టు ఖాళీగా ఉండటంతో స్వీపర్ ఎంఎన్ఓ పనులు నిర్వహిస్తున్నాడు. సంవత్సరకాలంగా ఎంఎన్ఓ లేకపోవడంతో స్వీపర్‌గా విధులు నిర్వహిస్తున్న రాంబాబుతోనే వైద్యులు రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి కుట్లు వేయించడం, కట్లు కట్టించడం వంటి పనులను చేపిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు ఎంఎన్ఓను నియమించేలా చర్యలు చేపట్టాలని రోగులు కోరుతున్నారు. దరఖాస్తుల ఆహ్వానం ఏటూరునాగారం: వాటర్ స్పోర్ట్స్ అకాడమీలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ పోచం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 5వ తరగతిలో బాలుర సీట్లు 20, బాలికల సీట్లు 20 సీట్లు, 6వ తరతిలో 9 సీట్లు, 7వ తరగతిలో 10 సీట్లు, 8వ తరగతిలో 7 సీట్లు ఉన్నాయని పేర్కొన్నారు. మోడల్ స్పోర్ట్స్ కొత్తగూడలో 5వ తరగతిలో బాలురకు 40 సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఏదైనా గుర్తింపు పొందిన ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలో ప్రస్తుతం 4, 5, 6, 7వ తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థులు అర్హులని తెలిపారు. దరఖాస్తులు చేసుకునే విద్యార్థుల తల్లిదండ్రులు ఏటూరునాగారం డీడీ కార్యాలయంలో ఈనెల 10వ తేదీలోపు అందజేయాలని సూచించారు. ఈ సెలక్షన్స్ ఈనెల 12వ తేదీన ఉంటాయని, వివరాలకు సెల్ నంబర్ 9701810567లో సంప్రదించాలని కోరారు. రోబోటిక్ ఎగ్జిబిషన్‌కు మోడల్ స్కూల్ విద్యార్థులు గోవిందరావుపేట: ములుగు విద్యాశాఖ, సోహన్ రోబోటిక్ అకాడమీ వారు జిల్లా నుంచి ఎంపిక చేసిన విద్యార్థులకు రోబోటిక్స్‌పై శిక్షణ ఇచ్చారు. ఈ క్రమంలో శనివారం హైదరాబాద్‌లోని శిల్పారామంలో ఏర్పాటు చేసిన ఫోర్త్ ఆన్వల్ రోబోటిక్ ఎగ్జిబిషన్లో చల్వాయి మోడల్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు బి.తరుణ్ కుమార్, భాను ప్రకాశ్‌లు పాల్గొన్నారు. వీరు రోబోటిక్ కిట్టును ఉపయోగించి సొంత ఆలోచనలతో సింగరేణి బొగ్గు గనుల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రమాదాన్ని గమనించి సింగరేణి కార్మికులు బయటికి వచ్చేలా అలారం సిస్టాన్ని కనుగొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు అభినందించారు. మిర్చి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలికన్నాయిగూడెం: ప్రభుత్వం మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహరావు అన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు సమ్మయ్యతో కలిసి ఆయన శనివారం మండల పరిధిలో పర్యటించి మిర్చి కల్లాల్లోకి వెళ్లి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మిర్చి పంటకు వెంటనే ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలన్నారు. అనంతరం బుట్టాయిగూడెంలో మృత్యువాత పడిన కుమ్మరి నాగేశ్వర్రావు కుటుంబాన్ని పరామర్శించారు. -
అక్రమ రవాణాకు చెక్
అధికారుల నిరంతర పర్యవేక్షణతో ఇసుక క్వారీ కాంట్రాక్టర్ల బెంబేలు● ఇసుక అక్రమ రవాణా కట్టడికి నాలుగు చెక్‌పోస్టుల ఏర్పాటు ● వారం రోజుల్లోనే 30 లారీలు సీజ్ ● ఇప్పటికే పలు క్వారీల్లో పనుల నిలిపివేత నిబంధనల మేరకు ఇసుక లోడింగ్ చేయిస్తున్న టీజీఎండీసీ సిబ్బంది ఏటూరునాగారం: జిల్లాలోని వివిధ మండలాల్లో ఉన్న ఇసుక క్వారీలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. క్వారీల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిబంధనలు కఠినతరం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఇసుక లారీల్లో తరలిస్తున్న అధికలోడు, జీరో బిల్లులపై దృష్టి సారించి అధికారులు నిరంతరం తనిఖీలు చేపడుతున్నారు. దీంతో అధికలోడ్‌తో వెళ్తున్న ఇసుక లారీలు చెక్‌పోస్టుల వద్ద పట్టుబడుతున్నాయి. ఎస్పీ శబరీశ్, ఏఎస్పీ శివం ఉపాధ్యాయ క్వారీల వద్దకు నేరుగా వెళ్లి స్టాక్ రిజిస్టర్, లోడింగ్, డంపింగ్, వే బిల్లులను పరిశీలిస్తున్నారు. దీంతో ఇసుక క్వారీ కాంట్రాక్టర్లు జంకుతున్నారు. నిబంధనలు కఠినతరం.. ఇసుక క్వారీల వద్ద ఎంట్రీ గేట్, ఎగ్జిట్ గేటు, సీసీ కెమెరాలు, వే బ్రిడ్జిలు, లారీలకు ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. అవేకాకుండా అదనపు బకెట్ లేకుండా, కెపాసిటీతో ఉన్న లారీకే వేబిల్లు ఇవ్వడం, ఎక్కువగా ఉన్న ఇసుకను వే బ్రిడ్జి వద్ద తొలగించడం వంటి చర్యలు చేపట్టారు. అలాగే, లోడింగ్‌కు డబ్బులు ఇవ్వకుండా, డబుల్ లారీలు నడపడం వంటివి మూసివేశారు. దీంతో క్వారీ నిర్వహణ ఆర్థికంగా ఆశాజనకంగా లేదని రీచ్‌లోని రేజింగ్ కాంట్రాక్టర్లు ముఖం చాటేస్తున్నారు. నిరంతరం తనిఖీలు.. జిల్లాలోని ఇసుక లారీలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఇసుక అక్రమ రవాణాను నియంత్రించేందుకు జిల్లాలో నాలుగు చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. కమలాపురం, ఏటూరునాగారం, ఎస్ఎస్ తాడ్వాయి, ములుగు ప్రాంతాల్లో ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. రెవెన్యూ, పోలీసులు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో సంయుక్తంగా 24గంటలు డ్యూటీలను కేటాయించి తనిఖీలను ముమ్మరంగా చేపడుతున్నారు. వారం రోజుల్లో జిల్లాలో ఏటూరునాగారం చెక్‌పోస్టు పరిధిలో 17, కమలాపురం పరిధిలో 5, ములుగు పరిధిలో 8 ఇసుక లారీలను పట్టుకున్నారు. అయితే అధిక లోడ్‌తో వెళ్తున్న ఇసుక లారీల యజమానులకు జరిమానా విధిస్తున్నప్పటికీ వారిలో ఎలాంటి మార్పులు రావడం లేదు. ఇసుక క్వారీల్లో దందా కొనసాగకపోవడంతో తాము క్వారీలను నడపలేమని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. గత పాలసీని కొనసాగిస్తేనే క్వారీలను నడుపుతామని తేల్చిచెప్పడం గమనార్హం. నిరంతరం నిఘా ఇసుక క్వారీలు, రవాణాపై నిరంతరం నిఘా ఉంటుంది. అక్రమంగా ఇసుకను ఎవరు తవ్వినా, తరలించినా శాఖా పరమైన కేసులు నమోదు చేస్తాం. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టాలని చూస్తే ఊరుకునేది లేదు. నిబంధనల ప్రకారం క్వారీలను నడపాలి. 24గంటల పాటు నిఘా వేసి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటాం. – శివం ఉపాధ్యాయ, ఏటూరునాగారం, ఏఎస్పీజిల్లాలోని ఇసుక క్వారీల పరిస్థితి ఇలా.. వాజేడు మండల పరిధిలోని అయ్యవారిపేట, భీమారం, ధర్మారం క్వారీలను కాంట్రాక్టర్లు మూసివేశారు. వెంకటాపురం(కె) మండల పరిధిలోని ఆలుబాక, చొక్కాల క్వారీల డీడీలను ఆన్లైన్లో పెట్టడం నిలిపివేశారు. మంగపేట మండల పరిధిలోని ఐదు క్వారీలకు ఒక క్వారీ వద్ద ఇసుక పోయడం నిలిపివేశారు. ఏటూరునాగారంలోని మానసపల్లి–1, 2 క్వారీల్లో ఇసుకు తవ్వకాల పనులు సాగడం లేదు. -
నేడు డయల్ యువర్ డీఎం
ములుగు రూరల్: జిల్లా కేంద్రంలో నేడు(శుక్రవారం) టీజీఆర్టీసీ డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వరంగల్–2 డిపో మేనేజర్ జ్యోత్స్న గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు ఆర్టీసీ సమస్యలు, సలహాలు, సూచనలు అందించాలని కోరారు. శుక్రవారం మధ్యాహ్నం 12నుంచి ఒంటిగంట వరకు సెల్ నంబర్ 9959226048లో సంప్రదించాలని కోరారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కోటగుళ్లలో లింగోద్భవ రుద్రాభిషేకం గణపురం: మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా గణపురం మండల కేంద్రంలోని కోటగుళ్లలో గురువారం ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణల నడుమ లింగోద్భవ రుద్రాభి షేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కోటగుళ్ల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో మహాఅన్నపూజ కార్యక్రమాన్ని అర్చకులు గంగాధర్, వినయ్, నాగరాజు, విజయ్‌కుమార్, శంకర్ నిర్వహించారు. జాతీయ లోక్ అదాలత్‌పై అవగాహన భూపాలపల్లి అర్బన్: మార్చి 8న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌పై జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం జిల్లాకేంద్రంలోని వారసంతలో మోబైల్ వ్యాన్‌తో అవగాహన కల్పించారు. జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది సూచించారు. క్షణికావేశాలకు పోయి, పగలు, పంతాలు పెంచుకొని కేసుల్లో ఇరికితే, పోలీస్ స్టేషన్లు కోర్టులకు ఎక్కితే నష్టమే తప్ప లాభం ఉండదన్నారు. విలువైన సమయం, డబ్బు కోల్పోవాల్సి వస్తుందని చెప్పారు. మహిళలకు క్రీడాపోటీలు భూపాలపల్లి అర్బన్: మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు, మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు ఏరియా అధికార ప్రతినిధి మారుతి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మార్చి 1న అంబేడ్కర్ స్టేడియం, థౌసండ్ క్వార్టర్స్, మార్చి 3న ఇల్లంద క్లబ్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో విజేతలైన వారికి మార్చి 8న జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. యాజమాన్యమే పనులు చేపట్టాలి భూపాలపల్లి అర్బన్: కాంట్రాక్టర్లకు అప్పగించే విధానాన్ని విరమించుకొని సింగరేణి యాజమాన్యమే బొగ్గు ఉత్పత్తి చేపట్టాలని ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్ డిమాండ్ చేశారు. ఏరియాలోని కేటీకే 8వ గని రెండో సీమ్‌ను ప్రైవేట్‌పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ గురువారం ఏరియాలోని జీఎం కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ.. కేటీకే 8వ గని ప్రైవేట్‌పరం చేయడం వల్ల సింగరేణికే కాకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందన్నారు. ిసింగరేణి ఆధ్వర్యంలోనే బొగ్గు వెలికితీయాలని కోరారు. ఎన్నో సంవత్సరాల నుంచి సింగరేణి సంస్థ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని, ప్రైవేట్‌పరం చేయడం వల్ల డిపెండెంట్ ఉద్యోగాలు రాక కార్మిక పిల్లలు రోడ్డున పడే ప్రమాదం ఉందన్నారు. సింగరేణిలో నూతన గనులు ఏర్పాటుకు యాజమాన్యం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎస్ఓటు జీఎం కవీంద్రకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాతంగి రామచందర్, సుధాకర్‌రెడ్డి, విజేందర్, శ్రీనివాస్, ఆసిఫ్పాష, రవికుమార్, రామచందర్ పాల్గొన్నారు. -
రామప్ప శిల్పకళ అద్భుతం
వెంకటాపురం(ఎం): రామప్ప దేవాలయం శిల్పకళ అద్భుతంగా ఉందని అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ కొనియాడారు. రామప్ప దేవాలయాన్ని ఆమె గురువారం సందర్శించారు. ములుగు ఆర్డీఓ వెంకటేశ్, జిల్లా టూరిజం అధికారి శివాజీ ఆమెకు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు హరీశ్ శర్మ, ఉమాశంకర్‌లు పూర్ణకుంభంతో ఆలయంలోకి ఆహ్వానించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి ఆమె పూజలు నిర్వహించగా అర్చకులు స్వామివారి శేషవస్త్రాలు అందించి శాలువాతో సత్కరించారు. రామప్ప ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్‌కుమార్ వివరించగా టెంపులు బాగుందని కొనియాడారు. రామప్ప ఆలయ నిర్మాణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆలయ గోపురానికి వినియోగించిన నీటిలో తేలాడే ఇటుకలను స్వయంగా పరిశీలించి ఆశ్చర్యానికి గురయ్యారు. ఆమె వెంట ములుగు డీఎస్పీ రవీందర్, తహసీల్దార్ గిరిబాబు, ఎస్సై జక్కుల సతీష్, కేంద్ర పురావస్తుశాఖ అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులతో ప్రత్యేక సమావేశం ఎస్ఎస్ తాడ్వాయి: మండల పరిధిలోని కాటాపూర్ గ్రామానికి చెందిన ఎన్నారై పులి రవిగౌడ్ ఆధ్వర్యంలో కాటాపూర్ జెడ్పీ పాఠశాలకు చెందిన 30మంది విద్యార్థులను రామప్పకు తీసుకెళ్లి అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులతో లార్సన్ మాట్లాడుతూ విద్యార్థులు ఆడుడుపాడుతూ ఆనందంగా విద్యను అభ్యసించాలన్నారు. ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు వింటూ ప్రణాళికతో చదువుకుని ఉన్నతస్థాయికి చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాటాపూర్ మాజీ సర్పంచ్ పులి నర్సయ్య, ఉపాధ్యాయులు శ్రీదేవి, చక్రునాయక్, విద్యార్థులు పాల్గొన్నారు.అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ -
ప్రశాంతంగా ‘ఎమ్మెల్సీ’ పోలింగ్
ములుగు: నల్గగొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. గురువారం ఉదయం 8గంటల నుంచి మొదలైన ఓటింగ్ ప్రక్రియ సాయంత్రం 4గంటల వరకు కొనసాగింది. జిల్లాలో తొమ్మిది పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 628మంది ఓటర్లకు గాను 583మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 383మంది పురుష, 200 మంది మహిళా ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులతో పాటుగా ప్రైవేట్ హైస్కూల్ ఉపాధ్యాయులు అదే స్ఫూర్తితో వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలో ఏకంగా ఓటింగ్ 92.83శాతంగా నమోదు అయింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సాయంత్రం 4గంటలకు ప్రిసైడింగ్ అధికారులు పోలింగ్ కేంద్రాల గేట్లను మూసివేశారు. వైద్యశాఖ తరఫున అన్ని కేంద్రాల్లో శిబిరాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ అనంతరం ఎన్నికల సిబ్బంది పోలింగ్ బాక్స్‌లను జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో గల రిసెప్షన్ సెంటర్‌కు తరలించారు. చెక్ లీస్ట్ ప్రకారం వాటిని పరిశీలించిన అనంతరం నల్లగొండలోని కౌంటింగ్ కేంద్రానికి తరలించారు. మందకొడిగా మొదలై.. బుధవారం రాత్రి శివరాత్రి జాగారాల కారణంగా ఉదయం 8నుంచి 10గంటల వరకు జిల్లాలో 81మంది మాత్రమే తమతమ ఓటుహక్కు వినియోగించుకోగా ఓటింగ్ శాతం 12.90గా నమోదయ్యింది. ఇక 10నుంచి 12 గంటలకు వేగం పుంజుకొని 47.29శాతంగా నమోదయ్యింది. 12నుంచి 2గంటల వరకు 79.66శాతంగా.. ఎన్నికలు ముగిసేసరికి ఓటింగ్ శాతం 92.83గా నమోదు అయింది. హనుమకొండ, వరంగల్ వంటి ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ఉపాధ్యాయులు సైతం తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలను కలెక్టరదివాకర, ఎస్పీ శబరీశ్, అదనపు కలెక్టర్ మహేందర్‌జీ, డీఎస్పీ రవీందర్, ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ పరిశీలించారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయగా కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ రూంలో సీసీటీవీ ఫుటేజీల ద్వారా కలెక్టర్ పరిస్థితిని సమీక్షించారు. ఎస్పీ శబరీశ్ నిత్యం పోలీస్ సిబ్బందికి తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. భారీ బందోబస్తు పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎస్పీ శబరీశ్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల చుట్టూ 100నుంచి 200 మీటర్ల వరకు 144 సెక్షన్‌ను పకడ్బందీగా అమలు చేశారు. ఓటర్లు, అధికారులు పోలింగ్ కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్ఫోన్లు తీసుకెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. తొమ్మిది కేంద్రాలలో 200మంది పోలీసులు బందోబస్తు విధుల్లో పాల్గొన్నారు.– మరిన్ని ఫొటోలు 9లోu జిల్లాలో 628ఓట్లకు 583 పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్ దివాకర, ఎస్పీ శబరీశ్ 92.83శాతం పోలింగ్ నమోదు డ్రోన్‌తో నిఘా వెంకటాపురం(కె): ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఏజెన్సీలోని మావోయిస్టు ప్రాంతాలపై పోలీసులు డ్రోన్‌తో నిఘా వేసి ఉంచారు. వెంకటాపురం సీఐ బండారి కుమార్, ఎస్సై కొప్పుల తిరుపతి రావుల పర్యవేక్షణలో మండల పరిధిలోని గోదావరి ఫెర్రి పాయింట్లతో పాటుగా పోలింగ్ కేంద్రాన్ని డ్రోన్‌తో నిత్యం పర్యవేక్షించారు. -
మార్మోగిన శివనామస్మరణ..
వెంకటాపురం(ఎం): మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని రామప్ప దేవాలయం శివనామస్మరణతో మారుమోగుతోంది. రామలింగేశ్వరా.. శరణు శరణు అంటూ భక్తజనం భక్తి పారవశ్యంలో మునిగితేలుతున్నారు. బుధవారం అర్ధరాత్రి శివపార్వతుల కల్యాణానికి హాజరైన మంత్రి సీతక్క రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ ఎంపీ సీతారాంనాయక్‌లు సైతం హాజరై రామలింగేశ్వరుడిని దర్శించుకున్నారు. రెండోరోజూ రామలింగేశ్వరస్వామికి పూజలు మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండోరోజు గురువారం ఆలయంలో గణపతి పూజ, రుద్రాభిషేకము, విగ్రహారాధన, వీరభద్ర పళ్లెరము, భద్రకాళి పూజ, సహస్రనామార్చన, బలిహారణ పూజలు నిర్వహించినట్లు ఆలయ ప్రధాన ఆర్చకుడు కోమళ్లపల్లి హరీశ్‌శర్మ, ఉమాశంకర్‌లు తెలిపారు. గురువారం ఉదయం భక్తులు కుటుంబసమేతంగా రామప్ప ఆలయానికి తరలివచ్చి రామలింగేశ్వరస్వామికి అభిషేకం, ఆర్చన పూజలు నిర్వహించారు. నేడు(శుక్రవారం) తెల్లవారుజామున 4గంటలకు అగ్నిగుండాల మహోత్సవ కార్యక్రమానికి భక్తులు అధికసంఖ్యలో రామప్ప ఆలయానికి తరలివస్తున్నట్లు ఆలయ ఈఓ బిల్లా శ్రీనివాస్ తెలిపారు. సుమారు 10వేల మంది భక్తులు హాజరుకానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ములుగు సీఐ శంకర్, ఎస్సై జక్కుల సతీష్, తహసీల్దార్ గిరిబాబు, ఎంపీడీఓ రాజు తమ సిబ్బందితో రామప్పలో విధులు నిర్వహిస్తున్నారు. 785 మందికి వైద్య సేవలు మహాశివరాత్రి సందర్భంగా రామప్పలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్యశిబిరం ద్వారా 785 మందికి వైద్యసేవలు అందించినట్లు వెంకటాపురం పీహెచ్సీ వైద్యాధికారి శ్రీకాంత్ తెలిపారు. గురువారం ఎండకు తట్టుకోలేక కళ్లు తిరిగి పడిపోయిన ఇద్దరు మహిళలకు వైద్యం అందించారు. ఎండ తీవ్రత అధికంగా ఉంటున్నందున భక్తులు తాగునీటితో పాటు ఓఆర్ఎస్ ద్రావణాన్ని తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ చందన, హెల్త్ సూపర్వైజర్ పుష్పకుమారి, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. రామప్పలో రెండోరోజు కొనసాగిన ఉత్సవాలు భారీగా తరలివచ్చిన భక్తులు నేటి తెల్లవారుజామున అగ్నిగుండాల మహోత్సవం -
చెక్‌డ్యామ్‌కు గండి
చిట్యాల/మొగుళ్లపల్లి: చిట్యాల మండలం నవాబుపేట, మొగుళ్లపల్లి మండలం పోతుగల్లు గ్రామాల మధ్య చలివాగుపై నిర్మించిన చెక్‌డ్యామ్‌కు బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు గండికొట్టారు. యాసంగికి ముందు చెక్ డ్యామ్ ఎండిపోయి దర్శనమిచ్చింది. పలుమార్లు సాగునీటి సమస్యపై స్థానిక ఎమ్మెల్యే సత్యనారాయణరావుతో పాటు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కలిసి హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం ముచ్చర్ల నాగారం చెరువు నుంచి నీటిని విడుదల చేసి వరి పంటలను కాపాడాలని రైతులు విన్నవించారు. దీంతో ఎమ్మెల్యేలు ఇద్దరు స్పందించి వరి పంటల కోసం నీటిని విడుదల చేశారు. నీళ్లు కింది భాగానికి వెళ్లకపోవడంతో రైతులు తమ పంటలు ఎండిపోతున్నాయని ఉద్దేశంతో చెక్ డ్యామ్‌కు గండి కొట్టినట్లు తెలుస్తుంది. చెక్‌డ్యామ్‌ను ఇరిగేషన్ డీఈ అమ్రపాలి. ఏఈలు వరుణ్ భాస్కర్లు సందర్శించి గండిని పరిశీలించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశారు. -
మిగిలింది అప్పులే..!
నల్లి పురుగుతో తగ్గిన మిర్చి దిగుబడిజిల్లాలో మిర్చి సాగు వివరాలు మండలం గతేడాది ప్రస్తుతం ములుగు 2,637.01 2,076.18 వెంకటాపురం(ఎం) 1,650.71 1,210.10 గోవిందరావుపేట 23.26 23.20 ఎస్‌ఎస్‌తాడ్వాయి 174.52 60.73 ఏటూరునాగారం 1,525.76 1,252.00 కన్నాయిగూడెం 4,371.39 3,980.00 మంగపేట 3,636.39 2,959.00 వెంకటాపురం(కె) 5,039.32 4,383.00 వాజేడు 6,548.20 3,813.00 మొత్తం 25,606.56 19,757.20ఖర్చు పెరిగింది.. ధర తగ్గింది.. గతేడాది 25గుంటల భూమిలో యశస్విని సీడ్ మిర్చి రకం సాగు చేశాను. దిగుబడి 16 క్వింటాలు వచ్చింది. పెట్టుబడి రూ.70 వేలు సాగుకు ఖర్చు చేశాను. మార్కెట్ ధర రూ.21 వేలు ఉండగా రూ.18 వేలకు పంటను అమ్మాను. ఈ ఏడాది ఎకరం 10గుంటల భూమిలో మిర్చి సాగు చేశాను. పెట్టుబడి ఇప్పటి వరకు రూ.2.10లక్షలు ఖర్చు చేశాను. ఈ ఏడాది మార్కెట్ ధర క్వింటా మిర్చికి రూ.13 వేలు ఉండగా 10క్వింటాలు అమ్మాను. ధర రూ.10,800మాత్రమే పలికింది. ధర పెరిగితే తప్పా పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. – బొంతల రాజుయాదవ్, రైతు, ములుగు -
వసంతోత్సవానికి వేళాయె..
● నేటి నుంచి నిట్‌లో ‘స్ప్రింగ్ స్ప్రీ–25’ కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌లో ప్రతీ ఏడాది విద్యార్థులే నిర్వాహకులుగా మూడు రోజులు వసంతోత్సవం (స్ప్రింగ్ స్ప్రీ–25) నిర్వహించనున్నారు. ఈనెల 28 నుంచి మార్చి 1, 2 తేదీల్లో నిర్వహించే కల్చరల్ ఫెస్ట్‌కు అన్ని ఏర్పాట్లు చేశారు. నాటి ఆర్ఈసీ నేటి నిట్‌లో ప్రపంచంలోని పలు ప్రాంతాలకు చెందిన విద్యార్థులు చదువుతున్నారు. భిన్నత్వంలో ఏకత్వంలా నిలుస్తున్న నిట్‌లో వివిధ దేశాల సంస్కృతీసంప్రదాయలను పరస్పరం పంచుకునేందుకు 1978లో ప్రారంభమైన వసంతోత్సవం దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద కల్చరల్ ఫెస్ట్గా పేరుగాంచింది. దేశవ్యాప్తంగా వివిధ ఇంజనీరింగ్ కళాశాలల నుంచి విద్యార్థులు హాజరుకానున్నారు. -
పెట్టుబడి రాని పరిస్థితి
మిర్చి సాగులో విత్తనాల కొనుగోలు నుంచి దుక్కిదున్నడం, ఎరువులు, పురుగు మందుల పిచికారీ, కూలీల ఖర్చు రోజురోజుకూ పెరుగుతోంది. ఎకరం భూమిలో మిర్చి సాగు చేసేందుకు సుమారు రూ.1.50 నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చు అవుతోంది. పెట్టుబడి పెరగడంతో పాటు పంటను ప్రధానంగా నల్లి, వేరుకుళ్లుతో పాటు చీడపీడలు అధికంగా ఆశిస్తుండడంతో దిగుబడి తగ్గుతోంది. దీంతో ఎకరాకు 15 క్వింటాల దిగుబడి రావడం కష్టంగా మారింది. క్వింటాకు మార్కెట్లో ధర రూ.13 వేలు లేదంటే ఇంకా తక్కువకు అమ్మాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దీంతో రైతులకు పెట్టిన పెట్టుబడలు రావడం లేదు. గతేడాది మిర్చి క్వింటాకు రూ.20 వేల పైచిలుకు ధర పలికితే ఈ ఏడాది ధర భారీగా పడిపోయింది. -
ఉమ్మడి జిల్లాలో జిల్లాల వారీగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ వివరాలు
జిల్లా ఓటర్లు పోలైన శాతం ఓట్లుజనగామ 1,002 945 94.31 హనుమకొండ 5,215 4,780 91.66 వరంగల్ 2,352 2,214 94.13 మహబూబాబాద్ 1,663 1,571 94.47 భూపాలపల్లి 329 308 93.62 ములుగు 628 583 92.83 ఉమ్మడి వరంగల్ జిల్లాలో 11,189 మంది ఓటర్లు ఉండగా 10,401 మంది ఓటు హక్కును వినియోగించుకోగా, మొత్తంగా 92.95శాతం పోలింగ్ నమోదైంది. -
ఇసుక లారీలతో తప్పని తిప్పలు
వెంకటాపురం(కె): మండల కేంద్రంలోని ఇసుక లారీలతో ఇక్కట్లు తప్పడం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం నుంచి వందల సంఖ్యలో ఇసుక లారీలు మండల కేంద్రం మీదుగా హైదరాబాద్‌కు వెళ్తున్నాయి. ఈ లారీలతో ప్రజలతో పాటు అత్యవసర సర్వీసులకు ఇబ్బందులు ఎదురైనా పట్టించుకునే వారే కరువయ్యారు. మంగళవారం మధ్యాహ్నం ఏటూరునాగారంలోని ప్రభుత్వ ఆస్పత్రికి గర్భిణులను ప్రసవ నిమిత్తం తరలిస్తున్న 102వాహనం ఇసుక లారీల మధ్యలో సుమారు అరగంట పాటు చిక్కుకుంది. సాయంత్రం సమయంలో అత్యవసర కేసులను తీసుకెళ్తున్న 108 వాహనం సైతం 45 నిమిషాల పాటు చిక్కుకుంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
కార్పొరేషన్/మున్సిపాలిటీల వారీగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల వివరాలు
జిల్లా మున్సిపాలిటీ మొత్తం ఆమోదం వివిధ స్థాయిల్లో గ్రేటర్వరంగల్ కార్పొరేషన్ 1,00,989 2,756 98,233 హనుమకొండ పరకాల 3,194 06 31,88 వరంగల్ నర్సంపేట 5,219 411 4,808 వర్ధన్నపేట 524 10 514 మహబూబాబాద్ మహబూబాబాద్ 12,201 566 11,635 డోర్నకల్ 872 241 631 మరిపెడ 2,629 63 2,566 తొర్రూరు 10,299 606 9,693 జేఎస్ భూపాలపల్లి భూపాలపల్లి 3,795 1214 2,581 జనగామ జనగామ 18,375 4,967 13,408 -
మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి
● ఎల్డీఎం జయప్రకాశ్ ఏటూరునాగారం: మహిళలు పొదుపుపై దృష్టి సారించి ఆర్థికాభివృద్ధి సాధించాలని ఎల్డీఎం జయప్రకాశ్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళా సాధికారిత విభాగం ఆధ్వర్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారిచే ప్రవేశపెట్టిన ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో భాగంగా ఎస్బీఐ బ్యాంక్ వారి సహకారంతో మహిళలకు అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించి కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ ఈట రేణుక అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా ఎల్డీఎం జయప్రకాశ్ హాజరై మాట్లాడారు. మహిళలు ఆర్థిక క్రమశిక్షణ పాటించినప్పుడు కుటుంబం, దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. పొదుపు చేయడంలో మెలకువలను పాటించాలన్నారు. మొబైల్ ఫోన్లకు వచ్చే లింక్‌లు, ఇతర విషయాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు పాతిమా, నవీన్, వెంకటయ్య, జ్యోతి, సంపత్, రమేష్, భాస్కర్, శేఖర్, సుమలత, మున్ని, భావన, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు. -
ఎట్టకేలకు ఎల్ఆర్ఎస్
సాక్షిప్రతినిధి, వరంగల్/ములుగు: అనుమతి లేని లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్)కు ఎట్టకేలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం.. తక్షణమే అమలు చేసేలా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ మేరకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, కుడా వైస్ చైర్మన్లతో పాటు మున్సిపల్ కమిషనర్లు, జిల్లాల ఉన్నతాధికారులకు మార్గదర్శకాల ఉత్తర్వులు కూడా అందాయి. చీఫ్ సెక్రటరీ శాంతికుమారి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. మార్చి నాటికి దాదాపుగా ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పూర్తి చేయాలన్న లక్ష్యంతో అధికార యంత్రాంగం ముందుకు సాగాలని సూచించారు. దరఖాస్తుల క్రమబద్ధీకరణకు అంతా సిద్ధం.. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేసేందుకు అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. మొదటగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వివిధ నిబంధనల ప్రకారం ఆన్లైన్లోనే వడపోసేందుకు రంగం సిద్ధం చేశారు. ఆయా ఆస్తులు నిషేధిత జాబితాలో ఉన్నాయా? దరఖాస్తుదారుడు పూర్తిస్థాయిలో పత్రాలు సమర్పించాడా? లేదా? అన్న అంశాలను పరిశీలిస్తారు. ఉమ్మడి జిల్లాలోని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు 9 మున్సిపాలిటీలు, వివిధ గ్రామాలనుంచి వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు రెవెన్యూ, నీటిపారుదల, టౌన్ ప్లానింగ్, పంచాయతీ అధికారులు కార్యాచరణ రూపొందించారు. దరఖాస్తుదారులకు సమాచారం ఇస్తూ.. ఆ ప్లాటు, స్థలం వద్దకు రమ్మని జీపీఎస్ ద్వారా పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉండగా నాలాలు, చెరువులు, కుంటలు, వారసత్వ సంపద, శిఖం, దేవాదాయ, ఇనాం భూములు వంటివి పరిశీలించి అభ్యంతరాలు ఉంటే నమోదు చేసుకుని ఉన్నతాధికారులకు రిపోర్టు చేస్తామని చెబుతున్నారు. చివరగా మరోసారి వాటిపై ఉత్తర ప్రత్యుత్తరాలు, పత్రాల పరిశీలన చేసినా అభ్యంతరాలు అలాగే ఉంటే వాటిని తిరస్కరించి సమాచారం ఇస్తామంటున్నారు. అర్హత ఉన్న దరఖాస్తులను వెంటనే పరిశీలించి కావాల్సిన పత్రాలతోపాటు ఫీజు చెల్లించేలా నోటీసు జారీ చేసి.. దరఖాస్తులు సరైనవి అయితే క్రమబద్ధీకరించి ఉత్తర్వులు జారీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. అందరికీ సమాచారం అందేలా ఏర్పాట్లు.. ఉమ్మడి వరంగల్‌లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సహా 9 మున్సిపాలిటీలు, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) 2020లో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తులు స్వీకరించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఈ కార్యక్రమం 2020 అక్టోబర్ 31 వరకు కొనసాగగా, రూ.1,000 ఫీజును ఆన్లైన్లో చెల్లించి వివరాలను నమోదు చేసుకున్నారు. మొత్తంగా 1,58,097 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 10,840 దరఖాస్తులు పరిశీలించిన అధికారులు అప్పట్లోనే కొన్నీ క్రమబద్ధీకరణ చేయగా.. 1,47,257 వివిధ స్థాయిల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ఆ తర్వాత ఈ ప్రక్రియకు బ్రేక్ పడగా.. రాష్ట్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వుల నేపథ్యంలో అధికార యంత్రాంగం మళ్లీ ఎల్ఆర్ఎస్ అమలుకు కదిలింది. ఈసారైనా నిబంధనల ప్రకారం చకచకా క్రమబద్ధీకరణ పూర్తి చేయాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. ●ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.. రాష్ట్ర ప్రభుత్వం ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఇచ్చిన అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. మూడు అంచెలుగా సర్వే చేసి డీపీఓకు పంపించారు. అక్కడి నుంచి నా దగ్గరకు వచ్చిన తర్వాత కలెక్టర్ లాగిన్‌కు పంపుతాం. డిజిటల్ మ్యాప్ ఆధారంగా ప్రాంతాన్ని బట్టి రుసుము అనేది ఆన్లైన్లో జనరేట్ అవుతుంది. సదరు ప్లాట్ కొనుగోలు చేసిన వ్యక్తి ఫీజు చెల్లించగానే క్లియరెన్స్ అందిస్తాం. – సంపత్‌రావు, అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) ప్లాట్ క్రమబద్ధీకరణకు సిద్ధంగా ఉన్నా.. ములుగు జిల్లా కేంద్రంలోని రిటైర్డ్ భవనం పక్కన 373 గజాల ప్లాట్ కొన్నాను. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్కు ఫీజు చెల్లించి క్రమ బద్ధీకరించుకోవాలని సూచించడంతో ఆన్లైన్లో రూ.1,000 చెల్లించాను. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి, రెవెన్యూ శాఖ తరఫున సర్వే చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం క్రమబద్ధీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సంతోషకరం. ఫీజు చెల్లించి భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా చూసుకుంటా. – పోరిక హరిసింగ్, అన్నంపల్లి ఇక చకచకా నాన్ లే అవుట్ భూముల క్రమబద్ధీకరణ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, ఉన్నతాధికారులకు మార్గదర్శకాలు మార్చి వరకు ప్రక్రియ పూర్తి చేసేలా ఆదేశాలు తాజా ఉత్తర్వులతో మళ్లీ కదలిక... ఇప్పటికై నా పూర్తి చేయాలంటున్న దరఖాస్తుదారులుఉమ్మడి జిల్లాలో ఇలా..మొత్తం దరఖాస్తులు 1,58,097 పరిశీలించి ఆమోదించినవి 10,840వివిధ స్థాయిల్లో పెండింగ్ 1,47,257 -
అడవిలో మంటలార్పిన అటవీశాఖ సిబ్బంది
వాజేడు: అడవిలో మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన అటవీశాఖ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. మండల పరిధిలోని దూలాపురం గుట్టలపై మంగళవారం మంటలు చెలరేగినట్లు ఫైర్ పాయింట్స్ ఆధారంగా అటవీశాఖ సిబ్బంది గుర్తించారు. ఈ మేరకు దూలాపురం రేంజికి చెందిన సిబ్బంది హతిరాం, ఆదిలక్ష్మి, ఫైర్ వాచర్స్ 5కిలో మీటర్ల మేర కాలినడకన గుట్టపైకి వెళ్లి అక్కడ అడవిలో మంటలు కనిపించడంతో ఆర్పారు. విద్యుత్ ఉద్యోగులకు సేఫ్టీ కిట్ల అందజేత వెంకటాపురం(కె)/వాజేడు: మండల కేంద్రంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌లో మంగళవారం విద్యుత్ ఉద్యోగులకు సేఫ్టీ కిట్లను ములుగు డీఈ నాగేశ్వరావు, ఏడీఈ అకిటి స్వామి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా నిరంతర విద్యుత్ అందిచాలనే లక్ష్యంతో ఉద్యోగులకు సేఫ్టి కిట్లు, జాకెట్లు, టార్చిలైట్లు, టూల్స్ తో పాటు తదితర వస్తువులను అందజేసినట్లు వారు వివరించారు. అదే విధంగా వాజేడు మండల కేంద్రంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ ఆవరణలో సిబ్బందికి ములుగు డీఈ నాగేశ్వరావు, ఏడీఈ అకిటి స్వామి, ఏఈ అర్షద్ అహ్మద్ సేఫ్టీ కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఈ హనుమాన్ దాస్, విద్యుత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మామిడి తోట దగ్ధం ఎస్‌ఎస్‌తాడ్వాయి: మండల పరిధిలోని ఒడ్డుగూడెంలో ఓ గిరిజన రైతు మామిడి తోట దగ్ధమైంది. ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే..మాతోట కార్యక్రమంలో భాగంగా నాబార్డు ఆర్థిక సాయంతో ఒడ్డుగూడెం గ్రామానికి చెందిన చెల చిన్న ఎర్రయ్య 2021లో ఐదు ఎకరాల్లో మామిడి మొక్కలను నాటారు. ఎకరానికి 70మొక్కల చొప్పున 350 నాటి కుటుంబ సభ్యులంతా కష్టపడి పెంచారు. ఈ క్రమంలో సోమవారం మామిడి తోటకు నిప్పంటుకుని దగ్ధమైందని బాధిత రైతు మంగళవారం తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది గుర్తు తెలియని వ్యక్తులు చేసిన పనా లేక మామిడి తోట ప్రమాదవశాత్తు దగ్ధమైందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనలో మామిడి తోటతో పాటు సోలార్ పెన్సింగ్, 300 మీటర్ల పైపులతో పాటు గుడిసె కూడా కాలిపోయిందని బాధితుడు వాపోయాడు. జాబితాను అధికారులకు అందించాలి వెంకటాపురం(కె):మొక్కజొన్న సాగు చేసి నష్టపోయిన రైతుల జాబితాను మొక్కజొన్న డీలర్లు అధికారులకు అందించాలని ములుగు ఆర్డీఓ వెంకటేశ్ అన్నారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో బాండ్ మొక్కజొన్న ఆర్గనైజర్స్, వ్యవసాయ శాఖ అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ మొక్కజొన్న కంపెనీ ఆర్గనైజర్స్ దగ్గర ఉన్న రైతుల జాబితాను అధికారులకు అందజేయాలన్నారు. జాబితా ఆధారంగా గ్రామాల వారీగా ఏఈవోలు సందర్శించి రైతులను వ్యక్తిగతంగా కలిసి వారి వద్ద నుంచి వివరాలను తీసుకుంటారని తెలిపారు. ఎవరైనా రైతులు కంపెనీ, ఆర్గనైజర్ ద్వారా నష్టపోతే నష్టాన్ని అంచనా వేసి వారికి పరిహారం చెల్లించాలని కంపెనీ ఆర్గనైజర్లను ఆదేశించారు. భవిష్యత్‌లో ఎటువంటి లిఖిత పూర్వక ఒప్పందాలు లేకుండా కంపెనీలు పంట సాగు చేయిస్తే ఆ కంపెనీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కంపెనీ ఆర్గనైజర్లతో రైతులు ఇబ్బందులు పడుతుంటే తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మిరాజయ్య, డీఏఓ సురేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి
● డీఎంహెచ్ఓ గోపాల్‌రావు ములుగు రూరల్: ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా వైద్యాధికారి గోపాల్‌రావు అన్నారు. ఈ మేరకు మంగళవారం రాయినిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని జాకారం ఆయుష్మాన్ మందిర్‌ను జాతీయ నాణ్యత ప్రమాణాల వర్చువల్ అసెస్మెంట్ కార్యక్రమంలో భాగంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ నాణ్యత ప్రమాణాల సర్టిఫికేషన్ పొందడం వల్ల ఆరోగ్య కేంద్రంలో సదుపాయాలు, ప్రజలకు నాణ్యతతో కూడిన వైద్యం అందుతుందన్నారు. ఆయుష్మాన్ మందిర్‌లో సమన్వయంతో పనిచేస్తున్న సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ విపిన్‌కుమార్, జిల్లా అసంక్రమిత వ్యాధుల నియంత్రణాధికారి పవన్‌కుమార్, ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీకాంత్, పీహెచ్సీ వైద్యాధికారి ప్రసాద్, వైద్యుడు నాగ అన్వేష్, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. -
‘ఎమ్మెల్సీ’ పోలింగ్‌కు సర్వం సిద్ధం
ములుగు: నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు జిల్లాలో ఏర్పాట్లను పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 9 పోలింగ్ కేంద్రాలను 6రూట్లుగా విభజించారు. నాలుగు స్ట్రైకింగ్, రెండు స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సును ఏర్పాటు చేశారు. ప్రతీ పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. 200 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో 628మంది ఉపాధ్యాయులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ నెల 27న ఉదయం 8నుంచి సాయంత్రం 4గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఇప్పటికే పోలింగ్ విధులకు హాజరయ్యే పీఓలు, ఏపీఓలు, ఓపీఓలకు మాస్టర్ ట్రైనర్ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. నేడు పోలింగ్ అధికారులు, సిబ్బందికి సంబంధిత సామగ్రిని అందజేయనున్నారు. అక్కడ నుంచి ప్రత్యేక వాహనాల్లో బ్యాలెట్ బాక్సులతో సాయంత్రానికి అధికారులు పోలింగ్ కేంద్రానికి చేరుకుంటారు. పోలింగ్ కేంద్రాల వివరాలు మండలం పోలింగ్ కేంద్రం ఓటర్లు ములుగు ప్రభుత్వ జూనియర్ కళాశాల 193 వెంకటాపురం(ఎం) జెడ్పీహెచ్ఎస్ 40 గోవిందరావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల 108 ఎస్‌ఎస్‌తాడ్వాయి ఏహెచ్ఎస్ బాలికల పాఠశాల 65 ఏటూరునాగారం జెడ్పీహెచ్ఎస్ 46 కన్నాయిగూడెం ఆశ్రమ పాఠశాల 19 మంగపేట జెడ్పీహెచ్ఎస్ 95 వాజేడు జెడ్పీ ఎస్ఎస్ పదోతరగతి గది 33 వెంకటాపురం(కె) జెడ్పీహెచ్ఎస్ 29●పోలింగ్ కేంద్రం పరిశీలన మంగపేట: మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ సీఐ అనుముల శ్రీనివాస్‌తో కలిసి మంగళవారం సాయంత్రం పరిశీలించారు. పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. ఓటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి సూచనలు చేశారు. ఆయన వెంట ఎస్సై టీవీఆర్ సూరి ఉన్నారు. జిల్లాలో 9 పోలింగ్ కేంద్రాలు.. 628 మంది ఓటర్లు కలెక్టరేట్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు రేపు ఉదయం 8నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ -
బుధవారం శ్రీ 26 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
వాజేడు: విద్యుత్ దీపాల వెలుగులో ప్రగళ్లపల్లిలోని శివాలయం రామప్ప దేవాలయంజిల్లాలో మహాశివరాత్రి వేడుకలను పురస్కరించుకుని శైవ క్షేత్రాలను ముస్తాబు చేశారు. నేడు(బుధవారం) భక్తులు తరలివచ్చి పరమశివుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. ఈ మేరకు పలు ఆలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన రామప్ప ఆలయంలో మూడు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలను విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ సంపత్‌రావు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఏర్పాట్లను పరిశీలించారు. అదే విధంగా నేటి నుంచి జరిగే ఉత్సవాలకు ముందే మంగళవారం పర్యాటకులు, విద్యార్థులు, భక్తులు అధికసంఖ్యలో రామప్పకు తరలివచ్చి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు హరీశ్ శర్మ, ఉమాశంకర్, రాజ్‌కుమార్‌లు పర్యాటకులకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. అనంతరం రామప్ప సరస్సును సందర్శించి బోటులో షికారు చేస్తూ సరస్సు అందాలను తిలకించారు. – వెంకటాపురం(ఎం)/వాజేడుశైవక్షేత్రాలకు.. మహాశివరాత్రి శోభన్యూస్రీల్ -
ఆదివాసీగూడేల్లో మౌలిక వసతులు కల్పించాలి
ములుగు రూరల్: జిల్లాలోని వలస ఆదివాసీగూడేల్లో మౌలిక వసతులు కల్పించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి గొంది రాజేష్ అన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట వలస ఆదివాసీలతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 20 సంవత్సరాలుగా వలస ఆదివాసీలు 68 గూడాలను ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నారన్నారు. నివాస ప్రాంతాల్లో కరెంటు, మంచి నీటి సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేతి పంపులు నీరు ఫ్లోరైడ్ కారణంగా తాగడానికి వీలులేకుండా ఉన్నాయన్నారు. వన్యప్రాణాలు సంరక్షణకు అనేక చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వాలు ఆదివాసీలను గుర్తించకపోవడం బాధాకరమన్నారు. ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు దుగ్గి చిరంజీవి, శోభన్, చంటి, దేవయ్య, సోమేష్, దేవేందర్, గంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్సీ రేసులో ఎవరెవరు?
కాంగి‘రేసు’లో పలువురు... సోమవారం నుంచే మొదలైన పైరవీలు.. వరంగల్ ఉమ్మడి జిల్లానుంచి ఎమ్మెల్సీలతోపాటు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ల కోసం పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే పోటీ పడుతున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్లు దక్కని వారికి ప్రాధాన్యత ఇస్తామని ఎన్నికల సందర్భంగా పలువురికి టీపీసీసీ భరోసా ఇచ్చింది. ప్రధానంగా ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా వేం నరేందర్‌రెడ్డి, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్లుగా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి, బెల్లయ్యనాయక్, ఐత ప్రకాష్‌రెడ్డి తదితరులకు.. కుడా చైర్మన్‌గా ఇనుగాల వెంకట్రాం రెడ్డిలకు అధిష్టానం అవకాశం కల్పించింది. ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ రేసునుంచి తప్పుకోవడంతో పాటు సీనియర్లుగా ఉన్న పలువురు ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నారు. సోమవారం నుంచే కొందరు ఆశావహులు ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్, మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా పైరవీలు మొదలెట్టారు. ఉమ్మడి వరంగల్ నుంచి దొమ్మాటి సాంబయ్య, హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, సింగాపురం ఇందిర తదితరులు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని అధిష్టానాన్ని కోరుతున్నట్లు తెలిసింది. అలాగే రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్లుగా పదవుల పొందిన వారిలో ముగ్గురు కూడా ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇవ్వాలని అడుగుతున్నట్లు తెలిసింది. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ పదవి ఉమ్మడి వరంగల్‌కు దక్కుతుందా? ఒకవేళ ఇస్తే ఎవరికి? అనే అంశాలు తేలనున్నాయన్న చర్చ జరుగుతోంది.సాక్షిప్రతినిధి, వరంగల్ : ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. ఇదే సమయంలో వెలువడిన ఎమ్మెల్యే కోటా శాసనమండలి సభ్యుల ఎన్నికల నగారా మోగింది. మార్చి 3న నోటిఫికేషన్, 20న పోలింగ్ ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పుడు ఆ ఎన్నికలపై దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా ఐదు స్థానాలకు జరిగే ఎన్నికల సందర్భంగా ఇప్పుడున్న శాసనసభ్యుల సంఖ్య ప్రకారం బీఆర్ఎస్ తిరిగి ఒక్కస్థానం లభించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ అధినేత ఈ ఐదుగురిలో మళ్లీ ఎవరికి ఛాన్స్ ఇస్తారు? ఉమ్మడి వరంగల్‌కు చెందిన సత్యవతి రాథోడ్ మళ్లీ అవకాశం ఉంటుందా? మరో సీనియర్‌కు అవకాశం కల్పిస్తారా? అన్న చర్చ ఆ పార్టీలో మొదలైంది. ఇదే సమయంలో కాంగ్రెస్‌కు నాలుగు ఎమ్మెల్సీలు దక్కే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ పార్టీలో ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ టికెట్ రేసులో ఉండి.. అధిష్టానం హామీతో సీటు త్యాగం చేసిన ఆ పార్టీ సీనియర్లు ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నారు. బీఆర్ఎస్ కోటాలో ఎర్రబెల్లి దయాకర్‌రావు పేరు? ఎమ్మెల్యేల సంఖ్యాపరంగా చూస్తే ఈసారి కాంగ్రెస్– 4 స్థానాలు, బీఆర్ఎస్–1 స్థానం దక్కించుకునే అవకాశం ఉంది. బీఆర్ఎస్ తరఫున ఎన్నికై న మీర్జా రియాజుల్ హసన్, ఎగ్గే మల్లేశం, మహమూద్ అలీ, శేరి సుభాష్‌రెడ్డి, సత్యవతి రాథోడ్ల పదవీ కాలం మార్చి 29తో ముగియనుండగా.. సోమవారం ఈ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ నేపథ్యంలో ఒక్కస్థానంపై బీఆర్ఎస్లో తీవ్రస్థాయిలో జరుగుతోంది. ఉమ్మడి వరంగల్‌కు చెందిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌కు మళ్లీ ఎమ్మెల్సీ దక్కుతుందా? అన్న చర్చ జరుగుతున్నప్పటికీ... ఏడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా కూడా కొనసాగిన సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు పేరుపై కూడా ప్రధానంగా చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన దయాకర్‌రావు పార్టీ నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావులతో సన్నిహితంగా ఉండటంతోపాటు పలు సందర్భాల్లో పార్టీ కార్యకలాపాల నిర్వహించడం ద్వారా తన ముద్ర వేశారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్‌కు ఎమ్మెల్సీ ఇవ్వదలచుకుంటే ఎర్రబెల్లి దయాకర్‌రావు పేరు కూడా పరిశీలనకు వచ్చే అవకాశం ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది. ఐదు స్థానాల నుంచి ఒకే స్థానంతో సరిపెట్టుకునే పరిస్థితి ఏర్పడటంతో పార్టీ అధినేత కూడా ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉందని అంటున్నారు. ఎమ్మెల్యే కోటా కింద పెద్దలసభకు వెళ్లేదెవరు..? ఉమ్మడి వరంగల్‌లో జోరుగా ఊహాగానాలు సత్యవతి రాథోడ్‌కు మళ్లీ చాన్స్ దక్కేనా.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేరు? కాంగ్రెస్ పార్టీ కోటాలో పెరుగుతున్న ఆశావహలు తెరమీదకు అసెంబ్లీ ఎన్నికల హామీలు.. పావులు కదుపుతున్న సీనియర్లు -
సమన్వయంతో పనిచేయాలి
వెంకటాపురం(ఎం): మహాశివరాత్రిని పురస్కరించుకొని యునెస్కో గుర్తింపు పొందిన రామప్పలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ దివాకర టీఎస్ పేర్కొన్నారు. సోమవారం మండలంలోని చారిత్రాత్మక రామప్ప ఆలయాన్ని ఆయన సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అన్ని శాఖల అధికారులతో రామప్ప గార్డెన్లో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఆయా శాఖల తరఫున చేపట్టిన ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మహాశివరాత్రి సందర్భంగా ఈనెల 26 నుంచి రామప్పకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడంతో పాటు పరిసరాలు శుభ్రంగా ఉండే విధంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్మికులను ఏర్పాటు చేశామన్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా మూడు రోజుల పాటు నిరంతర విద్యుత్ సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. జాగరణ చేసే భక్తుల కోసం రామప్ప పరిసర ప్రాంతాలలో ప్రత్యేక ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశామన్నారు. మూడు రోజుల పాటు సాయంత్రం ఐదు గంటల తర్వాత రామప్ప కట్టపైకి ఎవరిని అనుమతించవద్దని పోలీసు అధికారులను ఆదేశించారు. జాతరకు వచ్చే భక్తుల కోసం వాహనాల పార్కింగ్, మరుగుదొడ్ల ఏర్పాటుతోపాటు తాగునీటిని అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఉత్సవాల సందర్భంగా రామప్పలో చేపట్టిన పనులను, క్యూలైన్లలను పరీశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్ రావు, ఆర్డీఓ వెంకటేష్, డీఎస్పీ రవీందర్, ఎండోమెంట్ ఈఓ శ్రీనివాస్, డీఎంహెచ్ఓ గోపాల్ రావు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ దివాకర -
ఎరుపెక్కిన ఏనుమాముల..
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం మిర్చితో ఎరుపెక్కింది. రైతులు భారీ మొత్తంలో మిర్చిని తీసుకొచ్చారు.– 8లోuమహాశివరాత్రి సందర్భంగా రామప్పను సందర్శించే భక్తులకు అధికారులు అన్ని సౌకర్యాలు కల్పించా రు. రామలింగేశ్వరస్వామిని దర్శించుకునే సాధారణ భక్తులకు, స్వామివారికి అభిషేకాలు నిర్వహించే భక్తులకు వేర్వేరుగా క్యూలైన్లలను ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈఓ బిల్ల శ్రీనివాస్ తెలిపారు. రామప్ప ఆలయం చుట్టూ, గార్డెన్లో, పార్కింగ్ ప్రదేశాల్లో సుమారు 200 ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. ఆలయం చుట్టూ ఆరు సీసీ కెమెరాలను ఏ ర్పాటు చేశారు. ట్రాన్స్‌కో ఏడీఈ వేణుగోపాల్, ఏఈ రమేశ్, సబ్ ఇంజనీర్ సాంబరాజు ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిరంతర విద్యుత్ కోసం ట్రాన్స్ఫార్మర్లకు విద్యుత్ కనెక్షన్లను ఇచ్చారు. డీఎస్పీ రవీందర్ ఆధ్వర్యంలో ఎస్సై జక్కుల సతీష్ సిబ్బందితో కలిసి పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు. 300 మంది పోలీసు సిబ్బందితో బందో బస్తు నిర్వహించనున్నారు. డీపీఓ ఓంటేరు దేవరా జు ఆధ్వర్యంలో ఎంపీఓ శ్రీనివాస్‌తో పాటు పంచా యతీ కార్యదర్శులు రామప్పలో పర్యటిస్తూ శానిటేషన్ పనులు, తాగునీటి వసతి కల్పిస్తున్నారు. ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నట్లు డీఎంహెచ్ఓ గోపాల్‌రావు, డాక్టర్ శ్రీకాంత్‌లు తెలిపారు. 26 నుంచి 28వ తేదీ వరకు ములుగు, హనుమకొండ, పరకాల ప్రాంతాల నుంచి రామప్పకు ఆర్టీసీ బస్సులు నడిపించనున్నారు. వాతావరణం జిల్లాలో ఉదయం ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం ఉక్కపోత, ఎండ ఎక్కువగా ఉంటుంది. రాత్రి చల్లగాలులు వీస్తాయి.భక్తులకు సకల సౌకర్యాలు -
రేషన్ దందా!
రూటు మారిన అటవీమార్గం గుండా బియ్యం తరలింపుగోవిందరావుపేట: అధికారులు, పాలకుల అండతో రేషన్ బియ్యం మాఫియా చెలరేగుతోంది. పేదల క డుపు నింపేందుకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేష న్ బియ్యాన్ని అక్రమార్కులు అటవీమార్గం ద్వారా ఇతర రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తుండగా గోవిందరావుపేట మండలంలోని మొద్దులగూడెం గ్రామంలో రూ.13 లక్షల విలువ చేసే సుమారు 625 క్వింటాళ్ల బియ్యాన్ని పస్రా పోలీసులు పట్టుకున్నారు. మొద్దులగూడెంలో పస్రా ఎస్సై కమలాకర్ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా లారీపై అనుమానం వచ్చి తనిఖీ చేయగా రేషన్ బియ్యం కనిపించాయి. పోలీసుల విచారణలో బియ్యాన్ని నాగపూర్‌కు తరలిస్తున్నట్లుగా తేలింది. ఇలా రూటు మార్చి అటవీ మార్గం మీదుగా పొరుగు రాష్ట్రాలకు లారీల్లో రేషన్ బియ్యం తరలిస్తున్నారు. అడపాదడపా పోలీసుల తనిఖీల్లో అక్రమ వ్యాపారం బయటపడుతుంది. అయినా సంబంధిత శాఖ అధికారులు మాత్రం ప ట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు. అటవీ మార్గం ద్వారా తరలింపు.. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల నుంచి ఇల్లందు, గుండాల మీదుగా మండలంలోని లింగాల, కొడిశాల, మొద్దులగూడెం గ్రామాల మీదుగా జాతీయ రహదారికి రావడానికి దట్టమైన అటవీ ప్రాంతం ఉంటుంది. ఈ ప్రాంతాన్ని సూత్రదారులు ఆసరా చేసుకొని నాగ్‌పూర్‌కి తరలిస్తున్నారు. ఈ దారి మొత్తం అటవీ ప్రాంతంతో నిండి ఉంటుంది. చెకింగ్లు, పోలీస్ పెట్రోలింగ్‌లు తక్కువగా ఉండటంతో దళారులు ఈ మార్గం ద్వారానే బియ్యాన్ని తరలిస్తున్నట్లు తెలస్తుంది. దొరికితే దొంగలు..లేదంటే దొరలు.. గత కొంత కాలంగా సాగుతున్న రేషన్ మాఫియాలో ప్రతీనెల టన్నుల కొద్ది బియ్యం పక్కదారి పడు తున్నాయి. ఈ బియ్యం తరలింపు అడ్డుకునేందుకు ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రత్యేక అధికారులకు, పోలీసులకు అధికారం ఉన్న గోప్యంగా దందా సాగుతుంది. అక్రమార్కులు దొరికితే దొంగలు.. లేదంటే లక్షల సంపాదనతో దొరలు అన్న చందంగా పరిస్థితి మారింది. మండలంలోని కొంతమంది బియ్యం దళారులు, రేషన్ డీలర్లు కుమ్మకై ్క దారి మళ్లిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.మొద్దులగూడెంలో డంప్ చేసి.. రేషన్ బియ్యం ఎగుమతిపై పస్రా పోలీసులు దృష్టి సారించారు. ఇటీవల రెండు లారీలను పట్టుకోవడమే అందుకు నిదర్శనం. గోవిందరావుపేట, తాడ్వాయి మండలాలకు చుట్టూ పక్కల తండాలు, పల్లెలు అధిక సంఖ్యలో ఉండడం, వీటన్నింటికి మొద్దులగూడెం గ్రామం కేంద్రంగా డంప్ చేయడం అక్కడి నుంచి నాగ్‌పూర్‌కు తరలిస్తున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు చాకచక్యంగా పీడీఎ స్ బియ్యాన్ని పట్టుకుంటున్నారు. అయితే ప ట్టుబడిన నిందితులు మహబూబాబాద్, కొత్తగూడెం జిల్లాల నుంచి ఎగుమతి చేస్తున్నామని చెబుతుండటంతో అసలైన సూత్రదారులు ఎవరనేది క్లారిటీ రాకపోవడం శోచనీయం. దళారులు వివిధ గ్రామాల నుంచి బియ్యాన్ని కొనుగోలు చేసి ఒక దగ్గర డంప్ చేసి లారీల ద్వారా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నట్లు సమాచారం. మహబూబాబాద్ టు నాగ్‌పూర్ వయా పస్రా దళారులతో రేషన్ డీలర్ల కుమ్మక్కు పట్టించుకోని సంబంధిత శాఖ అధికారులు నిఘా పెంచిన పస్రా పోలీసులు -
పగిడిద్దరాజు జాతర పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి
ఎస్ఎస్ తాడ్వాయి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలోని యాపలగడ్డలో మార్చి 5 నుంచి 8వ తేదీ వరకు ఆరెం వంశీయుల ఆధ్వర్యంలో జరిగే పగిడిద్దరాజు జాతరను విజయవంతం చేయాలని మంత్రి సీతక్క అన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలో జాతర పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆరెం వంశీయుల ఆధ్వర్యంలో జరిగే పగిడిద్దరాజు జాతరకు రావాలని మేడారం జాతర కమిటీ చైర్మన్ ఆరెం లచ్చుపటేల్ ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్, మాజీ సర్పంచ్ ఇర్ప సునిల్, ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొప్పుల రవి, నాయకులు తాండాల శ్రీనివాస్, అశాడపు మల్లయ్య, ఎనుగంటి నరేష్, తదితరులు పాల్గొన్నారు. నిలిచిన పత్తి కొనుగోళ్లు ములుగు: జిల్లాలో పత్తి కొనుగోలు నిలిపేసినట్లు ప్రత్యేక శ్రేణి కార్యదర్శి (ఎఫ్ఏసీ) ఆర్.శ్రీదేవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సాంకేతిక కారణాలతో పత్తి కొనుగోలు నిలిపేశామని, తిరిగి ఈ నెల 28వ తేదీ నుంచి కొనుగోలు చేస్తామన్నారు. అంగన్వాడీ టీచర్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా సమ్మక్క●ములుగు రూరల్: తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా కె. సమ్మక్క ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి తెలిపారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లో జరిగిన యూనియన్ రాష్ట్ర కమిటీ సమావేశంలో ఈ ఎన్నిక నిర్వహించారన్నారు. తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర, జిల్లా నాయకులకు సమ్మక్క కృతజ్ఞతలు తెలిపారు. సున్నం బట్టి వీధిలో చోరీ వెంకటాపురం(కె): మండల కేంద్రంలోని సున్నం బట్టి వీధిలో ఇంటి తాళాలు పగులగొట్టి చోరీ చేసిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం..సున్నం బట్టి వీధికి చెందిన కృష్ణ అనే వ్యక్తి ఇంట్లో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగల గొట్టి ఇంట్లో బీరువాలోని నల్లపూసల గొలుసు, బంగారు ఆభరణాలు, రూ.10 వేల నగదును చోరీ చేశారు. కృష్ణ కుటుంబ సభ్యులు నాలుగు రోజుల క్రితం పనిమీద ఊరికి వెళ్లడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీ జరిగిందని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. -
ఆదివాసీగూడేల్లో మౌలిక వసతులు కల్పించాలి
ములుగు రూరల్: జిల్లాలోని వలస ఆదివాసీగూడేల్లో మౌలిక వసతులు కల్పించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి గొంది రాజేష్ అన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట వలస ఆదివాసీలతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 20 సంవత్సరాలుగా వలస ఆదివాసీలు 68 గూడాలను ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నారన్నారు. నివాస ప్రాంతాల్లో కరెంటు, మంచి నీటి సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేతి పంపులు నీరు ఫ్లోరైడ్ కారణంగా తాగడానికి వీలులేకుండా ఉన్నాయన్నారు. వన్యప్రాణాలు సంరక్షణకు అనేక చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వాలు ఆదివాసీలను గుర్తించకపోవడం బాధాకరమన్నారు. ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు దుగ్గి చిరంజీవి, శోభన్, చంటి, దేవయ్య, సోమేష్, దేవేందర్, గంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
జియోట్యూబ్స్ లేనట్లే?
ఏటూరునాగారం: మండలంలోని రామన్నగూడెం నుంచి ఏటూరునాగారం గ్రామం వైపు గోదావరి వరద ముంపుకు గురికాకుండా ఉన్న కరకట్ట కోతకు గురవుతూ వస్తుంది. పదేళ్ల నుంచి కరకట్ట పటిష్ట పరచడంలో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపుతోంది. ఏజెన్సీకి కేంద్ర బిందువు అయిన రామన్నగూడెం, ఏటూరునాగారం గ్రామాల కరకట్ట గోదావరి వరదకు ప్రతీ ఏడాది కోతకు గురవుతూ వస్తోంది. అయితే దీనిపై కేంద్ర, రాష్ట్ర ఇరిగేషన్‌శాఖ అసోంలోని బ్రహ్మపుత్ర నదిపై నూతన సాంకేతిక విజ్ఞానంతో కూడిన జియోట్యూబ్స్‌ను ఏర్పాటు చేసి కరకట్ట కోతకు గురికాకుండా చేస్తుందని ప్రణాళిక రూపొందించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిపాలన అనుమతులు కూడా పొందారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ శాఖ ద్వారా రూ.70 కోట్లు కూడా మంజూరు చేసింది. సీఈ పదవీ విరమణతో.. గతంలో పనిచేసిన చీఫ్ ఇంజనీర్ గతేడాది డిసెంబర్లో పదవీ విరమణ పొందడంతో జియోట్యూబ్స్ నిర్మాణ పనులు మూలన పడ్డాయి. కొత్తగా వచ్చిన ఈఎన్సీ, అధికారులకు దీనిపై అవగాహన లేక ముందుకు పోవడం లేదు. ప్రస్తుతం గోదావరి వద్ద నీటిలో మోటార్లను ఏర్పాటు చేసి నీటిని మళ్లీస్తున్నారు. కానీ జియోట్యూబ్ నిర్మాణ పనులు మాత్రం కావడం లేదు. ఈ ఏడాది వర్షాకాలంలో గోదావరి ఉప్పొంగితే రామన్నగూడెం, ఏటూరునాగారానికి రక్షణగా ఉన్న కరకట్ట కొట్టుకుపోయి ప్రాణ, ఆస్తినష్టం జరిగేలా ఉంది. ఈ విషయాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం బాధాకరం. షాంపిల్ అడుగుతున్నారని.. కేంద్ర డిజైనింగ్ ఆఫీస్ (సీడీఓ) అధికారులు ఏటూరునాగారంలోని కరకట్ట కోతకు గురికాకుండా ఉన్న మట్టి (అన్డిస్టబుల్) నమూనాలను సేకరించి పంపించాలని ఆదేశాలు ఇచ్చారు. ఇలాంటి షాంపిల్స్‌ను ఇరిగేషన్‌శాఖ అనేకమార్లు ఇచ్చిందని వాపోతున్నారు. అయినప్పటికీ మళ్లీ షాంపిల్స్ కావాలని కోరడంతో స్థానిక ఈఈ, డీఈఈలు దీనిపై దృష్టి సారించడం లేదు. ఫలితంగా షాంపిల్స్ సీడీఓకు చేరకపోవడంతో జియోట్యూబ్స్ పనులు నిలిచిపోయాయి. మళ్లీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే అన్న చందంగానే మారింది కరకట్ట పునరుద్ధరణ పనులు. దీనిపై కలెక్టర్, మంత్రులు, పాలకులు, ఉన్నతాధికారులు స్పందించి కరకట్ట పటిష్టపై దృష్టి పెట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.కరకట్ట అన్ డిస్టెబుల్ షాంపిల్ కోరిన సీడీఓ అధికారులు గతంలో పంపినా..మళ్లీ కోరుతున్నారని పంపించని స్థానిక అధికారులు చీఫ్ ఇంజనీర్ పదవీ విరమణతో మూలనపడిన పునరుద్ధరణ పనులు -
రామప్ప సిద్ధం
మహాశివరాత్రి వేడుకలకు ముస్తాబైన ఆలయంవెంకటాపురం(ఎం): ప్రపంచ వారసత్వ సంపద కలిగిన రామప్ప దేవాలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని మూడురోజుల పాటు జరిగే మహోత్సవాలకు రామప్ప సిద్ధమైంది. కలెక్టర్ దివాకర టీఎస్, అదనపు కలెక్టర్ సంపత్‌రావు, ఎస్పీ శబరీష్, డీఎస్పీ రవీందర్‌లు ఎప్పటికప్పుడు రామప్పలో జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. రామప్ప ఆలయ తూర్పు ముఖద్వారానికి ఇరువైపులా ఉన్న పిచ్చిమొక్కలను తొలగించి వరదలతో కొట్టుకుపోయిన రోడ్డుపై గ్రావెల్ పోసి వినియోగంలోకి తెచ్చారు. రామప్పను సందర్శించే వీఐపీలతో పాటు రామప్పలో విధులు నిర్వహించే ఉద్యోగులను తూర్పుముఖద్వారం నుంచి అనుమతించనున్నారు. బుధవారం రాత్రి 10గంటలకు వైభవంగా శివపార్వతుల కల్యాణాన్ని ఆలయ అర్చకులు కోమళ్లపల్లి హరీష్‌శర్మ, ఉమాశంకర్‌లు నిర్వహించనున్నారు. శివపార్వతుల కల్యాణాన్ని తిలకించేందుకు సుమారు 60 వేల మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. -
నిండా ముంచిన ‘బాండ్ మక్క’
కన్నాయిగూడెం: మండల పరిధిలోని పలు గ్రామాల్లో బాండ్ మక్క పేరు చెప్పి పంటసాగు చేయించిన ఓ కంపెనీ ప్రతినిధులు నకిలీ విత్తనాలు ఇచ్చి రైతులను నిండా ముంచారు. ఈ ఘటన మండలంలో ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. బాధితుల రైతుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని లక్ష్మీపురం, గుర్రేవుల, బుట్టాయిగూడెం, చింతగూడెం, కంతనపల్లి గ్రామాల్లో సిజెంటా, హైటెక్ కంపెనీలకు చెందిన బాండ్ మక్కను ఆయా కంపెనీల ప్రతినిధులు రైతులకు అందించి 80ఎకరాల్లో సాగు చేయించారు. సాగు సమయంలో ఫిక్స్డ్ రేటుతో పాటు మంచి దిగుబడి వస్తుందని నమ్మించారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంట ఏపుగా పెరిగింది గానీ కంకులకు గింజలు పోయకుండా బెండు మాత్రమే ఉందంటూ రైతులు చెబుతున్నారు. ఈ క్రమంలో కంపెనీ ప్రతినిధులను రైతులు నిలదీయగా కంపెనీ నుంచి నష్టపరిహారం ఇప్పిస్తామని చెప్పి సంచుల్లో వాటిని నింపి పెట్టండి తీసుకెళ్తామని నమ్మబలికి ఇక్కడి నుంచి వెళ్లిపోయి తిరిగి రావడం లేదని వాపోయారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఆయా కంపెనీల ప్రతినిధులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని రైతులు వేడుకుంటున్నారు. పంటచేతికొచ్చినా గింజలు లేకుండా బెండు మాత్రమే ఉంది -
వెదురు మొక్క.. ఆదాయం పక్కా!
వెయ్యి మంది ఎంపిక లక్ష్యంవాజేడు 5,63810,297వెంకటాపురం(కె)6,29110,713వెంకటాపురం(ఎం) 6,83011,887ములుగు10,70818,159మంగపేట6,87411,303గోవిందరావుపేట5,793 9,147ఏటూరునాగారం5,560 9,657మొత్తం55,410 94,187ఏటూరునాగారం: జిల్లాలో పేదరిక నిర్మూలనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ ఈజీఎస్) కింద వెదురు (కంకవనాల) పంట సాగుకు శ్రీకారం చుట్టాయి. నాలుగేళ్ల పంట తర్వాత ఒక్కో మహిళకు రూ.40 వేల నుంచి రూ.ఒక లక్ష వరకు ఆదాయం వచ్చే విధంగా పథకాన్ని రూపొందించారు. ఉపాధి హామీ జాబ్‌కార్డు ఉండి పనికివెళ్లే కూలీలకు ఉచితంగా మొక్కలను అందజేసి వాటిని 15 గుంటల పట్టా భూమిలో సాగు చేయడానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఒక్కో మహిళకు 60మొక్కలు ఈ పథకం కింద ప్రభుత్వం ఒక్కో మహిళకు ఉచితంగా ఈజీఎస్ కింద 60 వెదురు మొక్కలను అందిస్తారు. వాటిని పెంచేందుకు ఒక్కో మొక్కకు రోజుకు రూ.15 వాచ్ అండ్ వాటరింగ్ కింద అందజేస్తారు. ఇలా నాలుగేళ్లు పంట దిగుబడి వచ్చే వరకు అందజేసి ఆ తర్వాత ఎన్జీఓ లేదా ఇతర రాష్ట్రాల్లోని కంపెనీల ద్వారా ఆ వెదరుకు వచ్చిన వేర్లు, కంక కర్రలను కొనుగోలు చేయిస్తారు. ఈ పంట 40ఏళ్ల పాటు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ పంటతో వచ్చే ఆదాయం పేదరిక నిర్మూలనకు దోహదపడడంతో పాటు మహిళల స్వావలంబనకు ఈ పథకం ఎంతో భరోసా ఇవ్వనుంది. అవగాహన కల్పిస్తున్నాం.. పట్టా భూమి ఉన్న వారి కుటుంబాలకు, మహిళలకు అవగాహన కల్పిస్తున్నాం. కంకవనం పంట సాగు వల్ల కలిగే లాభాల గురించి వివరిస్తున్నాం. నాలుగేళ్ల పంట తర్వాత ఆర్థికంగా అనేక లాభాలున్నాయి. మొక్కలను ఉచితంగా అందజేస్తాం. కంకవనం(వెదురు) పంటను కొనుగోలు చేసేందుకు కూడా ఏర్పాటు చేస్తాం. – చరణ్, ఈజీఎస్ ఏపీఓ, ఏటూరునాగారం జిల్లాలో కంకవనం సాగుకు అధికారుల ప్రణాళికలు నాలుగేళ్ల తర్వాత రూ.40 వేల నుంచి రూ.లక్ష ఆదాయం 15 గుంటల పట్టాభూమి ఉన్న ఉపాధి కూలీలు అర్హులు ఈజీఎస్ ద్వారా ఉచితంగా మొక్కల పంపిణీ పైలట్ ప్రాజెక్టు కింద మూడు మండలాలు ఎంపికజిల్లాలోని 15 గుంటల పట్టా భూమి ఉన్న వెయ్యి మంది మహిళలను ఎంపిక చేసేందుకు అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదటగా పైలట్ మండలాలుగా ఏటూరునాగారం, కన్నాయిగూడెం, ఎస్‌ఎస్‌తాడ్వాయి గుర్తించారు. ఆ గ్రామాల వారీగా ఈజీఎస్ అధికారులు కంకవనం మొక్కల పంట సాగుపై అవగాహన కల్పిస్తున్నారు. మొక్కలు నాటే విధానంతో పాటు పలు సూచనలు సలహాలు ఇస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పట్టా భూమి ఉన్న మహిళలు పేర్లను గ్రామ పంచాయతీల్లో నమోదు చేసుకోవాలని అధికారులు టంకా వేయించారు. వ్యవసాయ భూములు ఉన్న మహిళల నుంచి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. -
పులి సంచరిస్తోందంటూ ప్రచారం
మల్హర్: అనుమానాస్పద స్థితిలో ఆవు మృత్యువాతపడిన ఘటన మండలంలోని కాపురం అటవీ ప్రాతంలోని చెరువు శివారులో చోటు చేసుకుంది. మండలంలోని తాడిచర్ల గ్రామానికి చెందిన రఘపతి ఆవు గత శనివారం మేతకు వెళ్లి ఇంటికి రాలేదు. దీంతో రఘుపతి ఆదివారం ఉదయం కాపురం అటవీ ప్రాతంలో గాలించగా.. ఆవు చనిపోయి కనిపించింది. ఆవుపై ఏదో అటవీ జంతువు దాడి చేసినట్లు గుర్తించి, ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. తాడిచర్ల ఫారెస్ట్ సెక్షన్ అధికారి లక్ష్మణ్, సిబ్బంది అక్కడికి చేరుకుని ఆవును పరిశీలించారు. ఆవు కళేబరంపై ఉన్న గాయాలను పరిశీలించారు. ఆవుపై పులి దాడి చేసిందా? లేక ఇతర అటవీ జంతువులేమైనా దాడి చేశాయా? అనే కోణంలో చుట్టు పక్కల పాదముద్రలను పరిశీలించారు. ఇప్పటి వరకు పులికు సంబందించిన పాదముద్రల కానీ.. ఇతర అటవీ జంతువు ఆనవాళ్లు కానీ కనిపించలేదని రేంజర్ రాజేశ్వర్‌రావు తెలిపారు. ఆవు మృతి చెందిన సమీపంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. జంకుతున్న ప్రజలు అనుమానాస్పద స్థితిలో ఆవు చనిపోవడంతో కాపురం అటవీ ప్రాతంలో పులి సంచరిస్తోందని గ్రామాల్లో ప్రచారం జరగుతోంది. గత కొన్ని రోజులుగా మహదేవపూర్ మండలం గోదావరి పరివాహక ప్రాతంలో, కాటారం అడవుల్లో మగపులి సంచరిస్తోంది. పులి అటవీ ప్రాంతాల గుండా కాపురం అటవీ ప్రాతంలోకి వచ్చి ఆవుపై దాడి చేసి చంపిందని గ్రామాల్లో ప్రచారం జరగుతోంది. ఈ అటవీ ప్రాతంలో ఏర్పాటు చేసిన కన్వేయర్ మట్టి రోడ్డు గుండా తాడిచర్ల ఓపెన్‌కాస్ట్ పనులకు నిత్యం కార్మికులు, ఉద్యోగులు ప్రయాణం చేస్తున్నారు. అలాగే.. భూపాలపల్లికి వెళ్లడానికి సైతం వాహనదారులు రహదారిని వినియోగిస్తారు. పులి సంచరిస్తోందని ప్రచారం జరగడంతో రహదారిగుండా ప్రయాణించడానికి వాహనదారులు, పొలాల వద్దకు వెళ్లాడానికి రైతులు జంకుతున్నారు. అనుమానాస్పద స్థితిలో ఆవు మృతిఏన్కపల్లి అడవుల్లో పెద్దపులి కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం ఏన్కపల్లి, కిష్టారావుపేట అటవీ ప్రాంతంలో ఆదివారం పెద్ద పులి సంచరిస్తోంది. గత కొన్ని రోజులుగా మహాదేవపూర్, కాటారం అటవీ ప్రాంతంలో సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. మహదేవపూర్ మండలం పలుగుల ప్రాంతంలో ఓ ఎద్దుపై దాడి చేసిన విషయం తెలిసిందే. శనివారం కాటారం మండలం నస్తురుపల్లి అటవీ ప్రాంతంలో ప్రత్యక్షమైంది. అక్కడి నుంచి ఆదివారం మండలంలోని ఏన్కపల్లి, కిష్టరావుపేట, అటవీ ప్రాంతంలో పులిపాదముద్రలను గుర్తించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఆప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. -
నీళ్లు లేవనడం కాంగ్రెస్ చేతగాని తనం
ఖిలా వరంగల్: రెండు పంటలకు నీళ్లు ఇవ్వాల్సిందిపోయి ‘వరి సాగు చేయొద్దు.. నీళ్లు లేవని చెప్పడం’ కాంగ్రెస్ ప్రభుత్వ చేతగాని తనానికి నిదర్శనమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు. వరంగల్–నల్లగొండ–ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన వరంగల్ బొల్లికుంట ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ఆధ్వర్యాన ఉపాధ్యాయ ఓటర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కృష్ణానదిలో పుష్కలంగా నీళ్లుంటే అప్పనంగా నాడు కేసీఆర్, నేడు రేవంత్‌రెడ్డి ఏపీకి దోచిపెడుతున్నారని ఆరోపించారు. కాశేశ్వరం ప్రాజెక్ట్‌ను 50 శాతం కేసీఆర్ నాశనం చేస్తే.. మిగిలిన 50శాతం కాంగ్రెస్ నాశనం చేస్తున్నదని మండిపడ్డారు. ఇప్పటికే నీళ్లు లేక 7లక్షల ఎకరాల్లో వేసిన వరి పంట ఎండిపోయిందని, యూరియా పుష్కలంగా ఉన్నా పంపిణీ చేసేందుకు ఈ ప్రభుత్వానికి చేత కావడం లేదని ధ్వజమెత్తారు. ఫీజు రీయింబర్స్ మెంట్ అందక చిన్నచిన్న కాలేజీలు అడుక్కునే పరిస్థితి ఉందని, అప్పులు చేసి విద్యా సంస్థలు నడిపించే దుస్థితి వచ్చిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అధికారంలోకి రాగనే గాలికొదిలేస్తున్నదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ 14 నెలల పాలనలో ఆసరా, రైతు భరోసా, రుణమాఫీ అరకొరగానే ఇచ్చారు.. నేటికీ 2లక్షల ఉద్యోగాల భర్తీ లేదు.. టీచర్ల సమస్యలు ఎక్కడివక్కడే ఉన్నాయి.. విద్యావ్యవస్థ అస్తవ్యస్తమైందని అన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు బెన్ఫిట్స్ ఇవ్వలేక కేసీఆర్ 61 ఏళ్లకు ఉద్యోగ విరమణ పెడితే.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం 65 ఏళ్లకు పెంచే యోచనలో ఉందని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు ఖాయమని తెలిసి సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ప్రచారం చేస్తున్నారని, రాహుల్ గాంధీ వచ్చి ప్రచారం చేసినా గెలిచే పరిస్థితి లేదని చెప్పారు. ఉపాధ్యాయులు చైతన్యవంతులై బీజేపీ బలపర్చిన అభ్యర్థి సరోత్తంరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర, జిల్లా నేతలు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, రావు పద్మ, మాజీ ఎమ్మెల్యేలు ధర్మారావు, కొండేటి శ్రీధర్, సత్యపాల్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి, కీర్తిరెడ్డి, విజయ్‌చందర్‌రెడ్డి, డాక్టర్ కాళీప్రసాద్, మల్లాడి తిరుపతిరెడ్డి, బన్న ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ -
గురుకుల ప్రవేశ పరీక్ష ప్రశాంతం
ఏటూరునాగారం/కన్నాయిగూడెం: గురుకుల ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 11గంటల నుంచి ఒంటిగంట వరకు పరీక్షను నిర్వహించారు. ఏటూరునాగారం మండలకేంద్రంలో 349మందికి 343మంది పరీక్షకు హాజరైనట్లు ఏటూరునాగారం గురుకుల క్రీడా పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. విద్యార్థులను తనిఖీ చేసిన తర్వాతే పరీక్ష గదిలోకి పంపించినట్లు వెల్లడించారు. అదే విధంగా కన్నాయిగూడెం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రానికి విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి కలిసి ఆటోలు, ద్విచక్రవాహనాలు, కార్లలో చేరుకున్నారు. పరీక్ష సమయంలో హాల్ టికెట్‌తో పాటు ఆధార్ కార్డు చూపించాలని మొదట కోరగా విద్యార్థుల తల్లిదండ్రులు తీసుకురాలేదని తెలపడంతో సెంటర్లోకి అనుమతించారు. 172 మంది విద్యార్ధులకు 151 మంది మాత్రమే హాజరయ్యారు. -
మహాశివరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలి
వెంకటాపురం(ఎం): ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామప్ప దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 26నుంచి 28 వరకు నిర్వహిచనున్న ఉత్సవాలను విజయవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని మంత్రి ఆదివారం సందర్శించి రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి విలేకర్లతో మాట్లాడారు. రామప్పలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న మహా శివరాత్రి జాతర ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని తెలిపారు. రామప్పకు అదనపు బస్సులు, పారిశుద్ధ్యం, పార్కింగ్, తాగునీటి సరఫరా, హెల్త్ క్యాంప్‌ల ఏర్పాటు, ఫైర్ ఇంజన్ సౌకర్యం వంటి వసతులు కల్పించనున్నట్లు వెల్లడించారు. భక్తుల కోసం 26న రాత్రి 10గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. జాతరకు వచ్చే భక్తులు ఇబ్బందులు పడకుండా పటిష్ట భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రామప్పలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటారని తెలిపారు. అనంతరం రామప్ప సందర్శనకు వచ్చిన పర్యాటకులతో సీతక్క సెల్ఫీలు దిగడంతో పర్యాటకులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్, కాంగ్రెస్ నాయకులు చెన్నోజు సూర్యనారాయణ, మిల్కూరి అయిలయ్య, బైరెడ్డి భగవాన్‌రెడ్డి, బండి శ్రీనివాస్, జంగిలి రవి పాల్గొన్నారు. సేవాలాల్ జయంతికి హాజరుకావాలని ఆహ్వానం ములుగు/ఏటూరునాగారం: ఈ నెల 28న జిల్లాకేంద్రంలో నిర్వహించనున్న సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవానికి హాజరుకావాలని కోరుతూ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ సభ్యులు ఆదివారం మంత్రి సీతక్కను క్యాంపు కార్యాలయంలో కలిసి ఆహ్వాన పత్రికను అందించారు. మంత్రిని కలిసిన వారిలో సేవాలాల్ జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్లు పోరిక సర్వన్‌కుమార్, జయరాం, సీనియర్ సభ్యులు పోరిక మోహన్‌లాల్, కోశాధికారులు సునీల్‌కుమార్, జరుపుల బాలునాయక్, ప్రచార కార్యదర్శులు పాడ్య కుమార్, పోరిక రాహుల్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్కమంత్రిని సన్మానించిన శివాలయ కమిటీ ఏటూరునాగారం మండల కేంద్రంలోని శ్రీ ఉమారామలింగేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 26న శివపార్వతుల కల్యాణం(శివరాత్రి) వేడుకలకు రావాలని ఆలయ కమిటీ చైర్మన్ మడుగూరి ప్రసాద్ మంత్రి సీతక్కను కోరారు. మండల కేంద్రంలోని క్రాస్‌రోడ్డుకు వచ్చిన మంత్రిని కమిటీ చైర్మన్‌తో పాటు నాయకులు, డైరెక్టర్లు కలిసి మంత్రిని సన్మానించి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇర్సవడ్ల వెంకన్న, గుడ్ల దేవేందర్, ఎర్రబెల్లి మనోజ్, వావిలాల ఎల్లయ్య, సర్వ అక్షిత్, సరికొప్పుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
మహాశివరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలి
వెంకటాపురం(ఎం): ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామప్ప దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 26నుంచి 28 వరకు నిర్వహిచనున్న ఉత్సవాలను విజయవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని మంత్రి ఆదివారం సందర్శించి రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి విలేకర్లతో మాట్లాడారు. రామప్పలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న మహా శివరాత్రి జాతర ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని తెలిపారు. రామప్పకు అదనపు బస్సులు, పారిశుద్ధ్యం, పార్కింగ్, తాగునీటి సరఫరా, హెల్త్ క్యాంప్‌ల ఏర్పాటు, ఫైర్ ఇంజన్ సౌకర్యం వంటి వసతులు కల్పించనున్నట్లు వెల్లడించారు. భక్తుల కోసం 26న రాత్రి 10గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. జాతరకు వచ్చే భక్తులు ఇబ్బందులు పడకుండా పటిష్ట భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రామప్పలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటారని తెలిపారు. అనంతరం రామప్ప సందర్శనకు వచ్చిన పర్యాటకులతో సీతక్క సెల్ఫీలు దిగడంతో పర్యాటకులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్, కాంగ్రెస్ నాయకులు చెన్నోజు సూర్యనారాయణ, మిల్కూరి అయిలయ్య, బైరెడ్డి భగవాన్‌రెడ్డి, బండి శ్రీనివాస్, జంగిలి రవి పాల్గొన్నారు. సేవాలాల్ జయంతికి హాజరుకావాలని ఆహ్వానం ములుగు/ఏటూరునాగారం: ఈ నెల 28న జిల్లాకేంద్రంలో నిర్వహించనున్న సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవానికి హాజరుకావాలని కోరుతూ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ సభ్యులు ఆదివారం మంత్రి సీతక్కను క్యాంపు కార్యాలయంలో కలిసి ఆహ్వాన పత్రికను అందించారు. మంత్రిని కలిసిన వారిలో సేవాలాల్ జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్లు పోరిక సర్వన్‌కుమార్, జయరాం, సీనియర్ సభ్యులు పోరిక మోహన్‌లాల్, కోశాధికారులు సునీల్‌కుమార్, జరుపుల బాలునాయక్, ప్రచార కార్యదర్శులు పాడ్య కుమార్, పోరిక రాహుల్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్కమంత్రిని సన్మానించిన శివాలయ కమిటీ ఏటూరునాగారం మండల కేంద్రంలోని శ్రీ ఉమారామలింగేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 26న శివపార్వతుల కల్యాణం(శివరాత్రి) వేడుకలకు రావాలని ఆలయ కమిటీ చైర్మన్ మడుగూరి ప్రసాద్ మంత్రి సీతక్కను కోరారు. మండల కేంద్రంలోని క్రాస్‌రోడ్డుకు వచ్చిన మంత్రిని కమిటీ చైర్మన్‌తో పాటు నాయకులు, డైరెక్టర్లు కలిసి మంత్రిని సన్మానించి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇర్సవడ్ల వెంకన్న, గుడ్ల దేవేందర్, ఎర్రబెల్లి మనోజ్, వావిలాల ఎల్లయ్య, సర్వ అక్షిత్, సరికొప్పుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు చేయాలి
ములుగు రూరల్: పత్తి పంటను సీసీఐ ద్వారా కొనుగోలు చేసి క్వింటాకు రూ.25వేలు ధర చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి.అమ్జద్‌పాషా అన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో మంత్రి సీతక్కకు ఆయన ఆదివారం వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో సుమారు 20వేల ఎకరాల్లో పత్తి పంటసాగు అయిందని తెలిపారు. సీసీఐ రెండు నెలలుగా కొనుగోలు చేసి వారం నుంచి కొనుగోళ్లు చేయడం లేదని తెలిపారు. వెంటనే సీసీఐ ద్వారా కొనుగోళ్లు చేపట్టాలని కోరారు. అదే విధంగా మిర్చిని మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి క్వింటాకు రూ.25వేలు చెల్లించాలన్నారు. మంత్రిని కలిసిన వారిలో నాయకులు బోడ రమేష్, గొంది సాంబయ్య, తిరుపతి, రామయ్య పాల్గొన్నారు. రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అమ్జద్‌పాషా -
వెదురు మొక్క.. ఆదాయం పక్కా!
వెయ్యి మంది ఎంపిక లక్ష్యంవాజేడు 5,63810,297వెంకటాపురం(కె)6,29110,713వెంకటాపురం(ఎం) 6,83011,887ములుగు10,70818,159మంగపేట6,87411,303గోవిందరావుపేట5,793 9,147ఏటూరునాగారం5,560 9,657మొత్తం55,410 94,187ఏటూరునాగారం: జిల్లాలో పేదరిక నిర్మూలనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ ఈజీఎస్) కింద వెదురు (కంకవనాల) పంట సాగుకు శ్రీకారం చుట్టాయి. నాలుగేళ్ల పంట తర్వాత ఒక్కో మహిళకు రూ.40 వేల నుంచి రూ.ఒక లక్ష వరకు ఆదాయం వచ్చే విధంగా పథకాన్ని రూపొందించారు. ఉపాధి హామీ జాబ్‌కార్డు ఉండి పనికివెళ్లే కూలీలకు ఉచితంగా మొక్కలను అందజేసి వాటిని 15 గుంటల పట్టా భూమిలో సాగు చేయడానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఒక్కో మహిళకు 60మొక్కలు ఈ పథకం కింద ప్రభుత్వం ఒక్కో మహిళకు ఉచితంగా ఈజీఎస్ కింద 60 వెదురు మొక్కలను అందిస్తారు. వాటిని పెంచేందుకు ఒక్కో మొక్కకు రోజుకు రూ.15 వాచ్ అండ్ వాటరింగ్ కింద అందజేస్తారు. ఇలా నాలుగేళ్లు పంట దిగుబడి వచ్చే వరకు అందజేసి ఆ తర్వాత ఎన్జీఓ లేదా ఇతర రాష్ట్రాల్లోని కంపెనీల ద్వారా ఆ వెదరుకు వచ్చిన వేర్లు, కంక కర్రలను కొనుగోలు చేయిస్తారు. ఈ పంట 40ఏళ్ల పాటు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ పంటతో వచ్చే ఆదాయం పేదరిక నిర్మూలనకు దోహదపడడంతో పాటు మహిళల స్వావలంబనకు ఈ పథకం ఎంతో భరోసా ఇవ్వనుంది. అవగాహన కల్పిస్తున్నాం.. పట్టా భూమి ఉన్న వారి కుటుంబాలకు, మహిళలకు అవగాహన కల్పిస్తున్నాం. కంకవనం పంట సాగు వల్ల కలిగే లాభాల గురించి వివరిస్తున్నాం. నాలుగేళ్ల పంట తర్వాత ఆర్థికంగా అనేక లాభాలున్నాయి. మొక్కలను ఉచితంగా అందజేస్తాం. కంకవనం(వెదురు) పంటను కొనుగోలు చేసేందుకు కూడా ఏర్పాటు చేస్తాం. – చరణ్, ఈజీఎస్ ఏపీఓ, ఏటూరునాగారం జిల్లాలో కంకవనం సాగుకు అధికారుల ప్రణాళికలు నాలుగేళ్ల తర్వాత రూ.40 వేల నుంచి రూ.లక్ష ఆదాయం 15 గుంటల పట్టాభూమి ఉన్న ఉపాధి కూలీలు అర్హులు ఈజీఎస్ ద్వారా ఉచితంగా మొక్కల పంపిణీ పైలట్ ప్రాజెక్టు కింద మూడు మండలాలు ఎంపికజిల్లాలోని 15 గుంటల పట్టా భూమి ఉన్న వెయ్యి మంది మహిళలను ఎంపిక చేసేందుకు అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదటగా పైలట్ మండలాలుగా ఏటూరునాగారం, కన్నాయిగూడెం, ఎస్‌ఎస్‌తాడ్వాయి గుర్తించారు. ఆ గ్రామాల వారీగా ఈజీఎస్ అధికారులు కంకవనం మొక్కల పంట సాగుపై అవగాహన కల్పిస్తున్నారు. మొక్కలు నాటే విధానంతో పాటు పలు సూచనలు సలహాలు ఇస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పట్టా భూమి ఉన్న మహిళలు పేర్లను గ్రామ పంచాయతీల్లో నమోదు చేసుకోవాలని అధికారులు టంకా వేయించారు. వ్యవసాయ భూములు ఉన్న మహిళల నుంచి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. -
గొత్తికోయలను మోసం చేసిన అటవీశాఖ అధికారి
ఏటూరునాగారం: గొత్తికోయల భూమిని వేరొకరి వద్ద డబ్బులు తీసుకుని వారిపేరు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాకు ఎక్కించి పోడు భూముల సర్వే బీట్ ఆఫీసర్ మోసం చేశారని రాయిబంధం గ్రామ పెద్దలు పథం జోగయ్య, కిశోర్, వడ్కాపురం సారయ్యలు ఆరోపించారు. మండల కేంద్రంలో ఆదివారం గ్రామ పెద్దలు, బాధితులు విలేకర్లకు వివరాలను వెల్లడించారు. మండల పరిధిలోని చిన్నబోయినపల్లి పరిధిలో గల రాయిబంధం గ్రామ శివారులో 25ఏళ్లుగా కాస్తులో పథం పొజ్జయ్య, మడకం సమ్మయ్య, కత్మా గంగయ్య తమకున్న నాలుగు ఎకరాల భూమిని సాగుచేసుకుంటున్నారని తెలిపారు. ఈ క్రమంలో 2023లో పోడు భూముల సర్వే బీట్ ఆఫీసర్ రాజేష్ పెద్ద వెంకటాపురం గ్రామానికి చెందిన గిరిజన మహిళ కబ్బాక నీలమ్మ వద్ద డబ్బులు తీసుకుని గొత్తికోయలకు చెందిన భూమిని ఆమె పేరుపై ఆర్ఓఎఫ్ఆర్ పట్టాకు ఎక్కించారని ఆరోపించారు. దీనిపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి బాధిత రైతులకు న్యాయం చేయాలని వారు కోరారు. జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప్రభాకర్ ఎంపిక ఏటూరునాగారం: జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆదివాసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కోటే రవి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొమురం ప్రభాకర్‌ను ఎంపిక చేసి నియామక పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రవి, పొదెం కృష్ణప్రసాద్, వీరయ్య, మంకిడి రవి, భాస్కర్, చందా మహేష్ తదితరులు పాల్గొన్నారు. 13 ఇసుక లారీలు సీజ్ ఏటూరునాగారం: మండల పరిధిలోని చిన్నబోయిన్నపల్లి వేబ్రిడ్జి వద్ద వాహనాలను ఆదివారం తనిఖీ చేస్తుండగా అధిక లోడుతో వెళ్తున్న 13ఇసుక లారీలను సీజ్ చేసినట్లు ఎస్సై తాజొద్దీన్ తెలిపారు. ఎస్పీ శబరీశ్, ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఆదేశాల మేరకు, సీఐ శ్రీనివాస్ సూచనలతో వాహనాలు తనిఖీ చేపట్టినట్లు తెలిపారు. భద్రాది కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని వీరాపురం ఇసుక రీచ్ నుంచి వస్తున్న 13ఇసుక లారీలను పరిశీలించినట్లు తెలిపారు. ప్రతీ లారీలో టన్నున్నర ఇసుక అధికంగా ఉండడంతో వారిపై కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. అసత్య ఆరోపణలు వెనక్కి తీసుకోవాలిభూపాలపల్లి అర్బన్: సీఎంపీఎఫ్ అక్రమాలపై బీఎంఎస్ నాయకులు చేసిన అసత్య ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పసునూటి రాజేందర్ డిమాండ్ చేశారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2015 సంవత్సరంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉందని ఆసమయంలో సీఎంపీఎఫ్ అక్రమాలు జరిగినట్లు తెలిపారు. అవగహన లేకుండా యూపీఏ హయంలో అక్రమాలు జరిగాయని బీఎంఎస్ నాయకులు ఆరోపణలు చేయడం తగదన్నారు. సమావేశంలో నాయకులు రాజయ్య, రమేశ్ పాల్గొన్నారు. మార్చి 4 నుంచి కేయూ ఎంబీఏ పరీక్షలు కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఎంబీఏ మొదటి సెమిస్టర్ పరీక్షలు మార్చి 4వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఆసిం ఇక్బాల్ తెలిపారు. మార్చి 4, 6,11, 13, 17, 19, 21 తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు ఉంటాయని, మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కాకతీయ.ఏసీ.ఇన్‌లో చూడవచ్చునని సూచించారు. -
ఎయిడ్స్‌పై అవగాహన తప్పనిసరి
● ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ జగదీశ్ ములుగు: హెచ్ఐవీ, ఎయిడ్స్‌పై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ములుగు ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగదీశ్ సూచించారు. ఈ మేరకు కాకతీయ విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మహర్షి విద్యాసంస్థల ఆవరణలో కరస్పాండెంట్ తుమ్మ పిచ్చిరెడ్డి అధ్యక్షతన శనివారం ఎయిడ్స్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ ఈసం నారాయణతో కలిసి డాక్టర్ జగదీశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జగదీశ్ మాట్లాడుతూ అప్రమత్తంగా ఉంటేనే ఎయిడ్స్‌ను నియంత్రించగలమన్నారు. ఈసం నారాయణ మాట్లాడుతూ హెచ్ఐవీ, ఎయిడ్స్ రోజురోజుకు చాపకింద నీరులా విస్తరిస్తుందన్నారు. ఎయిడ్స్‌కు మందులేదని నివారణ ఒక్కటే మార్గం అని సూచించారు. ప్రాజెక్టు అధికారి జ్యోతి మాట్లాడుతూ జిల్లాలో 700మంది ఎయిడ్స్ బాధితులు ఉన్నారని అందులో కేవలం 25శాతం మంది మాత్రమే మందులు వాడుతున్నారని తెలిపారు. ఎన్ఎస్ఎస్ జిల్లా కన్వీనర్ ప్రసన్ కుమార్ మాట్లాడుతూ నేటి యువత డ్రగ్స్‌కు బానిసలు అవుతుండడం బాధాకరం అన్నారు. -
జారి పడగలరు.. జాగ్రత్త..!
వెంకటాపురం(ఎం): ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని ప్రతిరోజూ పర్యాటకులు, విద్యార్థులు సందర్శిస్తుంటారు. ఈ క్రమంలో ఆలయానికి వచ్చిన వారు మిడిల్ ప్లాట్‌ఫాం చివరన కూర్చొని ఫొటోలు దిగుతుంటారు. ఈ ప్లాట్‌ఫాం చుట్టూ రెయిలింగ్ లేకపోవడంతో ఆలయం చుట్టూ ఉన్న శిల్పాలను తిలకించే క్రమంలో, గ్రూపు ఫొటోలు దిగే సమయంలో పర్యాటకులు కిందపడి గాయాలపాలవుతున్నారు. ప్రమాదమని తెలిసిన పర్యాటకులు, పాఠశాలల యాజమాన్యాలు గ్రూప్ ఫొటోల కోసం ప్రాధాన్యత ఇస్తుండడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్లాట్‌ఫాం చుట్టూ రెయిలింగ్ ఏర్పాటు చేసి పర్యాటకులు ప్రమాదాల భారిన పడకుండా పురావస్తుశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని పర్యాటకులు కోరుతున్నారు. -
రోగులకు అందుబాటులో ఉండాలి
ఏటూరునాగారం/కన్నాయిగూడెం: రోగులకు వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గోపాల్‌రావు సూచించారు. మండల పరిధిలోని రొయ్యూరు(చెల్పాక) ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్‌సీలోని రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ పీహెచ్‌సీకి వచ్చే రోగులకు మెరుగైన చికిత్స అందించి మందులు ఇవ్వాలన్నారు. రోగులతో మర్యాదపూర్వకంగా మాట్లాడి వారిలో మనోధైర్యాన్ని నింపాలని సూచించారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీలోని మందుల నిల్వ గది, ల్యాబ్ టెక్నీషియన్ గది, రిజిస్టర్లను పరిశీలించారు. అదే విధంగా కన్నాయిగూడెం మండల కేంద్రంలోని పీహెచ్‌సీని డీఎంహెచ్ఓ ఆకస్మికంగా సందర్శించారు. పీహెచ్సీలో మందులు వివరాలపై ఆరా తీశారు. ల్యాబ్ టెక్నీషన్ గదితో పాటు రికార్డులను, హాజరు పట్టికను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కీటక జనిత వ్యాధుల నియంత్రణ అధికారి చంద్రకాంత్, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ గోపాల్‌రావు -
మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి
● సీపీఐ జిల్లా కార్యదర్శి మలికార్జునరావు వెంకటాపురం(కె): మిర్చి రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి తోట మల్లికార్జునరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల పరిధిలోని మిర్చి రైతులను శనివారం సీపీఐ నాయకులు కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సమస్యలను పట్టించుకోవటం లేదన్నారు. మిర్చి రైతులు ఆరుకాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే ప్రభుత్వం స్పందించి మిర్చి క్విటాకు రూ.26 వేల నుంచి 30 వేల వరకు ధర ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు గడ్డం రామకృష్ణ, శ్యామల సుబ్బారావు, గారాపు వెంకటేశ్వర్లు, సండ్ర నగేష్, శ్రీను, రవి, సారయ్య, కార్తీక్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఇప్పపువ్వు లడ్డూ, న్యాప్కిన్ తయారీపై శిక్షణ పూర్తి
ఏటూరునాగారం: ఐటీడీఏ పరిధిలోని గిరిజన మహిళలకు ఇప్పపువ్వు లడ్డూ, న్యాప్కిన్ తయారీపై రెండు రోజుల శిక్షణను ఉట్నూరు ఐటీడీఏ పరిధిలో ఇచ్చినట్లు జేడీఎం కొండల్రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన శనివారం శిక్షణ వివరాలను వెల్లడించారు. ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా ఆదేశాల మేరకు మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మహాదేవునిగూడెం గ్రామానికి చెందిన 16మంది గిరిజన మహిళలను ఇప్పపువ్వు లడ్డూ తయారీపై అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు. అలాగే ములుగు మండలంలోని జంగాలపల్లికి చెందిన నలుగురు గిరిజన మహిళలకు న్యాప్కిన్ తయారీపై శిక్షణకు ఉట్నూరుకు రెండు రోజుల శిక్షణ, అవగాహన కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తున్నారని తెలిపారు. శిక్షణ పొందిన మహిళలు ఇప్పపువ్వు లడ్డూ, న్యాప్కిన్ తయారీ చేసి ఆర్థికాభివృద్ధి సాధించాలని కోరారు. పోలీసుల అదుపులో గొత్తికోయలు ఏటూరునాగారం: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి మండల పరిధిలోని రామన్నగూడెం, రాంనగర్ ప్రాంతాలకు మిర్చికోతల పనులకు వచ్చిన 15మంది గొత్తికోయలను శనివారం తెల్లవారు జామున పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఎవరైనా ఉన్నారా అని ఆరా తీస్తున్నారు. గొత్తికోయగూడెంతో పాటు గొత్తికోయ గిరిజనుల నుంచి వివరాలను సేకరిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన కూలీలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి వివరాలు కూపిలాగుతున్నారు. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాలకు చెందిన వారు ఏజెన్సీలో ఎక్కడెక్కడ మకాం వేశారని ఆరా తీస్తున్నారు. కూలీలను తీసుకొచ్చే రైతులకు సైతం పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఫాస్టాగ్ నుంచి మినహాయింపు ఏటూరునాగారం: ఏటూరునాగారం మండలంలోని నాలుగు చక్రాల వాహనాలతో పాటు ఆపై వాటికి అటవీశాఖ ఫాస్టాగ్ నుంచి మినహాయింపు ఉంటుందని అటవీశాఖ రేంజ్ అధికారి అబ్దుల్ రెహమాన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏటూరునాగరంలో ఫాస్టాగ్ చెక్ పోస్ట్ అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మండలంలోని కార్లు, టాటా మ్యాజిక్, ఇతర ఫోర్ వీల్స్ వాహనాల యజమానులు వారి వాహనాల వివరాలను ఫారెస్ట్ రేంజ్ అధికారి కార్యాలయంలో తెలపాలని కోరారు. ఆ వాహనాలకు మాత్రమే ఫాస్టాగ్ నుంచి మినహాయింపు ఉంటుందని వివరించారు. ఈ అవశాకాన్ని వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
రామప్పలో మహాశివరాత్రి ఏర్పాట్లు
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని పాలంపేట శివారులో గల రామప్ప దేవాలయంలో ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు మూడు రోజుల పాటు మహాశివరాత్రి మహోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రామప్ప రామలింగేశ్వరస్వామిని క్యూ పద్ధతిలో భక్తులు దర్శించుకునేందుకు ఆలయం ముందు నుంచి నందీశ్వరుని వరకు క్యూలైన్లను ఏర్పాటు చేసి చలువ పందిళ్లు వేస్తున్నట్లు ఆలయ ఈఓ శ్రీనివాస్ తెలిపారు. రామప్ప ఆలయం, గార్డెన్, రామప్ప పరిసర ప్రాంతాల్లో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భక్తులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్సై జక్కుల సతీష్ తెలిపారు. 300మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించడమే కాకుండా ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాలకు వేర్వేరుగా పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. రామప్ప తూర్పు ముఖద్వారం రహదారికి ఇరువైపులా ఉన్న పిచ్చిమొక్కలను గ్రామపంచాయతీ సిబ్బంది శనివారం తొలగించారు. రహదారిని వాటర్ ట్యాంక్ సహాయంతో శుభ్రపరిచారు. రామప్ప గార్డెన్లో భక్తులు సేదతీరేలా గార్డెనింగ్ సిబ్బంది గార్డెన్‌ను అందంగా తీర్చిదిద్దారు. మహాశివరాత్రి ఉత్సవాల కోసం మూడు రోజుల ముందు నుంచే అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తు భక్తులకు వసతులు కల్పిస్తున్నారు. పర్యాటకుల సందడి రామప్ప దేవాలయంలో శనివారం పర్యాటకుల సందడి నెలకొంది. వీకెండ్ కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో తరలివచ్చి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు హరీశ్‌శర్మ, ఉమాశంకర్, రాజ్‌కుమార్‌లు పర్యాటకులకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. రామప్ప ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్‌కుమార్ విద్యార్థులకు వివరించారు. నందీశ్వరుడి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అదేవిధంగా రష్యాకు చెందిన వాల్ రామప్ప ఆలయాన్ని సందర్శించి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. రామప్ప శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు. రామలింగేశ్వరస్వామి దర్శనానికి క్యూలైన్లు 300 మంది పోలీసులతో బందోబస్తు -
ప్రమాదం అంచున ప్రయాణం
● గూడ్స్ వాహనాల్లో పరిమితికి మించి కూలీల తరలింపు ఏటూరునాగారం: మండల పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన రైతులు మిర్చి కోత కోసేందుకు అటవీ గ్రామాల నుంచి గొత్తికోయగూడేలకు చెందిన కూలీలను గూడ్స్ వాహనాల్లో పరిమితికి మించి తరలిస్తున్నారు. దీంతో ఒకరిపై ఒకరు కూర్చొని వాహనాల్లో వెళ్తున్నారు. వాహనదారులు గూడ్స్ వాహనాల్లో జనాలను తరలించొద్దనే నిబంధనలు ఉన్నప్పటికీ విరుద్ధంగా తరలించడం గమనార్హం. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ప్రాణాలపై ఆశలు కూడా ఉండవని ఈ దృశ్యాన్ని చూస్తే అర్ధం అవుతుంది. పోలీసులు, ఆర్టీఏ అధికారులు వాహనదారులు, కూలీలకు, రైతులకు కౌన్సెలింగ్ నిర్వహించి ప్రమాదాలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
రామప్పలో మహాశివరాత్రి ఏర్పాట్లు
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని పాలంపేట శివారులో గల రామప్ప దేవాలయంలో ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు మూడు రోజుల పాటు మహాశివరాత్రి మహోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రామప్ప రామలింగేశ్వరస్వామిని క్యూ పద్ధతిలో భక్తులు దర్శించుకునేందుకు ఆలయం ముందు నుంచి నందీశ్వరుని వరకు క్యూలైన్లను ఏర్పాటు చేసి చలువ పందిళ్లు వేస్తున్నట్లు ఆలయ ఈఓ శ్రీనివాస్ తెలిపారు. రామప్ప ఆలయం, గార్డెన్, రామప్ప పరిసర ప్రాంతాల్లో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భక్తులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్సై జక్కుల సతీష్ తెలిపారు. 300మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించడమే కాకుండా ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాలకు వేర్వేరుగా పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. రామప్ప తూర్పు ముఖద్వారం రహదారికి ఇరువైపులా ఉన్న పిచ్చిమొక్కలను గ్రామపంచాయతీ సిబ్బంది శనివారం తొలగించారు. రహదారిని వాటర్ ట్యాంక్ సహాయంతో శుభ్రపరిచారు. రామప్ప గార్డెన్లో భక్తులు సేదతీరేలా గార్డెనింగ్ సిబ్బంది గార్డెన్‌ను అందంగా తీర్చిదిద్దారు. మహాశివరాత్రి ఉత్సవాల కోసం మూడు రోజుల ముందు నుంచే అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తు భక్తులకు వసతులు కల్పిస్తున్నారు. పర్యాటకుల సందడి రామప్ప దేవాలయంలో శనివారం పర్యాటకుల సందడి నెలకొంది. వీకెండ్ కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో తరలివచ్చి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు హరీశ్‌శర్మ, ఉమాశంకర్, రాజ్‌కుమార్‌లు పర్యాటకులకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. రామప్ప ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్‌కుమార్ విద్యార్థులకు వివరించారు. నందీశ్వరుడి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అదేవిధంగా రష్యాకు చెందిన వాల్ రామప్ప ఆలయాన్ని సందర్శించి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. రామప్ప శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు. రామలింగేశ్వరస్వామి దర్శనానికి క్యూలైన్లు 300 మంది పోలీసులతో బందోబస్తు -
భాగస్వామికి విశ్రాంతినివ్వాలి..
నిత్యం పని ఒత్తిడిలో బిజీగా ఉండే భార్యకు వారాంతపు సెలవు దినంలో విశ్రాంతినివ్వాలి. ఇలా చేయడం వల్ల జీవితభాగస్వామి మానసిక ఒత్తిడికి దూరమవుతుంది. వారాంతపు సెలవు దినంలో ఇంటిపని, గార్డెనింగ్, ఇంటి శుభ్రతలో నిమగ్నమవుతుంటాను. నేనే స్వయంగా పిల్లలకు ఇష్టమైన, ఆరోగ్యకరమైన వంటలు చేసి వడ్డిస్తాను. పిల్లలకు అవసరమైన వస్తువులు కొనిస్తాను. సంతోషంగా గడుపుతాను. – డాక్టర్ బీఆర్ శరవణభవ, ప్రొఫెసర్, హెడ్ ఫార్మ్ డీ, వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, హనుమకొండ -
– హన్మకొండ కల్చరల్
ఉదయం లేచింది మొదలు.. టీ పెట్టివ్వడం నుంచి కూరగాయలు కోయడం, వంట చేయడం. బట్టలు ఆరేయడం.. ఆరేసినవి మడత బెట్టడం. ఇంటిని సర్దడం.. పిల్లలకు స్నానాలు చేయించడం. వారిని చదివించడం.. ఇలా చూడడానికి అన్నీ చిన్న పనులే.. కానీ అవే ఆమె ముఖాన చిరునవ్వులు మొలిపిస్తాయి. ‘ప్రతీ క్షణం నీకోసం నువ్వు.. వారానికి ఒక్కరోజు నీ ఇల్లాలికి ఇవ్వు’ అన్నట్లు ఆదివారం ‘ఇల్లాలి’కి ఇంటి పనుల్లో సాయమందించాల్సిన అవసరం ఉంది. గంపెడు బాధ్యతలతో ఇంటి బండిని నడిపే ఆమెకు వారంలో ఒక్కరోజైనా విశ్రాంతి కావాలంటున్నారు.. ఆదివారం ఇంటి, వంట పనుల్లో పాలు పంచుకుంటే అనుబంధం మరింత పెరిగే అవకాశమూ ఉంది. ఆమె ఆరోగ్యవంతురాలైతే.. ఇంటిల్లిపాదికీ ఆరోగ్యమే. కుటుంబం సక్రమంగా నడవడానికి ఆమే ప్రధాన కారణం. అలాంటి ఇల్లాలికి వారంలో ఒక్కరోజైనా విశ్రాంతి కావాలి. వారాంతంలో భార్య చేసే ఇంటి పనుల్లో ఓ చెయ్యి వేస్తే ఆ ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది. ఆమెకూ విశ్రాంతి దొరుకుతుంది. ఏమి చేయొచ్చంటే.. ● ఇంట్లోని దుమ్ము దులపడం, వాక్యూమింగ్ చేయడం, నేలలను తుడవడం, – బాత్రూం శుభ్రపరచడం, వంటగది శుభ్రపరచడం (పాత్రలు, కౌంటర్‌టాప్‌లు) – కూరగాయలు కోయడం, భోజనం తయారీ –దుస్తులు ఉతికి ఆరబెట్టడం, ఆరాక మడతబెట్టడం, అవసరమైనప్పుడు ఇసీ్త్ర చేయడం. పిల్లల సంరక్షణలో ఇలా.. ● ఆ రోజు పిల్లలకు కూడా సెలవుదినం కావడం వల్ల స్నానం చేయించి దుస్తులు ధరింపజేయాలి. ● హోంవర్క్‌లో సహాయం చేయడం, ఆ రోజు పాఠశాలలో ఏదైనా కార్యక్రమం ఉన్నా హాజరు కావడం. ● ఇంటి ఆవరణలో పెరిగిన పిచ్చిమొక్కలను తొలగించడం, పచ్చిక కోయడం, తోటపని చేయడం.ఆదివారం ప్రత్యేకమైన వంటలు చేస్తారు... నా భర్త ఉద్యోగరీత్యా ఉదయమే వెళ్తారు. ఆదివారం సెలవు కావడంతో నాకు సహాయంగా ఉంటారు. కూరగాయలు తరగడం, బట్టలు ఉతికితే ఆరేయడం, వంటగదిని శుభ్రం చేయడం వంటి పనులు చేస్తారు. మా బాబుకు ఇష్టమైన చికెన్ బిర్యానీ చేసి స్వయంగా వడ్డిస్తారు. – సీత స్వప్న, పోచమ్మకుంట, హనుమకొండ ●ఒక్క రోజు విశ్రాంతి ఇస్తే ఆనందమే భర్త తన కష్టాలను మోస్తున్నాడని, తనకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాడని నమ్మకం ఏర్పడుతుంది. ఇంట్లో భార్యాభర్తల మధ్య కొన్ని అపార్థాలు ఉంటాయి. కుటుంబ పరిస్థితులు, సంఘటనలతో ఇవి తలెత్తుతుంటాయి. వంట చేయడం, దుస్తులు ఉతికి ఆరబెట్టడం వంటి కొన్ని పనులు కలిసి చేయడం వల్ల ఇద్దరి మధ్య మనస్పర్థలు తొలగిపోయే అవకాశం ఉంది. ఇంటిపని మహిళలకే పరిమితమనే భావన నెలకొంది. కానీ, భార్యాభర్తలు ఇంటిపనులు పంచుకోవడం వల్ల దాంపత్యంలో సామరస్యం పెరుగుతుంది. పనులను షేర్ చేసుకున్నప్పుడు త్వరగా పూర్తవుతాయి. మిగిలిన సమయంలో కూర్చుని కబుర్లు చెప్పుకోవచ్చు. ఒకరి అభిప్రాయాలు మరొకరు పంచుకోవచ్చు. అప్పుడు ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గౌరవించడం ప్రారంభిస్తారు. కలిగే ప్రయోజనాలుఇల్లాలిపై ప్రేమను చూపడంలో అతను ఇంటిపనుల్లో చేసే సహాయం కీలకం. ప్రతి పనిని భారంగా తీసుకోకుండా చేస్తున్నప్పుడు భర్త తనను ఎంతగా ప్రేమిస్తున్నాడో, పట్టించుకున్నాడో భార్య అర్థం చేసుకుంటుంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకునేందుకు దోహద పడుతుంది. -
ఇప్పపువ్వు లడ్డూ, న్యాప్కిన్ తయారీపై శిక్షణ పూర్తి
ఏటూరునాగారం: ఐటీడీఏ పరిధిలోని గిరిజన మహిళలకు ఇప్పపువ్వు లడ్డూ, న్యాప్కిన్ తయారీపై రెండు రోజుల శిక్షణను ఉట్నూరు ఐటీడీఏ పరిధిలో ఇచ్చినట్లు జేడీఎం కొండల్రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన శనివారం శిక్షణ వివరాలను వెల్లడించారు. ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా ఆదేశాల మేరకు మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మహాదేవునిగూడెం గ్రామానికి చెందిన 16మంది గిరిజన మహిళలను ఇప్పపువ్వు లడ్డూ తయారీపై అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు. అలాగే ములుగు మండలంలోని జంగాలపల్లికి చెందిన నలుగురు గిరిజన మహిళలకు న్యాప్కిన్ తయారీపై శిక్షణకు ఉట్నూరుకు రెండు రోజుల శిక్షణ, అవగాహన కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తున్నారని తెలిపారు. శిక్షణ పొందిన మహిళలు ఇప్పపువ్వు లడ్డూ, న్యాప్కిన్ తయారీ చేసి ఆర్థికాభివృద్ధి సాధించాలని కోరారు. పోలీసుల అదుపులో గొత్తికోయలు ఏటూరునాగారం: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి మండల పరిధిలోని రామన్నగూడెం, రాంనగర్ ప్రాంతాలకు మిర్చికోతల పనులకు వచ్చిన 15మంది గొత్తికోయలను శనివారం తెల్లవారు జామున పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఎవరైనా ఉన్నారా అని ఆరా తీస్తున్నారు. గొత్తికోయగూడెంతో పాటు గొత్తికోయ గిరిజనుల నుంచి వివరాలను సేకరిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన కూలీలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి వివరాలు కూపిలాగుతున్నారు. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాలకు చెందిన వారు ఏజెన్సీలో ఎక్కడెక్కడ మకాం వేశారని ఆరా తీస్తున్నారు. కూలీలను తీసుకొచ్చే రైతులకు సైతం పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఫాస్టాగ్ నుంచి మినహాయింపు ఏటూరునాగారం: ఏటూరునాగారం మండలంలోని నాలుగు చక్రాల వాహనాలతో పాటు ఆపై వాటికి అటవీశాఖ ఫాస్టాగ్ నుంచి మినహాయింపు ఉంటుందని అటవీశాఖ రేంజ్ అధికారి అబ్దుల్ రెహమాన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏటూరునాగరంలో ఫాస్టాగ్ చెక్ పోస్ట్ అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మండలంలోని కార్లు, టాటా మ్యాజిక్, ఇతర ఫోర్ వీల్స్ వాహనాల యజమానులు వారి వాహనాల వివరాలను ఫారెస్ట్ రేంజ్ అధికారి కార్యాలయంలో తెలపాలని కోరారు. ఆ వాహనాలకు మాత్రమే ఫాస్టాగ్ నుంచి మినహాయింపు ఉంటుందని వివరించారు. ఈ అవశాకాన్ని వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
నవ్వులు విరియాలంటే..
ఆదివారం శ్రీ 23 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025ఆమె ఆరోగ్యవంతురాలైతే.. ఇంటిల్లిపాదికీ ఆరోగ్యమే. కుటుంబం సక్రమంగా నడవడానికి ఆమే ప్రధాన కారణం. అలాంటి ఇల్లాలికి వారంలో ఒక్కరోజైనా విశ్రాంతి కావాలి. వారాంతంలో భార్య చేసే ఇంటి పనుల్లో ఓ చెయ్యి వేస్తే ఆ ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది. ఆమెకూ విశ్రాంతి దొరుకుతుంది. ఉదయం లేచింది మొదలు.. టీ పెట్టివ్వడం నుంచి కూరగాయలు కోయడం, వంట చేయడం. బట్టలు ఆరేయడం.. ఆరేసినవి మడత బెట్టడం. ఇంటిని సర్దడం.. పిల్లలకు స్నానాలు చేయించడం. వారిని చదివించడం.. ఇలా చూడడానికి అన్నీ చిన్న పనులే.. కానీ అవే ఆమె ముఖాన చిరునవ్వులు మొలిపిస్తాయి. -
చిరుతల రామాయణం ప్రదర్శన
కాళేశ్వరం: మహాదేవపూర్ మండలం మద్దులపల్లిలో ఐదు రోజులుగా నిర్వహిస్తున్న చిరుతల రామాయణం శనివారంతో ముగిసింది. పల్లెల్లో పౌరాణిక నాటకాలు, ప్రదర్శనలు అంతరించిపోతున్న తరుణంలో పల్లె వాతావరణంలో రామాయణ ఘట్టంలోని పాత్రలకు తగిన వేషాలను వేసుకొని ప్రదర్శనను గ్రామస్తులు నిర్వహించారు. రామ,లక్ష్మణులు లంకపై దాడిచేసి రావణాసూరుడిని హతమార్చి లంకలో ఉన్న సీతను తీసుకొచ్చిన సన్నివేశాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం పట్టాభిషేక ఘట్టం నిర్వహించారు. ఈ సన్నివేశాన్ని చూడడానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మద్దులపల్లికి తరలివచ్చారు. -
వాహనాలకు అటవీశాఖ ఫాస్టాగ్
ఏటూరునాగారం: రాష్ట్రంలో మొదటిసారిగా ములుగు జిల్లాలో ఫాస్టాగ్ తరహాలో వాహనాలకు అటవీశాఖ ఆధ్వర్యంలో రుసుం వసూలు చేసే కా ర్యక్రమానికి శుక్రవారం ఫారెస్టు డివిజనల్ అధికారి(ఎఫ్డీఓ) రమేశ్ ట్రయల్‌రన్ నిర్వహించారు. ఇందులో భాగంగా అటవీశాఖ చెక్‌పోస్టు వద్ద ఫాస్టాగ్ తరహాలో వాహనాలకు ఆటోమెటిక్‌గా రుసుం చె ల్లించేలా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపా రు. ఏటూరునాగారం, పస్రా, తాడ్వాయి ప్రాంతా ల్లో ఈ తరహా చెక్‌పోస్టులు ఏర్పాటు చేయగా ఏటూరునాగారంలో శుక్రవారం అటవీశాఖ ఫాస్టాగ్‌ను ట్రయల్ రన్ చేపట్టి రుసుం వసూలు చేశారు. గూడ్స్ వాహనాలకు రూ.200, కార్లకు రూ.50, ఇతర వాహనాలకు వేర్వేరుగా రుసుం ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఆటోమెటిక్‌గా వాహనదారుడి ఖాతాల నుంచి అటవీశాఖ ఖాతాలోకి జమకావడం రాష్ట్రంలో మొదటిసారి ములుగు జిల్లాలో చేపట్టడం విశేషం. ట్రయల్ రన్ నిర్వహించిన ఎఫ్డీఓ రమేశ్ జిల్లాలో మూడు ఏర్పాటు -
‘రామప్ప’ను సందర్శించిన ఆర్కియాలజీ విద్యార్థులు
వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రాత్మక రామప్ప దేవాలయాన్ని పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ ఇనిస్టిట్యూబ్ ఆఫ్ ఆర్కియాలజీ (2023–25 బ్యాచ్) కు చెందిన 22 మంది విద్యార్థులు శుక్రవారం సందర్శించారు. గ్రేటర్ నోయిడాలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు శిక్షణలో భాగంగా కేంద్ర పురావస్తుశాఖ ఆధ్వర్యంలో తెలంగాణలో మూడు రోజులపాటు పర్యటించనున్నారు. శుక్రవారం రామప్ప ఆలయాన్ని సందర్శించి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం రామప్ప ఆలయ విశిష్టత, కాకతీయుల చరిత్ర, రామప్ప ఆలయ నిర్మాణశైలి, ఆలయ ప్రత్యేకతలు పురావస్తుశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట కేంద్ర పురావస్తుశాఖ అధికారులు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ ఆశీష్ రంజన్ సాహూ, సీనియర్ ఫొటోగ్రాఫర్ సుభాష్ చంద్, అసిస్టెంట్ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ సాయికృష్ణ, వరంగల్ ఇన్చార్జ్ నవీన్‌కుమార్, గార్డెన్ ఇన్చార్జ్ ప్రదీప్‌బాబు ఉన్నారు. నీటిసరఫరాపై ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్ ములుగు: గ్రామీణ ప్రాంతాల్లో మిషన్ భగీరథ నీటిసరఫరా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ 1800 5994007ను ఏర్పాటు చేసినట్లు మిషన్ భగీరథ ఇంట్రా డివిజన్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ సీహెచ్ సుభాష్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. టోల్ ఫ్రీ నంబర్ 24/7 అందుబాటులో ఉంటుందని జిల్లా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నిర్మోహమాటంగా ఫిర్యాదు చేయొచ్చని సూచించారు. ఫిర్యాదులపై స్పందించి, సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పీడీఎస్ బియ్యం స్వాధీనం గోవిందరావుపేట: అక్రమంగా తరలిస్తున్న 323 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టుకున్నట్టు పస్రా ఎస్సై కమలాకర్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని మొద్దులగూడెం గ్రామ శివారులో శుక్రవారం పస్రా ఎస్సై కమలాకర్ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అనుమానంతో ఓ లారీని తనిఖీ చేసి పీడీఎస్ బియ్యం తరలిస్తున్నట్లు గుర్తించారు. లారీలో ఉన్న పీడీఎస్ బియ్యం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం, లచ్చగూడేకి చెందిన బత్తుల రాజుకు చెందినవిగా అదే మండలానికి చెందిన డ్రైవర్ వల్లెపు బంగారి అంగీకరించినట్లు ఎస్సై తెలిపారు. ఇల్లందు చుట్టు పక్కల గ్రామాల నుంచి తక్కువ ధరకు బియ్యం సేకరించి మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. బియ్యం విలువ సుమారుగా రూ.6,47,000 ఉంటుందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై కమలాకర్ వెల్లడించారు. ఆశ్రమ పాఠశాల తనిఖీ ఏటూరునాగారం: మండలంలోని ఆశ్రమ పాఠశాలలు, కళాశాలలు, తాడ్వాయిలోని కళాశాల, ఆశ్రమ పాఠశాలను ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా శుక్రవారం రాత్రి 10 గంటల తర్వాత ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి, వసతి గదులు, స్టాక్ రూమ్, భోజన మెనూ పరిశీలించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. టెన్త్, ఇంటర్ పరీక్షల్లో విద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. తరగతి గదుల్లో, వసతి గృహాల్లో విద్యుత్ సమస్యలు, ఇతర మరమ్మతులు ఉంటే వెంటనే నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కిటికీలు, దర్వాజలకు డోర్లను అమర్చాలన్నారు. వార్డెన్లు విద్యార్థులకు అందుబాటులో ఉండాలని, నిర్లక్ష్యం చేయొద్దని హెచ్చరించారు. ఆమె వెంట డీడీ పోచం ఉన్నారు. -
ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
ములుగు: ఈ నెల 27వ తేదీన జరగనున్న నల్గొండ–ఖమ్మం–వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి సూచించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం వీడియో కాన్పరెన్స్ నిర్వహించి తగిన సూచనలు చేశారు. జిల్లా నుంచి కలెక్టర్ దివాకర టీఎస్, ఓఎస్డీ మహేష్ బీ గీతే, ఆర్డీఓ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ములుగు జిల్లాలో పోలింగ్ స్లిప్పుల పంపిణీ 70 శాతం పూర్తికాగా.. శనివారం వరకు 100 శాతం పూర్తి చేస్తామని అన్నారు. మొత్తం 9 పోలింగ్ కేంద్రాల్లో 12 మంది పీఓలు, 12 మంది ఏపీఓలు, 12 మంది ఓపీఓలు, 11 మంది మైక్రో అబ్జర్వర్లు విధులు నిర్వహిస్తారని తెలిపారు. అధికారులు, సిబ్బందికి మొదటి, రెండో విడత శిక్షణ పూర్తి చేసినట్లు చెప్పారు. కలెక్టరేట్లో రిసెప్షన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. మెటీరియల్ రవాణాకు రెండు రూట్లను ఏర్పాటు చేశామని అన్నారు. పొరపాట్లు లేకుండా ఎన్నికలు నిర్వహించాలి నల్గొండ–ఖమ్మం–వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. 27వ తేదీన నిర్వహించే పోలింగ్ ప్రక్రియపై పీఓలు, ఏపీఓలు, మైక్రో అబ్జర్వర్లకు ఇచ్చిన శిక్షణ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనలు, విధులపై అవగాహ న కలిగి ఉండాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని అన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల పోలింగ్ పక్రియ భిన్నంగా ఉంటుందని అన్నారు. బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఈ పోలింగ్‌కు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుందన్నారు. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ఓటింగ్ ఉంటుందని క్యూ లో ఉండేవారికి టోకెన్లు అందించాలని అన్నారు. ఎన్నికల కేంద్రానికి వెళ్లే ముందు చెక్‌లిస్ట్ ఆధారంగా మెటిరీయల్ అందిందా.. లేదా.. సరిచూసుకోవాలని అన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రంలోకి సెల్‌ఫోన్‌కు అనుమతి లేదని అన్నారు. ఎన్నికల తతంగం ముగిసిన వెంటనే ప్రిసైడింగ్ అధికారులు నల్గొండ జిల్లాకేంద్రంలోని రిసెప్షన్ కేంద్రానికి బ్యాలెట్ బాక్సులను భద్రత మధ్య తరలించాలని అన్నారు. అనంతరం మాస్టర్ ట్రైనర్ హమీద్ పవర్‌పాయింగ్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ అల్లం రాజ్‌కుమార్, తహసీల్దార్ విజయభాస్కర్, పర్యవేక్షకులు సలీం, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి కలెక్టరేట్లో అధికారుల శిక్షణలో పాల్గొన్న కలెక్టర్ మాదకద్రవ్యాల అనర్థాలపై అవగాహన కల్పించాలి జిల్లాలో మాదకద్రవ్యాల నిషేధానికి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని వాటి వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ దివాకర టీఎస్ సూచించారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో శుక్రవారం నార్కోటిక్ డ్రగ్స్‌పై సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. గంజాయి సాగు జరగకుండా వ్యవసాయశాఖ తరఫున ప్రత్యేక నిఘాపెట్టాలని అన్నారు. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారి నేతృత్వంలో జూనియర్, డిగ్రీ కళాశాలల్లో యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యాశాఖ జిల్లా అధికారి ఆధ్వర్యంలో ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. మత్తు పధార్థాల వల్ల కలిగే అనారోగ్య సమస్యలను విద్యార్థుల కు వివరించాలని చెప్పారు. టాస్క్‌ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు డ్రగ్స్ మూలాలపై నిత్యం నిఘా పెట్టాలని తెలిపారు. పోలీసు, ఆబ్కారీ శాఖలు సైతం డ్రగ్స్ నియంత్రణలో భాగస్వాములు కావాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేశ్, డీసీఆర్బీ డీఎస్పీ కిషోర్‌కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పాణిని, డీఎంహెచ్ఓ గోపాల్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారం బీజేపీతోనే సాధ్యం
● గరికపాటి మోహన్‌రావు ములుగు రూరల్: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు అన్నారు. ఈ మేరకు శుక్రవారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ, టీపీయూ బలపరిచిన వరంగల్–ఖమ్మం–నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సరోత్తంరెడ్డి గెలుపునకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. ఉపాధ్యాయులు, విద్యావంతులు బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను గాలికి వదిలేసిందని ఆరోపించారు. గతంలో గెలిసిన ఎమ్మెల్సీలు స్వార్ధప్రయోజనాలకు అధికార పార్టీలలో చేరి సమస్యలను పట్టించుకోలేదని ఆరోపించారు. ఉపాధ్యాయులు సమస్యలపై బీజేపీ నిరంతరం పోరాటం చేస్తుందని అన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తారని తెలిపారు. అనంతరం ములుగు జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్ని కైన బలరాంను సన్మానించారు. నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, జిల్లా ఎన్నికల ఇన్చార్జ్ విజయచందర్‌రెడ్డి, వెన్నంపల్లి పాపన్న, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భాస్కర్‌రెడ్డి, అజ్మీరా కృష్ణవేణినాయక్, కొత్త సురేందర్, బలరాం, జవహార్‌లాల్, రవీంద్రాచారి, కృష్ణాకర్, రవీందర్‌రెడ్డి, స్వరూప పాల్గొన్నారు. -
వన్య ప్రాణులకు హాని చేయొద్దు
ములుగు: వన్యప్రాణాల వేట కోసం కరెంట్ తీగలు అమర్చి వాటికి హాని చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ శబరీష్ శుక్రవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. ఎవరైనా తీగలు అమర్చిన ట్లు సమాచారం అందిస్తే నగదు బహుమానం ఇస్తామని చేసిన ప్రకటనకు మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. ఈ నెల 10వ తేదీన ములుగు మండలం అబ్బాపూర్ గ్రామ శివారులో, 19వ తేదీ న కుమ్మరిపల్లి శివారులోని పంట పొలాల చుట్టూ విద్యుత్ తీగలు అమర్చినట్లు సమాచారం అందుకొని ఎస్సై వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఇదే సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి సమాచారం అందించిన వారికి రూ.5 వేల చొప్పున రివార్డు అందించామని తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గతంలో విద్యుత్ తీగలు అమర్చిన వారిని గ్రామాల వారీగా గుర్తించి బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు. వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన డీఎస్పీ రవీందర్, సీఐ శంకర్, ఎస్సై వెంకటేశ్వర్‌రావులను ఎస్పీ అభినందించారు. ఎస్పీ డాక్టర్ శబరీష్ -
మేడారానికి నిత్యం వేలాది భక్తులు
జంపన్నవాగు వద్ద డ్రెస్సింగ్ గదులు లేని చోట ఏర్పాటు చేసిన షవర్లుఎస్ఎస్ తాడ్వాయి : మేడారం సమ్మక్క –సారలమ్మల దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తున్నారు. మహాజాతర, మినీ జాతరలకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతున్నా, నిత్యం వచ్చే భక్తులు కష్టాలు తప్పడం లేదు. మేడారానికి ప్రతి బుధ, గురు, శుక్ర, ఆదివారాల్లోనే కాకుండా మిగతా రోజుల్లోనూ భక్తులు వందలాదిగా తరలివస్తుంటారు. సౌకర్యాలు లేమితో ఇక్కట్లు ఎదుర్కొంటున్న భక్తులు శాశ్వ త సదుపాయాలు కల్పించాలిన కోరుతున్నారు. విడిది ప్రాంతాల్లో లేని టాయిలెట్ బ్లాక్‌లు అమ్మవార్ల దర్శనానికి తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం శాశ్వత టాయిలెట్ బ్లాక్‌ల నిర్మాణం చేపడితే ఉపయోగకరంగా ఉంటుంది. ఆర్టీసీ బస్టాండ్ వై జంక్షన్, చిలుకలగుట్ట, జంపన్నవాగు, ఊరట్టం క్రాస్, నార్లాపూర్ చింతల్ ప్రాంతాల్లో ఎక్కువగా భక్తులు విడిది చేస్తుంటారు. ఈ ప్రాంతాల్లో శాశ్వత టాయిలెట్ బ్లాక్‌లు నిర్మిస్తే భక్తులకు సౌకర్యంగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న శాశ్వత టాయిలెట్ బ్లాక్‌లను వినియోగంలోకి తీసుకొచ్చినా ఇబ్బంది లేకుండా ఉంటుందని భక్తుల అభిప్రాయం. జాతర సమయంలోనే తాగు నీరు.. మహాజాతర సమయంలో మేడారం చుట్టు పక్కల ప్రాంతాల్లో ఎక్కడపడితే అక్కడ అధికారులు తాగునీటి కోసం బ్యాటరీ ఆఫ్ ట్యాప్ నల్లాలను ఏర్పాటు చేస్తారు. జాతర అనంతరం వాటిని తొలగించడంతో నిత్యం మేడారానికి వచ్చే భక్తులకు తాగునీటి సమస్య జటిలంగా మారింది. ఏడాది పొడవునా తరలివచ్చే భక్తులకు కొన్ని ప్రత్యేక ప్రాంతాలను గుర్తించి ట్యాంకుల ఏర్పాటు చేసి తాగు నీరు అందించాలని కోరుతున్నారు. మేడారానికి వచ్చే భక్తులు మినరల్ వాటర్ కొనుగోలు చేసి వంటావార్పు, దాహం తీర్చుకోవాల్సి వస్తోంది.నిరంతర నిఘా అవసరం.. మేడారానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో వారి భద్రత కోసం పోలీస్ తరఫున నిరంతరం నిఘా ఉంచాలి. బుధ, గురు, ఆదివారాల్లో మేడారానికి భక్తుల తాకిడి పెరుగుతుంది. అమ్మవార్ల గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకుంటున్న సమయంలో.. మేడారం పరిసరాల్లో దొంగలు చేతివాటం ప్రదర్శించకుండా నిఘా నేత్రాలు ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. దేవాదాయ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకుంటూ భక్తుల భద్రతకు భరోసా కల్పించాలంటున్నారు. అరకొర సదుపాయాలతో ఇక్కట్లు శాశ్వత పనులు చేపట్టాలని వేడుకోలు -
దొంగనోట్ల కలకలం
ఏటూరునాగారం : ఏజెన్సీ ప్రాంతంలో దొంగనోట్ల కలకలం రేపింది. శుక్రవారం మండల కేంద్రంలోని ఓ రిక్షా కార్మికుడి వద్ద రూ.100 దొంగనోటు దర్శనమిచ్చింది. అదే వంద రూపాయలు తీసుకెళ్లి ఓ కూల్‌డ్రింక్ షాపులో ఇవ్వగా షాపు యజమాని ఇది దొంగ నోటు అంటూ వెనుకకు ఇచ్చాడు. అయితే ఈ నోటు ఎలా వచ్చింది? ఎవరు ఇచ్చారనేది పూర్తిగా తెలియడం లేదు. కూలీ పనులకు వెళ్లిన వారు ఇచ్చిన డబ్బులు చేతులు మారుతుంటాయి. ఈ విషయం తెలిసిన స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎక్కువగా ఛత్తీస్‌గఢ్ నుంచి కూలీలు, మిర్చి వ్యాపారం చేసే వారి నుంచి నగదు చేతులు మారుతుంటాయని పలువురు చర్చించుకుంటున్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికలపై అలర్ట్!
సాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్–నల్లగొండ–ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం ఎన్నికల పోలింగ్‌కు మరో ఐదు రోజులే గడువుంది. ఈనేపథ్యంలో.. అధికార యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లలో ఉండగా.. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి ఆరు జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులను అలర్ట్ చేశారు. ఈమేరకు ఆయన శుక్రవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించిన సుదర్శన్‌రెడ్డి, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు చేయాలన్నారు. 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు కట్టుదిట్టమైన ఏర్పా ట్లు చేయాలన్నారు. పోలింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో.. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా ని ఘా పటిష్టం చేయాలని సూచించారు. ఎన్నికల కోడ్ నిబంధనలను జిల్లాల్లో పకడ్బందీగా అమలు చేయాలని, డబ్బు, మద్యం, ఇతర ఆభరణాలు పరి కరాల ద్వారా ఓటర్లను ప్రభావితం చేయకుండా జాగ్రత్త పడాలని, క్షేత్రస్థాయి నుంచి వచ్చే సమాచారంతో ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తూ వీటిని నిరోధించాలని అధికారులను ఆదేశించారు. ఏర్పాట్లలో అధికారులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు అవసరమైన మేర సౌకర్యాలు ఉండేలా ఇప్పటికే అధికారులు చర్యలు చేపట్టారు. పూర్వ వరంగల్, నల్లగొండ, ఖ మ్మం జిల్లాల్లో 24,905 ఓట్లు ఉండగా.. ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లాల్లో 6,509 పురుషులు, 4,288 సీ్త్రలు కలిపి 10,797 మంది ఓటర్లున్నారు. ఆరు జిల్లాల్లో ని 70 మండలాల్లో ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా.. 72 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు సంబంధిత అధికారులు వెళ్లి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్ నిరంతరాయంగా పని చేసేలా విద్యుత్ సరఫరా ఏర్పాట్లపై స్థానికులతో మాట్లాడుతున్నారు. 27న జరిగే పోలింగ్ కోసం ఒక్కరోజు ముందే ఎన్నికల సామగ్రిని తరలించేలా జిల్లా కేంద్రాల్లో డిస్టిబ్య్రూషన్, రిసెప్షన్ కేంద్రాల వద్ద అవసరమైన వసతులపై కసరత్తు చేస్తున్నారు. ప్రతీ పోలింగ్ కేంద్రంలో ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమయ్యేలా, ప్రతీ రెండు గంటల కు పోలింగ్ వివరాలను ప్రకటించేలా ఎన్నికల అధి కారులు, సిబ్బందిని కలెక్టర్లు సంసిద్ధం చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఓటర్ల వివరాలిలా.. జిల్లా మండలాలు పోలింగ్ పురుషులు సీ్త్రలు మొత్తం కేంద్రాలుహనుమకొండ 11 15 2,884 2214 5,098 వరంగల్ 13 13 1,381 844 2,225 జనగామ 12 12 556 365 921 మహబూబాబాద్ 18 16 1,083 535 1,618 భూపాలపల్లి 07 07 211 112 323 ములుగు 09 09 394 218 612 మొత్తం 70 72 6,509 4,288 10,797ఏర్పాట్లపై కలెక్టర్లకు సీఈఓ సుదర్శన్‌రెడ్డి ఆదేశం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ఉమ్మడి జిల్లాలో 10,797 మంది ఓటర్లు ఈనెల 27న పోలింగ్.. వచ్చే నెల 3న లెక్కింపు ప్రచారంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులువేడెక్కిన ప్రచారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 19 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 23 మంది 50 సెట్లు నామినేషన్లు దాఖలు చేయగా.. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ తర్వాత 19 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. బరిలో అలుగుబెల్లి నర్సిరెడ్డి – స్వతంత్ర (యూటీఎఫ్ మద్దతు), గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి – స్వతంత్ర (టీచర్స్ జేఏసీ మద్దతు), పులి సరోత్తంరెడ్డి – బీజేపీ (టీపీయూఎస్ మద్దతు), శ్రీపాల్‌రెడ్డి పింగిళి – స్వతంత్ర (పీఆర్టీయూ – టీఎస్ మద్దతు), పూల రవీందర్ – స్వతంత్ర (ఎస్టీయూ మద్దతు)తో పాటు స్వతంత్రులుగా సంగంరెడ్డి సుందర్రాజు, కొలిపాక వెంకటస్వామి, అర్వ స్వాతి, కంటె సాయన్న, పన్నాల గోపాల్‌రెడ్డి ఏలె చంద్రమోహన్, చాలిక చంద్రశేఖర్, జంకిటి కైలాసం, జి.శంకర్, తలకోల పురుషోత్తంరెడ్డి, తాటికొండ వెంకటరాజయ్య, దామెర బాబురావు, బంక రాజు, ప్రజావాణి పార్టీ నుంచి లింగిడి వెంకటేశ్వర్లు పోటీలో ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు మరో ఐదు రోజులే గడువుండడంతో అభ్యర్థులు తమదైన శైలిలో ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. -
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
ములుగు రూరల్: పాఠశాల విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ దివాకర అన్నారు. శుక్రవారం రాత్రి జాకారం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. పదో తరగతి విద్యార్థులు వచ్చే వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని అన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆయన వెంట పాఠశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు ఉన్నారు.కలెక్టర్ దివాకర -
ఇసుక అక్రమ రవాణాకు చెక్‌పోస్ట్
ములుగు/ములుగు రూరల్: ప్రభుత్వ ఆదేశాల మేరకు ములుగు సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం మల్లంపల్లి మండలకేంద్రంలో ఎస్సారెస్పీ కెనాల్ సమీపంలో చెక్‌పోస్ట్‌ను ఏర్పాటు చేశారు. ఈ మేరకు డీఎస్పీ రవీందర్ ఆధ్వర్యంలో సాయంత్రం చెక్‌పోస్టు వద్ద ఇసుక లారీలను తనిఖీ చేశారు. సమీపంలోని వేబ్రిడ్జి వద్ద కాంటా వేసి అధికలోడ్‌తో వచ్చిన లారీల డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎవరైనా ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీఎస్పీతో పాటు ఎస్సై వెంకటేశ్వర్రావు ఉన్నారు. -
ట్యాప్స్ ఓ పక్క.. డ్రెస్సింగ్ గదులు మరో పక్క
జంపన్నవాగు వద్ద స్నానఘట్టాల వద్ద మహిళలు దుస్తులు మార్చుకునేందుకు శాశ్వతంగా మూడు డ్రెస్సింగ్ గదులు నిర్మించారు. అందులో రెండు జంపన్నవాగు బ్రిడ్జికి దగ్గరగా నిర్మించారు. డ్రెస్సింగ్ గదులు ఉన్న చోట షవర్లు ఏర్పాటు చేస్తే జల్లు స్నానాలు చేసే మహిళలు పక్కనే ఉన్న డ్రెస్సింగ్ గదులు వినియోగించుకోవచ్చు. కానీ, డ్రెస్సింగ్ గదులు లేని చోట షవర్ ఏర్పాటు చేయడంతో స్నానాలు ఆచరించిన మహిళా భక్తులు దుస్తులు మార్చుకునేందుకు తంటాలు పడుతున్నారు. జాతర సమయంలో తాత్కాలికంగా డ్రెస్సింగ్ గదులను ఏర్పాటు చేస్తున్న అధికారులు జాతర అనంతరం వాటిని తొలగిస్తున్నారు. దీంతో శాశ్వత డ్రెస్సింగ్ గదులు ఉన్న చోట షవర్లు ఏర్పాటు చేయకపోవడం ఆ గదులు కూడా నిరుపయోగంగా మారుతుండగా.. మహిళా భక్తులకు ఇక్కట్లు తప్పడంలేదు. -
నర్సిరెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించండి
ఏటూరునాగారం: ఈ నెల 27న జరగనున్న వరంగల్, నల్లగొండ, ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల ఉమ్మడి అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గొప్ప సమ్మారావు అన్నారు. మండల పరిధిలోని యూటీఎఫ్ మండల కమిటీ సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరేళ్లుగా నిజమైన ఉపాధ్యాయ ప్రతినిధిగా వ్యవహరించారని తెలిపారు. నిత్యం నియోజకవర్గంలో పర్యటిస్తూ విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారని వివరించారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు పోడెం సమ్మయ్య, మండల అధ్యక్షులు కిరణ్, ప్రసాద్, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్ల పరిశీలన వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని పాలంపేటలో గల రామప్ప దేవాలయంలో ఈ నెల 26నుంచి జరగనున్న మహా శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని పోలీస్‌శాఖ తరఫున ములుగు డీఎస్పీ నలువాల రవీందర్ గురువారం పరిశీలించారు. ఆలయంలో క్యూలైన్ల ఏర్పాటు, స్వామివారి కల్యాణం నిర్వహించే ప్రాంతం, వాహనాల పార్కింగ్ ప్రదేశాలను చూశారు. మహాశివరాత్రికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా పోలీసు శాఖ తరఫున పర్యవేక్షణ చేపడతామని వివరించారు. రామప్ప చెరువులో బోటింగ్, స్నానాలకు అనుమతి లేదన్నారు. 26నుంచి 28వ తేదీ వరకు జరిగే ఉత్సవాలకు ఇద్దరు డీఎస్పీలు, ఎనిమిది మంది సీఐలు, 12మంది ఎస్సైలతో కలిపి 300మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. డీఎస్పీ వెంట సీఐ శంకర్, ఎస్సై జక్కుల సతీశ్ తదితరులు పాల్గొన్నారు. చట్టాలపై అవగాహన ఉండాలి గోవిందరావుపేట: విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని బాలల పరిరక్షణ విభాగం జిల్లా లీగల్ అధికారి డి.సంజీవ అన్నారు. మండల పరిధిలోని చల్వాయి కస్తూ ర్బా గాంధీ బాలికల విద్యాలయంలో గురువారం యువతరం యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సామాజిక న్యాయంతో పాటు చట్టాలపై వివరించారు. అనంతరం విద్యార్థులకు ఉచిత న్యాయం గురించి అవగాహన కల్పించారు. అనంతరం కళాశాల స్పెషల్ ఆఫీసర్ వెంకటలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులు ప్రణాళికతో చదువుకుని ఉన్నత స్థానంలోకి చేరుకోవాలన్నారు. కలాం స్ఫూర్తి యాత్ర భూపాలపల్లి అర్బన్: మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం స్ఫూర్తితో నిర్వహిసుత్న్న కలాం స్ఫూర్తి యాత్ర గురువారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి బర్ల స్వామి హాజరై మాట్లాడారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం విద్యార్థులకు అవసరమని తెలిపారు. ఈ సందర్శనలో బృందం సభ్యులు విద్యార్థులతో ఆసక్తికరంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో బృందం సభ్యులు మధులాష్‌బాబు, దిలీప్‌కుమార్, సాయి సుబ్రమణ్యం, రోహిత్ జలగాం, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పన్నుల చెల్లింపునకు సహకరించాలి భూపాలపల్లి అర్బన్: ఇంటి పన్నులు, ట్రేడ్ లైసెన్స్ పన్నులు సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ బిర్రు శ్రీనివాస్ కోరారు. పట్టణంలోని 8, 10వ వార్డులో గురువారం కమిషనర్ పర్యటించారు. కాలనీ శానిటేషన్ పనులు పరిశీలించి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చెత్త సేకరణ, రోడ్లు శుభ్రం ఉంచటం, డ్రెయినేజీల శుభ్రత గురించి కాలనీవాసులతో మాట్లాడారు. కాలనీల్లో సమస్యలు పేరుకుపోతే వెంటనే ఫిర్యాదు చేయాలని కోరారు. పన్నులు పెండింగ్‌లో లేకుండా ఎప్పటికప్పుడు చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ నవీన్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ దేవేందర్, వార్డు సిబ్బంది పాల్గొన్నారు. -
పూర్తయ్యేదెప్పుడో?
మంగపేట: జిల్లాలోని మంగపేట మండల పరిధిలోని గోదావరి ఒడ్డు వెంట కరకట్ట నిర్మాణానికి ప్రభుత్వం నుంచి మోక్షం లభించినా పనులు ముందుకు సాగకపోవడంతో ప్రారంభానికే పరిమతమయ్యాయి. కరకట్ట నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందోనని రైతులు ఎదురుచూస్తున్నారు. మండల కేంద్రంలోని దొంగల ఒర్రె నుంచి పుష్కరఘాట్ వరకు 2.5 కిలోమీటర్ల మేర కరకట్ట నిర్మాణానికి 2022లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.55 కోట్లు, భూ సేకరణకు రూ.55 కోట్లు మంజూరు చేసింది. కరకట్ట నిర్మాణం పనులను టెండర్ ద్వారా దక్కించుకుని ప్రభుత్వంతో అగ్రిమెంటు కుదుర్చుకున్న హర్ష కన్స్ట్రక్షన్ ప్రైవేట్ కంపెనీ కరకట్ట నిర్మాణ పనుల్లో భాగంగా 2024 జూన్‌లో గోదావరి ఒడ్డు వెంట స్లోబ్ లెవల్ పనులను ప్రారంభించింది. మంత్రి సీతక్క చొరవతోనే.. సుదీర్ఘీకాలం తర్వాత మంత్రి సీతక్క చొరవ, పట్టుదలతోనే పనులు ప్రారంభమయ్యాయని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కరకట్ట లేకపోవడంతో గోదావరి ఒడ్డు ప్రతిఏటా కోతకు గురవుతూ విలువైన సాగు భూములు గోదావరిలో కలిసిపోతున్నాయి. రైతులకు జరుగుతున్న నష్టం, ప్రతీ ఏడాది వర్షాకాలంలో గోదావరి పరీవాహక లోతట్టు ప్రాంతాల ప్రజలు గోదావరి వరదలతో ఎదుర్కొంటున్న పరిస్థితులను ప్రత్యక్షంగా చూసిన మంత్రి సీతక్క అసెంబ్లీ సమావేశాల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయింది. ప్రభుత్వం స్పందించే వరకు ప్రజల పక్షాన పోరాటం చేసి కరకట్ట నిర్మాణానికి నిధులు మంజూరు చేయించింది. అప్పటిలాగే మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ తీసుకుని పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని గోదావరీ తీర ప్రాంత ప్రజలతో పాటు రైతులు కోరుతున్నారు. నాలుగు ఎకరాలు గోదావరిలో కలిసిపోయింది.. గోదావరి ఒడ్డు వెంట ఉన్న 5ఎకరాల భూమిలో 4ఎకరాలు వరద కోతకు గురై గోదావరిలో కలిసి పోయింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి నష్ట పరిహారం అందలేదు. ఉన్న ఎకరం పొలంతో పాటు కొంత భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాను. ఉన్న ఎకరంలో కరకట్ట నిర్మాణానికి అర ఎకరం భూమి పోతోంది. వర్షాకాలం వరకు కరకట్ట నిర్మాణం పూర్తికాకపోతే ఉన్న భూమి కోతకు గురవుతుంది. – బొల్లె రాములు, రైతు, పొదుమూరు డిజైన్ అప్రూవల్ కాలేదు.. కరకట్ట నిర్మాణం చేపట్టేందుకు చీఫ్ ఇంజనీర్(సీడీఓ) ద్వారా డిజైన్ అప్రూవల్ కాక పోవడంతో పనులు ప్రారంభించ లేదు. డిజైన్ అఫ్రూవల్ రాగానే పనులు వెంటనే ప్రారంభిస్తాం. – రవికుమార్, ఇరిగేషన్ డీఈ●ముందుకు సాగని కరకట్ట నిర్మాణం స్లోబ్ లెవల్ పనులు ప్రారంభమై ఆగిన వైనం సమీపిస్తున్న అగ్రిమెంట్ గడువు త్వరితగతిన పూర్తిచేయాలని రైతులు, ప్రజల వేడుకోలు -
పనులను పరిశీలించిన కలెక్టర్
కరకట్ట నిర్మాణ పనులను ప్రారంభించిన క్రమంలో కలెక్టర్ టీఎస్.దివాకర 2024 జూన్ 20న సందర్శించారు. సంబంధిత ఇరిగేషన్ అధికారులతో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. కరకట్ట నిర్మాణం పూర్తయితే ఒడ్డు వెంట ఉన్న సాగు భూములు కోతకు గురికాకుండా ఉండడంతో పాటు గోదావరి పరీవాహక ప్రాంతం వెంట ఉన్న లోతట్టు వరద ముంపు గ్రామాలు సురక్షితంగా ఉంటాయన్నారు. కరకట్ట నిర్మాణానికి కావాల్సిన మెటీరియల్‌ను దిగుమతి చేసుకుని నిర్మాణం పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఈ క్రమంలోనే కరకట్ట పనులను మంత్రి సీతక్క చేత అధికారికంగా ప్రారంభించేందుకు శిలాఫలకం వంటి తదితర ఏర్పాట్లు చేశారు. అనంతరం వర్షాల కారణంగా అంతటితో పనులు నిలిచిపోయాయి. ఎనిమిది నెలలు పూర్తి కావస్తున్నా నేటి వరకు ఆ పనుల గురించి పట్టించుకున్న వారే కరువయ్యారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.