Business
-
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:22 సమయానికి నిఫ్టీ(Nifty) 10 పాయింట్లు ఎగబాకి 22,5001కు చేరింది. సెన్సెక్స్(Sensex) 82 పాయింట్లు పెరిగి 74,183 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 103.55 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 70.04 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.27 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.75 శాతం దిగజారింది. నాస్డాక్ 0.18 శాతం నష్టపోయింది.ఇదీ చదవండి: ఎస్బీఐ యూపీఐ సేవల్లో అంతరాయంయూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల విధింపు చర్యలపై వివిధ దేశాలు ప్రతికార సుంకాలు అమలు చేస్తున్నట్లు ప్రకటిస్తున్నాయి. దాంతో యూఎస్ మార్కెట్లు ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. ఆసియా మార్కెట్లు లాభాల్లో ట్రేడవడం, అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగియడం సహా ప్రపంచ మార్కెట్ల మిశ్రమ సంకేతాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు కీలకంగా మారుతున్నాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) అమ్మకాలు కొనసాగుతుండటం భారతీయ ఈక్విటీలపై ఒత్తిడి పెంచుతోంది. ఫిబ్రవరి నెలకు భారత వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ద్రవ్యోల్బణ డేటాను ఇన్వెస్టర్లు పరిశీలించనున్నారు. ఈ నెల 14వ తేదీన హోలీ పండుగ సందర్భంగా మార్కెట్లకు సెలవు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఎస్బీఐ యూపీఐ సేవల్లో అంతరాయం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కస్టమర్లు యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్ సేవలను పొందడంలో మంగళవారం నాలుగు గంటలకు పైగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ సమస్య తలెత్తింది. సమస్యను పూర్తిగా పరిష్కరించామని బ్యాంక్ ప్రకటించింది. మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి ఈ సమస్య ఉత్పన్నమైంది. దీంతో వినియోగదార్లు చాలా మంది తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు. ‘ఎస్బీఐ యూపీఐ యాప్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యలు పరిష్కరించాం. సాయంత్రం 5 గంటల నుండి ఆటంకం లేకుండా పనిచేస్తోంది’ అని బ్యాంక్ వివరించింది.రికార్డు స్థాయిలో యూపీఐ చెల్లింపులుయూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) ఆధారిత డిజిటల్ చెల్లింపులు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి. లావాదేవీల విలువ, పరిమాణం విషయంలో 2025 ఫిబ్రవరి 1 సరికొత్త రికార్డు సృష్టించింది. ఏకంగా ఆ ఒక్కరోజే రూ.99,835 కోట్ల విలువైన లావాదేవీలు నమోదయ్యాయి. లావాదేవీల సంఖ్య 60 కోట్లు దాటింది. యూపీఐ వ్యవస్థలో ఇదే రికార్డు. గత రికార్డులు చూస్తే లావాదేవీల విలువ 2025 జనవరి 2న అత్యధికంగా రూ.94,429 కోట్లు, లావాదేవీల సంఖ్య జనవరి 10న 57.8 కోట్లు నమోదైంది. ఫిబ్రవరి 1–25 మధ్య రూ.19,60,263 కోట్ల విలువైన 1439.8 కోట్ల లావాదేవీలు జరిగాయి.ఇదీ చదవండి: టాటా గ్రూప్ నుంచి మరో ఐపీవోఅగ్రస్థానంలో ఫోన్‌పేయూపీఐ విభాగంలో ఫోన్‌పే తొలి స్థానంలో దూసుకుపోతోంది. 2025 జనవరిలో రూ.11,91,304 కోట్ల విలువైన 810 కోట్ల లావాదేవీలను సాధించింది. గూగుల్‌పే రూ.8,26,845 కోట్ల విలువైన 618 కోట్ల లావాదేవీలతో రెండవ స్థానంలో కొనసాగుతోంది. రూ.1,26,313 కోట్ల విలువైన 115 కోట్ల లావాదేవీలతో పేటీఎం మూడవ స్థానంలో నిలిచింది. లావాదేవీల విలువ పరంగా క్రెడ్, ఐసీఐసీఐ బ్యాంక్ యాప్స్, నవీ, గ్రో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ యాప్స్, అమెజాన్ పే, భీమ్ యాప్స్ తర్వాతి స్థానాల్లో పోటీపడుతున్నాయి. -
టాటా గ్రూప్ నుంచి మరో ఐపీవో
టాటా గ్రూప్ ఫైనాన్షియల్ సర్వీసుల సంస్థ టాటా క్యాపిటల్ త్వరలో పబ్లిక్ ఇష్యూకి రానుంది. అయితే ఇందుకు కంపెనీతో టాటా మోటార్స్ ఫైనాన్స్ విలీనానికి జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) అనుమతించవలసి ఉంది. తదుపరి సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసేందుకు వీలుంటుంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ఈ నెల(మార్చి) చివరికల్లా విలీనానికి ఎన్సీఎల్టీ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనున్నట్లు అంచనా. దీంతో 2 బిలియన్ డాలర్ల(రూ.17,000 కోట్లు) విలువైన ఐపీవోకు శ్రీకారం చుట్టనుంది. తద్వారా 11 బిలియన్ డాలర్ల విలువైన కంపెనీగా నిలవనున్నట్లు అంచనా. ఆర్బీఐ వద్ద అప్పర్‌లేయర్ ఎన్‌బీఎఫ్‌సీగా గుర్తింపు పొందిన టాటా క్యాపిటల్ పబ్లిక్ ఇష్యూకి ఇప్పటికే సంస్థ బోర్డు అనుమతించింది. ఐపీవోలో భాగంగా 2.3 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా ప్రస్తుత వాటాదారులు సైతం కొంతమేర ఈక్విటీని ఆఫర్ చేయనున్నారు.ఏప్రిల్‌లో ఏథర్ ఎనర్జీ ఐపీవోఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన కంపెనీ ఏథర్ ఎనర్జీ ఏప్రిల్‌లో పబ్లిక్ ఇష్యూకి వచ్చే సన్నాహాలు చేపట్టింది. ఇందుకు వీలుగా కంపెనీ తప్పనిసరిగా మార్పిడికిలోనయ్యే ఫ్రిఫరెన్స్ షేర్ల(సీసీపీఎస్)ను ఈక్విటీగా మార్పు చేస్తోంది. కంపెనీల రిజిస్టర్ (ఆర్వోసీ) సమాచార ప్రకారం 1.73 సీసీపీఎస్‌ను 24.04 కోట్ల ఈక్విటీ షేర్లుగా మార్పిడి చేసేందుకు ఏథర్ బోర్డు తాజాగా అనుమతించింది. సెబీ నిబంధనల ప్రకారం ప్రధాన ప్రాస్పెక్టస్ దాఖలు చేసే ముందుగానే సీసీపీఎస్‌ను ఈక్విటీగా మార్పిడి చేయవలసి ఉంటుంది. వెరసి 2025–26లో పబ్లిక్ ఇష్యూకి వచ్చిన తొలి కంపెనీగా ఏథర్ ఎనర్జీ నిలిచే వీలున్నట్లు మర్చంట్ బ్యాంకింగ్ వర్గాలు పేర్కొన్నాయి.ఇదీ చదవండి: పాక్ రైల్వే విస్తీర్ణం ఎంతో తెలుసా..?గతేడాది సెప్టెంబర్‌లో ఏథర్ సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. మహారాష్ట్రలో ఈవీ ద్విచక్ర వాహన తయారీ ప్లాంటు ఏర్పాటు, రుణ చెల్లింపులకుగాను నిధుల సమీకరణ చేపట్టనున్నట్లు పత్రాలలో పేర్కొంది. ఐపీవోలో భాగంగా రూ. 3,100 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 2.2 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు విక్రయానికి ఉంచనున్నారు. దీంతో ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ తదుపరి రెండో ద్విచక్ర ఈవీ కంపెనీగా స్టాక్ ఎక్ఛ్సేంజీల్లో లిస్ట్‌కానుంది. -
మహిళా వ్యాపారులకు షీట్రేడ్స్ ఇండియా హబ్
న్యూఢిల్లీ: ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తలకు సాధికారత కల్పించేందుకు, ఎగుమతుల వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్ఐఈవో మంగళవారం షీట్రేడ్స్ ఇండియా హబ్‌ను ఆవిష్కరించింది. ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ (ఐటీసీ) భాగస్వామ్యంతో ఏర్పాటైన ఈ కేంద్రానికి బ్రిటన్ ప్రభుత్వానికి చెందిన షీట్రేడ్స్ కామన్వెల్త్ప్లస్ ప్రోగ్రాం కింద నిధులు అందుతాయి.ఇదీ చదవండి: ఫ్రెంచ్ కంపెనీపై జైడస్ లైఫ్ కన్నుఇది మహిళల సారథ్యంలో ఎగుమతుల వృద్ధికి దోహదపడుతుందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిస్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) సంతోష్ కుమార్ సారంగి తెలిపారు. ఇందులో 3 లక్షల మంది మహిళా ఎంట్రప్రెన్యూర్లను ఎన్రోల్ చేయడంపై ఎఫ్ఐఈవో, ఐటీసీ దృష్టి పెట్టాలని సూచించారు. దేశవ్యాప్తంగా మహిళల ఆధ్వర్యంలోని వ్యాపారాలకు వనరులను సమకూర్చే సమగ్ర కేంద్రంగా షీట్రేడ్స్ ఇండియా హబ్ ఉంటుంది. ఇందులో సామర్థ్యాలను పెంచుకునేందుకు ఉపయోగపడే వర్క్‌షాప్‌లు, మెంటారింగ్ సెషన్లు మొదలైనవి నిర్వహిస్తారు. భారత్ ఏటా 80,000 కోట్ల డాలర్ల ఉత్పత్తులు, సర్వీసులు ఎగుమతి చేస్తోందని, వచ్చే కొన్నేళ్లలో దీన్ని 2 లక్షల కోట్ల డాలర్లకు చేర్చుకోవాలనేది లక్ష్యంగా నిర్దేశించుకుందని సారంగి చెప్పారు. -
ఫ్రెంచ్ కంపెనీపై జైడస్ లైఫ్ కన్ను
న్యూఢిల్లీ: మెడ్‌టెక్ ఫ్రెంచ్ కంపెనీ యాంప్లిట్యూడ్ సర్జికల్‌లో మెజారిటీ వాటా కొనుగోలు చేసేందుకు ప్రత్యేక చర్చలు నిర్వహిస్తున్నట్లు దేశీ హెల్త్‌కేర్ సంస్థ జైడస్ లైఫ్‌సైన్సెస్ పేర్కొంది. మెజారిటీ వాటా సొంతం చేసుకునేందుకు కంపెనీ యాజమాన్యం పీఏఐ పార్ట్నర్స్సహా రెండు మైనారిటీ వాటాదారు సంస్థలతో డీల్ కుదుర్చుకోనున్నట్లు తెలియజేసింది. వెరసి వోటింగ్ హక్కులతో 85.6% వాటా కొనుగోలుకి 25.68 కోట్ల యూరోలు (రూ.2,444 కోట్లు) వెచ్చించనున్నట్లు వెల్లడించింది. అత్యంత నాణ్యమైన లోయర్లింబ్ ఆర్థోపెడిక్ టెక్నాలజీలలో యాంప్లిట్యూడ్కు పట్టున్నట్లు పేర్కొంది. వీటిలో సమస్యాత్మకంగా మారిన జాయింట్ల రీప్లేస్మెంట్లో విని యోగించే మెడికల్ ప్రొడక్టుల డిజైన్, డెవలప్మెంట్ తదితర కార్యకలాపాలున్నట్లు తెలియజేసింది.ఇదీ చదవండి: సిబిల్ స్కోర్ అప్డేట్.. ఆర్బీఐ ఆరు నిబంధనలునిఫ్టీ కెమికల్ ఇండెక్స్ షురూకెమికల్ రంగానికీ ఎన్ఎస్ఈ ప్రాధాన్యతన్యూఢిల్లీ: స్టాక్ ఎక్ఛ్సేంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ తాజాగా కెమికల్ రంగానికి ఇండెక్స్‌ను ప్రవేశపెట్టింది. నిఫ్టీ కెమికల్స్ పేరుతో ఆవిష్కరించింది. నిఫ్టీ 500 నుంచి కెమికల్ రంగ షేర్ల పనితీరును ఇండెక్స్ ప్రతిఫలించనుంది. అనుబంధ సంస్థ ఎన్ఎస్ఈ ఇండిసెస్ ద్వారా కొత్త ఇండెక్సునకు తెరతీసింది. తాజా ఇండెక్స్ అసెట్ మేనేజర్లకు ప్రామాణికంగా నిలిచే వీలున్నట్లు ఎన్ఎస్ఈ అంచనా వేస్తోంది. ఈటీఎఫ్‌ల రూపంలో ప్యాసివ్ ఫండ్స్ ట్రాక్ చేసే రిఫరెన్స్ ఇండెక్స్‌గా ఉపయోగపడనున్నట్లు అభిప్రాయపడింది. ఆరు నెలల సగటు ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా 20 స్టాక్స్‌ను ఎంపిక చేసినట్లు పేర్కొంది. ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో ట్రేడింగ్‌కు అందుబాటులో ఉన్న షేర్లను పరిగణించింది. ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ విలువ ఆధారంగా ఒక్కో షేరుకి వెయిట్ ఉంటుందని, 33 శాతానికి మించదని ఎక్ఛ్సేంజీ వెల్లడించింది. -
హైదరాబాద్‌లో తగ్గిన ఇళ్ల విక్రయాలు.. విలువ ఎంతంటే..
న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో గతేడాది ఇళ్ల అమ్మకాల విలువ చెప్పుకోతగ్గ స్థాయిలో పడిపోయింది. 2023తో పోల్చి చూస్తే 18 శాతం తక్కువగా రూ.1.05 లక్షల కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. 2023లో విక్రయాల విలువ రూ.1.28 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. కానీ, దేశవ్యాప్తంగా టాప్ 9 ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాల విలువ 2024లో నికరంగా 12 శాతం పెరిగి రూ.6,73,000 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. రియల్ ఎస్టేట్ డేటా అనలైటిక్స్ సంస్థ ‘ప్రాప్‌ఈక్విటీ’ ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. 2023లో రూ.6,00,143 కోట్ల విలువైన ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి. ఢిల్లీలో సానుకూల పరిస్థితులు ‘‘ఢిల్లీ–ఎన్సీఆర్ మార్కెట్లో సగటు విక్రయ ధర చదరపు అడుగుకి (ఎస్ఎఫ్టీ) రూ.12,469గా ఉంది. మౌలిక వసతుల అభివృద్ధి మెరుగ్గా ఉండడం, కార్పొరేట్ కంపెనీల ప్రాతినిధ్యం పెరుగుతుండడం, విస్తృత ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రావడంతో డిమాండ్ పెరుగుతోంది’’అని ప్రాప్ ఈక్విటీ వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ జసూజ తెలిపారు. నగరాల వారీగా అమ్మకాలు.. ⇒ గురుగ్రామ్‌లో 2023లో రూ.64,314 కోట్ల ఇళ్ల విక్రయాలు జరిగితే, 2024లో రూ.1,06,739 కోట్లకు పెరిగాయి. ⇒ ఢిల్లీ–ఎన్సీఆర్ ప్రాంతంలో గతేడాది ఇళ్ల అమ్మకాలు 63 శాతం పెరిగి రూ.1,53,000 కోట్లకు చేరాయి. 2023లో అమ్మకాల విలువ రూ.94,143 కోట్లుగానే ఉంది. ⇒ ముంబై మార్కెట్లో అమ్మకాల విలువ 13 శాతం పెరిగి రూ.1.38 లక్షల కోట్లకు చేరింది. ⇒ నవీ ముంబైలోనూ 32 శాతం వృద్ధితో ఇళ్ల అమ్మకాలు రూ.25,000 కోట్లకు చేరాయి. ⇒ థానేలో 6 శాతం అధికంగా రూ.56,000 కోట్ల అమ్మకాలు 2024లో జరిగాయి. ⇒ బెంగళూరు మార్కెట్లో రూ.85,000 కోట్ల విలువైన ఇళ్ల విక్రయాలు గతేడాది జరిగాయి. అంతకుముందు ఏడాది విక్రయాలు రూ.75వేల కోట్లతో పోల్చి చూస్తే 13 శాతం పెరిగాయి. ⇒ చెన్నై మార్కెట్లో 5 శాతం వృద్ధితో ఇళ్ల విక్రయాలు రూ.20,000 కోట్లుగా ఉన్నాయి. ⇒ కోల్‌కతాలో రూ.15,000 కోట్ల అమ్మకాలు చోటుచేసుకున్నాయి. 2023లో విక్రయాలు రూ.13,000 కోట్లతో పోల్చి చూస్తే 15 శాతం వృద్ధి నమోదైంది. ⇒పుణెలో అమ్మకాల విలువ కేవలం ఒక శాతం క్షీణించి రూ.76,000 కోట్లుగా ఉంది. 2023లో ఇక్కడ రూ.77,000 కోట్ల విక్రయాలు జరిగాయి. -
పెరుగుతున్న ఫ్లైట్లు, హోటళ్ల బుకింగ్స్.. కారణం..
సాక్షి, బిజినెస్ డెస్క్ : మహా కుంభ మేళా హడావిడి ముగిసిన తర్వాత పర్యాటకానికి హోలీ పండుగ రూపంలో మరో కొత్త దన్ను దొరికింది. శుక్రవారం నాడు హోలీ కావడంతో సుదీర్ఘ వారాంతపు సెలవులొస్తున్న నేపథ్యంలో టూరిజానికి డిమాండ్ పెరిగింది. వివిధ ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీల డేటా ప్రకారం గత సీజన్‌తో పోలిస్తే ఫ్లయిట్ బుకింగ్స్ 25–30 శాతం ఎగిశాయి. అలాగే హోటల్ బుకింగ్స్ కూడా 20–30 శాతం పెరిగాయి.ఇక వీటితో పాటు ప్రయాణికులను ఆకట్టుకునేందుకు విమానయాన సంస్థ డిస్కౌంట్లు, ప్రమోషనల్ ఆఫర్లు ఇస్తున్నప్పటికీ చార్జీలు సైతం పెరిగాయి. దేశీ ప్రయాణాలకు సంబంధించి చార్జీలు సగటున 12–18 శాతం, అంతర్జాతీయ రూట్లలో చార్జీలు 8–14 శాతం పెరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి సందర్భాల్లో వీలైనంత ముందుగా ట్రావెల్ ప్రణాళికలు వేసుకోవాలంటూ కస్టమర్లకు సూచిస్తున్నట్లు వివరించాయి. లగ్జరీ హోటళ్లలో టారిఫ్‌లు జూమ్.. ఇక హోటళ్ల విషయం తీసుకుంటే, సాధారణ వీకెండ్ బుకింగ్స్‌తో పోల్చినప్పుడు లగ్జరీ, ప్రీమియం ప్రాపర్టీల్లో గదుల రేట్లు 30–40 శాతం పెరిగినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. అదే స్టాండర్డ్ హోటళ్లలో చూస్తే ధరల పెరుగుదల 15–20 శాతం మేర ఉన్నట్లు వివరించాయి. జైపూర్, ఉదయ్‌పూర్, వారణాసి, గోవా, అలీబాగ్, లోనావాలా, రిషికేష్, కూర్గ్, కేరళ వంటి డెస్టినేషన్లలో హోటల్ గదుల బుకింగ్స్ 25–30 శాతం పెరిగాయి.కుటుంబాలు, ఫ్రెండ్స్ బృందాలు ఎక్కువగా ప్రైవేట్ విల్లాలు, లగ్జరీ హోటళ్లు, ప్రీమియం రిసార్టులవైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో లగ్జరీ ప్రాపర్టీలు, ప్రైవేట్ విల్లాల బుకింగ్స్ సాధారణ వీకెండ్స్‌తో పోలిస్తే 40–50 శాతం పెరిగాయి. రాజస్థాన్, గోవాతో పాటు ప్రధాన మెట్రోలకు సమీపంలో ఉన్న హిల్ స్టేషన్లలో చాలా మటుకు ప్రీమియం, లగ్జరీ హోటల్స్ ఇప్పటికే 70–80 శాతం బుక్ అయిపోయాయి.కొన్ని రిసార్టుల్లో ఇప్పటికే ఆక్యుపెన్సీ పూర్తి స్థాయికి చేరినట్లు జోస్టెల్ సంస్థ వివరించింది. కాక్స్ అండ్ కింగ్స్ ప్రకారం జైపూర్, వారణాసి, రిషికేష్, గోవాలాంటి ప్రాంతాలకు టూర్ ప్యాకేజీలు, హోటల్ బుకింగ్స్‌కి భారీ డిమాండ్ నెలకొంది. ఇక అంతర్జాతీయంగా చూస్తే దుబాయ్, సింగపూర్, బ్యాంకాక్లాంటివి ఫేవరెట్ డెస్టినేషన్లుగా ఉంటున్నాయి. ఎయిర్‌లైన్స్ ప్రత్యేక ఆఫర్లు..హోలీ అనంతరం కూడా ప్రయాణాలకు డిమాండ్ భారీగా పడిపోకుండా విమానయాన సంస్థలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆకాశ ఎయిర్, ఇండిగో తదితర సంస్థలు పరిమిత కాలం పాటు డిస్కౌంట్లు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. పౌర విమానయాన శాఖ డేటా ప్రకారం ఫిబ్రవరి ఆఖరు వారంలో నమోదైన 5.2 లక్షల మంది రోజువారీ విమాన ప్రయాణికుల సంఖ్య మార్చి తొలి రెండు వారాల్లో సుమారు 4.8 లక్షల ప్యాసింజర్లకు పడిపోయినప్పటికీ.. వార్షికంగా చూస్తే మాత్రం మెరుగ్గానే ఉన్నట్లు తెలుస్తోంది. -
ఫ్లాటుగా ముగిసిన స్టాక్ సూచీలు
ముంబై: ఆరంభ నష్టాల నుంచి కోలుకున్న స్టాక్ సూచీలు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే 452 పాయింట్లు పతనమై సెన్సెక్స్ చివరికి 13 పాయింట్ల స్వల్ప నష్టంతో 74,102 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 38 పాయింట్లు పెరిగి 22,498 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 145 పాయింట్లు క్షీణించి 22,315 వద్ద కనిష్టాన్ని తాకింది. అమెరికా మాంద్యం భయాలతో సూచీలు ఉదయం నష్టాలతో మొదలయ్యాయి.ఇండస్ ఇండ్ బ్యాంక్ షేరు భారీ క్షీణత(27%), ప్రైవేటు బ్యాంకులు, ఐటీ షేర్లలో తలెత్తిన అమ్మకాలతో నష్టాలు మరింత అధికమయ్యాయి. అయితే అఖరిగంటలో అధిక వెయిటేజీ ఐసీఐసీఐ బ్యాంకు(2.50%), రిలయన్స్ (1%), ఎయిర్టెల్ (2%) షేర్లు రాణించడంతో సూచీలు నష్టాలు భర్తీ చేసుకోగలిగాయి. ట్రంప్ వాణిజ్య యుద్ధం ఆర్థిక మందగమనానికి దారితీయోచ్చనే ఆందోళనలతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. -
దేశంలో టెలికాం యూజర్ల సంఖ్య ఎంతో తెలుసా..
న్యూఢిల్లీ: దేశీయంగా డిసెంబర్లో మొత్తం టెలిఫోన్ సబ్‌స్క్రయిబర్స్ సంఖ్య గతంలో కంటే స్వల్పంగా పెరిగి 118.99 కోట్లకు చేరింది. నవంబర్‌లో ఇది 118.71 కోట్లుగా నమోదైంది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ఇటు మొబైల్, అటు ఫిక్స్డ్ లైన్ విభాగాల్లో జియో పెద్ద సంఖ్యలో కొత్త యూజర్లను దక్కించుకుంది. వైర్లెస్ యూజర్ల విభాగంలో, రిలయన్స్ జియోకి నికరంగా 39.06 లక్షలు, భారతి ఎయిర్‌టెల్‌కు 10.33 లక్షల మంది కొత్తగా జత కాగా వొడాఫోన్ 17.15 లక్షల మందిని కోల్పోయింది. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ వరుసగా 3.16 లక్షలు, 8.96 లక్షల మంది సబ్ర్స్కయిబర్స్ను కోల్పోయాయి. ఈ విభాగంలో ప్రైవేట్ సంస్థల మార్కెట్ వాటా 91.92 శాతంగా ఉండగా, ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ వాటా కేవలం 8.08 శాతంగా ఉంది.మరోవైపు, వైర్‌లైన్ యూజర్ల సంఖ్య నవంబర్‌లో 3.85 కోట్ల నుంచి డిసెంబర్లో 3.92 కోట్లకు చేరింది. జియోకి 6.56 లక్షల మంది, భారతి ఎయిర్‌టెల్‌కు 1.62 లక్షలు, టాటా టెలీకి 9,278 మంది యూజర్లు జతయ్యారు. బీఎస్ఎన్ఎల్ ఏకంగా 33,306 యూజర్లను, ఎంటీఎన్ఎల్ 14,054 మంది సబ్‌్రస్కయిబర్స్‌ను కోల్పోయాయి. బ్రాడ్‌బ్యాండ్ యూజర్లు 94.49 కోట్లు.. మొత్తం బ్రాడ్‌బ్యాండ్ యూజర్లు నవంబర్‌లో 94.47 కోట్లుగా ఉండగా, డిసెంబర్లో 94.49 కోట్లకు చేరింది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ సబ్‌స్క్రయిబర్స్ 47.65 కోట్లుగా, భారతి ఎయిర్టెల్ యూజర్లు 28.93 కోట్లు, వొడాఫోన్ ఐడియా 12.63 కోట్లు, భారత్ సంచార్ నిగమ్ 3.53 కోట్లు, ఎట్రియా కన్వర్జెన్స్ టెక్నాలజీస్ యూజర్లు 22.7 లక్షల మంది ఉన్నారు. బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్లో 50.43 శాతం వాటాతో జియో అగ్రస్థానంలో ఉండగా, భారతి ఎయిర్టెల్ (30.61 శాతం), వొడాఫోన్ ఐడియా (13.37 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. -
ఇండస్ఇండ్ ఇన్వెస్టర్లకు షాక్
న్యూఢిల్లీ: డెరివేటివ్స్ పోర్ట్‌ఫోలియో ఖాతాల నిర్వహణలో రూ. 2,100 కోట్లమేర అంతరం నమోదైనట్లు తాజాగా ప్రయివేట్ రంగ సంస్థ ఇండస్ఇండ్ బ్యాంక్ వెల్లడించింది. అయితే బ్యాంక్‌వద్ద తగినంత రిజర్వులు, మూలధనం ఉండటంతో కవర్ చేసుకోగలమని పేర్కొంది. అయితే యాజమాన్యం హామీ ఇచ్చినప్పటికీ ఇన్వెస్టర్లలో ఆందోళనలు తలెత్తాయి. ఫలితంగా ట్రేడింగ్ ప్రారంభంలోనే ఇండస్ఇండ్ షేరు 10% పతనమైంది. ఆపై మరింత బలహీనపడుతూ 20% సర్క్యూట్‌ను తాకింది. సర్క్యూట్ నుంచి రిలీజ్ అయ్యాక మరింత దిగజారింది. వెరసి ట్రేడింగ్ ముగిసేసరికి 27% కుప్పకూలి రూ. 657 వద్ద నిలిచింది. ఒక దశలో రూ. 649 వద్ద ఏడాది కనిష్టాన్ని తాకింది. ఏం జరిగిందంటే? ఖాతాలో వ్యత్యాసాన్ని గతేడాది(2024) సెప్టెంబరు– అక్టోబర్‌లో గుర్తించినట్లు ఇండస్ఇండ్ బ్యాంక్ సీఈవో, ఎండీ సుమంత్ కథ్పాలియా పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రాథమిక సమాచారాన్ని ఆర్బీఐకు గత వారమే నివేదించినట్లు తెలియజేశారు. అయితే తుది వివరాలు బయటి ఏజెన్సీతో చేయిస్తున్న ఆడిట్ ద్వారా వెల్లడికానున్నట్లు పేర్కొన్నారు. నివేదిక ఏప్రిల్ మొదట్లో వెలువడనున్నట్లు తెలియజేశారు. లాభదాయకత, మూలధన పటిష్టత నేపథ్యంలో ఈ ప్రభావాన్ని బ్యాంక్ సర్దుబాటు చేసుకోగలదన్నారు. 2024 ఏప్రిల్1కు ముందు 5–7ఏళ్లుగా డెరివేటివ్ పోర్ట్‌ఫోలియో ఖాతాలో తేడా నమోదవుతూ వచ్చిందని చెప్పారు. ఎక్స్ఛేంజీలకు సమాచారం...డెరివేటివ్స్ పోర్ట్‌ఫోలియోలో కొన్ని అంతరాలున్నట్లు సోమవారం ఇండస్ఇండ్ బ్యాంక్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు నివేదించింది. వీటి వల్ల బ్యాంక్ నెట్‌వర్త్‌పై 2.35 శాతంమేర ప్రతికూల ప్రభావం పడే వీలున్నట్లు పేర్కొంది. అంతర్గత సమీక్ష ద్వారా ఈ అంశాన్ని గుర్తించినట్లు వెల్లడించింది. వీటిని స్వతంత్రంగా సమీక్షించి నిర్ధారించేందుకు బయటి ఏజెన్సీని ఎంపిక చేసినట్లు తెలిపింది.కాగా.. ట్రెజరీ బిజినెస్‌లో గుర్తించిన వ్యత్యాసం అంతర్గత, చట్టబద్ధ, ఆర్బీఐ ఆడిట్లలో బయటపడకపోవడం గమనార్హం! 2024 ఏప్రిల్ 1నుంచి డెరివేటివ్స్‌లో ఇంటర్నల్ ట్రేడ్‌ను నిలిపివేస్తూ 2023 సెప్టెంబరులో జారీ అయిన ఆర్బీఐ సర్క్యులర్ కారణంగా అంతర్గత బుక్‌పై సమీక్షకు తెరతీసినట్లు సుమంత్ వెల్లడించారు. దీంతో బయటి ఆడిట్‌కు ఆదేశించినట్లు తెలియజేశారు. అయితే బ్యాంక్ ఎండీ, సీఈవోగా తిరిగి ఎంపిక చేయడంలో ఆర్బీఐపై ఈ అంశంప్రభావం చూపి ఉండవచ్చని పేర్కొన్నారు. బ్యాంక్ బోర్డు మూడేళ్ల కాలానికి ప్రతిపాదించగా.. గత వారం ఆర్బీఐ ఏడాది కాలానికే సుమంత్ బాధ్యతల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.రూ. 19,000 కోట్లు ఆవిరి...షేరు భారీ పతనంతో ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే ఇండస్ఇండ్ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)కు ఒక్కరోజులోనే రూ. 19,000 కోట్లమేర చిల్లుపడింది. ఈ నెల 10న నమోదైన రూ. 70,150 కోట్ల నుంచి బ్యాంక్ మార్కెట్ విలువ తాజాగా రూ. 51,168 కోట్లకు క్షీణించింది. బ్యాంక్ షేరు 2018 ఆగస్ట్‌లో రూ. 2038 వద్ద చరిత్రాత్మక గరిష్టానికి చేరింది. గతేడాది అంటే 2024 ఏప్రిల్ 8న రూ. 1,576 వద్ద నమోదైన గరిష్టం నుంచి తాజాగా 52 వారాల కనిష్టం రూ. 649ను తాకింది. వెరసి 59 శాతం పతనమైంది. ఫండ్స్ లబోదిబో ఇది ఇండెక్స్ షేరు కావడంతో 2025 ఫిబ్రవరికల్లా 35 మ్యూచువల్ ఫండ్స్ 360 పథకాల ద్వారా ఇండస్ఇండ్ బ్యాంక్‌లో ఇన్వెస్ట్ చేశాయి. 20.88 కోట్ల షేర్లను కలిగి ఉన్నాయి. ఈ హోల్డింగ్స్ విలువ రూ. 20,670 కోట్లు కాగా.. షేరు తాజా పతనంలో రూ. 6,970 కోట్లు ఆవిరైంది. దీంతో హోల్డింగ్స్ విలువ రూ. 13,700 కోట్లకు పరిమితమైంది. ఇక ప్యాసివ్ ఫండ్స్ సైతం బ్యాంక్ షేర్ల పతనంతో ప్రభావితమైనట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. -
సిబిల్ స్కోర్ అప్డేట్.. ఆర్బీఐ ఆరు నిబంధనలు
ఆర్థిక అవసరాలు నిత్యం పెరుగుతున్నాయి. వాటిని తీర్చుకునేందుకు చాలామంది రుణాలు తీసుకుంటున్నారు. ఆర్థిక సంస్థలు రుణాలపై విధించే వడ్డీరేట్లు కూడా భారీగా ఉన్నాయి. మంచి క్రెడిట్ స్కోరు సొంతం చేసుకుంటే తక్కువ వడ్డీకే రుణాలు పొందే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల ఆర్బీఐ కస్టమర్ల రుణ ప్రక్రియను సులభతరం చేయడానికి కొన్ని నిబంధనలు జారీ చేసింది. ఆర్బీఐ విడుదల చేసిన ఈ ఆరు నిబంధనలు వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉండనున్నాయి.సిబిల్ స్కోర్ అప్డేషన్లో మార్పులుఆర్బీఐ జారీ చేసిన నిబంధనల ప్రకారం క్రెడిట్ స్కోర్ 30 రోజులకు బదులుగా ప్రతి 15 రోజులకు అప్డేట్ అవుతుంది. ఈ నిబంధనలు 2025 జనవరి 1 నుంచే అమల్లోకి వచ్చాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ క్రెడిట్ స్కోర్‌ను వీలైనంత త్వరగా అప్డేట్ చేసుకోవాలని ఆర్బీఐ బ్యాంకులకు సూచించింది. దీనితో పాటు క్రెడిట్ సంస్థలు ప్రతి నెలా కస్టమర్ క్రెడిట్ సమాచారాన్ని సీఐసీ(చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్)కి తెలియజేయాలి.తనిఖీ చేస్తే సమాచారంబ్యాంకు లేదా ఎన్బీఎఫ్సీ ఖాతాదారుల క్రెడిట్ రిపోర్టును తనిఖీ చేసినప్పుడల్లా ఆయా సమాచారాన్ని కస్టమర్లకు పంపాలని ఆర్బీఐ అన్ని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు తెలిపింది. నిబంధనల ప్రకారం ఈ సమాచారాన్ని కస్టమర్లకు పంపడానికి ఎస్ఎంఎస్ లేదా ఇమెయిల్ ఉపయోగించవచ్చు.అభ్యర్థన తిరస్కరణకు కారణాన్ని తెలిపేలా..ఖాతాదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కస్టమర్ అభ్యర్థనలను బ్యాంకులు తిరస్కరించినట్లయితే దానికిగల కారణాన్ని వారికి చెప్పాలి. తద్వారా వినియోగదారులు వారి అభ్యర్థన ఎందుకు తిరస్కరించబడిందో తెలుసుకోవచ్చని, వారు దాన్ని సకాలంలో మెరుగుపరచవచ్చని ఆర్బీఐ తెలిపింది.ఉచిత క్రెడిట్ రిపోర్టులునిబంధనల ప్రకారం కస్టమర్లు తమ క్రెడిట్ హిస్టరీని సరిగ్గా తెలుసుకునేందుకు వీలుగా ఏడాదికి ఒకసారి క్రెడిట్ కంపెనీలకు ఉచితంగా పూర్తి క్రెడిట్ స్కోర్లను అందించాలి. ఇందుకోసం క్రెడిట్ కంపెనీలు తమ వెబ్సైట్లో ప్రత్యేకంగా లింక్‌ను డిస్ప్లే చేయాలి.నోడల్ అధికారి నియామకంఏదైనా బ్యాంక్ కస్టమర్‌ను డిఫాల్ట్‌గా ప్రకటించబోతున్నట్లయితే అంతకుముందు ఆర్థిక సంస్థలు ఆ విషయాన్ని సదరు వ్యక్తికి సమాచారం అందించాలి. ఇందుకోసం రుణాలు ఇచ్చిన సంస్థలు ఎస్ఎంఎస్/ ఈ-మెయిల్ ద్వారా ఖాతాదారులకు సమాచారాన్ని చేరవేయాలి. దీనితో పాటు బ్యాంకు లేదా రుణం ఇచ్చిన సంస్థలు నోడల్ అధికారిని (నోడల్ ఆఫీసర్) నియమించాలి. ఖాతాదారుల క్రెడిట్ స్కోర్‌కు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ఈ నోడల్ అధికారి పనిచేస్తారు.ఇదీ చదవండి: పాక్ రైల్వే విస్తీర్ణం ఎంతో తెలుసా..?త్వరితగతిన ఫిర్యాదుల పరిష్కారంఖాతాదారులకు ఏవైనా సమస్యలు ఉంటే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీకి ఫిర్యాదు చేయవచ్చు. ఈ కంపెనీలు 30 రోజుల్లోగా వినియోగదారుల సమస్యలను పరిష్కరించకపోతే రోజుకు రూ.100 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. -
పాక్ రైల్వే విస్తీర్ణం ఎంతో తెలుసా..?
భారత్‌కు దాయాది దేశంగా ఉన్న పాకిస్థాన్‌లో బెలూచిస్థాన్ వేర్పాటు వాదులు తాజాగా తీవ్ర కార్యకలాపాలకు పాల్పడ్డారు. పాకిస్థాన్‌కు చెందిన పాక్ జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను (Jaffar Express) తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సుమారు 100కి పైగా ప్రయాణికులను బంధించారు. ఈ చర్యలను ప్రతిఘటించిన ఆరుగురు పాకిస్థాన్ జవాన్లను హతమార్చారు. పాకిస్తాన్ రైల్వే దేశవ్యాప్తంగా ముఖ్యమైన రవాణా సాధనంగా పనిచేస్తోంది. దీని విస్తృతమైన నెట్వర్క్ మారుమూల ప్రాంతాలను అనుసంధానించడంలో, వాణిజ్యాన్ని సులభతరం చేయడంలో, పర్యాటకానికి మద్దతుగా నిలవడంతో తోడ్పడుతుంది. అసలే అంతంతమాత్రంగా ఉన్న పాకిస్థాన్ ఎకనామీకి ఇలాంటి ఘటనలు కోలుకోలేని దెబ్బగా మారే ప్రమాదముందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.భారత్‌తో పోలిస్తే చాలా తక్కువ..పాకిస్థాన్‌లో 1861లో కరాచీ నుంచి కోత్రి మధ్య మొదటి రైల్వే లైన్ ప్రారంభమైంది. బ్రిటిష్ వలసరాజ్య కాలంలో నార్త్ వెస్ట్రన్ స్టేట్ రైల్వేగా స్థాపించిన ఈ రైల్వే 1947లో భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత పాకిస్థాన్ రైల్వేగా మారింది. కాలక్రమేణా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలు, పట్టణాలను కలుపుతూ నెట్‌వర్క్‌ను విస్తరించింది. ప్రస్తుతం పాకిస్థాన్ రైల్వే సుమారు 7,789 కిలోమీటర్ల మేరకు విస్తరించింది. ఇది భారతరైల్వే విస్తరించిన సుమారు 68,000 కిలోమీటర్ల ట్రాక్‌తో పోలిస్తే చాలా తక్కువ. పాక్ రైల్వే కేవలం 479 స్టేషన్లను కవర్ చేస్తుంది. ఈ నెట్వర్క్ ప్యాసింజర్, సరుకు రవాణా సేవలకు కీలకంగా మారింది.చైనా-పాక్ మధ్య ఎంఎల్-1 ప్రాజెక్ట్ఇటీవలి కాలంలో పాకిస్థాన్ రైల్వే సేవలను పెంచడానికి ఆధునీకరణ కార్యక్రమాలను ప్రారంభించింది. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా మెయిన్ లైన్ 1 (ఎంఎల్-1) వంటి ప్రధాన రైల్వే మార్గాలు ఏర్పాటు చేస్తుంది. ఇది కరాచీ, లాహోర్, పెషావర్ వంటి పట్టణ కేంద్రాలను కలుపుతుంది. ఎంఎల్-1 అప్‌గ్రేడేషన్ వంటి ప్రాజెక్టులు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, రైలు వేగాన్ని పెంచడం, రైల్వే సామర్థ్యాన్ని విస్తరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా కరాచీ నుంచి చైనాలోని పెషావర్ వరకు 1,726 కిలోమీటర్ల రైల్వే లైన్‌ను ఏర్పాటు చేయనున్నారు. క్రమంగా భవిష్యత్తులో ట్రాక్‌ను రెట్టింపు చేయడం, రైలు వేగాన్ని గంటకు 160 కిలోమీటర్లకు పెంచడం వంటివి ప్రాజెక్ట్ లక్ష్యాల్లో కీలకంగా ఉన్నాయి.ఈ ప్రాజెక్ట్ ఎందుకోసం అంటే..సరుకులు, ప్రయాణీకుల రవాణాను సులభతరం చేయడం ద్వారా ఈ ప్రాజెక్ట్ వాణిజ్యాన్ని పెంచుతుందని నమ్ముతున్నారు. ఇతర దేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షిస్తుందని, నిర్మాణ సమయంలో, తర్వాత కాలంలో కూడా వందలాది ఉద్యోగాలను సృష్టిస్తుందని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థలు, డబుల్ ట్రాక్‌లు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇవి ఆపరేషనల్ భద్రతను మెరుగుపరుస్తాయని, ప్రమాదాలను తగ్గిస్తాయని అంచనా వేస్తున్నారు. రోడ్డు రవాణా కంటే రైలు మార్గాలను ప్రోత్సహించడం ద్వారా ఈ ప్రాజెక్ట్ ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తూ, కర్బన ఉద్గారాలను నియంత్రిస్తుందని చెబుతున్నారు.ఇదీ చదవండి: ‘పెట్టుబడుల కంటే ప్రధానమైనవి ఇవే..’సవాళ్లు ఇవే..ఈ ప్రాజెక్ట్‌కు ప్రాముఖ్యత ఉన్నప్పటికీ పాకిస్థాన్ రైల్వే కాలం చెల్లిన మౌలిక సదుపాయాలతో నెట్టుకొస్తోంది. దేశంలో సరైన భద్రత లేకపోవడంతో తాజాగా జరిగిన ట్రెయిన్ హైజాక్ వంటి ఘటనలు పునరావృత్తమైతే ఆర్థిక వ్యవస్థపై, దేశ సమగ్రతపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇప్పటికే బెలుచిస్థాన్‌లో వేర్పాటు వాదులు పాకిస్థాన్‌కు పక్కలో బళ్లెంలాగా పరిణమిస్తున్నారు. దేశంలో ఇప్పటికే ఆర్థిక పరిస్థితి తీవ్రరూపం దాల్చినట్లు నివేదికలు వెల్లడవుతున్నాయి. చైనా-భారత్ మధ్య చెలరేగుతున్న భౌగోళిక అనిశ్చితుల నేపథ్యంలో భారత్‌కు శత్రు దేశమైన పాకిస్థాన్‌తో చెలిమి చేస్తే భవిష్యత్తులో ఆసరాగా ఉంటుందని చైనా నమ్ముతుంది. దాంతో పాక్ ప్రాజెక్ట్‌ల్లో చైనా పెట్టుబడి పెడుతోంది. పాక్ పెద్దలు ఈ విషయాన్ని గ్రహించినా అక్కడి ఆర్థిక పరిమితులకు లోబడి చైనాతో చెలిమి చేయక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.‘కేసీఆర్’ ప్రాజెక్టుభారత్లో ఐఆర్సీటీసీ మాదిరిగానే పాకిస్థాన్‌లో ఆన్లైన్ టికెట్ బుకింగ్, లైవ్ ట్రైన్ ట్రాకింగ్, డిజిటల్ పేమెంట్స్, రియల్ టైమ్ అప్డేట్స్ అందించే ‘రబితా అప్లికేషన్’ను అక్కడి రైల్వే ప్రవేశపెట్టింది. కరాచీలోని పట్టణ రవాణా వ్యవస్థను పునరుద్ధరించడానికి, ఆధునీకరించడానికి కరాచీ సర్క్యులర్ రైల్వే (కేసీఆర్) ప్రాజెక్టును ప్రారంభించారు. ఇది ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, నగరవాసులకు రైలు సేవలను చేరువ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. -
‘పెట్టుబడుల కంటే ప్రధానమైనవి ఇవే..’ కామత్ సూచన
పర్సనల్ ఫైనాన్స్(Personal Finance) ప్రణాళికలు మెరుగ్గా ఉంటే భవిష్యత్తులో ఆర్థిక స్వతంత్రం సాధించవచ్చని అనుకుంటారు. దాన్ని సాధించేందుకు చాలామంది స్టాక్‌మార్కెట్ లేదా ఇతర పెట్టుబడి మార్గాలవైపు మొగ్గు చూపుతారు. కానీ జెరోధా స్టాక్ బ్రోకింగ్ కంపెనీ వ్యవస్థాపకుడు నితిన్ కామత్(Nitin Kamat) మాత్రం పర్సనల్ ఫైనాన్స్ కంటే ముఖ్యమైన అంశాలపై పెట్టుబడిదారులు దృష్టి సారించాలని సూచించారు. ఇటీవల కామత్ తన బ్లాగ్‌లో స్పందిస్తూ పర్సనల్ ఫైనాన్స్ కంటే ప్రతిఒక ఇన్వెస్టర్ తప్పకుండా తెలుసుకోవాల్సిన అంశాలేంటో తెలియజేశారు.‘మీరు చేసే పెట్టుబడులు దీర్ఘకాలంలో మంచి రాబడులు అందించే అవకాశం ఉంటుంది. అందుకోసం చాలామంది స్టాక్ మార్కెట్లు, ఇతర మార్గాలను ఎంచుకుంటున్నారు. కానీ కుటుంబంలో మీపై ఆదారపడినవారు ఉంటే ముందుగా మీరు పెట్టుబడుల కంటే జీవిత బీమాకే తీసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అదే మీ గొప్ప పెట్టుబడి ఆలోచనవుతుంది. మీ కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడం మీ ప్రాథమిక బాధ్యత. అది చాలా అవసరం కూడా’ అని కామత్ రాశారు.ఇదీ చదవండి: ఒకే వాహనం.. 14 కెమెరాలు, 9 రాడార్లు, 6 సెన్సార్లు‘మారుతున్న జీవన ప్రమాణాలు, ఆహార అలవాట్ల దృష్ట్యా మనుషుల ఆరోగ్య సంరక్షణ ఖర్చులు పెరుగుతూ, ఆయుర్దాయం తగ్గుతోంది. ఊహించని వైద్య ఖర్చులను నిర్వహించేలా తగినంత ఆరోగ్య బీమాను ఎంచుకోండి. మీపై ఆధారపడిన వారి ఆర్థిక అవసరాలకు అనుగుణంగా మంచి టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. మారుతున్న జీవన పరిస్థితులకు అనుగుణంగా కవరేజీని క్రమానుగతంగా పునఃసమీక్షించాలి. ఈ చర్యలు మీ కుటుంబానికి ఆర్థిక కష్టాల నుంచి కాపాడటమే కాకుండా మనశాంతిని అందిస్తాయి. ఫలితంగా పెట్టుబడిదారులు ఆత్మవిశ్వాసంతో తమ ఆర్థిక లక్ష్యాలను కొనసాగించడానికి ఈ విధానాలు వీలు కల్పిస్తాయి’ అని తెలిపారు.దీర్ఘకాలిక దృక్పథంతో పెట్టుబడులుమార్కెట్ కరెక్షన్ల సమయంలో క్రమానుగత పెట్టుబడి విధానం(సిప్)లను ఆపవద్దని కామత్ ఇన్వెస్టర్లకు సూచించారు. ‘మార్కెట్ క్షీణత భయపెట్టవచ్చు, కానీ అవి దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలను అందిస్తాయి’ అని తెలిపారు. క్రమశిక్షణతో ఉండటం, సిప్ కంట్రిబ్యూషన్లను నిర్వహించడం ద్వారా పెట్టుబడిదారులు దీర్ఘకాలంలో మంచి రాబడులు పొందవచ్చు. పెట్టుబడి పెట్టడానికి కంటే ముందుకు ప్రతిఒక్కరు విధిగా జీవిత, ఆరోగ్య బీమాలు తీసుకోవాలని కామత్ కోరారు. -
భారత్‌లో స్టార్‌లింక్.. ఎలాన్ మస్క్‌తో ఎయిర్టెల్ డీల్
ఢిల్లీ : ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ శుభవార్త చెప్పింది. తన వినియోగదారులకు హైస్పీడ్ ఇంటర్నెట్ను అందించేందుకు అపరకుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. స్పేస్ఎక్స్కు చెందిన స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని భారత్‌లో ఎయిర్టెల్ కస్టమర్లకు అందించనున్నట్లు ఎయిర్టెల్ ప్రెస్‌నోట్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా ఎయిటెల్ మేనేజింగ్ డైరెక్టర్, వైస్ ఛైర్మన్ గోపాల్ మిట్టల్ మాట్లాడుతూ.. భారత్‌లో ఎయిర్టెల్ కస్టమర్లకు శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందించేందుకు స్పేఎక్స్‌తో పనిచేయడం ఓ మైలురాయి. ముఖ్యంగా కస్టమర్లకు శాటిలైట్ ఇంటర్నెట్ను అందించేందుకు సంస్థ కట్టుబడి ఉంది. ఎయిర్టెల్, స్పేస్ఎక్స్ ఒప్పందంలో భాగంగా ఎయిర్టెల్ రిటైల్ స్టోర్లలో స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని పొందేందుకు అవసరమయ్యే ఎక్విప్మెంట్ పొందవచ్చు. దీంతో పాటు భారత్‌లో మారుమూల ప్రాంతాల్లో పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, తదితర వాటిని కనెక్ట్ చేసేందుకు ఈ డీల్ ఉపయోగపడనుందని తెలిపారు. ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా స్టార్‌లింక్ పేరుతో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందిస్తోంది. దీంతో పాటు మొబైల్ బ్రాడ్ బ్యాండ్‌ను అందించే లక్ష్యంతో పనిచేస్తోంది. తద్వారా యూజర్లు స్ట్రీమింగ్, వీడియో కాల్స్, ఆన్లైన్ గేమింగ్, రిమోట్ వర్కింగ్ కార్యకలాపాలు సులభతరం కానున్నాయి. ఇప్పుడే ఈ సంస్థతో ఎయిర్టెల్ ఒప్పందం కుదుర్చుకుంది. -
ఒకే వాహనం.. 14 కెమెరాలు, 9 రాడార్లు, 6 సెన్సార్లు
ప్రపంచం ఆటోమేషన్ వైపు వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రధానంగా ఆటోమోటివ్ విభాగంలో ఈ ఆటోమేషన్ పాత్ర కీలకంగా మారింది. ప్రస్తుతం స్వయంచాలిత డ్రైవింగ్‌కు ఆదరణ పెరుగుతోంది. దాంతో చాలా కంపెనీలు ఈ మేరకు కొత్త సాంకేతికతను వినియోగిస్తూ వాటిని పరీక్షిస్తున్నాయి. అందులో భాగంగా సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల విభాగంలో జపాన్ ఆటోమోటివ్ దిగ్గజం నిస్సాన్ సంస్థ దూసుకుపోతోంది. ఇటీవల జపాన్‌లోని యోకోహమాలోని రద్దీగా ఉన్న వీధుల్లో అత్యాధునిక అటానమస్ వ్యవస్థ కలిగిన సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను పరీక్షించింది.అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన సెరెనా మినీవ్యాన్‌ను యోకోహమా వీధుల్లో పరుగు పెట్టించింది. ఈ వాహనంలో 14 కెమెరాలు, 9 రాడార్లు, 6 లైడార్ సెన్సార్లను వాడారు. ఇవి అధిక రద్దీ ఉంటే రోడ్లపై సులువుగా ప్రయాణించేందుకు దోహదం చేస్తాయని నిర్వాహకులు తెలిపారు. మెరుగైన అటానమస్ వ్యవస్థ ఉండడంతో స్వయంగా వేగ పరిమితులను నిర్ధారించుకుంటుందని చెప్పారు. ట్రాఫిక్‌ను, అడ్డంకులను తప్పించుకుంటు ముందుకు సాగుతాయని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఒకేరోజు 27 శాతం కుప్పకూలిన బ్యాంకు స్టాక్..జపాన్‌లో వృద్ధుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ కార్లు భవిష్యత్తులో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. రానున్న రోజుల్లో డ్రైవర్ల కొరత అధికమవుతుందని, అలాంటి వారికి కంపెనీ చేస్తున్న ఇలాంటి ఆవిష్కరణలు ఎంతో దోహదం చేస్తాయని చెప్పారు. సెరెనా ప్రస్తుతం లెవల్ 2 స్వయంప్రతిపత్తితో(అటానమీ వ్యవస్థ-పాక్షికంగా ఆపరేట్ చేయడానికి మానవుల అవసరం ఉండడం) పనిచేస్తుండగా.. 2029 నాటికి లెవల్ 4 స్వయంప్రతిపత్తి(మానవ ప్రయేయంలేని)ని సాధించాలని నిస్సాన్ లక్ష్యంగా పెట్టుకుంది. -
ఒకేరోజు 27 శాతం కుప్పకూలిన బ్యాంకు స్టాక్.. కారణం..
దేశీయ ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒకటైన ఇండస్ ఇండ్ బ్యాంక్ షేరు ధర మంగళవారం ఒక్కరోజే సుమారు 27 శాతం కుప్పుకూలింది. నిన్నటి సెషన్లో షేరు ధర రూ.900.5 ముగింపు నుంచి ఈ రోజు ముగింపు సమయానికి రూ.655 వద్దకు చేరింది. బ్యాంకు ఎదుర్కొంటున్న సవాళ్లపై సీఈఓ సుమంత్ కత్పాలియా మాట్లాడుతూ ప్రస్తుతం బ్యాంకుకు ఇది ‘లిట్మస్ టెస్ట్’గా అభివర్ణించారు. బ్యాంకు పాలన, నాయకత్వంపై ప్రశ్నలు లేవనెత్తిన కీలక పరిణామాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.కత్పాలియా పదవీకాలాన్ని మూడేళ్ల పాటు పొడిగించాలని బోర్డు సిఫారసు చేసినప్పటికీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఒక సంవత్సరం వరకు మాత్రమే తన పదవీకాలం పొడిగింపును ఆమోదించింది. తన నాయకత్వ నైపుణ్యాల గురించి ఆర్బీఐకి ఆందోళనలు ఉండవచ్చునని కత్పాలియా అన్నారు. ఏదేమైనా ఆర్బీఐ నిర్ణయాన్ని గౌరవిస్తానని చెప్పారు. ఈ వ్యాఖ్యలు బ్యాంకు షేర్ ధర పడిపోవడానికి కారణమైనట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సీఈఓ స్థాయి వ్యక్తే ఇలా తన సామర్థ్యాలను అంగీకరించడంపట్ల ఇన్వెస్టర్లలో ఆందోళన వ్యక్తం అయినట్లు తెలిపారు.ఇదీ చదవండి: ఆన్లైన్ మోసాల కట్టడికి వినూత్న విధానంఅంతర్గత ఆడిట్లో బ్యాంక్ డెరివేటివ్స్ పోర్ట్‌ఫోలియోలో వ్యత్యాసాలున్నట్లు గుర్తించారు. ఇది డిసెంబర్ 2024 నాటికి ఉన్న లెక్కల ప్రకారం బ్యాంకు నికర విలువలో సుమారు 2.35% అంటే సుమారు రూ.1530 కోట్లుగా ఉన్నట్లు తేల్చారు. ఈ వ్యత్యాసాలపై స్వతంత్ర సమీక్ష నిర్వహించడానికి ఇండస్ ఇండ్ బ్యాంక్ బాహ్య ఆడిటర్‌ను నియమించింది. బ్యాంక్ వృద్ధి ఎజెండా చెక్కుచెదరకుండా ఉందని, ఈ సవాళ్లను పారదర్శకంగా పరిష్కరించడానికి నాయకత్వ బృందం కట్టుబడి ఉందని కత్పాలియా వాటాదారులకు హామీ ఇచ్చారు. -
తీవ్ర ఒడిదొడుకులు.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం తీవ్ర ఒడిదొడుకుల మధ్య లాభాల్లో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 37 పాయింట్లు లాభపడి 22,497 వద్దకు చేరింది. సెన్సెక్స్ 12 పాయింట్లు దిగజారి 74,102 వద్దకు చేరింది. ఇటీవల భారీగా పడి క్రమంగా పంజుకుంటున్న మార్కెట్లు సోమవారం తీవ్ర ఒడిదొడుకులకు గురయ్యాయి. ప్రధానంగా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు పతనమయ్యాయి.సెన్సెక్స్ 30 సూచీలో సన్ ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, మారుతీ సుజుకీ, టైటాన్, ఎల్ అండ్ టీ, రిలయన్స్, ఎన్టీపీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐటీసీ, నెస్లే, ఎస్బీఐ, టాటా మోటార్స్ స్టాక్‌లు లాభాల్లో ముగిశాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్సర్వ్, ఎం అండ్ ఎం, జొమాటో, హెచ్‌యూఎల్, పవర్‌గ్రిడ్ స్టాక్‌లు భారీగా నష్టపోయాయి.ఇదీ చదవండి: ఆన్లైన్ మోసాల కట్టడికి వినూత్న విధానంమార్కెట్ ఒడిదొడుకులకు కారణాలు..ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రతికూలంగా ప్రభావితం చేశాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐ) విచ్చలవిడిగా అమ్మకాలు జరుపుతుండడంతో భారత మార్కెట్ల నుంచి ఇతర ప్రాంతాలకు నిధులు తరలిపోతున్నాయి. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ స్టాక్‌ల వాల్యుయేషన్ ఆందోళనల వల్ల ఆయా సెగ్మెంట్లు తీవ్ర దిద్దుబాట్లకు లోనయ్యాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఆన్లైన్ మోసాల కట్టడికి వినూత్న విధానం
ప్రముఖ టెలికాం ఆపరేటర్లలో ఒకటైన ఎయిర్టెల్ తన కస్టమర్లను ఆన్లైన్ మోసాల నుంచి రక్షించేందుకు ప్రయత్నాలు చేపట్టింది. పెరుగుతున్న ఆన్లైన్ మోసాలు, ఫిషింగ్ స్కామ్(పాస్వర్డ్లు, క్రెడిట్ కార్డ్ నంబర్లు లేదా వ్యక్తిగత వివరాలు వంటి సున్నితమైన సమాచారాన్ని బహిర్గతం చేయడానికి హ్యాకర్లు ఉపయోగించే ఒక రకమైన సైబర్ క్రైమ్) నుంచి కంపెనీకి చెందిన 38 కోట్ల మంది సబ్‌స్కైబర్లకు మెరుగైన భద్రత అందించేందుకు కొత్త సాంకేతికతను అమలు చేయనున్నట్లు కంపెనీ అధికారులు తెలిపారు.కొత్త టెక్నాలజీ అమలు సుమారు 80 శాతం పూర్తయిందని కంపెనీ తెలిపింది. ఈ ప్రతిష్టాత్మక చర్యల వల్ల వన్ టైమ్ పాస్‌వర్డ్‌ల(ఓటీపీ) దుర్వినియోగాన్ని నిరోధించడం, హానికరమైన లింక్‌లను కట్టడి చేయడంపై దృష్టి సారించినట్లు పేర్కొంది. అధునాతన కృత్రిమ మేధ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్‌లను ఉపయోగించడం ద్వారా ఎయిర్టెల్ తన వినియోగదారులకు సురక్షితమైన డిజిటల్ వాతావరణాన్ని సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ టెక్నాలజీ వల్ల రియల్ టైమ్‌లో కస్టమర్లకు వచ్చే మోసపూరిత కాల్స్, స్కామ్ మెసేజ్‌లను గుర్తించి వాటిని అరికడుతుంది. దాంతో వినియోగదారులు ఆన్లైన్ మోసానికి గురవుతామనే భయం లేకుండా కమ్యూనికేట్ చేయడానికి, ఆన్లైన్లో ఆర్థిక లావాదేవీలు నిర్వహించడానికి వీలవుతుందని సంస్థ పేర్కొంది.పరిష్కారం పరిమితంగానే..ఈ టెక్నాలజీ పరిష్కారం పరిధి ప్రస్తుతం ఎస్ఎంఎస్, కాల్ ఆధారిత మోసాలకు మాత్రమే పరిమితమైంది. ఎన్క్రిప్షన్ ప్రోటోకాల్స్ కారణంగా వాట్సాప్, టెలిగ్రామ్ వంటి ఓవర్-ది-టాప్ (ఓటీటీ) కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి ఉత్పన్నమయ్యే స్పామ్, మోసాలకు ఈ సాంకేతికత పరిష్కరించదని అధికారులు స్పష్టం చేశారు. సైబర్ నేరగాళ్లు ఈ మోసాలపై అవగాహనలేని వినియోగదారులను లక్ష్యంగా చేసుకోవడానికి ఈ ఎన్క్రిప్టెడ్ ప్లాట్‌ఫామ్‌లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కొన్ని టెక్నికల్ కారణాలవల్ల డిజిటల్ మోసాలు పెరుగుతున్న అంశాన్ని ప్రస్తావిస్తూ ఎయిర్టెల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు రక్షణ కల్పించేందుకు రెగ్యులేటరీ జోక్యం చేసుకోవాలని తెలిపింది. ఓటీటీ కమ్యూనికేషన్ సేవలను రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ కిందకు తీసుకురావాలని ప్రభుత్వాన్ని, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)ను కోరింది. ఓటీటీ యూజర్లకు నో యువర్ కస్టమర్ (కేవైసీ) వెరిఫికేషన్ తప్పనిసరి చేయడం, ఈ ప్లాట్‌ఫామ్‌లను సెంట్రలైజ్డ్ స్పామ్ డిటెక్షన్ సిస్టమ్స్‌లోకి ఇంటిగ్రేషన్ చేయడం వంటివి ఇందులో ఉన్నాయి.ఇదీ చదవండి: యాపిల్ సాఫ్ట్వేర్ రీడిజైనింగ్.. కీలక మార్పులు ఇవేనా?ఏకీకృత విధానం అవసరం..డిజిటల్ మోసాలకు వ్యతిరేకంగా సమగ్ర వ్యూహాన్ని రూపొందించడానికి టెలికాం ఆపరేటర్లు, రెగ్యులేటర్లు, టెక్నాలజీ ప్రొవైడర్లతో సహా వాటాదారుల మధ్య సహకారం అవరసమని నిపుణులు సూచిస్తున్నారు. ఎయిర్టెల్ తన ప్రయత్నాలతో ఆన్లైన్ మోసాలను కట్టడి చేసేందుకు ముందడుగు వేసినప్పటికీ, ఓటీటీ ద్వారా ఉత్పన్నమయ్యే మోసాలపై పోరాటానికి, అన్ని కమ్యూనికేషన్ ఛానళ్లను రక్షించడానికి ఏకీకృత విధానం అవసరమని చెబుతున్నారు. -
యాపిల్ సాఫ్ట్వేర్ రీడిజైనింగ్.. కీలక మార్పులు ఇవేనా?
ప్రపంచవ్యాప్తంగా యాపిల్ ఉత్పత్తులకు ఎంత గిరాకీ ఉంటుందో తెలుసుకదా. ప్రత్యేకమైన యాపిల్ సాఫ్ట్వేర్ కోసమే చాలామంది వినియోగదారులు కంపెనీ ఉత్పత్తులను కొనుగోలు చేస్తూంటారు. దాంతోపాటు డిజైనింగ్, ఆర్ అండ్ డీ(పరిశోధన, అభివృద్ధి) విభాగం నిత్యం అందిస్తున్న అప్డేట్లకు ఫిదా అవుతుంటారు. ఉత్పత్తుల విషయంలో ఇన్నోవేషన్, డిజైనింగ్‌లో ప్రసిద్ధి చెందిన యాపిల్ ఇంక్ చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన సాఫ్ట్వేర్ మార్పులకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది చివర్లో ఈ సాఫ్ట్వేర్ రీడిజైనింగ్ ప్రారంభకానున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మార్పులు దాని ఫ్లాగ్షిప్ పరికరాలైన ఐఫోన్, ఐప్యాడ్, మాక్బుక్ల్లో వినియోగదారుల అనుభవాన్ని ఏకీకృతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.మార్పులు ఇవేనా..రాబోయే యాపిల్ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు ఆపరేటింగ్ సిస్టమ్‌కు ఏకీకృత డిజైన్‌ను తీసుకువస్తుందని నమ్ముతున్నారు. మాక్ఓఎస్, ఐఓఎస్, ఐప్యాడ్ఓఎస్ మధ్య ఫంక్షనల్ అంతరాలను ఈ మార్పులు భర్తీ చేయనున్నాయని కంపెనీ పేర్కొంది. గత ఏడాది లాంచ్ చేసిన యాపిల్ విజన్ ప్రో మిక్స్డ్ రియాలిటీ హెడ్సెట్ సాఫ్ట్వేర్ నుంచి స్ఫూర్తి పొంది ఈ కొత్త ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పింది. రీడిజైన్‌లో భాగంగా కొన్ని ఐకాన్లు, మెనూలు, అప్లికేషన్లు, సిస్టమ్ బటన్లలో కూడా మార్పులు ఉంటాయని అధికారులు తెలిపారు. ఇది భవిష్యత్తులో మరింత క్రమబద్ధమైన, సహజమైన యూజర్ ఇంటర్ఫేస్ను అందిస్తుందని చెబుతున్నారు.ఇదీ చదవండి: హోలీ గేట్‌వే సేల్.. రూ.1,199కే విమాన ప్రయాణం!వ్యూహాత్మక లక్ష్యాలుసంస్థ ఆదాయ వృద్ధి మందకొడిగా ఉన్న నేపథ్యంలో వినియోగదారుల ఆసక్తిని పునరుద్ధరించేందుకు యాపిల్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. యాపిల్‌కు ఈ రీడిజైనింగ్ కీలకంగా మారనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కంపెనీ ప్రాథమిక ఆదాయ వనరుగా ఉన్న ఐఫోన్ అమ్మకాలు గత హాలిడే సీజన్లో భారీగా తగ్గిపోయాయి. అద్భుతమైన ఇంటర్ఫేస్ను ప్రవేశపెట్టడం ద్వారా తిరిగి యాపిల్ ఉత్పత్తుల అమ్మకాలు పెంచేలా కంపెనీ చర్యలు చేపట్టింది. టెక్నాలజీ ఆవిష్కరణలో తన స్థానాన్ని అగ్రగామిగా సుస్థిరం చేసుకోవాలని యాపిల్ భావిస్తోంది. ఐఓఎస్ 19, ఐప్యాడ్ ఓఎస్ 19, మాక్ ఓఎస్ 16ల్లో భాగమైన సాఫ్ట్వేర్ అప్డేట్లను జూన్‌లో జరిగే యాపిల్ వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్‌లో ఆవిష్కరించనున్నారు. -
మూడేళ్ళలో.. రెండు లక్షల మంది కొన్న కారు ఇది
అతి తక్కువ కాలంలోనే అధిక ప్రజాదరణ పొందిన కియా కారెన్స్ (Kia Carens) అమ్మకాల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది. దాని విభాగంలో అత్యంత వేగంగా అమ్ముడవుతున్న వాహనాలలో ఒకటిగా అవతరించిన ఈ కారు.. ప్రీమియం ఫీచర్స్, కొత్త డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది.కియా ఇండియా.. కారెన్స్ కారును లాంచ్ చేసినప్పటి నుంచి, అంటే 36 నెలల్లో ఏకంగా 2,00,000 అమ్మకాల మైలురాయిని దాటేసింది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. దేశీయ మార్కెట్లో మాత్రమే కాకుండా.. కంపెనీ 70 కంటే ఎక్కువ దేశాల్లో 24064 యూనిట్ల కారెన్స్ కార్లను విక్రయించిందని స్పష్టం చేసింది.మొత్తం అమ్మకాలలో కారెన్స్ పెట్రోల్ వేరియంట్లు 58 శాతం వాటాను కలిగి ఉండగా, 42 శాతం కస్టమర్లు డీజిల్ వెర్షన్‌ను ఎంచుకున్నారు. 32% కొనుగోలుదారులు ఆటోమేటిక్, iMT ట్రాన్స్మిషన్లను ఎంచుకుంటున్నారు. 28 శాతం మంది కస్టమర్లు సన్‌రూఫ్‌తో కూడిన వేరియంట్లను ఎంచుకున్నారు.ఇదీ చదవండి: 48 గంటల్లో 20000 బుకింగ్స్.. మొదటి 50వేల మందికి..కియా కారెన్స్ ధరలు ఇండియన్ మార్కెట్లో రూ. 12.92 లక్షల నుంచి రూ. 19.95 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ఈ కారు మల్టిపుల్ వేరియంట్లలో, వివిధ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. కాబట్టి ఎక్కువమంది దీనిని కొనుగోలు చేయడానికి ఎగబడుతుంటారు.నెలవారీ (ఫిబ్రవరి) అమ్మకాల్లో సోనెట్ (7,598 యూనిట్లు), సెల్టోస్ (6,446 యూనిట్లు) మంచి వృద్ధిని సాధించాయి. కారెన్స్ గత నెలలో 5318 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. కంపెనీ మొత్తం సేల్స్.. 2024 ఫిబ్రవరి కంటే 23.8 శాతం ఎక్కువ. దీన్నిబట్టి చూస్తుంటే.. కియా కార్లకు ఇండియన్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని స్పష్టమవుతోంది. -
15 నిమిషాల్లో అంబులెన్స్: జెంజో సంస్థ కీలక నిర్ణయం
ముంబై: ఎమర్జెన్సీ సేవల సంస్థ జెంజో దేశవ్యాప్తంగా 450 నగరాల్లో 25,000 ప్రైవేట్ అంబులెన్స్‌లను ప్రవేశపెట్టింది. 15 నిమిషాల్లోపే స్పందించే విధంగా ఈ నెట్వర్క్ ఉంటుందని సంస్థ తెలిపింది. ఎమర్జెన్సీ సర్వీసులు, ప్రథమ చికిత్స, సీపీఆర్ ట్రైనింగ్ మొదలైన వాటిపై అవగాహన పెంచేందుకు జొమాటోతో పాటు ఇతరత్రా డెలివరీ ప్లాట్‌ఫాంలు, ఈకామర్స్ సంస్థలతో చేతులు కలిపినట్లు వివరించింది.దీని టోల్ ఫ్రీ నంబరు 1800 102 1298గా ఉంటుంది. 5 కి.మీ. పరిధికి బేసిక్ అంబులెన్స్ చార్జీలు రూ. 1,500గా ఉంటాయి. ఆ తర్వాత ప్రతి కిలోమీటరుకు అదనంగా రూ. 50 చెల్లించాలి. కార్డియాక్ అంబులెన్స్కైతే 5 కి.మీ.కు రూ. 2,500, ఆ తర్వాత నుంచి ప్రతి కిలోమీటరుకు రూ. 100 చార్జీలు వర్తిస్తాయి. రాబోయే రోజుల్లో డిమాండ్‌ను బట్టి మరిన్ని నగరాల్లో మరిన్ని అంబులెన్స్‌లను జోడిస్తామని సంస్థ సహ వ్యవస్థాపకురాలు శ్వేతా మంగళ్ తెలిపారు. -
ఇక యూపీఐ, రూపే లావాదేవీలపై ఛార్జీలు..
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI), రూపే డెబిట్ కార్డుల ద్వారా నిర్వహించే లావాదేవీలపై మర్చెంట్ ఫీజులను తిరిగి తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. ఈ మేరకు బ్యాంకింగ్ సమాఖ్య పంపిన ప్రతిపాదనలకు కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.ప్రస్తుతం ఈ లావాదేవీలపైన ఎటువంటి అదనపు ఛార్జీలు లేవు. అయితే వార్షిక ఆదాయం రూ. 40 లక్షల కంటే ఎక్కువ ఉన్న వ్యాపారుల యూపీఐ చెల్లింపుల మీద 'మర్చెంట్ డిస్కౌంట్ రేట్' (MDR)ను మళ్ళీ తీసుకురావాలని ప్రతిపాదిస్తూ బ్యాంకింగ్ ఇండస్ట్రీ ప్రతినిధులు కేంద్రానికి పంపించారు. దీనిపై కేంద్రం కూడా సానుకూలంగా స్పందించడంతో.. ఇది త్వరలోనే అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే వీసా కార్డు, మాస్టర్ కార్డు వంటి డెబిట్ కార్డులు.. క్రెడిట్ కార్డుల లావాదేవీలపై మర్చెంట్ డిస్కౌంట్ రేట్ చెల్లిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వారు యూపీఐ, రూపే డెబిట్ కార్డుల లావాదేవీలపై కూడా ఛార్జీలు ఎందుకు చెల్లించకూడదు?. ఈ విషయాన్ని కేంద్రం అలోచించి సానుకూలంగా స్పందించింది. అయితే వార్షిక ఆదాయం రూ. 40 లక్షల కంటే తక్కువ ఉన్నవారు ఈ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడంలో భాగంగా.. ప్రభుత్వం 2022 బడ్జెట్లో ఎండీఆర్ చార్జీలను తొలగిస్తున్నట్లు వెల్లడించారు. అప్పటి వరకు వ్యాపారుల లావాదేవీ మొత్తంలో ఒక శాతం కంటే తక్కువ ఛార్జీ వసూలు చేసేవారు. తరువాత ఈ ప్రాసెసింగ్ ఖర్చులను భర్తీ చేయడానికి బ్యాంకులు, ఫిన్‌టెక్ కంపెనీలకు కేంద్రం సబ్సిడీలు ఇస్తూ వచ్చింది. అయితే ఈ సబ్సిడీ కూడా ఈ ఏడాది రూ. 3,500 కోట్ల నుంచి రూ. 437 కోట్లకు తగ్గింది. ఇప్పుడు మళ్ళీ ఛార్జీలు వసూలు చేయడానికి కేంద్రం గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేసింది.ఇదీ చదవండి: దిగొచ్చిన బంగారం.. మరోసారి తగ్గిన రేటుఇటీవల కొత్తగా నియమితులైన ఆర్బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రాతో జరిగిన సమావేశంలో ఫిన్‌టెక్ అధికారులు డిజిటల్ చెల్లింపులపై ఎండీఆర్ అంశాన్ని లేవనెత్తారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) డేటా ప్రకారం, ఫిబ్రవరి 2025లో యూపీఐ లావాదేవీల మొత్తం 16.11 బిలియన్ డాలర్లు అని తెలుస్తోంది. -
పోర్ట్‌ఫోలియోలో వైవిధ్యానికి మొమెంటం ఇన్వెస్టింగ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టాక్స్‌కి సంబంధించి నిర్దిష్ట లక్షణాల ప్రాతిపదికన పెట్టుబడులు పెట్టే ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్లో భాగంగా ముమెంటం ఇన్వెస్టింగ్‌కి గణనీయంగా ప్రాచుర్యం పెరుగుతోందని టాటా అసెట్ మేనేజ్మెంట్ హెడ్ (ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్) ఆనంద్ వరదరాజన్ తెలిపారు.డిమాండ్ దృష్ట్యా ఎన్ఎస్ఈ ప్రస్తుతం దాదాపు 31 ఫ్యాక్టర్ ఆధారిత సూచీలను అందిస్తోందని వివరించారు. ధరపరంగా బలమైన ట్రెండ్‌ను ప్రదర్శిస్తున్న స్టాక్స్‌ను గుర్తించి, క్రమశిక్షణతో పెట్టుబడులు పెట్టడం ద్వారా అధిక రాబడులను అందించడంపై ముమెంటం ఇన్వెస్టింగ్ ప్రధానంగా దృష్టి పెడుతుందని తెలిపారు. దీర్ఘకాలికంగా మెరుగైన రాబడులను అందుకునేందుకు, పోర్ట్‌ఫోలియోలో వైవిధ్యాన్ని పాటించేందుకు ఇన్వెస్టర్లు కొంత భాగాన్ని ఈ వ్యూహానికి కేటాయించే అవకాశాన్ని పరిశీలించవచ్చని వరదరాజన్ చెప్పారు. గత కొన్నాళ్లుగా మార్కెట్లు కరెక్షన్కు లోను కావడంతో పాటు ఒడిదుడుకులమయంగా ఉంటున్నప్పటికీ నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 ముమెంటం 50 ఇండెక్స్‌ను ట్రాక్ చేసే ఇండెక్స్ ఫండ్స్ మాత్రం మెరుగ్గా రాణిస్తున్నాయని పేర్కొన్నారు. తమ టాటా నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 ముమెంటం 50 ఇండెక్స్ ఫండ్‌లోకి గతేడాది పెట్టుబడులు మూడింతలై సుమారు రూ. 500 కోట్లకు చేరడం వీటిపై పెరుగుతున్న ఆకర్షణకు నిదర్శనమని వరదరాజన్ తెలిపారు. -
దిగొచ్చిన బంగారం: మరోసారి తగ్గిన రేటు
పడుతూ.. లేస్తూ ఉన్న బంగారం ధరలు మళ్ళీ తగ్గుదల దిశగా అడుగులు వేసాయి. నేడు (మార్చి 11) గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 330 పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ ప్రాంతంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలను తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 80,200 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 87,490 వద్ద నిలిచాయి. నిన్న స్వల్పంగా పెరిగిన గోల్డ్ రేటు.. ఈ రోజు రూ. 300 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 330 (24 క్యారెట్స్ 10గ్రా) తగ్గింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 300, రూ. 330 తగ్గింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 80,200 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 87,490 వద్ద ఉంది.ఇదీ చదవండి: దుబాయ్ నుంచి ఎంత బంగారం తీసుకురావచ్చు?దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 80,350 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 87,640 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 300, రూ. 330 తక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు గరిష్టంగా రూ.1000 తగ్గింది. దీంతో ఈ రోజు (మార్చి 11) కేజీ సిల్వర్ రేటు రూ. 1,07,000 చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకేవిధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 98,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు.. మంగళవారం ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 423.38 పాయింట్లు లేదా 0.57 శాతం నష్టంతో 73,691.79 వద్ద, నిఫ్టీ 112.85 పాయింట్లు లేదా 0.50 శాతం నష్టంతో 22,347.45 వద్ద కొనసాగుతున్నాయి.టాప్ గెయినర్స్ జాబితాలో.. నీతిరాజ్ ఇంజనీర్స్, హెడ్స్ అప్ వెంచర్స్, ఎల్సీసీ ఇన్ఫోటెక్, ఆస్ట్రాన్ పేపర్ బోర్డ్ మిల్ లిమిటెడ్ వంటి కంపెనీలు చేరాగా.. ఐఓఎల్ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఆకాష్ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్, సద్భావ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, జ్యోతి సీఎన్సీ ఆటోమేషన్ వంటివి నష్టాలలో కొనసాగుతున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మస్క్ పతనం మొదలైందా?: లక్షల కోట్లు ఆవిరి
టెస్లా, స్పేస్ఎక్స్, ఎక్స్ (ట్విటర్) వంటి సంస్థలను విజయవంతంగా ముందుకు నడిపిస్తున్న ఎలాన్ మస్క్ సంపద భారీగా ఆవిరవుతోంది. ఇటీవల తన నికర విలువలో 120 బిలియన్ డాలర్లు (రూ. 10లక్షల కోట్ల కంటే ఎక్కువ) తగ్గింది. అయితే.. 330 బిలియన్ డాలర్ల సంపదతో, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్నప్పటికీ.. 2025 ప్రారంభం నుంచి సంపదలో 25 శాతం క్షీణతను పొందారు. ఇది ఇలాగే కొనసాగితే.. నెం.1 స్థానానికే ముప్పు ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.మస్క్ తరువాత స్థానంలో అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ (Jeff Bezos), ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) ఉన్నారు. మస్క్ సంపద ఇలాగే తగ్గుతూ పోతే.. ప్రపంచ కుబేరుడి స్థానాన్ని మరొకరు స్వాధీనం చేసుకుంటారు.మస్క్ సంపద తగ్గడానికి కారణంమస్క్ సంపద తగ్గడానికి ప్రధాన కారణం టెస్లా (Tesla) అని తెలుస్తోంది. ఈ ఎలక్ట్రిక్ కార్ కంపెనీ అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉండటం వల్ల.. టెస్లా అమ్మకాలు 2024 డిసెంబర్ నుంచి 2025 జనవరి వరకు 16 శాతం తగ్గాయి. అంతే కాకుండా గత రెండు నెలల్లో, టెస్లా షేర్ ధర దాదాపు 35% తగ్గింది. దీంతో మస్క్ సంపద గణనీయంగా తగ్గింది.ఇదీ చదవండి: ఎక్స్‌పై సైబర్ ఎటాక్ ఆ దేశం పనే!మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసే సంస్థలు కూడా పెరిగాయి. దీంతో చాలామంది కొత్త కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపారు. దెబ్బకు టెస్లా ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు పడిపోయాయి. అమ్మకాల్లో ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వాల్సి వచ్చింది. కాగా టెస్లా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు తెలుస్తోంది.రాజకీయ ప్రమేయంప్రపంచ కుబేరుడు, దిగ్గజ వ్యాపారవేత్త మస్క్ సంపద తగ్గడానికి మరో కారణం.. పెరుగుతున్న రాజకీయ ప్రమేయం అని తెలుస్తోంది. ట్రంప్ ఎన్నికల ప్రచారానికి మస్క్ భారీగా ఖర్చు చేశారు. దీంతో అమెరికా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత.. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ (DOGE) అధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తరువాత కొంతమంది పెట్టుబడిదారులతో భయం మొదలైంది. ఇది కూడా మస్క్ కంపెనీ షేర్స్ తగ్గడానికి కారణమైంది. -
ఎక్స్‌పై సైబర్ ఎటాక్ ఆ దేశం పనే!
ఎలాన్ మస్క్ (Elon Musk) సారథ్యంలోని ఎక్స్(ట్విటర్)లో అంతరాయం ఏర్పడింది. ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ప్రపంచవ్యాప్తంగా పలుమార్లు డౌన్ అయింది. ఈ విషయాన్ని మస్క్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.ఎక్స్ సైబర్ దాడిని ఎదుర్కొంటోందని.. హ్యాకర్లను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామని ట్వీట్ చేశారు. దీని వెనుక ఒక పెద్ద సమూహం లేదా ఒక దేశం హస్తం ఉండొచ్చు అని మస్క్ తెలిపారు. ఉక్రెయిన్ ప్రాంతంలోని ఐపీ చిరునామాల నుంచి సైబర్ దాడి జరిగిందని అన్నారు. ఈ కారణంగానే రోజంతా అంతరాయం ఏర్పడిందని అన్నారు.డౌన్‌డెటెక్టర్ ప్రకారం.. ఎక్స్ ప్లాట్‌ఫామ్ రోజంతా మూడు అంతరాయాలను ఎదుర్కొంది. మధ్యాహ్నం 3:00 గంటలకు ఈ అంతరాయాలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. భారతదేశం నుంచి దాదాపు 2000 మంది, యునైటెడ్ స్టేట్స్ నుంచి 18,000 మంది, యునైటెడ్ కింగ్డమ్ నుంచి 10,000 మంది ఎక్స్ యాప్‌ను యాక్సెస్ చేయలేకపోయినట్లు స్పష్టం చేసింది. రాత్రి 9 గంటలకు కూడా ఈ అంతరాయాలు కొనసాగాయి.ట్రాకింగ్ వెబ్సైట్ దాదాపు 52 శాతం సమస్యలు వెబ్‌సైట్‌కు సంబంధించినవని, 41 శాతం యాప్‌కు సంబంధించినవని, 8 శాతం సర్వర్ కనెక్షన్ సమస్యలతో సంబంధం కలిగి ఉన్నాయని చూపించింది. ఇప్పుడు కూడా అంతరాయం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.ఎలాన్ మస్క్ 2022లో 44 బిలియన్ డాలర్లకు (రూ. 3 లక్షల కోట్ల కంటే ఎక్కువ) Xని కొనుగోలు చేశారు. 2023లో అతని ఫాలోవర్స్ సంఖ్య 200 మిలియన్స్ దాటేసింది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్స్ ఉన్న మొదటి వ్యక్తిగా రికార్డ్ క్రియేట్ చేశారు. -
అమెరికా సుంకాలు: ఆ రంగంపైనే అధిక ప్రభావం..
న్యూఢిల్లీ: అమెరికా ప్రతికార సుంకాలు విధిస్తే.. అప్పుడు భారత ఫార్మా రంగంపై అధిక ప్రభావం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అధిక టారిఫ్‌లతో అమెరికాలో భారత ఫార్మా ఉత్పత్తుల ఖరీదు, ఇతర దేశాలతో పోల్చితే పెరిగిపోతుందంటున్నారు. అదే సమయంలో భారత ఆటోమొబైల్ కంపెనీలపై సుంకాల ప్రభావం చాలా పరిమితంగానే ఉంటుందంటూ.. అమెరికాకు ఆటో ఎగుమతులు చాలా తక్కువగా ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.అమెరికా ఉత్పత్తులపై భారీ సుంకాలు మోపుతున్న భారత్‌పై ఏప్రిల్ 2 నుంచి తాము కూడా అదే స్థాయిలో ప్రతిసుంకాలు అమలు చేస్తామని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అదే పనిగా ప్రకటిస్తుండడం గమనార్హం. ప్రస్తుతం అమెరికా నుంచి దిగుమతి అవుతున్న ఔషధాలపై భారత్ 10 శాతం సుంకం అమలు చేస్తోంది. భారత్ నుంచి వచ్చే ఉత్పత్తులపై అమెరికా ఎలాంటి సుంకాలు వసూలు చేయడం లేదు.చరిత్రను గమనిస్తే దేశీ డిమాండ్‌ను తీర్చుకునేందుకు అమెరికా ఇప్పటి వరకు ఫార్మా ఉత్పత్తుల విషయంలో నికర దిగుమతిదారుగా ఉన్నట్టు శార్దూల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ అండ్ కో పార్ట్నర్ అరవింద్ శర్మ తెలిపారు. ‘‘భారత్ నుంచి వచ్చే ఫార్మా ఉత్పత్తులపై గణనీయ స్థాయిలో టారిఫ్‌లు విధించాలని అమెరికా ఇటీవల నిర్ణయించడం భారత ఫార్మా రంగంపైనా చెప్పుకోతగ్గ ప్రభావం చూపిస్తుంది. అంతిమంగా దేశీ వినియోగంపైనా దీని ప్రభావం ఉంటుంది’’అని చెప్పారు.అమెరికన్లకు గణనీయంగా ఆదా..అమెరికాలో ప్రతి నాలుగు ఔషధాల్లో ఒకటి భారత్ నుంచి సరఫరా అవుతుండడం గమనార్హం. చౌకగా భారత్ అందిస్తున్న ఔషధాలతో అమెరికాకు 2022లో 219 బిలియన్ డాలర్లు ఆదా అయినట్టు పరిశ్రమ వర్గాల అంచనా. 2013 నుంచి 2022 వరకు చూస్తే పదేళ్ల కాలంలో 1.3 ట్రిలియన్ డాలర్లను అమెరికన్లు ఆదా చేసుకున్నారు. అంతేకాదు భారత చౌక జనరిక్ ఔషధాలతో అమెరికాకు వచ్చే ఐదేళ్లలో మరో 1.3 ట్రిలియన్ డాలర్లు ఆదా అవుతుందని అంచనా.భారత ఫార్మా ఎగుమతులకు అమెరికా పెద్ద మార్కెట్ అని శర్మ చెప్పారు. భారత మొత్తం ఔషధ ఎగుమతుల్లో అమెరికా వాటాయే మూడింట ఒక వంతుగా ఉన్నట్టు తెలిపారు. ఉన్నట్టుండి టారిఫ్‌లు పెంచితే, అది భారత్‌లో ఔషధ తయారీని, దిగుమతి వ్యయాలను పెంచుతుందన్నారు. అదే జరిగితే అప్పుడు ఇతర దేశాలతో పోల్చితే భారత ఔషధ ఉత్పత్తులు ఖరీదుగా మారతాయన్నారు. ఇది అమెరికా ఆరోగ్య సంరక్షణ వ్యయాలను పెంచుతుందని, వినియోగదారులపై భారాన్ని మోపుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.ఫార్మా రంగానికి కొత్త దారులుఅమెరికా అధిక సుంకాలతో కొత్త మార్కెట్ అవకాశాల దిశగా భారత ఫార్మా రంగానికి ప్రోత్సాహం లభిస్తుందని శర్మ అంచనా వేస్తున్నారు. భారత కంపెనీలు యూరప్, ల్యాటిన్ అమెరికా లేదా ఆఫ్రికాలపై ఎక్కువ దృష్టి పెట్టొచ్చన్నారు. అమెరికా మార్కెట్‌కు భారత ఆటో ఎగుమతులు చాలా తక్కువ కావడంతో ఈ రంగంపై సుంకాల ప్రభావం తక్కువే ఉంటుందని ఇండస్ లా పార్ట్నర్ శశి మాథ్యూస్ అభిప్రాయపడ్డారు. కాకపోతే భారత ఆటో విడిభాగాల కంపెనీలపై కొంత ప్రభావం ఉండొచ్చన్నారు. అమెరికా డిమాండ్ చేస్తున్నట్టు ఆ దేశ ఆటో ఉత్పత్తులపై భారత్ సుంకాలను సున్నా స్థాయికి సమీప కాలంలో తగ్గించకపోవచ్చన్న విశ్లేషణ వ్యక్తం చేశారు. -
అమెరికా మార్కెట్లు క్రాష్: కారణం ఇదే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెరతీసిన టారిఫ్ వార్ ఆర్థిక అనిశ్చితులకు దారి తీయోచ్చనే ఆందోళనలతో సోమవారం అమెరికా స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. నాస్డాక్ 4%, ఎస్అండ్పీ 2.5%, డోజోన్స్ 1.3% నష్టాలతో ట్రేడయ్యాయి.టెక్ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నాస్డాక్ ఇండెక్స్‌లోని ప్రధాన షేర్లైన ఆల్ఫాబెట్, అమెజాన్, యాపిల్, మెటా, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, టెస్లా షేర్లు 2–14% కుప్పకూలాయి.ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత నవంబర్‌లో టెస్లా షేరు ఆర్జించిన లాభాలన్నీ(50%) తుడిచిపెట్టుకుపోయాయి. టారిఫ్‌ల కారణంగా ధరలు పెరుగుతాయనే ఆందోళనలను ట్రంప్ తోసిపుచ్చారు. అయితే ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశాలను మాత్రం తోసిపుచ్చలేదు.రూపాయి 36 పైసలు డౌన్రూపాయి విలువ నెలరోజుల్లో అతిపెద్ద పతనం చవిచూసింది. డాలర్ మారకంలో సోమవారం 36 పైసలు క్షీణించి 87.31 వద్ద స్థిరపడింది. ఫిబ్రవరి 5 తర్వాత ఒక రోజులో రూపాయికిదే భారీ నష్టం. క్రూడాయిల్ ధరల్లో ఒడిదుడుకులు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు దేశీయ కరెన్సీపై ఒత్తిడి పెంచాయని నిపుణులు తెలిపారు. ఇదీ చదవండి: గుట్టు విప్పిన ఐటీ శాఖ: అలాంటి వారికి ట్యాక్స్ నోటీసులు? -
ఏఐ అభివృద్ధిలో వివక్ష!
న్యూఢిల్లీ: కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉంది. దీంతో భవిష్యత్ సాంకేతిక పరిజ్ఞానాలలో ప్రబలంగా ఉన్న సామాజిక వివక్ష శాశ్వతంగా పెరిగే ప్రమాదం ఉందని మైక్రోసాఫ్ట్ ఇండియా, దక్షిణాసియా చీఫ్ పార్ట్నర్ ఆఫీసర్ హిమానీ అగ్రవాల్ అన్నారు. ‘మహిళలను చేర్చుకోవడం అనేది ఉమ్మడి బాధ్యత. విభిన్న దృక్కోణాలు లేకుండా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను (ఏఐ) రూపొందించడం కొనసాగితే.. నేటి వివక్ష రేపటి సాంకేతికతలోకి బలంగా మారే ప్రమాదం ఉంది. ఇది కేవలం సంఖ్యల సమస్య కాదు. మనం నిర్మిస్తున్న భవిష్యత్తు గురించి. ఏఐ ప్రపంచాన్ని రూపొందిస్తుంటే.. ఏఐని రూపొందిస్తున్న వ్యక్తులు ప్రపంచ వైవిధ్యాన్ని ప్రతిబింబించాలి’ అని అభిప్రాయపడ్డారు. అందుకే మనం ముందుగానే అడుగు వేయాలని అన్నారు. ఏఐని ముందుకు నడిపించడానికి యువతులలో ఉత్సుకతను రేకెత్తించడం, మెంటార్షిప్ నెట్‌వర్క్‌లను బలోపేతం చేయడం, మహిళలకు నైపుణ్యాలు, నాయకత్వ అవకాశాలు ఉన్నాయని తెలియజెప్పాలని పిలుపునిచ్చారు. ఒక కఠిన పనిగా.. ఉద్యోగ రంగంలోకి ప్రవేశించడం, నిలదొక్కుకోవడం చాలా మంది మహిళలకు ఒక కఠిన పనిగా అనిపిస్తుందని హిమానీ అగ్రవాల్ అన్నారు. మైక్రోసాఫ్ట్ ప్రధాన ఉద్యోగులలో మహిళలు 31.6 శాతం ఉన్నారని చెప్పారు. మరింత మంది మహిళలను చేర్చుకోవడం కోసం కంపెనీ చురుకుగా పనిచేస్తోందని ఆమె వివరించారు. సైబర్ సెక్యూరిటీ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలలో మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉండటం చాలా ముఖ్యమని చెప్పారు. అయితే ఈ విభాగంలో డిమాండ్ అధికంగా ఉన్నప్పటికీ మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉందని తెలిపారు. మహిళలు కేవలం ఉద్యోగ రంగంలోకి ప్రవేశించడమేగాక కెరీర్లో అభివృద్ధి చెందేలా చూసుకోవడంలో నిజమైన సవాల్, అవకాశం ఉందన్నారు. ‘సాంకేతికత సమానత్వాన్ని అందించే శక్తిని కలిగి ఉంది. సౌకర్యవంత కెరీర్లు, విభిన్న ఉద్యోగ బాధ్యతలు అపరిమిత అవకాశాలను అందిస్తుంది. అయినప్పటికీ మధ్య స్థాయి నుండి నాయకత్వానికి కీలక మార్పు చాలా మంది మహిళలకు అడ్డంకిగా మిగిలిపోయింది. ఇక్కడే మహిళలను చేర్చుకునే సంస్కృతి మార్పును కలిగిస్తుంది’ అని వివరించారు. -
భారత్‌కు ఏఐ నిపుణులు కావలెను
సాక్షి, బిజినెస్ బ్యూరో: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్.. ప్రపంచం అంతా మాట్లాడుకుంటున్న హాట్ టాపిక్ ఇదే. అయితే ప్రపంచ ఏఐ నిపుణులకు కేంద్రంగా మారడానికి భారత్‌కు అవకాశాలు ఉన్నప్పటికీ.. ఈ రంగంలో నిపుణుల కొరతను దేశం ఎదుర్కొనబోతోందని మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థ బెయిన్ అండ్ కంపెనీ తన తాజా నివేదికలో వెల్లడించింది. పెరుగుతున్న నైపుణ్య అంతరం ఈ రంగంలో దేశ పురోగతికి ఆటంకం కలిగించే ప్రమాదం ఉందని తెలిపింది. 2027 నాటికి భారత ఏఐ రంగంలో 10 లక్షలకుపైగా నైపుణ్యం కలిగిన నిపుణుల కొరత తప్పదని జోస్యం చెప్పింది. అందుబాటులో ఉన్న నిపుణులతో పోలిస్తే 1.5–2 రెట్ల డిమాండ్ ఉంటుందని అంచనాగా వెల్లడించింది. సమస్య నుంచి గట్టెక్కాలంటే కంపెనీలు సంప్రదాయ నియామక విధానాలకు మించి ముందుకు సాగాలి. నిరంతర నైపుణ్యాల పెంపుదలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆవిష్కరణ–ఆధారిత పర్యావరణ వ్యవస్థను పెంపొందించాలి అని వివరించింది. రీస్కిల్–అప్‌స్కిల్.. పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి భారత్‌లో శ్రామిక శక్తి నైపుణ్యం తిరిగి మెరుగుపరచడం, నైపుణ్యాలను పెంచడం అత్యవసరమని నివేదిక స్పష్టం చేసింది. ‘అభివృద్ధి చెందుతున్న సాంకేతిక సాధనాలు, నైపుణ్యాలపై ప్రస్తుత నిపుణుల్లో ఎక్కువ మందిలో తిరిగి నైపుణ్యం మెరుగుపర్చడం, పెంచడంలో సవాళ్లతోపాటు అవకాశాలూ ఉన్నాయి’ అని బెయిన్ అండ్ కంపెనీ ఏఐ, ఇన్సైట్స్, సొల్యూషన్స్ ప్రాక్టీస్ పార్ట్నర్, లీడర్ సైకత్ బెనర్జీ తెలిపారు. ‘ప్రతిభ కొరతను పరిష్కరించడానికి బహుముఖ విధానం అవసరం. కంపెనీలు సంప్రదాయ నియామక పద్ధతులకు మించి అంతర్గత ప్రతిభను పెంపొందించడానికి నిరంతర నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతిభ కొరత ఒక ముఖ్యమైన సవాల్. కానీ అధిగమించలేనిది కాదు. దీనిని పరిష్కరించడానికి వ్యాపార సంస్థలు ఏఐ ప్రతిభను ఆకర్షించడం, అభివృద్ధి చేయడం, నిలుపుకోవడంలో ప్రాథమిక మార్పు అవసరం’ అని నివేదిక వివరించింది. ఏఐ స్వీకరణలో వెనుకంజ.. ఆకర్షణీయంగా జీతాలు పెరిగినప్పటికీ అర్హత కలిగిన ఏఐ నిపుణుల సరఫరా డిమాండ్ వేగాన్ని అందుకోలేదు. ప్రతిభ అంతరం పెరగడం వల్ల పరిశ్రమల్లో ఏఐ స్వీకరణ మందగించే ప్రమాదం ఉందని నివేదిక వివరించింది. ఉత్పాదక ఏఐ సాంకేతికతలను అమలు చేయడానికి అంతర్గత ఏఐ నైపుణ్యం లేకపోవడం ఒక ప్రధాన అడ్డంకి అని ప్రపంచవ్యాప్తంగా సర్వేలో పాలుపంచుకున్న కంపెనీల ప్రతినిధులు వెల్లడించారు. ఈ కొరత కనీసం 2027 వరకు కొనసాగుతుందని, అంతర్జాతీయ మార్కెట్లలో వివిధ స్థాయిల్లో ప్రభావం ఉంటుందని అంచనాగా చెప్పారు. దేశంలో 2019 నుండి ఏఐ సంబంధిత ఉద్యోగ నియామకాలు ఏటా 21 శాతం దూసుకెళ్లాయి. అయితే వేతనాలు ప్రతి సంవత్సరం 11 శాతం పెరిగాయి. ఏఐ అవకాశాలు: 2027 నాటికి 23 లక్షలకుపైమాటే. అంటే అందుబాటులో ఉన్న నిపుణులతో పోలిస్తే 1.5–2 రెట్లు అధిక డిమాండ్. మూడేళ్లలో వనరులు: సుమారు 12 లక్షల మందికి చేరిక నిపుణుల కొరత : 10 లక్షల మందికిపైగా డిమాండ్ తీర్చాలంటే: మానవ వనరుల నైపుణ్యం తిరిగి మెరుగుపరచడం (రీస్కిల్), నైపుణ్యాలను పెంచడం (అప్‌స్కిల్) అత్యవసరం. -
హైదరాబాద్ యూనివర్సిటీతో బయోఫ్యాక్టర్ ఒప్పందం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీవ ఎరువుల తయారీలో ఉన్న బయోఫ్యాక్టర్ తాజాగా హైదరాబాద్ విశ్వవిద్యాలయంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా వివిధ రంగాలకు అనువైన, వినూత్న నానోకణాల రూపకల్పనపై పరిశోధన, వాణిజ్యపర వినియోగానికి అనుగుణంగా ఆవిష్కరణలను చేపడతామని బయోఫ్యాక్టర్ సీఈఓ ఎల్.ఎన్.రెడ్డి తెలిపారు. పంట ఉత్పాదకత, కచ్చిత పోషకాల పంపిణీ, పర్యావరణ అనుకూల నానోపెస్టిసైడ్స్ను మెరుగుపరచడం, రసాయనాలపై ఆధారపడటాన్ని తగ్గించడం ఈ భాగస్వామ్య లక్ష్యం అని చెప్పారు. తక్కువ ఖర్చుతో, అధిక దిగుబడినిచ్చే పరిష్కారాలతో రైతులకు ప్రయోజనం చేకూరుస్తామన్నారు. -
ఎస్ఎంఈ ఐపీఓలు అంత ఈజీ కాదు
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా చిన్న, మధ్యతరహా సంస్థ(ఎస్ఎంఈ)ల పబ్లిక్ ఇష్యూలకు నిబంధనలను కఠినతరం చేసింది. వీటిలో భాగంగా లాభదాయకత అంశాన్ని ప్రవేశపెట్టింది. ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) పరిమితిని 20 శాతానికి పరిమితం చేసింది. ఇన్వెస్టర్లకు రక్షణ కల్పిస్తూనే పటిష్ట పనితీరు సాధిస్తున్న ఎస్ఎంఈల నిధుల సమీకరణకు అండగా నిలిచే లక్ష్యంతో సంస్కరణలకు సెబీ తెరతీసింది. గత క్యాలెండర్ ఏడాదిలో ఎస్ఎంఈ ఐపీఓలు, ఇన్వెస్టర్ల పార్టిసిపేషన్ భారీగా పెరిగిన నేపథ్యంలో సెబీ తాజా చర్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. లాభదాయకత అంశానికివస్తే పబ్లిక్ ఇష్యూ ప్రణాళికల్లో ఉన్న ఎస్ఎంఈ గత మూడేళ్లలో కనీసం రెండేళ్ల పాటు రూ. కోటి చొప్పున నిర్వహణ లాభం(ఇబిటా) ఆర్జించి ఉండాలి. మొత్తం ఇష్యూ పరిమాణంలో 20 శాతానికి మించి వాటాదారులు షేర్లను విక్రయించేందుకు అనుమతించరు. ఇదేవిధంగా వాటాదారుల హోల్డింగ్స్‌లో 50 శాతానికి మించి ఆఫర్ చేసేందుకు వీలుండదు.నిధుల వినియోగమిలాసంస్థాగతేతర ఇన్వెస్టర్లకు షేర్ల కేటాయింపులో మెయిన్ బోర్డ్ ఐపీఓ నిబంధనలే ఎస్‌ఎంఈలకూ వర్తించనున్నాయి. కనీస దరఖాస్తు పరిమాణాన్ని రెండు లాట్లకు సెబీ కుదించింది. తద్వారా అనవసర స్పెక్యులేషన్‌కు చెక్ పెట్టనుంది. సాధారణ కార్పొరేట్ అవసరాలకు ఐపీఓ నిధుల్లో 15 శాతం లేదా రూ. 10 కోట్లవరకూ(ఏది తక్కువైతే) మాత్రమే కేటాయించేందుకు అనుమతిస్తారు. ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్ సంస్థలు, సంబంధిత పార్టీల నుంచి తీసుకున్న రుణ చెల్లింపులకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఐపీఓ నిధులు వెచ్చించేందుకు అనుమతి ఉండదు. ప్రమోటర్ల కనీస వాటాకుపైన గల ప్రమోటర్ హోల్డింగ్‌కు దశలవారీ లాకిన్ గడువు వర్తిస్తుంది. అధికంగా ఉన్న ప్రమోటర్ వాటాలో ఏడాది తరువాత 50 శాతం, రెండేళ్ల తదుపరి మిగిలిన 50 శాతానికి గడువు ముగుస్తుంది. పబ్లిక్కు అందుబాటుఎస్ఎంఈలు సెబీకి దాఖలు చేసిన ఐపీఓ ప్రాస్పెక్టస్(డీఆర్‌హెచ్‌పీ)ను 21 రోజులపాటు పబ్లిక్కు అందుబాటులో ఉంచాలి. వార్తా పత్రికల్లో ప్రకటనల ద్వారా తెలియజేయాలి. సులభంగా తెలుసుకునేందుకు క్యూఆర్ కోడ్‌ను సైతం వినియోగించాలి. ఎస్ఎంఈ ఎక్సే్ఛంజ్, కంపెనీ వెబ్సైట్, మర్చంట్ బ్యాంకర్.. సంబంధిత డీఆర్హెచ్పీపై పబ్లిక్ స్పందనకు వీలు కల్పించాలి. ఎస్ఎంఈలు ఐపీఓ తదుపరి మెయిన్ బోర్డులోకి చేరకుండానే నిధుల సమీకరణ చేపట్టాలంటే సెబీ(ఎల్‌వోడీఆర్) నిబంధనలు పాటించవలసి ఉంటుంది. చెల్లించిన మూలధనం రూ. 25 కోట్లకు మించవలసి ఉంటుంది. రైట్స్, ప్రిఫరెన్షియల్ కేటాయింపులు, బోనస్ షేర్ల జారీ తదితరాలు ఈ విభాగంలోకి వస్తాయి. గత రెండేళ్లలో ఎస్ఎంఈ ఐపీఓలు భారీగా ఎగసిన నేపథ్యంలో సెబీ నిబంధనలు మరింత కఠినతరం చేసేందుకు ఉపక్రమించింది. 2024లో ఐపీఓల ద్వారా 240 చిన్న, మధ్యతరహా సంస్థలు రూ. 8,700 కోట్లు సమీకరించాయి. అంతక్రితం 2023లో సమకూర్చుకున్న రూ. 4,686 కోట్లతో పోలిస్తే ఇవి రెట్టింపుకావడం ప్రస్తావించదగ్గ అంశం!! -
ఐపీఓల జోరుకు బ్రేక్!!
న్యూఢిల్లీ: గతేడాదంతా జోరుగా దూసుకెళ్లిన ఐపీఓల మార్కెట్ ప్రస్తుతం సెకండరీ మార్కెట్లో కరెక్షన్ కారణంగా నెమ్మదించిన ధోరణి కనిపిస్తోంది. గత రెండు నెలలుగా నెలకొన్న పరిస్థితులు దీన్ని సూచిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. 2024 డిసెంబర్లో ఏకంగా 16 లిస్టింగ్స్ నమోదు కాగా .. ఈ ఏడాది జనవరిలో అయిదు ఇష్యూలు మాత్రమే వచ్చాయి. ఫిబ్రవరిలో ఈ సంఖ్య నాలుగుకి తగ్గింది. అంతేగాకుండా కొన్ని కంపెనీలు ఐపీఓ ప్రణాళికలను పక్కన పెడుతున్నాయి. జనవరి, ఫిబ్రవరిలో అడ్వాన్స్డ్ సిస్–టెక్, ఎస్ఎఫ్సీ ఎన్విరాన్మెంటల్ టెక్నాలజీస్, వినే కార్పొరేషన్ ఇలా ప్రతిపాదనలను వెనక్కి తీసుకున్న వాటిల్లో ఉన్నాయి. గత రెండు నెలల్లో ప్రధానంగా సెకండరీ మార్కెట్ కరెక్షన్‌కి లోను కావడంతో పలు లిస్టెడ్ కంపెనీల షేర్లపై ప్రతికూల ప్రభావం పడిందని ఈక్విరస్ ఎండీ భావేష్ షా తెలిపారు. దీనితో ఇన్వెస్టర్లు కొత్త లిస్టింగ్లవైపు చూడటం కాకుండా ప్రస్తుతమున్న పోర్ట్‌ఫోలియోను కాపాడుకోవడంపై దృష్టి పెడుతున్నారని పేర్కొన్నారు. ఇలా కొత్త ఐపీఓలపై ఇన్వెస్టర్ల ఆసక్తి సన్నగిల్లడంతో పబ్లిక్ ఇష్యూల మార్కెట్ కూడా నెమ్మదించిందని ఆయన పేర్కొన్నారు. పటిష్టమైన ఎకానమీ, మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లు భారీగా పెరగడం వంటి సానుకూలాంశాలతో 2014లో ఏకంగా 91 ఐపీఓల ద్వారా కంపెనీలు రూ. 1.6 లక్షల కోట్లు సమీకరించాయి. అయినప్పటికీ.. ఆశావహమే.. పబ్లిక్ ఇష్యూలపై ప్రస్తుతానికి ఇన్వెస్టర్ల ఆసక్తి సన్నగిల్లినప్పటికీ .. దీర్ఘకాలికంగా చూస్తే మాత్రం మార్కెట్ సానుకూలంగానే కనిపిస్తోందని ఆనంద్ రాఠీ అడ్వైజర్స్ డైరెక్టర్ వి. ప్రశాంత్‌రావు తెలిపారు. పెద్ద ఎత్తున సంస్థలు ఐపీఓకి సిద్ధమవుతుండటమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ‘పెద్ద సంఖ్యలో ప్రాస్పెక్టస్‌లు దాఖలవుతున్నాయి. మార్కెట్లు స్థిరపడటం కోసం కంపెనీలు వేచిచూస్తున్నాయి. ప్రస్తుతం రూ. 67,000 కోట్లు సమీకరించడానికి 45 కంపెనీలకు సెబీ అనుమతులు ఉన్నాయి. మరో రూ. 1.15 లక్షల కోట్ల సమీకరణ కోసం 69 కంపెనీలు అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాయి. ఇందులో 45 కంపెనీలు గత కొద్ది నెలల్లో ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి‘ అని ఆయన పేర్కొన్నారు. గత రెండు నెలల వ్యవధిలోనే దాదాపు 30 కంపెనీలు సెబీకి ప్రాస్పెక్టస్‌లను సమరి్పంచినట్లు వివరించారు. సత్వ గ్రూప్, బ్లాక్‌స్టోన్ దన్ను గల నాలెడ్జ్ రియల్టీ ట్రస్ట్ ఈమధ్యే రూ. 6,200 కోట్ల సమీకరణకు సంబంధించి పత్రాలు దాఖలు చేసింది. రాబోయే కొద్ది నెలల్లో మార్కెట్లు స్థిరపడిన తర్వాత ఐపీఓలు మళ్లీ పుంజుకుంటాయనే సంకేతాలు కనిపిస్తున్నాయని షా ఆశాభావం వ్యక్తం చేశారు. మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుండటంతో పాటు మదుపరులు కూడా కొత్త కంపెనీల్లో తాజాగా ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తారని పేర్కొన్నారు. అయితే, ఇన్వెస్టర్లను ఆకట్టుకోవడానికి కంపెనీలు, ప్రస్తుత మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా తమ వేల్యుయేషన్లను సరిచేసుకోవాల్సి ఉంటుందని షా అభిప్రాయపడ్డారు. -
48 గంటల్లో 20000 బుకింగ్స్
మార్చి 5న అల్ట్రావయొలెట్ కంపెనీ తన టెస్సెరాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. సంస్థ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించిన 48 గంటల్లో రికార్డ్ స్థాయిలో బుకింగ్స్ స్వీకరించింది.అల్ట్రావయొలెట్ టెస్సెరాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ 48 గంటల్లో 20,000 కంటే ఎక్కువ ప్రీ-బుకింగ్‌లను పొందింది. ఈ విషయాన్ని సంస్థ అధికారికంగా ప్రకటించింది. అయితే ప్రారంభ పరిచయ ధరను (రూ. 1.20 లక్షలు) 10000 నుంచి 50000 యూనిట్లకు పెంచింది. అంటే మొదటి 50వేలమందికి మాత్రమే ఆ ధర వర్తిస్తుంది. ఆ తరువాత దీని ధర రూ. 1.45 లక్షలకు (ఎక్స్ షోరూమ్) చేరుకుంటుంది.అల్ట్రావయొలెట్ టెస్సెరాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు 2026 మొదటి త్రైమాసికంలో ప్రారంభమవుతాయి. దీనిని రూ. 999 కు ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు. ఇది ఒక ఫుల్ ఛార్జితో 261 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది. కేవలం 100 రూపాయలతో రెండుసార్లు ఛార్జ్ చేయడం ద్వారా 500 కిలోమీటర్ల పరిధిని సాధించగలదని అల్ట్రావయోలెట్ పేర్కొంది.ఇదీ చదవండి: ఎక్కువమంది కొంటున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదంటే?టెస్సెరాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఆన్‌బోర్డ్ నావిగేషన్‌తో కూడిన 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, రెండు డాష్‌క్యామ్‌లు (ముందు, వెనుక), వైర్లెస్ ఛార్జింగ్, హ్యాండిల్‌బార్ కోసం హాప్టిక్ ఫీడ్‌బ్యాక్, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, డ్యూయల్ డిస్క్‌లు, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటివి పొందుతుంది.టెస్సెరాక్ట్ అనేది రాడార్ బేస్డ్ ADAS టెక్నాలజీతో కూడిన భారతదేశపు మొట్టమొదటి స్కూటర్. ఇది బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, ఓవర్టేక్ అలర్ట్, కొలిజన్ అలర్ట్, లేన్ చేంజ్ అసిస్ట్ వంటి ఫీచర్స్ పొందుతుంది. ఈ స్కూటర్ ఫ్లోటింగ్ డీఆర్ఎల్, ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్‌లతో కూడిన డ్యూయల్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ ల్యాంప్ పొందుతుంది. దీని అండర్ సీట్ స్టోరేజ్ 34 లీటర్లు. -
గుట్టు విప్పిన ఐటీ శాఖ: అలాంటి వారికి ట్యాక్స్ నోటీసులు?
నిర్దిష్ట ఆదాయం కంటే ఎక్కువ సంపాదన ఉన్నప్పుడు.. మన దేశంలో ట్యాక్స్ చెల్లించాలి. పాత ఆదాయపు పన్ను విధానం ప్రకారం.. ట్యాక్స్ రిబేట్ రూ. 5 లక్షలుగా ఉండేది. కొత్త పన్ను విధానం ప్రకారం ఇది రూ. 12 లక్షలకు చేరింది. ఆదాయపన్ను చట్టం 1961 కింద.. కొత్త, పాత పన్ను విధానాల కింద ఏది ఎంచుకుంటే.. ఆ శ్లాబుల ప్రకారం ట్యాక్స్ చెల్లించాలి.పన్ను మినహాయింపు పరిమితి దాటితే.. ఐటీఆర్ ఫైల్ చేయాలి. కొందరు దీనిని పెడచెవిన పెడుతున్నారు. అంటే ట్యాక్స్ చెల్లించకుండా తప్పించుకుంటున్నారు. అలాంటి వారిని ఇప్పుడు ఐటీ శాఖ గుర్తించింది. ఇప్పటికే ట్యాక్స్ కట్టకుండా ఉన్నవారి లిస్ట్ కూడా తయారు చేసుకుంది. సదరు వ్యక్తులకు నోటీసులు కూడా అందుతాయి.ఎవరైతే ట్యాక్స్ కట్టకుండా తప్పించుకుంటున్నారో.. వారిపైన సెక్షన్ 148ఏ కింద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు లిస్ట్ చేసిన వారు 2018-19, 2019-20, 2020-21, 2021-22 ఆర్ధిక సంవత్సరానికి గానూ చెల్లించకుండా ఉన్నవారు అని తెలుస్తోంది. ఇప్పటికే కొందరికి నోటీసులు పంపినట్లు చెబుతున్నారు.పన్ను కట్టకుండా తప్పించుకునే వారిని గుర్తించడానికి ఏఐఎస్, టీడీఎస్/టీసీఎస్ స్టేట్మెంట్స్, ఫైనాన్సియల్ ట్రాన్సక్షన్ స్టేట్మెంట్ వంటి వాటిని ఆదాయపన్ను శాఖ తనిఖీ చేస్తుంది. వీటి ద్వారానే ఎవరు పన్ను కడుతున్నారు, ఎవరు కట్టడం లేదనే విషయాలను తెలుసుకుంటుంది. పన్ను ఎగ్గొట్టే వారిని గుర్తించి.. వారికి నోటీసులు జారీ చేస్తుంది.ఇదీ చదవండి: రన్యా రావు కేసు.. దుబాయ్ నుంచి ఎంత బంగారం తీసుకురావచ్చంటే?ఎవరైతే పన్ను చెల్లించకుండా.. తప్పించుకుంటున్నారో వారికి నోటీసులు జారీ చేసి, చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే కండొనేషన్ ఆఫ్ డిలేకు అప్లై చేసుకుని లేదా వడ్డీతో కలిపి ట్యాక్స్ పూర్తిగా చెల్లించినట్లయితే.. బయటపడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. -
బ్యాంకులకు వరుస సెలవులు: ఎందుకో తెలుసా?
ఈ నెలలో (మార్చి 2025) దాదాపు పది రోజుల కంటే ఎక్కువ బ్యాంకు సెలవులు ఉన్నాయి. కాగా ఈ ఒక్క వారంలోనే వరుస సెలవులు వస్తున్నాయి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సెలవులు ఉన్నాయి, ఆ సమయంలో ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉంటాయా? అనే వివరాలు తెలుసుకుందాం.మార్చి రెండో వారం కూడా మొదలైపోయింది. ఈ వారంలో 13 నుంచి 16వరకు వివిధ ప్రాంతాల్లోని బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. వరుస సెలవులు రావడం చేత.. తప్పకుండా బ్యాంకులకు వెళ్లి పూర్తి చేయాల్సిన పనులను ముందుగానే పూర్తి చేసుకోవచ్చు. ఆలస్యమైనా పరవాలేదు అనుకున్నప్పుడు.. ఎప్పుడు బ్యాంకులు మూసి ఉంటాయి అనే విషయం తెలుసుకోవాలి. అయితే ఆన్లైన్ సేవలు అన్నీ సెలవు దినాల్లో కూడా అందుబాటులో ఉంటాయి.➤మార్చి 13 (గురువారం): మార్చి 13న హోలిక దహన్, అట్టుకల్ పొంగళ పండుగ కారణంగా జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, కేరళ వంటి రాష్ట్రాల్లో సెలవు ఉంటుంది.➤మార్చి 14 (శుక్రవారం): హోలీ పండుగ సందర్భంగా.. త్రిపుర, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, మణిపూర్, కేరళ, నాగాలాండ్ మినహా ఇతర రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో సెలవు.➤మార్చి 15 (శనివారం): కొన్ని రాష్ట్రాలు మార్చి 14కి బదులుగా మార్చి 15న హోలీని జరుపుకుంటాయి. ఈ జాబితాలో త్రిపుర, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, మణిపూర్ ఉన్నాయి.➤ మార్చి 16 (ఆదివారం); ఆదివారం కావడం చేత దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు.(బ్యాంకింగ్ సెలవుల షెడ్యూల్ మారవచ్చు.. కాబట్టి హాలిడే క్యాలెండర్లో ఏవైనా అప్డేట్లు లేదా రివిజన్ల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. లేదా మీ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక ప్రకటనలను గమనించాల్సి ఉంటుంది). -
ఐఫోన్లపై అదిరిపోయే డిస్కౌంట్స్!
భారతదేశంలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ (మార్చి 7 నుంచి 13 వరకు) ప్రారంభమైంది. ఇందులో భాగంగా లేటెస్ట్ ఐఫోన్ 16, ఐఫోన్ 15 మోడళ్లపై డిస్కౌంట్స్ కూడా ప్రకటించింది. ఈ తగ్గింపులకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ఐఫోన్ 16 సిరీస్ ఆఫర్లుఐఫోన్ 16 బేస్ వేరియంట్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 79,900 నుంచి 68,999 రూపాయలకు చేరింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆఫర్ కింద రూ. 4000, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కింద రూ. 5000 తగ్గింపును పొందవచ్చు. అంటే ఇప్పుడు ఐఫోన్ 16ను రూ. 59,999లకు సొంతం చేసుకోవచ్చు. నో కాస్ట్ ఈఎమ్ఐ కూడా రూ. 10,000 నుంచి ప్రారంభమవుతుంది.కొత్తగా విడుదలైన ఐఫోన్ 16e ధర రూ. 59,900. అయితే ఇది ఇప్పుడు 55,900 రూపాయలకు అందుబాటులో ఉంది. ఐఫోన్ 16 ప్లస్ ధర రూ. 89,900 నుంచి రూ. 78,999కు చేరింది. ఐఫోన్ 16 ప్రో రూ. 1,19,900 నుంచి రూ. 1,08,900కు & ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ అసలు ధర రూ. 1,44,900 కాగా, సేల్‌లో భాగంగా రూ. 1,31,900కు లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్స్, ఇతర ప్రయోజనాలను ఉపయోగించుకుంటే.. వీటి ధరలు మరింత తగ్గుతాయి.ఐఫోన్ 15 సిరీస్ ఆఫర్లుఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సమయంలో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 14 వరుసగా రూ. 60,999, రూ. 64,999 & రూ. 50,999 ప్రారంభ ధరలకు అందుబాటులో ఉన్నాయి. సాధారణ డిస్కౌంట్లతో పాటు, కొనుగోలుదారులు నో కాస్ట్ ఈఎమ్ఐ ఎంపికలు, స్టాండర్డ్ ఈఎమ్ఐ ఎంపికలు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు, కూపన్ ఆధారిత డిస్కౌంట్లను సేల్‌లో పొందవచ్చు. -
జీఎస్టీ తగ్గింపుపై నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు
పేదల కోసం సంక్షేమ పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వానికి నిధులు అవసరం. కాబట్టి, పరిశ్రమలు పన్నులను తగ్గించాలని నిరంతరం డిమాండ్ చేయకూడదని కేంద్ర మంత్రి 'నితిన్ గడ్కరీ' న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో వెల్లడించారు.జీఎస్టీ, ఇతర పన్నులను తగ్గించమని అడగకూడదు, ఒకవేళా పన్నులను తగ్గిస్తే.. ఇంకా తగ్గించాలని చెబుతారు. ఎందుకంటే అది మానవ నైజం. పన్నులు వసూలు చేయకుండా.. ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడం కష్టం. ధనవంతుల నుంచి పన్ను తీసుకొని.. పేదలకు ప్రయోజనాలు కల్పించడం ప్రభుత్వ దార్శనికత అని గడ్కరీ అన్నారు.రెండేళ్లలోపు భారతదేశంలోని లాజిస్టిక్స్ ఖర్చు 9 శాతానికి తగ్గుతుందని నితిన్ గడ్కరీ అన్నారు. ప్రస్తుతం భారతదేశ లాజిస్టిక్స్ ఖర్చు 14 నుంచి 16 శాతంగా ఉంది. చైనాలో లాజిస్టిక్స్ ఖర్చు 8 శాతంగా ఉంది. అమెరికా, యూరోపియన్ దేశాలలో ఇది 12 శాతం అని మంత్రి అన్నారు. కాబట్టి మరో రెండేళ్లలో మన దేశంలో కూడా లాజిస్టిక్ ఖర్చులను తగ్గించనున్నట్లు స్పష్టం చేశారు. అంత కాకుండా పెట్టుబడిని పెంచడం ద్వారా భారతదేశం మరిన్ని ఉద్యోగాలను సృష్టించబోతోందని మంత్రి పేర్కొన్నారు.ఇదీ చదవండి: నెలకు 10 రోజులు.. టెక్ కంపెనీ కొత్త రూల్!మీరు సంపద సృష్టికర్తలు మాత్రమే కాదు, ఉద్యోగాల సృష్టికర్తలు కూడా. ఈ స్వర్ణ యుగాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. అంతేకాకుండా, భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి దిగుమతులను తగ్గించి ఎగుమతులను పెంచాల్సిన అవసరాన్ని గడ్కరీ నొక్కి చెప్పారు. -
ఇంద్రుడిలా.. ఇన్‌కం ట్యాక్స్ వాళ్లు..
ఇంద్రుడికి వేయి కళ్లున్నాయి అనేది నాటి కథ. పురాణ కథ. ఇప్పుడు చెప్పుకోబోయేది నేటి కథ. జరగబోయే కథ. ఇన్‌కం ట్యాక్స్ వాళ్లు ఇప్పటికే తమకున్న విస్తృత అధికారాలను వాడుతూ, ఎన్నో రాళ్లు రువ్వుతున్నారు రతనాల కోసం. ప్రతి రాయీ రత్నం అవుతోంది. ఆదాయాన్ని తెస్తోంది. వారి దగ్గర ఉన్నది ‘‘డేటా’’ కాదు .. మీ బ్యాంకు బ్యాలెన్సు. ఆదాయాన్ని అసెస్ చేసి, వారి వాటా ఉంచుకుని మిగతాది మీకు ఇస్తారు. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ మైమరచిపోయే రోజులు పోయాయి. అరకొర సిబ్బంది ఏమీ చేయలేరని అనుకోకండి. అర కొర సిబ్బందికి కొత్త కోరలు వచ్చాయి. ఇక జాగ్రత్త.‘‘సంసారం గుట్టు .. రోగం రట్టు’’ అనేది ఒక సామెత. ‘‘సంపాదన గుట్టు, రోగం గుట్టు’’ అనే వాళ్లూ ఉన్నారు. మగవాడి జీతం అడగకూడదనే నానుడి ఉంది. డిజిటల్ ప్రపంచంలో అన్నీ అందరికీ తెలిసిపోతున్నాయి. సీక్రెసీ లేదు. ప్రైవసీ లేదు. ఇనుపపెట్టెలో రొక్కం, బీరువాలో నగలు, లాకర్లో బంగారం, స్విస్ బ్యాంకులో జమలు.. ఇవన్నీ తెలుసుకుంటున్నారు.మనం మన వంటికి ‘కవచకుండలం’లాగా భావించే సెల్‌ఫోన్ నిజానికి కవచ కుండలం కాదు. డేటాను వెదజల్లే కుండ. మన సంభాషణలు, వాట్సప్‌లో సందేశాలు, ఈమెయిళ్లు, గూగుల్ చెల్లింపులు, పేటీఎం చెల్లింపులు, అమెజాన్ ఆర్డర్లు, ఫ్లిప్‌కార్ట్ కొనుగోళ్లు, స్విగ్గీ ఆర్డర్లు, జొమాటో ఆర్డర్లు, విదేశీ ప్రయాణాలు, పండగ ఆఫర్లు, బంగారం కొనుగోళ్లు ప్రతీదీ తెలిసిపోతుంది. అలాగే బిల్డర్లతో, బ్రోకర్స్‌తో, బ్యాంకర్లతో, ఇన్వెస్ట్మెంట్ ప్లానర్స్‌తో, వ్యాపారవేత్తలతో స్నేహితులతో, పిల్లలతో, భాగస్వాములతో జరిపే ఈమెయిల్స్ సంభాషణలు, మన ఇన్‌స్ట్రాగామ్, వాట్సాప్, యూట్యూబ్, సోషల్ మీడియా, లింక్డిన్ ఖాతాలు మొదలైన వివరాలన్నీ తెలిసిపోతాయి.2026 ఏప్రిల్ 1 నుంచి అంటే 2026–27 ఆర్థిక సంవత్సరం నుంచి ఇన్‌కం ట్యాక్స్ అధికారులకు ఇంద్రుడిలాగా విస్తృత అధికారాలు ఇచ్చారు. మీ సోషల్ మీడియా అకౌంటు, బ్యాంకు అకౌంట్లు, ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ అకౌంటు, ట్రేడింగ్ అకౌంటు ... ఇలా అన్నీ చెక్ చేయొచ్చు. బ్యాంకు లాకర్లు పగలకొట్టడం విన్నాం. ఇప్పుడు మీ కంప్యూటర్ సిస్టంను బ్రేక్ చేస్తారు. వర్చువల్ డిజిటల్ స్పేస్‌లో ప్రవేశిస్తారు. ఇప్పటికే అనుభవజ్ఞులైన ఎథికల్ హ్యాకర్స్ని ఇన్వాల్వ్ చేసి మన సమాచారం తప్పని, తక్కువని, పూర్తిగా జరిపిన వ్యవహారాలన్నీ చూపించి మన జాతక విశ్వరూప ప్రదర్శనం చేసి వారి ‘‘విశ్వరూపాన్ని’’ చూపిస్తున్నారు. మేఘాల్లో (క్లౌడ్) నుంచి కూడా సమాచారాన్ని సంగ్రహించి, అసెస్మెంట్ చేస్తున్నారు. వెబ్సైట్లు, క్లౌడ్ సర్వర్లు, డిజిటల్ ప్లాట్‌ఫాంలు దేన్నీ వదలడం లేదు. ‘‘ఇందుగలడందు లేడ’’ని చెప్పినట్లు, ఎక్కడికైనా వెళ్తారు. ఆగమేఘాల మీద రావడం అంటే ఇదేనేమో.అధికార్లు ఎందుకు వస్తారు... నా ప్రైవసీలోకి రావచ్చా.. ఇది రాజ్యాంగబద్ధమా.. ఇది హక్కులు నేలరాయటం కాదా లాంటి ప్రశ్నలు వెయ్యకండి. కొత్త బిల్లులో నిర్వచనం చాలా పకడ్బందీగా రాశారు. ఉద్యోగి సిస్టం ద్వారా యజమాని వివరాలు తెలుసుకుంటారు. అంతే కాకుండా కొన్న సంవత్సరం నుంచి ఎనిమిదేళ్లు వెనక్కు వెళ్తారు. అందుకని జాగ్రత్త వహించండి. మనం ఎవరికీ తెలియకుండా వ్యాపారం/వ్యవహారం చేస్తున్నాం అనుకుంటాం. ఇరుగు పొరుగుకి, అన్నదమ్ములకు తప్ప అందరికీ తెలుస్తుంది. ‘కాగల కార్యం గంధర్వులే’ తీర్చినట్లుగా తెలియకూడని వాళ్లకే సర్వం తెలిసిపోతోంది. ‘సర్వం జగన్నాధం’.అయితే, ఈ అధికారాలు దుర్వినియోగం కాకూడదు. అందరికీ సమానంగా, అంటే పన్ను ఎగవేసే ప్రతి బడాబాబుకీ వర్తించేలా, బంధుప్రీతి లేకుండా, కక్ష సాధింపులా కాకుండా, రాజకీయాలకు అతీతంగా జరిగితే ఎంతో మంచిది. అదే విశ్వకల్యాణం.కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తికె.వి.ఎన్ లావణ్యట్యాక్సేషన్ నిపుణులు -
మళ్ళీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం లాభాలబాట పట్టిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 217.41 పాయింట్లు లేదా 0.29 శాతం నష్టంతో 74,115.17 వద్ద, నిఫ్టీ 92.20 పాయింట్లు లేదా 0.41 శాతం నష్టంతో 22,460.30 వద్ద నిలిచాయి.వెల్స్పన్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ కమర్షియల్స్, బంకా బయోలూ, బోడల్ కెమికల్స్, లిప్సా జెమ్స్ అండ్ జ్యువెలరీ, ICE మేక్ రిఫ్రిజిరేషన్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. కేసోరామ్ ఇండస్ట్రీస్, SBC ఎక్స్‌పోర్ట్స్, నాగార్జున ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్, హిందుస్తాన్ మీడియా వెంచర్స్, నియోజెన్ కెమికల్స్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఎక్స్ డౌన్: గగ్గోలు పెడుతున్న యూజర్లు
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నాయకత్వంలో నడుస్తున్న ఎక్స్ (ట్విటర్)లో అంతరాయం ఏర్పడింది. లక్షలాది మంది వినియోగదారులు ఈ సోషల్ మీడియా యాప్‌ను యాక్సెస్ చేయలేకపోయినట్లు వెల్లడించారు.ఆన్లైన్ అంతరాయాలను ట్రాక్ చేసే ప్లాట్‌ఫామ్ డౌన్‌డెటెక్టర్ నివేదికల ప్రకారం.. భారతదేశం నుంచి దాదాపు 2000 మంది, యునైటెడ్ స్టేట్స్ నుంచి 18,000 మంది, యునైటెడ్ కింగ్డమ్ నుంచి 10,000 మంది ఎక్స్ యాప్‌ను యాక్సెస్ చేయలేకపోయినట్లు స్పష్టం చేసింది. అయితే ఈ అంతరాయంపై కంపెనీ స్పందించలేదు.X Twitter Down, Users Face Outage: Social media platform X has started showing troubles as several users reported it was not working in India which could be because of a technical glitch. pic.twitter.com/mmhRrJP6Oa— Divya 🦋 (@Hiraeth85) March 10, 2025యాప్‌ను ఓపెన్ చేయడానికి ప్రయత్నించినప్పుడు.. చాలా మంది వినియోగదారులకు "ఏదో తప్పు జరిగింది, మళ్లీ లోడ్ చేయడానికి ప్రయత్నించండి" అనే సందేశం వచ్చింది.డౌన్‌డెటెక్టర్ డేటా ప్రకారం 57% మంది వినియోగదారులు X యాప్‌తో సమస్యలను ఎదుర్కొంటున్నారని, 34% మంది వెబ్సైట్లో సమస్యలు ఉన్నాయని, 9% మంది సర్వర్ సమస్యలను నివేదించారని తేలింది. UKలో, 61% మంది వినియోగదారులు అప్లికేషన్ గురించి, 34% మంది వెబ్సైట్ గురించి, 5% మంది సర్వర్ సమస్యలను ఎదుర్కొన్నారు.𝕏 is down / having connection issues. @grok is also down and unable to complete requests.— Nicky 🇬🇧 (@NickyThomas) March 10, 2025 -
దుబాయ్ నుంచి ఎంత బంగారం తీసుకురావచ్చు?
కన్నడ నటి 'రన్యా రావు' 14.2 కేజీల బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారనే ఆరోపణలతో బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో దుబాయ్ బంగారం ధరల గురించి చర్చ మొదలైంది. ఇంతకీ దుబాయ్ నుంచి ఎంత బంగారం తీసుకురావాలి?, ఎక్కువ తీసుకురావాలనే ఏమైనా రూల్స్ పాటించాలా? అనే విషయాలను ఇక్కడ చూసేద్దాం.భారతదేశంతో పోలిస్తే.. దుబాయ్‌కు బంగారం ధరలు తక్కువగా ఉంటాయని, చాలామంది అక్కడ నుంచి ఇండియాకు బంగారం తీసుకొస్తూ ఉంటారు. అక్కడ గోల్డ్ రేటు తక్కువగా ఉండటానికి కారణం.. అక్కడ ఆభరణాలపై జీఎస్టీ లేకపోవడం, తయారీ ఛార్జీలు తక్కువగా ఉండటమే.భారతదేశంలోకి బంగారాన్ని తీసుకురావడానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) నిర్ణయించిన రూల్స్ తప్పకుండా పాటించాల్సిందే. లేకుంటే రన్యా రావు మాదిరిగా అరెస్ట్ అవ్వాల్సి వస్తుంది. విదేశాల నుంచి మన దేశానికి బంగారాన్ని తీసుకురావాలంటే.. దిగుమతి సుంకం చెల్లించాలి. ఈ ట్యాక్స్ ఇప్పుడు 6 శాతం వద్ద ఉంది. ఈ సుంకం నుంచి తప్పించుకోవడానికే.. చాలామంది అక్రమంగా బంగారాన్ని తరలిస్తుంటారు.సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ ప్రకారం.. దుబాయ్‌లో ఆరు నెలల (1967 పాస్‌పోర్ట్ చట్టం) కంటే ఎక్కువ సమయం ఉండి, కస్టమ్స్ డ్యూటీ చెల్లించినవారు.. తమ బ్యాగేజీలో ఒక కేజీ వరకు బంగారం తీసుకురావచ్చు. అంతకంటే ఎక్కువ బంగారం తీసుకురావాలనుంటే.. ట్యాక్స్ చెల్లించిన బంగారం అని నిరూపించి తీసుకురావాల్సి ఉంటుంది. లేకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.ఇదీ చదవండి: జీఎస్టీ రేట్ల తగ్గింపుపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటనకస్టమ్స్ డ్యూటీ చెల్లించకుండా.. పురుషులు 20 గ్రా, మహిళలు 40 గ్రా తెచ్చుకోవచ్చు. అయితే వీరు తెచ్చుకునే బంగారం.. గోల్డ్ బార్లు, కాయిన్స్ రూపంలో ఉండాలి. అయితే 15 ఏళ్లలోపు పిల్లలకు 40 గ్రా పరిమితి ఉంది. వీరికోసం కొనుగోలు చేసే బంగారం.. నగలు, గిఫ్ట్స్ రూపంలో ఉండాలి. కస్టమ్స్ డ్యూటీ వెరిఫికేషన్ సమయం.. బంగారం కొనుగోలుకు సంబంధించిన పూర్తి వివరాలను చూపించాల్సి ఉంటుంది. పిల్లలకు అయితే.. తల్లితండ్రులు లేదా గార్డియెన్లకు సంబంధించిన ఐడీ కార్డు ఉండాలి.బంగారం ధరలుభారతదేశంలో ఈ రోజు (మార్చి 10) 24 క్యారెట్ల 10 గ్రా గోల్డ్ రేటు రూ. 87820, 22 క్యారెట్ల 10 గ్రా బంగారం ధర రూ. 80,500గా ఉంది. దుబాయ్‌లో 10 గ్రా బంగారం విలువ 3,260 AED (దుబాయ్ కరెన్సీ). భారతీయ కరెన్సీ ప్రకారం రూ.77,281.46. అంటే ఇండియాకు.. దుబాయ్‌కు బంగారం విలువ తేడా సుమారు రూ. 3000. ఈ కారణంగానే చాలా మంది దుబాయ్ నుంచి బంగారం కొనుగోలు చేస్తారు. -
జీవ్ మే శివ్ హై.. వంతారా కృషిపై ఆధ్యాత్మిక గురువు స్పందన
వన్యప్రాణుల సంరక్షణలో అనంత్ అంబానీ చేస్తున్న విశేష కృషిని బాగేశ్వర్ ధామ్ ఆధ్యాత్మిక గురువు ధీరేంద్ర కృష్ణ శాస్త్రి ప్రశంసించారు. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ నేతృత్వంలోని ప్రపంచంలోనే అతిపెద్ద జంతు సంరక్షణ, పునరావాస కేంద్రం వంతారా ‘జీవ్ మే శివ్ హై’ అనే దృక్పథంతో పని చేస్తుందని చెప్పారు. ధీరేంద్ర శాస్త్రి వంతారా చేస్తున్న కృషిని కొనియాడుతూ వీడియో విడుదల చేశారు. అదికాస్తా వివిధ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.వీడియోలో ధీరేంద్ర కృష్ణ శాస్త్రి తెలిపిన వివరాల ప్రకారం..‘జీవ్ మే హి శివ్ హై.. ప్రతి జీవంలో శివుడు ఉంటాడు. ఇది అన్ని జీవుల్లో దైవిక ఉనికిని గుర్తించే తత్వం. ఎన్నో కారణాలవల్ల సంరక్షణకు నోచుకోని జంతువులకు కొత్త జీవితాన్ని అందించే కేంద్రం వంతారా ఎంతో కృషి చేస్తోంది. వంతారా అంటే ‘అటవీ నక్షత్రం’. దీని పేరుకు తగినట్లుగానే ఎన్నో వన్యప్రాణులను రక్షిస్తోంది. ఇందుకు అనంత్ అంబానీ అనుసరిస్తున్న విధానాలు ప్రశంసణీయం. వంతారా ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి వణ్యప్రాణుల సంరక్షణ చర్యలకు ప్రేరణ ఇస్తోంది. మానవాళికి సమస్త జీవరాశుల సంరక్షణ స్ఫూర్తిని పెంపొందిస్తోంది’ అని తెలిపారు. View this post on Instagram A post shared by Peepingmoon (@peepingmoonofficial)వంతారాఅనంత్ అంబానీ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో 3వేల ఎకరాల్లో వంతారా పేరుతో కృత్రిమ అడవిని ఏర్పాటు చేశారు. ఇందులో జంతువులు నివసించేందుకు వీలుగా సహజంగా ఉండేలా వసతులు ఏర్పాటు చేశారు. ఈ అడవిలో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రి ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్దది. పూర్తిగా పోర్టబుల్ ఎక్స్‌రే యంత్రాలు, శస్త్ర చికిత్సల కోసం లేజర్ యంత్రాలు, పాథాలజీ ల్యాబ్‌లు, హైపర్బారిక్ ఆక్సిజన్ ఛాంబర్‌తోపాటు అధునాతన సదుపాయాలు ఉన్నాయి. ఈ ఎలిఫెంట్ కేర్ సెంటర్లో 240కి పైగా ఏనుగులను రక్షించారు. అల్లోపతి, ఆయుర్వేదం, ఆక్యుపంక్చర్(చైనాలో మాదిరి సుదులతో గుచ్చి రోగాన్ని నయం చేయడం) వైద్యాన్ని సమ్మిళితం చేసే అధునాతన పశువైద్య చికిత్సలను వంతారాలో అందిస్తున్నారు. ఆర్థరైటిస్ చికిత్స కోసం హైడ్రోథెరపీ, గాయం నయం చేయడానికి హైపర్బారిక్ ఆక్సిజన్ ఛాంబర్ వంటి ప్రత్యేక సదుపాయాలున్నాయి.ఇదీ చదవండి: హోలీ గేట్‌వే సేల్.. రూ.1,199కే విమాన ప్రయాణం!‘ప్రాణి మిత్ర’గా గుర్తింపుఅనంత్ అంబానీకి జంతు సంరక్షణలో చేస్తున్న కృషికి గుర్తుగా ఇటీవల భారతదేశపు అత్యున్నత గౌరవమైన ప్రతిష్టాత్మక ‘ప్రాణి మిత్ర’ జాతీయ పురస్కారం లభించింది. ప్రాణి మిత్ర జాతీయ పురస్కారం జంతు సంరక్షణ విభాగంలో అందించే అత్యున్నత పురస్కారం. జంతువుల శ్రేయస్సుకు అవార్డు గ్రహీతలు చేసిన అసాధారణ కృషిని ఇది గుర్తిస్తుంది. గత ఐదేళ్లలో జంతు సంక్షేమానికి విశేష కృషి చేసిన సంస్థలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ సంస్థలు, సహకార సంఘాల కృషిని గుర్తించి భారత ప్రభుత్వం ఈ అవార్డును అందిస్తోంది. -
హోలీ గేట్‌వే సేల్.. రూ.1,199కే విమాన ప్రయాణం!
ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఇండిగో తన వినియోగదారులకు హోలీ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ‘హోలీ గెట్‌వే సేల్’ పేరుతో ఆకర్షణీయ ఆఫర్లను అందించింది. ఇది ప్రయాణికులు తక్కువ ధరలతే తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు అవకాశం కల్పిస్తుందని కంపెనీ తెలిపింది. ఇందులో భాగంగా మార్చి 10 నుంచి మార్చి 12, 2025 వరకు బుకింగ్స్ కోసం పరిమిత ఆఫర్‌ను అందిస్తుంది. ఈ సమయాల్లో విమాన టికెట్లు బుక్ చేసిన ప్యాసింజర్లు మార్చి 17 నుంచి సెప్టెంబర్ 21, 2025 వరకు ప్రయాణించేందుకు వీలు కల్పిస్తున్నట్లు పేర్కొంది.విమాన ఛార్జీలు ఇలా..ఈ హోలీ గెట్‌వే సేల్‌లో భాగంగా ఇండిగో దేశీయ రూట్లలో రూ.1,199, అంతర్జాతీయ రూట్లలో రూ.4,199 నుంచి వన్ వే విమాన ఛార్జీలు అమలు చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. రానున్న వేసవిలో విహారయాత్రలు, సెలవులకు వెళ్లే వారికి ఈ ఆఫర్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పింది. విమాన ఛార్జీల్లో తగ్గుదలతోపాటు యాడ్-ఆన్ సర్వీసుల్లో డిస్కౌంట్లను కూడా అందిస్తున్నట్లు పేర్కొంది. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలకు ప్రీపెయిడ్ అదనపు బ్యాగేజీపై 20 శాతం వరకు తగ్గింపు ఇస్తున్నారు. స్టాండర్డ్ సీట్ సెలక్షన్లో 35 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు. నిబంధనల ప్రకారం ముందుగా బుక్ చేసుకున్న వారికి భోజనం ఖర్చులో 10 శాతం తగ్గింపు ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది.ఇదీ చదవండి: ఐపీఎల్లో పొగాకు, మద్యం ఉత్పత్తుల ప్రకటనలపై నిషేధం?అదనంగా ఐదు శాతం తగ్గింపు..ఇండిగో అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా తమ విమానాలను బుక్ చేసుకునే ప్రయాణికులు అదనంగా 5 శాతం డిస్కౌంట్ పొందవచ్చని కంపెనీ పేర్కొంది. అయితే ఇండిగో హోలీ గెట్ వే సేల్ పరిధిలోని ఏయే గమ్యస్థానాలు వస్తాయో స్పష్టత ఇవ్వలేదు. సంస్థ విమానాల నెట్వర్క్ దేశీయ, అంతర్జాతీయ గమ్యస్థానాలను కవర్ చేస్తుంది. ప్రధానంగా ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, కోల్‌కతా వంటి ప్రసిద్ధ దేశీయ నగరాలతో పాటు దుబాయ్, సింగపూర్, బ్యాంకాక్, కౌలాలంపూర్ వంటి అంతర్జాతీయ గమ్యస్థానాలకు అధికంగా సర్వీసులు నడుపుతోంది. వీటికి ఉన్న పాపులారిటీ, కనెక్టివిటీ దృష్ట్యా ఈ సేల్‌లో ఈ గమ్యస్థానాలు భాగం అయ్యే అవకాశం ఉంది. -
ఐపీఎల్లో పొగాకు, మద్యం ఉత్పత్తుల ప్రకటనలపై నిషేధం?
ప్రజారోగ్యాన్ని పెంపొందించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మ్యాచ్‌లు, సంబంధిత కార్యక్రమాలు, జాతీయ టెలివిజన్ ప్రసారాల సమయంలో అన్ని రకాల పొగాకు, ఆల్కహాల్ ప్రకటనలను నిషేధించాలని కోరింది. ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించడంలో, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్సీడీ) వ్యాప్తిని నియంత్రించడంలో క్రీడల పాత్ర కీలకమని ఎత్తిచూపుతూ ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ సింగ్ ధుమాల్, బీసీసీఐకి లేఖ రాసింది.దేశంలో ఏటా సంభవించే మరణాల్లో 70 శాతం ఎన్సీడీల వల్ల జరుగుతున్నవేనని ఆరోగ్య మంత్రిత్వ శాఖ లేఖలో హైలైట్ చేసింది. పొగాకు, మద్యపానం హృదయ సంబంధ వ్యాధులు, క్యాన్సర్, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు, మధుమేహంతో సహా అనేక ఇతర రోగాలకు దోహదం చేసే ప్రధాన ప్రమాద కారకాలుగా ఉన్నాయని తెలిపింది. పొగాకు సంబంధిత మరణాల్లో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి దాదాపు 14 లక్షల మరణాలతో రెండో స్థానంలో ఉందని గణాంకాలను తెలియజేసింది.ఇదీ చదవండి: స్వల్పంగా పెరిగిన బంగారం ధర! తులం ఎంతంటే..క్రికెట్‌కు భారత్‌లో ఆదరణ పెరుగుతోందని తెలియజేస్తూ, క్రీడలు ప్రజల ఆరోగ్య సంరక్షణ బాధ్యతను నిర్వర్తించాలని చెప్పింది. పొగాకు లేదా ఆల్కహాల్ బ్రాండ్లను ప్రోత్సహించే ప్రకటనలను నిరోధించడానికి కఠినమైన నిబంధనలు అనుసరించాలని ఐపీఎల్, బీసీసీఐను మంత్రిత్వ శాఖ కోరింది. అంతేకాకుండా క్రీడాకారులు, కామెంటేటర్లు, ఇతర భాగస్వాములు పొగాకు, ఆల్కహాల్‌తో ముడిపడి ఉన్న ఉత్పత్తులను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రోత్సహించకుండా తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఐపీఎల్‌కు ఉన్న అపారమైన ప్రజాదరణ, రోల్ మోడల్స్‌గా క్రికెటర్ల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజారోగ్య కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని తెలిపింది. మార్చి 22 నుంచి ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభంకానుంది. -
స్వల్పంగా పెరిగిన బంగారం ధర! తులం ఎంతంటే..
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధర త్వరలో తులం రూ.ఒక లక్షకు చేరుతుందని కొందరు అంచనా వేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో సోమవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rate) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.80,500 (22 క్యారెట్స్), రూ.87,820 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.100, రూ.110 పెరిగింది.ఇదీ చదవండి: 100 మంది ఐటీ ఉద్యోగులు ర్యాలీ.. కారణం..చెన్నైలో సోమవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.100, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.110 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.80,500 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.87,820 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.100 పెరిగి రూ.80,650కు చేరుకోగా..24 క్యారెట్ల ధర రూ.110 పెరిగి రూ.87,970 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరలు పెరుగుతున్నా వెండి ధరల్లో మాత్రం తగ్గుదల కనిపిస్తుంది. సోమవారం వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. కేజీ వెండి రేటు(Silver Price) గతంతో పోలిస్తే రూ.100 తగ్గి రూ.1,08,000 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
రూ.550 కోట్లతో కూతురి పెళ్లి.. దివాలా తీసిన వ్యాపారవేత్త
ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికి తెలియదు. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయి. అలాంటి ఘటన ఒకటి బడా పారిశ్రామికవేత్త విషయంలో నిజమయ్యింది. ఒకప్పుడు ఉక్కు పరిశ్రమలో ప్రముఖ వ్యక్తిగా ప్రమోద్ మిట్టల్‌కు గొప్పపేరుండేది. విలాసవంతమైన జీవనశైలికి బ్రాండ్అంబాసిడర్గా ఉండే మిట్టల్ సుమారు రూ.24,000 కోట్ల అప్పు తీర్చలేక దివాలా తేశారు. ఒక్కప్పుడు తన కూతురి పెళ్లికి ఏకంగా రూ.550 కోట్లు ఖర్చు చేసి వార్తల్లో నిలిచిన ఆ వ్యక్తి ఎందుకు ఇంతలా దిగజారిపోయారు. అందుకుగల కారణాలను ఈ కథనంలో తెలుసుకుందాం.భారతీయ ఉక్కు దిగ్గజం, ప్రపంచంలోని అతిపెద్ద ఉక్కు మైనింగ్ కంపెనీ ఆర్సెలర్ మిట్టల్ ఛైర్మన్, దేశంలోని స్టీల్ పరిశ్రమలో ఎన్నో విజయాలు సాధించి ‘స్టీల్ మాగ్నెట్’గా పేరు తెచ్చుకున్న లక్ష్మీ మిట్టల్ సోదరుడే ఈ ప్రమోద్ మిట్టల్. మైనింగ్, మెటల్స్ రంగంలో లక్ష్మీ మిట్టల్ అత్యంత సంపన్నుల్లో ఒకరిగా కొనసాగుతుండగా, ప్రమోద్ అదృష్టం మరో మలుపు తిరిగింది. బిలియనీర్‌గా, ఇస్పాత్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్‌గా ప్రమోద్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని కొనసాగించారు. 2013లో తన కుమార్తె సృష్టి మిట్టల్ పెళ్లి కోసం రూ.550 కోట్లు వెచ్చించి వార్తల్లో నిలిచారు. స్పెయిన్‌లోని బార్సిలోనాలో జరిగిన ఈ వివాహ కార్యక్రమంలో రుచికరమైన వంటకాలు, విస్తారమైన అలంకరణలు, హైప్రొఫైల్ అతిథులు పాల్గొన్నారు.బోస్నియా కోక్ ఉత్పత్తిదారు గ్లోబల్ ఇస్పాత్ కోక్స్నా ఇండస్ట్రీస్ లుకావాక్ (జీఐకేఐఎల్) చేసిన అప్పులకు హామీదారుగా ప్రమోద్ మిట్టల్ పాత్ర ఉందని అధికారులు తెలిపారు. ఇది దాని ఆర్థిక బాధ్యతలను తీర్చడంలో విఫలమైంది. దాంతో ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరిగా ఉన్న ప్రమోద్ ఆర్థిక సామ్రాజ్యం కుప్పకూలింది. మోసం ఆరోపణలపై 2019లో బోస్నియాలో తనను అరెస్టు చేశారు. రూ.24,000 కోట్లకు పైగా అప్పులతో ప్రమోద్ దివాలా తీసినట్లు 2020లో లండన్ కోర్టు ప్రకటించింది. తుజ్లాలోని కంటోనల్ కోర్టు జీఐకేఐఎల్ నష్టపరిహారంగా దాదాపు 11 మిలియన్ యూరోలను డిపాజిట్ చేయాలని ప్రమోద్ను ఆదేశించింది. దాంతో అతని ఆర్థిక కష్టాలు మరింత పెరిగాయి.ఇదీ చదవండి: 100 మంది ఐటీ ఉద్యోగులు ర్యాలీ.. కారణం..ప్రమోద్ మిట్టల్ వ్యవహారం నేర్పే ఆర్థిక పాఠాలు..మితిమీరిన అప్పులు: మిట్టల్ ఆర్థిక ఇబ్బందులకు ప్రధాన కారణం మితిమీరిన అప్పులు చేయడం. తిరిగి చెల్లించే సామర్థ్యానికి మించి రుణాలు తీసుకోవడం వ్యక్తులకు, వ్యాపారాలకు దివాలాకు దారితీస్తుంది.వివేకవంతమైన ఖర్చు: తన కుమార్తె వివాహానికి విచ్చలవిడిగా ఖర్చు చేయడం, సంపదను ప్రదర్శించడం, అదుపులేని దుబారా వల్ల ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వానికి ప్రాధాన్యమివ్వడం కీలకం.రిస్క్ మేనేజ్మెంట్: జీఐకేఐఎల్ కేసులో మిట్టల్ చేసినట్లుగా రుణాలకు హామీదారుగా వ్యవహరించడం సరికాదు. అవతలి పక్షం అప్పులు చెల్లించడంలో డిఫాల్ట్ అయితే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. హామీలకు కట్టుబడి ఉండేముందు ప్రమాదాలను అర్థం చేసుకోవడం చాలా అవసరం.ఫైనాన్షియల్ ప్లానింగ్: అపారమైన సంపద ఉన్నప్పటికీ పేలవమైన ఆర్థిక ప్రణాళిక, ఆకస్మిక నిల్వలు లేకపోవడం దివాలాకు దారితీస్తుంది. అత్యవసర నిధిని నిర్వహించేటప్పుడు ఆస్తులను వైవిధ్యపరచడం చాలా ముఖ్యం. -
100 మంది ఐటీ ఉద్యోగులు ర్యాలీ.. కారణం..
ఐటీ రంగంలో ఆరోగ్యకరమైన వర్క్-లైఫ్ బ్యాలెన్స్(Work Life Balance) విధానానికి ఉద్యోగులు తమ మద్దతు ప్రకటిస్తున్నారు. వర్క్-లైఫ్ సమతుల్యత కోసం కర్ణాటక స్టేట్ ఐటీ/ఐటీఈఎస్ ఎంప్లాయీస్ యూనియన్ (కేఐటీయూ) ఆధ్వర్యంలో బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్ వద్ద 100 మందికి పైగా ఐటీ నిపుణులు సమావేశమయ్యారు. ఉద్యోగుల ఆరోగ్యం, మానసిక శ్రేయస్సుపై అధిక పని గంటలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. ప్రస్తుత పని విధానాలపై పెరుగుతున్న ఆందోళనలను పరిష్కరించడమే లక్ష్యంగా ఇటీవల ర్యాలీ నిర్వహించారు.ఐటీ రంగంలో ఉత్పాదకతను పెంచేందుకు పరిష్కారంగా పనివేళలను పొడిగించాలని సూచించిన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి, ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ సహా కొందరు పరిశ్రమ ప్రముఖులు ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ఈ నిరసన నిర్వహించారు. పని వేళలపై కంపెనీ ప్రముఖులు చేసిన ప్రకటనలు విస్తృత విమర్శలకు దారితీశాయి. చాలా మంది ఉద్యోగులు శారీరక, మానసిక ఆరోగ్యంపై అధిక పనివేళలు వంటి పద్ధతుల ప్రతికూల ప్రభావాన్ని ర్యాలీలో ఎత్తిచూపారు.అధిక పని ఒత్తిడితో సమస్యలుచాలా కాలంగా పని సంస్కృతితో ఐటీ రంగం విమర్శల పాలవుతోంది. ఇందులో వెంటనే సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరాన్ని కేఐటీయూ సభ్యులు నొక్కిచెప్పారు. కేఐటీయూ ప్రధాన కార్యదర్శి సుహాస్ అడిగ మాట్లాడుతూ..‘దేశంలో ఐటీ కంపెనీలు అనుసరిస్తున్న సుదీర్ఘ పని గంటల వల్ల ఉద్యోగులపై హానికరమైన ప్రభావాలు ఉంటున్నాయి. ఈ మేరకు అనేక అధ్యయనాలు, సర్వేలు వెల్లడవుతున్నాయి. ఈ రంగంలో 70 శాతానికి పైగా ఉద్యోగులు అధిక పని ఒత్తిడి కారణంగా మానసిక, ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. వెంటనే ప్రస్తుతం పని విధానంలో సంస్కరణలు తీసుకురావాలి’ అని డిమాండ్ చేశారు.రైట్ టు డిస్కనెక్ట్ విధానం..రోజువారీ పని గంటల పరిమితులను అమలు చేయడం, కార్మిక చట్ట ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోవడం, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో అవలంబిస్తున్నట్లు ‘రైట్ టు డిస్కనెక్ట్’(అధికారిక పని వేళలు పూర్తయితే ఈమెయిల్స్, కాల్స్ లేదా సందేశాలు వంటి కమ్యూనికేషన్లకు స్పందిచకూడదనే నిబంధన) విధానాన్ని అమలు చేయాలని యూనియన్ డిమాండ్ చేస్తుంది. పనిగంటలను క్రమబద్ధీకరించడంలో, కార్మిక చట్టాలను పాటించేలా చూడటంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం లేదని ఉద్యోగులు విమర్శించారు. ఓవర్ టైమ్ అలవెన్స్‌లు, చట్టబద్ధమైన పనిగంటల పరిమితులను ఉల్లంఘించారని ఆరోపిస్తూ గత ఏడాది కార్మిక మంత్రికి వినతిపత్రం సమర్పించినప్పటికీ ఈ సమస్యల పరిష్కారానికి నిర్దిష్టమైన చర్యలు తీసుకోలేదని యూనియన్ పేర్కొంది.ఇదీ చదవండి: నేటి నుంచి యూఎస్‌పై చైనా సుంకాలు.. వ్యూహాత్మక ప్రతీకారండిమాండ్లు తెలిపేందుకే ర్యాలీఉద్యోగులు తమ ఆందోళనలను వ్యక్తం చేయడానికి, పాలసీ విధానకర్తలకు తమ డిమాండ్లు తెలియజేయడానికి ఈ ర్యాలీ ఒక వేదికగా నిలిచిందని ఉద్యోగులు భావిస్తున్నారు. ఈ ర్యాలీలోని ఒక ఐటీ ఉద్యోగి స్పందిస్తూ..‘మేము మా ఉద్యోగాలను ప్రేమిస్తాం. పరిశ్రమకు సహకారం కొనసాగించాలనుకుంటున్నాం. కానీ అదే సమయంలో మా ఆరోగ్యం, వ్యక్తిగత జీవితాలను పణంగా పెట్టం’ అని అన్నారు. ప్రస్తుత పని విధానాలకు వ్యతిరేకంగా ఐటీ నిపుణుల్లో పెరుగుతున్న అవగాహన, వ్యతిరేకతను ఈ కార్యక్రమం హైలైట్ చేసింది. దేశంలోని అత్యంత ప్రముఖ పరిశ్రమల్లో ఐటీ ఒకటి. ఈ విభాగంలో ఉద్యోగుల్లో స్నేహపూర్వక పని వాతావరణాన్ని సృష్టించడానికి సమష్టి కృషి అవసరం. -
క్రమంగా పెరుగుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఇటీవల కాలంలో భారీగా పడిన మార్కెట్ సూచీలు గడిచిన నాలుగు సెషన్ల నుంచి క్రమంగా పెరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:25 సమయానికి నిఫ్టీ(Nifty) 39 పాయింట్లు ఎగబాకి 22,594కు చేరింది. సెన్సెక్స్(Sensex) 112 పాయింట్లు పెరిగి 74,441 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 103.8 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 70.02 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.28 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.56 శాతం లాభపడింది. నాస్డాక్ 0.71 శాతం ఎగబాకింది.ఇదీ చదవండి: నేటి నుంచి యూఎస్‌పై చైనా సుంకాలు.. వ్యూహాత్మక ప్రతీకారంఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు ప్రపంచ పరిస్థితులు, స్థూల ఆర్థిక గణాంకాలపై దృష్టి పెట్టనున్నాయి. వీటికితోడు యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ టారిఫ్‌ల విధింపు చర్యలకూ ప్రాధాన్యత ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. టారిఫ్‌ల కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ నీరసించవచ్చన్న అంచనాలు తెరమీదకు వస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో గత వారం యూఎస్ టెక్నాలజీ దిగ్గజాలు డీలాపడటంతో నాస్డాక్ ఇండెక్స్ పతనమైన సంగతి తెలిసిందే. గ్లోబల్ ట్రెండ్ సైతం దేశీయంగా సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. కాగా..ఈ వారం మార్కెట్లు నాలుగు రోజులే పనిచేయనున్నాయి. వారాంతాన(14న) హోలీ పండుగ సందర్భంగా మార్కెట్లకు సెలవు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నేటి నుంచి యూఎస్‌పై చైనా సుంకాలు.. వ్యూహాత్మక ప్రతీకారం
ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు అమెరికా-చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం(Trade Tensions) ముదురుతోంది. ఇటీవల అమెరికా చైనా దిగుమతులపై సుంకాలు(tariffs) విధిస్తున్నట్లు ప్రకటించింది. చైనా దిగుమతులపై సుంకాలను 10 నుంచి 20 శాతానికి పెంచుతూ యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. దీనికి ప్రతీకారంగా సోమవారం నుంచి అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై బీజింగ్ సుంకాలు అమలు చేసింది.ట్రంప్ ఓటర్ బేస్ లక్ష్యంగా..కొత్త చైనా సుంకాలు చికెన్, గోధుమ, మొక్కజొన్న, పత్తితో సహా యూఎస్ వ్యవసాయ ఉత్పత్తుల శ్రేణిపై 10-15 శాతంగా అమలు చేస్తున్నారు. అలాగే సోయాబీన్స్, పంది మాంసం, పాడి ఉత్పత్తులపై కూడా ఈ సుంకాలు అమలు చేయాలని చైనా నిర్ణయించింది. అమెరికాలో ట్రంప్ ఓటర్ బేస్‌ను ఆధారంగా చేసుకొని, వ్యవసాయ రాష్ట్రాల్లోని వారే లక్ష్యంగా ఈ సుంకాలను చైనా జాగ్రత్తగా రూపొందించినట్లు ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.పరిస్థితులు మరింత క్లిష్టతరం?యూఎస్-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తీవ్రతరం కావడంతో చైనా నాయకత్వం సవాళ్లను ఎదుర్కొంటోంది. దేశ ఆర్థిక వ్యవస్థ మందకొడిగా సాగుతోంది. వినియోగదారుల వ్యయ సామర్థ్యం తగ్గుతోంది. దీర్ఘకాలిక స్థిరాస్తి రంగం సంక్షోభంలోకి వెళుతుంది. రికార్డు స్థాయిలో యువత నిరుద్యోగంతో అవస్తలు పడుతున్నారు. ఈ క్రమంలో వాణిజ్య యుద్ధం ఒత్తిళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు, చైనా తన ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడానికి చేస్తున్న ప్రయత్నాలు పరిస్థితులను మరింత క్లిష్టతరం చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ అడ్డంకులు ఉన్నప్పటికీ పరిస్థితిని మెరుగ్గా నిర్వహిస్తామని చైనా అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. టారిఫ్‌ల ప్రభావాన్ని ఎదుర్కోవడానికి క్రియాశీల ఆర్థిక విధానాల అవసరాన్ని నొక్కిచెప్పిన చైనా అధ్యక్షుడు జీజిన్‌పింగ్‌కు సన్నిహితుడైన లీ కియాంగ్ ఇటీవల ఈ సంవత్సరానికి 5 శాతం ఆర్థిక వృద్ధి లక్ష్యాన్ని నిర్దేశించారు.ఇదీ చదవండి: మహిళలకూ కావాలి సమగ్ర బీమాచర్చలకు దారి తీస్తాయా..ఇరు దేశాల మధ్య వాణిజ్య వివాదం ముదురుతున్న కొద్దీ పరస్పరం ఆర్థిక వృద్ధిపై ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. బీజింగ్ సుంకాలు అమెరికాపై రాజకీయ ఒత్తిడి తీసుకురావడానికి రూపొందించినప్పటికీ అవి ఇరు వర్గాల మధ్య చర్చలకు దారితీసే అవకాశం కూడా కల్పిస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ వ్యూహాలు పరిష్కారానికి దారితీస్తాయా లేదా మరింత ఉధృతికి అవకాశం కల్పిస్తాయా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. -
మహిళలకూ కావాలి సమగ్ర బీమా
సంరక్షకులుగా, కుమార్తెలుగా, మాతృమూర్తులుగా తమ కుటుంబాల సంక్షేమం కోసం మహిళలు సమాజంలో ఎంతో కీలకమైన, వైవిధ్యమైన పాత్రలు పోషిస్తుంటారు. అయితే ఈ బాధ్యతలను నిర్వర్తించడంలో వారు సాధారణంగానే తమ సొంత ఆర్థిక, వైద్య భద్రత విషయాలను అంతగా పట్టించుకోరు. అందుకే చాలా మంది మహిళలకు తగినంత బీమా భద్రత లేకపోవడమో లేదా పూర్తిగా తమ జీవిత భాగస్వామి లేదా బంధువు బీమాపైనో ఆధారపడాల్సిన పరిస్థితి ఉంటోంది. జీవిత కాలం ఎక్కువగా ఉండటం, కెరియర్లో అంతరాయాలు, భారీ ఆరోగ్య సంరక్షణ ఖర్చుల్లాంటి ప్రత్యేక ఆరోగ్య, ఆర్థిక సవాళ్లెన్నో మహిళలకు ఉంటాయి. అందుకే వారి స్వాతంత్య్రానికి, స్థిరత్వానికి తగినంత బీమా రక్షణ ఉండటం ఎంతో అవసరం.కీలకంగా బీమా ..సాధారణంగా పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువ కాలం జీవించినప్పటికీ, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక పరిమితుల కారణంగా సుదీర్ఘ కాలం పాటు మెరుగైన జీవితాన్ని గడిపే అవకాశం ఉండకపోవచ్చు. సమగ్రమైన బీమా కవరేజీ ఉంటే సముచితమైన ఆరోగ్య సంరక్షణ పొందడానికి అవకాశాలు గణనీయంగా మెరుగుపడగలవు. 2023, 2024 మధ్య కాలంలో చూస్తే 15 నుంచి 49 ఏళ్ల వరకు వయస్సున్న మహిళల్లో 30 శాతం మందికి ఎటువంటి ఆరోగ్య బీమా గానీ ఆర్థిక రక్షణ కవచం గానీ లేదని వెల్లడైంది. ఇలా చాలా మంది మహిళలు తమ సొంత అవసరాలను పక్కన పెట్టి కుటుంబ అవసరాలకే ప్రాధాన్యమిస్తుంటారు. ఆర్థిక పరిమితుల వల్ల నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను పొందలేకపోతుంటారు.మెటర్నిటీ, కుటుంబ భద్రతప్రసవానికి పూర్వ పరీక్షలు, ప్రసవ వ్యయాలు, ప్రసవానంతర సంరక్షణ, నవజాత శిశువుల వైద్య అవసరాలకు అవసరమైన కీలక ఆర్థిక సహాయాన్ని మెటర్నిటీ ఇన్సూరెన్స్ అందిస్తుంది. పిల్లల కోసం సన్నద్ధమవుతున్న యువ జంటలకు ఇలాంటి పాలసీలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. శిశుజననం, సంబంధిత ఖర్చుల విషయంలో ఆర్థికంగా సన్నద్ధంగా ఉండేందుకు ఇవి సహాయకరంగా ఉంటాయి. చాలా మంది మహిళలు సాధారణంగా ఉద్యోగాలు చేసే సంస్థ ఇచ్చే బీమాపైనో లేదా జీవిత భాగస్వామి బీమాపైనో ఆధారపడుతుంటారు. కానీ సొంతంగా పాలసీ ఉంటే మరింత ఆర్థిక భద్రత ఉంటుంది. కెరియర్ మార్పుల వల్ల లేదా జీవితంలో మార్పుల వల్ల కవరేజీపై ప్రభావం పడే పరిస్థితుల్లో ఇదెంతో అండగా ఉంటుంది.రిటైర్మెంట్, దీర్ఘకాలిక సంరక్షణ ప్రణాళికమహిళలు సాధారణంగా పెద్ద వయస్సులోని బంధువుల బాగోగులను చూసుకునే సంరక్షకుల పాత్రను కూడా పోషిస్తూ ఉంటారు. ఇది భావోద్వేగాలపరంగా, ఆర్థికంగా భారంగా ఉండొచ్చు. దీర్ఘకాలిక సంరక్షణ బీమా అనేది వైద్య వ్యయాలను, ఆర్థిక ఒత్తిళ్లను అధిగమించేందుకు ఉపయోగపడుతుంది. సంరక్షకులు అలాగే వారిపై ఆధారపడిన వారికి కూడా మెరుగైన సహాయం లభించేలా తోడ్పడుతుంది. అంతేగాకుండా, జీవిత కాలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రిటైర్మెంట్ త ర్వాత కూడా స్థిరమైన, మెరుగైన జీవితాన్ని సాగించేలా మహిళలు పెన్షన్ ప్లాన్లు లేదా యాన్యుటీ ఆధారిత బీమా పాలసీలను తప్పక పరిశీలించాలి.వైకల్యం, ఆదాయ భద్రతపిల్లల సంరక్షణ కోసం కావచ్చు లేదా వయస్సు పైబడుతున్న తల్లిదండ్రుల సంరక్షణ కోసం కావచ్చు చాలా మంది మహిళలకు కెరియర్లో అంతరాయాలు ఏర్పడుతుంటాయి. దీనితో వారు పని చేసే కంపెనీల నుంచి బీమా ప్రయోజనాలు పరిమితంగానే ఉండొచ్చు. అలాగే దీర్ఘకాలిక పొదుపు కూడా తగ్గుతుంది. అనారోగ్యం లేదా ప్రమాదం బారిన పడి పని చేసే పరిస్థితి లేనప్పుడు కూడా స్థిరమైన ఆదాయం లభించేలా డిజేబిలిటీ ఇన్సూరెన్స్ అనేది ఆర్థిక భద్రతను అందిస్తుంది. జీవితపు అనిశ్చితుల్లోనూ ఆర్థిక భద్రత ఉండేందుకు ఈ రక్షణ ఉపయోగపడుతుంది.స్థిరమైన భవిష్యత్తుకు రక్షణ కవచంమహిళలు తమ ఆర్థిక స్వతంత్రత, ఆరోగ్య సంరక్షణ భద్రతకు తప్పక ప్రాధాన్యమివ్వాలి. వీలైనంత ముందుగా సమగ్ర బీమా పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల, అనూహ్య ఆర్థిక కష్టాల నుంచి రక్షణను, దీర్ఘకాలికంగా స్థిరత్వాన్ని పొందేందుకు వీలవుతుంది. క్రియాశీలకమైన చర్యలు తీసుకోవడం ద్వారా అనుకోని సవాళ్ల నుంచి మహిళలు తమను, తమ కుటుంబాలను రక్షించుకోవచ్చు.స్వతంత్రంగా నిర్ణయాలుతొలినాళ్లలోనే బీమా పాలసీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మహిళలు ఆర్థిక ప్రణాళికల విషయంలో క్రియాశీలకంగా వ్యవహరించాలి. చిన్న వయస్సులోనే బీమా తీసుకోవడం వల్ల ప్రీమియంల భారం తక్కువగా ఉంటుంది. అలాగే ప్రీ–ఎగ్జిస్టింగ్ కండీషన్స్‌కి సంబంధించిన ఎక్స్‌క్లూజన్స్ కూడా తగ్గుతాయి. యుక్తవయస్సులోని చాలా యువతులకు తమ తల్లిదండ్రుల హెల్త్ ఇన్సూరెన్స్‌తో కవరేజీ లభిస్తుంది. అయితే, స్వతంత్ర పాలసీకి మారడం వల్ల, డిపెండెంట్ కవరేజీ వయో పరిమితిని దాటిన తర్వాత కూడా నిరంతరాయ కవరేజీ, అదనపు ప్రయోజనాలను పొందవచ్చు.ఇదీ చదవండి: ఈటీఎఫ్‌లు–ఇండెక్స్ ఫండ్స్ మధ్య వ్యత్యాసం?స్మార్ట్ ఆర్థిక ప్రణాళికఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ, 80డీ కింద జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీలకు పన్ను ప్రయోజనాలు ఉంటాయి. ఆ రకంగా చూస్తే ఇవి ఆర్థికంగా స్మార్ట్ పెట్టుబడి సాధనాలుగా కూడా ఉంటాయి. వీలైనంత ముందుగా ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టిన మహిళలకు తక్కువ ప్రీమియంలతో ఎక్కువ కవరేజీ, తద్వారా దీర్ఘకాలం పాటు ఆర్థిక భద్రత ప్రయోజనాలు లభిస్తాయి. మెటర్నిటీ కేర్, డెలివరీ, ఫెర్టిలిటీ చికిత్సలు సహా మహిళలకు సంబంధించిన ప్రత్యేకమైన ఆరోగ్యసంరక్షణ అవసరాలను తీర్చే విధంగా బీమా పాలసీలు ఉంటాయి. మూడేళ్ల పాటు లైఫ్ కవరేజీ సహా సరోగేట్ తల్లులకు పూర్తి కవరేజీ ఉండాలని బీమా రంగ నియంత్రణ మరియు అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) నిర్దేశిస్తోంది.-అమితాబ్ జైన్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ -
ఈటీఎఫ్‌లు–ఇండెక్స్ ఫండ్స్ మధ్య వ్యత్యాసం?
ఈటీఎఫ్‌లు, ఇండెక్స్ ఫండ్స్ మధ్య వ్యత్యాసం ఏంటి? – దీప్తిఈ రెండు సాధనాల మధ్య సూక్ష్మమైన వ్యత్యాసమే ఉంది. ఈ రెండూ కూడా ప్యాసివ్ పెట్టుబడుల కోసం రూపొందించినవే. ఇండెక్స్‌ను (నిఫ్టీ50, సెన్సెక్స్ తదితర) ప్రతిఫలిస్తూ పెట్టుబడులు పెడుతుంటాయి. వీటిల్లో వ్యయాలు చాలా తక్కువ. చూడ్డానికి ఈ రెండు ఒకే విధంగా ఉన్నప్పటికీ, వాటిల్లో పెట్టుబడుల పరంగా వ్యత్యాసం ఉంటుంది. ధరల అస్థిరతల భయం లేకుండా ఇన్వెస్ట్ చేసుకునేందుకు ఇండెక్స్ ఫండ్స్ వీలు కల్పిస్తాయి. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో వీటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. చాలా సులభంగా, పెట్టుబడులను ఆటోమేట్ చేసే సాధనమే ఇండెక్స్ ఫండ్స్. ఈటీఎఫ్‌లు అలా కాదు. ఇవి స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ట్రేడ్ అవుతుంటాయి. వీటిని మీరే స్వయంగా కొనుగోలు చేసుకోవాలి. అందుకోసం ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాలుండాలి. కొనుగోళ్లపై బ్రోకర్, ఇతర చార్జీలు చెల్లించాలి. దీర్ఘకాల ఇన్వెస్టర్లకు ఇండెక్స్ పండ్స్ సులభమైన ఎంపిక. వీటిని తరచుగా పర్యవేక్షించుకోనక్కర్లేదు. సిప్ రూపంలో పెట్టుబడి పెట్టుకోవచ్చు. డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలుండి, మార్కెట్ కదలికలను అర్థం చేసుకుని పెట్టుబడులు పెట్టే వారికి ఈటీఎఫ్‌లు అనుకూలం.ఇదీ చదవండి: బిజినెస్‌లో గుజరాతీల సక్సెస్ సీక్రెట్స్.. ‘ఎక్స్’ పోస్ట్ వైరల్నేను ఒకే అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ పరిధిలో (ఏఎంసీ) ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) ఫండ్ నుంచి, మరో ఈక్విటీ పథకంలోకి సిస్టమ్యాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ (ఎస్టీపీ) ద్వారా పెట్టుబడులను మార్చుకోవాలని అనుకుంటున్నాను. దీనిపై దీర్ఘకాల మూలధన లాభాల పన్ను పడుతుందా? – శ్రీకాంత్ ఎన్వీఈఎల్ఎస్ఎస్ పథకం నుంచి మరో ఈక్విటీ పథకంలోకి ఎస్టీపీ చేసుకుంటే అప్పుడు దీర్ఘకాల మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది. ఆ రెండు ఒకటే ఏఎంసీ పరిధిలో ఉన్నా సరే ఈ నిబంధనే వర్తిస్తుంది. ఇన్వెస్టర్ ఎస్టీపీ ద్వారా ఒక ఈక్విటీ పథకంలోని పెట్టుబడులను క్రమంగా మరో ఈక్విటీ పథకంలోకి మార్చుకునేందుకు వీలు కల్పిస్తుంది. మధ్యలో బ్యాంక్ ఖాతా అవసరం ఉండదు. కానీ, పన్ను పరంగా చూస్తే ప్రతీ ఎస్టీపీ బదిలీని ఉపసంహరణగానే చట్టం కింద పరిగణిస్తారు. తిరిగి తాజా పెట్టుబడి కింద చూస్తారు. ఈఎల్ఎస్ఎస్ పథకాల్లో పెట్టుబడికి మూడేళ్ల లాకిన్ పీరియడ్ వర్తిస్తుంది. మూడేళ్ల కాలం ముగిసిన యూనిట్లనే ఎస్టీపీ ద్వారా బదిలీ చేసుకోగలరు. ఉపసంహరణపై వచ్చిన లాభం ఒక ఆర్థిక సంత్సరంలో రూ.1.25 లక్షలు మించితే, అదనపు మొత్తంపై 12.5 శాతం పన్ను పడుతుంది. పన్ను పడకుండా ఎస్టీపీ చేసుకోవాలంటే ఒక ఆర్థిక సంవత్సరంలో ఉపసంహరణ, బదిలీ అన్నది రూ.1.25 లక్షలు మించకుండా చూసుకోవాలి.- ధీరేంద్ర కుమార్, సీఈఓ, వ్యాల్యూ రీసెర్చ్ -
ఈ ఏడాది మరో 500 నగరాల్లో సర్వీసులు
న్యూఢిల్లీ: ఈ ఏడాది మరో 500 నగరాల్లో సర్వీసులను విస్తరించే ప్రణాళికల్లో ఉన్నట్లు రైడ్ సేవల సంస్థ ర్యాపిడో సహ వ్యవస్థాపకుడు పవన్ గుంటుపల్లి వెల్లడించారు. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మార్కెట్లలో 50 పైచిలుకు నగరాల్లో సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. తదుపరి తమిళనాడు, కర్ణాటకలో, ఆ తర్వాత ఉత్తరాది రాష్ట్రాల్లోను విస్తరించనున్నట్లు పవన్ చెప్పారు. ప్రస్తుతం రోజుకు 33 లక్షల రైడ్లు నమోదవుతున్నాయన్నారు. ఇందులో 15 లక్షలు టూ–వీలర్ల విభాగంలో, 13 లక్షలు త్రీ–వీలర్ సెగ్మెంట్లో, 5 లక్షల రైడ్స్ కార్ల విభాగంలో ఉంటున్నాయని పవన్ చెప్పారు. గతేడాదే తాము ఫోర్ వీలర్ల విభాగంలోకి ప్రవేశించినా, గణనీయంగా వృద్ధి నమోదు చేశామని తెలిపారు. తాము కమీషన్ ప్రాతిపదికన కాకుండా ప్లాట్‌ఫాం యాక్సెస్ ఫీజు విధానాన్ని అమలు చేయడం వల్ల కెప్టెన్లకు (డ్రైవర్లు) ఆదాయ అవకాశాలు మరింతగా ఉంటాయని పవన్ చెప్పారు. కంపెనీ వద్ద గణనీయంగా నిధులు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం పబ్లిక్ ఇష్యూకి వచ్చే యోచనేదీ లేదన్నారు. ప్రస్తానికి కార్యకలాపాల విస్తరణపైనే ఫోకస్ చేస్తున్నట్లు చెప్పారు. -
గ్రాన్యూల్స్ ఇండియాకు ఎఫ్‌డీఏ అక్షింతలు
ముంబై: ఫార్ములేషన్స్ ప్లాంటులో నిర్వహణ లోపాలకు గాను గ్రాన్యూల్స్ ఇండియాను అమెరికా ఆహార, ఔషధ రంగ నియంత్రణ సంస్థ యూఎస్ఎఫ్డీఏ తీవ్రంగా ఆక్షేపించింది. ఔషధాలను నిల్వ చేయడంలో, యంత్ర పరికరాల పరిశుభ్రత, నిర్వహణ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు నిరూపించడంలో విఫలమైనట్లు వ్యాఖ్యానించింది. తెలంగాణలోని మేడ్చల్–మల్కాజిగిరి తయారీ ప్లాంటులో గతేడాది ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 6 వరకు నిర్వహించిన తనిఖీలకు గాను కంపెనీ సీఎండీ కృష్ణప్రసాద్ చిగురుపాటికి ఎఫ్‌డీఏ ఈ మేరకు హెచ్చరిక లేఖ పంపింది. ఔషధాలు కలుషితం కాకుండా నివారించే ఫిల్టర్లు ఉన్నప్పటికీ, వాటిని సరిగ్గా శుభ్రం చేయకపోవడం వల్ల అవి నిరుపయోగంగా మారాయని తనిఖీల్లో తేలినట్లు పేర్కొంది. తయారీ, ప్రాసెసింగ్, ప్యాకింగ్, నిల్వకు ఉపయోగించే బిల్డింగ్‌ల నిర్వహణ సరిగ్గా లేదని వ్యాఖ్యానించింది. ఎయిర్ ప్యూరిఫికేషన్ యూనిట్లు, డక్ట్లు, ఫ్లోర్‌ల్లాంటి నిర్దిష్ట ప్రదేశాల్లో పక్షుల రెట్టలు, ఈకలు కనిపించినట్లు పేర్కొంది. దిద్దుబాటు చర్యలపై సంతృప్తి కలిగేంత వరకు కంపెనీ సమర్పించే కొత్త ఔషధాల దరఖాస్తులకు అనుమతులను నిలిపివేయొచ్చని పేర్కొంది. -
దేశీ ఎయిర్‌లైన్స్‌లో అవకాశాలపై ఐబీఎస్ ఫోకస్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ట్రావెల్ పరిశ్రమకు సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్విస్ (సాస్) సేవలు అందించే ఐబీఎస్ సాఫ్ట్వేర్ .. భారత ఎయిర్‌లైన్స్ రంగంలో, లాయల్టీ ప్రోగ్రామ్స్ విభాగంలో అవకాశాలను అందిపుచ్చుకోవడంపై దృష్టి పెడుతోంది. తాము ప్రస్తుతం భారత్‌లో ఎయిర్ కార్గో నిర్వహణ విభాగంలో, అలాగే ఎయిరిండియాకి స్టాఫ్ ట్రావెల్ మేనేజ్మెంట్కి సంబంధించి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అందిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు, చైర్మన్ వీకే మాథ్యూస్ తెలిపారు. మిగతా పోటీ సంస్థలతో పోలిస్తే తమ ఉత్పత్తులు కాస్త ఖరీదైనవిగానే ఉంటాయి కాబట్టి తగిన భాగస్వామిని ఎంచుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ధరకు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చే భారత మార్కెట్లో ఐటీని విలువను చేకూర్చేదిగా కాకుండా ఖర్చుగానే పరిగణిస్తారని, కానీ ప్రస్తుతం ఆ ధోరణి క్రమంగా మారుతోందని మాథ్యూస్ చెప్పారు. ఇప్పుడు ధరే ప్రాతిపదికగా ఉంటున్నప్పటికీ ఎకానమీ పురోగమించే కొద్దీ విలువకు ప్రాధాన్యత పెరుగుతుందన్నారు. మిగతా మార్కెట్లలోలాగా భారత్, చైనా మార్కెట్లలో తాము అంత విజయం సాధించలేకపోయామని అంగీకరించిన మాథ్యూస్ భారత మార్కెట్‌కి గణనీయంగా వృద్ధి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. వచ్చే 20 ఏళ్ల పాటు వృద్ధి బాటలో కొనసాగుతుందన్నారు. కస్టమర్లతో మెరుగైన సంబంధాలు, అత్యుత్తమ టెక్నాలజీ సిస్టంలు, ట్రావెల్ కామర్స్ మొదలైనవి పరిశ్రమలో కీలక ట్రెండ్స్‌గా ఉంటున్నాయన్నారు. -
గ్లోబల్ ట్రెండ్, గణాంకాలపై దృష్టి
ముంబై: ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు ప్రపంచ పరిస్థితులు, స్థూల ఆర్థిక గణాంకాలపై దృష్టి పెట్టనున్నాయి. వీటికితోడు యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ టారిఫ్‌ల విధింపు చర్యలకూ ప్రాధాన్యత ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. టారిఫ్‌ల కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ నీరసించవచ్చన్న అంచనాలు తెరమీదకు వస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో గత వారం యూఎస్ టెక్నాలజీ దిగ్గజాలు డీలాపడటంతో నాస్డాక్ ఇండెక్స్ పతనమైన సంగతి తెలిసిందే. దీంతో గ్లోబల్ ట్రెండ్ సైతం దేశీయంగా సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. కాగా.. ఈ వారం మార్కెట్లు నాలుగు రోజులే పనిచేయనున్నాయి. వారాంతాన(14న) హోలీ పండుగ సందర్భంగా మార్కెట్లకు సెలవు. ఐఐపీ, సీపీఐ జనవరి నెలకు పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) గణాంకాలు బుధవారం(12న) విడుదలకానున్నాయి. 3.7 శాతం వృద్ధి నమోదుకాగలదని అంచనా. 2024 జనవరిలో 4.2 శాతం పురోగమించగా.. డిసెంబర్లో 3.2 శాతం వృద్ధి చూపింది. ఇక ఫిబ్రవరి నెలకు రిటైల్ ధరల ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలు సైతం విడుదలకానున్నాయి. 2025 జనవరిలో సీపీఐ 3.2 శాతంగా నమోదైంది. 2024 డిసెంబర్లో నమోదైన 3 శాతంతో పోలిస్తే స్వల్పంగా పెరిగింది. ఇతర అంశాలూ కీలకమే దేశీయంగా విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఇటీవల నిరంతరంగా అమ్మకాలు చేపడుతున్నారు. దీంతో ఎఫ్‌పీఐల తీరు మార్కెట్లలో కీలకంగా నిలుస్తున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. కాగా.. మరోవైపు యూఎస్ డాలరుతోపాటు ట్రెజరీ ఈల్డ్స్ బలపడటం అటు మార్కెట్లను, ఇటు రూపాయినీ దెబ్బతీస్తున్నాయి. వీటితోపాటు రాజకీయ భౌగోళిక అనిశి్చతులు, ముడిచమురు ధరలు సైతం ఇన్వెస్టర్లను ఆందోళనకు లోను చేస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. గత వారమిలాగత వారం(3–7) దేశీ స్టాక్ మార్కెట్లు భారీ అమ్మకాల నుంచి బయటపడ్డాయి. ఇండెక్సులు బౌన్స్‌బ్యాక్ అయ్యాయి. సెన్సెక్స్ నికరంగా 1,134 పాయింట్లు(1.6 శాతం) ఎగసి 74,333 వద్ద నిలిచింది. నిఫ్టీ మరింత అధికంగా 428 పాయింట్లు(2 శాతం) జంప్‌చేసి 22,553 వద్ద స్థిరపడింది. యూఎస్ టారిఫ్‌ల విధింపు ఆలస్యంకానున్న అంచనాలు, వీటిపై చర్చలకు ఆస్కారమున్నట్లు వెలువడిన అంచనాలు మార్కెట్లు బలపడేందుకు దోహదం చేసినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్విసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ తెలియజేశారు.అమ్మకాలువీడని ఎఫ్పీఐలుమార్చి తొలివారంలో రూ. 24,753 కోట్లు దేశీ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) అమ్మకాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఈ నెలలో ఇప్పటి(7)వరకూ రూ. 24,753 కోట్ల(2.8 బిలియన్ డాలర్లు) పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఫిబ్రవరిలో రూ. 34,574 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. జనవరిలోనూ రూ. 78,027 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. వెరసి ఈ కేలండర్ ఏడాది(2025)లో ఇప్పటిరకూ రూ. 1.37 లక్షల విలువైన స్టాక్స్ విక్రయించారు. ప్రపంచ వాణిజ్య ఆందోళనలు, దేశీ కార్పొరేట్ ఫలితాల నిరాశ వంటి అంశాలు ప్రభావం చూపుతున్నాయి. 2024 డిసెంబర్ 13 నుంచి చూస్తే ఎఫ్‌పీఐలు దేశీ స్టాక్ మార్కెట్ల నుంచి నికరంగా 17.1 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఉపసంహరించారు. -
మీ బ్యాంక్ డిపాజిట్ ఎంత భద్రం?
ముంబైకి చెందిన ధన్‌రాజ్ (50) ఉదయం నిద్రలేచి, పేపర్ చూడగానే ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యాడు. న్యూ ఇండియా సహకార బ్యాంక్‌లో స్కామ్ జరిగిందనేది ఆ వార్త సారాంశం. చిరుద్యోగి అయిన ధన్‌రాజ్ తన కుమార్తె వివాహం కోసమని రూ.4 లక్షలను అదే బ్యాంక్‌లో కొన్నాళ్ల క్రితం డిపాజిట్ చేశాడు. కంగారుగా బ్యాంక్ శాఖకు చేరుకుని విచారించగా, డిపాజిట్లకు ఢోకా లేదన్న సమాచారం విని కాస్తంత కుదుటపడ్డాడు. రూ.5 లక్షల వరకు డిపాజిట్లపై బీమా సదుపాయం ఉంటుందని కస్టమర్లు చెప్పుకుంటుండగా విని.. హమ్మయ్య అని ఊపిరిపీల్చుకున్నాడు. బ్యాంక్ డిపాజిట్.. దేశంలో చాలా మందికి తెలిసిన, ఇష్టమైన పెట్టుబడి సాధనం. చాలా మంది తమ పొదుపు సొమ్మును డిపాజిట్ రూపంలో మదుపు చేయడం కూడా చూస్తుంటాం. కానీ, ఇందులో ఉండే రిస్క్ ల గురించి అవగాహన ఉండదు. డిపాజిటర్లు అందరూ దీనిపై ఓసారి దృష్టి సారించాల్సిన అవసరాన్ని న్యూ ఇండియా కో ఆపరేటివ్ బ్యాంక్ ఉదంతం గుర్తు చేస్తోంది. ఒకప్పుడు ప్రతి కుటుంబ ఆర్థిక సాధనాల్లో బ్యాంక్ డిపాజట్ (ఎఫ్డీ) తప్పకుండా ఉండేది. కాలక్రమంలో ఇతర సాధనాల పట్ల ఆసక్తి పెరుగుతూ వస్తోంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ ఈటీఎఫ్‌లు తదితర వాటిల్లో పెట్టుబడులు పెరుగుతూ, డిపాజిట్లు తగ్గుతున్నాయి. ఇప్పటికీ 15 శాతం గృహ పొదుపులు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లలోకే (ఎఫ్డీలు/టర్మ్ డిపాజిట్లు) వెళుతున్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఎఫ్డీలు ఎంతో మందికి నమ్మకమైన, మెరుగైన సాధనం. దీర్ఘకాలంలో గొప్ప రాబడి రాకపోయినా సరే, అత్యవసరంలో వేగంగా వెనక్కి తీసుకునేందుకు అనుకూలంగా ఉండడం చాలా మందికి నచ్చే అంశం. పైగా డిపాజిట్ అంటే ఏ మాత్రం రిస్క్ ఉండదని చాలా మంది అభిప్రాయపడుతుంటారు. ప్రభుత్వ గ్యారంటీ (సావరీన్) ఉంటే తప్పించి, బ్యాంక్ ఎఫ్డీ అయినా, ఏ ఇతర పెట్టుబడి సాధనంలో అయినా ఎంతో కొంత రిస్క్ ఉంటుంది. దీనిపట్ల ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరం. మెరుగైన నియంత్రణలు ఎఫ్డీ ఎంతో ప్రాచుర్యానికి నోచుకోవడం వెనుక అందులోని సరళత్వం, భద్రత కీలకమని చెప్పుకోవాలి. ఏవో కొన్ని బ్యాంకు వైఫల్యాలను పక్కన పెడితే, మన దేశంలో బ్యాంకింగ్ రంగం పటిష్ట నియంత్రణల మధ్య కొనసాగుతుంటుంది. ప్రజల్లో నమ్మకం ఏర్పడడానికి ఇది కూడా ఒక కారణం. బ్యాంక్ యాజమన్యాలు/ఉద్యోగుల మోసపూరిత వ్యవహారం, రుణ వ్యాపారంలో దూకుడైన తీరు కొన్ని సందర్భాల్లో సమస్యలు, సంక్షోభాలకు దారితీయవచ్చు. ఎంత కట్టుదిట్టమైన నియంత్రణలు ఉన్నా కానీ, 2019లో పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంక్, 2020లో యస్ బ్యాంక్, ఇప్పుడు న్యూ ఇండియా కోపరేటివ్ బ్యాంక్ సంక్షోభాలు చోటుచేసుకున్నాయి. అంతకుముందు గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ కరాడ్ ఉదంతాలూ గుర్తుండే ఉంటాయి. కనుక బ్యాంక్ డిపాజిట్లలోనూ రిస్క్ ఉంటుందని అర్థం చేసుకోవాలి. కాకపోతే మనదగ్గర ఆర్బీఐ పటిష్ట నియంత్రణల కారణంగా ఈ తరహా సంక్షోభాలు చాలా తక్కువగా కనిపిస్తుంటాయి.డిపాజిట్‌పై బీమా ఆర్బీఐ నియంత్రణ పరిధిలోని అన్ని బ్యాంకుల్లోనూ రూ.5 లక్షల వరకు డిపాజిట్‌కు బీమా రక్షణ ఉంటుంది. అసలు లేదా అసలుతోపాటు వడ్డీ కలుపుకుని రూ.5 లక్షలకు మించి ఉన్నప్పటికీ బీమా రూ.5 లక్షలకే పరిమితం. బ్యాంక్ ఏదైనా సంక్షోభం పాలైతే అప్పుడు ఒక్కో డిపాజిట్ దారుడికి గరిష్టంగా రూ.5 లక్షలు వెనక్కి వస్తాయి. సేవింగ్స్, ఫిక్స్డ్, కరెంట్, రికరింగ్ ఇలా అన్ని డిపాజిట్లకూ ఈ రక్షణ వర్తిస్తుంది. ఈ వ్యవహారం అంతా చూసేది ఆర్బీఐ అనుబంధ సంస్థ అయిన ‘డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’ (డీఐసీజీసీ). ప్రతి రూ.100 డిపాజిట్‌పై రూ.12 పైసలు చొప్పున ప్రీమియం కింద బ్యాంక్‌లు డీఐసీజీసీకి చెల్లించాల్సి ఉంటుంది. ఒక బ్యాంక్‌కు చెందిన ఒకటికి మించిన శాఖలో డిపాజిట్లు ఉన్నప్పటికీ.. ఒక్కో ఖాతాదారుని పేరు మీద గరిష్ట బీమా రూ.5 లక్షలుగానే ఉంటుంది. కనుక ఒక బ్యాంక్‌లో రూ.5 లక్షలకు మించి చేసే డిపాజిట్‌పై కచ్చితంగా రిస్క్ ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఒక వ్యక్తి వేర్వేరు బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తే.. అప్పుడు విడిగా ఒక్కో బ్యాంక్ పరిధిలో సంబంధిత వ్యక్తికి గరిష్టంగా రూ.5 లక్షల డిపాజిట్‌కు బీమా రక్షణ వర్తిస్తుంది.బ్యాంక్ కుదుటపడితే.. బ్యాంకులో మోసం కావచ్చు. లేదా లిక్విడిటీ సంక్షోభం తలెత్తవచ్చు. రుణ ఎగవేతలతో క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్లిపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఆర్బీఐ తప్పకుండా జోక్యం చేసుకుంటుంది. తాత్కాలిక నిర్వహణ బాధ్యతల కోసం బోర్డ్‌ను ఏర్పాటు చేస్తుంది. బ్యాంక్ వ్యవహారాలను లోతుగా పరిశీలించి, చక్కదిద్దే వరకు డిపాజిట్ల ఉపసంహరణపై పూర్తిగా లేదా పాక్షికంగా ఆంక్షలు విధిస్తుంది. పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంక్‌లో రుణ అవకతవకలు సంక్షోభానికి దారితీయగా, ఆర్బీఐ దాన్ని చక్కదిద్దింది. అది ఇప్పుడు యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో భాగం అయింది. యస్ బ్యాంక్‌లోనూ రుణ మోసాలు బయటపడగా, కొత్త బోర్డ్‌ను ఏర్పాటు చేసి గాడిన పెట్టింది. రూ.5 లక్షలకు పైగా డిపాజిట్లు కలిగిన వారు.., రూ.5 లక్షలకు పైబడిన మొత్తాన్ని తిరిగి పొందడం కోసం బ్యాంక్ గాడిన పడే వరకు వేచి చూడాల్సిందే. అప్పటికీ పూర్తి మొత్తం వెనక్కి వస్తుందన్న గ్యారంటీ ఉండదు. ఎంత కోత పడుతుందన్నది బ్యాంక్ ఆర్థిక పద్దుల ఆరోగ్యంపైనే ఆధారపడి ఉంటుంది.బ్యాంకు నుంచే చెల్లింపులు బ్యాంక్‌లో సమస్య తలెత్తినప్పుడు డిపాజిట్‌దారులు డీఐసీజీసీని సంప్రదించాల్సిన అవసరం ఉండదు. బ్యాంక్ నిర్వహణ బాధ్యతలు చూసే బోర్డ్.. డిపాజిట్‌దారుల వివరాలతో జాబితాను డీఐసీజీసీకి పంపిస్తుంది. ఆ వివరాల వాస్తవికతను 30 రోజుల్లోపు డీఐసీజీసీ తేల్చాలి. అక్కడి నుంచి 15 రోజుల్లోపు డిపాజిట్‌దారులకు చెల్లించాల్సిన బీమా మొత్తాన్ని బ్యాంక్‌కు డీఐసీజీసీ బదిలీ చేస్తుంది. అప్పుడు ఖాతాదారులకు బ్యాంక్ సిబ్బంది చెల్లింపులు చేస్తారు. బ్యాంక్‌పై ఆంక్షలు విధించిన నాటి నుంచి 90 రోజుల్లో డిపాజిట్‌దారులకు బీమా మొత్తం వెనక్కి చెల్లించాలని నిబంధనలు చెబుతున్నాయి. విచారించుకున్న తర్వాతే.. ఆర్బీఐ పరిధిలోని అన్ని బ్యాంక్‌లు తప్పనిసరిగా డీఐసీజీసీ పరిధిలోకి వస్తాయి. అవి డిపాజిట్లపై బీమా ప్రీమియం కచ్చితంగా చెల్లించాల్సిందే. సందేహం ఉంటే డిపాజిట్ చేసే ముందు బ్యాంక్ అధికారిని అడిగి బీమా ఉందా? అని నిర్ధారించుకోవచ్చు. అన్ని ప్రభుత్వరంగ బ్యాంక్‌లు, ప్రైవేటు షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంక్‌లు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లు, భారత్‌లో కార్యకలాపాలు నిర్వహించే విదేశీ బ్యాంక్‌లు, కో ఆపరేటివ్ బ్యాంక్‌లు, లోకల్ ఏరియా బ్యాంక్‌లు, రీజినల్ రూరల్ బ్యాంక్‌లు, పేమెంట్స్ బ్యాంక్‌లు, స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్‌లు, అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్‌లు డీఐసీజీసీ పరిధిలోకి వస్తాయి. ప్రైమరీ కో ఆపరేటివ్ సొసైటీలు మాత్రం దీని కిందికి రావు.అధిక వడ్డీ రేట్లు.. అన్నీ చూసాకే ప్రభుత్వరంగ బ్యాంక్‌లు, ప్రైవేటు యూనివర్సల్ బ్యాంకులతో పోల్చితే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు డిపాజిట్లపై అధిక వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తుంటాయి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు రుణాలపై అధిక రేట్లను చార్జ్ చేస్తుంటాయి. కనుక అవి డిపాజిట్లను ఆకర్షించేందుకు ఎక్కువ రేట్లను ఇస్తుంటాయి. ఏ బ్యాంక్ అయినా సరే అధిక వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తుంటే, అందులో ఇన్వెస్ట్ చేసే ముందు ఈ రేషియోలను ఒక్కసారి పరిశీలించడం మంచిది. సీఆర్ఏఆర్: క్యాపిటల్ టు రిస్క్ అస్సెట్ రేషియో అని, దీన్నే క్యాపిటల్ అడెక్వెసీ రేషియో అని కూడా అంటారు. ప్రభుత్వరంగ బ్యాంక్‌లకు ఇది కనీసం 12 శాతంగా, ప్రైవేటు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్‌లకు 9 శాతం మేర ఉండాలి. అదే స్మాల్ ఫైనాన్స్‌బ్యాంక్‌లకు 15 శాతం ఉండాలి. బ్యాంక్ తనకు ఎదురయ్యే చెల్లింపుల బాధ్యతలను ఎంత సమర్థంగా ఎదుర్కోగలదన్నది ఇది తెలియజేస్తుంది. ఎల్‌సీఆర్: లిక్విడిటీ కవరేజీ రేషియో 100 శాతం ఉండాలి. 30 రోజుల అవసరాలకు సరిపడా నిధులు బ్యాంకుల వద్ద ఉంచడం కోసం ఈ నిబంధన. దీనివల్ల లిక్విడిటీ షాక్‌లను బ్యాంక్‌లు సమర్థంగా ఎదుర్కోగలవు. అసలు రాబడి ఎంత? అత్యవసర నిధిని అట్టి పెట్టుకునేందుకు, స్వల్పకాలిక అవసరాలకు ఉద్దేశించిన నిధులను బ్యాంక్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేసుకుంటానంటే ఫర్వాలేదు. కానీ, దీర్ఘకాల లక్ష్యాల కోసం నిధిని సమకూర్చుకునేందుకు, సంపద సృష్టికి బ్యాంక్ డిపాజిట్ మెరుగైన సాధనం కాబోదు. ఈక్విటీలపై దీర్ఘకాలంలో 12 శాతం, బంగారంలో 8 శాతం మేర సగటు రాబడి ఉంటోంది. ఈక్విటీ, బంగారంలో పెట్టుబడిని విక్రయించినప్పుడే లాభాలపై పన్ను చెల్లిస్తే సరిపోతుంది. బ్యాంక్ డిపాజిట్లపై అలా కాదు. ప్రతి ఏటా ఆర్జించే వడ్డీ రాబడి అదే ఏడాది ఇన్వెస్టర్ వార్షిక ఆదాయానికి కలిపి చూపించాలి. అవసరమైతే పన్ను చెల్లించాలి. ఎఫ్డీ రాబడిపై పన్ను చెల్లించగా, మిగిలే నికర రాబడి ద్రవ్యోల్బణ స్థాయిలోనే ఉంటుంది. కనుక డిపాజిట్లలో కాంపౌండింగ్ ప్రయోజనం పెద్దగా ఉండదు.బీమా మరింత పెంచేనా..? 2019లో పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంక్‌లో సంక్షోభం తలెత్తిన తర్వాతే.. డిపాజిట్లపై రూ.లక్షగా ఉన్న బీమా పరిమితిని 2020 ఫిబ్రవరిలో రూ.5 లక్షలకు పెంచారు. ఈ బీమా రక్షణను మరింత పెంచాలన్న ప్రతిపాదన పరిశీలనలో ఉందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఎం.నాగరాజు ఇటీవల చేసిన ప్రకటన ఈ దిశగా డిపాజిటర్లలో అంచనాలను పెంచింది. ఇప్పటికిప్పుడు దీన్ని పెంచకపోయినా, భవిష్యత్తులో ఇందుకు తప్పక అవకాశం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఎన్బీఎఫ్సీ డిపాజిట్ల సంగతేంటి? బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ తదితర డిపాజిట్లు స్వీకరించే ఆర్బీఐ అనుమతి కలిగిన ఎన్బీఎఫ్సీలు (ఎన్బీఎఫ్సీ–డీ) దేశంలో 25 ఉన్నాయి. వీటి పరిధిలో 2024 మార్చి నాటికి రూ.1,02,994 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. మరి ఉన్నట్టుండి వీటిల్లో ఏదైనా ఎన్బీఎఫ్సీకి నిధుల సమస్య తలెత్తితే పరిస్థితి ఏంటి? బ్యాంకుల్లో మాదిరి వీటిల్లో డిపాజిట్లకు డీఐసీజీసీ కింద ఎలాంటి బీమా రక్షణ లేదు. ఇవన్నీ ప్రజల డిపాజిట్లే కనుక వీటిని సైతం డీఐసీజీసీ కిందకు తీసుకురావాలన్న డిమాండ్లు ఉన్నాయి. వీటిల్లో డిపాజిట్ చేసే ముందు ఇన్వెస్టర్లు రిస్క్ లను అర్థం చేసుకోవాలి. బ్యాంకులకూ రేటింగ్ ఉండాలి.. ఎన్బీఎఫ్సీలు తమ నిధుల అవసరాల కోసం బాండ్లు, ఎన్సీడీలను జారీ చేస్తుంటాయి. సంబంధిత ఎన్బీఎఫ్సీ ఆర్థిక ఆరోగ్యం ఆధారంగా రేటింగ్ ఏజెన్సీలు క్రెడిట్ రేటింగ్‌ను ప్రకటిస్తాయి. నిబంధనల ప్రకారం రేటింగ్ తప్పనిసరి. బ్యాంక్‌లు సైతం బాండ్లను జారీ చేయాలంటే రేటింగ్ తీసుకోవాల్సిందే. కానీ బ్యాంక్ డిపాజిట్లకు వచ్చే సరికి ఈ తరహా రేటింగ్ విధానం లేకపోవడాన్ని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. బ్యాంక్ డిపాజిట్లకు సైతం రేటింగ్‌ను తప్పనిసరి చేయడం వల్ల పాలన మెరుగుపడుతుందని ఎన్ఎస్జీ అండ్ పార్ట్నర్స్ పార్ట్నర్ రవి భడానీ అభిప్రాయపడ్డారు. దీనివల్ల డిపాజిట్ చేసే సమయంలో ఆయా బ్యాంక్‌లకు సంబంధించి రిస్క్ ను ఇన్వెస్టర్లు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అలా చేస్తే అప్పుడు బలహీన బ్యాంక్‌ల నుంచి అధిక రేటింగ్ ఉన్న బ్యాంకుల్లోకి డిపాజిట్లు తరలిపోయే రిస్క్ ఏర్పడుతుందని ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ డైరెక్టర్ సతీష్ మరాటే పేర్కొన్నారు. దీనికి బదులు మెరుగైన రేటింగ్ ఉన్న బ్యాంకులకు డిపాజిట్లపై బీమా ప్రీమియం తక్కువ వసూలు చేసే విధానం ఫలితమిస్తుందన్నారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
టాటా స్టీల్ మూసివేత.. 900 మంది అప్పు తీర్చిన హాలీవుడ్ నటుడు
సౌత్ వేల్స్ లోని పోర్ట్ టాల్బోట్లోని టాటా స్టీల్ బ్లాస్ట్ ఫర్నేస్ మూసివేత తర్వాత అక్కడి వారి జీవితాలు దుర్భరంగా మారాయి. 2,800 మంది కార్మికుల ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో అదే ప్రాంతానికి చెందిన ప్రముఖ హాలీవుడ్ నటుడు మైఖేల్ షీన్.. తమ ప్రాంత ప్రజలను ఆదుకునేందుకు ముందుకువచ్చారు. సుమారు 900 మందికి చెందిన 1 మిలియన్ పౌండ్ల (సుమారు రూ.8 కోట్లు) రుణాలను తాను చెల్లించారు.ది క్వీన్, గుడ్ ఓమెన్స్, ట్విలైట్ చిత్రాల్లో నటించిన మైఖేల్ షీన్ బాధితుల ఆర్థిక భారాన్ని తగ్గించే బాధ్యతను తనపై వేసుకున్నాడు. షీన్ తన వ్యక్తిగత సంపాదన లోంచి 1,00,000 పౌండ్లు వెచ్చించి 900 మందికి సంబంధించిన రుణాలను తీర్చడం కోసం ఒక సంస్థను స్థాపించాడు. రుణ పరిశ్రమ ఎలా పనిచేస్తుందనే దానిపై మొదట్లో తనకు అవగాహన లేదని, కానీ మార్పు తీసుకురావాలని నిశ్చయించుకున్నానని షీన్ చెప్పాడు. మైఖేల్ షీన్ సీక్రెట్ మిలియన్ పౌండ్ గిఫ్ట్ గురించి త్వరలో ప్రసారం కానున్న ఛానెల్ 4 షోలో డాక్యుమెంట్ చేశారు.టాటా స్టీల్ మూసివేత ప్రభావంపోర్ట్ టాల్బోట్లోని టాటా స్టీల్ బ్లాస్ట్ ఫర్నేస్ మూసివేత ఈ ప్రాంతంలో సాంప్రదాయ ఉక్కు తయారీ ముగింపును సూచిస్తోంది. పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల గణనీయ సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోవడంతోపాటు స్థానికులకు సైతం ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టింది. పోర్ట్ టాల్బోట్కు చెందిన షీన్.. కార్మికులు, వారి కుటుంబాల దుస్థితిని చూసి చలించిపోయారు. స్థానిక కేఫ్ ను సందర్శించిన సందర్భంగా ఆయన ఉద్యోగుల తొలగింపు భావోద్వేగాలను కళ్లారా చూశారు. ఉక్కు కార్మికులు తమ అనిశ్చిత భవిష్యత్తుపై కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో వారిని ఆదుకునేందుకు ఏదైనా చేయాలని సంకల్పించారు.ఎవరీ మైఖేల్ షీన్?మైఖేల్ షీన్ బహుముఖ ప్రజ్ఞతోపాటు సామాజిక కారణాల పట్ల నిబద్ధతకు ప్రసిద్ధి చెందిన నటుడు. 1969లో వేల్స్ లోని న్యూపోర్ట్ లో జన్మించిన షీన్ రాయల్ అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్ (రాడా)లో శిక్షణ పొంది నాటకరంగంలో తన కెరీర్ ను ప్రారంభించారు. ది క్వీన్ అండ్ ది స్పెషల్ రిలేషన్ షిప్ లో బ్రిటిష్ ప్రధాని టోనీ బ్లెయిర్ పాత్రలకు అంతర్జాతీయ ప్రశంసలు పొందాడు. తన నటజీవితానికి మించి, సామాజిక పోరాటకారుడైన షీన్.. తనను తాను "లాభాపేక్ష లేని నటుడిగా" ప్రకటించుకున్నాడు. తన సంపాదనను సామాజిక కార్యక్రమాల కోసం వెచ్చిస్తున్నాడు. ఇప్పుడే కాదు.. 2021లోనే అతను తన సంపదను ధార్మిక కార్యక్రమాలకు విరాళంగా ఇవ్వాలనే నిర్ణయాన్ని ప్రకటించాడు. -
క్రెడిట్ కార్డు రూల్స్‌లో కీలక మార్పులు
ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ, ప్రయివేట్ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకులు తమ క్రెడిట్ కార్డు పాలసీల్లో కీలక మార్పులు చేస్తున్నాయి. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ మైల్స్టోన్ టికెట్ వోచర్లతో సహా అనేక ప్రయోజనాలను నిలిపివేయనుండగా, ఎస్బీఐ తన క్లబ్ విస్తారా ఎస్బీఐ, క్లబ్ విస్తారా ఎస్బీఐ ప్రైమ్ క్రెడిట్ కార్డుల నిబంధనలను సవరించింది. 2025 ఏప్రిల్ 1 నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి.ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డు మార్పులుఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ 2025 మార్చి 31 నుండి మైల్స్టోన్ టికెట్ వోచర్లు, పునరుద్ధరణ ప్రయోజనాలు, ఇతర ఫీచర్లను అందించడాన్ని నిలిపివేయనుంది. అయితే 2026 మార్చి 31 వరకు మహారాజా పాయింట్లు కొనసాగుతాయి. ఆ తర్వాత కార్డు పూర్తిగా నిలిచిపోతుంది. బ్యాంక్ ప్రకటన ప్రకారం కీలక మార్పులు ఇవే..క్లబ్ విస్తారా సిల్వర్ మెంబర్ షిప్ ఇకపై అందుబాటులో ఉండదు.వన్ ప్రీమియం ఎకానమీ టికెట్, వన్ క్లాస్ అప్ గ్రేడ్ వోచర్ తో సహా కాంప్లిమెంటరీ వోచర్లు నిలిచిపోతాయి.ప్రీమియం ఎకానమీ టికెట్లకు మైల్ స్టోన్ వోచర్లు ఇకపై జారీ కావు.2025 మార్చి 31 తర్వాత కార్డులను రెన్యువల్ చేసుకునే కస్టమర్ల వార్షిక రుసుమును ఏడాది పాటు రద్దు చేస్తారు.ఎస్బీఐ క్రెడిట్ కార్డు పాలసీల్లో మార్పులుక్లబ్ విస్తారా ఎస్బీఐ క్రెడిట్ కార్డుదారులకు ఎకానమీ టికెట్ వోచర్లు ఇకపై ఉండవు.రూ.1.25 లక్షలు, రూ.2.5 లక్షలు, రూ.5 లక్షల వార్షిక ఖర్చులకు మైల్ స్టోన్ బెనిఫిట్స్ నిలిపివేయనున్నారు.క్లబ్ విస్తారా ఎస్బీఐ ప్రైమ్ క్రెడిట్ కార్డు ఇకపై ప్రీమియం ఎకానమీ టికెట్ వోచర్లను అందించదు.బేస్ కార్డు రెన్యువల్ ఫీజు రూ.1,499, పీఎం కార్డు రెన్యువల్ ఫీజు రూ.2,999.వినియోగదారులకు ఫీజు మాఫీకి ఇంకా అవకాశం ఉంటుంది.మార్పుల వెనుక కారణంగత ఏడాది నవంబర్‌లో విస్తారా-ఎయిరిండియా విలీనం తర్వాత ఈ మార్పులు జరిగాయి. ఇది ఎయిరిండియా మహారాజా క్లబ్ లాయల్టీ కార్యక్రమంలో సర్దుబాట్లకు దారితీసింది. ఎస్బీఐ, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ తమ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలను సవరించగా, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ ఇంకా ఎటువంటి మార్పులను ప్రకటించలేదు. -
ఎలాంటి ప్రశ్నలు లేకుండా మహిళలకు వర్క్ ఫ్రమ్ హోమ్
న్యూఢిల్లీ: సంస్థ మొత్తం ఉద్యోగుల్లో 2030 నాటికి మహిళల సంఖ్య 30 శాతం సాధన దిశగా అడుగులు వేస్తున్నామని వేదాంత తెలిపింది. మహిళా సిబ్బందిలో అత్యంత కీలక నిర్ణయాలు తీసుకొనే పదవుల్లో 28% మంది ఉన్నారని, ఇది దేశంలో మెటల్స్, మైనింగ్ కంపెనీల్లోనే అత్యధికమని పేర్కొంది.అర్హత కలిగిన మహిళలకు తగిన స్థానం కల్పిస్తున్నామని కంపెనీ తెలిపింది. అనువైన పని గంటలు, ఎటువంటి ప్రశ్నలు వేయకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం, పిల్లల సంరక్షణ కోసం ఏడాదంతా సెలవులు, జీవిత భాగస్వామి నియామకం తదితర స్నేహపూర్వక విధానాల అమలు ద్వారా ప్రతి దశలోనూ మహిళల ప్రగతికి తోడ్పాటు అందిస్తున్నామని వివరించింది.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వేదాంత గ్రూప్‌నకు చెందిన హిందుస్థాన్ జింక్ ఉమెన్ ఆఫ్ జింక్ క్యాంపేయిన్ ప్రారంభించింది. మెటల్ రంగం పట్ల మహిళల్లో మరింత ఆసక్తిని పెంచడం ఈ ప్రచార కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. -
గుజరాతీలు జాబ్స్ ఎందుకు చేయరంటే..
వ్యాపారం, ఆర్థిక రంగాల్లో గుజరాతీల (Gujaratis) ఆధిపత్యం గురించి తెలిసిందే. అయితే వారు ఆయా రంగాల్లో అంతలా రాణించడానికి కారణాలు ఏంటి.. సంపద సృష్టిలో వారికున్న ప్రత్యేక లక్షణాలేంటి అన్న దానిపై పై స్టాకిఫీ వ్యవస్థాపకుడు అభిజిత్ చోక్సీ అద్భుతమైన విశ్లేషణ చేశారు. వారి ఆర్థిక ప్రభావాన్ని హైలైట్ చేసే గణాంకాలతో ఆయన ‘ఎక్స్’లో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.దేశంలోని 191 మంది బిలియనీర్లలో 108 మంది గుజరాతీలేనని రాసుకొచ్చిన చోక్సీ సంపద సృష్టిలో వారికున్న ప్రత్యేకతలను వివరించారు. చివరికి అమెరికాలో నివసిస్తున్న గుజరాతీ.. సగటు అమెరికన్ కంటే మూడు రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నాడని చోక్సీ అభిప్రాయపడ్డారు. భారతదేశ జనాభాలో కేవలం 5% మాత్రమే ఉన్నప్పటికీ, గుజరాత్ దేశ జీడీపీకి 8% పైగా, దేశ పారిశ్రామిక ఉత్పత్తిలో 18% భాగస్వామ్యం వహిస్తోంది. భారత భూభాగంలో కేవలం 6% మాత్రమే ఉన్న గుజరాత్ దేశం మొత్తం ఎగుమతుల్లో 25% వాటాను కలిగి ఉంది.గుజరాతీల సక్సెస్‌కు కారణాలివే..మరి గుజరాతీలు వ్యాపారంలో అంత సక్సెస్ కావడానికి కారణం ఏమిటి? చోక్సీ ప్రకారం.. ఇది తరతరాలుగా వస్తున్న జ్ఞానం, వ్యవస్థాపక మనస్తత్వం, కొత్త మార్కెట్లను స్వీకరించడానికి, ఆధిపత్యం చేయడానికి సాటిలేని సామర్థ్యం కలయిక. గుజరాతీలు వ్యాపార, ఆర్థిక వ్యవహారాలను శాసించడానికి 20 కారణాలను ఆయన వివరించారు.ఉద్యోగాల (Jobs) కంటే వ్యాపారానికి తరతరాలుగా ప్రాధాన్యత ఇవ్వడమే ఈ విజయానికి కారణమని చోక్సీ పేర్కొన్నారు. "నౌకరీ తో గరీబోన్ కా దండా చే" (ఉద్యోగాలు పేదల కోసం) అనేది గుజరాతీ కుటుంబాలలో ఒక సాధారణ నమ్మకం. వ్యాపారం అనేదేదో నేర్చుకోవాల్సిన ఒక నైపుణ్యంలాగా కాకుండా గుజరాతీ పిల్లలు.. తమ కుటుంబాల్లో డబ్బును ఎలా నిర్వహిస్తున్నారు.. డీల్స్ ఎలా చేస్తున్నారు.. నష్టాలను ఎలా అంచనా వేస్తున్నారు.. అనేది నిత్యం చూస్తూ పెరుగుతారు.రిస్క్ తీసుకోవడం అనేది మరో ముఖ్యమైన లక్షణం. వజ్రాల ట్రేడింగ్ నుంచి స్టాక్ మార్కెట్ల వరకు గుజరాతీలు అనిశ్చితిని స్వీకరించి అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఈ మనస్తత్వం ప్రారంభ ఆర్థిక విద్య ద్వారా బలపడుతుంది. చాలా మంది పిల్లలు చిన్న వయస్సు నుండే కుటుంబ వ్యాపారాలలో సహాయపడతారు. ఏ ఎంబీఏ బోధించలేని రియల్ వరల్డ్ ఆర్థిక శాస్త్రాన్ని నేర్చుకుంటారు.నెట్ వర్కింగ్, కమ్యూనిటీ సపోర్ట్ కీలకం. రుణాలు, మార్గదర్శకత్వం, మార్కెట్ విషయంలో గుజరాతీలు ఒకరికొకరు చురుకుగా సహాయపడతారు. వారి పొదుపు జీవనశైలి కూడా ఒక పాత్ర పోషిస్తుంది. లాభాలను విలాసవంతంగా ఖర్చు చేయకుండా తిరిగి పెట్టుబడి పెడతారు. ఇది దీర్ఘకాలిక సంపద సేకరణకు దారితీస్తుంది.వివిధ పరిశ్రమల్లో గుజరాతీలు ఎలా ఆధిపత్యం చెలాయిస్తున్నారో కూడా చోక్సీ తెలియజేశారు. ప్రపంచంలోని 90 శాతం వజ్రాలను సూరత్ మాత్రమే ప్రాసెస్ చేస్తోందని, బెల్జియం, ఇజ్రాయెల్ లోని పోటీదారులను గుజరాతీ పారిశ్రామికవేత్తలు ఎలా అధిగమించారో ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా, భారతదేశ స్టాక్ మార్కెట్ వ్యాపారులలో 60% పైగా గుజరాతీలు లేదా మార్వాడీలు ఉన్నారు.అమెరికాలో కూడా గుజరాతీలు వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించుకున్నారు. అమెరికాలోని మొత్తం హోటళ్లలో 60 శాతానికి పైగా గుజరాతీ కుటుంబాలకు చెందినవేనని, ప్రధానంగా పటేల్ సామాజిక వర్గానికి చెందినవని చోక్సీ వెల్లడించారు. 1950వ దశకంలో చిన్న చిన్న పెట్టుబడులుగా ప్రారంభమైన ఈ పరిశ్రమ మల్టీ బిలియన్ డాలర్ల పరిశ్రమగా రూపాంతరం చెందింది.108 out of 191 Indian billionaires are Gujarati.A Gujarati living in America makes three times more than an average American.Gujarat, which has 5% of India’s population, contributes over 8% to the GDP and 18% of the industrial output.Gujarat has a land area of only 6% but… pic.twitter.com/ZId5idzCNS— Abhijit Chokshi | Investors का दोस्त (@stockifi_Invest) March 8, 2025 -
స్పైస్‌జెట్‌కు కొత్త చిక్కులు
చవక విమానయాన సేవలు అందిస్తున్న స్పైస్‌జెట్‌కు కొత్త సమస్యలు ఎదురయ్యాయి. విమానాల లీజు రంగంలో ఉన్న ఐర్లాండ్‌కు చెందిన మూడు సంస్థలు, ఒక మాజీ పైలట్ స్పైస్‌జెట్‌పై ఎన్సీఎల్టీలో దివాలా పిటిషన్లు దాఖలు చేయడం ఇందుకు కారణం. స్పైస్‌జెట్ సుమారు రూ.110 కోట్లు బకాయి పడిందని, ఐబీసీ సెక్షన్ 9 కింద దివాలా ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ ఎన్‌జీఎఫ్ ఆల్ఫా, ఎన్‌జీఎఫ్ జెనెసిస్, ఎన్‌జీఎఫ్ చార్లీ పిటిషన్లు దాఖలు చేశాయి.ఈ వారం ప్రారంభంలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ విచారణ సందర్భంగా పరిష్కార చర్చలు జరుగుతున్నందున ఈ విషయాన్ని పరిష్కరించడానికి స్పైస్‌జెట్ కొంత సమయం కోరింది. తదుపరి విచారణ కోసం 2025 ఏప్రిల్ 7న మూడు పిటిషన్లను లిస్ట్ చేయాలని ఎన్సీఎల్టీ ఆదేశించింది. లీజుదారులు గతంలో స్పైస్‌జెట్‌కు ఐదు బోయింగ్ 737 విమానాలను లీజుకు ఇచ్చాయి.ఇంజిన్లతో సహా విమానంలోని భాగాలను దొంగిలించి ఇతర విమానాలలో ఉపయోగించారని ఆరోపిస్తూ ఈ కంపెనీలు స్పైస్‌జెట్‌కు లీగల్ నోటీసును పంపించాయి. 19 సంవత్సరాలుగా విమానయాన రంగంలో ఉన్న స్పైస్‌జెట్.. ఎన్సీఎల్టీ, అప్పీలేట్ ట్రిబ్యునల్ ఎన్సీఎల్ఏటీ వద్ద విల్లిస్ లీజ్, ఎయిర్కాజిల్ ఐర్లాండ్, విల్మింగ్టన్, సెలెస్టియల్ ఏవియేషన్ వంటి రుణదాతల నుండి దివాలా పిటిషన్లను ఎదుర్కొంటోంది. -
శాంసంగ్ ప్రీమియమ్ ఫోన్‌పై భారీ తగ్గింపు
మంచి కెమెరా, డిస్ప్లే, పనితీరు, క్లీన్ యూజర్ ఎక్స్‌పీరియన్స్‌తో గతేడాది అత్యధికంగా అమ్ముడైన ఫోన్లలో ఒకటిగా నిలిచిన శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా (Samsung Galaxy S24 Ultra) ఫోన్ ఇప్పుడు భారీ తగ్గింపుతో లభిస్తోంది. అప్పట్లో అధిక ధర కారణంగా ఈ ప్రీమియమ్ ఫోన్‌ను కొనలేకపోయినవారు ఇప్పుడు కొనవచ్చు.శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా ఫోన్ ఇప్పుడు తగ్గింపు, బ్యాంక్ డిస్కౌంట్ల తరువాత రూ .93,000 కంటే తక్కువకు లభిస్తుంది. మార్కెట్లోకి శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా వచ్చినప్పటికీ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రాకు క్రేజ్ అలాగే ఉంది. కాబట్టి మంచి కెమెరా, ఏఐ ఫీచర్లతో సరైన ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ల కోసం చూస్తున్నట్లయితే అమెజాన్‌కి వెళ్లి ఈ డీల్ చూడవచ్చు.తగ్గింపు అలర్ట్శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర ప్రస్తుతం అమెజాన్‌లో రూ.98,499గా ఉంది. లాంచ్ అయినప్పుడు దీని ధర రూ.1,29,999. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డును ఉపయోగిస్తే రూ.2,955 తగ్గింపు లభిస్తుంది. అలాగే కస్టమర్లు నో కాస్ట్ ఈఎంఐ (వడ్డీ ఆదా కోసం), రూ .4,775 నుండి ప్రారంభమయ్యే స్టాండర్డ్ ఈఎంఐ ప్లాన్లను ఎంచుకోవచ్చు. ఇక ఈ ఫోన్ కొనుగోలు కోసం మీరు మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేయవచ్చు. దీనికి ఆ ఫోన్ మోడల్, వర్కింగ్ కండీషన్, బ్రాండ్‌ను బట్టి రూ.22,800 వరకు పొందవచ్చు. యాడ్-ఆన్‌లుగా వినియోగదారులు రూ .6,999 టోటల్ ప్రొటెక్షన్ ప్లాన్‌ను కూడా ఎంచుకోవచ్చు.శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా స్పెసిఫికేషన్లు120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో 6.8 అంగుళాల క్యూహెచ్ డీ+ అమోఎల్ఈడీ ప్యానెల్ ను ఇందులో అందించారు. ఈ డివైజ్ 2,600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ సెట్‌పై నడుస్తుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ 45వాట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ డివైజ్ ఇప్పటికే లైవ్ ట్రాన్స్‌లేట్, సర్కిల్ టు సెర్చ్, నోట్ అసిస్ట్ వంటి గెలాక్సీ ఏఐ ఫీచర్లను అందిస్తోంది. రాబోయే ఆండ్రాయిడ్ 15 ఆధారిత వన్ యూఐ 7 అప్డేట్తో ఇది మరిన్ని ఏఐ ఫీచర్లను పొందుతుంది.కెమెరా విషయానికొస్తే.. 200 మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ విత్ 5ఎక్స్ ఆప్టికల్ జూమ్, 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. 3ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో పాటు అదనంగా 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ లభిస్తుంది. ముందువైపు 12 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. -
రూ. 1,000కే ఎస్ఎస్ఈ ఇన్స్ట్రుమెంట్
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా లాభాపేక్షలేని సంస్థ(ఎన్పీవో)ల నిధుల సమీకరణకు మరింత వెసులుబాటు కల్పించే యోచనలో ఉంది. ఇందుకు వీలుగా ఎన్‌పీవోలు జారీ చేసే జీరో కూపన్, జీరో ప్రిన్సిపల్ ఇన్స్ట్రుమెంట్(జెడ్‌సీజెడ్‌పీ)ల కనీస పరిమాణాన్ని భారీగా తగ్గించేందుకు ప్రతిపాదించింది. వెరసి ప్రస్తుత రూ. 10,000 నుంచి రూ. 5,000 లేదా రూ. 1,000కు దరఖాస్తు కనీస పరిమాణాన్ని కుదించాలని భావిస్తోంది.ఇందుకు చర్చా పత్రాన్ని విడుదల చేసింది. తద్వారా మార్చి 14వరకూ ప్రజాభిప్రాయ సేకరణకు తెరతీసింది. సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎస్ఎస్ఈ)లతో ఎన్‌పీవోలు జెడ్సీజెడ్పీలను జారీ చేస్తుంటాయి. ప్రస్తుత ప్రతిపాదనలు అమలైతే ఎన్‌పీవోలు జారీ చేసే జెడ్సీజెడ్పీలలో రిటైలర్ల పెట్టుబడులు భారీగా పెరిగే అవకాశముంటుంది.జెడ్సీజెడ్పీలంటే? సెబీ ఎన్‌పీవోల కోసం ఎస్‌ఎస్‌ఈని ఏర్పాటు చేసింది. ఎస్ఎస్ఈలో లిస్టయిన ఎన్‌పీవోలు అందుకునే విరాళాలకుగాను జెడ్సీజెడ్పీలను జారీ చేస్తాయి. నిజానికి 2023 నవంబర్‌లో జెడ్‌సీజెడ్‌పీ కనీస పరిమాణాన్ని రూ. 2 లక్షల నుంచి రూ. 10,000కు కుదించింది. ఇదేవిధంగా జెడ్‌సీజెడ్‌పీ మొత్తం పరిమాణాన్ని రూ. కోటి నుంచి రూ. 50 లక్షలకు తగ్గించింది.ఎస్ఎస్ఈల ద్వారా రిటైలర్ల విరాళాలు పెరుగుతుండటాన్ని ఎన్‌పీవోలు సెబీ దృష్టికి తీసుకువెళ్లాయి. అయితే రూ. 10,000 కనీస పరిమాణం పలువురికి అడ్డు తగులుతున్నట్లు అభిప్రాయపడ్డాయి. ప్రస్తుత స్టాక్ ఎక్సే్ఛంజీలకు భిన్నమైన ఎస్ఎస్ఈ దేశీయంగా కొత్త విభాగంకాగా.. సామాజిక సంస్థలు, దాతలను కలపడంతోపాటు.. నిధుల ఆసరాకు వీలు కలుగుతుంది. -
దేశీయ విఫణిలో వోల్వో ఎక్స్‌సీ90 ఫేస్‌లిఫ్ట్ లాంచ్: పూర్తి వివరాలు
వోల్వో ఎక్స్‌సీ90 (Volvo XC90) ఫేస్‌లిఫ్ట్ భారతదేశంలో రూ. 1.02 కోట్ల (ఎక్స్-షోరూమ్) ధరతో లాంచ్ అయింది. ఇది దాని మునుపటి మోడల్ కంటే ఎక్కువ అప్డేట్స్ పొందింది. అయితే ఇది కేవలం ఒక వేరియంట్లో.. పెట్రోల్ పవర్‌తో మాత్రమే లభిస్తుంది. డెలివరీలు ఈ నెలలోనే ప్రారంభమవుతాయి.కొత్త వోల్వో ఎక్స్‌సీ90 ఫేస్‌లిఫ్ట్.. ఆరు రంగులలో, కొత్త అల్లాయ్ వీల్స్ పొందుతుంది. 11.3 ఇంచెస్ పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇందులో ఉంది. మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, డ్రైవర్ అసిస్ట్ సిస్టమ్స్, పవర్డ్ సీట్లు, పవర్డ్ టెయిల్ గేట్, ఫుల్ ఎల్ఈడీ లైటింగ్ వంటి ఫీచర్స్ కూడా పొందుతుంది.వోల్వో XC90 ఫేస్‌లిఫ్ట్ 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ద్వారా.. 250 Bhp పవర్, 360 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 48వీ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ కూడా పొందుతుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికను పొందుతుంది. ఇది కేవలం 7.7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ కారు ఆడి క్యూ7, బీఎండబ్ల్యూ ఎక్స్5, మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ, జీప్ గ్రాండ్ చెరోకీ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.ఇదీ చదవండి: అందరికీ గూగుల్ జాబే కావాలి.. ఎందుకో వీడియో చూసేయండి -
సన్‌స్క్రీన్ టెస్టర్ - స్మార్ట్ వాటర్ బాటిల్
వేసవిలో మీ చర్మానికి రక్షణ ఉందా? లేదా? అని ఈ బుల్లి సన్‌స్క్రీన్ టెస్టర్ ద్వారా ఇట్టే తెలుసుకోవచ్చు. చిన్న పెన్‌డ్రైవ్‌లా కనిపించే ఈ పరికరం, నిజానికి ఒక ప్రత్యేకమైన కెమెరా.వేసవిలో ఒళ్లంతా చెమటలు పట్టిన తర్వాత, ఈత కొట్టినప్పుడు, రుమాలుతో ముఖం తుడుచుకున్నప్పుడు, రాసుకున్న క్రీమ్స్ చర్మంపై అక్కడక్కడ మిస్ అవుతుంటుంది. అలాంటప్పుడు ఈ చిన్న కెమెరాలో నుంచి చూసినట్లయితే, సన్‌స్క్రీన్ క్రీమ్ రక్షణ తొలగిపోయిన ప్రదేశాలను డార్క్‌గా చూపిస్తుంది. ఇది పూర్తిగా వాటర్ ప్రూఫ్, అల్ట్రా పోర్టబుల్. దీని ధర రూ.10,311 మాత్రమే!స్మార్ట్ వాటర్ బాటిల్వేసవిలో హైడ్రేటెడ్‌గా ఉండటం తప్పనిసరి. పని ఒత్తిడిలో పడి చాలామంది తరచుగా నీళ్లు తాగటం మరచిపోతుంటారు. ఈ స్మార్ట్ వాటర్ బాటిల్‌తో మీరు హైడ్రేటెడ్‌గా ఉండొచ్చు.ఈ బాటిల్ మీరు నీటిని తీసుకోవడాన్ని ట్రాక్ చేస్తుంది. అంతే కాకుండా, అవసరమైనప్పుడల్లా మిమ్మల్ని చల్లబరచడానికి మంచి కూలింగ్ వాటర్‌ను అందిస్తుంది. అలాగే వ్యాయామాలు, హైకింగ్లు, బీచ్ డేస్‌కి తీసుకెళ్లడానికి ఈ వాటర్ బాటిల్ చాలా అనువుగా ఉంటుంది. ఇలాంటి బాటిల్స్ మార్కెట్లో చాలానే దొరుకుతున్నాయి. రివ్యూలను చూసి తీసుకోవటం మంచిది. -
అందరికీ గూగుల్ జాబే కావాలి.. ఎందుకో వీడియో చూసేయండి
దిగ్గజ టెక్ కంపెనీ 'గూగుల్'లో జాబ్ తెచ్చుకోవాలని చాలామంది కలలు కంటారు. దీనికి కారణం ఎక్కువ వేతనాలు, ఆఫీసులోనే లగ్జరీ సదుపాయాలు. ఇటీవల సోషల్ మీడియాలో వెల్లడైన ఒక వీడియోలో గూగుల్ ఆఫీస్ ఎలా ఉంటుందో చూడవచ్చు.శివ్జీ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ తన ఖాతాలో గూగుల్ ఆఫీస్ వీడియో షేర్ చేశారు. ఇది గురుగ్రామ్‌లోని గూగుల్ ఆఫీస్ అని తెలుస్తోంది. అద్భుతమైన డోర్స్, హాల్, కావలసినన్ని స్నాక్స్, డ్రింక్స్ వంటివన్నీ ఆఫీసులోనే ఉండటం చూడవచ్చు. మైక్రో కిచెన్, పూల్ టేబుల్ ఉన్న గేమ్స్ రూమ్, ఒక స్నాప్ రూమ్, మసాజ్ కుర్చీలతో కూడిన రూమ్ కూడా వీడియోలో కనిపిస్తాయి. వీడియో షేర్ చేస్తూ.. గూగుల్‌లో మరో అలసిపోయే రోజు! అని క్యాప్షన్ ఇచ్చింది.ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 4,72,786 లైక్స్ పొందిన ఈ వీడియోను 12.3 మిలియన్ల మంది వీక్షించారు. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఎప్పుడూ ఎంటర్టైన్మెంట్ మాత్రమేనా.. పనిచేసేది ఏమైనా ఉందా? అని ఒకరు కామెంట్ చేశారు. ఇన్ని సౌకర్యాలను ఉపయోగించుకుంటూ పని చేస్తున్నారు కదా.. మీకు జీతం ఎంత ఇస్తారు అని మరొకరు కామెంట్ చేశారు. నాకు విశ్రాంతి తీసుకునే గది చాలాబాగా నచ్చిందని ఇంకొకరు కామెంట్ చేశారు.ఇదీ చదవండి: బనస్కాంత నుంచి బోర్డ్‌రూమ్ వరకు: అదానీ పోస్ట్ వైరల్గూగుల్ కంపెనీ.. తమ ఉద్యోగులకు ఆఫీసులోనే చాలా సౌకర్యాలను అందిస్తుంది. దీనికోసం కార్యాలయాలను ప్రత్యేకంగా డిజైన్ చేస్తారు. ఆఫీసులోనే ఫిట్నెస్ కేంద్రాలు, ఆన్ సైట్ చైల్డ్‌కేర్, గేమ్ రూమ్‌లు, వినోద ప్రదేశాలు, విశ్రాంతి ప్రాంతాలు ఉన్నాయి. ఇటీవల గూగుల్ కంపెనీ బెంగళూరులో అత్యాధునిక సదుపాయాలతో.. ఓ ఆఫీస్ ప్రారంభించింది. View this post on Instagram A post shared by Shivangi Gupta | Content creator 🌶️ (@shivjeee) -
కొత్త రకం ఫ్యాన్లు: వీటి గురించి తెలుసా?
వేసవిలో చాలామంది ఉపయోగించే క్యాప్స్ కూడా స్మార్ట్‌గా మారాయి. ఈ క్యాప్స్‌కు అటాచబుల్ మిని ఫ్యాన్ వస్తుంది. ముఖానికి కప్పుకొనే చోట ఈ ఫ్యాన్ ఉంటుంది. దీనికి సోలార్ ప్యానెల్స్ సహాయంతో పవర్ సరఫరా అవుతుంది. క్యాప్ ఎండకు ఎక్స్పోజ్ కాగానే ఆటోమేటిక్‌గా ఈ ఫ్యాన్స్ పనిచేస్తాయి. వీటిల్లో కొన్ని చార్జబుల్ స్టయిల్ మోడల్స్‌లోనూ లభిస్తున్నాయి. కంపెనీల్లో క్వాలిటీ బట్టి ధరల్లో తేడా ఉండొచ్చు. రివ్యూలను పరిశీలించి, కొనుగోలు చేసుకోవచ్చు.చేతిలోనే ఫ్యాన్స్విసనకర్రలను ఎక్కడికైనా తేలికగా తీసుకుపోగలిగినట్లే, ఈ మినీ ఫ్యాన్స్‌ను కూడా ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లవచ్చు. స్మార్ట్‌ఫోన్, పవర్ బ్యాంకు మాదిరిగానే ఈ మినీ ఫ్యాన్స్‌ను కూడా పాకెట్లో లేదా హ్యాండ్‌బ్యాగులో పెట్టుకోవచ్చు. మండుటెండల్లో ఇవి ఎంతగానో ఉపశమనాన్ని కలిగిస్తాయి. మల్టిపుల్ ఫ్యాన్ స్పీడ్స్కు తోడు రీచార్జబుల్ బ్యాటరీలు వీటిలో ఉంటాయి. వీటిలో కొన్ని యూఎస్బీ పవర్ సోర్స్‌కు కనెక్ట్ చేసుకుని కూడా వాడుకోవచ్చు. ఇలాంటి మినీ ఫ్యాన్స్‌లోనూ వివిధ రకాలు, స్టయిల్స్ ఉంటాయి. కొనుగోలు చేసే ముందు కాస్త నాణ్యత ప్రమాణాలను పరిశీలించడం మంచిది. -
భారత్‌లో ఖరీదైన స్కూటర్ లాంచ్: రేటు ఎంతంటే?
బీఎండబ్ల్యూ మోటొరాడ్ (BMW Motorrad) ఇండియన్ మార్కెట్లో.. 'సీ 400 జీటీ' స్కూటర్ లేటెస్ట్ వెర్షన్ లాంచ్ చేసింది. రూ. 11.50 లక్షల (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధర వద్ద లభించే ఈ స్కూటర్, దాని మునుపటి మోడల్ కంటే అప్డేట్స్ పొందుతుంది. కాబట్టి దీని ధర స్టాండర్డ్ మోడల్ కంటే రూ. 25000 ఎక్కువ. దీంతో ఇండియన్ మార్కెట్లో లభిస్తున్న స్కూటర్లలో ఇది ఒకటిగా చేరింది.బీఎండబ్ల్యూ సీ 400 జీటీ స్కూటర్.. సాధారణ ప్రయాణానికి మాత్రమే కాకుండా, దూర ప్రయాణాలకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇందులోని 350 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 7500 rpm వద్ద 34 Bhp పవర్, 5750 rpm వద్ద 35 Nm టార్క్ అందిస్తుంది. ఈ స్కూటర్ లీన్-సెన్సిటివ్ బ్రేకింగ్ అసిస్ట్, డైనమిక్ బ్రేక్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్‌తో కూడిన ఏబీఎస్ వంటి రైడర్ అసిస్ట్ ఫీచర్లను పొందుతుంది.సీ 400 జీటీ స్కూటర్.. పెద్ద విండ్‌షీల్డ్ పొందుతుంది. ఇది బ్లాక్‌స్టార్మ్ మెటాలిక్, డైమండ్ వైట్ మెటాలిక్ పెయింట్ స్కీమ్‌లలో లభిస్తుంది. ఇందులో 10.25 ఇంచెస్ TFT డిస్ప్లే ఉంది. ఇది హై రిజల్యూషన్ ఇంటర్ఫేస్తో నావిగేషన్, మీడియా అండ్ స్మార్ట్‌ఫోన్ ఇంటిగ్రేషన్ వంటి వాటిని మెరుగుపరుస్తుంది. అండర్ సీట్ కంపార్ట్మెంట్ 37.6 లీటర్లు. కాబట్టి ఇది అన్ని విధాలా రైడర్లకు చాలా అనుకూలంగా ఉంటుంది. -
'అప్పుడే అలా ప్రతిజ్ఞ చేశాను': గౌతమ్ అదానీ
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. ప్రముఖ పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్ చైర్మన్ 'గౌతమ్ అదానీ' (Gautam Adani) లింగ సమానత్వం, అన్ని రంగాలలో మహిళల సాధికారత పట్ల తన నిబద్ధతను వెల్లడించారు. తన ప్రయాణాన్ని రూపొందించిన బలమైన మహిళల గురించి మాట్లాడుతూ.. ''బనస్కాంత నుండి బోర్డ్‌రూమ్‌ల వరకు: నా ప్రపంచాన్ని తీర్చిదిద్దిన మహిళలు" అనే పేరుతో ఓ పోస్ట్ చేశారు.లింగ సమానత్వం అంటే..తన మనవరాళ్లు.. తమ కలలను సాధించడంలో మహిళలు ఎటువంటి అడ్డంకులు ఎదుర్కోని ప్రపంచాన్ని నిర్మించాలనే తన సంకల్పాన్ని ఆదానీ వివరించారు. నన్ను, నా ప్రయాణాన్ని దృఢంగా రూపందించుకోవడంలో.. నా తల్లి, భార్య సహాయం చేశారని చెప్పారు. లింగ సమానత్వం అంటే.. ''కేవలం మహిళలకు అవకాశాలు కల్పించడం మాత్రమే కాదు, ఇది మానవ మనుగడకు ఎంతో అవసరం'' అని నొక్కి చెప్పారు.అవధులు లేని ప్రపంచాన్నిదశాబ్దం క్రితం, నా మొదటి మనవరాలి సున్నితమైన వేళ్లను నేను పట్టుకున్నప్పుడు, నేను నిశ్శబ్దంగా ఒక ప్రతిజ్ఞ చేసాను. ఆమె ఆకాంక్షలకు అవధులు లేని ప్రపంచాన్ని నిర్మించడంలో సహాయం చేయాలని అనుకున్నాను. ఇప్పుడు అందమైన ముగ్గురు మానవరాళ్లను చూస్తుంటే.. నా వాగ్దానం మరింత గుర్తుకొస్తోందని అదానీ చెప్పుకొచ్చారు.ఇదీ చదవండి: ప్రపంచ కుబేరుడితో నాల్గవ బిడ్డకు జన్మనిచ్చింది: ఎవరీ షివోన్ జిలిస్?క్యాలెండర్లో ఒక తేదీఅంతర్జాతీయ మహిళా దినోత్సవం కేవలం క్యాలెండర్లో ఒక తేదీ కాదు, మనం సాధించిన పురోగతిని.. ముందుకు సాగుతున్న ప్రయాణాన్ని గుర్తుచేస్తుంది. వ్యక్తిగతంగా.. తల్లి నుంచి ప్రేరణ పొందిన చిన్న పిల్లవాడిగా, నాయకత్వంలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను చూస్తున్న వ్యాపారవేత్తగా, నా భార్య ప్రీతి అదానీ ఫౌండేషన్ పట్ల అచంచలమైన అంకితభావంతో ప్రేరణ పొందిన భర్తగా.. నన్ను దాదూ అని ఆప్యాయంగా పిలిచే అమ్మాయిల కోసం పరిమితులు లేని ప్రపంచం గురించి కలలు కంటున్న తాతగా నన్ను నేను చూసుకుంటున్నాను.ప్రతిభకు హద్దులు లేవుగౌతమ్ అదానీ.. తన కంపెనీ ఓడరేవులలో ఒకదానిని సందర్శించినప్పుడు తనకు ఎదురైన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకున్నారు. అక్కడ నాయకత్వ పాత్రల్లో మహిళలు లేకపోవడాన్ని గమనించారు. ఇదే ఆయనలో మార్పు తీసుకురావడానికి దోహదపడింది. నాయకత్వ పాత్రల్లో మహిళలు లేకపోవడానికి కారణం.. సామర్థ్యం లేకపోవడం కాదు, పురుషాధిక్యంతో వివిధ రంగాలలో మార్గాలు లేకపోవడం అని తెలుసుకున్నారు. మహిళల ప్రతిభకు హద్దులు లేవు, వారికి కూడా సమాన అవకాశాలు కల్పించాలి. కాబట్టి అన్ని రంగాల్లోనూ మహిళలకు సమానమైన అవకాశాలు కల్పించాలని మహిళా దినోత్సవం సందర్భంగా అదానీ సంకల్పించారు. -
జీఎస్టీ రేట్ల తగ్గింపుపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన
జీఎస్టీ రేట్లు మరింత తగ్గుతాయని, పన్ను రేట్లు & శ్లాబులను హేతుబద్ధీకరించే పని దాదాపు ముగింపు దశకు చేరుకుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) అన్నారు. 2017 జూలై 1న GST అమలులోకి వచ్చిన సమయంలో 15.8 శాతంగా ఉన్న రెవెన్యూ న్యూట్రల్ రేటు (RNR) 2023 నాటికి 11.4 శాతానికి తగ్గిందని అన్నారు. ఇది మరింత తగ్గుతుందని స్పష్టం చేశారు.సెప్టెంబర్ 2021లో సీతారామన్ నేతృత్వంలోని.. రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్, జీఎస్టీ రేట్లను హేతుబద్ధీకరించడానికి.. శ్లాబులలో మార్పులను సూచించడానికి మంత్రుల బృందాన్ని (GoM) ఏర్పాటు చేసింది. ఈ బృందంలో ఆరు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఉంటారు.శనివారం ఢిల్లీలో 'ది ఎకనామిక్ టైమ్స్ అవార్డ్స్' కార్యక్రమంలో జీఎస్టీ రేట్లు, శ్లాబులను హేతుబద్ధీకరించాల్సిన సమయం ఆసన్నమైందా అనే ప్రశ్నకు, నిర్మలా సీతారామన్ సమాధానమిస్తూ.. ఆ పని దాదాపు ముగింపు దశకు చేరుకుందని అన్నారు.స్టాక్ మార్కెట్ అస్థిరతకు కారణాలు, మార్కెట్లు మరింత ప్రశాంతంగా ఉండటానికి మార్గం ఎలా ఉందనే ప్రశ్నకు సీతారామన్ స్పందిస్తూ.. మీరు అడిగే ప్రశ్నలు.. ప్రపంచం ప్రశాంతంగా ఉంటుందా?, యుద్ధాలు ముగుస్తాయా?, ఎర్ర సముద్రం సురక్షితంగా ఉంటుందా?, సముద్ర దొంగలు ఉండరా అన్నట్లు ఉన్నాయి. ఇలాంటి ప్రశ్నలకు మీరు, నేను ఖచ్చితమైన సమాధానం చెప్పగలమా? అని అన్నారు.ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా తగ్గింపుపై సీతారామన్ మాట్లాడుతూ.. ప్రజల వాటాను పెంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎక్కువ మంది రిటైల్ పెట్టుబడిదారులు ఉండాలని తాము కోరుకుంటున్నట్లు సీతారామన్ స్పష్టం చేశారు.ఇదీ చదవండి: ప్రపంచ కుబేరుడితో నాల్గవ బిడ్డకు జన్మనిచ్చింది: ఎవరీ షివోన్ జిలిస్? -
అప్పుల్లోనూ ఆమెదే పైచేయి
ముంబై: ఇంటి బాధ్యతల్లో కీలక పాత్ర పోషిస్తున్న మహిళలు.. కుటుంబం, వృత్తిపరమైన అవసరాలకు రుణాలను తీసుకోవడానికీ వెనుకాడడం లేదు. గతేడాది యాక్టివ్ రుణ గ్రహీతల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉన్నట్టు క్రెడిట్ బ్యూరో సంస్థ ‘క్రిఫ్ హైమార్క్’ తెలిపింది.రుణాలు తీసుకోవడమే కాదు, వాటిని సకాలంలో తిరిగి చెల్లించడంలోనూ పురుషులతో పోల్చితే మహిళలే మెరుగైన పనితీరు చూపిస్తున్నట్టు వెల్లడించింది. 2024 డిసెంబర్ నాటికి యాక్టివ్ మహిళా రుణగ్రహీతలు 10.8 శాతం పెరిగి 8.3 కోట్లుగా ఉన్నట్టు తెలిపింది. అదే సమయంలో పురుష రుణ గ్రహీతల్లో వృద్ధి 6.5 శాతంగానే ఉన్నట్టు వెల్లడించింది. ‘‘రుణాల విషయంలో పురుషుల కంటే స్త్రీలే మెరుగైన ప్రవర్తన చూపిస్తున్నారు. బంగారం రుణాలు మినహా మిగిలిన రుణాల్లో 91 నుంచి 180 రోజుల వరకు చెల్లింపులు నిలిపివేసిన రుణ గ్రహీతల్లో మహిళలు తక్కువగా ఉన్నారు’’అని ఈ నివేదిక తెలిపింది.గృహ రుణాలు, వ్యాపార రుణాలు, వ్యవసాయం, ట్రాక్టర్ల రుణాలు, ప్రాపర్టీ రుణాలు, విద్యా రుణాల్లో మహిళల తీరు మెరుగ్గా ఉన్నట్టు వెల్లడించింది. వినియోగ రుణాల్లోనూ (కన్జ్యూమర్) మగవారి కంటే చెల్లింపుల పరంగా మహిళల ప్రవర్తనే మెరుగ్గా ఉన్నట్టు తెలిపింది. 2024 చివరికి మొత్తం మహిళా రుణ గ్రహీతలు 18 శాతం పెరిగి 36.5 కోట్లుగా ఉన్నట్టు పేర్కొంది. రుణాల్లో 35 ఏళ్లలోపు వారు ఎక్కువగా తీసుకుంటున్నారు. మహిళలకు సంబంధించి గృహ రుణాలు, వ్యాపార రుణాలు, ప్రాపర్టీ రుణాలు, ఆటో రుణాలు, క్రెడిట్‌కార్డ్, విద్యా రుణాల్లో మహారాష్ట్ర ముందున్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. -
'గంటకు రూ. 67కే జీపీయూలు'
న్యూఢిల్లీ: ఇండియాఏఐ కంప్యూట్ పోర్టల్‌లో గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు (జీపీయూలు) అత్యంత తక్కువ ధరకి, గంటకు రూ. 67కే అందుబాటులో ఉంటాయని కేంద్ర ఐటీ మంత్రి 'అశ్విని వైష్ణవ్' తెలిపారు. ఇండియా ఏఐ మిషన్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఇండియాఏఐ కంప్యూట్ పోర్టల్, డేటాసెట్ ప్లాట్‌ఫాం ఏఐకోశ మొదలైనవి ఆయన ఆవిష్కరించారు.అంకుర సంస్థలు, విద్యార్థులు, పరిశోధకులకు మొదలైన వారికి ఇండియాఏఐ కంప్యూట్ పోర్టల్‌లో 18,000 జీపీయులు, క్లౌడ్ స్టోరేజ్, ఇతరత్రా ఏఐ సర్వీసులు అందుబాటులో ఉంటాయని మంత్రి వివరించారు. సొంత ఫౌండేషనల్ మోడల్స్‌ను రూపొందించుకోవడంపై భారత్ పురోగతి బాగుందన్నారు. ఇందుకు సంబంధించి 67 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు.ఏఐ అప్లికేషన్స్, సొల్యూషన్స్‌ను తయారు చేయడంలో పరిశోధకులు, ఎంట్రప్రెన్యూర్లు, స్టార్టప్‌లకు ఉపయోగపడేలా డేటాసెట్లు, సాధనాలు మొదలైనవన్నీ ఏఐకోశలో ఉంటాయి. ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా ఏఐ ఆవిష్కరణలకు తోడ్పడే సమగ్ర వ్యవస్థను తయారు చేసే దిశగా కేంద్ర క్యాబినెట్ గతేడాది మార్చిలో రూ. 10,372 కోట్ల బడ్జెట్‌తో ఇండియాఏఐ మిషన్ ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది. -
నూకల ఎగుమతులపై నిషేధం ఎత్తివేత
న్యూఢిల్లీ: నూకల ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం ఎత్తివేసింది. ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ తెలిపింది. ప్రభుత్వ గోడౌన్లలో బియ్యం నిల్వలు పుష్కలంగా ఉండటంతో పాటు రిటైల్ ధరలూ అదుపులోకి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిల్వలు భారీగా పెరగడంతో ఎగుమతులకు ఆమోదం ఇవ్వాలంటూ ఎగుమతిదారులు ప్రభుత్వాన్ని గతంలో కోరారు. కాగా 2022 సెప్టెంబర్‌లో నూకల ఎగుమతులపై భారత్ నిషేధం విధించింది. గత ఏడాది బాస్మతియేతర తెల్ల బియ్యం ఎగుమతుల కోసం నిర్దేశించిన టన్నుకు 490 డాలర్ల కనీస ఎగుమతి ధరను (ఎంఈపీ) ప్రభుత్వం తొలగించింది. అలాగే ఈ రకం ఎగుమతులపై ఉన్న పూర్తి నిషేధాన్ని ఉపసంహరించుకుంది. భారత్ గత ఆర్థిక సంవత్సరంలో గాంబియా, బెనిన్, సెనెగల్, ఇండోనేషియా తదితర దేశాలకు 194 మిలియన్ డాలర్ల విలువైన నూకలు ఎగుమతి చేసింది. 2022–23లో 983 మిలియన్ డాలర్లు, 2021–22లో 1.13 బిలియన్ డాలర్ల విలువ చేసే నూకలు భారత్ నుంచి విదేశాలకు చేరాయి. -
రూ. 1.5 లక్షల కోట్లకు రష్యా చమురు కొనుగోళ్లు
న్యూఢిల్లీ: ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా నుంచి భారత్ దాదాపు 112.5 బిలియన్ యూరోల (సుమారు రూ. 1.5 లక్షల కోట్లు) ముడి చమురు కొనుగోలు చేసినట్లు సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (క్రియా) ఒక నివేదికలో తెలిపింది. రష్యా–ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు మొదలైన 2022 ఫిబ్రవరి 24 నుంచి శిలాజ ఇంధనాలకు సంబంధించి రష్యాకు లభించిన చెల్లింపుల వివరాలను ఇందులో పొందుపర్చింది. దీని ప్రకారం యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా శిలాజ ఇంధన ఎగుమతుల ద్వారా 835 బిలియన్ యూరోల ఆదాయం ఆర్జించినట్లు వివరించింది. చైనా అత్యధికంగా 235 బిలియన్ యూరోల (170 బిలియన్ యూరోల చమురు, 34.3 బిలియన్ యూరోల బొగ్గు, 30.5 బిలియన్ యూరోల గ్యాస్) ఇంధనాలు కొనుగోలు చేసింది. భారత్ 205.84 బిలియన్ యూరోల ఇంధనాలను కొనుగోలు చేసింది. ఇందులో 112.5 బిలియన్ యూరో క్రూడాయిల్, 13.25 బిలియన్ డాలర్ల బొగ్గు ఉంది. యుద్ధం వల్ల విధించిన ఆంక్షలతో రష్యా చమురు చౌకగా లభిస్తున్న నేపథ్యంలో ఆ దేశం నుంచి భారత్ గణనీయంగా కొనుగోళ్లు పెంచుకున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు బ్యారెల్‌కి 18–20 శాతం వరకు లభించిన డిస్కౌంటు ఇటీవలి కాలంలో 3 డాలర్ల దిగువకు పడిపోయింది. -
మందగమనంలోకి అమెరికా!
వాషింగ్టన్: తీవ్ర అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి అడుగుపెట్టొచ్చని ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ అభిప్రాయపడ్డారు. వినియోగదారుల వ్యయంలో మందగమనం సంభవించే అవకాశముందని, ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులపై తీవ్ర అనిశ్చితి కొన సాగుతోందని వ్యాపార వర్గాల్లో అంచనాలు నెలకొన్నాయి. ఈ వార్తల నేపథ్యంలో ఫెడ్ చైర్మన్ వ్యా ఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో జరిగిన ఆర్థిక ఫోరంలో ఆయన చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు. → కొత్త ట్రంప్ ప్రభుత్వ విధానాలు ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అన్న అంశంపై స్పష్టత వచ్చే వరకు ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించడంలో ఏ మాత్రం తొందరపడబోదు. → కొత్త ప్రభుత్వం 4 ప్రధాన రంగాల్లో గణనీయమైన విధాన మార్పులను అమలు చేసే ప్రక్రియలో ఉంది. వాణిజ్యం, వలస, ద్రవ్య, నియంత్రణ విధానాల్లో మార్పులు చోటుచేసుకునే వీలుంది. ఈ మార్పులు, వాటి ప్రభావాలపై అనిశ్చితి తీవ్రంగా ఉంది. → పరిస్థితులు ఎలా మారుతున్నాయో అర్థం చేసుకోవడంపై మేము దృష్టి సారిస్తాము. మేము తొందరపడాల్సిన అవసరం లేదు. స్పష్టత కోసం ఎదురుచూడడానికే మేము మొగ్గు చూపిస్తాము. → ఆర్థిక వ్యవస్థ పటిష్ట స్థితిలో ఉంది. అయితే చోటుచేసుకుంటున్న పరిణామాలు భవిష్యత్తులో వ్యయాలు, అలాగే పెట్టుబడులపై ఎలా ప్రభావం చూపుతాయో వేచి చూడాలి. → కీలక సూచీలు స్థిరంగానే ఉన్నాయని. అయితే ద్రవ్యోల్బణం విషయంలో ఇంకా అస్పష్టత కొనసాగుతోంది. ఉపాధి కల్పనలో మాత్రం వృద్ధి ధోరణి కొనసాగుతోంది. → ద్రవ్యోల్బణం అంచనాలను మించిన వేగంతో తగ్గినా లేదా ఆర్థిక వ్యవస్థ బలహీనపడినా ద్రవ్య విధానంలో అవసరమైన మార్పులు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. → ఫిబ్రవరి నెలలో అమెరికా ప్రభుత్వం 1,51,000 ఉద్యోగాల వృద్ధిని నమోదుచేసింది. అయితే సెపె్టంబర్ నుంచి చూస్తే నెలకు సగ టున 1,91,000 ఉద్యోగ కల్పన జరుగుతోంది. మార్కెట్లపై ప్రతికూలతలు.. ట్రంప్ ప్రభుత్వం మెక్సికో, కెనడా వంటి ప్రధాన వ్యాపార భాగస్వాములపై భారీ దిగుమతి సుంకాలను ప్రకటించడం, అలాగే చైనా నుండి దిగుమతులపై సుంకాలను రెట్టింపు చేయడం వంటి పరిణామాలు మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో ఫెడరల్ రిజర్వ్ మార్చి 18–19 తేదీల్లో జరిపే తన పాలసీ సమావేశంలో 4.25%–4.50% శ్రేణిలో వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచే అవకాశం ఉంది. పాలసీ నిర్ణేతలు ఆవిష్కరించే కొత్త ఆర్థిక అంచనాలు.. ట్రంప్ ప్రభుత్వ తొలి రెండు నెలల విధానాలు, ఇవి ద్రవ్యోల్బణం, ఉపాధి, ఆర్థిక వృద్ధి, వడ్డీ రేట్ల మార్గాన్ని ఎలా ప్రభావితం చేశాయనే అంశంపై స్పష్టత నిచ్చే అవకాశం ఉంది. కాగా, మార్కెట్లో పెట్టుబడిదారులు ప్రస్తుతం అమెరికా ఆర్థిక వ్యవస్థలో మాంద్యం సంభవించే అవకాశం ఎక్కువగా ఉందని భావిస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఫెడ్ మూడు దఫాలుగా పావు శాతం (మొత్తం 0.75%) చొప్పున రేటు కోతలు ఉండే అవకాశం ఉందని భావిస్తుండడం గమనార్హం. -
బోలెడంత షాపింగ్..!
సాక్షి, బిజినెస్ బ్యూరో: పెరుగుతున్న మధ్యతరగతి, ఆదాయాల్లో వృద్ధి, డిజిటల్ అవగాహన కలిగిన యువ కస్టమర్లు, విస్తరిస్తున్న మహిళా శ్రామిక శక్తి.. ఇంకేముంది బోలెడంత షాపింగ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా వినియోగదార్లు గత ఏడాది రూ.82,00,000 కోట్ల విలువైన వస్తువులను కొనుగోలు చేశారు. మన దేశంలోకి విదేశీ కంపెనీల రాక, అలాగే బీటూసీ బ్రాండ్లు వెల్లువెత్తడం, మారుతున్న ప్రజల అభిరుచులతో రిటైల్ మార్కెట్ అంచనాలను మించి రికార్డులను సృష్టిస్తోంది. వచ్చే దశాబ్దంలో భారతీయ రిటైల్ మార్కెట్ ఏటా 8.8 శాతం వృద్ధి చెంది 2034 నాటికి రూ.1,90,00,000 కోట్లు మించిపోనుందని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్త నివేదిక వెల్లడించింది.రిటైల్ రంగం పరుగెడుతోంది..ఆన్లైన్ షాపింగ్ విస్తృతి2014లో రూ.35,00,000 కోట్ల నుంచి వార్షిక ప్రాతిపదికన రిటైల్ రంగం ఏటా 8.9 శాతం దూసుకెళ్లిందంటే కొనుగోలు తీరుతెన్నుల్లో వస్తున్న మార్పులను అర్థం చేసుకోవచ్చు. జీవనశైలి, వినోదం కోసం చేస్తున్న వ్యయాలు ఏటా 10 శాతం పెరిగాయి. వ్యవస్థీకృత రిటైల్‌లో పెట్టుబడులు 2014–2024 మధ్య రెండింతలయ్యాయి. ఈ కాలంలో ఆన్లైన్ షాపింగ్‌లో 30 శాతం వృద్ధి నమోదైంది. వినియోగానికి అనుగుణంగా రిటైల్ రంగం పరుగెడుతోంది. భారతదేశ వినియోగ వృద్ధి ఇతర ఆర్థిక వ్యవస్థల కంటే ఎక్కువగా ఉండడం విశేషం. ఈ నేపథ్యంలో 2030 నాటికి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని అంచనా. 32.5 కోట్లుగా ఉన్న గృహాల సంఖ్య 2034 నాటికి 40.7 కోట్లకు చేరుకోనుందని నివేదికలు చెబుతున్నాయి.విదేశీ బ్రాండ్లకు సై..ప్రపంచీకరణ, విదేశీ బ్రాండ్ల పట్ల భారతీయులు సాను కూలంగా భావిస్తున్నారు. గ్లోబల్ బ్రాండ్లకై వినియోగ దారుల డిమాండ్‌ను తీర్చడానికి గడిచిన నాలుగు సంవత్సరాల్లో భారత్‌కు 60కిపైగా విదేశీ సంస్థలు ఎంట్రీ ఇచ్చాయి.ఆర్థిక స్తోమతనుబట్టి.. వినియోగదార్ల కొనుగోళ్లను నిర్ణయి స్తున్న అంశాలు ఆర్థిక స్తోమతనుబట్టి మారు తున్నాయి. దిగువ మధ్యతరగతి కస్టమర్లలో అత్యధికుల షాపింగ్‌ను ధర ప్రభావితం చే స్తోంది. మధ్య తరగతి, అధిక ఆదాయ కుటుంబాల్లో ఎక్కువ మంది ఫీచర్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు.కొనుగోలు నిర్ణయం ఇలా..ఏదైనా వస్తువును కొనుగోలు చేయాలంటే అత్యధికులు ఆఫ్లైన్పైనే ఆధారపడుతున్నారు. అంటే ప్రత్యక్షంగా దుకాణాలకు వెళ్లి కావాల్సిన ఉత్పత్తులను చూసి, ముట్టుకుని నిర్ణయం తీసుకుంటున్నారన్న మాట. మిశ్రమ మార్గాలలో అంటే నేరుగా షాప్‌కు వెళ్లి వస్తువులను పరిశీలించి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టడం లేదా ఆన్లైన్లో పరిశోధించి ఆఫ్‌లైన్‌లో కొనడం.లోకల్‌కే మొగ్గు..భారతీయ బ్రాండ్లు, స్థానిక ఉత్పత్తులను కొనడానికి జనం ఇష్టపడుతున్నారు. 2016 నుండి భారత్‌లో 600లపైచిలుకు స్వదేశీ డైరెక్ట్ టు కంజ్యూమర్ (డీటీసీ) బ్రాండ్లు ఉద్భవించాయి. -
అలలపై కలల విహారం
అలలపై తేలియాడుతూ ప్రయాణం.. గమ్యం చేరే వరకు ఎక్కడా బోర్ కొట్టకుండా ఆటలు, పాటలు, విందులు, వినోదాల్లాంటి బోలెడన్ని సరదాలు.. కళ్లు చెదిరే ఇంటీరియర్లతో అందమైన గదులు.. ప్రయాణ బడలిక తెలియనివ్వని పాన్పులు.. ఒకవేళ అలసటకు గురైతే స్పా, మసాజ్ లాంటి సర్వీసులు.. ఉన్న చోటే బోలెడంత షాపింగ్ చేసుకొనే అవకాశం.. ఇంకా ఈత కొలనులు.. జిమ్‌లు.. ఇలా ఒకటేమిటి ఇంద్రభవనం లాంటి సకల విలాసాలతో కూడిన నౌకల్లో విహారయాత్రలంటే ఎవరికి ఇష్టం ఉండదు.అందుకే దేశంలో లగ్జరీ క్రూజ్ టూరిజం సరికొత్త ట్రెండ్‌గా మారింది. పర్యాటకులను ఆనంద‘సాగరం’లో ముంచెత్తే అనుభూతులు పంచుతోంది. ఇంకేం.. జీవితాంతం గుర్తుండిపోయే సముద్రమంత లోతైన జ్ఞాపకాలు కావాలనుకుంటే ‘సీ’కేషన్కు సిద్ధమైపోండి. గెట్ సెట్ క్రూజ్!! దేశంలో క్రూజ్ పర్యాటకం క్రమంగా పుంజుకుంటోంది. డెస్టినేషన్ వెడ్డింగ్స్, ప్రైవేటు పార్టీలు, కంపెనీల గెట్ టు గెదర్ వంటి కార్యక్రమాలకు కూడా క్రూజ్‌లు వేదికలుగా మారుతున్నాయి. ప్రస్తుతం దేశంలో క్రూజ్ ప్రయాణికుల సంఖ్య 4.5 లక్షలు దాటింది. కార్డీలియా క్రూజెస్ అనే స్వదేశీ సంస్థ 2021 సెపె్టంబర్లో సుమారు 2 వేల మంది ప్రయాణికుల సామర్థ్యంగల ‘ఎంప్రెస్’నౌక ద్వారా భారత్‌లో తొలిసారిగా లగ్జరీ క్రూజ్ పర్యాటకానికి తెరతీసింది.బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రాల్లో క్రూజ్ యాత్రలు నిర్వహిస్తోంది. పశ్చిమ తీరంలో ముంబై హోమ్ పోర్టుగా సెపె్టంబర్–జూన్ మధ్య గోవా, కొచ్చి, లక్షదీవులకు... జూన్–సెప్టెంబర్ మధ్య తూర్పు తీరంలో చెన్నై హోమ్ పోర్ట్‌గా క్రూజ్ ట్రిప్పులు తిప్పుతోంది. 2023 జూన్‌లో భారత్ నుంచి శ్రీలంకకు జర్నీతో విదేశీ క్రూజ్ సర్విసులను ప్రారంభించిన ఘనతను కూడా కార్డీలియా సొంతం చేసుకుంది.ఇప్పుడు ఏటా చెన్నై–శ్రీలంక మధ్య జూన్–సెపె్టంబర్ నెలల్లో కార్డీలియా ’ఎంప్రెస్‘విహారయాత్రలను నిర్వహిస్తోంది. గమ్యస్థానాల్లో వాటర్ అడ్వెంచర్లు, జంగిల్ సఫారీలు, ఆన్‌షోర్ సిటీ టూర్, అవుట్డోర్ పర్యటనలను కూడా అందిస్తోంది. దేశీయ గమ్యస్థానాలకు పర్యాటకుల ఆక్యుపెన్సీ 85 శాతం మేర ఉంటోందని.. వేసవి సెలవుల్లో టికెట్లు పూర్తిగా బుక్ అయిపోతున్నాయని కంపెనీ సీఈఓ జుర్గెన్ బైలోమ్ చెబుతున్నారు. కొత్త రూట్లు, గమ్యస్థానాలకు విస్తరణ నేపథ్యంలో భారతీయ క్రూజ్ ట్రాఫిక్ 25–30 శాతం పెరిగే అవకాశం ఉందన్నారు. కేంద్రం దన్ను.. దేశంలో సముద్ర క్రూజ్ పర్యాటకులను 2029 నాటికి ఏటా 10 లక్షల మంది స్థాయికి చేర్చడంతోపాటు ఈ రంగంలో 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేలా ఐదేళ్ల భారత్ క్రూజ్ మిషన్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా 10 సముద్ర క్రూజ్ టెర్మినల్స్, 100 రివర్ క్రూజ్ టెర్మినల్స్ నిర్మించాలనేది ప్రభుత్వ లక్ష్యం.ప్రపంచస్థాయి మౌలిక వసతులతోపాటు పర్యాటక ప్రదేశాలను మరింతగా అభివృద్ధి చేయనున్నారు. బడ్జెట్లో కూడా క్రూజ్ పరిశ్రమ వృద్ధికి ప్రోత్సాహకాలు ఇవ్వడం విశేషం. గంగ, బ్రహ్మపుత్ర నదుల్లో ఇప్పటికే రివర్ క్రూజ్ సర్విసులు ప్రారంభమయ్యాయి. కృష్ణా, గోదావరి, నర్మద, కావేరి నదుల్లోనూ ఈ సర్విసులను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రివర్ క్రూజ్ పర్యాటకులను 2029 నాటికి ఏటా 15 లక్షలకు పెంచాలనేది మిషన్ లక్ష్యం.వైజాగ్ హాట్ డెస్టినేషన్... జూలైలో మళ్లీ క్రూజ్ రెడీ2022లో తొలిసారి కార్డీలియా క్రూజెస్ ‘ఎంప్రెస్’నౌక విశాఖ–చెన్నై మధ్య సముద్ర విహారంతో పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచింది. గతేడాది ‘ద వరల్డ్’అనే విదేశీ లగ్జరీ క్రూజ్ షిప్ గ్లోబల్ టూరిస్టులను విశాఖకు తీసుకొచ్చింది. ఇక్కడ సకల సౌకర్యాలతో నిర్మించిన అంతర్జాతీయ క్రూజ్ టెర్మినల్‌లో లంగరేసింది. ఈ ఏడాది మళ్లీ జూలైలో కార్డీలియా ఎంప్రెస్ నౌక వైజాగ్–పుదుచ్చేరి–చెన్నై మధ్య ట్రిప్పులకు రెడీ అవుతోంది.సుమారు రూ. 100 కోట్ల వ్యయంతో విశాఖ పోర్టులో నిర్మించిన ఇంటర్నేషనల్ క్రూజ్ టెర్మినల్ నుంచి నౌకల రాకపోకలు మొదలవడంతో క్రూజ్ పర్యటకానికి కూడా వైజాగ్ హాట్ డెస్టినేషన్‌గా నిలుస్తోంది. షిప్ ఆకారంలో నిర్మించిన ఈ టెర్మినల్‌లోని బెర్త్‌లో 2,500 మంది సామర్థ్యంతో కూడిన భారీ క్రూయిజ్లను లంగరేయొచ్చు. త్వరలో ఇక్కడి నుంచి సింగపూర్, మలేసియా, థాయ్‌లాండ్, శ్రీలంక తదితర దేశాలకు క్రూజ్ సర్వీసులు ప్రారంభించేందుకు పలు క్రూజ్ కంపెనీలతో సంప్రదింపులు జరుగుతున్నాయి.విదేశీ క్రూజ్‌ల క్యూఇటలీకి చెందిన కోస్టా క్రూజెస్ తొలిసారిగా 2023లో భారత్ పర్యాటకులకు అంతర్జాతీయ స్థాయి క్రూజ్ అనుభూతితోపాటు ఇటాలియన్ ఆతిథ్యాన్ని రుచి చూపించింది. ముంబై, కొచ్చి, గోవాతోపాటు లక్షదీవుల మధ్య మొత్తం 23 ట్రిప్పులు నిర్వహించింది. మొత్తం 14 అంతస్తులు (డెక్‌లు), 3,780 మంది ప్రయాణికుల సామర్థ్యంతో కోస్టా సెరీనా క్రూజ్ భారత సముద్ర జలాల్లో విహరించిన అతిపెద్ద నౌకగా రికార్డుకెక్కింది.ఆసియా పసిఫిక్ కార్యకలాపాల కోసం భారత్‌ను ప్రధాన కేంద్రంగా చేసుకోవడంపై దృష్టి పెడుతున్నామని కోస్టా క్రూజెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాబర్టో అల్బెర్టీ వెల్లడించారు. క్రూజ్ టూరిజానికి ప్రభుత్వ ప్రోత్సాహంతో మరిన్ని క్రూజ్ కంపెనీలు భారత్‌కు క్యూ కట్టనున్నాయి. వచ్చే ఏడాది నుంచి ‘రిసార్ట్ వరల్డ్ వన్’క్రూజ్ లైనర్ మన దేశంలో సెయిలింగ్‌కు సై అంటోంది. రాయల్ కరీబియన్, డిస్నీ తదితర దిగ్గజ క్రూజ్ లైనర్లు కూడా భారత మార్కెట్లోకి అడుగుపెట్టే ప్రణాళికల్లో ఉన్నాయి.ఇక అలలపై ఆగ్నేయాసియా చుట్టేయొచ్చు! భారత క్రూజ్ పరిశ్రమ ఇక అంతర్జాతీయంగానూ సత్తా చాటనుంది. కార్డీలియా తొలిసారిగా భారత్ నుంచి ఆగ్నేయాసియాలోని ప్రముఖ పర్యాటక దేశాలకు జూలైలో క్రూజ్ జర్నీ ప్రారంభిస్తోంది. ఇందుకోసం 2,500 మంది సామర్థ్యంగల రెండు కొత్త క్రూజ్లను కొననుంది. చెన్నై నుంచి మొదలయ్యే ఈ 10 రోజుల ట్రిప్‌లో థాయ్‌లాండ్ (ఫుకేట్), మలేసియా (కౌలాలంపూర్, లంకావీ)ల మీదుగా సింగపూర్ చేరుకోవచ్చు.అలాగే సింగపూర్ నుంచి మొదలై అవే డెస్టినేషన్లను కవర్ చేస్తూ చెన్నై చేరేలా టూర్లను ప్లాన్ చేశారు. ఇప్పటికే కార్డీలియా వెబ్సైట్ (www.cordeliacruises) తోపాటు ప్రముఖ ట్రావెల్ పోర్టల్స్‌లో బుకింగ్స్ మొదలయ్యాయి. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రాలను చుట్టేయడంతోపాటు గమ్యస్థానాల్లో సిటీ టూర్స్, ఆన్‌షోర్ పర్యటనలతో ఒకే ట్రిప్‌లో మూడు దేశాలను కవర్ చేసే అవకాశం ఉంటుంది.ప్యాకేజీలు ఇలా... కార్డీలియా ‘ఎంప్రెస్షిప్లో మధ్యతరగతి కుటుంబం సైతం లగ్జరీ క్రూజ్ జర్నీ చేసేవిధంగా రకరకాల రూమ్‌లు, ఆఫర్లు, గ్రూప్ ప్యాకేజీలు ఉన్నాయి. ఉదాహరణకు చెన్నై–విశాఖ మధ్య ఇద్దరు పెద్దవాళ్లకు రెండు రాత్రులు, 3 పగళ్ల ప్యాకేజీ ధరలు (పన్నులన్నీ కలిపి) చూస్తే...అన్లిమిటెడ్ ఫుడ్, ఎంటర్టైన్మెంట్తో మూడు రోజులపాటు ఫైవ్ స్టార్ లగ్జరీ సముద్ర ప్రయాణ అనుభూతిని సొంతం చేసుకోవచ్చు. జర్నీ రూట్, ఎంత మంది, ఎన్ని రోజులు (3, 5 నైట్స్ ప్యాకేజీలు) అనేదాన్ని బట్టి రేట్లు మారతాయి. 12 ఏళ్ల లోపు పిల్లలకు షరతులకు లోబడి ఉచిత ప్రయాణ (పన్నులు కాకుండా) ఆఫర్ ఉంది. ధర ఎక్కువైనా మరింత లగ్జరీ, సౌకర్యాలు కోరుకునేవారికి సూట్, చైర్మన్ సూట్ కూడా ఉన్నాయి.విదేశీ టూర్ల విషయానికొస్తే... చెన్నై నుంచి శ్రీలంకకు (హంబన్‌టోట, ట్రింకోమలీ, జాఫ్నా), తిరిగి చెన్నై (5 నైట్స్, 6 డేస్ రౌండ్ ట్రిప్) జర్నికి ఇద్దరు పెద్దవాళ్లకు చార్జీ దాదాపు రూ. లక్ష పడుతుంది. అలాగే చెన్నై నుంచి సింగపూర్ (ఫుకెట్, లంకావీ, కౌలాలంపూర్ మీదుగా వన్‌వే ట్రిప్ – 10 నైట్స్, 11 డేస్) ట్రిప్‌కి చార్జీ రూ.2,21,745 అవుతుంది. పన్నులతో కలిపి, ఇంటీరియర్ స్టేట్‌రూమ్ ప్యాకేజీలు ఇవి.క్రూజ్ లెక్కలు ఇలా.. 3 కోట్లు: ప్రపంచవ్యాప్తంగా ఏటా క్రూజ్ జర్నీ చేస్తున్న పర్యాటకుల సంఖ్య (సుమారుగా) 30 బిలియన్ డాలర్లు: క్రూజ్ జర్నీ మార్కెట్ విలువ45 బిలియన్ డాలర్లు: 2029 నాటికి క్రూజ్ జర్నీ మార్కెట్ విలువ అంచనా4.5 లక్షలు: దేశంలో ప్రస్తుతం క్రూజ్ ప్రయాణికుల సంఖ్య5.3 లక్షలు: ఇప్పటిదాకా కార్డీలియా ఎంప్రెస్‌లో విహరించిన పర్యాటకులు -
ప్రపంచ కుబేరుడితో నాల్గవ బిడ్డకు జన్మనిచ్చింది: ఎవరీ షివోన్ జిలిస్?
ప్రపంచ కుబేరుడు 'ఎలాన్ మస్క్' (Elon Musk) గురించి తెలిసిన చాలామందికి.. అతని నలుగురు పిల్లలకు తల్లి అయిన 'షివోన్ జిలిస్' (Shivon Zilis) గురించి బహుశా తెలిసుండకపోవచ్చు. ఇంతకీ ఈమె ఎవరు? ఈమె గురించి ఆసక్తికరమైన విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.నిజానికి.. షివోన్ జిలిస్ భారతీయ మూలాలున్న మహిళ. ఎలా అంటే ఈమె తల్లి పంజాబీ ఇండియన్ శారద. అయితే శారద కెనడియన్ అయిన రిచర్డ్‌ని వివాహం చేసుకుంది. వీరిద్దరికి పుట్టిన సంతానమే షివోన్ జిలిస్. ఈమె 1986 ఫిబ్రవరి 8న కెనడాలోని అంటారియోలోని మార్ఖమ్‌లో జన్మించింది.షివోన్ జిలిస్ అమెరికాలోని ప్రతిష్టాత్మక యేల్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రం, తత్వశాస్త్ర డిగ్రీలు పూర్తి చేశారు. ఐటీ దిగ్గజం ఐబీఎం కంపెనీలో తన కెరీర్ ప్రారంభించింది. యేల్ యూనివర్సిటిలో చదువుకునే సమయంలో ఐస్ హాకీ జట్టులో కీలక సభ్యురాలు. గోల్ కీపర్‌గా ఆల్ టైమ్ బెస్ట్. ఆమె గిటార్, డ్రమ్స్ కూడా ప్లే చేసేది.షివోన్ జిలిస్ కెనడియన్ ఏఐ నిపుణురాలు, వెంచర్ క్యాపిటలిస్ట్. ఆమె మస్క్ వ్యాపార సామ్రాజ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతే కాకుండా ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్‌లో ప్రత్యేకత కలిగిన టెస్లా, ఓపెన్ఏఐ, న్యూరాలింక్ వంటి కంపెనీలలో పనిచేసినట్లు సమాచారం.షివోన్ జిలిస్ 2016లో ఓపెన్ఏఐ (OpenAI)లో బోర్డు సభ్యురాలిగా చేరింది. తరువాత 2017 నుంచి 2019 వరకు టెస్లాలో పనిచేసింది, అక్కడ ఆమె కంపెనీ ఆటోపైలట్ ప్రోగ్రామ్, సెమీకండక్టర్ వంటి విభాగాల్లో కీలక పాత్ర పోషించింది. ఆ సమయంలో మస్క్ బ్రెయిన్ చిప్ స్టార్టప్ న్యూరాలింక్‌లో ప్రధాన పాత్ర పోషించింది. అక్కడ ఆమె ఆపరేషన్స్, ప్రత్యేక ప్రాజెక్టుల డైరెక్టర్‌గా పనిచేస్తోంది.ఇదీ చదవండి: ఆ నగరం భారతదేశ బాహుబలి: ఆనంద్ మహీంద్రా2021లో షివోన్ జిలిస్ కవలలకు జన్మనించింది, 2024లో మూడవ బిడ్డను స్వాగతించింది. కాగా ఇటీవల నాల్గవ బిడ్డకు జన్మనిచ్చినట్లు, బిడ్డకు సెల్డాన్ లైకుర్గస్ (Seldon Lycurgus) అని పేరు పెట్టినట్లు వెల్లడించింది. మొత్తం మీద ఇప్పుడు ఎలాన్ మస్క్ 14 మంది పిల్లలకు తండ్రి అయ్యారు. -
హైదరాబాద్‌లో సీఐఐ తెలంగాణ సమావేశం
భారత పరిశ్రమల సమాఖ్య (CII) తెలంగాణ, తన యాన్యువల్ సెషన్ & కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని ఒక ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను నిర్మించడమే ప్రధాన ఉద్దేశ్యంగా.. హైదరాబాద్‌లో నిర్వహించింది. ఈ సందర్భంగా, పరిశ్రమ నాయకులు గ్రీన్ ఛాంపియన్లకు వనమహోత్సవ్ అవార్డులను అందజేశారు. అంతే కాకుండా సీఐఐ తెలంగాణ.. సీఐఐ ఆదిలాబాద్ జిల్లా జోన్‌ను ప్రారంభించింది.పరిశ్రమలు 4.0 నుంచి 5.0కు సాగాలని, దీనికోసం తెలంగాణ పారిశ్రామిక పరివర్తనను వేగవంతం చేయడంపై సీఐఐ తెలంగాణ నివేదికను విడుదల చేసింది. అంతే కాకుండా.. 2025-26 సంవత్సరానికి సీఐఐ తెలంగాణ చైర్మన్‌గా ఆర్ శివ ప్రసాద్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా గౌతమ్ రెడ్డి మెరెడ్డి ఎన్నికయ్యారు.సీఐఐ సమావేశంలో ఈవై ఇండియా మేనేజింగ్ పార్టనర్ రోహన్ సచ్దేవ్ మాట్లాడుతూ.. జీసీసీలు ఆవిష్కరణ కేంద్రాలుగా ఆవిర్భవించాయని అన్నారు. హైదరాబాద్‌లో దాదాపు 7000 స్టార్టప్‌లు, 51 ఇంక్యుబేషన్ సెంటర్లు, దాదాపు 300 మంది పెట్టుబడిదారులు ఉన్నారు. ఇటీవలి కాలంలో రాష్ట్రం ఆవిష్కరణ కేంద్రంగా అవతరించిందని అన్నారు. స్థిరమైన పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణ ముందంజలో ఉందని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో.. సీఐఐ సదరన్ రీజియన్ & సైయెంట్ లిమిటెడ్ చైర్మన్ డాక్టర్ బీవీఆర్ మోహన్ రెడ్డి, చంద్ర టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్పర్సన్ డాక్టర్ ఆర్ నందిని, సీఐఐ తెలంగాణ చైర్మన్ & భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డీ ప్రసాద్, సీఐఐ తెలంగాణ మాజీ ఛైర్మన్ & ఎలికో లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వనితా దట్ల మొదలైనవారు పాల్గొన్నారు. -
క్రిప్టో మార్కెట్ వైపు అతివల అడుగులు: కారణం ఇదే..
క్రిప్టో కరెన్సీ విలువ రోజురోజుకి వృద్ధి చెందుతున్న తరుణంలో.. చాలామంది చూపు దీనిపై పడింది. అయితే క్రిప్టో కరెన్సీలో పెట్టుబడిపెడుతున్న వారిలో పురుషులే అధికంగా ఉన్నప్పటికీ.. స్త్రీల సంఖ్య కూడా కొంత పెరిగిందని, దేశంలోని ప్రముఖ క్రిప్టో ఎక్స్ఛేంజ్ 'జియోటస్' వెల్లడించింది.మహిళా పెట్టుబడిదారులు భారత క్రిప్టో మార్కెట్లోకి మునుపటి కంటే ఎక్కువగా ప్రవేశిస్తున్నారు. ఈ సంఖ్య 20 శాతం పెరిగిందని జియోటస్ స్పష్టం చేసింది. మహిళా పెట్టుబడిదారులు దీర్ఘకాలిక పెట్టుబడులలో మాత్రమే కాకుండా.. బిట్‌కాయిన్, ఎథెరియం వంటి వాటిలోకి ప్రవేశిస్తున్నారు.మహిళలు క్రిప్టో కరెన్సీవైపు ఎక్కువ ఆసక్తి చూపించడానికి ప్రధాన కారణం.. చదువుకున్న వారికి డిజిటల్ అవగాహన, పెట్టుబడికి సంబంధించిన అవగాహన పెరగడం అని తెలుస్తోంది. యువత ఎక్కువగా క్రిప్టోలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్నట్లు ఆర్ధిక నిపుణులు కూడా చెబుతున్నారు.ఇదీ చదవండి: శివ్ నాడార్ కీలక నిర్ణయం.. కుమార్తెకు భారీ గిఫ్ట్ఇప్పుడు పెద్ద పెద్ద పట్టణాల్లో ఉన్న మహిళలు మాత్రమే కాకుండా. టైర్ 2, టైర్ 3 నగరాల్లోని మహిళలు కూడా వివిధ రంగాలలో పెట్టుబడులు పెడుతున్నారు. ఇందులో క్రిప్టో కరెన్సీ కూడా ఉంది. రాబోయే రోజుల్లో మహిళా పెట్టుబడిదారుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉందని జియోటస్ అంచనా వేస్తోంది. -
బెస్ట్ సీఎన్జీ కార్లు: ధర రూ.10 లక్షల కంటే తక్కువే..
పెట్రోల్ ధరలు పెరగడం, సీఎన్జీ రీఫ్యూయలింగ్ స్టేషన్లు అందుబాటులోకి రావడం అన్నీ జరుగుతున్నాయి. ఈ తరుణంలో చాలామంది పెట్రోల్ కార్ల స్థానంలో సీఎన్జీ కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ కథనంలో రూ. 10 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే ఉత్తమ సిఎన్జీ కార్లను గురించి తెలుసుకుందాం.మారుతి సుజుకి ఆల్టో కే10 సీఎన్జీప్రస్తుతం భారతదేశంలో అందుబాటులో ఉన్న అత్యంత సరసమైన సీఎన్జీ కార్లలో ఒకటి 'మారుతి సుజుకి ఆల్టో కే10'. ఎల్ఎక్స్ఐ (ఓ), వీఎక్స్ఐ (ఓ) వేరియంట్లలో అందుబాటులో ఉన్న ఈ కారు ధరలు రూ. 5.8 లక్షలు, రూ. 6.04 లక్షలు. ఇందులోని 998 సీసీ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 5300 rpm వద్ద 56 Bhp పవర్, 3400 rpm వద్ద 82.1 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ పొందుతుంది. ఈ కారు 33.85 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుందని సమాచారం.మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో సీఎన్జీఇది కూడా ఎల్ఎక్స్ఐ (ఓ), వీఎక్స్ఐ (ఓ) అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. దీని ధరలు వరుసగా రూ. 5.91 లక్షలు, రూ. 6.11 లక్షలు. ఈ కారులో 998 సీసీ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 56 Bhp పవర్, 82.1 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఇది 32.73 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుంది.టాటా టియాగో సీఎన్జీటాటా టియాగో సీఎన్జీ ధరలు రూ. 6 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. ఇందులో ట్విన్ సిలిండర్ CNG ట్యాంక్ ఉంటుంది. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులో ఉన్న అత్యంత సరసమైన సీఎన్జీ కారుగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ కారు ఐదు మాన్యువల్, మూడు ఆటోమాటిక్ వేరియంట్లలో లభిస్తుంది. మాన్యువల్ ధరలు రూ. 5.99 లక్షల నుంచి రూ. 8.19 లక్షల మధ్య ఉన్నాయి. ఆటోమాటిక్ ధరలు రూ. 7.84 లక్షల నుంచి రూ. 8.74 లక్షల మధ్య ఉన్నాయి.మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ సీఎన్‌జీమారుతి సుజుకి వ్యాగన్ ఆర్ సీఎన్జీ.. ఎల్ఎక్స్ఐ (ఓ), విఎక్స్ఐ (ఓ) అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 6.54 లక్షల నుంచి రూ. 6.99 లక్షల వరకు ఉంటాయి. ఇది 998 సీసీ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ ద్వారా 5300 ఆర్పీఎమ్ వద్ద 56 బిహెచ్పీ పవర్ఉ.. 3400 ఆర్పీఎమ్ వద్ద 82.1 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. దీని మైలేజ్ 33.47 కిమీ/కేజీ వరకు ఉంది.ఇదీ చదవండి: అమ్మకాల్లో టాప్ కంపెనీలు.. ఎక్కువమంది కొంటున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే!మారుతి సుజుకి సెలెరియో సీఎన్‌జీమారుతి సుజుకి సెలెరియో సీఎన్జీ.. భారతదేశంలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే సీఎన్జీ కార్లలో ఒకటి. దీని ధర రూ. 6.90 లక్షలు. ఇది 34 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుంది. ఈ కారులోని 998 సీసీ ఇంజిన్ 5300 rpm వద్ద, 55.92 Bhp పవర్ & 3400 rpm వద్ద 82.1 Nm టార్క్ అందిస్తుంది. -
ఓలా ఎలక్ట్రిక్.. 95% షోరూమ్‌లకు ట్రేడ్ సర్టిఫికేట్లు లేవు!
ఓలా ఎలక్ట్రిక్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కంపెనీకి చెందిన 95 శాతం షోరూమ్‌లకు ట్రేడ్ సర్టిఫికేట్లు లేవని బ్లూమ్‌బర్గ్ న్యూస్ వార్తలు ప్రచురించింది. అందులోని వివరాల ప్రకారం మొత్తం 4,000 షోరూమ్‌ల్లో 3,400లకు సంబంధించిన డేటా అందుబాటులో ఉండగా వాటిలో కేవలం 100 షోరూమ్‌లకు మాత్రమే భారత మోటారు వాహనాల చట్టం ప్రకారం ట్రేడ్ సర్టిఫికేట్లు ఉన్నట్లు గుర్తించారు. దీని అర్థం ఓలా ఎలక్ట్రిక్ 95 శాతం స్టోర్లలో నమోదుకాని ద్విచక్ర వాహనాలను ప్రదర్శించడానికి, విక్రయించడానికి, టెస్ట్ రైడ్లను అందించడానికి లేదా రవాణా చేయడానికి అవసరమైన ధృవీకరణ లేదు. ఈ సర్టిఫికేట్లు లేకపోవడం రెగ్యులేటరీ నిబంధనలకు కంపెనీ కట్టుబడి ఉందా అనే ప్రశ్నలు వస్తున్నాయి.2022 నుంచి ఓలా ఎలక్ట్రిక్ తన షోరూమ్‌లను విస్తరించడంలో గణనీయమైన పురోగతిని సాధించింది. డిజిటల్-ఓన్లీ సేల్స్ మోడల్(భౌతికంగా షోరూమ్ ఉండకుండా కేవలం డిజిటల్ ద్వారానే ఉత్పత్తులను విక్రయించడం) నుంచి బ్రిక్-అండ్-మోర్టార్(షోరూమ్‌లను ఏర్పాటు చేయడం) వంటి విధానానికి మారింది. ఈ మార్పువల్ల కస్టమర్ అనుభవాన్ని పెంచడం, సేవా సంబంధిత సమస్యలను పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దాంతో భారతదేశం అంతటా సుమారు 4,000 ప్రదేశాలకు విస్తరించింది.రెగ్యులేటరీ చర్యలుఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లోని రవాణా అధికారులు చర్యలు చేపట్టారు. సంబంధిత రాష్ట్రాల్లోని కంపెనీ షోరూమ్‌ల్లో దాడులు నిర్వహించి, వాటిని మూసివేసి, వాహనాలను సీజ్ చేసినట్లు బ్లూమ్‌బర్గ్ తెలిపింది. అదనంగా ఇప్పటికే ఓలా ఎలక్ట్రిక్ రాష్ట్ర స్థాయి రవాణా అధికారుల నుంచి షోకాజ్ నోటీసులను అందుకుంది.ఇదీ చదవండి: రూ.115-125 లక్షల కోట్ల రుణ సమీకరణ.. ఎందుకంటే..ఓలా ఎలక్ట్రిక్ స్పందన..ఓలా ఎలక్ట్రిక్ దర్యాప్తు ఫలితాలను ఖండించింది. కంపెనీ కార్యకలాపాలపై మార్కెట్లో వస్తున్న వార్తలు పూర్తిగా తప్పు అని, పక్షపాతంతోనే ఇలాంటి వార్తలను వైరల్ చేస్తున్నారని తేల్చి చెప్పింది. కంపెనీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, గోదాములు మోటారు వాహనాల చట్టం మార్గదర్శకాలకు అనుగుణంగానే ఉన్నాయని స్పష్టం చేసింది. అయితే షోరూమ్‌ల్లో అవసరమైన ట్రేడ్ సర్టిఫికేట్లు ఉన్నాయో లేదో మాత్రం నేరుగా ప్రస్తావించలేదు. -
ఎక్కువమంది కొంటున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే!
ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ కరంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది తక్కువ సమయంలో ఎక్కువ అమ్మకాలు కంపెనీల జాబితాలో బజాజ్ ఆటో అగ్రస్థానంలో నిలిచింది. ప్రభుత్వ వాహన్ పోర్టల్‌లో (మార్చి 1, ఉదయం 7 గంటల నాటికి) అందుబాటులో ఉన్న సేల్స్ డేటా ప్రకారం.. 21,335 యూనిట్ల రిటైల్ అమ్మకాలతో, 'బజాజ్ చేతక్' 81 శాతం బలమైన వృద్ధిని నమోదు చేసింది.ఏప్రిల్ 2024 నుంచి ఫిబ్రవరి 2025 మధ్య 10,18,300 ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‌లు, మోపెడ్ల మొత్తం రిటైల్ అమ్మకాలతో ఎలక్ట్రిక్ టూ వీలర్ విభాగం ఒక ఆర్ధిక సంవత్సరంలో మొదటిసారి.. 10 లక్షల యూనిట్ల అమ్మకాలను దాటేసింది. ఈ అమ్మకాలు అంతకుముందు ఆర్ధిక సంవత్సరం కంటే 7 శాతం ఎక్కువ. ఎక్కువ అమ్మకాలు పొందిన కంపెనీల జాబితాలో.. బజాజ్, టీవీఎస్, ఏథర్ ఎనర్జీ, మొదలైనవి ఉన్నాయి.ఎక్కువ అమ్మకాలు పొందిన కంపెనీలు➤బజాజ్ ఆటో: 21,335 యూనిట్లు➤టీవీఎస్ మోటార్ : 18,746 యూనిట్లు➤ఏథర్ ఎనర్జీ: 11,788 యూనిట్లు➤ఓలా ఎలక్ట్రిక్: 8,647 యూనిట్లు➤గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ: 3,700 యూనిట్లు➤విడా (హీరో మోటోకార్ప్): 2,677 యూనిట్లుఇదీ చదవండి: ఆ నగరం భారతదేశ బాహుబలి: ఆనంద్ మహీంద్రా -
2030 నాటికి రూ.115-125 లక్షల కోట్ల రుణ సమీకరణ.. ఎందుకంటే..
దేశీయ కార్పొరేట్ కంపెనీల మూలధన వ్యయం పెరుగుతోంది. దాంతో 2030 నాటికి సుమారు రూ.115-125 లక్షల కోట్లు రుణాన్ని సమీకరించనున్నాయని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ భారీ నిధులు ఆయా కంపెనీలకు మూలధన వ్యయం (CAPEX), వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు (NBFC) ఫైనాన్సింగ్ కోసం ఉపయోగించబోతున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. కార్పొరేట్ రంగంలో భవిష్యత్తులో మౌలిక సదుపాయాల రంగం కీలక పాత్ర పోషిస్తుందని, ఈ పెట్టుబడుల్లో సింహభాగం అందుకే ఖర్చు చేస్తాయని భావిస్తున్నారు.రుణ కేటాయింపులు ఇలా..మూలధన వ్యయం: మొత్తం రుణంలో సుమారు రూ.45-50 లక్షల కోట్లు కాపెక్స్‌కు కేటాయిస్తారు. ఉత్పత్తి సామర్థ్యాలను విస్తరించడానికి, సాంకేతిక పరిజ్ఞానాన్ని అప్‌గ్రేడ్ చేయడానికి, వివిధ పరిశ్రమల్లో కొత్త సౌకర్యాలను సిద్ధం చేయాడానికి ఈ పెట్టుబడి కీలకం.వర్కింగ్ క్యాపిటల్, ఎన్బీఎఫ్సీ ఫైనాన్సింగ్: మిగిలిన రూ.70-75 లక్షల కోట్లు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, ఎన్బీఎఫ్సీ ఫైనాన్సింగ్ అవసరాలను తీరుస్తాయి. కార్పొరేట్ ఎకోసిస్టమ్‌లో కార్యకలాపాలు సజావుగా, లిక్విడిటీ ఉండేలా ఈ ఫండ్స్ దోహదపడతాయి.మౌలిక సదుపాయాలు: కార్పొరేట్ కంపెనీ అభివృద్ధిలో భాగంగా మొత్తం పెట్టుబడుల్లో దాదాపు మూడొంతుల వాటాను మౌలిక సదుపాయాలకు ఖర్చు చేస్తారు. ఇందులోనూ ప్రధానంగా కింది విభాగాల్లో ఖర్చులు పెరగన్నాయని చెబుతున్నారు.రవాణా: కనెక్టివిటీ, లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని పెంచడానికి రోడ్లు, రైల్వేలు, ఓడరేవుల్లో పెట్టుబడులు పెడుతారు.ఎనర్జీ: పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల విస్తరణ, పవర్ గ్రిడ్ల ఆధునీకరణకు ఇన్వెస్ట్ చేస్తారు.పట్టణాభివృద్ధి: పట్టణ ప్రాంతాల్లో గృహనిర్మాణం, నీటి సరఫరా, పారిశుద్ధాన్ని మెరుగుపరిచేందుకు చర్యలు చేపడుతారు.ఇదీ చదవండి: 2025 ఆర్థిక సంవత్సరంలో గోధుమల దిగుమతి ఎంతంటే..సవాళ్లు, అవకాశాలురుణ ఆధారిత కార్పొరేట్ కంపెనీల విస్తరణ అపారమైన అవకాశాలను అందిస్తున్నప్పటికీ ఈ విధానంలో కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు. బ్యాంకులు, కార్పొరేట్ బాండ్లు, బాహ్య వాణిజ్య రుణాలు(ఈసీబీ) సహా ఫైనాన్సింగ్ ఎకోసిస్టమ్ వార్షికంగా 10 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. అయితే పెరుగుతున్న రుణ అవసరాలను తీర్చడానికి ఈ వృద్ధి సరిపోకపోవచ్చు. ఇది రూ.10-20 లక్షల కోట్ల నిధుల అంతరానికి దారితీస్తుంది. ఈ అంతరాన్ని పూడ్చడానికి కార్పొరేట్ బాండ్ మార్కెట్ కీలకపాత్ర పోషించాలని నిపుణులు సూచిస్తున్నారు. -
ఆ నగరం భారతదేశ బాహుబలి: ఆనంద్ మహీంద్రా
ప్రముఖ పారిశ్రామికవేత్త 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra).. ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే తాజాగా గుజరాత్‌లోని ఓ చిన్న పట్టణానికి చెందిన వీడియో షేర్ చేశారు. ఇది నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.మహీంద్రా & మహీంద్రా చైర్మన్ షేర్ చేసిన వీడియోలో.. గుజరాత్‌లోని మోర్బి, సిరామిక్ పరిశ్రమలో దాని ఆధిపత్యాన్ని వెల్లడించడం చూడవచ్చు. కేవలం 9 కి.మీ. విస్తీర్ణంలో ఉన్న మోర్బి పట్టణం భారతదేశ సిరామిక్ ఉత్పత్తిలో 90% వాటాను కలిగి.. ప్రపంచ సిరామిక్ హబ్‌గా ఎలా అభివృద్ధి చెందిందో ఈ వీడియోలో చూడవచ్చు. 1930 నుంచి దాదాపు 1,000 కుటుంబాల యాజమాన్యంలో ఈ పరిశ్రమ వృద్ధి చెందింది.నాణ్యతలో ఏ మాత్రం తీసిపోకుండా.. తక్కువ ధరలోన సిరామిక్ వస్తువులు లభిస్తున్నాయి. ప్రపంచంలోని మొత్తం సిరామిక్ ఉత్పత్తిలో మోర్బి గణనీయమైన వాటాను కలిగి ఉంది. మోర్బి వ్యవస్థాపకులను ప్రశంసిస్తూ.. భారతీయ వ్యాపారాలు చైనాతో పోటీ పడగలవా? బహుశా మనం విజయగాథల కోసం సరైన ప్రదేశాల కోసం వెతకడం లేదు. 'మోర్బి' ప్రభావానికి సంబంధించిన ఈ వీడియో చూసి నేను సంతోషించాను. ఇది చిన్న పట్టణమే అయినప్పటికీ.. భారతదేశ 'బాహుబలి' అని ఆనంద్ మహీంద్రా అన్నారు.మోర్బి సిరామిక్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లుప్రపంచవ్యాప్తంగా విజయం సాధించినప్పటికీ.. మోర్బి సిరామిక్ పరిశ్రమ దేశీయ, అంతర్జాతీయ డిమాండ్ తగ్గడంతో ఇబ్బంది పడుతోంది. గ్యాస్ వినియోగంపై పన్నులను తగ్గించాలని, వ్యాట్ నుంచి GSTకి మారాలని.. ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ ప్రయోజనాల వంటివి కావాలని ప్రభుత్వాన్ని తయారీదారులు కోరుతున్నారు. ఈ పరిశ్రమ రోజుకు దాదాపు మూడు మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను వినియోగిస్తుంది. తయారీదారులు దీనికే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది.ఇదీ చదవండి: శివ్ నాడార్ కీలక నిర్ణయం: కుమార్తెకు భారీ గిఫ్ట్సౌదీ అరేబియా, ఖతార్, తైవాన్ వంటి దేశాలు 50% నుంచి 106% వరకు యాంటీ డంపింగ్ సుంకాలు విధించడం వల్ల ఎగుమతులు కూడా దెబ్బతిన్నాయి. అంతే కాకుండా.. ఇరాన్‌పై వాణిజ్య ఆంక్షలు కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, అజర్‌బైజాన్‌లకు ఎగుమతి మార్గాలను దెబ్బతీశాయి. దీని వలన తయారీదారులు ఖరీదైన ప్రత్యామ్నాయ షిప్పింగ్ మార్గాలను ఎంచుకోవలసి వచ్చింది. ఇన్ని సవాళ్ళను ఎదుర్కొంటూనే.. మోర్బి ప్రపంచ సిరామిక్ నాయకుడిగా భారతదేశం ఖ్యాతిని నలుదిశల వ్యాపింపజేస్తోంది.Can Indian businesses compete with China?Maybe we’re not looking in the right places for success stories.I was delighted to see this video on the ‘Morbi’ effect.Agile, small-town entrepreneurs—The ‘bahubalis’ of India.👏🏽👏🏽👏🏽 pic.twitter.com/L4PiMVzYZl— anand mahindra (@anandmahindra) March 7, 2025 -
ఇల్లే బంగారమాయె..
బంగారం, గృహం, స్టాక్ మార్కెట్.. ఈ మూడింట్లో ఎందులో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నారని మహిళలను అడిగితే.. ఠక్కున చెప్పే సమాధానం బంగారమే! కానీ, నేటి మహిళల పెట్టుబడి ఆలోచనల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. మొదట సొంతిల్లు.. ఆ తర్వాతే బంగారం, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ అంటున్నారు. 69 శాతం మంది మహిళలు సొంత ఇంటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుండగా.. 31 శాతం మంది పెట్టుబడి కోసం ప్రాపర్టీలను కొనుగోలు చేస్తున్నారని అనరాక్ కన్జ్యూమర్ సెంటిమెంట్ సర్వే వెల్లడించింది. – సాక్షి, సిటీబ్యూరో మన దేశంలో గృహ కొనుగోలు ప్రక్రియలో మహిళలు ఎల్లప్పుడూ కీలక నిర్ణయాధికారులే. మహిళలు స్వతంత్ర, వ్యక్తిగత ఆస్తుల కొనుగోళ్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రాపర్టీ కొనుగోళ్లలో మెజారిటీ మహిళలు తుది వినియోగదారులే. పెట్టుబడి రీత్యా ఆస్తుల కొనుగోళ్లూ ఆశించిన స్థాయిలోనే ఉండటం గమనార్హం. పెరుగుతున్న స్వాతంత్య్రం, వ్యక్తిగత స్వేచ్ఛ, నిర్ణయాధికారం, మెరుగైన ఆదాయ వనరులు కారణంగా గృహ విభాగంలో మహిళా పెట్టుబడిదారులు ఎక్కువగా వస్తున్నారు. 2022 హెచ్2 (జులై–డిసెంబర్)లో మహిళా గృహ కొనుగోలుదారుల్లో తుది వినియోగం: పెట్టుబడి నిష్పత్తి 79:21గా ఉండగా.. 2024 హెచ్2 నాటికి 69:31గా ఉందని తెలిపింది.లాంచింగ్ ప్రాజెక్టుల్లోనే.. సర్వేలో పాల్గొన్న 69 శాతం మహిళలకు రియల్ ఎస్టేట్ అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆస్తి తరగతిగా భావిస్తున్నారు. 2022 హెచ్2లో ఇది 65 శాతంగా ఉండగా.. కోవిడ్ కంటే ముందు 2019 హెచ్2లో 57 శాతంగా ఉంది. గతంలో కొత్తగా ప్రారంభించిన ప్రాజెక్ట్‌లలో కొనుగోళ్లకు 10 శాతం మంది మహిళలు మొగ్గుచూపగా.. ఇప్పుడది 18 శాతానికి పెరిగింది. నిర్మాణం పూర్తయి, గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్లు (రెడీ టు మూవ్) కొనుగోళ్ల ప్రాధాన్యత 29 శాతం మేర తగ్గింది.లగ్జరీకే మొగ్గు.. లగ్జరీ ప్రాపర్టీలకు మహిళలూ ఆసక్తి చూపిస్తున్నారు. రూ.90 లక్షల కంటే ఎక్కువ ధర ఉండే ప్రీమియం ఇళ్ల కొనుగోళ్లకు 52 శాతం ఉమెన్స్ మొగ్గు చూపిస్తున్నారు. వీటిలో 33 శాతం మంది రూ.90 లక్షల నుంచి రూ.1.5 కోట్ల ధర ఉండే ప్రాపర్టీలను ఇష్టపడుతుండగా.. 11 శాతం మంది రూ.1.5 కోట్ల నుంచి రూ.2.5 కోట్ల ధర ఉండే గృహాలను, 8 శాతం మంది రూ.2.5 కోట్ల కంటే ఎక్కువ ధర ఉండే అల్ట్రా లగ్జరీ ప్రాపర్టీల కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తున్నారు. దేశంలో మహిళా హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ) పెరుగుదలకు ఇదే నిదర్శనం.గోల్డ్, స్టాక్ మార్కెట్.. ప్రాపర్టీ తర్వాత మగువలకు అమితాసక్తి బంగారమే. అందుకే రియల్ ఎస్టేట్ తర్వాత గోల్డ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌కే మహిళలు జై కొడుతున్నారు. 2022 హెచ్2లో బంగారంలో పెట్టుబడులకు 8 శాతం మంది మహిళలు ఆసక్తి చూపించగా.. 2024 హెచ్2 నాటికి 12 శాతానికి పెరిగింది. ఇక, ఏటేటా స్టాక్ మార్కెట్ ఆకర్షణ కోల్పోతుంది. రెండేళ్ల క్రితం మార్కెట్లో పెట్టుబడులకు 20 శాతం మంది మహిళలు ఆసక్తి చూపిస్తే.. ఇప్పుడది ఏకంగా 2 శాతానికి పడిపోయింది. -
కుమార్తెకు భారీ గిఫ్ట్: శివ్ నాడార్ కీలక నిర్ణయం
వారసత్వ ప్రణాళికను క్రమబద్దీకరించడానికి.. ఫ్యామిలీ హోల్డింగ్లను ఏకీకృతం చేయడానికి, ఒక ముఖ్యమైన చర్యలో భాగంగా.. దేశంలో మూడో అతిపెద్ద ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఫౌండర్ 'శివ్ నాడార్' (Shiv Nadar) కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. హెచ్‌సీఎల్ కంపెనీలో మాత్రమే కాకుండా.. ప్రమోటర్ కంపెనీలైన వామ సుందరి ఇన్వెస్ట్మెంట్స్ (ఢిల్లీ) ప్రైవేట్ లిమిటెడ్‌లలోని తనకు చెందిన మొత్తంలో 47 శాతం వాటాను తన కుమార్తె 'రోష్ని నాడార్ మల్హోత్రా'కు బదిలీ చేస్తూ గిఫ్ట్ డీడ్లను అమలు చేశారు.ఈ బదిలీలకు ముందు, శివ్ నాడార్.. రోష్ని నాడార్ మల్హోత్రా రెండు సంస్థలలోనూ వరుసగా 51%, 10.33% వాటాలను కలిగి ఉన్నారు. లావాదేవీల తరువాత, HCL కార్పొరేషన్, VSIPL లలో రోష్ని వాటాలు 57.33 శాతానికి పెరిగాయి, శివ్ నాడార్ వాటా 4 శాతానికి చేరుకున్నాయి.రోష్ని నాడార్ మల్హోత్రా (Roshni Nadar Malhotra)టెక్ దిగ్గజం, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకులు 'శివ్ నాడార్'కు ఏకైక సంతానంగా ఢిల్లీలో 1982లో జన్మించిన రోష్ని.. వసంత్ వ్యాలీ పాఠశాలలో చదువుకున్నారు. నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ నుంచి కమ్యూనికేషన్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, కెలాగ్స్ యూనివర్సిటీ నుంచి ఎంబిఏ చేశారు. చదువు పూర్తి కాగానే బ్రిటన్‌లో న్యూస్ ప్రొడ్యూసర్‌గా కెరీర్ ప్రారంభించారు. 27 సంవత్సరాలు వచ్చేసరికి తండ్రి ప్రారంభించిన వ్యాపారంలో భాగస్వాములయ్యారు. హెచ్‌సీఎల్‌లో చేరిన సంవత్సరానికే ఆ కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా మాత్రమే కాకుండా కంపెనీ సీఈఓగా బాధ్యతలు కూడా చేపట్టారు.ఇదీ చదవండి: నెలకు ఒకరోజు సెలవు.. దిగ్గజ కంపెనీ కీలక నిర్ణయం -
మితిమీరిన ట్రేడింగ్ కట్టడికే కఠిన నిబంధనలు
ముంబై: ఇండెక్స్ డెరివేటివ్స్‌లో ఎక్స్పైరీ రోజున మితిమీరిన ట్రేడింగ్ కట్టడికే నిబంధనలను కఠినతరం చేస్తున్నట్లు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ హోల్‌టైమ్ సభ్యుడు అనంత నారాయణ్ తెలిపారు. డెరివేటివ్స్ ట్రేడింగ్‌లో రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా నష్టపోతున్నారని అధ్యయనంలో తేలిన మీదట గతేడాది అక్టోబర్‌లో చర్యలు ప్రకటించినట్లు ఆయన చెప్పారు.కనీస కాంట్రాక్టు పరిమాణాన్ని రూ. 5 లక్షల నుంచి రూ. 30 లక్షలకు దశలవారీగా పెంచడం, ప్రీమియంను ముందుగా వసూలు చేయడం తదితర చర్యలను సెబీ ప్రకటించింది. ముందుగా క్యాష్ మార్కెట్‌ను అభివృద్ధి చేసి, ఆ తర్వాత డెరివేటివ్స్‌పై కసరత్తు చేయాలని స్టాక్ ఎక్స్చేంజీలకు సూచించారు. మరోవైపు, పరస్పర విరుద్ధ ప్రయోజనాల వివరాలను సెబీ బోర్డు సభ్యులందరూ ప్రజలకు వెల్లడించడాన్ని తప్పనిసరి చేసేలా నిబంధనలను రూపొందిస్తామని సెబీ కొత్త చైర్మన్ తుహిన్ కాంత పాండే తెలిపారు.విశ్వసనీయతను, పారదర్శకతను పెంపొందించడానికి ఇది ఉపయోగపడగలదని ఆయన వివరించారు. ఓవైపు నియంత్రణ సంస్థ అధిపతిగా, మరోవైపు నియంత్రిత సంస్థల్లో భాగస్వామిగా పరస్పర విరుద్ధ ప్రయోజనాల కోసం పని చేశారంటూ సెబీ మాజీ చీఫ్ మాధవి పురి బుచ్‌పై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పాండే వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సెబీ విచారణ ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్ సంస్థ సహ–ఇన్వెస్టరుగా ఉన్న ఫండ్‌లో ఆమె పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. -
2025 ఆర్థిక సంవత్సరంలో గోధుమల దిగుమతి ఎంతంటే..
ఆహార ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించేందుకు భారత ప్రభుత్వం 2025 ఆర్థిక సంవత్సరం(ఏప్రిల్1, 2024 నుంచి మార్కి 31, 2025)లో మూడు మిలియన్ టన్నుల (ఎంటీ) గోధుమలను బహిరంగ మార్కెట్ నుంచి దిగుమతి చేసుకుంది. ఆహార ధాన్యాల నిల్వల నిర్వహణ, మార్కెట్లో ఆహార ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ప్రభుత్వ వ్యూహంలో భాగంగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) ఈ చర్యలను అమలు చేసినట్లు మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇటీవల కాలం వరకు మిగులు గోధుమ నిల్వలను బహిరంగ మార్కెట్లో విక్రయించారు. ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ (ఓఎంఎస్ఎస్) కింద 2024 ఆర్థిక సంవత్సరంలో బల్క్ కొనుగోలుదారులకు రికార్డు స్థాయిలో 10 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని విక్రయించడం విశేషం.లభ్యత తగ్గుదల2023-24 పంట సంవత్సరానికి భారతదేశ గోధుమ ఉత్పత్తి 113.29 మెట్రిక్ టన్నులుగా అంచనా వేశారు. ఇది బలమైన సరఫరాను నిర్ధారిస్తుంది. అయితే మిగులు నిల్వలను మార్కెట్ డిమాండ్లతో సమతుల్యం చేసేందుకు ప్రభుత్వం గతంలో సవాళ్లు ఎదుర్కొంది. కానీ ఇటీవల దేశీయ గోధుమల లభ్యత తగ్గిపోవడంతో దిగుమతులపై ఆధారపడుతుంది. 2025 ఆర్థిక సంవత్సరంలో మూడు మూడు మెట్రిక్ టన్నుల గోధుమలను దిగుమతి చేసుకోవడం ద్వారా తక్కువ కాలంలో ధాన్యం లభ్యతను మెరుగుపరచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.వేలంలో తగ్గిన ధరలుబల్క్ కొనుగోలుదారులు, ప్రాసెసర్లకు ధాన్యాన్ని విక్రయించడానికి ఇటీవల నిర్వహించిన వీక్లీ ఆక్షన్‌లో ఎఫ్‌సీఐ 0.49 మెట్రిక్ టన్నుల గోధుమలను విక్రయించింది. అంతకుముందు వారంకంటే క్వింటాలుకు కనీసం రూ.200 తక్కువకు అమ్ముడయ్యాయని వాణిజ్య వర్గాలు తెలిపాయి. కొత్త మార్కెటింగ్ సీజన్ (2025-26) కోసం మధ్యప్రదేశ్‌లో మార్చి 15న సేకరణ కార్యకలాపాలు ప్రారంభంకానున్నందున వీక్లీ ఇ-ఆక్షన్ కొనసాగే అవకాశం లేదని వర్గాలు తెలిపాయి. అయినప్పటికీ అధికారికంగా ఎఫ్‌సీఐ, రాష్ట్ర ఏజెన్సీలు పంజాబ్, హరియాణా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌తో సహా ఇతర రాష్ట్రాల్లో ఏప్రిల్ 1 నుంచి రైతుల ద్వారా కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కు గోధుమలను కొనుగోలు చేయనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లోని మండీలకు తాజా పంట రావడం ప్రారంభమైందని, ఇది సరఫరాను పెంచుతుందని తెలిపాయి.బఫర్ కంటే అధికంగానే నిల్వలుగతేడాది ఏప్రిల్ 1న ఎఫ్‌సీఐ వద్ద 7.46 మెట్రిక్ టన్నుల గోధుమలు నిల్వ ఉండగా, ఈసారి 13.55 మెట్రిక్ టన్నుల వరకు నిల్వలు ఉన్నాయి. పరిశ్రమ అంచనాల ప్రకారం గోధుమ నిల్వలు ఈ ఏడాది ఏప్రిల్ 1న 10-11 మెట్రిక్ టన్నుల మధ్య ఉండే అవకాశం ఉంది. ఇది బఫర్ కంటే కొంచెం ఎక్కువగా ఉంది. 2024-25 సీజన్లో కేంద్రం ప్రకటించిన ఎంఎస్పీ క్వింటాలుకు రూ.2425 కంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో క్వింటాలుకు రూ.125 బోనస్ ప్రకటించించారు. దాంతో రాబోయే రెండు వారాల్లో పంట రాబడి పుంజుకున్న తర్వాత మండీ ధరలు క్వింటాలుకు రూ.2600 వరకు ఉండే అవకాశం ఉందని వ్యాపారులు తెలిపారు.ఈసారి సేకరణ ఇలా..2025-26 రబీ మార్కెటింగ్ సీజన్ (ఏప్రిల్-జూన్)లో ఏజెన్సీల ద్వారా గోధుమల సేకరణ 31 మెట్రిక్ టన్నులుగా ఉంటుందని ఆహార మంత్రిత్వ శాఖ గత వారం అంచనా వేసింది. ఇది 2024-25 మార్కెటింగ్ సీజన్లో వాస్తవ కొనుగోలు 26.6 మెట్రిక్ టన్నులతో పోలిస్తే 26 శాతం అధికంగా ఉంది. 2021-22 సీజన్లో రికార్డు స్థాయిలో 43.3 మెట్రిక్ టన్నుల సేకరణను సాధించిన తరువాత ఎంఎస్పీ, తక్కువ ఉత్పత్తి కారణంగా 2022-23 సీజన్లో రికార్డు స్థాయిలో 18.8 మెట్రిక్ టన్నులకు పడిపోయాయి. అయితే 2023-24 సీజన్లో ఇది 40 శాతం పెరిగి 26.2 మెట్రిక్ టన్నులకు చేరుకుంది.ఇదీ చదవండి: 61 ఏళ్ల వయసులో నీతా అంబానీ ఫిటెనెస్ సీక్రెట్ ఇదే..2023-24 పంట సంవత్సరంలో గోధుమ ఉత్పత్తి 113.29 మెట్రిక్ టన్నులుగా అంచనా వేసినట్లు వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రాసెసింగ్ పరిశ్రమ అంచనాల ప్రకారం ప్రస్తుత పంట సంవత్సరంలో (2024-25) గోధుమ ఉత్పత్తి 110 మెట్రిక్ టన్నులుగా అంచనా వేశారు. ప్రస్తుత మార్కెటింగ్ సంవత్సరానికి (2024-25) ఎంఎస్పీ క్వింటాలుకు రూ.2,275 ఉంది. -
‘స్త్రీ’రాస్తి రంగంలో.. మహిళలు అంతంతే..
సాక్షి, సిటీబ్యూరో: అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా పోటీ పడుతున్న మహిళలు.. స్థిరాస్తి రంగంలో మాత్రం కాస్త వెనకబడే ఉన్నారు. దేశీయ రియల్ ఎస్టేట్ పరిశ్రమలో మహిళా కార్మికులు పరిమితంగానే ఉన్నారు. ప్రస్తుతం రియల్టీలో 7.1 కోట్ల మంది కార్మికులు పని చేస్తుండగా.. మహిళా కార్మికుల సంఖ్య కేవలం 70 లక్షలే. మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు (ఎల్ఎఫ్పీఆర్) కేవలం 25.1 శాతంగా మాత్రమే ఉందని రియల్టీ సంస్థ మ్యాక్స్ ఎస్టేట్స్, గ్లోబల్ కన్సల్టింగ్ ఇన్ టెన్డమ్ అధ్యయనం వెల్లడించింది. మహిళా జనాభాలో 1.2 శాతమే.. వ్యవసాయం తర్వాత అత్యధిక ఉపాధి, ఉద్యోగ అవకాశాలను సృష్టించే రంగం రియల్ ఎస్టేటే. కానీ, స్థిరాస్తి రంగ శ్రామిక శక్తిలో మహిళ భాగస్వామ్యం అంతంత మాత్రంగానే ఉంది. దేశీయ స్థిరాస్తి రంగం క్రాస్ రోడ్స్‌లో ఉంది. అద్భుతమైన వృద్ధికి సిద్ధంగా ఉంది. అదే సమయంలో తారాస్థాయిలో వృద్ధి చెందకుండా నిరోధించేందుకూ సవాళ్లు ముందున్నాయి. దేశ జనాభాలో మహిళలు 48.5 శాతం మంది ఉన్నారు. ఇందులో దాదాపు 1.2 శాతం మంది మహిళలు రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్నారు.సవాళ్లు ఇవీ.. స్థిరాస్తి రంగంలోని శ్రామిక శక్తిలో అన్ని స్థాయిలలోనూ మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉండటం, అసమాన వేతనం.. ఇవే ఈ రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న ప్రధానమైన సవాళ్లు. లింగ సమానతలు పరిష్కరించడం వల్ల గణనీయమైన ఆర్థిక క ప్రయోజనాలు చేకూరతాయి. ఉత్పాదకత, ఆవిష్కరణలు, లాభదాయకత పెరుగుతాయి. అలాగే ఈ రంగంలో బ్లూ, వైట్ కాలర్ మహిళా కార్మికులను శక్తివంతం చేయడానికి నైపుణ్యాభివృద్ధి, శిక్షణ కార్యక్రమాల అవసరం ఉంది. సరైన నాయకత్వం, సాంకేతికత వినియోగంతోనే దీన్ని సాధించగలమని నివేదిక సూచించింది. -
61 ఏళ్ల వయసులో నీతా అంబానీ ఫిటెనెస్ సీక్రెట్ ఇదే..
రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ(61) ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటూ లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె తన రోజువారీ ఫిట్నెస్ షెడ్యూల్‌ను పంచుకున్నారు. ముఖ్యంగా 30 ఏళ్లు పైబడిన మహిళలు ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యత ఇవ్వాలని నొక్కి చెప్పారు. ఈమేరకు ఒక వీడియో విడుదల చేశారు. అదికాస్తా వైరల్ అవుతోంది.వీడియోలో నీతా అంబానీ తెలిపిన వివరాల ప్రకారం..‘రోజూ 5,000 నుంచి 7,000 అడుగులు నడుస్తాను. నేను చురుకుగా ఉండటానికి సరళమైన ప్రభావవంతమైన మార్గం ఇది. దినచర్యలో భాగంగా నిత్యం జిమ్ వ్యాయామాలు, స్విమ్మింగ్, యోగా, ఆక్వా వ్యాయామాలు ఉంటాయి. అదనంగా డ్యాన్స్ చేస్తాను. ఇది నన్ను శారీరకంగా ఫిట్‌గా ఉంచడంతోపాటు మానసిక స్థితికి ఎంతో తోడ్పాటు అందిస్తోంది. ప్రతిరోజూ #StrongHERMovement(ట్విటర్-ఎక్స్‌లో ట్యాగ్)లో చేరి ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి మరింత దృఢంగా మారి ఎన్నో విజయాలు సాధించాలి’ అన్నారు.‘షుగర్-ఫ్రీ’ లైఫ్స్టైల్నీతా అంబానీ ఫిట్నెస్ జర్నీలో ఆహారం కీలక అంశమని తెలిపారు. ఆర్గానిక్, ప్రకృతి ఆధారిత ఆహార పదార్థాలపై దృష్టి సారించాలని సూచించారు. తాను ఎప్పుడూ శాకాహారం తీసుకుంటానని పేర్కొన్నారు. ఆమె షుగర్(చక్కెర ఉండే పదార్థాలు) అధికంగా ఉండే ఆహారానికి దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. సమతుల భోజనం, ప్రోటీన్లు, పోషకాలు సమృద్ధిగా ఉండేలా జాగ్రత్త పడతానని చెప్పారు.ఆరోగ్యానికి 30 నిమిషాలుUnstoppable at 61! This International Women’s Day, Mrs. Nita Ambani shares her inspiring fitness journey and invites women of all ages to prioritize their health and wellbeing. With her dedicated workout routine, she shows us that age is just a number. Join the #StrongHERMovement… pic.twitter.com/CyhfT1zm9r— Reliance Industries Limited (@RIL_Updates) March 8, 2025మహిళలు రోజుకు కనీసం 30 నిమిషాలపాటు వారి ఆరోగ్యానికి సమయం కేటాయించాలని నీతా అంబానీ సూచించారు. ఫిట్నెస్ అంటే వయసుతో పోరాడటం కాదని, దాన్ని పాజిటివిటీతో స్వీకరించడం అని నొక్కి చెప్పారు. నీతా ఫిట్నెస్ సందేశం అన్ని వయసుల మహిళలకు ఎంతో ఉపయోగపడుతుంది. అతివల స్వీయ సంరక్షణ, శ్రేయస్సుకు ఎంతో దోహదం చేస్తుంది. ఫిట్‌గా, యాక్టివ్‌గా ఉండాలనుకునేవారికి వయసుతో సంబంధం లేదని నిరూపిస్తూ ఆమె ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. -
రైల్వే కీలక నిర్ణయం.. ఇక కన్ఫర్మ్ టికెట్ ఉంటేనే..
మెరుగైన క్రౌడ్ మేనేజ్మెంట్ దిశగా భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో దేశవ్యాప్తంగా 60 కీలక రైల్వే స్టేషన్లలో కన్ఫర్మ్ టికెట్లు ఉన్న ప్రయాణికులను మాత్రమే ప్లాట్‌ఫామ్ మీదకు అనుమతించనుంది. రద్దీని నియంత్రించడానికి, సురక్షితమైన ప్రయాణ పరిస్థితులను నిర్ధారించడానికి ఈ స్టేషన్లలో శాశ్వత ప్రయాణికుల హోల్డింగ్ ప్రాంతాలు ఉంటాయి.రద్దీ రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రాకపోకల క్రమబద్ధీకరణపై జరిగిన ఉన్నత స్థాయి సమావేశం అనంతరం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. అధికారులతో విస్తృతంగా చర్చించి రద్దీగా ఉండే ప్రయాణ సమయాల్లో ఎంపిక చేసిన స్టేషన్లలో అమలు చేసిన విజయవంతమైన రద్దీ నియంత్రణ చర్యలను సమీక్షించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఉన్నవారు అక్కడే.. ఇందులో భాగంగా ఈ 60 స్టేషన్లలో వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఉన్న ప్రయాణికులను స్టేషన్ ఆవరణ వెలుపల నిర్దేశిత వెయిటింగ్ ప్రాంతాలకు పంపనున్నారు. ఇటీవలి మహాకుంభమేళా సందర్భంగా ప్రయాణికుల భారీ రద్దీని నిర్వహించడానికి ప్రయాగ్‌రాజ్‌తోపాటు సమీప తొమ్మిది స్టేషన్లలో బాహ్య వెయిటింగ్ జోన్లను ఏర్పాటు చేశారు. ఇవి సత్ఫలితాలు ఇచ్చిన నేపథ్యంలో ఎక్కువ రద్దీ ఉండే మరిన్ని స్టేషన్లలో శాశ్వత వెయిటింగ్ ఏరియాలను అమలు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది.‘వార్ రూమ్’ల ఏర్పాటుఇప్పటికే న్యూఢిల్లీ, ఆనంద్ విహార్, వారణాసి, అయోధ్య, పాట్నా వంటి స్టేషన్లలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఈ స్టేషన్లలో అనధికారిక ప్రవేశాన్ని నివారించడానికి నియంత్రిత యాక్సెస్ గేట్లను ఏర్పాటు చేశారు. సమర్థవంతమైన పర్యవేక్షణ కోసం స్టేషన్లు, పరిసర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా నిఘాను పెంచాలని రైల్వే శాఖ యోచిస్తోంది. వీటితోపాటు ప్రధాన స్టేషన్లలో రద్దీ మరీ ఎక్కువగా ఉన్న సమయాల్లో వివిధ శాఖల అధికారులు సమన్వయం చేసుకుని చర్చించుకునేందుకు ‘వార్ రూమ్’లను సైతం ఏర్పాటు కానున్నాయి.కమ్యూనికేషన్‌ను మెరుగుపరచడానికి, ప్రయాణికుల భారీ రద్దీని నిర్వహించే స్టేషన్లలో వాకీ-టాకీలు, అధునాతన అనౌన్స్మెంట్ వ్యవస్థలు, మెరుగైన కాలింగ్ వ్యవస్థలతో సహా కొత్త డిజిటల్ పరికరాలు ప్రవేశపెట్టనున్నారు. ముఖ్యంగా అత్యవసర సమయాల్లో సులభంగా గుర్తించేందుకు వీలుగా సిబ్బందికి రీడిజైన్ చేసిన ఐడీ కార్డులు, కొత్త యూనిఫామ్ అందించనున్నారు. అలాగే అన్ని ప్రధాన స్టేషన్లలో సీనియర్ అధికారులను స్టేషన్ డైరెక్టర్లుగా నియమించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. వీటితోపాటు స్టేషన్ కెపాసిటీ ఆధారంగా టికెట్ల అమ్మకాలను నియంత్రించడం, మరింత సమర్థవంతమైన క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకోవడానికి అధికారులకు మరిన్ని అధికారాలు కల్పించనున్నారు. -
ఇంటి కొనుగోలు.. ‘ఆమె’కు నచ్చితేనే..
సాధారణంగా మహిళలు వంట గది విశాలంగా ఉండాలని కోరుకుంటారు. కానీ, నేటి అవసరాలు, అభిరుచులు మారుతుండటంతో ఆధునిక వసతులనూ కోరుకుంటున్నారు. జిమ్, మెడిటేషన్ వంటి సౌకర్యాలతో పాటు వాకింగ్, జాగింగ్ ట్రాక్స్, గ్రీనరీ స్పేస్, పిల్లల కోసం పార్క్, స్పోర్ట్స్ వంటి వసతులను ఎంచుకుంటున్నారని ఆర్క్ గ్రూప్ సీఈఓ మేఘన గుమ్మి తెలిపారు. గృహిణి, ఉద్యోగిని ఎవరైనా సరే ఇంటిని, కుటుంబ సభ్యుల బాగోగులను చూసుకునేది మహిళే. దీంతో ఇంట్లో ఏ గదికి ఎంత స్పేస్ అవసరమో నిర్ణయించగలదు. వాస్తవానికి పురుషుల కంటే మహిళలకే దృశ్యీకరణ (విజువలైజేషన్) శక్తి ఎక్కువగా ఉంటుంది. తాను ఉండబోయే కిచెన్, బెడ్ రూమ్, బాల్కనీ ఇంట్లోని ప్రతీది ఏ విధంగా ఉండబోతుందో ఊహించగలదు. –సాక్షి, సిటీబ్యూరోఐదారేళ్ల క్రితం వరకూ రియల్ ఎస్టేట్ రంగంలో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉండేది. అయితే స్థిరాస్తి రంగంలో వృత్తి నైపుణ్యం, ఆదాయ వనరులు పెరగడం, వర్క్ కల్చర్ మారడంతో క్రమంగా ఈ విభాగంలో మహిళలు ప్రవేశిస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్, హెచ్ఆర్, మార్కెటింగ్, సేల్స్ విభాగంలోనే కాదు సైట్ల మీద కూడా మహిళలు పనిచేసే స్థాయికి ఎదిగారు. దీంతో రియల్టీ సెక్టార్ అసంఘటిత రంగం నుంచి సంఘటిత రంగంగా అభివృద్ధి చెందుతుంది. ఐటీ, ఫార్మా వంటి రంగాల్లో మాదిరిగా రియల్టీ సెగ్మెంట్లోనూ వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి.ఆమెకు నచ్చితేనే.. ఇల్లు కొందామని నిర్ణయించుకున్నాక.. ప్రాంతం, ధర, ప్రాజెక్ట్, వసతులు ఏవైనా సరే భర్తకు నచ్చినా సరే అంతిమంగా నిర్ణయించాల్సింది, ఓకే చేయాల్సిందీ ఇల్లాలే. ఆమెకు నచ్చకుండే ఇంటి కొనుగోలు చేయరు. సొంతింటి ఎంపికలో మహిళల పవర్ అదీ. అపార్ట్మెంట్లతో పోలిస్తే విల్లాలలో ఓపెన్ స్పేస్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉండటంతో నేటి యంగ్ ఉమెన్స్ విల్లాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మరోవైపు నిర్ణయాధికారం, కొనుగోలు శక్తి పెరగడంతోనూ ప్రాపర్టీలకు డిమాండ్ ఏర్పడింది.ఇన్ఫ్రాకు నీడ రియల్టీ.. మనల్ని అంటిపెట్టుకొని నీడ ఎలాగైతే ఫాలో అవుతుందో.. ఇన్ఫ్రాకు రియల్ ఎస్టేట్ కూడా అంతే. మౌలిక వసతులు అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలోనే రియల్ పరుగులు పెడుతుంది. భూముల ధరలు పెరగడంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో అభివృద్ధి చెందుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం సౌత్ హైదరాబాద్ వైపు ఫోకస్ పెట్టింది. కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, రాయదుర్గం వంటి పశ్చిమ ప్రాంతాలు ఇప్పటికే కిక్కిరిసిపోయాయి. ఇక్కడ సామాన్యులు కొనే పరిస్థితి లేదు. సౌత్‌లో ఇన్ఫ్రా డెవలప్మెంట్తో కొత్తూరు, షాద్‌నగర్, ఆదిభట్ల, ముచ్చర్ల వంటి దక్షిణ ప్రాంతాలు బాగా డెవలప్ అవుతాయి. ప్రస్తుతం ఆయా ప్రాంతాలలో ధరలు తక్కువగా ఉన్నాయి కాబట్టి సామాన్య, మధ్యతరగతి ఈ టైమ్‌లో కొనుగోలు చేయడం ఉత్తమం. ఏ నగరమైనా సమాంతరంగా అభివృద్ధి చెందాలి. కానీ, మౌలిక వసతుల కల్పనలో హెచ్చు తగ్గులు కారణంగా అభివృద్ధి కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. దీంతో హైదరాబాద్‌లో వెస్ట్, సౌత్ జోన్లో భూముల ధరలు బాగా పెరిగాయి. మూసీ సుందరీకరణ, మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్డు, ఫ్యూచర్ సిటీ.. హైదరాబాద్ స్థిరాస్తి రంగాన్ని నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లడం ఖాయం. ఈ బృహత్తర ప్రాజెక్ట్‌లతో రియల్ ఎస్టేట్ మార్కెట్ మళ్లీ పుంజుకోవడం ఖాయం. -
గడవు పొడిగించిన సెబీ..
న్యూఢిల్లీ: క్లెయిమ్ చేయని నిధులు, సెక్యూరిటీలు బ్రోకర్ల వద్దే ఉండిపోతే.. వాటిని ‘విచారణ పరిధిలో’ పెట్టాలన్న ప్రతిపాదనపై ప్రజలు తమ అభిప్రాయాలు తెలియజేసేందుకు గడువును ఈ నెల 31 వరకు సెబీ పొడిగించింది. ఈ ప్రతిపాదనపై ఫిబ్రవరి 11న సెబీ సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేసింది. దీనిపై స్పందనలు తెలియజేయడానికి మార్చి 4వరకు గడువు ఇవ్వడం గమనార్హం.సెబీ నిబంధనల ప్రకారం క్లయింట్ల ఖాతాల్లోని నిధులను (ఫండ్స్) ప్రతి త్రైమాసికానికి ఒకసారి వెనక్కి పంపాల్సి ఉంటుంది. సెక్యూరిటీలను నిబంధనల మేరకు ఎప్పటికప్పుడు వారి డీమ్యాట్ ఖాతాల్లో జమ చేయాలి. ఒకవేళ నిధులు, సెక్యూరిటీలను బదిలీ చేసే విషయంలో క్లయింట్ల ఆచూకీ లేనట్టయితే.. సంబంధిత ఖాతాలను వెంటనే ‘ఎంక్వైరీ స్టేటస్’ కింద ఉంచాలని సెబీ ప్రతిపాదన తీసుకొచ్చింది.లేఖలు, ఈమెయిల్స్, టెలిఫోన్ ద్వారా బ్రోకర్లు క్లయింట్లను సంప్రదించాలి. ఇలా ఎంక్వైరీ స్టేటస్ కింద 30 రోజులకుపైగా నిధులు, సెక్యూరిటీలు ఉండిపోతే, వాటిని అన్క్లెయిమ్డ్గా పరిగణిస్తారు. ఆ తర్వాత క్లయింట్ నామినీని సంప్రదించాల్సి ఉంటుందని సెబీ తన ప్రతిపాదనలో పేర్కొంది. -
టెలికాం ఆపరేటర్లకు ఊరట.. ఎస్‌యూసీ ఛార్జీలు మినహాయిపు..?
దేశీయ టెలికాం ఆపరేటర్లకు స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జీలను (SUC) మాఫీ చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. ఈ అంశంపై కేబినెట్ సెక్రటరీ టీవీ సోమనాథన్ మార్చి 10న భారత టెలికాం విభాగం(DoT), ఫైనాన్స్ మినిస్ట్రీ అధికారులతో చర్చించబోతున్నట్లు తెలిసింది. దేశ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్కు కీలకంగా ఉన్న భారత టెలికాం రంగం చాలా కాలంగా ఆర్థిక సవాళ్లతో సతమతమవుతోంది. ఈ తరుణంలో ఇలాంటి నిర్ణయం తీసుకోనుండడం గమనార్హం.ఎస్‌యూసీ అంటే ఏమిటి?స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీలు(ఎస్‌యూసీ)..రేడియో ఫ్రీక్వెన్సీలను ఉపయోగించడానికి టెలికాం ఆపరేటర్లు ప్రభుత్వానికి చెల్లించే రుసుము. ఆపరేటర్ల సర్దుబాటు స్థూల ఆదాయం (ఏజీఆర్)లో ఈ ఛార్జీలను కొంత శాతంగా లెక్కిస్తారు. కొన్నేళ్లుగా ఎస్‌యూసీ టెలికాం కంపెనీలకు ఆర్థిక బాధ్యతగా ఉంటోంది. ఇది వాటి లాభదాయకతను, నిర్వహణ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. దీన్ని మాఫీ చేస్తే వీటి లాభాలు పెరుగుతాయనే వాదనలున్నాయి.రూ.5,000 కోట్ల ఆర్థిక ఉపశమనం2022 వేలానికి ముందు కొనుగోలు చేసిన స్పెక్ట్రమ్‌కు ఈ మాఫీని వర్తింపజేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే టెలికాం ఆపరేటర్లకు సుమారు రూ.5,000 కోట్ల ఆర్థిక ఉపశమనం లభించనుంది. 2022 వేలం తర్వాత కొనుగోలు చేసిన స్పెక్ట్రమ్‌పై డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్) ఇప్పటికే ఎస్యూసీను తొలగించింది. దాంతో గతంలో కేటాయించిన దానిపై ఈ మినహాయింపు కీలకంగా మారనుంది.టెలికాం రంగంపై ప్రభావం ఇలా..ఈ మాఫీ టెలికాం ఆపరేటర్లపై ఆర్థిక ఒత్తిడిని తగ్గిస్తుంది. మౌలిక సదుపాయాలు, సాంకేతికతలో ఎక్కువ పెట్టుబడులు పెట్టడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఆర్థిక భారాలు తగ్గడంతో టెలికాం కంపెనీలు తమ నెట్‌వర్క్‌లను విస్తరించడం, కనెక్టివిటీని మెరుగుపర్చుకోవడంపై దృష్టి సారించవచ్చు. ఈ రంగంలో ఆరోగ్యకరమైన పోటీని, సృజనాత్మకతను ప్రోత్సహించే అవకాశం ఉంటుంది.లబ్ధిదారులు ఎవరంటే..రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రధాన టెలికాం సంస్థలు ఈ మాఫీ వల్ల గణనీయంగా ప్రయోజనం పొందనున్నాయి. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్‌కు రూ.1,100 కోట్లు చొప్పున ఆదా అవుతుందని అంచనా. వొడాఫోన్ ఐడియాకు సుమారు రూ.2,000 కోట్ల ఉపశమనం లభించవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: వేతన పెరుగుదలలో టీచింగ్ లీడర్లదే హవా!సవాళ్లు ఇవే..ఎస్‌యూసీ మాఫీ సానుకూల చర్య అయినప్పటికీ ఈ రంగం ఎదుర్కొంటున్న ఇతర ఆర్థిక సవాళ్లను పరిష్కరించడం చాలా అవసరం. ఉదాహరణకు.. పరిశ్రమ ఏజీఆర్ బకాయిలు, అధిక లైసెన్స్ ఫీజులు, 5జీ టెక్నాలజీలో గణనీయమైన మూలధన పెట్టుబడి వంటి చాలా సమస్యలు టెలికాం విభాగాన్ని సవాలుగా మారుతున్నాయి. వీటిని పరిష్కరించాల్సి ఉంది. -
బంగారం మళ్లీ భారీగా...
దేశంలో బంగారం ధరలు (Gold Prices) పెరుగుదల బాట పట్టాయి. రెండు రోజులుగా వరుసగా తగ్గి కొనుగోలుదారులకు ఊరటనిచ్చిన పసిడి ధరలు నేడు (March 8) మళ్లీ ఎగిశాయి. బంగారం ధరలు (Gold Rates) ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. నేటి బంగారం ధరలు ఏయే ప్రాంతాల్లో ఎలా ఉన్నాయనేది ఈ కథనంలో తెలుసుకుందాం.ఇది చదివారా? గోల్డ్ లోన్లు ఇక అంత ఈజీ కాదు..తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలుఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 80,400, 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 87,710 వద్ద ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.500, రూ.550 చొప్పున ఎగిశాయి.ఇతర ప్రాంతాల్లో.. దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.87,860 వద్ద, 22 క్యారెట్ల పసిడి ధర రూ.80,550 వద్ద ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.550, రూ.500 చొప్పున పెరిగాయి.చైన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 80,400 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 87,710 వద్దకు వచ్చాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.500, రూ.550 చొప్పున భారమయ్యాయి. బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి.వెండి ధరలు దేశవ్యాప్తంగా వెండి ధరల్లో నేడు ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ రూ.1,08,100 వద్ద, ఢిల్లీలో రూ. 99,100 వద్ద కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
వేతన పెరుగుదలలో టీచింగ్ లీడర్లదే హవా!
వేగంగా అభివృద్ధి చెందుతున్న స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో కంపెనీలకు నాయకత్వ వాహిస్తున్న వారికి మెరుగైన వేతనాలున్నాయని కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ కంపెనీలను విజయపథంలో నడిపించడంలో సమర్థవంతమైన నాయకత్వం కీలక పాత్ర పోషిస్తుందనేది రహస్యమేమీ కాదు. అయితే స్టార్టప్ లీడర్లు, ముఖ్యంగా టీచింగ్ రోల్స్‌లో ఉన్నవారు వేతనాల విషయంలో 80 శాతం ముందంజలో ఉన్నారని నిపుణులు చెబుతున్నారు.బోధించే నాయకుల ప్రాముఖ్యతస్టార్టప్ల్లో టీచింగ్ లీడర్లు అంటే సంస్థల్లో మెంటార్షిప్, ఎడ్యుకేషనల్ బాధ్యతలను చేపట్టేవారు. ఈ వ్యక్తులు తమ బృందాలకు నాయకత్వం వహించడమే కాకుండా సహోద్యోగుల నైపుణ్యాలు, జ్ఞానాన్ని పెంపొందించడంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. అలా చేయడం ద్వారా నిరంతర అభ్యాసం, నూతన ఆవిష్కరణలకు దోహదపడుతుంది. స్టార్టప్‌ల సుస్థిరతకు ఇది ఎంతో అవసరం అవుతుంది.ఇదీ చదవండి: ఇంటి ఓనర్ మహిళ అయితే ఎన్ని ప్రయోజనాలో..ఫైనాన్షియల్ రివార్డులుస్టార్టప్ల్లో టీచింగ్ లీడర్లకు ఇచ్చే ఆర్థిక రివార్డులు ఇటీవలి కాలంలో గణనీయంగా పెరుగుతున్నాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం బోధనా బాధ్యతలను చేపట్టే నాయకులు, అటువంటి కార్యకలాపాల్లో పాల్గొనని ఒకే స్థాయి తోటి ఉద్యోగులతో పోలిస్తే వేతన ప్యాకేజీలపరంగా 80 శాతం ముందుంజలో ఉంటున్నారు. ఈ వేతన పెంపునకు కొన్ని కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.సంస్థ విలువను పెంచడం: టీచింగ్ లీడర్లను సంస్థకు సంబంధించిన అమూల్యమైన ఆస్తులుగా పరిగణిస్తారు. ఎందుకంటే వారు టీమ్ మొత్తం అభివృద్ధికి దోహదం చేస్తారు. ఇతర ఉద్యోగుల్లో నైపుణ్యాలు పెంచి స్టార్టప్ పనితీరును ప్రభావితం చేస్తారు.ప్రతిభను నిలుపుకోవడం: బలమైన టీచింగ్ లీడర్లు ఉన్న స్టార్టప్‌లు టాప్ టాలెంట్‌ను ఆకర్షించడానికి, దాన్ని నిలుపుకోవడానికి మొగ్గు చూపుతాయి. ఉద్యోగులు కంపెనీ ఎదిగేందుకు సహకరిస్తూ, టర్నోవర్ వ్యయాలను తగ్గించే అవకాశం ఉంటుంది.మెరుగైన నాయకత్వ నైపుణ్యాలు: టీచింగ్ లీడర్లు సహజంగానే అధునాతన నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించుకుంటారు. ఇతరులకు మార్గనిర్దేశం చేయడం ద్వారా వారు తమ కమ్యూనికేషన్, సమస్యా పరిష్కార సామర్థ్యాలను మెరుగుపరుస్తారు. -
ఇంటి ఓనర్ మహిళ అయితే ఎన్ని ప్రయోజనాలో..
ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలంటారు పెద్దలు. కానీ, ఇల్లే ఇల్లాలి పేరు మీద ఉండాలంటారు నిపుణులు! రెండూ నిజమే. మొదటి దాని గురించి చర్చ అవసరం లేకపోయినా.. రెండో దాని గురించి మాత్రం అవసరమే. ఎందుకంటే ఇంటి ఓనర్ లేదా కో–ఓనర్ మహిళ అయితే ఎన్నో ప్రయోజనాలున్నాయి గనక! గృహ రుణం నుంచి మొదలు పెడితే వడ్డీ రాయితీ, ఆదాయ పన్ను మినహాయింపు, స్టాంప్ డ్యూటీ తగ్గింపు.. ఇలా ఎనెన్నో ప్రయోజనాలున్నాయి. అందుకే తెలివైన గృహ కొనుగోలుదారుడు ఇంటిని భార్య, తల్లి లేకపోతే అక్క, చెల్లి మొత్తమ్మీద మహిళ పేరు మీద కొనుగోలు చేస్తారని నిపుణులు చెబుతున్నారు. – సాక్షి, సిటీబ్యూరోస్టాంప్ డ్యూటీలో తగ్గింపు.. పలు రాష్ట్రాలు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ల సమయంలో మహిళలకు స్టాంప్ డ్యూటీ రాయితీని అందిస్తున్నాయి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మహిళలకు 1 శాతం రాయితీ ఉండేది. ప్రస్తుతం లేదు. ఢిల్లీలో ప్రాపర్టీ కొనుగోలుదారులకు మగవారికైతే ప్రాపర్టీ విలువలో 6 శాతం స్టాంప్ డ్యూటీ వసూలు చేస్తుండగా.. మహిళ ఓనరైతే 4 శాతం చెల్లించాల్సి ఉంటుంది. జమ్మూ అండ్ కశ్మీర్లో అయితే మహిళ ప్రాపర్టీ కొనుగోలుదారులకు స్టాంప్ డ్యూటీనే లేదు. ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనూ మహిళా ఓనర్లకు స్టాంప్ డ్యూటీ మినహాయింపులు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అయితే పట్టణ, గ్రామీణ ప్రాంతాల వర్గీకరణ ఆధారంగా కూడా స్టాంప్ డ్యూటీలో మినహాయింపు ఉంది.ఐటీప్రయోజనాలు..గృహ యజమాని లేదా సహ–యజమాని మహిళ అయితే ఆదాయ పన్ను మినహాయింపులు కూడా ఉన్నాయి. భార్యభర్తలు ఇద్దరూ ఉద్యోగులైతే ఇద్దరు వేర్వేరుగా అసలు, వడ్డీలపై ఐటీ తగ్గింపులను క్లయిమ్ చేసుకునే వీలుంది. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ ప్రకారం సహ దరఖాస్తుదారు ప్రిన్సిపల్ అమౌంట్‌పై ఏడాదికి రూ.1.5 లక్షల వరకు, చెల్లించిన వడ్డీపై రూ.2 లక్షల వరకు ప్రయోజనాన్ని పొందవచ్చు. అలాగే సెక్షన్ 80ఈఈ కింద ఇతర క్లెయిమ్‌లతో పాటు తొలిసారి గృహ యజమానురాలు మహిళ అయితే ప్రిన్సిపల్ అమౌంట్ మీద రూ.50 వేలు తగ్గింపు కూడా అందుతుంది. అద్దె ఆదాయంపై కూడా.. మహిళలు ఆస్తిని విక్రయించేటప్పుడు క్యాపిటల్ గెయిన్ మినహాయింపులను కూడా పొందవచ్చు. అంతేకాకుండా ప్రాపర్టీని మహిళలు అద్దెకు ఇస్తే.. ఆమె రెండు రకాల తగ్గింపులకు క్లయిమ్ చేసుకోవచ్చు. అద్దెకు ఇచ్చిన ప్రాపర్టీపై ఏదైనా లోన్‌పై చెల్లించే వడ్డీపై పన్ను తగ్గింపుతో పాటు రెంటల్ ఆదాయంపై 30 శాతం స్టాండర్డ్ డిడెక్షన్ లభిస్తుంది. అయితే పన్ను ప్రయోజనాలను క్లెయిమ్ చేయాలంటే మహిళలకు ఆదాయ వనరులు ఉండాల్సిందే. గృహ రుణ వడ్డీ రేట్ల తగ్గింపు..బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలు మహిళలను విశ్వసనీయ రుణ గ్రహీతలుగా పరిగణిస్తుంటాయి. అందుకే స్థిరాస్తి రంగంలో మహిళా పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక రుణ కార్యక్రమాలను, స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకొస్తుంటాయి. తక్కువ వడ్డీ రేట్లకు రుణాలను అందిస్తున్నాయి. ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ వంటి బ్యాంకులలో పురుష రుణ గ్రహీతలతో పోలిస్తే మహిళలకు హోమ్ లోన్ వడ్డీ రేట్లు 0.5 నుంచి 1 శాతం తక్కువగా ఉంటాయి.ఈ శాతం తక్కువగా కనిపిస్తున్నప్పటికీ దీర్ఘకాలంలో డబ్బు, ఈఐఎంను ఆదా చేస్తుంది. ప్రధాన్‌మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద లో ఇన్‌కం గ్రూప్(ఎల్ఐజీ) కేటగిరీ కింద మహిళలకు రూ.6 లక్షల రుణానికి 6.5 శాతం వడ్డీ రాయితీతో.. రూ.2.67 లక్షల వరకు సబ్సిడీని పొందవచ్చు. ఇన్‌కం సోర్స్ లేని మహిళలకు బ్యాంక్‌లు రుణాలను అందించవు.వారసులకు బదిలీ సులువు..మహిళ పేరిట ప్రాపర్టీ ఉంటే అది ఆమె ఎస్టేట్‌లో భాగమవుతుంది. ఎటువంటి చట్టపరమైన చిక్కులు లేకుండా ఆమె వారసులకు సులభంగా బదిలీ అవుతుంది. అయితే విడాకుల సమయంలో సేల్‌డీడ్ ఆధారంగా ఆస్తి కేటాయింపులు ఉంటాయి. ఏదైనా చట్టపరమైన వివాదాలు తలెత్తితే ఆస్తి మహిళ పేరు మీద ఉన్నప్పటికీ భర్త ఉమ్మడిగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. -
మహిళలకు ఎస్బీఐ ప్రత్యేక పథకం.. డెబిట్ కార్డు
మహిళా ఎంట్రప్రెన్యూర్లకు పూచీకత్తు లేకుండా, తక్కువ వడ్డీ రేటుపై రుణాలు అందించేలా ’అస్మిత’ పథకాన్ని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ప్రవేశపెట్టింది. మహిళల సారథ్యంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా యూనిట్లకు డిజిటల్ మాధ్యమం ద్వారా వేగవంతంగా, సులభతరంగా రుణ సదుపాయం లభించేందుకు ఇది ఉపయోగపడుతుందని బ్యాంక్ చైర్మన్ సీఎస్ శెట్టి తెలిపారు.వినియోగ ప్రయోజనాల కోసం రుణాలు తీసుకోవడానికి ఇష్టపడే మహిళలు వ్యాపార రుణాలకు తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ట్రాన్స్ యూనియన్ సిబిల్ ప్రకటించిన కొద్ది రోజుల్లోనే ఈ ఆవిష్కరణ జరగడం గమనార్హం. ప్రముఖ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ ప్రకారం.. మహిళలు తీసుకున్న రుణాలలో కేవలం 3 శాతం మాత్రమే వ్యాపార ప్రయోజనాల కోసం, 42 శాతం వ్యక్తిగత రుణాలు, కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్స్, హోమ్ ఓనర్షిప్ వంటి పర్సనల్ ఫైనాన్స్ ఉత్పత్తుల కోసం, 38 శాతం బంగారంపై ఉన్నాయి.మరోవైపు, మహిళల కోసమే ప్రత్యేకంగా రూపొందించిన రూపే ఆధారిత ’నారీ శక్తి’ ప్లాటినం డెబిట్ కార్డును కూడా బ్యాంకు ఆవిష్కరించింది. ఇక మరో ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా ప్రవాస భారతీయులలో మహిళల కోసం 'బీవోబీ గ్లోబల్ ఉమెన్ ఎన్ఆర్ఈ అండ్ ఎన్ఆర్ఓ సేవింగ్స్ అకౌంట్' పేరిట ప్రత్యేక ఖాతాను ప్రారంభించింది. -
మహిళలకు ఫ్రెష్‌బస్ ఫ్రీ కార్డులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న తమ బస్సుల్లో ప్రయాణించే మహిళా ప్రయాణికులకు రూ. 500 వరకు పొదుపు చేసే ఫ్రెష్ కార్డులను ఉచితంగా ఇస్తున్నట్లు ఫ్రెష్‌బస్ తెలిపింది. వీటిని తదుపరి 10 రైడ్స్ కోసం ఉపయోగించుకోవచ్చని, ఒక్కో రైడ్‌పై రూ. 50 ఆదా చేసుకోవచ్చని వివరించింది.తమ వెబ్సైట్ లేదా యాప్‌లో బుక్ చేసుకున్న వారికి ఇది వర్తిస్తుందని పేర్కొంది. హైదరాబాద్, తిరుపతి, గుంటూరు, విజయవాడ, బెంగళూరు తదితర రూట్లలో సర్వీసులు నడిపిస్తున్నట్లు కంపెనీ వ్యవస్థాపకుడు సుధాకర్ రెడ్డి చిర్రా తెలిపారు. సంస్థను ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకూ తమ బస్సుల్లో 6.5 లక్షల మంది ప్రయాణించగా ఇందులో 30 శాతం అంటే 1.94 లక్షల మంది మహిళలు ప్రయాణించారని ఆయన తెలిపారు. మహిళలకు తమ సంస్థపై పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు. -
సమిష్టి కృషితోనే ఆన్లైన్ బెట్టింగ్‌కి చెక్
న్యూఢిల్లీ: దేశీయంగా వేగంగా విస్తరిస్తున్న అక్రమ ఆన్లైన్ గేమింగ్ రంగాన్ని కట్టడి చేయాలంటే అన్ని వర్గాల నుంచి సమిష్టి కృషి అవసరమని డిజిటల్ ఇండియా ఫౌండేషన్ ఒక నివేదికలో తెలిపింది. ఇందుకోసం ప్రభుత్వం, గూగుల్ .. మెటాలాంటి బడా టెక్ కంపెనీలు కలిసి పని చేయాలని పేర్కొంది. ‘ఈ అక్రమ రంగం ఏటా 100 బిలియన్ డాలర్ల పైగా ఉంటోంది. ఏటా 30 శాతం పైగా వృద్ధి చెందుతోంది. డిజిటల్ వినియోగం, సాంకేతిక పురోగతి పెరుగుతుండటం, నియంత్రణపరంగా అనిశ్చితి నెలకొనడం ఇందుకు కారణంగా ఉంటోంది. గ్యాంబ్లింగ్ సంబంధిత ప్రమోషన్లను నియంత్రించడం కష్టతరంగా ఉంటున్న నేపథ్యంలో గూగుల్, మెటాలాంటి బడా సోషల్ మీడియా కంపెనీలతో భారతీయ నియంత్రణ సంస్థలు క్రియాశీలకంగా కలిసి పనిచేయాలి‘ అని నివేదిక వివరించింది. అక్రమ ఆపరేటర్లు అత్యంత అధునాతనమైన డిజిటల్ అడ్వర్టైజింగ్, మార్కెటింగ్ మాధ్యమాలు, పేమెంట్ వ్యవస్థలు, సాఫ్ట్వేర్ ప్రొవైడర్ల నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుంటున్నారని వివరించింది. ఆన్లైన్ అక్రమ బెట్టింగ్లనేవి మనీలాండరింగ్, అక్రమ చెల్లింపుల సమస్య పెరిగిపోవడానికి దారి తీస్తున్నాయని డిజిటల్ ఇండియా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అరవింద్ గుప్తా తెలిపారు. గూగుల్, మెటాలాంటి కంపెనీలు సాధారణంగా అడ్వరై్టజింగ్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ (ఎస్ఈవో) ద్వారా లాభాలు ఆర్జిస్తుంటాయి కాబట్టి అవి అక్రమ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ సంస్థలపై నిర్ణయాత్మకంగా చర్యలు తీసుకోలేకపోతుంటాయని పేర్కొన్నారు. ‘‘వాటికి వచ్చే ట్రాఫిక్‌లో మూడింట ఒక వంతు ఈ వెబ్సైట్ల నుంచే ఉంటోంది. ఈ వెబ్సైట్లు విస్తరించే కొద్దీ బిగ్ టెక్ కంపెనీలకు అడ్వరై్టజింగ్ రూపంలో ఆదాయాలు వస్తున్నాయి. దీని దుష్ప్రభావాల గురించి పూర్తి అవగాహన లేక ఇన్ఫ్లుయెన్సర్లు వీటిని ప్రమోట్ చేస్తున్నారు’’ అని గుప్తా చెప్పారు. ‘ఆపరేటర్లు అక్రమంగా ఆర్జిస్తున్నారు. మనీ లాండరింగ్ చేస్తున్నారు. పేమెంట్ నిబంధనలను తోసిరాజని డొల్ల కంపెనీల ద్వారా, డి్రస్టిబ్యూషన్ చానల్ ద్వారా అక్రమ మార్గాల్లో చెల్లింపులను పొందుతున్నారు. బిగ్ టెక్ కంపెనీలకు నిధులిస్తున్నారు. కాబట్టి బిగ్ టెక్ కంపెనీలు కూడా వారిని కట్టడి చేయడంపై దృష్టి పెట్టడం లేదు‘ అని గుప్తా పేర్కొన్నారు.నివేదికలోని మరిన్ని అంశాలు.. → దేశీయంగా అక్రమ గ్యాంబ్లింగ్, బెట్టింగ్ కార్యకలాపాలు భారీ స్థాయిలో ఉంటున్నాయి. 2024 అక్టోబర్–డిసెంబర్ మధ్య పరీమ్యాచ్, స్టేక్, 1ఎక్స్‌బెట్, బ్యాటరీ బెట్ అనే నాలుగు ప్లాట్‌ఫాంలలో 1.6 బిలియన్ పైగా విజిట్స్ నమోదయ్యాయి. → 48.2 మిలియన్ విజిట్లతో దీనికి సోషల్ మీడియా కూడా దోహదకారిగా నిలి్చంది. ఫేస్‌బుక్‌లాంటి ప్లాట్‌ఫాంలలో డైరెక్ట్ పెయిడ్ ప్రకటనలు, కంటెంట్ ప్రమోషన్, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, సోషల్ మీడియా ఎంగేజ్మెంట్ ప్రచార కార్యక్రమాలు మొదలైన వాటి ద్వారా ఈ ట్రాఫిక్ వచి్చంది. నియంత్రణ నిబంధనలపరంగా వాటి వెబ్సైట్ల నిలిపివేతను తప్పించుకునేందుకు ఆయా ఆపరేటర్లు పలు వెబ్సైట్లు నిర్వహిస్తున్నారు. → దాదాపు అన్ని సంస్థలు, (సుమారు 600) ఇతర దేశాల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తూ, భారత్‌లో జీఎస్టీ నిబంధనలను యధేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాయి. → గ్యాంబ్లింగ్ ప్రకటనలను హోస్ట్ చేయకుండా, జీఎస్‌టీలాంటివి చెల్లించని అక్రమ సైట్లను ప్రమోట్ చేయకుండా చర్యలు ఉండాలి. ఆ తరహా సైట్లకు చెల్లింపులు జరగకుండా ఫైనాన్షియల్, పేమెంట్ వ్యవస్థలు నిరోధించాలి. → అక్రమ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ సైట్లను బ్లాక్ చేస్తే సరిపోదని నార్వే, బ్రిటన్, డెన్మార్క్, బెల్జియం, అమెరికా వంటి దేశాల అనుభవాల ద్వారా తెలుస్తోంది. కాబట్టి వెబ్సైట్లను బ్లాక్ చేయడంతో పాటు మార్కెటింగ్పరమైన ఆంక్షలు విధించడం, చెల్లింపులను బ్లాక్ చేయడం మొదలైన వ్యూహాలన్నింటి మేళవింపును అమలు చేస్తే మరింత మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. → అక్రమ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ మనుగడ సాగించేందుకు దోహదకారులను పూర్తిగా కట్టడి చేసేందుకు నియంత్రణ విధానాలు వేర్వేరుగా ఉండకుండా సమగ్ర వ్యవస్థ ఏర్పాటు కావాలి. → డిజిటల్ మీడియా చానళ్ల ద్వారా యూజర్లకు చేరువ కాకుండా వాటిని కట్టడి చేయడం, అక్రమ లావాదేవీలను బ్లాక్ చేసేందుకు ఆర్థిక నిబంధనలను కఠినతరం చేయడం, వైట్‌లిస్ట్/బ్లాక్‌లిస్ట్ రూపంలో నియంత్రణ విధానాలను పటిష్టం చేయడం వంటి చర్యలు చేపట్టాలి. → పన్నులు చెల్లించే కంపెనీలతో వైట్‌లిస్ట్ తయారు చేసి, మిగతా వాటిని బ్లాక్‌లిస్ట్‌లో చేర్చడం వల్ల కొంత నష్టం తగ్గవచ్చు. -
ఆధార్ ధ్రువీకరణ లావాదేవీలు 225 కోట్లు
న్యూఢిల్లీ: డిజిటల్ లావాదేవీలకు ఆధార్ కీలకంగా మారుతోంది. ఫిబ్రవరి నెలలో ఆధార్ ఆధారిత ధ్రువీకరణ లావాదేవీలు 225 కోట్లుగా ఉన్నాయి. ఆధార్ ఆధారిత ఈ–కేవైసీ లావాదేవీలు మరో 43 కోట్లు జరిగాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇతర రంగాల్లో ఆధార్ ఆధారిత ధ్రువీకరణకు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఆధార్ ధ్రువీకరణలు మెరుగైన కస్టమర్ అనుభవానికి తోడ్పడుతున్నట్టు ప్రభుత్వ ప్రకటన తెలిపింది. ఆధార్ ఆధారిత ఈ–కేవైసీ లావాదేవీలు గతేడాది ఫిబ్రవరి గణాంకాలతో చూస్తే 14 శాతం పెరిగాయి. ఇక 2025 ఫిబ్రవరి నాటికి మొత్తం మీద ఆధార్ ధ్రువీకరణ లావాదేవీలు 14,555 కోట్లను అధిగమించాయి. అలాగే ఇప్పటి వరకు నమోదైన ఆధార్ ఆధారిత ఈ–కేవైసీ లావాదేవీలు 2,311 కోట్లకు చేరాయి. ఆధార్ ముఖ గుర్తింపు ధ్రువీకరణలకూ ఆదరణ పెరుగుతోంది. ఫిబ్రవరిలో ఇలాంటివి 12.54 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. 2021 ఫిబ్రవరిలో ఆధార్ ముఖ గుర్తింపు ధ్రువీకరణను ప్రవేశపెట్టగా.. అప్పటి నుంచి చూస్తే నెలవారీ గరిష్ట లావాదేవీలు ఫిబ్రవరిలోనే నమోదు కావడం గమనార్హం. ఇప్పటి వరకు మొత్తం ముఖ గుర్తింపు ధ్రువీకరణ లావాదేవీలు 115 కోట్లకు చేరాయి. ఇందులో 87 కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే నమోదు కావడం గమనార్హం. కోటక్ మహీంద్రా ప్రైమ్, ఫోన్‌పే, కరూర్ వైశ్యా బ్యాంక్, జేఅండ్‌కే బ్యాంక్ ముఖ గుర్తింపు ధ్రువీకరణ కోసం కొత్తగా అనుమతి పొందాయి. ఇప్పటి వరకు మొత్తం 97 సంస్థలకు ఇందుకు అనుమతి లభించింది. -
వాహనాలకు డిమాండ్ డౌన్
న్యూఢిల్లీ: వాహనాలకు డిమాండ్ తగ్గిన నేపథ్యంలో ఫిబ్రవరిలో ప్యాసింజర్ వాహనాలు, టూ వీలర్లు సహా ఆటోమొబైల్ రిటైల్ అమ్మకాలు 7 శాతం క్షీణించినట్లు ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య ఫాడా వెల్లడించింది. గతేడాది ఫిబ్రవరిలో 20,46,328 వాహన విక్రయాలు నమోదు కాగా తాజాగా గత నెల 18,99,196 యూనిట్లకు తగ్గాయి. ప్యాసింజర్ వాహనాల రిటైల్ విక్రయాలు 10 శాతం క్షీణించి 3,03,398 యూనిట్లకు పరిమితమయ్యాయి. టూ వీలర్ల విక్రయాలు 6 శాతం క్షీణించి 14,44,674 నుంచి 13,53,280 యూనిట్లకు తగ్గాయి. వాణిజ్య వాహనాలు 9 శాతం క్షీణించి 82,763 యూనిట్లకు, ట్రాక్టర్ల విక్రయాలు 14 శాతం తగ్గి 65,574 యూనిట్లకు పడిపోయాయి. నిల్వలపరంగా సమతౌల్యత లేకపోవడం, ధరలపరంగా మార్పులు, వినియోగదారుల్లో బలహీన సెంటిమెంట్, ఎంక్వైరీలు తగ్గిపోవడం, రుణ లభ్యత పరిమిత స్థాయిలోనే ఉండటం తదితర అంశాలు అమ్మకాల క్షీణతకు కారణమైనట్లు ఫాడా పేర్కొంది. ఎంట్రీ లెవెల్ కేటగిరీలో మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగా ఉండటం, కొనుక్కోవాలనుకునే ఆలోచన కొనుగోలు రూపం దాల్చడంలో జాప్యం జరుగుతుండటం, అలవికాని లక్ష్యాలు డీలర్లకు సమస్యాత్మకంగా ఉంటున్నాయని ఫాడా ప్రెసిడెంట్ సీఎస్ విఘ్నేశ్వర్ తెలిపారు. ఇదే విషయాన్ని తయారీ సంస్థలకు తెలియజేశారని, తమపై భారీ నిల్వల భారం మోపడాన్ని నివారించాలని కోరారని వివరించారు. మార్చిలో అమ్మకాలపై ఆశావహంగా ఉన్నప్పటికీ డీలర్లు కాస్త ఆచి తూచి వ్యవహరిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం 50–52 రోజులకు సరిపడే నిల్వలు ఉంటున్నాయని పేర్కొన్నారు. -
టెక్ అంకురాల్లోనూ మహిళల హవా..!
న్యూఢిల్లీ: వినూత్న ఆవిష్కరణలతో ఆకట్టుకుంటున్న మహిళా స్టార్టప్‌లు, భారీ ఎత్తున నిధుల సమీకరణలోనూ సత్తా చాటుతున్నాయి. మహిళల సారథ్యంలోని అంకుర సంస్థలు ఇప్పటివరకు 26 బిలియన్ డాలర్ల పెట్టుబడులను సమీకరించాయి. ఆల్‌టైమ్ ఫండింగ్ విషయంలో అమెరికా తర్వాత స్థానంలో నిల్చాయి. రీసెర్చ్, అనలిటిక్స్ సంస్థ ట్రాక్షన్ ఒక నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది. దీని ప్రకారం దేశీయంగా మహిళల సారథ్యంలోని అంకుర సంస్థల సంఖ్య 7,000 పైచిలుకు ఉంది. క్రియాశీలకంగా ఉన్న మొత్తం స్టార్టప్‌లలో వీటి వాటా 7.5 శాతం. ఇవన్నీ కలిసి ఇప్పటివరకు 26.4 బిలియన్ డాలర్లు సమీకరించాయి. 2021లో అత్యధికంగా 6.3 బిలియన్ డాలర్లు దక్కించుకున్నాయి. 2022లో అంతర్జాతీయంగా చూస్తే మహిళా స్టార్టప్‌లు మొత్తం మీద 32.8 బిలియన్ డాలర్లు సమీకరించగా .. దేశీ అంకురాలు 5 బిలియన్ డాలర్లతో 15.18% వాటా దక్కించుకున్నాయి. ఇక 2024లో అంతర్జాతీయంగా మహిళల సారథ్యంలోని స్టార్టప్‌లకు ఫండింగ్ విషయంలో 3.96% వాటాతో అమెరికా, బ్రిటన్ తర్వాత భారత్ మూడో స్థానంలో నిలి్చంది. ఈ స్టార్టప్‌లు భారీగా నిధులను సమీకరించడంతో పాటు పరిశ్రమలకు కొత్త నిర్వచనాన్ని ఇస్తూ, ఉద్యోగాలు కల్పిస్తూ, భవిష్యత్ ఎంట్రప్రెన్యూర్లకు కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తున్నాయని ట్రాక్షన్ పేర్కొంది. ఇవి మరింత వృద్ధిలోకి రావాల ంటే ఆర్థిక తోడ్పాటు, మెంటార్షిప్, వ్యవస్థాగతంగా మద్దతు లభించడం కీలకమని వివరించింది. నివేదికలోని మరిన్ని విశేషాలు.. → రంగాలవారీగా చూస్తే రిటైల్ స్టార్టప్‌లు అత్యధికంగా 7.8 బిలియన్ డాలర్లు, ఎడ్టెక్ 5.4 బిలియన్ డాలర్లు, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అంకురాలు 5 బిలియన్ డాలర్లు సమీకరించాయి. బిజినెస్ టు కన్జూమర్ ఈ–కామర్స్, ఇంటర్నెట్ ఫస్ట్ బ్రాండ్లు, ఫ్యాషన్ టెక్ అంకురాలు కూడా గణనీయంగా రాణిస్తున్నాయి. → మహిళా స్టార్టప్‌ల సంఖ్యాపరంగా, అలాగే ఇప్పటి వరకు సమీకరించిన నిధులపరంగా బెంగళూరు అగ్రస్థానంలో ఉంది. ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్ ఆ తర్వాత స్థానాల్లో నిల్చాయి. → 2021లో మహిళల సారథ్యంలోని స్టార్టప్‌లలో అత్యధికంగా ఎనిమిది అంకురాలు యూనికార్న్‌లుగా ఎదిగాయి. 2019లో మూడు, 2020లో నాలుగు, 2022లో అయిదు ఈ హోదా సాధించాయి. అయితే, 2017, 2023, 2024లో ఒక్క యూనికార్న్ కూడా నమోదు కాలేదు. → 2021లో మహిళా స్టార్టప్‌లు అత్యధికంగా 45 సంస్థలను కొనుగోలు చేశాయి. 2022లో ఇది 36కి, 2023లో 25కి, 2024లో 16కి తగ్గింది. → 2024లో మహిళల సారథ్యంలోని అయిదు స్టార్టప్‌లు పబ్లిక్ ఇష్యూకి వచ్చాయి. మొబిక్విక్, ఉషా ఫైనాన్షియల్, తన్వాల్, ఇంటీరియర్స్ అండ్ మోర్, లాసీఖో వీటిలో ఉన్నాయి. -
అమెరికాలో టెక్ మహీంద్రా విస్తరణ
న్యూఢిల్లీ: అమెరికా మార్కెట్లో కార్యకలాపాల విస్తరణలో భాగంగా ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా తాజాగా టెక్సాస్‌లోని ప్లానోలో ఆఫీసు ఏర్పాటు చేసింది. ఇది 130 సీట్ల సామర్థ్యంతో 27,000 చ.అ. విస్తీర్ణంలో ఏర్పాటైంది. అమెరికాలో ఇది తమకు పంతొమ్మిదో కార్యాలయమని సంస్థ తెలిపింది. కన్సలి్టంగ్, డెలివరీ, కస్టమర్ సపోర్ట్ సర్వీసులు మొదలైన సరీ్వసులు దీని ద్వారా అందించనున్నట్లు వివరించింది. ఇదే ప్రాంగణంలో ఇన్నోవేషన్ ల్యాబ్‌ను కూడా ప్రారంభించనున్నట్లు కంపెనీ తెలిపింది. ప్రస్తుతం 90 పైగా దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న టెక్ మహీంద్రాలో 1,50,000 మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. -
బీవోబీ గ్లోబల్ ఉమెన్ ఎన్ఆర్ఈ, ఎన్ఆర్వో ఖాతా
న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) మహిళల కోసం ప్రత్యేకంగా.. ‘బీవోబీ గ్లోబల్ ఉమెన్ ఎన్ఆర్ఈ అండ్ ఎన్ఆర్వో సేవింగ్స్ ఖాతాను’ ప్రారంభించింది. ఆటో స్వీప్ సదుపాయంతో ఇది ఉంటుంది. తద్వారా ఖాతాలో పరిమితికి మించి ఉన్న బ్యాలెన్స్ డిపాజిట్‌గా మారిపోయి, అధిక వడ్డీ రాబడి లభిస్తుంది. అలాగే, ఈ ఖాతాదారులకు గృహ రుణాలు, ఆటో రుణాలపై రాయితీ రేట్లు, తక్కువ ప్రాసెసింగ్ చార్జీలు ఉంటాయని బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటించింది. 17 దేశాల్లో 60,000 టచ్ పాయింట్ల ద్వారా 16.5 కోట్ల అంతర్జాతీయ కస్టమర్లకు బీవోబీ సేవలు అందిస్తోంది. బీవోబీ ప్రీమియం ఎన్ఆర్ఈ, ఎన్ఆర్వో సేవింగ్స్ ఖాతా విషయంలోనూ మార్పులు చేసింది. మహిళా దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయంగా ఉన్న భారతీయ మహిళలకు ప్రీమియం బ్యాంకింగ్ సేవలను అందించే లక్ష్యంతో బీవోబీ ఉమెన్ ఎన్ఆర్ఈ అండ్ ఎన్ఆర్వో ఖాతాను రూపొందించినట్టు బ్యాంక్ ఆఫ్ బరోడా ఈడీ మీనా వహీద్ ప్రకటించారు. -
మహిళలు.. ‘ఫండ్’ రాణులు!
అన్ని రంగాల్లోనూ ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న మగువలు... స్టాక్ మార్కెట్లోనూ తగ్గేదేలే అంటూ ‘బుల్’ రైడ్ చేస్తున్నారు. లక్షల కోట్ల రూపాయల విలువైన మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో ఇన్వెస్టర్ల నిధులను పక్కాగా నిర్వహిస్తూ ఫండ్ మేనేజర్లుగా సత్తా చాటుతున్నారు. తాము ఇంటినే కాదు.. అవకాశమిస్తే, ఫండ్ హౌస్‌లను కూడా మగాళ్లకు దీటుగా చక్కబెట్టగలమని నిరూపించుకుంటున్నారు. మహిళల నిర్వహణలో ఉన్న ఫండ్ ఆస్తులు ‘ఇంతింతై.. అన్నట్లుగా ఏడాది వ్యవధిలో రెట్టింపై రూ.13.45 లక్షల కోట్లకు ఎగబాకడం విశేషం!! అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎంఎఫ్ రంగంలో రాణిస్తున్న అతివలపై స్పెషల్ ఫోకస్... దేశంలో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ దూకుడు లాగే.. మహిళా ఫండ్ మేనేజర్లు కూడా జోరు పెంచారు. ఈ ఏడాది జనవరి నాటికి వారి సంఖ్య 49కి పెరిగింది. ఏడాది క్రితం ఉన్న 42 మందితో పోలిస్తే కొత్తగా ఏడుగురు జతయ్యారు. ఇదే కాలంలో మగ ఫండ్ మేనేజర్లు ఇద్దరు మాత్రమే పెరగడం గమనార్హం. ఇక మగువల నిర్వహణలో ఉన్న ఫండ్ ఆస్తులు కూడా రూ.13,45 లక్షల కోట్లకు ఎగిశాయి. గతేడాది జనవరితో పోలిస్తే రెట్టింపైంది. దేశంలో ఎంఎఫ్ సంస్థల నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తులు (ఏయూఎం) రూ.67.25 లక్షల కోట్లు కాగా, ఇందులో మహిళా ఫండ్ మేనేజర్లు/కో–ఫండ్ మేనేజర్లు నిర్వహిస్తున్న అసెట్స్ విలువ 20 శాతానికి జంప్ చేసింది. అయితే, మొత్తం ఎంఎఫ్ ఫండ్ మేనేజర్లు 482 మందిలో మహిళల వాటా ఇంకా తక్కువగానే ఉన్నప్పటికీ, గత ఏడాది కాలంలో మగాళ్లతో పోలిస్తే మగువల సంఖ్య ఎక్కువగా పెరగడం ఈ రంగంలో వారి భవిష్యత్తుపై మరింత ఆశలు రేకెత్తిస్తోంది.25 ఎంఎఫ్‌లు... 339 స్కీమ్‌లు దేశవ్యాప్తంగా 25 మ్యూచువల్ ఫండ్ సంస్థల్లో అతి వలు ఫండ్ మేనేజర్లుగా రాణిస్తున్నారు. మొత్తం 339 ఫండ్ స్కీమ్‌లను మేనేజ్ చేస్తున్నారు. కాగా, 6 ఫండ్ సంస్థల్లో ముగ్గురు కంటే ఎక్కువ మహిళా ఫండ్ మేనేజర్లు ఉండగా, 6 ఫండ్ హౌస్‌లలో ఇద్దరు చొప్పున, 13 సంస్థల్లో కనీసం ఒకరు ఉన్నారు. అన్నింటికంటే ఎక్కువగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్‌లో ఏడుగురు మహిళా ఫండ్ మేనేజర్లు రూ.2.27 లక్షల కోట్ల విలువైన 66 స్కీమ్‌లను నిర్వహిస్తున్నారు. భారత్‌లో అతిపెద్ద ఫండ్ హౌస్‌గా నిలుస్తున్న ఎస్బీఐ ఎంఎఫ్లోలో ఐదుగురు మగువలు రూ.1.88 లక్షల కోట్ల ఆస్తులను (14 స్కీమ్‌లు) మేనేజ్ చేస్తున్నారు. ఇక నిప్పన్ ఇండియా ఎంఎఫ్‌లో ఇద్దరు అతివలు రూ.1.53 లక్షల కోట్ల అసెట్లను (26 స్కీమ్‌లు) నిర్వహిస్తున్నారు.రూ.6.13 లక్షల కోట్లు ...తాజా గణాంకాల ప్రకారం దేశంలోని 49 మహిళా ఫండ్ మేనేజర్లలో టాప్–5 మగువలు మేనేజ్ చేస్తున్న ఫండ్ అసెట్స్ రూ.6.13 లక్షల కోట్లు (45.55 శాతం)గా ఉంది. ఇందులో ఎస్బీఐ ఎంఎఫ్‌కు చెందిన మాన్సి సజేజా రూ.1.41 లక్షల కోట్ల అసెట్లను నిర్వహిస్తూ.. భారత్‌లో నంబర్ వన్ మహిళా ఫండ్ మేనేజర్‌గా నిలిచారు. నిప్పన్ ఇండియా ఎంఎఫ్ కింజల్ దేశాయ్ (రూ.1.37 లక్షల కోట్ల అసెట్స్), యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ కృష్ణా ఎన్ (రూ.1.34 లక్షల కోట్లు) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఇక ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఫ్ అశ్విని షిండే 47 స్కీమ్‌లతో అత్యధిక స్కీమ్‌లను మేనేజ్ చేస్తున్న వారిలో టాప్‌లో ఉన్నారు. తర్వాత స్థానాల్లో మిరే అసెట్ ఇండియా ఎంఎఫ్ ఏక్తా గాలా (30 స్కీమ్‌లు), నిప్పన్ ఇండియా ఎంఎఫ్ కింజల్ దేశాయ్ (24 స్కీమ్‌లు) నిలిచారు. పురుషుల విషయానికొస్తే.. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఎఫ్‌కు చెందిన మనీష్ బాంతియా రూ.3.49 లక్షల కోట్ల అసెట్లను మేనేజ్ చేస్తూ.. దేశంలో టాప్ ఫండ్ మేనేజర్‌గా కొనసాగుతున్నారు.ఇన్వెస్టర్లుగానూ... ఇటీవల కాలంలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడంతో పాటు ట్రేడింగ్ చేస్తున్న అతివల సంఖ్య కూడా భారీగా పెరుగుతూ వస్తోంది. 2021 నుంచి చూస్తే ఏటా కొత్తగా 3 కోట్ల డీమ్యాట్ ఖాతాలు జతవగా.. ప్రతి నలుగురు ఇన్వెస్టర్లలో ఇప్పుడు 1 మహిళా ఇన్వెస్టర్ ఉండటం వారి జోరుకు నిదర్శనం. జనవరి నాటికి దేశంలో మొత్తం డీమ్యాట్ ఖాతాల సంఖ్య 18.8 కోట్లకు చేరుకుంది. ఇందులో దాదాపు 23.9 శాతం మహిళలవే కావడం గమనార్హం. కాగా, మ్యూచువల్ ఫండ్స్ ఫోలియోల (ఖాతాల) సంఖ్య 22.92 కోట్లకు చేరింది. 2021 మే నెలలో తొలిసారి 10 కోట్ల మైలురాయిని చేరగా.. నాలుగేళ్లలోనే దాదాపు 13 కోట్ల ఫోలియోలు కొత్తగా జతవ్వడం ఫండ్స్‌లోకి పెట్టుబడులు ఏ రేంజ్లో వచ్చి పడుతున్నాయనేందుకు నిదర్శనం. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
అంతర్జాతీయ మహిళా దినోత్సవం: అద్భుతమైన సందేశం
ప్రపంచ వ్యాప్తంగా.. వివిధ రంగాలలో మహిళలు సాధించిన విజయాలకు గుర్తుగా, వారిని గౌరవించడానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని (International Women’s Day) జరుపుకుంటారు. ఈ సందర్భంగా గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ 'ప్రియాంక చిగురుపాటి' (Priyanka Chigurupati) ఓ సందేశాన్ని ఇచ్చారు.మహిళా దినోత్సవం అనేది.. ఒక వేడుక కంటే ఎక్కువ. ఇది ప్రతి మహిళలో దాగి ఉన్న శక్తిసామర్త్యాల జ్ఞాపకం. మన దేశంలో మహిళా వ్యవస్థాపకులు కేవలం వ్యాపారాలను మాత్రమే కాకుండా.. భవిష్యత్తులను రూపొందిస్తున్నారు. నేడు స్టాక్ మార్కెట్లోకి కొత్తగా అడుగుపెడుతున్న నలుగురు వ్యక్తులలో ఒకరు స్త్రీ కావడం గమనార్హం, గర్వించదగ్గ విషయం. ఇది కేవలం గణాంకాల కోసం చెప్పుకునే సంఖ్య కాదు.. వారు సొంతంగా నిలబడుతున్నారు అనేదానికి నిదర్శనం అని ప్రియాంక అన్నారు.మహళలు పురోగతి సాధించాలంటే.. ఒంటరి ప్రయత్నం కాకుండా, సమిష్టిగా కృషి చేయాల్సి ఉంటుంది. ఇది వ్యవస్థాగత అడ్డంకులను ఛేదించడానికి, ఆర్థిక.. వృత్తిపరమైన అభివృద్ధికి, స్త్రీ సామర్థ్యాన్ని గుర్తించడానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.గ్రాన్యూల్స్.. నిజమైన సాధికారత పని ప్రదేశానికంటే ఉత్తమంగా ఉంటుంది. మహిళలను నాయకులుగా, ఆవిష్కర్తలుగా, సమాజంలో మార్పు తీసుకొచ్చేవారిగా అభివృద్ధి చెందే పర్యావరణ వ్యవస్థలను రూపొందించడమే కంపెనీ ఉద్దేశ్యం. వీరు శాస్త్రీయ పురోగతులను నడిపిస్తున్నా, విజయవంతమైన సంస్థలను నడుపుతున్నా లేదా ఆర్థిక భవిష్యత్తును రూపొందిస్తున్నా వారిని ఇంకా అభివృద్ధి చెందేలా చేయాలి. దీనికోసం మహిళా దినోత్సవం నుంచే పాటు పడాలని చెప్పారు. -
ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్: జియోస్టార్ సరికొత్త రికార్డ్
జియోస్టార్ టీవీ.. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో లైవ్ స్పోర్ట్స్ ప్రసార అనుభవాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపరుస్తూనే ఉంది. ఇటీవల జరిగిన ఐసీసీ మెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 'ఇండియా vs పాకిస్తాన్' మ్యాచ్‌ను 20.6 కోట్లమంది వీక్షించారు. ఇది బీఏఆర్సీ చరిత్రలోనే ఎక్కువమంది వీక్షించిన రెండవ క్రికెట్ మ్యాచ్‌గా (వరల్డ్ కప్ మ్యాచ్‌లు మినహా) నిలిచింది.2025 ఫిబ్రవరి 23న జరిగిన ఐసీసీ పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా జరిగిన భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఈ మ్యాచ్‌ను 20.6 కోట్లమంది వీక్షించారు. ఈ సంఖ్య 2023లో అహ్మదాబాద్‌లో జరిగిన ఓడీఐ ప్రపంచ కప్ మ్యాచ్ కంటే దాదాపు 11% ఎక్కువ. ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ ఇండియా 2023లో జరిగిన మ్యాచ్‌తో పోలిస్తే రేటింగ్లలో 10% కంటే ఎక్కువ. వ్యూయ్స్ టైమ్ కూడా 2609 కోట్ల నిమిషాలుగా నమోదైంది.భారతదేశంలో జరుగుతున్న క్రీడా కార్యక్రమాలతో జియోస్టార్ కొత్త మైలురాళ్లను చేరుకుంటోంది. అభిమానుల అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి, మా ప్రేక్షకుల సంఖ్యను విస్తరించడానికి మేము కట్టుబడి ఉన్నామని జియోస్టార్ ప్రతినిధి వ్యాఖ్యానించారు. ఈ మ్యాచ్‌ను మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ కలిసి ప్రత్యక్షంగా వీక్షించారు. -
20 రాష్ట్రాలు.. 100 స్టేషన్లు: ఫుడ్ డెలివరీలో స్విగ్గీ హవా
ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ (Swiggy).. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) భాగస్వామ్యంతో దేశంలోని 20 రాష్ట్రాలలో 100 రైల్వే స్టేషన్లకు తన సేవలను విస్తరించింది. రాబోయే రోజుల్లో మరిన్ని రైల్వే స్టేషన్లకు ఈ సదుపాయాన్ని విస్తరించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.నిజానికి రైలు ప్రయాణం అనేది.. భారతదేశ సంస్కృతిలో అంతర్భాగమైపోయింది. ఈ ప్రయాణంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. రైళ్లలో స్విగ్గీ ఫుడ్‌ను 100 స్టేషన్లకు విస్తరించడం వల్ల ప్రయాణీకులకు ఎక్కువ సౌలభ్యంగా ఉంది. అంతే కాకుండా దేశవ్యాప్తంగా విభిన్న రకాల భోజనాలను రుచి చూసే అవకాశం లభించిందని.. స్విగ్గీ ఫుడ్ మార్కెట్‌ప్లేస్ వైస్ ప్రెసిడెంట్ దీపక్ మాలూ అన్నారు.స్విగ్గీ 2024 మార్చిలో ఐఆర్సీటీసీతో ఒప్పందం కుదుర్చుకున్న తరువాత.. సీటుకు గ్యారెంటీ డెలివరీ (లేదా పూర్తి వాపసు) ప్రకటించింది. తాము ఎక్కడైతే ఫుడ్ డెలివరీ చేసుకోవాలనుకుంటున్నారో.. ముందు స్టేషన్లోనే నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. అప్పుడు తాము చేరుకునే సమయానికి ఫుడ్ డెలివరీ అవుతుంది. జొమాటో కూడా ఈ తరహా ఫుడ్ డెలివరీ చేస్తోంది. ఈ రెండు సంస్థలు రోజుకు లక్ష కంటే ఎక్కువ ఫుడ్ డెలివరీలు చేస్తున్నట్లు సమాచారం. -
డీఏ పెంపు.. ఈ సారి ఎంత ఉంటుందంటే?
హోలీకి ముందు కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్నెస్ అలవెన్స్ (DA) & డియర్నెస్ రిలీఫ్ (DR) పెంపును ప్రకటించే అవకాశం ఉంది. ఇదే జరిగితే 1.2 కోట్ల కంటే ఎక్కువ మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు.. పదవీ విరమణ చేసిన వారికి ప్రయోజనం చేకూరుతుంది.ప్రభుత్వం సంవత్సరానికి రెండుసార్లు (జనవరి, జూలై) డీఏను సమీక్షిస్తుంది. జనవరి సవరణ సాధారణంగా మార్చిలో జరిగితే.. జూలై సవరణ అక్టోబర్ లేదా నవంబర్‌లో ప్రకటిస్తారు. అయితే ఈ సారి డీఏ పెంపు 2 శాతం వరకు ఉండొచ్చని సమాచారం. గత ఏడాది.. కేంద్ర ప్రభుత్వం డీఏను రెండు సార్లు పెంచింది. దీంతో డీఏ 46 శాతం నుంచి 50 శాతానికి పెరిగింది. ఆ తరువాత అక్టోబర్‌లో 50 నుంచి 53 శాతానికి పెరిగింది. ఇప్పుడు వస్తున్న ఊహాగానాలు నిజమైతే.. డీఏ 53 శాతానికి చేరుతుంది.మార్చి 5న న్యూఢిల్లీలో జరిగిన కేబినెట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుపై ఎటువంటి చర్చ జరపలేదని తెలుస్తోంది. అయితే దీనిపై స్పష్టత రావడానికి హోలీ వరకు వేచి చూడాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాలను సమీక్షించడానికి 8వ వేతన సంఘం ఏర్పాటును ప్రభుత్వం జనవరి 2025లో ప్రకటించింది. ఇది వచ్చే ఏడాది జనవరి నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది.ఇదీ చదవండి: నెలకు 10 రోజులు.. టెక్ కంపెనీ కొత్త రూల్!కేంద్రం 8వ వేతన సంఘం ఏర్పాటు ప్రకటించినప్పటి నుంచి.. జీతం, పెన్షన్లలో సవరణలకు సంబంధించిన ఊహాగానాలు పెరిగిపోతున్నాయి. అయితే ఈ 8వ వేతన సంఘం తన సిఫార్సులను సంకలనం చేయడానికి దాదాపు ఒక సంవత్సరం పడుతుంది. ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగుల ప్రతినిధులను సంప్రదించి తుది ప్రతిపాదనలు చేసే ముందు వారి ఆందోళనలను అర్థం చేసుకుంటుంది. -
నెలకు ఒకరోజు సెలవు: దిగ్గజ కంపెనీ కీలక నిర్ణయం
వేల మంది ఉద్యోగిణులకు ఉపాధి కల్పించిన ఇంజనీరింగ్, నిర్మాణరంగ దిగ్గజ సంస్థ లార్సెన్ అండ్ టూబ్రో(ఎల్అండ్టీ) సంస్థ గురువారం మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. నెలసరి సమయంలో ఒకరోజు పెయిడ్ లీవ్ ఇస్తున్నట్లు ప్రకటించింది.అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఎల్ అండ్ టీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ ఈ ప్రకటన చేశారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దేశంలో ఎల్అండ్టీ వంటి దిగ్గజ కార్పొరేట్ సంస్థ ఒకటి ఇలా నెలసరి పెయిడ్ లీవ్ ఇవ్వడం ఇదే తొలిసారి. పెయిడ్ లీవ్ విధానాన్ని ఏ తరహాలో అమలుచేస్తారనే వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే ఎల్అండ్టీ మాతృసంస్థలో పనిచేసే మహిళలకే ఈ లీవ్ సౌకర్యం ఉంటుందని తెలుస్తోంది.ఇదీ చదవండి: నెలకు 10 రోజులు: టెక్ కంపెనీ కొత్త రూల్!ఎల్అండ్టీ అనుబంధ విభాగాలైన ఆర్థిక సేవలు లేదా టెక్నాలజీ వంటి విభాగాల్లో చేసే ఉద్యోగిణులకు ఈ సౌకర్యం ఉండకపోవచ్చని ఆయా వర్గాలు స్పష్టంచేశాయి. ప్రస్తుతం ఎల్అండ్టీలో 60,000 మంది ఉద్యోగులు ఉండగా వారిలో 9 శాతం అంటే దాదాపు 5,000 మంది మహిళలు ఉన్నారు. -
హైదరాబాద్‌లో అతిపెద్ద జ్యువెలరీ ప్రదర్శన: ఎన్ని రోజులంటే..
మార్చి 7, 2025, హైదరాబాద్: దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రియమైన ఫైన్ జ్యువెలరీ బ్రాండ్ అయిన PMJ జ్యువెల్స్ ఆధ్వర్యంలో శుక్రవారం బంజారా హిల్స్‌లోని తాజ్ కృష్ణలో హైదరాబాద్‌లో అతిపెద్ద వెడ్డింగ్, హాఫ్ సారీ ఆభరణాల ప్రదర్శనను ప్రారంభమైంది.ఈ ప్రదర్శన కార్యక్రమానికి.. PMJ జ్యువెల్స్ ఆధ్వర్యంలో ప్రతీక్ జైన్, చక్రపాణి, పాండు గౌడ్, ఇతర ప్రముఖ వ్యక్తులు హాజరయ్యారు. మార్చి 7న ప్రారంభమైన ఈ ప్రదర్శన మార్చి 9 వరకు కొనసాగుతుంది. ఆభరణాల ప్రదర్శనలో 20,000 కంటే ఎక్కువ PMJకు చెందిన హ్యండ్ మేడ్ డిజైనర్ ఆభరణాలను ప్రదర్శిస్తారు.వివాహ ఆభరణాలు, హాఫ్ సారీ ఆభరణాలతో పాటు.. ఈ ప్రదర్శనలో రోజువారీ దుస్తులు, ఫెస్టివల్ క్రియేషన్లు కూడా ప్రదర్శించనున్నారు. ఇవి ప్రత్యేక సీజన్లకు మాత్రమే కాకుండా ఆఫీసు, పార్టీలతో పాటు సాధారణ దుస్తులకు కూడా అనుకూలంగా ఉంటాయి.ఈ ప్రదర్శనలో ప్రత్యేకంగా క్యూరేట్ చేసిన.. బ్యూటీ డిజైన్లు ఉంటాయి. ఇవి కాలాతీత సంప్రదాయాన్ని సమతుల్యం చేయడంతో పాటు ఫ్యాషన్ డిజైన్లను ప్రతిబింభిస్తున్నాయి. వజ్రాలు, బంగారం, పోల్కీ, సాలిటైర్లలో విస్తృత శ్రేణి డిజైన్లతో.., ఈ ప్రదర్శనలో సాంప్రదాయ డిజైన్లు మొదలు ఆధునిక హంగుల వరకు సమకాలీన సౌందర్యంతో అలరిస్తున్నాయి. -
యాపిల్ ఫోల్డబుల్ ఐఫోన్: లాంచ్ ఎప్పుడంటే?
వివో, మోటోరోలా, శాంసంగ్ వంటి కంపెనీలు ఇండియన్ మార్కెట్లో ఫోల్డబుల్ ఫోన్స్ లాంచ్ చేసి విక్రయిస్తున్నాయి. ఈ విభాగంలో 'యాపిల్' (Apple) కూడా చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ ఎప్పుడు మార్కెట్లో లాంచ్ అవుతుంది? ధర ఎంత ఉంటుందనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.యాపిల్ కంపెనీ ఇప్పటి వరకు.. ఫోల్డబుల్ ఫోన్స్ లాంచ్ చేయలేదు. మొదటిసారి ఈ రకమైన స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయడానికి సన్నద్ధమైంది. సంస్థ దీనిని 2026లో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ధర కూడా 2000 డాలర్లు (రూ. 1.73 లక్షలు) ఉండొచ్చని సమాచారం.ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ గురించి యాపిల్ కంపెనీ అధికారిక సమాచారం వెల్లడించలేదు. ఒకవేళా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ నిజమైతే.. ఇదే మార్కెట్లో అత్యంత ఖరీదైనదిగా మారనుంది. ప్రతి ఏటా కొత్త ఉత్పత్తులను లాంచ్ చేసే యాపిల్.. ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ చేస్తుందనుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ పరిశ్రమ అభివృద్ధి చెందుతున్నప్పటికీ.. యాపిల్ కంపెనీ మాత్రం సైలెంట్‌గా ఉంది. కాగా త్వరలోనే ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది స్టెయిన్లెస్ స్టీల్ వంటి వాటితో తరవుతుందని తెలుస్తోంది. అయితే ఇందులో పేస్ ఐడీ ఫీచర్ మిస్ అయ్యే అవకాశం ఉంది. టచ్ ఐడీ ఫీచర్ అనేది సైడ్ బటన్ ద్వారా అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది.ఫోల్డబుల్ ఐఫోన్లో 5.5 ఇంచెస్ కవర్ డిస్ప్లే, 7.8 ఇంచెస్ మెయిన్ ఫోల్డింగ్ డిస్ప్లే వంటివి పొందవచ్చని సమాచారం. ఈ ఫోన్ వెనుక డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంటుంది. రెండు సెల్ఫీ కెమెరాలు ఉండనున్నాయి. ఇప్పటివరకు లీకైన ఫీచర్స్ అద్భుతంగానే ఉన్నాయని తెలుస్తోంది. కానీ దీని పనితీరు గురించి తెలుసుకోవాలంటే.. లాంచ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే. -
ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి మిశ్రమ ఫలితాలను చవిచూశాయి. సెన్సెక్స్ 7.52 పాయింట్లు లేదా 0.010 శాతం నష్టంతో.. 74,332.58 వద్ద, నిఫ్టీ 7.80 పాయింట్లు లేదా 0.035 శాతం లాభంతో 22,552.50 వద్ద నిలిచాయి.బంకా బయోలూ, సోమి కన్వేయర్ బెల్టింగ్స్, బాలాక్సీ ఫార్మాస్యూటికల్స్, లక్ష్మీ డెంటల్, కంప్యూకామ్ సాఫ్ట్వేర్ వంటి కంపెనీలు లాభాల జాబితాలో చేరాయి. నాగార్జున ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్, MRO-TEK రియాలిటీ, ఎస్ పీ అప్పారల్స్, గార్వేర్ హై-టెక్ ఫిల్మ్స్, దావణగిరి షుగర్ ఫ్యాక్టరీ వంటివి నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఈ బ్యాంక్ సీఈఓ జీతం ఎంతో తెలుసా?: ప్రపంచంలోనే..
గురువారం విడుదలైన బ్యాంక్ వార్షిక నివేదిక ప్రకారం, డీబీఎస్ గ్రూప్ హోల్డింగ్స్ లిమిటెడ్‌లో.. భారత సంతతికి చెందిన సీఈఓ 'పియూష్ గుప్తా' (Piyush Gupta) వేతనం భారీగా పెరిగింది. 2024 సంవత్సరానికి 56 శాతం వేతన పెంపును పొందారు. దీంతో ఆయన వేతనం 17.6 మిలియన్ సింగపూర్ డాలర్లకు (రూ. 110 కోట్ల కంటే ఎక్కువ) చేరింది.సింగపూర్‌కు చెందిన DBS గ్రూప్ హోల్డింగ్స్ సీఈఓ గుప్తా.. 2023లో డిజిటల్ బ్యాంకింగ్ లోపాల కారణంగా 11.2 మిలియన్ సింగపూర్ డాలర్లను వార్షిక వేతనంగా తీసుకున్నారు. ఆ తరువాత ఈయన వేతనం క్రమంగా పెరిగింది. ఇప్పుడు 17.6 మిలియన్లకు చేరింది. కాగా పియూష్ గుప్తా ఈ నెలలో తన పదవిని వీడుతున్నట్లు తెలుస్తోంది. ఆ స్థానంలో 'టాన్ సు షాన్' నియమితులయ్యారు. ఈయన మార్చి 28 నుంచి DBS గ్రూప్ హోల్డింగ్స్ బాధ్యతలు స్వీకరిస్తారు.2024 సంవత్సరానికి పియూష్ గుప్తా.. తన ప్యాకేజీలో 6.6 మిలియన్స్ క్యాష్ బోనస్, 2.5 డాలర్స్ ఇతర అలవెన్స్ వంటివి పొందారు. దీంతో ప్రపంచంలోనే అత్యధిక జీతం పొందుతున్న బ్యాంకర్లలో ఒకరిగా నిలిచారు. కాగా మొదటి వ్యక్తి.. స్టాండర్డ్ చార్టర్డ్ సీఈవో 'బిల్ వింటర్స్' ఉన్నారు.ఇదీ చదవండి: రెండు లక్షలమంది కొన్న కారు: ఇప్పుడు కొత్త ఎడిషన్‌లో..గత 15 సంవత్సరాలుగా.. డీబీఎస్ బ్యాంక్ మార్కెట్ క్యాప్ గణనీయంగా పెరుగుతోంది. 2009లో ఈ బ్యాంక్ మార్కెట్ క్యాప్ 35 బిలియన్ సింగపూర్ డాలర్స్ కాగా.. 2024 నాటికి ఇది 124 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో 100 బిలియన్ డాలర్ల మార్కును దాటిన సింగపూర్ లిస్టెడ్ కంపెనీల జాబితాలో చేరింది. 2009లో కేవలం 14,000 మంది ఉద్యోగులు మాత్రమే ఈ బ్యాంకులో పనిచేసేవారు. ఈ సంఖ్య 2024కు 41,000 మందికి చేరింది. డీబీఎస్ బ్యాంక్ సీఈఓ జీతం మాత్రమే కాకుండా.. ఇతర సీనియర్ ఉద్యోగుల జీతాలు కూడా పెరిగినట్లు తెలుస్తోంది. -
స్టాక్మార్కెట్లోకి ‘చాయ్ పాయింట్’
న్యూఢిల్లీ: టీ, కాఫీ చైన్.. చాయ్ పాయింట్ 2026 మే నెలకల్లా స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యే ప్రణాళికల్లో ఉంది. ఈ అంశాన్ని ప్రతిరోజు సుమారు 9 లక్షల కప్పుల టీ, కాఫీ విక్రయిస్తున్న సంస్థ సహవ్యవస్థాపకుడు తరుణ్ ఖన్నా తెలియజేశారు. అయితే కుంభమేళాలో రోజుకి 10 లక్షలకంటే అధికంగా విక్రయించినట్లు తెలియజేశారు.ముంబైలో తమ విద్యార్ధి అములీక్ సింగ్ బిజ్రాల్తో కలసి ఒక కేఫ్‌లో టీ తాగే సమయంలో 2009లో చాయ్ పాయింట్ ప్రారంభించే ఆలోచన వచ్చినట్లు హార్వార్డ్ యూనివర్శిటీ ప్రొఫెసర్ ఖన్నా వెల్లడించారు. ప్లాస్టిక్ కప్పులలో అంత శుభ్రతలేని విధంగా అందిస్తున్న చాయ్ స్థానే అత్యున్నత నాణ్యతతో, పరిశుభ్రంగా అందుబాటు ధరలో సువాసనలతో కూడిన చాయ్ అందించాలనే ఆలోచనతో చాయ్ పాయింట్‌కు తెరతీసినట్లు వివరించారు.దీంతో టీ అందించే వ్యక్తు(చోటూ)లకు ఉపాధిని సైతం కల్పించవచ్చని భావించినట్లు తెలియజేశారు. దీంతో 2010లో బెంగళూరులోని కోరమంగళలో తొలి ఔట్‌లెట్‌ను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. అములీక్తో కలిసి ఐదుగురు ఉద్యోగులతో బిజినెస్‌ను మొదలుపెట్టినట్లు వెల్లడించారు. ప్రస్తుతం రోజుకి 90 లక్షల కప్పుల టీ, కాఫీలను విక్రయిస్తున్నట్లు తెలియజేశారు. -
డిపాజిట్లపై బీమా పెంచితే బ్యాంకులపై ప్రభావం
ముంబై: డిపాజిట్లపై బీమా పరిమితిని రూ.5 లక్షలకు మించి పెంచితే అది బ్యాంకుల లాభదాయకతపై ప్రభావం చూపిస్తుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. దీనివల్ల సుమారు రూ.12,000 కోట్ల మేర లాభం తగ్గిపోవచ్చని అంచనా వేసింది. ప్రస్తుతం ఒక బ్యాంక్ పరిధిలో ఒక కస్టమర్ పేరిట రూ.5లక్షల బీమా సదుపాయాన్ని డీఐసీజీసీ అందిస్తోంది. ఇందుకు గాను బ్యాంక్‌లు డిపాజిట్ల మొత్తంపై డీఐసీజీసీకి ప్రీమియం చెల్లిస్తుంటాయి.రూ.5 లక్షలకు మించి పెంచే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్టు కేంద్ర ఆర్థిక సేవల కార్యదర్శి నాగరాజు ఇటీవలే ప్రకటించడం గమనార్హం. ప్రభుత్వం ఆమోదం తెలిపితే, నోటిఫై చేస్తామని చెప్పారు. ‘‘ఇటీవల ఓ కోపరేటివ్ బ్యాంక్ (న్యూ ఇండియా కోపరేటివ్ బ్యాంక్) వైఫల్యం నేపథ్యంలో డిపాజిట్ ఇన్సూరెన్స్ పరిమితి పెంపు చర్చకు వచ్చింది. ఇది బ్యాంక్‌లపై స్వల్ప స్థాయిలోనే అయినా, చెప్పుకోతగ్గ మేర లాభదాయకతపై ప్రభావం చూపించనుంది’’అని ఇక్రా ఫైనాన్షియల్ రంగం రేటింగ్స్ హెడ్ సచిన్ సచ్దేవ పేర్కొన్నారు. పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంక్ వైలఫ్యంతో చివరిగా 2020 ఫిబ్రవరిలో డిపాజిట్‌పై బీమాను రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచినట్టు గుర్తు చేశారు.97.8 శాతం డిపాజిట్లకు రక్షణ 2024 మార్చి నాటికి 97.8 శాతం బ్యాంక్ ఖాతాలు బీమా రక్షణ పరిధిలో ఉన్నట్టు ఇక్రా తెలిపింది. ఈ ఖాతాల్లోని డిపాజిట్ల మొత్తం రూ.5లక్షల్లోపే ఉన్నట్టు పేర్కొంది. ఇన్సూర్డ్ డిపాజిట్ రేషియో (ఐడీఆర్) 43.1 శాతంగా ఉన్నట్టు తెలిపింది. ఈ ఐడీఆర్‌ను 47 శాతం నుంచి 66.5 శాతానికి తీసుకెళితే, అప్పుడు బ్యాంకుల నికర లాభం రూ.1,800 కోట్ల నుంచి రూ.12,000 కోట్ల మేర ప్రభావితమవుతుందని వివరించింది. దీంతో బ్యాంకుల రిటర్న్ ఆన్ అసెట్స్ (ఆర్వోఏ) 0.01–0.04 శాతం మేర, రిటర్న్ ఆన్ ఈక్విటీ (ఆర్‌వోఈ) 0.07–0.4 శాతం మేర ప్రభావితం కావొచ్చని అంచనా వేసింది. -
‘కొత్త ఫండ్’ పథకానికి సెబీ కొత్త రూల్
న్యూఢిల్లీ: ఇకపై అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ(ఏఎంసీ)లు తప్పనిసరిగా కొత్త ఫండ్ పథకం (NFO) నిధుల ను 30 రోజుల్లోగా వినియోగించవలసి ఉంటుంది. 2025 ఏప్రిల్ 1నుంచి అమల్లోకి వచ్చే విధంగా ఇందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశాలు జారీ చేసింది.వెరసి ఏఎంసీలు ఎన్ఎఫ్వోలో భాగంగా సమీకరించిన నిధులను సంబంధిత పెట్టుబడుల కోసం 30 రోజుల్లోగా వెచ్చించవలసి ఉంటుంది. సెబీ తాజా స ర్క్యులర్ ప్రకారం ఇన్వెస్టర్లకు యూనిట్ల కేటాయింపు తదుపరి గడువు అమల్లోకి రానుంది. దీంతో మ్యూచువల్ ఫండ్ పథకాలలో తప్పుడు విక్రయాలకు తావివ్వకుండా సెబీ చెక్ పెట్టనుంది.పథకం సమాచార పత్రా(ఎస్ఐడీ)లలో ఏ ఎంసీలు నిధుల వినియోగ గడువు, కేటాయింపు తదితరాలను వెల్లడించవలసి ఉంటుంది. ఒకవేళ 30 పనిదినాల్లోగా నిధుల వినియోగా న్ని చేపట్టలేకపోతే.. కారణాలను వివరిస్తూ ఏఎంసీ ఇన్వెస్ట్మెంట్ కమిటీకి లేఖ ద్వారా వెల్లడించవలసి ఉంటుంది. తద్వారా కమిటీ మరో 30 రోజుల గడువును ఇచ్చేందుకు వీలుంటుంది. -
రూ.260 కోట్లు.. ఆర్జనలోనూ అతివలే..
మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఇప్పుడిప్పుడే ఆధిపత్యాన్ని చాటుతున్నారు. ప్రస్తుతం ప్రపంచం మహిళా దినోత్సవాన్ని జరుపుకొంటున్న వేళ ప్రముఖ అంతర్జాతీయ ఆతిథ్య సంస్థ ఎయిర్‌బీఎన్‌బీ.. మహిళల వ్యాపార పురోభివృద్ధిపై ఆసక్తికర విశేషాల్ని వెల్లడించింది.ఎయిర్‌బీఎన్‌బీలో భారతీయ మహిళా హోస్ట్‌లకు (హోటల్స్, పీజీలు అద్దెకిచ్చే వారు) 2024 సంవత్సరం ఒక మైలురాయిగా నిలిచింది. వారు ఆ ఏడాదిలో రూ.260 కోట్లు ఆర్జించారు. ఇది ఆ ప్లాట్‌ఫామ్ ఆతిథ్య ల్యాండ్ స్కేప్‌కు గణనీయంగా దోహదం చేసింది. దేశంలోని ఎయిర్‌బీఎన్‌బీ హోస్ట్ లలో దాదాపు 30% ఉన్న మహిళలు సమ్మిళితతను పెంపొందించడం, ఆర్థిక అవకాశాలను అందిపుచ్చుకోవడం ద్వారా సాంప్రదాయ ఆతిథ్య పరిశ్రమను పునర్నిర్మించారు. దేశవ్యాప్తంగా ట్రావెల్ అనుభవాలను పునర్నిర్వచించడంలో మహిళల ప్రాముఖ్యత పెరుగుతోందనడానికి వారి సాధనలే నిదర్శనం.పెరుగుతున్న మహిళా హోస్ట్లుదేశంలో మహిళా హోస్ట్‌లు గణనీయమైన విజయాన్ని సాధించారు. భారత్‌లో ఎయిర్‌బీఎన్‌బీ గెస్ట్ ఫేవరెట్ లిస్టింగ్స్‌లో దాదాపు 35% మహిళా హోస్ట్‌లే నిర్వహిస్తుంటం విశేషం. చిరస్మరణీయమైన, సౌకర్యవంతమైన బసలను అందించడంలో వారి అసాధారణ సామర్థ్యాన్ని ఇది హైలైట్ చేస్తుంది. సుందరమైన ప్రదేశాలలో సౌకర్యవంతమైన హోమ్ స్టేల నుండి ఆధునిక పట్టణ అపార్ట్ మెంట్ల వరకు, మహిళలు సృజనాత్మకత, శ్రద్ధ, అతిథి అంచనాలపై లోతైన అవగాహనను ప్రదర్శించారు.భారతీయ మహిళల్లో ట్రావెల్ ట్రెండ్స్దేశీయ, అంతర్జాతీయ పర్యటనలకు ఎయిర్‌బీఎన్‌బీని భారత మహిళా ప్రయాణికులు వేదికగా ఎంచుకున్నారు. 2024లో భారతీయ మహిళా ప్రయాణికులకు అత్యంత డిమాండ్ ఉన్న దేశీయ గమ్యస్థానాలలో గోవా, ఢిల్లీ, బెంగళూరు, పూణే, జైపూర్ ఉన్నాయి. అంతర్జాతీయంగా లండన్, దుబాయ్, బ్యాంకాక్, పారిస్, రోమ్ వంటి నగరాలు వారి ట్రావెల్ విష్ లిస్ట్‌లో అగ్రస్థానంలో నిలిచాయి.మిలీనియల్ మహిళలు (1981-1996 మధ్య పుట్టినవారు) తమ ప్రయాణ ప్రణాళికల కోసం ఎయిర్‌బీఎన్‌బీని ఉపయోగించడంలో ముందంజలో ఉన్నారు. వారి తరువాత వరుసలో జెన్‌జెడ్ మహిళలు (1996-2012 మధ్య పుట్టినవారు) ఉన్నారు. సౌలభ్యం, ప్రత్యేకమైన అనుభవాలు, స్థోమత కోసం వారి ప్రాధాన్యత ఎయిర్‌బీఎన్‌బీ ప్రజాదరణను పెంచింది. డుయో ట్రావెల్ అత్యంత ఇష్టమైన ట్రిప్ టైప్ గా అవతరించింది. తరువాత సమూహ ప్రయాణాలు, మహిళల్లో భాగస్వామ్య ప్రయాణ అనుభవాల పెరుగుతున్న ధోరణిని ప్రతిబింబిస్తున్నాయి. -
బంగారం వరుస తగ్గుదల
దేశంలో పెరుగుతున్న బంగారం ధరలు (Gold Prices) రెండు రోజులుగా కొనుగోలుదారులకు ఊరటనిస్తున్నాయి. నేడు (March 7) వరుసగా రెండో రోజూ పసిడి ధరలు దిగివచ్చాయి. అంతకుముందు వరుస పెరుగుదలతో బెంబేలెత్తించిన బంగారం ధరలు ఇప్పుడు క్షీణిస్తుండటంతో పసిడి ప్రియులు కుదటపడి కొనుగోళ్లకు మొగ్గుచూపిస్తున్నారు.బంగారం ధరలు (Gold Rates) ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. నేటి బంగారం ధరలు ఏయే ప్రాంతాల్లో ఎలా ఉన్నాయనేది ఈ కథనంలో తెలుసుకుందాం.ఇది చదివారా? గోల్డ్ లోన్లు ఇక అంత ఈజీ కాదు..తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలుఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 79,900, 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 87,160 వద్ద ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.300, రూ.330 చొప్పున తగ్గాయి.ఇతర ప్రాంతాల్లో.. దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.87,310 వద్ద, 22 క్యారెట్ల పసిడి ధర రూ.80,050 వద్ద ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.330, రూ.300 చొప్పున క్షీణించాయి.చైన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 79,900 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 87,160 వద్దకు వచ్చాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.300, రూ.330 చొప్పున కరిగాయి. బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి.వెండి ధరలు రివర్స్దేశవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టగా వెండి ధరల్లో మాత్రం నేడు పెరుగుదల నమోదైంది. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ ధర రూ.100 పెరిగి రూ.1,08,100 వద్దకు చేరింది. ఇక ఢిల్లీలో కేజీ వెండి రూ. 99,100 వద్ద కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే రూ.100 పెరిగింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
రూ. 1,100 కోట్ల లాభం వస్తుంది.. ఓయో అంచనా
న్యూఢిల్లీ: రానున్న ఆర్థిక సంవత్సరం(2025–26)లో రూ. 1,100 కోట్ల నికర లాభం ఆర్జించగలమని ట్రావెల్ టెక్ స్టార్టప్ ఓయో అంచనా వేసింది. ఈ బాటలో రూ. 2,000 కోట్ల నిర్వహణ లాభం(ఇబిటా) సాధించగలమని భావిస్తున్నట్లు యూనికార్న్ సంస్థ ఓయో వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ పేర్కొన్నారు. ఇందుకు ఆదాయంలో వృద్ధి దోహదపడగలదని అభిప్రాయపడ్డారు.ఇటీవల కొనుగోలు చేసిన మోటెల్ 6 తాజా అంచనాలకు దన్నుగా నిలవనున్నట్లు తెలియజేశారు. ఈ కాలంలో మోటెల్ 6 ఇబిటా రూ. 630 కోట్లకు చేరగలదని ఓయో ఊహిస్తోంది. ఓయో కొనుగోలు చేశాక తొలిసారి మోటెల్ 6 పూర్తి ఏడాది పనితీరును వెల్లడించనుంది. వెరసి ఓయో సంయుక్త ఇబిటా రూ. 2,,000 కోట్లను తాకనున్నట్లు సంబంధిత వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఈ ఏడాది క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో ఓయో రూ. 166 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో నమోదైన రూ. 25 కోట్లతో పోలిస్తే నికర లాభం ఆరు రెట్లు ఎగసింది. వెరసి ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి 9 నెలల్లో(ఏప్రిల్–డిసెంబర్) రూ. 457 కోట్ల నికర లాభం ప్రకటించింది. గతేడాది ఇదే కాలంలో రూ. 111 కోట్ల నష్టం ప్రకటించింది. -
నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు.. బలహీనంగా ఐటీ, బ్యాంక్ షేర్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. బలహీన అంతర్జాతీయ సంకేతాల మధ్య బెంచ్ మార్క్ ఈక్విటీ ఇండెక్స్ బీఎస్ఈ సెన్సెక్స్ 176.47 పాయింట్లు లేదా 0.24 శాతం క్షీణించి 74,163.62 వద్ద మొదలైంది. ఇక నిఫ్టీ 50 ప్రారంభ సమయానికి 40.85 పాయింట్లు లేదా 0.18 శాతం క్షీణించి 22,503 వద్ద ఉంది.బలహీన అంతర్జాతీయ సంకేతాల మధ్య నిఫ్టీ ఐటీ, ఎఫ్ ఎంసీజీ, బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీలు ఎన్ఎస్ఈలో ప్రారంభ ట్రేడింగ్ లో ఒత్తిడికి లోనయ్యాయి. ఐటీ ఇండెక్స్ 0.97 శాతం, ఎఫ్ఎంసీజీ 0.12 శాతం, బ్యాంక్ 0.12 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.06 శాతం నష్టపోయాయి.విస్తృత మార్కెట్ సూచీలు ప్రారంభ ట్రేడింగ్ లో మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 0.34 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 0.09 శాతం నష్టపోయాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు దేశ ఆర్థిక వ్యవస్థను కుంగదీస్తాయన్న భయాలే ఈ రోజు స్టాక్ మార్కెట్లలో అమ్మకాలకు కారణం కావచ్చు. యునైటెడ్ స్టేట్స్-మెక్సికో-కెనడా ఒప్పందం కిందకు వచ్చే కొన్ని కెనడా, మెక్సికో వస్తువులపై సుంకాలను ఏప్రిల్ 2 వరకు వాయిదా వేస్తూ ఆయన తీసుకున్న నిర్ణయం కూడా ఇన్వెస్టర్లను శాంతపరచడంలో విఫలమైంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
గోల్డ్ లోన్లు ఇక అంత ఈజీ కాదు..
గోల్డ్ లోన్లు (Gold Loans) పొందడం రానున్న రోజుల్లో అంత సులువు కాకపోవచ్చు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ విభాగంలో అవకతవకలను అరికట్టడం, ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడమే లక్ష్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బంగారు రుణాలపై నిబంధనలను కఠినతరం చేయనుంది.బంగారు ఆభరణాలు, వస్తువులు హామీగా పెట్టి తీసుకునే రుణాలు ఇటీవల కాలంలో అసాధరణంగా పెరిగాయి. 2024 సెప్టెంబర్ నుండి బంగారు రుణాలు 50% పెరుగుదలను చూశాయి. ఈ నేపథ్యంలో ఎటువంటి అనైతిక పద్ధతులకు ఆస్కారం లేకుండా బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (NBFC) రుణ విధానాలను ప్రామాణికం చేయడానికి సెంట్రల్ బ్యాంక్ చురుకైన చర్యలు తీసుకుంటోందని పరిశ్రమ వర్గాలతోపాటు ఆర్బీఐ ఆలోచనల గురించి తెలిసిన వ్యక్తులను ఉటంకిస్తూ వార్తా సంస్థ రాయిటర్స్ కథనం పేర్కొంది.కీలక ఆందోళనలు.. ప్రతిపాదిత మార్పులుగత 12 నుంచి 16 నెలలుగా ఆర్బీఐ నిర్వహించిన ఆడిట్లలో గోల్డ్ లోన్ రంగంలో అనేక అవకతవకలు వెలుగు చూశాయి. వాటిలో కొన్ని..సరిపోని నేపథ్య తనిఖీలు: తాకట్టు పెట్టిన బంగారం యాజమాన్యాన్ని ధ్రువీకరించడంలో, రుణగ్రహీతలపై క్షుణ్ణంగా శ్రద్ధ వహించడంలో బ్యాంకులు, రుణ సంస్థల లోపాలు కనిపించాయి.వాల్యుయేషన్ సమస్యలు: రుణగ్రహీత లేకుండా బంగారాన్ని మదింపు చేసిన సంఘటనలు, వాల్యుయేషన్ పద్ధతుల్లో అసమానతలు ఆందోళన కలిగిస్తున్నాయి.అనైతిక పద్ధతులు: కొన్ని రుణ సంస్థలు డిఫాల్ట్ రుణగ్రహీతలకు తెలియజేయకుండా, పారదర్శక నిబంధనలను ఉల్లంఘించి తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేశాయి.ఔట్ సోర్సింగ్ ప్రమాదాలు: ప్రామాణిక ప్రోటోకాల్స్ ను దాటవేస్తూ బంగారాన్ని సేకరించడం, నిల్వ చేయడం, తూకం వేయడం వంటి పనులను ఫిన్ టెక్ ఏజెంట్లకు అప్పగించారు.ఈ సమస్యలను పరిష్కరించడానికి, ఆర్బీఐ కఠినమైన అండర్ రైటింగ్ విధానాలను అమలు చేయాలని, రుణ వినియోగాన్ని నిశితంగా పర్యవేక్షించాలని, రుణదాతలందరికీ ఒకే విధమైన మార్గదర్శకాలను నిర్ధారించాలని యోచిస్తోంది. థర్డ్ పార్టీ ఏజెంట్లపై అతిగా ఆధారపడటాన్ని నివారించడం, రుణ సంస్థలు బంగారం మదింపు, నిల్వ వంటి కీలకమైన ప్రక్రియలను స్వయంగా నిర్వహించేలా చూడటం సెంట్రల్ బ్యాంక్ లక్ష్యం.పరిశీలన ఎందుకు?ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగారం వినియోగదారు అయిన భారత్ లో రికార్డు స్థాయిలో బంగారం ధరలు పెరగడం, అన్ సెక్యూర్డ్ లెండింగ్ పై నిబంధనలను కఠినతరం చేయడంతో బంగారం రుణాలు పెరిగాయి. కుటుంబాలు సాంప్రదాయకంగా పండుగలు, వివాహాలకు బంగారాన్ని కొనుగోలు చేస్తాయి. ఇది రుణాలను పొందడానికి విలువైన ఆస్తిగా మారుతుంది. ఏదేమైనా, ఈ విభాగం వేగవంతమైన వృద్ధి మొత్తం రుణ వృద్ధిని అధిగమించింది. దీంతో ఆర్బీఐ జోక్యం చేసుకుని రుణ పద్ధతులు నైతికంగా, పారదర్శకంగా ఉండేలా చూడటానికి ప్రేరేపించింది.రుణగ్రహీతలు, సంస్థలపై ప్రభావంప్రతిపాదిత మార్పులు రుణగ్రహీతలకు బంగారు రుణాలను మరింత సురక్షితంగా, విశ్వసనీయంగా మారుస్తాయని భావిస్తున్నారు. అయితే కఠినమైన నిబంధనలు రుణాలను ప్రాసెస్ చేయడానికి అవసరమైన సమయం, శ్రమను కూడా పెంచుతాయి. దీంతో రుణగ్రహీతలకు త్వరగా నిధులను పొందడం కష్టతరం అవుతుంది. ఇక రుణ సంస్థల విషయానికి వస్తే.. బంగారు రుణాలకు సంబంధించి ఆర్బీఐ ప్రమాణాలకు అనుగుణంగా శిక్షణ, సాంకేతికత, సమ్మతి చర్యలకు ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరాన్ని కొత్త నిబంధనలు కల్పిస్తాయి. -
క్యాస్ట్రాల్ ఇండియాపై అరామ్కో కన్ను
న్యూఢిల్లీ: గత నాలుగు రోజులుగా ర్యాలీ బాటలో సాగుతున్న లూబ్రికెంట్స్ తయారీ దిగ్గజం క్యాస్ట్రాల్ ఇండియా కౌంటర్‌కు మరోసారి డిమాండ్ పెరిగింది. దీంతో బీఎస్ఈలో షేరు 11 శాతం జంప్‌చేసి రూ. 246 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈలోనూ 10 శాతం ఎగసి రూ. 245 వద్ద నిలిచింది. ఒక దశలో 13.4 శాతం దూసుకెళ్లి రూ. 252 వద్ద గరిష్టానికి చేరింది.ఎన్ఎస్ఈలో 7.39 కోట్ల షేర్లు, బీఎస్ఈలో 23.62 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. బీపీ(గతంలో బ్రిటిష్ పెట్రోలియం)కు చెందిన లూబ్రికెంట్ బిజినెస్‌ను సౌదీ చమురు దిగ్గజం అరామ్కో కొనుగోలు చేయనున్నట్లు వెలువడిన వార్తలు షేరుపై సానుకూల ప్రభావం చూపుతున్నాయి. దీంతో వరుసగా నాలుగో రోజు క్యాస్ట్రాల్ ఇండియా బలపడింది. 10 బిలియన్ డాలర్లు.. క్యాస్ట్రాల్ బ్రాండుతో బీపీ.. లూబ్రికెంట్స్ విక్రయించే సంగతి తెలిసిందే. బీపీ ఇటీవల పునర్వ్యవస్థీకరణలో భాగంగా లూబ్రికెంట్స్ విభాగం విలువను దాదాపు 10 బిలియన్ డాలర్లుగా మదింపు చేసినట్లు తెలుస్తోంది! కాగా.. వాల్వోలైన్ లూబ్రికెంట్స్ యూనిట్‌తో క్యాస్ట్రాల్ ఆస్తులను జత చేసే యోచనలో అరామ్కో ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.2023లో 2.65 బిలియన్ డాలర్లకు వాల్వోలైన్‌ను అరామ్కో కొనుగోలు చేసింది. భారత్, చైనా, ఆగ్నేయ ఆసియాలో అదనపు రిఫైనింగ్, కెమికల్స్ బిజినెస్‌ల కొనుగోలుకి చూస్తున్నట్లు అరామ్కో గతేడాది పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో క్యాస్ట్రాల్ ఇండియా కొనుగోలుపై అంచనాలు పెరిగినట్లు నిపుణులు తెలియజేశారు. -
ఓలా ఎలక్ట్రిక్‌కి పీఎల్ఐ ప్రోత్సాహకాలు
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ సంస్థలకు సంబంధించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం (పీఎల్ఐ–ఆటో స్కీమ్) కింద రూ. 73.74 కోట్లు లభించినట్లు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ వెల్లడించింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలపై ఈ మొత్తం మంజూరు అయినట్లు వివరించింది. దీంతో ఈ స్కీము కింద ప్రోత్సాహకాలు అందుకున్న తొలి టూ వీలర్ ఈవీగా నిల్చినట్లు ఓలా ఎలక్ట్రిక్ వివరించింది.ఓలా ప్రస్తుతం ఎలక్ట్రిక్ టూ వీలర్ సెగ్మెంట్లో 28 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో ఉంది. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకునే క్రమంలో దేశీయంగా ఆటోమోటివ్ రంగంలో తయారీని, పర్యావరణ అనుకూల మొబిలిటీ సొల్యూషన్స్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం 2021లో పీఎల్ఐ–ఆటో స్కీమ్‌ను ప్రకటించింది. అయిదేళ్ల వ్యవధి కోసం దీనికి రూ. 25,938 కోట్లు కేటాయించింది. -
మహిళా పారిశ్రామిక వేత్తలకు సాధికారత
న్యూఢిల్లీ: మహిళా పారిశ్రామికవేత్తల సాధికారత కోసం ఎస్ఎంఈ ఫోరమ్, నీతి ఆయోగ్ సంయుక్తంగా ‘ఏ మిలియన్ ఉమెన్ అరైజ్’ పేరుతో కార్యక్రమాన్ని చేపట్టాయి. దేశవ్యాప్తంగా 6 కోట్ల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్ఎంఈ) సంస్థలు ఉంటే, అందులో 35 శాతం మహిళల నిర్వహణలోనివేనని కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ డైరెక్టర్ అంకితా పాండే ఈ సందర్భంగా తెలిపారు. అయినప్పటికీ లింగపరమైన పక్షపాతం, మార్కెట్లో పరిమిత అవకాశాల వంటి వినూత్న సవాళ్లను వారు ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. సంఘటితం చేయడం, మార్గదర్శకం, సామర్థ్య నిర్మాణం, ఈ–కామర్స్‌తో అనుసంధానం ద్వారా ఈ అంతరాలను పరిష్కరించేందుకు ఎంఎస్ఎంఈ శాఖ కట్టుబడి ఉన్నట్టు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో మహిళా వ్యాపారవేత్తలకు మద్దతుగా మహిళా ఎంటర్ప్రెన్యుర్షిప్ ప్లాట్‌ఫామ్ (డబ్ల్యూఈపీ)ను ఏర్పాటు చేసినట్టు నీతి ఆయోగ్ డైరెక్టర్ అన్నారాయ్ తెలిపారు.మహిళ వ్యాపారవేత్తలకు రుణ సదుపాయం, నిబంధనలపరమైన మద్దతు, నైపుణ్య కల్పన, మార్గదర్శకం, నెట్వర్కింగ్ పరంగా సాయమందించనున్నట్టు చెప్పారు. నీతి ఆయోగ్ సహకారంతో డబ్ల్యూఈపీ కార్యక్రమాన్ని లక్షలాది మంది ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తలకు చేరువ చేయగలమని ఇండియా ఎస్ఎంఈ ఫోరమ్ ప్రెసిడెంట్ వినోద్ కుమార్ చెప్పారు. ఎంఎస్ఎంఈలకు మెరుగైన రవాణా పరిష్కారాలను అందించే లక్ష్యంతో ఎయిర్‌లైన్స్ సంస్థ ఇండిగోతో ఎస్ఎంఈ ఫోరమ్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఈ సందర్భంగా కుదుర్చుకుంది. రెట్టింపు సంఖ్యలో మహిళలకు రుణాలు: సరళ్ ఎస్సీఎఫ్ బ్లాక్‌సాయిల్ క్యాపిటల్‌కు చెందిన ఎస్ఎంఈ ప్లాట్‌ఫామ్ ‘సరళ్ ఎస్సీఎఫ్’ 2025లో రెట్టింపు మహిళా వ్యాపారవేత్తలకు సాయమందించాలనుకుంటోంది. ఇప్పటికే 150 మంది మహిళా వ్యాపారవేత్తలకు రూ.64 కోట్ల రుణాలను సమకూర్చినట్టు ప్రకటించింది. వృద్ధికి పెట్టుబడి, దీర్ఘకాల స్థిరత్వం దిశగా వారికి మద్దతుగా నిలుస్తున్నట్టు పేర్కొంది. 2024లో ఈ సంస్థ అంతక్రితం సంవత్సరంతో పోల్చితే 34 శాతం అధికంగా రూ.1,237 కోట్ల రుణాలను మంజూరు చేసినట్టు ప్రకటించింది. -
భారత్‌లో టెస్లాకు అంత ఈజీ కాదు
న్యూఢిల్లీ: భారత్‌లో తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లాకు ఇక్కడి మార్కెట్‌పై పట్టు సాధించడం అంత సులువు కాదని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ వ్యాఖ్యానించారు. టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రాలాంటి దేశీ దిగ్గజాల తరహాలో అది రాణించలేకపోవచ్చని తెలిపారు. ఎర్న్స్ట్ అండ్ యంగ్ ‘ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. ‘‘మస్క్ చాలా స్మార్ట్. అందులో సందేహం లేదు. ఆయన చాలా గొప్ప పనులు చేస్తున్నారు. కానీ ఆయన ఉన్నది అమెరికాలో, భారత్‌లో కాదు. ఇక్కడ విజయం సాధించాలంటే అంత సులభం కాదు. మహీంద్రా, టాటాల్లాగా ఆయన రాణించలేరు’’ అని జిందాల్ పేర్కొన్నారు. ఈవీల దిగుమతులపై టారిఫ్‌ల తగ్గింపు అవకాశాలతో భారత మార్కెట్లో ప్రవేశించేందుకు టెస్లా సన్నాహాలు చేసుకుంటున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ కూడా ఈవీ సెగ్మెంట్లో అవకాశాలను అందిపుచ్చుకునే ప్రయత్నాల్లో ఉంది. చైనాకు చెందిన ఎస్ఏఐసీ కార్పొరేషన్‌తో ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ సంస్థ జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటర్ ఇండియా ఇటీవలే ఎలక్ట్రిక్, ప్లగ్–ఇన్ హైబ్రిడ్స్ మొదలైన పలు వాహనాలను ప్రదర్శించింది. -
ఇంటర్నెట్లాగే ఏఐతో కొత్త ఉద్యోగాలొస్తాయ్..
బెంగళూరు: గతంలో ఇంటర్నెట్, సోషల్ మీడియాతో కొత్త కెరియర్లు వచ్చినట్లే కృత్రిమ మేథతో (ఏఐ) కూడా కొత్త ఉద్యోగాలు వస్తాయని జోహో సీఈవో మణి వెంబు తెలిపారు. ఏఐ సొల్యూషన్స్‌కి సంబంధించి పాశ్చాత్య దేశాలకు భారత్ గట్టి పోటీదారుగా ఎదగగలదని ధీమా వ్యక్తం చేశారు. పుష్కలంగా నిపుణుల లభిస్తుండటం, దేశీయంగా సొల్యూషన్స్ రూపొందించుకోవాలన్న ఆకాంక్షలు పెరుగుతుండటం ఇందుకు దోహదపడగలవని వెంబు చెప్పారు. ఏఐ కల్పించగలిగే అవకాశాలను విశాల దృక్పథంతో పరిశీలించి, తగు దిశలో ముందుకెళ్లాలని ఆయన పేర్కొన్నారు. ఏఐ, కొత్త సాంకేతికతలను ఉపయోగించి తమ ప్రస్తుత సిబ్బంది ఉత్పాదకతను పెంచుకునే మార్గాలపై జోహో ప్రధానంగా దృష్టి పెడుతోందని వెంబు వివరించారు. మరోవైపు, అమెరికాలో విధానాలు, టారిఫ్‌లపరంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రభావాలను దేశీ ఐటీ పరిశ్రమ ఇప్పుడే అంచనా వేయలేదని, వేచి చూసే ధోరణిని పాటించాల్సి ఉంటుందని వెంబు చెప్పారు. -
ఉద్యోగాలకు ముందుకొస్తున్న మహిళలు
ముంబై: ఉద్యోగ బాధ్యతలు చేపట్టేందుకు మరింత మంది మహిళలు ముందుకు వస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా 2021 నుంచి 2024 మధ్యకాలంలో టైర్–2, 3 ఇతర నాన్ మెట్రో పట్టణాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నట్టు ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫామ్ ‘ఆప్నా డాట్ కో’ వెల్లడించింది. ముఖ్యంగా టైర్–2, 3 పట్టణాల నుంచి మహిళా అభ్యర్థుల దరఖాస్తులు మూడు రెట్లు పెరిగినట్టు తెలిపింది. మెట్రోలకు వెలుపల ఉద్యోగాల్లో పెరుగుతున్న మహిళల భాగస్వామ్యాన్ని ఇది తెలియజేస్తున్నట్టు పేర్కొంది. పెరుగుతున్న ఉపాధి అవకాశాలు, డిజిటల్ అనుసంధానత, నియామకాల్లో వస్తున్న మార్పులు చిన్న పట్టణాల్లోనూ వివిధ రంగాల్లో మహిళల ప్రవేశానికి వీలు కల్పిస్తున్నట్టు తెలిపింది. → టైర్–2, 3 పట్టణాల్లో సేల్స్, బిజినెస్ డెవలప్మెంట్, అడ్మిన్, బ్యాక్‌ఆఫీస్, కస్టమర్ సపోర్ట్‌లో మహిళలు ఎక్కువగా ఉపాధి పొందుతున్నారు. 55 శాతం మంది మహిళలు ఈ ఉద్యోగాల్లోనే చేరుతున్నారు. → అంతేకాదు కఠిన పరిస్థితులు ఉండే క్షేత్రస్థాయి అమ్మకాలు, డెలివరీ, లాజిస్టిక్స్‌లోనూ కొందరు పనిచేసేందుకు సుముఖత చూపుతున్నారు. → క్షేత్రస్థాయి విక్రయాల్లో ఉద్యోగానికి 6 లక్షలు, డెలివరీ, లాజిస్టిక్స్ ఉద్యోగాలకు 2.5 లక్షల దరఖాస్తులు, సెక్యూరిటీస్ సేవల ఉద్యోగాలకు 1.5 లక్షల దరఖాస్తులు 2021–2024 మధ్యకాలంలో వచ్చాయి. → లక్నో, జైపూర్, ఇండోర్, భోపాల్, సూరత్, నాగ్‌పూర్, కోయింబత్తూర్ మహిళలకు ఉపాధి కేంద్రాలు. ఆప్నా ప్లాట్‌ఫామ్‌పై ఉద్యోగ దరఖాస్తుల్లో 45% ఇక్కడివే. -
వ్యక్తిగత బాధ్యతలే కెరీర్ పురోగతికి బ్రేక్!
ముంబై: ఉద్యోగంతోపాటు, వ్యక్తిగత బాధ్యతలకు సమప్రాధాన్యం దృష్ట్యా మహిళలు కెరీర్లో నాయకత్వ బాధ్యతలకు దూరం అవుతున్నారు. నాయకత్వ బాధ్యతలు చేపట్టే విషయంలో తమకు తగినంత ప్రోత్సాహం ఉన్నప్పటికీ ఆ విషయంలో ముందడుగు వేయలేకపోతున్నట్టు నౌకరి సర్వేలో తెలిపారు. ‘మహిళా నిపుణులు అసుల ఏమి కోరుకుంటున్నారు?’ పేరుతో నౌకరీ సర్వే నివేదికను విడుదల చేసింది. మహిళా ఉద్యోగులు ఏం చెబుతున్నారు? → నాయకత్వ బాధ్యతల నిర్వహణ దిశగా తమకు ప్రోత్సాహం ఉందని 66 శాతం మంది తెలిపారు. అయినప్పటికీ 44 శాతం మంది మహిళలు ఈ బాధ్యతల నిర్వహణ పట్ల సుముఖంగా లేరు. ఉద్యోగం–వ్యక్తిగత జీవితానికి సమ ప్రాధాన్యం ఇవ్వడం కోసమే వారు నాయకత్వాన్ని వద్దనుకుంటున్నారు. ఈ బాధ్యతలు స్వీకరిస్తే కెరీర్ సాఫీగా సాగిపోకుండా, క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. → అస్పష్టత, ప్రమోషన్లలో పక్షపాతం కారణాలతో 35 శాతం మంది, నాయకత్వానికి సంబంధించి పరిమిత కార్యక్రమాల నేపథ్యంలో 14% మంది, తమకు సరైన మార్గదర్శకులు లేరన్న కారణంతో 7 % మంది నాయకత్వ పాత్రను చేపట్టడానికి ముందుకు రావడం లేదు. → 50 పట్టణాల నుంచి సుమారు 70వేల మంది మహిళల అభిప్రాయాలను నౌకరీ తన సర్వే కోసం స్వీకరించింది. → పురుషులతో సమాన వేతనం కంటే కూడా నెలసరి సమయంలో సెలవుకు మహిళా ఉద్యోగుల ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉద్యోగంలో తమ మొదటి ప్రాధాన్యం దీనికేనని 34 శాతం మంది చెప్పారు. కొత్తగా కెరీర్ ఆరంభించిన మహిళల్లో సగం మంది ఈ విషయంలో చర్చించడానికి అవకాశం లేదన్నారు. 75 శాతం మంది తాము పనిచేసే చోట ఈ తరహా విధానాల్లేవని తెలిపారు. → 2 ఏళ్లలోపు సర్విసు ఉన్న నిపుణుల్లో 75 శాతం మంది నాయకత్వ బాధ్యతల్లో సమ ప్రాధాన్యం కోరుకుంటుంటే, మూడింట ఒక వంతు మంది సీనియర్లు (15 ఏళ్లకు పైగా సర్విసు) వేతనాల్లో పారదర్శకత అవసరమని అంటున్నారు. → మహిళలు కెరీర్లో మరింత ముందుకు వెళుతున్న కొద్దీ వేతనాల్లో అసమానతలు పెరుగుతున్నట్టు ఈ నివేదిక తెలిపింది. రూ.2–5 లక్షల మధ్య వేతనాలు అందుకుంటున్న వారిలో 11% మంది స్త్రీ–పురుష ఉద్యోగుల మధ్య వేతన వ్యత్యాసాన్ని గుర్తిస్తుంటే.. రూ.50 లక్షల నుంచి ఏడాదికి రూ.కోటి వరకు వేతనం అందుకుంటున్న వారిలో 26 శాతం మందికి అది అనుభవమవుతోంది. → ముంబైలో 28%, బెంగళూరులో 27%, ఢిల్లీలో 24% చొప్పున వేతన వ్యత్యాసం ఉంది. అది కూడా బీఎఫ్ఎస్ఐ రంగంలో 28%, ఎఫ్ఎంసీజీ రంగంలో 27%, ఐటీలో 24% చొప్పున స్త్రీ–పురుష ఉద్యోగుల మధ్య వేతనాల్లో అంతరం ఉంది. -
ఎన్ఎండీసీ సీఎండీగా అమితవ ముఖర్జీ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇనుప ఖనిజ మైనింగ్ దిగ్గజం ఎన్ఎండీసీ.. కొత్త చైర్మన్, ఎండీగా అమితవ ముఖర్జీని నియమించింది. సీఎండీగా ముఖర్జీ గురువారం(6) నుంచి బాధ్యతలు స్వీకరించినట్లు కంపెనీ పేర్కొంది. ఇప్పటివరకూ సీఎండీగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2025 మార్చి 6 నుంచి బోర్డు సీఎండీగా ఎంపిక చేసినట్లు ఎన్ఎండీసీ వెల్లడించింది. వయసురీత్యా 2028 ఫిబ్రవరి 29 వరకూ లేదా తదుపరి ఆదేశాలు జారీ చేసేటంతవరకూ ముఖర్జీ పదవిని నిర్వహించనున్నట్లు తెలియజేసింది. 2018 నవంబర్‌లో ఫైనాన్స్ డైరెక్టర్‌గా కంపెనీలో చేరిన ముఖర్జీ 2023 మార్చి నుంచి సీఎండీగా అదనపు బాధ్యతలు చేపట్టారు. -
ఓటీటీ.. బంపర్ హిట్
డిజిటల్ స్ట్రీమింగ్ మీడియా సేవల (ఓటీటీ) ముందు నేడు సినిమా థియేటర్లు, టీవీలు చిన్నవైపోతున్నాయి. ప్రేక్షకుల సందడి లేక థియేటర్లు వెలవెలబోతుంటే.. వీక్షకులను కాపాడుకునేందుకు టీవీ చానళ్లు తంటాలు పడుతున్నాయి. వీటికి అందనన్నట్టుగా ఓటీటీ వేదికలు ఎక్స్‌ప్రెస్ వేగంతో దూసుకుపోతున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియోస్టార్, యూట్యూబ్, జీ5, సోనీలివ్, ఆహా.. ఇలా ఓటీటీల జాబితా చాలా పెద్దదే. ఓటీటీ సేవలకు 4జీ టెలికం ఊతమిస్తే.. కరోనా విపత్తు ప్రేక్షకులకు మరింత చేరువ చేసిందని చెప్పుకోవాలి. బాహుబలుల కుస్తీపట్లకు వేదికైన ‘వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్’ (డబ్ల్యూడబ్ల్యూఈ) షోలకు అమెరికా తర్వాత ఎక్కువ మంది వీక్షకులు ఉన్నది భారత్‌లోనేనని నెట్‌ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ మోనికా షెర్గిల్ వెల్లడించారు. డబ్ల్యూడబ్ల్యూఈకి చెందిన రా, ఎన్ఎక్స్టీ, స్మాక్‌డౌన్ ఇలా ప్రతి ఫార్మాట్‌కు సంబంధించి షోలు నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉన్నట్టు చెప్పారు. 2019లోనే డబ్ల్యూడబ్ల్యూఈ ఫార్మాట్లను భారత్‌లో 5 కోట్ల మంది యూజర్లు వీక్షించడం గమనార్హం. చేతిలో స్మార్ట్‌టీవీ మాదిరిగా ఓటీటీ పరిశ్రమ విస్తరిస్తోంది. విస్తరణ వ్యూహాలు.. అమెజాన్ ప్రైమ్‌లో ఇప్పుడు ‘శివరాపల్లి’ వెబ్‌సిరీస్ అదరగొడుతోంది. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఓటీటీ షోలలో ‘పంచాయత్’ ఒకటి. మొదట హిందీలో వచ్చిన ఈ షో ఆ తర్వాత తమిళంలోకి ‘తలైవెట్టియాన్ పాళయం’పేరుతో అనువదించగా, అక్కడా దుమ్ము దులుపుతోంది. ఆ తర్వాత శివరాపల్లి పేరుతో గత నెలలో విడుదలై క్రమంగా ఆదరణ పెంచుకుంటోంది. అమెజాన్ ప్రైమ్ ఇప్పుడు 8,500 టైటిళ్లను ఆఫర్ చేస్తోంది. కొత్తగా విడుదలైన సినిమాలను వేగంగా ప్రైమ్‌లోకి తీసుకొచ్చేందుకు ఎంత చెల్లించడానికైనా వెనుకాడడం లేదు. సెలబ్రిటీ షోల విషయంలోనూ దూకుడు ప్రదర్శిస్తోంది. సోనీ లివ్ ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్’, ‘రాకెట్ బోయ్స్’, షార్క్ ట్యాంక్ ఇండియా, మిలియన్ డాలర్ లిస్టింగ్ తదితర పాపులర్ షోలతో తన యూజర్లను 3.3 కోట్లకు పెంచుకోవడం గమనార్హం. 5.5 కోట్ల యూజర్లు కలిగిన జియోహాట్‌స్టార్ అయితే.. రిలయన్స్ జియోకి ఉన్న 42 కోట్ల కస్టమర్లకు చేరువయ్యేందుకు వ్యూహాలు అమలు చేస్తోంది. సాధారణంగా ఒక వెబ్‌సిరీస్‌లో 6–7 షోలు ఉంటే.. 100 వరకు ఎపిసోడ్లతో సి రీస్ తీసుకురావాలని నిర్మాతలను కోరుతోంది. తద్వారా యూజర్ ఎంగేజ్మెంట్ పెంచుకోవాలని అనుకుంటోంది. విలీనాలు.. కొనుగోళ్లుభారీ మార్కెట్, అదే సమయంలో గణనీయమైన పోటీ నేపథ్యంలో ఓటీటీ పరిశ్రమలో అగ్రస్థానంలో ఉన్న డిస్నీ హాట్‌స్టార్.. తనకు ప్రధాన ప్రత్యర్థిగా అవతరిస్తున్న జియో సినిమాస్‌తో చేతులు కలపడం పరిశ్రమలో స్థిరీకరణ దిశగా బలమైన అడుగులు పడినట్టయింది. పరిశ్రమలో ఇప్పుడు జియోహాట్‌స్టార్ నంబర్ 1 ప్లేయర్. జీతో విలీనం అయ్యేందుకు సోనీ చేసిన ప్రయత్నం ఫలించలేదు. పోటీ పెరగడంతో అమెజాన్ లైట్ పేరుతో ఒక్కరు/ఇద్దరు సభ్యుల కుటుంబం కోసం తక్కువ చార్జీల నమూనాను తీసుకొచ్చింది. అలాగే, 2024లో ఎంఎక్స్ ప్లేయర్‌ను కొనుగోలు చేసి.. దీనిపై ఉచిత కంటెంట్‌ను అందుబాటులో ఉంచింది.భారీగా ఆదాయం.. 2024లో ఓటీటీ సంస్థలు రూ.35,600 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకున్నాయి. ఇందులో యూజర్ల సబ్‌్రస్కిప్షన్ చార్జీలతోపాటు ప్రకటనల ఆదాయం కలిసి ఉంది. ఇందులో 40 శాతం యూట్యూబ్‌కే రావడం గమనార్హం. 2022లో 11.2 కోట్ల ఓటీటీ యూజర్లు కాస్తా, 2023లో 9.6 కోట్లకు తగ్గారు. దీంతో మరింత కంటెంట్‌తో, చౌక ప్లాన్లతో ఓటీటీలు 2024లో యూజర్లను 12.5 కోట్లకు పెంచుకున్నాయి. కెనక్టెట్ టీవీల (ఇంటర్నెట్ అనుసంధానం కలిగినవి) కొనుగోళ్లు పెరుగుతుండడం ఓటీటీలకు మరింత డిమాండ్‌ను తెచ్చి పెడుతోంది. చేతిలో స్మార్ట్ ఫోన్‌కు బదులు పెద్ద సైజు టీవీ తెరలపై షోలను వీక్షించేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. పరిశ్రమ ఆదాయం 2022లో రూ.21,600 కోట్లుగా ఉంటే, 2023లో రూ.30,300 కోట్లకు, 2024లో రూ.35,600 కోట్లకు వృద్ధి చెందింది. వృద్ధికి భారీ అవకాశాలు.. 90 కోట్ల టీవీ వీక్షకులతో పోల్చి చూస్తే.. 12.5 కోట్ల వీక్షకులు కలిగిన ఓటీటీ పరిశ్రమకు మరింత మందిని చేరుకునేందుకు గణనీయమైన అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. దేశంలో స్మార్ట్‌ఫోన్ యూజర్లు 2024 నాటికి 65 కోట్ల మంది ఉంటారని అంచనా. 5 కోట్ల కనెక్టెడ్ టీవీలు కూడా ఉన్నాయి. ఈ పరంగా చూస్తే ఓటీటీల విస్తరణకు దండిగా అవకాశాలున్నాయన్నది విశ్లేషుకుల అభిప్రాయం. తొమ్మిదేళ్ల క్రితం ఫస్ట్ గేర్‌లోకి ప్రవేశించిన ఓటీటీ పరిశ్రమ ప్రస్తుతం పట్టణ యూజర్లకు వేగంగా చేరువ కాగా, దేశంలోని ఇతర ప్రాంతాల వారికీ తమ కంటెంట్‌ను చేరువ చేయాల్సి ఉందంటున్నారు. ఇందుకు వీలుగా ప్రకటనలతో కూడిన తక్కువ సబ్‌్రస్కిప్షన్ ప్యాక్‌లు సాయపడతాయని చెబుతున్నారు. సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఖరీదైన కారు కోసం బుకింగ్స్ షురూ..
లెక్సస్ కంపెనీ తన 'ఎల్ఎక్స్ 500డీ' కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండే ఈ కారు ప్రారంభ ధరలు రూ. 3 కోట్లు (ఎక్స్ షోరూమ్, ఇండియా).కొత్త లెక్సస్ ఎల్ఎక్స్ 500డీ గంభీరమైన డిజైన్ పొందుతుంది. ఈ కారు ముందు భాగంలోని స్పిండిల్ గ్రిల్ ఎల్ షేప్ ఎల్ఈడీ సిగ్నేచర్లతో పెద్ద, యాంగ్యులర్ హెడ్లైట్లను పొందుతుంది. 22 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కలిగిన ఈ కారు వెనుక భాగంలో కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్‌లు, చంకీ క్లాడింగ్ వంటివి ఉన్నాయి.లెక్సస్ ఎల్ఎక్స్ 500డీ.. 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, 7 ఇంచెస్ డ్రైవ్ మోడ్ డిస్ప్లే, త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్, హెడ్స్-అప్ డిస్ప్లే, ఫ్రంట్ సీట్ మసాజ్ ఫంక్షన్స్, హీటెడ్ అండ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ & రియర్ సీట్లు, 4 జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్లెస్ ఆపిల్ కార్ప్లే, వైర్డు ఆండ్రాయిడ్ ఆటో, వెనుక ప్రయాణీకుల కోసం రెండు 11.6 ఇంచెస్ ఎంటర్టైన్మెంట్ డిస్ప్లేలు, సింగిల్ పేన్ సన్‌రూఫ్, 25 స్పీకర్ 3డీ మార్క్ లెవిన్సన్ సౌండ్ సిస్టమ్ మొదలైనవన్నీ ఉన్నాయి.బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, ప్రీ-కొలిషన్ సిస్టమ్, లేన్ డిపార్చర్, ట్రేస్ అసిస్ట్, సేఫ్ ఎగ్జిట్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, అడాప్టివ్ హై బీమ్స్, 10 ఎయిర్‌బ్యాగ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ అసిస్ట్ కంట్రోల్, ట్రైలర్ స్వే కంట్రోల్ మొదలైన సేఫ్టీ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.ఇదీ చదవండి: నెలకు 10 రోజులు: టెక్ కంపెనీ కొత్త రూల్!లెక్సస్ ఎల్ఎక్స్ 500డీ 3.3 లీటర్ ట్విన్-టర్బో డీజిల్ వీ6 ఇంజిన్ పొందుతుంది. 304 హార్స్ పవర్, 700 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 10 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పొందుతుంది. ఇది ఆల్-వీల్ డ్రైవ్, యాక్టివ్ హైట్ కంట్రోల్, స్టాండర్డ్ సెంటర్ డిఫరెన్షియల్ లాక్ మరియు అడాప్టివ్ సస్పెన్షన్‌ను పొందుతుంది. -
లక్ష మంది పిల్లలకు ఎన్పీఎస్ వాత్సల్య
న్యూఢిల్లీ: ఎన్పీఎస్ వాత్సల్య పథకాన్ని లక్ష మంది పిల్లల పేరిట తెరిచినట్టు పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి మండలి (పీఎఫ్ఆర్డీఏ) వెల్లడించింది. గతేడాది సెప్టెంబర్‌లో ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది.దేశంలో పింఛను సదుపాయం ఉన్నవారు తక్కువగా ఉండడంతో ఈ పథకాన్ని మరింత మందికి చేరువ చేసేందుకు ఎన్నో చర్యలను అమలు చేస్తున్నట్టు పీఎఫ్ఆర్డీఏ చైర్పర్సన్ దీపక్ మహంతి తెలిపారు.‘అప్పుడే పుట్టిన శిశువులు సైతం ఎన్పీఎస్ను ఎంపిక చేసుకోవచ్చు. ఆర్ధిక మంత్రి గత సెప్టెంబర్‌లో ఈ పథకం ప్రారంభించిన నాటి నుంచి లక్ష మందికి పైగా శిశువులు ఎంపిక చేసుకున్నందుకు సంతోషంగా ఉంది’’అని చెప్పారు. ఎన్పీఎస్ వాత్సల్యలో 18 ఏళ్లు నిండని వారంతా చేరొచ్చు. పీఎఫ్ఆర్డీఏ నిర్వహించే అన్ని పింఛను పథకాల కింద (ఎన్పీఎస్, ఏపీఎస్) 7 కోట్ల మంది చందాదారులు ఉన్నట్టు మహంతి తెలిపారు. -
వివో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్: ధర కూడా తక్కువే!
న్యూఢిల్లీ: హ్యాండ్సెట్స్ దిగ్గజం వివో (Vivo) తాజాగా టీ4 సిరీస్‌లో తొలి స్మార్ట్‌ఫోన్ - టీ4ఎక్స్ 5జీని ప్రవేశపెట్టింది. దీని ధర రూ.13,999 నుంచి రూ. 16,999 వరకు ఉంటుంది. మార్చ్ 12 నుంచి ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఈ-స్టోర్, ఇతర రిటైల్ స్టోర్స్‌లో లభిస్తుందని కంపెనీ తెలిపింది.హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్‌ల కస్టమర్లు రూ.1,000 డిస్కౌంట్ పొందవచ్చని పేర్కొంది. ఇందులో 6500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫన్‌టచ్ ఓఎస్ 15, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్, 50 ఎంపీ ఏఐ కెమెరా, మిలిటరీ గ్రేడ్ ప్రమాణాలు మొదలైన ప్రత్యేకతలు ఉన్నట్లు కంపెనీ తెలిపింది. -
కొత్త నాయిస్ మాస్టర్ బడ్స్: దీని స్పెషాలిటీ ఏంటంటే..
ఇయర్ బడ్స్ వినియోగం పెరిగిపోతున్న తరుణంలో.. నాయిస్ (Noice) కొత్త 'మాస్టర్ బడ్స్' (Master Buds) ప్రారంభించింది. ఇది సౌండ్ బై బోస్ టెక్నాలజీ కలిగిన వైర్లెస్ ఇయర్ బడ్.మాస్టర్ సిరీస్‌లోని మొదటి ఉత్పత్తి అయితే ఈ ఇయర్ బడ్స్ అద్భుతమైన పనితీరును అందిస్తుంది. దీని డిజైన్.. ఇప్పటి వరకు మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇయర్ బడ్స్ కంటే భిన్నంగా ఉంది. డ్యూయల్ డివైస్ కనెక్టివిటీ, గూగుల్ ఫాస్ట్ పెయిరింగ్ వంటి ఫీచర్స్ కలిగిన ఈ మాస్టర్ బడ్స్ మంచి లిజనింగ్ అనుభూతిని అందిస్తుంది.నాయిస్ మాస్టర్ బడ్స్ స్పేషియల్ ఆడియో సపోర్ట్‌ను కలిగి ఉంటాయి. పీక్, టైటానియం వంటి అత్యుత్తమ మెటీరియల్‌లతో తయారైన ఈ బడ్స్.. 12.4 మిమీ డ్రైవర్లతో అమర్చబడి ఉంటాయి. హై-డెఫినిషన్ ఆడియోను మరింత పెంచడానికి, ఇయర్‌బడ్‌లు ఎల్హెచ్డీసీ (లో లేటెన్సీ హై డెఫినిషన్ ఆడియో కోడెక్) మద్దతుతో వస్తాయి.సౌండ్ బై బోస్ టెక్నాలజీతో, నాయిస్ మాస్టర్ బడ్స్ అన్ని ఫ్రీక్వెన్సీలలో.. మంచి ఆడియోను అందించేలా తయారైంది. అంతే కాకుండా 49 డెసిబుల్స్ వరకు సౌండ్ ఐసోలేషన్‌ను అందించే నాయిస్ క్యాన్సిలేషన్‌ను పొందుతాయి. మ్యూజిక్, కాల్స్ వంటివి చాలా క్లారిటీగా వినిపిస్తాయి.ఇదీ చదవండి: రెండు లక్షలమంది కొన్న కారు: ఇప్పుడు కొత్త ఎడిషన్‌లో..సాఫ్ట్ టచ్ మెటీరియల్‌లతో తయారైన నాయిస్ మాస్టర్ ఇయర్‌బడ్స్.. చెవులపై ఒత్తిడిని కలిగించవు. ఇది మూడు పరిమాణాలలో అందుబాటులో ఉంటుంది. వీటిని మీరు జిమ్‌లో ఉన్నా, ఆఫీసులో ఉన్నా లేదా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నా రోజంతా ఉపయోగించవచ్చు. ఒక ఛార్జితో 40 గంటలు పనిచేసే దీని ధర రూ. 7999 కావడం గమనార్హం. -
నెలకు 10 రోజులు: టెక్ కంపెనీ కొత్త రూల్!
కరోనా తరువాత దాదాపు అన్ని కంపెనీలు.. వర్క్ ఫ్రమ్ విధానానికి మంగళం పాడాలని నిర్ణయించుకున్నాయి. దశల వారీగా ఈ విధానం తొలగించడానికి సిద్దమయ్యాయి. ఇందులో భాగంగానే ప్రముఖ టెక్ కంపెనీ ఇన్ఫోసిస్.. టెక్నాలజీ టీమ్, నెలలో కనీసం 10 రోజులు ఆఫీసు నుంచి పని చేయాలనే ఆదేశాలను జారీ చేసింది.ఎక్కువ మంది ఆఫీస్ నుంచే పనిచేయాలనే.. ఉద్దేశ్యంతో ఇన్ఫోసిస్ ఈ నిర్ణయం తీసుకుంది. మార్చి 10 నుంచి ఈ రూల్ అమలులోకి రానున్నట్లు తెలుస్తోంది. ప్రతి నెల.. ఆదరినీ ఆఫీసుకు రప్పించాలని, ఉద్యోగులకు అనుకూలంగా ఉండేలా.. కనీసం 10 రోజులు ఆఫీస్ నుంచి, మిగిలిన రోజులు ఇంటి నుంచి పనిచేసుకునే వెసులుబాటు కల్పించింది.ఈ విషయంపై ఇన్ఫోసిస్ అధికారికంగా స్పందించలేదు. అయితే సంస్థలో పనిచేస్తున్న 3.23 లక్షల కంటే ఎక్కువ మంది ఉద్యోగుల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి.. ఈ తరహా హైబ్రిడ్ సిస్టం ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: తగ్గిన బెంచ్ టైమ్.. ఐటీ ఉద్యోగులకు ఊరట!ఈ కొత్త రూల్ లెవల్ 5, అంతకేనట తక్కువ స్థాయి ఉద్యోగులకు వరిస్తుందని తెలుస్తోంది. ఇందులో టీమ్ లీడర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, సీనియర్ ఇంజనీర్లు, సిస్టమ్ ఇంజనీర్లు, కన్సల్టెంట్లు ఉన్నారు. ఎవరైనా 10 రోజులు ఆఫీసుకు రానట్లయితే.. లేదా ఒకటి, రెండు రోజులు తగ్గితే.. వాటిని ఉద్యోగి సెలవుల బ్యాలెన్స్ నుంచి తీసివేసే అవకాశం ఉంది. -
రెండు లక్షలమంది కొన్న కారు: ఇప్పుడు కొత్త ఎడిషన్‌లో..
భారతదేశంలో అతి తక్కువ కాలంలోనే అధిక ప్రజాదరణ పొందిన.. మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) కంపెనీకి చెందిన ''స్కార్పియో ఎన్'' అమ్మకాల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది. కంపెనీ 2,00,000 యూనిట్ల అమ్మకాలను సాధించింది. బిగ్ డాడీ ఆఫ్ ఎస్‌యూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సందర్భంగా సంస్థ స్కార్పియో-N కార్బన్ ఎడిషన్ లాంచ్ చేసింది. దీని ధరలు రూ. 19.19 లక్షల నుంచి రూ. 24.89 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి.మహీంద్రా స్కార్పియో ఎన్ కార్బన్ ఎడిషన్ పటిష్టమైన డిజైన్.. అప్డేటెడ్ ఫీచర్స్ కలిగిన మహీంద్రా స్కార్పియో ఎన్ ప్రీమియం లెథరెట్ సీట్లు, కాంట్రాస్ట్ డెకో-స్టిచింగ్‌తో.. స్మోక్డ్ క్రోమ్ ఫినిషింగ్ పొందుతుంది. డార్క్ ట్రీట్మెంట్, స్మోక్డ్ క్రోమ్ యాక్సెంట్లు, బ్లాక్ అల్లాయ్ వీల్స్, డార్క్ గాల్వానో ఫినిష్డ్ రూఫ్ రెయిల్స్ వంటివి దీనిని మరింత ఆకర్షణీయంగా చేస్తాయి. ఈ కొత్త ఎడిషన్ Z8, Z8L సెవెన్-సీటర్ వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది.స్కార్పియోదశాబ్దాల చరిత్ర కలిగిన మహీంద్రా స్కార్పియో.. ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందుతూనే ఉంది. ఇందులో భాగంగానే స్కార్పియో ఎన్ లాంచ్ అయింది. ఇప్పుడు స్కార్పియో ఎన్ కార్బన్ వేరియంట్ లాంచ్ అయింది.ఇదీ చదవండి: తగ్గిన బెంచ్ టైమ్.. ఐటీ ఉద్యోగులకు ఊరట!స్కార్పియో ఎన్ సేఫ్టీ విషయంలో 5 స్టార్ రేటింగ్ సాధించింది. మంచి డిజైన్, కొత్త ఫీచర్స్, లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల.. ఈ కారును చాలామంది కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఇప్పటికే రెండు లక్షల మంది ఈ కారును కొనుగోలు చేసారంటే.. దీనికున్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు..
స్వల్ప లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ 609.87 పాయింట్లు లేదా 0.83 శాతం లాభంతో.. 74,340.09 వద్ద, నిఫ్టీ 207.40 పాయింట్లు లేదా 0.93 శాతం లాభంతో 22,544.70 వద్ద నిలిచాయి.క్యాపిటల్ ట్రస్ట్, కోహినూర్ ఫుడ్స్, సోమి కన్వేయర్ బెల్టింగ్స్, కిర్లోస్కర్ ఎలక్ట్రిక్ కో, లాంకోర్ హోల్డింగ్స్ వంటి కంపెనీలు లాభాల జాబితాలో చేరాయి. లాంకోర్ హోల్డింగ్స్, బీబీ ట్రిపుల్వాల్ కంటైనర్స్, ఫుడ్ అండ్ ఇన్స్, శ్రీరామ న్యూస్ ప్రింట్, ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ వంటి సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మీడియా దిగ్గజం కీలక నిర్ణయం: 1100 మందిపై వేటు..
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు చెందిన వయాకామ్18.. ది వాల్ట్ డిస్నీ కో. ఇండియా యూనిట్ మధ్య కొత్తగా ఏర్పడిన జాయింట్ వెంచర్ విలీనం తర్వాత 'జియోస్టార్' (Jiostar) ఉద్యోగులను తొలగించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే తొలగింపులు ప్రక్రియ మొదలైనట్లు.. లేఆప్స్ జూన్ వరకు కొనసాగుతాయని చెబుతున్నారు.జియోస్టార్ లేఆప్స్ ప్రభావం సుమారు 1100 మంది ఉద్యోగులపై ప్రభావం చూపుతుంది. ఇందులో ఎంట్రీ లెవల్ ఉద్యోగులు, సీనియర్ మేనేజర్లు, సీనియర్ డైరెక్టర్లు, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్లు ఉన్నారు.అయితే.. ఛాంపియన్స్ ట్రోఫీ, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వంటి అనేక హై-ప్రొఫైల్ టోర్నమెంట్ల ప్రసారాన్ని నిర్వహిస్తున్నందున, మీడియా దిగ్గజం క్రీడా విభాగంలో పనిచేసే ఉద్యోగులపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలుస్తోంది.ఐపీఎల్ 2025 సమయంలో భారీ లాభాలను చవిచూడటమే లక్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే.. ఉద్యోగుల సంఖ్యను తగ్గించడానికి పూనుకుంది. లేఆప్స్ ప్రభావానికి గురైన ఉద్యోగులకు.. వారి పదవీకాలాన్ని బట్టి 6-12 నెలల జీతంతో సహా ఇతర ప్యాకేజీలను అందించనున్నట్లు సమాచారం.జియోస్టార్ నవంబర్ 2024లో రిలయన్స్ నేతృత్వంలోని వయాకామ్18, స్టార్ ఇండియా మధ్య జాయింట్ వెంచర్‌గా ఏర్పడింది. దీంతో 8.5 బిలియన్ డాలర్ల మీడియా దిగ్గజం అవతరించింది. ప్రస్తుతం ఇది నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి స్ట్రీమింగ్ దిగ్గజాలను ప్రత్యర్థిగా ఉంది. -
ఐటీలో మారిన పరిస్థితులు: తగ్గిన బెంచ్ టైమ్..
ఐటీ కంపెనీలు ఎప్పటికప్పుడు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ.. ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవడానికి కూడా ప్రయత్నించేవి. అయితే ఇప్పుడు ఐటీ రంగంలో కీలక మార్పులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే.. పలు టెక్ కంపెనీలు బెంచ్ టైమ్, నెంబర్ తగ్గిస్తున్నట్లు వెల్లడించాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఐటీ కంపెనీలలో ప్రాజెక్టులు కేటాయించని ఉద్యోగులను 'బెంచింగ్' అంటారు. వీరిని సంస్థలు బ్యాకప్ మాదిరిగా ఉపయోగించుకుంటాయి. వీరు ఎక్కువ రోజులు బెంచింగ్ మీద ఉంటే.. వారు లేఆఫ్స్‌కు దగ్గర ఉన్నట్లు. నిజానికి కొత్తగా ఉద్యోగంలో చేరినవారిని కొంతకాలం బెంచ్‌పై కూర్చోబెడతారు. కొన్ని సార్లు అనుభవజ్ఞులైన ఉద్యోగులు కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది.ఏడాదిన్నర కాలంగా బెంచ్ సమయం మారుతోంది. 2020-21 ఆర్ధిక సంవత్సరంలో బెంచ్ టైమ్ 45 నుంచి 60 రోజులు ఉండేది. దీనిని ప్రస్తుతం 35 నుంచి 45 రోజులకు తగ్గించారు. దీంతో బెంచ్‌పై ఉన్న ఉద్యోగుల సంఖ్య, సమయం రెండూ తగ్గాయి. ఇది ఐటీ ఉద్యోగులకు పెద్ద ఊరట అనే చెప్పాలి.భారతదేశంలో ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, అసెంచర్, హెచ్‌సీఎల్ వంటి దిగ్గజ కంపెనీలు.. బెంచ్‌పై ఉన్న ఉద్యోగుల సంఖ్యను, బెంచ్‌పై ఉండే సమయాన్ని తగ్గించాయి. దీనికి కారణం గత కొన్ని రోజులుగా కొత్త ఉద్యోగులను తీసుకోకపోవడమే అని తెలుస్తోంది. కరోనా తరువాత లెక్కకు మించిన ప్రాజెక్టులు లభిస్తున్నాయి. దీంతో ఐటీ కంపెనీలోని ఉద్యోగులకు చేతి నిండా పని దొరుకుతోంది. కొన్ని కంపెనీలు ఉద్యోగ నియామకాలను కూడా చేపట్టాయి.ఇదీ చదవండి: మీడియా దిగ్గజం కీలక నిర్ణయం.. 1100 మందిపై వేటు..రెండేళ్లకు ముందు బెంచ్ ఉద్యోగులు 10 నుంచి 15 శాతం ఉండేది. ఇప్పుడు ఈ శాతం 2 నుంచి 5 శాతానికి చేరింది. ఒకప్పుడు ఫ్రెషర్స్ మాత్రమే బెంచ్‌పై ఉండేవాళ్ళు. ఇప్పుడు కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్‌కి సంబంధించిన ప్రత్యేక నైపుణ్యాలకు డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల.. ప్రస్తుతం, తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాల అనుభవం ఉన్న ఉద్యోగులు కూడా బెంచ్ లేఆఫ్‌ల ప్రమాదంలో ఉన్నారు. వీరందరూ కొత్త టెక్నాలజీలను తప్పకుండా నేర్చుకోవాల్సిందే. లేకుంటే ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుంది. -
EPFO: క్షణాల్లో ఈపీఎఫ్‌వో విత్‌డ్రా
ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)ఖాతాదారులకు శుభవార్త. ఇప్పటికే ఉద్యోగుల సౌలభ్యం కోసం ఈపీఫ్ఓవో సంస్థ ఈపీఎఫ్‌వో అకౌంట్లలో పలు కీలక మార్పులు చేపట్టింది. ఈపీఎఫ్‌వో క్లయిమ్, వివరాలను చేర్చడం, తొలగించడం, ఎగ్జిట్ అవ్వడాన్ని సులభతరం చేసింది.తాజాగా, ఉద్యోగుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఫోన్‌పే,గూగుల్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్‌ల ద్వారా ఈపీఎఫ్‌వో విత్ర్ డ్రా చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తేనున్నట్లు తెలుస్తోంది వెలుగులోకి వచ్చిన నివేదికల ప్రకారం.. ప్రస్తుతం ఈపీఎఫ్‌వో సంస్థ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)తో కలిసి ఈ సౌకర్యాన్ని ప్రారంభించేందుకు చర్చలు జరుపుతుంది. సాధ్యసాధ్యాలను బట్టి సౌకర్యాన్ని ఈ ఏడాది మే, లేదా జూన్ నాటికి ప్రారంభించే యోచనలో ఈపీఎఫ్‌వో ఉందని వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. దీంతో పాటు ఈపీఎఫ్‌వో3.0లో ఏటీఎం ద్వారా ఈపీఎఫ్‌వో విత్‌డ్రా చేసుకునే వెసులు బాటు ఈ ఏడాది జూన్ నుంచి ప్రారంభించనున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు.ఉద్యోగులకు లభించే ప్రయోజనాలుయూపీఐ ద్వారా ఈపీఎఫ్‌వో విత్ డ్రా వల్ల ఉద్యోగలకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా అత్యవసర సమయాల్లో డబ్బుల్ని తక్షణమే పొందవచ్చు. పారదర్శకతతో పాటు ఈపీవోఎఫ్వో విత్ డ్రా ప్రక్రియ మరింత సజావుగా జరగనుంది.ఈపీఎఫ్‌వో 3.0 ప్రారంభంఈపీఎఫ్వో 3.0 అమల్లోకి వస్తే, సభ్యులు తమ పొదుపులను సాధారణ బ్యాంకు అకౌంట్ల నుంచి డబ్బులను ఉపసంహరించుకోవడం మరింత సులభం అవుతుంది. -
వస్త్ర రంగం అభివృద్ధికి ‘జీటీటీఈఎస్ 2025’లో చర్చలు
భారతదేశంలోని టెక్స్టైల్ పరిశ్రమ ఎదుర్కొంటున్న పర్యావరణ సవాళ్లను పరిష్కరిస్తూ రీసైక్లింగ్, సుస్థిర పద్ధతులపై ఇటీవల చర్చ జరిగింది. ముంబైలోని బాంబే ఎగ్జిబిషన్ సెంటర్లో 2025 ఫిబ్రవరి 21 నుంచి 23 వరకు జరిగిన గ్లోబల్ టెక్స్టైల్ టెక్నాలజీ అండ్ ఇంజినీరింగ్ ఎగ్జిబిషన్ (జీటీటీఈఎస్ 2025) వస్త్ర పరిశ్రమకు కీలకంగా మారింది. ఇండియా ఇంటర్నేషనల్ టెక్స్టైల్ మెషినరీ ఎగ్జిబిషన్స్ సొసైటీ (ఐటీఎంఈ సొసైటీ) నిర్వహించిన ఈ మూడు రోజుల కార్యక్రమంలో టెక్స్టైల్ టెక్నాలజీలో పురోగతిని ప్రదర్శించేందుకు, అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశ్రమ వర్గాలు, ఆవిష్కర్తలు, వాటాదారులు ఒకచోట చేరారు.జీటీటీఈఎస్ 2025 ముఖ్యాంశాలుభారత టెక్స్టైల్ కమిషనర్ రూప్రాశి మహాపాత్ర, దక్షిణాఫ్రికా, బెలారస్, బుర్కినా ఫాసో వంటి దేశాలకు చెందిన అంతర్జాతీయ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రెండో రోజున సెషన్‌ను ప్రారంభించిన అనంతరం ఐటీఎంఈ సొసైటీ ఛైర్మన్, స్టీరింగ్ కమిటీ మెంబర్ కేతన్ సంఘ్వీ మాట్లాడారు. ఛత్తీస్‌గఢ్ కొత్త పారిశ్రామిక అభివృద్ధి విధానం 2024-2030ను ప్రారంభించిందన్నారు. అభివృద్ధి చెందుతున్న పర్యావరణ వ్యవస్థను ప్రభావితం చేయడంలో ఈ వేదిక కీలకంగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. టెక్నాలజీ ఇన్నోవేషన్‌తోపాటు వ్యూహాత్మక అభివృద్ధికి ఇది కీలకంగా మారుతుందని చెప్పారు. టెక్స్టైల్ రంగం పురోగతికి ఈ కార్యక్రమం దిశానిర్దేశం చేస్తుందని తెలిపారు.ఛతీస్‌గఢ్ రాష్ట్ర పారిశామిక కార్పొరేషన్ అభివృద్ధి సభ్యులు, అదనపు డైరెక్టర్ ప్రవీణ్ శుక్లా మాట్లాడుతూ..రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వస్త్ర రంగం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. 24 ఏళ్లల్లో ఎగుమతులు 35.9 బిలియన్ డాలర్ల(సుమారు రూ.2.97 లక్షల కోట్లు)కు చేరుకున్నాయని చెప్పారు. ఇది దేశ జీడీపీలో 2.3 శాతానికి సమానమని తెలిపారు. జాతీయ ఎగుమతులకు ఈ పరిశ్రమ 10.5 శాతం దోహదం చేస్తుందన్నారు. రాష్ట్రంలోని జాంగీర్చంపాలో నెలకొల్పే వస్త్ర పరిశ్రమతో భవిష్యత్తులో ఛతీస్‌గఢ్ వస్త్ర కేంద్రంగా మారనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 25,000 కంటే ఎక్కువ ఎంఎస్ఎంఈలు, 1,400 కంటే ఎక్కువ నమోదిత సార్టప్‌లతో రాష్ట్ర వ్యవస్థాపక పర్యావరణ వ్యవస్థ అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు.ఆసియా అరబ్ చాంబర్ ఆఫ్ కామర్స్ హానరీ ట్రేడ్ కమిషనర్ మురుజా షబ్బీర్ అర్సీవాలా మాటాడుతూ..‘మేము ఆసియా ప్రాంతం, మిడిల్ ఈస్ట్ దేశాల్లో చాలా వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నాం. ఇప్పటివరకు దైపాక్షిక వాణిజ్యం, దిగుమతి-ఎగుమతులు పెంచడంలో, పెట్టుబడుల పరంగా రెండు వైపులా ఉన్న కంపెనీలకు సాయం అందించడంలో విజయం సాధించాం. వస్త్ర రంగంలో పనిచేయడంతోపాటు ప్రపంచ పర్యటనలో భాగంగా ఏ ప్రాంతాన్ని సందర్శించినా హాస్పిటాలిటీ రంగం రంగం మా అజెండాలో భాగంగా ఉంటుంది. ఆయా సంస్థలతో కలిసి పనిచేయడానికి ఉత్సాహంగా ఉన్నాం’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఎస్ఐడీస్ పర్సనల్ కన్సలెంట్ పురోహిత్, గురత్ భాటియా, ఐటీఎంఈ ట్రెజరర్స్ ఆఫ్ ఇండియా సెంతిల్ కుమార్ తదితరులు ఉన్నారు.ఇదీ చదవండి: 100 గిగావాట్ల అణువిద్యుత్‌కు రోడ్ మ్యాప్జీటీటీఈఎస్ 2025లో 39 దేశాలకు చెందిన 210 మంది ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం నెట్ వర్కింగ్, నాలెడ్జ్ ఎక్స్ఛేంజ్, వ్యాపార సహకారాలకు కేంద్రంగా పనిచేసింది. స్పిన్నింగ్, వీవింగ్, డైయింగ్, డిజిటల్ ప్రింటింగ్, టెక్స్టైల్ రీసైక్లింగ్‌లో పురోగతితో సహా అత్యాధునిక యంత్రాలు, సాంకేతికతలను ఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు. పరిశ్రమ ఎదుర్కొంటున్న పర్యావరణ సవాళ్లను పరిష్కరించే ప్రయత్నం చేస్తూ టెక్స్ టైల్ రీసైక్లింగ్, సుస్థిర పద్ధతులను ఈ కార్యక్రమంలో హైలైట్ చేశారు. ఎక్స్‌క్లూజివ్ బీ2బీ(బిజినెస్ టు బిజినెస్) సమావేశాలు, ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ వాటాదారుల జాయింట్ వెంచర్లు, వాణిజ్య సహకారాలు, సాంకేతిక పరిజ్ఞాన బదిలీలను అన్వేషించడానికి ఈ కార్యక్రమం వేదికగా నిలిచింది. ప్రపంచ టెక్స్టైల్ మెషినరీ మార్కెట్‌ను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఇందులో చర్చలు జరిగాయి. -
పరుగు ఆపిన పసిడి! మళ్లీ అవకాశం రాదేమో..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో(Gold Rate) మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధర గురువారం కొంత తగ్గి కొనుగోలుదారులకు ఊరట కల్పించింది. దాంతో ఈ పెళ్లిళ్ల సీజన్లో ఇప్పుడే బంగారం కొనాలని కొందరు సూచిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో గురువారం రోజున గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.80,200 (22 క్యారెట్స్), రూ.87,490 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. బుధవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.450, రూ.490 తగ్గింది.చెన్నైలో గురువారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.450, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.490 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.80,200 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.87,490 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.ఇదీ చదవండి: 100 గిగావాట్ల అణువిద్యుత్‌కు రోడ్ మ్యాప్దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.450 తగ్గి రూ.80,350కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.490 తగ్గి రూ.87,640 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరలు గురువారం తగ్గినా వెండి ధరలు మాత్రం అందుకు విరుద్ధంగా పెరిగాయి. నిన్నటితో పోలిస్తే గురువారం వెండి ధరలు(Sliver Rate) స్పల్పంగా పెంజుకున్నాయి. దాంతో కేజీ వెండి రేటు రూ.1,000 పెరిగి రూ.1,08,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
100 గిగావాట్ల అణువిద్యుత్‌కు రోడ్ మ్యాప్
భారత్ 100 గిగావాట్ల అణువిద్యుత్ సామర్థ్యం లక్ష్యాన్ని సాధించడానికి న్యూక్లియర్ ఎనర్జీ మిషన్(Nuclear Energy Mission) ద్వారా సమగ్ర రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేస్తోంది. 2070 నాటికి నికర జీరో కర్బన ఉద్గారాలను సాధించాలనే దీర్ఘకాలిక లక్ష్యానికి అనుగుణంగా ఈ చర్యలకు పూనుకుంది. దేశీయంగా పెరుగుతున్న ఇంధన డిమాండ్లను పరిష్కరించడానికి మార్చి చివరి నాటికి న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ ద్వారా సమగ్ర రోడ్ మ్యాప్‌ను అధికారికంగా వెల్లడిస్తారని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ ఏర్పాటుఅణుశక్తి విభాగం, విద్యుత్ మంత్రిత్వ శాఖ అధికారులు, ఇతర కీలక భాగస్వాములతో కూడిన ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ ఈ రోడ్ మ్యాప్‌ను రూపొందిస్తోంది. భారత్ అణుశక్తి సామర్థ్యాన్ని పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించే బాధ్యతను ఈ కమిటీకి అప్పగించారు. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ల (SMR-చిన్న అణువిద్యుత్ కేంద్రాలు) అభివృద్ధి, దేశీయ, అంతర్జాతీయ భాగస్వాములతో జాయింట్ వెంచర్లను ప్రోత్సహించడం ఇందులో ప్రధానాంశాలుగా ఉండనున్నాయి. ఎస్ఎంఆర్లను అధిక విద్యుత్ డిమాండ్ ఉన్న మారుమూల ప్రాంతాలు, పారిశ్రామిక మండలాల్లో సులువుగా ఏర్పాటు చేయవచ్చు. ఇది భారతదేశ ఇంధన అవసరాలకు సరళమైన, సమర్థవంతమైన పరిష్కారాన్ని అందిస్తుంది. 2033 నాటికి కనీసం ఐదు స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఎస్ఎంఆర్లను అమలు చేసేందుకు పరిశోధన, అభివృద్ధి(ఆర్అండ్డీ)కి ప్రభుత్వం రూ.20,000 కోట్లు కేటాయించింది.ఇంధన డిమాండ్‌కు పరిష్కారం..పట్టణీకరణ వేగంగా విస్తరించడం, పారిశ్రామిక వృద్ధి, డిజిటల్ ఎకానమీ కారణంగా 2047 నాటికి భారత విద్యుత్ డిమాండ్ నాలుగైదు రెట్లు పెరుగుతుందని అంచనా. సౌర, పవన విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన వనరులు విస్తరిస్తున్నప్పటికీ అవి మాత్రమే మొత్తం విద్యుత్ అవసరాలను తీర్చలేవు. కర్బన ఉద్గారాలను తగ్గించాలనే లక్ష్యాలు ఉండడంతో థర్మల్ పవర్‌ను క్రమంగా తగ్గించాలనే ప్రతిపాదనలున్నాయి. అందుకు ప్రత్యామ్నాయంగా అణుశక్తి ఈ అంతరాన్ని పూడ్చడంలో కీలక పాత్ర పోషించనుంది.ఇదీ చదవండి: భారత్‌లో టెస్లా తొలి షోరూమ్.. ఎక్కడంటే..ఇంధన సామర్థ్యాన్ని పెంచేందుకు జాయింట్ వెంచర్లను కూడా ఏర్పాటు చేయాలని ఈ రోడ్ మ్యాప్ నొక్కి చెప్పే అవకాశం ఉంది. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్పీసీఐఎల్) వంటి ప్రభుత్వ రంగ సంస్థలు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడులను తీసుకురావడానికి ప్రైవేటు సంస్థలు, అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేయాలని భావిస్తున్నాయి. ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని పెంచేందుకు వీలుగా అణుశక్తి చట్టం, సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ చట్టానికి చట్టపరమైన సవరణలు చేయాలని అధికారులు భావిస్తున్నారు.సుస్థిరత దిశగా అడుగులుప్రభుత్వం చేపడుతున్న ఈ చర్యలు కేవలం ఇంధన డిమాండ్లను తీర్చడం మాత్రమే కాదు.. భారతదేశం సుస్థిరత లక్ష్యాలకు మూలస్తంభంగా నిలువనున్నాయి. అణు ఇంధన తయారీ ఏర్పాట్లను విస్తరించడం ద్వారా శిలాజ ఇంధనాలపై ఆధారపడడం తగ్గించవచ్చు. గ్రీన్ హౌస్ ఉద్గారాలను నియంత్రించవచ్చు. భవిష్యత్ తరాలకు ఇంధన భద్రతను కల్పించవచ్చు. పెరుగుతున్న డిమాండ్‌కు సరిపడా ఇంధన అవరాలను తీర్చుకోవచ్చు. -
బుల్ జోష్.. లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఉదయం 9:25 సమయానికి నిఫ్టీ(Nifty) 48 పాయింట్లు ఎగబాకి 22,378కు చేరింది. సెన్సెక్స్(Sensex) 124 పాయింట్లు పెరిగి 73,856 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 104.3 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 69.72 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.32 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 1.12 శాతం లాభపడింది. నాస్డాక్ 1.46 శాతం ఎగబాకింది.బుల్.. బౌన్స్‌బ్యాక్!దేశీ స్టాక్ మార్కెట్లలో ఇటీవల నెలకొన్న ట్రెండ్‌కు పూర్తి విరుద్ధంగా ఇన్వెస్టర్లు భారీ కొనుగోళ్లకు తెరతీశారు. దీంతో మార్కెట్ సూచీలు పెరుగుతున్నాయి. ట్రంప్ ప్రభుత్వం టారిఫ్‌లపై వెనక్కి తగ్గవచ్చన్న అంచనాలు సెంటిమెంటుకు జోష్‌నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. సానుకూల ప్రపంచ మార్కెట్లు, ఫిబ్రవరిలో పుంజుకున్న సేవల రంగం, షార్ట్ కవరింగ్ లావాదేవీలు ఇందుకు సహకరించినట్లు విశ్లేషకులు తెలియజేశారు.ఇదీ చదవండి: భారత్‌లో టెస్లా తొలి షోరూమ్.. ఎక్కడంటే..రూపాయి.. జోరు!మార్కెట్ల దన్నుతో దేశీ కరెన్సీ సైతం బలపడింది. డాలరుతో మారకంలో రూపాయి 13 పైసలు పుంజుకుంది. 87.06 వద్ద నిలిచింది. డాలరుతోపాటు ముడిచమురు ధరలు బలహీనపడటం రూపాయికి దన్నునిచ్చినట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి. యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ టారిఫ్‌లకు వ్యతిరేకంగా చైనా తదితర దేశాలు సైతం సుంకాల విధింపునకు తెరతీయడంతో డాలరు వెనకడుగు వేసినట్లు తెలిపారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
భారత్‌లో టెస్లా తొలి షోరూమ్.. ఎక్కడంటే..
ఎలక్ట్రిక్ కార్ల యూఎస్ దిగ్గజం టెస్లా(Tesla) భారత్‌లో తొలి షోరూమ్‌ను ముంబైలో ఏర్పాటు చేయనుంది. ఇందుకు వీలుగా బాంద్రా కుర్లా కాంప్లెక్స్(బీకేసీ) బిజినెస్ డిస్ట్రిక్ట్‌లో 4,000 చదరపు అడుగుల స్పేస్‌ను లీజుకి తీసుకుంది. సీఆర్ఈ మ్యాట్రిక్స్ వివరాల ప్రకారం పార్కింగ్ సౌకర్యాలుగల షోరూమ్ స్పేస్‌కుగాను కంపెనీ ప్రమోటర్, బిలియనీర్ ఎలాన్ మస్క్ నెలకు రూ.35 లక్షల అద్దె చెల్లించనున్నారు. అద్దె ఏడాదికి 5 శాతం పెంపు ప్రాతిపదికన ఐదేళ్ల కాలానికి యూనివ్‌కో ప్రాపర్టీస్ నుంచి లీజుకి తీసుకుంది. ఈ ప్రాపర్టీ గ్రౌండ్ ఫ్లోర్ దేశీయంగా ఏర్పాటైన తొలి యాపిల్ స్టోర్‌కు దగ్గరగా ఉంటుంది. రెంటల్ అగ్రిమెంట్ ఫిబ్రవరి 27న రిజిస్టరైంది. రూ.2.11 కోట్లు సెక్యూరిటీ డిపాజిట్‌గా టెస్లా జమ చేసింది.ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) భారతదేశానికి టెస్లా కార్లను తీసుకురానున్నట్లు గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. టెస్లా (Tesla) కార్లు దేశీయ విపణిలో అడుగుపెడితే.. వాటి ధరలు ఎలా ఉంటాయనే వివరాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే విదేశీ కంపెనీలపై దిగుమతి సుంకాలను విధించడం సర్వసాధారణం. ప్రస్తుత అనిశ్చితుల కారణంగా టెస్లా కంపెనీపై దిగుమతి సుంకాన్ని 20 శాతం తగ్గిస్తే కార్ల ధరలు తగ్గుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ధరలు తగ్గిన తరువాత కూడా టెస్లా కారు ధర రూ.35 లక్షల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుందని ఇటీవల గ్లోబల్ క్యాపిటల్ మార్కెట్ కంపెనీ సీఎల్ఎస్ఏ తన నివేదికలో వెల్లడించింది.ఇదీ చదవండి: ఈ ఏడాదే భారత్‌లోకి చిన్న ఎలక్ట్రిక్ ఎస్యూవీప్రస్తుతం అమెరికాలో టెస్లా చౌకైన కారు ‘మోడల్ 3’ ధర ఫ్యాక్టరీ స్థాయిలో దాదాపు 35,000 డాలర్లు (సుమారు రూ.30.4 లక్షలు). భారతదేశంలో దిగుమతి సుంకాలను 15-20 శాతానికి తగ్గించడంతో పాటు, రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ వంటి అదనపు ఖర్చులతో, ఆన్-రోడ్ ధర 40,000 డాలర్లు లేదా దాదాపు రూ.35-40 లక్షలుగా ఉంటుందని అంచనా. మహీంద్రా XEV 9e, హ్యుందాయ్ ఈ-క్రెటా, మారుతి సుజుకి ఈ-విటారా వంటి దేశీయ ఎలక్ట్రిక్ వెహికల్స్ కంటే టెస్లా మోడల్ 3 ధర 20-50 శాతం ఎక్కువగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ ధరపై ఇంకా కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు.