National
-
భారత్ గెలుపు వేళ అభిమానులపై దాడి.. నిందితులకు పోలీసుల వింత శిక్ష
భోపాల్: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజయం తర్వాత దేశవ్యాప్తంగా అభిమానాలు సంబరాలు జరుపుకున్నారు. సంబరాల సందర్భంగా మధ్యప్రదేశ్‌లో అల్లర్లు చేలరేగాయి. అభిమానులు ఒకరిపై మరొకరు రాళ్లు విసురుకున్నారు. ఈ నేపథ్యంలో ఘర్షణకు కారణమైన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, వారికి పోలీసులు వింత శిక్ష విధించారు. వారికి గుండు గీయించి, ఊరేగింపు నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల ప్రకారం.. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్ టీమ్‌ని రోహిత్ సేన ఓడించింది. ఈ విజయం పట్ల దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు వేడక చేసుకున్నారు. విజయం అనంతరం రోడ్లపైకి వచ్చి తమ ఆనందాన్ని వ్యక్తి చేశారు. అయితే, మధ్యప్రదేశ్ మోవ్, దేవాస్ నగరాల్లో విజయోత్సవాల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వేడుకల సందర్బంగా పట్టణంలోని జామా మసీదు దగ్గర అభిమానుల మీద దాడి జరిగింది. అక్కడ ఎందుకు ఊరేగింపు చేస్తున్నారంటూ గొడవ మొదలుపెట్టారు. మాటామాటా పెరగడంతో ఊరేగింపు మీద రాళ్ళు రువ్వారు. ఆ దాడిలో పలువురు క్రికెట్ ప్రేమికులు గాయపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కొందరు అసాంఘిక శక్తులు క్రీడాభిమానుల వాహనాలను ధ్వంసం చేసారు. రెండు వాహనాలకు, రెండు దుకాణాలకూ నిప్పు పెట్టారు. దీంతో హింస చెలరేగింది.అయితే, దేవాస్‌లో జరిగిన అల్లర్లలో పాల్గొన్నట్లుగా భావిస్తున్న నిందితులను పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. వారికి గుండు గీయించి, ఊరేగింపు నిర్వహించారు. వేడుకల్లో పాల్గొన్న కొందరు యువకులు అత్యుత్సాహంతో పోలీసులతో దురుసుగా ప్రవర్తించినట్లు తెలిసింది. వీరిని కస్టడీలోకి తీసుకున్నారు. ఇక, దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.VIDEO | Madhya Pradesh: Police shave heads and parade those accused of creating ruckus in Dewas after India's ICC Champions Trophy victory on the night of March 9. (Full video available on PTI Videos - https://t.co/dv5TRAShcC) pic.twitter.com/PqCIvX4p0y— Press Trust of India (@PTI_News) March 11, 2025 -
నటి రన్యా రావు కేసులో భారీ ట్విస్ట్.. తరుణ్ రాజు అరెస్ట్
బెంగళూరు: కన్నడ సినీ నటి రన్యా రావు బంగారం స్మగ్లింగ్ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో ఆమె సవతి తండ్రి, డీజీపీ స్థాయి అధికారి కె.రామచంద్రరావు ప్రమేయంపై నిగ్గు తేల్చాలని కర్ణాటక ప్రభుత్వం అదనపు చీఫ్ సెక్రటరీ గౌరవ్ గుప్తాను ఆదేశించింది. ఈ మేరకు సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ అయినట్లు సీఎం కార్యాలయం మంగళవారం తెలిపింది.ఇక, అదే సమయంలో, కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో విధి నిర్వహణలో పోలీసు అధికారుల నిర్లక్ష్యం, లోటుపాట్లపైనా విచారణ చేపట్టాలని సీఐడీ విభాగాన్ని ఆదేశించింది. తక్షణమే దర్యాప్తు చేపట్టి, వారం లోగా నివేదిక అందించాలని స్పష్టం చేసింది. విచారణకు సహకరించాల్సిందిగా సంబంధిత పోలీసు విభాగాలను సీఎంవో కోరింది.రామచంద్రరావు ప్రస్తుతం కర్ణాటక స్టేట్ పోలీస్ హౌసింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ నెల 3వ తేదీన దుబాయ్ నుంచి బెంగళూరుకు చేరుకున్న రన్యా రావు వద్ద డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ)అధికారులు రూ.12.56 కోట్ల విలువైన బంగారు కడ్డీలను స్వా«దీనం చేసుకున్నారు. మరునాడు ఆమె ఇంట్లో మరికొంత బంగారం, డబ్బు స్వా«దీనం చేసుకోవడం తెలిసిందే. తరచూ దుబాయి వెళ్లి వస్తూ ఆమె బంగారాన్ని దొంగచాటుగా తీసుకువస్తోందని, విమానాశ్రయంలోని పోలీసు సిబ్బంది సోదాలు జరపకుండా ఆమెను పంపించి వేస్తున్నట్లు తేలింది. ఈ వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టించడంతో రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. కాగా, రన్యా రావు బంగారం స్మగ్లింగ్ వ్యవహారంతో మంత్రులకు సంబంధాలున్నట్లు వస్తున్న వార్తలన్నీ రాజకీయ పుకార్లేనని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కొట్టిపారేశారు. కేంద్ర విభాగాలు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. DRI Busts Smuggling Nexus: Ranya Rao’s associate, Tarun Raju, has been taken into custody as part of the ongoing smuggling investigation.#RanyaRao #TarunRaju #DRIProbe #SmugglingCase #BreakingNews #NewsX pic.twitter.com/7zE4CBQA3i— NewsX World (@NewsX) March 11, 2025హోటల్ యజమాని మనవడు అరెస్ట్ ఇదే కేసులో డీఆర్ఐ అధికారులు మంగళవారం బెంగళూరులోని అట్రియా హోటల్ యజమాని మనవడు తరుణ్ రాజును అరెస్ట్ చేశారు. అతడిని బెంగళూరులోని ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టులో హాజరు పరచగా ఐదు రోజుల కస్టడీకి అనుమతించిందని డీఆర్ఐ తెలిపింది. రన్యా రావు, తరుణ్ రాజులకు సన్నిహిత సంబంధాలున్నాయని, విదేశాల నుంచి బంగారాన్ని దొంగచాటుగా తేవడం వీరు కూడబలుక్కుని చేసిందేనని అంటోంది. రన్యా రావు వేరొకరిని పెళ్లి చేసుకోవడంతో వీరి మధ్య సంబంధాలు బెడిసి కొట్టినా చట్ట విరుద్ధ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారంది. దుబాయి నుంచి బంగారాన్ని తీసుకువచ్చేటప్పుడు రన్యా రావు తరుణ్ రాజుతో ఫోన్లో మాట్లాడినట్లు డీఆర్ఐ తెలిపింది. వీరిద్దరినీ వేర్వేరుగా, కలిపి సైతం విచారించినట్లు వివరించింది. అయితే, విచారణ సమయంలో అధికారులు తనను బెదిరించారని, మానసికంగా వేధించారని సోమవారం కోర్టు విచారణ సమయంలో రన్యా రావు ఆరోపించింది. తనను కొట్ట లేదు కానీ, పరుషంగా దూషించారని తెలిపింది. ఇష్టం లేకున్నా తనతో కొన్ని పత్రాలపై సంతకాలు చేయించారని రోదిస్తూ జడ్జికి ఫిర్యాదు చేసింది. -
కూతురి స్మగ్లింగ్‌లో డీజీపీ పాత్ర ఉందా?
బనశంకరి: నటి రన్య రావు పెంపుడు తండ్రి, రాష్ట్ర పోలీసు గృహ నిర్మాణ సంస్థ డీజీపీ రామచంద్రరావు చిక్కుల్లో పడ్డారు. రన్యకు బెంగళూరు విమానాశ్రయంలో ప్రోటోకాల్ ఇవ్వడం గురించి విచారణ చేపట్టి వారంలోగా నివేదిక అందించాలని హోంశాఖను సర్కారు ఆదేశించింది. బంగారం స్మగ్లింగ్ లో ఆయన కుమ్మక్కయ్యారా, ప్రోటోకాల్ దుర్వినియోగానికి పాల్పడడం వెనుక ఆయన హస్తం ఉందా అనే దానిపై వారంలోగా విచారణ చేపట్టి నివేదిక అందించాలని ఆదేశించింది. నటి రన్య తన ప్రయాణాల్లో రామచంద్రరావు పేరును విరివిగా వాడుకున్నారు. రన్య కేసు శాసనసభ సమావేశాల్లో తీవ్ర చర్చకు రావడం తెలిసిందే. ప్రభుత్వం ఏం చేస్తోందంటూ ప్రతిపక్ష బీజేపీ మండిపడడంతో ప్రభుత్వం ఇరుకునపడింది. రన్య ప్రోటోకాల్‌పై నివేదిక మరోపక్క రన్య రావు ప్రోటోకాల్ దుర్వినియోగం పట్ల పోలీస్ కమిషనర్ దయానంద్‌కు డీసీపీ నివేదిక అందజేశారు. రన్య రావ్ అరెస్టైనరోజు ప్రోటోకాల్‌లో ఉన్న కానిస్టేబుల్ బసవరాజుకు ఆమె కాల్ చేసి విమానాశ్రయంలో టెరి్మనల్ వన్ వద్దకు రావాలని తెలిపింది. ఇప్పుడు రాలేను మేడం, వేరే ఆఫీసర్ వస్తున్నారు, రిసీవ్ చేసుకోవాలి అని బసవరాజు చెప్పాడు. నువ్వే రావాలి లేకపోతే, అప్పాజీ కి చెబుతానని రన్య హెచ్చరించినట్లు నివేదికలో ప్రస్తావించారు. పోలీస్ స్టిక్కర్ వాడొద్దు: హోంమంత్రి దొడ్డబళ్లాపురం: పోలీసులు, వారి కుటుంబ సభ్యులు సొంత వాహనాలపై పోలీస్ అనే స్టిక్కర్లు వేసుకోవడం మామూలే. ఇది ఏ మాత్రం మంచిది కాదని, ఇది కచ్చితంగా చట్టాన్ని , నిబంధనలను ఉల్లంఘించడమేనని హోంమంత్రి పరమేశ్వర్ చెప్పారు. 2022 ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఇలా స్టిక్కర్లు వేసుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని మంగళవారం అసెంబ్లీలో చెప్పారు. శ్రవణబెళగోళ ఎమెల్యే సీఎస్ బాలక్రిష్ణ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు తెలిపారు. రన్య అరెస్టు వెనుక...బనశంకరి: బంగారం దొంగరవాణా కేసులో నటి రన్య రావు పట్టుబడటం వెనుక ఆమె భర్త, ఢిల్లీలో అరెస్టైన ఇద్దరు స్మగ్లర్లు, పలువురు పెద్దలు ఉన్నట్లు తెలిసింది. ఇటీవల జతిన్ హుక్కేరి అనే వ్యక్తితో రన్యకు బెంగళూరులో ఆర్భాటంగా వివాహం జరిగింది. కానీ వారి మధ్య గొడవలు వచ్చాయి. రన్య పదేపదే విదేశాలకు వెళ్లడం గురించి భర్త ప్రశ్నించేవాడు. ఆయనే డీఆర్ఐకి సమాచారం ఇచ్చాడని తెలుస్తోంది. కొన్నిరోజుల కిందట ఢిల్లీలో డీఆర్ఐ అధికారులకు ఇద్దరు స్మగ్లర్లు దొరికారు. రన్య అనే యువతి కూడా బంగారం దొంగ రవాణా చేస్తోందని ఉప్పందించారు. దీంతో ఢిల్లీ నుంచి బెంగళూరు డీఆర్ఐ విభాగానికి అలర్ట్ వచ్చింది. 3వ తేదీ రాత్రి రన్య బెంగళూరు విమానాశ్రయంలో దిగగానే అదుపులో తీసుకున్నారు. రన్య అంటే పడని బంగారు వ్యాపారులు, ఓ మంత్రి కూడా సమాచారం ఇచ్చారని ప్రచారం సాగుతోంది. 28 సార్లు విదేశీ ప్రయాణం నటి రన్య కేసులో తరుణ్‌రాజు అనే వ్యక్తి అరెస్టు కావడం బెంగళూరులో చర్చనీయాంశమైంది. రన్య వెనుక తరుణ్‌రాజు ఉన్నాడని తెలుస్తోంది. బెంగళూరు కు బంగారం తెప్పించి హవాలా ద్వారా దుబాయికి డబ్బు పంపించేవారు. రన్య ఖర్చులన్నింటినీ తరుణ్‌రాజు చూసుకునేవాడు. ఐపీఎస్ అధికారి కూతురు కావడంతో రన్య ద్వారా సులభంగా బంగరాన్ని తెప్పించవచ్చని గుర్తించాడు. రన్య ఒక ఏడాదిలో 28 సార్లు విదేశీ పర్యటనలు చేసింది. గత 15 రోజుల్లో నాలుగుసార్లు దుబాయ్‌కి వెళ్లి వచ్చింది. ఐదోసారి దుబాయ్‌కి వెళ్లి వస్తుండగా జాతకం మారిపోయింది. -
డీఎస్పీ కనకలక్ష్మి అరెస్టు
బనశంకరి: బెంగళూరులో బోవి అభివృద్ధి మండలి అక్రమాల కేసులో నిందితురాలు, న్యాయవాది జీవా (33) ఆత్మహత్య కేసులో సీఐడీ డీఎస్పీ కనకలక్ష్మీని మంగళవారం సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. మండలికి సామగ్రి సరఫరా చేసే కాంట్రాక్టును ఎస్.జీవా నిర్వహించేది. గత ఏడాది నవంబరు 22 తేదీన తేదీన డెత్‌నోట్ రాసిన జీవా బనశంకరి రాఘవేంద్రలేఔట్లోని ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. అక్రమాలు జరిగాయన్న కేసులో జీవాను సీఐడీ డీఎస్పీ కనకలక్ష్మి పిలిపించి చిత్రహింసలకు గురిచేసిందని, రూ. 25 లక్షల లంచం ఇవ్వాలని డిమాండు చేసిందని మృతురాలి సహోదరి సంగీత ఆరోపించారు. జీవా రాసిన 10 పేజీలకు పైగా డెత్‌నోట్ తో సమేతంగా సంగీతా బనశంకరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసును పోలీస్ కమిషనర్ దయానంద్ ఆదేశంతో సిట్ విచారిస్తోంది. ఎట్టకేలకు కనకలక్ష్మిని అరెస్టు చేశారు. -
దళిత విద్యార్థి వేళ్లు నరికేశారు
తిరునల్వేలి: తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో ఘోరం జరిగింది. పరీక్ష రాయడానికి వెళ్తున్న దేవేంద్రన్ అనే 11వ తరగతి విద్యారి్థపై కొందరు కిరాతకులు దాడి చేసి చేతి వేళ్లు దారుణంగా నరికేశారు. దిన కూలీ అయిన కొడుకైన దేవేంద్రన్ సోమవారం పాళయంకోటలోని పరీక్షా కేంద్రానికి బస్సులో బయలుదేరాడు. మార్గమధ్యంలో క్రాసింగ్ వద్ద ముగ్గురు వ్యక్తులు బస్సును అడ్డగించారు. దేవేంద్రన్‌ను బయటికి లాగి ఎడమ చేతి వేళ్లు నరికేశారు.అడ్డొచ్చిన అతని తండ్రి గణేశ్‌పైనా దాడి చేశారు. అతనికి తల, ఇతర చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. ప్రయాణికులు అడ్డుకోవడంతో అగంతకులు పారిపోయారు. తండ్రీకొడుకులను అదే బస్సులో శ్రీవైకుంఠం ప్రభుత్వాస్పత్రికి, తరువాత తిరునల్వేలి ఆస్పత్రికి తరలించారు. దాడికి తెగబడ్డ ముగ్గురు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కబడ్డీ మ్యాచ్‌లో ఓటమికి ప్రతీకారంగానే దాడికి తెగబడ్డారని దేవేంద్రన్ కుటుంబం ఆరోపించింది. -
మిస్టరీగా తెలుగమ్మాయి అదృశ్యం
న్యూఢిల్లీ: కరీబియన్ దేశం డొమినికన్ రిపబ్లిక్లో తెలుగు విద్యార్థిని అదృశ్యం మిస్టరీగా మారింది. 20 ఏళ్ల సుదీక్ష కోణంకి కుటుంబం అమెరికాలో వర్జీనియాలోని లౌడౌన్ కౌంటీలోని చంటిల్లీలో నివసిస్తోంది. సుదీక్షకు అమెరికా శాశ్వత నివాస హోదా ఉంది. పిట్స్బర్గ్ వర్సిటీలో మెడిసిన్ చదువుతోంది. ఐదుగురు తోటి విద్యారి్థనులతో వారం క్రితం డొమినికన్ రిపబ్లిక్‌లోని పుంటా కానాకు వెళ్లింది. అక్కడి రియు రిపబ్లికా రిస్టార్టులో వారికి మరో ఇద్దరు అమెరికా టూరిస్టులు కలిశారు. అంతా మార్చి 5న రాత్రి స్థానిక నైట్ క్లబ్‌కు వెళ్లారు. 6వ తేదీ తెల్లవారుజామున నాలుగింటి సమయంలో అక్కడి బీచ్‌కు చేరుకున్నారు. ఉదయం 5.50 సమయంలో మిగతా వాళ్లు రిసార్టుకు వచ్చేయగా టూరిస్టుల్లో ఒకరైన జాషువా స్టీవెన్ రిబే (24), సుదీక్ష బీచ్‌లోనే ఉండిపోయారు. ఆ తరువాత ఆమె కనిపించలేదు. ఉదయం 9 గంటలప్పుడు రిబే ఒక్కడే బీచ్ నుంచి వెళ్లిపోయినట్లు సీసీటీవీల్లో రికార్డయ్యింది. సాయంత్రమైనా సుదీక్ష ఆచూకీ లేకపోవడంతో స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటినుంచి హెలికాప్టర్లు, డ్రోన్లు, పడవలు, స్కూబా డైవర్లు, ఏటీవీలను మోహరించి తీరం, పరిసర ప్రాంతాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు. నాలుగు రోజులైనా ఆమె ఆచూకీ దొరకలేదు. దీనికి తోడు ఆమె అదృశ్యంపై స్నేహితుల నుంచి విరుద్ధ కథనాలు వస్తుండటంతో కుటుంబీకులు మరింత ఆందోళన చెందుతున్నారు. సుదీక్ష తల్లిదండ్రులు సుబ్బారాయుడు, శ్రీదేవి కూడా పుంటా కానా వెళ్లారు. ఆదివారం వారు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘‘కుమార్తె సెల్‌ఫోన్, బ్యాగ్, ఇతర వస్తువులన్నీ స్నేహితుల వద్దే ఉన్నాయి. ఆమెనెవరో కిడ్నాప్ చేసి ఉండొచ్చు’’అని అనుమానం వ్యక్తం చేశారు. ఆ దిశగా దర్యాప్తు చేయాలని కోరుతున్నారు. సుదీక్ష ఆచూకీ కోసం తాజాగా ఎఫ్‌బీఐ కూడా రంగంలోకి దిగింది. స్థానిక భారత రాయబార కార్యాలయం కూడా దర్యాప్తును పర్యవేక్షిస్తోంది. సుదీక్ష అదృశ్యంపై ఇంటర్‌పోల్ ఎల్లో నోటీస్ జారీ చేసింది.భిన్న కథనాలు సుదీక్షను చివరిసారిగా చూసిన జాషువా ఆమె అదృశ్యంపై భిన్న కథనాలు చెబుతున్నాడు. పెద్ద అలలు రావడంతో బీచ్ నుంచి వెళ్లిపోయానని ఓసారి, సుదీక్ష మోకాలి లోతు నీటిలో ఉండగా చివరగా చూశానని మరోసారి చెప్పాడు. ఆమె తీరంలో నడుస్తుండగా తాను నిద్రపోయానని మరోసారి చెప్పుకొచ్చాడు. పోలీసులు మాత్రం అతన్ని అనుమానితుడిగా భావించడం లేదు. బీచ్ లాంజ్‌లో ఆమె దుస్తులు కనిపించాయి. బహుశా బికినీలో సముద్రంలోకి వెళ్లి మునిగిపోయి ఉంటుందని భావిస్తున్నారు. ఆమె తండ్రి మాత్రం జాషువానే అనుమానిస్తున్నారు. -
రెండు నెలల్లో ట్రిపుల్ ఆర్ ఆమోదం!
సాక్షి, న్యూఢిల్లీ: రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) క్లియరెన్స్‌లన్నీ త్వరలో పూర్తికానున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. అనంతరం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే కేంద్ర కేబినెట్ ఆమోదానికి వెళ్తుందని చెప్పారు. ఈప్రక్రియ అంతా రెండు నెలల్లో పూర్తి చేస్తామని కేంద్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. కోమటిరెడ్డి మంగళవారం ఆర్ అండ్ బీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందనలతో కలిసి గడ్కరీతో భేటీ అయ్యారు.ట్రిపుల్ ఆర్, హైదరాబాద్–విజయవాడ ఆరులేన్ల రోడ్డు, 12 ఆర్వోబీలు తదితర అంశాలపై గడ్కరీతో చర్చలు జరిపారు. ఆ తర్వాత రాష్ట్రంలో పలు విమానాశ్రయాల గురించి పౌరవిమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుతో భేటీ అయ్యారు. కొత్తగూడెం, రామగుండం, పెద్దపల్లి, ఆదిలాబాద్, నిజామాబాద్ ఎయిర్‌పోర్టుల అంశంపై చర్చించారు. అనంతరం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. 95 శాతం భూసేకరణ చేశాం 2018–19లో రీజినల్ రింగ్ రోడ్డు ప్రకటించగా.. అప్పటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని కోమటి రెడ్డి విమర్శించారు. తాము అధికారం చేపట్టిన నాటి నుంచి కేంద్రంతో టచ్‌లో ఉంటూ ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే జంగారెడ్డి–భువనగిరి–చౌటుప్పల్ వరకు టెండర్లు పిలిచామన్నారు. 95 శాతం భూసేకరణను క్లియర్ చేశామని, కేంద్రం నుంచి ఆమోదం వచ్చాక వారికి పరిహారమిస్తామని తెలిపారు.‘హైదరాబాద్–విజయవాడ ఆరులేన్ల రహదారిని మచిలీపట్నం వరకు పొడిగిస్తున్నామని, ఇందుకు కన్సల్టెంట్‌ను పిలిచినట్లు గడ్కరీ తెలిపారు. అయితే, హైదరాబాద్–విజయవాడ వరకు ఇప్పటికే భూసేకరణ పూర్తయినందున త్వరగా టెండర్లు పిలవాలని కోరాను. రెండు ప్యాకేజీలుగా ఈ రహదారిని నిర్మించేందుకు కేంద్రం సిద్ధమైంది.మొదటి ప్యాకేజీలో మల్కాపూర్–విజయవాడ, రెండో ప్యాకేజీలో విజయవాడ–మచిలీపట్నం వరకు నిర్మాణం జరిపేందుకు గడ్కరీ ఒప్పుకున్నారు. పర్వతమాల పథకం కింద యాదగిరిగుట్ట, భువనగిరి కోటకు, నల్లగొండ పట్టణంలోని హనుమాన్ కొండ, నాగార్జున సాగర్ ఆనకట్ట మీదుగా నాగార్జున కొండను కలుపుతూ, మంథనిలోని రామగిరి కోట ప్రాంతాల్లో రోప్‌వేలు అడిగాను. వీటిపై గడ్కరీ సానుకూలంగా స్పందించారు’అని కోమటిరెడ్డి చెప్పారు.అనర్హత వేటు పడుతుందనే అసెంబ్లీకి కేసీఆర్ అనర్హత వేటు పడుతుందనే భయంతోనే బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు వస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎద్దేవాచేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇక లేనట్లేనని, ఆ పార్టీని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేరని మీడియాతో చిట్‌చాట్‌లో అన్నారు. ‘కాంగ్రెస్ వైఫల్యాలను ప్రశ్నిస్తానని కేసీఆర్ అంటున్నారు, ఒకవేళ కేసీఆర్ ఒక అంశాన్ని ఎత్తి చూపితే పది అంశాలను సభ ముందు పెడతాం. దళిత సీఎం నుంచి జర్నలిస్ట్‌ల వరకు కేసీఆర్ చేసిన మోసాలను ఎండగడతాం’అని అన్నారు. రేవంత్‌రెడ్డి పదేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని తెలిపారు. సీఎం మార్పు జరుగుతుందని వస్తున్నవన్నీ అసత్య ప్రచారాలేనంటూ కొట్టిపడేశారు. -
‘నాగపూర్ ప్లాన్’ అంగీకరించం
చెన్నై: జాతీయ విద్యా విధా నం అనేది విధ్వంసకర నాగ పూర్ ప్లాన్ అని తమి ళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ పరోక్షంగా ఆర్ ఎస్‌ఎస్‌పై మండిపడ్డారు. దాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని చెప్పా రు. హిందీ, సంస్కృత భాషలను ఆమోదిస్తే రూ.2 వేల కోట్లు ఇస్తామని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అంటున్నారని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం తమ రాష్ట్రానికి రూ.10 వేల కోట్లు ఇచ్చినా జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయబోమని స్టాలిన్ స్పష్టంచేశారు.మంగళవారం చెంగల్‌పేటలో ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేంద్రం తీసుకొచ్చిన విద్యా విధానం తమిళనాడులో విద్యాభివృద్ధిని పూర్తిగా దెబ్బతీస్తుందని తెలిపారు. విద్యార్థులను విద్య నుంచి దూరం చేసేలా ఈ విధానం తీసుకొచ్చారని విమర్శించారు. విద్యా రంగంపై కేంద్ర ప్రభుత్వ పెత్తనం ఏమిటని నిలదీశారు.విద్యలో మతతత్వాన్ని పెంచడం, ప్రైవేటీకరణను ప్రోత్సహించడం సరైంది కాదని స్పష్టం చేశారు. కేవలం సంపన్న వర్గాల పిల్లలే ఉన్నత విద్య అభ్యసించాలా? పేదలకు చదువుకొనే అవకా శాలు లభించకూడదా? అని ప్రశ్నించారు. తమిళ నా డు ప్రయో జనాల పరిరక్షణ కోసం కేంద్రంపై పోరాడుతూనే ఉంటామని స్టాలిన్ పునరుద్ఘాటించారు. -
మినీ ఇండియా.. మారిషస్
పోర్ట్ లూయిస్: భారత్‌కు, గ్లోబల్ సౌత్‌కు మధ్య మారిషస్ ఒక వంతెన అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మారిషస్ కేవలం భాగస్వామ్య దేశం మాత్రమే కాదని, భారతదేశ కుటుంబంలో ఒక అంతర్భాగమని చెప్పారు. మారిషస్ అంటే ‘మినీ ఇండియా’ అని అభివర్ణించారు. ఆయన మంగళవారం మారిషస్ రాజధాని పోర్ట్ లూయిస్‌లో ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో మారిషస్ ప్రధాని డాక్టర్ నవీన్‌చంద్ర రామ్‌గూలమ్, వీణా దంపతులు, మంత్రివర్గ సభ్యులు సైతం పాల్గొన్నారు.భారత్, మారిషస్ మధ్య బలమైన చారిత్రక సంబంధాలు ఉన్నాయని మోదీ గుర్తుచేశారు.ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా(ఓసీఐ) కార్డులను రామ్‌గూలమ్ దంపతులకు మోదీ అందజేశారు. మారిషస్‌లోని ఏడో తరం భారతీయులకు కూడా ఈ కార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. అంతకుముందు రెండు రోజుల పర్యటన నిమిత్తం మారిషస్‌కు చేరుకున్న ప్రధాని మోదీకి చిరస్మరణీయమైన స్వాగతం లభించింది.రాజధాని పోర్ట్ లూయిస్‌లోని సర్ సీవూసాగర్ రామ్‌గూలమ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో మారిషస్ ప్రధాని నవీన్‌చంద్ర రామ్‌గూలమ్‌తోపాటు ఉప ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, నేషనల్ అసెంబ్లీ స్పీకర్, ప్రతిపక్ష నేత, విదేశాంగ మంత్రి, కేబినెట్ సెక్రెటరీ తదితరులు ఘన స్వాగతం పలికారు. మోదీని స్వాగతించడానికి మొత్తం మంత్రివర్గం తరలిరావడం గమనార్హం. మంత్రులు, అధికారులు సహా 200 మందికి ఆయన కోసం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. బిహారీ సంప్రదాయ స్వాగతం మారిషస్‌లో నివసిస్తున్న భారతీయులు ప్రధాని మోదీకి సాదర స్వాగతం పలికారు. మోదీ బస చేసిన హోటల్ వద్ద భారతీయ మహిళలు సంప్రదాయ బిహారీ సాంస్కృతిక సంగీతభరిత నృత్యం ‘గీత్ గవాయ్’తో ఆయనను స్వాగతించారు. అలాగే భోజ్‌పురి సంప్రదాయ గీతం ఆలపించారు. భారత త్రివర్ణ పతాకం చేతబూని ‘భారత్ మాతాకీ జై’ అని బిగ్గరగా నినదించారు. తనకు లభించిన అపూర్వమైన గౌరవ మర్యాదల పట్ల ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. మారిషస్ అధ్యక్షుడికి గంగాజలం బహూకరణ మారిషస్ అధ్యక్షుడు ధరమ్ గోకుల్‌కు ప్రధాని మోదీ అరుదైన కానుక అందజేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్‌రాజ్‌లో త్రివేణి సంగమం వద్ద జరిగిన మహా కుంభమేళా సమయంలో ఇత్తడి, రాగి పాత్రలో సేకరించిన పవిత్ర గంగజలాన్ని బహూకరించారు. బిహార్‌లో సాగు చేసిన సూపర్‌ఫుడ్ మఖానాతోపాటు మరికొన్ని బహుమతులు సైతం అందించారు. అలాగే ధరమ్ గోకుల్ భార్య బృందా గోకుల్‌కు బనారసీ చీరను కానుకగా ఇచ్చారు. గుజరాత్ కళాకారులు తయారు చేసిన సందేలి చెక్కపెట్టెలో ఈ చీరను అందజేశారు. అలాగే ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా(ఓసీఐ) కార్డును ధరమ్ గోకుల్ దంపతులకు అందించారు.దివంగత నేతలకు నివాళులు భారత్, మారిషస్ ప్రధానమంత్రులు మోదీ, నవీన్‌చంద్ర రామ్‌గూలమ్ సర్ సీవూసాగర్ రామ్‌గూలమ్ బొటానికల్ గార్డెన్‌ను సందర్శించారు. ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. మారిషస్ దివంగత నేత సీర్ సీవూసాగర్ రామ్‌గూలమ్ సమాధి వద్ద మోదీ పుష్పగుచ్ఛం ఉంచి ఘనంగా నివాళులల్పించారు. అలాగే మాజీ అధ్యక్షుడు, మాజీ ప్రధాని అనిరుధ్ జగన్నాథ్ సమాధి వద్ద నివాళులల్పించారు. వారిని స్మరించుకున్నారు.మోదీకి మారిషస్ అత్యున్నత పురస్కారం భారత ప్రధానమంత్రి మోదీని తమ దేశ అత్యున్నత పురస్కారంతో సత్కరించనున్నట్లు మారిషస్ ప్రధాని రామ్‌గూలమ్ ప్రకటించారు. మోదీకి ప్రతిష్టాత్మక ‘ద గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అండ్ కీ ఆఫ్ ద ఇండియన్ ఓషియన్’ అవార్డు అందజేస్తామని వెల్లడించారు. ఈ పురస్కారం అందుకోనున్న మొట్టమొదటి భారత ప్రధానిగా మోదీ రికార్డుకెక్కబోతున్నారు. -
14 నెలలైనా.. హామీల అమలులో అదే కాలయాపన
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు 6 గ్యారంటీలు ప్రకటించి, అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్నా ఆ హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి మండిపడ్డారు. దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే పార్టీ బీజేపీ అని, తాము చేయలేకపోయిన హామీలను ఇంకొకరి మీద వేసి, వారు అడ్డుకుంటున్నారు అని ఎప్పుడూ ఎవరినీ నిందించలేదని పరోక్షంగా సీఎం రేవంత్‌రెడ్డిని కిషన్‌రెడ్డి విమర్శించారు. కొత్త ప్రాజెక్టుల పేరు మీద రూ. 1.5 లక్షల కోట్లు కావాలి అంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం చిన్నపిల్లల నవ్వులాటలా ఉందని ఎద్దేవా చేశారు. ఆర్థిక వనరులకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించాలని కిషన్‌రెడ్డి సూచించారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని తన నివాసంలో భారతీయ పురాతన చేతివృత్తుల వైభవాన్ని గుర్తుచేస్తూ రచించిన ‘వూట్జ్: ద ఫర్గాటెన్ మెటల్ క్రాఫ్ట్ ఆఫ్ డెక్కన్’పుస్తకాన్ని కిషన్‌రెడ్డి ఆవిష్కరించారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, తన వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ప్రజల దృష్టి మళ్లించడానికి కొత్త ప్రాజెక్టుల రూపకల్పన చేసి కేంద్ర ప్రభుత్వాన్ని డబ్బులు అడుగుతున్నారని విమర్శించారు. ఇది దివాలాకోరు విధానం, బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో రూ. 7.5 లక్షల కోట్లు అప్పు చేసిందని, తమకు తెలియదని, రాష్ట్ర అప్పు రూ.3.5 లక్షల కోట్లే అనుకున్నానని రేవంత్‌రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలను కిషన్‌రెడ్డి తప్పుబట్టారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నానని, హామీలు అమలు చేయలేకపోతున్నానంటూ ముఖ్యమంత్రి మాట మార్చడం రాహుల్‌గాం«దీ, రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, అసమర్థతకు అద్దం పడుతోందని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డుకు తామే హామీ ఇచ్చామని, తప్పకుండా అమలు చేస్తామని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. బుధవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసా, మహిళలకు ఇచ్చిన హామీలు, జాబ్ కేలండర్, నిరుద్యోగ భృతి, రైతులు, కౌలు రైతులకు ఆర్థిక సహాయం, పెన్షన్లు సహా ఇచి్చన అన్ని హామీల గురించి ప్రస్తావిస్తామన్నారు. వీటన్నింటి గురించి శాసనసభలో చర్చిస్తే బాగుంటుందని కిషన్‌రెడ్డి సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 14 నెలల్లో రాష్ట్రాన్ని దోపిడీ చేశారని, రియల్టర్లను వేధిస్తున్నారని మండిపడ్డారు. ఓడిపోతామన్న భయంతోనే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో తనపై వ్యక్తిగత విమర్శలు చేశారన్నారు. తనను ఎవరు తిట్టినా వారి విజ్ఞతకే వదిలేస్తానని చెప్పారు. -
Ranya Rao : రన్యారావు కేసులో భారీ ట్విస్ట్
బెంగళూరు : కన్నడ నటి రన్యారావు కేసులో భారీ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఆమెపై డీఆర్ఐ అధికారులకు ఆమె భర్తే జతిన్ హుక్కేరి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. పెళ్లైన రెండు నెలల నుంచి తరచు విదేశాలకు వెళ్తోంది. ఆమె విదేశీ టూర్లతో నిత్యం గొడవలు జరిగేవి.ఈ క్రమంలో తన భార్య ప్రవర్తనపై అనుమానం రావడంతో తన భర్త రన్యారావు డీఆర్ఐ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రన్యారావు కదలికలపై నిఘా పెట్టిన డీఆర్ఐ అధికారులు.. ఆమె బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. 15 రోజుల్లో నాలుగుసార్లు దుబాయ్‌కు వెళ్లడంకన్నడ హీరోయిన్ రన్యారావు (Ranya Rao) బంగారం అక్రమరవాణా కేసులో కటకటాలపాలైంది. 15 రోజుల్లో నాలుగుసార్లు దుబాయ్‌కు వెళ్లడం, అదికూడా ప్రతిసారి సేమ్ డ్రెస్ ధరించడంతో అధికారులకు అనుమానమొచ్చింది. సోమవారం (మార్చి 3న) ఆమెను బెంగళూరు ఎయిర్‌పోర్టులో తనిఖీ చేయగా 14 కిలోలకు పైగా బంగారంతో అడ్డంగా దొరికిపోయింది. దీంతో ఆమెను అరెస్టు చేసిన అధికారులు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఇకపోతే రన్యా రావు తండ్రి కర్ణాటక డీజీపీ డాక్టర్ కే.రామచంద్రారావు పెళ్లయ్యాక మళ్లీ కలిసిందే లేదన్న డీజీపీఇప్పటికే ఈ విషయంపై డీజీపీ స్పందిస్తూ రన్యాకు నాలుగు నెలలకిందటే పెళ్లి జరిగిందని, అప్పటినుంచి తనను కలవలేదని పేర్కొన్నారు. కూతురు, అల్లుడు చేసే పనుల గురించి తనకెటువంటి విషయాలు తెలియదన్నాడు. ఈ క్రమంలో రన్యా భర్త ఎవరన్న వివరాలు బయటకు వచ్చాయి. రన్యా భర్త పేరు జతిన్ హుక్కేరి. ఈయన ఆర్కిటెక్ట్. బెంగళూరులో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ పట్టా పొందాడు. తర్వాత లండన్‌లో డిస్రప్టివ్ మార్కెట్ ఇన్నొవేషన్ కోర్సు చదివాడు. తండ్రి డీజీపీ, భర్త ఆర్కిటెక్ట్మొదట్లో బెంగళూరులోని పలు రెస్టారెంట్లకు డిజైనర్‌గా పని చేశాడు. లండన్‌లోనూ ఆర్కిటెక్ట్‌గా సేవలందించాడు. WDA & DECODE LLC సంస్థను స్థాపించడంతోపాటు దానికి క్రియేటివ్ డైరెక్టర్‌గానూ వ్యవహరిస్తున్నాడు. క్రాఫ్ట్ కోడ్ కంపెనీకి ఫౌండర్ కూడా ఇతడే! రన్యారావును పెళ్లి చేసుకున్నాక తనతో కలిసి పలుమార్లు దుబాయ్ ట్రిప్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఎయిర్‌పోర్టులో బంగారం స్మగ్లింగ్ చేస్తూ రన్యా దొరికిపోగా.. ఆమె ఇంటిని సైతం తనిఖీ చేశారు. ఈ సోదాలో రూ.2.06 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ.2.67 కోట్ల నగదు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.సినిమారన్యా రావు.. కిశోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ స్కూల్లో నటనపై శిక్షణ తీసుకుంది. మాణిక్య అనే కన్నడ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. ఇది ప్రభాస్ మిర్చి మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది. పటాస్ కన్నడ రీమేక్ పటాకిలో హీరోయిన్గా నటించింది. తమిళంలో వాఘా మూవీ చేసింది. ఎనిమిదేళ్లుగా వెండితెరకు దూరంగా ఉంటోంది. -
‘పెరిగిన పోలవరం ఖర్చును ఎవరు భరిస్తారు?’
ఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు, బడ్జెట్ లో పోలవరంకు కేటాయించిన నిధులు, పెరిగిన పోలవరం ప్రాజెక్టు ఖర్చు, విద్యారంగం తదితర అంశాలపై వైఎస్సార్సీపీ తన గళం వినిపించింది. ఉభయ సభల్లోనూ వైఎస్సార్సీపీ ఎంపీలు కొన్ని కీలకాంశాలు లేవనెత్తారు.ఈరోజు(మంగళవారం) పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఎంపీ గురుమూర్తి.. లోక్‌సభలో మాట్లాడుతూ.. ‘పోలవరం ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గించారు. పోలవరం ఎత్తు తగ్గించడం వల్ల స్టోరేజ్ కెపాసిటీ 194 నుంచి కేవలం 115 టీఎంసీలకే పరిమితమవుతుంది. దీనివల్ల సాగునీరు, తాగు నీటికి , విద్యుత్తు ఉత్పత్తి పైన తీవ్ర ప్రభావం పడుతుంది. ఒరిజినల్ పోలవరం డ్యాం ఎత్తు ప్రకారమే నిర్మించాలి.ఇటీవల బడ్జెట్లో పోలవరంకు అరకొరగా రూ. 5936 కోట్లు మాత్రమే కేటాయించారు. పెరిగిన పోలవరం ఖర్చును ఎవరు భరిస్తారు?, పోలవరం సిఈఓ ఆఫీస్ ను ఏపీకి తరలించాలి. ఏపీలో 17 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనుమతులు తీసుకుంది. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం లేఖతో కడప మెడికల్ కాలేజీ పర్మిషన్ ను ఉపసంహరించారు.మౌలిక వసతులు లేవనే రాష్ట్ర ప్రభుత్వం లేఖతో ..మెడికల్ కాలేజీలకు పర్మిషన్ వెనక్కి తీసుకోవడం చరిత్రలో ఇదే తొలిసారి. 17 మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయకూడదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తారా లేదన్న అంశంపై కేంద్రం స్పష్టత ఇవ్వాలి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు ఇస్తారా లేదో చెప్పాలి. దుగ్గరాజపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి. విభజన చట్టం ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఇప్పటివరకు ఈ హామీని నిలుపుకోకపోవడం ప్రజలను మోసం చేయడమే. అమరావతికి ఇచ్చే 15000 కోట్ల రూపాయలను ఎవరు చెల్లిస్తారు?, అమరావతి అప్పులను ఎవరు చెల్లిస్తారనేది స్పష్టం చేయాలి’ అని ఎంపీ గురుమూర్తి డిమాండ్ చేశారు.వైఎస్ జగన్ విద్యారంగం అభివృద్ధి కృషి చేశారురాజ్యసభలో విద్యాశాఖ పద్దులపై వైఎస్సార్సీపీ ఎంపీ గొల్ల బాబురావు మాట్లాడుతూ.. ‘ వైఎస్ జగన్ హయాంలో ఏపీలో విద్యారంగం అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. విద్యా దీవెన, విద్యా వసతి దీవెన కింద రూ. 73 వేల కోట్లు రూపాయిలు విద్యార్థుల కోసం ఖర్చు చేశారు. 45 వేల ప్రభుత్వ పాఠశాలలను నందనవనంగా తీర్చిదిద్దారు. దీన్ని చూసి ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేశాయి. కాలేజీ విద్యను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది కాలేజీలో కేవలం డిగ్రీలు ఇచ్చే సంస్థలుగా మారిపోయాయి. ఎలాంటి నైపుణ్యాలు లేకుండా విద్యార్థులు బయటకు వస్తున్నారు’ అని ఎంపీ గొల్ల బాబురావు స్పష్టం చేశారు. -
జట్కా మటన్ అంటే ఏంటి, ఎక్కడ దొరుకుతుంది?
హలాల్ గురించి మాంసం ప్రియులకు తెలిసే ఉంటుంది. ముస్లింల దుకాణాల్లో హలాల్ చేసిన మాంసాన్ని విక్రయిస్తుంటారు. అయితే గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా హలాల్ వ్యతిరేక ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో హిందూ మాంసం దుకాణదారులను ఒక తాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నం మొదలైంది. ఖాతిక్ సమాజానికి చెందిన హిందువులు నిర్వహిస్తున్న జట్కా మాంసం (jhatka mutton) దుకాణాలను ప్రోత్సహించేందుకు కొత్తగా మల్హార్ సర్టిఫికేషన్ (Malhar certification) అందుబాటులోకి తెచ్చారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ కూడా ప్రారంభించారు.మల్హార్ సర్టిఫికేషన్ కింద నమోదు చేసుకోవడానికి ఒక పోర్టల్‌ను ప్రారంభించినట్లు మహారాష్ట్ర మత్స్యకార, ఓడరేవుల శాఖ మంత్రి నితేష్ రాణే (Nitesh Rane) సోమవారం ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జట్కా మటన్, చికెన్ విక్రేతలు అందరూ మల్హార్ సర్టిఫికెట్ పొందాలని ఆయన సూచించారు. హిందువులు మల్హార్ సర్టిఫికేషన్ ఉన్న దుకాణాల నుంచి మాత్రమే మటన్, చికెన్ కొనుగోలు చేయాలని సోషల్ మీడియా పోస్ట్‌లో కోరారు."ఈ రోజు మహారాష్ట్రలోని హిందూ సమాజం కోసం మేము ఒక ముఖ్యమైన అడుగు వేశాం. ఈ చొరవ హిందువులకు హిందూ ఆచారాల ప్రకారం లభించే జట్కా మాంసాన్ని విక్రయించే మటన్ దుకాణాలకు ప్రవేశం కల్పిస్తుంద"ని అని మంత్రి నితేష్ రాణే అన్నారు. వినియోగదారులను ధృవీకరించబడిన జట్కా మాంసం విక్రేతలతో అనుసంధానించడానికి వీలుగా MalharCertification.com అనే కొత్త వెబ్‌సైట్‌ను ప్రారంభించినట్టు ప్రకటించారు.మల్హార్ సర్టిఫికేషన్ అంటే?హిందూ మాంసం విక్రేతలందరినీ ఒకే వేదిక కిందకు తీసుకురావడానికి మల్హార్ సర్టిఫికేషన్ విధానాన్ని తెరపైకి తెచ్చారు. జట్కా మాంసం దుకాణాలను ఖాతిక్ సమాజానికి చెందిన హిందువులు మాత్రమే నిర్వహిస్తున్నారని మల్హార్ సర్టిఫికేషన్ నిర్ధారిస్తుంది. హిందువులు, సిక్కులకు హలాల్ రహిత మాంసం విక్రయించాలన్న లక్ష్యంతో దీన్ని అందుబాటులోకి తెచ్చారు. అంతేకాదు హిందూ మత సంప్రదాయాల ప్రకారం మేక, గొర్రె మాంసాన్ని శుభ్రంగా, లాలాజల కాలుష్యం లేకుండా.. మరే ఇతర జంతు మాంసం కలపకుండా విక్రయించేందుకు మల్హార్ సర్టిఫికేషన్ ఉపయోగపడుతుంది.వెబ్సైట్లో ఏముంది?జట్కా మటన్, చికెన్ విక్రేతలను ప్రామాణికంగా గుర్తించే ప్రక్రియే మల్హార్. హిందూ మతాచారాల ప్రకారమే మేక, గొర్రెలను వధించి మాంసాన్ని సంగ్రహిస్తారు. ఇది పరిశుభ్రంగా, లాలాజల రహితంగా ఉంటుంది. ఇందులో ఎటువంటి ఇతర జంతువుల మాంసం కలవదు. ఖాతిక్ సమాజానికి చెందిన హిందువులు మాత్రమే ప్రత్యేకంగా జట్కా మాంసాన్ని విక్రయిస్తారు. మల్హార్ నిర్ధారించిన దుకాణాల్లో మాత్రమే మటన్ కొనాలని మేము పోత్సహిస్తున్నామని మల్హార్ సర్టిఫికేషన్ వెబ్సైట్ పేర్కొంది.జట్కా మాంసాన్ని ఎందుకు ఇష్టపడతారు?హిందూ సంప్రదాయాలను పాటించే వారు జట్కా మాంసాన్ని ఇష్టపడతారు. మాంసం వినియోగానికి ఇది నైతిక పద్ధతి అని నమ్ముతారు. ఎందుకంటే జట్కా విధాననంలో జంతువుకు ఎక్కువ బాధ లేకుండా వెంటనే వధిస్తారు. హలాల్ మాంసంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో హలాల్ రహిత ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో గత సంవత్సరం నవంబర్‌లో ఎయిర్ ఇండియా.. హిందూ, సిక్కు ప్రయాణికులకు హలాల్ రహిత ఆహారాన్ని అందించి వార్తల్లో నిలిచింది. ఇప్పుడు మహారాష్ట్రలో మల్హార్ సర్టిఫికేషన్‌తో హలాల్ రహిత మాంసాన్ని విక్రయించేందుకు చొరవ చూపారు. దీనిపై మరాఠీల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచిచూడాలి. -
‘పెద్దల’ సభలో మల్లికార్జున్ ఖర్గే క్షమాపణలు
న్యూఢిల్లీ: ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే రాజ్యసభలో ఈరోజు(మంగళవారం) చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగడంతో ఆయన ఎట్టకేలకు దిగిచ్చారు. తాను చేసినవ్యా ఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని, అందుకు క్షమాపణలు తెలుపుతున్నానని అన్నారు. దీనిలో భాగంగా డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్కఉ క్షమాపణలు చెప్పారు.జాతీయ ఎడ్యుకేషన్ పాలసీపై తాము చర్చ చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని, మంత్రి ధర్మంద్ర ప్రదాన్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఆ క్రమంలోనే ప్రభుత్వాని తోసి వేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ మండిపడింది. ఆయన వ్యాఖ్యలు అవమానకంగా ఉన్నాయని, అసభ్య పదజాలాన్ని వాడారని, అది క్షమించరానిదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు.ఆ వ్యాఖ్యలకు కచ్చితంగా ఖర్గే క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు అదే సమయంలో ఆయన వాడిన పదాన్ని కూడా రికార్డులనుండి తొలగించాలన్నారు. దాంతో దిగి వచ్చిన ఖర్గే.. రాజ్యసభ చైర్మన్ కు క్షమాపణలు తెలియజేశారు. ‘నేను ఇక్కడ సభను ఉద్దేశించో, లేక మిమ్మల్ని( రాజ్యసభ చైర్మన్ చైర్)ను ఉద్దేశించో ఆ వ్యాఖ్యలు చేయలేదు. కేవలం ప్రభుత్వ విధానాలపైనే ఆ వ్యాఖ్యలను చేశాను. ఆ వ్యాఖ్యలు మీకు అభ్యంతరకరంగా ఉంటే వెనక్కి తీసుకుంటాను. అందుకు క్షమాపణలు తెలియజేస్తున్నాను’ అని ఖర్గే పేర్కొన్నారు.ఇదిలా ఉంటే, తమిళుల మనోభావాలు దెబ్బతీశారంటూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై డీఎంకే పార్టీ.. ఆయనపై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చింది. ఆయన చట్ట సభను తప్పుదోవ పట్టించారని డీఎంకే ఎంపీ కనిమొళి లోక్‌సభలో ఈ తీర్మానం దాఖలు చేశారు.తమిళనాడు.. అక్కడి ప్రజలు అనాగరికులు(Uncivilized) అంటూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఆయన తమిళిలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డీఎంకే, 8 కోట్ల మంది మా ప్రజల తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను’ అని ఆమె పేర్కొన్నారు. -
రాజధానికి కేంద్రం నిధులపై స్పష్టత లేదు: వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి
ఢిల్లీ: ఏపీ రాజధాని నిర్మాణం కోసం కేంద్రం అందించే నిధులపై స్పష్టత లేదన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఢిల్లీలో ఉన్న ఎంపీ గురుమూర్తి.. సాక్షి టీవీతో మాట్లాడుతూ.. రాజధానికి కేంద్రం అందిస్తున్న నిధులపై స్పష్టత లేదన్నారు.15 వేల కోట్ల రూపాయల సహాయం అందిస్తామన్న కేంద్రం 1500 కోట్లకే పరిమితం కావడం ఏమిటి ? , మిగిలిన సొమ్ముకు తాము కేవలం ఫెసిలిటేటర్ గానే వ్యవహరిస్తామని చెబుతోంది. రాజధాని అప్పుల చెల్లింపు బాధ్యత తమదేనని కేంద్ర ప్రభుత్వం ప్రకటించలేదు. ఇప్పటికే ఏపీ అప్పుల కుప్పగా మారింది. ఏపీ శ్రీలంక, జింబాబ్వే గా మారిందని గతంలో గగ్గోలు పెట్టిన కూటమి నేతలు రాజధాని అప్పులపై ఏం మాట్లాడుతారు. అలాగే రాజధానికి ఇస్తున్న అప్పుల కు విధిస్తున్న షరతులు , నిబంధనలేమిటో బయట పెట్టలేదు. ప్రపంచ బ్యాంకు లాంటి సంస్థలు పన్నులు పెంచాలని, సంస్థలను తాకట్టు పెట్టమని షరతులు పెడుతుంటాయి. అలాంటి షరతులు రాజధాని అప్పులకు ఏమైనా విధించారా? ఉంటే వాటిని బహిరంగపరచాలి’ అని ఆయన డిమాండ్ చేశారు. -
నటి రన్యారావు కేసులో కీలక మలుపు
సినీ నటి రన్యారావు కీలక నిందితురాలిగా ఉన్న బంగారం అక్రమ రవాణా కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగిస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంతో పాటు వీఐపీ ప్రొటోకాల్ దుర్వినియోగం.. అందులో ఆమె సవతి తండ్రి ప్రమేయం తేల్చేందుకు సీఎం సిద్ధరామయ్య ప్రత్యేక విచారణకు ఆదేశించారు.ఈ కేసులో పోలీసుల ప్రమేయం ఉందన్న ఆరోపణలు.. అలాగే తన విదేశీ పర్యటనల టైంలో వాళ్ల చేతుల్లో వేధింపులకు గురయ్యానన్న రన్యారావు ఆరోపణలపై సీఐడీ దర్యాప్తు జరపనుంది. వీలైనంత త్వరగా నిజనిర్ధారణలతో నివేదిక సమర్పించాలని దర్యాప్తు ఏజెన్సీని ప్రభుత్వం ఆదేశించింది.ఇక మరోవైపు.. నటి రన్యారావు వీఐపీ ప్రోటోకాల్‌ను దుర్వినియోగం చేస్తూ బంగారం అక్రమ రవాణా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కెంపగౌడ ఎయిర్‌పోర్టులో ప్రోటోకాల్ దుర్వినియోగం అంశంపైనా ప్రభుత్వం విడిగా మరో దర్యాప్తునకు ఆదేశించింది. ఈ బాధ్యతలను సీనియర్ ఐఏఎస్ అధికారి, అదనపు సీఎస్ గౌరవ్ గుప్తా అప్పగించింది. అలాగే.. ఈ అంశంలో ఆమె సవతి తండ్రి, డీజీపీ కె. రామచంద్రరావు పాత్రపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, అవసరమైతే ఆయన్ని విచారించాలని కోరింది. ఈ వ్యవహారంలో రామచంద్ర పాత్ర ఉందా? లేదా? అనేది తేల్చాలని గుప్తాకు వారం గడువు ఇచ్చింది ప్రభుత్వం. మార్చి 3వ తేదీన 14.8 కేజీల అక్రమ బంగారాన్ని దుబాయ్ నుంచి తీసుకొస్తూ.. బెంగళూరు ఎయిర్‌పోర్టులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్సీ(DRI) అధికారులకు చిక్కిన కన్నడ నటి రన్యారావు చిక్కారు. ఈ కేసు దర్యాప్తులో లోతుకు వెళ్లే కొద్దీ.. కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. -
కలికాలంలో.. ఓ తండ్రి విషాదగాథ!
తెలుగులో చంద్రమోహన్-జయసుధ నటించిన కలికాలం అనే సినిమా ఒకటుంది. సమాజంలో.. తల్లిదండ్రుల పట్ల పిల్లలు వ్యవహరించే తీరును సమకాలీన అంశాల ఆధారంగా అప్పట్లో చూపించారు దర్శకుడు ముత్యాల సుబ్బయ్య. అయితే ఆనాటికి.. ఈనాటికి ఆ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదని నిరూపించిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది.హరేంద్ర మౌర్య(46).. మోరెనా టౌన్లో ఎలక్ట్రీషియన్ పని చేసేవారు. ఆయనకు ముగ్గురు కూతుళ్లు.. ఓ కొడుకు. మార్చి 1వ తేదీన ఒకేసారి ఇద్దరు కూతుళ్లకు అంగరంగ వైభవంగా వివాహం చేశాడాయన. అయితే కొన్ని గంటలకే ఆ ఇంట విషాదం నెలకొంది. ఓ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్న హరేంద్ర.. ఎంత సేపటికి బయటకు రాలేదు. దీంతో తలుపులు బద్ధలు కొట్టి చూడగా ఆయన ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించారు. కిందకు దించి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని.. మృతదేహాన్ని గ్వాలియర్ మెడికల్ కాలేజీకి తరలించారు.భార్య విడాకులు తీసుకుంటుందనే ఇలా అఘాయిత్యానికి పాల్పడ్డాడని బంధువుల్లో కొందరు.. ఇంట్లో మనస్పర్థలవల్లే ఆయన చనిపోయాడని చుట్టుపక్కలవాళ్లు.. సొంత తండ్రి, సోదరుడే హరేంద్రను చంపారని భార్య తరఫు బంధువులు.. ఇలా ఎవరికి తోచినట్లు వాళ్లు మాట్లాడుకోసాగారు. ఈలోపు ఓ భయంకరమైన విషయం వెలుగు చూసింది.హరేంద్రను అతని భార్య, కూతుళ్లు కలిసి దారుణంగా హింసించిన వీడియో ఒకటి సోషల్ మీడియాకు ఎక్కింది. భార్య ఆయన కాళ్లను పట్టుకుంటే.. ఓ కూతురు చేతులు పట్టుకుంది. మిగతా ఇద్దరు కూతుళ్లు కర్రలతో ఆయన్ని విచక్షణ రహితంగా చితకబాదారు. ఆ బాధతో ఆయన అరుస్తున్న దృశ్యాలు అందులో రికార్డు అయ్యాయి. కొడుకు ఆ తండ్రిని రక్షించే ప్రయత్నం చేయగా.. అతన్ని వారించి మరీ హరేంద్రను హింసించడం ఆ వీడియోలో ఉంది. ఆ వీడియోను ఎవరు చిత్రీకరించారో.. ఎవరు బయట పెట్టారో తెలియదుగానీ.. హరేంద్ర మరణించిన తర్వాత బయటకు రావడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. Note: కలవరపరిచే దృశ్యాలు ఉన్న కారణంగా.. వీడియోను అప్లోడ్ చేయలేకపోతున్నాంఈ వీడియో ఆధారంగా హరేంద్రది బలవన్మరణం కాదని.. అతన్ని హింసించి హత్య చేశారని అతని బంధువులు ఆరోపిస్తున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన ఆ వీడియో రికార్డు చేసినట్లు ఉండగా.. పోలీసులు ఈ వీడియో ఆధారం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆ తండ్రికి ఎలాగైనా న్యాయం చేయాలంటూ పలువురు నెట్టింట డిమాండ్ చేస్తున్నారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
Dharmendra Pradhan: కేంద్ర మంత్రిపై ప్రివిలేజ్ మోషన్
న్యూఢిల్లీ: తమిళుల మనోభావాలు దెబ్బతీశారంటూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై మండిపడుతున్న డీఎంకే పార్టీ.. ఆయనపై ప్రివిలేజ్ మోషన్(Privilege motion) ఇచ్చింది. ఆయన చట్ట సభను తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ డీఎంకే ఎంపీ కనిమొళి లోక్‌సభలో ఈ తీర్మానం దాఖలు చేశారు.తమిళనాడు.. అక్కడి ప్రజలు అనాగరికులు(Uncivilized) అంటూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఆయన తక్షణమే క్షమాపణలు చెప్పాలని డీఎంకే, 8 కోట్ల మంది తమిళుల తరఫున నేను డిమాండ్ చేస్తున్నా అని అన్నారామె.జాతీయ విద్యా విధానం విషయంలో తమిళనాడు ప్రభుత్వం యూటర్న్ తీసుకుందని.. ఈ విషయంలో ఏమాత్రం నిజాయితీ లేకుండా వ్యవహరించిందని ధర్మేంద్ర ప్రధాన్(dharmendra pradhan) మండిపడిన సంగతి తెలిసిందే. ‘‘వాళ్లకు ఏమాత్రం నిజాయితీ లేదు. విద్యార్థుల జీవితాలు నాశనం చేసేలా రాజకీయాలు చేస్తున్నారు’’ అంటూ సోమవారం బడ్జెట్ మలివిడత సమావేశాల సందర్భంగా లోక్‌సభ వ్యాఖ్యలు చేశారు. దీంతో డీఎంకే ఎంపీలు ఆందోళనకు దిగగా.. సభ వాయిదా పడింది.అయితే కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై డీఎంకే భగ్గుమంది. ధర్మేంద్ర ప్రధాన్వి తలపొగరు వ్యాఖ్యలని డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. ఇది తమిళులను అవమానించడమేనని,ప్రధాని మోదీ ఇలాంటి వ్యాఖ్యలను అంగీకరిస్తారా? అంటూ మండిపడ్డారు.మరోవైపు.. పీఎం శ్రీ(PM SHRI) పథకం విషయంలో తమిళనాడు ప్రభుత్వం ఎంవోయూపై సంతకాలకు అంగీకరించి.. ఆపై వెనక్కి తగ్గిందని ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. అయితే ఇది ఏమాత్రం నిజం కాదని.. ఈ ప్రకటన పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించేదేనని.. ఇది సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని డీఎంకే అంటోంది. ఈ నేపథ్యంలో ఎంపీ కనిమొళి ప్రివిలేజ్ మోషన్ దాఖలు చేయగా.. ఆ తీర్మానాన్నిస్పీకర్ ఓం బిర్లా పరిశీలించనున్నారు. ఒకవేళ స్పీకర్ గనుక ఆ తీర్మానాన్ని అంగీకరిస్తే దర్యాప్తునకు ఆదేశిస్తారు. అందులో ఉల్లంఘన జరిగినట్లు తేలితే క్రమశిక్షణా ఉల్లంఘన కింద చర్యలు తీసుకుంటారు. -
తండ్రి మృతదేహం సాక్షిగా వివాహం
సాక్షి, చెన్నై: మరికొన్ని గంటల్లో కుమారుడి వివాహం జరగబోనుండగా.. తండ్రి గుండెపోటుతో(Heart attack) కుప్పకూలిపోయాడు. సాధారణంగా అయితే వివాహాన్ని వాయిదా వేస్తుంటారు. అంతటి దుఃఖంలోనూ వరుడి తల్లి స్పందించి.. తన భర్త నిర్ణయాన్ని అమలు చేశారు. ఆయన మృత దేహం సాక్షిగా కుమారుడి వివాహం జరిపించారు. వివరాలు.. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా పేరుగోపనపల్లికి చెందిన వరదరాజ్ (60) దుస్తుల వ్యాపారం చేస్తుండగా.. అతని భార్య మంజుల గృహిణి. వీరి కుమారుడు మనీశ్‌కు బర్గూరు చెందిన గోవిందరాజులు, శివశంకరిల కుమార్తె కావ్య ప్రియకు సోమవారం వివాహం జరగాల్సి ఉంది. ఆదివారం రాత్రి వివాహానికి సంబంధించిన వేడుక నిర్వహించారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న వరుడి తండ్రి వరదరాజ్ హఠాత్తుగా కుప్పకూలాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి.. వరద రాజ్ గుండెపోటుతో మరణించినట్లు తెలిపారు. దీంతో వధూవరుల కుటుంబసభ్యులు, బంధువులు షాక్ గురయ్యారు. వివాహాన్ని వాయిదా వేద్దా మంటూ సలహాలు ఇచ్చారు. కానీ వరుడి తల్లి మంజుల స్పందించి.. పెళ్లి (marriage) కుదరగానే తన భర్త ఎంతో సంతోషించాడని కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన నిర్ణయం ప్రకారం వివాహ తంతు పూర్తి చేస్తే.. తన భర్త ఆత్మకు శాంతి కలుగు తుందన్నారు. దీంతో గ్రామ పెద్దలు, వధూవరుల కుటుంబసభ్యులు, బంధువులు చర్చించుకొని.. వివాహానికి అంగీకారం తెలిపారు. అనంతరం వరదరాజ్ మృతదేహం సాక్షిగా వరుడు మనీశ్ వధువు మెడలో తాళి కట్టాడు. అనంతరం వరదరాజ్ అంత్యక్రియలు నిర్వహించారు.Video Credit To Polimer News -
కోతిని తుపాకీతో కాల్చి వండి తినేశారు!
సేలం(తమిళనాడు): కోతిని(monkey) నాటు తుపాకీతో కాల్చి వండి తిన్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు..దిండుగల్ జిల్లా వీరసిన్నంపట్టి ప్రాంతానికి చెందిన రాజారాంకు అదే ప్రాంతంలో మామిడి, కొబ్బరి తో ఉంది. కోతకు వచ్చిన మామిడి కాయలను ఆరగిస్తూ కోతులు నష్టం కలిగించసాగాయి. దీంతో రాజారాం గ్రామానికి చెందిన జయమణికి రూ. 1000 ఇచ్చి కోతుల బెడద లేకుండా చేయాలని కోరారు. దీంతో జయమణి నాటు తుపాకీతో ఒక కోతిని కాల్చి, దాన్ని వండుకుని తిన్నట్టు తేలింది. ఇది తెలుసుకున్న సిరుమలై అటవీ శాఖ పోలీసులు రాజారాం, జయమణిలను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. -
సుప్రీం జడ్జిగా బాగ్చీ నియామకం
న్యూఢిల్లీ: కలకత్తా హైకోర్టు జడ్జి జస్టిస్ జాయ్మాల్య బాగ్చీ సోమవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈయన పేరును సుప్రీంకోర్టు జడ్జిగా సిఫార్సుచేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం మార్చి ఆరో తేదీన నిర్ణయించడం తెల్సిందే. జస్టిస్ బాగ్చీని సుప్రీంకోర్టు జడ్జిగా నియమిస్తున్నట్లు న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ తన సామాజిక మాధ్యమ ఖాతా ‘ఎక్స్’లో సోమవారం ఒక పోస్ట్‌చేశారు. 1966 అక్టోబర్ మూడున జన్మించిన ఈయన సుప్రీంకోర్టులో ఆరేళ్లపాటు జడ్జిగా కొనసాగనున్నారు. ఈ కాలంలోనే పదోన్నతి పొంది సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తిగానూ సేవలందించే అవకాశముంది. జస్టిస్ కేవీ విశ్వనాథన్ 2031 మే 25వ తేదీన రిటైర్ అయ్యాక జస్టిస్ బాగ్చీ సీజేఐగా సేవలందించే వీలుంది. ఈయన 2031 అక్టోబర్ రెండోతేదీన పదవీవిరమణ చేస్తారు. హైకోర్టు జడ్జీలు 62 ఏళ్లకు, సుప్రీంకోర్టు జడ్జీలు 65 ఏళ్లకు రిటైరవుతారు. 2011 జూన్ 27వ తేదీన ఈయన కలకత్తా హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. తర్వాత 2021 జనవరి నాలుగోతేదీన ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీఅయ్యారు. అదే ఏడాది నవంబర్ 8న తిరిగి కలకత్తా హైకోర్టుకు బదిలీఅయ్యారు. అప్పట్నుంచీ అదే హైకోర్టులో సేవలందిస్తున్నారు. కలకత్తా హైకోర్టులో మొత్తంగా 13 ఏళ్లు పలు రకాల కేసులకు సంబంధించిన కీలక తీర్పులు వెలువర్చారు. సుప్రీంకోర్టులో జడ్జిగా ప్రమాణస్వీకారం చేశాక కోర్టులో జడ్జీల సంఖ్య 33కు పెరుగుతుంది. రాజ్యాంగం నిర్దేశించిన పరిమితి ప్రకారం సుప్రీంకోర్టులో గరిష్టంగా 34 మంది జడ్జీలు ఉండొచ్చు. -
తమిళులు అనాగరికులు!
న్యూఢిల్లీ: మోదీ సర్కారుకు, తమిళనాడులోని అధికార డీఎంకేకు మధ్య కొన్నాళ్లుగా సాగుతున్న రగడ పార్లమెంటునూ తాకింది. ‘అనాగరికులు’ అంటూ కేంద్ర విద్యా శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. వాటిపై డీఎంకే ఎంపీల నిరసనలు, ఆందోళనలతో సోమవారం రెండో విడత బడ్జెట్ సమావేశాల తొలి రోజు లోక్‌సభ అట్టుడికిపోయింది. తమిళుల ఆత్మగౌరవాన్ని మంత్రి దారుణంగా దెబ్బతీశారంటూ డీఎంకే ఎంపీ కనిమొళి దుయ్యబట్టారు. ఆయనపై సభాహక్కుల తీర్మానం ప్రవేశపెడతామని ప్రకటించారు. ప్రధాన్ వ్యాఖ్యలపై తమిళనాడు అంతటా డీఎంకే శ్రేణులు నిరసనకు దిగాయి. ఆయన దిష్టి బొమ్మలు తగలబెట్టాయి. తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా దీనిపై తీవ్రంగా స్పందించారు. ఆయన చెన్నైలో మీడియాతో మాట్లాడారు. ‘‘మంత్రివి అహంకారపూరిత వ్యాఖ్యలు. ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలి’’ అంటూ హెచ్చరించారు. ‘‘తమిళ ప్రజలందరినీ మంత్రి ఘోరంగా అవమానించారు. దీన్ని ప్రధాని నరేంద్ర మోదీ సమర్థిస్తారా?’’ అని ప్రశ్నించారు. మంత్రి వ్యాఖ్యలు దారుణమంటూ కాంగ్రెస్‌తో పాటు ఇతర విపక్షాలు కూడా లోక్‌సభ ప్రాంగణంలో దుయ్యబట్టాయి. డీఎంకేకు నిజాయితీ లేదు! సభ ప్రారంభం కాగానే నూతన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) అంశాన్ని డీఎంకే సభ్యులు లేవనెత్తారు. దాన్ని తమ రాష్ట్రంపై బలవంతంగా రుద్దేందుకు అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. అనంతరం పీఎంశ్రీ పథకంపై ప్రశ్నకు ప్రధాన్ బదులిస్తూ డీఎంకే ఎంపీల తీరుపై తీవ్రంగా స్పందించారు. వారికి నిజాయితీ లేదంటూ ఆక్షేపించారు. ‘‘కర్ణాటక, హిమాచల్ వంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా పీఎంశ్రీని అమలు చేస్తున్నాయి. అది తమకూ అంగీకారమేనని పలువురు డీఎంకే ఎంపీలు నాతో స్వయంగా చెప్పారు. ఈ మేరకు స్టాలిన్ కూడా ప్రకటన చేశారు. తర్వాత ఏ ’సూపర్ సీఎం’ జోక్యం చేసుకున్నాడో గానీ, ఉన్నట్టుండి యూటర్న్ తీసుకున్నారు. కేవలం భాషాపరమైన వివాదాలు సృష్టించడమే పనిగా ఫక్తు రాజకీయాలు చేస్తున్నారు. తమిళ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారు’’ అంటూ దుయ్యబట్టారు. విద్యార్థుల భవితవ్యం దృష్ట్యా స్వార్థాన్ని పక్కనపెట్టి రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని, ఎన్ఈపీకి అంగీకరించాలని హితవు పలికారు. వీటిపై డీఎంకే సభ్యులు తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు. ఎన్ఈపీ అంగీకారమేనని ప్రధాన్‌తో తామెన్నడూ చెప్పలేదన్నారు. ఆయన పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. నిరసనలు, నినాదాలు, ఆందోళనలతో హోరెత్తించారు. దక్షిణ భారతదేశానికి అన్యాయం చేసే ప్రయత్నాలు మానుకోవాలంటూ డిమాండ్ చేశారు. శాంతించాలంటూ స్పీకర్ విజ్ఞప్తి చేసినా వెనక్కు తగ్గలేదు. దాంతో సభ కాసేపు వాయిదా పడింది. మళ్లీ సమావేశమయ్యాక కూడా రగడ కొనసాగింది. కేంద్రానికి వ్యతిరేకంగా డీఎంకే సభ్యులు నినాదాలు కొనసాగించారు. ఎన్ఈపీని, హిందీ తప్పనిసరంటున్న త్రిభాషా సూత్రాన్ని డీఎంకే ముందునుంచీ వ్యతిరేకిస్తోందని కనిమొళి అన్నారు. ప్రధాన్ వ్యాఖ్యలు, ప్రత్యేకంచి ఒక పదం తమను తీవ్రంగా బాధించిందని ఆవేదన వెలిబుచ్చారు. దాంతో మంత్రి స్పందిస్తూ, ‘‘నా సోదరి రెండు అంశాలు లేవనెత్తారు. తమిళనాడు ప్రభుత్వం, ఎంపీలు, తమిళ ప్రజలను ఉద్దేశించి నేనలాంటి పదం వాడకుండా ఉండాల్సిందని అన్నారు. ఆ పదాన్ని వెనక్కు తీసుకుంటున్నా’’ అని ప్రకటించారు. అవి రికార్డుల్లోకి వెళ్లబోవని స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి పార్లమెంటు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ తమిళ ప్రజలను అవమానించేలా ప్రధాన్ దారుణ వ్యాఖ్యలు చేశారన్నారు. విద్యావిధానం వంటి అంశాలను ఏ రాష్ట్రంపైనా బలవంతంగా రుద్దరాదని కనిమొళి అభిప్రాయపడ్డారు. పార్లమెంటు ఆవరణలో ఆమె మీడియాతో మాట్లాడారు. మంత్రి తమను అబద్ధాలకోరులు అనడం ఏ మేరకు సబబని ప్రశ్నించారు. త్రిభాషా సూత్రాన్ని తమిళనాడు అంగీకరించేదే లేదని ఆ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం కూడా అన్నారు. ‘‘హిందీని మాపై రుద్దడాన్ని ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఈ విషయంలో రాష్ట్రంలో అన్ని పార్టీలదీ ఒకే వైఖరి’’ అని స్పష్టం చేశారు. మీపై చర్యలు తప్పవ్ మారన్‌పై స్పీకర్ ఆగ్రహం డీఎంకే సభ్యుడు దయానిధి మారన్‌పై స్పీకర్ ఓం బిర్లా మండిపడ్డారు. ఎన్ఈపీపై డీఎంకే సభ్యుల ఆందోళన సందర్భంగా పోడియం వద్ద మారన్ ఏవో వ్యాఖ్యలు చేశారు. వాటిపై స్పీకర్ తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. ఆయనపై కఠిన చర్యలు తప్పవని ప్రకటించారు. ‘‘మాట్లాడేటప్పుడు కాస్త నోరు జాగ్రత్త. మీ వ్యాఖ్యలు రికార్డులకు ఎక్కి ఉంటే తక్షణమే చర్యలు తీసుకునేవాడిని’’ అంటూ హెచ్చరించారు. మారన్‌పై చర్యలకు తీర్మానం ప్రవేశపెట్టాల్సిందిగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజుకు సూచించారు. లేదంటే తానే చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. సభ గౌరవానికి భంగం కలిగించే ప్రవర్తనను సహించే ప్రసక్తే లేదని స్పీకర్ స్పష్టం చేశారు. -
ఈసీ తీరుపై... అన్నీ అనుమానాలే!
సాక్షి, న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా అవకతవకలు, నకిలీ ఓటర్ కార్డులు, ఓటర్ల సంఖ్యలో అనూహ్య పెరుగుదల, ఇష్టారాజ్యంగా ఓటర్ల తొలగింపు తదితర అంశాలను కాంగ్రెస్‌తో పాటు విపక్ష పార్టీలన్నీ సోమవారం లోక్‌సభలో లేవనెత్తాయి. వీటిపై సందేహాలు, నానాటికీ దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న ఆరోపణలు మొత్తం ఎన్నికల ప్రక్రియ సమగ్రతనే ప్రశ్నార్థకంగా మార్చాయంటూ ఆందోళన వెలిబుచ్చాయి. పైగా వీటిపై కేంద్ర ఎన్నికల సంఘం అరకొర స్పందన మరిన్ని అనుమానాలకు తావిస్తోందన్నాయి. కనుక ఈ మొత్తం అంశంపై లోక్‌సభలో పూర్తిస్థాయి చర్చ జరగాల్సిందేనని డిమాండ్ చేశాయి. ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ జీరో అవర్‌లో ఈ అంశాన్ని లేవనెత్తారు. ఇది ప్రతిపక్షాలన్నీ ముక్త కంఠంతో చేస్తున్న డిమాండని ఆయన స్పష్టం చేశారు. స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ ఓటర్ల జాబితాను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేస్తుందా అని ప్రశ్నించారు. ‘‘కేంద్రం తయారు చేయదన్నది నిజమే. కానీ ఇవన్నీ మొత్తం ఎన్నికల ప్రక్రియపైనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అందుకే ఈ అంశంపై సవివరమైన చర్చకు మేం డిమాండ్ చేస్తున్నాం’’ అని రాహుల్ బదులిచ్చారు. ‘‘ఓటర్ల జాబితాల విశ్వసనీయతను దేశవ్యాప్తంగా విపక్ష పార్టీలన్నీ ప్రశ్నిస్తున్నాయి. మహారాష్ట్రతో సహా ప్రతి రాష్ట్రంలోనూ ప్రతిపక్షాలు దీనిపై అనుమానాలు లేవనెత్తాయి’’ అని గుర్తు చేశారు. ఇది చాలా తీవ్రమైన అంశమంటూ సమాజ్‌వాదీ, ఆర్జేడీ, బిజూ జనతాదళ్, ఆప్ కూడా గొంతు కలిపాయి. దీన్ని పార్లమెంటు చర్చకు స్వీకరించాల్సిందేనని పట్టుబట్టాయి. తృణముల్ కాంగ్రెస్ ఎంపీ సౌగతారాయ్ ఓటర్ల జాబితా అంశాన్ని జీరో అవర్‌లో లేవనెత్తారు. ‘‘ఓటర్ల ఫొటో గుర్తింపు కార్డు నంబర్లలో నకిలీల సమస్య దశాబ్దాలుగా ఉంది. కానీ పశి్చమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆందోళన అనంతరమే కేంద్ర ఎన్నికల సంఘం దీనిపై స్పందించింది. సమస్యను మూడు నెలల్లో పరిష్కరిస్తామని ప్రకటించింది’’ అంటూ దృష్టికి తెచ్చారు. అంటే ఇంతకాలంగా తప్పిదాలు జరుగుతూ వస్తున్నట్టే కదా అని ఆయన ప్రశ్నించారు. ‘‘బెంగాల్, హరియాణాల్లో నకిలీ ఓటరు కార్డులు దొరికాయి. ఇటీవలి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటర్ల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది. దానిపై అందరూ ప్రశ్నలు లేవనెత్తారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికలప్పుడూ ఇలాగే జరిగింది. ఇవన్నీ తీవ్రమైన లోటుపాట్లే. వచ్చే ఏడాది బెంగాల్, అసోం అసెంబ్లీ ఎన్నికలున్నందున ఆలోపే ఓటర్ల జాబితాలను పూర్తిగా సవరించాలి’’ అని డిమాండ్ చేశారు. ఈ తప్పిదాలపై దేశ ప్రజలకు ఈసీ బదులివ్వాల్సిందేనన్నారు. ఈ అంశంపై సమగ్ర చర్చకు డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు నిరసనలతో హోరెత్తించారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ పక్షపాతరహితంగా వ్యవహరించాలని సమాజ్‌వాదీ సభ్యుడు ధర్మేంద్రయాదవ్ అన్నారు. ‘‘మహారాష్ట్రలో నెలల వ్యవధిలోనే కొత్తగా లక్షలాది ఓటర్లు ఎలా పుట్టుకొచ్చారు? ఢిల్లీలోనూ అదే జరిగింది. 2022లో యూపీలోనూ ఇదే చేశారు’’ అని ఆరోపించారు.రాజ్యసభలోనూ... రాజ్యసభలో కూడా జీరో అవర్‌లో ఈ అంశాన్ని లేవనెత్తేందుకు విపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రయత్నించారు. డిప్యూటీ చైర్మన్ హరివంశ్ అందుకు అనుమతివ్వలేదు. దీనితో పాటు డజనుకు పైగా అంశాలపై 267వ నిబంధన కింద చర్చకు డిమాండ్ చేస్తూ విపక్షాలు ఇచి్చన నోటీసులన్నింటినీ తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు. దీన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌తో పాటు విపక్షాలన్నీ వాకౌట్ చేశాయి. ‘‘మహారాష్ట్రలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల మధ్య ఆర్నెల్లలోనే ఓటర్ల సంఖ్య భారీగా పెరిగిపోయింది. ఇదెలా సాధ్యం? దీనిపై కాంగ్రెస్‌తో పాటు విపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు ఈసీ వద్ద సమాధానమే లేదు. ఓటింగ్ ప్రక్రియ కోసం ఉపయోగించిన ఫొటో ఓటర్ల జాబితాను ఎక్సెల్ ఫార్మాట్లో మాకు అందజేయాలని డిమాండ్ చేస్తే ఈసీ నేటికీ స్పందించనే లేదు. దేశవ్యాప్తంగా ఓటర్ల పేర్లను ఇష్టారాజ్యంగా తొలగించడం, డూప్లికేట్ ఈపీఐసీ నంబర్ల వంటి తీవ్ర తప్పిదాలు, లోటుపాట్లు ఇష్టారాజ్యాంగా చోటుచేసుకుంటున్నాయి. ఇవన్నీ ఎన్నికల ప్రక్రియ తాలూకు సమగ్రతనే సవాలు చేస్తున్నాయి. పైగా ఈ తప్పిదాలను స్వయంగా ఈసీయే అంగీకరించింది. కనుక వీటన్నింటిపై పార్లమెంటులో చర్చ జరగాల్సిందే. అందుకు మోదీ సర్కారు అంగీకరించాల్సిందే’’ అంటూ అనంతరం ఖర్గే ఎక్స్‌లో పోస్ట్ చేశారు. తద్వారా ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగంపై ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలన్నారు. దేశంలో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడంలో కేంద్ర ఎన్నికల సంఘం కొన్నేళ్లుగా ఘోరంగా విఫలమవుతోందని అంతకుముందు టీఎంసీ సభ్యుడు కల్యాణ్ బెనర్జీ సభలో దుయ్యబట్టారు. ఇందుకు ఈసీపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘‘డూప్లికేట్ ఓటర్ కార్డుల అంశాన్ని సీఎం మమతే తొలిసారి లేవనెత్తారు. దీనిపై ఈసీ ఇచ్చిన వివరణ ఎన్నికల నిర్వహణ నిబంధనలకే విరుద్ధంగా ఉంది’’ అని ఆరోపించారు. అనుమానాలన్నింటినీ నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్రం, ఈసీపై ఉందని ఆప్ సభ్యుడు సంజయ్‌సింగ్ అన్నారు. ఇటీవలి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో హరియాణా పౌరులకు విచ్చలవిడిగా ఓటరు కార్డులిచ్చారని ఆరోపించారు. తద్వారా ఎన్నికల ప్రక్రియనే ప్రహసనంగా ఈసీ మార్చేసిందని దుయ్యబట్టారు. తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఈసీ ప్రయత్నిస్తోందని ఆర్జేడీ సభ్యుడు మనోజ్ ఝా ఆరోపించారు. ‘‘ఎన్నికల ప్రక్రియే పార్లమెంటు ఉనికికి ప్రాణం. ఎన్నికల అవకతవకలపై ఇక్కడ చర్చించేందుకు అవకాశమివ్వకపోతే ప్రజాస్వామ్యానికి అర్థమే లేదు’’ అన్నారు. -
మాటలతో హింసిస్తున్నారు.. బెదిరిస్తున్నారు: కోర్టులో రన్యారావు
బెంగళూరు: గోల్డ్ స్మగ్మింగ్ కేసులో భాగంగా ప్రస్తుతం డీఆర్ఐ కస్టడీలో ఉన్న కన్నడ నటి రన్యారావును ఈరోజు(సోమవారం) బెంగళూరు స్పెషల్ కోర్టులో హాజరుపరిచారు. తన మొహంపై గాయాలు కనిపిస్తున్న క్రమంలో ఆమెను కోర్టుకు తీసుకెళ్లారు డీఆర్ఐ అధికారులు. అయితే కస్టడీలో ఏమైనా భౌతిక దాడులు జరిగాయా అని కోర్టు ప్రశ్నించగా.. తనను శారీరకంగా ఏమీ ఇబ్బందులు గురి చేయడం లేదని, కానీ మాటలతో మానసికంగా హింసిస్తున్నారని కోర్టులో కన్నీటి పర్యంతమైంది. అయితే మానసికంగా మాటలతో హింసిస్తున్నారని ఆమె చెబుతున్న వాదనను డీఆర్ఐ ఖండించింది. అందులో ఎటువంటి వాస్తవం లేదని, తమ నిబంధనల మేరjo దర్యాప్తు చేస్తున్నామన్నారు. తమ దర్యాప్తును మొత్తం రికార్డు చేస్తున్నామని డీఆర్ఐ పేర్కొంది.వైరల్‌గా మారిన ఫోటోరన్యారావుకు చెందిన ఓ ఫోటో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.. ఆమె కంటి కింద గాయాలు, ఉబికిన మొహంతో ఆమె ఫోటోలో ఉంది. ఆమెను కస్టడీలో తీసుకుని విచారణ పేరుతో చిత్ర హింసలు పెట్టారా? అనే అనుమానం కలుగుతోంది. దీనిపై కర్ణాకట మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.ప్రధానంగా వైరల్ గా మారిన ఫోటోను ఉటంకిస్తూ మహిళా కమిషన్ చైర్మన్ నాగలక్ష్మీ చౌదరి అనుమానం వ్యక్తం చేశారు. ఆమెపై అధికారులు దాడికి పాల్పడ్డారా? అనే ప్రశ్న లేవనెత్తారు. అయితే దీనిపై తాము నేరుగా దర్యాప్తు చేసే అవకాశం లేదన్నారు. రన్యారావు తముకు ఏమైనా ఫిర్యాదు చేస్తే ఆమెకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు నాగలక్ష్మి,‘మాకు ఆమె లేఖ రూపంలో ఫిర్యాదు చేస్తే మేము సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆమె నుంచి ఫిర్యాదు అందిన పక్షంలో తమ పరిధిలో ఉన్న ఆయా విభాగాలను అప్రమత్తం చేస్తాం. సరైన రీతిలో దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఆమె ఏమైనా దాడికి గురయ్యిందా అనేది ఆమె ఫిర్యాదు రూపంలో ఇస్తేనే మేము ఏమైనా చేయగలం. ఒకవేళ ఆమె మమ్మల్ని సంప్రదించకపోతే దీనిపై కనీసం కామెంట్ కూడా చేయలేం’ అని మహిళా కమిషన్ చైర్ పర్సన్ నాగలక్ష్మి పేర్కొన్నారు. ఈ నేపధ్యంలోనే ఆమెను స్పెషల్ కోర్టులో హాజరుపరిచినట్లు తెలుస్తోంది. గత సోమవారం 12 కేజీలకు పైగా బంగారం కడ్డీలను తన బెల్ట్ లో పెట్టుకుని దుబాయ్ నుంచి అక్రమంగా తరలిస్తూ రన్యారావు పట్టుబడింది. బెంగూళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆమె అధికారులకు చిక్కింది. ప్రస్తుతం ఆమె మూడు రోజుల డీఆర్ఐ అధికారుల కస్టడీలో ఉంది. దీనిలో భాగంగా ఆమెను విచారిస్తున్న అధికారులు ఇందులో ‘కింగ్ పిన్’ ఎవరు అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు. -
పట్టపగలే దొంగల ముఠా బీభత్సం.. భారీ దోపిడీ!
పాట్నా: బీహార్ రాష్ట్రంలో పట్టపగలే దోపిడీ దొంగలు బీభత్సం స్పష్టించారు. ఓ నగల షాపులో ప్రవేశించి సుమారు రెండు కోట్ల రూపాయిల విలువైన బంగారు ఆభరణాలను దొంగిలించారు. రాష్ట్రంలోని బోజ్ పూర్ జిల్లాలోని గోపాలి చౌక్ వద్ద ఉన్న తనిష్క్ నగల దుకాణంలోకి ప్రవేశించిన ఒక ముఠా వారిని బెదిరించి భారీ ఎత్తును నగలను, నగదును తస్కరించుకుపోయారు. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో పట్ట పగలే ఇలా ఒక దుకాణంలోకి ప్రవేశించి నగలను, భారీ ఎత్తును డబ్బును దోచుకుపోవడంతో స్థానికంగా కలకలం రేగింది.అరగంటకు పైగా షాపులోనే..దోపిడీ ప్రణాళిక వచ్చిన ఒక ముఠా సుమారు అరగంట పాటు షాపులోనే ఉన్నారు. పెద్ద ఎత్తున తుపాకులతో వచ్చిన దొంగల ముఠా.. ఎటువంటి అనుమానం రాకుండా అరగంటకు పైగా షాపులోనే గడిపారు. ముందుగా నగల షాపులో ఉన్న వారిని బెదిరించి వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నగలను, క్యాష్ కౌంటర్ లో ఉన్న నగదును దొంగిలించుకుపోయారు.సెక్యూరిటీ గార్డు గన్ ను దొంగిలించి..నగల షాపు దోచుకున్న అనంతరం సెక్యూరిటీ గార్డు వద్ద ఉన్న గన్ ను సైతం దొంగలు దొంగిలించి అక్కడ నుంచి పారిపోయారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వచ్చేసరికి దొంగలు అక్కడ నుంచి పారిపోయారు.నలుగురు తప్పించుకున్నారు.. ఇద్దరు దొరికారుదీనిపై వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. ఆ ప్రాంతంలో జల్లెడ పట్టే యత్నం చేశారు. అయితే ఆ దొంగల్లో ఇద్దరు పోలీసులను చూసి తప్పించుకోవాలని చూశారు. దాంతో పోలీసులు షూట్ చేసి ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు వారి నుంచి నాలుగు బండిల్స్ జ్యూయలరీని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇంకో నలుగురు తప్పించుకున్నారు. ఈ భారీ దొంగతనంపై సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్న పోలీసులు.. త్వరలోనే మిగతా నలుగుర్ని పట్టుకుంటమన్నారు. -
దుబాయ్ నుంచి ఎంత బంగారం తీసుకురావచ్చు?
కన్నడ నటి 'రన్యా రావు' 14.2 కేజీల బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారనే ఆరోపణలతో బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో దుబాయ్ బంగారం ధరల గురించి చర్చ మొదలైంది. ఇంతకీ దుబాయ్ నుంచి ఎంత బంగారం తీసుకురావాలి?, ఎక్కువ తీసుకురావాలనే ఏమైనా రూల్స్ పాటించాలా? అనే విషయాలను ఇక్కడ చూసేద్దాం.భారతదేశంతో పోలిస్తే.. దుబాయ్‌కు బంగారం ధరలు తక్కువగా ఉంటాయని, చాలామంది అక్కడ నుంచి ఇండియాకు బంగారం తీసుకొస్తూ ఉంటారు. అక్కడ గోల్డ్ రేటు తక్కువగా ఉండటానికి కారణం.. అక్కడ ఆభరణాలపై జీఎస్టీ లేకపోవడం, తయారీ ఛార్జీలు తక్కువగా ఉండటమే.భారతదేశంలోకి బంగారాన్ని తీసుకురావడానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) నిర్ణయించిన రూల్స్ తప్పకుండా పాటించాల్సిందే. లేకుంటే రన్యా రావు మాదిరిగా అరెస్ట్ అవ్వాల్సి వస్తుంది. విదేశాల నుంచి మన దేశానికి బంగారాన్ని తీసుకురావాలంటే.. దిగుమతి సుంకం చెల్లించాలి. ఈ ట్యాక్స్ ఇప్పుడు 6 శాతం వద్ద ఉంది. ఈ సుంకం నుంచి తప్పించుకోవడానికే.. చాలామంది అక్రమంగా బంగారాన్ని తరలిస్తుంటారు.సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ ప్రకారం.. దుబాయ్‌లో ఆరు నెలల (1967 పాస్‌పోర్ట్ చట్టం) కంటే ఎక్కువ సమయం ఉండి, కస్టమ్స్ డ్యూటీ చెల్లించినవారు.. తమ బ్యాగేజీలో ఒక కేజీ వరకు బంగారం తీసుకురావచ్చు. అంతకంటే ఎక్కువ బంగారం తీసుకురావాలనుంటే.. ట్యాక్స్ చెల్లించిన బంగారం అని నిరూపించి తీసుకురావాల్సి ఉంటుంది. లేకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.ఇదీ చదవండి: జీఎస్టీ రేట్ల తగ్గింపుపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటనకస్టమ్స్ డ్యూటీ చెల్లించకుండా.. పురుషులు 20 గ్రా, మహిళలు 40 గ్రా తెచ్చుకోవచ్చు. అయితే వీరు తెచ్చుకునే బంగారం.. గోల్డ్ బార్లు, కాయిన్స్ రూపంలో ఉండాలి. అయితే 15 ఏళ్లలోపు పిల్లలకు 40 గ్రా పరిమితి ఉంది. వీరికోసం కొనుగోలు చేసే బంగారం.. నగలు, గిఫ్ట్స్ రూపంలో ఉండాలి. కస్టమ్స్ డ్యూటీ వెరిఫికేషన్ సమయం.. బంగారం కొనుగోలుకు సంబంధించిన పూర్తి వివరాలను చూపించాల్సి ఉంటుంది. పిల్లలకు అయితే.. తల్లితండ్రులు లేదా గార్డియెన్లకు సంబంధించిన ఐడీ కార్డు ఉండాలి.బంగారం ధరలుభారతదేశంలో ఈ రోజు (మార్చి 10) 24 క్యారెట్ల 10 గ్రా గోల్డ్ రేటు రూ. 87820, 22 క్యారెట్ల 10 గ్రా బంగారం ధర రూ. 80,500గా ఉంది. దుబాయ్‌లో 10 గ్రా బంగారం విలువ 3,260 AED (దుబాయ్ కరెన్సీ). భారతీయ కరెన్సీ ప్రకారం రూ.77,281.46. అంటే ఇండియాకు.. దుబాయ్‌కు బంగారం విలువ తేడా సుమారు రూ. 3000. ఈ కారణంగానే చాలా మంది దుబాయ్ నుంచి బంగారం కొనుగోలు చేస్తారు. -
Ranya Rao : రన్యారావు వ్యవహారంలో మరో బిగ్ ట్విస్ట్
బెంగళూరు: గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ దొరికి పోయిన కన్ననటి రన్యారావు కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రన్యారావు సంస్థకు గత బీజేపీ ప్రభుత్వం 12 ఎకరాల భూమిని కేటాయించినట్లు తెలుస్తోంది.2023 జనవరిలో ఈ కేటాయింపులు జరిగినట్లు కర్ణాటక పారిశ్రామిక బోర్డ్ బయటపెట్టింది. తుముకూరు జిల్లాలో సిరా ఇండస్ట్రియల్ ఏరియాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ఈ భూమి కేటాయించింది అప్పటి బసవరాజు బొమ్మై సర్కార్. రూ.138కోట్ల పెట్టుబడితో స్టీల్ టీఎంటీ బార్స్ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తాను అని రన్యారావు సంస్థ ధరఖాస్తు చేసుకోగా సింగిల్ విండో కమిటీ ఆమోదం తెలిపింది. -
రంజాన్ వేళ కశ్మీర్లో అర్ధనగ్న ఫ్యాషన్ షో.. సీఎం ఒమర్‌కు ఝలక్!
శ్రీనగర్: పవిత్ర రంజాన్ మాసం వేళ జమ్ము కశ్మీర్లో అర్ధనగ్న ఫ్యాషన్ షో తీవ్ర దుమారం రేపుతోంది. ఫ్యాషన్ షోలో మహిళలు, పురుషులు పొట్టి పొట్టి దుస్తులతో తెల్లటి మంచుపై ర్యాంప్ వాక్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో పర్యాటకంపై ప్రచారం పేరుతో ఈ అశ్లీల ప్రదర్శన ఏమిటని విపక్షాలు, ప్రజలు.. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.ఈ నేపథ్యంలో కశ్మీర్లో నిర్వహించిన ఫ్యాషన్ షో కార్యక్రమంపై సీఎం ఒమర్ అబ్దుల్లా స్పందించారు. పవిత్ర రంజాన్ మాసంలో ఇలాంటి ఫ్యాషన్ షో జరగడం పట్ల ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. ప్రజల కోపాన్ని తాము అర్థం చేసుకున్నట్లు చెప్పారు. తన కార్యాలయం స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ పరిణామంపై 24 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. నివేదిక తర్వాత చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.మరోవైపు.. ఈ ఫ్యాషన్ షో వ్యవహారం అటు జమ్ము కశ్మీర్ అసెంబ్లీని సైతం తాకింది. రంజాన్ వేళ ఇలాంటి కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారని ప్రతిపక్ష నేతలు ఒమర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. దీంతో, అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. A fashion show in Gulmarg has ignited controversy in J&K, with critics calling it "obscene" for being held during Ramzan. pic.twitter.com/4P77B8mtbf— Briefly (@Brieflybynewj) March 10, 2025ఇదిలా ఉండగా.. అంతకుముందు ఉత్తర కశ్మీర్ గుల్మార్గ్లోని ప్రముఖ స్కై రిసార్టులో ఆదివారం ప్రభుత్వ అధికారుల ఆధ్వర్యంలో ఫ్యాషన్ షో నిర్వహించారు. ఇందులో పాల్గొన్నవారు రెచ్చగొట్టే తరహాలో దుస్తులు ధరించారని స్థానిక మత పెద్దలతో పాటు హురియత్ కాన్ఫరెన్స్ చీఫ్ మిర్వాయిజ్ ఉమర్ ఫారూక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది దారుణంగా ఉందని విమర్శించారు. ఫ్యాషన్ షోకు సంబంధించిన చిత్రాలు, వీడియో తమను దిగ్భ్రాంతికి గురి చేశాయని అన్నారు. సూఫీ, సాధు సంస్కృతి, ప్రజల మతపరమైన దృక్పథానికి పేరుగాంచిన లోయలో దీన్ని ఎలా సహించాలి? ఇందులో పాల్గొన్న వారిని వెంటనే జవాబుదారీగా చేయాలి అని మండిపడ్డారు.#Watch: Noisy scenes in J&K #assembly over #Kathua killings, #Gulmarg fashion show pic.twitter.com/R80BG1YQ7A— Greater Kashmir (@GreaterKashmir) March 10, 2025 -
విమానంలో 322 మంది.. 8 గంటల జర్నీ తర్వాత వెనక్కి!
న్యూఢిల్లీ, సాక్షి: ముంబై-న్యూయార్క్ ఎయిరిండియా విమానం. ఎనిమిది గంటల ప్రయాణం తర్వాత.. ఎలా వెళ్లిందో అలాగే తిరిగి వెనక్కి వచ్చేసింది. దీంతో ప్రయాణికులంతా కంగారు పడ్డారు. మరోవైపు అధికారులు హడావిడిగా వాళ్లందరినీ దించేసి.. బాంబు స్క్వాడ్‌ను పిలిపించి తనిఖీలు చేయించారు. చివరకు తమకు వచ్చిన సమాచారంగా తేల్చారు. 303 మంది ప్రయాణికులు, 19 మంది సిబ్బంది ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 777 విమానం గత అర్ధరాత్రి 2గం. ముంబై నుంచి న్యూయార్క్‌కు బయల్దేరింది. సుమారు 15 గంటల తర్వాత జాన్ ఎఫ్ కెనడీ ఎయిర్‌పోర్టుకు అది చేరుకోవాల్సి ఉంది. అయితే విమానంలో బాంబు ఉందనే సమాచారం రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో అజర్బైజాన్ దాకా వెళ్లిన విమానానికి.. వెనక్కి రప్పించారు.#AirIndia pic.twitter.com/kZ7cEau7sI— NDTV (@ndtv) March 10, 2025ముంబైలో ఈ ఉదయం 10.20 గం. ప్రాంతంలో ఎయిరిండియా విమానం దిగగానే.. ప్రయాణికులను దించేసి బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు చేయించారు. చివరకు బెదిరింపు కాల్‌గా నిర్ధారించుకున్నారు. రద్దైన విమానం మంగళవారం ఉదయం 5గం. రీషెడ్యూల్ చేసినట్లు ప్రకటించింది. అసౌకర్యానికి ప్రయాణికులకు క్షమాపణ చెప్పిన ఎయిరిండియా.. వాళ్ల భద్రతే తమకు ముఖ్యమని తెలిపింది. ఈ ప్రయాణంలో వాళ్లకు అన్ని రకాల వసతులు కల్పిస్తామని తెలిపింది. మరోవైపు.. ఈ ఘటనపై ఎయిరిండియా ఫిర్యాదుతో అధికారులు దర్యాప్తు చేపట్టారు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. సజీవదహనమైన తల్లి, కుమారుడు..
కర్ణాటక: చిక్కబళ్లాపురం జిల్లా చింతామణి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. సొంతూరులో బంధువులను పలకరించి సంతోషంగా బెంగళూరుకు(Bangalore) వస్తున్న కుటుంబంలో విషాదం చిందింది. తల్లీ కుమారుడు సజీవ దహనమయ్యారు. చింతామణి సమీపంలోని కంచార్లపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని మదనపల్లి రోడ్డులో జోగ్యానహళ్లి–గోపల్లి మధ్య ఆదివారం ఉదయం 10 గంటలప్పుడు దుర్ఘటన జరిగింది. వారు ప్రయాణిస్తున్న బ్యాలెనో కారును ప్రైవేటు బస్సు ఢీకొనడంతో కారు మంటల్లో కాలిపోయింది. బంధువుకు కొడుకు పుట్టాడని.. వివరాలు.. ధనుంజయ రెడ్డి (Dhanunjaya Reddy)(30), ఆయన తల్లి కళావతి (52), ధనుంజయరెడ్డి భార్య శోభారాణి, కొడుకు మాన్విత్ రెడ్డి (3), శోభారాణి తల్లి మహాలక్ష్మీ కారులో బెంగళూరుకు బయల్దేరారు. ధనుంజయరెడ్డి కారు నడుపుతున్నారు. ఆయన తండ్రి గోపాల్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో కడప నగరంలోని రాఘవేంద్ర టౌన్ షిప్లో నివాసముంటూ ఆకాశవాణిలో ఉద్యోగం చేస్తున్నారు. ధనుంజయరెడ్డి, భార్య ఐటీ ఉద్యోగులు కాగా, బెంగళూరు మహదేవపురలో నివాసముంటున్నారు. కడపలో శోభారాణి అన్న సుబ్బారెడ్డికి కొడుకు పుట్టడంతో శనివారం అందరూ వెళ్లి చిన్నారిని చూసి సంతోషంగా గడిపారు. బెంగళూరుకు తిరిగి వస్తుండగా చింతామణి దగ్గర ఎదురుగా బెంగళూరు నుంచి తిరుపతికి వెళుతున్న శ్రీ భారతి ప్రైవేటు బస్సు వేగంగా కారును ఢీకొట్టింది. కారు రోడ్డు పక్కన పడి మంటల్లో చిక్కుకుంది. అప్పటికే కారులోని వారు బయటకు ఎగిరిపడ్డారు. ధనుంజయరెడ్డి, తల్లి కళావతికి మంటలు అంటుకుని సజీవ దహనమయ్యారు. మిగతా ముగ్గురికి గాయాలయ్యాయి. బస్సు కూడా బోల్తా పడింది. అందులోని కొందరికి చిన్న చిన్న గాయాలు అయ్యాయి. కారు పూర్తిగా దగ్ధం స్థానికులు చేరుకుని క్షతగాత్రులకు సాయం చేశారు. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేసేటప్పటికి కారు పూర్తిగా దహనమైంది. జిల్లా ఎస్పీ కుశాల్ చౌక్సి, డీఎస్పీ మురళీధర్, సీఐ వెంకటరమణప్ప తదితరులు పరిశీలించారు. మృతదేహాలకు చింతామణి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. శోభారాణి, కొడుకు మన్విత్, మహాలక్ష్మీలకు ప్రథమ చికిత్స నిర్వహించి బెంగళూరు ఆస్పత్రికి తరలించారు. ఆస్పతి దగ్గర బంధువుల రోదనలు మిన్నంటాయి. -
మాజీ మంత్రి కారు డ్రైవర్ అరెస్టు
దొడ్డబళ్లాపురం: జువెలరీ షాప్‌ల యజమానులు, పలువురు వ్యాపారులు, రాజకీయ నాయకుల నుంచి భారీగా నగలు, డబ్బు వసూలు చేసి మోసం చేసిన కిలేడీ ఐశ్వర్యగౌడ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. కాంగ్రెస్‌కు చెందిన మాజీ మంత్రి వినయ్ కులకర్ణి కారు డ్రైవర్ వీరేశ్ దళవాయిని అరెస్టు చేశారు. ఐశ్వర్యగౌడకు చెందిన బెంజ్ కారు వినయ్ కులకర్ణి ఇంటి ముందు లభించింది. దీంతో డ్రైవర్‌ను పోలీసులు విచారణ నిమిత్తం అరెస్టు చేశారు. వినయ్ కులకర్ణితో ఐశ్వర్యగౌడకు పరిచయం ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఇటీవల పోలీసులు గాలిస్తున్నప్పుడు ఆమె మహారాష్ట్రకు వెళ్లే ముందు ధార్వాడలోని వినయ్ కులకర్ణి ఇంటికి వచ్చింది. వెళ్లేటప్పుడు తన కారు అక్కడే వదిలి విమానంలో మహారాష్ట్రకు వెళ్లింది. కేసు కొలిక్కి వచ్చిందని త్వరలో ఛార్జ్ షీట్ సమర్పిస్తామని పోలీసులు తెలిపారు. -
మాజీ సీఎం ఇంట్లో ఈడీ సోదాలు.. కాంగ్రెస్ నేతల్లో టెన్షన్!
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో రాజకీయం ఆసక్తికరంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి భూపేష్ భాఘేల్, ఆయన కుమారుడి చైతన్య భాఘేల్ నివాసాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహిస్తున్నారు. మనీ లాండరింగ్ కేసు విషయమై 14 ప్రదేశాల్లో సోదాలు కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. దీంతో, మాజీ సీఎం నివాసం వద్దకు భారీ సంఖ్యలో కాంగ్రెస్ మద్దతుదారులు వచ్చి చేరుకున్నారు.ఛత్తీస్‌గఢ్‌లో మద్యం కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా మాజీ సీఎం భూపేశ్ భాఘేల్, ఆయన కుమారుడి నివాసాల్లో సోమవారం తెల్లవారుజాము నుంచి ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. భిలాయ్ 3 మానసరోవర్ కాలనీలో ఉన్న మాజీ సీఎం బంగ్లాలో ఈడీ తనిఖీలు చేపట్టింది. ఆర్థిక అవకతవకలు, మనీలాండరింగ్‌కు సంబంధించి ఈడీ దాడులు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఈడీ సోదాల నేపథ్యంలో కాంగ్రెస్ మద్దతుదారులు మాజీ సీఎం ఇంటికి వద్దకు భారీ సంఖ్యలో వచ్చి చేరుకున్నారు. ఈ సందర్భంగా భద్రత కోసం హాజరైన సీఆర్పీఎఫ్ జవాన్లకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. మీడియా సిబ్బంది కవరేజీని కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నాయి. అయితే కాసేపటి తర్వాత వాతావరణం సద్దుమణిగింది. కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ ప్రభుత్వానికి, ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.VIDEO | ED raids Congress leader Bhupesh Baghel's premises in Bhilai as part of a money laundering investigation against his son - Chaitanya Baghel - in an alleged liquor scam case.Chaitanya Baghel shares the Bhilai accommodation with his father and hence the premises are being… pic.twitter.com/AdUWic1y26— Press Trust of India (@PTI_News) March 10, 2025కేసు ఇదీ..ఛత్తీస్‌గఢ్‌లో భారీ మద్యం కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ స్కామ్ ద్వారా నిందితులు సుమారు రూ.2వేల కోట్లు లబ్ధి పొందినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) తెలిపింది. రాష్ట్రంలో అన్ని మద్యం షాపులను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఛత్తీస్‌గఢ్ స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (CSMCL) షాపుల నిర్వహణ, నగదు వసూలు, బాటిల్ తయారీ, హాలోగ్రామ్ తయారీ కోసం టెండర్లు పిలుస్తుంది. ఈ క్రమంలో రాజకీయ నాయకులు, సీఎస్‌ఎమ్‌సీఎల్ కమీషనర్, ఎండీల సహకారంతో తన సన్నిహితులైన వికాస్ అగర్వాల్, అర్వింద్ సింగ్‌లతో కలిసి బాటిల్ తయారీ నుంచి మద్యం అమ్మకాల వరకు ప్రతి విభాగంలో పెద్ద ఎత్తున్న లంచాలు ఆశచూపి పూర్తి మద్యం సరఫరా వ్యవస్థను అన్వర్ తన ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు ఈడీ వెల్లడించింది.తర్వాత మద్యం సరఫరా చేసే కంపెనీల నుంచి కేస్‌పై (మద్యం బ్రాండ్ ఆధారంగా) రూ. 75 నుంచి రూ. 150 కమిషన్ వసూలు చేయడంతోపాటు ప్రైవేటుగా నకిలీ మద్యం తయారుచేసి, వాటిని ప్రభుత్వ దుకాణాల్లో విక్రయించి 30 నుంచి 40 శాతం కమిషన్ పొందాడని ఈడీ ఆరోపించింది. అలా, 2019 నుంచి 2022లో సుమారు రూ. 1,200 నుంచి రూ. 1500 కోట్లు అక్రమంగా సంపాదించినట్లు గుర్తించింది. 2022లో ఐఏఎస్ అధికారి అనిల్ తుటేజాపై ఐటీశాఖ దాడులతో ఈ కుంభకోణం వెలుగు చూసింది. #WATCH | Chhattisgarh | Enforcement Directorate (ED) is conducting searches at the residence of former Chief Minister and Congress leader Bhupesh Baghel's son in an ongoing money laundering case. (Visuals from Durg) pic.twitter.com/k5Gmgew4K4— ANI (@ANI) March 10, 2025 -
అన్ని భాషలు సమానం... హిందీ మరింత సమానం!
దేశంలో ఇప్పుడు హిందీ వివాదం రగులుకుంది. తమిళ నాడు ముఖ్యమంత్రి ఎమ్కే స్టాలిన్ దక్షణ భారతదేశంలో హిందీ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఉద్యమించడానికి నడుం బిగించారు. తమిళనాడులో పెరియార్ ఇవీ రామసామి నాయకర్ కాలం నుండే హిందీ వ్యతిరేకతకు చాలా చరిత్ర వుంది. స్టాలిన్ పిలుపు మీద దక్షిణాదిలోని మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా స్పంది స్తాయో వేచి చూడాలి. మనకు జాతీయ భాష హిందీ, అంతర్జాతీయ భాష ఇంగ్లీషు, రాష్ట్ర భాష తెలుగు (Telugu) అనే ఒక తప్పుడు అభిప్రాయం సామాన్యుల్లోనేగాక విద్యావంతుల్లోనూ కొనసాగుతోంది. ఏపీ తెలుగు, తెలంగాణ (Telangan) తెలుగు రెండూ వేరే భాషలు, ప్రజలు వేరే జాతులవారు అనే అభిప్రాయాన్ని కొన్నాళ్ళుగా కొందరు కొనసాగిస్తు న్నారు. అది ఆ యా సమూహాల ఉనికివాద కోరికలు కావచ్చు. ఇవిగాక ఈ రెండు రాష్ట్రాల్లోనూ చెరో పాతిక భాషలు మాట్లాడే సమూహాలున్నాయి. ఇప్పటి ఆంధ్రప్రదేశ్‌లో గోండి, కోయ, కొంద, కువి, కోలామీ, పెన్గొ, మంద, యానాది, లంబాడ, సవర (Savara Language) తదితర చిన్న సమూహాలు ఓ పాతిక వరకు ఉంటాయి. అధికార భాషల ప్రాబల్యంలో చిన్న సమూహాలు చితికి పోతాయి; వాళ్ళ భాషలు అంతరించిపోతాయి. భాష కూడ నిచ్చెనమెట్ల కులవ్యవస్థ లాంటిది. తనకన్నా కింద ఉన్న కుల సమూహాన్ని అణిచివేసే సమూహాన్ని అంతకన్నా పైనున్న కుల సమూహం అణిచివేస్తుంటుంది. చిన్న సమూహాలు తమ మాతృభాషను వదులుకోవాల్సిన పరిస్థితుల్ని సృష్టిస్తారు. ఒక భాష అంతరించిపోవడం అంటే ఒక జాతి తన సంస్కృతీ సంప్రదాయాలనూ, తను సృష్టించినకళాసాహిత్యాలనూ కోల్పోవడమే అవుతుంది. అంటే ఆ జాతి ముందు జీవన్మృతిగా మారిపోతుంది. ఆ తరు వాత అంతరించిపోతుంది. బ్రిటిష్ ఇండియా మతప్రాతిపదిక మీద ఇండియా–పాకిస్తాన్‌గా చీలిపోయినట్టు మనకు తెలుసు. అయితే, ఒకేమత సమూహం అయినప్పటికీ పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ భాషా ప్రాతిపదిక మీద విడిపోయిందని మనకు గుర్తు ఉండదు. మనుషులకు భాష ప్రాణమంత ముఖ్యమైనది. యూరోప్ దేశాలన్నింటిలోనూ క్రైస్తవ మతసమూహాల ఆధిక్యత ఎక్కువ. అయినప్పటికీ, అవి అన్ని దేశాలుగా విడి పోవడానికి ప్రధాన కారణం భాష. సంస్కృతాన్నిసంఘపరివారం దైవవాణిగా భావిస్తుంది. తాము నిర్మించ తలపెట్టిన ‘హిందూరాష్ట్ర’లో సంస్కృతం జాతీయ భాషగా ఉంటుందనేది ఆ సంస్థ అభిప్రాయం. అంతవరకు దేవనాగరి లిపిలోని హిందీని జాతీయ భాషగా కొనసాగించాలని వారి ఆలోచన. జాతీయ భాష మీద చర్చ రాజ్యాంగ సభలోనే జోరుగా సాగింది. మనకు అందుబాటులో ఉన్న భాషల్లో ఏదో ఒకదాన్ని జాతీయ భాషగా చేస్తే అది మిగిలిన భాషల్ని మింగేస్తుందని చాలా మంది తీవ్ర ఆందోళన, అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రాజ్యాంగం ఎనిమిదవ షెడ్యూలు 22 భాషలకు గుర్తింపు ఇచ్చినప్పటికీ ఏ భాషకూ జాతీయ హోదా ఇవ్వలేదు. అన్ని భాషలూ సమానమే. మనకు బాగా ప్రాచుర్యంలో ఉన్న భాషలే తెలుసు. బోడో, డోగ్రీ, మైథిలి, సంథాలి తదితర భాషలకు కూడ రాజ్యాంగంలో స్థానంఉందని మనం తరచూ గుర్తించం. హిందీ జాతీయ భాష కాదు; అది కేంద్ర ప్రభుత్వానికి అధికార భాష మాత్రమే. హిందీ సరసన ఇంగ్లీషును కూడ అనుసంధాన భాషగా గుర్తిస్తున్నారు. జనాభాను బట్టి లోక్‌సభ స్థానాలు నిర్ణయం అవుతాయని మనకు తెలుసు. కేంద్ర ప్రభుత్వ ఆదాయాన్ని రాష్ట్రాలకు పంచే సమయంలోనూ జనాభా, లోక్‌సభ సీట్లు తదితర అంశాలు ప్రాతిపదికగా మారుతాయి. అదీగాక, త్వరలో లోక్‌సభ నియోజక వర్గాల పునర్ వ్యవస్థీకరణ జరగబోతోంది. ఉత్తరాది స్థానాలు మరింతగా పెరిగి దక్షిణాది స్థానాలు మరింతగా తగ్గిపోయే అవకాశం ఉన్నట్టు కొందరు ఆందో ళన వ్యక్తం చేస్తున్నారు. అంచేత ఇది భాషా సమస్య మాత్రమే కాదు; రాజకీయార్థిక సమస్య. ఎవర్ని ఎవరు పాలించాలనే ప్రాణప్రదమైన అంశం ఇందులో ఉంది. 1955లో వచ్చిన భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రతిపాదన... మధ్యప్రదేశ్, బిహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల అధికార భాషగా హిందీని పేర్కొంది. ఒక భాషకుఅంత విస్తారమైన ప్రాంతాన్ని కేటాయించడం ప్రమా దకరం అని ఆందోళన వ్యక్తం చేసిన వారిలో బీఆర్ అంబేడ్కర్ కూడా ఉన్నారు. ఎందుకయినా మంచిది ఉత్తరప్రదేశ్‌ను నాలుగు భాగాలు చేయాలని ఆయన అప్పుడే సూచించారు. ఇప్పుడు అంబేడ్కర్ భయపడి నట్టే జరుగుతోంది. గడిచిన 70 సంవత్సరాల్లో భోజ్ పురి, మైథిలి, గఢ్వాలి, అవధి, బ్రజ్‌లతో సహా దాదాపు 29 స్థానిక భాషల్ని హిందీ మింగేసింది. అది అక్కడితో ఆగలేదు. ఇప్పుడు ఏకంగా ఇండియాను మింగడానికి సిద్ధం అయింది.‘యానిమల్ ఫార్మ్’ వ్యంగ్య నవలలో జార్జ్ ఆర్వెల్ ఒకచోట విరోధాభాసాలంకారం ప్రయోగిస్తాడు. ఫార్మ్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్న పందుల సామాజిక వర్గం ‘జంతువులన్నీ సమానం; కానీ, పందులు మరింత సమానం’ అంటుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అలాంటి విరోధాభాసాలంకారాన్ని తరచూ ప్రయోగిస్తున్నది. రాష్ట్రాలన్నీ సమానం కానీ, హిందీ బెల్టు మరింత సమానం. ఉత్తరాది రాష్ట్రాలు ఇంకా సమానం అంటున్నది. ఇప్పుడు ‘భాషలన్నీ సమానం; కానీ, హిందీ మరింత సమానం’ అంటూ కొత్త పాట మొదలెట్టింది.-డానీవ్యాసకర్త సమాజ విశ్లేషకులు -
బడ్జెట్ సమావేశాలు: రాజ్యసభ నుంచి వాకౌట్
Parliament Live Updates March 10th: పార్లమెంట్ మలి(రెండో) విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. కాసేపటికే ఉభయ సభల్లో విపక్షాలకు ఆందోళనలకు దిగాయి.లోకసభ వాయిదామధ్యాహ్నం 12గంటల వరకు వాయిదా వేసిన స్పీకర్జాతీయ విద్యా విధానంలో త్రిభాషా వ్యవస్థకు వ్యతిరేకంగా విపక్షాల ఆందోళన గందరగోళం నడుమ సభను కాసేపు వాయిదా వేసిన స్పీకర్ ఓం బిర్లా #Loksabha adjourned till 12 noon. pic.twitter.com/OWiOwstBES— Lok Poll (@LokPoll) March 10, 2025 #WATCH | On the New Education Policy and three language row, Union Education Minister Dharmendra Pradhan says, "...They (DMK) are dishonest. They are not committed to the students of Tamil Nadu. They are ruining the future of Tamil Nadu students. Their only job is to raise… pic.twitter.com/LdBVqwH6le— ANI (@ANI) March 10, 2025 రాజ్యసభ నుంచి ప్రతిపక్షం వాకౌట్పెద్దల సభను కుదిపేసిన డీలిమిటేషన్ వ్యవహారంరాజ్యసభ నుంచి కాంగ్రెస్ సభ్యుల వాకౌట్ డీలిమిటేషన్(నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణ అంశంపై చర్చించాలని, అనుమానాలను నివృత్తి చేయాలని పట్టుబట్టిన విపక్షాలుప్రతిపక్షాల చర్యలపై ఎన్డీయే సభ్యుల ఆగ్రహం #WATCH | Delhi: Rajya Sabha MP Rekha Sharma says, "The opposition always obstructs the House and important issues are left behind...Today also they will do something similar and we are ready for that too...only those issues will come up in Parliament which are for the… pic.twitter.com/uWHQDiXooN— ANI (@ANI) March 10, 2025 రాజ్యసభలో టీమిండియాకు శుభాకాంక్షలుఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్టీమిండియాకు రాజ్యసభలో అభినందనలు #WATCH | Delhi: On behalf of Rajya Sabha members, Rajya Sabha Deputy Chairman Harivansh Narayan Singh congratulates the Indian team for clinching the Champions Trophy (Source: Sansad TV) pic.twitter.com/1HcsW5GgFb— ANI (@ANI) March 10, 2025 ప్రారంభమైన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కాసేపట్లో పార్లమెంట్ రెండవ విడత బడ్జెట్ సమావేశాలువక్ఫ్ బిల్లు ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్న విపక్షాలుఓటర్ల జాబితాలో అవకతవకలు, త్రిభాషా అంశం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశం పై విధించే సుంకాల పై చర్చ జరపాలని డిమాండ్ చేసే అవకాశం మార్చి 10 నుండి ఏప్రిల్ 4 వరకు కొనసాగనున్న సమావేశాలు2025-26 ఆర్ధిక సంవత్సరానికి గాను డిమాండ్ ఫర్ గ్రాంట్ల పై జరుగనున్న చర్చనేడు లోక్ సభలో రెండో విడత పద్దులను ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్మణిపూర్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్లోక్ సభలో నేడు త్రిభువన్ సహకారి యూనివర్సిటీ బిల్లు ను ప్రవేశపెట్టనున్న కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షాఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ ఆనంద్ ను, త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయంగా మారుస్తూ బిల్లుఈ సమావేశాల్లో బ్యాంకింగ్ చట్ట సవరణ బిల్లు, కోస్టల్ షిప్పింగ్ బిల్లు, 2024, ఇమ్మిగ్రేషన్ ఆండ్ ఫారినర్స్ బిల్లు,2025, రైల్వేస్ చట్ట సవరణ బిల్లు లను పార్లమెంట్ ఆమోదం కోసం ప్రవేశపెట్టనున్న కేంద్రంఈ సమావేశాల్లో వక్స్ బోర్డ్ సవరణ బిల్లు, 2024 ను కేంద్రం ప్రవేశపెట్టే అవకాశం -
ట్రక్కును ఢీకొన్న వాహనం.. ఏడుగురు భక్తులు మృతి
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. భక్తులతో వెళ్తున్న ఎస్యూవీ వాహనం ట్రక్కును ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా.. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.వివరాల ప్రకారం..‘మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో బహ్రీ వద్ద ట్రక్కు, ఎస్యూవీ వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే ఏడుగురు మృతిచెందారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆసుపత్రిలో క్షతగాత్రులకు చికిత్స జరగుతోంది. అయితే, వీరంతా మైహార్ ఆలయానికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటన అనంతరం, ట్రక్కు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.VIDEO | Madhya Pradesh: Several people died, while some others got injured after a car collided with a truck in Sidhi last night.DSP Gayatri Tiwari says, “Last night at around 2 am, we received the information about the accident between a bulker and a car near Utni Petrol Pump.… pic.twitter.com/LVxoYGOrRe— Press Trust of India (@PTI_News) March 10, 2025 -
రెండో విడత బడ్జెట్ సమావేశాలు నేటి నుంచే
సాక్షి, న్యూఢిల్లీ/చెన్నై: పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఇవి ఏప్రిల్ 4వ తేదీ దాకా కొనసాగుతాయి. పలు శాఖలకు గ్రాంట్లు, డిమాండ్లకు అమో దం, మణిపూర్ బడ్జెట్ ఆమోదం, అత్యంత కీలకమైన వక్ఫ్ (సవరణ) ను ఆమోదంపై ఈ సమావేశాల్లో కేంద్రం దృష్టి సారించనుంది. వక్ఫ్ బిల్లుపై సంయుక్త పార్లమెంటరీ సంఘం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఇప్పటికే నివేదిక అందజేసింది. దాన్ని వీలైనంత త్వరగా పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం చిత్తశుద్ధితో ఉన్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనకు పార్లమెంట్ ఆమోదం కోరుతూ కేంద్రం హోం మంత్రి అమిత్ షా తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. మణిపూర్ బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెడతారు. వాడీవేడిగా... రెండో విడత బడ్జెట్ సమావేశాలు వాడివేడీగా సాగే అవకాశాలున్నాయి. వక్ఫ్ బిల్లుతో పాటు మణిపూర్ హింసాకాండ, లోక్‌సభ నియోజకవర్గాల పుర్వివభజన, అమెరికా సుంకాల పెంపు తదితరాలపై మోదీ సర్కారును గట్టిగా నిలదీయాలని విపక్షాలు భావిస్తున్నాయి. జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమకు చేటు చేస్తుందని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తుండటం తెలిసిందే. 1971 నాటి జనాభా లెక్కల ప్రకారమే పునర్విభజన జరగాలని తమిళనాడు సీఎం స్టాలిన్ డిమాండ్ చేస్తున్నారు. దీన్ని పార్లమెంట్లో ప్రస్తావించాలని డీఎంకే ఎంపీలను ఆయన ఆదివారం ఆదేశించారు. జనాభా ప్రాతిపదికన పుర్వివభజనను, తమిళనాడుపై హిందీని బలవంతంగా రుద్దడాన్ని పార్లమెంటులో గట్టిగా వ్యతిరేకించాలని నిర్ణయించారు. ఈ మేరకు రెండు తీర్మానాలను ఆమోదించారు. పుర్వివభజనకు వ్యతిరేకంగా కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, ఒడిశా, పశి్చమబెంగాల్, పంజాబ్ పార్టీల మద్దతు కూడగట్టాలని డీఎంకే నిర్ణయించింది. ఇక నకిలీ ఎలక్టోరల్ ఫోటో గుర్తింపు కార్డు (ఎపిక్)లపై కేంద్రాన్ని నిలదీయాలని టీఎంసీ నిర్ణయించింది. దీనిపై కలిసి రావాలని కాంగ్రెస్, డీఎంకే, శివసేన (ఉద్ధవ్)లను కోరింది. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని, ఇటీవలి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త ఓటర్ల సంఖ్య భారీగా పెరిగిందని కాంగ్రెస్ కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తుండటం తెలిసిందే. దీనిపై పార్లమెంట్‌లోనూ గళ మెత్తాలని పార్టీ నిర్ణయించింది. -
స్వామి నారాయణ్ ఆలయంపై...విద్వేష దాడి
న్యూయార్క్/న్యూఢిల్లీ: అమెరికాలో హిందూ ఆలయాలను లక్ష్యంగా చేసుకొని దుండగులు రెచ్చిపోతున్నారు. కాలిఫోర్నియా రాష్ట్రంలో శాన్ బెర్నార్డినో కౌంటీలో ఉన్న చినో హిల్స్‌లోని ప్రఖ్యాత స్వామి నారాయణ్ మందిరంపై శనివారం గుర్తు తెలియని వ్యక్తులు దాడికి తెగబడ్డారు. ఆలయ గోడలపై భారత వ్యతిరేక రాతలు రాశారు. గ్రాఫిటీ రాతలతో అందవిహీనంగా మార్చే ప్రయత్నం చేశారు. ఇది ఖలిస్తానీల పనేనని భావిస్తున్నారు. చినో హిల్స్ లాస్ ఏంజెలెస్ కౌంటీకి సరిహద్దులోనే ఉంది. ఆలయాన్ని అపవిత్రం చేశారని బోచాసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ (బీఏపీఎస్) ఆవేదన వెలిబుచ్చింది. ‘‘ఆలయాలపై విద్వేషాన్ని హిందూ సమాజం గట్టిగా వ్యతిరేకిస్తోంది. ఈ విద్వేషాల వ్యాప్తిని చినో హిల్స్, దక్షిణ కాలిఫోర్నియాలోని హిందువులు కలసికట్టుగా అడ్డుకుంటారు’’ అని ‘ఎక్స్’లో పోస్టు చేసింది. ఈ ఘటనపై హిందూ అమెరికన్ ఫౌండేషన్ దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి దుండగులను కఠినంగా శిక్షించాలని ఎఫ్‌బీఐని, దాని డైరెక్టర్ కాశ్ పటేల్‌ను కోరింది. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని అమెరికా ప్రభుత్వానికి కోవలిషన్ ఆఫ్ హిందూస్ ఆఫ్ నార్త్ అమెరికా (కోహ్న) విజ్ఞప్తి చేసింది. ‘‘అమెరికాలో హిందువులపై ద్వేషభావం లేదని మీడియా, మేధావులు చెబుతున్నా వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. లాస్ ఏంజెలెస్‌లో ఖలిస్తాన్ రెఫరెండం పేరిట కొందరు డ్రామాలుడుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో స్వామి నారాయణ్‌పై ఆలయంపై దాడి ఆశ్చర్యం కలిగించలేదు’’ అని పేర్కొంది. కొన్నేళ్లలో అమెరికాలో 10 హిందూ ఆలయాలపై దాడులు జరిగాయని ఆవేదన వెలిబుచ్చింది. గతేడాది కాలిఫోర్నియాలోని శాక్రమెంటోలో, న్యూయార్క్‌లోని మెల్వీల్లేలో ఆలయాలపై దాడులు జరిగాయి. ‘హిందూస్ గో బ్యాక్’ అంటూ ఆలయాల గోడలపై రాతలు రాశారు.భారత్ ఖండన స్వామి నారాయణ్ ఆలయంపై దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ«దీర్ జైశ్వాల్ ఆదివారం డిమాండ్ చేశారు. అమెరికాలోని హిందూ దేవాలయాలకు తగిన రక్షణ కల్పించాలని కోరారు. స్వామి నారాయణ్ ఆలయాన్ని అపవిత్రం చేయడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఆలయాలపై అసహనం, విద్వేష చర్యలు అంగీకారయోగ్యం కాదని పేర్కొంది. దుండగులపై అమెరికా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. దాడిని యోగా గురు రాందేవ్ ఖండించారు. -
ఇస్రోకు మరో రెండు లాంచ్ ప్యాడ్లు
న్యూఢిల్లీ: వినూత్నమైన అంతరిక్ష ప్రయోగాల్లో దూసుకెళ్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తన శక్తి సామర్థ్యాలను మరింత పెంచుకునే ప్రయత్నాల్లో భాగంగా మరో రెండు నూతన లాంచ్ప్యాడ్లను సమకూర్చుకుంటోంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో, తమిళనాడులోని కులశేఖరపట్నంలో వీటిని నిర్మిస్తున్నట్టు ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ ధ్రువీకరించారు. వీటిని రెండేళ్లలో అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. వాటిద్వారా అత్యాధునిక రాకెట్లను నింగిలోకి పంపనున్నారు. కొత్త లాంచ్పాడ్లతో ఇస్రో రాకెట్ ప్రయోగ సామర్థ్యం మరింత ఇనుమడించనుందని చైర్మన్ అన్నారు. చంద్రయాన్–4కు సంబంధించి ఆయన కీలక ప్రకటన చేశారు. 2028లో ప్రయోగం చేపట్టనున్నట్లు తెలిపారు. చంద్రయాన్–3 ఉపగ్రహం మొత్తం బరువు 4,000 కిలోలు కాగా చంద్రయాన్–4 9,200 కిలోలుంటుందని వెల్లడించారు. చందమామపైకి చేరుకొని, అక్కడి నమూనాలను సేకరించి విజయవంతంగా రావడం చంద్రయాన్–4 మిషన్ లక్ష్యం. చంద్రుడిపై మన ప్రయోగాల్లో ఇది కీలక మలుపు కానుందని చెబుతున్నారు. మహిళా సైంటిస్టులకు ప్రాధాన్యం అంతరిక్ష ప్రయోగాల్లో పురుషులతో సమానంగా మహిళా సైంటిస్టులకు ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు నారాయణన్ పేర్కొన్నారు. చంద్రయాన్, మార్స్ ఆర్బిటార్ మిషన్ ప్రయోగాల్లో మహిళలది కీలక పాత్ర అని ప్రశంసించారు. అమెరికా, భారత్ ఉమ్మడిగా ‘నిసార్’ శాటిలైట్‌ను అభివృద్ధి చేస్తున్నాయన్నారు. దాన్ని జీఎస్ఎల్వీ మార్క్–2 రాకెట్ ద్వారా ప్రయోగించనున్నట్లు తెలియజేశారు. పర్యావరణ మార్పులపై అధ్యయనానికి ఈ ఉపగ్రహం తోడ్పడుతుందన్నారు. వాతావరణ పరిస్థితులపై అధ్యయనానికి జి–20 శాటిలైట్ రూపకల్పనలో ఇస్రో నిమగ్నమైంది. ఇందులో 40 శాతం పేలోడ్లు దేశీయంగా అభివృద్ధి చేసినవే కావడం విశేషం. భారత తయారీ రాకెట్లతో ఇప్పటిదాకా 34 దేశాలకు చెందిన 433 ఉపగ్రహాలను ప్రయోగించినట్టు వి.నారాయణన్ వెల్లడించారు. ఇందులో 90 శాతం ప్రయోగాలు గత పదేళ్లలోనే జరిగాయన్నారు. -
ఉడ్తా కేరళ!
అందమైన అడవులు, కొండలు, లోయలతో దేవుడు తీరిగ్గా తీర్చిదిద్దినట్టుగా ఉండే కేరళ మాదకద్రవ్యాల మత్తులో కూరుకుపోతోంది. రాష్ట్రాన్ని డ్రగ్స్ భూతం కబళిస్తోంది. చివరికి స్కూలు విద్యార్థులు కూడా డ్రగ్స్‌కు బానిసలవుతున్న పరిస్థితి! మాదకద్రవ్యాల వాడకంలో పంజాబ్‌ను కూడా దాటేసి దేశంలో తొలి స్థానంలో నిలిచింది. కేరళలోని కడక్కవూర్‌లో ఓ మహిళ డ్రగ్స్ మత్తులో టీనేజీ వయసున్న కన్న కొడుకుపైనే లైంగిక దాడులకు పాల్పడింది. దాంతో సహించలేక మరో కొడుకు ఆమెను చంపేశాడు! సంచలనం రేపిన ఈ ఘటన రాష్ట్రంలో సింథటిక్ డ్రగ్స్ విజృంభణకు ఉదాహరణ మాత్రమే.కేరళలో ఏ మూలన చూసినా డ్రగ్స్ ఘాటు గుప్పున కొడుతోందని నార్కోటిక్ గణాంకాలు చెబుతున్నాయి. 2024లో రాష్ట్రవ్యాప్తంగా నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ చట్టం,1985 కింద ఏకంగా 24,517 కేసులు నమోదయ్యాయి. డ్రగ్స్ అతి వాడకానికి మారుపేరుగా మారిన పంజాబ్‌లో నమోదైంది 9,734 కేసులే! ‘‘సింథటిక్ డ్రగ్స్ రాష్ట్రంలోకి అడుగుపెట్టకుండా కఠిన చట్టాలు చేయాల్సిన సమయమొచి్చంది. స్కూళ్ల ప్రాంగణాల్లోనూ డ్రగ్స్ బయటపడుతున్నాయి’’ అని కేరళ హైకోర్టు జస్టిస్ వీజీ అరుణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు పరిస్థితికి అద్దం పడుతున్నాయి.330 శాతం అధికం 2021 నుంచి చూస్తే మూడేళ్లలో కేరళలో డ్రగ్స్ కేసులు 330 శాతం పెరిగాయి. నమోదవని ఘటనలు మరెన్నో రెట్లు ఉంటాయని చెబుతున్నారు. రాష్ట్రంలో తరచూ భారీ పరిమాణంలో మత్తుపదార్థాలను పోలీసులు స్వా«దీనం చేసుకుంటున్నారు. గతంలో స్థానికంగా దొరికే గంజాయి సేవించేవారు. ఇప్పుడు సింథటిక్ డ్రగ్స్ వైపు మళ్లుతున్నారని స్వయంగా హైకోర్టు న్యాయమూర్తే వాపోయారు. దీనిపై అసెంబ్లీలో రెండుసార్లు చర్చించడమే గాక సమస్య పార్లమెంటులోనూ ప్రస్తావనకు వచ్చింది. ఎన్నెన్ని విషాదాలో...! డ్రగ్స్‌కు బానిసలైన వారి కుటుంబాల్లో ఆనందం ఆవిరవుతోంది. యువత, ముఖ్యంగా మైనర్లు మత్తులో తూగుతున్నారు..→ కాలికట్ జిల్లాలో మత్తుకు బానిసైన పాతికేళ్ల ఆశిఖ్ తన తల్లినే నరికి చంపాడు. పైగా ‘నాకు జన్మనిచి్చనందుకు శిక్షించా’ అంటూ డ్రగ్స్ మత్తు లో చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్‌గా మా రింది.→ త్రిసూర్‌లో మరో పాతికేళ్ల వ్యక్తి తల్లి నాలుక కోసేశాడు. జనవరి 1న త్రిసూర్‌లోనే 14, 16 ఏళ్ల టీనేజర్లు బహిరంగంగా డ్రగ్స్ తీసుకుంటూ హల్చల్ చేశారు. వారించిన 30 ఏళ్ల వ్యక్తిని అత్యంత దారుణంగా చంపేశారు.→ తమ అబ్బాయి డ్రగ్స్ వ్యసనాన్ని వదిలించలేకపోతున్నామంటూ పథినంతిట్ట జిల్లాలో ఒక వృద్ధ జంట ఆత్మహత్య చేసుకోవడం అందర్నీ కంటతడి పెట్టించింది.→ డ్రగ్స్ మానేయమన్న అక్క ముఖాన్ని బ్లేడుతో చెక్కేశాడో తమ్ముడు. మరో ప్రబుద్ధుడు మందలించిన తండ్రిపైనే దాడికి దిగాడు. ఇంకొకడు డ్రగ్స్ కొనేందుకు డబ్బివ్వలేదని తల్లినే చితకబాదాడు.→ డ్రగ్స్ తీసుకుంటూ టీచర్లకు పట్టుబడి, విషయం ఇంట్లో చెప్పొద్దని వాళ్లనే బెదిరిస్తున్న విద్యార్థులకు కొదవే లేదు. డార్క్‌వెబ్, క్రిప్టోకరెన్సీలో లావాదేవీలు డ్రగ్స్‌ను ముఠాలు పోలీసులకు చిక్కకుండా అత్యాధునిక సాంకేతికతను వాడుతున్నాయి. డార్క్‌వెబ్, క్రిప్టోకరెన్సీ, వాట్సాప్ గ్రూప్‌ల్లో లావాదేవీలు సాగిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. కేరళలో డ్రగ్ సరఫరా చేసే హాట్స్పాట్లు ఏకంగా 1,300కు పైగా ఉన్నట్లు చెబుతున్నారు. కొకైన్, హషి‹Ù, బ్రౌన్ షుగర్, హెరాయిన్ వాడకం ఎక్కువగానే ఉన్నా మిథేలిన్ డైఆక్సీ మిథాఫెటమైన్ (ఎండీఎంఏ) వీటన్నింటినీ మించిపోయింది. దీని వాడకం ఏడాదిలోనే ఏకంగా 65 శాతం పెరిగింది. ఎండీఎంఏ, మెథ్ వేరియంట్ డ్రగ్స్ బెంగళూరు, చెన్నై నుంచి కేరళలోకి వస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. 590 కిలోమీటర్ల సముద్రతీరం కూడా డ్రగ్స్ సరఫరాకు రాచమార్గంగా మారింది. జర్మనీ, ఫ్రాన్స్, థాయిలాండ్ దేశాల నుంచి డార్క్‌వెబ్ ద్వారా క్రిప్టో కరెన్సీని విక్రయించి బదులుగా కొరియర్ల ద్వారా డ్రగ్స్ తెప్పిస్తున్నారు.నాలుగేళ్లలో 93,599 అరెస్టులు! కేరళలో 2023లో ఏకంగా 30,697, 2024లో 24,517 డ్రగ్స్ కేసులు నమోదయ్యాయి. గత నాలుగేళ్లలో 87,101 కేసులు నమోదయ్యాయి. వీటిలో 93,599 మందిని అరెస్టు చేశారు. అంతకుముందు నాలుగేళ్లలో 37,228 కేసులు నమోదవగా 41,378 మందిని అరెస్టు చేసినట్టు సీఎం విజయన్ అసెంబ్లీలో చెప్పారు. గత జనవరిలో 2,000 డ్రగ్స్ కేసులు నమోదయ్యాయి.క్యాండీలు, ఐస్క్రీంల రూపంలో... సింథటిక్ డ్రగ్స్ వాడేవారిలో సమాజంలోని అన్నివర్గాల వారూ ఉన్నారు. విద్యార్థుల నుంచి వైద్యుల దాకా వాటికి బానిసలవుతున్నారు. ఎవరూ గుర్తు పట్టకుండా చాక్లెట్ల నుంచి ఐస్క్రీంల దాకా నానారకాలుగా వీటిని విక్రయిస్తున్నారు. పైగా వీటికి విద్యాసంస్థలే అడ్డాలుగా మారుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దాంతో తల్లిదండ్రులు భయంతో వణికిపోతున్నారు. తమ పిల్లలు డ్రగ్స్‌కు అలవాటు పడ్డారేమో తేల్చుకోవడానికి టెస్ట్ కిట్లు కొనుగోలు చేస్తున్నారు. దాంతో వాటి అమ్మకాలు విపరీతంగా పెరిగాయి.సూపర్‌బైక్‌లపై డెలివరీ... స్మార్ట్ ఫోన్లో, వాట్సాప్ గ్రూప్‌లోనూ మెసేజ్ చేస్తే పావుగంటలోపే సూపర్ బైక్‌లపై వచ్చి మరీ డ్రగ్స్ డెలివరీ చేసే స్థాయికి కేరళ ఎదిగిందని అసెంబ్లీలో విపక్ష నేత ఇటీవలే ఎద్దేవా చేశారు. పెడ్లర్లు డ్రగ్స్ సరఫరాకు తప్పుడు/నకిలీ నంబర్ ప్లేట్లున్న సూపర్‌బైక్‌లను వాడుతున్నారు. పోలీసులకు చిక్కకుండా వాటిపై మెరుపు వేగంతో దూసుకెళ్తున్నారు. తోటి పెడ్లర్ల పోటీని తట్టుకునేందుకు, వేగంగా సరకు డెలివరీకి రాత్రిళ్లు ఈ బైక్‌లను వాడుతున్నట్టు ఎక్సయిజ్, పోలీసు విభాగాలు చెబుతున్నాయి. డ్రగ్స్ ముఠాలు 18–24 ఏళ్ల వారినే డెలీవరీకి ఎంచుకుంటున్నారు. ఒక ప్యాకెట్‌కు రూ.1,000, రోజంతా డెలీవరీ చేస్తే రూ.4,000 ఇస్తున్నారు. ఫ్యామిలీ అని భ్రమింపజేసేలా బైక్ వెనక మహిళను కూర్చోబెట్టుకుంటున్నారు. టీనేజర్లనే డ్రగ్స్ పెడ్లర్లుగా ఈ ముఠాలు వాడుకుంటున్నాయి. పోకిరీలతో పరిచయాలు కాకుండా తల్లిదండ్రులే తమ పిల్లలపై కన్నేసి ఉంచాలి– రిటైర్డ్ ఎస్పీ కేజీ సిమాన్ కేరళలో పదేళ్ల విద్యార్థులు కూడా గ్యాంగ్ ఫైట్లకు దిగుతున్నారు. కనీసం 10 నుంచి 15 క్రిమినల్ కేసులున్న విద్యార్థి నాయకులను ఆదర్శంగా తీసుకుంటున్నారు– కేరళ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‘‘అత్యధిక అక్షరాస్యతా రేటు, ఉన్నత విద్యార్హతలున్నా ఉపాధి లేక కేరళలో యువత నైరాశ్యంతో డ్రగ్స్ బారిన పడుతోంది’’ – ఐరాస అభివృద్ధి కార్యక్రమం (యూఎన్డీపీ) ఆసియా–పసిఫిక్ రీజియన్ మాజీ సలహాదారు జి.ప్రమోద్‌కుమార్– సాక్షి, నేషనల్ డెస్క్ -
సీఎం నితీష్‌కు మీరు ఏదో ఆఫర్ చేశారంట కదా?
పాట్నా: ఈ ఏడాది చివర్లో బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో జేడీయూ ఆర్జేడీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయిలో ఉంది. ‘నేను గొప్ప అంటే నేను గొప్పు’ అనే రీతిలో వీరి మధ్య వాగ్వాదం జరుగుతోంది. అటు అసెంబ్లీ మొదలుకొని ఇటు మీడియా ముందు కూడా వీరి ఎక్కడా తగ్గడం లేదు.ఈ రోజు(ఆదివారం) జరిగిన ప్రెస్ మీట్ లో సైతం ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్.. జేడీయూ నేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ పై తనదైన శైలిలో రెచ్చిపోయారు. ‘ మీరు నితీష్ ను మీ పాలిటికల్ క్యాంప్ లోకి తీసుకునేందుకు ఏదో ఆఫర్ చేశారంట కదా’ అంటూ తేజస్వీ యాదవ్ కు ఒక ప్రశ్న ఎదురైంది. దానికి అంతే స్ట్రాంగ్ బదులిచ్చిన తేజస్వీ యాదవ్.. ‘ అదంతా నాన్సెస్. అయినా మీకు ఇటువంటి ఐడియాలు ఎవరిస్తారు. మేముందుకు ఆయన్ను ఆహ్వానిస్తాం. ఆఫర్, గీఫర్ ఏం లేదు. అటువంటి నాన్సెస్ గురించి మాట్లాడకండి. మీ పార్టీ నుంచి ఎవరికైనా ఆఫర్ చేస్తే.. అది నేను కానీ, మా తండ్రి(లాలూ ప్రసాద్ యాదవ్) లు మాత్రమే చేస్తాం. మేం ఎవరికీ ఎటువంటి ఆఫర్ చేయలేదు’ అని బదులిచ్చారు తేజస్వీ యాదవ్.2015 ఎన్నికల్లో ఆర్జేడీ 80 సీట్లు నెగ్గి అతిపెద్ద పార్టీగా అవతరించింది. నితీశ్ సారథ్యంలో జేడీ(యూ) 71 సీట్లు మాత్రమే గెల్చుకుంది. అయితే మహాఘట్బంధన్ కూటమిలో భాగంగా.. ముఖ్యమంత్రి పదవిని ఆర్జేడీ త్యాగం చేసింది. 2022లో బీజేపీకి కటీఫ్ చెప్పి మళ్లీ మహాఘట్బంధన్లో చేరి.. సీఎం పదవిని చేపట్టారు. ఈ రెండు సందర్భాల్లోనూ డిప్యూటీ సీఎంగా తేజస్వి యాదవ్ ఉన్నారు. అయితే ఈ బంధం ఏడాదిపాటే కొనసాగింది. 2024లో తిరిగి బీజేపీతో నితీశ్ జట్టు కట్టారు.రెండుసార్లు సీఎంను చేశా.. అది మరిచిపోకండిమీ నాన్నను అడుగు.. నేనేం చేశానో? -
TG: తుది దశకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక
ఢిల్లీ ; తెలంగాణ రాష్ట్రంలోని ఎమ్మెల్యే కోటా ఎంఎల్సీ అభ్యర్థుల ఖరారు అంశం తుది దశకు వచ్చింది ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఆదివారం భేటీ అయ్యారు. వీరిద్దరూ గంటన్నర పాటు సమావేశమై తెలంగాణ ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు చేశారు. దీనిలో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలతో వీరు ఫోన్ లో మాట్టాడారు. ఏ క్షణంలోనైనా ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జి మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమ్ ల చర్చలు పూర్తి చేశారు. ఎమ్మెల్సీ బరిలో ఓసీ వర్గం నుంచి పరిశీలను నరేందర్ రెడ్డి, కుసుమ కుమార్, కుమార్ రావ/ పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా, బీసీల నుండి ఇరపత్రి అనిల్, కొనగాల మహేష్, జెర్సీటీ జైపాల్, గాలి అనిల్ లు పరిశీలనలో ఉన్నాయి. ఇక ఎస్సీల నుండి అద్దంకి దయాకర్, జ్ఞాన సుందర్, దొమ్మడి సాంబయ్య, రాచమల్లు సిద్దేశ్వర్ పేర్లు వినిపిస్తున్నాయి. -
ఉప రాష్ట్రపతి జగదీప్ దన్కర్ త్వరగా కోలుకోవాలి: ప్రధాని
న్యూఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతి జగదీప్ దన్కర్ త్వరలో కోలుకోవాలని ప్రార్ధించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. జగదీప్ అస్వస్థతకు గురికావడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రితో చికిత్స అందిస్తున్నారు. ఈరోజు(ఆదివారం) తెల్లవారుజామున దన్కర్ కు ఛాతీలో నొప్పి రావడంతో ఎయిమ్స్ కు తరలించి అత్యవసర చికిత్స అందించారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఎయిమ్స్ ఆస్పత్రికి వెళ్లి దన్కర్ ను పరామర్శించారు. దన్కర్ ఆరోగ్యం గురించి అక్కడ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. దన్కర్ త్వరగా కోలుకోవాలని మోదీ ఆకాంక్షించారు.రావాలని ప్రార్ధించినట్లు మోదీ తన సోషల్ మీడియా హ్యాండిల్ ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు.Went to AIIMS and enquired about the health of Vice President Shri Jagdeep Dhankhar Ji. I pray for his good health and speedy recovery. @VPIndia— Narendra Modi (@narendramodi) March 9, 2025 కాగా, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున ఆయనకు ఛాతి నొప్పితో బాధపడినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో, తెల్లవారుజామున 2 గంటలకు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)కు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ రాజీవ్ నారంగ్ ఆధ్వర్యంలో ఆయనకు చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యబృందం తెలిపింది. ఇక, ధన్కర్ అస్వస్థత విషయం తెలిసిన వెంటనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. ఎయిమ్స్‌కు వెళ్లి ఆయనను పరామర్శించారు. -
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్కు అస్వస్థత.. ఎయిమ్స్‌కు తరలింపు
ఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్(Jagdeep Dhankar) అస్వస్థతకు గురయ్యారు. దీంతో, ఆయనను వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. అయితే, ఛాతి నొప్పితో బాధపడినట్లు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున ఆయనకు ఛాతి నొప్పితో బాధపడినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో, తెల్లవారుజామున 2 గంటలకు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)కు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ రాజీవ్ నారంగ్ ఆధ్వర్యంలో ఆయనకు చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యబృందం తెలిపింది. ఇక, ధన్కర్ అస్వస్థత విషయం తెలిసిన వెంటనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. ఎయిమ్స్‌కు వెళ్లి ఆయనను పరామర్శించారు. Vice President Jagdeep Dhankhar was admitted to the cardiac department at AIIMS Delhi in the early morning. He is stable and under observation: AIIMS Hospital Sources— ANI (@ANI) March 9, 2025 -
సెలవు లేదన్న హెడ్మాస్టర్.. లెక్కల టీచర్ ఏం చేశారంటే?
భువనేశ్వర్: తీవ్ర అనారోగ్యం పాలైన ఓ ఉపాధ్యాయుడు సెలవు కోసం పెట్టుకున్న దరఖాస్తును ప్రధానోపాధ్యాయురాలు తిరస్కరించారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా సెలవివ్వడం కుదరదంటూ తెగేసి చెప్పారు. పాపం ఆ ఉపాధ్యాయుడు విధిలేక చేతికి ఐవీ డిప్ సెలైన్ పెట్టుకునే విధులకు హాజరయ్యారు. ఆయన ఆరోగ్యం విషమించడం చూసి తోటి వారే ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటన ఒడిశాలోని బొలంగీర్‌లో చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. బొలంగీర్ ప్రభుత్వ పాఠశాలలో విజయలక్ష్మి ప్రధాన్ హెడ్మాస్టర్ కాగా, ప్రకాశ్ భోయి గణితం టీచర్. ఇటీవల తన తాత అంత్యక్రియల కార్యక్రమానికి హాజరైన అనంతరం ప్రకాశ్ ఆరోగ్యం దెబ్బతింది. విధులకు హాజరు కాలేనందున, సెలవు ఇప్పించమంటూ ఆయన ప్రధానోపాధ్యాయినికి విజ్ఞప్తి చేశారు. పరీక్షల సమయం కాబట్టి, మ్యాథ్స్ టీచర్ అవసరం ఎంతో ఉంటుందని చెబుతూ ఆమె ఆ వినతిని తిరస్కరించారు.అయితే, ఎన్ని సార్లు కోరినా హెడ్మాస్టర్ వినిపించుకోకపోవడంతో ప్రకాశ్ భోయి చేతికి సెలైన్ పెట్టుకునే విధులకు వచ్చారు. ఆయన పరిస్థితి చూసి తోటి టీచర్లే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పటన్గఢ్ బ్లాక్ విద్యాధికారి(బీఈవో) ప్రసాద్ మాఝి స్పందించారు. కాజువల్ లీవ్ కోసం ప్రకాశ్ భోయి పంపించిన దరఖాస్తును ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మీ ప్రధాన్ ఎందుకు తిరస్కరించారనే విషయమై విచారణ చేపట్టామన్నారు. ఆమెదే తప్పని తేలితే చర్యలు తీసుకుంటామని చెప్పారు. #ମିଳିଲାନି_ଛୁଟି #ସାଲାଇନ୍_ଧରି_ସ୍କୁଲରେ_ଶିକ୍ଷକଦେହ ଖରାପ ସତ୍ତ୍ବେ ମିଳିଲାନି ଛୁଟି। ମାନିଲେନି ପ୍ରିନ୍ସିପାଲ୍, ଶିକ୍ଷକ ହେଲେ ଗୁରୁତର। ସାଲାଇନ୍ ଲଗାଇ ସ୍କୁଲ ଦୁଆରେ ଛାଡ଼ିଲେ ପରିବାର। ଦେଖନ୍ତୁ ଏ ଦୃଶ୍ୟକୁ, ସ୍କୁଲ ଦୁଆରେ ଛିଡ଼ା ହୋଇଛନ୍ତି ଶିକ୍ଷକ। #Teacher #Leave #Saline #Controversy #Balangir #OTV pic.twitter.com/tlnV7Sxlvj— ଓଟିଭି (@otvkhabar) March 8, 2025 -
వీడియో: అమ్మాయిని పగబట్టిన కుక్కలు.. భయానక దాడి
జైపూర్: ఓ యువతి ఫోన్ మాట్లాడుతూ ఇంట్లో నుంచి బయటకు రావడమే ఆమెకు శాపమైంది. దాదాపు 10 వీధి కుక్కలు ఒక్కసారిగా ఆమెపై దాడి చేశాయి. ఆమెకు వెంటాడి మరీ గాయపరిచాయి. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లోని అల్వర్ నగరంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల ప్రకారం.. అల్వర్‌లోని జేకే నగర్‌కు చెందిన నవ్య ఫోన్ మాట్లాడుతూ ఇంటి బయటకు వచ్చింది. ఫోన్ మాట్లాడుకుంటూ అలా కొంత దూరం ముందుకు నడిచింది. ఈ క్రమంలో 10-12 కుక్కలు అకస్మాత్తుగా ఆమెపైకి వచ్చి దాడి చేశాయి. అనంతరం నవ్య పరుగులు తీస్తూ తప్పించుకునే ప్రయత్నం చేసింది. అయితే కుక్కలు ఆమెపై దాడి చేయడం వల్ల నవ్య కింద పడిపోయింది. అయినప్పటికీ కుక్కలు వదలకుండా ఆమెపై దాడి చేశాయి.ఈ సమయంలో పక్కన ఉన్న ఇంట్లో వారు, స్కూటీపై వెళ్తున్న మహిళ వెంటనే స్పందించి కుక్కలను తరిమేశారు. దీంతో, నవ్యపై దాడిని ఆపేసి పారిపోయాయి. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు.. ఈ ఘటన తర్వాత బాధితురాలు, ఫిజియోథెరపీ చదువుతున్న నవ్య మాట్లాడుతూ.. కుక్కల దాడి కారణంగా చాలా భయపడినట్లు చెప్పింది. రెండు రోజుల్లో ప్రాక్టికల్ పరీక్షలు ఉన్న నేపథ్యంలో ఇలా జరిగిందని వెల్లడించింది. పలుచోట్ల గాయాలైనట్టు తెలిపింది.ఇదిలా ఉండగా.. ఈ ఘటన తర్వాత వీధి కుక్కలకు ఆహారం పెట్టే ఓ మహిళను స్థానికులు మందలించారు. వీధి కుక్కల దాడులు పెరగడానికి ఇదే కారణమని చెప్పారు. గత ఐదేళ్లుగా వీధి కుక్కలు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయని ఈ ప్రాంత కౌన్సిలర్ అన్నారు. ఈ సమస్యను మున్సిపల్ కార్పొరేషన్ బోర్డులో అనేకసార్లు లేవనెత్తానని, కానీ ఎటువంటి పరిష్కారం చూపించలేదని తెలిపారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. Is there any city in India that does not have to suffer because of street dogs. This is from Alwar in Rajasthan. pic.twitter.com/0dmZaNdFpu— Ravi Handa (@ravihanda) March 8, 2025 -
రైల్వే ప్రయాణికులకు గమనిక.. ప్లాట్‌ఫామ్‌పై ఎంట్రీకి కొత్త రూల్!
సాక్షి, న్యూఢిల్లీ: రైలులో ప్రయాణించాలనుకునే వారు ఇకపై కన్ఫార్మ్ టికెట్ ఉంటేనే ప్లాట్‌ఫామ్ పైకి వెళ్ల గలుగుతారు. పైలట్ ప్రాజెక్టు కింద న్యూఢిల్లీ, ఆనంద్ విహార్, సూరత్, వారణాసి, అయోధ్య, పాట్నా రైల్వే స్టేషన్లలో ఈ వ్యవస్థను తక్షణమే అమల్లోకి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణీకులు రైల్వే శాఖ ఆదేశాలను పాటించాలని సూచనలు చేశారు.తాజాగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ నియంత్రణపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశవ్యాప్తంగా 60 ప్రధాన రైల్వే స్టేషన్లలోని అనధికార ఎంట్రీ పాయింట్లను మూసివేసి.. కన్ఫార్మ్ టికెట్లు ఉన్న ప్రయాణీకులను మాత్రమే ప్లాట్‌ఫామ్‌లపైకి అనుమతించాలని నిర్ణయించారు. మహా కుంభమేళా సందర్భంగా దేశంలోని 60 రైల్వే స్టేషన్లలో తాత్కాలికంగా వెయింటింగ్ రూములు ఏర్పాటు చేశారు. న్యూఢిల్లీ, సూరత్, పాట్నాల్లో రద్దీని నియంత్రించడంలో ఇవి ఎంతో ఉపయోగపడ్డాయి. రైలు విచ్చిన తర్వాతే ప్రయాణికులను ప్లాట్‌ఫామ్‌పైకి అనుమతించారు. ఇదే పద్ధతిని ఇప్పుడు శాశ్వతంగా అమలు చేయాలని నిర్ణయించారు.60 స్టేషన్లలో తాత్కాలికంగా నిర్మించిన వెయిటింగ్ రూములను శాశ్వతంగా ఉపయోగపడేలా మార్చబోతున్నారు. పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లలో రైళ్ల సామర్థ్యం మేరకే టికెట్లు విక్రయిస్తారు. ఈ స్టేషన్లలో రైల్వే సిబ్బందికి ప్రత్యేక డ్రెస్ కోడ్ కూడా ఉంటుంది. కుంభమేళా సందర్భంగా ఢిల్లీ స్టేషన్లో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో ప్రయాణికుల భద్రతపై రైల్వే శాఖ ఈ కీలక నిర్ణయాలు తీసుకుంది. BIG BREAKING NEWS 🚨 Only confirmed ticket holders will be allowed to enter platforms at 60 railway stations.Big decision by Railway Minister Ashwini Vaishnav to decongest stations.Those without a ticket or with a waiting list ticket will wait in the outside waiting area.… pic.twitter.com/IEmxJok5AE— Times Algebra (@TimesAlgebraIND) March 8, 2025 -
మణిపూర్‌లో మళ్లీ ఘర్షణలు
ఇంఫాల్: మణిపూర్ వ్యాప్తంగా శనివారం నుంచి అన్ని రకాల వాహనాలు స్వేచ్ఛగా రాకపోకలు సాగించవచ్చంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇచ్చిన ఆదేశాలు ఉద్రిక్తతలకు దారి తీశాయి. భద్రతా సిబ్బంది, కుకీ వర్గం ప్రజల మధ్య జరిగిన ఘర్షణల్లో నిరసనకారుడొకరు చనిపోగా 40 మంది గాయపడ్డారు. వీరిలో 16 మంది స్థానికులు కాగా, 27 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. హోం మంత్రి అమిత్ షా ఆదేశాలను నిరసిస్తూ కంగ్పోక్పి వద్ద రెండో నంబర్ ఇంఫాల్–దిమాపూర్ జాతీయ రహదారిపై కుకీలు నిరసన చేపట్టారు. అడ్డుకునేందుకు యతి్నంచిన భద్రతా సిబ్బందితో ఘర్షణకు దిగారు. అదే సమయంలో ప్రైవేట్ వాహనాలకు నిరసనకారులు నిప్పుపెట్టారు. మండుతున్న టైర్లను రోడ్డుపై పడేశారు. ఇంఫాల్ నుంచి సేనాపతి జిల్లా వైపు వెళ్తున్న రాష్ట్ర రవాణా సంస్థకు చెందిన బస్సుకు నిప్పు పెట్టేందుకు ప్రయతి్నంచడంతో పరిస్థితి చేయి దాటింది. దీంతో, భద్రతా సిబ్బంది వారిని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఘర్షణల్లో ఓ వ్యక్తి తీవ్ర గాయాలతో చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. అయితే, మైతేయి వర్గం చేపట్టిన శాంతి ర్యాలీని పోలీసులు కాంగ్పోక్పికి రాకమునుపే అడ్డుకున్నారు. ర్యాలీ ముందుకు సాగాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సుల్లోనే వెళ్లాలని వారికి షరతు విధించారు. చివరికి వారందరినీ 10 ప్రభుత్వ బస్సుల్లో తరలిస్తుండగా కుకీల మెజారిటీ ప్రాంతమైన కాంగ్పోక్పి వద్ద అడ్డుకుని, ఒక బస్సుకు నిప్పంటించేందుకు ప్రయతి్నంచారని పోలీసులు తెలిపారు. టియర్ గ్యాస్ ప్రయోగించి, నిరసన కారులను చెదరగొట్టాక మైతేయి శాంతి ర్యాలీ నిర్వాహకులున్న బస్సులు ముందుకు సాగాయని చెప్పారు. ఘటన అనంతరం ఆ ప్రాంతంలో కర్ఫ్యూ అమల్లోకి వచి్చందని చెప్పారు. -
నారీ శక్తికి సలాం
నవాసరీ (గుజరాత్): ఏ సమాజంలోనైనా, దేశంలోనైనా మహిళలను గౌరవించడమే ప్రగతి దిశగా తొలి అడుగని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. మహిళల సారథ్యంలో సమాజ ప్రగతి దిశగా భారత్ కొన్నేళ్లుగా ముందుకు సాగుతోందన్నారు. ‘‘నారీ శక్తికి నా నమస్సులు. మహిళల ఆత్మగౌరవానికి, భద్రతకు, సాధికారతకు మా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. వారిపై నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు నూతన చట్టాల్లో మరిన్ని కఠినమైన నిబంధనలు పొందుపరిచాం. వలస పాలన నాటి కాలం చెల్లిన చట్టాల స్థానంలో తెచి్చన పూర్తి దేశీయ చట్టాల్లో అత్యాచారం వంటి దారుణ నేరాలకు మరణశిక్షకు వీలు కల్పించాం. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు తదితరాల ద్వారా మహిళలకు సత్వర న్యాయం అందిస్తున్నాం. వారిపై తీవ్ర నేరాల్లో 45 నుంచి 60 రోజుల్లోపే తీర్పులు వచ్చేలా చర్యలు చేపట్టాం. విచారణ క్రమంలో బాధిత మహిళలకు ఎలాంటి ఇబ్బందులూ ఎదురవకుండా నిబంధనలు పొందుపరిచాం’’అని వివరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం గుజరాత్లో నవాసరీ జిల్లా వన్శ్రీ బోర్సీ గ్రామంలో ప్రత్యేక కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం లక్షన్నర మందికి పైగా మహిళలు హాజరైన భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘ఆడపిల్ల ఆలస్యంగా ఇంటికొస్తే పెద్దవాళ్లు లక్ష ప్రశ్నలడుగుతారు. అదే మగపిల్లాడు ఆలస్యమైతే పట్టించుకోరు. కానీ అతన్ని కూడా కచ్చితంగా నిలదీయాలి’’అని తల్లిదండ్రులకు సూచించారు. ప్రపంచంలోకెల్లా సంపన్నుడిని నేనే తాను ప్రపంచంలోకెల్లా సంపన్నుడిని అంటూ ఈ సందర్భంగా మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇది విని కొందరికి ఆశ్చర్యంతో కనుబొమ్మలు ముడిపడవచ్చు. కానీ ఇది నిజం. కాకపోతే సంపదపరంగా కాదు. కోట్లాది మంది తల్లులు, సోదరీమణులు, కూతుళ్ల ఆశీస్సులు నాకున్నాయి. ఆ రకంగా నేను అందరి కంటే సంపన్నుడిని. వారి ఆశీస్సులే నాకు అతి పెద్ద బలం, నా పెట్టుబడి. అవే నాకు తి రుగులేని రక్షణ కవచం కూడా’’అని వివరించారు. ప్రధాని సోషల్ ఖాతాల్లో... మహిళల విజయగాథలు పలు రంగాల్లో తమదైన ముద్ర వేసిన పలువురు మహిళా ప్రముఖులు శనివారం ప్రధాని మోదీ సోషల్ మీడియా హాండిళ్లను ఒక రోజు పాటు తామే నిర్వహించారు. తమ విజయగాథలను పంచుకున్నారు. కలలను నిజం చేసుకునేందుకు అమ్మాయిలు ధైర్యంగా ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. చెస్ గ్రాండ్‌మాస్టర్ ఆర్ వైశాలి, పారిశ్రామికవేత్తగా మారిన రైతు అనితా దేవి, అణు శాస్త్రవేత్త ఎలినా మిశ్రా, అంతరిక్ష శాస్త్రవేత్త శిల్పీ సోనీ తదితరులు వీరిలో ఉన్నారు. గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞా్ఞనంద సోదరి అయిన వైశాలి ఆరేళ్ల వయసు నుంచే చెస్ ఆడుతున్నారు. రైతు ఉత్పత్తుల కంపెనీ ద్వారా తన గ్రామానికి చెందిన వందలాది మంది మహిళలకు ఉపాధి కల్పించినట్టు అనితాదేవి వివరించారు. ఇది వారికి సంపాదనతో పాటు ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం కూడా కల్పించిందన్నారు. మహిళలకు ఆర్థిక సాధికారత అవసరాన్ని ఫ్రాంటియర్ మార్కెట్స్ సీఈఓ అజితా షా వివరించారు. అనంతరం వారి విజయగాథలను ప్రస్తుతిస్తూ మోదీ పలు పోస్టులు చేశారు. వికసిత భారత్ లక్ష్యసాధనలో మహిళలదే కీలక పాత్ర అని అభిప్రాయపడ్డారు. మహిళా పోలీసుల రక్షణ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నవాసరీ సభలో ప్రధాని మోదీకి పూర్తిగా మహిళలతో కూడిన అంగరక్షక దళం భద్రత కల్పించడం విశేషం. బహిరంగ సభతో పాటు ఆయన రక్షణ బాధ్యతలను కూడా 2,500 మందికి పైగా మహిళా పోలీసు సిబ్బందే చూసుకున్నారు. వీరిలో 2,145 మంది కానిస్టేబుళ్లు, 187 మంది ఎస్సైలు, 61 మంది ఇన్స్పెక్టర్లు, 19 మంది డీఎస్పీలు, ఐదుగురు ఎస్పీలు, ఒక డీఐజీ తదితరులున్నారు. హెలిప్యాడ్ వద్ద మోదీ రాక మొదలుకుని సభనుద్దేశించి ప్రసంగం, లఖ్పతీ దీదీ లబి్ధదారులకు సన్మానం, అనంతరం ఆయన వెనుదిరిగేదాకా సర్వం వారి కనుసన్నల్లోనే సాగింది. మొత్తం ఏర్పాట్లను అదనపు డీజీపీ నిపుణా తోర్వానే పర్యవేక్షించారు. పురుష సిబ్బంది పార్కింగ్, ట్రాఫిక్ విధులకే పరిమితమయ్యారు. ఇంతటి భారీ కార్యక్రమ భద్రత ఏర్పాట్లను పూర్తిగా మహిళా పోలీసు సిబ్బందే చూసుకోవడం దేశంలో ఇదే తొలిసారి. -
ఇజ్రాయెలీ సహా ఇద్దరిపై గ్యాంగ్ రేప్
సాక్షి, బళ్లారి: కర్ణాటకలోని చారిత్రక హంపి పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్‌కు చెందిన మహిళతోపాటు వారికి ఆతిథ్యమిస్తున్న స్థానిక మహిళపై దుండగులు దాడి చేసి తీవ్రంగా గాయపర్చడంతోపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అడ్డుకున్న ముగ్గురు పురుష పర్యాటకులపై దుండగులు దాడి చేసి, తీవ్రంగా కొట్టారు. తుంగభద్ర కాలువలోకి నెట్టివేయగా వీరిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు నలుగురు నిందితులను పట్టుకున్నారు. పరారీలో ఉన్న మరొకరి కోసం గాలింపు చేపట్టారు.గురువారం రాత్రి 11 గంటల సమయంలో గంగావతి సమీపంలోని సన్నాపుర వద్ద ఉన్న తుంగభద్ర కాలువ ఒడ్డున ఈ దారుణం చోటుచేసుకుంది. ఒడిశాకు చెందిన బిదాష్, మహారాష్ట్ర వాసి పంకజ్, అమెరికా పౌరుడు డానియెల్‌తోపాటు, ఇజ్రాయెల్ పర్యాటకురాలు, వీరికి ఆతిథ్యమిచ్చిన 29 ఏళ్ల స్థానిక మహిళ.. వీరంతా కలిసి తుంగభద్ర కాలువ ఒడ్డున గిటారు వాయిస్తూ సరదాగా కాలక్షేపం చేస్తున్నారు. అదే సమయంలో, కొందరు దుండగులు వీరి వద్దకు వచ్చి, పెట్రోల్ బంక్ ఎక్కడుందంటూ ప్రశ్నించారు. సనపూర్కు వెళ్లాలని బదులివ్వడంతో రూ.100 ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగారు. తెలుగు, కన్నడలో వారిని దూషించడం మొదలుపెట్టారు. దుండగుల్లో ఇద్దరు ఇజ్రాయెల్ మహిళతోపాటు ఆతిథ్యమిచ్చిన స్థానిక మహిళపైనా అత్యాచారానికి పాల్పడ్డారు మూడో వ్యక్తి ముగ్గురు పురుషులను తుంగభద్ర కాలువలోకి నెట్టివేశాడు. దీంతో, వీరిలో డానియెల్, పంకజ్‌లు ప్రాణాలతో బయటపడగా గల్లంతైన బిదాష్ మృతదేహం శనివారం ఉదయం కాలువలో దొరికింది. దుండగులు అంతటితో ఆగక స్థానిక మహిళను తీవ్రంగా కొట్టారు. ఆమె బ్యాగులో ఉన్న రెండు సెల్ఫోన్లు, రూ.9,500 నగదును దోచుకున్నారు. అనంతరం దుండగులు బైక్‌పై అక్కడి నుంచి పరారయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం బాధితుల ఫిర్యాదు మేరకు గంగావతి రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బాధిత మహిళలిద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని కొప్పాల్ ఎస్పీ రామ్ ఎల్ సిద్ధి చెప్పారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు నిందితులను గంగావతి పట్టణానికి చెందిన మల్లేశ్, చేతన్ సాయి, మోహన్, చన్నదాసర అనే వారిని పట్టుకున్నామన్నారు. ఐదో వ్యక్తిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా ఆరు పోలీస్ బృందాలను రంగంలోకి దించామని చెప్పారు. -
అలలపై కలల విహారం
అలలపై తేలియాడుతూ ప్రయాణం.. గమ్యం చేరే వరకు ఎక్కడా బోర్ కొట్టకుండా ఆటలు, పాటలు, విందులు, వినోదాల్లాంటి బోలెడన్ని సరదాలు.. కళ్లు చెదిరే ఇంటీరియర్లతో అందమైన గదులు.. ప్రయాణ బడలిక తెలియనివ్వని పాన్పులు.. ఒకవేళ అలసటకు గురైతే స్పా, మసాజ్ లాంటి సర్వీసులు.. ఉన్న చోటే బోలెడంత షాపింగ్ చేసుకొనే అవకాశం.. ఇంకా ఈత కొలనులు.. జిమ్‌లు.. ఇలా ఒకటేమిటి ఇంద్రభవనం లాంటి సకల విలాసాలతో కూడిన నౌకల్లో విహారయాత్రలంటే ఎవరికి ఇష్టం ఉండదు.అందుకే దేశంలో లగ్జరీ క్రూజ్ టూరిజం సరికొత్త ట్రెండ్‌గా మారింది. పర్యాటకులను ఆనంద‘సాగరం’లో ముంచెత్తే అనుభూతులు పంచుతోంది. ఇంకేం.. జీవితాంతం గుర్తుండిపోయే సముద్రమంత లోతైన జ్ఞాపకాలు కావాలనుకుంటే ‘సీ’కేషన్కు సిద్ధమైపోండి. గెట్ సెట్ క్రూజ్!! దేశంలో క్రూజ్ పర్యాటకం క్రమంగా పుంజుకుంటోంది. డెస్టినేషన్ వెడ్డింగ్స్, ప్రైవేటు పార్టీలు, కంపెనీల గెట్ టు గెదర్ వంటి కార్యక్రమాలకు కూడా క్రూజ్‌లు వేదికలుగా మారుతున్నాయి. ప్రస్తుతం దేశంలో క్రూజ్ ప్రయాణికుల సంఖ్య 4.5 లక్షలు దాటింది. కార్డీలియా క్రూజెస్ అనే స్వదేశీ సంస్థ 2021 సెపె్టంబర్లో సుమారు 2 వేల మంది ప్రయాణికుల సామర్థ్యంగల ‘ఎంప్రెస్’నౌక ద్వారా భారత్‌లో తొలిసారిగా లగ్జరీ క్రూజ్ పర్యాటకానికి తెరతీసింది.బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రాల్లో క్రూజ్ యాత్రలు నిర్వహిస్తోంది. పశ్చిమ తీరంలో ముంబై హోమ్ పోర్టుగా సెపె్టంబర్–జూన్ మధ్య గోవా, కొచ్చి, లక్షదీవులకు... జూన్–సెప్టెంబర్ మధ్య తూర్పు తీరంలో చెన్నై హోమ్ పోర్ట్‌గా క్రూజ్ ట్రిప్పులు తిప్పుతోంది. 2023 జూన్‌లో భారత్ నుంచి శ్రీలంకకు జర్నీతో విదేశీ క్రూజ్ సర్విసులను ప్రారంభించిన ఘనతను కూడా కార్డీలియా సొంతం చేసుకుంది.ఇప్పుడు ఏటా చెన్నై–శ్రీలంక మధ్య జూన్–సెపె్టంబర్ నెలల్లో కార్డీలియా ’ఎంప్రెస్‘విహారయాత్రలను నిర్వహిస్తోంది. గమ్యస్థానాల్లో వాటర్ అడ్వెంచర్లు, జంగిల్ సఫారీలు, ఆన్‌షోర్ సిటీ టూర్, అవుట్డోర్ పర్యటనలను కూడా అందిస్తోంది. దేశీయ గమ్యస్థానాలకు పర్యాటకుల ఆక్యుపెన్సీ 85 శాతం మేర ఉంటోందని.. వేసవి సెలవుల్లో టికెట్లు పూర్తిగా బుక్ అయిపోతున్నాయని కంపెనీ సీఈఓ జుర్గెన్ బైలోమ్ చెబుతున్నారు. కొత్త రూట్లు, గమ్యస్థానాలకు విస్తరణ నేపథ్యంలో భారతీయ క్రూజ్ ట్రాఫిక్ 25–30 శాతం పెరిగే అవకాశం ఉందన్నారు. కేంద్రం దన్ను.. దేశంలో సముద్ర క్రూజ్ పర్యాటకులను 2029 నాటికి ఏటా 10 లక్షల మంది స్థాయికి చేర్చడంతోపాటు ఈ రంగంలో 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేలా ఐదేళ్ల భారత్ క్రూజ్ మిషన్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా 10 సముద్ర క్రూజ్ టెర్మినల్స్, 100 రివర్ క్రూజ్ టెర్మినల్స్ నిర్మించాలనేది ప్రభుత్వ లక్ష్యం.ప్రపంచస్థాయి మౌలిక వసతులతోపాటు పర్యాటక ప్రదేశాలను మరింతగా అభివృద్ధి చేయనున్నారు. బడ్జెట్లో కూడా క్రూజ్ పరిశ్రమ వృద్ధికి ప్రోత్సాహకాలు ఇవ్వడం విశేషం. గంగ, బ్రహ్మపుత్ర నదుల్లో ఇప్పటికే రివర్ క్రూజ్ సర్విసులు ప్రారంభమయ్యాయి. కృష్ణా, గోదావరి, నర్మద, కావేరి నదుల్లోనూ ఈ సర్విసులను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రివర్ క్రూజ్ పర్యాటకులను 2029 నాటికి ఏటా 15 లక్షలకు పెంచాలనేది మిషన్ లక్ష్యం.వైజాగ్ హాట్ డెస్టినేషన్... జూలైలో మళ్లీ క్రూజ్ రెడీ2022లో తొలిసారి కార్డీలియా క్రూజెస్ ‘ఎంప్రెస్’నౌక విశాఖ–చెన్నై మధ్య సముద్ర విహారంతో పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచింది. గతేడాది ‘ద వరల్డ్’అనే విదేశీ లగ్జరీ క్రూజ్ షిప్ గ్లోబల్ టూరిస్టులను విశాఖకు తీసుకొచ్చింది. ఇక్కడ సకల సౌకర్యాలతో నిర్మించిన అంతర్జాతీయ క్రూజ్ టెర్మినల్‌లో లంగరేసింది. ఈ ఏడాది మళ్లీ జూలైలో కార్డీలియా ఎంప్రెస్ నౌక వైజాగ్–పుదుచ్చేరి–చెన్నై మధ్య ట్రిప్పులకు రెడీ అవుతోంది.సుమారు రూ. 100 కోట్ల వ్యయంతో విశాఖ పోర్టులో నిర్మించిన ఇంటర్నేషనల్ క్రూజ్ టెర్మినల్ నుంచి నౌకల రాకపోకలు మొదలవడంతో క్రూజ్ పర్యటకానికి కూడా వైజాగ్ హాట్ డెస్టినేషన్‌గా నిలుస్తోంది. షిప్ ఆకారంలో నిర్మించిన ఈ టెర్మినల్‌లోని బెర్త్‌లో 2,500 మంది సామర్థ్యంతో కూడిన భారీ క్రూయిజ్లను లంగరేయొచ్చు. త్వరలో ఇక్కడి నుంచి సింగపూర్, మలేసియా, థాయ్‌లాండ్, శ్రీలంక తదితర దేశాలకు క్రూజ్ సర్వీసులు ప్రారంభించేందుకు పలు క్రూజ్ కంపెనీలతో సంప్రదింపులు జరుగుతున్నాయి.విదేశీ క్రూజ్‌ల క్యూఇటలీకి చెందిన కోస్టా క్రూజెస్ తొలిసారిగా 2023లో భారత్ పర్యాటకులకు అంతర్జాతీయ స్థాయి క్రూజ్ అనుభూతితోపాటు ఇటాలియన్ ఆతిథ్యాన్ని రుచి చూపించింది. ముంబై, కొచ్చి, గోవాతోపాటు లక్షదీవుల మధ్య మొత్తం 23 ట్రిప్పులు నిర్వహించింది. మొత్తం 14 అంతస్తులు (డెక్‌లు), 3,780 మంది ప్రయాణికుల సామర్థ్యంతో కోస్టా సెరీనా క్రూజ్ భారత సముద్ర జలాల్లో విహరించిన అతిపెద్ద నౌకగా రికార్డుకెక్కింది.ఆసియా పసిఫిక్ కార్యకలాపాల కోసం భారత్‌ను ప్రధాన కేంద్రంగా చేసుకోవడంపై దృష్టి పెడుతున్నామని కోస్టా క్రూజెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాబర్టో అల్బెర్టీ వెల్లడించారు. క్రూజ్ టూరిజానికి ప్రభుత్వ ప్రోత్సాహంతో మరిన్ని క్రూజ్ కంపెనీలు భారత్‌కు క్యూ కట్టనున్నాయి. వచ్చే ఏడాది నుంచి ‘రిసార్ట్ వరల్డ్ వన్’క్రూజ్ లైనర్ మన దేశంలో సెయిలింగ్‌కు సై అంటోంది. రాయల్ కరీబియన్, డిస్నీ తదితర దిగ్గజ క్రూజ్ లైనర్లు కూడా భారత మార్కెట్లోకి అడుగుపెట్టే ప్రణాళికల్లో ఉన్నాయి.ఇక అలలపై ఆగ్నేయాసియా చుట్టేయొచ్చు! భారత క్రూజ్ పరిశ్రమ ఇక అంతర్జాతీయంగానూ సత్తా చాటనుంది. కార్డీలియా తొలిసారిగా భారత్ నుంచి ఆగ్నేయాసియాలోని ప్రముఖ పర్యాటక దేశాలకు జూలైలో క్రూజ్ జర్నీ ప్రారంభిస్తోంది. ఇందుకోసం 2,500 మంది సామర్థ్యంగల రెండు కొత్త క్రూజ్లను కొననుంది. చెన్నై నుంచి మొదలయ్యే ఈ 10 రోజుల ట్రిప్‌లో థాయ్‌లాండ్ (ఫుకేట్), మలేసియా (కౌలాలంపూర్, లంకావీ)ల మీదుగా సింగపూర్ చేరుకోవచ్చు.అలాగే సింగపూర్ నుంచి మొదలై అవే డెస్టినేషన్లను కవర్ చేస్తూ చెన్నై చేరేలా టూర్లను ప్లాన్ చేశారు. ఇప్పటికే కార్డీలియా వెబ్సైట్ (www.cordeliacruises) తోపాటు ప్రముఖ ట్రావెల్ పోర్టల్స్‌లో బుకింగ్స్ మొదలయ్యాయి. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రాలను చుట్టేయడంతోపాటు గమ్యస్థానాల్లో సిటీ టూర్స్, ఆన్‌షోర్ పర్యటనలతో ఒకే ట్రిప్‌లో మూడు దేశాలను కవర్ చేసే అవకాశం ఉంటుంది.ప్యాకేజీలు ఇలా... కార్డీలియా ‘ఎంప్రెస్షిప్లో మధ్యతరగతి కుటుంబం సైతం లగ్జరీ క్రూజ్ జర్నీ చేసేవిధంగా రకరకాల రూమ్‌లు, ఆఫర్లు, గ్రూప్ ప్యాకేజీలు ఉన్నాయి. ఉదాహరణకు చెన్నై–విశాఖ మధ్య ఇద్దరు పెద్దవాళ్లకు రెండు రాత్రులు, 3 పగళ్ల ప్యాకేజీ ధరలు (పన్నులన్నీ కలిపి) చూస్తే...అన్లిమిటెడ్ ఫుడ్, ఎంటర్టైన్మెంట్తో మూడు రోజులపాటు ఫైవ్ స్టార్ లగ్జరీ సముద్ర ప్రయాణ అనుభూతిని సొంతం చేసుకోవచ్చు. జర్నీ రూట్, ఎంత మంది, ఎన్ని రోజులు (3, 5 నైట్స్ ప్యాకేజీలు) అనేదాన్ని బట్టి రేట్లు మారతాయి. 12 ఏళ్ల లోపు పిల్లలకు షరతులకు లోబడి ఉచిత ప్రయాణ (పన్నులు కాకుండా) ఆఫర్ ఉంది. ధర ఎక్కువైనా మరింత లగ్జరీ, సౌకర్యాలు కోరుకునేవారికి సూట్, చైర్మన్ సూట్ కూడా ఉన్నాయి.విదేశీ టూర్ల విషయానికొస్తే... చెన్నై నుంచి శ్రీలంకకు (హంబన్‌టోట, ట్రింకోమలీ, జాఫ్నా), తిరిగి చెన్నై (5 నైట్స్, 6 డేస్ రౌండ్ ట్రిప్) జర్నికి ఇద్దరు పెద్దవాళ్లకు చార్జీ దాదాపు రూ. లక్ష పడుతుంది. అలాగే చెన్నై నుంచి సింగపూర్ (ఫుకెట్, లంకావీ, కౌలాలంపూర్ మీదుగా వన్‌వే ట్రిప్ – 10 నైట్స్, 11 డేస్) ట్రిప్‌కి చార్జీ రూ.2,21,745 అవుతుంది. పన్నులతో కలిపి, ఇంటీరియర్ స్టేట్‌రూమ్ ప్యాకేజీలు ఇవి.క్రూజ్ లెక్కలు ఇలా.. 3 కోట్లు: ప్రపంచవ్యాప్తంగా ఏటా క్రూజ్ జర్నీ చేస్తున్న పర్యాటకుల సంఖ్య (సుమారుగా) 30 బిలియన్ డాలర్లు: క్రూజ్ జర్నీ మార్కెట్ విలువ45 బిలియన్ డాలర్లు: 2029 నాటికి క్రూజ్ జర్నీ మార్కెట్ విలువ అంచనా4.5 లక్షలు: దేశంలో ప్రస్తుతం క్రూజ్ ప్రయాణికుల సంఖ్య5.3 లక్షలు: ఇప్పటిదాకా కార్డీలియా ఎంప్రెస్‌లో విహరించిన పర్యాటకులు -
మనవడి చితిలోనే తాత మరణ శాసనం..
భోపాల్: ఇదొక కల్లోలం.. ముగ్గురి జీవితాలపై విధి ఆడిన వింత నాటకం. సాఫీగా సాగుతున్న జీవితంలో ఒక్క ఉదుటను దూకిన ‘మృత్యుఘోష’. ఈ ఘటనలో ఒకరు హత్యకు గురైతే, మరొకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకొకరు ఆత్మాహుతి చేసుకున్నారు. మధ్యప్రదేశ్ లో జరిగిన ఈ విషాద ఘటన తలుచుకుంటేనే ఒళ్లు గగుర్పాటుకు గురౌవుతుంది.రాష్ట్రంలోని బాహ్రి పోలీస్ స్టేషన్ పరిధిలో సిహోలియా గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది. ముందుగా భార్యను చంపిన భర్త ఆపై ఆత్మహత్య చేసుకున్నాడు. మెడకు ఉరితాడు బిగించుకుని తాను కూడా ప్రాణాలు విడిచాడు. ఆ తర్వాత మనవడి మరణాన్ని జీర్ణించుకోలేని తాత.. అదే చితిమంటల్లో దూకి ఆత్మార్పణం చేసుకున్నాడు.అభయ్ రాజ్ అనే 34 ఏళ్ల వ్యక్తి.. భార్య సవితా యాదవ్(31)ను హత్య చేశాడు. ఇక తనులేని జీవితం వద్దనుకున్నాడో, లేక జైలు పాలు కావాల్సి వస్తుందని భయపడ్డాడో కానీ ఉరి వేసుకుని అతను కూడా తనువు చాలించాడు. ఇది శుక్రవారం ఉదయం జరగ్గా, అదే రోజు సాయంత్ర వారి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే మనవడిఅభయ్ రాజ్) లేని జీవితం వద్దనుకున్న తాత రామావతార్.. తాను కూడా ఆ మనవడి అంత్యక్రియలు నిర్వహించిన చితి మంటల్లోనే దూకి ప్రాణం తీసుకున్నాడు. అయితే శనివారం ఉదయమే ఈ వార్త తెలుసుకున్న పోలీసులు.. అక్కడకు చేరుకుని కాలిన మృతదేహాన్ని బయటకు తీశారు. అయితే ఒక హత్య, రెండు ఆత్మహత్యల వెనుక కారణాలు ఏమిటో తెలియలేదని సిధి జిల్లా డీఎస్పీ గాయత్రి తివారీ తెలిపారు. దీనిపై దర్యాప్తు సాగిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. -
మీకు మీరే ట్రోల్ చేసుకుంటున్నారు.. బాగుందయ్యా రాహుల్!
అహ్మదాబాద్: కొందరు కాంగ్రెస్ నేతలు.. బీజేపీకి బీ టీమ్‌గా వ్యవహరిస్తున్నారంటూ ఏఐసీసీ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. రాహుల్ గాంధీ వ్యాఖ్యల వల్ల ఆ పార్టీకి కలిసొచ్చే ఏమీ లేదని, వాళ్లని వారే ట్రోల్ చేసుకుంటున్నారంటూ గుజరాత్ బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాల్లా విమర్శించారు. ‘ రాహుల్ గాంధీ మిమ్మల్ని మీరే ట్రోల్ చేసుకుంటున్నారు. మీ పార్టీని కూడా బానే ట్రోల్ చేస్తున్నారు. ఆయన్ని ఆయన అద్దంలో చూసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకీ వాస్తవం ఏంటంటే కాంగ్రెస్ గుజరాత్ లో గెలవలేకపోతుందనే అసహనం. కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు వివాహాల్లో గుర్రాల చేత డ్యాన్స్ చేయించే వారి మాదిరిగా ఉన్నారని, మరి కొంతమంది పోటీల్లో పరుగెత్తే పెళ్లి గుర్రాల్లా ఉన్నారని రాహుల్ అంటున్నారు. అంటే మీ పార్టీ కార్యకర్తలు జంతువులా? అని ప్రశ్నించారు షెహజాద్. కనీసం మీ పార్టీ కార్యకర్తల్ని మనుషుల మాదిరి చూడండి.. అంతే కానీ వారిని గుర్రాలతో పోలుస్తారా? అంటూ నిలదీశారు.కాగా, ఎంపీ రాహుల్ గాంధీ గుజరాత్ పర్యటనలో కాంగ్రెస్ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో సొంత పార్టీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. గుజరాత్లో సగం మంది కాంగ్రెస్ నేతలు బీజేపీతో చేతులు కలిపారు. బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నారు. బీజేపీకి బీటీమ్‌గా ఉన్న వారిని బయటకు పంపుతాం. బీజేపీకి అనుకూలంగా ఉన్న ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదు’ అని రాహుల్ వార్నింగ్ ఇచ్చారు. -
‘అది ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ కాదు.. యుద్ధ విమానం’
న్యూఢిల్లీ: ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎఫ్-35 ఫైటర్ జెట్ విమానాలను భారత్ కు అమ్మడానికి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో అధునాతన ఐదో తరం ఎఫ్ 35 జెట్ విమానాలను భారత్ కు విక్రయించడానికి ట్రంప్ హామీ ఇచ్చారు. అయితే ఈ ఒక్కో ఫైటర్ జెట్ విమానం విలువ 80 మిలియన్ డాలర్లు( సుమారు రూ. 680 కోట్లు) ఉంటుంది. ఇలా వెళ్లి అలా తెచ్చుకునే వస్తువు కాదు..అయితే దీనిపై భారత ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఏపీ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండియా టుడే కాంక్లేవ్ లో ఏపీ సింగ్ మాట్లాడుతూ.. ఈ జెట్ ఫైటర్స్ ను పూర్తిగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అది ఏమీ మార్కెట్ కు ఇలా వెళ్లి అలా తెచ్చుకునే వాషింగ్ మిషీన్, ఫ్రిడ్జ్ లాంటి కాదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం భారత్ కు అధునాతన యుద్ధ విమానాల ఆవశక్యత ఉందంటూనే, మనం వాటిని కొనుగోలు చేసే క్రమంలో టెక్నాలజీని అన్ని విధాలు పరిక్షీంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇక్కడ ఒక జెట్ ఫైటర్ ను కొనుగోలు చేస్తున్నామంటే దాని సామర్థ్యంతో పాటు దాని ఖరీదును కూడా బేరీజు వేసుకోవాలన్నారు. ఆ జుట్ ఫైటర్స్ ను కొనుగోలు చేయడానికి ఇంకా తమకే అమెరికా నుంచి ఆపర్ ఏమీ రాలేదని, వచ్చినప్పుడు దానిపై సమ గ్రంగా పరిశీలన చేసిన నిర్ణయం తీసుకుంటామన్నారుమన దేశం నుంచి 2035లోనే..ప్రస్తుతం చైనా ఆరో జనరేషన్ యుద్ధ విమానాలను వాడటానికి సిద్ధమైన క్రమంలో మనం ఇంకా ఐదో జనరేషన్ ప్రోగ్రామ్ లో ఉన్నామన్నారు. మన దేశ ఐదవ తరం ఫైటర్ జెట్ ప్రోగ్రామ్ లో భాగంగా అడ్వాన్స్డ్ ఇండియా కాంబేట్ ఎయిర్ క్రాప్ట్(ఏఎంసీఏ) ఇంకా అభివృద్ధి దశలోనే ఉందని, మన దేశం నుంచి అధునాతన యుద్ధ విమానం 2035లో అందుబాటులోకి రావచ్చని పేర్కొన్నారు. అప్పటివరకూ యుద్ధ విమానాలను బయట నుంచే తెచ్చుకోక తప్పదన్నారు. ప్రస్తుత తరుణంలో చైనా ఆరో తరం ఫైటర్ జెట్ ల వాడకానికి సిద్ధం కాగా, పాకిస్తాన్ ఎఫ్ 16 ఫైటర్ జెట్ ల కోసం అమెరికా నుంచి నిధులు సమకూరుస్తున్న తరుణంలో అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సి న అవసరం ఉందని ఏపీ సింగ్ తేల్చి చెప్పారు. ఎఫ్-35.. అంతు ‘చిక్కదు’ -
Women's Day : మహిళలకు ప్రతీ నెల రూ. 2,500!
ఢిల్లీ: మహిళా దినోత్సవం రోజున బీజేపీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం ఆ రాష్ట్ర మహిళలకు తీపి కబురు అందించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచితంగా నెలకు రూ. 2,500 చొప్పున అందిస్తామని ఢిల్లీ సర్కార్ స్పష్టం చేసింది. ‘మహిళా సమృద్ధి యోజనా’ పథకంలో భాగంగా ఈ హామీని అమలు చేయాలని ఢిల్లీ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఆధ్వర్యంలో జరిగిన ఈ క్యాబినెట్ భేటీలో మహిళలకు రూ. 2500 స్కీమ్‌కు ఆమోద ముద్ర పడింది. దీనిపై సీఎం రేఖా గుప్తా మాట్లాడుతూ.. ‘ ఈరోజు మహిళల దినోత్సవం. మన క్యాబినెట్ సమావేశం కూడా అందుకే ఈరోజున పెట్టాం. మహిళా సమృద్ధి యోజనా పథకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ హామీని ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చాం. దాన్ని ఇప్పుడు అమలు చేయబోతున్నాం’ అని ఆమె తెలిపారు. ఈ స్కీమ్ కోసం రూ. 5,100 కోట్ల బడ్జెట్ ను కేటాయించినట్లు సీఎం రేఖా గుప్తా తెలిపారు. ఇందుకోసం ఒక కమిటీని తన నేతృత్వంలోనే ఏర్పాటు చేసి మరీ పథకాన్ని అమలు చేయడానికి శ్రీకారం చుట్టామన్నారు. ఇందుకోసం ఒక వెబ్ పోర్టల్ ను త్వరలోనే ఏర్పాటు చేస్తామని, ఈ పథకం కోసం రిజిస్ట్రేషన్లు అతి త్వరలోనే ప్రారంభమవుతాయన్నారు రేఖా గుప్తా.మహిళా సమృద్ధి యోజనా పథకానికి ఆమోద ముద్ర పడింది. ఇందుకోసం పోర్టల్ త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తాం. ఇక్కడ నుంచి అర్హులైన మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు సంబంధించిన వివరాలను పోర్టల్ పొందుపరుస్తాం. దీనికి ముగ్గురు మంత్రుల కమిటీ ఉంది. కపిల్ శర్మ, అశిష్ సూద్, పర్వేష్ వర్మలతో కూడిన కమిటీని ఏర్పాటు చేశాం. ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని మంత్రి మన్ జిందర్ సింగ్ సిర్సా పేర్కొన్నారు. -
ఛావా ఎఫెక్ట్.. గుప్తనిధుల కోసం జనం ఉరుకులు పరుగులు
విక్కీ కౌశల్ లీడ్ రోల్లో తెరకెక్కిన ఛావా(Chhaava) చిత్రం బ్లాక్‌బస్టర్ టాక్‌తో.. రికార్డు కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతోంది. ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్. ఓవైపు ఛావా కథాకథనాలపై విమర్శలు.. మరోవైపు రోమాంచితమైన ఫెర్మార్మెన్స్‌కు ప్రశంసలు దక్కాయి. అయితే ఈ సినిమా ప్రభావం మధ్యప్రదేశ్ బుర్హన్‌పూర్‌లో అలజడికి కారణమైంది.బుర్హన్‌పూర్‌లోని అసర్ఘడ్ కోట(Asirgarh Fort)ను బంగారు గనిగా, శంభాజీ సైన్య స్థావరంగా ఛావా చిత్రంలో చూపించాడు దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్. అయితే ఈ మధ్య అక్కడ జరిగిన ఓ ఘటన.. ఈ వాదనకు మరింత బలం చేకూర్చి జనాల్ని ఉరుకులు పరుగులు పెట్టించింది. టార్చ్ లైట్లు, ఇనుప పనిముట్లు, మెటల్ డిటెక్టర్స్ స్థానికులు రాత్రిపూట కోట దగ్గరకు చేరుకున్నారు. ఇష్టానుసారం తవ్వకాలకు దిగారు. కొందరు బంగారు నాణేలు దొరికాయని ప్రకటించడంతో.. ఆ ప్రాంతానికి రోజురోజుకీ జనాల తాకిడి పెరిగింది. అయితే పోలీసులకు, అధికారులకు ఈ విషయమై సమాచారం అందించినా పట్టించుకోవడం లేదని స్థానికంగా కొందరు యువకులు చెబుతున్నారు.అసలేం జరిగిందంటే..అసర్ఘడ్ కోటకు దగ్గర్లో ఉన్న జాతీయ రహదారిపై నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అక్కడ ఉన్న దర్గా దగ్గర తవ్వకాలు జరిపిన ఓ జేసీబీ మిషన్.. ఆ మట్టిని స్థానికంగా ఉన్న ఓ రైతు పొలంలో పోశారు. అయితే కూలీలు ఆ మట్టి నుంచి పాత నాణేలు గుర్తించరాని, అందులో బంగారం, వెండి నాణేలు ఉన్నాయని ప్రచారం మొదలైంది. ఈ పుకార్లు చిలిచిలికి గాలివానగా చుట్టుపక్కల ఊర్లకు విస్తరించాయి. అయితే ఈ ప్రచారం కొందరు ఆకతాయిల ప్రచారమేనని స్థానికులు అంటున్నారు. చరిత్రకారులు ఏం చెబుతున్నారంటే..బుర్హన్‌పూర్ గతంలో మొఘలుల నగరంగా ఉండేది. ఆ కాలంలో అప్పటి ప్రజలు యుద్ధాలు, దొంగలకు భయపడి తమ వద్ద ఉన్న బంగారం, ఇతర విలువైన వస్తువుల్ని మట్టిలో పాతి పెట్టేవాళ్లు. కాబట్టి తవ్వకాల్లో నాణేలు బయటపడడంలో పెద్ద ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదని అంటున్నారు. నిజంగా అక్కడ నాణేలు దొరుకుతుంటే గనుక.. ఈ అంశాన్ని తీవ్రంగా భావించాలని, తక్షణమే ఆ ప్రాంతానికి రక్షణ కల్పించాలని పురావస్తు శాఖ అధికారులు స్థానిక యంత్రాంగాన్ని కోరుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ అంశాన్ని పరిశీలించాలని పోలీసులను కోరింది. దీంతో స్పందించిన అధికారులు రంగంలోకి దిగి.. ఆ ప్రాంతంలో సిబ్బందిని మోహరింపజేశారు. ఇష్టానుసారం తవ్వకాలు చేపడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. -
కాంగ్రెస్ నేతలపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
గాంధీనగర్: గుజరాత్లో కాంగ్రెస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ. గుజరాత్లో కొందరు కాంగ్రెస్ నేతలు బీజేపీకి బీ-టీమ్‌గా వ్యవహరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నకిలీ నేతలకు బుద్ధి చెప్పాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ గుజరాత్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలతో రాహుల్ సమావేశమయ్యారు. ఈ క్రమంలో సొంత పార్టీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. గుజరాత్లో సగం మంది కాంగ్రెస్ నేతలు బీజేపీతో చేతులు కలిపారు. బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నారు. బీజేపీకి బీటీమ్‌గా ఉన్న వారిని బయటకు పంపుతాం. బీజేపీకి అనుకూలంగా ఉన్న ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదు. కాంగ్రెస్ పార్టీలో నేతలకు కొదవలేదు. తెలంగాణలో కాంగ్రెస్‌కు 22 శాతం ఓట్లు పెరిగాయి.. అసాధ్యం అనుకున్న చోట వారు సాధించి చూపించారు.గుజరాత్లో కూడా కాంగ్రెస్‌కు 40 శాతం ఓటు బ్యాంక్ ఉన్నది.. కానీ అందుకు భిన్నంగా పనిచేస్తూ పార్టీ ప్రతిష్టను రోజురోజుకూ దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు.. అందరూ పార్టీ లైన్లో ఉండి పనిచేయాల్సింది.. గీత దాటిన వారిపై వేటు వేయడానికి ఎంతో సమయం పట్టదు.. ఇప్పుటికైనా మించిపోయిందేమీ లేదు. వైఖరి మార్చుకొని పార్టీ కోసం పనిచేయాలి. పీసీసీ నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు అందరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. అలాగే, గత 30 ఏళ్లుగా గుజరాత్లో కాంగ్రెస్ అధికారంలో లేదు. నేను ఇక్కడికి వచ్చిన ప్రతీసారీ 2007, 2012, 2017, 2022, 2027 అసెంబ్లీ ఎన్నికల గురించి చర్చలు జరుగుతాయి. కానీ ప్రశ్న ఎన్నికల గురించి కాదు. మన బాధ్యతలను నెరవేర్చే వరకు గుజరాత్ ప్రజలు మనల్ని ఎన్నికల్లో గెలిపించరు. ప్రజల పట్ల మనం బాధ్యతతో ఉన్న రోజున వారే మనకు అధికారం ఇస్తారు అని కీలక వ్యాఖ్యలు చేశారు. #WATCH | Ahmedabad, Gujarat: Lok Sabha LoP and Congress MP Rahul Gandhi says "...Gujarat is stuck, it is unable to see the way, Gujarat wants to move forward. I am a member of the Congress party and I am saying that the Congress party of Gujarat is unable to show it the way, and… pic.twitter.com/UYBZ5BdvfM— ANI (@ANI) March 8, 2025 -
తుంగభద్ర కాలువ వద్ద దారుణం.. అర్ధరాత్రి టూరిస్ట్ మహిళపై..
బెంగళూరు: కర్ణాటకలో అమానుష ఘటన చోటుచేసుకుంది. మన దేశానికి అపఖ్యాతి మూటగట్టుకునే విధంగా కొందరు మూకలు దారుణానికి ఒడిగట్టారు. భారత పర్యటనకు వచ్చిన ఇజ్రాయెల్ యువతి, మరో మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన బెంగళూరుకు 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొప్పల్‌లో చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఇద్దరు మహిళల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం వారికి ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది.వివరాల ప్రకారం.. కొప్పల్‌కు చెందిన మహిళ(29) పర్యాటకుల కోసం హోమ్ స్టే నిర్వహిస్తోంది. విదేశాల నుంచి వచ్చే టూరిస్టులకు తన ఇంట్లో ఆశ్రయం ఇస్తూ ఆదాయం పొందుతోంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఇజ్రాయెల్ నుంచి ఓ మహిళ, అమెరికా నుంచి వచ్చిన డేనియల్ సహా మరో ఇద్దరికి ఆశ్రయం కల్పించింది. దీంతో, వారంతా ఆమె ఇంట్లోనే ఉంటున్నారు. అయితే, గురువారం వారంతా డిన్నర్ చేసిన అనంతరం బయటకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు.Israeli Tourist, Homestay Owner Gang-Raped While Stargazing In Karnataka pic.twitter.com/DbtuOlGuxp— NDTV (@ndtv) March 8, 2025అనంతరం, సోనాపూర్ సమీపంలోని తుంగభద్ర కెనాల్ ఒడ్డుకు వెళ్లాలని నిర్ణయించారు. దీంతో, వారంతా గురువారం రాత్రి 11:30 గంటల సమయంలో తుంగభద్ర కాలువ వద్దకు వెళ్లారు. కాలువ ఒడ్డున కూర్చుని నక్షత్రాలను చూస్తూ మాట్లాడుకుంటుండగా గుర్తు తెలియని వ్యక్తులు కొందరు అక్కడికి వచ్చి వారిపై దాడి చేశారు. టూరిస్టులలోని ముగ్గురు మగవాళ్లను కాలువలోకి తోసేసి, ఇజ్రాయెల్ పౌరురాలితో పాటు హోమ్ స్టే యజమానిపై అత్యాచారం చేసి పారిపోయారు. కాలువలో పడ్డ డేనియల్, మహారాష్ట్రకు చెందిన పంకజ్ బయటకు రాగా, ఒడిశాకు చెందిన బిబాష్ జాడ మాత్రం తెలియరాలేదు. ఈ క్రమంలో టూరిస్టులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరు యువతులను ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు స్పష్టం చేశారు. -
రాహుల్ గాంధీ ధారావి పర్యటపై సెటైర్లు
ముంబై: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత తాజాగా ముంబైలోని ధారావి ప్రాంతంలో పర్యటించారు(Dharavi Visit). అయితే ఈ పర్యటనలో కాంగ్రెస్ నేతలెవరూ కనిపించకపోవడంపై శివసేన నేత, మాజీ ఎంపీ సంజయ్ నిరుపమ్(Sanjay Nirupam) వ్యంగ్యాస్త్రాలు సంధించారు.గురువారం ధారావిలోని ఛామర్ స్టూడియోను సందర్శించిన రాహుల్ గాంధీ(Rahul Gandhi).. డిజైనర్ సుధీర్ రాజ్బర్ & టీంను కలిశారు. ఆపై సోషల్ మీడియాలో రాజ్బర్ బృందాన్ని అభినందనలతో ముంచెత్తారు కూడా.Sudheer Rajbhar of Chamar Studio encapsulates the life and journey of lakhs of Dalit youth in India. Extremely talented, brimming with ideas and hungry to succeed but lacking the access and opportunity to connect with the elite in his field. However, unlike many others from his… pic.twitter.com/VOtnA9yqSD— Rahul Gandhi (@RahulGandhi) March 6, 2025 అయితే ఒక కాంగ్రెస్ నేతగా కాకుండా.. యూట్యూబర్‌లాగా రాహుల్ ధారావిలో పర్యటించారంటూ సంజయ్ నిరుపమ్ ఎద్దేవా చేశారు. అంతేకాదు.. ముంబై కాంగ్రెస్ యూనిట్ డబ్బుల్లేక దివాళా తీసిందని సెటైర్లు కూడా వేశారు. ముంబైలో కాంగ్రెస్‌కు ఓట్లు మాత్రమే కాదు.. డబ్బులు కూడా లేకుండా పోయాయి. చాలాకాలంగా ముంబై కాంగ్రెస్ కార్యాలయం కరెంట్ బిల్లులు చెల్లించడం లేదు. ఆ బకాయిలు రూ. 5 లక్షల దాకా పేరుకుపోయాయి. అందుకే.. కావాలనే రాహుల్ కాంగ్రెస్ నేతలను కలవకుండా వెళ్లిపోయారు. ఒక కాంగ్రెస్ నేతలా కాకుండా.. యూట్యూబర్‌లాగా ఆయన పర్యటన సాగింది. గతంలో నేను ముంబై కాంగ్రెస్ యూనిట్ చీఫ్‌గా నాలుగేళ్లపాటు పని చేశా. కానీ, ఏనాడూ ఇంత ఘోరమైన పరిస్థితులు మాత్రం లేవు’’ అని సంజయ్ నిరుపమ్ అన్నారు.బాల్‌థాక్రే పిలుపుతో రాజకీయాల్లోకి అడుగు పెట్టిన సంజయ్ నిరుపమ్.. ఆ తర్వాత కాంగ్రెస్‌తోనూ అనుబంధం కొనసాగించారు. ఒకసారి శివసేన నుంచి, ఒకసారి కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు వెళ్లారు. 2009-14 మధ్య కాంగ్రెస్ నుంచి లోక్‌సభ ఎంపీగా పని చేశారు. అయితే కిందటి ఏడాది ఏప్రిల్‌లో క్రమశిక్షణ చర్యల కింద కాంగ్రెస్ ఆయనపై ఆరేళ్లపాటు సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో ఆయన కాంగ్రెస్‌కు రాజీనామా చేసి.. షిండే శివసేన వర్గంలో చేరారు. -
వణక్కం.. ఇక అంతా వీళ్ల చేతుల్లోనే!
న్యూఢిల్లీ, సాక్షి: దేశ ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) మహిళా దినోత్సవం సందర్భంగా.. నారీశక్తికి వందనం అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. మరోసారి అత్యంత అరుదైన నిర్ణయం తీసుకున్నారాయన. తన సోషల్ మీడియా అకౌంట్ల బాధ్యతలను ఎంపిక చేసిన మహిళలకు అప్పజెప్పారు. ఈ క్రమంలోనే వణక్కం.. అంటూ ఆయన ఖాతా నుంచి ఓ పోస్ట్ అయ్యింది.ఇవాళ తన సోషల్ మీడియా ఖాతాల నిర్వహణ బాధ్యతను ఇండియన్ గ్రాండ్ చెస్ మాస్టర్ వైశాలి రమేష్‌బాబు(Vaishali Rameshbabu)కి అప్పగించారు. ఇదే విషయాన్ని మోదీ ఎక్స్ ఖాతా నుంచి వైశాలి తెలియజేశారు. తాను చెస్ ప్లేయర్‌నని, దేశం తరఫు ప్రాతినిధ్యం వహించడం తనకు ఎంతో గర్వకారణంగా ఉందని పోస్ట్ చేశారామె. ప్రధాని ఖాతాను నిర్వహించడం తనకు దక్కిన గౌరవమని అన్నారు. ఈరోజంతా ఆమే ఆయన ఖాతా బాధ్యతలను చూసుకోనున్నారు. ఆరో ఏట నుంచి నేను చెస్ ఆడుతున్నాను. అది నాకొక ఉత్తేజకరమైన ప్రయాణం. మీరు ఎంచుకున్న మార్గంలో ఎన్ని అవరోధాలు ఎదురైనా మీ కలలు సాకారం చేసుకోవడానికి ముందుకుసాగండి. ఆడపిల్లలకు అండగా నిలవాలని తల్లిదండ్రులు, తోబుట్టువులను ఈసందర్భంగా కోరుతున్నాను. వారి సామర్థ్యంపై నమ్మకం ఉంచండి. వారు అద్భుతాలు చేయగలరు అని వైశాలి సందేశం ఉంచారు. మరోవైపు.. వైశాలితో పాటు న్యూక్లియర్, స్పేస్ సైంటిస్ట్‌లు అయిన ఎలినా మిశ్రా, శిల్పి సోనీ.. మోదీ ఖాతా నుంచి పోస్టులు పెట్టారు. భారతదేశం సైన్స్ పరిశోధనలకు అత్యంత అనుకూలమైన ప్రదేశమన్నారు. మరింత ఎక్కుమంది మహిళలు ఈ రంగాన్ని ఎంచుకోవాలని కోరారు.నేను అనితా దేవిని.. నలందా జిల్లాకు చెందిన అనితాదేవి ప్రధాని ఖాతా నుంచి తన విజయాలు వెల్లడించారు. ‘‘నేను జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాను. నా కాళ్ల మీద నిలబడి, సొంతంగా ఏదైనా సాధించాలనే తపన ఉండేది. 2016లో ఆ దిశగా అడుగేశాను. అప్పుడే స్టార్టప్‌లపై క్రేజ్ పెరుగుతోంది. నేను కూడా మాదోపుర్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్‌ను ప్రారంభించాను. నాతో కలిసి పనిచేసిన మహిళలు స్వయంసమృద్ధి సాధించడం నాకు అత్యంత సంతోషాన్ని ఇచ్చింది. వారి కుటుంబాలు బాగుపడటం ఎంతో సంతృప్తిని ఇచ్చింది. ఆర్థిక స్వాతంత్య్రం మహిళలకు గౌరవాన్ని ఇస్తుందని నా నమ్మకం. మీరు అంకిత భావం, కృషితో ముందుకుసాగాలని బలంగా అనుకుంటే ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు’’ అంటూ తన స్టోరీ వెల్లడించారు.ప్రధాని మోదీ గతంలోనూ ఇలానే తన సోషల్ మీడియా అకౌంట్లను స్ఫూర్తిదాయకమైన మహిళలకు అప్పగించారు కూడా. ఇక.. మహిళా దినోత్సవం(Women's Day 2025) పురస్కరించుకొని ఇవాళ ప్రధాని భద్రతను కూడా పూర్తిగా మహిళా పోలీసులే పర్యవేక్షించనుండడం గమనార్హం. ప్రస్తుతం ఆయన గుజరాత్ పర్యటనలో ఉన్నారు. అంతకు ముందు తన మహిళా దినోత్సవ సందేశంలో.. ‘‘వివిధ అభివృద్ధి పథకాల ద్వారా ఎన్డీయే ప్రభుత్వం మహిళా సాధికారికతకు కృషి చేస్తోంది’’ అని అన్నారాయన. -
ఎయిరిండియా నిర్వాకం.. ఐసీయూలో వృద్ధురాలు
ఎయిరిండియా విమానయాన సంస్థపై సంచలన ఆరోపణలు వెల్లువెత్తాయి. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఓ వృద్ధురాలికి వీల్‌ఛైర్ సేవలు నిరాకరించడంతో ఆమె కిందపడి గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెకు ఐసీయూలో చికిత్స అందుతుండగా.. ‘తప్పనిసరి పరిస్థితుల్లో..’ అంటూ ఆమె మనవరాలు జరిగిందంతా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యాన్ని ఆమె ఎండగట్టడంతో.. దెబ్బకు ఎయిరిండియా దిగొచ్చింది. రాజ్ పశ్రీచా(82) మాజీ సైనికాధికారి భార్య. తన కుటుంబ సభ్యులతో ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్లడానికి ఎయిరిండియా విమానంలో టికెట్ బుక్ చేసుకున్నారు. వృద్ధాప్య సమస్యలతో ఉన్న ఆమెకు వీల్‌ఛైర్ కోసం బుక్ చేసుకోగా.. అది కన్ఫర్మ్ అయ్యింది. అయితే గంటసేపైనా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఎవరూ పట్టించుకోలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె కుటుంబ సభ్యుల సాయంతో ముందుకు వెళ్లారు. కాలు జారి కిందపడి గాయపడ్డారు.ఆమె తలకు గాయం కాగా.. ముక్కు, నోటి నుంచి రక్తం కారింది. అయితే ఆ టైంలోనూ సిబ్బంది ఎవరూ సాయానికి ముందుకు రాలేదని, తామే మెడికల్ కిట్ కొనుక్కొచ్చి ఫస్ట్ ఎయిడ్ చేశామని మనవరాలు పరుల్ కన్వర్(Parul Kanwar) తెలిపారు. ఆపై కాసేపటికి వీల్‌ఛైర్ వచ్చిందని.. గాయాలతోనే ఆమెను బెంగళూరుకు తీసుకొచ్చామని తెలిపారు. అయితే.. ఈ మధ్యలో విమాన సిబ్బంది సాయం కోరగా.. బెంగళూరు ఎయిర్‌పోర్టులో ఆమెకు వైద్య సేవలు అందాయని, తలకు రెండు కుట్లు పడ్డాయని తెలిపారామె. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతుండగా.. ఎడమ వైపు భాగానికి పక్షవాతం సోకిందని, మెదడులో రక్తస్రావం జరిగిందేమోననే అనుమానాలను వైద్యులు వ్యక్తం చేశారని పరుల్ తెలిపారు. ఈ ఘటనను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆమె.. మనిషి జీవితానికి కొంచెమైనా విలువ ఇవ్వండి అంటూ ఎయిరిండియా సిబ్బందిని ఉద్దేశించి పోస్ట్ చేశారు. ఈ ఘటనపై డైరెక్టోరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA), ఎయిరిండియాలకు ఫిర్యాదు చేశామని, చర్యలకు కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారామె.అయితే పరుల్ పోస్టుపై ఎయిరిండియా స్పందించింది. ఆమె సోషల్ మీడియా ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్నామని బాధితురాలు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ఎయిరిండియా తెలిపింది. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఫోన్ నెంబర్, పూర్తి వివరాలను తమకు అందించాలని ఎయిరిండియా ఆమెను కోరింది. అయితే ఘటనపై దర్యాప్తు పూర్తైతేగానీ తాను ఎయిరిండియాతో సంప్రదింపులు జరపబోనని తేల్చారామె. -
భారత పాస్‌పోర్టు అప్పగించేస్తా: ఐపీఎల్ మాజీ చైర్మన్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మాజీ చైర్మన్ లలిత్ మోదీ(Lalit Modi) తన భారత పాస్‌పోర్ట్‌ను అప్పగించేందుకు లండన్‌లోని భారత హైకమిషన్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం వివరాలు వెల్లడించింది. ఐపీఎల్ చైర్మన్‌గా ఉన్న సమయంలో భారీగా నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లలిత్ మోదీ... 2010లో భారత్‌ను వదిలి వెళ్లిపోయాడు.అప్పటి నుంచి లండన్‌లో నివాసముంటున్నాడు. ఈ క్రమంలో పసిఫిక్ దీవుల్లోని వనువాతు(Vanuatu) దేశం పౌరసత్వం కూడా పొందాడు. నిధుల దుర్వినియోగం అంశంలో భారత దర్యాప్తు సంస్థలు చాన్నాళ్లుగా లలిత్ మోదీ కోసం గాలిస్తున్నాయి. ‘లండన్‌లోని భారత హైకమిషన్‌లో లలిత్ మోదీ తన పాస్‌పోర్ట్ అప్పగించేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. నిబంధనల ప్రకారం లలిత్ దరఖాస్తును పరిశీలిస్తాం. వనువాతు పౌరసత్వం పొందాడనే విషయాన్ని కూడా అర్థం చేసుకున్నాం. చట్ట ప్రకారం అతడిపై కేసులు కొనసాగుతున్నాయి’ అని భారత విదేశంగా మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణదీర్ జైస్వాల్ వెల్లడించారు. టీ20 ఫార్మాట్, సినీ గ్లామర్‌తో 2008లో భారత్‌లో ఐపీఎల్ రూపుదిద్దుకుంది. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత సంపన్న లీగ్‌గా కొనసాగుతున్న ఈ మెగా టోర్నీ సృష్టికర్తగా లలిత్ మోదీకి పేరుంది. అయితే, ఎంత వేగంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడో అంతే వేగంగా పతనాన్ని చూశాడు లలిత్. 2010 ఫైనల్ తర్వాత భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అతడిని సస్పెండ్ చేసింది.పుణె, కొచ్చి ఫ్రాంఛైజీల బిడ్ల విషయంలో రిగ్గింగ్‌కు పాల్పడ్డాడని, క్రమశిక్షణారాహిత్యం, ఆర్థిక అవకతవల నేపథ్యంలో అతడిపై బోర్డు వేటు వేసి దర్యాప్తునకు ఆదేశించింది. ఈ క్రమంలో విచారణ కమిటి అతడిపై వచ్చిన అభియోగాలు నిజమేనని తేల్చడంతో 2013లో లలిత్ మోదీపై జీవితకాల నిషేధం విధించింది. అనంతరం అతడు లండన్‌కు పారిపోయి.. బీసీసీఐపై అనేక ఆరోపణలు చేశాడు. తాను అయాకుడినని చెప్పుకునే ప్రయత్నం చేశాడు. -
సమస్యను మూడు నెలల్లో పరిష్కరిస్తాం
న్యూఢిల్లీ: ఎలక్టోరల్ ఫొటో ఐడెంటిటీ కార్డ్(ఎపిక్) సంఖ్యలు పునరావృతం కావడం వివాదాస్పదమైన నేపథ్యంలో ఎన్నికల కమిషన్(ఈసీ)మరోసారి స్పష్టత ఇచ్చింది. 2000వ సంవత్సరం నుంచి కొనసాగుతున్న ఈ వ్యవహారానికి వచ్చే మూడు నెలల్లో ముగింపు పలుకుతామని శుక్రవారం తెలిపింది. ఓటరు జాబితాలో పేరున్న వ్యక్తి ఎపిక్ సంఖ్యతో నిమిత్తం లేకుండా సంబంధిత పోలింగ్ కేంద్రంలోనే ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశముంటుందని, ఇతర పోలింగ్ బూత్‌లలో ఓటేసే అవకాశం ఆ వ్యక్తికి ఉండదని కూడా ఈసీ స్పష్టతనిచ్చింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వేర్వేరుగా ఓటరు జాబితాను తయారు చేస్తుండటం వల్లే ఇలా నంబర్లు పునరావృతమయ్యాయని వివరించింది. నమోదైన 99 కోట్లకు పైగా ఓటర్లతో భారత ఓటర్ల జాబితా ప్రపంచంలోనే అతిపెద్ద డేటాబేస్ అని ఒక ప్రకటనలో ఈసీ పేర్కొంది. రాష్ట్రాల చీఫ్ ఎలక్టోరల్ అధికారులు, సాంకేతిక నిపుణుల సాయంతో దశాబ్దాల నాటి ఈ అంశంపై మూడు నెలల్లో స్పష్టత తెస్తామంది. ప్రస్తుత ఓటర్లకు యూనిక్ నేషనల్ ఎపిక్ నంబర్‌ను కేటాయిస్తామని, కొత్తగా నమోదయ్యే వారికి సైతం ఈ విధానాన్ని వర్తింపజేస్తామని వివరించింది. దీనివల్ల నంబర్లు పునరావృతమయ్యే అవకాశం ఉండదని తెలిపింది. -
వంటనూనె తగ్గించండి.. వ్యాయామం చేయండి
సిల్వాస్సా: దేశంలో ఊబకాయ సమస్య నానాటికీ తీవ్రరూపం దాలుస్తుండడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. 2050 నాటికి 44 కోట్ల మంది భారతీయులు ఊబకాయులుగా మారుతారని అధ్యయనాలు చెబుతున్నాయని గుర్తుచేశారు. ప్రతి ముగ్గురిలో ఒకరు ఊబకాయంతో అవస్థలు పడే ప్రమాదం ఉందన్నారు. ఇది నిజంగా ప్రమాదకరమైన, దిగ్భ్రాంతి కలిగించే సంఖ్య అని చెప్పారు. ఒబేసిటీ అతిపెద్ద సవాలుగా మారిందని అన్నారు. ఊబకాయ సమస్యను అధిగమించడానికి వంట నూనెల వినియోగాన్ని కనీసం 10 శాతం తగ్గించుకోవాలని మరోసారి దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. వంట నూనెల విని యోగం తగ్గించుకుంటామని అందరూ ప్రతిజ్ఞ చేయాలని చెప్పారు. నిత్యం వ్యాయామం చేయాలని, శరీరంలో అవసరానికి మించి ఉన్న కొవ్వు శాతాన్ని తగ్గించుకోవాలని కోరారు. లేకపోతే భవిష్యత్తులో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రజలకు తక్కువ ధరకే ఔషధాలు అందించడానికి దేశవ్యాప్తంగా 25 వేల జన ఔషధి కేంద్రాలు ప్రారంభించబోతున్నామని తెలియజేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని మెడికల్ షాపుల్లో ఔషధాలు కొనుగోలు చేయడం వల్ల మధ్య తరగతి ప్రజలు, పేదలకు ఇప్పటికే రూ.30,000 కోట్లు ఆదా అయ్యాయని వివరించారు. ప్రధాని మోదీ శుక్రవారం కేంద్ర పాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీలో పర్యటించారు. సిల్వాస్సా పట్టణం లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. రూ.2,587 కోట్ల విలువైన పలు అభివృద్ధి, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. అలాగే రూ.460 కోట్లతో నిర్మించిన ‘నమో హాస్పిటల్’ను ప్రారంభించారు.11 నుంచి మోదీ మారిషస్ పర్యటన ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 11వ తేదీ నుంచి మారిషస్‌లో పర్యటించనున్నారు. ఆయన పర్యటన రెండు రోజులపాటు కొనసాగుతుందని విదేశాంగ శాఖ శుక్రవారం వెల్లడించింది. మారిషస్ ప్రధానమంత్రి నవీన్ రామ్గూలం ఆహా్వనం మేరకు మారిషస్ జాతీయ దినోత్సవంలో మోదీ ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలియజేసింది. రూ. 32 లక్షల కోట్లలో ఎన్ని సున్నాలో లెక్కించలేరుకాంగ్రెస్ను ఎద్దేవా చేసిన ప్రధాని మోదీసూరత్: చట్టసభల్లో సున్నా సీట్లు ఉన్న రాజకీయ పార్టీలు రూ.32 లక్షల కోట్లలో ఎన్ని సున్నాలు ఉంటాయో లెక్కించలేవని ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా కాంగ్రెస్ పార్టీని ఎద్దేవా చేశారు. ‘ప్రధానమంత్రి ముద్రా యోజన’ కింద పేదలకు ఇప్పటిదాకా రూ.32 లక్షల కోట్ల రుణాలు అందజేశామని చెప్పారు. ఉద్యోగులు, వ్యాపారులు, కార్మికులకు లబ్ధి చేకూర్చడానికి ఆదాయపు పన్ను మినహాయింపును రూ.12 లక్షల వరకు పెంచామని అన్నారు. శుక్రవారం గుజరాత్‌లోని సూరత్‌లో ‘సంతృప్తస్థాయిలో ఆహార భద్రత’ అనే కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఇతర జిల్లాలకు సైతం స్ఫూర్తిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తన సోషల్ మీడియా ఖాతాలను శనివారం పూర్తిగా మహిళలకే అప్పగించబోతున్నానని ప్రధానమంత్రి స్పష్టంచేశారు. -
మాది టీ20 మోడల్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రానిది టీ–20 మోడల్, దేశానికి రోల్‌మోడల్ అని.. గుజరాత్ మోడల్ కాలం చెల్లిన టెస్ట్ మ్యాచ్ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గుజరాత్ మోడల్లో ఏ విధమైన సంక్షేమం లేదని, ఏమైనా అభివృద్ధి ఉందనుకుంటే అది మోదీ సీఎంగా ఉన్నప్పుడు ప్రయత్నించినదేనని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి అయిన తర్వాత కూడా మోదీ గుజరాత్ కోసమే పనిచేస్తున్నారని ఆరోపించారు.దేశంలో ఏదైనా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే సహకరించడం లేదని.. గుజరాత్‌కు వెళ్లి పెట్టుబడులు పెట్టా లని చెబుతున్నారని విమర్శించారు. మోదీ ప్రధాని అయి ఉండీ ఇదేం పద్ధతని ప్రశ్నించారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఇండియాటుడే కాన్క్లేవ్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పలు అంశాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘గుజరాత్ మోడల్‌కు, తెలంగాణ మోడల్‌కు మధ్య ఎంతో తేడా ఉంది.మాది అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన నమూనా. తెలంగాణ నమూ నాతో ఎవరూ పోటీపడలేరు. అహ్మదాబాద్, హైదరాబాద్‌లోని మౌలిక వసతులను పోల్చిచూడాలి. హైదరాబాద్‌తో పోటీపడేలా ఔటర్ రింగు రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం అహ్మదాబాద్‌కు ఉన్నాయా? గుజరాత్లో ఫార్మా, ఐటీ పెట్టుబడులు ఉన్నాయా? గుజరాత్లో ఏం ఉంది? హైదరాబాద్ ఇప్పుడు అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, ఢిల్లీ నగరాలతో పోటీపడట్లేదు. మేం న్యూయార్క్, సియోల్, టోక్యోలతో పోటీపడాలనుకుంటున్నాం. చార్మినార్, గోల్కొండ కోట చంద్రబాబు కట్టారా? హైదరాబాద్ అభివృద్ధి ఇప్పుడు ప్రారంభమైంది కాదు. 450 ఏళ్లకుపైగా చరిత్ర ఉన్న నగరం. కులీకుతుబ్ షా నుంచి ప్రారంభమై నిజాం సర్కార్, తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం, స్వాతంత్య్రం తర్వాత మర్రి చెన్నారెడ్డి, చంద్రబాబునాయుడు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి.. అలా ఇప్పుడు నేను అభివృద్ధి చేస్తున్నా. చార్మినార్, గోల్కొండ కోట చంద్రబాబు ఏమైనా కట్టారా? హైదరాబాద్‌లో ప్రముఖ కట్టడాలన్నీ 450 ఏళ్ల కింద ప్రారంభమయ్యాయి. ప్రభుత్వాలు మారినా సీఎంలు మారినా అభివృద్ధి కొనసాగింది. బీసీలకు బీజేపీ అన్యాయం జనాభా లెక్కల్లో ఎస్సీ, ఎస్టీల లెక్కలు తీస్తున్నప్పుడు బీసీల లెక్కలు ఎందుకు చేయకూడదు. అందుకే జనగణనలో కులగణన కూడా చేపట్టాలని శాసనసభలో తీర్మానం చేశాం. బీసీలకు బీజేపీ అన్యాయం చేసింది. గతంలో ఎస్సీ, ఎస్టీలకు కాంగ్రెస్ రిజర్వేషన్లు ఇచ్చింది. ఇప్పుడు ఓబీసీలకు ఇవ్వాలనుకుంటున్నాం.బీజేపీ అనుబంధ సంస్థలుగా ఈడీ, సీబీఐ, ఐటీ... కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంస్థలుగా యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, విద్యార్థి కాంగ్రెస్‌లు ఉంటే.. బీజేపీకి అనుబంధ సంస్థలుగా ఈడీ, సీబీఐ, ఐటీలు పనిచేస్తున్నాయి. ప్రజాస్వామ్యయుతంగా, ఉదారంగా ఉండటమే కాంగ్రెస్ పార్టీ బలహీనత. అయినా పార్టీ వేరు, ప్రభుత్వం వేరు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.ముఖ్యమంత్రిగా నేను ప్రధాన మంత్రిని గౌరవిస్తా.. అదే సమయంలో పార్టీ వేదికపై పార్టీ విషయాలు మాట్లాడుతా. తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీకి అదానీ రూ.వంద కోట్లు ఆఫర్ చేస్తే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించలేదు. రాష్ట్రంలోని ప్రతిపక్షాలు బీజేపీ, బీఆర్ఎస్ వ్యతిరేకించాయి. మేం ప్రజల కోసం రూ.100 కోట్లు తేవాలనుకున్నాం. బీజేపీ అదానీ నుంచి తీసుకున్న బాండ్లను ఎందుకు వెనక్కి ఇవ్వలేదో చెప్పాలి?..’’ అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. మోదీతో విభేదాల్లేవు.. ఆయన విధానాలతోనే.. అభివృద్ధి విషయంలో ఎవరిపైనా పక్షపాతం చూపవద్దనే నేను కోరుతున్నాను. ప్రధాని మోదీ గిఫ్ట్ సిటీని గుజరాత్‌కు తీసుకెళ్లారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఎందుకు ఆ అవకాశం ఇవ్వలేదు? ప్రధాని మోదీతో నాకు వ్యక్తిగతంగా ఎటువంటి విభేదాలు లేవు. నేను మోదీ విధానాలతో విభేదిస్తున్నాను. దేశానికి ప్రధానిగా ఉన్నందున మోదీకి గౌరవం ఇవ్వాలి. ఆయనను కలసి తెలంగాణకు కావల్సినవి అడగడం నా హక్కు, నా బాధ్యత. ఆదాయంతో అన్నీ చేయగలమనుకున్నా.. అందరిలాగే 2023లో అధికారంలోకి వచ్చే వరకు కూడా నేను రాష్ట్రానికి రూ.3.75 లక్షల కోట్లు మాత్రమే అప్పు ఉందని అనుకున్నాను. వచ్చే ఆదాయంతో అన్నీ చేయగలమనుకున్నాను. సీఎం కురీ్చలో కూర్చున్న తర్వాత తెలంగాణకు రూ.7 లక్షల కోట్లు అప్పు ఉందన్న అసలు విషయం బయటపడింది. కేసీఆర్ పదేళ్ల కాలంలోనే రూ.6 లక్షల కోట్లకుపైగా అప్పులు చేసి వెళ్లారు. దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గించేందుకు బీజేపీ ప్రయత్నం ఒకే దేశం– ఒకే ఎన్నిక, నియోజకవర్గాల పునర్విభజన, ఇతర అంశాలపైన మాత్రమే గాకుండా గ్యారంటీలపై, మూలధన వ్యయంపై చర్చ జరగాలి. దక్షిణాదిలో బీజేపీకి అధికారం, ప్రాతినిధ్యం లేనందునే ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. ఇందుకోసం నియోజకవర్గాల పునర్విభజన అనే ఆయుధాన్ని ఎంచుకుంది. దక్షిణాది ప్రాతినిధ్యాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది.కుటుంబ నియంత్రణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిస్తే దక్షిణాది రాష్ట్రాలు అమలు చేసినందుకు ఇప్పుడు మాపై ప్రతీకారం తీర్చుకుంటారా? కొత్త కొత్త మార్గాల ద్వారా దక్షిణాదిని ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేస్తోంది. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే కుటుంబ నియంత్రణ విధానానికి ముందటి 1971 లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలి. లేకుంటే కేవలం బిహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలే ఎక్కువగా లబ్ధిపొందుతాయి. ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాలే కాకుండా పంజాబ్ సహా ఉత్తరాది రాష్ట్రాలు కలసి రావాలి. హైదరాబాద్‌కు ‘ఒలంపిక్స్’ చాన్స్ ఇవ్వాలి.. ఒలంపిక్స్ నిర్వహించేందుకు అహ్మదాబాద్ కన్నా వంద రెట్లు ఎక్కువగా హైదరాబాద్‌లో వసతులున్నాయి. అహ్మదాబాద్, హైదరాబాద్‌లలో ఏమేం వసతులు ఉన్నాయో తేల్చాలి. ఒలింపిక్స్ గేమ్స్ నిర్వహణలో హైదరాబాద్‌కు అవకాశం ఇవ్వాలి. ప్రపంచ సుందరి పోటీలు హైదరాబాద్‌లో జరుగుతున్నప్పుడు ఒలంపిక్స్ ఎందుకు జరగకూడదు? అహ్మదాబాద్‌కు నరేంద్ర మోదీ బ్రాండ్ అంబాసిడర్.. రాబోయే రోజుల్లో హైదరాబాద్ బ్రాండ్‌ను నేను ఎక్కడికి తీసుకెళతారో చూడండి. -
బాలుడికి చెంపదెబ్బ.. పోలీస్ అధికారి ట్రాన్స్ఫర్, ఆగిన శాలరీ హైక్
గాంధీ నగర్ : ప్రధాని మోదీ ఇవాళ తన సొంతరాష్ట్రమైన గుజరాత్లో పర్యటించారు. అయితే, ఈ పర్యటనకు ముందు రోజు అంటే నిన్న ప్రధాని మోదీ ఖాళీ కాన్వాయ్‌తో రిహార్సల్స్ నిర్వహించారు అధికారులు. అంత వరకు బాగానే ఉన్నా.. కాన్వాయ్ రిహార్సల్స్ సమయంలో ఓ పోలీసు అధికారి అత్యుత్సాహం ప్రదర్శించారు. అందుకు తగిన మూల్యం చెల్లించుకున్నారు.ప్రధాని మోదీ రాక నేపథ్యంలో సెక్యూరిటీ రిత్యా ఆయా ప్రాంతాల్లో ఖాళీ కాన్వాయ్‌తో రిహార్సల్స్ నిర్వహిస్తుంటారు. గుజరాత్ పర్యటన వేళ గుజారత్‌లోని రతన్ చౌక్ వద్ద పోలీస్ ఉన్నతాధికారులు మోదీ కాన్వాయ్‌తో రిహారాల్స్ నిర్వహించారు. ఆ సమయంలో 17ఏళ్ల బాలుడు సైకిల్ తొక్కుకుంటూ పొరపాటున రిహార్సల్స్ జరిగే ప్రాంతం వైపు వచ్చాడు. వెంటనే రెప్పపాటులో సైకిల్‌ను వెనక్కి తిప్పాడు.అదే సమయంలో పక్కనే విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారి ఎస్ బీఎస్ గాధ్వీ సదరు బాలుడిని జుట్టు పట్టుకుని లాగారు. ఆపై చెంప చెల్లు మనిపించాడు. దీంతో బాలుడు వెక్కివెక్కి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లి పోయాడు. అయితే, బాలుడిపై సదరు పోలీస్ అధికారి దాడి సమయంలో స్థానికంగా పలువురు వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో పోలీసు అధికారిపై విమర్శలు వెల్లువెత్తాయి. సంబంధిత వీడియోలు సైతం వైరల్‌గా మారాయి. వైరలైన వీడియోలపై డిప్యూటీ పోలీస్ కమిషనర్ అమిత్ వానాని స్పందించారు. గాధ్వీ తీరు క్షమించరానిది. ప్రస్తుతం,మ్రోబి జిల్లాలో పోలీస్‌స్టేషన్‌లో విధిలు నిర్వహిస్తున్న ఆయన్ను కంట్రోల్ రూంకి ట్రాన్స్ఫర్ చేసినట్లు తెలిపారు. అంతేకాదు, ఏడాదిపాటు శాలరీ ఇంక్రిమెంట్ సైతం నిలిపివేసినట్లు తెలుస్తోంది.This Gujarat Police officer brutally thrashed a harmless kid on a cycle just for coming in between the convoy of Police VVIP movement rehearsal.Look at how he makes a fist and punches the kid. NAME AND SHAME THIS COP UNITL HE IS SUSPENDED! pic.twitter.com/5a08yvdUVd— Roshan Rai (@RoshanKrRaii) March 7, 2025 -
రన్యారావుకు ఏమైంది.. వైరల్ గా మారిన ఫోటో..!
న్యూఢిల్లీ: బంగారం స్మగ్మింగ్ కేసులో భాగంగా ప్రస్తుతం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) కస్టడీలో ఉన్న కన్నడ నటి రన్యారావుకు చెందిన తాజా ఫోటో వైరల్ గా మారింది. ఆమె కంటి కింద గాయాలు, ఉబికిన మొహంతో ఆమె ఫోటోలో ఉంది. ఆమెను కస్టడీలో తీసుకుని విచారణ పేరుతో చిత్ర హింసలు పెట్టారా? అనే అనుమానం కలుగుతోంది. దీనిపై కర్ణాకట మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధానంగా వైరల్ గా మారిన ఫోటోను ఉటంకిస్తూ మహిళా కమిషన్ చైర్మన్ నాగలక్ష్మీ చౌదరి అనుమానం వ్యక్తం చేశారు. ఆమెపై అధికారులు దాడికి పాల్పడ్డారా? అనే ప్రశ్న లేవనెత్తారు. అయితే దీనిపై తాము నేరుగా దర్యాప్తు చేసే అవకాశం లేదన్నారు. రన్యారావు తముకు ఏమైనా ఫిర్యాదు చేస్తే ఆమెకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు నాగలక్ష్మి,‘ మాకు ఆమె లేఖ రూపంలో ఫిర్యాదు చేస్తే మేము సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆమె నుంచి ఫిర్యాదు అందిన పక్షంలో తమ పరిధిలో ఉన్న ఆయా విభాగాలను అప్రమత్తం చేస్తాం. సరైన రీతిలో దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఆమె ఏమైనా దాడికి గురయ్యిందా అనేది ఆమె ఫిర్యాదు రూపంలో ఇస్తేనే మేము ఏమైనా చేయగలం. ఒకవేళ ఆమె మమ్మల్ని సంప్రదించకపోతే దీనిపై కనీసం కామెంట్ కూడా చేయలేం’ అని మహిళా కమిషన్ చైర్ పర్సన్ నాగలక్ష్మి పేర్కొన్నారు.కాగా, విదేశాల నుంచి బంగారు కడ్డీలను తరలిస్తూ పట్టుబడ్డ కన్నడ నటి రన్యారావు.. తాను అమాయకరాలునని అంటోంది. తాను ట్రాప్ లో పడ్డానని, కావాలని ఇలా అక్రమంగా బంగారు కడ్డీలను తరలించలేదని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్((DRI)అధికారుల ముందు బోరుమంది.తాను నేరం చేసినట్లు ఒప్పుకుంటూనే, ఇది తాను కావాల్సి చేసిన పని కాదని అధికారుల ముందు చెప్పినట్లు తెలుస్తోంది. డీఆర్ఐ అధికారుల తాజా విచారణలో తాను దుబాయ్ తో పాటు, యూరప్, అమెరికా, మిగతా మిడిల్ ఈస్ట్ దేశాలను తిరిగి వచ్చినట్లు పేర్కొంది.ప్రస్తుతం డీఆర్ఐ విచారణ ఎదుర్కొంటున్న క్రమంలో రన్యారావుకు చెందిన ఎలక్ట్రానిక్స్ పరికరాలను అధికారాలు ముందుగా సీజ్ చేశారు. మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్ తదితర వస్తువుల్ని డీఆర్ఐ అధికారులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆమెకు ఎవరితో లింకులు ఉన్నాయనే కోణాన్ని కూడా పరిశీలిస్తున్నారు. 2024 నుంచి ఆమె జరిపిన ఫైనాన్షియల్ వ్యవహారాలపై కూడా ఆరా తీస్తున్నారు. అసలు ఈ రాకెట్ వెనుక మాస్టర్ మైండ్స్ ఎవరు అనే కోణంలో ప్రధానంగా దర్యాప్తు సాగుతోంది.కాగా, గత సోమవారం 12 కేజీలకు పైగా బంగారం కడ్డీలను తన బెల్ట్ లో పెట్టుకుని దుబాయ్ నుంచి అక్రమంగా తరలిస్తూ రన్యారావు పట్టుబడిన సంగతి తెలిసిందే. బెంగూళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆమె అధికారులకు చిక్కింది. ప్రస్తుతం ఆమె మూడు రోజుల డీఆర్ఐ అధికారుల కస్టడీలో ఉంది. దీనిలో భాగంగా ఆమెను విచారిస్తున్న అధికారులు ఇందులో ‘కింగ్ పిన్’ ఎవరు అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు.రన్యారావు కేసు.. వెలుగులోకి కొత్త విషయాలు -
ఏడుగురు రాష్ట్ర సీఎంలకు స్టాలిన్ లేఖ
చెన్నై: కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్న డీలిమిటేషన్ అంశంపై తమిళనాడు ఎంకే స్టాలిన్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇది సమాఖ్య వాదంపై స్పష్టమైన దాడిగా ఆయన అభివర్ణించారు. రాష్ట్ర పరిపాలనను శిక్షించడమేనని స్టాలిన్ పేర్కొన్నారు. దీనిపై స్పష్టమైన విముఖత వ్యక్తం చేస్తున్న స్టాలిన్.. ఏడుగురు సీఎంలకు లేఖలు రాశారు. దాంతో పాటు మాజీ సీఎంలకు ఆయన లేఖలు పంపినట్లు స్టాలిన్ పేర్కొన్నారు.ఈ అంశంపై తన సోషల్ మీడియా హ్యాండిల్ ‘ ఎక్స్’ వేదికగా మండిపడ్డారు స్టాలిన్. ‘ ఇది దేశ సమాఖ్యవాదంపై దాడి. రాష్ట్రాలను శిక్షించేందుకే ఈ కార్యాచరణకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జనాభా నియంత్రణ, సుపరిపాలనపై పార్లమెంట్ లో మన గొంతు వినిపించుకుండా చేయడమే వారి లక్ష్యం. దీనికి మేం పూర్తిగా వ్యతిరేకం. ఇంత ఎంతమాత్ర సమ్మతం కాదు’ అని స్టాలిన్ పేర్కొన్నారు.ఈ డీలిమిటేషన్ అంశంపై మాట్లాడేందుకు కేరళ సీఎం పినరయి విజయన్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, పంజాబ్ సీఎం భగవత్ మాన్, ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీలకు లేఖలు రాసినట్లు స్టాలిన్ తెలిపారు. The Union Govt's plan for #Delimitation is a blatant assault on federalism, punishing States that ensured population control & good governance by stripping away our rightful voice in Parliament. We will not allow this democratic injustice!I have written to Hon'ble Chief… pic.twitter.com/1PQ1c5sU2V— M.K.Stalin (@mkstalin) March 7, 2025 -
ఆర్టీసీ బస్సు-లారీ ఢీ.. ఐదుగురు మృతి
తిరుత్తణి: తమిళనాడులోని తిరుత్తణి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు. 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. మరో 20 మందికి తీవ్రంగా గాయపడ్డారు.స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మోదీ జీ.. ఇదెక్కడి న్యాయం?: సీఎం రేవంత్
ఢిల్లీ: ఉచిత పథకాలకు సంబంధించి దేశ వ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఇండియా టుడే కాంక్లెవ్ లో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఉచిత పథకాలపై దేశ వ్యాప్త చర్చ జరగాలన్నారు. ఇక పెట్టుబడులన్నీ ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ రాష్ట్రానికి తరలించుకుపోతున్నారన్న సీఎం రేవంత్.. ఇదెక్కడి న్యాయం? అని ప్రశ్నించారు.‘నెలకు 18 వేల కోట్ల రూపాయల ఆదాయం తెలంగాణకు వస్తే...అందులో 13 వేల కోట్ల రూపాయలు జీతాలు అప్పుల చెల్లింపులకే పోతుంది. మిగిలిన 5000 కోట్ల రూపాయలలోనే అభివృద్ధి, సంక్షేమ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మౌలిక వసతుల ప్రాజెక్టులపై కనీసం 500 కోట్ల రూపాయలు కూడా మేము ఖర్చు పెట్టలేకపోతున్నాం. 1971 నాటి జనాభా లెక్కల ఆధారంగా డీ లిమిటేషన్ జరగాలి. డిలిమిటేషన్ పై చర్చ జరిపేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. హిందీని బలవంతంగా రుద్దడాన్ని మేము వ్యతిరేకిస్తాం. హైదరాబాదులో ఒలింపిక్ క్రీడలు నిర్వహించడానికి అవసరమైన మౌలిక వసతులున్నాయి’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. -
నేనేమీ ఆ మాజీ సీఎం మాదిరి కాను: మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్
ముంబై: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండేల మధ్య ‘వర్గపోరు’కు దాదాపు ఫుల్ స్టాప్ పడినట్లే కనబడుతోంది. ఇటీవల ఏక్ నాథ్ షిండే మాట్లాడుతూ.. తనను తేలిగ్గా తీసుకోవద్దని, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చిన విషయాన్ని మర్చిపోవద్దనే విషయాన్ని మరిచిపోవద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయం ఎవరికి అర్థం కావాలో వారికి అర్ధమైతే బాగుంటుందనే కూడా ఏక్ నాథ్ షిండ్ చెప్పుకొచ్చారు. తాను సీఎం ఉండగా శంకుస్థాపన చేసిన ప్రాజెక్టును ఫడ్నవీస్ ఆపేసారనే ఆరోపణల నేపథ్యంలో ఏక్ నాథ్ షిండే కాస్త ఘాటుగా స్పందించారు.అయితే దీనికి ఫడ్నవీస్ ఇంచుమించు తెరదించినట్లే కనబుడుతున్నారు. తనకెందుకు వచ్చిన గొడవో ఏమిటో అనుకున్నారో కానీ శంకుస్థాపనుల, ఆరంభించిన ఏ ప్రాజెక్టును ఆపడం లేదన్నారు ఫడ్నవీస్. గవర్నర్ కు ధన్యవాదాలు తీర్మానంలో భాగంగా మహారాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడిన ఫడ్నవీస్.. ‘ నేనేమీ మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేను కాను. తలపెట్టిన ప్రాజెక్టులను ఆపిన ఘనత ఉద్ధవ్ ది. నేను అటువంటి సీఎం ను కాను అన్ని ప్రాజెక్టులు పట్టాలెక్కుతాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. షిండే హయాంలో ఉండగా కొన్ని ప్రాజెక్టులు చేపట్టాం. అది మేమంతా(షిండే, అజిత్ పవార్) కలిసి తీసుకున్న నిర్ణయం. ఆ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లే బాధ్యత మా అందరిపైనా ఉంది’ అంటూ పేర్కొన్నారు.మాపై ప్రజలు పెద్ద బాధ్యత ఉంచారుగతేడాది మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమ మహాయుతి కూటమికి భారీ సీట్లు ఇచ్చి అధికారాన్ని ఇచ్చారన్నారు. అందుచేతు ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని, బాధ్యతను నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు వెళతామని, భవిష్యత్ తరాలకు మంచి చేయడమే తమ ముందున్న లక్ష్యమన్నారు ఫడ్నవీస్. నన్ను తేలిగ్గా తీసుకోవద్దు.. ఏక్నాథ్ షిండే స్ట్రాంగ్ వార్నింగ్ -
Nishant Tripathi : ‘భార్యకు ప్రేమతో’.. కంపెనీ సైట్లో కంటతడి పెట్టిస్తోన్న లేఖ
ముంబై : ‘ఓయ్ నిన్నే.. నీపై నాకు ప్రేమ అనంతం. నేను నీకు ప్రామీస్ చేస్తున్నా అది ఎప్పటికీ చెరిగిపోదు’ అంటూ ఓ భర్త తన భార్యపై అమితమైన ప్రేమను వ్యక్తం చేస్తూ ఓ లేఖ రాశాడు. అనంతరం, నా చావుకు నా భార్య, ఆమె అత్తే కారణమని ఆ లేఖలో రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘ఆత్మహత్యకు గల కారణాలేంటో మా అమ్మకు బాగా తెలుసు. నా మరణం తర్వాత.. మీరు (భార్యను,భార్య అత్తను ఉద్దేశిస్తూ) ఆమెను ఇబ్బంది పెట్టకండి. ఇప్పటికే ఆమె మనసు విరిగిపోయింది. ఇకనైనా ఆమెను మనశాంతిగా ఉండనివ్వండి’ అంటూ విజ్ఞప్తి చేశాడు. ముంబైలో యానిమేటర్‌గా పని చేస్తున్న నిషాంత్ త్రిపాఠి (Nishant Tripathi) గత శనివారం ముంబైలో సహారా హోటల్ (sahara hotel mumbai) రూంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే, తమ హోటల్లో రూం బుక్ చేసి మూడురోజులవుతున్నా.. ఎప్పుడు వెళ్లినా ‘డు నాట్ డిస్ట్రబ్’ అనే బోర్డ్ తగిలించే ఉంది. దీంతో సహార హోటల్ యాజమాన్యానికి అనుమానం వచ్చి నిషాంత్ త్రిపాఠి ఉన్న రూంను పరిశీలించింది. త్రిపాఠిని పిలిచే ప్రయత్నించింది. సిబ్బంది ఎంత సేపటికి పిలుస్తున్నా హోటల్ గది నుంచి ఎలాంటి స్పందన రాలేదు.ఉరికి వేలాడుతూ సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాస్టర్ కీ సాయంతో హోటల్ రూంను ఓపెన్ చేసి చూడగా ఉరికి వేలాడుతూ త్రిపాఠి కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుడి తల్లి,మహిళా హక్కుల కార్యకర్త నీలం చతుర్వేది ఫిర్యాదుతో బాధితుడి భార్య అపూర్వ పరేఖ్, భార్య అత్త ప్రార్థనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ‘భార్యకు ప్రేమతో’.. కంపెనీ సైట్లో సూసైడ్ నోట్పోలీసుల దర్యాప్తులో బాధితుడు త్రిపాఠి కంపెనీ వెబ్సైట్లో అప్లోడ్ చేసిన ఆత్మహత్య లేఖను స్వాధీనం చేసుకున్నారు. ఆ లేఖలో అతను తన భార్య పట్ల తనకున్న ప్రేమను వ్యక్తం చేశాడు. తన మరణానికి ఆమెను, ఆమె అత్తే కారణమన్నారు. అంతేకాదు, భార్యపై తనకున్న ప్రేమను వ్యక్తం చేస్తూ.. ‘నువ్వు ఈ లేఖ చదివే సమయానికి నేనుండనేమో. నా చివరి క్షణాల్లో జరిగిన ప్రతిదానికీ నేను నిన్ను ద్వేషించేవాడినే. కానీ నేను అలా చేయను. చావు ముందు క్షణం వరకు నేను ప్రేమనే ఎంచుకుంటాను. అప్పుడు..ఇప్పుడు..ఎప్పుడూ నేను నిన్నే ప్రేమిస్తుంటాను. ఇప్పుడు కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను మాటిచ్చినట్లు నీపై నా ప్రేమ ఎప్పటికీ మసకబారదు’ అని రాశాడు.నా తలకొరివి పెట్టాల్సింది పోయితన కుమారుడి మరణంపై త్రిపాఠి తల్లి నీల చతుర్వేది (neelam chaturvedi) ఫేస్బుక్ (meta)లో సుదీర్ఘంగా ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్‌లో నేను నా జీవితాన్ని మహిళల హక్కులు, లింగ సమానత్వం కోసం నా జీవితాన్ని అంకితం చేశాను. ఇప్పుడు నా జీవితం ఇప్పుడు ముగిసింది. నా కొడుకు నిషాంత్ నన్ను విడిచిపెట్టి వెళ్లిపోయాడు. నన్ను జీవత్సవాన్ని చేశాడు. నాకు అంత్యక్రియలు చేయాల్సిన కొడుక్కే ఈరోజు ఈరోజు మార్చి 2న ముంబైలో ఈకో మోక్షాలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నా. నా కుమార్తె ప్రాచి తన అన్నయ్య అంత్యక్రియలు నిర్వహించింది. ఇంతటి విషాదంలో నా కుమార్తె ప్రాచిలో ధైర్యాన్ని నూరి పోయిండి అంటూ వేడుకుంది.కాగా, భార్యల వేధింపుల కారణంగా ఆత్మహత్య కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మగవారికి అనుకూలంగా ఉండేలా చట్టాలు తేవాలనే డిమాండ్లు కొనసాగుతున్న ఆందోళనల మధ్య ఈ దుర్ఘటన జరగడంపై సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. -
నాకేమీ తెలీదు.. ట్రాప్‌లో పడ్డాను: బోరుమన్న రన్యారావు
బెంగళూరు: విదేశాల నుంచి బంగారు కడ్డీలను తరలిస్తూ పట్టుబడ్డ కన్నడ నటి రన్యారావు.. తాను అమాయకరాలునని అంటోంది. తాను ట్రాప్ లో పడ్డానని, కావాలని ఇలా అక్రమంగా బంగారు కడ్డీలను తరలించలేదని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్((DRI)అధికారుల ముందు బోరుమంది.తాను నేరం చేసినట్లు ఒప్పుకుంటూనే, ఇది తాను కావాల్సి చేసిన పని కాదని అధికారుల ముందు చెప్పినట్లు తెలుస్తోంది. డీఆర్ఐ అధికారుల తాజా విచారణలో తాను దుబాయ్ తో పాటు, యూరప్, అమెరికా, మిగతా మిడిల్ ఈస్ట్ దేశాలను తిరిగి వచ్చినట్లు పేర్కొంది.గతేడాది కూడా ఇదే తరహాలో,..ప్రస్తుత రన్యారావు కేసుకు, గతేడాది చెన్నైలో జరిగిన బంగారం స్మగ్మింగ్ కేసుకు పోలికలు ఉండటంతో ఆ కోణంలో విచారణ ఆరంభించారు అధికారులు. గత సంవత్సరం సాఫ్ట్ వేర్ ఉద్యోగి భార్య 12 కేజీల బంగారాన్ని దుబాయ్ నుంచి తరలిస్తూ అధికారులకు పట్టుబడింది. అయితే తాను ఒక ఫ్రెండ్ వలలో చిక్కుకునే బంగారం స్మగ్మింగ్ చేసినట్లు ఆమె వెల్లడించింది. ఇప్పుడు ఈ కేసును కూడా అదే కోణంలో పరిశీలిస్తున్నారు పోలీసులు. ఇందులో ఎవరు పాత్ర ఉందనే దానిపై ఆరా తీస్తున్నారు. తాను ట్రాప్ లో చిక్కుకునే ఈ కథ నడిపినట్లు ఆమె పేర్కొనడంతో దీని వెనుక ఎవరున్నారు అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.ఆమె ఎలక్ట్రానిక్ పరికరాలు సీజ్..ప్రస్తుతం డీఆర్ఐ విచారణ ఎదుర్కొంటున్న క్రమంలో రన్యారావుకు చెందిన ఎలక్ట్రానిక్స్ పరికరాలను అధికారాలు ముందుగా సీజ్ చేశారు. మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్ తదితర వస్తువుల్ని డీఆర్ఐ అధికారులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆమెకు ఎవరితో లింకులు ఉన్నాయనే కోణాన్ని కూడా పరిశీలిస్తున్నారు. 2024 నుంచి ఆమె జరిపిన ఫైనాన్షియల్ వ్యవహారాలపై కూడా ఆరా తీస్తున్నారు. అసలు ఈ రాకెట్ వెనుక మాస్టర్ మైండ్స్ ఎవరు అనే కోణంలో ప్రధానంగా దర్యాప్తు సాగుతోంది.కాగా, గత సోమవారం 12 కేజీలకు పైగా బంగారం కడ్డీలను తన బెల్ట్ లో పెట్టుకుని దుబాయ్ నుంచి అక్రమంగా తరలిస్తూ రన్యారావు పట్టుబడిన సంగతి తెలిసిందే. బెంగూళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆమె అధికారులకు చిక్కింది. ప్రస్తుతం ఆమె మూడు రోజుల డీఆర్ఐ అధికారుల కస్టడీలో ఉంది. దీనిలో భాగంగా ఆమెను విచారిస్తున్న అధికారులు ఇందులో ‘కింగ్ పిన్’ ఎవరు అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు. -
నటి రన్యా రావు కేసు.. తండ్రి కూడా 'తేడా'నే!
విదేశాల నుంచి బంగారం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డిన కన్నడ నటి రన్యా రావు (Kannada Actor Ranya Rao) కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చాన్నాళ్లుగా ఆమె ఈ దందా సాగిస్తున్నట్టుగా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బంగారం అక్రమ రవాణాలో ఆమె కేవలం పాత్రధారి మాత్రమేనని సూత్రధారులు వేరే ఉన్నారని అనుమానిస్తున్నారు. రాజకీయ నేతల హస్తం కూడా ఉండొచ్చన్న వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వ్యవహారంలో ఎవరు ఉన్నా వదిలిపెట్టబోమని కర్ణాటక ప్రభుత్వం చెబుతోంది. పోలీసుల దర్యాప్తులో ఎవరి పేర్లు వెలుగులోకి వస్తాయోనని అందరూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.సవతి తండ్రిపైనా ఆరోపణలు రన్యా రావు అరెస్ట్ ఘటనలో తనకేం సంబంధం లేదని స్పష్టంచేసిన ఆమె సవతి తండ్రి కె.రామచంద్రరావు పైనా గతంలో ఆరోపణలున్నట్లు తాజాగా మీడియాలో వార్తలొచ్చాయి. ఐపీఎస్ అధికారి (IPS Officer) అయిన రామచంద్రరావు ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(కర్ణాటక రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్)గా సేవలందిస్తున్నారు. 2014లో మైసూరు సదరన్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పదవిలో ఉన్నప్పుడు హవాలా కేసులో ఈయన పాత్ర ఉందని ఆనాడు ఆరోపణలు వచ్చాయి.మైసూరులోని యెల్వాల్ నుంచి కేరళకు వెళ్తున్న బస్సును అడ్డగించిన పోలీసులు అందులోంచి రూ.20 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలొచ్చాయి. అయితే వాస్తవానికి ఆ బస్సు నుంచి రూ.2.07 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకుని రూ.20లక్షలు మినహా మిగతా కరెన్సీ పంచుకున్నారని ఒక వ్యాపారి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఉదంతంపై కేసు నమోదైంది. బస్సు వెళ్తున్న మార్గం వివరాలను వెల్లడించిన పోలీస్ ఇన్‌ఫార్మర్లతోపాటు రామచంద్రరావు వ్యక్తిగత గన్‌మెన్‌ను అరెస్ట్‌చేశారు. దీంతో రామచంద్రరావును ఈ పోస్ట్ నుంచి తప్పించి హెడ్‌క్వార్టర్స్‌కు ట్రాన్స్ఫర్చేశారు.తర్వాత రెండేళ్లకు మరో కేసులోనూ రామచంద్రరావు పేరు ప్రముఖంగా వినిపించింది. గ్యాంగ్స్టర్లు ధర్మరాజ్, గంగాధర్‌ల నకిలీ ఎన్కౌంటర్ కేసు (Fake Encounter Case)లో రామంచంద్రరావును సీఐడీ అధికారులు ప్రశ్నించారు.చదవండి: రన్యా రావు నాలుగు నెలలుగా ఇంటికి రాలేదు రన్యా రావుకు 3 రోజుల కస్టడీకర్ణాటకలోని బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం రాత్రి రూ.12.56 కోట్ల విలువైన బంగారు కడ్డీలు తెస్తూ రన్యా రావు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఆమెను మూడు రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) చేసిన విజ్ఞప్తిని ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు శుక్రవారం అనుమతించింది. -
ట్రంప్ దెబ్బకు దిగొచ్చిన చైనా.. భారత్ వైపు చూపు
బీజింగ్: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత దిగుమతి సుంకాలను భారీగా పెంచిన సంగతి తెలిసిందే. ప్రధానంగా కెనడా, మెక్సికో ఉత్పత్తులపై 25 శాతం చొప్పున, చైనా ఉత్పత్తులపై అదనంగా 10 శాతం సుంకాలు విధించబోతున్నామని, మంగళవారం నుంచే ఇది అమల్లోకి వస్తుందని ట్రంప్ ప్రకటించారు. అమెరికాకు వస్తువులను ఎగుమతి చేసే దేశాలు సుంకాలు చెల్లించాల్సిందేనని తెలిపారు.దీనికి చైనా కూడా అంతే ఘాటుగా స్పందించింది. తమ దేశంలోకి దిగుమతి అయ్యే అమెరికా వస్తువులపై అదనంగా 15 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించింది. చికెన్, గోధుమలు, మొక్కజొన్న, పత్తి తదితర దిగుమతులపై ఈ టారిఫ్ వసూలు చేస్తామని, అలాగే జొన్న, సోయాబిన్, పోర్క్, బీఫ్, సముద్ర ఉత్పత్తులు, పండ్లు, కూరగాయాలు, పాడి ఉత్పత్తులపై అదనంగా 10 శాతం సుంకాలు విధించనున్నట్లు వెల్లడించింది.అయితే చైనా ప్రస్తుత చూపులు భారత్ వైపు పడ్డాయి. భారత్ తో గతంలో ఉన్న విరోధాన్ని పూర్తిగా పక్కన పెట్టేందుకు సిద్ధమైంది చైనా. భారత్ తో శత్రుత్వం కంటే మిత్రత్వమే మేలనే భావనకు వచ్చింది చైనా.-భారత్ తో కలిసి పని చేయాలని చూస్తోంది., ఈ మేరకు ఇప్పటికి ఓ మెట్టు దిగి భారత్ సహకారం కావాలంటోంది డ్రాగన్.ఇద్దరం కలిసి పని చేద్దాం: చైనా విదేశాంగ మంత్రిభారత్ తో కలిసి పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి స్పష్టం చేశారు. ఒకరిని ఒకరు కించ పరుచుకోవడం కంటే కలిసి పని చేస్తే అద్భుతాలు స్పష్టించవచ్చాన్నారు వాంగ్ యి. ఆ దేశ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ మీట్ తర్వాత వాంగ్ యి మాట్లాడుతూ.. ‘ ఢిల్లీ, బీజింగ్ కలిసే పని చేసే సమయం ఆసన్నమైంది. డ్రాగన్, ఎలిఫెంట్ డ్యాన్స్ కలిసి చేస్తే బాగుంటుంది. ఇరుదేశాలు ఒకరికొకరు సహకరించుకోవాల్సిన అవసరం ఉంది. సహకారంతో పోయేదేమీ ఉండదు. సహకారం ఇచ్చి పుచ్చుకుంటే మరింత బలోపేతం అవుతాం. ఇది దేశ ప్రజలకు, దేశాలకు మంచిది’ అని పేర్కొన్నారు.ఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగిన టీ20 విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్ తో వాంగ్ యి భేటీ అయ్యారు. అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 2020లో గల్వాన్ ఘటన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అప్పట్నుంచి నిన్న మొన్నటి వరకూ ఇరు దేశాలు పెద్దగా సమావేశం అయ్యింది కూడా తక్కువే. ఆపై 2024లో ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భేటీ తరువాత .ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కాస్త చల్లబడింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఉన్న చోట నుంచి ఇరు దేశాలు తమ బలగాలను వెనక్కి పిలపించడంతో అప్పట్నుంచీ సామరస్య వాతావరణం కనిపిస్తోంది. -
మరాఠీయే ముంబై భాష
ముంబై: ముంబైలో మరాఠీ భాష తప్పనిసరేం కాదన్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) నాయకుడు సురేష్ భయ్యాజీ జోషి వ్యాఖ్యలపై ప్రతిపక్ష ఎంవీయే కూటమి మండిపడింది. మరాఠీ ముంబై భాష అంటూ గురువారం దక్షిణ ముంబైలోని హుతాత్మ చౌక్ వద్ద నిరసన నిర్వహించింది. ఈ నిరసనలో శివసేన (యూఈటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, కాంగ్రెస్ నాయకులు విజయ్ వడేట్టివార్, భాయ్ జగ్తాప్, నితిన్ రౌత్ మరియు ఎన్సీపీ(ఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ సహా పలువురు ఎంవీయే కూటమి నాయకులు పాల్గొన్నారు. అమరవీరుల స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి, మరాఠీ ముంబై భాష అని నొక్కి చెబుతూ నినాదాలు చేశారు. బుధవారం ఘట్కోపర్లో జరిగిన ఒక కార్యక్రమంలో జోషి మాట్లాడుతూ.... ‘ముంబైకి ఒకే భాష అంటూ ఏమీ లేదు. ముంబైలోని ప్రతి ప్రాంతానికి భాష మారుతూ ఉంటుంది. ఉదాహరణకు ఘట్కోపర్లో గుజరాతీ ఎక్కువగా మాట్లాడతారు. కాబట్టి మీరు ముంబైలో నివసిస్తున్నంత మాత్రాన మరాఠీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు‘ అన్నారు. దీనిపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రతిపక్షాలు కూటమి అగ్రనేతలతో కలిసి నిరసన చేపట్టారు నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు...జోషి తన వ్యాఖ్యలపై ప్రతిపక్షాల విమర్శలకు బదులుగా జోషి‘వారు నా వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకున్నారు. మరాఠీ మహారాష్ట్ర భాష, ముంబై భాష కూడా. ఈ విషయంలో ద్వంద అభిప్రాయాలేమీ లేవు. అనేక భాషలు మాట్లాడే ప్రజలు ముంబైలో సామరస్యంగా జీవిస్తారు.మరాఠీ నా మాతృభాష. అందుకు నేను గర్విస్తున్నాను. బయటిప్రాంతాల ప్రజలు కూడా మరాఠీని అర్థంచేసుకోవాలన్నదే నా అభిప్రాయం.’అని ముక్తాయించారు. ఎంవీయే అగ్రనేతలు -
LKG విద్యార్థి Phd హోల్డర్‌కు ఉపన్యాసం ఇచ్చినట్టుంది: కేంద్రంపై స్టాలిన్ సెటైర్లు
సాక్షి, చెన్నై: తమిళనాడులో హిందీ(Hindi) భాష విషయమై రాజకీయం పీక్ స్టేజ్‌కు చేరుకుంది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్((MK Stalin), కేంద్రమంత్రుల మధ్య విమర్శలు చోటుచేసుకుంటున్నాయి. స్టాలిన్ వ్యాఖ్యలకు తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కౌంటరిచ్చారు. తమిళ భాషకు కేంద్రం తగిన గుర్తింపు ఇస్తుందన్నారు. తమిళం విషయంలో స్టాలిన్ రాజకీయం సరికాదన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తమిళనాడు(Tamil Nadu)లోని రాణిపేటలో పర్యటిస్తున్నారు. శుక్రవారం సీఐఎస్ఎఫ్ కార్యక్రమానికి అమిత్ షా హాజరయ్యారు. ఈ సందర్బంగా అమిత్ షా మాట్లాడుతూ..‘ఇంజనీరింగ్, మెడికల్ విభాగాల్లో ఉన్నత విద్య కోసం తమిళ భాషలోనే సిలబస్ తీసుకొస్తాం. వీలైనంత త్వరగా చర్యలు చేపడతాం. తమిళ భాష అభివృద్ధి, సంస్కృతికి కట్టుబడి ఉన్నాం. దేశంలో ప్రాంతీయ భాషలు అన్నింటినీ గౌరవిస్తాం. ఇప్పటివరకు సీఏపీఎఫ్(CAPF) నియామకంలో మాతృభాషకు స్థానం లేదు. ఈ నేపథ్యంలో యువతకు నష్టం జరుగుతోందని ప్రధాని మోదీ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నారు. అన్ని భాషలతో పాటు తమిళంలో కూడా సీఏపీఎఫ్ పరీక్షలు నిర్వహించాలని మోదీ నిర్ణయించారు. ఇప్పటికైనా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను సీఎం స్టాలిన్ మానుకోవాలి’ అని కామెంట్స్ చేశారు.#WATCH | Arakkonam, Tamil Nadu: Union Home Minister Amit Shah says, "... Till now, there was no place for mother tongue in the CAPF recruitment... PM Narendra Modi decided that our youth will now be able to write their CAPF exam in all languages in the eight list, including… pic.twitter.com/Q8pXv1IzZ4— ANI (@ANI) March 7, 2025అంతకుముందు, కేంద్రంపై సీఎం స్టాలిన్ విరుచుకుపడ్డారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై ఆయన విమర్శలు చేశారు. స్టాలిన్ ట్విట్టర్ వేదికగా..‘విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎప్పటికీ గెలవని యుద్ధం మొదలుపెట్టారు. చెట్టు ప్రశాంతంగా ఉండాలని అనుకున్నా.. గాలి రాకుండా మాత్రం ఉండదు కదా!. అలాగే.. భాష విషయంలో ఆయన మమ్మల్ని రెచ్చగొడుతున్నారు. అందుకే ఆయనకు వరుసగా లేఖలు రాస్తున్నాం. ఎన్ఈపీని తిరస్కరిస్తున్న తమిళనాడు.. ఇప్పటికే విద్యావిధానంలో అనేక లక్ష్యాలను సాధించింది.త్రిభాష విషయంలో.. ఎల్కేజీ విద్యార్థి పీహెచ్డీ హోల్డర్‌కి ఉపన్యాసం ఇచ్చినట్లు ఉంది ఆయన తీరు. మేం ఢిల్లీ ఆదేశాలను తీసుకోం. త్రిభాషా విధానంపై బీజేపీ సర్కారు చేస్తున్న సంతకాల ప్రచారం హాస్యాస్పదంగా ఉంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అంశాన్నే ప్రధాన అజెండాగా చేసుకొని బరిలో దిగాలని సవాల్ విసురుతున్నా. పథకాల దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఇచ్చే అవార్డుల వరకు అన్నింటికీ హిందీ పేర్లను పెట్టారు. దేశంలో అధికంగా ఉన్న హిందీయేతర ప్రజలను ఇది ఉక్కిరిబిక్కిరి చేస్తుంది’ అని స్టాలిన్ చెప్పుకొచ్చారు. 🎯 "The tree may prefer calm, but the wind will not subside." It was the Union Education Minister who provoked us to write this series of letters when we were simply doing our job. He forgot his place and dared to threaten an entire state to accept #HindiImposition, and now he… pic.twitter.com/pePfCnk8BS— M.K.Stalin (@mkstalin) March 7, 2025 -
చెల్లెలితో అన్న శారీరక సంబంధం
యశవంతపుర(కర్ణాటక): చెల్లెలితో అన్న శారీరకంగా కలవటంతో( sister) బిడ్డకు జన్మనిచ్చిన ఘటన ఉత్తర కన్నడ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ముండగోడ తాలూకా కుందర్గి గ్రామంలో ఈ ఘటన జరిగింది. అదే గ్రామానికి చెందిన 19 సంవత్సరాల వయసున్న యువకుడు 10వ తరగతి చదువుతున్న చెల్లెలు యల్లాపురలోని బంధువుల ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో యువకుడు తన చెల్లిని రెచ్చగొట్టి శారీరకంగా కలిసినట్లు పోలీసు విచారణలో బయట పడింది. అన్నతో 9 నెలల క్రితం శారీరకంగా కలిసినట్లు బాధితురాలు వైద్యులకు సమాచారం ఇచ్చింది. బడికి వెళుతున్న కూతురు ఒక్కసారిగా ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. జన్మనిచ్చిన శిశువులో ఆరోగ్య సమస్యలు ఉన్న కారణంగా మెరుగైన చికిత్స కోసం కారవార జిల్లా ఆస్పత్రికి తరలించారు. 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యయశవంతపుర: పదో తరగతి చదువుతున్న విద్యార్థిని అత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తరకన్నడ జిల్లా కారవారలో జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతూ బాలికల హాస్టల్లో ఉంటున్న విద్యార్థిని అక్కడే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తండ్రి లేని కారణంగా బాలిక బాలమందిరంలో చదువుకుంటోంది. ఆమె గదిలో ఒక్కరే ఉన్నప్పుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలాన్ని కారవార పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. -
డబ్బు ఇస్తేనే తల్లికి అంత్యక్రియలు
బెంగళూరు: తల్లి చనిపోయిందనే బాధ కూడా వారికి లేదు. తమ వాటా డబ్బు ఇస్తేనే అంత్యక్రియలకు అంగీకరిస్తామని కర్కోటక కుమారులు అమానుషంగా వ్యవహరించారు. దీంతో మృతురాలి కుమార్తెల బిడ్డలు తమ అవ్వ మృతదేహాన్ని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. తహసీల్దార్ జోక్యంతో అంత్యక్రియలు జరిగాయి. ఈ ఉదంతం చిక్కబళ్లాపురం జిల్లా గౌరిబిదనూరు తాలూకాలోని దొడ్డకురుగోడులో జరిగింది. గ్రామానికి చెందిన అనంతక్కకు నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు.భర్త మృతితో అనంతక్క మధుగిరి తాలూకా కడగత్తూరులో ఉన్న కుమార్తెల వద్ద ఉంటోంది. భర్తద్వారా ఆమెకు సంక్రమించిన భూమిని ప్రభుత్వం పరిశ్రమల కోసం సేకరించి రూ.93 లక్షలు అందజేసింది. ఆ మొత్తంలో 40 లక్షలు కుమార్తెలు తీసుకున్నారు. ఈక్రమంలో వృద్ధాప్యం కారణంగా అనంతక్క మంగళవారం తన కుమార్తె ఇంటిలోనే మృతి చెందింది. భర్త సమాధి పక్కనే తనను ఖననం చేయాలని అనంతక్క గతంలోనే కుమార్తెకు తెలియజేసింది.దీంతో మృతదేహాన్ని దొడ్డకురుగోడుకు తీసుకురాగా కుమారులు అడ్డుకున్నారు. తల్లి నుంచి కుమార్తెలు తీసుకున్న రూ.40లక్షలు తిరిగి ఇస్తేనే అంత్యక్రియలకు సహకరిస్తామని మొండికేశారు. దీంతో అనంతక్క మృతదేహాన్ని కుమార్తెలు, మనువరాండ్రు పోలీస్‌స్టేషన్ వద్దకు తీసుకెళ్లారు. రాత్రంతా మృతదేహం అక్కడే ఉంది. బుధవారం ఉదయం తహసీల్దార్ మహేపత్రి స్పందించి అనంతక్క కుమారులను పిలిపించి సర్ది చెప్పారు. అనంతరం మృతదేహాన్ని దొడ్డకురుగోడుకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. -
రన్యారావ్ పాత్రధారి మాత్రమే
బనశంకరి: బంగారం అక్రమ రవాణా కేసులో పట్టుబడిన నటి రన్యారావ్ కేసు కీలక మలుపు తిరిగింది. కిలో బంగారం రవాణాకు రన్యారావ్‌కు రూ.5 లక్షల కమీషన్ అందిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నటి పాత్రధారి కాగా అసలైన సూత్రధారి వేరే వ్యక్తి అని తెలిసింది. నటి రన్యారావ్‌ను డీఆర్ఏ అధికారులు తీవ్ర విచారణ చేపట్టగా నేను పాత్రధారి మాత్రమే అని, అసలు వ్యక్తి వేరేవారని తెలిపింది. రూ.17 కోట్లు విలువ చేసే బంగారం కొనుగోలు చేసే శ్రీమంతురాలు కాదు. ఈమె సీనియర్ పోలీస్ అధికారి పెంపుడు కూతురు కావడంతో ఆమెను ఈ దందాకు వాడుకుంటే చాలా సులభంగా బంగారం రవాణా చేయవచ్చనే అంచనాతో నటి రన్యారావ్‌ను బంగారం రవాణాకు వాడుకున్నారు. అక్రమ బంగారం రవాణాలో విమానాశ్రయంలోని కొందరు అధికారులు కూడా కుమ్మక్కైనట్లు అనుమానం వ్యక్తమైంది.డీఆర్ఐ అధికారులు ఈ కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు. బంగారం రవాణాలో రన్యారావ్‌కు రూ.4 లక్ష లనుంచి రూ.5 లక్షలు కమీషన్ ఇస్తున్నట్లు తెలిసింది. రన్యారావ్ బెంగళూరుకు తీసుకువచ్చిన బంగారం ఎవరికి ఇస్తుంది అనేదానిపై అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. గత రెండేళ్లుగా రన్యారావ్ వాడుతున్న బ్యాంక్ అకౌంట్ మొబైల్‌ను అదికారులు స్వా«దీనం చేసుకున్నారు. డీఆర్ఐ అధికారులు అసలు సూత్రధారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. వీడియో: కర్ణాటకలో దారుణం.. పెళ్లి పేరుతో మైనర్‌ను బలవంతంగా లాక్కెళ్లి.. -
‘మా ప్రేమ కథకు కొనసాగింపు’.. తల్లిదండ్రులు కాబోతున్న క్రీడా జంట
భారత మాజీ రెజ్లర్ వినేశ్ ఫొగట్(Vinesh Phogat) శుభవార్త చెప్పింది. తాను తల్లి కాబోతున్నట్లు వెల్లడించింది. భర్త సోమ్‌వీర్ రాఠీ(Somvir Rathee)తో కలిసి తొలి బిడ్డకు స్వాగతం పలుకబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ‘‘మా ప్రేమ కథకు కొనసాగింపు.. సరికొత్త అధ్యాయంతో మొదలు’’ అంటూ చిన్నారి పాదం, లవ్ ఎమోజీలను షేర్ చేస్తూ ఈ క్రీడాకారుల జంట తమ సంతోషాన్ని అభిమానులతో పంచుకుంది.కాగా భారత స్టార్ రెజ్లర్‌గా పేరొందిన వినేశ్ ఫొగట్ గతేడాది పతాక శీర్షికల్లో నిలిచింది. ప్యారిస్ ఒలింపిక్స్-2024 ఫైనల్‌కు చేరుకున్న ఈ హర్యానా అథ్లెట్‌పై అనూహ్య రీతిలో ఆఖరి నిమిషంలో వేటు పడింది. నిర్ణీత బరువు కంటే వంద గ్రాములు అదనంగా ఉన్నందు వల్ల ఆమెను అనర్హురాలిగా తేల్చారు. దీంతో.. రెజ్లింగ్‌లో భారత్‌కు తొలి స్వర్ణం వస్తుందన్న ఆశలు ఆవిరి కాగా.. దేశవ్యాప్తంగా యూడబ్ల్యూడబ్ల్యూ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.అనర్హత వేటు ఎదుర్కోవాల్సిందేనన్న స్పోర్ట్స్ కోర్టుభారత ఒలింపిక్ సంఘం(IOA), అధికారుల తీరుపైనా ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఐఓఏ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (సీఏఎస్)లో అప్పీలు చేయగా నిరాశే ఎదురైంది. ‘‘అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే క్రీడాకారులు నిబంధనలను పూర్తిగా తెలుసుకోవాలి’’ అంటూ వినేశ్ అభ్యర్థనను కొట్టిపారేసింది.‘క్రీడాకారులకు నిబంధనలపై పూర్తి అవగాహన ఉండాలి. బరిలోకి దిగే బరువు కేటగిరీ కంటే ఎక్కువ ఉంటే అనుమతించరు. అది అందరికీ వర్తిస్తుంది. ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవు. నిర్ణీత బరువు కంటే ఒక్క గ్రాము ఎక్కువ ఉన్న అనర్హత వేటు ఎదుర్కోవాల్సిందే’’ అని సీఏఎస్ స్పష్టం చేసింది.ఈ క్రమంలో తొలి రోజు పోటీల్లో నిర్ణీత బరువుతోనే పోటీపడి విజయాలు సాధించినందుకుగానూ... గుజ్మన్ లోపెజ్‌తో కలిపి తనకూ రజతం ఇవ్వాలని వినేశ్ న్యాయపోరాటం చేసినా సానుకూల ఫలితం రాలేదు. దీంతో మహిళల 50 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో సంచలన విజయాలు సాధించినా వినేశ్ పతకం లేకుండానే దేశానికి తిరిగి వచ్చింది. రాజకీయాల్లోకికాగా ప్యారిస్ ఒలింపిక్స్‌లో దిగ్గజ రెజ్లర్ యూ సుసూకీపై వినేశ్ సాధించిన విజయం చిరస్మరణీయంగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. అంతేకాదు.. ఒలింపిక్స్ ఫైనల్‌కు చేరిన తొలి మహిళా రెజ్లర్‌గా చరిత్ర పుటల్లో ఆమె పేరు అజరామరంగా ఉంటుంది.అతడే ఆమెకు సర్వస్వంఇక ఈ తీవ్ర నిరాశ అనంతరం.. కుస్తీకి స్వస్తి చెప్పిన వినేశ్ ఫొగట్ రాజకీయాల్లో ప్రవేశించింది. కాంగ్రెస్ పార్టీలో చేరి హర్యానాలోని ఝులన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైంది. కాగా వినేశ్ భర్త సోమ్‌వీర్ కూడా రెజ్లరే. హర్యానాకు చెందిన అతడు.. జాతీయ స్థాయిలో పతకాలు గెలుచుకున్నాడు. వినేశ్, సోమ్‌వీర్ రాఠీ రైల్వేలో ఉద్యోగం చేస్తున్న సమయంలో ప్రేమలో పడ్డారు.అయితే, వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా అనుకున్న లక్ష్యాలు చేరుకునే క్రమంలో వినేశ్‌కు సోమ్‌వీర్ అన్నిరకాలుగా అండగా నిలిచాడు. ఈ క్రమంలో పెళ్లి బంధంతో ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్న ఈ క్రీడా జంట 2018లో వివాహం చేసుకున్నారు. ‘బేటీ బచావో.. బేటీ పడావో.. బేటీ ఖిలావో’ అంటూ సప్తపదికి మరో అడుగును జతచేసి పెళ్లినాడు ఎనిమిది అడుగులు వేశారు.సంబంధిత వార్త : తను లేకుంటే నేను లేను.. వినేశ్‌కు అతడే కొండంత అండ -
వీడియో: కర్ణాటకలో దారుణం.. పెళ్లి పేరుతో మైనర్‌ను బలవంతంగా లాక్కెళ్లి..
బెంగళూరు: మన దేశంలో బాల్య వివాహాలపై ఎన్ని చట్టాల తెస్తున్నా ఎక్కడో ఒక చోట మైనర్లకు బలవంతపు పెళ్లిళ్లు చేస్తూనే ఉన్నారు. మైనర్లకు ఇష్టం లేని పెళ్లిళ్లు చేసి వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే కర్ణాటకలో చోటుచేసుకుంది. ఓ 14 ఏళ్ల బాలికకు పెళ్లి చేసి, ఆమెను బలవంతంగా కాపురానికి పంపే ప్రయత్నంలో ఒక పశువును లాక్కెళ్లినట్లు లాక్కెళ్లారు. భార్యను ఆమెను ఎత్తుకుని పరుగు తీశాడు. దీంతో, అక్కడున్న వారు.. ఆమెను కిడ్నాప్ చేశారని అనుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల ప్రకారం..తమిళనాడులోని హోసూర్ సమీపంలోని తొట్టమంజు పర్వత ప్రాంతంలోని తిమ్మత్తూర్ అనే చిన్న గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలిక.. స్థానిక పాఠశాలలో ఏడో తరగతి వరకు చదివి, ఆ తర్వాతి ఇంటి వద్దే ఉంటోంది. ఈ క్రమంలో ఆమెకు పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు భావించి.. కర్ణాటకలోని కాలికుట్టై పర్వత గ్రామానికి చెందిన మాదేష్(29)తో వివాహం జరిపించారు. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని ఎంత చెప్పినా తల్లిదండ్రులు పట్టించుకోలేదు. ఇక, ఇటీవలే వీరి వివాహం బెంగళూరులో జరిగింది. అనంతరం, సదరు బాలిక తన స్వగ్రామానికి వచ్చేసింది. ఈ క్రమంలో అత్తారింటికి వెళ్లేందుకు నిరాకరించింది."என்னை விடுங்க.." உயிரை வெறுத்து கதறிய சிறுமி.. குண்டுக்கட்டாக தூக்கி சென்ற இளைஞர் - ஷாக்கிங் வீடியோ#childmarriage #hosur #thanthitv pic.twitter.com/lheSh1UjZ8— Thanthi TV (@ThanthiTV) March 6, 2025అయితే, పెళ్లి తర్వాత అత్తారింటికి వెళ్లాలని పేరెంట్స్.. ఆమెకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఆమె వినలేదు. దీంతో, భర్త మాదేష్, అతడి కుటుంబ సభ్యులు బాలిక ఇంటి వచ్చారు. బలవంతంగా ఆమెను తమ ఇంటికి తీసుకెళ్లారు. ఓ గొర్రె పిల్లను బలవంతంగా బలికి తీసుకెళ్లినట్లు ఎత్తుకెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఆమె కేకలు వేస్తూ కన్నీరు పెట్టుకుంది. ఈ దృశ్యాలను కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. మరికొందరు ఆమెకు కిడ్నాప్ చేస్తున్నారని అనుకున్నారు. ఈ వీడియో పోలీసులకు చేరడంతో వారిపై పోక్సో చట్టం, బాల్య వివాహ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇక, బాధితురాలు ప్రస్తుతం తన అమ్మమ్మ ఇంట్లో ఉంటోంది. -
జుట్టు దొంగలు
బెంగళూరు: రాత్రిళ్లు వజ్రాభరణాల దుకాణాలు, ఏటీఎంలను కొల్లగొట్టి దొంగలు కోట్ల విలువైన నగదు, బంగారాన్ని కొట్టేసే ఘటనలు రోజు ఏదో ఒక రాష్ట్రంలో చూస్తున్నే ఉన్నాం. కానీ ఈసారి కొందరు దొంగలు తమ చోరకళలో వైవిధ్యం ప్రదర్శించారు. బంగారం కొట్టేస్తే దానిని నగదుగా, ఒక వేళ నగదును కొట్టేస్తే నేరుగా వాడుకునే వెసులుబాటు దొంగలకు ఉంది. కానీ చోరీ చేసిన దానిని వెంటనే నగదుగా వాడుకునే అవకాశం లేకపోయినా సరే కొందరు దొంగలు జుట్టుపై కన్నేశారు. జుట్టుపై అంటే వ్యక్తుల తలపై ఉండే జుట్టుపై కాదు. అప్పటికే మొక్కు రూపంలోనో, మరేదైనా కారణంగానో తలనీలాలను కత్తిరించగా వాటిని సేకరించిన ఓ వ్యాపారి తన గిడ్డంగిలో భద్రపరిచగా దానిని దొంగలు చోరీచేసి ఎత్తుకుపోయారు. కిలోల కొద్దీ జుట్టును చోరశిఖామణులు కొట్టేసిన ఘటన కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది. దాదాపు రూ.90 లక్షల నుంచి రూ.1 కోటి విలువైన జుట్టును కొట్టేసిన వార్త తెలిసి ఆ గోడౌన్ యజమాని లబోదిబోమని ఏడ్వడంతో జుట్టు దోపిడీ వార్త ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చోరీ విషయం తెల్సి పోలీసులు భారతీయ న్యాయసంహిత చట్టాల కింద కేసు నమోదుచేసి దర్యాప్తు మొదలెట్టారు. తెలిసిన వ్యక్తుల పనేనా? కోటి విలువైన సరుకు ఉందన్న పక్కా సమాచారంతోనే దొంగలు చోరీకి తెగబడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల చైనా నుంచి వచి్చన ఒక వ్యాపారి ఈ జుట్టును సరిచూసుకుని మార్కింగ్ వేసి మరీ వెళ్లారని యజమాని వెంకటస్వామి పోలీసులకు చెప్పారు. ఫిబ్రవరి 28 అర్ధరాత్రి పెద్దకారులో వచ్చిన ఆరుగురు దొంగలు వెంట తెచ్చుకున్న ఇనుపరాడ్లతో గోడౌన్ షట్టర్‌ను పగలగొట్టి తెరచి 27 సంచులను ఒక్కోటి ఎత్తుకెళ్లడం మొదలెట్టారు. ఇది గమనించిన సమీపంలోని ఓ వ్యక్తి ఆరాతీయగా ‘‘ఈ సరుకుంతా మాదే. వేరే చోటుకు తరలిస్తున్నాం’’అని దొంగలు తెలుగులో ఏమాత్రం అనుమానంరాని రీతిలో అతనికి చెప్పారని పోలీసులు తెలిపారు. హడావిడిగా కారులోకి ఎక్కించడం, జుట్టు రోడ్డపై చెల్లాచెదురుగా పడటం గమనించిన మరో వ్యక్తి వెంటనే హెల్ప్‌లైన్ 112కు ఫోన్‌చేసి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకోగా అప్పటికే దొంగలు ఉడాయించారు. లక్ష్మీపుర క్రాస్ ప్రాంతంలో కేశాల వ్యాపారులు ఎక్కువ. ఈ సరకు విషయం తెల్సిన వ్యక్తులే ఈ దొంగతనం చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అంతర్రాష్ట కేశాల వ్యాపారంలో ఉన్న వ్యక్తుల హస్తం ఈ చోరీలో ఉండొచ్చనే అనుమానాలు పోలీసులు వ్యక్తంచేశారు. 850 కేజీల జుట్టు ఉత్తర బెంగళూరు ప్రాంతానికి చెందిన 73 ఏళ్ల కె.వెంకటస్వామి అనే వ్యాపా రి తన గోడౌన్‌ను హెబ్బళ్ ప్రాంతం నుంచి లక్ష్మీపుర క్రాస్ అనే ప్రాంతానికి ఫి బ్రవరి 12వ తేదీన మార్చారు. ఇతను కే శాల వ్యాపారం చేస్తుంటారు. కడప, శ్రీ కాకుళం ఇలా ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లాల్లో ఊరూరు తిరిగి జనం దగ్గర జుట్టును కొందరు వ్యక్తులు డబ్బులకు సేకరించిన ఏజెంట్లకు విక్రయిస్తారు. ఆ ఏజెంట్లను జుట్టును వెంకటస్వామి వంటి వ్యాపారులకు విక్రయిస్తారు. అలా తన వద్దకు వచి్చన జుట్టును వెంకటస్వామి హైదరాబాద్‌లోని ఒక వ్యాపారికి విక్రయిస్తారు. ఆ వ్యాపారి బర్మాకు ఎగు మతి చేస్తారు. అది ఆ తర్వాత చైనాకు తరలిపోతుంది. అక్కడ అత్యంత నాణ్యమైన విగ్గులను తయారుచేస్తారు. భారతీయుల జుట్టుతో తయారైన విగ్గులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. అంతటి విలువైన 850 కేజీల జుట్టును ఏజెంట్ల నుంచి కొనుగోలు చేసి వెంకటస్వామి తన గోడౌన్లో 27 సంచుల్లో భద్రపరిచారు. -
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జైమాల్యా బాగ్చీ
న్యూఢిల్లీ: కలకత్తా హైకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ జైమాల్యా బాగ్చీని సుప్రీంకోర్టు న్యాయ మూర్తిగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం గురు వారం కేంద్ర ప్రభు త్వానికి సిఫార్సు చేసింది. 2013 జూలై 18న జస్టిస్ అల్తమస్ కబీర్ పదవీ విరమణ చేసిన చేసిన తర్వాత కలకత్తా హైకోర్టు నుంచి ఏ న్యాయమూర్తి కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందలేదు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం ప్రత్యేకంగా ప్రస్తావించింది. కొలీజియం సిఫా ర్సును కేంద్రం ఆమోదిస్తే జస్టిస్ జైమాల్యా బాగ్చీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితు లవుతారు. ఆయన పదవీకాలం ఆరేళ్లకుపైగా ఉన్నందున సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందే అవకాశం ఉంది. -
16 ఏళ్లు రిలేషన్లో ఉండి రేప్ అంటే ఎలా?
న్యూఢిల్లీ: ఏకంగా 16 సంవత్సరాలు ఒక వ్యక్తితో సంబంధం నెరిపి ఇప్పుడు రేప్ కేసు పెడితే ఎలా? అని సుప్రీంకోర్టు ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై అభ్యంతరం వ్యక్తంచేసింది. పెళ్లిచేసుకుంటానని నమ్మించి రేప్ చేశాడని ఒక మహిళ దాఖలుచేసిన పిటిషన్‌ను జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టేసింది. మహిళ చేసిన ఆరోపణల్లో నిజం లేదని కోర్టు అభిప్రాయపడింది.‘‘ పెళ్లిచేసుకుంటానని చెప్పి మోసం చేసి సంబంధం పెట్టుకుంటే దానిని రేప్‌గా భావించలేం. మహిళ సమ్మతి లేదని నిరూపణ అయితేనే రేప్‌గా పరిగణిస్తాం. ఈ కేసులో సమ్మతి లేదు అని చెప్పలేం. ఎందుకంటే ఉన్నత విద్యార్హతలున్న, పరిణతి సాధించిన చదువుకున్న మహిళ.. ఒక వ్యక్తి పెళ్లిచేసుకుంటానని నమ్మిస్తే 16 ఏళ్లపాటు అతడిని అలాగే నమ్మడం అనేది అసంభవం. 16 ఏళ్లపాటు తనపై లైంగికదాడిని ఆ మహిళ భరించిందంటే నమ్మశక్యంగా లేదు. సుదీర్ఘకాలాన్ని చూస్తుంటే లైంగిక సంబంధం అనేది పరస్పర సమ్మతితో కొనసాగినట్లు స్పష్టమవుతోంది. ఇన్నేళ్ల శారీరక సంబంధం తర్వాత ఇప్పుడొచ్చి అత్యాచారం చేశాడంటూ కేసు పెట్టడం సరికాదు. 16 ఏళ్ల కాలం అనేది ‘బలవంతంగా లైంగిక దోపిడీచేశాడు. శారీరక సంబంధం కోసం వంచించాడు’ అనే వాదనలను బలం చేకూర్చడంలేదు. పెళ్లిచేసుకుంటానని అతను మాటిస్తే ఇన్నేళ్లలో ఆమెకు ఒక్కసారైనా అనుమానంరాకపోవడం విచిత్రం. అతను వేరే మహిళను పెళ్లిచేసుకున్న తర్వాతే ఈ మహిళ తొలిసారిగా పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఈ 16 సంవత్సరాల్లో వీళ్లు ఒకే చోట సహజీవనం చేశారు. ఈ కేసు పూర్తిగా ప్రేమ/సహజీవనానికి సంబంధించిన అంశం. ఇందులో అత్యాచారం అనే కోణానికి తావులేదు. మహిళ చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చే సాక్ష్యాధారాలు లేవు. ఇలాంటి సందర్భంలో ఇంకా అతనిపై నేర విచారణ కొనసాగించడం చట్టప్రకారం సబబు కాదు’’ అంటూ సుప్రీంకోర్టు ఈ కేసును కొట్టేసింది. 2006లో ఒకరోజు రాత్రి ఇంట్లో చొరబడి రేప్ చేశాడని, తర్వాత పెళ్లిచేసుకుంటానని ఇన్నేళ్లు మోసంచేశాడని సంబంధిత మహిళ 16 సంవత్సరాల తర్వాత 2022లో ఫిర్యాదుచేసింది. దీంతో అదే ఏడాది ఎఫ్ఐఆర్ నమోదుచేసి కేసు విచారణ ప్రారంభించారు. ఈ కేసులో హైకోర్టులోనూ తనకు వ్యతిరేకంగా తీర్పురావడంతో ఆ వ్యక్తి చివరకు సుప్రీంకోర్టును ఆశ్రయించగా చిట్టచివరకు అతనికి అనుకూలంగా తీర్పు వచ్చింది. మార్చి మూడో తేదీనాటి ఈ కేసు తీర్పు వివరాలు గురువారం బహిర్గతమయ్యాయి. -
గంగా మాత ఆశీస్సులతో దేశ సేవ: ప్రధాని మోదీ
హర్సిల్/న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో పర్యాటక రంగ అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఇక్కడ ఏదో ఒక సీజన్‌కు పరిమితం కాకుండా ఏడాది పొడవునా పర్యాటకులను ఆకర్శించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మంచు కొండలు, ప్రకృతి రమణీయతతో కూడిన సుందరమైన రాష్ట్రం ఉత్తరాఖండ్‌లో ఆఫ్–సీజన్ అనేదే ఉండకూడదని పేర్కొన్నారు. పర్యాటర రంగాన్ని అభివృద్ధి చేసుకుంటే స్థానికులకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయని, తద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ గురువారం ఉత్తరాఖండ్‌లో పర్యటించారు. ఉత్తరకాశీ జిల్లాలోని ముఖ్వా గ్రామంలో గంగా మాత ఆలయాన్ని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. తనను గంగా మాత దత్తత తీసుకున్నట్లు భావిస్తున్నానని, ఆ తల్లి ఆశీస్సులే తనను కాశీ(వారణాసి)కి తీసుకెళ్లాయని, దేశ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాయని వ్యాఖ్యానించారు. అనంతరం హర్సిల్ గ్రామంలో బహిరంగ సభలో నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఉత్తరాఖండ్‌లో శీతాకాలంలో పర్యటిస్తే చక్కటి అనుభూతి లభిస్తుందని అన్నారు. దేశమంతా పొగమంచుతో కప్పబడి ఉన్న సమయంలో ఉత్తరాఖండ్ మాత్రం సూర్యకాంతిలో స్నానమాడుతూ కనిపిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 12 నెలల టూ రిజం విజన్‌ను ప్రధానమంత్రి ప్రశంసించారు. పర్యాటకులను ఆకర్శించడానికి బహుముఖ చర్యలు అవసరమని పేర్కొన్నారు. వేసవి కాలంలో పర్యాటకులతో కళకళలాడే ఉత్తరాఖండ్ చలికాలంలో మాత్రం ఖాళీగా దర్శనిస్తోందని, ఈ పరిస్థితి మారాలని స్పష్టంచేశారు. అన్ని సీజన్లలో పర్యాటకులు భారీగా తరలివచ్చేలా వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని కోరారు. వింటర్ టూరిజం మనం లక్ష్యం కావాలని అన్నారు. చలికాలంలోనే అసలైన ఉత్తరాఖండ్‌ను అనుభూతి చెందవచ్చని పర్యాటకులకు సూచించారు. గిరిజన గ్రామమైన జడూంగ్ నుంచి హర్సిల్ విలేజ్ వరకూ ట్రెక్, బైక్ జర్నీని ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రంలో రెండు కీలకమైన రోప్‌వే ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు గుర్తుచేశారు. రోప్‌వే ప్రాజెక్టుతో కేదార్నాథ్ ప్రయాణం 9 గంటల నుంచి 30 నిమిషాలకు తగ్గిపోతుందని వెల్లడించారు. వివాహాలు చేసుకొనేందుకు, సినిమాలు, షార్ట్‌ఫిలింల షూటింగ్‌లకు ఉత్తరాఖండ్‌లో చక్కటి వేదికలు ఉన్నాయని, వీటిని ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. సరిహద్దు గ్రామమైన హర్సిల్‌లో అడుగుపెట్టిన మొట్టమొదటి ప్రధానమంత్రి మోదీయేనని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామీ పేర్కొన్నారు. రేపు గుజరాత్లో మోదీ పర్యటన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8వ తేదీన గుజరాత్లో పర్యటించనున్నారు. నవసారి జిల్లాలో లఖ్పతి దీదీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని పూర్తిగా మహిళా పోలీసులు, మహిళా సిబ్బంది ఆధ్వర్యంలోనే నిర్వహించబోతున్నారు. -
కుటుంబ నియంత్రణపై నా ఆలోచన మారింది
సాక్షి, న్యూఢిల్లీ : జనాభా నియంత్రణ విషయంలో తన ఆలోచన విధానం పూర్తిగా మారిపోయిందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. గురువారం సాయంత్రం ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన రిపబ్లిక్ టీవీ ‘లిమిట్లెస్ ఇండియా’ సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో జనాభా నిర్వహణ భారత్‌కు చాలా ముఖ్యమైనదని చెప్పారు. ప్రస్తుతం చైనా, జపాన్, యూరప్‌లలో జనాభా పెరుగుదల తగ్గిపోయిందని అన్నారు. 2047 కల్లా దేశంలో 65% మంది ప్రజలు 35 ఏళ్లలోపు వారు ఉంటారన్నారు. కుటుంబ నియంత్రణ విధానాన్ని సక్రమంగా నిర్వహించినందుకు దక్షిణ భారత దేశంలో జనాభా తగ్గిందన్నారు. ఇప్పుడు జనాభా నియంత్రణ విషయంలో దక్షిణాదిలో ఆలోచనా విధానం మారాలని సూచించారు. బీహార్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాలు ఎక్కువ మంది జనాభాతో దేశాన్ని కాపాడుతున్నాయని, ఈ విధానాన్ని అన్ని రాష్ట్రాలూ అనుసరించాలని చెప్పారు.మెట్రో ప్రాజెక్టులకు వందశాతం సహాయం చేయండివిశాఖపట్నం, విజయవాడ నగరాలకు మెట్రో ప్రాజెక్టుల అనుమతులను త్వరితగతిన ఇవ్వాలని సీఎం చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. ఈ ప్రాజెక్టులకు వంద శాతం ఖర్చును కేంద్రమే భరించాలని విన్నవించారు. చంద్రబాబు గురువారం ఢిల్లీలో కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి, విద్యుత్తు శాఖల మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో సమావేశమై ఈమేరకు విజ్ఞప్తి చేశారు. ఈ భేటీ వివరాలను సీఎం ఎక్స్ ద్వారా వెల్లడించారు. విశాఖపట్నంలో ట్రాఫిక్ రద్దీ పెరుగుతోందని తెలిపారు. భోగాపురం విమానాశ్రయం వచ్చే ఏడాది జూన్‌కి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నందున జాతీయ రహదారులకు మెట్రోను అనుసంధానించడం ఎంతో ముఖ్యమని తెలిపారు. విజయవాడ మెట్రో ప్రాజెక్టు అమరావతి ప్రవేశ ద్వారంగా ప్రాంతీయ కనెక్టివిటీని బలోపేతం చేయడానికి, ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుందన్నారు. విజయవాడలో పెరుగుతున్న రవాణా అవసరాలను తీర్చడానికి ఈ ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ భేటీలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా పాల్గొన్నారు. లూథ్రాతో చంద్రబాబు రహస్య భేటీ?ఎలాగైనా కేసులన్నీ క్లోజ్ అయ్యేలా చూడాలని వినతి!సాక్షి, న్యూఢిల్లీః సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్థార్థ లూథ్రాతో సీఎం చంద్రబాబు రహస్యంగా సమావేశమైనట్లు తెలిసింది. ఈ భేటీలో గతంలో చంద్రబాబుపై నమోదైన కేసులను ఎత్తివేసే అంశంపై చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. గురువారం రాత్రి ఢిల్లీ వచ్చిన చంద్రబాబు రిపబ్లికన్ టీవీ నిర్వహించిన ‘లిమిట్ లెస్ ఇండియా’ సదస్సుకు హాజరయ్యారు. సదస్సు అనంతరం ఆయన నేరుగా డిఫెన్స్ కాలనీలోని లూథ్రా నివాసానికి వెళ్లారు. దాదాపు 40 నిమిషాలు వీరిద్దరూ పలు విషయాలపై చర్చించినట్లు తెలిసింది. ఏం చేసైనా సరే తనపై ఉన్న కేసులన్నీ త్వరితగతిన క్లోజ్ అయ్యేలా చూడాలని లూథ్రాను చంద్రబాబు కోరినట్లు విశ్వసనీయ సమచారం.ఆ కేసులన్నీ మూసేద్దాం2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు చేసిన దోపిడీని సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఆధారాలతో సహా నిగ్గు తేల్చిన విషయం తెలిసిందే. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం, అసైన్డ్ భూముల దోపిడీ, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణం, ఫైబర్‌నెట్ కుంభకోణాల కుట్రదారు, లబ్ధిదారు చంద్రబాబే అనే విషయాన్ని సిట్ ఆధారాలతో సహా బట్టబయలు చేసింది. నిబంధనలకు విరుద్ధమని చెప్పినా సరే సీఎం హెూదాలో చంద్రబాబు ఆదేశించడంతోనే అక్రమాలకు పాల్పడాల్సి వచ్చిందని ఉన్నతాధికారులు, ఇతరులు వాంగ్మూలాలు కూడా ఇచ్చారు. అక్రమ నిధులు హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి, టీడీపీ బ్యాంకు ఖాతాలకు చేరినట్టు ఆధారాలను సిట్ సేకరించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ కేసుల నుంచి చంద్రబాబు పేరు తప్పించేందుకు కుట్ర పన్నుతోంది. చంద్రబాబు అవినీతి కేసుల్లో గతంలో సిట్ సేకరించిన డాక్యుమెంటరీ ఆధారాలను తారుమారు చేసే విషయాలపై లూథ్రాతో చంద్రబాబు చర్చించినట్లు తెలిసింది. ఈ కేసులన్నింటి నుంచి త్వరితగతిన ఉపశమనం కలిగేలా మార్గాలను చూడాలని లూథ్రాను సీఎం కోరినట్లు సమాచారం. దేశంలో తానే సీనియర్ ముఖ్యమంత్రినని, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కక్షగట్టి తనని జైలుపాలు చేసిందని చంద్రబాబు అన్నట్లు తెలిసింది. వైఎస్సార్సీపీ పదే పదే ఆ కేసులను ప్రస్తావించడం, ప్రజల్లోకి తీసికెళ్లడం వల్ల తనపై ప్రజల్లో నమ్మకం పోతుందని, అందుకే ఆ కేసుల నుంచి వీలైనంత త్వరగా ఉపశమనం కలిగేలా చూడాలని లూథ్రాను కోరినట్లు సమాచారం. గురువారం రాత్రి చంద్రబాబు ఢిల్లీలోని అధికార నివాసంలో బస చేశారు. శుక్రవారం ఉదయం విజయవాడకు వెళ్లనున్నారు. -
ఫిషింగ్ హార్బర్లో భారీ అగ్ని ప్రమాదం.. 30 బోట్లు దగ్ధం
భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రంలోని ఫిషింగ్ హార్బర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పారాదీప్ ఫిషింగ్ హార్బర్లో మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 30 ఫిషింగ్ బోట్లు దగ్థం.. కోట్లలో ఆస్తి నష్టం వాటిలినట్లు తెలుస్తోంది. ఈ సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది హుటాహుటీనా అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. -
జైశంకర్ పర్యటనలో ఖలిస్థానీల అత్యుత్సాహం.. ఖండించిన యూకే
లండన్ : యూకే పర్యటలో భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ వాహనంపై ఖలిస్థానీ మద్దతుదారులు జరిపిన దాడి యత్నాన్ని యూకే ఖండించింది. ఈ సందర్భంగా బ్రిటన్ విదేశీ వ్యవహారాల శాఖ (FCDO) అధికారికంగా స్పందించింది."యూకే చాఠమ్ హౌస్ బయట భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ కారుపై దాడి యత్నాన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. యూకే శాంతియుత నిరసన హక్కును గౌరవిస్తుంది. కానీ ఇలా దాడులకు యత్నించడం, బెదిరించడం, ప్రజా కార్యక్రమాల్ని అడ్డుకోవడం సరైందని కాదని’ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.మరోవైపు లండన్ మెట్రోపాలిటన్ పోలీసు వర్గాలు సైతం జైశంకర్‌పై జరిగిన దాడి యత్నాన్ని ఖండించాయి. నిందితులపై చర్యలు తీసుకున్నామని పేర్కొంది. మా అతిథుల భద్రతను పర్యవేక్షించడం, వారి సంరక్షణ బాధ్యతలకు మేం పూర్తిగా కట్టుబడి ఉన్నామని మరో ప్రకటనలో స్పష్టం చేసింది. -
‘20 ఏళ్లుగా అనుకుంటున్నా.. కానీ రాహుల్ అనుకోలేదు’
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంతగానో సేవ చేసిన తనను పార్టీ ప్రస్తుతం గుర్తించకపోవడంపై ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి మణి శంకర్ మళ్లీ పెదవి విప్పారు. పార్టీకి ఇంకా సేవ చేద్దామని ఉన్నా తనను గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తానొక వృద్ధుడిని అని పక్కన పెట్టేశారని, తాను మరీ అంత వృద్ధుడినేమీ కాదన్నారు 83 ఏళ్ల మణిశంకర్ అయ్యర్. జాతీయ మీడియాకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో మణి శంకర్ అయ్యర్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.‘ ఇప్పుడు నేనేమీ మాట్లాడినా బీజేపీ వక్రీకరిస్తుంది. వారు కచ్చితంగా ఆ పని చేస్తారు. మీతో మాట్లాడిన దానిని వక్రీకరిస్తారు. కానివ్వండి.. వారు అలా చేస్తే మనం చేసేదేమీ ఉండదు.. మా పార్టీలోని పవన్ ఖారే నాకు ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. నా సేవలు పార్టీకి అవసరం లేదని తేల్చి చెప్పేశారు. ఏ రకంగానే నా సేవలు అవసరం లేదన్నారు. ఇక ‘గాంధీ’ ఫ్యామిలీతో ఉన్న రిలేషన్ షిప్ పై మణి శంకర్ అయ్యర్ స్పందించారు. ‘ మా ఫ్రెండ్ షిప్ కొనసాగుతోంది. వారు నన్నేమీ శత్రవుగా చూడటం లేదు. కానీ రాహుల్ గాంధీ.. నన్ను బాగా వృద్ధుడిగా చూస్తున్నారు. నేను వృద్ధుడ్నే కానీ.. మీరు అనుకునేంత వృద్ధుడ్ని కాదు. ఇదే వారు నన్ను సంప్రదించకపోవడానికి ప్రధాన కారణం’ అని చెప్పుకొచ్చారు.ఇక రాహుల్ గాంధీకి మెంటార్ గా వ్యవహరిస్తారా అని అడిగిన ప్రశ్నకు.. మణిశంకర్ అయ్యర్ తనదైన శైలిలో జవాబిచ్చారు. ‘ రాహుల్ కు మెంటార్ గా ఉండాలని గత 20 ఏళ్లగా సిద్ధంగా ఉన్నా. కానీ వారు నన్ను కోరుకోవడం లేదు. నా అభిప్రాయాన్ని వారు మీద నేను బలవంతంగా రుద్దలేను కదా. నేను ఉండాలని కోరుకుంటున్నా. కానీ రాహుల్ అనుకోవడం లేదు’ అని అన్నారు. కాంగ్రెస్ లో కొంతమంది తనపై లేనిపోనివి చెప్పి తనను వారి నుంచి దూరం చేసి ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేశారు అయ్యర్.మరి ఈ విషయాల్ని రాహుల్ గాంధీ సమక్షంలోనే నివృత్తి చేసుకోవచ్చు కదా అని అడిగిన మరో ప్రశ్నకు అయ్యర్ బదులిస్తూ.. ‘ నేను ఎలా కలుస్తాను.. వారు కలిసే అవకాశం ఇవ్వకపోతే నేను కలవగలను. 2004లొ రాహుల్ నా మాట గౌరవం ఇచ్చేవారు. ఆ సందర్భంలో మీరు నా తండ్రికి స్నేహితుడు.. అందుకు మీ మాట వింటాను.. మా తండ్రి మీ మాట విన్నారు.. నేను కూడా మీ మాట వింటాను’ అని ఒకానొక సందర్భంలో సంగతిని అయ్యర్ గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు వారిని కలిసే పరిస్థితి లేదన్నారు. వారే తనను దూరం పెడుతున్నారన్నారు. అటు రాహుల్, ఇటు ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ ఎవర్నీ నేను కలవలేకపోతున్నా. సోనియా గాంధీకి ఆరోగ్యం బాగా లేకపోయినా కలవడానికి లేకుండా ఉంది. నేను వారు గురించి ఎందుకు డిస్టర్బ్ కావాలి. నాకేమైనా ఇప్పుడు ఎంపీ పోస్ట్ కోసం వారిని కలవాలా? ఏంటీ, అని అయ్యర్ తిరిగి ప్రశ్నించారు. -
‘మెడలో తాళి, నుదుటున బొట్టు లేదు.. మీ భర్త మిమ్మల్ని ఎలా ప్రేమిస్తారు’: కోర్టు
ముంబై : వాళ్లిద్దరూ భార్యా, భర్తలు. అయితే, భర్త తనని వేధిస్తున్నాడని ఆరోపిస్తూ భార్య కోర్టును ఆశ్రయించింది. భర్త నుంచి తనకు విడాకులు కావాలని కోరింది. ఈ కేసుపై కోర్టు విచారణ చేపట్టింది. విచారణ సమయంలో న్యాయమూర్తికి, మహిళకు మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.పూణేకు చెందిన అంకుర్ ఆర్ జగిధర్ లాయర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా, ఓ మహిళ తన భర్త నుంచి తనకు విడాకులు ఇప్పించాలని కోరుతూ తనని సంప్రదించిందని, అందుకే ఆమె తరుఫున వాదిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే, తాజాగా తన క్లయింట్ కేసు పూణే జిల్లా కోర్టులో విచారణకు వచ్చిందని, విచారణ సమయంలో న్యాయమూర్తితో జరిగిన వాదనలను భార్య తరుఫు లాయర్ లింక్డిన్లో పోస్ట్ చేశారు. ఆ పోస్టులో పూణే జిల్లా కోర్టులో ‘‘నా క్లయింట్ విడాకుల కేసు విచారణ జరిగింది. విచారణలో భర్త తన డిమాండ్లను నెరవేర్చాలని కోర్టును కోరింది. అయితే, ఈ కేసు విచారిస్తున్న న్యాయమూర్తి నా క్లయింట్‌ను ఇలా ప్రశ్నించారు. ‘‘ఏమ్మా.. మిమ్మల్ని చూస్తుంటే మొడలో మంగళసూత్రం, నుదుట బొట్టు పెట్టుకునేవారిలా కనిపించడం లేదే? వివాహం జరిగిన స్త్రీగా మీరు కనిపించకపోతే.. మీ వారు.. మిమ్మల్ని ఎలా ఇష్టపడతారు? అందుకే భర్తలతో ప్రేమగా ఉండండి. కఠువగా ఉండకండి అని సలహా ఇచ్చారు.అంతేకాదు.. మాటల మధ్యలో న్యాయమూర్తి ఇలా అన్నారు. ‘‘ఒక స్త్రీ బాగా సంపాదిస్తే, ఆమె ఎప్పుడూ తనకంటే ఎక్కువ సంపాదిస్తున్న భర్తనే కోరుకుంటుంది. తక్కువ సంపాదిస్తున్న వ్యక్తి చాల్లే అని సరిపెట్టుకోదు. అదే బాగా సంపాదించే వ్యక్తి తాను వివాహం చేసుకోవాలనుకుంటే, తన ఇంట్లో పాత్రలు కడిగే పనిమనిషినైనా సరే వివాహం చేసుకోవాలనుకుంటాడు. కాబట్టి మీరు మీ భర్త పట్ల కాస్త ప్రేమను చూపించండి. కఠినంగా ఉండొద్దు అని ఇద్దరు దంపతుల్ని ఒక్కటి చేసే ప్రయత్నం చేశారని వివరిస్తూ’’ సదరు న్యాయవాది రాసిన సోషల్ మీడియా పోస్టు నెట్టింట్లో చక్కెర్లు కొడుతోంది. -
గోల్డ్ కేసులో ట్విస్ట్.. నటి రన్యారావు వెనక ఓ రాజకీయ నేత!?
కన్నడ నటి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. రన్యారావు బంగారం స్మగ్లింగ్ వెనక ఓ రాజకీయ నాయకుడి హస్తం ఉన్నట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. అందుకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య న్యాయసలహాదారు ఐఎస్ పొన్నన్ చేసిన వ్యాఖ్యలు అందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి.దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన రన్యారావు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. డైరెక్టరేట్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు (DRI) ఆమె ఇంట్లో జరిపిన సోదాల్లో భారీ ఎత్తున బంగారాన్ని గుర్తించారు. ఈ బంగారం ఎవరిది? అని ఆరా తీయగా.. ఆ గోల్డ్‌ను సదరు నేత కొనుగోలు చేసినట్లు పలు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. రన్యారావుతో ఆ రాజకీయ నాయకుడే స్మగ్లింగ్ చేయించినట్లు డీఆర్ఐ అధికారులు అనుమానిస్తున్నారు. రాజకీయ నాయకుడు,రన్యారావుల మధ్య ఒప్పందం జరిగింది. గోల్డ్‌ను దుబాయ్ నుంచి భారత్‌కు తీసుకు వస్తే కిలోలక్ష ఇస్తానని హామీ ఇచ్చారు. ఒప్పందం ప్రకారం.. స్మగ్లింగ్ కోసం నటి ఒక్క ఏడాదిలో దాబాయ్కు ౩౦ సార్లు వెళ్లింది. ట్రిప్‌కు 12 నుంచి 14 లక్షలు సంపాదించిన ప్రాథమిక విచారణలో తేలింది. ప్రస్తుతం డీఆర్ఐ అధికారులు బంగారం కొనుగోళ్ల సంబంధించిన రసీదులను సేకరించే పనిలో పడ్డారు.మరోవైపు రన్యారావు బంగారం స్మగ్లింగ్ వ్యవహారంలో రాజకీయనాయడి హస్తం ఉందనే ఆరోపణలపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య న్యాయసలహాదారు ఐఎస్ పొన్నన్ స్పందించారు.నటికి ఉన్న రాజకీయ పరిచయాలతో సంబంధం లేకుండా చట్టం తన పని తాను చేస్తుందని అన్నారు. ఈ కేసులో ఎవరి జోక్యం ఉన్నా దర్యాప్తులో భయటపడుతుందని చెప్పారు. -
జైశంకర్‌పై ఖలిస్థానీ సానుభూతిపరులు దాడికి యత్నం.. ఖండించిన భారత్
ఢిల్లీ : లండన్ పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కారుపై ఖలిస్థానీ సానుభూతిపరులు దాడికి యత్నించడం కలకలం రేపుతోంది. అయితే, ఈ దాడిని భారత్ ఖండించింది. భద్రతా లోపంపై విదేశాంగ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది.మంత్రి జై శంకర్ బుధవారం రాత్రి లండన్‌లోని ఛాఠమ్ హౌస్‌లో నిర్వహించిన అధికారిక సమావేశాలకు హాజరయ్యారు. ఈ సమావేశాలు ముగించుకొని బయటకు వచ్చిన సమయంలో ఖలిస్థానీ మద్దతుదారులు ఆయన కారుపై దూసుకువచ్చారు. పలువురు భారత జాతీయ జెండాలను చించే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన లండన్ పోలీసులు వారిని అడ్డుకున్నారు. కారువైపు దూసుకొచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఘటనపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వేర్పాటువాదులు, తీవ్రవాదుల రెచ్చగొట్టే చర్యలను, ప్రజాస్వామ్య స్వేచ్ఛ దుర్వినియోగం కావడాన్ని మేం త్రీవంగా ఖండిస్తున్నాము. ఇలాంటి సందర్భాల్లో ఆతిథ్య దేశం వారి దౌత్యపరమైన బాధ్యతలను పూర్తిగా నెరవేర్చాలి. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుంటుందని మేం ఆశిస్తున్నాం’ అని ప్రకటనలో పేర్కొంది.🚨 Breaking: In London, a Khalistan protester tries to assault EAM S Jaishankar and shreds the Indian flag | Watch the video. pic.twitter.com/HRGcMAgDGt— Indian InSight (@IndianInsight_) March 6, 2025 -
ముదిరిన భాషా వివాదం.. తమిళిసై అరెస్ట్
చెన్నై: తమిళనాడులో త్రిభాషా వివాదం ముదిరింది. త్రిభాషా విధానానికి మద్దతుగా బీజేపీ సంతకాల సేకరణ చేపట్టింది. ఈ క్రమంలోబీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ నాయకురాలు తమిళిసైని పోలీసులు అరెస్ట్ చేశారు.కాగా, రాష్ట్రంలో త్రి భాష విధానానికి మద్దతుగా ఇంటింటా సంతకాల సేకరణకు బీజేపీ నిర్ణయించిన సంగతి తెలిసిందే.. అలాగే డీఎంకే అఖిల పక్షాన్ని బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం నిర్దేశించిన విధంగా రాష్ట్రంలోని మూడు భాషల విధానానికి మద్దతుగా నిర్ణయం తీసుకున్నారు.నిన్నటి (బుధవారం) నుంచి త్రిభాషా విధానానికి మద్దతుగా తమిళనాడులో ఇంటింటికి సంతకాల సేకరణ, ప్రచార, అవగాహన, ఈ – సంతకాల సేకరణ కార్యక్రమాలు బీజేపీ చేపట్టింది. కాగా, డీఎంకే నేతృత్వంలో బుధవారం జరిగిన అఖిల పక్షం భేటీని కూడా బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రజా వ్యతిరేక విధానాలు, అవినీతి విధానాలు, దుష్ప్రవర్తన, శాంతిభద్రతల వైఫల్యాల గురించి చర్చించిన కోర్‌కమిటీ.. రానున్న రోజులలో తమిళ ప్రజల సంక్షేమార్థం, డీఎంకే ప్రభుత్వ తీరును ఎండగట్టే విధంగా కార్యక్రమాలకు నిర్ణయించారు. -
దురభిమానం ఎలా ఉంటుందంటే.. విమర్శలకు స్టాలిన్ కౌంటర్
చెన్నై: కేంద్ర నూతన జాతీయ విద్యావిధానాన్ని(National Educational Policy) వ్యతిరేకిస్తూ.. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరోసారి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తాము కోరుకునేది భాషా సమానత్వం మాత్రమేనని.. అంత మాత్రానికే తమను విమర్శించడం తగదని అన్నారాయన. ఈ క్రమంలో.. డీఎంకే ప్రభుత్వంపై వస్తున్న విమర్శలకు ఆయన ఓ కొటేషన్‌తో కౌంటర్ ఇచ్చారు. మేం కోరుకునేది భాషా సమానత్వం. తమిళనాడులో తమిళం భాషకు ప్రాధాన్యం కల్పించమని అడుగుతున్నాం. అంతమాత్రానికే దురభిమానం, పక్షపాతం అనే ముద్రలు మాపై వేస్తున్నారు. మీరు ప్రత్యేక హక్కులకు అలవాటుపడటంతో మేం కోరుకునే సమానత్వం కూడా అణచివేతలా కనిపిస్తుంది(కొటేషన్‌ను పోస్ట్ చేశారు). దురభిమానం ఎలా ఉంటుందంటే.. తమిళులు అర్థం చేసుకోలేని భాషలో మూడు నేర చట్టాలకు పేర్లు పెట్టడంలా ఉంటుంది. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే రాష్ట్రానికి ప్రాముఖ్యత ఇవ్వకపోవడం, ఎన్ఈపీని నిరాకరించినందుకు విద్యకు వెచ్చించాల్సిన నిధులను ఆపేయడం దాని కిందికే వస్తుంది. .. గాడ్సే భావజాలాన్ని కీర్తించే వ్యక్తులు.. చైనా దురాక్రమణ, కార్గిల్ యుద్ధం, బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిపిన యుద్ధాల్లో అత్యధిక నిధులు అందించిన డీఎంకే, ఆ పార్టీ నేతృత్వంలో ప్రభుత్వానికి ఉన్న దేశభక్తిని ప్రశ్నిస్తున్నారు అంటూ కేంద్రంలోని బీజేపీకి పరోక్షంగా చురకలంటించారాయన. 👉🏾 "When you are accustomed to privilege, equality feels like oppression." I am reminded of this famous quote when some entitled bigots brand us chauvinists and anti-nationals for the 'crime' of demanding Tamil’s rightful place in Tamil Nadu.👉🏾 The very people who glorify… pic.twitter.com/MOzmUSEyia— M.K.Stalin (@mkstalin) March 6, 2025ఇదిలా ఉంటే.. జాతీయ విద్యావిధానంలో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం కొనసాగుతోంది. హిందీని బలవంతంగా హిందీయేత ప్రాంతాలకు రుద్దే ప్రయత్నం చేస్తున్నారంటూ కేంద్రం స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం మండిపడుతోంది. ఈ క్రమంలో.. రాష్ట్రానికి రావాల్సిన నిధులను నిలిపివేశారని స్టాలిన్ ప్రభుత్వం కేంద్రంపై సంచలన ఆరోపణలు చేసింది. అయితే ఈ ఆరోపణలను, డీఎంకే ప్రభుత్వ ప్రచారాలను కేంద్రం తోసిపుచ్చుతూ వస్తోంది. -
తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ గురువారం ఉదయం ఓ సందేశం విడుదల చేశారాయన. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని ఆశీర్వదించి గెలిపించిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు. కొత్తగా ఎన్నికైన మా అభ్యర్థులకు అభినందనలు. గొప్ప శ్రద్ధతో పని చేసిన పార్టీ కార్యకర్తలను చూసి నేను గర్విస్తున్నా’’ అని ఎక్స్ పోస్టులో సందేశం ఉంచారాయన. ఇదిలా ఉంటే.. కరీంనగర్–మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య గెలిచారు. ఇక.. ఉత్కంఠ భరితంగా సాగిన ఉమ్మడి కరీంనగర్- ఆదిలాబాద్- నిజామాబాద్- మెదక్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా చిన్నమైల్ అంజిరెడ్డి నెగ్గారు. టీచర్స్ ఎమ్మెల్సీగా కొమురయ్య మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలవగా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ మాత్రం ఉత్కంఠ భరితంగా సాగింది. చివరకు.. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన అల్ఫోర్స్ నరేందర్రెడ్డిపై 5,106 ఓట్ల ఆధిక్యంతో అంజిరెడ్డి జయకేతనం ఎగురవేశారు. -
రెండుసార్లు మిమ్మల్ని సీఎంను చేశా.. అది మర్చిపోకండి
తన వల్లే లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) రాజకీయాల్లో ఎదిగారంటూ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ పడింది. తన వల్లే జేడీయూ ఇవాళ మనుగడలో ఉందని.. నితీశ్ రెండుసార్లు సీఎం కాగలిగారని లాలూ తనయుడు, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అన్నారు..తన వల్లే లాలూ సీఎం కాగలిగారని నితీశ్ అసెంబ్లీలో అన్నారు. కానీ, ఒకసారి ఆయన గతం గుర్తు తెచ్చుకోవాలి. ఆయన(నితీశ్) కంటే ముందే నా తండ్రి రెండుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా నెగ్గారు. ఎంతో మందిని ప్రధానులుగా చేయడంలో నా తండ్రిదే కీలక పాత్ర. అంతేకాదు..నితీశ్ కుమార్ రెండుసార్లు సీఎం కావడంలో నేను ముఖ్యపాత్ర పోషించా. ఆయన పార్టీని కాపాడా.. ఈ సంగతులేవీ మరిచిపోవద్దు ’’ అని పాట్నాలో జరిగిన ఓ ర్యాలీలో నితీశ్‌ను ఉద్దేశించి తేజస్వి యాదవ్ అన్నారు.2015 ఎన్నికల్లో ఆర్జేడీ 80 సీట్లు నెగ్గి అతిపెద్ద పార్టీగా అవతరించింది. నితీశ్ సారథ్యంలో జేడీ(యూ) 71 సీట్లు మాత్రమే గెల్చుకుంది. అయితే మహాఘట్బంధన్ కూటమిలో భాగంగా.. ముఖ్యమంత్రి పదవిని ఆర్జేడీ త్యాగం చేసింది. 2022లో బీజేపీకి కటీఫ్ చెప్పి మళ్లీ మహాఘట్బంధన్లో చేరి.. సీఎం పదవిని చేపట్టారు. ఈ రెండు సందర్భాల్లోనూ డిప్యూటీ సీఎంగా తేజస్వి యాదవ్ ఉన్నారు. అయితే ఈ బంధం ఏడాదిపాటే కొనసాగింది. 2024లో తిరిగి బీజేపీతో నితీశ్ జట్టు కట్టారు.నితీశ్ ఏమన్నారంటే..బీహార్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా.. మంగళవారం తన ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన తేజస్విపై సీఎం నితీశ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో బిహార్‌లో అభివృద్ధి ఏమీ జరగలేదని, తన హయాంలోనే జరిగిందన్నారు. ఈ సందర్భంగా తన వల్లే లాలూ ప్రసాద్ యాదవ్ రాజకీయాల్లో ఎదిగారని వ్యాఖ్యానించారు.‘‘గతంలో బిహార్‌లో పరిస్థితి ఎలా ఉండేదో గుర్తుందా? సాయంత్రం అయ్యిందంటే ఎవ్వరూ బయటకు వచ్చేవారు కాదు. అప్పుడు నువ్వు చిన్నపిల్లాడివి. ఒకసారి వెళ్లి ప్రజలను అడుగు. మీ నాన్న ఈ స్థాయిలో ఉన్నాడంటే అది నా వల్లే. లాలూకు ఎందుకు అండగా నిలుస్తున్నారని మీ సొంత మనుషులే అడిగారు. అయినప్పటికీ.. మద్దతు ఇచ్చా’ అని నితీశ్ అన్నారు. -
ట్రంప్ సాయంతో కశ్మీర్ సమస్యను పరిష్కరిస్తారా?
ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొల్పాలనే ఉద్దేశంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దూకుడుగా అడుగులేస్తున్నారు . ఉక్రెయిన్, గాజా సంక్షోభాలకు ముగింపు పలికేందుకు కఠిన నిర్ణయాలే తీసుకుంటున్నారు. అయితే ఆయన సాయంతోనే సున్నితమైన కశ్మీర్ సమస్య(Trump Kashmir Issue)ను భారత్ పరిష్కరించుకోవచ్చు కదా!. ఇదే ప్రశ్న భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌కు ఎదురైంది.లండన్ చాథమ్ హౌస్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి జై శంకర్ హాజరయ్యారు. కశ్మీర్ పరిష్కారం కోసం మధ్యవర్తిత్వం వహించమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Trump)ను భారత ప్రధాని మోదీ కోరే ఉద్దేశమేదైనా ఉందా? అని ప్రతినిధులు ఆయన్ని అడిగారు. అయితే ఈ అంశంలో భారత్ ఇప్పటిదాకా స్వతంత్రంగానే వ్యవహరించిందని.. ఇక మీదటా ‘మూడో ప్రమేయం’ ఉండదని స్పష్టం చేశారాయన. కశ్మీర్ సమస్య పరిష్కారం దిశగా ఇప్పటిదాకా మేం(భారత్) ఒంటరి ప్రయత్నాలే చేశాం. మంచి అడుగులెన్నో వేశాం. ఇప్పటికే నిర్ణయాత్మక చర్యలెన్నో తీసుకున్నాం. అందులో మొదటి అడుగే ఆర్టికల్ 370(Article 370) తొలగింపు. కశ్మీర్ అభివృద్ధి, ఆర్థిక పురోగతి, సామాజిక న్యాయం.. ఇవి రెండో అడుగు. అత్యధిక ఓటింగ్ శాతం నమోదు అయ్యేలా ఎన్నికలు నిర్వహించడం మూడో అడుగు. అయితే..ఇంకా పరిష్కారం కాని అంశం.. దేశం అవతల ఉంది. అదే పాక్ ఆక్రమిత కశ్మీర్(Pak Occupied Kashmir). దానిని తిరిగి స్వాధీనం చేసుకోవడం మాత్రమే మిగిలి ఉంది. అది పూర్తైతే గనుక కశ్మీర్ సమస్య పరిష్కారం అయినట్లే. అందుకు నేను మీకు హామీ ఇస్తున్నా’’ అని జైశంకర్ అన్నారు. ‘పీవోకే’ భారత్‌లో అంతర్భాగమని, అది 1947 నుంచి పాక్ ఆక్రమణలో ఉందని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ ఎప్పటికప్పుడు చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కిందటి ఏడాది.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) విదేశీ భూభాగమేనని స్వయంగా పాకిస్థాన్ ప్రభుత్వం ఇస్లామాబాద్ హైకోర్టులో అంగీకరించింది. ఓ జర్నలిస్ట్ కిడ్నాప్ కేసులో హైకోర్టులో వాదనలు వినిపించిన అదనపు అటార్నీ జనరల్.. పీవోకే విదేశీ భూభాగమని, అక్కడ పాక్ చట్టాలు చెల్లవని తెలిపారు. -
కన్నడ వర్ధమాన నటి రన్య రావు అరెస్ట్
చందనాన్ని స్మగ్లింగ్ చేస్తాడు. ఈ అందాల నటి నిజ జీవితంలో బంగారాన్ని దొంగ రవాణా చేయసాగింది. తరచూ విమానాల్లో ప్రయాణాలు, చుట్టరికాల మద్దతుతో హాలీవుడ్ సినిమా స్థాయిలో కేజీల కొద్దీ బంగారం బిస్కెట్లు, నగలను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. విధి వక్రించి అరెస్టయ్యింది.బనశంకరి: అరబ్ దేశాలనుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ పట్టుబడిన కన్నడ వర్ధమాన నటి, ఓ డీజీపీ బంధువు రన్య రావు విచారణలో డొంకంతా కదులుతోంది. ఆమె నుంచి ఇప్పటివరకు మొత్తం రూ.17.29 కోట్ల విలువైన పసిడి, నగదును సీజ్ చేశారు. ఈమె దుబాయ్ నుంచి 14.8 కేజీల బంగారాన్ని తీసుకొస్తూ సోమవారం రాత్రి బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయంలో దొరికిపోవడం తెలిసిందే. అప్పటినుంచి ఆమెను డీఆర్ఐ అధికారులు విచారిస్తున్నారు. ఇంటిలో బంగారం నిల్వలు బెంగళూరు ల్యావెల్లీ రోడ్డు నందవాణి మ్యాన్సన్ నివాసంలో నటి రన్య రావు నివసిస్తోంది. ఆమె నెలకు రూ.4.5 లక్షల అద్దె చెల్లిస్తున్నట్లు తెలిసింది. ఆ ఇంటిలో వెతికేకొద్దీ బంగారు బిస్కెట్లు, కడ్డీలు, ఆభరణాలు లభించాయి. మంగళవారం నుంచి సోదాలు నిర్వహించి రూ.2.06 కోట్ల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు. రూ.2.67 కోట్ల నగదు కూడా లభించింది. ఆమె నుంచి రూ.12.56 కోట్ల విలువచేసే 14.2 కిలోల విదేశీ బంగారం, రూ.4.73 కోట్ల విలువచేసే ఇతర ఆస్తులను జప్తు చేసుకున్నామని డీఆర్ఐ ప్రకటించింది. 14 రోజుల రిమాండు ప్రత్యేక ఆర్థిక నేరాల కోర్టులో రన్య ను హాజరుపరచగా 14 రోజుల జుడీషియల్ కస్టడీకి ఆదేశించింది. ఆమెను హెచ్ఆర్బీఆర్ లేఔట్‌లోని డీఆర్ఐ కేంద్రకార్యాలయంలో అధికారులు ప్రశ్నించారు. ఆమె బంగారం స్మగ్లింగ్ దందాకు కొందరు పోలీసులు, పారిశ్రామికవేత్తలు సహకారం అందించినట్లు అనుమానం వ్యక్తమైంది. తరచూ దుబాయ్ టూర్లు నటి రన్యారావ్ తరచూ దుబాయ్‌కి వెళ్లి వస్తోంది. వచ్చేటప్పుడు పెద్ద మొత్తంలో బంగారు నగలను ధరించి అక్రమంగా తీసుకువచ్చేది. కస్టమ్స్ , భద్రతా సిబ్బంది తనిఖీలు చేయకుండా డీజీపీ పేరును చెప్పేది. అనధికారికంగా పోలీస్ ఎస్కార్ట్ వాహనంలో ఇంటికి వెళ్లేది. తరచూ దుబాయ్‌కి వెళ్లి గుట్టుగా బంగారాన్ని తీసుకు వస్తుండడం వెనుక పెద్ద ముఠానే ఉండవచ్చని డీఆర్ఐ ఆ దిశగా దర్యాప్తు చేస్తోంది. ఇలా తరలిస్తోంది విమానం దిగగానే రన్యను డీఆర్ఐ అధికారులు తనిఖీ చేయగా గుట్టు రట్టయింది, 14 బంగారు బిస్కెట్లను తొడ భాగంలో గమ్‌తో అంటించి టేప్ చుట్టినట్లు గుర్తించారు. ఆ టేప్ పై క్రేప్ బ్యాండేజ్‌ను చుట్టుకుందని తెలిపారు. ఇలాగైతే స్కానర్ల తనిఖీలో దొరకనని అనుకుంది. శ్యాండల్‌వుడ్‌లో స్టార్‌గా ఎదగాలంటే ఆర్ అనే అక్షరంతో పేరు ఉండాలనుకుని ఆమె రన్య రావుగా పేరు మార్చుకుంది. ఆమె అసలు పేరు హర్షవర్ధిని యఘ్నేశ్, మాణిక్య సినిమా టైంలో రన్య అయ్యింది. ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు ఆర్ అక్షరం పేరుతో స్టార్లు అయ్యారని, తనకూ ఆర్ కలిసొస్తుందని భావించింది.ఒక్కొక్కరు ఎంత బంగారం తేవచ్చు..⇒ దుబాయి నుంచి భారత్ కు వచ్చే పురుష ప్రయాణికులు కస్టమ్స్ ఫీజు లేకుండా 20 గ్రాముల బంగారం, మహిళలైతే 40 గ్రాములు బంగారం తీసుకురావచ్చు. ⇒ ఒకవేళ పురుషులు 50 గ్రాములు తెస్తే 3 శాతం కస్టమ్స్ ఫీజును చెల్లించాలి. 50 గ్రాముల కంటే ఎక్కువైతే 6 శాతం, 100 గ్రాములకు మించితే 10 శాతం కస్టమ్స్ ఫీజును చెల్లించాలి. ⇒మహిళా ప్రయాణికులు 100 గ్రాములు బంగారానికి 3 శాతం, 100 గ్రాములు మించితే 6 శాతం కస్టమ్స్ రుసుమును చెల్లించాలి. 200 గ్రాముల కంటే ఎక్కువైతే 10 శాతం కస్టమ్స్ ఫీజు వేస్తారు. బంగారం కొనుగోలు చేసిన రసీదులను తప్పక చూపించాలి. హీరోయిన్ అరెస్ట్.. నాలుగునెలలుగా ఇంటికి రాలేదన్న తండ్రి డీజీపీ -
రూ.50 లక్షలు, బెంజ్ కారు కావాలి
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): ప్రేమించుకుని పెళ్లికి సిద్ధమయ్యారు. కానీ అత్యాశతో వరకట్నం కోసం కక్కుర్తి పడ్డారు. అలిగిన వరుడు, అతని తల్లితండ్రులు, బంధువులు పెళ్లి మండపం నుంచి పరారయ్యారు. ఈ వింత సంఘటన బెంగళూరులో వెలుగు చూసింది. న్యాయం చేయాలంటూ వధువు తండ్రి ఉప్పారపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కాలేజీ నుంచి ప్రేమ వధువరులు ఇద్దరూ కాలేజీ రోజుల నుంచి స్నేహితులు. ప్రేమలో పడి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ప్రస్తుతం ఫ్రాన్స్‌లో ఉద్యోగాలు చేస్తున్నారు. గత ఏడాది జూలై నెలలో ఇండియాకు వచ్చిన యువతి ప్రేమ గురించి తల్లిదండ్రులకు తెలిపింది. ఇరువైపుల పెద్దలు మాట్లాడి గతేడాది జూలైలో నిశ్చితార్థం చేశారు. మార్చి 2న 2025లో వివాహం కూడా నిశ్చయించారు. గత ఫిబ్రవరి 17న షాపింగ్ కోసం ఫ్రాన్స్ నుండి ఢిల్లీకి వచ్చిన యువతి ఓ హోటల్లో బస చేసింది. ప్రియుడు ప్రేమ్ కూడా వచ్చి యూరోపియన్ సంస్కృతి ప్రకారం పెళ్లికి ముందే ఇద్దరూ శారీరకంగా కలవాలని కథలు చెప్పి ఆమెను లొంగదీసుకున్నాడు. పొద్దున పెళ్లనగా గొడవ వివాహ వేడుకల కోసం ఫిబ్రవరి 28 నుంచి మార్చి 2 వరకూ బెంగళూరు గాందీనగర్‌లోని రైల్వే ఆఫీసర్స్ ఎన్‌క్లేవ్‌లోని నంది క్లబ్‌ని బుక్ చేశారు. 28న సంగీత్, మెహందీ వేడుకలను జరిపారు. మార్చి 1న రాత్రి వరుడు, తల్లితండ్రులు గొడవకు దిగారు. రూ.50 లక్షల నగదు, అర్ధ కేజీ బంగారం, ఒక బెంజ్ కారును కట్నంగా ఇవ్వాలని పట్టుబట్టారు. వధువు తండ్రి తన చేత కాదని చెప్పాడు. కొంతసేపటికి వరుని కుటుంబం మొత్తం పరారైంది. తెల్లవారితే జరగాల్సిన పెళ్లి జరగలేదు. ఫిర్యాదు మేరకు పోలీసులు వరుడు ప్రేమ్, అతని తల్లిదండ్రులు శివకుమార్, రాధలపై కేసు నమోదు చేసుకున్నారు. -
ఐఏఎస్‌లది ఆధిపత్య ధోరణి
సాక్షి, న్యూఢిల్లీ: ఐఏఎస్ అధికారులు ఎప్పుడూ ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌లపై ఆధిపత్యం ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తారని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. అందుకే ఐఏఎస్‌ల మాట మేం ఎందుకు వినాలనే అసహనం, అసంతృప్తి ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల్లో గూడుకట్టుకుపోయిందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ఒక కేసును జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్‌ల ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. అటవీ అధికారులు తమ ఆదేశాలను పాటించాలని ఐఏఎస్ అధికారులు కోరడంపై ధర్మాసనం విస్త్రృతంగా చర్చించింది. ఇండియన్ అడ్మిస్ట్రేటివ్ సర్వీసెస్, ఇండియన్ పోలీస్ సర్వీసెస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అధికారుల మధ్య జరుగుతున్న ఈర‡్ష్య యుద్దాన్ని ప్రస్తావిస్తూ జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐఏఎస్‌లకు ఐపీఎస్, ఐఎఫ్ఎస్లకు మధ్య బేదాభిప్రాయాలు లేవని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చేసిన వాదనను జడ్జి తప్పుబట్టారు. ‘‘నేను ప్రభుత్వ న్యాయవాదిగా మూడేళ్లు పనిచేశా. న్యాయమూర్తిగా 22 ఏళ్లుగా సేవలందిస్తున్నా. ఇన్నేళ్లలో నేను గమనించింది ఏంటంటే ఐఏఎస్‌లు ఎçప్పుడూ ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌లపై ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని చూస్తుంటారు. ఈ వివాదం అన్ని రాష్ట్రాల్లో ఉంది. అందరూ ఒకే అఖిల భారత సర్వీస్‌లకు సంబంధించిన ఉన్నతాధికారులమే అయినప్పుడు ఐఎఎస్‌ల మాటే ఎందుకు వినాలి? అనే అసంతృప్తి ఐపీఎస్, ఐఎఫ్ఎస్లలో ఉంది. ఈ విధానం మారాలి. ఈ విషయంలో అందర్నీ సమానంగా చూడాలని భావన ఐఏఎస్‌లలో కల్పించండి’’ అని కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు జస్టిస్ గవాయ్ సూచించారు. అధికారుల మధ్య ఉన్న అంతర్గత వివాదాలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని కేంద్రం తరఫున తుషార్ కోర్టుకు తెలిపారు. జడ్జీలు కేసు తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదావేశారు. -
త్వరలో మన ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లకు
న్యూఢిల్లీ: భారతదేశ ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లకు (రూ.435.17 లక్షల కోట్లు) చేరుకోవడం ఇక ఎంతోదూరంలో లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. దేశంలో ఆర్థిక ప్రగతికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ప్రజలపై, ఆర్థిక వ్యవస్థపై, నవీన ఆవిష్కరణలపై భారీగా పెట్టుబడులు పెట్టాలని భాగస్వామ్యపక్షాలకు పిలుపునిచ్చారు. ఆర్థిక వృద్ధికి, ఉద్యోగాల సృష్టికి పెట్టుబడులు అత్యంత కీలకమని వివరించారు. ‘బడ్జెట్ అనంతరం ఉద్యోగాలు, ఉపాధి కల్పన’పై బుధవారం జరిగిన వెబినార్‌లో ప్రధాని మోదీ మాట్లాడారు. 2014 నుంచి తమ ప్రభుత్వం 3 కోట్ల మంది యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచి్చందని అన్నారు. దేశవ్యాప్తంగా 1,000 ఐటీఐలను అప్‌గ్రేడ్ చేయాలని, ఐదు ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’లు నెలకొల్పాలని నిర్ణయించినట్లు తెలిపారు. 2015 నుంచి 2025 దాకా ఇండియా ఆర్థిక వ్యవస్థ 66 శాతం వృద్ధి చెందినట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఐఎంఎఫ్ నివేదిక వెల్లడించినట్లు గుర్తుచేశారు. ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్థ 3.8 ట్రిలియన్ డాలర్లకు చేరుకుందని హర్షం వ్యక్తంచేశారు. వెబినార్‌లో ప్రధాని మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే... సరైన దిశలో సరైన పెట్టుబడులు ‘‘ప్రపంచంలోని అత్యున్నత ఆర్థిక వ్యవస్థలను మనం అధిగమించాం. ఇండియా త్వరలో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడం తథ్యం. ఆర్థిక వ్యవస్థ పరుగులు పెట్టాలంటే సరైన దిశలో సరైన పెట్టుబడులు పెట్టడం అత్యంత కీలకం. ఇందుకోసం కేంద్ర బడ్జెట్లో పలు ప్రతిపాదనలు చేశాం. వాటిని అమలు చేయడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. భాగస్వామ్యపక్షాలన్నీ ఇందులో పాలుపంచుకోవాలి. ఐదేళ్లలో 75 వేల మెడికల్ సీట్లు విద్యా రంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టాం. ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ భవిష్యత్తుకు బ్లూప్రింట్‌గా నిలుస్తుంది. మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, ప్రజలు, ఆర్థికం, నవీన ఆవిష్కరణలపై పెట్టుబడులకు సరిసమాన ప్రాధాన్యం ఇస్తున్నాం. యువతలో ప్రాక్టికల్ స్కిల్స్ పెంచడానికి, నూతన అవకాశాలు కలి్పంచడానికి ‘పీఎం ఇంటర్న్‌షిప్ పథకం’ ప్రవేశపెట్టాం. పరిశ్రమ వర్గాలు సైతం ఈ పథకంలో భాగస్వామిగా మారాలి. ఈ ఏడాది బడ్జెట్లో అదనంగా 10 వేల మెడికల్ సీట్లు ప్రకటించాం. రాబోయే ఐదేళ్లలో కొత్తగా 75 వేల మెడికల్ సీట్లు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.గ్లోబల్ టూరిజం, వెల్నెస్ హబ్గాఇండియా పర్యాటక రంగంలో ఉద్యోగాల కల్పనకు ఎన్నో అవకాశాలున్నాయి. అందుకే ఈ రంగానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ కలి్పంచాలని నిర్ణయం తీసుకున్నాం. దేశ జీడీపీలో 10 శాతం సమకూర్చగల సత్తా పర్యాటక రంగానికి ఉంది. దేశంలో 50 ప్రాంతాలను అద్భుతమైన పర్యాటక క్షేత్రాలుగా అభివృద్ధి చేయబోతున్నాం. అక్కడి హోటళ్లకు ఎన్నో ప్రోత్సాహకాలు ఇస్తాం. దీనివల్ల టూరిజం అభివృద్ధి చెందడంతోపాటు స్థానిక యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.అర్బన్ చాలెంజ్ ఫండ్‌కు రూ.లక్ష కోట్లు జనాభా పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణ చాలా కీలకం. ఇందులో భాగంగా అర్బన్ చాలెంజ్ ఫండ్‌కు రూ.లక్ష కోట్లు కేటాయించాలని నిర్ణయించాం. ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణ కోసం ప్రైవేట్ రంగం.. ప్రధానంగా రియల్ ఎసేŠట్ట్ చొరవ తీసుకోవాలి. దేశ ఆర్థిక ప్రగతిలో కృత్రిమ మేధ పాత్ర ఎంతో కీలకం. అందుకే ఏఐ ఆధారిత విద్య, పరిశోధనల కోసం బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించాం. ఏఐ కెపాసిటీని అభివృద్ధి చేయడానికి నేషనల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్‌ను ఏర్పాటు చేయబోతున్నాం’’ అని ప్రధాని మోదీ వివరించారు. -
త్వరలో ల్యాండ్ గ్రాబింగ్ ప్రొవిజన్ బిల్లు
సాక్షి, న్యూఢిల్లీ: త్వరలో రాష్ట్రంలో ‘ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొవిజన్’ బిల్లును తీసుకురానున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌తో ఆయన వేర్వేరుగా భేటీ అయ్యారు. అనంతరం ఎంపిక చేసుకున్న మీడియాతో సీఎం సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఐదేళ్లలో అనేక భూములు కబ్జాకు గురయ్యాయని ఆరోపించారు. ప్రతి పది కేసుల్లో ఆరు భూ వివాదాలకు సంబంధించినవే అన్నారు. భూముల కంప్యూటరీకరణలో సరైన విధానం లేక సమస్యలు ఎదురవుతున్నట్లు చెప్పారు. ప్రైవేటు భూములను బలవంతంగా 22ఏలో చేర్చారని.. అటవీ భూములను అధికారులతో కలిసి ఆక్రమించారని ఆరోపించారు. గుజరాత్లో ల్యాండ్ గ్రాబింగ్ బిల్లు విజయవంతంగా అమలవుతోందని, దాని అమలును ఏపీలో కూడా అనుమతించాలని కోరినట్లు చెప్పారు. డీలిమిటేషన్ నిరంతర ప్రక్రియనియోజకవర్గాల పునర్విభజన అనేది నిరంతర ప్రక్రియ అని.. దీనిపై సమయానుకూలంగా స్పందిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. గతంలో జనాభా నియంత్రణను ప్రోత్సహించానని, ఇప్పుడు జనాభాను పెంచాలనే విషయం అర్థమై పిలుపునిస్తున్నట్లు చెప్పారు.పోలవరం 2027 కల్లా పూర్తిగత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల బకాయిలను వదిలిపెట్టిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలకు తెలిపినట్లు చంద్రబాబు చెప్పారు. రాయలసీమ వంటి కరువు ప్రాంతాలకు నీరందించేందుకు.. సముద్రంలో కలిసే జలాలను వినియోగించుకుంటామని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామన్నారు. పోలవరంను 2027 కల్లా పూర్తి చేస్తామని తెలిపారు. 189 కి.మీ. మేర అమరావతి ఔటర్ఎనిమిది లైన్లతో 189 కి.మీ. మేర అమరావతి ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించినట్లు చంద్రబాబు చెప్పారు. శ్రీశైలం ఆలయం వద్ద ట్రాఫిక్ రద్దీని పరిష్కరించేందుకు రోడ్డును విస్తరించాలని, వినుకొండ–అమరావతి తదితర ప్రాజెక్టులపై చర్చించినట్లు తెలిపారు. డీపీఆర్‌లు సిద్ధం చేసిన తర్వాత టెండర్లు పిలుస్తామని గడ్కరీ చెప్పారని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రానికి రూ.6.5 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయన్నారు. మిర్చి క్వింటాకు రూ.11,781 మద్దతు ధర ఇచ్చేందుకు కేంద్రం ఒప్పుకొందన్నారు. కాగా, ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అవుతున్న 5 ఎమ్మెల్సీ స్థానాల సర్దుబాటుకే చంద్రబాబు ఢిల్లీ వచ్చారని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. -
చాలా బాగుంది.. ఎలా తయారు చేస్తారు?
సాక్షి, న్యూఢిల్లీ/భద్రాచలం: ‘యే క్యాహై?.. బహుత్ అచ్ఛా హై.. ఇస్కో కైసే బనాతే హో? (ఇదేంటి? చాలా బాగుంది..! ఎలా తయారు చేస్తారు?)’.. అంటూ అగ్గిపెట్టెలో పట్టేలా చేతితో నేసిన చీరను చూసి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆశ్చర్యానికి గురయ్యారు. సిరిసిల్ల చేనేత కళాకారులపై ప్రశంసలు కురిపిస్తూ చీర తయారీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. బుధవారం రాష్ట్రపతి భవన్‌లోని అమృత్ ఉద్యాన్‌లో రాష్ట్రపతి ముఖ్యఅతిథిగా ‘వివిధతా కా అమృత్ మహోత్సవ్’ సౌత్ ఎడిషన్ ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంబోత్సవానికి ముందు తెలంగాణ పెవిలియన్‌ను సందర్శించిన రాష్ట్రపతిని.. గవర్నర్, ఉపముఖ్యమంత్రి సాదరంగా ఆహ్వానించి తెలంగాణ చేనేత కళాకారుల పనితనాన్ని, చేతివృత్తుల ప్రాముఖ్యతను వివరించారు. ఉత్సవ ప్రారంభంలో కళాకారులు ప్రదర్శించిన గుస్సాడీ నృత్యం ఆహూతులను అలరించింది. ఈనెల 9 వరకు ఉత్సవం కొనసాగనుంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పెవిలియన్‌లో రాష్ట్రానికి చెందిన పద్మశ్రీ పురస్కార గ్రహీతలు గజం అంజయ్య, గజం గోవర్ధన్‌తో సహా 20 మంది పలు ప్రాంతాలకు చెందిన ప్రముఖ చేనేత కార్మికులు, 20 మంది నిపుణులతో స్టాళ్లు ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి భవన్లో ‘భద్రాద్రి’ ఉత్పత్తులు తెలంగాణ నుంచి భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని మహిళలు రూపొందించిన పలు రకాల సబ్బులు, షాంపూలు, మిల్లెట్ బిస్కెట్లు, కరక్కాయ పౌడర్, తేనె, న్యూట్రీ మిక్స్ ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచినట్టు పీఓ రాహుల్ తెలిపారు. ఆదివాసీ గిరిజన మహిళలు రూపొందించే ఉత్పత్తులు, వాటి వల్ల ప్రయోజనాలను ఇతర రాష్ట్రాల ప్రతినిధులు, ప్రజలకు తెలియజేసి ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేలా గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరీ సూచనలతో ఈ స్టాళ్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. -
ఔరంగజేబ్‌ను పొగిడిన ఎస్పీ ఎమ్మెల్యే సస్పెన్షన్
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీలో మొఘల్ చక్రవరి ఔరంగజేబ్‌పై పొగడ్తలు కురిపించిన సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అబూ ఆసిమ్ అజ్మీపై సస్పెన్షన్ వేటుపడింది. ఈ నెల 26వ తేదీ వరకు కొనసాగే ప్రస్తుత బడ్జెట్ సమావేశాల నుంచి ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్లు బుధవారం స్పీకర్ ప్రకటించారు. ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా అయిన అజ్మీ మంగళవారం..‘ఔరంగజేబ్ హయాంలో భారతదేశ సరిహద్దులు అఫ్గానిస్తాన్, మయన్మార్ వరకు విస్తరించాయి. అప్పట్లో ప్రపంచ జీడీపీలో మన జీడీపీ వాటా 24 శాతం వరకు ఉంది. అది భారత్‌కు స్వర్ణయుగమైంది’అని పేర్కొన్నారు. ఔరంగజేబ్, ఛత్రపతి శంభాజీ మహారాజ్ మధ్య జరిగిన యుద్ధాన్ని ఆయన రాజకీయ పోరాటంగా అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలపై ఉభయసభలు దద్దరిల్లాయి. డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే తీవ్రంగా స్పందించారు. ‘అజ్మీ ఉద్దేశ పూర్వకంగానే శివాజీని, సంభాజీని అవమానించారు. ఔరంగజేబ్‌ను పొగిడారు. అటువంటి అజ్మీ ద్రోహి, అసెంబ్లీలో కూర్చునే అర్హత ఆయనకు లేదు’అని నిప్పులు చెరిగారు. ‘ఔరంగజేబ్ క్రూరమైన చర్యలను ఎదుర్కొంటూ సంభాజీ ప్రదర్శించిన ధైర్యసాహసాలను వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. మతం మార్చుకోవాలంటూ సంభాజీని ఔరంగజేబ్ 40 రోజుల పాటు చిత్రహింసలకు గురిచేశాడు. అతడు హిందువులను మాత్రమే కాదు, ఇతర మతస్తులను సైతం చంపించాడు’అని చెప్పారు. ఔరంగజేబ్‌ను పొగడటం అంటే ఛత్రపతి శివాజీని, ఆయన కుమారుడు సంభాజీని అవమానించడమేనని సభ్యులు ఆరోపించారు. అజ్మీని సస్పెండ్ చేసి, దేశ ద్రోహం కింద కేసు నమోదు చేయాలని అధికార పక్ష సభ్యులు డిమాండ్ చేశారు. అజ్మీని మిగతా కాలం సమావేశాల నుంచి సస్పెండ్ చేయాలంటూ బుధవారం మంత్రి చంద్రకాంత్ పాటిల్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది.నా వ్యాఖ్యలను వక్రీకరించారు: అజ్మీ‘ఔరంగజేబ్‌ను గురించి నేను చెప్పిన విషయాలన్నీ చరిత్రకారులు, వివిధ రచయితలు పేర్కొన్నవే. శివాజీ, సంభాజీకి ఇతర మహనీయులకు వ్యతిరేకంగా నేనెలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. అయినప్ప టికీ, నా వ్యాఖ్యలు ఎవరికైనా మనస్తాపం కలిగించి ఉంటే వాటిని వెనక్కి తీసుకుంటాను’అని పేర్కొంటూ అజ్మీ ఓ వీడియో విడుదల చేశారు. తను పేర్కొన్న విషయాల్లో ఎలాంటి తప్పు లేకున్నా వాటిని వక్రీకరించారని ఆరోపించారు. ‘సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించరాదనే ఉద్దే శంతో అసెంబ్లీ వెలుపల మాట్లాడానని, అయినప్ప టికీ తనను సస్పెండ్ చేశారు’అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.అజ్మీని మా దగ్గరికి పంపించండి: యూపీ సీఎం యోగి‘ఔరంగజేబ్‌ను ప్రశంసించిన ఎస్పీ ఎమ్మె ల్యే అజ్మీని ఉత్తరప్రదేశ్‌కు పంపించండి. ఇటు వంటి వాళ్లని ఏం చేయాలో మా రాష్ట్ర ప్రజలకు తెలుసు’ అని సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొ న్నారు. ఔరంగజేబ్‌ని హీరో అంటూ పొగిడిన అజ్మీకి దేశంలో ఉండే అర్హతుందా అని ప్రశ్నించారు. అజ్మీ వ్యాఖ్య లపై వైఖరిని వెల్లడించాలని ఎస్పీని డిమాండ్ చేశారు. అజ్మీని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. -
‘నా భార్య నా రక్తం తాగేస్తోంది.. ఏం చేయమంటారు!’
లక్నో: ‘నా భార్యకు నాకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. తను ప్రతి రోజు నా కలలోకి వస్తుంది. నా గుండెలపై కూర్చుంటుంది. నా రక్తాన్ని తాగేందుకు ప్రయత్నిస్తుంది. అందుకే నేను నిద్ర పోలేకపోతున్నా. ఫలితమే నా విధుల్లో సమయ పాలన పాటించలేకపోతున్నా’అంటూ ఓ పారామిలటరీ జవాన్ తన కమాండర్‌కు లేఖ రాశారు. ఆ లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భార్య పోరు పడలేక సదరు జవాన్ రాసిన ఆ లేఖను లక్షల మంది నెటిజన్లు షేర్ చేస్తున్నారు. ఇంతకి ఏం జరిగింది?దేశంలో శాంతి భద్రతలకు విఘూతం కలగకుండా డేగ కన్నుతో నిత్యం రక్షణ కల్పించే పారా మిలరీ విభాగంలో ప్రొవిన్సియల్ ఆర్మ్డ్ కానిస్టేబులరీ (pac) విభాగం ఉంది. ఉత్తరప్రదేశ్ కేంద్రంగా 44వ ప్రదేషిక్ ఆర్మ్డ్ కాన్స్టేబులరీ (Pradeshik Armed Constabulary) విభాగంలో ఓ జవాన్ విధులు నిర్వహిస్తున్నారు. విధుల్లో సిన్సియర్‌గా, స్ట్రిక్ట్‌గా ఉండే సదరు జవాన్‌లో ఇటీవల కాలంలో సమయ పాలన లోపించింది. డ్యూటీ టైంకు రాకపోవడం,షేవింగ్ చేసుకోకపోవడం, చిందవందరగా యూనిఫారమ్ ధరించడం, ఇచ్చిన పనిని సకాలంలో చేయకుండా ఆలస్యం చేస్తుండేవారు.విధుల్లో నిర్లక్ష్యం.. అందుకు కారణంఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ గత నెల 17న పీఏసీ 44వ బెటాలియన్ జీస్వ్కాడ్ కమాండర్ మదుసూధన్ శర్మ సదరు జవాన్‌కు విధుల్లో అలసత్వం వహిస్తున్నారని, వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసుల్లో.. మందురోజు విధులు ఎలా జరిగాయో తెలుసుకుని.. ఆ రోజు విధులు ఎక్కడ నిర్వహించాలో ప్రతి రోజు ఉదయం బ్రీఫింగ్ ఉంటుంది. ఆ బ్రీఫింగ్‌కు గైర్హాజరు కావడం కాకుండా ఆలస్యంగా రావడం, మిలటరీ విభాగంలో విధులు నిర్వహించే వారు తప్పని సరిగా ఫుల్ షేవింగ్ చేసుకోవాలి. కానీ అలా షేవింగ్ చేసుకోకుండా విధులు నిర్వహించడం, ఇష్టానుసారంగా యూనిఫారమ్ ధరించడం, ఇచ్చిన పనిని సకాలంలో పూర్తి చేయకుండా ఆలస్యం ఎందుకు చేస్తున్నారో లేఖలో పేర్కొన్నారు. వివరణ ఇచ్చేందుకు ఒకరోజు సమయం కూడా ఇచ్చారు.అసలేం జరిగిందంటే?కమాండర్ నుంచి వచ్చిన లేఖపై సదరు పీఏసీ జవాన్ వివరణ ఇచ్చారు. తాను విధుల్లో ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నారో భావోద్వేగంతో పలు కారణాల్ని జత చేశారు. ‘సార్ నేను ఫిబ్రవరి 16న డ్యూటీకి ఆలస్యంగా వచ్చాను. ఎందుకంటే వ్యక్తిగత సమస్యలు నన్ను తీవ్రంగా వేధిస్తున్నాయి. వాటి వల్ల రాత్రిపూట నిద్రపోవడం కష్టంగా మారింది. కొద్ది రోజుల క్రితం నా భార్యతో గొడవలు జరిగాయి. గొడవ తర్వాత నా భార్య నా కలలోకి వస్తుంది. నా గుండెలపై కూర్చుకుంటుంది. నా రక్తాన్ని తాగేందుకు ప్రయత్నిస్తుంది. దీనికి తోడు నా తల్లిని అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. కారణంగా నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నాను. తీవ్ర మనోవేధనకు గురవుతున్నా. దీని నుంచి భయటపడేందుకు చికిత్స తీసుకుంటున్నాను. నేను పడుతున్న కష్టాల నుంచి విముక్తి కలిగించేలా ఓ దారి చూపాలని ఆ లేఖలో ప్రాధేయపడ్డారు. ఆ లేఖపై 44వ బెటాలియన్ పీఏసీ కమాండంట్ సత్యేంద్ర పటేల్ స్పందించారు. ఆన్లైన్లో వైరల్ అవుతున్న లేఖ నిజమేనా? అదే నిజమైతే ఎవరు రాశారో? పరిశీలిస్తాం. సదరు జవాన్‌కు ఇబ్బందులు ఉంటే అతనికి అండగా నిలుస్తాం. చికిత్స కూడా అందిస్తాం’అని అన్నారు. -
రాహుల్ గాంధీకి కోర్టు రూ.200 జరిమానా.. ఎందుకంటే?
లక్నో: లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీకి (Rahul Gandhi) కోర్టు ఫైన్ విధించింది. స్వాతంత్య్ర సమరయోధుడు వీర్‌సావర్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను రాహుల్‌పై పరువు నష్టం దావా కేసు నమోదైంది. అయితే, ఈ కేసు విచారణలో భాగంగా రాహుల్ గాంధీ లక్నోలోని అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ (acjm)ముందు హాజరు కావాల్సి ఉంది.కానీ రాహుల్ కోర్టు విచారణకు గైర్హాజరయ్యారు. రాహుల్ తీరుపై ఏసీజేఎం న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.200 ఫైన్ విధించారు. ఇదే కేసులో ఏప్రిల్ 14న కోర్టు విచారణకు తప్పని సరిగా హాజరు కావాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. -
వాళ్ల కల హిందీయా.. కేంద్రంపై కమల్ హాసన్ విసుర్లు
ప్రముఖ నటుడు.. తమిళనాడు రాజకీయ నేత కమల్ హాసన్(Kamal Haasan) కేంద్రంలోని బీజేపీపై భగ్గుమన్నారు. హిందీయేతర రాష్ట్రాలపై బలవంతంగా భాషను రుద్దే ప్రయత్నం ఏమాత్రం సహించరానిదని.. అన్ని రాష్ట్రాలను హిందీ రాష్ట్రాలుగా మార్చేసి లబ్ధి పొందాలని బీజేపీ ప్రయత్నిస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారాయన.బుధవారం తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అధ్యక్షతన అఖిలపక్ష పార్టీల సమావేశం జరిగింది. ఈ భేటీకి మక్కల్ నీది మయ్యం తరఫున కమల్ హాసన్ పాల్గొన్నారు. జాతీయ విద్యా విధానం హిందీ భాషను తప్పించడంతో పాటు.. 1971 జనాభాల లెక్కల ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) చేపట్టాలని కేంద్రానికి వ్యతిరేకంగా డిమాండ్లతో ఈ భేటీలో ఓ తీర్మానం చేశారు. అనంతరం.. జరిగిన ఎంఎన్ఎం పార్టీ మీటింగ్‌లో కమల్ కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘మన కల ఇండియా. కానీ వాళ్ల కల హిందీయా. బలవంతంగా హిందీని హిందీయేతర ప్రాంతాలకు రుద్దాలన్నదే వాళ్ల ప్రయత్నం. తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారు. అది నెరవేరకుండా తమిళులంతా ఏకమై పోరాడాలి’’ అని పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారాయన. అయితే హిందీయా కామెంట్లు గతంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చేయడం గమనార్హం. 2019లో హిందీ దివస్ సందర్భంగా కేంద్ర మంత్రి అమిత్ షా.. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఉన్న ఏకైక భారతీయ భాష హిందీనేనని పేర్కొన్నారాయన. అయితే.. ఈ పోస్టుకి నాడు డీఎంకే అధ్యక్షుడిగా ఉన్న స్టాలిన్ కౌంటర్ ఇచ్చారు. ఇది ఇండియా అని.. హిందీయా కాదని కౌంటర్ పోస్ట్ చేశారు. ఇదిలా ఉంటే.. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ద్వారా తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాల్లో పార్లమెంట్ స్థానాలు తగ్గుతాయంటూ తమిళనాడు కొంతకాలంగా చెబుతోంది. ఈ వ్యాఖ్యలను కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కొట్టిపడేశారు. అయినప్పటికీ దీనిపై పలు రాష్ట్రాల తమ ఆందోళనను వ్యక్తంచేస్తున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రలోని బీజేపీ, ఇతర రాష్ట్రాల్లోని పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై మరో ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్ (Vijay) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తుందదని.. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అంగీకరించమని ఓ ప్రకటనలో తెలిపారాయన. -
అమెరికాలో కాల్పుల కలకలం.. తెలుగు విద్యార్థి మృతి
వాషింగ్టన్: అమెరికాలో కాల్పులు కలకలం సృష్టించాయి. మిల్వాకీ కౌంటీ విస్కాన్సిన్ రాష్ట్రం మిల్వాకీ నగరంలో దుండగులు తెలంగాణలోకి రంగారెడ్డి జిల్లా కేశం పేటకు చెందిన ప్రవీణ్‌పై (27) కాల్పులు జరిపారు.దుండగుల జరిపిన కాల్పుల్లో ప్రవీణ్ మృతి చెందాడు. ఎంఎస్ సెకండియర్ చదువుతున్న ప్రవీణ్ మృతిపై సమాచారం అందుకున్న అతని కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
కుటుంబం తలరాత మార్చిన ‘కుంభమేళా’.. 30 కోట్లు సంపాదన
లక్నో: ఇటీవల ముగిసిన మహాకుంభమేళా నిర్వహణపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న వేళ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దీటుగా బదులిచ్చారు. పడవలు నడిపే కుటుంబాలకు పెద్దగా ఒరిగిందేమీ లేదని సమాజ్‌వాదీ పార్టీ చేసిన విమర్శకు రాష్ట్ర బడ్జెట్‌పై చర్చ సందర్భంగా శాసనసభలో సీఎం యోగి సమాధానమిచ్చారు.ఈ సందర్భంగా సీఎం యోగి మాట్లాడుతూ..‘45 రోజులపాటు కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన సనాతన ఆధ్యాత్మిక వైభవం మహాకుంభ్‌మేళా. ప్రయాగ్‌రాజ్‌లో ఒక కుటుంబం విజయగాథ చెప్తా. ఆ కుటుంబానికి 130 పడవలు ఉన్నాయి. 45 రోజుల కుంభమేళా రోజుల్లో ఈ కుటుంబం ఏకంగా రూ.30 కోట్ల లాభాలను కళ్లజూసింది. అంటే ఒక్కో బోటు రూ.23 లక్షల లాభాల తెచ్చింది. రోజుల లెక్కన చూస్తే ఒక్కో బోటు నుంచి రోజుకు రూ.50,000 నుంచి రూ.52,000 లాభం వచ్చింది’ అని అన్నారు.ఇదే సమయంలో కుంభమేళా వివరాలను యోగి వెల్లడించారు. ఒక్క తొక్కిసలాట ఘటన తప్పితే 45 రోజుల్లో ఏకంగా 66 కోట్ల మంది భక్తులు సంతోషంగా మేళాకు వచ్చి వెళ్లారు. ఒక్క నేరం జరగలేదు. మహిళలపై వేధింపులు, కిడ్నాప్, దోపిడీ, హత్య ఘటన ఒక్కటి కూడా జరగలేదు అని అన్నారు.One Boatman family who has 130 boats earn ₹ 30cr in just 45 days during the Kumbh Mela. pic.twitter.com/7UhvKZZosc— Farrago Abdullah Parody (@abdullah_0mar) March 4, 2025వేల కోట్లు పెడితే లక్షల కోట్ల వ్యాపారం..కుంభమేళాకు ఏర్పాట్లు, రక్షణ, భద్రత తదితరాల కోసం అయిన మొత్తం ఖర్చు రూ.7,500 కోట్లు. 200కుపైగా రోడ్లను వెడల్పు చేశాం. 14 ఫ్లైఓవర్లు కట్టాం. 9 అండర్‌పాస్‌లు నిర్మించాం. 12 కారిడార్లను సిద్ధంచేశాం. దీంతో పలు రంగాల్లో మొత్తంగా ఏకంగా రూ.3 లక్షల కోట్ల వ్యాపారం జరిగింది. హోటల్ రంగంలో రూ.40,000 కోట్ల వ్యాపారం జరిగింది. ఇక ఆహారం, నిత్యావసరాల విభాగంలో రూ.33,000 కోట్లు, రవాణారంగంలో రూ.1.5 లక్షల కోట్ల వ్యాపారం జరిగింది. రూ.660 కోట్ల విరాళాలు వచ్చాయి. జాతీయరహదారుల వెంట టోల్‌ట్యాక్స్ రూపంలో రూ.300 కోట్లు వచ్చాయి. ఇతర రెవిన్యూ మార్గాల్లో రూ.66,000 కోట్ల వ్యాపారం జరిగింది. ఈఏడాది దేశ స్తూలజాతీయోత్పత్తికి కుంభమేళా సైతం తన వంతు వాటాను అందించింది అని యోగి చెప్పారు. -
సగం జనాభా లావెక్కింది
న్యూఢిల్లీ: ప్రపంచ జనాభాలో సగానికి పైగా వయోజనులు ఊబకాయులుగా మారిపోయారు! 2050 నాటికి ఇది 57 శాతం దాటనుంది. అంతేగాక పిల్లలు, టీనేజర్లు, యువకుల్లో మూడింట ఒక వంతు ఊబకాయులుగా మారొచ్చని లానెస్ట్ జర్నల్ అంచనా వేసింది. 200 పైగా దేశాలకు చెందిన గ్లోబల్ డేటాను విశ్లేషించిన మీదట ప్రచురించిన తాజా అధ్యయనంలో ఈ వివరాలను వెల్లడించింది. దశాబ్ద కాలంలో ముఖ్యంగా అల్పాదాయ దేశాల్లో ఊబకాయం వేగంగా పెరుగుతోందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దీని కట్టడికి ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌లోని ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ (ఐహెచ్ఎంఈ)కు చెందిన ప్రొఫెసర్ ఇమ్మాన్యుయేల్ నాయకత్వంలో ఈ పరిశోధన జరిగింది. ఊబకాయుల సంఖ్య 1990తో పోలిస్తే నేడు రెట్టింపైంది. 2021 నాటికి ప్రపంచ వయోజనుల్లో సగం మంది ఊబకాయులుగా మారిపోయారు. 25 ఏళ్లు, అంతకు పైబడ్డ వారిలో ఏకంగా 100 కోట్ల పురుషులు, 111 కోట్ల మంది మహిళలు అధిక బరువుతో బాధపడుతున్నారు. ఈ ధోరణులు ఇలాగే కొనసాగితే 2050 ప్రపంచవ్యాప్తంగా వయోజనుల్లో ఊబకాయుల సంఖ్య పురుషుల్లో 57.4 శాతానికి, స్త్రీలలో 60.3 శాతానికి పెరగవచ్చు. ఇక 1990 నుంచి 2021 నాటికి పిల్లలు, టీనేజర్లలో ఊబకాయులు 8.8 శాతం నుంచి 18.1 శాతానికి పెరిగారు. 20–25 మధ్య వయసు యువతలో 9.9 నుంచి 20.3 శాతానికి పెరిగింది. చైనాలో 62 కోట్లు ఊబకాయుల సంఖ్య 2050 నాటికి చైనాలో 62.7 కోట్లు, భారత్‌లో 45 కోట్లు, అమెరికాలో 21.4 కోట్లకు చేరనుంది. సబ్ సహారా ఆఫ్రికా దేశాల్లో ఈ సంఖ్య ఏకంగా 250 శాతానికి పైగా పెరిగి 52.2 కోట్లకు చేరుతుదని అంచనా. నైజీరియా 2021లో 3.66 కోట్ల మంది అధిక బరువుతో ఉండగా 2050 కల్లా 14.1 కోట్లకు చేరనుంది. సామాజిక వైఫల్యం... వయోజనుల్లో సగం ఊబకాయులే కావడాన్ని సామా జిక వైఫల్యంగా చూడాలని ప్రొఫెసర్ ఇమ్మాన్యుయేల్ అన్నారు. యువతలో ఊబకాయం వేగంగా పెరుగుతుండటం ఆందోళనకరమన్నారు. ‘‘కొత్తగా వచ్చిన బరువు తగ్గించే మందుల ప్రభావాన్ని అధ్యయనం పరిగణనలోకి తీసుకోలేదు. ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకుంటే విపత్తును ఎంతో కొంత నివారించవచ్చు’’అని ఆమె వెల్లడించారు. ఆరోగ్య వ్యవస్థలకు సవాలు ఊబకాయం పెరగడం ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలకు సవాలేనంటున్నారు ఆస్ట్రేలియాలోని మర్డోక్ చి్రల్డన్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన డాక్టర్ జెస్సికా కెర్. ‘‘పిల్లలు, టీనేజర్ల విషయంలో ఇప్పట్నుంచే శ్రద్ధ పెడితే ఊబకాయాన్ని నివారించడం సాధ్యమే. యూరప్, దక్షిణాసియా దేశాల్లో పిల్లలు, టీనేజర్లు అధిక బరువుతో ఉన్నట్టు అధ్యయనంలో తేలింది.ఉత్తర అమెరికా, ఆస్ట్రలేషియా, ఓషియానియా, ఉత్తర ఆఫ్రికా, పశ్చిమాసియా, లాటిన్ అమెరికా దేశాల్లో కూడా ఊబకాయుల సంఖ్య భారీగా పెరుగుతోంది. టీనేజీ బాలికల్లో ఎక్కువగా ఉంది’’అని చెప్పారు. భావి తరాలు అనారోగ్యం బారిన పడకుండా చూడటం, ఆర్థిక, సామాజిక నష్టాలను నివారించడం తక్షణ కర్తవ్యమని సూచించారు. -
డ్రైవర్‌ను చెప్పుతో కొట్టిన మాజీ సీఎం కుమార్తె!
గౌహతి: ఓ ఆటోడ్రైవర్‌ను మాజీ సీఎం కుమార్తె చెప్పుతో కొట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. హై సెక్యూరిటీ మధ్య డ్రైవర్‌ను మొకాళ్లపై కూర్చొబెట్టి మాజీ సీఎం కుమార్తె చెప్పుతో కొడుతున్న దృశ్యాల్ని స్థానికులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.అస్సాం రాజధాని గౌహతిలోని శివారు ప్రాంతమైన డిస్పూర్లోని రాష్ట్ర ప్రజాప్రతినిధులు నివాసం ఉండే ఎమ్మెల్యే హాస్టల్లో మాజీ సీఎం ప్రఫుల్ల కుమార్ మహంత కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రఫుల్ల కుమార్ మహంత కుమార్తె ప్రజోయితా కశ్యప్ ఆటోడ్రైవర్‌ను దుర్భాషలాడుతూ చితక బాదారు.A video of an incident allegedly involving former Assam CM Prafulla Kumar Mahanta's daughter, has gone viral on social media.The footage purportedly shows her thrashing the driver and making him hold his ear, leading to accusations of mental harassment. The incident reportedly… pic.twitter.com/ibx9EKoReV— India Today NE (@IndiaTodayNE) March 3, 2025ఈ ఘటన వెలుగులోకి ప్రజోయితా కశ్యప్ స్పందించారు. బాధితుడు తన ఇంట్లో సుదీర్ఘకాలంగా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఎప్పుడూ తాగుతూ ఉంటాడు. తాగిన ప్రతీసారి నా గురించి చెడుగా మాట్లాడేవాడు. ఇది సరైన పద్దతి కాదని పలు మార్లు చెప్పా.ఈ విషయం అందరికి తెలుసు.ఈ రోజు మద్యం మత్తులో మా ఇంటి బాదాడు. అందుకే కొట్టా’నని తెలిపారు. అయితే, అసభ్యంగా ప్రవర్తించే డ్రైవర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారా? బాధితుడు ప్రభుత్వ డ్రైవరా? ప్రైవేట్ డ్రైవరా? అని ప్రశ్నిస్తే ఆమె నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. అస్సాం గణ పరిషత్ మాజీ అధ్యక్షుడు ప్రఫుల్లకుమార్ మహంత రెండుసార్లు అస్సాం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. -
‘నీ వల్లే నా జీవితాన్ని ఇక్కడితో ముగిస్తున్నా’.. అంటూ వీడియో కాల్
అతనొక టైలర్. వృత్తి చేసుకుంటూ జీవనం సాగించడానికి ఒక ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ అంతా ప్రశాంతంగానే గడిచింది. తిరిగి సొంతూరికి వచ్చిన తర్వాత ఒక మహిళతో వివాహేతర సంబంధానికి దారి తీయగా, అ సంబంధం కాస్తా ఇప్పుడు అతన్ని ప్రాణాలు తీసింది. చాలా కాలం ఆమెతో వివాహేతర బంధాన్ని కొనసాగించిన సదరు వ్యక్తి.. ఆమె బ్లాక్ మెయిలింగ్ కు బలయ్యాడు. ఆమె వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు. తాను చనిపోతున్న విషయాన్ని ఆమెకు వీడియో కాల్ లో తెలిపి మరీ చనిపోయాడు.వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నావ్ జిల్లాకు చెందిన అల్తాఫ్ అనే వ్యక్తి మహారాష్ట్రలోని థానేలో టైలర్ గా జీవనం సాగిస్తున్నాడు. గతేడాది తన తల్లి చనిపోయినప్పుడు ఇంటికి వచ్చిన అల్తాఫ్.. ఆపై థానేకు తిరిగి వెళ్లిపోయాడు. అయితే అతని కుటుంబ సభ్యులు ఇక్కడే(థానే)లో పని చేసుకోమని చెప్పడంతో అక్కడకు తిరిగి వచ్చేశాడు. ఈ క్రమంలోనే సమీప బంధువులైన ఒక మహిళతో అల్తాఫ్ కు వివాహేతర బంధం ఏర్పడింది. అయితే మహిళతో వివాహేతర సంబంధాన్ని గ్రహించిన అతని కుటుంబ సభ్యులు.. తిరిగి థానేకు పంపించేశారు.అయినప్పటికీ ఆ మహిళ.. అతన్ని ఫోన్ లో వేధింపులకు గురి చేసింది. తాను కడుపుతో ఉన్నానని, రూ. 10 వేల నుంచి లక్ష వరకూ పంపాలంటూ డిమాండ్ చేసిందని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తప్పుడు కేసు బనాయించిన సదరు మహిళ.. డబ్బుల కోసం వేధించేదని అల్తాఫ్ సోదరి అంటోంది. జైలుకు పంపుతానని బెదిరింపులకు గురి చేయడంతోనే తన సోదరుడు బలవన్మరణానికి పాల్పడ్డాడని సోదరి రేష్మ స్పష్టం చేసింది.చనిపోతున్నానని చెప్పినా..తాను చనిపోయే ముందు వివాహేత బంధం కొనసాగించిన మహిళకు వీడియో కాల్ చేశాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, నీ వేధింపులు భరించలేక చనిపోవాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. ‘చనిపోతే చనిపో.. నాకేమీ నష్టం లేదు. నాకు భర్త ఉన్నాడు. నువ్వు చనిపోవడం వల్ల నేనేమీ కోల్పోను’ అని చెప్పినట్లు వీడియో కాల్ లో రికార్డు అయ్యింది.నేను విషం తీసుకుంటున్నా. నేనేమీ డ్రామా ఆడటం లేదు. నేను బాధలో ఉన్నా. నువ్వు అర్థం చేసుకోవడం లేదు. నీవల్ల నా జీవితాన్ని ఇక్కడితో ముగిస్తున్నా’ అంటూ మరొక వీడియో కాల్ లో రికార్డు అయ్యింది. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
రూ.10 కోసం తండ్రిని చంపి.. తలతో పోలీస్ స్టేషన్‌కు..
బారిపడా: ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో దారుణం జరిగింది. 40 ఏళ్ల వ్యక్తి 'గుట్కా' కొనడానికి తన తండ్రిని రూ.10 అడిగాడు. ఇవ్వడానికి నిరాకరించిన తండ్రిని తల నరికి చంపేశాడు. నిందితుడు.. తండ్రి తలను చందువా పోలీస్ స్టేషన్‌కు తీసుకుని వచ్చి లొంగిపోయాడు. మృతి చెందిన వ్యక్తిని బైధర్ సింగ్‌గా పోలీసులు గుర్తించారు.తల్లిదండ్రులు, నిందితుడికి మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకోగా, తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ వ్యక్తి తండ్రిని దారుణంగా హత్య చేశాడు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన అతని తల్లి అక్కడి నుంచి పారిపోయింది. పోలీస్ అధికారి మాట్లాడుతూ చిన్న సమస్య హత్యకు దాని తీసిందని తెలిపారు. పోలీసులు ఫోరెన్సిక్ బృందంతో కలిసి గ్రామానికి చేరుకున్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. -
బెంగుళూరు ఎయిర్‌పోర్ట్‌లో కన్నడ నటి అరెస్ట్
బెంగుళూరు: బెంగుళూరు ఎయిర్‌పోర్టులో భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. కన్నడ హీరోయిన్ రాన్యారావును గోల్డ్ స్మగ్లింగ్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి బెంగుళూర్‌కు 14 కేజీల బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తుండగా డీఆర్ఐ అధికారులకు పట్టుబడ్డారు. రాన్యారావును అధికారులు ప్రశ్నిస్తున్నారు. కాగా, అధికారులకు తాను డీజీపీ కూతురినంటూ రన్యారావు చెప్పినట్లు సమాచారం.తరచుగా దుబాయ్ వెళ్లే రన్యారావు.. ఈసారి కూడా వెళ్లి మార్చి 3వ తేదీ రాత్రి తిరిగి దుబాయ్ నుంచి వచ్చింది. బెంగుళూరు ఎయిర్ పోర్ట్‌లో అనుమానంతో ఆమెను అధికారులు చెక్ చేయగా, స్మగ్లింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆమె దుస్తులలో 14.8 కిలోల బంగారం బయటపడింది. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ దాదాపు రూ.12 కోట్లు ఉంటుందని అంచనా. కాగా, కన్నడలో సుదీప్తో మాణిక్య సినిమాలో రాన్యా నటించింది. -
‘మీ నాన్నను అడుగు.. నేను ఏం చేశానో?
పాట్నా: బీహార్ రాష్ట్రంలో తిరుగులేని నేతగా వెలుగొందుతున్న జేడీయూ నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్. ఒకప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ హవా నడిస్తే.. ఇప్పుడు నితీష్ కుమార్ దే శాసనం. అటు ఇండియా కూటమిలో ఉండాలన్నా, అంతే త్వరగా దానికి ఎండ్ కార్డ్ వేసి ఎన్డీయే కూటమిలో చేరాలన్నా ఆయనకే చెల్లింది. ఆయన ఏ కూటమితో జట్టు కట్టినా తన సీఎం పదవికి ఢోకా లేకుండా చూసుకుంటూ రాజకీయాలు చేస్తూ ఉంటారు నితీష్ కుమార్. అయితే ఇదే అంశాన్ని లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడైన ఆర్జేడీ నాయకుడు, తేజస్వీ యాదవ్.. అసెంబ్లీ వేదికగా లేవనెత్తారు. బీహార్ లో నితీష్ పాలన ‘పొలిటికల్ షిప్ట్స్’ మాదిరిగా ఉంది అంటూ విమర్శించారు.ఈరోజు(మంగళవారం) బీహార్ అసెంబ్లీలో రాష్ట్ర అభివృద్ధి గురించి సీఎం నితీష్ మాట్లాడే సమయంలో తేజస్వీ యాదవ్ అడ్డుకున్నారు. ఎన్డీఏ నేతృత్వంలోని మన ప్రభుత్వం బీహార్ ను అభివృద్ధి పధంలో తీసుకెళుతోందని నితీష్ వ్యాఖ్యానించగా, అందుకు తేజస్వీ యాదవ్ అడ్డుతగిలారు. అసలు బీహార్ కు ఏం చేశారో చెప్పండి అంటూ నిలదీశారు. అందుకు తీవ్రంగా స్పందించిన సీఎం నితీష్.. అంతకుముందు బీహార్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనే రీతిలో సమాధానమిచ్చారు. ‘ నేను ఏం చేశానో మీ తండ్రి లాలూను అడుగు. మీ తండ్రి రాజకీయంగా ఎదగడానికి నేనే కారణం. మీ నాన్న పొలిటికల్ కెరీర్ ఎదిగింది అంటే అందులో నాది ప్రధాన పాత్ర. మీ నాన్నకు సపోర్ట్ చేయడాన్ని మీ కులంలోని వాళ్లే వ్యతిరేకించే వారు. ఎందుకు అలా చేస్తున్నావ్ అంటూ నన్ను అడిగే వారు. కానీ మీ నాన్నను తయారు చేసింది నేనే. ఇప్పటికీ మీ నాన్నకు సపోర్ట్ చేస్తూనే ఉంటాను’ అని రిప్లై ఇచ్చారు నితీష్.దీనికి తేజస్వీ యాదవ్ స్పందిస్తూ.. ప్రస్తుత బీహార్ పరిస్థితి గురించి అడిగితే.. 2005 కు ముందు బీహార్ చరిత్ర చెబుతారు నితీష్ అంటూ ఎద్దేవా చేశారు. నితీష్ చెప్పేదానిని బట్టి.. 2005కు ముందు బీహార్ ఉనికే లేదంటారా? అంటూ ప్రశ్నించారు తేజస్వీ. ఈ ప్రభుత్వం ప్రస్తుతం కన్ ఫ్యూజన్ లో ఉందని, రిక్రూట్ మెంట్ కు సంబంధించి గత హామీలనే మళ్లీ రిపీట్ చేస్తున్నారు అంటూ తేజస్వీ విమర్శించారు. -
ప్రైవేట్ ఆస్పత్రులలో మెడిసిన్ కొనుగోలు.. రాష్ట్రాలకు సుప్రీం చివాట్లు
ఢిల్లీ : ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం పేదలకు అందని ద్రాక్షాగా మారింది. ఇదే అంశంపై సుప్రీం కోర్టు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను చివాట్లు పెట్టింది. సామాన్యులకు వైద్య సంరక్షణ,మౌలిక సదుపాయాలు కల్పిస్తూ భరోసా ఇవ్వడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడింది. వైద్యాన్ని సామాన్యులకు దూరం చేయడమేకాదు.. వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రులలో చేరేలా పరోక్షంగా సులభతరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీపై సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ప్రైవేట్ ఆస్పత్రులు తాము నిర్వహించే మెడికల్ షాపుల్లోనే మెడిసిన్లు, ఇంప్లాంట్స్, ఇతర మెడికల్ కేర్ ఉత్పుత్తులు కొనుగోలు చేయాలని పేషెంట్లను, వారి కుటుంబ సభ్యులను ఒత్తిడి చేస్తున్నాయని పిల్లో పేర్కొన్నారు. అంతేకాదు, రోగులకు అమ్మే మెడిసిన్లను సైతం వాస్తవ ధరకంటే అత్యధిక ధరకు విక్రయిస్తున్నారని హైలెట్ చేశారు. ఫలితంగా రోగులు దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర,రాష్ట్రాలు ప్రైవేట్ ఆస్పత్రులపై నియంత్రణ, దిద్దుబాటు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యాయని ఆరోపిస్తూ.. తమ ఫార్మసీలలో మాత్రమే మెడిసిన్ కొనుగోలు చేయాలని ఒత్తిడి చేయకుండా ప్రైవేట్ ఆస్పత్రులకు ఆదేశాలు జారీ చేయాలని పిల్లో కోరారు. ఆ పిల్‌పై ఇవాళ సుప్రీం కోర్టు జస్టిస్ సూర్యకాంత్, ఎన్కే సింగ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా మేము మీతో ఏకీభవిస్తున్నాము.. అయితే దీన్ని ఎలా నియంత్రించాలి? అని జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు.The Supreme Court is hears a Public Interest Litigation (PIL) challenging the practice of hospitals and in-house pharmacies compelling patients to purchase medicines exclusively from their designated pharmacy.Bench: Justice Surya Kant and Justice N. Kotiswar Singh pic.twitter.com/jS3RLmZBwJ— Bar and Bench (@barandbench) March 4, 2025 ఈ సందర్భంగా తమ ఫార్మసీలలోనే మెడిసిన్ తీసుకోవాలని పేషెంట్లపై ఒత్తిడి చేసే ఆస్పత్రులపై తగు చర్యలు తీసుకునేలా ఆయా రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేశారు. బహిరంగ మార్కెట్లో మెడిసిన్ తక్కువ ధరలో దొరికినప్పుడు అక్కడే కొనుగోలు చేసుకోవచ్చు. అలా కాకుండా హాస్పిటల్‌కు చెందిన ఫార్మసీలలో మెడిసిన్ కొనుగోలు చేయాలని పేషెంట్లపై ఒత్తిడి చేయొకూడదని సూచించింది.మరోవైపు, కేంద్ర ప్రభుత్వానికి ప్రైవేట్ హాస్పిటల్స్, వైద్య సంస్థలు పౌరులను దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు చర్యలు తీసుకునే అవసరాన్ని నొక్కిచెప్పింది. ఇప్పటికే ప్రైవేటు ఆస్పత్రులకు చెందిన ఫార్మసీలలో మెడిసిన్ కొనుగోలు అంశంపై సుప్రీం కోర్టు ఒరిస్సా, ఆరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, బీహార్, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్,రాజస్థాన్‌లకు నోటీసులు జారీచేసింది. దీనిపై ఆయా రాష్ట్రాలు సుప్రీంలో కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేశాయి.మెడిసిన్ ధరలు కేంద్రం జారీ చేసిన ధర నియంత్రణ ఆదేశాలపై ఆధారపడ్డాయని, అత్యవసర మెడిసిన్ సైతం అందుబాటులో ఉండేందుకు ధరలు నిర్ణయించబడ్డాయని తెలిపాయి. హాస్పిటల్ ఫార్మసీల నుండి మందులు కొనుగోలు చేయాలని పేషెంట్లపై ప్రైవేట్ ఆస్పత్రులు బలవంతం చేయడంలేదు’కేంద్రం సైతం సుప్రీం కోర్టుకు వివరణ ఇచ్చింది. -
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీతో మరోసారి రేవంత్ భేటీ
ఢిల్లీ : కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి సమావేశమయ్యారు. 2024 25 సంవత్సరానికి సంబంధించి సేకరించిన ధాన్యం బకాయిలు రూ. 1, 468.94 కోట్లను విడుదల చేయాలని కేంద్రమంత్రికి వినతిపత్రం సమర్పించారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద సరఫరా చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు రూ. 343. 27 కోట్లను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక సీఎంఆర్ డెలివరీ గడువును పొడిగించాలని కేంద్రమంత్రిని రేవంత్ కోరారు. సీఎం రేవంత్ వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. కేంద్ర మంత్రులను కలుస్తూ తెలంగాణకు సంబంధించిన సమస్యలను విన్నవిస్తున్నారు. తమ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని కేంద్ర మంత్రులకు విన్నవిస్తున్నారు.నిన్న సీఆర్ పాటిల్‌తో భేటీ..కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న(సోమవారం) భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించి పలు ప్రాజెక్టులపై కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ చర్చించారు. సీఎం వెంట తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఉన్నారు. దేవాదుల ఎత్తిపోతల పథకం, భీమా ఎత్తిపోతల పథకం, ఎస్సారెస్పీ స్టేజి -2కు సంబంధించి భూసేకరణ, వివాదాలు 18,189 కోట్ల రూపాయల పెండింగ్ పనులు గురించి రేవంత్ చర్చించినట్లు తెలుస్తోంది.ప్రధానంగా కృష్ణా జలాల అంశంపై కేంద్ర జలశక్తి మంత్రికి వివరించారు. దీనిపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. కృష్ణా జలాలను ఏపీ అన్యాయంగా తరలించుకుపోతోందని, ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమావేశం అనంతరం పేర్కొన్నారు. కృష్ణా నదీ జలాల వివాదంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్నారు. -
తృటిలో తప్పిన ఘోర రైలు ప్రమాదం.. బోగీలు రెండుగా విడిపోయి..
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో(Uttar Pradesh) ఘోర రైలు ప్రమాదం తృటిలో తప్పింది. ప్రయాణిస్తున్న రైలు బోగి రెండుగా విడిపోయాయి. 200 మీటర్ల మేర ప్రయాణించాయి. బోగి విడిపోవడంపై అప్రమత్తమైన రైల్వే అధికారులు వెంటనే ఆ రైలు ఆపేయడంతో పెను ప్రమాదం తప్పింది.పోలీసుల సమాచారం మేరకు..బీహార్ నుంచి ఒడిశాలోని పురి ప్రాంతానికి నందన్ కానన్ ఎక్స్‌ప్రెస్ (Nandan Kanan Express ) బయలుదేరాల్సి ఉంది. అయితే, మార్గం మధ్యలో ఉత్తర ప్రదేశ్‌లో పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ్ స్టేషన్ (Pandit Deen Dayal Upadhyaya (DDU) లో నందన్ కానన్ ఎక్స్‌ప్రెస్ బోగీ విడిపోయింది. #WATCH | Chandauli, Uttar Pradesh: The coupling of the Nandan Kanan Express broke near the Pandit Deen Dayal Upadhyaya (DDU) Junction, splitting it into two parts. pic.twitter.com/QjqUHN7tfe— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 4, 2025ట్రైన్ ఆరు బోగీలు విడిపోయి 200 మీటర్లు ముందుకు వెళ్లిపోయాయి. మిగతా 15 బోగీలు వెనకే ఉన్నాయి. బోగీలు విడిపోవడంతో రైల్లోని ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ప్రాణ భయంతో కేకలు వేశారు. దీంతో అప్రమత్తమైన రైల్వే సిబ్బంది ట్రైన్‌ను నిలివేశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రయాణికుల్ని సురక్షితంగా మరో కోచ్‌కు తరలించారు. అనంతరం, రైలు బోగీ విడిపోవడంపై రైల్వే అధికారులు ఆరా తీశారు. ఈ క్రమంలోనే రైలు కప్లింగ్ విరిగిపోయిన విషయాన్ని గుర్తించారు. సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి దాన్ని మళ్లీ అతికించారు. -
అసెంబ్లీలో ఎమ్మెల్యేల గలీజు పని.. స్పీకర్ ఫైర్
అసెంబ్లీకి వెళ్లిదే ఎవరు.. ప్రజా ప్రతినిధులు. వారు ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. వారి వ్యక్తిగత అలవాట్లను పక్కన పెడితే, అసెంబ్లీని మాత్రం శుభ్రంగా ల్సిన కనీస బాధ్యత వారిపై ఉంటుంది. అది కూడా ఎమ్మెల్యేలు చేయకపోతే, ఇక ప్రజలకు వారిచ్చే సందేశం ఏముంటుంది. మరి అటువంటి ఎమ్మెల్యేలు తమ బాధ్యతను మరిచి కనీసం అసెంబ్లీని శుభ్రంగా ఉంచడంలో నిర్లక్ష్యం వహిస్తే, ఇలానే ఉంటుంది. అసలు ఏమి జరిగిందనే విషయాన్ని ఒక్కసారి చూస్తే..ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఇవాళ ఆసక్తికరమైన ఉదంతం జరిగింది. అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా అసెంబ్లీ హాల్‌ను సిబ్బందితో కలిసి శుభ్రం చేశారు. అనంతరం విధాన సభలో ఆయన చేసిన ఓ ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశమైంది. సభా ప్రాంగణంను శుభ్రంగా ఉంచాలని సభ్యులను కోరిన ఆయన.. తాను శుభ్రం చేయడానికి గల కారణం చెప్పడంతో ఎమ్మెల్యేలంతా తలలు దించుకున్నారు.సెషన్ ప్రారంభమైన వెంటనే స్పీకర్ సతీష్ మహానా సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఈ ఉదయం విధాన సభ హాల్లో జరిగిన ఓ ఘటన గురించి మీకు చెప్పాలి. సభ్యుల్లో ఒకాయన పాన్ మసాలా నమిలి ఉమ్మేశారు. విషయం తెలియగానే నేనే స్వయంగా వెళ్లి అక్కడ శుభ్రం చేశా. ఆ ఎమ్మెల్యే ఎవరనేది ఆ వీడియోలో నేను చూశా. కానీ, పేరు చెప్పి ఒక గౌరవ సభ్యుడి పరువు తీయాలని అనుకోవడం లేదు. తనంతట తానుగా ఆయన నా దగ్గరకు వచ్చి వివరణ ఇచ్చుకుంటే మంచిది. లేకుంటే నేనే పిలవాల్సి ఉంటుంది. ఈ సమయంలో దయచేసి మీ అందరికీ ఓ విజ్ఞప్తి. ఇక మీదట అలా ఎవరైనా చేస్తుండడం మీరు గమనిస్తే.. వాళ్లను అడ్డుకోండి. ఎందుకంటే.. అసెంబ్లీని శుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత అని అన్నారు. #WATCH | Uttar Pradesh Assembly Speaker Satish Mahana raised the issue of some MLA spitting in the House after consuming pan masala. He said that he got the stains cleaned, urged other MLA to stop others from indulging in such acts and also appealed to the MLA to step forward and… pic.twitter.com/VLp32qXlU8— ANI (@ANI) March 4, 2025 -
పనిప్రదేశాల్లో పాలివ్వడం తప్పేమి కాదు: సుప్రీం కోర్టు
పనిప్రదేశాల్లో తల్లి తన బిడ్డకు పాలివ్వడం తప్పేమి కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. మహిళల గౌరవానికి భంగం కలిగించే పద్ధతులను త్యజించాలని స్పష్టం చేసింది. పాలిచ్చే తల్లలుకు తమ బిడ్డ సంరక్షణలో అది భాగమని, దాన్ని అందరూ గౌరవించాలని పేర్కొంది. అది వారి హక్కు కూడా కాబట్టి బహిరంగ ప్రదేశాల్లో, పనిప్రదేశాల్లో తల్లి బిడ్డకు పాలివ్వడాన్ని తప్పుపట్టొద్దని ధర్మాసనం వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వ స్థలాలు, భవనాల్లో చైల్డ్ కేర్ గదుల ఏర్పాటకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సలహాలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను/కేంద్రపాలిత ప్రాంతాలను కోరుతూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్‌లు బి.వి. నాగరత్న, పి.బి. వరలేలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పుని వెలువరించింది. అంతేగాదు ఇలా బహిరంగ ప్రదేశాల్లోనూ, పనిప్రదేశాల్లోనూ తల్లిపాలివ్వడాన్ని అవమానకరంగా చూస్తే..మహిళలు అనవసరమైన ఒత్తిడి లేదా బెదిరింపులకు గురవ్వుతారంటూ యూఎన్ నివేదికను వెల్లడించింది. అలాగే తల్లిపాలిచ్చే హక్కుని గురించి కూడా నొక్కి చెప్పింది. ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 అంతర్జాతీయ చట్టంలో పొందుపరిచిన పిల్లల ప్రయోజనాలు, అనే ప్రాథమిక సూత్రం, 2015 జువైనల్ జస్టిస్(పిల్లల సంరక్షణ )చట్టంల నుంచి ఈ హక్కు ఉద్భవించిందని ధర్మాసనం తెలిపింది. అంటే అందుకు తగిన సౌకర్యాలు, వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత రాష్ట్రలపై ఉందని దీని అర్థం అని కూడా స్పష్టం చేసింది. ఈ విషయంలో ఫిబ్రవరి 27, 2024న కేంద్ర మహిళా-శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి, కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖతో కలిసి ప్రభుత్వ భవనాల్లో ఫీడింగ్ గదులు, క్రెచ్‌లు వంటి వాటి కోసం స్థలాలు కేటాయించాలని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలను కోరుతూ ఆదేశించిన సలహాను ధర్మాసనం పరిగణలోకి తీసుకుని ఇలా తీర్పుని వెల్లడించింది. అంతేగాదు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15(3) కింద ఉన్న ప్రాథమిక హక్కులకు అనుగుణంగా కేంద్రం సలహా ఉందని కూడా పేర్కొంది ధర్మాసనం. ఇది తల్లలు గోప్యత, శివువుల ప్రయోజనార్థం సూచించన సలహాగా పేర్కొంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు/కేంద్రపాలిత ప్రాంతాలు చర్య తీసుకుంటే తల్లి బిడ్డల గోప్యతకు భంగం వాటిల్లకుండా చేయడం సులభతరమవుతుందని తెలిపింది. అందువల్ల, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు ఈ ఆర్డర్ కాపీతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శి/నిర్వాహకుడికి రిమైండర్ కమ్యూనికేషన్ రూపంలో పైన పేర్కొన్న సలహాను చేర్చాలని సూచించింది. తద్వారా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్రం జారీ చేసిన ఈ సలహాలను పాటిస్తాయిని పేర్కొంది ధర్మాసనం. దీంతోపాటు ప్రస్తుత ప్రజా ప్రదేశాలలో సాధ్యమైనంతవరకు, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు పైన పేర్కొన్న ఆదేశాలు అమలులోకి వచ్చేలా చూసుకోవాలని కూడా పేర్కొంది. అలాగే అన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు ఈ సలహాలు తెలియజేసేలా ఆదేశాలు జారీచేయాలని ప్రభుత్వాన్ని కోరింది ధర్మాసనం. (చదవండి: జాతీయ భద్రతా దినోత్సవం: భద్రంగా ఉంటున్నామా..?) -
పాకిస్థానీ అనడం నేరమేమీ కాదు: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: వ్యక్తిగత దూషణకు సంబంధించిన ఓ కేసులో దేశ సర్వోన్నత న్యాయం మంగళవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మియాన్-టియాన్, పాకిస్థానీ అనడం నేరమేమీ కాదని, అలా అనడం వల్ల మతపరమైన మనోభావాలు దెబ్బ తిన్నాయన్న వాదన అర్ధరహితమని వ్యాఖ్యానించింది.జార్ఖండ్‌లో పని చేసే ఓ ప్రభుత్వ ఉద్యోగి.. ఆర్టీఐ దరఖాస్తు వెరిఫికేషన్‌లో భాగంగా ఓ వ్యక్తిని సంప్రదించారు. అయితే ఆ టైంలో మతం ప్రస్తావన తెచ్చి ఆ వ్యక్తి.. సదరు ఉద్యోగిని దుర్భాషలాడాడు. దీంతో తన విధులకు ఆటంకం కలిగించాడంటూ ఆ ఉద్యోగి పోలీసులను ఆశ్రయించాడంతో కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో నిందితుడికి జార్ఖండ్ హైకోర్టులో ఊరట దక్కలేదు. దీంతో సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. మియాన్-టియాన్, పాకిస్థానీ అని సంబోధించడం ద్వారా తన మనోభావాలు దెబ్బన్నాయని ఫిర్యాదుదారు అంటున్నారు. ముమ్మాటికీ అలాంటి వ్యాఖ్యలు అప్రస్తుతం. అయినప్పటికీ.. అది మతపరమైన మనోభావాలు దెబ్బతీయడం ఏమాత్రం కాదని స్పష్టం చేస్తూ ఆ వ్యక్తికి ఊరట కలిగించింది. -
అంబానీ వంతారా: పులి పిల్లలతో నరేంద్ర మోదీ - వీడియో
గుజరాత్‌లోని వన్యప్రాణుల రక్షణ, పునరావాసం & సంరక్షణ కేంద్రంమైన 'వంతారా'ను ప్రధానమంత్రి 'నరేంద్ర మోదీ' ప్రారంభించారు. అక్కడ పరిసరాలను సందర్శించారు. అక్కడ పునరావాసం పొందుతున్న వివిధ జాతుల జంతువులతో ఆయన సన్నిహితంగా మెలిగారు.వంతారాలోని వన్యప్రాణుల ఆసుపత్రిని ప్రధానమంత్రి సందర్శించారు. అక్కడ జంతువుల కోసం ఏర్పాటు చేసిన MRI, CT స్కాన్లు, ICUలు మొదలైన వాటితో కూడిన పశువైద్య సౌకర్యాలను వీక్షించారు. అంతే కాకుండా వైల్డ్‌లైఫ్ అనస్థీషియా, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఎండోస్కోపీ, డెంటిస్ట్రీ, ఇంటర్నల్ మెడిసిన్ మొదలైన అనేక విభాగాలను కూడా పరిశీలించారు.ఆసియాటిక్ సింహానికి MRI చేయడం, హైవేలో కారు ఢీకొట్టిన తర్వాత గాయపడిన చిరుతకు ఆపరేషన్ చేయడం వంటి దృశ్యాలను మోదీ చూసారు. ఆసియాటిక్ సింహం పిల్లలు, తెల్ల సింహం పిల్ల, అరుదైన మరియు అంతరించిపోతున్న జాతి చిరుతపులి పిల్ల, కారకల్ పిల్ల వంటి వివిధ జాతులతో సరదాగా గడిపడమే కాకుండా.. వాటికి పాలు పట్టించడం వంటివియు కూడా మోదీ చేశారు.వంతారా కేంద్రంలో.. రక్షించబడిన జంతువులను వాటి సహజ ఆవాసాలను దగ్గరగా ప్రతిబింబించే ప్రదేశాలలో ఉంచారు. ఇక్కడ ఆసియాటిక్ సింహం, చిరుత, ఒక కొమ్ము గల ఖడ్గమృగం, జిరాఫీ, చింపాంజీ, ఒరంగుటాన్, హిప్పోపొటామస్, మొసళ్ళు, ఏనుగులు, పెద్ద పాములు మొదలైన జంతువులను మోదీ చూసారు.ప్రపంచంలోనే అతిపెద్ద ఆసుపత్రి అయిన ఏనుగుల ఆసుపత్రిని కూడా ఆయన సందర్శించారు. జంతువులను వీక్షించడమే కాకుండా.. వాటికి సేవ చేస్తున్న వైద్యులు, సహాయక సిబ్బంది, కార్మికులతో ప్రధానమంత్రి సంభాషించారు. వంతారాలో 2,000 కంటే ఎక్కువ జాతులు.. రక్షించబడిన, అంతరించిపోతున్న 1.5 లక్షలకు పైగా జంతువులు ఉన్నాయి.Watch: Prime Minister Narendra Modi inaugurated and visited Vantara, a wildlife rescue and conservation center in Gujarat, home to over 1.5 lakh rescued animals. He explored its advanced veterinary facilities, interacted with rare species, witnessed surgeries, and participated in… pic.twitter.com/XV5j8mELaz— IANS (@ians_india) March 4, 2025 -
మహారాష్ట్ర మంత్రి ధనంజయ్ ముండే రాజీనామా
ముంబై: మహా రాజకీయాల్లో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆహార, పౌరసరఫరా శాఖల మంత్రి ధనంజయ్ ముండే(Dhananjay Munde) తన పదవులకు రాజీనామా చేశారు. ఓ సర్పంచ్ హత్య కేసులో ఆయన అనుచరుడు అరెస్ట్ కాగా.. తీవ్రమైన ఆరోపణలు రావడంతో ధనంజయ్ రాజీనామా చేయాల్సి వచ్చింది.గత డిసెంబర్లో బీడ్ జిల్లా మస్సాజోగ్ గ్రామ సర్పంచ్ సంతోష్ దేశ్‌ముఖ్ దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ కేసుకు సంబంధించి.. మంత్రి ధనంజయ్ ముండే అనుచరుడు వాల్మీక్ కరాద్ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ధనంజయ్ పాత్రపైనా ఆరోపణలు వెల్లువెత్తాయి.రాజకీయ విమర్శలు తీవ్రతరం కావడంతో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్(Devendra Fadnavis), ఎన్సీపీ చీఫ్.. డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌తో భేటీ అయి చర్చించారు. సీఎం ఫడ్నవిస్ సూచన మేరకు ధనంజయ్ రాజీనామా చేసినట్లు సమాచారం. ఆపై ఆ లేఖను ఆమోదించిన ఫడ్నవిస్.. గవర్నర్ ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు పంపించారు.ధనంజయ్ ఎవరంటే..ధనంజయ్ పండిత్రావ్ ముండే.. కేంద్ర మాజీ మంత్రి, దివంగత గోపినాథ్ ముండేకు దగ్గరి బంధువు. గతంలో ఈయన బీజేపీలో పని చేశారు. బీజేవైఎం యువ విభాగానికి అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు. శాసన మండలిలో ప్రతిపక్ష నేత హోదా కూడా చేపట్టారు. ఆపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(NCP)లో చేరారు. ధనంజయ్ 2019, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పార్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. కూటమి ప్రభుత్వంలోని ఫడ్నవిస్ కేబినెట్లో కీలక మంత్రిత్వ శాఖలతో పాటు బీడ్ జిల్లాకు సంరక్షణ మంత్రిగా ఉన్నారు.గతంలో ఈయన ఓ వివాదంలోనూ చిక్కుకున్నారు. ప్రముఖ గాయని రేణు శర్మ 2021జనవరిలో ఆయనపై అత్యాచార కేసు పెట్టారు. దీంతో ప్రతిపక్షాలు ఆయన రాజీనామాకు పట్టుబట్టాయి. అయితే ఆ ఆరోపణలు తోసిపుచ్చిన ఆయన.. సంచలన ప్రకటన చేశారు. రేణు శర్మ సోదరి కరుణా శర్మతో తాను సహజీవనంలో ఉన్నానని, తమకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, ఈ విషయం తన భార్య, కుటుంబ సభ్యులకూ తెలుసని ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ తర్వాత రేణు శర్మ ఆయనపై పెట్టిన కేసును వెనక్కి తీసుకున్నారు. -
రోహిత్‌పై బాడీషేమింగ్ కామెంట్స్.. కోహ్లీని వదలని షామా!
న్యూఢిల్లీ: స్టార్ బ్యాటర్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)పై బాడీ షేమింగ్ పోస్టుతో వివాదంలో చిక్కుకున్న కాంగ్రెస్ నేత షామా మహమ్మద్.. ఎట్టకేలకు స్పందించారు. రోహిత్ అభిమానులు, టీమిండియా మాజీలు, బీజేపీ, ఆఖరికి సొంత పార్టీ నుంచి కూడా విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ జాతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు.‘‘ఓ ఆటగాడు ఎప్పుడూ ఫిట్‌గా ఉండాలన్నది నా అభిప్రాయం. అందుకే రోహిత్ శర్మ విషయంలో పరిశీలనపూర్వకంగానే నేను మాట్లాడా. అతను కాస్త ఓవర్‌వెయిట్ అనిపించాడు. అందుకే అలా ట్వీట్ చేశా. అందులో బాడీ షేమింగ్ ఏం లేదు. నేనేం తప్పు చేయలేదు’’ అని అన్నారామె. ఈ క్రమంలో.. గతంలో టీమిండియా మాజీ కెప్టెన్ల పేర్లను ప్రస్తావించిన షామా.. వాళ్లతో రోహిత్‌ను బాడీని పోల్చారు.#WATCH | On her comment on Indian Cricket team captain Rohit Sharma, Congress leader Shama Mohammed says, "It was a generic tweet about the fitness of a sportsperson. It was not body-shaming. I always believed a sportsperson should be fit, and I felt he was a bit overweight, so I… pic.twitter.com/OBiLk84Mjh— ANI (@ANI) March 3, 2025ఇది ప్రజాస్వామ్యం.. అందులో తప్పేం ఉంది. నాకు మాట్లాడే హక్కు ఉంది అని అన్నారామె. అలాగే.. ఈ సందర్భంగా స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై షామా ప్రశంసలు గుప్పించారు. గతంలో పాక్‌పై ఓటమి తర్వాత మహమ్మద్ షమీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఆ సమయంలో షమీకి కోహ్లీ అండగా నిలిచాడు. అందుకు కోహ్లీని కూడా విమర్శించారు. తోటి ఆటగాళ్లకు అండగా ఉంటూ జట్టును ముందు ఉండి నడిపించడం, పరుగులు చేయడం, ప్రత్యర్థి జట్టు ప్రదర్శన గురించి తెలిసి ఉండడం.. ఇవన్నీ మంచి సారథికి ఉండే లక్షణాలు. ఇవన్నీకోహ్లీకి ఉన్నాయి. ప్రత్యర్థులు బాగా ఆడినా మెచ్చుకునేందుకు కోహ్లీ వెనకాడడు’’ అని షామా అన్నారు. అయితే ఇదే షామా గతంలో కోహ్లీపై చేసిన ఓ పోస్ట్ అంటూ ఒక స్క్రీన్ షాట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.2018లో కెప్టెన్‌గా ఉన్న సమయంలో కోహ్లీ ఓ ఫ్యాన్ పెట్టిన పోస్టుకు తీవ్రంగా స్పందించాడు. ‘‘నాకు భారతీయుల కంటే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రీడాకారుల క్రికెట్ బాగుంటుంది. ఇక కోహ్లీని అయితే జనాలు అనసవరంగా ఆకాశానికి ఎత్తేస్తుంటారు’’ అని ఓ ఫ్యాన్ చేసిన పోస్టును కోహ్లీ స్వయంగా చదివి వినిపించాడు.‘‘నువ్వు ఇండియాలో ఉండాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. భారత్‌లో ఉంటూ ఇతర దేశాలపై అభిమానం చూపించడం ఏమిటి. నీకు నేను నచ్చకపోవడంపై నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే, ఇతర దేశాల వారు నచ్చినప్పుడు నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం’’ అని కోహ్లీ అన్నాడు.అయితే.. కోహ్లీ పోస్టుపై అప్పట్లో షామా చాలా ఘాటుగా స్పందించారు. ‘‘బ్రిటిషర్లు కనిపెట్టిన ఆటను కోహ్లీ ఆడుతుంటాడు. విదేశీ బ్రాండ్లకు ప్రచారం చేస్తూ కోట్లు సంపాదిస్తుంటాడు. పెళ్లి కూడా ఇటలీలో చేసుకున్నాడు. హెర్షెల్ గిబ్స్ తన ఫేవరెట్ క్రికెటర్ అని కూడా చెబుతాడు. కెర్బర్ తన ఫేవరెట్ టెన్నిస్ ప్లేయర్ అని అంటాడు. కానీ ఇతర దేశాల క్రీడాకారులను అభిమానించే వారు మాత్రం దేశాన్ని విడిచిపెట్టి పోవాలని అంటాడు’’ అని షామా మండిపడ్డారు. రోహిత్‌పై ఆమె చేసిన కామెంట్లు దుమారం రేపడం, కోహ్లీని పొగడడం నేపథ్యంలో ఈ పోస్ట్ మళ్లీ తెరపైకి వచ్చింది.షామా ఏమన్నారంటే..ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ సరైన ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. ‘‘క్రీడాకారుడిగా రోహిత్ శర్మ ఫిట్‌గా లేడు. అతడు బరువు తగ్గాలి. అంతేకాదు.. గత కెప్టెన్లతో పోలిస్తే అత్యంత ఆకట్టుకోని సారథి ఇతడే’’ అని షామా రాసుకొచ్చారు. ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారడంతో దీనిపై తీవ్ర వివాదం రాజుకుంది. -
ప్రేమ పేరుతో CISF అధికారిణి వంచన.. ఐటీ ఉద్యోగి ఆత్మహత్య
యశవంతపుర: సీఐఎస్ఎఫ్ మహిళా అధికారి పెళ్లి పేరుతో తనను మోసం చేసిందంటూ ఆమె ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలోని బెళగావిలో వెలుగు చూసింది. సెల్ఫీ వీడియోను ఇన్‌స్టాలో పోస్టు చేసి సదరు వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఘటన చర్చనీయాంశంగా మారింది.వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజిపురకు చెందిన అభిషేక్ సింగ్(40).. చెన్నైలోని ఓ ఐటీ కంపెనీలో పని చేస్తున్నారు. ఈ క్రమంలో గుజరాత్ చెందిన మోనిక సింగ్‌తో అభిషేక్‌కు పరిచయం ఏర్పడింది. ఆమె బెళగావిలో సీఐఎస్ఎఫ్లో సహాయక కమాండెంట్‌గా పని చేస్తున్నారు. అయితే, ఆమె తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసిందని అభిషేక్ ఆరోపించారు. సోమవారం మంగళూరు రావ్ సర్కిల్లోని ఓ లాడ్జ్‌లో అభిషేక్ సింగ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.అంతకుముందు ఆయన రాసిన లేఖలో సదరు మహిళకు వివాహం అయినప్పటికీ, వివాహం కాలేదని నమ్మించి తన లైంగిక అవసరాలు తీర్చుకున్నారని ఆరోపించారు. పెళ్లి చేసుకుందామని అడిగితే బెదిరించి మానసికంగా హింసిస్తోందని వీడియోలో చెప్పాడు. ఈ సందర్భగా తాము సన్నిహితంగా ఉన్న ఫోటోలను కూడా పోస్టు చేశాడు. ఈ ఘటనపై బెళగావి నగర పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.A shocking incident has come to light in #Karnataka's #Mangaluru where a man from #UttarPradesh died by suicide, alleging he was exploited by a #CISF woman officer.The deceased, identified as #AbhishekSingh (40) from #Ghazipur, Uttar Pradesh, was found hanging in a lodge near… pic.twitter.com/QKuh3pcdOD— Hate Detector 🔍 (@HateDetectors) March 3, 2025 -
జ్వరం వచ్చిందని చిన్నారికి 40 చోట్ల వాతలు.. చివరకు..
భువనేశ్వర్: ప్రపంచం ఇరవై ఒకటో శతాబ్దంలో ఓవైపు కృత్రిమ మేథతో దూసుకుపోతుంటే మరోవైపు కొందరు ఇంకా మూఢాంధకారంలో మగ్గిపోతున్నారు. తమ మూఢ విశ్వాసాలకు కుటుంబసభ్యులనూ బలిచేస్తున్నారు. ఒడిశాలో ఇలాంటి ఘటన తాజాగా వెలుగుచూసింది.అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న నెల వయసు పసికందుకు నిర్దాక్షిణ్యంగా వాతలు పెట్టారు. దాదాపు 40 చోట్ల వాతలతో నరకయాతన పడుతున్న చిన్నారిని ఎట్టకేలకు ఆస్పత్రిలో చేర్పించడంతో బతికి ప్రాణాలతో బయటపడ్డాడు. నబారంగ్పూర్ జిల్లాలోని చందహండీ బ్లాక్ గంభారీగూడ పంచాయతీ పరిధిలోని ఫూన్దేల్పాడా గ్రామంలో ఈ దారుణోదంతం జరిగింది. ప్రస్తుతం చిన్నారిని ఉమెర్కోట్ సబ్–డివిజనల్ ఆస్పత్రిలో చేరి్పంచి చికిత్స అందిస్తున్నామని నబారంగ్పూర్ చీఫ్ డి్రస్టిక్ట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సంతోష్ కుమార్ సోమవారం చెప్పారు. తలపై, పొట్టపై వాతలు.. నెలరోజుల క్రితం జన్మించిన ఈ బాబు గత పదిరోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. ఒళ్లు వేడెక్కి కాలిపోతుండటంతో గుక్కబెట్టి ఏడుస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో పిల్లాడిని వెంటనే ఆస్పత్రిలో చేర్పించాల్సిన కుటుంబసభ్యులకు మూఢవిశ్వాసాలపై గురి ఎక్కువ. ఈ గ్రామీణ ప్రాంతంలో పిల్లలకు ఆరోగ్యం బాగోలేకపోతే చెడుగాలి సోకిందని, దుష్టశక్తిని పారద్రోలేందుకు ఉపాయంగా ఇనుప కడ్డీతో ఒంటిపై వాతలు పెడతారు. ఇదే అంధవిశ్వాసంతో కుటుంబసభ్యులు ఈ పిల్లాడికి తలపై, పొట్టపై దాదాపు 40 చోట్ల కాల్చిన ఇనుపకడ్డీతో వాతలు పెట్టారు. కాలిన గాయాలతో పిల్లాడి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది.దీంతో చేసేదేమీలేక చివరకు పిల్లాడిని ఉమెర్కోట్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం పిల్లాడి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు చెప్పారు. విషయం తెలుసుకున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చందహండీ బ్లాక్ పరిధిలో ప్రజల్లో మూఢవిశ్వాసాలను పోగొట్టి వారిలో సామాజిక చైతన్యం తీసుకొచ్చేందుకు నడుం బిగించారు. వాతలు పెట్టే పురాతన పద్ధతులను విడనాడాలని అవగాహన కార్యక్రమాలు మొదలెట్టారు. -
కాంగ్రెస్ హిమానీ హత్య కేసు.. వెలుగులోకి సీసీటీవీ వీడియో
ఢిల్లీ: హర్యానాకు చెందిన కాంగ్రెస్ నాయకురాలు హిమానీ నర్వాల్ హత్య కేసులో కీలక ఆధారాలు బయటకు వచ్చాయి. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే సచిన్ అనే నిందితుడిని అరెస్టు చేశారు. తానే హత్య చేసినట్టు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. ఇక, తాజాగా నిందితుడు హిమానీ హత్యకు గురైన రోజున ఆమె నివాసం సమీపంలో నుంచి సూటుకేసును తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది.హర్యానాలో రోహ్తక్ జిల్లాలోని సాంప్లా బస్టాండ్ సమీపంలో మార్చి ఒకటో తేదీన సూట్‌కేసులో హిమానీ నర్వాల్ మృతదేహం బయటపడటం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో హిమానీ హత్య కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సోమవారం సచిన్ అనే నిందితుడిని అరెస్టు చేశారు. అనంతరం, హిమానీ నివాసం వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. ఈ క్రమంలో నిందితుడు ఓ సూట్‌కేసును పట్టుకుని వెళ్తున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. ఫిబ్రవరి 28న రాత్రి 10 గంటల సమయంలో హిమానీ నివాసం సమీపం నుంచి అతడు వెళ్లడం గుర్తించారు. మరుసటి రోజు ఉదయం అదే సూట్‌కేసులో ఆమె మృతదేహం ఉండటం గమనార్హం.ఈ నేపథ్యంలో హిమానీ నర్వాల్ తన ఇంట్లోనే హత్యకు గురైనట్టు పోలీసులు వెల్లడించారు. అయితే, ఆమెతో తనకు సన్నిహిత సంబంధం ఉందని నిందితుడు చెప్పుకొచ్చారు. అలాగే, తనను తరచూ డబ్బులు డిమాండ్ చేయడంతోనే హత్య చేసినట్టు సచిన్ పోలీసుల విచారణలో చెప్పినట్లు సమాచారం. ఇక, వారిద్దరు స్నేహితులని, నిందితుడికి ఇప్పటికే వివాహమైందని పోలీసులు తెలిపారు.VIDEO | Himani Narwal murder case: CCTV footage - dated February 28, 2025 - shows accused Sachin carrying the black suitcase with the body stuffed in it, through a street. The CCTV visuals have been verified by the police. Sachin - a "friend" of Congress worker Himani Narwal -… pic.twitter.com/f9qvKFR5rz— Press Trust of India (@PTI_News) March 3, 2025 -
అతి తెలివి కుర్రాళ్లు!
న్యూఢిల్లీ: దేశమంతటా రచ్చ అయిన ‘ఇండియా హాజ్ గాట్ టాలెంట్’ యూట్యూబ్ షో వివాదం తాలూకు మంటలు ఇంకా చల్లారడం లేదు. ఆ షోలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసి ప్రముఖ యూట్యూబర్ రణ్వీర్ అలహాబాదియా చిక్కుల్లో పడటం తెలిసిందే.మెదడులోని చెత్తనంతా వాంతి రూపంలో బయట పెట్టుకున్నారంటూ సుప్రీంకోర్టు ఆయనకు తీవ్రంగా తలంటింది కూడా. ఈ వ్యవహారంలో రణ్వీర్తో పాటు సదరు షో హోస్ట్ సమయ్ రైనా కూడా పలు కోర్టు కేసులు ఎదుర్కొంటున్నారు. ఇంతటి రగడకు కారణమైన ఆ వివాదాస్పద ఎపిసోడ్‌పై ఇటీవల కెనడాలో నిర్వహించిన ఒక షోలో సమయ్ వ్యంగ్యాస్త్రాలు విసిరి తాజాగా మరోసారి సుప్రీంకోర్టు ఆగ్రహానికి గురయ్యారు.‘‘బాగా ఫన్నీగా ఏవేవో చెప్పి నవ్విస్తానని అనుకుంటున్నారేమో! బీర్‌బైసెప్స్ (రణ్వీర్ అలహాబాదియా)ను ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి! బహుశా నా టైం బాగా లేనట్టుంది. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి. నా పేరే సమయ్’’ అని ప్రేక్షకులను ఉద్దేశించి రైనా వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈ షో టికెట్లు కొనడం ద్వారా నా కోర్టు ఖర్చులను భరించినందుకు కృతజ్ఞతలు’’ అంటూ ముక్తాయించారు. సోమవారం అలహాబాదియా పిటిషన్‌పై విచారణ సందర్భంగా రైనా తాజా వ్యాఖ్యలను సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రత్యేకంగా ప్రస్తావించి మరీ వాటిపై కన్నెర్ర చేసింది.‘‘ఈ అతి తెలివి కుర్రాళ్లు తమకే అన్నీ తెలుసనుకుంటారు. మనల్ని బహుశా పనికిరాని పాత తరంగా భావిస్తారేమో తెలియదు! వీళ్లలో ఒకరు కెనడాకు వెళ్లి మరీ ఆ పనికిమాలిన ఎపిసోడ్‌ను మరోసారి పనిగట్టుకుని ప్రస్తావించారు. ఈ కోర్టు న్యాయపరిధి ఎంతటిదో, తలచుకుంటే ఎలాంటి చర్యలు తీసుకోగలదో బహుశా వీళ్లకు తెలిసినట్టు లేదు’’ అంటూ న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తీవ్రంగా హెచ్చరించారు.‘‘కాకపోతే ఎంతైనా వాళ్చ్లు కుర్రాళ్లు. మేం అర్థం చేసుకోగలం. అందుకే అలాంటి చర్యలేవీ తీసుకోదలచలేదు’’ అని స్పష్టం చేశారు. చేసిన తప్పులకు వాళ్లు ఇప్పటికైనా పశ్చాత్తాపపడుతున్నారని ఆశిస్తున్నట్టు చెప్పారు. హక్కులతో పాటే బాధ్యతలు అలహాబాదియాకు కూడా ఈ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ గట్టిగా చురకలు వేశారు. ‘‘కొందరు గిరాకీ లేని వ్యక్తులు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పేరిట పనికిరాని వ్యాసాలు రాసి వదులున్నారని మాకు తెలుసు. వారిని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా బాగా తెలుసు. ప్రాథమిక హక్కులు తమ సొత్తని ఎవరైనా భావిస్తే పొరపాటు.మన దేశంలో ఎవరికైనా సరే, బాధ్యతలతో పాటు హక్కులు వర్తిస్తాయి. హక్కులను ఆస్వాదించాలంటే వాటితో పాటుగా రాజ్యాంగం కల్పించిన బాధ్యతలను నిర్వర్తించి తీరాల్సిందే. దీన్ని అర్థం చేసుకోని వారిని ఎలా డీల్ చేయాలో మాకు తెలుసు’’ అని హెచ్చరించారు. రణ్వీర్ యూట్యూబ్ షోపై విధించిన నిషేధాన్ని ఈ సందర్భంగా ధర్మాసనం ఎత్తేసింది. ఇకపై నైతిక ప్రమాణాలకు లోబడి పద్ధతిగా వ్యవహరించాలని హెచ్చరించింది. ఈ మేరకు హామీ పత్రం సమర్పించాల్సిందిగా ఆదేశించింది. -
సిద్దరామయ్యకు ఝలక్.. కర్ణాటక సీఎంగా డీకే?
బెంగళూరు: కర్నాటక కాంగ్రెస్‌లో రాజకీయం ఆసక్తికరంగా మారింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను పదవి నుంచి తొలగిస్తున్నారనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ కూడా హింట్ ఇస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ త్వరలోనే సీఎంగా బాధ్యతలు చేపడతారని చెప్పుకొచ్చారు. దీంతో, కాంగ్రెస్ వర్గాల్లో చర్చ మొదలైంది.ఇక, వీరప్ప మొయిలీ వ్యాఖ్యలపై తాజాగా సీఎం సిద్ధరామయ్య స్పందించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ..‘నేను మరోసారి చెబుతున్నాను. సీఎం ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తుంది. మొయిలీ లేదా మరొకరు ఏం మాట్లాడారనేది ఇక్కడ ముఖ్యం కాదు. హైకమాండ్ నిర్ణయమే అంతిమం’అని సిద్ధరామయ్య సోమవారం అన్నారు. సీఎం మారతారని కాంగ్రెస్ నాయకులు బాహటంగా చర్చిస్తున్న విషయాన్ని సిద్ధూ దృష్టికి తేగా.. ‘నేను హైకమాండ్ అదేశాల మేరకే నడుచుకుంటాను’ అని ఆయన బదులిచ్చారు. -
దృష్టి లోపమున్నా...న్యాయ నియామకాలకు అర్హులే
న్యూఢిల్లీ: దృష్టి లోపం ఉన్నంత మాత్రాన జ్యుడీషియల్ సర్వీస్‌లో ఉద్యోగావకాశాలను నిరాకరించడం కూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ ఉద్యోగాలకు వాళ్లు అనర్హులని పేర్కొంటున్న మధ్యప్రదేశ్ జ్యుడీషియల్ సర్వీస్ (ఎంపీజేఎస్) నిబంధనలను కొట్టేసింది. న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్డీవాలా, జస్టిస్ ఆర్.మహదేవన్ ధర్మాసనం సోమవారం ఈ మేరకు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. దృష్టి లోపమున్న వారికి పలు రాష్ట్రాలు జ్యుడీషియల్ సర్వీస్ ఉద్యోగాల్లో ప్రత్యేక కోటా కల్పించకపోవడం తదితరాలపై దాఖలైన కేసులను ధర్మాసనం విచారించింది. ‘‘వైకల్యం ఆధారంగా వివక్ష చూపరాదన్నది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. దివ్యాంగుల హక్కుల చట్టం, 2016 కూడా అదే చెబుతోంది’’ అని పేర్కొంది. ‘‘దృష్టి లోపమున్న అభ్యర్థులకు జ్యుడీషియల్ పోస్టుల్లోనూ సముచిత ప్రాతినిధ్యం దక్కాలి. ఎంపిక ప్రక్రియలో ప్రతి దశలోనూ ఇందుకు అవసరమైన అన్ని చర్యలనూ ప్రభుత్వాలు చేపట్టాలి. వారికి కటాఫ్ మార్కులను విడిగా నిర్ణయించాలి. మెరిట్ లిస్టునూ విడిగానే సిద్ధం చేయాలి. దాని ఆధారంగానే ఎంపిక జరగాలి’’ అని ఆదేశించింది. దృష్టి లోపం కేటగిరీలో తగినంత మంది అభ్యర్థులు లేకపోతే కటాఫ్ మార్కులను తగ్గించేందుకు కూడా ధర్మాసనం ఈ సందర్భంగా అనుమతించింది. న్యాయ వ్యవస్థలో ఇప్పటికే చేపట్టిన, ఇకపై చేపట్టబోయే భర్తీ ప్రక్రియలన్నింటికీ ఈ తీర్పును ప్రాతిపదికగా తీసుకోవాలని స్పష్టం చేసింది.రాజ్యాంగ స్ఫూర్తీ అదేజ్యుడీషియల్ సర్వీసులకు పోటీ పడేందుకు దృష్టి లో పమున్న వాళ్లు పూర్తిగా అర్హులేనని జస్టిస్ మహదేవన్ స్పష్టం చేశారు. ధర్మాసనం తరఫున ఈ మేరకు 122 పేజీల తీర్పు ఆయనే రాశారు. ‘‘ఈ విషయంలో ఎంపీజేఎస్లో పొందుపరిచిన నిబంధనలు రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వపు హక్కు తదితరాలకు పూర్తిగా విరుద్ధం. నిజానికి ఇలాంటి విషయాల్లో సముచిత ప్రాతినిధ్య సూత్రాలను పాటించాలి. అంతే తప్ప కాఠిన్యం కూడదు. కఠినమైన కటాఫ్ నిబంధనలు తదితర పరోక్ష అడ్డంకుల ద్వారా దివ్యాంగులను ఉద్యోగావకాశాలకు దూరం చేయకూడదు. పలు అంతర్జాతీయ సూత్రాలు, ఒప్పందాలు కూడా అదే చెబుతున్నాయి’’ అన్నారు. ‘‘పౌరులందరినీ కలుపుకుని ముందుకు సాగాలన్న సూత్రమే మన రాజ్యాంగానికి పునాది. రాజ్యాంగపు మౌలిక స్వరూపంలో విడదీయలేని భాగం. సమానత్వం తదితర ప్రాథమిక హక్కులన్నింటికీ మూలాధారం. ప్రాథమిక హక్కుల్లో భాగంగా ఆర్టికల్స్ 14, 15, 16ల్లో దీన్ని విస్పష్టంగా పేర్కొన్నారు’’ అని న్యాయమూర్తి గుర్తు చేశారు. ‘‘సముచిత ప్రాతినిధ్యం పౌరుల ప్రాథమిక హక్కే తప్ప విచక్షణాత్మక చర్య కాదు. దివ్యాంగులకు సమానత్వం కూడా అందులో అంతర్భాగమే’’ అని సుప్రీంకోర్టు గత తీర్పులను ఉటంకిస్తూ స్పష్టం చేశారు. ‘‘సమాజంలోని బలహీన వర్గాల ప్రయోజనాల పరిరక్షణను 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా ప్రభుత్వాల తప్పనిసరి బాధ్యతగా మార్చుకున్నాం. ఈ నిర్వచనం పరిధిలోకి శారీరక, మానసిక వికలాంగులు కూడా వస్తారు’’ అని వివరించారు. -
నిబంధనలు తప్పనిసరి
న్యూఢిల్లీ: ఆన్లైన్ కంటెంట్ ప్లాట్‌ఫాంలు ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి, ఏది పడితే అది జనంపై రుద్ద డానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. యూ ట్యూబర్ రణ్వీర్ అలహాబాదియా వివాదానికి సంబంధించిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సోమ వారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆన్లైన్ కంటెంట్‌ను నియంత్రించేందుకు ఒక సమగ్ర వ్యవస్థ తప్పనిసరన్న కేంద్ర ప్రభుత్వం వాదనతో ఏకీభవించింది. అలాగని రాజ్యాంగం ప్రసాదించిన వాక్ స్వా తంత్య్రం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ వంటి ప్రాథమిక హక్కులను హరించే సెన్సార్షిప్ మాదిరిగా ఉండరాదని న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. ‘‘వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటూ ఆర్టికల్ 19(4) పరిధులకు లోబడి ఉండేలా సోషల్ మీడియా నియంత్రణకు నిబంధనలను సూచించండి. అనంతరం వాటిపై ఇరు వర్గాలతో పాటు ప్రజల నుంచి కూడా సలహాలు, సూ చనలు స్వీకరించండి’’ అని కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సూచించారు. భారత సమాజ నైతిక ప్రమాణాలకు గొడ్డలిపెట్టు వంటి అశ్లీల, అభ్యంతరకర ఆన్లైన్ కంటెంట్ ప్రసారాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరముందని ఎస్జీ అన్నారు. ‘‘నైతికత విషయంలో మిగతా దేశాలకు, మనకు తేడా ఉంది. అమెరికాలో జాతీయ పతాకాన్ని తగలబెట్టడం ప్రాథమిక హక్కు. మన దగ్గర మాత్రం క్రిమినల్ నేరం’’ అని ఉదహరించారు. సోషల్ ఖాతాల నిషేధంపై సమీక్షసోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ల వాదనలు వినకుండానే వారి ఖాతాలను నిషేధించడాన్ని సమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ గవాయ్ సారథ్యంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం విచారణకు స్వీకరించింది. ప్రభు త్వాలకు ఇందుకు వీలు కల్పిస్తున్న ఐటీ రూల్స్, 2009లోని 16వ నిబంధనను కొట్టేయాలన్న పిటిషనర్ అభ్యర్థనపై కేంద్రం స్పందన కోరింది. వెబ్సైట్లు, ఆన్లైన్ అప్లికేషన్లు, సోషల్ మీడియా అకౌంట్లకు నోటీసులివ్వకుండా, వాదనలే వినకుండా బ్లాక్ చేస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదించారు. సోషల్ మీడియా గురించి ధర్మాసనానికి బాగా తెలిసే ఉంటుందని జైసింగ్ అనడంతో జస్టిస్ గవాయ్ సరదాగా స్పందించారు. ‘‘నేనైతే ఎలాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలోనూ లేను. ఎక్స్‌లోనే కాదు, వై, జెడ్ వేటిలోనూ లేను’’ అనడంతో నవ్వులు విరిశాయి. -
ఐఆర్సీటీసీ, ఐఆర్ఎఫ్సీకి నవరత్న హోదా
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో మరో రెండు ప్రభుత్వరంగ సంస్థలు నవరత్న హోదా సాధించాయి. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ), ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ)లకు నవరత్న హోదా కల్పిస్తున్నట్లు కేంద్రం చెప్పింది. దీంతో నవరత్న హోదా పొందిన 25వ కంపెనీగా ఐఆర్సీటీసీ, 26వ కంపెనీగా ఐఆర్ఎఫ్సీ అవతరించాయని డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సోమవారం వెల్లడించింది. కంపెనీల ఆర్థిక పనితీరు, నిర్వహణ ఆధారంగా నవరత్న, మహారత్న హోదాలను కేంద్రం మంజూరు చేస్తుంది. -
నా ఇన్సిపిరేషన్ అమ్మ.. ఎందుకంటే..
‘నాకు ఏడేళ్లప్పడు మా అమ్మ నన్ను, నా ఇద్దరు చెల్లెళ్లను తీసుకుని నాన్న దగ్గర్నుంచి బయటకు వచ్చేసింది. ఆ ఇంట్లోంచి వెళ్లిపోతున్నప్పుడు ‘మనం ఊరెళ్లిపోతున్నాం’ అని చెప్పింది అమ్మ. ‘ఎందుకు?’ అడిగాను. ‘నేను కొడుకును కనివ్వలేను కాబట్టి’ అంది. నాన్న వాళ్లింట్లోంచి వచ్చేప్పుడు అనుకున్నాను ‘ఎప్పటికైనా ఆ ఇంటిని కొంటాను’ అని! అనుకోవడమే కాదు అమ్మతో చెప్పాను కూడా! చాలెంజెస్ ఫేస్ చేయడం ఆ రోజునుంచే మొదలైంది. డబుల్, ట్రిబుల్ జాబ్స్ చేస్తూ డబ్బు సంపాదించాను. ఆ ఇంటిని కొనేంత కూడబెట్టాను. ఒకరోజు అక్కడికి వెళ్లి అమ్మకు ఫోన్ చేశాను. ‘చిన్నప్పుడు వదిలి వచ్చేసిన ఇంటి దగ్గరున్నానమ్మా’ అని! అప్పుడు అమ్మ ‘ప్రతీకారకాంక్ష మనల్ని దహించేస్తుంది.. విలువైన సమయాన్ని వృథా చేస్తుంది. మన ఎనర్జీని నిరుపయోగమైన వాటివైపు మళ్లిస్తుంది. అందుకే మనల్ని హర్ట్ చేసిన వాళ్లను క్షమించి, మరచిపోవాలి. మనకు కోపం తెప్పించే వాటిని ఇగ్నోర్ చేయాలి. మన ఎనర్జీని పదిమందికి ఉపయోగపడే విషయాలపై వెచ్చించాలి’ అని చెప్పింది. ఆ మాట నా దిశను మార్చేసింది. అందుకే మా అమ్మే నా ఇన్సిపిరేషన్, టీచర్, గైడ్, ఫిలాసఫర్!’ -
యూఏఈలో భారతీయ మహిళకు మరణశిక్ష అమలు
న్యూఢిల్లీ: నాలుగు ఏళ్ల చిన్నారి మృతి కేసులో భాగంగా ఓ భారత మహిళకు యూఏఈలో మరణశిక్ష అమలైంది. గత నెల 15వ తేదీన శిక్షను ఖరారు చేసినప్పటికీ, ఆ విషయాన్ని తాజాగా విదేశాంగ శాఖ.. ఢిల్లీ హైకోర్టు తెలిపింది. యూపీకి చెందిన షెహజాదీ ఖాన్ అనే మహిళ.. గత కొంతకాలంగా అబుదాబిలో ఉంటోంది. 33 ఏళ్ల షెషజాదీ ఖాన్.. యూపీలోని బాంద్రా జిల్లాకు చెందిన మహిళ. టూరిస్టు వీసా మీద నాలుగేళ్ల క్రితం అబుదాబి వెళ్లింది.2022లో ఆగస్టులో తన కొడుకును చూసుకునే బాధ్యతను ఆమెకు అప్పగించాడు. షెహజాదీ కేర్ గివర్ కింద ఆ బాధ్యతలు తీసుకుంది. 2022, డిసెంబర్ 7 వ తేదీన వ్యాక్సినేషన్ కు తీసుకెళ్లింది నాలుగేళ్ల బుడతడికి. అయితే అది కాస్తా విషాదాంతమైంది. ఆ బాబు చనిపోవడంతో కేసు షెహజాదీ పడింది. తన కుమారుడు మరణానికి ఆమె కారణమంటూ కేసు ఫైల్ చేశాడు. ఇలా కొంతకాలం కోర్టులో చుట్టూ తిరగ్గా ఆమెకు మరణశిక్ష ఖరారైంది. ఆమెకు మరణశిక్ష ఖాయమైందన్న తెలుసుకున్న కుటుంబ సభ్యులు లబోదిబోమన్నారు. ఆ క్రమంలోనే ఆమె తండ్రి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. అయితే యూఏఈ చట్టాల ప్రకారం ఆమె మరణశిక్ష అమలు కావడంతో ఆ విషయాన్ని విదేశాంగ శాఖ.. ఢిల్లీ హైకోర్టుకు స్పష్టం చేసింది.అక్రమంగా రవాణా చేసి.. ఆమె టూరిస్టు వీసా మీద వెళ్లి అక్కడ స్థిరపడాలనుకుంది షెహజాదీ. అయితే ఆమెను అక్కడికి తీసుకెళ్లేముందు అది టూరిస్టు వీసా అనే సంగతిని ఫైజ్, నాడియా దంపతులు ఆమెకు చెప్పలేదు. అలా వెళ్లి ఇరుక్కుపోయింది ఆమె.ఆమెను అక్రమంగా రవాణా చేసినందుకు ఫైజ్, నాడియా దంపతులపై కూడా కేసు నమోదు అయ్యింది. ఈ క్రమంలోనే వారి నాలుగేళ్ల కొడుకును షెహజాదీ చూసుకుంటోంది. కానీ ఆ బాబు ఆమె చేతుల మీదుగానే చనిపోవడంతో మరొక కేసు షెహజాదీకి చుట్టుకుంది. యూఏఈ చట్టాలు కఠినంగా అమలు చేయడంతో ఆమెకు మరణశిక్ష అమలు చేసింది అక్కడ కోర్టు.చివరి కోరికను అడగ్గా..మరణశిక్ష అమలుకు ముందు గత నెల 16వ తేదీన చివరి కోరిక ఏమటని అడగ్గా.. కుటుంబ సభ్యులతో మాట్లాడిన తెలిపింది. తాను నిర్దోషినని కుటుంబ సభ్యుల ముందు కన్నీటి పర్యంతమైంది. అదే చివరిసారి ఆమె కుటుంబంతో మాటలని తండ్రి అంటున్నారు. -
అయోధ్య రామమందిరంపై ఉగ్రదాడికి ఐఎస్ఐ కుట్ర.. భగ్నం చేసిన భారత్
గాంధీనగర్: అయోధ్య రామమందిరంపై ఉగ్రదాడి చేసేందుకు ప్రయత్నించిన పాకిస్థాన్(Pakistan) ఐఎస్ఐ ఉగ్రదాడిని భారత్ భగ్నం చేసింది. గుజరాత్, హర్యానా యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ జాయింట్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ జాయింట్ ఆపరేషన్‌లో భాగంగా హర్యానాలో ఉగ్రవాది రెహ్మాన్‌ను అరెస్ట్ చేసింది. పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ(ISI)తో సంబంధాలున్న ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్‌లో పట్టుబడ్డాడు. భద్రతా సంస్థల సమాచారం మేరకు.. ఐఎస్ఐ సంస్థ అబ్దుల్ రెహ్మాన్ ద్వారా అయోధ్య రామ్ మందిరంపై దాడి చేయించేందుకు ప్లాన్ చేసింది. ఉగ్రదాడిలో భాగంగా అబ్దుల్ రెహ్మాన్ రామమందిరంపై రెక్కీ నిర్వహించాడు. సమాచారాన్ని సేకరించి ఐఎస్ఐకి చేరవేర్చాడు. అనంతరం, అబ్దుల్ రెహ్మాన్ ఫైజాబాద్ నుంచి ట్రైన్లో మొదట ఫరీదాబాద్ చేరుకున్నాడు. ఫరీబాదాబాద్‌లో హ్యాండ్ గ్రనేడ్లను సేకరించాడు. వాటిని తీసుకుని ట్రైన్ ద్వారా అయోధ్య వెళ్లాల్సి ఉంది. అనంతరం ఆ హ్యాండ్ గ్రనేడ్‌తో రామమందిరంపై దాడి చేసేలా ప్లాన్ వేశాడు. అంతకంటే ముందే దేశ భద్రతా సంస్థలు అందించిన సమాచారంతో గుజరాత్ ఏటీఎస్, ఫరీదాబాద్ ఏటీఎస్ స్క్వాడ్ అబ్దుల్ రెహ్మాన్‌ను అదుపులోకి తీసుకున్నాయి. అయోధ్యరామ మందిరంపై ఉగ్రదాడిని భగ్నం చేశాయి. -
గంజాయి కేసులో ఐఐటీ బాబా అరెస్ట్!
జైపూర్: మహా కుంభమేళాతో దేశం దృష్టిని ఆకర్షించిన ఐఐటీ బాబా(IIT Baba) అభయ్ సింగ్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. గంజాయి కేసులో తాజాగా ఆయన్ని జైపూర్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా ఐఐటీ బాబానే ధృవీకరించడం విశేషం. ఐఐటీ బాబా సూసైడ్ చేసుకుంటానన్న ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు జైపూర్ షిప్రా పాథ్ పోలీసులు ఓ హోటల్లో ఉన్నారనే సమాచారంతో అక్కడికి వెళ్లారు. ఆ టైంలో ఆయన నుంచి గంజాయి సేవిస్తుండడంతో పోలీసులు అదుపులోకి తీన్నారు. ఆయనపై నార్కోటిక్ డ్రగ్స్ &సైకోట్రోపిక్ సబ్స్టానెన్స్(NDPS) యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు అక్కడి మీడియా కథనాలు ఇచ్చింది. VIDEO | Amid reports of his arrest, Maha Kumbh fame Abhay Singh, alias 'IIT Baba' was seen celebrating his birthday with followers in Jaipur. pic.twitter.com/WhA8aTIUv2— Press Trust of India (@PTI_News) March 3, 2025అయితే.. ఆయన అరెస్ట్ ప్రచారం నడుమ అనూహ్యంగా ఆయన తన భక్తుల మధ్య పుట్టినరోజు వేడుకలు చేసుకుంటూ కనిపించారు. దీంతో మీడియా ఆయన్ని అరెస్ట్‌పై ఆరా తీసింది. తాను ఆత్మహత్య చేసుకుంటానన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని అన్నారాయన. అయితే తాను గంజాయి తీసుకున్న మాట వాస్తవమేనని.. అయితే పరిమితితో కూడి గంజాయి ఉండడంతో పోలీసులు బెయిల్ మీద తనను విడుదల చేశారని అన్నారాయన. అయితే తన దృష్టిలో అది గంజాయి కాదని.. ప్రసాదమని ఆయన వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. ఓప్రైవేట్ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో తనపై దాడి జరిగిందంటూ నోయిడా పీఎస్ వద్ద ఐఐటీ బాబా హడావిడి చేసిన సంగతి తెలిసిందే. చివరకు పోలీసులు ఆయన్ని శాంతపర్చి అక్కడి నుంచి పంపించేశారు. అయితే ఇంటర్వ్యూకు ముందు ఆయనే సదరు ఛానెల్ యాంకర్‌పై దాడి చేశారంటూ ప్రచారం జరగడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి కేసు నమోదు కాలేదు.ఐఐటీ బాబాగా ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా(Prayagraj Maha Kumbh) అభయ్ సింగ్ ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూతో పాపులారిటీ సంపాదించుకున్నారు. హర్యానా చెందిన అభయ్ ఐఐటీ బాంబేలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ పూర్తిచేసినట్లు చెబుతున్నారు. కొంతకాలం ఓ కార్పొరేట్ సంస్థలో పనిచేసిన ఆయన.. దాన్ని వదిలేశారట. ఆపై కొంతకాలం ఫొటోగ్రఫీ.. అటు నుంచి ఆధ్యాత్మికం వైపు అడుగులు వేశారట. -
కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ భేటీ
ఢిల్లీ: కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించి పలు ప్రాజెక్టులపై కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ చర్చించారు. సీఎం వెంట తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఉన్నారు. దేవాదుల ఎత్తిపోతల పథకం, భీమా ఎత్తిపోతల పథకం, ఎస్సారెస్పీ స్టేజి -2కు సంబంధించి భూసేకరణ, వివాదాలు 18,189 కోట్ల రూపాయల పెండింగ్ పనులు గురించి రేవంత్ చర్చించినట్లు తెలుస్తోంది.ప్రధానంగా కృష్ణా జలాల అంశంపై కేంద్ర జలశక్తి మంత్రికి వివరించారు. దీనిపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. కృష్ణా జలాలను ఏపీ అన్యాయంగా తరలించుకుపోతోందని, ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమావేశం అనంతరం పేర్కొన్నారు. కృష్ణా నదీ జలాల వివాదంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఏమన్నారంటే..కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందినాగార్జునసాగర్, శ్రీశైలం నుంచి ఏపీ తీసుకెళుతున్న అధిక జలాలను ఆపాలని కోరాంకేంద్రం అత్యవసర జోక్యం చేసుకుని అన్యాయాన్ని ఆపాలిఏపీ తీసుకెళుతున్న పదివేల క్యూసెక్కుల నీటిని అయిదువేలకు తగ్గిస్తామని కేంద్రమంత్రి చెప్పారుఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు మేము అభ్యంతరం చెప్పాంఏపీ నుంచి ఎటువంటి నివేదిక రాలేదని, ఈ అంశంలో తెలంగాణ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటాంకృష్ణా ట్రిబ్యునల్ ద్వారా తెలంగాణకు ఎక్కువ నీరు ఇచ్చేలా సహకరించాలని కేంద్రాన్ని కోరాంపాలమూరు రంగారెడ్డి, సమ్మక్క సారక్క, సీతారామ సాగర్ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు, నిధులు ఇవ్వాలని అడిగాంకృష్ణా నదిలో శ్రీశైలం, నాగార్జున సాగర్ సహా ఇతర ప్రాజెక్టులలో టెలీ మెట్రీ పరికరాలు ఏర్పాటు చేయాలిటెలీమెట్రీల కోసం తెలంగాణ, ఆంధ్రా వాటా ఖర్చు కూడా మేమే భరిస్తామని చెప్పాముఈ ప్రతిపాదనకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారుఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి తెలంగాణకు 50 ఏళ్ల పాటు దీర్ఘకాలిక వడ్డీ లేని రుణం ఇవ్వాలని కోరాంమేడిగడ్డ, సుందిళ్ల ప్రాజెక్టులపై NDSA - నేషనల్ డ్యాం సేప్టీ అథారిటీ నుంచి నివేదిక త్వరగా ఇవ్వాలని కోరాంతెలంగాణ జల వనరుల విషయంలో సీఎం రేవంత్, నేను కేంద్రం వద్ద మా వాదన బలంగా వినిపించాంకృష్ణా జలాల వివాదంలో రోజువారీగా కేంద్రం జోక్యం చేసుకుంటామని హామీ ఇచ్చిందిదీర్ఘకాలికంగా బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ త్వరితగతిన విచారణ పూర్తిచేయాలని కోరాంతుమ్మడిహట్టి దగ్గర గతంలో కాంగ్రెస్ ప్రతిపాదించి పనులు మొదలు పెట్టనున్నాంప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు విషయంలో కూడా కేంద్రంతో చర్చించాంకేంద్రం మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి భూసేకరణ విషయంలో సహకరించాలని కోరాము -
డీలిమిటేషన్ హీట్.. యూటర్న్ తీసుకున్న స్టాలిన్
చెన్నై: నియోజకవర్గ పునర్వవ్యస్థీకరణపై రాజకీయ దుమారం కొనసాగుతున్న వేళ.. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో కొత్తగా పెళ్లైన జంటలను ఆలస్యంగా పిల్లలను కనాలని సూచించిన ఆయన.. ఇప్పుడు స్టాండ్‌పై యూటర్న్ తీసుకున్నారు. అందుకు నియోజకవర్గాల పునర్విభజన రాజకీయం వేడెక్కడమే కారణం. సోమవారం నాగపట్నంలో డీఎంకే నేత కుటుంబ వివాహ వేడుకకు హాజరైన సీఎం స్టాలిన్ మాట్లాడుతూ.. గతంలో కొత్తగా పెళ్లైన వాళ్లను పిల్లల విషయంలో కొంత సమయం తీసుకోవాలని నేనే చెప్పాను. ఫ్యామిలీ ప్లానింగ్ విషయంలో మనం విజయవంతం అయ్యాం కూడా. కానీ, ఇప్పుడు.. నియోజకవర్గాల పునర్విభజన(Delimitation)పై కేంద్రం కొత్త పాలసీలు తీసుకొస్తున్న వేళ అలా చెప్పను. కొత్తగా పెళ్లైన జంటలు వీలైనంత త్వరగా పిల్లలను కనండి. వాళ్లకు మంచి తమిళ పేర్లు పెట్టండి అని స్టాలిన్ అన్నారు. అయితే.. జనాభా ప్రతిపాదికన కేంద్రం నియోజకవర్గాలను పునర్విభజించబోతోందని స్టాలిన్ చెప్పడం ఇదేం కొత్త కాదు. ఇంతకు ముందూ ఆయన ఇలాగే మాట్లాడారు. అలా జనాభా ప్రకారం చూసుకుంటే.. తమిళనాడుకు 8 స్థానాలు తగ్గే అవకాశం ఉందని.. ఇది మరికొన్ని రాష్ట్రాలపైనా ప్రభావం చూపెడుతుందని ఆందోళన వ్యక్తం చేశారాయన.దేశ సంక్షేమం, ఆర్థిక అభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే.. కుటుంబ నియంత్రణ ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా విజయం సాధించాయని అనుకుంటున్నాయి. రేపు ఒకవేళ జనాభా ప్రతిపాదికన గనుక కేంద్రం నియోజకవర్గాలను విభజిస్తే.. ఆ రాష్ట్రాలకే తీవ్ర నష్టం అని అంటున్నారాయన.అయితే స్టాలిన్ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ(BJP) కౌంటర్ ఇచ్చింది. తమిళనాడు సీఎం వ్యాఖ్యలు నిరాశవాదంతో కూడుకున్నవని, నిజాయితీలేని రాజకీయాలకు సంకేతమని బీజేపీ అధికార ప్రతినిధి సీఆర్ కేశవన్ చెబుతున్నారు. జనాభాకు తగ్గట్లుగా హక్కులు ఉంటాయా? అని గతంలో మీ మిత్రపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని స్టాలిన్‌ను ఉద్దేశించి కేశవన్ అన్నారు. పాలనాపరమైన వైఫల్యాల నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఈ డ్రామాలని డీఎంకేపై మండిపడ్డారాయన. మరోవైపు.. డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగబోదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇదివరకే ఓ ప్రకటన చేశారు. -
సుప్రీం కోర్టులో రణవీర్ అల్హాబాదియాకు ఊరట
ఢిల్లీ : తల్లిదండ్రుల గురించి, శృంగారం పైన ప్రశ్నించి వివాదాల్లో చిక్కుకున్న ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియాకు సుప్రీం కోర్టులో (supreme court) ఊరట దక్కింది. వివాదాస్పద వ్యాఖ్యలతో ఆగిపోయిన పాడ్ కాస్ట్ ‘ది రణ్వీర్ షో’తో పాటు ఇతర షోలను తిరిగి ప్రారంభించుకోవడంతో పాటు వాటిని ప్రసారం చేసుకోవచ్చని తెలిపింది.‘ఇండియాస్ గాట్ లాటెంట్’ (India's Got Latent) వేదికగా యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియా (Ranveer Allahbadia) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దీంతో అల్హాబాదియా వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా పలు కేసులు నమోదయ్యాయి. అల్హాబాదియా చేస్తున్న షోలు సైతం ఆగిపోయాయి. అయితే, అల్హాబాదియా తాను ఇంటర్వ్యూలు, షోలు చేసుకునే అవకాశం కల్పించాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అంతేకాదు,తాను చేస్తున్న షోలపై సుమారు 280 మంది ఆధారపడ్డారని, షోలు ఆగిపోవడం వల్ల వారికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పిటిషన్లో పేర్కొన్నారు ఆ పిటిషన్‌పై సుప్రీం కోర్టు న్యాయమూర్తులు సూర్యకాంత్, ఎన్.కోటీశ్వర్ సింగ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. అల్హబాదియా పిటిషన్‌పై కేంద్రం తరఫు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా (Solicitor General Tushar Mehta) తన వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా తాను ఉత్సుకతతో అల్హాబాదియా షోను చూశానని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. ఆ షో అసభ్యంగా మాత్రమే కాదు.. వక్రంగా ఉందని వ్యాఖ్యానించారు. హాస్యం, అసభ్యత, వక్రబుద్ధి మధ్య గణనీయమైన వ్యత్యాసం ఉందని నొక్కి చెప్పారు.ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీం ద్విసభ్య ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. వాక్ స్వాతంత్ర్యం ప్రాథమిక హక్కు, అశ్లీలత విషయంలో స్పష్టమైన సరిహద్దు ఉండాలని పునరుద్ఘాటించింది. ఈ సందర్భంగా అల్హాబాదియాకు సుప్రీం కోర్టు చురకలంటించింది. భావప్రకటనా స్వేచ్ఛకు పరిమితులు ఉన్నాయని, అసభ్య పదజాలం వాడటం హాస్యం కాదని మందలించింది. అల్హాబాదియా షోలు చేసుకోవచ్చని, నైతికంగా, మర్యాద ఉండాలని సూచించింది.👉చదవండి : హాస్యం పేరిట అల్హాబాదియా నీచపు వ్యాఖ్యలు -
ముంచుకొస్తున్న ఎండలు.. ముందు జాగ్రత్తలివే..
ఈ ఏడాది దేశంలో మార్చి నుంచే ఎండలు దంచి కొట్టనున్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఇలా మార్చి నుంచే ఎండలు మండిపోతే ఇక ఏప్రిల్, మే నెలల్లో ఎండలు ఎలా ఉంటాయోనని చాలా మంది ఇప్పటి నుంచే బెంబేలెత్తిపోతున్నారు. దీనికితోడు ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేని విధంగా హీట్ వేవ్స్ వస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఈ నేపధ్యంలో వేసవి కాలంలో ఎదురయ్యే అనారోగ్య సమస్యల నివారణకు వైద్య నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. అవేమిటో ఇప్పుడు చూద్దాం..వేసవి కాలంలో డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండేందుకు దాహం వేయకపోయినా తరచూ నీటిని తాగుతుండాలి.రోజులో ఒకటి రెండుసార్లు ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్ఎస్)ని ఉపయోగించాలి. అలాగే నిమ్మరసం, మజ్జిగ /లస్సీ, పండ్ల రసాలతో పాటు ఇంట్లో తయారుచేసిన ఇతర పానీయాలలో కొద్దిగా ఉప్పు కలిపి తీసుకోవాలి.బయటకు వెళ్లేటప్పుడే కాకుండా ఇంట్లో ఉన్పప్పుడు కూడా వదులుగా ఉండే కాటన్ దుస్తులను ధరించాలి. అలాగే తప్పనిసరై బయటకు వెళ్లినప్పుడు ఎండ నుంచి రక్షణ పొందేందుకు గొడుగు, టోపీ, టవల్ వంటివి ఉపయోగిస్తూ నేరుగా శరీరానికి ఎండ తాకకుండా చూసుకోవాలి.ఎప్పటికప్పుడు వాతావరణానికి సంబంధించిన వార్తలను తెలుసుకోవాలి. వాతావరణ మార్పులకు అనుగుణంగా నడుచుకోవాలి. అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు తప్పనిసరైతేనే బయటకు వెళ్లాలి.వేసవిలో ఉదయం వేళ కిటికీలు, కర్టెన్లను మూసివేయాలి. సాయంత్రం సమయంలో చల్లని గాలి లోపలికి వచ్చేవిధంగా కిటికీలను తెరిచివుంచాలి.శిశువులు, పిల్లలు, గర్భిణులు, ఆరుబయట పనిచేసేవారు, మానసిక అనారోగ్యం కలిగినవారు, శారీరకంగా అనారోగ్యంతో ఉన్నవారు, గుండె జబ్బులు లేదా అధిక రక్తపోటు ఉన్నవారు వేడి వాతావరణంలోనికి వెళ్లినప్పడు వారికి వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. అలాంటివారు డీహైడ్రేషన్‌కు గురికాకుండా చూసుకోవాలి.అధిక ఉష్ణోగ్రతలు ఉన్న రోజ్లులో మధ్యాహ్నం 12:00 నుంచి 3:00 గంటల మధ్య ఎండలో బయటకు వెళ్లకుండా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎండ ఎక్కువగా ఉండే సమయాల్లో వంట చేయడాన్ని తగ్గించాలి. ముందుగానే వంటపనులు పూర్తిచేసుకోవాలి. అలాగే వంట చేసే ప్రదేశంలో గాలి ఆడేందుకు తలుపులు, కిటికీలు తెరిచివుంచాలి.పార్క్ చేసిన వాహనాలలో పిల్లలను లేదా పెంపుడు జంతువులను వదిలివెళ్లకూడదు. ఎందుకంటే వాహనం లోపల ఏర్పడే ఉష్ణోగ్రత వారి ప్రాణానికే ప్రమాదం తీసుకొస్తుందనే సంగతిని గమనించాలి.ఎండల కారణంగా వికారం లేదా వాంతులు, తలనొప్పి, విపరీతమైన దాహం, మూత్రవిసర్జన తగ్గడం, వేగంగా శ్వాస తీసుకోవడం, అధికంగా గుండె కొట్టుకోవడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: ఆకర్షించే స్క్వేర్ వేవ్స్.. దగ్గరకు వెళ్తే అంతే సంగతులు -
ప్రధాని మోదీ మెచ్చిన గిర్ అభయారణ్యం ప్రత్యేకతలివే..
గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని ప్రధాని నరేంద్ర మోదీ గిర్ వన్యప్రాణుల అభయారణ్యంలో జంగిల్ సఫారీలో పాల్గొన్నారు. రాష్ట్ర అటవీశాఖ గెస్ట్‌హౌస్ ‘సింగ్ సదన్’ నుంచి ప్రధానితో పాటు కొందరు మంత్రులు, అటవీ శాఖ సీనియర్ అధికారులు జంగిల్ సఫారీకి తరలి వెళ్లారు. ప్రధాని మోదీ ‘జంగిల్ సఫారీ’కి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ గిర్ వన్యప్రాణుల అభయారణ్యం ప్రత్యేకత ఏమిటి?ఆసియా సింహాల పరిరక్షణగుజరాత్లోని జునాగఢ్‌కు 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న గిర్ నేషనల్ పార్క్ దేశంలోని ప్రధాన జాతీయ ఉద్యానవనాలలో ఒకటి. ఈ అభయారణ్యం దాదాపు 1412 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. దీనిని 1965లో ఏర్పాటు చేశారు. దాదాపు రెండు శతాబ్దాల పాటు అరణ్యాలలో స్వతంత్రంగా తిరిగిన ఆసియా సింహాల పరిరక్షణకు గిర్ ప్రసిద్ధి చెందింది.1884 నుంచి గిర్ నేషనల్ పార్క్ అంతరించిపోతున్న ఆసియా సింహాలకు ఏకైక సహజ నివాసంగా ఉంది. ఆసియా సింహాలతో సహా దాదాపు 2,375 విభిన్న వన్యప్రాణుల జాతులకు గిర్ అభయారణ్యం ఆశ్రయం కల్పిస్తున్నది. గిర్ వన్యప్రాణుల అభయారణ్యం అందమైన నల్సరోవర్ సరస్సు సమీపంలో ఉంది. ఆసియా సింహాలు, ఆఫ్రికన్ సింహాలు రెండూ ఒకే జాతికి చెందిన ఉపజాతులు. ఆసియా సింహాలు.. ఆఫ్రికన్ సింహాల నుండి లక్ష సంవత్సరాల క్రితం విడిపోయాయి. ఆసియా సింహాలు ఒకప్పుడు మధ్యప్రాచ్యం నుండి భారతదేశానికి తరలివచ్చాయి. ఇప్పుడు వీటిలో కొన్ని జాతులు మాత్రమే అడవుల్లో మనుగడలో ఉన్నాయి.‘గిర్’ చుట్టుపక్కల పర్యాటక ఆకర్షణలుకమలేశ్వర్ ఆనకట్టతులసి శ్యామ్ ఆలయంగిరిజన స్థావరాలుఉపర్కోట్ కోటసోమనాథ్ ఆలయందేవలియా సఫారీ పార్క్జంజీర్ జలపాతంసఫారీ ఎలా చేయాలి?గిర్ అభయారణ్యంలో సఫారీ చేయాలనుకుంటే ముందుగానే జీప్ సఫారీని ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. పార్క్ లోపలికి ప్రవేశించేటప్పుడు ఐడీ ప్రూఫ్‌లను చూపించాలి. జంగిల్ సఫారీ వైపు వెళ్లేటప్పుడు సౌకర్యవంతమైన దుస్తులను ధరించాలి. పార్క్ లోపల ధూమపానం, మద్యపానం నిషేధించారు.ప్రాజెక్ట్ లయన్ఆసియాటిక్ సింహాల సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం ‘ప్రాజెక్ట్ లయన్’ కింద రూ.2,900 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసింది. ప్రస్తుతం గుజరాత్‌లోని తొమ్మిది జిల్లాల్లోని 53 తాలూకాల్లో ఆసియా సింహాలు దాదాపు 30,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నివసిస్తున్నాయని ప్రభుత్వం ప్రకటించింది. జునాగఢ్ జిల్లాలోని న్యూ పిపాల్య వద్ద 20.24 హెక్టార్లకు పైగా భూభాగంలో వన్యప్రాణుల వైద్య నిర్ధారణ, వ్యాధి నివారణ కోసం 'నేషనల్ రెఫరల్ సెంటర్’ను ప్రభుతం ఏర్పాటు చేయనుంది.👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ఇది కూడా చదవండి: ఆకర్షించే స్క్వేర్ వేవ్స్.. దగ్గరకు వెళ్తే అంతే సంగతులు -
ఈజీగా ఇంటర్నేషనల్ జర్నీ
విమానం మిస్సవుతుందనే భయం లేదు. నిశ్చింతగా బయలుదేరవచ్చు. గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాయాల్సిన అవసరం లేదు. ఎలాంటి నిరీక్షణ లేకుండా ఇమిగ్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ – ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రామ్ (ఎఫ్టీఐ–టీటీపీ) హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సత్ఫలితాలిస్తోంది.ఉద్యోగాలు, వ్యాపారాల రీత్యా విదేశాలకు క్రమం తప్పకుండా ప్రయాణించేవారికి ఇది ఎంతో ఉపయోగపడుతోంది. సాధారణ ఇమిగ్రేషన్ క్యూలైన్లకు వెళ్లవలసిన అవసరం లేకుండా ఫాస్ట్‌ట్రాక్ ఇమిగ్రేషన్ ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా ప్రవేశ, నిష్క్రమణ ఈ–గేట్లను ఏర్పాటు చేశారు. – సాక్షి, హైదరాబాద్నమ్మకమైన ప్రయాణికుల కోసమే..హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతిరోజూ సుమారు 70 వేల మందికి పైగా డొమెస్టిక్ (దేశీయ), ఇంటర్నేషనల్ (అంతర్జాతీయ) ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. వీరిలో 10 వేల మందికి పైగా విదేశాలకు వెళ్లి వచ్చేవారు ఉన్నారు. వీరిలో తరచూ ప్రయాణించేవారికి ఈ ఫాస్ట్‌ట్రాక్ విధానం ఎంతో ఉపయుక్తంగా ఉంది. టూరిస్టులు, రెండుమూడేళ్లకోసారి విదేశీ ప్రయాణం చేసేవాళ్లు ఈ సేవలను వినియోగించుకోలేరని, తరచూ రాకపోకలు సాగించే నమ్మకమైన ప్రయాణికుల కోసమే దీనిని అందుబాటులోకి తెచ్చామని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అధికారి ఒకరు తెలిపారు.‘ఇది భారతీయ పాస్ట్‌పోర్ట్‌లు, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డులు కలిగిన వాళ్ల కోసం ప్రవేశపెట్టిన సాంకేతిక వ్యవస్థ. ఇమిగ్రేషన్ చెక్ కోసం క్యూలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ప్రత్యేక వ్యవస్థ ద్వారా ఈ ప్రక్రియను ముగించి రాకపోకలు సాగించవచ్చు’అని ఆయన చెప్పారు.ఇప్పటివరకు 500 మందికి పైగా ఎఫ్టీఐ–టీటీపీలో వివరాలను నమోదు చేసుకున్నట్లు తెలిపారు. రోజూ 10 – 15 మంది వరకు ఈ సేవలను వినియోగించుకుంటున్నారని, రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. వీరికోసం ప్రత్యేకంగా 8 గేట్లను వినియోగిస్తున్నామని తెలిపారు.దరఖాస్తు ఇలా..ఫాస్ట్‌ట్రాక్ ఇమిగ్రేషన్ వ్యవస్థను ఉపయోగించుకోవాలంటే www.ftittp.mha.gov.in వెబ్సైట్లో ప్రయాణికులు తమ వివరాలు నమోదు చేసుకోవాలి. పాస్‌పోర్ట్ కనీసం 6 నెలల చెల్లుబాటును కలిగి ఉండాలి. దరఖాస్తు సమయంలోనే పాస్‌పోర్ట్‌ను అప్లోడ్ చేసి, ఇతర అన్ని వివరాలు నమోదు చేయాలి. భద్రతాపరమైన తనిఖీల అనంతరం ఎఫ్టీఐ–టీటీపీ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ఈ సమాచారాన్ని ఇమిగ్రేషన్ బ్యూరో పరిశీలించి ఆమోదిస్తే, ఆ సమాచారం ప్రయాణికుల మొబైల్ ఫోన్‌కు ఎస్సెమ్మెస్ రూపంలో వస్తుంది. ఈ మెయిల్‌కు కూడా సందేశం వస్తుంది. వేలిముద్రలు, ఫొటో వంటి బయోమెట్రిక్ వివరాలను నమోదు చేసేందుకు ఎయిర్‌పోర్టులోని ప్రత్యేక కౌంటర్లలో సంప్రదించవలసి ఉంటుందని అధికారులు తెలిపారు.సేవలు ఇలా.. ⇒ ఫాస్ట్‌ట్రాక్ ఇమిగ్రేషన్ సదుపాయం కలిగిన ప్రయాణికులు వీసా తనిఖీ పూర్తయిన తరువాత బోర్డింగ్ పాస్ కోసం రిజిస్టర్డ్ ప్యాసింజర్ చెక్–ఇన్ కౌంటర్లో సంప్రదించాలి. ⇒ బోర్డింగ్ పాస్ తీసుకున్న తరువాత ఇమిగ్రేషన్ కోసం వీరికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ–గేట్ల వద్దకు వెళ్లాలి. ⇒ మొదటి గేట్ వద్ద పాస్‌పోర్ట్, బోర్డింగ్ పాస్ స్కానింగ్ పూర్తవుతుంది. దీంతో రెండో ఈ–గేట్‌కు అనుమతి లభిస్తుంది. ⇒ రెండో ఈ–గేట్ వద్ద ప్రయాణికుడి ముఖాన్ని స్కాన్ చేస్తారు. ధ్రువీకరణ అనంతరం ఇమిగ్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. ప్రయోజనాలు ఇవీ.. ⇒ సాధారణ ఇమిగ్రేషన్ ప్రక్రియలో వివిధ దేశాలకు వెళ్లే ప్రయాణికులంతా ఒకే క్యూలైన్లో వెళ్లవలసి ఉంటుంది. అందువల్ల ఎక్కువ సమయం పడుతుంది. ఒక్కోసారి అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటే గంటకు పైగా పడిగాపులు తప్పవు.⇒ అంతర్జాతీయ ప్రయాణికులు విమానం బయలుదేరడానికి 3 గంటల ముందే ఎయిర్‌పోర్టుకు చేరుకోవాలి. ఆ తరువాత సంబంధిత ఎయిర్‌లైన్స్‌లో క్యూలో వేచి ఉండి బోర్డింగ్ పాస్ తీసుకోవాలి. అదే సమయంలో లగేజ్ చెక్ –ఇన్ ఉంటుంది. ఆ తరువాత వరుసగా భద్రతా తనిఖీలు, ఇమిగ్రేషన్ లైన్లలోకి వెళ్లాలి. ఈ ప్రక్రియ పూర్తవడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఎఫ్టీఐ టీటీపీ వ్యవస్థలో ముందే వివరాలు నమోదు చేసుకోవడం వల్ల సాధారణ భద్రతా తనిఖీల అనంతరం నేరుగా ఈ–గేట్ ద్వారా ఇమిగ్రేషన్ పూర్తి చేసుకొని వెళ్లవచ్చు. డిజియాత్ర మొబైల్ యాప్ ఉన్న ప్రయాణికులు బోర్డింగ్పాస్ను ఆన్లైన్లోనే పొందవచ్చు. -
రోహిత్ శర్మపై కాంగ్రెస్ నేత బాడీ షేమింగ్ వ్యాఖ్యలు
ఢిల్లీ: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ నాయకురాలు షామా మొహమ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేశారు. రోహిత్ లావుగా ఉంటాడు.. బరువు తగ్గాలని వ్యాఖ్యలు చేశారు. ఏదో లక్కీగా అతడికి కెప్టెన్సీ దక్కిందని చెప్పుకొచ్చారు. దీంతో, వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తాజాగా ఆమె వ్యాఖ్యలకు బీజేపీ నేతలు కౌంటరిస్తున్నారు.దుబాయ్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య ఆదివారం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ రోహిత్ తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. ఈ క్రమంలో రోహిత్ ఆటతీరుపై కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి షామా మొహమ్మద్ ఘాటుగా స్పందించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. షామా మొహమ్మద్ ట్విట్టర్ వేదికగా రోహిత్‌ను టార్గెట్ చేసి.. రోహిత్ లావుగా ఉంటాడు. అతడు బరువు తగ్గాలి. ఫిటినెస్ ఉండదు ఏదో అదృష్టం కొద్ది రోహిత్ భారత జట్టుకు కెప్టెన్ అయ్యాడు. ఇప్పటివరకు అత్యంత చెత్త కెప్టెన్ రోహిత్. సచిన్, కోహ్లీ, ధోనీలతో పోలిస్తే రోహిత్ జస్ట్ యావరేజ్ ఆటగాడు’ అంటూ కామెంట్స్ చేశారు.Congress leader Shama Mohamed has insulted and mocked 'National Pride' and T20 world cup winning captain Rohit Sharma .Congress with Rahul Gandhi at their helm is giving certificate of mediocrity to others ! Some jokes write themselves. pic.twitter.com/IQlquH4mri— विकास प्रताप सिंह राठौर🚩🇮🇳 (@V_P_S_Rathore) March 3, 2025దీంతో, ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బీజేపీ నేతలు, నెటిజన్లు షామా మొహమ్మద్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంతో ఆమె తన ట్వీట్‌ను సోషల్ మీడియా నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలో షామా మొహమ్మద్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి స్పందిస్తూ..‘భారత క్రికెట్ జట్టును అభిమానించే ప్రతి దేశభక్తుడికి ఇది అవమానం. కాంగ్రెస్ విమర్శలను నేను ప్రశ్నిస్తున్నాను. రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేసే మీకు కెప్టెన్సీ గురించి ఏం తెలుస్తుంది అంటూ విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నారా? అంటూ ఎద్దేవా చేశారు. దీంతో, మరోసారి షామా మొహమ్మద్ స్పందిస్తూ.. ప్రజాస్వామ్యంలో మాట్లాడే స్వేచ్ఛ తనకు ఉందని చెప్పుకొచ్చారు. Shame on Congress!Now they are going after the Indian Cricket Captain!Do they expect Rahul Gandhi to now play cricket after failing in Indian politics! https://t.co/taWuC8bqgi— Pradeep Bhandari(प्रदीप भंडारी)🇮🇳 (@pradip103) March 2, 2025ఇదిలా ఉండగా.. విరాట్ కోహ్లీ తర్వాత 2022 నుంచి రోహిత్ శర్మ(37) భారత జట్టుకు కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. రోహిత్ నాయకత్వంలో, గత సంవత్సరం భారత జట్టు టీ20 ప్రపంచ కప్‌ను సాధించింది. ఐపీఎల్లో కూడా రోహిత్ సారథ్యంలోనే ముంబై జట్టు ఐదుసార్లు ట్రోఫీని దక్కించుకుంది. క్రికెట్ చరిత్రలోనే రోహిత్‌కు పలు రికార్డులు ఉన్న సంగతి తెలిసిందే. -
అయోధ్య రాముని దర్శన వేళల్లో మార్పులు
అయోధ్య: యూపీలోని రామజన్మభూమి అయోధ్య(Ram Janmabhoomi Ayodhya)లో బాలరాముణ్ణి దర్శించుకునే వేళల్లో మార్పులు చోటుచేసుకున్నాయని రామమందిర ట్రస్ట్ తెలిపింది. ఇటీవల ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా జరిగిన సమయంలో అక్కడి నుంచి వస్తున్న భక్తుల సౌకర్యార్థం అయోధ్య రామాలయాన్ని ప్రతీరోజూ 19 గంటల పాటు తెరిచివుంచారు. ఇప్పుడు ఈ దర్శన సమయాన్ని తగ్గించారు.మహాకుంభమేళా(Mahakumbh Mela) జరిగిన సమయంలో ప్రతీరోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ భక్తులకు రామ్‌లల్లా దర్శనం కల్పించారు. ఇప్పుడు ప్రయాగ్‌రాజ్ కుంభమేళా ముగిసిన దరిమిలా అయోధ్యకు వచ్చే భక్తుల సంఖ్య కొంతమేరకు తగ్గింది. ఈ నేపధ్యంలో రామజన్మ భూమి తీర్థ ట్రస్ట్ గతంలో మాదిరిగానే దర్శనాల సమయాన్ని కొనసాగించాలని నిర్ణయించింది. దీంతో ఇకపై రామభక్తులకు అయోధ్యలో ప్రతీరోజూ 19 గంటలపాటు దర్శనం లభించదని ట్రస్ట్ తెలిపింది.రామాలయ ట్రస్ట్(Ramalaya Trust) సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా మీడియాతో మాట్లాడుతూ ఇకపై ప్రతీరోజూ మంగళ హారతి ఉదయం 4 గంటలకు జరుగుతుందని, ఆ తర్వాత 4:15 నుండి 6 గంటల వరకు తలుపులు మూసివేస్తారన్నారు. తిరిగి ఉదయం ఆరు గంటలకు మరో హారతి ఉంటుందని, అనంతరం భక్తులు 6:30 నుండి 11:50 వరకు దర్శనాలు చేసుకోవచ్చన్నారు. తరువాత ఆలయ తలుపులను మధ్యాహ్నం 12 గంటల వరకు మూసివేస్తారన్నారు. మధ్యాహ్న రాజభోగం 12 గంటలకు ఉంటుందని, హారతి అనంతరం దర్శనం 12.30 వరకు ఉంటుందని, ఆ తరువాత ఆలయ తలుపులను ఒంటి గంట వరకు మూసివేస్తారన్నారు. అనంతరం సాయంత్రం 6:50 వరకు దర్శనాలు ఉంటాయన్నారు. తరువాత రాత్రి 7 గంటల వరకు తలుపులు మూసివేస్తారని, సాయంత్రం 7 గంటలకు హారతి అనంతరం రాత్రి 9:45 వరకు బాలరాముని దర్శనం ఉంటుందన్నారు. 9:45 నుండి 10 వరకు తలుపులు మూసివేస్తారని, ఆ సమయంలో బాలరామునికి విందు వడ్డిస్తారన్నారు. శయన హారతి అనంతరం రాత్రి 10:15కు ఆలయ తలుపులు మూసివేస్తారన్నారు. ఇది కూడా చదవండి: World Wild Life Day: వన్యప్రాణులతోనే మానవ మనుగడ -
రూ. 1000తో రూ. 1.50 లక్షల బంగారం.. వింత టోకరా
ఆ బంగారు నగల దుకాణంలో వింత మోసం చోటుచేసుకుంది. కస్లమర్లుగా వచ్చిన ఒక జంట దుకాణం యజమానిని బురిడీ కొట్టించారు. తాను మోసపోయాన్న విషయాన్ని దుకాణం యజమాని చాలా ఆలస్యంగా గుర్తించాడు. వెంటనే ఈ ఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే..ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని సుల్తాన్‌పూర్‌లోని ఒక నగల దుకాణంలో మోసం జరిగినట్లు ఆలస్యంగా వెలుగుచూసింది. బంగారు నగల దుకాణంలోనికి కస్టమర్లుగా వచ్చిన ఒక జంట దుకాణం యజమానికి ముందుగా రూ.1000 చెల్లించి, రూ.1.5 లక్షల విలువైన ఆభరణాలను ఎంచుకుని, కొద్దిసేపటి తరువాత వస్తామని చెప్పి దుకాణం నుంచి వెళ్లిపోయారు. అయితే సాయంత్రం దాటినా వారు తిరిగి దుకాణానికి రాలేదు. దీంతో దుకాణం యజమానికి అనుమానం వచ్చింది. వెంటనే అతను సీసీటీవీ ఫుటేజ్(CCTV footage)ను పరిశీంచి, దానిలోని దృశ్యాలను చూసి ఆశ్చర్యపోయాడు. జరిగిన మోసంపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించారు.ఈ ఘటనలో మోసపోయిన నగల దుకాణం యజమాని కృష్ణచంద్ర మాట్లాడుతూ తమ దుకాణానికి కస్టమర్లుగా వచ్చిన ఒక పురుషుడు, ఒక మహిళ తనను బంగారు హారం, గొలుసు చూపించమని అడిగారన్నారు. వాటిని తాను చూపించాక వారు అడ్వాన్స్(Advance) గా వెయ్యి రూపాయలు చెల్లించి, పది నిముషాల్లో తిరిగి వచ్చి, మిగిలిన మొత్తం చెల్లించి, వస్తువులు తీసుకుంటామని చెప్పి వెళ్లిపోయారని తెలిపారు. అయితే వారిద్దరూ సాయంత్రం దాటినా రాకపోయేసరికి తనకు అనుమానం వచ్చి, దుకాణంలోని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా వారు రూ.1.5 లక్షల విలువైన ఆభరణాలతో పారిపోయారని గుర్తించానన్నారు. జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశానని కృష్ణచంద్ర పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: World Wild Life Day: వన్యప్రాణులతోనే మానవ మనుగడ -
కాంగ్రెస్ నేత హిమాని కేసులో బిగ్ ట్విస్ట్.. అతడే హంతకుడు?
ఢిల్లీ: కాంగ్రెస్ నేత హిమాని నర్వాల్ దారుణ హత్య హర్యానాలో తీవ్ర కలకలం సృష్టించింది. ఆమె హత్య కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో తాజాగా ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ఢిల్లీకి చెందిన వ్యక్తి కాగా.. అతడు హిమానికి స్నేహితుడు అని తెలుస్తోంది. హర్యానాకు చెందిన కాంగ్రెస్ నేత హిమాని హత్య కేసులో సోమవారం ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి పేరును మాత్రం వెల్లడించలేదు. ఇక, పోలీసులు అతడి దగ్గర నుంచి హిమాని మొబైల్ ఫోన్, ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు. విచారణలో భాగంగా హిమానికి స్నేహితుడి అని తెలిసింది. అత్యంత సన్నిహితుడిగా ఉన్నట్టు సమాచారం. హిమాని ఇంటికి దగ్గరలోనే నివాసం ఉంటున్నట్టు పోలీసులు తెలిపారు. హిమాని అతడిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసిందని ఆరోపణలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. హర్యానాలోని రోహతక్ జిల్లాలో శనివారం హిమాని నర్వాల్ దారుణ హత్యకు గురయ్యారు. ఆమెను హత్య చేసిన అనంతరం సూట్ కేసులో మూటగట్టి ఓ నిర్మానుష ప్రాంతంలో మృతదేహాన్ని పడేశారు దుండగులు. సంప్లా బస్టాండ్ దగ్గర సూట్ కేసులో హిమానీ నార్వాల్ మృతదేహం ఉండటంతో స్థానికంగా కలకలం రేగింది. ఆ బస్టాండ్ వద్ద సూట్ కేసు పడి ఉండటంతో తెరిచి చూడటంతో ఈ దారుణం వెలుగు చూసింది. గతంలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్రలో ఆమె చురుగ్గా పాల్గొన్నారు. ఆమె మెడపై గాయాలుండటం కూడా ఇదే హత్యేనని అనడానికి మరింత బలం చేకూర్చుతోంది.ఇక, హిమాని నర్వాల్ హత్యపై దర్యాప్తు చేయడానికి పోలీసులు ప్రత్యేక దర్యాప్తు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. బాధితురాలి కుటుంబం ఢిల్లీలో ఉండగా, హిమాని నర్వాల్ హర్యానాలో ఒంటరిగా ఉంటుందని సాంప్లా డీఎస్పీ రజనీష్ కుమార్ తెలిపారు.#WATCH | Rohtak, Haryana: Visuals of the accused who is arrested in Congress worker Himani Narwal murder case. pic.twitter.com/zSvHIEIP7a— ANI (@ANI) March 3, 2025బాధితురాలి తల్లి ఆరోపణలుఅంతకుముందు, బాధితురాలి తల్లి సవిత సంచలన ఆరోపణలు చేసింది. రాజకీయాల్లో తన కూతురు ఎదుగుదలను తట్టుకోలేక పార్టీలోని కొందరు వ్యక్తులే తన కూతురిని హతమార్చి ఉండొచ్చంటూ ఆమె సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ కోసం తన కూతురు పదేళ్లుగా ఎన్నో త్యాగాలు చేశారని తెలిపారు. పార్టీలోని గొడవలు, వాగ్వాదాలపై కూతురు తనతో చెప్పేదన్నారు. తన కూతురికి న్యాయం జరిగే వరకు తాను ఆమె అంత్యక్రియలు చేయనని అన్నారు. -
గగనాన్ని జయించినా..
సూళ్లూరుపేట: భారత క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహ ప్రయోగాల్లో ఇస్రో బాలారిష్టాలను దాటలేకపోతోంది. ఇప్పటికే 7 ఉపగ్రహాలను ప్రయోగించినా అనుకోని సాంకేతిక అవాంతరాలతో సత్ఫలితాలను సాధించలేకపోతోంది. భారత క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహ (ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం) వ్యవస్థలో ఇంకా తప్పటడుగులు పడుతూనే ఉన్నాయి. ఈ ఏడు ఉపగ్రహాల సిరీస్‌లో ఐఆర్ఎన్ఎస్ఎస్–1 ఉపగ్రహం సాంకేతిక లోపంతో పని చేయడం లేదు.దీనిస్థానంలో 2017 ఆగస్ట్ 31న ఐఆర్ఎన్ఎస్ఎస్–1హెచ్ పేరుతో చేసిన ప్రయోగం విఫలమైంది. మళ్లీ ఐఆర్ఎన్ఎస్ఎస్–1ఐ ఉపగ్రహాన్ని ప్రయోగించి ఐఆర్ఎన్ఎస్ఎస్–1ఏ స్థానంలో ప్రవేశపెట్టినప్పటికీ సొంత నావిగేషన్ వ్యవస్థ అందుబాటులోకి రాలేదు. ఇదిలావుండగానే ఈ నావిగేషన్ వ్యవస్థలో సెకండ్ జనరేషన్ శాటిలైట్ వ్యవస్థ పేరుతో నావిక్–01 ఉపగ్రహాన్ని 2023లో ప్రయోగించారు. ఈ ఏడాది జనవరి 31న నావిక్–02 ఉపగ్రహాన్ని ప్రయోగించారు. నావిగేషన్ ఉపగ్రహాల శ్రేణిలో కొన్నింటికి కాలపరిమితి ముగియనుండటంతో వాటి స్థానంలో నావిక్ ఉపగ్రహాలను ప్రవేశపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. నావిక్–02 ఉపగ్రహం జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ నుంచి జియో ఆర్బిట్‌లోకి ఇంకా చేరలేదు. ఉపగ్రహంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అపోజి ఇంధనాన్ని మండించేందుకు ఆక్సిడైజర్ వాల్‌్వలు తెరుచుకోకపోవడం వల్ల కక్ష్య దూరాన్ని పెంచలేకపోతున్నారు. ఈ ఉపగ్రహం కూడా విఫలమైనట్టుగానే ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీంతో భారతదేశానికి సొంత నావిగేషన్ వ్యవస్థ ఎప్పటికి అందుబాటులోకి వస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది.7 ఉపగ్రహాల అవసరాన్ని గుర్తించి..భారతదేశానికి పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నావిగేషన్ సిస్టం తయారు చేసుకోవడానికి ఏడు ఉపగ్రహాల అవసరాన్ని 2006లో ఇస్రో గుర్తించింది. దీనికి రూ.3,425 కోట్ల వ్యయం అవుతుందని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. దీనికి కేంద్రం ఆమోద ముద్ర వేసి బడ్జెట్లో నిధులు కూడా కేటాయించింది. భారత క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థలో మొత్తం ఏడు ఉపగ్రహాలకు రూ.1,000 కోట్లు, రాకెట్లకు రూ.1,125 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ చేపట్టారు. ఈ ఉపగ్రహ వ్యవస్థకు ప్రత్యేకంగా బెంగళూరు సమీపంలోని బైలాలు అనే ప్రాంతంలో రూ.1,300 కోట్లతో గ్రౌండ్ స్టేషన్ నిర్మాణం కూడా చేశారు.సొంత నావిగేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి 2006లోనే ప్రణాళికలు సిద్ధం చేసుకుని 2013 జూన్ 1న ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం (ఐఆర్ఎన్ఎస్ఎస్–1ఏ) ఉపగ్రహ ప్రయోగంతో శ్రీకారం చుట్టారు. 2014 ఏప్రిల్ 4న ఐఆర్ఎన్ఎస్ఎస్–1బీ, అక్టోబర్ 16న ఐఆర్ఎన్ఎస్ఎస్–1సీ, 2015 మార్చి 28న ఐఆర్ఎన్ఎస్ఎస్–1డీ, 2016 జనవరి 20న ఐఆర్ఎన్ఎస్–1ఈ, మార్చి 10న ఐఆర్ఎన్ఎస్ఎస్–1ఎఫ్, ఏప్రిల్ 28న ఐఆర్ఎన్ఎస్ఎస్–1జీ ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.ఇందులో 1ఏ ఉపగ్రహంలో సాంకేతిక లోపం తలెత్తడంతో దీని స్థానంలో 2017 ఆగస్ట్ 31న ఐఆర్ఎన్ఎస్ఎస్–1హెచ్ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. అది విఫలమైంది. తిరిగి 2018 ఏప్రిల్ 12న ఐఆర్ఎన్ఎస్ఎస్–1ఐ ఉపగ్రహాన్ని 1ఏ ఉపగ్రహం స్థానంలో రీప్లేస్ చేశారు. ఇందులో కొన్ని ఉపగ్రహాలకు కాల పరిమితి కూడా ముగియనుండటంతో నావిగేషన్ వ్యవస్థను బలోపేతం చేయడానికి సెకండ్ జనరేషన్ పేరుతో నావిక్–01 సిరీస్‌లో ఐదు ప్రయోగాలకు శ్రీకారం చుట్టగా.. వీటిలో రెండు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇందులో ఒకటి ఉపగ్రహం కక్ష్యలోకి వెళ్లినప్పటికీ దాన్ని భూమికి 36 వేల కిలోమీటర్ల దూరంలోని జియో ఆర్బిట్‌లోకి పంపే ప్రక్రియ సాంకేతిక లోపంతో ఆగిపోయింది. చిన్నచిన్న అవాంతరాలతో తప్పని ఇబ్బందులునావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థలోని 7 ఉపగ్రహాల్లో 3 ఉపగ్రహాలు భూమికి 36 వేల కిలోమీటర్లు ఎత్తులోని భూస్థిర కక్ష్యలో 34 డిగ్రీలు, 83 డిగ్రీలు, 130.5 డిగ్రీ తూర్పు రేఖాంశాల వద్ద కక్ష్యలో ఉండి పనిచేస్తాయి. మిగతా నాలుగు ఉపగ్రహాలు భూమధ్య రేఖలను ఖండించే భూస్థిర కక్ష్యలోనే 55 డిగ్రీలు, 115 డిగ్రీల తూర్పు భూమధ్య రేఖాతలానికి 31 డిగ్రీల వాలుతో ఉండే కక్ష్యలో 12 ఏళ్లపాటు సేవలందిస్తాయి.భూస్థిర కక్ష్యలో వివిధ స్థానాల్లో ఉండి పనిచేయడం ప్రారంభించి స్వదేశీ దిక్సూచి వ్యవస్థను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాల్లో లోపాలు తలెత్తడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భూమి, జల, వాయు మార్గాల స్థితిగతులు దిక్కులు తెలియజేయడం, ఆపద సమయాల్లో భూగోళానికి సంబంధించిన సమాచారం, వాహన చోదకులకు దిశానిర్దేశం, ఇంటర్నెట్తో అనుసంధానం, భారత విమానయాన, నౌకాయాన మార్గాలకు, సైనిక అవసరాలకు కూడా ఈ ఉపగ్రహ వ్యవస్థ అందుబాటులోకి తెచ్చేందుకు నావిగేషన్ సిరీస్ ఉపగ్రహాలను ప్రయోగిస్తూనే ఉన్నప్పటికీ చిన్న చిన్న అవాంతరాల వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే భారతదేశం అంచునుంచి సుమారు 1,500 కిలోమీటర్ల పరిధి వరకు ఈ సేవలు విస్తరించి పనిచేస్తుంది. -
బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు.. రేసులో తెలంగాణ నేత?
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ కొత్త అధ్యక్షుని ఎంపికపై అధిష్టానం చురుగ్గా కసరత్తు చేస్తోంది. రాబోయే ఐదేళ్లలో పలు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలతోపాటు 2029 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీని సమర్థంగా నడపగలిగే నేత కోసం బీజేపీ, ఆర్ఎస్ఎస్ పెద్దలు కొన్ని నెలలుగా మంతనాల్లో మునిగి తేలారు. సంఘ్, పార్టీ మధ్య సమన్వయం చేసుకోగల సత్తా ఉన్న నాయకుడికే పగ్గాలు అప్పగించే అవకాశాలున్నాయి. ఇప్పటి కే ఒక జాబితా సిద్ధమైందని చెబుతున్నా రు. అందులోంచి ఒకరిని ఏకగ్రీవంగా ఎంపిక చేయనున్నారు. మార్చి 20 లోపు కొత్త అధ్యక్షుని ప్రకటన ఉంటుందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.2019లో అమిత్ షా కేంద్ర హోం మంత్రి అయ్యాక వెంటనే జగత్ ప్రకాశ్ నడ్డా తొలుత బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. ఆర్నెల్ల తర్వాత అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన పదవీకాలం 2023 జనవరిలో ముగియాల్సి ఉన్నా 2024 లోక్‌సభ ఎన్నికల దాకా పొడిగించారు. ఆ తర్వాత నడ్డా కేంద్ర కేబినెట్ మంత్రి అయినా మహారాష్ట్ర సహా పలు అసెంబ్లీ ఎన్నికల వల్ల కొత్త అధ్యక్షని ఎంపిక వాయిదా పడింది. నూతన అధ్యక్షుని ఎంపికపై రెండు రకాల ప్రతిపాదనలున్నట్టు చెబుతున్నారు.పంజాబ్, పశ్చిమ బెంగాల్, బిహార్, ఉత్తరప్రదేశ్ వంటి ముఖ్యమైన రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలున్నందున అక్కడ పార్టీని నడపడంలో సమర్థుడై ఉండటంతో పాటు ఆర్ఎస్ఎస్ నేప థ్యం కలిగి ఉన్న నేతను నియమించాలనేది ఒక ప్రతిపాదన. దక్షిణాదిలో చొచ్చుకెళ్లేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు. వచ్చే మూడేళ్లలో తమిళనాడు, కేరళ, కర్ణాటక వంటి దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్నికలున్నాయి. కనుక దక్షిణాది నేతను అధ్యక్షున్ని చేస్తే పార్టీకి మేలన్నది.మరో ప్రతిపాదన..బీజేపీ వర్గాల సమాచారం ప్రకారం అధ్యక్ష రేసులో ఉత్తరాది నుంచి కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, భూపేంద్ర యాదవ్, మనోహర్ లాల్ ఖట్టర్, ధర్మేంద్ర ప్రధాన్ పేర్లు గట్టిగా విన్పిస్తున్నాయి. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ పేరు కూడా ప్రస్తావనలో ఉంది. దక్షిణాది నుంచి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తదితర పేర్లు షికారు చేస్తున్నాయి. -
సోమనాథుని సన్నిధిలో ప్రధాని మోదీ పూజలు
గిర్ సోమనాథ్: ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) తన సొంత రాష్ట్రమైన గుజరాత్లో మూడు రోజుల పాటు పర్యటిస్తున్నారు. దీనిలో భాగంగా గిర్ సోమనాథ్ జిల్లాలోని సోమనాథ్ ఆలయంలో పూజలు చేశారు. సోమనాథ్ క్షేత్రం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. అంతకుముందు ప్రధాని మోదీ జామ్‌నగర్ జిల్లాలోని జంతు సంరక్షణ, పునరావాస కేంద్రమైన ‘వంతారా’ను సందర్శించారు. సోమనాథ్ ఆలయాన్ని సందర్శించిన తర్వాత మోదీ సమీపంలోని జునాగఢ్ జిల్లాలోని గిర్ వన్యప్రాణుల అభయారణ్యం ప్రధాన కార్యాలయమైన సాసన్ చేరుకున్నారు.ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా(Maha Kumbh Mela) ముగిసిన తర్వాత సోమనాథుణ్ణి పూజించాలనే తన సంకల్పంలో భాగంగా ఈ సందర్శన జరిగిందని ప్రధాని మోదీ ‘ఎక్స్’ పోస్టులో పేర్కొన్నారు. ‘కోట్లాది మంది దేశప్రజల కృషితో ప్రయాగ్‌రాజ్‌లో ‘ఐక్యతా మహాకుంభ్’ విజయవంతమయ్యింది. ఒక భక్తునిగా మహా కుంభమేళా అనంతరం 12 జ్యోతిర్లింగాలలో మొదటి జ్యోతిర్లింగమైన శ్రీ సోమనాథుణ్ణి(The Jyotirlinga of Sri Somanath) పూజించాలని నా మనస్సులో నిశ్చయించుకున్నాను’ అని తెలిపారు. ‘ఈ రోజు సోమనాథుని ఆశీస్సులతో నా సంకల్పం నెరవేరింది. దేశప్రజలందరి తరపున, నేను ఐక్యతా మహా కుంభ్ విజయాన్ని సోమనాథుని పాదాలకు అంకితం చేస్తున్నాను. అలాగే దేశప్రజల ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నాను’ అని ప్రధాని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా సోమవారం ససాన్లోని 'లయన్ సఫారీ'ని ప్రధానమంత్రి సందర్శించనున్నారు. అలాగే జాతీయ వన్యప్రాణి బోర్డు (ఎన్బీడబ్ల్యూఎల్) సమావేశానికి అధ్యక్షత వహిస్తారు.ఇది కూడా చదవండి: India Bhutan Train : త్వరలో భారత్-భూటాన్ రైలు.. స్టేషన్లు ఇవే..