Politics

పసుపు రైతులు అల్లాడుతుంటే.. రేవంత్ సర్కార్ ఏం చేస్తోంది?: కవిత
సాక్షి, హైదరాబాద్: పసుపు రైతుల ఆందోళనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. పసుపు రైతుల ఆందోళనలు రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా? అంటూ ప్రశ్నించారు. గిట్టుబాటు ధర రాక పసుపు రైతులు అల్లాడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందంటూ నిలదీశారు. మాటలు చెప్పిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడానికి ముందుకు రావడం లేదు. క్వింటాలు పసుపుకు 15 వేల ధర కల్పిస్తామని ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు పసుపునకు కనీసం 9 వేలు రాని పరిస్థితి ఉంది. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడానికి చర్యలు తీసుకోకపోవడం దారుణమని కవిత ధ్వజమెత్తారు.‘‘ఇది రైతులను నయవంచన చేయడమే, మోసం చేయడమే. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రూ.15 వేల మద్దతు ధర చెల్లిస్తూ పసుపు పంటను కొనుగోలు చేయాలి. పసుపు బోర్డు తీసుకొచ్చామని చెబుతున్న బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కనీసం రైతులను పరామర్శించడం లేదు. పసుపు బోర్డుకు చట్టబద్ధత లేకపోవడంతో రైతులకు ప్రయోజనాలు కలగడం లేదు. పసుపుకు ధరలు పెంచుతామని, మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తామని పసుపు బోర్డు ప్రారంభోత్సవంలో బండి సంజయ్ చెప్పారు. కానీ ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపించడం లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి పసుపు రైతులను ఆదుకోవాలి’’ అని కవిత డిమాండ చేశారు.

వెంకయ్య నాయుడు గారూ.. అవేం మాటలు?
మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును పొగడ్తలతో ముంచెత్తారు. మనకెవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. అయితే.. ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలపై మాత్రం చర్చ జరగాల్సిందే. ఎన్నికల్లో గెలిచేందుకు మూడు పార్టీలు కలిసికట్టుగా వచ్చి అబద్ధాలు ప్రచారం చేయడం, ఆచరణ సాధ్యం కానీ అనేక హామీలివ్వడం.. ఆపై వాటిని విస్మరించడం వంటి అంశాలపై వెంకయ్య నాయుడు తన అభిప్రాయం చెప్పకుండా.. చేయగలిగిన పనులపైనే ఎక్కువ దృష్టి పెడితే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఇంతకీ ఈ వ్యాఖ్యకు అర్థమేమిటి?. ఎన్నికల హామీలు పట్టించుకోవద్దని చెప్పడమే అవుతుంది కదా?. ఉపరాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన తరువాత వెంకయ్య నాయుడు(M Venkaiah Naidu).. రాజకీయాలకు దాదాపుగా దూరంగా ఉంటున్నారు. బీజేపీ కార్యక్రమాల్లోనూ అప్పుడప్పుడూ మాత్రమే పాల్గొంటున్నారు. స్వర్ణభారతి ట్రస్టు కార్యకలాపాల్లో భాగస్వామి అవుతుంటారు. ఆయన ఉచిత పథకాలకు వ్యతిరేకమని ప్రతీతి. ఈ విషయాన్ని ఆయన చాలాసార్లు బహిరంగంగానే చెప్పుకున్నారు కూడా. అయితే.. కొన్ని దశాబ్దాలుగా మిత్రుడిగా ఉన్న చంద్రబాబు నాయుడికి ఈ విషయాలేవీ ఆయన చెప్పినట్లు కనిపించదు. 👉ఇటీవల వెంకయ్య నాయుడు విశాఖపట్నంలో మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన పుస్తక ఆవిష్కరణ సభలో చంద్రబాబు(Chandrababu)ను అభివృద్ది కాముకుడిగగా ప్రశంసించారు. అయితే సూపర్సిక్స్తోపాటు 150 ఇతర హామీలు ఇవ్వడంలో ఆయనకు ఏ అభివృద్ధి కాముకత కనిపించిందో తెలియదు. ఏదో రకంగా మిత్రుడు గెలిచారన్న ఆనందం ఉంటే ఉండవచ్చు??. చంద్రబాబు ప్రభుత్వం చేసిన హామీలను అమలు చేస్తోందా? లేదా? అనేది ఆయనకు తెలియకుండా ఉంటుందా!. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని హామీలు అమలు చేయాలని సూచించాల్సిన వెంకయ్య.. చేయగలిగిన పనులపైనే దృష్టి పెట్టాలని చెప్పడం ప్రజలను మోసం చేయడమే అవుతుంది కదా. 👉చంద్రబాబు ఆలోచనలు మంచివని వెంకయ్య సర్టిఫికెట్ ఇస్తూ.. అవి చాలా ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. అవి ఏరకంగా ఉంటాయి? సూపర్‌సిక్స్‌తో సహా అనేక వాగ్దానాలు చేయడంలో ఉన్న మంచి ఆలోచనలు ఏమిటో కాస్త వివరంగా చెప్పి ఉంటే జనానికి కూడా బాగా అర్థమయ్యేది కదా?. ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఇస్తామని టీడీపీ, జనసేనలు ఎన్నికల హామీ ఇచ్చాయి. కాని తాజాగా ప్రవేశపెట్టన బడ్జెట్లో ఆ ఊసే ఎత్త లేదు. ఇది మంచి ఆలోచనా కాదా? అదే కాదు..నిరుద్యోగులకు రూ.3,000 భృతి ఇస్తామని,.. వలంటీర్లకు జీతం రూ.10,000 చేస్తామని రాష్ట్రంలో ఎక్కడైనా తిరిగే విధంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని, బలహీన వర్గాల వారికి 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని, తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్ధికి రూ.15 వేలు పంపిణీ చేస్తామని.. పలు వాగ్దానాలు చేశారు. ఇవన్నీ చంద్రబాబులో వచ్చిన మంచి ఆలోచనలే అని వెంకయ్య చెప్పదలిచారా?.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు కలిసి చేసిన వాగ్దానాల విలువ ఏడాదికి సుమారు లక్షన్నర కోట్ల వరకు ఉండొచ్చు. కేవలం సూపర్ సిక్స్ హామీలకే రూ.79,179 కోట్లు అవసరమవుతాయి. కాని చంద్రబాబు ప్రభుత్వం కేవలం రూ.17,179 కోట్లే కేటాయించడం మంచి ఆలోచనేనని వెంకయ్య చెబుతారా?. 👉విద్య సంగతి ఎలా ఉన్నా మద్యం బాగా సరఫరా చేస్తున్నామని చెబుతున్న ఏపీ ప్రభుత్వం తీరు చూసి వెంకయ్య నాయుడు పరవశిస్తున్నారా?. చంద్రబాబు మాతృబాషలోనే విద్యా బోధన జరగాలని అన్నందుకు వెంకయ్య సంతోషించారు. విద్యాబోధన పదో తరగతి వరకు మాతృభాషలోనే ఉండాలని కూడా ఆయన సలహా ఇచ్చారు. ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తెలుగులో జరగాలని అన్నారు. మరి ప్రభుత్వంలో ఆ పరిస్థితి ఉందో, లేదో వెంకయ్య అడిగి తెలుసుకుని ఉండాలి. అలాగే చంద్రబాబు మనుమడు కాని, ఆయన బంధుమిత్రులలో ఎందరు తెలుగు మీడియంలో విద్యను అభ్యసిస్తున్నారో ఆరా తీసుకుని మెచ్చుకుని ఉంటే బాగుండేది కదా!. 👉ఇక్కడే సమస్య వస్తోంది. తెలుగు మీడియం అంటూ ప్రచారం చేసే చంద్రబాబు, వెంకయ్య నాయుడు తదితర ప్రముఖుల కుటుంబాలలో ఎంతమంది దానిని పాటిస్తున్నారో ఇంతవరకు ఎవరూ చెప్పడం లేదు. కేవలం పేదలు, బలహీన వర్గాల వారు చదువుకునే ప్రభుత్వ స్కూళ్లలో మాత్రమే తెలుగు మీడియం ఉండాలని అనడంలో ఆంతర్యం ఏమిటో తెలియదు. సోషల్ మీడియాను అదుపులో పెట్టకపోతే పరిణామాలేమిటో ఏపీలో చూశామని, దాని పరిణామాలు అనుభవిస్తున్నారని ఆయన అన్నారు. వెంకయ్య నాయుడు కూడా ఏదో తెలుగుదేశం నాయకుడు మాట్లాడినట్లే స్పీచ్ ఇవ్వడం దురదృష్టకరం. వైఎస్సార్సీపీ హయాంలో టీడీపీ సోషల్ మీడియా ఎంత అరాచకంగా పోస్టులు పెట్టినా ఈయన ఎన్నడైనా నోరు తెరిచారా? అప్పుడేమో భావ వ్యక్తికరణ స్వేచ్చ అని చంద్రబాబు.. ఎల్లో మీడియా ప్రచారం చేశారే. సీఎంగా ఉన్న జగన్‌ను పట్టుకుని బూతులు తిట్టినా కేసులు పెట్టడానికి వీలులేదని వాదించారే. ఆ విషయాలు వెంకయ్య నాయుడుకు తెలియకుండా ఉంటాయా? 👉అధికారంలోకి వచ్చాక సైతం వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ వారు ఎంత అరాచకంగా వ్యవహరిస్తునేది ఆయన తెలుసుకోలేక పోతున్నారు. కావాలంటే టీడీపీ వారు పెట్టిన బండబూతుల పోస్టింగులు చూడాలని ఆయన భావిస్తే.. మాజీ మంత్రులు రోజా, అంబటి రాంబాబు వంటివారు పంపిండానికి సిద్దంగా ఉంటారు. అచ్చంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి చదివి అవి రాసే పచ్చి అబద్దాలనే ఆయన ప్రచారం చేస్తున్నట్లుగా ఉంది. ఉప రాష్ట్రపతి పదవి చేసిన పెద్దాయన ఎవరూ అభ్యంతరకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టరాదని అన్ని పార్టీల వారికి చెప్పాలి కాని, ఒకవైపే మాట్లాడడం సమంజసం అనిపించదు.👉అంతెందుకు జగన్ ప్రభుత్వం(Jagan Government)పై ఎన్ని అసత్య ఆరోపణలు చంద్రబాబు, పవన్, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా ప్రచారం చేసింది తెలియదా?. వెంకయ్య నాయుడుకు అవి సూక్తి ముక్తావళిలా నిపించేవేమో తెలియదు. అప్పులపై చంద్రబాబు, పవన్, పురందేశ్వరి తదితరులు చేసిన పచ్చి అబద్దాలు ఇప్పుడు ఆధార సహితంగా కనిపిస్తున్నాయే. అసెంబ్లీ సాక్షిగానే స్వయంగా ఆర్థిక మంత్రి కేశవ్ అవి అబద్దాలని అంగీకరించారే. అలా ఆర్గనైజ్డ్గా మూడు పార్టీల నేతలు అబద్దాలు ప్రచారం చేయడం నేరమో, కాదో వెంకయ్య నాయుడు చెప్పగలిగి ఉంటే బాగుండేది. వైఎస్సార్సీపీ వారికి పనులు చేయవద్దని ఆదేశిస్తున్న చంద్రబాబు నాయుడును అభివృద్ధి కాముకుడని, మంచి ఆలోచనలు కలిగిన వ్యక్తి అని ప్రశంసిస్తుంటే ప్రజలు ఏమనుకోవాలి?. కనీసం అలాంటి వివక్ష వద్దని చంద్రబాబుకు సలహా ఇవ్వలేక పోయారే! ఏది ఏమైనా ఎమర్జెన్సీలో జైలుకు వెళ్లిన వెంకయ్య నాయుడు.. ఏపీలో ఇప్పుడు ఉన్న ఎమర్జెన్సీని సమర్థిస్తున్నట్లు మాట్లాడడం, కనిపిస్తున్న కక్షపూరిత రాజకీయాలు, అరాచక పరిస్థితులపై స్పందించ లేకపోవడం బాధాకరం.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాలా వ్యాఖ్యాత.

బుడమేరు వరద సాయంలో చంద్రబాబు సర్కార్ విఫలం: బొత్స
సాక్షి, అమరావతి: వరద సహాయంలో కూటమి సర్కార్ విఫలమైందని విపక్షనేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. బుడమేరు వరద సాయంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, వైఎస్ జగన్ ప్రకటించిన కోటి రూపాయలను మేమే బాధితులకు అందించామని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని.. అందుకే మేమే స్వయంగా మా పార్టీ తరపున బాధితులకు సాయం అందించామని బొత్స తెలిపారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడుతూ, వరద బాధితుల్లో అనేక మందికి ఇంకా పరిహారం అందలేదని మండిపడ్డారు. వరద సహాయం విషయంలో ప్రభుత్వం విఫలమైంది. ఆపరేషన్ బుడమేరు అన్నారు.. ఇప్పటివరకు ఏం చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రుహుల్లా మాట్లాడుతూ.. బుడమేరు గేట్లను ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి చేయలేదని.. వరదల తర్వాత బుడమేరును ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ఇప్పటికీ అనేకమంది బాధితులు కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు. ఒక ఇంటికి పరిహారం ఇచ్చి 10 ఇళ్లకు ఇచ్చినట్లు రాసుకున్నారు. అందరికీ సాయం అందిందని చెప్పడం పచ్చి అబద్ధమని రుహుల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన తెలంగాణ భవన్లో శాసనసభాపక్ష(BRSLP) సమావేశం ప్రారంభమైంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా ఈ భేటీకి హాజరు అయ్యారు. ఇటు శాసన సభలో, అటు మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ వాళ్లతో చర్చించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అంశాలపై ప్రధానంగా దిశానిర్దేశం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.గత బడ్జెట్ సమావేశాల సందర్భంగా తొలి రోజు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి.. మీడియా పాయింట్ వద్ద మాట్లాడి వెళ్లిపోయారు. ఆ టైంలో బడ్జెట్ తన మార్క్ విమర్శలు గుప్పించారాయన. అయితే.. ఈ దఫా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ పూర్తిగా హాజరు అవుతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే జరిగితే.. ఈ సెషన్ వాడీవేడిగా జరిగే ఛాన్స్ లేకపోలేదు.
Sports

ప్రణామ్ ప్రణవ్
ఆరేళ్ల వయసులో ఎత్తులు వేయడం నేర్చుకున్న ఆ చిన్నారి... పదహారేళ్లు వచ్చేసరికి గ్రాండ్‌మాస్టర్ హోదా దక్కించుకున్నాడు. మ్యాచ్‌కు ముందు పావులతో ప్రాక్టీస్ చేయడం పక్కనపెట్టి క్రికెట్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ ఇలా వేర్వేరు ఆటల్లో నిమగ్నమయ్యే అలవాటున్న ఆ కుర్రాడు... తాజాగా మరో ఘనత తన పేరిట లిఖించుకున్నాడు. విశ్వ చదరంగ వేదికపై భారత జోరు సాగుతున్న క్రమంలో... ఆ కుర్రాడు ప్రపంచ చాంపియన్‌గా అవతరించాడు. ఇటీవల మోంటెనిగ్రోలో జరిగిన ప్రపంచ జూనియర్ చెస్ చాంపియన్‌షిప్ అండర్–20 ఓపెన్ విభాగంలో విజేతగా నిలిచిన ఆ కుర్రాడే... ప్రణవ్ వెంకటేశ్! రెండేళ్ల క్రితమే గ్రాండ్‌మాస్టర్ హోదా దక్కించుకున్న ఈ తమిళనాడు యువ సంచలనం... భవిష్యత్తులో నిలకడగా విజయాలు సాధించడమే తన లక్ష్యమని అంటున్నాడు. చదరంగానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన చెన్నైకి చెందిన ఈ కుర్రాడి ప్రస్థానాన్ని ఓసారి పరిశీలిస్తే... – సాక్షి క్రీడావిభాగం జూనియర్ ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ ప్రారంభానికి సరిగ్గా ఏడాది క్రితం... ప్రణవ్ ప్రయాణం క్రికెట్ మైదానంలో మొదలైంది. అదేంటి అప్పటికే గ్రాండ్‌మాస్టర్ హోదా దక్కించుకున్న ప్రణవ్ క్రికెట్ గ్రౌండ్ నుంచి ప్రాక్టీస్ ప్రారంభించడం ఏంటి అని సందేహిస్తున్నారా? ప్లేయర్లు ఆటవిడుపు కోసం అప్పుడప్పుడు వేరే క్రీడలు ఆడటం పరిపాటే! అలాగే చెన్నైలోని పెరంబూరు సమీపంలోని చెస్ అకాడమీలో సీనియర్ గ్రాండ్‌మాస్టర్ శ్యామ్‌సుందర్ నిర్వహిస్తున్న కోచింగ్‌కు వరుణ్ హాజరయ్యాడు. ఆటగాళ్లను శారీరకంగా చురుకుగా ఉంచడంతో పాటు వారిలో ఉత్సాహం నింపేందుకు నిర్వహిస్తున్న క్యాంప్‌లో ప్రణవ్ క్రికెట్ పాఠాలు నేర్చుకున్నాడు. అప్పటి వరకు శ్యామ్‌సుందర్ వద్ద శిక్షణ తీసుకోని వరుణ్... ఆ తర్వాత అతడితో అనుబంధం పెంచుకున్నాడు. గతంలో ఇతర కోచ్‌ల వద్ద ట్రైనింగ్ తీసుకున్న అతడు... శ్యామ్‌లో ఓ సోదరుడిని చూసుకున్నాడు. తన ఆలోచనలకు దగ్గరగా ఉన్న శ్యామ్‌తో ప్రయాణం తనకు లాభసాటి అని భావించి తండ్రి వెంకటేశ్ అనుమతితో అతడి దగ్గర శిష్యరికం ప్రారంభించాడు. క్లాసికల్ కష్టమైనా... బ్లిట్జ్ గేమ్‌లో చక్కటి ప్రదర్శన కనబర్చిన ప్రణవ్ ఇప్పటికే ఆన్లైన్ మ్యాచ్‌ల్లో మాగ్నస్ కార్ల్సన్ వంటి ప్రపంచ చాంపియన్లపై విజయాలు సాధించాడు. ప్రారంభంలో బ్లిట్జ్ నుంచి క్లాసికల్‌కు మారేందుకు కాస్త సమయం తీసుకున్న ప్రణవ్... ఆ తర్వాత ఫార్మాట్‌తో సంబంధం లేకుండా మెరుగైన ఆటతీరు కనబర్చడం ప్రారంభించాడు. శ్యామ్ వద్ద శిక్షణ ప్రారంభించిన రెండు నెలలకే స్పెయిన్ వేదికగా జరిగిన టోర్నీల్లో పాల్గొనేందుకు వరుణ్ విరామం తీసుకున్నాడు. ఆ సమయంలో సరైన ఫలితాలు రాకపోవడంతో... మరింత సమయం తీసుకున్న శ్యామ్... వరుణ్ ఆటతీరుకు తగ్గట్లు ప్రణాళికలు రూపొందించడం ప్రాంరభించాడు. ఆ దిశగా కసరత్తు చేయడంతో... దుబాయ్ చాంపియన్‌షిప్, షార్జా మాస్టర్స్‌లో అతడు విజేతగా నిలిచాడు. గతేడాది డిసెంబర్లో చెన్నై చాలెంజర్స్ ఇన్విటేషనల్ టోర్నీలో విజేతగా నిలవడం ద్వారా ప్రణవ్ ప్రతిష్టాత్మక చెన్నై మాస్టర్స్ టోర్నీకి అర్హత సాధించాడు. బాటిల్ మూతలతో క్రికెట్... మ్యాచ్‌కు ముందు ఆటవిడుపుగా క్రికెట్, టేబుల్ టెన్నిస్, షటిల్ ఆడటం ప్రణవ్‌కు అలవాటు. దీంతో హోటల్ రూమ్‌లో బాటిల్ మూతలను బాల్‌గా భావించి మంచి నీళ్ల సీసాలతోనే కోచ్ శ్యామ్‌తో కలిసి క్రికెట్ ఆడేవాడు. దీంతోనే ఇతర ఆలోచనలు దరిచేరనివ్వకుండా మనసును లగ్నం చేసుకునే వాడు. సామాజిక మాధ్యమాలకు కూడా దూరంగా ఉండేవాడు. ప్రపంచ జానియర్ చెస్ చాంపియన్‌సిప్ ప్రారంభానికి ముందు కొన్ని ఆన్లైన్ సెషన్లలో పాల్గొన్న ప్రణవ్... ప్రత్యర్థిపై కాస్త ఆధిక్యం దక్కినా... దాన్ని కొనసాగిస్తూ మరిన్ని అవకాశాలు సృష్టించుకోవడాన్ని అలవాటుగా చేసుకున్నాడు. శిక్షణ సమయంలో విభిన్న ప్రత్యామ్నాయాలను ప్రయత్నించే ప్రణవ్... ఒక్కసారి మ్యాచ్ ప్రారంభమైతే... ప్రత్యర్థి ఆటతీరును బట్టి ప్రణాళికలు మార్చుకోవడంలో ఆరితేరాడు. దాని ఫలితమే... విశ్వనాథన్ ఆనంద్ (1987), పెంటేల హరికృష్ణ (2004), అభిజిత్ గుప్తా (2008) తర్వాత... ప్రపంచ జూనియర్ చెస్ చాంపియన్‌గా నిలిచిన నాలుగో భారత ప్లేయర్‌గా ప్రణవ్ గుర్తింపు పొందాడు. అజేయంగా... తాజా ప్రపంచ జూనియర్ చెస్ చాంపియన్‌షిప్ అండర్–20 ఓపెన్ విభాగంలో మొత్తం 11 రౌండ్ల పాటు పోటీలు జరగగా... ప్రణవ్ 9 పాయింట్లతో అగ్ర స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో 7 గేమ్‌లు గెలిచిన ప్రణవ్... మిగిలిన 4 గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా వరల్డ్ చాంపియన్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. ‘ఆటలో క్లిష్ట పరిస్థితులు ఎదురైనా... ఏమాత్రం వెనక్కి తగ్గని ప్రణవ్... ఏ క్షణంలోనూ ఆత్మవిశ్వాసం కోల్పోడు. ఇద్దరం తమిళనాడుకు చెందిన వాళ్లమే కావడంతో... తమిళంలోనే మాట్లాడుకుంటాం. దీంతో ఒకరి భావాలు మరొకరం సులభంగా అర్థం చేసుకుంటాం. కామెడీ సినిమాలను ఎక్కువ ఇష్టపడే ప్రణవ్... ఆట తప్ప వేరే ఆలోచనలను దరిచేరనివ్వడు. ఆ క్రమశిక్షణే అతడిని ఈ స్థాయికి తెచ్చింది. చదరంగ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తరహాలో నిలకడ కొనసాగించడమే ప్రణవ్ లక్ష్యం’ అని 32 ఏళ్ల శ్యామ్ వివరించాడు. క్రికెట్‌కు వీరాభిమాని... క్రికెట్‌ను విపరీతంగా అభిమానించే ప్రణవ్ కు... నేటి తరం ప్రేక్షకుల్లాగే టెస్టుల కన్నా... వన్డే, టి20 ఫార్మాట్లంటేనే ఎక్కువ ఇష్టం. చదరంగంలో క్లాసికల్ గేమ్ టెస్టుల మాదిరి కాగా... వన్డే, టి20ల వంటి ర్యాపిడ్, బ్లిట్జ్‌లో ప్రణవ్ వేగం శ్యామ్‌సుందర్‌ను ఆకట్టుకుంది. కాస్త సానబెడితే అద్భుతాలు సాధించగల సత్తా అతడిలో ఉందని గుర్తించిన శ్యామ్ ఆ దిశగా ప్రయాణం ప్రారంభించాడు. ఏడాది శిక్షణలో అతడికిష్టమైన ర్యాపిడ్ బ్లిట్జ్‌లో మరింత మెరుగు పరుస్తూనే... సంపద్రాయ క్లాసికల్పై కూడా ఆసక్తి పెరిగేలా చేశాడు. ‘గత సంవత్సరం జనవరి నుంచి అధికారికంగా మేమిద్దరం కలిసి పనిచేస్తున్నాం. అప్పటికే గ్రాండ్‌మాస్టర్ అయిన ప్రణవ్ను మరింత మెరుగు పర్చేందుకు తగిన ప్రణాళికలు రూపొందించాను. టి20 క్రికెట్లో దూకుడుగా ఆడేందుకు వీలుంటుంది. అదే టెస్టు క్రికెట్లో ఓపిక ముఖ్యం. ప్రణవ్ కూడా క్విక్ ఫార్మాట్లో చక్కటి ప్రదర్శన చేస్తున్నాడు. కానీ సుదీర్ఘ ఫార్మాట్ వంటి క్లాసికల్లో మరింత ప్రావీణ్యం పొందే విధంగా తర్ఫీదునిచ్చాను’ అని శ్యామ్ సుందర్ విరించాడు.

బెంగళూరు గెలిచింది
ముంబై: ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో నిలిచి నేరుగా ఫైనల్ చేరాలనుకున్న ముంబై ఆశలపై డిఫెండింగ్ చాంప్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) నీళ్లు చల్లింది. డబ్ల్యూపీఎల్ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఆర్సీబీ 11 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. దీంతో రెండో స్థానంతోనే సరిపెట్టుకున్న హర్మన్‌ప్రీత్ సేన ఫైనల్‌కు అర్హత సాధించేందుకు రేపు గుజరాత్ జెయింట్స్‌తో ‘ప్లేఆఫ్’ మ్యాచ్ ఆడనుంది. వరుసగా ఐదు ఓటముల తర్వాత ఆర్సీబీ విజయం సాధించడం విశేషం. తాజా ఫలితంతో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా మూడో సీజన్లోనూ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఢిల్లీ, ముంబై చెరో 10 పాయింట్లతో సమంగా నిలిచినా ... రన్‌రేట్‌తో క్యాపిటల్స్ ముందంజ వేసింది. 2023, 2024లలో కూడా ఢిల్లీ ఫైనల్ చేరినా... రన్నరప్‌గానే సరిపెట్టుకుంది. మంగళవారం జరిగిన పోరులో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ స్మృతి మంధాన (37 బంతుల్లో 53; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఎలీస్ పెరీ (38 బంతుల్లో 49 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగారు. అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసి పోరాడి ఓడింది. నాట్ సివర్ బ్రంట్ (35 బంతుల్లో 69; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించింది. బెంగళూరు బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ స్నేహ్ రాణా (3/26) మూడు... కిమ్ గార్త్, పెరీ చెరో రెండు వికెట్లు తీశారు. అందరూ ధాటిగా... బెంగళూరు జట్టులో క్రీజులోకి దిగినవారంతా ధాటిగా పరుగులు సాధించారు. సబ్బినేని మేఘన (13 బంతుల్లో 26; 4 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్స్మృతి ఓపెనింగ్ వికెట్‌కు 22 బంతుల్లో 41 పరుగులు జోడించారు. తర్వాత కెప్టెన్ మంధానకు జతయిన ఎలీస్ పెరీ కూడా వేగంగా ఆడటంతో బెంగళూరు స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. వీళ్లిద్దరు రెండో వికెట్‌కు 59 పరుగులు జోడించారు. స్మృతి నిష్క్రమణతో క్రీజులోకి వచ్చిన రిచా ఘోష్ (22 బంతుల్లో 36; 5 ఫోర్లు, 1 సిక్స్) తనదైన శైలిలో దూకుడు కనబరిచింది. రిచా, పెరీలిద్దరూ జట్టు స్కోరును 150 పరుగులు దాటించారు. అనంతరం రిచా జోరుకు హేలీ అడ్డుకట్ట వేసింది. అయితే జార్జియా వేర్హామ్ (10 బంతుల్లో 31 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) డెత్ ఓవర్లలో చెలరేగడంతో ప్రత్యర్థి ముందు 200 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రాణించిన నాట్ సివర్ ముంబై ఆరంభంలోనే తడబడింది. ఓపెనర్లు హేలీ మాథ్యూస్ (19), అమెలియా కెర్ (9) భారీ లక్ష్యానికి అనువైన శుభారంభాన్ని ఇవ్వలేకపోయారు. నాట్ సివర్ బ్రంట్ చక్కగా పోరాడినప్పటికీ తర్వాత వచ్చిన బ్యాటర్లు వికెట్లు పారేసుకోవడంతో ముంబై జట్టు లక్ష్యానికి దూరమైంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (20; 2 ఫోర్లు), అమన్‌జోత్ (17) ప్రభావం చూపలేకపోగా... ఆఖరి ఓవర్లో సజీవన్ సజన (12 బంతుల్లో 23; 1 ఫోర్, 2 సిక్స్‌లు) భారీ షాట్లతో వణికించింది. 3 బంతుల్లో 12 పరుగులు చేయాల్సిన దశలో ఆమె కూడా అవుట్ కావడంతో ముంబైకి ఓటమి ఖాయమైంది. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: మేఘన (సి) పారుణిక (బి) హేలీ మాథ్యూస్ 26; స్మృతి (సి) షబి్నమ్ (బి) అమెలియా 53; ఎలీస్ పెరీ నాటౌట్ 49; రిచా ఘోష్ (సి) నాట్ సివర్ (బి) హేలీ మాథ్యూస్ 36; జార్జియా నాటౌట్ 31; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 199. వికెట్ల పతనం: 1–41, 2–100, 3–153. బౌలింగ్: షబ్నిమ్ ఇస్మాయిల్ 4–0–41–0, నాట్ సివర్ 2–0–16–0, హేలీ మాథ్యూస్ 4–0–37–2, అమన్‌జోత్ 4–0–27–0, అమెలియా కెర్ 3–0–47–1, సంస్కృతి గుప్తా 1–0–6–0, పారుణిక సిసోడియా 2–0–24–0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: హేలీ మాథ్యూస్ (సి) గ్రాహమ్ (బి) స్నేహ్ రాణా 19; అమెలియా (సి) మంధాన (బి) స్నేహ్ రాణా 9; నాట్ సీవర్ (సి అండ్ బి) పెరీ 69; హర్మన్‌ప్రీత్ (సి) రిచా ఘోష్ (బి) కిమ్ గార్త్ 20; అమన్‌జోత్ (బి) గ్రాహమ్ 17; యస్తిక భాటియా (సి అండ్ బి) స్నేహ్ రాణా 4; సజన (సి) మేఘన (బి) పెరీ 23; కమలిని (సి) పెరీ (బి) జార్జియా 6; సంస్కృతి (సి) జోషిత (బి) కిమ్ గార్త్ 10; షబ్నిమ్ నాటౌట్ 4; పారుణిక నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 188. వికెట్ల పతనం: 1–27, 2–38, 3–78, 4–129, 5–134, 6–140, 7–152, 8–167, 9–188. బౌలింగ్: కిమ్ గార్త్ 4–0–33–2, ఎలీస్ పెరీ 4–0–53–2, స్నేహ్ రాణా 4–0–26–3, హిథెర్ గ్రాహమ్ 4–0–47–1, జార్జియా వేర్హామ్ 4–0–29–1.

భారత రెజ్లర్లకు ఊరట
న్యూఢిల్లీ: భారత రెజ్లర్లకు మేలు చేసే కీలక నిర్ణయాన్ని కేంద్ర క్రీడాశాఖ తీసుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై విధించిన సస్పెన్షన్‌ను క్రీడా శాఖ ఎత్తేసింది. డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై స్టార్ రెజ్లర్ల లైంగిక ఆరోపణలు దరిమిలా చుట్టుముట్టిన వివాదాలు, కోర్టు కేసుల అనంతరం 15 నెలల క్రితం కొత్త కార్యవర్గం కొలువు దీరింది. కానీ రోజుల వ్యవధిలోనే కేంద్ర క్రీడా శాఖ ఆగ్రహానికి గురైంది. దీంతో పలు అంతర్జాతీయ ఈవెంట్లలో భారత రెజ్లర్లు పాల్గొనేందుకు ఇబ్బందులెదురవుతున్నాయి. రెజ్లర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు నిషేధాన్ని ఎత్తేసింది. కేంద్ర క్రీడా శాఖ మార్గదర్శకాలను డబ్ల్యూఎఫ్ఐ పాటించడంతో పాటు రెజ్లర్ల విస్తృత ప్రయోజనాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ శాఖ అధికారులు వెల్లడించారు. క్రీడాపాలసీ ప్రకారం డబ్ల్యూఎఫ్ఐ నడచుకోవాలని, వివాదాస్పద, కళంకిత అధికారులు, పాత కార్యవర్గ సభ్యులకు దూరంగా ఉండాలని, లేదంటే కఠిన చర్యలకు వెనుకాడమని క్రీడా శాఖ హెచ్చరించినట్లు తెలిసింది. డబ్ల్యూఎఫ్ఐ కార్యకలాపాలు మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ ఇంటినుంచే నిర్వహిస్తున్నారనే విమర్శలపై క్రీడాశాఖ పర్యవేక్షక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రత్యక్ష పరిశీలన అనంతరం ఇచి్చన నివేదికను బట్టే తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దీంతో వచ్చే ఏషియాడ్ (2026), లాస్ ఏంజెలెస్ (2028) ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలనుకునే రెజ్లర్లకు కొండంత ఆత్మవిశ్వాసం లభించినట్లయ్యింది. క్రీడాశాఖ నిర్ణయంపై డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు సంజయ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వానికి కృతజ్ఞతలు. సస్పెన్షన్ తొలగిపోవడంతో ఇక మా కార్యకలాపాలు సజావుగా జరిగేందుకు అవకాశం లభించింది. రెజ్లింగ్ క్రీడ అభ్యున్నతికి ఇలాంటి నిర్ణయం ఎంతో అవసరం కూడా! ఇప్పటికే ప్రతిభావంతులైన రెజ్లర్లు పలు అంతర్జాతీయ ఈవెంట్లకు దూరమయ్యారు. ఇకనుంచి వారంతా పతకాల కోసం పోటీపడొచ్చు’ అని అన్నారు. క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ సస్పెన్షన్‌ను ఇంకా కొనసాగిస్తే రెజ్లర్లకు అన్యాయం చేసిన వారమవుతామని చెప్పారు. రెజ్లర్లు అంతర్జాతీయ క్రీడావేదికలపై రాణించాలనే సదుద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్‌భూషణ్ మాట్లాడుతూ తనపై చేసిన తప్పుడు ఆరోపణలేవీ నిలబడలేదని చెప్పుకొచ్చారు.

లక్ష్యసేన్ శుభారంభం
బర్మింగ్హమ్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ తొలి రోజు భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. తొలి రౌండ్లో లక్ష్యసేన్, మాళవిక బన్సోద్ విజయాలు సాధించి ముందంజ వేయగా... హెచ్ఎస్ ప్రణయ్ పరాజయంతో ఇంటిబాట పట్టాడు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో మంగళవారం ప్రపంచ 15వ ర్యాంకర్ లక్ష్యసేన్ 13–21, 21–17, 21–15తో ప్రపంచ 37వ ర్యాంకర్ లి యాంగ్ సు (చైనీస్ తైపీ)పై విజయం సాధించాడు. గంటా 15 నిమిషాల పాటు సాగిన పోరు తొలి గేమ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన లక్ష్య... హోరాహోరీగా సాగిన రెండో గేమ్ 17–17తో సమంగా ఉన్న సమయంలో చైనీస్ తైపీ షట్లర్ తప్పిదాలతో వరుస పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. నిర్ణయాత్మక మూడో గేమ్ ఆరంభం నుంచే దూకుడు కనబర్చిన లక్ష్యసేన్... నెట్ గేమ్‌తో ప్రత్యర్థిని ఉక్కిరి బిక్కిరి చేసి 11–9తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అయితే పట్టువదలని చైనీస్ తైపీ షట్లర్ 15–15తో స్కోరు సమం చేశాడు. అక్కడి నుంచి విజృంభించిన లక్ష్యసేన్... బలమైన రిటర్న్‌లతో చెలరేగి వరుసగా ఆరు పాయింట్లు సాధించి ప్రిక్వార్టర్స్‌కు చేరాడు. ఈ మ్యాచ్‌లో మూడో సీడ్ జొనాథన్ క్రిస్టి (ఇండోనేసియా)తో లక్ష్యసేన్ తలపడతాడు. 2024 పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక పోరులో క్రిస్టి చేతిలో ఓడిన లక్ష్యసేన్... ఆ పరాజయానికి బదులు తీర్చుకునేందుకు ఇది చక్కటి అవకాశం. మరో మ్యాచ్‌లో ప్రపంచ 29వ ర్యాంకర్ ప్రణయ్ 19–21, 16–21తో ప్రపంచ 17వ ర్యాంకర్ టోమా జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్) చేతిలో పరాజయం పాలయ్యాడు. 53 నిమిషాల పాటు సాగిన పోరులో ప్రణయ్ వరుస గేమ్‌ల్లో ఓడాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో రైజింగ్ స్టార్ మాళవిక బన్సోద్ 21–13, 10–21, 21–17తో జియా మిన్ యో (సింగపూర్)పై విజయం సాధించింది. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో ద్వయం 20–22, 18–21తో చెన్ చెంగ్–సెయి పెయి షాన్ జంట చేతిలో ఓడింది. మిక్స్డ్ డబుల్స్‌లో సతీశ్ కుమార్ కరుణాకరన్–ఆద్య జంట 6–21, 15–21తో జిన్ వా–చెన్ ఫెంగ్ హుయి (చైనా) ద్వయం చేతిలో ఓడింది. భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి బుధవారం బరిలోకి దిగనున్నారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో యున్ కిమ్ (దక్షిణ కొరియా)తో సింధు తలపడుతుంది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో డానియల్ లిండ్‌గార్డ్–మాడ్స్ వెస్టర్‌గాడ్ (డెన్మార్క్) జంటతో సాత్విక్–చిరాగ్ జోడీ ఆడుతుంది.
National

డీఎస్పీ కనకలక్ష్మి అరెస్టు
బనశంకరి: బెంగళూరులో బోవి అభివృద్ధి మండలి అక్రమాల కేసులో నిందితురాలు, న్యాయవాది జీవా (33) ఆత్మహత్య కేసులో సీఐడీ డీఎస్పీ కనకలక్ష్మీని మంగళవారం సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. మండలికి సామగ్రి సరఫరా చేసే కాంట్రాక్టును ఎస్.జీవా నిర్వహించేది. గత ఏడాది నవంబరు 22 తేదీన తేదీన డెత్‌నోట్ రాసిన జీవా బనశంకరి రాఘవేంద్రలేఔట్లోని ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. అక్రమాలు జరిగాయన్న కేసులో జీవాను సీఐడీ డీఎస్పీ కనకలక్ష్మి పిలిపించి చిత్రహింసలకు గురిచేసిందని, రూ. 25 లక్షల లంచం ఇవ్వాలని డిమాండు చేసిందని మృతురాలి సహోదరి సంగీత ఆరోపించారు. జీవా రాసిన 10 పేజీలకు పైగా డెత్‌నోట్ తో సమేతంగా సంగీతా బనశంకరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసును పోలీస్ కమిషనర్ దయానంద్ ఆదేశంతో సిట్ విచారిస్తోంది. ఎట్టకేలకు కనకలక్ష్మిని అరెస్టు చేశారు.
దళిత విద్యార్థి వేళ్లు నరికేశారు
తిరునల్వేలి: తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో ఘోరం జరిగింది. పరీక్ష రాయడానికి వెళ్తున్న దేవేంద్రన్ అనే 11వ తరగతి విద్యారి్థపై కొందరు కిరాతకులు దాడి చేసి చేతి వేళ్లు దారుణంగా నరికేశారు. దిన కూలీ అయిన కొడుకైన దేవేంద్రన్ సోమవారం పాళయంకోటలోని పరీక్షా కేంద్రానికి బస్సులో బయలుదేరాడు. మార్గమధ్యంలో క్రాసింగ్ వద్ద ముగ్గురు వ్యక్తులు బస్సును అడ్డగించారు. దేవేంద్రన్‌ను బయటికి లాగి ఎడమ చేతి వేళ్లు నరికేశారు.అడ్డొచ్చిన అతని తండ్రి గణేశ్‌పైనా దాడి చేశారు. అతనికి తల, ఇతర చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. ప్రయాణికులు అడ్డుకోవడంతో అగంతకులు పారిపోయారు. తండ్రీకొడుకులను అదే బస్సులో శ్రీవైకుంఠం ప్రభుత్వాస్పత్రికి, తరువాత తిరునల్వేలి ఆస్పత్రికి తరలించారు. దాడికి తెగబడ్డ ముగ్గురు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కబడ్డీ మ్యాచ్‌లో ఓటమికి ప్రతీకారంగానే దాడికి తెగబడ్డారని దేవేంద్రన్ కుటుంబం ఆరోపించింది.

మిస్టరీగా తెలుగమ్మాయి అదృశ్యం
న్యూఢిల్లీ: కరీబియన్ దేశం డొమినికన్ రిపబ్లిక్లో తెలుగు విద్యార్థిని అదృశ్యం మిస్టరీగా మారింది. 20 ఏళ్ల సుదీక్ష కోణంకి కుటుంబం అమెరికాలో వర్జీనియాలోని లౌడౌన్ కౌంటీలోని చంటిల్లీలో నివసిస్తోంది. సుదీక్షకు అమెరికా శాశ్వత నివాస హోదా ఉంది. పిట్స్బర్గ్ వర్సిటీలో మెడిసిన్ చదువుతోంది. ఐదుగురు తోటి విద్యారి్థనులతో వారం క్రితం డొమినికన్ రిపబ్లిక్‌లోని పుంటా కానాకు వెళ్లింది. అక్కడి రియు రిపబ్లికా రిస్టార్టులో వారికి మరో ఇద్దరు అమెరికా టూరిస్టులు కలిశారు. అంతా మార్చి 5న రాత్రి స్థానిక నైట్ క్లబ్‌కు వెళ్లారు. 6వ తేదీ తెల్లవారుజామున నాలుగింటి సమయంలో అక్కడి బీచ్‌కు చేరుకున్నారు. ఉదయం 5.50 సమయంలో మిగతా వాళ్లు రిసార్టుకు వచ్చేయగా టూరిస్టుల్లో ఒకరైన జాషువా స్టీవెన్ రిబే (24), సుదీక్ష బీచ్‌లోనే ఉండిపోయారు. ఆ తరువాత ఆమె కనిపించలేదు. ఉదయం 9 గంటలప్పుడు రిబే ఒక్కడే బీచ్ నుంచి వెళ్లిపోయినట్లు సీసీటీవీల్లో రికార్డయ్యింది. సాయంత్రమైనా సుదీక్ష ఆచూకీ లేకపోవడంతో స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటినుంచి హెలికాప్టర్లు, డ్రోన్లు, పడవలు, స్కూబా డైవర్లు, ఏటీవీలను మోహరించి తీరం, పరిసర ప్రాంతాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు. నాలుగు రోజులైనా ఆమె ఆచూకీ దొరకలేదు. దీనికి తోడు ఆమె అదృశ్యంపై స్నేహితుల నుంచి విరుద్ధ కథనాలు వస్తుండటంతో కుటుంబీకులు మరింత ఆందోళన చెందుతున్నారు. సుదీక్ష తల్లిదండ్రులు సుబ్బారాయుడు, శ్రీదేవి కూడా పుంటా కానా వెళ్లారు. ఆదివారం వారు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘‘కుమార్తె సెల్‌ఫోన్, బ్యాగ్, ఇతర వస్తువులన్నీ స్నేహితుల వద్దే ఉన్నాయి. ఆమెనెవరో కిడ్నాప్ చేసి ఉండొచ్చు’’అని అనుమానం వ్యక్తం చేశారు. ఆ దిశగా దర్యాప్తు చేయాలని కోరుతున్నారు. సుదీక్ష ఆచూకీ కోసం తాజాగా ఎఫ్‌బీఐ కూడా రంగంలోకి దిగింది. స్థానిక భారత రాయబార కార్యాలయం కూడా దర్యాప్తును పర్యవేక్షిస్తోంది. సుదీక్ష అదృశ్యంపై ఇంటర్‌పోల్ ఎల్లో నోటీస్ జారీ చేసింది.భిన్న కథనాలు సుదీక్షను చివరిసారిగా చూసిన జాషువా ఆమె అదృశ్యంపై భిన్న కథనాలు చెబుతున్నాడు. పెద్ద అలలు రావడంతో బీచ్ నుంచి వెళ్లిపోయానని ఓసారి, సుదీక్ష మోకాలి లోతు నీటిలో ఉండగా చివరగా చూశానని మరోసారి చెప్పాడు. ఆమె తీరంలో నడుస్తుండగా తాను నిద్రపోయానని మరోసారి చెప్పుకొచ్చాడు. పోలీసులు మాత్రం అతన్ని అనుమానితుడిగా భావించడం లేదు. బీచ్ లాంజ్‌లో ఆమె దుస్తులు కనిపించాయి. బహుశా బికినీలో సముద్రంలోకి వెళ్లి మునిగిపోయి ఉంటుందని భావిస్తున్నారు. ఆమె తండ్రి మాత్రం జాషువానే అనుమానిస్తున్నారు.

రెండు నెలల్లో ట్రిపుల్ ఆర్ ఆమోదం!
సాక్షి, న్యూఢిల్లీ: రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) క్లియరెన్స్‌లన్నీ త్వరలో పూర్తికానున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. అనంతరం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే కేంద్ర కేబినెట్ ఆమోదానికి వెళ్తుందని చెప్పారు. ఈప్రక్రియ అంతా రెండు నెలల్లో పూర్తి చేస్తామని కేంద్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. కోమటిరెడ్డి మంగళవారం ఆర్ అండ్ బీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందనలతో కలిసి గడ్కరీతో భేటీ అయ్యారు.ట్రిపుల్ ఆర్, హైదరాబాద్–విజయవాడ ఆరులేన్ల రోడ్డు, 12 ఆర్వోబీలు తదితర అంశాలపై గడ్కరీతో చర్చలు జరిపారు. ఆ తర్వాత రాష్ట్రంలో పలు విమానాశ్రయాల గురించి పౌరవిమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుతో భేటీ అయ్యారు. కొత్తగూడెం, రామగుండం, పెద్దపల్లి, ఆదిలాబాద్, నిజామాబాద్ ఎయిర్‌పోర్టుల అంశంపై చర్చించారు. అనంతరం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. 95 శాతం భూసేకరణ చేశాం 2018–19లో రీజినల్ రింగ్ రోడ్డు ప్రకటించగా.. అప్పటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని కోమటి రెడ్డి విమర్శించారు. తాము అధికారం చేపట్టిన నాటి నుంచి కేంద్రంతో టచ్‌లో ఉంటూ ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే జంగారెడ్డి–భువనగిరి–చౌటుప్పల్ వరకు టెండర్లు పిలిచామన్నారు. 95 శాతం భూసేకరణను క్లియర్ చేశామని, కేంద్రం నుంచి ఆమోదం వచ్చాక వారికి పరిహారమిస్తామని తెలిపారు.‘హైదరాబాద్–విజయవాడ ఆరులేన్ల రహదారిని మచిలీపట్నం వరకు పొడిగిస్తున్నామని, ఇందుకు కన్సల్టెంట్‌ను పిలిచినట్లు గడ్కరీ తెలిపారు. అయితే, హైదరాబాద్–విజయవాడ వరకు ఇప్పటికే భూసేకరణ పూర్తయినందున త్వరగా టెండర్లు పిలవాలని కోరాను. రెండు ప్యాకేజీలుగా ఈ రహదారిని నిర్మించేందుకు కేంద్రం సిద్ధమైంది.మొదటి ప్యాకేజీలో మల్కాపూర్–విజయవాడ, రెండో ప్యాకేజీలో విజయవాడ–మచిలీపట్నం వరకు నిర్మాణం జరిపేందుకు గడ్కరీ ఒప్పుకున్నారు. పర్వతమాల పథకం కింద యాదగిరిగుట్ట, భువనగిరి కోటకు, నల్లగొండ పట్టణంలోని హనుమాన్ కొండ, నాగార్జున సాగర్ ఆనకట్ట మీదుగా నాగార్జున కొండను కలుపుతూ, మంథనిలోని రామగిరి కోట ప్రాంతాల్లో రోప్‌వేలు అడిగాను. వీటిపై గడ్కరీ సానుకూలంగా స్పందించారు’అని కోమటిరెడ్డి చెప్పారు.అనర్హత వేటు పడుతుందనే అసెంబ్లీకి కేసీఆర్ అనర్హత వేటు పడుతుందనే భయంతోనే బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు వస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎద్దేవాచేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇక లేనట్లేనని, ఆ పార్టీని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేరని మీడియాతో చిట్‌చాట్‌లో అన్నారు. ‘కాంగ్రెస్ వైఫల్యాలను ప్రశ్నిస్తానని కేసీఆర్ అంటున్నారు, ఒకవేళ కేసీఆర్ ఒక అంశాన్ని ఎత్తి చూపితే పది అంశాలను సభ ముందు పెడతాం. దళిత సీఎం నుంచి జర్నలిస్ట్‌ల వరకు కేసీఆర్ చేసిన మోసాలను ఎండగడతాం’అని అన్నారు. రేవంత్‌రెడ్డి పదేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని తెలిపారు. సీఎం మార్పు జరుగుతుందని వస్తున్నవన్నీ అసత్య ప్రచారాలేనంటూ కొట్టిపడేశారు.
International
NRI

న్యూజెర్సీలో ఘనంగా ‘మాట’ మహిళా దినోత్సవ వేడుకలు
మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ, మహిళా సాధికారతకు, అభ్యున్నతికి పలు కార్యక్రమాలు చేపడుతున్న మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ - మాట అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది. అమెరికాలోని న్యూజెర్సీలో ఉమెన్స్ డే వేడకలను అంగరంగ వైభవంగా నిర్వహించి.. వనితలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని మాట ఉమెన్ కమిటీ మరోసారి రుజువు చేసింది. ప్రముఖ సినీ నటి, ఇంద్రాణి ఫేమ్ అంకితా జాదవ్ ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై.. ప్రసంగించారు. సింగర్ దామిని భట్ల, దీప్తి నాగ్ తో పాటు పలువురు ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అంకితా కొనియాడారు. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన మాట కార్యవర్గాన్ని అభినందించారు. అంకితా జాదవ్ నటించిన ఆల్బమ్ సాంగ్స్ ను ఈ వేదికగా ప్రదర్శించారు. ఈ వేడుకల్లో మహిళామణులు పెద్ద సంఖ్యలో పాల్గొని కనువిందు చేశారు. ఇక వేదికపై నిర్వహించిన పలు కార్యక్రమాలు మహిళల సంతోషాల మధ్య ఆహ్లదంగా సాగాయి. యువతులు, మహిళల ఆట, పాటలతో.. సంబరాల సంతోషాలు అంబరాన్నంటాయి. అటు సంప్రదాయం.. ఇటు ఆధునికత ఈ రెండింటిని ప్రతిబింబిస్తూ ఎన్నో కార్యక్రమాలతో మహిళలు ఆకట్టుకున్నారు. శాస్త్రీయ నృత్యం, మోడ్రన్ డ్యాన్స్ రెండింటిలో తమకు సాటి లేదని నిరూపించారు.MS మాట కాంపిటీషన్, ఫ్యాషన్ షో, బ్యూటీ పాజెంట్ వంటి అద్భుతమైన ప్రదర్శనలు ఆహుతులను ఆకర్షించాయి. ఈ ప్రదర్శనల్లో మగువలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహిళా శక్తి ఏమిటో నిరూపించారు. అందాల ముద్దుగుమ్మలు హొయలు పోతూ ర్యాంప్‌పై క్యాట్ వాక్ చేశారు. అందాల పోటీలకు నటి అంకితా జాదవ్ తో పాటు పలువురు ప్రముఖులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. MS మాట కాంపిటీషన్ 2025 విజేతకు కిరీటాన్ని బహూకరించారు. పోటీల్లో పాల్గొన్న మగువలకు బెస్ట్ స్మైల్, బెస్ట్ వాక్ వంటి పలు విభాగాల్లో అవార్డులు అందించారు. ఫోటో బూత్, ఇండో వెస్ట్రన్ అవుట్ ఫిట్, ఫన్ ఫీల్డ్ గేమ్స్, రాఫెల్ టికెట్స్ వంటి కార్యక్రమాలు అమితంగా ఆకట్టుకున్నాయి.వేదికపై మగువలు, చిచ్చర పిడుగులు ప్రదర్శించిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డ్యాన్స్‌లు, డిజె మ్యూజిక్ కార్యక్రమాలు హోరెత్తించాయి. సంప్రదాయ ఫ్యాషన్ షో, గేమ్స్ తో పాటు ఇతర కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో భాగంగా వెండర్స్ బూత్ ఏర్పాటు చేశారు. మహిళలు షాపింగ్ స్టాల్స్ దగ్గర సందడి చేశారు. తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతిఒక్కరికీ పసందైనా విందుభోజనం అందించారు. ఆహా ఏమి రుచి… తినరా మైమరచి.. అనే మాటను నిజం చేస్తూ ఎంతో రుచికరమైన భోజనాలు అందించారు. స్వీట్స్ నుంచి ఐస్ క్రీమ్ వరకు పలు వైరటీలతో రుచికరమైన వంటకాలు ఏర్పాటు చేశారు. మాట మహిళా నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న మహిళా ప్రసంగాలతో పాటు అనేక సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మాట నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను సత్కరించారు. సంస్థ మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత, మహిళా సాధికారతకు, అభ్యున్నతికి మాట అధ్వర్యంలో చేపట్టిన ప్రణాళికలను నాయకులు వివరించారు. ఈ సందర్భంగా సంస్థ తరుపున చేస్తున్న పలు కార్యక్రమాలను వివరించారు. స్త్రీలు ప్రతి కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కుంటూ ముందుకు సాగాలని పలువురు ప్రముఖులు హితవు పలికారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. మాట పలువురిని అవార్డుతో సత్కరించింది. అలాగే సభా వేదికపై పలువురిని సన్మానించి, సత్కరించారు. మాట కార్యక్రమాలు అండగా ఉంటూ, సహాయసహాకారాలు అందిస్తున్న ప్రతిఒక్కరినీ నిర్వహకులు ప్రశంసించారు. ఈ సంబరాలను అద్భుతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన ప్రతిఒక్కరినీ మాట ఉమెన్ కమిటీ ప్రత్యేకంగా అభినందించింది. ఈ వేడుకకు విచ్చేసిన స్త్రీమూర్తులకు నిర్వహకులు కృతజ్ఞతలు తెలియజేశారు. విందు - వినోదాలతో మాట - అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఎంతో ఉత్సహంగా సాగాయి. ఈ సంబరాల్లో మేము సైతం అంటూ వెయ్యి మందికి పైగా మహిళలు ముందుకొచ్చి ఉమెన్స్ డే వేడుకలను గ్రాండ్ సక్సెస్ చేశారు. సంబరమాశ్చర్యాలతో, ఆసాంతం ఆహ్లాద పరిచేలా ఈ వేడుకను కనువిందుగా నిర్వహించారు. వేలాదిగా ఆదర్శ వనితలు ఒక చోటు చేరి, అటపాటలతో, కేరింతలతో హోరేత్తించడం.. మాట విజయానికి మచ్చుతునకగా చెప్పవచ్చు.

ఫ్లోరిడాలో అత్యున్నత స్థాయి ‘హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2025’
అమెరికాలోని ఫ్లోరిడాలోని ఓర్లాండో నగరంలో మెడికల్ కాన్ఫరెన్స్ ఘనంగా జరిగింది. 70-80 మంది ఆంకాలజిస్టులు, ప్రైమరి కేర్ డాక్టర్లు హాజరైన ఈ కార్యక్రమం, ఇన్నోవేటివ్ ఎడ్యుకేషన్‌కి ఒక వేదికగా పనిచేసిందని నిర్వాహకులు తెలిపారు. ఈ సదస్సు ప్రముఖ కీనోట్ వక్త, డాక్టర్ బార్బరా మెకనీ, మాజీ AMA ఉపాధ్యక్షురాలు ఆంకాలజి పరిశోధన, పక్షవాతం, పేషంట్ కేర్ మొదలైన అంశాల ప్రాముఖ్యాన్ని వివరించారు.‘హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2025 తన విజన్‌ను నిజం చేసింది. మహిళల కోసం క్యాన్సర్ సంరక్షణను ముందుకు తీసుకెళ్లడంలో వైద్య సమాజాన్ని శక్తివంతం చేయడానికి, అవగాహన నిమిత్తందీన్ని రూపొదిచామనీ, ఈమెడ్ ఈవెంట్స్, ఈమెడ్ ఎడ్ సీఈఓగా, శంకర నేత్రాలయ, యూఎస్ఏ సీఎమ్ఈ చైర్‌పర్సన్‌గా(USA CME) ఒక మహిళగా, మహిళా ఆరోగ్య సంరక్షణలో మార్పు తీసుకురావడానికి ఇదొక సదవకాశమని’ డాక్టర్ ప్రియా కొర్రపాటి సంతోషం వ్యక్తం చేశారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!చైర్పర్సన్ డాక్టర్ సతీష్ కత్తుల, ఆంకాలజిస్ట్, హెమటాలజిస్ట్, AAPI అధ్యక్షుడు, మహిళలలో సాధారణ క్యాన్సర్లను పరిష్కరించడం, నిరంతర అవగాహన ప్రాముఖ్యతను హైలైట్ చేశారు. కాంగ్రెస్‌లో 10 మంది అత్యున్నత నైపుణ్యం కలిగిన వక్తలు ఉన్నారని, ప్రతి ఒక్కరూ ఆంకాలజీలో పురోగతి, సమగ్ర రోగి సంరక్షణపై దృష్టిపెడుతున్నారని డా. ప్రియా అన్నారు. ఈ కాంగ్రెస్‌ను కేవలం ఒక కార్యక్రమం కాకుండా, కంటిన్యూస్ లర్నింగ్ చేయాలనే తమ లక్ష్యాన్ని బలోపేతం చేశారన్నారు. AAPI, CAPI (టంపా నుండి స్థానిక అధ్యాయం) eMed Ed తో కలిసి చేస్తున్న సహకార ప్రయత్నాలను డా. సతీష్ అభినందించారు. ప్రత్యేక ఆకర్షణలుNFL ఆటగాడు షెప్పర్డ్ స్టెర్లింగ్ ఈ సదస్సు హాజరు కావడం విశేషం. ఆంకాలజీ వంటి క్రిటికల్ కేర్ వైద్యులలో చాలా ఉద్యోగపరైమన ఒత్తిడి అధికంగా ఉంటుంది దాని కోసం ప్రత్యేకంగా ఆంకాలజీ బర్నవుట్ సెషన్ నిర్వహించటం మరో విశేషం. డాక్టర్ వర్షా రాథోడ్, ఇంటిగ్రేటివ్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఓర్లాండో, ఫ్లోరిడా ఈ సెషన్ నిర్వహించారు. డాక్టర్ శైలజ ముసునూరి, ఇంటిగ్రేటెడ్ మెడిసిన్, చీఫ్ ఆఫ్ సైకియాట్రి, వుడ్ సర్వీసెస్, పెన్సిల్వేనియా వారు నిర్వహించిన సైకాలజికల్ ఆంకాలజీ సెషన్ ఆకట్టుకుంది. క్యాన్సర్ కేర్ లో మెడికల్ ట్రీట్మెంట్ మాత్రమే కాకుండా, రోగుల మానసిక, భావోద్వేగ స్థితిని కూడా సమర్థంగా నిర్వహించాలని పేర్కొన్నారు.వాలంటీర్ల దృక్పదంస్పీకర్లకి మించి, ఈ కాంగ్రెస్ స్వచ్ఛంద సేవకులకు కూడా గొప్ప అనుభవాన్ని ఇచ్చిందనీ, సెషన్లు, ఆసక్తిక్రమైన చర్చలు జరిగాయి. డాక్టర్లు అనేక ప్రశ్నలను చాలా లోతైన వివరణ, పరిస్కారాలు ఇచ్చారని, క్వెషన్ అండ్ ఆన్సర్ సెషన్ చాలా ఆసక్తిగా, ఉపయోగంగా ఉందని ఆమె తెలిపారు.ఆడియన్స్ అభిప్రాయాలుమహిళల క్యాన్సర్లపై దృష్టి సారించే ఆంకాలజీ సమ్మేళనాలు అరుదుగా ఉన్నాయని, ఈ కార్యక్రమం ఆంకాలజిస్ట్‌లు, ప్రమరి కేర్ డక్టర్లు ఇద్దరికీ ఒక అమూల్యమైన అవకాశం అని అన్నారు. రోగులను ఎప్పుడు రిఫర్ చేయాలి, కొత్త చికిత్సా విధానాల ఏమున్నాయి వంటి అవసరమైన అంశాలను ఎలా నిర్వహించాలనేది తమ అభిప్రాయాల ద్వారా వెల్లడించారు.హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ భవిష్యత్తు హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2026 కాంగ్రెస్ ఓహియోలో జరుగుతుందని ప్రకటించారు. ఈ కార్యక్రం విజయానికి సహకరించిన అందరికీ ప్రియా కొర్రపాటి ధన్యవాదాలు తెలిపారు. అలాగే మహిళల కోసం ఆంకాలజీ సంరక్షణను ముందుకు తీసుకెళ్లే మిషన్‌లో ముందుకు సాగడానికి ఇది స్ఫూర్తినిస్తుందని ఇప్పుడున్నఆంకాలజీని ముందుకు ముందుకు తీసుకెళ్ళటానికి కలిసి పనిచేద్దామనిఆమె పిలుపునిచ్చారు.

డాక్టర్ కావాలనుకుంది : భారతీయ విద్యార్థిని విషాదాంతం?!
డొమినికన్ రిపబ్లిక్లో కనిపించకుండాపోయిన భారతీయ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిందా అంటే అవుననే అనుమానాలు బాగా బలపడుతున్నాయి. గత వారం విహారయాత్రకు వెళ్లి కనిపించకుండా పోయిన పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయ విద్యార్థిని నీటిలో మునిగి మరణించి ఉంటుందని భావిస్తున్నట్టు అధికారులు ఆదివారం ధృవీకరించారని ఏబీసీ న్యూస్ తెలిపింది. ప్రమాదవశాత్తూ నీటిమునిగి ఉంటుందని పోలీసులు వెల్లడించినట్టు తెలిపింది. మార్చి 6వ తేదీ,తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఆరుగురు స్నేహితులతో రిసార్ట్‌కు వెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం పిట్స్బర్గ్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ చదువుతున్న సుదీక్ష కోణంకి ఈ నెల 6న ప్రముఖ పర్యాటక పట్టణమైన వ్యూంటా కానా ప్రాంతానికి వెళ్లింది. అక్కడ బీచ్‌లో ఒక స్నేహితుడితో కలిసి ఈతకోసం వెళ్లిన ఆమె ఎంతకీ తిరిగి రాకపోవడంతో మిగిలిన స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సోషల్ మీడియాలో ఆమె ఆచూకీ కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో ఆమె బీచ్‌లో కొట్టుకుపోయి ఉంటుందని పోలీసులు భావించి సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. డ్రోన్లు, హెలికాఫ్టర్లతో గత నాలుగు రోజులుగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. భారతదేశానికి చెందిన సుదీక్ష తల్లిదండ్రులు రెండు దశాబ్దాల క్రితం అమెరికాకు వలస వెళ్లి అక్కడ శాశ్వత నివాస హోదా పొందారు. 20 ఏళ్ల నుంచి వర్జీనియాలో నివాసం ఉంటున్న సుదీక్ష కోణంకి పిట్స్బర్గ్ యూనివర్శిటీలోచదువుతోంది. తన కుమార్తె పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయంలో ప్రీ-మెడికల్ స్టడీకి ముందు వెకేషన్కోసం పుంటా కానాకు వెళ్లిందని, స్నేహితులతో కలిసి రిసార్ట్‌లో పార్టీకి వెడుతున్నట్టు చెప్పిందని, అవే తనతో మాట్లాడిన చివరి మాటలని సుదీక్ష తండ్రి సుబ్బరాయుడు కోణంకి కన్నీటి పర్యంతమైనారు. తన బిడ్డ మెరిట్ స్టూడెంట్ అనీ, డాక్టర్ కావాలని కలలు కనేదని గుర్తు చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో స్నేహితులను పోలీసులు ప్రశ్నించారని, ఎవరిపైనా ఎలాంటి అభియోగాలు నమోదు కాలేదని అధికారులు తెలిపారు.

న్యూయార్లో ఘనంగా తెలుగువారి సంబరాలు.
అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ లో తెలుగువారి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఒకే రోజు రెండు ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. మహిళా దినోత్సవంతో పాటు మహా శివరాత్రి వేడుకలను కూడా ఓకేసారి న్యూయార్క్ లో స్థిరపడిన తెలుగువారి చేసుకున్నారు. న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా) ఆధ్వర్యంలో ఫ్లషింగ్ గణేష్ టెంపుల్ ఆడిటోరియంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి.వందలాది మంది తెలంగాణ, తెలుగు వాసులు తమ కుటుంబాలతో సహా చేరి ఉత్సవాల్లో పాల్గొని ఆడి పాడారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ మాట్లాడుతూ అమెరికాతో పాటు న్యూ యార్క్ మహానగరం అభివృద్ది, సంస్కృతిలో తెలుగువారు అంతర్భాగం అయ్యారని కొనియాడారు.తెలంగాణ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్కమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్క, తదితర ప్రముఖులు ప్రత్యేక సందేశాల ద్వారా నైటా కార్యక్రమాలను, ఆర్గనైజింగ్ కమిటీ కృషిని ప్రశంసిస్తూ ప్రత్యేక సందేశాలను పంపారు. వీటి సంకలనంతో పాటు నైటా సభ్యులు, కార్యక్రమాలతో కూడిన సమాహారంగా నైటా వార్షికోత్సవ సావనీర్ ను ఈ సందర్భంగా విడుదల చేశారు.ఈ ఫెస్టివల్ ఈవెంట్ లో తెలంగాణ సూపర్ రైటర్, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ కాసర్ల శ్యామ్ తో పాటు, యూకే నుంచి సింగర్ స్వాతి రెడ్డి, డాన్సింగ్ అప్సరాస్ గా పేరొందిన టీ అండ్ టీ సిస్టర్స్, ఇండియన్ ఫేమస్ ఫ్యూజన్ మ్యూజిక్ గ్రూప్ పరంపరా లైవ్ ఫెర్మామెన్స్ తో అదరగొట్టారు. కొన్ని గంటల పాటు జరిగిన కార్యక్రమం ఆద్యంతం అందరినీ కట్టిపడేసింది.తెలుగు యువత గుండెల్లో చిరకాలం నిలిచిపోయే పాటలను రచించటంతో పాటు, పాడిన యువ గాయకుడు కాసర్ల శ్యామ్ కొన్ని హిట్ సాంగ్స్ తో అందరినీ ఉర్రూతలూగించారు. అమెరికాలో తెలుగువారి బలగాన్ని, బలాన్ని తన పాటల ద్వారా శ్యామ్ చాటి చెప్పారు. ఇక కొంత ఆలస్యంగానైనా న్యూయార్క్ తెలుగువారు శివరాత్రి వేడుకలు జరుపుకున్నా ఆధ్యాత్మిక గీతాలు, చిన్నారులు భక్తి పాటలతో ఆడిటోరియటం మారు మోగింది.న్యూయార్క్ మహానగరంలో నిత్యం వారి వారి వృత్తుల్లో బిజీగా ఉండే మన తెలుగు వారు అన్నింటినీ పక్కన పెట్టి అటు శివ భక్తి, ఇటు మహిళా దినోత్సవాన్ని ఒకే సారి వేడుకగా జరుపుకున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నైటా ఆర్గనైజింగ్ టీమ్ తో పాటు తెరవెనుక సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా అధ్యక్షురాలు వాణీ రెడ్డి ఏనుగు కృతజ్జతలు తెలిపారు.నైటా కార్యక్రమాలకు వెన్నుముకగా నిలుస్తూ ప్రోత్సాహం అందిస్తున్న డాక్టర్ పైళ్ల మల్లారెడ్డిని నైటా టీమ్ ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో వందలాది మంది తెలుగు కుటుంబాలతో పాటు, న్యూయార్క్ కాంగ్రెస్ విమెన్ గ్రేస్ మెంగ్, ఇండియన్ కాన్సులేట్ జనరల్ నుంచి బిజేందర్ కుమార్ తదితరులు హాజరయ్యారు.
Sakshi Originals

బంగారు అవకాశం.. హద్దు ఆకాశం
ఎన్నాళ్లుగానో మదిలో మెదులుతున్న రూపం కళ్ల ముందు కదలాడే క్షణాలవి.. ఎన్నో కలలు, మరెన్నో ఆశల ప్రతిరూపాలుగా వాహనాలు మెరుపులా దూసుకెళ్లే అపురూప ఘడియలవి. గోకార్టింగ్ అంటే కేవలం వాహనాల పోటీ కాదు. ఎంతో ఇష్టపడి తయారు చేసుకున్న మోడల్, కష్టపడి తయారు చేసుకున్న ఇంజిన్, వాహనంలో ప్రతి విభాగంపై సొంత ముద్ర.. ఇలా ప్రతి అంశంలోనూ విద్యార్థులు తమను తాము చూసుకుంటారు. పోటీలో బండి పరుగులు పెడుతుంటే చూసి మురిసిపోతారు. ఓ కొత్త వాహనానికి పురుడు పోసే దశను గుండెతో ఆస్వాదిస్తారు. టెక్కలి: శ్రీకాకుళం జిల్లాలో జరిగిన జాతీయ స్థాయి గోకార్టింగ్ పోటీలు ఇంజినీరింగ్ విద్యార్థుల మనసు దోచుకున్నాయి. ఆటోమొబైల్ రంగంలో ఎదగాలనుకునే విద్యార్థులకు ఈ పోటీలు ఒకరకంగా తొలి పరీక్ష లాంటివి. ఈ పోటీలు నిర్వహించడం, అందులో పాల్గొనడం, వాహనాలు తయారు చేయడం ఆషామాషీ విషయం కాదు. చాలారకాల దశలు దాటాకే బండిని ట్రాక్ మీదకు ఎక్కించాలి. గోకార్టింగ్ పోటీలు ఎందుకు నిర్వహిస్తారు..? ఆటోమొబైల్ రంగంపై ఆసక్తి కలిగిన ఇంజినీరింగ్ విద్యార్థుల్లో అంతర్లీనంగా ఉండే సృజనకు పరీక్ష పెట్టేందుకే ఈ గోకార్టింగ్ పోటీలు నిర్వహిస్తారు. ఇందులో రెండు రకాల వాహనాలు తయారు చేస్తారు. వాటిలో సీవీ(ఇంజిన్‌తో తయారుచేసినవి) ఈవీ(ఎలక్ట్రికల్ వాహనాలు) ఉంటాయి. వాహనాల తయా రీతో పాటు బిజినెస్ ఆలోచనలు సైతం పంచుకునే విధంగా ఈ గోకార్టింగ్ పోటీలు నిర్వహిస్తారు. అర్హతలు ఉండాల్సిందే.. గోకార్టింగ్ పోటీల్లో పాల్గొనాలంటే కళాశాల స్థాయి లో ‘మోటార్ స్పోర్ట్ కార్పొరేషన్’ తయారు చేసిన రూల్ బుక్ ఆధారంగా గ్రాఫికల్‌గా డిజైన్ చేస్తూ వాహనాన్ని తయారుచేయాలి. ఆ తర్వాత పోటీల్లో పాల్గొనేందుకు ఆయా కళాశాలలు నిర్వహించే ఆన్లైన్ పరీక్ష ఉత్తీర్ణత సాధించాలి. పోటీల్లో పాల్గొనే ముందు కూడా డిజైనింగ్ చెక్, ఇన్నోవేషన్ చెకింగ్‌లో భాగంగా కొత్తగా ఐఓటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్), ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారిత ఆలోచనలకు ప్రాముఖ్యతనిస్తారు. అలాగే బ్రేక్ టెస్ట్, లోడ్ టెస్ట్, స్పీడ్ టెస్ట్, స్టీరింగ్ టెస్ట్ తో పాటు ఇండ్యూరేషన్ టెస్ట్కూడా చేస్తారు. చివరగా బిజినెస్ రౌండ్లోనూ నెగ్గితేనే అర్హత సాధించినట్టు. ఒక్కో వాహనానికి 20 నుంచి 30 మంది టీమ్ సభ్యులు ఉంటారు. వారిలో కెపె్టన్, రైడర్, కో రైడర్ ఉంటారు. వాహనం తయారీ » గోకార్టింగ్ వాహనం తయారీకి సుమారు రూ. 70వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చవుతుంది. »ఇందులో సీవీ వాహనాలను పూర్తిగా ఇంజిన్‌తో తయారు చేస్తారు. ఇంజిన్, మోటారు, వీల్స్, స్టీరింగ్, ఇతర పార్టులు ఉంటాయి. »ఈవీ వాహనాలను బ్యాటరీ ఆధారంగా తయారుచేస్తారు. దీనికి బ్యాటరీ, వీల్స్, స్టీరింగ్, మోటారు ఇతర పార్టులు ఉంటాయి. ఒక్కో వాహనం సుమారు 80 నుంచి 100 కిలోల వరకు బరువు ఉంటుంది. అఫిడవిట్ కచ్చితం.. గోకార్టింగ్ పోటీల్లో రైడర్ల పాత్ర కీలకం. కానీ రైడర్‌గా మారాలంటే విద్యార్థి తల్లిదండ్రులు, కళాశాల సిబ్బంది నుంచి అఫిడవిట్‌ను సమర్పించాల్సిందే. గోకార్టింగ్ తో వచ్చే అవకాశాలు గోకార్టింగ్ పోటీల్లో పాల్గొనే అవకాశం రావడమే విద్యార్థుల విజయానికి తొలిమెట్టు లాంటిది. వాటి లో ప్రముఖ కోర్ కంపెనీల్లో ఉద్యోగవకాశాలు, ఆటోమొబైల్ రంగంలో సొంతంగా వ్యాపారం చేయాలనే ఆలోచన ఉన్న వారికి ప్రాథమిక ప్లాట్‌ఫామ్‌గా గోకార్టింగ్ ఉపయోగపడుతుంది. ప్రమాదమైనా ఇష్టమే.. గోకార్టింగ్ లో రైడింగ్ ప్రమాదకరమైనప్పటికీ ఎంతో ఆసక్తిగా ఉండడం వలన రైడర్‌గా మారాను. 60 ఓల్ట్స్ బ్యాటరీ సామర్థ్యంతో వాహనం తయారుచేశాం. మా కళాశాల ప్రిన్సిపాల్ కె.వీ.ఎన్.సునీత, ఫ్యాకల్టీ లు రూపత్, గోపీకృష్ణ సహకారంతో గోకార్టింగ్ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నాం. అందరి సహకారంతో ఈవీ వెహికల్ రైడ్‌లో మొదటి స్థానంలో నిలిచాం. – జననీ నాగరాజన్, రైడర్, బీవీఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాల, హైదరాబాద్. రెండు సార్లు రైడర్‌గా మొదటి స్థానం మా కళాశాల సీనియర్స్ ఇన్స్పిరేషన్తో గోకార్టింగ్ రైడర్ గా పోటీల్లో పాల్గొంటున్నాను. 150 సీసీ పల్సర్ ఇంజిన్‌తో వాహనం తయారుచేశాం. రైడర్‌గా రెండు సార్లు మొదటి స్థానంలో నిలిచాం. మాది మధ్య తరగతి కుటుంబం. మా నాన్న ఆటోడ్రైవర్, అమ్మ గృహిణి. భవిష్యత్‌లో మంచి కోర్ కంపెనీలో ఉద్యోగం సాధించడమే లక్ష్యం. – వి.సునీల్, రైడర్, రఘు ఇంజినీరింగ్ కళాశాల, విశాఖపట్టణం

అద్భుతమైన ఇంజనీరింగ్ శైలి..
కోరుట్ల: పెద్ద పెద్ద రాతి స్తంభాలు.. వాటిపై శిలాఫలకాలతో శ్లాబ్ వంటి నిర్మాణాలు. అక్కడక్కడ చిన్నచిన్న విశ్రాంతి గదులు. దుస్తులు మార్చుకునేందుకు అనువైన నిర్మాణాలు. మూడు అంతస్తుల నిర్మాణం. భూమిపై కనిపించేది కేవలం ఒక అంతస్తు మాత్రమే.. మిగిలిన రెండు అంతస్తుల నిర్మాణం భూగర్భంలోకి వెళ్లిపోయింది. క్రీ.శ. 957–1184 మధ్య కాలం నాటి శిల్పుల ఇంజనీరింగ్ శైలికి నిదర్శనంగా నిలిచిన అద్భుతమైన నిర్మాణం జగిత్యాల జిల్లాలోని కోరుట్లలో ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. జైన చాళుక్యుల కాలంలో.. క్రీ.శ. 1042–1068 వరకు వేములవాడ రాజధానిగా పరిపాలన సాగించిన జైన చాళుక్యుల కాలంలో ఈ మెట్ల బావి నిర్మించినట్లు సమాచారం. 7–10వ శతాబ్ది వరకు పరిపాలన సాగించిన కల్యాణి చాళు క్యులు, రాష్ట్రకూటుల హయాంలోనూ ఈ మెట్ల బావి (Stepwell) ఆ కాలం నాటి రాజవంశీయుల స్నానాలకు, విశ్రాంతి తీసుకోవడానికి, ఈత నేర్చుకోవడానికి వినియోగించారని చెబుతారు. ఈ మెట్ల బావిలోని రాతి స్తంభాలపై చెక్కిన తీరు అమోఘం. రాతి స్తంభాల కింది భాగంలో భూగర్భమార్గంలో రాజకోటను చేరుకోవడానికి సొరంగం వంటి మెట్ల నిర్మా ణం ఉన్నట్లుగా ప్రచారంలో ఉంది. రాజవంశీయుల కాలంలో నిషిద్ధ ప్రాంతంగా ఉన్న ఈ మెట్ల బావి ప్రస్తుతం కోరుట్ల (Korutla) మున్సిపల్ అధీనంలో ఉంది. ఎక్స్‌లెన్స్ సర్టిఫికెట్ కోరుట్లలోని మెట్ల బావిలో స్నానాలకు వచ్చే రాజవంశీయులకు దుస్తులు మార్చుకోవడానికి అనువుగా మెట్లబావి రెండవ అంతస్తులో చిన్నచిన్న గదులుండటం గమనార్హం. వీటితో పాటు విశ్రాంతి తీసుకోవడానికి మెట్ల బావి చుట్టూ రాతి స్తంభాల మీద నిలబెట్టిన శిలాఫలకాలతో పెద్ద వసారా ఉంది. మెట్ల బావి (stair well) చుట్టూ దీపాలు వెలిగించడానికి అవసరమైన చిన్నపాటి గూళ్లు ఉన్నాయి. మెట్లబావిపై భాగంలో ఉన్న మెట్లకు వెంబడి ఎడమ వైపు ఉన్న ఓ రాతిపై శిలాశాసనం (Epigraphy) ఉంది. ఈ శిలాశాసనం సంపూర్ణంగా చదవడానికి వీలు కానట్లుగా సమాచారం. ఈ మధ్య కాలంలో దెబ్బతిన్న కోరుట్ల మెట్లబావిని మున్సిపల్ ఆధ్వర్యంలో బాగు చేయించి కొత్త సొబగులద్దారు. దీంతో ఈ మెట్లబావికి ఇండి గ్లోబల్ నెట్వర్క్ నుంచి 2022–23 సంవత్సరంలో ఎక్స్‌లెన్స్ సర్టిఫికెట్ దక్కింది. చదవండి: వెండితెరపై మానుకోట

స్వర్గం భూమ్మీదకు వచ్చిందా?.. అందాల లోకం.. వారెవ్వా వనాటు
స్వర్గం ఎలా ఉంటుందో ఎవడికి తెలుసు?. ఎవరో వర్ణిస్తే కానీ ఊహించుకోవడం తప్పించి!. ఒకవేళ అది భూమ్మీద గనుక ఉంటే.. అది అచ్చం ‘వనాటు’(Vanuatu)లాగే ఉంటుందని లలిత్ మోదీ అంటున్నారు. ఐపీఎల్ సృష్టికర్త కారణంగా ఇప్పుడు ఈ దేశం పేరు తెగ వినిపించేస్తుండగా.. దాని గురించి వెతికే వాళ్ల సంఖ్యా ఒక్కసారిగా పెరిగిపోయింది.ఆర్థిక నేరగాడికి అభియోగాలు ఎదుర్కొంటున్న లలిత్ మోదీ 2010లో దేశం విడిచి లండన్ పారిపోయారు. అయితే ఆయన్ని వెనక్కి రప్పించే ప్రయత్నాలు భారత్ ముమ్మరంగా చేయగా.. ఆయన తెలివిగా వనాటు పౌరసత్వం పొందారు. అయితే ఈ విషయం తెలియడంతో ఆ దేశం ఆయన పౌరసత్వాన్ని రద్దు చేసింది. ఇది ఇక్కడితోనే ఆగలేదు. లలిత్ మోదీ పౌరసత్వాన్ని రద్దు చేసినట్లు వనాటు ప్రధాని జోథం నపాట్ స్వయంగా ప్రకటించారు. ఆ ప్రకటన వెలువడిన కాసేపటికే.. ఎక్స్ వేదికగా లలిత్ ఓ పోస్ట్ చేశారు.‘‘వనాటు ఒక అందమైన దేశం, స్వర్గంలా ఉంది. మీ పర్యటనల జాబితాలో దీన్ని చేర్చాల్సిందే’’ అని సందేశం ఉంచారు. దీంతో నెటిజన్స్ ఆయన కామెంట్ సెక్షన్లో సరదా కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వనాటు అందాల గురించి ఆరా తీస్తున్నారు.వనాటు.. ఎక్కడుంది?ఉత్తర ఆస్ట్రేలియాకు 1,750 కిలోమీటర్ల దూరంలో దక్షిణ పసిఫిక్ మహా సముద్రంలో ఉంది ఈ ద్వీప దేశం. మొత్తం 83 చిన్న చిన్న ద్వీపాల సముదాయంగా వై(Y) ఆకారంలో ఉంటుందీ దేశం. ఇందులో 65 ద్వీపాల్లో మాత్రమే ప్రజలు జీవిస్తున్నారు. ఎఫేట్ ఐల్యాండ్‌లో ఉండే పోర్టువిల్లా నగరం ఆ దేశ రాజధాని. పశ్చిమంగా ఫిజీ దేశం, ఇతర దిక్కుల్లో సాలామాన్ ద్వీపాలు, న్యూ కాలేడోనియా ఉన్నాయి. ఒకప్పుడు బ్రిటిష్ఫ్రెంచ్ సంయుక్త పాలనలో ఇది బానిస దేశంగా ఉండేది. 1980 జులై 30న వనాటు స్వాతంత్రం పొందింది. కరెన్సీ వనాటు వాటు. ప్రస్తుత జనాభా దాదాపు మూడున్నర లక్షలు. ‘‘దేవుడితో మేం నిలబడతాం’’ అనేది ఆ దేశపు నినాదం.అగ్నిపర్వతాలు.. భూకంపాల నేలఈ ద్వీప దేశంలో అగ్నిపర్వతాలు ఉన్నాయి. వీటిల్లో కొన్ని క్రియాశీలకంగా కూడా ఉన్నాయి. సంవత్సరంలో సుదీర్ఘంగా వేసవి వాతావరణంతో పొడిగా ఉంటుంది అక్కడ. అయితే నవంబర్-ఏప్రిల్ మధ్య వర్షాలు, తుపాన్లు సంభవిస్తుంటాయి. ఫసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌లో ఉండడం మూలంగా భూ కంపాలు షరామాములుగా మారాయి. అయితే కిందటి ఏడాది డిసెంబర్లో 7.3 తీవ్రతతో వచ్చిన భూకంపం ఆ దేశానికి తీవ్ర నష్టం కలిగించింది. ఈ భూకంపంలో 14 మంది చనిపోగా.. 265 మంది తీవ్రంగా గాయపడ్డారు. అందాల లోకం.. వనాటులో ఉన్న వృక్ష, జంతు సంపద అత్యంత అరుదైంది. ఈ భూమ్మీద ఎక్కడా కనిపించని జీవ జాతులు ఉన్నాయక్కడ. ఎటు చూసినా.. దట్టమైన అడవులు, జలపాతాలు, అందమైన సముద్రం.. నిర్మానుష్యమైన తీరాలు, కొన్ని ద్వీపాల్లో లాగున్లూ.. ఓ ప్రత్యేక అనుభూతిని పంచుతాయి. సహజ సౌందర్యం, జీవ వైవిధ్యం.. వనాటును ప్రపంచ పర్యాటక జాబితాలో ‘ప్యారడైజ్ ఆఫ్ ది ఎర్త్’గా నిలబెట్టాయి.టూరిజం కోసమే..టూరిజం, వ్యవసాయం ఇక్కడి ప్రజల ప్రధాన ఆదాయ వనరులు. అలాగే జనాభాలో గ్రామీణ జనాభా ఎక్కువ. 80 శాతం వ్యవసాయమే చేస్తుంటారు. కావా పంట ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతుంది. పర్యాటకం ద్వారా వచ్చే ఆదాయం ఆ దేశ జీడీపీలో 65 శాతంగా ఉంది. పర్యాటకం మీద ఆధారపడిన ప్రజలు కావడంతో.. పర్యాటకులను మర్యాదలతో ముంచెత్తారు. అలాగే.. సంప్రదాయాలకు అక్కడి ప్రజలు పెద్ద పీట వేస్తుంటారు. పెంటెకాస్ట్ ఐల్యాండ్‌లో స్థానికులు ల్యాండ్ డైవింగ్ క్రీడ నిర్వస్తుంటారు. బొంగులలాంటి నిర్మాణలను ఎత్తుగా పేర్చి.. చెట్ల తీగలతో సాయంతో బంగీ జంప్లా కిందకు దూకుతారు. ఎవరి తల భూమికి మొదట తాకితే వాళ్లు విజేతలు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు చేసే ఈ ప్రయత్నాల్లో.. పాపం ఒక్కోసారి ప్రాణాలు పొగొట్టుకుంటారు కూడా. పన్నులు లేవు, కానీ..వనాటులో ఎలాంటి పన్నులు విధించరు. ఈ కారణంగా అంతర్జాతీయ నియంత్రణ సంస్థలు ఈ దేశంపై ప్రత్యేక దృష్టి సారించాయి. అదే టైంలో.. వనాటు ఆర్థిక నేరాలకు అడ్డా కూడా. మనీలాండరింగ్‌కు సంబంధించిన చట్టాలు కూడా అక్కడ బలహీనంగా ఉండడమే ప్రధాన కారణం. ఆర్థిక నేరాలతో పాటు డ్రగ్స్.. ఆయుధాల అక్రమ రవాణాలకు ఇది అడ్డాగా మారింది. ఈ కారణంగానే పైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఈ దేశాన్ని గ్రే లిస్ట్‌లో చేర్చింది. అలాగే.. 2017లో వెలుగు చూసిన ప్యారడైజ్ పేపర్స్ లీక్.. అక్కడి అక్రమ సంపద వ్యవహారాలను బయటపెట్టింది. ఇక.. 2001 ఏప్రిల్‌లో అప్పటి ప్రధాని బరాక్ సోప్ ఫోర్జరీ కేసులో చిక్కుకున్నారు. భారత్‌కు చెందిన వ్యాపారవేత్త అమరేంద్ర నాథ్ ఘోష్‌కు వందల కోట్ల విలువ చేసే పైనాన్షియల్ గ్యారెంటీలను అనధికారికంగా కట్టబెట్టారని బరాక్‌పై అభియోగాలు వచ్చాయి. ఈ కారణంతో ఆయన అదే ఏడాది తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే.. ప్రపంచం దృష్టిలో ఏర్పడిన ఈ మచ్చని.. కఠిన చట్టాల ద్వారా తొలగించుకునే పనిలో ఉంది ఈ సుందర ద్వీప దేశం.

కెనడా తదుపరి ప్రధానిగా మార్క్ కార్నీ
టొరంటో: కెనడా సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌గా గతంలో సేవలందించిన బ్యాంకింగ్ రంగ ప్రముఖుడు మార్క్ కార్నీను కెనడా ప్రధానమంత్రి పీఠం వరించింది. ప్రస్తుత ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో రాజీనామా చేస్తానని జనవరిలో ప్రకటించిన నేపథ్యంలో పాలక లిబిరల్ పార్టీ నూతన సారథి కోసం ఎన్నికలు నిర్వహించగా కార్నీ ఘన విజయం సాధించారు. దాంతో తదుపరి ప్రధానమంత్రిగా 59 ఏళ్ల కార్నీ త్వరలో బాధ్యతల స్వీకరించనున్నారు. ట్రంప్ సారథ్యంలోని అమెరికాతో కెనడా వాణిజ్యయుద్ధానికి దిగిన వేళ కెనడా ప్రధాని పగ్గాలు కార్నీ చేపడుతుండటం గమనార్హం. ఆదివారం లిబరల్ పార్టీ సారథ్యం కోసం జరిగిన ఓటింగ్‌లో కార్నీ 1,31,674 ఓట్లు సాధించారు. మొత్తం ఓట్లలో ఏకంగా 85.9 శాతం ఓట్లు కార్నీ కొల్లగొట్టడం విశేషం. గతంలో మహిళా ఉపప్రధానిగా సేవలందించిన క్రిస్టినా ఫ్రీలాండ్ రెండోస్థానంలో సరిపెట్టుకున్నారు. ఈమెకు కేవలం 11,134 ఓట్లు పడ్డాయి. అంటే మొత్తం ఓట్లలో కేవలం 8 శాతం ఓట్లు ఈమెకు దక్కాయి. గవర్నమెంట్ హౌస్ లీడర్ కరీనా గౌల్డ్(4,785 ఓట్లు) మూడో స్థానంతో, వ్యాపా ర అనుభవం ఉన్న నేత ఫ్రాంక్ బేలిస్(4,038) నాలుగో స్థానంతో సరిపెట్టు కున్నారు. మొత్తం 1,51,000 మందికిపైగా పార్టీ సభ్యులు ఓటింగ్‌లో పాల్గొన్నారు.పదవీ స్వీకారం ఎప్పుడు ?పార్టీ ఎన్నికల్లో గెలిచినా వెంటనే కార్నీ ప్రధాని పీఠంపై కూర్చోవడం కుదరదు. ట్రూడో ప్రధానిగా రాజీనామా చేసి గవర్నర్ జనరల్‌కు సమర్పించాలి. కెనడా ఒకప్పుడు బ్రిటన్ వలసరాజ్యం కావడంతో ప్రస్తుత బ్రిటన్ రాజు కింగ్ ఛార్లెస్–3 సమ్మతితో గవర్నర్ జనరల్.. కార్నీతో నూతన ప్రధానిగా ప్రమాణంచేయిస్తారు. అయితే అక్టోబర్ 20వ తేదీలోపు కెనడాలో సాధారణ ఎన్నికలు చేపట్టాల్సిఉంది. అందుకే కార్నీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించగానే ఎన్నికలకు పిలుపిచ్చే వీలుంది.ట్రంప్‌ను నిలువరిద్దాంపార్టీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించాక వందలాది మంది మద్దతుదారులనుద్దేశించి కార్నీ ప్రసంగించారు. అమెరికా దిగు మతి టారిఫ్‌ల పెంపు అంశాన్ని ప్రస్తావించారు. ‘‘ ఇకపై ఏమాత్రం నమ్మలేని దేశం(అమెరికా) మనకు గడ్డు పరిస్థితు లను తీసుకొచ్చింది. అయినాసరే మనం ఈ పరిస్థితిని దీటుగా ఎదుర్కోగలం. అమెరికా దిగుమతి టారిఫ్‌లకు దీటుగా మనం కూడా టారిఫ్‌లు విధిస్తాం. మమ్మల్ని అమెరికా గౌరవించేదాకా ఇవి కొనసాగుతాయి. అమెరికన్లు మా సహ జవనరులు, భూములు, నీళ్లు, ఏకంగా మా దేశాన్నే కోరుకుంటున్నారు. ఏ రూపంలోనూ కెనడా ఎప్పటికీ అమెరికాలో భాగం కాబోదు. ట్రంప్ గెలవకుండా నిలువరిద్దాం’’ అని వందలాది మంది మద్దతుదారులను ద్దేశించి కార్నీ ప్రసంగించారు.బ్యాంకర్ పొలిటీషియన్కెనడా, బ్రిటన్‌లోని సెంట్రల్ బ్యాంక్‌లకు సారథ్యం వహించి అపార బ్యాంకింగ్ అనుభవం గడించిన మార్క్ కార్నీ ఇప్పుడు కెనడా ప్రధానిగా కొత్త పాత్ర పోషించనున్నారు. బ్యాంక్ ఆఫ్ కెనడా గవర్నర్ హోదాలో 2008లో ఆర్థిక సంక్షోభం నుంచి కెనడాను గట్టెక్కేలాచేసి శెభాష్ అనిపించుకున్నారు. వలసలు, అధికమైన ఆహార, ఇళ్ల ధరలతో ప్రస్తుతం కెనడా సతమవుతున్న వేళ ట్రంప్ టారిఫ్ యుద్ధానికి తెరలేప డంతో కార్నీ తన బ్యాంకింగ్ అనుభవాన్ని పరిపాలనా దక్షతగా మార్చాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.హార్వర్డ్‌లో ఉన్నత విద్య: 1965 మార్చి 16వ తేదీన వాయవ్య కెనడాలోని ఫోర్ట్‌స్మిత్ పట్టణంలో కార్నీ జన్మించారు. తర్వాత ఆల్బెర్టా రాష్ట్రంలోని ఎడ్మోంటెన్‌లో పెరిగారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో 1988లో ఉన్నతవిద్య పూర్తిచేశారు. ఈయనకు ఐస్ హాకీ అంటే చాలా ఇష్టం. కాలేజీ రోజుల్లో ఐస్హాకీ బాగా ఆడేవారు. తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆర్థికశాస్త్రంలో పీహెచ్డీ సాధించారు. బ్రిటన్‌కు చెందిన ఆర్థికవేత్త డయానా ఫాక్స్‌ను పెళ్లాడారు. వీళ్లకు నలుగురు కుమార్తెలు. కెనడా పౌరసత్వంతోపాటు ఈయనకు ఐరిష్, బ్రిటిష్ పౌరసత్వం కూడా ఉంది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌కు గవర్నర్‌గా పనిచేసినకాలంలో తొలిసారిగా బ్రిటన్ పాస్‌పోర్ట్ సంపాదించారు. గోల్డ్‌మ్యాన్ శాక్స్‌లో దశాబ్దానికిపైగా పనిచేశారు. లండన్, టోక్యో, న్యూయార్క్, టొరంటోలో పనిచేశారు. తర్వాత 2003లో బ్యాంక్ ఆఫ్ కెనడాలో డిప్యూటీ గవర్నర్‌గా పనిచేశారు.3 శతాబ్దాల్లో తొలిసారిగా: 2013 నుంచి ఏడేళ్లపాటు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ గవర్నర్‌గా సేవలందించారు. 1694లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌ను స్థాపించగా గత 300 సంవత్సరాల్లో ఆ బ్యాంక్‌కు గవర్నర్‌గా ఎన్నికైన తొలి బ్రిటీషేతర వ్యక్తిగా 2013లో కార్నీ చరిత్ర సృష్టించారు. బ్రెగ్జిట్ వేళ బ్రిటన్ ఆర్థికసంక్షోభంలో కూరుకుపోకుండా బ్యాంకర్‌గా కార్నీ సమర్థవంత పాత్ర పోషించారు. 2020లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌ను వీడాక ఐక్యరాజ్యసమితిలో వాతావరణ మార్పులు, ఆర్థిక అంశాలపై ప్రత్యేక దౌత్యవేత్తగా సేవలందించారు. – సాక్షి, నేషనల్ డెస్క్
కాంగ్రెస్‌ను ప్రశ్నించిన రేవతి అరెస్ట్.. రేవంత్‌పై కేటీఆర్ సీరియస్
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
శ్రీలంకను చిత్తు చేసిన శిఖర ధవన్ సేన
ఎస్బీఐ యూపీఐ సేవల్లో అంతరాయం
భారత్ గెలుపు వేళ అభిమానులపై దాడి.. నిందితులకు పోలీసుల వింత శిక్ష
ఎల్లప్పుడూ ప్రజల వెంటే.. మళ్లీ అధికారంలోకి వచ్చేది మనమే: వైఎస్ జగన్
టాటా గ్రూప్ నుంచి మరో ఐపీవో
దివ్య.. పరీక్ష రాస్తే విజయమే
మహిళా వ్యాపారులకు షీట్రేడ్స్ ఇండియా హబ్
ఆమె మాట్లాడితేనే టవర్ దిగుతా
బంధువుల నుంచి ధనలాభం.. ఆర్థిక లావాదేవీలలో పురోగతి
ఇక భూ మండలం మీద పాస్‌పోర్ట్ రాదని చంద్రమండలానికి ప్లాన్ చేస్తున్నాడు!
గ్రూప్–1 పరీక్షలో నల్ల లావణ్యరెడ్డి ప్రతిభ
ఏబీ డివిలియర్స్ విధ్వంసం.. 28 బంతుల్లో సెంచరీ
CT 2025: జట్టును ప్రకటించిన ఐసీసీ.. రోహిత్‌కు దక్కని చోటు
జట్కా మటన్ అంటే ఏంటి, ఎక్కడ దొరుకుతుంది?
ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా టీమిండియా.. అల్లుడిపై మామ ప్రశంసలు
CT: ఇండియా-‘బి’ టీమ్ కూడా ఫైనల్ చేరేది: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
దళపతి విజయ్ పై పోలీసులకు ఫిర్యాదు
48 గంటల్లో 20000 బుకింగ్స్
క్రైమ్

ప్రియుడిని పెళ్లి చేసుకునేందుకు భర్తను కడతేర్చింది
అన్నానగర్: తన మరో ప్రియుడిని పెళ్లి చేసుకునేందుకు ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తనే కడతేర్చిందో మహిళ. వివరాలు.. కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన జనార్థన (22). అదే ప్రాంతానికి చెందిన ఎలన్ మేరీ(21) కాలేజీలో చదువుతున్నప్పుడే ప్రేమించుకున్నారు. పెద్దలను కాదని వీరిద్దరూ నాగై జిల్లాలోని వేలంగన్నికి వచ్చి మాతా గుడిలో పెళ్లి చేసుకుని లాడ్జిలో ఉంటున్నారు. అయితే ఆదివారం జనార్థన వేలంగన్ని రైల్వే స్టేషన్ సమీపంలో శవమై వెలుగులోకి రావడం కలకలం రేపింది. అయితే జనార్థన, మేరీతో కలిసి ఉంటున్న ఇద్దరు వ్యక్తులు రైలులో తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని పట్టుకుని విచారణ చేశారు. వారు బెంగళూరు శివమొగ్గ ప్రాంతానికి చెందిన సుబ్రమణ్య కుమారుడు జీవన్ (19), 15 ఏళ్ల బాలుడు అని తేలింది. జనార్థనను పక్కా ప్లాన్ చేసి కడతేర్చారని తేలింది. ఎలన్‌మేరీ ఓ వైపు జనార్థన ప్రేమిస్తూనే, మరోవైపు జీవన్‌తో కూడా ప్రేమాయణం వెలగబెడుతున్నట్టు వెల్లడైంది. తమకు అడ్డుగా ఉన్న జనార్థనను కడతేర్చాలని ఎలన్ మేరి, జీవన్ వ్యూహం పన్నారు. దీని ప్రకారం వేలంగన్నిలో జనార్థనను వివాహం చేసుకున్న ఎలన్ మేరి, తన ప్రియుడు జీవన్‌తో కలిసి అతడిని హత్య చేసింది. వాస్తవానికి ఆమెకు రెండేళ్ల క్రితమే ధర్మపురిలో వివాహమైంది. ఆ తర్వాత జనార్థనను ప్రేమించి రెండో పెళ్లి చేసుకుని, ఆ తర్వాత జీవన్‌ను పెళ్లిచేసుకునేందుకు హత్యకు స్కెచ్ వేసింది. ఈ హత్యకు సంబంధించి ఎలన్ మేరి, జీవన్‌తోపాటు 15 ఏళ్ల బాలుడిని పోలీసులు అరెస్టు చేశారు.

కోతిని తుపాకీతో కాల్చి వండి తినేశారు!
సేలం(తమిళనాడు): కోతిని(monkey) నాటు తుపాకీతో కాల్చి వండి తిన్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు..దిండుగల్ జిల్లా వీరసిన్నంపట్టి ప్రాంతానికి చెందిన రాజారాంకు అదే ప్రాంతంలో మామిడి, కొబ్బరి తో ఉంది. కోతకు వచ్చిన మామిడి కాయలను ఆరగిస్తూ కోతులు నష్టం కలిగించసాగాయి. దీంతో రాజారాం గ్రామానికి చెందిన జయమణికి రూ. 1000 ఇచ్చి కోతుల బెడద లేకుండా చేయాలని కోరారు. దీంతో జయమణి నాటు తుపాకీతో ఒక కోతిని కాల్చి, దాన్ని వండుకుని తిన్నట్టు తేలింది. ఇది తెలుసుకున్న సిరుమలై అటవీ శాఖ పోలీసులు రాజారాం, జయమణిలను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

అన్నం తినిపించే విషయమై గొడవ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
హైదరాబాద్: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ రాజేశ్వర్ రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నంద్యాల పట్టణానికి చెందిన సంగిరెడ్డి నర్సింహారెడ్డి (28) విష్ణుప్రియ దంపతులు మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదిత్య నగర్ కృష్ణకాలనీలో నివాసముంటున్నారు. నర్సింహారెడ్డి సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం కుమారుడికి అన్నం తినిపించే విషయమై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహానికి లోనైన నర్సింహారెడ్డి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. అతను ఎంత సేపటికీ బయటికి రాకపోవడంతో విష్ణు ప్రియ స్థానికుల సహాయంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా నరసింహారెడ్డి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. అతడిని కిందకు దింపి చూడగా అప్పటికే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న మియాపూర్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య విష్ణుప్రియ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో సాఫ్్టవేర్ ఉద్యోగి దుర్మరణం మియాపూర్: టిప్పర్ లారీని ఓవర్ టెక్ చేయబోయి స్కూటీని ఢీకొని అదుపుతప్పి బుల్లెట్ పై వెళ్తున్న సాఫ్్టవేర్ ఉద్యోగి మృతి చెందిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కడప జిల్లాకు చెందిన రోషన్(27) మూడేళ్లుగా చందానగర్‌లో స్నేహితులతో కలిసి ఉంటూ సాఫ్్టవేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి అతను బైక్‌పై చందానగర్ నుంచి మియాపూర్ వైపు వెళ్తుండగా మదీనాగూడ దీప్తీశ్రీనగర్ కాలనీ కమాన్ సమీపంలో ముందు వెళ్తున్న టిప్పర్‌ను ఓవర్ టెక్ చేసే క్రమంలో స్కూటీని ఢీనడంతో అతడి బైక్ అదుపుతప్పింది. హెల్మెట్ లేకపోవడంతో తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి, అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి తల్లి జహరాబాను ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అంగన్వాడీ టీచర్ ఆత్మహత్య
నకరికల్లు: టీడీపీ, జనసేన నాయకుల బెదిరింపులు భరించలేక ఒక అంగన్వాడీ టీచర్ ఆత్మహత్య చేసుకున్నారు. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం పాపిశెట్టిపాలేనికి చెందిన షేక్ ఫాతిమాబేగం (35) అదే గ్రామంలో 11 ఏళ్లుగా అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆమెను అంగన్వాడీ టీచర్ పోస్టు నుంచి తొలగించి, తమవారిని నియమించుకుంటామని గ్రామానికి చెందిన టీడీపీ, జనసేన నాయకులు బెదిరిస్తున్నారని ఫాతిమాబేగం కుటుంబ సభ్యులు తెలిపారు. దాదాపు 9 నెలలుగా ఆమెను బెదిరిస్తూనే ఉండటంతో తీవ్ర ఒత్తిడికి గురవుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఫాతిమాబేగాన్ని అంగన్వాడీ టీచర్ ఉద్యోగం నుంచి తొలగిస్తారని టీడీపీ, జనసేన నాయకులు ప్రచారం చేస్తుండటంతో తీవ్ర ఆందోళనకు గురైన ఆమె ఆదివారం తమ ఇంట్లోనే గడ్డిమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. వెంటనే బంధువులు నరసరావుపేటలోని ఒక ప్రైవేటు వైద్యశాలకు తీసుకువెళ్లారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందారు. ఫాతిమాబేగం భర్త సైదావలి గుంటూరులో మెకానిక్‌గా పని చేస్తున్నారు. వారికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. తన భార్య మృతిపై సైదావలి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వీడియోలు


TSPSC Group 2 results released : తెలంగాణ గ్రూప్-2 ఫలితాలు విడుదల


కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం


Amrutha Pranay: ఇన్స్టాగ్రామ్ లో పేరు మార్చిన అమృత


Hyderabad: పిల్లల్ని చంపి దంపతుల బలవన్మరణం


SLBC టన్నెల్ వద్ద 18వ రోజు కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్


తెలంగాణలో భారీ స్కామ్ కు తెరలేపారు: కేటీఆర్


కొడుకుని తలుచుకొని బోరున ఏడ్చిన ప్రణయ్ తండ్రి


నటనా రంగంలోకి అడుగు పెట్టనున్నకాంగ్రెస్ నేత జగ్గారెడ్డి


ప్రణయ్ హత్య కేసులో నల్లగొండ కోర్టు సంచలన తీర్పు


చట్టం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు!