Family
-
గరిమెళ్ల గళంలో అన్నమయ్య అమృతం
ఆచార్య తాడేపల్లి పతంజలికొందరు జీవించి ఉన్నప్పుడే తాము ఎంచుకున్న క్షేత్రంలో అంకితభావంతో కృషిచేసి ప్రసిద్ధులవుతారు. శరీరాన్ని విడిచి పెట్టిన తర్వాత ఈ లోకానికి సిద్ధ పురుషులుగా మిగిలిపోతారు. అటువంటి వారిలో శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ ఒకరు.‘పుడమి నిందరి బట్టె భూతము కడుబొడవైన నల్లని భూతము‘ అని అన్నమయ్య వేంకటేశుని గురించి వర్ణిస్తాడు. ఆ అన్నమయ్య కీర్తనల భూతం ఎప్పటినుంచో సంగీత సాహిత్య ప్రపంచంలో చాలా మందిని పట్టుకొని వదలటం లేదు.అటువంటి అన్నమయ్య వేంకటేశుని భూతము పట్టినవారిలో గరిమెళ్ళ ఒకరు. తన మనసుని పట్టుకున్న అన్నమయ్య కీర్తనకి అద్భుతమైన తన గాత్ర రాగ చందనాన్ని అద్ది సంగీత సాహిత్య ప్రియుల హృదయాలలో పట్టుకునేటట్లు కలకాలం నిలిచి ఉండేటట్లు చేసారు. ఒకటా రెండా... వందల కొలది అన్నమయ్య కీర్తనలు గరిమెళ్ళ వారి స్వరరచనలో విరబూసిన వాడిపోని కమలాలుగా, సౌగంధికా పుష్పాలుగా నేటికీ విరబూస్తున్నాయి. భావ పరిమళాలు వెదజల్లుతున్నాయి.ఒక గొప్ప రహస్యంఎందరు గాయకులు పాడుతున్నప్పటికీ ప్రత్యేకంగా శ్రీ గరిమెళ్ళ అన్నమయ్య కీర్తన ఇంతగా ప్రచారం కావడం వెనుక ఒక గొప్ప రహస్యం ఏమిటంటే, అన్నమయ్య మానసిక స్థాయికి తాను వెళ్లి, రసానుభూతితో పాడారు కనుకనే గరిమెళ్ళ వారి అన్నమయ్య కీర్తన సప్తగిరులలోను, లోకంలోను ప్రతిధ్వనిస్తున్నది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయకులయిన గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ నడుస్తూనే ఈ లోకం నుంచి సెలవు తీసుకొన్నారు. బహుశా ఆ సమయంలో కూడా అన్నమయ్య కీర్తన ఏదో ఆయన మనస్సులో ప్రస్థానం సాగించే ఉంటుంది. అనుమానం లేదు.సంగీత ప్రస్థానంశ్రీ గరిమెళ్ళ సంగీత ప్రస్థానం చాలా విచిత్రంగా సాగింది. మొదట్లో సినిమా పాటలు పాడేవారు. తర్వాత లలిత సంగీతం, ఆ తర్వాత శాస్త్రీయ సంగీతం ఆయనను తన అక్కున చేర్చుకుంది. తన పినతల్లి అయిన ప్రముఖ సినీ నేపథ్యగాయని ఎస్. జానకి గారి ఇంట్లో ఆరు నెలల పాటు ఉండి ఆమెతో కలిసి రికార్డింగ్లకి వెళ్లేవారు. జానకి గారు గరిమెళ్ళ వారిని ఎంతోప్రోత్సహించారు. బాలకృష్ణ ప్రసాద్ మొదట్లో చిన్న చిన్న కచేరీల్లో మృదంగం వాయించేవారు. తన 16వ ఏట చలనచిత్ర గీతాలతో పాటు భక్తి పాటలు కలిపి మొదటి కచేరీ చేసారు. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా చేసిన కచేరీలు, శబ్దముద్రణలు (రికార్డింగ్‌లు లెక్కకు అందనివి.కొత్త పద్ధతిసాధారణంగా ఎవరైనా ఒకే వేదిక నుంచి ఒకరోజు సంకీర్తన యజ్ఞం చేస్తారు కానీ బాలకృష్ణ ప్రసాద్ ఒక వారం రోజులపాటు ఒకేవేదిక నుంచి సంకీర్తన యజ్ఞం చేసి ఒక కొత్త పద్ధతినిప్రారంభించారు. టెలివిజన్ మాధ్యమాల ద్వారా అనేక మందికి సంగీతపు పాఠాలు నేర్పించారు.నేదునూరి నోట – అన్నమయ్య మాటఅప్పట్లో ప్రసిద్ధమయిన ఆకాశవాణి భక్తి రంజనిలో బాలకృష్ణ ప్రసాద్ ని పాడటానికి సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి ఆహ్వానించారు. పోంగిపోయారు బాలకృష్ణ ప్రసాద్. గరిమెళ్ళ గానానికి సంతోషించిన నేదునూరి తిరుపతి అన్నమాచార్యప్రాజెక్టులో చేరమని సలహా ఇచ్చారు. అలా అన్నమయ్య కు వేంకటేశునికి బాలకృష్ణ ప్రసాద్ దగ్గరయ్యారు. అన్నమాచార్యప్రాజెక్టుకు బాలకృష్ణప్రసాద్ అందించిన సేవలు సాటిలేనివి. పురస్కారాలురాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నుంచి 2023 ఫిబ్రవరి 23న కేంద్ర సంగీత, నాటక అకాడమీ అవార్డు, శ్రీపోట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు ఇలా కోకొల్లలు. అన్నమాచార్య సంకీర్తన సంపుటి, అన్నమయ్య నృసింహ సంకీర్తనం వంటి పుస్తకాలు తెలుగు, తమిళ భాషల్లో ఆయన ప్రచురించారు. గరిమెళ్ళపై ముగ్గురు పీహెచ్డీ విద్యార్థులు పరిశోధన గ్రంథాలు సమర్పించారు.శివపదం కూడా...గరిమెళ్ళ ఎంతటి అన్నమయ్య వేంకటేశ భక్తులో అంతగా శివభక్తులు కూడా. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ శివునిపై రచించిన సాహిత్యానికి, గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్ మృదుమధురంగా స్వరపరిచి పాడారు. ‘‘అడుగు కలిపెను’’,’’ఐదు మోములతోడ’’, ‘‘అమృతేశ్వరాయ’’ వంటి కీర్తనలు ఎంతో ప్రసిద్ధి పోందాయి. ‘చూపు లోపల త్రిప్పి చూచినది లేదు, యాగ విధులను నిన్ను అర్చించినది లేదు‘ అంటూ ఒక శివ పద కీర్తనలో బాల కృష్ణప్రసాద్ ఆర్తి మరిచిపోలేనిది. ఆంజనేయుడు మొదలయిన ఇతర దేవతలపై కూడా గరిమెళ్ళ పాడిన పాటలు ప్రసిద్ధాలు.అన్నమయ్య స్వరసేవ‘అన్నమయ్యకు స్వరసేవ చేయడం తప్ప మరో ప్రపంచం తెలీదు. అన్నమయ్య పాటలే ప్రపంచంగా బతికారు. ఆ పాటలు వినని వాళ్లకు కూడా బలవంతంగా వినిపించేవారు. ప్రతి ఇంట్లో అన్నమయ్య పాట ఉండాలి.. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని తపన పడేవారు. అన్నమయ్య కీర్తనలు స్వరం, రాగం, తాళం తూకం వేసినట్లు కచ్చితంగా పాడాలని పట్టుబట్టేవారు.’’ అని బాలకృష్ణ ప్రసాద్ సతీమణి రాధ చెప్పారు. అన్నమయ్య చెప్పినట్లు ‘‘ఇదిగాక వైభవంబిక నొకటి కలదా?’’చిరస్మరణీయంతెలంగాణ రాష్ట్రంలోని యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా మార్చి నెల 6న నిర్వహించిన అన్నమాచార్య సంకీ ర్తన విభావరియే ఆయన చివరి కచేరీ. నాలుగు నెలలుగా గొంతు సరిగా లేకపోవడంతో ఎక్కడా కచేరీ చేయలేదని, నీదే భారమంటూ స్వామికి మొక్కి వచ్చినట్లు ఆయన ఆర్ద్రంగా యాదగిరి గుట్టలో చెప్పిన విషయం చిరస్మరణీయం.అన్నమయ్య కీర్తనలకు రాగి రేకులలో ప్రతిపాదించిన రాగాలతో కొన్ని సంగీత పరచినా, కొన్ని పాట అర్థానికి, అందానికి తగినట్లుగా సుందర రంజని, వాణిప్రియ వంటి దాదాపు 20కొత్త రాగాలు కూడా సృష్టించారు.ప్రసూన బాలాంత్రపుమంద్రస్థాయిలోని మధుర స్వరం భక్తి, ప్రేమ రంగరించి రూపం దాలిస్తే అది బాలకృష్ణ ప్రసాద్ అవుతుంది. ఈ తరం వారికి అన్నమయ్య పాటలంటే మొట్టమొదట గుర్తుకు వచ్చేది బాలకృష్ణ ప్రసాద్. లలిత సంగీత ధోరణిలో అన్నమయ్యను అందరికి దగ్గర చేసిన ఘనత ఆయనది. 1948 నవంబర్ 9న రాజమండ్రిలో కృష్ణవేణి, గరిమెళ్ళ నరసింహరావులకు జన్మించారు బాలకృష్ణ. ఇంటిలో అందరూ సంగీత కళాకారులే కావడం వల్ల ఆయన పాటతోనే పెరిగారు. ప్రముఖ నేపథ్యగాయని జానకి వారి పినతల్లి. సంగీతం ఎంతో సహజంగా వారికి అబ్బింది కనుకే ఒక పాట రాసినా, సంగీతం కూర్చినా, పాట పాడినా అది అందరి మనస్సులను ఆకర్షించింది. 1980లో మాట. టి.టి.డి వాళ్ళు అన్నమాచార్యప్రాజెక్ట్ మొదలు పెట్టి రాగి రేకులలో దొరికిన అన్నమయ్య పాటలను ప్రజలకు చేర్చాలని నిశ్చయించారు. అప్పటికే కొన్ని పాటలు జనంలో వున్నా అవి అన్నమయ్య పాటలు అని తెలియదు.ఉదాహరణకు ‘జో అచ్యుతానంద’. ఒక ఉద్యమంగా ఈ పాటలు ప్రచారం చెయ్యాలని ప్రతిపాదన. ప్రముఖ విద్వాంసులు రాళ్ళపల్లి అనంత కృష్ణ్ణశర్మ, నేదునూరి కృష్ణమూర్తి, బాలాంత్రపు రజనీకాంతరావు, మల్లిక్ ఈ పాటలకు సంగీతం కూర్చారు. ఆ తరువాత తరం కళాకారులు బాలకృష్ణ ప్రసాద్, శోభారాజు. నేదునూరి కృష్ణమూర్తి గారి దగ్గర బాలకృష్ణ ప్రసాద్ స్కాలర్‌షిప్‌తో శిష్యులుగా చేరి శాస్త్రీయ సంగీతం, అన్నమయ్య పాటలు నేర్చుకున్నారు. నేదునూరి గారు ముందుగా స్వరపరచినది ‘ఏమొకో చిగురుటధరమున’ అనే పాట. ఇది కీర్తన అనేందుకు లేదు. మాములుగా శాస్త్రీయ సంగీతంలో కనిపించే ధోరణులు ఇందులో ఉండవు. మరో పాట ‘నానాటి బ్రతుకు’ కూడా ఇటువంటిదే. ఆ పాటలలో భావం, కవి హృదయం వినే మనస్సుకు అందాలి.అది ఆ సంగీతంలోని భావనా శక్తి. అదే బాలకృష్ణ ప్రసాద్ గారికి స్ఫూర్తి. ఇక అన్నమయ్య పాట పుట్టింది. ప్రచారంలో ఉన్న త్యాగరాజ కీర్తనలకు భిన్నంగా నడిచింది ఈ సంగీతం. నిజానికి అన్నమయ్య త్యాగరాజ ముందు తరం వాడు. అదే బాటలో మొదటి అడుగుగా ‘వినరో భాగ్యం విష్ణు కథ’ పాటలా మన ముందుకు వచ్చింది. నేదునూరి రాగభావన అందిపుచ్చుకుని బాలకృష్ణ ప్రసాద్ ముందుకు నడిచారు. ‘చూడరమ్మ సతులాలా’ అన్నా, ‘జాజర పాట’ పాడినా, ‘కులుకుతూ నడవరో కొమ్మల్లాలా’ అన్నా బాలకృష్ణ ప్రసాద్ గొంతులో భావం, తెలుగు నుడి అందంగా ఒదిగిపోతాయి. అలాప్రారంభం అయిన బాలకృష్ణ ప్రసాద్ సంగీత ప్రస్థానం 150 రాగాలతో 800 పైగా సంకీర్తనలకు సంగీతం కూర్చడం దాకా సాగింది. అన్నమయ్య కీర్తనలకు రాగి రేకులలో ప్రతిపాదించిన రాగాలతో కొన్ని సంగీత పరచినా, కొన్ని పాట అర్థానికి, అందానికి తగినట్లుగా సుందర రంజని, వాణిప్రియ వంటి దాదాపు 20 కొత్త రాగాలు కూడా సృష్టించారు. అన్నమయ్యవి అచ్చ తెలుగు పాటలు. బాలకృష్ణ ప్రసాద్ గొంతులో ఆ తెలుగు సొబగు మృదుమధురంగా వినిపిస్తుంది. ఆయన సంగీతంలో అనవసరమైన సంగతులు ఉండవు. పాట స్పష్టంగా, హృదయానికి తాకేటట్లు పాడడమే ఉద్దేశం. విన్న ప్రతివారు మళ్ళీ ఆ పాట పాడుకోగలగాలి. దీనికై వారు అన్నమయ్య సంగీత శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించి ప్రచారం చేశారు. 400 పైగా కృతులను తెలుగు, సంస్కృత భాషల్లో రచించారు బాలకృష్ణ. అనేక వర్ణాలు, తిల్లానాలు, జావళీలు రచించారు. 400కు పైగా లలిత గీతాలు రచించారు. 16 నవంబర్ 2012లో టి.టి.డి ఆస్థాన గాయకులుగా, కంచి కామకోటి పీఠం ఆస్థాన గాయకులుగా నియమించబడ్డారు. ఆయన లలిత గీతాలు కూడా రచించారు. ఆంజనేయ కృతి మణిమాల, వినాయక కృతులు, నవగ్రహ కృతులు, సర్వదేవతాస్తుతి రచించి క్యాసెట్టు రూపంలో అందించి తెలుగు వారి పూజాగృహంలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆయన పాట ఒక అనుభూతి, ఒక స్వర ప్రవాహం, ఒక భావ సంపద. కొందరికి మరణం ఉండదు. వారి పాట, మాట నిత్యం మనతోనే ఉంటాయి. బాలకృష్ణ ప్రసాద్ అటువంటి మహనీయుడు. -
ఈ వర్ణం సహజం
వస్త్ర తయారీ ప్రక్రియలో రంగుల అద్దకం అంతర్భాగం. రంగులు వేసే పద్ధతులుప్రాంతాన్ని బట్టీ మారుతుంటాయి. అయితే అసలు సమస్య... రసాయన రంగులతోనే. ఈ సమస్యకు పరిష్కారంగా జహీరాబాద్‌లోని దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్) సహజ వర్ణాలకు పెద్ద పీట వేస్తోంది. మోదుగు, తంగేడు, నీలగిరి బెరడు... మొదలైన వాటి రంగులను దుస్తుల అద్దకంలో వాడేలా మహిళలకు శిక్షణ ఇచ్చింది.రసాయన రంగులతో తయారైన దుస్తులు చర్మానికి హానికరంగా మారుతున్నాయి. కొందరికి రసాయన రంగుల బట్టలు అసలు పడవు. హానికరమైన రంగులతో ఒక్కోసారి చర్మ సంబంధిత క్యాన్సర్‌కు సైతం దారితీసే అవకాశాలుంటాయి. వీటిని అధిగమించేందుకు సహజసిద్ధమైన రంగులతో ‘టై అండ్ డై’ పద్ధతిలో కృషి విజ్ఞాన కేంద్ర (కేవీకే)తో కలిసి మహిళలకు శిక్షణ ఇస్తోంది దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ.మిల్లెట్ సాగునుప్రోత్సహించే దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్) సంస్థ ఇప్పుడు మారుమూలప్రాంతాల్లోని మహిళల్లో రకరకాల నైపుణ్యాలను పెంపోందించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. అందులో సహజ రంగులతో అద్దకం కళ కూడా ఒకటి.ఈ టై అండ్ డై (అందమైన డిజైన్ల అద్దకం)లో ఉండే వివిధ రకాల పద్ధతులను గ్రామీణ మహిళలకు వివరిస్తున్నారు. లహరియ, చెవ్రాన్, ప్లీటింగ్, బండ్లింగ్, క్లమ్పింగ్, బాందిని వంటి వివిధ రకాల ‘టై అండ్ డై’ పద్ధతులలో శిక్షణ ఇస్తున్నారు.‘మనకు నిత్యం అందుబాటులో ఉండే వాటితో రంగులు తయారు చేయడం, వాటితో బట్టలపై అద్దకం (టై అండ్ డై) నేర్చుకోవడం సంతోషంగా ఉంది. రంగుల తయారీ, అద్దకంపై ప్రతి దశలోనూ మాకు సులభంగా అర్థం అయ్యేలా చెప్పారు. మేము సొంతంగా డిజైన్ లు చేయడం గర్వంగా ఉంది’ అంటుంది శ్రీవాణి.‘చెట్ల వేర్లు, కాండం నుంచి రంగులు ఎలా తీయవచ్చు అనేది నేర్చుకున్నాను. ఆ రంగులను బట్టలకు ఎలా అద్దాలి అనే దాని గురించి శిక్షణ పోందాము. ఇలాంటి విధానం పర్యావరణానికి మేలు చేస్తుంది. హానికరమైన రసాయనాల కంటే ప్రకృతి సిద్ధమైన రంగులు ఎంతో మేలు’ అంటుంది విజయలక్ష్మి.దేశవ్యాప్తంగా వస్త్ర తయారీ పరిశ్రమలో సహజ రంగులప్రాముఖ్యత పెరుగుతోంది. ప్రతిప్రాంతంలో వస్త్ర పరిశ్రమ తనదైన మూలాలను వెదుక్కుంటుంది. ఈ నేపథ్యంలో దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ చేపడుతున్న కార్యక్రమాలు ఒకవైపు ప్రకృతికి మేలు చేస్తున్నాయి. మరోవైపు మహిళలలోని సహజ సృజనాత్మకతకు మెరుగులు దిద్దుతున్నాయి. – పాత బాలప్రసాద్, సాక్షి ప్రతినిధి, సంగారెడ్డిసృజన ప్లస్ ఉపాధికృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. మహిళల్లో స్వయం ఉపాధిని పెంపోందించడానికి వివిధ రకాల శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా ‘టై అండ్ డై’పై గ్రామీణ మహిళలకు ఉచిత శిక్షణ కార్యక్రమం చేపట్టాం. ఈ కార్యక్రమానికి మంచి స్పందన వస్తోంది. మహిళలు ఉత్సాహంగా నేర్చుకోవడం సంతోషంగా ఉంది. – హేమలత, శాస్త్రవేత్త -
ఆ ఏనుగు హెయిర్ స్టైల్ వేరేలెవెల్..!
ఫ్యాషన్ అంటే కేవలం మనుషుల మాత్రమేనా మేము కూడా తీసికిపోం అంటున్నాయి జంతువులు. ట్రెండీ ఫ్యాషన్‌ని మనుషులే కాదు జంతువుల కూడా ఫాలోఅవుతాయని ఈ వైరల్ వీడియోని చూశాక ఒప్పుకుంటారు. ఆ వీడియోలోని ఏనుగు స్టైల్ చూస్తే..వేరేలేవెల్ అని అంగీకరిస్తారు. మరీ ఇంతకీ ఇదంతా ఎక్కడ జరిగిందంటే..తమిళనాడులో మన్నార్గుడిలోని రాజగోపాలస్వామి ఆలయంలో ఏనుగు విలక్షణమైన హెయిర్‌స్టైల్‌తో చూడముచ్చటగా ఉంటుంది. ఆ ఏనుగు పేరు సెంగమాలం. ఆ ఏనుగుకి సంబంధించిన వీడియోని ఇండియా కల్చరల్ హబ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఆ వీడియోలో సెంగమాలం ఏనుగు మనుషుల జుట్టు మాదిరిగా 'బాబ్‌కట్ హెయిర్ స్టైల్'లో ఉంటుంది. చూస్తే మనుషుల హెయిర్‌స్టైల్ మాదిరిగానే ఉంటుంది ఆ ఏనుగు హెయిర్. అంతేగాదండోయ్ ఆ ఆలయానికి వచ్చే భక్తులకు ఈ ఏనుగే ప్రధాన ఆకర్షణగా ఉంటుందట. అయితే ఇంతలా ఏనుగు జుట్టు పట్ల కేర్ తీసుకుంటున్న దాని సంరక్షకుడిని మెచ్చుకోవాల్సిందే. ఈ మేరకు ఆ ఏనుగు సంరక్షకుడు ఎస్ రాజగోపాల్ మాట్లాడుతూ..ఈ సెంగమాలం జుట్టుని వేసవికాలంలో రోజుకి మూడుసార్లు, ఇతర సీజన్లలో కనీసం రోజుకి ఒకసారైనా.. కడుగుతామని చెబుతున్నారు. 2003లో ఆ ఏనుగుని కేరళ నుంచి తీసుకవచ్చారట. అప్పటి నుంచి ఈ ఆలయంలోనే నివాసిస్తోందట. దేవుని కైంకర్యాలకు ఈ ఏనుగుని వినియోగిస్తామని చెబుతున్నారు ఆలయ నిర్వాహకులు. మే నెలలో ఈ ఏనుగుకి చల్లదనం కల్పించడం కోసం ప్రత్యేకంగా దాదాపు రూ. 45 వేలు ఖరీదు చేసే షవర్‌ని కూడా ఏర్పాటు చేశామని చెబుతున్నారు ఆలయ నిర్వాహకులు. View this post on Instagram A post shared by India Cultural Hub (@indiaculturalhub) (చదవండి: జ్ఞాపకంగా మిగిలిన ఆ కుక్క కోసం .. ఏకంగా రూ. 19 లక్షలా..!) -
బీట్రూట్ని మజ్జిగతో కలిపి తీసుకోవచ్చా..?
మాములుగా బీట్రూట్తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయన్న సంగతి తెలిసిందే. దీన్ని జ్యూస్ రూపంలో లేదా కూర రూపంలో తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే కొన్నింటిని కొన్ని రకాల ఆహారాలతో జత చేసి తీసుకుంటే మరిన్ని ప్రయోజనాలు పొందొచ్చు. అదెలాగో చూద్దామా..!.బీట్రూట్ ఐరన్, యాంటీ ఆక్సిడెంట్ల మూలం. దీన్ని మజ్జిగతో జత చేసి తీసుకుంటే శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ శోషణ పెరుగుతుందని చెబుతున్నారు న్యూట్రిషన్లు. ఇలా తీసుకుంటే ఐరన్ శోషణ తోపాటు, గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందట. చలవ చేయడమే గాక మొత్తం ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారు. బీట్రూట్లో ఉండే కొన్ని రకాల ఐరన్లను మన శరీరం గ్రహించలేదు. అదే దాన్ని మజ్జిగతో కలిపి తీసుకున్నట్లయితే.. అందులో ఉండే లాక్టిక్ ఆమ్లం మంచి ప్రోబయోటిక్‌లను అందిస్తుంది. మంచి గట్ ఆరోగ్యాన్ని అందిస్తుంది. అంతేగాదు ఇందులోని ఆమ్లత్వం పేగులోని ఐరన్ శోషణను మరింత పెంచుతుంది. ఎర్రరక్తకణాలు ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. అలాగే రక్తహీనతను కూడా నివారిస్తుంది. దీనిలో నైట్రిక్ ఆక్సైడ్లుగా మార్చే నైట్రేట్లు ఉంటాయి. రక్తనాళాల్లో బ్లాక్‌లు ఉండవని చెబుతున్నారు నిపుణులు. ఇది హృదయనాళ పనితీరుకి మద్దతిచ్చే బయోయాక్టివ్ పెప్టైడ్లను అందిస్తుంది. వీటన్నింటి తోపాటు కాలేయ పనితీరుకి కూడా సహాయపడుతుంది. శరీరంలోని టాక్సిన్లను తొలగిస్తుంది. ఇలా బీట్రూట్ బట్టర్‌మిల్క్ మిక్సింగ్ అనేది శక్తిమంతమైన రిఫ్రెష్ టానిక్‌లా పనిచేస్తుంది. (చదవండి: 'ఎగ్ ఫ్రీజింగ్' అంటే..? ఉపాసన, నటి మెహ్రీన్ , తానీషా ముఖర్జీ అంతా..!) -
'ఎగ్ ఫ్రీజింగ్' అంటే..? ఉపాసన, నటి మెహ్రీన్ , తానీషా ముఖర్జీ అంతా..!
మాతృత్వం మధురిమ మాటలకందనిది. అందుకోసం ప్రతి అమ్మాయి తపిస్తుంటుంది. ప్రస్తుత జీవనవిధానం ,పర్యావరణ కాలుష్యం కారణంగా "అమ్మ" అనే పిలుపు దూరమవుతున్నారు. ఆ పరిస్థితిని అధిగమించడానికి కొందరూ 'ఎగ్ ఫ్రీజింగ్' బాటపడుతున్నారు. ముఖ్యంగా ఈ మార్గాన్నే టాలీవుడ్ హీరో రామ్‌చరణ్ భార్య ఉపాసన, నటి మెహ్రీన్, మ్యూచువల్ ఫండ్ సీఈవో రాధికా గుప్తా వంటి ప్రముఖులు ఎంచుకున్నారు. తాజాగా వారి సరసన చేరింది బాలీవుడ్ నటి తనీషా ముఖర్జీ. అసలు ఇంతకీ ఏంటి ఎగ్ ప్రీజింగ్..? ఈ వైద్య విధానం మంచిదేనా?.. అంటే..ప్రస్తుతం యువత కెరీర్‌కి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ క్రమంలో వయసు పెరిగిపోతుంది. ఆ తర్వాత పిల్లలు పుట్టక చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నారు. దీన్ని అధిగమించేందుకు నవతరం ఈ ఎగ్ ఫ్రీజింగ్ బాట పడుతోంది. చెప్పాలంటే ఇది జెన్ జెడ్ ట్రెండ్‌గా మారింది. అసలు ప్రముఖులే కాగా సామాన్యులు సైతం ఈ పద్ధతికే మొగ్గుచూపిస్తాన్నారు. మరీ అసలు ఈ విధానం ఎలా ఉంటుందనే దాని గురించి బాలీవుడ్ నటి తనీషా మాటల్లో చూద్దాం. ఎగ్ ఫ్రీజింగ్ అంటే..ఎగ్ ఫ్రీజింగ్ విధానాన్ని ఎంచుకున్నామంటే అంతా తప్పుగా చూస్తారు. పైగా ఇది చాలా పెయిన్‌తో కూడిన విధానమని భయబ్రాంతులు గురిచేశారని చెప్పుకొచ్చింది 46 ఏళ్ల తనీషా. అయితే తానువైద్యుల సాయంతో దాని గురించి వివరంగా తెలుసుకున్నాకే ధైర్యంగా ముందడుగు వేశానని చెప్పింది. వైద్య పర్యవేక్షణలో అండాలు భద్రపరుచుకునే విధానాన్ని ఎగ్ ఫ్రీజింగ్ అంటారు. ఈ పక్రియలో కడుపు ప్రాంతంలో ప్రొజెస్టెరాన్‌ని ఇంజెక్ట్ చేస్తారు. మొదట్లో తిమ్మిరితో కూడిన బాధ ఉంటుంది. ఆ తర్వాత ఐదు నుంచి ఆరో రోజులు అందుకు బాడీ ఆటోమేటిగ్గా సిద్ధమైపోతుంది. ఇదంతా అరగంట ప్రక్రియ. అయితే వాళ్లు అండాలను సేకరించిన విధానం మనకు తెలియకుండానే జరిగిపోతుందంటూ..ఆ వైద్య విధానం గురించి వివరించింది సోషల్‌మీడియా వేదికగా వెల్లడించింది. అయితే ఈ హర్మోన్లు ఇంజెక్ట్ చేసే ప్రక్రియలో బరువు పెరగడం జరుగుతుంది. అయితే ఇంజెక్ట్ చేసిన హార్మోన్లను తొలగించడానికి కూడా ఓ విధానం ఉంటుందని చెప్పుకొచ్చారు తనీషా. వైద్యులు ఏమంటున్నారంటే..నిజానికి ఈ ఎగ్ ప్రీజింగ్ ప్రక్రియలో సాధారణంగా హార్మోన్ల ఇంజెక్షన్ల సాయంతో అండాలను సేకరించడం జరుగుతుంది. అయితే అందుకు పేషెంట్ శారీరకంగా మాససికంగా సంసిద్ధంగా ఉండటం అనేది అత్యంత కీలకం. అయితే ఈ హార్మోన్ల ఇంజెక్షన్లలో ప్రొజెస్టెరాన్ ఉండదని ప్రసూతి వైద్యులు చెబుతున్నారు. అండాశయాలను ఉత్తేజపరిచేందుకే ఈ హార్మోన్ ఇంజెక్షన్లు ఉంటాయని అన్నారు. అయితే వీటి కారణంగా బరువు పెరగడం అనేది జరగదని చెప్పారు. అయితే ఆ తర్వాత సంభవించే ఆకలి మార్పులే లేదా శరీరంలో ద్రవాల నిలుపదల వంటి మార్పులను ఎదుర్కొంటారు. ఆ సమస్యలు ఒకటి లేదా రెండు రోజుల్లో తగ్గుముఖం పడతాయట. ఇక్కడ తగినంత నీరు తాగినట్లయితే అదనపు హార్మోన్లు బయటకు వచ్చేస్తాయని చెబుతున్నారు వైద్యులు. దీంతో ఈ హార్మోన్లు శరీరం నుంచి బయటకు వెళ్లేలా తాజాపండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, కాయధాన్యాలు తదితర పోషకాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. ఆ సమయంలో వాకింగ్, యోగా వంటి తేలికపాటి వ్యాయామాలు రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచి, బరువు పెరగకుండా రక్షిస్తాయని అన్నారు. వాటన్నింటి తోపాటు ఎనిమిది గంటల నిద్ర, యోగా, ధ్యానం వంటి వాటితో ఈ అదనపు హార్మోన్లను సమతుల్యం చేయొచ్చని చెప్పారు. జస్ట్ రెండు రుతక్రమ సైకిల్స్ కల్లా సాధారణ స్థితికి మహిళలు తిరిగి వస్తారని వెల్లడించారు వైద్యులు..ఈ విధానాన్ని ఎంచుకోవడానికి రీజన్..కెరీర్లో ముందుండాలనే క్రమంలో వయసు దాటిపోతుంది. ఆ తర్వాత పిల్లలను కనేందుకు ప్లాన్ చేసుకున్న చాలామంది జంటలు ఎంతలా అనారోగ్య సమస్యలు ఫేస్ చేస్తున్నారనేది తెలిసిందే. పోనీ ఏదోలా పిల్లలను కన్నా..వాళ్లు ఆరోగ్యంగా ఉండక ఆస్పత్రులు చుట్టూ తిరుగుతూ నానాపాట్లు పడుతున్నవాళ్లున్నారు. ఆ నేపథ్యంలోనే యువత ఇలా అండాలను భద్రపరుచకునే ఎగ్ ప్రీజింగ్ లేదా క్రయో ఫ్రిజర్వేషన్ పద్ధతిని ఆశ్రయిస్తున్నారు. ఇక ఆ జంటలు లేదా యువత కెరీర్లో నిలదొక్కుకున్నాక హాయిగా పిల్లల్ని కనడం గురించి ప్లాన్ చేస్తున్నారు. (చదవండి: జ్ఞాపకంగా మిగిలిన ఆ కుక్క కోసం .. ఏకంగా రూ. 19 లక్షలా..!) -
ఉపవాసాలు: స్విగ్గీ కొత్త అప్డేట్ చూశారా?
ప్రస్తుత రంజాన్ మాసంతో పాటు నవరాత్రి వంటి ఇతర ఉపవాస సమయాల్లో కస్టమర్లను నోటిఫికేషన్లతో ఇబ్బంది పెట్టకుండా ‘ఫాస్టింగ్ మోడ్’ అనే వినూత్న ఎంపికను ‘స్విగ్గీ’ ప్రారంభించింది. ఇది ఉపవాస సమయాల్లో వినియోగదారులు ఫుడ్ డెలివరీ నోటిఫికేషన్లను పాజ్ చేయడానికి అనుమతించే సరికొత్త ఫీచర్. ఈ ఫీచర్ ఉపవాస సమయాల్లో జోక్యం చేసుకోదు. వినియోగదారులకు అవసరమైనప్పుడు మాత్రం ఈ వేదిక సిద్ధంగా ఉంచుతుంది. వినియోగదారులు యాప్ నుంచి ఈ సెట్టింగ్‌ను సులభంగా ప్రారంభించ వచ్చు. అవసరం లేని సమయంలో నిలిపివేయవచ్చు. వినియోగదారులు స్విగ్గీ యాప్ నుండి ఎప్పుడైనా ఫాస్టింగ్ మోడ్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు. యాక్టివేట్ చేసిన తర్వాత.. రంజాన్ సందర్భంగా ఉపవాసం ఉండే వినియోగదారులు అందరికీ సహర్ (తెల్లవారుజామున), సాయంత్రం 4 గంటల మధ్య ఫుడ్ నోటిఫికేషన్లు పాజ్ చేయబడతాయి. వినియోగదారుల ఉపవాస సమయం పూర్తయిన తరువాత నోటిఫికేషన్లు తిరిగి ప్రారంభమవుతాయి. మనం ఆన్ చేయాల్సిన అవసరం లేదు. స్విగ్గీ ఆహార పదార్థాలపై 50 శాతం వరకూ తగ్గింపుతో రుచికరమైన వంటకాలు, ప్రత్యేక రంజాన్ భోజనాలను అందిస్తుందని యాజమాన్యం తెలిపింది. ఈ ఫీచర్‌ను సంస్థ సృజనాత్మక భాగస్వామి టాలెంటెడ్ రూపొందించింది. రోబోఆల్–ఇన్–వన్ కిచెన్ వండర్చెఫ్లోపద్మశ్రీ అవార్డు గ్రహీత చెఫ్ సంజీవ్ కపూర్దక్షిణ భారత్‌లో వండర్‌చెఫ్ ఔట్లెట్లను రెట్టింపు చేస్తామని పద్మశ్రీ అవార్డు గ్రహీత చెఫ్ సంజీవ్ కపూర్ తెలిపారు. కొత్తగూడలోని శరత్‌సిటీ క్యాపిటల్ మాల్లో వండర్‌చెఫ్ ఔట్‌లెట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దక్షిణాది మార్కెట్లో వంట గది వినూత్న పరిష్కారాలను అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. వండర్‌చెఫ్ బ్రాండ్ ఔట్లెట్లను రెట్టింపు చేస్తామని, ఇందులో హైదరాబాద్ మార్కెట్ ముఖ్యమైందని తెలిపారు. వండర్ చెఫ్ వినూత్న ఆవిష్కరణలతో హోమ్ చెఫ్‌లు ఆరోగ్యకరమైన వంటకాలు తయారు చేసుకునేందుకు వీలుంటుందన్నారు. అధునాతన మౌల్డింగ్ టెక్నాలజీలో కాస్ట్ ఐరన్ వంట సామగ్రి ‘ఫెర్రో’ని ప్రవేశపెట్టింది. కత్తిరించడం, ఆవిరి చేయడం, సాటింగ్, కలపడం, బ్లెండింగ్ చేసేందుకు ఆల్–ఇన్–వన్ కిచెన్ రోబోలా పనిచేస్తుంది. చెఫ్ సంజీవ్ కపూర్ స్వయంగా క్యురేట్ చేసిన 370కి పైగా వంటకాలతో కూడిన గైడ్ సహాయంతో స్క్రీన్లపై చూస్తూ హోమ్ చెఫ్‌లు వివిధ రకాల వంటలు చేసుకోవచ్చని తెలిపారు. -
బీట్స్‌తో అదరగొట్టేసిన బుడ్డోళ్లు : 3 కోట్ల వ్యూస్, ఓ లుక్కేసుకోండి మరి!
‘బాల్యం బంగారు నిధి’ ఇది అందరం ఒప్పుకునే మాట. బాల్య స్మృతులు ఎవరికైనా చెప్పలేనంత ఉల్లాసాన్ని ఇస్తాయి. బాల్యం అనగానే అందమైన అనుభూతులు, అనుభవాలు ఒక్కసారిగా మనల్ని చుట్టుముడతాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించిన జ్ఞ్యాపకాలు ఒక్కసారిగా నిద్ర లేస్తాయి. చిన్నపుడు మనం చేసిన అల్లరి, చిలిపి చిలిపి చేష్టలు గుర్తొస్తాయి. బ్లాక్ బోర్డుపై రాసిన రాతలు, స్కూలు బెంచ్‌పై చెక్కుకున్నపేర్లు, అదేదో సినిమాలో అన్నట్టు నచ్చిన అమ్మాయిపై పేపర్ బాల్ విసరడం, అది మాస్టార్‌కు తగిలి, వీపు పగలడం ఇలా.. ఎన్నో..ఎన్నో గుర్తుకు వస్తాయి కదా. ఇపుడు మీరు చదవబోయే కథనం కూడా అలాంటి ఎన్నో అనుభవాలను గుర్తు చేస్తుంది. పుణేకు చెందిన విద్యార్థుల వీడియో ఒకటి నెట్టింట హల్చల్ చేస్తోంది.ప్రాజెక్ట్ అస్మి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో ఇపుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇప్పటికే ఇది 3 కోట్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. కమెంట్లు వెల్లువెత్తాయి. పూణేలోని ఒక పాఠశాల చెందిన బ్యాచ్ జామెట్రీ బాక్స్, బెంచె మీద వాయిస్తూ అద్భుతమైన సంగీతాన్ని సృష్టించారు. వాటర్ బాటిల్‌ను మాత్రమే ఉపయోగించి డ్రమ్ బీట్స్‌తో అదరగొట్టేశారు. ఒకరి తరువాత ఒకరు తమ టాలెంట్‌తో రెచ్చిపోయారు. దీంతో తరగతి గది ఒక చిన్న కచేరీ వేదికగా మారిపోయింది. దీంతో టీచర్లు కూడా అలా మైమరిచిపోయారు. చుట్టూ ఉన్న పిల్లలు, స్నేహితులు చప్పట్ల మోత మోగించారు. చదవండి: అప్పుడు వెడ్డింగ్ గౌను, ఇపుడు ఎంగేజ్మెంట్ రింగ్ : సమంత అంత పనిచేసిందా? View this post on Instagram A post shared by Project Asmi (@projectasmi_pune)అందుబాటులో ఉన్న వస్తువులను ఉపయోగించి విద్యార్థులు ఉత్పత్తి చేసే బీట్లు , రిథమ్‌లు భలే ఉంటాయి. వారి క్రియేటివిటీని మెచ్చుకోకుండా ఉండలేం. కల్మషం లేని లేత వయసులో వారి ప్రతిభను ,సృజనాత్మకతను గుర్తించి ప్రోత్సహిస్తే గొప్ప ప్రతిభావంతులుగా మారతారు. మరి ఈ బాల శివమణిలకు ఎలాంటి ప్రోత్సాహం లభిస్తుందో వేచి చూద్దాం. -
LVFW25 అటు ఐఫిల్ టవర్, ఇటు దీపికా : భర్త కామెంట్ వైరల్
ప్యారిస్ ఫ్యాషన్ వీక్ 2025లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే తన మెస్మరైజింగ్ లుక్‌తో అందర్నీ ఆశ్చర్యపర్చింది. మార్చి 3-11వరకు ఫ్రాన్స్‌లో జరుగుతున్న ప్యారిస్ 2025-2026 (ఫాల్/వింటర్ విమెన్స్వేర్)లో క్లాసిక్ వింటేజ్ లుక్‌లో అదరగొట్టింది. ఫ్యాషన్ ప్రపంచంలో తనదైన మార్క్‌ను చాటుకుంది. ఇది చూసిన ఫ్యాన్స్ ఆమె లుక్‌ను 'ఐకానిక్' అంటూ తెగ పొగిడేశారు. ఐఫిల్ టవర్‌కు సమాంతరంగా దీపిక ఫోజులు నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి.'లూయిస్ విట్టన్ ఫాల్/వింటర్ 2025-2026 కలెక్షన్ ఆవిష్కరణ కోసం పారిస్‌కు వెళ్లిన ఈ కల్కి నటి మరోసారి హై ఫ్యాషన్ పట్ల తనకున్న అనుబంధాన్ని నిరూపించుకుంది. లూయిస్ విట్టన్‌లో క్లాసిక్ మోనోక్రోమ్ లుక్‌లో లగ్జరీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఈ గ్లోబల్ స్టార్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. దీపికా పదుకొణే దీనికి సంబంధించి ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్లు ఐకానిక్ లుక్, ఫ్యాషన్ స్టైల్‌కి ఫిదా అయిపోయారు. ఓర్రీ, సోఫీ చౌదరి "లవ్" ఎమోజీలతో తమ సంతోషాన్ని ప్రకటించారు. మరోవైపు దీపికా భర్త రణవీర్ సింగ్ ("Lord have mercy on me") చక్కటి మెసేజ్‌ను పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by दीपिका पादुकोण (@deepikapadukone) దీపికా ఐకానిక్ ఐఫిల్ టవర్‌కు ఎదురుగా ఫోజులిచ్చింది. తెల్లటి భారీ కోటు, స్టైలిష్ టోపీ, స్కార్ఫ్, డీప్ రెడ్ లిప్‌స్టిక్, బ్లాక్ హీల్స్, గ్లోవ్లతో పారిసియన్ గాంభీర్యానికి పరాకాష్టగా నిలిచింది. ఈ ఫోటోలు అటు ఫ్యాషన్ ఔత్సాహికులు, విమర్శకులు ప్రశంసలందుకున్నాయి. ఐకానిక్ భవనం ది కోర్ కారీ డు లౌవ్రేలో దీపిక ఎంట్రీ అంతర్జాతీయ ఫ్యాషన్ రంగంలో తన ప్రత్యేకతను మరోసారి చాటుకుంది. దీపికా పదుకొనేతో పాటు, ఎమ్మా స్టోన్, జాడెన్ స్మిత్, జౌ డోంగ్యు, జెన్నిఫర్ కోన్నెల్లీ, అనా డి అర్మాస్ లాంటి అనేక గ్లోబల్ స్లార్లు ఈ షోలో కనిపించారు. కె-పాప్ స్టార్ లిసా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చదవండి: అప్పుడు వెడ్డింగ్ గౌను, ఇపుడు ఎంగేజ్మెంట్ రింగ్ : సమంత అంత పనిచేసిందా?కాగా రణవీర్‌తో పెళ్లి, కుమార్తె దువాకు జన్మనిచ్చిన తరువాత ఈ సంవత్సరం ప్రారంభంలో, ప్రముఖ డిజైనర్ సబ్యసాచి షోలో అద్భుతమైన ప్రదర్శనతో రీఎంట్రీ ఇచ్చింది. దుబాయ్‌లో జరిగిన కార్టియర్ 25వ వార్షికోత్సవ వేడుకలకు అద్భుతమైన నల్లటి దుస్తులలో మెరిసిపోవడం దగ్గర్నుంచి గ్లోబల్ ప్లాట్‌ఫారమ్, అబుదాబిలో జరిగిన ఫోర్బ్స్ సమ్మిట్‌లో గోల్డెన్ గర్ల్‌గా గుర్తింపు పొందడం వరకు ఆమె ఫ్యాషన్ ఎంపికలు వార్తల్లో నిలుస్తూ వచ్చాయి. ప్రపంచ ఫ్యాషన్‌లో భారతీయ ప్రాతినిధ్యానికి, ఆమె సిగ్నేచర్ స్టైల్‌కు ఇది గొప్ప మైలురాళ్లు. లూయిస్ విట్టన్, కార్టియర్ రెండింటికీ గ్లోబల్ అంబాసిడర్‌గా సంతకం చేసిన తొలి భారతీయురాలు దీపికా. -
జ్ఞాపకంగా మిగిలిన ఆ కుక్క కోసం .. ఏకంగా రూ. 19 లక్షలా..!
కొందరూ యజమానులు తమ పెంపుడు కుక్కల కోసం ఎంత దూరమైనా.. వెళ్లిపోతారు. వాటికోసం ఎంత డబ్భైనా ఖర్చు చేస్తారు. అలానే గతంలో కొందరు యజమానులు తమ కుక్కలకు పుట్టిన రోజులు, పెళ్లిళ్లు జరిపించి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఓ యజమానురాలు తాను ఎంతో ఇష్టంగా పెంచుకున్న కుక్క దూరమైందని ఆమె ఏ చేసిందో తెలిస్తే మతిపోతుంది. మరీ ఇంతలానా అని అనుకోవడం ఖాయం. ఇంతకీ ఆ మహిళ ఏం చేసిందంటే..చైనాలోని హాంగ్జౌకు చెందిన జు అనే మహిళ 2011లో డోబర్మ్యాన్ అనే కుక్కను కొనుగోలు చేసి జోకర్ అని పేరు పెట్టుకుంది. దాన్ని ఎంతో ప్రేమగా చూసుకునేది. రాను రాను ఆ కుక్కతో ఆమెకు విడదీయరాని బంధం ఏర్పడింది. తన పాఠశాల విద్య నుంచి వృత్తి జీవితం వరకు తన పెంపుడు కుక్కతో పెనవేసుకున్న ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. అయితే ఆ కుక్క తొమ్మిదేళ్ల వయసులో ప్రాణాంత సార్కోమా బారిన పడింది. ఆ సమయంలోనూ జు తన కుక్కను తన కంటిపాపల కాచుకుంది. దానికి అనస్థీషియా లేకుండానే విజయవంతంగా శస్త్ర చికిత్స చేయించి మరీ రక్షించుకుంది. అయితే కాలక్రమంలో ఆ కుక్క పలు వ్యాధుల బారినపడటం మొదలైంది. అయినా తన శక్తిమేర దాని బాగోగులు చూసుకుంటూనే వచ్చింది జూ. కానీ ఆ కుక్క 2022లో గుండెపోటుతో అనూహ్యంగా మరణించింది. దీంతో పెంపుడు కుక్క పోయిందన్న దిగులతో గడపటం మొదలుపెట్టింది జూ. అలా ఆ కుక్క మరణం జూపై తీవ్ర ప్రభావం చూపింది. నిద్రలేని రాత్రులతో సతమతమయ్యేది. ఇక ఆమె ఆరోగ్యం నెమ్మదిగా క్షీణించటం మొదలైంది. ఇక లాభం లేదు ఇలా దుఃఖంలో మునిగిపోవడమే తప్ప బయటకి రాలేనని గ్రహించింది జు. దీనికి సరైన పరిష్కారం కనుగొని ఇదివరకటిలా హాయిగా జీవితాన్ని గడపాలనుకుంది. అందుకోసం బాగా ఆలోచించి.. క్లోనింగ్ ఒక్కటే మార్గమని డిసైడ్ అయ్యింది. క్లోనింగ్ ప్రక్రియతో జీవిని పోలిని జీవిని సృష్టిస్తారు శాస్త్రవేత్తలు. ఇదే తన బాధకు చక్కటి ఉపశమనం అని నమ్మి.. క్లోనింగ్ సౌకర్యాన్ని అందించే ఆస్పత్రిని సందర్శించి ఏకంగా రూ. 19 లక్షలు చెల్లించింది. ఆ ఆస్పత్రి వైద్యులు జు పెంపుడు కుక్క ఉదరం, చెవుల నుంచి కొద్ది మొత్తంలో చర్మాన్ని సేకరించి ఒక ఏడాదిలో అచ్చం అలాంటి కుక్కనే రూపొందించారు. వైద్యులు జుకి సమాచారం ఇవ్వడంతో ఆనందంగా ఆ చిన్న కుక్కను ఇంటికి తీసుకువెళ్లింది. దానికి లిటిల్ జోకర్ అని పేరుపెట్టుకుని పెంచుకుంటుంది. ఇది అచ్చం తన పెంపుడు కుక్క జోకర్ మాదిరిగానే ఉందని ఆనందంగా చెబుతోంది. ఈ కొత్త కుక్కరాకతో ఆ బాధ నుంచి తేరుకోగలుగుతున్నాని సంతోషంగా చెబుతోంది జు. మనిషి తన బాధకు ఉపశమనం కోసం ఎంత దూరమైన వెళ్తాడంటే ఇదేనేమో. అంతేగాదు మనం పెంచుకుంటున్న వాటిపై చూపించే ప్రేమ అంతకుమించి అన్నట్లు ఉంటే జులానే ఎంత డబ్భైనా ఖర్చు పెట్టేందుకు వెనుకాడరేమో కదూ. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట తెగ వైరల్‌గా మారింది.(చదవండి: నాలుగు పదుల వయసులోనూ అంతే అందంగా శ్రియ.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!) -
మానవ సేవే.. మాధవ సేవగా... మహ్మద్ నజీబ్ సేవలు!
మానవ సేవే మాధవ సేవ.. అనే నానుడిని ఒంటబట్టించుకున్నారు.. గోల్కొండ ప్రాంతానికి చెందిన మహ్మద్ నజీబ్. సరిగ్గా అదే తలంపుతో గత 18 ఏళ్లుగా పేదల కోసం నిరంతరాయం శ్రమిస్తూ.. నిరుపేదలకు, వలస కూలీలకు సేవలందిస్తున్నారు. తాను స్థాపించిన తెలంగాణ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఆర్గనైజేషన్ ద్వారా పేదల కుటుంబాల్లో తలెత్తే తగాదాలను పరిష్కరిస్తూ వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. మరోవైపు వలస కూలీలు, నిరుపేదలకు వైద్య సహాయం, నిత్యావసరాలు అందజేస్తున్నాడు. కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో మహ్మద్ నజీబ్ షేక్‌పేట ఫ్రెండ్స్ కాలనీలో ప్రత్యేక వంటశాలను ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ఉపాధి కోల్పోయిన వారికి ప్రతినిత్యం వంద కిలోల బియ్యంతో వంట చేస్తూ లేబర్ అడ్డాలు, ఆస్పత్రుల వద్ద భోజన ప్యాకెట్లు అందించారు. – గోల్కొండ నజీబ్ చిన్ననాటి స్నేహితులతో కలిసి గోల్కొండలోని షేక్ పేటలో నిరంతరాయంగా నిరుపేదలకు సేవలందిస్తున్నాడు మహ్మద్ నజీబ్. స్థానిక ప్రాంతంలో ఇంటింటికీ తిరిగి వారి సమస్యలను గుర్తిస్తూ.. తనకు తోచిన సహాయాన్ని అందిస్తున్నాడు. స్థానికులకు, పేదలకు అండగా నిలుస్తున్నాడు. ముఖ్యంగా లేబర్ అడ్డాల వద్ద ఒక్కపూట భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నాడు. కాలనీలో ప్రత్యేకంగా ఓ వంట శాలను సైతం ఏర్పాటు చేశాడు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి ప్రతినిత్యం భోజన ప్యాకెట్లను అందించాడు. పలువురు బాధితులకు ఆక్సిజన్ సిలిండర్లను ఉచితంగా అందించాడు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యుల సహాయంతో స్థానికులకు వైద్య సేవలను అందించాడు. కుటుంబ కలహాలు చక్కబెడుతూ.. టోలిచౌకీలోని తెలంగాణ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ప్రధాన కార్యాలయంలో స్థానికుల కుటుంబ తగాదాలు, భార్యా భర్తల కలహాలకు పరిష్కార వేదిక ఏర్పాటు చేశారు. దాదాపు 15 యేళ్లగా చిన్న చిన్న తగాదాలతో విడాకులు తీసుకోడానికి తనవద్దకు వచి్చన వారికి కౌన్సిలింగ్ ఇప్పించి వారి కలహాలకు పరిష్కారం చూపుతున్నాడు. ఇప్పటి వరకూ దాదాపు 350 మంది దంపతులకు కౌన్సిలింగ్ ఇప్పించి, వారిని ఏకం చేస్తున్నాడు. మరోవైపు నిరుపేద విద్యార్థులకు ఆర్గనైజేషన్ ద్వారా తామున్నామంటూ అండగా ఉంటూ ఫీజులకు తన వంతు సహాయం అందిస్తున్నాడు. చదువు మధ్యలో వదిలేసిన వారిని చదువు కొనసాగించేలా ప్రోత్సహిస్తున్నాడు. ప్రతి యేటా తాము 8 మంది నిరుపేద విద్యార్థులను దత్తత తీసుకుంటున్నామని, పదో తరగతి వరకూ ఉచితంగా చదువుకునేలా వారికి అండగా నిలబడుతున్నాడు. ప్రస్తుతం ఆర్గనైజేషన్ కార్యకలాపాలు తెలంగాణ జిల్లాలకు కూడా విస్తృతం చేస్తున్నట్లు నజీబ్ తెలిపారు. -
ఏ ఇంటి తలుపు తట్టినా... గుండెల్ని పిండేసే ఉద్దానం కథలు
నిత్యం పంటలతో తొణికిసలాడే ఉద్దానం విషాదాలకు నిలయంగా మారింది. ఏ ఇంటి తలుపుతట్టినా కన్నీటిచారలే కనిపిస్తున్నాయి. గుండెలను పిండేసే కిడ్నీ బాధలు అడుగడుగునా తారసపడుతున్నాయి. ఇంటికి పెద్ద దిక్కు కిడ్నీ వ్యాధితో మంచాన పడితే.. ఆ పెద్ద దిక్కును దక్కించుకోవడానికి ఉన్నదంతా అమ్మేసి రోడ్డున పడ్డ కుటుంబాల దర్శనమిస్తున్నాయి. ఎదిగొచ్చిన కన్న కొడుకు కిడ్నీ వ్యాధితో కళ్లేదుటే కూలిపోతుంటే భరించలేని ఆ తల్లిదండ్రులు, భారీగా అప్పులు చేసి ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు. ఆ కుటుంబాలను ఒకసారి పలకరిస్తే... – ఇచ్ఛాపురం రూరల్ ఇల్లు అమ్మేశాం భర్తే సర్వస్వంగా భావించి తన ఐదో తనాన్ని కాపాడుకునేందుకు నీడనిచ్చే ఇంటిని అమ్మేసి అతడిని రక్షించుకునే పనిలో పడింది ఈ ఇల్లాలు. ఇచ్ఛాపురం మండలం నీలాపపుట్టుగ గ్రామానికి చెందిన కోనేటి తులసీరావు, దమయంతి దంపతులకు పిల్లలు లేకపోవడంతో ఒకరి కొకరు కంటి పాపల్లా బతుకుతున్నారు. విసనకర్రలు తయారు చేస్తూ ఊరూరా తిరిగి అమ్ముతూ, వచ్చే ఆదాయంతో కడుపునింపుకునేవారు. అయితే ఈ దంపతులపై కిడ్నీ భూతం పంజా విసిరింది. ఐదేళ్ల క్రితం కిడ్నీ వ్యాధికి గురైన తులసీరావును రక్షించుకునేందుకు శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో భర్తను చేరి్పంచింది. ఖరీదైన వైద్యం కోసం భార్య దమయంతి రెండు ఇళ్లను అమ్మేసింది. 8 నెలలు నుంచి వ్యాధి మరింత తీవ్రరూపం దాల్చడంతో ప్రస్తుతం కవిటిలో డయాలసిస్ చేయిస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న అరకొర మందులతో ఇబ్బంది పడుతున్న భర్త బాధను చూడలేక ప్రస్తుతం తాము నివసిస్తున్న ఇంటిని సైతం తాకట్టుపెట్టింది. రోజుకు పది విసనకర్రలు తయారు చేసి అమ్మితే రూ.100లు వస్తుందని, అయితే ఆ డబ్బులు మందులకే సరిపోవడం లేదని వాపోతోంది.ఉన్నదంతా వైద్యానికే ఇచ్ఛాపురం మండలం సన్యాసిపుట్టుగ గ్రామానికి చెందిన ఆయన పేరు నందూరి విజయ భూషణ్. ఛండీగడ్‌లో కూలి పనులు చేసుకొని కుటుంబాన్ని పెంచుకుంటూ వస్తున్న దశలో కిడ్నీ మహమ్మారికి గురయ్యాడు. శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ఖరీదైన చికిత్స తీసుకున్నప్పటికీ ఫలితం కనిపించలేదు. రూ.లక్షలు అప్పులు చేసి నెలకు రూ.20 వేలు చొప్పున చెల్లించి ఏడాది పాటు డయాలసిస్ చేయించుకున్నాడు. ప్రస్తుతం కవిటిలో డయాలసిస్ చేయించుకుంటున్నారు. డయాలసిస్‌కు వెళ్లిన ప్రతిసారి కేవలం ఆటో ఖర్చులే రూ.600 వరకు అవుతున్నాయని, ప్రభుత్వం ఇచ్చే పింఛన్ ఆటో ఖర్చులకే అయిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కళ్లముందు అప్పులు కనిపిస్తుంటే తమ కుటుంబ భవిష్యత్తు ఎలా ఉంటుందోననే భయమేస్తోందని విచారం వ్యక్తం చేస్తున్నాడు. మునుపటిలా 108 వాహనం ద్వారా తమను ఆస్పత్రికి తీసుకెళ్లడం, రావడం వంటి సదుపాయాలు కల్పించాలని కోరుతున్నాడు.ఇదీ చదవండి: అప్పుడు వెడ్డింగ్ గౌను, ఇపుడు ఎంగేజ్మెంట్ రింగ్ : సమంత అంత పనిచేసిందా?నాడు భర్త, కొడుకు – నేడు తల్లి కవిటి మండలం బొరివంక గ్రామంలోని హరిజనవాడకు చెందిన ఈమె పేరు బలగ కామాక్షి. భర్త తలయారీగా పనిచేస్తూ పన్నెండేళ్ల కిత్రం మూత్రపిండాల వ్యాధితో మృతి చెందగా, తండ్రి ఉద్యోగాన్ని సంపాదించిన కొడుకు బాలరాజు తల్లితో పాటు భార్య, పిల్లలను సాకుతూ వచ్చాడు. విధి ఆడిన వింత నాటకంలో కొడుకు బాలరాజు సైతం కిడ్నీవ్యాధి బారినపడ్డాడు. కొడుకు వైద్యం కోసం తల్లి అప్పులు చేసినా ఎంతో కాలం బతకలేదు. ఈ పిరిస్థితుల్లో కోడలు పిల్లలను వదిలేసి వెళ్లిపోయింది. దీంతో ఎదిగొచ్చిన పిల్లలను పెంచి పోషించే బాధ్యత కామాక్షిపై పడింది. అప్పులు చేసి పిల్లలకు పెళ్లి చేసిన కామాక్షి, ఇప్పుడు తాను సైతం కిడ్నీ భూతం కబంధ హస్తాల్లో చిక్కుకుంది. నెలకు సుమారు రూ.10 వేలు వరకు వైద్యానికే ఖర్చవుతోందని, ప్రభుత్వం వితంతు పింఛన్ మాత్రమే ఇస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తోంది -
Filter Coffee: ఫిల్టర్ కాఫీ క్రేజ్ అలాంటిది మరి..అందుకే!
ఉదయాన్నే గుక్కెడు కాఫీ కడుపులో పడితే గానీ.. మనసు ప్రశాంతంగా ఉండదు. అసలా ఆ వాసన పీల్చగానే వచ్చే ఫీలింగే చాలా రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. మరి అలాంటి కాఫీ లవర్స్‌కు గుడ్‌న్యూస్. అదేంటంటే..ట్రావెల్ గైడ్ ప్లాట్‌ఫామ్ టేస్ట్ అట్లాస్ ఇటీవల విడుదల చేసిన 'టాప్ 38 కాఫీస్ ఇన్ ది వరల్డ్' జాబితాలో మన ఫిల్టర్ కాఫీ ట్యాప్ ప్లేస్‌లో చోటు దక్కించుకుంది. ప్రపంచ టాప్ 38 కాఫీల జాబితాలో ఫిల్టర్ కాఫీకి రెండో స్థానం దక్కింది. ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల కాఫీ గింజలు, పలురకాల కాఫీలు పలురకాలున్నప్పటికీ ఫిల్టర్ కాఫీ కున్నప్రత్యేకతే వేరు. అందులోనూ భారతీయులు ఇష్టంగా తాగేది మాత్రం ఫిల్టర్ కాఫీనే. మరీ ముఖ్యంగా సౌతిండియాలో ఫిల్టర్ కాఫీకి ఉన్న డిమాండే వేరు.ఫుడ్ అండ్ ట్రావెల్ టావెల్ గైడ్ ప్లాట్‌ఫాం టేస్ట్ అట్లాస్ ఇటీవల విడుదల చేసిన ప్రపంచ టాప్ 38 కాఫీల జాబితాలో మన ఫిల్టర్ కాఫీ రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నది.కాఫీ రుచి,వాసన, కాఫీ తయారీకి ఉపయోగించే సాంప్రదాయ , ప్రత్యేకమైన పద్ధతుల ఆధారంగా ఈ ర్యాంకింగ్‌లను ఇచ్చారు.మొదటి ప్లేస్‌లో క్యూబాకు చెందిన ఎస్ప్రెస్సో నిలిచింది. దీన్ని డార్క్ రోస్టెడ్ గింజలతో కాఫీ కాచేటప్పుడు చక్కెర కలుపుతారు. దీనిని స్టవ్టాప్ ఎస్ప్రెస్సో మేకర్లో లేదా ఎలక్ట్రిక్ ఎస్ప్రెస్సో మెషీన్లో తయారు చేస్తారు. ఇండియన్ ఫిల్టర్ కాఫీని ఇండియన్ కాఫీ ఫిల్టర్ మెషీన్‌ని ఉపయోగించి తయారు చేస్తారు. స్టెయిన్లెస్ స్టీల్ ఫిల్టర్ పైభాగంలో కాఫీ పౌడర్ వేసి, వేడి నీళ్లు పోస్తారు. దీని అడుగు భాగా ఉన్న చిన్న చిన్న రంధ్రాల ద్వారా, చుక్క చుక్కలుగా కింద వున్న మరో గిన్నెలో పడతాయి. దీన్ని పాలతో మరిగించి, చక్కెర కలుపుకొని తాగుతారు.ఘిక మూడు, నాలుగు స్థానాల్లో గ్రీస్‌కు చెందిన రెండు రకాల కాఫీలు చోటు దక్కించుకున్నాయి. ఇటలీకి చెందిన క్యాపచినో ఐదో స్థానంలో, తుర్కియేకు చెందిన టర్కిష్ కాఫీ ఆరోస్థానంలో, ఇటలీకే చెందిన కాఫీ రిస్ట్రెట్టో 7వ స్థానంలో, గ్రీస్‌కు చెందిన ఇంకో రకం ఫ్రాప్పె 8వ స్థానంలో, జర్మనీకి చెందిన ఐస్కాపీ 9వ స్థానంలో నిలువగా.. చివరిగా పదో స్థానంలో వియత్నాంకు చెందిన వియత్నాంకు చెందిన ఐస్డ్ కాఫీ నిలిచింది. -
నాలుగు పదుల వయసులోనూ అంతే అందంగా శ్రియ.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
టాలీవుడ్ హీరోయిన్ శ్రియ శరణ్ (Shriya Saran) ఇప్పటికీ అంతే అందంతో అభిమానులను కట్టిపడేస్తుంది. ఆమె తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల సినిమాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది. శ్రియ ఇష్టం సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో బ్లాక్బాస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. అంతేగాదు ఇప్పటికీ అంతే ఆకర్షణీయమైన లుక్‌తో కుర్ర హీరోయిన్లకు మించిన సౌందర్యం ఆమెది. శ్రియ సినీ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడూ ఎలా ఉందో.. అలానే గ్లామర్‌గా ఉంది. ఆమె అందం రోజురోజుకి పెరుగుతుందే కానీ తగ్గదు అనేలా మాయ చేస్తుంటుంది. అంతే ఫిట్‌గా స్లిమ్‌గా ఉంటుంది. నాలుగు పదుల వయసులోనూ ఇంతలా బాడీ ఎలా మెయింటైన్ చేస్తుందా అని ఆశ్యర్యం కలగకమానదు. మరీ ఆమె హెల్త్, బ్యూటీ సీక్రెట్లేంటో చూద్దామా.. నటి శ్రియ శరణ్ ఒక ఇంటర్వ్యూలో తన ఫిట్నెస్ రహస్యాన్ని షేర్ చేసుకుంది. అదే తన తన బ్యూటీ సీక్రెట అని నవ్వుతూ చెబుతోంది. ఆరోగ్యంగా ఉంటే అందంగా ఉన్నట్లేనని అంటోంది శ్రియ. మన ఆరోగ్యంతో మన సౌందర్యం ముడిపడి ఉంటుందంట. అందుకే తినే భోజనం విషయంలో చాలా కేర్‌ఫుల్‌గా ఉంటానంటోంది. వర్కౌట్ల కంటే కూడా తీసుకునే భోజనం పోషకవంతమైనదైతే ఆటోమేటిగ్గా స్లిమ్‌గా, అందంగా ఉంటామని నమ్మకంగా చెబుతోంది శ్రియ. ఇదేంటి ఆమె చాలా వెరైటీగా మాట్లాడుతుందనుకుంటే.. పొరబడ్డట్టే. ఎందుకంటే చాలామంది నిపుణులు కూడా చాలాసార్లు ఈ విషయాన్నే బలంగా నొక్కి చెప్పారు. డైట్ ఎలా ఉండాలంటే..సమతుల్యతకు ప్రాధాన్యత ఇచ్చే మంచి పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటుందట. నిర్ణిత సమయానికే బోజనం తీసుకునేలా చూసుకుంటుందట. కడుపు నిండిన అనుభూతి కలిగించే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటానని తెలిపింది. తన రోజుని నిమ్మకాయ తేనెలతో కూడిన వాటర్ తీసుకుంటుందట. ఇది జీర్ణక్రియను మెరుగ్గా ఉంచి,బాడీలో ఉండే టాక్సిన్లను బయటకు పంపేస్తుందట. హైడ్రేషన్ తప్పనిసరిగా ప్రాధాన్యత ఇస్తానంటోంది. బ్రేక్‌ఫాస్ట్ కోసం బాదంగింజలు, ఓట్మీల్, గుడ్లులో తెల్లసొనతే వేసిన ఆమ్లేట్ లేదా బెర్రీలు, అరటి పండ్లు తింటుందట. పొద్దపొద్దునే డీప్ ఫైడ్ పదార్థాల జోలికిపోదట. ఇవి జీర్ణక్రియను నెమ్మదించి చురుకుదనం లేకుండా చేస్తాయట. ఇక భోజనంలో పప్పు, రోటీ , సబజీ, కవినోవా, ఉడికించిన కూరగాయలు, కాల్చిన చేప లేదా చికెన్ ఉంటాయట. ఇంట్లో తయారు చేసిన పెరుగుని తీసుకుంటుందట. పెరుగు ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడటమే గాక జీర్ణక్రియ సమస్యలను అదుపులో ఉంచుతుందట. ఇక స్నాక్స్‌గా బిస్కెట్లు లేదా చిప్స్ వంటి జోలికి అస్సలు పోనంటోంది. అందుకోసం దోసకాయ, క్యారెట్ వంటివి ఆస్వాదిస్తా, ఒకవేళ కుదరకపోతే కొంచెం డార్క్ చాక్లెట్ ముక్కతో గ్రీన్ టీ తీసుకుంటానంటోంది. జీవక్రియను చురుగ్గా ఉంచే స్నాకస్ తీసుకుంటే అతిగా తినాలనే కోరిక అదుపులో ఉంటుందటోంది శ్రియ. రాత్రి భోజనం తేలికగా జీర్ణంమయ్యే వాటిని ఎంచుకుంటానంటోంది. కూరగాయలతో తయారు చేసిన సూప్, కిచ్డీ లేదా సలాడ్ తీసుకుంటానంటోంది. అయితే రాత్రి భోజనం సాధ్యమైనంతవరకు సాయంత్రం ఏడున్నరలోపే ఫినిష్ చేస్తుందట. అంతేగాదు రాత్రి సమయాల్లో ఎక్కువ ఆయిల్‌తో కూడిన ఆహారాలను తీసుకోకపోవడమే మేలంటోంది. ఎందుకంటే ఇది జీరణక్రియను మందగింపచేసి, మరసటి రోజు బాడీలోని శక్తిస్థాయిలను ప్రభావితం చేస్తుందట. ఎలాంటి వర్కౌట్లంటే.. చర్మం ఆరోగ్యం, బరువు నిర్వహణకు ఉపకరించేలా నీళ్లను ఎక్కువగా తీసుకుంటుందట. అలాగే యోగా, పైలేట్స్, డ్యాన్స్ వంటివి తన దినచర్యలో భాగమని అంటోంది. హెల్తీగా ఉండటం అంటే..ఫిట్‌గా ఉండటం అంటే ఆహారాలను దూరం చేసుకోవడం అని కాదు. ఆరోగ్యకరమైన వాటిని చేర్చుకోవడం అని భావిస్తే..బరువు నిర్వహించడం తేలిక అవుతుంది. అలాగే కడుపు నిండిన అనుభూతినిచ్చేలా ఆరోగ్యకరమైన ఫుడ్స్ తీసుకుంటే నోరు కట్టేసుకున్నామనే ఫీల్ కలగదు. పైగా శరీరానికి కావాల్సిన విటమిన్లు, ఖనిజాలు అందుతాయి. శ్రమ లేకుండానే మంచి పోషకాహారాలతో హెల్తీగా, నాజుగ్గా ఉండొచ్చని చెబుతోంది అందాల శ్రియ. (చదవండి: మానసిక ఒత్తిడి..శారీరక సమస్యలు..!) -
అప్పుడు వెడ్డింగ్ గౌను, ఇపుడు ఎంగేజ్మెంట్ రింగ్ : సమంత అంత పనిచేసిందా?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతా రూత్ ప్రభు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నటుడు నాగచైతన్యతో వివాహం, విడాకులు తరువాత, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోంది. సినీ పరిశ్రమలో అందం, ప్రతిభతో తానేంటో నిరూపించుకుంటూ స్టార్ హీరోయిన్గా అభిమానుల మనసుల్లో తన చోటును సుస్థిరం చేసుకుంది. తాజాగా సమంతాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అదేంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.సమంత నిశ్చితార్థ ఉంగరాన్ని సరికొత్తగా మార్చేసినట్టు తెలుస్తోంది. తన ఎంగేజ్మెంట్ రింగ్‌ను లాకెట్టుగా మార్చేసిందని తాజా నివేదికల సమాచారం. ఈ మేరకు సూరత్‌కు చెందిన ఆభరణాల డిజైనర్ ధ్రుమిత్ మెరులియా అంచనాలు వైరల్‌గా మారాయి. నాలుగు సంవత్సరాల వివాహం తర్వాత, ఈ జంట 2021 లో విడాకులు తీసుకుంది. విడాకుల తీసుకున్న ఇన్నేళ్లకు ఇపుడు సమంత తన డైమండ్ రింగ్‌ను లాకెట్టుగా మార్చుకుంది. 3 క్యారెట్ల ప్రిన్సెస్-కట్ డైమండ్ రింగ్‌ను లాకెట్‌గా ఎలా మార్చుకుందో వివరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేశాడు. దీన్ని క్రమం తప్పకుండా ధరిస్తోందని, ఇది ప్రస్తుత ట్రెండ్ అంటూ పేర్కొన్నాడు. అయితే దీనిపై ఎలాంటి ధృవీకరణ లేనప్పటికీ ధ్రుమిత్ మెరులియా ఊహ మాత్రమే అయినప్పటికీ, ఇది ఫ్యాన్స్ మరియు, నెటిజనులను మనసులను కదిలించింది. View this post on Instagram A post shared by Dhrumit Merulia (@dhrumitmerulia) కాగా 2024లో, సమంత తన వెడ్డింగ్ గౌను అవార్డుల వేడుక కోసం కొత్తగా డిజైన్ చేయించుకుంది. వైట్ వెడ్డింగ్ గౌనును నల్లటి సాసీ గౌనుగా మార్చి ఫ్యాషన్ డిజైనర్ క్రేషా బజాజ్ దీనికి న్యూలుక్‌ను తీసుకురావడం విశేషం. దీంతో అభిమానులు దీనిని 'రివెంజ్ డ్రెస్' అని కూడా ట్యాగ్ చేశారు. ఈ డ్రెస్ ఫోటోలను కూడా సమంత ఇన్‌స్టాలో పంచుకుంది. గౌను ధరించిన చిత్రాలను పంచుకుంది. మన భూమాత రక్షణ కోసం, తన జీవన శైలిని సస్టైనబుల్‌గా మార్చుకుంటున్నట్టు వెల్లడించింది. ఈ క్రమంలో మనం తీసుకునే ప్రతీ చిన్న నిర్ణయాత్మక చర్య చాలా ముఖ్యం.అందరూ దీన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను అంటూ పేర్కొంది. అంతేకాదు విడాకుల తర్వాత, సాధారణంగా ఒక అమ్మాయి 'సెకండ్ హ్యాండ్', 'ఆమె జీవితం వృధా అయింది' లాంటి ముద్రలు వేస్తారు. ఇది ఆమెకు, ఆమె కుటుంబానికి కూడా చాలా ఇబ్బంది. ఇక అంతా అయిపోయినట్టు, విఫలమై నట్లు భావిస్తారు. ఇది తనకు చాలా బాధపెట్టిందని, కానీ తాను విడాకులు తీసుకున్నాననే వాస్తవాన్ని జీర్ణించుకుంటున్నట్టు చెప్పింది. అలాగే తన పెళ్లి గౌనును మార్చుకోవడం అనేది ప్రతీకారం కోసం ఎంతమంత్రం కాదని, తన బలానికి అదొక చిహ్నమని సమంతా స్పష్టం చేసింది. చదవండి: Amrutha Pranay Case Verdict : పీవోడబ్ల్యూ సంధ్య స్పందన ఇదే!…సమంతతో విడాకుల తరువాత నాగ చైతన్య డిసెంబర్ 2024లో నటి శోభిత ధూళిపాళను వివాహం చేసుకున్నాడు. అలాగే సమత ది ఫ్యామిలీ మ్యాన్ 2 , సిటాడెల్: హనీ బన్నీ లాంటి సిరీస్‌లతో కలిసి పనిచేసిన రాజ్ & డీకే ద్వయంలో ఒకరైన రాజ్ నిడిమోరుతో డేటింగ్ చేస్తోందన్న పుకార్లు బాగా వినిపిస్తున్నాయి. -
మహిళలు.. మహారాణులు..!
మహిళలు.. మహారాణులు.. అన్నమాట అక్షరాల నిజం కానుంది. అతివలను కోటీశ్వరులను చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంలో మరో ముందుడుగు పడింది. ప్రభుత్వం ప్రోత్సహిస్తే.. మరింతగా ఎదుగుతామని ధీమాగా ఉన్నారు. ప్రభుత్వం అందజేసిన ఆర్టీసీ బస్సుల ద్వారా సమకూరే ఆదాయంతో మరిన్ని కొత్త స్టార్టప్‌లు, వ్యాపారాలు మొదలుపెడతామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా 20కి పైగా మండల మహిళా సమాఖ్యలకు బస్సులను అందజేసింది. ఇందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినవే ఐదు సమాఖ్యలు ఉండటం గమనార్హం. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం శ్రీ చైతన్య సమాఖ్య, కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఉదయలక్ష్మి సమాఖ్య, సైదాపూర్ మండలం సంతోషిమాత సమాఖ్య, పెద్దపల్లి జిల్లా ముత్తారానికి చెందిన రుద్రమ సమాఖ్య, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన అభ్యుదయ సమాఖ్యలు తొలివిడతలో బస్సులు పొందాయి. ఉమ్మడి జిల్లాకు 47 బస్సులు..వాస్తవానికి రాష్ట్రవ్యాప్తంగా 150 మండల మహిళాసమాఖ్యలకు ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు ఇచ్చేందుకు ఎంపిక చేసింది. అందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు 47 బస్సులు కేటాయించింది. పెద్దపల్లి జిల్లాలో 9, రాజన్న సిరిసిల్లలో 9, కరీంనగర్ 14, జగిత్యాల 15 సమాఖ్యలు ఉన్నాయి. నేషనల్ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్ (ఎన్.ఆర్.ఎల్.ఎం) పథకంలో భాగంగా కేంద్రం మహిళా సమాఖ్యలకు ఆర్థిక సాయం చేయనుంది. ఈ మేరకు రూ.30 లక్షలు ఈపథకం ద్వారా, మహిళా సమాఖ్య నిధుల నుంచి మరో రూ.6 లక్షలు కలిపి మొత్తం రూ.36 లక్షలు వెచ్చించి ఆర్టీసీ (పల్లె వెలుగు) బస్సులు కొంటారు. 47 బస్సులకు కలిపి రూ.14.10 కోట్ల వరకు నిధులను ప్రభుత్వం మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ బస్సుల ఆర్సీ బుక్‌లో మహిళా సమాఖ్య పేరు మీదే రిజిస్ట్రేషన్ చూపిస్తారు. సమాఖ్యలతో జరిగిన ఒప్పంద మేరకు నిర్వహణ అంతా ఆర్టీసీ చూసుకుంటుంది. ఏడేళ్లపాటు నెలనెలా రూ. 77,220 చొప్పున మొత్తం రూ.64 లక్షలవరకు ఆయా సమాఖ్యలకు ఆర్టీసీ చెల్లిస్తుంది. ఇది ఇటు ఆర్టీసీకి, అటు మహిళా సమాఖ్యలకు లాభదాయకంగా ఉండనుంది.సోలార్‌ప్లాంట్ ఆలోచనలో ఉన్నాంప్రభుత్వం బస్సులివ్వడం ఊహించలేదు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం, చెల్లించడమే తెలిసిన మాకు ఇది మంచి అవకాశం. నెలనెలా ఆర్టీసీ చెల్లించే డబ్బులతో సొలార్ ప్లాంట్లు పెట్టాలన్న ఆలోచనలో ఉన్నాం. ఇప్పటికే స్థలాలు పరిశీలిస్తున్నాం. సమాఖ్యను ఆర్థికంగా మరింత పరిపుష్టం చేస్తాం. మంత్రి పొన్నం ప్రభాకర్, సెర్ఫ్ సీఈవో దివ్యదేవరాజన్లకు ధన్యవాదాలు.– హరిణి, ఉదయలక్ష్మి సమాఖ్య, చిగురుమామిడిప్రభుత్వానికి రుణపడి ఉంటాం మా సమాఖ్యకు బస్సు రావడం సంతోషకరం. మా మీద నమ్మకంతో బస్సు కేటాయించిన ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. నెలానెలా బస్సుల ద్వారా వచ్చే ఆదాయంతో కొత్త వ్యాపారాలు మొదలు పెడుతాం. మరిన్ని విజయాలు సాధించడమే లక్ష్యంగా ముందుకెళతాం.సరిత, శ్రీచైతన్య మండల సమాఖ్య, ధర్మపురిఆర్థికాభివృద్ధికి వినియోగిస్తాం ప్రభుత్వం మా సంఘానికి కేటాయించిన ఆర్టీసీ బస్సు ద్వారా వచ్చే రూ.77 వేల ఆదాయాన్ని సంఘ సభ్యుల ఆరి్థకాభివృద్ధికి ఉపయోగిస్తాం. ఆదాయ మార్గాలను అన్వేíÙంచి, కొత్త వ్యాపారం కోసం త్వరలో నిర్ణయం తీసుకుంటాం. సంఘ సభ్యులంతా సమావేశమై సమష్టిగా చర్చిస్తాం. – గుర్రాల మహేశ్వరి, అధ్యక్షురాలు, రుద్రమ మండల సమాఖ్య, ముత్తారంబస్సు రావడం సంతోషంగా ఉందిమా మండల సమాఖ్యకు బస్సు రావడం సంతోషంగా ఉంది. రాజన్నసిరిసిల్ల జిల్లాలో మొదటి బస్సు మాకే ఇచ్చారు. మండల సమాఖ్య సమావేశం నిర్వహించి, ఆ మీటింగ్‌లో బస్సు నిర్వహణ ఖర్చుల విషయం, మాకు వచ్చే ఆదాయం చర్చించి ఏం చేయాలి అనే విషయాన్ని నిర్ణయించుకుంటాం. మా సంఘంపై నమ్మకంతో బస్సును అందించినందుకు ధన్యవాదాలు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు బస్సును అందించి బాసటగా నిలిచారు.– పంచెరుపుల విజయ, అభ్యుదయ మహిళా సంఘం అధ్యక్షురాలు, జయవరం -
మానసిక ఒత్తిడి..శారీరక సమస్యలు..!
ఒత్తిడి ఉంటేనే కొన్ని పనులు పూర్తవుతాయని కొందరి అభిప్రాయం. కానీ అది మితిమీరితే వచ్చే దుష్పరిణామాలు అన్నీ ఇన్నీ కావు. ఆ కాసేపు ఒత్తిడిని భరిస్తే సరిపోతుంది కదా అని సరిపెట్టుకోవాలనుకునేవారు మరికొందరు. కానీ అప్పటి ఒత్తిడి... ఆ అనంతరం కాలంలోనూ తన దుష్ప్రభావాలను చూపుతుంది. అంతేకాదు... మానసిక ఒత్తిడి అన్నది అలా చాలాకాలం పాటు అలా కొనసాగుతుంటే అది శారీరకంగా కూడా అనేక సమస్యలను... ముఖ్యంగా అనేక ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. మానసిక ఒత్తిడి తెచ్చిపెట్టే అనేక శారీరక సమస్యలూ, వ్యాధుల గురించి తెలుసుకుందాం. ఒత్తిడి ఎప్పుడూ తాత్కాలికం కాదు. దాని వల్ల శరీరంలో అనేక ప్రతికూలమైన మార్పులు వస్తాయి. అన్నిటికంటే ముందు ప్రభావితమయ్యేది మన వ్యాధి నిరోధక వ్యవస్థ. దాంతో అది అనేక జబ్బులకూ, శారీరక సమస్యలకు తావిస్తుంది. ఫలితంగా ఎన్నిరకాల వ్యాధులు వస్తాయో చూద్దాం. ప్రధాన ప్రభావం...వ్యాధి నిరోధక వ్యవస్థపైనే! మామూలుగా ఎవరికైనా ఎక్కడైనా గాయమైనప్పుడు అక్కడ ఇన్ఫ్లమేషన్ రావడం (వాపు వచ్చి ఎర్రబారి మంటగా అనిపించడం) మామూలే. సాధారణంగా దేహంలో ఎక్కడ గాయమైనప్పటికీ ఇలా జరుగుతుంది. గాయాన్ని మానేలా చేయడమనే ప్రక్రియలో వ్యాధి నిరోధక వ్యవస్థ ద్వారా కార్యకలాపాలు వల్ల ఇలా వాపు, మంట రావడమనేవి సహజంగా జరుగుతాయి. ఆ తర్వాత అవి మెల్లగా తగ్గిపోతాయి. అయితే ఎవరిలోనైనా అపరిమితమైన ఒత్తిడి ఉన్నప్పుడు ఇన్ఫ్లమేషన్ మానడం అనేది బాగా ఆలస్యమవుతుంది. ఈ విషయం కార్నెగీ మెలాన్ యూనివర్సిటీకి చెందిన షెల్డన్ కోహెన్ అనే అధ్యయనవేత్త ఆధ్వర్యంలో జరిగిన అధ్యయన ఫలితాల ద్వారా స్పష్టంగా వెల్లడయ్యింది. ఈ అధ్యయన ఫలితాలు నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ తాలూకు మార్గదర్శకాల్లో చోటుచేసుకున్నాయి కూడా. ఒత్తిడి అన్నది శరీరంపై ఎలా దుష్ప్రభావం చూపుతుందన్న విషయం మొదటిసారిగా స్పష్టమైన తార్కాణాలతో వెలుగుచూసింది. నిజానికి ఎవరిలోనైనా ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు కార్టిజోల్ అనే హార్మోన్ విడుదలై, అది వ్యాధి నిరోధక అంశాలను ప్రేరేపిస్తుంది. దాంతో ఆ నిరోధక అంశాలు మెల్లగా ఇన్ఫ్లమేషన్ను నియంత్రిస్తాయి. దాంతో ఇన్ఫ్లమేషన్ త్వరగా తగ్గిపోవాలి. కానీ అదేపనిగా చాలాకాలం పాటు ఒత్తిడి కొనసాగుతూపోతూ ఉంటే ఆ కారణంగా వ్యాధి నిరోధక అంశాలు కార్టిజోల్ వల్ల సరిగా ప్రేరణ చెందవు. ఫలితంగా ఇన్ఫ్లమేషన్ తగ్గదు. ఇది మాత్రమే కాకుండా... ఇంకొన్ని ఉదాహరణల ద్వారా కూడా ఈ థియరీ వాస్తవమని తేలింది. సాధారణంగా ఎవరికైనా జలుబు వస్తే, ఒకటి రెండు రోజుల్లో అది దానంతట అదే తగ్గుతుంది. కానీ దీర్ఘకాలం ΄ాటు ఒత్తిడికి గురయ్యే వారిలో జలుబు తగ్గడానికి చాలాకాలం పడుతుంది. ఒత్తిడి ప్రభావం కారణంగా వ్యాధినిరోధక అంశాలపై ప్రతికూల ప్రభావాలు పడటమే ఇందుకు కారణం. ఇలా చూసినప్పుడు మానసికమైన ఒత్తిడి కేవలం మానసికంగానే కాకుండా అది శారీరక సమస్యలైన స్థూలకాయం వంటి వాటిని తెచ్చిపెడుతుంది. ఇలా ఒక్క బరువు పెరగడమనే కారణమే కీళ్లనొప్పులూ వంటి ఇంకా ఎన్నో సమస్యలకు దారితీస్తుందన్న విషయం తెలిసిందే. అంతేకాదు... గుండెజబ్బులు, డయాబెటిస్, జీర్ణకోశ సమస్యలు, డిప్రెషన్, ఆస్తమా, అలై్జమర్స్ వంటి వ్యాధులకు దారితీస్తుందని పరిశోధకులు స్పష్టంగా తెలుసుకున్నారు.ఒత్తిడి ఉన్నట్లు గుర్తించడమిలా...కొందరు వ్యక్తులు నిత్యం ఒత్తిడికి గురవుతున్నప్పుడు వాళ్లలో తీవ్రమైన ఒత్తిడి ఉన్న విషయమే వారికి తెలియక΄ోవచ్చు. కానీ కొన్ని శారీరక లక్షణాలతో వారు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్న విషయం తెలుస్తుంది. ఆ లక్షణాలివి.. ఆకలి లేకపోవడం బాగా ఆలస్యంగా నిద్రపట్టడం లేదా అస్సలు నిద్రపట్టకపోవడం (నిద్రలేమి) మాటిమాటికీ తలనొప్పి వస్తుండటం తరచూ కండరాలు పట్టేస్తుండటం (మజిల్ క్రాంప్స్) తరచూ గ్యాస్, కడుపులో మంట వంటి జీర్ణకోశ సమస్యలు ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఇవి చాలా సాధారణంగా కనిపించేవే కదా అని నిర్లక్ష్యం చేయకూడదు.ఆస్తమా : తీవ్రమైన ఒత్తిడి ఊపిరి అందకుండా చేసే ఆస్తమాను ప్రేరేపిస్తుందని వైద్య పరిశోధనల్లో అనేక సార్లు వెల్లడైంది. ఇలా జరగడాన్ని సైకలాజికల్ ఇండ్యూస్డ్ ఆస్తమా అంటారు. నిజానికి పెద్దల్లో ఒత్తిడి కలగడం వల్ల అది వాళ్లకు మాత్రమే పరిమితం కాదు... తల్లిదండ్రుల ఒత్తిడి చూసి, పిల్లలూ తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు. దాంతో అది వారి చిన్నపిల్లల్లోనూ ప్రతికూల ప్రభావం చూపి, ఆ చిన్నారుల్లోనూ ఆస్తమా రూపంలో వ్యక్తమయ్యే అవకాశమున్నట్లు అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. తీవ్రమైన ఒత్తిడి అనుభవిస్తున్న గర్భవతులనూ, అలాగే తీవ్రమైన కాలుష్యం నెలకొని ఉన్న పరిసరాల్లో నివసిస్తున్న ఇంకొందరిని ఒక అధ్యయనం కోసం ఎంపిక చేశారు. ఈ అధ్యయన ఫలితాలు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేలా ఉన్నాయి. నిజానికి కాలుష్యపు పొగకు గురైన గర్భిణులకు పుట్టిన సంతానం కంటే... తీవ్రమైన ఒత్తిడికి లోనైన గర్భవతులకు పుట్టిన పిల్లల్లో చాలా మందికి ఆ తర్వాతికాలంలో ఆస్తమా వస్తుండటం పరిశోధకలను అబ్బుర పరిచింది. అంటే కాలుష్య ప్రభావం కంటే తీవ్రమైన ఒత్తిడి తాలూకు ప్రతికూల ప్రభావాలే ఎక్కువనేది గత కొంతకాలం కిందట తెలిసి వచ్చిన వాస్తవం.గుండెజబ్బులు : తీవ్రమైన ఆవేశానికి లోనైనవాళ్లు గుండెపట్టుకుని కుప్పకూలిపోతుండటం సినిమాల్లో చాలా తరచుగా చూసే దృశ్యం. అయితే అది పూర్తిగా సత్యదూరం కాదంటున్నారు పరిశోధకులు. ఏవైనా సమస్యల ఒత్తిడి కారణంగా గట్టిగా అరుస్తుండేవాళ్లు, త్వరగా వాదనల్లోకి దిగేవాళ్లు, త్వరగా కోపగించుకునేవాళ్లలో అనేక మంది ఆ ఒత్తిడి తాలుకు దుష్ప్రభావానికి లోనై గుండె జబ్బులు తెచ్చుకుంటారనేది నిపుణుల మాట. ఒత్తిడి తాలూకు ప్రతికూల ఫలితాలు గుండెజబ్బుల రూపంలో వ్యక్తమవుతుంటాయంటున్నారు కొందరు పరిశోధకులు. గుండెజబ్బులు ఉన్నవారిలో చాలామందిని పరిశీలించి, వారిపై అధ్యయనాలు నిర్వహించినప్పుడు వాళ్లలో నిత్యం భావోద్వేగాలకు లోనయ్యేవాళ్లూ, త్వరగా కోపం వచ్చేవారే ఎక్కువగా ఉంటారని ఆ అధ్యయన ఫలితాల్లో తేలింది. అలా ఒత్తిడికి గురయ్యేవారిలో దీర్ఘకాలిక గుండెజబ్బులు వస్తుండటంతోపాటు అవే ఒక్కోసారి గుండెపోటుకు దారితీస్తాయంటున్నారు అధ్యయనవేత్తలు, గుండెజబ్బుల నిపుణులు. స్థూలకాయం: శరీరంలోని మిగతా భాగాలతో పోలిస్తే... సాధారణంగా పోట్ట, తొడలు, పృష్టభాగం(హిప్స్) వంటి భాగాల్లోనే కొవ్వు ఎక్కువగా పేరుకుంటుంది. వీటన్నింటిలో తొడలు, పృష్టభాగంలో పేరుకునే కొవ్వు కంటే... పోట్టలో పేరుకునే కొవ్వు వల్ల తీవ్రమైన హాని కలుగుతుందంటున్నారు నిపుణులు. అయితే ఇలా పొట్టభాగంలో కొవ్వు పేరుకోవడమన్నది... ఒత్తిడి అనుభవించే వారిలోనే ఎక్కువగా జరుగుతుందని స్పష్టమైందని అధ్యయనవేత్తలు వెల్లడిస్తున్నారు. మామూలుగా ఇతర చోట్లలో కొవ్వు పేరుకునేవారికంటే పొట్టలో కొవ్వు పేరుకోవడం వల్ల (ఆబ్డామినల్ ఒబేసిటీ) వల్ల ఎక్కువగా హాని జరుగుతుందని తేలడం వల్ల... ఒత్తిడి అనేది మొదట పోట్టభాగంలో కొవ్వు ఎక్కువగా పేరుకునేందుకు దారితీయడంతోపాటు ఆ తర్వాత అది గుండెజబ్బుల వంటి వాటి ద్వారా తీవ్రమైన హానిచేస్తుందని అనేక పరిశోధనల్లో తేలింది. అధిగమించడం మేలు...అది చేయాల్సిందిలా...మానసిక ఒత్తిడి వల్ల కలిగే శారీరకంగానూ సమస్యలు ఎదురవుతాయని గుర్తించినప్పుడు చేయాల్సిందల్లా ఆ సమస్యను అధిగమించడానికీ లేదా నియంత్రించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. దీనివల్ల చాలా ప్రయోజనాలే ఉంటాయని తేలింది.ఉదాహరణకు మొదటిసారి గుండెపోటుకు గురైనవారు, ఒత్తిడిని బాగా నియంత్రించుకోగలిగితే 74 శాతం మందిలో రెండో స్ట్రోక్ రాకుండా నివారించుకోగలగడం సాధ్యమేనని కొన్ని అధ్యయనాల్లో తేలింది. పైగా ఇలా ఒత్తిడి నియంత్రణ కారణంగా వ్యాధి నిరోధకశక్తి కూడా పెరిగి అది కూడా జబ్బులను దూరం చేస్తుందని నిరూపితమైంది. ఒత్తిడిని అధిగమించడానికి అనుసరించాల్సిన మార్గాలివి... ఏ కారణంగా ఒత్తిడి కలుగుతుందో గుర్తించి, దాని నుంచి దూరంగా ఉండటం. ఉదాహరణకు ఒక వృత్తి వల్ల ఒత్తిడి పెరుగుతుందని గుర్తిస్తే, ఒకవేళ ప్రొఫెషన్‌ను పూర్తిగా మార్చుకునే అవకాశం ఉంటే దాన్ని మార్చుకోవడమే మేలు. అలా మార్చుకునే అవకాశం లేక΄ోతే ఒత్తిడిని అధిగమించడానికి కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించడం అవసరం. అవి... బ్రీతింగ్ వ్యాయామాలు చేయాలి. దాంతోపాటు యోగా వంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ అవలంబించాలి ∙ఏదైనా అంశం తీవ్రంగా బాధపెడుతుండటం లేదా పదే పదే గుర్తుకొస్తూ పశ్చాత్తాపానికి గురిచేస్తుంటే మరో వ్యాపకంలో పడిపోయి దాన్ని మరచిపోయి, ఒత్తిడి నుంచి విముక్తం కావడానికి ప్రయత్నించడం పరిస్థితులను సానుకూల దృక్పథంతో చూడాలి. సమస్యలను అధిగమించాల్సిన పరిస్థితుల్లో ఏ మార్గం ద్వారా వాటిని పరిష్కరించుకోవచ్చో తెలుసుకోవాలి. లేదంటే ఆ పరిస్థితిని అధిగమించడానికి తోడ్పడే నిపుణులను సంప్రదించాలి దేహానికి అవసరమైన వ్యాయామాలు చేయాలి. దీని వల్ల మెదడులో దేహాన్ని రిలాక్స్ చేసే, ఆహ్లాదంగా ఉంచే రసాయనాలు విడుదలవుతాయి. ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇవేవీ పనిచేయనప్పుడు అవసరమైతే వృత్తినిపుణులైన సైకాలజిస్టులు, కౌన్సెలర్స్‌ను సంప్రదించాలి.డయాబెటిస్ : తీవ్రమైన మానసిక ఒత్తిడి డయాబెటిస్‌కు దారితీయవచ్చన్న విషయం అందరికీ తెలిసిందే. మళ్లీ ఇది రెండు రకాలుగా బాధిస్తుంది. డయాబెటిస్ కారణంగా పెరిగే ఆకలి వల్ల అప్పటికప్పుడు దొరికే... తినడానికి ఆరోగ్యకరం కాని ఆహార పదార్థాలైన వేపుళ్లు, నిల్వ పదార్థాలూ, బేకరీ ఐటమ్స్ తినేలా చేస్తుంది. ఇవి తిన్న తర్వాత మళ్లీ రక్తంలో గ్లూకోజ్ మోతాదులు పెరగడంతో బాధితులు అనారోగ్యానికి గురవుతారు. డయాబెటిస్ కారణంగా ఇదొక సైకిల్లా సాగుతూ అనారోగ్యానికీ, చక్కెర పెరుగుదలకూ దారితీస్తుంది.వయసు త్వరగా పైబడటం : ఒత్తిడి వల్ల వయసు పైడాల్సిన సమయం కంటే ముందే వృద్ధులై΄ోయే మరో దుష్పరిణామానికి అవకాశముంది. తల్లుల, పిల్లల డీఎన్ఏలను పరిశీలిస్తూ జరిగిన ఒక అధ్యయనంలో ఈ ఫలితాలు స్పష్టమయ్యాయి. ఒత్తిడికి గురైన వారు, వారి తల్లిదండ్రులతో పోలిస్తే మీరే త్వరగా వృద్ధాప్య దశకు చేరుకున్నట్లు ఆ అధ్యయన ఫలితాలు పేర్కొంటున్నాయి. నిర్దిష్టంగా చె΄్పాలంటే తీవ్రమైన ఒత్తిడితో బాధపడుతున్న కొందరు ఆ వయసుకు కనపడాల్సిన లక్షణాలను చాలా త్వరగా అంటే... 9 నుంచి 17 ఏళ్ల ముందుగానే కనబరుస్తున్నట్లు ఆ అధ్యయన ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.అల్జిమర్స్ డిసీజ్ : ఒత్తిడి వల్ల మెదడులో కలిగే గాయాలు తీవ్రమై అలై్జమర్స్ డిసీజ్‌కు దారితీస్తుందని కొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఒత్తిడి వల్ల అలై్జమర్స్ డిసీజ్ తీవ్రం కావడంతో ΄ాటు దానివల్ల వచ్చే మరుపు మరింత వేగవంతం కావడం చాలా త్వరత్వరగా జరుగుతుంది. అంటే ఒత్తిడి లేనివారిలో అలై్జమర్స్ డిసీజ్ కాస్త ఆలస్యమైతే... ఒత్తిడి వల్ల అది రావాల్సిన సమయం కంటే ముందుగా వచ్చే అవకాశాలూ ఉన్నాయని స్పష్టమవుతోంది.చాలా ముందుగా మరణించడం (ప్రీ–మెచ్యుర్ డెత్) : ఒకరి ఆరోగ్య పరిస్థితిని బట్టి వారిలో మరణం ఎప్పుడు సంభవించవచ్చో కొంతమేరకు అంచనా వేయడం చాలా సాధారణ ప్రజలు కూడా చేస్తుంటారు. ఉదాహరణకు ‘ఆయన ఇప్పుడే చనిపోవాల్సిన వ్యక్తి కాదు. ఇంకా చిన్నవయసు’ లాంటి వ్యాఖ్యానాలు చేస్తుండటం కొందరి విషయంలో వింటుండటం పరిపాటే. తీవ్రమైన దీర్ఘకాలిక ఒత్తిడికి లోనయ్యేవారిలో మరణం చాలా ముందుగానే వస్తుందని అధ్యయనవేత్తలు హెచ్చరిస్తున్నారు. (చదవండి: ప్రధాని మోదీ స్ఫూర్తితో ‘భారత్ డిష్'..! ఎలాంటి వంటకాలు ఉంటాయంటే..) -
చీరకట్టు.. కనికట్టు : ఎన్ని రకాలో!
చీర.. దాన్ని కట్టుకుంటే వచ్చే అందమే వేరు! దాని ముందు ఎన్ని మోడర్న్ డ్రెస్‌లు అయినా దిగదుడుపే.. అవెంత సౌకర్యాన్నిచ్చినా! అందుకే అందం, అనుకూలత రెండిట్లోనూ అన్నితరాలకూ చీర ఆల్‌టైమ్ ఫేవరెట్ అండ్ ఫ్యాషన్ కాస్ట్యూమ్‌గా మారింది. అలాంటి మన సంప్రదాయ కట్టుకు ప్రాంతానికో తీరు ఉంది. కొన్నిటికి వాటి వెనుక పర్యావరణహితాలు కారణాలైతే కొన్నిటికి వాతావరణ పరిస్థితులు కారణాలుగా కనపడుతున్నాయి. ఇంకొన్నిటికి భౌగోళిక స్వరూపాలు కారణంగా నిలుస్తున్నాయి. కేరళలో కనిపించే ఆఫ్ వైట్ విత్ గోల్డెన్ బార్డర్ శారీ (ముండు)నే తీసుకుంటే.. ఆ ప్యాటర్న్ రంగుల్లో కనిపించదు. కేవలం క్రీమ్ కలర్లోనే కనిపిస్తుంది. కేరళ తీరప్రాంతం కాబట్టి.. రంగుల అద్దకంతో ఆ నీటిని కలుషితం చేసుకోకూడదనే పర్యావరణ స్పృహతో ముండును పర్మినెంట్‌గా క్రీమ్కలర్లో ప్యాక్ చేశారు. కూర్గ్‌కి వెళితే అక్కడ కొడగు కట్టు కనిపిస్తుంది. పశ్చిమ కనుమల్లో ఉన్న కూర్గ్‌ను కన్నడాలో కొడగు అని పిలుస్తారు. కొడగు చీర కట్టులో పమిట కుడివైపు, కుచ్చిళ్లు వెనుకవైపు ఉంటాయి. ఇది హిల్ స్టేషన్ కాబట్టి.. నడవడానికి, రోజూవారి పనులకు సౌకర్యంగా ఉండేందుకే ఇక్కడి స్త్రీలు చీరను అలా కట్టుకుంటారు. తమిళనాడులోని బ్రాహ్మణ స్త్రీలు మడిసర్ చీరకట్టులో కనిపిస్తారు. ఇది తొమ్మిది గజాల చీర. ఇదీ అంతే... రోజూవారీ పనులకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది. తొమ్మిది గజాలంటే గుర్తొచ్చింది.. తెలంగాణలోని కొన్నిప్రాంతాల్లో.. మహారాష్ట్రలోనూ తొమ్మిది గజాల చీరకట్టు కనపడుతుంది. దీనికి గోచీ చీర అనే వ్యవహార నామమూ ఉంది. ఈ చీరకట్టు కనిపించే ప్రాంతంలోని స్త్రీలు (దాదాపుగా) పొలాల్లో పనిచేసేవారే! చేలల్లో దిగి పనిచేయడానికి అనువుగా ఉండేలా ఈ కట్టును కనిపెట్టుకున్నారని శారీ చరిత్రలో కనిపిస్తున్న సాక్ష్యం. గోవాకు వెళితే.. కున్బీ కట్టు కనిపిస్తుంది. ఇది తొమ్మిది గజాల కట్టుకు ఆధునిక రూపం. మూలాలను మరవకుండా ఆధునికతనూ అలంకరించుకోవాలనే ఆసక్తిగల ఆడవాళ్లకు ఇష్టమైన కట్టు కున్బీ. ఇలాంటి వైవిధ్యమైన కట్టులతపాటు దేశం మొత్తమ్మీద 21 రకాల టెక్స్టైల్స్ కూడా ఉన్నాయని, ఇక్కడ కనిపించే రంగులకూ మన ప్రకృతి, పండే పంటలే ప్రేరణ, స్ఫూర్తి అని చెబుతారు రచయిత, హిస్టారియన్, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్, శారీ లవర్ మాళవికా సింగ్. -
Ramadan ఉపవాసాల అసలు లక్ష్యం
పవిత్ర రమజాన్ రాకడతో శుభాల పర్వం మొదలయింది. ముస్లింలు ఎంతో ఉత్సాహంతో ఉపవాస దీక్షలు ప్రారంభించారు. చిన్నపిల్లలు సైతం ‘రోజా’ పాటించడానికి ఉబలాట పడుతున్నారు. దీనికి కారణం ఏమిటి? అసలు ఉపవాసంఎందుకుండాలి? దీనికి స్వయంగా దైవమే, ‘ఉపవాసం వల్ల మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది’ అంటున్నాడు. భయ భక్తులంటే ఏమిటి? మానవుడి మనస్సు దుష్కర్మలపట్ల ఏవగింపును, అసహ్యాన్ని ప్రకటిస్తూ, సత్కర్మల పట్ల అధి కంగా మొగ్గుచూపే స్థితి. ఈ స్థితిని మానవ ఆంతర్యంలో జనింపజేయడమే ఉపవా సాల అసలు ఉద్దేశ్యం. అందుకని ఉపవాసం పాటించేవారు బాహ్య పరిశుభ్రతతోపాటు, అంతశ్శుద్ధిని కూడా పాటించాలి. నోటిని నియంత్రణలో ఉంచుకోవాలి. మాట్లాడే అవసరం లేకపోతే మౌనం పాటించాలి. ఇతరులెవరైనా అకారణంగా రెచ్చగొట్టినా తాము ఉపవాస దీక్ష పాటిస్తున్నామన్న విషయాన్ని మరిచిపోకూడదు. ఈ స్పృహ ఉన్నప్పుడే అన్నిరకాల చెడుల నుండి సురక్షితంగా ఉండే అవకాశం ఉంటుంది. ఉపవాస దీక్ష పాటిస్తున్నప్పటికీ అసత్యం పలకడం, అసత్యాన్ని ఆచరించడం మానుకోనివారు నిజానికి వ్రతం పాటిస్తున్నట్లు కాదు. కేవలం పస్తులుండడంతో సమానం. ఉపవాసదీక్షల పేరుతో ఇలా ఆకలిదప్పు లతో పడి ఉండటం పట్ల దైవానికి ఏమాత్రం ఆసక్తిలేదు. మహ మ్మద్ ప్రవక్త(స) ఇలా చెప్పారు: ‘ఉపవాస దీక్ష పాటించే చాలా మందికి, తమ ఉపవాసాల ద్వారా ఆకలిదప్పుల బాధ తప్ప, మరెలాంటి ప్రయోజనమూ చేకూరదు’. ఉపవాస లక్ష్యం మనిషిని ఆకలిదప్పులతో మాడ్చిఉంచడం కాదు. దైవాదేశ పాలనలో మరింత రాటుదేలే విధంగా తీర్చిదిద్దడం. దైవ విధేయతా పరిధిని ఏమాత్రం అతిక్రమించకుండా, అన్నిరకాల చెడుల నుండి సురక్షితంగా ఉంచడం. పవిత్ర రమజాన్‌లో ఏ విధంగా అన్ని రకాల చెడులకు, అవలక్షణాలకు దూరంగా సత్కార్యాల్లో, దాన ధర్మాల్లో, దైవధ్యానంలో, సమాజ సంక్షేమ కార్యకలాపాల్లో పాల్గొంటారో... అలాగే మిగతా కాలమంతా సమాజంలోశాంతి, న్యాయం, ధర్మం పరిఢవిల్లుతూ జీవితం సాఫీగా గడిచిపోవాలని, పరలోక సాఫల్యం సిద్ధించాలన్నది అసలు ధ్యేయం.– యండి. ఉస్మాన్ ఖాన్ -
సాఫ్ట్వేర్ నుంచి పర్మాకల్చర్లోకి..!
పుట్టిన గడ్డపై ప్రజలు చిన్న వయసులోనే కేన్సర్, లివర్, గుండె జబ్బు వంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడి మృతి చెందటంతో కలవరపాటుకు గురైన ఆమె అమెరికాలో ఆరంకెల సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి ఏడేళ్ల క్రితం పుట్టింటికి తిరిగి వచ్చేశారు. తమ ఏడెకరాల్లో ఐదంచెల ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. యోగా, ప్లాస్టిక్ రహిత జీవన శైలిని తాను ఆచరిరిస్తూ 2017 నుంచి అనేక ఇతర స్వచ్ఛంద సంస్థలతో కలసి ప్రచారోద్యమం చేపట్టారు. ముఖ్యంగా పాఠశాల విద్యార్థుల్లో ఎకోఫ్రెండ్లీ లివింగ్పై శిక్షణ ఇస్తున్నారు. ఆమె పేరు అక్కిన భవానీ.పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం చినతాడేపల్లి భవాని స్వగ్రామం. అమెరికాలో పెద్ద జీతంతో కూడిన సాఫ్ట్వేర్ ఉద్యోగం 17 ఏళ్లకు పైగా చేశారు. తాను పుట్టిన గడ్డ మీద ఆహార, ఆరోగ్య, పర్యావరణ సంక్షోభాన్ని గుర్తించి, ఉద్యోగానికి రాజీనామా చేశారు. మితిమీరిన రసాయనాలతో ఆహారోత్పత్తి చేయటం, ప్లాస్టిక్ వాడకం, అపసవ్యమైన జీవన శైలి మూల కారణాలని గుర్తించారు. అమెరికాలో ఉండగానే ఆమె యోగా నేర్చుకున్నారు. ప్రకృతికి అనుగుణమైన సాధారణ జీవన శైలిని అలవర్చుకున్నారు. మనకు, భూమికి శాశ్వత ప్రయోజనాన్ని కలిగించే పర్మాకల్చర్ వ్యవసాయ పద్ధతిని నేర్చుకున్నారు. గత 50 ఏళ్లుగా పర్మాకల్చర్ను ఆచరిస్తున్న వాషింగ్టన్ (అమెరికా)కు చెందిన మైఖేల్ పిలార్సి్క వద్ద శిక్షణ పొందారు. అనేక దేశాలు పర్యటించి ప్రకృతి వనరుల పరిరక్షణ పద్ధతుల్ని భవాని అధ్యయనం చేయటం విశేషం. భూమి, నీరు, గాలి, అడవి, భూమిపైన జీవరాశిని పరిరక్షించుకోవటం ద్వారా మనిషి ఆరోగ్యంగా జీవించవచ్చని.. ప్లాస్టిక్, రసాయన రహిత ఆరోగ్యదాయకమైన జీవన శైలి, యోగా, ప్రకృతి సేద్యం ఇందుకు దోహదపడతాయని భవాని మనసా వాచా కర్మణా నమ్ముతున్నారు. రసాయనాల్లేని ఆహారోత్పత్తితో పాటు యోగా తదితర కార్యకలాపాల ద్వారా.. శారీరకంగా/ మానసికంగా/ఆధ్యాత్మికంగా ఆరోగ్యదాయకమైన జీవనశైలిని అనుసరించటం అవసరమని నమ్ముతున్నారు. ఈ భావాలను తమ గ్రామం కేంద్రంగా ప్రచారం చేయటమే జీవిత లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం వర్క్‌షాపులు, స్టడీ టూర్లు, ఫామ్ విజిట్లు నిర్వహించటంతో పాటు ‘నర్చర్5’ పేరుతో వెబ్‌సైట్‌ను, యూట్యూబ్ ఛానల్‌ను నిర్వహిస్తున్నారు.స్వగ్రామానికి తిరిగి వచ్చిన తర్వాత 2019లో పాలేకర్ పద్ధతిలో వరి సాగుతో ప్రకృతి సేద్యంప్రారంభించారు. తదనంతరం తమ కుటుంబానికి చెందిన 7 ఎకరాల భూమిలో ఫైవ్ లేయర్ మోడల్లో వక్క ప్రధాన పంటగా పండ్లు, కూరగాయలు, ఔషధ మొక్కలను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేపట్టారు. సేంద్రియ పెరటి తోటల సాగు ద్వారా పోషకాహార స్థాయిని పెంపొందించటం.. పండ్ల తొక్కలతో సేంద్రియ ద్రావణాలు తయారు చేసుకొని వినియోగించటం.. గుడ్డ సంచుల వాడకం.. వంటి అంశాలపై గుంటూరు తదితర ప్రాంత పాఠశాలల్లో విద్యార్థులు, టీచర్లకు శిక్షణ ఇస్తున్నారు. కరోనా సమయంలో జిల్లా అధికారులతో కలసి ఆరోగ్యదాయకమైన జీవన శైలి, యోగా తదితరాలపై ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆహారం, ఆదాయం, ఆరోగ్యం అనే ఫార్ములాతో భవానీ ప్రస్తుతం చినతాడేపల్లిలోని ఏడెకరాల ‘పొలంలో ప్రకృతి బడి’ని నిర్మించే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఆదాయం కోసం వక్క సాగు, ఆహారం కోసం వివిధ రకాల మంచి పండ్లు, ఆరోగ్యం కోసం ఔషధ మొక్కలు ఒకే చోట పెంచే ఫుడ్ ఫారెస్ట్‌ను పెంచుతున్నారు. వక్క ప్రధాన పంటగా నాటారు. మొదట అరటి, ఆ తర్వాత పసుపు అంతర పంటలుగా వేశారు. అక్కడక్కడా మామిడి, లిచీ, రాంభోళా వంటి పండ్ల మొక్కలను నాటారు. వక్క చెట్లపైకి పాకించడానికి రెండు రకాల మిరియం పాదులను పెంచుతున్నారు. ఒక మడిని ఔషధ మొక్కల కోసం కేటాయించారు. కుంకుడు, షికాకాయ్ మొక్కలు కూడా నాటారు. ఔషధ మొక్కలతో తల నూనె, పండ్ల పొడి, ఎండిన పూలతో టీ పొడి, పసుపు తదితర ఉత్పత్తులను స్వయంగా తయారు చేసి విక్రయిస్తున్నారు. క్షేత్రంలో మొక్కలన్నిటికీ డ్రిప్ పద్ధతిలో నీటిని అందిస్తున్నారు. పొలం చుట్టూ రక్షణ కోసం వెదురు, వాక్కాయ మొక్కలను నాటారు. మడినే బడిగా మార్చి బాలలు, యువతకు ప్రకృతి పాఠాలు బోధించాలన్నది ఆమె సంకల్పం. నవతరానికి స్ఫూర్తిని కలిగించే వర్కుషాపుల నిర్వాహణ ఆమెకు ఇష్టం. భవానీ కృషిని గుర్తించిన హైద్రాబాద్‌లోని ‘మేనేజ్’ సంస్థ గత ఏడాది ఉమెన్ అగ్రిప్రెన్యూర్ పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది. జీవితానుభవాలతో ‘జర్నీ ఆఫ్ మై మిస్టేక్స్’ అనే పుస్తకం రాస్తున్నానని ఆమె తెలిపారు. – యడ్లపల్లి మురళీకృష్ణ, తాడేపల్లిగూడెం, పశ్చిమగోదావరి జిల్లా -
సోషల్ మీడియాలో ఇంటిపంటల వైభవం!
సేంద్రియ ఇంటిపంటలు / మిద్దె తోటల సాగు ద్వారా పట్టణాలు, నగరాల్లోని గృహస్తులు తమకు అవసరమైన కూరగాయలు, ఆకుకూరలతో పాటు కొంత వరకు పండ్లను కూడా మేడలపైనే సాగు చేసుకుంటున్నారు. వీరి సంఖ్య తెలుగు రాష్ట్రాల్లో లక్షల్లో ఉంటుంది. గత కొద్ది సంవత్సరాల్లో ఇంటిపంటల సాగు సంస్కృతి ఇబ్బడి ముబ్బడిగా విస్తరించింది. ఇంటిపంటలు / మిద్దె తోట సాగులో ముఖ్య భూమిక మహిళలదే అని చెప్పొచ్చు. అవగాహన పెంచుకొని సంతృప్తికరంగా వంటింటి వ్యర్థాలతో కంపోస్టు ఎరువు తయారు చేసుకొని, ఇంటిపంటల సాగుకు ఆ కంపోస్టును ఉపయోగిస్తున్నారు. తమ కుటుంబం ఆరోగ్యం కోసం సేంద్రియ పంటలను పెంచుతున్న సాగుదారులు వాట్సప్, ఫేస్బుక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌ను సమర్థవంతంగా వినియోగించుకుంటున్నారు. మిద్దె తోటల నిపుణులు, ప్రచారకర్త తుమ్మేటి రఘోత్తమ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని జిల్లాల్లోనూ మిద్దెతోట అనుభవాలను పంచుకోవటానికి, సందేహాలను నివృత్తి చేసుకోవటానికి ఉపయోగపడే ఫేస్బుక్ పేజీలు, యూట్యూబ్ ఛానళ్లు, వాట్సప్ గ్రూపులు ఏర్పాటయ్యాయి. ఆయన తన మిద్దె తోట అనుభవాలను ఫేస్బుక్ వాల్‌పై సంవత్సరాల తరబడి సీరియల్‌గా రాశారు.అంతేకాదు, తోటి మిద్దెతోట సాగుదారులతో కూడా అనుభవాలను రాయించారు. వంద మంది రాసిన అనుభవాలతో రైతునేస్తం ఫౌండేషన్ ద్వారా సంకలనం ప్రచురించటం విశేషం. సుమారు 60కి పైగా వాట్సప్ గ్రూపులను తుమ్మేటి నిర్వహిస్తున్నారు. ఇవి కాకుండా అర్బన్ టెర్రస్ ఫార్మర్స్ చాలా మంది ఎక్కడికక్కడ తమ బంధుమిత్రులతో వాట్సప్ గ్రూప్‌లు లెక్కకు మిక్కిలిగాప్రారంభించారు. మిద్దె తోటల సాగుదారులు యూట్యూబ్ వీడియోలను చూసి ఇతర కిచెన్ గార్డెనర్ల అనుభవాలను తెలుసుకుంటూ తమ కిచెన్ గార్డెనింగ్ నైపుణ్యాలను నిరంతరం పెంపొందించుకుంటున్నారు. కొందరు ఇంటిపంటల సాగుదారులు మరో ఒకడుగు మందుకు వేసి తామే సొంతంగా యూట్యూబ్ ఛానళ్లనుప్రారంభించారు. సీనియర్ మిద్దె తోట సాగుదారు, వాట్సప్ గ్రూప్‌ల నిర్వాహకురాలు లతా కృష్ణమూర్తి అంచనా ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో 411 పైగా యూట్యూబ్ ఛానళ్లు సేంద్రియ మిద్దె తోటలకు సంబంధించిన విషయాలను ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నాయి. మిద్దె తోట సాగుదారులు యూట్యూబర్లుగా మారి విస్తృతంగా వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. వీరిలో కొందరు తమ యూట్యూబ్ ఛానళ్లను మానిటైజ్ చేయటం ద్వారా మంచి ఆదాయాన్ని సైతం పొందుతుండటం విశేషం. ఆర్థిక సాధికారతతో శక్తి వంతంగా ఎదుగుతున్నారుమిద్దెతోటల పెంపకం ద్వారా మహిళలు, ముఖ్యంగా గృహిణులు, ఇంటికే పరిమితం కాకుండా పది మందిలోకి ధైర్యంగా రాగలుగుతున్నారు. కుటుంబ బాధ్యతలు కొంత తీరిన తర్వాత వారికంటూ కొంత సమయం కేటాయించుకుంటున్నారు. అది కుడా మిద్దెతోటల సాగు ద్వారా ఆరోగ్యకరమైన జీవన శైలిని ఎంచుకుంటున్నారు. రసాయన రహిత ఆహారప్రాముఖ్యతను గురించి యూట్యూబ్ వీడియోల ద్వారా అందరికీ తెలియజేస్తూ, ఇంటిపంట సాగుదారుల సంఖ్యను పెంచటంలో తమ వంతు పాత్రను పోషిస్తున్నారు. ఎంతో కొంత ఆదాయాన్ని కూడా పొందుతున్నారు. మరొకరిపై ఆధాపడకుండా ఆర్థిక సాధికారతతో శక్తి వంతంగా ఎదగగలుగుతున్నారు. కొందరు మిద్దెతోటలకు కావలసిన ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. ఇంకొంత మంది మిద్దెతోటలను నిర్మాణంతో పాటు మెయింటెనెన్స్ కూడా చేస్తున్నారు. మిద్దెతోట సాగుదారులుగా, యూట్యూబర్లుగా సాధారణ మహిళలు సాధికారత సాధించడం ఎంతో అభినందించాల్సిన విషయం. మిద్దెతోటల గురించి అవగాహన కల్పించడానికి 411కి పైగా తెలుగు యూట్యూబ్ ఛానెల్స్ రావడం మంచి విషయం. ఇంకా చాలా మంది మిద్దె తోటలు పెంచడానికి ముందుకు రావాలని మహిళా దినోత్సవం సందర్భంగా కోరుకుంటున్నాను.– లతా కృష్ణమూర్తి (94418 03407), సీనియర్ మిద్దెతోట సాగుదారు, హైదరాబాద్– పంతంగి రాంబాబు -
పోలీస్ అక్క భద్రత.. భరోసా
‘అక్క’ అనే మాటలో ఆప్యాయత మాత్రమే కాదు... ‘భద్రత’ను ఇచ్చే ‘భరోసా’ కూడా ఉంటుంది. చిన్నప్పుడు స్కూల్లో తోటిపిల్లలు ఏడిపిస్తుంటే...‘మా అక్కకు చెబుతాను’ అనడం సాధారణం. అవును. అక్క అంటే ఫ్రెండ్ కాని ఫ్రెండ్. ఏ దాపరికాలు లేకుండా మనసులోని మాటను పంచుకునే అమ్మ కాని అమ్మ! ఇంట్లో కుటుంబ సభ్యులు ఉంటారు. వారితో అన్నీ పంచుకుంటారు. ఇంటికి దూరంగా హాస్టల్లో ఉండే ఆడపిల్లలకు తోడెవరు? చుట్టూ ఎంతోమంది ఉన్నా, వారితో అన్ని విషయాలు పంచుకోలేక ‘నేను ఒంటరిని’ అనే భావన ఎటైనా దారితీయవచ్చు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకీ షర్మిల ‘పోలీస్ అక్క’కు ప్రాణం పోసింది.ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలలో విద్యార్థినులు వేధింపులు, దాడులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో చాలామంది అమ్మాయిలు తమలో తామే కుమిలిపోతూ చివరకు ఆత్మహత్య వరకు వెళ్తున్నారు. ఇలాంటివి నివారించడానికి ‘నేనున్నాను’ అంటూ ముందుకు వచ్చింది పోలీసు అక్క.దత్తత తీసుకుంటారు...ఒక్కో మహిళా కానిస్టేబుల్‌కు ఒక్కో విద్యాలయం, వసతిగృహం బాధ్యతను అప్పగించారు. ‘మీరు అక్కడి విద్యార్థులను దత్తత తీసుకున్నట్లు భావించాలి. వారు మీ కుటుంబ సభ్యులే’ అని ఒకటికి రెండుసార్లు చె΄్పారు. ప్రతినెలా ఒకటో శనివారం మహిళా కానిస్టేబుళ్లు తమకు అప్పగించిన గురుకులానికి వెళతారు. ఆ రోజంతా అక్కడే ఉంటూ విద్యార్థినులతో కలిసి భోజనం చేస్తారు. సొంత అక్కలా వారి యోగక్షేమాలు తెలుసుకుంటారు.సైబర్‌క్రైమ్, ఉమెన్ ట్రాఫికింగ్, గుడ్‌టచ్–బ్యాడ్‌టచ్, మహిళల భద్రత, చట్టాలు.. మొదలైన విషయాలపై చర్చిస్తారు. రాత్రిపూట అక్కడే బస చేస్తారు. ప్రస్తుతం 18 పాఠశాలలకు 18 మంది మహిళా కానిస్టేబుళ్లను నియమించారు. వీరి పని తీరును ఎస్పీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు.ఆ బాధ నుంచే...ఎస్పీగా నిర్మల్ జిల్లాలోనే తొలి పోస్టింగ్ తీసుకున్న జానకీ షర్మిలకు ఇక్కడి బాసర ట్రిపుల్ ఐటీలో కొందరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం కలచి వేసింది. విద్యార్థులకు అండగా నిలవడానికి, తనవంతుగా ఏదైనా చేయాలని, వారిలో భరోసా నింపాలనీ అనుకున్నారు. స్వయంప్రతిపత్తి కలిగిన ట్రిపుల్‌ఐటీని మూడునెలల పాటు దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అప్పటినుంచి విద్యార్థులతో మమేకమవుతూ వారి సమస్యల గురించి తెలుసుకుంటూ పరిష్కారంపై దృష్టి పెట్టారు. ప్రతి సీనియర్ ఒక జూనియర్ని గైడ్ చేయాలని సూచించారు. విజేతలుగా నిలిచిన పూర్వ విద్యార్థులు, ట్రెండింగ్ సెలబ్రిటీలు, మోటివేషనల్ స్పీకర్లతో సమావేశాలు, క్రీడాపోటీలు నిర్వహించారు. ఇవి విద్యార్థులలో ఉత్సాహాన్ని నింపాయి. ధైర్యాన్ని ఇచ్చాయి.పెట్రోలింగ్ బాధ్యతలు...తనలాగే మహిళా పోలీసులు ప్రత్యక్ష పోలీసింగ్ చేయాలని ఎస్పీ జానకీ షర్మిల నిర్ణయించారు. మహిళాదినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోనే తొలిసారి మహిళా కానిస్టేబుళ్లకు ప్రత్యక్ష పోలీసింగ్ బాధ్యతలు అప్పగించారు. కేవలం స్టేషన్ లో పనులు చేయడానికి, రిసెప్షనిస్టులుగానే పరిమితమైన ఉమెన్ కానిస్టేబుళ్లు ఇక నుంచి వారానికోసారి పెట్రోలింగ్, డయల్ 100, ఎమర్జెన్సీ, డెయిలీ రూట్ చెకింగ్, వాహనాల తనిఖీలాంటి బాధ్యతలను చేపడతారు. పెట్రోలింగ్‌లో తొలిరోజే సత్తా చాటారు. భైంసా మండలం వట్టోలి గ్రామంలో పేకాట రాయుళ్లను పట్టుకున్నారు. ‘పోలీసులు ప్రజల్లో కలిసిపోయినప్పుడే... ప్రజలకు భరోసా, భద్రత’ అంటారు. ‘పోలీసు అక్క’లాంటి వినూత్నమైన కార్యక్రమాలు ఆ మాటకు బలాన్ని ఇస్తాయి.అందుకే... పోలీస్ అక్కఎక్కడైనా మహిళలకు ఇబ్బందులు, అడ్డంకులు ఉంటూనే ఉంటాయి. చాలామంది మహిళలకు కాస్త భరోసా, కాసింత ్రపోత్సాహం ఇస్తే చాలు దేన్నైనా సాధించగలరు. నిర్మల్ జిల్లాలో ప్రత్యేకంగా విద్యార్థినులకు అండగా నిలవాలనుకున్నాం. ఇందుకోసమే ‘పోలీస్ అక్క’ కార్యక్రమం చేపట్టాం. ఎన్నోఏళ్లుగా స్టేషన్ లకే పరిమితమైన మహిళా కానిస్టేబుళ్లు సైతం తాము పోలీసులం అని గర్వపడేలా ప్రత్యక్ష పోలీసింగ్ చేసేలా డ్యూటీలను అప్పగించాం.– జానకీ షర్మిల, ఎస్పీ, నిర్మల్– రాసం శ్రీధర్, సాక్షి ప్రతినిధి, నిర్మల్ -
స్ట్రోక్ థ్రోంబోలిసిస్, థ్రోంబెక్టమీపై అపోలో హాస్పిటల్స్ సదస్సు
హైదరాబాద్, మార్చి 10, 2025: అపోలో హాస్పిటల్స్ మార్చి 8 ,9, తేదీలలో స్ట్రోక్ థ్రోంబోలిసిస్ అండ్ థ్రోంబెక్టమీపై ఎస్టీఏటీ-2025 సదస్సు విజయవంతంగా నిర్వహించింది. తీవ్రమైన స్ట్రోక్ నిర్వహణలో అత్యాధునిక పురోగతి, వినూత్న ఇమేజింగ్ పద్ధతులు , క్లిష్టమైన విధానపరమైన వ్యూహాలను చర్చించడానికి ప్రముఖ అంతర్జాతీయ , జాతీయ నిపుణులను సమావేశపరిచింది.ఈ సదస్సులను తెలంగాణ డీజీపీ డాక్టర్ జితేందర్, అపోలో హాస్పిటల్స్ తెలంగాణ ప్రాంత సీఈఓ శ్రీ వి తేజస్వి రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ వైద్య నిపుణులు, అపోలో హాస్పిటల్స్ అసోసియేట్ డీఎంఎస్ డాక్టర్ సుబ్బారెడ్డి, అపోలో హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్-న్యూరాలజిస్ట్ డాక్టర్ అలోక్ రంజన్, సీనియర్ కన్సల్టెంట్-న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ హాజరయ్యారు.ప్రారంభోత్సవానికి హాజరైన ప్రఖ్యాత అంతర్జాతీయ వైద్య నిపుణులలో బాసెల్, స్విట్జర్లాండ్ కు చెందిన డాక్టర్ మారియోస్ సైకోగియోస్, బార్సిలోనా, స్పెయిన్‌కు చెందిన డాక్టర్ మార్క్ రిబో, అల్బానీ, న్యూయార్క్, యుఎస్ఏకు చెందిన డాక్టర్ నబీల్ హెరియల్, ఫిలడెల్ఫియా, యుఎస్ఏ కు చెందిన డాక్టర్ రీడ్ గూచ్, ఫిలడెల్ఫియా, యుఎస్ఏ కు చెందిన డాక్టర్ ఉస్మాన్ కోజాక్ మరియు ఇస్తాంబుల్, టర్కీ కు చెందిన డాక్టర్ యిల్మాజ్ ఓనాల్ ఉన్నారు.ఈ సందర్భంగా అపోలో గ్రూప్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్ సంగీత రెడ్డి మాట్లాడుతూ .. ప్రపంచవ్యాప్తంగా వైకల్యం , మరణాలకు ఒక ముఖ్యమైన కారణంగా తీవ్రమైన స్ట్రోక్ నిలుస్తుంది . ఎస్టీఏటీ-2025 వంటి సదస్సులు ప్రపంచ నాయకుల మధ్య విప్లవాత్మక ఆలోచనలు, పద్ధతులు, అనుభవాల మార్పిడిని సులభతరం చేయడం ద్వారా స్ట్రోక్ కేర్‌ను మార్చడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. అపోలో ఆస్పత్రిలో స్ట్రోక్ కేర్‌కు సంబంధించిన అన్నీ రకాల చికిత్సలను అందిస్తున్నట్లు తెలిపారు.అపోలో హాస్పిటల్స్ తెలంగాణ ప్రాంత సీఈఓ శ్రీ వి తేజస్వి రావు మాట్లాడుతూ, "అపోలో హాస్పిటల్స్ వద్ద , ఆవిష్కరణ , నైపుణ్యం ద్వారా తీవ్రమైన స్ట్రోక్ కేర్‌ను ముందుకు తీసుకెళ్లడానికి మేము కట్టుబడి ఉన్నాము. స్ట్రోక్ థ్రోంబోలిసిస్ థ్రోంబెక్టమీలో విప్లవాత్మక పురోగతిని చర్చించడానికి ప్రపంచ, జాతీయ నిపుణులను ఒకచోట చేర్చడానికి ఎస్టీఏటీ-2025 సమావేశం కీలకమైన వేదికగా పనిచేస్తుంది. రోగికి మెరుగైన ఫలితాలను అందించటానికి తోడ్పడనుంది’ అని అన్నారు. అపోలో హాస్పిటల్స్ తెలంగాణ ప్రాంత మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర బాబు మాట్లాడుతూ.. స్ట్రోక్ నిర్వహణలో సకాలంలో తగిన వైద్య సేవలను అందించడం చాలా కీలకం. ఎస్టీఏటీ-2025 సమావేశం ఈ రంగంలో అవగాహన మరియు క్లినికల్ నైపుణ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. తాజా చికిత్సలు , సాంకేతికతలపై చర్చలను ప్రోత్సహించడం ద్వారా, తీవ్రమైన స్ట్రోక్ కేర్‌లో కొత్త ప్రమాణాలను నిర్దేశించటానికి మరియు రోగులకు మెరుగైన ఫలితాలను నిర్ధారించడానికి మేము కృషి చేస్తున్నాము’ అని అన్నారు.ఎస్టీఏటీ-2025 సమావేశంలో యుఎస్ఏ , స్పెయిన్, స్విట్జర్లాండ్, సింగపూర్, టర్కీ వంటి దేశాల నుండి హాజరైన అంతర్జాతీయ అధ్యాపకులతో పాటు 650 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. -
ప్రధాని మోదీ స్ఫూర్తితో ‘భారత్ డిష్'..! ఎలాంటి వంటకాలు ఉంటాయంటే..
ఇంటిగ్రేటివ్ లైఫ్‌స్టైల్ నిపుణుడు ల్యూక్ కౌటిన్హో ‘భారత్ డిష్'ని ఆవిష్కరించారు. దీన్ని న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ప్రతిష్టాత్మక NXT కాన్క్లేవ్ 2025లో ప్రారంభించారు. ఇది స్వదేశీ ఆహార పదార్థాల ఆరోగ్య ప్రయోజనాలను హైలెట్ చేసేలా లైఫ్‌స్టైల్ నిపుణుడు రూపొందించారు. ఇది భారతదేశ గొప్ప పాకకళ వారసత్వానికి నివాళి. భారతదేశ ఆహార సంస్కృతిలో పాతుకుపోయిన పోషకాహారాలు, వాటి రుచి సమతుల్యతను ప్రతిబింబిస్తుంది ఈ ‘భారత్ డిష్'. అంతేగాదు రోజువారీ ఆహారంలో ఎలాంటి ఆహారాన్ని భాగం చేసుకోవాలనే దానిపై అవగాహన కల్పిస్తుందని చెబుతున్నారు ల్యూక్ కౌటిన్హో . దీన్ని అగ్రశ్రేణి చెఫ్‌లచే రూపొందించినట్లు తెలిపారు. మరి ఇంతకీ అందులో ఎలాంటి ఆహార పదార్థాలు, వంటకాలు ఉంటాయంటే..ప్రధాని మోదీ క్రమశిక్షణా జీవనశైలిని స్ఫూర్తిగా తీసుకుని రూపొందించానని అన్నారు ల్యూక్ కౌటిన్హో. ఇందులో ముఖ్యంగా పోషకాలు అధికంగా ఉండే చిరుధాన్యాలు, ప్రోటీన్ అధికంగా ఉండే సత్తు, సాంప్రదాయ మఖానా, రోగనిరోధక శక్తిని పెంచే పసుపు, తాజా శీతాకాలపు ఆకుకూరలు, స్థానికంగా లభించే, కాలానుగుణ పదార్థాలు తదితరాలు ఉంటాయి. అంతేగాదు భారతీయ వంటకాలు సమతుల్యతకు పెద్దపీట వేసేలా కాలనుగుణంగా ఉంటాయని చెబుతున్నారు జీవనశైలి నిపుణుడు. కలిగే లాభాలు..పేగు ఆరోగ్యం, రోగనిరోధక శక్తి, మానసిక ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇచ్చేలా తయారు చేస్తారు. ఇవి దీర్ఘాయువుని, ఆరోగ్య ప్రయోజనాలని అందించే పదార్థాలు. ఆరోగ్యకరమైన భోజనాన్ని హైలెట్ చేయడమే గాక, అతిగా తినడం, బరువు సమస్యలకు చెక్‌పెట్టేలా ఉంటుందట. భారతీయ ఆహారం శరీరానికి మాత్రమే కాకుండా మనసులో భావోద్వేగాలకు కూడా ఔషధమేనట. దీన్ని ఆవిష్కరించడానికి ప్రధాన కారణం ప్రజలు అనారోగ్య సమస్యలతో పోరాటాన్ని నివారించడమేనట. ఇక ఈ భారత్డిష్ అనేది పూర్వీకులు చేసినట్లు కాలనుగుణంగా ఉండటమేగాక, ప్రతి ఒక్కరూ సులభంగా చేసుకునేలా ప్రోత్సహిస్తుందట.ప్రధాని మోదీ చెప్పినట్లుగా వంట నూనెల వాడకం తగ్గించి, ఏ2 నెయ్యి, కోల్డ్-ప్రెస్డ్ నూనెలు, నట్స్ వంటివి మాత్రమే ఉంటాయట.చివరిగా ఇది శాకాహారులైన, మాంసాహారులైన బరువుని అదుపులో ఉంచే ఆరోగ్యకరమైన వంటకాలే ఉంటాయట ఇందులో.At the NXT Conclave 2025, I had the honor of unveiling The Bharat Dish & Lifestyle Tips, inspired by Hon. Prime Minister Narendra Modi Ji’s disciplined lifestyle and health practices.This is more than just a dish—it’s a celebration of India’s rich culinary wisdom and the power… pic.twitter.com/OR8PzeGV8b— Luke Coutinho (@LukeCoutinho17) March 1, 2025 ఈ మేరకు జీవనశైలి నిపుణుడు ల్యూక్ కౌటిన్హో మాట్లాడుతూ..ప్రపంచ నాయకులు భాగస్వామ్యం అయ్యే ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో భారత్ డిష్‌ని ఆవిష్కరించడం గర్వంగా ఉందన్నారు. భారతీయ వెల్నెస్ జ్ఞానాన్ని ప్రపంచవేదికపై తీసుకువెళ్లేందుకు ఉపకరించిన అద్భుత అవకాశం అని అన్నారు. ఈ 'భారత్ డిష్' అనేది ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేలా ప్రోత్సహించే ఒక ఉద్యమం, ప్రభావంతమైన మార్పుకి నాంది. ఇది ఇక్కడితో ఆగదు. ప్రతి కుటుంబం, పాఠశాలు, ఇతర సంఘాలకు చేరకునేలా చేసే ఒక గొప్ప చొరవ. అంతేగాదు ఆరోగ్య స్ప్రుహతో కూడిన సాధికారతకు మార్గం వేస్తుందని కూడా చెబుతున్నారు ల్యూక్ కౌటిన్హో.#StopObesity | Today, Mr. @LukeCoutinho17, Co-Founder, Luke Coutinho Holistic Healing Systems while visiting an Anganwadi Centre in New Delhi stressed on the importance of tackling obesity to build a healthier India. Highlighting Prime Minister Shri @narendramodi’s vision for a… pic.twitter.com/WgNqoM1pzk— Ministry of Health (@MoHFW_INDIA) February 28, 2025(చదవండి: కశ్మీర్ వివాదాస్పద ఫ్యాషన్ షో: నిర్వహించింది ప్రసిద్ధ ఫ్యాషన్ బ్రాండ్..ఆ డిజైనర్లు ఎవరంటే..?) -
రీల్స్, యూట్యూబ్ మోజులో పిల్లలు, తలలు పట్టుకుంటున్న పేరెంట్స్
నా కూతురు 8వ తరగతితో చదువు మానేసింది. యూట్యూబ్ చానల్ ప్రారంభించి ఇన్ఫ్లుయెన్సర్గా మారాలనుకుంటోంది. భారీ పెట్టుబడి లేకుండానే త్వరగా డబ్బు సంపాదించవచ్చని అంటోంది. కౌన్సెలింగ్ కూడా ఇప్పించా. అయినా ఫలితం లేదు. ఆమె మనసును ఎలా మార్చాలో తెలియడం లేదు..- హైదరాబాద్‌కు చెందిన ఓ తండ్రి బాధ మా అమ్మాయిలు ఒకరు 9, మరొకరు8 చదువుతున్నారు. ఇటీవలే రీల్స్ చేయడంఅలవాటు చేసుకున్నారు. మొదట్లో మేం కూడా సరదాగా ఎంకరేజ్ చేశాం. ఇప్పుడు అదే పనిలో పడిపోయి చదువును పూర్తిగా అటకెక్కించారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు.. - వరంగల్ జిల్లాకు చెందిన ఓ తల్లి ఆవేదనపిల్లల మనసు మార్చాలని మా వద్దకు తీసుకొస్తే.. ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంత సంపాదిస్తారో తెలుసా? మీ డాక్టర్లు కూడా అంత సంపాదించలేరు అంటూ ఎదురు ప్రశ్నలేస్తున్నారు.. - మానసిక వైద్యులు చెబుతున్నది ఇది బాల్యం సోషల్ మీడియా వలలో చిక్కి విలవిల లాడుతోంది. రీల్స్, యూట్యూబ్ చానల్స్‌తో లక్షలు సంపాదించొచ్చన్న ఇన్ఫ్లుయెన్సర్ల మాటలగారడీలో పడి స్కూలు పిల్లలు కూడా జీవితాలు పాడుచేసుకుంటున్నారు. పట్టణాలు, నగరాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా అంతటా ఈ జాడ్యం పెరుగుతోంది. దీంతో స్కూల్ పిల్లల్లో చదువుపట్ల ఆసక్తి తగ్గిపోతోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు -సాక్షి, హైదరాబాద్చదువు కోసం మొదలై.. కరోనా లాక్డౌన్ సమయంలో పిల్లల చదువు పాడవకూడదని అందరూ ఆన్లైన్ చదువుల వైపు మొగ్గారు. అందుకోసం పిల్లలకు పర్సనల్ కంప్యూటర్స్, ఫోన్లు, ట్యాబులు కొనిచ్చారు. ఇప్పుడు అదే పాపంగా మారింది. ఆన్లైన్లో అధిక సమయం గడపడంతో పిల్లలకు క్విక్ మనీకి బోలెడు మార్గాలు కనిపించాయి. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సహా అనేక అంశాలపై అర్థసత్యాలు, అసత్యాలతో కూడిన అనవసర పరిజ్ఞానాన్ని అందించాయి. ‘హౌ టు మేక్ 30 లాక్స్ ఇన్ 2 ఇయర్స్’వంటి ఊరింపులు టీనేజ్ ఆలోచనలను కలుషితం చేశాయి.సంపాదనకు వెల్కమ్.. స్కూల్‌కు బైబై...సోషల్ మీడియాకు బానిసైన 8 లేదా 9వ తరగతి విద్యార్థుల్లో చాలామంది పాఠశాలకు వెళ్లడానికి కూడా ఇష్టపడడం లేదు. తాము సుఖంగా బతకడానికి సంప్రదాయ విద్య సరిపోదని వీరు బలంగా నమ్ముతున్నారు. ‘సోషల్ మీడియా ద్వారా కొందరు సులభంగా డబ్బు, పాపులారిటీ సంపాదించడాన్ని చూసి తామూ అలాగే చేయగలమని చాలామంది విద్యార్థులు భావిస్తున్నారు. పాఠశాలలో గడిపే కాలం వృథా అనే ప్రమాదకర అభిప్రాయం పెంచుకుంటున్నారు’ అని సైకాలజిస్ట్ అరుణ్ చెప్పారు. యూట్యూబ్ చానల్ ప్రారంభించాలని కొందరు, తమ వ్యాపార ఆలోచనలకు తల్లిదండ్రులు నిధులు సమకూర్చాలని ఇంకొందరు, సేవా సంస్థను ప్రారంభించాలని/ ఇన్ఫ్లుయెన్సర్ / సింగర్‌గా మారాలని.. ఇలా ఏవేవో కోరుకుంటున్నారు. వీరిలో కొందరు చాలా మొండిగా తయారవుతుండడంతో వారికి కౌన్సెలింగ్ కూడా పనిచేయడం లేదని సైకాలజిస్టులు చెబుతున్నారు. బీద, మధ్యతరగతి వర్గాల్లోనే ఎక్కువఇటీవల ఈజీ మనీ మీద టీనేజర్లలో బాగా ఆసక్తి పెరిగింది. అది వారి చదువు మీద వ్యతిరేక ప్రభావం చూపిస్తోంది. ఇది బీద, మధ్యతరగతి వర్గాల్లోనే ఎక్కువ కనిపిస్తోంది. గేమింగ్‌తో సహా రకరకాల యాప్స్ ద్వారా సులభంగా డబ్బులు సంపాదించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తమ పిల్లల్ని వాటికి దూరం చేసి ఎలాగోలా చదువు మీద దృష్టిపెట్టేలా చేయమని మమ్మల్ని సంప్రదించే తల్లిదండ్రులు పెరిగారు. అయితే ఈ వ్యసనాన్ని ముదరనీయకుండా ప్రాథమిక దశలోనే గుర్తించి తుంచాల్సిన అవసరం ఉంది. దీనిపై స్కూళ్లలో అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఫోన్ల ద్వారా కూడా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం. - డా. పృథ్వీ రెడ్డి, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, కరీంనగర్ జాగ్రత్తగా డీల్ చేయాలిస్కూల్ విద్యతో ఉపయోగం లేదని 13–15 ఏళ్ల మధ్య వయస్కులు కొందరు పాఠశాల నుంచి నిష్క్రమించాలని కోరుకుంటున్నారు. దీంతో పిల్లలు కనీసం ఇంటర్ పూర్తి చేసినా చాలని, మందులతోనైనా బాగు చేయాలని వారి తల్లిదండ్రులు అడుగుతున్నారు. నా దగ్గరకు కౌన్సెలింగ్‌కు తీసుకొచ్చిన ఓ టీనేజ్ అమ్మాయి ఆన్లైన్లో ఓ రీల్ చూపించి తన వయసే ఉన్న ఓ టీనేజర్ రూ.30 లక్షలు సంపాదించిందని.. మీ డాక్టర్లు కూడా అంత సంపాదించలేరని చెప్పింది. ఫ్రెండ్స్ అంతా కలిసి ప్లాన్ చేసుకుని మరీ డ్రాప్ అవుట్స్‌గా మారుతున్నారు. వీరిని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. గైడెన్స్, అవేర్నెస్ అందించాలి. మన విద్యా విధానం కూడా మారాలి. చదువుతో పాటు లైఫ్ స్కిల్స్ కూడా నేర్పించాలి.- డా.చరణ్ తేజ, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్, హైదరాబాద్ -
బరువు తగ్గాలని ఆ డైటింగ్ : చివరికి ప్రాణమే పోయింది!
బరువు తగ్గాలనే ఆరాటంలో చాలా పొరబాట్లు చేస్తూ ఉంటారు కొంతమంది. శరీర తత్వాన్ని అవగాహన చేసుకోవాలి. అసలు బరువు తగ్గడం అవసరమా? తగ్గితే ఎన్ని కిలోలు తగ్గాలి? ఎలాంటి డైట్ పాటించాలి? ఎలాంటి వ్యాయామాలు చేయాలి? అనేది నిర్ణయించుకోవడం అవసరం. ఇందుకు వైద్యుల సలహాలు, నిపుణుల సూచనలు చాలా ముఖ్యం. అలాకాకుండా బరువు పెరుగుతామనే భయంతో ఆన్లైన్లో చూసో, లేదా మరెవరో చెప్పారనో ఏ డైట్ బడితే అది ఫాలో కావడం అనర్థం. ఒక్కోసారి ఇది ప్రాణాలు కూడా పోవచ్చు. కేరళలో కన్నూరులో చోటు చేసుకున్న ఘటన ఇలాంటి ఆందోళనలనే రేకెత్తిస్తోంది. కొన్ని రకాల రుగ్మతల వల్ల కూడా భయం పెరిగిపోతామనే భయం పట్టుకుంటుందని మీకు తెలుసా? రండి తెలుసుకుందాం! కేరళలోని కన్నూర్‌కు చెందిన 18 ఏళ్ల అమ్మాయి తీవ్రమైన ఆహార నియంత్రణలు పాటించేది. యూట్యూబ్‌లో చూసి దాదాపు పూర్తిగా ఆహారాన్ని తీసుకోవడం మానేసింది. కేవలం నీటినే తీసుకునేది. చివరికి తీవ్రమైన దీర్ఘకాలిక ఆకలి కారణంగా ఏర్పడిన ఆరోగ్య సమస్యల కారణంగా చనిపోయింది. మృతురాల్ని కూతుపరంబ నివాసి శ్రీనందగా గుర్తించారు. తీవ్రమైన సమస్యలతో తలస్సేరిలోని ఒక ఆసుపత్రిలో చేరింది. వెంటిలేటర్‌పై చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. కొన్ని రోజులు వెంటిలేటర్‌పై ఉండి ప్రాణాలు కోల్పోయింది. ఆమె గతంలో కూడి ఇలాంటి సమస్యలతో కోజికోడ్ మెడికల్ కాలేజీలో చేరిందట. వైద్యుడు డాక్టర్ నాగేష్ ప్రభు ప్రకారం, శ్రీనంద అనోరెక్సియా నెర్వోసా అనే తినే రుగ్మతతో బాధపడుతోంది. దీని వలన రోగి బరువు పెరుగుతారనే భయం ఉంటుంది. ఆరు నెలల కింత నుంచి ఆకలితోనే ఉంటోందని ఆయన తెలిపారు. సోడియం , చక్కెర స్థాయిలు తీవ్రంగా పడిపోవడంతో చనిపోయిందని వైద్యులు ప్రకటించారు. ఇలాంటి సమస్యలకు వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని సూచించారు. ఈ వ్యాధి తీవ్రత గురించి తెలుసు కోవాలన్నారు. పశ్చిమ దేశాల్లో ఎక్కువగా కనిపించే అనోరెక్సియా నెర్వోసా కేరళలో కనిపించడం ఇది చాలా అరుదు అని కూడా ఆయన చెప్పారు. అనోరెక్సియా నెర్వోసా అంటే..?డా. నగేష్ అందించిన వివరాల ప్రకారం అనోరెక్సియానెర్వోసాతో బాధపడేవారిలో కాలక్రమేణా ఆకలి అనే అనుభూతిని కోల్పోతారు. దీనికి కారణాలపై స్పష్టత లేదు. అయితే మానసిక ఆరోగ్యం, జన్యు మార్పులు, పర్యావరణం వంటివి ఈ పరిస్థితికి కారణమవుతుంది. అన్ని వయసులు, జాతులు, శరీర రకాలను కూడా ఇది ప్రభావితం చేస్తుంది.మానసిక చికిత్సఅనోరెక్సియా నెర్వోసా ఒక మానసిక పరిస్థితి. దీని లక్షణాలను బట్టి మానసిక చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. మందులు, పోషకాహార కౌన్సెలింగ్, వారానికి ఒకసారి మానసిక కౌన్సెలింగ్ తీసుకోవాలి. అవసరమైతే ఆసుపత్రిలో చేరాలి. సకాలంలో చికిత్స చేస్తే నయమవుతుంది. అయితే, ఇలాంటివి రుగ్మతలు రాత్రికి రాత్రే నయం కావు. కోలుకోవడానికి సమయం చాలా పట్టవచ్చు. వైద్యులను సలహాలను తప్పక పాటిస్తూ, క్రమం తప్పకుండా మందులు వాల్సి ఉంటుంది. -
కశ్మీర్ వివాదాస్పద ఫ్యాషన్ షో: ఆ డిజైనర్లు ఎవరంటే..?
పవిత్ర రంజాన్ మాసం వేళ జమ్ము కశ్మీర్లో జరిగిన ఫ్యాషన్ షో తీవ్ర దుమారం రేపింది. ఫ్యాషన్ షోలో మహిళలు, పురుషులు పొట్టి పొట్టి దుస్తులతో తెల్లటి మంచుపై ర్యాంప్ వాక్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అయ్యాయి. దీంతో ఒక్కసారిగా ఈ ఈవెంట్‌పై రాజకీయ, సామాజిక వర్గాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అంతేగాదు ఫ్యాషన్ షో దూమారం జమ్ముకశ్మీర్ అసెంబ్లీని కూడా అట్టుడికించింది. ఈ వ్యవహారంపై ప్రతిపక్ష నేతలు ఒమర్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశాయి. ఈ నెల మార్చి 7న గుల్మార్గ్లో జరిగిన ఈ ఫ్యాషన్ షోపై తారాస్థాయిలో విమర్శలు వచ్చాయి. దీనిపై జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వివాదాస్పదంగా మారిన ఈ షో వెనుకున్న డిజైనర్లు ఎవరంటే..?ఎవరా డిజైనర్ ద్వయం..?ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన డిజైనర్లు శివన్ భాటియా, నరేష్ కుక్రేజా. ఈ ఇద్దరు స్థానిక సున్నితత్వాన్ని విస్మరించి పవిత్ర రంజాన్ మాసంలో అశ్లీల దుస్తులతో ప్రదర్శన ఇవ్వడంతోనే ఈ షో వివాదాస్పదమైంది. అయితే డిజైనర్ల ద్వయం ఫ్యాషన్ పరిశ్రమలో తమ 15వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గుల్మార్గ్లోని ప్రఖ్యాత స్కీ రిసార్ట్‌లో ఈ ఫ్యాషన్ షోని నిర్వహించారు. వాళ్ల బ్రాండ్‌కి సంబంధించిన శిల్పకళా స్కీ సూట్లు, అప్రెస్-స్కీ దుస్తులు, ఆర్ట్ ప్రింట్లు ఉన్న ట్రాన్స్పరేంట్ దుస్తులు ధరించారు ఇందులో పాల్గొన్న పురుషులు, మహిళలు. అయితే వాళ్లు సరిగ్గా రంజాన్ పర్వదినం సమయంలో దీన్ని నిర్వహించడతో ఇంతలా స్థానిక ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకతను దారితీసింది. పైగా ఈ ఈవెంట్ సాంస్కృతిక విలువలకు తిలోదాకలిచ్చే రీతిలో దారుణంగా ఉందంటూ మత పెద్దలు, ప్రజలు, రాజకీయనాయకులు మండిపడ్డారు. అయితే ఈ షోని నిర్వహించింది ప్రఖ్యాత ఫ్యాషన్ బ్రాండ్ హాలిడే. ఇది కేన్స్‌లోని 'మారే డి మోడా'లో భారతదేశపు తొలి లగ్జరీ బ్రాండ్‌గా పేరు తెచ్చుకుంది. అధునాతన సౌందర్యానికి చెందిన ఈ బ్రాండ్ హాలిడే రిసార్ట్, స్విమ్ దుస్తుల పరంగా ఫ్యాషన్‌లో సంచలనాలు సృష్టించింది. వారి కలెక్షన్లు డీఎల్ఎఫ్ ఎంపోరియో (ఢిల్లీ), కలఘోడా (ముంబై), బంజారా హిల్స్ (హైదరాబాద్), ఎంబసీ చాంబర్ (బెంగళూరు) లలో అందుబాటులో ఉన్నాయి.ఇద్దరు డిజైనర్లు ఫ్యాషన్ ఇండస్ట్రీలో అద్భుతమైన స్థానాన్ని దక్కించుకున్నారు. వారిలో శివన్ NIFT ఢిల్లీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ డిజైన్, ఇస్టిట్యూట్ యూరోపియో డి డిజైన్ నుంచి మాస్టర్స్ డిగ్రీని పొందారు. కాగా నరేష్ అదే సంస్థ నుంచి లగ్జరీ అండ్ మార్కెటింగ్‌లో మాస్టర్ డిగ్రీ చేశారు. ఈ బ్రాండ్‌ని ఎక్కువగా బాలీవుడ్ నటులు కిమ్ కర్దాషియాన్, ప్రియాంక చోప్రా, సోనమ్ కపూర్, కంగనా రనౌత్ వంటి ప్రముఖులు నిర్వహించారు. ఈ బ్రాండ్‌కి వరించిన అవార్డులు..స్వరోవీస్కీ మోస్ట్ క్రియేటివ్ డిజైనర్ ఆఫ్ ది ఇయర్ (2007)ఉత్తమ ఎమర్జింగ్ డిజైనర్లు (మేరీ క్లైర్ ఫ్యాషన్ అవార్డ్స్, 2010)ఉత్తమ రిసార్ట్ వేర్ (ఎల్లే స్టైల్ అవార్డ్స్, 2010)ఉత్తమ క్రూయిజ్ వేర్ (గ్రాజియా యంగ్ ఫ్యాషన్ అవార్డ్స్, 2011)‘మేడ్ ఇన్ ఇండియా’ లేబుల్ టు ది వరల్డ్ (గ్రాజియా యంగ్ ఫ్యాషన్ అవార్డ్స్, 2012)యంగ్ అచీవర్స్ అవార్డు (ఎంబసీ ఆఫ్ ఇండియా, ఖాట్మండు అండ్ టుడేస్ యూత్ ఆసియా)ఇంత మంచి పేరు, కీర్తీ దక్కించుకున్న ఈ ఫ్యాషన్ డిజైనర్లు గుల్మార్గ్ ఫ్యాషన్ షోతో ఒక్కసారిగా వివాదాస్పద వ్యక్తులుగా అపకీర్తిని మూటగట్టుకున్నారు, విమర్శలపాలయ్యారు. View this post on Instagram A post shared by SHIVAN & NARRESH (@shivanandnarresh) (చదవండి: వర్కౌట్లకు టైం లేదా..? ఐతే ఇలా బరువు తగ్గించుకోండి..) -
చికాగో టూ కశ్మీర్..యువరాణిలా డ్రీమీ వెడ్డింగ్: వావ్ అంటున్న నెటిజన్లు
భారతీయ పెళ్లిళ్లలో తమదైన బ్యూటీతో ట్రెండ్ సెట్ చేస్తున్నారు పెళ్లి కూతుళ్లు. అత్యంత సుందరంగా ముస్తాబవుతో యువరాణులను మరపిస్తున్నారు. మేకప్ నుంచి డిజైనర్ దుస్తులు, ఆభరణాలు, మెహిందీ, ఇలా ప్రతీదాంట్లోనూ రాయల్ లుక్స్‌తో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నారు. కోరుకున్న కలల రాకుమారుడిని పెళ్లి చేసుకునే క్షణాలను అపురూపంగా దాచు కునేందుకు డెస్టినేషన్ వెడ్డింగ్‌ను ఎంచుకుంటున్నారు. ఈ డ్రీమీ వెడ్డింగ్ స్టైల్ చికాగోకు చెందిన ఒక వైద్యురాల్ని విపరీతంగా ఆకర్షించింది. అందాల కశ్మీరంలో.. తన వివాహ వేడుకను ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకకు సంబంధించి ఒక వీడియో నెట్టింట సందడి చేస్తోంది. మరి ఆ వివరాలేంటో చూసేద్దామా!చికాగోకు చెందిన డాక్టర్ పైజ్ రిలే(Paige Riley) తన వివాహ వేడకలతో అందర్నీ అబ్బురవపర్చింది. కాశ్మీరీ వధువుగా మారి తన జీవితంలో అత్యంత ప్రత్యేకమైన రోజును సెలబ్రేట్ చేసుకుంది. మేకప్ దుస్తులు, అలంకరణ, మెహిందీ ఇలా ప్రతీదీ స్పెషల్‌గా ఉండేలా జాగ్రత్తపడి కశ్మీరీ పెళ్లి కూతురిలా మెరిసి పోయింది. రాహుల్ మిశ్రా రూపొందించిన పీకాక్, పూల డిజైన్‌లో ఐవరీ కలర్ లెహెంగా, షీన్ దుపట్టాతో అందర్మీ మెస్మరైజ్ చేసింది. తన జుట్టును కర్ల్స్‌తో అలంకరించుకుంది. పచ్చల హారం, ఝుంకాలు, గాజులు, ఉంగరంతో చోకర్ ఇలా భారతీయ ఆభరణాల్లో అమె అందం మరింత ఎలివేట్ అయింది. దీనికి తోడుగా సింపుల్‌గా ఐషాడో, బ్లష్, మస్కారా, బిందీతో మేకప్ చేసుకుంది. View this post on Instagram A post shared by JAMMU MAKEUP ARTIST (@sabihabeig) ఇక మెహెందీ వేడుక కోసం హౌస్ ఆఫ్ మసాబా నుండి అందమైన పసుపు-టోన్డ్ లెహంగాను లెహెంగాను ఎంచుకుంది. నక్సీ డిజైన్‌లో వెండి జరీ వర్క్‌తో పాటు గులాబీ రంగుల్లో టెంపుల్ వర్క్‌తో తయారు చేయబడింది. స్లీవ్‌లపై పూల ప్రింట్లు ఉన్నాయి. అలాగే ఈ లెహెంగాతో డ్యూయల్ దుపట్టాలను ధరించింది. View this post on Instagram A post shared by JAMMU MAKEUP ARTIST (@sabihabeig) దీనికి సంబంధించిన వీడియో చూసినెటిజన్లు తెగ ముచ్చటపడిపోతున్నారు. ‘‘భలే అందంగా ఉన్నారు’’ ‘ప్రిన్సెస్‌లా ఉన్నారు. డ్రెస్ అద్భుతంగా ఉంది’, "మీరు డ్రెస్ చేసుకున్న విధానం నాకు చాలా నచ్చింది, వావ్ అచ్చం కాశ్మీరీ పండిట్లా ఉన్నారు.. లాంటి కామెంట్స్ వెల్లువెత్తాయి. -
చదువు పాతదాయె.. కొలువు కొత్తగాయె, ఇంట్రస్టింగ్ సర్వే!
టెక్ ప్రపంచంలో రోజుకో కొత్త సాంకేతికత పుట్టుకొస్తోంది. ఒక టెక్నాలజీని నేర్చుకోవటం మొదలుపెట్టేలోపు.. కొంగొత్తది పుట్టుకొచ్చి. నేర్చుకునేది పాతబడిపోతోంది. చదివిన చదువుకు, సాధించిన డిగ్రీలకు.. ఇప్పుడున్న మార్కెట్ అవసరాలకు పొంతనే లేకుండా పోతోంది. దేశంలోని 80 % వృత్తి నిపుణులది ఇప్పుడు ఇదే సమస్య. కృత్రిమ మేధ, మిషన్ లరి్నంగ్, జనరేటివ్ ఏఐ, డేటా అనలిటిక్స్ వంటి నైపుణ్యాలున్న వారికి మంచి ప్యాకేజీలతో అవకాశాలు లభిస్తున్నాయి. కానీ, పాతకాలపు టెక్నాలజీ కోర్సులు చదివినవారికి ఎంత వృత్తి అనుభవం ఉన్నా కొత్త ఉద్యోగాలు దొరకటం లేదు. గురుగోవింద్‌సింగ్ ఇంద్రప్రస్థ యూనివర్సిటీ, హీరోవైర్డ్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఇలాంటి అనేక విషయాలు వెల్లడయ్యాయి. సర్వేలోని ముఖ్యాంశాలుదేశంలోని ప్రతి 10 మంది వృత్తి నిపుణుల్లో 8 మంది విద్యార్హతలు ప్రస్తుత జాబ్ మార్కెట్ అవసరాలకు సరిపోవడం లేదు. కాలేజీల్లో నేర్చుకున్నదానికిభిన్నంగా జాబ్ మార్కెట్ఉండడంతో.. అందుకు తగ్గట్టుగా తాము సిద్ధం కాలేకపోతున్నామని సర్వేలో పాల్గొన్న వారిలో 77% మంది తెలిపారు. నేటి అవసరాలకు తగ్గట్టుగా తమనుతాము మలుచుకోవాలంటే ఏఐ టెక్నాలజీపై పట్టుసాధించాలని 90.1 శాతం మంది అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం డేటా అనలిటిక్స్ కీలకపాత్ర పోషిస్తున్నట్లు 89.6 శాతం మంది తెలిపారు. ఆగ్మెంటెడ్ అనలిటిక్స్ ఓ గేమ్‌ఛేంజర్‌గా మారుతున్నదని 72 శాతం వృత్తి నిపుణులు అభిప్రాయపడ్డారు. (Amrutha Pranay Case Verdict : పీవోడబ్ల్యూ సంధ్య స్పందన ఇదే!)సస్టెయినబుల్ ఇన్నోవేషన్ ఒక ముఖ్యమైన పరిశ్రమగా ఉద్భవిస్తోందని 69.7 శాతం మంది చెప్పారు. క్రియేటివ్ ఆంట్ర ప్రెన్యూర్షిప్ ద్వారా సుస్థిరమైనకెరీర్ను నిర్మించు కోవచ్చని 62.3%అభిప్రాయం నిపుణులు సూచలు ప్రస్తుత జాబ్మార్కెట్లో అందుబాటులో ఉన్నఅవకాశాలకు తగ్గట్టుగా ఆధునిక సాంకేతికతలపై పట్టు సాధించాలి. సాంకేతికతపై పట్టుకే పరిమితం కాకుండాసృజనాత్మకత, టీంవర్క్,సవాళ్లకు తగ్గట్టుగాస్పందించే తీరుతోనే ప్రయోజనం ఉంటుంది. ఎప్పటికప్పుడు మారుతున్న ‘జాబ్ రోల్స్’కు అనుగుణంగానైపుణ్యాలు మెరుగుపరుచుకోవాలి. నైపుణ్యాలకు తగ్గట్టుగా కెరీర్‌ను ఎంచుకోవాలి. ఏఐ నైపుణ్యాలకే పరిమితంకాకుండా కంటెంట్ క్రియేషన్,డేటా అనలిటిక్స్ వంటి వాటి ద్వారా కూడా ముందుకు సాగొచ్చు. గతంలో ఓ వెలుగు వెలిగినఇంజనీరింగ్, మీడియా/ఎంటర్టైన్మెంట్, మెడిసిన్ వంటి రంగాలు ప్రస్తుతం కొంత నెమ్మదిస్తున్నాయి.ఆగ్మెంటెడ్ అనలిటిక్స్, సస్టెయినబుల్ ఇన్నోవేషన్, క్రియేటివ్ ఆంట్రప్రెన్యూర్షిప్, మల్టీసెన్సరీ డిజైన్ వంటివి ప్రాధాన్యం సాధిస్తున్నాయి.- సాక్షి, హైదరాబాద్ -
30 ఏళ్ల తండ్లాట...అమ్మను చూడాలని !
తల్లిని కలిసేందుకు ఓ తనయ ఆరాటపడుతోంది. 30 ఏళ్లుగా ఆమెకు దూరమై తల్లడిల్లిపోయింది. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ ఠాణాలో మీ అమ్మ ఉందంటూ భవానికి తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులు సమాచారం ఇచ్చారు. దీంతో భవాని ఆదివారం కోరుట్లలో ఉంటున్న తన బంధువులతో కలిసి అక్కడకు బయలుదేరి వెళ్లింది. వివరాల్లోకి వెళితే..జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన పసుల రాంరెడ్డి 1979లో పీపుల్స్‌వార్‌లో చేరారు. అప్పుడే అరెస్ట్ అయ్యారు. జైలు నుంచి విడుదలయ్యాక ఏడాదిపాటు ఇంటి వద్దే ఉండగా, కథలాపూర్ మండలం సిరికొండకు చెందిన వసంతతో వివాహం జరిగింది. ఏడాది వ్యవధిలోనే రాంరెడ్డి–వసంత దంపతులిద్దరూ పీపుల్స్‌వార్‌లోకి వెళ్లారు. అజ్ఞాతంలో ఉండగానే కూతురు జన్మించింది. ముంబైలో ఉండే తన అన్నసాయిబాబాకు కూతురు (భవాని)ని అప్పగించాడు రాంరెడ్డి. 2001లో ఉత్తర తెలంగాణ స్పెషల్ జోన్ కార్యదర్శి హోదాలో ఉన్న సమయంలో కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం మద్దిమల్ల సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో పసుల రాంరెడ్డి హతమయ్యాడు. అయినా అజ్ఞాతం వీడని వసంత శాంతక్క, మమతక్క పేర్లతో దండకారణ్యంలోని బస్తర్ డివిజన్ కమిటీ సభ్యురాలిగా కొనసాగారు. చదవండి: Amrutha Pranay Case Verdict : పీవోడబ్ల్యూ సంధ్య స్పందన ఇదే!మోకాళ్ల నొప్పులు, షుగర్ వంటి అనారోగ్య సమస్యలతో 2024 నవంబర్‌లో వసంత కాంకేర్ జిల్లా పోలీసులకు పట్టుబడ్డారు. ఆ తర్వాత కాంకేర్ పోలీసులు ఆమెతోపాటు మరో ఏడుగురు మావోయిస్టులు 2025 జనవరిలో లొంగిపోయినట్టు ప్రకటించారు. అప్పటి నుంచి కాంకేర్లోనే పోలీసుల అదీనంలో ఉంటోంది. ఛత్తీస్‌గఢ్ పోలీసులు ఆమె గురించి ఆరా తీస్తూ తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులకు విషయం చెప్పారు. రెండురోజుల క్రితం తెలంగాణ పోలీసులు భవాని ఆచూకీ తెలుసుకున్నారు. ఆమెకు తల్లి సమాచారం చెప్పడంతో ఛత్తీస్‌గఢ్‌కు బయలుదేరింది. ఒకట్రెండుసార్లు అమ్మను కలిశాను ఒకట్రెండు సార్లు అమ్మను కలిశా...చిన్నప్పుడు కోరుట్లలోనే ఓ చోట ఒకట్రెండు సార్లు అమ్మను కలిశా. అప్పుడు అమ్మానాన్న ఇద్దరూ అజ్ఞాతంలోనే ఉన్నారు. ఇప్పుడు నేను వెళితే నన్ను అమ్మ తప్పకుండా గుర్తుపడుతుంది. ఇన్నాళ్లు పెద్దనాన్న దగ్గర దత్త పుత్రికగానే పెరిగాను. కొన్నేళ్ల క్రితమే పెద్దనాన్న దంపతులు ఇద్దరూ చనిపోయారు. అమ్మ వస్తుందంటే బంధువులంతా సంతోషపడుతున్నారు. – భవాని -
వర్కౌట్లకు టైం లేదా..? ఐతే ఇలా బరువు తగ్గించుకోండి..
మగవాళ్లకు కుదిరినట్లుగా మహిళలకు తమ ఫిట్‌నెస్‌పై దృష్టి సారించడం సాధ్యం కాదనేది చాలామంది వర్కింగ్ మహిళల వాదన. ఎందుకంటే, పొద్దున లేచినప్పటి నుంచి పిల్లలు, కుటుంబ బాధ్యతలే సరిపోతాయి. ఇంకెక్కడ టైం ఉంటుంది తమ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడానికి..?. అలాంటి బిజీ వర్కింగ్ విమెన్స్ ఫిట్నెస్ కోచ్ అకన్నీ సలాకో సింపుల్ టిప్స్ ఫాలోఅయ్యి, ఈజీగా బరువు తగ్గండి. మరి ఇంకెందుకు ఆలస్యం హెల్ప్ అయ్యే ఆ చిట్కాలేంటో చూసేద్దామా..!.అత్యంత బిజీగా ఉండే మహిళలు తమ ఫిట్‌నెస్‌పై దృష్టి సారించేలా ప్లాన్ చేసుకోవాలో వెయిట్ లాస్ కోచ్ డాక్టర్ అకన్నీ సలాకో ఇన్‌స్టా వేదికగా వీడియోలో వెల్లడించారు. పనులు వేగవంతంగా చేయాలన్న ధ్యాసలో ఆకలి ఆటోమేటిగ్గా ఎక్కువ అవుతుంది. దాంతో తెలియకుండానే స్వీట్స్, జంక్ఫుడ్స్ స్పీడ్‌గా లాగించేస్తుంటారని చెబుతున్నాడు అకన్నీ. అందుకే వ్యాయమాలు చేయడం కష్టం అనుకున్న మహిళలు వీటిని ఎట్టిపరిస్థితుల్లోనూ దరిచేరనీయకూడదు. సౌకర్యమంతమైన ఆరోగ్యదాయకమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వమని సూచించారు. పోనీ ఇది కష్టం అనుకుంటే ఓ రెండు రోజులు స్వీట్లు ముట్టనని స్ట్రాంగ్‌గా ఫిక్స్ అవ్వండిచాలు అంటున్నారు అకన్నీ. దీంతోపాటు ఏదోలా చిన్నపాటి వ్యాయామాలు చేసుకునేలా ప్లాన్ చేయాలి. ఇక్కడ ఉద్యోగం, పిల్లలు కుటుంబం తోపాటు ఆరోగ్యం కూడా ప్రధానమే అన్న విషయం గుర్తించండి. ముందు మీరు బాగుంటేనే కదా ఈ పనులన్నీ సవ్యంగా పూర్తి చేయగలరు. కాబట్టి ఎలాగైన చిన్న చిన్న వ్యాయామాలు చేద్దాం. పోనీ అలా కాదు నో ఛాన్స్ అంటే.. వారంలో రెండు లేదా మూడు రోజులు కనీసం 30 నిమిషాలు వ్యాయామాలకి కేటాయించండి చాలు. అప్పుడు ఆటోమేటిగ్గా నెమ్మదిగా మనంతట మనమే రోజులు పెంచుకునే ఛాన్స్ ఉంటుందని అన్నారు. భోజనం విషయంలో సమయాపాలన పాటించండి. పోషకాలతో కూడిన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వండని చెబుతున్నారు. మధ్యాహ్నం 1 గంటకి మంచి ప్రోటీన్, రెండు నుంచి మూడు కూరగాయలు, తక్కువ గ్లైసెమిక్ కార్బ్. అలాగే సాయంత్రం 6 గంటకి, మంచి ప్రోటీన్, రెండు నుంచి మూడు కూరగాయలు, తక్కువ గ్లైసెమిక్ కార్బ్లతో పూర్తి చేయండి. స్నాక్స్ జోలికిపోవద్దని హెచ్చరిస్తున్నారు. ఇలా ప్రోటీన్, కూరగాయలు, తక్కువ గ్లైసెమిక్ కార్బ్ వంటి సమతుల్య భోజనానికి ప్రాధాన్యత ఇస్తే ఆకలి నియంత్రణలో ఉంటుంది, అలాగే బరువు పెరిగే అవకాశం ఉండదని చెబుతున్నారు ఫిట్నెస్ కోచ్ అకన్నీ. అలాగే ఇది పోషకాహారం, ఫిట్నెస్కి ప్రాధాన్యత ఇచ్చే సమసర్థవంతమైన డైట్‌ప్లాన్ అని అన్నారు ఫిట్నెస్ నిపుడు అకన్నీ.గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Dr. Akanni Salako | Women’s Weight Loss Coach (@dr.salako) (చదవండి: పిల్లలుంటే బ్రెయిన్ ఆరోగ్యంగా ఉంటుందా..? అధ్యయనంలో అవాక్కయ్యే విషయాలు..) -
Amrutha Pranay Case Verdict : పీవోడబ్ల్యూ సంధ్య స్పందన ఇదే!
సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసులో వెలువడిన నల్గొండ ఎస్సీ, ఎస్టీ తీర్పు కూడా అంతే పంచలనంగా మారింది. సుదీర్ఘ వాదనల అనంతరం నేడు (మార్చి10) తుది తీర్పు వెలువరించింది. కేసులో A2 నిందితుడిగా ఉన్న సుభాష్ కుమార్ శర్మకు ఉరిశిక్ష ఖరారు చేసింది. మిగిలిన నిందితులకు న్యాయస్థానం జీవితఖైదు విధించింది. దీనిపై ప్రజా సంఘాలు, నేతలు స్పందించారు. ప్రణయ్ తల్లిదండ్రులు, భార్య అమృతకు న్యాయం కావాలని పోరాటం చేసిన ప్రజా ఉద్యమకారులు ఈ తీర్పును ఆహ్వనించారు. ముఖ్యంగా ప్రగతిశీల మహిళాసంఘం జాతీయ కన్వీనర్ సంధ్య తాజా కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు.నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పుపై వీ సంధ్య స్పందిస్తూ ప్రేమించి పెళ్లి చేసుకున్న కుమార్తె భర్తను కిరాయి హంతకులతో అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన ఇది అని గుర్తు చేశారు. ఈ కేసులో రెండో ప్రధాన నిందితుడిగా ఉన్న సుభాష్ శర్మకు ఉరిశిక్ష సరైనదేనని ఆమె వ్యాఖ్యానించారు. ఇది ప్రజాఉద్యమాలు, ప్రజా పోరాటాల గెలుపు అని పేర్కొన్నారు. అలాగే అత్యంత క్రూరమైన హత్యలు, దౌర్జన్యాల పట్ల, పోలీసులు కోర్టులు స్పందించాల్సిన ఇలాంటి వైఖరి ఇదేనని ఆమె స్పష్టం చేశారు. పోలీసులు అధికారులు, న్యాయవ్యవస్థ చిత్తశుద్ధిగా పనిచేస్తే వచ్చే ఫలితాలకు, తీర్పులకు ఈ తీర్పు ఒక నిదర్శనమన్నారు. ఈ కేసులో నిర్వహించినట్టుగానే అన్ని కేసుల్లోనూ పకడ్బందీ విచారణలు అవసర మన్నారు. దిశ కేసులో జరిగినట్టుగా ఎలాంటి విచారణలు, సాక్ష్యాలు లేకుండా ఎన్కౌంటర్లు కాదు పరిష్కారం, రుజువులు, సాక్ష్యాలతో టెక్నికల్ ఎవిడెన్స్‌తో జరిగే తీర్పులు ఈ సమాజానికి కావాలని సంధ్య పిలుపునిచ్చారు. 2018లో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ఈ పరువు హత్య కేసు తెలంగాణలో సంచలనం సృష్టించింది. ప్రణయ్ తండ్రి బాలస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మారుతీరావుతో సహా ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తన కుమార్తె అమృత కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతోనే ఆమె తండ్రి మారుతీ రావు సుపారీ గ్యాంగ్‌తో ప్రణయ్‌ను హత్య చేయించాడని పోలీసులు నిర్ధారించారు. 2019 జూన్ 12న 1600 పేజీలతో ఛార్జిషీటు దాఖలు చేశారు. అయితే ప్రణయ్ హత్య కేసులో A1 నిందితుడు మారుతీరావు (అమృత తండ్రి) 2020లో ఆత్మహత్య చేసుకున్నాడు. A2 సుభాష్ కుమార్ శర్మ, A3 అస్గర్‌అలీ, A4 బారీ, A5 కరీం, A6 శ్రవణ్ కుమార్, A7 శివ, A8 నిజాంలు నిందితులుగా ఉన్నారు. వీరంతా బెయిల్‌పై బయటకు వచ్చారు. అయితే సుభాష్‌శర్మ ప్రస్తుతం జైలులోనే ఉన్నాడు. అస్గల్ అలీ మరో కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.కాగా ప్రణయ్ హత్యనాటికి గర్భవతిగా ఉన్న అమృత ఒక బిడ్డకు జన్మనిచ్చింది. చెట్టంత కొడుకును పోగొట్టుకున్న దుఃఖంలో ప్రణయ్ తల్లితండ్రులే కోడల్ని కంటికి రెప్పలా కాపాడుకున్నారు. అయితే తండ్రి మరణం తరువాత అమృత క్రమంగా తల్లికి దగ్గరైంది. అట అత్తమామలు, ఇటు తల్లితోనూ సన్నిహితంగా ఉంటోంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రణయ్‌కు ప్రతిరూపమైన తన కొడుకును అంతే ప్రాణంగా పెంచుకుంటోంది. -
పిల్లలుంటే బ్రెయిన్ ఆరోగ్యంగా ఉంటుందా..?
వయసు పెరిగే కొద్దీ బ్రెయిన్ సామర్థ్యం కూడా తగ్గుతుంటుంది. అది సర్వసాధారణం. అయితే అలా కాకుండా బాడీపై వచ్చే వృద్ధాప్య లక్షణాలకు ఎలా అడ్డుకట్టవేస్తామో అలాగే బ్రెయిన్ సామర్థ్యం వృద్ధాప్యం బారిన పడకుండా ఎలా సంరక్షించుకోవాలనే దిశగా శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. తాజా అధ్యయనంలో చాలా అవాక్కయ్యేలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. గంపెడుమంది పిల్లలు ఉంటే బాధ్యతలు ఎక్కువై మతిమరుపు, త్వరితగతి వృద్ధాప్యం బారినపడటం జరుగుతుదనేవారు. కానీ అది అవాస్తమట. పరిశోధన ఏం చెబుతుందో తెలిస్తే.. అసలు ఇదెలా అని విస్తుపోవడం ఖాయం. మరీ పరిశోధనలో వెలుగు చూసిన ఆ షాకింగ్ విషయాలేంటో చూద్దామా..!.ఈ సరికొత్త పరిశోధన ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (PNAS)లో ప్రచురితమైంది. ఈ అధ్యయనం పిల్లలను కలిగి ఉన్నవాళ్లకు మెదడు ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంటుందని తేల్చింది. అందుకోసం శాస్త్రవేత్తలు దాదాపు మూడు వేల మందికిపైగా తల్లిదండ్రుల మెదడు పనితీరుపై పరిశోధనలు చేయగా ఈ విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అలసట, ఒత్తిడి అనేవి తల్లిదండ్రులైన వాళ్లలో కంటే పిల్లలు లేని తల్లిదండ్రులలోనే ఎక్కువగా కనిపించాయట. పిల్లలు ఉండటం అనేది వ్యక్తిగత జీవితాన్ని సుసంపన్నం చేసి అహ్లదభరితంగా చేస్తుందట. సాధారణంగా పేరెంట్స్ శారీరక శ్రమని పరస్పర సహకారంతో సునాయసంగా అధిగమించగలుగుతారని పరిశోధన నొక్కి చెబుతోంది. ఎక్కువ మంది పిల్లలున్న తల్లిదండ్రుల మెదడు మంచి క్రియెటివిటి కనెక్టివిటీని కలిగి ఉంటుందని కూడా పేర్కొంది అధ్యయనం. ఈ పరిశోధనలలో తల్లిదండ్రుల్లో తండ్రిని మినహాయించాయి. ఎందుకంటే వారు శారీరకంగా గర్భం ధరించరు, ప్రసివించరు, తల్లిపాలు ఇవ్వరు కాబట్టి తల్లులకే ప్రాధాన్యత ఇచ్చినట్లు పేర్కోన్నారు పరిశోధకులు. అయితే ఈ అధ్యయనంలో దాదాపు 17 వేలకు పైగా పురుషులు కూడా పాల్గొన్నారని అన్నారు.అయితే ఈ పరిశోధన పిల్లల పుట్టుక, వారి పెంపకం, పెరిగిన అదనపు బాధ్యతలు మెదడు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని చెబుతున్నాయి. అయితే లేటు వయసులో తల్లిదండ్రులైన వారిలో తక్కువ మెరుగైన ఫలితాలే కనిపించాయన్నారు. తల్లిదండ్రులుగా వారి పిల్లల బాధ్యతే వారి మెదడుని వృద్ధాప్యం బారిన పడకుండా శ్రీరామరక్షలా కాపాడతుందని అధ్యయనం చెబుతోంది. అంతేగాదు ఈ పరిశోధనకు కీలకమైన శాస్త్రవేత్త అవ్రామ్ హోమ్స్ ఎంత ఎక్కువ మంది పిల్లలు ఉంటే అంతలా వారి మెదుడు సురక్షితంగా ఉంటుందని చెప్పడం విశేషం. ఇది వరకు పిల్లల బాధ్యతల కారణంగా జుట్టు ఊడిపోవడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటివి జరుగతాయని ప్రగాడంగా భావించేవారు అంతా. అయితే అదంతా అవాస్తమని కొట్టిపారేసింది తాజా అధ్యయనం. కానీ ఈ అధ్యయనంలో పాల్గొన్నవారంతా యూకేకి చెందిన వాళ్లే కావడంతో మరిన్ని కచ్చితమైన ఫలితాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేరెంట్స్‌పై పరిశోధన చేయాల్సి ఉందని అన్నారు శాస్త్రవేత్తలు. దీంతోపాటు పిల్లల పెంపకం అనేది బ్రెయిన్ వృధ్యాప్యాన్ని ఎలా నివారిస్తుందో తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉందని నొక్కి చెప్పారు. ఈ పరిశోధన గనుక నిజమైతై ఒటరితనం, చిత్తవైకల్యం వంటి సమస్యలను ఎలా అధిగమించాలనేందుకు కచ్చితమైన పరిష్కారం కనుగొనేందుకు మార్గం సుగమం అవుతుందని చెబుతున్నారు పరిశోధకులు. (చదవండి: పదకొండేళ్లకే బీఎస్సీ, 21 ఏళ్లకే పీహెచ్డీ..! మాజీ సీఎం లాలు యాదవ్, ప్రదాని మోదీ..) -
పదకొండేళ్లకే బీఎస్సీ, 21 ఏళ్లకే పీహెచ్డీ..!
కొందరు చిన్న వయసులోనే అసాధారణ తెలివితేటలు, ప్రతిభ సామర్థ్యంతో అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. ఈ అసామాన్య వ్యక్తులు అందరిలా కాకుండా చిన్న వయసులోనే పెద్ద పెద్ద డిగ్రీలు పూర్తి చేసి శెభాష్ అనిపించుకుంటారు. అలాంటి కోవకు చెందినవాడే తథాగత్ అవతార్ తులసి. అతడి అసామాన్య ప్రతిభ గురించి తెలిస్తే నోటమాట రాదు. మరీ అతడి ప్రతిభాపాటవాలేంటో చూద్దామా..!.ఆ అసామాన్యుడే తథాగత్ అవతార్ తులసి. ఆయన సెప్టెంబర్ 9, 1987న బిహార్‌లోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తథాగత్ చిన్నప్పటి నుంచి తన అసాధారణ మేథాతో అందర్నీ ఆశ్చర్యపరిచేవాడు. అలా తథాగత్ 9 ఏళ్లకే పాఠశాల విద్యను పూర్తి చేశాడు. 11 ఏళ్లకు బీఎస్సీ బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడు. ఇక 12 ఏళ్లకే ఎంఎస్సీ పూర్తి చేసి, 21 ఏళ్లకే డాక్టరేట్‌ని పొందాడు. ఆ విధంగా 22 ఏళ్ల వయసుకే ప్రతిష్టాత్మక ఐఐటీలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రొఫెసర్ అయ్యాడు. ఈ అపార ప్రతిభాశాలి పీహెచ్‌డీలో క్వాంటం సెర్చ్ అల్గారిథంపై పరిశోధన చేసి మంచి పేరుతెచ్చుకున్నాడు. అంతేగాదు తథాగత్ ప్రఖ్యాత శాస్త్రవేత్త లవ్ గ్రోవర్తో కలిసి ఒక పరిశోధనా పత్రాన్ని కూడా రచించాడు అయితే అది ఏ జర్నల్‌లోనూ ప్రచురితం కాలేదు. అయితే ప్రస్తుతం ఆయన 2019లో ఐఐటీ బాంబే నుంచి తొలగించబడ్డారు. దీంతో అప్పటి నుంచి ఆయన ఉద్యోగ పోరాటం చేస్తున్నారు. 2011లో తథాగత్ తీవ్ర జ్వరం బారినపడీ అలెర్జీకి గురయ్యాడు. ఆ అనారోగ్యం చాలా ఏళ్ల పాటు కొనసాగడంతో సుదీర్ఘ సెలవు తీసుకున్నాడు. చివరికి 2013లో ముంబై విడిచిపెట్టే పరిస్థితి వచ్చింది. ఆ కారణాల వల్లే 2019లో తథాగత్ ప్రొఫెసర్ ఉద్యోగం కోల్పోయాడు. తన అనారోగ్య సమస్యల కారణంగా ముంబైలో నివసించడం సాధ్యం కాదని, తనని ప్రత్యేక కేసు కింద IIT ఢిల్లీకి బదిలీ కోసం అభర్థిస్తున్నారు తథాగత్. అందుకోసం ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించనున్నట్లు సమాచారం. చివరగా తథాగత్ మాట్లాడుతూ..క్వాంటం కంప్యూటర్ల రంగం పరంగా నాదేశం అభివృద్ధి కోసం పనిచేయాలనుకుంటున్నా. ఎందుకంటే ఈ అంశంపైనే చాలా కాలంగా అధ్యయనం చేస్తున్నాను. కేవలం 17 ఏళ్ల వయసులో లవ్ గ్రోవర్ మార్గదర్శకత్వంలో దీనిపై పనిచేయడం ప్రారంభించాను. తన పరిశోధన ప్రొఫైల్ ముందు బాగానే ఉంది. ఆ తర్వాత తన అనారోగ్య కారణాల దృష్ట్యా ఆ పరిశోధనపై ఫోకస్ పెట్టలేకపోయానని వాపోయారు. కానీ ఇప్పుడు తాను క్వాంటం కంప్యూటర్ల రంగానికి తోడ్పాలని కోరుకుంటున్నానని అన్నారు. అదీగాక మన భారతదేశంలో క్వాంటం కంప్యూటర్లపై రూ. 8 వేల కోట్లు ఆంక్షలు ఉన్నాయి. కావున ఆ సమస్యకు చెక్‌పెట్టేలా ఈరంగంలో మంచి విప్లవం తీసుకురాగలనని ధీమాగా చెప్పారు తథాగత్ .సత్కారాలు, అవార్డులు..1994లో, తథాగత అవతార్ తులసిని అప్పటి బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ సత్కరించారు. ఆయన సాధించిన విజయానికి బహుమతిగా ఆయనకు కొంత డబ్బుని పారితోషకంగా ఇచ్చారు. కానీ తథాగత్ ఆ డబ్బుని తీసుకోవడానికి నిరాకరించారు. దీంతో ఆయనకు ఒక మంచి కంప్యూటర్ని బహుమతిగా ఇచ్చారు. అది ఆయనకు మరిన్ని గొప్ప విజయాలను సాధించడానికి సహాయపడింది. అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ సైతం తథాగత్ సాధించిన విజయాలకు అబ్బురపడటమే గాక అతడిని ఘనంగా సత్కరించారు కూడా. (చదవండి: అంతా జేమ్స్ బాండ్ హీరో హీరో సెవన్‌గా కీర్తిస్తారు..కానీ ఆయన..!) -
వినోదం వికాసం
సాధారణ మనుషుల్లా కాకుండా ఆయనకు మూడో కన్ను ఉంటుంది.., అదే తన కెమెరా. ఈ కన్నుతో తాను చూసిన అద్భుతాలు, సామాజిక అంతరాలు వంటి విశేషాంశాలన్నింటినీ కెమెరాలో బంధిస్తాడు. అలా తను తీసిన ఫొటోలు భారత్‌తో పాటు విదేశాల్లోని ఫొటో ఎగ్జిబిషన్లలో ప్రదర్శించాడు. ఆయనే వినోద్ వెంకపల్లి. ఆయన ప్రయాణం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, సామాజిక ఇతివృత్తాలను బంధించి ప్రపంచానికి పరిచయం చేశాడు. చదువుకుంది ఐఐటీ ఎని్వరాన్మెంటల్ ఇంజినీరింగ్, కానీ తన శోధన, పరిశోధన అంతా ఫొటోగ్రఫీనే. ఎందుకు అని ఎవరైనా అడిగితే.. అందులోనే సంతృప్తి దొరుకుతుందని చెబుతాడు. తన ఫొటోగ్రఫీ నైపుణ్యంతో క్యోటో వేదికగా జరగనున్న కేజీ ప్లస్ సెలెక్ట్ 2025 ఫొటో ఎగ్జిబిషన్‌కు అర్హత సాధించారు. ఇందులో పాల్గొనడానికి ప్రపంచవ్యాప్తంగా 10 మందికి మాత్రమే అవకాశముంటుంది. ఈ నేపథ్యంలో నగరానికి చెందిన వినోద్ తన అనుభవాలను, ప్రయాణాన్ని సాక్షితో పంచుకున్నారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. ఇంజినీరింగ్.. చెన్నైలో, ఎమ్‌టెక్ ఐఐటీ దన్బాగ్లో చేశాను. కానీ నా ఆలోచనలన్నీ సమాజం చుట్టూనే తిరిగేవి. ముఖ్యంగా సామాజిక సమస్యలు, ఇతివృత్తాలను పరిశోధించడం, ఫొటోలుగా బంధించడం ఇష్టం. వాటితో స్టోరీ టెల్లింగ్ ఇంకా ఇష్టం. దీని కోసం ఎంత దూరమైనా కెమెరా బుజాన వేసుకుని బైక్‌పై వెళుతుంటాను. కొన్ని రోజులు జాబ్ కూడా చేశాను.. కానీ సంతృప్తినివ్వలేదు. కెమెరాతో ఊర్లు తిరుగుతూ.. అక్కడి సంస్కృతులు, సంప్రదాయాలు, పండుగలు, జాతరలు, కష్టాలు, సంతోషాలను ఫొటోలుగా తీయడం మంచి అనుభూతినిచ్చేది. ఇలా 11 ఏళ్ల నుంచి ఫొటోగ్రఫీ, డాక్యుమెంటరీలతో నా సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తున్నాను. ఈ ప్రయాణంలో కేజీ ప్లస్ సెలెక్ట్ 2025 ఫొటో ఎగ్జిబిషన్లో పాల్గోనుండటం సంతోషంగా ఉంది. ఏప్రిల్ 12 క్యోటోలో నా ఫొటోలను ప్రదర్శించనున్నాను. గతంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కంబోడియా, తైవాన్, అమెరికా వంటి దేశాల్లో నిర్వహించిన ఎగ్జిబిషన్లలో ఫొటోలు ప్రదర్శితమయ్యాయి. ప్రయాణం నగరం నుంచే.. నగరంలోని ట్యాంక్‌బండ్ వంటి ప్రదేశాల్లో ఫొటోలు తీస్తూ మొదలు పెట్టిన ప్రయాణం తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలకు చేరింది. చిన్నప్పటి నుంచి గ్రామీణ వాతావరణం ఏమీ తెలియదు. అమ్మా, నాన్న డాక్టర్లు. కానీ వారు నా సామాజిక బాధ్యతను ప్రేరేపించేవారు. అటువైపు నన్ను ప్రోత్సహించేవారు. ఈ ప్రయాణంలో నల్గొండ ఫ్లోరోసిస్‌పై పరిశోధనాత్మక ఫొటోగ్రఫీ చేశాను. దీని కోసం బైక్‌పై నల్గొండలోని ఫ్లోరైడ్ బెల్ట్‌కు వెళ్లేవాడిని. అంతేకాకుండా తెలంగాణలోని అప్పటి నీళ్ల కష్టాలను నా ఫొటోలతో చూపించాను. అరకులో మలేరియా వ్యాపించి ప్రజలు అవస్థలు పడుతున్నారనే విషయం తెలుసుకుని చేసిన ప్రాజెక్టు ఇంకా కళ్ల మందే మెదులుతోంది. మహబూబ్‌నగర్‌లో నీటి ఎద్దడికి ఇసుక చలిమల్లో ఓ చిన్నారి ముంతతో నీరు సేకరించిన ఘటన..నీటి ప్రధాన్యతను తెలియజేసింది. కరువు, సంక్షోభాలు, విపత్కర పరిస్థితులు, సామాజిక సమస్యలు, మానవీయ కోణాలు, వివక్ష, సాంఘిక అకృత్యాలను ఫొటోలుగా బంధిస్తూ వచ్చాను. క్రమంగా నమ్మకం కలిగింది.. హైదరాబాద్‌లో బోనాలు, ముంబైలో వినాయక చవితి, మహోకుంభ మేళా.. ఇలా సందర్భం ఏదైనా అక్కడి పరిస్థితులను చిత్రించాను. అమ్మ నాన్నలు నాస్తికులు.. కానీ ప్రజల్లో దేవుని పై నమ్మకం నన్ను ఆలోచింపజేసేది. నమ్మకం లేకుంటే మనిషి పరిస్థితులు ఏంటనే దిశగానూ శోధించాను. అప్పులు చేసి పంట వేసిన ఒక రైతు దేవుడి పై నమ్మకంతో తన జీవనాన్ని ఎలా ముందుకు సాగిస్తాడు.. ఆ నమ్మకమే లేకుంటే కష్టజీవుల మానసిక అవస్థలు ఎలా ఉంటాయో దగ్గరగా చూశాను. వివిధ వేదికల్లో.. నా ఫొటోలు ది న్యూయార్క్ టైమ్స్, ది గార్డియన్, ది వాషింగ్టన్ పోస్ట్, ఎమ్ఎస్ఎన్ సౌత్ ఆఫ్రికా, డైలీ మెయిల్, యాయూ న్యూస్ యూకే, నేషనల్ పోస్ట్, యూఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ వంటి వేదికల్లో ప్రచురితమయ్యాయి. నాకు విభిన్న కళల్లో ప్రావీణ్యముంది.. డ్రాయింగ్ వేస్తాను. శిల్పకళలోనూ ప్రావీణ్యముంది. మెటల్ ఫేస్ తయారు చేస్తాను. ఫొటోగ్రఫీకి బయటకు వెళ్లడానికి నాకు డబ్బులను అందించేది నా డ్రాయింగ్ మాత్రమే. నా ఫొటోల్లో బంధించలేని వాటిని బొమ్మలుగా వేసి ముంబై ఆర్ట్ ఫెయిర్‌లో ప్రదర్శిస్తే.. అన్నీ అమ్ముడు పోయాయి. ఫొటోగ్రఫీలో ప్రతిష్టాత్మక టోటో ఫొటోగ్రఫీ అవార్డ్, రెండు సార్లు తెలంగాణ స్టేట్ అవార్డులను అందుకున్నాను. ఇండియన్ ఫొటోగ్రఫీ ఫెస్టివల్లో సభ్యుడిని. సామాజిక అంశాల ఇతివృత్తంతో రెండు, మూడు డాక్యుమెంటరీలు, షార్ట్ఫిల్్మలు తీసే ప్రయత్నంలో ఉన్నాను. అది అమాయకత్వం కాదు.. ఆప్యాయత.. ఫొటోల కోసం గ్రామాలకు వెళ్లినప్పుడు అక్కడి ప్రజల స్వచ్ఛమైన మనస్తత్వం చూశాను. మొదట్లో ఆశ్చర్యపడేవాడిని. ఓ అవ్వ అన్నం పెట్టేది. ఒక పెద్దాయన తన ఇంట్లో ఆశ్రయం కలి్పంచేవారు. ఇలా పల్లె మట్టిలో అమ్మతనం నన్ను ఫొటోగ్రఫీలో మరింత లోతుగా తీసుకెళ్లింది. మొదట్లో అదంతా అమాయకత్వం అనుకున్నా.. కాదు ఆప్యాయత అని నెమ్మదిగా తెలుసుకున్నా. తోటి మనుషులకు వారిచ్చే విలువను తెలుసుకున్నా. అఫ్ఘాన్ వార్‌లో చనిపోయిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ దాని‹Ùసిద్ధికీ (ఢిల్లీ) పలు విలువైన సూచనలిచ్చి ఫ్రీలాన్స్ ఫొటో జర్నలిస్టుగా మారేలా చేశారు. -
బౌద్ధవిహారం: బిహార్‌కి ఆ పేరు ఎలా వచ్చిందంటే..?
బిహార్‌కు ఆ పేరు ఎలా వచ్చింది? చారిత్రక– పౌరాణిక సాహిత్యంలో ఈ ప్రదేశం ఉంది. కానీ...అప్పట్లో ఈ ప్రదేశం పేరు బిహార మాత్రం కాదు. చాణుక్యుడు పుట్టాడు... కానీ అతడి పేరు రాలేదు. ఆర్యభట్ట పుట్టాడు... అతడి పేరూ రాలేదు. అశోకుడు పాలించాడు... ఆ చక్రవర్తి పేరూ రాలేదు. బుద్ధుడు విహరించిన ఈ ప్రదేశం బుద్ధవిహారగా పేరు తెచ్చుకుంది.. బౌద్ధ విహారాలు... చైత్యాల నిలయం బౌద్ధవిహారగా స్థిరపడింది. స్థానిక భాషల్లో విహార... బిహారగా వాడుకలోకి వచ్చింది. నాడు బుద్ధుడు విహరించిన బుద్ధవిహారయే నేటి మన బిహార్. గంగా తీరాన నడక... నదిలో డాల్ఫిన్ వీక్షణం ఈ టూర్లో బోనస్.నలంద విద్యాలయంనలంద విశ్వవిద్యాలయం మనదేశంలోనే కాదు ప్రపంచంలోని ్ర΄ాచీన విశ్వవిద్యాలయాల్లో ఒకటి, తొలి రెసిడెన్సియల్ యూనివర్సిటీ ఇదే. ఈ బౌద్ధ మహావిహారకు విద్యాభ్యాసం కోసం క్రీ.శ ఐదవ శతాబ్దం నుంచి పన్నెండవ శతాబ్దం వరకు దేశవిదేశాల నుంచి విద్యార్థులు వచ్చేవారు. వారు నివసించడానికి ఒక్కొక్కరికి ఒక్కో గది, ఆ గదిలో గోడలకు ఒక వైపు పుస్తకాల అర, మరొక గోడకు దుస్తులు పెట్టుకునే వెసులుబాటు ఉండేవి. ప్రతి గది బయట నీరు వెలుపలకు వెళ్లడానికి నిర్మాణంలోనే పైపుల ఏర్పాటు ఉండేది. పౌర్ణమి రోజు చంద్రుడి వెలుతురు పడి ప్రకాశించే చంద్రశిలలను చూడవచ్చు. క్లాసు రూముల ఏర్పాటు చాలా సమగ్రంగా ఉంటుంది. అందరూ నేల మీదనే కూర్చోవాలి. అయితే ఆచార్యులు కూర్చునే పీఠం వంటి స్థానం, విద్యార్థులు ఒకరికొకరు మూడడుగుల దూరంలో కూర్చునే విధంగా ఉంది నిర్మాణం. భక్తియార్ ఖిల్జీ హయాంలో ఇక్కడ తాళపత్ర గ్రంథాలను రాశి΄ోసి తగుల పెట్టిన చోట ఇటుకలు కూడా నల్లగా మాడి΄ోయి ఉన్న గోడలను చూపిస్తారు గైడ్లు. ఇక్కడ దుకాణాల్లో పెన్నులు నలంద, రాజ్‌గిర్ వంటి బౌద్ధ క్షేత్రాల పేర్లతో ఉంటాయి. టూర్‌కి గుర్తుగా తెచ్చుకోవచ్చు, స్నేహితులుగా బహుమతులుగా ఇవ్వవచ్చు. ఇది పట్నాకు 70 కిలోమీటర్ల దూరాన ఉంది. పట్నా నుంచి బయలుదేరిన తర్వాత నలంద పర్యటన పూర్తి చేసుకుని రాజ్‌గిర్‌కు వెళ్లాలి. నలంద మహావిహారను చూసిన తర్వాత సూర్యమందిర్, చైనా యాత్రికుడు హ్యూయాన్ త్సాంగ్ మందిరాన్ని కూడా చూడాలి. ఈ ఆలయం ఒక చరిత్ర పుస్తకానికి దృశ్యరూపం. వీటి తర్వాత చూడాల్సిన ప్రదేశం ఆర్కియలాజికల్ మ్యూజియం.మహాబోధిగయ బోద్‌గయకు ఆ పేరు రావడానికి కారణం మహాబోధి వృక్షమే. సిద్ధార్థ గౌతముడు ఈ బోధి చెట్టు కింద ధ్యానం చేశాడు. అతడికి జ్ఞానోదయమై బుద్ధుడిగా మారిన ప్రదేశం ఇది. యునెస్కో ఈ ప్రదేశాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించింది. ఈ బోధి వృక్షాన్ని చూస్తే ఆశ్చర్యంతోపాటు క్రీస్తు పూర్వం ఐదు వందల ఏళ్ల నాటి వృక్షమా అనే సందేహం కలుగుతుంది. ఆ సందేహంలో అర్థం ఉంది. బుద్ధుని కాలం నాటి మహాబోధి వృక్షం మతహింసలో భాగంగా అగ్నికి ఆహుతై΄ోయింది. ఆ స్థానంలో శ్రీలంక నుంచి తెచ్చి నాటిన మొక్క ఇప్పుడు మహావృక్షమైంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే... శ్రీలంకలోని అనూరాధపురను ΄ాలిస్తున్న రాజు దేవానాం ప్రియ తిస్స బౌద్ధం పట్ల ఆకర్షితుడయ్యాడు. బౌద్ధ పట్ల అవగాహన కోసం అశోక చక్రవర్తిని కోరాడు. అశోకుడు బౌద్ధ ప్రచారంలో భాగంగా తన కూతురు సంఘమిత్ర, కొడుకు మహేంద్రను శ్రీలంకకు పంపించాడు. శ్రీలంకకు వెళ్లేటప్పుడు సంఘమిత్ర ఈ మహాబోధి నుంచి సేకరించిన మొక్కను తీసుకెళ్లి దేవానాం ప్రియ తిస్సకు బహూకరించింది. ఆ మొక్కను అనూరాధ పురలో నాటారు. బోధగయలోని మూలవృక్షం స్థానంలో శ్రీలంక బోధి వృక్షం నుంచి మొక్కను తెచ్చి నాటారు. అదే ఇప్పుడు మనం చూస్తున్న బోధి వృక్షం. ఈ వృక్షం పక్కనే మహాబోధి ఆలయం ఉంది. బౌద్ధం పరిఢవిల్లుతున్న భూటాన్, థాయ్‌లాండ్ వంటి అనేక దేశాల మోనాస్ట్రీలు కూడా బోద్‌గయలో ఉన్నాయి. వీటిలో వ్యక్తమయ్యే సంపన్నతను చూసినప్పుడు బుద్ధుడు చెప్పిన నిరాడంబరత కోసం బౌద్ధంలో ఆశించకూడదనిపిస్తుంది. ఈ ప్రదేశం బిహార్ రాజధాని నగరం పట్నా నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉంది. గయకు 15 కిలోమీటర్ల దూరం. ఈ టూర్లో చూడాల్సిన మరో ప్రదేశం నిరంజన నది. బుద్ధుడు ధ్యానంలో ఉన్న కాలంలో తరచూ ఈ నదికి వెళ్లేవాడు. స్థానికులు ఫాల్గు నదిగా పిలుస్తారు. వైశాలి గత వైభవంబుద్ధుడు తన జీవితకాలంలో ఎక్కువ కాలం ( మూడు దఫాలు) వైశాలిలో జీవించాడు. తన చివరి బోధనను వెలువరించాడు. బుద్ధుడి అవశిష్టంతో ఇక్కడ ఒక స్థూపాన్ని నిర్మించారు. ఈ ప్రదేశంలో అశోకుడు ఏకసింహం స్థూపాన్ని నిర్మించాడు. మ్యూజియం కూడా ఉంది. ఈ ప్రదేశం ఒకప్పుడు లిచ్ఛవుల రాజధాని. ఆసియా ఖండంలో తొలి రిపబ్లిక్ స్టేట్ కూడా ఇదే. వైశాలి గత వైభవం విశాలమైనదే కానీ ఇప్పుడిక్క బౌద్ధ విశిష్ఠతలు మినహా మరే ప్రత్యేకతలూ కనిపించవు. జైన తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు పుట్టిన ప్రదేశం కూడా ఇదే. చిన్న జైన మందిరం కూడా ఉంది.విక్రమశిల మహావిహారఇది కూడా భక్తియార్ ఖిల్జీ చేతిలో ధ్వంసమైన ప్రాచీన విశ్వవిద్యాలయం. మనదేశంలో ఉన్న ప్రధానమైన బౌద్ధ మహావిహారల్లో మూడు బీహార్లోనే ఉన్నాయి. విక్రమశిల... వందకు పైగా గురువులు, వెయ్యికి పైగా విద్యార్థులతో విలసిల్లిన విద్యాలయం. తత్వం, వ్యాకరణం, ఆధిభౌతికం, తర్కశాస్త్రాలను బోధించేవారు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఆసియా ఖండంలో బౌద్ధాన్ని విస్తరించారు. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ యూనివర్సిటీ శిథిలాలను భద్రపరిచి పునరుద్ధరించే పనిలో ఉంది. చారిత్రక జ్ఞాపకాల గౌరవార్థం ప్రభుత్వం నలంద, విక్రమశిల పేర్లతో కొత్త యూనివర్సిటీలను ఏర్పాటు చేసింది. లోకల్ ఆటో రిక్షా, కార్ ట్యాక్సీల వాళ్లతో మాట్లాడేటప్పుడు స్పష్టంగా చెప్పాలి.ఓదంతపురి చదువుల క్షేత్రంమనదేశంలో ప్రసిద్ధమైన బౌద్ధ మహావిహారలు మూడు. నలంద, విక్రమశిల, ఓదంతపురి విహారలు. నలంద తర్వాత రెండవ విశ్వవిద్యాలయం ఓదంతపురి. ఇది బీహార్ షారిఫ్లో ఉంది. పట్నా– రాజ్‌గిర్ రైల్వేలైన్‌లో వస్తుంది. ఈ మహావిహార కూడా టర్కీ నుంచి వచ్చి భారత్ మీద దాడి చేసిన ఖిల్జీ చేతిలో ధ్వంసమైనదే. ఇక్కడ బౌద్ధ క్షేత్రానికి సంబంధించిన ప్రాధాన్యత తప్ప మరే ప్రత్యేకతలూ లేక΄ోవడంతో పర్యాటకపరంగా సౌకర్యాలు తక్కువ.సారనాథ్ రాజముద్ర బుద్ధుడు తొలి ప్రవచనాన్ని వెలువరించిన ప్రదేశం సారనాథ్. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహణలో ఉంది. ఇక్కడి స్థూపం పరిరక్షణ పనులు పూర్తి చేసి పర్యాటకులకు ప్రవేశం కల్పించారు. మనం అధికారిక ముద్రగా స్వీకరించిన నాలుగు సింహాల పిల్లర్ ఇక్కడిదే. అయితే అసలు పిల్లర్‌ని మ్యూజియానికి తరలించారు. నమూనాలు ఈ ప్రాంగణంలో ఉన్నాయి. ఈ టూర్‌కి ఐఆర్సీటీసీ ప్యాకేజ్ సౌకర్యంగా ఉంటుంది. ఈ ప్యాకేజ్‌లో సారనాథ్(ఉత్తరప్రదేశ్), బుద్ధుడు పుట్టిన లుంబిని (నేపాల్), మహాపరినిర్వాణం పొందిన కుశినగర (ఉత్తరప్రదేశ్) కూడా కవర్ అవుతాయి.రాజ్‌గిర్ విశ్వశాంతి కిరణంఇది మహాభారత కాలం నుంచి ప్రాముఖ్యత సంతరించుకున్న ప్రదేశం. జరాసంధుని రాజ్యం గిరివ్రజ. పాండవ మధ్యముడు భీముడితో జరాసంధుడు యుద్ధం చేసిన ప్రదేశంగా చెబుతారు. జైనులకు కూడా ఇది ప్రముఖ ప్రదేశమే. 24వ తీర్థంకరుడు మహావీరుడు (ముని సువ్రత) పద్నాలుగేళ్లు నలంద, రాజ్గిర్లలో జీవించాడు. మగధ రాజ్యానికి తొలినాళ్లలో రాజధాని ఇదే. రాజగృహ అని పిలిచేవాళ్లు. ఇక్కడ అనేక రాజ్యాల రాజుల సమావేశంలో బుద్ధుడు బౌద్ధాన్ని బోధించాడు. రాజ్‌గిర్ విశ్వశాంతి స్తూపం నుంచి కనిపించే గ్రద్ధకూట పర్వతం మీద బుద్ధుడు కొంతకాలం ధ్యానం చేసుకున్నాడు. సప్తపర్ణి గుహలో బౌద్ధ సమావేశాలు జరిగేవి. సమీపంలోని వేణుబన్ (వెదురు వనం)లో సాంత్వన దేవాడు. శిష్యులు, సామాన్యులతోపాటు మగధ రాజు బింబిసారుడికి కూడా ఇక్కడే బోధనలు చేశాడు. విశ్వశాంతిని కోరుతూ బుద్ధుడు చేసిన బోధనలకు ప్రతీకగా ఆ ప్రదేశంలో తెల్లటి అందమైన శాంతిస్థూపాన్ని నిర్మించారు. ఈ కొండ మీదకు వెళ్లడానికి రోప్‌వే ఉంటుంది. ఈ రోప్‌వే బకెట్ ఒక్కరు మాత్రమే కూర్చునేటట్లు ఉంటుంది. కొండ మీదకు వెళ్లేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు ప్రకృతి దృశ్యాలు కనువిందు చేస్తాయి. (చదవండి: వన్ లెగ్డ్ జీన్స్..! ఇదేం ఫ్యాషన్ ట్రెండ్..) -
కొల్లేరులో కొలువైన కొంగు బంగారం పెద్దింట్లమ్మ
కొల్లేటికి మహాపట్టమహిషి పెద్దింట్లమ్మ జాతర ద్వీపకల్పమైన కొల్లేరు సరస్సు మధ్యన అంగరంగ వైభవంగా జరుగుతోంది. రాష్ట్రంలో అత్యంత పురాతన చరిత్ర కలిగిన దేవాలయాల్లో ఏలూరు జిల్లా, కైకలూరు మండలం కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం ఒకటి. ప్రతి ఏటా ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుంచి పౌర్ణమి వరకూ జాతర జరుగుతుంది. ఈ ఏడాది మార్చి 1 నుంచి 13 వరకు అమ్మవారి జాతర (తీర్థం) నిర్వహిస్తున్నారు. జాతరలో అత్యంత కీలకఘట్టమైన జలదుర్గా గోకర్ణేశ్వరుల కల్యాణం మార్చి 10, ఆదివారం రాత్రి జరిగింది.కొల్లేరు సరస్సు మధ్యలో కోట దిబ్బపై పెద్దింట్లమ్మతల్లి 9అడుగుల ఎత్తులో, విశాల నేత్రాలతో వీరాసన భంగిమలో భక్తులకు దర్శనమిస్తారు. కాలాలతో పాటు కోటలు మాయమైనప్పటికీ పెద్దింట్లమ్మ తల్లి విగ్రహం చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. సామాన్యంగా ఒక గ్రామానికి ఒక దేవత ఉంటుంది. కానీ పెద్దింట్లమ్మ ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలో 44 కొల్లేరు దిబ్బలపై నివసించే వారందరికీ కులదైవంగా ఆరాధింపబడటం విశేషం.గ్రంథాల్లో కొల్లేరు అందాలు..రామాయణం అరణ్యకాండలో అగస్త్య మహాముని శ్రీరాముడికి ఈ సరస్సు గురించి చెప్పినట్లు ఉంది. అదేవిధంగా దండి అనే మహాకవి తన దశకుమార చరిత్రలో కొల్లేరు సరస్సును అభివర్ణించాడు. చరిత్రలో కొల్లేటికోట, కొల్లేరు సరస్సుప్రాంతాన్ని కొల్లేటికోట, కొల్లివీటికోట, కర్ణపురి, కొల్హాపురి, కృష్ణా, గోదావరి సంగమదేవ పుష్కరిణీ, సృష్ట్యారంభ పద్మ సరస్సు, దేవపుష్కరిణి, బ్రహ్మ సరస్సు, అరజా సరోవరం, బ్రహ్మండ సరస్సు, కోలాహలపురం, కొల్లేరు, కొలనువీడు అని వ్యవహరించేవారు. కొల్లేరుకు తెలంగాణ బోనాల సాంప్రదాయం..తెలంగాణలో ఉజ్జయిని మహంకాళి, మైసమ్మ, పోచమ్మ, పెద్దమ్మ, మారెమ్మలకు జూలై నెలలో బోనాలు సమర్పిస్తారు. అదేవిధంగా 2020 నుంచి కొల్లేటికోట పెద్దింట్లమ్మకు బోనాలు సమర్పిస్తోన్నారు. అమ్మవారి దేవస్థానానికి 2 కిలోమీటర్ల దూరంలోని పందిరిపల్లిగూడెం నుంచి ప్రభల ఊరేగింపుతో పాటు బోనాలు ప్రతీ ఏటా తీసుకొస్తున్నారు. రాత్రి సమయంలో దీపాల మధ్య బోనాలు, 7 కావిళ్ళలో అమ్మవారి పుట్టింటి నైవేద్యం పసుపు, కుంకుమ, నెయ్యి, వేప రొట్టలు, నిమ్మకాయలు, పానకం, కల్లుతో పెద్దింట్లమ్మ దేవస్థానం తీసుకు రానున్నారు. 3 మైళ్ళ దూరంలోని గోకర్ణేశ్వరపురంలో గోకర్ణేశ్వరస్వామిని ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారితో అంగరంగ వైభవంగా ఆదివారం కల్యాణం జరిపించారు. ఆ సమయంలో కొల్లేరు పెద్ద జనారణ్యంగా మారిపోయింది. జాతర పదమూడు రోజులని పేరే కానీ ఫాల్గుణ మాసం నెలరోజులూ ప్రతి ఆదివారం కొల్లేరు భక్తజన సంద్రంగా మారిపోతుంటుంది. చుట్టుపక్కల గ్రామాలనుంచి, జిల్లాల నుంచి భక్తులు విరివిగా విచ్చేసి అమ్మవారిని, స్వామివారినీ దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. – బి.శ్యామ్, సాక్షి, కైకలూరు, కృష్ణా జిల్లా -
ఆలిం‘ఘనం’ ఆత్మీయం
మనుష్యుల మధ్య మాటల కన్నా స్పర్శ ఎన్నో అనుభూతులను, ఎన్నో సంగతులను చెబుతుంది. భావోద్వేగాలను తెలియజేయడానికి కౌగిలి ఒక శక్తిమంతమైన మాధ్యమంగా పనిచేస్తుంది. ప్రేమ, కృతజ్ఞతల నుంచి కోపం భయం వరకు స్పర్శ ద్వారా వ్యక్తీకరించబడిన భావోద్వేగాలను కౌగిలి, శబ్ద భాషకు మించిన సంబంధాన్ని పెంపొందిస్తుంది, అవగాహనను, సానుభూతిని ప్రోత్సహిస్తుంది.శకుంతలను దుష్యంతుడు గాంధర్వ వివాహం చేసుకొని రాజ్యానికి వెళ్లిపోతాడు. కణ్వమహర్షి తన కూతురిని, మనుమడిని శిష్యులతో దుష్యంతుని దగ్గరకు పంపిస్తాడు. శకుంతల నిండు కొలువులో తానెవరో చెప్తుంది. కానీ దుష్యంతుడు మాత్రం వారి వివాహాన్ని అంగీకరించడు. ‘నీ కొడుకును పరిష్వంగం చేసుకో... అపుడు నీ కొడుకు అవునో కాదో తెలుస్తుంది’ అని చెప్తుంది. అంటే పరిష్వంగంలోని శక్తి అదన్నమాట. దమయంతిని దూరం చేసుకొని నలుడు మారుపేరుతో, దేశదేశాలు తిరిగి ఋతుపర్ణ మహారాజు దగ్గర కాలం గడుపుతుండేవాడు. దమయంతి బాహుకుని పేరుతో ఉన్న నలుడిని గుర్తించాలని తనకు ద్వితీయ వివాహం జరుగుతున్నట్లు ఋతుపర్ణ మహారాజుకు చెప్పి పంపిస్తుంది. ఆ వివాహానికి ఋతుపర్ణ రాజు నలుడిని అంటే బాహుకుడిని తన రథసారథిగా చేసుకొని దమయంతి దగ్గరకు వస్తారు. బాహుకుని రూపంలో ఉన్న నలుని గుర్తించడానికి తన చెలికత్తె ద్వారా తన కూతురిని, కొడుకును వంటచేసుకొంటున్న బాహుకుడి దగ్గరకు పంపుతుంది. ఆ పిల్లలను చూడగానే బాహుకుడు చేతులు చాపి వారిని అక్కున చేర్చుకుంటాడు. కంటతడి పెడ్తాడు. తండ్రీ పిల్లల ముఖకవళికలను చూసి దమయంతి ఆ వంటవాడే తన భర్త నలుడని గుర్తిస్తుంది. పిల్లల పరిష్వంగంలోని శక్తి అది అన్నమాటే కదా.సీతమ్మ క్షేమవార్త చెప్పిన ఆంజనేయుడికి చేతులు చాపి గాఢ పరిష్వంగాన్ని రాముడు ఇచ్చాడు. లంకలో సీతమ్మను చూసి, రావణునిలో భయం కలిగించి, ధైర్యాన్ని సీతమ్మలో నింపి వచ్చిన హనుమకి ప్రాణ సముడవు అని చెప్పడానికి రెండు చేతులు చాపి కౌగిలించుకున్నాడు రాముడు. పరిష్వంగం ద్వారానే రాముడు తన కుమారులుగా లవకుశులను గుర్తించినట్లు కొన్ని రామాయాణాల్లో కనిపిస్తుంది.– ఆనంద‘మైత్రేయ’మ్ -
కాటమరాయుడా.. కదిరి నరసింహుడా!
ఆ దేవుడు లక్ష్మీనారసింహుడు. భక్తులచేత వసంతవల్లభుడిగా, కాటమ రాయుడిగా, ప్రహ్లాదవరదుడిగా పూజలందుకుంటున్న శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి దివ్యక్షేత్రం శ్రీసత్యసాయిజిల్లా కదిరిలో వెలసింది. ఖాద్రీశుడి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం అంకురార్పణంతో అత్యంత వైభవంగా ప్రారంభం అయ్యాయి. ఈ ఉత్సవాలు పక్షం రోజులపాటు జరుగుతాయి. భక్తప్రహ్లాద సమేత నారసింహుని దర్శనం ఇక్కడ మాత్రమే చూడవచ్చు.స్థల పురాణంహిరణ్యకశిపుని సంహరించిన అనంతరం శ్రీవారు ఆ ఉగ్రరూపంలోనే సమీపంలోని కదిరి కొండ వద్ద సంచరించసాగారు. మహర్షులు ఆయనను శాంతింపజేసేందుకు ఆ కొండపై ఆలయాన్ని నిర్మించి స్వామివారిని అందులో వసించమని వేడుకున్నారు. అదే కొండపై శ్రీవారి పాదముద్రికలు కూడా ఉన్నాయి. అందుకే ఈప్రాంతాన్ని ‘ఖాద్రి’ అని పిలిచారు. ‘ఖా’ అంటే విష్ణుపాదమని, ‘అద్రి’ అంటే కొండ అని అర్థం. ఖాద్రి కాస్తా కదిరిగా పిలుస్తున్నారు.మహిమాన్వితుడు.. ఖాద్రీశుడుకదిరిప్రాంతంలో ఒకప్పుడు ఖాదిరి వృక్షాలు(చండ్ర వృక్షాలు) ఎక్కువగా ఉండేవి. వీటికింద ఒక పుట్టలో నారసింహుడు స్వయంభువుగా వెలిశాడని అందుకే ఖాద్రీ నారసింహుడని పిలు స్తున్నారని మరో కథనం. ప్రతి నెలా స్వాతినక్షత్రం రోజు మాత్రమే ఇక్కడ మూల విరాట్‌కు అభిషేకం చేస్తారు. వసంత వల్లభుడని పేరుశ్రీ మహావిష్ణువు అనుగ్రహం కోసం భృగు మహర్షి ఈప్రాంతంలో తపస్సు చేశాడని, అందుకు మెచ్చిన విష్ణువు తాను కోనేటిలో వెలిశానని, తన విగ్రహాలను వెలికితీసి పూజాది కార్యక్రమాలు చేయాలని కోరినట్లు ఓ కథనం. ఉత్సవ విగ్రహాల వెలికితీత జరిగింది వసంత మాసంలో కనుక స్వామివారికి వసంత వల్లభుడని పేరు కూడా ఉంది. అందుకే కోనేరును భృగుతీర్థమని పిలుస్తారు. ఆ ఉత్సవవిగ్రహాలనే ఇప్పటికీ బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ తిరువీధుల్లో ఊరేగిస్తారు. ఇంతటి తేజస్సు కల్గిన ఉత్సవ విగ్రహాలు ఎక్కడా లేవని భక్తులు చెబుతారు.దేశంలోనే 3వ అతి పెద్ద బ్రహ్మరథంస్వామివారి బ్రహ్మ రథం సుమారు 540 టన్నుల బరువు, 37.5 అడుగుల ఎత్తు ఉంది. రథంలోని పీఠం వెడల్పు 16 అడుగులు ఉంది. 130 ఏళ్ల క్రితం ఈ బ్రహ్మరథం తయారు చేశారు. రథంపై 256 శిల్పకళాకృతులను టేకుతో అందంగా తీర్చిదిద్దారు. తమిళనాడులోని అండాల్ అమ్మవారి శ్రీవల్లి పుత్తూరు రథం, తంజావూరు జిల్లాలోని తిరువార్ రథం తర్వాత 3వ అతి పెద్దది ఈ ఖాద్రీశుడి బ్రహ్మరథం. ఆదివారం (9న) అంకురార్పణతో మొదలయిన ఈ బ్రహ్మోత్సవాలలో రోజుకో వాహనం మీద స్వామివారి ఊరేగింపు జరుగుతుంది. 22వ తేదీ తీర్థవాది ఉత్సవం, 23న పుష్పయాగోత్సవంతో ముగుస్తాయి. మా వంశమంతా స్వామి సేవలోనే..తర తరాలుగా మా వంశాలు స్వామివారి సేవలోనే తరిస్తున్నాయి. అది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాం. ప్రహ్లాద సమేత లక్ష్మీనారసింహుడి దర్శనం ఇంకెక్కడా ఉండదు. బ్రహ్మోత్సవాలు 15 రోజుల పాటు జరిగేది కూడా ఇక్కడే. ప్రతి నెలా స్వాతి నక్షత్రం రోజు మూలవిరాట్‌కు అభిషేకం చేస్తాం. – నరసింహాచార్యులు, ఆలయ ప్రధాన అర్చకులుబ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లుబ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో రోజంతా నిత్యాన్నదానం ఉంటుంది. కల్యాణోత్సవంతో పాటు రథోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. ఇందుకు అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. అన్ని ప్రభుత్వ శాఖల అధికారుల సహకారంతో బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా జరిగేలా చూస్తున్నాం.– శ్రీనివాసరెడ్డి, ఆలయ ఈఓ– చెరువు శ్రీనివాసరెడ్డి, సాక్షి, కదిరి, శ్రీసత్యసాయి జిల్లా -
గిన్నిస్ వరల్డ్ రికార్డు నుంచి గోల్డ్ మెడల్ వరకు..
సాధించాలనే తపన, పట్టుదల ముందు ఏ వైకల్యమూ అడ్డుకారాదని.. ప్రతిభ ఉండాలే కానీ అవార్డులు.. రివార్డులు.. వాటంతట అవే వస్తాయని నిరూపించింది.. ఆ యువతి. దివ్యాంగురాలన్న భావన లేకుండా పట్టుదలతో కాన్వాస్‌పై చిత్రలేఖనం (Painting) నేర్చుకుని విమర్శకుల ప్రశంసలు పొందుతూ.. శభాష్ అనిపించుకుంటోంది.. ఆమే మేడ్చల్ జిల్లా శామీర్‌పేట (Shamirpet) మండలం తుర్కపల్లికి చెందిన విజయలక్ష్మి. చిత్రకళతో పాటు సంగీతంలోనూ రాణిస్తూ.. ప్రముఖుల ప్రశంసలు పొందుతూ పలువురికి స్ఫూర్తిగా నిలుస్తోంది.తుర్కపల్లికి చెందిన విజయలక్ష్మి మూడేళ్ల వయసులో పోలియో వచ్చి రెండు కాళ్లు, కుడి చెయ్యి పనిచేయకుండా పోయాయి. తల్లిదండ్రులు నర్సింహులు, ప్రమీళ, అన్నా వదిన అనంద్, శ్రవంతి విజయలక్ష్మికి అండగా నిలిచారు. ఆమెలో ఆత్మస్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించారు. దివ్యాంగురాలనే భావన కలుగకుండా చిత్రలేఖనంపై పట్టుసాధించేలా ప్రోత్సహించారు. మొదట్లో దినపత్రికలు, ఆదివారం ప్రచురణలలోని బొమ్మలను చూసి చిత్రలేఖనం నేర్చుకుంది. కష్టపడి డిగ్రీ పూర్తి చేసింది. పాఠశాల దశలోనే వివిధ చిత్రలేఖన పోటీల్లో బహుమతులు అందుకుంది. అవార్డులు.. ప్రశంసలు.. విజయలక్ష్మి ప్రతిభను గుర్తించిన రాష్ట్ర వికలాంగుల సంఘం సహకారంతో రవీంద్ర భారతిలో పలుమార్లు చిత్రలేఖన ప్రదర్శనలు నిర్వహించి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును అందుకుంది. త్యాగరాయ గానసభలో ప్రతిభా పురస్కారాలను అందుకుంది. గిన్నిస్ వరల్డ్ రికార్డు సంస్థ చేపట్టిన ఆన్లైన్ కాంపిటేషన్‌లో వరుసగా మూడేళ్లు వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్తో పాటు అవార్డులను గెలుచుకుంది. తెలంగాణ ఐకాన్ 2024, బుల్లితెర అవార్డు, తెలంగాణ సేవారత్న– 2025 వంటి అవార్డులనూ అందుకుంది. ఇప్పటివరకూ సుమారు వందకు పైగా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకుంది. చిన్ననాటి నుండే.. చిత్రలేఖనం అంటే చిన్ననాటి నుండే ఇష్టం. మా కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఉన్నా ఎన్నడూ నిరాశపడకుండా కుటుంబ సభ్యుల పోత్సాహంతో ప్రాక్టీస్ చేశా. గిన్నిస్ వరల్డ్ రికార్డు నుంచి గోల్డ్ మెడల్ (Gold Medal) సాధించడం ఆనందాన్నిచ్చింది. అనేక మంది ప్రముఖల ప్రశంసలు పొందాను. – విజయలక్ష్మి, తుర్కపల్లిమూడేళ్ల మోక్ష్ ప్రపంచ రికార్డు జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యాభవన్స్ ఆత్మకూరి రామారావు స్కూల్లో నర్సరీ చదువుతున్న మోక్ష్ అయాన్ సేవల (Moksh Ayaan Sevala) ప్రపంచ రికార్డు సృష్టించాడు. మూడేళ్ల ఐదు నెలల వయసున్న ఈ చిన్నారి ఇటీవల జరిగిన వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ టైటిట్లో భాగంగా అత్యంత వేగంగా పజిల్ సాల్వింగ్‌తో పాటు కలర్ మ్యాచింగ్‌లో అందరి కంటే ముందు నిలిచాడు. 3–5 ఏళ్ల కేటగిరీలో పాల్గొన్న మోక్ష్ కేవలం 11 సెకన్లలోనే ఈ పజిల్‌ను సాల్వ్ చేసి రికార్డ్ బ్రేక్ చేశాడు.పాఠశాలకు చెందిన ప్రీ ప్రైమరీ కో–ఆరినేటర్ విశాల్ అమిన్ మాట్లాడుతూ ఇంత చిన్న వయసులో ఈ ఘనత సాధించడం అద్భుతమన్నారు. విద్యార్థి ఘనతను స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీలతానాయర్ ప్రశంసించారు. ఈ ఘనత తమ స్కూలుకే గర్వకారణమని, భవిష్యత్తులో ఇలాంటి రికార్డులు మరిన్ని సాధించాలని ఆకాంక్షించారు. బాలుడికి పాఠశాల నుంచి సంపూర్ణ సహకారం, ప్రోత్సాహం లభిస్తుందన్నారు. ఇలాంటి విద్యార్థులు మిగతా వారికి స్ఫూర్తిగా నిలుస్తారన్నారు. చదవండి: పక్షులపై ప్రేమతో వేల మైళ్ల ప్రయాణం -
ఇంటికి గెస్ట్‌గా పొన్నంకి పిట్ట.. గొప్ప జ్ఞాపకం
విద్యార్థులకు ఆమె గణితం నేర్పాలనుకున్నారు. కానీ విధి లిఖితం ఆమెకు కొత్త రెక్కలు తొడిగింది. పక్షుల ప్రేమలో వేలమైళ్లు ప్రయాణించేలా చేసింది. ఐదేళ్లుగా విభిన్న రకాల పక్షులను గుర్తించారు. కాగా ఇప్పటి వరకూ 550కు పైగా జాతులను కెమెరాలో బంధించి రికార్డు సృష్టించారు. ఆమే హైదరాబాద్ (Hyderabad) నగరంలోని అమీన్పూర్ (Ameenpur) సమీపంలోని హెచ్ఎమ్టీ కాలనీలో నివసించే శ్యామల రూపాకుల (Syamala Rupakula).. పక్షి ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఆ ప్రేమ ఆమెకు అనారోగ్యాలను దూరం చేయడం మాత్రమే కాదు.. కొత్త రికార్డులకు దగ్గర చేస్తోంది. – సాక్షి, సిటీబ్యూరో‘ఆన్లైన్లో మ్యాథ్స్ ట్యూటర్‌గా పనిచేసేదాన్ని. కొన్ని ఆరోగ్య సమస్యలు నన్ను బాధించాయి. దీంతో ఆ పని వదిలేయాల్సి వచ్చింది. అనుకోకుండా బర్డ్ వాచర్‌గా మారాను’ అంటూ ఏడేళ్ల నాటి గతం గుర్తు చేసుకున్నారు శ్యామల. దాదాపు రికార్డు స్థాయిలో 550 పక్షులను గుర్తించి నగర బర్డ్ వాచర్స్ (Bird Watchers) ప్రపంచంలో తనదైన ముద్రను వేసుకున్నారు. ఐటీ ఉద్యోగి అయిన భర్త బాలసుబ్రహ్మణ్యకుమార్ సహకారంతోనే తన హాబీని ఇంతగా ఆస్వాదించగలిగానని చెబుతున్నారు. ఆమె ప్రయాణానికి సంబంధించిన మరిన్ని విశేషాలు ఆమె మాటల్లోనే..బీజం పడింది అక్కడే.. తొలుత జంతువుల పట్ల ఆసక్తితో వన్యప్రాణుల సంరక్షణా కేంద్రాలకు (వైల్డ్‌లైఫ్ శాంక్చురీ) వెళ్లేదాన్ని. బర్డ్ వాచింగ్ చేసినా మా ఇంటి దగ్గర్లో ఉన్న అమీన్పూర్ లేక్ వరకు మాత్రమే పరిమితమయ్యేదాన్ని. అయితే పక్షులపై వీరాభిమానానికి తొలిసారి బీజం పడింది మంజీరా వన్య ప్రాణుల సంరక్షణా కేంద్రానికి వెళ్లినప్పుడు. అక్కడ నాకు పరిచయమైన షివాన్ మాధురి దంపతులు.. నా బర్డ్ వాచింగ్ ఆసక్తిని గమనించి హైదరాబాద్ పాల్స్ గ్రూప్ గురించి చెప్పి నన్ను కూడా జాయిన్ చేశారు. అక్కడి నుంచి బర్డింగ్ కమ్యూనిటీలో స్నేహితుల మార్గదర్శకత్వంలో సీరియస్ బర్డ్ వాచింగ్ ప్రయాణం ప్రారంభమైంది. తమిళనాడు వెళ్లా. నవంబరు నుంచి ఫిబ్రవరి మధ్యలో నెలకు ఒకటైనా సరే కాస్త దూరంగా ఉండే ప్రాంతాలకు వెళ్తా. కేరళ రెండు సార్లు, ఉత్తరాఖండ్ మూడు సార్లు, కర్ణాటకకు ప్రతి యేటా వెళుతుంటాను. ఇక వారాంతాల్లో నరసాపూర్, క్రిష్ణారెడ్డి లేక్, అనంతగిరి హిల్స్, ఉమామహేశ్వరం.. ఇలా ఎక్కడో ఒక ప్రాంతానికి వెళతాం. మన దేశంలో 1300లకుపైగా జాతులు ఉన్నాయి. ఇప్పటి వరకూ 550కి పైగా పక్షులను గుర్తించాను. మొత్తం అన్నీ గుర్తించాలనే లక్ష్యంగా పెట్టుకున్నాను.రావోయీ అభిమాన అతిథీ.. మా ఇంట్లోనే ఒక చిన్న తోట పెంచుతున్నాం. పక్షుల రాక కోసమే ఇంట్లో డ్రిప్ సిస్టమ్ ఉంది. నీళ్ల కోసం దాదాపు 12 రకాల పక్షులు వస్తాయి. రోజూ పొద్దున్న, సాయంత్రం వాటిని చూస్తుంటే మనసు నిండిపోతుంది. గత సీజన్లో బర్డర్స్ ఫేవరెట్‌గా పేర్కొనే పొన్నంకి పిట్ట (ఇండియన్ పిట్ట) మా ఇంటికి వచ్చి ఏకంగా 4 రోజుల పాటు ఉండడం మరచిపోలేని, మధుర జ్ఞాపకం. ఇవి సాధారణంగా హిమాలయాల నుంచి వస్తాయని చెబుతారు. యేటా అక్టోబరు, నవంబర్ నెల్లో వచ్చి ఎండలు ముదిరినప్పుడు వెళ్లిపోతాయి. అలాంటి పక్షి.. మా ఇంటి పెరట్లో కొన్ని రోజుల పాటు ఉండడం గొప్ప జ్ఞాపకం. ప్రతి పక్షికీ ఓ పేరుంటుంది. ఒక్క జాతిలోనే అరడజను రకాలు ఉంటాయి. వాటి రెక్కల రంగు, పరిమాణం.. వంటి వాటిని బట్టి మనం గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. అలా గుర్తు పెట్టుకోవడం మొదట్లో చాలా కష్టం అనిపించేది. ఇప్పుడు అలవాటైంది.చదవండి: సామాజిక స్ఫూర్తికి సెల్యూట్ఎంతో సంతృప్తినిస్తోంది.. ప్రస్తుతం నగరంలో చాలా మంది బర్డ్ వాచర్స్గా మారుతున్నారు. పలువురు నాకు కాల్ చేసి పక్షుల రాకపోకల గురించి సమాచారం అడుగుతుంటే.. వాళ్లకి సమాధానం ఇస్తుండడం నాకెంత సంతృప్తిని అందిస్తుందో.. అభిరుచులను పంచుకోడాన్ని మించిన ఆనందం ఏముంటుంది? పైగా పక్షులను ప్రేమించడం అంటే ప్రకృతిని ప్రేమించడమే.. నీటి నుంచి నింగి వరకూ ప్రతి చోటా ప్రత్యక్షమయే పక్షుల ద్వారా.. ప్రకృతిలోని అనువణువూ బర్డ్ వాచింగ్ మనకు పరిచయం చేస్తుంది. మరచిపోలేని జ్ఞాపకాలను అందిస్తుంది. -
వన్ లెగ్డ్ జీన్స్..! ఇదేం ఫ్యాషన్ ట్రెండ్..
ఫ్యాషన్ ట్రెండ్ అనేది నిరంతరం మారుతూనే ఉంటుంది. ఎప్పటికప్పుడూ లేటెస్ట్ ట్రెండ్ వచ్చేస్తుంటుంది. అయితే కొన్ని ఫ్యాషన్ డిజైన్లు చూస్తే అబ్బా ఇదేం ఫ్యాషన్ అని నెటజన్లు మండిపడేలా ఉంటాయి. అసలు వాటిని ఎలా ధరిస్తారురా బాబు అనే ఫీలింగ్ వచ్చేస్తుంటుంది కూడా. అయితే వాటి ధర చూస్తే అంత పలుకుతుందా అని నెటిజన్లు షాక్ అయ్యేలా ఉంటాయి. అలాంటి ఫ్యాషన్ ట్రెండ్ ప్రస్తుతం నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. ఇదేం పిచ్చి ఫ్యాషన్ అని తిట్టుకుంటున్నారు నెటిజన్లు. నిజంగా ఇది స్టైలిష్ ఫ్యాషనా..? లేక తెలియక ఏదో అలా డిజైన్ చేశారా..? అని నెట్టింట చర్చించుకుంటున్నారు. ఫ్రెంచ్ లగ్జరీ లేబుల్ కోపర్ని కలెక్షన్‌కి సంబంధించిన డిజైనర్‌వేర్ వన్ లెగ్డ్ జీన్స్ గురించి ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ క్రిస్టీ సారా వీడియో రూపంలో తన అభిప్రాయాన్నిషేర్ చేసింది. దీంతో ఈ డిజైనర్‌వేర్ నెట్టింట హాట్‌టాపిక్ మారింది ఇది. ఆ వీడియోలో ఆమె భర్త సడెన్‌గా ఎంటర్ అయ్యి ప్రస్తుతం దీన్ని ఎవ్వరూ ధరించడం లేదని అన్నారు. అయితే సారా మాత్రం ఈ డిజైన్ నచ్చింది కానీ కాస్త పెద్ద సైజు కావాలన్నారు. అయితే దీని ధర మాత్రం రూ. 38 వేలు పైనే పలుకుతోందని తెలిపింది.తక్కువలో దొరికితే ఇలాంటి డిజైన్లు ట్రై చేయగలమని తన అభిప్రాయాన్ని పంచుకుంది. కానీ నెటిజన్లు మూవీలో ఫన్ కోసం నటులు వేసుకున్నారనుకున్నాం. ఇది కూడా ఓ ఫ్యాషన్‌నే అంటూ మండిపడ్డారు. అసలు ఎలా ధరించి బయటకు రాగలరు. ఏ ఫ్యాషన్ అయినా చూసేవాళ్లకు, మనకు కూడా కంఫర్ట్ ఉండాలి కదా అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Kristy Sarah Scott (@kristy.sarah) (చదవండి: సమ్మర్లో స్లిమ్‌గా మారడం ఈజీ..! ఎలాగంటే..) -
సమ్మర్లో స్లిమ్‌గా మారడం ఈజీ..! ఎలాగంటే..
వ్యాయామంతో బరువు తగ్గించుకునేందుకు ఇదే అనువైన సమయమంటున్నారు వైద్య నిపుణులు. ప్రతిరోజూ వ్యాయామం, యోగా చేస్తూ, ఆహార నియమాలు పాటిస్తూ వేసవిలో స్లిమ్‌గా మారొచ్చంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఇప్పటికే వేసవి ప్రారంభమైంది. జిమ్ చేయడానికి సిద్ధమవుదాం. నడక ఎంతో ప్రయోజనం ప్రస్తుత యాంత్రిక జీవనంలో అనేక రకాల పనుల కారణంగా తీవ్రమైన ఒత్తిడి ఎదురవుతోంది. దీన్ని నడకతో అధిగమించవచ్చని వైద్యులు చెబుతున్నారు. సాయంత్రం కంటే మార్నింగ్ వాక్ చాలా మంచిది. ఉదయం స్వచ్ఛమైన వాతావరణంతో పాటు, ఆక్సిజన్ స్థాయి అధికంగా ఉంటుంది. సున్నితంగా సూర్యకిరణాలు పడుతుంటే మనసుకు హాయినిస్తుంది. అయితే జాగింగ్ సమయంలో కొన్ని జాగ్రత్తలు తప్పవంటున్నారు. నీరసం వచ్చే వరకూ జాగింగ్ చేయడం ప్రమాదకరమే. దాహం వేస్తే అందుబాటులో తాగునీటిని ఉంచుకోవాలి. శీతల ప్రాణాయామం శీతల ప్రాణాయామం చేస్తే కొంత వరకూ ఎండల ప్రతాపాన్ని తట్టుకునే శక్తి శరీరానికి అందడంతోపాటు, బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. నాలుకను మడిచి, నోటి ద్వారా గాలి పీల్చి ముక్కుద్వారా వదిలే ప్రక్రియే శీతల ప్రాణా యామం. ఉదయం 7 గంటల లోపు 5 నిమిషాలు ఈ వ్యాయామం చేయడం మంచిదని యోగా నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఆహారం మేలు పుచ్చ, కీర, కర్బూజా, తాటి ముంజలు, బీర, పొట్ల వంటి వాటిలో నీటిశాతం పుష్కలంగా ఉంటుంది. వీటితో శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. శీతల పానీయాలు, షుగర్ వేసిన జ్యూస్‌లు, మ్యాంగో, సపోటా వంటివి తీసుకుంటే బరువు తగ్గకపోగా కొత్త సమస్యలు వస్తాయి. వేసవిలో ఆకలి తక్కువగా, దాహం ఎక్కువగా ఉంటుంది. డైట్ పాటిస్తూ కాలానికి తగ్గట్టుగా ఆహార పదార్థాలను తీసుకుంటే బరువును నియంత్రించవచ్చు. నీళ్లు, మజ్జిగ, కొబ్బరినీళ్లు తీసుకోవాలి. ఇవి పాటిస్తే.. బరువు తగ్గాలనుకునే వారికి స్విమ్మింగ్ మంచి వ్యాయామం ఎంతటి భోజన ప్రియులైన వేసవిలో కాస్త మోతాదు తగ్గించి ఆహారం తీసుకుంటారు వేసవిలో ఘన పదార్థాల కంటే ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలనిపిస్తుంది రోజుకు కనీసం 5 లీటర్ల నీటిని వివిధ రూపాల్గో తీసుకుంటే బరువు తగ్గడానికి దోహదపడుతుంది. ఫ్రిజ్‌లో నీటికన్నా కుండలోని నీటిని తాగడం ఉత్తమం. జాగ్రత్తలు తీసుకోవాలి వాకింగ్, జాగింగ్, వ్యాయామం చేసే సమయంలో నీరసం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అతిగా వాకింగ్ చేయకూడదు. ఎండలో వాకింగ్ చేయడం మంచిది కాదు. వేసవిలో శరీరంలో నీరు త్వరగా ఆవిరై డీ హైడ్రేషన్‌కు దారితీస్తుంది. మధుమేహం, రక్తపోటు ఉన్న వారు జాగ్రత్తలు తీసుకోవాలి. – డాక్టర్ టీవీ మురళీకృష్ణ, జనరల్ ఫిజీషియన్ఆహార నియమాలు పాటించాలి వేసవిలో ఆహార నియమాలు పాటించాలి. వేపుళ్లు, నూనె ఎక్కువుగా ఉన్న వంటకాలు తీసుకోకుండా ఉండటం మంచిది. తాజా ఆకుకూరలు, పళ్లు తీసుకోవాలి. నీరుశాతం ఎక్కువగా ఉంటే పుచ్చ, కర్బూజ, వంటి పళ్లు తీసుకోవాలి. జాగ్రత్తలు తీసుకుంటూ వ్యాయామం చేస్తే స్లిమ్‌గా మారొచ్చు. – గర్రే హరిత, ఆహార నిపుణులు -
ఈ మేకప్ బాక్స్ ఉపయోగించడం చాలా ఈజీ..!
మేకప్ ఉత్పత్తులను దాచిపెట్టుకోవడం, అవసరానికి వాటిని వెతుక్కోవడం పెద్ద సమస్య. ఇక మేకప్ సామగ్రికి బ్యాక్టీరియా, ఫంగస్ వంటివి చేరకుండా జాగ్రత్తపడటం మరో సమస్య. ఆ సమస్యను ఈ మేకప్ బాక్స్ ఇట్టే దూరం చేయగలదు. పైగా మిర్రర్, ఫ్యాన్, లైట్ వంటి వాటితో రూపొందిన ఈ మేకప్ బాక్స్ వాడుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది.క్రీమ్స్, సీరమ్స్, లోషన్స్, ఫౌండేషన్స లిప్స్టిక్స్, ఐ లైనర్స్, పౌడర్స్ ఇలా రోజువారీ వినియోగించే మేకప్ సామాన్లను ఈ బాక్స్‌లో చక్కగా సర్దిపెట్టుకోవచ్చు. ఈ కాస్మెటిక్ స్టోరేజ్ బాక్స్‌కి ఒకవైపు అద్దం ఉంటుంది. మరోవైపు స్టోరేజ్ కంటైనర్ ఉంటుంది. దీనికున్న అద్దాన్ని 360 డిగ్రీల్లో ఎలా అయినా తిప్పుకోవచ్చు. కూర్చునే కాదు, నిలబడి కూడా మేకప్ వేసుకోవచ్చు. వేసుకున్న మేకప్ త్వరగా ఆరడానికి దీనిలో ఫ్యాన్ కూడా ఉంటుంది. ఇక దీనిలో పర్ఫ్యూమ్స్, నెయిల్ పాలిష్‌లు, నెయిల్ రిమూవర్స్ వంటివన్నీ దాచుకోవచ్చు. అద్దం వెనుక భాగంలో కూడా కొన్ని మేకప్ వస్తువులను పెట్టుకోవచ్చు. ఈ కాస్మెటిక్ స్టోరేజ్ బాక్స్‌లో మరో నాలుగు చిన్నచిన్న సొరుగులు ఉంటాయి. దీనికి ఎల్ఈడీ లైట్ అమర్చి ఉండటంతో, కరెంట్ లేనప్పుడు కూడా మేకప్ వేసుకోవడానికి వీలవుతుంది. ఈ లైట్ మూడు వేర్వేరు కాంతుల్లో వెలిగేందుకు ఆప్షన్స్ ఉంటాయి. వాటిని మార్చుకుంటూ మేకప్ ముఖానికి సరైన విధంగా ఉందో లేదో చూసుకోవచ్చు. మనకు కావాల్సిన అన్ని రకాల మేకప్ ఉత్పత్తులను ఇందులో భద్రపరచుకోవచ్చు. ఎక్కడికైనా సులభంగా తీసుకుని వెళ్లొచ్చు. దీన్ని బాత్ రూమ్‌లో, బెడ్ రూమ్‌లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇలాంటి మేకప్బాక్సులు చాలానే, రకరకాల మోడల్స్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఇవి రకరకాల రంగుల్లో లభిస్తున్నాయి. దీని ధర సుమారుగా మూడు లేదా నాలుగు వేలు ఉంటుంది. మోడల్ని బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. వీటిలో కొన్నింటిని ముందే చార్జింగ్ పెట్టుకుని వాడుకోవచ్చు. కొన్నింటిని బ్యాటరీలతో వినియోగించుకోవచ్చు.ముఖ కాంతికి చికిత్స..:ముఖ సౌందర్యాన్ని మెరుగుపరచుకోవడానికి రకరకాల చిట్కాలు ఉన్నాయి. రకరకాల సౌందర్య లేపనాలు, అధునాతన పరికరాలు ఉన్నాయి. ఇవేవీ ఫలించనప్పుడు నిపుణులు చేసే చికిత్స పద్ధతులు ఉన్నాయి. ముఖ సౌందర్యాన్ని త్వరగా మెరుగుపరచడానికి ఇటీవలి కాలంలో ‘లో లెవల్ లేజర్ లైట్ థెరపీ’ అందుబాటులోకి వచ్చింది. ఈ పద్ధతిలో తక్కువ స్థాయిలో లేజర్ లైట్‌ను వెదజల్లే పరికరాన్ని ఉపయోగిస్తారు. టార్చ్లైట్లా ఉండే ఈ పరికరం ద్వారా ముఖచర్మంపై లేజర్ కాంతిని ప్రసరింపజేస్తారు. దీనివల్ల ముఖ కండరాల్లో కొలాజెన్ ఉత్పత్తి పెరిగి, సడలిపోయిన ముఖం తిరిగి బిగుతుదేరుతుంది. ముఖంపై ఏర్పడిన ముడతలు, మచ్చలు, మొటిమలు కూడా క్రమంగా నయమవుతాయి. పలు దేశాల్లో చర్మవైద్య నిపుణులు ఈ పద్ధతిలో చికిత్సను అందిస్తున్నారు. (చదవండి: ఇంధన స్పృహ కలిగిన ఇల్లులా ఆరోగ్యకరంగా మార్చేద్దాం..!) -
ఇంధన స్పృహ కలిగిన ఇల్లులా ఆరోగ్యకరంగా మార్చేద్దాం..!
ఇంటిని మరింత పర్యావరణ అనుకూలంగా ఎలా మార్చుకోవాలి అని చేసే ఆలోచనల్లో లైటింగ్ ఒకటి. అందుకు సరైన ఉపకరణాలను వాడటం, సరైన వెంటిలేషన్‌ను నిర్ధారించడం వంటి సాధారణ మార్పులు, ఇంధన శక్తిని పొదుపు చేయడానికి పాటించాల్సిన పద్ధతులు పెద్ద తేడాను కలిగిస్తాయి. ఇంధన స్పృహ కలిగిన ఇల్లు ఆరోగ్యకరమైన వాతావరణానికి, మరింత సౌకర్యవంతమైన జీవనశైలికి దోహదం చేస్తుంది. పాతకాలం బల్బుల కంటే ఎల్ఈడీ లైట్లు 80 శాతం వరకు తక్కువ విద్యుత్తును ఉపయోగిస్తాయి. ఎక్కువ కాలం వెలుగునిస్తాయి. దీంతో బల్బులను త్వరగా మార్చనక్కర్లేదు. కరెంట్ బిల్లు కూడా తగ్గుతుంది.కరెంట్ వినియోగం ఎక్కువ ఉండే వంట గదిని పరిశీలించండి. ఏ ఎలక్ట్రికల్ వస్తువును ఉపయోగిస్తున్నాం, ఆ వస్తువు లేకుండా మరో విధంగా పనులు పూర్తి చేయగలమా, బామ్మల కాలం నాటి పద్ధతులను అమలు చేయగలమా.. అని ఆలోచన చేయడమే కాకుండా, ఆచరణలో పెట్టవచ్చు.రోజూ కరెంట్‌తో నడిచే పరికరాలను వారంలో రెండు, మూడుసార్లు విరామమిచ్చేలా ప్లాన్ చేసుకోవచ్చు.ఇంటికి కరెంట్ వాడకం ఎంత అవసరం అనేది ముందు ఒక అంచనా వేసుకోవాలి. గాలి, వెలుతురు ధారాళంగా ఉండే ఇంటిలో లైట్ల వాడకం అంతగా ఉండదు. దీని వల్ల కరెంట్ వినియోగాన్ని సగానికి సగం తగ్గించవచ్చు.ఇంటికి కరెంట్ వాడకం ఎంత అవసరం అనేది ముందు ఒక అంచనా వేసుకోవాలి. గాలి, వెలుతురు ధారాళంగా ఉండే ఇంటిలో లైట్ల వాడకం అంతగా ఉండదు. దీని వల్ల కరెంట్ వినియోగాన్ని సగానికి సగం తగ్గించవచ్చు.కరెంట్ వినియోగం ఎక్కువ ఉండే వంట గదిని పరిశీలించండి. ఏ ఎలక్ట్రికల్ వస్తువును ఉపయోగిస్తున్నాం, ఆ వస్తువు లేకుండా మరో విధంగా పనులు పూర్తి చేయగలమా, బామ్మల కాలం నాటి పద్ధతులను అమలు చేయగలమా.. అని ఆలోచన చేయడమే కాకుండా, ఆచరణలో పెట్టవచ్చు.గది నుంచి బయటకు వెళ్లేటప్పుడు లైట్లు, ఫ్యాన్లు ఆపివేయడం అలవాటు చేసుకోవాలి. ఈ విషయంలో కుటుంబ సభ్యులకూ అవగాహన కల్పించాలి. కుటుంబంలో ప్రతి ఒక్కరూ విద్యుత్తును ఆదాచేయడంలో ప్రాధాన్యాన్ని అర్థం చేసుకునేలా మన ప్రవర్తన ఉండాలి. సోలార్ విద్యుత్తును ఉపయోగించడం వల్ల ఇతర ఇంధన శక్తిని కొనుగోలును తగ్గించవచ్చు. సోలార్, గ్యాస్ ఆధారిత వాటర్ హీటర్లను ఉపయోగించడం వల్ల కూడా విద్యుత్తు వినియోగాన్ని తగ్గించినవారవుతారు. కార్బన్ ఫుట్ ప్రింట్స్‌ను తగ్గిస్తూ, చిన్న చిన్న మార్పులతో పర్యావరణ అనుకూలంగా ఉంటే డబ్బు, సమయాన్ని ఆదాచేయడమే కాదు రేపటి తరాలకు కూడా మేలు చేసినవారవుతారు. -ఎన్.ఆర్(చదవండి: -
అంతా జేమ్స్ బాండ్ హీరో హీరో సెవన్‌గా కీర్తిస్తారు..కానీ ఆయన..!
యూఎస్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్.. క్లింట్ హిల్ ఇటీవలే ఫిబ్రవరి 21న తన 93వ యేట కన్నుమూశారు. తుదిశ్వాస వరకు కూడా జీవితమంతా ఆయన ఒకటే ఆశించారు. తను 1963 నవంబర్ 22నే.. ‘ఆన్ ది స్పాట్’ చనిపోయి ఉంటే బాగుండేదని, ప్రజల మనసుల్లో తనకు చిరస్మరణీయ స్థానం దక్కి ఉండేదని! ఏమిటి ఆ రోజుకు అంత ప్రత్యేకత? అదేమిటో తెలుసుకోవాలంటే, ముందు ఆయన ప్రత్యేకత ఏమిటో తెలుసుకోవాలి!ఐదుగురు ప్రెసిడెంట్ల దగ్గర..!ఐసనోవర్ మొదలు, వరుసగా జాన్ ఎఫ్. కెన్నెడీ, లిండన్ బి.జాన్సన్, రిచర్డ్ నిక్సన్, గెరాల్డ్ ఫోర్డ్.. మొత్తం ఐదుగురు అమెరికా ప్రెసిడెంట్ల దగ్గర సీక్రెట్ సర్వీస్ ఏజెంటుగా పని చేశారు క్లింట్ హిల్! గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, మిలటరీ సర్వీస్‌ను ముగించుకుని వచ్చాక 1958లో ప్రెసిడెంట్ ఐసనోవర్ సీక్రెట్ సర్వీస్‌లో ఏజెంట్‌గా తొలి ‘టఫెస్ట్’ జాబ్! అప్పటికి అతడి వయసు 26 ఏళ్లు. ఐసనోవర్ 1953 నుంచి 1961 వరకు ఎనిమిదేళ్ల పాటు రెండు టెర్మ్‌లు అమెరికా అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన తర్వాత జాన్ ఎఫ్.కెన్నెడీ అధ్యక్షుడిగా వచ్చేవరకు ఐసనోవర్ దగ్గర మూడేళ్లు పని చేశారు హిల్. తర్వాత కెన్నెడీకి, ఆయన సతీమణి జాక్వెలీన్‌కు సీక్రెట్ సర్వీస్ ఏజెంటుగా ఉన్నారు. ‘‘ఆ రోజే, ఆన్ ది స్పాట్, నేను కూడా చనిపోయి ఉంటే బాగుండేది’’ అని క్లింట్ ఏ రోజు గురించైతే అంటూండేవారో ఆ.. 1963 నవంబర్ 22.. కెన్నడీ హయాం లోనిదే!అసలు ఆ రోజు ఏమైంది?!ఏమీ కాలేదు! 62 ఏళ్ల క్రితం నాటి ఆ మధ్యాహ్నం 12.29 నిముషాల వరకు కూడా– అసలు ఏమీ కాలేదు. ఆ తర్వాతి 30వ నిముషంతోనే ఆ రోజుకు ఎక్కడలేని ప్రాముఖ్యం వచ్చి పడింది. ఓపెన్ టాప్ కారులో వెళుతున్న జాన్ ఎఫ్. కెన్నెడీ తలలోకి దూరాన్నుంచి తుపాకీ బులెట్ వచ్చి దిగబడింది! కెన్నెడీ అక్కడిక్కడ తల వాల్చేశారు. కారులో ఆయన పక్కన ఆయన సతీమణి కూర్చొని ఉన్నారు. వారి కారు వెనకే సీక్రెట్ ఏజెంట్ క్లింట్ హిల్ కూర్చొని ఉన్న కారు వెళ్తోంది. కెన్నెడీపై కాల్పులు మొదలవ్వగానే క్లింట్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఒక ఉదుటున గాల్లోంచి పైకి లేచి, కెన్నెడీ ఉన్న కారు మీదకు దూకారు. అతడి మొదటి లక్ష్యం ప్రెసిడెంట్ కెన్నెడీని కాపాడటం, కొన్ని లిప్తల ఆలస్యంతో ఆ లక్ష్యం చేజారింది. రెండో లక్ష్యం జాక్వెలీన్ని కాపాడటం. అప్పటికే ఆమె దిక్కు తోచనట్లు సీట్లోంచి పైకి లేచి కంగారుగా కారు పై భాగంలోకి వచ్చేశారు. హిల్ తక్షణం ఆమెను తిరిగి ఆమె సీట్లోనే కూర్చోబెట్టి ఆమెకు వలయంగా ఏర్పడ్డాడు. ఇదంతా కూడా కారు రన్నింగ్‌లో ఉన్నప్పుడే. క్షణమైనా ఆలస్యం చేయలేదు..!కెన్నెడీపై కాల్పులు జరుగుతున్నట్లు గ్రహించగానే హిల్ వెంటనే తన కారులోంచి నేరుగా కెన్నెడీ ఉన్న కారు పైకి జంప్ చేశారు! ‘‘ఆ ఘటనలో నేను సెకనులో ఐదో వంతు వేగాన్ని, కనీసం ఒక సెకను వేగంగానైనా సాధించగలిగి ఉంటే... దురదృష్టవశాత్తూ ఇప్పుడు మీ ఎదురుగా కూర్చొని ఉండి ఉండేవాడిని కాదు..’’ అని అమెరికన్ టెలివిజన్ ప్రోగ్రాం ‘సీబీఎస్ 60 మినిట్స్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు హిల్. ‘‘ఆ వేగం నాకు సాధ్యపడి ఉంటే ప్రెసిడెంట్ కెన్నెడీని కాపాడే ప్రయత్నంలో నాకూ బులెట్లు తగిలి ఉండేవి. నేనూ ఆన్ ది స్పాట్ చనిపోయి ఉండేవాడిని. అప్పుడు నా మరణానికి ఒక సార్థకత ఉండేది’’ అని కుమిలిపోయారు హిల్. ఆ అపరాధ భావనతోనే 1975లో గెరాల్డ్ ఫోర్ట్ అధ్యక్షుడు అయిన రెండో ఏడాదే, తన 43 ఏళ్ల వయసులో సీక్రెట్ సర్వీస్ నుంచి ముందుగానే పదవీ విరమణ చేశారు. ‘‘హీరోని కాదు, నేనొక జీరో!’’ఆ రోజు– కెన్నెడీ కారు, ఆ వెనుక మరికొన్ని కార్లు, నెమ్మదిగా కదులుతూ ముందుకు వెళుతున్న సమయంలో, రోడ్డుకు రెండు పక్కల నిలబడి చేతులు ఊపుతున్న జనం మధ్యలో అబ్రహాం జఫ్రూడర్ కూడా ఉన్నాడు. అతడొక వస్త్రాల వ్యాపారి. ప్రెసిడెంట్ కెన్నెడీ కాన్వాయ్‌ని ఉత్సాహం కొద్దీ వీడియో తీస్తూ ఉన్న అబ్రహాం చేతిలోని కెమెరాలో... కెన్నెడీపై కాల్పులు జరగడం, ఆయన తలవాల్చటం, వెనుక కార్లోంచి క్లింట్ హిల్ అమాంతం ఈ కారులోకి దూకటం– అన్నీ స్పష్టంగా రికార్డు అయ్యాయి. ఆ వీడియో బయటికి వచ్చాక.. హిల్ అమెరికా ప్రజల హీరో అయ్యారు. కానీ హిల్ హీరోలా ఫీల్ అవలేదు. తానెందుకు బతికిపోయానా అని జీవితాంతం జీరోలా బాధపడుతూనే ఉండిపోయారు. అయినప్పటికీ అమెరికా చరిత్రలో చిరస్మరణీయుడిగా మిగిలారు. జేమ్స్ బాండ్ హీరో హీరో సెవన్‌గా అమెరికన్ ప్రజలు అతడిని కొనియాడారు. (చదవండి: -
ఈ వారం కథ: మెలకువలో చీడకల
‘‘రీచ్ అయ్యావా?’’, టింగ్‌మని వాట్సప్‌లో భర్త. అబ్బో! కేరింగ్ మెసేజే అనుకుంటూ ‘‘హా, ఇప్పుడే ఆఫీస్ లోపలికొచ్చాను’’ అని ఆమె రిప్లై.‘‘ఒకసారి లొకేషన్ పంపు’’మెసేజ్‌ని ముసుగు తీస్తే బయటపడ్డ అనుమానం.‘‘యే! నమ్మట్లేదా నన్ను? అయినా దించిన ఓలా డ్రైవర్ నుండి డ్రాప్ లొకేషన్ కూడా పంపించుకున్నావ్ కదా! మళ్లీ ఏంటీ? దున్నపోతులా పడుకునే బదులు పొద్దున్నే లేచి నన్ను డ్రాప్ చెయ్యొచ్చుగా?’’ అని ఫాస్ట్‌గా టైప్ చేసింది కోపం బాధ కలిపి, కానీ పంపలేదు. బ్యాక్ స్పేస్ బటన్ మీద ఒత్తిడి పెంచడంతో టైప్ చేసిందంతా క్లియర్ అయింది, స్క్రీన్ మీద పడిన కన్నీటి బొట్లు తప్ప!లొకేషన్ పంపించింది.వచ్చిన మెసేజ్లోని ఆమె కోపాన్ని పసిగట్టి, ‘‘ఆఫీస్ అయిపోతే నిన్ను పికప్ చేసుకోవడానికి అడిగాన్లే’’ మెసేజ్‌కు అతడి సమాధానం.ఆమె నమ్మినట్టుగా ఓ థంబ్సప్ ఎమోజీ పంపింది ఏడుపు ముఖం దాచుకుంటూ. ‘‘మీ జాయినింగ్ ఫార్మాలిటీస్ అయిపోయాయి, కాసేపు మీటింగ్ రూమ్‌లో కూర్చోండి’’ అనగానే ఆమె మూడ్ మారింది. సిస్టం కీబోర్డులతో కుస్తీ పడుతున్న ఎంప్లాయీస్‌ని గమనిస్తూ కూర్చుంది.‘‘హలో మేడమ్, వెల్కమ్ ఆన్ బోర్డ్. మై సెల్ఫ్ యామిని’’ అంటూ ఓ అమ్మాయి తన దగ్గరికి వచ్చింది షేక్ హ్యాండ్ ఇచ్చింది.‘‘హలో, ఐయామ్ మధుమతి’’‘‘తెలుసు మేడమ్‘‘‘‘అయ్యో, మేడమ్ వద్దు. కాల్ మీ మధు’’‘‘అంటే, ఇక్కడికి రాక ముందు కూడా మీరు నాకు మేడమే కదానీ’’మధుమతి వెలిగిపోయింది, కానీ ఏదో గుర్తొచ్చి ఆ బ్లష్ అంతా ఒక్కసారిగా ఫ్లష్ అయిపోయింది.‘‘కూల్ మేడమ్, మీరు లెక్చరర్‌గా చేసిన కాలేజ్‌లోనే నేను చదువుకున్నాను’’ చెప్పింది యామిని.‘‘అది అర్థమైంది. కానీ, ఈ విషయం ఆఫీసులో ఇంకెవరికైనా తెలుసా?’’ అడిగింది మధుమతి.‘‘లేదు, ఇంకా ఎవరికీ చెప్పలే’’ పూర్తి చేయకముందే,‘‘చెప్పొద్దు కూడా ప్లీజ్. సారీ నేను నిన్ను గుర్తుపట్టలేదు, ఏ ఇయర్ పాస్డ్‌ఔట్?’’ అడిగింది మధుమతి.‘‘2021 మేడమ్’’ చెప్పింది యామిని.‘‘నీకోటి చెప్పాలి యామిని, బట్ ప్లీజ్ కీపిట్ సీక్రెట్’’ అని కాస్త ముందుకు వంగి, ‘‘నేను ఆ కాలేజ్‌లో మానేసి, గ్యాప్ తీసుకుని, ఈ కంపెనీలో జూనియర్ డెవలపర్‌గా జాయిన్ అయ్యాను. ఇన్ని రోజులు కాలేజ్‌లో వర్క్ చేసినట్టు ఏమీ చెప్పలేదు ఈ కంపెనీ వాళ్లకి. నో ఎక్స్‌పీరియ¯Œ ్స. సో నో బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్’’ అంది మధుమతి.‘‘అచ్ఛా ఓ..కే’’ దీర్ఘంగా చూస్తూ తలూపింది యామిని.‘‘మేడమ్, నాకో డౌట్. టెక్నికల్లీ మీరు చాలా సౌండ్. కాలేజ్‌లో స్టూడెంట్స్‌కి మీరంటే క్రేజ్ కూడా! మీకు ప్రమోషన్ కూడా వచ్చిందని విన్నాను. అలాంటిది మీరు రిజైన్ చేయడానికి రీజన్ మీ పెళ్లా?’, మధుమతి తాళి చూస్తూ అడిగింది యామిని.‘‘హ్మ్...నో’’,‘‘మరి?’’‘‘చెప్తాను, కానీ అది చెప్పే కంటే ముందు ఒకటి అడగాలి. సాఫ్ట్వేర్ జాబ్ వచ్చి సిటీలో బానే సెటిల్ అవుతున్నవ్ కదా ఇప్పుడు మన కాలేజ్ గురించి నీకేం అనిపిస్తుంది?’’ అడిగింది మధుమతి.మొదట బ్లాంక్ ఫేస్ పెట్టింది. ‘‘చెప్పాలంటే, ఇప్పుడనే కాదు ఎప్పుడడిగినా సేమ్ ఫీలింగ్ అలాంటి బేకార్ కాలేజీలో ఎందుకు జాయిన్ అయ్యానా అని’’ అంది యామినీ.మధుమతి తన ఫోన్ తీసి ‘ఇది చదువు’ అని ఇచ్చింది,‘ఇది అన్ని గ్రూపుల్లోకి షేర్ చేయండి. ఆర్థికంగా వెనుకబడిన ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉచితంగా ఇంజనీరింగ్ సీట్స్. మారుతున్న కాలంతో పాటు ఇంజనీరింగ్‌లో కూడా ఏఐ, ఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీలాంటి అధునాతన కోర్సులు ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌తో అందిస్తున్నాం! రాష్ట్ర రాజధానికో మరో నగరానికో వెళ్లాల్సిన పనిలేదు, కాలేజీ మన ఊరికి దగ్గర్లోనే! హాస్టల్ ఫెసిలిటీ, స్కాలర్షిప్ కూడా కలదు’యామిని మొత్తం చదివి, అర్థమయ్యీ కానట్టుగా ఫోన్ ఆమెకిచ్చేసింది.‘‘ఇంటర్ కాలేజీల్లోంచి స్టూడెంట్స్ లిస్ట్ తీసుకుని, పేరెంట్స్‌కి ఒక్కో లెక్చరర్ నుండి ఒక్కో నంబర్ ద్వారా ఈ మెసేజ్‌లు పంపేది మేమే! మన ప్రిన్సిపాల్ దగ్గరుండి మరీ ఇలాంటి పనులు మాతో చేయిస్తుంటాడు. ఇంజినీరింగ్ తర్వాత మీ 35 సంవత్సరాల కెరీర్ వాళ్లకు అనవసరం, వాళ్లకు నువ్వు ఓ 35 వేల రూపాయిల రీయింబర్స్మెంట్ ఐటమ్వి మాత్రమే! లెక్చరర్‌గా నాకే చాలాసార్లు అనిపించింది, అలాంటిది స్టూడెంట్స్‌గా మీ పరిస్థితిని అర్థం చేసుకోగలను’’ అంది మధుమతి.‘నో నో, ఎలాగో అయిపోయి సంవత్సరాలు దాటాయి కదా మేడమ్. ఇప్పుడేం చేస్తాం. సో మీరు జాబ్ మారింది పెళ్లై కాదు కాలేజ్ వల్లేనా? అలా అయితే వేరే కాలేజీలు ఉన్నాయిగా!’ అంది యామిని.‘‘కాని, ఎక్కడికి వెళ్ళినా నా కోసమే కాలేజ్కొచ్చే స్టూడెంట్స్ ఉన్నారని నువ్వే అన్నావ్ కదా, అలాంటి విషయాలు అల్లరిగా పైకి కనబడినా లోపలి చిల్లరతనం ఏదో రోజు బయటపడుతుంది. లాస్ట్ ఇయర్, క్లాస్ రూముల్లో మందు తాగే బదులు పైన టెర్రస్ మీద తాగి పడిపోండంటూ రెండు రూములు కట్టించాడు ప్రిన్సిపాల్! అడిగితే ఏం చెప్పాడో తెలుసా? ‘చెప్తే వినే వాడు స్టూడెంటే కాదు అని సినిమా డైలాగులు కొట్టి వెళ్లిపోయారమ్మా స్టూడెంట్సు. పైగా ఏసీ ఉందనీ నా క్యాబిన్లోకి వచ్చి మందు సిట్టింగ్‌లు వేస్తామంటే టెర్రస్ మీద రూమ్‌లు కట్టించాను. మరేం చేయమంటావ్? మర్యాద కాపాడుకోవాలిగా’ అన్నాడు’’‘కాని అది మర్యాద కాదు సార్’ అని అంటే,దానికి ఆయన, ‘ఆపమ్మా తల్లీ, లెక్చర్లు స్టూడెంట్స్కివ్వు కాని, నాలాంటి ప్రిన్సిపాల్‌కి కాదు. ఏమైనా ఉంటే ప్రిన్సిపాల్ మీదికో కాలేజ్ మీదికో వచ్చి ఎగురుతారు గాని, స్టూడెంట్స్ వేషాలేమైనా తక్కువా! స్నానాలు చేయకుండానే, గడ్డాలు గీసుకోకుండానే కనీసం జుట్టు కూడా దువ్వుకోకుండానే కాలేజీకి వస్తారు, రావడంతోనే అమ్మాయిలని, లేడీ స్టాఫ్‌ని చూసి కామెంట్స్ చేస్తున్నారు. ఇది చాలదన్నట్టు ఓ ముప్పైఐదు నలభై వయసున్న లెక్చరర్లతో ఫ్రెండ్షిప్లు చేయడం, వెనకేసుకొస్తారు కాబట్టి వాళ్లను కూడా కలుపుకొని పార్టీలు షికార్లకి తీసుకెళ్లి అటెండె మేనేజ్ చేయడం. చొక్కా పైబటన్ పెట్టుకోరు, అడిగితే ఉడుకపోస్తుంది అని మిగతా బట¯Œ ్స కూడా విప్పేస్తారు. ఇంకా దరిద్రం ఏంటంటే ఫస్టియర్ క్లాస్ రూముల్లో కండోమ్స్ దొరకడం, బాత్రూంలో కెమెరాలు పెట్టడం, పోలీసులు వచ్చి మరీ డ్రగ్స్ దొరకబట్టే దాకా తెలీలేదు కాలేజ్ హాస్టల్లో ఎన్ని దరిద్రాలున్నాయో... ఛీ...ఛీ... ఏమైనా మారుద్దామంటే ఎన్నిసార్లని కన్నేసి ఉంచుతాం? ఎంతమంది మీదేసి ఉంచుతాం చెప్పు!కనీసం అమ్మాయిలైనా బుద్ధిగా శ్రద్ధగా ఉంటారా అంటే కనబడితే గుడ్ మార్నింగ్ కూడా చెప్పరు. గర్ల్స్ హాస్టల్ కదా నేనెలా వెళ్లి చెక్ చేస్తాను అని వార్డెన్లను చూడమంటే రూమ్స్ నిండా బీరుసీసాలే! చదివే ఓపికుండదు గాని పొద్దున్నుండి రాత్రి వరకు హెడ్సెట్లు పెట్టుకొని ఫోన్ల మీద ఫోన్లు మాట్లాడుతూనే ఉంటారు. వాడెవడినో ప్రేమించిందే గాక వాడు పెట్టమన్నాడని సిగ్గులేకుండా వెళ్లి వాళ్ల హాస్టల్ బాత్రూముల్లో కెమెరాలు పెట్టింది...చ్చీచ్చీఛీఛీ. నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఎలాగో జాయిన్ అయిన కొద్ది రోజులకే తెలుస్తోంది కదా వాళ్ల పిల్లలు ఎలా తయారవుతున్నారో, పేరెంట్స్ వచ్చి మళ్లీ నా మీదనే పడి చస్తారు చెడగొడ్తున్నారనీ... వాళ్లేదో పద్ధతిగా పెంచారా?’మధుమతి ప్రిన్సిపాల్ మాటలు చెప్తుంటే యామినికి తన కాలేజీ రోజులు ఒక్కసారిగా కళ్లముందు కదిలాయి. ఇలాంటి రోజుల నుండి బయటపడ్డా అనే ఫీలింగ్ ఎంత రిలాక్స్డ్గా ఉందో తనకి!‘ఇవే కాదు అసలు దరిద్రాలు కాలేజీలో జరిగే యాన్యువల్ డేలు, ఫ్రెషర్–ఫేర్వెల్ పార్టీల్లో ఉంటాయి. దానికి గెస్టులుగా సినిమా హీరోలు, హీరోయిన్లు. అసలు వాళ్లే ఎందుకు? సరే ఆ ఏజ్‌లో సినిమా వాళ్లంటే ఓ క్రేజ్, ఓ ఇన్స్పిరేషన్ అని అనుకున్నా, అప్పటి వరకు కాలేజీ మొహం కూడా చూడని వాళ్లు ఇలాంటి ప్రోగ్రాంలకి తప్పక వస్తారు. స్టూడెంట్స్ చేసే గోలను చూసి సినిమా వాళ్లు ఇదే బాగుందని, ‘నెక్స్ట్ టైం నుండి సినిమా ప్రమోషన్ కూడా కాలేజీలోనే చేస్తే బాగుంటదని’ ఎవడో తొత్తు సలహా ఇస్తాడు. అలాంటి ప్రమోషన్‌కి పక్క కాలేజీ వాళ్లు కూడా ఈ కాలేజీకే వస్తారు. తాగేసి ఫ్యా అంటూ గొడవలు మొదలై, పాన్ పరాగ్ ఉమ్మిన ప్రహరీ గోడలకు రక్తంతో మెరుగులు దిద్దుతారు. సర్లే ఇదంతా ఒక్క రోజేగా అనుకుంటే ఆ హీరోను చూసి ఇంకో హీరో, అది చూసి మరో హీరో.ఇన్ని ప్రోగ్రాంల మధ్య సిలబస్ టైముకి అవదు, పైగా లైబ్రరీలో బుక్స్ సరిగ్గా ఉండవు, ఉండాల్సినంత మంది లెక్చరర్లు ఉండరు. ఖర్చుతో పని కాబట్టి ప్రిన్సిపాల్ పట్టించుకోడు. పైగా ‘అరవై ఉన్న క్లాసులో చదివేది పదిమందేగా! కనీసం కాలేజీకి సినిమా ఫంక్షన్తోనైనా పేరు వస్తుంది’ అని ఊరుకుంటాడు. వచ్చిన సినిమా వాళ్ళు ప్రమోషన్ మాటలు మాట్లాడుతారా అంటే, ‘ఏమీ చదవకుండానే నేనీ పొజిషన్లో ఉన్నాను. చదువు దేనికీ పనికిరాదు. కాలేజీ ఉన్నది కేవలం మిమ్మల్ని రోబోలుగా మార్చి పనిప్పించడానికే! ముందు ప్రపంచాన్ని చదవండి’ అని అంటుంటే ఆ వయసుకి ఆ మాటలు ఎంత వరకు అర్థమవుతాయి?ప్రపంచాన్ని ఎంత చదివినా, చదవాల్సిన టైమ్‌లో పుస్తకాలు చదవకపోతే స్టూడెంట్స్ ఏ ఎగ్జామైనా ఎలా పాసవుతారు? కానీ ఆ స్పీచ్‌లకు చప్పట్లు, విజిల్స్‌తో కాలేజీ దద్దరిల్లేది’’ గ్లాసులో నీళ్ళు అందుకుంటూ అంది మధుమతి.యామిని ఏమీ అనలేక, ఆ కంప్లయినింగ్ టోన్ వినలేక సఫొకేట్ అవుతోంది. మేడం లెక్చరర్‌గా మానేసినా, కూడా క్లాస్ పీకడం మాత్రం మానట్లేదని అనుకుంటూ,‘‘సర్లేండి మేడమ్. మనం మాత్రం ఏం చేస్తాం. కాఫీ?’’ అడిగింది‘‘ఇదంతా తప్పు కదమ్మా. అందుకే’’ ఆపేసింది నీళ్లు తాగుతూ.‘ఏం చేశారనీ’ కుతుహలంతో అడిగింది యామిని.‘‘ల్యాబ్స్, లైబ్రరీ, టాయిలెట్స్, హాస్టల్ ఎంత దారుణంగా ఉన్నాయో ఫోటోలతో సహా కలిపి యూజీసీకి కంప్లైంట్ రాశాను’’ చెప్పింది.‘‘యూజీసీకా! వాళ్ళు యాక్షన్ తీసుకోగలిగితే, ఈ పాటికి చాలా కాలేజీలు’’ యామిని ఏదో చెప్పేలోపే మధుమతి ఫోన్ రింగ్ అయ్యింది.సైలెంట్లో పెట్టి కాల్ కట్ చేసింది.‘‘అయ్యో లిఫ్ట్ చేయండి’’ అంది యామిని ‘‘ఇట్స్ ఓకే. ఇతని గురించే చెప్పాలి. కాలేజీలో నాకు ప్రమోషన్ వచ్చాక, ఇతని పెళ్లి సంబంధం కూడా వచ్చింది. బాగున్నాడు. నచ్చి పెళ్లి చేసుకున్నాను. అతను అదే టౌన్ కాబట్టి జాబ్ కంటిన్యూ చేశాను. అంతా బాగుండేది. కొత్తలో ఇబ్బందులున్నా కూడా లైఫ్‌లో ఎక్సైట్మెంట్ ఉండేది’’ అని ఆమె మెల్లిగా తల దించుకుంది. దుఃఖం ఆగట్లేదు, గొంతు తడబడుతోంది. వణుకుతున్న చేతులు ముఖానికి అడ్డం పెట్టుకొని వెక్కివెక్కి ఏడవడం మొదలుపెట్టింది. యామిని అయోమయంగా, ‘‘అయ్యో మేడమ్, ఏమైంది, ప్లీజ్ ఏడ్వకండి’’ అంది దగ్గరికి తీసుకుంటూ.‘‘అలాంటి టైంలో ఒక మగ లెక్చరర్‌తో నాకు అఫైర్ ఉన్నట్టు నా హస్బెండ్‌కి పదేపదే కొంతమంది స్టూడెంట్స్ కాల్ చేశారు, మెసేజ్‌లు పెట్టారు. కాలేజీలో ఏ అబ్బాయి వచ్చి నాతో మాట్లాడినా తెలీకుండా ఫొటోలు తీసి పంపేవారు’’ ఏడ్చుకుంటూ చెప్పింది మధుమతి. యామిని ఇంకా దగ్గరికి తీస్కోగానే, ‘‘నేను ఏ అఫైర్ పెట్టుకోలేదమ్మా నిజంగా. అదే నా భర్త నమ్మాడో లేదో తెలీదు. నేను ఏ తప్పు చేయలేదని నమ్మినట్టే మాట్లాడతాడు కాని, మళ్లీ డౌట్ పడతాడు. జీతాలు పెంచమని అడిగినందుకు బౌన్సర్లతో కొట్టించారని ఓ లెక్చరర్ నాతో చెప్పుకుంటే, అతనికి నాకు అఫైర్ ఉందని కాలేజీలో స్ప్రెడ్ చేశారు. విషయం తెలుసుకున్న మా నాన్న నన్ను కొట్టాడు. అమ్మ నానా మాటలంది. నా భర్త మాత్రం కనీసం ఓ మాటైనా అనలేదు కాని, నా ఫోన్ లాక్కున్నాడు. నంబర్ మార్చాడు. పాత నంబర్ బ్లాక్ చేసి, సిమ్ కాల్చేశాడు. ఇంట్లో వాళ్ల ఫోన్ నంబర్లు తప్ప ఇంకెవరి నంబర్లు నా ఫోన్లో ఉండకుండా చేశాడు. ఎవరికి కాల్ చేస్తున్నాను, ఎవరికి మెసేజ్‌లు పెడ్తున్నానో చూసేవాడు. ఎవరితోనూ కాంటాక్ట్ అవ్వద్దన్నాడు. మెల్లగా జాబ్ మానేయమని ప్రెజర్ పెట్టాడు! సడన్‌గా జాబ్ మానేస్తే, ‘తప్పు చేసింది కాబట్టే మానేసింది’ అనుకుంటారని నేను చెప్పినా వినలేదు. సిటీకి తీసుకొచ్చాడు. ఎప్పుడన్నా కాలేజీ ప్రస్తావన తెస్తే చిరాకుపడుతూ అరిచేవాడు. అతనే సర్వస్వం అనుకున్నాక జాబ్ వదిలేయడం పెద్ద మ్యాటర్ కాదనిపించింది. మూడు నెలల తర్వాత, ఇంటి నుంచే వర్క్ చేసుకునే సౌకర్యం సాఫ్ట్‌వేర్‌లో ఉంది కాబట్టి గట్టిగా అడిగాను. ఒప్పుకున్నాడు. ఇదిగో ఇలా వచ్చి ఈ కంపెనీలో!’’ మధ్య మధ్యలో కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది మధుమతి.‘‘రిలాక్స్ మేడమ్. అప్పుటి నుండి ఏదేదో చెప్తున్నారు అనుకున్నాను గాని, మీకు ఇంత జరిగిందని, ఇంత బాధ దాచుకున్నారని అనుకోలేదు. షేమ్ ఆన్ దోస్ పీపుల్. అలాంటి కాలేజీలో చేయకపోవడమే బెటర్ లెండి. టైమ్ తీసుకుని మంచి ప్లేస్‌కే వచ్చారు. డోంట్ వర్రీ, ఈ కంపెనీ, మా టీమ్ చాలా బెటర్. ట్రస్ట్ మీ’’ అంటూ మధుమతి చేతులను తన చేతుల్లోకి తీసుకుంటూ అభయమిచ్చింది యామిని.ఈ గ్యాప్‌లో మధుమతి ఫోన్లో భర్త నుండి మిస్డ్ కాల్స్, మెసేజ్‌లు.‘‘సిగ్నల్స్ లేవనీ, ఫోన్ సైలెంట్లో ఉందని చెప్పకు. వాటర్ కూడా సరిగ్గా తాగలేదని నీ స్మార్ట్ వాచ్ చెప్తోంది. ఫోన్ మర్చిపోయి బాత్రూమ్కి కూడా వెళ్లవు అని నాకు తెలుసు. నా మెసేజ్‌లు, కాల్స్ అన్నీ చూస్తావు కాని, కావాలనే రిప్లై ఇవ్వవని కూడా తెలుసు. నీ కోపమంతా ఇంట్లో చూపించు మధు, ప్లీజ్ నేను ఆల్రెడీ నీ ఆఫీస్ దగ్గరున్నాను. కిందికి రా ప్లీజ్’’ వాట్సాప్‌లో భర్త.‘వర్క్ ఫ్రమ్ హోమ్’ చేయడానికి ల్యాప్‌టాప్, యాక్ససరీస్ ఇచ్చారు. ప్రాజెక్ట్ డీటెయిల్స్ మెయిల్ చేస్తామని చెప్పారు. యామినికి ‘బై’ చెప్పి ఆఫీస్ బిల్డింగ్ కిందకి వచ్చింది మధుమతి.‘‘ఒక్కరోజు, అది కూడా రెండు మూడు గంటలు బయటికి వస్తే ఇన్ని కాల్స్ మెసేజెస్సా! ఛీ’’ అతన్ని తిడుతూనే బైక్ ఎక్కి కూర్చుందామె. వెనక నుండి ఓ రెండుసార్లు అతని హెల్మెట్ మీద కొట్టింది కూడా. అతను ఏం మాట్లాడకుండా బండి ముందుకు పోనిచ్చాడు. ‘ఎందుకంత స్పీడు, మెల్లిగా’ అంటూ ఇంకా తిడుతోంది.‘‘ఐయామ్ సారీ’’ అన్నాడతను.ఆమె కాసేపు మౌనంగా ఉంది. చౌరస్తా దాటి ఓ ఖాళీ రోడ్డు రాగానే, వెనక నుండే అతన్ని మెల్లగా కౌగిలించుకుంటూ వాలిపోయింది. అతను ఇంకాస్త స్లో అయ్యి, చిన్నగా బ్లష్ అవుతూనే సిగ్గుగా వస్తున్న నవ్వును ఆపుకున్నాడు. ‘కొత్తగా ఉందిరా అంతా, కాని, బానే ఉండేలావుంది. నేను సెట్ అవగలను అనిపిస్తోంది. నువ్వు కూడా సెట్ అవ్వొచ్చుగా! మన పెళ్ళైన కొత్తలో ఉన్నట్టుగా. ప్రేమగా పిలుస్తూ దగ్గరికి తీస్కోవటం, ప్రతి సాయంత్రం బయటకెళ్తూ కబుర్లు చెప్పుకోవటం, ఇంటి పనిలో నాకు హెల్ప్ చేస్తూ..’ ఆమె చెప్తూ పోతుంటే మళ్లీ మెయిన్ రోడ్ వచ్చిందని బండాపాడు సిగ్నల్ చూసి. హెల్మెట్ తీయడు, ఎక్స్ప్రెషన్ కనబడదు.అయినా అతనంత పెద్ద ఎక్స్‌ప్రెసివ్ కాదులే, కోపం తప్ప మిగతా అన్ని ఫీలింగ్స్ దాచుకుంటాడనీ ఆమె కంప్లైంట్ కూడా!ముగింపు నిజానికి అతను అంతగా ఏం దాచుకున్నాడంటే, కాలేజ్ బాత్రూంలో లేడీ లెక్చరర్ల వీడియోలు కూడా తీశారనీ, అలా ఆమె వీడియో కూడా తీసి అతనికే పంపారనీ ఆమెకి చెప్పకుండా దాచాడు!అఫైర్ అలిగేషనే తట్టకోలేని ఆమె ఈ విషయం తెలిస్తే మానానికి పోయి సూసైడ్ చేసుకుని చస్తుందేమోననే భయంతో ఆమె దగ్గరి నుండి ఫోన్‌తో సహా లాక్కొని, సిమ్ కాల్చి, విషయం ఆమెకి చేరకుండా చేశాడు!ఇక మనుషుల్ని నమ్మడం మానేసిన అతను కాలేజీకే కాదు, ఎక్కడకి వెళ్ళినా అక్కడి బాత్రూంకి వెళ్తుందని, ఎక్కడికీ పంపించకుండా ఆమెని కాపాడే ప్రయత్నం బయటపడకుండా దాచాడు.ఇప్పుడూ అంతే, వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఇంటి బాత్రూం మాత్రమే వాడుకోవచ్చని ఈ జాబ్‌కి రిఫర్ చేయించి మరీ ఇప్పించాడని ఆమె దగ్గర దాచాడు.ఉపసంహారం 1సడన్‌గా ఇంజనీరింగ్ బుక్సో, బస్సో కనబడినా, ‘మేడమ్’ అనే పిలుపు వినబడినా ఆమెలో ఓ అలజడి! ఆ రోజంతా డల్లైపోతుంది. రాత్రవగానే ఓ దిక్కు పడుకొని దిండు తడుపుకుంటుంది. నిద్ర పట్టక భర్త వైపు తిరిగే సరికి అతను మాత్రం గాఢనిద్రలో ఉంటాడు. ఆమె దిండు ఇంకా ఎక్కువ తడుస్తుంది.ఉపసంహారం 2ఎక్కడికి వెళ్లినా ఆమెకి బాత్రూం వస్తుందేమోనని, త్వరగా ఇంటికి వెళ్లాలనే తొందరలో బైక్ నడుపుతుంటాడు. ఫోన్లో ఏ మెసేజ్ వచ్చినా, ఏం చూడాల్సి వస్తుందోనని భయంతో రోజు గడుపుతుంటాడు. ఇలా మెలకువలో పీడకలలా వెంటాడే అతనికి, రాత్రులు నిద్ర మాత్రలు వేసుకుంటే గాని నిద్ర పట్టదు. అతనికి నిద్రే ఓ ఉపశమనం మరి!సంహారంఏదో పోగొట్టుకున్నట్టు రోజు గడిపే ఇద్దరూ తెల్లారేసరికి మాత్రం ఒకరినొకరు హత్తుకొని నిద్రలోనే కలిసిపోయినట్టు కనబడతారు, ఒకే దుప్పటిలో. అలా ఓ రోజు లేచేసరికి మధుమతి ఇన్‌బాక్స్‌లో‘ఏఐ’ ద్వారా స్పై కెమెరాలను కనిపెట్టే మొబైల్ యాప్, ఇప్పటి వరకు తీసినవి లింక్ పెడితే వాటిని సైబర్ సెక్యురిటీతో బ్లాక్ చేయించగల యాప్ తయారు చేసే ప్రాజెక్ట్‌లోకి డెవలపర్‌గా తీసుకుంటున్నట్టు యామినికి మెయిల్ వచ్చింది. అదే ఇక నుండి ఆమెను రోజంతా యాక్టివ్‌గా ఉంచే మాత్ర, అతనికి రాత్రులు మాత్రలు అక్కర్లేకుండా పట్టే నిద్ర. -
నగరాన్ని తలపించే హైటెక్ నౌక..!
సర్వాంగ సుందరంగా సకల సౌకర్యాలతో ఉండే రాజప్రాసాదం నీటిలో తేలియాడితే ఎలా ఉంటుందంటే, అది అచ్చం ‘సోమ్నియా’లాగే ఉంటుంది. సోమ్నియా ఈ ప్రపంచంలోనే అతిపెద్ద నౌక మాత్రమే కాదు, అద్దాల గోడలతో నిండిన అద్భుత నిర్మాణం. లాటిన్లో సోమ్నియా అంటే ‘కల’ అని అర్థం. పేరుకు తగ్గట్లుగానే ఈ నౌక ఒక కలల ప్రపంచంలా కనిపిస్తుంది. ఇందులో మొత్తం విలాసవంతమైన 39 అపార్ట్మెంట్లను ఆరు డెక్‌లలో నిర్మించారు. సుమారు పదివేలమంది వరకు ఇందులో ఉండొచ్చు. పెద్ద రెస్టరెంట్లు, లాబీ, స్పా, బార్లు, సూపర్ మార్కెట్లు, బొటిక్, ఫిట్నెస్ సెంటర్లు, టెన్నిస్ కోర్టు, జాగింగ్ ట్రాక్, స్విమ్మింగ్‌పూల్, కాక్టెయిల్ లాంజ్ సహా సమస్త సౌకర్యాలను ఈ నౌకలో ఏర్పాటు చేశారు. ఈ నౌక యజమాని మలేషియాలో అత్యంత ధనవంతుడైన రాబర్ట్ కుయోక్ అని సమాచారం. రాబర్ట్ తన విహార యాత్రల కోసం కస్టమైజ్డ్ యాట్‌లను తయారు చేసే డచ్ కంపెనీతో దీనిని తయారు చేయించుకుంటున్నట్లు కొన్ని కథనాలు వెలువడ్డాయి.. కాని, అధికారికంగా ఇంకా ఈ నౌక యజమాని ఎవరనేది వెల్లడి కాలేదు.(చదవండి: భారీ కీటకం.. దాంతోనే వంటకం..! ఎక్కడంటే..?) -
సండే వెరైటీగా రొయ్యల దోసెలు, కాజు రవ్వ వడ చేసేయండిలా..!
ఈ ఆదివారం చిన్న పెద్ద అంతా ఇంట్లోనే సందడిగా ఉంటారు. ఆదివారం అంటే ఆటవిడుపులా అనిపిస్తుంది అందరికి. అమ్మపై భారం వేయకుండా..అందరూ తలో చేయి వేసి ఈ సండే ఇలా వెరైటీ వంటకాలు ట్రై చేసి మరింత ఖుషీగా ఉండండి. ఇంకెందుకు ఆలస్యం ఎలా చేసేయాలో చూసేయండి మరీ..!.రొయ్యల దోసెలుకావలసినవి: సోయా పాలు– 1 కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్– 2 టీ స్పూన్లు ఉల్లిపాయ ముక్కలు– 2 లేదా 3 టేబుల్ స్పూన్లు జీలకర్ర పొడి– అర టీ స్పూన్ పసుపు– కొద్దిగా ఉప్పు– తగినంత రొయ్యలు– 250 గ్రాములు (శుభ్రం చేసుకుని హాఫ్ బాయిల్ చేసుకుని, పక్కన పెట్టుకోవాలి) మిరియాల పొడి– పావు స్పూన్ కొత్తిమీర తురుము– కొద్దిగా కరివేపాకు– కొద్దిగా పచ్చిమిర్చి– 2 (చిన్నగా తరగాలి) గరం మసాలా– 1 టీ స్పూన్ దోసెల పిండి– రెండు మూడు కప్పులు గుడ్లు– రెండు లేదా మూడు (అభిరుచిని బట్టి) నూనె– సరిపడాతయారీ: ముందుగా కళాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె పోసుకుని, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, పసుపు, కొద్దిగా ఉప్పు, కారం వేసుకుని దోరగా వేయించుకోవాలి. అనంతరం దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, గరిటెతో తిప్పుతూ అర నిమిషం పాటు వేయించాలి. తర్వాత మిరియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, మరికొద్దిగా కారం వేసుకుని బాగా కలపాలి. ఇప్పుడు సోయా పాలు పోసి మూత పెట్టి, చిన్న మంట మీద ఉడికించాలి. మధ్య మధ్యలో గరిటెతో తిప్పుతూ ఉండాలి. కాస్త దగ్గరపడుతున్న సమయంలో రొయ్యలు వేసుకుని, ఒకసారి రుచి చూసి, సరిపడా ఉప్పు వేసుకుని గరిటెతో తిప్పుకోవాలి. ఆ మిశ్రమం మరింత దగ్గర పడిన తర్వాత ఆ కళాయి దించి పక్కన పెట్టుకుని, స్టవ్ మీద దోసెల పెనం పెట్టుకోవాలి. దానిపై దోసెలు వేసుకుని, ఒక్కో దోసెపై ఒక్కో గుడ్డు కొట్టి, అభిరుచిని బట్టి పసుపు సొనను కదిలించకుండా ఉడికించి, ఆపైన కొద్దికొద్దిగా రొయ్యల కర్రీ, కొత్తిమీర తురుము వేసుకుని, దోసెను ఫోల్డ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి. కాజు రవ్వ వడ..కావలసినవి: జీడిపప్పు– అర కప్పు రవ్వ– కప్పు అల్లం తురుము– టేబుల్ స్పూన్ కొత్తిమీర తురుము– 2 టేబుల్ స్పూన్లు పచ్చిమిర్చి– 1 (చిన్నగా తరగాలి) ఉప్పు– తగినంత కరివేపాకు– 1 రెమ్మ (చిన్నచిన్నగా తుంచి వేసుకోవాలి) కుకింగ్ సోడా– అర టీ స్పూన్ డ్రై ఫ్రూట్స్ తరుగు– కొద్దిగా పెరుగు– అర కప్పు పైనే నూనె– డీప్ ఫ్రైౖ కి సరిపడాతయారీ: ముందుగా జీడిపప్పును పొడిపొడిగా మిక్సీ పట్టుకోవాలి. దానిలో రవ్వ, అల్లం తురుము, కొత్తిమీర తురుము, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కరివేపాకు, కుకింగ్ సోడా, డ్రై ఫ్రూట్స్ తరుగు వేసుకుని, బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దానిలో పెరుగు కొద్దికొద్దిగా పోసుకుంటూ, ముద్దలా చేసుకోవాలి. అనంతరం చేతికి నెయ్యి లేదా నూనె రాసుకుని, వడల్లా ఒత్తుకుని, నూనెలో దోరగా వేయించుకుంటే సరిపోతుంది. ఇవి చట్నీలో లేదా సాస్‌లో కలిపి తింటే భలే రుచిగా ఉంటాయి. -
యువ కథ: అమ్మ ఎప్పుడూ ఇంతే!
‘ఏంటమ్మా.. నేను ఇంకా చిన్న పిల్లాడిని అనుకుంటున్నావా? నాకు తెలుçసమ్మా.. నువ్వు ఇలా చేయడం నాకు ఇబ్బంది అనిపిస్తుంది’.. అరిచేశా కాస్త గట్టిగానే!‘అలా ఏం కాదు నాన్నా! నాకు కొంచెం బెంగగా ఉంటుంది. అందుకే ఇలా’ అమ్మ సంజాయిషీ.ఏంటో అమ్మ ఎప్పుడూ అర్థం చేసుకోదు. నేనేమీ చిన్నపిల్లాడిని కాదు. రేపో మాపో పదో తరగతి పూర్తవుతుంది. ఏడాది దాటితే నేను కాలేజీకి వెళ్తాను. నేనూ పెద్దాడిని అయిపోయాను. అయినా అమ్మ ఇంకా నాకు ఏం తెలీదు అనుకుంటుంది. నేను స్కూలుకు వెళ్లడానికి బస్సు ఎక్కాలంటే ఇంటి నుంచి 20 నుంచి 30 అడుగులు వేస్తే సరిపోతుంది. పొద్దున్నే లేచి, కావాల్సిన బుక్స్ అన్నీ బ్యాగులో పెట్టుకుని, హడావిడిగా స్నానం చేసి రెడీ అయిపోతా. సరిగ్గా ఉదయం ఎనిమిదికల్లా స్కూలు బస్సు వచ్చేస్తుంది. ఆ లోపు నేను అన్నీ పూర్తి చేసుకుని సిద్ధమయ్యే లోపు అమ్మ నాకు కావాల్సిన క్యారేజీ కట్టే పనిలో ఉంటుంది. నన్ను పంపించాకే ఇంట్లో నాన్నకు కాఫీలు, టిఫిన్లు. హడావిడిగా అన్నీ ఒక్క చేత్తో చేసేస్తుంది. నేనేమో రెడీ అయిపోయి బ్యాగు వేసుకోగానే, చేతికి లంచ్ క్యారేజీ ఇచ్చేస్తుంది. అక్కడితో అయిపోతుందా అనుకుంటే నా వెంటే పరుగులు పెడుతూ వచ్చేస్తుంది. స్కూలు బస్సు ఎక్కి, అది కదిలే వరకు అక్కడే ఉంటుంది. నాతో పాటు బస్సులో వచ్చే మిగతా ఫ్రెండ్స్ వాళ్ల అమ్మలు కూడా వచ్చి జాగ్రత్తలు చెప్పి వెళ్తారు. కాని, మా అమ్మ ఎందుకో కొంచెం ఎక్కువ హడావుడి చేసేస్తుంది. అది చూసి చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అదో రకంగా చూస్తారు నా వంక, కొన్నిసార్లు నవ్వుతారు కూడా! ఇదంతా రోజూ అనుభవిస్తుంటే, నా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు. గట్టిగా అమ్మ మీద అరవాలి అనిపిస్తుంది.ఇలా ఆలోచిస్తున్న నేను బస్సు హారన్ సౌండ్‌తో ఒక్కసారిగా గతం నుంచి తేరుకున్నాను. దూరం నుంచి బస్సు నా వైపు వస్తోంది. అది చూడగానే నా ఆరేళ్ల కూతురు నా చేతిలో ఉన్న లంచ్ బాక్స్ పెట్టిన బ్యాగు లాక్కుని ముందుకు పరుగెత్తింది. తెలియకుండానే ‘జాగ్రత్త..’ అని నా నోటి నుంచి వచ్చిన మాట పూర్తి కాకుండానే, ‘నాకు తెలుసు డాడీ’ అంటూ పరుగులు పెట్టింది. ఆ మాట వినగానే మళ్లీ ఎక్కడో తడిమినట్లు అనిపించింది. బస్సు ఆగింది. చకచకా పిల్లలు ఎక్కేస్తున్నారు. వాళ్లతో పాటు ఎక్కిన నా కూతురు బస్సు కిటికీ పక్కన సీటులో కూర్చుని, బయటికి చేయి చూపిస్తూ ‘టాటా డాడీ’ అని నవ్వుతూ చెబుతోంది. బస్సు అటు వెళ్లగానే, నేను నా కారు పార్క్ చేసిన వైపు వెళ్లాను. కారులో కూర్చుని స్టార్ట్ చేసి ఇంటికి పోనిచ్చాను. దారంతా ఎందుకో ఒకటే ఆలోచనలు. ఏంటీ నేను ఏమైనా తప్పుగా ప్రవర్తిస్తున్నానా? ఒకప్పుడు నా ఇష్టం అనుకున్నది ఇప్పుడు ఎందుకు ఒక చిన్న భయంలా మారింది. అమ్మ నన్ను చాలా ప్రేమించింది. అందరి కన్నా ఎక్కువే ప్రేమించింది. కాని, ఆ అతి ప్రేమ నన్ను ఇబ్బంది పెట్టిందా? అంతా నాకే తెలుసు అనే స్వభావం ఏర్పడి తెలియకుండానే నేను అమ్మ మీద అరిచేవాడినా? తండ్రయ్యాక తెలిసింది.. పిల్లల మీద మనం చూపించే ఆ ప్రేమ కొన్నిసార్లు భయం వల్ల కూడా పుడుతుంది అని. వాళ్లు జాగ్రత్తగా ఉండాలనుకునే మన ఆరాటం వారిని ఇబ్బంది పెడుతుందని. ఆరేళ్లుగా నా కూతుర్ని చూస్తున్నా– స్కూలుకు వెళ్లడం మొదలెట్టాక తన పనులు తానే చేసుకుంటుంది. ఎంచక్కా రెడీ అయిపోతుంది. కానీ నాకెందుకు? తను జాగ్రత్తగా స్కూలు బస్సు ఎక్కేవరకు ఒక తెలియని బెరుకు. ఇదేనా అమ్మ కూడా నా మీద చూపించిన ప్రేమ తాలూకు జ్ఞాపకం. ఇలా ఆలోచిస్తుండగానే కారు ఇంటి ముందు ఆగింది.ముభావంగానే లోపలికి వెళ్లిన నాకు నా భార్య లలిత ఎదురొచ్చి చేతిలో కాఫీ పెట్టింది. అది అందుకుని ఏమీ మాట్లాడకుండానే, బెడ్ రూంలోకి వెళ్లిపోయా. నేను అలా వెళ్లడం చూసి ఏమీ అర్థం కానట్లు కాసేపు చూసి, వంటగదిలోకి వెళ్లిపోయింది. రూంలోకి వచ్చిన నేను, చేతిలో ఉన్న కాఫీని టేబుల్‌పై పెట్టేసి పైన చొక్కా తీసేసి, అలా బెడ్‌పై వాలిపోయా. వంటింట్లో నుంచి కమ్మటి వాసన, తాలింపు చప్పుళ్లు. నా భార్య మధ్యాహ్నానికి కావాల్సిన వంటలో నిమగ్నమైపోయింది. కాసేపు అలా కళ్లు మూతలు పడ్డాయి. కాసేపటికి ఎందుకో అమ్మ నా తల మీద చేయి పెట్టి నా జుట్టు నిమిరినట్టు అనిపించింది. చెప్పాలంటే చాలా హాయిగా, తడుముతున్న చేతుల్లో ప్రేమ అందినట్లుగా అనిపించింది. కాస్త తేరుకున్న నాకు ఒక మాట వినపడింది. ‘ఏంటి అలా ఉన్నారు? మీ ఒంట్లో బాగానే ఉందా?’ కళ్లు తెరిచిన నాకు ఎదురుగా అప్పటివరకు నా తల మీద చేయి పెట్టి నిమురుతున్న నా భార్య. తనను అలా చూస్తూనే హాల్లోకి నడిచాను. ఎదురుగా కప్‌బోర్డులో పెట్టిన అమ్మ ఫొటోపై నా దృష్టి పడింది. ఆ ఫొటో వంకే చూస్తూ.., ‘మనం ఊరికి వెళ్లి ఒకసారి అమ్మని కలవాలి’ అన్నా. అది విని లలిత కూడా ఆ ఫొటో వైపు చూసి చిన్నగా నవ్వింది.ఆఫీసు వెళ్లడానికి రెడీ అవుతున్న నాకు.. హాల్లో నుంచి కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. లలిత ఫోన్లో మాట్లాడుతోంది. ఇంకెవరితో, మా అమ్మతోనే! మేము పాపతో కలిసి ఈ శనివారం ఊరికి వస్తున్నామని, తను చెప్పడం నాకు స్పష్టంగా వినపడుతోంది. ఆ మాట చెప్పగానే అమ్మ కూడా చాలా సంతోషపడి ఉంటుంది. ఈ ఆఫీసు పనుల్లో బిజీ అవ్వడం, మళ్లీ పాపని చూసుకోవడం వల్ల ఎప్పుడోగాని అమ్మతో మాట్లాడే సమయం దొరకట్లేదు. ఎప్పుడైనా అమ్మే నా సెల్ నంబర్‌కి కాల్ చేసినా ఆఫీసు పనుల్లో తలమునకలై ఉన్న నేను.. తర్వాత చేస్తాలే అమ్మా అని చెప్పడం ఈ మధ్య బాగా అలవాటు అయిపోయింది. ఇదిగో ఇలా ఈ అత్తాకోడళ్లే ఎప్పుడూ మాట్లాడుకునేది. ఒకసారి మొదలెడితే వాళ్ల లోకంలోకి వాళ్లు వెళ్లిపోయి, పక్కన వాళ్లను పట్టించుకోనంతగా మునిగిపోతారు. అలా అనుకుంటూనే హాల్లో ఉన్న డైనింగ్ టేబుల్ మీద నా కోసం పెట్టిన క్యారేజీ తీసుకుని, ఆఫీసుకు వెళ్లొస్తా అన్నట్లు లలిత వంక సైగ చేస్తూ వెళ్లిపోయా. గుమ్మం వరకూ వచ్చి నన్ను చూస్తూ అమ్మతో ఫోన్లో మాట్లాడుతూనే లలిత కూడా నావైపు చేయి ఊపింది.కారు వేగంగా వెళుతోంది. పాపతో కలిసి లలిత, నేను ఊరికి వెళ్తున్నాం. వాతావరణం చక్కగా ఉంది. ఊరికి దగ్గర్లో పడిన మాకు ఈ ప్రయాణం చాలా నచ్చింది. రోడ్డుకు ఇరువైపులా పచ్చని పంటపొలాలు, చల్లని గాలి, కమ్మటి మట్టి వాసన. నా కూతురు కారు కిటికీలో నుంచి బయటికి చూస్తూ, ‘ఇంకా ఎంత దూరం నాన్నా! నాన్నమ్మని ఎప్పుడు కలుస్తాం’ అని ఒకటే ప్రశ్నలు. ‘వచ్చేశాంలేమ్మా! దగ్గర్లోనే ఉన్నాం’ అంటూ లలిత బయటికి పెట్టిన పాప చేతిని కారు లోపలికి అంటూ నచ్చజెబుతోంది. డ్రైవింగ్ చేస్తున్న నాకు కూడా లోలోపల అదే ఆరాటం ఉన్నా బయట పడలేనేమో కదా! అమ్మని కాసేపట్లో చూస్తున్నాం అన్న ఆనందంతో నాకు కూడా చిన్న పిల్లాడినై గెంతాలని ఉంది. ఇలా అనుకుంటుండగానే కారు పొలిమేర దాటి ఊరిలోకి ప్రవేశించింది. దారిలో వెళ్తుంటే ఎన్నో అనుభవాలు, జ్ఞాపకాలు. పుట్టి పెరిగిన ఊరు కదా మరి!కారు ఇంటి ముందు ఆగిందో లేదో, తలుపు తెరుచుకుని నా కూతురు ఇంట్లోకి పరిగెత్తింది. కారు ఆగిన శబ్దం విని అమ్మ కూడా బయటికి వచ్చింది. ఎదురుగా వస్తున్న మనవరాలిని అందుకోవాలని ముందుకు కదులుతూ మా వంక చూస్తోంది. ‘నాన్నమ్మా!’ అని గట్టిగా హత్తుకోగానే, అమ్మ తనని చేతుల్లోకి తీసుకుని ముద్దాడింది. వెనకే వస్తున్న మేము అది చూసి మురిసిపోతూ ఇంట్లోకి నడిచాం. ’ఎలా ఉన్నావు నాన్నా’ అని అమ్మ నా గడ్డం దగ్గర చేయి పెట్టి ఆప్యాయంగా అడుగుతూనే, లలిత వంక కూడా చూసింది. ’నువ్వు ఎలా ఉన్నావమ్మా’ అని అడుగుతూనే, తనని అక్కడే ఉన్న సోఫాలో కూర్చోబెట్టాను. నా తలని తన ఒడిలోకి అదుముకుని ప్రేమగా నా వీపు తడుతూ, ‘ఎప్పుడు తిన్నారో ఏమో! పదండి వెళ్లి భోజనం చేద్దాం’ అంది. ‘సరే అమ్మా, తిందాంలే!’ అంటున్న నాకు మనసు ఎందుకో ప్రశాంతంగా అనిపించింది. అమ్మతో చాలా చెప్పాలి అనిపించింది. అమ్మని చూడగానే గుండెలో భారం దిగినట్లుగా అనిపించింది. చిన్నప్పటి నుంచి అమ్మ చూపించే అపురూపమైన ప్రేమను ఇబ్బందిలా ఫీలయ్యే నా తెలియనితనానికి కొంచెం సిగ్గుగా అనిపించింది. సోఫాలో ఉన్న అమ్మ ఒడిలో తల పెట్టి, కింద కూర్చున్న నాకు తెలియకుండా నా కుడి చేయి తన పాదం మీదికి చేరింది. ఎన్నో చెప్పాలనుకున్నా, క్షమించమని అడగాలి అనుకున్నా కానీ ఏమీ చెప్పలేక మాటలు పెగలని నాకు ఆ ఆశీర్వాదం సరైన ప్రాయశ్చిత్తంలా అనిపించింది. కాలిని తాకిన నా చేయి వంక చూస్తూ అమ్మ కళ్లల్లో చిన్నగా తడిని చూశా. అమ్మ వెనక చేరి భుజాలపై నుండి చేతులు వేసిన నా కూతురు నాన్నమ్మ చెంపలపై ముద్దులు పెడుతోంది. -
రాజవర్ధనుడి కథ
పూర్వం దమనుడు అనే రాజుకు రాజవర్ధనుడు అనే కొడుకు ఉండేవాడు. తండ్రి తదనంతరం రాజవర్ధనుడు పట్టాభిషిక్తుడై, రాజ్యభారాన్ని చేపట్టాడు. ప్రజలకు చోరభయం, దుష్టమృగ భయం, శత్రుభయం, క్షామం, దారిద్య్రం లేకుండా రాజ్యాన్ని ధర్మమార్గంలో సుభిక్షంగా పాలించసాగాడు. పొరుగు రాజ్యాన్ని పాలించే విధూరథుడికి రాజవర్ధనుడి పాలనాదక్షత గురించి తెలిసింది. విధూరథుడికి మానిని అనే కుమార్తె ఉంది. రాజవర్ధనుడు తన కుమార్తెకు తగిన వరుడని తలచి, అతడికి తన కుమార్తెను ఇచ్చి వివాహం జరిపించాడు. మానిని ద్వారా రాజవర్ధనుడికి అనేకమంది కుమారులు కలిగారు. భార్యతో హాయిగా సంసారయాత్ర సాగిస్తూ, రాజవర్ధనుడు రాజ్యాన్ని సుభిక్షంగా, ప్రశాంతంగా పాలించసాగాడు. అలా ఏడువేల సంవత్సరాలు గడిచిపోయాయి.ఒకనాడు రాజవర్ధనుడికి భార్య మానిని స్వయంగా తలంటు పోయసాగింది. తలంటు పోస్తుండగా, ఆమె కన్నీటి బిందువులు వెచ్చగా రాజవర్ధనుడి నుదుటిపై పడ్డాయి. ఈ పరిణామానికి రాజవర్ధనుడు ఆందోళన చెందాడు. ‘మహారాణీ! ఏమైంది? ఎందుకు దుఃఖిస్తున్నావు?’ అని ప్రశ్నించాడు.‘మహారాజా! మీ తలవెంట్రుకలు తెల్లబడుతున్నాయి. అందువల్లనే నాకు తీరని విచారంగా ఉంది’ అని ఆమె బదులిచ్చింది.‘మహారాణీ! ప్రకృతి సహజమైన పరిణామానికి విచారిస్తావెందుకు? ఏడువేల సంవత్సరాలు సుఖాలను అనుభవించాం. సద్గుణ సంపన్నులు, పాలనాదక్షులు అయిన సుపుత్రులను పొందాం. మానవులకు జరామరణాలు తప్పించడం ఎవరికీ సాధ్యం కాదు. వార్ధక్యం మరింతగా మీద పడకముందే, రాజ్యాన్ని పుత్రులకు అప్పగించి, మనం తపోవనాలకు వెళ్లిపోదాం’ అని చెప్పాడు రాజవర్ధనుడు.రాజ్యాన్ని పుత్రులకు అప్పగించి, రాజవర్ధనుడు భార్యాసమేతంగా తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్లిపోవాలని నిర్ణయించు కున్నట్లు తెలిసి, మంత్రి పురోహితులు విచారించారు. ఈ సంగతి తెలిసి పౌరులు మరింతగా ఆందోళన చెందారు. ‘ఇన్నాళ్లూ మనల్ని కన్నబిడ్డల్లా పరిపాలించిన రాజు రాజ్యాన్ని విడిచి వెళ్లిపోతే, ఇక బతకడం దండగ’ అనుకుని, ప్రజలు బాధపడసాగారు. రాజుకు మరో పదివేల సంవత్సరాల ఆయుర్దాయం కలిగించాలని భావించిన మంత్రులు, ఇందుకు సమర్థులైన పురోహితులను తపోవనాలకు పంపారు. ఇదంతా రాజుకు తెలియకుండానే చేశారు.పురోహితులు సూర్యభగవానుడి గురించి ఘోరతపస్సు చేశారు. వారి తపస్సుకు మెచ్చిన సూర్యుడు వారికి ప్రత్యక్షమయ్యాడు. వారి కోరిక మేరకు రాజవర్ధనుడికి మరో పదివేల సంవత్సరాల ఆయుర్దాయాన్ని వరంగా ప్రసాదించాడు. వారు సంతోషంగా రాజధానికి చేరుకుని, మంత్రులకు సూర్యుడు వరమిచ్చిన సంగతి చెప్పి, ఇళ్లకు వెళ్లిపోయారు. సూర్యభగవానుడి వరప్రభావం వల్ల రాజు మరో పదివేల ఏళ్లు తమను పరిపాలించబోతున్నాడని తెలిసి ప్రజలు ఆనందంగా సంబరాలు చేసుకున్నారు. ఒకవైపు రాజ్యంలో ప్రజలంతా ఆనందంతో సంబరాలు చేసుకుంటుంటే, మరోవైపు రాజవర్ధనుడు అంతఃపురంలో విచారగ్రస్తుడై కూర్చుండిపోయాడు. అతడి తీరును గమనించిన మహారాణి మానిని, ‘మహారాజా! ప్రజలంతా సంతోషంగా ఉంటే, మీరు ఎందుకు ఇంత విచారంగా ఉన్నారు?’ అని అడిగింది. ‘మహారాణీ! మీరంతా ఉండగా, నాకొక్కడికే పదివేల ఏళ్ల ఆయుర్దాయం కలగడం మంచిది కాదు. మంత్రి పురోహితాదులు, ఆప్తులు అందరూ మరణించిన తర్వాత నేను బతికి ఉన్నా, దానివల్ల ప్రయోజనం ఏముంది?’ అన్నాడు రాజవర్ధనుడు.‘మహారాజా! మీరు చెప్పిన మాటలు సమంజసంగానే ఉన్నాయి. దీనికి తరుణోపాయం ఏమిటి?’ అని అడిగింది మానిని. ‘రేపటి వేకువనే మనం తపోవనాలకు బయలుదేరుతున్నాం’ అన్నాడు రాజవర్ధనుడు.మర్నాటి వేకువనే రాజదంపతులు తపోవనాలకు చేరుకున్నారు. రాజవర్ధనుడు సూర్యుడి గురించి తపస్సు చేశాడు. సూర్యభగవానుడు ప్రత్యక్షమయ్యాడు. ‘మహాత్మా! నాకొక్కడికే పదివేల సంవత్సరాల ఆయుర్దాయం ఇవ్వడం న్యాయమేనా? నా భార్యా పుత్రులకు, మంత్రి పురోహితులకు, నా రాజ్య పౌరులకు కూడా అంతే ఆయుర్దాయాన్ని అనుగ్రహించు’ అని వరం కోరుకున్నాడు రాజవర్ధనుడు.సూర్యభగవానుడు అతడి ప్రజానురాగానికి సంతోషించి, ‘తథాస్తు’ అని అనుగ్రహించాడు.రాజవర్ధనుడు భార్యాసమేతంగా తిరిగి రాజధానిలోకి అడుగుపెట్టాడు.పురజనులను సమావేశపరచి, సూర్యభగవానుడు అనుగ్రహించిన వరం గురించి చెప్పాడు. ప్రజలందరూ రాజవర్ధనుడికి జయజయధ్వానాలు పలుకుతూ సంతోషం వ్యక్తం చేశారు.∙సాంఖ్యాయన -
సమ్మర్ కష్టాలకు స్మార్ట్‌గా చెక్పెట్టేద్దాం ఇలా..!
‘అయ్యో వచ్చే వేసవి.. తెచ్చే తిప్పలు’ అనే మాటలకు ఇకపై స్మార్ట్‌గా చెక్ పెట్టొచ్చు. మండే ఎండల నుంచి తప్పించుకోవడానికి చల్లదనం కోసం, ప్రజలు రకరకాల చిట్కాలను పాటిస్తుంటారు. ఆ చిట్కాల్లో ఈ గాడ్జెట్లనూ చేర్చి, సమ్మర్‌కు స్మార్ట్‌గా, కూల్‌గా మార్చేయచ్చు. ఇందుకోసం ఉపయోగపడే కొన్ని లేటెస్ట్ గాడ్జెట్ల వివరాలు మీకోసం...సన్‌స్క్రీన్ టెస్టర్ వేసవిలో మీ చర్మానికి రక్షణ ఉందా? లేదా? అని ఈ బుల్లి సన్‌స్క్రీన్ టెస్టర్ ద్వారా ఇట్టే తెలుసుకోవచ్చు. చిన్న పెన్‌డ్రైవ్‌లా కనిపించే ఈ పరికరం, నిజానికి ఒక ప్రత్యేకమైన కెమెరా. వేసవిలో ఒళ్లంతా చెమటలు పట్టిన తర్వాత, ఈత కొట్టినప్పుడు, రుమాలుతో ముఖం తుడుచుకున్నప్పుడు, రాసుకున్న క్రీమ్స్ చర్మంపై అక్కడక్కడ మిస్ అవుతుంటుంది. అలాంటప్పుడు ఈ చిన్న కెమెరాలో నుంచి చూసినట్లయితే, సన్‌స్క్రీన్ క్రీమ్ రక్షణ తొలగిపోయిన ప్రదేశాలను డార్క్‌గా చూపిస్తుంది. ఇది పూర్తిగా వాటర్ ప్రూఫ్, అల్ట్రా పోర్టబుల్. దీని ధర రూ.10,311 మాత్రమే!స్మార్ట్ వాటర్ బాటిల్వేసవిలో హైడ్రేటెడ్‌గా ఉండటం తప్పనిసరి. పని ఒత్తిడిలో పడి చాలామంది తరచుగా నీళ్లు తాగటం మరచిపోతుంటారు. ఈ స్మార్ట్ వాటర్ బాటిల్‌తో మీరు హైడ్రేటెడ్‌గా ఉండొచ్చు. ఈ బాటిల్ మీరు నీటిని తీసుకోవడాన్ని ట్రాక్ చేస్తుంది. అంతే కాకుండా, అవసరమైనప్పుడల్లా మిమ్మల్ని చల్లబరచడానికి మంచి కూలింగ్ వాటర్‌ను అందిస్తుంది. అలాగే వ్యాయామాలు, హైకింగ్లు, బీచ్ డేస్‌కి తీసుకెళ్లడానికి ఈ వాటర్ బాటిల్ చాలా అనువుగా ఉంటుంది. ఇలాంటి బాటిల్స్ మార్కెట్లో చాలానే దొరుకుతున్నాయి. రివ్యూలను చూసి తీసుకోవటం మంచిది. క్యాప్ విత్ ఫ్యాన్వేసవిలో చాలామంది ఉపయోగించే క్యాప్స్ కూడా స్మార్ట్‌గా మారాయి. ఈ క్యాప్స్‌కు అటాచబుల్ మిని ఫ్యాన్ వస్తుంది. ముఖానికి కప్పుకొనే చోట ఈ ఫ్యాన్ ఉంటుంది. దీనికి సోలార్ ప్యానెల్స్ సహాయంతో పవర్ సరఫరా అవుతుంది. క్యాప్ ఎండకు ఎక్స్పోజ్ కాగానే ఆటోమేటిక్‌గా ఈ ఫ్యాన్లు పనిచేస్తాయి. వీటిల్లో కొన్ని చార్జబుల్ స్టయిల్ మోడల్స్‌లోనూ లభిస్తున్నాయి. కంపెనీల్లో క్వాలిటీ బట్టి ధరల్లో తేడా ఉండొచ్చు. రివ్యూలను పరిశీలించి, కొనుగోలు చేసుకోవచ్చు.చేతిలోనే ఫ్యాన్స్విసనకర్రలను ఎక్కడికైనా తేలికగా తీసుకుపోగలిగినట్లే, ఈ మినీ ఫ్యాన్స్‌ను కూడా ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లవచ్చు. స్మార్ట్‌ఫోన్ , పవర్ బ్యాంకు మాదిరిగానే ఈ మినీ ఫ్యాన్స్‌ను కూడా పాకెట్లో లేదా హ్యాండ్‌బ్యాగులో పెట్టుకోవచ్చు. మండుటెండల్లో ఇవి ఎంతగానో ఉపశమనాన్ని కలిగిస్తాయి. మల్టిపుల్ ఫ్యాన్ స్పీడ్స్కు తోడు రీచార్జబుల్ బ్యాటరీలు వీటిలో ఉంటాయి. వీటిలో కొన్ని యూఎస్బీ పవర్ సోర్స్‌కు కనెక్ట్ చేసుకుని కూడా వాడుకోవచ్చు. ఇలాంటి మినీ ఫ్యాన్స్‌లోనూ వివిధ రకాలు, స్టయిల్స్ ఉంటాయి. కొనుగోలు చేసే ముందు కాస్త నాణ్యత ప్రమాణాలను పరిశీలించడం మంచిది. (చదవండి: 'యుద్ధాన్ని తలపించే పండుగ'..! కానీ అక్కడు అడుగుపెట్టారో..) -
ఆటోనే ఆధారమైంది!
హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో కేడియా ఆయిల్స్ కంపెనీ యజమాని రోహిత్ కేడియా ఇంట్లో చోరీ జరిగింది. దొంగలు దాదాపు రూ.40 కోట్ల సొత్తు, నగదు దోచుకుపోయారు. ఒక ఆటో ఆధారంగా ఈ కేసును పోలీసులు ఛేదించారు. సంఘటన జరిగిన ఇరవై గంటల్లోనే ముగ్గురు నిందితులను పట్టుకుని, సొత్తు రికవరీ చేశారు. రోహిత్ కేడియా తన ఉమ్మడి కుటుంబంతో నివసిస్తున్నారు. ఆయన కుటుంబ సంస్థ కేడియా ఆయిల్స్ కంపెనీలో వివిధ రాష్ట్రాలకు చెందిన ఇరవైమంది పని చేస్తున్నారు. దాదాపు ఎకరం విస్తీర్ణంలోని తమ ఇంటి ప్రాంగణంలోనే పనివారి కోసం మూడంతస్తుల భవనం నిర్మించారు.రోహిత్ ఇంట్లో బిహార్‌లోని బీరుల్ గ్రామానికి చెందిన సుశీల్ ముఖియా రెండేళ్ల పాటు పనిచేసి, ఏడాది కిందట మానేశాడు. ఇటీవల రోహిత్ కుమార్తె వివాహం నిశ్చయమైంది. దుబాయ్‌లో డెస్టిన్‌షన్ మ్యారేజ్ చేయాలని నిర్ణయించారు. పెళ్లి పనుల్లో సహాయంగా ఉండటానికి సుశీల్‌ను రోహిత్ 15 రోజుల కిందట పిలిపించారు. ఇదే ఇంట్లో పని చేసే పశ్చిమ బెంగాల్ మహిళ బసంతి ఆర్హికి సుశీల్‌తో గతంలోనే వివాహేతర సంబంధం ఉంది. సుశీల్, బసంతి మిగిలిన పని వాళ్లతో కలిసి రోహిత్ ఇంటి ప్రాంగణంలోని భవనంలోనే ఉంటున్నారు. కుమార్తె వివాహం కోసం రోహిత్ కుటుంబం మొత్తం ఫిబ్రవరి రెండో వారంలో దుబాయ్ వెళ్లారు. దీన్ని అదనుగా భావించిన సుశీల్ ఆ ఇంటిని దోచేయడానికి ఢిల్లీలో ఉండే తన స్నేహితుడు మోల్హు ముఖియాను పిలిపించాడు. ఫిబ్రవరి 10న వచ్చిన మోల్హు అదే రోజు అర్ధరాత్రి దాటాక సుశీల్‌తో కలిసి రోహిత్ ఇంట్లోకి ప్రవేశించాడు. అల్మారాలు, లాకర్లు పగులకొట్టి 710 గ్రాముల వజ్రాభరణాలు, 1.4 కేజీల ఇతర బంగారు ఆభరణాలు, రూ.19.63 లక్షల నగదు, 24 దేశాల కరెన్సీ, 215 గ్రాముల వెండి తస్కరించారు. ఈ సొత్తుతో పాటు బసంతిని తీసుకుని ఉడాయించారు. ఫిబ్రవరి 11న ఉదయం రోహిత్ ఇంట్లో చోరీ జరిగిన విషయాన్ని మిగిలిన పనివాళ్లు గుర్తించి దుబాయ్‌లో ఉన్న యజమానికి చెప్పారు. ఈ కేసు ఛేదించడానికి నారాయణగూడ పోలీసులు, ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. రోహిత్ ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నా, మానిటర్ లేదు. రోహిత్ కుటుంబ సభ్యులు తమ సెల్ఫోన్లలోనే ఈ దృశ్యాలు చూస్తుంటారు. సెల్ఫోన్లో రికార్డయిన అనుమానితుల వీడియోలు తమకు పంపాలని పోలీసులు రోహిత్‌ను కోరారు. వీటిని పంపిన రోహిత్, ఆ ముగ్గురిలో ఇద్దరిని సుశీల్, బసంతిగా గుర్తించాడు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ నేరం జరిగితే, ఉదయం 9 గంటలకు ఫిర్యాదు వచ్చింది. ఏమాత్రం ఆలస్యమైనా నిందితులు చిక్కరని భావించిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. రోహిత్ ఇంటి సమీపంలో రహదారిపై ఉన్న సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడ్‌ను పోలీసులు పరిశీలించి, నిందితులు చోరీ చేసిన ఇంటి నుంచి తెలుగు అకాడమీ వరకు నడుచుకుంటూ వెళ్లి, ఆటో ఎక్కినట్లు గుర్తించారు. అయితే ఆటో రిజిస్ట్రేషన్ నంబర్ కనిపించకపోవడంతో వాహనం వెళ్లిన దిశను ఆధారంగా చేసుకున్నారు. నిందితులతో ఉన్న ఆటో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్, ఓల్డ్ కమిషనరేట్, ట్రాఫిక్ కమిషనరేట్ మీదుగా ప్రయాణించినట్లు గుర్తించారు. సుశీల్ బిహార్‌కు, బసంతి పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారని రోహిత్ ద్వారా తెలుసుకున్న పోలీసులు– నిందితులు ఆ రెండు రాష్ట్రాల్లో ఏదో ఒక చోటుకు వెళ్లి ఉంటారని అంచనా వేశారు. అంత సొత్తుతో విమానం ఎక్కే అవకాశం ఉండదని, నాంపల్లి రైల్వే స్టేషన్‌కు వెళ్లి ఉంటారని భావించారు. అక్కడకు వెళ్లిన ప్రత్యేక బృందం ఫ్లాట్‌ఫామ్స్‌పై ఉన్న సీసీ కెమెరాల్లోని ఫీడ్‌ను పరిశీలించి, ఆ ముగ్గురూ ఢిల్లీ వెళ్లే తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ఎక్కారని, అది ఉదయం 6.45 గంటలకు బయలుదేరిందని గుర్తించారు. వెంటనే ఈస్ట్‌జోన్ డీసీపీ బి.బాలస్వామి రైల్వే పోలీసులను అప్రమత్తం చేసి, నిందితుల ఫొటోలు పంపారు. అధికారులు తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో విధులు నిర్వర్తిస్తున్న వారిని అప్రమత్తం చేశారు. తనిఖీలు చేపట్టిన రైల్వే పోలీసులకు జనరల్ బోగీలో టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఈ ముగ్గురూ తారసపడ్డారు. వీరిని పట్టుకుని, రైల్వే పోలీసులు సొత్తు రికవరీ చేశారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో నాగపూర్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్న హైదరాబాద్ పోలీసులకు వీరిని అప్పగించారు. మరోవైపు, రోహిత్ ఇంట్లో ఫింగర్ ప్రింట్స్ బ్యూరో అధికారులు సుశీల్‌తో పాటు మోల్హు వేలిముద్రలను సేకరించారు. వీటిని తమ డేటాబేస్‌లో సెర్చ్ చేయగా, 2023 జనవరి 31న దోమలగూడలో జరిగిన స్నేహలతాదేవి హత్యకు సంబంధించిన కీలక ఆధారం దొరికింది. అప్పట్లో ఆమెకు కేర్ టేకర్‌గా పని చేసిన బిహారీ మహేష్‌కుమార్ ముఖియా, మోల్హు ముఖియాతో కలిసి ఆ వృద్ధురాలిని చంపి, రూ.కోటి విలువైన సొత్తుతో ఉడాయించాడు. గత ఏడాది అక్టోబర్‌లో మహేష్ చిక్కినా, మోల్హు పరారీలోనే ఉన్నాడు. కేడియా ఇంట్లో దొరికిన వేలిముద్రల ఆధారంగా నాటి కేసులోనూ మోల్హు నిందితుడని గుర్తించారు. దీంతో ఇతడిని తొలుత నారాయణగూడ, ఆపై దోమలగూడ కేసుల్లో అరెస్టు చేశారు. నిందితులు చిక్కడం ఆలస్యం కావడంతో స్నేహలతాదేవిని చంపి ఎత్తుకుపోయిన సొత్తులో కనీసం ఒక్క రూపాయి కూడా రివకరీ కాలేదు. ∙శ్రీరంగం కామేష్ -
భారీ కీటకం.. దాంతోనే వంటకం..!
చిన్న బొద్దింకను చూస్తేనే చాలామంది భయపడుతుంటారు. అలాంటిది పెద్ద బొద్దింకను చూస్తే ఇక పరుగులే! కాని, ఫొటోలో పెద్దసైజు బొద్దింకలా కనిపిస్తున్నది కీటకమే గాని, వియత్నాం ప్రజలు మాత్రం దీంతో రుచికరమైన వంటకాన్ని తయారు చేసుకుని ఆరగిస్తారు. దీని అతిపెద్ద ఆకారం, తలను చూసి, వియత్నాంలో అందరూ, దీనిని ‘స్టార్ వార్స్’ సినిమాల్లో విలన్ అయిన ‘డార్త్ వాడర్’గా పిలుచుకుంటారు. దాదాపు 30 నుంచి 35 సెంటీమీటర్లు పొడవు, ఒకటి నుంచి రెండు కిలోల బరువుతో ఉంటుంది ఈ కీటకం. వియత్నాం ఫుడ్మార్కెట్లో విక్రయిస్తున్న దీనిని ఈ మధ్యనే శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది ‘బాతినోమాస్’ జాతికి చెందిన జెయింట్ ఐసోపాడ్ అనే సముద్ర కీటకంగా నిర్ధారించారు. ఈ సముద్ర కీటకానికి సంబంధించిన మరో రెండు నమూనాలను పరిశోధకులు విశ్లేషణ కోసం సేకరించారు. మరిన్ని విషయాలను అధ్యయనం చేశాకనే వెల్లడించగలమని తెలిపారు. -
'యుద్ధాన్ని తలపించే పండుగ'..! కానీ అక్కడ అడుగుపెట్టారో..
శరవేగంగా పరుగులు తీసే గుర్రాలను అధిరోహించి, ఒకరిపై మరొకరు ఈటెలతో కలబడే ఆ దృశ్యాన్ని చూస్తే, అక్కడేదో యుద్ధం జరుగుతోందని ఎవరైనా పొరబడతారు. నిజానికి అది యుద్ధంకాదు, అక్కడి ప్రజలు జరుపుకొనే సంప్రదాయ పర్వదినం. ఇండోనేసియా తూర్పు ప్రాంతంలోని సుంబా దీవిలో జరిగే ఈ పండుగ పేరు ‘పసోలా’. ఏటా ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఈ పండుగను పంటకాలానికి ప్రారంభ సూచికగా జరుపుకొంటారు.పూర్వీకుల ఆత్మశాంతి కోసం, కుటుంబాల మధ్య అనుబంధాలను బలపరచుకోవడానికి, మూలాలను కాపాడుకోవడానికి ఈ పండుగ ఒక మార్గమని స్థానికులు చెబుతారు. ఈ పండుగలో ముఖ్యమైన ఘట్టం ఈటెల పోటీ. సత్తా ఉన్నవారంతా బరిలోకి దిగి, గుర్రాల మీద స్వారీ చేస్తూ, ప్రత్యర్థులతో కలబడతారు. ఎదురుగా దూసుకొచ్చే ఈటెలను తప్పుకోవడం ఒక ఎత్తయితే, గురిచూసి ఎదుటివారిని దెబ్బతీయడం మరో ఎత్తు. యుద్ధాన్ని తలపించే ఈ పోటీల్లో చాలామందికి గాయాలవుతుంటాయి.పసోలా అనే పదానికి సుంబా స్థానిక భాషల్లో ‘ఈటె విసరడం’ అని అర్థం. ఈ పోటీల్లో వినియోగించే ఈటెలను ‘హోలా’ అని పిలుస్తారు. ఈ పండుగ వెనుక పురాతన చరిత్ర ఉంది. స్థానిక పురాణాల ప్రకారం, పసోలా పండుగ ఆకాశంలో ఒకరితో ఒకరు పోరాడిన రెండు శక్తిమంతమైన ఆత్మల కథ నుంచి మొదలైందట! ఆ ఆత్మల సంఘర్షణ ఫలితంగా భూమిపై ఈటెల వర్షం కురిసిందట!. ఈ పౌరాణిక గాథ ప్రేరణతోనే ఈ పండుగ ప్రారంభమైంది. ఈ వేడుక కోసం గుర్రాలను పెంచడాన్ని గౌరవంగా, హోదాచిహ్నంగా భావిస్తుంటారు. పనికట్టుకుని ఈ పోటీలో పాల్గొనే పోటీదారులు తమ గుర్రాలను తామే పెంచుకుని, రోజుల తరబడి సాధన చేసి మరీ బరిలోకి దిగుతుంటారు. ఈ పోటీని చూడటానికి పెద్దసంఖ్యలో పర్యటకులు కూడా పోటెత్తుతారు. అడుగుపెడితే శిలైపోతారుభూమిపై ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో ఉత్తర టాంజానియాలో ఉండే నాట్రాన్ సరస్సు ఒకటి. ఇందులోని నీరు నెత్తుటిలా ఎర్రగా ఉంటుంది. సరస్సంతా నెత్తుటి మడుగులా కనిపిస్తుంది. ఈ సరస్సును దయ్యాలు సృష్టించాయని, ఆ సరస్సులోకి మనుషులు గాని, జంతువులు గాని దిగితే, రాళ్లుగా మారిపోతారని స్థానికులు చెబుతుంటారు. అందుకే, సూర్యాస్తమయం తర్వాత ఎవరూ అక్కడ తిరగడానికి సాహసించరు. శాస్త్రవేత్తలు ఈ సరస్సును పరిశీలించి, ఈ సరస్సు నీటిలో సోడియం కార్బొనేట్, నైట్రో కార్బొనేట్ ఎక్కువగా ఉండటంతో, ఇందులోని నీరు ప్రాణాంతకంగా మారిందని తేల్చారు. ఈ సరస్సులోకి మనుషులు సహా ప్రాణులేవైనా వెళ్తే, ఇలా రాళ్లలా గడ్డకట్టిపోవడానికి గల కారణాలను మాత్రం శాస్త్రవేత్తలు ఇంకా కనిపెట్టలేకపోయారు. (చదవండి: గిన్నిస్‌కెక్కిన మహిళల వేడుక..!) -
గిన్నిస్‌కెక్కిన మహిళల వేడుక..!
అందరూ మహిళలే జరుపుకొనే వేడుక ఇది. అత్యధిక సంఖ్యలో మహిళలు ఒకేచోట చేరి జరుపుకొనే కార్యక్రమంగా గిన్నిస్ బుక్‌లోకి ఎక్కిన అరుదైన వేడుక ఇది. ఈ వేడుకలో పాల్గొనడానికి పురుషులకు అనుమతి ఉండదు. తరతరాలుగా సాగుతున్న ఈ వేడుక కేరళ రాజధాని తిరువనంతపురం చేరువలోని అట్టుకల్ గ్రామంలో వెలసిన భగవతి అమ్మవారి ఆలయంలో జరుగుతుంది. ఏటా పదకొండు రోజుల పాటు జరిగే ఈ వేడుకలో లక్షలాది మంది మహిళలు పాల్గొంటారు.తిరువనంతపురం జిల్లా అట్టుకల్ గ్రామంలోని భగవతి అమ్మవారి ఆలయం చాలా పురాతనమైనది. అట్టుకల్ గ్రామంలో వెలసినందున ఈ అమ్మవారు ‘అట్టుకల్ భగవతి’గా ప్రసిద్ధి చెందింది. ఈ ఏడాది మార్చి 5 నుంచి 15 వరకు ఈ ఆలయంలో అట్టుకల్ భగవతి అమ్మవారి వేడుకలు జరుగుతున్నాయి. వేడుకల తొమ్మిదో రోజున లక్షలాది మంది మహిళలు ఇక్కడకు చేరుకుని, అమ్మవారికి పొంగలి నైవేద్యం సమర్పిస్తారు. ఈ కార్యక్రమాన్ని ‘అట్టుకల్ పొంగల్’ వేడుకగా పిలుస్తారు. తొమ్మిదో రోజున తిరువనంతపురం నగరంలోని అన్ని రహదారులూ అట్టుకల్ భగవతి అమ్మవారి ఆలయానికి వెళ్లే మహిళలతో కిటకిటలాడుతూ కనిపిస్తాయి. ఈ వేడుకల్లో పాల్గొనడానికి కేరళ నుంచే కాకుండా, ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన మలయాళీ మహిళలు పెద్దసంఖ్యలో ఇక్కడకు చేరుకుంటారు.ఇక్కడకు వచ్చే మహిళలు ఆలయ ప్రాంగణంలోను, ఆలయ పరిసరాల్లోని వీథుల్లోను ఇటుకలతో కట్టెల పొయ్యిలను ఏర్పాటు చేసుకుని, వాటి మీద పొంగలి, చక్కెరపొంగలి వండుతారు. ఆలయ ప్రధాన అర్చకుడు నిర్ణయించిన ముహూర్తానికి అందరూ ఒకేసారి పొయ్యిలు వెలిగించి వంట మొదలుపెడతారు. ముహూర్త సమయం ఆసన్నం కాగానే, అర్చకుడు గంట మోగిస్తాడు. అయితే, మహిళలు పొంగలి వండుతున్న ప్రదేశంలోకి ఆలయ అర్చకులు కూడా అడుగు పెట్టరు. ఈ వేడుకలో భాగంగా మహిళలందరూ తిరువనంతపురంలోని మనకాడు ప్రాంతంలో ఉండే శ్రీధర్మ శాస్త ఆలయం వరకు భారీ ఊరేగింపు జరుపుతారు. మొదటి రోజున ‘కప్పుకెట్టు’ కార్యక్రమంతో ఈ వేడుక మొదలవుతుంది. ఇందులో భాగంగా ‘కణ్ణగి చరిత’ను గానం చేస్తారు. ‘కణ్ణగి చరిత’గానం వరుసగా తొమ్మిది రోజుల పాటు జరుగుతుంది. చివరి రోజున ‘కురుత్తి తర్పణం’ పేరుతో తర్పణాలు విడిచిపెట్టడంతో ఈ వేడుకలు ముగుస్తాయి. వేడుక కొనసాగినన్ని రోజులూ అట్టుకల్ భగవతి అమ్మవారి ఆలయానికి చేరుకునే వీథులన్నీ రంగురంగుల అలంకరణలతో కనువిందు చేస్తాయి. ఈ వేడుకల సందర్భంగా వీథుల్లో ఏర్పాటు చేసే బహిరంగ వేదికలపై సంప్రదాయ నృత్య సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. అట్టుకల్ పొంగల్ వేడుకలలో 1997 సంవత్సరంలో 15 లక్షల మందికి పైగా మహిళలు పాల్గొనడంతో తొలిసారి గిన్నిస్‌బుక్ రికార్డుల్లో నమోదైంది. ఆ తర్వాత 2009లో 25 లక్షలకు పైగా మహిళలు పాల్గొనడంతో మరోసారి గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కింది. ఈ వేడుక ప్రశాంతంగా జరగడానికి వీలుగా కేరళ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేస్తుంది.(చదవండి: అంచనాలు నెరవేరకపోయినా..బంధం స్ట్రాంగ్‌గానే ఉండాలి..!) -
అంచనాలు నెరవేరకపోయినా..బంధం స్ట్రాంగ్‌గానే ఉండాలి..!
అనిత, అరవింద్ ప్రేమించి, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. యూనివర్సిటీ లెక్చరర్ అవ్వాలని అరవింద్ కలలు కన్నాడు. అదే లక్ష్యంగా చదువుతూ, అనితకు కూడా తన భవిష్యత్తుపై అదే ఆశను కల్పించాడు. కానీ పెళ్లయిన రెండేళ్ల తర్వాత, అరవింద్ తన ఆలోచన మార్చుకున్నాడు. అకడమిక్ కెరీర్ కంటే తనకు వ్యాపారం సరిపోతుందని భావించి, స్నేహితుడితో కలిసి టీవీ షోరూం ప్రారంభించాడు. అనితకు ఇది పెద్ద షాక్.అనిత ఎప్పుడూ ‘యూనివర్సిటీ ప్రొఫెసర్ భార్య’ అని తనను ఊహించుకుంది. కానీ అరవింద్ వ్యాపారం ప్రారంభించడం ఆమె అంచనాలను తారుమారు చేసింది. దాన్ని ఆమె భరించలేకపోయేది. ‘‘నువ్వు లెక్చరర్ అవుతావని నిన్ను పెళ్లి చేసుకున్నా!’’అంటూ తరచు విమర్శించేది. దానికితోడు వ్యాపారంలో అరవింద్‌కు నష్టం వచ్చింది. దాంతో అనిత విమర్శల జోరు పెరిగింది. ‘‘ఈ మాత్రం దాని కోసమేనా లెక్చరర్ ఉద్యోగం వద్దనుకుంది’’ అని దెప్పి పొడిచేది. కష్టాల్లో అండగా ఉండాల్సిన భాగస్వామి అలా మాట్లాడటం అరవింద్ మనసును తీవ్రంగా గాయపరిచింది. తనను తాను నిరూపించుకోవాలని అరవింద్ కసిగా పనిచేశాడు. వ్యాపారం పట్టాలెక్కింది. పట్టణంలో ఒక ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు సంపాదించుకున్నాడు. తన వ్యాపారం పట్ల అరవింద్ ఎంత సంతోషంగా ఉన్నా, అనిత మాత్రం అతని మార్పును అంగీకరించలేదు. తన కలలను నాశనం చేశాడనే బాధ ఆమె మనసును దాటడంలేదు. దాంతో సూటిపోటి మాటలు అంటూనే ఉంది. దీంతో వారి మధ్య మాటలు తగ్గాయి. ఒకరి ఆనందాన్ని మరొకరు పంచుకోవడం మానేశారు. చివరకు ఒకరినొకరు ఇష్టపడటం కూడా మానేశారు. ఒకే ఇంట్లో ఉంటున్న ఇద్దరు అపరిచితులుగా మారిపోయారు.అంచనాలు నెరవేరకపోతే!?‘నా కలలు తుడిచిపెట్టుకుపోయాయి’ అనే భావనతో నిరాశ పెరుగుతుంది.‘నువ్వు నా జీవితాన్ని నాశనం చేశావు’ అంటూ విమర్శ తారస్థాయికి చేరుతుంది.‘ఇప్పటికైనా మారవచ్చు కదా’ అనే ఒత్తిడి పెరుగుతుంది. ‘ఇతను నా జీవితానికి సరైన వ్యక్తి కాదు’ అంటూ ప్రేమ తగ్గిపోతుంది ‘ఇదే కొనసాగితే విడిపోవడమే సరైన మార్గమేమో’ అనే ఆలోచన బలపడుతుంది.అసలైన సమస్య ఏమిటి?‘పెళ్లికి ముందు మాయ మాటలు చెప్పి నన్ను మోసం చేశాడు’ అని అనిత భావించడం.‘నా నిర్ణయాన్ని, నా కెరీర్ మార్పును భార్య అర్థం చేసుకోవడం లేదు!’ అని అరవింద్ భావించడం.నిజానికి ఇద్దరూ బాధితులే కాని, ఇద్దరూ ఒకరినొకరు బాధ్యుల్ని చేయడం.భాగస్వామి మారుతున్నప్పుడు మనం కూడా మారాలనే దృక్పథం లేకపోవడం.ఒకరి మార్పును మరొకరు అంగీకరించకపోవడం.ఆర్థిక భద్రత, భవిష్యత్తు పట్ల భయం సంబంధాన్ని దెబ్బతీసేలా మారడం. బంధాన్ని ఎలా కాపాడుకోవాలి? ‘నా దృష్టికోణం మాత్రమే నిజం’ అనే ఆలోచన వదలాలి. ‘అతను నన్ను మోసం చేశాడు’ అనే ఆలోచన పక్కనపెట్టి ‘అతనికి సంతోషం ఇచ్చే మార్గం మారిపోయింది. నేను దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు?’ అని ఆలోచించాలి.ఆశలకు, వాస్తవానికి మధ్య తేడా ఎక్కడుందో గుర్తించాలి. భర్త లెక్చరర్ అవ్వాలి, జీతం స్థిరంగా ఉండాలనేది అనిత ఆశ. భద్రత కంటే ఆనందం అరవింద్‌కు ముఖ్యం. ఈ తేడాను అంగీకరించకపోతే, సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది!‘వ్యాపారంలో నష్టం వస్తే మన భవిష్యత్తు ఏమిటి?’ అనే భయాన్ని ‘మన ఇద్దరి భద్రత కోసం మనం కలిసి ప్లాన్ చేసుకోవచ్చు’ అని ప్రేమగా మార్చాలి.అరవింద్ అనితను ప్రేమించడంలేదని కాదు, అతను తన కలలను మార్చుకున్నాడు, కాని, అనిత తన ఊహల్లోనే ఉంది. కలిసుండాలంటే, ఒకరి కలలను మరొకరు అర్థం చేసుకోవాలి.అరవింద్ మారిన మార్గాన్ని అనిత అర్థం చేసుకోవాలి. భద్రత పట్ల ఉన్న అనిత భయాన్ని అర్థం చేసుకోవాలి. ఇద్దరూ సంపాదన, భద్రత, భవిష్యత్తు గురించి కలిసి చర్చించుకోవాలి.పెళ్లంటే ఒకరినొకరు మార్చడం కాదు, ఒకరి కోసం ఒకరు మారడమని, ఇద్దరూ కలిసి ప్రయాణం చేయడమని అర్థం చేసుకోవాలి. సంబంధాల్లో ప్రధానమైనది భాగస్వాముల ఆనందం. ఆర్థిక భద్రత అవసరమే కాని, అది మాత్రమే ప్రేమను నిర్వచించలేదు. పరిస్థితులకు అనుగుణంగా మన ఆలోచనలను సర్దుబాటు చేసుకోగలగాలిసైకాలజిస్ట్ విశేష్ www.psyvisesh.com(చదవండి: హీరోయిన్ నయనతారలాంటి స్టన్నింగ్ లుక్ కోసం..!) -
గర్భస్రావం కాకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?
నా వయసు 35 ఏళ్లు. సాఫ్ట్వేర్ ఉద్యోగిని, నైట్ షిఫ్ట్స్‌లో చేస్తాను. ఈ వయసులో గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువ అని విన్నాను. అలా కాకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? – శైలజ, చిత్తూరు. వయసు పెరిగేకొద్దీ జెనెటిక్ కారణాలు, హార్మోన్లలో మార్పుల వలన గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాటిని నిరోధించడం కష్టం. అందువల్ల, ముందుగానే ప్లాన్ చేసుకోవటం, సరైన సమయానికి పరీక్షలు చేయించుకోవటం చెయ్యాలి. ప్రీకాన్సెప్షన్ కౌన్సెలింగ్ అంటే ప్లానింగ్‌కు ముందు ఒకసారి భార్యభర్తలిద్దరూ గైనకాలజిన్ట్ దగ్గర తీసుకోవాలి. డాక్టర్ ఫ్యామిలీ హిస్టరీలో ఏదైనా ప్రివెంట్ చేసే సమస్యలను గుర్తించి, వివరిస్తారు. రొటీన్ థైరాయిడ్, సుగర్, బీపీలను పరీక్షిస్తారు. కొన్ని వ్యాధులకు ప్రివెంటివ్ వాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి. అవి ముందుగా వేయించుకుంటే ప్రెగ్నెన్సీలో గర్భస్రావం కాకుండా ఉంటుంది. రుబెల్లా, చికెన్ పాక్స్ లాంటివి.. ఇమ్యూనిటీ లేకపోతే వాక్సిన్స్ ఇస్తాం. ఒకనెల తరువాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. మీకేదైనా మెడికల్ రిస్క్స్ ఉండి, ఇతర మందులు వాడుతుంటే వాటిని మార్చి, సురక్షితమైన మందులను రాసి ఇస్తాం. ఉబ్బసం, అధిక బరువు ఉంటే కూడా గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువ. అప్పుడు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేలా సూచిస్తాం. నైట్ షిఫ్ట్స్ వలన ప్రెగ్నెన్సీలో సాధారణంగా ఏ సమస్య ఉండదు. ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించాలి. మీరు చెకప్స్‌కు వచ్చినప్పుడు బీఎమ్ఐ కాలిక్యులేట్ చేసి, తగిన డైట్ సూచిస్తాం. కొంతమందికి గర్భసంచిలో పొర లేదా గడ్డలు ఉంటాయి. వాటిని స్కాన్స్‌లో కనిపెడతాం. ఏదైనా సమస్య ఉండి, ప్రెగ్నెన్సీలో ఇబ్బంది కలిగేటట్లయితే, పూర్తి శరీర ఆరోగ్య పరీక్షల తర్వాత చిన్న సర్జరీ ద్వారా ముందే కరెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ముందు నుంచి తీసుకుంటే బేబీ మెదడు, వెన్నెముక సమస్యలు తగ్గుతాయి. రక్తం పలుచబడే వ్యాధులు ఉన్నట్లు కనిపెడితే, ముందుగా కొన్ని మందులతో చికిత్స చేసి మొదటి వారాల్లోనే గర్భస్రావం కాకుండా చేయచ్చు. అందుకే, ముందుగానే చెకప్స్‌కు వెళ్తే, థైరాయిడ్ లాంటివి గుర్తించి, తగిన మందులు ఇస్తారు. అప్పుడు ప్లాన్ చేసినప్పుడు గర్భస్రావం రిస్క్ తగ్గుతుంది. కొన్నిసార్లు ఏ కారణం లేకుండా శిశువు ఎదుగుదల సమస్యతో ఆకస్మికంగా గర్భస్రావం కావచ్చు. అది మళ్లీ రిపీట్ కాకపోవచ్చు. పూర్తి హిస్టరీ, కౌన్సెలింగ్, ఆరోగ్యకరమైన అలవాట్ల ద్వారా గర్భస్రావాన్ని నివారించవచ్చు.రావడం లేదునాకు కాన్పు అయి మూడు రోజులు అవుతుంది. చాలా కష్టంగా కాన్పు జరిగింది. బేబీకి బ్రెస్ట్ ఫీడ్ ఎక్కువ రావటం లేదు. బయట పాలు పట్టడం నాకు ఇష్టం లేదు. ఏం చెయ్యాలి?– రమాదేవి, ఉరవకొండ. కొన్నిసార్లు కాన్పు సమయంలో తీసుకునే ఒత్తిడి కారణంగా శిశువులకు లాచింగ్ అంటే బ్రెస్ట్, ఐరోలాను నోటిలో పెట్టుకొని సక్ చెయ్యటంలో కొంచెం బలహీనపడతారు. మూడు నుంచి పదిహేను రోజుల్లో వాళ్లకి అలవాటు అవుతుంది. కాని, ఈ సమయంలో బేబీ బరువు తగ్గటం, సుగర్, ఉష్ణోగ్రతలను సరైన స్థాయిలో ఉంచటం చాలా అవసరం. పీడియాట్రీషియన్ సలహా పాటించడం మంచిది. సాధారణంగా సహజ ప్రసవం లేదా సిజేరియన్ కాన్పు జరిగిన అరగంటలోపు బేబీకి, తల్లితో బ్రెస్ట్ సకింగ్ కచ్చితంగా చేయించాలి. దీనితో తల్లికి, బిడ్డకు బంధం ఏర్పడుతుంది. బ్రెస్ట్‌లోని ప్రోలాక్టిన్ రిసెప్టర్స్ సిమ్యులేట్ అవుతాయి. భవిష్యత్తులో బ్రెస్ట్ ఫీడింగ్ బాగా వృద్ధి చెందుతుంది. కాని, ముందు కేవలం నీళ్లలాంటి కొలోస్ట్రమ్ మాత్రమే వస్తుంది. అప్పుడే పుట్టిన బేబీకి ఈ కొలోస్ట్రమ్ సరిపోతుంది. సరైన పాలు మూడు నుంచి ఆరు రోజులకు గాని రావు. ఒకవేళ బేబీ లాచింగ్ చెయ్యకపోతే చేతితో లేదా బ్రెస్ట్ పంప్‌తో ఈ కొలోస్ట్రమ్ బేబీకి ఇవ్వటానికి ప్రయత్నించాలి. సరైన రొమ్ముపాలు ఇవ్వడం అనేది చాలాసార్లు నెమ్మదిగానే జరుగుతుంది. తల్లి చాలా పాజిటివ్‌గా ఉండాలి. మంచి పోషకాహారం తీసుకోవాలి. బేబీ పుట్టిన మొదటి 24 గంటల్లో మూడు నుంచి నాలుగుసార్లు మాత్రమే ఫీడ్ తీసుకుంటారు. తర్వాతి రోజు నుంచి రోజులో ఎనిమిది సార్లు దాకా ఫీడ్ తీసుకుంటారు. ప్రతి బ్రెస్ట్ ఫీడింగ్ పది నుంచి నలభై నిమిషాలు సక్ చేయించాలి. దీని వలన బ్రెస్ట్ స్టిమ్యులేట్ అయి, పాల ఉత్పత్తి మొదలవుతుంది. ఒకవేళ బేబీ సక్ చెయ్యకపోతే ఇదే రిథమ్‌తో బ్రెస్ట్ పంప్‌తో చెయ్యండి. స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ బేబీకి చాలా అవసరం. ఎప్పుడూ తల్లి పక్కనే బిడ్డను పడుకోబెట్టుకోవాలి. ప్రతి రెండు నుంచి మూడు గంటలకు ఒకసారి నిద్రలో ఉన్నా లేపి, సకింగ్ చేయించాలి. మూడు గంటల కన్నా ఎక్కువ సేపు ఫీడ్ లేకుండా ఉండకూడదు. ఎక్స్ప్రెస్డ్ మిల్క్ అయినా ఇదే పద్ధతి ఫాలో కావాలి. బేబీ ఎన్నిసార్లు యూరిన్, మోషన్ చేస్తుంది అనేది గమనించాలి. తక్కువ యూరిన్ పాస్ చేస్తున్నా, డల్‌గా ఉన్నా, వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఎక్స్ప్రెస్డ్ ఫీడ్స్ లేదా బ్రెస్ట్ పంప్ వాడటం వలన బ్రెస్ట్ మిల్క్ తగ్గదు. ఎలక్ట్రానిక్ పంప్ వాడవచ్చు. ఒకసారి బేబీకి లాచింగ్ అలవాటు అయిన తరువాత ఎక్స్ప్రెస్డ్ ఫీడ్ ఇవ్వటం ఆపేయాలి. తల్లి పాజిటివ్‌గా ఉండి, స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ తరచు ఇస్తూ, ప్రతి రెండు నుంచి మూడు గంటలకు బ్రెస్ట్ సకింగ్ చేయిస్తే ఫీడ్ సరిపోవట్లేదనే సమస్య ఉండదు. లాక్టేషన్ కౌన్సెలర్ సహాయంతో వివిధ బ్రెస్ట్ ఫీడింగ్ పొజిషన్స్ కూడా నేర్చుకోవచ్చు. -
భారతీయుల ఖర్చు మాములుగా లేదు..!
భారత్ ఖర్చు చేస్తోంది. షాపింగ్ ద్వారా సంతోషాన్ని కొని తెచ్చుకునేవారు కొందరైతే, ఇతరులకు పోటీగా హోదా ప్రదర్శించేవారు మరికొందరు. మారుమూల పల్లెలకూ ఇంటర్నెట్ చేరువ కావడం; చౌకగా డేటా లభించడం; విరివిగా స్మార్ట్ఫోన్ల వాడకం; ఈ–కామర్స్ దూకుడు; స్వదేశీ, విదేశీ బ్రాండ్ల మార్కెటింగ్ వ్యూహాలు; ఊరిస్తున్న ఫ్యాషన్ ప్రపంచం; ఊదరగొట్టే కంపెనీల ప్రకటనలు; సానుకూల మార్కెట్ వాతావరణం.. కారణం ఏదైతేనేం ప్రజల ఆదాయాల్లో వృద్ధి, మారుతున్న జీవన శైలి, పెరుగుతున్న ఆకాంక్షలు జనాలను ఖర్చుల వైపు నడిపిస్తున్నాయి. బ్యాంకింగ్, ఫిన్‌టెక్ కంపెనీలు టెక్నాలజీని ఆసరాగా చేసుకుని ప్రజలకు రుణాలను వేగంగా, విరివిగా అందించడమూ ఖర్చులకు ఆజ్యం పోస్తోంది. దినసరి కూలీలు, వేతన జీవులు, వ్యాపారస్తులు– ఉపాధిమార్గం ఏదైనా, ఆదాయం ఎంత ఉన్నా, డబ్బు ఖర్చుకు వెనుకాడడం లేదు. భారతీయులు తమ మొత్తం ఆదాయంలో అనవసర ఖర్చులకే 29 శాతం వెచ్చిస్తున్నారట! రూ.40 వేల కంటే అధిక ఆదాయం ఉన్న వ్యక్తులైతే అవసరాలను మించి అనవసర వ్యయాలు చేస్తున్నారంటే ప్రజలు హంగు, ఆర్భాటాలకు ఎంతలా ప్రాధాన్యమిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. మరీ విడ్డూరమేమిటంటే, రూ.20 వేలలోపు ఆదాయం ఉన్న అల్పాదాయ వర్గాల వారిలో ఆన్లైన్ గేమింగ్‌కు ఖర్చు చేస్తున్న వారి శాతం అత్యధికంగా 22% ఉంది. జనం ఎంతగా వెచ్చిస్తున్నారంటే, తాము చేసిన పెట్టుబడుల గడువు తీరక ముందే వాటిని ఉపసంహరించుకుని మరీ ఖర్చు చేస్తున్నారు.బలమైన వృద్ధి, పెరుగుతున్న మధ్య, అధిక–ఆదాయ తరగతి, డిజిటల్ మౌలిక సదుపాయాలు, వెరసి పెట్టుబడి, వినియోగదారుల కార్యకలాపాలకు ప్రపంచ హాట్‌స్పాట్‌గా భారత్ ఉద్భవించింది. భారత మార్కెట్లోకి భారీగా మూలధనం వెల్లువెత్తుతోంది. ప్రపంచంలోని ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక సేవల రంగంలో పెరుగుతున్న డిజిటలైజేషన్ తిరుగులేని ప్రభావాన్ని చూపుతోంది. పెరుగుతున్న మధ్యతరగతి, ఆదాయాల్లో వృద్ధి, విస్తరిస్తున్న గ్రామీణ మార్కెట్లు, మెరుగైన డిజిటల్ అనుసంధానత, జనాభాలో పెరుగుతున్న ఆకాంక్షల ఫలితంగా 2027 నాటికి భారత్ రెండు మెట్లు ఎక్కి ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద వినియోగదారుల మార్కెట్‌గా అవతరిస్తుందని పలు నివేదికలు చెబుతున్నాయి. దేశంలో వినియోగదారుల మార్కెట్ పరివర్తన దిశగా పయనిస్తోంది. వినియోగదారుల ప్రవర్తనలో శరవేగంగా మార్పులొస్తున్నాయి. వస్తువులు, సేవలకు డిమాండ్ పెరుగుతోంది.ఈ డైనమిక్ మార్కెట్లో భాగస్వామ్యం కోసం ఉవ్విళ్లూరుతున్న ఆర్థిక సంస్థలు, విధాన రూపకర్తలు, వ్యాపారులకు భారతీయులు ఖర్చు పెడుతున్న తీరును అర్థం చేసుకోవడం చాలా అవసరం. ‘భారత్ ఎలా ఖర్చు చేస్తోంది: వినియోగదారుల వ్యయాల తీరుతెన్నులపై లోతైన అధ్యయనం’ పేరుతో కన్సల్టింగ్, ఫైనాన్షియల్ అడ్వైజరీ సేవల్లో ఉన్న పీడబ్ల్యూసీ ఇండియా సహకారంతో ఫిన్‌టెక్ సాఫ్ట్వేర్ కంపెనీ పర్ఫియోస్ నివేదికను రూపొందించింది. 30 లక్షల మంది టెక్–ఫస్ట్ భారతీయ వినియోగదారుల లావాదేవీల సమాచారాన్ని విశ్లేషించి, వారు చేసే ఖర్చులను లోతుగా పరిశీలించింది. ఈ అధ్యయనం వివిధ ఆదాయ స్థాయులు, ప్రదేశాలలోని వ్యక్తుల ఖర్చు అలవాట్ల గురించి తెలియజేస్తుంది. భారతీయ వినియోగ, వ్యయ ధోరణులలోని మార్పులకు ఈ నివేదిక అద్దం పడుతుంది. ప్రజలు తప్పనిసరి ఖర్చులకు అత్యధిక మొత్తంలో డబ్బు కేటాయిస్తున్నారు. ఇది వారి మొత్తం వ్యయంలో 39 శాతం ఉంటోంది. అవసరాలకు 32 శాతం, హంగులు, ఆర్భాటాలు వంటి అనవసర ఖర్చులకు 29 శాతం వెచ్చిస్తున్నారు.అన్ని నగరాల్లోనూ వ్యక్తులు తమ ఆదాయంలో 33 శాతానికి పైగా నెల వాయిదాల (ఈఎంఐ) చెల్లింపులకు కేటాయిస్తున్నారు.అనవసర ఖర్చుల్లో 62 శాతం కంటే ఎక్కువ జీవనశైలి కొనుగోళ్లకు సంబంధించివే! అంటే ఫ్యాషన్, వ్యక్తిగత సంరక్షణ వస్తువుల షాపింగ్‌కు ఖర్చు చేస్తున్నారు.నెలకు రూ.20 వేల లోపు ఆదాయం ఉన్న ఎంట్రీ–లెవల్ సంపాదనపరుల్లో ఆన్లైన్ గేమింగ్‌కు ఖర్చు చేస్తున్న వ్యక్తుల సంఖ్య అత్యధికంగా 22 శాతం ఉంది.టైర్–1 నగరాల కంటే టైర్–2 నగరాల్లో ఇంటి అద్దెకు సగటున 4.5 శాతం ఎక్కువ ఖర్చు అవుతోంది. టైర్–2 నగరాల్లో నివసించే ప్రజలు వైద్య ఖర్చులకు సగటున రూ.2,450 వెచ్చిస్తున్నారు. మెట్రోలలో ప్రజలు నెలకు సగటున వైద్య ఖర్చులకు రూ.2,048 వెచ్చిస్తున్నారు.తప్పనిసరి ఖర్చులకు, అవసరాలు, అనవసర ఖర్చుల చెల్లింపులకు యూపీఐని ఎక్కువగా వినియోగిస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న వినియోగదారుల దేశంగా భారత్ ఆకర్షిస్తోంది. 2023లో జీడీపీలో ప్రైవేట్ వినియోగం (వస్తు సేవలకు జనం చేసిన ఖర్చు) వాటా 60% నమోదు కావడం ఇందుకు నిదర్శనం. 2031 నాటికి ఏటా 13.4 శాతం వార్షిక సగటు వృద్ధితో దేశ వినియోగ ఆర్థిక వ్యవస్థ రూ.426.4 లక్షల కోట్లను తాకనుందని అంచనాలు ఉన్నాయి. పెరుగుతున్న మధ్యతరగతి, వస్తు సేవల వినియోగం, పట్టణీకరణ, పెరుగుతున్న ఆకాంక్షలు, యువజన జనాభా ఈ వృద్ధిని ముందుకు నడిపిస్తున్నాయి. వేతన జీవుల సంఖ్యలో 2019 నుంచి ఏటా సగటున 9.1 శాతం వృద్ధి నమోదవుతోంది. ఆదాయాల్లో స్థిర వృద్ధి గృహ వినియోగం పెరగడానికి, వస్తు సేవల గిరాకీకి కారణమవుతోంది. అయితే, భారతీయ కుటుంబాలు బ్యాంక్ డిపాజిట్లు, స్టాక్స్, బాండ్స్, లోన్ల వంటి తమ ఆర్థిక ఆస్తులలో క్షీణతను ఎదుర్కొంటున్న సమయంలో ఈ ధోరణి నెలకొనడం గమనార్హం. దేశ జీడీపీలో ఫైనాన్షియల్ అసెట్స్ వాటా 2022లో 7.2 శాతం నుంచి 2023లో 5.1 శాతానికి పడిపోయింది. గత యాభయ్యేళ్లలో ఇదే అత్యల్పస్థాయి అని ఆర్బీఐ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2024 నాటికి పర్సనల్ లోన్స్ 13.7 శాతం వార్షిక వృద్ధితో ఏకంగా రూ.55.3 లక్షల కోట్లకు చేరుకున్నాయంటే జనం ఏ స్థాయిలో ఖర్చు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.డిజిటల్ అక్షరాస్యతవిభిన్న ఫీచర్లతో ఆకట్టుకుంటున్న స్మార్ట్ఫోన్లు, సామాన్యులకు చేరువైన టెలికం సేవలు 82 కోట్ల మంది భారతీయులకు ఇంటర్నెట్ను చేర్చింది. వాస్తవ వినియోగంలో ఉన్న స్మార్ట్ఫోన్ల వాటా మొత్తం జనాభాలో 72% మించిపోయింది. దేశంలో డిజిటల్ అక్షరాస్యత 38 శాతం ఉండగా, పట్టణ ప్రాంతాల్లో ఇది 61 శాతం ఉంది. వెబ్, మొబైల్ అప్లికేషన్లతో సేవలను అందించడం ద్వారా ఆర్థిక సేవల రంగం ఈ ధోరణిని ఉపయోగించుకుంటోంది. ఈ అంశమే వ్యక్తిగత రుణాల పెరుగుదలకు ఆజ్యం పోస్తోంది.ఆదాయాల జోరుదేశవ్యాప్తంగా 2019–24 మధ్య వ్యక్తుల వేతనాలు ఏడాదికి 9.1 శాతం కంటే ఎక్కువ రేటుతో పెరిగింది. వ్యక్తుల ఆదాయంలో ఈ పెరుగుదల వినియోగదారుల వ్యయాల తీరును నిర్ణయించే కీలక అంశాలలో ఒకటి. భారతీయుల తలసరి ఖర్చు చేయదగ్గ ఆదాయం 13.3 శాతం వృద్ధి రేటుతో 2023–24లో రూ.2.14 లక్షలకు పెరిగింది. 2023–24లో స్థూల పొదుపు 30 శాతం తగ్గింది. పొదుపులో తగ్గుదల పెరిగిన వ్యయాలను సూచిస్తుంది. ఉపాధి, ఉద్యోగ భద్రత2017–19 నుంచి 2022–23 మధ్య ఉపాధి రేటు 46.8 శాతం నుంచి 56 శాతానికి పెరిగింది. నిరుద్యోగ రేటు 6 శాతం నుంచి 3.2 శాతానికి తగ్గింది. పెరిగిన ఉపాధి రేటు వ్యక్తుల వినియోగ వ్యయం పెరగడానికి దోహదపడుతోంది.భావోద్వేగ వ్యయంసాధారణంగా వినియోగదారులు సంతోషం, ఒత్తిడి, ఆందోళన మొదలైన మానసిక స్థితి ద్వారా ప్రభావితం అవుతున్నారు. ఇది వారి వ్యయ ప్రవర్తనను ప్రభావితం చేస్తోంది. ఉదాహరణకు చాలామంది కస్టమర్లు తమ మానసిక స్థితిని మెరుగుపరచుకోవడానికి అంటే తమ సంతోషం కోసం ఇష్టమైన బ్రాండ్లు, నచ్చిన ఉత్పత్తులను కొనుగోలు చేసే రిటైల్ థెరపీలో పాల్గొంటున్నారు.సామాజిక ప్రభావంకుటుంబం, సహచరుల ప్రభావం, సామాజిక స్థితి, జీవనశైలి, సాంస్కృతిక ధోరణులు వంటి అనేక సామాజిక అంశాలు కస్టమర్ల ఖర్చు ప్రవర్తనను నిర్ణయిస్తాయి. ఉదాహరణకు తల్లిదండ్రులు చేస్తున్న ఖర్చులు, ఆదా చేసే విధానం వారి పిల్లల వ్యయ ప్రవర్తనపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. అలాగే, తోటివారి ఒత్తిడి యువ వినియోగదారులను వారి సామాజిక స్థితిని కొనసాగించడానికి, మెరుగుపరచడానికి ఖర్చు పెట్టేలా చేస్తోంది. భారతీయ సాంస్కృతిక పద్ధతులు వినియోగదారుల ఖర్చులను ప్రభావితం చేస్తున్నాయి. ఉదాహరణకు 2023 దీపావళి సీజన్లో భారత రిటైల్ మార్కెట్లో రూ.3.75 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి.సాంకేతికతతో వినియోగం దూకుడుటెక్నాలజీ అందుబాటులో ఉండటం, ఈ–కామర్స్ వృద్ధి, ఫిన్ టెక్ పరిష్కారాల పెరుగుదల భారతీయ వినియోగాన్ని దూసుకెళ్లేలా చేస్తున్నాయి. ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్ల విస్తృతితో ఈ–కామర్స్ వృద్ధి వినియోగదారుల షాపింగ్ అనుభవాన్ని విప్లవాత్మకంగా మార్చింది. దేశంలో 2024లో ఈ కామర్స్ ఆధారిత అమ్మకాలు రూ.4,41,700 కోట్లు నమోదయ్యాయి. 2029 నాటికి ఏటా 11.45% వార్షిక వృద్ధితో ఇది రూ.7,59,200 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ప్రభుత్వ విధానాలు, పన్నుల కారణంగా వివిధ ఉత్పత్తుల ధరలు ప్రభావితమవుతున్నాయి. ఆకట్టుకునే ప్రకటనలువినియోగదారుల ఖర్చును వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ప్రభావితం చేయవచ్చు. ఇవి కస్టమర్లను ఆకట్టుకుంటూ, అమ్మకాలను మాత్రమే కాకుండా, బ్రాండ్ విధేయతను కూడా పెంచుతున్నాయి. దేశంలో ప్రకటన ఖర్చులు 2024లో 10.2 శాతం పెరిగి రూ.1,55,386 కోట్లు నమోదయ్యాయి. మార్కెట్ వాటాను పెంచుకోవడానికి, వినియోగదారులను ప్రభావితం చేయడానికి కంపెనీలు చేస్తున్న ప్రయత్నాన్ని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.ఈఎంఐలే తప్పనిసరి..తప్పనిసరి ఖర్చుల్లో గృహ, వాహన, వ్యక్తిగత రుణాలకు చెల్లించే ఈఎంఐలే సింహభాగం ఉంటున్నాయి. రుణ వ్యవస్థ సామాన్యులకు అందుబాటులోకి రావడంతో అప్పులు తీసుకోవడంలో వృద్ధి నమోదవుతోంది. ఆర్బీఐ డేటా ప్రకారం మొత్తం క్రెడిట్లో వ్యక్తిగత రుణాల వాటా 2023లో 30.6 శాతం నుంచి 2024 ఫిబ్రవరిలో 32.6 శాతానికి పెరిగింది. 2023 నాటికి మొత్తం రిటైల్ రుణాలలో గృహరుణాల వాటా ఏకంగా 47.2 శాతానికి చేరింది. ఈఎంఐలు 42 శాతానికి పెరిగాయి. మదుపు చేయడమూ తెలుసుఖర్చులే కాదు మదుపు చేయడమూ జనానికి తెలుసు. షేర్స్, బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్‌ను నిల్వ చేసుకునే డీమ్యాట్ ఖాతాలు దేశవ్యాప్తంగా 2022 ఆగస్ట్ నాటికి 10 కోట్లు. 2025 జనవరి నాటికి ఈ సంఖ్య 18.8 కోట్లకు చేరిందంటే, పెట్టుబడుల పట్ల జనంలో ఆసక్తిపెరుగుతోందని చెప్పవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలో ఉన్న ఆస్తులు (ఏయూఎం), బీమా, పదవీ విరమణ పొదుపులు 2013 నుంచి 2023 వరకు ఏటా 15% పెరిగాయి. బ్యాంక్ డిపాజిట్లు కూడా అదే కాలానికి 9% వార్షిక సగటు వృద్ధి నమోదు చేశాయి.(చదవండి: అంచనాలు నెరవేరకపోయినా..బంధం స్ట్రాంగ్‌గానే ఉండాలి..!) -
హీరోయిన్ నయనతారలాంటి స్టన్నింగ్ లుక్ కోసం..!
తెరపై నవరసాలను అలవోకగా పలికించే నటి నయనతార. అంతటి అభినయాన్ని మ్యాచ్ చేసే ధైర్యం లేక.. ఆమె అందాన్ని మ్యాచ్ చేసే పోటీలో మేమూ నిలబడతామన్న కొన్ని ఫ్యాషన్ బ్రాండ్స్ ఏంటో ఇక్కడ చూద్దాం.. నా ముఖంలో వచ్చిన మార్పులకు చాలామంది ప్లాస్టిక్ సర్జరీ కారణమని అనుకుంటుంటారు. కాని, నాకు తరచు ఐబ్రోస్ చేయించుకోవటం ఇష్టం. అవి గేమ్ చేంజర్ లాంటివి. ఆహారం, బరువులో వచ్చే తేడాలతో పాటు నా డిఫరెంట్ ఐబ్రోస్ స్టయిల్స్ కూడా నా లుక్స్‌ని మారుస్తాయని చెబుతోంది లేడీ సూపర్ స్టార్ నయన తార.అందాల చేతులకు సెలబ్రిటీ టిప్చేతిగాజులు చేతులకే అందాన్ని తెస్తాయి. కాని, అవి సంప్రదాయ దుస్తులకే సెట్ అవుతాయి. జీన్స్, వెస్టర్న్వేర్ దుస్తులకు గాజులు నప్పవు. అలాంటప్పుడు ఈ సింపుల్ సెలబ్రిటీ స్టయిల్ ఫాలో అయితే, మీ చేతులను అందంగా మార్చేయచ్చు. సింపుల్‌గా ఉండే బ్రాస్లెట్తో పాటు మరో రెండు, మూడు రకాల బ్రాస్లెట్స్ను ఒకేసారి ధరిస్తే మీ చేతులకు ఎలిగెంట్, ట్రెండీ లుక్ సొంతం అవుతుంది. ఇలా మీ రెండు చేతులకు లేదా ఒక చేతికి కూడా ధరించొచ్చు. ఈ విధంగా హెవీగా చేతులను స్టయిల్ చేసినప్పుడు మెడను, చెవులను కూడా సింపుల్‌గా స్టయిల్ చేసుకోవాలి. అప్పుడే మీ చేతులు హైలెట్ అయి అందంగా కనిపిస్తారు. ఈ టెక్నిన్నే నటి నయనతార కూడా ఫాలో అయింది. ఈ ఫొటోలు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా జ్యూలరీ షాపింగ్ చేసేటప్పుడు మూడు నాలుగు రకాల బ్రాస్లెట్స్ను కూడా కార్ట్‌లో యాడ్ చేసుకోండి. (చదవండి: విద్యార్థులే రచయితలుగా మాసపత్రిక..!) -
విద్యార్థులే రచయితలుగా మాసపత్రిక..!
పత్రిక నిర్వహణ ఆషామాషీ కాదు. చేయితిరిగిన రచయితలు, పాత్రికేయులు సైతం పత్రికను స్వయంగా నిర్వహించాలంటే, వెనుకాడుతారు. అలాంటిది కొందరు హైస్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయుల సాయంతో మాసపత్రికను తీసుకొస్తున్నారు. ఇప్పటి వరకు ముప్పయిమూడు సంచికలను వారు విజయవంతంగా ప్రచురించారు. ఇటీవల ప్రచురించిన ముప్పయిమూడో సంచికను చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆవిష్కరించారు.లెక్కల మాస్టారి చొరవతో ప్రారంభంవిద్యార్థులు నడుపుతున్న ఈ మాసపత్రిక పేరు ‘మంగళ విద్యావాణి’. మంగళపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేసే గణిత ఉపాధ్యాయుడు, గణిత అవధాని అరుణ్శివప్రసాద్ విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసే ఉద్దేశంతో 2018లో ఈ పత్రికను ప్రారంభించారు. సొంత ఖర్చులతో తొలి సంచికను ప్రచురించారు. తొలి నాలుగు నెలలు 8 పేజీలు, ఆ తరువాత 12 పేజీలు, ప్రస్తుతం 16 పేజీలతో మాసపత్రిక నడుస్తోంది. ప్రత్యేక సందర్భాల్లో 20, 24, 28 పేజీలతో కూడా సంచికను వెలువరించారు. మాసపత్రిక నిర్వహణలో ముఖ్యపాత్ర అరుణ్శివప్రసాద్దే. పత్రిక రూపకల్పన, ఆవిష్కరణ, దాతలను సంప్రదించడం వంటి కార్యక్రమాలను ఆయనే చూసుకుంటున్నారు. పత్రికను 16 పేజీలతో తేవడానికి రూ.4 వేలు ఖర్చవుతోంది. మాసపత్రిక ప్రచురణ ఖర్చులను దాతల నుంచి స్వీకరిస్తుంటారు. ప్రతి నెలా 250 ప్రతులను ముద్రిస్తున్నారు. ఈ పత్రికను పాఠశాలలో రెండువందల మందికి ఉచితంగా అందిస్తున్నారు. మిగిలిన ప్రతులను పరిసర ప్రాంతాలలోని ఉన్నత పాఠశాలలకు అందిస్తున్నారు. సొంత ముద్రణాలయం లేనందున ఇతరుల చేత డీటీపీ చేయించి, జిరాక్స్ చేసి పంపిణీ చేస్తున్నారు. కవర్‌పేజీ కన్నా సెంటర్ పేజీలకు ప్రాధాన్యం కల్పిస్తున్నారు. సెంటర్ పేజీల్లో విద్యార్థులు గీసిన చిత్రాలు, పాఠశాల కార్యక్రమాల ఫొటోలను ప్రచురిస్తున్నారు.ఉపాధ్యాయుల సహకారంపత్రిక ప్రచురణలో విద్యార్థులకు ఉపాధ్యాయులు అన్నివిధాలా సహకరిస్తున్నారు. పత్రికలో ప్రచురించే రచనలకు తగిన అంశాలపై సూచనలు చేయడమే కాకుండా, వాటిలో అక్షరదోషాల సవరణ బాధ్యతలను ఉపాధ్యాయులు చూసుకుంటున్నారు. ప్రత్యేక సందర్భాల గురించి వివిధ మాధ్యమాల ద్వారా అవగాహన చేసుకుని, పూర్తిగా విద్యార్థులే ఈ పత్రికకు రచనలు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఏర్పాటు, మంత్రులు, వారి శాఖలు, శాస్త్రవేత్తల చరిత్రలు, క్రీడలపై కథనాలు, కవితలు వంటి రచనలతో పత్రికను ముచ్చటగా తీసుకొస్తున్నారు. విద్యార్థుల చిత్రలేఖనానికి ప్రత్యేకంగా పేజీని కేటాయించి, ప్రోత్సహిస్తున్నారు. చివరి పేజీలో పరీక్షల్లో ప్రతిభ కనబరచిన విద్యార్థుల ఫొటోలను, వారి వివరాలను ప్రచురిస్తున్నారు.పఠనాసక్తిని పెంపొందించడానికే!: అరుణ్శివప్రసాద్ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతోనే ‘మంగళ విద్యావాణి’ మాసపత్రికను ప్రారంభించాం. విద్యార్థుల్లో రచనాసక్తిని పెంపొందించడం, వారిలోని కళానైపుణ్యాన్ని వెలికి తీయడం, పోటీ తత్త్వాన్ని పెంపొందించడం, పుస్తక పఠనంపై ఆసక్తి పెంచడంతో పాటు విద్యార్థులు భవిష్యత్తులో ఎదుర్కొనే పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు దోహదపడేలా పత్రికను తీసుకొస్తున్నాం. సహకారం అందిస్తున్న దాతలుమంగళపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ద్వారా నడుపుతున్న ‘మంగళ విద్యావాణి’ పత్రిక మొదటి సంచికను వ్యవస్థాపకుడు అరుణ్శివప్రసాద్ సొంత ఖర్చులతో ప్రారంభించారు. తరువాత సహోపాధ్యాయులు, విద్యావంతులు, వ్యాపారవేత్తలు, వివిధ పాఠశాలల యాజమాన్యంతో పాటు ఇతర దాతలు పత్రిక ముద్రణకు సహకరిస్తున్నారు. అమెరికాలో ఉన్న అరుణ్శివప్రసాద్ స్నేహితుడు పార్థసారధి సహకారంతో 18వ మాసపత్రికను 50 వేలతో గణిత సూత్రాలతో ప్రత్యేక సంచికగా విడుదల చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అన్ని పాఠశాలల్లోని విద్యార్థులకు దీనిని ఉచితంగా పంపిణీ చేశారు.మేధావుల ప్రశంసలువిద్యార్థులే రచయితలుగా వ్యవహరిస్తూ మాసపత్రికను నడుపుతున్న మంగళపల్లె ప్రభుత్వ ఉన్నత పాఠశాల రాష్ట్రంలోనే ప్రప్రథమమని పలువురు మేధావులు కొనియాడుతున్నారు. పాఠశాలలో నిర్వహించిన మొదటి వార్షికోత్సవ సంచిక ఆవిష్కరణకు విచ్చేసిన మాజీ ఎమ్మెల్సీ ఎండపల్లె శ్రీనివాసులు, మాసపత్రికను ఆవిష్కరించేందుకు విచ్చేసిన విఠపు బాలసుబ్రమణ్యం ‘మంగళ విద్యావాణి’ మాసపత్రికపై ప్రశంసలు కురిపించారు. అదే విధంగా 25వ సంచికను ఆనాటి కలెక్టర్ సగిలి షన్మోహన్, 27వ సంచికను ప్రస్తుత ఎమ్మెల్యే మురళిమోహన్, ప్రముఖ శతావధాని ఆముదాల మురళి ‘మంగళ విద్యావాణి’ సంచికలను ఆవిష్కరించి విద్యార్థుల ప్రతిభను ప్రశంసించారు. గత ఏడాది ‘హిందీ దివస్’ సందర్భంగా మాసపత్రికను పూర్తిగా హిందీలోనే ప్రచురించడాన్ని అభినందించారు. గత డిసెంబర్లో 28 పేజీలతో భారత గణిత శాస్త్రవేత్తల చరిత్రను గురించి ప్రత్యేక సంచిక వెలువరించడం ప్రశంసనీయమని కొనియాడారు. బాబన్నగారి శివశంకర్, బంగారుపాళెం(చదవండి: వాలుజడతో ఊరికే పేరుతెచ్చారు..! ఆ మహిళలెవరంటే..) -
Sakshi Excellence Awards 2025: సినీ ప్రతిభకు క్లాప్స్
తెలుగు ప్రజల ప్రాథమిక వినోదం సినిమా. ప్రతి శుక్రవారం కొత్త రిలీజుకై ఎదురు చూసే ప్రేక్షకులు తమ ఇష్టాఇష్టాలతో జాతకాలు మారుస్తుంటారు. వీరిని మెప్పించేందుకు హీరో, హీరోయిన్లు, నిర్మాత–దర్శకులు అనుక్షణం కొత్త ఆలోచనలు చేస్తుంటారు. 2023 ఎన్నో ఘనవిజయాలను చూసింది. అలాగే 2024లోనూ తెలుగు సినిమా ఘన విజయాలు చూసింది... ఘనతలు సాధించింది. చంద్రమోహన్ వంటి గొప్ప నటుణ్ణి కోల్పోయింది. అందుకే చంద్రమోహన్‌కు నివాళి అర్పిస్తూ ఈ వేడుకను నిర్వహించింది ‘సాక్షి’. వేయి చిత్రాల్లో నటించిన గొప్ప నటి రమాప్రభకు ‘లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు’ బహూకరించడం తనను తాను గౌరవించుకోవడంగా భావిస్తోంది ‘సాక్షి’. మాతో పాటు మీరూ క్లాప్స్ కొడుతూ వేడుకలోకి రండి.‘సాక్షి’ టీమ్‌కి ధన్యవాదాలు. యాక్చువల్లీ... ఇది నాకు సర్ప్రైజ్. ఈ అవార్డుని అసలు ఊహించలేదు. నేను కాలేజీలో లెక్చరర్‌గా చేస్తూ... జాబ్ వదిలేసి సినిమాల్లోకి వద్దామనుకున్నప్పుడు ... నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించిన నా గురువు రామ్మోహన్రావుగారికి ఈ అవార్డు అంకితం ఇస్తున్నాను. థ్యాంక్యూ... సార్. మీ లవ్ అండ్ సపోర్ట్‌కి. – 2024 ‘తెలుగు పర్సన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకున్న సందర్భంగా దర్శకుడు సుకుమార్∙అవార్డు అందుకుంటున్న సుకుమార్ మా హీరో బన్నీ (అల్లు అర్జున్), నిర్మాతలు నవీన్, రవిగార్లు, దేవిశ్రీ ప్రసాద్‌లతో పాటు నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ ఎంతో సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్. ‘పుష్ప 2’ థ్యాంక్స్ మీట్లో నేను కొందరికి థ్యాంక్స్ చెప్పలేకపోయాను. సెట్స్‌లో నాతోపాటు ఏకధాటిగా పని చేసిన పాండు, ఆర్ట్ అసిస్టెంట్ మధు, నాతోపాటు ఐదేళ్లు వేరే సినిమా చేయకుండా పని చేసిన కూలీ గ్యాంగ్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు. సహ నిర్మాతలు ప్రవీణ్, సతీష్గార్లు, ప్రశాంతిగారికి థ్యాంక్స్. – ‘పుష్ప 2’కి పాపులర్ డైరెక్టర్ అవార్డు అందుకున్న సందర్భంగా సుకుమార్నా సినిమా ప్రయాణం చాలా పెద్దది. నేను ఇండస్ట్రీకి వచ్చి 63 సంవత్సరాలు అయింది. ఈ పెద్ద ప్రయాణంలో ఐదు తరాలతో కలిసి నటించాను. అలాంటి నాకు ఈ జీవిత సాఫల్య పురస్కారం ఇచ్చినందుకు ‘సాక్షి’ యాజమాన్యానికి, భారతీగారికి ధన్యవాదాలు. సరైన సమయంలో... సరైన వయసులో నాకు ఈ అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్యూ భారతమ్మా. – నటి రమాప్రభ‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్’ సందర్భంగా దివంగత చంద్రమోహన్‌గారికి నివాళి అర్పిస్తూ, మా కుటుంబాన్ని ఆహ్వానించినందుకు ‘సాక్షి’ మీడియా గ్రూప్‌కి కృతజ్ఞతలు. నేను, మా పెద్దమ్మాయి మీనా మోహన్, మా చిన్నమ్మాయి డాక్టర్ మాధవి హైదరాబాద్‌లో లేకపోవడం వల్ల వ్యక్తిగతంగా ఈ వేడుకకి హాజరు కాలేకపోయాం. మా తరఫున మా మేనల్లుడు శివలెంక కృష్ణప్రసాద్ ఈ వేడుకలో పాల్గొని, మా అందరి తరఫున కృతజ్ఞతలు చెబుతారు. – జలంధర, చంద్రమోహన్ సతీమణిచంద్రమోహన్గారి రెండో అక్క కొడుకుని నేను. 1978లో ‘సీతామాలక్ష్మి’ సినిమా సమయంలో ఆయన వద్దకు నేను ఉద్యోగం కోసం వెళ్లాను. అప్పుడు ఆయన నా వ్యక్తిగత విషయాలు చూసుకో అన్నారు. అలా మావయ్య వద్ద చేరాను. ‘నిర్మాత కావొద్దు... టెక్నీషియన్‌గా అయినా పర్వాలేదు’ అని కూడా ఆయన అన్నారు. కానీ, నేను మాత్రం నిర్మాతగా నా తొలి సినిమానే మావయ్య, రాజేంద్రప్రసాద్‌లతో ‘చిన్నోడు పెద్దోడు’ తీశా. ఆ తర్వాత బాలకృష్ణగారితో ‘ఆదిత్య 369’తో పాటు నాలుగు సినిమాలు చేశాను. ఈ మధ్య కాలంలో ‘యశోద’ మూవీ తీశాను. చంద్రమోహన్‌గారు 1965లో ఇండస్ట్రీకి రాగా 1966లో మొదటి మూవీ చేశారు. మన తెలుగు వాళ్లే కాకుండా మిగతా భాషల్లో కూడా ఆయనకి అప్రిషియేషన్ ఉండేది. శివాజీ గణేశన్, ఎంజీఆర్గార్లతో పాటు అందరూ ఆయన్ని అభినందించేవారు. 1977–78 నుంచి ఆయన పూర్తి స్థాయిలో హీరోగా మారి దాదాపు 160 సినిమాలు చేశారు. దాదాపు 54 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ ఎన్నో పాత్రలు వేశారు. మావయ్యగారి ‘సుఖ దుఃఖాలు’ మూవీ చూసి, మహానటుడు ఎస్వీ రంగారావుగారు మావయ్యతో ‘బాంధవ్యాలు’ అనే సినిమా నిర్మించారు. చంద్రమోహన్గారిలాంటి మంచి నటుడికి, మంచి వ్యక్తికి మేనల్లుడు కావడం నా అదృష్టం. మావయ్య నటనని, చిత్రసీమకు ఆయన చేసిన సేవలను పురస్కరించుకుని గుర్తింపు ఇచ్చినందుకు ‘సాక్షి’ మేనేజ్మెంట్కి మా కుటుంబం తరఫున కృతజ్ఞతలు. – నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‘పుష్ప 2’ చిత్రానికి ఇది తొలి అవార్డు. ‘సాక్షి’ అవార్డుతోప్రారంభం అయింది. ఇక్కడి నుంచి ఇంకా చాలా అవార్డులు రావాలని, వస్తాయని నమ్ముతున్నాను. పదేళ్ల క్రితం ‘శ్రీమంతుడు’ చిత్రానికి ఇదే వేదికపై ఇదే ‘సాక్షి’ అవార్డుని భారతీగారు తన గోల్డెన్ హ్యాండ్స్‌తో ఇచ్చారు. అప్పటి నుంచి మా ప్రయాణం సినిమా సినిమాకి పెరుగుతూ వస్తోంది. ‘సాక్షి’ మొదటి అవార్డుతో మొదలైన మా ప్రయాణంలో ఇప్పటికి మా మైత్రీ మూవీ మేకర్స్‌కి దాదాపు 50 నుంచి 100 అవార్డులు వివిధ సంస్థల నుంచి వచ్చాయి. అందులో జాతీయ అవార్డు కూడా ఉండటం గొప్పగా భావించే అంశం. థ్యాంక్యూ వెరీ మచ్ టు ‘సాక్షి’. ‘పుష్ప 2’ని బెస్ట్ ఫిల్మ్‌గా ఎంపిక చేసిన జ్యూరీకి కృతజ్ఞతలు. మా హీరో అల్లు అర్జున్‌కి బెస్ట్ యాక్టర్‌గా ‘సాక్షి’ అవార్డు రావడం హ్యాపీగా ఉంది. అల్లు అర్జున్‌గారు ఇక్కడ ఉండి ఉంటే తప్పకుండా వచ్చి అవార్డు తీసుకునేవారు. ఆయన తర్వాతి సినిమా ట్రాన్స్ఫర్మేషన్ కోసం సిద్ధం అవుతుండటం వల్ల రాలేకపోయారు. – నిర్మాత యలమంచిలి రవిశంకర్‘లక్కీ భాస్కర్’లో నా నటనని గుర్తించి ‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డు’ ఇచ్చినందుకు థ్యాంక్స్. ఈ అవార్డు అందుకోవడం గౌరవంగా ఉంది. ఇది నాకు తొలి అవార్డు కావడంతో ఎక్స్ట్రా స్పెషల్. మా నిర్మాతలు చినబాబు, నాగవంశీగార్లకు, సుమతి వంటి మంచి పాత్ర ఇచ్చిన డైరెక్టర్ వెంకీ అట్లూరిగారికి థ్యాంక్స్. ఈ అవార్డు నా జీవితంలో ఓ భాగం. – హీరోయిన్ మీనాక్షీ చౌదరి నాకు ఇది తొలి అవార్డు. ‘క’ సినిమాని నిర్మించిన చింతా గోపాలకృష్ణా రెడ్డిగారికి, నాకు ఇంత మంచి సినిమా ఇచ్చిన దర్శకులు సుజీత్, సందీప్‌లకు ధన్యవాదాలు. ‘క’కి పని చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ థ్యాంక్స్. పీపుల్స్ ఛాయిస్ అవార్డు రావడం ఆనందంగా ఉంది. నన్ను ఆదరించి, సపోర్ట్ చేసిన ప్రేక్షకులందరికీ ఈ అవార్డుని అంకితం ఇస్తున్నాను. నన్ను గుర్తించి అవార్డు ఇచ్చిన ‘సాక్షి’కి కృతజ్ఞతలు. – హీరో కిరణ్ అబ్బవరంమా ‘హను–మాన్’ సినిమానిప్రోత్సహించిన ఆడియన్స్‌కు, ఎఫర్ట్స్ పెట్టిన దర్శకుడు ప్రశాంత్, మమ్మల్ని నమ్మిన నిర్మాత నిరంజన్ రెడ్డిగారికి థ్యాంక్స్. ఇలా అవార్డ్స్‌తో ప్రతిభనుప్రోత్సహిస్తున్నందుకు ‘సాక్షి’ యాజమాన్యానికి థ్యాంక్స్. సుకుమార్‌గారి చేతుల మీదగా అవార్డు అందుకోవడం హ్యాపీ. నేపాల్, చైనా–టిబెట్ బోర్డర్ లొకేషన్స్‌లో మా సినిమా షూటింగ్ జరిపినప్పుడు అక్కడి వారు... ఇది ఏ సినిమా అంటే.. తెలుగు సినిమా అన్నాం. వెంటనే వాళ్లు ‘హో పుష్ప’ అన్నారు. మేం ‘పుష్ప’ టీమ్ కాదు కానీ ‘పుష్ప’ సినిమా తీసిన ల్యాండ్ నుంచి వచ్చాం అని చె΄్పాం. – హీరో తేజ సజ్జా‘క’ సినిమాకు మాకు అవకాశం ఇచ్చిన నిర్మాత గోపాలకృష్ణా రెడ్డిగారు, మమ్మల్ని నమ్మిన కిరణ్ అబ్బవరంగారికి థ్యాంక్స్. ‘సాక్షి’కి చాలా థ్యాంక్స్. ఇది మా ఫస్ట్ అవార్డు. మాకెంతో ప్రత్యేకం. కంటెంట్‌ను నమ్మి సినిమా తీద్దామనుకున్నాం. స్ట్రాంగ్ కంటెంట్ చెబుదామనుకున్నాం... కంటెంట్‌ను నమ్మి చేసినందుకు మమ్మల్ని ఇక్కడివరకు తీసుకొచ్చిన తెలుగు ఆడియన్స్‌కు ధన్యవాదాలు. ఈ అవార్డును వారికి అంకితం ఇద్దామనుకుంటున్నాం. – దర్శకులు సుజిత్ అండ్ సందీప్ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును ఇచ్చిన ‘సాక్షి’కి థ్యాంక్స్. మా అమ్మానాన్నలకు, యూ ట్యూబ్ ద్వారా ఎంతో నేర్పించిన షార్ట్ ఫిల్మ్ మేకర్స్‌కి, ఎలా సినిమా తీయాలో నేర్పించిన ప్రతి దర్శకుడికి ధన్యవాదాలు. ప్రతి డెబ్యూ డైరెక్టర్ పడే కష్టాలన్నీ పడ్డాను. రైట్ స్క్రిప్ట్‌కి, రైట్ ప్రొడ్యూసర్ అవసరం అంటారు. నిహారిక కొణిదెల, ఫణి ఎడపాకగార్ల ద్వారా ఆ అవకాశం దక్కింది. ‘ఇది చిన్న సినిమా (‘కమిటీ కుర్రోళ్లు) కాదు.. ఎంత బడ్జెట్ కావాలో అంత పెడతాం’ అన్నారు. అందుకే ఈ అవార్డు నిహారిక, ఫణిగార్లకు అంకితం. – దర్శకుడు యదు వంశీ‘నాకు ఫస్ట్ క్లాస్‌లో సాంస్కృతిక విభాగంలో బహుమతి ఇచ్చారు. నాకు ఊహ తెలిశాక అది ఫస్ట్ అవార్డు కావడంతో ఇప్పటికీ గుర్తు. ఇప్పుడు నా సినిమా (‘డ్రింకర్ సాయి’)కి హీరోగా ‘సాక్షి’ అవార్డు రావడం హ్యాపీగా ఉంది. ‘సాక్షి’కి థ్యాంక్స్. ఈ అవార్డు జీవితాంతం గుర్తుండిపోతుంది. 2025లో నా తొలి హ్యాపియెస్ట్ మూమెంట్ ఇది. – హీరో ధర్మఇలాంటి అవార్డులు ఇచ్చినప్పుడు సరికొత్త కథలు రావడానికిప్రోత్సాహకంగా ఉంటుంది. దర్శకుడిగా నాకిది (‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’) తొలి సినిమా అయినప్పటికీ చాన్స్ ఇచ్చిన గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద బ్యానర్‌కి థ్యాంక్స్. – డైరెక్టర్ దుష్యంత్ఈ అవార్డు ఇచ్చినందుకు ‘సాక్షి’కి థ్యాంక్స్. ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ని ఆదరించిన ప్రేక్షకులకూ మరోసారి ధన్యవాదాలు. – నిర్మాత ధీరజ్ మొగిలినేనిమా సినిమాకి అవార్డు ఇచ్చినందుకు ‘సాక్షి’కి, భారతీ మేడమ్‌కి ధన్యవాదాలు. – హీరో సుహాస్వ] ూ దర్శక–నిర్మాతలకు, గీతా ఆర్ట్స్‌కి, ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ని సపోర్ట్ చేసిన ఆడియన్స్‌కి థ్యాంక్స్ – హీరోయిన్ ఎన్. శివాని‘హాయ్ నాన్న’ విడుదలై చాలా రోజులు గడిచిపోయాయి. కానీ, ఆ సినిమా గెలుచుకుంటున్న ప్రేమ, అవార్డులు, రివార్డులు... ఇలా కొనసాగుతూనే ఉన్నాయి. మరోసారి ఈ మూవీని సెలబ్రేట్ చేస్తున్నందుకు ‘సాక్షి’కి, జ్యూరీ మెంబర్లకు కృతజ్ఞతలు. మా సినిమాని వివిధ విభాగాల్లో ఎంపిక చేసినందుకు, అలాగే నన్ను బెస్ట్ యాక్టర్‌గా ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు. నేను వేరే దేశంలో ఉండటం వల్ల అవార్డు ఫంక్షన్‌కి రాలేకపోయాను. – హీరో నాని‘హాయ్ నాన్న’ విడుదలై ఏడాదికి పైగా అయినప్పటికీ ఇప్పటికీ ప్రేక్షకులు అదే అభిమానం చూపిస్తుండటం అపురూపమైనది. బెస్ట్ యాక్ట్రస్‌గా ఈ అవార్డు ఇచ్చినందుకు ‘సాక్షి’కి కృతజ్ఞతలు. నేను ఫంక్షన్‌కి రానందుకు క్షమించాలి. నాని, శౌర్యువ్, బేబి కియారా, నిర్మాతలు, సంగీత దర్శకుడు... ఇలా వీరందరూ లేకుంటే ఈ సినిమా ఉండేది కాదు. – హీరోయిన్ మృణాల్ ఠాకూర్‘హాయ్ నాన్న’కి ఈ అవార్డు ఇచ్చిన ‘సాక్షి’కి, భారతీగారికి ధన్యవాదాలు. ఎన్నో అవార్డులు గెలుచుకున్నాం. ఫిల్మ్‌ఫేర్, ఐఫా, సైమా అవార్డులొచ్చాయి. వీటన్నిటికన్నా ఒక తెలుగు అవార్డు (సాక్షి ఎక్సలెన్స్) అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డుని నా నిర్మాతలకి, నటీనటులకి, సాంకేతిక నిపుణులకు అంకితం ఇస్తున్నా... ప్రత్యేకించి నానీగారికి. ఎందుకంటే ఒక కొత్త డైరెక్టర్ని నమ్మి ఇలాంటి ఒక సున్నితమైన కథ, అందులోనూ ‘దసరా’ లాంటి సినిమా తర్వాత ఆయన ‘హాయ్ నాన్న’ని ఒప్పుకుని చేసినందుకు రుణపడి ఉంటాను. – డైరెక్టర్ శౌర్యువ్మా సినిమాకి అవార్డు ఇచ్చిన సాక్షి యాజమాన్యానికి, జ్యూరీ మెంబర్లకు థ్యాంక్స్. ‘బలగం’ అనేది పీపుల్స్ ఛాయిస్ మూవీ. ఈ సినిమా క్రెడిట్ వేణుకి దక్కుతుంది. – నిర్మాత హన్షితా రెడ్డి‘బలగం’ చిత్రానికి పీపుల్స్ ఛాయిస్ విభాగంలో అవార్డు అందించిన ‘సాక్షి’వారికి థ్యాంక్స్. వైఎస్ రాజశేఖర రెడ్డిగారు మా నాన్నకి చాలా క్లోజ్. మా ఆటోమొబైల్ బిజినెస్‌లో ఓ షాప్ ఓపెనింగ్‌ని రాజశేఖర రెడ్డిగారి చేతుల మీదుగా చేయించాలని మా నాన్న మూడు నెలలు వేచి ఉండి, ఆయన చేతుల మీదుగానేప్రారంభింపజేశారు. ఇప్పుడు మేం నిర్మించిన ‘బలగం’కి వాళ్ల సంస్థ (సాక్షి) నుంచి మాకు అవార్డు రావడం, అది కూడా మా ఫస్ట్ మూవీ కావడం హ్యాపీగా ఉంది. – నిర్మాత హర్షిత్ రెడ్డి‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్’ టెన్త్ ఎడిషన్‌లో అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డు మాకో మధురమైన అనుభూతి. ‘బేబీ’ సక్సెస్‌కు కారణమైన నా స్నేహితుడు సాయి రాజేశ్‌కు మరోసారి కృతజ్ఞతలు. – నిర్మాత ఎస్కేఎన్ ‘సాక్షి ఎక్సలెన్స్’ అవార్డు తీసుకోవడం, పైగా బెస్ట్ క్రిటికల్లీ ఎక్లై్లమ్డ్ ఫిల్మ్‌కు తీసుకోవడం అనేది ఇంకా సంతోషం. – దర్శకుడు సాయి రాజేశ్2023 నా లైఫ్‌లో స్పెషల్ ఇయర్. మా ‘బేబీ’ ద్వారా మాకు చాలా లవ్, ఎంకరేజ్మెంట్ దొరికింది. ‘బేబీ’ సినిమా నా లైఫ్‌లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ‘బెస్ట్ డెబ్యూ యాక్ట్రస్’ అవార్డు ఇచ్చిన ‘సాక్షి’కి ధన్యవాదాలు. ఈ అవార్డు తీసుకోవడం చాలా ఎంకరేజింగ్‌గా, మోటివేటివింగ్గా ఉంది. – హీరోయిన్ వైష్ణవీ చైతన్య ‘బలగం’ వంటి ఒక మించి కథని నమ్మి నాకు అన్ని రకాలుగా సహకారం అందించి, నన్ను ముందుకు నడిపించిన ‘దిల్’ రాజు, హన్షిత, హర్షిత్, శిరీష్గార్లకు ధన్యవాదాలు. జీవితాంతం వీళ్లందరికీ రుణపడి ఉంటాను. జీవితాంతం గుర్తుంచుకునే మరపురాని అనుభూతిని ఇచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్... అలాగే వారికి జన్మజన్మలు రుణపడి ఉంటాను. మా ‘బలగం’ విజయం కానీ, ఏ అవార్డు అయినా కానీ మా యూనిట్ అందరికీ దక్కుతుంది. – దర్శకుడు వేణు యెల్దండినన్ను నమ్మిన నిర్మాత నాగవంశీగారికి ఈ అవార్డు (బెస్ట్ డెబ్యూ డైరెక్టర్)ని అంకితం ఇస్తున్నాను. అలాగే మా ‘మ్యాడ్’ ముగ్గురు హీరోలకి, నిర్మాత చినబాబుగారికి, ఎడిటర్ నవీన్ నూలిగార్లకు థ్యాంక్స్. ‘మ్యాడ్ 2’ కూడా రాబోతోంది. టీజర్ కూడా విడుదలైంది. ఈ చిత్రం కూడా తొలి భాగం అంత క్రేజీగా ఉంటుంది. దయచేసి అందరూ చూడండి. ఇది నా మొదటి అవార్డు.. చాలా ప్రత్యేకం. ‘సాక్షి’కి ప్రత్యేక కృతజ్ఞతలు. – డైరెక్టర్ కల్యాణ్ శంకర్ -
Sakshi Excellence Awards 2025: సామాజిక స్ఫూర్తికి సెల్యూట్
సమాజం ఆర్థిక సూత్రాల పై ఆధారపడి నడుస్తున్నట్టు కనిపించినా దానికి హృదయం, స్పందన ఇచ్చేది మాత్రం సామాజిక, సాంస్కృతిక అంశాలే. ‘ఇలా మారాలి’ అని సామాజిక సేనానులు బోధ చేస్తే, ‘ఇలా వికాసం పొందాలి’ అని సాంస్కృతిక సారథులు దారి చూపుతారు. సామాజిక చైతన్యం, సాంస్కృతిక వికాసం లేని సమాజంలో సంపద కేవలం పటాటోపం మాత్రమే. అందుకే అర్థవంతమైన సమాజం కోసం గత పది సంవత్సరాలుగా సాక్షి మీడియా గ్రూప్ ‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్’ నిర్వహిస్తోంది. సామాజిక రంగంలో, కళారంగంలో విశిష్ట రీతిలో పని చేస్తున్న వారికి అవార్డ్స్ ఇచ్చి గౌరవిస్తోంది. ఈ పరంపరలో 2023కు గాను ఫిబ్రవరి 28 శుక్రవారం హైదరాబాద్‌లో ఘనమైన వేడుక నిర్వహించింది. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ వేడుకలో వై.ఎస్.భారతి రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేశారు. సాక్షి మీడియా గ్రూప్ డైరెక్టర్లు, ఎడిటర్, విశిష్ట అతిథులు పాల్గొన్న వేడుక అవార్డు గ్రహీతలకు జీవితకాల అనుభూతిగా మారింది.సమాజంలో ఉన్నటువంటి అనేక మంది సేవకు గుర్తింపు రావడం అంటే సామాన్య విషయం కాదు. వారు ఆయా రంగాల్లో చేసిన సేవను గౌరవించడానికి ఈ అవార్డులు ఇస్తున్నారు. సమాజానికి సేవ చేసిన వారికి ఇలాంటి గౌరవం ఇవ్వడం అభినందనీయం. సాక్షి గ్రూప్‌నకు, ముఖ్యంగా భారతీరెడ్డి గారికి అభినందనలు.– బండారు దత్తాత్రేయ, హరియాణ గవర్నర్సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమంలో భాగస్వామి కావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవార్డుల కార్యక్రమంతో నాకు 10 ఏళ్ల అనుబంధం ఉంది. జ్యూరీలో నన్ను భాగస్వామిని చేసినందుకు కృతజ్ఞతలు. అసామాన్య ప్రతిభ చూపే వారిలో ఉత్తములను ఎంపిక చేయడం కత్తిమీద సాములాంటిది. ఇందుకోసం సాక్షి టీమ్ ఎంతో కష్టపడ్డారు. ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై రీసెర్చ్ చేసి పెద్ద నోట్స్ సిద్ధం చేశారు. మేం ఎలా ముందుకు సాగాలో తెలియజెప్పేందుకు వారు పడిన కష్టం ఎంతో గొప్పది. ఎలాంటి పక్షపాతం లేకుండా అవార్డులకు ఎంపిక చేసే విధానం సాక్షిలో నాకు కనిపించిన గొప్పదనం. అవార్డులు తీసుకున్న వారందరికీ నా అభినందనలు.– శాంతా సిన్హా, జ్యూరీ చైర్పర్సన్మట్టిని పట్టుకున్నా బంగారమే అవుతుందని నిరూపించాడు కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన మావురం మల్లికార్జున్‌రెడ్డి. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేసిన తరువాత వ్యవసాయం మీదున్న ఆసక్తితో తన 12 ఎకరాల భూమికి తోడు మరో 5 ఎకరాలు కౌలుకు తీసుకుని సేంద్రియ వ్యవసాయం ప్రారంభించారు. వరి, అల్లం, మిర్చి సాగు చేస్తూ మరోవైపు దేశీ ఆవులు, కోళ్లు పెంచుతూ సమీకృత వ్యవసాయానికిప్రాచుర్యం కల్పిస్తున్నారు. ఆయనను ‘ఎక్సలెన్స్ ఇన్ ఫార్మింగ్ అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.మావురం మల్లికార్జున్ రెడ్డి, సేంద్రియ వ్యవసాయంభద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ సర్జన్‌గా పని చేస్తున్న హర్షవర్ధన్ ఒక డాక్టర్‌గా విధులు నిర్వహిస్తూనే తన ప్రజా వైద్యశాలలో కేవలం ఒక్క రూపాయి ఫీజుతో కార్పోరేట్ హాస్పిటల్ స్థాయి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఏజెన్సీప్రాంత నిరుపేదలకు ఆయనొక ఆపద్బాంధవుడు. అవసరమైనవారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా సర్జరీలు చేస్తుంటారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్న డాక్టర్ హర్షవర్థ్దన్ ను ‘ఎక్సలెన్స్ ఇన్ హెల్త్ కేర్ అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.హర్షవర్థన్, ఆరోగ్య సంరక్షణచెక్కుచెదరని సంకల్పం ఉంటే సాధ్యం కానిదేమీ లేదు అని నిరూపించారు నెల్లూరుకు చెందిన సుహాస్. ఫార్మసీలో పీహెచ్డీ చేసి 3 లక్షల రూపాయల పెట్టుబడితో చిన్న ఐస్‌క్రీమ్ స్టోర్ప్రారంభించిన సుహాస్ ఇప్పుడు ఏడు రాష్ట్రాల్లో 120కి పైగా స్టోర్లకు విస్తరించారు. 14 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించారు. ఆర్గానిక్ ఐస్‌క్రీమ్ తయారు చేస్తూ ఆదరణ పొందారు. సుహాస్ బి షెట్టిని ‘బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ – స్మాల్ అండ్ మీడియం అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.సుహాస్ బి శెట్టి, చిన్న/మధ్య తరహా వాణిజ్యంవీధి బాలలను చేరదీసి ఆశ్రయం కల్పించి తగిన పౌష్టికాహారం అందించి బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దాలనే సమున్నత ఆశయంతో పని చేస్తోంది రెయిన్ బో హోమ్స్ప్రోగ్రాం సంస్థ్థ. దేశవ్యాప్తంగా పది నగరాల్లో ఇప్పటివరకు 14,996 మంది వీధి బాలలు, 5,557 మంది చిన్నారులు, యువతీ, యువకులకు ఆశ్రయం కల్పించింది. రెయిన్ బో హోమ్స్ ప్రోగ్రామ్ సంస్థను ‘ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.కె. అనురాధ, విద్యారంగంమట్టిని పట్టుకున్నా బంగారమే అవుతుందని నిరూపించాడు కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన మావురం మల్లికార్జున్‌రెడ్డి. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేసిన తరువాత వ్యవసాయం మీదున్న ఆసక్తితో తన 12 ఎకరాల భూమికి తోడు మరో 5 ఎకరాలు కౌలుకు తీసుకుని సేంద్రియ వ్యవసాయంప్రారంభించారు. వరి, అల్లం, మిర్చి సాగు చేస్తూ మరోవైపు దేశీ ఆవులు, కోళ్లు పెంచుతూ సమీకృత వ్యవసాయానికి ప్రాచుర్యం కల్పిస్తున్నారు. ఆయనను ‘ఎక్సలెన్స్ ఇన్ ఫార్మింగ్ అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.మావురం మల్లికార్జున్ రెడ్డి, సేంద్రియ వ్యవసాయంభద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ సర్జన్‌గా పని చేస్తున్న హర్షవర్ధన్ ఒక డాక్టర్‌గా విధులు నిర్వహిస్తూనే తన ప్రజా వైద్యశాలలో కేవలం ఒక్క రూపాయి ఫీజుతో కార్పోరేట్ హాస్పిటల్ స్థాయి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఏజెన్సీప్రాంత నిరుపేదలకు ఆయనొక ఆపద్బాంధవుడు. అవసరమైనవారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా సర్జరీలు చేస్తుంటారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్న డాక్టర్ హర్షవర్థ్దన్ ను ‘ఎక్సలెన్స్ ఇన్ హెల్త్ కేర్ అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.హర్షవర్థన్, ఆరోగ్య సంరక్షణచెక్కుచెదరని సంకల్పం ఉంటే సాధ్యం కానిదేమీ లేదు అని నిరూపించారు నెల్లూరుకు చెందిన సుహాస్. ఫార్మసీలో పీహెచ్డీ చేసి 3 లక్షల రూపాయల పెట్టుబడితో చిన్న ఐస్‌క్రీమ్ స్టోర్ప్రారంభించిన సుహాస్ ఇప్పుడు ఏడు రాష్ట్రాల్లో 120కి పైగా స్టోర్లకు విస్తరించారు. 14 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించారు. ఆర్గానిక్ ఐస్‌క్రీమ్ తయారు చేస్తూ ఆదరణ పొందారు. సుహాస్ బి షెట్టిని ‘బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ – స్మాల్ అండ్ మీడియం అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.సుహాస్ బి శెట్టి, చిన్న/మధ్య తరహా వాణిజ్యంచదరంగంలో ఎత్తుకు పై ఎత్తు వేసి...ప్రత్యర్థిని చిత్తు చేయాలి.. అలాంటి టాలెంట్ పుష్కలంగా ఉన్న అర్జున్ చెస్‌లో అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతున్నారు. హన్మకొండకు చెందిన అర్జున్ గుజరాత్లో జరిగిన జాతీయ చాంపియన్ షిప్లో అండర్ 13 విభాగంలో గోల్డ్ మెడల్ గెలుచుకుని తన విజయయాత్రనుప్రారంభించారు. 2015 ఏషియన్ యూత్ చాంపియన్ షిప్లో రజతం గెలిచి తొలి అంతర్జాతీయ పతకం సొంతం చేసుకున్నారు. 2018లో 14 ఏళ్ల వయసులో గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించి తెలంగాణ నుంచి జీఎం హోదా పొందిన మొదటి ఆటగాడిగా చరిత్ర సృష్టించారు. అర్జున్ ను ‘యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్–స్పోర్ట్స్ అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.అర్జున్ ఎరిగైసి, క్రీడలుఅడవులు అంతరించి పర్యావరణ సంక్షోభం ఏర్పడుతున్న ఈ కాలంలో అడవినే సృష్టించడానికి ముందుకు వచ్చిన వ్యక్తి దుశర్ల సత్యనారాయణ. సూర్యాపేట జిల్లా రాఘవపురంలో 70 ఎకరాల వ్యవసాయ భూమిని అడవిగా మార్చేశారాయన. ఆయన కృషి ఫలితంగా లక్షల చెట్లు ఊపిరి తీసుకుంటూ ఉండగా వాటితో పాటు నెమళ్లు, జింకలు, నక్కలు, అడవి పందులు... నీడ పొందుతున్నాయి. పక్షులు, జంతువుల కోసం ఆ అడవిలోనే ఏడు చెరువులు తవ్వించిన సత్యనారాయణను ‘ఎక్సలెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.దుశర్ల సత్యనారాయణ, పర్యావరణంభద్రాచలంకు చెందిన గొంగడి త్రిష క్రికెట్లో కొత్త తారగా అవతరించింది. ఎనిమిదేళ్ల వయసులో జిల్లాస్థాయి అండర్ 16 జట్టుకు ఆడి ‘ప్లేయర్ ఆఫ్ ద సీరిస్’ గా నిలిచింది. పన్నెండేళ్ల వయసులో హైదరాబాద్ మహిళల క్రికెట్ జట్టుకు ఎంపికైన త్రిష బీసీసీఐ ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు’ను గెలుచుకుంది. ఆల్ రౌండర్‌గా పేరు తెచ్చుకున్న ఈ లెగ్ స్పిన్నర్ ఐసీసీ అండర్–19 మహిళల టి 20 వరల్డ్ కప్–2025లో సెంచరీ చేసి రికార్డులు బ్రేక్ చేసింది. గొంగడి త్రిషను ‘యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్– స్పోర్ట్స్ అవార్డు’తో సత్కరించింది సాక్షి.త్రిష, క్రీడలుఖమ్మం జిల్లా కారేపల్లికి చెందిన మద్దెబోయిన మానస పుట్టుకతోనే అంధురాలు. ఇరుగు పొరుగువారి మాటలకు మానసగాని ఆమె తల్లిదండ్రులుగాని కొంచెం కూడా వెరవలేదు. డిగ్రీ వరకు చదివిన మానస తానెవరికీ తక్కువ కాదు అని పోటీ పరీక్షలపై దృష్టి సారించారు.ఇంటి వద్దనే సొంతంగా ప్రిపరేషన్ మొదలు పెట్టి గ్రూప్–4 ఉద్యోగానికి ఎంపికై తన కలను నెరవేర్చుకున్నారు. ఎందరికో ఆదర్శంగా నిలిచిన మానసను ‘ యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్ ఎడ్యుకేషన్ అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.మద్దెబోయిన మానస, విద్యారంగంవరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన దీప్తికి పుట్టుకతో జన్యుపరమైన బలహీనత ఉంది. అయినా స్కూల్లో తోటి విద్యార్థులతో సమానంగా ఆటల్లో పాల్గొనేది. ఆమె ప్రతిభను గుర్తించిన కోచ్ రమేశ్ పారా అథ్లెట్‌గా ట్రెయినింగ్ ఇచ్చారు. ఇక ఆ తరువాత మొదలైంది పతకాల వేట. 2024లో జపాన్ లో జరిగిన పారా అథ్లెటిక్స్ ప్రపంచ ఛాంపియన్ షిప్లో 400 మీటర్ల టి20 విభాగంలో స్వర్ణ పతకం గెలుచుకోవడమే కాకుండా ప్రపంచ రికార్డును నెలకొల్పారు దీప్తి. దీప్తి జీవాంజిని స్పోర్ట్స్ కేటగిరిలో ‘యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.జీవాంజి దీప్తి, క్రీడలుపెద్ది శంకర్ గౌడ్ ‘రెడీ టు సర్వ్ ఫౌండేషన్’ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి 2011లో వనస్థలిపురంలో ఒక ఓల్డేజ్ హోమ్ప్రారంభించారు. ఏ ఆసరా లేని వృద్ధులకు ఆశ్రయం కల్పించి ఉచిత భోజన, వైద్య సేవలు అందచేస్తోంది ఈ సంస్థ. ప్రముఖ హాస్పిటల్స్ యాజమాన్యాలను ఒప్పించి అక్కడి వైద్యుల చేత వృద్ధులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహిస్తూ అవసరమైన మెడిసిన్స్ ఉచితంగా ఇస్తున్నారు. పెద్ది శంకర్ గౌడ్‌ను ‘యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్ సోషల్ సర్వీస్’ అవార్డుతో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.పెద్ది శంకర్, సామాజిక సేవమద్దినేని ఉమామహేష్.. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు కొల్లగొడుతున్న ఇరవయ్యేళ్ల షూటర్. స్వస్థలం విజయవాడ. బెంగుళూరులో జరిగిన ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో గోల్డు మెడల్ సాధించాడు. 2022లో జర్మనీలో జరిగిన ISSF జూనియర్ వరల్డ్ కప్‌లో, 2024లొ ఢిల్లీలో జరిగిన FISU వాల్డ్ యూనివర్సిటీ ఛాంపియన్ షిప్ మెన్స్ టీమ్ ఈవెంట్లో స్వర్ణ పతకాలు సాధించాడు. ఉమా మహేష్‌ను ‘స్పోర్ట్స్ కేటగిరిలో యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు’తో సత్కరించింది సాక్షి.మద్దినేని ఉమా మహేష్, క్రీడలుఇస్రో మాజీ శాస్త్రవేత్తలైన పవన్ కుమార్ చందన, నాగభరత్ కలిసి 2018లో స్కైరూట్ ఏరోస్పేస్నుప్రారంభించారు. ఇది భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ అంతరిక్ష ప్రయోగాల స్టార్టప్ కంపెనీ. అంతరిక్షాన్ని అందరికీ చేరువ చేయాలనే లక్ష్యంతో విక్రమ్–సిరీస్ ప్రయోగ వాహనాలను అభివృద్ధి చేస్తోంది స్కైరూట్. ఈ కంపెనీలో 350కు పైగా ప్రతిభావంతమైన అంతరిక్ష నిపుణులు పని చేస్తున్నారు. అంతరిక్ష పరిశోధనలను సరళతరం చేస్తున్న స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీని ‘ఎక్సలెన్స్ ఇన్ స్టార్టప్ అవార్డు’తో సత్కరిస్తోంది సాక్షి మీడియా గ్రూప్.పవన్ చందన, నాగ భరత్, స్టార్టప్తలసీమియా... చిన్నారుల పాలిట శాపమైన ఈ వ్యాధికి వైద్యం చేయించలేక తల్లడిల్లుతున్న తల్లిదండ్రులకు అండగా నిలిచారు పొద్దుటూరి అనిత. ఖమ్మంలో ఆర్టీసీలో కండక్టర్‌గా పనిచేస్తూనే తలసీమియాతో బాధపడుతున్న చిన్నారుల కోసం సంకల్ప పేరిట ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. విరివిగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ తలసేమియా గురించి... రక్త దానం ఆవశ్యకత గురించి అవగాహన కల్పిస్తున్నారు. పొద్దుటూరి అనితను ‘ఎక్సలెన్స్ ఇన్ సోషల్ డెవలప్మెంట్ అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.అనితప్రొద్దుటూరి, సామాజిక సేవచంద్రకాంత్ సాగర్ పుట్టుకతోనే 90 శాతం శారీరక లోపంతో జన్మించారు. అయినా ఏనాడూ కుమిలిపోలేదు. వీల్‌చైర్ నుంచే 2019లో ప్రణవ్ ఎంటర్ప్రైజెస్ పేరుతో పరిశ్రమ ఏర్పాటు చేసి పర్యావరణహిత సంచులు, సర్జికల్ మాస్కులు, పెన్నులు, పెన్సిళ్లు తయారు చేస్తూ పది మంది దివ్యాంగులకు ఉపాధి కల్పిస్తున్నారు. ప్రస్తుతం వారి టర్నోవర్ 25 లక్షలు. చంద్రకాంత్ సాగర్ని ‘బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ కేటగిరీ’లో స్పెషల్ జ్యూరీ రికగ్నేషన్ అవార్డుతో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.చంద్రకాంత్ సాగర్, చిన్న/మధ్య తరహా వాణిజ్యండొక్కరి రాజేశ్ గుండె ధైర్యం, త్యాగం దేశాన్నే కాదు తెలుగు వారిని కూడా గర్వపడేలా చేసింది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం చెట్లతాండ్ర గ్రామానికి చెందిన డొక్కరి రాజేశ్ 2018లో ఆర్మీలో చేరి తండ్రి కలను నిజం చేశారు. మూడేళ్లలోనే నాయక్ స్థాయికి ఎదిగారు. సెలవుపై స్వగ్రామానికి వచ్చినప్పుడల్లా పేద విద్యార్థుల చదువు కోసం ఖర్చుపెట్టేవారు. 2024 జూలై 15న జమ్ము కాశ్మీర్‌లోని దోడా జిల్లాలో ఉగ్రవాదులను ఎదుర్కొంటూ వీరమరణం పొందారు. వీర జవాన్ డొక్కరి రాజేశ్‌కు సాక్షి ఎక్సలెన్స్ – పొస్తమస్ అవార్డును ఆయన కుటుంబ సభ్యులకు అందించింది సాక్షి మీడియా గ్రూప్.డొక్కరి రాజేష్ తల్లిదండ్రులు, అమర సైనికుడు→పురస్కార గ్రహీత చంద్రకాంత్‌తో భారతీరెడ్డి ∙‘సాక్షి’ మీడియా గ్రూప్ ప్రతినిధులతో ముఖ్య అతిథి బండారు దత్తాత్రేయడొక్కరి రాజేష్ తల్లిదండ్రులకు పురస్కారం అందిస్తూ... -
లండన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
బిందువు బిందువు కలిస్తేనే సింధువు అనే విధంగా యూకే లో నివసిస్తున్న తెలుగు మహిళలు అందరూ “తెలుగు లేడీస్ యుకె” అనే ఫేస్బుక్ గ్రూప్ ద్వారా కలుసుకుని అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు జరుపుకున్నారు సహాయం కోరే వారికి మరియు సహాయం అందించే వారికి వారధిగా నిలిచే తెలుగు లేడీస్ ఇన్ యుకె గ్రూపును శ్రీదేవి మీనా వల్లి 14 ఏళ్ల క్రితం స్థాపించారు. ఈ గ్రూపులో ప్రస్తుతం ఐదు వేలకు పైగా తెలుగు మహిళలు ఉన్నారు.యూకే కి వచ్చినా తెలుగు ఆడపడుచులను ఆదరించి వారికి తగిన సూచనలు సలహాలు ఇస్తూ విద్యా వైద్య ఉద్యోగ విషయాల్లో సహాయం అందించడమే గ్రూప్ ఆశయమని శ్రీదేవి గారు తెలియజెప్పారు. ఈ సంవత్సరం యూకేలోని పలు ప్రాంతాల నుండి 300కు పైగా తెలుగు మహిళలు పాల్గొని ఆటపాటలతో ,లైవ్ తెలుగు బ్యాండ్ తో, పసందైన తెలుగు భోజనంతో పాటు,చారిటీ రాఫెల్ నిర్వహించి అవసరంలో ఉన్న మహిళలకు ఆసరాగా నిలిచారు.మస్తీ ఏ కాదు మానవత్వం లో కూడా ముందు ఉన్నాము అని నిరూపించారు.ఈవెంట్ లో డాక్టర్ వాణి శివ కుమార్ గారు మహిళలకు సెల్ఫ్ కేర్ గురించి ఎన్నో మంచి సూచనలు ఇచ్చారు. ఈవెంట్ కి వచ్చిన వాళ్లందరికీ మనసు నిండా సంతోషంతో పాటు మన తెలుగుతనాన్ని చాటిచెప్పేలా గాజులు,పూతరేకులు, కాజాలు వంటి పసందైన రుచులతో తాంబూలాలు పంచిపెట్టారు. ఈ ఈవెంట్లో శ్రీదేవి మీనావల్లితో పాటు సువర్చల మాదిరెడ్డి ,స్వాతి డోలా,జ్యోతి సిరపు,స్వరూప పంతంగి ,శిరీష టాటా ,దీప్తి నాగేంద్ర , లక్ష్మి చిరుమామిళ్ల , సవిత గుంటుపల్లి, చరణి తదితరులు పాల్గొన్నారు. -
పెళ్లికూతురు డ్యాన్స్, నోట్ల వర్షం: చివరికి ఏమైందంటే..!
భారతీయ వివాహ వేడుకల్లో ఆడంబరాలు, విలాసాలకు, సంప్రదాయాలకు కొదవూ ఉండదు. అలాగే వధూవరులు ఆనందంతో నృత్యం చేయడం చాలాకామన్. ట్రెండింగ్‌లో ఉండే పాటలకు డ్యాన్స్‌లు చేస్తూ సోషల్‌మీడియాను షేక్ చేసిన ఉదంతాలు గతంలో చాలా చూశాం. కానీ వీటన్నింటికీ భిన్నంగా వధువు వార్తల్లో నిలిచింది. ఆమె చర్యకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. స్టోరీ ఏమిటంటే..డిజైనర్ దుస్తులు, విలువైన ఆభరణాలతో అందంగా ముస్తాబైన వధువు తన పెళ్లిలో డ్యాన్స్ చేస్తోంది. జరీ వర్క్చేసిన ఎరుపు రంగు లెహంగా, దుప్పట్టా, హారాలు, సరిపోయే చెవిపోగులు, చూడమణితో చూడముచ్చటగా ఉన్న ఆమెను అందరూ ఉత్సాహపరుస్తున్నారు. ఇంతలో కొంతమంది అతిథులు ఆమెపై నోట్ల వర్షం కురిపించడం ప్రారంభించారు. దీంతో ఆమె వెంటనే ఆగిపోయింది. అంతేకాదు ఆమె ముఖం చిన్నబుచ్చుకుంది. నృత్యం చేయడం ఆపి, గౌరవంగా తల వంచుకుని, నిశ్శబ్దంగా పక్కకు వెళ్ళిపోయింది. ఇదే అందర్నీ ఆశ్చర్యపర్చింది. నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. View this post on Instagram A post shared by SR Cinematic (@sr_cinematicc) అటువంటి సంప్రదాయాలకు వ్యతిరేకంగా నిలబడినందుకు నెటిజన్లు ఆమెను ప్రశంసించారు. ఇది చాలాచోట్ల సాధారణమైనప్పటికీ, ఆధునిక యుగంలో ఇలాంటి వాటి గురించి పునరాలోచించాలని ఒకరు, "చాలా అందంగా.. తన సంతోషంగా నృత్యం చేస్తోంది....ఆమె ఇతరులను సంతోష పెట్టడం కోసం కాదు, తనకోసం ఆనందంగా నృత్యం చేస్తోంది. వాళ్ కానీ డబ్బులు విసరడం ఎందుకు, అందుకే ఆమె ఆపేసింది అని మరొకరు రాశారు. 'అత్యంత అందమైన వధువు' అని మరికొందరు, ఈ రోజుల్లో కూడా ఇలాంటి ఆచారాలా? ప్రశ్నించారు.మరోవైపు మరికొందరు వధువు తన వివాహంలో నృత్యం చేసినందుకు ఆమెను విమర్శించారు కూడా. వివాహ మర్యాదలు, ఆచారాల చుట్టూ చర్చకు దారితీసిందీ ఘటన.చదవండి: International Women's Day 2025 : యాక్సలరేట్ యాక్షన్ అంటే? మాటలేనా! -
లేడీస్ బ్యాంక్ ఎక్కడుందో తెలుసా?
సనత్‌నగర్: ఇంటిని అందంగా తీర్చిదిద్దడమే కాదు.. కుటుంబాన్ని నడిపించడంలోనూ మహిళల పాత్ర ఎనలేనిది. ఓ వైపు ఇంటి బాధ్యతలను నెరవేరుస్తూ.. మరోవైపు ఉద్యోగ విధులను బాధ్యతాయుతంగా చేపడుతున్న మహిళలు కోకొల్లలు. అయితే అందరి ఆర్థిక అవసరాలు తీర్చే బ్యాంకింగ్ రంగంలోనూ మహిళలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే నగరంలోని సుందర్‌నగర్ బ్రాంచ్‌లో మాత్రం నూటికి నూరు శాతం మహిళా ఉద్యోగులే ఖాతాదారులకు సేవలందిస్తున్నారు. క్యాషియర్ దగ్గర నుంచి మేనేజర్ వరకూ అందరూ మహిళామణులే విధులు నిర్వహిస్తుండడంతో దీనికి లేడీస్ బ్యాంక్‌గా ముద్ర పడింది. చదవండి: International Women's Day 2025 : యాక్సలరేట్ యాక్షన్ అంటే? మాటలేనా!2023 డిసెంబర్లో మేనేజర్‌గా సునీత బాధ్యతలు స్వీకరించిన అనంతరం అన్ని పోస్టుల్లోనూ మహిళలే భర్తీ అయ్యారు. ప్రస్తుతం ఈ బ్యాంకులో రమ్య, శృతి, సృజన, లక్ష్మీ, జ్యోతిర్మయి, ధీరజ తదితర మహిళా ఉద్యోగులు వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తూ.. ఖాతాదారులకు ఎంతో ఓపిగ్గా సేవలందిస్తున్నారు. -
‘మూల సంత’ సూర్యకళ : మహిమాన్వితం
మనం జీవించి ఉన్నాం, జీవిస్తున్నాం.. అంటే అనుక్షణం ప్రకృతి నుంచి తీసుకుంటూనే ఉన్నామని అర్థం. మనం తీసుకున్నంత తిరిగి ఇవ్వాలని ప్రకృతి కోరుకోదు. విధ్వంసం చేయకపోతే చాలనుకుంటుంది. ప్రకృతి తనను తాను స్వస్థత పరుచుకుంటుంది. కానీ ఆ సమయం కూడా ఇవ్వనంత వేగంగా కాలుష్యభరితం చేస్తున్నాం. ప్రకృతిని పరిరక్షిస్తూ సాగిన మన భారతీయ జీవనశైలిని మర్చిపోయాం. మనం మరిచిపోయిన ఆరోగ్యకరమైన జీవనశైలిని గుర్తు చేయాలి, ఆచరణలోకి తెచ్చే వరకూ చైతన్యవంతం చేస్తూనే ఉండాలనే ఉద్దేశంతో పదిహేనేళ్లుగా గ్రీన్ వారియర్‌గా మారారు సూర్యకళ మోటూరి. జీవనశైలి మార్పు ఇంటి నుంచే మొదలవ్వాలని, అది మహిళ నుంచే ప్రారంభం కావాలని, అందుకోసం ఆమె మహిళలను చైతన్యవంతం చేయడానికి పూనుకున్నారు. గ్రామభారతి అధ్యక్షబాధ్యతలు నిర్వర్తిస్తున్న ఏకైక మహిళ సూర్యకళ మహిళాదినోత్సవం సందర్భంగా సాక్షితో పంచుకున్న వివరాలివి. – సాక్షి, సిటీబ్యూరోహైదరాబాద్‌లో పుట్టి పెరిగిన సూర్యకళ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో పీజీ చేసి నగరంలోని ఓ ఎమ్ఎన్సీలో ఉద్యోగం చేస్తున్నారు. జాతీయోధ్యమ నాయకుల జీవితగాథలను చదివినప్పుడు ఆ కాలంలో పుట్టనందుకు ఆవేదన చెందేవారామె. రాజీవ్ దీక్షిత్ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు.. ‘దేశం కోసం పని చేయడానికి ఎప్పుడూ ఏదో ఒక సామాజిక అవసరం ఉండనే ఉంటుంది. దానిని తెలుసుకుని పని చేయాలి’ అనే ఆలోచన రేకెత్తింది. సుభాష్ పాలేకర్ శిక్షణలో వాలంటీర్‌గా పని చేసినప్పుడు జరిగిన సంఘటన ఆమెను ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు మళ్లించింది. అక్కడికి వచ్చిన ఒక మహిళారైతు ఇచ్చిన కందిపప్పును ఇంటికి తెచ్చుకుని వండుకున్నారు. ఆ రుచి అమృతంలా అనిపించిందన్నారు సూర్యకళ. ప్రతి ఒక్కరూ అలాంటి ఆహారాన్ని తినాలని కోరుకున్నారు. సేంద్రియ వ్యవసాయం, నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ విభాగాల్లో పని చేయసాగారు. ‘శిక్షణా తరగతులు నిర్వహించి సేంద్రియ వ్యవసాయంపై ‘మా గ్రామభారతి స్వచ్ఛంద సంస్థ’ విజయవంతమైంది. కానీ ఆ ఉత్పత్తులకు మార్కెట్ లేకపోతే ఆ రైతు నిలదొక్కుకునేదెలా అనే ప్రశ్నకు సమాధానంగా ఒక వేదికను రూపొందించాను. ఆర్గానిక్ ఫుడ్ విషయంలో అవగాహన కల్పించడంలో మీడియా చాలా బాగా పని చేస్తోంది. చైతన్యం వచ్చింది కానీ ఉత్పత్తులు అందుబాటులో లేవు. దాంతో ‘మూలసంత’ పేరుతో వాటిని నగరానికి తీసుకొచ్చే బాధ్యత చేపట్టాను. కార్పొరేట్ కంపెనీల్లో మూలసంతలు పెడుతున్నాం. ఇటీవల ఇన్ఫోసిస్‌లో 30 స్టాళ్లతో సంత పెట్టాం. మహిళలను సంఘటిత పరిచి ఆర్గానిక్ ఉత్పత్తులను వారి వంటింటి వరకూ తీసుకెళ్లేలా చేయగలిగాం. నీటి వృథాను అరికట్టడం వంటి విషయాల్లో ఆలోచన రేకెత్తించడం నుంచి పెళ్లి, ఇతర వేడుకల్లో పర్యావరణ హితమైన వేదికల ఏర్పాటు వరకూ కృషి చేశాం. పదిహేనేళ్ల నా ప్రస్థానంలో ఏమి సాధించానని చూసుకుంటే మన వేడుకలు కనిపిస్తాయి. ఆహ్వాన పత్రికల, రిటర్న్ గిఫ్ట్‌లు, భోజనం వడ్డించే ప్లేట్ల వరకూ ప్రతిదీ బయో డీగ్రేడబుల్ థీమ్‌ని అనుసరిస్తున్నారు. మా ప్రయత్నం ఏ మాత్రం వృథా కాలేదు. ఒక మంచి బాట వేయగలిగాం’ అన్నారు సూర్యకళ. చదవండి: International Women's Day 2025 : యాక్సలరేట్ యాక్షన్ అంటే? మాటలేనా!చోదకశక్తి మనమే! ఇంటిని నడిపేది మహిళే. ఇంట్లోకి వచ్చే ఏ వస్తువూ ప్రకృతికి హానికలిగించేదిగా ఉండకూడదు.. అనే నియమాన్ని మహిళలు పాటిస్తే చాలు. ప్రకృతిని కాపాడుకోడం కోసం మేము వేదికల మీద మాట్లాడితే ఆ ప్రయత్నం చైతన్యవంతం వరకే పరిమితం. ఆచరణ ఇంటి నుంచే మొదలు కావాలి, అది మహిళతోనే మొదలు కావాలి. అందుకే సమాజహితమైన ఏ పని అయినా మహిళల నుంచి మొదలైతే అది విజయవంతమవుతుంది. మన పిల్లల భవిష్యత్తు కోసం నిధులు, పొలాలు సమకూరుస్తుంటాం. అంతకంటే ముఖ్యమైన పని పిల్లలకు ఆరోగ్యకరమైన భూమిని అందించడం. మహిని రక్షించే మహిమాని్వతమైన శక్తి మహిళకే ఉంది. మహిళలుగా మనం చేయాల్సిన సమాజసేవ, దేశసేవ ఇది. – సూర్యకళ మోటూరి, గ్రీన్ వారియర్, అధ్యక్షురాలు, గ్రామభారతి -
Trekker Sindhu: తనయ నడిచే.. తండ్రిని గెలిపించే!
ఆధునిక మహిళల విజయాలు వ్యక్తిగతానికి మాత్రమే పరిమితం కావడం లేదు. తమ పిల్లల నుంచి పేరెంట్స్ వరకూ సక్సెస్ ఫుల్ అనిపించుకునేలా కూడా చేస్తున్నాయి. అలాంటి ఓ యువతి.. కృష్ణా రామా అనుకుంటూ కూర్చోవాలి అని సమాజం నిర్దేశించిన వయసులో ఉన్న తండ్రిని యువకులతో సమానంగా ట్రెక్కింగ్‌లో రాణించేలా తీర్చిదిద్దింది. సాక్షి, సిటీబ్యూరో రిటైర్మెంట్ తర్వాత శ్రమ పడకూడదని తల్లిదండ్రులను ఇంటి దగ్గరే ఉంచి ఇల్లు, నౌకర్లు, కారు వగైరా సౌకర్యాలన్నీ అమర్చి జాగ్రత్తగా చూసుకునే కూతుళ్లు, కొడుకులను చూసి ఉంటాం. కానీ 60 ఏళ్ల వయసులో తండ్రిని కొండలు, గుట్టలు ఎక్కించి వేల కిలోమీటర్లు తనతోపాటు నడిపించిన కూతుర్ని చూశామా? అంటే.. ‘మా అమ్మాయే నా చేత తొలి అడుగులు వేయించింది..’ అంటూ సంతోషంగా చెబుతారు ఆమె తండ్రి ఏబీఆర్పీ రెడ్డి. కొండాపూర్‌లో నివసించే సింధు రెగ్యులర్‌గా కొండలు, గుట్టలు ఎక్కేసే సిటీ ట్రెక్కింగ్ లవర్స్‌లో ఒకరు. వ్యాపార వ్యవహారాల నుంచి విశ్రాంతికి షిఫ్ట్ అయిన వెంటనే తన ట్రెక్కింగ్ హాబీని తండ్రికి వారసత్వంగా అందించారు. తద్వారా ఓ మంచి ట్రెక్కర్‌గా మారేందుకు మాత్రమే కాదు 73 ఏళ్ల వయసులో రికార్డ్స్ సృష్టించేందుకు కూడా దోహదపడ్డారు. మార్కెటింగ్ రంగంలో ఉన్న సింధు ఇప్పటి వరకూ ఎనిమిది చెప్పుకోదగ్గ సాహసవంతమైన ట్రెక్స్ని పూర్తి చేశారు. సింధు ఇటు ఆటలు, అటు సాహసాలతో ఆత్మ సంతృప్తికే ప్రాధాన్యత ఇస్తూ.. విలాసాల వెనుక పరుగులు తీసేవారికి ఓ గుణపాఠంలా నిలుస్తున్నారు. ‘వయసు అనేది ఒక నెంబర్ మాత్రమే అంతా మైండ్‌సెట్‌లోనే ఉంది అని నేను నమ్ముతాను’ అంటారు సింధు. అందుకే అరవైలో ఉన్న తండ్రిని సైతం తనతో పాటు సాహస యాత్రలవైపు నడిపించారు. చదవండి: International Women's Day 2025 : యాక్సలరేట్ యాక్షన్ అంటే? మాటలేనా!‘నాన్న మొదటి నుంచీ చాలా ఫిట్‌గా ఉంటారు. బిజినెస్ నుంచి ఫ్రీ కాగానే జిమ్‌లో చేరడమే కాకుండా నాతో పాటు ట్రెక్కి రమ్మని ప్రోత్సహించాను’ అంటూ గుర్తు చేసుకున్నారు.. తాను 23 ఏళ్ల వయసులో ట్రెక్కింగ్ ప్రారంభించిన సింధు.. రన్నింగ్, సైక్లింగ్ ఇలా ప్రతి హాబీనీ తండ్రితో కలిసి పంచుకున్నారు. ‘నాన్నకు చిన్నప్పుడు సాహస యాత్రలు చేసే అలవాటు ఉండేది, అయితే వర్క్‌లో పడిపోయాక దాన్ని మరచిపోయారు. నేను దానిని మళ్లీ గుర్తు చేశా అంతే’ అంటూ చెప్పారామె. గత డిసెంబర్లో తన తండ్రితో కలిసి చేసిన ట్రెక్.. ఎప్పటికీ మరచిపోలేనిదని అంటారామె. అప్పటి వరకూ ఒక్కసారి కూడా ట్రెక్కింగ్ అనుభవం లేని తండ్రి తొలిసారే ఉత్తరాఖండ్‌లో 12వేల కిమీ అధిరోహించి రికార్డ్ సృష్టించారు. అయితే నాన్న ఫిట్నెస్ గురించి నాకు తెలుసు. అలాగే ఎప్పుడైతే మా అడ్వెంచర్ గ్రూప్‌లో జాయిన్ చేశానో.. దాని నుంచి నాన్న కూడా బాగా ఇన్స్పైర్ అయ్యారు.’ అంటూ వివరించారామె.మైండ్‌సెట్‌లోనే అంతా ఉంది.‘వయసు అనేది ఒక నెంబర్ మాత్రమే అంతా మైండ్‌సెట్‌లోనే ఉంది అని నేను నమ్ముతాను’ అంటారు సింధు. అందుకే అరవైలో ఉన్న తండ్రిని సైతం తనతో పాటు సాహస యాత్రలవైపు నడిపించారు. ‘నాన్న మొదటి నుంచీ చాలా ఫిట్‌గా ఉంటారు. బిజినెస్ నుంచి ఫ్రీ కాగానే జిమ్‌లో చేరడమే కాకుండా నాతో పాటు ట్రెక్కి రమ్మని ప్రోత్సహించాను’ అంటూ గుర్తు చేసుకున్నారు.. తాను 23 ఏళ్ల వయసులో ట్రెక్కింగ్ ప్రారంభించిన సింధు.. రన్నింగ్, సైక్లింగ్ ఇలా ప్రతి హాబీనీ తండ్రితో కలిసి పంచుకున్నారు. ‘నాన్నకు చిన్నప్పుడు సాహస యాత్రలు చేసే అలవాటు ఉండేది, అయితే వర్క్‌లో పడిపోయాక దాన్ని మరచిపోయారు. నేను దానిని మళ్లీ గుర్తు చేశా అంతే’ అంటూ చెప్పారామె. గత డిసెంబర్లో తన తండ్రితో కలిసి చేసిన ట్రెక్.. ఎప్పటికీ మరచిపోలేనిదని అంటారామె. అప్పటి వరకూ ఒక్కసారి కూడా ట్రెక్కింగ్ అనుభవం లేని తండ్రి తొలిసారే ఉత్తరాఖండ్‌లో 12వేల కిమీ అధిరోహించి రికార్డ్ సృష్టించారు. అయితే నాన్న ఫిట్నెస్ గురించి నాకు తెలుసు. అలాగే ఎప్పుడైతే మా అడ్వెంచర్ గ్రూప్‌లో జాయిన్ చేశానో.. దాని నుంచి నాన్న కూడా బాగా ఇన్స్పైర్ అయ్యారు.’ అంటూ వివరించారామె. -
సమానత్వం,సాధికారతకోసం కలిసి పనిచేద్దాం : అపోలో సునీతా రెడ్డి
అపోలో హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సునీతా రెడ్డి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్బంగా అపోలో హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సునీతా రెడ్డి మహిళలకు శుభాకాంక్షలు అందించారు. 1995 బీజింగ్ డిక్లరేషన్ , ప్లాట్‌ఫామ్ ఫర్ యాక్షన్ నుండి ప్రపంచవ్యాప్తంగా మహిళా హక్కులను ముందుకు తీసుకెళ్లడంలో సాధించిన పురోగతిని గుర్తించాలన్నా ఈ సందర్బంగా పేర్కొన్నారు. అయితే, ఎక్కువ మంది బాలికలు పాఠశాలలో చదువుతున్నప్పటికీ మరియు కీలకమైన సేవలను పొందుతున్నప్పటికీ, పురోగతి సమానంగా లేదనీ, గణనీయమైన సవాళ్లు ఇంకా కొనసాగుతు న్నాయని గుర్తు చేశారు. ముఖ్యంగా అట్టడుగు వర్గాలలోని బాలికలకు, కొన్ని సంఘర్షణ ప్రాంతాలకు , వాతావరణ సంక్షోభం,మహమ్మారి ద్వారా ప్రభావితమైన బాలికలకు చేరడం లేదన్నారు.‘మన సమిష్టి బలాన్ని పెంపొందించుకుంటూ, మహిళలు, బాలికలు తమ పూర్తి సామర్థ్యాన్ని సాధించకుండా అడ్డుకునేవ్యవస్థాగత అడ్డంకులను తొలగించుకునేందుకు, నిజంగాసమానమైన, సమ్మిళిత వాతావరణాలను సృష్టించడానికి మనం కలిసి పనిచేయాలి. తరువాతి తరానికి సాధికారత కల్పించడం చాలా ముఖ్యం. శాశ్వత మార్పుకు ఉత్ప్రేరకాలు , భవిష్యత్తును నడిపించడానికి రూపొందించడానికి హక్కులు, వనరులు మరియు అవకాశాలతో వారి సన్నద్ధం కావాలి’’ అన్నారామె.మహిళల హక్కులు మరియు లింగ సమానత్వాన్ని ప్రోత్సహించే చొరవలలో వ్యూహాత్మక పెట్టుబడులు ఏ బాలికను వదిలి వెళ్ళకుండా చూసుకోవడంలో సహాయపడతాయి.తమ స్వాభావిక ప్రభావ మూలధనాన్ని ఉపయోగించుకోని, రాబోయే తరాలకు సాధికారత , సమానత్వం యొక్క వారసత్వాన్నిఅందించాలని ఆమె మహిళా నాయకులను కోరారు.. అందరికీ న్యాయమైన సమానమైన ప్రపంచాన్ని నిర్మించేక్రమంలో మహిళలు, బాలికలందరికీ 'హక్కులు, సమానత్వం, సాధికారత'ను స్పష్టమైన వాస్తవికతగా మార్చేలా కలిసి పనిచేద్దామని ఆమె పిలుపునిచ్చారు. చదవండి: International Women's Day 2025 : యాక్సలరేట్ యాక్షన్ అంటే? మాటలేనా! -
మహిళలూ ఒక్క అరగంట మీ కోసం : నీతా అంబానీ సందేశం వైరల్ వీడియో
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ (Nita Ambani) మహిళల కోసం ఓ ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ సతీమణి నీతా ఫిట్నెస్ గురించి, ఆమె ష్యాషన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆరు పదుల నిండిన వయసులో కూడా అనేక కార్యక్రమాలతో చాలా చురుగ్గా నిర్మాణాత్మకంగా ఉంటారు ఇదే విషయాన్ని గుర్తుచేస్తూ మార్చి 8న నీతా అంబానీ మహిళల కోసం ఒక వీడియోను షర్ చేశారు. ఫిట్నెస్ రొటీన్లో క్రమశిక్షణ, అభిరుచిరెండింటినీ మిళితం చేయాలని సూచించారు. అన్ని వయసుల మహిళలు తమ ఆరోగ్యం , శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వ్యాయామం మనలో సానుకూల ధోరణిని పెంచుతుంది,మనసుకు ప్రశాతంనిస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట సందడిగా మారింది. తాను ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు, ఎలాంటి వ్యాయామం చేస్తారో, తన జీవన శైలి వివరాలను పంచుకున్నారు. అలాగే మహిళలు తమ ఆరోగ్యం, శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వాలని నీతా అంబానీ సూచించారు. ప్రస్తుతం తన వయసు 61 ఏళ్లని.. ఆరేళ్ల వయస్సునుంచి డ్యాన్స్ ప్రాక్టీస్, వ్యాయాం చేస్తూ ఇప్పటికీ ఎంతో ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తన ఫిట్నెస్ దినచర్య గురించి కూడా వివరించారు. రోజూ 30 నిమిషాల పాటూ ఫిట్నెస్ కోసం కేటాయిస్తానని, వాకింగ్, జిమ్, స్విమ్మింగ్ చేస్తానని తెలిపారు. చురుగ్గా ఉండటం చక్కెర, చక్కెర ప్రత్యామ్నాయ పదార్థాలను కూడా తీసుకోనని వెల్లడించారు. రోజుకి 5-7వేల అడుగులు నడవడంతోపాటు శాఖాహారంమాత్రమే తీసుకుంటూ, సరైన మోతాదులో ప్రోటీన్, పోషకాలు ఉండేలా జాగ్రత్తపడతానని చెప్పారు.ముఖ్యంగా అంతేకాదు మహిళలు తమను తాము జాగ్రత్తగా చూసుకోవడానికి, దీనికి సంబంధించిన చర్యను ప్రారంభించడానికి సమయం మించిపోలేదని గుర్తు చేశారు. ముఖ్యంగా 30 ఏళ్ల తర్వాత మహిళలు తమను తాము జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరమన్నారు. కండరాలు బలహీనపడతాయి. ఎముకల బలం తగ్గుతుంది. అందుకే మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. ఒక్క అరగంట : నీతా అంబానీ ఫిట్నెస్ మంత్రా వైరల్ వీడియో ‘‘61 ఏళ్లలో నేనుచేయగిలిగనపుడు.. మీరెందు చేయలేరు.. కదలండి! ఒక్క అరగంట మీకోసం కేటాయించుకోండి!!’’ అంటూ నీతా అంబానీ మహిళలకు పిలుపునిచ్చారు. -
women's day 2025 అవగాహన ఉంటే అద్భుతాలు సృష్టించవచ్చు!
‘అన్నం ముద్దను మన నోటికి చేర్చే రైతు కష్టానికిఅవగాహన, సాంకేతికత, ఆర్థిక వెన్నుదన్ను అందిస్తేవ్యవసాయ రంగంలో అద్భుతాలు సృష్టించవచ్చు’ అంటున్నారు డాక్టర్ నీరజా ప్రభాకర్. శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్శిటీకి ఫస్ట్ ఉమన్ వైస్ ఛాన్సలర్‌గా చేసి, అగ్రికల్చర్యూనివర్శిటీలో హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి హెడ్‌గా, సీనియర్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. 42 ఏళ్లుగా ఈ రంగంలో చేస్తున్న కృషిని, చోటు చేసుకుంటున్న మార్పులను, నేటి తరం ఆలోచనలనూ మన ముందు ఆవిష్కరించారు. ‘‘రైతు నేలలో విత్తనాలు వేసిన రోజు నుంచి నీటి సదు΄ాయాలు, భూసారం, వాతావరణం, తెగుళ్లు.. అన్నింటినీ దాటుకొని రైతు కష్టం మన చేతికి వచ్చేవరకు ఏయే దశలు దాటుతుంది అనే విషయాల పట్ల అందరికీ అవగాహన ఉండాలి. అప్పుడే ఈ రంగంలో అద్భుతాలు సృష్టించగలం. ఉల్లిపా యలు వేసిన మార్గం..మాది వ్యవసాయం కటుంబం. చదువుకునే రోజుల నుంచి ఉల్లిపాయలపై మార్కెట్లో వచ్చే హెచ్చు తగ్గులు ఎప్పుడూ విస్మయానికి లోను చేస్తుండేవి. ఆ ఆలోచనతోనే 1983లో ఎమ్మెస్సీ హార్టీ్టకల్చర్, అటు తర్వాత ‘ఉల్లిపాయలు– నీటి యాజమాన్యం’ మీద పీహెచ్డీ చేశాను. 1994 లో సంగారెడ్డి ఎఆర్వో నర్సరీ ఇంచార్జ్‌గా జాయిన్ అయ్యాను. ఆ తర్వాత మూడేళ్లకు ఉల్లి ధరలుæపెరగడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో రైతులు ఉల్లి సాగులో ఎక్కువ దిగుబడి సాధించడానికి శిక్షణాతరగతులు నిర్వహించాం. అక్కణ్ణుంచి మామిడి, జామ, స΄ోట, సీతాఫలం అంటు మొక్కలతోపాటు జామ, పనస వంటి పండ్లు, మల్లె మొక్కల... అమ్మకాలు కూడా ప్రాంరంభించాం.ప్రాంతానికి తగిన విధంగాఏ ప్రాంతానికైనా అక్కడి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పండే పంటలు కొన్ని ఉంటాయి. వాటిని గుర్తించి అన్ని సీజన్లలో ఎలా పండించవచ్చో సాధించి చూ΄ాం. వెజిటబుల్ రీసెర్చ్ స్టేషన్ (అఖిల భారత సమన్వయ సంస్థ కూరగాయల పరిశోధన)లో ఆరేళ్లు పని చేశాను. రైతుల దగ్గరకు వెళ్లి, వాళ్లు ఎంచుకున్న సాగు పద్ధతులు స్వయంగా తెలుసుకొని, మార్పులూ చేశాం. బీర, దోస, సొరకాయ, గుమ్మడి.. మొదలైన వాటిలో క్రాసింగ్,, హైబ్రీడ్స్ మీద వర్క్ చేశాను.పారిశ్రామిక రంగానికి జత చేయాలిఆ తర్వాత 15 ఏళ్లు అధ్యాపకురాలిగా ఉన్నాను. సీనియర్ ప్రొఫెసర్‌గా ప్రమోషన్ ఆ తర్వాత 20 రోజుల్లోనే కొండాలక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్శిటీ కి ఫస్ట్ రెగ్యులర్ వైస్ ఛాన్స్లర్ పోస్టింగ్ వచ్చింది. దేశంలోనే హార్టికల్చర్ యూనివర్శిటీస్‌లో ఫస్ట్ ఉమన్ వైస్ ఛాన్సలర్‌గానూ గుర్తింపు లభించింది. మొదటిసారి విద్యార్థులనుపారిశ్రామిక రంగానికి అటాచ్ చేస్తూ స్కిల్స్ నేర్పించే విధంగా ప్రోగ్రామ్స్ చేశాం. కమర్షియల్ హార్టికల్చర్, నర్సరీ, ఫ్లోరికల్చర్, మష్రూమ్స్‌పై పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ, డ్రై ఫ్లవర్ టెక్నాలజీ, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్‌తో తయారుచేసే నిల్వ పదార్థాలు, సుగంధ తైలాల తయారీలోనూ ట్రైనింగ్ ఇచ్చాం. టెర్రస్ గార్డెన్ కాన్సెప్ట్స్, మామిడిపై పరిశోధన, ప్రదర్శనలు, డ్రాగన్ ఫ్రూట్ సాగులను ప్రోత్సహించాం. వివిధ దేశాల నుంచి వచ్చిన వ్యవసాయ శాస్త్రవేత్తలతో మన రైతులకు, స్టూడెంట్స్‌కు మధ్య చర్చలు జరిపాం.నవతరం దృష్టి మారాలి..ఐదారేళ్ల నుండి ఈ రంగంలోకి వచ్చే అమ్మాయిల సంఖ్య పెరుగుతోంది. అయితే, అమ్మాయిలు ఫీల్డ్కి వెళ్లడానికి ఇష్టపడటం లేదు. అవగాహన కలిగినవారు వెనుకంజ వేస్తే వ్యవసాయ రంగం సమతుల్యత దెబ్బతింటుంది. ఈ రంగంలోకి వచ్చేవారు పొలాలకు వెళ్లడానికి ఉదయం, సాయంత్రం సమయాలను ఎంచుకోవడం వంటి స్మార్ట్ వర్క్ నేర్చుకోవడం కూడా ముఖ్యం. రైతులు ఏ విధంగా కష్టపడతారో ఈ రంగంలోకి వచ్చి శిక్షణ తీసుకున్నవారు కూడా అంత కష్టపడాల్సి ఉంటుంది. చేసే పనిలో అంకితభావం ఉంటే మంచి ఫలితాలను ΄÷ందగలం’’అని వివరించారు.- నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
International Women's Day 2025 : స్వీయ ప్రేమ ముఖ్యం
విత్తనంలో మహావృక్షం దాగి ఉంటుందనేది అనుభవజ్ఞులు చెప్పిన మాట. ఆ మాటలను ఆచరణలో పెట్టి ఫలాలను పంచేవారు ఎప్పుడూ సమాజంలో స్ఫూర్తిమంతంగా నిలుస్తారు. మహిళగా ఏడుపదుల అనుభవాన్ని, తన ఆలోచనలను పంచుకున్నారు సికింద్రాబాద్ బోయినపల్లిలో ఉంటున్న కావేరీ సీడ్స్ డైరెక్టర్ జి.వి.వనజాదేవి. ‘కుటుంబం, సమాజం పట్ల బాధ్యతలు నిర్వర్తించాలంటే మహిళలు అన్నింటికన్నా ముందు స్వీయ ప్రేమ కలిగి ఉండటం అవసరం’ అంటున్నారామె. విమెన్స్ డే 2025 థీమ్మరింత వేగంగా... మరింత నిర్మాణాత్మకంగా ఈ సంవత్సరం విమెన్స్ డే క్యాంపెయిన్ థీమ్... యాక్సిలరేట్ యాక్షన్.లింగ సమానత్వాన్ని సాధించడానికి ఉత్తమమైన మార్గాలను ఎంచుకోవడంతో పాటు ఆ పనిని మరింత వేగంగా, నిర్మాణాత్మకంగా చేయాలి. ‘యాక్సిలరేట్ యాక్షన్’లో మహిళల పురోగతికి ఉపయోగపడే వ్యూహాలు, ఆలోచనలు ఉంటాయి. ‘లింగ సమానత్వానికి ఎన్నో అడ్డంకులు ఉన్నాయి’ అని నిరాశపడిపోవడం కంటే ఆశావహ దృక్పథంతో తగిన కార్యాచరణతో ముందుకు వెళ్లడం అవసరం. ‘యాక్సిలరేట్ యాక్షన్’కు సంబంధించిన ఒక నినాదం... సపోర్ట్ ది సపోర్టర్స్. మనకు ఎవరైతే మద్దతు ఇస్తున్నారో వారికి మద్దతు ఇవ్వడం ద్వారా లింగ సమానత్వం కోసం వేసే అడుగులను వేగవంతం చేయవచ్చు. మహిళలకు సహాయపడేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంస్థలు పనిచేస్తున్నాయి. వాటికి సంఘీభావం తెలియజేయాలి.మనం ఏ రకంగా యాక్సిలరేట్ యాక్షన్‌లో భాగం కావచ్చు?వివక్షను సవాలు చేయడం, మహిళల విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడం, మనకు తెలిసిన విషయాలను ఇతర మహిళలతో కలిసి పంచుకోవడం, మహిళల నాణ్యమైన విద్య, ఆరోగ్యం గురించి పనిచేయడం, మహిళల సృజనాత్మకతను ప్రోత్సహించడం లాంటివి ఎన్నో ఉన్నాయి. గత కాలం, ప్రస్తుతం కాలం అంటూ మహిళ విషయంలో ప్రత్యేకించి చెప్పలేం. ఏ రోజుల్లోనైనా మహిళ సంఘర్షణలతోనే దోస్తీ చేస్తుంది. ఆమె ఆలోచనలన్నీ కుటుంబం చుట్టూతానే కేంద్రీకృతమై ఉంటాయి. తల్లిదండ్రులు, తోబుట్టువులు, పెళ్లయ్యాక భర్త, అత్తింటివాళ్లు, పిల్లలు .. ఒత్తిడితో కూడిన జీవనంలోనే తనని తాను నిరూపించుకోవడానికి, నిలబడటానికిపోరాటం చేస్తూనే ఉంటుంది. అయితే, ఈ క్రమంలో తనని తాను మర్చిపోతుంది. పెళ్లి తర్వాత కుటుంబపోషణలో లీనమైపోతూ తన ఆరోగ్యం గురించి పట్టించుకోదు, చక్కగా ముస్తాబు అవడాన్ని పట్టించుకోదు. నిజానికి తనని తాను ప్రేమించుకోవడం మర్చిపోతుందనిపిస్తుంది. చదవండి: International Women's Day 2025 : యాక్సలరేట్ యాక్షన్ అంటే? మాటలేనా!ఆత్మస్థైర్యమే బలంమాది కరీంనగర్ జిల్లాలోని గట్ల నరసింగాపూర్ గ్రామం. పెద్ద కుటుంబం. ఎప్పుడూ నలుగురికి పెట్టగలిగే స్థితిలోనే ఉన్నాం. ఉమ్మడి కుటుంబంలో అందరినీ కలుపుకుని ΄ోతూ, బాధ్యతలను నెరవేరుస్తూ, నా ఉనికిని కోల్పోకుండా కాపాడుకున్నాను. పెళ్లినాటికి డిగ్రీ చదువు పూర్తయ్యింది. మా వారు జి.వి.భాస్కరరావుకి వ్యవసాయ రంగం అంటే ప్రేమ. అగ్రికల్చర్ బీఎస్సీ చేశారు. పుట్టిన గడ్డపైన తనని తాను నిరూపించుకోవాలని తపన. అందుకు నేను మద్దతుగా నిలిచాను. కావేరీ సీడ్స్ మొదలుపెట్టినప్పుడు ఒడిదొడుకులు ఎదుర్కొన్నాం. సమస్య వచ్చింది కదా అని అక్కడే వదిలేస్తే ఈ రోజు కావేరీ సీడ్స్ ఉండేది కాదు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో 50కి పైగా మా సీడ్ యూనిట్స్ ఉన్నాయి. ఈ ఏడాది వ్యవసాయ రంగంలో విద్యార్థులను తీర్చిదిద్దడానికి కావేరీ యూనివర్శిటీ కూడా ప్రారంభించాం.దిద్దుబాటుకుటుంబం, పిల్లల బాగోగులు, కంపెనీలో చేదోడుగా ఉండటం .. ఒక దశ తర్వాత బాధ్యతలు తీరి కాస్త తీరిక దొరకడంతో చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు చిన్నజీయర్ స్వామి వారి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆకర్షించాయి. అప్పుడే జైలుశిక్ష అనుభవిస్తున్న మహిళల గురించి తెలిసింది. ఖైదీలుగా ఉన్నవారి సమస్యలను అర్థం చేసుకోవడానికి చంచల్‌గూడ, చర్లపల్లి జైలుకు ‘వికాస తరంగిణి’సభ్యులతో కలిసి వెళ్లాను. క్రమం తప్పకుండా మహిళా ఖైదీలను కలవడం, కౌన్సెలింగ్ ఇవ్వడం, వారి పిల్లలను తిరిగి స్కూళ్లలో చేర్పించడం వంటి కార్యక్రమాలు చేశాం. మంచి ఫలితాలు రావడంతో కరీంనగర్, రాజమండ్రి, వరంగల్, విజయవాడ, వైజాగ్‌లలోని జైళ్లలోనూ కౌన్సెలింగ్ కార్యక్రమాలకు ఆహ్వానం అందింది. మహిళాఖైదీలు జైలు నుంచి విడుదలయ్యాక వారి జీవనం సానుకూలంగా గడిచే ఏర్పాట్లు చేయడం ఎంతో తృప్తిని కలిగించింది. క్యాన్సర్ అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనడం, కాన్సర్ రోగులకు చికిత్స అందేలా చూడటం, మా ఊరితోపాటు చుట్టుపక్కల గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేయడం, మహిళారైతుల సమస్యలను తీర్చడం, చదువుకునే విద్యార్థులకు క్యాంపులు, మహిళలకు శిక్షణాతరగతులు నిర్వహించడం.. ఇలా సామాజిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాలు లభించాయి. వ్యవసాయ రంగంలో మహిళలు రావడం అంటే గత కాలం కూలీలుగానే చూసేవాళ్లం. కానీ, ఇప్పుడలా కాదు. ఉన్నతవిద్యతో వ్యవసాయం రంగంలో మార్పులు తీసుకురావడానికి యువతరం ముందుకు వస్తుంది. మా యూనివర్శిటీలో చేరిన విద్యార్థుల సంఖ్యే అందుకు నిదర్శనం. ముందుగా మహిళలు తమని తాము ప్రేమించుకోవాలి. ఆరోగ్యం, సంరక్షణ, చదువుతో తనకు తానుగా ఎదుగుతూనే కుటుంబ బాధ్యతలను నిర్వర్తించాలి. ఒక్కో విజయాన్ని అందుకుంటూ సమాజంలో వెనకబడినవారిని తనతో కలుపుకుంటూ ముందుకు వెళ్లాలి. దైనందిన జీవనం ప్రశాంతంగా, సంతోషంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటే ఒత్తిడులను కూడా సులువుగా అధిగమించవచ్చు.’’ తన అనుభవసారాన్ని కళ్లకు కట్టారు వనజాదేవి. -నిర్మలా రెడ్డి సాక్షి, ఫీచర్స్ ప్రతినిధి -
International women's day 2025: 115 ఏళ్లు గడిచాయి? ఎక్కడుందీ సమానత్వం?
అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రకటించి 115 సంవత్సరాలైంది. అమానవీయమైన అణచివేతను, వివక్షను ఎదుర్కొన్న మహిళా కార్మికులు నెత్తురు ధారబోసి హక్కులకోసం తెగించి పోరాడారు. ఫలితంగా 8 గంటల పని దినాన్ని, వేతన పెంపుదలను, మరికొన్ని హక్కులను సాధించుకున్నారు. అయినప్పటికీ మహిళలు నేటికీ అనేక సవాళ్లను ఎదుర్కొంటూ కనిపిస్తున్నారు. మన సమాజంలో, ఆర్థిక, రాజకీయ వ్యవస్థలో మహిళా లోకం పురుషుల కంటే తక్కువగానే ఉంటూ వస్తోంది. ఇంట్లోనూ, బయట ఉద్యోగాల్లోనూ – మహిళలు పూర్తి బాధ్యతను మోస్తున్నప్పటికీ – ఈ అసమానత కొనసాగుతుంది. మహిళలు బలమైన పోరాటాలు చేస్తున్నప్పటికీ, వారి మీద లైంగిక హింస పెరుగుతూనే వుంది. దళిత, మైనారిటీ మహిళలు ఎక్కువగా దాడులకు గురి అవుతున్నారు. ప్రొఫెసర్లు, సైంటిస్టులు, డాక్టర్ల దగ్గర నుండి పారిశుధ్య కార్మికుల వరకు – అందరికీ కాంట్రాక్టు, తాత్కాలిక పనులే తప్ప ప్రభుత్వ ఉద్యోగాలు లేవు. ఈ పనుల్లో కూడా మహిళలకు సమాన పనికి సమాన వేతనాలు రావడం లేదు. ఉద్యోగ బీమా పథకాన్ని కోల్పోవడం అంటే మహిళలను ప్రసూతి ప్రయోజనాలకుదూరంగా పెట్టినట్లే. చదవండి! International Women's Day 2025 : యాక్సలరేట్ యాక్షన్ అంటే? మాటలేనా!1970లో పురుడు పోసుకున్న ‘ప్రగతిశీల మహిళా సంఘం’ ఎన్నో సమరశీల పోరాటాలు నిర్వహించింది. నిర్బంధానికి అణచివేతకు గురయ్యింది. అనేక మంది వీరవనితలు అమరులయ్యారు. 12 రాష్ట్రాల్లో గుర్తింపు కలిగిన మహిళా పోరాటాలు నిర్వహించింది. భూమికోసం, ఇళ్ళస్థలాలకోసం, స్త్రీ పురుష సమానత్వంకోసం లైంగిక హింసకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలను నిర్మించాం. ఈ క్రమంలో 2013లో సంస్థ చీలికకు గురయ్యింది. ఫలితంగా మహిళా ఉద్యమాలు తీవ్రంగా నష్టాన్ని చవిచూసాయి. వీటిని సమీక్షించుకొన్న తర్వాతరెండు సంస్థలు కలిసి భవిష్యత్‌లో ఒకే సంస్థగా పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. మార్చి 8వ తేదిన అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం సందర్భంగా విలీనం కావాలని రెండు సంస్థలు భావించాయి. ఈ విలీనానికి ఒంగోలు వేదిక కాబోతుంది. – బి.పద్మ, ప్రధాన కార్యదర్శి,ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ), ఏపీ -
International Women's Day 2025 : యాక్సలరేట్ యాక్షన్ అంటే? మాటలేనా!
అంతర్జాతీయమహిళాదినోత్సవం అంటే మహిళాహక్కుల గురించి చర్చించుకోవడం. వారి హక్కులరక్షణ, మహిళా సాధికారతను సాధించడం ఎలా దానిపై అవగాహన కలిగిఉండటం. ఈ ఏడాది థీమ్ ‘యాక్సలరేట్ యాక్షన్’ అంటే...లింగ సమానత్వానికి సంబంధించిన చర్యల్ని వేగవంతం చేయడం. అంటే మహిళా విద్యా అవకాశాలను మెరుగుపర్చడం, ఉద్యోగ అవకాశాలను మరిన్ని కల్పించడం. సమిష్టిగా, లింగ సమానత్వం కోసం చర్యలను వేగవంతం చేయడం. ప్రపంచ ఆర్థిక వేదిక డేటా ప్రస్తుత పురోగతి రేటు ప్రకారం, పూర్తి లింగ సమానత్వాన్ని చేరుకోవడానికి 2158 వరకు పడుతుంది. అంటే ఇప్పటి నుండి దాదాపు ఐదు తరాలు పడుతుంది దీనికి సంబంధించి అసలు యాక్సలరేట్ యాక్షన్ అనేది ఎలా ఉండాలి అనే అంశంపై పాపులేషన్ ఫస్ట్ డైరెక్టర్ డాక్టర్ ఎ.ఎల్. శారదతో సాక్షి. కామ్ సంభాషించింది. ఆ వివరాలు మీకోసం...యాక్సలరేట్ యాక్షన్ అంటే మహిళలకు విలువైన సేవలను, వనరులను మరింత వేగంగా, నిర్మాణాత్మకంగా అధికంగా అందుబాటులోకి తీసుకు రావడం. సపోర్ట్ ది సపోర్టర్స్ అనే నినాదానికి కనుగుణంగా ఉమ్మడిగా సాగిపోవడం అన్నారామె. అది మాత్రమే కాకుండా, నాణ్యమైన సేవలను అందించడం అనే లక్ష్యంగా ఈ కార్యాచరణ సాగాలి. వారికి మరిన్ని అవకాశాలను కల్పించడం అనేది ప్రధానంగా ఉండాలి. ఇది సామూహికంగా సాగాలి. నామమాత్రపు చర్యలుగా గాకుండా చిత్తశుద్ధిగా సాగాలి. కేవలం మాటలు, వాగ్దానాలకు పరిమితం గాకుండా, చేతలు, చర్యలుగా ఉండాలి.గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు కూడా ఉపయోగపడేలా చర్యల్ని వేగవంతం చేయాలంటే వివిధ సంస్థలు, వ్యక్తులతో కలిసి జమిలిగా పనిచేయాలి. అపుడు మాత్రమే ఆశించిన ఫలితాలు సాధించగలం. కానీ మహిళలకు సేవలను అందుబాటులోకి తీసుకు రావడం అంటే.. మహిళల అభివృద్ధి అంటే ఆడబిడ్డల పెళ్లికి ఎంతో కొంత డబ్బులు ఇవ్వడం, లేదా ఇతర ఉచిత పథకాలు అనుకుంటాయి ప్రభుత్వాలు. కానీ ఇలాంటి పథకాల వల్ల ఆయా పార్టీలకు ఓట్లు వస్తాయోమోగానీ, మహిళలకు పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. మహిళల నాణ్యమైన విద్య, ఆరోగ్యం, క్రియేటివిటీ, నైపుణ్య శిక్షణ, వనరులను అందుబాటులోకి తీసుకు రావడం లాంటివి జరగాలి. ప్రాక్టికల్‌గా లింగ వివక్షను రూపు మాపేందుకు, అందుకు తగిన మెరుగైన అవకాశాలు కల్పించేందుకు కృషి చేయాలి. సాధికారత సాధించేలా వారికి తోడ్పాటు అందించాలి. వారి జీవన పరిస్థితుల మెరుగుదలకు కావాల్సిన వనరులు కల్పించాలి. దీంతోపాటు వనరుల రక్షణలో మహిళలకు శిక్షణ ఇవ్వాలి. ఉదాహరణకు నీటి వసతి కల్పించాలి అంటే తాతాల్కిక పరిష్కారాలతోపాటు నీటి నిల్వలను ఎలా కాపాడాలి, బావులను తవ్వడం లాంటి అంశాలపై దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలి. దీనిపై మహిళలకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలి. సమస్య ఏదైనా పరిష్కారం మూలాల్లోకి వెళ్లాలి. సమాజంలో వివిధ కమ్యూనిటీలు, వ్యక్తులను ఇందులో భాగస్వామ్యులను చేయాలి. బాలికల అక్షరాస్యత శాతం ఎందుకు పడిపోతోంది అనే పరిశోధన జరగాలి. ప్రాంతీయ భాషల్లో అర్థమయ్యేలా విద్యాబోధన జరగాలి. ఇది శాస్త్రీయపరంగా, ఆధునిక బోధనా పద్దతులు ద్వారా జరగాలి. అపుడు మాత్రమే పిల్లలకు చదువుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది.చర్యలు ఏమైనా ప్లాన్ ఓరియెంటెడ్‌గా గాకుండా, పీపుల్ ఓరియెంటెడ్‌గా ఉండాలి. ఆయా సమస్యల పరిష్కారానికి సంబంధించిన అంశాలపై దృష్టి పెట్టాలి. వాటిపై అవగాహన కల్పించాలి. జంగా చర్యల్ని వేగవంతం చేయడం అంటే పేపర్‌మీద లెక్కలుగా గాకుండా ఫలితాలు, వాస్తవంగా ప్రయోజనకరంగా ఉండాలి. అపుడు మాత్రమే ఈ థీమ్‌కు సాఫల్యత చేకూరుతుంది. ఆ దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలి. మహిళా హక్కుల కోసం పనిచేస్తున్న వ్యక్తులు, సంస్థలు,నెట్‌వర్క్‌తో గ్రూపులతో చర్చించి చర్యలు తీసుకోవాలి అన్నారు. పాపులేషన్ ఫస్ట్ ఆధ్వర్యంలో తాము ఇలాంటి సేవలనే అందిస్తున్నామని, అనేక మంది సంస్థలు, వ్యక్తులతో జమిలిగా పనిచేసి, ఫలితాలు సాధిస్తున్నామని శారద చెప్పారు. అలాగే లింగ వివక్ష నిర్మూలన సమాన అవకాశాల్లో ఎంత సాధించాం అనేది ఒక్కసారి ఆలోచించుకుంటే.. చాలామార్పును సాధించాం అనడంలో ఎలాంటి సందేహం లేదు. పురుషాధిక్య భావజాలం, ఆధిపత్యం ఇంకా కొనసాగుతున్నప్పటికీ, జరుగుతున్న అన్యాయాలపై, హక్కులపై అవగాహన పెరిగింది. ఎందుకిలా అని ప్రశ్నించే తత్వం, పోరాట స్ఫూర్తి పెరిగింది. నిజం చెప్పాలంటే మహిళలు చాలా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా చాలా ముందుకు పోతున్నారు. కానీ గుణాత్మకమైన మార్పు సాధించాలంటే ఇది సరిపోదు. 90 శాతం మహిళలు ఇంకా వెనుకబడే ఉన్నారన్నారు. వీరి పురోగతి రేటును వేగవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలను, చిత్తశుద్ధిగా, నిబద్ధతతో మరింత వేగవంతం చేయాల్సింది ఉందన్నారు శారద. పాపులేషన్ ఫస్ట్పాపులేషన్ ఫస్ట్ అనేది మహిళా సాధికారత, లింగ సమానత్వం ,సమాజ సమీకరణ కోసం అంకిత భావంతో పనిచేస్తున్న సంస్థ. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుండి సోషియాలజీలో డాక్టరేట్ చేసిన డా. శారద పాపులేషన్ ఫస్ట్ ఫౌండర్ డైరెక్టర్‌గా ఉన్నారు. శారద నేతృత్వంలోని పాపులేషన్ ఫస్ట్ జెండర్ సెన్సిటైజేషన్‌ను గుర్తించి, దాని కోసం పనిచేసే అనేకమంది (ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా) జర్నలిస్టులకు ‘లాడ్లీ’ మీడియా పేరుతో అవార్డులు అందించి ప్రోత్సహిస్తుంది. ఇంకా అవగాహనా వర్క్‌షాప్‌లు నిర్వహిస్తుంది. ఫెలోషిప్‌లు అందిస్తుంది. డా.శారద సెంట్రల్ బోర్డ్ ఫర్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) సభ్యురాలిగా కూడా ఉన్నారు. గత మూడు దశాబ్దాలుగా బాలికా విద్యా , మహిళా హక్కులు, సమానత్వం కోసం కృషి చేస్తున్నారు. మహిళామూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు -
International Women's Day 2025: మహిళా విముక్తిలో ఓ అంకం
‘కన్యాశుల్కం’ నాటకం గుర జాడను అత్యుత్తమ నాటక రచ యి తగా తెలుగు సాహిత్యంలో నిలిపింది. ఈ నాటకాన్ని ‘జగన్నాథ విలాసినీ సభ’ 1892 ఆగస్టులో మొదట ప్రదర్శించింది. కన్యాశు ల్కంలో ప్రధానమైన సమస్య సుబ్బి పెళ్లి తప్పించటం! ఆడవాళ్లకి ఏ ఆలోచనాశక్తి లేదని, చులకనగా వారిని చూసే నాటి సమాజంలో మహిళలను ధైర్యవంతులుగా చిత్రించి మహిళల చరిత్రను పునర్లిఖించారు గురజాడ. సుబ్బమ్మ లేక సుబ్బి ఈ కథకి మూలం. నాటకంలో ఎక్కడా కనిపించదు. వెంకమ్మ – కృష్ణరాయపురం అగ్రహారీ కుడు అగ్నిహోత్రావధాన్ల భార్య. బుచ్చమ్మ-అగ్ని హోత్రావ ధాన్ల పెద్ద కూతురు, వితంతువు. మీనాక్షి - రామచంద్రా పురం అగ్రహారీకుడు లుబ్ధావధాన్ల కుమార్తె, వితంతువు. మధురవాణి–విజయనగరానికి చెందిన వేశ్య. పూట కూళ్ళమ్మ విజయనగరంలో పూట కూళ్ళిల్లు నడిపే వితంతువు. వెంకమ్మ అన్నగారు కరటక శాస్త్రి. ఇతడు కృష్ణరాయ పురం అగ్రహారంలో ఉన్న చెల్లెలి ఇంటికి వచ్చినపుడు సుబ్బి పెళ్ళి విషయం తెలుస్తుంది. ఈ సంబంధం ఇష్టంలేనివెంకమ్మ అన్న కరటకశాస్త్రిని ఈ సంబంధం తప్పించమని వేడుకుంటుంది. ఎలాగైనా మేనకోడలు పెళ్లి తప్పించాలని పథకాన్ని రూపొందిస్తాడు అతడు.మధురవాణిది నాటకంలో కీలకమైన పాత్ర. ఆమె వేశ్య. విజయనగరంలో ఉండే మధురవాణి కారణాంతరాల చేత రామచంద్రపురం అగ్రహార నివాసి, ఊరి కరణం రామప్ప పంతులి ఇంటికి చేరుతుంది. సుబ్బితో పెళ్లి ఖాయం చేసు కున్న లుబ్ధావధాన్లు రామచంద్రపుర వాసి. రామప్పపంతులు నయవంచకుడని ఆమె తొంద ర్లోనే కనిపెట్టేసింది. స్వతహాగా ఎదుటివారికి సాయం చెయ్యాలనే సద్బుద్ధి కలి గిన మధురవాణి... లుబ్ధావధాన్ల పెళ్లి రామప్ప పంతులు కుదిర్చాడని తెలిసిన వెంటనే ‘ఈ పెళ్లి మాన్పించకపోతే నేను మీతో మాట్లాడను’ అంటుంది. ఆ తరువాత అసలు కథ మొదలైంది.కరటకశాస్త్రి తన ప్రణాళిక అమలు చెయ్యటానికి రామప్ప పంతులు ఇంటికి వస్తాడు. అక్కడ మధుర వాణిని చూసి తన మేనకోడలి పెళ్లి తప్పించమని కోరతాడు. ఆమె అంగీకరించి కొన్ని సలహాలు ఇస్తుంది. తన ‘కంటె’ని పెళ్లిలో పెళ్లికూతురికి పెట్టటానికి కూడా ఒప్పుకుంటుంది. ఆడవేషంలో ఉన్న కరటకశాస్త్రుల శిష్యుడు మహేష్‌ని ఇచ్చి పెళ్ళి జరిపించి, తద్వారా సుబ్బి పెళ్లి ఆపటంలో మధురవాణి చాకచక్యాన్ని ప్రదర్శించింది. తర్వాత లుబ్ధావధా న్లను పెళ్లి చేసుకున్న మహేష్...మధురవాణి దగ్గరకు వచ్చి ఆమె ‘కంటె’ ఆమెకి ఇచ్చేస్తాడు. మధురవాణి ఆడపిల్ల వేషంలో ఉన్న మహేష్‌కు దాసరి వేషం వేసి ఊరు దాటిస్తుంది.‘కంటె’ కోసం రామప్ప పంతుల్ని ఇబ్బంది పెట్టడంతో అతడే హెడ్ కానిస్టేబుల్‌తో లుబ్ధావధాన్ల మీద ఖూనీ కేసు పెట్టిస్తాడు. ఈ వ్యవహారంలో లుబ్ధావధాన్లను కేసునుంచి బయట పడెయ్యడానికి మధురవాణి, సౌజన్యా రావు పంతులు ఇంటికి వెళుతుంది. అదే సమయంలో గిరీశం కూడా ఆ ఇంటికి వస్తాడు. బుచ్చమ్మని లేవదీసుకు పోయిన గిరీశం అంతటితో తృప్తిపడక లుబ్ధావధాన్ల ఆస్తి చేజిక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తూ అక్కడికి వచ్చాడు. గిరీశం నిజస్వరూపం తెలుసుకున్న సౌజన్యా రావు పంతులు బుచ్చమ్మను పూనాలో విడోస్ హోవ్ుకు పంపే ఏర్పాట్లు చేస్తాడు. నాటకంలో మీనాక్షి పాత్ర కూడా ముఖ్యమైనదే. ముసలి తండ్రి పెళ్లి కరటకశాస్త్రి శిష్యుడు మహేశంతో జరి పించటంలో సిద్ధాంతికి సంపూర్ణ సహకారం అందిస్తుంది. ఒక రాత్రివేళ రామప్ప పంతులితో తమ ఇంట్లో తండ్రికి దొరికిపోతుంది. తండ్రి బయటికి గెంటేస్తాడు. ఈ చర్యకి మీనాక్షి ఏమీ జంకకుండా ‘‘... ఈ జన్మలో ఈ ఇంట్లో అడు గుపెట్టను’’ అంటూ రామప్ప పంతు లుతో వెళ్లిపోతుంది.ఇక గంపెడు చాకిరీ చేస్తూ నెత్తిన ముసుగేసుకుని జీవి తాన్ని గడుపుతున్న బుచ్చమ్మ ఆలోచనాశక్తి, తెంపరితనం ఉన్న మహిళ. బుచ్చమ్మకి గిరీశం తన కళ్లముందు నిలిపిన రంగుల లోకం... అందరి ముత్తయిదువలలాగ జీవించాలనే ఆశని కల్గించింది. ఇంకో పక్క గిరీశం తన ఈ నిర్ణయం వల్ల ముసలాడితో చెల్లెలి పెళ్లి ఆగిపోతుందని నచ్చ చెప్పాడు. ధైర్యంగా ఆమె గిరీశంతో అగ్ని హోత్రావధాన్ల కళ్లుగప్పి వెళ్లి పోయింది. విజయనగరంలో పూటకూళ్ల ఇల్లు నడుపుకునే పూటకూళ్లమ్మ ఇంట్లో పనీపాటూ చేసు కుంటూ, ఆకతాయిగా తిరిగే మాయలాడు గిరీశం... ఆమెని మోసగించినందుకు అతడిని చీపురు తీసుకుని వెంటబడు తుంది. దానితో కృష్ణరాయ పురం అగ్రహారం వెంకటేశంతో చేరతాడు గిరీశం. లుబ్ధా వధాన్లకి వరసకి తమ్ముడైన గిరీశం: సుబ్బిని పెళ్లి చేసు కోవద్దంటూ లుబ్ధావధాన్లకి అర్థం అయ్యేటట్లు, భయ పెడుతూ ఉత్తరం రాస్తాడు. కాబట్టి సుబ్బి పెళ్లి ఆపటంలో పూటకూళ్లమ్మ కూడా తెలీకుండానే పెద్దసాయం చేసింది. గిరీశం కృష్ణరాయపురం చేరేటట్టు చేసింది.కన్యాశుల్కం నాటకం సుబ్బి కొరకే, సుబ్బికోసమే నడి చింది. చెప్పాలంటే అదృశ్యంగా కథ నడిపింది సుబ్బే. తలా ఒక చెయ్యివేసి దుర్మార్గాన్ని అడ్డుకున్నది మహిళా శక్తి! అదే గురజాడ మహిళలకు చూపిన వెలుగుదారి. డా. తుర్లపాటి రాజేశ్వరి వ్యాసకర్త కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కార విజేత -
Karimnagar: ఫుట్‌పాత్‌పై వ్యాపారం.. రీల్స్‌తో క్రేజ్! సినిమాల్లోనూ ఆఫర్లు!
విద్యానగర్(కరీంనగర్): ఠాకూర్ అశ్విని అలియస్ ఆశాది కరీంనగర్‌లోని భగత్‌నగర్. నగరంలోని డైలీ మార్కెట్, వేంకటేశ్వరస్వామి గుడి వద్ద ఫుట్‌పాత్‌పై సీజనల్ వ్యాపారం చేస్తుంది. మట్టికుండలు, దీపాల ప్రమిదలు, రంగుల ముగ్గులు, పచ్చడి జాడీలు, దీపాల వత్తులు అమ్ముతుంది. రెండేళ్ల కిత్రం వ్యాపార అభివృద్ధి కోసం తొలిసారిగా ఆమె అమ్మే వస్తువుల గురించి రీల్ చేసి ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేయగా వేల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. దీంతో మరిన్ని రీల్స్ చేసి పోస్ట్ చేసింది. వాటికి కూడా ఆశించిన దానికన్నా ఎక్కువగా స్పందన రావడంతో సినిమా పాటలు, జానపద గేయాలు, భక్తి, రోమాంటిక్, ప్రేమ, ఎడబాటు తదితర అంశాలపై రీల్స్ చేయడం మొదలు పెట్టగా వాటికి కూడా లక్షల్లో వ్యూస్ రావడం, ఆరో తరగతి వరకే చదివిన ఆశాకు భర్త, కుటుంబ సభ్యులు ప్రోత్సాహం తోడవడంతో రీల్స్‌పై మక్కువ పెంచుకుంది. రెండేళ్లలో 600 వరకు రీల్స్ చేసింది. ‘ఇన్‌స్ట్రాగామ్‌లో నా రీల్స్ చూసిన డైరెక్టర్లు చాలా మంది వారి సినిమాల్లో అడిగారు. కీ రోల్ పాత్రలు వస్తే తప్పకుండా చిన్న, పెద్ద సినిమాల్లో చేస్తాను’ అని ఠాకూర్ అశ్విని వెల్లడించింది. View this post on Instagram A post shared by Thakur Asha (@ashwini_anu_007) View this post on Instagram A post shared by Thakur Asha (@ashwini_anu_007) -
అతిరథులు ఈ అతివలు..
ఈ సృష్టిలో శక్తి మంతమైనవి రెండే అంశాలున్నాయి.. అందులో ఒకటి ప్రకృతి, మరొకటి మగువ అని ఆనాడే ఓ ప్రఖ్యాత రచయిత చెప్పాడు. సమాజమంతా మహిళలను కీర్తిస్తూ.. మహిళా సాధికారత అంటూ గొంతెత్తుతున్నప్పటికీ.. తమ గౌరవాన్ని, గొప్పతనాన్ని కాపాడుకోడానికి ఆ తల్లులు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో పలువురి స్ఫూర్తిదాయక మహిళల ఇతివృత్తాలను తెలుసుకుందాం.. సాహిత్యం.. సావాసం..తన ప్రయాణమంతా సాహిత్యంతోనే.. తన మనసంతా ప్రకృతిమయం. గొప్ప గొప్ప విషయాలు ఎక్కడో ఉండవు.. కాస్త తరచి చూస్తే మనచుట్టూనే, మన మధ్యే ఉంటాయంటారు ప్రముఖ రచయిత స్వర్ణ కిలారి. సామాజిక ఇతివృత్తాలతో పలు ప్రభావ వంతమైన కథలు, రచనలు, అనువాదం చేసిన స్వర్ణ కిలారి.. మహిళల ట్రావెలింగ్ అనుభవాలతో ఇంతియానం అనే పుస్తకానికి సంపాదకీయం రాశారు. విశ్వవ్యాప్త ప్రయాణాలు చేసిన మగువలు.. విభిన్న అంశాల పై వారి అనుభవాలు, ఆలోచనలకు అక్షరరూపం తీసుకొచ్చారు. మరికొద్ది రోజుల్లో ఇంతియానం 2.0 సైతం రాబోతోంది. ఈ నేపథ్యంలో తన స్ఫూర్తివంతమైన ఆలోచనలు ఆమె మాటల్లోనే..ది షూటింగ్ స్టార్ స్ఫూర్తితో..రచనలన్నా, సాహిత్యమన్నా నాకెంతో ఇష్టం. ఇందులో భాగంగానే నాకు బాగా నచ్చిన కొన్ని పుస్తకాలను తెలుగులోకి అనువాదం చేశాను. ఇందులో కేరళకు చెందిన బాల మేధావి క్లింట్ బయోగ్రఫీ లిప్తకాలపు స్వప్నం, ది గోట్ లైఫ్ అనే ప్రముఖ రచనను మేక బతుకు పేరుతో తెలుగులోకి అనువాదం చేశాను. వ్యక్తిగతంగా నల్ల బంగారం, 13 వంటి రచనలు చేశాను. ఒక రచన కోసం నార్త్ థాయ్‌లాండ్ వెళ్లిన సమయంలో.. ఉన్న కొద్ది ఆస్తిని అమ్మి ప్రపంచ యాత్ర చేసిన అమ్మాయి నవ్య నాథ్ రాసిన ది షూటింగ్ స్టార్ బుక్ చదివి ఆశ్చర్యపోయాను. ఇలా మన తెలుగువారి ట్రావెలాగ్స్‌తో మంచి పుస్తకం తీసుకురావాలని అప్పుడే నిర్ణయించుకుని పని ప్రారంభించాను. ఇందులో భాగంగా మన తెలుగు మహిళలు చేసిన అద్భుత ప్రయాణాలు, అనుభవాలు చూసి స్ఫూర్తిని పొందాను. ఇందులో ఒంటరిగా ప్రయాణలు చేసిన వారు ఎందరో ఉన్నారు. ఇంటి నుంచి బయటకి వచ్చి ఉద్యోగాలు చేయడమే గగనమైన తరుణంలో స్థానిక ఆదిలాబాద్, కాకినాడ అడవులు మొదలు.. విదేశాల్లోని దండకారణ్యాలు, నగరాలు, సంస్కృతులు ఎన్నెన్నో వింతలు, విశేషాలను ఆస్వాదించిన మహిళ ప్రయాణ కథలు నాకు జీవితకాల సంతృప్తినిచ్చాయి. ఇలా 45 మంది కథలతో మొదటి పుస్తకం ముద్రించాను. ప్రస్తుతం మరో 55 మంది వనితల ప్రయాణ కథలతో ఇంతియానం 2.0ను తీసుకురానున్నాను. ఆడవారి ట్రావెలాగ్ వినూత్నంగా, విభిన్నంగా ఉంటుంది. వారు చూసే కోణం, ఆస్వాదించే విధానం కాస్త భిన్నంగా ఉంటుంది. ఉమెన్ ట్రావెంలింగ్ అంత సులభం కూడా కాదు. సామాజికంగా, శారీరకంగా, మానసికంగా పలు అంశాలు సహకరించవు. ఈ సారి మహిళల సోలో కథలతో పాటు తల్లీ కూతుళ్లు వంటి వైవిధ్యాలున్నాయి. వ్యక్తిగతంగా నేను మెక్సికో, బాలి, శ్రీలంక, అమెరికా, భూటాన్ వంటి దేశాలు ప్రయాణించాను. నా రచన 13 కోసం ఉత్తర థాయిలాండ్ వెళ్లి అక్కడ చియాంగ్ రాయ్ గుహలో చిక్కుకున్న 13 మంది పిల్లల నిజజీవిత కథను, వ్యథను రాశాను. భవిష్యత్తులో మరిన్ని రచనలు చేయాలనుంది. – స్వర్ణ కిలారి, ప్రముఖ రచయిత్రి, హైదరాబాద్వైకల్యాన్ని జయించి.. తానోక దివ్యాంగురాలు.. చిన్నప్పటి నుంచి అందరిలానే తానూ వివక్షకు గురైంది. ముందే దివ్యాంగురాలివి, అందులోనూ అమ్మాయివి.. నువ్వేం చేయగలవు, నీ వల్ల ఏమీ కాదు అనే మాటల తూటాలు ఆమె మనసును విచి్ఛన్నం చేశాయి. ఎలాగైనా తనను తాను నిరూపించుకోవాలి, ఎవరి, జాలి, సహాయంపైన ఆధార పడకూడదని నిశ్చయించుకుని ఇంటిని వదిలి హైదరాబాద్ నగరానికి చేరుకుంది. సంపూర్ణంగా తన పనులు తాను చేసుకోలేకపోయినా, అందరిలా నడవలేకపోయినా.. కుంగిపోకుండా కంప్యూటర్ వర్క్ నేర్చుకుని, డీటీపీ వర్క్ చేసి తన ఖర్చుల వరకూ సంపాదించుకునేది. తానే కాదు తనలాంటి మరికొందరికి ఆశ్రయం ఇవ్వాలని ‘ఆద్య నిలయం ట్రస్ట్’ ఏర్పాటు చేసి మరి కొందరు మహిళా దివ్యాంగులకు ఉచితంగా ఆశ్రయం, ఆహారం, వసతులను అందిస్తోంది. ఈ క్రమంలో తమకు కూడా మగతోడు ఉంటే బాగుంటుంది.. వైకల్యం దేహానికే కానీ మనసుకు కాదు. అందరిలాగే తమకు కూడా అనుభూతులు, కోరికలు, ఇష్టాలు ఉంటాయని.. మిత్రుల సూచనతో మరో దివ్యాంగ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అలా తను సతీష్ అనే దివ్యాంగుడినిపెళ్లి చేసుకోవడమే కాకుండా తనలాంటి మరికొందరికి పెళ్లిల్లు చేయిస్తోంది. మరికొందరికి బాసటగా.. దివ్యాంగులకు మొదటి వివక్ష వారి కుటుంబాల నుంచే మొదలవుతుంది. నువ్వేం చేయలేవు.. జీవితాంతం వారు పెట్టింది తింటూ ఇంట్లో ఓ మూలన కూర్చో అనే సందర్భాలే ఎక్కువ. ఇలాంటి తరుణంలో మా ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ, మా కష్టంతో ముందుకు సాగుతున్నాం. ఇలా మరికొందరు దివ్యాంగులకు ఆశ్రయం ఇస్తూ ఒక కుటుంబంగా బతుకుతున్నాం. మా ప్రయాణంలో ఆర్థికంగా, సామాజికంగా, మానసికంగా తోడ్పాటును అందించిన వారు ఎందరో ఉన్నారు. నా పెళ్లిని సర్వ్ నీడి అనే స్వచ్ఛంద సంస్థ జరిపించింది. నా మొదటి పెళ్లి రోజు సందర్భంగా ఆత్మీయుల్లో ఒకరు డబ్బులు ఇచ్చి పార్టీ చేసుకోమన్నారు. ఆ డబ్బుతో నేను మరికొందరు దివ్యాంగుల జంటలకు పెళ్లి పరిచయ వేదిక ఏర్పాటు చేశాను. ఇప్పటి వరకూ ఐదు జంటలకు చేశాను. మరికొన్ని చేసే ప్రయత్నంలో ఉన్నాను. – క్రిష్ణప్రియ, ఆద్య నిలయం ట్రస్ట్, హైదరాబాద్ -
పుణ్యమూర్తివి నీవమ్మా.. మా ఇంటి కావలి తల్లివి నీవమ్మా
ఆధునిక సమాజంలో మహిళలకు గౌరవం దక్కడం ఇప్పిడిప్పుడే మొదలైంది. స్త్రీ విద్య.. స్త్రీలకు ఉద్యోగాలు.. రాజకీయ పదవులు.. సామాజిక హోదా ఈమధ్యనే పెరుగుతూ వస్తోంది. కానీ, ఈ మారుమూల పల్లెల్లో స్త్రీమూర్తులను సాక్షాత్తుగా దేవతలుగా కొలుస్తారు. తమ ఇంటి ఇలవేల్పులుగా ఆరాధిస్తారు. తమ కుటుంబాలను కాపాడే శక్తిగా.. అమ్మవారిగా పూజిస్తారు.. తమ ఇంట పండిన పంటలో తోలి గంపను ఆమెకు సమర్పిస్తారు.. తమ ఇంట వండిన వంటలు తొలిముద్దను ఆమెకు సమర్పిస్తారు. ఇంట్లో ఏదైనా పండగొచ్చినా పబ్బమొచ్చినా ఇళ్లలో వండుకునే పిండివంటల్లో తొలివాయి ఆమెకే ఇచ్చి.. అమ్మా నీ చలవతోనే మేమంతా చల్లగా ఉన్నాం.. నువ్విచ్చిన ఆస్తిపాస్తులు.. ఆశీస్సులతో ఇలా సాగుతున్నాం.. నువ్వు లేకున్నా నీ జ్ఞాపకాలు చాలు.. ఇదిగో నిన్ను చూస్తూ బతికేస్తాం అంటూ భక్తి.. ప్రేమ నిండిన కళ్ళతో ఆ స్మారకాలవద్ద పవిత్రంగా ప్రమిదలు వెలిగిస్తారు.. ఏదైనా ఇంట్లో ఒక మహిళా పుణ్యస్త్రీగా కన్నుమూస్తే ఆమెను పేరంటాలుగా గౌరవిస్తారు. ఆమె పేరిట ఒక స్మారక చిహ్నాన్ని నిర్మిస్తారు.. వీటిని గుండాం అంటారు. భర్తకన్నా ముందే తనువు చలించడం ఒక మహిళకు దైవత్వాన్ని తెచ్చిపెడుతోంది. అంటే ఆమె పుణ్యస్త్రీగా ముత్తైదువుగా కన్నుమూసి ఆ ఇంటి వారి పాలిట ఇలవేల్పుగా కొలువైపోతుంది. భారతీయ సమాజంలో విధవగా జీవించడం మహిళ ఒక శాపంలా భావిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో భర్తకన్నా ముందుగానే ప్రాణం విడిచివెళ్లిన స్త్రీ ఏకంగా దైవత్వాన్ని సంతరించుకుని ఆయా కుటుంబాల్లో దేవతలుగా కొలువుదీరుతారు. విజయనగరం జిల్లాలోని రాజాం, రేగిడి, వంగర, సంతకవిటి మండలాల్లో వందలాది పల్లెల్లో ఈ ఆచారం ఉంది.పంటపొలాలకు.. పాడిపశువుల నువ్వే అండాదండాఇక్కడ పొలాల్లో, రోడ్లకు ఇరువైపులా కనిపిస్తున్న ఈ చిన్న చిన్న నిర్మాణాలను ఇక్కడి స్థానికులు గుండాలు అని పిలుస్తారు. ఇటువంటి గుండాలు ప్రతీ గ్రామంలో వందల సంఖ్యలో ఉంటాయి. బొమ్మనాయుడువలస, బొద్దూరు, గుళ్ళ సీతారాంపురం, గడ్డి ముడిదాం, ఉణుకూరు, అరసాడ, కాగితాపల్ల వంటి పల్లెల్లో ప్రతి ఇంటికీ ఇలాంటి గుండాలు ఒంటరి.. వారువారు స్థోమతను బట్టి తమ పొలాల్లోను.. కల్లంలోనూ వీటిని నిర్మించి అందులో ఆ మహిళా ఆత్మను ప్రతిష్టించి ఆ గుండంలో ఆమె జీవించి ఉన్నట్లుగా భావిస్తారు. ఆ ఇంట జరిగే శుభ కార్యాల్లో తోలి కబురు ఆమెకే చెబుతారు. గర్భిణీలు.. పెళ్లికూతుళ్ళు కూడా అక్కడకు వెళ్లి దీపం పెట్టి.. నీలాగే గొప్ప ముత్తైదువులా జీవించేలా ఆశీర్వదించాలమ్మా అని ప్రార్థిస్తారు. అంతేకాకుండా పంటపొలాలు.. పాడిపశువులను సైతం ఆ పేరంటాలు కాపాడుతుందని.. వ్యవసాయపనుల సందర్భాల్లో ఎలాంటి ఇబ్బందులు.. ప్రమాదాలు కూడా రాకుండా ఆమె కావలి ఉంటుందని .. ఇంటికి చీడపీడలు.. అనారోగ్యాలు రానివ్వకుండా ఆ పేరంటాలు అడ్డంగా నిలబడుతుందని విశ్వాసంతో ఉంటారు. అందుకే ప్రతి గుండానికి లలితమ్మ పేరంటాలు.. లక్షమ్మ పేరంటాలు.. రాధమ్మ పేరంటాలు అని పేర్లు పెడుతూ మరణించిన తరువాత కూడా తమ భక్తిప్రపత్తులు చాటుకుంటారు. ఈ గ్రామాల్లో వందలాది ఇలాంటి స్మారకాలు ( గుండాలు) కనిపిస్తాయి. వాటికి ఏటా రంగులు వేసి.. చక్కగా ముస్తాబు చేసి అందులో తమ ఇంటి ముత్తైదువను చూసుకుంటారు. ఈరోజుల్లో మహిళలను గౌరవించడం మాట అటుంచి వారికి రక్షణ కూడా లేకుండా పోతున్న పరిస్థితుల్లో ఉండగా వందల ఏళ్ళనుంచీ ఆ పల్లెవాసులు మహిళలకు ఏకంగా దేవతా స్థానం కల్పించి మరణించాక కూడా ఆమెను తమ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చూస్తూ.. ఏటా కొత్తబట్టలు.. పిండి వంటలు.. పళ్ళు ఫలాలు.. సమర్పిస్తారు.. ఇది కదా అసలైన మహిళా సాధికారత.. ఇది కదా మహిళలకు అసలైన గౌరవం..-సిమ్మాదిరప్పన్న. -
కష్టాన్నే నమ్ముకోవాలి
హాస్యచతురత.. సమయస్ఫూర్తి అని గూగుల్ చేస్తే సుమ కనకాల అని వస్తుందేమో! అందుకే ఇన్నేళ్లయినా ఆమె యాంకరింగ్‌కి ఆదరణ తగ్గలేదు.. తన పేరుతోనే షోలకు ఫాలోయింగ్‌ని పెంచే స్థాయికి చేరుకుంది.. ఆ తరం నుంచి ఈ తరం దాకా అందరికీ అభిమాన హోస్ట్‌గా మారిపోయింది..ఇంటర్నేషనల్ విమెన్స్ డే ఉత్సవాన ఆమె గురించి ఆమె మాటల్లోనే..‘నేను పుట్టింది కేరళలోని పాలక్కాడ్‌లో. పెరిగింది మాత్రం హైదరాబాద్‌లోనే. అందుకే చిన్నప్పటి నుంచీ తెలుగు తెలుసు. మెట్టుగూడ రైల్వేక్వార్టర్స్‌లో ఉండేవాళ్ళం. తార్నాకలోని సెయింట్ ఆన్స్ హైస్కూల్లో చదివాను. రైల్వే డిగ్రీ కాలేజ్‌లో గ్రాడ్యుయేషన్ చేశాను. తెలుగులో ఫ్లుయెన్సీ ఉండాలని మా అమ్మగారు పట్టుబట్టడం వల్ల స్కూల్లో తెలుగును సెకండ్ లాంగ్వేజ్‌గా తీసుకున్నాను. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత రైటర్స్, డైరెక్టర్స్ ద్వారా కొంత తెలుగు నేర్చుకున్నాను. తెలుగుమీద నాకు పూర్తి పట్టు రావడంలో నా భర్త రాజీవ్ హెల్ప్ కూడా ఉంది. పుట్టింట్లో ఉన్నప్పుడు మాత్రమే మలయాళం .. మిగతా అంతా తెలుగే!దూరదర్శన్ మాత్రమే.. ఈ ఫీల్డ్‌లోకి చిత్రంగా వచ్చాను. నేను చేసిన ఓ డాన్స్ప్రోగ్రామ్ నచ్చి, దూరదర్శన్ సీరియల్స్ అసిస్టెంట్ డైరెక్టర్ ఉమామహేశ్వరరావు గారు ఫోన్ చేశారు.. ‘ప్రదీప్ గారి డైరెక్షన్‌లోని ఓ సీరియల్లో మమ్మల్ని కాస్ట్ చేయాలనుకుంటున్నాం.. మీకు ఇంట్రెస్ట్ ఉందా?’ అంటూ! నాకు లేదు కానీ మా పేరెంట్స్ సరదాపడ్డారు. దాంతో ఓకే అన్నాను. అలా తెలుగు టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టాను. అప్పుడు దూరదర్శన్ చానల్ మాత్రమే ఉండేది. అందులో ఎక్కువగా సింగిల్ ఎపిసోడ్సే ఉండేవి. అందుకనే నేను సింగిల్ ఎపిసోడ్స్‌లోనే ఎక్కువగా చేశాను. కొన్ని సినిమా బేస్డ్ప్రోగ్రామ్స్కి యాంకరింగ్ కూడా చేశాను. శాటిలైట్ చానల్స్ స్టార్ట్ అవగానే పూర్తిగా యాంకరింగ్‌కి షిఫ్ట్ అయిపోయాను. ‘అంత్యాక్షరి’, ‘వన్స్ మోర్’ నుంచి ‘అవాక్కయ్యారా’,‘స్టార్ మహిళ’ లాంటి ఎన్నో షోస్‌ని హోస్ట్ చేశాను. ‘స్టార్ మహిళ’ నేను మరచిపోలేని షో. దాదాపు 12 సంవత్సరాలపాటు అయిదు వేల షోస్ చేసి లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాను. ఆ షోతో ఎంతో మంది మహిళలు తమ వ్యక్తిత్వాలతో నన్ను ఇన్స్పైర్ చేశారు. సొంత మనిషిలా ఆదరించారు. అవకాశముంటే మళ్లీ ఆ షో చేయాలనుకుంటున్నాను. తెలుగువారితో ఆ అనుబంధం రోజురోజుకీ బలపడుతోంది. జీన్స్, క్యాష్.. ఇప్పుడు ‘సుమ అడ్డా’ప్రోగ్రామ్స్‌కి దొరుకుతున్న ఆదరణే అందుకు సాక్ష్యం. ఇప్పుడు.. నా యూట్యూబ్ చానల్లో ‘చాట్ షో’ని స్టార్ట్ చేశాను. అలాగే ‘షెఫ్ మంత్ర’ అనే కొత్త షో కూడా మొదలైంది. ‘ప్రేమంటే’ అనే ఒక సినిమాలో కీ రోల్ చేస్తున్నాను. దేవాలయాల మీద ‘అవర్ టెంపుల్స్’ అనే సిరీస్ చేయాలి అనుకుంటున్నాను. టాలెంట్‌కి ఆకాశమే హద్దు. ఒక రీల్ షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే చాలు.. వైరల్ అయిపోవచ్చు. ఫోన్లలో రీల్స్‌తో ఎంటర్టైన్ అవుతున్న కాలం ఇది. కాబట్టి అందులో కూడా నా ఎంటర్టైన్మెంట్ పోర్షన్‌ను అందిస్తున్నాను. లీజర్టైమ్ దొరికితే.. వెబ్ సిరీస్, మూవీస్ చూస్తాను.నాకు అత్యంత మెమరబుల్ మూమెంట్ నా పిల్లలే! ప్రొఫెషన్‌కి సంబంధించి అయితే .. నంది అవార్డ్ తీసుకోవడం! సామాజిక బాధ్యతనూ పంచుకునేందుకు మహిళల ఆరోగ్యం, సాధికారత, అలాగే ట్రాఫికింగ్ నుంచి బయటపడ్డ అమ్మాయిల స్వావలంబన, పిల్లల ఆరోగ్యం గురించి పనిచేసే ‘ఫెస్టివల్స్ ఫర్ జాయ్’ అనే ఎన్జీవోను మూడేళ్ల కిందట స్టార్ట్ చేశాను. భవిష్యత్‌లో మరికొన్నిప్రాజెక్ట్స్ చేపట్టాలని ప్లాన్ చేస్తున్నాం. నేను నమ్మేదొక్కటే.. కష్టాన్ని నమ్ముకుంటే అవకాశాల తలుపులు తెరుచుకుంటాయి. అప్పుడు అందరూ అందరికీ ఇన్స్పిరేషన్గా నిలుస్తారు’ అంటూ ముగించారు సుమ కనకాల. బహుభాషలతో ప్రయోజనంయాంకరింగ్ పర్సనల్ క్యారెక్టర్‌కి ప్రతిబింబం లాంటిది. ఈ విషయంలో నాకున్న జోవియల్ నేచర్, సమయస్ఫూర్తి చాలా హెల్ప్ అయ్యాయి. దాంతోపాటు నాకు బహుభాషలు తెలిసుండటమూ ప్లస్ పాయింట్ అయింది. మాతృభాష మలయాళం అవడం, తమిళ్, హిందీ కూడా వచ్చి ఉండటం, ఇంగ్లిష్ లో ఫ్లుయెన్సీ వల్ల.. ఏవైనా అవార్డ్ ఫంక్షన్స్‌కి రెండు, మూడు భాషల వాళ్ళు వచ్చినప్పుడు కమ్యూనికేట్ చేయడం, వాళ్ల సినిమాల గురించి మాట్లాడటం చాలా ఈజీ అయిపోతోంది.ప్రొఫెషన్లో ఎదురయ్యే సవాళ్ళను సమయస్ఫూర్తితోనే నెగ్గుకొస్తాను. నావి ఎక్కువగా లైవ్ షోసే కాబట్టి ఎడిటింగ్‌కి స్కోప్ ఉండదు. నాకు నేనే ఎడిటర్‌గా వ్యవహరించుకోవాలి. ఆచితూచి మాట్లాడాలి. నేను నటించిన సీరియల్స్, సినిమాలు నాకు చాలా నేర్పించాయి. ఈప్రొఫెషన్కు చక్కటి బాట వేశాయి. మా అత్తగారివైపు అందరూ ఇదే ఫీల్డ్‌కు చెందిన వాళ్లవడం నాకు కలిసొచ్చింది. వర్క్, లైఫ్ బ్యాలెన్స్ సాధ్యమైంది. మా ఇంట్లో నా షోస్‌కు బిగ్గెస్ట్ ఫ్యాన్స్.. మా అత్తగారు, మా అమ్మగారు. – శిరీష చల్లపల్లి -
లీడర్షిప్ కావాలి
నేను ఐపీఎస్ జాయిన్ అయినప్పుడు అంటే 1995లో పోలీస్ డిపార్ట్మెంట్లో రెండు లేదా మూడు శాతం మాత్రమే మహిళలు ఉండేవారు. ఐపీఎస్ క్యాడర్లో ఇంకా తక్కువ.. ఎంతంటే నేను ఏ పోస్ట్‌కి వెళ్లినా ఆ పోస్ట్‌లో ఫస్ట్ ఉమన్‌ని నేనే అయ్యేంత! కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. మా బ్యాచ్‌లో పదమూడు మంది మహిళలం ఉంటే ఇప్పుడు 60 మంది వరకూ ఉంటున్నారు. ఇంతకుముందు పోలీసులు అంటే కేవలం పురుషులే అన్న ఇమేజ్ ఉండేది. ఇప్పుడది మారిపోయింది. డిపార్ట్మెంట్లోని అన్ని స్థాయుల్లోకి మహిళలు వస్తున్నారు. తెలంగాణలో 33 శాతం రిజర్వేషన్ కల్పించింది ప్రభుత్వం. దాంతో మహిళల సంఖ్య పెరుగుతోంది. అందుకే ఇప్పుడు పోలీస్ అంటే మహిళలు కూడా అనే ఇమేజ్ స్థిరపడిపోయింది. పోలీస్ స్టేషన్స్‌లో సౌకర్యాలూ విమెన్ ఫ్రెండ్లీగా మారుతున్నాయి. తెలంగాణనే తీసుకుంటే.. ప్రతి స్టేషన్లో మహిళల కోసం సపరేట్ వాష్ రూమ్స్‌ని కట్టించాం. కొన్ని జిల్లాల్లో అయితే బేబీ కేర్ సెంటర్స్‌ని కూడా ఏర్పాటు చేశాం. ఈ మధ్య సైబరాబాద్ కమిషనరేట్‌లో కూడా బేబీ కేర్ సెంటర్‌ను పెట్టారు. ఇదివరకు బందోబస్త్‌లు, గణేశ్ నిమజ్జనానికి మహిళా పోలీస్‌లు డ్యూటీకి వెళితే వాష్‌రూమ్స్ ఉండక చాలా అవస్థపడాల్సి వచ్చేది. ఇప్పుడు మొబైల్ వాష్‌రూమ్స్ సౌకర్యం వచ్చింది. ఎక్కడ బందోబస్త్ ఉంటే అక్కడికి ఈ మొబైల్ వాష్‌రూమ్‌ని పంపిస్తున్నారు. ఇలా మహిళలు చక్కగా పనిచేసుకోవడానికి అనుగుణమైన వసతులు ఏర్పాటవుతున్నాయంటే మహిళల పనికి గుర్తింపు, డిమాండ్ వచ్చినట్టే కదా!దృష్టి పెడతారు.. ఏ రంగంలో అయినా ఎంతమంది మహిళలు వస్తే అంత వేగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. మొత్తం వ్యవస్థలోనే విమెన్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఏర్పడుతుంది. అంతేకాదు లీడర్షిప్ రోల్స్‌ని పొందే అవకాశం వస్తుంది. లీడర్షిప్ రోల్స్‌లో మహిళలు ఉంటే స్త్రీల అవసరాల మీద దృష్టిపెడతారు. సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయి.చెప్పుకోదగ్గదే కానీ.. మహిళా సాధికారత సాధించాలంటే ముందు స్త్రీల హక్కుల గురించి స్త్రీలతోపాటు సమాజమూ తెలుసుకోవాలి. స్త్రీ సెకండ్ సిటిజన్ కాదు.. తోటి ΄ûరురాలే అన్న స్పృహ రావాలి. అది ఇంటినుంచే మొదలవ్వాలి. నన్ను మా బ్రదర్‌తో సమానంగా చదివిస్తేనే కదా నా ఐపీఎస్ కల సాధ్యమైంది. అలా కొడుకైనా కూతురైనా ఇద్దరూ సమానమే.. హక్కులు, అవకాశాలు ఇద్దరికీ సమానమే అనే భావన పేరెంటింగ్‌లో కనిపించాలి. తర్వాత స్కూల్లో టీచింగ్‌లోనూ భాగం కావాలి. అప్పుడే అది సమాజంలో రిఫ్లెక్ట్ అవుతుంది. స్త్రీల పట్ల గౌరవం పెరుగుతుంది. ఆడపిల్లలు చదువును నిర్లక్ష్యం చేయకూడదు. ఆర్థికస్వాతంత్య్రానికి అదే మెట్టు! కాబట్టి అమ్మాయిలు అందరూ చదువు మీద దృష్టిపెట్టాలి. ఎలాంటి టాస్క్లకైనా సిద్ధమే! ఏ రంగంలో అయినా మహిళలు శారీరక శ్రమలో కానీ.. బుద్ధికుశలతలో కానీ పురుషులతో సమంగా ఉంటున్నారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా! మహిళలు కదా అని తేలికపాటి టాస్క్‌లు ఇవ్వడం ఉండదు. కీలకమైన బాధ్యతలనూ అప్పగిస్తారు. నన్నే తీసుకుంటే నేను మావోయిస్ట్ ఏరియాల్లో కూడా పని చేశాను. కాబట్టి మహిళలకు సమాన అవకాశాలే ఉన్నాయి.. ఉంటాయి.. ఉండాలి కూడా!– సరస్వతి రమ -
శ్రమతోనే సక్సెస్
పూసర్ల వెంకట సింధు... ఒలింపిక్స్‌లో పతకాలు సాధించింది.కామన్వెల్త్... వరల్డ్ చాంపియన్‌షిప్‌లలో స్వర్ణాలు సొంతం చేసుకుంది.ప్రపంచవేదికల మీద దేశ పతాకాన్ని సగర్వంగా ఎగురవేసింది.భారత మాత మెడలో పతకాల హారం వేసి బంగారు సింధు అయింది.ఈ ఏడాది మహిళాదినోత్సవాన్ని శ్రీమతి సింధుగా వేడుక చేసుకుంటోంది.సాధికారత దిశగా పయనిస్తున్న మహిళలకు అభినందనలు చెప్పింది.ఈ తరంలో మహిళలు బిజినెస్, స్పోర్ట్స్‌తోపాటు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. కేవలం తమకు తాము నిలదొక్కుకోవడంతో సరిపెట్టడం లేదు, ఆ రంగంలో నంబర్ వన్‌గా నిలవడానికి శ్రమిస్తున్నారు. నంబర్ వన్ లక్ష్యాన్ని సాధిస్తున్నారు కూడా. ఈ స్ఫూర్తిని, ఇదే పంథాను కొనసాగించాలని అభిలషిస్తున్నాను. సక్సెస్‌కు దారి! ప్రతి ఒక్కరూ తమ కోసం తాము కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. వాటిని చేరుకోవడానికి తగినంత శ్రమించాలి. సక్సెస్ అనే లక్ష్యాన్ని చేరడానికి ఉన్న ఏకైక దారి హార్డ్‌వర్క్. హార్డ్‌వర్క్‌తో మాత్రమే విజయానికి చేరువ కాగలుగుతాం. అది కూడా ఒక నెల శ్రమతోనో ఏడాది శ్రమతోనో శిఖరాన్ని చేరాలని ఆశించకూడదు. కొన్నేళ్ల కఠోరశ్రమ, అంకితభావంతో శ్రమించినప్పుడే సక్సెస్ మనదవుతుంది. అయితే కొందరికి సక్సెస్ కొంత త్వరగా రావచ్చు, మరికొందరికి ఆలస్యం కావచ్చు. మన మీద మనం నమ్మకాన్ని కోల్పోకూడదు. ఆశను వదులుకోకూడదు, నిరాశపడకూడదు. మనం మనవంతుగా శ్రమిస్తూ ఉండాలి. సక్సెస్ వచ్చినప్పటి నుంచి మరింత బాధ్యతగా పని చేయాలి. సక్సెస్ అనే శిఖరాన్ని చేరాం అని రిలాక్స్ కాకూడదు. నంబర్ వన్‌కి చేరడానికి నేనలాగే కష్టపడ్డాను, కష్టపడుతూనే ఉంటాను కూడా. అమ్మానాన్న... భర్త! ఇప్పటి వరకు నన్ను, నా ఆర్థిక వ్యవహారాలను అమ్మానాన్న చూసుకునేవారు. టోర్నమెంట్‌కి తోడుగా నాన్న వచ్చేవారు. ఇప్పుడు మా వారు వస్తున్నారు. నా గురించి అన్నీ వాళ్లే చూసుకుంటారు. నా ఫోకస్ అంతా ఆట మీదనే కేంద్రీకరించడానికి తగిన వెసులుబాటునిస్తున్నారు. పేరెంట్స్ నడిపించాలి! దేశానికి కొత్తతరం క్రీడాకారులు తయారు కావాలి. క్రీడాకారులను తయారు చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. పిల్లలకు స్పోర్ట్స్ మీద ఆసక్తి ఉన్నప్పటికీ తల్లిదండ్రుల సహకారం లేకపోతే క్రీడాకారులు తయారుకారు. పిల్లలను క్రీడల దిశగా నడిపించడం పేరెంట్స్ చేతిలోనే ఉంటుంది. ఆటలు, చదువు రెండూ కీలకమే. రెండింటినీ ఎలా బాలెన్స్ చేసుకోవాలో నేర్పించగలిగింది కూడా పేరెంట్సేనని నా అభి్రపాయం. పేరెంట్స్‌కి కోరిక ఉన్నప్పటికీ పిల్లలకు ఆడాలనే ఆసక్తి లేకపోతే ఆ పిల్లలు దీర్ఘకాలం కొనసాగడం కష్టం. అలాగే ఆటల పట్ల ఆసక్తి ఉన్న పిల్లలకు పేరెంట్స్ సహకారం లేకపోతే తొలి అడుగు కూడా పడదు. అందుకే తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యం.సింధుగానే గుర్తించాలి! సమాజం నన్ను సింధుగానే గుర్తించాలి. ‘పీవీ సింధు’ అనగానే చేతిలో రాకెట్‌తో నా రూపం కళ్ల ముందు మెదులుతుంది. అలా నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాను. దేశం కోసం ఆడగలిగే స్థాయికి చేరాను. దేశం కోసం ఆడాను. దేశానికి ఎన్నో పతకాలను సాధించాను. దేశానికి గౌరవాన్ని పెంచడంలో నా శ్రమ కూడా ఉందని సంతోషపడుతున్నాను. ఈ గుర్తింపు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
సమతుల్యత సాధించాలి
‘‘ఏ రంగంలోనైనా నాయకత్వం వహించడానికి దూరదృష్టి, కొత్త ఆవిష్కరణలపై అవిశ్రాంత కృషి అవసరం. సాంకేతికతంగా వస్తున్న మార్పులను అమలు చేయడంలో, టీమ్ వర్క్‌ను బలోపేతం చేయడంలో ముందుండాలి. బలమైన నాయకులుగా ఉండాలంటే పనిలో నైపుణ్యాలతో పాటు వైవిధ్యాన్నీ పెంపొందించాలి. సక్సెస్ ఉద్దేశం ఒక్కరమే ఎదగడం కాదు, అర్థవంతమైన మార్పుతో మనతోపాటు ఉన్నవారితో కలిసి నడవడం.సమతుల్యం చేయడంలోనే సవాళ్లువైద్య రంగంలో మహిళలు అతిపెద్ద కీలక పాత్ర పోషిస్తున్నారు. అయినప్పటికీ నిత్యం సవాళ్లను ఎదుర్కొంటూనే ఉన్నారు. వృత్తిపరంగా ఎదగడంలోనూ, వ్యక్తిగత బాధ్యతలతో బాలెన్స్ చేయడం అనేది అతిపెద్ద అడ్డంకిగా మారింది. కెరీర్– ఇల్లు రెండింటినీ సమర్థంగా నిర్వహించడానికి సమాజం ఇప్పటికీ మహిళలపై చెప్పలేనన్ని అంచనాలను ఉంచుతోంది. రెండుచోట్లా మహిళలు అభివృద్ధి చెందడానికి వీలు కల్పించే వాతావరణం ఉండాలి. అలా లేకపోవడంతో ‘ఆమె సమర్ధత’కు ప్రతిబంధకాలు ఏర్పడుతున్నాయి. మన సమాజంలో మరొక సవాల్ లోతుగా పాతుకుపోయిన లింగ వివక్ష. నాయకత్వ అవకాశాలను పరిమితం చేసేది ఇదే.నాయకత్వం జెండర్‌తో కాదు సామర్థ్యం వల్లే సాధ్యం అని నిరూపించడానికి మహిళ మరింత కష్టపడి పనిచేయాలి. మహిళల అభివృద్ధి నుండి మహిళల నేతృత్వంలోని అభివృద్ధికి మరింత చురుగ్గా వ్యవహరించాలి. డెసిషన్ మేకర్స్ జాబితాలో ఎక్కువ మంది మహిళలకు స్థానం ఉండేలా చూసుకోవాలి. మిగతావాటికన్నా వైద్యరంగం భిన్నమైనది, లోతైనది కూడా. ఎందుకంటే ఇక్కడప్రాణాలను కాపాడటం, ఆరోగ్య ఫలితాలలో మంచి మార్పులు తీసుకురావడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. టెక్నాలజీని అందిపుచ్చుకోవడం, సరిహద్దులను దాటి ఆలోచించడం, యథాతథ స్థితి కొనసాగేలా టీమ్స్‌ను ప్రోత్సహించడం... వంటివి వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలో మనల్ని ముందు ఉంచుతుంది.నెట్‌వర్క్‌ను నిర్మించుకోవాలిసాధారణంగా మహిళలు రిస్క్ తీసుకొని, తమ స్థానాన్ని సాధించేందుకు వెనకాడతారు. మీ ముందు చూపును, అంతర్దృష్టిని నమ్మండి. బలమైన మద్దతునిచ్చే నెట్‌వర్క్‌ను నిర్మించుకోండి. విజయం ఎప్పుడూ ఒంటరి ప్రయాణం కాదు. మిమ్మల్ని సవాలు చేసేవారు, మార్గదర్శకులు, సహచరులు, టీమ్స్‌తో ముందుకు కదలాలి. నేర్చుకోవడాన్ని ఎప్పుడూ ఆపవద్దు. సవాళ్లను సోపానక్రమాలుగా స్వీకరించాలి. ప్రతి అడ్డంకిని నూతనంగా ఆవిష్కరించడానికి, అభివృద్ధి చెందడానికి ఒక అవకాశం అనుకోవాలి. మహిళా వ్యవస్థాపకులు పరిశ్రమలను రూపొందిస్తున్నారు, ఇది మన సమయం అని గుర్తించండి’’ అంటూ మహిళాభ్యున్నతికి మార్గదర్శకం చేస్తున్నారు డాక్టర్ సంగీతారెడ్డి. మార్పులు తప్పనిసరిరోల్ మోడల్స్ మార్గదర్శకత్వంతో పాటు అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు వెళ్లాలి. వ్యవస్థాగత అడ్డంకులను పరిష్కరించాలి. పనిప్రదేశంలో సమాన వేతనం, నిష్పాక్షికమైన కెరీర్ పురోగతికి మద్దతు ఇవ్వాలి. ముఖ్యంగా, మహిళల అభివృద్ధి నుండి మహిళల నేతృత్వంలోని అభివృద్ధికి మారాలి. మహిళలు ఆరోగ్య సంరక్షణలో పాల్గొనేవారు మాత్రమే కాదు, భవిష్యత్తుకు చురుకైన రూపశిల్పులుగా మారాలి.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
Womens Day 2025: సృష్టికి మూలం ఆమె..! కనీసం ఈ రోజున..
అంతర్జాతీయ మహిళా దినోత్సవం మూలాలు 20వ శతాబ్దం ప్రారంభంలో గుర్తించారు. 1900 సంవత్సరం ప్రారంభ కాలంలో కార్మిక ఉద్యమాలు, సోషలిస్ట్ క్రియాశీలత ముఖ్యమైన పాత్ర పోషించాయి . అమెరికాలో సోషలిస్ట్ పార్టీ ఫిబ్రవరి 28, 1909న జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించింది. 1910లో కాపెన్హాగన్లో జరిగిన అంతర్జాతీయ సోషలిస్ట్ మహిళల సమావేశంలో " క్లారా జెట్కిన్ " అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆలోచనను ప్రతిపాదించారు. 1911లో తొలి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 19న అనేక యూరోపియన్ దేశాలలో నిర్వహించారు. 1917 సంవత్సరం ఫిబ్రవరి 23 న, రష్యా లో మహిళలు " ఆహారం, శాంతి" ( బ్రెడ్ అండ్ పీస్ ) కోసం సమ్మెకు వెళ్ళారు. రష్యన్ విప్లవానికి దోహదపడిన ఈ సంఘటన అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా మారింది. అలా ఏటా మార్చి8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించారు.భారతదేశంలో మహిళా సామాజిక సంస్కర్తలు సావిత్రిబాయి ఫూలే , దుర్గాబాయి దేశ్ ముఖ్ లు సామాజిక అన్యాయాలకు వ్యతిరేకంగా చురుకుగా ప్రచారం చేసారు. మహిళల విద్య , బాల్య వివాహలు నిరోధించడం, వితంతువులకు ఆశ్రయం, అట్టడుగు వర్గాలను శక్తిమంతం చేయడానికి పనిచేసారు.ఐక్యరాజ్యసమితి 1975 నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించింది. దీన్ని ప్రపంచ దేశాలన్నీ గుర్తించేలా ప్రోత్సహించింది. ఈ దినోత్సవం మహిళలు తమ లక్ష్యాలను సాధించడానికి, వారి హక్కుల కోసం పోరాడటానికి సమాజంలో నాయకత్వ పాత్రలను చేపట్టడానికి ప్రేరణ, ప్రోత్సాహాన్ని అందించింది.దేశాల వారిగా మహిళల శాతం..ఇవాళ ప్రపంచ జనాభా 810 కోట్లు . ప్రపంచ జనాభా లో 50.30% పురుషులు , 49. 70% మహిళలు. హాంకాంగ్ లో 54. 92 % , లాట్వియా లో 54% , రష్యా లో 54.3%, ఉక్రెయిన్ లో 54% , లిథువేనియా లో 54% మంది చొప్పున ఆయా దేశ జనాభాలో మహిళలు ఉన్నారు.ఖతార్ లో 28.48% , యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో 30.9% , ఒమన్ లో 35.8% , బహ్రెయిన్ లో 38% , సౌదీ అరేబియా లో 43.2% మంది మహిళా జనాభా ఉంది. ప్రపంచవ్యాప్తంగా మహిళలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నప్పటికీ, ఐస్లాండ్, నార్వే, స్వీడన్ వంటి దేశాలు లింగ సమానత్వానికి ప్రసిద్ధి చెందాయి. ఈ దేశాలలో మహిళకు సమాన అవకాశాలు..ఇక్కడ మహిళలకు ఉద్యోగ అవకాశాలు, వేతన సమానత్వం ఎక్కువగా ఉంటాయి. కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలు కూడా మహిళలకు అనుకూలమైన కార్యాలయ వాతావరణాన్ని, ప్రభుత్వ మద్దతును అందిస్తున్నాయి. భారతదేశంలో మహిళలకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నప్పటికీ, లింగ వివక్ష , వేతన అసమానతలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ఐటీ, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, ఆరోగ్య సంరక్షణ, విద్య, స్వయం ఉపాధి వంటి రంగాలలో మహిళలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. ఈ దినోత్సవం ప్రాముఖ్యత..భారతదేశంలో "అంతర్జాతీయ మహిళా దినోత్సవం" అనేక ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నది. అవేంటంటే..మహిళా సాధికారతను ప్రోత్సహించడానికి, వారి హక్కులు సమానత్వం గురించి అవగాహన పెంచడానికి ఒక వేదికగా పనిచేస్తుంది. సైన్స్, రాజకీయాలు, వ్యాపారం, క్రీడలు, కళలు వంటి వివిధ రంగాలలో మహిళల విజయాలను గుర్తించడానికి ఉపయోగపడుతోంది.లింగ సమానత్వం , మహిళలపై హింసను అంతం చేయడం, సమాజంలో వారి సమాన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం వంటి సమస్యలపై దృష్టి సారించడానికి ఇది ఒక అవకాశం. నాయకత్వ పాత్ర పై , విద్య, వాణిజ్య , ఉద్యోగ , ఆరోగ్య, ఉపాధి , ఆర్థిక స్థిరత్వంలో మహిళలను ప్రేరేపించడం, మహిళా సాధికారతను ప్రోత్సహించడం మహిళలు ఎదుర్కొంటున్న గృహ హింస, లైంగిక వేధింపులు మహిళలకు సరిపోని ఆరోగ్య సంరక్షణ , మెరుగైన పని వాతావరణం వంటి సవాళ్ల గురించి ప్రభుత్వం, దృష్టికి తీసుకురావడం ఈ మహిళా దినోత్సవం ప్రధాన ఉద్దేశ్యం.బీజింగ్ డిక్లరేషన్ ప్రకారం ఐక్యరాజ్య సమితి ఈ మహిళా దినోత్సవం 2025ను మహిళలు-బాలికలకు అందరికీ హక్కులు, సమానత్వం, సాధికారత వంటి అంశాల మార్పుకు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శక్తిమంతమైన వేదికగా నిలవాలి ఆకాంక్షిస్తుంది. ఇక ఈ ఏడాది మహిళా దినోత్సవాన్ని .. 'Accelerate Action' అనే థీమ్‌తో నిర్వహిస్తున్నారు. మహిళల పురోగతికి ఉపయోగపడే వ్యూహాలు, వనరులు, చొరవలను గుర్తించి.. వాటిని విస్తృతంగా, వేగంగా అమలు చేయాలనే ఉద్దేశాన్ని ఇది చెబుతోంది. .చివరగా ఈ దినోత్సవం రోజున ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వం ఆర్థిక స్వావలంబన కోసం వివిధ పథకాలను అందిస్తోంది. ఇక కార్పొరేట్లు, స్వచ్ఛంద సంస్థలు, యాజమాన్యాలు మహిళా దినోత్సవం సందర్భంగా అనేక చర్చలు , గోస్టులు, ఆటలు, పాటలు, ఆరోగ్య శిబిరాలు, ప్రతిభ చూపిన మహిళలుకు సన్మాన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాయి. సృష్టికి మూలం అయిన స్త్రీమూర్తులందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. వారికి జేజేలు. వెంకట సూర్య వేణుగోపాల్ నాగుమళ్ల, విశ్రాంత ఆర్ టీసి డిపో మేనేజర్, (చదవండి: మేము సైతం..! ఆటల్లో సత్తా చాటుతున్న నారీమమణులు) -
సాల్ట్ అండ్ పెప్పర్: అందాల ఈ పెళ్లి కూతుర్నిచూసి షాకవ్వకండి!
ఇటీవలికాలంలో వివాహ తీరుతెన్నుల్లో చాలా మార్పులొచ్చాయి. తమ జీవితంలో ముఖ్యమైన క్షణాలను అపురూపంగా దాచుకునేందుకు ఎంతఖర్చుకైనా వెనుకాడని వారు,స్థాయికి మంచి ఖర్చుచేస్తున్నవారు కొందరైతే, అత్యంత సాదాసీదాగా పెళ్లిళ్లు చేసుకొని, కొంత పొమ్మును దాతృత్వ సేవలకు వెచ్చిస్తున్నవారు కొందరు. ఇవన్నీ ఒకెత్తు అయితే, తామెలా ఉన్నా, ఆత్మన్యూనతకు గురికుండా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తున్నారు ఈ తరం జంటలు. ఆత్మస్థైర్యంతో తమ వ్యక్తిత్త్వాన్ని చాటుకుంటున్నారు. పురాతన స్టీరియోటైప్ అభిప్రాయాలనుంచి బయటపడి, సెల్ఫ్ లవ్ అనే కాన్సెప్ట్‌తో ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాంటి ఆసక్తికరమైన వధువు గురించి తెలుసుకుందాం.నల్లగా వున్నా, లావుగా ఉన్నా, తెల్ల జుట్టు ఉన్నా, ఆడవాళ్లకు మీసాలు గడ్డాలు వచ్చినా, మగవాళ్లకు బట్ట తల ఉన్నా.. అదేదో లోపం లాగా ఆత్మన్యూనతతో బాధపడుతూ కూర్చోవడంలేదు. ఎలా ఉన్నా మనల్ని మనల్ని యథాతథంగా స్వీకరించడం, మనల్ని మనం ప్రేమించుకోవడం అవగాహన కూడా పెరుగుతోంది. భారత దేశానికి చెందిన మైత్రి జొన్నల నెరిసి తెల్ల జుట్టుతో ధైర్యంగా పెళ్లి పీటలెక్కి తన వ్యక్తిత్వాన్ని చాటుకుంది. పెళ్లి కూతురు అంటే ఇలాగే ఉండాలి అనే సాంప్రదాయపు గోడల్ని బద్దలు కొట్టింది. సహజ సౌందర్యంతో, ఆనందంగా తన చిరకాల ప్రియుడు పార్త్‌ను గత ఏడాది వివాహం చేసుకుంది. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు తాజాగా నెట్టింట సందడిగా మారాయి.అమ్మనుంచి వచ్చిన గిఫ్ట్ఈ సందర్భంగా మైత్రి సాల్ట్ అండ్ పెప్పర్ జుట్టు తల్లితో తనకున్న అనుబంధాన్ని పంచుకుంది.తన జుట్టు గురించి సిగ్గుపడటం లేదా భయపడటం లేదని వెల్లడించింది. తన తల్లికి కూడా 30 ఏళ్లు వచ్చేసరికి పూర్తిగా బూడిద రంగులోకి మారిపోయిందనీ, ఎవరెన్ని ఉచిత సలహాలిచ్చినా, తన సహజ జుట్టును అలాగే ఉంచుకుందని గుర్తు చేసుకుంది. ఆమే తనకు స్ఫూర్తి అని ఆత్మవిశ్వాసంతో తెలిపింది. View this post on Instagram A post shared by Mythri Jonnala (@mythrijonnala) "నా బూడిద జుట్టు నన్ను భయపెట్టదు, అది నేను నా తల్లి కూతురినని నాకు గుర్తు చేస్తుంది. నా అమ్మ జుట్టు 30 ఏళ్ల నాటికి పూర్తిగా తెల్లగా మారిపోయినా, కానీ ఆమె ఎప్పుడూ వాటికి రంగు వేసుకోలేదు. అలాగే వదిలేసింది. ఉచిత సలహాలను ఎప్పుడూ పట్టించుకోలేదు. అమ్మ ధైర్యమే శక్తినిస్తోంది’’ అని తెలిపింది. మొదట్లో కొన్ని రోజులు నేను సిగ్గు పడ్డాను. కానీ పెళ్లి మాత్రం ఇలాగే చేసుకోవాలను కున్నాఇప్పటివరకు అనుభవించిన అత్యంత అందమైన క్షణాలివే అంటూ సిగ్గుపడింది మైత్రి. మైత్రి జొన్నల బంగారు అంచుతో ఉన్న చక్కటి ఎర్రటి చీరలో అందంగా మెరిసిపోయింది. దీనికి జతగా బంగారు జరీ వర్క్‌తో తయారు చేసిన రెడ్ బ్లౌజ్ ధరించింది. నెక్లెస్, చెవులకు ఝుంకాలు, పాపిట బిళ్ల, అరవంకీ, గాజులుతో లుక్ మరింత ఆకర్షణీయంగా కనిపించేలా జాగ్రత్తపడింది. కాగా మైత్రి తత్వ భోపాల్‌లోని నేషనల్ లా ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ నుండి బీఏ, ఎల్ఎల్బి (ఆనర్స్), సదరన్ కాలిఫోర్నియా యూనివర్సిటీ నుండి బిజినెస్ లా , ఎడిఆర్లో మాస్టర్ ఆఫ్ లాస్‌ను అభ్యసించింది. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ లావాదేవీ సలహాదారుగా పనిచేస్తోంది. -
చెట్లను నరుకుతూ హరితహారాలెందుకు?
సోలాపూర్–ధూళే నేషనల్ హైవేపై సర్వీసు రోడ్డును నిర్మిస్తున్న ఎన్హెచ్ఏ ఓవైపు ‘హరితహారం’ఏర్పాట్లు ..మరోవైపు చెట్ల నరికివేత పనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తుల్జాపూర్ నాక వాసులు సోలాపూర్: ఒకవైపు పట్టణవ్యాప్తంగా ‘హరితహారం’కోసం ఏర్పాట్లు జరుగుతుండగా మరోవైపు తుల్జాపూర్లో అందుకు భిన్నంగా చెట్ల నరికివేత జరుగుతోంది. దీంతో ఎస్ఎంసీ వైఖరి ఏమిటో అంతుబట్టడం లేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సోలాపూర్ – ధూళే నేషనల్ హైవేపై సోలాపూర్– తలే ఇప్పర్గా మార్గంలో నేషనల్ హైవే అథారిటీ సర్వీసు రోడ్డును నిర్మిస్తోంది. ప్రతి ఏడాది తుల్జాపూర్లో జరిగే కోజగిరి పూర్ణిమ వేడుకల కోసం వేలాది భక్తులు ఈ మార్గం గుండానే కాలినడకన ప్రయాణిస్తారు. అలాగే పండరీపూర్‌లో జరిగే ఆషాఢ ఏకాదశి ఉత్సవాల కోసం వేలాది మంది వార్కారీలు, భక్తులు సాధుసంతుల పల్లకీలతో ఇదే మార్గంలో పాదయాత్రగా వెళుతుంటారు. వీరంతా మార్గమధ్యంలో ఈ చెట్లనీడనే సేదతీరతారు. ఇప్పుడా సౌకర్యం ఉండబోదంటూ స్థానికులు ఆవేదన చెందుతున్నారు. కాగా సర్వీసు రోడ్డు పనుల కోసమే చెట్లను నరికివేస్తున్నామని, పూర్తైన అనంతరం తిరిగి మొక్కలు నాటుతామని సోలాపూర్ జాతీయ రహదారుల ప్రాజెక్టు డైరెక్టర్ రాకేష్ జవాడే తెలిపారు. -
వాలుజడతో ఊరికే పేరుతెచ్చారు..! ఆ మహిళలెవరంటే..
ఈ రోజుల్లో జుట్టు పొడవుగా ఉండటం అత్యంత అరుదు. ఏవేవో ఫ్యాషన్లతో భుజాల వరకే ఉండేలా జుట్టు ఫ్రీగా వదిలేయడం ట్రెండ్‌గా మారింది. పైగా లాంగ్ జుట్టు మెయింటైన్ చేయడం మావల్ల కాదని చెప్పేస్తోంది నేటి యువత. అలాంటి ఈ కాలంలో పొడవు జుట్టుతో అందర్నీ ఆకర్షిస్తూ ప్రత్యేకంగా నిలుస్తున్నారు ఈ గ్రామం అమ్మాయిలు. అంతేగాదు ఆ వాలు జడతో తమ ఊరి పేరు వార్తల్లో నిలిచేలా చేశారు. అంతలా ఆ మహిళలందరి జుట్టు ఎలా పొడవుగా ఒత్తుగా ఉంది..? అందుకోసం వాళ్లే ఏం చేస్తారనే సందేహాలు కచ్చితంగా వస్తాయి. అయితే ఆ మహిళలున్న గ్రామంలో కనీస సదుపాయాలేం లేవు. కటిక పేదరికం. కేవలం ఆ పొడవాటి జుట్టు కారణంగా ప్రపంచంలోనే ప్రత్యేకమైన వ్యక్తులుగా నిలబెట్టింది అంతే..మరీ ఆమహిళలెవరు..? ఎక్కడుందా గ్రామం..? ఆ పొడవాటి కురుల సీక్రెట ఏంటి తదితరాల గురించి తెలుసుకుందామా..!.చైనాలోని గుయ్లిన్ నగరానికి వంద కిలోమీటర్ల దూరంలో హుయాంగ్లుయో అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలోని మహిళలు జుట్టే అత్యంత పొడవుగా ఉంటుంది. అలాంటి కురులు కేవలం అమ్మాయిలకే సొంతం కాదు..అమ్మమ్మలు, నానమ్మల వయసులో ఉన్న వారూ కూడా వాలుజడతో హోయలు పోతుంటారట..!.రెడ్ యావో తెగకు చెందిన ఈ మహిళలందరూ పొడవైన ఆరోగ్యకరమైన జుట్టుకి పేరుగాంచినవారు. వీళ్లంతా జుట్టుని పొడవుగా ఉంచుకోవడమే గాక అందంగా అలంకరించుకోవడంలోనూ ముందుంటారు. అయితే పెళ్లి కానీ అమ్మాయిలు స్కార్ఫ్‌తో జుట్టుకి హంగులద్దితే..పెళ్లైన మహిళలు తల ముందు భాగంలో పెద్ద బన్ మాదిరిగా హెయిర్‌స్టైల్ వేసుకుంటారట!. ఆ కురుల సీక్రెట్ ఏంటంటే..రెడ్ యావో మహిళలు తమ శిరోజాల సంరక్షణ కోసం సహజసిద్ధమైన వాటినే ఉపయోగిస్తారట. అదే వారి కేశ సంపద రహస్యమట. ఈ మహిళలంతా లాంగ్షెంగ్ రైస్‌తో తయారు చేసిన ప్రత్యేక షాంపూతో జుట్టుని శుభ్రం చేసుకుంటారట, అలాగే జుట్టుని నది నీటితోనే కడుగుతామని చెబుతున్నారు ఆ తెగ మహిళలు.తమ జుట్టు సంరక్షణలో భాగంగా పులియబెట్టిన బియ్యం నీటిని ఉపయోగిస్తారట. ఆ మహిళలంతా చెక్క దువ్వెనలనే ఉపయోగిస్తారట. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే..80 ఏళ్లకు చేరకున్న ఏ మహిళ జుట్టు కూడా తెల్లబడదట. ఈ చిట్కాల తోపాటు ప్రొటీన్లు అధికంగా ఉండే బీన్స్నూ తరచూ ఆహారంలో తీసుకుంటారట. ఇలా పొడవాటి జుట్టుతో పేరుతెచ్చుకున్నారు ఈ యావో మహిళలు. ఆ ప్రత్యేకతతోనే వారి గ్రామానికి గుర్తింపు కూడా వచ్చింది. గిన్నిస్‌లోనూ చోటు!ఈ యావో మహిళలు తమ పొడవాటి జుట్టుతో ప్రపంచం దృష్టిని ఆకర్షించడమే కాదు.. గిన్నిస్ రికార్డు కూడా సృష్టించారు. రెండేళ్ల క్రితం జరిగిన ‘Longji Long Hair Festival’లో భాగంగా.. గిన్నిస్ రికార్డే లక్ష్యంగా బరిలోకి దిగారు 256 మంది యావో మహిళలు. ఈ క్రమంలో అక్కడి ఓ నదీ తీరానికి చేరుకున్న వీరు.. ఒకరి వెనకాల మరొకరు నిల్చొని చెక్క దువ్వెనలతో తమ జుట్టును దువ్వుతూ.. 456 మీటర్ల (1,496 అడుగుల) మేర పొడవాటి చైన్‌గా ఏర్పడ్డారు. దీంతో ‘లాంగెస్ట్ హెయిర్ కోంబింగ్ చెయిన్’గా ఇది గిన్నిస్ రికార్డులకి ఎక్కింది. అంతేకాదు.. ఇందులో పాల్గొన్న మహిళలంతా ఎరుపు-నలుపు రంగులు కలగలిపి రూపొందించిన సంప్రదాయ దుస్తులు ధరించి.. ‘లాంగ్ హెయిర్ బల్లాడ్’ అంటూ పాటలు పాడుతూ మరీ పాల్గొనడం.. ప్రధాన ఆకర్షణగా నిలిచింది.అయితే ఈ తెగ తమ జీవన విధానాన్ని కాపాడుకోవటానికి చాలా సవాళ్లు ఎదుర్కొంటుంది. పెళ్లికాని స్త్రీ జుట్టును కిందకి వదులుగా ఉండగా ఏ పురుషుడైనా చూస్తే..అతడు ఆమెతో మూడేళ్లు కలిసి ఉండాల్సిందేనట. అయితే ప్రస్తుతం వారు ఆ ఆచారాన్ని పాటించటం లేదట. పర్యాటకుల ముందు తమ జుట్టుని ప్రదర్శించి డబ్బులు సంపాదించి బతుకుతున్నామని ఆ యావో తెగ మహిళలు ఆవేదనగా చెబుతున్నారు. View this post on Instagram A post shared by SheThePeople (@shethepeopletv) (చదవండి: డెన్మార్క్ రాణి 1800ల నాటి అరుదైన కిరీటం..! 140 ఏళ్లుగా..) -
వెక్కిరింపులను లెక్క చేయలే.... కానీ కొట్టాడు వరల్డ్ రికార్డ్!
లావుగా ఉన్నవాళ్లు సన్నగా రివటలా మారాలని ఆరాట పడుతూ ఉంటారు. అలాగే సన్నగా ఉన్నవాళ్లు కాస్తంత బొద్దుగా ఉంటే బావుండు అని నిట్టూరుస్తూ ఉంటారు. ఇక రింగు, రింగులు జుట్టు ఉన్నవాళ్లలో కొంతమంది స్మూత్ అండ్ సిల్కీ హెయిర్ చూసి మురిసిపోతుంటారు. నాకూ అలా ఉంటే బావుండు అని అనుకుంటూ ఉంటారు. ఇది సహజమే కానీ అసహజమైన, వింత సిండ్రోమ్‌తో బాధపడుతున్న భారతీయ బాలుడు తన పరిస్థితి గురించి బాధపడ లేదు..ఆత్మవిశ్వాసంతో గిన్నిస్ టైటిల్‌ను గెలుచుకోవడం విశేషం. ఎవరా బాలుడు? అతనికున్న సిండ్రోమ్ ఏంటి? తెలుసుకుందాం.మధ్యప్రదేశ్‌లోని రత్లాంకు చెందిన లలిత్ పాటిదార్ తనకున్న విపరీతమైన జుట్టుతో బాధపడేవాడు. అవమానపడేవాడు. కానీ దైర్యం కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాడు. ఇపుడు అతని జుట్టే అతడికి రికార్డు తెచ్చి పెట్టింది. చదరపు సెంటీమీటర్‌కు 201.72 వెంట్రుకలతో రికార్డు సృష్టించాడు. హైపర్ట్రికోసిస్ అనే అరుదైన వైద్య పరిస్థితి కారణంగా అతని ముఖంలో 95 శాతానికి పైగా వెంట్రులున్నాయి.మధ్య యుగాల నుండి ప్రపంచవ్యాప్తంగా నమోదైన దాదాపు 50 కేసుల్లో పాటిదార్ కూడా ఒకడని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది.అయితే మొదట్లో తాను సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, ఆ తరువాత అందరూ తనను అర్తం చేసుకున్నారని అన్నాడు. ఇపుడు చాలా మంది దయతో ఉంటారని చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఎవరైనా వెంట్రుకలను తొలగించుకోవాలని సూచించే వారికి ఇది మామూలే..దీని గురించి పెద్దగా పట్టించుకోను అని చెబుతాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వచ్చిన సందర్భంగా మాట్లాడుతూ ‘నేను ఎలా ఉన్నానో అలాగే ఉండటం నాకిష్టం...నా రూపాన్ని మార్చుకోవాలనుకోవడం లేదని’ చెప్పాడు."నాకు మాటలు రావడం లేదు, ఈ గుర్తింపు లభించడం చాలా సంతోషంగా ఉంది కాబట్టి నాకు ఏమి చెప్పాలో తెలియడం లేదు" అంటూ ఆనందం వ్యక్తం చేశాడు. View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords) మధ్యప్రదేశ్‌లోని రత్లాంకు చెందిన లలిత్ పాటిదార్ పుట్టినప్పటి నుండి అరుదైన ''వేర్వోల్ఫ్ సిండ్రోమ్'తో బాధపడుతున్నాడు. 'వేర్వోల్ఫ్ సిండ్రోమ్' లేదా హైపర్ట్రికోసిస్ తల నుండి కాలి వరకు జుట్టు ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితి చాలా అరుదుగా ఉండటం వల్ల మధ్య యుగాల నుండి కేవలం 50 మందికి మాత్రమే ఇది సోకిందట. లలిత్ శరీరం మొత్తం పూర్తిగా జుట్టుతో కప్పబడి ఉంది. లలిత్ పాటిదార్‌ను ఇది చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. స్కూల్లో పిల్లలు ఎగతాళి చేశారు. మంకీ బాయ్ అంటూ మరికొంతమంది ఏడిపించేవారు. "కొరుకుతాడేమో" అని భయపడేవారు. రాళ్ళు విసిరేవారు. మరికొంతమంది హనుమంతుడి అవతారంగా భావించేవారు. లలిత్ తండ్రి రైతు , అతని తల్లి గృహిణి. ప్రస్తుతం, ముఖం 95 శాతానికి పైగా వెంట్రుకలతో నిండిపోయి ఉన్న లలిత్‌కు తల్లితండ్రులు తొలుత గుండు చేయించారు. కానీ పరిస్థితిలో మార్పు లేదు. వైద్యుల దగ్గరికి తీసుకెళ్లారు. దీన్ని హైపర్ట్రైకోసిస్ అంటారని, ప్రస్తుతానికి దీనికి చికిత్స లేదని వైద్యులు చెప్పారు. అయితే వయసు పెరిగిన తరువాత ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవచ్చని చెప్పారు.లలిత్‌కు ఇన్స్టాగ్రామ్, తన యూట్యూబ్ ఛానెల్లో ఫాలోయింగ్‌కు కూడా బాగానే ఉంది. ఇన్‌స్టాలో 2 లక్షల 65 వేలు, యూట్యూబ్‌లో లక్షకు పైగా ఫాలోయర్లున్నారు. ఇటీవల ఇటలీలోని మిలన్ టెలివిజన్ షో లో కనిపించాడు. కుటుంబం ఇస్తున్న మద్దతు, ప్రోత్సాహతో ప్రపంచాన్ని చుట్టి రావాలని భావిస్తున్నాడు. విభిన్న సంస్కృతులను అన్వేషించాలనే కల సాకారం దిశగా సాగుతున్నాడు లలిత్. -
డెన్మార్క్ రాణి 1800ల నాటి అరుదైన కిరీటం..! 140 ఏళ్లుగా..
రాణులు ధరించే ప్రతి ఆభరణానికి ఎంతో చారిత్రక నేపథ్యం ఉంటుంది. తరతరాలుగా ఆ ఆభరణాలను వారసత్వంగా ధరించడం జరుగుతుంది. అయితే ఆ భరణాలు అత్యంత ఖరీదే గాక వాటి వెనుక ఎంతో ఆసక్తికరమైన కథలు ఉంటాయి. వాటి నేపథ్యం చూస్తే నోటమాటరాదు. అన్నేళ్లుగా ఆ ఆభరణాలను తరతరాలుగా భద్రపరచడం చూస్తే..వాటికున్న విలువ, పూర్వకాలం నాటి హస్తకళా నైపుణ్యం భవిష్యత్తు తరాలకు తెలుసుకునే వీలుంటుంది. ప్రస్తుతం ఈ డెన్మార్క్ క్వీన్ ధరించి శోరోభూషణం కూడా అందరీ దృష్టిని ఆకర్షించడమే ఒక్కసారిగా దాని చారిత్రక నేపథ్యం కళ్లముందుకు కదలాడింది. మరీ ఆఇంట్రస్టింగ్ స్టోరీ ఏంటో చూద్దామా..!.డెన్మార్క్రాణి మేరీ ఇటీవల హెల్సింకిలోని ఒక రాష్ట్ర వేడకలో అందరూ మర్చిపోయిన రాజ ఆభరణాన్ని వెలుగులోకి తెచ్చింది. క్వీన్ మేరీ డెన్మార్క్, ఫిన్లాండ్ల మధ్య సన్నిహిత సంబంధాల బలోపేతం చేసుకునేందకు ఏర్పాటు చేసిన వైట్- టై ఈవెంట్లో ఈ శిరో ఆభరణాన్ని(కిరీటం)ధరించింది. ఆమె ధరించి కిరీటం 1839- 1848 కాలం నాటిది. ఆ కాలంలో డెన్మార్క్ రాజప్రతినిధి అయిన క్రిస్టియన్ VIIIని వివాహం చేసుకున్న క్వీన్ కరోలిన అమాలీకి చెందిన బంగారు కీరిటీం. ఈ కిరీటం అత్యంత అరుదైన రత్నాలతో పొదిగి ఉంటుంది. డానిష్ కోర్టు ప్రకారం, 1819-1821లో ఈ జంట ఇటలీ పర్యటన సందర్భంగా ఆ 11 రత్నాలను సేకరించారట. ఆ పర్యటనలో ఈ దంపతులు రోమ్ని సందర్శించి సమీపంలో పాంపీలో జరిపిన పురాతన తవ్వకాల నుంచి వీటిని సేకరించినట్లు డానిష్ కోర్టు పేర్కొంది. ఆసక్తికర కథేంటంటే..ఈ కిరీటం 140 ఏళ్లకు పైగా కనిపించలేదు. రాజ ఖజనాలోనే లాక్ చేసి ఉంచారని డానిష్ కోర్టు ధృవీకరించింది. మళ్లీ ఇన్నేళ్లకు డెన్మార్క్ రాణి మేరీ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌లో జరిగిన వేడుకలో ఆ ఆభరణాన్ని తలకు ధరించింది. ఈ కార్యక్రమం ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్, అతని భార్య సుజాన్ ఇన్నెస్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఇది ఇరు దేశాల సంబంధాలను బలోపేతం చేసుకునే దిశగా జరిగిన ఈవెంట్. ఇక రాయల్ కలెక్షన్లలో తరుచుగా కనిపించే అత్యంత విలాసవంతమైన వస్తువులా కాకుండా రోజువారీ దుస్తులకు సరిపోయేలా ధరించడానికి అనుగుణంగా ఉండేటమే ఈ కిరీటం ప్రత్యేకతట. (చదవండి: ‘ఆడపిల్లనమ్మా..’ పాటతో పాపులర్ అయిన సింగర్ మధుప్రియ జర్నీ..!) -
‘శ్రీ విశ్వశాంతి’ : చేతిలో చిల్లిగవ్వ లేకుండానే కల సాకారం!
‘నీ దగ్గర ఏముంది?’ అనే ప్రశ్నకు తిరుగులేని జవాబు... ‘నా దగ్గర కల ఉంది!’ఆ కలే చేతిలో చిల్లిగవ్వ లేని ఎంతోమందిని విశ్వ విజేతలను చేసింది.‘శ్రీ విశ్వశాంతి’ కల కూడా అలాంటిదే. కొన్ని దశాబ్దాల క్రితం... పేదింటి బిడ్డ మాదల సుబ్రహ్మణ్యేశ్వరరావు కన్న కల... శ్రీ విశ్వశాంతి. రవీంద్రుడి ‘విశ్వభారతి’లాంటి విలువైన కల అది. ‘ప్రపంచమంతా ఒకే గూడులో’ అనే నినాదం పునాదిపై ఏర్పాటైన ‘విశ్వభారతి’ తనకు స్ఫూర్తి. ఆరుగురు విద్యార్థులతో మొదలైన విశ్వశాంతి గ్రామీణ విశ్వవిద్యాలయం స్థాయికి ఎదిగింది. 16 రాష్ట్రాలకు చెందిన 6,500 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. ఆ విజయ ప్రస్థానం మాదల సుబ్రహ్మణ్యేశ్వరరావు మాటల్లోనే...కృష్ణా జిల్లా ఉయ్యూరు సమీపంలోని గండిగుంట గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన నా దగ్గర కరెన్సీ నోట్లు లేవు. కల మాత్రమే ఉంది. అయినా సరే, చిన్న గుడిసెలో ‘శ్రీ విశ్వశాంతి పాఠశాల ప్రారంభించాను. ఆరుగురు విద్యార్థులతో మొదలైన ఆ పాఠశాల ‘ఇంతింతై వటుడింతై...’ అన్నట్లుగా ఎదిగిపోయింది. బలమైన విద్యా వ్యవస్థగా నిర్మాణం అయిన ‘శ్రీ విశ్వశాంతి గ్రామీణ విశ్వ విద్యాలయం’ గోల్డెన్ జూబ్లీ వేడుకలకు ముస్తాబైంది.ఆరోజుల్లో...నేను, మా ఆవిడ ప్రమీలారాణి టీచర్లుగా పనిచేసేవాళ్లం. మా నెల జీతం నూట ఇరవై రూపాయలు. ‘మేము కొత్త స్కూలు స్టార్ట్ చేయాలనుకుంటున్నాం’ అని చెప్పినప్పుడు విన్నవారు ‘ఎందుకొచ్చిన రిస్కు...వచ్చిన జీతంతో సర్దుకు పోకుండా’ అని సలహా ఇస్తారేమో?...ఇలాంటి సందేహాలు ఎన్నో వచ్చాయి.‘చాలా విజయాలు భద్ర జీవితాల్లోనే ఆగిపోతాయట!’ అనే మాట గుర్తుకు వచ్చింది. ‘నాకు ఇక్కడ సుఖంగానే ఉంది కదా... రిస్కు తీసుకోవడం ఎందుకు’ అనుకునే చాలామందిలో నేను ఉండపోదల్చుకో లేదు. నాకు ఇష్టమైన నాయకుడు జవహర్లాల్ నెహ్రు. ఆ మహనీయుడు చెప్పిన విలువైన మాట – ‘అజ్ఞానం అనేది ఎప్పుడూ మార్పుకు భయపడుతుంది’ అయితే నేను మార్పుకు భయపడే రకం కాదు. అందుకే ధైర్యంగా నా కలకు శ్రీకారం చుట్టాను. 1975 ఫిబ్రవరి 22న ఉయ్యూరు పట్ట ణంలో ఒక తాటాకు ΄ పాకలో ‘శ్రీ విశ్వశాంతి’ పాఠశాలను ప్రారంభించాం.‘ఎంతో ఊహిస్తే ఆరుగురు విద్యార్థులేనా!’ అని మేము నిరాశపడిపోలేదు. ‘ఈరోజు ఆరుగురు...రేపు నూరు మంది’ అనుకున్నాము. అది వృథా పోలేదు. మరుసటి ఏడాది నుంచే హాస్టల్‌ను కూడ ప్రారంభించాము. అక్కడ మొదలైన ప్రస్థానం ప్రస్తుతం ఉయ్యూరు (గండిగుంట) పరిధిలో సువిశాలమైన 80 ఎకరాల విస్తీర్ణంలో అధునాతన భవన సముదాయంతో విస్తరించింది. స్టేట్, సీబీఎస్ఈ సిలబస్ అందుబాటులో ఉంది. ఎల్కేజీ నుంచి ప్లస్ 2 వరకూ విద్యాబోధన అందిస్తున్నాం. ‘మాదల ప్రమీలారాణి మెమోరియల్ జూనియర్ కళాశాల’ ఏర్పాటు చేశాం. దేశంలోని 16 రాష్ట్రాలకు చెందిన 6500 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. మా గ్రామీణ యూనివర్శిటీపై ప్రత్యక్షంగా 768 మంది కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. ఆరుగురితో మొదలైన విద్యాసంస్థ అందనంత ఎత్తు ఎదగడానికి కారణం ఏమిటి? ‘మన ఆదర్శాలు, అంకితభావాన్ని మరచిపోయినప్పుడు మాత్రమే అపజయం ఎదురవుతుంది’ అంటారు నెహ్రు. పేద విద్యార్థులకు అండగా ఉండాలి అనే ఆదర్శాన్ని, సంస్థ కోసం క్షణక్షణం కష్టపడాలి అనే అంకితభావానికి నేను ఎప్పుడూ దూరం కాలేదు. అదే శ్రీ విశ్వశాంతి విజయ రహస్యం. ‘శ్రీ విశ్వశాంతి ‘గుడ్‌విల్’కు గుడ్ ఎగ్జాంపుల్‌గా నిలిచినా ‘పక్కా కమర్షియల్’ దారిలోకి ఎప్పుడూ వెళ్లలేదు. ఏ ప్రాంతంలో ప్రాంరంభమైందో ఆ ప్రాంతంలోనే పెరిగి, పెద్దై వటవృక్షమై ఎంతోమంది విద్యార్థులు, ఉద్యోగులకు నీడను ఇస్తోంది. విద్యాసంస్థ ఏర్పాటు చేసిన నాటి నుంచి సింగిల్ బ్రాంచ్గానే నడుపుతున్నాం. సేవాపథంలో...గ్రామీణ విద్యార్థులకు ఆర్థిక భారం తగ్గించి చేయూతఅందించాలనేది మాదల ప్రమీలారాణి కోరిక. ఆమె కోరిక మేరకు ఏటా 300 మందికి పైగా విద్యార్థులకు ఫీజు రాయితీ ఇస్తున్నారు. ఎన్నో రకాల సామాజిక సేవా కార్యక్రమాలను శ్రీ విశ్వశాంతి నిర్వహిస్తోంది. ‘50వ వసంతంలోకి అడుగుపెట్టిన వేళ అంతర్జాతీయ ప్రమాణాలు, అన్ని రకాల వసతులు, సౌకర్యాల కల్పనతో విద్య అందించటం కోసం పాటుపడుతున్నాం. కుమారులు, కోడళ్లు అంతా పాఠశాలలోనే ఉంటూ విద్యా ప్రగతిలో భాగస్వాములు అవుతూ ఉన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు చక్కగా చదివితే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. తద్వారా దేశ ప్రగతి సాధ్యమవుతుంది’ అంటున్నారు మాదల సుబ్రహ్మణ్యేశ్వరరావు. ఫేస్ ప్రోగ్రాంఅధునాతన సౌకర్యాలు, వసతులతో కూడిన కంప్యూటర్ ల్యాబ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ ల్యాబ్‌లు, లైబ్రరీలు గ్రామీణ యూనివర్శిటీలో అందుబాటులో ఉన్నాయి. ‘ఫేస్ప్రోగ్రాం’ పేరుతో విద్యార్థులను అన్ని పోటీ పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. ఐఐటీ, జెఈఈ మెయిన్స్ అడ్వాన్స్డ్, ఎన్డీఏ, నీట్, ఒలంపియాడ్లకు కోచింగ్‌లను అందిస్తున్నారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ వింగ్, స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. విశ్వశాంతిలో శిక్షణ పొదిన ఎంతోమంది విద్యార్థులు నేవీ, ఆర్మీలలో ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఎన్సీసీలో విద్యార్థులను తీర్చిదిద్దుతున్న విధానం ఎన్నో ప్రశంసలు అందుకునేలా చేసింది. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా విద్యార్థులు బహుమతులు అందుకున్నారు. స్టేట్, సీబీఎస్ఈ, జెఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ నీట్ ఫలితాల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధిస్తూ రికార్డులు సృష్టిస్తోంది శ్రీవిశ్వశాంతి. అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకల సందర్భంగా ‘అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా’ ఆధ్వర్యంలో ‘అంతర్జాతీయ విద్యారత్న’ పురస్కారాన్ని ‘శ్రీవిశ్వశాంతి’ ఫౌండర్ మాదల సుబ్రహ్మణ్యేశ్వరరావు అందుకున్నారు. సొంతంగా పాల డైరీచదువుపై మాత్రమే కాదు విద్యార్థుల ఆరోగ్యంపై కూడా శ్రీ విశ్వశాంతి గ్రామీణ యూనివర్శిటీ తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. విద్యార్థులు ఆహ్లాదభరిత వాతావరణంలో గడిపేలా ప్రాంగణం అంతా పచ్చని మొక్కలతో తీర్చిదిద్దారు. యూనివర్శిటీ సొంతంగా పాల డైరీ నిర్వహిస్తోంది. సమర్థంగా డెయిరీ నిర్వహణకు ‘బెస్ట్ డెయిరీ ఫామ్ ఆఫ్ ఏపీ అవారుర్డును అందుకున్నారు. ఈ యూనివర్శిటీలో చదువుకున్న ఎంతోమంది విద్యార్ధులు దేశ, విదేశాల్లో వివిధ రంగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు.ఇష్టంగా కష్టపడాలిప్రతి విద్యార్థికీ లక్ష్యశుద్ధి ఉండాలి. అప్పుడే లక్ష్యం సిద్ధిస్తుంది. సమయాన్ని సక్రమంగా వినియోగించు కుంటూ ఇష్టమైన పాఠ్యాంశాలను కష్టంతో కాకుండా ఇష్టంగా చదువుకోవాలి. సమయ పాలన విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. చదువుపైనే దృష్టి కేంద్రీకరించాలి. ప్రస్తుత ప్రపంచీకరణ పరిస్థితుల్లో ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. తమకు అనువైన, ఇష్టమైన రంగాన్ని ఎంచుకుని ఆ రంగంలో నైపుణ్యం సాధించి స్థిరపడాలి. అందుకు సూక్ష్మమైన, సున్నితమైన మార్గాలను అన్వేషించి సాధించుకోవటం అలవర్చుకోవాలి. పట్టుదలతో ఎంచుకున్న లక్ష్యాన్ని ఇష్టంతో సాధించేందుకు ప్రయత్నం చేయాలి. ఎంత కష్టమైనా కష్టం అనిపించదు. విజయం సాధించటం సులువు అవుతుంది. ఎవరూ పుట్టుకతోనే ఉన్నతులు కారు. జీవితంలో చూపిన అచంచలమైన కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసం మాత్రమే ప్రతి ఒక్కరినీ ఉన్నతులను చేస్తుంది. విద్య నేర్పే గురువులు కూడా గుర్తించాల్సింది ఏమిటంటే... గురువు అంటే నిరంతర విద్యార్థి అని అర్థం. గురువు అనే అర్థం చాలా విస్తృతమైనది. ఇది అర్థం కావాలంటే మన పూర్వ అపూర్వ శాస్త్రాలను అధ్యయనం చేస్తే తెలుస్తుంది. ఇవన్నీ నేను లైబ్రరీల్లో అనేక పుస్తకాలను చదవటం వల్ల తెలుసుకున్నదే. యుద్ధ అశాంతి నుంచి శ్రీ విశ్వశాంతి చదువుకునే రోజుల్లో లైబ్రరీకి ఎక్కువగా వెళ్లేవాడిని. జవహర్లాల్ నెహ్రూ పుస్తకాలు చదవటం అంటే ఇష్టం. ఆయన జీవితం స్పూర్తిదాయకంగా ఉంటుంది. కుటుంబ పరిస్థితుల కారణంగా మా సోదరుడు కృష్ణమూర్తి 18వ ఏట ఆర్మీలో చేరాడు. అప్పుడు యుద్ధాలు ఎక్కువగా ఉండేవి. ఎందరో సైనికులు చనిపోయారంటూ వార్తలు విని చాలా కలత చెందేవాణ్ణి. యుద్ధాల వల్ల ఎన్నో కుటుంబాలు రోదనకు, వేదనకు గురవుతున్నాయి. అసలు యుద్ధం ఎందుకు? ఇరు వర్గాల నేతలు కూర్చుని సంప్రదించుకుంటే విశ్వశాంతి జరుగుతుంది అనేది నా ఉద్దేశం. ఆ ఆకాంక్ష నుంచే పుట్టిందే శ్రీ విశ్వశాంతి. భిన్నత్వంలో ఏకత్వం ఉండాలనే తలంపుతో విద్యాసంస్థను నడుపుతున్నాను.– మాదల సుబ్రహ్మణ్యేశ్వరరావు– ఈడా శివప్రసాద్, సాక్షి, కంకిపాడు, కృష్ణా జిల్లా -
స్వీట్ చేంజ్.. విందులో పసందైన రుచులు
ఏదైనా శుభవార్త చెప్పే ముందు నోరు తీపి చేస్తారు. ఇది ఒకప్పటి మాట. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది.. ప్రతి చిన్న విషయానికీ స్వీట్‌తో పండుగ చేసుకుంటున్నారు. అంతేనా! అంటే కాదు..కొందరు భోజనానికి ముందు.. కొందరు భోజనానికి తర్వాత కూడా స్వీట్ తినే అలవాటు చేసుకుంటున్నారు. ఈ అలవాటుకు అనుకూలంగా నగరంలోని పలు రెస్టారెంట్స్, హోటల్స్ ఫుడ్ సర్వ్ చేసేటప్పుడు చివరి వంటకంగా డిసర్ట్స్ సర్వ్ చేస్తున్నారు. స్టార్టర్స్, మెయిన్ కోర్సు వగైరాలన్నీ పూర్తయ్యాక ఫైనల్‌గా అందించే తీపి కబురు కోసం ఫుడ్ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీటిని తరచూ మారుస్తూ చెఫ్స్ కూడా ఆ ఆసక్తిని సజీవంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఒకప్పుడు మిఠాయి అంటే స్వీట్ షాప్ మాత్రమే గుర్తొచ్చే నగరవాసులు.. ఇప్పుడు కొన్ని రకాల డిసర్ట్స్‌ను ఎంజాయ్ చేసేందుకు రెస్టారెంట్స్‌కు క్యూ కడుతున్నారు. భోజనం అయిపోగానే కాస్తంత తీపి రుచిని ఆస్వాదించడం చాలా కాలంగా ఒక సంప్రదాయంగా స్థిరపడింది. ఇప్పుడు ఆ సంప్రదాయం ఇంతింతై వటుడింతై అన్నట్లు.. రెస్టారెంట్స్ వడ్డించే విందులో డిసర్ట్స్ని అత్యంత ప్రాధాన్యత కలిగిన భాగంగా మార్చేసింది. మిఠాయిలు ఆస్వాదించాలంటే కేవలం స్వీట్ షాప్స్ మాత్రమే శరణ్యం అనే పరిస్థితి మారి కేవలం డిసర్ట్స్ కోసం రెస్టారెంట్స్‌కి వెళ్లడం ఇప్పుడు సాధారణంగా మారింది. జామ్.. బూమ్.. రెస్టారెంట్ల తొలినాళ్లలో గులాబ్ జామ్ వంటి అందరికీ తెలిసిన స్వీట్లను మాత్రమే వడ్డించేవారు. అయితే ఆ తర్వాత క్రమంలో పూర్తి భోజనాన్ని మూడు భాగాలుగా విభజించిన తర్వాత డిసర్ట్స్ పేరుతో మెనూలో ప్రత్యేక స్థానాన్ని తీపి వంటకాలకు కేటాయించారు. తొలినాళ్లలో గులాబ్ జామ్, హల్వా, జిలేబీ, రస్మలాయ్, కోవా మాత్రమే చాలాకాలం డిసర్ట్స్గా రాజ్యమేలాయి. అయితే మల్టీ క్యుజిన్ల వెల్లువ ధాటికి మెయిన్ కోర్సుతో పాటు డిసర్ట్స్ కూడా విభిన్న రుచులకు విస్తరించాయి. ఒకప్పుడు ఆరు వెరైటీల దగ్గర నుంచి ఇప్పుడు అతిథులకు తీపి రుచులను పెద్ద సంఖ్యలో లంచ్, డిన్నర్లలో వడ్డిస్తున్నారు.బేకరీ ఉత్పత్తులకూ చోటు.. తొలుత అందరికీ బాగా తెలిసిన ప్రాంతీయ తీపి వంటకాలు ఆ తర్వాత పేస్ట్రీలకు కూడా డిసర్ట్స్ స్టైల్ మారుతూ వచి్చంది. రస్మలాయ్కి బదులు అదే ఫ్లేవర్‌లో ఐస్‌క్రీమ్ పెడుతున్నారు. బఫేలో కాంటినెంటల్ చీజ్ కేక్, బ్రౌనీ, చాకోలావా, మథుపై.. ఇలా బేకరీ ఐటమ్స్ కూడా భాగం చేస్తున్నారు. కొంత కాలంగా ఐస్‌క్రీమ్ కూడా డిసర్ట్స్‌లో తప్పనిసరి భాగం అయిపోయింది. ఐస్‌క్రీమ్‌కి కాంబినేషన్‌గా గులాబ్‌జామ్/పేస్ట్రీస్/ మూంగ్‌దాల్ హల్వా వంటివి అతిథుల నోరూరిస్తున్నాయి. కొన్నిచోట్ల సంప్రదాయ వంటకాలైన ఖద్దూ కా ఖీర్, ఫ్రూట్ కస్టర్డ్.. సేమియా పాయసం, సగ్గుబియ్యం పాయసం, పూర్ణాలు, బొబ్బట్లు కూడా వడ్డిస్తున్నారు. ఆరోగ్య ‘తీపి’..రస్తు.. ఇటీవల ప్రారంభమైన ఆరోగ్యకరమైన వంటకాల ప్రభావం రెస్టారెంట్స్ మీద కూడా పడింది. దీనిలో భాగంగా కొత్తగా పరిచయమైన మిల్టెట్స్తో తయారైన తీపి వంటకాలను అతిథులకు అందిస్తున్నారు. కొర్రల పరమాన్నం, జవారి లడ్డు, రాగుల పాయసం, ఊదల లడ్డు, సామల పరమాన్నం.. వంటివి నెమ్మదిగా విస్తరిస్తున్నాయి. ఇవన్నీ పంచదార కాకుండా తృణధాన్యాలు, బెల్లంతో తయారవడం డయాబెటిక్ రోగులకు కూడా పెద్దగా హానికారకం కాకపోవడంతో వీటి పట్ల నగరవాసుల్లో మోజు పెరిగిందని చెఫ్ యాదగిరి చెబుతున్నారు. ఆయా సీజన్లలో వచ్చే పండ్లను ఉపయోగించి తయారు చేసే సీజనల్ డిసర్ట్స్ కూడా రెస్టారెంట్స్‌లో సందడి చేస్తున్నాయి. సీతాఫలం దొరికే సీజన్లో సీతాఫల్ రబ్డీ, ప్రస్తుతం జామకాయలు విరివిగా దొరుకుతాయి కాబట్టి జామూన్ డిలైట్ ఇలా ఆయా సీజన్స్ ప్రకారం కొత్త రుచులను అందిస్తున్నారు. అలాగే మల్బరీ పండ్లు విరివిగా లభించే సమయంలో ఐస్‌క్రీమ్ మల్బరీస్ మిక్స్, మల్బరీ జ్యూస్ వంటివి అందిస్తున్నారు. -
విప్లవం, ప్రేమ వేరు కాదని చెప్పిన విప్లవ ప్రేమికురాలు!
ఉమ్మడి గుంటూరు జిల్లా క్రైస్తవ మతానికీ, కమ్యూనిస్టు ఉద్యమానికీ పేరు. దళితులు ఈరెండింటిలో రాష్ట్రంలో ఎక్కడా లేనంత పెద్ద సంఖ్యలో చేరడం చరిత్ర. ఒకనాటి తెనాలి తాలూకా, ఇప్పటి కొల్లిపర మండలంలోని దావులూరు ఒక పచ్చటి పల్లెటూరు. కమ్యూనిస్టు ఉద్యమం, క్రైస్తవ మిషనరీలు ఇచ్చిన తోడ్పాటుతో ఆ ఊరిలో ఆడ పిల్లలు, మగ పిల్లలు బాగా చదువులపై శ్రద్ధ పెట్టేవారు. ‘పాలేరు’, ‘భూమికోసం’ వంటి నాటికలు, బుర్రకథలు వారిలో ఉత్సాహాన్ని ప్రోదిచేసేవి. వేము సువార్తమ్మ, నాలాది దయమ్మ, గుమ్మడి సత్యవేదం వంటి వారు మోటూరి ఉదయం వంటి నాయకురాళ్ళ దగ్గర బుర్రకథ నేర్చుకున్నారు. తర్వాత బుర్రకథ పితామహుడిగా పేరుగాంచిన షేక్ నాజర్‌తో కలిసి పనిచేశారు.దావులూరు కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో వేము కుటుంబానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ కుటుంబంలో సుమారు మూడు తరాలవారు ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసి తమ ఆస్తి పాస్తులను ఉద్యమం కోసం త్యాగం చేశారు. 1934లో పుట్టిన సువార్తమ్మ కమ్యూనిస్టు పార్టీ నాయకులైన అంబటి రాజారావు, దీనమ్మల కుమార్తె. వేము రామసుబ్బయ్యకు మేనత్త కూతురు. వారిది ఆ రోజుల్లోనే కమ్యూనిస్టు పార్టీ పద్ధతి ప్రకారం జరిగిన దండల పెళ్లి. ఆమె పదో తరగతి వరకు చదివింది. తర్వాత హిందీ ‘భాషా ప్రవీణ’ పూర్తి చేసింది. సువార్తమ్మ, రామసుబ్బయ్య అనేక నిర్బంధాలను ఎదుర్కొని రాజ మండ్రి, కడలూరు, సేలంలలో జైలు శిక్ష అనుభవించారు. వారికి ఏడుగురు పిల్లలు. వారిలో ఇద్దరు చిన్న వయసులోనే పోషణ కరవై చనిపోగా ముగ్గురు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు మిగిలారు. చదవండి: International women's day 2025 హోమ్ మేకర్‌కు వేతనమేదీ? దళిత ఉద్యమంలో పాల్గొంటూ చిన్న కొడుకు శాంతి చనిపోయాడు. భర్త పార్టీ కోసం పొలం ఇవ్వడం, ఉద్యోగం చెయ్యకుండా, ఇల్లు పట్టకుండా, పిల్లల్ని పట్టించుకోకుండా పార్టీ పనులపై తిరుగుతున్నా ఆమెకు ఎప్పుడూ కోపం రాలేదు. ఆయన నిబద్ధతను గౌరవించింది. ఉద్యమం విజయవంతమైతే పేదలు, పీడితుల జీవితాలలో వెలుగు వస్తుందని నమ్మిన గొప్ప ప్రజాస్వామికవాది. సువార్తమ్మ దృష్టిలో విప్లవం, ప్రేమ వేరు కాదు. ఈ నెల ఒకటవ తేదీన మృతి చెందిన వేము సువార్తమ్మ గారికి జోహార్లు!– ప్రొ.చల్లపల్లి స్వరూపరాణి; ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు -
‘ఆడపిల్లనమ్మా..’ పాటతో పాపులర్ అయిన సింగర్ మధుప్రియ జర్నీ..!
గాయని మధుప్రియ గళంతో మధువులొలికిస్తుంది! ఆ స్వర ప్రయాణం ఆమె మాటల్లోనే...‘నేనసలు సంగీతం నేర్చుకోలేదు. అమ్మ, నాన్న, తాతయ్య పాడతారు. ఆ కళ వాళ్ల దగ్గర నుంచే వచ్చింది. నా గురువు మా అమ్మే! నాకు ఆరేళ్లున్నప్పటి నుంచే పాడటం స్టార్ట్ చేశా. స్కూల్లో, ఫంక్షన్స్‌లో పాడేదాన్ని. ఆ తర్వాత మెల్లమెల్లగా జానపదాలు, తెలంగాణ ఉద్యమగీతాలు పాడటం మొదలుపెట్టా. తెలంగాణ మూవ్మెంట్ టైమ్‌లో గద్దర్ తాతతో కలిసి పాడటం అదృష్టంగా ఫీలవుతాను. నా పాటల ప్రయాణంలో సూపర్ సింగర్లో పాల్గొనడం చెప్పుకోదగ్గ మలుపు.వాళ్ల బాధ చూసి రాసిన పాట...నాకు గుర్తింపునిచ్చిన పాట ‘ఆడపిల్లనమ్మా..పాటే! మేం ముగ్గురం అక్కచెల్లెళ్లం. ‘ముగ్గురూ ఆడపిల్లలే’ అని అమ్మా నాన్న బాధపడటం చూసి నా చిన్నప్పుడే రాసుకున్న పాట అది. నా స్టోరీ. ఒకరకంగా ప్రతి ఆడపిల్ల కథ. అందుకే ఎంతోమంది అమ్మాయిలు ఆ పాటతో కనెక్ట్ అయ్యారు. అందుకే అదంత పాపులర్ అయింది. అదొక్కటే కాదు నేను రాసి, పాడిన పాటలన్నీ ఆడపిల్లల గురించే ఉంటాయి. ‘అమ్మా నీ మనసు గొప్పదిలే..’ అంటూ అమ్మ మీదా ఎన్నో పాటలు పాడాను. ఎన్నో అవార్డ్స్ కూడా తీసుకున్నాను. ఈ మదర్స్ డేకి ‘ఆడపిల్లనమ్మా..’ వీడియో ఆల్బమ్‌ను తీసుకొస్తున్నాను. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సంస్కృతి, దేశభక్తి, జానపదాలు.. ఏవైనా నూటికి తొంభై తొమ్మిది శాతం మెసేజ్ ఓరియెంటెడ్ పాటలే పాడుతూంటాను. వాటితో నాకెన్ని డబ్బులొస్తున్నాయి అనేకంటే నా పాటలు ఎంతమందికి చైతన్యాన్నిస్తున్నాయనేదే చూస్తాను.అభిమానాన్ని పొందాలి...ఇరవై ఒక్క సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నాను. తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటి గోదారి గట్టు పాట వరకు చాలానే ఫేస్ చేశాను. ఎంతవరకు నిలబడ్డాను అనేదే పరిగణనలోకి తీసుకుంటాను. నా గురించి ఎవరన్నా తప్పుగా మాట్లాడినా, ఇబ్బంది పెట్టినా.. పట్టించుకోను. మహా అయితే రెండు నిమిషాలు బాధపడతానేమో అంతే! తర్వాత నా పనిలో పడిపోతాను. నేర్చుకోవాల్సిన విషయాల మీద దృష్టిపెడతాను. ఎలాంటి పరిస్థితులెదురైనా నవ్వుతూ ఎదుర్కొంటాను. అదే నా స్ట్రెంగ్త్. ఇంకా చాలా పాటలు రాయాలి.. పాడాలి.. జనాల అభిమానాన్ని పొందాలి.. అదే నా లక్ష్యం’’ అంటూ ముగించింది మధుప్రియ.– శిరీష చల్లపల్లి (చదవండి: మేము సైతం..! ఆటల్లో సత్తా చాటుతున్న నారీమమణులు) -
International Women's Day 2025: హోమ్ మేకర్‌కు వేతనమేదీ?
ప్రతీ ఏడాది మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International women's day) జరుపుకుంటాం. వివిధ రంగాల్లో మహిళలు సాధించిన విజయాలను గుర్తించి సెలబ్రేషన్స్ జరుపుకుంటారు. అలాగ ప్రపంచంలో మహిళలు ఎదుర్కొంటున్న వివక్షతను, సవాళ్లపై విస్తృతంగా చర్చించడం వాటి పరిష్కారానికి తీసుకోవలసిన చర్యలపై సమాలోచన చేయడం. మహిళా సాధికారత, హక్కులు, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రాజకీయ సహకారాలపై అవగాహన కల్పించడమే దీని లక్ష్యం. ప్రతి ఏడాదీ లాగానే ఈ ఏడాది యాక్సలరేట్ యాక్షన్(Accelerate Action) అనేథీమ్తో మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. మహిళా సాధికారతకు, అభివృద్ధికి తోడ్పడూ వ్యూహాలు, వనరులు, చొరవలను గుర్తించి వేగంగా అమలు చేయాలనేది దీని ఉద్దేశం. ఈ సందర్బంగా ఎమ్.డి. మునీర్, సీనియర్ జర్నలిస్ట్ ప్రత్యేక వ్యాసం.ప్రపంచంలో కోట్లాది మంది గృహిణులకు వేతనం ఎందుకు ఉండ కూడదు అనే విషయం ప్రస్తుతం చర్చానీయాంశం అయింది. చైనాలోని బీజింగ్‌లో ఒక విడాకుల కేసులో కోర్టు గత ఏడాది ఇచ్చిన తీర్పు ఈ చర్చకు దారితీసింది. అయితే ఇంటిపనులు, పిల్లల పెంపకం – సంరక్షణ లాంటివి చూసే గృహిణులకు జీతాలు ఎవరు ఇవ్వాలి అనేదే సమస్య! పురుషుల కన్నా 3 నుంచి 4 గంటలు ఎక్కువ పనిచేస్తారు గృహిణులు. వంట చేయడం, ఇంటిని, వంట సామగ్రిని శుభ్రం చేయడం, పిల్లలు, భర్త, ఇతర కుటుంబ సభ్యుల బట్టలు ఉతకడం వంటి పనులే కాక... తల్లి, భార్య, సోదరి పాత్రల్లో ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తుంది. అందుకే ఆమెకు జీతం ఇవ్వాలనే డిమాండ్ ఊపందుకుంటోంది.తమిళనాడులో గృహిణికి వేతనం అంశం సినీనటుడు కమల హాసన్ తన పార్టీ మేనిఫెస్టోలో పెట్టారు. ఇది కూడా గత ఏడాది పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. బీజింగ్ కోర్టు తన తీర్పులో 5 సంవత్సరాలు భర్తతో ఉండి ఇంటి పనులు చూసుకున్నది కాబట్టి, తన కెరీర్‌ను కోల్పోయింది కాబట్టి, రూ. 5 లక్షల పైచిలుకు పరిహారం జీతం కింద ఇవ్వాలని పేర్కొంది. ఈ తీర్పును ప్రపంచం మొత్తంలో 60 కోట్లకు పైగా జనం సోషల్ మీడియాలో చూశారు. గ్రామీణ మహిళ ప్రతి రోజు 14 గంటలు పనిలో ఉంటుంది. గ్రామీణ పురుషులతో పోలిస్తే 2.5 గంటలు ఇది ఎక్కువ అని పరిశోధకులు అంటున్నారు. ఉద్యోగం చేసే పురుషుల కన్నా మహిళల పని నాలుగింతలు ఎక్కువ. ఇంత చేస్తున్నా గుర్తింపు, ఆదాయం లేకపోగా వేధింపులు, అత్యాచారాలు, హత్యా చారాలు. క్రిమినల్ జస్టిస్ వైఫల్యం వల్ల దేశంలో ఆడబిడ్డలపై గృహహింస పెరుగుతోంది. హోమ్ మేకర్లకు జీతం వస్తే... పురుషుల ఆలోచనా విధానంలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. గృహిణికి కుటుంబంపై ఆధారపడకుండా ఆర్థిక స్వేచ్ఛ లభిస్తుంది. రక్షణకు... ఒక గ్యారంటీ, నమ్మకం ఏర్పడుతుంది. కుటుంబంలో గౌరవం దక్కుతుంది. -
మేము సైతం..! ఆటల్లో సత్తా చాటుతున్న నారీమమణులు
ఒకప్పుడు క్రీడల్లో మహిళల ప్రాతినిధ్యం నామమాత్రం. ఇప్పుడు సీన్ మారింది. ప్రాతినిధ్యం స్థాయి నుంచి ఎదిగి ఏకంగా దేశానికి పతకాలు అందించే స్థాయికి మన మహిళా క్రీడాకారిణులు చేరుకున్నారు. వయసుతో సంబంధం లేకుండా... ఒకవైపు కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే... మరోవైపు ప్రతికూలతలనూ అధిగమిస్తూ అత్యున్నత శిఖరానికి చేరుకుంటున్నారు. నిరంతర శ్రమ, సడలని విశ్వాసం, సాధించాలనే సంకల్పం ఉంటే తమకు తిరుగులేదని నిరూపిస్తున్నారు. తమ ప్రతిభాపాటవాల ద్వారా భావితరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు... వారిలో కొందరి గురించి....నూషిన్ అల్ ఖదీర్... మంచి ప్లేయర్ మంచి కోచ్ కూడా కాగలరని నిరూపించారు నూషిన్ అల్ ఖదీర్. 44 ఏళ్ల నూషిన్ గత నెలలో మలేసియాలో జరిగిన అండర్–19 మహిళల టి20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరించారు. 2023లోనూ తొలిసారి జరిగిన అండర్–19 మహిళల టి20 ప్రపంచకప్‌లో నూషిన్ శిక్షణలోనే టీమిండియా జగజ్జేతగా అవతరించింది.కర్ణాటకలోని గుల్బర్గాలో జన్మించి, ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో స్థిరపడిన నూషిన్ 2002 నుంచి 2012 వరకు భారత సీనియర్ మహిళల క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. 5 టెస్టులు, 78 వన్డేలు, రెండు టి20 మ్యాచ్‌ల్లో భారత్ తరఫున బరిలోకి దిగింది. 2005లో ఆటకు వీడ్కోలు చె΄్పాక నూషిన్ కోచింగ్ వైపు వచ్చింది. నూషిన్ శిక్షణలో భారత టీనేజ్ క్రికెటర్లు వరుసగా రెండు టి20 ప్రపంచకప్‌లలో విజేతగా నిలిచి ఔరా అనిపించారు.కోనేరు హంపి... రెండున్నర దశాబ్దాలుగా భారత మహిళల చెస్‌కు ముఖచిత్రంగా వెలుగుతూ ఎన్నో గొప్ప విజయాలు సాధించింది విజయవాడకు చెందిన 37 ఏళ్ల హంపి. రెండుసార్లు ప్రపంచ మహిళల ర్యాపిడ్ చెస్ చాంపియన్‌గా నిలిచి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. 2019లో జరిగిన ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించింది. మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్‌లలో పతకాలు గెలవడం అలవాటు చేసుకున్న హంపి 2024 డిసెంబర్లో కజకిస్తాన్‌లో జరిగిన ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది. ఓఎన్జీసీలో చీఫ్ మేనేజర్ అయిన హంపి క్లాసిక్ ఫార్మాట్లో ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ సాధించడమే లక్ష్యం అంటోంది.జ్యోతి సురేఖభారత మహిళల ఆర్చరీ కాంపౌండ్ విభాగంలో తిరుగులేని ప్లేయర్ వెన్నం జ్యోతి సురేఖ. విజయవాడకు చెందిన 28 ఏళ్ల జ్యోతి సురేఖ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో ర్యాంక్‌లో ఉంది. 14 ఏళ్లుగా అంతర్జాతీయస్థాయిలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న జ్యోతి సురేఖ 2023 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో మూడు స్వర్ణ పతకాలు సాధించింది. ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న జ్యోతి సురేఖ ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్‌షిప్, ప్రపంచకప్ టోర్నీలలో కలిపి 50 పతకాలు సాధించింది. జ్యోతి యర్రాజీపాఠశాలలో వ్యాయామ విద్య ఉపాధ్యాయుడు ఇచ్చిన సలహాతో అథ్లెటిక్స్ లో అడుగు పెట్టి.. అచిరకాలంలోనే అంతర్జాతీయ అథ్లెటిక్స్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది వైజాగ్‌కు చెందిన జ్యోతి యర్రాజీ. 100 మీటర్లు, 60 మీటర్ల హర్డిల్స్‌లో జాతీయ రికార్డులు లిఖించుకున్న జ్యోతి యర్రాజీ 2024 పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. ఒలింపిక్స్‌లో 100 మీటర్ల హర్డిల్స్‌లో భారత్ తరఫున పోటీపడ్డ తొలి మహిళా అథ్లెట్‌గా జ్యోతి గుర్తింపు పొందింది. అదే ఏడాది జరిగిన ఆసియా క్రీడల్లో ఆమెకు కాంస్య పతకం లభించింది. దక్షిణ మధ్య రైల్వేలో జూనియర్ క్లర్క్‌గా విధులు నిర్వహిస్తున్న జ్యోతి వరుసగా మూడుసార్లు జాతీయ క్రీడల్లో 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకాలు సాధించింది. 2024 సంవత్సరానికి కేంద్రం నుంచి జ్యోతికి ‘అర్జున అవార్డు’ లభించింది. గుగులోత్ సౌమ్య... జట్టు క్రీడ ఫుట్‌బాల్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలంటే విశేష ప్రతిభ ఉండాల్సిందే. ఆ నైపుణ్యాన్ని సొంతం చేసుకొని భారత సీనియర్ మహిళల ఫుట్‌బాల్ జట్టులో ఫార్వర్డ్‌గా రాణిస్తోంది గుగులోత్ సౌమ్య. నిజామాబాద్ జిల్లాకు చెందిన 23 ఏళ్ల సౌమ్య అండర్–14, అండర్–16, అండర్–19 విభాగాల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. ప్రస్తుతం దేశవాళీ మహిళల ఫుట్‌బాల్ లీగ్‌లో విఖ్యాత ఈస్ట్ బెంగాల్ క్లబ్ జట్టుకు ఆడుతున్న సౌమ్య ఇటీవలే షార్జాలో జరిగిన పింక్ లేడీస్ కప్ నాలుగు దేశాల అంతర్జాతీయ టోర్నీలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. ఆకుల శ్రీజటేబుల్ టెన్నిస్‌లో భారత నంబర్‌వన్ ర్యాంకర్ ఆకుల శ్రీజ 2024 పారిస్ ఒలింపిక్స్ లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. గత ఏడాది కజకిస్తాన్‌లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో టీమ్ విభాగంలో కాంస్య పతకం నెగ్గిన 26 ఏళ్ల శ్రీజ... వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) సర్క్యూట్లో కంటెండర్ స్థాయి టోర్నీలో టైటిల్ నెగ్గిన తొలి భారతీయ ప్లేయర్‌గా గుర్తింపు పొందింది. గత ఏడాది జూన్‌లో నైజీరియాలో జరిగిన లాగోస్ ఓపెన్ కంటెండర్ టోర్నీలో ఆమె విజేతగా నిలిచింది. గతేడాది జరిగిన ప్రపంచ టీమ్ చాంపియన్‌షిప్ లీగ్ మ్యాచ్‌లో చైనాకు చెందిన ప్రపంచ రెండో ర్యాంకర్ వాంగ్ యిడిపై సంచలన విజయం సాధించింది. 2022లో కేంద్ర ప్రభుత్వం నుంచి ‘అర్జున అవార్డు’ అందుకుంది. కరణం నారాయణ, సాక్షి స్పోర్ట్స్ డెస్క్ (చదవండి: -
హద్దులు చెరిపేసి... నిరూపిస్తున్నారు
ఇరవై ఏళ్లుగా 35 దేశాల్లో జరిగిన బ్యూటీ అండ్ ఫ్యాషన్ ఈవెంట్లకు హోస్ట్‌గా, జడ్జ్‌గా, గ్రూమర్‌గా ఉన్నాను. ఒకప్పుడు పదిమంది అమ్మాయిలు ఫ్యాషన్ షోలో పాల్గొనడానికి వస్తే చాలు అనుకునేవాళ్లం. కానీ, నేడు అమ్మాయిలే కాదు, అమ్మలు అయ్యాక తమని తాము నిరూపించుకోవడానికి వచ్చే మహిళల శాతం 50 నుంచి 60 శాతానికి పెరిగింది. ప్రతి ఒక్కరికీ కల ఉంటుంది. దానిని నెరవేర్చుకునే క్రమంలో మహిళలకు సరైన ΄్లాట్ఫారమ్ దొరక్కపోవడం,ప్రొఫెషనల్ గా లేకపోవడం, తర్వాత చేద్దాం అనుకోవడం, కుటుంబ బాధ్యతలు అడ్డుగా ఉండటం .. వీటన్నింటి వల్ల టైమ్ దాటిపోతుంటుంది. కానీ, ఏదో ఒక సమయంలో రియలైజ్ అయి, ఆలస్యంగా అయినా తమని తాము ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే ఇప్పుడు ‘మిసెస్ బ్యూటీ’ పోటీలలో పాల్గొనే గృహిణుల సంఖ్య పెరిగింది. ‘నేను స్టేజీ మీద వాక్ చేయాలి, మంచి గ్లామరస్ డ్రెస్సులు వేసుకోవాలి, కాన్ఫిడెంట్‌గా సమాధానాలు చెప్పగలగాలి...’ ఇలా ఆలోచిస్తున్నారు. గత తరం వరకు సమాజంలో ఒక ఫ్యాషన్ స్టిగ్మా ఉండేది. దాని నుంచి బయటకు వచ్చేస్తున్నారు. మహిళా దినోత్సవం ఉద్దేశం కూడా అదే. అందుకు తగినట్టుగానే ఇప్పుడు చాలా వేదికలు ముందుకు వచ్చాయి. మిసెస్ కేటగిరీలోకి వచ్చే మహిళల మైండ్ సెట్, ఔట్ లుక్ పూర్తిగా మారింది. ఇప్పుడు కావాల్సింది టాలెంట్, కాన్ఫిడెన్స్. మహిళ జీవితమే ఒక ఛాలెంజ్. అందుకే, ఫ్యాషన్ ఇండస్ట్రీలో మహిళలు సవాళ్లను చాలా సులవుగా అధిగమిస్తున్నారు. ఒక కాలేజీ అమ్మాయి మిస్ కాలేజీ తర్వాత మిస్ ఇండియా ఆ తర్వాత మిస్ యూనివర్స్ గురించి ఆలోచిస్తున్నట్టే, గృహిణులుగా ఉన్నవారు కూడా అలాగే క్లారిటీగా ఆలోచిస్తున్నారు. గ్లామర్ రంగంలో గతంలో అమ్మాయిల గురించి ఉన్న నెగిటివిటీ స్థానంలో పాజిటివిటి చేరింది. ఇది చాలా మంచి మార్పు. జూన్‌లో మిసెస్ అండ్ మిస్టర్ గ్రాండ్– సి వరల్డ్‌ని హోస్ట్ చేస్తున్నాను. దీనికి గృహిణులుగా ఫ్యాషన్ షోలలో పాల్గొనేవారికి శిక్షణ ఇస్తున్నాను.– వాలెంటీనా మిశ్రా, క్రియేటివ్ డైరెక్టర్, మిసెస్ అండ్ మిస్టర్ గ్రాండ్– సి వరల్డ్ హోస్ట్ -
సక్సెస్ 'కీ' పవర్ డ్రెస్సింగ్
పవర్ డ్రెస్సింగ్ అనేది ఫ్యాషన్ ఎంపికలను అధిగమిస్తుంది. ఇది స్వీయ అవగాహన, వృత్తిపరంగా తమను తాము చూపాలనుకునే విధానాన్ని ప్రభావితం చేస్తుంది. సరైన దుస్తులు మానసిక కవచంగా పనిచేస్తాయి. మహిళలు కార్పొరేట్ రంగంలోకి ప్రవేశించడం, వృత్తినైపుణ్యాలను ప్రదర్శించడం, గౌరవాన్ని పొందడం లక్ష్యంగా పవర్ డ్రెస్సింగ్ ఉద్భవించింది.1920లలో జాకెట్, స్కర్ట్‌తో మహిళల పవర్ డ్రెస్సింగ్ వెలుగులోకి వచ్చింది. ఇది మహిళల దుస్తులు ధరించే విధానంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. సౌకర్యం విషయంలో రాజీపడకుండా ఆధునికంగా కనిపించడానికి వీలు కల్పించింది. పనిలో లింగసమానత్వాన్ని ప్రోత్సహించడానికి ఇది ఒక ముఖ్యమైన అడుగు. ‘విజయం కోసం డ్రెస్సింగ్’ అనడానికి నిదర్శనంగా ఇంటర్నేషనల్ ఉమెన్ డ్రెస్సింగ్ బ్రాండ్ ‘క్వా’ ఒక ఆన్లైన్ పోల్ నిర్వహించింది. ఇందులో 100 మంది మహిళల్లో 99 మంది పవర్ డ్రెస్సింగ్ వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు.వృత్తికి తగిన డ్రెస్సింగ్ఉపాధ్యాయులు, వైద్యులు, రాజకీయ నాయకులు, ఐఎఎస్ అధికారులు, ఆర్కిటెక్ట్‌లు, కార్పొరేట్ లీడర్లు, వ్యాపార మహిళలు, ఆర్థిక నిపుణులు వంటి విభిన్న స్థాయిలలో పనిచేసే మహిళలకు పనిజీవితంలో సౌకర్యాన్ని, నమ్మకాన్ని ఇచ్చే వర్క్‌వేర్ అవసరం. ఒక కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ శక్తిని వెలికితీసేందుకు ప్యాంటుతో పాటు డిజైనర్ బ్లేజర్‌ను ధరిస్తారు. ఒక రాజకీయ వ్యక్తి పరిపూర్ణతకు అనుగుణంగా చీర లేదా కుర్తాను ధరించవచ్చు. టీచర్ లేదా డాక్టర్ తమ వృత్తినైపుణ్యానికి రాజీ పడకుండా తమ పనిని నిర్వహించడానికి సౌకర్యవంతమైన కుర్తా లేదా ఇండో–వెస్ట్రన్‌ను ఎంచుకోవచ్చు. విధి నిర్వహణలోని మహిళలు భారతీయ ప్రింట్లను ఆధునిక కట్లతో కలిపే దుస్తులను ధరించడానికి ఇష్టపడతారు. ఈ కాంబినేషన్ కూడా ప్రత్యేకంగా ఉంటుంది.పవర్ డ్రెస్సింగ్‌కి ప్రేరణ కోసం...→ వృత్తికి అనుగుణమైన దుస్తులు ధరించాలి. అప్పుడు పనితీరులో కూడా మెరుగుదల ఉంటుంది → పర్యావరణ స్పృహతో కూడిన ఫ్యాషన్‌ని అనుసరించడం మేలు. కాలర్ బ్లౌజ్‌లు, ఫంక్షనల్ పాకెట్స్, తక్కువ జ్యువెలరీ... వీటిలో ప్రధానమైనవి → డ్రెస్ నాణ్యత, ఫిటింగ్ మీరు హుందాగా, శక్తిమంతంగా ఉన్నారని తెలియజేస్తుంది → ఎవరికి వారు ఓన్ స్టైల్‌ను అభివృద్ధి చేసుకోవాలి. తమ డ్రెస్సింగ్ ద్వారా తమని తాము వ్యక్తీకరించుకోవడమూ అవసరమే. రంగులతో ప్రయోగాలు, ఫిట్‌గా ఉండే దుస్తుల ద్వారా మీరేమిటనేది చాటవచ్చు → ప్యాంట్ సూట్స్, కో–ఆర్డ్ సెట్స్, మిడీస్, జాకెట్స్.. ఇలా ఏ డ్రెస్ ఎంపిక అయినా ఇస్త్రీ చేసిన దుస్తులను ధరించండి. లేత రంగులు, తక్కువ ఆభరణాలతో సింపుల్‌గా ఉండేలా చూసుకోండి.సందర్భానికి తగిన ఎంపికలుభారతీయ వనిత హుందాతనానికి, మనదైన సంస్కృతికి, చక్కదనానికీ బహుముఖాల డ్రెస్సింగ్ శైలులను ఎంచుకుంటోంది. సందర్భానికి తగిన ఎంపిక ఇప్పుడు సాధారణంగా ఉంటోంది..డ్రేపింగ్ శైలులతో ఎవర్‌గ్రీన్‌గా నిలుస్తూ మహిళను పవర్ ఫుల్‌గా చూపుతోంది చీర. మన దేశీయ చేనేతలైన కంచి, బనారసి, చందేరీ, పోచంపల్లి, నారాయణపేట్, ధర్మవరం, ... ఇలా మనదేశంలో ఒక్కో ప్రాంత ప్రత్యేకతను, భారతీయ సంస్కృతిని ప్రపంచానికి ఘనంగా చూపుతున్నాయి. ఈ చేనేతల కట్టుతో మన మహిళలు తమ హుందాతనాన్ని ప్రపంచానికి చాటుతున్నారు.సల్వార్ కమీజ్భారతీయ మహిళల ఫార్మల్ దుస్తులలో మరొక ప్రధానమైనది సల్వార్ కమీజ్. సౌకర్యం, శైలి రెండింటినీ ఈ డ్రెస్ అందిస్తుంది. అధికారిక కార్యక్రమాలు, పార్టీలకు అనుకూలంగా ఉంటుంది. క్లిష్టమైన ఎంబ్రాయిడరీ అలంకరణతో వెలిగే అనార్కలీ సూట్లు గొప్పగా వెలుగుతుంటే, మరోవైపు స్ట్రెయిట్కట్ సూట్స్ ్ర΄÷ఫెషనల్ లుక్‌ని అందిస్తున్నాయి. ఆఫీస్‌వేర్‌గానూ, సంప్రదాయం, అధునిక మినిమలిజం మధ్య సమతుల్యతను అందిస్తున్నాయి.ఇండో– వెస్ట్రన్ ఫ్యూజన్భారతీయ దుస్తులలో అంశాలను పాశ్చాత్య సిల్హౌట్‌లతో మిళితం చేయడం దీని ప్రత్యేకత. ఆధునిక అభిరుచులకు అనుగుణంగా ప్రత్యేకమైన, స్టైలిష్ దుస్తులను సృష్టిస్తాయి. కుర్తా, పలాజో సెట్ అందుకు ఒక ఉదాహరణ. సాంస్కృతిక కార్యక్రమాలకు ఉల్లాసభరితంగానూ, అనువైనదిగానూ నిలిచింది ధోతీ ప్యాంట్‌ను కుర్తాతో జత చేయడం.వెస్ట్రన్ గౌన్లు పాశ్చాత్య శైలి దుస్తులలో ప్రధానంగా చెప్పుకునేవి గౌన్లు. అధికారిక కార్యక్రమాలలో గణనీయమైన ప్రజాదరణ పొందాయి. ఎ–లైన్ గౌన్లు, ఫ్యూజన్ టచ్ కోసం భారతీయ మోటిఫ్స్, ఎంబ్రాయిడరీతో ఇవి పార్టీలు, అధికారక విందులు, సమావేశాలలో ఈవెనింగ్ గౌన్లు అద్భుతమైన ఎంపికను అందిస్తున్నాయి. సిల్క్, శాటిన్ లేదా వెల్వెట్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన గౌన్లపై బీడ్‌వర్క్, స్వీక్వెన్లు కలిగి మహిళ చక్కదనానికి, ఆధునికతకు అద్దం పడుతూ రిచ్ లుక్‌ను ఇస్తున్నాయి. ఫార్మల్ వేర్మన దేశం ఉష్ణమండలం అవడం వల్ల సౌకర్యం కోసం ఖాదీ, కోటా డోరియా వంటి కాటన్స్‌ను ఎంచుకుంటున్నారు. వీటిమీద ఎంబ్రాయిడరీలు, టై అండ్ డైలు, పెయింటింగ్‌లా ఉన్నవాటితో తమని తాము కొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు.ఇతర అలంకారాలకూ...మ్యాచింగ్, ఎంబ్రాయిడరీ, సందర్భానికి తగిన విధంగా దుస్తుల ఎంపిక ఎలా ఉంటుందో, అలాగే ఫుట్‌వేర్ ఎంపిక కూడా ముఖ్యమైన జాబితాలో ఉంది. బంగారు, వజ్రాలు, కుందన్, పోల్కీ.. ఆభరణాలు సంప్రదాయ దుస్తులకు, ఆక్సిడైజ్డ్ ఆధునిక దుస్తులకు ఎంపికగా మారాయి. ఇండో–వెస్ట్రన్ శైలులు ఆభరణాల జాబితాలోనూ ప్రథమంగా ఉంటోంది. రీసైక్లింగ్ బెస్ట్ ఛాయిస్టెక్స్టైల్ ఇండస్ట్రీలో సస్టెయినబుల్, ఇండియన్ ఆర్ట్, ఇండియన్ టెక్స్టైల్, కెమికల్ ఫ్రీగా ఉండే హ్యాండ్లూమ్స్ని మహిళలు ఇష్టపడుతున్నారు. పవర్‌లూమ్స్, సింథటిక్స్ని దూరం పెడుతున్నారు. అంతర్జాతీయంగానూ ఎక్స్పరిమెంటల్ ప్యాషన్లోనూ రీ సైక్లింగ్ మీద దృష్టి ఎక్కువ ఉంటుంది. పాత కాలం నాటి బామ్మల పట్టుచీరలను కూడా తిరిగి ఉపయోగిస్తున్నారు. కట్ సిల్టౌట్స్, ఎంబ్రాయిడరీలో థ్రెడ్ వర్క్.. వంటి పాత కాలం స్టైల్స్ ఎంచుకుంటున్నారు. ఉదాహరణకు.. పాత బనారసి, పాత కంచి శారీస్‌ను తీసుకొని ప్యాచ్‌వర్క్‌తో మరో కొత్త డిజైనర్ శారీని తయారుచేస్తున్నారు. ఇండో–వెస్ట్రన్స్ విషయంలో చూస్తే రీ సైక్లింగ్కి బాగా డిమాండ్ ఉంది. ఉన్న వాటినే రీ క్రియేట్ చేస్తున్నారు. అమ్మమ్మ, అమ్మల చీరలను ఇన్నోవేషన్‌గా రీ సైక్లింగ్ చేయించుకొని తమ పెళ్లిళ్లకు ధరిస్తున్నారు. ఒక డ్రెస్‌ను పది మోడల్ డ్రెస్సులుగా ధరిస్తున్నారు. ప్రకృతి పట్ల బాధ్యతగా ఉండేది మహిళలే కాబట్టి. ఈ అవగాహన మహిళల నుండి వచ్చిందే. నార్త్ ఇండియన్స్ కూడా పాత చీరలు, వస్త్రాలతో ప్యాచ్‌వర్క్ చేసి బ్యాగ్స్, ఫుట్‌వేర్, క్విల్ట్‌లను సృష్టిస్తున్నారు. ఇది ఇంకా విస్తృతం అవుతుంది. మా దగ్గర పాతికమంది మహిళలు మేం ఉపయోగించగా మిగిలిన వేస్ట్ ఫ్యాబ్రిక్స్‌తో టాజిల్స్, రిబ్బన్స్, పౌచ్‌లు, జ్యువెలరీ, బ్యాంగిల్స్ తయారు చేసి అమ్ముతున్నారు. ఇవి ఇండోవెస్ట్రన్ ఔట్‌ఫిట్స్‌కు స్టైలిష్ లుక్‌నిస్తాయి. యువతరం, మహిళల ఆలోచనలకు తగినట్టుగా కెమికల్ ఫ్రీగా ఫ్యాషన్ ఇండస్ట్రీ తయారు కావడం ముదావహం. ‘పవర్ డ్రెస్’నుచూపినవారిలో...∙భారతదేశపు మొట్టమొదటి మహిళా ఫొటోజర్నలిస్ట్ హోమై వ్యారవల్లా. బ్రిటిష్ కాలం నుండి కొత్తగా స్వతంత్రదేశంగా మారడాన్ని డాక్యుమెంట్ చేయడంలో ప్రసిద్ధి చెందారు. గుజరాత్ రాష్ట్రంలో పుట్టిన ఆమె పార్సీ సమాజానికి చెందింది. తన వృత్తికి తగినట్టుగా హై రౌండ్ నెక్ బ్లౌజ్, లేతరంగు కాటన్ చీరలను ధరించేవారు. గౌన్లు, పలాజో ప్యాంట్లు ధరించి ఆమె తనదైన స్టైల్ స్టేట్మెంట్ను సృష్టించారు → నేతలలో తలమానికమైన ఇందిరాగాంధీ నేత చీరల కట్టు ఇప్పటికీ ఆమె ఆహార్యాన్ని కళ్లకు కడుతుంది. పాలిటిక్స్‌లో తన చీరకట్టు, హెయిర్ స్టైల్‌తో పవర్ఫుల్ ఐకాన్‌గా నిలిచారు. ఒక నిర్దిష్ట సందేశాన్ని ఇవ్వడానికి డ్రెస్సింగ్‌ని ఒక శక్తిమంతమైన మాధ్యమంగా ఉపయోగించారు. ఆమె చూపిన మార్గంలో చాలామంది మహిళా రాజకీయ వేత్తలు నేత చీరలను ధరించడం చూస్తున్నాం → సినీతారలు సందడి చేసే ఈవెంట్లను చూస్తే తమదైన స్టైలింగ్ డ్రెస్సులతో ఆకట్టుకునే తారలు ఎందరో. వారిలో ఎవర్‌గ్రీన్‌గా నిలిచే బాలీవుడ్ నటి రేఖతోపాటు దీపికా పదుకొనే, ప్రియాంకా చోప్రా, కరీనా, సోనమ్ .. వంటి తారలు ఏ ఈవెంట్లోనైనా తమ స్టైల్స్టేట్మెంట్ను చూపుతుంటారు. ఇటీవల నీతాఅంబానీప్రాచీన కళకు, రిచ్లుక్కి ఐకాన్‌గా మారడం గమనిస్తున్నాం. -
'వంట చేయడం గొప్ప టాలెంట్'..!: థైరోకేర్ వ్యవస్థాపకుడు
వంట చేయడం లేదా వంట వృత్తిని తక్కువగా లేదా తేలిగ్గా చూస్తారు చాలామంది. పైగా గబగబ ఏదో ఒకటి టైంకి వండిపెట్టేవాళ్లు లేకపోతే అల్లాడిపోతాం. అలాంటిది ఆ వృత్తిని మాత్రం చీప్‌గా చూస్తాం. ఇప్పుడు నెట్టింట థైరోకేర్ వ్యవస్థాపకుడు షేర్ చేసిన ట్వీట్ చూసి కచ్చితంగా మనసు మార్చుకుంటారు. ఎందుకుంటే వంట ప్రాముఖ్యతను హైలెట్ చేస్తూ వివరించిన విధానం నెటిజన్ల మనసును హత్తుకుంది. ఇంతకీ ఆయన ఏం అన్నారంటే..థైరోకేర్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఎ వేలుమణి ఇటీవల రెండు రకాల వ్యక్తులపై తన దృక్పథాన్ని గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌లో వంట ప్రాముఖ్యతను ఆయన హైలెట్ చేయడంతో ఒక్కసారిగా నెట్టింట ఈ పోస్ట్ హాట్‌టాపిక్‌గా మారింది. వేలుమణి వంట చేయడం నేర్చుకునేవారు, వంట చేయడాన్ని టైం వేస్ట్ పనిగా భావించే వారు అంటూ రెండు విరుద్ధ అభిప్రాయల గల వ్యక్తుల గురించి పోస్ట్‌లో రాశారు. వంటను రుచికరంగా చేసేవారు వైవాహిక జీవితాన్ని చక్కగా ఆస్వాదిస్తారని, అత్యంత సంపన్న కుటుంబ నేపథ్యం ఉండి, వంట చేయడాన్ని టైం వేస్ట్‌గా భావించేవారికి వైవాహిక జీవితంలో సత్సంబంధాలు సవ్యంగా ఉండవని అన్నారు. అంటే ధనవంతుడైనా భాగస్వామి దొరికినా.. ఆమెకు వంట చేయడం పట్ల సరైన ఆసక్తి లేకపోతే ఇరువురి మధ్య సరైన సత్సంబంధాలు లేక ఇబ్బంది పడతారని అన్నారు వేలుమణి. అంతేగాదు తన పోస్ట్‌లో థైరోకేర్ వ్యవస్థాపకుడు వేలుమణి తన భార్య సుమతి వేలుమణి ఇరు కుటుంబాలను చక్కగా చూసుకునేదని అన్నారు. ఆమె స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో ఉద్యోగం చేస్తూ కూడా కుటుంబ బాధ్యతలను చక్కగా నిర్వహించేదని, వంట చక్కగా చేసేదంటూ తన దివంగత భార్యతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకున్నారు. ఆహారమే ఓ వ్యక్తి ప్రేమను మరింత హృదయానికి హత్తుకునేలా చేస్తుందని అన్నారు. అందుకే ప్రతి తల్లిదండ్రులు తమ పిలల్లకు వంట నేర్పించండి. ఆ విషయంలో పేరెంట్స్‌గా విఫలమై ఆ తర్వాత పశ్చాత్తాపం పడినా ప్రయోజనం లేదంటూ రాసుకొచ్చారు వేలుమణి ఆ పోస్ట్‌లో.There are two kinds. 1. Intelligent enough to Learn a good deal of cooking. They enjoy a happy married life by building bilateral relationships. 2. Lazy enough to think that cooking is waste of time. Even if they find a rich spouse, they struggle in generating or sustaining… pic.twitter.com/rVHR6jM3fu— Dr. A. Velumani.PhD. (@velumania) March 5, 2025 (చదవండి: ఆ వ్యక్తికి 16 మంది భార్యలు, 104 మంది పిల్లలు..! కుటుంబమే..) -
కుటుంబాలను నడిపిస్తోంది మహిళలే : గో డాడీ అధ్యయనం...
భారతీయ మహిళలే చిన్న తరహా వ్యాపారాల (Indian Female Small Business Owners) ద్వారా తమ కుటుంబాలను నడిపిస్తున్నారు. తమ చిన్న వ్యాపారాలకు మరింత శక్తిని అందించేందుకు కృత్రిమ మేధస్సు (ఏఐ) స్వీకరణకు కూడా సై అంటున్నారు. సాంకేతిక సేవలకు పేరొందిన గోడాడీ (GoDaddy) సంస్థ నిర్వహించిన తాజా గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది. మహిళలు స్థిరత్వంతో విజయాన్ని పునర్నిర్వచించు కుంటున్నారని, కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి, వ్యాపార అవకాశాలు ఆవిష్కరణల కొత్త శకానికి ప్రేరణనిచ్చేందుకు సాంకేతికతను ఉపయోగిస్తు న్నారని వెల్లడించింది. లఘు, చిన్న తరహా వ్యాపారాలలో పావు వంతు (27%) కంటే ఎక్కువ మహిళల యాజమాన్యంలో ఉన్నాయని అధ్యయనం తేల్చింది, వీటిలో 74% సాంకేతికత విస్తరించిన గత ఐదు సంవత్సరాలలోనే తమ వ్యాపారాన్ని ప్రారంభించినట్లు కూడా తెలిపింది. మహిళలు తమ సొంత వ్యాపారాలను నడపడమే కాదు, అచంచలమైన విశ్వాసంతో రాణిస్తున్నారు. ప్రతీ ఐదుగురిలో నలుగురు (79%) తమ వ్యాపారాలు వచ్చే సంవత్సరంలో పెద్ద, మెరుగైన వనరులు కలిగిన కంపెనీలతో పోటీ పడటానికి ఏఐ సహాయపడుతుందని ఆశిస్తున్నారు. ఉదాహరణకు, భారతీయ మహిళలు ఏఐఆర్వో వంటి ఏఐ సాధనాలను ఉపయోగించడం ద్వారా వారానికి 12 గంటలు ఆదా చేస్తున్నారని కూడా వెల్లడైంది.. సృజనాత్మక ఆలోచనలతో ముందుకు రావడానికి 63%మంది, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి లేదా ప్రస్తుత వాటిని మెరుగుపరచడానికి 55%మంది వ్యాపార భవిష్యత్తును ప్లాన్ చేయడానికి 46% మంది సమయం వెచ్చిస్తున్నారు.చదవండి: ప్రముఖ గాయనితో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వివాహం, ఫోటోలు వైరల్ -
ఆ వ్యక్తికి 16 మంది భార్యలు, 104 మంది పిల్లలు..!
ఈ రోజుల్లో పెళ్లిళ్లు చేసుకున్న ఒక్క రోజుల్లోనే పెటాకులు అవుతున్నాయి. కనీసం మూన్నాళ్లైన కలిసి ఉండటమే గగనం అన్నట్లుగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఓ వ్యక్తి పెళ్లిళ్లల్లో రికార్డు సృష్టించాడు. అతడి ఇల్లే ఓ గ్రామంలా తలిపించేలా ఉంటుందట. ఎవరా వ్యక్తి అన్ని పెళ్లిళ్లు ఎలా చేసుకున్నాడో చూద్దామా..!.ఆఫ్రికా దేశమైన టాంజానియాలోని ఒక చిన్న గ్రామంలో నివసించే కపింగా (మ్జీ ఎర్నెస్టో ముయినుచి కపింగా) అనే వ్యక్తి వరుస పెళ్లిళ్లతోనే వరల్డ్ ఫేమస్ అయిపోయాడు. ఈ ఆఫ్రికన్ వ్యక్తి సుమారు 20 పెళ్లిళ్లు చేసుకోగా.. కొన్ని కారణాలతో నలుగురు భార్యల్లో కొందరు చనిపోగా, కొందరు విడిచి వెళ్లిపోయారు. ప్రస్తుతం 16 మంది భార్యలు, 104 మంది పిల్లలు ఉన్నారు. అలాగే.. 144 మంది మనవళ్లు, మనవరాళ్ళు కూడా ఉన్నారు. అంతా ఒకేచోట ఆనందంగా కలిసి మెలిసి జీవిస్తున్నారు.చెప్పాలంటే అతడి ఇల్లే..ఓ గ్రామంలా మారిపోయింది. వాళ్లింట్లో వంటలు చేస్తే..ఏదో వేడుక జరుగుతుందేమో అన్నట్లు ఉంటుంది. ఎందుకంటే అంతమందికి భారీస్థాయిలో వంటలు చేయాల్సి ఉంటుంది. అయితే అంతా కలసే వండుకుని ఒకే చోట కూర్చొని తింటారట. మరీ కపింగ ఇన్ని పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నాడో తెలిస్తే మాత్రం విస్తుపోతారు..ఇన్ని పెళ్లిళ్లు ఎందుకంటే..కపింగ తన తండ్రి కోరిక మేరకు ఇన్ని పెళ్లిళ్లు చేసుకున్నాడట. తాను 1961లో మొదటి వివాహం చేసుకున్నానని, తన భార్య మొదటి బిడ్డకు జన్మనిచ్చిందని చెప్పుకొచ్చాడు. అప్పుడు తన తండ్రి నువ్వు ఒక్క పెళ్లి కాదు మరిన్ని పెళ్లిళ్లు చేసుకోవాలి, మన కుటుంబం పెద్దదిగా ఉండాలి అని చెప్పాడట. నువ్వు మరో పెళ్లి చేసుకుంటే..వచ్చే కట్నం డబ్బులు నీకే ఇస్తానని చెప్పాట. తండ్రి కోరిక మేరకు ఇన్ని పెళ్లిళ్లు చేసుకున్నాడట. అయితే అందులో ఐదు వివాహాలకు తన తండ్రే డబ్బు ఖర్చు పెట్టాడట. మిగతావి తానే చేసుకున్నానని చెప్పాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే..16 మంది భార్యల్లో ఏడుగురు కపింగ సోదరిమణులే. కానీ వాళ్లు అతడి భార్యలలాగే జీవిస్తున్నారు. వాళ్లంతా సవితి పోరు లేకుండా హాయిగా కలిసిమెలిసి ఉండటం విశేషం. మరీ ఇంతమంది ఆయన్నే ఎలా పెళ్లి చేసుకున్నారు అనే సందేహం కూడా వస్తోంది కదూ..? అయితే అందుకు అంతా చెబుతున్న కారణం ఒక్కటే..అది కపింగ మంచితనమేనట. అతడు చాలా మంచివాడని, అతడి భార్యగా ఉండటం అదృష్టంగా భావిస్తారట వారంతా. అలాగే తన కుటుంబ సభ్యులంతా ఎలాంటి గొడవులు లేకుండా ప్రశాంతంగా జీవించడానికి తన భార్యలే కారణమని అంటాడు కపింగ. ఏ సమస్య అయినా సాధ్యమైనంత వరకు తన వరకు రాకుండా పరిష్కరించుకుంటారని..ఒక్కోసారి తన వద్దకు వచ్చినా.. అక్కడితో సమస్యను పరిష్కరించి ఎలాంటి గొడవలు తలెత్తకుండా చూసుకుంటామని చెబుతున్నాడు. వారంతా స్వయం సమృద్ధి విధానంతో జీవిస్తున్నారని చెప్పాడు. మొత్తం కుటుంబం అంతా వ్యవసాయంపై ఆధారపి జీవిస్తుందట. అందరూ పంటలు పండిస్తూ, పశువులును మెపుతూ..తమ ఆహార అవసరాలను తీర్చుకుంటారట. అయితే కపింగా ఇంత పెద్ద కుటుంబ కారణంగా దాదాపు 50 మంది పేర్లే గుర్తుంటాయట. తక్కిన వారందర్నీ వాళ్ల ముఖం చూసి గుర్తుపట్టి మాట్లాడతానని చెబుతున్నాడు.(చదవండి: అతిలోక సుందరి శ్రీదేవి కూతురు ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!) -
డిజిటల్ యాడ్‌లో మెరిసిన సిద్ధార్థ్, అదితీ
ప్రపంచపు నంబర్ 1 బ్యూటీ బ్రాండ్ లోరియల్ ప్యారిస్ (L'Oréal Paris) తమ కొత్త డిజిటల్ ప్రచార కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. ఇందులో ప్రముఖ బాలీవుడ్ జంట అదితి రావు హైదరీ, సిద్ధార్థ్ నటించారు. తొలి క్యాంపెయిన్ విజయవంతమైన నేపథ్యంలో అదితి రావు హైదరీ, సిద్ధార్థ్ నటించిన కొత్త డిజిటల్ క్యాంపెయిన్ లోరియల్ ప్యారిస్ ఆవిష్కరించింది.ఇందులో 2003 క్లాసిక్ సినిమా ‘బాయ్స్’ను గుర్తు చేసేలా ఫన్రీల్తో సిద్ధార్థ్ ఇన్‌స్టాగ్రాంలో కనిపిస్తారు. దుమ్మూ, చెమట లాంటి కారణంగా తలపై నూనె పేరుకుపోవడం, జిడ్డుగా మారడంలాంటి జుట్టు కష్టాల గురించి సిద్ధార్థ్ సరదాగా ముచ్చటిస్తారు. సరిగ్గా ఈ టైంలో సిద్ధార్థ్ స్వీట్హార్ట్ అదితి ఎంట్రీ ఇచ్చి లోరియల్ ప్యారిస్ హయాలురోన్ ప్యూర్ షాంపూను అందించి, అందులోని కీలకాంశాలైన శాలిసిలిక్ యాసిడ్, హయాలురోనిక్ యాసిడ్ ప్రయోజనాల గురించి ముచ్చటిస్తుంది. సరదాగా సాగే మాటల మధ్యలో, తాను ఈ ప్రొడక్ట్‌కి ఫ్యాన్నే అయినప్పటికీ, అదితినే అధికారిక బ్రాండ్ అంబాసిడర్ అని సిద్ధార్థ్ గుర్తు చేస్తాడు ఈ డిజిటల్ ఫిలింకి భారీ స్పందన లభించడం విశేషం. విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ల కొద్దీ వీక్షణలను సాధించింది. ఆన్-స్క్రీన్‌పై సిద్ధార్థ్, అదితి జంట కెమిస్ట్రీకి అభిమానుల ప్రశంసలు దక్కడంతో ఈ క్యాంపెయిన్, సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారింది. View this post on Instagram A post shared by Siddharth (@worldofsiddharth)ఈ సందర్భంగా లోరియల్ ప్యారిస్ కుటుంబానికి తోడ్పాటు అందిస్తున్న, సిద్ధార్థ్ అదితి రావు హైదరీకి లోరియల్ ప్యారిస్ ఇండియా జనరల్ మేనేజర్ డేరియో జిజ్జీ (Dario Zizzi) కూడా ధన్యవాదాలు తెలిపారు. సౌందర్యాన్ని మెరుగుపర్చే వినూత్న ఉత్పత్తులను ఆవిష్క రించేందుకు లోరియల్ ప్యారిస్ కట్టుబడి ఉందన్నారు. లోరియాల్ ప్యారిస్ హయాలురోన్ ప్యూర్ షాంపూ తల మీద నూనె పేరుకుపోవడాన్ని నివారించి, జుట్టు తేలికగా, పరిశుభ్రంగా, తాజాగా ఉంచుతుందని వివరించారు. -
Breast Abscess బాధాకరమైన రొమ్ము గడ్డలకు కారణాలు, చికిత్స
రొమ్ము ఇన్ఫెక్షన్ అనేది స్త్రీ స్తనములలో చీముతో కూడిన బాధాకరమైన నొప్పిని రొమ్ము అబ్సెస్(Breast Abscesses) అంటారు. రొమ్ము గడ్డలు మాస్టిటిస్ యొక్క సాధారణ పరిణామం. మాస్టిటిస్ అనేది రొమ్ములలో వాపు మరియు నొప్పిని కలిగించే ఇన్ఫెక్షన్. పాలిచ్చే తల్లులు ఎక్కువగా ఈ పరిస్థితికి గురౌతారు.రొమ్ము గడ్డలకు కారణంరొమ్ము గడ్డలు ఈ క్రింది కారణాల వల్ల సంభవిస్తాయి:మాస్టిటిస్ అని పిలువబడే రొమ్ము ఇన్ఫెక్షన్లు రొమ్ము చీముకు అత్యంత సాధారణ కారణం. మాస్టిటిస్ అనేది రొమ్ము కణజాలాన్ని, ముఖ్యంగా పాల నాళాలు మరియు గ్రంథులను ప్రభావితం చేసే ఒక తాపజనక పరిస్థితి. ఈ పరిస్థితి సాధారణంగా తల్లిపాలు ఇచ్చే స్త్రీలలో సంభవిస్తుంది.చనుమొన నొప్పి లేదా పగిలిన చనుమొన ద్వారా బ్యాక్టీరియా ప్రవేశించడం వల్ల ఎక్కువగా తల్లిపాలు ఇవ్వని మహిళల్లో రొమ్ము గడ్డలుఏర్పడతాయి. ఏదైనా మచ్చల కారణంగా కూడా చనుమొన నాళాలు మూసుకుపోయినప్పుడు రొమ్ము గడ్డలు ఏర్పడవచ్చు.రొమ్ము అబ్సెసెస్ లక్షణాలుస్తనముల వాపు, బాధాకరమైన నొప్పి,వేడిగా ఉన్న రొమ్ము, చనుమొన నుండి చీము లేదా స్రావం కారడం,తలక్రిందులుగా ఉన్న చనుమొనలు, చలి,వికారం మరియు వాంతులు,అధిక శరీర ఉష్ణోగ్రత లేదా జ్వరం మొదలగునవి వుంటాయి.రొమ్ము అబ్సెసెస్ నిర్ధారణరోగి చరిత్రవైద్యులను సందర్శించి నపుడు సాధారణంగా లక్షణాలను రొమ్ము నొప్పి, వేడి, ఎరిథెమా (చర్మం ఎర్రగా మారడం) మరియు రొమ్ములలో వాపును కూడా డాక్టరుకు తెలియచేయాలి తల్లిపాలు ఇచ్చే సమాచారాన్ని తెలియచేయాలి.వైద్యుడు గతంలో ఏవైనా రొమ్ము ఇన్ఫెక్షన్లు మరియు వాటి చికిత్స గురించి కూడా విచారిస్తారు.మధుమేహం వంటి వైద్య చరిత్రను వైద్యుడికి తెలియజేయాలి.క్లినికల్ పరీక్షవైద్యుడు రోగ నిర్ధారణ చేయడానికి శారీరక పరీక్షను చేస్తారు. వైద్యుడు రొమ్ములో చీము ఉందని అనుమానించినట్లయితే, రోగ నిర్ధారణను నిర్ధారించడానికి గడ్డ యొక్క ఆస్పిరేషన్ నిర్వహించబడుతుంది. అటువంటి సందర్భంలో, రొమ్ము గడ్డలు చీముతో నిండి ఉందో లేదో చూడటానికి వాపు ఉన్న ప్రదేశంలోకి ఒక సూదిని చొప్పించబడుతుంది.అసౌకర్యం మరియు వాపు చీము వల్ల సంభవిస్తాయో లేదో నిర్ధారించడానికి వైద్యుడు రొమ్ము అల్ట్రాసౌండ్ స్కాన్‌ను కూడా సిఫారసు చేయవచ్చు.రొమ్ము అబ్సెసెస్ చికిత్సఇంటి నివారణలు: ఇన్ఫెక్షన్ సోకిన రొమ్ము కణజాలానికి వెచ్చని మరియు తేమతో కూడిన కంప్రెస్లను ఇవ్వవచ్చు.ఇన్ఫెక్షన్ సోకిన రొమ్ము నుండి చీము కారుతున్నట్లయితే, స్త్రీలు బ్రాను ధరించే ముందు చనుమొనను సున్నితంగా కడిగి, గాలికి ఆరనివ్వాలివాపు మరియు నొప్పి నుండి ఉపశమనం పొందడానికి, రొమ్ములపై 10-15 నిమిషాలు ఐస్ లేదా కోల్డ్ ప్యాక్‌ను ఉంచవచ్చు. తల్లి పాలిస్తున్నటువంటి స్త్రీలైతే పాలు ఇచ్చే సమయం లో మధ్య విరామాలలో ఇలా చేయండి : పాలు తాగేటప్పుడు బయటి అంచు నుండి చనుమొన వరకు రొమ్మును మసాజ్ చేయండి, ఇది పాల ప్రవాహాన్ని ప్రోత్సహించడానికి మరియు అడ్డుపడే పాల నాళాలను తొలగించడానికి సహాయపడుతుంది.మందులుపారాసెటమాల్ లేదా ఇబుప్రోఫెన్ వంటి నొప్పి నివారణ మందులతో నొప్పి మరియు జ్వరాన్ని తగ్గించవచ్చు. ఈ మందులు పాలిచ్చే తల్లులు తీసుకోవడం సురక్షితమని భావిస్తారు. రొమ్ము గడ్డలు నివారించడానికి ముందు లేదా తర్వాత ఇన్ఫెక్షన్ తగ్గించడానికి యాంటీబయాటిక్స్ వాడవచ్చు.చికిత్సరొమ్ము చీముకు ప్రాథమిక చికిత్స ఏమిటంటే, రొమ్మును నుండి చీమును తొలగించడం.వైద్యుడు చీమును తొలగించడానికి ఈ క్రింది పద్ధతులను ఉపయోగించవచ్చు:సూది ద్వారా చిమును బయటకు తీయడం. ఈ పద్ధతిలో, లక్ష్య ప్రాంతంలోకి ఒక సూదిని చొప్పించి, చీమును బయటకు పీలుస్తారు.కోత ద్వారా చీమును బయటకు పంపడం: ఇందులో ద్రవంతో నిండిన గడ్డపై చిన్న కోత చేసి దానిని పూర్తిగా బయటకు వచ్చేలా చేయడం జరుగుతుంది.- L. ఉమాపతి MA PGDHE(Dr. MGR MU) Chennaiవిశ్రాంత డెమో వైద్య ఆరోగ్య శాఖ అనంతపురం జిల్లా -
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
దివంగత టాలీవుడ్ నటి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ అచ్చం తల్లిలానే తన అందం అభినయంతో వేలాదిగా అభిమానులను సంపాదించుకుంది. అలనాటి అందాల తార శ్రీదేవిని తలపించేలా ముగ్ధమనోహరంగా ఉంటుంది. దేవర మూవీలో టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ సరసన నటించి నటనలో మంచి మార్కులు కొట్టేసింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ చేసేలా కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రస్తుతం అటు టాలీవుడ్, ఇటు బాలీవుడ్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఈ రోజు ఆమె పుట్టినరోజు. ఈ ఏడాది మార్చి 06తో 28 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఆమె గ్లామర్ పరంగా తన తల్లికి ఏమాత్రం తీసిపోని విధంగా ఫిట్‌గా స్లిమ్‌గా ఉంటుంది. మరో అతిలోక సందరిలా కళ్లు తిప్పుకోనివ్వని అందం ఆమె సొంతం. అంతలా ఫిజిక్ మెయింటైన్ చేయడం వెనుకున్న రహస్యం ఏంటో చూద్దామా..!.జాన్వీ తరుచుగా తన ఫిట్నెస్కి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటుంది. ఆమె ఒక ఇంటర్వ్యూలో బ్యూటీ సీక్రెటని బయటపెట్టింది. తన ఆహారపు అలవాట్లు, ఫిటెనెస్ సీక్రెట్ తదితరాల గురించి షేర్ చేసుకుంది. తాను ఎక్కువుగా ఇంట్లో వండిన ఆహారాలనే ఇష్టంగా తింటానని అంటోంది. కఠినమైన డైట్‌ని ఫాలోఅవుతానని అంటోంది. అల్పాహారం అవకాడో, రెండు గుడ్ల మాత్రమేనని, భోజనంలో గ్రిల్డ్ చికెన్, పాలకూర, సూప్ తీసుకుంటానని చెబుతోంది. ఎక్కువగా జపనీస్, ఇటాలియన, ఆంధ్ర, మొఘలాయ్ వంటకాలంటే ఇష్టమని చెప్పుకొచ్చింది. అయితే తాను గ్లూటైన్ రహిత ఫుడ్‌నే తీసుకుంటానంటోంది. ఎందుకంటే గ్లూటైన్ తనకు పడదని, అలెర్జీ వస్తుందని తెలిపింది. తనకు బాగా నచ్చిన ఆరోగ్యకరమైన మంచీలను లేదా పండ్లు ఎక్కువగా ఇష్టంగా తింటానని చెప్పింది. వాటిలో చక్కెర ఎలాగో ఎక్కువ ఉంటుంది కాబట్టి స్వీట్స్ జోలికి వెళ్లనంటోంది. బాగా, పానీపూరీ, ఐస్‌క్రీం, స్ట్రాబెర్రీలు అంటే మహా ఇష్టమని చెబుతోంది. చాలామటుకు అన్ని కూరగాయలు, పళ్లు తింటానని, కాకపోతే బరువు పెరగకుండా చూసుకునేందుకు ఎక్కువగా వ్యాయామాలు చేస్తానని చెప్పింది. తేలికగా జీర్ణమయ్యే ఆహారానికే ప్రాధాన్యత ఇస్తుందట. అందుకే ఎక్కువగా రెడ్‌రైస్ బిర్యానీనే తింటుదట. తన చివరి భోజనం తొందరగానే పూర్తి చేశానని ఒకవేళ షూటింగ ఉంటే 10 గంటల కల్లా పూర్తి చేస్తానని చెబుతోంది. ఇంతకుమునుపు చిలగడదుంప, పరాఠా వద్దకు వెళ్లేదాన్నికాదని, నో కార్బ్సో డైట్‌ను పాటించేదాన్ని అని తెలిపింది. అయితే ఇప్పుడు కార్బోహైడ్రేట్లు పెంచడం ప్రారంభించినట్లు వెల్లడించింది జాన్వీ కపూర్. గ్లామర్ పీల్డ్‌లో రాణించాలంటే ఆ మాత్రం కేర్ తీసుకోకపోతే కష్టమే కదూ..!.(చదవండి: కోచింగ్ లేకుండానే నీట్లో 720కి 720 మార్కులు..!) -
ప్రముఖ గాయనితో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వివాహం, ఫోటోలు వైరల్
యువ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య (Tejasvi Surya)తన ప్రియురాలితో వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. చెన్నైకి చెందిన ప్రముఖ గాయని, శాస్త్రీయ సంగీతం, భరతనాట్య కళాకారిణి అయిన శివశ్రీ స్కంద ప్రసాద్ (Singer Sivasri Skanda prasad)ను సాంప్రదాయ బద్దంగా వివాహం చేసుకున్నారు. మార్చి 6, 2025న బెంగళూరులో జరిగిన ఒక సన్నిహిత, సాంప్రదాయ వేడుకలో వివాహం చేసుకున్నారు. ఈ వివాహ వేడుకకు పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు, బీజేపీ నేతలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వీరిలో కేంద్ర మంత్రి వి. సోమన్న, అన్నామలై, ప్రతాప్ సింహా, అమిత్ మాలవ్య, బి.వై. విజయేంద్ర ఉన్నారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. దీంతో పలువురు నెటిజనులు నూతన వధూవరులకు శుభాకాంక్షలు అందించారు.శివశ్రీ స్కంద ప్రసాద్ పసుపు కాంచీపురం పట్టు చీర, బంగారు ఆభరణాలలో కనిపించగా సూర్య వైట్ గోల్డెన్ కలర్ దుస్తులను ధరించారు. మరొక ఫోటోలో, వధువు ఎరుపు-మెరూన్ చీరలో, వరుడు ఆఫ్-వైట్ దుస్తులలో పెళ్లికళతో మెరిసారు.बेंगलुरु दक्षिण से सांसद श्री @Tejasvi_Surya जी एवं संगीत गायिका, भरतनाट्यम की प्रसिद्ध कलाकार शिवश्री स्कंदप्रसाद जी के शुभ विवाह समारोह में सम्मिलित होकर नवदंपत्ति को उनके मंगलमय दांपत्य जीवन के लिए शुभकामनाएँ व आशीर्वाद प्रदान किया। pic.twitter.com/S7n531yxmn— Arjun Ram Meghwal (@arjunrammeghwal) March 6, 2025 భక్తి , శాస్త్రీయ సంగీత అభిమానులకు సుపరిచితమైన శివశ్రీ, మణిరత్నం , AR రెహమాన్ కాంబోలో వచ్చిన పొన్నియిన్ సెల్వన్ మూవీలోని పాటతో చలనచిత్ర సంగీతంలోకి ఎంట్రీ ఇచ్చి అందర్నీ అలరించారు. అలాగే గత సంవత్సరం జనవరిలో అయోధ్యలో రామాలయం ప్రతిష్ట సందర్భంగా ఆమె విద్వత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కూడా దక్కించుకుంది. దీంతోపాటు PVA ఆయుర్వేద ఆసుపత్రి నుండి ఆయుర్వేద కాస్మోటాలజీలో డిప్లొమా కూడా పొందింది. అలాగే 'ఆహుతి' వ్యవస్థాపకురాలు ,డైరెక్టర్ కూడా. శివశ్రీ యూట్యూబ్ చానెల్‌కు 2 లక్షల మందికిపైగా, ఇన్‌స్టాగ్రామ్‌లో 1.13 లక్షలకు పైగా ఫాలోవర్లున్నారు. శివశ్రీ శాస్త్ర యూనివర్సిటీ నుంచి బయో ఇంజినీరింగ్, మద్రాస్ యూనివర్సిటీ నుంచి భరతనాట్యంలో ఎంఏ, మద్రాస్ సంస్కృత కాలేజీలో సంస్కృతంలో ఎంఏ చదివారు. ఇక తేజస్వి సూర్య వృత్తి రీత్యా న్యాయవాది, ప్రస్తుతం ఆయన బెంగళూరు సౌత్ నియోజకవర్గం నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీ తరపున వరుసగా రెండోసారి ఎంపీగా గెలుపొందారు. 2019, 2024 ఎంపీ ఎన్నికల్లో విజయం సాధించారు. 2020 నుంచి భారతీయ జనతా యువ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. దేశంలోనే అత్యంత పిన్న వయస్సు ఎంపీల్లో ఒకరిగా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Sivasri Skandaprasad (@sivasri.skanda) -
Avoidable Fatalities నిజామాబాద్‌లో సేవ్‌లైఫ్ ఫౌండేషన్ ట్రామా కేర్
సేవ్‌లైఫ్ ఫౌండేషన్ (SaveLIFE Foundation ) మెర్సిడెస్-బెంజ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో భాగస్వామ్యంతో, జీరో ఫెటాలిటీ కారిడార్ (Zero Fatality Corridor) కార్యక్రమంలో భాగంగా, తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ట్రామా కేర్ సెంటర్లో ఎమర్జెన్సీ కేర్ సౌకర్యాలను అందిస్తోంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(CSR) అధునాతన క్రాష్ డేటా విశ్లేషణ, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, మెరుగైన ట్రామా కేర్ మరియు సామర్థ్య నిర్మాణాన్ని ఉపయోగించి అధిక-ప్రమాదకర రహదారులను సురక్షితమైన కారిడార్లుగా మార్చాలని భావిస్తోంది. ఇందులో భాగంగా గురువారం(మార్చి 6)న నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆర్మూర్‌లోని ఏరియా హాస్పిటల్‌కి అధునాతన ట్రామా కేర్ పరికరాలను అందించారు. తద్వారా వైద్య సహాయంలో జాప్యాలను తగ్గించడంతోపాటు, రోగులను ఉన్నత వైద్య కేంద్రాలకు తరలించే లోపు సంభవించే మరణాలను నివారించగల మరణాలను నివారిస్తుందని నిర్వహికులు ఒక ప్రకటనలో తెలిపారు. వాయుమార్గ నిర్వహణ కోసం పునరుజ్జీవన సాధనాలు, శ్వాసకోశ మద్దతు, షాక్ నివారణ, రక్తస్రావం నియంత్రణ, ఫ్రాక్చర్ నిర్వహణకు సంబంధించిన ఆర్థోపెడిక్ సర్జికల్ సాధనాలతో సహా కీలకమైన ట్రామా కేర్‌ను అందిస్తుంది. ఇది రోగులను తదుపరి చికిత్స కోసం అధునాతన వైద్య కేంద్రాలకు తరలించేలోపు రోగులను ప్రాణాపాయం నుంచి కాపాడతాయి. అత్యవసర వైద్య అందక సంభవించే మరణాలను తగ్గిస్తాయి.ఆర్మూర్‌లోని ఏరియా హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవి కుమార్ మాట్లాడుతూ, “సేవ్‌లైఫ్ ఫౌండేషన్ ద్వారా అత్యవసర సంరక్షణ సేవలు, పరికరాలను అప్‌గ్రేడ్ చేయడం మన జిల్లాలో ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో ఒక ముఖ్యమైన అడుగు అన్నారు. తద్వారా బాధితులకు మెరుగైన సేవలు అందించడంతోపాటు, క్లిష్టమైన పరిస్థితుల్లో మనుగడ రేటును మెరుగు పడుతుందన్నారు. రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించడంలో ప్రత్యేక అత్యవసర సంరక్షణ సేవలు కీలకమైనవని సేవ్‌లైఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, సీఈవో పియూష్ తివారీ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్‌లోని ఏరియా హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవి కుమార్ , ఆర్మూర్‌లోని ఏరియా హాస్పిటల్ రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అమృతం రెడ్డి; భీమ్‌గల్‌లోని ఏరియా హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శివశంకర్,సేవ్‌లైఫ్ ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
కోచింగ్ లేకుండానే నీట్లో 720కి 720 మార్కులు..!
చాలామంది పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లలో కోచింగ్‌లు తీసుకుని చదువుతుంటారు. అయినా కూడా అనుకున్న ర్యాంకు సాధించలేక చతికిల పడుతుంటారు. తల్లిందండ్రులకు ఆర్థిక భారాన్ని కలిగిస్తున్నామనే బాధ ఓ పక్క, చదవలేక మరోవైపు నానాఇబ్బందులు పడుతుంటారు కొందరు విద్యార్థులు. అలాంటి వాళ్లకు ఈ కుర్రాడే స్ఫూర్తి. ఎలాంటి కోచింగ్ లేకుండానే నూటికి నూరు శాతం మార్చులు తెచ్చుకుని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. సక్సెస్ అంటే ఇది అని చూపించాడు.ఆ కుర్రాడే బీహార్‌లోని మధుబనిలోని ఆంధ్రాతర్హి గ్రామానికి చెందిన తథాగత్ అవతార్. అతడు నీట్ పరీక్షలో 720/720 మార్కుల స్కోరు సాధించాడు. అతడి విజయ ప్రస్థానం అంత ఈజీగా సాగలేదు. అతడు కూడా అందరిలానే తొలి ప్రయత్నంలో కాస్త ఇబ్బంది పడ్డాడు కానీ 611 మార్కులు సాధించాడు. అయితే మంచి కాలేజ్‌లో ఎంబీబీఎస్ చేయాలన్న కోరికతో మరోసారి ప్రయత్నించాడు. ఈసారి మరింత కష్టపడి చదివాడు. అతడి కృషి ఫలించి నీట్ 2024లో మంచి మార్కులు సాధించి టాప్ ర్యాంకు తెచ్చుకున్న ఇతర అభ్యర్థుల సరసన నిలిచాడు. అయితే నీట్ యూజీ తాత్కాలికి సమాధాన కీ ఆధారంగా తొలుత 715 మార్కులు స్కోర్ చేయగా, జూన్ 4న విడుదల చేసిన సవరించిన కీ ఆధారంగా అతని స్కోరు 720 రావడం జరిగింది. ఆల్ ఇండియా ప్రథమ ర్యాంకులో నిలచాడు. అతను ఇప్పుడు ఢిల్లీ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ ఫస్ట్ ఈయర్ చదువుతున్నాడు.కుటుంబ నేపథ్యం..తథాగత్ విద్యావేత్తల కుటుంబం నుంచి వచ్చాడు. అతని తల్లి కవితా నారాయణ్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు, తండ్రి మిడిల్ స్కూల్లో టీచర్. తల్లి తరుఫు తాత అశోక్ చౌదరి మధుబనిలోని జూనియర్ కళాశాల లైబ్రేరియన్. అతని తాత ఇప్పటికీ తన పూర్వీకుల గ్రామమైన గెహుమాబెరియాలో నివశిస్తున్నారు. కానీ తథాగత్, అతని కుటుంబం ప్రస్తుతం అతని తాత గ్రామమైన ఆంధ్రతార్హిలో నివసిస్తున్నారు.గ్రామంలోనే ఉండి నీట్కి ప్రిపేరయ్యాడు..తథాగత్ తన గ్రామంలోనే ప్రిపరేషన్ కొనసాగించాడు. ఆన్లైన్ తరగతులకు హాజరవ్వుతూ ప్రిపేరయ్యాడు. అతడు చిన్ననాటి నుంచే స్వతహాగా తెలివైన విద్యార్థి అని తల్లిదండ్రులు, బంధువులు చెబుతున్నారు. అతడు ఇంతలా మంచి మార్కుల తెచ్చుకున్నందుకు తమకెంతో గర్వంగా ఉందని అతడి కుటుంబం చెబుతోంది. ఎయిమ్స్‌లో చదవాలనేది తన జీవితకాల కల అని అందుకే ఇంతలా కష్టపడ్డానని, తన కృషి ఫలించిందని ఆనందంగా చెబుతున్నాడు తథాగత్. అయితే భారతదేశంలో ఉన్న వైద్యుల కొరత, ఆర్థిక పరిమితులు దృష్ట్యా ఎంతమంది విద్యార్థులు డాక్టర్ చదువు అభ్యసించలేక ఇబ్బందులు పడుతున్నారో చూస్తే బాధనిపించిందని, అదే తనకు డాక్టర్ అయ్యేందుకు ప్రేరణనిచ్చిందని అన్నాడు. ముందుకు ఖర్చు గురించి విద్యార్థులు చింతించకుండా మంచి ర్యాంకు తెచ్చుకోవడంపై దృష్టిపెడితే తక్కువ ఖర్చుతోనే మంచి ప్రభుత్వ కళాశాలల్లో చదువుకోగలుగుతారని తథాగత్ చెబుతున్నాడు. ఈ విధంగా మరింతమంది అర్హులైన విద్యార్థులు నైపుణ్యం కలిగిన వైద్యులుగా మారి దేశానికి సేవ చేస్తారని చెబుతున్నాడు తథాగత్.(చదవండి: కొడుకు అనారోగ్యం ఆ అమ్మను వ్యాపారవేత్తగా మార్చింది..! ఏడాదికి రూ. 9 లక్షలు) -
డైరెక్టరవుదామనుకుని : మహిళా సినిమాటోగ్రాఫర్ సక్సెస్ స్టోరీ
మేము సైతం అంటూ అనేక రంగాల్లో మహిళలు దూసుకుపోతున్నారు. తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ఆకాశంలో సగం.. అవకాశాల్లోనూ సగం అంటూ తమ టాలెంట్‌ను నిరూపించుకుంటున్నారు. ముఖ్యంగా పురుషులకే పరిమితం అని భావించే రంగాల్లో ప్రవేశించి ప్రతిభకు జెండర్‌తో సంబంధం లేదని నిరూపిస్తూ అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కెమెరా మహిళగా వెండి తెరపై అడుగు పెట్టి, బెస్ట్ సినిమాటోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకున్న ఒడిశాకి చెందిన ఫల్గు సత్పతి గురించి తెలుసుకుందాం. దశాబ్దానికి పైగా ఈ వృత్తిలో కొనసాగుతూ తన క్రియేటివిటీతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.ఫల్గుకి ఒడిస్సీ నృత్యం అంటే చిన్నప్పటినుంచీ ఇష్టం ఏర్పడింది. అయిదేళ్ల వయస్సులోనే తల్లి ప్రోత్సాహంతో ఒడిస్సీ నేర్చుకుంది. గురువు పల్లవి దాస్ వద్ద శిక్షణ పొందింది. అనేక ప్రదర్శనలిచ్చింది. నృత్యాకారిణిగా రాణించింది. దీంతో పాటు, బాల్యంనుంచే నాటకాల పట్ల ఆకర్షితురాలైంది. బాలనటిగా, బిజయ్ మొహంతి, తాండ్రా రే వంటి అనుభవజ్ఞులతో కలిసి దూరదర్శన్‌లో నటించింది. కనిపించాను. ఈ సందర్భంలోనే వెండితెర వెలుగుల వెనుక ఇంకా చాలామంది ఉంటారని గమనించింది. సినిమాలంటే ఇష్టంగా మారింది. అమ్మమ్మ ఒడియా సినిమాలు చూడటానికి థియేటర్స్‌కి వెళ్లేది. కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా , ప్రతీ అంశాన్ని విమర్శనాత్మకంగా పరిశీలించేది ఫల్గు. ఒకసారి అనుకోకుండా 'కరణ్ అర్జున్' చూసి దర్శకత్వంపై మోజు పెంచుకుంది.ఈ క్రమంలో ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్ BPFTIO (బిజు పట్టనాయక్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఒడిశా)గురించి అక్కడ దీనికి సంబంధించిన కోర్సులో చేరాలని ప్రయత్నించింది. కానీ సెలెక్ట్ కాకపోవడంతో సినిమాటోగ్రఫీలో చేరేలా చేసింది. ఎందుకంటే దర్శకుడు తర్వాత కెమెరామన్ పనితీరు అత్యద్భుతమని ఆమె నమ్మకం. అయితే, ఇక్కడ చదువుకుంటున్న క్రమంలో , సినిమా తీయడం వెనుక చాలా మంది నిపుణులు, కష్టపడి పనిచేసే వ్యక్తులు ఉన్నారని ఫల్గు గుర్తించింది. ఇక్కడ చదువు పూర్తైన తరువాత, కాలేజీలో తన సీనియర్ దగ్గర తొలుత ఒక రియాలిటీ షోకి పనిచేసింది. తర్వాత సుశాంత్ మణి, శుభ్రాంశు దాస్‌లాంటి పేరెన్నికగన్న ఛాయాగ్రాహకులతో కలిసి వర్క్ చేసింది.తొలి ప్రాజెక్ట్‌తోనే ప్రశంసలుఫల్గు తొలి స్వతంత్ర ప్రాజెక్ట్ , ఒడియా చిత్రం 'పుష్కర. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ (DOP) గా ఎన్నో ప్రశంసలు అందుకుంది. ఇంకా శిక్షా మండల్, ఫౌజీ కాలింగ్ (హిందీ ఫీచర్ ఫిల్మ్) , దివానా దివానీ, హలో ఇన్ లవ్, సపనార పాథే పాథే', 'లవ్ యు జెస్సికా', 'ము తారా కియే' వంటి ఒడియా చిత్రాలకు అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్‌గా కూడా పనిచేసింది. అనేక రియాలిటీ షోలకు వెబ్ సిరీస్‌లకు కూడా సహాయ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసింది.'బెటర్ హాఫ్' అనే మరాఠీ చిత్రానికి వర్క్ చేసింది. ఫల్గు కెమెరా పనితనానికి నిదర్శనంగా ‘పడే ఆకాశ’ ఈ మహిళా దినోత్సవానికి విడుదల కానుంది. దివ్యాంగుల హక్కుల కోసం వీల్ చైర్ నుంచే అలుపెరుగని పోరాటం చేస్తున్న ఒడియా మహిళ డా. శ్రుతి మహాపాత్ర జీవితం ఆధారంగా తెరకెక్కిందీ సినిమా. అంతేకాదు ఒడియాలో మంచి హిట్ సాధించిన పుష్కర మూవీకి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన ఘనత కూడా ఫల్గుదే కావడం విశేషం. ఇన్స్టిట్యూట్లో పరిచయమైన నటుడు హరా రాత్ని 2013 లో వివాహం చేసుకుంది.ఆకాశమే హద్దు..‘‘మహిళ సినిమాటోగ్రఫీ అనే ఈ వృత్తిని ఎంచుకోవడం అంత సులభం కాదు. శారీరకంగా , మానసికంగా చాలా కష్టపడాలి. కానీ జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే, పోరాడాలసిందే. ఈ విషయంల అత్తమామలు నా కుటుంబం మద్దతు చాలా ఉందని తెలిపింది. ఫల్గు. సమాజంలోని కట్టుబాట్ల నుంచి అమ్మాయిలను విముక్తి పొందనివ్వాలి. గొప్పగా ఆలోచించి, విజయాలు సాధించేలా వారిని ప్రోత్సహించాలి. ఈ ప్రపంచంలో ఏదీ తమ జీవితాల్లో విజయం సాధించకుండా ఆపదని అమ్మాయిలు గ్రహించాలి. ఆకాశమే హద్దు అనే దృఢ సంకల్పంతో ఎదగాలి’’ అంటుంది ఫల్గు. కెరీర్‌కు సంబంధించి మనం ఏ సినిమాకు పనిచేస్తున్నాం అన్నది ఎంత ముఖ్యమో, ఎవరితో కలిసి పనిచేస్తున్నాం అన్నదీ అంతే ముఖ్యం అంటుంది. -
కొడుకు అనారోగ్యం ఆ అమ్మను వ్యాపారవేత్తగా మార్చింది..! ఏడాదికి రూ. 9 లక్షలు..
కొన్ని బాధకరమైన ఘటనలు మన అంతర్గత శక్తిని ప్రేరేపించి గొప్ప వ్యక్తులుగా మారుస్తుంది. అయితే సమస్య వచ్చినప్పుడు తల్లడిల్లిపోతాం. అలా కాకుండా ఆ పరిస్థితికి కలత చెందకుండా..ఎలా ఫేస్ చేద్దామనే ఆలోచనే మనల్ని కార్యోన్ముఖులుగా మార్చి అద్భుతాలు చేయిస్తుంది. ఆ విధంగానే ఈ తల్లి స్టార్టప్‌ని పెట్టేందుకు దారితీసి ఓ గొప్ప వ్యాపారవేత్తగా దూసుకుపోతోంది. ఏడాదికి రూ. 9 లక్షలకు పైగా ఆర్జిస్తోంది. ఒక సాధారణ గృహిణి అయిన ఆ తల్లి ఆ స్థాయికి ఎలా చేరుకోగలిగిందో చూద్దామా..!.కర్ణాటకకు చెందిన లక్ష్మీ ప్రియ విజయగాథ ఎందరికో ఆదర్శం. ఆమె కొడుకు అనారోగ్యమే ఆమెలో దాగున్న అసాధారణ వ్యాపారవేత్తను బయటకు తీసుకొచ్చింది. లక్ష్మికి నెలలు నిండకుండానే పుట్టిన కొడుకు ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలే ఆమెను స్టార్టప్ పెట్టుందుకు దారితీశాయి. ఆమెకు పుట్టిన నవజాత శిశువు నెలల నిండకుండా జన్మించడంతో సుమారు 21 రోజులు ఇంక్యుబేటర్‌లో పెట్టారు వైద్యులు. ఆ తర్వాత కూడా ఆ శిశువులో పెద్దగా మెరుగుదల కనిపించపోగా పలు అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. బతుకుతాడనేది చెప్పలేమని వైద్యులు చెప్పేశారు. చివరి ప్రయత్నంగా ఆ చిన్నారికి తల్లి ఒడిలోవెచ్చదనం అందించి ప్రయత్నిద్దామని చెప్పడంతో..అలా చేసిన కొద్దిసేపట్లోనే ఏదో అద్భుతం జరిగినట్లుగా కోలుకోవడం జరిగింది ఆ శిశువు. పల్స్ రేట్ పెరిగి బతికి బట్టకట్టాడు. కానీ ఆ తర్వాత కూడా లక్ష్మీ కొడుకు బలహీనమైన రోగనిరోధకశక్తితో ఇబ్బంది పడేవాడు. శరీరంలో తగినంత స్థాయిలో రక్తం కూడా లేకపోవడం వంటి రుగ్మతనలు ఎదర్కొన్నాడు. దీనికి పోషకాహార లోపమని వైద్యులు చెప్పడంతో ఆమె ఆ దిశగా వంటగదిలో ప్రయోగాలు చేసేది. తన కొడుకు పోషకాహార లోపంతో బాధపడకూదన్న ఆమె సంకల్పం పాలకూర వంటి ఆకుకూరలపై దృష్టిసారించేలా చేసింది. తనలాంటి తల్లలకు సహాయం అందించేలా చేయాలనే తపన, తన కొడుకు ఆరోగ్యం మెరుగ్గా ఉండాలనే బలమైన కోరిక వెరసీ ఆమెను పాలకూర స్టార్టప్ పెట్టేందుకు దారితీసింది. పాలకూరలో ఉండే విటమిన్లు పోషకాహార లోపాన్ని భర్తీ చేస్తాయని న్యూట్రిషన్ల ద్వారా తెలుసుకుంది. ఆకుకూరల గొప్పతనం, వాటి వల్ల కలిగే ప్రయోజనాలే ఆమెను పాలకూరతో రకరకాల వంటకాలు చేసేందుకు పురిగొలిపింది. కానీ ఈ పాలకూర త్వరగా పాడైపోతుంది. అలా కాకుండా దాన్ని ఎండలో బెట్టి పౌడరు చేసుకుని రకరకాల వంటకాలు ఎలా చేయొచ్చని ప్రయోగాల చేసింది. అలా ఆమె తానే స్వయంగా పాలకూర పొడులకు సంబంధించిన తినాసరి కీరై స్టార్టప్ పెట్టి విక్రయించడం ప్రారంభించింది. ఈ స్టార్టప్‌లో పాలకూరకు సంబంధించిన 40 రకాలు పొడుల మిక్స్‌లు ఉంటాయి. పాలకూరని కన్నడలో కీరై అని పిలుస్తారు. అందులోని వెరైటీలు ప్రధానంగా మనథక్కలి, కాసిని, ముదకథన్ , అగతి కరిసలంగన్నితో దాదాపు 15 రకాల వంటకాలను రూపొందించింది. ఈ లోగా కొడుకు కూడా ఆరోగ్యవంతుడయ్యాడు. క్రీడల్లో ఛాంపియన్‌గా కూడా రాణించే స్థాయికి చేరుకున్నాడు తన సొంత జ్ఞానంతో పెట్టిన ఈ స్టార్టప్‌తో ప్రారంభంలో పలు సమస్యలు ఎదుర్కొంది. ఈ పొడులతో దోసెలు, సూప్‌లు, బియ్యం మిశ్రమాలు వంటి వాటిని కూడా చేర్చింది. వీటి గురించి తన కొడుకు స్నేహితుల తల్లిదండ్రులకు పేరెంట్ మీటింగ్ సమావేశాల్లో తన స్టార్టప్‌లో విక్రయించే ఈ పాలకూర పొడుల ప్రాముఖ్యత గురించి వివరించేది. పైగా పాలకూర కొని చేయడం కంటే ఈ మిక్స్‌లతో సులభంగా వండటమేగాక మంచి పోషకాహారాన్ని అందిస్తామన్న ఆమె వివరణ ఎందరో తల్లిదండ్రులను ఆకర్షించింది. సులభంగా వండగలమన్న విధానం ప్రజలను ప్రభావితం చేసి.. కొనేందుకు ముందుకు వచ్చారు. అందులోనూ పిల్లలకు ఆకుకూరల తినడానికి అస్సలు ఇష్టపడరు. ఇలాంటివి అయితే సులభంగా తింటారు, పైగా పోషకాలు అందుతాయన్న ఆశతో కొనేందుకు ముందుకు రావడంతో పెద్ద మొత్తంలో కస్టమర్ల పెరగడం తోపాటు ఆర్డర్లు కూడా వచ్చేవి. అందుకు తగ్గట్టుగానే ఐఎస్ఓ(ISO)-సర్టిఫైడ్ పద్ధతులను అవలంబించడం, తన బ్రాండ్ నాణ్యతలో రాజీపడకుండా అందించి ప్రజల నమ్మకాన్ని చూరగొంది. అలా అనాతి కాలంలోనే వార్షిక అమ్మకాలు రూ. 9 లక్షలకు చేరుకోవడంతో చిన్న వంటగది ప్రయోగాలు కాస్త ఓ పెద్ద బిజినెస్‌గా మారి దూసుకుపోయేందుకు కారణమైంది. అంతేగాదు లక్ష్మీ స్టార్టప్ ఈ స్టార్టప్ ఇప్పుడు భారతదేశం దాటి విస్తరించింది, కాలిఫోర్నియా, సింగపూర్ వంటి సుదూర ప్రాంతాలలో ప్రపంచవ్యాప్తంగా జీవితాలను ప్రభావితం చేస్తుంది.నిపుణులు ఏమంటున్నారంటే..చివరగా పోషకాహార నిపుణురాలు పద్మజ గుత్తికొండ, పాలకూర అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల కలిగే ప్రయోజనాలను పునరుద్ఘాటించారు. పాలకూరలో కెరోటినాయిడ్లు, విటమిన్లు సీ, కే, ఫోలిక్ ఆమ్లం , కాల్షియంలకు మూలం అని ఆమె అన్నారు. ఇది కంటి ఆరోగ్యం, ప్రేగు ఆరోగ్యం, రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. దీనిని ప్రతిరోజూ పిల్లల ఆహారంలో లేదా వారానికి కనీసం 4 నుంచి 5 సార్లు చేర్చడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరగడమే గాక కంటి చూపుకి ఢోకా ఉండదని చెబుతున్నారు.(చదవండి: టైప్ 2 డయాబెటిస్‌కి మొక్కల ఆధారిత ఔషధం..! ట్రయల్స్‌లో షాకింగ్ ఫలితాలు) -
స్వజనులకు అక్షర భిక్ష : సిడాం మారూమాస్టారు గురించి తెలుసా?
తాను వెలుగుతూ చుట్టూరా కమ్మిన చీకట్లను తరిమేయడమే దీపం సుగుణం. అలాంటివారే మారూ మాస్టారు. ఆదివాసీలను అభివృద్ధి పథంలో నడిపించడానికి అవసరమైన చైతన్యాన్ని వారిలో నింపారు. 1925 ఫిబ్రవరిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని గడల్ పల్లి ఏజెన్సీ గూడెంలో జన్మించిన సిడాం మారూ 1962లో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన తొలి ఆదివాసీ. రాజ్ గోండ్ తెగకు చెందిన ఆయన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని తమ జాతిలో వెనుక బాటుతనాన్ని పోగొట్టాలంటే కనీస అక్షర జ్ఞానం నింపాలని భావించారు. దీనికి తోడు అప్పటి నైజాం ప్రభుత్వంలో గిరిజన జాతులపై పరిశ ధన చేస్తున్న ఆంత్రొపాలజిస్ట్ ప్రొ.హైమండార్ఫ్ ప్రోత్సహించడంతో ఉపాధ్యాయ వృత్తి స్వీకరించారు. చదవండి: మొబైల్భూ వాస్తవాల విస్మరణే ప్రమాదానికి కారణం బాహ్య ప్రపంచమే తెలియని అదిమ తెగలైన రాజ్ గోండ్, పర్దాన్, నాయకపోడు, తోటి, కోయ గిరిజను లను చేరదీసి మాతృభాషలో బోధించేవారు. 1940లో నిజాం సాయుధ దళాలతో జరిగిన జోడె ఘాట్ పోరాటంలో క్షత గాత్రులైన తమ వారిని దాచిపెట్టి, అవసరమైన సపర్యలు చేసిన మానవీయుడు, దయా మయుడు. 1983లో ఉపాధ్యాయ వృత్తి నుండి పదవీ విరమణ పొందిన మారూ మాస్టారు వెనువెంటనే ఉట్నూరులోని సమగ్ర గిరిజనా భివృద్ధి సంస్థ (ఐటీడీఏ) తరఫున ఆదివాసీ అభివృద్ధి నిర్వాహకుడిగా నియమితులయ్యారు. ఐటీడీఏ ప్రవేశ పెట్టిన పలు పథకాలను, ప్రోత్సాహకాలను ఉపయోగించుకుని గిరిజనులందరూ అభివృద్ధి చెందాలని చైతన్యం కలిగించిన ఘనత ఆయనకే దక్కుతుంది. గిరిజనులకు అండగా నిలబడి గిరిజనాభివృద్ధిలో ఆదివాసు లను భాగస్వాములుగా చేస్తూ హైమండార్ఫ్ స్థాపించిన ‘రాయ్ సెంటర్ల’ను పునఃప్రారంభించడానికి తగు కృషి చేశారు మారూ మాస్టారు. తుదకు 2000, మార్చి 6న ప్రకృతి ఒడిలోకి చేరారు. ఆదివాసీల మదిలో మారూ జ్ఞాపకం మరువ లేనిది. – గుమ్మడి లక్ష్మీనారాయణ, సామాజిక రచయిత (నేడు మారూ మాస్టారు వర్ధంతి) -
National Dentists Day : రోజుకు ఎన్నిసార్లు బ్రష్ చేయాలి?
నిజామాబాద్ నాగారం: మానవ శరీరంలో ఉన్న అవయవాలు సమర్థవంతంగా పనిచేసేందుకు శక్తినిచ్చేది దంతాలు. ఆహారాన్ని నమిలి మింగడానికి దోహదప డతాయి. అందుకే నోరు బాగుంటేనే ఆరోగ్యం బాగుంటుందని దంత వైద్యులు చెబుతుంటారు. నోటి శుభ్రతపై నిర్లక్ష్యం వహించొద్దని సూచిస్తున్నారు. నేడు జాతీయ దంత వైద్యుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. ఉదయం, సాయంత్రం సరిగా బ్రష్ చేసుకోకపోవడంతో నోట్లో ఆహారం చేరి బ్యాక్టీరియా తయారవుతుంది. దీంతో పుప్పిపళ్ల సమస్య ఉత్పన్నమవుతుంది. ఇదే కాకుండా నోరు శుభ్రంగా లేకపోతే రోగాలు దరి చేరుతాయని వైద్యులు చెబుతున్నారు. దంతాల శుభ్రతలో జాగ్రత్తలు.. ●దంతాలను ఆరోగ్యంగా ఉంచేందుకు రోజుకు రెండుసార్లు బ్రష్ చేయాలి. ● ఏదైనా తిన్న తర్వాత నోటిని నీటితో కడగాలి. దీంతో పంటిలో చిక్కుకున్న ఆహారం బయటకు పోతుంది. ● ప్రతి ఆరు నెలలకోసారి దంత పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. ● మన్నికై న టూత్ పేస్ట్, టూత్ బ్రష్‌లను వాడాలి. ● చాక్లెట్లు, చిప్స్, తీపి పదార్థాలు తినొద్దు. ప్రతి సంవత్సరం మంచి నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో దంతవైద్యులు మరియు వారు అందించే ముఖ్యమైన పాత్రను గుర్తించేందుకు జాతీయ దంతవైద్యుల దినోత్సవంగా మార్చి 6న పాటిస్తారు. జాతీయ దంతవైద్యుల దినోత్సవ చరిత్ర 20వ శతాబ్దం నాటిది, దీనిని అమెరికన్ డెంటల్ అసోసియేషన్ (ADA) అధికారికంగా మొదలు పెట్టింది. దంతవైద్యంలో మైలురాళ్లను స్మరించుకోవడానికి ఈ రోజును పాటిస్తారు. ఉదాహరణకు, 1840లో డాక్టర్ హోరేస్ వెల్స్ మొదటిసారిగా అనస్థీషియాను ఉపయోగించారు. దంతవైద్యులు దంత సమస్యలను నయం చేయడమే కాకుండా నోటి అనారోగ్యానికి సంబంధించిన సంక్లిష్ట ఆరోగ్య సమస్యలను కూడా గుర్తిస్తారు. -
శివతత్త్వాన్ని పొందాలంటే...!
మన హృదయంలో ఉండేది శ్రీ మహాదేవుని ప్రతిబింబం. ఇది శ్రీ శివుని నివాసం. ఇది అన్నింటినీ మించినది. మన మనస్సుకు, ఆలోచనలకు అన్నింటికీ అతీతమైనది. ఈ శివ తత్త్వాన్ని పొందాలంటే, ముందుగా మనం శ్రద్ధ వహించి మన హృదయం ఎంత స్వచ్ఛంగా ఉందో మన లోపలికి మనం చూసుకోవాలి. మన హృదయం లోపల, మనం చాలా మురికిని పెంచుకుంటాము. ఉదాహరణకు, మనం ఎవరినైనా చూసి అసూయపడతాం. ఎవరో మనకు చెడు చేసినట్టు అసూయ పడుతుంటాము. వారు మనకు నిజంగా హాని చేసినా కూడా, ఇబ్బంది కలిగించినా కూడా వారి పట్ల అసూయపడి ప్రయోజనం లేదు. మన హృదయం శుభ్రంగా ఉంటే, మన హృదయమనే అద్దంలో గల సర్వ శక్తిమంతుడైన భగవంతుని ప్రతిబింబం స్పష్టంగా ఉంటుంది. కానీ మనం మన లోపల అసూయను కలిగి ఉంటే, అప్పుడు ఆ అద్దం శుభ్రంగా ఉండదు. అందులో భగవంతుని ప్రతిబింబం కూడా పరిపూర్ణంగా ఉండదు. ఎవరితోనైనా శత్రుత్వం కలిగి ఉండటం, ఎవరి పట్లనైనా హృదయంలో కోపం లేదా చెడు భావాలను కలిగి ఉండటం చాలా తప్పు. దాని వలన శ్రీ శివతత్త్వాన్ని కలిగి ఉండలేము. అందుకే మనం అందరినీ ప్రేమించడం, క్షమించడం చాలా ముఖ్యం. మనం రోజూ శివునికి పూజలు, అభిషేకాదులు చేస్తూ మన లోపల గల అరిషడ్వర్గాలను విడిచి పెట్టలేకపోతే శ్రీ శివతత్త్వాన్ని పొందలేం. శ్రీ శివతత్త్వాన్ని పొందాలంటే మన హృదయం నిర్మలంగా ఉండాలి. ఎటువంటి అలజడులు లేని స్వచ్ఛమైన నీటిని కలిగి ఉన్న సరస్సు మాత్రమే ఆకాశంలో ఉన్న సూర్యుని చక్కగా ప్రతిబింబించ గలుగుతుంది. అదే విధంగా మన హృదయం కూడా ఎటువంటి ఆలోచనలు లేని నిర్విచార స్థితిలో, ఇతరుల పట్ల ఏ విధమైన ద్వేషం, కోపం లేకుండా ఉన్నప్పుడు మాత్రమే భగవంతుని నిజమైన స్వరూపాన్ని ప్రతిబింబించ గలుగుతాము. అనగా శ్రీ శివ తత్త్వాన్ని పొందగలుగుతాం.శ్రీ శివుని సచ్చిదానంద స్వరూపుడు అని వర్ణిస్తారు. అనగా సత్ + చిత్ + ఆనంద స్వరూపుడు. సత్యము, చిత్తము మరియు ఆనందమును స్వరూపముగా కలిగిన వాడు శ్రీ శివుడు. ఏ విషయం గురించైనా సత్యము ఏమిటి అనేది మనకు సహస్రారములో ఉండే శ్రీ సదాశివుని పాదాల వద్దనే తెలుస్తుంది. మన చిత్తం ఆత్మ ప్రకాశంతో నిండినప్పుడే మనకు ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది. నిరంతరం నిర్మలమైన ఆనందంతో ఉండే వ్యక్తే భగవంతుని పరిపూర్ణంగా ప్రతిబింబించ గలుగుతాడు. ఈ సచ్చిదానంద స్వరూపమయిన శ్రీ శివ తత్త్వాన్ని పొందగలిగిన వారి జన్మ ధన్యం.మన లోపల ఉండే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలు మన హృదయంలో ఉండే శ్రీ శివుని ప్రకాశానికి అడ్డు పొరలుగా ఏర్పడతాయి. మనం సహజ యోగంలో కుండలినీ జాగృతి ద్వారా ఆత్మ సాక్షాత్కారం పొందినప్పుడు ఈ ఆత్మ ఉనికిని మన చేతి వేళ్ళపై అనుభూతి చెందడం ప్రారంభిస్తాం. అప్పుడు ఆత్మ పరిశీలన ద్వారా ఈ అరిషడ్వర్గాలను క్రమంగా తొలగించుకొన్నప్పుడు, పరిపూర్ణంగా ఆత్మ స్వరూపులమయ్యి భగవంతుని ప్రతిబింబాన్ని స్పష్టంగా మన హృదయంలో ప్రతిబింబించ గలుగుతాం. అటువంటి వ్యక్తులలో దైవికమైన సుగుణాలన్నీ స్పష్టంగా ప్రస్ఫుటమవుతూ ఉంటాయి. అటువంటి వ్యక్తులు నిత్య నిరామయమైన శ్రీ శివ తత్త్వాన్ని పొంది, సదా శివసాన్నిధ్యంలో ఉంటారు.– డా. పి. రాకేష్(పరమపూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి ప్రవచనాల ఆధారంగా) -
International women's day 2025: ఈ నెల 9న రన్ ఫర్ హర్
మాదాపూర్: మహిళలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ఈ రన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివైబ్ సీఈవో రఘవీణసజ్జ తెలిపారు. మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో బుధవారం రన్ ఫర్ హర్ పేరిట పరుగు నిర్వహించనున్న కార్యక్రమానికి సంబందించిన వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 9వ తేదీన రన్‌ఫర్ హర్ కార్యక్రమాన్నినిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమాన్ని మంత్రి సీతక్క ప్రారంభిస్తారని తెలిపారు. ఈ రన్‌కు సంబందించిన బ్రోచర్, టీషర్టు, మెడల్స్‌ను ఆవిష్కరించారు. ఇందులో 3కె, 5కె, 10కె విభాగంలో ఈ పరుగును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాయదుర్గంలోని నాలెడ్జీ సిటీ పార్కు వద్ద పరుగును ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. 200 మందికి పైగా వైద్యులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు, మహిళలు, పురుషులు, చిన్నారులు పాల్గొననున్నట్టు తెలిపారు.డబుల్స్ డైవ్ చాలెంజ్‌కు పదేళ్లు సాక్షి, సిటీబ్యూరో: సింక్రోనీ ఆధ్వర్యంలో నిర్వహించే ‘డబుల్స్ డైవ్ చాలెంజ్’ పది సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా సింక్రోనీ బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక వేడుక నిర్వహించారు. నగరంలోని నోవోటెల్ హెచ్ఐసీసీ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో సింక్రోనీ సంస్థకు చెందిన దాదాపు 500 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. తమ ‘డబుల్స్ డైవ్ ఛాలెంజ్’లో భాగంగా.. ఉద్యోగులు పేద విద్యార్థుల విద్యకు అవసరమైన వనరులను రూపొందించడంతో పాటు వారి సృజనాత్మకతకు సహకారం అందిస్తారని సింక్రోనీలో ఇ–చాట్ వైస్ ప్రెసిడెంట్, సెంట్రల్ రీజినల్ ఎంగేజ్మెంట్ హబ్ లీడర్ రాజ్ కోలా తెలిపారు. యూ అండ్ ఐ ట్రస్ట్ ప్రయత్నంలో భాగంగా హ్యాండ్‌మేడ్ బుక్మార్క్లు, ఆకర్షణీయమైన పద శోధన మెటీరియల్స్‌తో పాటు విజ్ఞాన అంశాలను పెంపొందించే చాట్బోర్డులు, పుస్తకాలను అందిస్తామన్నారు. నిర్మాణ్ సంస్థ సహకారంతో ప్రాణాలను రక్షించే నైపుణ్యాలపై అవగాహన కల్పిస్తామని, ఇందులో సీపీఆర్, ప్రథమ చికిత్స శిక్షణ తదితర అంశాలున్నాయని పేర్కొన్నారు. ఈ విధంగా ఒక జట్టుగా పదేళ్ల పాటు కృషి చేయడం అభినందనీయమని వివరించారు. మహిళామణుల ఆరోగ్యం కోసం..సాక్షి, సిటీబ్యూరో: అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో ఖైరతాబాద్‌లోని జలమండలి కార్యాలయంలో మహిళా ఉద్యోగుల కోసం బుధవారం ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రి, జలమండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరాన్ని వాటర్‌బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి ప్రారంభించారు. వంద మందికిపైగా మహిళా ఉద్యోగులు పాల్గొని పరీక్షలు చేయించుకున్నారు. వైద్యులు వీరికి బీపీ, షుగర్, ఈసీజీ, కంటి చూపు, దంత పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో కిమ్స్ ఆసుపత్రి వైద్యురాలు డా.ఎం.మాధవి, ఫైనాన్స్ సీజీఎం కేదారేశ్వరి, జలమండలి ఉమెన్స్ మినిస్టీరియల్ స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు శైలజ, జనరల్ సెక్రటరీ బిల్కిస్ భాను తదితరులు పాల్గొన్నారు. ఆర్ట్ ఫర్ హోప్ సామాజిక మార్పు కోసం కళను సాధనంగా మార్చాలనే సందేశంతో హ్యుందాయ్ మోటర్ ఇండియా ఫౌండేషన్ ‘ఆర్ట్ ఫర్ హోప్’ పేరిట ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ విషయాన్ని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. దీని ద్వారా 50 మంది ప్రతిభావంతులైన కళాకారులను ఎంపిక చేస్తున్నామని, వీరికి రూ.60 లక్షల మొత్తం గ్రాంట్‌గా అందిస్తున్నామన్నారు. ఎంపికైన చిత్రకారుల కోసం దేశ రాజధానిలో భారీ ప్రదర్శన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. -
గృహ సామ్రాజ్యానికి మహారాణి..!
ఒక ఉత్తమ సమాజ స్థాపనకు వెన్నెముక కుటుంబం కనుక పురుషుడు బయటి సామ్రాజ్యానికి అధిపతి అయితే స్త్రీని ఆ గృహ సామ్రాజ్యానికి మహారాణిగా చేసింది ఇస్లాం. పిల్లల ఆలన భర్త పాలన చేస్తూ, ఎలాంటి ఆర్థిక బాధ్యతలు లేకుండా స్త్రీని మినహాయించింది. ఏ విషయంలోనూ ఆడపిల్లను తక్కువగా చూడరాదని, మగపిల్ల వాడిని అధికుడిగా చూడరాదనీ, ఇద్దరిపట్ల సమానమైన ప్రేమను చూపించాలనీ, భ్రూణ హత్యలను నిషేధిస్తూ ఆడపిల్లను అన్యాయంగా హతమార్చితే కఠిన శిక్షకు గురవుతారని హెచ్చరించింది. తల్లి పాదాల చెంత స్వర్గం ఉందని ప్రకటించి స్త్రీ జాతి ఔన్నత్యాన్ని పతాక స్థాయికి చేర్చిన ఘనత ఇస్లాం ధర్మానికే దక్కుతుంది.1400 సంవత్సరాలకు పూర్వమే స్త్రీలకు ఓటు హక్కును కల్పించి, తన తండ్రి, భర్త, పిల్లల ఆస్తిలో వాటాను కల్పిస్తూ, ఆమెకు ఆస్తిహక్కును ప్రకటించింది. వివాహ విషయంలో తనకిష్టమైన వరుడిని ఎంపిక చేసుకునే విషయమై ఆమె సమ్మతి తీసుకోవాలనీ, దుర్మార్గుడైన భర్త నుండి ‘ఖులా‘ అనే ప్రక్రియ ద్వారా విడిపోయి తనకు తానుగా జీవించే హక్కును కలిగి ఉండడమే కాక పునర్వివాహం చేసుకునే హక్కునూ ప్రసాదించింది. కనుకనే తనకన్నా వయసులో 15 ఏళ్ల పెద్దదైన హజరత్ ఖదీజా అనే వితంతువును పాతికేళ్ల నిండు యవ్వనంలో వివాహమాడి స్త్రీ జాతి కీర్తిని సమున్నత స్థాయికి చేర్చారు ప్రవక్త ముహమ్మద్ (సం). స్త్రీ సహ ధర్మచారిణి అంటూ మీరు తిన్నదే ఆమెకు తినిపించండని సమాజానికి హితవు పలికారు. విద్యనభ్యసించడం స్త్రీ పురుషుల విధి అని విద్యనభ్యసించడాన్ని ప్రోత్సహించడమే కాక, సమాజానికి స్ఫూర్తిదాయకమైన స్త్రీ మూర్తులను అందించింది ఇస్లాం. ఇస్లామీయ చరిత్ర లో హజరత్ ఆయిషా (ర) ప్రముఖ విద్వాంసురాలిగా, హజరత్ షిఫా(ర) ప్రముఖ గైనకాలజిస్టు గా, హజరత్ ఖదీజా(ర )అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారవేత్తగా సమాజానికి అమూల్యమైన సేవలందించారు. ప్రముఖ మేధావి ఫాతిమా అల్ ఫహ్రీ మురాకోలో స్థాపించిన ‘అల్ ఖరావీన్’ యూనివర్సిటీ ప్రపంచంలోనే అతి పురాతన విశ్వవిద్యాలయంగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ లో నమోదయ్యింది. హదీసు విద్యావేత్తలలో మహిళా ఉపాధ్యాయులుగా పేరుగాంచి ఇస్లామీయ చరిత్రకు వన్నెతెచ్చిన వనితలు కోకొల్లలు. మహిళలు తమ కార్య పరిధిలో ఉంటూనే మౌలికమైన బాధ్యతలతో పాటు సమాజంతో చక్కటి బాంధవ్యాన్ని ఏర్పరచుకోగలరనే స్ఫూర్తినిచ్చింది ఇస్లాం ధర్మం..– బతూల్ హుమైర్వీ(చదవండి: -
ఆ పరీక్షే నాకు ఆనందాన్నిస్తోంది..!
ప్రవచనాలు చెప్పడం మామూలు విషయం కాదు. ఎందుకంటే పాఠశాలలో లేదా కళాశాలలో ఏమీ తెలియని వారికి, చిన్న వాళ్లకీ పాఠాలు బోధించడం చాలా సులువు. కానీ అన్నీ తెలిసిన వారికి, పెద్దవారికి ప్రవచనాలు చెప్పడం అంటే కత్తిమీద సామే. అది మహిళా ప్రవచనకారులకు మరీ పరీక్ష. అయినా సరే, ఆ పరీక్షే తనకు ఆనందాన్నిస్తోందంటున్నారు దుర్భాకుల హేమ... అది ఆమె మాటల్లోనే...ప్రవచనాలు చెప్పడం మామూలు విషయం కాదు. ఎందుకంటే పాఠశాలలో లేదా కళాశాలలో ఏమీ తెలియని వారికి, చిన్న వాళ్లకీ పాఠాలు బోధించడం చాలా సులువు. కానీ అన్నీ తెలిసిన వారికి, పెద్దవారికి ప్రవచనాలు చెప్పడం అంటే కత్తిమీద సామే. అది మహిళా ప్రవచనకారులకు మరీ పరీక్ష. అయినా సరే, ఆ పరీక్షే తనకు ఆనందాన్నిస్తోందంటున్నారు దుర్భాకుల హేమ... అది ఆమె మాటల్లోనే...నా పూర్వజన్మ సుకృతంప్రతిసారీ ప్రవచనం చెప్పడం నాకొక గొప్ప పరీక్ష. ఆ పరీక్షే నాకు చాలా అనందాన్నిచ్చేది. విస్తృతంగా గ్రంథ పఠనం చేయడం, విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవడం, ఆవళింపు చేసుకున్న విషయాన్ని సభాముఖంగా సుస్పష్టంగా వివరిస్తూ శ్రోతలకు ఆనందం కలిగించడం ప్రవచనకారిణిగా నా ప్రథమ కర్తవ్యంగా భావించాను. ఎంతోమంది ప్రఖ్యాత ప్రవచనకారుల ఉపన్యాస వైదుద్యాన్ని తెలుసుకోవడం కోసం వీలున్నప్పుడల్లా వారి ఉపన్యాసాలు వినేదాన్ని. ఇంకొక విషయం, నా పూర్వజన్మ సుకృతం వల్ల నాకు లభించిన ప్రవచన వేదికలన్నీ చాలా శక్తివంతమైనవి. ఎన్నో దేవాలయ ప్రాంగణాలు, ఎన్నో ధార్మిక సంస్థల వారి వేదికలు, మరెన్నో ప్రాచుర్యం వహించిన ఆధ్యాత్మిక స్థలాలు నాకు చేయూతనిచ్చాయి. కాలం మారింది. నేడు ఎందరో యువతీయువకులు ఆధ్యాత్మిక రంగం పట్ల ఆసక్తి పెంచుకుంటున్నారు. నా ప్రవచనం పూర్తయ్యాక నా దగ్గరకు వచ్చి ‘‘అమ్మా! మీరు చెబుతున్న విషయాలు బాగున్నాయి. ఇంకా కొత్త విషయాలు తెలుసుకోవాలంటే ఏ ఏ పుస్తకాలు చదవాలి ? ఏ ఏ గ్రంథాలయాలలో పుస్తకాలు కోసం వెదకాలి. అని అడుగుతుంటే మనసు సంతోషంతో ఉప్పొంగుతుంది. నాకు సాధ్యమైనంతవరకు వారికి తగిన మార్గాన్ని సూచిస్తుంటాను. – డాక్టర్ దుర్భాకుల హేమ -
అభయమిచ్చే వీర హనుమానుడు..!
ఆసియా ఖండంలో అతి ఎత్తయిన ఆంజనేయస్వామి విగ్రహం 65వ నంబర్ జాతీయ రహదారి పక్కన కొలువై ఉంది. ప్రసన్నాంజనేయ స్వామిని దర్శించుకునేందుకు నిత్యం ఇతర రాష్ట్రాల నుంచి వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఆంజినీపుత్రుడిని పూజిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాల 65వ నంబర్ జాతీయ రహదారి సమీపంలో పచ్చని పంట పొలాలు, ఆహ్లాదకరమైన ప్రకృతి నడుమ అభయాంజనేయ స్వామి భక్తులకు దర్శనమిస్తున్నాడు. స్వామి వారిని విశాలమైన ్ర΄ాంగణంలో జాతీయ రహదారి పక్కన 2003వ సంవత్సరంలో ప్రతిష్ఠించారు. వర్షాకాల నేపథ్యంలో చుట్టూ పచ్చని పొలాల మధ్య అభయమిచ్చే వాయుపుత్రుని చూసేందుకు నిత్యం భక్తులు వచ్చి వెళ్లుతుంటారు. జాతీయ రహదారి పక్కన పరిటాల సమీపంలో ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ధర్మకర్త బోడేపూడి వెంకటేశ్వరరావు 28 ఏప్రిల్ 2001లో శంకుస్థాపన చేశారు. నాలుగున్నర ఎకరాల్లో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. అంజినీ పుత్రుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ఆలయ ్ర΄ాంగణంలో ప్రతిరోజు హనుమాన్‌చాలీసా పారాయణం చేశారు. విగ్రహం ఏర్పాటు చేసే నాటికి 1.35 లక్షల సార్లు హనుమాన్ చాలీసా పారాయణ జరిగింది.అతి ఎత్తయిన విగ్రహం...ఆసియా ఖండంలో అతి ఎత్తయిన ప్రసన్నాంజనేయస్వామి విగ్రహం పరిటాల గ్రామ సమీపంలో పాదపీఠంతో కలుపుకుని 150 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అతిపెద్ద నగరమైన విజయవాడకు 28 కిలోమీటర్ల దూరంలో ఈ విగ్రహం వుంది. ప్రతి ఏటా నిత్యం ఆలయ ప్రాంగణం భక్తులతో కళకళలాడుతుండేది. ఆలయంలో ఒకపక్క స్వామి వారికి భక్తిపారవశ్యంతో భజన కీర్తనలు, మరో పక్క హనుమాన్ చాలీసా, ఇంకోపక్క అన్నసమారాధనతో ఆలయ ప్రాంగణం భక్తులతో విరాజిల్లుతుంటుంది.పర్యాటక కేంద్రంగా పరిటాల ఆలయం...కంచికచర్ల మండలంలోని పరిటాల జాతీయ రహదారి పక్కన కొలువై ఉన్న ఆంజనేయస్వామి ఆలయం పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. అభయాంజనేయస్వామి విగ్రహానికి పూజలు చేసేందుకు భక్తులు బస్సులు, కార్లు ఇతర వాహనాల ద్వారా వస్తుంటారు. తమిళనాడు, కర్నాటక, తెలంగాణా రాష్ట్రాల నుంచి నిత్యం వందల సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకుంటారు.హనుమాన్ జయంతి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి విశేష పూజలు చేస్తుంటారు. ఆలయ ధర్మకర్త వెంకటేశ్వరరావు భారీగా అన్న సమారాధన చేస్తుంటారు. అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో బాలాంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలో రామాలయం, క్షేత్ర ΄ాలకురాలయిన రేణుకాంబ అమ్మవారి ఆలయం కూడా ఉన్నాయి. ఆలయంలో నిత్యం హనుమాన్ చాలీసా మహాన్యాస పూర్వక నీరాజన, అష్టోత్తర పూజలు జరుగుతుంటాయి. నిత్యం భక్తులచే ప్రత్యేక పూజలందుకుంటున్న అభయాంజనేయ స్వామిని ప్రజలు చూసి తరించాల్సిందే.– శ్రీనివాస శర్మ, ప్రధాన అర్చకులు, పరిటాల – బొక్కా ప్రభాకర్, సాక్షి, కంచకచర్ల (ఎన్టీఆర్ జిల్లా)(చదవండి: మహిమాన్విత క్షేత్రం.. ఓంకారం! ఏకంగా 13 రకాల వంటకాలతో..) -
హలో హలీమ్.. చలో తినేద్దాం..
హైదరాబాద్: నగరంలో రంజాన్ మాసం అంటే ఆధ్యాత్మికతకు నెలవు. అయితే రుచుల ప్రియులకు అది హలీమ్‌కు కొలువు. రద్దీ బజార్ల నుంచి సందు గొందుల దాకా తినుబండారాల స్టాల్స్ నుంచి లగ్జరీ ఫైన్‌డైనింగ్ రెస్టారెంట్ల వరకు, ఎందెందు వెదకినా.. అందందే హలీమ్ ఘుమఘమలు గుబాళిస్తూ ఉంటాయి. నగరవాసులకు మాత్రమే కాదు విదేశాలకు సైతం ఎగుమతి అయ్యే సిటీ హలీమ్‌ను అందించడంలో స్పెషల్‌గా నిలవాలని తయారీదారులు పోటీపడుతుంటారు. కొందరు తమ సంప్రదాయ తయారీ పద్ధతులకు కట్టుబడి ఉంటారు, మరికొందరు సమకాలీన రుచులతో ప్రయోగాలు చేస్తారు. పలువురు ఫుడ్ లవర్స్‌ను ఫ్యాన్స్‌గా మార్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో ఆదరణ పొందిన టాప్ 10 హలీమ్ స్పాట్స్ విశేషాలివి.. భలే ‘సర్వీ’స్.. ప్రముఖ రెస్టారెంట్.. సర్వి గత కొంతకాలంగా అత్యంత ఆదరణ పొందుతున్న హలీమ్‌కు కేరాఫ్‌గా ఉంది. ఈసారి చికెన్ 65, ఉడికించిన గుడ్డు, జీడిపప్పు, క్రీమ్‌లతో కూడిన ప్రత్యేక ఇరానీ హలీమ్‌ను అందిస్తున్నారు. మాసాబ్‌ట్యాంక్, బంజారాహిల్స్, మాదాపూర్, సికింద్రాబాద్‌లలో సర్వి రెస్టారెంట్స్ ఉన్నాయి. ‘వజ్రం’లా.. హోటల్ సిటీ డైమండ్ హలీమ్ ప్రియుల ఫేవరెట్ ప్లేస్‌గా పేరొందింది. నెయ్యితో తయారైన వీరి హలీమ్ సుగంధ మిశ్రమాన్ని కలిగి ఉంటుంది. దీనిని సంప్రదాయ భట్టిలో వండుతారు. మెహదీపట్నంలో సిటీ డైమండ్ ఉంది. హుషార్.. పెషావర్.. ప్రత్యేక టాపింగ్స్ లేని హలీమ్‌ను ఇష్టపడే వ్యక్తులకు, పెషావర్ సరైన ప్లేస్. గత కొన్ని సంవత్సరాలుగా సువాసన గల హలీమ్‌తో హైదరాబాదీలను ఆకట్టుకుంటోన్న పెషావర్ లక్డీకాపూల్, మలక్‌పేట్‌లో ఉంది. వహ్వా.. అని‘పిస్తా’.. నగరవాసులు అత్యంత ఇష్టపడే పిస్తా హౌస్ ప్రస్తావన లేకుండా హైదరాబాద్ హలీమ్ పండుగ ఉండదు. ప్రతి ఏటా మాంసం, మసాలాతో కూడిన హలీమ్‌తో తనదైన రుచిని పిస్తా హౌస్ అందిస్తుంది. నగరంలో దాదాపు ప్రతీ ప్రధాన ఏరియాలో పిస్తా హౌస్‌లు ఉన్నాయి. మది దోచే.. మందార్ అచ్చమైన సంప్రదాయ పద్ధతులను ఉపయోగించి వండే హలీమ్‌కు మందార్ పేరొందింది, కాసింత ఇంటిశైలి రుచిని ఇష్టపడేవారికి కరెక్ట్ ప్లేస్. ఈ హలీమ్‌ను రుచి చూడాలంటే టోలీచౌకిలోని మందార్ను సందర్శించాల్సిందే. ట్రిపుల్ ‘ఫై’న్.. ఫ్యూజన్ హలీమ్‌కు ప్రసిద్ధి చెందింది కేఫ్ 555.. చికెన్ 65, నల్లి ఘోష్్ట, తలవా ఘోష్్ట, ఉడికించిన గుడ్డు లేదా క్రీమ్ వంటి విభిన్న టాపింగ్స్‌తో వెరైటీ రుచులను అందిస్తుంది మాసాబ్ ట్యాంక్‌లో ఉన్న ఈ కేఫ్. సుభాన్.. మహాన్.. ఉస్మానియా బిస్కెట్ల సృష్టికర్త సుభాన్ బేకరీ రెండేళ్ల క్రితం హలీమ్ వ్యాపారంలో అడుగు పెట్టింది. స్వల్పకాలంలోనే నగరవాసుల మనసులను గెలుచుకుంది. నాంపల్లి, అత్తాపూర్ ప్రాంతాలలో ఈ బేకరీ ఉంది. గ్రిల్.. భారీ థ్రిల్.. బాహుబలి హలీమ్‌తో ప్రత్యేకంగా గుర్తింపు పొందింది గ్రిల్(3 ప్లేట్ల హలీమ్, ఉడికించిన గుడ్లు, చికెన్ 65, పత్తర్ కా ఘోష్ట్, నల్లి, వేయించిన ఉల్లిపాయలు, జీడిపప్పు, బాదం క్రీమ్)తో కూడిన హలీమ్‌లను వడ్డిస్తూ ఫుడ్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ హలీమ్ టేస్ట్ చేయాలంటే ఛలో సికింద్రాబాద్.మటన్కా.. బాద్‘షా’ షాగౌస్ పేరు తెలియని మాంసాహార ప్రియులు సిటీలో ఉండరేమో. ఆ క్రమంలోనే హలీమ్ లవర్స్నూ తనదైన శైలితో ఆకట్టుకుంటోంది. వినియోగించే మాంసపు రుచి పరంగా ఫ్యాన్స్‌ను దక్కించుకున్న ఈ రెస్టారెంట్ సిటీలోని లక్డికాపూల్, టోలిచౌకి, గచి్చ»ౌలి షాలీబండాల్లో ఉంది. ఆదాబ్.. షాదాబ్.. ఓల్డ్ సిటీ నడి»ొడ్డున ఉన్న షాదాబ్ హోటల్ ప్రతి రంజాన్‌కు హలీమ్ ఆదరణలో అగ్రగామిగా ఉంటుంది. నాణ్యమైన ముడిదినుసులు సాంప్రదాయ వంట శైలిని ఉపయోగించడం వీరి ప్రత్యేకత. ఘాన్సీ బజార్లో షాదాబ్ ఉంది. -
వీ ఆర్ వీగన్స్
కొన్ని సంవత్సరాలుగా వీగన్స్, వీగనిజంపై విస్తృతంగా అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో వీగనిజంకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలు, ప్రాముఖ్యత తెలిపే సదస్సులు నిర్వహిస్తున్నారు. జంతు సంరక్షణ, మూగజీవాల హక్కుల కోసం పాటు పడటం వంటి అంశాలపై వీగన్లు, వీగన్ సంస్థలు విశేషంగా కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగా నగరం వేదికగా మెర్సీ ఫర్ యానిమల్స్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ సినీతార దక్ష నాగర్కర్ భాగస్వామ్యంతో మొక్కల–ఆధారిత ఆహార జీవనాన్ని ప్రోత్సహించే అవగాహన ప్రచారాన్ని ప్రారంభించారు. స్వతాహ వీగన్ అయిన దక్ష నాగర్కర్ వీగనిజం ప్రాముఖ్యత, జంతువులపై హింస వద్దంటూ ఈ ప్రచారం ద్వారా తెలియజేస్తోంది. ఈ నేపథ్యంలో వీగనిజం గురించి, ప్రస్తుత తరుణంలో దాని ప్రాధాన్యత.. తదితర అంశాల గురించి ‘సాక్షి’తో పంచుకుంది. ప్రస్తుత మానవ జీవన విధానం జంతువులను అత్యంత హీనంగా హింసిస్తోంది. ముఖ్యంగా మాంసం కోసం 2, 3 నెలల జంతువులను కృత్రిమ విధానాలతో బలవంతంగా ఎక్కువ బరువు పెంచి సృష్టి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా డైరీ పామ్స్, ఫౌల్ట్రీ, పిగ్ ఫామ్స్‌లో కనీసం ఒక జంతువు స్వేచ్ఛగా తిరగకుండా కేజ్‌లలో బందించి వాటి ఉత్పత్తులను సేకరిస్తున్నారు. కొన్ని జంతువులైతే వాటి జీవిత కాలంలో సూర్యరశి్మకి కూడా చూడకుండా పెరుగుతున్నాయి. ఇది జీవవైవిధ్యానికి విరుద్దం. దేశంలో జనాభా పెరిగిపోయింది, ఇంతమందికి సరిపడా జంతు ఉత్పత్తులు అందించలేక, బ్యాలెన్స్ చేయలేక అనైతిక బ్రీడింగ్‌తో హింసిస్తున్నారు. ఈ సందర్భంగా ‘పవర్డ్ బై వెజ్జీస్‘ అంటూ కూరగాయలను మాత్రమే తినాలని ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా ఫ్యాక్టరీలు, వాహనాల కాలుష్యం కన్నా ఫ్యాక్టరీ ఫార్మమింగ్తో ఎక్కువ కాలుష్యం జరుగుతోంది. ఇలాంటి తరుణంలో ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించడం కోసం బాగా స్పందిస్తున్నారు. వారి జీవనంలో కొనసాగుతున్న ప్రాంతీయ వీగన్ వంటకాల విశిష్టతను తెలుసుకుంటున్నారు. కానీ నగరాల్లో మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది కదా అని వాదిస్తున్నారు. కానీ మొక్కల్లో స్టిమ్యులే మాత్రమే ఉంటుంది, జంతువుల్లో వలె నొప్పిని తెలియజేసే నాడీ వ్యవస్థ ఉండదని అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వీగన్స్ అంటే మాంసాన్ని మాత్రమే కాదు.. పాలు, పెరుగు, గుడ్లు వంటి జంతు పదార్థాలతో పాటు జంతు ఉత్పత్తులతో తయారు చేసిన బ్యాగ్‌లు, దుస్తులు ఏ ఇతర వస్తువులను వినియోగించరు. జంతువులకు వాటి స్వేచ్ఛను ఇవ్వడంతో పాటు హింసకు దూరం చేయడం అవసరం. నేను నటించిన జాంబిరెడ్డి సినిమా షూటింగ్ సమయంలో మా దర్శకులు ఒక మేకను ఎంత జాగ్రత్తగా, సురక్షితంగా చూసుకున్నారో చూసి సంతోషపడ్డాను. ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో జంతువుల హింసించకూడదనే అంశంపై కొత్త చట్టాలను వెలువరించారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం కూడా జంతు పెంపకాలపై దృష్టి సారిస్తూ నియమాలను పాటిస్తుంది. సినిమాల విషయానికొస్తే త్వరలో మరో 2 సినిమాలు చేస్తున్నాను. తెలుగు ప్రజలకు దగ్గరవ్వడం చాలా సంతోషంగా ఉంది. – దక్ష నాగర్కర్జంతు సంరక్షణే లక్ష్యంగా 2016లో ప్రారంభించిన మెర్సీ ఫర్ యానిమల్స్ ఇండియా ఫౌండేషన్ దేశవ్యాప్తంగా కృషి చేస్తోంది. సంస్థ పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల్లో క్రూరంగా పందులను పెంచడం నిషేధించారు. ఇందులో తెలంగాణ రాష్ట్రం కూడా ఉంది. శాఖాహారం, మాంసాహారం ఉన్నట్లుగానే వీగన్ ఫుడ్‌కు కూడా లేబుల్ ఉండేలా మార్పు తీసుకొచ్చాం. జాన్ అబ్రహం, సోనాక్షి సిన్హ, సాక్షి మల్లిక్ మాదిరిగానే హైదరాబాద్‌లో వీగనిజం కోసం దక్షా నాగర్కర్ క్యాంపెయిన్ చేయడం సంతోషంగా ఉంది. ప్రస్తుతం ఒక జంతువును చంపితే రూ.50 ఫైన్ కట్టి హాయిగా తిరుగుతున్నారు. ఒక మనిషిని చంపితే ఎలాంటి చట్టం ఉంటుందో జంతు హత్యలపై కూడా కఠినమైన చట్టాలు తీసుకురావాలని ఉన్నత న్యాయస్థానాలకు విన్నవించాం. – నికుంజ్ శర్మ, సీఈఓ, మెర్సీ ఫర్ యానిమల్స్ ఇండియా -
ఒక ఆలోచన...విజేతను చేసింది
నళిని ఓ ఫుడ్ప్రెన్యూర్. జంషెడ్పూర్, టాటానగర్‌లో పుట్టారు. ప్లస్ టూ వరకు అక్కడే చదివారు. ఆ తర్వాత ఒడిశా, భువనేశ్వర్‌లో డిగ్రీ, ఎంబీఏ చేశారు. బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేశారు. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద కలిగిన ఆసక్తి ఆమెను మార్కెటింగ్ వైపు అడుగులు వేయించింది. పాలు, పాల ఉత్పత్తుల మార్కెటింగ్‌లో సక్సెస్ అయ్యారు. కరోనా పాండమిక్ ఆమె కెరీర్‌ని మలుపు తిప్పింది. సొంతంగా ఏదైనా చేయాలనే ఆసక్తి ఆమెతో మిల్లెట్ మిరకిల్ చేయించింది. బ్రెడ్ తయారీలో ఉన్న ఆసక్తి కొద్దీ ఆ ఫార్ములాని మిల్లెట్స్ మీద ప్రయోగం చేశారు. అగ్రికల్చర్, ఫుడ్ సైంటిస్టుల పరీక్షలను నెగ్గిన నళిని విజయవంతమైన తన ప్రయోగానికి పేటెంట్ ఫైల్ చేశారు. మహిళాదినోత్సవం సందర్భంగా ఆమె ‘సాక్షి’తో పంచుకున్న వివరాలివి.ఇది నా పేటెంట్ ప్రోడక్ట్! చపాతీ అంటే ప్రకటనలో చూపించినట్లు మూడువేళ్లతో తుంచేటంత మృదువుగా ఉండాలి. మిల్లెట్స్ ఆరోగ్యానికి మంచివని చపాతీ చేస్తే తినడం కష్టంగా ఉంటోంది. పరిష్కారం ఏమిటి? దీనిని ఛేదించగలిగితే సక్సెస్ చేతికందినట్లే. ఇందుకోసం నళిని తన ఆలోచనకు పదును పెట్టారు. తన సాధన ఫలించి ఆమె సాధన ఫలించి, ఇంట్లో వాళ్లు సంతృప్తిగా తిన్నారూ.. తిన్నారు. దీనినే తన ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కి మార్గం చేసుకోవచ్చు కదా! అనుకోవడంతోనే సంబంధిత అనుమతుల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఆమె చేసిన రెడీ టూ కుక్, రెడీ టూ ఈట్ మిల్లెట్ చపాతీలు ఆ పరీక్షల్లో నెగ్గాయి. నిల్వ ఉండడానికి ఆర్టిఫీషియల్ ప్రిజర్వేటివ్స్ ఏమీ వాడడం లేదని, పోషకాల లభ్యత బాగుందని హైదరాబాద్, రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఫుడ్æ సైంటిస్టులు నిర్ధారించారు. పరీక్షలలో నెగ్గిన తర్వాత తన ఫార్ములాను పరిరక్షించుకోవడం కోసం పేటెంట్ ఫైల్ చేశారు నళిని. అగ్రికల్చరల్ యూనివర్సిటీ... ఫుడ్ డెవలప్మెంట్ విభాగంలోని ఇన్‌క్యుబేటర్‌లో ప్రయోగదశలను నిర్వహించడానికి అవకాశం ఇవ్వడంతోపాటు అగ్–హబ్, నిధి ప్రయాస్ గ్రాంట్లు ఇచ్చి ప్రోత్సహించింది. తన ఆలోచన, ప్రభుత్వం నుంచి అందినప్రోత్సాహంతో పరిశ్రమ స్థాపించగలిగానని చెప్పారు నళిని. ‘‘రెండు–మూడు సంవత్సరాల గ్రౌండ్ వర్క్ తర్వాత తెరమీదకు వచ్చాను. ప్రస్తుతం పరిమితంగానే ఉత్పత్తి చేస్తూ నగరంలోని క్యూ మార్ట్, స్టార్ హోటళ్లకు అందిస్తున్నాను. పేటెంట్ వచ్చిన తర్వాత మార్కెటింగ్ మీద దృష్టి పెడతాను. ఒక కొత్త ఉత్పత్తిని ఊహించుకుని, నా జ్ఞానాన్ని మేళవించి, నిరంతరాయంగా శ్రమించి సాధించుకున్న విజయం ఇది. నా ఆలోచన, ప్రయోగానికి పేటెంట్ సాధించుకోవడం అనే ఊహే ఆనందంగా ఉంది’’ అన్నారు నళిని. మల్టీ టాస్కింగ్ మహిళలకు కొత్త కాదు! మల్టీ టాస్కింగ్‌లో మహిళలు సిద్ధహస్తులు. ఇంటి బాధ్యతలను నిర్వహించడమే అందుకు నిదర్శనం. గృహిణి బాధ్యతలకే పరిమితం కాకుండా ఇంకా ఏదైనా చేయాలనే ఆసక్తి ఉన్న వాళ్లు చాలామంది ఉన్నారు. కానీ వాళ్లలో ఎక్కువ మంది అలా అనుకుంటూనే రోజులు గడిపేస్తుంటారు. ధైర్యం చేసి తొలి అడుగు వేస్తే నడక దానంతట అదే కొనసాగుతుంది. అయితే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో అడుగుపెట్టేముందు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే... మరుసటి రోజు నుంచే లాభాల కోసం చూడరాదు. రాబడి పెరిగి ఆదాయం వచ్చే వరకు శ్రమించగలిగిన సహనం ఉండాలి. లాభాల బాట పట్టిన తర్వాత కూడా అలాగే శ్రమను కొనసాగించాలి. – నళిని, ఫౌండర్, కిబేస్, హైదరాబాద్ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
నిర్వహణలోనూ రాణిస్తాం
ఒకరు వైద్యశాస్త్రం చదివాక... తన సేవలకు ఆ పరిధి సరిపోదేమోనని సివిల్ సర్వీసెస్ రాసి... ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి హెల్త్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. మరొకరు ఓ పెద్ద హాస్పిటల్‌కు వైస్ ప్రసిడెంట్... ఇంకొకరు మరో పేరుమోసిన హాస్పిటల్‌కు సీవోవో... మరికొందరు హాస్పిటల్ డైరెక్టర్లు. వైద్యశాస్త్రం చదివి మహిళా వైద్యులుగా పేరు పొందినవాళ్లు చాలామందే ఉన్నారు. కానీ హాస్పిటల్ రంగంలో ఎంటర్ప్రెన్యూర్లుగా, ఆరోగ్యరంగ సారథులుగా ఉంటూ సారథ్యం వహిస్తున్న వారు కాస్త తక్కువే గానీ ఇప్పుడు వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇలా వైస్ ప్రెసిడెంట్లుగా, సీవోవోలుగా, కీలకమైన స్థానాల్లో ఉండి రాష్ట్రానికీ, హాస్పిటళ్లకూ దిశానిర్దేశం చేస్తూ... వాటిని ముందుండి నడిపిస్తూ ప్రధాన బాధ్యతలు తీసుకొని పనిచేస్తున్న మహిళా వైద్యుల స్ఫూర్తిమంతమైన మాటలివి.పల్లెనాడి పట్టడానికి ఐఏఎస్‌గా...నా మీద చిన్నప్పట్నుంచీ మా నాన్నగారి ప్రభావం ఎంతో ఉంది. గతంలో ఆంధ్రప్రదేశ్, మిజోరా రాష్ట్రాల్లో అనేక శాఖల్లో పనిచేస్తూ సమాజానికి అంకితభావంతో సేవలందించిన మంచి ఉద్యోగి ఆయన. పల్లె ప్రాంతల్లో పనిచేసే సమయంలో మా నాన్న ఎదుర్కొన్న సవాళ్లూ, వాటిని ఆయన పరిష్కరించిన తీరు... ఇవన్నీ చూస్తూ పెరిగాను నేను. ఆయన అనుభవాలన్నీ అటు తర్వాత నాకెంతో ఉపకరించాయి. గ్రామీణప్రాంతాల్లో నాన్న ఎదుర్కొన్న సవాళ్లకు ఆరోగ్యసేవల ద్వారానే ఉత్తమమైన పరిష్కారం అందించవచ్చని అనిపించడంతో నేను ఎంబీబీఎస్ చేశా. నా ఇంటర్న్‌షిప్ సమయంలో మారుమూల పల్లెల్లో పనిచేస్తున్నప్పుడు నేను కనుగొన్న కొన్ని లోపాలను మంచి పాలనతోనే అధిగమించవచ్చని నాకు అనిపించింది. దాంతో సివిల్ సర్వీసెస్ రాశా. అలా నేను డాక్టర్ నుంచి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌గా మారాను. ఎంత పెద్ద ప్రయాణమైనా... మొట్టమొదటి అడుగుతో మొదలవుతుందనే సూక్తిని నమ్మిన నేను ఈశాన్య రాష్ట్రాలకు సేవలందించాక ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో అందునా వైద్యశాఖ ద్వారానే నా సేవలందిస్తున్నా. మన సమాజమే పితృస్వామ్య సమాజమైనప్పటికీ మహిళలు తమ సామర్థ్యాలు చూపుతూ చాలా రంగాల్లో తమ సత్తా చాటుతున్నారు. ఒక్కోసారి తమ పురుష ప్రత్యర్థుల కంటే మహిళల సామర్థ్యాలే మెరుగ్గా ఉంటున్నాయని చెప్పవచ్చు. ఒక్కోసారి మా నాన్నవాళ్ల తరం కంటే మా తరం బాగానే పురోగమిస్తోందనిపిస్తోంది. నిజానికి మా వైద్యశాఖలో పనిచేసే సిబ్బందిలో చాలామంది మహిళలే ఉన్నారు. సమాజంలో ఈ వివక్ష ఉన్నప్పటికీ నా మట్టుకు నేను మంచి సామర్థ్యంతో,ప్రొఫెషనలిజమ్‌తో కష్టపడి పనిచేస్తే ఈ వివక్షనూ అధిమించవచ్చనే ఉద్దేశంతో పనిచేస్తున్నాను. గత 24 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రానికంతటికీ నా సేవలందించేలా మనస్ఫుర్తిగా పనిచేయడం నాకు గుండెల నిండా ఆనందాన్ని, తృప్తిని ఇస్తోంది. హెల్త్ సెక్రటరీగా రాష్ట్రంలోని అట్టడుగు, బడుగువర్గాల వారందరికీ మా ప్రభుత్వ సేవలందాలనేదే నా మొట్టమొదటి లక్ష్యం. మేము అమలు చేసిన కార్యక్రమాలతో మెరుగైన స్క్రీనింగ్ పరీక్షలూ, వైద్యపరీక్షలతో ఎన్నో మాతృమరణాలూ, శిశుమరణాలూ... వీటన్నింటినీ గణనీయంగా తగ్గించగలిగాం. మారుమూల గిరిజన్ప్రాంతాల్లో వ్యాధినిర్ధారణ కేంద్రాలూ, ఐటీడీఏలకు అంబులెన్స్ సర్వీసులపై దృష్టి నిలిపాం. చిన్న పల్లెల్లో చదివే ప్రతిభావంతులైన పిల్లలకూ వైద్యవిద్య అందాలనే సదుద్దేశంతో ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీలూ, 16 నర్సింగ్ కాలేజీలూ, 28 పారామెడికల్ కాలేజీలతోపాటు మహిళా శిశు సంక్షేమ శాఖ సమన్వయంతో... ఎంతో వివక్షకు లోనవుతున్న ట్రాన్స్‌జెండర్ వాళ్ల ఆరోగ్యం కోసం ఓ తొలి ప్రయత్నంగా 33 క్లినిక్‌లు ఏర్పాటు చేసే దిశగా పనిచేశాం. ఓ ప్రభుత్వ ఉద్యోగిగా సివిల్ సర్వీసెస్‌లో ఉంటూ నా పనుల ద్వారా సమాజంలో ఎంతో మార్పు తెచ్చామన్న తృప్తి ప్రతిరోజూ ప్రతిక్షణం ఉండటమే ఈ వృత్తిలో ఉన్నందుకు నాకు దక్కే సంతృప్తి. – డాక్టర్ క్రిస్టినా జడ్ చోంగ్తూ, సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సంకల్ప బలంతోనే సాధన సులభంఒక హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్‌గా, మా టీమ్‌లోని ఉద్యోగులకు స్ఫూర్తిని అందించే మెంటార్‌గా, మా హెచ్ఆర్ టీమ్‌లకూ, పారామెడికల్ స్టాఫ్‌కూ మార్గనిర్దేశనం చేస్తూ, వారికి నేతృత్వం వహించే పనిచేయడాని కంటే ముందు నేను మా తల్లిదండ్రులకు ఏకైక సంతానాన్ని. దాంతో నా తల్లిదండ్రుల బాధ్యతలూ నేనే నిర్వహించాలి. దాంతోపాటు నా భర్తకు అవసరమైన నైతిక స్థైర్యాన్ని, నా అత్తమామలకు అవసరమైన సేవలందిస్తూ ఇలా ఇంటిబాధ్యతలు చూస్తూనే... కెరియర్ పరంగా ఓ ఎంట్రప్రెన్యూర్‌గా హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ బాధ్యతలు చేపట్టా. ఓవైపు ఇంటిబాధ్యతలూ, మరోవైపు కెరియర్ బాధ్యతలు... ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ మా సంస్థ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నా. సంకల్పబలం ఉంటే కష్టసాధ్యమైన లక్ష్యాలనూ ఛేదించగలం అనేది నేను నమ్మే తారకమంత్రం. ఈ మాట ఎందుకు చె΄్పాల్సి వస్తోందంటే... నేను రెండోసారి గర్భవతిగా ఉన్నప్పుడు నా రేడియాలజీ పీజీ పూర్తి చేశా. అటు తర్వాత ప్రతిష్ఠాత్మమైన ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్’లో ఏఎమ్పీహెచ్ ప్రోగ్రామ్ పూర్తికావడంతోనే ప్రీతీ హాస్పిటల్స్ గ్రూపునకు ఆపరేషన్స్ అధినేతగా బాధ్యతలు తీసుకున్నా. ప్రస్తుతం నేను మా సంస్థలో వందల సంఖ్యలో పనిచేస్తున్న ఉద్యోగులకు నేతృత్వం వహిస్తున్నా. ఈ క్రమంలో మా సంస్థలో జెండర్ వివక్ష ఉండకూడదనే ఉద్దేశంతో వీలైనంత మేరకు మహిళా ఉద్యోగులనే నియమిస్తున్నాం. రోజు డ్యూటీ ముగిసి ఇంటికెళ్లే సమయానికి... మేం మా పేషెంట్ల పట్ల మాత్రమే కాకుండా... సమాజంలోని నిరుపేదల విషయంలోనూ సహానుభూతితో వ్యవహరిస్తున్నామన్న తృప్తే మమ్మల్ని ముందుకు నడిపించే మరో స్ఫూర్తిమంత్రమంటూ వినమ్రంగా చెబుతున్నాను. – డాక్టర్ రూప పుట్టా, సీనియర్ రేడియాలజిస్ట్, డైరెక్టర్ అండ్ కో ఫౌండర్ ఆఫ్ ప్రీతీ యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్స్, హైదరాబాద్ సారథ్యం అంత కష్టమేమీ కాదు!ప్రస్తుతం నా వయసు 37 ఏళ్లైతే... మా హాస్పిటల్ వయసు 32 ఏళ్లు. అంటే నా ఊహ తెలిసినప్పటినుంచి మా అమ్మతో పాటు హాస్పిటల్, క్లినిక్... ఇలా నిత్యం వైద్యుల మధ్యనే మెలగుతున్నా. నా ఇంటర్మీడియట్ టైమ్‌లో బైపీసీ తీసుకుని వైద్యరంగం వైపునకు వెళ్లడం అనివార్యంగా జరిగిపోయింది. మాకు ఓ సొంత హాస్పిటల్ ఉండటం... అలాగే మేము నడుపుతున్న మెడికల్ కాలేజీలూ ఉండటం వల్ల అక్కడ హాస్పిటల్ సారథిగా కీలకమైన అడ్మినిస్ట్రేషన్ స్థానంలోకి నేను వెళ్లడం చాలా సులువు అని కొంతమందికి అనిపించవచ్చు. అయితే ఈ పురుషులప్రాధాన్య ప్రపంచంలో ప్రతి సవాలునూ, ప్రతి సమస్యనూ పరిష్కరించుకుంటూ రావడం, ఓ మహిళగా ప్రతి నిమిషం, ప్రతిక్షణం తనను తాను నిరూపించుకుంటూ ఉండటం, ఆ స్థానాన్ని పదిలంగా నిలబెట్టుకోవడం, అందులో పదికాలాలు నిలదొక్కుకోవడం చాలా కష్టమైన పని. ఇక్కడ మనం చేయాల్సిందొక్కటే... మన హద్దులను మనమే మరింతగా విస్తృత పరచుకుంటూ, మన పరిధిని మనమే మరింత విశాలం చేసుకుంటూ మన తోటివారినీ మనతోపాటు ముందుకు తీసుకెళ్తూ ఉండటమే. ఓ మహిళగా నా టీమ్‌ను ఈ దిశగా నడిపిస్తూ నా డాక్టర్లూ, నా సిబ్బందీ వీళ్లందరూ మంచి కౌన్సెలర్లుగా సహానుభూతితో పనిచేసేలా చేయగలగడం, మంచి ఆరోగ్యాన్ని అందించడం ప్రస్తుతం నేను చేస్తున్న పని. చాలాకాలం పాటు హాస్పిటళ్ల చుట్టూ తిరుగుతూ ఉండాల్సిన నిరుపేద పేషెంట్లకూ, గ్రామీణప్రాంతపు రోగులకూ ఈ సౌకర్యాలన్నీ ఇవ్వగలుగుతూ వస్తున్నామన్న ఓ అద్భుతమైన భావనే నాకు సంతృప్తినిస్తుంది. – డాక్టర్ గాయత్రి కామినేని, ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో), కామినేని హాస్పిటల్స్, హైదరాబాద్మేనేజ్మెంట్లో మేమే బెస్ట్!మొదట నేను ఓ డాక్టర్‌గానే సేవలందిస్తా అనుకున్నా. కానీ ఓ ఎంట్రప్రెన్యూర్‌గా, ఓ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేయడం వల్ల చాలా విస్తృతస్థాయిలో సేవలందించడానికి మనకు సాధ్యమవుతుందని గ్రహించాను. సరిగ్గా ఇదే సమయంలో విజయవాడలో డాక్టర్ భాస్కర్రావుగారు కిమ్స్ తమ హాస్పిటల్ శాఖనుప్రారంభించారు. ఆ టైమ్‌లో అసిస్టెంట్ మెడికల్ డైరెక్టర్‌గా కిమ్స్‌లో పనిచేయడం మొదలుపెట్టా. హాస్పిటల్ నడిపించడమెలాగో నేర్చుకోవడం కోసం ప్రతిరోజూ నేను గుంటూరు నుంచి విజయవాడకు వెళ్లి... అక్కడ ప్రతి విభాగంలో ఉండే కష్టనష్టాలూ, సాధకబాధకాలు బాధకాలూ తెలుసుకుంటుండేదాన్ని. ఆ రంగంలో నాకున్న ఆసక్తి కారణంగా ప్రతిరోజూ గుంటూరు నుంచి విజయవాడకు వస్తూ పోతూ ఉండటాన్ని కంటిన్యువస్‌గా నాలుగేళ్లపాటు కొనసాగించా. అటు తర్వాత హైదరాబాద్‌లోని కొండాపూర్ కిమ్స్ విభాగానికి మెడికల్ డైరెక్టర్‌గా, ఇప్పుడు కిమ్స్ హాస్పిటల్స్ తాలూకు వైస్‌ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నాను. పేదలూ, బడుగువర్గాల నుంచి ప్రతిభావంతులైన మహిళలను ఎంచుకుని వారు సమర్థంగా పనిచేయగల స్థానాల్లో వారి నియామకాలు జరిగేలా చూసినప్పుడు... సమాజానికి అవసరమైన పని చేశామన్న సంతృప్తి ఉంటుంది. రేపు ఇంతకంటే మెరుగ్గా చేయాలన్న సంకల్పమూ ఉంటుంది. – డాక్టర్ హరిణి చేబ్రోలు, వైస్ ప్రెసిడెంట్ (రెవిన్యూ సైకిల్ మేనేజ్మెంట్), కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ కెరియర్ మెట్లపై‘ఫెమ్’నిస్టులం!అందరూ మహిళా డాక్టర్లే ఉంటూ, మహిళలతోనే నడిచే ఓ పూర్తిస్థాయి మహిళల హెల్త్‌కేర్ సెంటర్‌ను మేము ఏర్పాటు చేయడానికి వెనక ఓ చిన్న కథ ఉంది. చిన్నపిల్లల వైద్యుడూ, రోజుల పిల్లల స్పెషలిస్తూ (నియోనేటాలజిస్ట్) అయిన నా భర్త దగ్గరికి తమ పిల్లలను తీసుకొచ్చే తల్లులు తనను నిత్యం ఓ ప్రశ్న అడుగుతుండేవారు. ‘ఏమండీ... ఎవరైనా మహిళా రేడియాలజిస్టు ఉన్నారా?... ఎక్కడైనా ఓ లేడీ బ్రెస్ట్ సర్జన్ దొరుకుతారా?’’ అన్నదే చాలామంది ప్రశ్న. దీంతో ఆ రంగాల్లో మహిళా వైద్యుల అవసరముందనే విషయం మా దృష్టికి వచ్చింది. దాంతోపాటు మరో అంశమేమిటంటే... మా అమ్మ గారు క్యాన్సర్ విజేత. ఆమెకు క్యాన్సర్ చికిత్స జరుగుతున్న సమయంలో నేను ఆమె వెంట వెళ్తూ ఉండేదాన్ని. ఎవరైనా మహిళా వైద్యురాలి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆమె చాలా సౌకర్యంగా ఫీలవుతుండటాన్ని గ్రహించా. అలాంటి అనుభవాల నుంచి పుట్టిందే మా ఫెమ్‌సిటీ హాస్పిటల్. ఓ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలనుకునే మహిళకు జస్ట్ 9 టు 5 జాబ్ చేయడం కుదరని పని. మనం ఎంచుకునే కెరియర్ అంతకంటే ఎక్కువే డిమాండ్ చేస్తుంటుంది. ఉదాహరణకు... నా చిన్నారి బేబీకి జన్మనివ్వడానికి కేవలం నాలుగు గంటల ముందు కూడా నేను నా టీమ్‌తో పనిలో నిమగ్నమయ్యే ఉన్నాను. అంతేకాదు... నా టీమ్‌తో ఏదో చర్చిస్తూ, వాళ్లకు మార్గనిర్దేశనం చేసిన మరో నాలుగ్గంటల తర్వాతే నా బేబీని నా చేతుల్లోకి తీసుకున్నా. నిజానికి మహిళలు తమ చుట్టూ ఉండేవాళ్ల ఆరోగ్యాన్నీ, సంక్షేమాన్ని, భద్రతనూ ఎల్లప్పుడూ కోరుకుంటూ, వాళ్లకేప్రాధాన్యమిస్తుంటారు. అందుకే ఈ సమాజానికి మరో తరాన్ని ఇస్తూ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ముందుండే మహిళలతో సాటి మహిళగా కనెక్ట్ అవుతూ, ఆమెకు మానసిక, శారీరక ఆరోగ్యానందాలను ఇవ్వడం చాలా కీలకమైన అంశంగా ఫీలవుతుంటాను. ఫెమ్‌సిటీ కేర్స్ అనే ఫౌండేషన్ సహాయంతో ఖర్చులు భరించలేని, అఫర్డ్ చేయలేని అనేక మందికి శానిటరీ న్యాప్కిన్స్ పంపిణీ, నెలల పిల్లలకూ, చిన్న చిన్నపిల్లల వైద్యం, అనేక మందికి సర్జరీలూ ఉచితంగా అందిస్తున్నాం. ఇలాంటి సేవలెన్నో మా మహిళా, చిన్నపిల్లల హాస్పిటల్ ద్వారా నిరంతరం అందించగలుగుతున్నామన్నదే నాకు సంతృప్తినిచ్చే అంశం. – ఎల్మిరా సిద్దీఖీ, కౌ–ఫౌండర్ అండ్ డైరెక్టర్ (పబ్లిక్ రిలేషన్స్), ఫెమ్‌సిటీ హాస్పిటల్స్, హైదరాబాద్రంగుల కళఇంటర్నేషనల్ విమెన్స్ డే సింబల్, పోస్టర్ డిజైన్లలో సాధారణంగా పింక్ కలర్లో కనిపిస్తుంటుంది. నిజానికి ఎన్నో ఏళ్లుగా ఇంటర్నేషనల్ విమెన్స్ డేఅంటే ఊదా, ఆకుపచ్చ, తెలుపు రంగులు మాత్రమేప్రాచుర్యం పొందాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వెబ్సైట్ ప్రకారం... ఊదా రంగు గౌరవానికి, న్యాయానికి, ఆకుపచ్చ ఆశకు, తెలుపు స్వచ్ఛతకు ప్రతీక. యూకేలోని ఉమెన్స్ సోషల్ అండ్ పొలిటికల్ యూనియన్ (డబ్ల్యూ ఎస్పీయూ–1908) ద్వారా ఈ రంగులుప్రాచుర్యంలోకి వచ్చాయి. -
టైప్ 2 డయాబెటిస్‌కి మొక్కల ఆధారిత ఔషధం..!
దేశంలో ఎక్కువ మంది టైప్2డయాబెటిస్(Type2Diabetes)తోనే బాధపడుతున్నారు. గణాంకాలు సైతం ఆ వ్యాధి బాధితులు ఏటా వేలల్లో ఉంటున్నట్లు చెబుతున్నాయి. ఇప్పటి వరకు వాడుతున్న మందులన్నీ ఈ వ్యాధిని అదుపులో ఉంచుతాయే తప్ప. పూర్తిగా నివారించలేవు. ఆ దిశగా పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు కొంత పురోగతిని సాధించారు. తాజా అధ్యయనంలో టైప్2 డయాబెటిస్‌కి చెక్‌పెట్టే సరికొత్త ఔషధాన్ని తయారు చేశారు. ఇది రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌లో సత్ఫలితాలనందించి, డయాబెటిస్ రోగుల్లో కొత్త ఆశను రేకెత్తించింది. మరీ ఆ ఔషధం విశేషాలేంటో చూద్దామా..!.బెర్బెరిన్ అనేది వివిధ మొక్కలలో సహజంగా లభించే ఆల్కలాయిడ్. దీన్ని సాంప్రదాయ చైనీస్‌లో జీర్ణ సమస్యలు, వాపు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. వాళ్లు దీన్ని శతాబ్దాలుగా వివిధ రకాల చికిత్సకు ఉపయోగిస్తన్నారు. దాంతోనే టైప్2డయాబెటిస్ ఔషధాన్ని తయారు చేశారు చైనాలోని పెకింగ్ యూనివర్సిటీ పీపుల్స్ హాస్పిటల్ పరిశోధకులు. మొక్కల్లో లభించే బెర్బెరిన్ ఉత్పన్నం అయినబెర్బెరిన్ ఉర్సోడియోక్సికోలేట్ ఔషధాన్ని తయారు చేశారు. ఇక టైప్ 2 డయాబెటిస్ అనేది ఇన్సులిన్ నిరోధకత వల్ల సంభవిస్తుంది, ఇక్కడ శరీరం ప్యాంక్రియాస్ ఉత్పత్తి చేసే ఇన్సులిన్‌కు సరిగా స్పందించదు. కాబట్టి రక్తంలో గ్లూకోజ్ అమాంతం పెరుగుతుంది. అయితే దీనికి కేవలం రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను సాధారణ స్థాయికి తగ్గించే మందులు వాడుతూ..ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంభించడమే మార్గం. నిజానికి ఫ్యాటీ లివర్ వ్యాధికి చికిత్స చేయడానికి బెర్బెరిన్ ఉర్సోడియోక్సికోలేట్, లేదా HTD1801ని కనుగొన్నారు. అయితే ఫేస్ 2 ట్రయల్స్‌లో ఊహించని విధంగా టైప్ 2 డయాబెటిస్‌ని కూడా సమర్థవంతంగా ప్రభావితం చేసి గణనీయంగా తగ్గించింది. అంతేగాదు ఆ అధ్యయనంలో ఇది కాలేయ కొవ్వు శాతంతోపాటు రక్తంలోని గ్లూకోజ్ నియంత్రణను గణనీయంగా మెరుగుపరిచిందని పరిశోధకులు గుర్తించారు. ఇక్కడ గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ లేదా HbA1c అనేది రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను కొలిచే మార్కర్. అయితే ఆ ట్రయల్స్‌లో ఆహారం, వ్యాయామంతో తగినంతగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గని ఈ టైప్2 డయాబెటిస్ రోగుల్లో మాత్రం గణనీయమైన ప్రభావం చూపింది. వారిలో ఈ HTD1801 ఔషధం ప్రభావాన్ని అంచనా వేయగా..కొందరికి దీన్ని 500 మిల్లీ గ్రాములన చొప్పున రోజుకు రెండుసార్లు ఇచ్చారు. అలా తీసుకున్న వాళ్లలో గణనీయమైన మెరుగుదల కనిపించింది. వారందరిలో HbA1c అనేది చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. రోజుకు 500 మిల్లీగ్రాముల చొప్పున తీసుకున్నవాళ్లలో ఈ HbA1c 0.7% తగ్గింపు కనిపించింది. ఇక రోజుకు రెండు సార్లు చొప్పున మొత్తం 1000 మిల్లిగ్రాముల మోతాదులో ఔషధం తీసుకున్నవారిలో HbA1c లో 1.0% తగ్గింపు కనిపించింది. అంటే ఈ ఔషధం మోతాదు ఆధారిత మెరుగుదలను గుర్తించారు పరిశోధకులు. అంతేగాదు ఈ HTD1801 ఔషధం లిపోప్రొటీన్ కొలెస్ట్రాల్ (LDL-C, 'చెడు' రక్తం) స్థాయిలు, వాపు, హృదయనాళ ప్రమాదాలను గణనీయంగా తగ్గించింది. అలాగే ఈ పరిశోధనలో పాల్గొన్న రోగులెవరు బరువు పెరగలేదు కూడా. ఈ ఔషధంతో చికిత్స సురక్షితమైనది రోగులు ఈ మందు ప్రభావాన్ని తట్టుకోగలుగుతున్నారు. పైగా ఇతర ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పడుతున్నట్లు పరిశోధనలో తేలిందన్నారు శాస్త్రవేత్తలు. దీన్ని కేవలం టైప్ 2 డయాబెటిస్‌కి మాత్రమే కాకుండా ఇతర చికిత్సలకు కూడా వినయోగించొచ్చని వెల్లడించారు. ఇక ఈ ట్రయల్స్‌కి ఔషధం HTD1801 తయారీదారులైన షెన్జెన్ హైటైడ్ బయోఫార్మాస్యూటికల్ లిమిటెడ్ నిధులు సమకూర్చింది. ఈపరిశోధన జామా నెట్వర్క్ జర్నల్‌లో ప్రచురితమైంది. (చదవండి: 'మష్రూమ్ చట్నీ పౌడర్': పోషకాలు పుష్కలం ఆరోగ్యం కూడా..!) -
'మష్రూమ్ చట్నీ పౌడర్': పోషకాలు పుష్కలం ఆరోగ్యం కూడా..!
బెంగళూరులోని భారతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ (ఐఐహెచ్ఆర్) రూపొందించిన ముఖ్యమైన సాంకేతికతల్లో ఒకటి ‘అర్క మష్రూమ్ చట్నీ పౌడర్’ టెక్నాలజీ. పుట్టగొడుగులకు విలువ జోడించటం ద్వారా వాటిలో పోషక విలువలను అనేక విధాలుగా ఉపయోగించుకోవటానికి అవకాశం ఉంటుంది. సంప్రదాయం, పౌష్టికత, రుచిల మేలు కలయికకు మష్రూమ్ చట్నీ పౌడర్ టెక్నాలజీ నిదర్శనంగా నిలుస్తుంది. తాజా పుట్టగొడుగులు ఎన్నో రోజులు నిల్వ ఉండవు, పైగా మార్కెట్ ధర ఎక్కువ. కాబట్టి అందరికీ అందుబాటులో ఉండవు. అందుకని వీటిత పొడులు తయారు చేసే టెక్నాలజీని ఐఐహెచ్ఆర్ రూపొందించింది. ఎండు పుట్టగొడుగులతో రకరకాలుగా చట్నీ పొడులను తయారు చేసుకోవచ్చు. పట్టణ, గ్రామీణ ప్రాంతవాసులు రోజువారీ భోజనంలో సులభంగా వాడుకునే విధంగా పోషకాలు నష్టపోని రీతిలో పొడులు తయారు చేయవచ్చు. సంప్రదాయ రుచులకు తగినట్టుగా 7 రకాల పుట్టగొడుగుల చట్నీ పొడులను రూపొందించారు. బ్రహ్మీ, మునగ ఆకులు, అవిశ గింజలు, నువ్వులు, వేరుశనగలు, కొబ్బరి వంటి వాటితో వీటిని వేర్వేరుగా రూపొందించారు. మన వంటకాల్లో కలిపి ఈ పొడులను వాడుకోవచ్చు. స్కూళ్లలో మధ్యాహ్నభోజనం, సైన్యానికి భోజనాల్లో సైతం వాడుకోదగినవని ఐఐహెచ్ఆర్ పేర్కొంది. నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఈ పొడులను తయారు చేసి ఎయిర్ టైట్ కంటెయినర్లలో/ పౌచ్‌లలో నింపుకొని (26–28 డిగ్రీల సెల్షియస్) సాధారణ ఉష్ణోగ్రత ఉండే చోట నిల్వ చేసుకుంటే 3 నెలల పాటు వాడుకోవచ్చు. ఈ పొడులను తయారు చేసి విక్రయించడం ద్వారా మహిళా స్వయం సహాయక బృందాలు, సైనిక వితంతువులు, వికలాంగులు.. ఉపాధి పొందవచ్చని ఐఐహెచ్ఆర్ చెబుతోంది. ఈ టెక్నాలజీ పూర్తి వివరాలకు.. 080–23086100 – ఎక్స్టెన్షన్ 348, 349 mushroomiihr@gmail.com(చదవండి: -
బరువు తగ్గాలన్నా, ఫిట్‌గా ఉండాలన్నా ది బెస్ట్ ఫార్ములా!
బరువు తగ్గాలంటే జీవన శైలి మార్పులు చేసుకోవాలి. వాకింగ్, యోగా ఇలాంటి ఏదో ఒక వ్యాయామం తప్పకుండా చేయాలి. అంతేకాదు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలన్నా కూడా వాకింగ్‌కు మించింది లేదు. ఈ వాకింగ్‌లో చాలా పద్దతులు న్నాయి. రోజులో కనీసం 5 వేల అడుగులు వేయాలని, 10 వేల అడుగులు నడిచే వారికి ఊబకాయం అనే సమస్య ఉండదని నిపుణులు చెబుతారు. అయితే ఒక పద్ధతిని పాటిస్తే వాకింగ్ బోర్ కొట్టకుండా ఉత్సాహంగా ఉంటుందంటున్నారు నిపుణులు. అదేంటో తెలుసుకుందామా మరి.ఫిట్‌గా ఉండటానికి నడక కంటే మెరుగైన వ్యాయామం లేదు. రెగ్యులర్ వాకింగ్ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. నడక వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. గుండెకు బలం చేకూరుతుంది. కీళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎముకలు, దృఢంగా మారతాయి. కండరాల శక్తి పెరుగుతుంది. బీపీ, షుగర్ లాంటి వాటి నుంచి దూరంగా ఉండొచ్చు. వీటన్నింటికి మించి ఒత్తిడి తగ్గుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. అయితే, ఈ రోజువారీ నడకలో చిన్న మార్పులు చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలొస్తాయని నిపుణులు అంటున్నారు. అదే 2:2:1 వాకింగ్ ఫార్ములాచదవండి: ఇంటి గుట్టు :దెబ్బకి రూ. 80 లక్షలు ఖతం, చివరికి!ఏంటీ 2:2:1 వాకింగ్ ఫార్ములా రెండు(2) నిమిషాలు వేగంగా నడవడం (Brisk walking) తరువాతి రెండు(2) నిమిషాలు జాగింగ్ (jogging) చేయడంఆ తరువాత ఒక నిమిషం (1) పాటు సాధారణ నడక(normal walking) అన్నమాట. ఈ సైకిల్‌ను రిపీట్ చేస్తే అటు బరువు తగ్గడంతోపాటు, ఇటు ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు. రోజులో కనీసం అరగంట ఈ పద్ధతినే పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. బరువు తగ్గాలని చూస్తున్న వారికి గేమ్-ఛేంజర్‌గా భావిస్తారు. ప్రయోజనాలుకేలరీలు తొందరగా,ఎక్కువగా బర్న్ అవుతాయి. 30 నిమిషాలు బ్రిస్క్ వాకింగ్ చేయడం వల్ల 200 కేలరీలు బర్న్ అవుతాయని పరిశోధనలు చెబుతున్నాయిజీవక్రియ వేగవంతమవుతుంది.వేగంగా నడవడం వల్ల హృదయ స్పందన రేటు పెరుగుతుంది. ఆ తరువాత చేసే జాగింగ్ కొవ్వును వేగంగా కరిగించడానికి సాయపడుతుంది. బ్రిస్క్ వాకింగ్, జాగింగ్ ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుంది. శరీరంలో ఆక్సిజన్ స్తాయి పెరుగుతుంది. నెమ్మదిగా నడుస్తున్నప్పుడు జాగింగ్‌తో అలసిన కండరాలకు విశ్రాంతి లభిస్తుంది. ఈ విధానంలో అలసట రాదు , ఆసక్తికరంగా ఉంటుంది కూడా. నెమ్మదిగా, స్థిరంగా చేసే ఒకే రకమైన వ్యాయామాల కంటే ఇంటర్వెల్-స్టైల్ వ్యాయామాలు కొవ్వును కరిగించ డానికి, సమర్థవంతంగా ఉంటాయని అధ్యయనాల ద్వారా వెల్డైంది. కాబట్టి బరువు తగ్గాలనుకుంటే 2:2:1 ఫార్ములా ఉత్తమమంటున్నారు నిపుణులు. -
మహిళలు అలాంటి డైట్‌ని పాటించకండి! వైద్యుల స్ట్రాంగ్ వార్నింగ్
ఇటీవల యువత స్మార్ట్‌గా, నాజుగ్గా ఉండటానికి ఇష్టపడుతోంది. అలా ఉండేందు కోసం వ్యాయామాల, కసరత్తులంటూ తెగ కష్టపడుతున్నారు. మరికొందరూ కఠినమైన డైట్ల పేరుతో నోరు కట్టేస్తుకుంటున్నారు. ఎలాగైన హీరోయిన్ మాదిరిగా స్లిమ్‌గా ఉండాలన్నదే అందరి ఆరాటం. ఏ మాత్రం కొద్దిగా బరువు పెరిగినా..ఏదో జరగకూడనిది జరిగినట్లుగా ఫీలవ్వుతున్నారు. అంతలా చిన్నా, పెద్దా..తమ బాడీపై శ్రద్ధ తీసుకుంటున్నారు. అయితే ఆ క్రమంలో ఫాలో అయ్యే డైట్లు ఒక్కోసారి బరువు తగ్గడం ఎలా ఉన్నా..పలు ఆరోగ్య సమస్యలు తెచ్చు పెడుతున్నాయని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ఇక్కడ అలానే ఒక మహిళ స్లిమ్‌గా ఉండాలని అనుసరించిన డైట్ ఎలాంటి సమస్యలు తెచ్చిపెట్టిందో చూస్తే షాకవ్వుతారు. అంతేకాదండోయ్ వైద్యులు మహిళలందర్నీ అలాంటి డైట్ ఫాలో కావద్దని హెచ్చరిస్తున్నారు కూడా. అదెంటో చూద్దామా..శరీరంలో కొవ్వుని తగ్గించి శరీరాన్ని మంచి ఆకృతిలో ఉంచేందుకు ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడంపై ఆధారపడతారు. ఆ నేపథ్యంలో పెద్ద మొత్తంలో మాంసాహారాన్ని తీసుకుంటుంటారు. అంటే ఇక్కడ మాంసాహారంతో కూడిన డైట్‌కి ప్రాధాన్యత ఇస్తారు. దీంతో ఈ డైట్లో కూరగాయలు, పండ్లు, ధాన్యాలు, చిక్కుళ్లు, నెట్స్ మినహాయించి మాంసం, పౌల్ట్రీ, గుడ్లు, సముద్ర ఆహారం, చేపలు, పాల ఉత్పత్తులు, నీటిని మాత్రమే తీసుకుంటారు. నిజానికి దీన్ని"జీరో కార్బ్" అని పిలుస్తారు. ఈ డైట్లో కార్బోహైడేట్స్ అనేవి ఉండవు. అయితే ఇది మహిళ ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్ కరణ్ రాజన్ అందుకు సంబంధించిన వీడయోని షేర్ చేసి మరీ వివరించారు. ఇలా మాంసాహారంతో కూడిన డైట్ మహిళలకు పనికిరాదని చెప్పారుమహిళలు మాంసాహారం ఎందుకు తీసుకోకూడదంటే..డాక్టర్ కరణ్ షేర్చేసిన వీడియోలో ఒక మహిళ ఎనిమిది వారాలపాటు మాంసాహారమే తీసుకునే డైట్‌ని పాటించినట్లు వెల్లడించి. ఆమె ఆ వీడియోలో తాను ఎమనిది వారాల పాటు మాంసాహారమే తీసుకున్నట్లు చెబుతుంది. దీంతో ఆమె కొవ్వుని కోల్పోయి కొన్ని రకాల ఆరోగ్య సమస్యల బారినపడినట్లు చెబుతోంది. ముఖ్యంగా ఆమెకు పీరియడ్స్ ఆగిపోవడం జరిగిపోతుంది. అంటే పీసీఓఎస్ సమస్యలు వచ్చాయి. మొటిమలు తీవ్రమయ్యాయి. మాంసాహారం అధికంగా తీసుకుంటే మహిళల్లో పునరుత్పత్తి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని అన్నారు. ఎందుకంటే దీనిలో ఫైబర్ ఉండదు అది మొత్తం ప్రత్యుత్పత్తి వ్యవస్థనే తీవ్రంగా ప్రభావితం చేస్తుందట. అదెలాగంటే..మొక్కల ఆధారిత ఆహారం జీవక్రియను ప్రభావితం చేసి శరీరంలోని వేస్ట్‌ని బయటకు పంపేస్తుంది.చెప్పాంటే డంపింగ్ పనిని ప్రోత్సహిస్తుంది. ఇక్కడ కాలేయం ఈస్ట్రోజెన్‌ను గట్‌లోకి పంపిస్తుంది. అయితే ఆహారంలో ఫైబర్ లేని కారణంగా దాన్ని బంధించి బయటకు పంపిచే అవకాశం లేకపోతుంది. దీంతో ప్రేగులే ఈస్ట్రోజన్ని తిరిగి గ్రహిస్తాయి. దీంతో ఈ జీవక్రియ సమస్య కాస్త చర్మంపై దుష్ప్రభావాలకు దారితీస్తుంది. అధిక ఈస్ట్రోజన్ చర్మ సమస్యలు, హర్మోన్ల అసమతుల్యతకు దారితీసి మొటిమలకు కారణమవుతుందని అన్నారు. అంతేగాదు దీనితోపాటు మూడ్ స్వింగ్స్, ఆందోళన, మెదడు పనిచేయకపోవడం తదితర సమస్యలు ఉత్పన్నమవుతాయని చెప్పారు డాక్టర్ కరణ్. అయితే ప్రతి ఒక్కరి ఆరోగ్యం భిన్నంగా ఉంటుంది. కొంతమందికి మాంసాహారం డైట్ సైడ్ఎఫెక్ట్స్ ఇవ్వకపోవచ్చు. కానీ చాలామటుకు ఇది సరిపడదని తేల్చి చెప్పారు. హర్మోన్ల అసమతుల్యతకు, గట్ ఆరోగ్యానికి ప్రతిబంధకాన్ని కలిగిస్తుందని అన్నారు. ఈ డైట్ మానవ శరీరాన్ని జడత్వంగా మార్చేస్తుందని, చురుకుదనం ఉండదని పలువురు వైద్యులు చెబుతున్నారు. (చదవండి: పప్పు ధాన్యాలు తీసుకోకపోతే శరీరంలో సంభవించే మార్పులు ఇవే..!) -
ఇంటి గుట్టు : దెబ్బకి రూ. 80 లక్షలు ఖతం, చివరికి!
మోసగాళ్లు మనకు తెలియకుండానే మన చుట్టూ వైఫైలా ముసిరేసి ఉంటారు. ఏ మాత్రం గుట్టు జారినా, ఆదమర్చి ఉన్నా భారీ నష్టం తప్పదు. అలా ఒక బాలిక అమాయకంగా ఇంట్లోని కొన్ని ఆర్థిక విషయాలు షేర్ చేసినందుకు గాను ఆమె కుటుంబం చిక్కుల్లోపడింది. ఇంటిగుట్టు లంకకు చేటు అన్నట్టు అయి పోయింది. 15 ఏళ్ల పాఠశాల విద్యార్థినిని బ్లాక్మెయిల్ చేసి రూ.80 లక్షలు దోచుకున్న వైనం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్టోరీ ఏంటంటే.. గురుగ్రామ్‌లో 9వ తరగతి చదువుతున్న బాలిక బాలిక గొప్పగా చెప్పిందో, అమాయకంగా చెప్పిందో కానీ తన అమ్మమ్మ ఖాతాలో భార మొత్తంలో సొమ్ము ఉందని ఫ్రెండ్స్‌కి చెప్పింది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం బాలిక అమ్మమ్మ( 75) తనకున్న ఆస్తిని అమ్మి తన ఖాతాలో రూ.80 లక్షలు జమ చేసింది. ఈ వివరాలతోపాటు, అమ్మమ్మ బ్యాంకు ఖాతాకు యాక్సెస్ కూడా తనకుందని తొలుత పదో తరగతి అబ్బాయికి చెప్పింది. అతను తన అన్నయ్యకు చెప్పాడు. వాడు తన స్నేహితుడికి చెప్పి ఆ డబ్బులు కొట్టేసేందుకు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే ఆ అమ్మాయికి బెదిరింపులు మొదలయ్యాయి. మార్ఫ్ చేసిన చిత్రాలతోఆమెను బ్లాక్మెయిల్ చేసి, వాటిని సోషల్ మీడియాలో లీక్ చేస్తామని, అలా చేయకుండా ఉండాలంటే, సొమ్మును ముట్టచెప్పాలని బాలికను బెదిరించారు. దీంతో బెంబేలెత్తిన బాలిక ఒకటీ రెండు సార్లు పలుదఫాలుగా నిందితుడు ఇచ్చిన ఫోన్ నంబర్లకు రూ. 80 లక్షలను బదిలీ చేసింది. ఇలా అమ్మమ్మ ఖాతాలోని మొత్తం డబ్బులన్నీ డిసెంబర్ 21 నాటికి స్వాహా అయిపోయాయి.అయినా బెదింపులు అగలేదు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో, క్లాస్‌లో ముభావంగా ఉన్న బాలికను గమనించిన టీచర్ గట్టిగా నిలదీయడంతో విషయమంతా టీచర్‌కు చెప్పింది. అలా అసలు సంగతి కుటుంబానికి చేరింది. దీంతో అమ్మమ్మ, ఇతర కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగు చూసింది. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మార్ఫింగ్ ఫోటోలతో బెదిరింపులకు పాల్పడ్డారు. వివిధ అకౌంట్ల ద్వారా, డబ్బును తమకు బదిలీ చేయించుకున్నారు. ఇలా కొట్టేసిన సొమ్మంతా దాదాపు పార్టీలకు ఖర్చు చేశారు.గత ఏడాది డిసెంబర్లో నమోదైన ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకూ ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు నవీన్ కుమార్ గత రెండు నెలలుగా పరారీలో ఉన్నాడని పోలీసులు మంగళవారం తెలిపారు. నవీన్ కుమార్ (28) గురుగ్రామ్‌లోని గర్హి హర్సారులోని న్యూ కాలనీ నివాసి. సోమవారం రాత్రి అతన్ని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించామని పోలీసు అధికారి రాంబీర్ సింగ్ తెలిపారు. అలాగే నిందితుడి నుంచి రూ.5.13 లక్షలు, బాధితురాలి ఏటీఎం కార్డును స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇప్పటివరకు రూ. 36 లక్షలు స్వాధీనం చేసుకున్నామని, దర్యాప్తు కొనసాగుతోందన్నారు. -
పప్పుధాన్యాలు తీసుకోకపోతే ఏం జరుగుతుందంటే..!
పప్పుధాన్యాలు పోషకాల గనులు. ఇవి తీసుకోకపోయినా..లేక అవి లేకపోతే పర్యావరణ పరంగానే కాదు మానువుల ఆరోగ్యం కూడా ప్రమాదంలో పడిపోతుంది. అవి తీసుకోకపోతే జీవనమే అస్తవ్యస్తంగా అయిపోతుంది. మొక్కల ఆధారిత ప్రోటీన్, ఫైబర్‌తో కూడిన పోషక కేంద్రాలివి. ఇవి గుండె ఆరోగ్యానికి, జీర్ణక్రియకి మద్దతిస్తాయి. అలాగే స్థిరమైన వ్యవసాయానికి కీలకం ఇవి. పోషకాహారంలో వాటి పాత్ర అపారమైనది. అవి లేకుండా జీవనం అంటే.. ఊహకే అందని విషయం. ఇవి మానవ ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో చూద్దామా..ప్రోటీన్లు కోల్పోతాం.పప్పుధాన్యాలు తీసుకోకపోతే కండరాల నష్టం, బలహీనత వంటి సమస్యలు వస్తాయి. శాకాహారులు మాంసకృత్తుల కోసం ప్రత్యామ్నాయంగా వాడే పప్పుధాన్యాలతో ఎన్నో ప్రయోజనాలు పొందుతారు. ఈ పప్పుధాన్యాలు తీసుకోకపోతే గుండెకు ఆరోగ్యకరమైన ప్రోటీన్లను కోల్పోతాం. హృదయ సంబంధ వ్యాధులు, కేన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. వీటిని పూర్తిగా తీసుకోవడం మానేస్తే ప్రోటీన్ కొరత ఏర్పడి కీళ్ల సమస్యలు అధికమయ్యే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.ఫైబర్లు అందవు: జీర్ణక్రియ, గట్ సమస్యలు మొదలవుతాయి. మలబద్ధకం, పొట్ట ఉబ్బరం, గట్ సంబంధిత సమస్యలు అధికమవ్వుతాయి. కొలొరెక్టల్ కేన్సర్, టైప్ 2 డయాబెటిస్ , హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. నిజానికి పప్పుధాన్యాల్లో ఉండే ఫైబర్లు గట్ ఆరోగ్యానికి, రోగ నిరోధక శక్తికి, జీర్ణక్రియకు మద్దతిస్తాయి. అలాంటిది వాటిని అస్సలు తీసుకోకపోవడమంటే.. ఆరోగ్యాన్ని కోల్పోవడంతో సమానమని హెచ్చరిస్తున్నారు నిపుణులు.ఐరన్ లోపం:పప్పుధాన్యాల్లో ఐరన్, ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం, జింక్ వంటివి ఉంటాయి. ఎప్పుడైతే వీటిని తీసుకోమో అప్పటి నుంచి శరీరంలో రక్తహీనత వంటి సమస్యలు అధికమవుతాయి. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కారణంగా సులభంగా వివిధ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఐరన్, ఫోలేట్లు రక్తహీనతను నివారించగా, మెగ్నీషియం, పొటాషియ గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. జింక్ రోగనిరోధక వ్యవస్థను పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది.పర్యావరణానికి కూడా నష్టమే..ఈ పప్పుధాన్యాలు మానవులకు మాత్రమే కాదు పర్యావరణానికి కూడా మంచివి. వాటి నత్రజని-స్థిరీకరణ సామర్థ్యం నేలను సారవంతంగా ఉంచుతుంది. వ్యవసాయానికి అనుకూలంగా మారుస్తుంది. ఇతర పంటలతో పోలిస్తే ఈ పప్పుధాన్యాల పంటలకు తక్కువ నీరు చాలు. అంతేగాదు రైతులు వనరులు అధికంగా అవసరమయ్యే పంటలు, జంతువుల పెంపకంపై ఆధారపడవలసి వస్తుంది. దీని వల్ల అధిక నీరు వినియోగం కోసం భూమిపై అధిక ఒత్తిడి తెస్తుంది. ఫలితంగా ఆహార ఉత్పత్తి తగ్గుతుంది పర్యావరణ నష్టం మరింత పెరుగుతుంది.చెడు ఆహారపు అవాట్లు ఎక్కువ అవుతాయి..ఎప్పుడైతే పప్పుధాన్యాలు లేవో అప్పుడు ప్రజలు అనారోగ్యకరమైన ఆహారపదార్థాలకు ఎడిక్ట్ అవుతారు. ఇవి రుచికరంగా ఉన్నా..ఆరోగ్యానికి అంతగా మంచివి కావు. ఎప్పుడైతే ప్రాసెస్ చేసిన ఆహారాలు తీసుకోవడం మొదలవుతుందో పోషకాహారం లోపం ఏర్పడి వివిధ వ్యాధుల బారినపడే ప్రమాదం కూడా ఎక్కవ అవుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. రక్తంలో చక్కెర అధికమవుతుంది:డయాబెటిస్ ప్రమాదం పెరిగిపోతుంది. ఎందుకంటే ఈ పప్పుధాన్యాలు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI)ని కలిగి ఉంటాయి. ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలను స్థిరీకరించడానికి కీలకమైన ఆహారంగా మారుతాయి. డయాబెటిస్ రోగులు పప్పుధాన్యాలు తీసుకోకపోవడం వల్ల చక్కెరను అదుపులో ఉంచే మార్గాన్ని కోల్పోవడం జరగుతుంది. జీవక్రియ రుగ్మతలు, బరువు పెరగడం తదితర సమస్యలు ఉత్పన్నమవుతాయి.చూడటానికి చిన్నగా ఉండే ఈ పప్పుధాన్యాలు శక్తిమంతమైనవి. ఇవి దీర్ఘకాలిక వ్యాధులను అదుపులో ఉంచడం లేదా దరిచేరనీయవు. ఇవి మానవ ఆరోగ్యాన్ని కాపాడి, ఆకలిని నియంత్రించే అద్భుతమైన పోషకాలని కలగి ఉంటాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవి లేని ప్రపంచమంటే అనారోగ్యకరమైన జీవనం లేదా ప్రాణాపాయకరమైన జీవనంగా పేర్కొనవచ్చు అని చెబుతున్నారు నిపుణులు.(చదవండి: ఆరోగ్యకరమైన హైడ్రేటెడ్ చర్మ కోసం తప్పక తీసుకోవాల్సిన ఆహారాలివే..! -
వేపలగడ్డలో ఆదివాసీ జాతర
ఆదివాసీ తిరుగుబాటుకు తిరుగులేని సాక్ష్యంగా నిలిచిన సమ్మక్క-సారలమ్మలకు మేడారం కేంద్రంగా అతి పెద్ద జాతర జరుగు తుంది. వీరితో సంబంధం కలిగినవాడే పగిడిద్దరాజు. ఆదివాసీ స్వయంపాలన కోసం కాకతీయులపై కత్తులు దూసి కదన రంగంలో అమరులైన సమ్మక్క భర్తే ఈయన. ఈయనకు భద్రాద్రి–కొత్తగూడెం జిల్లా గుండాల మండలం ‘వేపలగడ్డ గ్రామం’లో అత్యంత వైభంగా ‘ఆరెం’ వంశస్థులు జాతర జరుపు తారు. ఈ ఏడాది మార్చి 5నుంచి 7 వరకు ఈ జాతర జరుగుతుంది.కరువుకాలంలో కాకతీయు లకు కప్పం కట్టడానికి నిరాకరించిన కోయ రాజు పగిడిద్దరాజు పైకి చక్రవర్తి ప్రతాప రుద్రుడు దండెత్తి వచ్చాడనీ, ఆ యుద్ధంలో కోయరాజుతో పాటు ఆయన కూతుర్లు సారలమ్మ, నాగులమ్మ; కొడుకు జంపన్న, అల్లుడు గోవింద రాజులు అసువులు బాశారనీ, భార్య సమ్మక్క యుద్ధం చేస్తూ చిలకలగుట్ట ప్రాంతంలో అదృశ్యం అయిందనీ ఆదివాసుల విశ్వాసం. సమ్మక్క కుంకుమ భరణి రూపంలో ఇప్పటికీ చిలకల గుట్టపై ఉందని కోయలు నమ్ముతారు. అందుకే మేడారంలో జరిగే సమ్మక్క– సారలమ్మ మహాజాతరకు పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు మేడారం చేరుకుంటేనే జాతర ప్రారంభం అవుతుంది.పగిడిద్దరాజును ఒక పోరాట యోధునిగా కీర్తిస్తూ స్మరిస్తూనే దైవత్వం నుండే వీరత్వం పుట్టిందని... ఈయనను ఒక దైవంగా నేడు ఆదివాసీలు కొలుస్తున్నారు. ఈ జాతరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీలు తరలివస్తారు. ఈ సందర్భంగా ఆదివాసీ యువతకు క్రీడలు నిర్వహిస్తారు. ఆదివాసీ స్వయం పాలన కోసం పోరాడి అమరుడైన పగిడిద్దరాజు స్ఫూర్తితో నేడు ఆదివాసీలు తమ హక్కుల కోసం పోరాటం చేయాలి. మూలవాసీ అస్తిత్వాన్ని చాటు కోవాలి. ‘కంకవనం’ చేజారకుండా పొదివి పట్టుకోవాలి. ఆదివాసీ పోరాటాలకు, ఆరాటాలకు ప్రజాతంత్ర శక్తులన్నీ అండగా నిలవాలి.– వూకె రామకృష్ణ దొర ‘ (నేటి నుంచి భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా, వేపలగడ్డలో 7వ తేదీ వరకు పగిడిద్ద రాజు జాతర) -
Ash Wednesday 2025 పవిత్ర ప్రార్థనలు
విశ్వవ్యాప్తంగా క్రైస్తవ విశ్వాసులు భక్తి శ్రద్ధలతో ఉపవాస ధ్యానంలో ఆచరించే తపస్సు కాలాన్ని ‘లెంట్ కాలం’అంటారు. లెంట్ అనే లాటిన్ మాటకు చిగురించడం అని అర్థం. ఇది బుధవారంతో ప్రారంభమవుతుంది. అందు చేత ‘భస్మ బుధవారం’ లేదా ‘బూడిద బుధ వారం’ అంటారు. లెంట్ మొత్తం నలభై రోజులు. లాటిన్ భాషలో ‘క్వాడ్రగెసిమ’ అనే మాటకు నలభై అనిఅర్థం. బైబిల్లో నలభై దినాల ఉపవాసానికి ఉదాహరణగా, మోషేనలభై దినాలు ఉపవసించి ప్రార్థన చేశాడు. ఏలియా ప్రవక్త 40 రోజులు ఉపవసించి, ప్రార్థించాడు. నోవా జలప్రళయం 40 దినాలు జరిగింది. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి కానానుకు 40 సంవత్సరాలు పయనించారు. ఏసు పరిచర్యకు ఉపక్రమించే ముందు 40 దినాలు ఉపవసించి ప్రార్థించాడు. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రార్థన ఉపవాస ధ్యానాలు 40 రోజులు భక్తి శ్రద్ధలతో నిష్ఠగా ఒంటిపూట సాత్వికాహారం తీసుకుని నియమబద్ధమైన జీవితం గడుపుతూ ఆచరిస్తారు.బుధవారం రోజు కొన్ని ఆలయాల్లో విశ్వాసులు తాటాకులతోగాని, కొబ్బరి ఆకులతోగాని, ఖర్జూరపు ఆకులతో చేసిన సిలువ ప్రతిమలు తెచ్చి ఉంచుతారు. వాటిని మరుసటి సంవత్సరం వరకు ఉంచి బుధవారం భస్మం చేస్తారు. ఆ బూడిదతో నుదుటపై సిలువు గుర్తు వేసుకుని లేదా తలపై చల్లుకుని బూడిద బుధవారం నుంచి శుభ శుక్రవారం వరకు జరిగే క్వాడ్రగెసిమ కాలం ధ్యానాలు ఆచరిస్తారు. లెంట్కాలం అంతా దేవాలయాల్లో నలభై అంశాలపై ధ్యానం చేస్తూ ప్రార్థనలు జరుగుతాయి. ఈ కాలంలో శుభకార్యాలు గాని, కుటుంబాల్లో జరుపుకునే ఇతర ఉత్సవాలు గాని చేయరు. భస్మ బుధవారం నుంచిశుభ శుక్రవారం వరకూ వచ్చే నలభై దినాలు ‘శ్రమల కాలం’గా పరిగణించి, ప్రక్షాళన కోసం పవిత్రపరచుకునే సంప్రదాయాన్ని ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సమాజం ఆచరిస్తుంది. శుభ శుక్రవారం అనంతరం వచ్చే శనివారాన్ని ‘లాజరస్ సాటర్ డే’ అంటారు. దీన్నే ‘నిశ్శబ్ద శనివారం’ అని కూడా పిలుస్తారు. ఏసు మరణించిన శుక్రవారం సమాధిలో ఉన్నా, శనివారం అనంతరం పునర్జీవితుడై తిరిగి లేచిన ఆదివారం ‘ఈస్టర్ ఆది వారం’గా జరిగే ప్రార్థనలతో లెంట్కాలం పూర్తవుతుంది. ఈ క్వాడ్రగెసిమ కాలం అంతా పాప ప్రక్షాళనతో పాటు వ్యక్తిగత నియమనిష్ఠలను పాటించి, ప్రపంచ శాంతి, సమసమాజ సుహృద్భావ జీవనం కలగాలని ప్రార్థనలు చేస్తారు. – ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి, క్రైస్తవ సాహిత్య పరిశోధకులు (నేడు భస్మ బుధవారం) -
మల్టీపర్పస్ రోబో : పనులన్నీ చక చకా
తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న అగ్రిహబ్, ఇక్రిశాట్, టిహబ్, ఐఎస్బి, ట్రిపుల్ ఐటి, ఐఐటి హైదరాబాద్, బిరాక్లలో 2017లో ఇంక్యుబేట్ అయిన అగ్రిటెక్ స్టార్టప్ ‘ఎక్స్ మెషిన్స్’. ఈ ఇండియన్ రోబోటిక్స్, ఎఐ కంపెనీ వ్యవస్థాపకుడు త్రివిక్రమ్ కుమార్ డోగ్గా. పటాన్‌చెరులోని ఇక్రిశాట్లో ఎఐపి బిల్డింగ్ కేంద్రంగా ఎక్స్ మెషిన్స్ రీసెర్చ్ లాబ్ పనిచేస్తోంది. ఎక్స్ మెషిన్స్ రూ పొందించిన కృత్రిమ మేధ ఆధారిత మల్టీపర్పస్ రోబో వ్యవసాయంలో కూలీలు చేసే కలుపుతీత వంటి అనేక పనులను చక్కబెడుతుంది. పంటల సాగులో రసాయనాల వాడకాన్ని సాధ్యమైనంత తగ్గించటం, శాస్త్రీయ, సుస్థిర వ్యవసాయ సాంకేతికతలను రైతులకు అందుబాటులోకి తేవటం ఎక్స్ మెషిన్స్ లక్ష్యాలు. ప్రెసిషన్ అగ్రికల్చర్ కోసం మల్టీపర్పస్ ఎఐ బేస్డ్ రోబోలను తయారు చేస్తోంది. వ్యవసాయంతో ప్రారంభించి ఇతర పరిశ్రమలకు అవసరమైన ఎఐ రోబోలను కూడా ఈ సంస్థ రూపొందిస్తోంది. ఈ రోబోలను ఎవరూ నడపాల్సిన అవసరం లేదు. వాటంతట అవే తమ ప్రయాణాన్ని నిర్దేశించుకొని పనిచేస్తాయని నిర్వాహకులు చెబుతున్నారు. మిరప, పత్తి, పొగాకు తదితర సాళ్లుగా విత్తే పంట పొలాల్లో అన్ని మొక్కలకూ పురుగుమందుల పిచికారీలు అవసరం ఉండదు. కనీసం 30% మొక్కలకు అవసరం ఉండదని ఎక్స్ మెషిన్స్ సంస్థ అంచనా. చీడపీడల బారిన పడిన మొక్కల్ని ఎఐ టెక్నాలజీతో గుర్తించి వాటిపై మాత్రమే పిచికారీ చేయటం ఈ రోబో ప్రత్యేకత అని చెబుతున్నారు. వ్యవసాయంతో పాటు గోదాములు, లాజిస్టిక్స్, రక్షణ శాఖ అవసరాలు, ఉత్పత్తి యూనిట్లకు అవసరమైన ఎఐ రోబోలను కూడా ఈ సంస్థ రూపొందిస్తోంది.చదవండి: ‘మునగరాణి’ : అపుడు ఎన్నో అవహేళనలు..ఇపుడు నెలకు లక్ష రూపాయలు సాంకేతికత: ఎక్స్ 111– మల్టీపర్పస్ రోబోసమస్య: కూలీల కొరత రైతులకు ప్రధాన సవాళ్లలో ఒకటి. దాని అనుబంధ ఖర్చులు కూడా భారీగానే ఉంటాయి. పరిష్కారం: ఈ సవాల్‌ను అధిగమించడానికి ఎక్స్ మెషిన్స్ రోబోని రూపొందించింది.వ్యవసాయ పంటల్లో కలుపు సమస్య, కూలీల కొరత లేకుండా చేస్తుంది. ఇది విత్తనం వేయటం, నారు పెంపకం, మైక్రో స్ప్రేలు, ఎరువుల పిచికారీ, ఇతర పనులకు సమర్థవంతంగా ఉపయోగించవచ్చు. ఇది 8 గంటల సమయంలో 2.5 ఎకరాల్లోని కలుపు మొక్కల్ని తొలగిస్తుంది. -
అపుడు అవహేళనలు.. ఇపుడు నెలకు లక్ష రూపాయలు
పట్టుదల, కష్టపడే తత్వం ఉంటే పెద్దగా చదువుకోకపోయినా నమ్ముకున్న రంగంలో ఉన్నత స్థాయికి ఎదగవచ్చని చెప్పటానికి తమిళనాడుకు చెందిన మహిళా రైతు పొన్నరాసి (Ponnarasi) విజయగాథే ఒక ఉదాహరణ. ఆమెకు 38 ఏళ్లు. నలుగురు పిల్లల తల్లి. వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగింది. పదో తరగతి మధ్యలో చదువు మానేసింది. పదేళ్లుగా పది ఎకరాల్లో మునగ తోట సాగు చేస్తూ.. తొలుత విత్తనాలు, ఆకులు, మొక్కలు అమ్ముతుండేది. పోటీ ఎక్కువై ఆదాయం తగ్గిపోయింది. వ్యవసాయ విశ్వవిద్యాలయం నిపుణులను కలిసి సలహా అడిగింది. విత్తనాలు, ఆకులు, మొక్కలు వంటి మునగ ముడి ఉత్పత్తులకు అంత విలువ లేదు. వాటికి విలువను జోడించి.. అంటే, ప్రాసెసింగ్ చేసి రూపం మార్చి.. అమ్మితే మంచి ఆదాయం వస్తుందని చెప్పారు. అదెలా చెయ్యాలో తెలీదు. పెద్దగా చదువు లేదు. అయినా, పట్టుదలతో ముందడుగు వేసి, శిక్షణ పొంది ధైర్యంగా ముందడుగు వేసింది. మునగ సాగు చేస్తూనే మునగ నూనె తదితర ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తూ వ్యాపారవేత్తగా ఎదిగింది. నాణ్యతా ప్రమాణాలు పాటించటంతో దేశంలో వివిధ ప్రాంతాల నుంచే కాదు అమెరికా, సింగపూర్ వంటి అనేక ఇతర దేశాలకూ మునగ ఉత్పత్తుల్ని ఎగుమతి చేస్తోంది. ఏటా రూ. 12 లక్షలకు పైగా నికారదాయం సంపాదిస్తూ తోటి రైతులకు, మహిళలకు శిక్షణ కూడా ఇస్తోంది. అందుకే పొన్నరసికి ‘మునగ రాణి’ అని పేరొచ్చింది!తమిళనాడులోని దిండిగల్ ప్రాంతం మునగ సాగుకు పెట్టింది పేరు. అటువంటి రంగంలో నలుగురు బిడ్డల తల్లి అయిన మహిళా రైతు పొన్నరాసి సంచలనమే సృష్టించింది. ‘మా కుటుంబానికి ఉన్న పదెకరాల భూమిలో గత దశాబ్ద కాలంలో నేను మునగ తోట సాగు (Drumstick farming) చేస్తున్నాను. మునగ ఆకులు, విత్తనాలు, వేర్లు అమ్మేవాళ్లం. అయితే, ఈ పని చేసే రైతులు చాలా మంది ఉండటం వల్ల మార్కెట్ దారుణంగా పడిపోయింది. మునగ విత్తనాల కిలో ధర రూ. 5–10కి పడిపోయింది..’ అని ఎటువంటి సంక్షోభ పరిస్థితుల్లో తాను కొత్తగా ఆలోచించి ప్రాసెసింగ్‌లోకి అడుగు పెట్టిందీ పొన్నరాసి వివరించారు.అటువంటి దిక్కుతోచని పరిస్థితుల్లో కోయంబత్తూరు వెళ్లి, అక్కడి తమిళనాడు వ్యవసాయ కాలేజీలో డాక్టర్ జాన్ కెనడీ అనే శాస్త్రవేత్తను స్వయంగా కలిసి మాట్లాడటమే ఆమె జీవితాన్ని కొత్త మలుపు తిప్పింది. ‘పంటను పండించి, ఎక్కువ దిగుబడి తియ్యటం, పండించిన పంటను ముడి రూపంలో అలాగే ఎంతో కొంతకు అమ్ముకోవటం వల్ల డబ్బులు రావు. ప్రాసెసింగ్ చేసి మునగ నూనె ((Drumstick Oil), పొడి, సౌందర్య సాధనాలను అమ్మితే డబ్బులు వస్తాయి అని జాన్ కెనడీ సార్ చెప్పగా విన్నప్పుడు.. వ్యవసాయం గురించి అప్పటి వరకు నాకు ఉన్న అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. ఏం చేస్తే గట్టెక్కుతామో అర్ధమైంది..’ అన్నారామె.కిలో మునగ నూనె రూ. 5 వేలుకెనడీ చెప్పిన విషయాలు పొన్నరాసికి బాగా నచ్చాయి. అయితే వాటిని తయారు చేయటం ఎట్లా? ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కునే క్రమంలో దిండిగల్ జిల్లాలోనే ఉన్న గాంధీ గ్రామ్ యూనివర్సిటీలో వ్యవసాయ విస్తరణాధికారులు శ్రీకుమారి, శరవణన్లను సంప్రదించింది. మునగ గింజల నుంచి నూనెను వెలికి తీసే పద్ధతులు, యంత్రాలకు సంబంధించిన విషయాలన్నిటినీ తెలుసుకుంది. మునగ గింజల నుంచి తీసే నూనె కిలో రూ. 5 వేలు పలుకుతుందని పొన్నరాసికి తెలిసింది అప్పుడే. కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల సహకారం కూడా తీసుకొని ముందడుగు వేసింది. ఆ విధంగా వ్యవసాయం తప్ప వ్యాపారం తెలియని ఆమె జీవితంలో 2019లో వ్యాపారఅధ్యాయం ప్రారంభమైంది.కరువును తట్టుకునే మూలనుర్ మునగమునగ మెట్ట పంట అయినప్పటికీ అన్ని రకాల మునగ విత్తనాలూ కరువును తట్టుకొని మంచి దిగుబడిని ఇవ్వలేవు. అందుకే పొన్నరాసి కరువును తట్టుకునే మూలనూర్ మునగ రకాన్ని సాగు చేస్తున్నారు. అంతే కాదు ఏడాదికి మూడు టన్నుల దిగుబడి ఇస్తుంది. ఈ రకం గింజల్లో నూనె శాతం కూడా ఎక్కువట. అయితే, మునగ విత్తనాల నుంచి నూనె తియ్యటం అంత తేలికేమీ కాదు. విత్తనంపైన పొరను తొలగించడానికి చాలా మంది కూలీలు అవసరం అవుతారు. యంత్రాల నిర్వహణ అనుభవం కూడా అవసరం.నూనె తీయటం ప్రారంభించబోయే లోగా తన చుట్టూ ఉన్న వారు ఏవేవో కామెంట్స్ చేసి ఆమె ఉత్సాహం మీద నీళ్లు చల్లేవారు. పదో తరగతి చదువు కూడా లేని దానివి ఏం చేస్తావులే అని ఎత్తి పొడుపు మాటలు అనేవారు. ‘వారి మాటల్ని నేను అసలు పట్టించుకునే దాన్ని కాదు. నా ద్విచక్రవాహనంపై నలుగురు పిల్లల్ని ఎక్కించుకొని ఎక్కడికంటే అక్కడకు వెళ్లి పనులు చక్కబెట్టుకునే దాన్ని. బంధువులు కూడా నా ఆర్థిక పరిస్థితి గురించి ఇంకా వేవేవో సూటిపోటి మాటలు అనేవారు..’ అని పొన్నరాసి గుర్తు చేసుకున్నారు. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు. పట్టిన పట్టు విడవలేదు. ‘అక్క ఇంటా బయటా చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. అయితే, ఆత్మస్థయిర్యంతో అన్నీటినీ ఎదుర్కొంది. ఆమె మీద నమ్మకం ఉంచి మేం పనిచేస్తున్నాం అన్నారు పొన్నరాసి దగ్గర పనిచేసే మహిళ కలైరాసి. విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేయటం ఒక్కటే సరిపోదు. అవి నాణ్యతా ప్రమాణాలకు తగినట్టు ఉండేలా చూసుకోవటం కూడా ఒక సవాలే. తంజావూరులోని ఇండియన్ ఫుడ్ ఎడిబుల్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ (ఐఇఎఫ్ఇడి) అనే సంస్థ నుంచి తన ఉత్పత్తులకు నాణ్యతా సర్టిఫికెట్ తీసుకోవటంతో పొన్నరాసికి మార్కెట్లో మంచి పట్టు దొరికింది. ప్రమాణాలకు తగినట్లు విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేస్తున్న మహిళా రైతు, వ్యాపారవేత్తగా ఆమెకు ప్రభుత్వం నుంచి రూ. 2 లక్షల గ్రాంటు వచ్చింది. ఆ సొమ్ముతో పొలంలోనే ప్యాక్ హౌస్‌ను ఏర్పాటు చేసుకోగలిగింది. దాంతో ఆమె పని సులువైంది. అంతేకాదు, ఆ తర్వాత నుంచి మునగ ఆకులు, కాయలు, గింజలతో మొత్తం 36 రకాల ఉత్పత్తులను తయారు చేయటానికి వీలు దొరికింది. మునగ నూనెతో పాటు సబ్బులు, షాంపూలు, లిప్ బామ్స్ తయారీలో వాడేందుకు పొడిని.. సూప్ పౌడర్లు.. ఇటువంటివే ఎన్నో ఉత్పత్తుల్ని తయారు చేశారు. ‘ఆహారోత్పత్తులను స్వయంగా తయారు చేయిస్తాను. సౌందర్య సాధనాలను తయారు చేయించే పనులను మా తమ్ముడు చూసుకుంటున్నాడని ఆమె తెలిపారు.కస్టమర్ల సంఖ్య పెరిగే కొద్దీ, వారి అవసరాలను తెలుసుకొని అందుకు అనుగుణంగా కొత్త కొత్త ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ప్రతి ఏటా కనీసం పది రకాల కొత్త ఉత్పత్తులను అదనంగా చేర్చుతున్నారామె. తన సిబ్బంది ఇతి తమ పనిగా భావించి నిమగ్నమై పని చేయటం వల్ల పనులు సజావుగా చేయగలుగుతున్నానని చెబుతూ.. మునగ ఇడ్లీ పొడిని తయారు చేస్తే బాగుంటుందని మా దగ్గర పనిచేసే కలైరాసి చెప్పటంతోనే మొదలు పెట్టామని పొన్నరాసి సంతోషంగా చెప్పారు.ఫేస్బుక్, వాట్సప్..పొన్నరాసి గత ఆరేళ్లుగా అంకితభావంతో పనిచేయటం వల్ల ఏడాదికి రూ. 12 లక్షలకు పైగా నికరాదాయం పొందగలుగుతున్నారు. ఆమె దగ్గర మునగ ఉత్పత్తుల్ని కొనుగోలు చేసే వారి సంఖ్య లక్ష దాటిపోయింది. ఫేస్బుక్, వాట్సప్ గ్రూప్‌ల ద్వారా తెలుసుకొని కాంటాక్ట్ చేసిన వినియోగదారులకు తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. అంతేకాదు, సోషల్ మీడియా ద్వారా ΄ పొన్నరాసి కృషి గురించి, మునగ ఉత్పత్తుల గురించి తెలుసుకున్న మలేషియా, సింగపూర్, అమెరికా, ఫ్రాన్స్, మస్కట్ వాసులు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నారు.ఎన్ని ఎక్కువ ఉత్పత్తుల్ని ఆమె విక్రయిస్తున్నా అందులో బాగా అమ్ముడు పోయేవి మాత్రం.. మునగ విత్తనాలు, సూప్ పౌడర్లు, నూనె మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరగటం, పొన్నరాసి నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ ఉత్పత్తులు తయారు చేస్తుండటంతో మంచి వ్యాపారం జరుగుతోంది. త్రిచీ కలెక్టర్ పొన్నరాసికి బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డును ప్రదానం చేసి గౌరవించారు. దీంతో ఆమెకు ‘మునగ రాణి’ అని పేరొచ్చింది.చదవండి: కార్బన్ పాజిటివ్ పొలం.. అంటే తెలుసా?ఇప్పుడామె చాలా మంది రైతులకు, స్వయం సహాయక బృందాలకు మునగ ఉత్పత్తుల తయారీపై శిక్షణ ఇస్తూ, ఆర్థిక స్వావలంబన సాధించేందుకు తోడ్పడుతోంది. ‘ఎంబిఎ కాలేజీ వాళ్లు నన్ను పిలిచి వ్యవసాయాధిరిత వ్యాపార పాఠాలు చెప్పమని అడుగుతుంటే చాలా గర్వంగా ఉంది’ అని సంబర పడుతున్నారు పొన్నరాసి. సోషల్ మీడియాలో మెసేజ్‌లు పెట్టటం నాకు తెలిసేది కాదు. మా అమ్మాయి నేర్పించింది. ఫేస్బుక్లో మా ఉత్పత్తుల వివరాలు చూసి విదేశాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. ఆ విధంగా ఫేస్బుక్, వాట్సప్ మా వ్యాపారానికి చాలా బాగా ఉపయగపడ్డాయి అని పొన్నరాసి సంబరంగా చెబుతున్నారు!ప్రచారాలను పట్టించుకోకూడదు..‘మహిళ బాధ్యతల విషయంలో సమాజం గందరగోళపరిచే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఒక మహిళ వ్యాపారం మొదలు పెట్టిందంటే, ఆమె తల్లిగా లేదా భార్యగా విఫలమైపోయిందని ప్రచారం జరుగుతుంటుంది. ఇటువంటి ప్రచారాలను పట్టించుకోకుండా మహిళలు తాము ఉన్న చోట నుంచి ముందడుగు వేయాలి. కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ఆ తర్వాత తెలుస్తుంది మనం చేసిన పనుల వల్ల ఎంత ప్రయోజనం చేకూరిందో, ఆర్థికంగా ఎంత స్వయం సమృద్ధి సాధించామో. డిగ్రీలే చదివి వుండాలనేమీ లేదు. మన సంకల్పంతో పాటు నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవటం, సామర్ధ్యాన్ని మెరుగుపరచుకోవటం ముఖ్యం. – పొన్నరాసి, ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారిన మునగ రైతు, దుండిగల్, తమిళనాడు -
ముడతలు లేని ఆరోగ్యకరమైన చర్మం కోసం..!
చర్మం గరుకుగా పొడిబారినట్లుగా అయిపోయి వృద్ధాప్య సంకేతాలు కనిపిస్తున్నాయా..?. అందుకోసం చర్మ సంరక్షణ ఉత్పత్తులపై ఆధారపడటానికి బదులుగా తీసుకునే ఆహారంపై శ్రద్ధ చూపితే మేలు అని చెబుతున్నారు చర్మ నిపుణులు. మొక్కల ఆధారిత ఆహారాలు చర్మ ఆరోగ్యానికి తోడ్పడే పోషకాలతో నిండి ఉంటాయని పలు పరిశోధనల్లో నిరూపితమైంది కూడా. వీటిలో చర్మానికి కావాల్సిన విటమిన్ సీ, ఈ, బీటా కెరోటిన్, పాలీఫెనాల్స్, ఫినోలిక్ ఆమ్లాలు వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలు ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడానికి, చర్మంపై వచ్చే మంటను తగ్గించడానికి ఉపయోగపడతాయని చెబుతున్నారు నిపుణులు. అంతేగాదు చర్మం ఆకృతికి, ఆర్థ్రీకరణను ప్రోత్సహించడానికి సహాయపడతాయని చెబుతున్నారు. మరీ అందుకోసం తీసుకోవాల్సిన సూపర్ యాంటీ ఏజింగ్ ఫుడ్స్ ఏంటో చూద్దామా..!.జర్నల్ ఆఫ్ ది అకాడమీ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ డైటెక్స్ 2022లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం..నిర్దిష్ట పండ్లు, కూరగాయలు, గింజలు, చిక్కుళ్ళు , పాలీఫెనాల్ అధికంగా ఉండే పానీయాలు తదితరాలు మెరుగ్గా ఉండే ఆరోగ్యకరమైన చర్మంలో కీలకపాత్ర పోషిస్తాయని తేలింది. ఈ ఆహారాలు యవ్వనంతో నిగనిగలాడే చర్మాన్ని అందిస్తాయని పరిశోధన వెల్లడించింది. మరి యవ్వన చర్మానికి దోహదపడే మొక్కల ఆధారిత ఆహారాలు ఏవంటే..నారింజ: ఇది విటమిన్ 'సీ'కి అద్భుతమైన మూలం. ఇది కొల్లాజెన్ సంశ్లేషణ, చర్మం మరమత్తులో కీలకపాత్ర పోషిస్తుంది. ముదురుఎరుపు రంగు కండ కలిగిన బ్లడ్ ఆరెంజ్‌లతో మరింత ప్రయోజనకరంగా ఉంటాయి. సుమారు 20 నుంచి 27 ఏళ్ల వయసు గల యువత 21 రోజుల పాటు ప్రతిరోజూ 600 ఎంఎల్ బ్లడ్ ఆరెంజ్ జ్యూస్ తీసుకోవడం వల్ల డీఎన్ఏ నష్టం తగ్గడం తోపాటు విటమిన్ సీ, కెరోటినాయిడ్ల స్థాయిలు పెరిగినట్లు పరిశోధనలో వెల్లడైంది.టమోటాలు..దీనిలో లైకోపీన్ ఉంటుంది. ఇది చర్మానికి శక్తిమంతమైన యాంటీ ఆక్సీడెంట్లను అందిస్తుంది. పెద్దలు ప్రతిరోజు ఆలివ్‌నూనె తోపాటు 55 గ్రాముల టమోటా పేస్ట్ తీసుకోవడం వల్ల చర్మ సమస్యలు గణనీయంగా తగగుతాయని పరిశోధనలో తేలింది. దీనిలో చర్మ నష్టం నుంచి రక్షించే శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. అంతేగాదు సూర్యరశ్మి, కాలుష్యం, పర్యావరణ ఒత్తిళ నుంచి చర్మాన్ని రక్షించడంలో టమోటాలు సమర్థవంతంగా ఉంటాయని అన్నారు.బాదంపప్పుబాదంపపపులో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు(ఎంయూఎఫ్ఏ), విటమిన్ ఈ, పాలీఫైనాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ చర్మరక్షణకు దోహదం చేస్తాయి. రుతుక్రమం ఆగిపోయిన మహిళలు 16 వారాల పాటు మొత్తం రోజువారీ కేలరీల్లో 20% బాదంపప్పులు తీసుకోవడంతో గణనీయమైన మార్పులు కనిపించాయని అన్నారు. సోయబీన్స్..దీనిలో ఐసోఫ్లేవోన్లుగా పిలిచే సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి ఈస్ట్రోజెన్‌తో సమానమైన నిర్మాణాలను కలిగి ఉంటాయి. రుతువిరతి సమయంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గడం తోపాటు చర్మం పొడిబారడం, గాయలయ్యే అవకాశాలు ఎక్కుగా ఉంటాయట. ఎప్పుడైతే సోయాబీన్ తీసుకోవడం మొదలుపెడతామో..అప్పటినుంచి చర్మ స్థితిస్థాపకతలో మంచి మార్పుల తోపాటు ఆర్థ్రీకరణ పెరిగి గీతలు తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కోకోకోకోలో ఫ్లేవనోల్స్ నిండి ఉన్నాయి. ఇవి రక్తప్రసరణను మెరుగుపరిచి, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి చర్మ ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి. పరిశోధనలో 24 వారాలపాటు ఓ వృద్ధ మహిళ ప్రతిరోజూ కోకో పానీయం తీసుకోవడంతో ఆమె చర్మంలో ముడతలు, గరుకుదనం తగ్గి యవ్వనపు కాంతి సంతరించుకుందని శాస్తవేత్తలు చెబుతున్నారు. అందువల్ల పోషకాలు అధికంగా ఉండే ఈ మొక్కల ఆధారిత ఆహారాలను డైట్లో చేర్చుకోవడం వల్ల చర్మ ఆర్థ్రీకరణ, స్థితిపాకత తోపాటు మొత్తం రూపాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అలాగే వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఆరోగ్యకరమైన యవ్వన చర్మాన్ని ప్రోత్సహించడంలో కీలకంగా ఉంటాయని చెబుతున్నారు చర్మ నిపుణులు. (చదవండి: మహిళల రక్షణకు ఉపకరించే చట్టాలివే..) -
జిమ్ కెళ్తున్నారా.. జర భద్రం.. సొంత ప్రయోగాలొద్దు!
జిమ్‌కి వెళ్లడం ఆరోగ్యానికి మేలే.. కానీ జిమ్‌కి వెళ్లే ముందు మానసికంగా, ఆరోగ్యంగా సంసిద్ధంగా ఉన్నామా? లేదా! అనేది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అందుకు తగిన మూల్యం తప్పదని ఫిట్నెస్ నిపుణులు చెబుతున్నారు. జిమ్ చేసే క్రమంలో నియమావళిని తప్పక పాటించాలని, ప్రాథమిక అవగాహన తప్పనిసరిగా పెంచుకోవాలని చెబుతున్నారు. ఇటీవల జిమ్‌లో ప్రాక్టీస్ చేస్తూ ప్రమాదవశాత్తూ ఓ మహిళ మృతి చెందిన వీడియో సమాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇప్పుడీ అంశాలు చెప్పుకోడానికి ఇదే ప్రధాన కారణం. సొంత ప్రయోగాలకు పోకుండా నిపుణుల సలహాల మేరకే వ్యాయామం చేయాలనేదే ఇందులోని ముఖ్య ఉద్దేశం. – సాక్షి, సిటీబ్యూరో ఈ మధ్యనే ఒక జాతీయ స్థాయి ఈవెంట్లో గోల్డ్ మెడల్ సాధించిన యస్తిక (17) ప్రాక్టీస్‌లో భాగంగా 270 కిలోల బరువును ఎత్తుతూ ప్రమాదానికి గురైంది. ప్రమాదవశాత్తు వెయిట్స్ మెడపై పడి చనిపోయింది. సోషల్ మీడియాలో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీంతో ఇలాంటి ప్రమాదాలకు సంబంధించిన మరికొన్ని వీడియోలను పలువురు సామాజిక మాధ్యమాల్లో.. షేర్ చేస్తున్నారు. కేవలం చిన్న పొరపాట్లే ఒక్కోసారి ప్రాణాలు కోల్పోయేలా చేస్తాయి. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలను నివారించవచ్చని ఫిట్నెస్ నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిమ్, వ్యాయామ సమయాల్లో తీసుకోవాల్సిన ప్రాథమిక జాగ్రత్తలను సూచిస్తున్నారు. చదవండి: ‘మునగరాణి’ : అపుడు ఎన్నో అవహేళనలు..ఇపుడు నెలకు లక్ష రూపాయలు జిమ్ పార్ట్నర్ తప్పనిసరి.. ప్రమాదకర వ్యాయామాలు చేస్తున్న సమయంలో జిమ్ పార్ట్నర్ను ఎంచుకోవడం తప్పనిసరి. ట్రైనర్ ఉన్నప్పటికీ ఎక్కువ సమయం విభిన్న వర్కవుట్లు చేసే క్రమంలో పార్ట్నర్ ప్రమాదాల నుంచి రక్షణగా నిలుస్తారు. ముఖ్యంగా బెంచ్ ప్రెస్, స్క్వాట్స్ వంటి వ్యాయామాల్లో, అధిక బరువులను ఎత్తుతూ వర్కవుట్లు చేసే సమయంలో భాగస్వామి సమన్వయం చేస్తారు. స్పాటర్ లిఫ్టింగ్ సమయంలో సహాయకారిగా ఉంటారు. టెక్నిక్స్‌తోనే సేఫ్.. వెయిట్ లిఫ్టింగ్ వంటి కఠిన వ్యాయామాలు చేసే క్రమంలో ఆరోగ్యంగా ఫిట్‌గా ఉండటం ప్రాథమిక నియమం. ఫామ్‌లో లేని సమయంలో ఎలాంటి బరువులూ ఎత్తే ప్రయత్నం చేయకూడదు. దీంతోపాటు జిమ్ టెక్నిక్స్ ప్రమాదాలు, గాయాల బారినుంచి సంరక్షిస్తాయి. శారీరక, మానసిక దృఢత్వమే హాస్పిటల్ బెడ్ పై కాకుండా వెయిట్ లిఫ్టింగ్ బెంచ్‌పై ఉండేందుకు ఉపకరిస్తుందని ఉమెన్ ఫిట్నెస్ ట్రైనర్ శ్వేత పేర్కొన్నారు. పరిసరాలను గమనించాలి.. వ్యాయామం చేస్తున్న సమయంలో చాలా మంది ఇయర్ బడ్స్ పెట్టుకుంటారు. ఇది ప్రమాదాలకు కారణం కావచ్చు. వ్యాయామం చేసేటప్పుటు జిమ్ పరిసరాల్లో, ఇతరులు చేస్తున్న వ్యాయామ ప్రక్రియలను గమనిస్తుండాలి. లేదంటే పొరపాటున ఇతరులు చేసే వ్యాయామ పరికరాలు తగలడం, మీద పడటం, రాడ్స్ తగలడం వంటి ప్రమాదాలకు గురయ్యే ప్రమాదం ఉందని ట్రైనర్లు చెబుతున్నారు. ద్రవాలతో డీహైడ్రేషన్‌కు చెక్.. సాధారణంగా జిమ్ సెంటర్లన్నీ వెంటిలేషన్ తక్కువగా ఉండే పెద్ద పెద్ద హాల్స్‌లో నిర్వహిస్తుంటారు. ఓ వైపు వ్యాయామం ద్వారా వచ్చే వేడి, మరో వైపు ఉబికివచ్చే చెమటలు. ఈ కారణాలతో శరీరం డీహైడ్రేట్ కావడం సర్వసాధారణం. ఇలాంటి సమయాల్లో అనువైన ద్రవాలు, పానీయాలు తీసుకోవడం కీలకం. లేదా ఇతర ప్రమాదాలకు డీహైడ్రేషన్ కూడా కారణమవుతుంది. క్రమశిక్షణ ముఖ్యం.. జిమ్ కల్చర్‌లో క్రమశిక్షణ ప్రాథమిక నియమం. ఫిట్నెస్ వ్యాయామాల తరువాత జిమ్ ఎక్విప్మెంట్ వాటిని భద్రపరిచే ర్యాక్‌లో పెట్టడం ఇతరులను ప్రమాదాల నుంచి నివారిస్తుంది. జిమ్ ఫ్లోర్‌పై డంబెల్స్, వెయిటింగ్ బెల్స్ ఎక్కడివక్కడే ఉంచడం వల్ల కాలికి గాయాలయ్యే ప్రమాదం ఉంది. ఒక్కోసారి స్కిప్ అయ్యి దానిపై పడితే తలకు బలమైన గాయాలు అయిన సందర్భాలూ కోకొల్లలు. జిమ్‌లో తగిలే గాయాలకు మరో ప్రధాన కారణం ‘వ్యాయామ క్రమశిక్షణ’ లేకపోవడమేనని ప్రముఖ ట్రైనర్ సంతోష్ హెన్రిక్ తెలిపారు. వార్మ్ అప్ తప్పనిసరి.. వ్యాయామాలకు ముందు వార్మ్ అప్ తప్పనిసరి. దీనిని గంటల తరబడి చేయాల్సిన అవసరం లేదు.. ముఖ్యంగా కార్డియో యంత్రాలను ఉపయోగిస్తుంటే, నెమ్మదిగా ప్రారంభించి క్రమంగా పరుగుకు చేరుకోవాలి. స్టైల్ సెషన్ చేయబోతున్నట్లయితే.. శరీరమంతా రక్తప్రసరణ సజావుగా సాగేలా తేలికపాటి జాగింగ్‌తో ప్రారంభించాలి. బరువులు ఎత్తడం, పిన్– లేదా ప్లేట్–లోడెడ్ మెషీన్ల విషయంలో వాటి కదలికలకు అనుగుణంగా శరీరాన్ని ఉంచాలి. వ్యాయామాలకు ముందు వార్మ్ అప్ తప్పనిసరి. దీనిని గంటల తరబడి చేయాల్సిన అవసరం లేదు.. ముఖ్యంగా కార్డియో యంత్రాలను ఉపయోగిస్తుంటే, నెమ్మదిగా ప్రారంభించి క్రమంగా పరుగుకు చేరుకోవాలి. స్టైల్ సెషన్ చేయబోతున్నట్లయితే.. శరీరమంతా రక్తప్రసరణ సజావుగా సాగేలా తేలికపాటి జాగింగ్‌తో ప్రారంభించాలి. బరువులు ఎత్తడం, పిన్– లేదా ప్లేట్–లోడెడ్ మెషీన్ల విషయంలో వాటి కదలికలకు అనుగుణంగా శరీరాన్ని ఉంచాలి. సమయం తప్పనిసరి.. ఉరుకుల పరుగుల జీవితంలో ఎప్పుడు కుదిరితే అప్పుడు ఆదరాబాదరా జిమ్‌కి వెళ్లడం సరికాదు. ఇది అత్యంత ప్రమాదకరం. వ్యాయామాలు, ఫిట్నెస్ ప్రక్రియలను నిర్దేశిత సమయాల్లోనే చేయాలి. తక్కువ సమయంలో పూర్తి చేసి వెళ్లాలనే తొందరలో ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అంతేకాదు.. జిమ్ పార్ట్నర్ కోసం త్వరగా ముగించడం, ఎక్కువ సేపు చేయడం కూడా ప్రమాదమే. మన స్థాయికి తగ్గట్టుగానే..వ్యాయామాల్లో ఎక్కువగా చేసే తప్పలు ‘సామర్థ్యానికి మించిన బరువులను ఎత్తడం’. అధిక బరువులను ఓ క్రమ పద్ధతిలో రోజు రోజుకూ పెంచుకుంటూ పోవాలనేది నిపుణుల సూచన. ఎంత ఎత్తగలరో అంతే ఎత్తండి అని ప్రతి ట్రైనర్ చెబుతుంటారు. అనివార్యకారణాల వల్ల కొన్ని రోజులు జిమ్‌కు వెళ్లని పక్షంలో.. తిరిగి మునుపటి బరువులు ఎత్తడం సరికాదు. దీనివల్ల కండరాలకు గాయాలయ్యే ప్రమాదం ఉందని బంజారాహిల్స్‌లోని ఓ జిమ్ ట్రైనర్ రవి చెబుతున్నారు. వ్యాయామాలు చేసేవారు తమతోపాటు తప్పనిసరిగా టవల్ వెంట తీసుకెళ్లాలి. ఇది ఆరోగ్య రక్షణకు, ప్రమాదాల నివారణకు సహకరిస్తుంది. వ్యాయామాల సమయంలో పట్టే చెమట వల్ల బరువైన వస్తువులు జారిపోయే ప్రమాదం ఉంది. తద్వారా గాయాలు కావొచ్చు. టవల్‌తో చెమటను తుడుచుకోవడం వల్ల దాని ద్వారా వచ్చే సూక్ష్మ క్రిములు తొలగిపోయి చర్మానికి రక్షణ చేకూరుతుంది. -
మిసెస్ ఇండియా పోటీలకు తెలుగు ఎన్ఆర్ఐ
సాక్షి, సిటీబ్యూరో: లండన్ వేదికగా ప్రముఖ బహుళ జాతి సంస్థలో కార్పొరేట్ లీడ్ రోల్ నిర్వహిస్తున్న తెలుగు వనిత బిందు ప్రియ.. త్వరలో జరగనున్న మిసెస్ ఇండియా 2025 పోటీల్లో ఎన్ఆర్ఐ విభాగంలో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించనున్నారు. జాతీయ వేదికపై తెలంగాణకు ప్రాతినిధ్యం వహించడం సంతోషంగా ఉందని నిజామాబాద్ జిల్లాకు చెందిన బిందు ప్రియ తెలిపారు. బిందు ప్రియా జైస్వాల్ మిసెస్ ఇండియా తెలంగాణా 2025 క్లాసిక్ NRI కేటగిరీలో విజేతగా నిలిచింది. 2025 ప్రారంభంలో ఎన్ఆర్ఐ విభాగంలో మిసెస్ ఇండియా తెలంగాణ–2025 కిరీటాన్ని గెలుచుకుని త్వరలో జరగనున్న మిసెస్ ఇండియా పోటీల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. బిందు బహుముఖ ప్రజ్ఞాశాలి. వర్క్‌లైఫ్, ఫ్యామిలీ లైఫ్‌ను బ్యాలెన్స్ చేసుకుంటూ ఐటీలో కార్పొరేట్ లీడర్ , గ్లోబల్ బ్యాంకింగ్ నిపుణురాలు. ఉన్నత విద్యావంతురాలు. ఆరోగ్యం & ఫిట్నెస్ ఔత్సాహికురాలు కూడా. తన తల్లి బోధించిన గీత పాఠాలే స్ఫూర్తి అని చెబతారు. కథక్, తెలుగు, హిందీ సంగీతం, గిటార్, పియానో వంటి సంగీత వాయిద్యాల్లో బిందుకు ప్రావీణ్యం ఉంది. అలాగే యూకేలోని ప్రసిద్ధ వేదికలపైన నృత్య ప్రదర్శనలివ్వడం విశేషం. సేవా (ఎస్ఈడబ్ల్యూఏ) సభ్యురాలిగా నిరుపేద విద్యార్థుల విద్య, మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నారు. -
ప్రతి మహిళ తప్పక తెలుసుకోవాల్సిన చట్టాలివే..!
ఎంతలా అభివృద్ధిపథంలోకి దేశం దూసుకుపోతున్నా..స్త్రీలపై వేధింపులు మాత్రం ఆగడం లేదు. ఎక్కడో ఏదో ఒక మూలన అత్యాచారం, లైగంగిక వేధింపులు వంటి అమానుష ఘటనలు చోటు చేసుకంటూనే ఉన్నాయి. చదువుకుని తమ కాళ్లపై నిలబడినా మహిళలంటే చిన్న చూపు, తేలిక భావం ఇంకా ఉన్నాయి. అన్ని రంగాల్లో పురుషులకు ఏ మాత్రం తీసిపోమని చెబుతున్నా..ఆమె మగాడు లేకపోతే మనలేదు అనే కుచించిత భావంలోనే ఉండిపోతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ప్రతి మహిళ తనను తాను రక్షించుకునేందుకు తప్పక తెలసుకోవాల్సిన చట్టాలేంటో చూద్దామా..!1. అనైతిక వ్యాపారర (నివారణ) చట్టము, 1956 The Immoral Traffic (Prevention) Act, 19562. వరకట్న నిషేధ చట్టం, 1962. The Dowry Prohibition Act, 19613. గృహహింస నుండి మహిళల రక్షణ చట్టం, 2005.Protection of Women from Domestic Violence Act, 20054. పనిచేయుచోట మహిళలపై లైంగిక హింస (నివారణ, నిషేధము – పరిహార) చట్టం, 2013. The Sexual Harassment of Women at Workplace PREVENTION, PROHIBITION and REDRESSAL Act, 20135. స్త్రీల అసభ్య చిత్రణ (నిషేధ) చట్టం, 1986. The Indecent Representation of Women (Prohibition) Act, 19866. భారతీయ సాక్ష్య అధినియం, BNS IPC) ) లోని స్త్రీలపై జరుగుతున్న లైంగిక దాడులు, మహిళల గౌరవానికి భంగం కలిగించే నేరాలు, గృహహింస, వివాహం చేసుకుంటానని నమ్మించి మోసగించటం వంటి పలు రకాల నేరాలకు గల శిక్షలు.7. పలు వివాహ చట్టాలు – క్రిమినల్ ప్రోసీజర్ కోడ్ లోని సెక్షన్ 125 (144 బిఎన్ఎస్ఎస్) ద్వారా తమను తాము పోషించుకోలేని మహిళలకు మెయింటెనెన్స్, భరణం పొందే హక్కు 8. తల్లి దండ్రుల, వయోవృద్ధుల పోషణ – పరిరక్షణ చట్టం, 20079. విద్యాహక్కు చట్టం, 200910. చిన్నపిల్లలను లైంగిక వేధింపుల నుంచి రక్షించటానికి POCSO Act, 2012(చదవండి: కనపడని నాలుగో సింహం..! నిందితుడిని కటకటాల్లోకి పంపేది వారే..! -
లాలస: స్త్రీలందరికీ ఆమె ఆదర్శమా? అనుసరణీయమా?
గాఢంగా చీకట్లు కమ్మిన ఒక రాత్రి– ఆకాశాన్ని చీలుస్తూ ఒక మెరుపు మెరుస్తుంది... మనల్ని, మన పరిసరాలనీ మన కళ్ళకే చూపించి మాయమై పోతుంది. ఆ మెరుపును మన ఇంటి దీపంలాగా గోడకు వేలాడదీసుకుందామంటే కుదరదు. కుదిరి నా భరించటానికి ఆ ఇంటికి శక్తి చాలదు. ఆ క్షణకాలపు వెలుగులో ఏం చూడగలరో, పరిసరాలను ఎంత చక్కదిద్దుకోగలరో ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాల్సిందే. సరిగ్గా ఆ మెరుపులాంటిదే లాలస! చలం రాసిన ‘జీవితాదర్శం’లో నాయిక. లాలస నాకు నచ్చింది అని చెప్పిన వాళ్ళకు కొన్ని ప్రశ్నలు ఎదురవుతాయి– స్త్రీలందరికీ ఆమె ఆదర్శమా? అనుసరణీయమా? ఆ దారిలో నడవటం ఆడవాళ్ళకు క్షేమమా? అంటూ. అన్నిటికీ జవాబు ఒకటే– కాదు. మరెందుకు మాట్లాడుకోవాలి లాలస గురించి? స్త్రీ పురుష సంబంధాలు– అధికారం వల్లనో, అవసరాల కోసమో సాగేవిగా ఉండరాదని, అవి హృదయగతమైన సంబంధాలుగా ఉండాలని చెప్పినందుకు, వాటిలో కపటమూ మోసమూ చోటు చేసుకున్నప్పుడు ఎంత బలమైన నిర్మాణమైనా లోలోపల గుల్లబారి కూలిపోక తప్పదని చెప్పటానికి తనను తానొక ప్రయోగశాలగా మార్చుకున్నందుకు లాలస గురించి మాట్లాడుకోవాలి.లాలస నమ్మి, ఆచరించిన ‘హృదయవాదం’ అతి ప్రమాదకరమైనది. ఉనికిలో వున్న ఏ ఆదర్శ నమూనాలోనూ అది ఇమడదు. ‘నీతిమంతమైన’ ఏ నిర్మాణమూ దాన్ని భరించదు. నిజానికి లాలస పేచీ పడింది నీతితోనూ, ఆదర్శాలతోనూ కానేకాదు. ‘నీతి చాలా గొప్ప విషయమూ, అవసరమైన విషయమూ’ అని గౌరవించే లాలస ఆ నీతులూ, ఆదర్శాలూ హృదయం లోంచి పుట్టే సహజ ప్రేరణలుగా కాకుండా ఉత్తి రిచువల్స్గా తయారవటాన్ని అసహ్యించుకుంటుంది. స్త్రీలను సమానులుగా మనస్ఫూర్తిగా గుర్తించకుండా, అలా ఉన్నట్టుగా కనబడే వ్యక్తులకు సామాజిక గౌరవం ఉన్నందుకే ఆలా నడుచుకునే హి΄ోక్రటిక్ ఆదర్శ జీవులను ఆమె నిలదీస్తుంది. అయితే ఇలా విమర్శించినంత మాత్రాన తానొక ఆదర్శ వ్యక్తిననే భ్రమలు ఆమెకేమీ లేవు. ‘నువ్వు నాకు ఆదర్శమైన పురుషుడివి కావు... ఆదర్శమైన స్త్రీ కూడా లేదు. కానీ, నేనొకతె ను ఉన్నానని నమ్ముతున్నావు, దురదృష్టవంతుడివి కనుక’ అని తను పెళ్ళాడబోతున్న వ్యక్తితో నిస్సంకోచంగా చెప్పగలదు లాలస. ఆదర్శవంతమైన మనుషులు, అత్యంత కఠినమైన స్వీయ ప్రయత్నంతో రూపొందగలరే తప్ప, సామాజిక నిర్బంధంతో కాదని ఆమె నమ్మకం. ఆ ప్రయత్నంలో ఎగుడు దిగుళ్ళూ, తప్పటడుగులూ ఉండి తీరుతాయి. ఏ విలువల ప్రాతిపదికన బయల్దేరుతామో వాటిని కోల్పోయే స్థితికి దిగజారే ప్రమాదమూ ఎదురు కావచ్చు. వీటన్నిటికీ సిద్ధపడి, ఒక విలువను ప్రతిపాదించగల స్థాయికి చేరిన వ్యక్తి లాలస. జనసామాన్యాన్ని కూడగట్టి నడిపించటానికీ, ఆచరణాత్మకమైన నిర్మాణాలను రూపొందించటానికీ పనికొచ్చే నాయకులు కాదు లాలస వంటి వ్యక్తులు. చదవండి: కనపడని నాలుగో సింహం..!ఆ పనుల కోసం రూపొందాయని చెప్పే మార్గాలు మూఢనమ్మకాలుగా మారిపోకుండానూ, ఆ నిర్మాణాలు గిడసబారి పోకుండానూ హెచ్చరించే అనుభవాల ప్రయోగశాలలు వీళ్ళు. మార్పు కొరకు జరిగే ప్రతి ఉద్యమమూ మానవీయమైన సహజ చర్యగా సాగాలని, ఆదర్శాలన్నవి మనుషుల వ్యక్తిత్వాల్లో అసంకల్పితంగా భాగమై పోయేంత సహజ స్పందనలుగా మారాలనీ కలలుగనే మానవులు. అలాంటి కలలు గన్న పాత్రగా లాలస పాఠకులకు నచ్చుతుంది.- కాత్యాయని -
కనపడని నాలుగో సింహం..!
సినిమాల్లో ‘శుభం’ కార్డు పడే సమయంలో ‘యూ ఆర్ అండర్ అరెస్ట్’ అంటూ ఇన్స్పెక్టర్ పరుగెత్తుకు వచ్చి నేరస్థుడికి అలవోకగా సంకెళ్లు వేస్తాడు. అయితే నిజజీవితంలో అలా కాదు. నేరస్థుడిని పట్టుకోవడానికి లక్ష సవాళ్లు ఎదురవుతాయి. అలా అని నేరస్థుడిని పట్టుకోవడంలో ఆలస్యం జరగకూడదు. ‘నేరస్థుడిని త్వరగా పట్టుకోవాలి’ అనే తొందరపాటు కూడా ఉండకూడదు. ‘99 మంది దోషులు చట్టం నుంచి తప్పించుకున్నా... ఒక్క అమాయకుడు శిక్షకు గురి కాకూడదు’ అనే మాట ఉండనే ఉంది! క్రైమ్ సీన్ సవాలు విసురుతుంది. ఎవరైతే ఆ సవాలును స్వీకరించి, తమ తెలివితేటలు, శక్తిసామర్థ్యాలకు పదును పెట్టి, ఏ పుట్టలో ఏ పాము ఉందో కనిపెట్టి నిందితుడిని కటకటాల వెనక్కి తీసుకువెళతారో... వారే క్రైమ్‌సీన్ ఆఫీసర్లు. క్లూస్‌టీమ్‌లో భాగంగా పనిచేసే క్రైమ్‌సీన్ ఆఫీసర్లు (సీఎస్ఓ) నేరం జరిగిన వెంటనే ఘటనాస్థలికి వెళ్లి అణువణువూ అధ్యయనం చేసి, దర్యాప్తు అధికారులుగా ఉండే పోలీసులు నిందితులను పట్టుకోవడానికి అవసరమైన ఆధారాలు అందిస్తారు. హైదరాబాద్ క్లూస్‌టీమ్‌లో మొత్తం 43 మంది సీఎస్ఓలు ఉండగా వీరిలో ఆరుగురే మహిళలు. పోలీసులు మనకు కనిపించే మూడు సింహాలైతే... ఈ ‘సీఎస్ఓ’లు కంటికి కనిపించని నాలుగో సింహం. ‘క్లూ’లు అందించడంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన గుడిబోయిన ఇందిర, దానం ఎలిజబెత్‌లు ఎన్నో ముఖ్యమైన కేసుల దర్యాప్తులో కీలక పాత్ర పోషించారు... హైదరాబాద్‌లోని నేరేడ్మెట్ (Neredmet) ప్రాంతానికి చెందిన గుడిబోయిన ఇందిర 2015 నుంచి హైదరాబాద్ (Hyderabad) క్లూస్ టీమ్‌లో సీఎస్ఓగా పని చేస్తోంది. తన పదేళ్ల సర్వీసులో ఎన్నో నేరస్థలాలకు వెళ్లి కీలక ఆధారాలు సేకరించి కేసు చిక్కు ముడి వీడడంలో కీలక పాత్ర పోషించింది. ఆ కేసులలో కొన్ని...నిందితుడు... ఇదిగో... ఈ ఇంట్లోనే!హైదరాబాద్‌లోని మెట్టుగూడ (Mettuguda) నల్లపోచమ్మ ఆలయం దగ్గర నివసించే రేణుక పెద్ద కుమారుడు యశ్వంత్ మౌలాలీలోని రైల్వే కాంట్రాక్టర్ దగ్గర పని చేసి మానేశాడు. ఫిబ్రవరి ఆరోతేదీన కొంతమంది దుండగులు తమ ఇంట్లోకి చొరబడ్డారని, తల్లితోపాటు తనపై కత్తితో దాడి చేశారని యశ్వంత్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఇద్దరికీ తీవ్రగాయాలు కావడంతో ఈ హత్యాయత్నం కేసు సంచలనం సృష్టించింది. విధి నిర్వహణలో భాగంగా సీఎస్ఓ ఇందిర యశ్వంత్ ఇంటికి వెళ్లింది. ఘటనాస్థలిలో ఉన్న పరిస్థితులతోపాటు ఆ ఇంటి పరిసరాలను అధ్యయనం చేసింది. రేణుక ఒంటిపై ఉన్న కత్తిపోట్లు ఎదుటివాళ్లే పొడిచినట్లు ఉన్నప్పటికీ యశ్వంత్ గాయాలపై అనుమానం వచ్చింది. దీనికితోడు వారి ఇంటికి బయటనుంచి గడియపెట్టి ఉందనే విషయం తెలుసుకున్న ఇందిర మరింత లోతుగా ఆరా తీసింది. ఈ నేరంలో మూడో వారి ప్రమేయం లేదంటూ పోలీసులకు నివేదించింది. దీంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా యశ్వంతే నిందితుడని తేలింది. కుటుంబ కలహాలు, పెళ్లి కావట్లేదనే బాధతో డిప్రెషన్ కు గురైన యశ్వంత్ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన తల్లికి కత్తిపోట్లు పడ్డాయి. దీంతో భయాందోళనలకు గురైన యశ్వంత్ తనపై కేసు కాకుండా ఉండటానికి ‘ఎవరో మాపై హత్యాయత్నం చేశారు’ అంటూ నాటకం ఆడాడు. కుమారుడిని జైలుకు పంపడం ఇష్టంలేక పోలీసులను తప్పుదోవ పట్టించింది రేణుక. చివరకు ఇందిర చొరవతో కేసు కొలిక్కివచ్చి యశ్వంత్‌పై హత్యాయత్నం కేసు నమోదైంది.స్క్రూ డ్రైవర్ ముక్కే... పక్కాగా పట్టించింది!నాలుగేళ్ల క్రితం బేగంపేటలో ఒక ఇంట్లో చోరీ జరిగింది. నేరస్థలిని సందర్శించిన ఇందిర అక్కడ విరిగిన స్క్రూడ్రైవర్ ముక్కను గుర్తించింది. బాధితులు పక్కింటివారిపై అనుమానం వ్యక్తం చేయడంతో వారింట్లో సోదాలు చేశారు. అక్కడ మిగిలిన స్క్రూ డ్రైవర్ దొరకడంతో వారే నిందితులుగా తేలి కేసు కొలిక్కివచ్చింది.సూసైడ్ నోట్ కనిపెట్టి... అతడి ఆట కట్టించిందికుటుంబ కలహాల నేపథ్యంలో గత వారం వారాసిగూడ ప్రాంతంలో ఒక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఆ సమయంలో ఆమె భర్త కూడా ఇంట్లోనే ఉండటంతో ఇది హత్యగా అనుమానించారు. ఘటనాస్థలికి వెళ్లిన ఇందిర మృతురాలి శరీరంతోపాటు ఆమె వస్త్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి సూసైడ్ నోట్ వెలికి తీసింది. ఆత్మహత్యకు ప్రేరేపించడం, వేధింపుల కేసు భర్తపై నమోదైంది. తట్టిఅన్నారంలోని జీవీఆర్ కాలనీకి చెందిన దానం ఎలిజబెత్ 2015 నుంచి హైదరాబాద్ క్లూస్ టీమ్‌లో సీఎస్ఓగా పని చేస్తోంది. ఇప్పటి వరకు అనేక కేసుల దర్యాప్తులో కీలకంగా మారిన ఆధారాలను సేకరించి అందించింది. గత ఏడాది చివరలో హబీబ్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చిన ‘గుండెపోటు మరణం’ ఎలిజెబెత్ అందించిన ఆధారాలతోనే హత్యగా తేలింది.డస్ట్‌బిన్‌లో దాగిన రహస్యంకురుమబస్తీకి చెందిన రేణుక ఇంటి అరుగుపై ఉదయం ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రహదారిపై నడుచుకుంటూ వెళ్తుండగా గుండెపోటు వచ్చి ఉంటుందని, తమ అరుగుపై పడుకుని ప్రాణాలు విడిచి ఉంటాడని రేణుక పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న హబీబ్‌నగర్ పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో మృతుడు ఏ బ్యాట్రీలేన్కు చెందిన ఖాలేద్‌గా గుర్తించారు. రేణుక ఇంట్లోనూ సోదాలు చేయాలని పోలీసులు క్లూస్ టీమ్‌ను కోరారు. ఎలిజబెత్ అక్కడకు వెళ్లి రేణుక ఇంటిలో అణువణువూ పరిశీలించింది. రేణుక మంచం పైన కనిపించిన కొన్ని వెంట్రుకలు ఖాలేద్ వెంట్రుకలతో సరిపోలాయి. రేణుక వంటగదిలో ఉన్న డస్ట్‌బిన్‌లో ఓ కొత్త కాటన్ టవల్ పడి ఉండటం ఎలిజబెత్ దృష్టిలో పడింది. కొత్త టవల్ డస్ట్‌బిన్‌లో ఉండటం, అదీ కిచెన్లోది కావడంతో అనుమానించింది. ఆ టవల్ తడిగా ఉండటంతోపాటు కొన్ని రకాలైన మరకలు ఉన్నట్లు కనిపెట్టింది. వీటి ఆధారంగా రేణుక హత్య చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు సమాచారం అందించింది ఎలిజబెత్. దీంతో అధికారులు రేణుకను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అనుకోకుండా హత్య చేశానని, తన సోదరుడు వెంకటేష్ సాయంతో మృతదేహాన్ని ఇంట్లోంచి బయటకు తీసుకువచ్చి అరుగుపై పడుకోబెట్టానని రేణుక ఒప్పుకుంది. చదవండి: 'ఇ-నాలుక' రుచిని కోల్పోయిన వాళ్లకు వరం..!రేణుక–ఖాలేద్ల మధ్య కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. ఆరోజు రేణుక ఇంటికి వెళ్లిన ఖాలేద్ తన కోరిక తీర్చమని కోరగా ఆమె అంగీకరించలేదు. ఆ సమయంలో జరిగిన గొడవలో బెడ్‌పై పడిన ఖాలేద్ నోరు, ముక్కు టవల్‌తో మూసేసి హత్య చేసింది. రేణుకతోపాటు ఆమె సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు. -
ఈక్వల్ జర్నీ స్లోగా ఉంది
పని ప్రదేశాల నుండి బహిరంగ ప్రదేశాల వరకు ఎన్నో చోట్ల భద్రతప్రాపాముఖ్యతను గుర్తుతెస్తుంది... జాతీయ భద్రతా దినోత్సవం (National Safety Day). భద్రతా అవగాహన–అమలుకు అంకితమైన ‘నేషనల్ సేఫ్టీ వీక్’లో భాగంగా వివిధ రంగాలలో, వివిధ ప్రదేశాలలో, వివిధ కోణాలలో మహిళల భద్రతకు ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కార మార్గాలు వెదకడం అత్యవసరం. అనివార్యం. వికసిత భారత్‌కు ఆయువు పట్టు... మహిళల శ్రేయస్సు, భద్రత...నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే(ఎన్ఎఫ్హెచ్ఎస్–5) ప్రకారం భారతదేశంలో 15–49 సంవత్సరాల వయస్సు గల 30 శాతం మంది మహిళలు శారీరక, లైంగిక, గృహహింసను అనుభవిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన దేశంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల భద్రతకు అత్యంతప్రాపాధాన్యత ఇస్తున్నాయి.మహిళల భద్రత, భద్రతాప్రాపాజెక్ట్ల కోసం ప్రభుత్వం ‘నిర్బయ నిధి’ని ఏర్పాటు చేసింది. నిర్భయ నిధి కింద బ్యూరో ఆఫ్ పోలిస్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (బిపీఆర్ అండ్ డి) దర్యాప్తు అధికారులు,ప్రాపాసిక్యూషన్ అధికారులు, వైద్య అధికారులకు శిక్షణ ఇస్తారు. నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు. లైంగిక దాడి సాక్ష్యాల సేకరణ(సెక్సువల్ అసాల్ట్ ఎవిడెన్స్ కలెక్షన్) కిట్లను రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాపాంతాలకు పంపిణీ చేయడం లాంటి కార్యక్రమాలు చేపట్టారు.‘ఉమెన్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇండెక్స్’(డబ్ల్యూపీఎస్–2023)లో 177 దేశాల్లో మహిళల భద్రతలో మన దేశం నాలుగో స్థానంలో నిలిచింది. మొదటి రెండు స్థానాలను డెన్మార్క్, స్విట్జర్లాండ్ దక్కించుకున్నాయి. ఆఫ్గనిస్తాన్ అట్టడుగు స్థానంలో ఉంది.2022: మహిళలను లక్ష్యంగా చేసుకొని రాజకీయ హింసకుపాల్పడే టాప్10 దేశాల్లో భారత్ కూడా ఉంది. ఈ జాబితాలో 537 సంఘటనతో మెక్సికో అగ్రస్థానంలో ఉంది. 125 సంఘటనలతో మన దేశం 7వ స్థానంలో ఉంది.ఉమెన్ సేఫ్టీకి సంబంధించి వివిధ సంస్థలు ట్రైనింగ్ సెషన్స్ నిర్వహిస్తున్నాయి. ప్రమాదకరమైన పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి నుంచి సేఫ్టీకి సంబంధించిన టిప్స్, సేఫ్టీకి సంబంధించిన గోల్డెన్ రూల్స్ చెప్పడం, యాప్స్‌ను పరిచయం చేయడం వరకు ఎన్నో చేస్తున్నారు. సెల్ఫ్–డిఫెన్స్‌కు సంబంధించి అపోహలను తొలగిస్తున్నారు. హక్కులను సాధించడానికి పోరాటపటిమ... అవకాశాలను అందుకోవడానికి ప్రతిభాపాటవాలు... సాధించి, అందుకున్న దాంట్లో స్థిరపడే చోటేపోరాటం... ఇవన్నీ అవసరం అవడానికి కారణం అభద్రత, రక్షణలేమి! అవి ఇన్నేళ్ల మహిళల ప్రయాణాన్ని మళ్లీ మొదటికే తీసుకొస్తాయేమోననే భయం వెంటాడుతోంది! తర్వాత తరాలను జీరో దగ్గర నిలబెట్టకుండా.. వాళ్లకో మైల్‌స్టోన్‌ను అందివ్వాలనేదే ఈతరం మహిళల ఆరాటం! అది విమెన్ ఫ్రెండ్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్లే సాధ్యం! ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రపోలీస్ శాఖ చేసిన, చేస్తున్న ప్రయత్నాలను వివరించారు తెలంగాణ సీఐడీ, విమెన్ సేఫ్టీవింగ్ ఏడీజీపీ శిఖాగోయల్ (Shikha Goel).ఏ రంగంలో అయినా మహిళాప్రాపాతినిధ్యం పెరిగితేనే మహిళలకు అనుకూలమైన వాతావరణం ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. మొదటినుంచీ పురుషాధిపత్య రంగమైనపోలీస్ డిపార్ట్మెంట్లోనూ మహిళలప్రాతినిధ్యం పెరగాలి. ఇదివరకటితో పోలిస్తే పెరిగింది కూడా. అయినా జాతీయ స్థాయిలో చూస్తే వీరి సంఖ్య 25 శాతం కూడా లేదు. తెలంగాణపోలీస్ శాఖలో మహిళల సంఖ్య పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం 33 శాతం రిజర్వేషన్‌ను అమలు చేస్తోంది. దాంతో రాష్ట్రపోలీస్ శాఖలో మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2024లో రికార్డ్ స్థాయిలో 2,500 మంది మహిళలను అపాయింట్ చేశాం. అంటే దాదాపు 20 శాతం. ఎస్‌సీటీపీసీ ప్రోగ్రామ్ ద్వారా 2,338 మందిని తీసుకున్నాం. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే అతి పెద్ద బ్యాచ్ ఇది.పోలీస్ డిపార్ట్మెంట్లోకి మహిళలను ప్రోత్సహించడానికే ఇలాంటి ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ సెంటర్స్‌ని ఏర్పాటు చేశాం. మౌలిక సదుపాయాల కల్పనలోనూ కృషి జరుగుతోంది. అయినా ఈ రంగంలో స్త్రీ, పురుష సమానత్వాన్ని సాధించడానికి ఇంకా చాలా దూరమే ప్రయాణించాల్సి ఉంది. మహిళల నియామకాలను పెంచడంలో చిత్తశుద్ధి ప్రయత్నాలతోపాటు జెండర్పాలసీ, మహిళలకు లీడర్షిప్ ట్రైనింగ్స్ అనేవీ చాలా అవసరం. ఇన్ని అవాంతరాల మధ్య కూడా గుర్తించదగిన విజయాన్నే సాధిస్తున్నాం.భద్రతా నగరాల్లో ఒకటిగా...మహిళా భద్రత, రక్షణ కేవలం బహిరంగ ప్రదేశాలకే పరిమితమైంది కాదు. ఇంటి నుంచి మొదలు స్కూల్, వర్కింగ్ ప్లేస్, ట్రాన్స్΄ోర్ట్ ఇలా అన్ని చోట్లా సమస్యగానే ఉంది. తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రత, రక్షణకు పెద్ద పీట వేస్తోంది. షీ టీమ్స్, భరోసా సెంటర్స్, సాహస్, సీడీఈడబ్ల్యూ (డొమెస్టిక్ వయొలెన్స్) కౌన్సెలింగ్ సెంటర్స్, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్, చట్టాలను కఠినంగా అమలుపరచడం, నిర్భయ ఫండ్స్‌తో అధునాతన నిఘా పరికరాలు, సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ సెంటర్స్, హెల్ప్‌లైన్స్ వంటివాటితో భద్రత, రక్షణ వ్యవస్థను పటిష్ఠం చేశాం. దీంతో మహిళ లు నిర్భయంగా బయటకు వచ్చి.. తమకు నచ్చిన రంగంలో రాణించే వాతావరణం ఏర్పడింది. కిందటేడు మార్చిలో టీ సేఫ్ సర్వీస్నుప్రాపారంభించింది ప్రభుత్వం. ఇది చదువు, స్త్రీల హక్కులు, చట్టాల గురించి అమ్మాయిల్లో అవగాహన కల్పించడం, అలాగే మహిళలను గౌరవించాలనే స్పృహను అబ్బాయిల్లో కలిగించడం వంటి కార్యక్రమాలను చేపడుతూ సమాజంలో మహిళల మీద జరుగుతున్న హింసను తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. వీటన్నిటి వల్లే తెలంగాణ ఈరోజు దేశంలోనే అత్యధిక వర్కింగ్ విమెన్ ఉన్న రాష్ట్రంగా, హైదరాబాద్.. దేశంలోకెల్లా భద్రతా నగరాల్లో ఒకటిగా నిలిచాయి. సవాళ్లు...ఇంత చేస్తున్నా ఇంకా చాలామంది మహిళల్లో తమ హక్కులు, చట్టాల విషయంలో పూర్తి అవగాహన రాలేదు. దీనివల్ల గృహహింస, పనిప్రదేశాల్లో లైంగికవేధింపులు వంటివాటి మీద ఫిర్యాదు చేయడం లేదు. అవగాహన ఉన్నవారు కూడా వెనుకడుగు వేస్తున్నారు పరువు, ప్రతిష్ఠ లాంటి భయాల వల్ల. ఇవన్నీ మహిళల భద్రత, రక్షణకు అడ్డంకులుగా మారుతున్నాయి. అయినాపోలీస్ శాఖ అలుపెరగని ప్రయత్నం చేస్తోంది.మనమే క్రియేట్ చేసుకోవాలి...ఏ రంగంలో మహిళలు మైనారిటీగా ఉంటారో ఆ రంగంలో సవాళ్లు తప్పనిసరి. అయితే వాటికి భయపడకుండా మన స΄ోర్ట్ సిస్టమ్‌ను మనమే రూ΄÷ందించుకోవాలి. దాన్ని విజయానికి సోపానంగా మలచుకోవాలి.ప్రాపాధాన్యాలను గ్రహించి.. దానికి అనుగుణంగా పనిచేసుకుపోవడమనేది కూడా ఒక నైపుణ్యంగా మారుతుంది.ప్రాపాధాన్యాలను గ్రహిస్తూ వర్క్– లైఫ్ బ్యాలెన్స్‌ని ఒక స్కిల్లా డెవలప్ చేసుకోవాలి. -శిఖాగోయల్డిజిటల్ థ్రెట్‌ను ఢీ కొట్టాలిట్రెడిషినల్ ముప్పుకు అదనంగా ఈ–థ్రెట్స్ సోషల్‌మీడియా రాకతో మరింత పెరుగుదల భయం వీడితేనే నేటి మహిళకు పూర్తి భద్రత బాధితుల వివరాల గోప్యతకుపోలీస్ భరోసా ‘సోషల్ మీడియా సహా డిజిటల్ ప్రపంచం మానవ జీవితాల్లోకి చొచ్చుకుపోయింది. ఆపై దాని వల్ల ముంచుకొస్తున్న ముప్పును తెలుసుకున్నాం. ఇప్పుడు నిరోధక మార్గాలు అన్వేషిస్తున్నాం. నేటి మహిళకు పెను సవాల్‌గా మారిన డిజిటల్ థ్రెట్‌ను సమర్థంగా ఢీ కొట్టాలి. ఇబ్బంది ఎదురైనప్పుడు ధైర్యంగా ఫిర్యాదు చేయాలి’... అన్నారు సీనియర్ ఐపీఎస్ అధికారి, హైదరాబాద్ నేర పరిశోధన విభాగం డీసీపీ ఎన్.శ్వేత. మహిళల భద్రతపై ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ పలు కీలకాంశాలు వివరించారు.వేధింపులు పరిధి దాటాయిప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా పని చేస్తున్నారు. ఆమెకు ఏళ్లుగా ఎదురవుతున్న వేధింపులు, గృహహింస తదితరాలను ట్రెడిషనల్ థ్రెట్‌గా చెప్పుకోవచ్చు. నేటి మహిళ వీటిని చాలా వరకు సమర్థంగా ఎదుర్కొంటోంది. ఫలానాప్రాపాంతం లో ఈవ్ టీజింగ్ చేసేపోకిరీలు ఉన్నారని తెలిస్తేపోలీసులకు ఫిర్యాదు చేస్తాం లేదా ఆ వైపు వెళ్లకుండా జాగ్రత్త పడతాం. అయితే డిజిటల్ థ్రెట్‌కు, సైబర్పోకిరీలకుప్రాపాంతం, పరిధి అంటూ ఉండవు.ముప్పును పట్టించుకోవట్లేదుడిజిటల్ మీడియాను మహిళలు, యువతులు ఓ మంచి ఎక్స్ప్రెషన్ లాట్ఫాంగా వినియోగించుకుంటున్నారు. తమ అభిప్రాయాలు, అభిరుచులను అక్కడ స్వేచ్ఛగా వెలిబుచ్చుతున్నారు. తద్వారా వేల మందికి సుపరిచితులుగా మారిన, ఆర్థికంగా నిలదొక్కుకున్న అతివలూ ఎందరో ఉన్నారు. అయితే ఈ ఎక్స్ప్రెషన్లో అంతర్లీనంగా ఉన్న ముప్పును గుర్తించలేక΄ోతున్నారు. ఫలితంగా అనేక మంది మహిళలు ఫిజికల్‌గా, వర్చువల్‌గా, ఎమోషనల్‌గా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.జాగ్రత్తలను విస్మరిస్తున్నారుస్వభావ సిద్ధంగానే మహిళలు బాహ్య ప్రపంచంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. తొందరగా అపరిచిత వ్యక్తులతో మాట్లాడరు. నమ్మకం కలిగే వరకు అభిరుచులు పంచుకోవడం మాట అటుంచి కనీసం తమ పేరు కూడా చెప్పరు. రియల్ వరల్డ్‌లో ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా... వర్చువల్ వరల్డ్‌లో మాత్రం తొందరపడుతున్నారు. హాయ్, హలోతో మొదలైన ఈ పరిచయాలు వ్యక్తిగత ఫొటోలు షేర్ చేసుకునే వరకు వెళుతున్నాయి. ఇవే కొన్నిసార్లు విపరీత పరిణామాలకు కారణం అవుతున్నాయి.వీరి భయమే వారికి ధైర్యండిజిటల్ థ్రెట్‌కు లోనైన మహిళలు, యువతులు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయట్లేదు. కుటుంబం, సమాజం, వ్యక్తిగత జీవితం.. ఇలా అనేక అంశాలను ఊహించుకుని భయపడుతున్నారు. ఈ భయమే ఎదుటి వారికి ధైర్యం అవుతోంది. మరింత రెచ్చి΄ోతూ బ్లాక్మెయిల్ చేసే స్థాయికి వెళుతున్నారు. మీ పరువు అనేది మీ చేతుల్లో, మీ ప్రవర్తనలోనే ఉంటుందని గుర్తుంచుకోండి. నట్టింట్లో, నడివీధిలోనే కాదు... ‘నెట్’ఇంట్లోనూ బాధితురాలిగా మారిన అతివకు అన్ని ఏజెన్సీలు అండగా ఉంటాయి. వీళ్లు తమకు సమస్యలు ఉన్నాయని ఒప్పుకోవాలి. ధైర్యంగా ముందుకువచ్చిపోలీసులతోపాటు సంబంధిత ఏజెన్సీలకు ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు ఎక్కడైనా చేయవచ్చుమీరు ఏప్రాపాంతంలో ఉన్నప్పటికీ మరేప్రాపాంతంలో అయినా ఏ ఏజెన్సీకి అయినా ఫిర్యాదు చేయవచ్చు. కేసు నమోదు చేసిన వాళ్లే దర్యాప్తు చేయడమో, సంబంధితప్రాపాంతానికి బదిలీ చేయడమో జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ బా«ధితుల పేర్లు, వివరాలు బయటకు రాకుండా గోప్యతపాటిస్తారు. ఈ విషయంలో న్యాయస్థానాలు సైతం బాధితులకు పూర్తి అండ, సహాయసహకారాలు అందిస్తుంటాయి. టెక్నాలజీని వాడుకోవాలి, విచక్షణతో ముందుకు వెళ్లాలి. – ఎన్.శ్వేత. డీసీపీ నేర పరిశోధన విభాగం, హైదరాబాద్ -
'ఇ-నాలుక'..రుచిని కోల్పోయిన వాళ్లకు వరం..!
సాంకేతిక సాయంతో ఎన్నో కొంగొత్త ఆవిష్కరణలతో సవాళ్లకు సమాధానమిస్తుంటారు శాస్త్రవేత్తలు. అలానే తాజాగా పరిశోధకులు సరికొత్త ప్రయోగంతో ఓ గొప్ప ఆవిష్కరణకు నాంది పలికారు. ఇంతవరకు జ్ఞానేంద్రియాలకు సంబంధించి క్లిష్టతరమైన ప్రయోగాల్లో ఎదురవ్వుతున్న సమస్యకు చెక్‌పెట్టేలా ముందడుగు శారు. ఈసారి ఏకంగా రుచిని గుర్తించే ఇ-నాలుక(E-Tongue)ను అభివృద్ధి చేశారు. రుచిని కోల్పోయిన వ్యక్తులకు ఈ ఆవిష్కరణ ఒక వరంగా ఉంటుందని చెబుతున్నారు కూడా. మరీ ఆ ఆవిష్కరణ విశేషాలేంటో చూద్దామా..!.యిజెన్ జియా నేతృత్వంలోని ఒహియో స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు ఇ-టేస్ట్(E-Tongue) అనే నాలుక వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఆహార నమూనాలను విశ్లేషించడం తోపాటు రుచులను పాక్షికంగా గుర్తించలేనివారికి ఇది ఉపయోగాపడేలా రూపొందించారు. ఈ సాంకేతికత ప్రాథమిక అభిరుచికి అనుగుణంగా ఐదు కీలక రుచులను సులభంగా గుర్తిస్తుంది. సోడియం క్లోరైడ్ (ఉప్పు), సిట్రిక్ ఆమ్లం (పుల్లని), గ్లూకోజ్ (తీపి), మెగ్నీషియం క్లోరైడ్ (చేదు), గ్లూటామేట్ (ఉమామి). ఈ ఐదు రుచులు మన రోజువారీ ఆహారంలో తప్పనిసరి ఉండేవే అని పరిశోధకుడు జియా చెబుతున్నారు. ఈ సరికొత్త ఎలక్ట్రానిక్ నాలుక ఇ టంగ్ కేక్, ఫిష్ సూప్ వంటి రుచులను గుర్తించగలదు. అయితే వాసనను ప్రభావితం చేసే రుచిని మాత్రం గుర్తించలేదు. ఇది ఇంకా వాసన ఆధారంగా రుచిని ఐడెంటిఫై చేయలేదని పరిశోధకులు తెలిపారు. ఎలా వర్క్ చేస్తుందంటే..ఆహారంలో రుచి భాగాల సాంద్రత గుర్తించడానికి ఇ-టేస్ట్ సెన్సార్లను ఉపయోగిస్తుంది. డేటాను డిజిటల్ సిగ్నల్లుగా మారుస్తుంది. ఒక పంపు సాయంతో ఒక వ్యక్తి నాలుక కింద ఉన్న గొట్టం ద్వారా ఫ్లేవర్డ్ హైడ్రోజెల్‌లను కచ్చితమైన మొత్తంలో పంపిణీ చేస్తుంది. ముందుగా ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో టెస్ట్ చేయడానికి మొదట ఇది రుచులను ఎలా పునరుత్పత్తి చేస్తుందో అంచనా వేశారు. ఆ తర్వాత పది మంది వ్యక్తుల్లో దీని సామర్థ్యాన్ని పరీక్షించగా.. కృత్రిమ రుచి ఒరిజనల్ రుచికి సమానంగా ఉందని చెప్పారు. ఆ తర్వాత నిమ్మరసం, కేక్, వేయించిన గుడ్డు, చేపల సూప్, కాఫీతో సహా సంక్లిష్ట రుచులను గుర్తించగలదో లేదో అని పరీక్షించారు. అయితే పరిశోధకులు ఆహారం ఫ్లేవర్ కంటే దాని రుచే ప్రధానమని చెబుతున్నారు. వాసన, రంగువంటి ఇంద్రియ అంశాలు ఆహారాన్నిఎలా గ్రహిస్తామనే దానిపై కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ఎందుకంటే ముక్కు, కళ్లు మూసుకుంటే స్ట్రాబెర్రీలు పుల్లగా అనిపిస్తాయట, అదే చూసి తింటే వాటి ఎరుపుదనం వల్ల తీపిదనంతో కూడిన అనుభూతి కలుగుతుందట. అందువల్ల తాము రూపొందించిన ఈ ఇ టేస్ట్ పులుపు, తీపి వంటి రుచులను చూడగలిగినా..మానవ నాలుకలా రుచిని పూర్తిగి ఆస్వాదింప చేయలేదని వెల్లడించారు పరిశోధకులు.(చదవండి: పనిప్రదేశాల్లో పాలివ్వడాన్ని అవమానంగా చూడొద్దు: సుప్రీం కోర్టు) -
పనిప్రదేశాల్లో పాలివ్వడం తప్పేమి కాదు: సుప్రీం కోర్టు
పనిప్రదేశాల్లో తల్లి తన బిడ్డకు పాలివ్వడం తప్పేమి కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. మహిళల గౌరవానికి భంగం కలిగించే పద్ధతులను త్యజించాలని స్పష్టం చేసింది. పాలిచ్చే తల్లలుకు తమ బిడ్డ సంరక్షణలో అది భాగమని, దాన్ని అందరూ గౌరవించాలని పేర్కొంది. అది వారి హక్కు కూడా కాబట్టి బహిరంగ ప్రదేశాల్లో, పనిప్రదేశాల్లో తల్లి బిడ్డకు పాలివ్వడాన్ని తప్పుపట్టొద్దని ధర్మాసనం వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వ స్థలాలు, భవనాల్లో చైల్డ్ కేర్ గదుల ఏర్పాటకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సలహాలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను/కేంద్రపాలిత ప్రాంతాలను కోరుతూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్‌లు బి.వి. నాగరత్న, పి.బి. వరలేలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పుని వెలువరించింది. అంతేగాదు ఇలా బహిరంగ ప్రదేశాల్లోనూ, పనిప్రదేశాల్లోనూ తల్లిపాలివ్వడాన్ని అవమానకరంగా చూస్తే..మహిళలు అనవసరమైన ఒత్తిడి లేదా బెదిరింపులకు గురవ్వుతారంటూ యూఎన్ నివేదికను వెల్లడించింది. అలాగే తల్లిపాలిచ్చే హక్కుని గురించి కూడా నొక్కి చెప్పింది. ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 అంతర్జాతీయ చట్టంలో పొందుపరిచిన పిల్లల ప్రయోజనాలు, అనే ప్రాథమిక సూత్రం, 2015 జువైనల్ జస్టిస్(పిల్లల సంరక్షణ )చట్టంల నుంచి ఈ హక్కు ఉద్భవించిందని ధర్మాసనం తెలిపింది. అంటే అందుకు తగిన సౌకర్యాలు, వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత రాష్ట్రలపై ఉందని దీని అర్థం అని కూడా స్పష్టం చేసింది. ఈ విషయంలో ఫిబ్రవరి 27, 2024న కేంద్ర మహిళా-శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి, కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖతో కలిసి ప్రభుత్వ భవనాల్లో ఫీడింగ్ గదులు, క్రెచ్‌లు వంటి వాటి కోసం స్థలాలు కేటాయించాలని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలను కోరుతూ ఆదేశించిన సలహాను ధర్మాసనం పరిగణలోకి తీసుకుని ఇలా తీర్పుని వెల్లడించింది. అంతేగాదు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15(3) కింద ఉన్న ప్రాథమిక హక్కులకు అనుగుణంగా కేంద్రం సలహా ఉందని కూడా పేర్కొంది ధర్మాసనం. ఇది తల్లలు గోప్యత, శివువుల ప్రయోజనార్థం సూచించన సలహాగా పేర్కొంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు/కేంద్రపాలిత ప్రాంతాలు చర్య తీసుకుంటే తల్లి బిడ్డల గోప్యతకు భంగం వాటిల్లకుండా చేయడం సులభతరమవుతుందని తెలిపింది. అందువల్ల, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు ఈ ఆర్డర్ కాపీతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శి/నిర్వాహకుడికి రిమైండర్ కమ్యూనికేషన్ రూపంలో పైన పేర్కొన్న సలహాను చేర్చాలని సూచించింది. తద్వారా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్రం జారీ చేసిన ఈ సలహాలను పాటిస్తాయిని పేర్కొంది ధర్మాసనం. దీంతోపాటు ప్రస్తుత ప్రజా ప్రదేశాలలో సాధ్యమైనంతవరకు, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు పైన పేర్కొన్న ఆదేశాలు అమలులోకి వచ్చేలా చూసుకోవాలని కూడా పేర్కొంది. అలాగే అన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు ఈ సలహాలు తెలియజేసేలా ఆదేశాలు జారీచేయాలని ప్రభుత్వాన్ని కోరింది ధర్మాసనం. (చదవండి: జాతీయ భద్రతా దినోత్సవం: భద్రంగా ఉంటున్నామా..?) -
National Safety Day 2025: భద్రంగానే ఉంటున్నామా..?
మన దేశంలో జాతీయ భద్రతా దినోత్సవాన్ని ఏటా మార్చి 4న నిర్వహిస్తారు. పర్యావరణం, కార్యాలయ భద్రత, ఆరోగ్య, నియమాలు, ట్రాఫిక్ నియమాలు, మానవ ఆరోగ్య విషయాలతో సహా అన్ని రకాల భద్రతా నిబంధనల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. ఈ ఏడాది భారతదేశం (India) 54వ భద్రతా దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ప్రతి ఏడాది ఓ థీమ్‌తో దీన్ని ప్రజల్లోకి ముందుకు తీసుకువెళ్లడం జరుగుతోంది. అలానే ఈ ఏడాది విక్షిత్ భారత్ భద్రత, సంక్షేమం కీలకం అనే థీమ్‌తో ప్రజలను చైతన్యపరిచేలా అవగాహన కల్పించనుంది. ఈ సందర్భంగా మన దేశంలోని భద్రత ఏ విధంగా ఉందో చూద్దాం. నిజంగా మహిళలు, పిల్లలు భద్రంగా ఉంటున్నారా..?. మనమంత సేఫ్టీకి చేరువలో ఉన్నామా..? అంటే..మన దేశంలో భద్రత అనే పదమే భారంగా కనిపిస్తుంది. ఎందుకంటే జరుగుతున్న ఘోరాలు, నేరాలు చూస్తుంటే సేఫ్టీకి చోటుందా అనే సందేహం కలుగకమానదు. మన భారతీయ సంస్కృతి స్త్రీని యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అని కీర్తిస్తూ సముచిత స్థానాన్ని ఇచ్చింది. మన వేదాలు, పురాణాలు కూడా స్త్రీకి పెద్దపీట వేసి మరీ గౌరవించాయి. అలాంటిది ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే హృదయ ద్రవించిపోతోంది. గొప్ప నాగరికులం, ఏఐ టెక్నాలజీతో పరుగులు పెట్టే కాలంలో ఉన్నామంటూ భుజాలు ఎగరేసుకుంటూ గొప్పలు చెప్పుకుంటున్నాం. కానీ మన సమాజంలో చిన్నారులు, మహిళలు ఎంతటి అభ్రతా పరిస్థితుత్లో జీవిస్తున్నారో చూస్తే ఇదేనా అభివృద్ధి అనే భావం కలుగుతుంది. ప్రతి ఏడాది జాతీయ భద్రతా దినోత్సవం (National Safety Day) పేరుతో వారోత్సవాలు నిర్వహించుకుంటూ చేతులు దులిపేస్తుకుంటున్నాం. అసలు మన చుట్టుపక్కల ఉన్న బాలికలు, అభంశుభం తెలియని పసి పిల్లలు హింసకు, లైగింక వేధిపులకు గురవ్వుత్ను ఘటనలు మీడియాలోనూ, పేపర్లో వస్తున్నా..ఆ..! ఇది కామన్ అన్నట్లు తేలిగ్గా తీసుకుంటున్నాం. మన పిల్లలు సేఫ్‌గా ఉన్నారు కదా అన్న ధీమా కొందరిది. నిజానికి ఉమెన్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇండెక్స్ 2023/24లో 177 దేశాల సరసన భారత్ 128కి పడిపోయింది. అంటే మన దేశంలో మహిళలకు భద్రత అనే మాటకు ఆస్కారం లేదనే కదా అర్థం. మహిళలు, చిన్నారులపై జరిగిన ఘటనలు చూస్తే..ప్రేమోన్మాదుల చేతిలో బలైన అమ్మాయిలు..ముఖ్యంగా అమ్మాయిల వెంటపడి వేధిస్తున్న ప్రేమోన్మాదులు ఎంతకైనా తెగిస్తున్నారు. పెళ్లికి ఒప్పుకోవడం లేదన్న కోపంతో నిరుడు హైదరాబాద్‌లోని గోపన్నపల్లిలో యువతి ప్రాణం తీశాడొక దుర్మార్గుడు. ఏపీలోని బద్వేలులోనూ గతేడాది ఒక ఇంటర్ విద్యార్థిని అలాగే బలైపోయింది. ప్రేమను నిరాకరించిందని బాపట్ల జిల్లాలో ఒక ప్రబుద్ధుడు ఇటీవల బాలికతో పాటు ఆమె కుటుంబంపై కత్తితో దాడిచేశాడు. అదే కారణంతో తాజాగా అన్నమయ్య జిల్లాలో ఒక సైకో మరీ పైశాచికంగా ప్రవర్తించాడు. యువతి నోట్లో యాసిడ్ పోసి, కత్తితో పొడిచి ఉసురు తీసేందుకు యత్నించాడు. ఇలా ప్రేమోన్మాదుల చేతుల్లో రోజూ ఎందరో అమాయక చిట్టి తల్లులు బలైపోతున్నారు. కరడుగట్టిన పితృస్వామ్య భావజాలమే దేశీయంగా మహిళా సాధికారతకు ప్రధాన ప్రతిబంధకమవుతోందనేది కొందరి నిపుణుల వాదన. సర్కారీ లెక్కల ప్రకారం 2014లో ఇండియాలో మహిళలపై నేరాలకు సంబంధించి 3.37 లక్షల కేసులు నమోదయ్యాయి. ఎనిమిదేళ్లలో అవి 31శాతం మేర ఎగబాకాయి. నిపుణులు చెబుతున్న కారణాలు..ఇంటర్నెట్, సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న అశ్లీల చిత్రాలు, వీడియోలకు తోడు విచ్చలవిడిగా దొరుకుతున్న మద్యం, మాదకద్రవ్యాల వినియోగంతో మనుషుల్లో పశుప్రవృత్తి కోరలు చాస్తోందంటున్నారు నిపుణులు. ఆడ పిల్లల్ని వేధించడాన్ని, ఇష్టారాజ్యంగా ప్రవర్తించడాన్ని హీరోయిజంగా చూపిస్తున్న సినిమాలు, వెబ్‌సీరిస్ యువతను దారితప్పిస్తున్నాయని చెబుతున్నారు.స్త్రీలను ఆటబొమ్మలుగా చిత్రీకరించే పెడపోకడలు పెరిగిపోతుండటంతో పనిప్రదేశాలూ బహిరంగ స్థలాలు.. ఇలా అన్నిచోట్లా మహిళల భద్రత ప్రశ్నార్థకమవుతోందని అన్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ అమ్మాయిలపై రోత వ్యాఖ్యల వెల్లువెత్తుతూనే ఉంటున్నాయని చెబుతున్నారు. అలాగే నవతరం నైతిక విద్యకు దూరమవుతున్న కొద్దీ దేశ భవిష్యత్తుపై చీకట్లు ముసురుతాయని హెచ్చరిస్తున్నారు. పాఠశాల దశ నుంచి పసి మనసులు కలుషిత కాకుండా కేర్ తీసుకోవాలని చెబుతున్నారు. తెలిసో తెలియకో లేదా పురుషాధిక్య ఆలోచనలతోనో ఇళ్లలో అబ్బాయిలను అతిగా ముద్దు చేసే ధోరణులు లింగ వివక్షను పెంచి పోషిస్తున్నాయి. మహిళల పురోగతికి అవే గొడ్డలిపెట్టు అవుతున్నాయి. తల్లిదండ్రుల మద్దతుతో ఎందరో అమ్మాయిలు నేడు అన్ని రంగాల్లో విశేషంగా రాణిస్తున్నారు. మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలనూ వెన్నుతట్టి ముందుకు నడిపించే అలాంటి వాతావరణం ప్రతి కుటుంబంలోనూ నెలకొనాలని అంటున్నారు నిపుణులు. భద్రతకు భరోసా ఇచ్చేలా జీవిద్దాం..ప్రతి తల్లి కూడా తమ కొడుకు అమ్మాయిల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తే కప్పి పుచ్చే యత్నం చేయకుండా దండించడమో లేదా శిక్షించడమో చేసి మార్పు తెవాలే గాని మగాడని వెనకేసుకొచ్చే యత్నం చేయకూడదు. అలాగే పోలీసులు మహిళలపై జరిగే అమానుష ఘటనలపై సత్వరమే స్పందించి వారికి తగిన న్యాయం జరిగేలా మద్దతిస్తే..బాలికలు, మహిళల భద్రతకు ఢోకా ఉండదని చెబుతున్నారు సామాజిక నిపుణులు. సేఫ్టీ దినోత్సవం పేరుతో ఐక్యతతో ఎదురయ్యే ప్రమాదాలను ఎదుర్కొందాం అంటూ మాటలు కాదు..అలాంటి ఘోరాలు జరిగినప్పుడూ గొంతెత్తి నినదిద్దాం. ఆ తప్పు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు పూనుకునేలా చేద్దాం. మహిళల, బాలికలకు భద్రత అనే మాటకు అసలైన అర్థం ఇచ్చేలా భరోసా కల్పిద్దాం. చదవండి: వయసుతో ముసిరే సమస్యలు.. -
ఆన్లైన్ డాక్టర్ కన్సల్టేషన్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు మీకోసమే!
పంజాగుట్టలోని ఆఫీస్‌లో కంప్యూటర్ సిస్టమ్ ముందు దీక్షగా పనిచేస్తున్న రవిరాజ్కి ఒక్కసారిగా కళ్లు బైర్లు కమ్మాయి.. నిలుచుంటే తూలి పడిపోతానేమో అని ఫీలింగ్, వెంటనే మొబైల్ చేతిలోకి తీసుకుని వేళ్లు కదిపాడు. అంతే.. నిమిషాల వ్యవధిలోనే అతని శారీరక, మానసిక పరిస్థితుల స్టేటస్ చార్ట్ సిద్ధమవడం, వ్యక్తిగత వైద్యునికి చేరడం, జాగ్రత్తలు, మందుల జాబితా రవిరాజ్కి చేతికి రావడం జరిగిపోయింది. నగరానికి చెందిన ఐటీ ఉద్యోగి నవీన్‌కి మూడేళ్ల బాబు.. ఉన్నట్లుండి అర్ధరాత్రి రెండు గంటలకు తీవ్ర జ్వరం, ఇతర ఆరోగ్య సమస్య తలెత్తింది.. అదే సమయంలో నవీన్ ఇంట్లో లేకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి.. ఆయన భార్య మొబైల్ యాప్ సహాయంతో ఆన్లైన్లో డాక్టర్ని సంప్రదించారు. డాక్టర్ సలహా మేరకు వెంటనే మందులను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టడంతో సమస్య నుంచి పరిష్కారం లభించింది. ఇలా ఇటీవల కాలంలో ఆన్లైన్లో డాక్టర్ కన్సల్టేషన్ తీసుకునేవారు అనేకం.. ఈ నేపథ్యంలో దీని గురించిన మరిన్ని విషయాలు.. – సాక్షి, సిటీబ్యూరో రవిరాజ్ మాత్రమే కాదు పలువురు నగరవాసులు ఆరోగ్య సమస్యల పరిష్కారంలో స్మార్ట్ ఫోన్‌పైనే ఆధారపడుతున్నారు. కోవిడ్ సమయంలో ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో పలువురు టెక్నాలజీని బాగానే ఔపోసన పట్టారు. అనంతర పరిణామాల క్రమంలో ఆరోగ్యంపై పెరిగిన అవగాహన మొబైల్స్‌ని పలువురికి మెడికల్ అసిస్టెంట్లుగా మార్చేశాయి. తొలుత సకాలంలో వైద్యసేవలను మాత్రమే అందించిన మొబైల్ ఫోన్ యాప్స్ ద్వారా ఇప్పుడు విభిన్న రకాలుగా ఆరోగ్యరక్షణలోనూ కీలకపాత్ర పోషిస్తోంది. ప్రివెంటివ్..కేర్ అనారోగ్యాలకు చికిత్సతో పాటు కొన్ని యాప్‌లు ప్రధానంగా ప్రివెంటివ్ హెల్త్ కేర్‌పై దృష్టి పెడుతున్నాయి. వైద్యులు, శిక్షకులను అందుబాటులోకి తెస్తున్నాయి. వ్యక్తి రోజువారీ ఫిట్నెస్ స్థాయిలు, రక్తపోటు హెచ్చుతగ్గులు, రక్తంలో చక్కెర స్థాయిలు వగైరాలన్నీ పర్యవేక్షిస్తూ మార్పుచేర్పులపై హెచ్చరిస్తున్నాయి. వినియోగదారులతో వైద్యులకు రిమోట్ యాక్సెస్ అందించే యాప్స్ ద్వారా వ్యక్తులు తమ పరిస్థితిని డాక్టర్‌కు వివరించడానికి చాట్ చేసే సౌకర్యం, వీడియో కాల్స్ వంటివెన్నో అందుబాటులోకి తెచ్చాయి. యాప్స్ ద్వారా జెనెటిక్ వెల్నెస్.. డాక్టర్ దగ్గరకు వెళితే ప్రిస్కిప్షన్ రాస్తాడు. రోగం తగ్గిపోగానే ఆ ప్రిస్కిప్షన్ విసిరేస్తాం. కానీ వాటిని జాగ్రత్త చేయం. కానీ ఆ ప్రిస్కిప్షన్ చాలా అవసరం అనే విషయం గ్రహించం. భవిష్యత్తులో ఆరోగ్య చికిత్సలకు ఇది చాలా కీలకం. అందుకే డిజిటల్ హెల్త్ రికార్డ్స్ అందుబాటులోకి తెచ్చాం’ అంటూ చెప్పారు నగరానికి చెందిన హెల్త్‌కేర్ సంస్థ ఆసియానా నిర్వాహకులు సత్యనారాయణ. ఆరోగ్య పరిరక్షణ, వ్యాధుల విషయంలో జీన్స్ ప్రాధాన్యతను గుర్తిస్తూ సరికొత్త ఆన్లైన్ ఆరోగ్య వేదికను రూపకల్పన చేశారాయన. ప్రతి డయాబెటిక్ రోగికి తక్షణ చికిత్సగా వెట్ మార్పిన్ ఇస్తారని, కానీ వంశపారంపర్యంగా వచ్చిందా, జీవనశైలి ద్వారా వచ్చిందా? అని గుర్తించాకే ట్రీట్మెంట్ ఇవ్వాలనీ అంటున్నారాయన. దీనికి వ్యక్తి ఆరోగ్య చరిత్ర, ఫ్యామిలీ హిస్టరీ వంటివన్నీ డిజిటల్ రికార్డ్స్‌గా భద్రపరచి యాప్స్‌తో అనుసంధానిస్తే ఆరోగ్య సమస్యలకు మరింత మెరుగైన పరిష్కారం లభిస్తుంది అంటున్నారాయన. వంశ ఆరోగ్య చరిత్ర తెలిస్తే.. జెనెటిక్ వెల్నెస్ కోసం జెనెటిక్ టెస్టులు సైతం అందుబాటులోకి తెచ్చారు. భవిష్యత్తులో ఎలాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి? వంటివి సైతం గుర్తించవచ్చు. తద్వారా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవచ్చు. అలాగే ఒక డాక్టర్ దగ్గరకి వెళ్లినప్పుడు అతని జీన్స్ ప్రకారం ఏ మెడిసిన్ ఇవ్వొచ్చు? ఇవ్వకూడదు? వంటివి కూడా సూచించగలుగుతున్నారు. అలాగే న్యూట్రిషనిస్ట్ దగ్గరకు వెళ్లినప్పుడు కూడా నప్పే, నప్పని ఆహారంపైనా ముందస్తు సూచనలు అందించేలా ఈ యాప్స్ వెల్నెస్ ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తున్నాయి. సరికొత్త సేవ ఫేస్స్కాన్.. ఎవరైనా తమ హెల్త్ ఎలా ఉంది? అని తెలుసుకోవాలి అనుకుంటే ఫేస్స్కాన్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. కేవలం 30 సెకన్లలోనే 25 రకాల పరిశీలనలను ఇది అందిస్తుంది. ఇది కూడా యాప్ ద్వారానే సాధ్యమవుతోంది. అలాగే ఒక వెల్నెస్ ప్రోగ్రామ్‌లో జాయిన్ అయ్యాక ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది? అనేది సమీక్షించుకునేందుకు కూడా ఈ ఫేస్ స్కాన్ ఉపకరిస్తోంది. హార్ట్ రేట్, థైరాయిడ్, కొలె్రస్టాల్ శాతం, వాసు్క్యలార్ రిస్క్, షుగర్ కంటెంట్, హైపర్ గ్లైసీమియా.. వంటివాటికి సంబంధించిన విశేషాలన్నీ స్కాన్ చేసి చెబుతుంది. ఈ ఫలితాలను బట్టి అవసరమైతే మరిన్ని వైద్య పరీక్షలు చేయించుకోవచ్చు. హెల్త్‌కేర్ వర్చువల్ కేర్‌పై అవగాహన.. కోవిడ్ తర్వాత వర్చువల్ కేర్‌పై అందరికీ ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలోనే రోగులకు వైద్యసేవలకు మధ్య ఉన్న ఖాళీని పూరించేందుకు డిజిటల్ ప్లాట్ ఫార్మ్ ఏర్పాటు చేశాం. డిజిటల్ కన్సల్టేషన్, ఫార్మసీ కన్సల్టేషన్స్, ల్యాబ్ కన్సల్టేషన్స్ అన్నీ అందిస్తున్నాం. ఫేస్ స్కాన్, జెనెటిక్ వెల్నెస్ వంటి అత్యాధునిక సేవలను అందుబాటులోకి తెచ్చాం. – సత్యనారాయణ వంటిపల్లి, ఛీప్ టెక్నాలజీ ఆఫీసర్, ఆసియానా -
వయసుతో ముసిరే సమస్యలు..!
చాలా సమస్యలు స్త్రీ, పురుషులిద్దరిలోనూ కామన్‌గానే ఉన్నా... కొన్ని సమస్యలు మాత్రం మహిళల్లో చాలా ప్రత్యేకం. వాళ్లలో స్రవించే హార్మోన్లూ, సంక్లిష్టమైన సైకిళ్ల వల్ల వాళ్లకు కొన్ని సమస్యలిలా ప్రత్యేకంగా వస్తుంటాయి. ఈ నెల 8న ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలూ, పరిష్కారాలను సూచించే ఈ ప్రత్యేక కథనమిది...రుతుస్రావం మొదలుకాగానే ఓ బాలిక బాలుర నుంచి వేరుగా కనిపించడం మొదలువుతుంది.రుతుస్రావం నుంచే అమ్మాయిల్లో కొన్ని సమస్యలు కనిపించడం మొదలువుతుంది. చాలామంది అమ్మాయిలు ఇంకా ఈ విషయమై మాట్లాడటానికి ఇబ్బంది పడుతుంటారు. ఇందులో బిడియపడాల్సిందేమీ లేదు. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు డాక్టర్‌ను సంప్రదించి తగిన సూచనలతోపాటు అవసరమైతే తగిన వైద్య చికిత్స కూడా తీసుకోవాలి.తొలుత యువతల్లో కనిపించే రుతుసంబంధమైన సమస్యలను తెలుసుకుందాం.రుతుసంబంధిత సమస్యలను ఇంగ్లిష్‌లో మెన్స్ట్రువల్ డిజార్డర్స్‌గా చెబుతారు. వీటిల్లో కొన్ని ప్రధాన సమస్యలిలా ఉంటాయి. ప్రైమరీ అమెనోరియా : సాధారణంగా అమ్మాయిల్లో 12 నుంచి 16 ఏళ్ల మధ్య రుతుస్రావం మొదలువుతుంది. కానీ కొందరు యువతుల్లో 16 ఏళ్లు దాటినా రుతుక్రమం మొదలుకాదు. ఈ కండిషన్‌ను ‘ప్రైమరీ అమెనోరియా’ అంటారు. ఇందుకు చాలా కారణాలుంటాయి. వీళ్లు డాక్టర్‌ను సంప్రదించి, తగిన పరీక్షలు చేయించి, కారణాలు తెలుసుకోవాలి. ఆ కారణాన్ని బట్టి చికిత్స అందించాల్సి ఉంటుంది. డిస్మెనూరియా: రుతుసంబంధిత సమస్యల్లో ప్రధానమైనదీ, దాదాపు 80 శాతం మంది అమ్మాయిల్లో కనిపించేది రుతు సమయాల్లో నొప్పి. దీన్నే ‘డిస్మెనూరియా’ అంటారు. వీళ్లు ఒకసారి డాక్టర్‌ను సంప్రదించాక, వారి సలహాతో రుతుసమయంలో నొప్పి వచ్చినప్పుడల్లా వారు సూచించిన మోతాదులో నొప్పి నివారణ మందులు వాడుకోవచ్చు. అయితే వీటిని ఎక్కువగా వాడటం వల్ల మరికొన్ని ఆరోగ్య సమస్యలు రావచ్చు. కాబట్టి డాక్టర్ సూచించిన మోతాదుకు మించకుండా వాడాలి. పరిష్కారం : రుతు సమయంలో వచ్చే ఈ నొప్పి ఒక వయసుకు వచ్చాక చాలామందిలో దానంతట అదే తగ్గిపోతుంది. ఇలాంటివారికి డాక్టర్లు కొన్ని న్యూట్రిషనల్ సప్లిమెంట్లు కూడా సూచిస్తారు. సంతానం కలిగిన తర్వాత చాలామందిలో ఈ నొప్పి రావడం ఆగిపోతుంది. కొందరిలో నొప్పి రావడం ఆగకపోవచ్చు. వాళ్లు డాక్టర్‌ను సంప్రదించి, తగిన మందులు వాడాలి. మెనొరేజియా: కొంతమంది యువతుల్లో రుతు సమయంలో రక్తస్రావం చాలా ఎక్కువగా అవుతుంటుంది. ప్రధానంగా చిన్న వయసు (తరుణ వయస్కులైన అడాలసెంట్) బాలికల్లో అలాగే పాతిక ముఫ్ఫై ఏళ్లు వరకు యువతుల్లోనూ ఈ సమస్య కాస్త ఎక్కువే. ఇలా ఎక్కువ మోతాదులో రక్తం పోతుండటం వల్ల రక్తహీనతతో పాటు మరెన్నో ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. పరీక్షలూ, పరిష్కారం: ఈ సమస్య ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు కొన్ని హార్మోనుల పరీక్షలు చేయించుకొని, అవసరాన్ని బట్టి మందులు వాడాల్సి ఉంటుంది. కొన్ని సార్లు ఈ రక్తస్రావం ఫైబ్రాయిడ్స్ వల్ల కావచ్చు. వైద్యపరీక్షల ఫలితాలను బట్టి చికిత్స ఉంటుంది. ప్రి మెనుస్ట్రువల్ సిండ్రోమ్ : కొంతమంది మహిళల్లో రుతుస్రావం మొదలు కావడానికి కొద్ది రోజులు ముందర నుంచే కొన్ని శారీరక సమస్యలు కనిపిస్తుంటాయి. ఉదాహరణకు... ఆ సమయంలో వాళ్లకు రొమ్ముల్లో సలపరం, బాధ /నొప్పి, భావోద్వేగాలు వెంటవెంటనే మారి΄ోవడం (మూడ్స్ స్వింగ్స్) వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సమస్యను ప్రీ–మెనుస్ట్రువల్ సిండ్రోమ్ అంటారు. పరిష్కారం : ఈ సమయంలో కలిగే బాధల నివారణ కోసం తగినన్ని నీళ్లు తాగుతుండాలి. అలాగే ద్రవాహారం ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఆకుకూరలు, కాయగూరలతో కూడిన పౌష్టికాహారం ఎక్కువగా తీసుకోవాలి. ఒత్తిడికి లోనుకాకూడదు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఎండార్ఫిన్ అనే హార్మోన్లు విడుదలై, మంచి ఉపశమనం కలగజేస్తాయి. ఈ సమస్య ఉన్నవారు పొగతాగడం, కెఫిన్ డ్రింక్స్ (కాఫీ, కూల్‌డ్రింక్స్‌లో కోలా డ్రింక్స్ వంటివి), ఆల్కహాల్ వంటి వాటికి దూరంగా ఉండాలి. ఆహారంలో ఉప్పు బాగా తగ్గించాలి. ఉప్పు ఎక్కువగా ఉండే బేకరీ ఐటమ్స్‌కు దూరంగా ఉండాలి. కొవ్వులు, చక్కెరలు ఎక్కువగా ఉండే ఆహారాలను చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. అప్పటికీ ప్రయోజనం కనిపించక΄ోతే డాక్టర్‌ను సంప్రదించి, కొన్ని హార్మోన్ పరీక్షలు చేయించుకుని, ఆ వైద్య పరీక్షల ఫలితాలను బట్టి అవసరమైన చికిత్స తీసుకోవాలి. మూత్ర సంబంధ సమస్యలుమహిళల శరీర నిర్మాణం కారణంగా పురుషులతో ΄ోలిస్తే... మహిళల్లో మూత్రసంబంధమైన ఇన్ఫెక్షన్లు చాలా ఎక్కువ. మూత్రసంబంధమైన ఇన్ఫెక్షన్స్తో తరచూ వస్తుండేవారు నీళ్లూ, ద్రవాహారం ఎక్కువగా తీసుకుంటూ ఉండటం, ప్రతి మూడు గంటలకోసారి మూత్రవిసర్జనకు వెళ్లి, మూత్రాశయాన్ని పూర్తిగా ఖాళీ అయ్యేలా జాగ్రత్త తీసుకోవడం, భార్యాభర్త కలయిక తర్వాత మూత్ర విసర్జనకు వెళ్లడం (ఈ సమయంలో కాస్త వేగంగా మూత్రవిసర్జన చేయాలి), ప్రైవేటు పార్ట్స్ శుభ్రంగా కడుక్కోవడం, ప్రైవేట్ పార్ట్స్ దగ్గర ఎప్పుడూ పొడిగా ఉంచుకోవడం వంటి జాగ్రత్తలతో ఈ సమస్యను నివారించవచ్చు. యూరినరీ ఇన్‌కాంటినెన్స్: కొందరు మహిళల్లో మూత్రంపై నియంత్రణ అంతగా ఉండదు. ఈ సమస్య ఉన్నవారు దగ్గినా, తుమ్మినా, ఏదైనా వస్తువును అకస్మాత్తుగా ఎత్తినా, కొందరిలో నవ్వినా వారి పొట్టపై కండరాలు మూత్రాశయంపై ఒత్తిడి కలిగించి... మూత్రం చుక్కలు, చుక్కలుగా పడేలా చేస్తాయి. సాధారణంగా ప్రసవం తర్వాత ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ప్రసవమైన తర్వాత మహిళల పొట్ట కండరాలు బలహీనం కావడంతో మూత్ర విసర్జన స్ఫింక్టర్‌పై వారు నియంత్రణ కోల్పోయేందుకు అవకాశమెక్కువ. దాంతో ఈ సమస్య కనిపిస్తుంది. పరిష్కారాలు: డాక్టర్‌ను సంప్రదించి, వారు సూచించిన విధంగా కొన్ని ప్రసవానంతర వ్యాయామాలూ, కెగెల్స్ ఎక్సర్సైజ్ల ద్వారా మూత్రవిసర్జనపై నియంత్రణ సాధించవచ్చు లేదా వారు సూచించిన విధంగా చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది కొందరిలో శస్త్రచికిత్స కూడా అవసరమవుతుంది. మహిళల్లో కనిపించే కొన్ని సాధారణ గైనిక్ సమస్యలు..పీసీఓఎస్ / పీసీఓడీ : అండాశయంలో అనేక నీటితిత్తులు పెరిగే ఈ సమస్యను వైద్యపరిభాషలో పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ లేదా డిజార్డర్ అంటారు. చాలావరకు అవి హానికరం కాకపోవచ్చు. అలాగే గర్భధారణకూ పెద్దగా అంతరాయం కలిగించకపోవచ్చు. పీసీఓఎస్ / పీసీఓడీకి కారణాలు : మహిళల అండాశయం నుంచి ప్రతి నెలా ఒక ఫాలికిల్ (అండం పెరిగే నీటి తిత్తి) కనిపిస్తుంది. దీని పరిమాణం 18 నుంచి 20 మిల్లీమీటర్లకు చేరాక ఇది పగిలి దాని నుంచి అండం విడుదల అవుతుంది. అయితే కొంతమందిలో ఫాలికిల్స్ 5–10 మిల్లీమీటర్లకు చేరగానే అంతకు మించి అది పెరగకుండా చిన్న చిన్న నీటి బుడగలాగా పెరుగుతాయి. అవి పది, పన్నెండు కంటే ఎక్కువగా ఉన్న కండిషన్‌ను పాలిసిస్టిక్ ఓవరీస్ అంటారు. ఇవి ఏర్పడానికి స్పష్టమైన కారణం తెలియదుగానీ... మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్లు, కొన్ని మానసిక, శారీరక సమస్యలతో పాటు హార్లోన్లలో అసమతౌల్యత, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వంటి సమస్యలు ఉన్నప్పుడు ఇవి వస్తుండటం పరిశోధకులు గమనించారు. ఈ సమస్య ఉన్న మహిళల్లో బరువు పెరగడం, అవాంఛిత రోమాలు, పీరియడ్స్ సక్రమంగా లేకపోవడంతో పాటు కొంతమందిలో సంతానలేమి, గర్భధారణ సమస్యలు కనిపించవచ్చు. పరీక్షలు/పరిష్కారాలు : కొన్ని రక్తపరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలతో సమస్యను నిర్ధారణ చేస్తారు. ఈ సమస్య ఉన్న మహిళలందరికీ ఒకేలాంటి చికిత్స ఉండదు. వారిలో కనిపించే లక్షణాలు, రక్తపరీక్షలు తేలిన అంశాలను బట్టి చికిత్స మారుతుంది. బరువు తగ్గించుకోవడం, అవసరాన్ని బట్టి మెట్ఫార్మిన్ వంటి మందులు, హార్మోన్లు వాడాల్సి ఉంటుంది. సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే అవసరాన్ని బట్టి ల్యాపరోస్కోపిక్ శస్త్రచికిత్స చేయాల్సి రావచ్చు. ఎండోమెట్రియాసిస్ : గర్భాశయం లోపలి పొరను ఎండోమెట్రియమ్ అంటారు. రుతుస్రావం తర్వాత ఈస్ట్రోజెన్ హార్మోన్ గర్భాశయం లోపలి గోడలపై ప్రభావం చూపడంతో అక్కడ ఎండోమెట్రియమ్ అనే పొర మొదటి 14 రోజులపాటు వృద్ధి చెంది, 15వ రోజున విడుదల అయ్యే ప్రోజెస్టెరాన్ అనే హార్మోన్ వల్ల ఆ పొర మరింత మందమవుతుంది. అక్కడ సన్నటి రక్తనాళాలు కూడా అభివృద్ధి చెందుతాయి. అప్పుడు ఓవరీస్‌లో విడుదలైన అండం శుక్రకణంతో కలవకపోతే 14 రోజుల తర్వాత ప్రొజెస్టెరాన్ ఉత్పత్తి ఆగిపోతుంది. దాంతో ఎండోమెట్రియమ్‌లో అభివృద్ధి చెందిన రక్తనాళాలు కుంచించుకుపోతాయి. ఫలితంగా ఎండోమెట్రియమ్ పొర... గర్భాశయం గోడ నుంచి ఊడిపోయి సన్నటి ముక్కలుగా రక్తంలో కలిసి బ్లీడింగ్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. మహిళల్లో ప్రతినెలా అయ్యే రుతుస్రావం ఇదే. అయితే కొందరిలో ఎండోమెట్రియమ్ కణాలు గర్భాశయంలోపలి వైపునకు కాకుండా, కొన్ని కారణాల వల్ల కడుపులోకి వివిధ అవయవాలపైన అంటే... అండాశయాలపైనా, ట్యూబ్స్‌పై, గర్భాశయం పై పొరపై, కత్తికడుపులోని గోడలపై, పేగులపై, మూత్రాశయంపై, ఇంకా చాలా అరుదుగా ఊపిరితిత్తుల్లో, మెదడులోకి పెరుగుతాయి. హార్మోన్ల ప్రభావం వల్ల అవి రుతుచక్రంలో ఎలాంటి మార్పులు చెందుతాయో... బయట పెరిగిన ఆ కణాల్లోనూ అలాంటి మార్పులే జరుగుతూ అవి పెరిగిన చోట కూడా వృద్ధి చెందుతుంటాయి. వాటినే ఎండోమెట్రియల్ ఇంప్లాంట్స్ అంటారు. రుతుస్రావం సమయంలో ఆ అవయవాల్లో కూడా కొద్దిగా బ్లీడింగ్ అవుతుంటుంది. ఈ సమస్యనే ఎండోమెట్రియాసిస్ అంటారు. వివిధ అవయవాలపై ఉన్న ఎండోమెట్రియమ్ ఇంప్లాంట్స్‌లో రక్తస్రావం జరిగాక... అది బయటకు వెళ్లడానికి దారి లేక రక్తం అక్కడిక్కడే ఇంకిపోతుంది. అయితే కొందరిలో రక్తం ఇంకకుండా అది గూడు కట్టడం జరగవచ్చు. కొందరిలో ఒక అవయవానికి, మరో అవయవానికి మధ్య ఈ రక్తపు కణాలు గూడుకట్టడం వల్ల కండ పెరగడమూ జరగవచ్చు. ఇలా జరగడం వల్ల పెరిగిన కండను అడ్హెషన్స్ లేదా ఫైబ్రోసిస్ బ్యాండ్స్ అంటారు. అలా పెరిగిన కణజాలం నుంచి విడుదల అయ్యే ప్రోస్టాగ్లాండిన్స్ హార్మోన్స్తోపాటు ఇతర రసాయన పదార్థాల వల్ల ఒక్కొక్కరిలో ఒక్కోలాంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో నడుం, పొత్తికడుపులో నొప్పి, సంతానం కలగకపోవడం, పేగులు అతుక్కు΄ోవడం, మూత్రనాళాలు, పేగుల్లో అడ్డంకులు ఏర్పడటం వంటి సమస్యలు రావచ్చు. పరిష్కారం : ఈ సమస్యకు ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్ వంటి హార్మోన్ మాత్రలతో చికిత్స అందిస్తారు. కొందరిలో శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం రావచ్చు.చర్మ సమస్యలు..మహిళల్లో బిగుతైన వస్త్రధారణ కారణంగా వారిలో చర్మానికి సంబంధించిన కొన్ని సమస్యలు కనిపించేందుకు అవకాశాలెక్కువ. అందులో ముఖ్యమైనవి... క్యాండిడియాసిస్ / ఫంగల్ ఇన్ఫెక్షన్స్: ఇది మహిళల్లో కనిపించే చాలా సాధారణ సమస్య. వాళ్లకు చెమట విపరీతంగా పట్టే ప్రదేశాల్లోనూ, అలాగే చర్మంలోని ముడతలుండే ప్రాంతాల్లో తగినంత గాలి, వెలుతురు సోకే అవకాశాలు తక్కువ. దాంతో అక్కడ ఉక్క΄ోతలతో చెమట తాలూకు చెమ్మ పెరగడంతో క్యాండిడియాసిస్ వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశమెక్కువ. ఇక కొందరిలో వాళ్లు గర్భం దాల్చినప్పుడూ ఈ సమస్యలు కనిపించడం మామూలే. అలాగే డయాబెటిస్ ఉన్నవారిలోనూ, రోగనిరోధక శక్తి తగ్గిన వారిలో, యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడే వారిలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తరచూ కనిపిస్తుంటాయి. పరీక్షలు / పరిష్కారాలు: సాధారణ ఫిజికల్ ఎగ్జామినేషన్‌తోనే ఈ సమస్యను తెలుసుకోవచ్చు. చర్మంపై వచ్చిన ఫంగస్ తాలూకు రకాన్ని బట్టి కొన్ని చర్మంపై పూసేందుకు కొన్ని పూతమందులూ (టాపికల్ మెడిసిన్స్), నోటి ద్వారా తీసుకోవాల్సిన యాంటీఫంగల్ మందులు వాడాల్సి ఉంటుంది. ఎండోక్రైన్ సమస్యలు : ఇది హార్మోన్ల స్రావాల్లో వచ్చే తేడాల వల్ల వచ్చే సమస్యలు. ఇందులో ప్రధానంగా రెండు రకాలు కనిపించేందుకు అవకాశాలెక్కువ. మొదటిది థైరాయిడ్ గ్రంథి చాలా తక్కువగా లేదా అస్సలు పనిచేయకపోవడం వల్ల వచ్చే సమస్య అయిన హైపోథైరాయిడిజమ్.ఈ సమస్య స్త్రీ, పురుషులిద్దరిలోనూ కనిపించినా సాధారణంగా మహిళల్లోనే కాస్త ఎక్కువ. రోగనిరోధక వ్యవస్థలో వచ్చే లోపాల వల్ల హై΄ోథైరాయిడిజమ్ రావచ్చు. తీవ్రమైన అలసట / మందకొడిగా ఉండటం, డిప్రెషన్, బరువు పెరగడం, చర్మం పొడిగా మారడం, మలబద్దకం, రుతుక్రమం సక్రమంగా రాకపోవడం వంటి లక్షణాలతో ఇది కనిపిస్తుంది. కొందరిలో ఈ కండిషన్ వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ మోతాదులు పెరిగి అవి హృద్రోగాలకు దారితీయవచ్చు. ఒక్కోసారి మైక్సిడిమా కోమా అన్న కండిషన్‌కు దారితీసి ప్రాణాపాయం కూడా సంభవించే అవకాశం ఉంది. గర్భిణుల విషయంలో థైరాక్సిన్ మోతాదులు తగ్గుతున్నాయేమో జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ పరీక్షలు చాలా అవసరం. గర్భిణుల్లో హై΄ోథైరాయిడిజం అన్నది బిడ్డ మానసిక వికాసానికి కొద్దిగా అంతరాయం కలిగించవచ్చు. అందుకే గర్భిణుల విషయంలో హైపోథైరాయిడిజమ్ లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. లెవో థైరాక్సిన్ సోడియమ్ వంటి మందుల ద్వారా దీనికి చికిత్స చేస్తారు. హైపర్ థైరాయిడిజమ్ : రక్తంలో థైరాయిడ్ హార్మోన్లు (టీ3, టీ4) పెరగడం వల్ల వచ్చే సమస్యను హైపర్ థైరాయిడిజమ్ లేదా థైరోటాక్సికోసిస్ అంటారు. దీని లక్షణాలన్నీ హైపోథైరాయిడిజమ్ లక్షణాలకు పూర్తిగా విరుద్ధంగా ఉంటాయి. గుండెదడ చేతులు వణకడం బరువు తగ్గిపోవడం ∙నీరసం ∙విరేచనాలు ∙ రుతుక్రమానికి సంబంధించిన సమస్యలు థైరాయిడ్ గ్రంథి వాపు (గాయిటర్) వంటి లక్షణాలు కనిపిస్తాయి. హైపర్‌థైరాయిడిజమ్‌ను రక్త పరీక్ష ద్వారా గుర్తిస్తారు. ఈ పరీక్షలో రక్తంలో టీ3, టీ4 మోతాదు ఎక్కు కావడం, టీఎస్‌హెచ్ మోతాదు బాగా తగ్గి΄ోవడం కనిపిస్తుంది. దీనికి చికిత్సగా యాంటీ థైరాయిడ్ మందులు ఉపయోగిస్తారు. ఈ మందులను డాక్టర్ సలహా మేరకు తీసుకోవాలి. కొన్ని నెలల వ్యవధిలోనే ఈ సమస్య పూర్తిగా తగ్గుతుంది. చాలామందిలో ఈ యాంటీథైరాయిడ్ మందులు ఆపిన తర్వాత మళ్లీ థైరాయిడ్ హార్మోన్ మోతాదులు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ముందుగా యాంటీ థైరాయిడ్ మందుల ద్వారా హార్మోన్‌ని తగ్గించి, ఆ తర్వాత ఈ సమస్య శాశ్వత పరిష్కారం కోసం రెండు పద్థతులు అనుసరిస్తారు. మొదటి దానిలో రేడియో ఆక్టివ్ అయోడిన్ మందును ఎక్కువ మోతాదులో ఇవ్వడం ద్వారా థైరాయిడ్ గ్రంథిలో హార్మోన్ తయారు చేసే కణాలను నాశనం చేయడం ద్వారా హార్మోన్ స్రావాన్ని తగ్గిస్తారు. ఇక రెండో పద్ధతిలో ఆపరేషన్ ద్వారా థైరాయిడ్ గ్రంథిని తొలగించడం ద్వారా హార్మోన్ స్రావాన్ని తగ్గిస్తారు. ఈ రెండు పద్ధతుల్లోనూ హార్మోన్ స్రావం బాగా తగ్గిపోయి, చివరకు హార్మోన్ లోపానికి దారితీస్తుంది. అప్పుడుహైపోథైరాయిడిజమ్లో మాదిరిగానే జీవితాంతం థైరాక్సిన్ మాత్రలు వాడాల్సి ఉంటుంది. మధ్య వయసులో వచ్చేవి..మధ్యవయసు నాటికి మహిళల్లో కనిపించే సమస్యల్లో ముఖ్యమైనవి ఇవి... మెనోపాజ్ సమస్యలు : రుతుక్రమం రావడంతో సమస్యలు మొదలవుతాయంటే... తమకు 45 ఏళ్లు వచ్చాక అదే రుతుక్రమం ఆగి΄ోవడం కూడా మహిళల్లో ఒక సమస్యాత్మక అంశంగానే ఉంటుంది. రుతుక్రమం ఆగే సమయంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గినందున వారికి ఒంట్లోంచి వెచ్చటి ఆవిర్లు రావడం, భావోద్వేగాల్లో వేగంగా మార్పులు (మూడ్స్ స్వింగ్స్), ఆస్టియో΄ోరోసిస్తో ఎముకలు బలహీనం కావడం, ఈస్ట్రోజెన్ వల్ల గుండెకు కలిగే సహజ రక్షణ తొలగిపోవడం వల్ల గుండెజబ్బులకు తేలిగ్గా గురికావడం, యోని పొడిగా మారడం, గర్భసంచి కిందికి జారడం వంటి అనేక సమస్యలు కనిపిస్తాయి. పరిష్కారం : రుతుక్రమం ఆగిన (మెనోపాజ్) మహిళల్లో సంబంధిత లక్షణాలేవైనా కనిపిస్తే తక్షణం డాక్టర్‌ను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. లక్షణాలను బట్టి డాక్టర్లు హెచ్ఆర్టీ వంటి చికిత్సలను సూచిస్తారు. క్యాల్షియమ్, విటమిన్ ’డి’ ఇవ్వడం వల్ల మెనోపాజ్ వచ్చిన మహిళల్లో ఎముకల ఆరోగ్యం పటిష్టంగా ఉండటమే కాకుండా ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలను నివారించవచ్చు. అలాగే ఆహారంలో క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే పాల వంటివి తీసుకోవడంతోపాటు దేహానికి తగినంత వ్యాయామం కూడా అందేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆస్టియోపోరోసిస్... మహిళల్లో ఈ ఎముకలకు గుల్లబారి΄ోయే ఈ వ్యాధి చాలా ఎక్కువ. పైగా మన దేశ మహిళలు (ముఖ్యంగా చిన్నపిల్లల నుంచి యువతుల వరకు) క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే పాలు క్రమం తప్పకుండా తాగడం చాలా తక్కువ. ఇటీవల చాలామంది సూర్యకాంతికి ఎక్స్పోజ్ కాకపోవడంతో ఎముకలకు బలం చేకూర్చే విటమిన్ డీ3 పాళ్లూ తగ్గుతాయి. పైగా మహిళలకు వ్యాయామ అలవాట్లూ తక్కువే. వీటిన్నింటి ఫలితంగా మహిళల్లో ఎముక సాంద్రతా, బలం క్రమంగా తగ్గుతూ పోతుంది. ఇక తమ వ్యాధినిరోధక శక్తి తమపైనే ప్రతికూల ప్రభావం చూపే ఎముక సంబంధితమైన రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఎస్‌ఎల్‌ఈ వంటి వ్యాధులు మహిళ్లోనే ఎక్కువ. అందుకే మహిళల్లో ఎముకల బలాన్ని పెంచడానికి పొట్టుతో ఉంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఇచ్చే ధాన్యాలైన (గోధువు, జొన్న, మెుక్కజొన్న, రాగులు, ఓట్స్)తో చేసిన పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే పొట్టుతీసిన కార్బోహైడ్రేట్స్ నివారించాలి. తాజా పండ్లు, క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే రాగులు, తాజా ఆకుపచ్చ కూరలు (గ్రీన్ లీఫీ వెజిటబుల్స్) తీసుకోవడం చాలా మంచిది. ఇటీవలి ఆధునిక మహిళలు ఇంటిపనులతోపాటు బయట ఉద్యోగాలూ చేస్తున్నారు. అందుకే వారిపై పనిఒత్తిడి తోపాటు మానసిక ఒత్తిడీ ఎక్కువే. ఫలితంగా ఆరోగ్య సమస్యలూ ఎక్కువే. అందుకే ఆమెకు కుటుంబం నుంచీ, అందునా మరీ ముఖ్యంగా భర్త నుంచి తగిన సహాయ సహకారాలు అవసరమని అందరూ తెలుసుకోవాలి.డాక్టర్ చల్మేడ నివేదిత, సీనియర్ ఫిజీషియన్, డయాబెటాలజిస్ట్ (చదవండి: అరుదైన శసస్త్ర చికిత్స: దంతంతో కంటి చూపు..!) -
సమాజ హితం కోసం.. సకినీ ఫౌండేషన్
సమాజ హితం కోసం తాను ఏదో చేయాలనుకున్నాడు.. అనుకున్నదే తడవుగా.. తనకు తోచిన మేరకు పేద విద్యార్థుల చదువుకు ఆర్థిక సాహాయం చేస్తున్నాడు. అంతటితో ఆగకుండా ఆపదలో ఉన్న పలువురు బస్తీ వాసులకు ఆపద్భాంధవుడిగా నిలుస్తున్నాడు. మురికి వాడల్లో నివసించే పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాడు. ఓ వైపు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూనే సమాజ సేవలోనూ ముందు వరుసలో ఉంటున్నాడు.. – గోల్కొండ నగరంలో అది పెద్ద లేబర్ అడ్డాల్లో టోలిచౌకీ లేబర్ అడ్డా ఒకటి. పొరుగు రాష్ట్రాల నుంచే కాకుండా నగర పరిసరాల నుంచి ఎందరో నిరుపేదలు ఉపాధి కోసం స్థానిక లేబర్ అడ్డాలకు వస్తుంటారు. పని దొరకక వారిలో అనేక మంది రోజుల తరబడి పస్తులు ఉంటుంటారు. ఇది గమనించిన ఆసిఫ్ హుసేన్స్న్ సోహెల్ సూర్యనగర్ కాలనీలో మాషా అల్లా పేరిట కిచెన్ ఏర్పాటు చేశాడు. దీని ద్వారా నిత్యం 250 మందికి మధ్యాహ్న సమయంలో భోజనం అందిస్తున్నాడు. వలస కూలీలకు అండగా.. ఆసిఫ్‌హుస్సేన్ సోహెల్ సేవలపై ప్రశంసలునగరంలో గోల్కొండకు చెందిన ఆసిఫ్‌హుస్సేన్ సోహెల్ సమాజంలో మార్పు కోసం తన వంతు కృషి చేస్తున్నాడు. మురికివాడల్లో చదువుకు నోచుకోని నిరుపేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తున్నాడు. చదువు మధ్యలో ఆపేసిన వారిని గుర్తించి వారికి అవగాహన కల్పించి, పై చదువులకు ప్రైవేటు పాఠశాలల్లో చేరి్పంచడం వంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. దీంతో పాటు ఆయా మురికి వాడల్లోని మహిళల సాధికారత కోసం సకీనా ఫౌండేషన్ ద్వారా సలహాలు, సూచనలు ఇస్తూ.. వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్నాడు. మహిళలకు ఉచితంగా వివిధ ఉపాధి పథకాల్లో శిక్షణ ఇప్పిస్తున్నాడు. పేదల బస్తీలైన విరాట్‌నగర్ వంటి ప్రాంతాల్లో ఫ్యాషన్ డిజైనింగ్, ఫస్ట్ ఎయిడ్, జిగ్‌జాగ్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వంటి అంశాల్లో శిక్షణ ఇప్పిస్తున్నాడు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేలా, వారి ఆర్థిక స్థితికి తోడ్పడుతూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నాడు. కరోనా సమయంలో.. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో వలస కూలీలకు తాను అండగా ఉన్నానంటూ నిత్యావసరాలు అందించడంతో పాటు వలస కూలీలు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ఉచిత రవాణా కలి్పంచాడు. టోలిచౌకీ ముంపు కాలనీగా పేరుగాంచిన నదీమ్ కాలనీలో వరదల సమయంలో బోట్లతో రంగంలోకి దిగి ఎందరినో సురక్షిత ప్రాంతాలకు తరలించాడు. వీటన్నింటికీ తోడుగా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తూ బస్తీలో రోగులకు వారి ఇంటి ముందే మందులు అందిస్తున్నారు. మున్ముందు కూడా సకీనా ఫౌండేషన్ ద్వారా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని సోహెల్ చెబుతున్నారు. -
సహనం విలువ
బయాజిద్ బిస్తామి ఓ సూఫీ. ఆయనను ‘జ్ఞానవాదుల రాజు‘ అని పిలిచేవారు. ఒకరోజు ఎక్కువసేపు మసీదులో గడిపి ఇంటికి బయలు దేరారు. మార్గమధ్యంలో ఓ తాగుబోతు ఎదురు పడ్డాడు. అతని చేతిలో ఓ సంగీత వాద్యం ఉంది. నోటికొచ్చి నట్టల్లా ఏదో పాడుకుంటూ వస్తు న్నాడు. ఆ దారిన వచ్చిపోతున్న వారిని తిడు తున్నాడు. అదే దారిలో బిస్తామీ వెళుతూ అతని స్థితిని చూసి బాధపడ్డారు. అతని దగ్గరకు వెళ్ళి ‘ఎందుకిలా ఉన్నావు?’ అని జాలిగా అడిగారు. బయటకు వచ్చిన ప్పుడు ఎలా ఉండాలో నాలుగు మంచి మాటలు చెప్పసాగారు. అయితే తాగుబోతుకి కోపం వచ్చింది. అతను తన చేతిలో ఉన్న సంగీత వాద్యంతో బిస్తామీ తల మీద కొట్టాడు. ఆయన తలకు గాయమైంది. రక్తం కారింది. అంతేకాదు, తాగుబోతు దగ్గరున్న వాద్యం కూడా విరిగింది. ఇంత జరిగినా సూఫీ జ్ఞాని అతనిని ఏమీ అనలేదు. ఆయన ఇంటికి దగ్గర్లోనే ఉంటాడా తాగుబోతు. మరుసటి రోజు ఆయన తీపి పదార్థాలను, కాస్తంత డబ్బు, ఒక ఉత్తరం ఒకరికి ఇచ్చి తాగుబోతు వద్దకు పంపించారు. తాగుబోతు ఆ ఉత్తరం చదివాడు. అందులో ఇలా ఉంది.‘మీ సంగీత వాద్యం ముక్కలైంది. అందుకు కారణం నా తలే. అందుకు నేను ఎంతో బాధపడుతున్నాను. కనుక నేను మీకిస్తున్న డబ్బుతోవాద్యం కొనుక్కోండి. అన్నట్టు మరొక విషయం. మీరు నిన్న రాత్రి నాతో మాట్లాడుతున్నప్పుడు మీ నోటంట అనేక చేదు మాటలు దొర్లాయనిపించింది. కనుక మీకు పంపిన తీపి పదార్థాలు తినండి. లోపల ఉన్న చేదు పోతుంది. అప్పుడు మీ మాటలు తీయగా ఉంటాయి’.తాగుబోతు ఈ సంఘటన తర్వాత తాగుడు మానేశాడు. బిస్తామీ వద్దకు వెళ్ళి తన తప్పును క్షమించ మన్నాడు. ఇంకెప్పుడూ అలా చేయనని హామీ ఇచ్చాడు. ‘మీ సహనం, మీ మంచి మాటలు నా కళ్ళు తెరిపించాయ’న్నాడు. – యామిజాల జగదీశ్ -
‘కార్బన్ పాజిటివ్’ పొలం!
లిస్సిమోల్ జె. వడక్కూట్.. దేశవ్యాప్తంగా విశిష్ట గుర్తింపు పొందిన డైనమిక్ వ్యవసాయ అధికారిణి. కేరళ వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖలో సహాయ సంచాలకురాలిగా గత 8 ఏళ్లుగా పనిచేస్తున్నారు. కొచ్చిన్ నగరానికి సమీపంలో అలువి అనే చోట వందేళ్లకు ముందే ఏర్పాటైన ప్రభుత్వ వరి విత్తనోత్పత్తి క్షేత్రం ఉంది. ఎనిమిదేళ్ల క్రితం లిస్సిమోల్ ఈ క్షేత్రం బాధ్యతలు తీసుకునేటప్పటికి దేశంలో ఎవరికీ దీని గురించి తెలీదు. అయితే, ఆమె అకుంఠిత దీక్షతో పనిచేసి ఈ క్షేత్రానికి ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టారు. దేశంలోనే తొలి ‘కార్బన్ న్యూట్రల్’ వరి క్షేత్రంగా అలువి సీడ్ ఫామ్‌కు గుర్తింపు దక్కింది. 5.32 హెక్టార్ల ఈ క్షేత్రంలో పూర్తిగా సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పాటిస్తున్నారు. వరి (ఇక్కడ పండించే వరి రకాల్లో అత్యధికం దేశీ రకాలే)తో పాటు అనేక ఇతర పంటలను సాగుచేస్తూ.. ఒక ఆదర్శ సమీకృత వ్యవసాయ క్షేత్రంగా లిస్సిమోల్ ప్రత్యేక శ్రద్ధతో తీర్చిదిద్దారు. ‘కార్బన్ న్యూట్రల్’ అంటే?నీటిని నిల్వ గట్టి వరి పంటను సాగు చేస్తే కర్బన ఉద్గారాలు భారీగానే వాతావరణంలోకి విడుదల అవుతున్నాయి. రసాయనిక ఎరువులు, పురుగుమందుల ఉద్గారాలతో పాటు... నీటిని నిల్వగట్టడం వల్ల మిథేన్ వాయువు వాతావరణంలోకి వెలువడుతుంటుంది. అటువంటి పొలం నుంచి విడుదలయ్యే ఉద్గారాలను అనేక పర్యావరణహిత సాగు పద్ధతులను అనుసరించటం ద్వారా అతి తక్కువ స్థాయికి తగ్గించటం మాత్రమే కాకుండా.. అంతకన్నా ఎక్కువ కర్బనాన్ని వాతావరణం నుంచి గ్రహించి భూమిలో స్థిరీకరించే స్థాయికి ఈ ఫామ్‌ను అభివృద్ధి చేయటంలో లిస్సిమోల్ విజయం సాధించారు. 2022 డిసెంబర్లో అలువ ఫామ్‌ను ప్రభుత్వం కార్బన్ న్యూట్రల్ ఫామ్‌గా ప్రకటించింది.170 టన్నుల కర్బనం మిగులు!కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న ‘కాలేజ్ ఆఫ్ క్లైమెట్ ఛేంజ్ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్’ (ఇలాంటి కాలేజీ ఒకటి దేశంలో ఇతర రాష్ట్రాల్లో మాటేమో గానీ తెలుగు రాష్ట్రాల్లో అయితే లేదు) ప్రయోగాలు చేసి ఉద్గారాలను శాస్త్రీయంగా లెక్కగట్టింది. తురుత్ ద్వీప ప్రాంతంలో గల ఈ ఫామ్ 43 టన్నుల కర్బనాన్ని వాతావరణంలోకి విడుదల చేస్తుండగా, 213 టన్నుల కర్బనాన్ని వాతావరణం నుంచి గ్రహించి భూమిలో స్థిరీకరిస్తోందని ఈ ప్రయోగాల్లో తేలింది. అంటే.. ఈ క్షేత్రం 170 టన్నుల కార్బన్ క్రెడిట్లను సంపాయించిందన్న మాట. ఇది నిజానికి ‘కార్బన్ పాజిటివ్’ క్షేత్రం!కేరళ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 13 విత్తనోత్పత్తి క్షేత్రాలు నడుస్తున్నాయి. వీటన్నిటినీ కార్బన్ న్యూట్రల్ ఫామ్స్‌గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యం చేరుకోవటంలో లిస్సిమోల్ విజయం సాధించారు. అంతేకాదు, రాష్ట్రంలోని 140 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఇటువంటి కార్బన్ న్యూట్రల్ ప్రదర్శనా క్షేత్రాలను నిర్మించే ప్రయత్నమూ జరుగుతోంది.ఇదీ సమీకృత సేంద్రియ సేద్యం5.32 హెక్టార్ల ఈ క్షేత్రంలో 3 హెక్టార్లలో వరితో పాటు.. ఒక హెక్టారులో చిరుధాన్యాలు, చియా గింజలు, కొబ్బరి, అరటి, దుంప పంటలు, జాపత్రి, కూరగాయలు, ΄్యాషన్ ఫ్రూట్ తదితర పంటలను సాగు చేస్తున్నారు. 2012 నాటికే ఎన్‌పిఓపి ఆర్గానిక్ సర్టిఫికేషన్ వచ్చింది. 15 మంది కార్మికులు పనిచేస్తున్నారు. కాసర్గోడ్ కల్లన్ రకం దేశీ ఆవులు 9, మలబార్ మేకలు 16, కుట్టనాడన్ బాతులు వంద, నాటు కోళ్లు, గిన్నె కోళ్లు కలిపి 50తో పాటు బ్యాచ్‌కి 5 వేల గిఫ్ట్ తిలాపియా చేపలను సైతం ఈ సమీకృత క్షేత్రంలో పెంచుతున్నారు. దేశీ వరి రకాలు (జపాన్ వైలెట్, రక్తశాలి, గోల్డెన్ నవార, వెల్లతొండి, వదక్కన్ వెల్లారి కైమ, జైవ, మనురత్న..), అధికోత్పత్తినిచ్చే వరి వంగడాల విత్తనోత్పత్తిని చేపట్టడంతో పాటు లైవ్ రైస్ మ్యూజియంగా ఈ క్షేత్రాన్ని తీర్చిదిద్దారు. పంచగవ్య, జీవామృతం వంటి ఆర్గానిక్ గ్రోత్ ప్రమోటర్ ద్రావణాలతో పాటు చీడపీడలను అరికట్టే కషాయాలను తయారు చేసుకొని పంటలకు వాడటమే కాకుండా రైతులకు విక్రయిస్తున్నారు. వామ్, వర్మీ కం΄ోస్టు, వర్మీవాష్‌ను తయారు చేస్తున్నారు. రెడువీద్ వంటి మిత్రపురుగులను సైతం పెంచుతున్నారు. తేనెటీగల పెంపకం కూడా ఉంది. పర్యాటకులను సైతం ఆకర్షిస్తున్న ఈ క్షేత్రం నిజంగా విలక్షణమైనదే. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. వరి పొలంలో అనేక సమస్యల పరిష్కారానికి బాతులను ఉపయోగించటం. కలుపు నివారణ, చీడపీడల నియంత్రణతో పాటు భూసారం పెంపొందించడానికి కూడా బాతులు ఉపయోగపడుతున్నాయని లెస్సిమోల్ తెలిపారు. ఇక్కడ అనుసరించే ప్రతి పనినీ శాస్త్రీయంగా రికార్డు చేసి, అధ్యయనం చేసి గణాంకాలను రూపొందించారు. సమీకృత సేంద్రియ వ్యవసాయాన్ని అన్ని హంగులతో సక్రమంగా చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో ఈ క్షేత్రం కళ్లకు కడుతున్నదనటంలో అతిశయోక్తి లేదు! దేశం నేర్చుకోదగ్గ పాఠాలు2012 నుంచి సేంద్రియ వ్యవసాయ పద్ధతులను ఈ క్షేత్రంలో అనుసరిస్తూ పదేళ్లలో ఈ మైలురాయిని దాటాం. హరిత గృహ వాయువుల ఉద్గారాలను తగ్గించే విధంగా వ్యవసాయ పనులను సమూలంగా మార్చాం. ఇలా చేయాల్సిన అవసరం ఏమిటో రైతులు, స్థానిక ప్రజలకు అవగాహన కలిగించేందుకు కృషి చేస్తున్నాం. దేశం యావత్తూ నేర్చుకోదగిన పర్యావరణ హిత సేద్య పాఠాలకు మా క్షేత్రం కేంద్ర బిందువైంది. – లిస్సిమోల్ జె. వడక్కూట్, సహాయ సంచాలకురాలు, స్టేట్ సీడ్ ఫామ్ అలువి, ఎర్నాకులం జిల్లా పంచాయత్, కేరళ -
నా ఇన్సిపిరేషన్ అమ్మ.. ఎందుకంటే..
‘నాకు ఏడేళ్లప్పడు మా అమ్మ నన్ను, నా ఇద్దరు చెల్లెళ్లను తీసుకుని నాన్న దగ్గర్నుంచి బయటకు వచ్చేసింది. ఆ ఇంట్లోంచి వెళ్లిపోతున్నప్పుడు ‘మనం ఊరెళ్లిపోతున్నాం’ అని చెప్పింది అమ్మ. ‘ఎందుకు?’ అడిగాను. ‘నేను కొడుకును కనివ్వలేను కాబట్టి’ అంది. నాన్న వాళ్లింట్లోంచి వచ్చేప్పుడు అనుకున్నాను ‘ఎప్పటికైనా ఆ ఇంటిని కొంటాను’ అని! అనుకోవడమే కాదు అమ్మతో చెప్పాను కూడా! చాలెంజెస్ ఫేస్ చేయడం ఆ రోజునుంచే మొదలైంది. డబుల్, ట్రిబుల్ జాబ్స్ చేస్తూ డబ్బు సంపాదించాను. ఆ ఇంటిని కొనేంత కూడబెట్టాను. ఒకరోజు అక్కడికి వెళ్లి అమ్మకు ఫోన్ చేశాను. ‘చిన్నప్పుడు వదిలి వచ్చేసిన ఇంటి దగ్గరున్నానమ్మా’ అని! అప్పుడు అమ్మ ‘ప్రతీకారకాంక్ష మనల్ని దహించేస్తుంది.. విలువైన సమయాన్ని వృథా చేస్తుంది. మన ఎనర్జీని నిరుపయోగమైన వాటివైపు మళ్లిస్తుంది. అందుకే మనల్ని హర్ట్ చేసిన వాళ్లను క్షమించి, మరచిపోవాలి. మనకు కోపం తెప్పించే వాటిని ఇగ్నోర్ చేయాలి. మన ఎనర్జీని పదిమందికి ఉపయోగపడే విషయాలపై వెచ్చించాలి’ అని చెప్పింది. ఆ మాట నా దిశను మార్చేసింది. అందుకే మా అమ్మే నా ఇన్సిపిరేషన్, టీచర్, గైడ్, ఫిలాసఫర్!’ -
నాకు నచ్చిన పాత్ర విమల
నచ్చటం అనేది నిరపేక్ష అంశం కాదు. ప్రత్యేకించి సాహిత్య పాత్రలు నచ్చటం– అవి చదివిన కాలం నాటి మన వయసు, ఆలోచనా స్థాయి, భావుకత్వ శక్తి వీటన్నిటిని బట్టి ఉంటుంది. అందువల్ల ఒకసారి నచ్చింది అలాగే ఉండిపోతుంది అనుకొనటానికి లేదు. ఒకొకసారి యూటర్న్ కూడా తీసుకోవచ్చు. లేదా గుణాత్మకంగా పరిణామామూ చెందవచ్చు. నా సాహిత్య సహవాసం ఆరోతరగతి నుండి వారపత్రికలలో సీరియల్‌గా వచ్చే స్త్రీల నవలలు చదవటంతో మొదలైంది (1966 –67). ఆ వరుసలో రంగనాయకమ్మ స్వీట్ హోమ్ (Sweet Home) నవలలోని విమల పాత్ర నాకు చాలా నచ్చింది. పన్నెండు పదమూడేళ్ల వయసులో విమల నాకెందుకు నచ్చింది? ఇళ్లల్లో కనబడే దాంపత్య సంబంధాల్లోని గంభీర ముద్రను, ఒద్దికను చెరిపేస్తూ భర్తతో అల్లరిగా, చిలిపిగా, చనువుగా ప్రవర్తించే ఆ పాత్ర విశిష్ట వ్యక్తిత్వం నన్ను ఆకర్షించిందా? అప్పటికి నేను చదివిన నవలల్లోని స్త్రీ పాత్రలకు భిన్నంగా తాను లోపల ఏమి అనుకొంటున్నదో దానిని ఎవరేమనుకొంటారో అని లోలోపల అణిచేసుకోకుండా బయటకు అనగల ధీరత్వం వలన విమల నాకు అపురూపంగా అనిపించిందా? ఆ క్రమంలో తాను స్త్రీ, భార్యే అయినా ప్రత్యేకవ్యక్తిని అన్న నిరంతర చైతన్యంతో జీవించటం వల్ల నాకు నచ్చిందా? ఏమో !? నాకవన్నీ ఆ రోజుకు ఇంత స్పష్టంగా తెలుసునని చెప్పలేను. కానీ ఆ నవల చదువుతూ సమ న్యాయానికి, సహజీవన సౌందర్యానికి సంబంధించిన అవ్యక్త అనురాగం ఏదో నా లోలోపల ఊపిరి పోసుకొంటుంటే విమల ప్రేమలో పడిపోయానన్నది వాస్తవం. ఆ తరువాత ఎన్నిసార్లు ఆ నవల (Novel) చదివానో లెక్కలేదు. విమల ఎందుకు నచ్చిందో ఆ కారణాలు రోజురోజుకీ మరింత విశదం అవుతూ వస్తున్నాయి. స్త్రీకి సహజ లక్షణాలుగా సమాజం నిర్దేశిస్తున్న విలువలను తిరస్కరించటం విమలను ప్రత్యేకంగా నిలబెడుతుంది. శాంతం, సహనం స్త్రీ«ధర్మాలు అనే బోధలు ఆమె సహించలేదు. పతివ్రతలుగా జీవించటం, మరణించటం స్త్రీకి ఆదర్శం చేసిన వ్యవస్థపై ఆమెకు కోపం. స్త్రీకి భర్త పట్ల అనురాగం స్వచ్ఛందంగా సహజ మానవీయ సంబంధాల నుండి కలగవలసినదే కానీ పై నుండి నిర్బంధం వల్ల కాదు అన్నది ఆమె నిశ్చితాభిప్రాయం. భర్త కోసం తాను ఇష్టంగా ఇంటి పని ఎంతైనా చేయవచ్చు కానీ, ఇంటి పని స్త్రీలదే అంటే మాత్రం విమల ఒప్పుకోదు. వంటిల్లు మగవాడిది కూడా అని చెప్పగలిగిన సమాన హక్కుల చైతన్యం ఆమెది. ఆమె సంస్కరణ కుటుంబానికి పరిమితమైనదే. కానీ కుటుంబంలో భార్యాభర్తల సంబంధాలలో ప్రజాస్వామీకీకరణను కలగనగలిగిన ఆధునిక మధ్యతరగతి యువతిగా విమల నాకు నచ్చిందనుకొంటాను. కుటుంబానికి అవతల నాకు అంతగా నచ్చిన మరొక స్త్రీ పాత్ర మధురవాణి. -
Oscar Awards 2025: భావోద్వేగాలకు జీవం
2024 సంవత్సరానికి ఆస్కార్ ఉత్తమ నటిగా నిలిచారు మైకీ మ్యాడిసన్ . సినిమా పేరు ‘అనోరా’. ధరించిన పాత్ర ‘వేశ్య’. హాలీవుడ్ కాని, ఇండియన్ సినిమాల్లోకానివేశ్య పాత్ర పోషించడం పట్ల తారలకు కొన్ని అభ్యంతరాలుంటాయి. అలాగే ఆ పాత్రలు పోషించిన వారందరూ ప్రశంసలు కూడా అందుకున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి వేశ్య పాత్ర వార్తల్లోకి వచ్చింది. ‘అనోరా’ గురించి, మైకీ మ్యాడిసన్ గురించి కథనం.వారికి ఆదివారం రాత్రి. మనకు సోమవారం తెల్లవారుజాము. కాని తారలకు, తారలను ప్రేమించే ప్రేక్షకులకు ఇది పడుతుందా?అమెరికా లాస్ ఏంజెలెస్‌లో జరిగిన 97వ అకాడమీ అవార్డ్స్ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు నిద్ర మానుకొని, మేల్కొని, వివిధ స్థానిక సమయాల ప్రకారం వీక్షించారు. విజేతలకు చప్పట్లతో శుభాకాంక్షలు తెలియజేశారు. తాము ఊహించిన సినిమాకో నటికో వస్తే తెగ ఉత్సాహం ప్రదర్శించారు. అయితే వీరందరూ కొంత ఊహించినా ఇంతగా ఎక్స్పెక్ట్ చేయని ఒక సినిమా ఆశ్చర్యపరిచింది. ‘ఉత్తమ చిత్రం’ పురస్కారంతో పాటు ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో ఐదు పురస్కారాలను సొంతం చేసుకుని హోరెత్తించింది. ఆ సినిమాయే ‘అనోరా’. 2024లో విడుదలైన ఈ చిత్రం అటు విమర్శకుల ప్రశంసలను, ఇటు బాక్సాఫీసు కాసుల రికార్డులనూ కొల్లగొట్టింది. భారతీయ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం జరిగిన ఆస్కార్ అవార్డు ప్రదానోత్సవంలో సైతం అదే పంథా కొనసాగించింది.ఎవరీ ‘అనోరా’?:నిజానికి ఇలాంటి కథలు మనకు ‘మొఘల్–ఏ–ఆజమ్’ నుంచి ఉన్నాయి. కథానాయకుడు వేశ్యను ప్రేమిస్తే సంఘం/పెద్దమనుషులు ఓర్వలేక విడగొట్టడం. కాని మొఘల్–ఏ–ఆజమ్‌లో కథానాయకుడి ప్రేమ నిజమైనది అయితే ‘అనోరా’లో కపటమైనది. అందుకే ఆ ప్రేమకు విక్టిమ్ అవుతుంది అనోరా. 23 ఏళ్ల ఈ అమ్మాయి న్యూయార్క్‌లోని ఓ క్లబ్లో స్ట్రిప్పర్‌గా పని చేస్తూ ఉంటుంది. ఒకరోజు ఈమెను క్లబ్ యజమాని రష్యాకు చెందిన ఇవాన్ అనే శ్రీమంతుల కుర్రవాడికి పరిచయం చేస్తాడు. చదువుకోవడానికి అమెరికాకు వచ్చిన ఈ కుర్రాడు బాధ్యత లేకుండా పార్టీల్లో, వీడియో గేమ్స్‌లో సమయం గడుపుతూ ఉంటాడు. అనోరా సాంగత్యం ఇష్టపడ్డ ఇవాన్ తరచూ ఆమెను తన బంగ్లాకు ఒక రాత్రి కోసం తీసుకువెళుతూ ఉంటాడు. ఆ తర్వాత హఠాత్తుగా ‘నాకు వారం రోజుల పాటు గర్ల్‌ఫ్రెండ్‌గా ఉండు. 15 వేల డాలర్లు ఇస్తాను’ అని క్లబ్‌కు వెళ్లకుండా ఆపేస్తాడు. ఆ వారంలో ఆమె మీద ప్రేమ పుట్టిందని చెప్పి, ఉక్కిరిబిక్కిరి చేసి, ఉరుకుల పరుగుల మీద పెళ్లి చేసుకుంటాడు.కష్టాలు మొదలుఅయితే ఇది పిల్లల ఆట కాదు. ఇద్దరు కలవడం వెనుక, కలిసి జీవించడం వెనుక ఎంత పెద్ద వ్యవస్థ ఇన్వాల్వ్ అయి ఉంటుందో మెల్లగా అనోరాకు తెలిసి వస్తుంది. ఇది క్లబ్లో తన ఇష్టానికి స్ట్రిప్పర్‌గా ఉండటం కాదని ‘పెళ్లి’ అనే వ్యవస్థ చుట్టూ అంతస్తు, సంఘ మర్యాద, వంశం... ఇలాంటివి అన్నీ ఉంటాయని అర్థమై హడలిపోతుంది. ఇవాన్‌ను ఈ పెళ్లి నుంచి బయటపడేయడానికి రష్యా నుంచి వచ్చిన ఇద్దరు మనుషులు ఈ యువ జంటను బెదిరిస్తారు. ‘గ్రీన్ కార్డు పొందడం కోసమే ఆమె నిన్ను పెళ్లి చేసుకుంది. ఆమె వేశ్య’ అని ఇవాన్ మనసును మార్చేస్తారు. ఈ మొత్తం వ్యవహారానికి బెదిరి అనోరాను వదిలి ఇవాన్ పారిపోతాడు. ఇవాన్‌ను వదిలి పెడితే 10 వేల డాలర్లు ఇస్తామనే బేరం పెడతారు రష్యా మనుషులు. ఈ పరిస్థితులు మానసికంగా అనోరాను బాధిస్తాయి.ఊరడించే బంధంఅయితే ఈ మొత్తం కథలో ఒక వ్యక్తి అనోరా పట్ల సానుభూతిగా ఉంటాడు. అతను ఇవాన్‌ను పెళ్లి నుంచి బయట పడేయడానికి రష్యా నుంచి వచ్చిన ఇగోర్. అనోరాకి అన్యాయం జరుగుతోందని ఆమె తన మానాన తాను బతుకుతుంటే ఇవాన్ డిస్ట్రబ్ చేశాడని అతనికి అనిపిస్తుంది. చివరకు అతను ఆమెకు స్నేహితుడిగా మారతాడు. అతనికి అనోరా తన సర్వస్వం అర్పించడానికి దగ్గరయ్యి ఆ కాస్త ఓదార్పుకు వెక్కివెక్కి ఏడ్వడంతో సినిమా ముగుస్తుంది. ఈ కథ మొత్తాన్ని తన భుజస్కందాల మీద అద్భుతంగా పోషించడం వల్ల, వివిధ భావోద్వేగాలను పలికించడం వల్ల ‘అనోరా’ పాత్ర పోషించిన మైకీ మాడిసన్‌కు ఉత్తమ నటి అవార్డు వచ్చింది. అవార్డు అందుకుంటూ ఆమె ‘సెక్స్ వర్కర్ కమ్యూనిటీకి కృతజ్ఞతలు’ అని చెప్పడం విశేషం.సినిమా విశేషాలు→ ఇది కల్పిత కథ కాదు, అలాగని పూర్తి వాస్తవ కథ కూడా కాదు. దర్శకుడు సీన్ బేకర్‌కి తన స్నేహితుడు చెప్పిన ఒక రష్యన్–అమెరికన్ జంట కథ ఆధారంగా పుట్టిందే ఈ కథ. 2000–2001 సమయంలో న్యూయార్క్‌లో సీన్ బేకర్ వీడియో ఎడిటర్‌గా పని చేస్తూ అనేక రష్యన్–అమెరికన్ జంటల పెళ్లి వీడియోలను ఎడిట్ చేశాడు. ఇవన్నీ కలిసి అతని మనసులో చెరగని ముద్ర వేశాయి. ఈ సినిమాకు రచనా సహకారం కోసం కెనెడియన్ రచయిత్రి, నటి ఆండ్రియా వెరన్ను సంప్రదించాడు దర్శకుడు. అందుకు కారణం ఆమె గతంలో సెక్స్ వర్కర్‌గా పని చేసి, ఆ అనుభవాలతో ‘మోడ్రన్ వోర్’ అనే స్వీయచరిత్ర రాసింది. బార్లలో ఆడిపాడే వారికి, వేశ్యావృత్తిలో ఉన్నవారికీ మనసుంటుందనీ, అదీ ఒక తోడు కోరుకుంటుందని చెప్పడానికే తాను ఈ సినిమా తీసినట్లు ఆయన వివరించారు. → కథలో ప్రధానమైన పాత్రను ధరించిన మైకీ మాడిసన్ ఆ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయింది. 25 ఏళ్ల మైకీ మాడిసన్ లాస్ ఏంజెలెస్‌లో పుట్టి శాన్ ఫెర్నాండ్ వ్యాలీలో పెరిగింది. యూదు కుటుంబానికి చెందిన మైకీ తల్లిదండ్రులిద్దరూ సైకాలజిస్టులు. ఈమెకు ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నలు.→ 2013లో తొలిసారి ‘రిటైర్మెంట్ అండ్ పనిష్ బాక్స్’ అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించే నాటికి మైకీ మాడిసన్ ఏడో తరగతి చదువుతోంది. సినిమాల వల్ల స్కూలుకు వెళ్లడం సాధ్యం కాకపోవడంతో ఆ తర్వాత ఆమె చదువంతా ఇంట్లోనే సాగింది. 2017లో హీరోయిన్గా తొలి చిత్రం ‘లిజా లిజా స్కైస్ ఆర్ గ్రే’ విడుదలైంది. అంతకుముందే 2016లో ‘బెటర్ థింగ్స్’ అనే కామెడీ డ్రామా సిరీస్‌లో టీనేజ్ యువతి పాత్ర పోషించింది. ఆ సిరీస్ విజయవంతమై 2022 దాకా నడిచింది. ఈ మధ్యలో ‘ఇంపోస్టర్స్’, ‘మాన్ స్టర్’, ‘నోస్టాల్జియా’ వంటి సిరీస్‌లలోనూ నటించి, మెప్పించింది. → 2019లో వచ్చిన ‘వన్స్ అపాన్ ఎ టైం ఇన్ హాలీవుడ్’ అనే సినిమా మైకీకి గుర్తింపు తెచ్చింది. అందులో ‘సూసన్’ పాత్రలో ఆమె నటన అందర్నీ ఆకట్టుకుంది. 77వ కాన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఈ చిత్రం ప్రశంసలు పొందింది. ఆ పై ‘స్క్రీమ్’, ‘లేడీ ఇన్ ది లేక్’ సినిమాల్లో నటించింది. → తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు, జయప్రద హీరో హీరోయిన్లుగా రూపొందిన ‘ప్రేమమందిరం’ కథ ‘అనోరా’ పోలికలతోనే ఉంటుంది. అందులో జయప్రద దేవదాసీల ఇంట్లోనే పుట్టిన అమ్మాయి పాత్ర పోషించగా అక్కినేని జమీందారు బిడ్డ పాత్ర పోషించారు.‘వన్స్ అపాన్ ఎ టైం ఇన్ హాలీవుడ్’, ‘స్క్రీమ్’ సినిమాలో మైకీ నటన చూసి తాను తీస్తున్న ‘అనోరా’లో ఈ అమ్మాయి బాగుంటుందని సీన్ బేకర్ భావించారు. అలా ఈప్రాజెక్టులోకి అడుగుపెట్టిన మైకీ సినిమాను తన భుజాల మీద మోసింది. వేశ్యగా, ప్రేమికురాలిగా, పెళ్లయిన మహిళగా, ప్రియుడి చేత మోసగింపబడ్డ యువతిగా... ఇన్ని రకాల హావభావాలను ఆ పాత్రలో పలికించి అందర్నీ మెప్పించింది. -
ట్రంప్ భేటీలో వైరల్‌గా జెలెన్స్కీ దుస్తులు..డిజైనర్ ఎవరంటే..?
ఉక్రేయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అమెరికా వైట్‌హౌస్ ఓవల్ కార్యాలయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ సమావేశంలో ఇరువురు అధ్యక్షుల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయిలో జరిగింది. ఆ తదనంతరం వైట్‌హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో జెలెన్ స్కీ ధరించిన దుస్తులు హాట్‌టాపిక్‌గా మారాయి. అగ్రరాజ్యం అధ్యక్షుడిని వైట్‌హౌస్‌లో కలిసేటప్పుడు డ్రెస్ కోడ్ పాటించాలి కదా అంటూ ప్రశ్నలు లేవెనెత్తడం జరిగింది. ఇది అమెరికన్లను అవమానించడమే అంటూ వ్యాఖ్యలు రాగా వాటికి జెలెన్స్కీ తనదైన శైలిలో ధీటుగా సమాధానాలిచ్చారు కూడా. ఈ నేపథ్యంలో ఆయన ధరించిన దుస్తులు ప్రత్యేకత, డిజైనర్ వంటి వాటి గురించి ఈ కథనంలో తెలుసుకుందామా..!.జెలెన్స్కీ నల్ల కార్గోప్యాంటు, బూట్లతోపాటు ఉక్రెనియన్ జెండాలో ఉండే త్రిశూలం వంటి చిహ్నలతో కూడిన డ్రెస్‌ని ధరించారు. పైన ధరించిన షర్ట్‌కి మూడు బటన్లు అల్లిన లాంగ్ స్లీవ్ పోలో చొక్కాను ధరించారు. ఆయన వైట్‌హౌస్‌లోకి ఎంటర్ అవ్వగానే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలకిరిస్తూ..జెలెన్స్కీ దుస్తులపై వ్యాఖ్యానించాడు. ఆ తర్వాత జరిగిన మీడియా సమావేశంలో రియల్ అమెరికాస్ వాయిస్ అనే కన్జర్వేటివ్ రిపోర్టర్ బ్రియాన్ గ్లెన్ జెలన్స్కీని మీరు సూటు ఎందుకు ధరించలేదు అంటూ ప్రశ్నించాడు. ఈ దేశ కార్యాలయంలో అత్యున్నత స్థాయిలో ఉన్నారు కదా..మరీ ఇలా సూట్ లేకుండా ఎలా వచ్చారంటూ ప్రశ్నలు గుప్పించాడు. అయితే అందుకు జెలెన్స్కీ త్వరలో మీకంటే మంచి సూట్ కచ్చితంగా ధరిస్తాను. స్వేచ్ఛను కోరుకుంటున్న తన దేశానికి ప్రతికగా ఈ వస్త్రధారణ అని ధీటుగా బదులిచ్చాడు జెలెన్స్కీ. మరీ ఈ దుస్తులని ఇంతలా అర్థవంతంగా తీర్చిదిద్దింది ఎవరో తెలుసా..!.ఎల్విరా గసనోవాఉక్రేనియన్ డిజైనర్ ఎల్విరా గసనోవా ఈ దుస్తులను రూపొందించింది. ఆమె డామిర్లి బ్రాండ్ పురుషుల దుస్తుల కలెక్షన్ నుంచి పోలో చొక్కా, ప్యాంటుని ధరించారు జెలెన్స్కీ. ఎల్విరా జెలెన్స్కీ కోసం ఈ పత్యేక వెర్షన్‌ను డిజైన్ చేసింది. దీన్ని డిజైనర్ 1991లో ఉక్రెయిన్ స్వీకరించిన కోట్ ఆఫ్ ఆర్మ్స్ త్రిశూలం ఉన్న షీల్డ్ ఆధారంగా రూపొందించిందిఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఉక్రెయిన్ భవిష్యత్తు కోసం పోరాటం సాగిస్తున్నా తమ ధైర్యానికి గుర్తుగా జెలెన్స్కీ సూట్‌ని కాకుండా ఉక్రెయిన్ బ్రాండ్ డామిర్లి పోలో చొక్కాను ఎంచుకున్నారు. ఇది ఆధునిక యోధుని యూనిఫాం. స్వేచ్ఛ కోసం నిలబడే దేశం అజేయమైన ఆత్మకు చిహ్నం. ఫ్యాషన్ సౌందర్యాన్ని అధిగమించి, ధిక్కరణ, విజయంపై విశ్వాసానికి శక్తిమంతమైన చిహ్నంగానూ, స్వరంగానూ ఉంటుంది ఈ వస్త్రధారణ అని ఎల్విరా సోషల్ మీడియా పోస్ట్‌లో రాసుకొచ్చింది.ఇక డిజైనర్ ఎల్విరా 2013లో డొనెట్స్క్లో తన బ్రాండ్‌ని స్థాపించారు. ఉక్రెయిన్ ప్రథమ మహిళ ఒలెనా జెలెన్స్కీ తరచుగా ఈ బ్రాండ్ బట్టలనే ధరిస్తుంటారు. దీన్ని ఆమె ఇద్దరు సభ్యులతో ప్రారంభించింది. తాను డిజైన్ చేయగలనా అని భయపడింది, కానీ క్రియేటివిటీగా తీర్చిదిద్దడంపై ఆసక్తి పెరిగి తనకు తెలియకుండానే వస్త్రాలు డిజైన్ చేయగలిగానంటోంది. నిజానికి ఆమె దంత వైద్యురాలు అవ్వాలనుకుంది. అయితే అనుకోకుండా డోనెట్స్క్ ఫ్యాషన్ డేలో పాల్గొంది. అక్కడ నుంచి ఫ్యాషన్ డిజైనర్‌గా మారాలని ఫిక్స్ అయ్యి ఈ రంగంలోకి వచ్చింది. ఆమె తొలి ఫ్యాషన్ షో నవంబర్ 01, 2013న జరిగింది. అలా ఆమె ఫ్యాషన్ డిజైనర్ ప్రస్థానం జరిగింది.Q: "Why don't you wear a suit?"Ukrainian President Zelenskyy: "I will wear costume after this war will finish." pic.twitter.com/FzJqjIAQHa— CSPAN (@cspan) February 28, 2025 (చదవండి: అరుదైన శస్త్రచికిత్స: దంతంతో కంటి చూపు..!) -
వారి కోసం జుకర్‌బర్గ్ ఫ్యావరెట్ హుడీ వేలం : మార్క్ డ్యాన్స్ వైరల్ వీడియో
మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ తనకెంతో ఇష్టమైన పాత హుడీని వేలం వేశారు. తద్వారా వచ్చిన సొమ్మును టెక్సాస్ పాఠశాల సంక్షేమం కోసం వినియోగించనున్నారు. బిజినెస్ ఇన్సైడర్ ప్రకారం, ఈ ప్రియమైన హూడీతోపాటు బిడ్ దక్కించుకున్న వ్యక్తికి జుకర్‌బర్గ్ స్వయంగా చేతితో రాసిన నోట్ కూడా దక్కింది. దీనిని ఫేస్బుక్ స్టేషనరీలో రూపొందించారట.2019లో తరచుగా ధరించే నల్లటి హూడీ లాస్ ఏంజిల్స్‌లో జరిగిన వేలంలో భారీ ధరకు అమ్ముడు బోయింది. జూలియన్స్ ఆక్షన్స్ వారి "స్పాట్లైట్: హిస్టరీ అండ్ టెక్నాలజీ" సిరీస్‌లో భాగంగా గత గురువారం ఈ వేలం నిర్వహించింది. దీనికున్న పర్సనల్ టచ్, క్రేజ్ అభిమానులను స్పష్టంగా ఆకట్టుకున్నాయి. దీంతో చాలా వేగంగా బిడ్డింగ్ జరిగింది. దాదాపు 22 బిడ్లు వచ్చాయి. చివరకు రూ.13 లక్షల కంటే ఎక్కువ ధర పలికింది. View this post on Instagram A post shared by Mark Zuckerberg (@zuck) ఇది తన ఆల్-టైమ్ ఫేవరెట్లలో ఒకటిగా అభివర్ణించారు జుకర్‌బర్గ్. , "నేను తొలినాళ్లలో దీన్ని ఎప్పుడూ ధరించేవాడిని. దాని లోపల మా అసలు మిషన్ స్టేట్మెంట్ కూడా ప్రింట్ అయి ఉంది" అని గుర్తు చేసుకున్నారు. ఈ హూడీ 2010 నాటిది. ఇదే ఏడాది జుకర్‌బర్గ్ టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యారు. ఈ వేలం ద్వారా వచ్చిన మొత్తం సొమ్మను టెక్సాస్‌లోని పాఠశాల పిల్లలకు మద్దతు ఇవ్వడానికి అంకితం చేస్తామని మార్క్ ప్రకటించారు. దీంతోపాటు పాటు ఆపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ ధరించిన సిగ్నేచర్ బో టై కూడా వేలంలో అమ్ముడైన ఇతర ప్రసిద్ధ వస్తువులలో ఒకటిగా దాదాపు రూ. 31 కోట్లకు బిడ్దక్కించుకుంది. దీని అసలు ధర వెయ్యి డాలర్లుమాత్రమే.మార్క్ డ్యాన్స్, భార్య ఫిదా మరోవైపు మార్చి 1న, భార్య ప్రిస్సిల్లా చాన్ పుట్టినరోజు సందర్భంగా జుకర్‌బర్గ్ డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. బ్లాక్ అండ్ వైట్ టక్సేడోలో పార్టీలో ఎంట్రీఇచ్చి టక్సేడోను చింపేసి మరీ, ఒక్క ఉదుటున స్టేజ్‌పైకి అద్భుతమైన నీలిరంగు జంప్‌సూట్‌లో పాట పాడి, డ్యాన్స్ చేశాడు. దీంతో చాన్ ఫిదా అయిపోయింది. తెగ వైరలవుతోంది. 2025 గ్రామీ అవార్డుల వేడుకలో బెన్సన్ బూన్ బ్యూటిఫుల్ థింగ్స్ ప్రదర్శన ఇస్తున్నప్పుడు ధరించిన జంప్‌సూట్ కూడా ఇలాంటిదేనట.