Sports
-
శ్రీలంకను చిత్తు చేసిన శిఖర ధవన్ సేన
ఆసియా లెజెండ్స్ లీగ్ ఆరంభ ఎడిషన్‌లో (2025) శిఖర్ ధవన్ నేతృత్వంలోని ఇండియన్ రాయల్స్ బోణీ కొట్టింది. నిన్న (మార్చి 11) శ్రీలంక లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 46 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 19.5 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌటైంది. వన్‌డౌన్ బ్యాటర్ ఫయాజ్ ఫజల్ (52) మెరుపు అర్ద సెంచరీ సాధించి భారత్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. భారత ఇన్నింగ్స్‌లో శిఖర్ ధవన్ 16, రాహుల్ యాదవ్ 21, మనోజ్ తివారి 3, యోగేశ్ నగర్ 0, మన్‌ప్రీత్ గోని 28, జకాతి 23, అనురీత్ సింగ్ 2 పరుగులు చేయగా.. రోహన్ రతి, మునాఫ్ పటేల్ డకౌట్లయ్యారు. లంక బౌలర్లలో సంజయ 4 వికెట్లు పడగొట్టి టీమిండియాను ఇబ్బంది పెట్టాడు. తిలకరత్నే దిల్షన్ 2, అరుల్ ప్రగాసమ్, ఉపుల్ ఇంద్రసిరి, తుషారా, కెప్టెన్ తిసారి పెరీరా తలో వికెట్ పడగొట్టారు.అనంతరం శ్రీలంక భారత బౌలర్ల ధాటికి 19.2 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో జకాతి 3 వికెట్లు పడగొట్టగా.. మనోజ్ తివారి, అనురీత్ సింగ్, మన్‌ప్రీత్ గోని తలో 2 వికెట్లు తీశారు. లంక ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. 35 పరుగులు చేసిన లసిత్ లక్షన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మెవన్ ఫెర్నాండో (20 నాటౌట్), రవీన్ సాయర్ (18), తిసారి పెరీరా (10) రెండంకెల స్కోర్లు చేశారు. స్టార్ బ్యాటర్ తిలకరత్నే దిల్షన్ ఒక్క పరుగుకే ఔటయ్యాడు. ఈ టోర్నీలో భారత్ మొన్న (మార్చి 10) జరగాల్సిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టైగర్స్‌తో తలపడాల్సి ఉండింది. అయితే ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య నిన్న జరగాల్సిన మరో మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దైంది. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ పఠాన్స్‌పై ఆసియా స్టార్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.కాగా, ఆసియా లెజెండ్స్ లీగ్ తొలి ఎడిషన్ (2025) మార్చి 10న ఘనంగా ప్రారంభమైంది. ఈ టోర్నీలో మొత్తం ఐదు జట్లు (ఏషియన్ లయన్స్, శ్రీలంక లయన్స్, ఆఫ్ఘనిస్తాన్ పఠాన్స్, ఇండియన్ రాయల్స్, బంగ్లాదేశ్ టైగర్స్) పాల్గొంటున్నాయి. ఏషియా ప్రాంతానికి చెందిన మాజీ స్టార్ క్రికెటర్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. ఇండియన్ రాయల్స్ తరఫున టీమిండియా స్టార్లు శిఖర్ ధవన్, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, అంబటి రాయుడు, మనోజ్ తివారి, మునాఫ్ పటేల్ తదితర స్టార్లు ఆడుతున్నారు. -
లేటు వయసులోనూ రెచ్చిపోతున్న దిగ్గజాలు.. మాస్టర్స్ లీగ్‌లో మరో సెంచరీ
క్రికెట్ దిగ్గజాలు లేటు వయసులోనూ రెచ్చిపోతున్నారు. యువ ఆటగాళ్లకు తామేమీ తీసిపోమని పరుగుల వరద పారిస్తున్నారు. దిగ్గజాల కోసం తొలిసారి నిర్వహించిన ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌లో మాజీ క్రికెటర్లు సెంచరీల మోత మోగిస్తున్నారు. ఈ టోర్నీలో ఇప్పటివరకు 14 మ్యాచ్‌లు జరగ్గా ఏకంగా ఏడు సెంచరీలు నమోదయ్యాయి. ఇందులో ఆసీస్ దిగ్గజం షేన్ వాట్సన్ ఒక్కడే 3 సెంచరీలు బాదాడు. ఇంగ్లండ్ మాజీ ఆటగాడు బెన్ డంక్, శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర, శ్రీలంక మాజీ బ్యాటర్ ఉపుల్ తరంగ, తాజాగా విండీస్ మాజీ ప్లేయర్ లెండిల్ సిమన్స్ తలోసారి శతక్కొట్టారు. ఈ టోర్నీలో భారత్ తరఫున ఒక్క సెంచరీ కూడా నమోదు కానప్పటికీ.. దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్, అంబటి రాయుడు, యూసఫ్ పఠాన్, గురుకీరత్ సింగ్, సౌరభ్ తివారి తలో హాఫ్ సెంచరీ చేశారు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన సచిన్ పూర్వపు రోజుల గుర్తు చేశాడు.నిన్నటి మ్యాచ్ విషయానికొస్తే.. సౌతాఫ్రికా మాస్టర్స్‌పై విండీస్ మాస్టర్స్ 29 పరుగుల తేడాతో విజయం సాధించారు. ఈ మ్యాచ్‌లో విండీస్ బ్యాటర్ లెండిల్ సిమన్స్ చెలరేగిపోయాడు. కేవలం 54 బంతుల్లోనే శతకొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తంగా 59 బంతుల ఎదుర్కొన్న సిమన్స్ 13 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 108 పరుగులు చేశాడు. విండీస్ ఇన్నింగ్స్ చివర్లో చాడ్విక్ వాల్టన్ (12 బంతుల్లో 38 నాటౌట్; 6 సిక్సర్లు) సిక్సర్ల సునామీ సృష్టించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. డ్వేన్ స్మిత్, పెర్కిన్స్ తలో 5 పరుగులు చేయగా.. దిగ్గజ ఆటగాడు బ్రియాన్ లారా 29, ఆష్లే నర్స్ డకౌటయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో క్రూగర్, ఎన్తిని తలో 2 వికెట్లు తీయగా.. మెక్ లారెన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. రవి రాంపాల్ 5 వికెట్లతో విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 171 పరుగులు మాత్రమే చేయగలిగింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో రిచర్డ్ లెవి 44, జాక్ కల్లిస్ 45, జాక్ రుడాల్ఫ్ 39 పరుగులు చేశారు. హషిమ్ ఆమ్లా (3), అల్విరో పీటర్సన్ (7) లాంటి స్టార్లు విఫలమయ్యారు. ఈ టోర్నీలో శ్రీలంక, భారత్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా ఇదివరకే సెమీస్‌కు అర్హత సాధించగా.. సౌతాఫ్రికా, ఇంగ్లండ్ నిష్క్రమించాయి. శ్రీలంక, భారత్ తలో 5 మ్యాచ్‌ల్లో 4 మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. -
ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాట్రిక్
మహిళల ఐపీఎల్లో (WPL) ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాట్రిక్ సాధించింది. వరుసగా మూడో సీజన్లో ఫైనల్‌కు చేరింది. డబ్ల్యూపీఎల్-2025లో టేబుల్ టాపర్‌గా నిలువడం ద్వారా ఈ ఘనత సాధించింది. గత రెండు సీజన్లలో ఫైనల్‌కు చేరినా ఢిల్లీకి టైటిల్ అందని ద్రాక్షాలానే ఉంది. మెగ్ లాన్నింగ్ సేన ఈసారైనా టైటిల్ నెగ్గుతుందో లేదో చూడాలి. డబ్ల్యూపీల్ ప్రారంభం (2023) నాటి నుంచి అద్భుత విజయాలు సాధిస్తూ వస్తున్న ఢిల్లీ.. ఫైనల్లో మాత్రం ప్రత్యర్ధులకు తలోగ్గుతుంది. 2023 సీజన్ ఫైనల్లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిన ఢిల్లీ.. గత సీజన్ ఫైనల్లో ఆర్సీబీ చేతిలో చిత్తైంది. ఈసారి ఫైనల్లో ఢిల్లీ ప్రత్యర్థి ఎవరో తేలాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాలి. ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య రేపు (మార్చి 13) జరుగబోయే ఎలిమినేటర్ మ్యాచ్‌లో విజేతతో ఢిల్లీ ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటుంది.కాగా, ప్రస్తుత సీజన్లో మెగ్ లాన్నింగ్ నేతృత్వంలోని ఢిల్లీ జట్టు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించి టేబుల్ టాపర్‌గా నిలిచి దర్జాగా ఫైనల్‌కు చేరింది. టేబుల్ టాపర్ అయ్యే అవకాశాన్ని ముంబై ఇండియన్స్ తృటిలో కోల్పోయింది. నిన్న (మార్చి 11) జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్‌లో ముంబై ఆర్సీబీ చేతిలో ఓడి రెండో స్థానంతో సరిపెట్టుకుంది. ముంబై సైతం 8 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించినప్పటికీ.. ఆ జట్టు రన్‌రేట్ ఢిల్లీ కంటే కాస్త తక్కువగా ఉంది. ఢిల్లీ 0.396 రన్‌రేట్ కలిగి ఉండగా.. ముంబై 0.192 రన్‌రేట్‌తో గ్రూప్ దశ ముగించింది. నిన్నటి మ్యాచ్‌లో ముంబై ఆర్సీబీ చేతిలో ఓడినప్పటికీ రన్‌రేట్ ఇంకాస్త పెంచుకుని ఉంటే ఫైనల్‌కు చేరేది. అక్కడికి మెరుగైన రన్‌రేట్ సాధించేందుకు ముంబై తీవ్రంగా పోరాడింది.తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 199 పరుగులు చేయగా.. ముంబై పరుగుల వేట 188 పరుగుల వద్దే ఆగిపోయింది. ఈ ఎడిషన్‌లో ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయిన మరో జట్టు గుజరాత్ జెయింట్స్. గత రెండు సీజన్లలో అట్టడుగు స్థానంలో నిలిచిన గుజరాత్.. ఈ సీజన్లో అనూహ్య విజయాలు సాధించి ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకుంది. ఈ సీజన్లో గుజరాత్ 8లో 4 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది.ఇక డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఆర్సీబీ.. ఆదిలో అదిరిపోయే విజయాలు సాధించినప్పటికీ ఆతర్వాత వరుసగా ఐదు ఓటములు ఎదుర్కొని ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. నిన్న ముంబైతో జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో మంచి స్కోర్ చేసి గెలవడంతో ఆర్సీబీ నాలుగో స్థానాన్నైనా దక్కించుకోగలిగింది. ఈ మ్యాచ్‌లో ఓడినా లేక నామమాత్రంగా గెలిచినా ఈ సీజన్లో ఆర్సీబీ ఆఖరి స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చేది. ఈ సీజన్లో ఆ జట్టు ఎనిమిదింట మూడు విజయాలు సాధించింది. యూపీ వారియర్జ్ విషయానికొస్తే.. ఈ జట్టు గత రెండు సీజన్ల లాగే ఈ సీజన్లోనూ నామమాత్రపు ప్రదర్శనలు చేసి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. యూపీ ఈ సీజన్లో ఆర్సీబీ లాగే 8 మ్యచ్‌ల్లో 3 గెలిచి చివరి స్థానంలో నిలిచింది. యూపీతో పోలిస్తే ఆర్సీబీ రన్‌రేట్ కాస్త మెరుగ్గా ఉంది. మార్చి 15న ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో జరిగే ఫైనల్లో ఢిల్లీ.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో విజేతతో తలపడుతుంది. -
ప్రణామ్ ప్రణవ్
ఆరేళ్ల వయసులో ఎత్తులు వేయడం నేర్చుకున్న ఆ చిన్నారి... పదహారేళ్లు వచ్చేసరికి గ్రాండ్‌మాస్టర్ హోదా దక్కించుకున్నాడు. మ్యాచ్‌కు ముందు పావులతో ప్రాక్టీస్ చేయడం పక్కనపెట్టి క్రికెట్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ ఇలా వేర్వేరు ఆటల్లో నిమగ్నమయ్యే అలవాటున్న ఆ కుర్రాడు... తాజాగా మరో ఘనత తన పేరిట లిఖించుకున్నాడు. విశ్వ చదరంగ వేదికపై భారత జోరు సాగుతున్న క్రమంలో... ఆ కుర్రాడు ప్రపంచ చాంపియన్‌గా అవతరించాడు. ఇటీవల మోంటెనిగ్రోలో జరిగిన ప్రపంచ జూనియర్ చెస్ చాంపియన్‌షిప్ అండర్–20 ఓపెన్ విభాగంలో విజేతగా నిలిచిన ఆ కుర్రాడే... ప్రణవ్ వెంకటేశ్! రెండేళ్ల క్రితమే గ్రాండ్‌మాస్టర్ హోదా దక్కించుకున్న ఈ తమిళనాడు యువ సంచలనం... భవిష్యత్తులో నిలకడగా విజయాలు సాధించడమే తన లక్ష్యమని అంటున్నాడు. చదరంగానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన చెన్నైకి చెందిన ఈ కుర్రాడి ప్రస్థానాన్ని ఓసారి పరిశీలిస్తే... – సాక్షి క్రీడావిభాగం జూనియర్ ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ ప్రారంభానికి సరిగ్గా ఏడాది క్రితం... ప్రణవ్ ప్రయాణం క్రికెట్ మైదానంలో మొదలైంది. అదేంటి అప్పటికే గ్రాండ్‌మాస్టర్ హోదా దక్కించుకున్న ప్రణవ్ క్రికెట్ గ్రౌండ్ నుంచి ప్రాక్టీస్ ప్రారంభించడం ఏంటి అని సందేహిస్తున్నారా? ప్లేయర్లు ఆటవిడుపు కోసం అప్పుడప్పుడు వేరే క్రీడలు ఆడటం పరిపాటే! అలాగే చెన్నైలోని పెరంబూరు సమీపంలోని చెస్ అకాడమీలో సీనియర్ గ్రాండ్‌మాస్టర్ శ్యామ్‌సుందర్ నిర్వహిస్తున్న కోచింగ్‌కు వరుణ్ హాజరయ్యాడు. ఆటగాళ్లను శారీరకంగా చురుకుగా ఉంచడంతో పాటు వారిలో ఉత్సాహం నింపేందుకు నిర్వహిస్తున్న క్యాంప్‌లో ప్రణవ్ క్రికెట్ పాఠాలు నేర్చుకున్నాడు. అప్పటి వరకు శ్యామ్‌సుందర్ వద్ద శిక్షణ తీసుకోని వరుణ్... ఆ తర్వాత అతడితో అనుబంధం పెంచుకున్నాడు. గతంలో ఇతర కోచ్‌ల వద్ద ట్రైనింగ్ తీసుకున్న అతడు... శ్యామ్‌లో ఓ సోదరుడిని చూసుకున్నాడు. తన ఆలోచనలకు దగ్గరగా ఉన్న శ్యామ్‌తో ప్రయాణం తనకు లాభసాటి అని భావించి తండ్రి వెంకటేశ్ అనుమతితో అతడి దగ్గర శిష్యరికం ప్రారంభించాడు. క్లాసికల్ కష్టమైనా... బ్లిట్జ్ గేమ్‌లో చక్కటి ప్రదర్శన కనబర్చిన ప్రణవ్ ఇప్పటికే ఆన్లైన్ మ్యాచ్‌ల్లో మాగ్నస్ కార్ల్సన్ వంటి ప్రపంచ చాంపియన్లపై విజయాలు సాధించాడు. ప్రారంభంలో బ్లిట్జ్ నుంచి క్లాసికల్‌కు మారేందుకు కాస్త సమయం తీసుకున్న ప్రణవ్... ఆ తర్వాత ఫార్మాట్‌తో సంబంధం లేకుండా మెరుగైన ఆటతీరు కనబర్చడం ప్రారంభించాడు. శ్యామ్ వద్ద శిక్షణ ప్రారంభించిన రెండు నెలలకే స్పెయిన్ వేదికగా జరిగిన టోర్నీల్లో పాల్గొనేందుకు వరుణ్ విరామం తీసుకున్నాడు. ఆ సమయంలో సరైన ఫలితాలు రాకపోవడంతో... మరింత సమయం తీసుకున్న శ్యామ్... వరుణ్ ఆటతీరుకు తగ్గట్లు ప్రణాళికలు రూపొందించడం ప్రాంరభించాడు. ఆ దిశగా కసరత్తు చేయడంతో... దుబాయ్ చాంపియన్‌షిప్, షార్జా మాస్టర్స్‌లో అతడు విజేతగా నిలిచాడు. గతేడాది డిసెంబర్లో చెన్నై చాలెంజర్స్ ఇన్విటేషనల్ టోర్నీలో విజేతగా నిలవడం ద్వారా ప్రణవ్ ప్రతిష్టాత్మక చెన్నై మాస్టర్స్ టోర్నీకి అర్హత సాధించాడు. బాటిల్ మూతలతో క్రికెట్... మ్యాచ్‌కు ముందు ఆటవిడుపుగా క్రికెట్, టేబుల్ టెన్నిస్, షటిల్ ఆడటం ప్రణవ్‌కు అలవాటు. దీంతో హోటల్ రూమ్‌లో బాటిల్ మూతలను బాల్‌గా భావించి మంచి నీళ్ల సీసాలతోనే కోచ్ శ్యామ్‌తో కలిసి క్రికెట్ ఆడేవాడు. దీంతోనే ఇతర ఆలోచనలు దరిచేరనివ్వకుండా మనసును లగ్నం చేసుకునే వాడు. సామాజిక మాధ్యమాలకు కూడా దూరంగా ఉండేవాడు. ప్రపంచ జానియర్ చెస్ చాంపియన్‌సిప్ ప్రారంభానికి ముందు కొన్ని ఆన్లైన్ సెషన్లలో పాల్గొన్న ప్రణవ్... ప్రత్యర్థిపై కాస్త ఆధిక్యం దక్కినా... దాన్ని కొనసాగిస్తూ మరిన్ని అవకాశాలు సృష్టించుకోవడాన్ని అలవాటుగా చేసుకున్నాడు. శిక్షణ సమయంలో విభిన్న ప్రత్యామ్నాయాలను ప్రయత్నించే ప్రణవ్... ఒక్కసారి మ్యాచ్ ప్రారంభమైతే... ప్రత్యర్థి ఆటతీరును బట్టి ప్రణాళికలు మార్చుకోవడంలో ఆరితేరాడు. దాని ఫలితమే... విశ్వనాథన్ ఆనంద్ (1987), పెంటేల హరికృష్ణ (2004), అభిజిత్ గుప్తా (2008) తర్వాత... ప్రపంచ జూనియర్ చెస్ చాంపియన్‌గా నిలిచిన నాలుగో భారత ప్లేయర్‌గా ప్రణవ్ గుర్తింపు పొందాడు. అజేయంగా... తాజా ప్రపంచ జూనియర్ చెస్ చాంపియన్‌షిప్ అండర్–20 ఓపెన్ విభాగంలో మొత్తం 11 రౌండ్ల పాటు పోటీలు జరగగా... ప్రణవ్ 9 పాయింట్లతో అగ్ర స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో 7 గేమ్‌లు గెలిచిన ప్రణవ్... మిగిలిన 4 గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా వరల్డ్ చాంపియన్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. ‘ఆటలో క్లిష్ట పరిస్థితులు ఎదురైనా... ఏమాత్రం వెనక్కి తగ్గని ప్రణవ్... ఏ క్షణంలోనూ ఆత్మవిశ్వాసం కోల్పోడు. ఇద్దరం తమిళనాడుకు చెందిన వాళ్లమే కావడంతో... తమిళంలోనే మాట్లాడుకుంటాం. దీంతో ఒకరి భావాలు మరొకరం సులభంగా అర్థం చేసుకుంటాం. కామెడీ సినిమాలను ఎక్కువ ఇష్టపడే ప్రణవ్... ఆట తప్ప వేరే ఆలోచనలను దరిచేరనివ్వడు. ఆ క్రమశిక్షణే అతడిని ఈ స్థాయికి తెచ్చింది. చదరంగ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తరహాలో నిలకడ కొనసాగించడమే ప్రణవ్ లక్ష్యం’ అని 32 ఏళ్ల శ్యామ్ వివరించాడు. క్రికెట్‌కు వీరాభిమాని... క్రికెట్‌ను విపరీతంగా అభిమానించే ప్రణవ్ కు... నేటి తరం ప్రేక్షకుల్లాగే టెస్టుల కన్నా... వన్డే, టి20 ఫార్మాట్లంటేనే ఎక్కువ ఇష్టం. చదరంగంలో క్లాసికల్ గేమ్ టెస్టుల మాదిరి కాగా... వన్డే, టి20ల వంటి ర్యాపిడ్, బ్లిట్జ్‌లో ప్రణవ్ వేగం శ్యామ్‌సుందర్‌ను ఆకట్టుకుంది. కాస్త సానబెడితే అద్భుతాలు సాధించగల సత్తా అతడిలో ఉందని గుర్తించిన శ్యామ్ ఆ దిశగా ప్రయాణం ప్రారంభించాడు. ఏడాది శిక్షణలో అతడికిష్టమైన ర్యాపిడ్ బ్లిట్జ్‌లో మరింత మెరుగు పరుస్తూనే... సంపద్రాయ క్లాసికల్పై కూడా ఆసక్తి పెరిగేలా చేశాడు. ‘గత సంవత్సరం జనవరి నుంచి అధికారికంగా మేమిద్దరం కలిసి పనిచేస్తున్నాం. అప్పటికే గ్రాండ్‌మాస్టర్ అయిన ప్రణవ్ను మరింత మెరుగు పర్చేందుకు తగిన ప్రణాళికలు రూపొందించాను. టి20 క్రికెట్లో దూకుడుగా ఆడేందుకు వీలుంటుంది. అదే టెస్టు క్రికెట్లో ఓపిక ముఖ్యం. ప్రణవ్ కూడా క్విక్ ఫార్మాట్లో చక్కటి ప్రదర్శన చేస్తున్నాడు. కానీ సుదీర్ఘ ఫార్మాట్ వంటి క్లాసికల్లో మరింత ప్రావీణ్యం పొందే విధంగా తర్ఫీదునిచ్చాను’ అని శ్యామ్ సుందర్ విరించాడు. -
బెంగళూరు గెలిచింది
ముంబై: ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో నిలిచి నేరుగా ఫైనల్ చేరాలనుకున్న ముంబై ఆశలపై డిఫెండింగ్ చాంప్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) నీళ్లు చల్లింది. డబ్ల్యూపీఎల్ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఆర్సీబీ 11 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. దీంతో రెండో స్థానంతోనే సరిపెట్టుకున్న హర్మన్‌ప్రీత్ సేన ఫైనల్‌కు అర్హత సాధించేందుకు రేపు గుజరాత్ జెయింట్స్‌తో ‘ప్లేఆఫ్’ మ్యాచ్ ఆడనుంది. వరుసగా ఐదు ఓటముల తర్వాత ఆర్సీబీ విజయం సాధించడం విశేషం. తాజా ఫలితంతో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా మూడో సీజన్లోనూ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఢిల్లీ, ముంబై చెరో 10 పాయింట్లతో సమంగా నిలిచినా ... రన్‌రేట్‌తో క్యాపిటల్స్ ముందంజ వేసింది. 2023, 2024లలో కూడా ఢిల్లీ ఫైనల్ చేరినా... రన్నరప్‌గానే సరిపెట్టుకుంది. మంగళవారం జరిగిన పోరులో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ స్మృతి మంధాన (37 బంతుల్లో 53; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఎలీస్ పెరీ (38 బంతుల్లో 49 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగారు. అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసి పోరాడి ఓడింది. నాట్ సివర్ బ్రంట్ (35 బంతుల్లో 69; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించింది. బెంగళూరు బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ స్నేహ్ రాణా (3/26) మూడు... కిమ్ గార్త్, పెరీ చెరో రెండు వికెట్లు తీశారు. అందరూ ధాటిగా... బెంగళూరు జట్టులో క్రీజులోకి దిగినవారంతా ధాటిగా పరుగులు సాధించారు. సబ్బినేని మేఘన (13 బంతుల్లో 26; 4 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్స్మృతి ఓపెనింగ్ వికెట్‌కు 22 బంతుల్లో 41 పరుగులు జోడించారు. తర్వాత కెప్టెన్ మంధానకు జతయిన ఎలీస్ పెరీ కూడా వేగంగా ఆడటంతో బెంగళూరు స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. వీళ్లిద్దరు రెండో వికెట్‌కు 59 పరుగులు జోడించారు. స్మృతి నిష్క్రమణతో క్రీజులోకి వచ్చిన రిచా ఘోష్ (22 బంతుల్లో 36; 5 ఫోర్లు, 1 సిక్స్) తనదైన శైలిలో దూకుడు కనబరిచింది. రిచా, పెరీలిద్దరూ జట్టు స్కోరును 150 పరుగులు దాటించారు. అనంతరం రిచా జోరుకు హేలీ అడ్డుకట్ట వేసింది. అయితే జార్జియా వేర్హామ్ (10 బంతుల్లో 31 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) డెత్ ఓవర్లలో చెలరేగడంతో ప్రత్యర్థి ముందు 200 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రాణించిన నాట్ సివర్ ముంబై ఆరంభంలోనే తడబడింది. ఓపెనర్లు హేలీ మాథ్యూస్ (19), అమెలియా కెర్ (9) భారీ లక్ష్యానికి అనువైన శుభారంభాన్ని ఇవ్వలేకపోయారు. నాట్ సివర్ బ్రంట్ చక్కగా పోరాడినప్పటికీ తర్వాత వచ్చిన బ్యాటర్లు వికెట్లు పారేసుకోవడంతో ముంబై జట్టు లక్ష్యానికి దూరమైంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (20; 2 ఫోర్లు), అమన్‌జోత్ (17) ప్రభావం చూపలేకపోగా... ఆఖరి ఓవర్లో సజీవన్ సజన (12 బంతుల్లో 23; 1 ఫోర్, 2 సిక్స్‌లు) భారీ షాట్లతో వణికించింది. 3 బంతుల్లో 12 పరుగులు చేయాల్సిన దశలో ఆమె కూడా అవుట్ కావడంతో ముంబైకి ఓటమి ఖాయమైంది. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: మేఘన (సి) పారుణిక (బి) హేలీ మాథ్యూస్ 26; స్మృతి (సి) షబి్నమ్ (బి) అమెలియా 53; ఎలీస్ పెరీ నాటౌట్ 49; రిచా ఘోష్ (సి) నాట్ సివర్ (బి) హేలీ మాథ్యూస్ 36; జార్జియా నాటౌట్ 31; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 199. వికెట్ల పతనం: 1–41, 2–100, 3–153. బౌలింగ్: షబ్నిమ్ ఇస్మాయిల్ 4–0–41–0, నాట్ సివర్ 2–0–16–0, హేలీ మాథ్యూస్ 4–0–37–2, అమన్‌జోత్ 4–0–27–0, అమెలియా కెర్ 3–0–47–1, సంస్కృతి గుప్తా 1–0–6–0, పారుణిక సిసోడియా 2–0–24–0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: హేలీ మాథ్యూస్ (సి) గ్రాహమ్ (బి) స్నేహ్ రాణా 19; అమెలియా (సి) మంధాన (బి) స్నేహ్ రాణా 9; నాట్ సీవర్ (సి అండ్ బి) పెరీ 69; హర్మన్‌ప్రీత్ (సి) రిచా ఘోష్ (బి) కిమ్ గార్త్ 20; అమన్‌జోత్ (బి) గ్రాహమ్ 17; యస్తిక భాటియా (సి అండ్ బి) స్నేహ్ రాణా 4; సజన (సి) మేఘన (బి) పెరీ 23; కమలిని (సి) పెరీ (బి) జార్జియా 6; సంస్కృతి (సి) జోషిత (బి) కిమ్ గార్త్ 10; షబ్నిమ్ నాటౌట్ 4; పారుణిక నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 188. వికెట్ల పతనం: 1–27, 2–38, 3–78, 4–129, 5–134, 6–140, 7–152, 8–167, 9–188. బౌలింగ్: కిమ్ గార్త్ 4–0–33–2, ఎలీస్ పెరీ 4–0–53–2, స్నేహ్ రాణా 4–0–26–3, హిథెర్ గ్రాహమ్ 4–0–47–1, జార్జియా వేర్హామ్ 4–0–29–1. -
భారత రెజ్లర్లకు ఊరట
న్యూఢిల్లీ: భారత రెజ్లర్లకు మేలు చేసే కీలక నిర్ణయాన్ని కేంద్ర క్రీడాశాఖ తీసుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై విధించిన సస్పెన్షన్‌ను క్రీడా శాఖ ఎత్తేసింది. డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై స్టార్ రెజ్లర్ల లైంగిక ఆరోపణలు దరిమిలా చుట్టుముట్టిన వివాదాలు, కోర్టు కేసుల అనంతరం 15 నెలల క్రితం కొత్త కార్యవర్గం కొలువు దీరింది. కానీ రోజుల వ్యవధిలోనే కేంద్ర క్రీడా శాఖ ఆగ్రహానికి గురైంది. దీంతో పలు అంతర్జాతీయ ఈవెంట్లలో భారత రెజ్లర్లు పాల్గొనేందుకు ఇబ్బందులెదురవుతున్నాయి. రెజ్లర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు నిషేధాన్ని ఎత్తేసింది. కేంద్ర క్రీడా శాఖ మార్గదర్శకాలను డబ్ల్యూఎఫ్ఐ పాటించడంతో పాటు రెజ్లర్ల విస్తృత ప్రయోజనాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ శాఖ అధికారులు వెల్లడించారు. క్రీడాపాలసీ ప్రకారం డబ్ల్యూఎఫ్ఐ నడచుకోవాలని, వివాదాస్పద, కళంకిత అధికారులు, పాత కార్యవర్గ సభ్యులకు దూరంగా ఉండాలని, లేదంటే కఠిన చర్యలకు వెనుకాడమని క్రీడా శాఖ హెచ్చరించినట్లు తెలిసింది. డబ్ల్యూఎఫ్ఐ కార్యకలాపాలు మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ ఇంటినుంచే నిర్వహిస్తున్నారనే విమర్శలపై క్రీడాశాఖ పర్యవేక్షక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రత్యక్ష పరిశీలన అనంతరం ఇచి్చన నివేదికను బట్టే తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దీంతో వచ్చే ఏషియాడ్ (2026), లాస్ ఏంజెలెస్ (2028) ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలనుకునే రెజ్లర్లకు కొండంత ఆత్మవిశ్వాసం లభించినట్లయ్యింది. క్రీడాశాఖ నిర్ణయంపై డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు సంజయ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వానికి కృతజ్ఞతలు. సస్పెన్షన్ తొలగిపోవడంతో ఇక మా కార్యకలాపాలు సజావుగా జరిగేందుకు అవకాశం లభించింది. రెజ్లింగ్ క్రీడ అభ్యున్నతికి ఇలాంటి నిర్ణయం ఎంతో అవసరం కూడా! ఇప్పటికే ప్రతిభావంతులైన రెజ్లర్లు పలు అంతర్జాతీయ ఈవెంట్లకు దూరమయ్యారు. ఇకనుంచి వారంతా పతకాల కోసం పోటీపడొచ్చు’ అని అన్నారు. క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ సస్పెన్షన్‌ను ఇంకా కొనసాగిస్తే రెజ్లర్లకు అన్యాయం చేసిన వారమవుతామని చెప్పారు. రెజ్లర్లు అంతర్జాతీయ క్రీడావేదికలపై రాణించాలనే సదుద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్‌భూషణ్ మాట్లాడుతూ తనపై చేసిన తప్పుడు ఆరోపణలేవీ నిలబడలేదని చెప్పుకొచ్చారు. -
లక్ష్యసేన్ శుభారంభం
బర్మింగ్హమ్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ తొలి రోజు భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. తొలి రౌండ్లో లక్ష్యసేన్, మాళవిక బన్సోద్ విజయాలు సాధించి ముందంజ వేయగా... హెచ్ఎస్ ప్రణయ్ పరాజయంతో ఇంటిబాట పట్టాడు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో మంగళవారం ప్రపంచ 15వ ర్యాంకర్ లక్ష్యసేన్ 13–21, 21–17, 21–15తో ప్రపంచ 37వ ర్యాంకర్ లి యాంగ్ సు (చైనీస్ తైపీ)పై విజయం సాధించాడు. గంటా 15 నిమిషాల పాటు సాగిన పోరు తొలి గేమ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన లక్ష్య... హోరాహోరీగా సాగిన రెండో గేమ్ 17–17తో సమంగా ఉన్న సమయంలో చైనీస్ తైపీ షట్లర్ తప్పిదాలతో వరుస పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. నిర్ణయాత్మక మూడో గేమ్ ఆరంభం నుంచే దూకుడు కనబర్చిన లక్ష్యసేన్... నెట్ గేమ్‌తో ప్రత్యర్థిని ఉక్కిరి బిక్కిరి చేసి 11–9తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అయితే పట్టువదలని చైనీస్ తైపీ షట్లర్ 15–15తో స్కోరు సమం చేశాడు. అక్కడి నుంచి విజృంభించిన లక్ష్యసేన్... బలమైన రిటర్న్‌లతో చెలరేగి వరుసగా ఆరు పాయింట్లు సాధించి ప్రిక్వార్టర్స్‌కు చేరాడు. ఈ మ్యాచ్‌లో మూడో సీడ్ జొనాథన్ క్రిస్టి (ఇండోనేసియా)తో లక్ష్యసేన్ తలపడతాడు. 2024 పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక పోరులో క్రిస్టి చేతిలో ఓడిన లక్ష్యసేన్... ఆ పరాజయానికి బదులు తీర్చుకునేందుకు ఇది చక్కటి అవకాశం. మరో మ్యాచ్‌లో ప్రపంచ 29వ ర్యాంకర్ ప్రణయ్ 19–21, 16–21తో ప్రపంచ 17వ ర్యాంకర్ టోమా జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్) చేతిలో పరాజయం పాలయ్యాడు. 53 నిమిషాల పాటు సాగిన పోరులో ప్రణయ్ వరుస గేమ్‌ల్లో ఓడాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో రైజింగ్ స్టార్ మాళవిక బన్సోద్ 21–13, 10–21, 21–17తో జియా మిన్ యో (సింగపూర్)పై విజయం సాధించింది. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో ద్వయం 20–22, 18–21తో చెన్ చెంగ్–సెయి పెయి షాన్ జంట చేతిలో ఓడింది. మిక్స్డ్ డబుల్స్‌లో సతీశ్ కుమార్ కరుణాకరన్–ఆద్య జంట 6–21, 15–21తో జిన్ వా–చెన్ ఫెంగ్ హుయి (చైనా) ద్వయం చేతిలో ఓడింది. భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి బుధవారం బరిలోకి దిగనున్నారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో యున్ కిమ్ (దక్షిణ కొరియా)తో సింధు తలపడుతుంది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో డానియల్ లిండ్‌గార్డ్–మాడ్స్ వెస్టర్‌గాడ్ (డెన్మార్క్) జంటతో సాత్విక్–చిరాగ్ జోడీ ఆడుతుంది. -
భారత మహిళల కబడ్డీ జట్టుకు రూ. 67.50 లక్షల నగదు బహుమతి
ఆసియా కబడ్డీ చాంపియన్‌షిప్‌లో ఐదోసారి విజేతగా నిలిచిన భారత మహిళల జట్టుకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ రూ. 67.50 లక్షల నగదు బహుమతి అందించింది. ఇటీవల ఇరాన్ వేదికగా జరిగిన టోర్నీలో అజేయంగా నిలిచిన భారత మహిళల కబడ్డీ జట్టు... ఫైనల్లో 32–25 పాయింట్ల తేడాతో ఆతిథ్య ఇరాన్ జట్టును ఓడించింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత జట్టు ఐదో సారి ఈ టోర్నీలో విజేతగా నిలిచింది.మంగళవారం స్వదేశానికి తిరిగి వచ్చిన భారత మహిళల కబడ్డీ జట్టును కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అభినందించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ... ‘మహిళా అథ్లెట్లను మరింత ప్రోత్సహించేందుకు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాం. మహిళా కబడ్డీ ప్లేయర్లకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేకంగా కబడ్డీ లీగ్‌ను కూడా ప్రారంభించాలనుకుంటున్నాం’ అని అన్నారు. -
ఏబీ డివిలియర్స్ విధ్వంసం.. 28 బంతుల్లో సెంచరీ
దక్షిణాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ తన ప్రొఫెషనల్ క్రికెట్ రీ ఎంట్రీ మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించాడు. ఐపీఎల్-2021 తర్వాత ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన డివిలియర్స్.. తిరిగి సీఎస్ఎ లీగ్‌తో పునరాగమనం చేశాడు. ఈ లీగ్‌లో టైటాన్ లెజెండ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న డివిలియర్స్.. బుల్స్ లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.ఏబీడీ ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. క్రీజులోకి వచ్చినప్పటినుంచే బౌండరీల వర్షం కుర్పించాడు. ఈ క్రమంలో డివిలియర్స్ కేవలం 28 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 15 సిక్స్‌లతో 101 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.అతడి తుపాన్ ఇన్నింగ్స్ ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన టైటాన్ లెజెండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 278 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం లక్ష్య చేధనలో బుల్స్ లెజెండ్స్ 14 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. ఆ తర్వాత వరుణుడు ఎంట్రీ ఇవ్వడంతో టైటాన్ లెజెండ్స్‌ను విజేతగా ప్రకటించారు.డివిలియర్స్ దక్షిణాఫ్రికా తరుపున 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. మే 2018లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుని అందరికి ఏబీడీ షాకిచ్చాడు. ఆ తర్వాత 2019 వన్డే ప్రపంచ కప్‌లో ఆడాలని డివిలియర్స్ భావించాడు. కానీ అతడి అభ్యర్థనను క్రికెట్ దక్షిణాఫ్రికా తిరస్కరించింది. డివిలియర్స్‌కు అంతర్జాతీయ క్రికెట్లో 20,014 పరుగులు ఉన్నాయి. అదేవిధంగా 47 ఇంటర్ననేషనల్ సెంచరీలు అతడి పేరిట ఉన్నాయి.డివిలియర్స్‌కు ఐపీఎల్లో కూడా మంచి రికార్డు ఉంది. 2011-2021 వరకు 11 ఏళ్లపాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) తరఫున ఆడాడు. అంతకుముందు కొన్ని సీజన్ల పాటు ఢిల్లీ డెర్డేవిల్స్కు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్లో మొత్తం 184 మ్యాచ్‌ల్లో 39.71 సగటు, 151.69 స్ట్రైక్‌రేట్‌తో 5,162 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 40 అర్ధ సెంచరీలున్నాయి.చదవండి: #R Ashwin: ఛాంపియన్స్ ట్రోఫీ బెస్ట్ టీమ్.. రోహిత్ శర్మకు షాక్ -
పాకిస్తాన్ క్రికెట్ ఐసీయూలో ఉంది.. అన్నీ మారుతాయి: అఫ్రిది
పాకిస్తాన్ క్రికెట్ జట్టు గత 18 నెలలగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. వన్డే ప్రపంచకప్-2023, టీ20 ప్రపంచకప్-2024లో లీగ్ స్టేజీలోనే ఇంటిముఖం పట్టిన పాకిస్తాన్... ఇప్పుడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లోనూ అదే తీరును కనబరిచింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసిన పాక్ జట్టు.. గ్రూపు స్టేజిలోనే తమ ప్రయాణాన్ని ముగించింది. దీంతో పాకిస్తాన్ జట్టుపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి.ఈ క్రమంలో టీ20 జట్టు నుంచి కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్, స్టార్ ప్లేయర్లు బాబర్ ఆజం, షాహీన్ షా అఫ్రిదిలను పీసీబీ సెలక్షన్ కమిటీ తప్పించింది. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే గత ఏడాదిగా జట్టుగా దూరంగా ఉంటున్న ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్‌ను తీసుకొచ్చి ఏకంగా వైస్ కెప్టెన్సీ సెలక్టర్లు కట్టబెట్టారు. సెలక్టర్లు తీసుకున్న ఈ నిర్ణయాన్ని పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది తప్పుబట్టాడు."పాక్ జట్టులోకి ఎప్పుడు ఎవరు తిరిగి వస్తారో తెలియదు. దేశవాళీ క్రికెట్లో షాదాబ్ ఖాన్ దారుణంగా విఫలమయ్యాడు. అతడిని తీసుకొచ్చి వైస్ కెప్టెన్‌గా చేశారు. మెరిట్ ఆధారంగా నిర్ణయాలు తీసుకోనప్పుడు జట్టు పరిస్థితి ఇలానే ఉంటుంది. ప్రస్తుతం టీ20 సెటాప్‌లో లేని వారిని కూడా తిరిగి ఎంపిక చేస్తున్నారు.పాకిస్తాన్ క్రికెట్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఈవెంట్‌కు పీసీబీ ప్రతినిధిని ఎందుకు ఆహ్వానించలేదనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. పాక్ క్రికెట్ ప్రస్తుతం ఐసీయూలో ఉంది. మేము బాగుచేయడానికి ముందుకు వస్తాము. కొత్త చైర్మన్ వచ్చిన వెంటనే, ప్రతిదీ మారుతుంది.ప్రస్తుత క్రికెట్ బోర్డు ప్యానల్ మంచి జట్టును తయారు చేయడానికి సమయం కేటాయించడం లేదు. కెప్టెన్లు, కోచ్‌లను మార్చడంలో బీజీగా ఉంది. ప్రతీఒక్కరికి కొంతసమయమివ్వాలి. కోచ్‌లు తమ ఉద్యోగాలను కాపాడుకోవడానికి ఆటగాళ్లపై నిందిస్తారు. కాబట్టి అన్ని ఆలోచించాక ఏ నిర్ణయమైనా తీసుకోవాలని" అఫ్రిది పేర్కొన్నాడు.చదవండి: #R Ashwin: ఛాంపియన్స్ ట్రోఫీ బెస్ట్ టీమ్.. రోహిత్ శర్మకు షాక్ -
ఛాంపియన్స్ ట్రోఫీ బెస్ట్ టీమ్.. రోహిత్ శర్మకు షాక్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ముగిసిన సంగతి తెలిసిందే. ఆదివారం(మార్చి 9) దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి భారత్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 12 ఏళ్ల తర్వాత తిరిగి భారత్ సొంతమైంది.ఈ క్రమంలో టోర్నీలో ఉత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లతో కూడిన జట్టును భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రకటించాడు. ఈ పదకొండు మంది సభ్యుల జట్టులో నలుగురు భారత ప్లేయర్లకు చోటు దక్కింది. కెప్టెన్ రోహిత్ శర్మకు మాత్రం అశ్విన్ తన ఎంచుకున్న టీమ్‌లో చోటు ఇవ్వలేదు. రోహిత్ శర్మ ఫైనల్లో 74 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అంతేకాకుండా కెప్టెన్సీ పరంగా రోహిత్ అదరగొట్టాడు. టోర్నీలో భారత్ ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ విజేతగా నిలిపాడు. ఐసీసీ ప్రకటించిన ఉత్తమ టీమ్‌లో కూడా రోహిత్‌కు చోటు దక్కలేదు.కాగా అశ్విన్ తన ఎంపిక చేసిన జట్టులో న్యూజిలాండ్‌కు చెందిన రచిన్ రవీంద్ర, ఇంగ్లండ్ ఆటగాడు బెన్ డకెట్లకు ఓపెనర్లగా అవకాశమిచ్చాడు. అదేవిధంగా ఫస్ట్ డౌన్లో భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి, సెకెండ్ డౌన్లో శ్రేయస్ అయ్యర్‌కు చోటు దక్కింది. వికెట్ కీపర్‌గా ఆస్ట్రేలియాకు చెందిన జోష్ ఇంగ్లిష్‌ను అశూ ఎంచుకున్నాడు.ఫినిషర్‌గా డేవిడ్ మిల్లర్‌కు ఛాన్స్ లభించింది. ఆల్‌రౌండర్ల కోటాలో అజ్మతుల్లా ఓమర్జాయ్, మైఖల్ బ్రేస్‌వెల్.. స్పెషలిస్ట్ స్పిన్నర్లగా వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్‌లకు చోటు దక్కింది. ఏకైక ఫాస్ట్ బౌలర్‌గా కివీస్ స్పీడ్ స్టార్ మాట్ హెన్రీని అశ్విన్ ఎంపిక చేశాడు. అశ్విన్ తన జట్టులో 12వ ప్లేయర్‌గా న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్‌ను ఎంచుకున్నాడు. అయితే ఐసీసీ మాత్రం తన ప్రకటించిన టీమ్‌కు శాంట్నర్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయడం గమనార్హం.ఆర్ అశ్విన్ ఎంపిక చేసిన బెస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు: రచిన్ రవీంద్ర, బెన్ డకెట్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, జోష్ ఇంగ్లిస్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మైఖేల్ బ్రేస్‌వెల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, మాట్ హెన్రీ. 12వ ఆటగాడు: మిచెల్ సాంట్నర్చదవండి: రిషబ్ పంత్ ఇంట్లో పెళ్లి భజాలు.. సందడి చేయనున్న భారత క్రికెటర్లు -
రిషబ్ పంత్ ఇంట్లో పెళ్లి భజాలు.. సందడి చేయనున్న భారత క్రికెటర్లు
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇంట్లో పెళ్లి భజాలు మోగనున్నాయి. అతడి సోదరి సాక్షి పంత్ పెళ్లి పీటలు ఎక్కనుంది. సాక్షి పంత్.. వ్యాపారవేత్త అంకిత్ చౌదరిని వివాహం చేసుకోబోతోంది. ఈ వివాహ వేడుకలు మంగళవారం, బుధవారం ముస్సోరీలో జరగనున్నట్లు తెలిసింది.ఈ వివాహానికి భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని హాజరు కానున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. కాగా 9 ఏళ్లపాటు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట.. గతేడాది నిశ్చితార్థం చేసుకున్నారు. లండన్‌లో జరిగిన వారి నిశ్చితార్థానికి ఎంఎస్ ధోని హాజరయ్యాడు.లక్నో కెప్టెన్‌గా..ఇక ఛాంపియన్స్ ట్రోఫీ-2025 గెలుచుకున్న భారత జట్టులో పంత్ సభ్యునిగా ఉన్నాడు. కానీ ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం పంత్‌కు రాలేదు. కేఎల్ రాహుల్ ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్‌గా ఉండడంతో పంత్‌కు తుది జట్టులో చోటుదక్కలేదు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ఐపీఎల్‌పైనే పడింది. ఐపీఎల్-2025 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది.ఒకట్రెండు రోజులు విశ్రాంతి తీసుకుని ఆటగాళ్లంతా తమ తమ జట్లలో చేరనున్నారు. ఇప్పటికే రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా వంటి స్టార్ ప్లేయర్లు తమ ప్రాతినిథ్యం వహిస్తున్న ఫ్రాంచైజీలతో కలిశారు. ఈ ఏడాది సీజన్ ఐపీఎల్లో రిషబ్ పంత్ లక్నో సూపర్‌జెయింట్స్ తరపున ఆడనున్నాడు. గత డిసెంబర్లో జరిగిన మెగా వేలంలో పంత్‌ను రూ.27 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా పంత్ రికార్డులెక్కాడు. ఈ సీజన్లో లక్నో కెప్టెన్‌గా పంత్ వ్యవహరించనున్నాడు.చదవండి: అక్షర్, రాహుల్ కాదు..? ఢిల్లీ కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్!? -
'ప్రపంచ క్రికెట్‌ని భారత్ శాసిస్తుంది’
టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin)ది ప్రత్యేక శైలి. స్వతహాగా ఇంజనీర్ అయిన అశ్విన్ తన స్పిన్ బౌలింగ్ లోనూ అదే మేధస్సును ప్రదర్శించాడు. గత సంవత్సరం జరిగిన ఆస్ట్రేలియా సిరీస్ మధ్యలోనే రిటైర్మెంట్ ప్రకటించిన 38 అశూ.. ఆటను విశ్లేషించడంలో మాంచి దిట్ట. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజయంపై కూడా తనదైన శైలిలో స్పందించాడు. ప్రస్తుత భారత్ జట్టు 1990- 2000లలో దశాబ్ద కాలంలో ఆస్ట్రేలియా ప్రపంచ క్రికెట్ ని ఎలా శాసించిందో.. అదే రీతిలో విజయ పరంపర కొనసాగిస్తుందని వ్యాఖ్యానించాడు.భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy)ని గెలుచుకున్న తర్వాత ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో అశ్విన్ మాట్లాడుతూ.. ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా లేకుండానే భారత్ ఈ విజయం సాధించడం చాలా ప్రత్యేకమైందన్నాడు. ఇది భారత బౌలింగ్ లైనప్ బలాన్ని రుజువు చేసిందని వ్యాఖ్యానించాడు.బౌలింగ్ వల్లేటీమిండియా ఈసారి బ్యాటింగ్ వల్ల కాదు, బౌలింగ్ వల్లే ఈ ట్రోఫీ గెలిచిందని. .ఇది అందరూ గుర్తించాల్సిన అవసరం ఉందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. ఈ సందర్భంగా గ్రాస్ రూట్ స్థాయిలో బౌలర్లకు మరింత మద్దతు, ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరముందని అశ్విన్ పిలుపునిచ్చాడు. బుమ్రా లేకుండా ఈ టోర్నమెంట్లో విజయం సాధిండానికి భారత్ బౌలర్ల చేసిన కృషి ని ప్రత్యేకంగా అభినందించక తప్పదని అశ్విన్ తెలియజేసాడు. వచ్చే సంవత్సరం జరిగే టీ20 ప్రపంచ కప్ గురించి మాట్లాడుతూ అశ్విన్ భారత జట్టుకు ముగ్గురు ప్రధాన ఆటగాళ్లను అశ్విన్ గుర్తించాడు. జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ మరియు వరుణ్ చక్రవర్తి భారత్ జట్టులో తప్పనిసరిగా ఉండాలని అశ్విన్ సూచించాడు. వారి ముగ్గురితో కూడిన బౌలింగ్ ని ఎదుర్కోవడం ప్రత్యర్థులకు భయంకరంగా ఉంటుందని వ్యాఖ్యానించాడు.రచిన్ కాదు వరుణ్ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూ జిలాండ్ అల్ రౌండర్ రచిన్ రవీంద్ర ని ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు ప్రకటించడం పై అశ్విన్ విభేదించాడు. రచిన్ రవీంద్రకి బదులుగా, భారత్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కి ఆ గౌరవం దక్కాల్సిందని అశ్విన్ పేర్కొన్నాడు. రచిన్ 263 పరుగులతో ఈ టోర్నమెంట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. "ఎవరేమి చెప్పినా, ఏం చేసినా, నా దృష్టిలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ కచ్చితంగా వరుణ్ చక్రవర్తి. అతను ఈ మొత్తం టోర్నమెంట్ ఆడలేదు. కానీ ఆడిన రెండు మూడు మ్యాచ్ లలోనే చాల కీలక భూమిక వహించాడు. వరుణ్ చక్రవర్తి లేకుంటే, ఈ భారత్ కి ఈ టోర్నమెంట్ చాల భిన్నంగా ఉండేదని నేను భావిస్తున్నాను. అతను భారత్ జట్టులో 'ఎక్స్ ఫ్యాక్టర్'.. జట్టు బౌలింగ్ కి వైవిధ్యాన్ని అందించాడు’’ అని అశ్విన్ స్పష్టంచేశాడు .ఆతిధ్య పాకిస్తాన్‌కి తలవంపులు ఓ వైపు భారత్ క్రికెటర్లు సంబరాల్లో మునిగిపోగా, ఈ టోర్నమెంట్ కి ఆతిధ్యమిచ్చి చివరికి ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా గ్రూప్ దశ నుంచి నిష్క్రమించిన పాకిస్తాన్ పరిస్థితి చాల దారుణంగా తయారైంది. ఈ టోర్నమెంట్ కి ఆతిధ్యమిచ్చిన గౌరవం దక్కకపోగా, ఆ జట్టు వైఫల్యంతో అవమానంతో తలవంపులు తెచ్చుకుంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మోహ్సిన్ నఖ్వీ దుబాయ్ లో భారత్, న్యూ జిలాండ్ ల మధ్య జరిగిన ఫైనల్ కి హాజరుకాకపోవడం మరో దుమారానికి దారితీసింది. భారత్ అన్ని మ్యాచ్ లను 'హైబ్రిడ్ మోడల్'లో దుబాయ్‌లో ఆడింది. దీనితో పాటు భయానకమైన ఎయిర్ షోలు, ఖాళీ స్టేడియంలు మరియు పేలవమైన డ్రైనేజీ వ్యవస్థలు ఐసీసీ టోర్నమెంట్‌కు పాకిస్తాన్ అధ్వాన్నస్థితిని బయటపెట్టాయి. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నిరసన తెలిజేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. దుబాయ్ లో జరిగిన ముగింపు వేడుకలో టోర్నమెంట్ డైరెక్టర్ సుమైర్ అహ్మద్ ను ఆహ్యానించకపోవడం పై పీసీబీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీనిపై ఐసీసీ వెలిబుచ్చిన కారణాలతో మొహ్సిన్ నఖ్వీ సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. -
మ్యాచ్ ఫిక్సింగ్.. అన్నీ చెప్పేస్తా: పాక్ మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు
పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్(Rashid Latif) సంచలన వ్యాఖ్యలు చేశాడు. తొంభైవ దశకంలో జరిగిన ‘మ్యాచ్ ఫిక్సింగ్’ దారుణాలను తాను త్వరలోనే బయటపెడతానని పేర్కొన్నాడు. తాను రాస్తున్న పుస్తకంలో ప్రతి విషయాన్ని విడమరిచి చెబుతానంటూ 90s ఆటగాళ్లు బెంబేలెత్తిపోయేలా చేశాడు.‘‘నేను ఒక పుస్తకం రాయడటం మొదలుపెట్టాను. ఇందులో 90వ దశకంలో జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్ గురించి రాయబోతున్నాను. అప్పట్లో ఇది తారస్థాయిలో ఉండేది. ఎవ్వరి గురించి దాచేదిలేదు. అన్ని విషయాలను పూర్తిగా బయటపెట్టేస్తాను.మ్యాచ్ ఫిక్సింగ్.. అన్నీ చెప్పేస్తాఅందులో ఎవరెవరి పాత్ర ఏమిటన్నది కూడా చెప్తాను. ఏ మాజీ కెప్టెన్ అయితే.. అధ్యక్షుడి క్షమాభిక్ష కోసం ఎదురుచూశాడో.. అతడి గురించి కూడా పూర్తి వివరాలు అందిస్తా’’ అని రషీద్ లతీఫ్ ‘ది కరెంట్ పీకే’కు వెల్లడించాడు.అంతకు ముందు జియో న్యూస్‌తో మాట్లాడుతూ.. తొంభైవ దశకంలో ఆడిన వాళ్లు పాకిస్తాన్ జట్టుకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని రషీద్ లతీఫ్ అభిప్రాయపడ్డాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాకిస్తాన్ దారుణ ప్రదర్శన నేపథ్యంలో.. ‘‘పాకిస్తాన్ క్రికెట్ అంటే 90s ఆటగాళ్లకు నచ్చదు. వారి వల్లే వరల్డ్‌కప్ గెలవడం ఆలస్యమైంది.దయచేసి వీరందిని పాక్ క్రికెట్‌కు దూరంగా ఉంచండి. అప్పుడే అనుకున్న ఫలితాలు పొందవచ్చు. పాక్ క్రికెట్‌కు సేవ చేసీ చేసీ వాళ్లు అలసిపోయారు. కాబట్టి ఇకనైనా వారికి విశ్రాంతినివ్వండి’’ అని రషీద్ లతీఫ్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.చాలా వరకు స్క్రిప్టెడ్ఇక క్రిక్ఇన్ఫోకు రాసిన కాలమ్‌లోనూ రషీద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘‘నాకు తెలిసి.. క్రికెట్ మ్యాచ్‌లలో చాలా వరకు స్క్రిప్టెడ్. సినిమాలు, నాటకాల మాదిరే క్రికెట్ కూడా!.. టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఎన్ని పరుగులు రాబట్టాలి. ఎన్ని ఓవర్లు వేయాలి.. ఇలాంటివన్నీ ముందే చెప్తారు.ప్రతి ఒక్క ఆటగాడు తన భవిష్యత్తు గురించే ఆలోచిస్తారు. దీర్ఘకాలంపాటు జట్టులో కొనసాగలేమని అందరికీ తెలుసు. అందుకే డబ్బులు వచ్చే మార్గం కనిపించినపుడు ఇలా అడ్డదారులు తొక్కడం సహజమే. ఏదేమైనా ఒక ఆటగాడు స్వార్థపరుడైతే అతడు కచ్చితంగా అక్రమార్కుల వలలో చిక్కుకుంటాడు.తొలి ఐదేళ్లలో ఇది జరుగుతుంది. నా దృష్టిలో ప్రతిభలేని ఆటగాడి కంటే.. టాప్ ప్లేయర్ మరింత స్వార్థంగా ఉంటాడు’’ అని రషీద్ లతీఫ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. కాగా 1990లో పాక్ క్రికెట్‌ను ఫిక్సింగ్ ఉదంతం కుదిపేసింది. జస్టిస్ మాలిక్ మొహమద్ ఖయ్యూం నేతృత్వంలో ఏర్పాటైన దర్యాప్తు కమిటీ.. సుదీర్ఘ విచారణ అనంతరం మాజీ కెప్టెన్ సలీం మాలిక్, పేసర్ అటా ఉర్ రెహ్మాన్‌లను దోషులుగా తేల్చింది. దీంతో వారిపై జీవితకాల నిషేధం పడింది. ఘోర అవమానం ఇదిలా ఉంటే.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఆతిథ్య దేశంగా వ్యవహరించిన పాకిస్తాన్‌కు ఘోర అవమానం ఎదురైంది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకిదిగిన మెన్ ఇన్ గ్రీన్.. కనీసం ఒక్క మ్యాచ్ గెలవకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. గ్రూప్ దశలో న్యూజిలాండ్, టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిన రిజ్వాన్ బృందం.. ఆఖర్లో బంగ్లాదేశ్‌పైనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని భావించింది. అయితే, వర్షం వల్ల ఆ మ్యాచ్ రద్దు కావడంతో విజయమన్నదే లేకుండా ఈ వన్డే టోర్నీని ముగించింది. మరోవైపు.. తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో ఆడిన టీమిండియా చాంపియన్‌గా నిలిచి ట్రోఫీని ముద్దాడింది. చదవండి: IPL 2024: ట్రోఫీ గెలిచినా.. కోరుకున్న గుర్తింపు దక్కలేదు: శ్రేయస్ అయ్యర్ -
అక్షర్, రాహుల్ కాదు..? ఢిల్లీ కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్!?
ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన వెంటనే మరో క్రికెట్ పండగ అభిమానులను అలరించేందుకు సిద్దమైంది. ఐపీఎల్-2025 మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ కోలకతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ ఏడాది క్యాష్‌రిచ్ లీగ్ సీజన్లో పాల్గోనే మొత్తం పది జట్లు తమ ప్రాక్టీస్‌ను మొదలు పెట్టేశాయి.ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగమైన భారత ఆటగాళ్లు సైతం ఒక్కొక్కరుగా తాము ప్రాతినిథ్యం వహిస్తున్న జట్లతో చేరుతున్నారు. అయితే ఈ టోర్నీలో భాగమయ్యే పది జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ ఇంకా తమ కెప్టెన్ వివరాలను వెల్లడించలేదు. గతసీజన్ వరకు తమ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన రిషబ్ పంత్‌ను ఐపీఎల్ మెగా వేలంలోకి ఢిల్లీ విడిచిపెట్టింది. దీంతో ఢిల్లీ కెప్టెన్ ఎంపిక ఇప్పుడు అనివార్యమైంది.నో చెప్పిన రాహుల్..ఈ క్రమంలో ఐపీఎల్-2025 మెగా వేలంలో రూ.14 కోట్లకు కొనుగోలు చేసిన కేఎల్ రాహుల్‌కు ఢిల్లీ తమ జట్టు పగ్గాలను అప్పగిస్తుందని అంతాభావించారు. అంతా అనుకున్నట్లే అతడిని కెప్టెన్‌గా ఎంపికచేసేందుకు ఢిల్లీ యాజమాన్యం ముందుకు వచ్చింది. కానీ రాహుల్ మాత్రం కెప్టెన్సీపై తనకు ఆసక్తి లేదని, కేవలం బ్యాటర్‌గా మాత్రమే కొనసాగుతానని సున్నితంగా తిరష్కరించినట్లు తెలుస్తోంది. దీంతో భారత స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ బాధ్యతలు చెపడాతడని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.రేసులో డుప్లెసిస్..అయితే ఢిల్లీ కెప్టెన్సీ రేసులో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ క్యాపిట్సల్ మెనెజ్‌మెంట్ డుప్లెసిస్‌ను పేరును పరిశీలిస్తున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. కాగా డుప్లెసిస్‌కు కెప్టెన్‌గా చాలా అనుభవం ఉంది. గత మూడు సీజన్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా డుప్లెసిస్ వ్యవహరించాడు. అతడు కెప్టెన్సీలో ఐపీఎల్-2022,24 సీజన్లలో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ ఆర్హత సాధించింది. డుప్లెసిస్ కెప్టెన్‌గా కాకుండా వ్యక్తిగత ప్రదర్శన పరంగా కూడా ఆకట్టుకున్నాడు. డుప్లెసిస్ పలు ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్‌లో కూడా వ్యవహరిస్తున్నాడు. దీంతో అతడిని అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని తమ జట్టు పగ్గాలను అప్పగించాలని ఢిల్లీ భావిస్తోంది. ఒకట్రెండు రోజుల్లో ఢిల్లీ కొత్త కెప్టెన్ ఎవరన్నదానిపై ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.2025 ఐపీఎల్ సీజన్ కోసం ఢిల్లీ జట్టు..ఫాఫ్ డుప్లెసిస్, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, కరుణ్ నాయర్, సమీర్ రిజ్వి, అషుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, దర్శన్ నల్కండే, అజయ్ జాదవ్ మండల్, త్రిపురణ విజయ్, అక్షర్ పటేల్, మన్వంత్ కుమార్, మాధవ్ తివారి, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్, డొనొవన్ ఫెరియెరా, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, దుష్మంత చమీరా, మిచెల్ స్టార్క్, మోహిత్ శర్మ, టి నటరాజన్, ముకేశ్ కుమార్చదవండి: Hardik Pandya: ఈ విజయం ఆయనకే అంకితం.. హార్దిక్ పాండ్యా భావోద్వేగం -
Hardik Pandya: ఈ విజయం ఆయనకే అంకితం.. హార్దిక్ పాండ్యా భావోద్వేగం
భారత క్రికెట్ జట్టు.. 12 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని అందుకుంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) ను సొంతం చేసుకున్న టీమిండియా.. న్యూజిలాండ్‌పై పాతికేళ్ల నాటి ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. భారత్‌కు ఇది మూడో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ కావడం విశేషం. 2002లో తొలిసారిగా ఈ మెగా టోర్నీ టైటిల్‌ను భారత్‌కు సౌరవ్ గంగూలీ అందించగా.. ఆ తర్వాత 2013 ఎంస్ ధోని సారథ్యంలో తిరిగి మళ్లీ ఛాంపియన్స్‌గా నిలిచింది. మళ్లీ ఇప్పుడు పన్నెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఈ ట్రోఫీ భారత్ సొంతమైంది. టీమిండియా ఛాంపియన్స్‌గా నిలవడంలో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా(Hardhik Pandya)ది కీలక పాత్ర. ఈ టోర్నీ అసాంతం తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత్‌కు వెన్నముకగా నిలిచాడు.ముఖ్యంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో హార్దిక్ ఆడిన ఇన్నింగ్స్ ఎప్పటికి అభిమానులకు గుర్తుండిపోతుంది. అంతేకాకుండా పాకిస్తాన్‌పై కూడా సంచలన స్పెల్‌ను పాండ్యా బౌల్ చేశాడు. ఇక ఈ విజయాన్ని తన దివంగత తండ్రికి హార్దిక్ పాండ్యా అంకితమిచ్చాడు. తను సాధించిన ప్రతీ విజయం వెనుక తన తండ్రి దీవెనలు ఉన్నాయి పాండ్యా చెప్పుకొచ్చాడు."నేను, నా సోదరుడు ఏ స్ధాయి నుంచి ఇక్కడికి చేరుకున్నామో మాకు బాగా తెలుసు. ఇప్పటికీ మాకు ఇది ఒక కలలానే ఉంది. కానీ ఈ విషయం గురుంచి మేము ఎప్పుడూ ఎక్కువగా ఆలోచించలేదు. ఆ దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ, కష్టపడి పనిచేయడమే మా లక్ష్యంగా పెట్టుకున్నాము. మేము సాధించిన విజయాలను చూసి మా తల్లిదండ్రులు సంతోషించారు. మా నాన్న బౌతికంగా మాకు దూరమైనప్పటికి.. ఆయన ఆశీర్వాదాలు మాకు ఎప్పటికి ఉంటాయి. ఆయన పై నుంచి అన్ని చూస్తున్నారు" అంటూ హార్దిక్ ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భావోద్వేగానికి లోనయ్యాడు. కాగా హార్దిక్, కృనాల్ తండ్రి 2021లో గుండెపోటుతో మరణించారు.అదేవిధంగా 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఓటమిపై కూడా హార్దిక్ మాట్లాడాడు. "ఈ ఎనిమిదేళ్ల కాలంలో భారత క్రికెట్ జట్టు చాలా విజయాలు సాధించింది. ఏదేమైనప్పటికి ఎట్టకేలకు ఛాంపియన్స్ ట్రోఫీని సొంతంచేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందరూ స్వదేశానికి తిరిగి వెళ్లి సంబరాలు చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. భారత జట్టులో సీనియర్లు, జూనియర్లు అంటూ తారతామ్యాలు ఉండవు.. డ్రెసింగ్ రూమ్‌లో అందరం కలిసిమెలిసి ఉంటాము. నా పదేళ్ల కెరీర్లో చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇప్పటివరకు నేను నేర్చుకున్నది, నా అనుభవాలను కొత్తగా వచ్చిన ఆటగాళ్లతో పంచుకుంటూ ఉంటాను. అది అతడికి మాత్రమే కాకుండా జట్టుకు కూడా ఉపయోగపడుతుందని పాండ్యా పేర్కొన్నాడు. కాగా ఛాంపియన్స్ ట్రోఫీ-2017 ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో భారత్ ఓటమి చూసిన సంగతి తెలిసిందే.339 పరుగుల భారీ లక్ష్య చేధనలో టీమిండియా చతికలపడింది. హార్దిక్ పాండ్యా 76 పరుగులతో ఫైటింగ్ నాక్ ఆడినప్పటికి జట్టును మాత్రం ఓటమి నుంచి తప్పించలేకపోయాడు. కానీ ఈసారి మాత్రం పాకిస్తాన్‌ను చిత్తు చేసి గత ఓటమికి భారత్ బదులు తీర్చుకుంది.చదవండి: IPL 2024: ట్రోఫీ గెలిచినా.. కోరుకున్న గుర్తింపు దక్కలేదు: శ్రేయస్ అయ్యర్ -
ట్రోఫీ గెలిచినా.. కోరుకున్న గుర్తింపు దక్కలేదు: శ్రేయస్ అయ్యర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో అత్యధిక టైటిళ్లు గెలిచిన కెప్టెన్లుగా రోహిత్ శర్మ(Rohit Sharma), మహేంద్ర సింగ్(MS Dhoni) కొనసాగుతున్నారు. ముంబై ఇండియన్స్‌ను ఏకంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన ఘనత హిట్‌మ్యాన్‌కు దక్కగా.. అతడి తర్వాత ఐదుసార్లు ట్రోఫీ గెలిచిన సారథిగా ధోని చరిత్రకెక్కాడు. చెన్నై సూపర్ కింగ్స్ నాయకుడిగా ఈ ఫీట్ నమోదు చేశాడు.విన్నింగ్ కెప్టెన్ల జాబితాలోఇక గతేడాది కోల్‌కతా నైట్ రైడర్స్(KKR)ను విజేతగా నిలపడం ద్వారా మరో టీమిండియా స్టార్ శ్రేయస్ అయ్యర్ కూడా విన్నింగ్ కెప్టెన్ల జాబితాలో చోటు సంపాదించాడు. గౌతం గంభీర్ తర్వాత కేకేఆర్‌ను చాంపియన్‌గా నిలిపిన రెండో సారథిగా నిలిచాడు. అతడి సారథ్యంలో కోల్‌కతా గతేడాది అద్భుత విజయాలు సాధించింది.లీగ్ దశలో పద్నాలుగింట తొమ్మిది మ్యాచ్‌లు గెలిచి టాపర్‌గా ప్లే ఆఫ్స్ చేరిన కేకేఆర్.. క్వాలిఫయర్-1లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది. టైటిల్ పోరులోనూ మరోసారి సన్‌రైజర్స్‌తో తలపడి పైచేయి సాధించి.. విజేతగా అవతరించింది. దీంతో ఓవరాల్‌గా మూడోసారి కేకేఆర్ ఈ క్యాష్ రిచ్‌లీగ్‌లో విన్నర్‌గా నిలిచింది.అయితే, ఈ విషయంలో తనకు రావాల్సినంత గుర్తింపు దక్కలేదంటున్నాడు శ్రేయస్ అయ్యర్. ఐపీఎల్లో టైటిల్ సాధించినా తను కోరుకున్నట్లుగా ఏదీ జరుగలేదని పేర్కొన్నాడు. కాగా శ్రేయస్ ఇటీవల ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో అదరగొట్టిన విషయం తెలిసిందే. ఈ మెగా వన్డే టోర్నమెంట్లో ఐదు ఇన్నింగ్స్‌లో కలిపి 243 పరుగులతో టీమిండియా తరఫున టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు.తద్వారా భారత్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించి ప్రశసంలు అందుకుంటున్నాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024లో కేకేఆర్‌ను విజేతగా నిలిపినప్పటికీ వేలానికి ముందు ఫ్రాంఛైజీ శ్రేయస్ అయ్యర్‌ను రిటైన్ చేసుకోలేదు. దీంతో ఇరువర్గాల మధ్య విభేదాలు తలెత్తాయనే వార్తలు వచ్చాయి.ఈ నేపథ్యంలో ఐపీఎల్-2025 మెగా వేలంలో పాల్గొన్న శ్రేయస్ అయ్యర్ ఊహించని ధరకు అమ్ముడయ్యాడు. పంజాబ్ కింగ్స్ అతడి కోసం ఏకంగా రూ. 26.75 కోట్లు ఖర్చు చేసింది. కేకేఆర్‌తో పోటీపడి అయ్యర్‌ను భారీ ధరకు తమ సొంతం చేసుకుంది. ఐపీఎల్-2025లో తమ కెప్టెన్‌గా నియమించింది.కోరుకున్న గుర్తింపు దక్కలేదుఈ క్రమంలో చాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత శ్రేయస్ అయ్యర్ గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు. ‘‘ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత కూడా నేను కోరుకున్నంత.. నాకు దక్కాల్సినంత గుర్తింపు దక్కలేదని అనిపిస్తోంది. అయితే, వ్యక్తిగతంగా నా ప్రదర్శన, కెప్టెన్సీ పట్ల నేను సంతృప్తిగా ఉన్నాను.ఎవరూ లేనపుడు కూడా మనం సరైన, న్యాయమైన దారిలో వెళ్తేనే విలువ. వ్యక్తిగా మనకు అన్నింటికంటే నిజాయితీ అతి ముఖ్యమైనది. అలాగని నాకు ఎవరి మీదా అసహనం, అసంతృప్తి లేదు. ఐపీఎల్ ఆడినందు వల్లే చేదు జ్ఞాపకాల నుంచి బయటపడ్డాను. అదృష్టవశాత్తూ టైటిల్ కూడా గెలిచి మనుపటిలా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నాను’’ అని శ్రేయస్ అయ్యర్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నాడు.క్రెడిట్ మొత్తం అతడి ఖాతాలోకే కాగా ప్రస్తుతం టీమిండియా హెడ్‌కోచ్‌గా ఉన్న గంభీర్ గతేడాది కేకేఆర్ మెంటార్‌గా వ్యవహరించాడు. కోల్‌కతా టైటిల్ గెలిచిన క్రెడిట్ మొత్తం అతడి ఖాతాలోకే వెళ్లిందన్నది బహిరంగ రహస్యమే. ఈ విజయం తర్వాతే అతడిని భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రధాన కోచ్‌గా నియమించింది. ఒక్కసారి కూడా కోచ్‌గా పని చేసిన అనుభవం లేకపోయినా గంభీర్‌పై నమ్మకం ఉంచింది. అయితే, టెస్టుల్లో అతడి మార్గదర్శనంలో న్యూజిలాండ్ చేతిలో 3-0తో వైట్‌వాష్.. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఓడిన భారత్.. చాంపియన్స్ ట్రోఫీలో మాత్రం విజేతగా నిలిచింది.చదవండి: CT: ఇండియా-‘బి’ టీమ్ కూడా ఫైనల్ చేరేది: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ -
రచిన్ రవీంద్ర కాదు.. అతడే ప్లేయర్ ఆఫ్‌ది టోర్నమెంట్: అశ్విన్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. దుబాయ్ వేదికగా ఫైనల్లో జరిగిన ఫైనల్లో 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించిన భారత్.. ముచ్చటగా మూడోసారి ట్రోఫీని ముద్దాడింది. ఛాంపియన్స్ ట్రోఫీతో రోహిత్ సేన సోమవారం సొంతగడ్డపై అడుగుపెట్టింది.అయితే ఐపీఎల్-2025 సీజన్‌కు సమయం దగ్గరపడుతుండడంతో ఈసారి ఎటువంటి విక్టరీ పరేడ్లను నిర్వహించకూడదని బీసీసీఐ నిర్ణయించింది. స్వదేశానికి చేరిన ఆటగాళ్లు ఒక్కొక్కరిగా తమ ఐపీఎల్ జట్లతో కలుస్తున్నారు. ఇక ఇది ఇలా ఉండగా.. న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్రను ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీగా ఎంపిక చేయడం పట్ల భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్లేయర్ ఆఫ్ టోర్నీ అవార్డు అందుకునేందుకు భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఆర్హడుని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. "ప్లేయర్ ఆఫ్‌ది టోర్నమెంట్ రచిన్ రవీంద్రను ఎంపిక చేసుండొచ్చు. కానీ దృష్టిలో మాత్రం ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ వరుణ్ చక్రవర్తినే. అతడు టోర్నీ మొత్తం ఆడలేదు. ఆడిన కొన్ని మ్యాచ్‌ల్లోనే అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడి 9 వికెట్లు పడగొట్టాడు. అతడు భారత్‌కు ఎక్స్ఫ్యాక్టర్గా మారాడు. వరుణ్ లేకపోయింటే పరిస్థితి మరోవిధంగా ఉండేది.ఈ టోర్నీలో ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. నేను జడ్జిని అయివుంటే ఆ అవార్డు వరుణ్‌కి ఇచ్చేవాడిని. ఫైనల్ మ్యాచ్‌లో గ్లెన్ ఫిలిప్స్‌ను చక్కవర్తి ఔట్ చేసిన విధానం గురుంచి ఎంతచెప్పుకున్న తక్కువే. గూగ్లీతో ఫిలిప్స్‌ను వరుణ్ బోల్తా కొట్టించాడు. ఈ ఒక్క మ్యాచ్‌లోనే కాదు అతడు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఈ తరహా ప్రదర్శన చేశాడు. అతడు ఆడిన మ్యాచ్‌లను పరిగణలోకి తీసుకుని ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీగా ఎంపిక చేయాల్సింది. ఈ అవార్డుకు వరుణ్ కచ్చితంగా ఆర్హుడు" అని తన యూట్యూబ్ ఛానల్లో అశ్విన్ పేర్కొన్నాడు. కాగా వరుణ్ ఈ టోర్నీలో తన స్పిన్ మయాజాలంతో అందరిని ఆకట్టుకున్నాడు. తొలి రెండు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమైన చక్రవర్తి.. కివీస్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌కు తుది జట్టులోకి వచ్చాడు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే వరుణ్ ఇంపాక్ట్ చూపించాడు. ఆ మ్యాచ్‌లో 5 వికెట్లు పడగొట్టి కివీస్ పతానాన్ని శాసించాడు. ఆ తర్వాత సెమీఫైనల్, ఫైనల్లో రెండేసి వికెట్లు పడగొట్టి భారత్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. మరోవైపు రచిన్ రవీంద్ర.. ఈ టోర్నీలో నాలుగు మ్యాచ్‌లు ఆడి 263 పరుగులతో లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు.చదవండి: అద్భుతంగా రాణించాను.. టెస్టు రీఎంట్రీకి సిద్ధం -
లెజెండ్స్ లీగ్‌కు మెరుపు ఆరంభం.. శతకాల మోత మోగించిన ప్లేయర్లు
ఏషియన్ లెజెండ్స్ లీగ్ తొలి ఎడిషన్ (2025) నిన్న (మార్చి 10) ఘనంగా ప్రారంభమైంది. ఈ టోర్నీలో మొత్తం ఐదు జట్లు (ఏషియన్ లయన్స్, శ్రీలంక లయన్స్, ఆఫ్ఘనిస్తాన్ పఠాన్స్, ఇండియన్ రాయల్స్, బంగ్లాదేశ్ టైగర్స్) పాల్గొంటున్నాయి. ఏషియా ప్రాంతానికి చెందిన మాజీ స్టార్ క్రికెటర్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. ఇండియన్ రాయల్స్ తరఫున టీమిండియా స్టార్లు శిఖర్ ధవన్, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, అంబటి రాయుడు, మనోజ్ తివారి, మునాఫ్ పటేల్ తదితర స్టార్లు ఆడుతున్నారు. నిన్న జరిగిన టోర్నీ ఓపెనర్‌లో ఏషియన్ స్టార్స్, ఆఫ్ఘనిస్తాన్ పఠాన్స్ తలపడ్డారు. రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఏషియన్ స్టార్స్.. ఆఫ్ఘనిస్తాన్ పఠాన్స్ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. షోయబ్ ఖాన్ (63 బంతుల్లో 104 నాటౌట్) మెరుపు శతకంతో కదంతొక్కడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ అస్గర్ అఫ్ఘాన్ (65) అర్ద సెంచరీతో రాణించాడు.అనంతరం బరిలోకి దిగిన ఏషియన్ స్టార్స్ కెప్టెన్ మెహ్రాన్ ఖాన్ (52 బంతుల్లో 109 నాటౌట్) సునామీ శతకంతో విరుచుకుపడటంతో 19.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. మరో ఎండ్‌లో మెహ్రాన్ ఖాన్‌కు పెద్దగా సపోర్ట్ లేనప్పటికీ.. ఒంటిచేత్తో ఏషియన్ స్టార్స్‌ను గెలిపించాడు. ఏషియన్స్ స్టార్స్ ఇన్నింగ్స్‌లో అంకిత్ నర్వాల్ (39), రాఘవ్ ధావన్ (34 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. నిన్ననే జరగాల్సిన మరో మ్యాచ్ రద్దైంది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టైగర్స్, ఇండియన్ రాయల్స్‌తో తలపడాల్సి ఉండింది.ఏషియన్ లెజెండ్స్ లీగ్‌లో ఇండియన్ రాయల్స్ జట్టు..అంబటి రాయుడు, మనోజ్ తివారి, సుబ్రమణ్యం బద్రీనాథ్, ఫయాజ్ ఫజల్, శిఖర్ ధవన్, యూసఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, నమన్ ఓఝా, శ్రీవట్స్ గోస్వామి, అనురీత్ సింగ్, మునాఫ్, కరణ్వీర్ సింగ్, బరిందర్ శ్రాన్, షాదాబ్ జకాతి, మన్‌ప్రీత్ గోని, సుదీప్ త్యాగి -
అద్భుతంగా రాణించాను.. టెస్టు రీఎంట్రీకి సిద్ధం
టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) టెస్టుల్లో పునరాగమనంపై దృష్టి సారించాడు. దేశవాళీ టోర్నమెంట్లలో తాను అద్భుతంగా రాణించానని.. అందుకే తాను తిరిగి జాతీయ జట్టుకు ఆడతాననే ధీమా వ్యక్తం చేశాడు. కాగా వన్డే ప్రపంచకప్-2023 తర్వాత క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడ్డాడనే కారణంతో బీసీసీఐ(BCCI) శ్రేయస్ అయ్యర్‌పై వేటు వేసిన విషయం తెలిసిందే. దేశవాళీ క్రికెట్ ఆడాలన్న నిబంధనలను గాయం సాకు చూపి తప్పించుకున్నాడని భావించిన బోర్డు.. అయ్యర్ వార్షిక కాంట్రాక్టును రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ముంబై తరఫున దేశీ బరిలో దిగిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. గతేడాది శ్రీలంకతో వన్డే సిరీస్ సందర్భంగా టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు.ఇక తాజాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో సత్తా చాటిన శ్రేయస్ అయ్యర్.. ఈ వన్డే టోర్నీలో భారత్ తరఫున టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసి ఐదు ఇన్నింగ్స్‌లో కలిపి 243 పరుగులు సాధించాడు. తద్వారా ఈ మెగా ఈవెంట్లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో న్యూజిలాండ్ స్టార్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ రచిన్ రవీంద్ర(263) తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు.ఇదిలా ఉంటే.. వన్డేల్లో తానేంటో మరోసారి నిరూపించుకున్న శ్రేయస్ అయ్యర్.. టీమిండియా టెస్టు రీఎంట్రీకి తాను సిద్ధమనే సంకేతాలు ఇచ్చాడు. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో మాట్లాడుతూ.. ‘‘టెస్టుల్లో పునరాగమనం చేయాలని ఉంది. వీలైనంత ఎక్కువగా క్రికెట్ ఆడాలని భావిస్తున్నా.నేను ఉత్తమంగా రాణించానుదేశవాళీ టోర్నమెంట్లో నేను ఉత్తమంగా రాణించాను. అయితే, నా చేతుల్లో ఏమీ లేదు. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే. కానీ ఈ విషయం గురించి పదే పదే ఆలోచించను. దాని వల్ల అనసవరంగా నా మెదడుపై ఒత్తిడి పెరుగుతుంది.అనుకున్నది జరుగకపోతే మానసికంగానూ కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ క్షణాన్ని ఆస్వాదిస్తా. విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటా. సమయం వచ్చినపుడు అవకాశం అదే తలుపుతడుతుంది. ముందుగా చెప్పినట్లు నేను భవిష్యత్తు, గతం గురించి ఎక్కువగా ఆలోచించే మనిషిని కాను. ప్రస్తుతం నేను ఇలా ఉండటానికి కారణం అదే’’ అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. కాగా చివరిసారిగా అయ్యర్ గతేడాది ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్ ఆడాడు. ఇక ఇప్పటి వరకు మొత్తంగా టీమిండియా తరఫున 14 టెస్టులు ఆడిన ఈ ముంబైకర్ 811 పరుగులు చేశాడు. ఇంగ్లండ్‌తో సిరీస్ నాటికి!?ఇందులో ఓ శతకం కూడా ఉంది. ఇక తాజా రంజీ ట్రోఫీ సీజన్లో శ్రేయస్ అయ్యర్.. ఆడిన ఐదు మ్యాచ్‌లలోనే ఏకంగా 480 పరుగులు సాధించాడు. ఇక టీమిండియా జూన్‌లో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఇందులో భాగంగా స్టోక్స్ బృందంతో టెస్టులు ఆడనుంది. ఈ సిరీస్ నాటికి అయ్యర్ పునరాగమనం చేసే అవకాశాలు లేకపోలేదు.చదవండి: CT: ఇండియా-‘బి’ టీమ్ కూడా ఫైనల్ చేరేది: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ -
కేఎల్ రాహుల్ సంచలన నిర్ణయం..!
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు కేఎల్ రాహుల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తుంది. రాహుల్.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టేందుకు నిరాకరించాడని సమాచారం. కెప్టెన్సీ చేపట్టే విషయంలో డీసీ యాజమాన్యం రాహుల్‌ను సంప్రదించగా.. సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తుంది. కేవలం ఆటగాడిగా మాత్రమే కొనసాగుతానని రాహుల్ మేనేజ్మెంట్కు స్పష్టం చేశాడట. దీంతో డీసీ యాజమాన్యం అక్షర్ పటేల్ పేరును కెప్టెన్‌గా ఖరారు చేసినట్లు సమాచారం. ఇవాళో రేపో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా అక్షర్ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ సక్సెస్ అనంతరం డీసీ మేనేజ్మెంట్ అక్షర్ విషయంలో చాలా హ్యాపీగా ఉందని తెలుస్తుంది. అక్షర్‌ను డీసీ మేనేజ్మెంట్ మెగా వేలానికి ముందు రూ. 16.5 కోట్లకు రీటైన్ చేసుకుంది. కేఎల్ రాహుల్‌ను మెగా వేలంలో రూ. 14 కోట్లకు సొంతం చేసుకుంది. రాహుల్‌కు టీమిండియాతో పాటు ఐపీఎల్లో పంజాబ్, లక్నో సూపర్ జెయింట్స్‌కు కెప్టెన్‌గా పని చేసిన అనుభవం ఉండగా.. అక్షర్ కెప్టెన్‌గా ఎంపికైతే ఇదే అతనికి ఫుల్‌టైమ్ కెప్టెన్‌గా తొలి అసైన్మెంట్ అవుతుంది. అక్షర్‌కు దేశవాలీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో గుజరాత్ కెప్టెన్‌గా పని చేసిన అనుభవం ఉంది.అక్షర్ గత సీజన్లో రిషబ్ పంత్ అందుబాటులో లేనప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా వ్యవహరించారు. అక్షర్ 2019 నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌తోనే కొనసాగుతున్నాడు. అక్షర్ తన ఐపీఎల్ కెరీర్లో 150 మ్యాచ్‌లు ఆడి 1653 పరుగులు, 123 వికెట్లు తీశాడు. అక్షర్ బ్యాటింగ్ స్ట్రయిక్‌రేట్ 130.88గా ఉండగా.. బౌలింగ్ ఎకానమీ 7.28గా ఉంది. అక్షర్ ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా వైస్ కెప్టెన్‌గా కూడా పని చేశాడు. కాగా, గత సీజన్ వరకు కెప్టెన్‌గా ఉన్న రిషబ్ పంత్‌ను ఢిల్లీ వదిలేసుకున్న విషయం తెలిసిందే. మెగా వేలంలో పాల్గొన్న పంత్‌ను లక్నో రికార్డు ధరకు కొనుగోలు చేసి కెప్టెన్సీ బాధ్యతలు కట్టబెట్టింది.పలు మ్యాచ్‌లకు దూరం కానున్న రాహుల్..?ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభంకానుండగా.. ఢిల్లీ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 24న ఆడనుంది. వైజాగ్‌లో జరిగే పోరులో ఢిల్లీ..లక్నోతో తలపడనుంది. కాగా, ఈ సీజన్లో తొలి రెండు, మూడు మ్యాచ్‌లకు కేఎల్ రాహుల్ దూరం కానున్నాడని తెలుస్తుంది. రాహుల్ భార్య అతియా శెట్టి త్వరలో బిడ్డకు జన్మనివ్వనుందని సమాచారం. ఈ కారణంగానే రాహుల్ ఫ్రాంచైజీ మేనేజ్మెంట్ వద్ద పర్మిషన్ తీసుకున్నాడని ప్రచారం జరుగుతుంది. రాహుల్-అతియాల వివాహాం 2023 జనవరిలో జరిగింది. ఈ జంట గతేడాది నవంబర్‌లో ప్రెగ్నెన్సీ విషయాన్ని బహిర్గతం చేసింది.2025 ఐపీఎల్ సీజన్ కోసం ఢిల్లీ జట్టు..ఫాఫ్ డుప్లెసిస్, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, కరుణ్ నాయర్, సమీర్ రిజ్వి, అషుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, దర్శన్ నల్కండే, అజయ్ జాదవ్ మండల్, త్రిపురణ విజయ్, అక్షర్ పటేల్, మన్వంత్ కుమార్, మాధవ్ తివారి, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్, డొనొవన్ ఫెరియెరా, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, దుష్మంత చమీరా, మిచెల్ స్టార్క్, మోహిత్ శర్మ, టి నటరాజన్, ముకేశ్ కుమార్ -
టీమిండియాను అవమానించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేత టీమిండియాపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీ తన అక్కసును వెళ్లగక్కాడు. ఛాంపియన్స్ ట్రోఫీ విజయవంతం కావడంపై ట్వీట్ చేస్తూ టోర్నీ విజేత భారత్‌ను విస్మరించాడు. తన ట్వీట్లో నఖ్వీ ఛాంపియన్స్ టీమిండియా పేరెత్తకుండా మిగతా విషయాలన్నిటిని ప్రస్తావించాడు. ఇది ఓ లెక్కన టీమిండియాకు అవమానమేనని భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. తమ దేశం ఆతిథ్యమిచ్చిన టోర్నీలో సొంత జట్టు కనీసం గ్రూప్ దశ కూడా దాటలేకపోగా.. భారత్ ఛాంపియన్‌గా అవతరించడాన్ని నఖ్వీ జీర్ణించుకోలేకపోతున్నాడు. అందుకే అతను దుబాయ్‌లో జరిగిన టోర్నీ ముగింపు వేడుకకు కూడా హాజరుకాలేదు. టోర్నీ ఆతిథ్య బోర్డు అధ్యక్షుడి హోదాలో నఖ్వీ ముగింపు వేడుకకు రావాల్సి ఉన్నా ఓ సాధారణ ఉద్యోగిని పంపి చేతులు దులుపుకున్నాడు. ఇలా చేసినందుకు ఐసీసీ అధ్యక్షుడిగా ఉన్న జై షా పాక్‌కు గట్టిగానే బుద్ది చెప్పాడు. పీసీబీ పంపించిన ఉద్యోగిని ప్రోటోకాల్ సాకుగా చూపి పోడియంపైకి అనుమతించలేదు. ఈ టోర్నీ ప్రారంభం కాక ముందు నుంచి నఖ్వీ ఏదో ఒక రూపంలో భారత్ తన అయిష్టతను బహిర్గతం చేస్తూనే ఉన్నాడు. టీమిండియా తమ జెర్సీలపై పాక్ పేరును తప్పక ఉంచుకోవాలని పట్టుబట్టి మరీ ఐసీసీ చేత ఒప్పించుకున్నాడు. టోర్నీ ప్రారంభానికి ముందు అన్ని దేశాల జాతీయ జెండాలను ప్రదర్శించి, ఒక్క భారత జెండాను మాత్రమే విస్మరించాడు. భద్రతా కారణాల చేత టీమిండియా పాక్‌లో అడుగుపెట్టేందుకు నిరాకరించినందుకు ఏదో ఒక రీతిలో భారత్‌పై అక్కసును వెళ్లగక్కుతూనే ఉన్నాడు. తాజాగా టోర్నీ సక్సెస్ నోట్లో ఛాంపియన్స్ టీమిండియా పేరు ప్రస్తావించుకుండా తన వక్రబుద్దిని చాటుకున్నాడు. ఇలా చేయడంపై కొందరు భారత అభిమానులు మండిపడుతున్నప్పటికీ.. మరికొందరు మాత్రం లైట్‌గా తీసుకుంటున్నారు. వాళ్లు మన జట్టు పేరు ప్రస్తావించడమేంటి.. వారికి అస్సలు టీమిండియా పేరెత్తే అర్హత లేదంటూ కౌంటరిస్తున్నారు.ఇంతకీ ఛాంపియన్స్ ట్రోఫీ సక్సెస్ నోట్లో నఖ్వీ ఏం రాశాడంటే.. టోర్నీని అద్భుతంగా నిర్వహించిన పీసీబీ అధికారులు, స్టాఫ్‌కు కృతజ్ఞతలు. టోర్నీ నిర్వహణకు సహకరించిన ప్రాంతీయ ప్రభుత్వాలకు ధన్యవాదాలు. టోర్నీ నిర్వహణలో తమకు సహకరించిన ఐసీసీ అధికారులకు మరియు పాకిస్తాన్‌కు ప్రయాణించిన అద్భుతమైన క్రికెట్ జట్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరి నిబద్ధత మరియు సమిష్టి కృషితోనే ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ నిర్వహణ విజయవంతమైంది. ఈ మెగా టోర్నీని విజయవంతంగా నిర్వహించినందుకు యావత్ పాకిస్తాన్ గర్వపడుతుంది.కాగా, మార్చి 9న దుబాయ్‌లో జరిగిన ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్‌పై విజయం సాధించి, ముచ్చటగా మూడోసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో పాక్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేక గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. ఈ టోర్నీలో భారత్‌తో జరిగిన పోరులో పాక్ యధా మామూలుగా చిత్తుగా ఓడింది. పసికూన బంగ్లాదేశ్‌పై అయినా విజయం సాధించి టోర్నీలో బోణీ కొట్టాలనుకుంటే అది కాస్త వర్షం కారణంగా రద్దైంది. అంతకుముందు టోర్నీ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ పాక్‌కు చుక్కలు చూపించింది. ఇలా స్వదేశంలో జరిగిన టోర్నీలో వరుస పరాజయాలు ఎదుర్కొన్న పాక్, అవమాన భారంతో నిష్క్రమించింది. -
CT: ఇండియా-‘బి’ టీమ్ కూడా ఫైనల్ చేరేది: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
భారత జట్టు ‘బలం’ ముందు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్(Michael Vaughan) తలవంచాడు. టీమిండియా విజయాలను తక్కువ చేసి మాట్లాడిన అతడే.. పరిమిత ఓవర్ల క్రికెట్లో ప్రపంచంలోనే గొప్ప జట్టు అని భారత్‌ను కొనియాడాడు. ‘హోం అడ్వాంటేజ్’ అంటూ విమర్శలుచాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో రోహిత్ సేనకు ‘హోం అడ్వాంటేజ్’ ఉంటుందని విమర్శించిన వాన్.. ఇప్పుడు ద్వితీయ శ్రేణి జట్టుతోనే టీమిండియా టైటిల్ గెలవగలదని కితాబు ఇచ్చాడు.కాగా పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ మొదలు కాగా.. టీమిండియా భద్రతా కారణాల దృష్ట్యా అక్కడికి వెళ్లలేదు. అంతర్జాతీయ క్రికెట్ మండలి ఆమోదంతో తటస్థ వేదికైన దుబాయ్‌లోనే తమ మ్యాచ్‌లన్నీ ఆడింది. అయితే, ఒకే మైదానంలో ఆడటం వల్ల ఇతర జట్లతో పోలిస్తే భారత్‌కు అదనపు ప్రయోజనాలు చేకూరుతున్నాయని.. అలవాటైన స్టేడియంలో ఆడటం వారికి సానుకూలాంశమని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు విమర్శించారు.అంతేగాక.. టీమిండియాతో మ్యాచ్‌ల కోసం ఇతర జట్లు పాకిస్తాన్- దుబాయ్(Dubai) మధ్య ప్రయాణాలు చేయడం కూడా ఇబ్బందికరమేనని పేర్కొన్నారు. వేదిక ఏదైనా టీమిండియాకు తిరుగు లేదంటూ సునిల్ గావస్కర్ వంటి భారత క్రికెట్ దిగ్గజాలు ఈ విమర్శలను తిప్పికొట్టారు.ఏదేమైనా గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్‌లను ఓడించి టాపర్‌గా సెమీస్ చేరిన రోహిత్ సేన.. ఆస్ట్రేలియాపై గెలిచి ఫైనల్లో అడుగుపెట్టింది. దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో ఆదివారం నాటి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి విజేతగా అవతరించింది.టీమిండియా-‘బి’ టీమ్ కూడా ఫైనల్ చేరేదిఈ నేపథ్యంలో మైకేల్ వాన్ భారత జట్టు ఆట తీరును కొనియాడాడు. అదే విధంగా.. భారత్ ‘బెంచ్ స్ట్రెంత్’ను ఉద్దేశించి ఆసక్తికర ట్వీట్ చేశాడు. ‘‘నిజాయితీగా చెప్పాలంటే.. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇండియా అత్యుత్తమ జట్టుగా కొనసాగుతోంది. ఈ విజయానికి వారు అర్హులు. టీ20 ప్రపంచకప్ గెలిచిన వెంటనే.. ఇండియా చాంపియన్స్ ట్రోఫీ కూడా గెలిచింది.జైస్వాల్, వర్మ, శర్మ, స్కై, పంత్, రెడ్డి, సుందర్, చహల్, అర్ష్‌దీప్, బుమ్రా, బిష్ణోయిలతో కూడిన జట్టు కూడా ఫైనల్‌కు చేరేది. టైటిల్ కూడా గెలిచేది. వైట్‌బాల్ క్రికెట్లో వారి బెంచ్ బలానికి ఇంతకంటే గొప్ప నిదర్శనం మరొకటి ఉండదు’’ అని మైకేల్ వాన్ ‘ఎక్స్’ పోస్టులో రాసుకొచ్చాడు.అతడు దూరం.. వారు బెంచ్‌కే పరిమితంకాగా భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా వెన్నునొప్పి కారణంగా చాంపియన్స్ ట్రోఫీ మొత్తానికి దూరం కాగా.. యశస్వి జైస్వాల్‌ను ఆఖరి నిమిషంలో తప్పించి వరుణ్ చక్రవర్తిని జట్టులోకి తీసుకుంది మేనేజ్మెంట్. ఇక ఈ జట్టులో రిషభ్ పంత్‌కు స్థానం దక్కినా.. వికెట్ కీపర్ కోటాలో కేఎల్ రాహుల్‌ను తుదిజట్టులో ఆడించారు. దీంతో పంత్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్‌లదీ ఇదే పరిస్థితి.ఇక వీరితో పాటు తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, యజువేంద్ర చహల్, రవి బిష్ణోయిలతో కూడిన జట్టు కూడా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేరేదంటూ మైకేల్ వాన్ పేర్కొనడం విశేషం.చదవండి: Team of the Tourney 2025: జట్టును ప్రకటించిన ఐసీసీ.. రోహిత్‌కు దక్కని చోటు -
అమ్మాయితో కనిపించిన చాహల్.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన భార్య ధనశ్రీ వర్మ!
భారత స్టార్ క్రికెటర్, స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిపోయాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత మరింత ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఆట కంటే వ్యక్తిగత విషయాలతో చాహల్ మరింత ఫేమస్ అవుతున్నాడు. ఇటీవల దుబాయ్ వేదికగా జరిగిన ఛాంఫియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఓ అమ్మాయితో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇది చూసిన నెటిజన్స్ ఇంతకీ ఆమె ఎవరా అని ఆరా తీస్తే ఆర్జే మహ్వాష్గా గుర్తించారు. ఇంకేముంది ఆమెతో మనోడు పీకల్లోతు డేటింగ్లో ఉన్నాడంటూ సోషల్ మీడియాలో కోడై కూస్తోంది.ఈ సంగతి పక్కనపెడితే.. యుజ్వేంద్ర చాహల్ భార్య, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ తాజాగా ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. తన భర్త చాహల్ దిగిన ఫోటోలను ఇన్‌స్టాలో రీ లోడ్ చేసింది. అతనితో ఉన్న ఫోటోలతో పాటు పెళ్లి ఫోటోలు కూడా అన్ని ధనశ్రీ వర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో మళ్లీ దర్శనమిచ్చాయి. ఇప్పటికే ఈ జంట విడాకులు తీసుకోబోతున్నారంటూ చాలాసార్లు వార్తలొచ్చాయి. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు తెగ వైరలయ్యాయి. తాజాగా చాహల్ ఫోటోలు రీ లోడ్ చేయడంతో వీరిద్దరు విడాకుల రూమర్స్‌కు చెక్ పడే అవకాశముంది. వాటిని ఫుల్స్టాప్ పెట్టేందుకే ఇచ్చేందుకే ధనశ్రీ వర్మ ఫోటోలన్నింటినీ రీ స్టోర్ చేసినట్లు తెలుస్తోంది.కాగా.. యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ 2020లో వివాహం చేసుకున్నారు. అయితే వీరిద్దరు ఇప్పటికే కోర్టులో విడాకుల పిటిషన్ వేసినట్లు తెలుస్తోది. ఇటీవల ధనశ్రీ న్యాయవాది అదితి మోహోని ఈ విషయాన్ని వెల్లడించారు. 2024లోనే విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. మరోవైపు ధనశ్రీ వర్మ రూ. 60 కోట్ల భరణం డిమాండ్ చేసిందని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ ఆరోపణలను ఆమె కుటుంబం ఖండించింది. View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) -
All Time India ODI XI: రోహిత్, కోహ్లిలకు చోటు.. కెప్టెన్‌గా ఎవరంటే?
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) విజేతగా నిలవడంతో టీమిండియా ఐసీసీ టైటిళ్ల సంఖ్య ఏడుకు చేరింది. భారత్ తొలిసారి 1983లో ప్రపంచకప్‌ను ముద్దాడింది. నాటి వన్డే వరల్డ్‌కప్ టోర్నమెంట్లో అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన కపిల్ సేన ఏకంగా చాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది. పటిష్ట వెస్టిండీస్ జట్టును ఓడించి వరల్డ్‌కప్ విజేతగా నిలిచింది.ఫలితంగా టీమిండియాకు మొట్టమొదటి ఐసీసీ ట్రోఫీ అందించిన సారథిగా కపిల్ దేవ్(Kapil Dev).. భారత క్రికెట్ చరిత్రలో తన పేరును అజరామరం చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత దాదాపు రెండు దశాబ్దాలకు పైగా భారత జట్టుకు ఒక్క ఐసీసీ టైటిల్ కూడా దక్కలేదు. అయితే, మహేంద్ర సింగ్ ధోని(MS Dhoni) ఆ లోటును తీర్చేశాడు.ధోని ఖాతాలో ముచ్చటగా మూడుఅంతర్జాతీయ క్రికెట్ మండలి 2007లో తొలిసారిగా ప్రవేశపెట్టిన టీ20 ప్రపంచకప్‌ను టీమిండియాకు అందించాడు. అనంతరం 2011లో వన్డే వరల్డ్‌కప్ గెలిచిన కెప్టెన్‌గానూ ధోని నిలిచాడు. అంతేనా.. 2013లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భారత్‌ను విజేతగా నిలిపి.. అత్యధిక ఐసీసీ టైటిళ్లు గెలిచిన భారత కెప్టెన్‌గా ఇప్పటికీ కొనసాగుతున్నాడు.రోహిత్ ‘డబుల్’ హ్యాపీఇక తాజాగా రోహిత్ శర్మ చాంపియన్స్ ట్రోఫీ-2025 గెలిచి రెండో ఐసీసీ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన హిట్‌మ్యాన్.. తాజా ఈ వన్డే టోర్నమెంట్లోనూ జట్టును అజేయంగా ముందుకు నడిపి ట్రోఫీని ముద్దాడాడు. తద్వారా ధోని తర్వాత అత్యధిక సార్లు టీమిండియాను చాంపియన్‌గా నిలిపిన కెప్టెన్‌గా నిలిచాడు ఈ వన్డే ‘ట్రిపుల్’ డబుల్ సెంచరీల వీరుడు.మరి కపిల్ దేవ్, ధోని, రోహిత్ శర్మ.. కెప్టెన్లుగా ఈ ఘనతలు సాధించారంటే అందుకు అప్పటి జట్లలో ఉన్న ఆటగాళ్లది కూడా కీలక పాత్ర. 1983లో ఆల్‌రౌండర్ మొహిందర్ అమర్నాథ్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించి జట్టును ఫైనల్‌కు చేర్చాడు.ఇక 2011 ప్రపంచకప్‌లో యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లిలు కూడా అద్భుతంగా ఆడారు. హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్ తమ వంతు పాత్ర పోషించగా.. తాజా చాంపియన్స్ ట్రోఫీలో కెప్టెన్ రోహిత్, కోహ్లిలతో పాటు రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ కూడా రాణించారు.బుమ్రాకు దక్కని చోటుఈ నేపథ్యంలో తన ఆల్‌టైమ్ వన్డే తుదిజట్లులో టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ వీరందరికి చోటివ్వడం గమనార్హం. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా విజేతగా నిలిచిన తర్వాత చిన్నపిల్లాడిలా గంతులేసిన ఈ మాజీ సారథి... తాజాగా తన వన్డే బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌ను పంచుకున్నాడు. ఈ జట్టులో క్రికెట్ దేవుడ్, వంద శతకాల వీరుడు సచిన్ టెండుల్కర్‌కు ఓపెనర్‌గా గావస్కర్ చోటిచ్చాడు. అయితే, ఈ జట్టుకు టీమిండియా ప్రధాన పేసర్, ప్రపంచస్థాయి ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను మాత్రం గావ స్కర్ ఎంపిక చేయలేదు.సునిల్ గావస్కర్ ఆల్‌టైమ్ వన్డే ఎలెవన్:సచిన్ టెండుల్కర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, మొహిందర్ అమర్నాథ్, యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోని(కెప్టెన్, వికెట్ కీపర్), కపిల్ దేవ్, రవీంద్ర జడేజా, హర్భజన్ సింగ్, మహ్మద్ షమీ, జహీర్ ఖాన్. భారత్ గెలిచిన ఐసీసీ టైటిళ్లు ఇవే1983- వన్డే వరల్డ్‌కప్2002- చాంపియన్స్ ట్రోఫీలో శ్రీలంకతో కలిసి సంయుక్త విజేతగా 2007- టీ20 ప్రపంచకప్2011- వన్డే వరల్డ్‌కప్2013- చాంపియన్స్ ట్రోఫీ2024- టీ20 ప్రపంచకప్2025- చాంపియన్స్ ట్రోఫీ.చదవండి: Team of the Tourney 2025: జట్టును ప్రకటించిన ఐసీసీ.. రోహిత్‌కు దక్కని చోటు -
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ముందు పాక్ స్పీడ్‌స్టర్‌కు గుడ్ న్యూస్
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ముందు పాక్ స్పీడ్‌స్టర్ హరీస్ రౌఫ్‌కు గుడ్ న్యూస్ అందింది. రౌఫ్ తండ్రి అయ్యాడు. అతని భార్య ముజ్నా మసూద్ మాలిక్ మగబిడ్డకు జన్మనిచ్చింది. హరీస్ రౌఫ్-ముజ్నా మాలిక్‌కు ఇది తొలి సంతానం. రౌఫ్-ముజ్నా వివాహాం 2022, డిసెంబర్ 23న జరిగింది.రౌఫ్ తొలిసారి తండ్రి అయిన విషయం తెలిసి అతని సహచరుడు షాహీన్ అఫ్రిది సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపాడు. నా సహోదరుడా.. మీకు మగబిడ్డ పుట్టినందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు. నీకు, నీ కుటుంబానికి అంతులేని ఆనందం కలగాలని దేవుడిని ప్రార్ధిస్తున్నానని తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చాడు. అఫ్రిది పోస్ట్‌ను చూసి షాదాబ్ ఖాన్ కూడా రౌఫ్‌కు శుభాకాంక్షలు తెలిపాడు.ఇదిలా ఉంటే, స్వదేశంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భంగపడిన అనంతరం పాక్ మార్చి 16 నుంచి న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో పాక్ న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడుతుంది. ఈ పర్యటనకు బయల్దేరకముందే హరీస్ రౌఫ్‌కు కొడుకు పుట్టాడన్న శుభవార్త అందింది.న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ కోసం ప్రకటించిన పాక్ జట్టులో హరీస్ రౌఫ్ కీలక సభ్యుడు. రౌఫ్‌తో పాటు అతనికి శుభాకాంక్షలు తెలిపిన షాహీన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్ కూడా న్యూజిలాండ్ సిరీస్ కోసం ఎంపిక చేసిన పాక్ టీ20 జట్టులో ఉన్నారు. అయితే ఈ ముగ్గురికి వన్డే జట్టులో చోటు దక్కలేదు.న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ కోసం పాక్ జట్టు: ఒమెయిర్ యూసఫ్, అబ్దుల్ సమద్, హసన్ నవాజ్, ఖుష్దిల్ షా, సల్మాన్ అఘా (కెప్టెన్), షాదాబ్ ఖాన్, ఇర్ఫాన్ ఖాన్, జహన్దాద్ ఖాన్, మొహమ్మద్ హరీస్, ఉస్మాన్ ఖాన్, షాహీన్ అఫ్రిది, అబ్బాస్ అఫ్రిది, హరీస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్, సూఫియాన్ ముఖీమ్, మొహమ్మద్ అలీన్యూజిలాండ్తో వన్డే సిరీస్ కోసం పాక్ జట్టు: అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హాక్, ఖుష్దిల్ షా, బాబర్ ఆజమ్, తయ్యబ్ తాహిర్, ఇర్ఫాన్ ఖాన్, సల్మాన్ అఘా, ఫహీమ్ అష్రాఫ్, మహ్మద్ రిజ్వాన్, అబ్రార్ అహ్మద్, అకీఫ్ జావిద్, మొహమ్మద్ ఆలీ, మహ్మద్ వసీం జూనియర్, నసీం షా, సూఫియాన్ ముఖీమ్కాగా, స్వదేశంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో ఘెర పరాభవం అనంతరం పాక్ క్రికెట్ బోర్డు జట్టు మొత్తాన్ని ప్రక్షాళన చేసింది. పరిమిత ఓవర్ల కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్, స్టార్ ఆటగాడు బాబర్ ఆజమ్‌ను టీ20 జట్టు నుంచి తప్పించి కేవలం వన్డేలకే పరిమితం చేసింది. అలాగే సీనియర్ బౌలర్లు షాహీన్ అఫ్రిది, హరీస్ రౌఫ్, స్టార్ ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్‌లను కేవలం టీ20లకే పరిమితం చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో పాక్ ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది.న్యూజిలాండ్ పర్యటనలో పాక్ షెడ్యూల్..మార్చి 16- తొలి టీ20 (క్రైస్ట్‌చర్చ్)మార్చి 18- రెండో టీ20 (డునెడిన్)మార్చి 21- మూడో టీ20 (ఆక్లాండ్)మార్చి 23- నాలుగో టీ20 (మౌంట్ మౌంగనూయ్)మార్చి 26- ఐదో టీ20 (వెల్లింగ్టన్)మార్చి 29- తొలి వన్డే (నేపియర్)ఏప్రిల్ 2- రెండో వన్డే (హ్యామిల్టన్)ఏప్రిల్ 5- మూడో వన్డే (మౌంట్ మౌంగనూయ్)పాకిస్తాన్‌తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు: మైఖేల్ బ్రేస్‌వెల్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మార్క్ చాప్మన్, జాకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్ (4,5 మ్యాచ్‌లకు), మిచ్ హే, మాట్ హెన్రీ (4,5 మ్యాచ్‌లకు), కైల్ జామిసన్ (1, 2, 3 మ్యాచ్‌లకు), డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, విల్ ఓ'రూర్కే (1, 2, 3 మ్యాచ్‌లకు), టిమ్ రాబిన్సన్, బెన్ సియర్స్, టిమ్ సీఫెర్ట్, ఇష్ సోధి -
ఏకైక ‘శత్రువు’ను అతడు జయించేశాడు: భారత మాజీ క్రికెటర్
టీమిండియా స్టార్ కేఎల్ రాహుల్(KL Rahul)పై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్(Sanjay Manjrekar) ప్రశంసలు కురిపించాడు. ఒత్తిడిలోనూ అద్భుతంగా ఆడాడని.. భారత్ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) గెలవడంలో అతడి పాత్ర మరువలేనిదని కొనియాడాడు. తన ‘శత్రువు’ని జయించి రాహుల్ తన విలువేమిటో మరోసారి చాటుకున్నాడని ప్రశంసించాడు.వికెట్ కీపర్ బ్యాటర్‌గా సేవలు అందిస్తున్న కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా, మిడిలార్డర్లో నాలుగు, ఐదు, ఆరో స్థానాల్లో బ్యాటింగ్ చేశాడు. జట్టు ప్రయోజనాలకు అనుగుణంగా యాజమాన్యం చెప్పినట్లుగా నడుచుకునే క్రమంలో ఎప్పుడు ఏ స్థానంలో బ్యాటింగ్ చేయాల్సి వస్తుందో అతడికే తెలియని పరిస్థితి.కూల్‌గా, పక్కా ప్రణాళికతోముఖ్యంగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా అతడి సేవలను వాడుకున్న తీరు దారుణమని నవజ్యోత్ సింగ్ సిద్ధు లాంటి వాళ్లు బీసీసీఐని విమర్శించడం గమనార్హం. అయితే, కేఎల్ రాహుల్ మాత్రం తాను ఏ స్థానంలో ఆడినా కూల్‌గా, పక్కా ప్రణాళికతో ముందుకు సాగాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్లో భారత్ విజయం సాధించడానికి.. విరాట్ కోహ్లితో పాటు ఈ కర్ణాటక బ్యాటర్ ధనాధన్ ఇన్నింగ్స్ కూడా ప్రధాన కారణం. సెమీస్ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ ఆరో స్థానంలో వచ్చి 34 బంతుల్లో 42 పరుగులతో అజేయంగా నిలిచి.. జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇక న్యూజిలాండ్‌తో ఫైనల్లోనూ అతడు అదరగొట్టాడు. 33 బంతుల్లో 34 పరుగులు సాధించి.. మరో ఓవర్ మిగిలి ఉండగానే భారత్ గెలుపొందడంలో కీలక పాత్ర పోషించాడు. నిజానికి వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీలో రాహుల్ రాణించాడు.అయితే, సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో నాటి ఫైనల్లోనూ అర్ధ శతకం సాధించాడు. అయితే, 107 బంతుల్లో కేవలం 66 పరుగులే చేయడంతో.. భారత్ ఓటమికి అతడి స్లో ఇన్నింగ్స్ కూడా ఓ కారణమని కొంతమంది విమర్శించారు. అయితే, చాంపియన్స్ ట్రోఫీలో అతడు తన శైలిని మార్చుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్లపై దూకుడు ప్రదర్శిస్తూ సరైన షాట్ల ఎంపికతో పరుగులు రాబట్టి.. టీమిండియా గెలుపుల్లో భాగమయ్యాడు.ఏకైక ‘శత్రువు’ను అతడు జయించేశాడుఈ నేపథ్యంలో సంజయ్ మంజ్రేకర్ కేఎల్ రాహుల్ గురించి మాట్లాడాడు.‘‘వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్ నుంచి రాహుల్ ‘స్లో ఇన్నింగ్స్’ భారం మోస్తున్నాడు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి అతడు మాట్లాడుతూ.. ఆ ఇన్నింగ్స్ తాలూకు చేదు అనుభవం తనను వేటాడుతూ.. పదే పదే పాత గాయాన్ని గుర్తు చేస్తుందని చెప్పాడు.ఇక ఇప్పుడు సెమీస్, ఫైనల్లో అతడి ప్రదర్శన వల్ల కచ్చితంగా సంతృప్తి పడి ఉంటాడు. నిజానికి కేఎల్ రాహుల్‌కు బౌలర్లు ‘శత్రువులు’ కారు. అతడికి ఉన్న ఏకైక ‘శత్రువు’ అతడి మెదడే. తన ఆలోచనా విధానం వల్లే అతడు ఒత్తిడిలో కూరుకుపోయి ఉంటాడు.అయితే, ఇప్పుడు ఆ భారాన్ని జయించి.. సంయమనం పాటిస్తూ చక్కటి షాట్లతో అలరించాడు. అతడి ప్రయాణం గొప్పగా సాగుతోంది’’ అని సంజయ్ మంజ్రేకర్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో వ్యాఖ్యానించాడు. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో కేఎల్ రాహుల్ ఐదు మ్యాచ్‌లలో నాలుగు ఇన్నింగ్స్ ఆడి 140 పరుగులు సాధించాడు. స్ట్రైక్ రేటు 97.90. ఐసీసీ ప్రకటించిన టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ ప్లేయింగ్ ఎలెవన్‌లోనూ ఈ వికెట్ కీపర్ బ్యాటర్ స్థానం సంపాదించాడు.చదవండి: Team of the Tourney 2025: జట్టును ప్రకటించిన ఐసీసీ.. రోహిత్‌కు దక్కని చోటు View this post on Instagram A post shared by ICC (@icc) -
అత్యధిక ఐసీసీ టైటిళ్లు గెలిచిన ఆటగాడిగా విరాట్.. పాంటింగ్ సరసన చోటు
ఛాంపియన్స్ ట్రోఫీ-2025తో టీమిండియా ఖాతాలో ఏడో ఐసీసీ ట్రోఫీ చేరింది. భారత్ తొలిసారి 1983లో ఐసీసీ ట్రోఫీ (వన్డే వరల్డ్‌కప్) గెలిచింది. ఆతర్వాత 2002 (ఛాంపియన్స్ ట్రోఫీ, శ్రీలంకతో సంయుక్తంగా), 2007 (టీ20 వరల్డ్‌కప్), 2011 (వన్డే వరల్డ్‌కప్), 2013 (ఛాంపియన్స్ ట్రోఫీ), 2024 (టీ20 వరల్డ్‌కప్), 2025లో (ఛాంపియన్స్ ట్రోఫీ) ఐసీసీ ట్రోఫీలు కైవసం చేసుకుంది. ప్రపంచంలో అత్యధిక ఐసీసీ ట్రోఫీలు గెలిచిన జట్ల జాబితాలో భారత్ ఆస్ట్రేలియా తర్వాతి స్థానంలో ఉంది.ఆస్ట్రేలియా అత్యధికంగా 10 ఐసీసీ ట్రోఫీలు (1987, 1999, 2003, 2007, 2015, 2023 వన్డే వరల్డ్‌కప్‌లు.. 2021 టీ20 వరల్డ్‌కప్.. 2006, 2009 ఛాంపియన్స్ ట్రోఫీ.. 2021-23 డబ్ల్యూటీసీ టైటిల్) కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా, భారత్ తర్వాత అత్యధిక ఐసీసీ టైటిళ్లు గెలిచిన ఘనత వెస్టిండీస్‌కు దక్కుతుంది. విండీస్ మొత్తంగా ఐదు ఐసీసీ టైటిళ్లు (1975, 1979 వన్డే వరల్డ్‌కప్‌లు.. 2012, 2016 టీ20 వరల్డ్‌కప్‌లు.. 2004 ఛాంపియన్స్ ట్రోఫీ) సాధించింది.విండీస్ తర్వాత పాకిస్తాన్ (1992 వన్డే వరల్డ్‌కప్.. 2009 టీ20 వరల్డ్‌కప్.. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ), శ్రీలంక (1996 వన్డే వరల్డ్‌కప్.. 2014 టీ20 వరల్డ్‌కప్.. 2002 ఛాంపియన్స్ ట్రోఫీ (భారత్‌తో కలిసి సంయుక్తంగా), ఇంగ్లండ్ (2019 వన్డే వరల్డ్‌కప్.. 2010, 2022 టీ20 వరల్డ్‌కప్‌లు) తలో మూడు ఐసీసీ టైటిళ్లు సాధించాయి. న్యూజిలాండ్ రెండు (2000 ఛాంపియన్స్ ట్రోఫీ.. 2019-2021 డబ్ల్యూటీసీ), సౌతాఫ్రికా ఓ ఐసీసీ టైటిల్ (1998 ఛాంపియన్స్ ట్రోఫీ) గెలిచింది.ఐసీసీ టైటిళ్లు గెలిచిన జట్ల విషయం ఇలా ఉంటే.. వ్యక్తిగతంగా అత్యధిక ఐసీసీ టైటిళ్లు గెలిచిన ఘనత ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి దక్కుతుంది. ఈ ఇద్దరు తలో ఐదు ఐసీసీ టైటిళ్లు (అండర్-19 ఈవెంట్లు కలుపుకొని) సాధించారు. పాంటింగ్ 1999, 2003,2007 వన్డే వరల్డ్‌కప్‌లు.. 2006, 2009 ఛాంపియన్స్ ట్రోఫీలు గెలువగా.. విరాట్ 2008 అండర్ 19 వరల్డ్‌కప్.. 2011 వన్డే వరల్డ్‌కప్.. 2013, 2025 ఛాంపియన్స్ ట్రోఫీలు.. 2024 టీ20 వరల్డ్‌కప్ టైటిళ్లు గెలిచాడు.పాంటింగ్, విరాట్ తర్వాత అత్యధిక ఐసీసీ టైటిళ్లు గెలిచిన ఘనత రోహిత్ శర్మ (2007, 2024 టీ20 వరల్డ్‌కప్‌లు.. 2013, 2025 ఛాంపియన్స్ ట్రోఫీలు), ఆడమ్ గిల్‌క్రిస్ట్ (1999, 2003, 2007 వన్డే వరల్డ్‌కప్‌లు.. 2006 ఛాంపియన్స్ ట్రోఫీ), గ్లెన్ మెక్‌గ్రాత్ (1999, 2003, 2007 వన్డే వరల్డ్‌కప్‌లు.. 2006 ఛాంపియన్స్ ట్రోఫీ), షేన్ వాట్సన్ (2007, 2015 వన్డే వరల్డ్‌కప్‌లు.. 2006, 2009 ఛాంపియన్స్ ట్రోఫీలు), డేవిడ్ వార్నర్ (2015, 2023 వన్డే వరల్డ్‌కప్‌లు.. 2021 టీ20 వరల్డ్‌కప్.. 2021-23 డబ్ల్యూటీసీ టైటిల్), మిచెల్ స్టార్క్ (2015, 2023 వన్డే వరల్డ్‌కప్‌లు.. 2021 టీ20 వరల్డ్‌కప్.. 2021-23 డబ్ల్యూటీసీ టైటిల్), స్టీవ్ స్మిత్‌కు (2015, 2023 వన్డే వరల్డ్‌కప్‌లు.. 2021 టీ20 వరల్డ్‌కప్.. 2021-23 డబ్ల్యూటీసీ టైటిల్) దక్కుతుంది. వీరంతా తలో నాలుగు ఐసీసీ టైటిళ్లు గెలిచారు.కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో భారత్ న్యూజిలాండ్‌పై 4 వికెట్ల తేడాతో గెలుపొంది, మూడో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను, ఓవరాల్‌గా ఏడో ఐసీసీ టైటిల్‌ను కైవసం చేసుకుంది. -
ఐపీఎల్-2025 ప్రారంభానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్‌కు భారీ ఎదురుదెబ్బ
ఐపీఎల్-2025 ప్రారంభానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్‌కు భారీ షాక్ తగిలింది. రూ. 11 కోట్లు పెట్టి రీటైన్ చేసుకున్న ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ లీగ్ ఫస్ట్ హాఫ్‌కు దూరం కానున్నాడు. గతేడాది టీమిండియా అరంగేట్రం సందర్భంగా గాయపడిన మాయంక్ ఇంకా కోలుకోలేదు. ప్రస్తుతం అతను బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్‌లో రిహాబ్‌లో ఉన్నాడు. బీసీసీఐ మయాంక్ గాయానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ఐపీఎల్-2025 సెకండాఫ్ సమయానికి మయాంక్ కోలుకుని అవకాశం ఉందని తెలుస్తుంది. లీగ్ ఫస్ట్ హాఫ్‌లో మయాంక్ లేకపోవడం ఎల్ఎస్జీకి పెద్ద ఎదురుదెబ్బ అవుతుంది.మయాంక్ గతేడాది ఐపీఎల్ సందర్భంగా స్థిరంగా 150 కిమీలకు పైగా వేగంతో బంతులు సంధించి వెలుగులోకి వచ్చాడు. ఈ ప్రదర్శన కారణంగా అతను గతేడాది అక్టోబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు (టీమిండియాకు) ఎంపికయ్యాడు. ఈ సిరీస్‌లో మయాంక్ అద్భుతంగా బౌలింగ్ చేసినప్పటికీ అనుకోని గాయం అతన్ని 6 నెలలకు పైగా క్రికెట్‌కు దూరం చేసింది. బంగ్లాతో జరిగిన టీ20 సిరీస్‌లో మయాంక్ అదే స్థిరమైన వేగంతో (150 కిమీ పైగా) బౌలింగ్ చేసి 3 మ్యాచ్‌ల్లో 4 వికెట్లు పడగొట్టాడు.టీమిండియాకు మరో నాణ్యమైన ఫాస్ట్ బౌలర్ దొరికాడని అనుకునే లోపే మయాంక్ గాయపడ్డాడు. మయాంక్ గతేడాది ఐపీఎల్లో సూపర్ ఫాస్ట్ బౌలింగ్‌తో ప్రత్యర్థులకు దడ పుట్టించాడు. ఆ సీజన్లో అతను 4 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు తీసి లక్నో విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. లక్నో గతేడాది కేఎల్ రాహుల్ సారథ్యంలో 14 మ్యాచ్‌ల్లో 7 విజయాలు సాధించి ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. గత చేదు అనుభవాల దృష్ట్యా లక్నో ఈసారి జట్టు మొత్తాన్ని ప్రక్షాళన చేసింది. లక్నో తమ నూతన కెప్టెన్‌గా రిషబ్ పంత్‌ను ఎంపిక చేసుకుంది. ఈ ఏడాది లక్నో జట్టులో విధ్వంకర బ్యాటర్లు మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, మిచెల్ మార్ష్ చేరారు. 2025 సీజన్లో లక్నో తమ ప్రయాణాన్ని మార్చి 24 నుంచి ప్రారంభిస్తుంది. లక్నో తమ తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్ వైజాగ్‌లో జరుగనుంది. ఈ ఏడాది ఐపీఎల్ మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ ఆర్సీబీతో తలపడుతుంది. ఈ మ్యాచ్ కోల్‌కతాలో జరుగనుంది. కాగా, 2022లో గుజరాత్ టైటాన్స్‌తో కలిసి ఐపీఎల్ అరంగేట్రం చేసిన లక్నో సూపర్ జెయింట్స్ ఇప్పటివరకు ఆడిన 3 సీజన్లలో ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. 2022, 2023 సీజన్లలో మూడో స్థానంలో నిలిచిన ఈ జట్టు.. గత సీజన్‌తో అడపాదడపా ప్రదర్శనలతో ఏడో స్థానంతో సరిపెట్టుకుంది.2025 సీజన్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ జట్టు..డేవిడ్ మిల్లర్, ఎయిడెన్ మార్క్రమ్, హిమ్మత్ సింగ్, ఆయుశ్ బదోని, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (కెప్టెన్), మాథ్యూ బ్రీట్జ్కీ, ఆర్యన్ జుయల్, మిచెల్ మార్ష్, షాబాజ్ అహ్మద్, యువరాజ్ చౌదరీ, అబ్దుల్ సమద్, రాజవర్దన్ హంగార్గేకర్, అర్శిన్ కులకర్ణి, ఆవేశ్ ఖాన్, ఆకాశ్‌దీప్, ప్రిన్స్ యాదవ్, మొహిసిన్ ఖాన్, షమార్ జోసఫ్, ఆకాశ్ సింగ్, మయాంక్ యాదవ్, మణిమారన్ సిద్దార్థ్, దిగ్వేశ్ సింగ్, రవి బిష్ణోయ్సపోర్ట్ స్టాఫ్..హెడ్ కోచ్- జస్టిన్ లాంగర్మెంటార్- జహీర్ ఖాన్అసిస్టెంట్ కోచ్- విజయ్ దాహియాడైరెక్టర్ ఆఫ్ టాలెంట్ సెర్చ్- ఎంఎస్కే ప్రసాద్క్రికెట్ కన్సల్టెంట్- ఆడమ్ వోగ్స్స్పిన్ బౌలింగ్ కన్సల్టెంట్- ప్రవీణ్ తాంబేఫీల్డింగ్ కోచ్- జాంటీ రోడ్స్ -
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో అద్భుత ప్రదర్శనకు రివార్డు.. న్యూజిలాండ్ కెప్టెన్‌గా బ్రేస్‌వెల్
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో అద్భుత ప్రదర్శనకు గానూ న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ మైఖేల్ బ్రేస్‌వెల్‌కు రివార్డు లభించింది. త్వరలో స్వదేశంలో పాకిస్తాన్‌తో జరుగబోయే టీ20 సిరీస్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు బ్రేస్‌వెల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. సొంతగడ్డపై న్యూజిలాండ్ జాతీయ జట్టు పగ్గాలు చేపట్టడం బ్రేస్‌వెల్‌కు ఇది మొదటిసారి. గతేడాది బ్రేస్‌వెల్ ఇదే పాకిస్తాన్‌పై (పాకస్తాన్‌లో) ఓ సారి కెప్టెన్‌గా వ్యవహరించాడు. అప్పడు న్యూజిలాండ్ ద్వితియ శ్రేణి జట్టుతో బరిలోకి దిగింది. ఈసారి కూడా పాక్‌తో జరుగబోయే సిరీస్ కోసం ఎంపిక చేసిన న్యూజిలాండ్ జట్టులో కీలక ఆటగాళ్లు లేరు. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ ఆడిన న్యూజిలాండ్ జట్టులో నుంచి కేవలం ఏడుగురు మాత్రమే ఈ సిరీస్‌కు ఎంపికయ్యారు. రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ విశ్రాంతి తీసుకోవడంతో బ్రేస్‌వెల్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. పాక్‌తో సిరీస్‌కు ఛాంపియన్స్ ట్రోఫీ హీరో రచిన్ రవీంద్రతో పాటు స్టార్ ఆటగాళ్లు కేన్ విలియమ్సన్, డెవాన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్ కూడా ఎంపిక కాలేదు. ఈ ముగ్గురికి న్యూజిలాండ్ సెలెక్టర్లు విశ్రాంతినిచ్చారు. గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన పేసర్ లోకీ ఫెర్గూసన్ కూడా ఈ సిరీస్‌కు ఎంపిక కాలేదు. ఫెర్గూసన్ గాయం నుంచి ఇంకా కోలుకోలేదని తెలుస్తుంది. విదేశీ లీగ్‌ల కమిట్మెంట్స్ కారణంగా గత సిరీస్‌కు దూరంగా ఉన్న టిమ్ సీఫర్ట్, ఫిన్ అలెన్, జేమ్స్ నీషమ్ పాక్‌తో సిరీస్‌కు జట్టులోకి వచ్చారు. లంకతో సిరీస్‌కు దూరంగా ఉన్న వెటరన్ లెగ్ స్పిన్నర్ ఇష్ సోధి తిరిగి జట్టులోకి వచ్చాడు. గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన పేసర్ బెన్ సియర్స్ ఈ సిరీస్‌కు ఎంపికయ్యాడు. వర్క్ లోడ్ కారణంగా పేసర్లు కైల్ జేమీసన్, విలియమ్ ఓరూర్కీ తొలి మూడు టీ20లకు మాత్రమే ఎంపికయ్యారు. కెప్టెన్‌గా ఎంపిక కావడం పట్ల బ్రేస్‌వెల్ ఆనందం వ్యక్తం చేశాడు. జాతీయ జట్టుకు సారథ్యం వహించడం గొప్ప గౌరవమని అన్నాడు. టీ20ల్లో పాక్ బలమైన ప్రత్యర్థి అని, వారిని ఎదుర్కొనేందుకు ఆతృతగా ఉన్నాయని తెలిపాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఓడటంతో ఆటగాళ్లు కాస్త నిరుత్సాపడ్డారని.. పాక్‌తో సిరీస్ సమయానికి మామూలు స్థితికి వస్తారని పేర్కొన్నాడు. వైట్ బాల్ కెప్టెన్‌గా సాంట్నర్ లెగసీకి కొనసాగిస్తానని తెలిపాడు. కాగా, న్యూజిలాండ్‌లో పాక్ పర్యటన మార్చి 16న మొదలవుతుంది. ఈ పర్యటనలో పాక్ 5 టీ20లు, 3 వన్డేలు ఆడుతుంది. పాకిస్తాన్‌తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు: మైఖేల్ బ్రేస్‌వెల్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మార్క్ చాప్మన్, జాకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్ (4,5 మ్యాచ్‌లకు), మిచ్ హే, మాట్ హెన్రీ (4,5 మ్యాచ్‌లకు), కైల్ జామిసన్ (1, 2, 3 మ్యాచ్‌లకు), డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, విల్ ఓ'రూర్కే (1, 2, 3 మ్యాచ్‌లకు), టిమ్ రాబిన్సన్, బెన్ సియర్స్, టిమ్ సీఫెర్ట్, ఇష్ సోధిన్యూజిలాండ్ పర్యటనలో పాక్ షెడ్యూల్..మార్చి 16- తొలి టీ20 (క్రైస్ట్‌చర్చ్)మార్చి 18- రెండో టీ20 (డునెడిన్)మార్చి 21- మూడో టీ20 (ఆక్లాండ్)మార్చి 23- నాలుగో టీ20 (మౌంట్ మౌంగనూయ్)మార్చి 26- ఐదో టీ20 (వెల్లింగ్టన్)మార్చి 29- తొలి వన్డే (నేపియర్)ఏప్రిల్ 2- రెండో వన్డే (హ్యామిల్టన్)ఏప్రిల్ 5- మూడో వన్డే (మౌంట్ మౌంగనూయ్) -
సంగక్కర విధ్వంసకర శతకం.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన శ్రీలంక
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ 2025లో శ్రీలంక మాస్టర్స్ జోరు కొనసాగుతుంది. ఇంగ్లండ్ మాస్టర్స్‌తో నిన్న (మార్చి 10) జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా పాయింట్ల పట్టికలో భారత మాస్టర్స్‌ను వెనక్కు నెట్టి అగ్రస్థానానికి చేరుకోవడంతో పాటు నాకౌట్స్‌కు అర్హత సాధించింది. 4 మ్యాచ్‌లు ఆడినా ఒక్క విజయం కూడా సాధించని ఇంగ్లండ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.నిన్నటి మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక.. ఇంగ్లండ్ మాస్టర్స్‌ను స్వల్ప స్కోర్‌కే కట్టడి చేసింది. శ్రీలంక బౌలర్లు కలిసికట్టుగా రాణించడంతో ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 146 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఉడాన, దిల్రువన్ పెరీరా, గుణరత్నే, చతురంగ, జీవన్ మెండిస్ తలో వికెట్ తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేశారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో ఫిల్ మస్టర్డ్ (39 బంతుల్లో 50; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ద సెంచరీతో రాణించగా.. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (10), టిమ్ ఆంబ్రోస్ (17), డారెన్ మ్యాడీ (15), టిమ్ బ్రేస్నన్ (18 నాటౌట్), క్రిస్ ట్రెమ్లెట్ (14 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఉడాన బంతితో సత్తా చాటడంతో పాటు ఫీల్డింగ్‌లోనూ మెరిశాడు. ఈ మ్యాచ్‌లో అతను మూడు క్యాచ్‌లు పట్టాడు.సంగక్కర విధ్వంసకర శతకంస్వల్ప లక్ష్య ఛేదనలో శ్రీలంక ఓపెనర్ కుమార సంగక్కర విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. సంగ 47 బంతుల్లో 19 ఫోర్లు, సిక్సర్ సాయంతో 106 పరుగులతో అజేయంగా నిలిచి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. సంగక్కరకు మరో ఎండ్‌లో ఎలాంటి సహకారం లభించనప్పటికీ.. ఒంటిచేత్తో శ్రీలంకను గెలిపించాడు. లంక ఇన్నింగ్స్‌లో రొమేశ్ కలువితరణ 16, అసేల గుణరత్నే 22 పరుగులతో అజేయంగా నిలిచాడు. సంగక్కర సుడిగాలి శతకంతో చెలరేగడంతో శ్రీలంక 12.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది (వికెట్ కోల్పోయి). శ్రీలంక కోల్పోయిన ఏకైక వికెట్ (కలువితరణ) మాస్కరెన్హాస్కు దక్కింది.ఈ గెలుపుతో ప్రస్తుత మాస్టర్స్ లీగ్ ఎడిషన్‌లో శ్రీలంక విజయాల సంఖ్య నాలుగుకు (5 మ్యాచ్‌ల్లో) చేరింది. భారత మాస్టర్స్‌తో ఆడిన మ్యాచ్ మినహా శ్రీలంక అన్ని మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. పాయింట్ల పట్టికలో భారత మాస్టర్స్ రెండో స్థానంలో ఉంది. భారత్ సైతం ఈ టోర్నీ ఇప్పటిదాకా ఆడిన 5 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సాధించింది. భారత్ ఒక్క ఆస్ట్రేలియా మాస్టర్స్ చేతుల్లో మాత్రమే ఓడింది. పాయింట్ల పరంగా భారత్, శ్రీలంక సమంగా ఉన్నప్పటికీ లంక రన్‌రేట్ భారత్‌తో పోలిస్తే కాస్త మెరుగ్గా ఉంది. పాయింట్ల పట్టికలో శ్రీలంక, భారత్ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్, సౌతాఫ్రికా ఉన్నాయి. ఆసీస్, విండీస్ తలో 4 మ్యాచ్‌లు ఆడి రెండ్రెండు విజయాలు సాధించగా.. సౌతాఫ్రికా నాలుగింట ఒకే ఒక విజయం సాధించింది. టోర్నీలో ఇప్పటివరకు ఒక్క విజయం కూడా సాధించని ఇంగ్లండ్ టోర్నీ నుంచి ఎలిమినేట్ అయ్యింది. కాగా, తొలిసారి జరుగుతున్న ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ 6 దేశాలకు చెందిన దిగ్గజ, మాజీ క్రికెటర్లు పాల్గొంటున్న విషయం తెలిసిందే. -
ఈసారైనా ‘ఆల్ ఇంగ్లండ్’ అందేనా!
ప్రతి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కెరీర్లో ఒక్కసారైనా ఆడాలనుకునే టోర్నీ, గెలవాలనుకునే టోర్నీ ఏదైనా ఉందంటే అది ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ మాత్రమే. బ్యాడ్మింటన్ క్రీడలో అతి పురాతన టోర్నీలలో ఒకటిగా, ప్రపంచ చాంపియన్‌షిప్ స్థాయి ఉన్న టోర్నీగా ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌నకు పేరుంది. 126 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ మెగా టోర్నీకి రంగం సిద్ధమైంది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య వరల్డ్ టూర్ టోర్నమెంట్ క్యాలెండర్‌ను ప్రవేశపెట్టాక... అత్యున్నత శ్రేణి సూపర్–1000 నాలుగు టోర్నీలలో (మలేసియా, ఆల్ ఇంగ్లండ్, ఇండోనేసియా, చైనా ఓపెన్) ఒకటిగా ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ కొనసాగుతోంది. మంగళవారం నుంచి ఆదివారం జరిగే ఈ టోర్నీకి బరి్మంగ్‌హమ్ ఆతిథ్యమివ్వనుంది. బర్మింగ్హమ్: బ్యాడ్మింటన్ సీజన్‌లోని మరో మెగా టోర్నీకి భారత క్రీడాకారులు సమాయత్తమయ్యారు. నేటి నుంచి ఆదివారం వరకు జరిగే ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో భారత్ నుంచి మొత్తం 17 మంది ప్లేయర్లు బరిలోకి దిగనున్నారు. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ మాజీ చాంపియన్ పీవీ సింధు, రైజింగ్ స్టార్ మాళవిక బన్సోద్... పురుషుల సింగిల్స్‌లో ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ మాజీ రన్నరప్ లక్ష్య సేన్, ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత హెచ్ఎస్ ప్రణయ్ పోటీపడనున్నారు. పురుషుల డబుల్స్‌లో ఆసియా క్రీడల చాంపియన్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి... మహిళల డబుల్స్‌లో గత రెండేళ్లలో సెమీఫైనల్ చేరిన పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ... పారిస్ ఒలింపిక్స్‌లో పోటీపడ్డ అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో.. శ్రుతి మిశ్రా–ప్రియా కొంజెంగ్‌బమ్... మిక్స్డ్ డబుల్స్‌లో గద్దె రుత్విక–రోహన్ కపూర్... తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల... ఆద్యా–సతీశ్ కుమార్ జోడీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. భారత్ నుంచి పురుషుల సింగిల్స్‌లో మాత్రమే ఇద్దరు చాంపియన్స్‌గా నిలిచారు. 1980లో ప్రకాశ్ పదుకొనే... 2001లో పుల్లెల గోపీచంద్ ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టైటిల్స్ సాధించారు. ఆ తర్వాత భారత్ నుంచి మరో ప్లేయర్ ఆల్ ఇంగ్లండ్ టైటిల్ అందుకోలేకపోయారు. 2015లో మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్... 2022లో పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్ ఫైనల్‌కు చేరినా చివరకు రన్నరప్ ట్రోఫీలతో సరిపెట్టుకున్నారు. ఈసారి స్టార్ ప్లేయర్లు సింధు, లక్ష్య సేన్, ప్రణయ్, సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టిలపై భారత క్రీడాభిమానులు ఆశలు పెట్టుకున్నారు. గతంలో 12 సార్లు ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో ఆడిన సింధు అత్యుత్తమంగా 2018, 2021లలో సెమీఫైనల్ దశకు చేరుకుంది. ఈసారి సింధుకు కాస్త క్లిష్టమైన ‘డ్రా’నే ఎదురైంది. తొలి రౌండ్లో దక్షిణ కొరియా ప్లేయర్ గా యున్ కిమ్‌తో సింధు ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గితే ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 4వ ర్యాంకర్ హాన్ యువెతో సింధు తలపడే అవకాశముంది. భారత్‌కే చెందిన మాళవిక నేడు జరిగే తొలి రౌండ్లో జియా మిన్ యో (సింగపూర్)తో తలపడుతుంది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో లి యాంగ్ సు (చైనీస్ తైపీ)తో లక్ష్య సేన్...టోమా జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్)తో ప్రణయ్ ఆడతారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో డానియల్ లిండ్‌గార్డ్–మాడ్స్ వెస్టర్‌గాడ్ (డెన్మార్క్)లను సాత్విక్–చిరాగ్ ఢీకొంటారు. -
రూ. 12 కోట్లు ఇస్తున్నారు
న్యూఢిల్లీ: హాకీ ఇండియా (హెచ్ఐ) వార్షిక అవార్డుల విజేతలకు ఈసారి భారీగా ప్రైజ్‌మనీ దక్కనుంది. 2024 సీజన్‌కు సంబంధించి అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో కనబరిచిన ప్రదర్శన ఆధారంగా 8 కేటగిరీల్లో 32 మంది నామినేట్ అయ్యారు. వీరందరికి కలిపి ఏకంగా రూ. 12 కోట్ల ప్రైజ్‌మనీ అందజేయనున్నట్లు హెచ్ఐ తెలిపింది. శనివారం న్యూఢిల్లీలో అవార్డుల వేడుక నిర్వహించనున్నారు. » మహిళలు, పురుషుల కేటగిరీలో ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’గా నిలిచిన వారికి బల్బీర్‌సింగ్ సీనియర్ అవార్డు... వర్ధమాన ప్లేయర్లకు పురుషుల విభాగంలో జుగ్రాజ్ సింగ్ పేరిట... మహిళల్లో అసుంత లాక్రా పేరిట ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డులను అందజేస్తారు. » ‘గోల్‌కీపర్ ఆఫ్ ద ఇయర్’గా నిలిచిన వారికి బల్జీత్ సింగ్ అవార్డును... ‘డిఫెండర్ ఆఫ్ ద ఇయర్’కు పర్గత్ సింగ్ అవార్డు, ‘మిడ్ ఫీల్డర్ ఆఫ్ ద ఇయర్’కు అజిత్‌పాల్ సింగ్ అవార్డును... ‘ఫార్వర్డ్ ఆఫ్ ద ఇయర్’కు ధన్‌రాజ్ పిళ్లై అవార్డును బహూకరిస్తారు. » భారత పురుషుల హాకీ జట్టు ప్రపంచకప్ (1975) టైటిల్ గెలిచి 50 ఏళ్లు పూర్తికావడం, అలాగే అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) గుర్తింపు పొంది 100 ఏళ్లు (1925) పూర్తికావడంతో స్వర్ణోత్సవ వేడుకలు ఈ అవార్డుల కార్యక్రమంలోనే జరుగనుంది. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన పురుషుల జట్టును, ఆసియా చాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన పురుషులు, మహిళల జట్లను ఘనంగా సన్మానించనున్నారు. సీనియర్ జట్లతో పాటు జూనియర్ ఆసియాకప్ సాధించిన పురుషులు, మహిళల జట్లను సత్కరిస్తారు. » బల్బీర్‌సింగ్ సీనియర్ అవార్డు రేసులో రిటైరైన పీఆర్ శ్రీజేశ్, కృష్ణన్ బహదూర్ పాఠక్‌లతో పాటు మహిళా ప్లేయర్లు సవిత, బిచూ దేవి ఖరిబం కూడా ఉన్నారు. » డిఫెండర్ అవార్డు కోసం సంజయ్, అమిత్ రోహిదాస్, హర్మన్‌ప్రీత్ సింగ్, ఉదిత పోటీపడుతున్నారు. » మిడ్‌ఫీల్డర్ అవార్డు కోసం జర్మన్‌ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్, నీలకంఠ శర్మ, సుమిత్ నామినేట్ అయ్యారు. » ఫార్వర్డ్ అవార్డు కోసం లాల్రెమ్సియామి, అభిషేక్, సుఖ్జీత్, నవ్‌నీత్ కౌర్ బరిలో ఉన్నారు. æ అండర్–21 మహిళలకు ఇచ్చే వర్థమాన ప్లేయర్ అవార్డు రేసులో బ్యూటీ డుంగ్‌డుంగ్, దీపిక, వైష్ణవి ఫాల్కే, సునెలితా టొప్పొ ఉన్నారు. »అండర్–21 పురుషులకు ప్రదానం చేసే వర్ధమాన ప్లేయర్ పురస్కారం కోసం అర్‡్షదీప్ సింగ్, అమిర్ అలీ, శర్దానంద్ తివారి, అరిజీత్ సింగ్ బరిలో ఉన్నారు. -
ముంబై ‘ఫైనల్’ రేసులో...
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) లో అగ్రస్థానంతో నేరుగా ఫైనల్ చేరేందుకు ముంబై ఇండియన్స్ జట్టు విజయం దూరంలో నిలిచింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 9 పరుగుల తేడాతో గుజరాత్ జెయింట్స్‌పై గెలుపొందింది. మొదట ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 179 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (33 బంతుల్లో 54; 9 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించింది. తర్వాత గుజరాత్ 20 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది. భారతి (25 బంతుల్లో 61; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) ముంబై బౌలర్లపై విరుచుకుపడింది. జెయింట్స్ ఒకదశలో 92 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఓటమికి సిద్ధమవగా... భారతి ధనాధన్ ఆటతో ఆశలు రేపింది. 41 బంతుల్లో 88 పరుగుల సమీకరణం ఆఖరి ఓవర్‌కు వచ్చేసరికి 6 బంతుల్లో 13 పరుగులుగా మారింది. కానీ 20వ ఓవర్ వేసిన హేలీ... తనూజ (10)ను రనౌట్ చేసింది. తర్వాతి బంతికి సిమ్రాన్ (18; 1 ఫోర్, 1 సిక్స్), చివరి బంతికి ప్రియా (1) వికెట్లు తీసి ఆలౌట్ చేసింది. నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగే లీగ్ దశ ఆఖరి మ్యాచ్‌లోనూ గెలిస్తే ముంబై 12 పాయింట్లతో పట్టికలో టాప్ లేపి నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ప్రస్తుతం ముంబై, ఢిల్లీ క్యాపిటల్స్ 10 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నా... మెరుగైన రన్‌రేట్ కారణంగా ఢిల్లీ ‘టాప్’లో ఉంది. -
అపురూపంగా అక్కున చేర్చుకొని...
దుబాయ్: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల చేతుల్లో నాలుగో ఐసీసీ టైటిల్స్...రవీంద్ర జడేజాకు ముచ్చటగా మూడోది. గిల్, పంత్, పాండ్యా, అక్షర్, అర్‡్షదీప్ సింగ్, కుల్దీప్ ఏడాది వ్యవధిలో రెండో ఐసీసీ ట్రోఫీని అందుకోగా... షమీ, అయ్యర్, రాహుల్, సుందర్, రాణా మొదటిసారి కప్‌ను ముద్దాడారు... 15 మంది సభ్యుల జట్టులో అందరి ఘనతలు వేర్వేరు కావచ్చు... కానీ ఇప్పటికే ఎన్ని గెలిచినా, ఏం సాధించినా మరో విజయం దక్కినప్పుడు అందరిలో కనిపించే ఆనందం ఒక్కటే... సంబరాల్లో ఎవరూ ఎక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదు. ఆదివారం చాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకున్న భారత జట్టు ఆటగాళ్ల వేడుకల్లో ఇది స్పష్టంగా కనిపించింది. జడేజా బౌండరీ కొట్టి ఛేదన పూర్తి చేయడంతో మొదలైన జోష్ సోమవారం వరకు సాగింది. స్టేడియంలో ఒకవైపు జట్టు సహచరులతో విజయాన్ని పంచుకుంటూనే మరోవైపు రోహిత్, కోహ్లి, జడేజా, షమీ, గిల్ తమ కుటుంబ సభ్యులతో ట్రోఫీ ఆనందాన్ని ప్రదర్శిస్తూ సుదీర్ఘ సమయం గడిపారు. అక్కడి నుంచి ఇదే ఉత్సాహం డ్రెస్సింగ్ రూమ్‌లోనూ కొనసాగింది. ప్రత్యేకంగా సిద్ధం చేసిన కేక్‌ను కెప్టెన్ రోహిత్ కట్ చేసిన తర్వాత తమ విజయానుభూతిని అంతా పంచుకున్నారు. అనంతరం హోటల్ చేరుకున్న భారత బృందానికి ఘన స్వాగతం లభించింది. మ్యాచ్ గెలిచిన తర్వాత కుల్దీప్ చెప్పినట్లు రాత్రంతా పార్టీ కొనసాగింది. గిల్, పాండ్యా, వరుణ్ హోటల్ గదుల్లోనే చాంపియన్స్ ట్రోఫీతో ఫోటోలకు పోజులిస్తూ ఈ మధుర క్షణాలను చిరస్మరణీయం చేసుకున్నారు. సోమవారం ఉదయం విజేత కెప్టెన్‌తో ఐసీసీ ప్రత్యేక ఫొటో షూట్ కార్యక్రమం జరిగింది. ముందుగా ఐసీసీ ప్రచార కార్యక్రమంలో భాగంగా టోర్నీ జ్ఞాపికలుగా మ్యాచ్‌లలో ఉపయోగించిన బంతులు, స్టంప్స్‌పై రోహిత్ శర్మ ఆటోగ్రాఫ్‌లు ఇచ్చాడు. ఆ తర్వాత ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫా నేపథ్యంగా జరిగిన షూట్లో ట్రోఫీతో భారత సారథి సగర్వంగా నిలిచాడు. గత ఏడాది రోహిత్ నాయకత్వంలోనే గెలుచుకున్న టి20 వరల్డ్ కప్‌ను కూడా చాంపియన్స్ ట్రోఫీతో కలిపి ప్రదర్శించడం విశేషం. స్వదేశానికి చేరిన టీమిండియా ఆటగాళ్లుచాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచి సంబరాలు ముగించిన వెంటనే టీమిండియా స్వదేశం పయనమైంది. సోమవారం రాత్రికే జట్టు ఆటగాళ్లంతా భారత్‌కు చేరుకున్నారు. -
‘2027’పై ఇప్పుడే చెప్పను!
దుబాయ్: వరుసగా గత మూడు ఐసీసీ టోర్నీల్లో ఫైనల్ చేరిన భారత జట్టు రెండు టైటిల్స్ నెగ్గి మరో దాంట్లో రన్నరప్‌గా నిలిచింది. ఈ మూడు టోర్నీలు కలిపి 24 మ్యాచ్‌లు ఆడితే ఒక్క వరల్డ్ కప్ ఫైనల్ మినహా మిగతా 23 మ్యాచ్‌లు గెలిచింది. వరుసగా టి20 వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీలలో ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా ట్రోఫీని సాధించింది. ఇది అసాధారణ ఘనత అని, తమ జట్టు స్థాయిని ప్రదర్శించామని భారత కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. ‘నిజాయితీగా చెప్పాలంటే ఇది చాలా పెద్ద ఘనత. మా టీమ్ ఎంత బలంగా ఉందో ఇది చూపించింది. ఆటగాళ్ల ప్రదర్శనతో పాటు వారి మధ్య చక్కటి సమన్వయం, బయటి అంశాలను పట్టించుకోకుండా ఒత్తిడిని అధిగమించి ఇలాంటి విజయాలు సాధించడం అసాధారణం. విజయం సాధించాలనే ఒకే ఒక లక్ష్యంతో అందరూ పని చేశారు’ అని రోహిత్ అన్నాడు. వరుసగా రెండు ఐసీసీ టోర్నీలు సాధించడం అంత సులువైన విషయం కాదని, దాని వెనక చాలా శ్రమ ఉందని అతను చెప్పాడు. ‘చాలా తక్కువ జట్లు మాత్రమే ఓటమి లేకుండా వరుసగా రెండు ట్రోఫీలు గెలిచాయి. అన్నీ మా వ్యూహాల ప్రకారమే ఆడి సఫలమయ్యాం. వన్డే వరల్డ్ కప్‌లో చాలా అద్భుతంగా ఆడిన తర్వాత కూడా ఫైనల్లో ఓడాం. ఇదే విషయాన్ని కుర్రాళ్లకు చెబుతూ గత రెండు ఫైనల్స్‌కు ముందు చివరి బంతి పడే వరకు పోరాడమని స్ఫూర్తి నింపాం. ఇదే ఫలితాన్ని అందించింది’ అని రోహిత్ వెల్లడించాడు. తమ తుది జట్టులో వైవిధ్యమైన ఆటగాళ్లు ఉండటం విజయానికి కారణమని కూడా అతను విశ్లేషించాడు. ‘1 నుంచి 11వ నంబర్ ఆటగాడి వరకు ఏదో ఒక రూపంలో జట్టు విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. ఈ సమష్టితత్వంతో పాటు గెలవాలనే కసి కూడా వారిలో కనిపించింది’ అని రోహిత్ వివరించాడు. 2027 వన్డే వరల్డ్ కప్‌లో ఆడే విషయంపై తాను ఇప్పుడే ఎలాంటి వ్యాఖ్య చేయనని, ప్రస్తుతానికి తాజా విజయాలను ఆస్వాదిస్తున్నట్లు రోహిత్ స్పష్టం చేశాడు. ఈ ఫార్మాట్ నుంచి తాను రిటైర్ కావడం లేదని ఆదివారమే మ్యాచ్ అనంతరం అతను వెల్లడించాడు. ‘ప్రస్తుతం అంతా బాగుంది. భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన అవసరం అప్పుడే లేదు. 2027 వన్డే వరల్డ్ కప్ ఆడతానా లేదా అని ఇప్పుడే చెప్పను. దీని గురించి ఈ సమయంలో మాట్లాడటం అనవసరం. నా కెరీర్లో ఒక్కో అడుగు వేసుకుంటూ వెళ్లాను. మున్ముందు ఏం జరుగుతుందో ఎప్పుడూ ఆలోచించలేదు. నా సహచరులతో కలిసి క్రికెట్‌ను ఆస్వాదిస్తున్నాను. అది చాలు’ అని రోహిత్ వ్యాఖ్యానించాడు. -
WPL 2025: దంచికొట్టిన హర్మన్.. ధనాధన్ హాఫ్ సెంచరీ
మహిళల ప్రీమియర్ లీగ్(WPL)లో ఫైనల్ చేరడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ముంబై ఇండియన్స్.. గుజరాత్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో మెరుగైన స్కోరు సాధించింది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో సోమవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్.. హర్మన్‌ప్రీత్ కౌర్ బృందాన్ని తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.హర్మన్ కెప్టెన్ ఇన్నింగ్స్ముంబై ఓపెనర్లలో అమెలియా కౌర్(5) విఫలం కాగా.. మరో ఓపెనర్ హేలీ మాథ్యూస్(27) ఫర్వాలేదనిపించింది. వన్‌డౌన్ బ్యాటర్ నాట్ సీవర్-బ్రంట్ 38 పరుగులతో రాణించగా.. హర్మన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 33 బంతుల్లోనే 6 ఫోర్ల సాయంతో 54 పరుగులు రాబట్టింది.మిగతా వాళ్లలో అమన్‌జ్యోత్ కౌర్(15 బంతుల్లో 27) దంచికొట్టగా.. సజీవన్ సంజన మెరుపు(6 బంతుల్లో 11, నాటౌట్)లు మెరిపించింది. ఆఖర్లో వికెట్ కీపర్ బ్యాటర్ యస్తికా భాటియా 4 బంతుల్లోనే 13 పరుగులతో దుమ్ములేపింది. ఈ క్రమంలో నిర్ణీత ఇరవై ఓవర్లలో ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల నష్టానికి 179 పరుగులు స్కోరు చేసింది.ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారుగుజరాత్ జెయింట్స్ బౌలర్లలో తనూజ కన్వార్, కశ్వీ గౌతం, ప్రియా మిశ్రా, కెప్టెన్ ఆష్లే గార్డ్నర్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే.. WPL-2025లో ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారైన విషయం తెలిసిందే. ఎనిమిదింట ఐదు విజయాలతో ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్ పది పాయింట్లతో టాప్‌లో కొనసాగుతుండగా.. గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ చెరో నాలుగు విజయాలతో ఎనిమిది పాయింట్లు సాధించి.. ఢిల్లీతో కలిసి ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టాయి.టాప్‌లో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్కుఅయితే, పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. రెండు, మూడు స్థానాల్లో ఉన్న జట్లు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడతాయి. అయితే, లీగ్ దశలో గుజరాత్‌కు తాజా మ్యాచ్ రూపంలో ఒకే మ్యాచ్ మిగిలి ఉండగా.. ముంబైకి గుజరాత్‌తో పాటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ కూడా మిగిలే ఉంది.ఈ నేపథ్యంలో సోమవారం నాటి మ్యాచ్‌లో గుజరాత్‌ను.. తదుపరి మంగళవారం బెంగళూరును ఓడిస్తే పన్నెండు పాయింట్లతో నేరుగా ఫైనల్లో అడుగుపెడుతుంది. అందుకే గుజరాత్‌ను ఓడించి.. ఆ తర్వాత బెంగళూరు జట్టు పనిపట్టాలని హర్మన్‌సేన పట్టుదలగా ఉంది. ఇక ముంబై ఇండియన్స్‌తో సోమవారం నాటి మ్యాచ్‌లో ఫలితాన్ని బట్టి గుజరాత్ భవితవ్యం తేలిపోనుంది.డబ్ల్యూపీఎల్-2025: ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్తుదిజట్లుముంబై ఇండియన్స్:హేలీ మాథ్యూస్, యస్తికా భాటియా(వికెట్ కీపర్), నాట్ సీవర్- బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), అమేలియా కర్, సజీవన సంజన, జి.కమలిని, అమన్‌జోత్ కౌర్, సంస్కృతి గుప్తా, షబ్నం ఇస్మాయిల్, పరుణిక సిసోడియాగుజరాత్ జెయింట్స్బెత్ మూనీ(వికెట్ కీపర్), హర్లిన్ డియోల్, ఆష్లే గార్డ్నర్(కెప్టెన్), డియాండ్రా డాటిన్, కశ్వీ గౌతం, సిమ్రన్ షేక్, ఫోబే లిచ్‌ఫీల్డ్, భార్తి ఫల్మాలి, తనుజ కన్వార్, మేఘనా సింగ్, ప్రియా మిశ్రా. View this post on Instagram A post shared by Women's Premier League (WPL) (@wplt20) -
IPBL: అదరగొట్టిన భారత బాక్సర్లు
ఇండియన్ ప్రొ బాక్సింగ్ లీగ్(IPBL)లో భాగంగా వరల్డ్ చాంపియన్స్‌తో పోటీలో భారత బాక్సర్లు అదరగొట్టారు. రానా దగ్గుబాటి బాక్సింగ్ బే- ఆంటొని పెట్టిస్ ఏపీఎఫ్సీల మధ్య జరుగుతున్న బాక్సింగ్ పోటీల్లో అక్షయ్ చహల్- సబరి జయశంకర్ సత్తా చాటారు. హైదరాబాద్ వేదికగా ప్రపంచ చాంపియన్లు అయిన లూయీస్ ఫెలిషియానో, సెర్గియో పెట్టిస్లపై అద్భుత విజయం సాధించి.. ప్రొఫెషనల్ బాక్సింగ్‌కు భారత్ సిద్ధంగా ఉందనే సంకేతాలు ఇచ్చారు.అక్షయ్-సబరి అద్బుత పోరాటం కారణంగా టీమిండియా- టీమ్ అమెరికా మధ్య సాగిన పోరు 2-2తో డ్రాగా ముగిసింది. ఈ సందర్భంగా మాజీ యూఎఫ్‌సీ లైట్ వెయిట్ ఛాంపియన్ ఆంటోని పెట్టిస్ మాట్లాడుతూ.. ‘‘IPBL ప్రపంచంలోని అతిపెద్ద బాక్సింగ్ లీగ్‌లలో ఒకటిగా ఎదుగుతుందనడంలో సందేహం లేదు.అగ్రశ్రేణి బాక్సర్లను ఇక్కడికి తీసుకువచ్చేందుకు నేను కట్టుబడి ఉన్నాను. ఇండియాలో ఈ పోటీలను మరింత విస్తృతం చేయాలనే సంకల్పంతో ఉన్నాం’’ అని తెలిపాడు. ఇక రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్ అసమాన హోస్ట్ అని మరోసారి నిరూపితమైంది’’అని హర్షం వ్యక్తం చేశాడు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని.. ఇండియాలోనే బాక్సింగ్ క్యాపిటల్‌గా హైదరాబాద్ ఎదిగేలా తాము ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించాడు. పెట్టిస్ ఈ ఉద్యమానికి మద్దతుగా నిలిచాడని.. అతడి సహకారం ఇలాగే కొనసాగుతుందని రానా ఆశాభావం వ్యక్తం చేశాడు. -
CT 2025: జట్టును ప్రకటించిన ఐసీసీ.. రోహిత్‌కు దక్కని చోటు
పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న మొదలైన చాంపియన్స్ ట్రోఫీ-2025(Champions Trophy) ఎడిషన్ మార్చి 9న దుబాయ్‌లో ముగిసింది. టైటిల్ పోరులో న్యూజిలాండ్‌తో తలపడ్డ టీమిండియా జయకేతనం ఎగురవేసి ట్రోఫీని ముద్దాడింది. గ్రూప్ దశలో మూడు.. సెమీస్, ఫైనల్ గెలిచి అజేయంగా ఈ వన్డే టోర్నమెంట్‌ను ముగించింది.ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) తాజాగా చాంపియన్స్ ట్రోఫీ-2025 టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌ను ప్రకటించింది. ఈ పదకొండు మంది సభ్యుల జట్టులో భారత్ హవా కొనసాగింది. టీమిండియా నుంచి ఈ జట్టులో ఏకంగా ఐదుగురు క్రికెటర్లు స్థానం సంపాదించారు.పాకిస్తాన్‌కు మొండిచేయిమరోవైపు.. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి గెలుపన్నదే లేకుండా నిష్క్రమించిన పాకిస్తాన్‌కు మొండిచేయి ఎదురైంది. అంతేకాదు.. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ జట్ల నుంచి కూడా ఒక్క ఆటగాడూ ఐసీసీ జట్టులో స్థానం సంపాదించలేకపోయాడు. ఇక టీమిండియా తర్వాత న్యూజిలాండ్ నుంచి అత్యధికంగా నలుగురు ఐసీసీ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకున్నారు. అదే విధంగా అఫ్గనిస్తాన్ నుంచి ఇద్దరు ఇందులో ఉన్నారు. అయితే, ఇందులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు మాత్రం చోటు దక్కకపోవడం గమనార్హం. ఈ జట్టుకు సారథిగా కివీస్ నాయకుడు మిచెల్ సాంట్నర్ ఎంపికయ్యాడు.నాలుగు వికెట్ల తేడాతో ఓడించికాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ పోటీపడగా.. టీమిండియా, కివీస్ సెమీస్ చేరాయి. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, అఫ్గనిస్తాన్ బరిలో దిగగా.. ఆసీస్, ప్రొటిస్ జట్లు సెమీ ఫైనల్లో అడుగుపెట్టాయి.ఈ క్రమంలో తొలి సెమీస్ మ్యాచ్‌లో భారత్- ఆసీస్‌ను... రెండో సెమీస్‌లో కివీస్ ప్రొటిస్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకున్నాయి. ఈ క్రమంలో దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో రోహిత్ సేన సాంట్నర్ బృందాన్ని నాలుగు వికెట్ల తేడాతో ఓడించి చాంపియన్‌గా అవతరించింది. ఈ మ్యాచ్‌లో 76 పరుగులతో రాణించిన భారత సారథి రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా.. మొత్తంగా రెండు శతకాల సాయంతో 263 పరుగులు సాధించిన కివీస్ యువ ఆటగాడు రచిన్ రవీంద్రకు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు దక్కింది.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ‘టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్’రచిన్ రవీంద్ర(న్యూజిలాండ్), ఇబ్రహీం జద్రాన్(అఫ్గనిస్తాన్), విరాట్ కోహ్లి(ఇండియా), శ్రేయస్ అయ్యర్(ఇండియా), కేఎల్ రాహుల్(ఇండియా), గ్లెన్ ఫిలిప్స్(న్యూజిలాండ్), అజ్మతుల్లా ఒమర్జాయ్(అఫ్గనిస్తాన్), మిచెల్ సాంట్నర్(కెప్టెన్, న్యూజిలాండ్), మ్యాట్ హెన్రీ(న్యూజిలాండ్), వరుణ్ చక్రవర్తి(ఇండియా)12వ ఆటగాడు: అక్షర్ పటేల్(ఇండియా)చాంపియన్స్ ట్రోఫీ-2025లో వీరి ప్రదర్శన👉రచిన్ రవీంద్ర- రెండు శతకాల సాయంతో 263 రన్స్. స్పిన్ బౌలర్‌గానూ రాణించిన రచిన్. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎంపిక👉ఇబ్రహీం జద్రాన్- ఒక సెంచరీ సాయంతో 216 పరుగులు. ఇంగ్లండ్‌పై అఫ్గన్ గెలుపొందడంలో కీలక పాత్ర👉విరాట్ కోహ్లి- ఒక శతకం సాయంతో 218 పరుగులు. పాకిస్తాన్‌పై అజేయ సెంచరీ. వన్డేల్లో అత్యంత వేగంగా పద్నాలుగు వేల మార్కు అందుకున్న క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు.👉శ్రేయస్ అయ్యర్- రెండు అర్ధ శతకాల సాయంతో 243 రన్స్. టీమిండియా చాంపియన్‌గా నిలవడంతో కీలక మిడిలార్డర్ బ్యాటర్‌గా రాణింపు.👉కేఎల్ రాహుల్- 140 పరుగులు. వికెట్ కీపర్‌గానూ సేవలు.👉గ్లెన్ ఫిలిప్స్- 177 పరుగులు. రెండు వికెట్లు, ఐదు క్యాచ్‌లు.👉అజ్మతుల్లా ఒమర్జాయ్- 126 రన్స్, ఏడు వికెట్లు.👉మిచెల్ సాంట్నర్- 4.80 ఎకానమీతో తొమ్మిది వికెట్లు👉మహ్మద్ షమీ- 5.68 ఎకానమీతో తొమ్మిది వికెట్లు. ఇందులో ఓ ఫైవ్ వికెట్ హాల్.👉మ్యాట్ హెన్రీ- 5.32 ఎకానమీతో పది వికెట్లు👉వరుణ్ చక్రవర్తి- 4.53 ఎకానమీతో తొమ్మిది వికెట్లు👉అక్షర్ పటేల్- 4.35 ఎకానమీతో ఐదు వికెట్లు.చదవండి: అతడు మా నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు.. ఓడినా గర్వంగానే ఉంది: కివీస్ కెప్టెన్ View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
Dhoni- Rohit: స్వర్ణయుగం.. ఇద్దరూ ఇద్దరే! నాకు మాత్రం అదే ముఖ్యం!
భారత్ క్రికెట్లో మహేంద్ర సింగ్ ధోని(MS Dhoni)కి ప్రత్యేక స్థానం ఉంది. సుదీర్ఘ కాలం తర్వాత అతడి నాయకత్వంలోనే టీమిండియాకు మళ్ళీ ప్రపంచ కప్ విజయం లభించింది. 1983లో కపిల్ దేవ్(Kapil Dev) నేతృత్వంలోని తొలిసారి వన్డే ప్రపంచ కప్ సాధించిన భారత్.. 2007 తర్వాత ధోని నాయకత్వంలో వరుసగా మూడు ఐసీసీ టైటిల్స్ సాధించింది. అయితే, సారథిగా ధోని నిష్క్రమణ తర్వాత భారత్ విజయ పరపంపరకి రోడ్‌బ్లాక్ పడింది. పదకొండు సంవత్సరాలు ట్రోఫీ లేకుండా మిగిలిపోయింది. ఇలాంటి కఠిన దశలో నాయకత్వ బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ(Rohit Sharma) 2024, 2025లో వరుసగా వరుసగా రెండు ఐసీసీ ట్రోఫీ లను గెలిపించి భారత్‌కి కొత్త హీరో గా ఖ్యాతి వహించాడు.భారత క్రికెట్‌కు స్వర్ణయుగంవైట్-బాల్ క్రికెట్లో భారతదేశం తిరిగి తమ స్వర్ణ యుగానికి చేరుకుందా అంటే అవుననే చెప్పాలి. 2010ల ప్రారంభంలో ధోని చూపించిన నాయకత్వ లక్షణాలు ఇప్పుడు రోహిత్ శర్మ లో కూడా కనిపిస్తున్నాయి. వీరిద్దరూ సాధించిన ఐసీసీ ట్రోఫీలను పరిశీలిస్తే ఇది కరక్టే అనిపిస్తుంది. ఎంఎస్ ధోని సహజంగా ఎక్కువగా మాట్లాడాడు. సరిగ్గా అవసరమైనప్పుడు తన నిర్ణయాలు, వ్యక్తిగత సామర్ధ్యం ఏమిటో చూపిస్తాడు. తన స్థాయి ఏమిటో తెలియజేస్తాడు.ఇప్పుడు రోహిత్ శర్మ సరిగ్గా అదే చేసి చూపించాడు. ఇక ట్రోఫీల పరంగా చూస్తే ధోని 2007లో టీ20 ప్రపంచ కప్, 2011లో వన్డే ప్రపంచ కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీలను భారలత్కి అందించాడు.ఇప్పుడు రోహిత్ శర్మ నాయకత్వం లో భారత్ 2023లో వన్డే ప్రపంచ కప్ రన్నరప్‌గా నిలిచింది. 2024లో టీ20 ప్రపంచ కప్ గెలిచింది. మళ్ళీ ఈ సంవత్సరం ఛాంపియన్స్ ట్రోఫీ గెలుపొందింది.అప్పటి భారత జట్టు వెనుకబాటుకి కారణం?2014- 2022 మధ్య భారత్ జట్టు వెనుకడిందని చెప్పవచ్చు. నిజానికి టీమిండియాకు అపారమైన ప్రతిభ గల ఆటగాళ్లు ఉన్నా సరళంగా చెప్పాలంటే, వారు తమ బృందానికి న్యాయం చేయడంలో విఫలమయ్యారు. ఈ కాలంలో భారత్ జట్టు ఐసీసీ ప్రధాన టోర్నమెంట్లలో నిలకడ గా ఆడి నాకౌట్ దశలకు చేరుకున్నప్పటికీ, ట్రోఫీ లను అందుకోవడంలో విఫలమైంది. ఫైనల్ కి చేరుకున్న జట్లని ఎవ్వరూ గుర్తుపెట్టుకోరు.ట్రోఫీ గెలిస్తేనే ఆ జట్టు చరిత్రలో విజయం సాధించిన జట్టుగా కీర్తిని గడిస్తుంది. ధోని నాయకత్వంలో భారత్ జట్టు 2007 టీ20 ప్రపంచ కప్ విజయం ఊహించనిది. 2011లో భారత్ భారీ అంచనాల రీతి తగ్గట్టుగా ఆడి సొంత గడ్డ పై ప్రపంచ కప్‌ను సాధించింది. ఈ టోర్నమెంట్లో సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, జహీర్ ఖాన్, యువరాజ్ సింగ్ , హర్భజన్ సింగ్ వంటి ఆటగాళ్లు భారత్ జట్టు విజయంలో కీలక భూమిక వహించారు.ఇక 2013 నాటికి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సురేశ్ రైనా, ఇషాంత్ శర్మలతో కూడిన కొత్త తరం ఆటగాళ్లు భారత జట్టులోకి చేరారు. ఇంగ్లండ్‌లో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్నప్పుడు ధోని వ్యూహాత్మక ప్రతిభ స్పష్టంగా కనిపించింది. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలతో పాటు కొత్త ఫాస్ట్ బౌలర్ల ఆవిర్భావంతో అప్పుడు జట్టును బలోపేతం చేశారు.కాగా 2017లో విరాట్ కోహ్లీ వైట్-బాల్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించినప్పుడు, అతడి టెస్ట్ విజయం పరిమిత ఓవర్ల ఆధిపత్యంగా మారలేదు. రెడ్-బాల్ క్రికెట్ పట్ల కోహ్లీకి స్పష్టమైన అవగాహన ఉన్నప్పటికీ వైట్-బాల్ టోర్నమెంట్లలో కోహ్లీ అదే విజయ పరంపరను కొనసాగించలేకపోయాడు.రోహిత్ నాయకత్వంలో పునరుజ్జీవనంఇప్పుడు రోహిత్ శర్మ నాయకత్వంలో భారత్ మళ్ళీ మునుపటి విజయ పరంపరను కొనసాగించే స్థాయికి ఎదిగింది. 2007 పరాజయం తర్వాత ధోని భారత్ జట్టు ని ఎలా పునర్నిమించాడో ఇప్పుడు రోహిత్ తనదైన శైలి లో అదే చేసి చూపించాడు. జట్టు లో ఉత్తేజాన్ని పెంచాడు. ఎక్కడా తలవొగ్గ కుండా దూకుడుగా ఆడటాన్ని అలవాటు చేసాడు.2019 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్, 2021 టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన అవమానం, 2022లో ఇంగ్లండ్ చేతిలో జరిగిన సెమీ-ఫైనల్ ఓటమి వంటి హృదయ విదారక సంఘటనలు రోహిత్ మనస్తత్వంలో మార్పును రేకెత్తించాయి. భారత్ జట్టులో తీసుకురావాల్సిన మార్పును సరిగ్గా గుర్తించాడు.నాకు అదే ముఖ్యం2019 ప్రపంచ కప్ లో రోహిత్ ఐదు సెంచరీలు సాధించినప్పటికీ చివరికి ట్రోఫీ గెలువలేకపోవడం బాగా అసంతృప్తిని మిగిల్చింది. రోహిత్ వ్యక్తిగతంగా రాణించినప్పటికీ అది జట్టు విజయానికి దోహదం చేయలేదన్న బాధ అతన్ని కలిచివేసింది. “నేను 2019 ప్రపంచ కప్‌లో వ్యక్తిగతంగా బాగా రాణించాను. కానీ మేము ట్రోఫీ గెలవలేకపోయాం.ఆ సెంచరీల పరంపర, పరుగుల వరద నాకు సంతృప్తి ఇవ్వలేకపోయింది. వ్యక్తిగతంగా 30 లేదా 40 పరుగులు చేసినప్పటికీ ట్రోఫీ గెలిస్తే లభించే ఆనందం వేరే స్థాయిలో ఉంటుంది. అలా చేయడం నాకు చాలా ముఖ్యమని నేను భావిస్తున్నాను" అని రోహిత్ ఆదివారం ఛాంపియన్స్ ట్రోఫీ విజయం అనంతరం వ్యాఖ్యానించడం అతని లోని పరిణతికి అద్దం పడుతుంది.విజయం అనేది ఒక వ్యసనం లాంటిది. భారత్ ఐసీసీ వైట్-బాల్ మ్యాచ్‌లలో ఇంతవరకు వరుసగా 24 మ్యాచ్‌లలో 23 గెలించిందంటే మామూలు విషయం కాదు. వరుసగా రెండు ఐసీసీ టైటిళ్లను కైవసం చేసుకున్న రోహిత్ శర్మ ఇప్పుడు చారిత్రాత్మక ట్రిపుల్‌పై దృష్టి పెట్టాడు. అంటే 2027 వన్డే ప్రపంచ కప్‌లో టీమిండియాను విజయపథాన నడిపించాలని భావిస్తున్నాడు. అదే జరిగితే రోహిత్ శర్మ ఎంఎస్ ధోని నాయకత్వ రికార్డుని సమం చేసినట్టే!ఇక ఓవరాల్‌గా కెప్టెన్లుగా ధోని- రోహిత్ రికార్డులు చూస్తే ఇద్దరూ చెరో ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచారు. ధోని చెన్నై సూపర్ కింగ్స్ తరఫున.. రోహిత్ ముంబై ఇండియన్స్ తరఫున ఈ ఫీట్ నమోదు చేశారు. ఆసియాకప్ టోర్నమెంట్లోనూ రెండుసార్లు టీమిండియాను విజయపథంలో నిలిపారు. ధోని 2010, 2016.. రోహిత్ 2018, 2023లో టైటిల్స్ గెలిచారు. ఇక చాంపియన్స్ లీగ్ ట్రోఫీలో ధోని రెండుసార్లు (2010, 2014).. రోహిత్ ఒకసారి(2013) టైటిల్ సాధించారు.చదవండి: తప్పులు సరిదిద్దుకుని.. ‘టాప్’ రన్ స్కోరర్‌గా.. మాటలకు అందని అనుభూతి! -
IPL 2025: బ్రూక్ బాటలో మరో ముగ్గురు విదేశీ స్టార్లు..?
మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభం కానుండగా ఢిల్లీ క్యాపిటల్స్ కీలక ఆటగాడు, ఇంగ్లండ్ వైస్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ క్యాష్ రిచ్ లీగ్ నుంచి వైదొలిగాడు. జాతీయ జట్టు సేవలకు సిద్దమయ్యేందుకు ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు బ్రూక్ తెలిపాడు. బ్రూక్‌ను గత డిసెంబర్లో జరిగిన మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 6.25 కోట్లకు కొనుగోలు చేసింది. బ్రూక్ ఐపీఎల్ నుంచి వైదొలగడం ఇది వరుసగా రెండోసారి. గత సీజన్లోనూ బ్రూక్ ఇలాగే పొంతన లేని కారణాలు చెప్పి క్యాష్ రిచ్ లీగ్ నుంచి వైదొలిగాడు. గత సీజన్లో కూడా ఢిల్లీనే బ్రూక్‌ను కొనుగోలు చేసింది. ఆ సీజన్లో బ్రూక్ వ్యక్తిగత కారణాలను సాకుగా చూపి వైదొలిగినా, అసలు కారణాలు వేరే అని తెలిసింది. ఆ సీజన్ వేలంలో తక్కువ ధర (రూ. 4 కోట్లు) పలికినందుకు బ్రూక్ వైదొలిగాడట. 2023 సీజన్లో బ్రూక్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 13.25 కోట్ల రికార్దు ధర వెచ్చింది సొంతం చేసుకుంది. 2024 వేలంలోనూ బ్రూక్ ఇదే స్థాయి మొత్తాన్ని ఆశించగా.. నిరాశ ఎదురైంది.కాగా, బ్రూక్ తాజా నిర్ణయంతో బీసీసీఐ అతనిపై నిషేధం విధించే అవకాశం ఉంది. బీసీసీఐ కొత్త రూల్స్ ప్రకారం.. వేలంలో అమ్ముడుపోయిన ఆటగాడు సరైన కారణం లేకుండా ఐపీఎల్ నుంచి వైదొలిగితే రెండేళ్ల బ్యాన్ పడుతుంది. మరి బ్రూక్‌పై ఐపీఎల్ నిర్వహకులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.బ్రూక్ ఎపిసోడ్ బయటికి వచ్చాక మరో ముగ్గురు విదేశీ స్టార్లు ఐపీఎల్-2025 నుంచి వైదొలుగుతారని ప్రచారం జరుగుతుంది. వీరిలో ఆసీస్ ఆటగాళ్లు మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, ఇంగ్లండ్ సీమర్ జోఫ్రా ఆర్చర్ ఉన్నారని సమాచారం.ఆర్చర్ జాతీయ విధుల దృష్ట్యా ఐపీఎల్‌కు డుమ్మా కొడతాడని తెలుస్తుంది. ఇంగ్లండ్ హోమ్ సమ్మర్‌కు ముందు ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ గాయపడటంతో ఆర్చర్‌ను ఐపీఎల్ నుంచి వైదలగాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ఏడాది హోం సమ్మర్లో ఇంగ్లండ్ టెస్ట్‌ల్లో భారత్‌ను ఢీకొట్టాల్సి ఉంది. ఆర్చర్‌ను 2025 మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ రూ. 12.5 కోట్లకు కొనుగోలు చేసింది.ఆడమ్ జంపా విషయానికొస్తే.. ఇతన్ని ఐపీఎల్ 2025 మెగా వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 2.4 కోట్లకు సొంతం చేసుకుంది. జంపా కూడా జాతీయ విధుల పేరుతో ఐపీఎల్‌కు డుమ్మా కొట్టనున్నాడని తెలుస్తుంది. జంపా 2024 సీజన్లోనూ వ్యక్తిగత కారణాలను సాకుగా చూపి ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. గత సీజన్లో జంపా రాజస్థాన్ రాయల్స్‌కు ఆడాల్సి ఉండింది.మిచెల్ స్టార్క్ విషయానికొస్తే.. గత సీజన్లో అత్యంత ఖరీదైన ఆటగాడు మిచెల్ స్టార్క్‌ను ఈ ఏడాది మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 11.75 కోట్లకు దక్కించుకుంది. 2025 సీజన్‌కు ముందు స్టార్క్ వ్యక్తిగత కారణాలను సాకుగా చూపి వైదొలుగుతాడని ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి ఐపీఎల్ 2025 తర్వాత ఆస్ట్రేలియా సౌతాఫ్రికాతో డబ్ల్యూటీసీ ఫైనల్లో తలపడాల్సి ఉంది. ఇదే కారణం చేత స్టార్క్ తదితర ఆసీస్ టెస్ట్ జట్టు సభ్యులు ఐపీఎల్ నుంచి వైదొలుగుతారని సమాచారం. -
రిటైర్మెంట్ ప్రకటిస్తాడంటూ వార్తలు.. జడ్డు రియాక్షన్ ఇదే!
దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) టోర్నమెంట్ జరుగగా.. టీమిండియా విజేతగా అవతరించింది. డిఫెండింగ్ చాంపియన్ పాకిస్తాన్ ఒక్క గెలుపు కూడా లేకుండా నిష్క్రమించగా.. భారత్ ఆఖరి వరకు అజేయంగా నిలిచి ట్రోఫీని ముద్దాడింది. దుబాయ్ వేదికగా ఆదివారం నాటి ఫైనల్లో న్యూజిలాండ్(India vs New Zealand)ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి చాంపియన్‌గా నిలిచింది.ఆ నలుగురు.. అప్పుడూ.. ఇప్పుడూఇక 2017 చాంపియన్స్ ట్రోఫీ నాటి భారత జట్టులో ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా(Ravindra Jadeja), హార్దిక్ పాండ్యా.. తాజా ఎడిషన్‌లోనూ ఆడారు. ప్రస్తుతం ఈ వన్డే టోర్నమెంట్ గెలిచిన జట్టుకు రోహిత్ కెప్టెన్‌గా ఉండగా.. మిగతా ముగ్గురు అతడితో కలిసి టీమిండియాను విజేతగా నిలపడంలో తమ వంతు పాత్ర పోషించారు.ముఖ్యంగా స్పిన్‌కు అనుకూలించిన దుబాయ్ పిచ్‌పై ఆల్‌రౌండర్ జడ్డూ ప్రభావం చూపాడు. మొత్తంగా ఐదు మ్యాచ్‌లలో పొదుపుగా బౌలింగ్ చేసిన జడ్డూ మొత్తంగా ఐదు వికెట్లు తీశాడు. ప్రత్యర్థి జట్ల బ్యాటర్లపై ఒత్తిడి పెంచుతూ కీలక వికెట్లు కూల్చి టీమిండియాను విజయపథంలో నిలపడంలో కీలకంగా వ్యవహరించాడు. ఈ టోర్నీలో ఐదు మ్యాచ్‌లలో కలిపి 42 ఓవర్లు బౌలింగ్ చేసిన జడేజా.. 4.35 ఎకానమీ రేటుతో 183 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. బంతితోనే కాకుండా.. అవసరమైన వేళ బ్యాట్‌తోనూ జడ్డూ రాణించాడు. ముఖ్యంగా కివీస్‌తో ఫైనల్లో ఫోర్ బాది టీమిండియా విజయాన్ని ఖరారు చేసి.. ఈ టోర్నీని చిరస్మరణీయంగా మార్చుకున్నాడు. జడేజా రిటైర్మెంట్ గురించి ఊహాగానాలుఅయితే, ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో జడేజా తన బౌలింగ్ ఓవర్ల కోటా పూర్తి చేయగానే విరాట్ కోహ్లి వచ్చి జడ్డూను ఆత్మీయంగా హత్తుకున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట విస్తృతంగా వైరల్ అయ్యాయి.ఈ నేపథ్యంలో చాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆస్ట్రేలియాకు కెప్టెన్‌గా వ్యవహరించిన స్టీవ్ స్మిత్‌కు కోహ్లి హగ్ ఇచ్చిన ఫొటోలను షేర్ చేస్తూ.. జడేజా రిటైర్మెంట్ గురించి ఊహాగానాలు వచ్చాయి. జడ్డూ వన్డేల్లో తన చివరి స్పెల్ వేసేశాడని.. ఇక రిటైర్మెంట్ ప్రకటనే తరువాయి అన్నట్టుగా ప్రచారం సాగింది.జడ్డు రియాక్షన్ ఇదే!టీమిండియా విజయానంతరం ఈ విషయంపై స్పందించిన జడేజా.. ‘‘అనవసరంగా వదంతులు ప్రచారం చేయద్దు.. ధన్యవాదాలు’’ అంటూ చేతులెత్తి నమస్కరిస్తున్నట్లుగా ఉన్న ఎమోజీతో పాటు సెల్యూట్ చేస్తున్నట్లుగా ఉన్న ఎమోజీని జత చేశాడు. కాగా ఫైనల్లో జడ్డూ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఆరు బంతుల్లో ఒక ఫోర్ సాయంతో తొమ్మిది పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు.ఇదిలా ఉంటే.. సెమీ ఫైనల్లో టీమిండియా చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోయిన తర్వాత స్టీవ్ స్మిత్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతకంటే ముందు కోహ్లి అతడిని ఆలింగనం చేసుకోగా.. అధికారిక ప్రకటన కంటే ముందే స్మిత్ కోహ్లికి ఈ విషయం చెప్పాడని వార్తలు వచ్చాయి. జడ్డూ విషయంలో కూడా ఇలాగే జరుగుతుందని భావించిన వాళ్లకు తాజాగా అతడి పోస్టుతో స్పష్టతవచ్చింది.చదవండి: తప్పులు సరిదిద్దుకుని.. ‘టాప్’ రన్ స్కోరర్‌గా.. మాటలకు అందని అనుభూతి!Ravindra Jadeja with his family!#INDvsNZ #ChampionsTrophy2025 pic.twitter.com/16MpYrm7V6— Chandra 🇮🇳 (@cbatrody) March 9, 2025 -
CT 2025: బ్యాటింగ్‌లో రచిన్.. బౌలింగ్‌లో హెన్రీ
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా టీమిండియా అవతరించిన విషయం తెలిసిందే. దుబాయ్ వేదికగా నిన్న (మార్చి 9) జరిగిన ఫైనల్లో భారత్ న్యూజిలాండ్‌పై 4 వికెట్ల తేడాతో గెలుపొంది, మూడోసారి (2002, 2013, 2025) ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొనగా.. భారత్, న్యూజిలాండ్ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి ఫైనల్‌కు చేరాయి. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో భారత్ న్యూజిలాండ్‌పై పైచేయి సాధించింది. టీమిండియా ఈ టోర్నీలో గ్రూప్ దశలోనూ కివీస్‌పై విజయం సాధించింది.ఈ టోర్నీలో భారత్ విజేతగా నిలిచినప్పటికీ.. గణాంకాలలో న్యూజిలాండ్ ఆటగాళ్లే టాప్‌లో ఉన్నారు. బ్యాటింగ్‌లో రచిన్ రవీంద్ర.. బౌలింగ్‌లో మ్యాట్ హెన్రీ టోర్నీ టాపర్లుగా నిలిచారు. ఈ టోర్నీలో తొలి మ్యాచ్ నుంచే అదరగొట్టిన రచిన్.. 4 మ్యాచ్‌ల్లో 65.75 సగటున, 106.48 స్ట్రయిక్‌రేట్‌తో 263 పరుగులు (2 సెంచరీలు) చేసి లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డును కూడా గెలుచుకున్నాడు. బౌలింగ్ విషయానికొస్తే.. ఈ టోర్నీలో మ్యాట్ హెన్రీ 4 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. గాయం కారణంగా కీలకమైన ఫైనల్లో హెన్రీ ఆడకపోవడం న్యూజిలాండ్ విజయావకాశాలను ప్రభావితం చేసింది.ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో హెన్రీ తర్వాతి స్థానాల్లో భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్, టీమిండియా పేసర్ మహ్మద్ షమీ ఉన్నారు. వీరు ముగ్గురు తలో 9 వికెట్లు తీశారు. సాంట్నర్ షమీ తలో ఐదు మ్యాచ్‌లు ఆడగా.. వరుణ్ కేవలం 3 మ్యాచ్‌ల్లోనే 9 వికెట్లు పడగొట్టాడు. ఈ టోర్నీ టాప్-5 లీడింగ్ వికెట్ టేకర్లు భారత్, న్యూజిలాండ్ వారే కావడం విశేషం.ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లుమ్యాట్ హెన్రీ- 10వరుణ్ చక్రవర్తి- 9మిచెల్ సాంట్నర్- 9మహ్మద్ షమీ- 9మైఖేల్ బ్రేస్‌వెల్- 8కుల్దీప్ యాదవ్- 7ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఐదు వికెట్ల ప్రదర్శనలుమ్యాట్ హెన్రీ- భారత్పైవరుణ్ చక్రవర్తి- న్యూజిలాండ్పైమహ్మద్ షమీ- బంగ్లాదేశ్పైఅజ్మతుల్లా ఒమర్జాయ్- ఇంగ్లండ్పైఛాంపియన్స్ ట్రోఫీ-2025లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లురచిన్ రవీంద్ర- 263శ్రేయస్ అయ్యర్- 243బెన్ డకెట్- 227జో రూట్- 225విరాట్ కోహ్లి- 218ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో సెంచరీలు చేసిన ఆటగాళ్లురచిన్ రవీంద్ర-2బెన్ డకెట్జో రూట్విరాట్ కోహ్లిఇబ్రహీం జద్రాన్టామ్ లాథమ్కేన్ విలియమ్సన్శుభ్మన్ గిల్విల్ యంగ్ర్యాన్ రికెల్టన్జోస్ ఇంగ్లిస్డేవిడ్ మిల్లర్తౌహిద్ హృదయ్ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా ఆటగాళ్ల ప్రదర్శనలుఅయ్యర్ - 243 పరుగులు కోహ్లి - 218 పరుగులు గిల్ - 188 పరుగులు రోహిత్ - 180 పరుగులు రాహుల్ - 140 పరుగులు అక్షర్ - 109 పరుగులు + 5 వికెట్లు హార్దిక్ - 99 పరుగులు + 4 వికెట్లు జడేజా - 27 పరుగులు + 5 వికెట్లు షమీ - 9 వికెట్లు వరుణ్ - 9 వికెట్లు కుల్దీప్ - 7 వికెట్లు హర్షిత్ - 4 వికెట్లుఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేయగా.. భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. -
CT 2025 Final: షమీ తల్లి కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న కోహ్లి
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో టీమిండియా విజయానంతరం దుబాయ్ క్రికెట్ స్టేడియంలో పలు ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. టీమిండియా ఆటగాళ్ల విజయోత్సవ సంబురాలతో పాటు పలు దృష్యాలు సోషల్‌మీడియాను విపరీతంగా ఆకర్శించాయి. ఇందులో ఒకటి విరాట్ కోహ్లి.. సహచరుడు మహ్మద్ షమీ తల్లికి పాదాభివందనం చేయడం. విజయోత్సవ సంబురాల్లో భాగంగా టీమిండియా ఆటగాళ్లంతా కుటుంబ సభ్యులతో కలిసి స్టేడియంలో కలియతిరుగుతుండగా.. కోహ్లికి షమీ తల్లి తారసపడింది. Virat Kohli Touched Mohammad Shami’s Mother Feet And Clicked Pictures With Shami’s Family. pic.twitter.com/D08GRCfurN— khalid Chougle (@ChougleKhalid) March 10, 2025కోహ్లి వెంటనే షమీ తల్లి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాడు. అనంతరం షమీ కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలు దిగాడు. విరాట్ షమీ తల్లి పాదాలకు నమస్కరించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఇది చూసి జనాలు విరాట్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. విరాట్‌కు పెద్దలంటే ఎంత గౌరవమోనని చర్చించుకుంటున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ విజయానంతరం దుబాయ్ స్టేడియంలో ఇలాంటి ఫ్యామిలీ మూమెంట్స్ చాలా కనిపించాయి. శుభ్‌మన్ గిల్ తండ్రితో రిషబ్ పంత్ చిందులేయడం.. శ్రేయస్ తల్లి అతన్ని ముద్దాడటం.. ఇలా చాలా ఆసక్తికర ఫ్యామిలీ మూమెంట్స్‌కు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ వేదికైంది.Shubman Gill's father doing Bhangra with Rishabh Pant. 😂❤️pic.twitter.com/SdUu58044d— Mufaddal Vohra (@mufaddal_vohra) March 10, 2025ఇదిలా ఉంటే, నిన్నటి ఫైనల్లో భారత్ న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. భారత్ ఆటగాళ్లలో విరాట్, రోహిత్, జడేజా మినహా దాదాపుగా అందరికీ ఇదే తొలి ఐసీసీ టైటిల్ కావడం విశేషం. చాలాకాలంగా టీమిండియాలో కీలక సభ్యుడిగా ఉన్నా షమీకి సైతం ఐదే తొలి ఐసీసీ టైటిల్. 2013 జనవరిలో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన షమీ.. ఐసీసీ ఈవెంట్లలో టీమిండియా తరఫున ఎన్నో అత్యుత్తమ ప్రదర్శనలు చేసినా దీనికి ముందు ఒక్కసారి కూడా టైటిల్ విన్నింగ్ జట్టులో భాగం కాలేకపోయాడు. గతేడాది భారత్ టీ20 వరల్డ్‌కప్ గెలిచినప్పటికీ.. ఆ ఐసీసీ టోర్నీకి షమీ దూరంగా ఉన్నాడు. వన్డే వరల్డ్‌కప్-2023 సందర్భంగా గాయపడిన షమీ.. తిరిగి ఛాంపియన్స్ ట్రోఫీ-2025తోనే (ఐసీసీ టోర్నీలు) రీఎంట్రీ ఇచ్చాడు. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో షమీ 5 మ్యాచ్‌ల్లో 25.88 సగటున, 5.68 ఎకానమీ రేటుతో 9 వికెట్లు తీసి భారత్ అజేయ యాత్రతో తనవంతు పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో షమీ అత్యుత్తమ ప్రదర్శన బంగ్లాదేశ్‌పై వచ్చింది. ఆ మ్యాచ్‌లో షమీ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. సెమీస్‌లో ఆస్ట్రేలియాపై కూడా షమీ సత్తా చాటాడు. ఆ మ్యాచ్‌లో షమీ మూడు వికెట్లు పడగొట్టాడు.ఫైనల్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేయగా.. భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు చెలరేగడంతో న్యూజిలాండ్ ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితమైంది. న్యూజిలాండ్ తరఫున డారిల్ మిచెల్ (63), మైఖేల్ బ్రేస్‌వెల్ (53 నాటౌట్) రాణించారు. రచిన్ రవీంద్ర (37), ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. విల్ యంగ్ (15), కేన్ విలియమ్సన్ (11), టామ్ లాథమ్ (14),మిచెల్ సాంట్నర్ (8) తక్కువ స్కోర్లకు ఔటయ్యారు. భారత్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో 2.. షమీ, జడేజా చెరో వికెట్ పడగొట్టారు.ఛేదనలో రోహిత్ (76) భారత్‌కు శుభారంభాన్ని అందించారు. శుభ్‌మన్ గిల్‌తో (31) కలిసి తొలి వికెట్‌కు 105 పరుగులు జోడించాడు. అయితే భారత్ 17 పరుగుల వ్యవధిలో గిల్, కోహ్లి (1), రోహిత్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో శ్రేయస్ అయ్యర్ (48), అక్షర్ పటేల్ (29) మంచి భాగస్వామ్యం నెలకొల్పి భారత్‌ను తిరిగి గేమ్‌లోకి తెచ్చారు. అయితే శ్రేయస్, అక్షర్ కూడా స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో టీమిండియా మరోసారి కష్టాల్లో పడింది. అయితే కేఎల్ రాహుల్ (34 నాటౌట్).. హార్దిక్ పాండ్యా (18), రవీంద్ర జడేజాతో (18 నాటౌట్) కలిసి మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యాలు నెలకొల్పి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. న్యూజిలాండ్ బౌలర్లలో సాంట్నర్, బ్రేస్‌వెల్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. జేమీసన్, రచిన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. -
తప్పులు సరిదిద్దుకుని.. ‘టాప్’ రన్ స్కోరర్‌గా.. మాటలకు అందని అనుభూతి!
తొలిసారి ఐసీసీ ట్రోఫీని ముద్దాడిన అనుభూతిని మాటల్లో వర్ణించలేనంటున్నాడు టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer). ప్రస్తుతం తన కాళ్లు నేలమీద నిలవడం లేదని.. ఇంతకంటే గొప్ప భావన మరొకటి ఉండదంటూ ఆనందంలో మునిగితేలుతున్నాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో సహచర ఆటగాళ్ల సంతోషం చూసి తన మనసు గాల్లో తేలిందని ఉద్వేగానికి లోనయ్యాడు.అనూహ్య పరిస్థితుల్లో జట్టుకు దూరంకాగా వన్డే ప్రపంచకప్-2023లో అద్భుతంగా రాణించిన శ్రేయస్ అయ్యర్.. ఆ తర్వాత అనూహ్య పరిస్థితుల్లో జట్టుకు దూరమయ్యాడు. దేశవాళీ క్రికెట్ ఆడాలన్న బీసీసీఐ నిబంధనలు ఉల్లంఘించాడన్న ఆరోపణలతో సెంట్రల్ కాంట్రాక్టు(BCCI Cetral Contract) కూడా కోల్పోయాడు. అయితే, ఈ ముంబైకర్ తనకు ఎదురైన చేదు అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని తనను తాను సరిదిద్దుకున్నాడు.తప్పులు సరిదిద్దుకుని..బోర్డు ఆదేశాలను పాటిస్తూ ముంబై తరఫున దేశీ క్రికెట్ బరిలో దిగిన శ్రేయస్.. కఠినశ్రమ, అంకితభావంతో తనను నిరూపించుకున్నాడు. వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడ్డ ఈ ముంబై ఆటగాడు... దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కెప్టెన్‌గా వ్యవహరించి టైటిల్ గెలిచాడు. రంజీల్లో సత్తా చాటి తన విలువను చాటుకున్నాడు.అంతేకాదు.. ఐపీఎల్-2024(IPL 2024)లో కోల్‌కతా నైట్ రైడర్స్ సారథిగా వ్యవహరించి.. జట్టును చాంపియన్‌గా నిలిపాడు. ఈ క్రమంలో భారత క్రికెట్ జట్టులో పునరాగమనం చేసిన శ్రేయస్ అయ్యర్.. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో సూపర్ ఫామ్‌తో పరుగులు రాబట్టాడు. తొలి వన్డేకు మోకాలి నొప్పి కారణంగా విరాట్ కోహ్లి దూరం కాగా.. అతడి స్థానంలో తుదిజట్టులో చోటు దక్కించుకుని జట్టుకు విజయాలు అందించాడు.జట్టుకు వెన్నెముకలా నిలిచిఈ క్రమంలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఎంపికైన జట్టులో స్థానం సంపాదించిన శ్రేయస్ అయ్యర్ ఇక్కడా అద్బుతంగా రాణించాడు. మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో రాణిస్తూ జట్టుకు వెన్నెముకలా నిలిచాడు. ఈ వన్డే టోర్నమెంట్లో మొత్తంగా టీమిండియా ఆడిన ఐదు మ్యాచ్‌లలో కలిపి శ్రేయస్ 48.60 సగటుతో 243 పరుగులు రాబట్టాడు. ఇందులో రెండు అర్ధ శతకాలు ఉన్నాయి.20 పరుగుల తేడాతో..తద్వారా ఈ టోర్నీలో టీమిండియా తరఫున టాప్ రన్ స్కోరర్‌గా నిలిచిన శ్రేయస్ అయ్యర్.. ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచిన రచిన్ రవీంద్రకు 20 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. రచిన్ రెండు శతకాల సాయంతో 263 పరుగులు సాధించి ఓవరాల్‌గా అత్యధిక పరుగుల వీరుడిగా నిలవగా.. శ్రేయస్ రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.ఇక ఆదివారం నాటి ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్‌ను ఓడించడంలోనూ శ్రేయస్ అయ్యర్‌ది కీలక పాత్ర. కివీస్ విధించిన 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ శుబ్‌మన్ గిల్(31), విరాట్ కోహ్లి(1) రూపంలో కీలక వికెట్లు కోల్పోయిన వేళ.. రోహిత్ శర్మ(76)తో కలిసి శ్రేయస్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. మొత్తంగా 62 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 48 పరుగులు సాధించాడు. మిగతా వాళ్లలో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్(33 బంతుల్లో 34 నాటౌట్), హార్దిక్ పాండ్యా(18 బంతుల్లో 18), రవీంద్ర జడేజా(6 బంతుల్లో 9 నాటౌట్) రాణించారు. తద్వారా మరో ఓవర్ మిగిలి ఉండగానే రోహిత్ సేన టార్గెట్ పూర్తి చేసి నాలుగు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.మాటలకు అందని అనుభూతిఅనంతరం చాంపియన్‌గా నిలిచిన భారత్‌కు ట్రోఫీతో పాటు విన్నింగ్స్ మెడల్స్ అందించారు. ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. ‘‘ఈ అనుభూతిని మాటల్లో ఎలా వర్ణించాలో తెలియడం లేదు. నేను గెలిచిన మొదటి ఐసీసీ ట్రోఫీ ఇదే. ఈ టోర్నమెంట్లో అడుగుపెట్టిన నాటి నుంచి ఫైనల్ వరకు మా జట్టు జైత్రయాత్ర అమోఘం.నిజం చెప్పాలంటే.. నేను ఒత్తిడిలోనే మరింత గొప్పగా రాణించగలను. సవాళ్లను ఎదుర్కోవడం నాకు భలే మజాను ఇస్తుంది. ఈ టోర్నమెంట్లో నాకు అద్భుత ఆరంభం లభించింది. దానిని అలాగే కొనసాగించాను. అయితే, భారీ స్కోర్లు సాధించలేకపోయాను. అయినప్పటికీ జట్టు విజయాలకు నా ప్రదర్శన దోహదం చేసింది కాబట్టి ఆనందంగానే ఉన్నాను. ఇంతకంటే సంతృప్తి, సంతోషం మరొకటి ఉండదు’’ అని హర్షం వ్యక్తం చేశాడు.చదవండి: అతడు మా నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు.. ఓడినా గర్వంగానే ఉంది: కివీస్ కెప్టెన్ -
CT 2025 Final: ముగింపు వేడుకలో ఒక్క పాకిస్తాన్ ప్రతినిధి కూడా లేడు.. కారణం ఏంటి..?
20 రోజుల పాటు సాగిన ఛాంపియన్స్ ట్రోఫీ-2025 భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన నిన్నటితో (మార్చి 9) ఫైనల్‌తో ముగిసింది. ఈ టోర్నీలో భారత్ విజేతగా నిలిచింది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి, మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది.కాగా, నిన్నటి ఫైనల్ అనంతరం ప్రజెంటేషన్ సెర్మనీ సందర్భంగా పోడియంపై ఒక్క పాకిస్తాన్ ప్రతినిథి కూడా కనపడకపోవడం చర్చనీయాంశంగా మారింది. టోర్నీకి ఆతిథ్యమిచ్చిన పాకిస్తాన్ నుంచి పోడియంపై ఒక్క ప్రతినిధి కూడా లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ అంశాన్ని పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ సోషల్‌మీడియా వేదికగా లేవనెత్తాడు. టోర్నీకి ఆతిథ్యమిచ్చిన పాకిస్తాన్ నుంచి ఒక్క ప్రతినిధి కూడా లేకపోవడమేంటని ప్రశ్నించాడు. ఇలా జరగడం దురదృష్టకరమని అన్నాడు.వాస్తవానికి భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌కు టోర్నీ ఆతిథ్య దేశ హోదాలో పాకిస్తాన్ నుంచి ఒక్కరైనా హాజరు కావాల్సి ఉండింది. అయితే అలా జరగలేదు. ముగింపు వేడుకకు పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ రావాల్సి ఉన్నా రాలేదు. బదులుగా, పాకిస్తాన్ లెగ్ మ్యాచ్‌లు నిర్వహించిన టోర్నీ డైరెక్టర్ సుమైర్ అహ్మద్‌ను పంపారు. ప్రోటోకాల్ ప్రకారం ముగింపు వేడుకల్లో పోడియంపైకి బోర్డు ద్వారా ఎన్నికైన సభ్యులు లేదా డైరెక్టర్లను మాత్రమే అనుమతిస్తారు. సుమైర్ అహ్మద్ పీసీబీ ఉద్యోగి మాత్రమే కావడంతో అతన్ని పోడియంపైకి అనుమతించలేదు. దుబాయ్ లెగ్‌కు బాధ్యత వహించిన మరో టోర్నమెంట్ డైరెక్టర్ ఆండ్రీ రస్సెల్‌ను కూడా పోడియంపైకి పిలువ లేదు. మొత్తంగా పాకిస్తాన్ ప్రతినిథి లేకుండానే ఛాంపియన్స్ ట్రోఫీ ముగింపు వేడుక ముగిసింది.ముగింపు వేడుకలో ఐసీసీ తరఫున చైర్మన్ జై షా, బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, న్యూజిలాండ్ క్రికెట్ డైరెక్టర్ రోజర్ ట్వోస్ పాల్గొన్నారు.ఇదిలా ఉంటే, ఉత్కంఠగా సాగిన నిన్నటి ఫైనల్లో భారత్ న్యూజిలాండ్‌పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేయగా.. భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు చెలరేగడంతో న్యూజిలాండ్ ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితమైంది. న్యూజిలాండ్ తరఫున డారిల్ మిచెల్ (63), మైఖేల్ బ్రేస్‌వెల్ (53 నాటౌట్) రాణించారు. రచిన్ రవీంద్ర (37), ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. విల్ యంగ్ (15), కేన్ విలియమ్సన్ (11), టామ్ లాథమ్ (14),మిచెల్ సాంట్నర్ (8) తక్కువ స్కోర్లకు ఔటయ్యారు. భారత్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో 2.. షమీ, జడేజా చెరో వికెట్ పడగొట్టారు.ఛేదనలో రోహిత్ (76) భారత్‌కు శుభారంభాన్ని అందించారు. శుభ్‌మన్ గిల్‌తో (31) కలిసి తొలి వికెట్‌కు 105 పరుగులు జోడించాడు. అయితే భారత్ 17 పరుగుల వ్యవధిలో గిల్, కోహ్లి (1), రోహిత్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో శ్రేయస్ అయ్యర్ (48), అక్షర్ పటేల్ (29) మంచి భాగస్వామ్యం నెలకొల్పి భారత్‌ను తిరిగి గేమ్‌లోకి తెచ్చారు. అయితే శ్రేయస్, అక్షర్ కూడా స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో టీమిండియా మరోసారి కష్టాల్లో పడింది. అయితే కేఎల్ రాహుల్ (34 నాటౌట్).. హార్దిక్ పాండ్యా (18), రవీంద్ర జడేజాతో (18 నాటౌట్) కలిసి మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యాలు నెలకొల్పి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. న్యూజిలాండ్ బౌలర్లలో సాంట్నర్, బ్రేస్‌వెల్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. జేమీసన్, రచిన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. -
ఎక్కడైనా టీమిండియాదే గెలుపు!.. ఇచ్చిపడేసిన పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్
టీమిండియాపై పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్ వసీం అక్రం(Wasim Akram) ప్రశంసలు కురిపించాడు. వేదిక ఏదైనా రోహిత్ సేనకు తిరుగులేదని.. అద్భుత ప్రదర్శనతో విజయాలు సాధిస్తున్న తీరు అమోఘమని కొనియాడాడు. ఎల్లవేళలా తమ కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌లకు సంపూర్ణ మద్దతు ప్రకటించి భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) అనుకున్న ఫలితాన్ని రాబట్టగలిగిందని ప్రశంసించాడు.కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో భారత్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ ఈ మెగా టోర్నీ నిర్వహణ హక్కులు దక్కించుకోగా.. టీమిండియా మాత్రం తటస్థ వేదికైన దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడింది. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్‌లను ఓడించిన రోహిత్ సేన.. సెమీస్‌లో ఆస్ట్రేలియాను, ఫైనల్లో న్యూజిలాండ్‌లపై గెలిచి టైటిల్ సాధించింది.బీసీసీఐ అనుసరించిన విధానాల వలనే..అయితే, ఒకే వేదికపై ఆడటం భారత్‌కు సానుకూలంగా మారిందనే విమర్శల నేపథ్యంలో పాక్ దిగ్గజ ఫాస్ట్‌బౌలర్ వసీం అక్రం తనదైన శైలిలో స్పందించాడు. బీసీసీఐ అనుసరించిన విధానాలే టీమిండియా జైత్రయాత్రకు కారణమని పేర్కొన్నాడు. ఈ మేరకు.. ‘‘ప్రస్తుత భారత జట్టు ప్రపంచంలోని ఏ వేదికపై ఆడినా కచ్చితంగా గెలుస్తుంది.ఒక్క ఓటమి కూడా లేకుండాదుబాయ్లో ఆడినందుకు టీమిండియా లాభపడిందని చాలా మంది అంటున్నారు. కానీ పాకిస్తాన్లో ఆడినా రోహిత్ సేన టైటిల్ గెలిచేది. టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో భారత జట్టు కూడా అన్ని టీమ్స్ మాదిరే వివిధ వేదికలకు ప్రయాణాలు చేసింది. మరి అజేయంగానే చాంపియన్‌గా నిలిచింది కదా! ఒక్క ఓటమి కూడా లేకుండా ట్రోఫీని ముద్దాడింది.ఐసీసీ ఈవెంట్లలో భారత జట్టుకు నిలకడకు ఇది నిదర్శనం. రోహిత్ శర్మ నాయకత్వ పటిమకు ఇదో కొలమానం. న్యూజిలాండ్‌తో స్వదేశంలో టీమిండియా టెస్టు సిరీస్‌లో కనీవినీ ఎరుగని రీతిలో 3-0తో వైట్‌వాష్ అయింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో.. పదేళ్ల తర్వాత తొలిసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీని చేజార్చుకుంది.అంతకు ముందు శ్రీలంకకు వన్డే సిరీస్‌ను కూడా కోల్పోయింది. ఇలాంటి సమయాల్లో బోర్డుపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. కెప్టెన్, కోచ్‌లను తొలగించాలనే డిమాండ్లు వస్తాయి. అయితే, బీసీసీఐ మాత్రం తమ సారథికి, శిక్షకుడికి అన్ని వేళలా పూర్తి మద్దతుగా నిలిచింది. అందుకు తగ్గ ఫలితాన్ని చాంపియన్స్ ట్రోఫీలో చాంపియన్‌గా నిలవడం ద్వారా పొందింది’’ అని వసీం అక్రం పేర్కొన్నాడు.మూడోసారి ఈ ఐసీసీ టైటిల్‌ను కైవసంకాగా చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో టీమిండియా కివీస్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది. తద్వారా మూడోసారి(2002, 2013, 2025) ఈ ఐసీసీ టైటిల్‌ను కైవసం చేసుకుంది. దుబాయ్‌లో ఆదివారం రాత్రి ముగిసిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్ తొలుత బౌలింగ్ చేసింది. కివీస్ బ్యాటర్లలో డారిల్ మిచెల్(63), మైకేల్ బ్రాస్‌వెల్(40 బంతుల్లో 53 నాటౌట్) రాణించడం ద్వారా నిర్ణీత యాభై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది.భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ చెరో రెండు, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో కెప్టెన్ రోహిత్ శర్మ అర్ధ శతకం(83 బంతుల్లో 76)తో రాణించగా.. శ్రేయస్ అయ్యర్(48), కేఎల్ రాహుల్(33 బంతుల్లో 34 నాటౌట్), హార్దిక్ పాండ్యా(18 బంతుల్లో 18), రవీంద్ర జడేజా(6 బంతుల్లో 9 నాటౌట్) జట్టు విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. రోహిత్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ఈ టోర్నీలో పాకిస్తాన్ ఒక్క విజయం కూడా లేకుండా నిష్క్రమించడం గమనార్హం.చదవండి: అతడు మా నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు.. ఓడినా గర్వంగానే ఉంది: కివీస్ కెప్టెన్ TEAM INDIA ARE CHAMPIONS AGAIN! 🏆🇮🇳#ChampionsTrophyOnJioStar #INDvNZ #ChampionsTrophy2025 pic.twitter.com/Uh6EZWFfSL— Star Sports (@StarSportsIndia) March 9, 2025 -
ఆ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో ఆడలేదు: భారత మాజీ క్రికెటర్ వ్యంగ్యాస్త్రాలు
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)ని టీమిండియా అజేయంగా ముగించింది. గ్రూప్ దశలో మూడింటికి మూడూ గెలిచిన రోహిత్ సేన.. సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఫైనల్లో న్యూజిలాండ్(India vs New Zealand)తో ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో గెలిచి పరిపూర్ణ విజయంతో చాంపియన్‌గా నిలిచింది.ఈ నేపథ్యంలో భారత జట్టుపై ప్రశంసలు వెల్లువెత్తుతుండగా.. ఒకే వేదికపై ఆడిన తీరుపై విమర్శలు కూడా వస్తున్నాయి. కాగా ఫిబ్రవరి 19న మొదలైన ఈ వన్డే టోర్నమెంట్‌కు పాకిస్తాన్ ఆతిథ్యమివ్వగా.. టీమిండియా మాత్రం భద్రతా కారణాల దృష్ట్యా తటస్థ వేదికపైన తమ మ్యాచ్‌లు ఆడింది. దుబాయ్(Dubai)లోనే ఈ ఐదు మ్యాచ్‌లలో ప్రత్యర్థులతో తలపడింది.అదనపు ప్రయోజనం అంటూ విమర్శలుమరోవైపు.. రోహిత్ సేనతో మ్యాచ్‌లు ఆడేందుకు ఆయా జట్లు పాకిస్తాన్- దుబాయ్ మధ్య ప్రయాణాలు చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఒకే మైదానంలో ఆడటం భారత్‌కు అదనపు ప్రయోజనాలను చేకూర్చిందని ఇంగ్లండ్, సౌతాఫ్రికా తదితర దేశాల మాజీ క్రికెటర్లు టీమిండియా విజయాలను విమర్శించారు. ఈ క్రమంలో చాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా భారత్ అవతరించిన అనంతరం.. టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. ఐసీసీ టోర్నమెంట్లలో భారత జట్టు విజయాలను ఉటంకిస్తూ.. ‘‘కేవలం ఐసీసీ టైటిళ్ల విషయంలోనే కాదు.. టీమిండియా ఎన్ని ఐసీసీ మ్యాచ్‌లు గెలిచిందో కూడా చూడాలి. చెంపపెట్టు లాంటి సమాధానంగత ఆరేళ్లుగా ఐసీసీ ఈవెంట్లలో భారత్‌కు అద్బుత రికార్డు ఉంది. మరొక్క మాట.. ఈ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో మాత్రం ఆడినవి కాదండోయ్!’’ అంటూ విమర్శకులను ఉద్దేశించి మంజ్రేకర్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. టీమిండియా విజయాలను తక్కువ చేసి మాట్లాడుతున్న వారికి చెంపపెట్టు లాంటి సమాధానం ఇచ్చారు అంటూ అభిమానులు మంజ్రేకర్ ట్వీట్ వైరల్ చేస్తున్నారు.కాగా ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2023లో ఫైనల్ వరకు అజేయంగా ఉన్న టీమిండియా.. టీ20 ప్రపంచకప్-2024లో అన్ని మ్యాచ్‌లు గెలిచి చాంపియన్‌గా నిలిచింది. ఇక చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నమెంట్లోనూ ఓటమన్నదే లేకుండా ముందుకు సాగి ట్రోఫీని ముద్దాడింది. అరుదైన రికార్డులుఈ మూడు ఈవెంట్లలో రోహిత్ సేన మొత్తంగా 24 మ్యాచ్‌లు ఆడగా.. ఏకంగా 23 గెలిచింది. ఒక మ్యాచ్ మాత్రం ఓడిపోయింది. సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్-2023లో ఆస్ట్రేలియాతో చేతిలో పరాజయం పాలై ట్రోఫీని చేజార్చుకుంది.ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీలో ఇంత వరకు ఏ జట్టుకు సాధ్యం కాని ఘనతను కూడా భారత్ సాధించింది. ఈ వన్డే టోర్నమెంట్లో ఇప్పటి వరకు మొత్తంగా 34 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా ఇరవై మూడింట గెలిచి.. ఎనిమిది ఓడింది. మూడింట ఫలితాలు రాలేదు. ఇక ప్రపంచంలోని ఏ క్రికెట్ జట్టూ కూడా ఈ టోర్నీలో పదిహేను కంటే ఎక్కువ విజయాలు సాధించకపోవడం గమనార్హం.అంతేకాదు.. ఒక వేదికపై అత్యధిక వన్డే విజయాలు సాధించిన జట్టుగానూ భారత్.. న్యూజిలాండ్ రికార్డును సమం చేసింది. దుబాయ్‌లో ఇప్పటి వరకు పదకొండు మ్యాచ్‌లు ఆడి పదింట గెలిచింది. న్యూజిలాండ్ గతంలో డునెడిన్‌లో పదింటికి పది మ్యాచ్‌లలో విజయం సాధించింది.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ భారత్ వర్సెస్ న్యూజిలాండ్ 👉కివీస్ స్కోరు: 251/7 (50)👉టీమిండియా స్కోరు: 254/6 (49)👉ఫలితం: నాలుగు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై గెలిచి చాంపియన్‌గా భారత్👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రోహిత్ శర్మ(83 బంతుల్లో 76)చదవండి: అతడు మా నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు.. ఓడినా గర్వంగానే ఉంది: కివీస్ కెప్టెన్TEAM INDIA ARE CHAMPIONS AGAIN! 🏆🇮🇳#ChampionsTrophyOnJioStar #INDvNZ #ChampionsTrophy2025 pic.twitter.com/Uh6EZWFfSL— Star Sports (@StarSportsIndia) March 9, 2025 -
ఇతర దేశాలకు ఆడుతున్న టాప్-10 భారత సంతతి క్రికెటర్లు
భారత సంతతికి చెందిన చాలామంది క్రికెటర్లు ఇతర దేశాలకు ఆడి పేరు ప్రఖ్యాతలు గడించారు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో రచిన్ రవీంద్ర (న్యూజిలాండ్‌కు ఆడుతున్న భారత సంతతి ఆటగాడు) ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచిన నేపథ్యంలో భారత సంతతి క్రికెటర్ల ప్రస్తావన వచ్చింది. ఇతర దేశాలకు ఆడిన, ఆడుతున్న భారత సంతతి టాప్-10 క్రికెటర్లపై ఓ లుక్కేద్దాం.1. రచిన్ రవీంద్ర (న్యూజిలాండ్)2. కేశవ్ మహారాజ్ (సౌతాఫ్రికా)3. ఐష్ సోధి (న్యూజిలాండ్)4. నునీల్ నరైన్ (వెస్టిండీస్)5. రవి బొపారా (ఇంగ్లండ్)6. శివ్‌నరైన్ చంద్రపాల్ (వెస్టిండీస్)7. మాంటి పనేసన్ (ఇంగ్లండ్)8. తేజ నిడమనూరు (నెదర్లాండ్స్)9. మోనాంక్ పటేల్ (యూఎస్ఏ)10. మిలింద్ కుమార్ (యూఎస్ఏ)రచిన్ రవీంద్ర- నవంబర్ 18, 1999న రచిన్ న్యూజిలాండ్‌లోని వెల్లింగ్టన్లో బెంగళూరుకు చెందిన దంపతులకు జన్మించాడు. ఐదు సంవత్సరాల వయసులోనే క్రికెట్ ఆడటం ప్రారంభించిన రచిన్.. తండ్రి రవి కృష్ణమూర్తిచే (మాజీ బెంగళూరు క్లబ్ ఆటగాడు) ప్రభావితం చేయబడ్డాడు. కృష్ణమూర్తి రచిన్ పేరును భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ పేర్లు కలిసొచ్చేలా పెట్టాడు. రచిన్ 2021లో న్యూజిలాండ్ తరఫున అరంగేట్రం చేశాడు. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన రచిన్.. అనతికాలంలో స్టార్‌గా ఎదిగాడు.కేశవ్ మహారాజ్- ఫిబ్రవరి 7, 1990న దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో జన్మించిన కేశవ్ మహారాజ్ భారతీయ కుటుంబం నుండి వచ్చాడు. కేశవ్ మహారాజ్ పూర్వీకులు ఉత్తరాది ప్రాంతానికి చెందిన వారని తెలుస్తుంది. కేశవ్ 2016లో దక్షిణాఫ్రికా తరఫున టెస్ట్ అరంగేట్రం చేశాడు. అతికొద్ది కాలంలోనే టాప్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లలో ఒకరిగా మారాడు. దక్షిణాఫ్రికా సాధించిన అనేక టెస్ట్ విజయాలలో మహారాజ్ కీలక పాత్ర పోషించాడు. 2021లో వెస్టిండీస్‌పై మహారాజ్ సాధించిన హ్యాట్రిక్ మరపురానిది.ఐష్ సోధి- ఇందర్బీర్ సింగ్ 'ఇష్' సోధి అక్టోబర్ 31, 1992న పంజాబ్‌లోని లూథియానాలో జన్మించాడు. సోధి తన ప్రారంభ దినాలను న్యూజిలాండ్‌లో గడిపాడు. సోధి 2013లో న్యూజిలాండ్ తరఫున అరంగేట్రం చేశాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో సోధికి మంచి ప్రదర్శనకారుడిగా పేరుంది. ముఖ్యంగా టీ20 ఫార్మాట్లో సోధి చెలరేగిపోతాడు.సునీల్ నరైన్- 1988, మే 26న ట్రినిడాడ్ అండ్ టొబాగోలో భారతీయ తల్లిదండ్రులకు జన్మించిన సునీల్ నరైన్ మిస్టరీ స్పిన్ బౌలింగ్‌కు ప్రసిద్ధి చెందాడు. 2011లో విండీస్ తరపున అరంగేట్రం చేసిన నరైన్.. 2012 టీ20 ప్రపంచ కప్‌లో వెస్టిండీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. నరైన్ విశ్వవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రైవేట్ లీగ్‌ల్లో ఆడతాడు.రవి బొపారా- మే 4, 1985న లండన్‌లో భారతీయ తల్లిదండ్రులకు జన్మించిన రవి బొపారా.. అన్ని ఫార్మాట్లలోనూ ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2007లో ఇంగ్లండ్ తరఫున అరంగేట్రం చేసిన బొపారా.. తన స్టైలిష్ బ్యాటింగ్‌తో పాటు మీడియం పేస్ బౌలింగ్‌కు ప్రసిద్ధి చెందాడు. వన్డే, టెస్ట్‌ల్లో బొపారాకు మంచి ట్రాక్ రికార్డు ఉంది.శివ్‌నరైన్ చంద్రపాల్- వెస్టిండీస్ క్రికెట్లో అత్యంత నమ్మకమైన బ్యాటర్లలో ఒకరైన శివ్‌నరైన్ చంద్రపాల్ ఆగస్టు 16, 1974న గయానాలోని ఒక భారతీయ కుటుంబంలో జన్మించాడు. 1994లో విండీస్ తరఫున అరంగేట్రం చేసిన చంద్రపాల్.. తన విలక్షణమైన బ్యాటింగ్ భంగిమతో ప్రసిద్ది చెందాడు. చంద్రపాల్ తన కెరీర్లో 20000కు పైగా పరుగులు సాధించాడు. ఘనమైన విండీస్ క్రికెట్ చరిత్రలో చంద్రపాల్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మాంటీ పనేసర్- మద్సుదేన్ సింగ్ 'మాంటీ' పనేసర్ 1982 ఏప్రిల్ 25న ఇంగ్లండ్‌లోని లూటన్‌లో పంజాబీ దంపతులకు జన్మించాడు. మాంటీ 2006లో ఇంగ్లండ్ తరఫున టెస్ట అరంగేట్రం చేశాడు. ఎడమచేతి వాటం స్పిన్నర్ అయిన మాంటీ ఇంగ్లండ్ తరఫున టెస్ట్‌ల్లో విశేషంగా రాణించాడు. మాంటీ.. ఇంగ్లండ్ యాషెస్ సిరీస్ గెలుపుల్లో కీలకపాత్ర పోషించాడు.తేజ నిడమనూరు- ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో జన్మించిన తేజ నిడమనూరు నెదర్లాండ్స్‌కు ఆడుతున్నాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో తేజ మంచి ప్రదర్శనకారుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తేజ నెదర్లాండ్స్ గెలిచిన చాలా మ్యాచ్‌ల్లో కీలకపాత్ర పోషించాడు. నెదర్లాండ్స్‌కు రాకముందు తేజ క్రికెట్ అవకాశాల కోసం న్యూజిలాండ్‌లో గడిపాడు. ఆల్‌రౌండర్ అయిన తేజ ఐసీసీ టోర్నీల్లో విశేషంగా రాణించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.మోనాంక్ పటేల్- గుజరాత్లో మే 1, 1993న జన్మించిన మోనాంక్ పటేల్ అమెరికాకు వలస వచ్చి అమెరికన్ క్రికెట్లో మంచి పేరు గడించాడు. పటేల్.. యూఎస్ఏ జట్టుకు టాపార్డర్ బ్యాట్స్‌మన్‌గా, వికెట్ కీపర్‌గా సేవలందస్తాడు. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్‌కప్, అంతకుముందు జరిగిన మేజర్ లీగ్ క్రికెట్లో మోనాంక్ అద్భుత ప్రదర్శనలు చేశాడు.మిలింద్ కుమార్- ఫిబ్రవరి 15, 1991న ఢిల్లీలో జన్మించిన మిలింద్ కుమార్ భారత దేశవాళీ క్రికెట్లో చాలా పరుగులు చేశాడు. తదనంతరం అతను అమెరికాకు మకాం మార్చి అమెరికా జాతీయ జట్టు తరపున ఆడటం ప్రారంభించాడు. మిలింద్ అనతి కాలంలోనే యూఎస్ఏ జట్టులో కీలక ఆటగాడిగా స్థిరపడ్డాడు. -
నోరు అదుపులో పెట్టుకోండి గవాస్కర్ సాబ్: ఇంజమామ్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్‌పై ఓటమి అనంతరం పాకిస్తాన్ జట్టును లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత పాకిస్తాన్ జట్టు ఇండియన్-బి టీమ్‌ను కూడా ఓడించలేదని ఆయన ఎద్దేవా చేశారు. "పాకిస్తాన్ జట్టు బెంచ్ అంత బలంగా లేకపోవడం నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. పాకిస్తాన్ జట్టులో ఒకప్పుడు సహజమైన నైపుణ్యాలు, ప్రతిభ కలిగిన ఆటగాళ్లు ఉండేవారు. టెక్నికల్‌గా వారు అంత గొప్పగా లేకపోయినా, గేమ్‌పై మాత్రం వారికి మంచి అవగహన ఉండేది. బ్యాట్‌తో పాటు బంతితో కూడా అద్భుతాలు చేసేవారు.ఉదాహరణకు ఇంజమామ్-ఉల్-హక్‌ను తీసుకుంటే... అతడిలా ఉండాలని యువ ఆటగాళ్లకు సలహా ఇవ్వలేం. కానీ ఆట పట్ల అతడికి ఒక తరహా పిచ్చి ఉండేదని చెప్పవచ్చు. ఆటే పరమావధిగా ముందుకు సాగేవాడు. తన దూకుడుతో ఒక్కోసారి సాంకేతిక లోపాలను అధిగమించి అనుకున్న ఫలితాన్ని రాబట్టడంలోనూ సఫలమయ్యేవాడు. ప్రస్తుతం ఉన్న ఫామ్‌తో పాక్ జట్టు, భారత్-బి టీమ్‌పై కూడా గెలవలేదు. సి టీమ్ విషయంలో కచ్చితంగా చెప్పలేను" అని గవాస్కర్ పేర్కొన్నాడు.ఇంజమామ్ ఫైర్.. తాజాగా గవాస్కర్ వ్యాఖ్యలపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్ ఘూటుగా స్పందించాడు. ఇతర జట్ల గురుంచి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని ఇంజమామ్ హెచ్చరించాడు. "గవాస్కర్ సాబ్.. మీ జట్టు బాగా ఆడి గెలిచింది. అది నేను కూడా అంగీకరిస్తాను. కానీ మా జట్టు గురించి ఏది పడితే అది మాట్లాడితే మేము చూస్తూ ఊరుకోము. మా జట్టు గణాంకాలు చూసి మాట్లాడండి. షార్జా వేదికగా జరిగిన ఓ మ్యాచ్‌లో పాకిస్తాన్‌కు భయపడి మీరు పారిపోలేదా? మీరు మా కంటే పెద్దవారు.మిమ్మల్ని మేము చాలా గౌరవిస్తాము. కానీ మీరు ఇతర దేశం కోసం అలా తక్కువ చేసి మాట్లాడం సరికాదు. మీ జట్టును ఎంత కావాలంటే అంతగా ప్రశంసించే హక్కు మీకు ఉంది. కానీ ఇతర జట్లను చులకన చేసే మాట్లాడే హక్కు మీకు లేదు. ముందు మా పాకిస్తాన్ గణాంకాలను చెక్ చేసుకోండి.మీ వ్యాఖ్యలు నన్ను చాలా బాధించాయి. మీరు గొప్ప క్రికెటర్, కానీ ఇటువంటి వ్యాఖ్యలు చేయడంతో మీ గౌరవాన్ని పోగట్టుకుంటున్నారు. ఇటువంటి కామెంట్స్ చేసేముందు అతడు తన నోటిని అదుపులో పెట్టుకోవాలి" అని 24 న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంజమామ్ మండిపడ్డాడు.పాక్‌దే పై చేయి..కాగా వన్డే క్రికెట్లో భారత్‌పై పాక్‌దే పైచేయిగా ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకు వన్డేల్లో ముఖా ముఖి 136 సార్లు తలపడ్డాయి. వాటిల్లో భారత్ 58 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. పాకిస్తాన్ 73 సార్లు విజేతగా నిలిచింది. ఐదు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. అయితే ఐసీసీ టోర్నీల్లో మాత్రం భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. వరుసగా మూడు టోర్నీల్లో పాకిస్తాన్‌ను టీమిండియా మట్టికర్పించింది. ఇక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా భారత్ నిలిచింది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి టైటిల్‌ను భారత్ ఎగరేసుకుపోయింది.చదవండి: కోహ్లి, గిల్ కాదు.. అతడే సైలెంట్ హీరో: రోహిత్ శర్మ -
ఐసీసీ ఈవెంట్లలో తిరుగులేని కోహ్లి, రోహిత్.. ఇద్దరూ ఇద్దరే..!
ఐసీసీ వైట్ బాల్ టోర్నీలు (పరిమిత ఓవర్ల టోర్నీలు) అనగానే టీమిండియా కృష్ణార్జునులు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు పూనకం వస్తుంది. ఈ ఇద్దరు మామూలు మ్యాచ్‌ల్లో ఎలా ఆడినా ఐసీసీ ఈవెంట్లలో మాత్రం చెలరేగిపోతారు. ఇందుకు తాజా నిదర్శనం 2025 ఛాంపియన్స్ ట్రోఫీ. ఈ ఐసీసీ టోర్నీలో విరాట్ ఆది నుంచే చెలరేగగా.. రోహిత్ కీలకమైన ఫైనల్లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి భారత్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు.ఈ ఇద్దరు గడిచిన 18 ఏళ్లలో భారత్‌కు ఐసీసీ టోర్నీల్లో ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు. రోహిత్ ఆటగాడిగా 2007 టీ20 వరల్డ్‌కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ.. కెప్టెన్‌గా 2024 టీ20 ప్రపంచకప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ విజయాల్లో భాగం కాగా.. విరాట్ ఆటగాడిగా 2011 వన్డే వరల్డ్‌కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ, 2024 టీ20 వరల్డ్‌కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ విజయాల్లో భాగమయ్యాడు.ఐసీసీ ఈవెంట్లలో కోహ్లి, రోహిత్‌ల ట్రాక్ రికార్డును పరిశీలిస్తే ప్రపంచంలో ఏ ఆటగాడికి సాధ్యం కాని రికార్డు వీరు సొంతం చేసుకున్నారు. కోహ్లి, రోహిత్ ఐసీసీ వైట్‌బాల్ టోర్నీల్లో ఇప్పటివరకు (ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్) తలో 90 మ్యాచ్‌లు ఆడి 70కి పైగా విజయాల్లో (కోహ్లి 72, రోహిత్ 70) భాగమయ్యారు. ప్రపంచంలో మరే క్రికెటర్ ఐసీసీ వైట్‌బాల్ టోర్నీల్లో వీరు సాధించినన్ని విజయాలు సాధించలేదు. కోహ్లి, రోహిత్ తర్వాత ఐసీసీ వైట్ బాల్ టోర్నీల్లో అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన ఘనత మహేళ జయవర్దనేకు దక్కుతుంది. జయవర్దనే 93 మ్యాచ్‌ల్లో 57 విజయాలు సాధించాడు.ఐసీసీ వైట్ బాల్ టోర్నీల్లో అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన ఆటగాళ్లు..విరాట్ కోహ్లి- 72 (90 మ్యాచ్‌లు)రోహిత్ శర్మ- 70 (90)మహేళ జయవర్దనే- 57 (93)కుమార సంగక్కర- 56 (90)రవీంద్ర జడేజా- 52 (66)రికీ పాంటింగ్- 52 (70)ఎంఎస్ ధోని- 52 (78)ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విషయానికొస్తే.. ఈ టోర్నీలో భారత్ అజేయ జట్టుగా ఫైనల్‌కు చేరి ఫైనల్లో న్యూజిలాండ్‌ను మట్టికరిపించి ఛాంపియన్‌గా నిలిచింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. భారత స్పిన్నర్లు చెలరేగిన వేల డారిల్ మిచెల్ (63), మైఖేల్ బ్రేస్‌వెల్ (53 నాటౌట్) అద్భుతమైన అర్ద సెంచరీలు సాధించి న్యూజిలాండ్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. ఆదిలో రచిన్ రవీంద్ర (37), ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ (34) మంచి ఇన్నింగ్స్‌లు ఆడగా.. విల్ యంగ్ (15), కేన్ విలియమ్సన్ (11), టామ్ లాథమ్ (14),మిచెల్ సాంట్నర్ (8) తక్కువ స్కోర్లకు ఔటయ్యారు. భారత్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో 2.. షమీ, జడేజా చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఛేదనలో రోహిత్ (76) భారత్‌కు శుభారంభాన్ని అందించారు. శుభ్‌మన్ గిల్‌తో (31) కలిసి తొలి వికెట్‌కు 105 పరుగులు జోడించాడు. అయితే భారత్ 17 పరుగుల వ్యవధిలో గిల్, కోహ్లి (1), రోహిత్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో శ్రేయస్ అయ్యర్ (48), అక్షర్ పటేల్ (29) మంచి భాగస్వామ్యం నెలకొల్పి భారత్‌ను తిరిగి గేమ్‌లోకి తెచ్చారు. అయితే శ్రేయస్, అక్షర్ కూడా స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో టీమిండియా మరోసారి కష్టాల్లో పడింది.ఈ దశలో కేఎల్ రాహుల్ (34 నాటౌట్).. హార్దిక్ పాండ్యా (18), రవీంద్ర జడేజాతో (18 నాటౌట్) కలిసి మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యాలు నెలకొల్పి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. జడేజా బౌండరీ బాది భారత్‌ను గెలిపించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో సాంట్నర్, బ్రేస్‌వెల్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. జేమీసన్, రచిన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడం భారత్‌కు ఇది మూడోసారి (2002, 2013, 2025). ఫైనల్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించగా.. టోర్నీ ఆధ్యాంతం రాణించిన రచిన్ రవీంద్రకు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు లభించింది. -
ఛాంపియన్స్‌గా భారత్.. చిన్నపిల్లాడిలా గంతులేసిన గవాస్కర్! వీడియో
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 12 ఏళ్ల తర్వాత టీమిండియా వశమైంది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించిన భారత జట్టు.. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్‌ను ముద్దాడింది. రవీంద్ర జడేజా విన్నింగ్ షాట్ కొట్టగానే స్టేడియంలో ఉన్న భారత అభిమానలతో పాటు దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి.ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) ఆనందానికి అవధలు లేకుండా పోయాయి. ఫైనల్ పోరులో కామెంటేటర్‌గా వ్యవహరించిన గవాస్కర్.. టీమిండియా గెలిచిన వెంటనే మైదానంలో వచ్చి సందడి చేశాడు. 75 ఏళ్ల వయసులోనూ ఆయన చిన్నపిల్లాడిలా డ్యాన్స్ చేస్తూ టీమిండియా విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.సహచర కామెంటేటర్లు వారి సెల్ఫోన్లలో అద్బుత క్షణాలను బంధించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టీమిండియా ప్లేయర్లు కూడా ట్రోఫీని అందుకున్నాక తమదైన శైలిలో డ్యాన్స్ చేస్తూ అలరించారు.కాగా భారత్‌కు ఇది మూడో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ కావడం విశేషం. 2002లో శ్రీలంకతో ట్రోఫీని సంయుక్తంగా పంచుకున్న భారత జట్టు.. ఆ తర్వాత 2013, 2025లో ఛాంపియన్స్‌గా నిలిచింది. అదేవిధంగా తొమ్మిది నెలల వ్యవధిలో భారత్‌కు ఇది రెండో ఐసీసీ టైటిల్ కావడం గమనార్హం.ఇక ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 7 వికెట్లకు 251 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో డారిల్ మిచెల్(101 బంతుల్లో 3 ఫోర్లతో 63), మైఖేల్ బ్రేస్‌వెల్(40 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం 252 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఆరు వికెట్లు కోల్పోయి చేధించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రోహిత్ శర్మ 74 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. Sunil Gavaskar after India won champions trophy 😂😂😂I think now we can understand his harsh criticism of players pic.twitter.com/rWNsT8k47b— Chintan Patel (@Patel_Chintan_) March 9, 2025 -
ఐపీఎల్లో పొగాకు, మద్యం ఉత్పత్తుల ప్రకటనలపై నిషేధం?
ప్రజారోగ్యాన్ని పెంపొందించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మ్యాచ్‌లు, సంబంధిత కార్యక్రమాలు, జాతీయ టెలివిజన్ ప్రసారాల సమయంలో అన్ని రకాల పొగాకు, ఆల్కహాల్ ప్రకటనలను నిషేధించాలని కోరింది. ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించడంలో, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్సీడీ) వ్యాప్తిని నియంత్రించడంలో క్రీడల పాత్ర కీలకమని ఎత్తిచూపుతూ ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ సింగ్ ధుమాల్, బీసీసీఐకి లేఖ రాసింది.దేశంలో ఏటా సంభవించే మరణాల్లో 70 శాతం ఎన్సీడీల వల్ల జరుగుతున్నవేనని ఆరోగ్య మంత్రిత్వ శాఖ లేఖలో హైలైట్ చేసింది. పొగాకు, మద్యపానం హృదయ సంబంధ వ్యాధులు, క్యాన్సర్, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు, మధుమేహంతో సహా అనేక ఇతర రోగాలకు దోహదం చేసే ప్రధాన ప్రమాద కారకాలుగా ఉన్నాయని తెలిపింది. పొగాకు సంబంధిత మరణాల్లో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి దాదాపు 14 లక్షల మరణాలతో రెండో స్థానంలో ఉందని గణాంకాలను తెలియజేసింది.ఇదీ చదవండి: స్వల్పంగా పెరిగిన బంగారం ధర! తులం ఎంతంటే..క్రికెట్‌కు భారత్‌లో ఆదరణ పెరుగుతోందని తెలియజేస్తూ, క్రీడలు ప్రజల ఆరోగ్య సంరక్షణ బాధ్యతను నిర్వర్తించాలని చెప్పింది. పొగాకు లేదా ఆల్కహాల్ బ్రాండ్లను ప్రోత్సహించే ప్రకటనలను నిరోధించడానికి కఠినమైన నిబంధనలు అనుసరించాలని ఐపీఎల్, బీసీసీఐను మంత్రిత్వ శాఖ కోరింది. అంతేకాకుండా క్రీడాకారులు, కామెంటేటర్లు, ఇతర భాగస్వాములు పొగాకు, ఆల్కహాల్‌తో ముడిపడి ఉన్న ఉత్పత్తులను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రోత్సహించకుండా తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఐపీఎల్‌కు ఉన్న అపారమైన ప్రజాదరణ, రోల్ మోడల్స్‌గా క్రికెటర్ల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజారోగ్య కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని తెలిపింది. మార్చి 22 నుంచి ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభంకానుంది. -
ఐపీఎల్ నుంచి తప్పుకున్న స్టార్ ప్లేయర్.. బ్యాన్ పడుతుందా?
ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఊహించని షాక్ తగిలింది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ నుంచి ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ వైదొలిగాడు. గత డిసెంబర్లో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో రూ.6.25 కోట్ల భారీ ధరకు బ్రూక్‌ను ఢిల్లీ కొనుగోలు చేసింది.రాబోయే సిరీస్‌లు సిద్దమయ్యేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్రూక్ తెలిపాడు. కాగా ఈ ఇంగ్లండ్ వైస్ కెప్టెన్ ఐపీఎల్ నుంచి వైదొలగడం ఇది వరుసగా రెండో సారి. ఐపీఎల్ 2024 సీజన్లో కూడా ఢిల్లీనే రూ.4 కోట్లకు హ్యారీ బ్రూక్‌ని కొనుగోలు చేసింది. అయితే వ్యక్తిగత కారణాలతో గతేడాది సీజన్ నుంచి కూడా బ్రూక్ తప్పకున్నాడు.ఐపీఎల్-2025 సీజన్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. ఇది చాలా కఠినమైన నిర్ణయం. కానీ భవిష్యత్తు ప్రణాళికలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఆ సమయాన్ని ఇంగ్లండ్ క్రికెట్‌కు కేటాయించాలని అనుకుంటున్నాను. ఢిల్లీ క్యాపిటల్స్‌కు వారి అభిమానులకు క్షమాపణలు తెలుపుతున్నాను అని ఓ ప్రకటనలో పేర్కొన్నాడు.బ్రూక్‌పై బ్యాన్..!కాగా బీసీసీఐ కొత్త రూల్స్ ప్రకారం.. వేలంలో అమ్ముడుపోయిన తర్వాత ఆటగాడు సరైన కారణంగా లేకుండా ఐపీఎల్ నుంచి తప్పుకుంటే సదరు ప్లేయర్‌పై రెండేళ్ల బ్యాన్ పడనుంది. మరి హ్యారీ బ్రూక్‌పై ఐపీఎల్ నిర్వహకులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. కాగా ఇంగ్లండ్ వైట్ బాల్ కెప్టెన్సీ నుంచి జోస్ బట్లర్ తప్పుకున్న సంగతి తెలిసిందే. అతడి స్ధానంలో బ్రూక్ ఇంగ్లండ్ జట్టు పగ్గాలు చేపట్టే అవకాశముంది. కాగా ఐపీఎల్-2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున హ్యారీ ఆడాడు. రూ.13.25 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఆడిన హ్యారీ బ్రూక్, 11 మ్యాచుల్లో 190 పరుగులు చేశాడు.ఇక ఐపీఎల్-2025 సీజన్ మార్చి 22న నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ ఇంకా తమ కెప్టెన్‌ను ఎంపిక చేయలేదు. కేఎల్ రాహుల్ లేదా అక్షర్ పటేల్ ఢిల్లీ జట్టు పగ్గాలు చేపట్టే ఛాన్స్ ఉంది.చదవండి: అతడు మా నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు.. ఓడినా గర్వంగానే ఉంది: కివీస్ కెప్టెన్ -
అతడు మా నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు.. ఓడినా గర్వంగానే ఉంది: కివీస్ కెప్టెన్
మరోసారి చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) గెలవాలన్న న్యూజిలాండ్ ఆశలపై టీమిండియా నీళ్లు చల్లింది. పాతికేళ్ల క్రితం ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుని 2025 ఫైనల్లో కివీస్‌ను ఓడించి విజేతగా నిలిచింది. అయితే, ఈ మ్యాచ్‌లో తమ జట్టు ఆఖరి వరకు పోరాడిన తీరు అద్భుతమని కెప్టెన్ మిచెల్ సాంట్నర్ సహచర ఆటగాళ్లను అభినందించాడు. ఈ టోర్నమెంట్ తమకు చేదు-తీపిల కలయికగా మిశ్రమ అనుభూతిని మిగిల్చిందని పేర్కొన్నాడు.కాగా పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న మొదలైన ఈ మెగా వన్డే టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొన్నాయి. గ్రూప్-ఎ నుంచి భారత్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, పాకిస్తాన్.. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ బరిలో నిలిచాయి. ఈ క్రమంలో లీగ్ దశలో మూడింటికి మూడూ గెలిచి సెమీస్‌కు చేరిన రోహిత్ సేన.. సెమీస్‌లో ఆసీస్‌పై గెలుపొందింది. మరోవైపు.. గ్రూప్ దశలో కేవలం టీమిండియా చేతిలో ఓడిన కివీస్.. సెమీ ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి ఫైనల్లో భారత్‌ను ఢీకొట్టింది.దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన టైటిల్ పోరులో భారత్ చేతిలో నాలుగు వికెట్ల తేడాతో ఓడి రిక్తహస్తాలతో వెనుదిరిగింది. అయితే, 49వ ఓవర్ వరకు ఫలితం తేలకుండా న్యూజిలాండ్ బౌలర్లు అడ్డుపడటం... ఆఖరి వరకు పట్టుదలగా పోరాడిన తీరును ప్రస్తావిస్తూ సాంట్నర్(Mitchell Santner) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓటమి అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆఖర్లో మాకు మిశ్రమ అనుభూతి లభించింది. అయితే, ఫైనల్లో పటిష్ట జట్టు చేతిలో ఓడిపోయినందువల్ల పెద్దగా బాధపడాల్సిన పనిలేదు.మ్యాచ్ ఆసాంతం మేము టీమిండియాను సవాల్ చేయగలిగాం. అది మాకు సంతృప్తినిచ్చింది. ఒకటీ రెండు చిన్నతప్పుల వల్ల మ్యాచ్ మా చేజారింది. ఏదేమైనా ఈ జట్టును చూసి నేను గర్విస్తున్నాను. టోర్నీ ఆసాంతం మా వాళ్లు అద్భుతంగా ఆడారు. అనుభవజ్ఞులు, యువ ఆటగాళ్లతో మా జట్టు సమతూకంగా ఉంది. ఇలాంటి జట్టుకు కెప్టెన్‌గా ఉండటం అంత తేలికేమీ కాదు. నాకైతే ఈ టోర్నీ అద్భుతమైన అనుభవాన్ని ఇచ్చింది.ముందుగా చెప్పినట్లు మేము బలమైన జట్టు చేతిలో ఓడిపోయాం. ఇంకో 20 పరుగులు చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదేమో!.. అయితే, రోహిత్ శర్మ(Rohit Sharma) తన అద్భుత బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను మా నుంచి లాగేసుకున్నాడు. ఫైనల్ వరకు మా ఆటతీరు అద్బుతంగా సాగింది. టైటిల్ పోరులోనూ మేము ఆఖరి వరకు పోరాడటం గర్వకారణం’’ అని 33 ఏళ్ల లెఫ్టార్మ్ స్పిన్నర్ సాంట్నర్ తమ జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు.కాగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన సాంట్నర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రచిన్ రవీంద్ర(37),గ్లెన్ ఫిలిప్స్(34) ఫర్వాలేదనిపించగా.. డారిల్ మిచెల్(63), మైకేల్ బ్రాస్‌వెల్(53 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఈ క్రమంలో నిర్ణీత యాభై ఓవర్లలో కివీస్ జట్టు ఏడు వికెట్ల నష్టానికి 251 పరుగులు స్కోరు చేసింది.భారత బౌలర్లలో స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ పొదుపుగా బౌలింగ్ చేసి రెండేసి వికెట్లు తీశారు. రవీంద్ర జడేజా ఒక వికెట్ దక్కించుకోగా.. పేసర్లలో షమీ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక లక్ష్య ఛేదనను దూకుడగా ఆరంభించిన భారత్ 49 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసింది.ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ(83 బంతుల్లో 76, 7 ఫోర్లు, మూడు సిక్సర్లు) అద్భుత అర్ధ శతకం సాధించగా.. శ్రేయస్ అయ్యర్(48), కేఎల్ రాహుల్(33 బంతుల్లో 34 నాటౌట్), హార్దిక్ పాండ్యా(18 బంతుల్లో 18), రవీంద్ర జడేజా(6 బంతుల్లో 9 నాటౌట్) రాణించారు. కివీస్ బౌలర్లలో మైకేల్‌బ్రాస్‌వెల్, మిచెల్ సాంట్నర్‌రెండేసి వికెట్లు కూల్చగా.. రచిన్ రవీంద్ర, కైలీ జెమీసన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోగా.. సిరీస్ ఆసాంతం రాణించిన రచిన్ రవీంద్రకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.చదవండి: మా స్పిన్నర్లు అద్భుతం: రోహిత్ శర్మ -
రోహిత్ శర్మ వరల్డ్ రికార్డు.. ఇప్పటివరకు ఎవరికి సాధ్యం కాలేదు!
రోహిత్ శర్మ.. ఈ పేరు భారత క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. కేవలం తొమ్మిది నెలల వ్యవదిలోనే భారత జట్టుకు రెండు ఐసీసీ టైటిల్స్‌ను అందించిన లీడర్ అతడు. రోహిత్ సారథ్యంలో టీ20 ప్రపంచకప్-2024 విజేతగా నిలిచిన టీమిండియా.. ఇప్పుడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్‌ను ముద్దాడింది.న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన టీమిండియా.. మూడో సారి ఛాంపియన్స్‌గా నిలిచింది. ఈ విజయంతో పాతికేళ్ల కిందట కివీస్ చేతిలో పరాభావానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. దీంతో యావత్తు దేశం మొత్తం సంబరాల్లో మునిగితేలుతోంది. ప్రధాని నుంచి సామన్య మానవుడి వరకు టీమిండియాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.భారత కెప్టెన్ రోహిత్ శర్మది కీలకపాత్ర. రోహిత్ కెప్టెన్‌గానే కాకుండా వ్యక్తిగత ప్రదర్శన పరంగా అదరగొట్టాడు. ఫైనల్ మ్యాచ్‌లో 76 పరుగుల తేడాతో కీలక ఇన్నింగ్స్ ఆడిన హిట్‌మ్యాన్.. ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.రోహిత్ శర్మ వరల్డ్ రికార్డు..👉ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఫైనల్ పోరులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న తొలి కెప్టెన్‌గా రోహిత్ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఏ జట్టు కెప్టెన్ కూడా ఈ ఫీట్ సాధించలేదు.👉అదేవిధంగా భారత్‌కు అత్యధిక ఐసీసీ టైటిల్స్‌ను అందించిన రెండో కెప్టెన్‌గా రోహిత్ నిలిచాడు. ఈ జాబితాలో దిగ్గజ కెప్టెన్ ఎంఎస్ ధోని ఉన్నాడు. ధోని సారథ్యంలో టీ20 ప్రపంచకప్-2007, వన్డే ప్రపంచకప్-2011, ఛాంపియన్స్ ట్రోఫీ-2013లను భారత్ కైవసం చేసుకుంది. ధోని మొత్తంగా భారత్‌కు మూడు టైటిల్స్‌ను అందించగా.. రోహిత్ రెండు టైటిల్స్‌ను సాధించాడు.👉పరిమిత ఓవర్ల ఐసీసీ ఈవెంట్లలో అత్యధిక విన్నింగ్ శాతం కెప్టెన్‌గా రోహిత్ నిలిచాడు. రోహిత్ కెప్టెన్సీలో భారత జట్టు వరుసగా మూడు వైట్‌బాల్ ఐసీసీ టోర్నీ ఫైనల్స్‌కు చేరింది. చివరి మూడు టోర్నమెంట్లలో భారత్ కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఓడిపోయింది.అది కూడా 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్. ఆ తర్వాత రెండు టోర్నీలను టీమిండియా ఆజేయంగా ముగించింది. దీంతో ఐసీసీ ఈవెంట్లలో రోహిత్ శర్మ విన్నింగ్ పర్సంటేజి 90 శాతంగా ఉంది. రోహిత్ తర్వాతి స్ధానాల్లొ పాంటింగ్(88 శాతం), గంగూలీ(80శాతం) ఉన్నారు.చదవండి: కోహ్లి, గిల్ కాదు.. అతడే సైలెంట్ హీరో: రోహిత్ శర్మ -
రోహిత్‌ను ఆలింగనం చేసుకున్న అనుష్క శర్మ.. ప్రత్యేక అభినందనలు
వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్ నాటి చేదు అనుభవాన్ని మరిపిస్తూ టీమిండియా అద్భుత విజయం సాధించింది. సొంతగడ్డపై ఎదురైన పరాభవాన్ని మరిపించేలా.. దుబాయ్‌లో చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) గెలిచి అభిమానులకు కానుక అందించింది. ఈ మెగా వన్డే టోర్నమెంట్ ఆద్యంతం అజేయంగా నిలిచి పరిపూర్ణ విజయంతో ముచ్చటగా మూడోసారి ట్రోఫీని ముద్దాడింది.పాతికేళ్ల క్రితం న్యూజిలాండ్(India vs New Zealand) చేతిలో ఫైనల్లో ఓడిపోయిన భారత జట్టు తాజాగా అదే ప్రత్యర్థిని ఓడించి ప్రతీకారం తీర్చుకుంది. నాలుగు వికెట్ల తేడాతో కివీస్‌పై గెలుపొంది 2025 చాంపియన్స్ ట్రోఫీ విజేతగా అవతరించింది. దీంతో అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. ఈ నేపథ్యంలో టీమిండియాపై.. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)పై ప్రశంసల వర్షం కురుస్తోంది.స్వదేశంలో వన్డే వరల్డ్‌కప్-2023లో తన అద్భుత కెప్టెన్సీతో జట్టును ఫైనల్ చేర్చిన హిట్‌మ్యాన్.. ఆ తర్వాత టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియాను చాంపియన్‌గా నిలిపాడు. తాజాగా చాంపియన్స్ ట్రోఫీ గెలిచి రెండో ఐసీసీ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా మహేంద్ర సింగ్ ధోని తర్వాత ఎక్కువ ఐసీసీ ట్రోఫీలు గెలిచిన రెండో కెప్టెన్‌గా నిలిచాడు.ఆత్మీయంగా హత్తుకుని.. శుభాకాంక్షలుఇక చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత సహచరులు రోహిత్ శర్మతో తమ ఆనందాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. స్టార్ బ్యాటర్, మాజీ సారథి విరాట్ కోహ్లి అయితే సంతోషంతో తబ్బిబ్బైపోయాడు. ఆ సమయంలో రోహిత్ కుటుంబంతో పాటు కోహ్లి ఫ్యామిలీ కూడా అక్కడే ఉంది.అయితే, విజయానంతరం రోహిత్ తన కుమార్తె సమైరాను ముద్దాడటంతో పాటు భార్య రితికాను ఆలింగనం చేసుకుని సంతోషం పంచుకున్నాడు. ఆ సమయంలో రితికా పక్కనే ఉన్న కోహ్లి భార్య అనుష్క శర్మ రోహిత్‌ను ప్రత్యేకంగా అభినందించింది. అంతేకాదు ఆత్మీయంగా అతడిని హత్తుకుని శుభాకాంక్షలు తెలిపింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కాగా చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా గెలవగానే అనుష్క- కోహ్లి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఆనందాన్ని పంచుకున్నారు. ఇక టీమిండియాకు మద్దతుగా అనుష్క పలుమార్లు స్టేడియంలో సందడి చేయడంతో పాటు భర్త విరాట్ అద్భుతంగా ఆడిన వేళ గాల్లో ముద్దులు ఇస్తూ అతడిపై ప్రేమను చాటుకున్న సందర్భాలు కోకొల్లలు. This moment!🏆❤️#AnushkaSharma hugged #ViratKohli after India's epic win in the #ICCChampionsTrophy2025 finals. #INDvsNZ pic.twitter.com/QmEDAJcziu— Filmfare (@filmfare) March 9, 2025 విరాట్ కూడా తాను కీలక మైలురాయిని అందుకున్న ప్రతివేళా సతీమణికి దానిని అంకితమిస్తాడు. ముఖ్యంగా ఫామ్‌లేమితో సతమతమైన వేళ అనుష్క వల్లే తాను తిరిగి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగేవాడినని.. ఆమె తనకు నైతికంగా ఎల్లవేళలా మద్దతు ఇస్తుందని గతంలో వెల్లడించాడు.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ బారత్ వర్సెస్ న్యూజిలాండ్ వేదిక: దుబాయ్, మార్చి 9టాస్: న్యూజిలాండ్ .. మొదట బ్యాటింగ్కివీస్ స్కోరు: 251/7 (50)టీమిండియా స్కోరు: 254/6 (49)ఫలితం: నాలుగు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై గెలిచి చాంపియన్‌గా భారత్ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రోహిత్ శర్మ(83 బంతుల్లో 76) Anushka Sharma specially called Rohit Sharma and gave him a tight hug.🔥They are like a family bro.#INDvNZ pic.twitter.com/6UgeFchHVT— 𝐕𝐢𝐬𝐡𝐮 (@Ro_45stan) March 9, 2025 -
కోహ్లి, గిల్ కాదు.. అతడే సైలెంట్ హీరో: రోహిత్ శర్మ
భారత క్రికెట్ జట్టు ఏడాది తిరగకముందే మరో ఐసీసీ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా టీమిండియా నిలిచింది. దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత జట్టు.. ముచ్చటగా మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా అవతరించింది. అయితే ఈ మెగా టోర్నీలో భారత తరపున అత్యంత కీలకమైన ప్రదర్శన చేసిన ఆటగాడు ఎవరంటే? కొంతమంది ఫైనల్లో 76 పరుగులు చేసిన రోహిత్ శర్మ పేరు చెబుతుంటే.. మరి కొంతమంది పాక్‌పై సెంచరీ, సెమీస్‌లో హాఫ్ సెంచరీ చేసిన విరాట్ కోహ్లి పేరు చెబుతున్నారు. వీరిద్దరూ కాకపోతే కేవలం మూడు మ్యాచ్‌ల్లో 9 వికెట్ల వికెట్లు పడగొట్టిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి పేరును ఎంచుకుంటున్నారు.. కానీ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం.. మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) అందరికంటే అద్బుతంగా ఆడాడని ప్రశించాడు. అయ్యర్ ఒక సైలెంట్ హీరో అని హిట్‌మ్యాన్ కొనియాడాడు.సూపర్ శ్రేయస్..అవును.. ఈ మెగా టోర్నీ అసాంతం శ్రేయస్ అయ్యర్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ టోర్నీలో జట్టు కష్టాల్లో ఉన్న ప్రతీసారి అతడు ముందుకు వచ్చి ఆదుకున్నాడు. మిడిలార్డర్లో భారత జట్టు వెన్నెముకగా నిలిచాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లోనూ అయ్యర్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ శర్మ ఔటయ్యాక అక్షర్ పటేల్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 61 పరుగుల మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యం నెలకొల్పాడు. ఒకవేళ ఈ భాగస్వామ్యం రాకపోయింటే పరిస్థితి మరో విధంగా ఉండేది. ఓవరాల్‌గా శ్రేయస్ 5 మ్యాచ్‌ల్లో 243 పరుగులు చేశాడు. ఈ టోర్నమెంట్లో భారత్ తరపున అత్యధిక పరుగుల చేసిన ఆటగాడిగా అయ్యర్ నిలిచాడు."శ్రేయస్ అయ్యర్ మాకు సైలెంట్ హీరో. అతడు మిడిలార్డర్లో చాలా కీలకమైన ఆటగాడు. ఈ మ్యాచ్‌లో నేను ఔటయ్యాక అయ్యర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అక్షర్‌తో భాగస్వామ్యం నెలకొల్పాడు. ప్రతీ మ్యాచ్‌లోనూ తన వంతు పాత్ర పోషించాడు. అతడు ఒత్తిడిలో ఇంకా అద్బుతంగా ఆడుతాడని" రోహిత్ శర్మ పేర్కొన్నాడు.అప్పుడు వేటు.. ఇప్పుడు ప్రమోషన్కాగా గతేడాది అయ్యర్ తన కెరీర్లో కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నాడు. దేశవాళీ క్రికెట్లో ఆడాలన్న తమ ఆదేశాలను ధిక్కరించడంతో అయ్యర్‌ను సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి బీసీసీఐ తప్పించింది. అంతేకాకుండా అతడు జాతీయ జట్టుకు కూడా దూరమయ్యాడు. ఈ క్రమంలో అతడి పని అయిపోయింది అంతా భావించారు. కానీ అయ్యర్ మాత్రం పడిలేచిన కేరటంలా తిరిగొచ్చాడు.దేశవాళీ క్రికెట్లో అద్బుతమైన ప్రదర్శన కనబరచడంతో అతడిని సెలక్టర్లు తిరిగి జాతీయ జట్టులోకి తీసుకున్నారు. తన రీ ఎంట్రీలో అయ్యర్ దుమ్ములేపుతున్నాడు. ఈ క్రమంలో అతడికి తిరిగి సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించుకుంది. త్వరలోనే బీసీసీఐ అధికారికంగా ప్రకటించనుంది.చదవండి: ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్.. ప్రైజ్ మనీ ఎన్ని కోట్లంటే? -
ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్.. ప్రైజ్ మనీ ఎన్ని కోట్లంటే?
గత కొన్ని రోజులుగా అభిమానులను ఉర్రూతలూగించిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు శుభం కార్డ్ పడింది. ఈ మెగా టోర్నీ విజేతగా భారత్(Teamindia) నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించిన భారత జట్టు.. రికార్డుస్థాయిలో మూడోసారి చాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది.టోర్నీ ఆసాంతం ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటిన రోహిత్ సేన.. ఫైనల్లోనూ అదే జోరును కనబరిచి పుష్కరకాలం తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని తిరిగి భారత్‌కు తీసుకొచ్చింది. భారత్ చివరగా 2013లో ధోని సారథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకోగా.. మళ్లీ రోహిత్ శర్మ నాయకత్వంలో తిరిగి సాధ్యమైంది. ఇక ఛాంపియన్స్‌గా నిలిచిన భారత్ ఎంత ప్రైజ్‌మనీని గెల్చుకుంది, రన్నరప్‌గా న్యూజిలాండ్ ఎంత మొత్తం దక్కించుకుంది అనే వివరాలను తెలుసుకుందాం.విజేతకు ఎంతంటే?ఛాంపియన్స్ ట్రోఫీ విన్నర్‌గా నిలిచిన టీమిండియాకు 2.4 మిలియన్ డాలర్లు ( భారత కరెన్సీలో దాదాపు రూ. రూ.19.5 కోట్లు) అందుకుంది. అదే విధంగా రన్నరప్‌గా నిలిచిన కివీస్‌కు 1.12 మిలియన్ డాలర్ల (రూ.9.72కోట్లు) ప్రైజ్‌మనీ దక్కింది. సెమీఫైనల్లో ఓటిమిపాలైన దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లకు 560,000 డాలర్లు (రూ.4.86కోట్లు) లభించాయి. ఐదో, ఆరో స్ధానాల్లో నిలిచిన జట్లు 350,000 డాలర్లు(రూ. 3 కోట్లు పైగా).. ఏడవ, ఎనిమిదవ స్థానంలో ఉన్న జట్లు 140,000 డాలర్లు(రూ. సుమారు 1.2 కోట్లు) దక్కించుకున్నాయి. గ్రూపు స్టేజిలో విజయం సాధించిన జట్టుకు 34,000 డాలర్లు (సుమారు రూ. 33 లక్షలు) అందనుంది. ఈ మెగా టోర్నీలో పాల్గోన్నందకు ప్రతీ జట్టుకు 125,000 డాలర్లు(రూ.కోటి) ఐసీసీ అందజేయనుంది. అంటే ఈ మెత్తాన భారత్‌కు రూ. 21 కోట్లపైనే అందింది.చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా భారత జట్టు అవతరించింది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా.. 12 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను తిరిగి ముద్దాడింది. ఈ విజయంతో 25 ఏళ్ల కిందట కివీస్ చేతిలో ఎదురైన పరాభావానికి భారత జట్టు బదులు తీర్చుకుంది. ఈ మెగా టోర్నీలో అద్వితీయమైన ప్రదర్శన కనబరిచిన రోహిత్ సేన.. మరోసారి 140 కోట్లమంది భారతీయులను సగర్వంగా తలెత్తుకునేలా చేసింది.ఈ విజయంలో జట్టులోని ప్రతీ ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించారు. తొలుత బౌలర్లు అదరగొట్టగా.. అనంతరం బ్యాటర్లు తమ పని తాము చేసుకుపోయారు. కివీస్ నిర్దేశించిన 252 పరుగుల లక్ష్యాన్ని భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేధించింది.రోహిత్ మాస్.. రాహుల్ క్లాస్లక్ష్య చేధనలో కెప్టెన్ రోహిత్ శర్మ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తొలి ఓవర్ నుంచే కివీస్ బౌలర్లను హిట్‌మ్యాన్ టార్గెట్ చేశాడు. పవర్ ప్లేలో బౌండరీల వర్షం కురిపించాడు. 83 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 76 పరుగులు చేశాడు. అయితే సెంచరీ చేరువలో ఓ భారీ షాట్‌కు ప్రయత్నించి స్టంపౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ మరోసారి వెన్నముకగా నిలిచారు. శ్రేయస్ అయ్యర్ (62 బంతుల్లో 48, 2 ఫోర్లు, 2 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (33 బంతుల్లో 34 నాటౌట్, 1 ఫోర్, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 7 వికెట్లకు 251 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో డారిల్ మిచెల్(101 బంతుల్లో 3 ఫోర్లతో 63), మైఖేల్ బ్రేస్‌వెల్(40 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలా రెండు వికెట్లు సాధించగా.. మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా తలో వికెట్ పడగొట్టారు.టీమిండియా వరల్డ్ రికార్డు..కాగాభారత్కు ఇది మూడో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్. ఈ క్రమంలో టీమిండియా ఓ ప్రపంచరికార్డును తమ పేరిట లిఖించుకుంది. మూడు ఛాంపియన్స్ ట్రోఫీ టైటిళ్లను గెలుచుకున్న మొదటి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. 2002లో శ్రీలంకతో కలిసి సంయుక్తంగా ట్రోఫీని గెలుచుకున్న టీమిండియా.. ఆ తర్వాత 2013, 2025లో ఈ మెగా టోర్నీ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా, భారత్ పేరిట సంయుక్తంగా ఉండేది. కానీ ఈ విజయంతో ఆసీస్‌ను మెన్ బ్లూ అధిగమించింది. అదేవిధంగా వరుసగా రెండు ఐసీసీ టోర్నీల్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఛాంపియన్స్‌గా నిలిచిన తొలి జట్టుగా భారత్ నిలిచింది. టీ20 ప్రపంచకప్-2024లో ఆజేయంగా విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టు.. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఒక్క మ్యాచ్‌లో కూడా టీమిండియా ఓడిపోలేదు.చదవండి: #Rohit Sharma: రిటైర్మెంట్పై రోహిత్ శర్మ కీలక ప్రకటన.. -
రిటైర్మెంట్పై రోహిత్ శర్మ కీలక ప్రకటన..
విశ్వవేదికపై మరోసారి భారత జెండా రెపరెపలాడింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా భారత క్రికెట్ జట్టు నిలిచింది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా.. ముచ్చటగా మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను ముద్దాడింది.ఈ విజయంతో ఏడాది తిరగకముందే మరో ఐసీసీ టైటిల్ భారత్ ఖాతాలో వేసుకుంది. కెప్టెన్‌గా రోహిత్ శర్మ వరుసగా రెండో ఐసీసీ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఈ క్రమంలో తన వన్డే రిటైర్మెంట్ వస్తున్న వార్తలకు రోహిత్ శర్మ చెక్ పెట్టాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన హిట్‌మ్యాన్.. ఇప్పటిలో రిటైర్ అయ్యే ఆలోచన తనకు లేదని స్పష్టం చేశాడు.ఇప్పుడే కాదు.."చాలా సంతోషంగా ఉంది. చక్కటి క్రికెట్ ఆడిన మాకు దక్కిన ఫలితమిది. మొదటి నుంచి మా స్పిన్నర్లు ప్రభావం చూపించారు. ఎన్నో అంచనాలు ఉన్న సమయంలో వారు నిరాశపర్చలేదు. ఈ సానుకూలతను మేం సమర్థంగా వాడుకున్నాం. రాహుల్ మానసికంగా దృఢంగా ఉంటాడు.సరైన షాట్లను ఎంచుకుంటూ ఒత్తిడి లేకుండా అతను ఈ మ్యాచ్‌ను ముగించగలిగాడు. అతని వల్లే అవతలి వైపు పాండ్యా స్వేచ్ఛగా ఆడగలిగాడు. మా బ్యాటర్లంతా ఆకట్టుకునే ప్రదర్శన ఇచ్చారు. వరుణ్ బౌలింగ్‌లో ఎంతో ప్రత్యేకత ఉంది. అతను కీలక సమయాల్లో వికెట్లు తీశాడు. ఇలాంటి పిచ్‌పై అలాంటి బౌలర్ కావాలని అంతా కోరుకుంటారు. మాకు ఇది సొంత మైదానం కాకపోయినా పెద్ద సంఖ్యలో వచ్చి మద్దతుగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు. దూకుడుగా బ్యాటింగ్ చేసేందుకు నన్ను కోచ్ ప్రోత్సహించారు. మరో విషయం నేను స్పష్టం చేయదల్చుకున్నాను. నేను ఈ ఫార్మాట్‌నుంచి రిటైర్ కావడం లేదు.ఎలాంటి వదంతులు రాకూడదని ఇది చెబుతున్నాను. సుదీర్ఘమైన క్రికెట్ ఆడినవారికి ఇంకా ఆడాలని ఉంటుంది. అయితే ఇది యువ ఆటగాళ్లపై ప్రభావం చూపుతోంది అని 38 ఏళ్ల రోహిత్ పోస్ట్‌మ్యాచ్ ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నాడు. కాగా రోహిత్, కోహ్లి ఇద్దరూ 2027 వన్డే ప్రపంచకప్ వరకు కొనసాగే అవకాశముంది.భారత్ ఆల్‌రౌండ్ షో..ఈ ఫైనల్ పోరులో టీమిండియా ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 251 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో డారిల్ మిచెల్(101 బంతుల్లో 3 ఫోర్లతో 63), మైఖేల్ బ్రేస్‌వెల్(40 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు.భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలా రెండు వికెట్లు సాధించగా.. మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 252 పరుగుల లక్ష్యాన్ని భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేధించింది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ (83 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 76) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడగా.. శ్రేయస్ అయ్యర్(62 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 48), కేఎల్ రాహుల్(33 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 34 నాటౌట్) కీలక నాక్స్ ఆడారు. కివీస్ బౌలర్లలో సాంట్నర్, బ్రేస్‌వెల్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర, జెమీసన్ చెరో వికెట్ సాధించింది.చదవండి:మా స్పిన్నర్లు అద్భుతం.. ఆ ఇద్దరు సూపర్.. అతడు నాణ్యమైన బౌలర్: రోహిత్ -
అజేయంగా... ఆసియా చాంపియన్‌గా!
టెహ్రాన్: ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన భారత మహిళల కబడ్డీ జట్టు తమకు తిరుగులేదని మరోసారి నిరూపించుకుంది. ఇరాన్లో జరిగిన మహిళల ఆసియా కబడ్డీ ఆరో చాంపియన్‌షిప్‌లో టీమిండియా టైటిల్‌ను నిలబెట్టుకుంది. ఎనిమిదేళ్ల విరామం తర్వాత జరిగిన ఈ మెగా ఈవెంట్లో భారత జట్టు లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి సెమీఫైనల్‌కు చేరింది. సెమీఫైనల్లో, ఆ తర్వాత ఫైనల్లోనూ జైత్రయాత్ర కొనసాగించి ఐదోసారి ఆసియా చాంపియన్‌గా నిలిచింది. టైటిల్ పోరులో భారత జట్టు 32–25 పాయింట్లతో తేడాతో ఆతిథ్య ఇరాన్ జట్టును ఓడించింది. అంతకుముందు సెమీఫైనల్లో భారత్ 56–18 పాయింట్ల తేడాతో నేపాల్ జట్టుపై ఘనవిజయం అందుకుంది. లీగ్ దశలో తొలి మ్యాచ్‌లో టీమిండియా 64–23 పాయింట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై, రెండో మ్యాచ్‌లో 76–21 పాయింట్లతో థాయ్‌లాండ్ జట్టుపై, మూడో మ్యాచ్‌లో 73–19 పాయింట్లతో మలేసియా జట్టుపై గెలుపొందాయి. మొత్తం ఏడు జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’లో భారత్, బంగ్లాదేశ్, మలేసియా, థాయ్‌లాండ్ జట్లు... గ్రూప్ ‘బి’లో ఇరాన్, ఇరాక్, నేపాల్ జట్లు ఉన్నాయి. గ్రూప్ ‘బి’లోని నాలుగో జట్టు చైనీస్ తైపీ జట్టు చివరి నిమిషంలో ఈ టోర్నీ నుంచి వైదొలిగింది. ఆసియా చాంపియన్‌షిప్‌లో రాణించిన భారత జట్టు ఈ ఏడాది చివర్లో భారత్‌లోనే జరిగే వరల్డ్‌కప్ టోర్నీలో ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. ఆసియా చాంపియన్‌షిప్ నెగ్గిన భారత జట్టుకు సోనాలి విష్ణు షింగేట్ కెపె్టన్‌గా, పుష్ప రాణా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించారు. జాతీయ చాంపియన్‌షిప్‌లో ఇండియన్ రైల్వేస్ తరఫున ఆడిన సోనాలి గోల్డెన్ రెయిడ్‌తో తన జట్టును విజేతగా నిలిపింది. పూజా కజిలా, నిధి శర్మ, పూజా నర్వాల్, ఆమ్రపాలి గలాండె, నేహా దక్ష్ , సంజూ దేవి, జ్యోతి ఠాకూర్, సాక్షి శర్మ, భావన దేవి, రీతూ మిగతా సభ్యులుగా ఉన్నారు. 2005లో హైదరాబాద్‌లో తొలిసారి ఆసియా చాంపియన్‌షిప్‌ను నిర్వహించగా... భారత జట్టు విజేతగా అవతరించింది. అనంతరం 2007లో టహ్రాన్ (ఇరాన్)లో జరిగిన రెండో ఆసియా చాంపియన్‌షిప్‌లో, 2008లో మదురై (భారత్)లో జరిగిన మూడో ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత జట్టు టైటిల్ నిలబెట్టుకుంది. 2008 తర్వాత ఎనిమిదేళ్లకు మళ్లీ ఆసియా చాంపియన్‌షిప్ జరిగింది. 2016లో బుసాన్ (దక్షిణ కొరియా)లో జరిగిన నాలుగో ఆసియా చాంపియన్‌షిప్‌లో దక్షిణ కొరియా జట్టు తొలిసారి విజేతగా అవతరించింది. 2017లో గొర్గాన్ (ఇరాన్)లో జరిగిన ఐదో ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత జట్టు దక్షిణ కొరియాను ఓడించి నాలుగోసారి చాంపియన్‌గా> నిలిచింది. 2017 తర్వాత మళ్లీ ఎనిమిదేళ్లకు నిర్వహించిన ఈ మెగా ఈవెంట్లో మరోసారి భారత్ తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. -
నేరుగా ఫైనల్ చేరడమే లక్ష్యం
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ప్లే ఆఫ్స్ బెర్త్‌లు శనివారం ఖరారయ్యాయి. ఇక మిగిలిందల్లా అగ్రస్థానం కోసం పోటీ! పాయింట్ల పట్టికలో ‘టాప్’లో నిలిచిన ఏకైక జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఇప్పుడు ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్‌ల పోరాటం కూడా దీని కోసమే! 8 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న గుజరాత్‌కు ఇది ఆఖరి లీగ్ మ్యాచ్ కాగా... మంచి రన్‌రేట్‌తో గెలిస్తే అగ్రస్థానంతో తుదిపోరుకు చేరే అవకాశముంది. 8 పాయింట్లతో రన్‌రేట్‌లో వెనుకబడినప్పటికీ... ముంబై జట్టుకు ఇంకా రెండు మ్యాచ్‌లు ఉండటం, సొంత ప్రేక్షకుల మధ్య జరగనుండటం అదనపు అనుకూలతగా మారింది. మాజీ చాంపియన్ ముంబై నేడు జెయింట్స్‌పై, రేపు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై గెలిస్తే చాలు ఎలాంటి రన్‌రేట్ సమీకరణాలతో పనిలేకుండా 12 పాయింట్లతో ఫైనల్ బరిలో నిలవొచ్చు. ఇప్పటికైతే ఢిల్లీ క్యాపిటల్స్ 10 పాయింట్లతో ‘టాప్’లో ఉంది. అనామకం కాదు కీలకం ముంబై, గుజరాత్ జట్లు ప్లేఆఫ్స్ చేరిన నేపథ్యంలో ఇది అనామక మ్యాచ్ అనుకుంటే పోరపాటే అవుతుంది. ఫైనల్ రేసు కోసం ఇరు జట్ల మధ్య ముమ్మాటికి కీలకపోరే జరుగనుంది! ముంబై జట్టు విదేశీ బ్యాటర్ల బలగంతో పటిష్టంగా ఉంది. నాట్ సివర్ బ్రంట్, హేలీ మాథ్యూస్‌లు ఈ టోర్నీలో నిలకడగా ఫామ్ చాటుకున్నారు. వీళ్లిద్దరితో పాటు కెప్టెన్ హర్మన్‌ప్రీత్, అమెలియా కెర్లు కూడా మెరుగ్గానే ఆడుతుండటంతో బ్యాటింగ్ లైనప్‌కు ఏ ఢోకా లేదు. బౌలింగ్‌లోనూ విదేశీ ఆల్‌రౌండర్లే జట్టు విజయాల్లో భాగమవుతున్నారు. యూపీ వారియర్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో అమెలియా కెర్ ఐదు వికెట్లతో సత్తా చాటుకుంది. నాట్ సివర్, హేలీ మాథ్యూస్‌లు కూడా అడపాదడపా వికెట్లను పడగొడుతున్నారు. మరోవైపు గుజరాత్ జెయింట్స్ కూడా గత మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జోరుకు చెక్ పెట్టింది. 177 పరుగుల భారీ లక్ష్యాన్ని జెయింట్స్ సులువుగా ఛేదించింది. హర్లీన్ డియోల్, బెత్ మూనీ, కెపె్టన్ ఆష్లీ గార్డ్నర్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లో ఆల్‌రౌండర్ డియాండ్రా డాటిన్, కాశ్వీ, తనూజ, మేఘన సింగ్‌లు ప్రభావం చూపగలరు. తుది జట్లు (అంచనా) ముంబై ఇండియన్స్: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), హేలీ మాథ్యూస్, అమెలియా కెర్, నాట్ సివర్, అమన్‌జ్యోత్ కౌర్, యస్తిక, సజన, కమలిని, సంస్కృతి, షబ్నమ్, పారుణిక సిసోడియా. గుజరాత్ జెయింట్స్: ఆష్లీ గార్డ్నర్ (కెప్టెన్), బెత్ మూనీ, హేమలత, హర్లీన్ డియోల్, డియాండ్రా, లిచ్‌ఫీల్డ్, కాశ్వీ గౌతమ్, భారతి, తనూజ, మేఘన సింగ్, ప్రియా మిశ్రా. -
జొకోవిచ్‌కు చుక్కెదురు
కాలిఫోర్నియా: సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్‌కు ఇండియన్ వెల్స్ ఏటీపీ–1000 మాస్టర్స్ టోర్నమెంట్లో చుక్కెదురైంది. 24 గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన ప్రపంచ మాజీ నంబర్‌వన్ జొకోవిచ్... ఈ టోర్నీలో రెండో రౌండ్లోనే ఇంటిబాట పట్టాడు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో ఆరో సీడ్ జొకోవిచ్ 2–6, 6–3, 1–6తో ‘లక్కీ లూజర్’ బొటిక్ వాన్ డి జాండ్‌షుల్ఫ్ (నెదర్లాండ్స్) చేతిలో పరాజయం పాలయ్యాడు. వాస్తవానికి జాండ్‌షుల్ప్ క్వాలిఫయింగ్ దశలోనే ఓడిపోయాడు. అయితే మెయిన్ ‘డ్రా’లో ఒక ప్లేయర్ వైదొలడగంతో క్వాలిఫయింగ్‌లో ఓడిపోయిన మెరుగైన ర్యాంకర్ జాండ్షుల్ప్కు ‘లక్కీ లూజర్’ హోదాలో మెయిన్ ‘డ్రా’లో ఆడే అవకాశం కల్పించారు. తొలి రౌండ్లో ‘బై’ దక్కించుకున్న జొకోవిచ్... బరిలోకి దిగిన తొలి పోరులోనే నిష్క్రమించాడు. గతంలో ఐదుసార్లు ఈ టోర్నీలో చాంపియన్‌గా నిలిచిన జొకోవిచ్... ఈసారి అదే జోరు కనబర్చలేకపోయాడు. 37 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. తొలి సెట్లోనే జొకో 14 అనవసర తప్పిదాలకు పాల్పడడంతో తిరిగి కోలుకోలేకపోయాడు.జాండ్‌షుల్ఫ్ బేస్‌లైన్‌తో పాటు నెట్ గేమ్‌తో అదరగొడితే... జొకో మ్యాచ్ ఆద్యాంతం తడబడ్డాడు. ఓవరాల్‌గా జాండ్‌షుల్ఫ్ 4 ఏస్‌లు సంధించగా... జొకో ఒక్క ఏస్ కూడా కొట్టలేకపోయాడు. నెదర్లాండ్స్ ప్లేయర్ 4 డబుల్ ఫాల్ట్స్ చేయగా... జొకోవిచ్ 3 డబుల్ ఫాల్ట్‌లకు పాల్పడ్డాడు. ‘గత కొంతకాలంగా పరిస్థితులు భిన్నంగా సాగుతున్నాయి. ఆశించిన స్థాయిలో ఆడేందుకు ఇబ్బంది పడుతున్నా. ఈ పోరాటం సవాలుతో కూడుకున్నది.మధ్యమధ్యలో ఒకటీ రెండు టోర్నీల్లో మంచి ప్రదర్శన కనబర్చగలుగుతున్నా... దాన్ని కొనసాగించడం ముఖ్యం. పేలవ ప్రదర్శనకు సాకులు వెతకాలనుకోవడం లేదు. ఇది నా రోజు కాదు. మరింత మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తా’ అని జొకోవిచ్ అన్నాడు. ఈ ఏడాది 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ ఖాతాలో వేసుకునేలా కనిపించిన జొకోవిచ్... కండరాల నొప్పితో ఆ్రస్టేలియా ఓపెన్ సెమీఫైనల్ నుంచి వైదొలిగాడు. గాయం నుంచి కోలుకొని బరిలోకి దిగిన దోహా టోర్నీ తొలి రౌండ్లోనే జొకో పరాజయం పాలయ్యాడు. మరోవైపు అగ్రశ్రేణి ఆటగాళ్లపై ఆరంభ దశలోనే విజయాలు సాధించడాన్ని అలవాటుగా మార్చుకున్న జాండ్‌షుల్ఫ్ గతంలో... డేవిస్ కప్‌లో రాఫెల్ నాదల్ (స్పెయిన్)పై, యూఎస్ ఓపెన్‌లో అల్కరాజ్ (స్పెయిన్)పై కూడా విజయాలు సాధించాడు. ఇప్పుడు మరో సంచలన నమోదు చేస్తూ జొకోవిచ్పై గెలుపొందాడు. ఓవరాల్‌గా టాప్–10 ప్రత్యర్థులపై జాండ్షుల్ఫ్కు ఇది 8వ విజయం కావడం విశేషం. కాగా, ఈ టోర్నీలో టాప్‌సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), నాలుగో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) కూడా రెండో రౌండ్లోనే పరాజయం పాలయ్యారు. -
వైట్ జాకెట్స్... ఈ ‘చాంపియన్స్’కే ఎందుకు!
దుబాయ్: వన్డే ప్రపంచకప్, టి20 ప్రపంచకప్, ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)... అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్ల చాంపియన్లు అవతరిస్తారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మాత్రం ‘చాంపియన్స్ ట్రోఫీ’ విజేతలకు మాత్రమే ప్రత్యేకమైన తెలుపురంగు జాకెట్లను అందజేస్తుంది. జెంటిల్మెన్ క్రికెట్లో దర్పానికి, గొప్ప గౌరవానికి ప్రతీకగా ట్రోఫీతో పాటు జాకెట్లను ఇస్తారు. విన్నింగ్ టీమ్ సభ్యులందరూ ఈ వైట్ జాకెట్లు (white jackets) ధరించే బహుమతి ప్రదానోత్సవ వేడుకలో తెగ హంగామా చేస్తారు. 1998లో బంగ్లాదేశ్‌లో ఈ టోర్నీకి శ్రీకారం చుట్టారు. అప్పట్లో నాకౌట్ టోర్నీగా మొదలైన ఈ ఈవెంట్‌ను మినీ ప్రపంచకప్‌గా అభివర్ణించేవారు. ఇక వైట్ జాకెట్ల హంగు, వేదికపై ఆర్భాటం మాత్రం 2009లో మొదలైంది. ముంబైకి చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ బబితా ఈ వైట్ జాకెట్ల రూపకర్త. మనకిది సాధారణ వైట్ సూట్లాగే కనిపిస్తుంది. కానీ ఇది ఎంతో ప్రత్యేకమైన ఇటాలియన్ వూల్‌తో తయారైంది. వినూత్న టెక్చ్సర్, స్ట్రిప్‌లు, బంగారు వర్ణ ఎంబ్రాయిడింగ్ వర్క్ చాంపియన్స్ ట్రోఫీ లోగోతో ఆ జాకెట్లకు మరిన్ని వన్నెలద్దారు డిజైనర్లు. పాకిస్తాన్ ఆతిథ్యమిచ్చిన తాజా టోర్నీకి సంబంధించిన ఈ ప్రత్యేకమైన జాకెట్లను ఆ దేశ దిగ్గజం, మాజీ కెప్టెన్ వసీమ్ అక్రమ్ విడుదల చేశాడు. ఈ సందర్భంగా అక్రమ్ మాట్లాడుతూ ‘ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ అత్యుత్తమ టోర్నీకి నిదర్శనం. క్రికెట్ గొప్పతనాన్ని విశ్వవ్యాప్తం చేసింది. ఆరంభం నుంచి విశేషాదరణ చూరగొంది’ అని అన్నాడు.చదవండి: రోహిత్ శర్మ వరల్డ్ రికార్డు.. ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాలేదు -
వన్డే విజయం తెచ్చిన ఆనందం...
నవంబర్ 19, 2023... కోట్లాది మంది భారతీయుల ఆశలు మోస్తూ వన్డే వరల్డ్ కప్‌లో ఫైనల్ బరిలోకి దిగిన భారత్ అనూహ్య పరాజయంతో అభిమానుల గుండెలు బద్దలయ్యాయి... జూన్ 29, 2024... టి20 ఫార్మాట్లో తమ స్థాయికి తగ్గ ఆటను కనబరుస్తూ భారత జట్టు వరల్డ్ కప్ గెలుచుకుంది...ఫ్యాన్స్‌కు కాస్త ఊరట... మార్చి 9, 2025... అంచనాలకు అనుగుణంగా ప్రతీ మ్యాచ్‌లో సంపూర్ణ ఆధిక్యంతో భారత జట్టు చాంపియన్స్ ట్రోఫీ సాధించింది... దేశవ్యాప్తంగా అన్ని చోట్లా ఆనందం... సాక్షి క్రీడా విభాగం : సుమారు 16 నెలల వ్యవధిలో భారత జట్టు మూడు ఐసీసీ టోర్నీల్లో ఫైనల్ చేరింది. వాటిలో రెండింటిలో విజేతగా నిలిచింది. వన్డే వరల్డ్ కప్ ఓటమి వేదన ఇప్పటికీ తీరనిది అయినా మిగతా రెండు విజయాలతో సాంత్వన దక్కిందనేది మాత్రం వాస్తవం. అంతర్జాతీయ క్రీడల్లో ఒక టోర్నమెంట్‌కు, మరో టోర్నమెంట్‌కు పోలిక ఉండదు. ఒక విజయానికి, మరో విజయానికి సంబంధం ఉండదు. దేని ప్రత్యేకత దానిదే. కానీ గెలుపు ఇచ్చే కిక్ మాత్రం ఎప్పుడైనా ఒకటే! ఇప్పుడు టీమిండియా ఆటగాళ్లు దానినే అనుభవిస్తున్నారు.వరల్డ్ కప్ కాకపోయినా టాప్–8 జట్ల మధ్య జరిగిన సమరంలో భారత్ తమ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 2013లో చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టులో సభ్యులైన రోహిత్, కోహ్లి, జడేజా ఇప్పుడూ ఉన్నారు. 2017 ఫైనల్లో పాక్ చేతిలో ఓడిన వారిలో ఈ ముగ్గురితో పాటు హార్దిక్ పాండ్యా, షమీ కూడా ఉన్నారు. షమీ, అయ్యర్, రాహుల్, హర్షిత్ రాణా, వరుణ్, సుందర్‌లకు ఇదే తొలి ఐసీసీ టైటిల్. దాని విలువ ఏమిటో వారి ఆనందంలోనే కనిపిస్తోంది. స్పిన్నర్లే విన్నర్లు... చాంపియన్స్ ట్రోఫీ కోసం జట్టును ప్రకటించినప్పుడు ‘ఐదుగురు స్పిన్నర్లా’ అంటూ అన్ని వైపుల నుంచి ఆశ్చర్యం వ్యక్తమైంది. పైగా అప్పటికే ఎంపిక చేసిన జట్టులో ఉన్న బ్యాటర్ యశస్వి జైస్వాల్‌ను తప్పించి మరీ వరుణ్ చక్రవర్తిని ఎంపిక చేశారు. టోర్నీలో మన స్పిన్నర్ల ప్రదర్శన చూస్తే ఇది ఎంత సరైన నిర్ణయమో తేలింది. సుందర్‌కు మ్యాచ్ ఆడే అవకాశం రాకపోగా... మిగతా నలుగురు వరుణ్, కుల్దీప్, అక్షర్, జడేజా పెను ప్రభావం చూపించారు. ఈ నలుగురు కలిసి మొత్తం 26 వికెట్లు పడగొట్టారు. ఇందులో వరుణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. కేవలం 15.11 సగటుతో అతను 9 వికెట్లు తీశాడు. లీగ్ దశలోనే కివీస్ పని పట్టిన అతను ఫైనల్లోనూ అదే ఆటను ప్రదర్శించి జట్టు విజయానికి కారణమయ్యాడు. కీలకమైన యంగ్, ఫిలిప్స్ వికెట్లు తీసిన అతను కనీసం ఒక్క బౌండరీ కూడా ఇవ్వకపోవడం విశేషం! టోర్నీకి ముందు అతను ఒకే ఒక వన్డే ఆడాడు. ‘వరుణ్ బౌలింగ్‌లో ఏదో ప్రత్యేకత ఉంది. నెట్స్‌లో కూడా అతను మాకు మామూలుగానే బౌలింగ్ చేస్తాడు. తన అసలైన ఆయుధాలను మ్యాచ్‌లోనే ప్రదర్శిస్తాడు. అలా చేస్తే చాలు’ అంటు రోహిత్ చేసిన ప్రశంస వరుణ్ విలువను చూపించింది. ఆరంభంలో కుల్దీప్ పెద్దగా ప్రభావం చూపకపోయినా... తుది పోరులో రెండు కీలక వికెట్లతో కివీస్‌ను నిలువరించాడు. జడేజా, అక్షర్ కూడా కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థులను కట్టి పడేశారు. వీరిద్దరి ఎకానమీ 4.35 మాత్రమే ఉందంటే వారు ఎంత పొదుపుగా బౌలింగ్ చేశారో అర్థమవుతుంది. గాయం నుంచి కోలుకొని తిరిగొచ్చిన షమీ గతంలోలా అద్భుతంగా బౌలింగ్ చేయకపోయినా కీలక సమయాల్లో జట్టును ఆదుకున్నాడు. టోర్నీలో అతను తీసిన 9 వికెట్లలో సెమీస్‌లో స్మిత్‌ను అవుట్ చేసిన క్షణం హైలైట్‌గా నిలిచింది. బుమ్రా లేని లోటును పూరిస్తూ ఈ సీనియర్ బౌలర్ తన వంతు పాత్రను పోషించాడు. బ్యాటర్లు సమష్టిగా... బ్యాటింగ్‌లో ఎప్పటిలాగే విరాట్ కోహ్లి (మొత్తం 218 పరుగులు) భారత జట్టు మూల స్థంభంగా నిలిచాడు. 1 సెంచరీ, 1 అర్ధసెంచరీతో రెండుసార్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా అతను జట్టును గెలిపించాడు. టోర్నీకి ముందు అతని బ్యాటింగ్‌పై కాస్త సందేహాలు రేగినా... వాటిని అతను పటాపంచలు చేశాడు. కోహ్లినే స్వయంగా చెప్పినట్లు ఆ్రస్టేలియా టూర్ తర్వాత తాము ఒక విజయం కోసం చూస్తున్న స్థితిలో ఈ టైటిల్ దక్కింది. మొత్తం పరుగులు చూస్తే రోహిత్ శర్మ (180) తక్కువగానే కనిపిస్తున్నా... ఓపెనర్‌గా అతను చూపించిన ప్రభావం ఎంతో ఉంది. శ్రేయస్ అయ్యర్ (243) జట్టు అత్యధిక స్కోరర్‌గా నిలవగా, గిల్ (188 పరుగులు) ఒక సెంచరీతో తాను ప్రధాన పాత్ర పోషించాడు. తనపై వస్తున్న విమర్శలకు జవాబిస్తూ కేఎల్ రాహుల్ (140 పరుగులు) మూడు మ్యాచ్‌లలో చివరి వరకు నిలిచి జట్టును గెలుపు తీరం చేర్చాడు. ఐదో స్థానంలో ప్రమోట్ అయిన అక్షర్ పటేల్ (109 పరుగులు) కూడా ఆకట్టుకున్నాడు. టాప్–6 బ్యాటర్లు ఆశించిన స్థాయిలో ఆడటంతో ఆందోళన లేకపోయింది. ఐదు మ్యాచ్‌లలో భారత్ నాలుగు సార్లు సునాయాసంగా 232, 242, 265, 252 లక్ష్యాలను అందుకుంది. కెప్టెన్ గా రోహిత్ ముద్ర... భారత్ నుంచి ధోని మాత్రం కెపె్టన్‌గా ఒకటికి మించి ఐసీసీ టైటిల్స్ సాధించాడు. ఇప్పుడు రెండు ట్రోఫీలతో రోహిత్ శర్మ తన నాయకత్వ లక్షణాలను ప్రదర్శించాడు. మరో దాంట్లో ఫైనల్ కూడా చేర్చిన ఘనత, వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో ఫైనల్లో సారథిగా వ్యవహరించిన ఘనత కూడా అతని ఖాతాలో ఉంది. చాంపియన్స్ ట్రోఫీలో కీలక సమయాల్లో కెప్టెన్ గా అతను జట్టును నడిపించిన తీరు హైలైట్‌గా నిలిచింది. గంభీర్‌కు ఊరట... ద్రవిడ్ నుంచి కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత గంభీర్ కోచింగ్‌లో చెప్పుకోదగ్గ ఫలితాలు రాలేదు. శ్రీలంకపై టి20 సిరీస్, స్వదేశంలో ఇంగ్లండ్‌తో సిరీస్ లు గెలిచినా వాటిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. సొంతగడ్డపై న్యూజిలాండ్, ఆ తర్వాత ఆసీస్ చేతిలో టెస్టుల్లో చిత్తయిన అవమాన భారం మాత్రమే అందరికీ గుర్తుండిపోయింది.ఇలాంటి సమయంలో వచ్చిన గెలుపు కోచ్‌గా అతనికి ఊరటనిచ్చిoదనడంలో సందేహం లేదు. ‘అంతర్జాతీయ క్రికెట్లో సంతృప్తికరమైన ఆట ఎప్పటికీ ఉండదు. ప్రతీసారి ఏదో ఒక విషయం మెరుగు పర్చుకోవాల్సిందే. అప్పుడే నిలకడగా ఫలితాలు వస్తాయి’ అంటూ ఆటగాళ్లలో స్ఫూర్తి నింపిన కోచ్ ఇప్పుడు ఫైనల్ అనంతరం చిరునవ్వులు చిందించాడు.ప్రధాని ప్రశంసలు... మూడోసారి చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలిచిన భారత క్రికెట్ జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ‘అద్భుతమైన మ్యాచ్...అద్భుతమైన ఫలితం... ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన మన క్రికెట్ జట్టును చూసి గర్వపడుతున్నా. టోర్నమెంట్ ఆసాంతం వారంతా చాలా బాగా ఆడారు. అసాధారణ ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన మన జట్టుకు నా అభినందనలు’ అని ‘ఎక్స్’లో మోదీ పేర్కొన్నారు. టీమిండియాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చందబ్రాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అభినందనలు తెలిపారు.మాజీ సీఎం జగన్ అభినందనలు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో అసాధారణ విజయం సాధించిన భారత జట్టుకు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం రాత్రి తన ‘ఎక్స్’ ఖాతా ద్వారా స్పందించారు. ‘ఇది ఎంతో అర్హమైన అజేయ విజయం. మన దేశానికి గర్వకారణమైన క్షణం! టీమిండియాకు అభినందనలు’ అని ఆయన పేర్కొన్నారు.7 భారత్ సాధించిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టైటిల్స్ సంఖ్య. ఇందులో 2 వన్డే వరల్డ్‌కప్‌లు (1983, 2011), 2 టి20 వరల్డ్‌కప్‌లు (2007, 2024), 3 చాంపియన్స్ ట్రోఫీలు (2022, 2013, 2025) ఉన్నాయి. ఈ జాబితాలో ఆస్ట్రేలియా 10 ఐసీసీ టైటిల్స్‌తో అగ్రస్థానంలో ఉంది.ఎవరికెంత ప్రైజ్‌మనీ అంటే? విజేత భారత్ 22 లక్షల 40 వేల డాలర్లు (రూ. 19 కోట్ల 52 లక్షలు) రన్నరప్ కివీస్ 11 లక్షల 20 వేల డాలర్లు (రూ. 9 కోట్ల 76 లక్షలు) -
మనమే చాంపియన్స్
భారత జట్టు మరోసారి తమ చాంపియన్ ఆటను ప్రదర్శించింది. తొలి మ్యాచ్ నుంచి అన్ని రంగాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తూ వచ్చిన జట్టు అజేయంగా విజయప్రస్థానాన్ని ముగించింది. అటు బౌలింగ్‌లో, ఇటు బ్యాటింగ్‌లో సమష్టి ఆటతో ఒక్కో ప్రత్యర్థిని పడగొడుతూ వచ్చిన జట్టు తమ స్థాయికి తగ్గ విజయాన్ని అందుకుంది. ఏడాది వ్యవధిలో మరో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టైటిల్‌ను సొంతం చేసుకొని ప్రపంచ క్రికెట్‌పై తమ ఆధిపత్యాన్ని స్పష్టంగా చూపించింది. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమిని పూర్తిగా మరచిపోయేలా కాకపోయినా... ఈ ఫార్మాట్లో మరో ప్రతిష్టాత్మక టైటిల్‌ను గెలుచుకొని అభిమానులకు ఆనందాన్ని పంచింది. 2013లాగే ఒక్క ఓటమి కూడా లేకుండా టీమిండియా ట్రోఫీని గెలుచుకోవడం విశేషం. ఫైనల్లో టాస్ ఓడినా న్యూజిలాండ్‌ను సాధారణ స్కోరుకే పరిమితం చేయడంతోనే భారత్‌కు గెలుపు దారులు తెరుచుకున్నాయి. మన స్పిన్ చతుష్టయాన్ని ఎదుర్కోవడంలో మళ్లీ తడబడిన కివీస్ భారీ స్కోరు సాధించలేకపోయింది. ఛేదనలో రోహిత్ శర్మ దూకుడైన ఆరంభం లక్ష్యాన్ని అందుకునేందుకు తగిన పునాది వేసింది. మధ్యలో కొద్దిసేపు కివీస్ స్పిన్నర్లూ ప్రభావం చూపడంతో 17 పరుగుల వ్యవధిలో 3 కీలక వికెట్లు కోల్పోయి కొంత ఉత్కంఠ నెలకొంది. అయితే లక్ష్యం మరీ చిన్నది కావడంతో సమర్థమైన బ్యాటింగ్ లైనప్ తడబడకుండా టీమ్‌ను విజయతీరం చేర్చింది. క్రికెట్లో ‘మంచి బాలురు’వంటి న్యూజిలాండ్ టీమ్ మరోసారి ‘పోరాడి ఓడిన’ ముద్రతోనే నిరాశగా నిష్క్రమించింది.దుబాయ్: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ–2025ను భారత్ సొంతం చేసుకుంది. లీగ్ దశలో మూడు మ్యాచ్‌లతో పాటు సెమీఫైనల్, ఫైనల్ కలిపి ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఓటమి లేకుండా జట్టు టైటిల్ గెలుచుకుంది. దుబాయ్‌లో ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో మాజీ చాంపియన్ న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. గతంలో భారత్ 2002, 2013లలో కూడా చాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను గెల్చుకుంది. ఫైనల్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. డరైల్ మిచెల్ (101 బంతుల్లో 63; 3 ఫోర్లు), మైకేల్ బ్రేస్‌వెల్ (40 బంతుల్లో 53 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లకు 254 పరుగులు సాధించి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రోహిత్ శర్మ (83 బంతుల్లో 76; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగగా... శ్రేయస్ అయ్యర్ (62 బంతుల్లో 48; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. టోర్నీ మొత్తంలో 263 పరుగులు చేసి 3 వికెట్లు తీసిన న్యూజిలాండ్ ప్లేయర్ రచిన్ రవీంద్ర ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డు గెల్చుకున్నాడు. మిచెల్ హాఫ్ సెంచరీ... కివీస్ ఇన్నింగ్స్‌ను రచిన్ రవీంద్ర (29 బంతుల్లో 37; 4 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా మొదలు పెట్టాడు. పాండ్యా ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ కొట్టిన అతను షమీ ఓవర్లో మరో రెండు ఫోర్లు బాదాడు. దాంతో ఆరో ఓవర్లోనే భారత్ స్పిన్నర్ వరుణ్‌ను బౌలింగ్‌కు దింపింది. విల్ యంగ్ (23 బంతుల్లో 15; 2 ఫోర్లు)ను అవుట్ చేసి అతను ఓపెనింగ్ జోడీని విడదీశాడు. 10 ఓవర్లలో కివీస్ స్కోరు 69 పరుగులకు చేరింది. తన తొలి బంతికే రచిన్‌ను బౌల్డ్ చేసిన కుల్దీప్, తన రెండో ఓవర్లో విలియమ్సన్ (14 బంతుల్లో 11; 1 ఫోర్)ను పెవిలియన్ పంపించి ప్రత్య ర్థిని దెబ్బ కొట్టాడు.లాథమ్ (30 బంతుల్లో 14) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. ఈ దశలో మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ (52 బంతుల్లో 34; 2 ఫోర్లు, 1 సిక్స్) కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే స్పిన్నర్లను ఎదుర్కోవడంలో బ్యాటర్లు బాగా ఇబ్బంది పడటంతో పరుగులు నెమ్మదిగా వచ్చాయి. వరుసగా 81 బంతుల పాటు బౌండరీనే రాలేదు. ఎట్టకేలకు 91 బంతుల్లో మిచెల్ అర్ధ సెంచరీ పూర్తయింది. ఒక వైపు తక్కువ వ్యవధిలో వరుసగా వికెట్లు కోల్పోయినా... ఆఖర్లో బ్రేస్‌వెల్ వేగంగా ఆడటంతో జట్టు స్కోరు 250 పరుగులు దాటింది. చివరి 10 ఓవర్లలో కివీస్ 79 పరుగులు చేసింది. నలుగురు భారత స్పిన్నర్లు కలిపి 38 ఓవర్లలో 144 పరుగులిచ్చి 5 వికెట్లు తీయగా... ఇద్దరు పేసర్లు 12 ఓవర్లలో 104 పరుగులిచ్చి ఒకే వికెట్ తీయడం మన స్పిన్నర్ల ప్రభావాన్ని చూపించింది. రాణించిన అయ్యర్... ఇన్నింగ్స్ రెండో బంతికే సిక్స్‌తో మొదలు పెట్టిన రోహిత్ తన ఇన్నింగ్స్ ఆసాంతం దూకుడుగా ఆడాడు. నాథన్ స్మిత్ ఓవర్లో అతను 2 ఫోర్లు, సిక్స్ కొట్టాడు. మరో ఎండ్‌లో శుబ్‌మన్ గిల్ (50 బంతుల్లో 31; 1 సిక్స్) పరుగులు చేయడానికి తీవ్రంగా శ్రమించాడు. 10 ఓవర్లలో స్కోరు 64 పరుగులు కాగా, 41 బంతుల్లోనే రోహిత్ హాఫ్ సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. ఎట్టకేలకు శతక భాగస్వామ్యం తర్వాత గిల్ అవుట్ కావడంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఆపై మరో 17 పరుగుల తేడాతో రెండు కీలక వికెట్లు తీసి కివీస్ పైచేయి సాధించింది. బ్రేస్‌వెల్ తొలి బంతికి కోహ్లి (1) వికెట్ల ముందు దొరికిపోగా, రోహిత్ భారీ షాట్‌కు ప్రయత్నించి స్టంపౌటయ్యాడు. ఈ దశలో అయ్యర్, అక్షర్ పటేల్ (40 బంతుల్లో 29; 1 ఫోర్, 1 సిక్స్) కలిసి చక్కటి సమన్వయంతో జాగ్రత్తగా ఆడుతూ మళ్లీ ఇన్నింగ్స్‌ను నడిపించారు. అయితే వీరిద్దరిని తక్కువ వ్యవధిలో వెనక్కి పంపడంతో కివీస్ బృందంలో ఆశలు రేగాయి. అయితే కేఎల్ రాహుల్ (33 బంతుల్లో 34 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) ముందుండి నడిపిస్తూ జట్టును విజయం దిశగా తీసుకెళ్లాడు. 68 బంతుల్లో 69 పరుగులు చేయాల్సిన స్థితిలో బరిలోకి దిగిన రాహుల్‌కు హార్దిక్ పాండ్యా (18 బంతుల్లో 18; 1 ఫోర్, 1 సిక్స్) సహకరించాడు. 49వ ఓవర్ చివరి బంతిని జడేజా (6 బంతుల్లో 9 నాటౌట్; 1 ఫోర్) డీప్‌స్క్వేర్ లెగ్ దిశగా ఫోర్ కొట్టడంతో భారత్ విజయాన్ని పూర్తి చేసుకుంది. స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: యంగ్ (ఎల్బీ) (బి) వరుణ్ 15; రచిన్ (బి) కుల్దీప్ 37; విలియమ్సన్ (సి అండ్ బి) కుల్దీప్ 11; మిచెల్ (సి) రోహిత్ (బి) షమీ 63; లాథమ్ (ఎల్బీ) (బి) జడేజా 14; ఫిలిప్స్ (బి) వరుణ్ 34; బ్రేస్‌వెల్ (నాటౌట్) 53; సాంట్నర్ (రనౌట్) 8; స్మిత్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 251. వికెట్ల పతనం: 1–57, 2–69, 3–75, 4–108, 5–165, 6–211, 7–239. బౌలింగ్: షమీ 9–0–74–1, పాండ్యా 3–0–30–0, వరుణ్ చక్రవర్తి 10–0–45–2, కుల్దీప్ యాదవ్ 10–0–40–2, అక్షర్ పటేల్ 8–0–29–0, రవీంద్ర జడేజా 10–0–30–1. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (స్టంప్డ్) లాథమ్ (బి) రచిన్ 76; శుబ్‌మన్ గిల్ (సి) ఫిలిప్స్ (బి) సాంట్నర్ 31; కోహ్లి (ఎల్బీ) (బి) బ్రేస్‌వెల్ 1; శ్రేయస్ అయ్యర్ (సి) రచిన్ (బి) సాంట్నర్ 48; అక్షర్ పటేల్ (సి) రూర్కే (బి) బ్రేస్‌వెల్ 29; కేఎల్ రాహుల్ (నాటౌట్) 34; హార్దిక్ పాండ్యా (సి అండ్ బి) జేమీసన్ 18; జడేజా (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (49 ఓవర్లలో 6 వికెట్లకు) 254. వికెట్ల పతనం: 1–105, 2–106, 3–122, 4–183, 5–203, 6–241. బౌలింగ్: జేమీసన్ 5–0–24–1, రూర్కే 7–0–56–0, స్మిత్ 2–0–22–0, సాంట్నర్ 10–0–46–2, రచిన్ 10–1–47–1, బ్రేస్‌వెల్ 10–1–28–2, ఫిలిప్స్ 5–0–31–0. ఫిలిప్స్ అసాధారణంఫీల్డింగ్ అత్యుత్తమ ప్రమాణాలు చూపిస్తూ తన స్థాయిని పెంచుకున్న ఫిలిప్స్ ఆదివారం మరోసారి దానిని ప్రదర్శించాడు. షార్ట్ కవర్ వైపు గిల్ షాట్ ఆడగా అసాధారణంగా గాల్లోకి ఎగురుతూ ఒంటి చేత్తో ఫిలిప్స్ అందుకోవడం అందరినీ ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది. ఈ టోర్నీలో అతను ఇప్పటికే కోహ్లి, రిజ్వాన్ క్యాచ్‌లను కూడా ఇదే తరహాలో అందుకున్నాడు. క్యాచ్‌లు వదిలేశారు...భారత జట్టు ఫీల్డింగ్‌లో పలు అవకాశాలు చేజార్చింది. కష్టసాధ్యమే అయినా ఏకంగా నాలుగు క్యాచ్‌లు వదిలేసింది. అయితే లైఫ్ లభించిన ఆటగాళ్లెవరూ దానిని పెద్దగా సది్వనియోగం చేసుకోలేకపోవడంతో పెద్దగా నష్టం జరగలేదు. రచిన్ రవీంద్ర స్కోరు 29 వద్ద ఉన్నప్పుడు రెండుసార్లు బతికిపోయాడు. షమీ రిటర్న్ క్యాచ్ వదిలేయగా, అయ్యర్ మరో క్యాచ్ వదిలేశాడు. మిచెల్ స్కోరు 38 వద్ద రోహిత్ క్యాచ్ వదిలేయగా, ఫిలిప్స్ స్కోరు 27 వద్ద గిల్ క్యాచ్ వదిలేసి అవకాశమిచ్చాడు. ఆ తర్వాత కివీస్ కూడా గ్రౌండ్ ఫీల్డింగ్ అద్భుతంగా చేసినా... రెండు క్యాచ్‌లు వదిలేసింది. గిల్ 1 పరుగు వద్ద మిచెల్ క్యాచ్ వదిలేయగా, అయ్యర్ 44 పరుగుల వద్ద ఉన్నప్పుడు జేమీసన్ అతి సులువైన క్యాచ్‌ను అందుకోలేకపోయాడు. 12 రోహిత్ శర్మ వరుసగా 12వసారి టాస్ ఓడిపోయాడు. ఈ జాబితాలో అగ్ర స్థానంలో ఉన్న వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా (12) రికార్డును సమం చేశాడు. అయితే మ్యాచ్‌లు గెలుస్తూ ఐసీసీ టైటిల్ సాధించిన వేళ ఇలాంటి టాస్‌లు ఎన్ని ఓడిపోయినా రోహిత్‌కు లెక్క లేదు! ‘నేను రిటైర్ కావడం లేదు’ చాలా సంతోషంగా ఉంది. చక్కటి క్రికెట్ ఆడిన మాకు దక్కిన ఫలితమిది. మొదటి నుంచి మా స్పిన్నర్లు ప్రభావం చూపించారు. ఎన్నో అంచనాలు ఉన్న సమయంలో వారు నిరాశపర్చలేదు. ఈ సానుకూలతను మేం సమర్థంగా వాడుకున్నాం. రాహుల్ మానసికంగా దృఢంగా ఉంటాడు. సరైన షాట్లను ఎంచుకుంటూ ఒత్తిడి లేకుండా అతను ఈ మ్యాచ్‌ను ముగించగలిగాడు. అతని వల్లే అవతలి వైపు పాండ్యా స్వేచ్ఛగా ఆడగలిగాడు. మా బ్యాటర్లంతా ఆకట్టుకునే ప్రదర్శన ఇచ్చారు. వరుణ్ బౌలింగ్‌లో ఎంతో ప్రత్యేకత ఉంది. అతను కీలక సమయాల్లో వికెట్లు తీశాడు. ఇలాంటి పిచ్‌పై అలాంటి బౌలర్ కావాలని అంతా కోరుకుంటారు. మాకు ఇది సొంత మైదానం కాకపోయినా పెద్ద సంఖ్యలో వచ్చి మద్దతుగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు. దూకుడుగా బ్యాటింగ్ చేసేందుకు నన్ను కోచ్ ప్రోత్సహించారు. మరో విషయం నేను స్పష్టం చేయదల్చుకున్నాను. నేను ఈ ఫార్మాట్‌నుంచి రిటైర్ కావడం లేదు. ఎలాంటి వదంతులు రాకూడదని ఇది చెబుతున్నాను –రోహిత్, భారత కెప్టెన్ గొప్పగా అనిపిస్తోంది. ఆ్రస్టేలియాతో సిరీస్ తర్వాత సరైన రీతిలో పునరాగమనం చేయాలని భావించాం. కుర్రాళ్ళతో కలిసి ఆడటం ఎంతో బాగుంది. వారు సరైన సమయంలో స్పందిస్తూ జట్టును ముందుకు తీసుకెళుతున్నారు. ఇన్నేళ్లుగా ఆడుతున్న తర్వాత ఒత్తిడి కొత్త కాదు. టైటిల్ గెలవాలంటే ఆటగాళ్లంతా రాణించాల్సి ఉంటుంది. అందరూ సమష్టిగా సత్తా చాటడంతోనే ఇది సాధ్యమైంది. సరైన, తగిన సమయం సమయం చూసి తప్పుకోవడం ముఖ్యం (రిటైర్మెంట్పై). –విరాట్ కోహ్లి -
Virat Kohli: అద్భుత విజయం.. అంతులేని సంతోషం!.. ఆసీస్ టూర్ తర్వాత..
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025) ఫైనల్లో టీమిండియా విజయం పట్ల స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) హర్షం వ్యక్తం చేశాడు. టోర్నమెంట్ ఆసాంతం జట్టులోని ప్రతి ఒక్క సభ్యుడు టైటిల్ గెలిచేందుకు తమ వంతు సహకారం అందించాడని తెలిపాడు. భారత జట్టులో ప్రస్తుతం ప్రతిభకు కొదువలేదని.. యువ ఆటగాళ్లు సీనియర్ల సలహాలు తీసుకుంటూనే తమదైన శైలిలో ముందుకు సాగుతున్న తీరును కొనియాడాడు.కాగా పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న మొదలైన చాంపియన్స్ ట్రోఫీ తాజా ఎడిషన్.. ఆదివారం దుబాయ్ వేదికగా భారత్- న్యూజిలాండ్ మధ్య ఫైనల్‌తో ముగిసింది. ఈ వన్డే టోర్నీలో గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్.. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్ ఇంగ్లండ్ పోటీపడ్డాయి. అయితే, ఆసీస్‌ను ఓడించి టీమిండియా.. సౌతాఫ్రికాను ఓడించి న్యూజిలాండ్ తుదిపోరుకు అర్హత సాధించాయి.ఈ క్రమంలో మార్చి 9 నాటి మ్యాచ్‌లో రోహిత్ సేన ఆఖరి వరకు పోరాడి కివీస్‌పై నాలుగు వికెట్ల తేడాతో గెలుపొంది.. టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో విజయానంతరం కోహ్లి తన మనసులోని భావాలు పంచుకున్నాడు. ‘‘ఇది అద్భుత విజయం. ఆస్ట్రేలియా పర్యటనలో చేదు అనుభవం తర్వాత పెద్ద టోర్నమెంట్ గెలవాలని మేము కోరుకున్నాం.సరైన దిశలోఇలాంటి తరుణంలో చాంపియన్స్ ట్రోఫీ గెలవడం అద్భుతంగా అనిపిస్తోంది. యువ ఆటగాళ్లతో కలిసి ఆడటం సంతోషంగా ఉంది. సీనియర్లుగా మేము మా అనుభవాలను వారితో పంచుకుంటున్నాం. వారు కూడా మా సలహాలు, సూచనలు తీసుకుంటూనే తమదైన శైలిలో రాణిస్తున్నారు.జట్టు ప్రస్తుతం సరైన దిశలో వెళ్తోంది. ఈ టోర్నీ మొత్తాన్ని మేము ఆస్వాదించాం. కొంతమంది బ్యాట్‌తో రాణిస్తే.. మరికొందరు బంతితో ప్రభావం చూపారు. అంతా కలిసి జట్టు విజయంలో భాగమయ్యారు. ఐదు మ్యాచ్‌లలో ప్రతి ఒక్కరు సరైన సమయంలో సరైన విధంగా రాణించి జట్టు గెలుపునకు బాటలు వేశారు. నిజంగా మాకు ఇది చాలా చాలా అద్భుతమైన టోర్నమెంట్’’ అంటూ కోహ్లి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు.కాగా ఈ టోర్నీలో దాయాది పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో శతకం(100 నాటౌట్)తో మెరిసిన కోహ్లి.. ఆసీస్‌తో సెమీ ఫైనల్లోనూ అద్భుత అర్ధ శతకం(84)తో రాణించాడు. అయితే టైటిల్ పోరులో మాత్రం దురదృష్టవశాత్తూ ఒక్క పరుగుకే పెవిలియన్ చేరాడు. ఇదిలా ఉంటే.. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్‌లను చిత్తు చేసిన రోహిత్ సేన.. సెమీస్‌లో ఆసీస్‌ను, ఫైనల్లో కివీస్‌ను ఓడించి అజేయంగా టైటిల్ విజేతగా నిలిచింది. ఇక కెప్టెన్‌గా రోహిత్ శర్మకు ఇది రెండో ఐసీసీ టైటిల్. గతేడాది టీ20 ప్రపంచకప్ గెలిచిన హిట్‌మ్యాన్.. తాజాగా చాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను కూడా సాధించాడు.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ భారత్ వర్సెస్ న్యూజిలాండ్ స్కోర్లు👉వేదిక: దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం, దుబాయ్👉టాస్: న్యూజిలాండ్... తొలుత బ్యాటింగ్👉న్యూజిలాండ్ స్కోరు: 251/7 (50)👉కివీస్ టాప్ రన్ స్కోరర్: డారిల్ మిచెల్(101 బంతులలో 63)👉టీమిండియా స్కోరు: 254/6 (49)👉ఫలితం: న్యూజిలాండ్‌పై నాలుగు వికెట్ల తేడాతో టీమిండియా గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రోహిత్ శర్మ(83 బంతుల్లో 7 ఫోర్లు,3 సిక్స్ లు 76 పరుగులు).చదవండి: మా స్పిన్నర్లు అద్భుతం: రోహిత్ -
మా స్పిన్నర్లు అద్భుతం.. అతడు ఒత్తిడిని చిత్తు చేశాడు: రోహిత్
పుష్కరకాలం తర్వాత టీమిండియా మరోసారి చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy 2025)ని ముద్దాడింది. పాతికేళ్ల క్రితం న్యూజిలాండ్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుని 2025 విజేతగా ఆవిర్భవించింది. దుబాయ్ వేదికగా ఆదివారం నాటి ఫైనల్లో కివీస్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో సాంట్నర్ బృందంపై పైచేయి సాధించి అభిమానులకు కనులవిందు చేసింది.మా స్పిన్నర్లు అద్భుతంఈ నేపథ్యంలో విజయానంతరం భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) మాట్లాడుతూ సమిష్టి కృషి వల్లే గెలుపు సాధ్యమైందని సహచరులపై ప్రశంసలు కురిపించాడు. ముఖ్యంగా స్పిన్నర్లు చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆసాంతం అదరగొట్టారని కితాబులిచ్చాడు. అదే విధంగా తమకు మద్దతుగా నిలిచిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు.‘‘ఇది మా సొంత మైదానం కాదు. అయినప్పటికీ మాకు మద్దతుగా అభిమానులు ఇక్కడికి తరలివచ్చారు. మా హోం గ్రౌండ్ ఇదే అన్నంతలా మాలో జోష్ నింపారు. గెలుపుతో మేము వారి మనసులను సంతృప్తిపరిచాం.ఫైనల్లో మాత్రమే కాదు.. టోర్నీ ఆరంభం నుంచీ మా స్పిన్నర్లు గొప్పగా రాణించారు. దుబాయ్ పిచ్ స్వభావరీత్యా వారిపై భారీ అంచనాలు నెలకొన్నప్పటికీ ఒత్తిడికి లోనుకాకుండా పనిపూర్తి చేశారు. వారి నైపుణ్యాలపై నమ్మకంతో మేము తీసుకున్న నిర్ణయాలు సరైనవే అని నిరూపించారు. వారి బలాలను మాకు అనుకూలంగా మలచుకోవడంలో మేము సఫలమయ్యాం.అతడు ఒత్తిడిని చిత్తు చేశాడుఇక.. కేఎల్ రాహుల్(KL Rahul) గురించి చెప్పాలంటే.. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఒత్తిడిని దరిచేరనీయడు. అందుకే మేము అతడి సేవలను మిడిల్లో ఎక్కువగా ఉపయోగించుకున్నాం. ఈరోజు తను బ్యాటింగ్ చేస్తున్నపుడు పరిస్థితులు మాకు అంత అనుకూలంగా లేవు. అయినప్పటికీ అతడు ఏమాత్రం తడబడకుండా షాట్ల ఎంపికలో సంయమనం పాటించాడు.తనతో పాటు బ్యాటింగ్ చేస్తున్న ఆటగాడు స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపించేలా చక్కటి సహకారం అందిస్తాడు. తను సరికొత్తగా కనిపిస్తున్నాడు. నాణ్యమైన బౌలర్ఇక వరుణ్ టోర్నీ ఆరంభంలో ఆడలేదు. అయితే, న్యూజిలాండ్‌తో లీగ్ మ్యాచ్‌లో ఐదు వికెట్లతో మెరిసిన తర్వాత అతడి సేవలను పూర్తిగా వినియోగించుకోవాలని మేము నిర్ణయించుకున్నాం. అతడొక నాణ్యమైన బౌలర్. ట్రోఫీ గెలవడంలో ప్రతి ఒక్క సభ్యుడు తమ వంతు పాత్ర పోషించారు’’ అని జట్టు ప్రదర్శన పట్ల రోహిత్ శర్మ సంతృప్తి వ్యక్తం చేశాడు. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. డారిల్ మిచెల్(63), మైకేల్ బ్రాస్‌వెల్(53 నాటౌట్) అర్ధ శతకాలతో రాణించారు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది.భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. షమీ, రవీంద్ర జడేజా ఒక్కో వికెట్ తీశారు.ఇక లక్ష్య ఛేదనలో భారత్‌కు ఓపెనర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్(31) శుభారంభం అందించారు. విరాట్ కోహ్లి(1) విఫలం కాగా.. శ్రేయస్ అయ్యర్(48)తో కలిసి రోహిత్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. 76 పరుగుల వద్ద రోహిత్ స్టంపౌట్ కాగా.. అక్షర్ పటేల్(29), కేఎల్ రాహుల్(33 బంతుల్లో 34 నాటౌట్), హార్దిక్ పాండ్యా(18 బంతుల్లో 18), రవీంద్ర జడేజా(6 బంతుల్లో 9) వేగంగా ఆడి మరో ఓవర్ మిగిలి ఉండగానే జట్టును విజయతీరాలకు చేర్చారు. రోహిత్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. -
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేత భారత్.. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో న్యూజిలాండ్‌పై విజయం
పాకిస్తాన్, దుబాయ్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఎడిషన్‌లో టీమిండియా విజేతగా నిలిచింది. దుబాయ్ వేదికగా ఇవాళ (మార్చి 9) జరిగిన ఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. భారత స్పిన్నర్లు చెలరేగిన వేల డారిల్ మిచెల్ (63), మైఖేల్ బ్రేస్‌వెల్ (53 నాటౌట్) అద్భుతమైన అర్ద సెంచరీలు సాధించి న్యూజిలాండ్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. ఆదిలో రచిన్ రవీంద్ర (37), ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ (34) మంచి ఇన్నింగ్స్‌లు ఆడారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో విల్ యంగ్ (15), కేన్ విలియమ్సన్ (11), టామ్ లాథమ్ (14),మిచెల్ సాంట్నర్ (8) తక్కువ స్కోర్లకు ఔటయ్యారు. భారత్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో 2.. షమీ, జడేజా చెరో వికెట్ పడగొట్టారు. భారత బౌలర్లలో షమీ, హార్దిక్ ధారాళంగా పరుగులు సమర్పించుకోగా.. కుల్దీప్, వరుణ్, జడ్డూ, అక్షర్ పొదుపుగా బౌలింగ్ చేశారు. ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి న్యూజిలాండ్ బ్యాటర్లు భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేశారు.అనంతరం స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఛేదనలో రోహిత్ (76) భారత్‌కు శుభారంభాన్ని అందించారు. శుభ్‌మన్ గిల్‌తో (31) కలిసి తొలి వికెట్‌కు 105 పరుగులు జోడించాడు. అయితే భారత్ 17 పరుగుల వ్యవధిలో గిల్, కోహ్లి (1), రోహిత్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో శ్రేయస్ అయ్యర్ (48), అక్షర్ పటేల్ (29) మంచి భాగస్వామ్యం నెలకొల్పి భారత్‌ను తిరిగి గేమ్‌లోకి తెచ్చారు. అయితే శ్రేయస్, అక్షర్ కూడా స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో టీమిండియా మరోసారి ఒత్తిడిలో పడింది. ఇన్నింగ్స్ మధ్యలో పరుగులు చేసేందుకు భారత బ్యాటర్లు తెగ ఇబ్బంది పడ్డారు. న్యూజిలాండ్ స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియా బ్యాటర్లపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు.ఈ దశలో కేఎల్ రాహుల్ (34 నాటౌట్).. హార్దిక్ పాండ్యా (18), రవీంద్ర జడేజాతో (18 నాటౌట్) కలిసి మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యాలు నెలకొల్పి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. జడేజా బౌండరీ బాది భారత్‌ను గెలిపించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో సాంట్నర్, బ్రేస్‌వెల్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. జేమీసన్, రచిన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడం భారత్‌కు ఇది మూడోసారి (2002, 2013, 2025). ఫైనల్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించగా.. టోర్నీ ఆధ్యాంతం రాణించిన రచిన్ రవీంద్రకు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు లభించింది. -
CT 2025 Final: గ్లెన్ ఫిలిప్స్ కళ్లు చెదిరే క్యాచ్.. క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమం
క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమమైన క్యాచ్ నమోదైంది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో గ్లెన్ ఫిలిప్స్ ఈ క్యాచ్‌ను అందుకున్నాడు. మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్ ఆడిన షాట్‌ను (కవర్స్ దిశగా) ఫిలిప్స్ అమాంతం గాల్లోకి ఎగిరి పట్టేసుకున్నాడు. ఈ క్యాచ్‌ను ఫిలిప్స్ సైతం నమ్మలేకపోయాడు. క్యాచ్ పట్టిన తర్వాత కింద కూర్చుని క్యాచ్ పట్టానా అన్నట్లు ఎక్స్ప్రెషన్ పెట్టాడు. What a magnificent catch by GLENN PHILLIPS 🤯👏👏👏#INDvsNZ #ChampionsTrophyFinal pic.twitter.com/1CxjG3QYiw— INNOCENT EVIL ⁶𓅓 (@raju_innocentev) March 9, 2025ఈ క్యాచ్‌ను చూసి గిల్ నోరెళ్లపెట్టాడు. ఈ క్యాచ్ తర్వాత దుబాయ్ స్టేడియంలో నిశ్శబ్దం ఆవహించింది. అప్పటిదాకా భారత్‌కు సపోర్ట్ చేసిన ప్రేక్షకులు ఫిలిప్స్ క్యాచ్ చూసి షాక్‌లో ఉండిపోయారు. అస్సలు సాధ్యంకాని క్యాచ్‌ను పట్టడంతో అభిమానులు ఫిలిప్స్‌కు జేజేలు పలుకుతున్నారు. ఈ క్యాచ్‌ను సంబంధించిన వీడియో సోషల్‌మీడియాను షేక్ చేస్తుంది. ఫిలిప్స్ మనిషా లేక పక్షా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఫిలిప్స్ ఇదే టోర్నీలో విరాట్ కోహ్లి క్యాచ్‌ను (గ్రూప్ దశ మ్యాచ్‌లో) కూడా ఇలాగే నమ్మశక్యంకాని రీతిలో పట్టుకున్నాడు. ఆ క్యాచ్‌ను ఇది తలదన్నేలా ఉంది. క్యాచెస్ విన్ మ్యాచెస్ అన్న నానుడుని ఫిలిప్స్ నిజం చేస్తాడేమో చూడాలి.ఫిలిప్స్ పట్టుకున్న క్యాచ్ ఆషామాషీ వ్యక్తిది కాదు. గిల్ మ్యాచ్ ఫలితాన్ని డిసైడ్ చేసే సత్తా ఉన్న ఆటగాడు. అదీ కాక భారత్ అప్పటిదాకా బాగా స్కోర్ చేసి విజయం దిశగా దూసుకుపోతుండుంది. ఫిలిప్స్ క్యాచ్‌తో భారత్ డిఫెన్స్‌లో పడింది. పుండుపై కారం చల్లినట్లు గిల్ (31) ఔటైన పరుగు వ్యవధిలోనే భారత్ అత్యంత కీలకమైన విరాట్ కోహ్లి (1) వికెట్ కూడా కోల్పోయింది. మరో 17 పరుగుల తర్వాత క్రీజ్‌లో కుదురుకుపోయిన రోహిత్ శర్మ (76) కూడా ఔటయ్యాడు. దీంతో భారత్ ఒక్కసారిగా కష్టాల్లో కూరుకుపోయినట్లైంది. శ్రేయస్ అయ్యర్ (35), అక్షర్ పటేల్ (13) భారత ఇన్నింగ్స్‌ను చక్కద్దిద్దే ప్రయత్నం చేస్తున్నారు. 35 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 161/3గా ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే 90 బంతుల్లో 91 పరుగులు చేయాలి. చేతిలో మరో 7 వికెట్లు ఉన్నాయి.అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై డారిల్ మిచెల్ (63), మైఖేల్ బ్రేస్‌వెల్ (53 నాటౌట్) అద్భుతమైన అర్ద సెంచరీలు చేసి న్యూజిలాండ్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో విల్ యంగ్ 15, రచిన్ రవీంద్ర 37, కేన్ విలియమ్సన్ 11, టామ్ లాథమ్ 14, గ్లెన్ ఫిలిప్స్ 34, మిచెల్ సాంట్నర్ 8 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో రెండు.. షమీ, జడేజా చెరో వికెట్ పడగొట్టారు. భారత బౌలర్లలో షమీ, హార్దిక్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేసినా న్యూజిలాండ్ మంచి స్కోర్ చేసింది. -
CT 2025 Final: తొలి హాఫ్ సెంచరీ చేసిన రోహిత్ శర్మ
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్స్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసి భారత్ ముందు ఫైటింగ్ టార్గెట్‌ను (252) ఉంచింది. స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై డారిల్ మిచెల్ (63), మైఖేల్ బ్రేస్‌వెల్ (53 నాటౌట్) అద్భుతమైన అర్ద సెంచరీలతో రాణించారు. ఫలితంగా న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది.న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో విల్ యంగ్ 15, రచిన్ రవీంద్ర 37, కేన్ విలియమ్సన్ 11, టామ్ లాథమ్ 14, గ్లెన్ ఫిలిప్స్ 34, మిచెల్ సాంట్నర్ 8 పరుగులు చేశారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో రెండు.. షమీ, జడేజా చెరో వికెట్ పడగొట్టారు. భారత బౌలర్లలో షమీ, హార్దిక్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేసినా న్యూజిలాండ్ మంచి స్కోర్ చేయగలిగింది.అనంతరం 252 పరుగుల లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్ రోహిత్ శర్మ ధాటిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. రోహిత్ కేవలం 41 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐసీసీ టోర్నీల ఫైనల్స్‌లో రోహిత్ శర్మకు ఇది తొలి హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఈ టోర్నీ ప్రస్తుత ఎడిషన్‌లోనూ రోహిత్‌కు ఇదే తొలి హాఫ్ సెంచరీ.18 ఓవర్ల అనంతరం భారత్ స్కోర్ 103/0గా ఉంది. రోహిత్‌తో (62 బంతుల్లో 69; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) పాటు శుభ్‌మన్ గిల్ (46 బంతుల్లో 29; సిక్స్) క్రీజ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే మరో 32 ఓవర్లలో 149 పరుగులు చేయాలి.ఐసీసీ టోర్నీల ఫైనల్స్‌లో రోహిత్ శర్మ స్కోర్లు.. 69*(62), 2025 CT 9(5), 2024 T20 WC47(31), 2023 ODI WC43(60), 2023 WTC15(26), 2023 WTC30(81), 2021 WTC34(68), 2021 WTC0(3), 2017 CT29(26), 2014 T20 WC9(14), 2013 CT30*(16), 2007 T20 WC -
CT 2025 Final: రవీంద్ర జడేజా రిటైర్మెంట్..?
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ తర్వాత టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని సోషల్‌మీడియా కోడై కూస్తుంది. ఫైనల్ మ్యాచ్‌లో జడ్డూ తన కోటా 10 ఓవర్లు పూర్తి చేసిన తర్వాత విరాట్ కోహ్లి అతన్ని భావోద్వేగంతో హగ్ చేసుకోవడంతో ఈ ప్రచారం మొదలైంది. విరాట్.. ఆసీస్‌తో జరిగిన సెమీఫైనల్ తర్వాత స్టీవ్ స్మిత్‌ను కూడా ఇలాగే హగ్ చేసుకున్నాడు. ఆ మ్యాచ్ అనంతరం స్టీవ్ స్మిత్ వన్డేలకు గుడ్ బై చెప్పాడు. దీంతో ఫైనల్ మ్యాచ్ తర్వాత జడేజా కూడా రిటైర్ అవుతాడని సోషల్‌మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తుంది.Kohli hugged Smith - Retirement Kohli hugged jadeja - Retirement??#Indvsnz #Indvsnzfinal pic.twitter.com/DtKFESNFii— भाई साहब (@Bhai_saheb) March 9, 2025కాగా, న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఫైనల్లో జడేజా ఎక్కువ వికెట్లు తీయకపోయినా చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో జడ్డూ కీలకమైన టామ్ లాథమ్ వికెట్ తీసి తన కోటా 10 ఓవర్లలో కేవలం 30 పరుగులు మాత్రమే ఇచ్చాడు. జడేజా మిడిల్ ఓవర్లలో చాలా పొదుపుగా బౌలింగ్ చేసి న్యూజిలాండ్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఈ టోర్నీలో జడేజా మొదటి మ్యాచ్ నుంచి ఇలాంటి ప్రదర్శనలతోనే ఆకట్టుకున్నాడు. ఈ టోర్నీలో జడేజా 5 మ్యాచ్‌ల్లో 4.36 ఎకానమీతో 5 వికెట్లు తీశాడు. జడేజా గతేడాది టీ20 వరల్డ్‌కప్ తర్వాత టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ టోర్నీలో భారత్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. 2024 టీ20 వరల్డ్‌కప్ తర్వాత జడేజాతో పాటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కూడా పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఒకవేళ జడేజా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత నిజంగానే వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించినా టెస్ట్‌ల్లో కొనసాగే అవకాశం ఉంది.మ్యాచ్ విషయానికొస్తే.. న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఫైనల్లో భారత స్పిన్నర్లు చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో జడేజా సహా భారత స్పిన్నర్లంతా చెలరేగినా న్యూజిలాండ్ బ్యాటర్లు మంచి స్కోర్‌నే చేశారు. స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై డారిల్ మిచెల్ (63), మైఖేల్ బ్రేస్‌వెల్ (53 నాటౌట్) అద్భుతమైన అర్ద సెంచరీలు చేసి న్యూజిలాండ్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో విల్ యంగ్ 15, రచిన్ రవీంద్ర 37, కేన్ విలియమ్సన్ 11, టామ్ లాథమ్ 14, గ్లెన్ ఫిలిప్స్ 34, మిచెల్ సాంట్నర్ 8 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో రెండు.. షమీ, జడేజా చెరో వికెట్ పడగొట్టారు. భారత బౌలర్లలో షమీ, హార్దిక్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.252 పరుగుల ఛేదనలో భారత్‌కు రోహిత్ శర్మ మెరుపు ఆరంభాన్ని అందించాడు. రోహిత్ 35 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేసి అజేయంగా ఉన్నాడు. మరో ఎండ్‌లో శుభ్‌మన్ గిల్ 13 బంతుల్లో 7 పరుగులు చేసి రోహిత్‌కు ఎక్కువగా స్ట్రయిక్ ఇస్తున్నాడు. 8 ఓవర్ల తర్వాత ఇండియా స్కోర్ 59/0గా ఉంది. -
CT 2025 Final: సత్తా చాటిన టీమిండియా స్పిన్నర్లు.. అయినా టఫ్ టార్గెట్‌ను సెట్ చేసిన న్యూజిలాండ్
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ పోటీపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ (63), మైఖేల్ బ్రేస్‌వెల్ (53 నాటౌట్) అర్ద సెంచరీలు చేసి న్యూజిలాండ్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో విల్ యంగ్ 15, రచిన్ రవీంద్ర 37, కేన్ విలియమ్సన్ 11, టామ్ లాథమ్ 14, గ్లెన్ ఫిలిప్స్ 34, మిచెల్ సాంట్నర్ 8 పరుగులు చేశారు.భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో రెండు.. షమీ, జడేజా చెరో వికెట్ పడగొట్టారు. భారత బౌలర్లలో షమీ, హార్దిక్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేసినా న్యూజిలాండ్ మంచి స్కోర్ చేయగలిగింది. డారిల్ మిచెల్, మైఖేల్ బ్రేస్‌వెల్ అత్యంత కీలకమైన ఇన్నింగ్స్‌లు ఆడి భారత్‌కు టఫ్ టార్గెట్ నిర్దేశించారు. స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా తమ కోటా 10 ఓవర్లు పూర్తి చేసి పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు కీలకమైన వికెట్లు తీశారు. అయితే ఇన్నింగ్స్ చివర్లో అక్షర్ పటేల్ కోటా ఓవర్లు ఇంకా మిగిలి ఉన్నా (2 ఓవర్లు) కెప్టెన్ రోహిత్ ఎందుకో అతనితో బౌలింగ్ చేయించలేదు. చివరి 3 ఓవర్లలో షమీ 2, హార్దిక్ ఓ ఓవర్ వేశారు. ఈ 3 ఓవర్లలో న్యూజిలాండ్ 35 పరుగులు పిండుకుంది. న్యూజిలాండ్ 235 పరుగులు చేస్తే కష్టమనుకున్న తరుణంలో షమీ, హార్దిక్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. చివరి ఓవర్లలో షమీ, హార్దిక్ ఇచ్చిన పరుగులు టీమిండియా ఫేట్‌ను మార్చే ప్రమాదముంది.ఈ పిచ్‌పై 252 పరుగులు ఛేదించడం అంత ఆషామాషీ విషయం కాదు. పిచ్‌పై మంచి టర్న్ లభిస్తుంది. న్యూజిలాండ్ వద్ద సాంట్నర్, బ్రేస్‌వెల్ లాంటి నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ తమ స్పిన్ బౌలింగ్‌తో మాయాజాలం చేయగలరు. మొత్తంగా భారత బ్యాటర్లు న్యూజిలాండ్ బౌలర్ల నుంచి కఠినమైన సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఛేదనలో ఓపెనర్ రోహిత్ కనీసం 20 ఓవర్ల పాటు క్రీజ్‌లో ఉండటం చాలా కీలకం. రోహిత్ తన సహజ శైలిలో వేగంగా పరుగులు సాధించే క్రమంలో వికెట్ కోల్పోతే టీమిండియా మూల్యం చెల్లించుకోక తప్పదు. భారత్‌కు ఓపెనింగ్ భాగస్వామ్యం చాలా కీలకం. భారత్ పవర్ ప్లేలో ఎట్టి పరిస్థితుల్లో వికెట్లు కోల్పోకూడదు. ఒకవేళ టీమిండియా పవర్ ప్లేలో వికెట్లు కోల్పోతే మిడిలార్డర్‌పై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై సాంట్నర్, బ్రేస్‌వెల్ లాంటి బౌలర్లను తట్టుకుని నిలబడటం ఆషామాషీ విషయం కాదు. -
CT 2025 Final: నాలుగు క్యాచ్‌లు జారవిడిచిన టీమిండియా ఫీల్డర్లు.. మూల్యం తప్పదా..?
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో ఇవాళ (మార్చి 9) భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. భారత స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తుండటంతో న్యూజిలాండ్ 196 పరుగులకు (44 ఓవర్లలో) సగం వికెట్లు కోల్పోయింది. డారిల్ మిచెల్ (51), మైఖేల్ బ్రేస్‌వెల్ (21) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర జడేజా ఓ వికెట్ దక్కించుకున్నాడు. వరుణ్, కుల్దీప్ న్యూజిలాండ్ ఆటగాళ్లు భాగస్వామ్యాలు నెలకొల్పుతున్న సమయంలో వికెట్లు తీసి భారత్‌ను తిరిగి ఆటలోకి తెచ్చారు. భారత్‌కు తొలి ఫలితం వరుణ్ చక్రవర్తి అందించాడు. ఇన్నింగ్స్ 8వ ఓవర్ చివరి బంతికి వరుణ్ విల్ యంగ్‌ను (15) ఎల్బీడబ్ల్యూ చేశాడు. అనంతరం కుల్దీప్ తన మొదటి బంతికే ఇన్ ఫామ్ బ్యాటర్ రచిన్ రవీంద్రను (37) క్లీన్ బౌల్డ్ చేశాడు. కొద్ది సేపటికే కుల్దీప్ మరో అద్భుత బంతితో స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్‌ను (11) క్యాచ్ అండ్ బౌల్డ్ చేశాడు. మిచెల్, లాథమ్ క్రీజ్‌లో కుదురుకుంటుండగా.. జడేజా లాథమ్‌ను (14) వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. మిచెల్‌తో కలిసి 50 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పి ప్రమాదకరంగా కనిపిస్తున్న ఫిలిప్స్‌ను (34) వరుణ్ చక్రవర్తి మరో అద్బుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు.ఇంతవరకు బాగానే ఉన్నా, ఈ మ్యాచ్‌లో భారత ఫీల్డర్ల ప్రదర్శన చాలా దారుణంగా ఉండింది. 40 ఓవర్లలోపే భారత ఫీల్డర్లు నాలుగు క్యాచ్‌లు డ్రాప్ చేశారు. తొలుత రచిన్ రవీంద్ర అందించిన రెండు క్యాచ్‌లను శ్రేయస్ అయ్యర్, మహ్మద్ షమీ నేలపాలు చేశారు. అయితే అదృష్టవశాత్తు రచిన్ ఔట్ కావడంతో భారత ఆటగాళ్లు ఊపిరిపీల్చుకున్నారు. తర్వాత భారత ఫీల్డర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ మరో రెండు క్యాచ్‌లు జారవిడిచారు. డారిల్ మిచెల్ క్యాచ్‌ను రోహిత్.. ఫిలిప్స్ క్యాచ్‌ను గిల్ వదిలేశారు. ప్రమాదకరంగా కనిపిస్తున్న ఫిలిప్స్ ఔటయ్యాడు కానీ మరో డేంజర్ బ్యాటర్ డారిల్ మిచెల్ ఇంకా క్రీజ్‌లోనే ఉన్నాడు. మిచెల్ డ్రాప్ క్యాచ్‌కు టీమిండియా మూల్యం చెల్లించకుంటుందేమో వేచి చూడాలి. -
ఐపీఎల్-2025 ప్రారంభానికి ముందు గుజరాత్ టైటాన్స్ కీలక నిర్ణయం
ఐపీఎల్-2025 సీజన్ ప్రారంభానికి ముందు గుజరాత్ టైటాన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ జట్టు యాజమాన్యం మాజీ ఆటగాడు, మాజీ ఆస్ట్రేలియా వికెట్‌కీపర్ మాథ్యూ వేడ్‌కు అసిస్టెంట్ కోచ్‌గా నియమించుకుంది. వేడ్ 2022, 2024 సీజన్లలో గుజరాత్ టైటాన్స్‌లో సభ్యుడిగా ఉన్నాడు. వేడ్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయినప్పటికీ ప్రైవేట్ లీగ్‌ల్లో పాల్గొంటున్నాడు. We love this Saturday Surprise, Wadey! 😁Welcome back as our 𝐀𝐬𝐬𝐢𝐬𝐭𝐚𝐧𝐭 𝐂𝐨𝐚𝐜𝐡. Matthew Wade | #AavaDe | #TATAIPL2025 pic.twitter.com/kIbV73qxL9— Gujarat Titans (@gujarat_titans) March 8, 2025వేడ్ ఐపీఎల్ 2025 మెగా వేలంలో పాల్గొనలేదు. వేడ్ ఆటగాడిగా కాకుండా కోచింగ్ రోల్లో గుజరాత్‌తో జతకట్టడం విశేషం. వేడ్‌ను అసిస్టెంట్ కోచ్‌గా నియమించిన విషయాన్ని గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం సోషల్‌మీడియా వేదికగా ప్రకటించింది. ఐపీఎల్లో వేడ్ మొత్తంగా 15 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 12 గుజరాత్ తరఫున ఆడాడు. 2022 సీజన్లో గుజరాత్ టైటిల్ గెలిచిన జట్టులో వేడ్ కీలక సభ్యుడిగా ఉన్నాడు. వేడ్ తదుపరి ఐపీఎల్ సీజన్లో హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా, బ్యాటింగ్ కోచ్ పార్థివ్ పటేల్, అసిస్టెంట్ కోచ్‌లు ఆశిష్ కపూర్, నరేందర్ నేగిలతో కలిసి పని చేస్తాడు. 37 ఏళ్ల వేడ్ ఇటీవలే హోబర్ట్ హరికేన్స్ తరఫున బిగ్‌బాష్ లీగ్ గెలిచాడు. ఆటగాడిగా ఉంటూనే వేడ్ కోచింగ్ అవకాశాల కోసం వెతుకుతున్నాడు. విండీస్ దిగ్గజం కీరన్ పోలార్డ్ కూడా ఇలాగే (ఆటగాడిగా కొనసాగుతూనే) కోచింగ్ డిపార్ట్మెంట్లో సెట్ అయ్యాడు. పోలార్డ్ కూడా గతంలో తాను ప్రాతినిథ్యం వహించిన ఫ్రాంచైజీలోనే (ముంబై ఇండియన్స్) కోచ్‌గా స్థిరపడ్డాడు. గుజరాత్ టైటాన్స్ 2025 సీజన్ నుంచి కొత్త యాజమాన్యం అండర్లో మ్యాచ్‌లు ఆడనుంది. 2025 సీజన్‌ను గుజరాత్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌తో ప్రారంభించనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా మార్చి 25న జరుగనుంది. ఈ సీజన్లోనూ గుజరాత్ శుభ్‌మన్ గిల్ సారథ్యంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. గుజరాత్ గత సీజన్‌ను ఎనిమిదో స్థానంతో ముగించింది. 2024 సీజన్లో గుజరాత్ 14 మ్యాచ్‌లు ఆడి కేవలం ఐదింట మాత్రమే విజయాలు సాధించింది.2025 ఐపీఎల్ సీజన్లో గుజరాత్ టైటాన్స్ జట్టు..శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవాతియా, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, మహిపాల్ లోమ్రార్, షారుక్ ఖాన్, నిషాంత్ సింధు, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, కరీమ్ జనత్, వాషింగ్టన్ సుందర్, జయంత్ యాదవ్, రవిశ్రీనివాసన్ సాయికిషోర్, కుమార్ కుషాగ్రా, జోస్ బట్లర్, అనూజ్ రావత్, గెరాల్డ్ కొయెట్జీ, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, ఇషాంత్ శర్మ, కగిస రబాడ, ప్రసిద్ద్ కృష్ణ, కుల్వంత్ కేజ్రోలియా, మహ్మద్ సిరాజ్ -
వారెవ్వా కుల్దీప్.. దెబ్బకు రవీంద్ర ఫ్యూజ్‌లు ఔట్! వీడియో వైరల్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరగుతున్న ఫైనల్లో కుల్దీప్ యాదవ్ తన స్పిన్ మయాజాలాన్ని ప్రదర్శిస్తున్నాడు. కుల్దీప్ బౌలింగ్ ఎటాక్‌లోకి వచ్చిన తొలి బంతికే భారత్‌కు వికెట్ అందించాడు. అప్పటివరకు దూకుడుగా ఆడుతున్న కివీ స్టార్ ఓపెనర్ రచిన్ రవీంద్రను కుల్దీప్ అద్బుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. కుల్దీప్ వేసిన బంతికి రచిన్ వద్ద సమాధానమే లేకుండా పోయింది.న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 11వ ఓవర్ వేసిన కుల్దీప్ తొలి బంతిని రవీంద్రకు గూగ్లీగా సంధించాడు. ఆ డెలివరీని రచిన్ బ్యాక్‌ఫుట్‌పై నుంచి ఆఫ్‌సైడ్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి మాత్రం బ్యాట్‌కు మిస్స్ అయ్యి ప్యాడ్‌కు తాకుతూ స్టంప్స్‌ను గిరాటేసింది. దీంతో రవీంద్ర ఒక్కసారిగా బిత్తరపోయాడు. ఈ వికెట్‌తో టీమిండియా సంబరాల్లో మునిగిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. రవీంద్ర 29 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 37 పరుగులు చేశాడు. కాగా కుల్దీప్ తన తరవాతి ఓవర్లో కేన్ విలియమ్సన్‌ను కూడా బోల్తా కొట్టించాడు. విలియమ్సన్.. కుల్దీప్కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 20 ఓవర్లు ముగిసే సరికి కివీస్.. 3 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది.ఫైనల్ మ్యాచ్‌కు తుది జట్లున్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): విల్ యంగ్, రాచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), కైల్ జామిసన్, విలియం ఓరూర్కే, నాథన్ స్మిత్భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిచదవండి: Champions Trophy Final: రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డు.. ప్రపంచంలోనేDC Blood Kuldeep Yadav got 2 wickets.KL Rahul and Kuldeep Yadav duo will gonna cook all thye ipl teams pic.twitter.com/EzuPwtBuVN— KL'sGIRL (@Silverglohss_1) March 9, 2025 -
రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డు.. ప్రపంచంలోనే?
అంతర్జాతీయ వన్డేల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వన్డేల్లో వరుసగా అత్యధిక సార్లు టాస్ ఓడిన కెప్టెన్‌గా వెస్టిండీస్ మాజీ కెప్టెన్ బ్రియాన్ లారా రికార్డును సమం చేశాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో భారత్-న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా రోహిత్ ఈ ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.రోహిత్ ఇప్పటివరకు వన్డేల్లో వరుసగా 12 సార్లు టాస్ ఓడిపోయాడు. బ్రియాన్ లారా కూడా వరుసగా 12 సార్లు టాస్ ఓడిపోయాడు. ఇక ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ ఫైనల్ మ్యాచ్‌కు కివీస్ స్టార్ పేసర్ మాట్ హెన్రీ గాయం కారణంగా దూరమయ్యాడు.ఆజేయంగా భారత్..ఇక ఈ టోర్నీలో టీమిండియా ఆజేయంగా ఫైనల్‌కు చేరింది. లీగ్ స్టేజిలో మూడుకు మూడు మ్యాచ్‌లు గెలిచిన భారత్.. సెమీస్‌లో ఆస్ట్రేలియాపై అద్బుతమైన విజయం సాధించింది. ఫైనల్లో కూడా కివీస్‌ను ఓడించి మూడో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకోవాలని భారత్ భావిస్తోంది. అయితే ఐసీసీ టోర్నీల్లో ఇప్పటివరకు ఫైనల్లో ఒక్కసారి కివీస్‌పై భారత్ గెలవలేదు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2000, వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమి చవిచూసింది.వన్డేల్లో వరుసగా అత్యధిక సార్లు టాస్ ఓడిపోయిన కెప్టెన్లు👉బ్రియన్ లారా- వెస్టిండీస్ మాజీ సారథి- అక్టోబరు 1998- మే 1999 వరకు- 12 సార్లు 👉రోహిత్ శర్మ- ఇండియా కెప్టెన్- నవంబరు 2023- మార్చి 2025*-12 సార్లు 👉పీటర్ బారెన్- నెదర్లాండ్స్ మాజీ కెప్టెన్- మార్చి 2011 నుంచి ఆగష్టు 2013-11 సార్లుఫైనల్ మ్యాచ్‌కు తుది జట్లున్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): విల్ యంగ్, రాచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), కైల్ జామిసన్, విలియం ఓరూర్కే, నాథన్ స్మిత్భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిచదవండి: Champions Trophy: ఫైనల్‌కు ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్.. -
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేత భారత్.. ఫైనల్లో న్యూజిలాండ్‌పై విజయం
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేత భారత్.. ఫైనల్లో న్యూజిలాండ్‌పై విజయం2025 ఎడిషన్ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా టీమిండియా అవతరించింది. దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (మార్చి 9) జరిగిన ఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడం ఇది మూడోసారి.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేయగా.. భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో డారిల్ మిచెల్ (63), మైఖేల్ బ్రేస్‌వెల్ (53 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించగా.. విల్ యంగ్ 15, రచిన్ రవీంద్ర 37, కేన్ విలియమ్సన్ 11, టామ్ లాథమ్ 14, గ్లెన్ ఫిలిప్స్ 34, మిచెల్ సాంట్నర్ 8 పరుగులు చేశారు. భారత్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో 2.. షమీ, జడేజా చెరో వికెట్ పడగొట్టారు.ఛేదనలో భారత్‌కు రోహిత్ శర్మ (76) శుభారంభం అందించారు. రోహిత్.. శుభ్‌మన్ గిల్‌తో (31) కలిసి తొలి వికెట్‌కు 105 పరుగులు జోడించారు. అయితే భారత్ 17 పరుగుల వ్యవధిలో గిల్, కోహ్లి (1), రోహిత్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో శ్రేయస్ అయ్యర్ (48), అక్షర్ పటేల్ (29) మంచి భాగస్వామ్యం నెలకొల్పి భారత్‌ను తిరిగి గేమ్‌లోకి తెచ్చారు. చివర్లో కేఎల్ రాహుల్ (34 నాటౌట్).. హార్దిక్ పాండ్యా (18), రవీంద్ర జడేజాతో (18 నాటౌట్) కలిసి భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. న్యూజిలాండ్ బౌలర్లలో సాంట్నర్, బ్రేస్‌వెల్ తలో 2.. జేమీసన్, రచిన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఐదో వికెట్ కోల్పోయిన భారత్.. అక్షర్ ఔట్203 పరుగుల వద్ద భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. బ్రేస్‌వెల్ బౌలింగ్‌లో రూర్కీకి క్యాచ్ ఇచ్చి అక్షర్ పటేల్ (29) ఔటయ్యాడు. 44 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 212/5గా ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే 36 బంతుల్లో 40 పరుగులు చేయాలి. నాలుగో వికెట్ కోల్పోయిన భారత్.. శ్రేయస్ ఔట్183 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. వేగంగా పరుగులు రాబట్టే క్రయంలో శ్రేయస్ అయ్యర్ (48) ఔటయ్యాడు. సాంట్నర్ బౌలింగ్‌లో రచిన్ క్యాచ్ పట్టడంతో శ్రేయస్ పెవిలియన్ బాటపట్టాడు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే 68 బంతుల్లో 69 పరుగులు చేయాలి. 38.4 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 183/4గా ఉంది.జాగ్రత్తగా ఆడుతున్న శ్రేయస్, అక్షర్252 పరుగుల ఛేదనలో స్వల్ప వ్యవధిలో గిల్, విరాట్, రోహిత్ శర్మ వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండిన భారత్‌ను శ్రేయస్ అయ్యర్ (47), అక్షర్ పటేల్ (17) ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీరిద్దరు జాగ్రత్తగా ఆడుతూ భారత్‌ను విజయతీరాలవైపు తీసుకెళ్తున్నారు. 37 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 176/3గా ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే 78 బంతుల్లో 76 పరుగులు చేయాలి. మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా.. రోహిత్ శర్మ ఔట్252 పరుగుల ఛేదనలో టీమిండియాకు మంచి ఆరంభం లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయింది. తొలి వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యం అనంతరం భారత్ 17 పరుగుల వ్యవధిలో మూడు కీలకమైన వికెట్లు కోల్పోయింది. 105 పరుగుల వద్ద పరుగు వ్యవధిలో గిల్, కోహ్లి వికెట్లు కోల్పోయిన భారత్.. 122 పరుగుల వద్ద రోహిత్ శర్మ (76) వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. అప్పటిదాకా చాలా జాగ్రత్తగా ఆడిన రోహిత్.. పరుగులు అస్సలు రాకపోవడంతో ఒత్తిడికి లోనై భారీ షాట్‌కు ప్రయత్నించాడు. రచిన్ రవీంద్ర బౌలింగ్‌లో క్రీజ్ దాటి చాలా ముందుకు వచ్చిన రోహిత్ బంతి కనెక్ట్ కాకపోవడంతో స్టంపౌటయ్యాడు. పరుగు వ్యవధిలో గిల్, కోహ్లి వికెట్లు కోల్పోయిన టీమిండియాపరుగు వ్యవధిలో టీమిండియా రెండు కీలకమైన వికెట్లు కోల్పోయింది. 105 పరుగుల వద్ద గిల్, 106 పరుగుల వద్ద కోహ్లి ఔటయ్యారు. అప్పటిదాకా గెలుపుపై ధీమా ఉన్న టీమిండియా ఒక్కసారిగా ఇద్దరు స్టార్ల వికెట్లు కోల్పోవడంతో డిఫెన్స్‌లో పడింది. గిల్‌ను సాంట్నర్.. కోహ్లిని బ్రేస్‌వెల్ ఔట్ చేశారు. గ్లెన్ ఫిలిప్స్ నమ్మశక్యంకాని రీతిలో క్యాచ్ పట్టడంతో గిల్ పెవిలియన్ బాట పట్టగా.. కోహ్లిని బ్రేస్‌వెల్ వికెట్ల ముందు దొరికించుకున్నాడు. 17 ఓవర్లలో 100 పరుగులు పూర్తి చేసిన టీమిండియా252 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 17 ఓవర్లలో 100 పరుగులు పూర్తి చేసుకుంది. భారత్ వికెట్ నష్టపోకుండా ఈ మార్కును తాకింది. రోహిత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని 68 పరుగులతో, గిల్ 27 పరుగులతో అజేయంగా ఉన్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే మరో 152 పరుగులు చేయాలి. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ 252 పరుగుల లక్ష్య ఛేదనలో రోహిత్ శర్మ ధాటిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. 41 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 11 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 65/0గా ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే మరో 187 పరుగులు చేయాలి.టార్గెట్ 252.. ధాటిగా ఆడుతున్న రోహిత్ శర్మ252 పరుగుల ఛేదనలో భారత్‌కు రోహిత్ శర్మ మెరుపు ఆరంభాన్ని అందించాడు. రోహిత్ 35 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేసి అజేయంగా ఉన్నాడు. మరో ఎండ్‌లో శుభ్‌మన్ గిల్ 13 బంతుల్లో 7 పరుగులు చేసి రోహిత్‌కు ఎక్కువగా స్ట్రయిక్ ఇస్తున్నాడు. 8 ఓవర్ల తర్వాత ఇండియా స్కోర్ 59/0గా ఉంది. మిచెల్, బ్రేస్‌వెల్ హాఫ్ సెంచరీలు.. టీమిండియా టార్గెట్ 252ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసి టీమిండియా ముందు 252 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కివీస్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ (63), మైఖేల్ బ్రేస్‌వెల్ (53 నాటౌట్) అర్ద సెంచరీలు చేసి టీమిండియాకు ఫైటింగ్ టార్గెట్‌ను నిర్దేశించారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో రెండు.. షమీ, జడేజా చెరో వికెట్ పడగొట్టారు. భారత బౌలర్లలో షమీ, హార్దిక్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. విరాట్ కోహ్లి సూపర్ త్రో.. సాంట్నర్ రనౌట్విరాట్ కోహ్లి సూపర్ త్రోతో మిచెల్ సాంట్నర్‌ను (8) రనౌట్ చేశాడు. 239 పరుగుల వద్ద న్యూజిలాండ్ ఏడో వికెట్ కోల్పోయింది.ఆరో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్45.4వ ఓవర్: 211 పరుగుల వద్ద న్యూజిలాండ్ ఆరో వికెట్ కోల్పోయింది. షమీ బౌలింగ్‌లో రోహిత్ శర్మ క్యాచ్ పట్టడంతో డారిల్ మిచెల్ (63) ఔటయ్యాడు. ఔట్ కాకముందు మిచెల్ షమీ బౌలింగ్‌లో రెండు బౌండరీలు కొట్టాడు.డేంజరెస్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ ఔట్37.5వ ఓవర్: డేంజరెస్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ ఔటయ్యాడు. వరుణ్ చక్రవర్తి ఫిలిప్స్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. 38 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 165/5గా ఉంది. డారిల్ మిచెల్‌కు (44) జతగా బ్రేస్‌వెల్ క్రీజ్‌లోకి వచ్చాడు. నిలకడగా ఆడుతున్న మిచెల్, ఫిలిప్స్లాథమ్ వికెట్ పడ్డ తర్వాత న్యూజిలాండ్ మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడుతుంది. డారిల్ మిచెల్ (41), గ్లెన్ ఫిలిప్స్ (28) నిలకడగా ఆడుతున్నారు. 36 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 156/4గా ఉంది. కివీస్ నాలుగో వికెట్ డౌన్..టామ్ లాథమ్ రూపంలో న్యూజిలాండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన లాథమ్ జడేజా బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి గ్లెన్ ఫిలిప్స్ వచ్చాడు. 26 ఓవర్లకు న్యూజిలాండ్ స్కోర్: 116/4నిలకడగా ఆడుతున్న మిచెల్, లాథమ్..22 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ 3 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. మిచెల్(18), టామ్ లాథమ్(14) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.విలియమ్సన్ ఔట్..కేన్ విలియమ్సన్ రూపంలో న్యూజిలాండ్ మూడో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన విలియమ్సన్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో విలియమ్సన్ రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులోకి టామ్ లాథమ్ వచ్చాడు. 15 ఓవర్లకు న్యూజిలాండ్ స్కోర్: 82-3కివీస్ స్పిన్ మ్యాజిక్.. రవీంద్ర క్లీన్ బౌల్డ్రచిన్ రవీంద్ర రూపంలో న్యూజిలాండ్ రెండో వికెట్ కోల్పోయింది. 37 పరుగులు చేసిన రవీంద్ర.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి డార్లీ మిచెల్ వచ్చాడు. 11 ఓవర్లకు భారత్ స్కోర్: 73/3వరుణ్ మ్యాజిక్.. కివీస్ తొలి వికెట్ డౌన్న్యూజిలాండ్ తొలి వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన విల్ యంగ్.. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. క్రీజులోకి కేన్ విలియమ్సన్ వచ్చాడు. 8 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ వికెట్ నష్టానికి 58 పరుగులు చేసింది. రవీంద్ర 34 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు.దూకుడుగా ఆడుతున్న రచిన్..టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ దూకుడుగా ఆడుతోంది. 4 ఓవర్లు ముగిసే సరికి కివీస్ వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. క్రీజులో రచిన్ రవీంద్ర(16), విల్ యంగ్(8) ఉన్నారు.ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్-న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్‌కు తెరలేచింది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరగుతున్న ఈ టైటిల్ పోరులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు కివీస్ స్టార్ పేసర్ మాట్ హెన్రీ దూరమయ్యాడు. అతడి స్ధానంలో నాథన్ స్మిత్ తుది జట్టులోకి వచ్చాడు. భారత్ మాత్రం ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది.తుది జట్లున్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): విల్ యంగ్, రాచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), కైల్ జామిసన్, విలియం ఓరూర్కే, నాథన్ స్మిత్భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిమరి కాసేపటిలో టాస్..ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్-న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్‌కు సర్వం సిద్దమైంది. మరికాసేపట్లో టాస్ పడనుంది. ఇరు జట్లకు టాస్ కీలకంగా మారనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచేందుకు ఇరు జట్లు తమ ఆస్తశాస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. 25 ఏళ్ల తర్వాత ఐసీసీ వన్డే టోర్నీ ఫైనల్లో ఇరు జట్లు తలపడుతున్నాయి.హెడ్ టు హెడ్ రికార్డ్..ఇప్పటివరకు భారత్-న్యూజిలాండ్ జట్లు ముఖాముఖి 119 వన్డేల్లో తలపడ్డాయి. ఇందులో భారత్ 61 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. న్యూజిలాండ్ 50 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. మరో 7 మ్యాచ్‌ల్లో ఫలితం తేలకపోగా.. ఓ మ్యాచ్ టై అయింది. -
ఫైనల్‌కు ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్..
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో దుబాయ్ వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్లు తలపడేందుకు సిద్దమైంది. ఈ ఫైనల్ పోరుకు ముందు కివీస్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలే సూచనలు కన్పిస్తున్నాయి. ఆ జట్టు స్టార్ పేసర్ మాట్ హెన్రీ గాయం కారణంగా ఫైనల్ మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశముంది.హెన్రీ ప్రస్తుతం భుజం గాయంతో బాధపడుతున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన సెమీస్‌లో గాయపడ్డ ఈ కివీ స్పీడ్ స్టార్ ఇంకా కోలుకోపోయినట్లు తెలుస్తోంది. అతడు భుజం నొప్పి కారణంగా అతడు ఎక్కువగా ప్రాక్టీస్‌లో కూడా పాల్గోకపోయినట్లు సమాచారం.నెట్ ప్రాక్టీస్‌లో హెన్రీ కేవలం ఏడు బంతులు మాత్రమే సంధించినట్లు రేవ్‌స్పోర్ట్స్ జర్నలిస్ట్ రోహిత్ జుగ్లాన్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. హెన్రీ అందుబాటుపై ఇప్పటివరకు న్యూజిలాండ్ జట్టు మెనెజ్‌మెంట్ ఎటువంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుత పరిస్థితుల బట్టి అతడు మ్యాచ్‌లో ఆడే సూచనలు కన్పించడం లేదు.ఒకవేళ హెన్రీ ఫైనల్‌కు దూరమైతే కివీస్‌కు గట్టి ఎదురుదెబ్బే అనే చెప్పాలి. అతడు ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. భారత్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో హెన్రీ 5 వికెట్లతో సత్తాచాటాడు. ముఖ్యంగా భారత్‌పై మంచి రికార్డు అతడికి ఉంది. భారత్‌పై 11 మ్యాచ్‌లు ఆడిన ఈ కివీ స్పీడ్ స్టార్.. 4.48 ఎకానమీతో 21 వికెట్లు పడగొట్టాడు. హెన్రీ మ్యాచ్‌కు దూరమైతే అతడి స్ధానంలో జాకబ్ డఫీ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, పాండ్యా, జడేజా, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, కుల్దీప్, వరుణ్. న్యూజిలాండ్: సాంట్నర్ (కెప్టెన్), యంగ్, రచిన్, విలియమ్సన్, మిచెల్, లాథమ్, ఫిలిప్స్, బ్రేస్‌వెల్, జేమీసన్, రూర్కే, హెన్రీ/ డఫీ.చదవండి: IML 2025: యువరాజ్, రాయుడు విధ్వంసం..సెమీస్‌కు చేరిన టీమిండియా -
WPL 2025: ప్లే ఆఫ్స్ బెర్త్‌లు ఖారారు.. ఇంటిముఖం పట్టిన ఆర్సీబీ
మహిళల ప్రీమియర్ లీగ్-2025లో ప్లే ఆఫ్స్ బెర్త్‌లు ఖారారు అయ్యాయి. ఈ మెగా ఈవెంట్లో ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్లు ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టాయి. పాయింట్ల పట్టికలో ఆఖరి రెండు స్ధానాల్లో నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియర్స్ ఇంటిముఖం పట్టాయి.కాగా శనివారం యూపీతో తప్పకగెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ 12 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో మరోమ్యాచ్ మిగులూండగానే టోర్నీ నుంచి మంథాన సేన నిష్క్రమించింది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిచి ఉండింటే తమ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండేవి.డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన ఆర్సీబీ ఈ ఏడాది సీజన్లో దారుణ ప్రదర్శన కనబరిచింది. ప్రస్తుత సీజన్లో 7 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ.. ఐదింట ఓటమిపాలైంది. ముఖ్యంగా ఈ ఏడాది ఎడిషన్‌లో ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంథాన దారుణ ప్రదర్శన కనబరిచింది. 7 మ్యాచ్‌లు ఆడి ఆమె కేవలం 144 పరుగులు మాత్రమే సాధించింది.ఇక పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో ఉన్న జట్టు నేరుగా ఫైనల్‌కు ఆర్హత సాధిస్తోంది. ఆ తర్వాత రెండు మూడు స్ధానాల్లో ఉన్న జట్లు ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడాల్సి ఉంటుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ 10 పాయింట్లతో టాప్ ప్లేస్‌లో ఉంది.ఢిల్లీ జట్టు తమ లీగ్ మ్యాచ్‌లన్నీ ఆడేసింది. ఆ తర్వాత స్ధానాల్లో గుజరాత్ జెయింట్స్(8 పాయింట్లు), ముంబై ఇండియన్స్(8) ఉన్నాయి. గుజరాత్‌కు కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉండగా.. ముంబై ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.ముంబై తమ ఆఖరి రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే పాయింట్స్ టేబుల్లో అగ్రస్ధానానికి చేరుకునే ఛాన్స్ ఉంది. ముంబై తమ చివరి రెండు లీగ్ మ్యాచ్‌లు వరుసగా మార్చి 10న గుజరాత్ జెయింట్స్, మార్చి 11న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడనుంది. మార్చి 13న ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుండగా.. మార్చి 15న ముంబై వేదికగా తుదిపోరు జరగనుంది.చదవండి: IML 2025: యువరాజ్, రాయుడు విధ్వంసం..సెమీస్‌కు చేరిన టీమిండియా -
న్యూజిలాండ్‌తో ఫైనల్.. రోహిత్ మరో కప్‌ను అందిస్తాడా?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్‌కు సర్వం సిద్దమైంది. దుబాయ్ వేదికగా మరికొన్ని గంటల్లో భారత్- న్యూజిలాండ్ మధ్య తుది పోరుకు తెరలేవనుంది. 25 ఏళ్ల తర్వాత.. ఐసీసీ వన్డే టోర్నీ టైటిల్ ఫైట్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి. ఆఖరిగా తలపడిన ఛాంపియన్స్ ట్రోఫీ-2000 ఫైనల్లో భారత్‌ను 4 వికెట్ల తేడాతో కివీస్ ఓడించింది. దీంతో నేడు జరగనున్న ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఎలాగైనా ఓడించి తమ 25 ఏళ్ల పగకు ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ కసితో ఉంది. మరోవైపు కివీస్ జట్టు సైతం గతంలో తరహాలోనే మరోసారి ట్రోఫీని ఎగరేసుకుపోవాలనే పట్టుదలతో ఉంది. ఇరు జట్లు సమవుజ్జీలగా ఉండడంతో ఈ టైటిల్ పోరు అభిమానులను ఆఖరివరకు మునివేళ్లపై నిలబెట్టడం ఖాయం.రోహిత్ మరో కప్‌ను అందిస్తాడా?కాగా భారత కెప్టెన్ గా రోహిత్ శర్మ జట్టును నాలుగు ఐసీసీ ఈవెంట్లలోనూ ఫైనల్ చేర్చాడు. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్-2023, వన్డే వరల్డ్ కప్-2023, టీ20 వరల్డ్ కప్, ఇప్పుడు చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఆఖరి పోరుకు అర్హత సాధించింది. డబ్ల్యూటీసీ, వన్డే ప్రపంచకప్‌లో ఆఖరి మెట్టుపై బోల్తా పడిన భారత జట్టు.. మరుసటి ఏడాది జరిగిన పొట్టి ప్రపంచకప్‌లో మాత్రం టీమిండియా అద్బుతం చేసింది.టీ20 వరల్డ్‌కప్-2024 విశ్వవిజేతగా టీమిండియా నిలిచింది. ఇప్పుడు ధోని తర్వాత రెండు ఐసీసీ టైటిల్స్ సాధించిన భారత సారథిగా నిలిచేందుకు అతను అడుగు దూరంలో ఉన్నాడు. దీనిని అతను అందుకుంటాడా అనేది నేడు జరిగే ఫైనల్ పోరులో తేలుతుంది. 2013లో చాంపియన్స్ ట్రోఫీలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ తన బ్యాటింగ్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. రోహిత్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడా?కాగా ఛాంపియన్స్ ట్రోఫీ విజయం సాధిస్తే వన్డేల నుంచి రోహిత్ శర్మ తప్పకోనున్నాడని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే బీసీసీఐతో హిట్‌మ్యాన్ మాట్లాడాడని, ఫైనల్ మ్యాచ్ తర్వాత తన నిర్ణయాన్ని వెల్లడించనున్నాడని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ కీలక మ్యాచ్‌కు ముందు జరిగిన విలేకరుల సమావేశానికి కూడా రోహిత్ గైర్హజారీ అయ్యాడు. రిటైర్మెంట్కు సంబంధించిన ప్రశ్నలను నివారించేందుకే ప్రెస్ కాన్ఫరెన్స్‌కు హిట్‌మ్యాన్ హాజరు కాలేదని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే గిల్ మాత్రం డ్రెసింగ్ రూమ్‌లో ఏ ఆటగాడి రిటైర్మెంట్ గురించి చర్చ జరగడం స్పష్టం చేశాడు. రోహిత్ వన్డేల్లో కొనసాగుతాడా లేదా రిటైర్మెంట్ ప్రకటిస్తాడో? ఆదివారం తేలిపోనుంది.చదవండి: Champions Trophy final: 'వరుణ్ కాదు.. అతడితోనే న్యూజిలాండ్‌కు ముప్పు' -
యువరాజ్, రాయుడు విధ్వంసం..సెమీస్‌కు చేరిన టీమిండియా
అంతర్జాతీయ మాస్టర్స్ లీగ్ టీ20-2025 టోర్నీలో ఇండియన్ మాస్టర్స్ టీమ్ మరో విజయాన్ని అందుకుంది. ఈ టోర్నీలో భాగంగా శనివారం రాయ్‌పూర్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. ఈ విజయంతో టీమిండియా తమ సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత మాస్టర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో సౌరబ్ తివారీ(37 బంతుల్లో 7 ఫోర్లు,2 సిక్స్‌లతో 60), అంబటి రాయుడు(35 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 63) హాఫ్ సెంచరీలతో మెరవగా.. ఆఖరిలో కెప్టెన్ యువరాజ్ సింగ్ విధ్వంసం సృష్టించాడు.విండీస్ బౌలర్లను యువీ ఉతికారేశాడు. కేవలం 20 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 49 పరుగులు చేసి ఆజేయగా నిలిచాడు. వీరితో పాటు గుర్క్రీత్ సింగ్ మానన్(21 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 46) తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. వెస్టిండీస్ బౌలర్లలో బెన, కార్టర్, టేలర్ తలా వికెట్ సాధించారు.అనంతరం భారీ లక్ష్య చేధనలో విండీస్ ఆఖరి వరకు పోరాడింది. 253 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కరేబియన్లు.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసింది. వెస్టిండీస్ బ్యాటర్లలో డ్వైన్ స్మిత్(34 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో 79), విలియమ్ పెర్కిన్స్(52) హాఫ్ సెంచరీలు సాధించాడు.లెండల్ సిమిన్స్( 13 బంతుల్లో 1 ఫోరు, 5 సిక్స్‌లతో 38) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కానీ ఆఖరిలో వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో వెస్టిండీస్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. భారత బౌలర్లలో స్టువర్ట్ బిన్నీ మూడు వికెట్లు పడగొట్టగా.. పవన్ నేగి రెండు, ఇర్ఫాన్ పఠాన్ ఒక్క వికెట్ సాధించారు.చదవండి: Champions Trophy final: 'అతడు 20 ఓవర్లు ఆడితే ఛాంపియన్స్ ట్రోఫీ భారత్‌దే' -
కేకేఆర్ అసిస్టెంట్ కోచ్‌గా వెస్టిండీస్ దిగ్గజం..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంఛైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఓటిస్ గిబ్సన్‌ను సహాయక కోచ్‌గా ఎంపిక చేసుకుంది. ఈ నెల 22 నుంచి ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభం కానుండగా... వెస్టిండీస్ మాజీ పేసర్ గిబ్సన్ కేకేఆర్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు.ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 650కి పైగా వికెట్లు పడగొట్టిన 55 ఏళ్ల గిబ్సన్... 1995 నుంచి 99 మధ్య వెస్టిండీస్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అనంతరం కోచింగ్ వైపు మళ్లిన గిబ్సన్... ఇంగ్లండ్ జాతీయ జట్టుకు రెండు పర్యాయాలు బౌలింగ్ కోచ్‌గా పనిచేశాడు.2010–14 మధ్య వెస్టిండీస్ హెడ్ కోచ్‌గా, 2017–19 మధ్య దక్షిణాఫ్రికా ప్రధాన కోచ్‌గా వ్యవహరించిన గిబ్సన్ అనుభవం తమ జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుందని డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ భావిస్తోంది. ప్రస్తుతం కోల్‌కతా జట్టుకు చంద్రకాంత్ పండిత్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తుండగా... బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్, స్పిన్ బౌలింగ్ కోచ్‌గా కార్ల్ క్రో పనిచేస్తున్నారు. గంభీర్ అనంతరం వెస్టిండీస్ మాజీ ఆటగాడు డ్వేన్ బ్రేవో కేకేఆర్ మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. -
'అతడు 20 ఓవర్లు ఆడితే ఛాంపియన్స్ ట్రోఫీ భారత్‌దే'
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో రసవత్తర పోరుకు సమయం అసన్నమైంది. దుబాయ్ వేదికగా ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో భారత్-న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తెల్చుకునేందుకు సిద్దమయ్యాయి. 12 ఏళ్ల విరామం తర్వాత తిరిగి ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకోవాలని టీమిండియా ఊవ్విళ్లరూతోంది.ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు ఆజేయంగా నిలిచిన భారత జట్టు.. అదే జోరును ఫైనల్లో కూడా కొనసాగించాలని తహతహలాడుతోంది. మరోవైపు కివీస్ మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీ-2000 ఫైనల్ ఫలితాన్ని పునరావృతం చేయాలని వ్యూహాలు రచించింది. సరిగ్గా 25 ఏళ్ల క్రితం జరిగిన ఈ మెగా టోర్నీ ఫైనల్లో భారత్‌ను న్యూజిలాండ్ ఓడించింది.ఆ తర్వాత వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్-2021 ఫైనల్లో కూడా టీమిండియా పరాజయం పాలైంది. ఈ రెండు ఓటములకు బదులు తీర్చుకోవడానికి భారత్‌కు ఇదే సరైన అవకాశం. ఇక టైటిల్ పోరు నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలను వెల్లడించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 20 ఓవర్లు పాటు బ్యాటింగ్ చేస్తే భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంటుందని చోప్రా జోస్యం చెప్పాడు. అదేవిధంగా హిట్‌మ్యాన్ కెప్టెన్సీపై కూడా ప్రశంసల వర్షం కురిపించాడు."రోహిత్ శర్మ అద్బుతమైన కెప్టెన్. మైదానంలో వ్యూహాలు రచించడంలో రోహిత్ దిట్ట. గత మూడు ఐసీసీ వైట్‌బాల్ టోర్నీల్లో అతడి కెప్టెన్సీలో భారత్ కేవలం ఒకే ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. ఈ ఫైనల్ పోరులో భారత్ విజయం సాధిస్తే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల ఖాతాలో నాలుగు ఐసీసీ ట్రోఫీలు చేరుతాయి.ఈ ఫీట్ సాధించిన తొలి భారత క్రికెటర్లగా వారిద్దరూ నిలుస్తారు. రోహిత్ శర్మ ఎల్లప్పుడూ దూకుడుగానే ఆడుతాడు. పవర్‌ప్లేలో పరుగులు రాబట్టేందుకు ప్రయత్నిస్తాడు. అయితే ఈ మ్యాచ్‌లో కాస్త ఎక్కువ సేపు అతడు ఆడితే బాగుంటుంది. రోహిత్ 20 ఓవర్లు ఆడితే భారత్‌దే ఛాంపియన్స్ ట్రోఫీ అని"చోప్రా తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.కాగా రోహిత్ శర్మ ఈ మెగా టోర్నీలో పర్వాలేదన్పిస్తున్నాడు. క్రీజులో ఉన్నంత సేపు పరుగులు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. అయితే తన లభించిన ఆరంభాలను భారీ ఇన్నింగ్స్‌లగా రోహిత్ మలచలేకపోతున్నాడు.తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, పాండ్యా, జడేజా, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, కుల్దీప్, వరుణ్. న్యూజిలాండ్: సాంట్నర్ (కెప్టెన్), యంగ్, రచిన్, విలియమ్సన్, మిచెల్, లాథమ్, ఫిలిప్స్, బ్రేస్‌వెల్, జేమీసన్, రూర్కే, హెన్రీ/ డఫీ.చదవండి: Champions Trophy final: 'వరుణ్ కాదు.. అతడితోనే న్యూజిలాండ్‌కు ముప్పు' -
'వరుణ్ కాదు.. అతడితోనే న్యూజిలాండ్‌కు ముప్పు'
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ పోరుకు మరి కొన్ని గంటల్లో తెరలేవనుంది. దుబాయ్ వేదికగా జరగనున్న ఈ ఫైనల్ మ్యాచ్‌లో భారత్-న్యూజిలాండ్ జట్లు తాడోపేడో తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి 25 ఏళ్ల పగకు ప్రతీకారం తీర్చుకోవాలని భారత జట్టు భావిస్తుంటే.. న్యూజిలాండ్ మాత్రం మరోసారి టీమిండియాను మట్టికర్పించాలని పట్టుదలతో ఉంది.ఇప్పటివరకు భారత్-కివీస్ రెండు సార్లు ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్లో తలపడ్డాయి. ఛాంపియన్స్ ట్రోఫీ-2000, వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్-2021 ఫైనల్లో కివీస్ చేతిలో టీమిండియా ఓటమి చవిచూసింది. ఇక ఈ టైటిల్ పోరు కోసం ఇరు జట్లు తమ ఆస్త్రశాస్రాలను సిద్దం చేసుకున్నాయి.మరోసారి స్పిన్నర్లు కీలక పాత్ర పోషించే అవకాశముంది. ఈ క్రమంలో ఇరు జట్ల ఆటగాళ్లు కూడా స్పిన్నర్లను నెట్స్‌లో ఎక్కువగా ఎదుర్కొన్నారు. న్యూజిలాండ్ అయితే ప్రత్యేకంగా శశ్వత్ తివారీ అనే ఓ స్పిన్నర్‌ను నెట్‌బౌలర్‌గా ఎంపిక చేసి మరి ప్రాక్టీస్ చేసింది.వరుణ్ కాదు.. అతడితోనే ముప్పు?అయితే న్యూజిలాండ్ టీమ్ ఆందోళన చెందుతుంది మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కోసం కాదంట. రవీంద్ర జడేజా వంటి ఎడమచేతి వాటం స్పిన్నర్‌ను సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి వారు సిద్దమవుతున్నారంట. ఈ విషయాన్ని స్వయంగా కివీస్ నెట్‌బౌలర్‌గా ఉన్న శశ్వత్ తివారీ వెల్లడించాడు."ఈ రోజు న్యూజిలాండ్ జట్టుకు నెట్స్‌లో చాలా సమయం పాటు బౌలింగ్ చేశాను. వారు రవీంద్ర జడేజాను ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్దమవుతున్నారు. జడేజా బౌలింగ్‌లో వేరియేషన్స్ ఉంటాయి. అతడు చాలా వేగంతో బంతిని స్పిన్ చేస్తాడు. ఆ స్పీడ్‌ను అలవాటు చేసుకునేందుకు నన్ను 18 యార్డ్స్ నుంచి బౌలింగ్ చేయమన్నారు.నేను వారి చెప్పినట్లగానే ఆ పాయింట్ నుంచి బౌలింగ్ చేశారు. కొద్దిసేపు వారు ప్రాక్టీస్ చేశారు. కానీ బంతి చాలా త్వరగా డెలివరీ అవుతుండడంతో 22 గజాల నుంచే తిరిగి బౌలింగ్ చేయమని చెప్పారు. వారు ముఖ్యంగా ఎడమచేతి వాటం బౌలర్లపై ఎక్కువగా దృష్టిపెట్టారు. ప్రాక్టీస్‌లో స్పిన్‌ను ఎదుర్కొవడంలో వారు ఎక్కడా ఇబ్బంది పడలేదు.కానీ భారత జట్టులో టాప్-క్లాస్ స్పిన్నర్లు ఉన్నారు. కాబట్టి భారత స్పిన్నర్ల నుంచి మరోసారి వారికి కఠిన సవాలు ఎదురు కానుంది" అని శశ్వత్ తివారీ ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా కివీస్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో చక్రవర్తి 5 వికెట్లతో సత్తాచాటాడు. దీంతో అతడి నుంచి మరోసారి కివీస్‌కు ముప్పు పొంచి ఉందని అంతా భావిస్తున్నారు.చదవండి: చాంపియన్ నువ్వా.. నేనా -
వోల్ కమాల్... బెంగళూరు ఢమాల్
లక్నో: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) చరిత్రకెక్కిన పరుగుల పోరులో డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు పోరాడి ఓడింది. డబ్ల్యూపీఎల్ ప్లే ఆఫ్స్‌కు దూరమైంది. గెలిస్తే రేసులో నిలవాల్సిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) 12 పరుగుల తేడాతో యూపీ వారియర్స్ చేతిలో పరాజయం చవిచూసింది. తాజా ఫలితంతో ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి. ఢిల్లీ ఇదివరకే ప్లేఆఫ్స్ చేరింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన వారియర్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోరు చేసింది. డబ్ల్యూపీఎల్‌లో ఇదే అత్యధిక స్కోరు కాగా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జార్జియా వోల్ (56 బంతుల్లో 99 నాటౌట్; 17 ఫోర్లు, 1 సిక్స్) ఆకాశమే హద్దుగా చెలరేగింది. కిరణ్ నవ్‌గిరే (16 బంతుల్లో 46; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) ధనాధన్ ఆట ఆడేసింది. ఆర్సీబీ బౌలర్లలో జార్జియా వేర్హమ్ 2 వికెట్లు తీసింది. అనంతరం కష్టమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ 19.3 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌటైంది. రిచా ఘోష్ (33 బంతుల్లో 69; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), స్నేహ్ రాణా (6 బంతుల్లో 26; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపులతో యూపీ శిబిరాన్ని వణికించారు. సోఫీ ఎకిల్‌స్టోన్, దీప్తిశర్మ చెరో 3 వికెట్లు తీశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భంగా యూపీ ప్లేయర్ తమ రెగ్యులర్ టీమ్ కిట్‌కు బదులుగా గులాబీ రంగు జెర్సీలను ధరించారు. జార్జియా ‘జిగేల్’ సొంత మైదానంలో ఆఖరి పోరులో బ్యాటింగ్‌కు దిగిన యూపీ ఓపెనర్లు గ్రేస్ హారిస్, జార్జియా వోల్ బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడ్డారు. బంతిని అదేపనిగా బౌండరీని దాటించడంతో స్కోరు రాకెట్ వేగంతో దూసుకుపోయింది. పవర్‌ప్లేలో 67 పరుగులు రాబట్టింది. గ్రేస్ హారిస్ (22 బంతుల్లో 39; 7 ఫోర్లు, 1 సిక్స్) రనౌట్ కావడంతో తొలి వికెట్‌కు 77 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అయితే కిరణ్ నవ్‌గిరే రావడంతో మరో మెరుపు భాగస్వామ్యం నమోదైంది. 9.3 ఓవర్లలోనే వారియర్స్ స్కోరు వందకు చేరుకుంది. 13వ ఓవర్లో కిరణ్ అవుట్ కావడంతో రెండో వికెట్‌కు 71 పరుగుల భాగస్వామ్యానికి తెరపడగా... మరోవైపు జార్జియా వోల్ కడదాకా అజేయంగా క్రీజులో నిలిచింది. పరుగు తేడాతో సెంచరీ భాగ్యాన్ని దక్కించుకోలేక పోయింది. ఆఖరి బంతికి రెండో పరుగు తీసే క్రమంలో దీప్తి రనౌటైంది. రిచా ధనాధన్ షో వృథా మూడో ఓవర్లో కెప్టెన్ స్మృతి మంధాన (4), మరుసటి ఓవర్లో మేఘన (12 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), పవర్ ప్లే తర్వాత ఎలిస్ పెర్రీ (15 బంతుల్లో 28; 6 ఫోర్లు), రాఘ్వి బిస్త్ (14), కనిక (8) ని్రష్కమించడంతో 107/5 స్కోరు వద్ద బెంగళూరు ఆశలు ఆడుగంటాయి. ఈ దశలో హిట్టర్ రిచా ఘోష్ అసాధారణ పోరాటం చేసింది. భారీ సిక్స్‌లు, చూడచక్కని బౌండరీలతో విజయంపై ఆశలు రేపింది. 25 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తిచేసుకుంది. 22 బంతుల్లో 55 పరుగులు చేయాల్సిన దశలో రిచా అవుటైంది. చార్లీ డీన్ (9), జార్జియా వేర్హామ్ (17) నిరాశపరిచారు. 4, 6, 6, 4, 6, అవుట్ 19వ ఓవర్లో స్నేహ్ రాణా మెరుపులు బెంగళూరులో ఆశలు రేపాయి. దీప్తి వేసిన ఈ ఓవర్లో కిమ్‌గార్త్ సింగిల్ తీసి స్నేహ్కు స్ట్రయిక్ ఇచ్చింది. తర్వాతి ఐదు బంతుల్లో ఆమె 4, 6, 6, 4(నోబాల్), 6లతో చకచకా 26 పరుగులు చేసింది. 7 బంతుల్లో 15 పరుగుల సమీకరణం సులువనిపించింది. కానీ ఆఖరి బంతికి స్నేహ్ రాణా భారీ షాట్‌కు ప్రయత్నించి బౌండరీ వద్ద పూనమ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో యూపీ ఊపరి పీల్చుకుంది. స్కోరు వివరాలు యూపీ వారియర్స్ ఇన్నింగ్స్: గ్రేస్ హారిస్ రనౌట్ 39; జార్జియా వోల్ నాటౌట్ 99; కిరణ్ (సి) పెర్రి (బి) వేర్హామ్ 46; చినెల్లీ హెన్రీ (సి) స్మృతి (బి) వేర్హామ్ 19; సోఫీ (బి) చార్లీడీన్ 13; దీప్తిశర్మ రనౌట్ 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 225. వికెట్ల పతనం: 1–77, 2–148, 3–191, 4–223, 5–225. బౌలింగ్: కిమ్ గార్త్ 4–0–42–0, రేణుక సింగ్ 3–0–42–0, చార్లీ డీన్ 4–0–47–1, ఎలీస్ పెర్రి 4–0–35–0, జార్జియా వేర్హామ్ 4–0–43–2, స్నేహ్ రాణా 1–0–13–0. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: మేఘన (సి) వోల్ (బి) సోఫీ 27; స్మృతి మంధాన (సి) వోల్ (బి) హెన్రీ 4; ఎలిస్ పెర్రి (బి) అంజలి 28; రాఘ్వి బిస్త్ (సి) ఉమాఛెత్రి (బి) హెన్రీ 14; రిచా ఘోష్ (సి) హెన్రీ (బి) దీప్తిశర్మ 69; కనిక (బి) దీప్తి శర్మ 8; జార్జియా వేర్హమ్ (సి) సబ్–ఆరుశ్రీ (బి) సోఫీ 17; చార్లీ డీన్ (సి) కిరణ్ (బి) సోఫీ 9; కిమ్‌గార్త్ నాటౌట్ 3; స్నేహ్ రాణా (సి) పూనమ్ (బి) దీప్తిశర్మ 26; రేణుక రనౌట్ 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (19.3 ఓవర్లలో ఆలౌట్) 213. వికెట్ల పతనం: 1–29, 2–43, 3–76, 4–80, 5–107, 6–171, 7–182, 8–183, 9–211, 10–213. బౌలింగ్: చినెల్లీ హెన్రీ 4–0–39–2, గ్రేస్ హారిస్ 1–0–22–0, సోఫి ఎకిల్‌స్టోన్ 4–0–25–3, క్రాంతి గౌడ్ 3–0–35–0, అంజలి శర్వాణి 3–0–40–1, దీప్తిశర్మ 4–0–50–3, జార్జియా వోల్ 0.3–0–2–0. -
క్లాసికల్ అంటేనే ఇష్టం
న్యూఢిల్లీ: చదరంగంలో ఎన్ని ఫార్మాట్లు వచ్చినా... క్లాసికల్‌కు ఉన్న ప్రాధాన్యత వేరని ప్రపంచ చెస్ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ అన్నాడు. ఇటీవలి కాలంలో అన్నీ ఫార్మాట్లలో సత్తా చాటుతున్న గుకేశ్... తనకు స్వతహాగా సంప్రదాయ క్లాసికల్ గేమ్ అంటేనే ఎక్కువ ఇష్టమని వెల్లడించాడు. ‘ఏ ఫార్మాట్లో ఆడాలి అనే దాని గురించి పెద్దగా ఆలోచించను. ఫ్రీ స్టయిల్ ఉత్తేజకరమైన ఫార్మాట్... ఆడేటప్పుడు ఎంతో బాగుంటుంది. ఇప్పటి వరకు ఫ్రీస్టయిల్ విభాగంలో రెండు టోర్నీలు మాత్రమే జరిగాయి. ఇప్పుడే దానిపై వ్యాఖ్యానించడం తొందరపాటు అవుతుంది. ఫ్రీస్టయిల్ ఫార్మాట్ మరింత ఆదరణ పొందాలని కోరుకుంటున్నా. అదే సమయంలో క్లాసికల్ విభాగానికి ఉన్న ప్రాధాన్యత వేరు. ఘన చరిత్ర ఉన్న క్లాసికల్ విభాగంలో ప్రపంచ చాంపియన్‌షిప్ అన్నిటి కంటే అత్యున్నతమైంది. క్లాసికల్, ర్యాపిడ్, బ్లిట్జ్కు ఫ్రీస్టయిల్ అదనం. నేను అన్నింట్లో ఆడాలని అనుకుంటున్నా’ అని గుకేశ్ శనివారం ఓ కాన్క్లేవ్లో అన్నాడు. వచ్చే నెల 7–14 వరకు జరగనున్న పారిస్ అంచె ఫ్రీస్టయిల్ చెస్ గ్రాండ్‌స్లామ్ టూర్లో పాల్గొననున్నట్లు గుకేశ్ వెల్లడించాడు. ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్సన్తో పాటు 12 మంది గ్రాండ్‌మాస్టర్లు పాల్గొంటున్న ఈ చెస్ గ్రాండ్‌స్లామ్ తొలి అంచె జర్మనీ పోటీల్లో విన్సెంట్ కెయిమెర్ విజేతగా నిలిచాడు. కెరీర్ తొలి నాళ్లలో ఎదుర్కొన్న ఆరి్థక కష్టాలను గుకేశ్ కాన్ క్లేవ్లో గుర్తుచేసుకున్నాడు. టోర్నమెంట్లలో పాల్గొనేందుకు డబ్బులు లేని సమయంలో తల్లిదండ్రుల స్నేహితులు అండగా నిలిచారని అన్నాడు. ‘ఒకప్పుడు పోటీలకు వెళ్లేందుకు తగినంత డబ్బు లేకపోయేది. కుటుంబ సభ్యులు ఎంతో ప్రయతి్నంచి నిధులు సమకూర్చేవారు. నిస్వార్ధపరమైన కొందరి సాయం వల్లే ఈ స్థాయికి వచ్చా. ఇప్పుడు ఆరి్థక ఇబ్బందులు తొలగిపోయాయి’ అని గుకేశ్ అన్నాడు. కొవిడ్–19 ప్రభావం తర్వాత దేశంలో చెస్‌కు మరింత ఆదరణ పెరిగిందని గుకేశ్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ప్రపంచ అత్యుత్తమ 100 మంది చెస్ ప్లేయర్లలో భారత్ నుంచి 13 మంది ఉన్నారని అది చదరంగంలో మన ప్రగతికి చిహ్నమని గుకేశ్ అన్నాడు. వీరందరికీ దారి చూపింది విశ్వనాథన్ ఆనంద్ అని... ఆయన బాటలోనే మరింత మంది గ్రాండ్‌మాస్టర్లు వచ్చారని పేర్కొన్నాడు. దేశంలో చెస్‌కు మంచి ఆదరణ లభిస్తోందని... స్పాన్సర్లతో పాటు ప్రభుత్వాలు కూడా అండగా నిలుస్తున్నాయని గుకేశ్ వివరించాడు. -
అరవింద్... కొత్త చాంపియన్
న్యూఢిల్లీ: భారత చదరంగంలో నేటితరం సంచలన విజేతలతో పోల్చుకుంటే అరవింద్ చిదంబరం ఆలస్యంగా వికసించిన చాంపియన్. ఇప్పటికే టీనేజ్లోనే దొమ్మరాజు గుకేశ్, ఆర్.ప్రజ్ఞానంద, అర్జున్ ఇరిగేశి అంతర్జాతీయ చెస్ టోర్నీలు, ఎలో రేటింగ్స్‌లో సత్తా చాటుకున్నారు. కానీ 64 గడుల బరిలో అరవింద్ 25 ఏళ్ల వయసులో వార్తల్లోకెక్కాడు. ప్రాగ్ మాస్టర్స్ టోర్నీలో విజేతగా నిలువడం ద్వారా భారత్‌లో కొత్త చదరంగ చక్రవర్తిగా అవతరించాడు. వయసు రీత్యా అతను లేటే కావొచ్చు... కానీ లేటెస్ట్ చాంపియన్‌గా భారత క్రీడాఖ్యాతిని పెంచాడు. గుకేశ్, ప్రజ్ఞానంద, అర్జున్‌లతో కలిసి ఇప్పుడు నాలుగో స్తంభమయ్యాడు. విజేతగా మలచిన తల్లి మధురైలో పుట్టిన అరవింద్ పసిప్రాయంలోనే తండ్రిని కోల్పోయాడు. మూడేళ్ల వయసులోనే కన్నతండ్రి లోకాన్ని వీడితే... కన్నతల్లే అన్నీ తానై పెంచింది. జీవితబీమా (ఎల్ఐసీ) ఏజెంట్‌గా పనిచేస్తూ మదురై నుంచి చెన్నైకి మారి బతుకుబండిని లాగించింది. ఏడేళ్ల వయసులో తాత చెస్‌లో ఓనమాలు నేర్పితే అందులోనే కెరీర్‌ను ఎంచుకున్నాడు. విఖ్యాత వేలమ్మాళ్ స్కూల్లో విద్యనభ్యసించిన అరవింద్ చదువుకునే రోజుల్లో ఇప్పటి ప్రపంచ చాంపియన్ గుకేశ్‌కు సీనియర్. గుకేశ్ కూడా వేలమ్మాళ్ విద్యార్థే! ప్రాగ్ మాస్టర్స్లాంటి మేటి టోర్నీల్లో సాధారణంగా టాప్–20 ర్యాంకింగ్ ప్లేయర్లకు పాల్గొనే అవకాశముంటుంది. అంతకుమించి ర్యాంకుల్లో ఉంటే నిర్వాహకుల నుంచి వైల్డ్కార్డ్లాంటి ఎంట్రీలు ఉండాల్సిందే. అలా వచ్చిన అవకాశాన్ని అరవింద్ చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. 2013లో తొలి జీఎమ్ నార్మ్ భారత విఖ్యాత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ 2013లో మాగ్నస్ కార్ల్‌సన్‌కు ప్రపంచ చెస్ చాంపియన్ కిరీటాన్ని కోల్పోయిన ఏడాదే పాఠశాల విద్యనభ్యసిస్తున్న అరవింద్ తొలి గ్రాండ్‌మాస్టర్ (జీఎమ్) నార్మ్ పొందాడు. అక్కడి నుంచి అతని ఆట మరో దశకు చేరడంతో 2015లో గ్రాండ్‌మాస్టర్ హోదా లభించింది. అడపాదడపా టోర్నీల్లో గెలుస్తున్నప్పటికీ 2019 అతని కెరీర్‌ను మలుపుతిప్పింది. భారత ఓపెన్‌లో క్లాసికల్, ర్యాపిడ్, బ్లిట్జ్ ఇలా మూడు విభాగాల్లోనూ అరవింద్ విజేతగా నిలిచి అరుదైన ఘనత సాధించిన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. దాంతో పాటే తొలిసారి 2700 ఎలో రేటింగ్లోకి వచ్చేశాడు. ఇప్పుడు ప్రాగ్ టైటిల్‌తో లైవ్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో అరవింద్ 14వ స్థానంలో ఉన్నాడు. భారత్ తరఫున నాలుగో ర్యాంకర్‌గా ఎదిగాడు. -
చాంపియన్ నువ్వా.. నేనా
పుష్కర కాలం క్రితం భారత జట్టు ఐదు మ్యాచ్‌లలో వరుసగా విజయాలు సాధించి అజేయంగా చాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను సొంతం చేసుకుంది. నాటి జట్టులో ఆడిన రోహిత్, కోహ్లి, జడేజా ప్రస్తుత టీమ్‌లోనూ భాగంగా ఉన్నారు. ఇప్పుడు కూడా టీమిండియా దాదాపు అదే తరహా ఫామ్‌తో ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తూ వచ్చింది. మరో మ్యాచ్‌లో ఇదే జోరు కొనసాగిస్తే ఏడాది వ్యవధిలో రెండో ఐసీసీ టైటిల్ భారత్ ఖాతాలో చేరుతుంది. భారత్ మూడో చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ వేటలో ఇప్పుడు న్యూజిలాండ్ అడ్డుగా ఉంది. లీగ్ స్థాయిల్లో ఎలా ఆడినా మన టీమ్‌పై ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లలో కివీస్‌దే పైచేయిగా ఉంది. పట్టుదలతో చివరి వరకు పోరాడటం, అంచనాలకు మించి రాణించడంలో ఆ జట్టుకు ఎంతో పేరుంది. వారం రోజుల క్రితం భారత్ చేతిలో ఓడినా ఆ మ్యాచ్‌తో దీనికి పోలిక లేదు. ఆ మ్యాచ్ పరాజయం నుంచి పాఠాలు నేర్చుకుంటూ అసలు పోరులో సత్తా చాటగలదు. గెలుపోటములతో పాటు మరో కీలకాంశం ఈ మ్యాచ్‌కు సంబంధించి చర్చకు వస్తోంది. సుదీర్ఘ కాలంగా భారత జట్టు మూల స్థంభాలుగా అద్భుత విజయాలు అందించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఈమ్యాచ్‌తో తమ వన్డే కెరీర్‌ను ముగిస్తారా...టి20 వరల్డ్ కప్ తరహాలో ఘనంగా ఆటను ముగిస్తారా అనేది చూడాలి. మరో వైపు కివీస్ కూడా తమ స్టార్ విలియమ్సన్కు ఒక్క ఐసీసీ వన్డే టోర్నీతోనైనా వీడ్కోలు పలకాలని పట్టుదలగా ఉంది.దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీలో పలు ఆసక్తికర సమరాల తర్వాత అసలైన ఆఖరి పోరుకు రంగం సిద్ధమైంది. టోర్నీలో ఆద్యంతం ఆధిపత్యం కనబర్చిన టీమిండియా ఒక వైపు... నిలకడగా రాణించిన కివీస్ మరో వైపు తుది సమరం కోసం రంగంలో నిలిచాయి. ప్రపంచ క్రికెట్ అభిమానులంతా ఎదురు చూస్తున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో నేడు న్యూజిలాండ్‌తో భారత్ తలపడుతుంది. 2017లో చివరిసారిగా జరిగిన ఈ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన భారత్ అంతకు ముందు రెండు సార్లు టైటిల్ సాధించింది. 2000లో చాంపియన్స్ ట్రోఫీని గెలిచిన కివీస్ ఖాతాలో వన్డేల్లో ఏకైక ఐసీసీ టోర్నీ ఉంది. భారత్ తమ బలమైన బ్యాటింగ్‌తో పాటు స్పిన్‌పై ఆధారపడుతుండగా...పరిస్థితులకు తగినట్లు స్పందించే తమ ఆల్‌రౌండ్ నైపుణ్యాన్ని కివీస్ నమ్ముకుంది. చివరకు ఎవరిది పైచేయి అవుతుందో ఆసక్తికరం. మార్పుల్లేకుండా... టోర్నీలో భారత్ ప్రదర్శన చూస్తే తుది జట్టులో ఎలాంటి మార్పులకు అవకాశమే లేదు. ఆటగాళ్లంతా చక్కటి ఫామ్‌లో ఉన్నారు. ఓపెనర్‌గా గిల్ కీలకం కానుండగా... మిడిలార్డర్లో అయ్యర్, రాహుల్ జట్టు భారం మోస్తారు. రాహుల్ బ్యాటింగ్ దూకుడు సెమీఫైనల్లో కనిపించింది కాబట్టి అతని ఫామ్‌పై కూడా ఆందోళన పోయింది. వన్డే వరల్డ్ కప్ సెమీస్‌లో కివీస్‌పై సెంచరీ చేసినప్పటినుంచి ఆ జట్టుపై అయ్యర్ మన బెస్ట్ బ్యాటర్. వరుసగా అన్ని మ్యాచ్‌లలో అతను చెలరేగిపోయాడు. స్టార్ బ్యాటర్ కోహ్లి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ టోర్నీలో కోహ్లి నాలుగు ఇన్నింగ్స్‌లలో కలిపి 217 పరుగులు సాధించాడు. అతని స్థాయి ఇన్నింగ్స్ మరొకటి వస్తే చాలు భారత్‌కు తిరుగుండదు. అన్ని ఫార్మాట్లలో కలిపి తాను ఆడిన ఐసీసీ టోర్నీ ఫైనల్స్‌లో 10 ఇన్నింగ్స్‌లలో కోహ్లి 3 అర్ధసెంచరీలు చేశాడు. దీనిని మరింత మెరుగుపర్చుకునే అవకాశం అతని ముందుంది.అయితే ఇప్పుడు భారత జట్టుకు సంబంధించి రోహిత్ బ్యాటింగే కాస్త ఆందోళన కలిగిస్తోంది. ఈ టోర్నీలో ఆడిన అన్ని మ్యాచ్‌లలో అతను విఫలమయ్యాడు. దూకుడుగా 20–30 పరుగులు చేసి పవర్‌ప్లేలోనే నిష్క్రమిస్తుండటం జట్టుకు ఇబ్బందిగా మారుతోంది. దీనిని అధిగమించి రోహిత్ భారీ స్కోరు చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. 10 ఐసీసీ టోర్నీ ఫైనల్ ఇన్నింగ్స్‌లలో రోహిత్ ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయలేదు! ఇప్పుడు తన స్థాయిని చూపించేందుకు ఇది సరైన వేదిక. మరో వైపు భారత స్పిన్నర్లు ప్రత్యర్థిపై చెలరేగిపోయేందుకు సిద్ధంగా ఉన్నారు. లీగ్ దశలో ఐదు వికెట్లతో కివీస్‌ను దెబ్బ తీసిన వరుణ్ చక్రవర్తి జట్టు ప్రధానాస్త్రం కాగా, లెఫ్టార్మ్ మణికట్టు బౌలర్ కుల్దీప్ యాదవ్ కూడా ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించగలడు. జడేజా, అక్షర్ కూడా రాణిస్తే కివీస్‌కు కష్టాలు ఖాయం. మన నలుగురు స్పిన్నర్లు కలిపి టోర్నీలో 21 వికెట్లు తీశారు. పేస్‌తో షమీ ఆకట్టుకోగా, పాండ్యా కూడా అండగా నిలుస్తున్నాడు. హెన్రీ ఆడతాడా! లీగ్ దశలో భారత్ చేతిలో ఓడినా న్యూజిలాండ్‌పై ఆ మ్యాచ్ ఫలితం పెద్దగా పడలేదు. ఆ మ్యాచ్లోజరిగిన లోపాలను సవరించుకొని బరిలోకి దిగుతున్నామని టీమ్ మేనేజ్మెంట్ ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తోంది. టీమ్ బ్యాటింగ్ విషయంలో కివీస్ బలంగా కనిపిస్తోంది. రచిన్ రవీంద్ర సెంచరీలతో చెలరేగిపోతుండగా... విలియమ్సన్ కూడా అదే స్థాయి ఆటను ప్రదర్శించాడు. ఐదు ఐసీసీ టోర్నీ ఫైనల్స్ ఇన్నింగ్స్ ఆడిన విలియమ్సన్ ఒకే ఒక అర్ధ సెంచరీ చేసినా... అతను ఈ టోర్నీలో రాణిస్తున్న తీరు జట్టుకు అదనపు బలంగా మారింది. యంగ్, మిచెల్ కూడా ఆకట్టుకోగా... ఫిలిప్స్ తన ఫీల్డింగ్‌తో హైలైట్‌గా నిలిచాడు. ధాటిగా ఆడగల సత్తా ఉన్న ఫిలిప్స్ కూడా చెలరేగితే కివీస్ కూడా భారీ స్కోరు సాధించగలేదు. జట్టు స్పిన్ కూడా మెరుగ్గానే ఉంది. కెప్టెన్ సాంట్నర్, బ్రేస్వెల్లతో పాటు ఫిలిప్స్ కూడా బంతిని బాగా టర్న్ చేయగల సమర్థుడు. పేసర్లు జేమీసన్, రూర్కేలు కీలకం కానుండగా అసలు మ్యాచ్‌కు ముందు హెన్రీ గాయం ఆందోళన రేపుతోంది. భారత్‌తో మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన హెన్రీ జట్టు ప్రధానాయుధం. అతను కోలుకొని బరిలోకి దిగితే కివీస్‌కు ఊరట. పిచ్, వాతావరణం ఫైనల్‌కు కూడా నెమ్మదైన పిచ్ అందుబాటులో ఉంది. ఆట సాగుతున్న కొద్దీ స్పిన్నర్ల ప్రభావం పెరుగుతుంది. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవడం ఖాయం. వర్ష సూచన లేదు. వన్డే టోర్నీ గెలిపిస్తాడా! భారత కెప్టెన్ గా రోహిత్ శర్మ జట్టును నాలుగు ఐసీసీ ఈవెంట్లలోనూ ఫైనల్ చేర్చాడు. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్, వన్డే వరల్డ్ కప్, టి20 వరల్డ్ కప్, ఇప్పుడు చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఆఖరి పోరుకు అర్హత సాధించింది. ఇందులో రెండు ఫైనల్స్‌లో పరాజయం పాలైన జట్టు టి20ల్లో విశ్వవిజేతగా నిలిచింది.ఇప్పుడు ధోని తర్వాత రెండు ఐసీసీ టైటిల్స్ సాధించిన భారత సారథిగా నిలిచేందుకు అతను అడుగు దూరంలో ఉన్నాడు. దీనిని అతను అందుకుంటాడా అనేది నేడు జరిగే ఫైనల్ పోరులో తేలుతుంది. 2013లో చాంపియన్స్ ట్రోఫీలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ తన బ్యాటింగ్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆఖరి మ్యాచా! కోహ్లి, రోహిత్‌ల భవిష్యత్తు ఈ మ్యాచ్‌తో తేలుతుందని అంతటా చర్చ వినిపిస్తోంది. 2027 వన్డే వరల్డ్ కప్ సన్నాహకాల్లో భాగంగా జట్టును సిద్ధం చేసేందుకు వీరు తప్పుకుంటారని అనుకుంటున్నా దీనిపై ఇప్పుడు స్పష్టత రాకపోవచ్చు. నిజానికి వీరి స్థాయి, ఆటను బట్టి చూస్తే ఇప్పటికిప్పుడు తప్పుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా కోహ్లి అయితే చెలరేగిపోతున్నాడు. అతని ఫిట్‌నెస్‌కు కూడా ఢోకా లేదు. అయితే స్టీవ్ స్మిత్ తరహాలోనే తానే స్వయంగా దూరమవుతాడా అనేది చెప్పలేం. మరో వైపు రోహిత్‌పైనే అందరి దృష్టీ ఉంది. ఇప్పటికి టి20లనుంచి తప్పుకున్న రోహిత్ సిడ్నీ టెస్టుకు దూరమైన దానిపై కూడా సందేహాలు రేపాడు. ఇక మిగిలిన ఫార్మాట్ వన్డేలు మాత్రమే. అయితే నిజంగా కొనసాగే ఆలోచన లేకపోయినా ఈ మ్యాచ్ ముగియగానే అధికారికంగా రిటైర్మెంట్పై ఎలాంటి ప్రకటన రాకపోవచ్చని వినిపిస్తోంది. భారీగా బెట్టింగ్‌లు... ఫైనల్‌పై జోరుగా బెట్టింగ్ సాగుతోంది. ఈ మొత్తం సుమారు రూ.5 వేల కోట్ల వరకు ఉండవచ్చని తెలుస్తోంది. దీని వెనక పెద్ద మాఫియా సామ్రాజ్యం కూడా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఆసీస్‌తో సెమీస్ మ్యాచ్‌పై పెద్ద స్థాయిలో బెట్టింగ్‌లు చేసిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. 2000భారత్, న్యూజిలాండ్ మధ్యే 2000 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కివీస్ 4 వికెట్ల తేడాతో నెగ్గి టైటిల్ సొంతం చేసుకుంది. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్), గిల్, కోహ్లి, అయ్యర్, రాహుల్, పాండ్యా, జడేజా, అక్షర్, షమీ, కుల్దీప్, వరుణ్. న్యూజిలాండ్: సాంట్నర్ (కెప్టెన్), యంగ్, రచిన్, విలియమ్సన్, మిచెల్, లాథమ్, ఫిలిప్స్, బ్రేస్‌వెల్, జేమీసన్, రూర్కే, హెన్రీ/ డఫీ. -
Champions Trophy 2025 Prize Money: ఛాంపియన్స్ ట్రోఫీ విజేతకు ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా..?
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 తుది అంకానికి చేరింది. దుబాయ్ వేదికగా రేపు (మార్చి 9) జరుగబోయే ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది. క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ కోసం కళ్లకు వత్తులు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు.విజేతకు భారీ ప్రైజ్మనీఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచే జట్టు భారీ మొత్తంలో ప్రైజ్‌మనీ లభించనుంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించిన వివరాల ప్రకారం.. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టుకు దాదాపు రూ. 19.48 కోట్లు ($2.24 మిలియన్) లభిస్తాయి. ఫైనల్లో ఓడిపోయిన జట్టు రూ. 9.74 కోట్లు ($1.12 మిలియన్) పొందుతుంది.సెమీఫైనలిస్టులకు కూడా భారీ ప్రైజ్‌మనీ ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనలిస్ట్‌లకు కూడా భారీ ప్రైజ్‌మనీ లభించనుంది. సెమీస్‌లో ఓడిన జట్లు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా రూ. 4.87 కోట్లు ($5,60,000) చొప్పున పొందుతాయి. ఈసారి గ్రూప్ దశ నుంచి నిష్క్రమించిన జట్లకు కూడా ప్రైజ్‌మనీ లభిస్తుంది.ఐదు, ఆరు స్థానాల్లో నిలిచిన ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌కు రూ. 3.04 కోట్లు ($3,50,000) లభిస్తాయి. ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచే పాకిస్తాన్, ఇంగ్లండ్ జట్లకు సుమారు రూ. 1.22 కోట్లు ($1,40,000) లభిస్తాయి. ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఐసీసీ సుమారు రూ. 60 కోట్లు ($6.9 మిలియన్లు) కేటాయించింది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీతో పోలిస్తే ఇది 53 శాతం అధికం.అజేయ భారత్ఈ టోర్నీలో టీమిండియా అజేయ జట్టుగా ఫైనల్‌కు చేరింది. భారత్.. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్‌నూ సూపర్ విక్టరీలు సాధించి సెమీస్‌కు చేరింది. సెమీస్‌లో ఆసీస్‌ను మట్టికరిపించి ఫైనల్‌కు చేరింది. మరోవైపు న్యూజిలాండ్ గ్రూప్ దశలో పాకిస్తాన్, బంగ్లాదేశ్‌పై విజయాలు సాధించి, భారత్ చేతిలో ఓడింది. అయినా గ్రూప్-ఏలో రెండో స్థానంలో నిలిచి సెమీస్‌కు చేరింది. సెమీస్‌లో కివీస్ సౌతాఫ్రికాను చిత్తు చేసి తుది పోరుకు అర్హత సాధించింది.రెండోసారిఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ భారత్‌ను ఎదుర్కోవడం ఇది రెండోసారి. 2000 ఎడిషన్ ఫైనల్లో కివీస్ భారత్‌ను ఢీకొట్టి విజేతగా నిలిచింది. న్యూజిలాండ్‌కు అది తొలి ఐసీసీ టైటిల్. ఐసీసీ టోర్నీల్లో న్యూజిలాండ్ సాధించిన రెండో టైటిల్ కూడా భారత్‌పైనే (ఫైనల్స్) కావడం గమనార్హం. 2019-2021 డబ్ల్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్ భారత్‌ను ఓడించి తమ రెండో ఐసీసీ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఐసీసీ ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌పై భారత్‌కు మంచి ట్రాక్ రికార్డు లేకపోవడంతో భారత అభిమానులు ఆందోళన పడుతున్నారు. -
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు ముందు విరాట్‌కు గాయం..?
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ మ్యాచ్‌కు ముందు టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి గాయమైనట్లు తెలుస్తుంది. ఇవాళ (మార్చి 8) ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా విరాట్ గాయపడినట్లు జియో న్యూస్ తెలిపింది. నెట్స్‌లో ఓ పేసర్‌ను ఎదుర్కొనే క్రమంలో విరాట్ మోకాలికి గాయమైనట్లు సమాచారం. గాయపడిన అనంతరం విరాట్ ప్రాక్టీస్‌ను ఆపేసినట్లు తెలుస్తుంది. విరాట్ గాయానికి ఫిజియో చికిత్స చేశాడని సమాచారం. చికిత్స తర్వాత విరాట్ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లకుండా మైదానంలోనే సహచరులతో గడిపినట్లు తెలుస్తుంది. విరాట్ గాయంపై కోచింగ్ స్టాఫ్‌ను ఆరా తీయగా తీవ్రమైంది కాదని పేర్కొన్నట్లు తెలుస్తుంది. ప్రాక్టీస్ సెషన్లో విరాట్ మోకాలికి కట్టు కట్టుకుని తిరిగినట్లు జియో న్యూస్ పేర్కొంది. విరాట్ గాయం గురించి తెలిసి అభిమానులు తొలుత ఆందోళన చెందారు. విరాట్ గాయంపై టీమిండియా మేనేజ్మెంట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఫైనల్లో విరాట్ ఎంత కీలకమైన ఆటగాడో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఒకవేళ స్వల్ప గాయమైనా ముందు జాగ్రత్త చర్చగా విరాట్‌ను ప్రాక్టీస్ చేయనిచ్చి ఉండరు. ఈ టోర్నీలో విరాట్ అత్యంత కీలకమైన ఇన్నింగ్స్‌లు ఆడి టీమిండియా ఫైనల్‌కు చేరడంలో ముఖ్యపాత్ర పోషించాడు. ఈ టోర్నీలో విరాట్ దాయాది పాకిస్తాన్‌పై సూపర్ సెంచరీ చేసి భారత్‌ను గెలిపించాడు. ఆసీస్‌తో జరిగిన సెమీఫైనల్లోనూ విరాట్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో కూడా విరాట్ సెంచరీ చేసుండాల్సింది. అయితే తృటిలో ఆ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. విరాట్ సూపర్ ఫామ్‌ను ఫైనల్లోనూ కొనసాగించి భారత్‌కు మరో ఐసీసీ టైటిల్ అందించాలని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు. ఫైనల్లో విరాట్ మంచి ఇన్నింగ్స్ ఆడితే భారత విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరు. దుబాయ్ పిచ్‌లకు విరాట్ అలవాటు పడ్డాడు కాబట్టి ఫైనల్లో తప్పక రాణిస్తాడని అంతా అనుకుంటున్నారు.కాగా, దుబాయ్ వేదికగా రేపు (మార్చి 9) జరుగబోయే ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోనున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో టీమిండియా అజేయ జట్టుగా ఫైనల్‌కు చేరింది. భారత్.. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్‌నూ సూపర్ విక్టరీలు సాధించి సెమీస్‌కు చేరింది. సెమీస్‌లో ఆసీస్‌ను మట్టికరిపించి ఫైనల్‌కు చేరింది. మరోవైపు న్యూజిలాండ్ గ్రూప్ దశలో పాకిస్తాన్, బంగ్లాదేశ్‌పై విజయాలు సాధించి, భారత్ చేతిలో ఓడింది. అయినా గ్రూప్-ఏలో రెండో స్థానంలో నిలిచి సెమీస్‌కు చేరింది. సెమీస్‌లో కివీస్ సౌతాఫ్రికాను చిత్తు చేసి తుది పోరుకు అర్హత సాధించింది.ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ భారత్‌ను ఎదుర్కోవడం ఇది రెండోసారి. 2000 ఎడిషన్ ఫైనల్లో కివీస్ భారత్‌ను ఢీకొట్టి విజేతగా నిలిచింది. న్యూజిలాండ్‌కు అది తొలి ఐసీసీ టైటిల్. ఐసీసీ టోర్నీల్లో టీమిండియాను న్యూజిలాండ్‌పై అంత మంచి ట్రాక్ రికార్డు లేదు. ఈ టోర్నీలో భారత్ న్యూజిలాండ్‌ను గ్రూప్ దశలో ఓడించినప్పటికీ.. ఫైనల్లో ఓడించడం మాత్రం అంత ఈజీ కాదు. ఐసీసీ ఈవెంట్లలో (అన్ని ఫార్మాట్లలో) న్యూజిలాండ్ భారత్‌తో ఆడిన 16 మ్యాచ్‌ల్లో పదింట గెలిచింది. ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో భారత్‌పై న్యూజిలాండ్‌కు మరింత ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ఐసీసీ నాకౌట్స్‌లో భారత్, న్యూజిలాండ్ నాలుగు సార్లు ఎదురెదురుపడగా.. 3 మ్యాచ్‌ల్లో కివీస్, ఒక మ్యాచ్‌లో భారత్ గెలుపొందాయి. న్యూజిలాండ్ తమ చరిత్రలో గెలిచిన రెండు ఐసీసీ టైటిళ్లు భారత్‌పైనే (ఫైనల్స్‌లో) సాధించినవే కావడం గమనార్హం. 2000 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత న్యూజిలాండ్ తమ రెండో ఐసీసీ టైటిల్‌ను 2021లో సాధించింది. 2019-2021 డబ్ల్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్ భారత్‌ను ఓడించి తమ రెండో ఐసీసీ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. -
IPL 2025: ముంబై ఇండియన్స్‌తో జతకట్టిన సౌతాఫ్రికా ఆల్‌రౌండర్
సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కార్బిన్ బాష్ ఫైవ్ టైమ్ ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో జతకట్టాడు. సహచరుడు లిజాడ్ విలియమ్స్ గాయం కారణంగా తదుపరి సీజన్‌కు దూరం కావడంతో అతని స్థానాన్ని బాష్ భర్తీ చేస్తున్నాడు. 30 ఏళ్ల బాష్‌ను ముంబై ఇండియన్స్ తమ హ్యామిలీలోకి ఆహ్వానించింది. రైట్ హ్యాండ్ బ్యాట్, రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలింగ్ వేసే బాష్ సౌతాఫ్రికా తరఫున ఓ టెస్ట్, 2 వన్డేలు ఆడాడు. బాష్ గతేడాది డిసెంబర్లో టెస్ట్‌ల్లో అరంగేట్రం చేశాడు.బాష్ తన తొలి టెస్ట్ మ్యాచ్‌లోనే ఇరగదీశాడు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బాష్ తొలి ఇన్నింగ్స్‌లో అజేయమైన 81 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో 4 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో బాష్ అద్భుత ఆల్‌రౌండ్ ప్రదర్శన కారణంగా సౌతాఫ్రికా పాకిస్తాన్‌ను 2 వికెట్ల తేడాతో చిత్తు చేసింది.ఈ మ్యాచ్‌కు ముందు బాష్ అదే పాకిస్తాన్‌పైనే వన్డే అరంగేట్రం చేశాడు. బాష్ ఇప్పటివరకు 2 వన్డేలు ఆడి 2 వికెట్లు సహా 55 పరుగులు చేశాడు. అరంగేట్రం ఇన్నింగ్స్‌లో బాష్ 44 బంతుల్లో 40 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇదే అతనికి వన్డేల్లో అత్యధిక స్కోర్. బాష్ తన రెండో వన్డేను కూడా పాక్‌తోనే ఆడాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు జరిగిన ట్రై సిరీస్‌లో బాష్ పాకిస్తాన్ మ్యాచ్‌లో ఆడాడు.అంతర్జాతీయ అరంగేట్రం అనంతరం బాష్ సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఏడాది బాష్ ఎంఐ కేప్‌టౌన్ తరఫున బరిలో నిలిచాడు. ఈ సీజన్లో బాష్ 8 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీసి ఎంఐ కేప్‌టౌన్ తమ తొలి టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.బాష్ సౌతాఫ్రికా 2014 అండర్-19 వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. నాడు పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో చెలరేగి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఆ మ్యాచ్‌లో బాష్ 4 వికెట్లు తీశాడు. బాష్ తన కెరీర్లో వివిధ ఫార్మాట్లలో ఇప్పటివరకు 2500కు పైగా పరుగులు చేసి 150కిపైగా వికెట్లు తీశాడు. బాష్ టీ20ల్లో 86 మ్యాచ్‌లు ఆడి 59 వికెట్లు తీశాడు. బాష్ చేరికతో ముంబై ఇండియన్స్‌లో ఆల్‌రౌండర్ల సంఖ్య 9కి చేరింది. ఇప్పటికే ఆ జట్టులో కెప్టెన్ హార్దిక్ పాండ్యా, బెవాన్ జాకబ్స్, మిచెల్ సాంట్నర్, విల్ జాక్స్, అర్జున్ టెండూల్కర్ తదితర ఆల్‌రౌండర్లు ఉన్నారు. త్వరలో ప్రారంభంకానున్న ఐపీఎల్-2025 ఎడిషన్‌లో ముంబై తమ తొలి మ్యాచ్‌ను మార్చి 23న ఆడుతుంది. చెన్నైలో జరిగే ఆ మ్యాచ్‌లో ముంబై సీఎస్కేను ఢీకొంటుంది.ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్..రోహిత్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార యాదవ్, నమన్ ధిర్, బెవాన్ జాకబ్స్, రాజ్ బవా, విల్ జాక్స్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), విజ్ఞేశ్ పుథుర్, సత్యనారాయణ రాజు, కార్బిన్ బాష్, మిచెల్ సాంట్నర్, అర్జున్ టెండూల్కర్, ర్యాన్ రికెల్టన్, కృష్ణణ్ శ్రీజిత్, రాబిన్ మింజ్, జస్ప్రీత్ బుమ్రా, అశ్వనీ కుమార్, కర్ణ్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, ముజీబ్ ఉర్ రెహ్మాన్ -
CT 2025 Final: వరుణ్ మిస్టరీ కోడ్‌ను కివీస్ బ్యాటర్లు ఛేదించగలరా..?
భారత్, న్యూజిలాండ్ మధ్య దుబాయ్‌లో జరుగనున్న 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌ను రెండు సమవుజ్జీలైన జట్ల మధ్య జరిగే టైటిల్ పోరుగా అభివర్ణించవచ్చు. బ్యాటింగ్ పరంగా చూస్తే భారత్, న్యూజిలాండ్ రెండు జట్ల బ్యాట్స్‌మన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. భారత్ తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో మినహా న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ ఎక్కడా తడబడినట్టు కానీ, తక్కువ స్థాయిలో ఆడుతున్నట్టు కానీ కనిపించలేదు. న్యూజిలాండ్ ను ఈ మ్యాచ్ లో నిలువరించి ఘనత భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి దక్కుతుంది.తొలి పోరులో వరుణ్ దే పైచేయిగత ఆదివారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి కివీస్ బ్యాట్స్‌మన్‌ని తన వైవిధ్యమైన బౌలింగ్ తో ముప్పతిప్పలు పెట్టాడు. అంటే న్యూ జిలాండ్ బ్యాట్స్‌మన్ కి స్పిన్నర్లను ఆడటం తెలియక కాదు. వారి జట్టులోనూ అద్భుతమైన స్పిన్నర్లు ఉన్నారు. స్పిన్నర్లపై ఆధిపత్యం సాధించే అద్భుతమైన బ్యాట్స్‌మన్ కూడా ఉన్నారు. కానీ వరుణ్ మాత్రం విభిన్నమైన స్పిన్నర్. అతని బౌలింగ్ యాక్షన్ బట్టి అతని ఎలాంటి బంతి వేస్తాడో అంచనా వేయడం కష్టం.అదే ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ కి పెద్ద అవరోధంగా కనిపిస్తోంది. అందుకే ఆ మ్యాచ్ లో వరుణ్ మిస్టరీ కోడ్‌ను అర్థం చేసుకోవడానికి కివీస్ బ్యాటర్లు నానా తిప్పలు పడ్డారు. ఈ మ్యాచ్ లో వరుణ్ 52 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇందులో విల్ యంగ్, గ్లెన్ ఫిలిప్స్ మరియు మిచెల్ సాంట్నర్ వంటి కీలక వికెట్లు కూడా ఉన్నాయి. ఆ తర్వాత సెమీ-ఫైనల్లో ఆస్ట్రేలియాపై కూడా వరుణ్ మంచి వైవిధ్యం తో బౌలింగ్ చేసాడు. ఎప్పడూ భారత్ జట్టుకి ప్రధాన అడ్డంకి గా నిలిచే ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్‌ను తన తొలి బంతితోనే బోల్తా కొట్టించాడు. వరుణ్ ఫామ్ ఫైనల్‌కి ముందు భారత్‌కు అదనపు బలాన్నిస్తునడంలో సందేహం లేదు.వరుణ్ గురించి హెచ్చరించిన కివీస్ కోచ్ అందుకే మ్యాచ్ కి ముందే న్యూజిలాండ్ కోచ్ గ్యారీ స్టీడ్ తమ బ్యాట్సమన్లని వరుణ్ నుంచి ఎదురయ్యే సవాలుకి సిద్ధంగా ఉండాలని హెచ్చరించాడు. గత మ్యాచ్ లో మా జట్టు పై 5/42 గణాంకాలతో పైచేయి సాధించిన వరుణ్ ఫైనల్లో ఆడతాడని కచ్చితంగా చెప్పగలను. వరుణ్ ఒక క్లాస్ బౌలర్. గత మ్యాచ్ లో మాకు తన నైపుణ్యం మేమిటో రుచి చూపించాడు. ఫైనల్లో వరుణ్ మాకు పెద్ద ముప్పుగా భావిస్తున్నాం. ఈ విషయం (వరుణ్ మా ప్రధాన అడ్డంకి అని ) ముందే తెలిసింది కాబట్టి అతన్ని ఎలా ఎదుర్కోగలం. ఎలా పరుగులు సాధించగలము అనే దాని పై అంచనాలు వేస్తున్నామని స్టీడ్ అన్నాడు.హెన్రీ ఆడతాడా?న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ-ఫైనల్ సందర్భంగా కివీస్ స్టార్ పేసర్ మాట్ హెన్రీ గాయపడ్డాడు. ప్రమాదకరమైన బ్యాట్స్‌మన్ హెన్రిచ్ క్లాసెన్‌ను అవుట్ చేసే ప్రయత్నంలో డైవింగ్ క్యాచ్ తీసుకుంటుండగా, హెన్రీ కుడి భుజంపై గాయమైంది. వెంటనే ఫిజియోలు అతనిని పరిశీలించినప్పటికీ అతను తీవ్ర అసౌకర్యంతో ఉన్నట్టు కనిపించాడు. చివరికి హెన్రీ మైదానం నుండి బయటకు వెళ్లవలసి వచ్చింది. ఈ మ్యాచ్ లో మాట్ హెన్రీ తన 10 ఓవర్లను పూర్తి చేయలేకపోయాడు. అతను కేవలం 7 ఓవర్లు బౌలింగ్ చేసి 2 వికెట్లు తీసి 42 పరుగులు ఇచ్చాడు.ఈ మ్యాచ్ అనంతరం న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ మాట్లాడుతూ.. మాట్ హెన్రీ భుజం కొంచెం నొప్పిగా ఉందని.. అతను భారత్‌తో ఫైనల్ ఆడగలడో లేదో వేచి చూడాలన్నాడు. ఈ మ్యాచ్ లో భారత్ బ్యాట్స్‌మన్ ని నిలువరించడంలో హెన్రీ కీలక పాత్ర వహించాడు. ఈ మ్యాచ్ లో హెన్రీ ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో తన అత్యుత్తమ గణాంకాలు (5/42) నమోదు చేసుకున్నాడు. ఫైనల్లో హెన్రీ ఆడకపోతే న్యూజిలాండ్‌కు పెద్ద దెబ్బ అవుతుంది. -
CT 2025: ఒకే వేదికపై ఆడటం వల్ల టీమిండియా లబ్ది పొందింది.. విమర్శకులకు ఇచ్చిపడేసిన అశ్విన్
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ తమ మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీకి పాక్ ఆతిథ్యమిస్తున్నప్పటికీ.. భద్రతా కారణాల రిత్యా టీమిండియా తమ మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడుతుంది. అయితే టీమిండియా తమ మ్యాచ్‌లను ఒకే వేదికపై ఆడటాన్ని కొందరు ప్రస్తుత, మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు. ఒకే వేదికపై మ్యాచ్‌లు ఆడటం వల్ల టీమిండియా లబ్ది పొందుతుందని ఆరోపిస్తున్నారు.ఈ ఆరోపణలపై భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. ఒకే వేదికపై ఆడటం వల్ల టీమిండియా లబ్ది పొందుతుందనడం సరికాదన్నాడు. గతంలో (2009 ఛాంపియన్స్ ట్రోఫీ) సౌతాఫ్రికా ఒకే వేదికపై అన్ని మ్యాచ్‌లు ఆడినా ఫైనల్‌కు చేరలేదన్న విషయాన్ని గుర్తు చేశాడు. బాగా ఆడితేనే టోర్నమెంట్లు గెలుస్తారని, సాకుల వల్ల కాదని చురకలంటించాడు. దుబాయ్‌లో ఆడటం వల్ల టీమిండియా లబ్ది పొందుతుందని తమ కెప్టెన్, కోచ్‌లను ప్రశ్నించినప్పుడు నవ్వుకున్నానని అన్నాడు. టీమిండియా చివరిగా కోవిడ్‌కు ముందు 2018లో (ఆసియా కప్) దుబాయ్‌లో ఆడిందన్న విషయాన్ని గుర్తు చేశాడు. టీమిండియా తర్వాత న్యూజిలాండ్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా దుబాయ్‌లో ఆడాయని అన్నాడు. ప్రయాణించడం వల్ల ఆటగాళ్లు అలసిపోతారన్న విషయంతో ఏకీభవించిన అశ్విన్.. షెడ్యూల్ ఫిక్స్ చేయడంలో టీమిండియా ప్రమేయం ఉండదన్న విషయాన్ని గుర్తు చేశాడు. సౌతాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా ఈ విషయాన్ని ప్రస్తావించాడు.ఎంతమంది ఎన్ని రకాలుగా టీమిండియాపై ఆరోపణలు (ఒకే వేదిక అంశం) చేసినా న్యూజిలాండ్ ఆటగాళ్లు మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయరని కితాబునిచ్చాడు. ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేయకుండా కేవలం ఆటపై దృష్టి పెడుతుంది కాబట్టే న్యూజిలాండ్‌కు భారీ సంఖ్యలో అభిమానులున్నారని అన్నాడు. ఫైనల్లో గెలిచినా ఓడినా న్యూజిలాండ్ ఆటగాళ్లు హుందాగా ప్రవర్తిస్తారని తెలిపాడు.కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ అదరగొడుతున్న విషయం తెలిసిందే. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాక్, న్యూజిలాండ్‌పై విజయాలు సాధించిన భారత్.. సెమీస్‌లో ఆసీస్‌ను మట్టికరిపించి అజేయ జట్టుగా ఫైనల్‌కు చేరింది. మరోవైపు న్యూజిలాండ్ గ్రూప్ దశలో పాకిస్తాన్, బంగ్లాదేశ్‌పై విజయాలు సాధించి, భారత్ చేతిలో ఓడింది. అయినా గ్రూప్-ఏలో రెండో స్థానంలో నిలిచి సెమీస్‌కు చేరింది. సెమీస్‌లో కివీస్ సౌతాఫ్రికాను చిత్తు చేసి తుది పోరుకు అర్హత సాధించింది. దుబాయ్ వేదికగా రేపు (మార్చి 9) జరుగబోయే తుది సమరంలో న్యూజిలాండ్ రోహిత్ సేనతో అమీతుమీ తేల్చుకోనుంది.ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ భారత్‌ను ఎదుర్కోవడం ఇది రెండోసారి. 2000 ఎడిషన్ ఫైనల్లో కివీస్ భారత్‌ను ఢీకొట్టి విజేతగా నిలిచింది. న్యూజిలాండ్‌కు అది తొలి ఐసీసీ టైటిల్. -
ఆర్సీబీకి ఆడాలని ఆరాటపడుతున్న పాక్ ఫాస్ట్ బౌలర్
పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ అమీర్ ఐపీఎల్ ఆడాలని తెగ ఆరాటపడిపోతున్నాడు. ప్రత్యేకించి ఐపీఎల్లో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించాలని కలలు కంటున్నాడు. భారత్‌తో దౌత్యపరమైన సంబంధాలు సరిగ్గా లేని కారణంగా పాక్ ఆటగాళ్లకు ఐపీఎల్లో ఎంట్రీ లేని విషయం తెలిసిందే. అయితే అమీర్ బ్రిటన్ పౌరసత్వం పొంది తన ఐపీఎల్ కల నెరవేర్చుకోవాలని ఆశిస్తున్నాడు. అమీర్‌కు 2026 నాటికి యూకే పాస్ట్‌పోర్ట్ వస్తుంది. అప్పుడు ఐపీఎల్ వేలంలో తన పేరును రిజిస్టర్ చేసుకోవాలని అనుకుంటున్నాడు.విరాట్ అంటే అమితమైన అభిమానంఎడమ చేతి వాటం ఫాస్ట్ బౌలర్ అయిన అమీర్‌కు విరాట్ కోహ్లి అంటే అమితమైన అభిమానం. ఈ విషయాన్ని అమీర్ చాలా సందర్భాల్లో చెప్పాడు. 2016 టీ20 ప్రపంచకప్‌కు ముందు కోహ్లి తనకు బ్యాట్‌ను బహుమతిగా ఇచ్చిన విషయాన్ని అమీర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. ఇదే సందర్భంగా అమీర్ కోహ్లిపై ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లి ప్రతిభను ఆరాధించే వ్యక్తి అని కొనియాడాడు. కోహ్లి తనకు బ్యాట్ ఇచ్చినప్పుడు ఉప్పొంగిపోయానని చెప్పుకొచ్చాడు. తాను కోహ్లి బ్యాటింగ్‌ను ఆరాధిస్తానని.. కోహ్లి తన బౌలింగ్‌ను గౌరవిస్తాడని తెలిపాడు. కోహ్లి ఇచ్చిన బ్యాట్‌తో చాలా మంచి ఇన్నింగ్స్‌లు ఆడానని గుర్తు చేసుకున్నాడు. అమీర్ ఆర్సీబీలో చేరితే ఆ జట్టు టైటిల్ కల నెరవేరుతుందని మరో పాకిస్తాన్ ఆటగాడు అహ్మద్ షెహజాద్ అభిప్రాయపడ్డాడు. ఆర్సీబీ బౌలింగ్ సమస్యలు పరిష్కరించడానికి అమీర్ లాంటి బౌలర్ అవసరమని షెహజాద్ అన్నాడు. ఆర్సీబీ బ్యాటింగ్ ఎల్లప్పుడూ బలంగా ఉంది. వారికి బౌలింగే పెద్ద సమస్య. అమీర్ వారితో చేరితే వారు టైటిల్ గెలుస్తారని షెహజాద్ జోస్యం చెప్పాడు.కాగా, 32 ఏళ్ల అమీర్ 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తిరిగి 2024లో (టీ20 ప్రపంచకప్ కోసం) రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు. అయితే 2024 ప్రపంచకప్ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అమీర్‌ను ఎంపిక చేయలేదు. ప్రస్తుతం అమీర్ ప్రపంచవ్యాప్తంగా వివిథ లీగ్‌ల్లో (ఐపీఎల్ మినహా) ఆడుతున్నాడు.ఇదిలా ఉంటే, ఆర్సీబీ ఈ ఏడాది ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లోనే డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్‌తో తలపడనుంది. మార్చి 22న జరిగే ఈ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగనుంది. ఈ ఏడాది ఆర్సీబీ నూతన కెప్టెన్‌గా మధ్యప్రదేశ్ ఆటగాడు రజత్ పాటిదార్ ఎంపికయ్యాడు. గత రెండు సీజన్లలో సారథ్యం వహించిన డుప్లెసిస్‌ను ఆర్సీబీ మెగా వేలానికి ముందు వదులుకుంది.ఈ ఏడాది ఆర్సీబీ జట్టు..రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, దేవ్‌దత్ పడిక్కల్, టిమ్ డేవిడ్,స్వస్థిక్ చికార, కృనాల్ పాండ్యా, లియామ్ లివింగ్‌స్టోన్, మనోజ్ భాండగే, జేకబ్ బేతెల్, రొమారియో షెపర్డ్, స్వప్నిల్ సింగ్, మోహిత్ రతీ, ఫిలిప్ సాల్ట్, జితేశ్ శర్మ, జోష్ హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, లుంగి ఎంగిడి, రసిక్ దార్ సలామ్, సుయాశ్ శర్మ, యశ్ దయాల్, నువాన్ తుషార, అభినందన్ సింగ్ఐపీఎల్ 2025లో ఆర్సీబీ షెడ్యూల్మార్చి 22- కేకేఆర్తోమార్చి 28- సీఎస్కేఏప్రిల్ 2- గుజరాత్ఏప్రిల్ 7- ముంబైఏప్రిల్ 10- ఢిల్లీఏప్రిల్ 13- రాజస్థాన్ఏప్రిల్ 18- పంజాబ్ఏప్రిల్ 20- పంజాబ్ఏప్రిల్ 24- రాజస్థాన్ఏప్రిల్ 27- ఢిల్లీమే 3- సీఎస్కేమే 9- లక్నోమే 13- సన్రైజర్స్మే 17- కేకేఆర్ -
'రోహిత్, కోహ్లి కాదు.. ఫైనల్లో అతడే గేమ్ ఛేంజర్'
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్‌ను ముద్దాడేందుకు టీమిండియా అడుగుదూరంలో నిలిచింది. దుబాయ్ వేదికగా ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో భారత్ తాడోపేడో తెల్చుకోనుంది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో తుది మెట్టుపై బోల్తా పడిన భారత జట్టు.. ఈసారి మాత్రం ఎలాగైనా విజేతగా నిలవాలని పట్టుదలతో ఉంది. అందుకు తగ్గట్టు ఫైనల్ మ్యాచ్ కోసం రోహిత్ సేన ప్రత్యేక వ్యూహాలను రచిస్తోంది. హెడ్‌కోచ్ గౌతం గంభీర్ నేతృత్వంలో భారత జట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. మరోవైపు న్యూజిలాండ్ సైతం ఛాంపియన్స్ ట్రోఫీ-2000 ఫైనల్ ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తోంది.2000లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో కివీస్ చేతిలో మెన్ ఇన్ బ్లూ ఓటమి చవిచూసింది. అయితే అప్పటికంటే ఇప్పుడు భారత జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా కన్పిస్తోంది. టీమిండియాను ఓడించడం అంత సులువు కాదు. ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్ సబా కరీం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు."ఛాంపియన్స్ ట్రోఫీ-2025ను గెలుచుకునేందుకు భారత్‌కు అన్ని రకాల అర్హతలు ఉన్నాయి. ప్రస్తుత భారత జట్టులో అద్బుతమైన ఆటగాళ్లు ఉన్నారు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన తర్వాత మరోసారి 2017లో భారత్‌కు టైటిల్‌ను సొంతం చేసుకునే అవకాశం లభించింది. కానీ ఆ ఎడిషన్‌లో భారత్ తుది మెట్టుపై బోల్తా పడింది.కానీ ఈసారి మాత్రం టీమిండియా వద్ద అద్బుతమైన స్పిన్నర్లు ఉన్నారు. ఈ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టుకు శ్రేయస్ అయ్యర్ కీలకంగా మారనున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు ఎక్స్ ఫ్యాక్టర్లగా మారుతారని నేను అనుకోవడం లేదు. వారిద్దరూ అనుభవజ్ఞులైన ఆటగాళ్లు అయినప్పటికి.. న్యూజిలాండ్ బౌలర్ల ముందు కాస్త బలహీనంగా కన్పించే ఛాన్స్ ఉంది. అయితే ఈ సీనియర్ ద్వయం నుంచి ఫైటింగ్ నాక్స్ ఆశించవచ్చు.ప్రస్తుత జట్టుపై మాత్రం నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇంగ్లండ్‌ను 3-0 తేడాతో ఓడించి ఈ మెగా టోర్నీలో అడుగుపెట్టారు. ఇక్కడ కూడా గ్రూపు మ్యాచ్‌లన్నీ గెలిచి.. ఆ తర్వాత సెమీస్‌లో ఆస్ట్రేలియాపై విజయం సాధించి ఫైనల్‌కు చేరుకున్నారు. రోహిత్ శర్మ అండ్ కో మంచి రిథమ్‌లో కన్పిస్తున్నారు.అయితే బ్లాక్ క్యాప్స్‌ను ఓడించడం అంత సలువు కాదు. గతంలో చాలా టోర్నమెంట్లలో చివరవరకు వచ్చి ఓటములను ఎదుర్కొన్నారు. అయితే ఐసీసీ టోర్నీల్లో మాత్రం భారత్‌పై వారికి మంచి రికార్డు ఉంది. కాబట్టి ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగడం ఖాయమని" స్టార్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరీం పేర్కొన్నాడు.చదవండి: పాతికేళ్ల పరాజయానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా? -
రోహిత్‌తో నాకు మంచి అనుబంధం ఉంది.. అతడు చాలా గ్రేట్: గంభీర్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ పోరులో భారత్-న్యూజిలాండ్ జట్లు తలపడేందుకు సిద్దమయ్యాయి. ఆదివారం దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఈ హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు భారత కెప్టెన్ రోహిత్ శర్మపై హెడ్‌కోచ్ గౌతం గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు.రోహిత్ శర్మతో తనకు మంచి అనుబంధం ఉందని గంభీర్ తెలిపాడు. కాగా రోహిత్ సారథ్యంలోని భారత జట్టు ప్రస్తుతం అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో వరుస విజయాలతో టీమిండియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. అయితే ఫైనల్‌కు చేరడంలో కోచ్ గంభీర్ పాత్ర కూడా ఉంది. అక్షర్ పటేల్‌ను బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోట్ చేయడం, వరుణ్ చక్రవర్తిని జట్టులోకి తీసుకురావడం వంటివి గంభీర్ తీసుకున్న నిర్ణయాలే. అయితే వైట్‌బాల్ క్రికెట్లో కెప్టెన్‌గా, కోచ్‌గా అదరగొడుతున్న రోహిత్-గంభీర్ జోడీ.. రెడ్ బాల్ క్రికెట్లో ఇంకా తమ మార్క్ చూపించలేకపోయారు.న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో ఘోర పరాభావం తర్వాత వీరద్దరూ తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచి విమర్శించిన వారితోనే శెభాష్ అన్పించుకోవాలని వీరు భావిస్తున్నారు."రోహిత్ శర్మ తనొక కెప్టెన్ అని, అన్ని అధికారాలు ఉన్నాయని ఎన్నడూ భావించలేదు. అద్భుతమైన వ్యక్తిత్వం కలవాడు. అతడితో నాకు బలమైన అనుబంధం ఉంది. మంచి మనసు ఉన్న వారు మంచి నాయకుడిగా కూడా మారుతారు. అందుకే ఐపీఎల్లో అతడు కెప్టెన్‌గా అన్ని టైటిల్స్ సాధించగలిగాడు.భారత్‌కు టీ20 ప్రపంచకప్‌ను అందించాడు. అయితే చరిత్ర ఎప్పుడు గతంగానే ఉంటుంది. ఇప్పుడు మా ముందు కొత్త సవాలు ఉంది. ఫైనల్ మ్యాచ్‌లో కూడా అతడు బ్యాటర్ గానే కాకుండా సారథిగా కూడా అత్యుత్తమ ప్రదర్శన చేయగలడని ఆశిస్తున్నాను" అని ఐసీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గౌతీ పేర్కొన్నాడు. కాగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత హిట్‌మ్యాన్ భారత వన్డే కెప్టెన్సీ నుంచి వైదొలిగే సూచనలు కన్పిస్తున్నాయి.చదవండి: పాతికేళ్ల పరాజయానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా? -
పాతికేళ్ల పరాజయానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా?
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పోరులో తలపడేందుకు భారత్, న్యూజిలాండ్ సంసిద్ధంగా ఉన్నాయి. ఈ రెండు జట్లు ఈ టోర్నమెంట్ ఫైనల్లో తలపడటం ఇది రెండోసారి. ఈ ఫైనల్ కి ముందు రెండు జట్లూ సమఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. ఈ టోర్నమెంట్ గ్రూప్ దశ మ్యాచ్‌లోభారత్ ఇప్పటికే కివీస్‌ను 44 పరుగుల తేడాతో ఓడించి కొద్దిగా పైచేయి తో ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ మ్యాచ్ లో శ్రేయాస్ అయ్యర్ 79 పరుగులు సాధించగా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 5 వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్ ని అద్భుతంగా నిలువరించడం తో భారత్ విజయం సాధించింది.పాతికేళ్ల క్రితం... భారత్ ని దెబ్బతీసిన న్యూజిలాండ్అయితే భారత్, న్యూజిలాండ్ జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో తలపడటం ఇది రెండోసారి. గతంలో అక్టోబర్ 15, 2000న కెన్యా రాజధాని నైరోబిలోని జింఖానా క్లబ్ గ్రౌండ్లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో కివీస్ జట్టు భారత్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి ట్రోఫీ ని ఎగరేసుకుపోయింది. కెప్టెన్ సౌరవ్ గంగూలీ అద్భుతమైన సెంచరీ చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ ఆరు వికెట్లకు 264 పరుగులు చేసింది. గంగూలీ మరియు సచిన్ టెండూల్కర్ 26.3 ఓవర్లలో తొలి వికెట్‌కు 141 పరుగుల భాగస్వామ్యంతో పునాది వేశారు. టెండూల్కర్ 69 పరుగుల వద్ద రనౌట్ కావడంతో ఈ భాగస్వామ్యం తెగిపోయింది. అయితే, గంగూలీ తన ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు, 130 బంతుల్లో 117 పరుగులు చేసి భారత్ కి ఆశలు రేకెత్తించాడు. అయితే అల్ రౌండర్ క్రిస్ కైర్న్స్ విజృంభించి 113 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 102 పరుగులు చేసి అజేయంగా నిలిచి కివీస్ కి విజయాన్ని చేకూర్చాడు.రోహిత్ కి కలిసిరాని టాస్భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ కి మాత్రం ప్రస్తుతం టాస్ కలిసి రావట్లేదు. రోహిత్ వరుసగా గత 14 వన్డే మ్యాచ్ లలో టాస్ గెలవలేక పోయాడు. 2023 నవంబర్ 19న అహ్మదాబాద్‌లో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్‌తో ప్రారంభమైన ఈ టాస్ పరాజయాల పరంపర ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే భారత్ మాత్రం ఈ 14 మ్యాచ్‌లలో తొమ్మిది విజయాలు సాధించింది, నాలుగింటిలో ఓటమి పాలయింది ఒక మ్యాచ్ (శ్రీలంకతో)తో టై గా ముగిసింది.ప్రస్తుత దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదిక గా ఆడుతున్న భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌లోని ఇంతవరకూ జరిగిన నాలుగు మ్యాచ్ ల లో టాస్ ఓడిపోయింది, అయినప్పటికీ అన్ని మ్యాచ్ లలో విజయం సాధించింది. అందువల్ల టాస్ భారత్ విజయావకాశాల పై ప్రభావం చూపించలేదన్నది వాస్తవం. అయితే ఇక్కడి వాతావరణ పరిస్థితులు రెండవ స్థానంలో బ్యాటింగ్ చేసే జట్టుకు అనుకూలంగా ఉండే అవకాశం ఉందని తొలుత భావించారు. కానీ అలాంటిదేమీ ఈసారి కనిపించలేదు. భారత్ మొదట బ్యాటింగ్ చేసినప్పుడు ఒకసారి ఛేజింగ్ చేస్తూ మూడు మ్యాచ్‌లు గెలిచింది. ఇక్కడి వాతావరణం లో మంచు ఎక్కువగా లేకపోవడం ఇందుకు కారణంగా చెబుతున్నారు. రాత్రులు వాతావరణం చల్లగా ఉండటంతో, టోర్నమెంట్లో మంచు పెద్ద పాత్ర పోషిస్తుందని భావించారు. అదృష్టవశాత్తూ అది జరగలేదు.వరుణ్ చక్రవర్తి కీలకం"ఈ సమయంలో ఈ మైదానంలో కొంచెం ఎక్కువ మంచు ఉంటుందని నేను అనుకున్నాను. అదృష్టవశాత్తూ అలా జరగలేదు. కాబట్టి టాస్ నిజానికి పెద్ద అంశం కాదని నేను భావిస్తున్నాను" అని న్యూజిలాండ్ మాజీ కోచ్ మైక్ హెస్సన్ అన్నాడు. "ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు వెళుతున్నప్పుడు ఎవరు టాస్ గెలుస్తారనే దాని గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక భారత్ అభిమానులైతే రోహిత్ శర్మ వరుసగా 14 మ్యాచ్‌ల లో టాస్ ఓడిపోయాడని నిద్ర మానుకోవాల్సి పని లేదు." అని హెస్సన్ వ్యాఖ్యానించాడు. ఫైనల్ ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా?సరిగ్గా పాతికేళ్ల క్రితం క్రితం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పరాజయం చవిచూసిన భారత్ ఇప్పుడు న్యూజిలాండ్ పై ప్రతీకారం తీర్చుకుంటుందా? 25 సంవత్సరాల క్రితం జరిగిన ఈ ఘోర పరాజయాన్నిభారత్ అభిమానులు ఇప్పటికీ మర్చిపోలేదు. ఇన్నేళ్లకు ఈ పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవడానికి రోహిత్ శర్మ బృందానికి అవకాశం కలిగింది. భారత్ జట్టు ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉంది మరియు టోర్నమెంట్‌లోని అన్ని మ్యాచ్‌లలో విజయం సాధించింది. రోహిత్ బృందం ఈ విజయ్ బాటను కొనసాగించాలన్న దృఢ సంకల్పంతో ఉంది. మరి ఈ ఫైనల్లో ఏమి జరుగుతుందో చూద్దాం.!చదవండి: భారత తుదిజట్టులో ఓ మార్పు.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వారికే: రవిశాస్త్రి -
భారత తుదిజట్టులో ఓ మార్పు.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ వారికే!
భారత్- న్యూజిలాండ్ మధ్య చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) నేపథ్యంలో టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి(Ravi Shastri) కీలక వ్యాఖ్యలు చేశాడు. కివీస్‌తో మ్యాచ్‌లో భారత తుదిజట్టులో ఓ మార్పు చోటు చేసుకోవచ్చని అంచనా వేశాడు. పిచ్ పరిస్థితికి తగ్గట్లుగా టీమిండియా మేనేజ్మెంట్ ఈ మేరకు నిర్ణయం తీసుకోవచ్చని అంచనా వేశాడు.అయితే, ఎవరిపై వేటు వేస్తారు? ఎవరిని తీసుకువస్తారన్న విషయంపై మాత్రం రవిశాస్త్రి స్పష్టతనివ్వలేకపోయాడు. కాగా పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న మొదలైన చాంపియన్స్ ట్రోఫీ తాజా ఎడిషన్ మార్చి 9న దుబాయ్ వేదికగా భారత్- న్యూజిలాండ్ మధ్య ఫైనల్‌తో ముగుస్తుంది. ఆతిథ్య జట్టు హోదాలో పాకిస్తాన్ సహా భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ ఈ వన్డే టోర్నమెంట్లో పాల్గొన్నాయి. ఈ క్రమంలో తొలి సెమీ ఫైనల్లో ఆసీస్‌ను ఓడించి రోహిత్ సేన.. సౌతాఫ్రికాను చిత్తు చేసి సాంట్నర్ బృందం టైటిల్ పోరుకు అర్హత సాధించాయి. ఇక టీమిండియా తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లోనే ఆడగా.. కివీస్‌కు కూడా ఇక్కడ ఓ మ్యాచ్ ఆడిన అనుభవం ఉంది కాబట్టి తమకూ పిచ్ పరిస్థితులపై అవగాహన ఉందని కోచ్ గ్యారీ స్టెడ్ అన్నాడు.భారత తుదిజట్టులో ఓ మార్పుఇదిలా ఉంటే.. గ్రూప్ దశలో భాగంగా భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌కు వాడిన పిచ్‌నే భారత్- కివీస్ ఫైనల్‌కు తిరిగి ఉపయోగించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కామెంటేటర్ రవిశాస్త్రి ఐసీసీ రివ్యూలో మాట్లాడుతూ.. ‘‘ఫైనల్ మ్యాచ్‌లో భారత తుదిజట్టులో ఓ మార్పు చోటుచేసుకున్నా ఆశ్చర్యం లేదు. పిచ్ పరిస్థితికి అనుగుణంగా నిర్ణయం ఉంటుంది.టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరిగిన పిచ్ ఈ టోర్నమెంట్‌లోనే అత్యుత్తమైనది. మళ్లీ అలాంటి హోరాహోరీ చూడాలని ఉంది. ఇక ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత గ్రౌండ్స్‌మెన్‌కి దాదాపు ఐదు రోజుల విరామం లభించింది. 280- 300 పరుగుల మేర రాబట్టగలిగే పిచ్ తయారు చేసి ఉండవచ్చు’’ అని అభిప్రాయపడ్డాడు.ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వారికేఇక ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఆల్‌రౌండర్ ఉండబోతున్నాడని రవిశాస్త్రి ఈ సందర్భంగా అంచనా వేశాడు. ‘‘అక్షర్ పటేల్ లేదంటే రవీంద్ర జడేజా టీమిండియా తరఫున ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవబోతున్నారు. ఒకవేళ న్యూజిలాండ్‌కు అవకాశం ఉంటే మాత్రం నేను గ్లెన్ ఫిలిప్స్ వైపు మొగ్గుచూపుతాను. అతడు అద్భుతంగా ఫీల్డింగ్ చేస్తాడు. మెరుపు ఇన్నింగ్స్‌తో 4- 50 పరుగులు రాబట్టగలడు. ఒకటీ లేదా రెండు వికెట్లు తీసి ఆశ్చర్యపరచనూగలడు’’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఆసీస్‌తో సెమీస్ ఆడిన భారత తుదిజట్టురోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.సౌతాఫ్రికాతో సెమీ ఫైనల్ ఆడిన న్యూజిలాండ్ ప్లేయింగ్ ఎలెవన్విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మ్యాట్ హెన్రీ, కైలీ జెమీసన్, విలియం ఓ రూర్కీ.చదవండి: CT 2025: వరుణ్‌తోనే పెను ముప్పు: కివీస్ కోచ్ -
IPL 2025: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్..
ఐపీఎల్-2025(IPL-2025) ఆరంభానికి ముందు ముంబై ఇండియన్స్(Mumbai Indians)కు భారీ షాక్ తగలింది. ఆ జట్టు స్టార్ పేసర్, టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) గాయం కారణంగా ఐపీఎల్ ఫస్ట్ హాఫ్ సీజన్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. బుమ్రా ప్రస్తుతం వెన్ను గాయంతో బాధపడుతున్నాడు.ఈ క్రమంలోనే కీలకమైన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి సైతం బుమ్రా దూరమయ్యాడు. బుమ్రా ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పునరావాసం పొందుతున్నాడు. అతడు తన పూర్తి ఫిట్నెస్ సాధించడానికి రెండు నుంచి మూడు వారాల సమయం పట్టనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఈ భారత స్పీడ్ స్టార్ ఏప్రిల్‌లో ముంబై ఇండియన్స్ శిబిరంలో చేరే అవకాశం ఉంది."బుమ్రా వేగంగా కోలుకుంటున్నాడు. అతడి మెడికల్ రిపోర్ట్స్ బాగానే ఉన్నాయి. అతడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో తిరిగి తన బౌలింగ్ ప్రాక్టీస్‌ను ప్రారంభించాడు. అయితే ఐపీఎల్లో బౌలింగ్ చేసే ఫిట్నెస్ మాత్రం ఇంకా సాధించలేదు. ఏప్రిల్ మొదటి వారంలో బుమ్రా తిరిగి మైదానంలో అడుగుపెట్టే అవకాశముంది. అది కూడా మేము కచ్చితంగా చెప్పలేము. మా వైద్య బృందం అతడిపై క్రమంగా వర్క్‌లోడ్ పెంచుతుంది.అతడు ఎటువంటి అసౌకర్యం లేకుండా బౌలింగ్ చేయగలిగితేనే వైద్య బృందం క్లియరన్స్ ఇస్తోంది. అప్పటివరకు అతడు సీఓఈలోనే ఉండనున్నాడని" బీసీసీఐ అధికారి ఒకరు టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2025 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్‌లో మార్చి 23న చెన్నైసూపర్ కింగ్స్‌తో తలపడనుంది. హార్దిక్ కూడా..ఈ మ్యాచ్‌కు ముంబై రెగ్యూలర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సైతం దూరం కానున్నాడు. గతేడాది సీజన్లో స్లో ఓవర్ రేటు కారణంగా పాండ్యాపై ఒక్క మ్యాచ్ నిషేధం పడింది. హార్దిక్ గత సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో మూడోసారి స్లో ఓవర్ రేట్‌కు కారణమయ్యాడు.దీంతో వరుసగా మూడు సార్లు స్లో ఓవరేట్‌ను మెయింటేన్ చేయడంతో ఐపీఎల్ నిర్వహకులు అతడిపై ఆడకుండా ఒక్క మ్యాచ్ నిషేదం విధించారు. ఆ బ్యాన్‌ను పాండ్యా ఈ ఏడాది సీజన్లో ఎదుర్కొన్నాడు. తొలి మ్యాచ్‌కు బెంచ్‌కే పరిమితం కానున్నాడు. కాగా గతేడాది సీజన్లో ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శనతో లీగ్ స్టేజికే పరిమితమైన సంగతి తెలిసిందే.చదవండి: BCCI: శుబ్‌మన్ గిల్‌కు ప్రమోషన్.. ఏకంగా రూ. 7 కోట్ల జీతం!? -
IND vs NZ: ‘అండర్డాగ్స్ అని మర్చిపోండి.. అతడి దూకుడుకు కళ్లెం వేస్తే..’
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) ఫైనల్లో టీమిండియా ఫేవరెట్‌గా బరిలో దిగనుంది. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లను చిత్తు చేసి టాపర్‌గా సెమీస్ చేరిన రోహిత్ సేన.. కీలక పోరులోనూ తన సత్తా చాటింది. వన్డే ప్రపంచకప్-2023 విజేత ఆస్ట్రేలియాను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది.ఐసీసీ టోర్నమెంట్ల ఫైనల్లో భారత జట్టుపై కివీస్(India vs New Zealand)దే పైచేయి అయినా.. దుబాయ్‌లో ప్రేక్షకుల మద్దతు మాత్రం రోహిత్ సేనకే లభించనుంది. అయితే, టీమిండియా ఎంత పటిష్టంగా ఉన్నప్పటికీ.. తమదైన రోజున న్యూజిలాండ్‌ను ఆపడం ఎవరితరం కాదు. ఈ విషయాన్ని కివీస్ జట్టు గుర్తించాలని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్(Shoaib Akhtar) అంటున్నాడు.అండర్డాగ్స్ అని మర్చిపోండిభారత్- న్యూజిలాండ్ ఫైనల్లో తలపడనున్న తరుణంలో కివీస్‌కు అక్తర్ కీలక సూచనలు చేశాడు. ‘‘మీరు టీమిండియాతో ఆడుతున్నామన్న విషయాన్ని మర్చిపోండి. మీరు అండర్‌డాగ్స్‌గా పరిగణింపబడతారనే అంశాన్నీ విస్మరించాలి. మీ జట్టు బాగా లేదని భావించవద్దు.సాంట్నర్‌కు గెలుస్తామనే నమ్మకం ఉంది. కెప్టెన్‌గా అతడు టైటిల్ గెలవాలని బలంగా కోరుకుంటున్నాడు. కాబట్టి కివీస్ ఏ దశలోనూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. ఇక భారత్‌తో మ్యాచ్ విషయంలో మీకు అతిపెద్ద సవాలు రోహిత్ శర్మ.అతడి దూకుడుకు కళ్లెం వేస్తేపవర్ ప్లేలో గనుక అతడికి అవకాశం ఇస్తే పరిస్థితి చేజారినట్టే. ఏమాత్రం దయ చూపకుండా అతడు దూకుడుగా ముందుకుపోతాడు. ముఖ్యంగా స్పిన్నర్లను ఒత్తిడిలోకి నెట్టగలడు. సాంట్నర్‌ను అటాక్ చేస్తాడు. కెప్టెన్‌గా తన జట్టులో ఆత్మవిశ్వాసం నింపాలంటే బ్యాటర్‌గానూ రాణించాలని అతడికి తెలుసు.70 శాతం టీమిండియాకే అవకాశంఓపెనర్గా తనదైన ముద్ర వేసి నిష్క్రమించాలనే కోరుకుంటాడు. కాబట్టి అతడి విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వద్దు. ఇక ఫైనల్ విజేతపై అంచనా గురించి చెప్పాలంటే 70 శాతం టీమిండియాకే అవకాశం ఉంది. వాళ్ల బ్యాటర్లు పరిణతితో ఆడుతున్నారు. స్పిన్నర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, న్యూజిలాండ్ తమ శాయశక్తులు ఉపయోగిస్తే మాత్రం మరోసారి టైటిల్ గెలిచే అవకాశం లేకపోలేదు’’ అని రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ గేమ్ ఆన్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. స్మిత్‌ను ఆదర్శంగా తీసుకోండిఇదే షోలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ మాట్లాడుతూ.. న్యూజిలాండ్ బ్యాటర్లు ఆస్ట్రేలియా సారథి స్టీవ్ స్మిత్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించాడు. ‘‘స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ చక్కటి సమన్వయంతో ముందుకు సాగటమే భారత బ్యాటర్ల గొప్ప లక్షణం. మెరుగైన భాగస్వామ్యాలు నెలకొల్పగలిగితే బౌలర్లపై ఒత్తిడి ఉండదు.ఇక సెమీస్‌లో స్మిత్ భారత స్పిన్నర్ల బౌలింగ్‌లో ఆడిన విధానం కివీస్ బ్యాటర్లకు స్ఫూర్తిదాయకం. గ్యాప్స్‌లో షాట్లు బాదుతూ హాఫ్ సెంచరీ(73)తో రాణించాడు. ఫైనల్లో న్యూజిలాండ్ బ్యాటర్లూ అదే చేయాలి’’ అని షోయబ్ మాలిక్ సూచనలు చేశాడు. కాగా 2000 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్‌పై గెలుపొంది టైటిల్ గెలిచిన న్యూజిలాండ్... వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(2023)లోనూ టీమిండియా ను ఓడించి ట్రోఫీని ముద్దాడింది. చదవండి: కెప్టెన్సీకి రోహిత్ శర్మ గుడ్‌బై? ఆటగాడిగా కొనసాగింపు? బీసీసీఐ నిర్ణయం? -
శుబ్‌మన్ గిల్‌కు ప్రమోషన్.. ఏకంగా రూ. 7 కోట్ల జీతం!?
భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ) 2025-26 ఏడాదికి గాను ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను ప్రకటించేందుకు సిద్దమైంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ముగిసిన తర్వాత ఈ లిస్ట్‌ను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. గతేడాది సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయిన మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు ప్రమోషన్ దక్కనున్నట్లు సమాచారం.అతని సెంట్రల్ కాంట్రాక్ట్‌ను పునరుద్దరించేందుకు బీసీసీఐ సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దేశీవాళీ క్రికెట్లో ఆడాలన్న తమ ఆదేశాలను ధిక్కరించడంతో బీసీసీఐ అయ్యర్‌పై వేటు వేసింది. ఆ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకుని రంజీల్లో ఆడిన శ్రేయస్ తిరిగి జాతీయ జట్టులోకి వచ్చాడు.జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన అయ్యర్.. తన అద్బుతప్రదర్శనతో అందరిని ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలోనూ శ్రేయస్ దుమ్ములేపుతున్నాడు. ఈ క్రమంలోనే అతడికి తిరిగి మళ్లీ కాంట్రాక్ట్ ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించుకుంది.గిల్‌కు ప్రమోషన్.. కోహ్లి, రోహిత్‌కు డిమోషన్మరోవైపు అద్బుతమైన ఫామ్‌లో ఉన్న టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్(Shubman Gill)కు సైతం ప్రమోషన్ ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గిల్ ప్రస్తుతం బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్‌ల్లో ఏ కేటగిరిలో ఉన్నాడు. ఇప్పుడు అతడిని టాప్ గ్రేడ్(ఏ ప్లస్)కు ప్రమోట్ చేయాలని బీసీసీఐ పెద్దలు నిర్ణయించుకున్నారంట. కాగా ప్రస్తుతం ఏ ప్లస్ కేటగిరిలో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రాలు మాత్రమే ఉన్నారు. అయితే అంతర్జాతీయ టీ20లకు విడ్కోలు పలికిన కోహ్లి, రోహిత్ శర్మ, జడేజా కాంట్రాక్లు మారనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఈ సీనియర్ త్రయాన్ని ఏ ప్లస్ నుంచి ఏ గ్రేడ్‌కు డిమోట్ చేసే అవకాశముంది. వీరిస్ధానాల్లో గిల్‌తో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఏ ప్లస్ కేటగిరిలో చోటు దక్కే సూచనలు కన్పిస్తున్నాయి.కేటగిరి వారీగా ఆటగాళ్లకు దక్కే మొత్తం ఎంతంటే?ఏ ప్లస్ కేటగిరిలో ఉన్న ఆటగాళ్లకు వార్షిక వేతనం కింద యేటా రూ. 7 కోట్లు దక్కనున్నాయి. ‘ఏ’ కేటగిరీలోని క్రికెటర్లకు రూ. 5 కోట్లు..‘బి’ కేటగిరిలో ఉన్న వారికి రూ. 3 కోట్లు.. ‘సి’ కేటగిరిలో ఉన్న క్రికెటర్లకు కోటి రూపాయల వార్షిక వేతనం లభించనుంది.కివీస్‌తో ఫైనల్ పోరు..ఇక ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా జరగనున్న ఫైనల్ పోరులో న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను సొంతం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు కివీస్ కూడా భారత్‌ను ఓడించి రెండోసారి ఈ మెగా టోర్నీ టైటిల్‌ను ముద్దాడాలని పట్టుదలతో ఉంది.చదవండి: CT 2025: భారత్-న్యూజిలాండ్ ఫైనల్ పోరు.. బ్యాటర్లకు చుక్కలే! ఎందుకంటే? -
నాణ్యమైన క్రికెటర్.. ఏ స్థానంలోనైనా అతడు ఆడతాడు: టీమిండియా కోచ్
భారత స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్(KL Rahul) విషయంలో యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఈ కర్ణాటక ఆటగాడి బ్యాటింగ్ స్థానాన్ని పదే పదే మార్చడం.. అతడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయం గురించి భారత మాజీ ఓపెనర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు మాట్లాడుతూ.. స్పేర్ టైర్ కంటే కూడా దారుణంగా మేనేజ్మెంట్ అతడి సేవలను వాడుకుంటోందని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.ఏ స్థానంలో ఆడేందుకైనా సిద్ధంఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్(Sitanshu Kotak) స్పందించాడు. జట్టులో తన పాత్ర పట్ల కేఎల్ రాహుల్ సంతృప్తిగా ఉన్నాడని తెలిపాడు. జట్టు ప్రయోజనాల కోసం ఏ స్థానంలో ఆడేందుకైనా సిద్ధంగా ఉన్నాడని పేర్కొన్నాడు. కాగా 2014లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన కేఎల్ రాహుల్.. ఆరంభంలో ఓపెనర్‌గా బరిలోకి దిగాడు.అనంతరం ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌ను మిడిలార్డర్‌కు డిమోట్ చేశారు. అయితే, ఇటీవల ఆస్ట్రేలియా(India vs Australia)తో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ సందర్భంగా మళ్లీ ఓపెనర్‌గా పంపారు. ఇక ఇంగ్లండ్‌తో స్వదేశంలో ఇటీవలి వన్డే సిరీస్‌లో ఒక్కోసారి ఆరో స్థానంలో ఆడించారు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లోనూ ఇదే కొనసాగిస్తున్నారు. వీలునుబట్టి ఐదో స్థానంలో కూడా ఆడిస్తున్నారు.అయితే, ఇలా పదే పదే తన బ్యాటింగ్ ఆర్డర్ మారుతున్నా కేఎల్ రాహుల్ సంతోషంగానే ఉన్నాడని కోచ్ సితాన్షు కొటక్ చెప్పడం విశేషం. ‘‘అతడు ఓపెనింగ్ చేయగలడు. నాలుగు లేదంటే ఐదో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. డిమాండ్‌ను బట్టి ఆరో స్థానంలోనూ ఆడతాడు.జట్టుకు ఏది అవసరమో అది చేస్తాడుపరిస్థితులకు తగ్గట్లుగా తనను తాను మార్చుకోవడం అతడికి ఇష్టం. జట్టులో తన పాత్ర పట్ల అతడు సంతృప్తిగా, సంతోషంగా ఉన్నాడు. రాహుల్ వంటి నాణ్యమైన బ్యాటర్ ఆరో స్థానంలో అందుబాటులో ఉండటం జట్టుకు అదనపు ప్రయోజనం.బ్యాటింగ్ ఆర్డర్ మార్పుల గురించి నేను తనతో మాట్లాడినపుడు తనకేమీ ఇబ్బంది లేదని చెప్పాడు. జట్టుకు ఏది అవసరమో అది చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని నాతో అన్నాడు’’ అని సితాన్షు కొటక్ వెల్లడించాడు. టీమిండియా- న్యూజిలాండ్ మధ్య ఆదివారం చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ నేపథ్యంలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.కాగా వన్డేల్లో ఐదో స్థానంలో వచ్చి ఇప్పటి వరకు 31 ఇన్నింగ్స్ ఆడిన కేఎల్ రాహుల్.. 1299 పరుగులు సాధించాడు. సగటు 56.47. ఇందులో రెండు శతకాలతో పాటు నాలుగు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఇక ఆరో స్థానంలో రాహుల్ ఏడుసార్లు బ్యాటింగ్ చేసి 160 పరుగులు మాత్రమే చేయగలిగాడు.ఇదిలా ఉంటే.. కివీస్‌తో టైటిల్ పోరు గురించి సితాన్షు కొటక్ మాట్లాడుతూ.. ‘‘సీనియర్లు, యువ ఆటగాళ్లతో జట్టు సమతూకంగా ఉంది. వాళ్లంతా కలిసికట్టుగా ఉంటూ.. ఆట గురించి చర్చిస్తూ ఉంటారు. ఏ జట్టుకైనా ఇంతకంటే విలువైన, గొప్ప విషయం మరొకటి ఉండదు.రోహిత్, విరాట్, హార్దిక్, షమీ, జడేజా.. జట్టులో ఉండటం సానుకూలాంశం. వాళ్లలో చాలా మందికి 15- 20 ఏళ్ల అనుభవం ఉంది. యువ ఆటగాళ్లు సీనియర్ల నుంచి ఎంతో నేర్చుకుంటున్నారు. ఫైనల్ విషయంలో మా జట్టుపై ఎలాంటి ఒత్తిడి లేదు’’ అని పేర్కొన్నాడు.చదవండి: CT 2025: వరుణ్‌తోనే పెను ముప్పు: కివీస్ కోచ్ -
అంపైర్‌తో వాగ్వాదం.. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌కు భారీ షాక్
లక్నో: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌పై జరిమానా పడింది. గురువారం యూపీ వారియర్స్‌తో మ్యాచ్ సందర్భంగా అంపైర్‌తో వాదనకు దిగినందుకు హర్మన్‌ప్రీత్ మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత పడింది. యూపీ వారియర్స్ ఇన్నింగ్స్ 19వ ఓవర్ ముగిసిన సమయంలో అంపైర్ అజితేశ్ అర్గాల్... సర్కిల్ బయట ముగ్గురు ఫీల్డర్లు మాత్రమే ఉంచాలని హర్మన్‌ప్రీత్‌కు సూచించాడు.స్లో ఓవర్‌రేట్‌కు పాల్పడినందుకు గానూ చివరి ఓవర్లో బౌండరీ సమీపంలో నలుగురు ఫీల్డర్లను మోహరించే అవకాశం లేదని హర్మన్‌కు వివరించాడు. దీంతో అంపైర్‌తో ముంబై సారథి వాగ్వాదానికి దిగింది. ఆల్‌రౌండర్ అమెలియా కెర్ కూడా హర్మన్‌కు వంతపాడింది. దీంతో ఈ ఘటనపై రిఫరీ క్రమశిక్షణ చర్యలకు పూనుకున్నాడు.‘హర్మన్‌ప్రీత్ లెవల్–1 తప్పిదానికి పాల్పడింది. నియమావళిలోని 2.8 ఆర్టికల్ ప్రకారం అంపైర్లతో వాగ్వాదానికి దిగడం, అంపైర్ నిర్ణయాన్ని ప్రశ్నించడతో మ్యాచ్‌లో ఫీజులో 10 శాతం జరిమానా విధించాం’ అని డబ్ల్యూపీఎల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. యూపీ వారియర్స్‌తో మ్యాచ్ సందర్భంగా ప్రత్యర్థి ప్లేయర్ సోఫీ ఎకిల్స్టోన్తోనూ హర్మన్‌ప్రీత్ వాదనకు దిగింది. కాగా... ఈ మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌పై విజయం సాధించిన ముంబై ఇండియన్స్ ‘ప్లే ఆఫ్స్’కు చేరువైంది.చదవండి: CT 2025: భారత్-న్యూజిలాండ్ ఫైనల్ పోరు.. బ్యాటర్లకు చుక్కలే! ఎందుకంటే? -
IML 2025: వాట్సన్ విధ్వంసకర సెంచరీ.. సౌతాఫ్రికాను చిత్తు చేసిన ఆసీస్
అంతర్జాతీయ మాస్టర్స్ లీగ్-2025లో ఆస్ట్రేలియా మాస్టర్స్ జట్టు తమ దూకుడును కొనసాగిస్తోంది. వడోదరగా వేదికగా సౌతాఫ్రికా మాస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 137 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఒక్క వికెట్ నష్టానికి 260 పరుగుల భారీ స్కోర్ సాధించింది.ఆసీస్ కెప్టెన్ షేన్ వాట్సన్ మరోసారి సెంచరీతో చెలరేగాడు. సౌతాఫ్రికా బౌలర్లను వాట్సన్ ఊచకోత కోశాడు. వాట్సన్ కేవలం 61 బంతుల్లోనే 9 ఫోర్లు, 9 సిక్స్‌లతో 122 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ టోర్నీలో వాట్సన్‌కు ఇది మూడో సెంచరీ కావడం విశేషం.అంతకుముందు వెస్టిండీస్, భారత్‌పై వాట్సన్ శతక్కొట్టాడు. ఈ మ్యాచ్‌లో షేన్‌తో పాటు కల్లమ్ ఫెర్గూసన్(43 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 85), బెన్ డంక్(16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 34) అద్బుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. ప్రోటీస్ బౌలర్లలో పీటర్సన్ ఓ వికెట్ పడగొట్టాడు.నిప్పులు చెరిగిన ఆసీస్ బౌలర్లు..అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 17 ఓవర్లలో కేవలం 123 పరుగులకే ఆలౌటైంది. కంగారుల బౌలర్ల దాటికి ప్రోటీస్ బ్యాటింగ్ లైనప్ పేక మేడలా కుప్పకూలింది. హషీమ్ ఆమ్లా(30) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రిచర్డ్ లివి(22), పీటర్సన్ పర్వాలేదన్పించారు. మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు.ఆసీస్ బౌలర్లలో బెన్ లాఫ్లీన్ మూడు వికెట్లు పడగొట్టగా.. దొహర్టీ, మెక్గైన్ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు కౌల్టర్ నైల్, నాథన్ రియర్డన్ చెరో వికెట్ పడగొట్టారు. ఇక శనివారం జరగనున్న మ్యాచ్‌లో వెస్టిండీస్, భారత్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ గెలిస్తే భారత్ తమ సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకుంటుంది.చదవండి: CT 2025: భారత్-న్యూజిలాండ్ ఫైనల్ పోరు.. బ్యాటర్లకు చుక్కలే! ఎందుకంటే? -
కిక్స్‌లో.. నైషా నైపుణ్యం..
సాక్షి, హైదరాబాద్: కిక్ బాక్సింగ్ క్రీడలో జాతీయ అంతర్జాతీయ వేదికలపై మెరిసింది. తెలంగాణ కిక్ బాక్సింగ్ పుస్తకంలో తన కంటూ ఒక పేజీ లిఖించింది నైషా బజాజ్. ‘ఫిట్నెస్ రంగంలో ఉన్న మా అమ్మకి మార్షల్ ఆర్ట్స్ హాబీ. ఆమెతో ఏడేళ్ల వయసులో సరదాగా కలిసి ప్రాక్టీస్ చేశా. అదే ఇప్పుడు నా లైఫ్‌గా మారింది’ అంటూ చెప్పింది పంజాగుట్టలో నివసించే టీనేజర్ నైషా.విజయాలెన్నో.. నగరం నుంచి వేళ్ల మీద లెక్కబెట్టగలిగే సంఖ్యలో కూడా కనబడని మహిళల కిక్‌బాక్సింగ్‌లో 2014లో నైషా పూర్తి స్థాయిలో ప్రవేశించిందని చెప్పొచ్చు. అప్పటి నుంచి రాష్ట్రంలోని అగ్రశ్రేణి మహిళా యోధుల్లో ఒకరిగా రాణిస్తోంది. ఆమె సాధించిన విజయాల్లో ఇండియన్ ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ (2022, 2024, 2025), నేషనల్ కిక్‌బాక్సింగ్ ఛాంపియన్షిప్ (2024, గోవా), ఖేలో ఇండియా ఉమెన్స్ కిక్‌బాక్సింగ్ లీగ్ (2024, హైదరాబాద్) తెలంగాణ స్టేట్ ఛాంపియన్‌షిప్‌లలో బంగారు పతకాలు.. సాధించింది. గత అక్టోబర్‌లో ఫ్రాక్చర్‌కు శస్త్రచికిత్స చేయించుకుని వెనువెంటనే 2025 ప్రారంభంలోనే తిరిగి బంగారు పతకాలను సాధించడం ఆమె పోరాట పటిమకు నిదర్శనం. కఠినమే కానీ.. అమ్మాయిలు క్రీడల్లో రాణించడం ఇప్పుడు సాధారణమే కావచ్చు కానీ.. కిక్ బాక్సింగ్ క్రీడలో మాత్రం ఇప్పటికీ విశేషమే. ‘చిన్న వయసులోనే నాలో ఉన్న ఆసక్తిని అమ్మ గమనించి మార్షల్ ఆర్ట్స్ వైపు ప్రోత్సహించింది’ అంటూ గుర్తు చేసుకుంది నైషా. తొలుత తైక్వాండోతో తన మార్షల్ ఆర్ట్స్ ప్రయాణాన్ని ప్రారంభించానని, ఆ తర్వాత కిక్ బాక్సింగ్‌లోకి మారానని వివరించింది. ఇది కఠినమైన క్రీడే అయినప్పటికీ.. ఇలాంటి యుద్ధకళల్లో మహిళలు రాణించాల్సిన సమయం వచి్చందంటోంది నైషా. బయటకు వెళ్లి ఎన్నో రంగాల్లో తమని తాము నిరూపించుకోవాలని తపిస్తున్న మహిళలు.. మార్షల్ ఆర్ట్స్ ద్వారా తమని తాము రక్షించుకోగలుగుతారని అంటోంది. -
IND Vs NZ: భారత్-న్యూజిలాండ్ ఫైనల్ పోరు.. బ్యాటర్లకు చుక్కలే! ఎందుకంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ-2025(Champions Trophy)లో ఫైనల్ పోరుకు సమయం అసన్నమైంది. ఆదివారం(మార్చి 9) దుబాయ్ వేదికగా జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో భారత్-న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ టైటిల్ పోరు కోసం ఇరు జట్లు తమ ఆస్రశాస్త్రాలను సిద్దం చేసుకున్నాయి.ఈ మ్యాచ్‌లో గెలిచి ముచ్చటగా మూడో సారి ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను ముద్దాడాలని భారత జట్టు భావిస్తుంటే.. మరోసారి ఐసీసీ టోర్నీ ఫైనల్లో టీమిండియాను ఓడించాలని కివీస్ పట్టుదలతో ఉంది. ఇక ఈ మెగా ఫైనల్ మ్యాచ్‌కు పిచ్ ఏర్పాటు పూర్తి అయింది. గ్రూపు స్టేజిలో పాకిస్తాన్-భారత్ మ్యాచ్ కోసం ఉపయోగించిన పిచ్‌నే తుది పోరుకు కూడా క్యూరేటర్ సిద్దం చేసినట్లు తెలుస్తోంది.ఈ మెగా టోర్నీలో భారత్ ఆడిన తమ నాలుగు మ్యాచ్‌లు వేర్వేరు పిచ్‌లపైనే ఆడింది. ఎందుకంటే ఒక్కసారి ఉపయోగించిన పిచ్‌ను మళ్లీ ఉపయోగించాలంటే కనీసం రెండు వారాల గ్యాప్ ఉండేలా ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ECB) ప్లాన్ చేసింది. ఇప్పుడు పాకిస్తాన్‌తో లీగ్ మ్యాచ్ ఆడి రెండు వారాలు పూర్తి కావడంతో ఆ పిచ్‌పై మళ్లీ ఆడేందుకు భారత్ సిద్దమైంది. కాగా ఆ మ్యాచ్‌లో పాకిస్తాన్ 244 పరుగులు చేయగా.. ఆ లక్ష్యాన్ని భారత్ సునాయసంగా ఛేదించింది.కివీస్‌కు మరోసారి..కాగా ఈ వికెట్ మరోసారి స్పిన్నర్లకు అనుకూలించే అవకాశముంది. పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్, జడేజా, అక్షర్ పటేల్ వంటి మణికట్టు స్పిన్నర్లు బంతితో మ్యాజిక్ చేశారు. ఆ మ్యాచ్‌లో ఇంకా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి లేడు. అతడు ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చాక భారత స్పిన్ విభాగం మరింత పటిష్టంగా మారింది. న్యూజిలాండ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో వరుణ్ ఏకంగా 5 వికెట్లతో సత్తాచాటాడు. అతడి స్పిన్ దాటికి కివీలు విల్లవిల్లాడారు. ఈ క్రమంలో మరోసారి న్యూజిలాండ్‌కు వరుణ్ నుంచి ముప్పు పొంచి ఉంది. అయితే ప్రత్యర్ధి జట్టులో కూడా మెరుగైన స్పిన్నర్లు ఉన్నారు.కెప్టెన్ మిచెల్ శాంట్నర్, బ్రెస్‌వెల్ వంటివారు బంతితో అద్భుతాలు చేయగలరు. వీరికి తోడు రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ వంటి పార్ట్ టైమ్ స్పిన్నర్లకు కూడా మ్యాచ్‌ను మలుపు తిప్పే సత్తాఉంది. దీంతో మరోసారి బ్యాటర్లకు స్పిన్నర్ల నుంచి కఠిన సవాలు ఎదురుకానుంది.కివీస్‌దే పైచేయి..కాగా ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్లో న్యూజిలాండ్-భారత జట్లు రెండు సార్లు తలపడ్డాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో కూడా కివీసే విజయం సాధించింది. 2000 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో, 2021 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియాను బ్లాక్ క్యాప్స్ చిత్తు చేసింది.చదవండి: రోహిత్ శర్మ భారీ ఇన్నింగ్స్ ఆడితే... -
Sunil Chhetri: రీఎంట్రీ అవసరమా?: ఫుట్‌బాల్ దిగ్గజం
భారత ఫుట్‌బాల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆటగాడు సునీల్ ఛెత్రి(Sunil Chhetri) అనడంలో సందేహమే లేదు. జాతీయ జట్టు తరఫున 151 మ్యాచ్‌లు ఆడి 94 గోల్స్ సాధించాడు. గత ఏడాది జూన్‌లో అతను అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించి తప్పుకున్నాడు. ఇప్పుడు అనూహ్యంగా ఛెత్రి పునరాగమనం చేస్తున్నాడు. 41 ఏళ్ల వయసులో అతను మళ్లీ భారత్‌కు ప్రాతినిధ్యం వహించేందుకు సిద్ధం కావడం ఫుట్‌బాల్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది.కోచ్ మనోలో మార్క్వెజ్ విజ్ఞప్తి మేరకు తిరిగి వచ్చాడని చెబుతున్నా... భారత్ ఫుట్‌బాల్ జట్టు తాజా పరిస్థితిని ఇది సూచిస్తోంది. అతను తిరిగి రావడంపై భిన్న స్పందనలు వస్తున్నాయి. ‘జట్టు కోణంలో చూస్తే ఇది సరైన నిర్ణయమే. 40 ఏళ్లు దాటిన వ్యక్తిని మళ్లీ ఆడిస్తున్నారేంటి అని అడగవచ్చు. అయితే గతంలోనూ ఇలాంటివి జరిగాయి.మంచి స్ట్రయికర్ను సిద్ధం చేసేందుకు భారత్ ఎంత ప్రయత్నిస్తున్నా ఫలితం రావడం లేదు. ఐఎస్ఎల్లో బాగా ఆడుతున్న వారంతా విదేశీయులే. పైగా ఛెత్రి సూపర్ ఫిట్‌గా ఉన్నాడు’ అని మాజీ ఆటగాడు ఎం.విజయన్ అభిప్రాయపడ్డారు. ఆసియా కప్ 2027 కోసం ప్రకటించిన 26 మంది సభ్యుల జట్టులో ఛెత్రికి అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) చోటు కల్పించింది. ప్రస్తుతం జరుగుతున్న ఐఎస్ఎల్లో మంచి ఫామ్‌లో ఉన్న ఛెత్రి 12 గోల్స్‌తో టాప్‌స్కోరర్‌గా ఉన్నాడు. వయసుకంటే అతని ఆటను చూడాలని ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడు కళ్యాణ్ చౌబే అన్నారు.‘ఛెత్రి నాయకత్వ లక్షణాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతని స్థాయి ప్లేయర్ మొత్తం జట్టులో స్ఫూర్తిని నింపగలడు. అలాంటి స్ట్రయికర్ ఉంటే భారత జట్టుకు మేలు జరుగుతుంది’ అని ఆయన చెప్పారు. ఛెత్రి రిటైర్మెంట్ తర్వాత నాలుగు మ్యాచ్‌లు ఆడిన భారత్ 3 మ్యాచ్‌లు ‘డ్రా’ చేసుకొని మరో దాంట్లో చిత్తుగా ఓడింది తప్ప ఒక్క విజయమూ దక్కలేదు. రీఎంట్రీ అవసరమా?అయితే ఛెత్రి పునరాగమనం భారత ఫుట్‌బాల్ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో చూపిస్తోంది. అతడు తప్పుకున్న తర్వాత కూడా కనీసం ఒక నాణ్యమైన స్ట్రయికర్ను జట్టు తయారు చేసుకోలేకపోతోంది.‘ఇప్పుడు కాకపోతే కొద్ది రోజులకైనా సరే ఛెత్రి తప్పుకోవాల్సిందే. అప్పుడు ఏం చేస్తారు. ఎప్పటి వరకు అతనిపై ఆధారపడతారు. ఏ ఆటలోనైనా, ఎంత గొప్పవారైనా ఆటను ముగించాల్సిందే. తర్వాతి తరాన్ని తీర్చిదిద్దడం, ప్రతిభను ప్రోత్సహించి ఫలితాలు రాబట్టడం ఫెడరేషన్ చేయాల్సిన పని. కానీ మళ్లీ వచ్చి ఆడమని అడగటం ఏ రకంగాను సరైంది కాదు. ఇప్పటికిప్పుడు ఫలితాలు రాకపోయినా... యువ ఆటగాళ్లను భవిష్యత్తు కోసం సిద్ధం చేసుకుంటే బాగుంటుంది’ అని ఫుట్‌బాల్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఈ నేపథ్యంలో భారత ఫుట్‌బాల్ దిగ్గజం, మాజీ కెప్టెన్ భాయ్చంగ్ భుటియా కూడా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. హెడ్‌కోచ్ మనోలో మీద తీవ్రమైన ఒత్తిడి ఉందని తనకు తెలుసునని.. అయితే, ఛెత్రిని తిరిగి తీసుకురావడం వల్ల దీర్ఘకాలంలో ప్రయోజనాలేమీ కలగవని పేర్కొన్నాడు. ఛెత్రి పునరాగమనం అద్భుతంగా అనిపిస్తున్నా.. భారత ఫుట్‌బాల్ అభివృద్ధికి ఇది ఏమాత్రం దోహదం చేయదని అభిప్రాయపడ్డాడు. నలభై ఏళ్ల ఆటగాడిపై ఆధారపడి జట్టును నడుపుతామని చెప్పడం సరైన సంకేతం కాదని భుటియా పేర్కొన్నాడు. -
భారత పాస్‌పోర్టు అప్పగించేస్తా: ఐపీఎల్ మాజీ చైర్మన్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మాజీ చైర్మన్ లలిత్ మోదీ(Lalit Modi) తన భారత పాస్‌పోర్ట్‌ను అప్పగించేందుకు లండన్‌లోని భారత హైకమిషన్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం వివరాలు వెల్లడించింది. ఐపీఎల్ చైర్మన్‌గా ఉన్న సమయంలో భారీగా నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లలిత్ మోదీ... 2010లో భారత్‌ను వదిలి వెళ్లిపోయాడు.అప్పటి నుంచి లండన్‌లో నివాసముంటున్నాడు. ఈ క్రమంలో పసిఫిక్ దీవుల్లోని వనువాతు(Vanuatu) దేశం పౌరసత్వం కూడా పొందాడు. నిధుల దుర్వినియోగం అంశంలో భారత దర్యాప్తు సంస్థలు చాన్నాళ్లుగా లలిత్ మోదీ కోసం గాలిస్తున్నాయి. ‘లండన్‌లోని భారత హైకమిషన్‌లో లలిత్ మోదీ తన పాస్‌పోర్ట్ అప్పగించేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. నిబంధనల ప్రకారం లలిత్ దరఖాస్తును పరిశీలిస్తాం. వనువాతు పౌరసత్వం పొందాడనే విషయాన్ని కూడా అర్థం చేసుకున్నాం. చట్ట ప్రకారం అతడిపై కేసులు కొనసాగుతున్నాయి’ అని భారత విదేశంగా మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణదీర్ జైస్వాల్ వెల్లడించారు. టీ20 ఫార్మాట్, సినీ గ్లామర్‌తో 2008లో భారత్‌లో ఐపీఎల్ రూపుదిద్దుకుంది. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత సంపన్న లీగ్‌గా కొనసాగుతున్న ఈ మెగా టోర్నీ సృష్టికర్తగా లలిత్ మోదీకి పేరుంది. అయితే, ఎంత వేగంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడో అంతే వేగంగా పతనాన్ని చూశాడు లలిత్. 2010 ఫైనల్ తర్వాత భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అతడిని సస్పెండ్ చేసింది.పుణె, కొచ్చి ఫ్రాంఛైజీల బిడ్ల విషయంలో రిగ్గింగ్‌కు పాల్పడ్డాడని, క్రమశిక్షణారాహిత్యం, ఆర్థిక అవకతవల నేపథ్యంలో అతడిపై బోర్డు వేటు వేసి దర్యాప్తునకు ఆదేశించింది. ఈ క్రమంలో విచారణ కమిటి అతడిపై వచ్చిన అభియోగాలు నిజమేనని తేల్చడంతో 2013లో లలిత్ మోదీపై జీవితకాల నిషేధం విధించింది. అనంతరం అతడు లండన్‌కు పారిపోయి.. బీసీసీఐపై అనేక ఆరోపణలు చేశాడు. తాను అయాకుడినని చెప్పుకునే ప్రయత్నం చేశాడు. -
‘బంగారం’లాంటి ఆటను వదిలి...
లండన్: జేడ్ జోన్స్... బ్రిటన్ ప్రొఫెషనల్ తైక్వాండో ప్లేయర్. అంతేకాదు! స్వదేశంలో జరిగిన 2012 లండన్ ఒలింపిక్స్ క్రీడల్లో... 2016 రియో ఒలింపిక్స్ క్రీడల్లో... మహిళల తైక్వాండో ఈవెంట్లో స్వర్ణ పతకాలు గెలుచుకుంది. తదనంతరం 2020 టోక్యో, 2024 పారిస్ విశ్వక్రీడల్లోనూ జేడ్ పాల్గొంది. 2010లో యూత్ ఒలింపిక్స్ స్వర్ణం మొదలు, ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్, ప్రపంచ చాంపియన్‌షిప్, యూరోపియన్ గేమ్స్, యూరోపియన్ చాంపియన్‌షిప్, గ్రాండ్‌ప్రి ఈవెంట్లలో 36 (19 స్వర్ణాలు, 11 రజతాలు, 6 కాంస్యాలు) పతకాలు గెలుచుకుంది. జేడ్ జోన్స్ పతకాల సంఖ్య ఆమె వయసు (31 ఏళ్లు)ను ఎప్పుడో మించిపోయింది. బహుశా ‘కిక్’ కొడితే పతకాలు రాలుతున్న తైక్వాండో క్రీడాంశం బోర్ కొట్టించిదేమో తెలియదు కానీ ఈ బ్రిటన్ క్రీడాకారిణి ఇప్పుడు కొత్త ‘పంచ్’కు సిద్ధమైంది. బాక్సింగ్‌ను తెగ ఇష్టపడటం వల్లే 20 ఏళ్ల తర్వాత కొత్త కెరీర్లోకి అడుగుపెడుతున్నట్లు జోన్స్ చెప్పింది. రింగ్‌లో ఆమె అపుడే లక్ష్యాన్ని కూడా నిర్దేశించుకుంది. ‘ఇప్పటికే తైక్వాండోలో ప్రపంచ చాంపియన్ అయ్యాను. త్వరలో బాక్సింగ్‌లోనూ ప్రపంచ చాంపియన్ కావాలని ఆశిస్తున్నాను. రెండు వేర్వేరు క్రీడల్లో ఈ ఘనత సాధిస్తే గొప్పగా ఉంటుంది కదూ’ అని చెప్పింది. బ్రిటిష్, కామన్వెల్త్ ఫెదర్వెయిట్ మాజీ చాంపియన్ స్టీఫెన్ స్మిత్ కోచింగ్‌లో తీవ్రస్థాయిలో కసరత్తులు కూడా చేస్తోంది.అయితే మూడు పదుల వయసు దాటిన తర్వాత పూర్తిగా కొత్త క్రీడలో పతకాలు సాధించడం పెద్ద సవాల్ అని చెప్పొచ్చు. 19 ఏళ్ల టీనేజ్లోనే జోన్స్ లండన్ విశ్వక్రీడల్లో బంగారు పతకం గెలిచింది. మళ్లీ నాలుగేళ్ల తర్వాత ‘రియో’లో నిలబెట్టుకుంది. -
రోహిత్ శర్మ భారీ ఇన్నింగ్స్ ఆడితే...
న్యూఢిల్లీ: భారత కెప్టెన్ , స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఫైనల్లో భారీ ఇన్నింగ్స్ ఆడితే అది మ్యాచ్‌నే ప్రభావితం చేస్తుందని క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ విశ్లేషించారు. ‘హిట్‌మ్యాన్’ 25, 30 పరుగులకే పరిమితం కాకుండా ఎక్కువసేపు క్రీజులో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ టోర్నీలో రోహిత్ మెరుపు ఆరంభాల కోసం ప్రతిసారి ఎదురుదాడికి దిగుతున్నాడు. కానీ ఇదే క్రమంలో వెంటనే అవుటవుతున్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్‌పై చేసిన 41 పరుగులే రోహిత్ అత్యధిక స్కోరుగా ఉంది. దీనిపై గావస్కర్ మాట్లాడుతూ ‘ఒకవేళ రోహిత్ 25 ఓవర్లపాటు బ్యాటింగ్ చేస్తే భారత్ 180 నుంచి 200 పరుగులు సాధిస్తుంది. అప్పుడు రెండు, మూడు వికెట్లు పడినా ఇన్నింగ్స్‌కు ఏ ఇబ్బంది ఉండదు. అక్కడి నుంచి సులువుగా 350 పరుగుల మార్క్‌ను దాటేస్తుంది. ఈ విషయాన్ని భారత కెపె్టన్ గుర్తుంచుకోవాలి. ఓపెనింగ్ మెరుపులు మెరిపించి వెళ్లడం కంటే కూడా కాస్త దూకుడుగా ఆడుతూ కనీసం 25–30 ఓవర్ల పాటు క్రీజును అట్టిపెట్టుకుంటే మ్యాచ్ రూపురేఖలే మారుతాయ్. రోహిత్ ఆట ఇన్నింగ్స్‌పై పెను ప్రభావాన్ని చూపిస్తుంది. దీంతో ఫైనల్ మ్యాచ్‌ను ప్రత్యర్థి చేతుల్లోంచి లాగేసుకోవచ్చు’ అని అన్నారు. భారత కెప్టెన్ పాక్‌పై 20, న్యూజిలాండ్‌పై 15, ఆ్రస్టేలియాపై 28 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు అర్ధసెంచరీ కూడా బాదలేకపోయాడు. న్యూజిలాండ్‌కు నాసిర్ హుస్సేన్ మద్దతు చాంపియన్స్ ట్రోఫీలో భారత్ అజేయమైన జట్టే అయినప్పటికీ ఫైనల్లో ట్రోఫీ గెలిచే అర్హత న్యూజిలాండ్‌కే ఉందని ఇంగ్లండ్ మాజీ కెపె్టన్ నాసిర్ హుస్సేన్ అన్నాడు. ‘కివీ క్రికెటర్లు చోకర్లు కాదు. ఒత్తిడిలోనూ నిలబడే స్థైర్యం వారికుంది. ప్రపంచశ్రేణి ఆటగాళ్లు ప్రస్తుత జట్టులో ఉన్నారు. అమీతుమీలో వారంతా శక్తికిమించే పోరాడతారు’ అని వివరించాడు. -
CT 2025: వరుణ్‌తోనే పెను ముప్పు: కివీస్ కోచ్
దుబాయ్: న్యూజిలాండ్ జట్టుకు ‘మిస్టరీ స్పిన్నర్’ వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy) బెంగపట్టుకుంది. అతనితోనే పెద్ద ముప్పు అని స్వయంగా కివీస్ హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ వెల్లడించారు. ఆదివారం ఇక్కడ జరిగే ‘ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy 2025)’ టైటిల్ పోరులో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో కోచ్ స్టెడ్ మీడియాతో మాట్లాడుతూ ‘భారత్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో వరుణ్ తిప్పేశాడు. అతని 5 వికెట్ల ప్రదర్శనే మ్యాచ్‌లో మేం కోలుకోకుండా చేసింది. అతనొక క్లాస్ బౌలర్. తన స్పిన్ నైపుణ్యంతో ఎవరికైనా ఉచ్చు బిగించగలడు. ఫైనల్లోనూ అతనే మాకు పెద్ద సమస్య. అందుకే మేం అతని బౌలింగ్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించాం. ఎలాగైనా ఫైనల్ రోజు అతని ఉచ్చులో పడకుండా బ్యాటింగ్ చేయాలనే ప్రణాళికతో బరిలోకి దిగుతాం’ అని అన్నారు. పలువురు క్రికెటర్లు దుబాయ్ అనుకూలతలపై చేస్తున్న వ్యాఖ్యల్ని ఆయన పెద్దగా పట్టించుకోలేదు. ‘టోర్నీ షెడ్యూల్, వేదికలనేవి మన చేతుల్లో ఉండవు. అందుకే దానిపై అతిగా ఆలోచించం. ఆందోళన చెందం. భారత్ అన్నీ మ్యాచ్‌లు అక్కడ ఆడి ఉండొచ్చు. అలాగే మేం కూడా అక్కడ ఓ మ్యాచ్ ఆడాం. కాబట్టి అక్కడి పరిస్థితులెంటో మాకూ బాగా తెలుసు. ఇలాంటి పెద్ద టోర్నీలో అదికూడా ఎనిమిది జట్ల నుంచి రెండు జట్లు ఫైనల్ దశకు వచ్చాక అనుకూలతలు, ప్రతికూలతలనే సాకులు వెతక్కొద్దు. టైటిల్‌కు ఒక మ్యాచ్ దూరంలో ఉన్నాం. దాని గురించే ఆలోచిస్తాం. వ్యూహాలు రచిస్తాం. మిగతా విషయాల్ని పట్టించుకోం’ అని కోచ్ వివరించారు. షెడ్యూల్ పాక్ నుంచి దుబాయ్‌కి... అక్కడి నుంచి తిరిగి ఇక్కడికి బిజిబిజీగా ఉన్నప్పటికీ న్యూజిలాండ్ ప్రొఫెషనల్ క్రికెటర్లకు ఎలాంటి బడలిక ఇబ్బందులు ఉండబోవని చెప్పారు. ఫైనల్‌కు హెన్రీ దూరం! పేసర్ మ్యాట్ హెన్రీ(Matt Henry) చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆడటం అనుమానంగా మారింది. భుజం నొప్పితో బాధపడుతున్న అతను ఆదివారం మ్యాచ్ సమయానికల్లా కోలుకుంటాడని టీమ్ మేనేజ్మెంట్ గంపెడాశలు పెట్టుకుంది. 33 ఏళ్ల హెన్రీ భారత్‌పై లీగ్ మ్యాచ్‌లో 5/42 గణాంకాలు నమోదు చేయడంతోపాటు ఈ టోర్నీలో మొత్తం 10 వికెట్లు తీశాడు. తన ప్రదర్శనతో ప్రధాన బౌలర్‌గా మారిన అతను దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీస్‌లో గాయపడ్డాడు. ‘మ్యాచ్ సమయంలో కిందపడటంతో అతని భుజానికి స్వల్పగాయమైంది. ఇదేమంత తీవ్రమైంది కాదు. ముందుజాగ్రత్తగా స్కానింగ్ కూడా తీశాం. సానుకూల రిపోర్టు వస్తుందనే ఆశిస్తున్నాం. ఫైనల్లో అతను ఎలాగైనా ఆడాలని మేమంతా గట్టిగా కోరుకుంటున్నాం’ అని కోచ్ స్టెడ్ చెప్పారు. -
మన ఆటలో వేగం పెరగాలి
న్యూఢిల్లీ: అరంగేట్ర మ్యాచ్‌లోనే అనూహ్య గోల్‌తో అదరగొట్టిన భారత మహిళల హాకీ జట్టు యువ ఫార్వర్డ్ సాక్షి రాణా... అంతర్జాతీయ స్థాయిలో నిలకడ కొనసాగించేందుకు ఆటలో వేగం పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. ఇటీవల అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్ సందర్భంగా స్పెయిన్‌తో మ్యాచ్ ద్వారా 17 ఏళ్ల సాక్షి రాణా సీనియర్ స్థాయిలో అరంగేట్రం చేసింది. భువనేశ్వర్ వేదికగా ప్రపంచ ఏడో ర్యాంకర్ స్పెయిన్‌తో జరిగిన పోరులో సాక్షి తన ఆటతీరుతో ఆకట్టుకుంది. ఆ మ్యాచ్‌లో భారత్ 3–4 గోల్స్ తేడాతో స్పెయిన్ చేతిలో ఓడినప్పటికీ... సాక్షి మాత్రం చక్కటి ‘ఫీల్డ్ గోల్’తో తనదైన ముద్ర వేసింది. జూనియర్ స్థాయిలో చక్కటి ప్రదర్శనతో సీనియర్ జట్టుకు ఎంపికైన సాక్షి రాణా... మొదటి మ్యాచ్‌లోనే గోల్ చేయడం చాలా ఆనందంగా ఉందని చెప్పింది. ‘సీనియర్ జట్టు తరఫున అరంగేట్రం చేసేందుకు చాన్నాళ్లుగా ఎదురుచూశా.తొలి మ్యాచ్‌లో సీనియర్ ప్లేయర్లు ఎంతగానో సహకరించారు. అంతర్జాతీయ స్థాయిలో మొదటి పోరును ఆస్వాదించమని సూచించారు. దీంతో ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడగలిగా’ అని సాక్షి వెల్లడించింది. స్పెయిన్‌తో మ్యాచ్‌లో ప్రత్యర్థి ప్లేయర్ల నుంచి సర్కిల్లో బంతి చేజిక్కించుకున్న సాక్షి దానిని గోల్‌గా మలిచింది. ‘తొలి మ్యాచ్‌లోనే గోల్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా. దాని కోసం తీవ్రంగా శ్రమించా. మ్యాచ్ సమయంలో నా చేతికి బంతి దొరికినప్పుడు చుట్టుపక్కల ఎవరూ లేరని గమనించా. అదే అదునుగా షాట్ కొట్టా. దీంతో ఒక్కసారిగా అందరూ అరవడం ప్రారంభించారు. అప్పుడుగోల్ కొట్టానని అర్థమైంది’ అని సాక్షి చెప్పింది. ఎఫ్ఐహెచ్ ప్రొ హాకీ లీగ్‌లో భాగంగా స్పెయిన్, జర్మనీ జట్లపై ఆడిన సాక్షి... విదేశీ ప్లేయర్లతో పోటీపడాలంటే ఆటలో మరింత వేగం పెంపొందించుకోవాలని సాక్షి అభిప్రాయపడింది. ‘అంతర్జాతీయ స్థాయి లో రాణించాలంటే మరింత వేగం, చురుకుదనం పెంచుకోవాలని అర్థమైంది. ఫార్వర్డ్‌గా అది నాకు మరింత కీలకం. అందుకే ఇప్పుడు దానిపై దృష్టి సారించా. ప్రొ హాకీ లీగ్‌కు స్టాండ్‌బై ప్లేయర్‌గా ఎంపికయ్యా. చీఫ్ కోచ్ హరేంద్ర సింగ్ తొలి మ్యాచ్ ఆడుతున్నావు అని చెప్పినప్పుడు చాలా సంతోషం వేసింది. నిన్ను మాత్రమే జట్టుకు ఎంపిక చేయలేదు... నీ ఆటను కూడా సెలెక్ట్ చేశాం... మైదానంలో విజృంభించు అని కోచ్ వెన్నుతట్టారు.దీంతో ఆత్మవిశ్వాసంతో ఆడగలిగాను’ అని సాక్షి చెప్పింది. గతేడాది జూనియర్ ఆసియా కప్‌లో పసిడి పతకం గెలిచిన భారత జట్టులో సభ్యురాలైన సాక్షి... ఈ ఏడాది చిలీ వేదికగా జరగనున్న జూనియర్ ప్రపంచకప్‌లో యువ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించనుంది. -
గుజరాత్ జెయింట్స్ జోరు
లక్నో: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో గుజరాత్ జెయింట్స్ వరుసగా మూడో విజయాన్ని అందుకొని పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది. శుక్రవారం జరిగిన ఈ పోరులో జెయింట్స్ 5 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. గుజరాత్ జెయింట్స్ గెలుపుతో యూపీ వారియర్స్ జట్టు అధికారికంగా ‘ప్లే ఆఫ్’ రేసు నుంచి దూరమైంది. గుజరాత్‌తో పోరులో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. కెప్టెన్ మెగ్ లానింగ్ (57 బంతుల్లో 92; 15 ఫోర్లు, 1 సిక్స్) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగగా... మరో ఓపెనర్ షఫాలీ వర్మ (27 బంతుల్లో 40; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా రాణించింది. వీరిద్దరు తొలి వికెట్‌కు 54 బంతుల్లోనే 83 పరుగులు జోడించారు. జెయింట్స్ బౌలర్లలో మేఘనా సింగ్ 3 వికెట్లు పడగొట్టగా, డియాండ్రా డాటిన్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం గుజరాత్ జెయింట్స్ 19.3 ఓవర్లలో 5 వికెట్లకు 178 పరుగులు సాధించి గెలిచింది.హర్లీన్ డియోల్ (49 బంతుల్లో 70 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా, బెత్ మూనీ (35 బంతుల్లో 44; 6 ఫోర్లు) రాణించింది. వీరిద్దరు రెండో వికెట్‌కు 57 బంతుల్లో 85 పరుగులు జత చేశారు. చివర్లో డాటిన్ (10 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఆష్లీ గార్డ్నర్ (13 బంతుల్లో 22; 1 ఫోర్, 2 సిక్స్‌లు) దూకుడైన బ్యాటింగ్ జెయింట్స్ విజయానికి కారణమయ్యాయి. ఈ మ్యాచ్‌లో గెలిస్తే నేరుగా ఫైనల్ చేరగలిగే స్థితిలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ నిరాశగా తమ చివరిదైన ఎనిమిదో లీగ్ మ్యాచ్‌ను ముగించింది. నేడు జరిగే మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో యూపీ వారియర్స్ తలపడుతుంది. ‘ప్లే ఆఫ్’ రేసులో నిలవాలంటే బెంగళూరు జట్టు ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: లానింగ్ (బి) డాటిన్ 92; షఫాలీ (సి) లిచ్‌ఫీల్డ్ (బి) మేఘన 40; జొనాసెన్ (బి) డాటిన్ 9; జెమీమా (సి) గార్డ్నర్ (బి) మేఘన 4; అనాబెల్ (సి) డాటిన్ (బి) మేఘన 14; కాప్ (నాటౌట్) 7; బ్రైస్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 177. వికెట్ల పతనం: 1–83, 2–108, 3–119, 4–141, 5–171. బౌలింగ్: డాటిన్ 4–0–37–2, కాశ్వీ 3–0–32–0, తనూజ 4–0–31–0, మేఘన 4–0–35–3, గార్డ్నర్ 2–0–18–0, ప్రియ 2–0–21–0 గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్: బెత్ మూనీ (సి) అనాబెల్ (బి) మిన్ను మణి 44; హేమలత (సి) లానింగ్ (బి) శిఖా 1; హర్లీన్ (నాటౌట్) 70; ఆష్లీ గార్డ్నర్ (సి) మిన్ను మణి (బి) శిఖా 22; డాటిన్ (సి) జెమీమా (బి) జొనాసెన్ 24; లిచ్‌ఫీల్డ్ (సి) షఫాలీ (బి) జొనాసెన్ 0; కాశ్వీ (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (19.3 ఓవర్లలో 5 వికెట్లకు) 178. వికెట్ల పతనం: 1–4, 2–89, 3–128, 4–162, 5–162. బౌలింగ్: మరిజాన్ కాప్ 4–1–29–0, శిఖా పాండే 4–0–31–2, అనాబెల్ సదర్లాండ్ 4–0–45–0, టిటాస్ సాధు 2–0–17–0, మిన్ను మణి 2–0–15–1, జొనాసెన్ 3.3–0–38–2. -
‘క్రీడాకారులకు ప్రత్యేక ఐడీ’
సాక్షి, హైదరాబాద్: దేశంలో ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా అన్నారు. ఇందు కోసం భిన్నమైన పలు కార్యక్రమాలు చేపట్టిందని ఆయన వెల్లడించారు. మాండవియా అధ్యక్షతన భారత క్రీడా రంగం మెరుగుదల, భవిష్యత్తుకు సంబంధించి శుక్రవారం ప్రత్యేక ‘చింతన్ శిబిర్’ ప్రారంభమైంది. నగర శివార్లలో కన్హా శాంతి వనంలో జరుగుతున్న రెండు రోజుల ఈ శిబిరం శనివారం ముగుస్తుంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన క్రీడా శాఖల మంత్రులు, క్రీడా పరిపాలకులు, సీనియర్ ప్రభుత్వాధికారులతో పాటు కేంద్ర క్రీడాశాఖ సహాయ మంత్రి రక్ష ఖడ్సే కూడా దీనికి హాజరయ్యారు. ప్రపంచ క్రీడల్లో భారత్ స్థాయిని మరింత పెంచే దిశగా పలు ఆలోచనలను పంచుకున్న వీరంతా అందుకు తగిన విధంగా రూట్ మ్యాప్ కోసం తమ వంతు సూచనలు అందించారు. ముఖ్యంగా 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో భారత్ పెద్ద సంఖ్యలో పతకాలు సాధించే లక్ష్యంతోపాటు 2036 ఒలింపిక్స్‌కు భారత్ ఆతిథ్యం ఇచ్చే అంశంపై ఈ కార్యక్రమంలో చర్చ జరిగింది. ఒలింపిక్స్‌ను మన దేశం నిర్వహించాలనే కలకు ఈ చింతన్ శిబిర్ నుంచి తొలి అడుగు పడాలని మాండవియా అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో దేశంలో ఉన్న క్రీడా ప్రతిభ వృథా కాకుండా ఉండేందుకు తాము ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు.‘ప్రతిభాన్వేషణలో ఖేలో ఇండియా వంటి పథకాలు కీలక పాత్ర పోషించాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 937 ఖేలో ఇండియా కేంద్రాలు సమర్థంగా పని చేస్తున్నాయి. 9–14 ఏళ్ల మధ్య వయసు ఉన్న ఆటగాళ్లను గుర్తించి తీర్చిదిద్దితే ఒలింపిక్స్‌లో మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు సాంకేతికతను వాడుకోవడం కూడా కీలకాంశం. దీని కోసం ప్రభుత్వం ఒక కొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. ఆటగాళ్ల వివరాలను ఒకే చోట నమోదు చేసి ప్రత్యేక ఐడీలు ఇవ్వబోతున్నాం. అలా చేస్తే వారిని తగిన రీతిలో ప్రోత్సహిస్తూ పురోగతిని పరిశీలించేందుకు అవకాశం ఉంటుంది’ అని మాండవియా వెల్లడించారు. ఒలింపిక్ మిషన్ కోసం జాతీయ క్రీడా సమాఖ్యలు మరింత సమర్థంగా పని చేయాల్సి ఉంటుందన్న కేంద్ర మంత్రి... ఆటగాళ్ల సెలక్షన్స్‌లో పారదర్శకత పాటిస్తే తల్లిదండ్రులు మరింత పెద్ద సంఖ్యలో తమ పిల్లలను క్రీడల వైపు తీసుకొస్తారని విశ్లేషించారు. కార్యక్రమంలో పాల్గొన్నవారంతా క్రీడాభివృద్ధి కోసం తమ సలహాలు అందించారు. దేశవ్యాప్తంగా జిల్లా స్థాయి స్పోర్ట్స్ స్కూల్లను ఏర్పాటు చేయాలని, అందుబాటులో ఉన్న స్టేడియంలు తదితర మౌలిక సౌకర్యాలను సమర్థంగా వాడుకునేలా చూడాలని వారు సూచించారు. -
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు ముందు కోహ్లిని ఊరిస్తున్న మూడు భారీ రికార్డులు
భారత్, న్యూజిలాండ్ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ మార్చి 9న దుబాయ్ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి మూడు భారీ రికార్డులు ఊరిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో కోహ్లి మరో 95 పరుగులు చేస్తే వన్డేల్లో న్యూజిలాండ్‌పై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా అవతరిస్తాడు. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమిస్తాడు. సచిన్ వన్డేల్లో న్యూజిలాండ్‌పై 1750 పరుగులు చేయగా.. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 1656 పరుగులు ఉన్నాయి.ఈ మ్యాచ్‌లో (ఫైనల్లో) విరాట్ సెంచరీ సాధిస్తే.. వన్డేల్లో న్యూజిలాండ్‌పై అత్యధిక సెంచరీలు చేసిన భారత బ్యాటర్‌గా సరికొత్త రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు విరాట్, వీరేంద్ర సెహ్వాగ్ పేరిట సంయుక్తంగా ఉంది. వీరిద్దరూ వన్డేల్లో న్యూజిలాండ్‌పై చెరో 6 సెంచరీలు బాదారు.ఈ మ్యాచ్‌లో విరాట్ మరో 128 పరుగులు చేస్తే.. ఐసీసీ వన్డే నాకౌట్స్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా అవతరిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. ఐసీసీ వన్డే నాకౌట్స్‌లో మాస్టర్ బ్లాస్టర్ 657 పరుగులు చేశాడు. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 530 పరుగులు ఉన్నాయి.ఈ మ్యాచ్‌లో విరాట్ హాఫ్ సెంచరీ చేస్తే ఐసీసీ వన్డే నాకౌట్స్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా సచిన్ సరసన నిలుస్తాడు. సచిన్ ఐసీసీ నాకౌట్స్‌లో ఆరు అర్ద సెంచరీలు చేయగా.. ప్రస్తుతం విరాట్ ఖాతాలో ఐదు అర్ద శతకాలు ఉన్నాయి.ప్రస్తుతం విరాట్ ఉన్న ఫామ్ ప్రకారం చూస్తే పైన ఉన్న మూడు రికార్డులు బద్దలు కావడం ఖాయంగా కనిపిస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో విరాట్ ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడి 72.33 సగటున, 83.14 స్ట్రయిక్‌రేట్‌తో 217 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ ఉన్నాయి. ఫైనల్లో విరాట్ సెంచరీ చేస్తే వన్డేల్లో 52వ శతకం.. ఓవరాల్‌గా 83వ శతకం అవుతుంది.విరాట్ ఫైనల్లో న్యూజిలాండ్‌పై సెంచరీ సాధించాలని ప్రతి భారత క్రికెట్ అభిమాని కోరుకుంటున్నాడు. అలాగే ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ కూడా ఫామ్‌లోకి రావాలని టీమిండియా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. టీమిండియాకు కృష్ణార్జులు లాంటి రోహిత్, కోహ్లి భారత్‌కు మరో ఐసీసీ టైటిల్ అందించాలని యావత్ భారతం ఆశిస్తుంది.టీమిండియాకు చెడు సూచకంఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు ముందు టీమిండియాకు చెడు సూచిస్తుంది. ఐసీసీ టోర్నీల ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌ను ఎదుర్కొన్న ప్రతిసారి భారత్‌కు అపజయమే ఎదురైంది. ఐసీసీ టోర్నీల ఫైనల్స్‌లో భారత్, న్యూజిలాండ్ ఇప్పటివరకు రెండు సార్లు ఎదురెదురుపడ్డాయి. తొలిసారి ఈ ఇరు జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ-2000 ఎడిషన్ ఫైనల్లో తలపడ్డాయి. నాడు న్యూజిలాండ్ భారత్‌ను ఓడించి తమ తొలి ఐసీసీ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ ఇరు జట్లు ఇనాగురల్ డబ్ల్యూటీసీ ఫైనల్లో (2019-2021) రెండో సారి పోటీపడ్డాయి. ఈసారి కూడా న్యూజిలాండ్ భారత్‌ను ఓడించి తమ రెండో ఐసీసీ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. న్యూజిలాండ్, తమ రెండు ఐసీసీ టైటిళ్లను భారత్‌పైనే గెలవడం విశేషం. -
పాపం క్లాసెన్.. ఎక్కడికి వెళ్లినా చేదు అనుభవమే..!
అంతర్జాతీయ క్రికెట్లో సౌతాఫ్రికా ఎంత దురదృష్టమైన జట్టో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఐసీసీ టోర్నీలో ఈ జట్టు దురదృష్టం పతాకస్థాయిలో ఉంటుంది. అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ (1991) ఇచ్చిన నాటి నుంచి సౌతాఫ్రికా ఒకే ఒక ఐసీసీ టైటిల్ (1998 ఛాంపియన్స్ ట్రోఫీ) గెలిచింది. టన్నుల కొద్ది టాలెంట్ ఉన్నా ఈ జట్టుకు అదృష్టం కలిసి రాదు. ఐసీసీ టోర్నీల్లో మొదటి దశలో రెచ్చిపోయే సౌతాఫ్రికన్లు నాకౌట్ మ్యాచ్‌లు వచ్చే సరికి తేలిపోతారు. నాకౌట్ మ్యాచ్‌ల్లో.. ముఖ్యంగా సెమీఫైనల్స్‌లో సౌతాఫ్రికాను ఏదో ఒక రూపంలో దురదృష్టం వెంటాడుతుంది. తాజాగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనలే ఇందుకు నిదర్శనం.కాగా, సౌతాఫ్రికా దురదృష్టాన్ని ఆ జట్టు విధ్వంసకర బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ కొనసాగిస్తున్నాడు. క్లాసెన్ ఎక్కడ నాకౌట్ మ్యాచ్‌లు ఆడినా అతని జట్టు ఓటమిపాలవుతుంది. క్లాసెన్ నాకౌట్ ఫోబియా ఒక్క సౌతాఫ్రికాకే పరిమితం కాలేదు. ప్రైవేట్ లీగ్‌ల్లోనూ క్లాసెన్‌ను నాకౌట్ బూచి వెంటాడుతుంది. ప్రైవేట్ లీగ్‌ల్లో క్లాసెన్ ఆడిన మూడు నాకౌట్ మ్యాచ్‌ల్లో అతను ప్రాతినిథ్యం వహించిన జట్లు ఓడాయి. 2023 మేజర్ లీగ్ క్రికెట్ ఫైనల్లో క్లాసెన్ ప్రాతినిత్యం వహించిన సియాటిల్ ఓర్కాస్ ముంబై ఇండియన్స్ న్యూయార్క్ చేతుల్లో ఓడింది.2024 సౌతాఫ్రికా టీ20 లీగ్ ఫైనల్లో క్లాసెన్ ప్రాతినిథ్యం వహించిన డర్బన్ సూపర్ జెయింట్స్ సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్ చేతుల్లో ఓటమిపాలైంది. 2024 ఐపీఎల్ ఫైనల్లో క్లాసెన్ ప్రాతినిథ్యం వహించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కేకేఆర్ చేతుల్లో పరాజయంపాలైంది.తొలి నాకౌట్ నుంచే..క్లాసెన్ ప్రాతినిథ్యం వహించిన తొలి ఐసీసీ నాకౌట్లోనే సౌతాఫ్రికా ఓటమిపాలైంది. 2023 వన్డే సెమీఫైనల్లో సౌతాఫ్రికా ఆస్ట్రేలియా చేతిలో చిత్తైంది. క్లాసెన్ ప్రాతినిథ్యం వహించిన రెండో ఐసీసీ నాకౌట్లో సౌతాఫ్రికా గుండెబద్దలైంది. 2024 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో ఆ జట్టు భారత్ చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైంది. తాజాగా క్లాసెన్ ప్రాతినిథ్యం వహించిన మూడో ఐసీసీ నాకౌట్లో కూడా సౌతాఫ్రికాకు చేదు అనుభవమే మిగిలింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌లో సౌతాఫ్రికాను న్యూజిలాండ్ చిత్తుగా ఓడించింది. నాకౌట్ మ్యాచ్‌ల్లో ఇన్ని పరాభవాలు ఎదురుకావడంతో క్లాసెన్‌పై క్రికెట్ అభిమానులు జాలి చూపిస్తున్నారు. పాపం క్లాసెన్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇదిలా ఉంటే, ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో సౌతాఫ్రికా గ్రూప్ దశలో అదిరిపోయే ప్రదర్శనలు చేసింది. ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లండ్‌పై ఘన విజయాలు సాధించింది. ఆస్ట్రేలియాతో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. అయినప్పటికీ సౌతాఫ్రికా గ్రూప్ టాపర్‌గా సెమీస్‌కు చేరింది. సెమీస్‌లోనూ మంచి ప్రదర్శనే చేసినప్పటికీ న్యూజిలాండ్ బ్యాటర్లు రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ సూపర్ సెంచరీలు చేసి సౌతాఫ్రికా చేతి నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నారు. సెమీస్‌లో సౌతాఫ్రికాను చిత్తు చేసిన న్యూజిలాండ్ ఫైనల్లో భారత్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది. -
ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్: జియోస్టార్ సరికొత్త రికార్డ్
జియోస్టార్ టీవీ.. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో లైవ్ స్పోర్ట్స్ ప్రసార అనుభవాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపరుస్తూనే ఉంది. ఇటీవల జరిగిన ఐసీసీ మెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 'ఇండియా vs పాకిస్తాన్' మ్యాచ్‌ను 20.6 కోట్లమంది వీక్షించారు. ఇది బీఏఆర్సీ చరిత్రలోనే ఎక్కువమంది వీక్షించిన రెండవ క్రికెట్ మ్యాచ్‌గా (వరల్డ్ కప్ మ్యాచ్‌లు మినహా) నిలిచింది.2025 ఫిబ్రవరి 23న జరిగిన ఐసీసీ పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా జరిగిన భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఈ మ్యాచ్‌ను 20.6 కోట్లమంది వీక్షించారు. ఈ సంఖ్య 2023లో అహ్మదాబాద్‌లో జరిగిన ఓడీఐ ప్రపంచ కప్ మ్యాచ్ కంటే దాదాపు 11% ఎక్కువ. ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ ఇండియా 2023లో జరిగిన మ్యాచ్‌తో పోలిస్తే రేటింగ్లలో 10% కంటే ఎక్కువ. వ్యూయ్స్ టైమ్ కూడా 2609 కోట్ల నిమిషాలుగా నమోదైంది.భారతదేశంలో జరుగుతున్న క్రీడా కార్యక్రమాలతో జియోస్టార్ కొత్త మైలురాళ్లను చేరుకుంటోంది. అభిమానుల అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి, మా ప్రేక్షకుల సంఖ్యను విస్తరించడానికి మేము కట్టుబడి ఉన్నామని జియోస్టార్ ప్రతినిధి వ్యాఖ్యానించారు. ఈ మ్యాచ్‌ను మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ కలిసి ప్రత్యక్షంగా వీక్షించారు. -
రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్న టీమిండియా మాజీ కెప్టెన్
భారత ఫుట్‌బాల్ దిగ్గజం, టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ ఛెత్రీ మళ్లీ నీలం రంగు జెర్సీతో బరిలోకి దిగనున్నాడు. 40 ఏళ్ల ఛెత్రీ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్లు ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ ప్రకటించింది. ఛెత్రీ త్వరలో జరుగనున్న ఫిఫా ఇంటర్నేషనల్ విండోలో భారత్ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఫిఫా ఇంటర్నేషనల్ విండో కోసం ప్రకటించిన 26 మంది సభ్యుల భారత జట్టులో ఛెత్రీకి చోటు దక్కింది. ఏడాది గడుస్తున్నా భారత జట్టులో తన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేకపోవడంతో రిటైర్మెంట్ విషయంలో ఛెత్రీ మనసు మార్చుకున్నాడు. పదేళ్లకు పైగా భారత జట్టుకు నాయకత్వం వహించిన ఛెత్రీ.. గతేడాది జూన్ 6న రిటైర్మెంట్ ప్రకటించాడు. కోల్‌కతాలో కువైట్‌తో జరిగిన ఫిఫా వరల్డ్‌కప్ క్వాలిఫయింగ్ మ్యాచ్ ఛెత్రీకి చివరిది.2005లో భారత్ తరఫున అరంగ్రేటం చేసిన ఛెత్రీ.. భారత ఆల్‌టైమ్ లీడింగ్ గోల్ స్కోరర్‌గా కెరీర్ ముగించాడు. ఛెత్రీ భారత్ తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగానూ రికార్డు కలిగి ఉన్నాడు. ఛెత్రీ తన కెరీర్లో 94 అంతర్జాతీయ గోల్స్ సాధించాడు. పురుషుల అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో నాలుగో అత్యధిక గోల్ స్కోరర్‌గా ఛెత్రీ కొనసాగుతున్నాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో దిగ్గజాలు క్రిస్టియానో రొనాల్డో, లియోనల్ మెస్సీ, అలీ డై మాత్రమే ఛెత్రీ కంటే ఎక్కువ గోల్స్ చేశారు.ఛెత్రీ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికినప్పటికీ.. ఇండియన్ సూపర్ లీగ్‌లో బెంగళూరు ఎఫ్సీకి ప్రాతినిథ్యం వహిస్తూనే ఉన్నాడు. ఈ సీజన్లో ఛెత్రీ 12 మ్యాచ్‌ల్లో 23 గోల్స్ చేసి ఐఎస్ఎల్లో భారత్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు.కాగా, భారత ఫుట్‌బాల్ జట్టు ఏఎఫ్సీ ఆసియా కప్ సౌదీ అరేబియా 2027 క్వాలిఫయర్స్ ఫైనల్ రౌండ్ సన్నాహకాల్లో భాగంగా మార్చి 19న మాల్దీవ్స్‌తో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనుంది. అనంతరం భారత్ ఏఎఫ్సీ ఆసియా కప్-2027 క్వాలిఫయర్స్‌లో (మార్చి 25) బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ టోర్నీలో భారత్.. బంగ్లాదేశ్, హాంగ్‌కాంగ్, సింగపూర్ జట్లతో పోటీపడనుంది. ఈ టోర్నీలో భారత్ మ్యాచ్‌లు షిల్లాంగ్‌లోని జవహర్ లాల్ స్టేడియంలో జరుగనున్నాయి.ఫిఫా ఇంటర్నేషనల్ విండో కోసం భారత జట్టు..గోల్ కీపర్స్- అమరిందర్ సింగ్, గుర్మీత్ సింగ్, విశాల్ కైత్డిఫెండర్స్- ఆషికి కురునియన్, ఆయుశ్ దేవ్ ఛెత్రీ, బ్రాండన్ ఫెర్నాండెస్, బ్రైసన్ ఫెర్నాండెస్, జీక్సన్ సింగ్ థౌనౌజమ్, లాలెంగ్మావియా, లిస్టన్ కొలాకో, మహేశ్ సింగ్ నోరెమ్, సురేశ్ సింగ్ వాంగ్జమ్ఫార్వర్డ్స్- సునీల్ ఛెత్రీ, ఫరూక్ ఛౌదరీ, ఇర్ఫాన్ యద్వాద్, లల్లియన్జువాలా ఛంగ్టే, మన్వీర్ సింగ్ -
వీరేంద్ర సెహ్వాగ్ సోదరుడు అరెస్ట్
టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సోదరుడు వినోద్ సెహ్వాగ్ అరెస్ట్ అయ్యాడు. చెక్ బౌన్స్ కేసులో చండీఘడ్ పోలీసులు వినోద్ సెహ్వాగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి అనేక మార్లు విచారణకు హాజరుకాకపోవడంతో 2023లో స్థానిక కోర్టు వినోద్ సెహ్వాగ్‌తో పాటు మరో ఇద్దరిని దోషులుగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే వినోద్ అరెస్ట్ జరిగింది. అరెస్ట్ అనంతరం వినోద్ తరఫు న్యాయవాది సెషన్స్ కోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను పోలీసులు వ్యతిరేకించారు. దీంతో దీనిపై విచారణ మార్చి 10కి వాయిదా పడింది. అప్పటివరకు వినోద్ సెహ్వాగ్ పోలీసుల కస్టడీలోనే ఉండనున్నాడు.అసలేం జరిగిందంటే.. క్సాల్టా ఫుడ్ అండ్ బేవరేజెస్ కంపెనీలో వినోద్ సెహ్వాగ్‌తో పాటు విష్ణు మిట్టల్, సుధీర్ మల్హోత్రా డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ కంపెనీ 2018లో శ్రీ నైనా ప్లాస్టిక్స్ నుండి రూ. 7 కోట్ల విలువైన వస్తువులు కొనుగోలు చేసింది. చెల్లింపుగా, కంపెనీ రూ. కోటి చొప్పున ఏడు వేర్వేరు చెక్కులను జారీ చేసింది.అయితే అకౌంట్లో సరిపడా నిధులు లేని కారణంగా అన్ని చెక్కులు బౌన్స్ అయ్యాయి. పలు ఫాలోఅప్‌ల అనంతరం శ్రీ నైనా ప్లాస్టిక్స్ అధినేత కృష్ణణ్ మోహన్ ఖన్నా కోర్టును ఆశ్రయించారు. స్థానిక కోర్టు క్సాల్టా ఫుడ్ అండ్ బేవరేజెస్ డైరెక్టర్లైన వినోద్ సెహ్వాగ్, విష్ణు మిట్టల్, సుధీర్ మల్హోత్రాను నిందితులుగా ప్రకటించింది. ఈ తీర్పుపై వినోద్ సెహ్వాగ్ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు.ఇదిలా ఉంటే, వీరేంద్ర సెహ్వాగ్‌కు సంబంధించి ఇటీవలికాలంలో వచ్చిన రెండో వార్త ఇది. వీరూ అతని భార్యతో విడాకులు తీసుకోనున్నాడని కొద్ది రోజుల కిందట సోషల్‌మీడియా కోడై కూసింది. ఇన్‌స్టాలో వీరూ, అతని సతీమణి ఇద్దరు అన్‌ఫాలో చేయడంతో ఈ ప్రచారం మొదలైంది. వీరూ గత కొద్ది రోజులుగా తన భార్యను విడిచి పెట్టి, తన ఇద్దరు పిల్లలతో పాటు వేరుగా ఉంటున్నట్లు తెలుస్తుంది. తరుచూ పుణ్యక్షేత్రాలు తిరిగే వీరూ ఈ మధ్యకాలంలో ఒంటరిగా ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు.46 ఏళ్ల వీరేంద్ర సెహ్వాగ్ 2013లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అప్పటినుంచి కామెంటేటర్‌గా, విశ్లేషకుడిగా క్రికెట్‌తో సంబంధం కలిగి ఉంటున్నాడు. సెహ్వాగ్‌కు ఇద్దరు కొడుకులు. ఈ ఇద్దరూ క్రికెటర్లే కావడం విశేషం. సెహ్వాగ్ పెద్ద కొడుకు ఇటీవలికాలంలో జూనియర్ క్రికెట్లో సత్తా చాటి వార్తల్లో నిలిచాడు. సెహ్వాగ్‌కు టీమిండియా విధ్వంసకర బ్యాటర్‌గా పేరుండేది. సెహ్వాగ్ భారత్ తరఫున టెస్ట్‌ల్లో తొలి ట్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. సెహ్వాగ్ తన కెరీర్లో రెండు ట్రిపుల్ సెంచరీలు చేశాడు. కేవలం బ్రాడ్‌మన్, గేల్, లారా మాత్రమే ఈ ఘనత సాధించారు. -
Champions Trophy 2025: శ్రేయస్ అయ్యర్‌కు ప్రమోషన్
టీమిండియా స్టార్ మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు ప్రమోషన్ లభించనుందని తెలుస్తుంది. శ్రేయస్ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను తిరిగి దక్కించుకోనున్నాడని సమాచారం. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో అద్భుత ప్రదర్శనల తర్వాత బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. శ్రేయస్ గతేడాది మార్చిలో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయాడు. 2023 వన్డే వరల్డ్‌కప్‌లో అంచనాలకు మించి రాణించినప్పటికీ బీసీసీఐ అతని కాంట్రాక్ట్‌ను పునరుద్దరించలేదు. గత మార్చిలో శ్రేయస్‌తో పాటు ఇషాన్ కిషన్ కూడా బీసీసీఐ కాంట్రాక్ట్‌ను కోల్పోయాడు.శ్రేయస్ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయాక టీమిండియాలో స్థానాన్ని కూడా చేజార్చుకున్నాడు. అయితే దేశవాలీ టోర్నీల్లో అద్భుతంగా రాణించి గోడకు కొట్టిన బంతిలా తిరిగి జట్టులో చోటు సంపాదించాడు. రీఎంట్రీలో శ్రేయస్ మరింత రెచ్చిపోయి ఆడుతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో 4 మ్యాచ్‌లు ఆడి 79.92 స్ట్రయిక్‌రేట్‌తో 195 పరుగులు చేశాడు. శ్రేయస్ ప్రదర్శనల ఆధారంగా టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీలో అజేయంగా ఫైనల్‌కు చేరింది.ఈ టోర్నీలో శ్రేయస్ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అత్యంత కీలకమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. మొదటి బ్యాటింగ్‌తో పాటు ఛేదనలోనూ సత్తా చాటాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో నిరాశపరిచిన (17 బంతుల్లో 15) శ్రేయస్.. ఆతర్వాత చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో (67 బంతుల్లో 56) మెరిశాడు. చివరి గ్రూప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై మరో హాఫ్ సెంచరీ చేసిన శ్రేయస్.. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో విరాట్ కోహ్లితో కలిసి కీలక ఇన్నింగ్స్ (45) ఆడి భారత విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనల తర్వాత శ్రేయస్‌కు ఎందుకు సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వకూడదని చర్చ మొదలైంది. దీంతో బీసీసీఐ శ్రేయస్‌కు తిరిగి సెంట్రల్ కాంట్రాక్ట్ ఇచ్చి గౌరవించుకోవాలని భావిస్తుంది. బీసీసీఐ మరికొద్ది రోజుల్లో అధికారికంగా సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాను ప్రకటించనుంది. సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలోకి కొత్తగా వరుణ్ చక్రవర్తి వచ్చే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే, ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. సెమీస్‌లో ఆసీస్‌ను మట్టికరిపించిన భారత్ తుది సమరానికి అర్హత సాధించింది. మరోవైపు న్యూజిలాండ్ సెమీస్‌లో సౌతాఫ్రికాను చిత్తు చేసి తుది పోరుకు అర్హత సాధించింది. భారత్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ ఈనెల 9వ తేదీన దుబాయ్ వేదికగా జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది.ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ తలపడటం ఇది రెండో సారి. 2000 ఎడిషన్‌లో ఇరు జట్లు ఎదురెదురుపడగా.. న్యూజిలాండ్ భారత్‌ను ఓడించి తమ తొలి ఐసీసీ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ ఇరు జట్లు ఇనాగురల్ డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ (2019-2021) తలపడ్డాయి. ఈసారి కూడా న్యూజిలాండ్ భారత్‌ను ఓడించి తమ రెండో ఐసీసీ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. న్యూజిలాండ్, తమ రెండు ఐసీసీ టైటిళ్లను భారత్‌పైనే గెలవడం విశేషం. -
Ind vs NZ: ఫైనల్‌కు వర్షం ముప్పు లేదు! కానీ ‘టై’ అయితే.. విజేతగా ఎవరు?
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) తుది అంకానికి చేరుకుంది. మొత్తం ఎనిమిది జట్లు భాగమైన ఈ వన్డే టోర్నమెంట్లో టీమిండియా- న్యూజిలాండ్(India vs New Zealand) ఫైనల్‌కు చేరుకున్నాయి. టైటిల్ కోసం దుబాయ్ వేదికగా ఆదివారం ఇరుజట్లు తలపడనున్నాయి. కాగా ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లలో కివీస్ భారత జట్టుపై మెరుగైన రికార్డు కలిగి ఉంది.పాతికేళ్ల క్రితం అలా2000లో చాంపియన్స్ ట్రోఫీ(నాడు ఐసీసీ నాకౌట్ ట్రోఫీ) తుదిపోరులో టీమిండియాపై గెలుపొంది న్యూజిలాండ్ టైటిల్ సాధించింది. అనంతరం 2019 వన్డే వరల్డ్‌కప్ సెమీ ఫైనల్లో కోహ్లి సేనను ఓడించడంతో పాటు.. 2023 వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(World Test Championship) ఫైనల్లోనూ టీమిండియాపై గెలుపొంది ట్రోఫీని ఎగురేసుకుపోయింది.ఈ క్రమంలో సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్-2023లో భారత్ న్యూజిలాండ్‌పై ప్రతీకారం తీర్చుకుంది. సెమీస్ మ్యాచ్‌లో కివీస్‌ను చిత్తు చేసి ఫైనల్‌కు దూసుకువెళ్లింది. ఇక తాజా చాంపియన్స్ ట్రోఫీ ఎడిషన్ గ్రూప్ దశలోనూ రోహిత్ సేనదే సాంట్నర్ బృందంపై పైచేయిగా ఉంది. గ్రూప్-‘ఎ’ నుంచి పోటీపడ్డ ఈ రెండు జట్లు బంగ్లాదేశ్, పాకిస్తాన్లను ఓడించి సెమీస్ చేరుకున్నాయి. అయితే, గ్రూప్ దశలో ఆఖరిదైన మ్యాచ్‌లో మాత్రం టీమిండియా న్యూజిలాండ్‌ను ఓడించి టాపర్‌గా నిలిచింది.అనంతరం సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్ చేరగా.. న్యూజిలాండ్ సౌతాఫ్రికాను చిత్తు చేసి టీమిండియాతో ఢీకొట్టేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో పటిష్టమైన ఇరుజట్ల మధ్య ఈ పోటీ మరింత ఆసక్తికరంగా మారనుంది. టైటిల్ పోరు ‘టై’గా మారితే పరిస్థితి ఏంటి?మరి ఒకవేళ సమవుజ్జీల మధ్య టైటిల్ పోరు ‘టై’గా మారితే పరిస్థితి ఏంటి?.. సూపర్ ఓవర్లోనూ ఇద్దరూ సరిసమానంగా ఉంటే విజేతగా ఎవరిని నిర్ణయిస్తారు? అనే ప్రశ్నలు సగటు అభిమాని మదిలో మెదులుతున్నాయి.మరి ఇందుకు సమాధానం ఏమిటంటే.. ఒకవేళ మ్యాచ్ ‘టై’ అయితే సూపర్ ఓవర్ ద్వారా ఫలితాన్ని తేల్చడం పరిపాటే. అయితే, సూపర్ ఓవర్లోనూ రెండు జట్లు సమానంగా ఉంటే.. విజేత తేలేంత వరకూ సూపర్ ఓవర్లు నిర్వహిస్తూనే ఉంటారు. 2019 వరల్డ్‌కప్ ఫైనల్ విన్నర్‌ను తేల్చిన విధానంపై విమర్శలు రాగా.. ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది.అప్పట్లో వివాదంనాడు ఫైనల్లో న్యూజిలాండ్- ఇంగ్లండ్ మ్యాచ్‌ను ‘టై’ చేసుకున్నాయి. అదే విధంగా సూపర్ ఓవర్లోనూ నువ్వా-నేనా అన్నట్లు తలపడి.. మళ్లీ ‘టై’ చేశాయి. దీంతో బౌండరీ కౌంట్ ఆధారంగా ఇంగ్లండ్‌ను చాంపియన్‌గా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఐసీసీ తీరుపై విమర్శలు రాగా.. ఇకపై ఐసీసీ టోర్నీల్లో ఒకవేళ మ్యాచ్ ‘టై’ అయితే.. విజేత తేలేంత వరకు సూపర్ ఓవర్ నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చింది.ఇక దుబాయ్‌లో వర్షం ముప్పులేదు. కానీ ఒకవేళ వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్ రద్దయితే ఇరుజట్లను సంయుక్త విజేతగా ప్రకటిస్తారు. 2002లో వరణుడి కారణంగా ఫైనల్ మ్యాచ్ సాగే వీలు లేకపోవడంతో భారత్- శ్రీలంకను టైటిల్ విజేతగా ప్రకటించారు. నిజానికి అప్పుడు రెండురోజుల్లో 110 ఓవర్ల ఆట పూర్తైనా.. ఆపై కొనసాగించే పరిస్థితి లేకపోవడంతో ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.చదవండి: కెప్టెన్సీకి రోహిత్ శర్మ గుడ్‌బై? ఆటగాడిగా కొనసాగింపు? బీసీసీఐ నిర్ణయం? -
రాణించిన సంగక్కర.. విండీస్‌పై శ్రీలంక ఘన విజయం
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్-2025లో శ్రీలంక మూడో విజయం నమోదు చేసింది. వెస్టిండీస్‌తో నిన్న (మార్చి 6) జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 21 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక మాస్టర్స్.. కెప్టెన్ కుమరా సంగక్కర (42 బంతుల్లో 47) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. గుణరత్నే (64) అర్ద సెంచరీతో సత్తా చాటాడు. వీరిద్దరు మినహా లంక ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. తిరుమన్నే (14), ఆఖర్లో చతురంగ (17 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. జయసింఘే, ప్రసన్న, లక్మల్ డకౌట్లు కాగా.. తరంగ, జీవన్ మెండిస్ తలో పరుగు చేశారు. విండీస్ బౌలర్లలో ఆష్లే నర్స్ 3 వికెట్లు పడగొట్టగా.. టీనో బెస్ట్ 2, జెరోమ్ టేలర్ ఓ వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 174 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 152 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ డ్వేన్ స్మిత్ (49), లెండిల్ సిమన్స్ 37 (నాటౌట్) విండీస్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. వీరికి ఇతరుల నుంచి సహకారం లభించకపోవడంతో విండీస్ శ్రీలంక నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. చాడ్విక్ వాల్టన్ డకౌట్, నర్సింగ్ డియోనరైన్ 14, జోనాథన్ కార్టర్ 17, ఆష్లే నర్స్ 2 పరుగులు చేసి ఔటయ్యారు. ఆఖర్లో దినేశ్ రామ్‌దిన్ (15 నాటౌట్) వేగంగా పరుగులు సాధించేందుకు ప్రయత్నించినా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. లంక బౌలర్లలో ఇసురు ఉడాన పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు 2 వికెట్లు తీశాడు. చతురంగ డిసిల్వ, జీవన్ మెండిస్ తలో వికెట్ పడగొట్టారు.ఈ గెలుపుతో న్యూజిలాండ్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది. సచిన్ నేతృత్వంలోని భారత్ అగ్రస్థానంలో కొనసాగుతుంది. భారత్, శ్రీలంక తలో 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలు సాధించినప్పటికీ.. మెరుగైన రన్‌రేట్ కారణంగా భారత్ టాప్ ప్లేస్‌లో ఉంది. లంక చేతితో ఓటమితో విండీస్ మూడో స్థానానికి పడిపోయింది. విండీస్ ఇప్పటివరకు జరిగిన 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు సాధించింది. ఆసీస్, ఇంగ్లండ్ నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. ఈ రెండు జట్లు తలో 3 మ్యాచ్‌లు ఆడి చెరో మ్యాచ్‌లో గెలిచారు. ఈ టోర్నీలో ఇంగ్లండ్ ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఓటమిపాలై, చిట్ట చివరి స్థానంలో ఉంది. -
ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీగా శుభ్‌మన్ గిల్.. రేసులో మరో ఇద్దరు స్టార్లు
ఫిబ్రవరి నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీల వివరాలను ఐసీసీ ఇవాళ (మార్చి 7) ప్రకటించింది. పురుషుల విభాగంలో టీమిండియా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్, న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్, ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ నామినేట్ అయ్యారు. మహిళల విభాగంలో అలానా కింగ్ (ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్), అన్నాబెల్ సదర్‌ల్యాండ్ (ఆసీస్ బ్యాటర్), తిసాట్చా పుత్తవోంగ్ (థాయ్‌ల్యాండ్ బౌలర్) నామినీస్‌గా నిలిచారు. ఫిబ్రవరిలో ఆయా ఫార్మాట్లలో అత్యుత్తమ ప్రదర్శనలు కనబర్చిన వారిని ఐసీసీ నామినీస్‌గా ఎంపిక చేసింది. ఓటింగ్ ఆధారంగా ప్లేయర్ ఆఫ్ ద మంత్ విజేతలను ప్రకటిస్తారు.శుభ్‌మన్ గిల్: ఫిబ్రవరి నెలలో గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ నెలలో అతను 100కుపైగా సగటుతో 406 పరుగులు చేశాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో గిల్ వరుసగా 87, 60, 112 పరుగులు చేశాడు. అనంతరం ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్‌పై మరో సెంచరీ బాదాడు. ఇదే నెలలో గిల్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానానికి ఎగబాకాడు.గ్లెన్ ఫిలిప్స్: ఫిబ్రవరి నెలలో ఫిలిప్స్ అద్భుత ప్రదర్శనలు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాకిస్తాన్లో జరిగిన వన్డే సిరీస్‌లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ సిరీస్‌లో ఫిలిప్స్ వరుసగా 28 నాటౌట్, 20 నాటౌట్, 106 (74 బంతుల్లో 7 సిక్సర్లు) స్కోర్లు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఫిలిప్స్ విజృంభించాడు. ఈ మ్యాచ్‌లో ఫిలిప్స్ మెరుపు అర్ద సెంచరీ (39 బంతుల్లో 61) సాధించాడు. ఇదే మ్యాచ్‌లో ఫిలిప్స్ పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ క్యాచ్‌ను నమ్మశక్యంకాని రీతిలో అందుకున్నాడు.స్టీవ్ స్మిత్: ఫిబ్రవరి నెలలో స్మిత్ టెస్ట్‌ల్లో అద్భుతంగా రాణించాడు. ఈ నెలలో శ్రీలంకతో జరిగిన రెండు టెస్ట్‌ల్లో స్మిత్ రెండు సెంచరీలు బాదాడు. ఫలితంగా ఈ సిరీస్‌లో స్మిత్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ ప్రదర్శనలతో స్మిత్ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టాప్-5లోకి చేరుకున్నాడు. -
గ్రీన్ అద్భుత శతకం.. శ్రీలంకను చిత్తు చేసిన న్యూజిలాండ్
న్యూజిలాండ్, శ్రీలంక మహిళా జట్ల మధ్య ఇవాళ (మార్చి 7) వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ శ్రీలంకను 78 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. మిడిలార్డర్ బ్యాటర్ మ్యాడీ గ్రీన్ అద్భుత సెంచరీతో (100) కదంతొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో గ్రీన్ మినహా ఎవరూ పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. జార్జియా ప్లిమ్మర్ 28, ఇసబెల్లా గేజ్ 19, జెస్ కెర్ 38, పోల్లీ ఇంగ్లిస్ 34 (నాటౌట్) పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 46 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ సూజీ బేట్స్ 5, ఎమ్మా మెక్లియోడ్ 6, బ్రూక్ హ్యల్లీడే 6 పరుగులకు ఔటయ్యారు. ఈ దశలో జార్జియా ప్లిమ్మర్ కొద్ది సేపు సంయమనంతో బ్యాటింగ్ చేసింది. ప్లిమ్మర్ 54 బంతులు ఎదుర్కొని 28 పరుగులు చేసి ఔటైంది. అనంతరం గ్రీన్.. గేజ్, కెర్, ఇంగ్లిస్ సహకారంతో సెంచరీ పూర్తి చేసుకుంది. గ్రీన్ సెంచరీ పూర్తి చేసుకుని ఇన్నింగ్స్ చివరి బంతికి రనౌటైంది. శ్రీలంక బౌలర్లలో చమారీ ఆటపట్టు 2 వికెట్లు పడగొట్టగా.. అచిని కులసూరియ, ఇనోషి ప్రియదర్శిని, కవిశ దిల్హరి తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 246 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 46.4 ఓవర్లలో 167 పరుగులకే చాపచుట్టేసి ఓటమిపాలైంది. కివీస్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి శ్రీలంక బ్యాటింగ్ లైనప్‌కు కుప్పకూల్చారు. హన్నా రోవ్ 4, బ్రీ లింగ్, ఏడెన్ కార్సన్ తలో 2, సూజీ బేట్స్ ఓ వికెట్ తీశారు. జెస్ కెర్ వికెట్ తీయకపోయినా అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసింది. శ్రీలంక ఇన్నింగ్స్‌లో హర్షిత సమరవిక్రమ (59) ఒక్కరే అర్ద సెంచరీతో రాణించారు. కవిష దిల్హరి 25, నీలాక్షి డిసిల్వ 20, అనుష్క సంజీవని 13 (నాటౌట్), కుగంధిక కుమారి, కెప్టెన్ ఆటపట్టు తలో 11 పరుగులు చేశారు. మనుడి ననయక్కార, ఇనోషి ప్రియదర్శిని డకౌట్లు కాగా.. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఈ గెలుపుతో న్యూజిలాండ్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. మూడు వన్డేలు, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం శ్రీలంక న్యూజిలాండ్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లో నేపియర్ వేదికగా జరగాల్సిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దైంది. మూడో వన్డే నెల్సన్ వేదికగా మార్చి 9న జరుగనుంది. ఈ సిరీస్ అనంతరం ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభమవుతుంది. మార్చి 14, 16, 18 తేదీల్లో మూడు టీ20లు జరుగనున్నాయి. తొలి రెండు మ్యాచ్‌లు క్రైస్ట్‌చర్చ్‌లో జరుగనుండగా.. మూడో టీ20 డునెడిన్‌లో జరుగనుంది. -
‘ఆ ఇద్దరు రాణిస్తే ట్రోఫీ మనదే.. కివీస్ ప్రధాన టార్గెట్ అతడే’
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)ఫైనల్లో టీమిండియా- న్యూజిలాండ్(India vs New Zealand) అమీతుమీ తేల్చుకోనున్నాయి. పాతికేళ్ల తర్వాత మరోసారి ఈ రెండు జట్లు ఈ మెగా వన్డే టోర్నీ టైటిల్ పోరులో తలపడనుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. నాడు కివీస్ టీమిండియాపై పైచేయి సాధించి ఐసీసీ నాకౌట్ ట్రోఫీ గెలవగా.. ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం అన్ని విభాగాల్లోనూ భారత్ పటిష్టంగా కనిపిస్తోంది.ఈ నేపథ్యంలో ఈసారి ఫైనల్ మామూలుగా ఉండబోదని ఇరుజట్ల అభిమానులు ఈ రసవత్తర పోరు కోసం ఎదురుచూస్తున్నారు. దుబాయ్ వేదికగా ఆదివారం భారత్- కివీస్ తలపడబోతున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఎక్స్’ ఫ్యాక్టర్ అతడేటైటిల్ సమరంలో టీమిండియా తరఫున మిడిలార్డర్ శ్రేయస్ అయ్యర్ ‘ఎక్స్’ ఫ్యాక్టర్ అవుతాడని అంచనా వేసిన ఈ మాజీ ఓపెనర్.. శుబ్‌మన్ గిల్ కూడా కీలకం కాబోతున్నాడని పేర్కొన్నాడు. ఏదేమైనా ఈసారి కివీస్ బౌలర్లు ప్రధానంగా శ్రేయస్ అయ్యర్‌నే టార్గెట్ చేస్తారని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘న్యూజిలాండ్‌పై వన్డేల్లో శ్రేయస్ అయ్యర్ ఒక్కసారి మాత్రమే 30 కంటే తక్కువ పరుగులు చేశాడనుకుంటా. అదొక్కటి మినహా ప్రతిసారీ అతడు కివీస్‌పై బాగానే రన్స్ రాబట్టాడు. కాబట్టి ఈసారి అతడినే ఎక్కువగా టార్గెట్ చేస్తారనిపిస్తోంది.మిడిల్ ఓవర్లలో వాళ్లు బాగా బౌలింగ్ చేస్తున్నారు. మిచెల్ సాంట్నర్, బ్రాస్‌వెల్ లేదంటే రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్.. ఈ నలుగురే ఎక్కువగా బరిలోకి దిగవచ్చు. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ స్పిన్ బాగా ఆడతాడు కదా! అందుకే అతడిని త్వరగా పెవిలియన్‌కు పంపేందుకు ఈ స్పిన్ బౌలర్లు ప్రయత్నిస్తారు. అతడిపైనే దృష్టి పెడతారు’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.కివీస్‌తో ఆటంటే శ్రేయస్‌కు మజాకాగా న్యూజిలాండ్‌తో వన్డేల్లో ఇప్పటి వరకు ఎనిమిది ఇన్నింగ్స్ ఆడిన శ్రేయస్ అయ్యర్.. సగటున 70.38తో 563 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు, నాలుగు హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం. ఇక కివీస్‌పై శ్రేయస్ అత్యల్ప స్కోరు 33. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా పైవిధంగా స్పందించాడు.ఇక ఓపెనింగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘బంగ్లాదేశ్‌పై సెంచరీ చేయడం ద్వారా ఈ ఐసీసీ టోర్నీలో గిల్ బిగ్బ్యాంగ్తో ముందుకు వచ్చాడు. పాకిస్తాన్‌పై కూడా మెరుగ్గా ఆడాడు. అయితే, ఆ తర్వాత అతడు కాస్త వెనుకబడ్డాడు. ఫైనల్లో బ్యాట్ ఝులిపిస్తేనే జట్టుకు, అతడికి ప్రయోజనకరంగా ఉంటుంది. మరో విరాట్ కావాలంటే గిల్ ఫైనల్లో తన ముద్రను వేయాలి. శ్రేయస్ అయ్యర్, శుబ్‌మన్ గిల్ గనుక రాణిస్తే చాంపియన్స్ ట్రోఫీ మనదే అని రాసిపెట్టుకోవచ్చు’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. డబుల్ సెంచరీ వీరుడుకాగా కివీస్‌పై గిల్‌కు కూడా గొప్ప రికార్డు ఉంది. ఇప్పటి వరకు కివీస్‌పై పదకొండు ఇన్నింగ్స్‌లో అతడు 592 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు ఉండగా.. హైదరాబాద్‌లో 2023లో డబుల్ సెంచరీ(208) కూడా కివీస్‌పైనే సాధించాడు. చదవండి: కెప్టెన్సీకి రోహిత్ శర్మ గుడ్‌బై? ఆటగాడిగా కొనసాగింపు? బీసీసీఐ నిర్ణయం? -
Mohammed Shami: ఇలాంటివి పట్టించుకోవాల్సిన అవసరం లేదు!
టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ(Mohammed Shami)కి అతడి చిన్ననాటి కోచ్ బదరుద్దీన్ సిద్దిఖీ(Badaruddin Siddiqui) అండగా నిలిచాడు. షమీ సరైన దారిలోనే వెళ్తున్నాడని.. అన్నింటి కంటే దేశమే ముఖ్యమని అతడికి తెలుసునని వ్యాఖ్యానించాడు. భారత్ కీలక మ్యాచ్‌కు సిద్ధమవుతున్న వేళ షమీ ఏకాగ్రత దెబ్బతినేలా ఎవరూ మాట్లాడవద్దని విజ్ఞప్తి చేశాడు.కాగా ఆల్ ఇండియా ముస్లి జమాత్ అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్ రజ్వీ బరేల్వి షమీపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పవిత్ర రంజాన్ మాసంలో ‘రోజా’(Roza) పాటించకుండా షమీ పెద్ద నేరం చేశాడని ఆయన ఆరోపించారు. అతడు ఇలాంటి తప్పు చేయకుండా ఉండాల్సిందని.. షరియత్ (చట్టం) దృష్టిలో అతడొక పెద్ద నేరగాడని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో అతడు దేవుడికి సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు.అత్యంత ముఖ్య విధి.. అతడో నేరగాడు‘రోజా’లో ఉపవాసం పాటించడమే అత్యంత ముఖ్య విధి అని.. కానీ దానిని విస్మరించడం మహిళలకైనా, పురుషులకైనా మంచిదికాదని షహబుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీమిండియా ప్రఖ్యాత క్రికెటర్ అయి ఉండి.. మ్యాచ్ మధ్యలో నీళ్లు లేదంటే వేరే ఏదో డ్రింక్ తాగడం సరికాదని విమర్శించారు.ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు మౌలానా ఖలీద్ రషీద్ ఫరాంగి మాహిల్ మాత్రం షమీకి అండగా నిలిచారు. రోజా పాటించాలా వద్దా అనేది వ్యక్తిగత నిర్ణయమని పేర్కొన్నారు.ప్రతి ఒక్కరు రోజా పాటించాలని ఖురాన్లో ఉందని.. అయితే, ప్రయాణాలు చేస్తున్నపుడు కొంతమందికి ఇది సాధ్యం కాదు కాబట్టి మినహాయింపు ఉంటుందని తమ పవిత్ర గ్రంథంలోనే ఉందని తెలిపారు. షమీ తప్పు చేశాడంటూ వేలెత్తి చూపే హక్కు ఎవరికీ లేదని ఖలీద్ స్పష్టం చేశారు.షమీ చేసినదాంట్లో తప్పేమీ లేదుఈ క్రమంలో షమీ టీమిండియా బౌలర్‌గా ఎదగడంలో కీలక పాత్ర పోషించిన చిన్ననాటి కోచ్ బదరుద్దీన్ సిద్ధిఖీ సైతం అతడికి మద్దతు పలికారు. ‘‘షమీ చేసినదాంట్లో తప్పేమీ లేదు. ఇలాంటి విషయాలను అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు.దేశానికే మొదటి ప్రాధాన్యం బయట నుంచి వచ్చే విమర్శలను పక్కనపెట్టి.. షమీ ఫైనల్ మ్యాచ్‌పై దృష్టి పెట్టాల్సి ఉంది. అతడు ఎలాంటి నేరమూ చేయలేదు. దేశం కోసం అతడు ఆడుతున్నాడు. వ్యక్తిగత విషయాల కంటే దేశానికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. అదే సరైంది. షమీ కూడా అదే చేస్తున్నాడు. దయచేసి ఎవరూ కూడా అతడి ఏకాగ్రత దెబ్బతినేలా మాట్లాడవద్దు’’ అని బదరుద్దీన్ విజ్ఞప్తి చేశారు.చాంపియన్స్ ట్రోఫీతో బిజీకాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహ్మద్ షమీ ప్రస్తుతం ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025తో బిజీగా ఉన్నాడు. వన్డే వరల్డ్‌కప్-2023లో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచి భారత్‌ను ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించిన ఈ రైటార్మ్ ఫాస్ట్‌బౌలర్.. తదుపరి చీలమండ గాయం వల్ల ఏడాదికి పైగా జట్టుకు దూరమయ్యాడు.ఇటీవల ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చిన షమీ.. చాంపియన్స్ ట్రోఫీలోనూ రాణిస్తున్నాడు. గ్రూప్ దశతో తొలుత బంగ్లాదేశ్‌పై ఐదు వికెట్లతో చెలరేగిన షమీ.. ఆస్ట్రేలియాతో కీలక సెమీస్ మ్యాచ్‌లోనూ అదరగొట్టాడు. పది ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి కేవలం 48 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ మెగా వన్డే టోర్నీలో ఫైనల్‌కు చేరిన టీమిండియా ఆదివారం దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో టైటిల్ పోరులో తలపడనుంది. అయితే, ఆసీస్‌తో మ్యాచ్ సందర్భంగా షమీ ఎనర్జీ డ్రింక్ తాగుతున్న దృశ్యాలు వైరల్ కావడంతో అతడిపై విమర్శలు వచ్చాయి.చదవండి: IND vs NZ: ఇది సరికాదు!.. టీమిండియాపై కివీస్ గెలవాలి: మిల్లర్ -
కెప్టెన్సీకి రోహిత్ శర్మ గుడ్‌బై?.. బీసీసీఐ నిర్ణయం ఏమిటి?
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో టీమిండియా ఎదురులేని విజయాలతో ఫైనల్‌కు చేరుకుంది. గ్రూప్ దశలో టాపర్‌గా నిలవడంతో పాటు సెమీస్‌లో ఆస్ట్రేలియాను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. దుబాయ్ వేదికగా ఆదివారం న్యూజిలాండ్(India vs New Zealand)తో మ్యాచ్‌లో రోహిత్ సేన అమీతుమీ తేల్చుకోనుంది. ఇక ఈ మెగా వన్డే టోర్నమెంట్ తర్వాత టీమిండియాలో కీలక మార్పు చోటుచేసుకోనున్నట్లు సమాచారం.రోహిత్ శర్మ(Rohit Sharma) భారత వన్డే, టెస్టు జట్ల కెప్టెన్సీకి వీడ్కోలు పలికి కేవలం ఆటగాడిగా కొనసాగనున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ అంశం గురించి ఇప్పటికే చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, హెడ్‌కోచ్ గౌతం గంభీర్ మధ్య చర్చలు కూడా జరిగినట్లు సమాచారం. అది రోహిత్ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుందిఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో టీమిండియా ఘోర పరాజయం తర్వాత జరిగిన ఈ సమీక్షలో రోహిత్ భవిష్యత్తు గురించి చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సన్నిహిత వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘తనలో ఇంకా క్రికెట్ ఆడే సత్తా మిగిలే ఉందని రోహిత్ విశ్వసిస్తున్నాడు. అయితే, తన భవిష్యత్ కార్యాచరణ ఏమిటన్న అంశం గురించి యాజమాన్యం అతడిని అడిగింది. రిటైర్మెంట్ ప్రకటిస్తాడా లేదా అన్నది పూర్తిగా అతడి నిర్ణయమే. అయితే, కెప్టెన్సీ విషయంలో మాత్రం మేనేజ్మెంట్ మార్పు వైపు మొగ్గుచూపుతున్నట్లు అనిపిస్తోంది. వచ్చే వరల్డ్‌కప్ నాటికి జట్టును సిద్ధం చేసుకోవాలని దిగ్గజ కెప్టెన్ రోహిత్‌కూ తెలుసు. ఇదే విషయం గురించి కోచ్, చీఫ్ సెలక్టర్ అతడితో మాట్లాడారు.కోహ్లి గురించి కూడా చర్చ.. కానీఇక విరాట్ కోహ్లి గురించి చర్చకురాగా.. మేనేజ్మెంట్ కూడా అతడితో మాట్లాడినట్లు తెలిసింది. అయితే, అతడి భవిష్యత్తుకు ఇప్పట్లో ఢోకా లేనట్లే అనిపిస్తోంది’’ అని పేర్కొన్నాయి. కాగా ద్వైపాక్షిక సిరీస్‌లలో టీమిండియాకు తిరుగులేని విజయాలు అందించడంతో పాటు ఐసీసీ టోర్నీల్లోనూ గొప్పగా రాణించిన కెప్టెన్‌గా రోహిత్ శర్మ పేరొందాడు.ఏకైక సారథిగా అరుదైన ఘనతగతేడాది అతడి కెప్టెన్సీలో టీమిండియా టీ20 ప్రపంచకప్-2024లో చాంపియన్‌గా నిలిచింది. అనంతరం అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు రోహిత్ వీడ్కోలు పలకగా.. విరాట్ కోహ్లి కూడా అతడి బాటలో నడిచాడు. ప్రస్తుతం ఈ దిగ్గజ బ్యాటర్లు వన్డే, టెస్టుల్లో కొనసాగుతున్నారు. ఇటీవల ఇంగ్లండ్‌తో సిరీస్‌లో శతకం బాది రోహిత్.. చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌పై సెంచరీ కొట్టి కోహ్లి వన్డేల్లో ఫామ్‌లోకి వచ్చారు. అయితే, టెస్టుల్లో మాత్రం వారి వైఫల్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాను ఫైనల్‌కు చేర్చడం ద్వారా ఇంత వరకు ఏ కెప్టెన్‌కూ సాధ్యం కాని ఘనతను రోహిత్ శర్మ సాధించాడు. ఐసీసీ వన్డే వరల్డ్‌కప్, వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్, టీ20 ప్రపంచకప్, చాంపియన్స్ ట్రోఫీ టోర్నీల్లో తమ జట్టును ఫైనల్‌కు తీసుకువెళ్లిన ఏకైక కెప్టెన్‌గా చరిత్రకెక్కాడు. ఇక ఇటీవల ఆసీస్‌తో సెమీస్ మ్యాచ్‌లో విజయానంతరం గంభీర్‌కు రోహిత్ శర్మ భవిష్యత్తు గురించి ప్రశ్నలు ఎదురుకాగా.. తమ కెప్టెన్ అద్భుతమైన టెంపోతో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇలాంటి విషయాలపై తానేమీ మాట్లాడలేనన్నాడు.చదవండి: Steve Smith: కోహ్లికి ముందే తెలుసు! -
‘మా ప్రేమ కథకు కొనసాగింపు’.. తల్లిదండ్రులు కాబోతున్న క్రీడా జంట
భారత మాజీ రెజ్లర్ వినేశ్ ఫొగట్(Vinesh Phogat) శుభవార్త చెప్పింది. తాను తల్లి కాబోతున్నట్లు వెల్లడించింది. భర్త సోమ్‌వీర్ రాఠీ(Somvir Rathee)తో కలిసి తొలి బిడ్డకు స్వాగతం పలుకబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ‘‘మా ప్రేమ కథకు కొనసాగింపు.. సరికొత్త అధ్యాయంతో మొదలు’’ అంటూ చిన్నారి పాదం, లవ్ ఎమోజీలను షేర్ చేస్తూ ఈ క్రీడాకారుల జంట తమ సంతోషాన్ని అభిమానులతో పంచుకుంది.కాగా భారత స్టార్ రెజ్లర్‌గా పేరొందిన వినేశ్ ఫొగట్ గతేడాది పతాక శీర్షికల్లో నిలిచింది. ప్యారిస్ ఒలింపిక్స్-2024 ఫైనల్‌కు చేరుకున్న ఈ హర్యానా అథ్లెట్‌పై అనూహ్య రీతిలో ఆఖరి నిమిషంలో వేటు పడింది. నిర్ణీత బరువు కంటే వంద గ్రాములు అదనంగా ఉన్నందు వల్ల ఆమెను అనర్హురాలిగా తేల్చారు. దీంతో.. రెజ్లింగ్‌లో భారత్‌కు తొలి స్వర్ణం వస్తుందన్న ఆశలు ఆవిరి కాగా.. దేశవ్యాప్తంగా యూడబ్ల్యూడబ్ల్యూ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.అనర్హత వేటు ఎదుర్కోవాల్సిందేనన్న స్పోర్ట్స్ కోర్టుభారత ఒలింపిక్ సంఘం(IOA), అధికారుల తీరుపైనా ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఐఓఏ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (సీఏఎస్)లో అప్పీలు చేయగా నిరాశే ఎదురైంది. ‘‘అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే క్రీడాకారులు నిబంధనలను పూర్తిగా తెలుసుకోవాలి’’ అంటూ వినేశ్ అభ్యర్థనను కొట్టిపారేసింది.‘క్రీడాకారులకు నిబంధనలపై పూర్తి అవగాహన ఉండాలి. బరిలోకి దిగే బరువు కేటగిరీ కంటే ఎక్కువ ఉంటే అనుమతించరు. అది అందరికీ వర్తిస్తుంది. ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవు. నిర్ణీత బరువు కంటే ఒక్క గ్రాము ఎక్కువ ఉన్న అనర్హత వేటు ఎదుర్కోవాల్సిందే’’ అని సీఏఎస్ స్పష్టం చేసింది.ఈ క్రమంలో తొలి రోజు పోటీల్లో నిర్ణీత బరువుతోనే పోటీపడి విజయాలు సాధించినందుకుగానూ... గుజ్మన్ లోపెజ్‌తో కలిపి తనకూ రజతం ఇవ్వాలని వినేశ్ న్యాయపోరాటం చేసినా సానుకూల ఫలితం రాలేదు. దీంతో మహిళల 50 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో సంచలన విజయాలు సాధించినా వినేశ్ పతకం లేకుండానే దేశానికి తిరిగి వచ్చింది. రాజకీయాల్లోకికాగా ప్యారిస్ ఒలింపిక్స్‌లో దిగ్గజ రెజ్లర్ యూ సుసూకీపై వినేశ్ సాధించిన విజయం చిరస్మరణీయంగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. అంతేకాదు.. ఒలింపిక్స్ ఫైనల్‌కు చేరిన తొలి మహిళా రెజ్లర్‌గా చరిత్ర పుటల్లో ఆమె పేరు అజరామరంగా ఉంటుంది.అతడే ఆమెకు సర్వస్వంఇక ఈ తీవ్ర నిరాశ అనంతరం.. కుస్తీకి స్వస్తి చెప్పిన వినేశ్ ఫొగట్ రాజకీయాల్లో ప్రవేశించింది. కాంగ్రెస్ పార్టీలో చేరి హర్యానాలోని ఝులన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైంది. కాగా వినేశ్ భర్త సోమ్‌వీర్ కూడా రెజ్లరే. హర్యానాకు చెందిన అతడు.. జాతీయ స్థాయిలో పతకాలు గెలుచుకున్నాడు. వినేశ్, సోమ్‌వీర్ రాఠీ రైల్వేలో ఉద్యోగం చేస్తున్న సమయంలో ప్రేమలో పడ్డారు.అయితే, వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా అనుకున్న లక్ష్యాలు చేరుకునే క్రమంలో వినేశ్‌కు సోమ్‌వీర్ అన్నిరకాలుగా అండగా నిలిచాడు. ఈ క్రమంలో పెళ్లి బంధంతో ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్న ఈ క్రీడా జంట 2018లో వివాహం చేసుకున్నారు. ‘బేటీ బచావో.. బేటీ పడావో.. బేటీ ఖిలావో’ అంటూ సప్తపదికి మరో అడుగును జతచేసి పెళ్లినాడు ఎనిమిది అడుగులు వేశారు.సంబంధిత వార్త : తను లేకుంటే నేను లేను.. వినేశ్‌కు అతడే కొండంత అండ -
IND vs NZ: ఇది సరికాదు!.. ఫైనల్లో కివీస్ గెలవాలి: సౌతాఫ్రికా స్టార్
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) ఫైనల్లో తన మద్దతు న్యూజిలాండ్ జట్టుకేనని సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ డేవిడ్ మిల్లర్(David Miller) అన్నాడు. టైటిల్ పోరులో తలపడే టీమిండియా- కివీస్ రెండూ పటిష్ట జట్లే అయినప్పటికీ తాను మాత్రం సాంట్నర్ బృందం వైపే ఉంటానని స్పష్టం చేశాడు. సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి అనంతరం మిల్లర్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. సెమీస్ మ్యాచ్‌ల షెడ్యూల్ పట్ల అతడికి ఉన్న అసంతృప్తే ఇందుకు కారణమని తెలుస్తోంది.కాగా ఫిబ్రవరి 19న పాకిస్తాన్(Pakistan) వేదికగా చాంపియన్స్ ట్రోఫీ మొదలుకాగా.. భారత జట్టు మాత్రం తటస్థ వేదికైన దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడుతోంది. టీమిండియాతో మ్యాచ్‌ల కోసం గ్రూప్-‘ఎ’లో భాగమైన బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్ పాక్ నుంచి దుబాయ్‌కు ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఇక రోహిత్ సేన సెమీస్ చేరడంతో గ్రూప్-బి నుంచి పోటీదారు ఎవరన్న అంశంపై ముందే స్పష్టత లేదు కాబట్టి ఆస్ట్రేలియాతో పాటు సౌతాఫ్రికా కూడా అరబిక్ దేశానికి రావాల్సి వచ్చింది.అయితే, గ్రూప్ దశలో ఆఖరిగా కివీస్‌పై విజయం సాధించిన భారత్.. గ్రూప్-ఎ టాపర్‌గా నిలవగా.. గ్రూప్-బి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా దుబాయ్‌లోనే ఉండిపోగా.. సౌతాఫ్రికా వెంటనే న్యూజిలాండ్‌తో సెమీస్ ఆడేందుకు పాకిస్తాన్‌కు తిరిగి వచ్చింది.ఈ పరిణామాల నేపథ్యంలో డేవిడ్ మిల్లర్ మాట్లాడుతూ.. ‘‘మా షెడ్యూల్ ఏమాత్రం బాగా లేదు. దుబాయ్‌కి ప్రయాణం గంటా 40 నిమిషాలే కావచ్చు. కానీ మేం వెళ్లక తప్పలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాతే ఆ రోజే సిద్ధమై సాయంత్రం దుబాయ్‌కు వెళ్లాం. సోమవారం తెల్లవారుజామున మళ్లీ పాకిస్తాన్‌కు వచ్చాం’ అని మిల్లర్ అన్నాడు.ఇక ఫైనల్లో టీమిండియా- కివీస్ తలపడనున్న తరుణంలో.. ‘‘ప్రతి ఒక్క జట్టు తమ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది. నిజానికి టీమిండియాతో మేము మరోసారి ఫైనల్ ఆడే పరిస్థితి ఉంటే ఎంతో బాగుండేది. కానీ మనం అనుకున్నవన్నీ జరగవు. ఏదేమైనా ట్రోఫీ గెలిచేందుకు ప్రతి ఒక్క ఆటగాడు కఠినశ్రమకు ఓర్చి అంకితభావంతో పనిచేస్తాడని చెప్పగలను. భారత్, న్యూజిలాండ్‌లు పటిష్టమైన జట్లే అయినా.. నిజాయితీగా చెప్పాలంటే.. నేను మాత్రం కివీస్ గెలవాలనే కోరుకుంటున్నా’’ అని డేవిడ్ మిల్లర్ పేర్కొన్నాడు.కాగా రెండో సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో సౌతాఫ్రికా ఓడిపోయిన విషయం తెలిసిందే. లాహోర్ వేదికగా బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో కివీస్ రికార్డు స్థాయిలో నిర్ణీత యాభై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 362 పరుగులు సాధించింది. అయితే, లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 312 పరుగులకే పరిమితమైంది. దీంతో డేవిడ్ మిల్లర్ వీరోచిత, విధ్వంసకర శతకం వృథాగా పోయింది. మిల్లర్ 67 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 100 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024 ఫైనల్లో టీమిండియా- సౌతాఫ్రికా తలపడిన విషయం తెలిసిందే. అయితే, ప్రొటిస్ జట్టు ఆఖరి వరకు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. రోహిత్ సే న ఏడు పరుగుల స్వల్ప తేడాతో గెలిచి చాంపియన్‌గా నిలిచింది.ఇక... ఐసీసీ టోర్నమెంట్లలో కీలక సమయాల్లో చేతులెత్తేసి చోకర్స్‌గా ముద్రపడ్డ సౌతాఫ్రికా ఖాతాలో ఉన్న ఏకైక ఐసీసీ టైటిల్ చాంపియన్స్ ట్రోఫీ మాత్రమే. 1998లో ప్రొటిస్ జట్టు విజేతగా నిలిచింది. ఆ తర్వాత పలు సందర్భాల్లో అద్భుత ప్రదర్శనతో సెమీస్, ఫైనల్ చేరినా ఇంత వరకు ట్రోఫీని మాత్రం ముద్దాడలేకపోయింది. -
WTA: క్రీడాకారిణులకు పెయిడ్ మెటర్నిటీ లీవ్!
రియాద్: మహిళా టెన్నిస్ క్రీడాకారిణుల కోసం ఉమెన్ టెన్నిస్ అసోసియేషన్ (డబ్ల్యూటీఏ) కీలక ప్రతిపాదనతో ముందుకొచ్చింది. టూర్లో ఆడుతున్న ప్లేయర్ ఎవరైనా గర్భం ధరిస్తే 12 నెలల పాటు వారికి డబ్బులు చెల్లిస్తూ ‘పెయిడ్ మెటర్నిటీ లీవ్’ ఇవ్వాలని నిర్ణయించింది. సరొగసీ లేదా దత్తత తదితర కారణాలతో అమ్మగా మారితే వారికి 2 నెలల పాటు ఈ సౌకర్యం కల్పిస్తారు. సౌదీ అరేబియాకు చెందిన పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (పీఐఎఫ్) ఈ మొత్తాలను చెల్లించేందుకు సిద్ధమైంది. ఏడాది కాలంగా పీఐఎఫ్... డబ్ల్యూటీఏ స్పాన్సర్లలో ఒకరిగా వ్యవహరిస్తోంది. ఈ కొత్త పథకం ద్వారా కనీసం 300 మంది టెన్నిస్ ప్లేయర్లకు ప్రయోజనం కలగుతుందని డబ్ల్యూటీఏ సీఈఓ పోర్షియా వెల్లడించింది. మహిళల టెన్నిస్ చరిత్రలో ఇది కొత్త అధ్యాయమని పేర్కొన్న ఆమె... టెన్నిస్ ఆడుతూ అమ్మగా మారిన ప్లేయర్లు ఆటకు ఒక్కసారిగా దూరం కాకుండా మళ్లీ వచ్చి పాల్గొనేందుకు ఇది ఊతమిస్తుందని తెలిపింది. సెరెనా (అమెరికా), అజరెంకా (బెలారస్), వొజ్నియాకి (డెన్మార్క్), క్లియ్‌స్టర్స్ (బెల్జియం), బెలిండా బెన్‌చిచ్ (స్విట్జర్లాండ్), ఒసాకా (జపాన్) వంటి స్టార్లు తల్లిగా మారిన తర్వాత తిరిగొచ్చి టైటిల్స్ గెలిచారు. పిల్లలకు అమ్మలైన తర్వాత తిరిగొచ్చి ఆడుతున్న వారు ప్రస్తుతం 25 మందికి పైగా ప్లేయర్లు ఉన్నారు. డబుల్స్ సెమీస్‌లో రష్మిక జోడీ గుర్‌గ్రామ్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ35 మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక డబుల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది.గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో రష్మిక–వైదేహి (భారత్) ద్వయం 6–3, 6–4తో అంటోనియా ష్మిడిట్ (జర్మనీ)–క్లారా వ్లాసీలర్ (బెల్జియం) జోడీపై విజయం సాధించింది.87 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక–వైదేహి తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశారు. మరోవైపు హైదరాబాద్‌కే చెందిన సహజ యామలపల్లి ప్రిక్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించింది. భారత్‌కే చెందిన వైదేహి 6–3, 6–3తో భారత రెండో ర్యాంకర్ సహజను ఓడించింది. -
IND vs NZ: ‘పిచ్‌పై భారత్‌కు స్పష్టత ఉంది’
లాహోర్: చాంపియన్స్ ట్రోఫీలో అన్ని మ్యాచ్‌లు ఒకే వేదికపై, ఒకే మైదానంలో ఆడుతూ, కనీసం ప్రయాణం చేసే అవసరం కూడా లేకుండా భారత్‌కు అన్ని అనుకూలతలు ఉన్నాయని వస్తున్న విమర్శల్లో మరో కీలక ఆటగాడు గొంతు కలిపాడు. టీమిండియాతో ఆదివారం జరిగే తుది పోరుకు ముందు కివీస్ టాప్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ పరోక్షంగా ఇదే విషయంపై మాట్లాడాడు. దుబాయ్‌లో పరిస్థితులపై భారత్‌కు మంచి అవగాహన ఉంది కదా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ... ‘దుబాయ్‌లో ఎలాంటి వ్యూహాలు పని చేస్తాయో భారత్‌కు బాగా తెలుసు. అన్ని మ్యాచ్‌లు ఒకే చోట ఆడిన జట్టుకు అక్కడి పరిస్థితులు, పిచ్ ఎలా స్పందిస్తుందో అవగాహన ఉంటుంది కదా. కానీ షెడ్యూల్ అలా ఉంది కాబట్టి ఏమీ చేయలేం. ఇతర అంశాల ప్రభావం ఉన్నా సరే... మేం ఫైనల్‌పైనే పూర్తిగా దృష్టి పెట్టాం. లాహోర్‌లో ఆడిన వాటితో పోలిస్తే అక్కడి పరిస్థితులు భిన్నం. మేమూ ఒక మ్యాచ్ దుబాయ్‌లో ఆడాం. ఫైనల్ కోసం అందుబాటులో ఉన్న సమయాన్ని వాడుకొని సన్నద్ధమవుతాం. భారత్ చేతిలో ఓడిన గత లీగ్ మ్యాచ్ నుంచి పాఠాలు నేర్చుకుంటాం’ అని విలియమ్సన్ అన్నాడు. మరోవైపు కివీస్ కెప్టెన్ మైకేల్ సాంట్నర్ కాస్త భిన్నంగా స్పందించాడు. విభిన్న పరిస్థితుల్లో ఆడాల్సి రావడం అంతర్జాతీయ క్రికెట్ స్వభావమని, టోర్నీ షెడ్యూల్‌ను నిర్ణయించేది తాను కాదన్న సాంట్నర్ ఫైనల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు. -
అవకతవకలకు తావులేకుండా...
న్యూఢిల్లీ: క్రీడాకారుల ఎంపిక విషయంలో పారదర్శకత పెంపొందించాలనుకుంటున్న కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ... జాతీయ క్రీడా సమాఖ్యలకు కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. సెలెక్షన్ ప్రక్రియను వీడియో రూపంలో పొందుపరచాలని ఇప్పటికే స్పష్టంచేసిన కేంద్ర మంత్రిత్వ శాఖ... ఎంపిక ప్రక్రియకు ముందు పాటించాల్సిన నింబధనలను తాజాగా వెల్లడించింది. సెలెక్షన్లో అవకతవకలకు తావివ్వకుండా జావాబుదారీతనం పెంపొందించేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి. క్రీడాకారులను ఎంపిక చేయడానికి 15 రోజుల ముందే దానికి సంబంధించిన పూర్తి వివరాలను వివిధ జాతీయ క్రీడా సమాఖ్యలు వెల్లడించాలని క్రీడా మంత్రిత్వ శాఖ సూచించింది. దీనివల్ల ట్రయల్స్‌లో అన్యాయం జరిగిందనే విమర్శలకు అవకాశం ఇవ్వకూడదని భావిస్తోంది. ఇటీవలి కాలంలో రెజ్లింగ్, షూటింగ్‌తో పాటు సెలెక్షన్స్ అవకతవకలపై పలు ఫిర్యాదులు అందడంతో... కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ జాతీయ క్రీడా సమాఖ్యలకు ప్రత్యేక సూచనలు చేశారు.ఎంపిక ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు అవకాశం ఇవ్వకూడదని సూచించారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసింది. భారత ఒలింపిక్స్ సంఘం (ఐఓఏ), స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్), జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్)లకు పంపింది. » ఎంపిక ప్రక్రియకు సంబంధించిన నియమ నిబంధనలను ప్రతి సమాఖ్య తమ అధికారిక వెబ్సైట్లో పొందుపరచడం తప్పనిసరి. సెలెక్షన్‌కు మూడు నెలల సమయం ఉన్నప్పుడు మాత్రమే వాటిలో మార్పు చేర్పులు చేయాలి. » సెలెక్షన్ ప్రక్రియనంతా వీడియోలో నిక్షిప్తం చేయాలి. వీటి రికార్డులను సెలెక్షన్ కమిటీ సంతకం చేసిన అనంతరం విధిగా ‘సాయ్’కు అందజేయాలి. ప్రతి ట్రయల్‌కు ముందు అవసరమైన ఆర్థిక సహాయానికి సంబంధించిన వివరాలను మంత్రిత్వ శాఖకు తెలియజేయాలి. » ఒలింపిక్స్, పారాలింపిక్స్, ఆసియా గేమ్స్, పారా ఆసియా గేమ్స్, కామన్వెల్త్ క్రీడల వంటి పెద్ద టోర్నీల ఎంపిక ప్రమాణాలను కనీసం రెండు సంవత్సరాల ముందుగానే పొందుపరచాలి. ఈ అంశంలో అథ్లెట్లకు అవగాహన కల్పించాలి. » విదేశీ టోర్నీల్లో పాల్గొనేందుకు వెళ్లే సమయంలో పాటిస్తున్న నిబంధనల విషయంలో పునరాలోచించాలని ప్రముఖ షూటింగ్ కోచ్ జస్పాల్ రాణా గతంలోనే కోరగా... తాజాగా కేంద్ర మంత్రిత్వ శాఖ ఈ అంశంలోనూ కీలక సవరణలు చేసింది. » సెలెక్షన్ కమిటీలోని సభ్యులెవరూ... ఫిర్యాదుల పరిష్కార కమిటీలో భాగం కాకూడదు. ఇది సహజ న్యాయ సూత్రానికి విరుద్ధం. జాతీయ క్రీడా సమాఖ్య వివాద పరిష్కార కమిషన్‌ను ఏర్పాటు చేసుకోవాలి. » జాతీయ క్రీడా సమాఖ్యల అధ్యక్షులు ఎంపిక ప్రక్రియను దగ్గరుండి పరిశీలించాలి. హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్, చీఫ్ కోచ్, మాజీ క్రీడాకారులు, ఖేల్‌రత్న, అర్జున అవార్డు గ్రహీతలు ఇలా అందుబాటులో ఉన్న వారిని సెలెక్షన్ కమిటీకి ఎంపిక చేసే అధికారం జాతీయ క్రీడా సమాఖ్యల అధ్యక్షులదే. -
IPL 2025: సన్‌రైజర్స్ తొలి రెండు మ్యాచ్‌ల టికెట్లు అమ్మకం
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సొంతగడ్డపై ఆడే తొలి రెండు మ్యాచ్‌లకు సంబంధించి టికెట్లను ఈరోజు ఆన్లైన్లో విక్రయించనున్నారు. ఈనెల 23న ఉప్పల్ స్టేడియంలో జరిగే తమ తొలి లీగ్ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ జట్టుతో సన్‌రైజర్స్ ఆడనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం గం. 3:30 నుంచి జరుగుతుంది. అనంతరం ఈనెల 27న ఉప్పల్ స్టేడియంలోనే జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో సన్‌రైజర్స్ తలపడుతుంది. ఈ మ్యాచ్‌ను రాత్రి గం. 7:30 నుంచి నిర్వహిస్తారు. ఈ రెండు లీగ్ మ్యాచ్‌లకు సంబంధించి టికెట్లను ఈరోజు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ మ్యాచ్‌ల అధికారిక టికెటింగ్ పార్ట్నర్ districtappలో district.in వెబ్సైట్లో ఈ టికెట్లను ఆన్లైన్లో కొనుగోలు చేయవచ్చు. -
WPL 2025: వారియర్స్ ఆశలు ఆవిరి!
లక్నో: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీలో ‘ప్లే ఆఫ్’ దశకు అర్హత సాధించే అవకాశాలు సజీవంగా ఉండాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్ జట్టు నిరాశపరిచింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్‌పై గెలిచి ప్లే ఆఫ్స్ దశకు చేరువైంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన యూపీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. జార్జియా వోల్ (33 బంతుల్లో 55; 12 ఫోర్లు) డబ్ల్యూపీఎల్‌లో తొలి అర్ధశతకంతో ఆకట్టుకోగా... గ్రేస్ హ్యారిస్ (28; 3 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ దీప్తి శర్మ (27; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. కిరణ్ నవ్గిరె (0), షినెల్ హెన్రీ (6), శ్వేత సెహ్రావత్ (0), ఉమా ఛెత్రీ (1) విఫలమయ్యారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో అమేలియా కెర్ 38 పరుగులిచ్చి 5 వికెట్లతో అదరగొట్టగా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హేలీ మాథ్యూస్ (2 వికెట్లు; 68 పరుగులు) ఆల్‌రౌండ్ ప్రదర్శన తో మెరిపించింది. ఓపెనర్లు రాణించడంతో ఒకదశలో 7.5 ఓవర్లలో 74 పరుగులు చేసిన యూపీ వారియర్స్ ఆ తర్వాత అదే జోరు కొనసాగించలేకపోయింది. అమేలియా విజృంభణతో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి సాధారణ స్కోరుకే పరిమితమైంది. అనంతరం లక్ష్యఛేదనలో ముంబై ఇండియన్స్ 18.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. హేలీ (46 బంతుల్లో 68; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), సివర్ బ్రంట్ (23 బంతుల్లో 37; 7 ఫోర్లు) రాణించారు.వీరిద్దరూ రెండో వికెట్‌కు 58 బంతుల్లోనే 92 పరుగులు జోడించడంతో ముంబై సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. లీగ్‌లో భాగంగా శుక్రవారం జరగనున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో గుజరాత్ జెయింట్స్ ఆడుతుంది. -
Axar Patel: ‘అక్షరా’లా అమూల్యం.. భారత జట్టులో స్థానం సుస్థిరం
అక్షర్ పటేల్ భారత జట్టు తరఫున 2014లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టాడు. అయితే పదేళ్ల కాలంలో కేవలం 14 టెస్టులు, 57 వన్డేలు, 60 టి20లు మాత్రమే ఆడగలిగాడు. తనలాంటి లెఫ్టార్మ్ స్పిన్ బౌలింగ్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ కలగలిసిన సీనియర్ ప్లేయర్ రవీంద్ర జడేజా నీడలోనే అతను ఎక్కువ కాలం ఉండిపోవడమే అందుకు కారణం. జడేజా ఏదో కారణంతో జట్టుకు దూరమైతే తప్ప అక్షర్‌కు అవకాశం దక్కకపోయేది. కానీ గత ఏడాది కాలంలో పరిస్థితి మారింది. వన్డేలు, టి20ల్లో చక్కటి ప్రదర్శనలతో అతను జట్టు విజయాల్లో కీలక ఆటగాడిగా ఎదిగాడు. జడేజాతో పోలికలు వచ్చినా సరే... తనదైన శైలిలో రెండు విభాగాల్లోనూ వైవిధ్యాన్ని కనబరుస్తూ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. సాక్షి క్రీడా విభాగం టి20 వరల్డ్ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాతో భారత్ పోరు... 34 పరుగులకే జట్టు రోహిత్, పంత్, సూర్యకుమార్ వికెట్లు కోల్పోయింది. ఈ స్థితిలో తీవ్ర ఒత్తిడి మధ్య ఐదో స్థానంలో అక్షర్ బరిలోకి దిగాడు. మరో ఎండ్‌లో కోహ్లిలాంటి దిగ్గజం ఉండగా అక్షర్ కీలక బాధ్యతలు తన భుజాన వేసుకున్నాడు. పాండ్యా, దూబే, జడేజాలాంటి ఆల్రౌండర్లను కాదని అక్షర్‌పై నమ్మకంతో కోచ్ ద్రవిడ్ ముందు పంపించాడు. దూకుడుగా ఆడి సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు రాబట్టే ఉద్దేశంతో వచ్చిన అతను తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. కోహ్లితో కలిసి అక్షర్ నాలుగో వికెట్‌కు 54 బంతుల్లో 72 పరుగులు జోడించాడు. ఇందులో కోహ్లి 23 బంతుల్లో ఒక్క బౌండరీ లేకుండా 21 పరుగులు చేస్తే... అక్షర్ ఒక ఫోర్, 4 సిక్స్‌లతో 31 బంతుల్లో 47 పరుగులు సాధించాడు. చివరకు భారత్ ప్రపంచ చాంపియన్‌గా నిలవడంలో ఈ ఇన్నింగ్స్ విలువేమిటో అందరికీ తెలిసింది. ఆ మ్యాచ్ టీమిండియాలో అక్షర్ స్థాయిని పెంచింది. ఇప్పుడు దాదాపు ఏడాది కాలంగా అది కనిపిస్తోంది. 2021లో ఇంగ్లండ్ జట్టు టెస్టు సిరీస్ కోసం భారత్‌కు వచ్చింది. ఈ సిరీస్‌లో జడేజా గైర్హాజరులో 3 టెస్టులు ఆడిన అక్షర్ కేవలం 10.59 సగటుతో 27 వికెట్లు పడగొట్టాడు. నిజానికి ఈ ప్రదర్శన అతనికి టెస్టు జట్టులో స్థానాన్ని సుస్థిరం చేయాలి. కానీ అలా జరగలేదు. ఆ తర్వాత కూడా అడపాదడపా అవకాశాలే తప్ప రెగ్యులర్‌గా బరిలోకి దిగలేదు. అలాంటి సమయంలో అక్షర్ వన్డేలు, టి20లపై ఎక్కువగా దృష్టి పెట్టాడు. జడేజాతో పోలిస్తే అక్షర్ బంతిని ఎక్కువ టర్న్ చేయలేడు. అందుకే టెస్టులతో పోలిస్తే వన్డే, టి20లకు అవసరమైన నైపుణ్యాలను సానబెట్టుకున్నాడు. బౌలింగ్‌కు కాస్త పేస్ జోడించి ‘ఆర్మ్ బాల్’తో నేరుగా వికెట్లపైకి సంధిస్తూ బ్యాటర్లను ఇబ్బంది పెట్టే శైలితో ఫలితం సాధించాడు. దీని వల్ల కొన్నిసార్లు బ్యాటర్‌కు భారీ షాట్ ఆడే అవకాశం వచ్చినా... అదే ఉచ్చులో ఎల్బీడబ్ల్యూ లేదా బౌల్డ్‌కు అవకాశం ఉంటుంది. ఆ్రస్టేలియాతో సెమీఫైనల్లో మ్యాక్స్‌వెల్ వికెట్ దీనికి చక్కటి ఉదాహరణ. ఇదే సమయంలో తన బ్యాటింగ్‌లో మరింత సాధన చేశాడు. పరిమిత ఓవర్లలో భారీ షాట్లతో పరుగులు రాబట్టడంలో తన ప్రత్యేకత చూపించాలని అతను భావించాడు. అన్నింటికి మించి జడేజాతో ఫీల్డింగ్ విషయంలో సహజంగానే పోలిక వచ్చింది. ఇందులోనూ ప్రత్యేక సాధన చేసి తాను ఫీల్డింగ్‌లోనూ చురుకైన వాడినేనని నిరూపించుకోవడం అతనికి వన్డేలు, టి20ల్లో మరిన్ని అవకాశాలు కల్పించింది. టి20 వరల్డ్ కప్‌లో అందరికీ సూర్యకుమార్ క్యాచ్ బాగా గుర్తుండిపోవచ్చు. అంతకుముందు ఆసీస్‌తో మ్యాచ్‌లో మార్ష్ క్యాచ్‌ను బౌండరీ వద్ద అక్షర్ ఒంటిచేత్తో అందుకున్న తీరు అద్భుతం. ఇక జడేజా రిటైర్మెంట్తో టి20ల్లో అతని స్థానం సుస్థిరమైంది. బ్యాటర్‌గానే తన కెరీర్ మొదలు పెట్టిన అక్షర్ తనలోని అసలైన బ్యాటర్‌ను గత కొంత కాలంగా బయటకు తెచ్చాడు. ముఖ్యంగా గత రెండేళ్లుగా అతని దానికి పూర్తి న్యాయం చేకూరుస్తున్నాడు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ అతనికి అలాంటి అవకాశం ఇచ్చింది. వాటిని చాలా వరకు అక్షర్ సమర్థంగా వాడుకున్నాడు. ఇప్పుడు భారత జట్టు అవసరాలరీత్యా అతనికి ఐదో స్థానంలో ఆడే అవకాశం దక్కుతోంది. వన్డేల్లో రాహుల్‌కే కీపర్‌గా తొలి ప్రాధాన్యత లభిస్తుండటంతో పంత్‌కు చోటు ఉండటం లేదు. దాంతో టాప్–6లో అంతా కుడిచేతి వాటం బ్యాటర్లే ఉంటున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని అక్షర్‌ను మేనేజ్మెంట్ ఐదో స్థానంలో పంపిస్తోంది. అది చక్కటి ఫలితాలను కూడా అందించింది. అక్షర్ బ్యాటింగ్‌లో చెప్పుకోదగ్గ అంశం అతను స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొనే తీరు. ముఖ్యంగా డీప్ మిడ్ వికెట్ మీదుగా స్లాగ్ స్వీప్‌తో అతను పెద్ద సంఖ్యలో పరుగులు రాబడుతున్నారు. అలవోకగా సిక్స్‌లు కొడుతున్న అతని నైపుణ్యం జట్టుకు అదనపు బలాన్ని ఇస్తోంది. టి20 వరల్డ్ కప్ తర్వాత శ్రీలంకతో వన్డే సిరీస్‌లో అతను తొలిసారి ఐదో స్థానంలో ఆడాడు. అక్షర్ వరుసగా 44, 52, 41 నాటౌట్, 8, 42, 27 పరుగులు సాధించాడు. ఒక బ్యాటర్‌గా చూస్తే ఇవన్నీ అద్భుత గణాంకాలు కాకపోయినా... ఆల్‌రౌండర్ కోణంలో, పైగా తక్కువ స్కోర్ల మ్యాచ్‌లలో ఈ స్కోర్లన్నీ అమూల్యమైనవే. ఇప్పుడు టీమిండియాలో అన్ని విధాలా ఆధారపడదగ్గ ప్లేయర్‌గా మారిన అక్షర్ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే సుదీర్ఘ కాలం జట్టుకు ప్రాతినిధ్యం వహించగలడు. -
ఐదేసిన అమేలియా కెర్.. నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన వారియర్జ్
డబ్ల్యూపీఎల్-2025లో భాగంగా లక్నో వేదికగా ఇవాళ (మార్చి 6) యూపీ వారియర్జ్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ముంబై ఇండియన్స్ యూపీ వారియర్జ్‌ను నామమాత్రపు స్కోర్‌కే పరిమితం చేసింది. అమేలియా కెర్ ఐదు వికెట్లతో విజృంభించడంతో వారియర్జ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 150 పరుగులు మాత్రమే చేయగలిగింది. వారియర్జ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ జార్జియా వాల్ (55) అర్ద సెంచరీతో రాణించగా.. గ్రేస్ హ్యారిస్ (28), కెప్టెన్ దీప్తి శర్మ (27), వృందా దినేశ్ (10), ఆఖర్లో సోఫీ ఎక్లెస్టోన్ (16) రెండంకెల స్కోర్లు చేశారు. కిరణ్ నవ్‌గిరే, శ్వేతా సెహ్రావత్ డకౌట్లు కాగా.. చిన్నెల్ హెన్రీ 6, ఉమ్రా ఛెత్రీ ఒక పరుగు చేశారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో అమేలియా కెర్‌తో పాటు హేలీ మాథ్యూస్ (2), నాట్ సీవర్ బ్రంట్ (1), పరుణిక సిసోడియా (1) వికెట్లు తీశారు. వారియర్జ్ ఇన్నింగ్స్‌కు ఓపెనర్లు గ్రేస్ హ్యారిస్, జార్జియా వాల్ గట్టి పునాది వేశారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 74 పరుగులు (8 ఓవర్లలో) జోడించారు. హ్యారిస్, వాల్ క్రీజ్‌లో ఉండగా.. వారియర్జ్ భారీ స్కోర్ సాధిస్తుందని అంతా భావించారు. అయితే 16 పరుగుల వ్యవధిలో వీరిద్దరూ ఔట్ కావడంతో వారియర్జ్ కష్టాల్లో పడింది. హ్యారిస్, వాల్ ఔటయ్యాక వారియర్జ్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి భారీ స్కోర్ చేయలేకపోయింది. సెకండ్ డౌన్లో వచ్చిన దీప్తి శర్మ చివరి ఓవర్ వరకు క్రీజ్‌లో ఉన్నప్పటికీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఆఖర్లో ఎక్లెస్టోన్ ఓ మోస్తరుగా బ్యాట్‌ను ఝులిపించడంతో వారియర్జ్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.ఈ సీజన్లో వారియర్జ్ ఆశించిన స్థాయిలో రాణించలేక పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 2 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలుపొందింది. ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఢిల్లీ ఆడిన 7 మ్యాచ్‌ల్లో ఐదింట విజయాలు సాధించి ప్లే ఆఫ్స్‌కు కూడా అర్హత సాధించింది. గత రెండు సీజన్లలో చివరి స్థానంలో నిలిచిన గుజరాత్ ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది. గతేడాది రన్నరప్ ముంబై ఇండియన్స్ మూడులో, ఢిపెండింగ్ చాంపియన్ ఆర్సీబీ నాలుగో స్థానంలో ఉన్నాయి. నేటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ గెలిస్తే పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుని ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంటుంది. -
Champions Trophy 2025: ఫైనల్ మ్యాచ్‌కు అంపైర్లు వీరే..!
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ మ్యాచ్‌ను నిర్వహించబోయే అంపైర్ల పేర్లను ఐసీసీ ఇవాళ (మార్చి 6) ప్రకటించింది. ఈ మ్యాచ్ కోసం ఐసీసీ అనుభవజ్ఞులైన మ్యాచ్ అఫీషియల్స్‌ను ఎంపిక చేసింది. ఈ మ్యాచ్‌లో ఆన్ ఫీల్డ్ అంపైర్లుగా పాల్ రీఫిల్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ వ్యవహరించనున్నారు. థర్డ్ అంపైర్‌గా జోయల్ విల్సన్ విధులు నిర్వహించనున్నాడు. ఫోర్త్ అంపైర్‌గా కుమార ధర్మసేన.. మ్యాచ్ రిఫరీగా రంజన్ మదుగలే వ్యవహరించనున్నారు. ఫైనల్ మ్యాచ్ అంపైర్లలో పాల్ రీఫిల్ సౌతాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో సెమీస్‌లో ఫీల్డ్ అంపైర్‌గా వ్యవహరించగా.. ఇల్లింగ్‌వర్త్, భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి సెమీఫైనల్‌కు ఫీల్డ్ అంపైర్‌గా వ్యవహరించాడు. నాలుగు సార్లు ఐసీసీ అంపైర్ ఆఫ్ ద ఇయర్‌గా నిలిచిన ఇల్లింగ్‌వర్త్.. 2023 వన్డే వరల్డ్‌కప్, 2024 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్స్‌లోనూ ఫీల్డ్ అంపైర్‌గా వ్యవహరించాడు. ఇల్లింగ్‌వర్త్.. భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన గ్రూప్ స్టేజీ మ్యాచ్‌కు కూడా ఫీల్డ్ అంపైర్‌గా వ్యవహరించాడు.కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ దుబాయ్ వేదికగా మార్చి 9న జరుగనుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది. భారత్ తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్‌కు చేరగా.. న్యూజిలాండ్ రెండో సెమీస్‌లో సౌతాఫ్రికాను చిత్తు చేసి తుది పోరుకు అర్హత సాధించింది.ఇదిలా ఉంటే, ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ తలపడటం ఇది రెండో సారి. 2000 ఎడిషన్‌లో ఇరు జట్లు ఎదురెదురుపడగా.. న్యూజిలాండ్ భారత్‌ను ఓడించి తమ తొలి ఐసీసీ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ ఇరు జట్లు ఇనాగురల్ డబ్ల్యూటీసీ ఫైనల్లో (2019-2021) రెండో సారి తలపడ్డాయి. ఈసారి కూడా న్యూజిలాండ్ భారత్‌ను ఓడించి తమ రెండో ఐసీసీ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. న్యూజిలాండ్, తాము గెలిచిన రెండు ఐసీసీ టైటిళ్లను భారత్‌పైనే గెలవడం విశేషం. -
ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఆర్సీబీకి శుభవార్త
2025 ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు శుభవార్త అందింది. ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరమవుతాడనుకున్న జేకబ్ బేతెల్ (ఇంగ్లండ్ ఆటగాడు) గాయం నుంచి పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తుంది. బేతెల్ మొదటి మ్యాచ్ నుంచే అందుబాటులో ఉంటాడని సమాచారం. బేతెల్.. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్ సందర్భంగా గాయపడిన విషయం తెలిసిందే. చిన్న వయసులోనే అద్భుతమైన స్ట్రోక్ ప్లేయర్‌గా గుర్తుంపు తెచ్చుకున్న బేతెల్‌ను ఆర్సీబీ గతేడాది మెగా వేలంలో రూ.2.6 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. బేతెల్ మిడిలార్డర్లో విధ్వంకర బ్యాటింగ్ చేయడంతో పాటు ఉపయోగకరమైన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ చేస్తాడు. బేతెల్ ఇప్పటివరకు 63 టీ20లు ఆడి 136.77 స్ట్రయిక్‌రేట్‌తో 1127 పరుగులు చేశాడు. గతేడాది చివర్లో ఇంగ్లండ్ తరఫున అరంగేట్రం చేసిన బేతెల్ 3 టెస్ట్‌లు, 9 వన్డేలు, 10 టీ20లు ఆడాడు. బేతెల్ టెస్ట్‌ల్లో 3, వన్డేల్లో 2, టీ20ల్లో 2 హాఫ్ సెంచరీలు చేశాడు. బేతెల్ మొత్తంగా అంతర్జాతీయ కెరీర్లో 674 పరుగులు చేశాడు. ఐదు వికెట్లు పడగొట్టాడు. 21 ఏళ్ల బేతెల్‌కు ఇది తొలి ఐపీఎల్ అవుతుంది. ఆర్సీబీ.. మార్చి 22న కోల్‌కతాలో జరిగే లీగ్ ఓపెనింగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్‌తో తలపడుతుంది. ఈ ఏడాదే ఆర్సీబీ నూతన కెప్టెన్‌గా మధ్యప్రదేశ్ ఆటగాడు రజత్ పాటిదార్ ఎంపికయ్యాడు.ఈ ఏడాది ఆర్సీబీ జట్టు..రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, దేవ్‌దత్ పడిక్కల్, టిమ్ డేవిడ్,స్వస్థిక్ చికార, కృనాల్ పాండ్యా, లియామ్ లివింగ్‌స్టోన్, మనోజ్ భాండగే, జేకబ్ బేతెల్, రొమారియో షెపర్డ్, స్వప్నిల్ సింగ్, మోహిత్ రతీ, ఫిలిప్ సాల్ట్, జితేశ్ శర్మ, జోష్ హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, లుంగి ఎంగిడి, రసిక్ దార్ సలామ్, సుయాశ్ శర్మ, యశ్ దయాల్, నువాన్ తుషార, అభినందన్ సింగ్ఐపీఎల్ 2025లో ఆర్సీబీ షెడ్యూల్మార్చి 22- కేకేఆర్తోమార్చి 28- సీఎస్కేఏప్రిల్ 2- గుజరాత్ఏప్రిల్ 7- ముంబైఏప్రిల్ 10- ఢిల్లీఏప్రిల్ 13- రాజస్థాన్ఏప్రిల్ 18- పంజాబ్ఏప్రిల్ 20- పంజాబ్ఏప్రిల్ 24- రాజస్థాన్ఏప్రిల్ 27- ఢిల్లీమే 3- సీఎస్కేమే 9- లక్నోమే 13- సన్రైజర్స్మే 17- కేకేఆర్ -
ఏప్రిల్, మే నెలల్లో ట్రై సిరీస్ ఆడనున్న భారత్
ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో శ్రీలంకలో మహిళల ముక్కోణపు వన్డే టోర్నీ జరుగనుంది. ఈ టోర్నీలో శ్రీలంక సహా భారత్, సౌతాఫ్రికా జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నీ డబుల్ రౌండ్ రాబిన్ ఫార్మాట్లో జరుగుతుంది. ప్రతి జట్టు నాలుగు గ్రూప్ స్టేజీ మ్యాచ్‌లు ఆడుతుంది. గ్రూప్ మ్యాచ్‌ల అనంతరం మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఈ టోర్నీలో అన్ని మ్యాచ్‌లకు కొలొంబోని ప్రేమదాస స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. మ్యాచ్‌లన్నీ డే మ్యాచ్‌లుగా జరుగుతాయి. ఏప్రిల్ 27న జరిగే టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు టీమిండియాతో తలపడనుంది. మే 11న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ టోర్నీ ఈ ఏడాది చివర్లో భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు సన్నాహకంగా ఉపయోగపడుతుంది. ఈ టోర్నీలో పాల్గొనే మూడు జట్లు ఇదివరకే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించాయి.ముక్కోణపు సిరీస్ షెడ్యూల్ఏప్రిల్ 27- భారత్ వర్సెస్ శ్రీలంకఏప్రిల్ 29- భారత్ వర్సెస్ సౌతాఫ్రికామే 1- శ్రీలంక వర్సెస్ సౌతాఫ్రికామే 4- భారత్ వర్సెస్ శ్రీలంకమే 6- భారత్ వర్సెస్ సౌతాఫ్రికామే 8- సౌతాఫ్రికా వర్సెస్ శ్రీలంకమే 11- ఫైనల్‌కాగా, భారత్ ఈ ఏడాది ఆరంభంలో స్వదేశంలో ఐర్లాండ్‌తో వన్డే సిరీస్ ఆడింది. ఈ సిరీస్‌లో భారత్ జయకేతనం ఎగురవేసింది. గతేడాది చివర్లో సౌతాఫ్రికా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం ఇంగ్లండ్‌కు ఆతిథ్యమిచ్చింది. ఈ సిరీస్‌ను సౌతాఫ్రికా 1-2 తేడాతో కోల్పోయింది. శ్రీలంక విషయానికొస్తే.. ఈ జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.మహిళల క్రికెట్ విషయానికొస్తే.. ప్రస్తుతం భారత్‌లో డబ్ల్యూపీఎల్ మూడో సీజన్ జరుగుతుంది. ఈ లీగ్ చివరి దశకు చేరింది. 15 మ్యాచ్‌లు అయిపోయే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఢిల్లీ ఆడిన 7 మ్యాచ్‌ల్లో ఐదింట విజయాలు సాధించి ప్లే ఆఫ్స్‌కు కూడా అర్హత సాధించింది. గత రెండు సీజన్లలో చివరి స్థానంలో నిలిచిన గుజరాత్ ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది. గతేడాది రన్నరప్ ముంబై ఇండియన్స్ మూడులో, ఢిపెండింగ్ చాంపియన్ ఆర్సీబీ నాలుగో స్థానంలో, యూపీ వారియర్జ్ ఐదో స్థానంలో ఉన్నాయి. లీగ్‌లో భాగంగా ఇవాళ (మార్చి 6) యూపీ వారియర్జ్, ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. -
షమీ పెద్ద నేరం చేశాడు.. అతనో క్రిమినల్.. ముస్లిం మత పెద్ద సంచలన వ్యాఖ్యలు
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీపై ఆల్ ఇండియా ముస్లిం జమాత్ జాతీయ అధ్యక్షుడు మౌలానా షాబుద్దీన్ రజ్వీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పవిత్ర రంజాన్ మాసంలో షమీ పెద్ద నేరం చేశాడని ఆరోపించాడు. షమీ ఓ క్రిమినల్ అని సంభోదించాడు. షమీపై రజ్వీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా దూమారం రేపుతున్నాయి. అసలేం జరిగిందంటే.. ఛాంపియన్స్ ట్రోఫీ-2025 తొలి సెమీఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ సందర్భంగా షమీ ఎనర్జీ డ్రింక్ తాగుతూ కనిపించాడు. దీనిపై ముస్లిం మత పెద్ద రజ్వీ తీవ్రంగా స్పందించాడు. #WATCH | Bareilly, UP: President of All India Muslim Jamaat, Maulana Shahabuddin Razvi Bareilvi says, "...One of the compulsory duties is 'Roza' (fasting)...If any healthy man or woman doesn't observe 'Roza', they will be a big criminal...A famous cricket personality of India,… pic.twitter.com/RE9C93Izl2— ANI (@ANI) March 6, 2025పవిత్ర రంజాన్ మాసంలో షమీ రోజా (ఉపవాసం) పాటించకుండా పెద్ద నేరం చేశాడని అన్నాడు. రంజాన్ మాసంలో ఆరోగ్యకరమైన వ్యక్తి రోజా పాటించకపోతే నేరస్థుడవుతాడని తెలిపాడు. రంజాన్ మాసంలో ముస్లింలంతా రోజా పాటిస్తుంటే షమీ ఇలా చేయడమేంటని ప్రశ్నించాడు. రోజా పాటించకుండా షమీ ప్రజల్లోకి తప్పుడు సందేశాన్ని పంపుతున్నాడని అన్నాడు. రోజా పాటించనందుకు షమీని క్రిమినల్‌తో పోల్చాడు. ఇలా చేసినందుకు షమీ దేవునికి సమాధానం చెప్పాలని ఓ వీడియో రిలీజ్ చేశాడు. షమీపై రజ్వీ చేసిన వ్యాఖ్యలపై క్రీడాభిమానులు మండిపడుతున్నారు. మతాన్ని క్రీడలతో ముడిపెట్టకూడదని అంటున్నారు. షమీ దేశం కోసం ఆడుతూ రోజా ఉండలేకపోయాడని కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయంలో ముస్లిం సమాజంతో పాటు యావత్ దేశం షమీకి మద్దతుగా నిలుస్తుంది. షమీ ఈ విషయాన్ని పక్కన పెట్టి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌పై దృష్టి పెట్టాలని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు.కాగా, ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో షమీ 48 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఈ టోర్నీలో బంగ్లాదేశ్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో షమీ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. అనంతరం పాకిస్తాన్, న్యూజిలాండ్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్‌ల్లో షమీ వికెట్లు తీయలేకపోయాడు. సెమీస్‌లో ఆసీస్‌పై విజయం సాధించి భారత్ ఫైనల్‌కు చేరింది. మార్చి 9న జరిగే ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది. 2000 ఎడిషన్ (ఛాంపియన్స్ ట్రోఫీ) తర్వాత భారత్, న్యూజిలాండ్ ఫైనల్లో తలపడటం ఇదే మొదటిసారి. ఐసీసీ టోర్నీల ఫైనల్స్‌లో భారత్‌తో తలపడిన రెండు సందర్భాల్లో న్యూజిలాండే విజేతగా నిలిచింది. 2000 ఎడిషన్ ఛాంపియన్స్ ట్రోఫీ, 2019-2021 డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో న్యూజిలాండ్ భారత్‌పై జయకేతనం ఎగురవేసి ఐసీసీ టైటిళ్లు ఎగరేసుకుపోయింది. -
CT 2025 Final IND vs NZ: విజేతను తేల్చేది ఆ ఇద్దరే!
ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) క్రికెట్ టోర్నమెంట్లో టీమిండియాను ఢీ కొట్టేందుకు న్యూజిలాండ్ సిద్ధంగా ఉంది. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో బుధవారం జరిగిన రెండో సెమీఫైనల్లో న్యూజిలాండ్ 50 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో కివీస్ జట్టులోని భారత సంతతి బ్యాటర్ రచిన్ రవీంద్ర(Rachin Ravindra), మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్(Kane Williamson) సెంచరీలు సాధించారు.రికార్డ్-బ్రేకర్ల మధ్య ఉత్కంఠమైన పోటీఇక టీమిండియా- న్యూజిలాండ్ మధ్య ఫైనల్‌కు రంగం సిద్ధమైన నేపథ్యంలో ఓ ఆసక్తికర పోటీ చూడబోతున్నాం. ఫ్యాబ్ ఫోర్లో భాగమైన కేన్ విలియమ్సన్ , విరాట్ కోహ్లీ.. ఇద్దరూ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. అనేక రికార్డులు బద్దలు కొడుతున్నారు. మార్చి 9 ఆదివారం జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఈ ఇద్దరు గొప్ప బ్యాటర్ల మధ్య జరిగే పోటీని ప్రధాన పోరుగా అభివర్ణించవచ్చు.ఎందుకంటే జట్టులో వీరిద్దరిదీ బాధ్యత ఒక్కటే. తమ జట్టు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఒక వైపు దృఢంగా నిలబడడం లేదా కాపు కాయడం. పరుగుల ప్రవాహాన్ని కొనసాగించడం. దీని ద్వారా ప్రత్యర్థి బౌలర్లకు బ్యాటర్‌పై పట్టు సాధించుకుండా నిరోధించడం. ఇందుకోసం వీరిద్దరూ ఆఖరి ఓవర్ వరకూ బ్యాటింగ్ చేయాలని చూస్తారు. విజేతను తేల్చేది ఆ ఇద్దరే!ఈ ప్రయత్నం లో వీరిద్దరూ సఫలమైతే వారి జట్టుకి గెలుపు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. దీంతో వీరిద్దరూ వారి జట్లలో ఎంత ప్రాముఖ్యం ఉందో అర్థమైపోతుంది.ఇక మంగళవారం దుబాయ్‌లో జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్ లో 36 ఏళ్ల విరాట్ కోహ్లీ ఆడిన తీరు అందరికీ తెలిసిందే. కోహ్లీ ఎంతో నింపాదిగా ఆడి భారత్ ఇన్నింగ్స్ కి వెన్నెముక గా నిలిచాడు. కోహ్లీ.. శ్రేయస్ అయ్యర్, ఆ తర్వాత కేఎల్ రాహుల్‌లతో కలిసి కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.కివీస్ విజయంలో కేన్ పాత్రదక్షిణాఫ్రికా తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో కూడా కేన్ అదే రీతిలో ఆడాడు. విలియమ్సన్, రచిన్ రవీంద్ర ఇద్దరూ సెంచరీలు సాధించి తమ జట్టు 362/6 పరుగుల భారీ స్కోరును చేరుకోవడానికి సహాయపడ్డారు. రవీంద్ర 108 పరుగులు చేయగా, విలియమ్సన్ తన 102 పరుగులు సాధించాడు. ఈ జంట రెండవ వికెట్‌కు ఏకంగా 164 పరుగులు జోడించి దక్షిణాఫ్రికాను కోలుకోలేని దెబ్బ కొట్టారు.ఈ ఇన్నింగ్స్ లో భాగంగా 34 ఏళ్ల కేన్ విలియమ్సన్ 19000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేశాడు. ఈ రికార్డును సాధించిన తొలి న్యూజిలాండ్ బ్యాటర్‌గా ఖ్యాతి వహించాడు. విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ (432 ఇన్నింగ్స్), బ్రియాన్ లారా (433 ఇన్నింగ్స్) తర్వాత అంతర్జాతీయ క్రికెట్ లో ఈ రికార్డ్ ని వేగవంతంగా సాధించిన వారిలో విలియమ్సన్ నాలుగో వాడు. ఈ ఘనతను నమోదు చేయడానికి న్యూజిలాండ్ దిగ్గజం 440 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. అతను వన్డే ల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్మన్ల ల లో 16వ స్థానంలో ఉన్నాడు.వన్డేల్లో విరాట్ కోహ్లీభారత్ ‘రన్ మెషిన్’గా ప్రసిద్ధి చెందిన విరాట్ కోహ్లీ 301 వన్డే మ్యాచ్‌ల్లో సగటు 58.11 సగటుతో 14,180 పరుగులు చేశాడు, ఇందులో 51 సెంచరీలు మరియు 74 అర్ధ సెంచరీలు ఉన్నాయి. కోహ్లీ స్ట్రైక్ రేట్ 93.35.వన్డేల్లో కేన్ విలియమ్సన్ఎప్పడూ ప్రశాంతంగా, నిబ్బరంగా బ్యాటింగ్ చేసే విలియమ్సన్ 172 వన్డే మ్యాచ్‌లు ఆడాడు, ఇందులో అతను 49.47 సగటు తో 81.72 స్ట్రైక్ రేట్‌తో 7,224 పరుగులు చేశాడు. ఇందులో 15 సెంచరీలు మరియు 47 అర్ధ సెంచరీలు ఉన్నాయి.ఈ ఇద్దరు స్టార్లలో ఎవరు ఫైనల్లో పైచేయి సాధిస్తారన్న దాని పైనే టైటిల్ విజేత నిర్ణయించబడుతుందనడం లో సందేహం లేదు. గణాంకాల ఆధారంగా చుస్తే విరాట్ కోహ్లీ మరింత ఆధిపత్యం చెలాయించే అవకాశం కనిపిస్తుంది. కానీ మ్యాచ్ ఫైనల్ మలుపులు తిరుగుతూ ఉత్కంఠంగా సాగడం ఖాయం. మరి ఫైనల్ మ్యాచ్ లో వీరిద్దరి లో ఎవరు మెరుస్తారో మ్యాచ్ రోజున స్పష్టంగా తెలుస్తుంది.చదవండి: అతడిని స్పేర్ టైర్ కంటే దారుణంగా వాడుతున్నారు: భారత మాజీ క్రికెటర్ ఫైర్ -
డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు సత్తా చాటిన ఆసీస్ ఓపెనర్
డబ్ల్యూటీసీ-2025 ఫైనల్‌కు ముందు ఆసీస్ వెటరన్ ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో భాగంగా టస్మానియాతో జరిగిన మ్యాచ్‌లో (క్లీన్స్‌ల్యాండ్) సూపర్ సెంచరీతో సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో ఖ్వాజా 221 బంతుల్లో 12 బౌండరీలు, సిక్సర్ సాయంతో 127 పరుగులు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఖ్వాజాకు ఇది 43వ శతకం. ఖ్వాజా సెంచరీతో కదంతొక్కడంతో తొలుత బ్యాటింగ్ చేసిన క్వీన్స్‌ల్యాండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసింది. ఖ్వాజాకు జతగా లాచ్లాన్ హెర్నీ (74) అర్ద సెంచరీతో రాణించాడు. ఆట ముగిసే సమయానికి మైఖేల్ నెసర్ (10), జాక్ విల్డర్‌ముత్ (4) క్రీజ్‌లో ఉన్నారు. క్లీన్స్‌ల్యాండ్ ఇన్నింగ్స్‌లో మ్యాట్ రెన్షా 20, జాక్ క్లేటన్ 19, బెన్ మెక్‌డెర్మాట్ 24, జిమ్మీ పియర్సన్ 14 పరుగులు చేసి ఔటయ్యారు. టస్మానియా బౌలర్లలో బ్యూ వెబ్‌స్టర్ 3 వికెట్లు పడగొట్టగా.. గేబ్ బెల్, మిచెల్ ఓవెన్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఫైనల్స్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఖ్వాజా సూపర్ సెంచరీ సాధించడంతో టస్మానియాపై క్లీన్స్‌ల్యాండ్ పైచేయి సాధించింది.కాగా, ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధించకముందు ఖ్వాజా శ్రీలంక పర్యటనలో డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. శ్రీలంకతో జరిగిన రెండో టెస్ట్‌లో ఖ్వాజా 352 బంతుల్లో 232 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శనతో ఖ్వాజా లేటు వయసులో ఆస్ట్రేలియా తరఫున డబుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. శ్రీలంక పర్యటనకు ముందు స్వదేశంలో భారత్‌తో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఖ్వాజా దారుణంగా విఫలమయ్యాడు. 5 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఖ్వాజా కేవలం ఒకే ఒక హాఫ్ సెంచరీ చేశాడు. మిగతా 9 ఇన్నింగ్స్‌ల్లో పూర్తిగా నిరాశపరిచాడు. సౌతాఫ్రికాతో జరుగబోయే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఖ్వాజా ఫామ్‌లో కొనసాగడం ఆసీస్‌కు శుభసూచకం. డబ్ల్యూటీసీ ఫైనల్ జూన్ 11-15 మధ్యలో లార్డ్స్ వేదికగా జరుగనుంది.ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియా వన్డే జట్టు ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీస్‌లో నిష్క్రమించింది. తొలి సెమీఫైనల్లో స్టీవ్ స్మిత్ సేన టీమిండియా చేతిలో భంగపడింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (73), అలెక్స్ క్యారీ (61) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో షమీ 3, వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా తలో 2, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం భారత్ 48.1 ఓవర్లలోనే ఆసీస్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించి ఫైనల్‌కు చేరింది. విరాట్ కోహ్లి (84) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి టీమిండియా గెలుపుతో కీలకపాత్ర పోషించాడు. శ్రేయస్ అయ్యర్ (45), కేఎల్ రాహుల్ (42 నాటౌట్), హార్దిక్ పాండ్యా (28) భారత్ గెలుపులో తలో చేయి వేశారు. మార్చి 9న జరుగబోయే ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. -
IPL 2025: సన్‌రైజర్స్ జట్టులోకి సౌతాఫ్రికా ఆల్‌రౌండర్
సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్టులోకి కొత్త క్రికెటర్ వచ్చాడు. సౌతాఫ్రికాకు చెందిన వియాన్ ముల్దర్(Wiaan Muldar)కు రైజర్స్ స్వాగతం పలికింది. ఈ ప్రొటిస్ ఆల్‌రౌండర్‌ను తమ జట్టులోకి చేర్చుకున్నట్లు హైదరాబాద్ ఫ్రాంఛైజీ గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. గాయం కారణంగా దూరమైన బ్రైడన్ కార్సే స్థానాన్ని ముల్దర్‌తో భర్తీ చేసినట్లు వెల్లడించింది.ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)-2025 మెగా వేలానికి ముందు సన్‌రైజర్స్ ఐదుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. సౌతాఫ్రికా స్టార్ హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్(రూ. 23 కోట్లు), ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్(రూ. 18 కోట్లు), టీమిండియా స్టార్లు అభిషేక్ శర్మ(రూ. 14 కోట్లు), నితీశ్ కుమార్ రెడ్డి(రూ. 6 కోట్లు ), ఆసీస్ హార్డ్ హిట్టర్ ట్రావిస్ హెడ్(రూ. 14 కోట్లు)లను రైజర్స్ యాజమాన్యం అట్టిపెట్టుకుంది.ఈ క్రమంలో రూ. 45 కోట్ల పర్సు వాల్యూతో ఐపీఎల్-2025 మెగా వేలం బరిలో దిగిన సన్‌రైజర్స్.. ఇషాన్ కిషన్, హర్షల్ పటేల్, మహ్మద్ షమీ, రాహుల్ చహర్ వంటి భారత స్టార్లతో పాటు ఆడం జంపా, బ్రైడన్ కార్సే, కమిందు మెండిస్, ఇషాన్ మలింగ రూపంలో విదేశీ క్రికెటర్లను కూడా కొనుగోలు చేసింది.బొటనవేలికి గాయం.. సీజన్ మొత్తానికి దూరంఅయితే, ఇంగ్లండ్ రైటార్మ్ ఫాస్ట్‌బౌలర్ బ్రైడన్ కార్సే ఇటీవల గాయపడ్డాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నమెంట్లో భాగంగా ఫిబ్రవరి 22న ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా.. కార్సే బొటనవేలికి గాయమైంది. ఫలితంగా అతడు ఈ వన్డే టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు దూరమైనట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అతడి స్థానంలో రెహాన్ అహ్మద్‌ను తీసుకువచ్చింది.ఇక ఐపీఎల్ నాటికి కూడా కార్సే కోలుకునే పరిస్థితి లేకపోవడంతో 18వ సీజన్ మొత్తానికి అతడు దూరమైనట్లు సన్‌రైజర్స్ ప్రకటించింది. అతడి స్థానంలో వియాన్ ముల్దర్‌ను రూ. 75 లక్షలకు జట్టులోకి తీసుకుంది. త్వరలోనే ఈ ఆల్‌రౌండర్ సన్‌రైజర్స్‌తో చేరనున్నాడు. ఆఖరిగా సెమీస్లోకాగా 27 ఏళ్ల వియాన్ ముల్దర్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్. కుడిచేతం వాటం బ్యాటర్ అయిన అతడు.. రైటార్మ్ మీడియం పేసర్. చాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆడిన ఈ ప్రొటిస్ ప్లేయర్ చివరగా న్యూజిలాండ్‌తో సెమీస్‌లో మాత్రం నిరాశపరిచాడు. కేన్ విలియమ్సన్(102) రూపంలో కీలక వికెట్ తీసినా.. బ్యాటింగ్‌లో మాత్రం నిరాశపరిచాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 13 బంతులు ఎదుర్కొన్న ముల్దర్ కేవలం ఎనిమిది పరుగులే చేసి.. మైకైల్ బ్రాస్‌వెల్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఇక సౌతాఫ్రికా తరఫున 2017లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ముల్దర్ ఇప్పటి వరకు 18 టెస్టులు, 24 వన్డేలు, 11 టీ20లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 589, 268, 105 పరుగులు చేయడంతో పాటు... 30, 21, 8 వికెట్లు కూల్చాడు. టెస్టుల్లో అతడి ఖాతాలో ఓ శతకం కూడా ఉండటం విశేషం. ఇదిలా ఉంటే.. సన్‌రైజర్స్ గతేడాది కమిన్స్ కెప్టెన్సీలో ఫైనల్ చేరింది.. కానీ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు టైటిల్‌ను చేజార్చుకుంది.ఐపీఎల్-2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుహెన్రిచ్ క్లాసెన్, ప్యాట్ కమిన్స్, ట్రవిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, రాహుల్ చహర్, అభినవ్ మనోహర్, ఆడం జంపా., సిమర్జీత్ సింగ్, ఇషాన్ మలింగ, బ్రైడన్ కార్సే, జయదేవ్ ఉనాద్కట్, కమిందు మెండిస్, జీషాన్ అన్సారీ, అనికేత్ వర్మ, అథర్వ టైడే.చదవండి: వాళ్లిద్దరు అద్భుతం.. టీమిండియాపై ఒత్తిడి పెంచాం.. మరోసారి: సాంట్నర్ వార్నింగ్ Welcome onboard 🧡The all-rounder from 🇿🇦 is now a RISER 🔥#PlayWithFire pic.twitter.com/we4AfNuExc— SunRisers Hyderabad (@SunRisers) March 6, 2025 -
అతడిని స్పేర్ టైర్ కంటే దారుణంగా వాడుతున్నారు: మాజీ క్రికెటర్ ఫైర్
టీమిండియా యాజమాన్యం తీరుపై భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు(Navjot Singh Sidhu) మండిపడ్డాడు. అందరు ఆటగాళ్లను సమానంగా చూడాలని.. అభ్రతా భావంతో కుంగిపోయేలా చేయకూడదని హితవు పలికాడు. భారత తుదిజట్టులో కేఎల్ రాహుల్(KL Rahul)ను స్పేర్ టైర్ కంటే దారుణంగా వాడుతున్నారంటూ సిద్ధు ఘాటు విమర్శలు చేశాడు.ఆరంభంలో ఓపెనర్‌గా కర్ణాటక బ్యాటర్ కేఎల్ రాహుల్ 2014లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఆరంభంలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌ను తర్వాత మిడిలార్డర్‌కు డిమోట్ చేశారు. అయితే, ఇటీవల ఆస్ట్రేలియా(India vs Australia)తో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ సందర్భంగా మళ్లీ ఓపెనర్‌గా పంపారు.టీ20లకు దూరంఇక వన్డే జట్టులో వికెట్ కీపర్‌గా.. మిడిలార్డర్ బ్యాటర్‌గా రాహుల్ సేవలు వినియోగించుకుంటున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ).. టీ20ల నుంచి పూర్తిగా అతడిని పక్కనపెట్టింది. ఇటీవల ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో రాహుల్‌కు కలిసివచ్చిన ఐదో స్థానంలో అక్షర్ పటేల్‌ను ప్రమోట్ చేసి.. ఆరో స్థానంలో అతడిని ఆడించింది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లోనూ ఇదే కొనసాగించింది.మారుస్తూనే ఉన్నారుఅయితే, తాను ఏ స్థానంలో వచ్చినా చాంపియన్స్ ట్రోఫీలో రాహుల్ మాత్రం అదరగొడుతున్నాడు. గ్రూప్ దశలో తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 47 బంతుల్లో 41 పరుగులతో అజేయంగా నిలిచి.. జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యాను ఐదు, అక్షర్‌ను ఆరో స్థానంలో పంపగా.. రాహుల్‌కు ఆడే అవకాశం రాలేదు.ఇక న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో మళ్లీ రాహుల్‌ను ఆరో స్థానంలో పంపగా.. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 29 బంతుల్లో 23 రన్స్ చేశాడు. అయితే, ఆస్ట్రేలియాతో కీలకమైన సెమీ ఫైనల్లో మాత్రం ఈ కర్ణాటక స్టార్ అదరగొట్టాడు. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఆరో స్థానంలో వచ్చిన రాహుల్ 34 బంతుల్లోనే 42 పరుగులతో అజేయంగా నిలిచి.. సిక్సర్‌తో జట్టు విజయాన్ని ఖరారు చేశాడు.అతడిని స్పేర్ టైర్ కంటే దారుణంగా వాడుతున్నారుఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్‌పై ప్రశంసలు కురుస్తున్నా... జట్టులో తనకంటూ సుస్థిర స్థానం లేకపోవడం పట్ల నవజ్యోత్ సింగ్ సిద్ధు సానుభూతి వ్యక్తం చేశాడు. ‘‘కేఎల్ రాహుల్... మీకు తెలుసా?.. అదనంగా మన దగ్గర పెట్టుకునే టైర్ కంటే కూడా అధ్వాన్నంగా, దారుణంగా అతడిని మేనేజ్మెంట్ వాడుకుంటోంది.ఓసారి వికెట్ కీపర్‌గా మాత్రమే ఆడిస్తారు, ఓసారి ఓపెనర్‌గా రమ్మంటారు.. మరోసారి ఐదు.. ఆరు స్థానాలు.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ వస్తే.. మూడో నంబర్లో ఆడమంటారు. మీ రెగ్యులర్ ఓపెనర్లు అందుబాటులో లేకుంటే మళ్లీ ఇన్నింగ్స్ ఆరంభించమంటారు.వన్డేల్లో ఓపెనర్‌గా రావడం సులువే. కానీ టెస్టుల్లో మాత్రం కష్టం. ఏదేమైనా జట్టు కోసం అతడు నిస్వార్థంగా తన స్థానాన్ని త్యాగం చేస్తూనే ఉన్నాడు’’ అని భారత జట్టు మాజీ ఓపెనర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు స్టార్ స్పోర్ట్స్ షోలో వ్యాఖ్యానించాడు.కాగా కేఎల్ రాహుల్ ఇప్పటి వరకు అంతర్జాతీయ కెరీర్లో 58 టెస్టులు, 84 వన్డేలు, 72 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో ఎనిమిది శతకాల సాయంతో 3257 పరుగులు సాధించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. వన్డేల్లో ఏడు సెంచరీలు కొట్టి 3009 రన్స్ పూర్తి చేసుకున్నాడు. ఇక టీ20లలోనూ రెండు శతకాలు నమోదు చేసిన రాహుల్ ఖాతాలో 2265 పరుగులు ఉన్నాయి.చదవండి: ‘లాహోర్‌లో ఫైనల్ జరిగితే బాగుండేది’.. బీసీసీఐ స్ట్రాంగ్ రియాక్షన్ -
వాళ్లిద్దరు అద్భుతం.. టీమిండియాపై ఒత్తిడి పెంచాం: సాంట్నర్ వార్నింగ్
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) రెండో సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ అదరగొట్టింది. సమిష్టి ప్రదర్శనను సౌతాఫ్రికా(New Zealand vs South Africa)ను చిత్తు చేసి ఫైనల్‌కు దూసుకువచ్చింది. తొలుత భారీ స్కోరు చేయడంతో పాటు దానిని కాపాడుకోవడంలోనూ సఫలమై అత్యద్భుత విజయంతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది.లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ రచిన్ రవీంద్ర(Rachin Ravindra- 101 బంతుల్లో 108)తో పాటు వన్‌డౌన్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ (94 బంతుల్లో 102) శతకాలతో చెలరేగగా.. డారిల్ మిచెల్(37 బంతుల్లో 49), గ్లెన్ ఫిలిప్స్(27 బంతుల్లో 49 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు.అత్యధిక స్కోర్ నమోదు చేసిన జట్టుఫలితంగా నిర్ణీత యాభై ఓవర్లలో న్యూజిలాండ్ ఏకంగా 362 పరుగులు సాధించింది. తద్వారా చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే అత్యధిక స్కోర్ నమోదు చేసిన జట్టుగా నిలిచింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 312 పరుగులకే చేతులెత్తేసింది. ఓపెనర్ రియాన్ రెకెల్టన్(17) విఫలం కాగా.. మరో ఓపెనర్, కెప్టెన్ టెంబా బవుమా అర్ద శతకం(71 బంతుల్లో 56) చేశాడు. వన్‌డౌన్ బ్యాటర్ రాసీ వాన్ డెర్ డసెన్ కూడా హాఫ్ సెంచరీ(66 బంతుల్లో 69) రాణించాడు.మిల్లర్ విధ్వంసంవీరంతా స్లో ఇన్నింగ్స్ ఆడగా డేవిడ్ మిల్లర్ మాత్రం ఆఖర్లో విధ్వంసం సృష్టించాడు. కేవలం 67 బంతుల్లో పది ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 100 పరుగులతో అజేయంగా నిలిచాడు. కానీ జట్టును మాత్రం విజయతీరాలకు చేర్చలేకపోయాడు. యాభై పరుగుల తేడాతో కివీస్ చేతిలో ఓటమిపాలైన ప్రొటిస్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరోవైపు.. న్యూజిలాండ్- టీమిండియాతో ఫైనల్ ఆడేందుకు అర్హత సాధించింది.ఈ నేపథ్యంలో సౌతాఫ్రికాపై విజయానంతరం కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ జట్టును ప్రశంసిస్తూనే భారత్‌తో మ్యాచ్‌కు తాము సంసిద్ధంగానే ఉన్నామనే సంకేతాలు ఇచ్చాడు. ‘‘పటిష్ట జట్టుతో పోటీపడి గెలవడం సంతోషంగా ఉంది. తదుపరి టీమిండియాతో ఆడబోతున్నాం.రచిన్ , విలియమ్సన్ అద్భుతంగ్రూప్ దశలోనూ రోహిత్ సేనను మీ ఢీకొట్టాం. అయితే, ఈసారి ఫైనల్ వేరుగా ఉంటుంది. మాకైతే కాస్త విరామం దొరికింది. విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్లీ ప్రాక్టీస్ మొదలుపెడతాం. ఇక సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో రచిన్ రవీంద్ర, విలియమ్సన్ ఆడిన తీరు అద్భుతం.అయితే, ఇక్కడ 320 పరుగుల స్కోరు సరిపోదని మేము భావించాం. కనీసం 350 రన్స్ దాటితేనే మ్యాచ్ మా చేతుల్లో ఉంటుందని భావించాం. రచిన్- విలియమ్సన్ భారీ భాగస్వామ్యం ఇందుకు బాటలు వేసింది.అదే విధంగా.. మిడిల్ ఓవర్లలో మా బౌలర్లు వికెట్లు తీయడం కలిసివచ్చింది. అయినా సరే సౌతాఫ్రికా మాకు సవాలు విసిరింది. ఎట్టకేలకు విజయం మాత్రం మమ్మల్నే వరించింది’’ అని సాంట్నర్ పేర్కొన్నాడు.ఒత్తిడిలోకి నెట్టగలిగాముఇక టీమిండియా చేతిలో గత మ్యాచ్‌లో ఓటమి గురించి ప్రస్తావిస్తూ.. ‘‘దుబాయ్‌లో మేము ఓడిపోయాం. అయితే, అక్కడే మ్యాచ్‌లు ఆడుతున్న వారిని మేము ఒత్తిడిలోకి నెట్టగలిగాము. టాపార్డర్‌ను మా వాళ్లు పడగొట్టారు’’ అంటూ తాము తక్కువేమీ కాదన్నట్లుగా రోహిత్ సేనకు ఒక రకంగా వార్నింగ్ ఇచ్చాడు. కాగా దుబాయ్ వేదికగా భారత్- న్యూజిలాండ్ మధ్య ఆదివారం ఫైనల్ జరుగుతుంది. చదవండి: మీరిద్దరు మాట్లాడుకుంటూనే ఉండండి.. నా పని నేను చేస్తా: జడ్డూ అసహనంSouth Africa's last man standing! 👊David Miller is keeping the fight on from one end ⚔#ChampionsTrophyOnJioStar 👉 #SAvNZ | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi, Star Sports 2 & Sports18-1!📺📱 Start watching FREE on JioHotstar pic.twitter.com/EkhEIpvEI0— Star Sports (@StarSportsIndia) March 5, 2025 -
25-30 పరుగులు చేస్తే చాలా?: గంభీర్‌కు టీమిండియా దిగ్గజం కౌంటర్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)కు భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్(Sunil Gavaskar) కీలక సూచనలు చేశాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) ఫైనల్లో దూకుడు వద్దని.. సంయమనంతో ఆడాలని సూచించాడు. అదే విధంగా.. రోహిత్ బ్యాటింగ్ శైలిని సమర్థిస్తూ హెడ్‌కోచ్ గౌతం గంభీర్ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవించడం లేదని సన్నీ కుండబద్దలు కొట్టాడు. కాగా చాంపియన్స్ ట్రోఫీ ముగింపు దశకు చేరుకున్న విషయం తెలిసిందే.తొలి సెమీస్‌లో ఆస్ట్రేలియాను టీమిండియా.. రెండో సెమీ ఫైనల్లో సౌతాఫ్రికాను న్యూజిలాండ్ ఓడించాయి. ఈ క్రమంలో దుబాయ్‌లో ఆదివారం నాటి టైటిల్ పోరులో టీమిండియా- న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ వన్డే టోర్నమెంట్‌కు ఆతిథ్యం దేశం పాకిస్తాన్ అయినప్పటికీ భద్రతా కారణాల దృష్ట్యా భారత జట్టు తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో ఆడుతోన్న విషయం తెలిసిందే.ఒక్క ఫిఫ్టీ కూడా లేదుగ్రూప్ దశలో భాగంగా బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్‌లను చిత్తు చేసిన భారత్.. సెమీస్‌లోనూ సత్తా చాటి అజేయంగా ఫైనల్లో అడుగుపెట్టింది. అంతాబాగానే ఉన్నా కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి మాత్రం ఇంత వరకు స్థాయికి తగ్గ ప్రదర్శన రాలేదు. నాలుగు మ్యాచ్‌లలో అతడు చేసిన స్కోర్లు వరుసగా... 41(36 బంతుల్లో), 20(15 బంతుల్లో), 15(17 బంతుల్లో), 28(29 బంతుల్లో).దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభిస్తున్న ఈ ఓపెనింగ్ బ్యాటర్ వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోతున్నాడు. దీంతో రోహిత్ శర్మ బ్యాటింగ్, భవిష్యత్‌పై విమర్శలు రాగా.. గంభీర్ అతడికి మద్దతుగా నిలిచాడు. అద్భుతమైన టెంపోతో ఆడుతున్న హిట్‌మ్యాన్ జట్టుకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాడని పేర్కొన్నాడు.గంభీర్ వ్యాఖ్యలతో ఏకీభవించని గావస్కర్ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘కెప్టెన్‌గా అతడు జట్టును ప్రభావితం చేస్తున్నాడన్నది నిజమే. అయితే, బ్యాటర్‌గా 25-30 పరుగులు మాత్రమే చేస్తే తన ప్రదర్శన పట్ల అతడు సంతోషంగా ఉంటాడా? ఓ బ్యాటర్‌గా అదొక లోటే.జట్టుపై నీ ఆట తీరుతో ప్రభావం చూపడం ఎంత ముఖ్యమో.. బ్యాటర్‌గా ఓ 25 ఓవర్ల పాటు క్రీజులో నిలబడితే మరింత గొప్పగా ప్రభావితం చేయవచ్చు. ఏడు, ఎనిమిది, తొమ్మిది ఓవర్లపాటే ఆడితే మజా ఏం ఉంటుంది?వైవిధ్యభరిత షాట్లు ఆడటంలో దిట్ట.. కానీదూకుడుగా ఆడటం మంచిదే కావొచ్చు. కానీ.. కొన్నిసార్లు అది బెడిసికొట్టవచ్చు. నిజానికి రోహిత్ గనుక 25- 30 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేస్తే.. టీమిండియా సగం ఇన్నింగ్స్ తర్వాత 180- 200 పరుగులకు చేరుకుంటుంది. ప్రత్యర్థి నుంచి మ్యాచ్‌ను లాగేసుకునే సత్తా రోహిత్‌కు ఉంది. అతడొక ప్రతిభావంతుడైన బ్యాటర్.వైవిధ్యభరిత షాట్లు ఆడటంలో దిట్ట. అయితే, గత వన్డే వరల్డ్‌కప్ నుంచి రోహిత్ శైలి పూర్తిగా మారిపోయింది, దూకుడుగా ఆడేందుకు అతడు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. కొన్నిసార్లు ఈ విషయంలో విజయవంతమైనా.. కీలక మ్యాచ్‌లలో మాత్రం ఆచితూచి నిలకడగా ఆడటం మంచిది’’ అని న్యూజిలాండ్‌తో ఫైనల్‌కు ముందు గావస్కర్ రోహిత శర్మకు సూచించాడు.రోహిత్ శర్మ ప్రపంచ రికార్డుఇదిలా ఉంటే.. నాలుగు ఐసీసీ ఈవెంట్లలోనూ జట్టును ఫైనల్‌కు చేర్చిన తొలి కెప్టెన్‌గా రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు సాధించాడు. వన్డే, టీ20 ప్రపంచకప్ టోర్నీలు.. అదే విధంగా వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్, తాజాగా చాంపియన్స్ ట్రోఫీలో భారత్‌ను ఫైనల్‌కు చేర్చడం ద్వారా ఈ ఘనత సాధించాడు.చదవండి: ‘లాహోర్‌లో ఫైనల్ జరిగితే బాగుండేది’.. బీసీసీఐ స్ట్రాంగ్ రియాక్షన్ -
పాపం సౌతాఫ్రికా.. మరోసారి హార్ట్ బ్రేకింగ్! ప్రపంచంలోనే తొలి జట్టుగా
మళ్లీ అదే కథ.. అదే వ్యథ. ఐసీసీ టోర్నమెంట్లలో దక్షిణాఫ్రికా తలరాత ఏ మాత్రం మారలేదు. 'చోకర్స్ అనే పేరును సఫారీలు మరోసారి సార్థకత చేసుకున్నారు. సెమీస్ గండాన్ని మరోసారి సౌతాఫ్రికా గట్టెక్కలేకపోయింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy 2025) సెమీఫైనల్స్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైంది.363 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించడంలో బవుమా సేన విఫలమైంది. దీంతో బరువెక్కిన హృదయాలతో సఫారీలు ఇంటిముఖం పట్టారు. సెమీస్‌లో ఓడిపోవడం దక్షిణాఫ్రికాకు ఇదేమి తొలిసారి కాదు.పాపం ప్రోటీస్..ఇప్పటివరకు ఓవరాల్‌గా ఐసీసీ వన్డే టోర్నీల్లో ఇప్పటివరకు పదిసార్లు సెమీఫైనల్స్ ఆడిన ప్రోటీస్ జట్టు ఏకంగా తొమ్మిదిసార్లు పరాజయం పాలైంది. దీంతో ఐసీసీ వన్డే టోర్నీ సెమీస్‌లో అత్యధిక సార్లు ఓటమిపాలైన జట్టుగా సౌతాఫ్రికా చెత్తరికార్డు నెలకొల్పింది. కాగా ప్రతీ ఐసీసీ ఈవెంట్లో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగే దక్షిణాఫ్రికా.. కీలక నాకౌట్ మ్యాచ్‌ల్లో ఒత్తిడికి చిత్తు అయ్యి ఇంటిదారి పడుతుంటుంది.ఐసీసీ ఛాంపియన్స్ తొట్టతొలి ఎడిషన్(1998) విజేతగా నిలిచిన సౌతాఫ్రికా.. ఆ తర్వాత ఈ మెగా టోర్నీలో కనీసం ఒక్కసారి కూడా ఫైనల్‌కు చేరలేకపోయింది. 2000, 2002 ఛాంపియన్స్ ట్రోఫీ సీజన్లలో వరుసగా సెమీ ఫైనల్స్‌కు చేరినప్పటికి.. రెండు సార్లు కూడా భారత్ చేతిలోనే ఓటమి పాలైంది. ఆ తర్వాత 2006, 2013 సీజన్లలో సెమీస్‌లో అడుగుపెట్టిన సౌతాఫ్రికా.. అక్కడ కూడా అదే తీరును కనబరిచింది. మళ్లీ ఇప్పుడు తాజా ఎడిషన్‌లో కూడా సౌతాఫ్రికాకు నిరాశే ఎదురైంది.వన్డే వరల్డ్‌కప్‌లో కూడా..కాగా వన్డే వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికాది ఇదే తీరు. అయితే ఈ ప్రపంచకప్‌లో సఫారీలను ఒత్తడితో పాటు దురదృష్టం కూడా వెంటాడింది. 1992 ప్రపంచకప్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు సంయుక్తంగా అతిథ్యమిచ్చాయి. సౌతాఫ్రికాకు ఇదే తొలి వన్డే ప్రపంచకప్. దక్షిణాఫ్రికా తమ తొలి వరల్డ్‌కప్‌లోనే సెమీస్‌కు చేరి అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే ఈమ్యాచ్‌లో ప్రోటీస్ జట్టుకు అదృష్టం కలిసిరాలేదు. వర్షం కారణంగా ఇంగ్లండ్ చేతిలో సౌతాఫ్రికా అనుహ్యంగా ఓటమి పాలైంది. ఆ తర్వాత 1999 వరల్డ్ కప్‌లో కూడా దక్షిణాఫ్రికా సెమీఫైనల్ల్లో అడుగుపెట్టింది. ఫైనల్ బెర్త్ కోసం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు పోటీ పడ్డాయి. ఈ మ్యాచ్ సగటు క్రికెట్ అభిమాని ఎప్పటికి మర్చిపోడు. ఈ మ్యాచ్‌లో ఈజీగా గెలవాల్సిన సౌతాఫ్రికా.. ఆఖరికి టైగా ముగించింది.రన్‌రేట్ ఆధారంగా ఆస్ట్రేలియా ఫైనల్‌కు క్వాలిఫై అయింది. అప్పటిలో సూపర్ ఓవర్ లేదు. దీంతో ప్రోటీస్ ఇంటిముఖం పట్టింది. ఆ తర్వాత 2007లో ఆస్ట్రేలియాపై, 2015లో న్యూజిలాండ్‌పై ఓడిపోయింది. 2015 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్‌ను సౌతాఫ్రికా తమ సొంత తప్పిదాల్ల వల్ల చేజార్చుకుంది.ఈ మ్యాచ్‌ను వర్షం కారణంగా 43 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ప్రోటీస్ 43 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 281 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆ తర్వాత డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం న్యూజిలాండ్ టార్గెట్‌ను 298 పరుగులగా నిర్ధేశించారు. న్యూజిలాండ్ ఆరంభంలో అద్బుతంగా ఆడినప్పటికి.. మిడిల్ ఓవర్లలో వికెట్లు కోల్పోవడంతో ప్రోటీస్ తిరిగి గేమ్‌లోకి వచ్చింది.అయితే మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచిన గ్రాంట్ ఇలియట్‌ను రనౌట్ చేసే ఈజీ ఛాన్స్‌ను డివిలియర్స్ మిస్ చేసుకున్నాడు. దీంతో ఇలియట్ ఆఖరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్‌ను సఫారీల నుంచి లాగేసుకున్నాడు. ఈ క్రమంలో ఏబీ డివిలియర్స్, మోర్నీ మోర్కల్ వంటి దిగ్గజ క్రికెటర్లు కంటతడి పెట్టుకున్నారు. అదేవిధంగా టీ20 ప్రపంచకప్-2024 ఫైనల్లో కూడా సౌతాఫ్రికా ఓటమి చవిచూసింది.చదవండి: మీరిద్దరు మాట్లాడుకుంటూనే ఉండండి.. నా పని నేను చేస్తా: జడ్డూ అసహనం -
మాట్లాడుకుంటూనే ఉండండి: రోహిత్-రాహుల్‌పై జడ్డూ అసహనం!
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో జైత్రయాత్ర కొనసాగించిన భారత క్రికెట్ జట్టు.. ఫైనల్లోనూ గెలిచి విజయాన్ని పరిపూర్ణం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. సమిష్టి ప్రదర్శనతో గ్రూప్ దశలో టాపర్‌గా నిలిచిన రోహిత్ సేన సెమీస్‌లోనూ అదరగొట్టిన విషయం తెలిసిందే. ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లలో గత కొంతకాలంగా భారత్‌కు చేదు అనుభవాలను మిగిల్చిన ఆస్ట్రేలియా(India vs Australia)ను ఓడించింది.కంగారూ జట్టును ఏ దశలోనూ కోలుకోనివ్వకుండా చేసి చిరస్మరణీయ విజయంతో టీమిండియా ఫైనల్‌కు దూసుకువెళ్లింది. ఇక ఈ మ్యాచ్ సందర్భంగా చోటు చేసుకున్న ఓ సరదా సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), వికెట్ కీపర్ కేఎల్ రాహుల్, స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మాట్లాడుకున్న మాటలు స్టంప్ మైకులో రికార్డు కాగా.. ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.264 పరుగులకు ఆసీస్ ఆలౌట్‌కాగా ఫిబ్రవరి 19న పాకిస్తాన్లో చాంపియన్స్ ట్రోఫీ మొదలుకాగా.. టీమిండియా మాత్రం తమ మ్యాచ్‌లన్నీ తటస్థ వేదికైన దుబాయ్‌లో ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తొలి సెమీస్‌లో భాగంగా భారత్ మంగళవారం ఆసీస్ జట్టును ఢీకొట్టింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.ఈ క్రమంలో ఓపెనర్ కూపర్ కన్నోలి(0)ని డకౌట్ చేసి మహ్మద్ షమీ టీమిండియాకు శుభారంభం అందించగా.. విధ్వంసకర ఓపెనర్ ట్రవిస్ హెడ్(39)ను వరుణ్ చక్రవర్తి స్వల్ప స్కోరుకే పెవిలియన్‌కు చేర్చాడు. ఈ దశలో స్మిత్ కెప్టెన్ ఇన్నింగ్స్(73)తో ఆకట్టుకోగా.. అలెక్స్ క్యారీ(61)అతడికి సహకరించాడు. అయితే, మిగతా వాళ్లు స్థాయికి తగ్గట్లు రాణించకపోవడంతో ఆసీస్ 49.3 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. 264 పరుగులు స్కోరు చేసింది.టీమిండియా బౌలర్లలో మహ్మద్ షమీ మూడు వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి రెండు, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ తీశారు. అయితే, జడ్డూ బౌలింగ్ చేసే సమయంలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. మాములుగా తనకు ఇచ్చిన సమయంలోపే ఓవర్లు ముగిస్తాడని జడేజాకు పేరుంది.జడేజా అసహనంఅయితే, కెప్టెన్ రోహిత్ , వికెట్ కీపర్ రాహుల్ వల్ల ఆలస్యం అవుతుందేమోనని జడ్డూ ఒకింత అసహనం వ్యక్తం చేశాడు. స్టంప్ మైకులో రికార్డైన సంభాషణ ప్రకారం.. జడేజా..‘‘బంతి అంతగా టర్న్ అవటం లేదు’’ అనగా.. రోహిత్ ఇందుకు బదులిస్తూ.. ‘‘ఇంకో మూడు బాల్స్ వేయాల్సి ఉంది కదా. స్లిప్ తీసుకో. బంతి స్పిన్ అవ్వచ్చు’’ అని పేర్కొన్నాడు.మీరు చర్చలు జరుపుతూనే ఉండండిఇంతలో కేఎల్ రాహుల్ జోక్యం చేసుకుంటూ.. ‘‘ఇప్పటి వరకు ఒక్క బంతి మాత్రమే టర్న్ అయింది’’ అని పేర్కొన్నాడు. వీళ్ల చర్చలతో చిర్రెత్తిపోయిన జడేజా.. ‘‘మీరిద్దరు ఇలా మట్లాడుతూనే ఉండండి. ఈ వ్యవధిలోనే నేను మిగిలిన నా మూడు బంతులు వేసేస్తా’’ అని కౌంటర్ వేశాడు.ఇదిలా ఉంటే.. ఆసీస్ విధించిన 265 పరుగుల లక్ష్య ఛేదనను భారత్ మరో పదకొండు బంతులు మిగిలి ఉండగానే పూర్తి చేసింది. విరాట్ కోహ్లి అర్ధ శతకం(84)తో అదరగొట్టగా.. శ్రేయస్ అయ్యర్(45), కేఎల్ రాహుల్(42 నాటౌట్) రాణించారు. ఆఖర్లో హార్దిక్ పాండ్యా(24 బంతుల్లో 28) కూడా తన వంతు పాత్ర పోషించాడు. ఈ క్రమంలో 48.1 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసిన టీమిండియా.. ఆసీస్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. దుబాయ్ వేదికగా ఆదివారం న్యూజిలాండ్‌తో టైటిల్ పోరులో తలపడుతుంది.చదవండి: Steve Smith: కోహ్లికి ముందే తెలుసు!Jab tak baat hogi, ek aur over hojayegi! 🤣That’s the speed of #Jadeja – blink, and the over’s done! Some on field stump mic gold!#ChampionsTrophyOnJioStar 👉 🇮🇳🆚🇦🇺 LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi, Star Sports 2 & Sports18-1!📺📱 Start Watching FREE on… pic.twitter.com/nsIpsZyAbb— Star Sports (@StarSportsIndia) March 4, 2025