Orissa
-
జిల్లా పోలీస్ కార్యాలయం మరమ్మతులకు మోక్షం
విజయనగరం క్రైమ్: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం, ఎస్పీ ఆఫీస్ భవనానికి ఎట్టకేలకు మోక్షం లబించింది. ప్రస్తుత ఎస్పీ వకుల్ జిందల్ చొరవతో దాదాపు రూ.3 లక్షల వ్యయంతో పరిపాలన భవనం మరమ్మతులు చేపట్టనున్నారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలో చేపడుతున్న పలు అభివృద్ధి, మరమ్మతు పనులను ఎస్పీ వకుల్ జిందల్ మంగళవారం పరిశీలించారు. అభివృద్ధి, మరమ్మతు పనులను నాణ్యంగా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు. మరమ్మతు పనుల పరిశీలనలో ఎస్పీ వెంట అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు, డీపీఓ ఏఓ పి.శ్రీనివాసరావు, ఎస్బీ సీఐలు ఏవీ లీలారావు, ఆర్వీఆర్కే చౌదరి, మహిళా పీఎస్ సీఐ ఈ.నర్సింహమూర్తి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఎన్.గోపాలనాయుడు, ఆర్ఎస్సై వర ప్రసాద్ పాల్గొన్నారు. 15తో ముగియనున్న చెరకు క్రషింగ్ రేగిడి: మండలంలోని సంకిలి గ్రామం వద్ద ఉన్న ఈఐడీ ప్యారీ చక్కెర కర్మాగారంలో చెరకు క్రషింగ్ ఈ నెల 15తో ముగియనుందని యాజమాన్య ప్రతినిధులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024–25 సంవత్సరానికి 3.25లక్షల మెట్రిక్ టన్నుల చెరకు క్రషింగ్ చేసినట్టు పేర్కొన్నారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం ప్రాంతాల నుంచి మిగులు చెరకును ఈ నెల 15లోగా కర్మాగారానికి తరలించేందుకు రైతులు ముందుకు రావాలని కోరారు. చెరకు క్రషింగ్‌కు సహకరించిన రైతులు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. -
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
పార్వతీపురం రూరల్: మండలంలోని పలు పంచాయతీల్లో ఎన్ఆర్ఈజీస్ నిధుల ద్వారా చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఎంపీడీఓ జీవీ రమణ మూర్తి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన మండలంలోని నర్సిపురం, పెదబొండపల్లి, ఎమ్మార్‌నగరం, తాళ్లబురిడి పంచాయతీలలో ప్రత్యేకాధికారి రమేష్ రామన్‌తో కలసి పర్యటించారు. అలాగే ఆయా పంచాయతీల్లో జరుగుతున్న పీ4 సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మౌలిక సదుపాయాల్లో భాగంగా మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించినట్లు చెప్పారు. పీ4 సర్వేను వేగవంతం చేయాలని సంబంధిత సచివాలయ సిబ్బందిని ఆదేశించినట్లు తెలిపారు. తాళ్లబురిడిలో ఇటీవల అంటువ్యాధులకు గ్రామస్తులు పలువురు గురికావడంతో గ్రామంలో పారిశుద్ధ్య పనులను పరిశీలించి, పారిశుధ్య నిర్వహణ మెరుగుపరచాలని, తాగునీటి బోర్లు, రక్షిత పథకాల వద్ద క్లోరినేషన్ చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. -
విద్యార్థులు మరింత విజ్ఞానం పెంపొందించుకోవాలి
పార్వతీపురం టౌన్: విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలకు వెళ్లే విద్యార్థులందరూ తమ విజ్ఞానాన్ని మరింత పెంపొందించుకోవాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అభిలాషించారు. జిల్లా విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన బస్సు ప్రారంభోత్సవ కార్యక్రమం మంగళవారం కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి బస్సును ప్రారంభించారు. గతంలో జిల్లాలో నిర్వహించిన విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలో ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులందరూ తమ విజ్ఞానాన్ని మరింత పెంపొందించుకునేలా విశాఖపట్నంలోని కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఆర్కే బీచ్ వద్ద గల ఐఎన్ఎస్ కుర్పురా సబ్‌మైరెన్ మ్యూజియం, ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం, ఆర్కియాలజీ మ్యూజియంలను సందర్శించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. విద్యార్థులందరికీ ఆయా ప్రాంతాల్లోని కొత్త విషయాలను తెలుసుకునేందుకు అవకాశం ఉంటుందని, ఆ విధంగా తమ విజ్ఞానాన్ని మరింత పెంపొందించుకుని, భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలకు నాంది పలకాలని కలెక్టర్ పిలులపునిచ్చారు. మండలానికి మూడు పాఠశాలలు చొప్పున జిల్లాలోని 15 మండలాల నుంచి 45 మంది విద్యార్ధులు ఈ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలకు బయలుదేరినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి ఎన్. తిరుపతినాయుడు, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఎవెన్యూ ప్లాంటేషన్ పెద్ద ఎత్తున చేపట్టాలి పార్వతీపురంటౌన్/పార్వతీపురం: ఎవెన్యూ ప్లాంటేషన్ పెద్ద ఎత్తున చేపట్టాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అదేశించారు. ఈ మేరకు మంగళవారం ఆయన అటవీ కార్యకలాపాలపై తన చాంబర్లో డీఎప్‌ఓ ప్రసూనతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రహదారుల వెంబడి ఎవెన్యూ ప్లాంటేషన్, చెరువు చుట్టూ ప్లాంటేషన్, గ్రామల్లో చెట్ల పెంపకానికి కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. సీడ్ బాల్స్ తయారీకి చర్యలు చేపట్టాలని సూచించారు. ఉపాధి హామీ పథకం, వన సంరక్షణ సమితుల ద్వారా ప్లాంటేషన్ పనులు చేపట్టాలని, త్కాలిక హోల్డింగ్ ఏరియా ఏర్పాట్ల పనులు చేపట్టడంపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు. జిల్లాలో చిత్తడి నేలల సరిహద్దులు, వాటి నోటిఫికేషన్‌పై సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ -
గ్లకోమా వ్యాధిపట్ల అప్రమత్తంగా ఉండాలి
విజయనగరం ఫోర్ట్: గ్లకోమా(నీటికాసులు) వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి సూచించారు. ప్రపంచ గ్లకోమా వారోత్సవాల సందర్భంగా స్థానిక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద జెండా ఊపి మంగళవారం ఆమె ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్లకోమా అనేది కళ్లకు సంబంధించిన వ్యాధి అని, కంటి డ్రైనేజీ నిర్మాణాలు సరిగా పనిచేయకపోవడం వల్ల కంటి లోపల పీడనం పెరిగి నరానికి హాని కలుగుతుందని తెలిపారు. గ్లకోమా ప్రారంభ దశలో ఎటువంటి లక్షణాలు ఉండకపోవచ్చునన్నారు. క్రమంగా చూపు కోల్పోవచ్చునని హెచ్చరించారు. గ్లకోమా బారిన పడిన చాలామందికి తమకు వ్యాధి ఉందని తెలియదన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ కె.రాణి, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ జీవనరాణి -
అక్రమంగా ఇసుక తరలిస్తున్న వ్యక్తి అరెస్టు
మల్కన్‌గిరి: జిల్లాలోని బలిమెల పోలీసులు మంగళవారం కుడుములగుమ్మ రహదారిలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఒక మినీ ట్రక్, మరో రెండు ట్రాక్టర్లను పట్టుకున్నారు. ఎస్ఐ అజిత్‌సింగ్ బరిహా ట్రాక్టర్ డ్రైవర్‌ను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. మొత్తం నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఐఐసీ దీరాజ్ పట్నాయక్ కేసు నమోదు చేశారు. వనశ్రీ సాధన కేంద్ర భవనం ప్రారంభం రాయగడ: సదరు సమితి పరిధి రివల్‌కొన గ్రామంలో వనశ్రీ సాధన కేంద్ర భవనం ప్రారంభమయ్యింది. జేకేపూర్‌లోని జేకే పేపర్ మిల్ ఆర్థిక సాయంతో ఈ భవనాన్ని నిర్మించారు. మంగళవారం జేకే పేపర్ మిల్స్ ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షుడు (వర్క్స్) వినయ్ ద్వివేది, కమర్షియల్ విభాగం ఉపాధ్యక్షుడు బిశ్వజీత్ ద్వివేది తదితరులు హాజరై ఈ భవననాన్ని ప్రారంభించారు. ఈ భవనంలో ఆదివాసీ విద్యార్థులకు వివిధ అంశాలపై శిక్షణ కల్పిస్తారు. కొలువుదీరిన అగ్ని గంగమ్మ ఘటాలు రాయగడ: నీలావడి అగ్ని గంగమ్మ అమ్మవారి జాతరలో భాగంగా అమ్మవారి ప్రతిరూపాలైన ఘటాలు కొలువుదీరాయి. అమ్మవారి మందిరానికి సమీపంలోని ప్రత్యేక మండపంలో వీటిని భక్తుల దర్శనం కోసం ఏర్పాటు చేశారు. అమ్మవారి ఘటాలను దర్శించుకున్న అనంతరం, మందిరంలోని అమ్మవారి విగ్రహానికి పూజా కార్యక్రమాలు చేపట్టి, భక్తులు మొక్కుబడులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తుంది. సోమవారం నుంచి ప్రారంభమైన జాతర ఈనెల 19వ తేదీ వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. లక్ష్మీ గణేష్ చిట్స్ యజమానుల ఆస్తుల జప్తు నరసన్నపేట: నరసన్నపేటలో లక్ష్మీ గణేష్ చిట్స్ సంస్థకు చెందిన యజమానుల ఆస్తులను జప్తు చేస్తూ హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జీఓ నంబరు 46 ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమార్ విశ్వజీత్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో చిట్ ఫండ్ వ్యాపారి కోరాడ గణేశ్వరరావు, ఆయన భార్య కోరాడ లక్ష్మి, బంధువులు అంధవరపు సూర్యనారాయణమూర్తి, అంధవరపు భారతిల పేరిట ఉన్న ఆస్తులను జప్తు చేస్తున్నట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు. స్థానిక కలివరపుపేటలో నివసిస్తున్న గణేశ్వరరావు 2021 జూన్ 30న కుటుంబంతో సహా పరారయ్యాడు. దీంతో బాధితులు పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించారు. నరసన్నపేట పోలీసులు కేసు నమోదు చేయగా.. అనంతరం కేసు సీఐడీకి అప్పగించారు. సీఐడీ అదనపు ఎస్పీ రవివర్మ నరసన్నపేటకు పలుమార్లు వచ్చి వివరాలు సేకరించారు. అప్పటి వరకూ తప్పించుకు తిరుగుతున్న గణేష్, భార్య, బంధువులను అరెస్టు చేశారు.తాజాగా ఆస్తుల జప్తుకు ఆదేశాలు జారీ అయ్యాయి. -
కేరాఫ్ దివ్యాంగులు
సహజ రంగులు.. ● పూలతో పర్యావరణ హితమైన రంగుల తయారీ ● అబ్బురపరుస్తున్న మనోవికాస కేంద్రం దివ్యాంగులు ● 14న హోలీ వేడుకలకు రంగులు సిద్ధంశ్రీకాకుళం కల్చరల్ : రంగుల కేళీ హోలీ పండుగ సమీపిస్తోంది. ఈ నెల 14న జరిగే ఆనందాల వేడుకకు ఇప్పటికే తాత్కాలిక రంగుల దుకాణాలు సిద్ధమయ్యాయి. అయితే రసాయనాలతో తయారుచేసే కృత్రిమ రంగులు కాకుండా పర్యావరణ హితమైన రంగులు వాడాలని పర్యావరణవేత్తలు ఎప్పటి నుంచో విజ్ఞప్తులు చేస్తున్నా అలాంటి రంగులు ఎలా తయారవుతాయో..అవి ఎక్కడ దొరుకుతాయో చాలామందికి తెలియదు. ఈ నేపథ్యంలో రసాయనాలు లేని రంగులు తయారు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు జిల్లా కేంద్రంలో ఉంటున్న బెహరా మనోవికాస కేంద్రంలోని దివ్యాంగులు. అందమైన, పర్యావరణానికి హాని చేయనటువంటి రంగులను స్వహస్తాలతో తయారు చేస్తున్నారు. పూలరెక్కలతో.. హోలీ రంగులు పర్యావరణానికి హాని చేయకుండా ఉండడానికి రసాయనాలు లేకుండా కేవలం పూల రెక్కలతోనే ఇక్కడ సహజ సిద్ధమైన రంగులు తయారు చేస్తున్నారు. 74మంది మానసిక దివ్యాంగులు ఈ రంగుల రూపకల్పనలో పాలుపంచుకుంటున్నారు. ముందుగా వివిధ రకాల పూల రెక్కలను ఆరబెడతారు. అవి పూర్తిగా ఆరాక రంగుల వారీగా విడదీసి యంత్రంలో వేసి పౌడర్‌గా చేస్తున్నారు. వాటిని చిన్నచిన్న ప్యాకెట్లలో కట్టి అమ్మకానికి సిద్ధం చేస్తున్నారు. కేంద్రంలో మానసిక దివ్యాంగులు తయారు చేసిన సహజ సిద్ధమైన రంగులు, ఇతర ఉత్పత్తులతో ఎగ్జిబిషన్ సైతం ఏర్పాటు చేశారు. వీటిని కొనుగోలు చేయడం ద్వారా మానసిక దివ్యాంగులను ప్రోత్సహించిన వారవుతారు. దివ్యాంగులకు ప్రోత్సాహం దివ్యాంగుల సృజనకు మా వంతు ప్రోత్సాహం ఇస్తున్నాం. పూలతో సహజ సిద్ధంగా తయారు చేసిన ఈ రంగులు ప్యాకెట్ రూ.30 నుంచి మొదలుకుని సెట్ రూ.150 వరకు విక్రయిస్తున్నాం. దివ్యాంగులను ప్రోత్సహించేందుకు ఎవరైనా కొనుగోలు చేయాలంటే కేంద్రంలో సంప్రదించవచ్చు. – శ్యామల, బెహరా మనోవికాస కేంద్రం నిర్వాహకులు, పాత హౌసింగ్ బోర్డు కాలనీ, శ్రీకాకుళం -
జూడో రాష్ట్రస్థాయి పోటీలకు కేజీబీవీ విద్యార్థులు
నెల్లిమర్ల: పట్టణంలోని కేజీబీవీ విద్యార్థులు జూడో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.ఈ నెల 15, 16 తేదీల్లో జరగనున్న రాష్ట్రస్థాయి జూనియర్ జూడో పోటీలకు జిల్లా నుంచి మహిళల విభాగంలో ఈ పాఠశాలకు చెందిన జె కావ్య, పి పావని, పి జ్యోత్స్న రాణి, ఎస్.ఢిల్లీశ్వరి, కె భార్గవి, బి.దీపిక, సత్య, అనూష, జయలక్ష్మి ఎంపికై నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ ఉమ తెలిపారు. వారిని పీఈటీ రమణి, ఉపాధ్యాయినులు అభినందించారు.అంతర రాష్ట్ర ఫెన్సింగ్ క్రీడలకు విద్యార్థి ఎంపికవిజయనగరం అర్బన్: కేరళలో ఈ నెల 14 నుంచి 18వ తేదీ వరకు జరిగే ఫెన్సింగ్ క్రీడలో అంతర్ రాష్ట్ర పోటీలకు పట్టణానికి చెందిన సత్య డిగ్రీ/ పీజీ కళాశాల విద్యార్థి కె.పవన్‌కుమార్ ఎంపికయ్యాడు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవీసాయిదేవమణి మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.ఎంపికై న విద్యార్థిని కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం.శశిభూషణరావు, కళాశాల అధ్యాపకులు అభినందించారు.ఎకనామిక్స్–1 పరీక్షకు 580 మంది గైర్హాజరు పార్వతీపురంటౌన్: ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం ఎకనామిక్స్ పరీక్షకు 580మంది గైర్హాజరైనట్లు డీవీఈఓ మంజుల వీణ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా 34 పరీక్షా కేంద్రాల్లో ఒకేషనల్ పేపర్3, ఎకానమిక్స్–1 పరీక్షకు 9540 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 8,960మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, మాస్‌కాపీయింగ్ జరగలేదని స్పష్టం చేశారు. 30 కేజీల గంజాయి పట్టివేత పాచిపెంట: మండలంలోని పి.కోనవలస చెక్‌పోస్టు దుర్గ గుడి వద్ద 30 కేజీల గంజాయిని పట్టుకున్నట్లు ఎస్సై వెంకటసురేష్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన మాట్లాడుతూ, సోమవారం పి.కోనవలస చెక్‌పోస్టు సమీపంలో దుర్గ గుడి వద్ద ముగ్గురు వ్యక్తులు గంజాయితో పట్టుబడ్డారన్నారు. పట్టుబడిన వారిలో కర్ణాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన మహమ్మద్ షఫీజ్, దివ్యాన్షు శుక్లా, ఓం శుక్లాల నుంచి 30 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని చెప్పారు. జిల్లా ప్రయాణికుల లోగో ఆవిష్కరణపార్వతీపురంటౌన్: జిల్లా ప్రయాణికుల లోగోను కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ మంగళవారం ఆవిష్కరించారు. జిల్లా ప్రయాణికుల సంక్షేమసంఘం ఈ లోగోను రూపొందించింది. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు బడే నాగభూషణరావు, తోటపల్లి ట్రస్ట్ ట్రెజరర్ జి.శ్రీరామచంద్రమూర్తి, డీఆర్‌యూసీసీ సభ్యులు శ్రీహరి, ఏఐ స్టాఫ్ బ్రాండ్ ప్రతినిధి భూషణ్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధి హామీ పనుల పరిశీలన గజపతినగరం రూరల్/దత్తిరాజేరు: గజపతినగరం మండలంలోని పట్రువాడ, చిట్టేయవలస, దత్తిరాజేరు మండలంలోని ఇంగిలాపల్లి, గొభ్యాం గ్రామాల్లో జరుగుతున్న ఉపాధిహామీ పనులను ఎన్ఆర్ఈజీఎస్ డైరెక్టర్ షణ్ముక్ కుమార్ మంగళవారం పరిశీలించారు. ఫారం పాండ్లు, ఫిష్ పాండ్ల నిర్మాణంపై వేతనదారులకు పలు సూచనలిచ్చారు. వేతనదారులకు రోజుకు రూ.300 వేతనం తక్కువ కాకుండా పనులు కల్పించాలని ఫీల్డు అసిస్టెంట్లను ఆదేశించారు. ఉపాధిహామీ పనులతో సాగునీటి వనరులను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట కాలుష్య నింయత్రణాధికారి గోపీచంద్, డ్వామా పీడీ శారదాదేవి, అడిషనల్ కమిషనర్ శివప్రసాద్ ఉన్నారు. -
డీకేటీ రైతులకు అన్యాయం..!
పార్వతీపురంటౌన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమం కోసం వివిధ పథకాలు అమలు చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చాయి. రైతులకు ఆ సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రస్తుతం వివిధ రకాల పద్ధతులను అవలంబిస్తున్నాయి. అయితే భవిష్యత్‌లో రైతులకు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్, పంటల యోజన బీమా, సబ్సిడీ పరికరాలు, పంట నష్టపరిహారం, ఎరువుల రాయితీ, కనీస మద్దతు ధర తదితర పథకాలను అందించేందుకు ప్రత్యేక కార్డులను అందించనున్నారు. ఇందుకోసం అర్హులైన ప్రతి రైతుకు ఆధార్‌కార్డు తరహాలో వ్యవసాయ శాఖ ద్వారా 14అంకెల యూఐడీ కేటాయిస్తున్నారు. అయితే ఇప్పటివరకు సొంత పట్టా భూములు ఉన్న రైతుల వివరాలు మాత్రం నమోదు చేసి ఒక యూనిక్ ఐడీని కేటాయిస్తున్నారు. కానీ డీకేటీ పట్టాలు ఉన్న రైతుల వివరాలు నమోదు చేయడం లేదు. ఇందుకు ఆన్లైన్లో అనుమతించడం లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో డీకేటీ రైతులు తమకు పథకాలు, నిధులు అందుతాయో లేదోనన్న ఆందోళనలో ఉన్నారు. కేవలం పట్టాదారులకే నమోదు చేస్తారా? జిల్లాలో గల 15 మండలాల్లో గడిచిన రెండు వారాలుగా అన్ని గ్రామాల్లో రైతులకు యూనిక్ ఐడీ నంబర్ కేటాయింపు కోసం వ్యవసాయ సిబ్బంది గ్రామాల్లో పర్యటిస్తున్నారు. రైతుల వద్దకు వెళ్లి వారి భూమి పాస్‌బుక్‌లు, ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ ద్వారా ఆన్లైన్ పోర్టల్‌లో నమోదు చేసి యూనిక్ ఐడీ కేటాయిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని రైతుసేవా కేంద్రాల్లో కూడా నమోదు ప్రక్రియ జరుగుతోంది. కానీ డీకేటీ రైతులకు మాత్రం ఆన్లైన్లో నమోదు అవడం లేదంటూ చెప్పి పంపించేస్తున్నారు. కేవలం పట్టాదారులకే నమోదు చేస్తారా? అంటూ డీకేటీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో డీకేటీ రైతుల వివరాలు యూనిక్ ఐడీ కోసం డీకేటీ భూములున్న ఏ ఒక్క రైతుకు ఆన్లైన్లో వివరాలు నమోదు చేసేందుకు అనుమతి ఇవ్వడం లేదు. జిల్లాలో పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏల పరిధిలో 24,245 మంది రైతులు డీకేటీ పట్టాలు కలిగి ఉన్నారు. రెండు ఐటీడీఏల పరిధిలో 36,483 మంది రైతులు నమోదు కావాల్సి ఉంది. ఆ రైతులందరూ యూనిక్ ఐడీ కార్డులు మాకు ఇవ్వరా? కార్డు ద్వారా సంక్షేమ పథకాలు అందిస్తే మా పరిస్థితి ఏమిటి అంటూ అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్‌లో సొంత పట్టాదారులకే నమోదు వారికే యూనిక్ ఐడీల కేటాయింపు డీకేటీ రైతులకు నమోదు అవదంటున్న అధికారులు ఆందోళనలో రైతులుఅనుమతి వస్తే నమోదు చేస్తాం ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే, వెబ్సైట్లో ఆప్షన్ వచ్చిన వెంటనే డీకేటీ రైతుల వివరాలు నమోదు చేస్తాం. ప్రస్తుతం సొంత పట్టాదారులకు సంబంధించి యూనిక్ ఐడీలను అప్లోడ్ చేస్తున్నాం. త్వరలోనే అనుమతి వస్తుందని సమాచారం. త్వరలో వారివి కూడా యూనిక్ ఐడీల నమోదు ప్రక్రియ చేపడతాం. – రాబర్ట్‌పాల్, జిల్లా వ్యవసాయశాఖాధికారి, పార్వతీపురం మన్యం -
మహిళల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
పర్లాకిమిడి: మహిళల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని కలెక్టర్ బిజయ కుమార్ దాస్ అన్నారు. స్థానిక గజపతి స్టేడియంలో జిల్లాస్థాయి లక్షాధిపతి దిద్దీల వర్క్‌షాపును మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికాభివృద్ధి సాధిస్తే కుటుంబాలు బాగుంటాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఒడిశా జీవికా మిషన్ అధికారి టిమోన్ బోరా, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ సీడీఎం శంకర్ కెరకెటా, అదనపు ఈవో పృథ్వీరాజ్ మండల్, పురపాలక శాఖ కార్యనిర్వహణ అధికారి లక్ష్మణ ముర్ము, జిల్లా సంక్షేమశాఖ అధికారి మనోరమా దేవి తదితరులు పాల్గొన్నారు. మల్కన్‌గిరి: స్థానిక మాల్యవంత్ హాస్టల్ ప్రాంగణంలో లక్షపతి దిదీ కార్యశాల కార్యక్రమం కలెక్టర్ ఆశిష్ ఈశ్వర్ పటేల్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు, మల్కన్‌గిరి సమితి అధికారి తపన్ కుమార్ సేవపతి తదితరులు పాల్గొన్నారు. -
కార్గో ఎయిర్‌పోర్టును అడ్డుకుందాం
వజ్రపుకొత్తూరు రూరల్: పచ్చని ఉద్దాన ప్రాంతంలో కార్గో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి వ్యతిరేకంగా ఈ నెల 18, 19 తేదీల్లో బాధిత ప్రాంతాలలో చేపట్టనున్న ప్రచార యాత్రను విజయవంతం చేయాలని ఎయిర్ పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఈ మేరకు వజ్రపుకొత్తూరు మండలం ఒంకులూరులో మంగళవారం వామపక్ష పార్టీలతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఉద్దాన ప్రాంతాన్ని నమ్ముకొని వేలాది మంది ప్రజలు జీవనోపాధి పొందుతుంటే ప్రభుత్వం ఈ ప్రాంతంలో విధ్వంసకర ఎయిర్ పోర్టుతో వారి బతుకులను నాశనం చేయాలని చూస్తోందని మండిపడ్డారు. ప్రజలకు మేలు చేయాలంటే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయాలని, ఉద్యాన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. కార్యక్రమంలో పోరాట కమిటీ అధ్యక్షుడు వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. -
పునర్విభజనను వ్యతిరేకిద్దాం
భువనేశ్వర్: వివాదస్పదమైన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను వ్యతిరేకిస్తున్న తమిళనాడులోని డీఎంకే పార్టీ నాయకులు రాష్ట్రంలోని విపక్ష నేతలను మంగళవారం కలిశారు. తమిళనాడు మంత్రి టి.ఆర్.బి.రాజా, ఎంపీ దయానిధి మారన్లతో కూడిన ఇద్దరు సభ్యుల డీఎంకే ప్రతినిధుల బృందం స్థానిక నవీన్ నివాస్‌లో ప్రతిపక్ష నాయకుడు నవీన్ పట్నాయక్, ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివాదాస్పదమైన నియోజకవర్గాల పునర్విభజన అంశంపై చర్చించారు. జనాభా ఆధారంగా మాత్రమే నియోజకవర్గాలను పునర్నిర్మించాలనే కేంద్రం ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ సంయుక్త క్రియా శీలక కమిటీ (జేఏసీ)లో చేరాలని కోరారు. 22న చైన్నెలో సమావేశం పునర్విభజన ప్రతిపాదనకు వ్యతిరేకంగా రాష్ట్రాలను ఏకం చేయడమే లక్ష్యంగా ఈనెల 22న చైన్నెలో జరగనున్న జేఏసీ సమావేశానికి హాజరు కావాలని డీఎంకే ప్రతినిధుల బృందం ఆహ్వానించింది. బీజేడీ జేఏసీలో చేరుతుందని డీఎంకే నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పునర్విభజన ప్రతిపాదనకు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టుకునేందుకు డీఎంకే ఎన్డీఏలోని పార్టీలతో సహా వివిధ పార్టీలను సంప్రదిస్తోందన్నారు. చైన్నెలో జరగబోయే సమావేశానికి హాజరు కావడానికి అధికారికంగా ఆహ్వానించడానికి సీఎం స్టాలిన్ తరపున ఇక్కడికి వచ్చినట్లు బృందం వివరించింది. పునర్విభజనతో తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, పంజాబ్ మరియు ఒడిశాతో సహా పలు రాష్ట్రాలు ప్రత్యక్షంగా ప్రభావితమవుతాయని డీఎంకే ఎంపీ దయానిధి మారన్ అన్నారు. బీజేడీ, కాంగ్రెసు నేతలకు డీఎంకే పిలుపు -
సెరీకల్చర్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలి
పార్వతీపురంటౌన్: రాష్ట్ర ప్రభుత్వం సూచించిన మేరకు పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రతి ఏడాది ప్రాథమిక రంగాలు వృద్ధి సాధించాలని, ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ సూచించారు. ఈ మేరకు మంగళవారం సంబంధిత శాఖాధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో సేంద్రియ వ్యవసాయం ఎక్కువగా జరుగుతుందని, సేంద్రియ పంటల రైతులను ప్రోత్సహించాలన్నారు. నిమ్మగడ్డికి మంచి గిరాకీ ఉందని, అందుకు తగిన ప్రణాళికలు రూపొందించి రైతులను ప్రొత్సహించాలని కోరారు. వ్యవసాయ పంటల్లో ఏటా 15 శాతానికి మించి వృద్ధి ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ, ఉద్యానవన, మత్స్య, పట్టు, వశుసంవర్థక శాఖాధికారులు కె. రాబర్ట్‌పాల్, బి.శ్యామల, వి.తిరుపతయ్య, ఏవీ సాల్మన్ రాజు, డా.ఎస్ మన్మథరావు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన జాతీయ విజ్ఞాన దినోత్సవ పోటీలు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్సవ పోటీలు ముగిశాయి. శ్రీకాకుళం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో శ్రీకాకుళం, టెక్కలి, పలాస మూడు డివిజన్ల పరిధిలో విజేతలగా నిలిచిన పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ప్రాథమిక, సెకండరీ విభాగాల్లో క్విజ్, ఎక్పైర్మెంట్, సింపోసియం (విశ్లేషనాత్మక చర్చ) అంశాల్లో పోటీలు జరిగాయి. విజేతలకు రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు కాంతారావు, డీఈఓ తిరుమల చైతన్య బహుమతులు అందజేశారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు శాసీ్త్రయమైన దృక్పథాలను అలవర్చుకోవాలని, పరిశోధనలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. అంతకుముందు కార్యక్రమ కో–ఆర్డినేటర్, శ్రీకాకుళం ఉప విద్యాశాఖాధికారి ఆర్.విజయకుమారి పోటీలను పర్యవేక్షించారు. వీటి కొనసాగింపుగా జరిగే రాష్ట్రస్థాయి విజ్ఞానశాస్త్ర దినోత్సవ పోటీలు (తేదీలు ఖరారుకాలేదు) శ్రీకాకుళంలోనే జరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉప విద్యాశాఖాధికారి(టెక్కలి)పి.విలియమ్స్, జిల్లా సైన్స్ అధికారి ఎన్.కుమారస్వామి, సైన్స్ ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. విజేతలు వీరే.. క్విజ్: ప్రాథమిక స్థాయిలో ఎంపీపీ స్కూల్ గంగువాడ, ఎంపీపీ స్కూల్ నందిగాం మెయిన్, ఎంపీపీ స్కూల్ పెద్దలంకాం మొదటి మూడుస్థానాల్లో నిలిచారు. సెకండరీ స్థాయిలో జెడ్పీహెచ్ స్కూల్ కొయ్యాం, జెడ్పీహెచ్‌స్కూల్ ప్లస్ హరిపురం, జెడ్పీహెచ్ స్కూల్ బోరివంగ తొలి మూడుస్థానాలు సాధించాయి. ఎక్పైర్మెంట్: ప్రాథమిక స్థాయిలో జరిగిన ఈ పోటీల్లో జెడ్పీహెచ్ స్కూల్ కోటబొమ్మాళి, ఎంజేపీడబ్ల్యూఆర్జీ స్కూల్ హయాతీనగరం, జెడ్పీహెచ్ స్కూల్(బోర్డు) నరసన్నపేట మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. సింపోసియం: సెకండరీ స్థాయిలోనే జరిగిన ఈ పోటీల్లో జెడ్పీహెచ్ స్కూల్ రొంపివలస, జెడ్పీహెచ్ స్కూల్ కొసమాల, జీహెచ్ స్కూల్ కవిటి పాఠశాలలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. -
శాసనసభలో క్రమశిక్షణ చర్యలు
భువనేశ్వర్: రాష్ట్ర శాసనసభలో క్రమశిక్షణ రాహిత్యంపై చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహిణీపతిని తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. మంగళవారం సభలో జరిగిన ఒక ఘటన తర్వాత 7 రోజుల పాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సభలో పట్టణాభివృద్ధి శాఖ ప్రశ్నోత్తరాలు జరుగుతున్న సమయంలో అధికార బీజేపీ ఎమ్మెల్యే జయ నారాయణ్ మిశ్రా, కాంగ్రెస్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ మధ్య గొడవ చోటు చేసుకుంది. పరిస్థితి వేడెక్కడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే చేయిచేసేందుకు విఫలయత్నం చేసినట్లు ఆరోపణ. అయితే జయ నారాయణ మిశ్రా మొదట తన కాలర్ పట్టుకున్నట్లు తారా ప్రసాద్ ప్రత్యారోపణ చేశారు. సభలో గందరగోళం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం నుంచే ప్రతిపక్ష కాంగ్రెస్, బిజూ జనతా దళ్ ఎమ్మెల్యేలు సభ మధ్యలోకి వచ్చి గందరగోళం సృష్టించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మహిళలపై హింసకు వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహిణీపతి స్పీకర్ పోడియం ఎక్కడానికి ప్రయత్నించారు. తారా ప్రసాద్ బాహిణీపతి, సాగర్ దాస్, రోమాంచ్ రంజన్ విశాల్, యోగేష్ సింగ్, దేవి రంజన్ త్రిపాఠి, మాధవ్ ధొడొ, నొబొ మల్లిక్, అభిమన్యు సెఠి, చక్రమణి కంవర్ అసెంబ్లీ రిపోర్ట్ టేబుల్‌పై నిలబడి నిరసన తెలిపారు. గాంధీ విగ్రహం వద్ద నిరసన సస్పెన్షన్ ఉత్తర్వులకు వ్యతిరేకంగా రాత్రంతా శాసనసభ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టనున్నట్లు తారా ప్రసాద్ బాహిణీపతి ప్రకటించారు. జరిగిన ఘటనపై వాస్తవాలను పరిశీలించకుండా తనకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టడం అన్యాయమన్నారు. విపక్షంలో ఉంటూ ప్రభుత్వ విధానాల్లో తప్పిదాలను వేలెత్తి చూపుతున్నందున ఇటువంటి చర్యలు చేపట్టారని ఆరోపించారు. బీజేపీ సభ్యుడు జయ నారాయణ మిశ్రా కాలర్ పట్టుకుని విదిలించగా ఎమ్మెల్యే బాబూ సింగ్ తోసి వేశారు. ఈ విషయాన్ని స్పీకర్‌కు లిఖితపూర్వకంగా వివరించినా, ఏకపక్ష ధోరణితో తనకు వ్యతిరేకంగా మాత్రమే సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేయడాన్ని తప్పబట్టారు. ప్రభుత్వ చీఫ్ విప్ సరోజ్ ప్రధాన్ ప్రతిపాదన మేరకు స్పీకర్ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహిణీపతి సస్పెండ్ -
ఎత్తిపోతల పథకం సామగ్రి చోరీ
ఆమదాలవలస రూరల్: రైతులకు సాగునీరందించేందుకు ఆమదాలవలస మండలం అక్కులుపేటలో బొడ్డేపల్లి రాజుగోపాలరావు వంశధార కుడిప్రధాన కాలువ 20ఎల్ ఎత్తిపోతల పథకం వద్ద చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి కరెంట్ సరఫరా నిలుపుదల చేసి మూడు ట్రాన్స్ఫార్మర్లలోని రాగి కాయిల్స్, కరెంట్ ఆయిల్ పట్టుకుపోయారు. పాటు అందులో ఉండే కరెంట్ ఆయిల్ అపహరించుకుపోయారు. విషయం తెలుసుకున్న రైతులు, శ్రీనివాసచార్యులుపేట సర్పంచ్ గౌరిపతి ఆమదాలవలస పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ ఎస్ బాలరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ కమిటీ ఏర్పాటు శ్రీకాకుళం కల్చరల్: రాష్ట్ర వ్యాప్తంగా గ్రంథాలయ పునర్వికాస ఉద్యమం కోసం జిల్లా, డివిజన్ కన్వీనర్లను నియమిస్తున్నట్లు ఉద్యమ రాష్ట్ర కన్వీనర్ వల్లూరి శివప్రసాద్ మంగళవారం ప్రకటించారు. జిల్లా కన్వీనర్‌గా విద్యావేత్త బుడుమూరు సూర్యారావును నియమించారు. ఈయన ప్రస్తుతం బూర్జ మండల ఉపాధ్యక్షునిగా ఉన్నారు. గ్రంథాలయ వ్యవస్థ పట్ల అభిమానం ఉన్నవారినే ఉద్యమ కమిటీలో ఏర్పాటు చేస్తున్నామని, వారి రాజకీయ కార్యకలాపాలతో తమకు సంబంధం లేదని శివప్రసాద్ స్పష్టం చేశారు. శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్ కన్వీనర్‌గా విద్యావేత్త డాక్టర్ జామి భీమశంకర్, టెక్కలి డివిజన్ కన్వీనర్‌గా బెండి నర్సింగరావు, పలాస డివిజన్ కన్వీనర్‌గా చాపర వేణుగోపాల్‌ను నియమించారు. సాహితీ స్రవంతి జిల్లా కన్వీనర్ కె.శ్రీనివాస్, న్యాయవాది బొడ్డేపల్లి మోహన్‌రావు, విశ్రాంత లైబ్రేరియన్ డి.గోపాలరావు, అరసం జిల్లా కార్యదర్శి చింతాడ కృష్ణారావు, విద్యావేత్త శాసనపురి మధుబాబు, ఇస్కఫ్ జిల్లా అధ్యక్షులు ఎం.వి.మల్లేశ్వరరావులను సభ్యులుగా ఎంపికచేశారు. ఈ నియామకాలపై రచయిత అట్టాడ అప్పలనాయుడు, అరసం జిల్లా అధ్యక్షులు నల్లి ధర్మారావు, కథానిలయం ప్రతినిధి దాసరి రామచంద్రరావు, శ్రీకాకుళ సాహితీ ప్రతినిధులు, కవులు కంచరాన భుజంగరావు, కలమట దాసుబాబు తదితరులు హర్షం వ్యక్తం చేస్తూ ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు. పరిశ్రమ వ్యర్థాలతో భూగర్భ జలాలు కలుషితం రణస్థలం: మండలంలోని పైడిభీమవరం పారిశ్రామికవాడలో సరాకా లేబొరేటరీ పరిశ్రమ వ్యర్థ జలాలు బయటకు విడిచిపెట్టి భూగర్భ జలాలు కలుషితం చేస్తున్నారంటూ నారువ పంచాయతీ ప్రజలు మంగళవారం ఫ్యాక్టరీ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. గతంలో పైపులైన్లు ద్వారా సముద్రంలో విడిచిపెట్టేవారని, కొన్నాళ్లుగా పరిశ్రమ పక్కనే గెడ్డ, కొండదిబ్బ దిగువ ప్రాంతాల్లో విడిచిపెడుతున్నారని చెప్పారు. వ్యర్థ జలాల కారణంగా ప్రాణాంతక వ్యాధులు సంక్రమిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై కాలుష్య నియంత్రణ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికై నా వ్యర్థాలు పారబోయడం ఆపకపోతే పోరాటం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. నిరసన కార్యక్రమంలో నారువ, అక్కయ్యపాలెం, బోయపాలెం తదితర గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. ప్రకృతి సాగుకు ప్రాధాన్యం ఎచ్చెర్ల క్యాంపస్: వచ్చే ఖరీఫ్‌లో జిల్లాలో 1.40 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం సాగు చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ పి.రేవతి తెలిపారు. ఎచ్చెర్లలోని సాంకేతిక శిక్షణ కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు రిసోర్సుపర్సన్లకు మూడు రోజుల శిక్షణ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 70వేల మంది రైతులకు ప్రకృతి వ్యవసాయ సాగుపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. పురుగుల మందులు, రసాయన ఎరువుల రహిత వ్యవసాయం లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. అనంతరం శాస్త్రవేత్తలు, నిపుణులు ఆన్లైన్లో పలు అంశాలపై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ ధనుంజయరావు, సిబ్బంది సూర్యనారాయణ, పీఎస్ బాబు పాల్గొన్నారు. -
వన్‌ధన్ వికాస కేంద్రాలు వృద్ధి చెందాలి
పార్వతీపురం: ఐటీడీఏ పరిధిలోని వన్‌ధన్ వికాస కేంద్రాలు వృద్ధి చెందాలని ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాత్సవ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన తన కార్యాలయంలో వీడీవీకేల నిర్వహణ, యంత్రాల కొనుగోలుపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీడీవీకేల ఉత్పత్తులు పెంచేందుకు అవసరమైన యంత్ర సామగ్రిని వారికి సమకూర్చి, వాటిపై శిక్షణ కార్యక్రమాలను నిర్వహించి, ఉత్పత్తులకు ఆకర్షణీయమైన ప్యాకింగ్ ఏర్పాటు చేసి మార్కెటింగ్ సదుపాయం కల్పించాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో వెలుగు ఏపీడీ, వెలుగు 8మండలాల ఏపీఎంలు, హెడ్‌క్వార్టర్ ఏపీఎంలు పాల్గొన్నారు. ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాత్సవ -
కలెక్టరేట్ ముట్టడి
పర్లాకిమిడి: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆశావర్కర్లు కలెక్టరేట్‌ను మంగళవారం ముట్టడించారు. ముందుగా ఒడిశా రాష్ట్ర ఆశా కార్మిక సంఘం, సంయుక్త భారతీయ మజ్దూర్ సంఘ్‌తో కలిసి రాజవీధి నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ వద్ద భారతీయ మజ్దూర్ సంఘ అధ్యక్షుడు సుజిత్ ప్రధాన్ మాట్లాడుతూ.. ఆశవర్కర్ల వేతనాన్ని రూ.18 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఆశా ఫెసిలేటర్లు, బీటీటీ కో–ఆర్డినేటర్లకు ఈపీఎఫ్, రిటైర్మెంట్ తర్వాత గ్రాట్యూటీ, మరణిస్తే కుటుంబాలకు రూ.5 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు సిద్ధమవుతామని ఆశావర్కర్ల సంఘం అధ్యక్షురాలు కమలా బెహరా హెచ్చరించారు. అనంతరం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం కార్యదర్శి మమతా మహంతి తదితరులు పాల్గొన్నారు. -
పాముకాటుకు గురై ఫీల్డ్ అసిస్టెంట్ మృతి
రామభద్రపురం: మండలంలోని నాయుడువలసకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ పాము కాటుకు గురై చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటనపై కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ ఆర్నిపల్లి సత్యనారాయణ(36) గ్రామంలోని మామిడితోటలో ఉపాధి కూలీలు వారం రోజులుగా చేసిన ఉపాధి పనుల కొలతలు వేసేందుకు శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో వెళ్తుండగా తోటలో ఆకులు ఎక్కువగా ఉండడంతో ఆకుల కింద పాము ఉందన్న విషయం తెలుసుకోలేక కాలితో మట్టేశాడు. దీంతో ఆకుల కింద ఉన్న పాము కాటు వేయడంతో స్థానికులు మెరుగైన చికిత్స కోసం విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి 11 గంటల సమయంలో మృతిచెందాడు. మృతుని భార్య గత రెండేళ్ల క్రితం మృతి చెందింది. పెద్ద పాప జ్యోతి ఇంటర్మీడియట్ మొదటి ఏడాది పరీక్షలు రాస్తోంది. రెండవ పాన నిఖిత 7 వ తరగతి చదువుతోంది. తల్లిదండ్రులిద్దరూ చనిపోవడంతో పిల్లలిద్దరూ దిక్కులేని వారయ్యారు. -
విద్యార్థులకు ఇస్రో పిలుపు
● అంతరిక్షం.. స్పేస్ అప్లికేషన్‌పై అవగాహన ● 9వ తరగతి విద్యార్థులకు చక్కటి అవకాశం ● మార్చి 23 వరకు దరఖాస్తుల స్వీకరణపాలకొండ రూరల్: విద్యార్థి దశ నుంచి సైన్స్‌పై మక్కువ చూపుతూ..నూతన ఆవిష్కరణల పట్ల ఉత్సాహం చూపే విద్యార్థులను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రోత్సహిస్తోంది. యువిక (యుంగ్ సైంటిస్ట్)–2025 పేరిట ఉపగ్రహ ప్రయోగాలను తెలుసుకునేందుకు, శాస్త్రవేత్తలతో మాట్లాడేందుకు 9వ తరగతి విద్యార్థులకు అవకాశం కల్పిస్తోంది. లక్ష్యాలు.. ● భారత అంతరిక్ష పరిశోధనలను విద్యార్థులకు పరిచయం చేయడం ● విద్యార్థులను స్పేస్ టెక్నాలజీ వైపు ప్రోత్సహించడం ● అంతరిక్ష పరిశోధకులుగా వారిని సిద్ధం చేయడం దరఖాస్తు చేసే విధానం.. ఈ నెల 23వ తేదీలోగా విద్యార్థులు నాలుగు దశల్లో దరఖాస్తులను పూర్తి చేయాల్సి ఉంటుంది. వచ్చిన దరఖాస్తులను ఏప్రిల్ 7వ తేదీనాటికి వడపోసి ఎంపికై న విద్యార్తుల జాబితాలను విడుదల చేస్తారు. మే నెల 18 నుంచి విద్యార్థులను ఆహ్వానిస్తారు. 19 నుంచి 30వ తేదీ వరకూ యువికా–25 కార్యక్రమం చేపడతారు. మే 31న ముగింపు కార్యక్రమం జరుగతుంది. అదే రోజు ప్రతిభ కనపర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తారు. ఎంపికై న విద్యార్థులకు ప్రయాణ, భోజన, వసతి ఏర్పాట్లును ఇస్రో పూర్తి ఉచితంగా అందజేస్తుంది. ఎంపికై న విద్యార్థులను మే నెలలో 14 రోజులు ఇస్రోకు చెందిన స్పెస్ సెంటర్లకు తీసుకువెళ్తారు. అక్కడి వింతలు, విశేషాలు, సప్తగహ కూటమి తదితర అంశాలపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తారు.భావిశాస్త్ర వేత్తలకు ప్రోత్సాహం భావిశాస్త్రవేత్తలను ప్రోత్సహించేందుకు ఇస్రో చేపడుతున్న యువికా కార్యక్రామాన్ని అర్హతగల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. సంబంధిత పాఠశాలల సైన్స్ ఉపాధ్యాయులు పిల్లలకు సహకరించాలి. జిల్లా పరిధిలో డీవీఈఓలు, ఎంఈఓలు ఈ విషయంపై వారి పరిధిలో యంత్రాంగాన్ని చైతన్యపర్చాలి. పెద్ద సంఖ్యలో విద్యార్థులతో దరఖాస్తు చేయించాలి. – ఎన్.తిరుపతినాయుడు, జిల్లా విద్యాశాఖాధికారి, పార్వతీపురం మన్యం ఎవరు అర్హులు ● ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 9వ తరగతి విద్యార్థులు ● ఆన్లైన్ పరీక్షలో ప్రతిభ కనపర్చిన విద్యార్ధులు ● 8వ తరగతిలో సాధించిన మార్కుల్లో 50 శాతం, మూడేళ్లలో పాఠశాల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహించిన సైన్స్ వైజ్ఞానిక ప్రదర్శనల్లో పాల్గొంటే వాటి ఆధారంగా 2 నుంచి 10 శాతం, ఆన్లైన్ క్విజ్ పోటీల్లో చూపించిన ప్రతిభకు 10 శాతం వెయిటేజీ అందిస్తారు. ఎన్సీసీ, స్కౌట్, గైడ్స్ విభాగాల్లో ఉంటే 5 శాతం, పల్లె ప్రాంతాలకు చెందినవారికి 15 శాతం ప్రాధాన్యం కల్పిస్తారు.జిల్లావ్యాప్తంగా సంసిద్ధం గతంలో నిర్వహించిన అనేక సైన్స్ ఎగ్జిబీషన్లు, పోటీ పరీక్షల్లో మన జిల్లా విద్యార్థులు సత్తాచాటి జాతీయ స్థాయిలో వారి ప్రదర్శనలతో అబ్బురపర్చారు. ఇదే స్ఫూర్తితో పెద్ద సంఖ్యలో అర్హత గత విద్యార్థులను సిద్ధం చేస్తున్నాం. ఇప్పటికే 40 వరకూ దరఖాస్తులను ఆన్లైన్లో రిజిస్టర్ చేశారు. ప్రస్తుత వేసవి సెలవుల్లో సమయం వృథా కాకుండా ఈ పర్యటనలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. – జి.లక్ష్మణరావు, జిల్లా సైన్స్ అధికారి, పార్వతీపురం మన్యం -
బుధవారం శ్రీ 12 శ్రీ మార్చి శ్రీ 2025
● కొరాపుట్ జిల్లాలో తెలుగు సినిమాల షూటింగ్స్ ● సందడి చేస్తున్న అగ్ర హీరోలు ● పెరిగిన పర్యాటకుల తాకిడి భారీ భద్రత రోజురోజుకీ సందర్శకుల తాకిడి పెరుగుతుండడంతో ప్రభుత్వం ఇక్కడ ప్లాటూన్ పోలీసులను మోహరించింది. ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు సుమారు 80 మంది భద్రతా ఏర్పాట్లలో మునిగి ఉన్నారు. ఇప్పటికే మహేష్‌బాబు, మళయాల విలన్ పృథ్వీరాజ్ కరుణాకరణ్లు చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఇంకా హిందీ నటులు ప్రియాంక చోప్రా, జాన్ అబ్రహాంలు రావాల్సి ఉంది. ఒడిశా ప్రభుత్వం కూడా సినిమా నిర్మాణానికి పూర్తి సహకారం అందజేస్తోంది. తద్వారా ఈ ప్రాంతం పర్యటక రంగంలో అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షిస్తోంది. ప్రముఖుల హర్షం ప్రస్తుతం రాజమౌళి సినిమా బృందం సందడి చేస్తుండడంపై రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ శాసన సభాపక్ష నాయకుడు రాం చంద్ర ఖడం మాట్లాడుతూ.. తెలుగు సినిమా ఇండస్ట్రీ తమ ప్రాంతంలో షూటింగ్ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. అవసరమైతే తాము పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించారు. మరిన్ని తెలుగు సినిమాలు ఇక్కడ షూటింగ్ చేయాలని కోరారు. బీజేడీకి చెందిన కొరాపుట్ జిల్లా పరిషత్ ప్రెసిడెంట్ సస్మితా మెలక మాట్లాడుతూ.. రాజమౌళి బృందానికి ధన్యవాదాలు తెలిపారు. ఇటువంటి సినిమాలు ఈ ప్రాంతంలో తీయడం వలన స్థానికులకు ఉపాధితో పాటు ఆదాయం వనరులు పెరుగుతాయన్నారు. న్యూస్‌రీల్ -
9 నెలల్లో రూ.21,000 కోట్ల రుణం
భువనేశ్వర్: రాష్ట్ర ప్రభుత్వ రుణభారం 9 నెలల స్వల్ప వ్యవధిలో రూ.21,000 కోట్ల పైబడిందని సీఎం మోహన్‌చరణ్ మాఝి రాష్ట్ర శాసనసభకు తెలియజేశారు. గతేడాది జూన్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరు నాటికి రాష్ట్ర ప్రభుత్వం రూ.21,177.99 కోట్లు అప్పుగా తీసుకుందన్నారు. ఈ నిధులను మౌలిక సదుపాయాలు మరియు సంక్షేమ పథకాల అమలు, కార్యాచరణ కోసం వినియోగించినట్లు పేర్కొన్నారు. బహుళ వనరుల నుంచి ఈ అప్పు తీసుకున్నట్లు ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న సీఎం వెల్లడించారు. విపక్ష బిజూ జనతా దళ్ ఎమ్మెల్యే గౌతమ్ బుద్ధ దాస్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ విషయాలు వెల్లడించారు. రూ.9,000 కోట్ల ఓపెన్ మార్కెట్ రుణాలు అత్యధికంగా రూ.9,000 కోట్లు ఓపెన్ మార్కెట్ రుణాలు తీసుకున్నట్లు సీఎం మోహన్‌చరణ్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.7,149.56 కోట్ల రుణం లభించిందన్నారు. ఒడిశా మినరల్ బేరింగ్ ఏరియాస్ డవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి రూ.2,750 కోట్లు, రాష్ట్ర పరిహార అటవీకరణ నిధి (క్యాంపా) నుంచి రూ.2,370 కోట్లు, వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి జాతీయ బ్యాంకు (నాబార్డ్) నుంచి రూ.2,261.16 కోట్లు, నికర ప్రావిడెంట్ ఫండ్ తగ్గింపుల నుంచి రూ.2,352.73 కోట్లు అప్పుగా సేకరించామన్నారు. ఈ రుణాలను నీటి పారుదల, విద్యుత్, రోడ్లు, విపత్తు నిర్వహణ, పట్టణ మౌలిక సదుపాయాల వంటి మూలధన – ఇంటెన్సివ్ రంగాలకు కేటాయించినట్లు విశ్లేషించారు. రుణాలు చెల్లించే ప్రయత్నాలు ప్రజాహిత, పురోగతి లక్ష్యంగా ఆర్థిక వనరులను అప్పుగా సేకరించిన రాష్ట్ర ప్రభుత్వం పాత అప్పులు తీర్చే దిశలో నిర్మాణాత్మక శైలితో ముందుకు సాగుతోందన్నారు. గతేడాది జూన్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు తొమ్మిది నెలల కాలంలో రాష్ట్రం మునుపటి రుణాలను రూ.14,970.97 కోట్లు తిరిగి చెల్లించిందని తెలిపారు. కొత్త రుణాలను ప్రభుత్వ పథకాల నిర్వహణ కోసం వినియోగిస్తూ.. మరోవైపు రాష్ట్ర ఆదాయంతో పాత అప్పులను తీర్చేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. సీఎం మోహన్‌చరణ్ మాఝీ -
యాక్షన్..!
ఒకప్పుడు మావోయిస్టుల కంచుకోటగా ఉన్నటువంటి కొరాపుట్ జిల్లా నేడు సినిమా షూటింగ్స్‌తో సందడిగా మారింది. 15 ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు దేశ ప్రజల దృష్టిని ఆకర్షించేవి. అయితే ప్రస్తుతం అంతా మారిపోయింది. ప్రకృతి అందాలకు ప్రసిద్ధిగాంచిన ఈ ప్రాంతం సినీ తారల ఆటపాటలతో కళకళలాడుతోంది. దీంతో ఒకప్పుడు ఈ ప్రాంతానికి బదిలీపై రావాలంటే భయపడిన అధికారులే నేడు బదిలీకి ముచ్చటపడుతున్నారు. లక్షలాది మంది దేశ, విదేశీయులు విహార యాత్రలకు కోసం తరలివస్తున్నారు. – కొరాపుట్ స్టార్ట్.. కెమెరా.. ఇప్పటివరకు చిత్రీకరణలు ఈ ప్రాంతంలో ఇదివరకే ప్రముఖ చిత్రాలు షూటింగ్ జరుపుకున్నాయి. పుష్ప–2 సినిమాను పక్కనే ఉన్న మల్కన్‌గిరి జిల్లాలో అత్యధిక భాగం షూటింగ్ చేవారు. ఇటీవల సూపర్‌హిట్‌గా నిలిచిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాని కొరాపుట్ జిల్లాలోనే చిత్రీకరణ చేశారు. అప్పట్లో వేంకటేష్ తదితర నటులు ఈ ప్రాంతంలో పర్యటించారు. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ఘాటీ సినిమా కొరాపుట్ జిల్లాలోనే అత్యధిక భాగం షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమా ఏప్రిల్ 18న ప్రజల ముందుకు రానుంది. ఈ సినిమా జయపూర్ మెయిన్ రోడ్డు మీద షూటింగ్ చేయడం గమనార్హం. తప్పని లీకుల గోల రాజమౌళి బృందం పటిష్ట చర్యలు తీసుకుంటున్నప్పటికీ లీకుల బెడద తప్పడం లేదు. మహేష్‌బాబుని విలన్ అనుచరులు నెట్టుకుంటూ వస్తుండగా, విలన్ వీల్ చైర్ మీద ఉండడం, మహేష్ బాబు అక్కడకి చేరడం వంటి వీడియోలు లీకయ్యాయి. ఇవి కొరాపుట్ జిల్లాలో, సోషల్ మీడియాలో ఆదివారం వైరల్ అయ్యాయి. ఒక వ్యక్తి సందర్శకుడి మాదిరిగా వచ్చి కారులో కూర్చుని ఈ వీడియో తీసి వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ చేసినట్లు తెలుస్తోంది. -
లోయలో పడి ఇద్దరు మృతి
పర్లాకిమిడి/కాశీబుగ్గ: ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా రాయఘడ బ్లాక్ అర్సిలింగి ఘాట్ వద్ద మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని సూదికొండకు చెందిన ఇద్దరు మృత్యువాతపడ్డారు. సూదికొండకు చెందిన ముగ్గురు కొయంపూర్కు వ్యక్తిగత పనిపై వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న స్కూటీని తప్పించబోయి లోయలో పడిపోయినట్లు తెలిసింది. ఈ ఘటనలో సూదికొండకు చెందిన సయ్యద్ ఫరీద్ (27) అక్కడికక్కడే మృతిచెందగా, బుట్ట గంగాధర్ (35) గజపతి జిల్లా పర్లాఖిమిడి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. గంగాధర్ భార్య బుట్ట సరళకు తీవ్ర గాయాలు కావడంతో బరంపురం పెద్దాసుపత్రికి చికిత్స అందిస్తున్నారు. బుధవారం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను బాధిత కుటుంబాలకు అప్పగించనున్నారు. గారబంద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒడిశాలో దుర్ఘటన మృతులు సూదికొండ వాసులు -
బీఈవో కార్యాలయం వద్ద ఆందోళన
జయపురం: సబ్ డివిజన్ పరిధి కుంద్ర సమితి లిమ్మ గ్రామ పంచాయతీ కుసుమగుడ గ్రామంలో ఉన్నత ప్రాథమిక పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడిని బదిలీ చేసినందుకు బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి(బీఈవో) కార్యాలయం వద్ద గ్రామస్తులు నిరసన తెలిపారు. కార్యాలయంలో బీఈవో లేకపోవడంతో అక్కడి ఉద్యోగికి వినతిపత్రం అందజేశారు. పాఠశాలలో 8వ తరగతి వరకు 127 మంది విద్యార్థులు చదువుతుండగా కేవలం 5 మంది ఉపాధ్యాయులు ఉన్నారన్నారు. వారిలో మరో ఉపాధ్యాయుడిని బదిలీ చేయడం సరికాదన్నారు. అధికారులు స్పందించి బదిలీ నిలుపుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల యాజమాన్య కమిటీ అధ్యక్షుడు త్రినాథ్ జాని, సభ్యులు తులమని మొసిహ, భగవాన్ ఖుడిపియ, గౌరీశంకర పొరజ, రీణ పంగి, లక్ష్మణ ఖుడిపియ, సురేష్ బారిక్, శ్రీధర పొరజ, ప్రతిమ జాని, గుప్త బారిక్ పాల్గొన్నారు. గుర్తు తెలియని మృతదేహం లభ్యం జయపురం: సమితిలోని మహుళభట్ గ్రామ సమీపంలో గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం లభ్యమైందని సదర్ పోలీసు అధికారి సచిన్ ప్రధాన్ వెల్లడించారు. వృద్ధుడు తెల్లని చారల చొక్కా వేసుకున్నాడని, ఒక ఎర్రని గావంచ ఉందని వెల్లడించారు. మృతదేహాన్ని జయపురం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. అతడి వయస్సు 65 ఏళ్లు ఉండవచ్చని, గుర్తించినవారు సమాచారం ఇవ్వాలని సూచించారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఇద్దరు అరెస్టు జయపురం: ఒక ట్రాక్టర్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను జయపురం పోలీసులు అరెస్టు చేశారు. అరైస్టెనవారు జయపురం సబ్ డివిజన్ కుంద్ర సమితి లిమా గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ భగవాన్ ఖెంధు, కుంద్ర సమితి ఘివురియగుడ గ్రామానికి చెందిన ట్రాక్టర్ యజమాని భాస్కర బిశాయిలుగా సదర్ పోలీసు అధికారి జచింద్ర ప్రధాన్ వెల్లడించారు. ఇసుక అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో సదర్ పోలీసులు జయపురం సమీప భూతనాథ్ మందిరం వద్ద తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో జయపురం వస్తున్న ఇసుక ట్రాక్టర్‌ను ఆపి సీజ్ చేశారు. నిందితులు కుంద్ర సమీపంలోని ఒక నది నుంచి ఇసుక తీసుకొస్తున్నట్లు పోలీసు అధికారి వెల్లడించారు. ఎస్ఐ రాజ కిశోర్ బారాక్ కేసు నమోదు చేసి, నిందితులను కోర్టుకు తరలించారు. నాటుసారా అమ్మకాలు నివారించాలి జయపురం: సబ్ డివిజన్ పరిధి బొరిగుమ్మ సమితి పూజారిపుట్ పంచాయతీ కొండగుడ గ్రామంలో నాటుసారా అమ్మకాలు నివారించాలని గ్రామస్తులు పోలీసులకు వినతిపత్రం మంగళవారం అందజేశారు. నాటుసారా అమ్మకాల వలన గ్రామంలోని కుటుంబాలు ఛిద్రమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని పురుషులు, మహిళలు సారా తాగుతుండడం వలన అకాల మరణాలకు గురవుతున్నారని పేర్కొన్నారు. వెంటనే అమ్మకాలు నిలిపివేయకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు త్రినాథ్ భూమియ, ఖగుపతి పూజారి తదితరులు పాల్గొన్నారు. -
హాస్టల్ సూపరింటెండెంట్ సస్పెన్షన్
రాజమౌళి షూటింగ్ షురూ పాన్ ఇండియా దర్శకుడు రాజమౌళి కొద్దిరోజుల క్రితం సామాన్య వ్యక్తి మాదిరిగా విశాఖపట్నం నుంచి రోడ్డు మార్గంలో వస్తూ ఈ ప్రాంత అందాలను తిలకించారు. దీనిలో భాగంగా కొరాపుట్ జిల్లా సిమిలిగుడ పట్టణంలోని ఒక ప్రైవేటు హోటల్లో స్టే చేశారు. ఇక్కడి అందాలను గమనించి తాను ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేష్‌బాబుతో చేస్తున్న సినిమా షూటింగ్ షురూ చేశారు. దీంతో ఈ ప్రాంతం సందడిగా మారింది. ప్రస్తుతం సిమిలిగుడ ప్రాంతంలోని హోటళ్లలో గదులు దొరకడం లేదు. ఆంధ్ర సరిహద్దు సాలూరుకి కూతవేటు దూరంలో దేవమాలి పర్వతంపై ఈ సినిమా తీస్తున్నారు. అందువలన ప్రతిరోజూ ఆంధ్ర, ఒడిశా ప్రాంతాల నుంచి వందలాది మంది అభిమానులు తారలను చూసేందుకు తరలి వస్తున్నారు.పెళ్లి పీటలెక్కనున్న మాజీ ఎంపీ ప్రదీప్ మజ్జి కొరాపుట్: నబరంగ్‌పూర్ మాజీ ఎంపీ, బీజేడీ నాయకుడు ప్రదీప్ మజ్జి వివాహం బుధవారం జరగనుంది. గోవాలోని పనాజీలో తన వివాహం జరుగుతుందని ఆయన స్వయంగా ప్రకటించారు. జర్నలిస్ట్ సుశ్రీ సంగీతా సాహుని ప్రేమ వివాహం చేసుకోనున్నారు. వీరిద్దరికీ భువనేశ్వర్‌లోని జిమ్‌లో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. రాయగడ: జిల్లాలోని గుణుపూర్ తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఉన్న అన్వేష హాస్టల్లో విద్యార్థిపై తోటి విద్యార్థుల మూకుమ్మడి దాడిపై జిల్లా యంత్రాంగం తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు హాస్టల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ రస్మిత సాహుపై సస్పెన్షన్ వేటువేసింది. అదేవిధంగా హాస్టల్లో వంటలు చేసే మరో ముగ్గురిని విధుల నుంచి తొలగించారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆసీమారావ్ ఆదివారం హాస్టల్‌కు వెళ్లి దర్యాప్తు చేపట్టి జిల్లా యంత్రాంగానికి నివేదిక సమర్పించింది. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ నిహారి రంజన్ కుహరో మరోసారి సోమవారం హాస్టల్‌కు వెళ్లి విద్యార్థులు, తల్లిదండ్రులతో మాట్లాడారు. అనంతరం సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. అలాగే హాస్టల్ నుంచి తొమ్మిది మంది విద్యార్థులను తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. వీరిలో 8 మంది విద్యార్థుల అనుచిత ప్రవర్తనపై జిల్లా అదనపు సంక్షేమ శాఖ అధికారి గంగాధర్ బెహర గుణుపూర్ ఆదర్శ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. -
అగ్నిగంగమ్మ జాతర ప్రారంభం
రాయగడ: రాయగడకు సమీపంలోని నీలావడి అమ్మవారి వార్షిక జాతర సోమవారం నుంచి ప్రారంభమయ్యింది. ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్న అమ్మవారి జాతరను వైభవంగా నిర్వహించేలా కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. సాయంత్రం సంప్రదాయ బద్ధంగా అమ్మవారి పాదాలను ఊరేగింపుగా తీసుకువచ్చి పూజా మండపంలో నిలపడం ద్వారా జాతరకు శ్రీకారం చుట్టారు. తొమ్మిది రోజులు జరగనున్న అమ్మవారి జాతరను తిలకించేందుకు ఇటు ఒడిశా అటు ఆంధ్రాకు చెందిన వేలాది మంది భక్తులు వస్తుంటారు. భక్తుల సౌకర్యార్ధం అన్ని ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అమ్మవారి జాతర ముగింపు రోజున రెండు లక్షల మందికిపైగా భక్తులు హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయడంతో పాటు తాగునీటి సౌకర్యాలను అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా క్యూలైన్లో నిలబడి అమ్మవారి దర్శనం కోసం ఉండే భక్తులకు ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. -
తాత్కాలిక వంతెన నిర్మాణం అడ్డగింత
జయపురం: జయపురం సబ్ డివిజన్ బొయిపరిగుడ సమితి బొదాపుట్ గ్రామ పంచాయతీ కబరగుడ గ్రామ సమీప నదిపై నిర్మిస్తున్న తాత్కాలిక వంతెన పనులను స్థానికులు అడ్డుకున్నారు. తకాల–మాది గ్రామాలను కలుపుతూ రోడ్డు ఉందని, దారిలో నది ఉందని తెలిపారు. వానాకాలంలో నది ఉద్ధృతంగా ప్రవహించి కబరగుడకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయని చెప్పారు. వానాకాలంలో రోగులను ఆస్పత్రికి కూడా తీసుకెళ్లలేకపోతున్నామని, నదికి ఆవల వైపునే శ్మశానం కూడా ఉందని, వానాకాలంలో దహన సంస్కారాలు కూడా జరగడం లేదని పేర్కొన్నారు. ఇంత కష్టకాలంలో ఉంటే నదిపై కేవలం నాలుగు అడుగుల హ్యూమ్ పైపులు వేసి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. తాత్కాలిక వంతెన నిర్మాణాన్ని అడ్డుకుంటున్నామని, శాశ్వత పరిష్కారం చూపించాలని డిమాండ్ చేశారు. పనులను అడ్డుకున్న వారిలో బొదాపుట్ పంచాయితీ సర్పంచ్ కృష్ణ భొత్ర,సుందర గదబ,జొగ గదబ,బుధ్ర గదబ,భగవాన్ శిశ, జగబందు గదబ,లెరి గదబ తదతరులు ఉన్నారు. -
18న పీఎఫ్ కమిషనర్ కార్యాలయాల ఘెరావ్
జయపురం: పీఎఫ్ కమిషనర్ కార్యాలయాన్ని ఈ నెల 18 వ తేదీన ఘెరావ్ చేయాలని జాతీయ ఈపీఎప్ పెన్షనర్స్ అసోసియేషన్ నిర్ణయించిందని కార్మిక నేత ప్రమోద్ కుమార్ మహంతి వెల్లడించారు. స్థానిక కార్మిక భవనంలో సోమవారం ఈపీఎఫ్ పెన్సనర్ల జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు నళినీకాంత రత్ అధ్యక్షతన జరిగిన పెన్షనర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మికులు తమ కష్టార్జితాన్ని కట్టి తిరిగి పొందలేకపోతున్నారని ఆరోపించారు. ఈపీఎఫ్ పెన్షన్‌దారులకు ఇప్పటికై నా నెలకు రూ.9వేలు చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. డీఏతోపాటు ఉచిత వైద్య సౌకర్యాలు కల్పించాలని కోరారు. డిమాండ్ల సాధన కోసం ఆందోళనలు చేస్తున్నా పాలకులు స్పందించడం లేదన్నారు. ఆందోళనను ఉద్ధృతం చేసి ప్రభుత్వం కళ్లు తెరిపించాలన్న లక్ష్యంతో ఈ నెల 18న దేశ వ్యాప్తంగా పీఎఫ్ కమిషనర్ల కార్యాలయాల ముందు ధర్నా చేయనున్నామన్నారు. పోరాటాలతోనే హక్కుల సాధన జయపురం: పోరాటం ద్వారానే హక్కులు సాధించలగమని నాన్ గెజిటెడ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ సమన్వయ సమితి కొరాపుట్ జిల్లా శాఖ అధ్యక్షుడు శశిభూషణ దాస్ అభిప్రాయపడ్డారు. స్థానిక యాదవ భవనంలో సోమవారం జరిగిన రాష్ట్ర నాన్‌గెజిటెడ్ ఉద్యోగుల సమన్వయ సమితి కొరాపుట్ జిల్లా శాఖ సమావేశంలో ఆయన మాట్లాడారు. నాన్ గెజిటెడ్ ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం సవతి ప్రేమ చూపుతోందని విమర్శించారు. ఎప్పటి కప్పుడు నాన్‌గెజిటెడ్ ఉద్యోగుల డిమాండ్లను విన్నవించుకుంటున్నా పట్టించుకోవడం లేదన్నారు. అందరూ ఒక్కటిగా నిలిచి ఆందోళనకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నాన్‌గెజిటెడ్ ఉద్యోగుల సమస్యలపై విస్తృతంగా చర్చించారు. ప్రభుత్వ ఉద్యోగుల, ఉపాధ్యాయుల ప్రారంభ వేతనాలు సవరించాలని, కోవిడ్ సమయంలో తగ్గించిన డీఏ వెంటనే చెల్లింపు, ఇంటి అద్దెలు సమానంగా చెల్లించాలని, పూర్వ నియమం ప్రకారం సహాయం అందించాలని, కాంట్రాక్ట్ ఉద్యోగాలను రద్దు చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల ధర్నా భువనేశ్వర్: రాష్ట్రంలో సగటు మహిళకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఈ పరిస్థితుల పట్ల ప్రభుత్వ చర్యలు శూన్యంగా పరిణమిస్తున్నాయి. రాష్ట్రంలో మహిళల పట్ల నేరాలు నిత్యకృత్యాలుగా మారి నేర సంఘటనలు పెచ్చుమీరుతున్నాయి. ఈ పరిస్థితి పట్ల ప్రభుత్వం వివరణ కోరుతూ శాసన సభ బడ్జెటు సమావేశాల్లో కాంగ్రెసు సభ్యులు రంకెలు వేశారు. వీరి గోడుని స్పీకరు పెడ చెవిన పెట్టడంతో పోడియం చుట్టు ముట్టేందుకు విఫలయత్నం చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు స్పీకరు వరుసగా సభా కార్యక్రమాల్ని వాయిదా వేయడంతో సభ నుంచి బయటకు తరలి వచ్చి గాంధీ మహాత్ముని బొమ్మ దగ్గర బైఠాయించి నిరసన ప్రదర్శించారు. 60 యూనిట్ల రక్తం సేకరణ రాయగడ: స్థానిక యూజీఎంఐటీలో సొమవారం సంబాద్, అమో ఒడిశా సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో 60 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఈ శిబిరంలో విద్యార్థులు, అధ్యాపకులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. ఆయా సంస్థలకు చెందిన అరవింద్ ప్రధాన్, డాక్టర్ ప్రదీప్ కుమార్ త్రిపాఠి, మానస్ రంజన్ ప్రధాన్ ఈ కార్యక్రమంలొ పాల్గొని పర్యవేక్షించారు. -
పార్వతీపుం మన్యం జిల్లా అంతటా గ్లకోమా సదస్సులు
ఈ వ్యాధి వచ్చినట్లు గుర్తించిన వెంటనే కంటి ఒత్తిడిని తగ్గించడమే దీనికి ప్రధాన చికిత్స. దీర్ఘకాలిక నియంత్రణ ఇచ్చే కంటి చుక్కల మందు, మాత్రల వాడకం చాలా ముఖ్యం. కొన్ని సందర్భాల్లో శస్త్ర చికిత్స కూడా చేయవలసి వస్తుంది. క్రమం తప్పకుండా నేత్ర పరీక్షలు చేయించుకోవాలి. గ్లకోమాను ముందుగా గుర్తిస్తే వైద్యం ద్వారా కళ్లను కాపాడుకోవచ్చు. జిల్లా అంతటా ప్రత్యేక గ్లకోమా అవగాహన సదస్సులు, ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తాం. – నగేష్ రెడ్డి, కంటి వెలుగు నేత్ర వైద్యాధికారి, పార్వతీపురం ● -
ముందుచూపు తప్పనిసరి
గ్లకోమా నివారణకు చర్యలు.. ● గ్లకోమా వ్యాధి కుటుంబ చరిత్ర కలవారు ముప్పై సంవత్సరాల వయసు నుంచే సమగ్ర నేత్ర పరీక్షలు(దృష్టి పరీక్ష, కంటిలో ఒత్తిడి, ఫంగస్ ద్వారా రెటీనా పరీక్షలు, క్షేత్ర దృష్టి పరీక్షలు) చేయించుకోవాలి. ● 40 సంవత్సరాలు వయసు దాటిన తరువాత క్రమం తప్పకుండా రెండేళ్లకు ఒకసారి సమగ్రంగా నేత్ర పరీక్షలు చేయించుకోవాలి. ● వైద్యుల సలహా మేరకు మాత్రమే స్టెరాయిడ్ మందులు లేదా కంటి చుక్కల మందు వాడాలి. ● కంటి గాయాలను నిర్లక్ష్యం చేయకుండా నేత్ర నిపుణుల పర్యవేక్షణలో చికిత్స పొందాలి. ● గ్లకోమా వ్యాధి నిర్ధారణ జరిగినప్పుడు నేత్ర నిపుణుల సలహా, సూచనల ప్రకారం నేత్ర పరీక్షలు చేసుకోవడం, మందులు వాడడం చేయాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా శాశ్వత అంధత్వం వస్తుంది.సాధారణంగా ప్రారంభదశలో ఎటువంటి లక్షణాలు కనిపించవు. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా చాపకింద నీరులా ఈ వ్యాధి వ్యాప్తి చెంది శాశ్వత అంధత్వానికి దారితీస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా మార్చి 9 నుంచి 15 వరకు ప్రపంచ గ్లకోమా వారోత్సవాలు జిల్లా అంధత్వ నివారణ సంస్థ నిర్వహిస్తుంటుంది. ఈ ఏడాది ‘గ్లకోమా రహిత ప్రపంచం కోసం ఐక్యమవుదాం’ అనే నినాదంతో కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. తద్వారా ఈ వ్యాధి వల్ల సంక్రమించే అంధత్వాన్ని నివారించవచ్చు.● -
● వేతనాలు పెంచాలని డిమాండ్
ఆశ కార్యకర్తల ఆందోళన రాయగడ: ఆశ కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంతో పాటు వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ఆశ కార్యకర్తల మహాసంఘం ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా ఆశ కార్యకర్తల సంఘం సొమవారం ఆందోళన చేపట్టింది. ఆ సంఘం జిల్లా శాఖ అధ్యక్షురాలు తమలా సాహుకార్, కార్యదర్శి గీతాంజలి హియాల్ నేతృత్వంలో జరిగిన ఆందోళనలో భాగంగా స్థానిక సమితి కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా వచ్చిన ఆశ కార్యకర్తలు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం డిప్యూటీ కలెక్టర్ నారాయణ మిశ్రోకు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆశ కార్యకర్తల సంక్షేమం కోసం తగురీతిలో స్పందించాలని వినతిపత్రంలొ పేర్కొన్నారు. ఆశ కార్యకర్తలకు భారతీయ మజ్దూర్ సంఘం నాయకులు జోగేశ్వర్ దాస్ తదితరులు మద్దతు ప్రకటించారు. -
ధారపర్తిని దగా చేసిందెవరు..?
శృంగవరపుకోట: అభంశుభం తెలియని గిరిజన తల్లుల గర్భశోకం..ఎవరి పాపం. తీవ్రమైన జ్వరాలు, వంటిపై దద్దుర్లుతో ఆస్పత్రి పాలైన చిన్నారుల తల్లుల శోకానికి, పాపానికి కారణం ఎవరన్న విషయమై వైద్యాధికారులు ఇంతవరకూ చెప్పలేదు. ఎస్.కోట మండలంలోని ధారపర్తి పంచాయతీ గిరిశిఖర గ్రామాల్లోని చిన్నారులు ఇటీవల తీవ్రజ్వరం, దద్దుర్లుతో ప్రాణాపాయ స్థితిలో స్థానిక ఏరియా ఆస్పత్రిలో చేరారు. ఏరియా ఆస్పత్రి వైద్యులు పరిస్థితిని చక్కదిద్దినా, డబ్ల్యూహెచ్ఓ సపోర్టింగ్ టీమ్ సభ్యుడు చెనగపాడు గ్రామంలో పర్యటించి ఇచ్చిన రిపోర్టుతో తీగలాగితే డొంక కదిలినట్లు, వైద్యసిబ్బంది కట్టు కథ బయటికొచ్చింది. పిల్లల్లో తట్టు, పొంగు వ్యాధుల నివారణకు ఇచ్చే ఎంఆర్ వ్యాక్సిన్ సకాలంలో ఇవ్వక పోవడం వల్లనే జ్వరాలు, దద్దుర్లు వచ్చాయని, ఇవి తట్టు లక్షణాలేనన్న నిజం బయటకు వచ్చింది. దీంతో గత వారం రోజులుగా వైద్యారోగ్యశాఖ అధికారులు, క్షేత్రసిబ్బంది కొండపైకి పరుగులు తీస్తూ, ఈ వ్యవహారం నుంచి బయట పడేందుకు మల్లగుల్లాలు పడుతున్నారు. ఎంసీపీ కార్డులు మాయం చేసి, ఎంఆర్ వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా కనిపించిన వారందరికీ వ్యాక్సిన్లు వేస్తున్నారు. ఇంతవరకూ వైరాలజీ ల్యాబ్ రిపోర్టులు ఏం చెప్పాయో తేల్చలేదు. దారపర్తి ఘటనపై విచారణకు ఆదేశించలేదు. దారపర్తిలో జ్వరాలకు కారకులైన క్షేత్రస్థాయి సిబ్బందిపై ఇంతవరకూ చర్యలు తీసుకోలేదు. ఇంతవరకూ 18మంది చిన్నారులు జ్వరం, దద్దుర్లతో ఎస్.కోట ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందారు. మరో 14మంది చిన్నారుల శాంపిల్స్ వైరాలజీ ల్యాబ్‌కు పంపారు. కాగా శాంపిల్ రిపోర్టులు బయట పెట్టలేదు. మరో 12మంది చిన్నారులు జ్వరాలు తదితర సమస్యలతో చికిత్స తీసుకున్నారు. చర్యల కోసం డిమాండ్ పిల్లలకు వ్యాక్సిన్ వేయకుండా వారి ప్రాణాలతో చెలగాటం అడుతున్న క్షేత్రస్థాయి వైద్యసిబ్బందిపై కలెక్టర్ తక్షణం చర్యలు తీసుకోవాలని ఏపీ గిరిజన సంఘ నేతలు డిమాండ్ చేశారు. అంతరించిందనుకున్న తట్టు వ్యాధి వైద్యసిబ్బంది నిర్లక్ష్యంతో తిరిగి పురుడు పోసుకోవడం ప్రభుత్వానికే సిగ్గు చేటని మండిపడ్డారు. గతంలో చిన్నారులు చనిపోతే కనీస విచారణ లేకుండా జిల్లా అధికారులు చేతులు తుడిచేసుకున్నారని ధ్వజమెత్తారు. వైద్యాధికారులు వదిలేసినా, తాము ఈ విషయాన్ని వదిలిపెట్టబోమన్నారు. ఈ వ్యవహారంలో జిల్లా అధికారుల నుంచి ఫీల్డ్‌స్టాఫ్ వరకూ అందరూ భాగస్వాములేనని మండిపడ్డారు. ల్యాబ్ రిపోర్టులు ఎక్కడ..? బాధ్యులపై చర్యలకు గిరిజన సంఘం డిమాండ్ -
అంబులెన్స్‌ను ఢీకొట్టిన గూడ్స్ రైలు
రాయగడ: చికిత్స కోసం రోగులను తీసుకెళ్తున్న అంబులెన్స్ ప్రమాదానికి గురైంది. కొరాపుట్–రాయగడ రైల్ మార్గంలో భళుమస్క, సికరపాయి రైల్వేస్టేషన్ మధ్య అంబులెన్స్‌ను కొరాపుట్ నుంచి వస్తున్న గూడ్స్ రైలు సోమవారం ఢీకొంది. అయితే గూడ్స్ డ్రైవర్ సమయస్ఫూర్తిగా వ్యవహరించి బ్రేకు వేయడంలో అంబెలెన్స్లోని రోగులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా బయటపడ్డారు. అయితే అంబులెన్స్ మాత్రం నుజ్జునుజ్జయ్యింది. వివరాల్లోకి వెళితే.. అనంత ఐ ఆస్పత్రికి చెందిన అంబులెన్స్ కళ్యాణసింగుపూర్ సమితి సికిరపాయి పంచాయతీలోని కానిపాయి, కంచోమోజురి, జుకుడు, బెతలొంక తదితర గ్రామాలకు చెందిన ఎనిమిది మంది రోగులను కంటి ఆపరేషన్ల కోసం సికరపాయికి అంబులెన్స్‌లో తీసుకువస్తున్న సమయంలో భళుమస్క, సికరపాయి మార్గం మధ్య లెవెల్ క్రాసింగ్ దాటుతుండగా హఠాత్తుగా గూడ్స్ రైలు ఢీకొంది. సుమారు వంద మీటర్ల వరకు ఆంబులెన్స్‌ను ఈడ్చుకుంటూ పోయింది. అయితే ఎనిమిది మంది రోగులతో పాటు డ్రైవరు, ఆశ కార్యకర్తలతో కలిసి మొత్తం పది మంది ప్రాణాలతో బయటపడగలిగారు. సమాచారం తెలుసుకున్న డీఆర్ఎం అమితాబ్ సింఘాల్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. భళుమస్క, సికరపాయి మధ్య ప్రజల రాకపొకలకు సంబంధించి మధ్యలో ఉన్న రైలు క్రాసింగ్‌ను దాటుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి. ఈ ప్రాంతంలో అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మించాలని ఎప్పటి నుంచో గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. సురక్షితంగా బయటపడిన రోగులు తప్పిన పెను ప్రమాదం -
పరారీలో ఉన్న నిందితుడి అరెస్టు
శృంగవరపుకోట: గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితుడిగా ఉండి పోలీసులు కళ్లు గప్పి తిరుగుతున్న గంజాయి స్మగ్లర్‌ను సోమవారం ఉదయం అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్లు ఎస్.కోట సీఐ వి.నారాయణమూర్తి చెప్పారు. 2023లో హోండాసిటీ కారులో 60కిలోల గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన కేసులో అనంతగిరి మండలం, డుంబ్రి గూడ గ్రామానికి చెందిన కె.శ్యామ్ ప్రధాన నిందితుడన్నారు. గతంలో చాకచక్యంగా తప్పించుకుని పరా రై తిరుగుతున్న శ్యామ్‌ను సోమవారం తమకు అందిన సమాచారంతో నిఘా వేసి స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు సీఐ చెప్పారు. -
ఇంటర్మీడియట్ ‘ద్వితీయ’ పరీక్షకు 372మంది గైర్హాజరు
పార్వతీపురంటౌన్: పార్వతీపురం మన్యం జిల్లాలో సోమవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షకు 372మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీవీఈఓ మంజులవీణా తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా 34 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించామని 7,880 మందికి గాను 7508 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. అందులో జనరల్ సబ్జెక్టు జువాలజీ–2 పరీక్షకు 4954 మంది హాజరు కావాల్సి ఉండగా 4812 మంది విద్యార్థులు హాజరయ్యారని పేర్కొన్నారు. ఒకేషనల్–2 పరీక్షకు 2926మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 2696 మంది హాజరయ్యారని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘనలు కాని, మాస్కాపీయింగ్గాని జరగకుండా చర్యలు చేపట్టామన్నారు. ఫ్లయింగ్, సిటింగ్ స్క్వాడ్లు, బల్క్ మెంబర్లు పరీక్షలను పర్యవేక్షించారని, పరీక్షలు సీసీ కెమెరా లైవ్ స్ట్రీమింగ్ ప్రత్యేక పర్యవేక్షణలో నిర్వహించినట్లు వివరించారు. కరాటేలో రెండు గోల్డ్ మెడల్స్సీతంపేట: ఈనెల 9న విజయనగరంలోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన అంతర్ జిల్లా స్థాయి కరాటే పోటీల్లో సీతంపేట మండలంలోని అచ్చిబ గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు గోల్డ్‌మెడల్స్ సాధించారు. గ్రామానికి చెందిన కె.దీపక్, ఎన్.హర్షలు బంగారు పతకాలు సాధించడంతో గ్రామస్తులు వారిని సోమవారం అభినందించారు. కారును ఢీ కొన్న లారీ●● కారు డ్రైవర్ మృతి ● మరో ఇద్దరికి గాయాలు గరుగుబిల్లి: పార్వతీపురం–పాలకొండ ప్రధాన రహదారిలో సుంకి జంక్షన్ వద్ద పార్వతీపురం నుంచి గుమ్మలక్ష్మీపురం వెళ్తున్న కారును ఖడ్గవలస నుంచి పార్వతీపురం వెళ్తున్న కర్రలలోడ్తో ఉన్న లారీ బలంగా ఢీ కొట్టడంతో జరిగిన ప్రమాదంలో కారు ముందుబాగం నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో కారు డ్రైవర్ కుండింగి హరి ప్రసాద్ (29) కారులో తన సీటు, స్టీరింగ్ మధ్య ఇరుక్కోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే కారులో ఉన్న లవాల గౌరీశంకర్, బిడ్డిక శ్రీనులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ మేరకు 108కు సమాచారం అందించగా ఘటనా స్థలానికి హుటాహుటిన వచ్చి క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి చికిత్సకోసం తరలించింది. సమాచారం మేరకు ఎస్సై పి.రమేష్‌నాయుడు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుని కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. -
సమస్యల పరిష్కారంలో జాప్యం తగదు
● పీజీఆర్ఎస్కు 136 వినతులుపార్వతీపురంటౌన్: పీజీఆర్ఎస్ ద్వారా అందిన వినతులపై అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారం ఉండాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ఆయన కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో 136 మంది అర్జీదారుల నుంచి వినతులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలు త్వరితగతిన పరిష్కారం కావాలని కోరారు. అర్జీదారుల విజ్ఞప్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పారదర్శకంగా విచారణ చేపట్టి అర్జీదారులను న్యాయం చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. దిగువస్థాయి అధికారులను పంపి మొక్కుబడిగా పరిష్కారం చేస్తే ఉపేక్షించమని హెచ్చరించారు. పీజీఆర్ఎస్లో అందిన వినతుల్లో కొన్ని.. ● పాచిపెంట మండలం కీరంగి నుంచి గ్రామ సర్పంచ్ లచ్చయ్య అర్జీని అందిస్తూ తమ మండల పరిధిలో చెక్‌డ్యామ్‌లు పాడైనందున వ్యవసాయానికి సాగునీరు అందడం లేదని చెక్‌డ్యాంలు మరమ్మతులు చేపట్టాలని కోరారు. ● పాలకొండ మండలం వాటపాగు నుంచి ఆర్.దుర్గాప్రసాదరావు దరఖాస్తులు అందిస్తూ తమ గ్రామంలో సర్వే నంబర్ 42–37లో తన వాటాగా సంక్రమించిన భూమిలోని ఐదు సెంట్లు జి. గౌరునాయుడు కబ్జా చేశారని తనకు న్యాయం చేయాలని కోరాడు. ● సాలూరు మండలం పెద్దవలస గ్రామానికి చెందిన కె.బంగార్రాజు తమ గ్రామంలో తన భూమి అన్యాక్రాంతమైందని, న్యాయం చేయాలని కోరాడు. ● జియ్యమ్మవలస మండలం చినమేరంగి గ్రామానికి చెందిన సాయిగీత వ్యవసాయ డిప్లమో చేసి ఖాళీగా ఉన్నానని తనకు ఉద్యోగం ఇప్పించాలని కోరింది. కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాత్సవ, ఇన్చార్జ్ జేసీ హేమలత, ఎస్డీసీ పి. ధర్మచంద్రారెడ్డి, జిల్లా వ్యవసాయశాఖాధికారి రాబర్ట్‌పాల్, పశుసంవర్ధకశాఖాధికారి మన్మథరావు, డ్వామాపీడీ కె.రామచంద్రరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సకాలంలో సమస్యల పరిష్కారానికి చర్యలు పార్వతీపురం రూరల్: సకాలంలో ఫిర్యాదు దారుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుని ప్రజలతో జవాబుదారీగా వ్యవహరించాలని పోలీస్ అధికారులను ఎస్పీ మాధవ్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి నిర్వహించారు. ఈ పరిష్కార వేదికకు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదు దారుల నుంచి అర్జీలను స్వీకరించి నేరుగా ఎస్పీ వారితో మాట్లాడుతూ సమస్యలను అడిగి తెలుసుకుని క్షుణ్ణంగా పరిశీలించారు. కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, తల్లిదండ్రుల వేదింపులు, భర్త/అత్తారింటి వేదింపులు, భూ–ఆస్తి వివాదాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీలు, ఆన్లైన్ మోసాలు, ప్రేమపేరుతో వంచన వంటి పలు సమస్యలపై ఫిర్యాదు దారులు ఎస్పీకి విన్నవించారు. వారి సమస్యలపై సంబంధిత పోలీసు అధికారులతో ఎస్పీ స్వయంగా ఫోన్లో మాట్లాడి ఫిర్యాదు అంశాలను పరిశీలించి వాటి పూర్వాపరాలపై విచారణ చేసి ఫిర్యాదులు వాస్తవాలు అయినట్లైతే చట్టపరమైన చర్యలు తక్షణమే చేపట్టాలని ఆదేశించారు. ఐటీడీఏ గ్రీవెన్స్ సెల్‌కు 61 వినతులు సీతంపేట: ఐటీడీఏ కార్యాలయంలో పీఓ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 61 వినతులు వచ్చాయి. ఈతమానుగూడ గ్రామానికి చెందిన ఎస్.సింహాచలం వైద్యశాఖలో ఉద్యోగం ఇప్పించాలని కోరారు. ఎర్రకువ్వారి గ్రామానికి చెందిన త్రినాథ్ అడ్వెంచర్ పార్కులో షాపుపెట్టుకోవడానికి అనుమతి ఇప్పించాలని విన్నవించాడు. కుశిమి గ్రామస్తుడు నిమ్మక వరహాలు గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ గ్రామంలో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశాడు. డెప్పిగూడ గ్రామస్తురాలు నిమ్మక కల్యాణి కమ్యూనిటీ హెల్త్ వర్కర్ జాబ్ ఇప్పించాలని వినతిపత్రం అందజేసింది. కార్యక్రమంలో ఈఈ రమాదేవి, పీహెచ్‌వో ఎస్వీ గణేష్, డిప్యూటీ ఈవో ప్రసన్నకుమార్, పశుసంవర్థకశాఖ ఎ.డి శ్రీనివాసరావు, సీడీపీఓ రంగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ శ్రేణుల ధర్నా
పర్లాకిమిడి: గత ఎనిమిది నెలల్లో రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, గ్యాంగ్ రేప్‌లు, రెసిడెన్సియల్ పాఠశాలల్లో విద్యార్థినులపై అఘాయిత్యాలు జరుపుతున్నా సీఎం మోహన్ చరణ్ మఝి, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మోహన ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షులు దాశరథి గోమాంగో ఆరోపించారు. మహిళపై నేరాలు చేస్తున్న వారిపై పోలీసు అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ స్థానిక కాంగ్రెస్ భవన్ నుంచి కలెక్టరేట్ వరకూ కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ రాష్ట్ర అబ్జర్వర్ దుర్గా పండా, మానస చౌదురి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బసంత పండా, మోహన కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రతినిధి కున్నా మఝి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ర్యాలీ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని అక్కడ కాంగ్రెస్ శ్రేణులు ధర్నా చేశాయి. గత ఎనిమిది మాసాలుగా 1600 మంది ఎస్సీ, ఎస్టీ, దళిత నారీమణులపై నేరాలు జరుగుతున్నా రాష్ట్ర హోం శాఖ పట్టించుకోవడం లేదని, అలాగే గజపతి జిల్లాలో పర్లాకిమిడి అన్వేషా ఎస్సీ, ఎస్టీ బాలికల హాస్టల్లో గిరిజన విద్యార్థిని వేధించిన సూపరింటెండెంట్‌ను బదిలీ చేశారని కానీ అరెస్టు చేయలేదని మోహన ఎమ్మెల్యే దాశరథి గోమాంగో ఆరోపించారు. ఢెంకనాల్‌లో ఏడుగురు ఒక వివాహితపై గ్యాంగ్ రేప్ చేశారని, బర్ఘడ్లో ధనుయాత్రలో ఒక అమ్మాయిపై నాలుగురోజుల పాటు గ్యాంగ్ రేప్ చేశారని అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలలో ఈ అంశంపై విపక్ష కాంగ్రెస్ నాయకులు ప్రశ్నలు లేవనెత్తనున్నారని ఎమ్మెల్యే దాశరథి గోమాంగో అన్నారు. అనంతరం జిల్లా అదనపు మేజిస్ట్రేట్ రాజేంద్ర మింజ్‌కు గవర్నర్‌కు అడ్రస్ చేస్తూ రాసిన వినతిని అందజేశారు. కాంగ్రెస్ ర్యాలీలో మోహన, నువాగడ, ఆర్.ఉదయగిరి, రాయఘడ, మహేంద్రగడ, గుమ్మా నుంచి అధిక కాంగ్రెస్ మహిళా శ్రేణులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు
రాయగడ: జేకేపూర్‌లోని కళ్యాణ వేంకటేశ్వర మందిర 49వ వార్షికోత్సవంతో పాటు స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సొమవారం మందిరం ప్రాంగణంలో లక్ష తులసీ దళ అర్చన పూజలు శ్రీనివాసాచార్యుల బృందంచే అత్యంత ఘనంగా జరిగాయి. అధిక సంఖ్యలో మహిళలు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు స్వామివారిని ప్రత్యేకంగా పూలతో అలంకరించారు. స్వామి వారికి విశేష పూజలతో పాటు శ్రీరామ స్తూపానికి ప్రత్యేక పంచామృత అభిషేకాలు నిర్వహించారు. ఈ నెల 13వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయని ఆలయ కమిటీ అధ్యక్షులు పట్నాన గౌరి శంకరరావు తెలిపారు. ● వైభవంగా లక్ష తులసీ దళ అర్చన పూజలు -
పర్లాకిమిడిలో డోలోత్సవాలు ప్రారంభం
పర్లాకిమిడి: స్థానిక డోలా ట్యాంకు రోడ్డులో డోలా ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. శ్రీజగన్నాథ మందిర ప్రాంగణంలో ఉన్న రామస్వామి మందిరం నుంచి రాధాకృష్ణుల ఉత్సవ విగ్రహాలను పల్లకీపై మోసుకు వచ్చి గజపతి ప్యాలెస్‌లోకి తీసుకెళ్లారు. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం కోటలో మహారాజా బ్రాహ్మణులు విచ్చేసి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. అనంతరం అనేక పురవీధులలో రాధాకృష్ణుల ఉత్సవ విగ్రహాల పల్లకిని మోసుకువెళుతూ పోగో (రంగులు) జల్లారు. పర్లాకిమిడి సముటియా వీధి సంకీర్తన మండళి, కె.సీతాపుచం, సుందరాడ, యువరాజపురం, జాజిపురం గ్రామాలనుండి ప్రభు శ్రీక్రిష్ణుని భక్తి భజనలు పాడుకుంటూ డోలా ట్యాంకు వద్దకు తీసుకువెళ్లారు. చివరికి డోలాట్యాంకు వద్ద ఉత్సవ మూర్తులను ఉంచి భక్తులు సమర్పించిన పువ్వులు, టెంకాయలు, ప్రసాదాలు స్వీకరించారు. డోలా ఉత్సవాలు ఈనెల 15 వరకూ డోలా ట్యాంకు వద్ద కోనసాగుతాయని డోలోచెరువు అభివృద్ధి కమిటీ సభ్యులు తెలియజేశారు. -
నేరాలపై మౌనమెందుకు..?: కాంగ్రెస్
భువనేశ్వర్: రాష్ట్రంలో నేరాలు పెరుగుతున్నాయి. ప్రధానంగా మహిళల భద్రత పెద్ద సమస్యగా తాండవిస్తుంది. మరో వైపు ప్రభుత్వం చోద్యం చూస్తోందని రాష్ట్ర కాంగ్రెస్ ఆరోపించింది. మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలు, ప్రభుత్వ ఉదాసీనతపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్ విమర్శించింది. శాసన సభ లోపల, బయట ఆందోళనలు నిర్వహించింది. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా ప్రధాన కార్యాలయాల ముట్టడి, గవర్నరుకు వినతి పత్రం సమర్పణ కార్యక్రమం విజయవంతంగా చేపట్టింది. రాష్ట్రంలో మహిళలతో పాటు బాలికలకు రక్షణ కొరవడింది. సోమవారం జరిగిన శాసన సభ బడ్జెట్ సమావేశాల్లో 2020 సంవత్సరం ఫిబ్రవరి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి మధ్య రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో 72 మంది విద్యార్థుల ఆత్మహత్య కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సోఫియా ఫిర్దౌస్ ప్రశ్నకు సమాధానంగా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ రాష్ట్ర అసెంబ్లీకి ఈ విషయాన్ని లిఖితపూర్వక సమాధానంలో తెలియజేశారు. శాసన సభో సమర్పించిన వివరాల ప్రకారం జనవరి నెలలో 111 హత్య కేసులు, 20 దోపిడీ కేసులు, 1,509 దొంగతనం కేసులు నమోదయ్యాయి. అదనంగా, 194 సైబర్ క్రైమ్ కేసులు, 655 దుష్ప్రవర్తన కేసులు కూడా నమోదయ్యాయి. ఈ గణాంకాలు రాష్ట్రంలో భద్రతా పరిస్థితి పట్ల తీవ్రమైన ఆందోళనలను లేవనెత్తాయి. -
3,738 మంది చొరబాటుదారులను గుర్తించాం: ముఖ్యమంత్రి
భువనేశ్వర్ : రాష్ట్ర వ్యాప్తంగా 3,738 మంది బంగ్లాదేశ్ జాతీయులను గుర్తించామని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి సోమవారం రాష్ట్ర శాసన సభలో తెలిపారు. వారిని బహిష్కరించే విషయం పరిశీలనలో ఉందన్నారు. రాష్ట్రంలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశ్ చొరబాటుదారులను గుర్తించి వారిని బహిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో తెలుసుకోవాలనుకున్న బీజేపీ ఎమ్మెల్యే మానస్ కుమార్ దత్తా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ముఖ్యమంత్రి ఈ సమాధానం ఇచ్చారు. మానస్ కుమార్ దత్తా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఒడిశా ప్రభుత్వం రాష్ట్రంలో నివసిస్తున్న 3,738 మంది బంగ్లాదేశ్ జాతీయులను గుర్తించిందని అనుబంధ గణాంకాలు ప్రవేశ పెట్టారు. బంగ్లాదేశీయ చొరబాటుదారులు అత్యధికంగా నాలుగు జిల్లాల్లో ఉన్నారు. ఈ జాబితా ప్రకారం కేంద్రాపడాలో అత్యధికంగా 1,649 మంది, జగత్సింగ్పూర్ ప్రాంతంలో 1,112 మంది, మల్కన్‌గిరిలో 655, మరియు నవరంగపూర్ ప్రాంతంలో 106 మంది ఉంటున్నారు. గత పదేళ్లలో రాష్ట్రంలో వివిధ క్రిమినల్ కేసుల్లో 41 మంది బంగ్లాదేశ్ జాతీయులు ఉన్నట్లు తేలిందని ముఖ్యమంత్రి తన సమాధానంలో సభకు తెలియజేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంట్లు (ఎస్పీలు) తమ తమ అధికార పరిధిలోని బంగ్లాదేశ్ చొరబాటుదారులను గుర్తించాలని ఆదేశించారు. మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య హిరమండలం: బంధువుల ఇంటికి వెళ్లి వస్తానని చెప్పిన భార్య, సమయానికి రాకపోవడంతో మండలంలో ధనుపురం గ్రామ సమీపంలోని తోటలో చెట్టుకు ఉరేసుకొని గొర్లె కన్నారావు (34) అనే వ్యక్తి ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పొందూరుకు చెందిన కన్నారావు దంపతులు ఊరూరా గాడిద పాలు అమ్ముకొని జీవనం సాగిస్తుంటారు. ధనుపురం స్పైసీ దాబా సమీపంలోని ఖాళీ గదుల్లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే కొన్నిరోజులుగా దంపతుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల అతడి భార్య ఆమె చెల్లెలు ఉన్న కవిటి గ్రామానికి వెళ్లింది. ఆదివారం తిరిగి వస్తానని చెప్పి రాలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కన్నారావు చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు తల్లి జి.సీతమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఎండీ యాసిన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాతపట్నం సీహెచ్‌సీకి తరలించారు. మృతుడికి భార్య, ఎనిమిదేళ్ల పాప, ఆరేళ్ల బాబు ఉన్నారు. -
ప్రజా ప్రతినిధులపై క్రిమినల్ కేసులు: ముఖేష్ మహాలింగ్
భువనేశ్వర్: రాష్ట్రంలో ప్రస్తుత, మాజీ ప్రజా ప్రతినిధులపై పలు కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు పూర్తి వివరాలు సోమవారం జరిగిన సభలో ప్రవేశ పెట్టారు. విపక్ష ఉప నేత ప్రసన్న ఆచార్య అడిగిన ప్రశ్నకు శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి ముఖేష్ మహాలింగ్ శాసన సభ బడ్జెటు సమావేశాల్లో ఈ వివరాలు ప్రవేశ పెట్టారు. దీని ప్రకారం.. మాజీ, ప్రస్తుత ఎంపీలపై 22 సాధారణ కేసులు, 39 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మాజీ, సిట్టింగ్ ఎమ్మెల్యేలు 115 కేసులను ఎదుర్కొంటున్నారు. వారిపై 418 క్రిమినల్ కేసులు నమోదైనట్లు మంత్రి సభలో వివరాలు ప్రవేశ పెట్టారు. వీటిలో 384 కేసులు ప్రస్తుతం విచారణలో ఉన్నాయి. 14 కేసులలో విచారణ పూర్తయింది. మరో 43 కేసులకు సంబంధించి దర్యాప్తు జరుగుతోంది. ఈ కేసుల్లో 198 కేసులు పూర్తిగా రాజకీయ స్వభావం కలిగినవిగా గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తి మృతి జయపురం: జయపురం రైల్వే స్టేషన్లో స్పృహలేకుండా పడి ఉన్న అపరిచిత వ్యక్తిని ఆస్పత్రిలో చేర్పించారు. అయితే అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు నిర్ధారించారని జయపురం సదర్ పోలీసు అధికారి సచీంద్ర ప్రధాన్ సోమవారం వెల్లడించారు. జయపురం సదర్ పోలీసు స్టేషన్ పరిధి గగణాపూర్ పోలీసు పంటి పరిధిలోని రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఒక వ్యక్తి స్పృహలేకుండా పడి ఉన్నట్లు, కున నాయిక్ అనే వ్యక్తి ఫోన్ ద్వారా తెలియజేశారన్నారు. పోలీసులు వెళ్లి అతన్ని జయపురం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చేర్చారని అయితే అప్పటికే ఆ వ్యక్తి మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారని పోలీసు అధికారి జచీంద్ర ప్రధాన్ వెల్లడించారు. కేసు నమోదు చేసి మృత దేహాన్ని జిల్లా కేంద్ర ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచామన్నారు. గుణుపూర్‌లో 40 వినతుల స్వీకరణ రాయగడ: జిల్లాలోని గుణుపూర్ సద్భావన సమావేశం హాల్లో జిల్లా అదనపు కలెక్టర్ నిహారి రంజన్ కుహోరో ఆధ్వర్యంలో సొమవారం వినతుల స్వీకరణ కార్యక్రమం జరిగింది. గుణుపూర్ పరిసర ప్రాంతాలకు చెందిన 40 వినతులను అధికారులు స్వీకరించారు. వీటిలో 27 వ్యక్తిగతమైనవి కాగా 13 గ్రామ సమస్యలుగా గుర్తించారు. జిల్లా ఎస్పీ శ్వాతి ఎస్ కుమార్, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. వ్యక్తి ఆత్మహత్య పర్లాకిమిడి: Ý린MýS Hyø ÐéÆý‡$z VýS…VýS$-Ë$ÐéÇ Ò«¨MìS ^ðl…¨¯]l Vøí³ »ñæàÆ> (40) EÇÐólçÜ$Mö° B™èlÃ-çßæ-™èlÅMýS$ ´ëÌSµ-yézyýl$. B¨-ÐéÆý‡… Æ>{† Hyýl$ VýS…rÌS çÜÐ]l$Ķæ$…ÌZ C…sìæ-ిMìS ™èlÍÏ-Æ>-V>.. MýS$Ð]l*Æý‡$yýl$ Vøí³ »ñæàÆ> EÇ-Ðól-çÜ$-Mö° ÐólÌê-yýl$™èl* E…yýl-sê°² VýSÐ]l$-°…-_…-¨. ©…™ø D ÑçÙ-Ķæ$OÐðl$ MýS$Ð]l*È »ñæàÆ> ÝùÐ]l$ÐéÆý‡… E§ýlĶæ$… ™èlÐ]l$MýS$ íœÆ>ŧýl$ ^ólíܯ]lr$t B§ýlÆý‡Ø ´ù΋Ü-õÜt-çÙ¯ŒS íܺ¾…¨ ™ðlÍ´ëÆý‡$. ´ùÎçÜ$ õÜtçÙ¯ŒS IIïÜ {ç³Ô>…™Œæ ¿¶æ*糆 B§ól-Ô>ÌS Ðól$Æý‡MýS$ GOòÜÞ Mú†M> Ôðæv MóSçÜ$ ¯]lÐðl*§ýl$ ^ólÔ>Æý‡$. Vøí³ »ñæàÆ> Ð]l$–™èl-§ólà°² ´ùçÜ$t-Ð]l*Æý‡t… °Ñ$™èl¢… Ý린MýS {糿¶æ$™èlÓ Bçܵ-{†MìS ™èlÆý‡-Í…-_¯]lr$t IIïÜ {ç³Ô>…™Œæ ¿¶æ*糆 ™ðlÍ-´ëÆý‡$. -
హాస్టల్ నిర్వాహకులపై చర్యకు డిమాండ్
రాయగడ: జిల్లాలోని గుణుపూర్ తహసీల్దార్ కార్యాలయానికి సమీపంలోని అన్వేష హాస్టల్లో చదువుతున్న విద్యార్థిపై తోటి విద్యార్థుల దాడి ఘటనకు సంబంధించి దర్యాప్తు చేసేందుకు ఆదివారం సాయంత్రం వెళ్లిన జిల్లా సంక్షేమ శాఖ అధికారి అసీమా రావ్‌ను విద్యార్థుల తల్లిదండ్రులు ఘెరావ్ చేశారు. హాస్టల్ నిర్వాహకులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుదూర గ్రామాల నుంచి తమ పిల్లలను చదువుకునేందుకు హాస్టల్‌కు పంపిస్తున్నామని అయితే ఇటువంటి తరహా ఘటనలు చోటు చేసుకుంటే తమ పిల్లల భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక విద్యార్థిపై ఇంతమంది మూకుమ్మడిగా దాడి చేస్తుంటే హాస్టల్ సూపరింటెండెంట్, వార్డన్ చొద్యం చూస్తున్నారా అని ప్రశ్నించారు. దాడికి పాల్పడిన విద్యార్థులను వేరే చోటకు తరలించాలని, సూపరింటెండెంట్, వార్డన్లపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారమయ్యే వరకు తమ పిల్లలను హాస్టల్‌కు పంపేది లేదని, అవసరమైతే సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని విద్యార్థుల తల్లిదండ్రులు అన్నారు. దీనికి విచారణాధికారి మాట్లాడుతూ.. నిజానిజాలు తెలుసుకున్న అనంతరం పూర్తి వివరాలతో నివేదికను జిల్లా కలెక్టర్‌కు సమర్పించి బాధ్యులపై తగు చర్యలు తీసుకునేలా తనవంతు సహకరిస్తానని జిల్లా సంక్షేమ శాఖ అధికారి రావ్ హామీ ఇచ్చారు. -
మృతి చెందిన కార్మిక కుటుంబాలను ఆదుకోవాలి
జయపురం: మృతి చెందిన కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని గగణాపూర్‌లోని సేవా పేపరుమిల్లు ప్రధాన గేటువద్ద విశ్రాంత కార్మికులు, మృత కార్మికుల కుటుంబ సభ్యులు సోమవారం ఆందోళన చేపట్టారు. సేవాపేపరుమిల్లు ప్రథమ యూనిన్ అధ్యక్షులు, ప్రముఖ కార్మిక నేత ప్రమోద్ మహంతి నేతృత్వంలో నిర్వహించిన ఆందోళనలో మృత కార్మికుల వితంతు మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిల్లు యూనిట్ హెడ్ ఎస్.ఎస్.పాల్‌కు వినతి పత్రాన్ని సమర్పించారు. కార్మిక నేత మహంతి మాట్లాడుతూ.. విధి నిర్వహణలో, ఉద్యోగ విమరణ తరువాత మరణించిన కార్మికుల కుటుంబాలకు చట్టపరంగా లభించాల్సిన బకాయిలు చెల్లించలేదని ఆరోపించారు. 2020 ఫిబ్రవరి 26వ తేదీన మిల్లును కొత్త కంపెనీకి అమ్మివేసిందని, మిల్లు నడిపేందుకు కార్మికులకు చెల్లించాల్సిన బకాయీలు చెల్లించేందుకు 2020 నుంచి 2023 మధ్యకాలంలో రూ. 200 కోట్లు అప్పుచేసిందన్నారు. అందులో పాత యజమాని రూ. 100 కోట్లు తీసుకున్నట్లు మహంతి వెల్లడించారు. బిజినెస్ ట్రాన్షపర్ అగ్రిమెంట్ ప్రకారం రూ. 15 కోట్లు చెల్లించేందుకు నిర్ణయించారని గుర్తు చేశారు. మరణించిన కార్మికులు మిల్లు కోసం శ్రమశక్తిని దారబోశారన్నారు. ఇప్పుడు యాజమాన్యం 75, 80 ఏళ్ల వయసు అధికారులకు లక్షలాది రూపాయలు ఇస్తుందని, వారికి గెస్ట్ హౌస్‌లు, ఉచిత భోజనం, వెహికల్ సమకూర్చుతోందన్నారు. అయితే మిల్లులో చెమటోడ్చి పనిచేసిన మృత కార్మిక కుంటుంబాలు దుర్భర జీతితం గడుపుతున్నా.. వారికి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించటం లేదని దుయ్యబట్టారు. చివరకు పీఎఫ్ డబ్బులను కూడా తీసుకోలేని పరిస్థితి ఉందన్నారు. దాదాపు 39 మంది విశ్రాంత కార్మికులతోపాటు మరికొంత మంది కంట్రాక్ట్ కార్మికులు మరణించడంతో వారి కుటుంబాలు దర్భర జీవితాన్ని అనుభవిస్తున్నాయన్నారు. ఇప్పటికై నా వారికి చెల్లించాల్చిన బకాయిలు చెల్లించి ఆదుకోవాలని కోరారు. -
పీజీఆర్ఎస్కు పోటెత్తిన అర్జీదారులు
విజయనగరం అర్బన్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు అర్జీదారులు పోటెత్తారు. ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత పునఃప్రారంభించిన ఈ కార్యక్రమానికి అధికసంఖ్యలో వినతులు అందాయి. కలెక్టర్ డాక్టర బీఆర్అంబేడ్కర్, ఇన్చార్జ్ జేసీ ఎస్.శ్రీనివాసమూర్తి, కేఆర్ఆర్సీ ఎస్డీసీ మురళి వినతులను స్వీకరించగా ఈ వారం మొత్తం 231 అర్జీలు వచ్చాయి. తప్పుగా ఎండార్స్మెంట్ ఇస్తే క్రమశిక్షణ చర్యలు పీజీఆర్ఎస్లో ప్రజల నుంచి అందిన వినతులకు ఏ విధమైన పరిష్కారం చూపిస్తున్నదీ సంబంధిత అర్జీదారుకు ఆయా ప్రభుత్వ శాఖలు తప్పనిసరిగా తెలియజేయాల్సి ఉంటుందని కలెక్టర్ డాక్టర్ బీఆర్ డాక్టర్ అంబేడ్కర్ అధికారులకు స్పష్టం చేశారు. వినతుల పరిష్కారంలో తప్పుగా ఎండార్స్మెంట్ ఇచ్చి పరిష్కరించినట్లు పేర్కొంటే ఆయా అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. ఇప్పటికే తప్పుగా ఎండార్స్మెంట్ ఇచ్చిన 33 మంది అధికారులకు మెమోలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఎస్పీ గ్రీవెన్స్ సెల్‌కు 37 ఫిర్యాదులు విజయనగరం క్రైమ్: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 37 ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు ఎస్పీ వకుల్ జిందల్ బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. స్వీకరించిన ఫిర్యాదుల్లో భూతగాదాలకు సంబంధించి 11, కుటుంబ కలహాలకు సంబంధించి 3, మోసాలకు పాల్పడినట్లు 10, ఇతర అంశాలకు సంబంధించి 13 ఫిర్యాదులు ఉన్నాయి. సంబంధిత అధికారులు ఫిర్యాదు అంశాలను పరిశీలించి, వాటి పూర్వాపరాలను విచారణ చేసి, ఫిర్యాదు అంశాలు వాస్తవమైనట్లయితే చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని సంబంధిత పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎస్బీ సీఐలు ఏవీ లీలారావు, ఆర్వీఆర్కే చౌదరి, డీసీఆర్బీ ఎస్సై రాజేష్, సిబ్బంది కృష్ణ, షణ్ముఖ్ తదితరులు పాల్గొన్నారు. వినతులను స్వీకరించిన కలెక్టర్ అంబేద్కర్ -
మాజీ మంత్రి అనంత దాస్ కన్నుమూత
భువనేశ్వర్: బాలాసోర్ జిల్లా భొగొరాయ్ మాజీ ఎమ్మెల్యే, మంత్రి అనంత దాస్ (85) కన్ను మూశారు. భువనేశ్వర్‌లో తన నివాసంలో ఆదివారం ఉదయం తుది శ్వాస విడిచారు. దీర్ఘకాలంగా వయో సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగానికి స్వస్తి పలికి 2004 సంవత్సరంలో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగిడారు. అది మొదలుకొని వరుసగా నాలుగు పర్యాయాలు బిజూ జనతా దళ్ అభ్యర్థిగా భొగొరాయ్ నియోజక వర్గం నుంచి రాష్ట్ర శాసన సభకు ప్రాతినిథ్యం వహించారు. తొలి సారి 2004 నుంచి 2009 వరకు ఎమ్మెల్యే, 2009 నుంచి 2014 వరకు శాసన సభ చీఫ్ విప్, 2014 నుంచి 2019 వరకు ఉన్నత విద్య మరియు పరిశ్రమల శాఖ మంత్రిగా కీలకమైన బాధ్యతల్ని విజయవంతంగా నిర్వహించారు. ఆయన 2019 నుంచి 2024 వరకు జిల్లా ప్రణాళిక బోర్డు చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. అనంత దాస్ ఆగస్టు 28, 1940న భొగొరాయ్ మండలం కురుఠియాలో జన్మించారు. మరణించే సమయానికి ఆయన వయస్సు 85 ఏళ్లు. అనంత దాస్ మరణంతో తన నియోజక వర్గం భొగొరాయ్ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
ఎస్టీఎఫ్ అదుపులో బంగ్లా దేశీయులు
భువనేశ్వర్: స్థానిక రైల్వే స్టేషన్లో తచ్చాడుతున్న బంగ్లా దేశీయుల్ని ప్రత్యేక టాస్కు ఫోర్సు ఎస్టీఎఫ్ అదుపులోకి తీసుకుంది. వీరిలో ఆ మంది మహిళలు, ఒక మైనర్‌తో సహా 10 మంది బంగ్లాదేశ్ జాతీయులు ఉన్నట్లు ఎస్టీఎఫ్ పేర్కొంది. వీరిని అక్రమ చొరబాటుదారులుగా భావిస్తున్నారు. వీరి రాకకు సంబంధించి పాస్‌పోర్ట్, వీసా లేదా ఇతరేతర చెల్లుబాటు అయ్యే ప్రయాణ పత్రాలు, ఆధారాలు లేకపోవడంతో ఈ సందిగ్ధత నెలకొంది. వీరి దగ్గర నుంచి 7 మొబైల్ ఫోన్లు, కొన్ని బంగ్లాదేశ్ కరెన్సీ నోట్లు, భారతీయ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. విచారణ కొనసాగుతుంది. -
విద్యార్థిపై దాడి
● దర్యాప్తు చేపట్టిన అధికారులురాయగడ: జిల్లాలోని గుణుపూర్ తహసీల్దార్ కార్యాలయం సమీపంలో గల వంద పడకల సామర్థ్యం గల అన్వేష హాస్టల్లో చదువుతున్న విద్యార్థిపై తోటి విద్యార్థులు దాడి చేసిన ఘటనకు సంబంధించి వీడియో వైరలైంది. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న వీడియోను చూసిన సంబంధిత శాఖ అధికారులు ఈ మేరకు దర్యాప్తు చేపట్టారు. హాస్టల్లో చదువుతున్న విద్యార్థుల సంరక్షణకు సంబంధించి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది నెలల క్రితం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో గల సంక్షేమ శాఖ పరిధిలో గల హాస్టళ్లల్లో చదువుతున్న కొంత మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడటం సంచలనం సృష్టించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి.. హాస్టళ్ల పనితీరు, తదితర అంశాలకు సంబంధించి వాస్తవాలను తెలియజేసేందుకు దర్యాప్తునకు కూడా ఆదేశించింది. తాజాగా జిల్లాలోని గుణుపూర్‌లో గల రాష్ట్ర సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్వేష హాస్టల్లో చదువుతున్న విద్యార్థిపై తోటి విద్యార్థులు దాడి చేసిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఒకటి నుంచి పదొ తరగతి వరకు చదుతున్న విద్యార్థుఽలు ఈ హాస్టల్లో ఉంటున్నారు. విద్యార్థిని తోటి విద్యార్థులు దాడి చేసి గాయపరిచారు. విద్యార్థి ఎంత మొరపెట్టుకున్నా ఒకరి తరువాత మరోకరు గాయపరుస్తూనే ఉన్నారు. కేకలు పెట్టినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. అనంతరం నిర్వాహకులు గాయాలకు గురైన విద్యార్థిని గుణుపూర్ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. గుట్టుచప్పుడు లేకుండా విద్యార్థిని చికిత్స చేయించిన అనంతరం తిరిగి హాస్టల్‌కు తరలించారు. శనివారం రాత్రి ఈ విషయమై వీడియో వైరల్ అవ్వడంతో అధికారులు దర్యాప్తు చేపట్టారు. -
ప్రకృతి సురక్ష పాదయాత్ర
జయపురం: ప్రకృతి పరిరక్షణపై ప్రజలకు అవగాహన కలిగించే ప్రధాన లక్ష్యంతో ప్రకృతి సురక్ష యాత్ర ప్రారంభించారు కొంతమంది గాంధేయ వాదులు. ప్రకృతి సురక్షా పాదయాత్ర అవిభక్త కొరాపుట్ మల్కన్‌గిరిలో గత నెల 28న ప్రారంభమైంది. చిత్తరంజన్ షొడంగి నేతృత్వంలో మల్కన్‌గిరి నుంచి ప్రారంభమైన యాత్ర శనివారం సాయంత్రం జయపురం చేరింది. ఈ పాద యాత్రలో రాయగడ జిల్లా బలరాం పండ, విశ్రాంత ఉపాద్యాయులు రవీంధ్ర నాథ్ అటోయి, ఒడిశా ఆరోగ్య సేవా సమితి ఉపాధ్యక్షుడు స్మృతి శేఖర సాహు, మహారాష్ట్ర నుంచి వచ్చిన నెహాల్ గాంధీ, జగదీష్ చండాల్, సందీప్ చాటే, సూర్య ప్రధాన్, పూరీ నీలకంఠ బేద్య, సంఘ సామాజిక కార్యకర్తలు కొరాపుట్, రాయగడ, మల్కనగిరి జిల్లాల నుంచి పలువురు పాల్గొన్నారు. ప్రతి దినం 15 కిలోమీటర్ల దూరం పాదయాత్ర జరుపుతూ 44 దినాలలో 670 కిటోమీటర్లు పాదయాత్ర నిర్వహించుకుంటూ ఏప్రిల్ 12న పూరీ చేరుకుంటామన్నారు. మహాత్మా గాంధీ ఆంగ్లేయ పాలకులకు వ్యతిరేకంగా ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించి 1930 ఏప్రిల్ 12 వ తేదీన గుజరాత్ దండీలో పూర్తి చేశారని గుర్తు చేశారు. ఈ యాత్రలో రాయగడ, మల్కన్‌గిరి సరిహద్దు రాష్ట్రాల నుంచి 25 మందికి పైగా పురుషులు, మహిళలు పాల్గొన్నారు. వీరు పూరీలో జరిగే మూడు దినాల జాతీయ స్థాయి సమ్మేళనంలో పాల్గొంటారు. -
జయపురంలో సత్య సాయి స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం
జయపురం: సత్య సాయిబాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా శ్రీసత్య సాయి సేవా ఆర్గనైజేషన్ ఒడిశా తరఫున 10 వ స్కిల్ డలప్మెంట్ కేంద్రాన్ని జయపురంలో ఆదివారం ప్రారంభించారు. శ్రీసత్య సాయి సేవా ఆర్గనైజేషన్ ఒడిశా అధ్యక్షుడు డాక్టర్ సత్య స్వరూప్ పట్నాయిక్ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహుళ ఆదివాసీ అవిభక్త కొరాపుట్‌లో విద్య, ఉద్యోగాలకు ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆ సమస్యలను గుర్తించి విద్యార్థుల్లో ఉన్న ప్రతిభకు పదును పెట్టేలా ఉచిత శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించామన్నారు. ఈ కేంద్రంలో విద్యార్థులకు కంప్యూటర్ విద్యా శిక్షణ, టైలరింగ్ శిక్షణ ఇస్తారన్నారు. మొదటి ఏడాది 18 మందికి కంప్యూటర్ శిక్షణ, 12 మందికి టైలరింగ్ శిక్షణ ఇస్తారని, సోమవారం నుంచి శిక్షణలు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో శ్రీసత్య సాయి సేవా సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు నాగభూషణం, కొరాపుట్ అధ్యక్షుడు మార్కండేయులు, శ్రీసత్య సాయి ట్రస్టు సభ్యలు సునీల్ మహంతి, రవి శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
సరిహద్దు గ్రామాల్లో చిరుత సంచారం
కొరాపుట్: సరిహద్దు ప్రాంతాల్లో చిరుత పులి సంచారం అందరినీ భయ బ్రాంతులకు గురి చేస్తోంది. ఆదివారం నబరంగ్‌పూర్ జిల్లా రాయిఘర్ సమితి పక్కనే ఉన్న రాష్ట్ర సరిహద్దు అవతల ఉన్న కాంకేర్ జిల్లా దుదుబా, మకిడి కానా గ్రామాల్లో చిరుత పులి సంచరించింది. సాయంత్రం అయ్యేసరికి గ్రామాల్లోకి వచ్చేస్తోంది. అటవీ శాఖ సిబ్బంది గ్రామాలలో పర్యటిస్తూ పులిని పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వారి ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. ఈ వార్తలు జిల్లాలో సరిహద్దు గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.పినాంగి పర్వత అడవిలో అగ్ని ప్రమాదం జయపురం: జయపురం విక్రమదేవ్ విశ్వవిద్యాలయం వెనుక వైపున ఉన్న పినాంగి రిజర్వ్ ఫారెస్ట్‌లో శనివారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. అటవీ విభాగానికి ఆలస్యంగా సమాచారం అందడంతో వారు వెళ్లి మంటలను ఆర్పారు. ఎవరో ఎండు ఆకులకు అగ్గి పెట్టి ఉంటారని, అందుచేత మంటలు విస్తరించి ఉంటాయని భావిస్తున్నారు. బెదిరింపు కేసులో నిందితుడి అరెస్టుజయపురం: జయపురం సదర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తిని బెదిరించి రూ.లక్ష డిమాండ్‌చేసిన నిందితుడిని జయపురం సదర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయం సదర్ పోలీసు అధికారి సచీంధ్ర ప్రదాన్ వెల్లడించారు. ఈ నెల 3 వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో జయపురం సమితి దుబులి గ్రామ వాసి కింకర్ సర్కార్(28) లిఖిత ఫిర్యాదు చేశారని ఆయన వెల్లడించారు. ఈ నెల 2వ తేదీ రాత్రి 8.45 గంటల సమయంలో డొంబుగుడ గ్రామం ఆటోడ్రైవర్ కృష్ణ టక్రి తన ఇంటికి వచ్చి ఒక లక్ష రూపాయలు డిమాండ్ చేశాడని, ఇవ్వనని చెబితే ఇళ్లు, భూములు ఖాళీ చేసి వెళ్లిపొమ్మని హెచ్చరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటల సమయంలో కృష్ణ టక్రి కొంత మంది అనుచరులతో కలసి సర్కార్ ఇంటికి వచ్చాడు. కత్తితో చంపుతానని బెదిరించి రూ.5వేలు తీసుకెళ్లిపోయాడని తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి కృష్ణ టక్రిని గుర్తించి అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అతడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచామని తెలిపారు. బైకు దొంగలు దొరికారు రాయగడ: జిల్లాలోని బిసంకటక్‌లో గల పలు ప్రాంతాల్లో చోరీకి గురైన 5 బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ముగ్గురుని అరెస్టు చేశారు. అరెస్టయిన వారు 15 ఏళ్ల లొపువారు కావడంతో వారిని భవానీపట్నంలో గల బాలల కారాగారానికి ఆదివారం తరలించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. శివరాత్రి రోజు బిసంకటక్ సమితిలో గల చాటికొన శైవక్షేత్రంలో శివుని దర్శనం కోసం వెళ్లిన హిమిరిక బైకు దొంగతనానికి గురైంది. దీనికి సంబంధించి బాధితుడు బిసంకటక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ మేరకు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా ఓ వ్యక్తిని రాయగడలో పట్టుకున్నారు. అనంతరం అతనిని బిసంకటక్ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించగా.. బైకు దొంగతనం చేసిన మరో ఇద్దరి వివరాలను పోలీసులకు చెప్పాడు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. -
వారసత్వ హోదా సన్నాహాలు
పూరీ రథయాత్రకు యునెస్కోఅటవీ శాఖ మహిళా గార్డులకు సత్కారంభువనేశ్వర్: పూరీ శ్రీ జగన్నాథ రథ యాత్రకు యునెస్కో ఇంటాంజిబుల్ సాంస్కృతిక వారసత్వ గుర్తింపు పొందేందుకు సన్నాహాలు ఊపందుకుంటున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు పూర్తి చేసినట్లు శ్రీ మందిరం ప్రధాన పాలన అధికారి సీఏఓ డాక్టరు అరవింద కుమార్ పాఢి తెలిపారు. రథ యాత్రకు యునెస్కో వారసత్వ హోదా కోసం పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందించేందుకు కేంద్ర సాంస్కృతిక శాఖ ఆసక్తి కనబరిచినట్లు ఆయన తెలిపారు. శ్రీ జగన్నాథ స్వామి వార్షిక రథ యాత్ర దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులను ఆకర్షించే ప్రపంచ ప్రఖ్యాత పూరీ రథ యాత్ర లేదా రథోత్సవంగా ప్రసిద్ధి. యునెస్కో ఇంటాంజిబుల్ సాంస్కృతిక వారసత్వ గుర్తింపు పొందే ప్రక్రియను శ్రీ జగన్నాథ ఆలయం పాలక వర్గం ఎస్జేటీఏ ప్రారంభించింది. ఈ గుర్తింపు కోసం త్వరలో నామినేషను దస్తావేజులు సమర్పించనున్నట్లు సీఏఓ వివరించారు. ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక శాఖ అధికారులతో ఈ విషయంపై చర్చించి వారి మద్దతు కోరారు. చర్చలు సానుకూలంగా జరిగాయని, సంబంధిత అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకుంటారని భావిస్తున్నారు. ఈ ప్రక్రియకు త్వరిత పరిష్కారం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ గౌరవనీయమైన హోదా పొందడం వల్ల రథ యాత్రకు వారసత్వ గౌరవం పరిరక్షించడంతో భారత దేశపు గొప్ప సాంస్కృతిక, మతపరమైన సంప్రదాయాల పట్ల ప్రపంచ వ్యాప్తంగా దృష్టిని ఆకట్టుకోవచ్చని ఎస్జేటీఏ భావిస్తుంది. పూరీ శ్రీ జగన్నాథ రథ యాత్ర (ఫైల్) -
సెలవు లేదన్న హెడ్మాస్టర్.. లెక్కల టీచర్ ఏం చేశారంటే?
భువనేశ్వర్: తీవ్ర అనారోగ్యం పాలైన ఓ ఉపాధ్యాయుడు సెలవు కోసం పెట్టుకున్న దరఖాస్తును ప్రధానోపాధ్యాయురాలు తిరస్కరించారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా సెలవివ్వడం కుదరదంటూ తెగేసి చెప్పారు. పాపం ఆ ఉపాధ్యాయుడు విధిలేక చేతికి ఐవీ డిప్ సెలైన్ పెట్టుకునే విధులకు హాజరయ్యారు. ఆయన ఆరోగ్యం విషమించడం చూసి తోటి వారే ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటన ఒడిశాలోని బొలంగీర్‌లో చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. బొలంగీర్ ప్రభుత్వ పాఠశాలలో విజయలక్ష్మి ప్రధాన్ హెడ్మాస్టర్ కాగా, ప్రకాశ్ భోయి గణితం టీచర్. ఇటీవల తన తాత అంత్యక్రియల కార్యక్రమానికి హాజరైన అనంతరం ప్రకాశ్ ఆరోగ్యం దెబ్బతింది. విధులకు హాజరు కాలేనందున, సెలవు ఇప్పించమంటూ ఆయన ప్రధానోపాధ్యాయినికి విజ్ఞప్తి చేశారు. పరీక్షల సమయం కాబట్టి, మ్యాథ్స్ టీచర్ అవసరం ఎంతో ఉంటుందని చెబుతూ ఆమె ఆ వినతిని తిరస్కరించారు.అయితే, ఎన్ని సార్లు కోరినా హెడ్మాస్టర్ వినిపించుకోకపోవడంతో ప్రకాశ్ భోయి చేతికి సెలైన్ పెట్టుకునే విధులకు వచ్చారు. ఆయన పరిస్థితి చూసి తోటి టీచర్లే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పటన్గఢ్ బ్లాక్ విద్యాధికారి(బీఈవో) ప్రసాద్ మాఝి స్పందించారు. కాజువల్ లీవ్ కోసం ప్రకాశ్ భోయి పంపించిన దరఖాస్తును ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మీ ప్రధాన్ ఎందుకు తిరస్కరించారనే విషయమై విచారణ చేపట్టామన్నారు. ఆమెదే తప్పని తేలితే చర్యలు తీసుకుంటామని చెప్పారు. #ମିଳିଲାନି_ଛୁଟି #ସାଲାଇନ୍_ଧରି_ସ୍କୁଲରେ_ଶିକ୍ଷକଦେହ ଖରାପ ସତ୍ତ୍ବେ ମିଳିଲାନି ଛୁଟି। ମାନିଲେନି ପ୍ରିନ୍ସିପାଲ୍, ଶିକ୍ଷକ ହେଲେ ଗୁରୁତର। ସାଲାଇନ୍ ଲଗାଇ ସ୍କୁଲ ଦୁଆରେ ଛାଡ଼ିଲେ ପରିବାର। ଦେଖନ୍ତୁ ଏ ଦୃଶ୍ୟକୁ, ସ୍କୁଲ ଦୁଆରେ ଛିଡ଼ା ହୋଇଛନ୍ତି ଶିକ୍ଷକ। #Teacher #Leave #Saline #Controversy #Balangir #OTV pic.twitter.com/tlnV7Sxlvj— ଓଟିଭି (@otvkhabar) March 8, 2025 -
సందడిగా సుభద్రాయోజన కార్యక్రమం
● తరలివచ్చిన మహిళలు మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా యంత్రగం ఆధ్వర్యంలో మాల్యవంత్ హాస్టల్ ప్రాంగణంలో శనివారం సుభద్రా యోజన రెండో విడత మంజూరు కార్యక్రమాన్ని నిర్వహించారు. బరంపురంలో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ప్రారంచగా.. అదే సమయంలో మల్కన్‌గిరిలో స్థానిక ఎమ్మెల్యే నర్సింగ్ మడ్కమి ప్రారంభించారు. ఈ పథకం కోసం ఇప్పటికే 1,49,153 మంది మహిళలు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అందులో 1,34,610 మందికి ఆర్థికసాయం చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా రెండో విడత నిధులు విడుదల చేసినట్టు ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలిపారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ ఈశ్వర్ పటేల్, జిల్లా అదనపు కలెక్టర్ వేద్బర్ ప్రదన్, జిల్లా సబ్ కలెక్టర్ దుర్యోధన్ బోయి పాల్గొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. రెండు వేలమందికి పైగా అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
భువనేశ్వర్ కొత్త రైల్వేస్టేషన్లో సేవల ప్రారంభం
● అమృత్ భారత్ పథకం కింద అభివృద్ధి భువనేశ్వర్: తూర్పు కోస్తా రైల్వే ప్రధాన కార్యాలయం స్టేషన్ భువనేశ్వర్ పరిసర ప్రాంతాల నగర వాసులకు రైలు సేవల్ని విస్తరిస్తున్నారు. స్థానిక లోక్ సభ సభ్యురాలు అపరాజిత షడంగి రైల్వే శాఖ సంప్రదింపులతో ఈ సౌకర్యాలు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. ఉత్తర భువనేశ్వర్, సమీప ప్రాంతాల నివాసితులకు రైలు రవాణా అనుసంధానం గణనీయంగా మెరుగుపరిచేందుకు రైల్వే శాఖతో ఈ మేరకు సంప్రదింపులు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. సంప్రదింపులు ఫలప్రదం కావడంతో భువనేశ్వర్ న్యూ రైల్వే స్టేషన్ (బీబీఎస్ఎన్) నుంచి 3 ప్రధాన ఎక్స్‌ప్రెస్ రైళ్లు త్వరలో బయల్దేరనున్నాయి. ఈ రైళ్లు మంచేశ్వర్ స్టేషన్లో కూడా ఆగుతాయి. ఈ జాబితాలో భువనేశ్వర్, ముంబై మధ్య నడిచే 11019, 11020 నంబర్ల కోణార్క్ ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్, సికింద్రాబాద్ మధ్య నడిచే 17015, 17016 నంబర్ల విశాఖ ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్, విశాఖపట్నం మధ్య నడిచే 22819, 22820 నంబర్ల ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉన్నాయి. త్వరలో ఈ సేవలు ఆరంభం కానున్నాయి. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు వెలువడుతాయి. భువనేశ్వర్ న్యూ రైల్వే స్టేషను సమీపం ఉత్తర భువనేశ్వర్ ప్రాంతంలో అత్యధిక ఇంజినీరింగ్, వైద్య కళాశాలలు ఇతరేతర విద్యా సంస్థలు, వైద్య, ఆరోగ్య సంస్థలు పని చేస్తున్నాయి. రైల్వే శాఖ తాజా నిర్ణయం అత్యధిక విద్యార్థులు, ఇతర వర్గాలకు ఉపకరిస్తుంది. అమృత్ భారత్ పథకం కింద పునరాభివృద్ధి అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద భువనేశ్వర్ న్యూ రైల్వే స్టేషను నిర్మాణం పనులు చకచకా సాగుతున్నాయి. మెరుగైన విద్యుద్దీప కాంతులతో విస్తృత పార్కింగు, సర్క్యులేటింగు ప్రాంతంతో అన్ని ప్లాట్‌ఫామ్‌లపై ఆధునిక విశ్రాంతి, నిరీక్షణ గదులు, లిఫ్ట్‌ల సౌకార్యలు అందుబాటులోకి వస్తాయి. -
ముగిసిన నామినేషన్ల పర్వం
జయపురం: ఈ నెల 27 వ తేదీన జరుగనున్న జిల్లా బార్ అసోసియేషన్ ఎన్నికల నామినేషన్ పర్వం ముగిసింది. మొత్తం 27 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారి దాసరథి పట్నాయక్ శనివారం వెల్లడించారు. జిల్లా బార్ అధ్యక్ష పదవికి ఐదు, ఉపాధ్యక్ష పదవికి 2 నామినేషన్లు దాఖలయ్యాయి. కార్యదర్శి పదవికి 3, సహాయ కార్యదర్శి పదివికి ఒకటి, సహాయ కార్యదర్శి (మహిళ)పదవికి ఒకటి, కోశాధిపతి పదవికి 2, గ్రంథాలయ కార్యదర్శి పదవికి 2, గ్రంథాలయ సహాయ కార్యదర్శి(మహిళ) పదవికి ఒకటి, కోశాధ్యక్ష పదవికి 2 నామినేషన్లు వచ్చాయి. కార్యవర్గ సభ్యుల పదవులకు 10 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎన్నికల అధికారికి సహాయ ఎన్నికల అధికారులుగా జ్యోతిరంజన్ పూజారి, ఎస్.ఎస్.సుందరమ్ సహకరించారు. 9వ తేదీన నామినేషన్ల పరిశీలన జరుగుతుందని, 12న నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. 12న బరిలో ఉన్న అభ్యర్థుల జాబితా విడుదల చేస్తారు. మార్చి 29వ తేదీన పోలింగ్ జరుగుతుంది. ఉదయం 9 నుంచి 3 గంటల వరకు పోలింగ్ ఉంటుందని, సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని ఎన్నికల అధికారి దాసరథి పట్నాయక్ వెల్లడించారు. 7 నామినేషన్లు జయపురం: జయపురం సబ్ డివిజన్ కొట్‌పాడ్ బార్ అసోసియేషన్ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల పర్వం పూర్తయింది. వివిధ పదవుల కోసం 7 నామినేషన్లు దాఖలయ్యాయని ఎన్నికల అధికారి, సీనియర్ న్యాయవాది జితేంద్రనాథ్ మహాపాత్రో శనివారం వెల్లడించారు. బార్ అధ్యక్ష పదవికి ప్రముఖ న్యాయవాది మణిప్రసాద్ పట్నాయక్, పంకజ కుమార్ పాత్రో, అజిత్ కుమార్ పట్నాయక్‌లు నామినేషన్లు దాఖలు చేశారని వెల్లడించారు. కార్యదర్శి పదవికి యువ న్యాయవాది ముక్తేశ్వర నాయక్(బాబులి), జ్ఞానేంద్ర నాయక్ నామినేషన్లు వేశారు. ఉపాధ్యక్ష పదవికి సుధీర్ చంద్రనాయక్ నామినేషన్ వేయగా, సహాయ కార్యదర్శి పదవికి ఎ.చంద్రరావు నామినేషన్ దాఖలు చేశారు. ఈ నెల 29వ తేదీన ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల అధికారి వెల్లడించారు. -
25 యూనిట్ల రక్తం సేకరణ
జయపురం: జయపురం సబ్‌డివిజన్ కుంద్ర గ్రామంలో శనివారం స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 25 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. కుంద్ర కమ్యూనిటీ ఆస్పత్రి, ఒడియా సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని వైధ్యాధికారి డాక్టర్ గణేష్ ప్రసాద్ దాస్ ప్రారంభించారు. కొరాపుట్ జిల్లా రక్త దాతల మోటివేటెడ్ అసోసియేషన్ సభ్యులు, కొట్‌పాడ్ ఎమ్మెల్యే ప్రతినిధి బద్రి నారాయణ ఆచార్య ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. గౌరవ అతిథిగా సమాజ సేవకుడు పద్మనాభ బిశాయి, భగవాన్ పండ, తుషార్ భట్, ఉపేంద్ర భట్, ధనపతి పొరజ, దయాధాన హరిజన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ గణేష్ ప్రసాద్ దాస్ మాట్లాడుతూ.. రక్తదాన శిబిరాల నిర్వహణ తగ్గడంతో అత్యవసర సమయంలో రక్తం లభ్యంకాని పరిస్థితి ఉందన్నారు. బ్లడ్‌బ్యాంకుల్లో నిల్వలు తగ్గుతున్నాయన్నారు. భవిష్యత్తులో సమితిలోని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల సహకారంతో ప్రతి గ్రామ పంచాయతీలో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తామన్నారు. అర్హులంతా రక్తదానం చేసి కొరతను అరికట్టాలని విజ్ఞప్తి చేశారు. కుంద్రా సమితిలో విరివిగా రక్తదాన శిబిరాలు నిర్వహించేందుకు జిల్లా రక్తదాతల మోటివేటెడ్ అసోసియేషన్ సహకరిస్తోందని సభ్యుడు భద్రినారాయణ ఆచారి హామీ ఇచ్చారు. జయపురం బ్లడ్‌బ్యాంక్ టెక్నీషియన్లు శుభశ్రీ మిశ్ర, బులు గౌడ, అజయ పండ దాతల నుంచి రక్తాన్ని సేకరించారు. కుంద్ర ఆస్పత్రి బి.ఎ.ఎం.తాజల్ తరాశియ, ఫార్మాసిస్టు త్రినాథ్ సాహు, విఘ్నేశ్వర పండ, సంగ్రామ కేశరి లెంక, సంబాద్ కుంద్ర బ్లాక్ ప్రతినిధి అక్షయ పట్నాయక్, సదాశివ నాయిక్, గంగాధర నాయిక్, కున హరిజన్ శిబిరాన్ని పర్యవేక్షించారు. రక్త దాతలకు ప్రశంసా పత్రాలను అందజేసి సత్కరించారు. -
నేరాల నియంత్రణ అందరి బాధ్యత
జయపురం: జయపురంలో నేరాలు పెరగటంపై పట్టణ ప్రముఖులు, పలు సంస్థల ప్రతినిధుల ఫిర్యాదుపై చర్యలు చేపట్టాలని పోలీస్ డీజీని ముఖ్యమంత్రి మోహణ మఝి ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జయపురం పట్టణంలో నేరాలు నివారించేందుకు పట్టణ పోలీసు అధికారి ఈశ్వర చంద్ర తండి నడుం బిగించారు. గతకొద్ది నెలలుగా పట్టణంలో దొంగతనాలు, చైన్ స్నేకర్స్, దోపిడీలు, కిడ్నాప్‌లు, నేరాలు ఎక్కవయ్యాయి. పట్టణాన్ని అపరాధ ముక్త పట్టణంగా మార్చాలని, పట్టణంలో శాంతిని పునరుద్ధరించాలని కొత్తగా పట్టణ పోలీస్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన ఈశ్వర చంద్ర తండి శుక్రవారం సాయంత్రం మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ల, పలు సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. జయపురం పట్ణణంలో అకస్మాత్తుగా నేరాలు పెరగటానికి గల కారణాలపై ఆయన సభికులతో చర్చించారు. సరస్వతీ పూజల సందర్భంగా మూర్తి నిమరజన చేసి వస్తున్న విక్రమదేవ్ విశ్వవిద్యాలయ విద్యార్థిపై కత్తితో పొడిచిన సంఘటన, హటపోదర్‌లో ఒక షోరూంలో దొంగతనం, లింగరాజ్నగర్లో ఒక ఇంటిలో40 తులాల బంగారం, రూ.30 వేల దొంగతనం, ధన్పూర్ శాఖ కెనాల్ ప్రాంతంలో దొంగతనం, ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంతోపాటు పలు ప్రాంతాల్లో అసాంఘిక వ్యక్తులకు అడ్డాలుగా ఉన్న విషయం, పట్టణంలో అపరిచితుల సంఖ్య పెరగటం, తదితర సంఘటనలపై చర్చించారు. బయట వారు ఎక్కడ నుంచి వచ్చి అద్దె ఇళ్లలో ఉంటున్నారో వారి జాబితా తయారు చేయాలని పోలీసు అధికారి కౌన్సిలర్లకు సూచించారు. అనుమానితులపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లేవారు ఆ విషయం పోలీసులకు తెలపాలన్నారు. మున్సిపల్ చైర్మన్ నరేంద్ర కుమార్ మహంతి, వైస్ చైర్పర్సన్ బి.సునీత, కౌన్సిలర్లు, ప్రైవేట్ బస్సు యజమానుల సంఘం, ట్రక్కు మాలిక్ సంఘం ప్రతినిధిలు, సమాజ సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. లోక్ అదాలత్‌లో ఒక్కటైన దంపతులు జయపురం: కొరాపుట్ జిల్లా న్యాయసేవా ప్రదీకరణ జయపురం వారు అంతర్ జాతీయ మహిళా దినోత్సవంతో పాటు లోక్ అదాలత్‌ను శనివారం నిర్వహించారు. స్థానిక ఇల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన ఆదాలత్‌లో వివిధ కోర్టుల్లో ఉన్న సివిల్, క్రిమినల్, మోటారు ప్రమాదాల కేసులు, రెవెన్యూ, భూ వివాదాలు, కుటుంబు సమస్యలు, వివాహ సంబంధిత కేసులను పరిష్కరించారు. మహిళా దినోత్సవం సందర్భంగా లోక్ అదాలత్‌లో భార్యా భర్తల మధ్య వివాదాన్ని పరిష్కరించారు. భర్తకు 60 ఏళ్లు, భార్యకు 50 ఏళ్లు, వారికి ఒక కుమార్తె. ఇరువురు విద్యావంతులు. బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగులు. అయితే కుటుంబ కలహాలతో ఎనిమిదేళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. లోక్ అదాలత్‌లో ఇద్దరితో చర్చించి సమస్యను పరిష్కరించి వారిని ఒకటి చేశారు. దంపతులు ఒకరికొకరు మిఠాయి తినిపించుకున్నారు. కాగా అదాలత్‌లో 6947 పెండింగ్ కేసులలో 6289 పరిష్కరించారు. మూడు కోట్ల 74 లక్షల రూాయలను జరిమానాగా వసూలు చేశారు. కేటగిరీస్ కేసులలో 2865 కేసులు టేకప్ చేసి వాటిలో 415 పరిష్కరించి 15 కోట్ల 10 లక్షల 88 వేల 87 రూపాయలతో కేసులు షటిల్ చేశారు. అదాలత్‌ను జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ అధ్యక్షులు పీప్ కుమార్ మహంత ప్రారంభించారు. అదనపు జిల్లా జడ్జి సంఘమిత్ర దాస్, మహిళా న్యాయ విభాగ విచారపతి అలకనంద మహంతి, న్యాయ సేవా ప్రదీకరణ కార్యదర్శి, లోక్‌అదాలత్ శాశ్వత విచారపతి సుమన్ జెన, రిజిస్ట్రార్ బిసు్ట్రపసాద్ దేవత, జయపురం సబ్ డివిజనల్ జడ్జి సంతోష్ కుమార్ దాస్, ప్రథమ శ్రేణి విభాగ విచారణపతి అనిమేస్ జెన పాల్గొన్నారు. కొరాపుట్, కొట్‌పాడ్, లక్ష్మీపూర్, సెమిలిగుడ, దసమంతపూర్, బొరిగుమ్మ, లమతాపుట్ కోర్టులలో కూడా లోక్ అదాలత్ నిర్వహించి పలు కేసులు పరిష్కరించినట్లు అధికారులు వెల్లడించారు. -
బాల్య వివాహాలకు అడ్డుకట్ట
రాయగడ: బాల్య వివాహం చేసేందుకు తన 15వ ఏటే తల్లిదండ్రులు సన్నద్ధమయ్యారు. అందుకు వరుడిని కూడా సిద్ధం చేశారు. పెళ్లికి అన్ని సమకూర్చారు. అయితే అందుకు ససేమిరా అంది. తల్లిదండ్రుల ఆలోచనను మార్చేసింది. బాల్యవివాహాలు చేసుకోవడం చట్టరీత్యా నేరమని వివరించింది. అయినా అంగీకరించని తన తల్లిదండ్రుల వైఖరిని అడ్డుకుంది. చివరకు బాల్యవివాహాన్ని తిరస్కరించింది లిల్లి కొండగిరి. అక్కడితో తన పని పూర్తయ్యిందని ఊపరిపీల్చుకొలేదు. తనలాగే పరిసర గ్రామాల్లో జరగుతున్న బాల్యవివాహాలను అడ్డుకుంది. వారికి నచ్చజెప్పింది. ఇలా సుమారు పది బాల్యవివాహాలను అడ్డుకున్న లిల్లీ అందరికీ ఆదర్శనీయురాలిగా మారింది. జిల్లాలోని రామనగుడ సమితి కొరడ గ్రామానికి చెందిన లిల్లిని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక డీఆర్డీఏ సమావేశ మందిరంలో శునివారం జరిగిన కార్యక్రమంలో జిల్లా యంత్రాంగం లిల్లీని ఘనంగా సత్కరించారు. చిన్న వయసులోనే బాల్యవివాహాలకు వ్యతిరేకంగా అడ్డుగోడగా నిలిచిన ఆమె అందరికీ ఆదర్శనీయులని జిల్లా అదనపు కలెక్టర్ నిహారి రంజన్ కుహారో ప్రశంసించారు. బాల్యవివాహాల నియంత్రణకు జిల్లా యంత్రాంగం చేపడుతున్న చైతన్య కార్యక్రమాలకు ఆమె వారధిగా నిలవడం శుభపరిణామమన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా యంత్రాంగం మహిళల మధ్య నిర్వహించిన వివిధ పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సామాజిక, సంక్షేమ శాఖ అధికారి మీనతీ దేవ్, సీడీపీవో మీనాక్షి తదితరులు పాల్గొన్నారు. ఆదర్శంగా నిలిచిన లిల్లీ -
జేకేపూర్‌లో వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు
రాయగడ: పారిశ్రామిక కేంద్రంగా గుర్తింపు పొందిన జేకేపూర్‌లోని శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామి మందిరం 49వ వార్షికోత్సవంతో పాటు స్వామి వారి బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధాన అర్చకులు పొందూరు వెంకట ప్రదీప్ ఆచార్యులు, ఆంపొలు రంగనాథ ఆచార్యుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. శనివారం ఉదయం విశ్వక్సేన పూజ, హావాచనం, పరిషత్, రుత్విక్ వరుణ, మంపపావాహనం, అంకురారోపణ, విశేష పూజలు, నీరాజన మంత్రపుష్పం, మంగళాశాసనం తదితర పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ నెల 13వ తేదీ వరకు ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ఆలయ కమిటీ అధ్యక్షులు పట్నాన గౌరీశంకరరావు, సభ్యులు ఎ.గిరిజా భాస్కరరావు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. -
ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
పర్లాకిమిడి: మహిళలకు సుభధ్ర పథకం ప్రభుత్వం అందజేయడంతో వారి ఆర్ధిక, సామాజిక స్థితిగతులు మెరుగుపడతాయని, ప్రతి మహిళను లక్షాధిపతి చేయడమే ముఖ్యమంత్రి మోహన్ మఝి సర్కారు ఉద్దేశమని కలెక్టర్ బిజయ కుమార్ దాస్ అన్నారు. స్థానిక గజపతి స్టేడియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సుభధ్ర పథకం లబ్ధిదారులకు రెండో విడత రూ.5వేలు ప్రదానోత్సవం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మఝి బరంపురంలో నిర్వహించిన కార్యక్రమాన్ని స్క్రీన్‌పై వీక్షించారు. కార్యక్రమానికి మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమంలో ఎస్పీ జితేంద్ర పండా, డీఆర్డీఏ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి ఇన్చార్జి ఫృథ్వీరాజ్ మండల్, పురపాలక ఈఓ లక్ష్మణ్ ముర్ము, జిల్లా సంక్షేమ శాఖ అధికారి మనోరమా దేవి, డీసీఓ అర్చనా మంగరాజ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంధర్బంగా జానపద నృత్యాలను విద్యార్థులు ప్రదర్శించారు. అలాగే ప్రగతి మహిళా సంఘటన్ ఆధ్వర్యంలో స్థానిక రాజావారి ప్యాలస్ యుటెక్ కంప్యూటర్స్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో మహిళలకు, విద్యార్థులకు నిర్వహించిన రంగవల్లులు, పిండివంటలు, వక్తృత్వ పోటీలలో విజేతలకు ముఖ్యఅతిథి ఇతిశ్రీ మహాపాత్రో, మానసీ పండా, పాయల్ పాత్రోలు బహుమతి ప్రదానం చేశారు. జయపురంలో.. జయపురం: అంతర్జాతీయ మహిళా దినోత్సవాలను పలు సంస్థలు, మహిళా సంఘాలు ఘనంగా జరుపుకున్నాయి. స్థానిక విక్రమదేవ్ విశ్వ విద్యాలయంలో జరిగిన కార్యక్రమానికి వర్సిటీ రిజిస్ట్రార్ మహేశ్వర నాయిక్ అధ్యక్షత వహించారు. విద్యారంగానికి ఎనలేని సేవలు అందిచిన స్థానిక ప్రభుత్వ మహిళా కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ సుచిత్ర మిశ్రను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పోస్టు గ్రాడ్యుయేట్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ ప్రశాంత కుమార్ పాత్రో, ఎగ్జామినేషన్ కంట్రోలర్, రంజన్ కుమార్ పాత్రో, కళాశాల డిపార్ట్మెంట్ కౌన్సిల్ డైరెక్టర్ మహేశ్వర దురియ, హ్యూమన్ రిసోర్స్ డవలప్మెంట్ కౌన్సిల్ డైరెక్టర్ డాక్టర్ దేవదత్త ఇండోరియ, ఫైనాన్స్ కంప్ట్రోలర్ సచిన్ కుమార్ నాయిక్, భగవత్ ప్రసాద్ సింగ్,శ్రీమతి సుకాంతి సోయ్ తదితరులు పాల్గొన్నారు. జయపురం సహకార సమితి తరఫున ర్యాలీ నిర్వహించారు. మున్సిపాలిటీ వారు స్థానిక టౌన్ హాలులో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చైర్మన్ నరేంద్రకుమార్ మహంతి, వైస్ చైర్మన్ బి.సునీత తదితరులు పాల్గొన్నారు. వినూత్న నిరసన భువనేశ్వర్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ విభిన్న రీతిలో నిరసన ప్రదర్శించింది. స్థానిక మాస్టర్ క్యాంటీన్ ప్రాంతంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో ఈ దృశ్యం తారస పడింది. మండల మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు మీనాక్షి బాహిణీపతి అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శిబిరంలో మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు నల్ల గుడ్డలు కట్టుకుని వినూత్న రీతిలో నిరసన ప్రదర్శించారు. రాష్ట్రంలో మహిళల దయనీయ పరిస్థితికి ప్రతీకగా ఈ ప్రదర్శన చేపట్టారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో రాష్ట్ర మహిళలు అణచివేతకు లోనై నిర్లక్ష్యానికి గురవుతున్నారని ఓపీసీసీ చీఫ్ భక్త చరణ్ దాస్ అన్నారు. మహిళలకు రక్షణ, సాధికారత కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన బీజేపీ తర్వాత ఇప్పుడు మహిళలను మోసం చేస్తోందని ఆరోపించారు. నరేంద్ర – మోహన్ ప్రభుత్వ హయాంలో మహిళలపై అణచివేత హద్దులు దాటిందన్నారు. నీలకంఠపూర్ గూడలో.. పర్లాకిమిడి: గుమ్మా బ్లాక్ నీలకంఠపూర్ గూడలో ప్రగతి మహిళా సంఘటన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ కేంద్ర వామపక్షనేత బాలచంద్ర షడంగి హాజరయ్యారు. మహిళలపై ఈనాటికీ హింస జరుగుతోందన్నారు. కేంద్ర బడ్జెట్లో మహిళలకు కేటాయింపులు తక్కువ జరుగుతున్నాయని, రాష్ట్ర బడ్జెట్లో ఏడాదికి పదివేల రూపాయల సుభద్ర పథకం కూడా అతి తక్కువ అని బాలచంద్ర షడంగి అన్నారు. ప్రాంతీయ సహకార సంఘం ఆధ్వర్యంలో.. పర్లాకిమిడి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వాకథాన్ 2025ను స్థానిక గజపతి ప్యాలెస్ నుంచి జిల్లా కోపరేటివ్ సొసైటీస్ అధికారి హారిహార శెఠి ప్రారంభించారు. మహిళలు అన్ని రంగాల్లో సాధికారత, ఆర్థిక స్వావలంబన సాధించాలని ఆయన కోరారు. సమావేశంలో సబ్ కలెక్టర్ అనుప్ పండా, మహిళా కో ఆపరేటివ్ సొసైటీస్ అధ్యక్షురాలు ఎ.పద్మాయరాజ్, రైతు సంఘం నాయకులు సూర్యనారాయణ పట్నాయిక్ తదితరులు పాల్గోన్నారు. అన్ని రంగాల్లో రాణించాలి రాయగడ: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఎస్పీ స్వాతి ఎస్.కుమార్ అన్నారు. స్థానిక మున్సిపాలిటీ టౌన్ హాల్లో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మున్సిపాలిటీ యంత్రాంగం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ శుభ్ర పండ, రాయగడ కళాశాల ప్రిన్సిపాల్ బబిలత షరఫ్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళల భద్రతపై నిబద్ధత
భువనేశ్వర్: భారతీయ జనతా పార్టీ మహిళల అభివృద్ధికి కట్టుబడి ఉందని, రాష్ట్ర కార్యాలయంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిదా అన్నారు. ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలో సుభద్ర యోజన పథకాన్ని అమలు చేస్తామన్న హామీని నెరవేర్చిందన్నారు. కేవలం 8 నెలల్లో సుభద్ర యోజన కింద 1 కోటి మందికి పైగా లబ్ధిదారులకు 10 వేల కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించారని తెలిపారు. ఈ పథకం కోసం ఐదేళ్లలో సమగ్రంగా రూ. 55,000 కోట్లు వెచ్చిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ ఐశ్వర్య బిస్వాల్ మాట్లాడుతూ మహిళల భద్రత, శ్రేయస్సు కోసం మోహన్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బీజేపీ మహిళా మోర్చా సభ్యులు అవయవ దానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినట్లు తెలిపారు. అవయవ దానం ప్రాముఖ్యతను అర్థం చేసుకుని 2,000 మందికి పైగా మరణానంతరం అవయవదానం కోసం తమ పేర్లను నమోదు చేసుకోగా, మరణానంతరం నేత్ర దానం కోసం 1000 మందికి పైగా ప్రమాణం చేశారని ఆమె తెలిపారు. విశిష్ట సేవలందించిన 20 మందిని సత్కరించారు. -
మహిళలకు గొడుగుల పంపిణీ
రాయగడ: మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక మహిళా వాకర్స్ క్లబ్ సభ్యులు శనివారం సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా రోడ్డు పక్కన చిరు వ్యాపారాలు చేసుకుని కుటుంబ పొషణ చేసుకుంటున్న మహిళలకు గొడుగులను పంపిణీ చేశారు. ఎండలో పొట్ట కూటి కొసం వ్యాపారాలు చేసుకుంటున్న వారి ధీన పరిస్థితిని గమనించిన క్లబ్ సభ్యులు ఈ మేరకు వారికి అండగా నిలిచారు. క్లబ్ అధ్యక్షురాలు కొరాడ రజిత, కార్యదర్శి కొరాడ భారతి, కోశాధికారి గెంబలి స్వప్న పాల్గొన్నారు. మరికొన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని అధ్యక్షురాలు రజిత తెలిపారు. లోక్ అదాలత్‌లో 2,348 కేసుల పరిష్కారం రాయగడ: స్థానిక సివిల్ కోర్టు ప్రాంగణలో శనివారం నిర్వహించిన లోక్‌అదాలత్‌లో కాసీపూర్, రాయగడ, బిసంకటక్, గుణుపూర్, పద్మపూర్, మునిగుడ కోర్టుల్లో కొన్నాళ్లుగా పెండింగ్‌లో ఉన్న 2,348 కేసులు పరిష్కారమయ్యాయి. జల్లా జడ్జి సత్యనారాయణ షడంగి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో 51,19,464 రూపాయలను జరిమానా కింద వసూలయ్యాయి. న్యాయవాదులు, లీగల్ సెల్ విభాగానికి చెందిన అధికారులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం రాయగడ: జిల్లాలోని చందిలి పోలీస్ స్టేషన్ పరిధిలో గల దేవ్‌పూర్ గ్రామ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మృతుడిని బిసంకటక్ సమితి ముండాబలి గ్రామానికి చెందిన రాజా కౌసల్య (28) గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న చందిలి పోలీస్ స్టేషన్ ఐఐసీ ప్రసన్న కుమార్ బెహర, సబ్ ఇన్స్పెక్టర్ అశుతోస్ సాహులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం ... రాజా తన బైక్‌లో స్వగ్రామం ముండాబలి నుంచి రాయగడకు వస్తున్న సమయంలొ దేవ్‌పూర్ గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న ఒక వాహనం బలంగా ఢీకొంది. ఈ సంఘటనలో రాజా అక్కడిక్కడే మృతి చెందాడు. అయితే ఢీకొన్న వాహనం ఆగకుండా వెళ్లిపొయింది. కేసు నమోదు చేసిన పోలీసులు వాహనం ఆచూకీ కోసం గాలిస్తున్నారు. యువకుని మృతదేహం స్వాధీనం రాయగడ: గుర్తు తెలియని యువకుని మృతదేహాన్ని కాసీపూర్ సమితి టికిరి పంచాయతీలోని అండరాకంచ్ పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. లుండురుకోన కూడలి సమీపంలోని చెట్టుకు వేలాడుతున్న యువకుని మృతదేహాన్ని చూసిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడా లేక మరేమైన కారణం ఉందనే విషయం పోస్టుమార్టం నివేదికలో వెల్లడవుతుందని పోలీసులు తెలిపారు. -
పౌర సేవలకు శ్రీకారం
భువనేశ్వర్: రెవెన్యూ సంబంధిత సర్టిఫికెట్లు పొందే ప్రక్రియను సులభతరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచి మొబైల్ అప్లికేషన్లను ప్రారంభించి రెవెన్యూ విభాగం సంబంధిత పౌర సేవల్ని అందజేసేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నేపథ్యంలో కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ తదితర పత్రాల జారీ సులభతరం చేయనుంది. ఈ సేవలు కల్పించేందుకు మొబైల్ యాప్ ప్రవేశ పెడుతుంది. ఈ సదుపాయం రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్‌లో ప్రారంభించేందుకు యోచిస్తుందని రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి సురేష్ కుమార్ పూజారి ప్రకటించారు. ఈ చొరవ ద్వారా లబ్ధిదారులకు తహసీల్ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొట్టే బెడద తొలగించడం లక్ష్యంగా మంత్రి పేర్కొన్నారు. కొత్త యాప్‌తో, పౌరులు తమ స్మార్ట్ ఫోన్ల నుంచి నేరుగా కులం, ఆదాయం, నివాస ధ్రువీకరణ పత్రాలు వంటి ముఖ్యమైన పత్రాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ పత్రాల కోసం పౌరులు వ్యయ ప్రయాసలకు లోనయ్యేవారు. ఈ యాప్‌తో ప్రజలు ఇప్పుడు తహసీల్ కార్యాలయాలను సందర్శించాల్సిన అవసరం లేకుండానే కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అని మంత్రి పూజారి వివరించారు. దరఖాస్తు తేదీ, సర్టిఫికెట్ ఉద్దేశం వంటి కీలక వివరాలను అప్లికేషన్ నమోదు చేస్తుంది. ఈ యాప్ సేవల సామర్థ్యాన్ని పెంపొందించే దిశలో విభాగం సన్నాహాలు చేస్తుంది. ప్రధానంగా నిర్ధారిత కాల పరిమితిలో దరఖాస్తుదారులకు ఆశించిన ధ్రువీకరణ పత్రం జారీ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఇందుకు అసవరమైన సమగ్ర మార్గదర్శకాలను రెవెన్యూ శాఖ రూపొందిస్తుంది. ఈ యాప్ ద్వారా అనుబంధ సమాచారం అప్లోడ్ చేసే బాధ్యతను తహసీల్దార్లకు కేటాయిస్తారు. దీని వల్ల సాధారణ పౌరులకు ప్రభుత్వం సేవలు వేగంగా లభిస్తాయి. ఒక వేళ ఆలస్యం జరిగితే రాష్ట్ర స్థాయి అధికారులకు త్వరగా సమాచారం అందేలా యాప్ రూపకల్పన యోచిస్తున్నారు. సంబంధిత తహసీల్దార్లు సర్టిఫికెట్ల జారీకి సంబంధించిన వివరణాత్మక డేటాను యాప్ ద్వారా అప్లోడ్ చేస్తారు. దీని నుంచి దరఖాస్తుదారులకు సేవలను అందించడంలో ఏదైనా జాప్యం గురించి రాష్ట్ర ప్రభుత్వం సమాచారాన్ని పొందవచ్చు అని మంత్రి సురేష్ కుమార్ పూజారి పేర్కొన్నారు. రాష్ట్రంలోని 45 మిలియన్లకు పైగా ప్రజలకు అన్ని ప్రభుత్వ సేవలను అందించేందుక ఏకీకృత వాట్సాప్ చాట్‌బాట్‌ను ప్రారంభించేందుకు మెటాతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకాల తంతు ముగిసింది. ఈ యూనిఫైడ్ వాట్సాప్ చాట్‌బాట్ 429 రకాల ప్రభుత్వ సేవలను ఒకే వాట్సాప్ నంబర్లో అనుసంధానిస్తుంది. ఈ చాట్‌బాట్ ద్వారా పౌరులు జనన, ఆదాయ ధృవీకరణ పత్రాలను పొందడం, డ్రైవింగ్, ఎరువుల లైసెన్స్‌ల కోసం దరఖాస్తు చేసుకోవడం, జాతీయ కుటుంబ ప్రయోజనాల పథకం వంటి ప్రోత్సాహకాలను పొందడం వంటి ముఖ్యమైన ప్రభుత్వ సేవలను ఒకే వాట్సాప్ నంబర్ ద్వారా పొందగలుగుతారు అని తెలిపారు. స్థానిక లోక్ సేవా భవన్లో ప్రభుత్వ ప్రఽముఖ కార్యదర్శి మనోజ్ ఆహుజా, అభివృద్ధి కమిషనర్ కమ్ అదనపు ప్రధాన కార్యదర్శి అనూ గర్గ్, సాధారణ పాలన, ప్రజాభియోగాల విభాగం అదనపు ప్రధాన కార్యదర్శి సురేంద్ర కుమార్, గోపబంధు అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ సురేంద్ర కుమార్, ఉన్నత విద్యా శాఖ కమిషనర్ కమ్ సెక్రటరీ అరవింద్ అగర్వాల్ మరియు మాజీ సమాచార కమిషనర్, సీవైఎస్డీ మెంటర్ జగదానంద సమక్షంలో ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. మొబైల్ యాప్ ద్వారా కుల, ఆదాయ – నివాస ఽధ్రువీకరణ పత్రాల జారీ -
హెల్త్‌సిటీలో రక్త రుగ్మతల కేంద్రం ప్రారంభం
ఆరిలోవ: హెల్త్‌సిటీ యునిక్ ఆస్పత్రిలో మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో రక్త రుగ్మతుల కేంద్రం అందుబాటులోకి వచ్చింది. ఈ కేంద్రాన్ని హెమటాలజీ పితామహుడు డాక్టర్ మామ్మెన్ చాందీ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో సికిల్ సెల్, తలసేమియాతో బాధపడుతున్న వారు ఎక్కువగా ఉన్నారన్నారు. అలాంటి వారికి ఈ కేంద్రం ఉపయోగపడుతుందన్నారు. పేదలకు వైద్యం అందుబాటులో ఉండే విధంగా ఈ కేంద్రాన్ని నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ కేంద్రం విశాఖలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఊన్న మురళీకృష్ణను అభినందించారు. నిమ్స్ మెడికల్ ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ సదాశివుడు మాట్లాడుతూ విశాఖలో రక్త రుగ్మతుల కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల ఆరోగ్య సంరక్షణలో కీలక ముందుడుగు పడిందన్నారు. దీర్ఘకాలిక వ్యాధులు ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయన్నారు. అలాంటి సమస్యల నివారణకు ఈ కేంద్రం అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. మేనేజింగ్ డైరెక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ ఏపీతోపాటు ఒడిశా, చత్తీస్‌గఢ్‌లలో ఎక్కడా రక్త వ్యాధులను సమగ్రంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా హెమటాలజీ కేంద్రం లేదన్నారు. ఈ లోటును భర్తీ చేయడానికి ఇక్కడ సమగ్ర రక్త రుగ్మతల కేంద్రం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పలువురు ఆంకాలజీ విభాగం వైద్యులు పాల్గొన్నారు. -
గడ్డి ట్రాక్టర్‌ను ఢీకొన్న గుర్తు తెలియని లారీ
కొత్తవలస : మండలంలోని అరకు – విశాఖ జాతీయ రహదారిలో నిమ్మలపాలెం జంక్షన్ సమీపంలో గల సూర్య ఐటీఐ వద్ద ముందు వెళ్తున్న గడ్డి ట్రాక్టర్‌ను వెనుక నుంచి గుర్తు తెలియని లారీ శనివారం ఢీకొట్టింది. ఎల్.కోట మండలం కళ్లేపల్లి నుంచి వరి గడ్డితో ట్రాక్టర్‌పై నుంచి కొత్తవలస వెళ్తుండగా వెనుక నుంచి అతి వేగంగా గుర్తు తెలియని లారీ వచ్చి ఢీకొట్టింది. దీంతో గడ్డి లోడుతో ఉన్న ట్రాక్టర్ బోల్తా పడింది. ట్రాక్టర్ డ్రైవర్ తెరుకునే లోపే లారీ అతివేగంగా తప్పించుకుపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. జేసీబీ సాయంతో గడ్డి ట్రాక్టర్‌ను రోడ్డు సేఫ్టీ పోలీస్‌లు దగ్గరుండి పక్కకు తొలిగించారు. గడ్డి ట్రాక్టర్ దగ్ధం గజపతినగరం రూరల్: మండలంలోని గంగచోళ్లపెంట గ్రామంలో శనివారం జరిగిన అగ్ని ప్రమాదంలో విద్యుత్ వైర్లుకు గడ్డి ట్రాక్టరు తగలడంతో దగ్ధమైంది. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కనకల సూర్యనారాయణకు చెందిన ట్రాక్టరులో ఎండు గడ్డిని ఎక్కించి తీసుకువెళ్తుండగా మార్గ మద్యలో ఉన్న విద్యుత్ వైర్లు తగలడంతో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు వ్యాపించి గడ్డితో పాటు ట్రాక్టరు పూర్తిగా కాలిపోయింది. ప్రమాద సంఘటన విషయాన్ని గజపతినగరం అగ్ని మాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో అగ్ని మాపక సిబ్బంది వాహనంతో వచ్చి మంటలను అదుపు చేశారు. అప్పటికే ట్రాక్టరు పూర్తిగా కాలి పోయింది. కుల దూషణపై అట్రాసిటీ కేసు బొండపల్లి: మండలంలోని కొత్తపాలెం సచివాలయం వెల్ఫేర్ సహాయకుడుగా పని చేస్తున్న ఉద్యోగిపై కుల దూషణ చేసినట్లు ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు నిర్వహించి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ యు.మహేష్ తెలిపారు. ఈ నెల 1న సామాజిక భద్రత పింఛన్లను పంపిణీ చేసేందుకు యడ్లపాలెం గ్రామానికి చెందిన వెల్ఫేర్ సహాయకుడు గొర్లె సతీష్‌కుమార్ వెళ్లాడు. మజ్జి అప్పయ్యమ్మ ఇంటికి పింఛన్ ఇచ్చేందుకు వెళ్లగా సెల్ సిగ్నల్స్ పని చేయకపోవడంతో పక్క ఇంటికి వెళ్లి పింఛన్ అందించడానికి వెళ్లాడు. ఈ క్రమంలో మా అమ్మకు పింఛన్ ఇవ్వకుండా పక్క ఇంటికి ఎందుకెళ్లావు? అని అప్పయ్యమ్మ కుమారుడు బంగారునాయుడు కులం పేరిట దూషించినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ డీఎస్పీ వీరాకుమార్ దర్యాప్తు నిర్వహించి కేసు నమోదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు పార్వతీపురం రూరల్: పార్వతీపురం పట్టణంలో గల ఎస్ఎన్పీ కాలనీకి చెందిన జె.సత్తిరాజు ఈ నెల 5వ తేదీన ఉదయం 6గంటలకు తన రోజువారీ పనుల నిమిత్తం బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో భార్య సౌజన్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసినట్టు పట్టణ ఎస్ఐ గోవిందరావు శనివారం తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ చెప్పారు. వధూవరులను ఆశీర్వదించిన జెడ్పీ చైర్మన్ విజయనగరం టౌన్/ గంటస్తంభం : విజయసాగర దుర్గా మల్లేశ్వరి అమ్మవారి ఆలయంలలో హెల్పింగ్ హ్యాండ్స్ హిజ్రాస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతులైన శ్రీసత్య – సత్యనారాయణరావు, విజయలక్ష్మి – వెంకటసత్య ఆచారి జంటలకు శనివారం వివాహం జరిపించారు. ఈ వివాహ వేడుకలకు జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ, మజ్జి సరిసహస్ర, వర్రి నరిసింహమూర్తి, జైహింద్‌కుమార్, ఐవీపీ రాజు, కనకల మురళీమోహన్, తదితరులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. సిరి సహస్ర నూతన దంపతులకు పట్టు వస్త్రాలు అందజేశారు. -
మన్యం సహజ రైతు ఉత్పత్తిదారుల కంపెనీకి జాతీయ అవార్డు
సీతంపేట: మన్యం సహజ రైతు ఉత్పత్తిదారుల కంపెనీకి జాతీయ స్థాయి అవార్డు లభించింది. ఈ మేరకు అవార్డును కేరళ రాష్ట్రంలోని త్రిశూర్‌లో శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆర్బీఐ ప్రతినిధి సతీష్ కె.మల్హోత్ర, ఈఎస్ఏఎఫ్ ఫౌండర్ పాల్ జోషెఫ్ చేతుల మీదుగా రూ.లక్ష నగదు బహుమతి, ప్రశంసా పత్రాన్ని ఆర్ట్స్ డైరెక్టర్ నూక సన్యాసిరావు, మన్యం సహజ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ సీఈఓ బెండి శంకరరావు అందుకున్నారు. ఆర్ట్స్ నేతృత్వంలో మన్యంలోని గిరిజన రైతులు సహజ ఉత్పత్తులను సాగు చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. తాజాగా జాతీయ స్థాయిలో ఈ అవార్డు రావడం పట్ల పలువురు అభినందించారు. -
క్రీడాకారులకు అభినందనలు
విజయనగరం: గత నెలలో మంగళగిరిలో జరిగిన 7వ పారా రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన జిల్లాకు చెందిన క్రీడాకారులను పలువురు ప్రజాప్రతినిధులు శనివారం అభినందించారు. నగరంలోని రాజీవ్ క్రీడామైదానం ప్రాంగణంలో గల జిల్లా క్రీడాప్రాధికార సంస్థ కార్యాలయంలో జరిగన కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అతిధి గజపతిరాజులు క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అతిధి గజపతిరాజు మాట్లాడుతూ.. ప్రతిభకు వైకల్యం అడ్డుకాదన్న విషయాన్ని పారా క్రీడాకారులు నిరూపిస్తున్నారని, ఇతర క్రీడాకారులకు ఏ మాత్రం తీసిపోని విధంగా మెడల్స్ సాధించడమే కాకుండా రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లాను రెండో స్థానంలో నిలపడం అభినందనీయమన్నారు. భవిష్యత్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. అనంతరం విజేతలకు మెడల్స్ వేసి, మెరిట్ సర్టిఫికెట్స్ అందజేశారు. కార్యక్రమంలో తూర్పుకాపు కార్పొరేషన్ చైర్పర్సన్ పాలవలస యశస్విని, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి వెంకటేశ్వరరావు, పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్, తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలకు అత్యుత్తమ సేవలందించాలి : ఎస్పీ
త్రుటిలో తప్పిన ప్రమాదం పాలకొండ రూరల్: నిత్యం రద్ధీగా ఉండే స్థానిక ప్రధాన మార్కెట్‌కు ఆనుకుని ఉన్న జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రహరీ గోడ ఒక్కసారిగా నేలకొరిగింది. నెలలో రెండవ శనివారం పాఠశాలకు సెలవు కావటం, గోడకు మరోవైపు ఉన్న మార్కెట్లో ఆ సమయంలో ఎవ్వరూ లేకపోవటంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఉన్నట్లుండి పెద్ద శబ్ధంతో ఈ భారీ గోడ కూలటంతో చుట్టపక్కల వారు అక్కడి చేరుకుని పరిస్థితిని పాఠశాల యాజమాన్యానికి తెలియజేశారు. ఈ ఘటనతో ఎటువంటి సమస్య తలెత్తకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న పాఠశాల హెచ్ఎం బి.శ్రీదేవి శాఖాపరమైన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామన్నారు. గడ్డి మందు తాగి వ్యక్తి మృతి మక్కువ : మండలంలోని పాయకపాడు గ్రామానికి చెందిన సామంతుల స్వామినాయుడు (29) మనస్తాపంతో గడ్డి మందు తాగి, వైద్య చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్వామినాయుడు ఈ నెల 6వ తేదీన ఉదయం ఇంటి వద్ద గడ్డి మందు తాగడంతో స్థానికులు గమనించి మక్కువలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రధమ చికిత్స చేసి మెరుగైన వైద్యం నిమిత్తం విజయనగరం మహారాజ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. గత కొంతకాలంగా ఏ పని చేయకుండా ఖాళీగా ఉండడంతో కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన స్వామినాయుడు గడ్డి మందు తాగాడు. మృతుడికి వివాహమై ఏడాదైంది. భార్య శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్ఐ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. పార్వతీపురం రూరల్: అనంతపురం పోలీసు శిక్షణ కళాశాలలో శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం గుంటూరు, కర్నూల్ రేంజ్‌కు సంబంధించిన 35మంది ప్రొబేషనరీ ఎస్ఐలను ప్రాక్టికల్ శిక్షణ నిమిత్తం పార్వతీపురం మన్యం జిల్లాకు కేటాయించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు శాఖ కార్యాలయంలో శిక్షణ నిమిత్తం వచ్చిన ఎస్ఐలు ఎస్పీ మాధవ్రెడ్డిని మర్యాదపూర్వకంగా శనివారం కలిశారు. ఈ నేపథ్యంలో ఎస్పీ వారితో మాట్లాడుతూ ప్రజలకు పోలీసు శాఖ ద్వారా అత్యుత్తమ సేవలందించాలన్నారు. విధి నిర్వహణలో నిర్భయంగా, నిష్పక్షపాతంగా, క్రమ శిక్షణ, నిజాయితీ, పారదర్శకత, జవాబుదారీతనంగా సేవలందించాలన్నారు. ప్రతీ ఒక్కరు ఈ శిక్షణలో టెక్నాలజీని ఉపయోగించి ఉత్తమ ఫలితాలను రాబట్టి పోలీసు శాఖ ప్రజలకు మరింత సేవలందించేలా చూడాలని సూచించారు. ఫిర్యాదుదారులతో మృదు స్వభావంతో మెలగాలన్నారు. ఎఫ్ఐఆర్ దర్యాప్తుకు సంబంధించిన రికార్డులు రాయడం గురించి క్షుణ్ణంగా తెలుసుకొని, కేసులను ఏ విధంగా ఛేదించాలి, సీసీటీఎన్ఎస్, డ్రోన్స్‌ను ఉపయోగించడం, పెట్రోలింగ్, సీసీ కెమెరాలను ఉపయోగించు విధానం, పహారా బీట్ గురించి ఎన్డీపీఎస్ కేసులలో చేయాల్సిన విధులు, కేసు డైరీ రాయడం, నేర స్థల పరిశీలన, పోలీసు బందోబస్తు ఏ విధంగా నిర్వహించాలో క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఏ విధమైన అనుమానాలు వ్యక్తమైనా సీనియర్ అధికారులను అడిగి తెలుసుకొని నివృత్తి చేసుకోవాలని ఎస్పీ సూచించారు. ఈ సందర్భంగా వారికి క్షేత్ర స్థాయిలో నిర్వహించాల్సిన విధులపై అవగాహన కల్పించేందుకు జిల్లాలో ఉన్న పలు పోలీసుస్టేషన్లకు కేటాయించారు. -
ఎన్డీఏకు ఎంపికై న విద్యార్థులకు సత్కారం
విజయనగరం రూరల్: కోరుకొండ సైనిక పాఠశాలలో విద్యనభ్యసించి, సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (ఎస్ఎస్బీ) నిర్వహించిన ఎంపిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి, జాతీయ రక్షణ అకాడమీ (ఎన్డీఏ)లో చేరనున్న 8 మంది విద్యార్థులను కోరుకొండ సైనిక పాఠశాలలో శనివారం ఘనంగా సత్కరించారు. పాఠశాల ప్రిన్సిపాల్, గ్రూప్ కెప్టెన్ ఎస్ఎస్ శాస్త్రి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మాట్లాడుతూ 63 ఏళ్ల పాఠశాల చరిత్రలో దేశానికి 744 మందికి పైగా రక్షణ అధికారులను అందించిన ఘనత కోరుకొండ సైనిక పాఠశాల సాధించడం గర్వకారణమని అన్నారు. దేశ రక్షణ రంగంలో ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాల్లో అనేక మంది పాఠశాల పూర్వ విద్యార్థులు వివిధ హోదాల్లో సేవలు అందించారని, ప్రస్తుతం అందిస్తున్నారని అన్నారు. ఎన్డీఏ, ఐఎన్ఏలో చేరడమే లక్ష్యంగా పాఠశాలలో శిక్షణ అందించడం జరుగుతుందన్నారు. సీనియర్లను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు అనుకున్న లక్ష్యాలను సాధించాలని కోరారు. విద్యార్థుల విజయాల్లో భాగమైన అధికారులు, ఉపాధ్యాయ సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఎన్డీఏకు ఎంపికై న విద్యార్థులు శిరీష్ శాస్త్రి, వర్షిత్ వర్థన్, వై.తేజేశ్వర్, చల్ల కృష్ణకుమార్, రూపేశ్ రోణంకి, ఎం.రోహిత్‌కుమార్, ఎస్.గీత్పవన్, కె.భార్గవ్‌లను సత్కరించి అభినందించి జ్ఞాపికలను అందించారు. కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపాల్, వింగ్ కమాండర్ కిరణ్ వి.పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు ఎన్.రామకృష్ణ, అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. -
అంబరాన్నంటిన ఎల్లమ్మ సంబరం...
నెల్లిమర్ల రూరల్: మండలంలోని సతివాడలో ఎల్లమ్మ తల్లి జాతర శనివారం ఘనంగా జరిగింది. వేకువజాము నుంచే భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి పెద్ద ఎల్లమ్మ తల్లి అలాగే పక్కనే ఉన్న చిన్నమ్మ తల్లిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం డప్పు వాయిద్యాల నడుమ ఎల్లమ్మ తల్లిని చదురు నుంచి గ్రామ పొలిమేర వరకు మూడుసార్లు ఊరేగించారు. సిరిమానోత్సవాన్ని పోటెత్తిన భక్తులు చుట్టు పక్కల ఉన్న 20 గ్రామాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి ఎల్లమ్మతల్లి సిరిమానోత్సవాన్ని కనులారా తిలకించి పసుపు, కుంకుమలను సమర్పించుకున్నారు. గ్రామానికి చెందిన సబ్బవరపు అచ్యుతరావు పూజారిగా సిరిమానును అధిరోహించారు. ఎల్లమ్మ తల్లి చదురు నుంచి సతివాడ జంక్షన్ వరకు సిరిమానోత్సవం చేపట్టారు. కార్యక్రమంలో సర్పంచ్ రేవళ్ల శ్రీనివాసరావు, ఎంపీటీసీ సభ్యుడు రెడ్డి సత్యనారాయణ, నాయకులు కోరాడ శ్రీను, ఆల్తి నల్లి బాబు, తదితరులు పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో సిరిమానోత్సవం తరలివచ్చిన వేలాది మంది భక్తులు -
లోక్ అదాలత్‌లో..6,677 కేసుల పరిష్కారం
విజయనగరం లీగల్: ఉమ్మడి విజయనగరం జిల్లాలోని విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, శృంగవరపుకోట, చీపురుపల్లి, గజపతినగరం, కొత్తవలస, కురుపాం కోర్టులలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లలో 6,677 కేసులు పరిష్కరించినట్టు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయికళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. రాజీయే రాజమార్గమని తెలిపారు. మోటారు ప్రమాద బీమా క్లైమ్లకు సంబంధించిన కేసులో రూ.70 లక్షల పరిహారాన్ని అందజేసినట్టు వెల్లడించారు. సుమారు రూ.35 కోట్ల ఆస్తులకు సంబంధించిన (విలువైన) కేసులు పరిష్కారమయ్యాయన్నారు. 10,500 మంది కక్షిదారులు ప్రయోజనం పొందినట్టు తెలిపారు. లోక్ అదాలత్‌లలో వివిధ కోర్టుల న్యాయమూర్తులు, జడ్జిలు బి.అప్పలస్వామి, ఎన్.పద్మావతి, కె.నాగమణి, టి.వి.రాజేష్‌కుమార్, బీహెచ్‌వీ లక్ష్మీకుమారి, ఎల్.దేవీరత్నకుమారి, బి.రమ్య, పి.బుజ్జి, ఎమ్.శ్రీనివాసరావు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎ.హరీష్ తదితరులు పాల్గొన్నారు. రాజీతోనే కేసుల పరిష్కారం పార్వతీపురం టౌన్: రాజీతోనే ఎక్కువ శాతం కేసులు పరిష్కారం అవుతాయని రెండవ అదనపు జిల్లా జడ్జి ఎస్.దామోదరరావు అన్నారు. స్థానిక జిల్లా కోర్టుల సముదాయంలో శనివారం ఏర్పాటు చేసిన మెగా లోక్ అదాలత్‌తో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసులు పరిష్కారానికి ఇరువర్గాల సభ్యుల రాజీ ఎంతో అవసరమని తెలిపారు. వివాదాలు ఒకసారి ప్రారంభం అయితే జీవితాంతం కొనసాగుతాయని, వాటిని సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కక్షిదారులకు విజ్ఞప్తి చేశారు. సంవత్సరాల తరబడి కేసుల వెంట వెళ్లేకన్నా రాజీ మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. న్యాయ స్థానాల్లో పెండింగ్‌లో వున్న కేసుల సంఖ్యను తగ్గించుకోవడానికి, వ్యాజ్యాలకు ముందు దశలోనే వివాదాలను పరిష్కరించడానికి న్యాయస్థానాలు లోక్ అదాలత్‌ను తీసుకువచ్చాయన్నారు. కార్యక్రమంలో అదనపు జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ సౌమ్య జోిస్పిన్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్ఎస్ రావు, అదనపు పీపీ చంద్రకుమార్, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు. -
నేటి నుంచి వేంకటేశ్వరుని కల్యాణోత్సవం
డెంకాడ: చింతలవలస ఐదవ ఏపీఎస్పీ బెటాలియన్ వద్ద ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో వేంచేసి ఉన్న వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవానికి ఆలయ కమిటీ ఏర్పాట్లు పూర్తి చేసింది. స్వామివారి 41వ వార్షిక కల్యాణ మహోత్సవాలు ఈ నెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకూ శ్రీనివాసుని కల్యాణ ఉత్సవాలు జరుగుతాయని ఆలయ కమిటీ తెలిపింది. 9వ తేదీ ఉదయం నుంచి స్వామివారి కల్యాణ ఉత్సవ పూజలు ప్రారంభమై సాయంత్రం 4.30 గంటలకు శ్రీవారి తిరువీధి ఉత్సవం జరుగుతుందని వివరించారు. 10వ తేదీన సాయంత్రం 6.30 గంటలకు వేదపండితుల ఆధ్వర్యంలో శ్రీవారి కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. 11వ తేదీ సాయంత్రం 7 గంటలకు ఆలయ ప్రాంగణంలో ఉన్న కోనేరులో తెప్పోత్సవం కన్నుల పండువగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్న సమారాధన జరుగుతుందని కమిటీ తెలిపింది. భక్తులు పాల్గొని స్వామి ప్రసాదాన్ని స్వీకరించాలని వారు కోరారు. ఉత్సవంలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయన్నారు. ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ కమిటీ -
క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్
విజయనగరం: విద్యార్థి దశలో క్రీడల్లో రాణించిన వారికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.శ్రీనివాసమూర్తి, జిల్లా విద్యాశాఖ అధికారి యు.మాణిక్యం నాయుడులు పేర్కొన్నారు. జాతీయస్థాయిలో జరిగిన స్కూల్‌గేమ్స్ పోటీల్లో రాష్ట్ర జట్టుకు విజయనగరం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన 28 మంది క్రీడాకారులకు శుక్రవారం సర్టిఫికెట్లు ప్రదానం చేసారు. స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో జిల్లా నుంచి ఖోఖో, కబడ్డీ, స్విమ్మింగ్, సాఫ్ట్‌బాల్, బేస్‌బాల్, సైక్లింగ్, తైక్వాండో, రెజ్లింగ్ పోటీల్లో రాష్ట్ర జట్లలో 28 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వారిని ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారితో పాటు, విద్యాశాఖ అధికారులు అభినందించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ క్రీడల ద్వారా మంచి భవిష్యత్ అందిపుచ్చుకోవచ్చన్నారు. జాతీయస్థాయి సర్టిఫికెట్తో ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచి భవిష్యత్ ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో హెచ్ఎం అసోసియేషన్ కార్యదర్శి సన్యాసిరాజు, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం కార్యదర్శి ఎన్.వెంకటనాయుడు, ఎస్ జీఎఫ్ జిల్లా కార్యదర్శి కె.కృష్ణంరాజు, వ్యాయామ ఉపాధ్యాయులు కేవీఎఎస్ రాజు, చంద్రశేఖర్, సూర్యారావు, తౌడుబాబు, సత్యనారాయణ, అప్పలనాయుడు, శ్రీను, టి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. జాతీయ స్కూల్‌గేమ్స్‌లో పాల్గొన్న క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం -
ఆయుధ భాండాగారంగా బాడంగి ఎయిర్‌స్ట్రిప్
బాడంగి: విజయనగరం జిల్లా బాడంగి సమీపంలోని బ్రిటిష్ కాలంనాటి ఎయిర్‌స్ట్రిప్‌ను విశాఖ నావికాదళ శాఖ ఆయుధ భాండాగారంగా తీర్చిదిద్దేందుకు ఆలోచన చేస్తున్నట్టు నావికాదళ జూనియర్ మేనేజర్, వర్క్స్సెక్షన్ ఆఫీసర్ పి.చైతన్య తెలిపారు. ఆర్డీఓ రామ్మోహన్‌రావుతో కలిసి శుక్రవారం సంబంధిత భూములు పరిశీలించారు. ఆయుధ భాండాగారం ఏర్పాటుకు ప్రస్తుతం నావికాదళానికి చెందిన భూమితో పాటు మరో 1613.63 ఎకరాలు అవసరమన్నారు. ఇక్కడ నావెల్ ట్రైనింగ్ పరికరాలు, యుద్ధసామగ్రిని నిల్వ చేస్తామన్నారు. దీనిని నావెల్ ఫీడ్రికై ్వర్ మెంట్ జోన్‌గా పిలుస్తామని చెప్పారు. ఇక్కడికి డొంకినవలస రైల్వేస్టేషన్ దగ్గరగా ఉన్నందున విడిపనిముట్లు సరఫరాకు వీలుంటుందన్నారు. రైల్వేస్టేషన్ వరకు ప్రత్యేక రోడ్డును నిర్మిస్తామని, ఇది స్థానిక ప్రజలకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. ఎయిర్‌స్ట్రిప్ నుంచి నేరుగా పాల్తేరు హైస్కూల్ వరకు రెవెన్యూశాఖ గుర్తించిన భూములను పరిశీలించారు. హైస్కుల్కు ప్రత్యామ్నాయ స్థలం కేటాయించి కొత్త భవనాలు నిర్మిస్తామని చెప్పారు. ముగడ, మల్లంపేట, పాల్తేరు, పూడివలస, కోడూరు, రామంచద్రాపురం, మల్లంపేట గ్రామాలకు చెందిన 1585 ఎకరాల భూములను గుర్తించామన్నారు. వీటిలో ప్రభుత్వ, డీ పట్టా, మాగాణి, మెట్ట భూములు, ప్రభుత్వేతర భూములు కలిసి ఉన్నాయన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సుధాకర్, సర్వేయర్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. నావికాదళ సెక్షన్ ఆిఫీసర్ చైతన్య ఆర్డీఓతో కలిసి భూముల పరిశీలన -
టేకు, మామిడి, జీడిచెట్లు దగ్ధం
బలిజిపేట: మండలంలోని మిర్తివలస గ్రామసమీపంలో మిర్తివలస, తుమరాడ రెవెన్యూ పరిధిలో ఉండే టేకు, మామిడి, జీడితోటల్లో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించడంతో చెట్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో 18మంది రైతులకు చెందిన సుమారు 2,580టేకుచెట్లు, 307మామిడి, 170జీడి చెట్లు కాలిపోయాయని రైతులు తెలిపారు. ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన కావడంతో మంటలు ఆర్పేందుకు అవకాశం లేకవడంతో చెట్లు కాలిపోయాయని రైతులు వాపోయారు. రెవెన్యూ సిబ్బంది నష్టాన్ని అంచనా వేశారని రైతులు తెలిపారు. ఈ ప్రమాదంలో డొక్కర రాము, ప్రగడ సోములయ్య, సాలీల సుశీల, శ్రీరాములు, పోలిరాజు, పైడితల్లి, ఈశ్వరరావు, గుడుపూరు గణపతి, జి.లక్ష్మణ, ఎం.పైడిరాజు, పి.రామారావు, జి.అచ్చియ్య, పైడయ్య, ఆర్.తిరుపతి, ఎస్.శివకృష్ణ, గంగయ్య, జి.సత్యం, ఎస్.సత్యం, మజ్జియ్య తదితరుల రైతులకు సంబంధించిన తోటల్లోని చెట్లు దగ్థమయ్యాయి. దీనిపై ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని బాధిత రైతులు కోరుతున్నారు. -
ప్రజా సమస్యల పరిష్కార కోసమే చైతన్యయాత్రలు
విజయనగరం గంటస్తంభం: సీపీఎం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించ తలపెట్టిన ప్రజాచైతన్య యాత్రల్లో ప్రజాసమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి పోరాటాలు చేస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన స్థానిక ఎల్బీజీ భవన్లో జరిగిన కార్యక్రమంలో కరప్రత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సైకిల్‌యాత్రగా విజయనగరం నుంచి బయలుదేరి మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటించి ప్రజలను కలిసి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుంటామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. మండలాలు, పట్టణ ప్రాంతాల్లో పాదయాత్రలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టి 10 నెలలు గడిచినా ఉపాధి కల్పనపై చిత్తశుద్ధి లేదని, ధరలు అదుపులో ఉండడం లేదన్నారు. మరోవైపు కరెంట్ చార్జీల భారం విపరీతంగా ప్రజలపై వేస్తున్నారని విమర్శించారు. సూపర్‌సిక్స్ గురించి గొప్పగా చెప్పడం తప్ప ఏ ఒక్క హామీ అమలు చేయకపోగా, సంక్షేమ పథకాల్లో కోత విధిస్తున్నారన్నారు. విజయనగరం జిల్లాలో కూడా తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, వేసవి తీవ్రత పెరగకుండానే తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. ప్రజలను చైతన్య పరుస్తూ తమయాత్రలు 17 వ తేదీ వరకు జరుగుతాయని తెలియజేశారు. ప్రజలంతా తమ సమస్యలను సీపీఎం దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రజాసమస్యల పరిష్కారానికి ఈనెల 22 నుంచి 28 వరకు వివిధ రూపాల్లో ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు. అయినా ప్రభుత్వం స్పందించకపోతే ఏప్రిల్, మే నెలల్లో సమరశీల పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ -
బైక్‌పైనుంచి జారి పడి వ్యక్తి మృతి
జియ్యమ్మవలస రూరల్: మండలంలోని అలమండ పంచాయతీ నీలకంఠాపురం గ్రామానికి చెందిన కొండగొర్రి నాగేశ్వరరావు(46) బైక్‌పై నుంచి జారిపడి మృతి చెందాడు. ఈ మేరకు చినమేరంగి ఎస్సై పి.అనీష్ తెలిపిన వివరాల మేరకు నీలకంఠాపురం గ్రామానికి చెందిన నిమ్మక శంకర్రావు తన బైక్‌పై అదే గ్రామానికి చెందిన కొండగొర్రి నాగేశ్వరరావు, పాలక లాలిబాబులను ఎక్కించుకుని గురువారం రాత్రి గుమ్మలక్ష్మీపురం మండలం బొద్దిడి గ్రామదేవత పండగకు వెళ్తున్నాడు. ఆ సమయంలో మార్గమధ్యంలో బైక్‌పై నుంచి జారిపడిన నాగేశ్వరరావుకు తీవ్ర గాయాలు కావడంతో 108 సహాయంతో పార్వతీపురం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. మితిమీరిన వేగంతో వెళ్లడంతోనే ప్రమాదం జరిగిందని, ప్రమాదంలో తమ చిన్నాన్న మృతి చెందాడని కొండగొర్రి అప్పారావు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి...భోగాపురం: ఈనెల 5వ తేదీన మండంలోని రావివలస ట్రంపెట్ వంతెన కింద ఆగి ఉన్న లారీని ఢీకొని గాయపడిన జోతేంద్ర నారాయణ పాండే(41) చికిత్స పొందుతూ మృతిచెందాడు. విశాఖపట్నానికి చెందిన జోతేంద్ర పాండేను గాయాల పాలైన అనంతరం తగరపువలస ఎన్ఆర్ఐ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్చారు. మృతుడి తండ్రి హరినారాయణ పాండే ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ ఎన్వీ ప్రభాకర్ తెలిపారు. -
మార్చి 12లోగా వ్యవసాయ పరికరాలకోసం దరఖాస్తు
పార్వతీపురం: వ్యవసాయ యాంత్రికరణలో భాగంగా రైతులకు ఆధునిక వ్యవసాయ పరికరాల కోసం రైతు సేవా కేంద్రాల్లో ఈనెల 12లోగా దరఖాస్తు చేసుకుని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా వ్యవసాయాధికారి కె.రాబర్ట్‌పాల్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మాట్లాడుతూ 2024–25 సంవత్సరానికి గాను రైతులకు 50శాతం సబ్సిడీపై వ్యవసాయ పరికరాలను సరఫరా చేసేందుకు పార్వతీపురం మన్యం జిల్లాకు రూ.2.47కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు. బ్యాటరీ స్ప్రేయర్లు, ఫుట్ స్ప్రేయర్లు, తైవాన్ స్ప్రేయర్లు, ట్రాక్టర్ దుక్కు, దమ్ము సెట్లు, రోటోవేటర్లు, పవర్ వీడర్లు, పవర్ టిల్లర్లను అందించనున్నట్లు చెప్పారు. గత ఐదేళ్లుగా వ్యవసాయశాఖ నుంచి సబ్సిడీ ద్వారా పరికరాలు పొందని ఎస్సీ,ఎస్టీ, సన్న, చిన్నకారు మహిళా రైతులు అర్హులన్నారు. ఆర్ఓఎఫ్ఆర్ భూములను సాగుచేస్తున్న రైతులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఏపీ స్టేట్ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్ఏఐడీసీ) రైతులతో చర్చించి పరికరాల ధరలను నిర్ణయించి లబ్ధిదారులకు అందించనున్నామని చెప్పారు. ఆసక్తిగల రైతులు వినియోగించుకోవాలని కోరారు. -
ఆత్మవిశ్వాసమే ఆభరణం
మహిళకు ఆత్మవిశ్వాసమే అసలైన ఆభరణం. మొక్కవోని కార్యదీక్ష, ఓర్పు, నేర్పు, శక్తియుక్తి వంటి లక్షణాలే తరగని ఆభరణాలు. మగవారికి మకుటమై మణిమాణిక్యమై మనుగడకే మణిదీపమై వెలుగులీనే వేగుచుక్క నేటి మహిళ. విధివంచితలైనా, విజయభేరి మోగించే నేటిమహిళ పురషుల కన్నా మహాశక్తి కలది.సమాజంలోని ఆటుపోట్లను ఎదుర్కొని ముందడుగు వేసే ప్రతిమహిళకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. – కోరుపోలు కళావతి, ప్రముఖ రచయిత్రి, విజయనగరంఅన్నిరంగాల్లోనూ మహిళలు రాణించాలినేటి మహిళలందరూ ప్రతి రంగంలోనూ రాణించాలి. ఉన్నతమైన లక్ష్యాలతో ముందుకు వెళ్లాలి. భవిష్యత్తుకు మార్గం వేయాలి. కుటుంబసభ్యుల ప్రోత్సాహం తప్పనిసరిగా ఉండాలి. కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసే విషయంలో మహిళలు నైపుణ్యం ఎలా ప్రదర్శిస్తారో..ఉద్యోగ విషయంలోనూ ఎటువంటి పరిస్ధితినైనా సమర్ధవంతంగా ఎదుర్కొని దానికి చక్కటి పరిష్కారం చూపించ గలుగుతారు. వృత్తిపట్ల నిబద్ధతతో పనిచేయగలుగుతారు. మహిళా మణులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. – కె.శిరీష, జిల్లా దేవాదాయశాఖ అధికారిణి, విజయనగరం -
మహిళా క్రీడాపోటీలతో ఆనందం
విజయనగరం అర్బన్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీఎన్జీవో జిల్లా మహిళా విభాగం ఆధ్వర్యంలో స్థానిక రాజీవ్ స్టేడియంలో శుక్రవారం జరిగిన క్రీడా పోటీలు మహిళా ఉద్యోగుల్లో ఆనందం నింపాయి. తొలుత పోటీలను విజయనగరం ఆర్డీఓ దాట్ల కీర్తి గాల్లో బెలూన్లు ఎగరవేసి జెండా ఊపి ప్రారంభించారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేసిన మహిళా ఉద్యోగులు అధికసంఖ్యలో ఉత్సాహవంతంగా పాల్గొని పోటీల్లో ప్రతిభ చూపారు. కబడ్డీ, ఖోఖో, టెన్నికాయిట్, షటిల్ బాడ్మింటన్, మ్యూజికల్ చైర్ తదితర క్రీడల్లో అధిక సంఖ్యలో మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. పోటీలను కె.భాను, పి.అదిలక్ష్మి, వి.సౌదామిని, ఎస్.విజయలక్ష్మి, పి.భారతీదేవి, అనురాధ నిర్వహించారు. కార్యక్రమంలో ఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షుడు డీవీరమణ, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టి.శ్రీధర్‌బాబు, ఎ.సురేష్, జీవీఆర్ఎస్కిశోర్, వై.ఆనంద్‌కుమార్, గోపీనాథ్, జిల్లా కోశాధికారి ఎస్వీసుధాకర్, ఎ.కనకరాజు, ఎల్.తవుడు, కేవీశ్రీను, జిల్లా మహిళా విభాగం చైర్పర్సన్ కె.ఆదిలక్ష్మి, ఆర్.శ్రీసప్న, కె.రాధిక, మహిళా కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
ఇష్టారాజ్యంగా కంకర తరలింపు
సాలూరు రూరల్: మండలంలోని నెలిపర్తి పంచాయతీ బట్టివలస గ్రామం వెళ్లే దారిలో గడిచిన 5 రోజులుగా అక్రమంగా కంకర తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ విషయం రెవెన్యూ అధికారులకు తెలిసినప్పటికీ కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.ఈ వ్వవహరంలో అక్రమ కంకర తవ్వకం దారులకు తెలుగుతమ్ముళ్లు అండగా ఉన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెవెన్యూలో ఉన్నతాధికారులను సైతం వారు మేనేజ్ చేస్తామని అక్రమార్కులకు భరోసా ఇస్తున్నట్లు పలువురు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. కంకర తవ్వకాల్లో జేసీబీతో పాటు సుమారు 10నుంచి 15 ట్రాక్టర్లు రవాణాలో వినియోగిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం నుంచి విజయనగరం జిల్లా రామభద్రపురం మండలానికి కంకర రవాణా చేస్తున్నారు. కనీసం ఎలాంటి అనుమతులు లేకుండా ఇంత బహిరంగంగా పక్క జిల్లాకు కంకర రవాణా జరుగుతున్నా ఇంతవరకు అధికారులు పట్టించుకోకపోవడం వెనుక కంకర అక్రమ తవ్వకాలను ఏమేరకు రెవెన్యూ అధికారులు ప్రోత్సహిస్తున్నారో అర్థమవుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా రెవెన్యూ అధికారులు ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పట్టించుకోని రెవెన్యూ అధికారులు -
నేడే జాతీయ లోక్ అదాలత్
విజయనగరం లీగల్: జాతీయ న్యాయ సేవ అధికార సంస్థ న్యూఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాలతో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కల్యాణ్ చక్రవర్తి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా 21 లోక్ అదాలత్ బెంచీలను ఏర్పాటు చేశామని తెలిపారు. రాజీ పడదగిన క్రిమినల్ కేసులను, మోటార్ ప్రమాద బీమా కేసులు, బ్యాంకు కేసులు, చెక్కుబౌన్స్ కేసులు, మనీ కేసులు, ప్రాంసరీ నోట్ కేసులు, ఎలక్ట్రిసిటీ కేసులు, ఎకై ్సజ్ కేసులు, ల్యాండ్ కేసులు, కుటుంబ తగాదాలు వాటర్ కేసులు, మున్సిపాలిటీ కేసులు, ప్రి లిటిగేషన్ కేసులు, ఇరుపార్టీల అనుమతితో రాజీ మార్గంలో శాశ్వత పరిస్కారం చేసుకోవచ్చునన్నారు. కక్షిదారులు, ప్రజలు శనివారం జరగనున్న జాతీయ లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. -
10న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా
సాలూరు: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో ఈ నెల 10న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ ఉషశ్రీ, జేకేసీ కో ఆర్డినేటర్ రాంబాబులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. దివిస్ ల్యాబొరేటరిస్ లిమిటెడ్ హైదరాబాద్, విశాఖపట్నం, కాకినాడ సమీపంలో ఉన్న బల్క్‌డ్రగ్ ప్రొడక్షన్ విభాగంలో పనిచేసేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారని పేర్కొన్నారు. ట్రైనీ సూపర్వైజర్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు బీఎస్సీ కెమిస్ట్రీ, బీఫార్మశీ, బీటెక్(కెమికల్). ఎంఎస్సీ (ఆర్గానిక్ కెమిస్ట్రి),అనలిటికల్ కెమిస్ట్రీ, ఎం ఫార్మశీ చేసిన వారు అర్హులని తెలిపారు.పై కోర్సులు పూర్తిచేసిన లేదా ఆఖరి సంవత్సరం చివరి సెమిస్టర్ చదువుతున్న అభ్యర్థులు ఒరిజనల్ సర్టిఫికెట్స్, జిరాక్స్‌లను తీసుకుని ఇంటర్వూకు హాజరు కావాలని సూచించారు. డీఎస్సీ, ఎస్జీటీకి ఆన్లైన్లో ఉచిత శిక్షణవిజయనగరం టౌన్: వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆఽంధ్రప్రదేశ్ ఆదేశాల మేరకు డీఎస్సీ, ఎస్జీటీ పరీక్షకు అర్హులైన జిల్లాకు చెందిన బీసీ, ఈడబ్ల్యూఎస్, ఈబీసీ వర్గాలకు చెందిన అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో ఉచిత శిక్షణకు దరఖాస్తులు కోరుతున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జి.పెంటోజీరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 10వతేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. అభ్యర్థుల వార్షిక ఆదాయం రూ.రెండు లక్షల లోపు ఉండాలని స్పష్టం చేశారు. ఉచిత ఆన్లైన్ శిక్షణకు డిగ్రీ మార్క్‌లిస్ట్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, నేటివిటీ, డీఎస్సీకి ఎంపికై న టెట్ మార్క్స్, జిరాక్స్ పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు రెండు దరఖాస్తుతో జతచేయాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఫోన్ 9603557333, 9177726454 నంబర్లను సంప్రదించాలని కోరారు. సేవా పతకాలు అందజేసిన కమాండెంట్ మల్లికా గార్గ్డెంకాడ: ఉత్కృష్ఠ, అతి ఉత్కృష్ఠ సేవా పతకాలను ఐదవ ఏపీఎస్పీ బెటాలియన్ పోలీస్అధికారులు, సిబ్బందికి కమాండెంట్ మల్లికా గార్గ్ అందజేశారు. చింతలవలస ఐదవ ఏపీఎస్పీ బెటాలియన్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో 2019లో 12, 2020లో 9, 2023లో 13 ఉత్కృష్ఠ సేవా పతకాలకు ఎంపికై న బెటాలియన్ పోలీస్ అధికారులు, సిబ్బందికి కమాండెంట్ చేతుల మీదుగా అందజేశారు. అలాగే 2019వ సంవత్సరంలో 7, 2020లో 4, 2023లో 7 అతి ఉత్కృష్ఠ పతకాలను అందజేశారు. పదిమందికి యాంత్రిక్ సేవా పతకాలను అందించారు. కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ డి.వెంకటేశ్వరరావు,అసిస్టెంట్ కమాండెంట్లు పి.సత్తిబాబు,ఎస్.బాపూజీ, డీవీ రమణమూర్తి,, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 41 గ్యాస్ సిలిండర్ల సీజ్ విజయనగరం ఫోర్ట్: జిల్లాలో డొమెస్టిక్ సిలిండర్లను అక్రమంగా వాడుతున్న హోటల్స్, రెస్టారెంట్స్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్స్‌పై సివిల్ సప్లయిస్ అధికారులు శుక్రవారం ఆకస్మికంగా దాడులు చేశారు. సివిల్ సప్లయిస్ డిప్యూటీ తహసీల్దార్లు రెండు బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు. విజయనగరం, డెంకాడ, గజపతినగరం మండలాల్లో 8 చోట్ల 6ఎ కేసులు నమెదు చేసి 25 సిలిండర్లు సీజ్ చేశారు. అదేవిధంగా చీపురుపల్లి, రాజాం, గరివిడి మండలాల్లో 7 చోట్ల ఏడు 6 ఎ కేసులు నమోదు చేసి 16 సిలిండర్లను సీజ్ చేశారు. నైపుణ్యాలు కలిగిన యువతతో గ్రామీణాభివృద్ధి ● గిరిజన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ టి.వి.కట్టిమణి విజయనగరం అర్బన్: నైపుణ్యాలు కలిగిన యువతతో గ్రామీణాభివృద్ధి సాధించవచ్చని కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ టీవీ కట్టిమణి అన్నారు. వర్సిటీలో ‘ఎంటర్ ప్రెన్యూర్ షిప్ ద్వారా గ్రామీణాభివృద్ధి సాధికారపరచడం’ అనే అంశంపై శుక్రవారం జరిగిన సదస్సును ఆయన ప్రారంభించారు. గ్రామీణాభివృద్ధిలో వ్యవస్థాపకత ప్రాముఖ్యతను తెలియజేశారు. నైపుణ్య అభివృద్ధి, స్థిరమైన పద్ధతులతో జనాభాను శక్తివంతంచేసే సహాయక కార్యక్రమాలకు వర్సిటీ ప్రాధాన్యమిస్తోందన్నారు. ప్రొఫెసర్ విఘ్నకాంత్ ఎస్.చాట్పల్లి మాట్లాడుతూ జీవనోపాధి మార్గాలను మెరుగుపరుచుకునేందుకు వ్యవస్థాపక వ్యూహాలను గ్రామీణ యువత అనుసరించాలన్నారు. కార్యక్రమంలో స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ (ఎస్ఎంఎస్) డీన్, ప్రొఫెసర్ జితేంద్రమోహన్ మిశ్రా, బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం అధిపతి డాక్టర్ ఎ.వి.అప్పసాబా పాల్గొన్నారు. -
విద్యార్థినులకు లఘుచిత్ర ప్రదర్శన
పార్వతీపురం రూరల్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో విద్యార్థినులకు మహిళల గౌరవాన్ని పెంపొందించే లఘు చిత్రాలను జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో సంబంధిత స్టేషన్ల సిబ్బంది ద్వారా శుక్రవారం ప్రదర్శించినట్లు ఎస్పీ మాధవ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు సామాజిక, ఆర్థిక, క్రీడ, రాజకీయ రంగాల్లో సాధించిన ప్రగతిని గురించి విద్యార్థులకు వివరించి మహిళల హక్కులు, వారి శక్తి, సమానత్వం, మానసిక స్థైర్యం, స్వీయ రక్షణ సామర్థ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా పలు కార్యక్రమాలను గత ఏడు రోజులుగా నిర్వహించామని చెప్పారు. మహిళా చట్టాలు, పోక్సో యాక్ట్, ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్, గుట్టచ్, బ్యాడ్‌టచ్, సామాజిక మాధ్యమాలు, సైబర్ నేరాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తల పరమైన అంశాలపై పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. పోలీసుశాఖ మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని పోలీస్‌సిబ్బంది సహాయ సేవలు 24/7 ఉంటాయన్నారు. అత్యవసర సమయాల్లో హెల్ప్‌లైన్ నంబర్లు చైల్డ్హెల్లైన్ 1098, ఉమెన్ హెల్లైన్ 181, పోలీస్ హెల్లైన్ 100/112 సైబర్ నేరాల హెల్ప్‌లైన్ 1930 నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి -
ప్రభుత్వ నిర్ణయం ఉపసంహరణకు బీజేడీ అభ్యర్థన
భువనేశ్వర్: దివంగత ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ జయంతి నాడు జరుపుకుంటున్న పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని బీజేపీ ప్రభుత్వం ఏప్రిల్ 24న నిర్వహించేందుకు మార్పు చేసింది. దీంతో బిజూ జనతా దళ్ ఉగ్ర రూపం దాల్చింది. శుక్రవారం ప్రారంభమైన శాసన సభ మలి విడత బడ్జెటు సమావేశాల్లో బీజేడీ సభ్యులు తీవ్ర నిరసన ప్రదర్శించారు. దీంతో సభా కార్యక్రమాలకు గండి పడింది. సభా కార్యక్రమాలు వాయిదా పడడంతో ఊరేగింపుగా బీజేడీ నాయకులు రాష్ట్ర గవర్నరుని కలిసేందుకు రాజ్ భవన్ సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నరు డాక్టరు హరిబాబు కంభంపాటికి స్మారక పత్రం సమర్పించారు. మార్చి 3న పంచాయతీ రాజ్ దినోత్సవ వేడుకలను మార్చి 5 నుంచి ఏప్రిల్ 24కి మార్చాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని బీజేడీ ఎమ్మెల్యేలు తమ మెమోరాండంలో కోరారు. బిజూ పట్నాయక్ జయంతి పురస్కరించుకుని ఏటా పంచాయతీ రాజ్ దివస్‌గా పాటించాలని 1993 సంవత్సరంలో రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిందిం. మూడు అంచెల పంచాయతీ రాజ్ సంస్థల సాధికారతపై దృష్టి సారించేందుకు ప్రతీకగా గత 31 ఏళ్లుగా, 1995 నుంచి 2000 వరకు కాంగ్రెస్ పాలనలో, 2000–2009 వరకు బీజేడీ–బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో కూడా రాష్ట్రం ఈ దినోత్సవాన్ని పాటిస్తోంది. కొత్త ప్రభుత్వం ఈ సంస్కృతికి తెర దించే ఉత్తర్వుల్ని రద్దు చేసేందుకు గవర్నరు కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా మంత్రివర్గ నిర్ణయాన్ని రద్దు చేయాలని గవర్నరుకు అభ్యర్థించింది. -
సమాన హక్కులు కల్పించాలి
జయపురం: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం చైల్డ్ ఫండ్ విభాగం ద్వారా జయపురం సమితి గొడొపొదర్, టంకువ గ్రామాలలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా ‘మహిళలు– బాలికల అధికారం– సమానత్వం’అనే అంశంపై చర్చ జరిగింది. కార్యక్రమంలో కిశోరీ స్యయం సహాయక గ్రూపు సభ్యులు, అంగన్వాడీ వర్కర్లు, హెల్త్ వర్కర్లు, పీఈవో, వార్డు మెంబర్లు, పలువురు మహిళలు పాల్గొన్నారు. పీఈవో శునాలీ పండ మాట్లాడుతూ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శనివారం నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. మహిళల సాధికారిత, హక్కులు, సమాజంలో సమానత్వంపై ఆమె ప్రసంగించారు. మహిళలు విద్య, ఆర్థిక రంగాలలో ప్రగతి సాధిస్తే సమాజం అభివృద్ధి సాధిస్తోందన్నారు. కార్యక్రమాలలో గొడొపొదర్ పంచాయతీ సర్పంచ్ హీరామణి భూమియ, టంకువ గ్రామ పంచాయతీ సర్పంచ్ రుక్మిణీ గదబ, పీఈవో రమణీరంజన్ త్రిపాఠీ, ఐసీడీఎస్ సూపరింటెండెంట్ సంధ్యారాణి సతనమ్, హెల్త్ వర్కర్ బందిత తరాసియ, అరుందతీ బిశ్వాస్, సివిల్ సప్లై సహాయకులు జగన్నాథ్ హరిజన్, చైల్డ్ ఫండ్ కోఆర్డినేటర్ పూర్ణిమ దాస్, అంశుమాన్ మఝి, సుమన్ కుమార్ నాయిక్, ధార్మికా నాయిక్, సీతామణి హంతాల్, ప్రసన్న నాగ్ పాల్గొన్నారు. -
ఫార్మసీ, నర్సింగ్ విభాగాల్లో మంచి అవకాశాలు
రాయగడ: వైద్య రంగంలో పలు సేవలను అందించాలనే ఉద్దేశంతో ఫార్మసీ, నర్సింగ్ విభాగాల్లో చదువుకున్న విద్యార్థులు వారి లక్ష్యానికి అనుగుణంగా వచ్చే అవకాశాలను సద్వినియోగపరుచుకోవాలని డాక్టర్ చంద్ర శేఖర్ పాత్రో అన్నారు. స్థానిక పితామహాల్ వద్ద గల సెంచ్యూరియన్ విశ్వవిద్యాలయంలో ఆఖరి సంవత్సరం చదువుకుని వెళుతున్న ఫార్మసీ, నర్సింగ్ విభాగాలకు చెందిన విద్యార్థుల వీడ్కొలు సమావేశం విశ్వవిద్యాలయం ప్రాంగణంలో శుక్రవారం జరిగింది. కార్యక్రమంలో ఫార్మసీ విభాగం అధ్యక్షులు డాక్టర్ పాత్రో మాట్లాడారు. ఫార్మసీ, నర్సింగ్ రంగాల్లో ప్రభుత్వం ఎన్నో అవకాశాలను కల్పిస్తుందని వివరించారు. వైద్యరంగంలో కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లో ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభిస్తాయని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నర్సింగ్ విభాగం అధ్యక్షులు కె.ఉర్మిల, అధ్యాపకులు గొపాలక్రిష్ణ పాఢి ప్రసంగించారు. -
నవజీవన్ ట్రస్టులో మహిళా దినోత్సవం
పర్లాకిమిడి: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని డోలా ట్యాంకు రోడ్డులో ఉన్న నవజీవన అనాథాశ్రమంలో ‘జస్టీస్ కార్నర్’ట్రస్టు ఆధ్వర్యంలో మహిళల హక్కులపై ప్రత్యేక కార్యక్రమం శుక్రవారం జరిగింది. ముఖ్యఅతిథిగా జిల్లా సంక్షేమ శాఖ అధికారి మనోరమా దేవి, డీసీపీయూ అరుణ్ కుమార్ త్రిపాఠి, జిల్లా సురక్షా అధికారిని సరలాపాత్రో, జువనైల్ కోర్టు సభ్యులు రవీంద్ర కుమార్ పాల్, మహిళా న్యాయవాది అనితా కుమారీ మిశ్రా, ఆకాంక్ష సంఘటన్ కార్యదర్శి మీనా కుమార్ టోహోలో, శక్తిసాధన్ సూపరింటెండెంటు మంజులా ఆచార్య, సీసీడీ సంస్థ కార్యదర్శి అట్టాడ జగన్నాథరాజు, సఖీ ఒన్ స్టాప్ సెంటర్ సునీతా మహారాణా, అంగన్వాడీ, మహిళా స్వయం సహాయక గ్రూపు మహిళలు పాల్గొన్నారు. మహిళా సాధికారత కోసం మనమంతా పోరాడాలని, బాల్యవివాహాలు, గృహహింస, మహిళలపై అనుచిత ప్రవర్తన, అక్రమరవాణా అరికట్టాలని, జసిస్ కార్నర్ అధ్యక్షులు భాగ్యలక్ష్మి నాయక్ అన్నారు. మహిళలు సమాజంలో మూలస్తంభాలని, వారి స్వశక్తీకరణ, భద్రత కోసం మహిళలంతా కలిసి పనిచేయాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారి మనోరమా దేవి అన్నారు. ఈ సందర్భంగా మహిళల భద్రత, స్వశక్తీకరణపై నిస్వార్థ సేవలకు గాను కవితా మల్లిక్‌కు జసిస్ కార్నర్ అధ్యక్షులు భాగ్యలక్ష్మి నాయక్ ఆధ్వర్యంలో సత్కారం చేశారు. కార్యక్రమానికి జస్టిస్ కార్నర్ ట్రస్టు సభ్యులు సంజయ్ కుమార్ రౌత్, కార్యదర్శి జగన్నాథ చౌదరి పాల్గొన్నారు. -
175 మంది పాసింగ్ అవుట్
భువనేశ్వర్: స్థానిక బిజూ పట్నాయక్ స్టేట్ పోలీస్ అకాడమీలో 8వ బ్యాచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ), 12వ బ్యాచ్ సబ్ పోలీస్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) శిక్షణ కార్యక్రమం ముగిసింది. ఈ సందర్భంగా శుక్రవారం నిర్వహించిన దీక్షా సమారోహ్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ముఖ్య అతిథిగా హాజరు అయి పరేడ్‌లో గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణలో వివిధ అంశాల్లో ప్రతిభ కనబరిచిన ఉత్తమ అభ్యర్థులకు ఆయన ప్రశంసా పత్రాలు, బహుమానాలు ప్రదానం చేశారు. నలుగురు అప్రెంటీస్ డీఎస్పీలు, 171 మంది అప్రెంటీస్ పోలీస్ సబ్–ఇన్స్పెక్టర్లు సుదీర్ఘ శ్రమతో ప్రాథమిక శిక్షణను పూర్తి చేసుకుని ఈరోజు పాసింగ్ అవుట్ పరేడ్‌లో పాలొన్నారు. -
రాష్ట్ర హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హరీష్ టండన్
భువనేశ్వర్: జస్టిస్ హరీష్ టండన్ రాష్ట్ర హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు. సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు మేరకు ఈ నియామకం జరిగింది. ఆయన ప్రస్తుతం కోల్‌కతా హై కోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2010 సంవత్సరం ఏప్రిల్ నెల 13 నుంచి కోల్‌కతా హైకోర్టులో న్యాయమూర్తిగా పని చేస్తున్నారు. 2025 సంవత్సరం జనవరి 19న రాష్ట్ర హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చక్రధారి శరణ్ సింగ్ పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి ఈ శాశ్వత పదవి ఖాళీ అయింది. సుప్రీం కోర్టు కొలీజియం ఒడిశా హై కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హరీష్ టండన్‌ను సిఫార్సు చేయడంతో ఈ ఖాళీ భర్తీ కానుంది.అడవిలో యువకుడి మృతదేహం మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా ఛలాన్‌గూఢ పంచాయతీ పరిధిలోని సమీప అడవిలో శుక్రవారం ఉదయం ఓ యువకుడి మృతదేహం కనిపించిందని మల్కన్‌గిరి పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్న జీతు అనే యువకుడు డోంబురు,జానీ,రాహుల్ కచిమ్ అనే ముగ్గురు యువకులతో రిక్లమేషన్కాలనీకి చెందిన ఆశిష్ హల్దార్ అనే కాంట్రాక్టర్‌తో సుకుమ ప్రాంతంలో కొత్త ఇళ్లకు సున్నం వేయడానికి మూడు రోజుల కిందట వెళ్లాడు. మిగతా వారు పని పూర్తి చేసుకుని వచ్చేశారు. జీతు మాత్రం ఇంటికి రాలేదు. దీంతో జీతు తమ్ముడు మల్కన్‌గిరి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం ఉదయం మృతదేహం కనిపించడంతో మల్కన్‌గిరి పోలీసు ఐఐసి రీగాన్ కీండో సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని మల్కన్‌గిరి ప్రభుత్వాస్పత్రికి పంపించారు. కొండల్లో కార్చిచ్చు రాయగడ: రాయగడ నుంచి కెరడ, జిమిడిపేట, బడహంస, పితామహాల్, టెంటాలిగడు, చింతలిగుడ, తడమ, నతమ, మల్లిపొడ, పెరిగాంకు వెళ్లే ప్రాంతాల్లో గల కొండల్లో కార్చిచ్చు రగులుతోంది. పోడు వ్యవసాయం పేరిట ఆదివాసీలు అడవుల్లో మంటలు పెడుతున్నారు. కొండలను తగుల బెట్టవద్దని అటవీ శాఖ ఎన్నో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నా వాటిని పెడ చెవిన పెడుతున్న ఆదివాసీలు కొండలను తగులబెడుతున్నారు. -
రాష్ట్రంలో అధునాతన పోలీసు ఠాణాలు: సీఎం
భువనేశ్వర్: రాష్ట్ర వ్యాప్తంగా అధునాతన పోలీసు ఠాణాలు అందుబాటులోకి వస్తాయని, ఠాణాకు విచ్చేసే ప్రతి ఒక్కరికి మౌలిక సౌకర్యాలతో కూడిన సదుపాయాలు రాత్రింబవళ్లు అందుబాటులో ఉంటాయని రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ తెలిపారు. స్థానిక నయాపల్లి ప్రాంతంలో కొత్తగా నిర్మించిన పోలీస్ స్టేషన్‌ను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన మరో 13 పోలీస్ స్టేషన్ భవనాలను ముఖ్యమంత్రి ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. ఈ 14 పోలీస్ స్టేషన్లను రూ. 41 కోట్ల 99 లక్షల 59 వేలు వెచ్చించి నిర్మించారు. పోలీసు అధికారులు మరింత సమర్థంగా విధులు నిర్వహించేందుకు వీలుగా అత్యాధునిక మౌలిక సదుపాయాలు, పటిష్టమైన సాంకేతికత వ్యవస్థతతో తీర్చిదిద్దారు. ఠాణాలకు విచ్చేసే వారి పట్ల పోలీసుల సత్ప్రవర్తన అత్యంత కీలకమని ముఖ్యమంత్రి పోలీసు అధికారులు, సిబ్బందికి హితవు పలికారు. సకాలంలో సముచిత సేవలు అందజేసి న్యాయసమ్మతంగా పోలీసు సేవలు అందజేయాలని తెలిపారు. ఠాణాలో సత్ప్రవర్తన ప్రజల్లో అవాంఛనీయ భయాందోళనలు తొలగించి నేర సంఘటనల నియంత్రణకు తోడ్పడే సానుకూల పరిస్థితులు అక్కరకు వస్తాయని తెలిపారు. -
కాంగ్రెస్ వాకౌట్
భువనేశ్వర్: శాసన సభలో మలి విడత బడ్జెటు సమావేశాలు పురస్కరించుకుని సభలో తలెత్తిన పరిస్థితులకు నిరసనగా కాంగ్రెసు సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం సభ ఆవరణలో ఉన్న జాతిపిత మహాత్మ గాంధీ విగ్రహం దగ్గర బైఠాయించి నిరసన ప్రదర్శించారు. రాష్ట్రంలో సగటు మహిళకు భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. అత్యాచారాలు నిత్య కృత్యాలుగా పరిణమిస్తున్నాయని, పాఠశాలల్లో మైనరు బాలికలు విద్యాబుద్ధులు సాధించడం బదులుగా గర్భం దాల్చడం వంటి సిగ్గు చేటు సంఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. ఈ చర్యల పట్ల ప్రభుత్వ స్పందన శూన్యంగా పరిణమించిందని కాంగ్రెసు సభ్యులు ఆరోపించారు. హోం శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి తక్షణమే మౌనం వీడి సభలో వివరణ ప్రవేశ పెట్టాలని సభ్యులు పట్టుబట్టారు. వీరి వాదనను స్పీకరు పట్టించుకోకపోవడంతో నిరసనగా సభ నుంచి బయటకు వచ్చారు. రాష్ట్రంలో మహిళల పట్ల జరుగుతున్న అత్యాచారాల వ్యతిరేకంగా ప్లకార్డులతో నిరసన ప్రదర్శించారు. -
ఇళ్ల పట్టాలు ఇవ్వాలని విజ్ఞప్తి
జయపురం: ఇళ్ల పట్టాలు అందజేసి న్యాయం చేయాలని స్థానిక క్రిస్టియన్‌పేట మహిళలు కోరారు. ఈ మేరకు జయపురం సబ్‌కలెక్టర్ కుమారి అక్కవరం శొశ్యా రెడ్డిని శుక్రవారం కలిసి విజ్ఞప్తి చేసి వినతిపత్రం సమర్పించారు. మున్సిపాలిటీ ఐదో వార్డు కౌన్సిలర్ ప్రణభ కిశోర్ నాయిక్ నేతృత్వంలో మహిళలు సబ్‌కలెక్టర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ కిశోర్ నాయిక్ మాట్లాడుతూ.. పట్టాలు లేకపోవడంతో లబ్ధిదారులైన మహిళలు సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. మున్సిపల్ అధికారులు ఇచ్చిన ప్రమాణ పత్రాలను సబ్‌కలెక్టర్‌కు చూపించారు. అయితే నేటి వరకు పట్టాలు సమకూర్చలేదని ఆరోపించారు. ఎంతో కాలంగా ఉన్న ఈ సమస్యను పరిష్కరించకపోవడంతో వందమంది లబ్ధిదారులు అన్యాయానికి గురవుతున్నారన్నారు. అయితే మంజూరు చేసిన ఇళ్ల స్థలాల్లో జలాశయం ఉండటం వలన వారికి ఎల్.ఆర్.సి ఇవ్వడం లేకపోతున్నామని తహసీల్దార్ చెబుతున్నారని సబ్‌కలెక్టర్‌కు కౌన్సిలర్ వివరించారు. సమస్యను తెలుసుకొని చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని సబ్‌కలెక్టర్ హామీ ఇచ్చారు.సబ్‌కలెక్టర్‌ను కలిసిన వారిలో రింకి నాయిక్, జానకీ నంద, సుభాషిణీ బాగ్, మోహినీబాగ్, కుమారి హియాల్, యరియ హియాల్లతో పాటు బిజురాజానగర్, కింద వీధి, కోర్టు కాలనీకి చెందిన మహిళలు ఉన్నారు. -
మిలెట్ శక్తి కేఫ్ ప్రారంభం
జయపురం: స్థానిక మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా మిలెట్ శక్తి కేఫ్‌ను జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి శుక్రవారం ప్రారంభించారు. రూ. 12 లక్షల 50 వేల వ్యయంతో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్నంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేఫ్‌లో పుష్టికర, ఆరోగ్య కరమైన ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచుతున్నట్టు పేర్కొన్నారు. మండియ ఆహార పదార్థాలను ప్రజలకు పరిచయం చేయటమే కేఫ్ ప్రధాన లక్ష్యం అన్నారు. కేఫ్‌లో మండియ (రాగులు)లతో తయారు చేసే మండియ కేక్, పొడపిట్ట, లస్సీ, మండియ టీ అందుబాటులో ఉంటాయన్నారు. ప్రజలు మిలెట్ శక్తి కేష్లలో కొనుగోలు చేసి చేయూత ఇవ్వాలన్నారు. కేఫ్ ప్రారంభోత్వవ కార్యక్రమంలో గౌరవ అతిథిగా మున్సిపల్ చైర్మన్ నరేంద్రకుమార్ మహంతి, జయపురం సబ్ కలెక్టర్, మున్సిపల్ కార్యనిర్వాహక అధికారి కుమారి అక్కవరం శొశ్య రెడ్డి, సీడీపీవో కాంచన పండ, మున్సిపల్ సహాయ కార్యనిర్వాహక అధికారి కృతిబాస్ సాహు, మున్సిపల్ ఇంజినీర్ అజయ జాని, చైతన్య బాసెకె పాల్గొన్నారు. -
అభివృద్ధికి ఆమడ దూరం
రాయగడ: జిల్లాలోని కొలన సమితి పరిధిలో ఉన్న మండియాడొంగొ గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. సుమారు 60 కుటుంబాలకు చెందిన 150 మందికి పైగా జనాభా ఇక్కడ నివసిస్తున్నారు. ఎత్తయిన కొండపై ఉండే ఈ గ్రామానికి వెళ్లేందుకు రాళ్లుతేరిన రహదారే దిక్కు. గ్రామానికి రహదారి నిర్మాణం చేపట్టేందుకు మనోరేగ పథకంలో ప్రతిఏటా నిధులు మంజూరవుతున్నాయి. అయితే ఆ నిధులతో మట్టిని పోసి చేతులు దులుపుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామం నుంచి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో పంచాయతీ కార్యాలయం, 28 కిలోమీటర్ల దూరంలో సమితి కార్యాలయం ఉంది. గ్రామంలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో పాఠశాలను మూసివేశారు. దీంతో దాదాపు పది మంది విద్యార్థులు చదువుకునేందుకు మూడు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది. ఇకపోతే గ్రామంలో తాగునీటి సమస్య వెంటాడుతోంది. 150 మందికి కేవలం ఒకే గొట్టపుబావి ఉండడంతో తాగునీటికి అవస్థలు తప్పడం లేదని వాపోతున్నారు. సమస్యను సంబంధిత శాఖ అధికారులకు తెలియజేసినప్పటికీ ఫలితం ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో గ్రామానికి అంబులెన్స్‌లు చేరుకోవడం లేదని, దీంతో రోగులను మోసుకుంటూ తీసుకెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయని తెలుపుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టాలని కోరుతున్నారు. మండియాడొంగొలో మౌలిక సదుపాయాలు కరువు -
హోటళ్లపై విస్తృత దాడులు
రాయగడ: సబ్ కలెక్టర్ ఆదేశానుసారం జిల్లా పౌరసరఫరాల శాఖ అదనపు అధికారి సుధాంశు భొయ్ నేతృత్వంలో పట్టణంలో గల పలు హొటళ్లపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమంగా వినియోగిస్తున్న 19 వంట గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఇందులొ భాగంగా స్థానిక ఇంజినీరింగ్ వర్క్స్ షాపులో అధికారులు నిర్వహించిన దాడుల్లో గ్యాస్ వెల్డింగ్లకు సంబంధించి కమర్షియల్ గ్యాస్ సిలిండర్లకు బదులు వంట గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తున్నట్లు గుర్తించిన అధికారులు ఈ మేరకు వంట గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా స్థానిక గ్రాండ్ డిలెట్ హోటల్లో 5, అంబికా హొటల్లో 2, నవీన్ హొటల్లో 2, జయహనుమాన్ హొటల్లో 5, సంతొషి హొటల్లో 2, అంగ్రొ ఇంజినీరింగ్ షాపులో మరో రెండు సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బార్ అసోసియేషన్ ఎన్నికలకు 4 నామినేషన్లు జయపురం: జిల్లా బార్ అసోసియేషన్‌కు జరగనున్న ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ పర్వంలో రెండో రోజైన శుక్రవారం నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. తొలి రోజున ఆరు నామినేషన్లు దాఖలైన విషయం విదితమే. రెండో రోజున కార్యదర్శి పదవికి న్యాయవాది శరత్ కుమార్ మఝి(పింటు) నామినేషన్‌ను ఎన్నికల అధికారి దాసరధి పట్నాయక్‌కు అందజేశారు. ట్రెజరర్ పదవికి శైనేష్ కుమార్ ముదులి, కార్యవర్గ సభ్యుల పదవులకు సురేష్ కుమార్ సెట్టి, తరణి పాణిగ్రహిలు నామినేషన్లు దాఖలు చేశారు. కార్యక్రమంలో ప్రధాన ఎన్నికల అధికారి దాసరథి పట్నాయక్, అసిస్టెంట్ ఎన్నికల అధికారులు పద్మిణి దాస్, జ్యోతి రంజన్ పూజారి సహకరించారు. ఈశాన్య రాష్ట్రాల్లో కొరాపుట్ ఎంపీ పర్యటన కొరాపుట్: కాంగ్రెస్ పార్టీకి చెందిన కొరాపుట్ పార్లమెంట్ సభ్యుడు సప్తగిరి శంకర్ ఉల్క ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. శుక్రవారం ఆ ప్రాంత నాయకులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. మణిపూర్ రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌లో ప్రదేశ్ కాంగ్రెస్ కార్యాలయంలో సమావేశాలు నిర్వహించారు. నాగాలాండ్ రాష్ట్ర పీసీసీ కార్యాలయంలో ఉల్క కి ఘన స్వాగతం లభించింది. కోహిమా యుద్ధ వీరుల స్మారక స్థూపం వద్ద నివాళులు అర్పించారు. త్రిపుర రాష్ట్రం లో ఉల్క పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు ప్రకటించాయి. -
వయో వృద్ధుల తీర్థయాత్ర ప్రారంభం
పర్లాకిమిడి: గజపతి జిల్లా పర్లాకిమిడి నుంచి 72 మంది వృద్ధులు తీర్థయాత్రల పథకం కింద అయోధ్య, కాశీ యాత్రలకు రెండు బస్సుల్లో శుక్రవారం బయల్దేరారు. వీరంతా 6 రోజులు తీర్థయాత్రలు చేసి అనంతరం ఈనెల 13వ తేదీన మరలా స్వగ్రామాలకు చేరుకుంటారు. ఈ బస్సులను జిల్లా కలెక్టర్ బిజయకుమార్ దాస్, పర్లాకిమిడి పురపాలక సంఘ అధ్యక్షురాలు నిర్మలా శెఠి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ఈ వయోవృద్ధుల తీర్థయాత్ర పథకం ద్వారా ఇప్పటికే గజపతి జిల్లా నుండి బ్యాచ్‌లు వెళ్లాయని కలెక్టర్ బిజయ కుమార్ దాస్ తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ అధ్యక్షుడు గవర తిరుపతిరావు, జిల్లా శిశు సంరక్షణ అధికారి అరుణ్ కుమార్ త్రిపాఠి, జిల్లా సాంస్కృతిక శాఖ అధికారి అర్చనా మంగరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆరో రోజు ఒకరు డిబార్
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా సాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 75 కేంద్రాల్లో జరుగుతున్న పరీక్షల్లో భాగంగా 6వ రోజు శుక్రవారం సెకండియర్ విద్యార్థులు సెట్–2 ప్రశ్న పత్రంతో మాథ్స్ 2ఎ, బోటనీ, సివిక్స్ పేపర్–2, ఇతర ఒకేషనల్ పేపర్లకు పరీక్ష రాశారు. జనరల్, ఒకేషనల్ రెండు విభాగాల్లో కలిపి 18763 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 385 మంది గైర్హాజరయ్యారు. 6వ రోజు జిల్లాలో ఒక మాల్‌ప్రాక్టీసు కేసు నమోదైంది. పొందూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెకెండియర్ మాథ్స్ 2ఏ పరీక్ష రాస్తున్న ఒక విద్యార్థి మాల్‌ప్రాక్టీసుకు పాల్పడుతూ పట్టుబడటంతో అధికారులు డీబార్ చేశారు. రెండు టన్నుల చింతపండు పట్టివేత సారవకోట: మండలంలోని వడ్డినవలస గ్రామ సమీపంలో శుక్రవారం ఒడిశా రాష్ట్రం గుణుపురం నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా తీసుకొస్తున్న చింతపండు వ్యాన్‌ను అటవీ శాఖ ఎస్ఎఫ్ఓ ఈశ్వరరావు పట్టుకున్నారు. సుమారు 2 టన్నుల చింతపండును గుణుపురం నుంచి నరసన్నపేటకు తీసుకొస్తున్నట్లు గుర్తించారు. అనుమతులు లేకపోవడంతో వ్యాన్‌ను అదుపులోకి తీసుకున్నారు.నరసన్నపేటకు చెందిన ఒక వ్యాపారి నిత్యం ఇదే మార్గంలో ఒడిశా నుంచి చింతపండు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. తెరుచుకోని గ్యాస్ గోదాంపొందూరు రూరల్: పొందూరులో గ్యాస్ ఇబ్బందులు తప్పడం లేదు. గత వారం రోజులుగా గ్యాస్ లభించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ బుక్ చేసినప్పటికీ ఇవ్వటం లేదు. గోదాం దగ్గరకు వచ్చి తీసుకుందామంటే తాళాలు వేసి ఉంటున్నాయి. గ్యాస్ గోదాం దగ్గరకు వచ్చిన లబ్ధిదారులు తమ గోడును వినిపించుకుంటున్నారు. శుక్రవారం రాపాక, పిల్లలవలస, ఎరుకులపేట, పొందూరుకు చెందిన పలువురు లబ్ధిదారులు గ్యాస్ గోడౌన్‌కు వచ్చి ఉసూరుమని తిరిగి వెనుకకు ఖాళీ సిలిండర్లతో వెళ్లిపోయారు. దుర్గమ్మ ఆలయంలో చోరీ వజ్రపుకొత్తూరు: మండలంలోని సుంకర జగన్నాథపురం దుర్గమ్మ తల్లి ఆలయంలో గురువారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు. తాళాలు పగలుగొట్టి వెండి, బంగారం నగలు ఎత్తుకెళ్లారు. శుక్రవారం ఉదయం దాసురాలమ్మ గాడి హైమావతి ఆలయం వద్దకు రాగా.. తాళం పగలుగొట్టి ఉండటంతో చోరీ జరిగినట్లు గుర్తించి గ్రామస్తులకు సమాచారం అందించారు. ఆభరణలు మాయం కావడంతో వజ్రపుకొత్తూరు పోలీసులకు సమాచారమిచ్చారు. చోరీలో రెండు కిలోల బరువు కలిగిన వెండి పల్లెం, అమ్మవారి విగ్రహం, కిరీటం, బల్లెం, గ్లాసు, రెండు తులాల బంగారం శతమానాలు, ముక్కు పుడకలు, కాసులను దొంగలు ఎత్తుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పూండి – నౌపడ ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న దేవాలయం కావడంతో దొంగలు రెక్కీ నిర్వహించి చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. వజ్రపుకొత్తూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డయాలసిస్ బెడ్లు పెంచాలి కవిటి: కిడ్నీ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం డయాలసిస్ బెడ్ల సంఖ్య పెంచాలని ఇచ్ఛాపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ నేత పిరియా సాయిరాజ్ డిమాండ్ చేశారు. శుక్రవారం కవిటిలో మండల కన్వీనర్ కడియాల ప్రకాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధానంగా కవిటి మండలంతో పాటు చాలా కేంద్రాల్లో డయాలసిస్ కోసం వేచి చూసే రోగులసంఖ్య అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం సానుకూల దృక్పథంతో డయాలసిస్ బెడ్ల సంఖ్య పెంపు దిశగా ఆలోచన చేయాలని కోరారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత పింఛన్లను రూ.10వేలకు పెంచాలని గుర్తు చేశారు. కవిటిలో పదిలోపు ఉన్న బెడ్ల సంఖ్యను 19కు పెంచిన విషయాన్ని తెలిపారు. ఇచ్ఛాపురంలో డయాలసిస్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారని, దాన్ని ప్రారంభించాలన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నేతలు కడియాల ప్రకాష్, జల్లు యుగంధర్ పాల్గొన్నారు. -
బైక్‌లను తగలబెట్టిన దుండగులు
రాయగడ: జిల్లాలో టికిరి రైల్వేస్టేషన్ సమీపంలోని ఒక అతిథి గృహం వద్ద పార్కింగ్‌లో ఉన్న మూడు ద్విచక్ర వాహనాలను గుర్తు తెలియని దుండగులు తగలబెట్టారు. దీంతో వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం తెలుసుకున్న అతిథి గృహం యజమాని కె.పవన్ కుమార్ టికిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దుండగులను గుర్తిస్తున్నట్లు తెలుస్తోంది.అదుపు తప్పి లారీ బోల్తా రాయగడ: కొరాపుట్ నుంచి రాయగడ మీదుగా కర్రల లోడ్‌తో జేకేపూర్ వెళ్తున్న లారీ అదుపుతప్పి స్థానిక కొరాపుట్ కూడలి వద్ద శుక్రవారం బోల్తా పడింది. దీంతో వెదురు కర్రలు ఒక వైపుగా ఒరిగిపోయాయి. డ్రైవరు సురక్షితంగా బయటపడ్డాడు. సమాచారం తెలుసుకున్న సదరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని లారీని జేసీబీ సాయంతో పక్కకు తీసుకొచ్చి ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. బీఎస్ఎఫ్ జవాన్‌కు గాయాలు రాయగడ: జిల్లాలోని మునిగుడ రైల్వేస్టేషన్ వద్ద గురువారం రాత్రి రన్నింగ్‌లో ఉన్న ట్రైన్ నుంచి ప్రమాదవశాత్తు జారిపడిన బీఎస్ఎఫ్ జవాన్ తీవ్రగాయాలకు గురయ్యాడు. వెంటనే బీఎస్ఎఫ్ సిబ్బందితో పాటు ఆర్పీఎఫ్ పోలీసులు అతడిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం జవాన్‌ను ప్రత్యేక హెలీకాఫ్టర్లో మెరుగైన చికిత్స కోసం భువనేశ్వర్‌కు తరలించారు. ఈ ప్రమాదంలో గాయాలుపాలైన జవాన్ అశోక్ కుమార్ మీనాగా గుర్తించారు. కొంధమాల్ జిల్లా బలిగుడలోని 136వ బెటాలియన్ బీఎస్ఎఫ్ జవానుగా గుర్తించారు. గురువారం అశోక్ జగదల్పూర్–హవడా సమలేశ్వరి ఎక్స్‌ప్రెస్‌లో మరో ఆరుగురు జవాన్లతో కలిసి కొరాపుట్ నుంచి మునిగుడ వరకు ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో మునిగుడ రైల్వేస్టేషన్ సమీపిస్తున్న సమయంలో గేటు వద్ద అదుపుతప్పి పడిపోయాడు. దీంతో అతని ఎడమ చేయి పూర్తిగా తెగిపోయింది. -
విక్రమదేవ్ వర్సిటీ రిజిస్ట్రార్‌గా మహేశ్వర్ నాయిక్ బాధ్యతల స్వీకరణ
జయపురం: జయపురం విక్రమదేవ్ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా మహేశ్వర నాయిక్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల విద్యాప్రగతికి కృషి చేస్తానన్నారు. విద్యార్థులలో క్రమశిక్షణ నెలకొల్పి ఆదర్శ విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని చెప్పారు. మహేశ్వర్ నాయిక్ ఓఏఎస్ అధికారి. బాధ్యతలు చేపట్టిన ఆయనకు సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. పూర్వ రిజిస్ట్రార్ రంజన్ కుమార్ ప్రధాన్, విక్రమదేవ్ హయ్యర్, సెకండరీ కళాశాల ప్రిన్సిపాల్ కెప్టెన్ డాక్టర్ లక్ష్యణ పాత్రో పాల్గొన్నారు. -
కొరాపుట్ జిల్లాలకు మణిహారం భారత మాల నిర్మాణం
కొరాపుట్: కొరాపుట్, నబరంగ్‌పూర్ జిల్లాలకు మణిహారంగా భారత మాల రోడ్డు నిలవనుంది. దీని నిర్మాణం దాదాపు 90 శాతం పూర్తి కావచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ రోడ్డు నిర్మిస్తోంది. విశాఖ పట్నం నుంచి రాయపూర్ వరకు 6 అంచెల ఎకనామిక్ కారిడార్‌గా రూపు దిద్దుకుంటోంది. దీని నిర్మాణం కోసం సుమారు రు.20 వేల కోట్లు వెచ్చిస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల మీదుగా ఈ నిర్మాణం కొనసాగింది. కొరాపుట్ జిల్లాలకు రావాలంటే ఘాట్ రోడ్లు ఉంటాయనే ప్రచారం ఉంది. కానీ ఈ రోడ్డులో ఎక్కడా ఘాట్ రోడ్డు లేకుండా కొండల కింద నుంచి సొరంగాలు నిర్మించారు. ఈ రోడ్డు ఒడిశాలో కేవలం కొరాపుట్,నబరంగ్‌పూర్ జిల్లాల నుంచి మాత్రమే వెళ్లనుంది. 464 కిలోమీటర్ల దూరం ఉండే ఈ రోడ్డు నిర్మాణంతో ఈ ప్రాంతం అభివృద్ధిలోకి వస్తుందని కేంద్రం భావిస్తోంది. -
ఆక్రమణల తొలగింపునకు చర్యలు
జయపురం: స్థానిక జగన్నాథ్‌సాగర్ పునరుద్ధరణ, సుందరీకరణ పనులలో భాగంగా సాగర్ స్థలాల ఆక్రమణల తొలగింపునకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్నాథ్ సాగర్‌కు ఒక పక్కనున్న మత్స్య విభాగ కార్యాలయం ప్రహరీ పడగొట్టేందుకు మున్సిపల్ అధికారులు ఆదేశించారు. జగన్నాథ్ సాగర్ స్థలంలో మత్స్య విభాగ ఆధీనంలోని 45 హెక్టార్ల స్థలం ఉండేది. అందులో ఇప్పటికే 25 హెక్టార్ల స్థలం పట్టణాభివృద్ది విభాగానికి అప్పజెప్పింది. మిగతా 20 హెక్టార్లను అతిత్వరలో అప్పజెప్పనున్నారు. ఈ నేపథ్యంలో మత్స్య విభాగ అధికారులు లక్షలాది రూపాయల ఖర్చుతో తమ కార్యాలయం చుట్టూ ప్రహరీ నిర్మిస్తున్నారు. పట్టణాభివృద్ధికి అప్పగించాల్సిన స్థలం చుట్టూ ప్రహరీ ఎందుకు కడుతున్నారని జగన్నాథ్ సాగర్ ట్రస్టు సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం జయపురం సబ్‌కలెక్టర్, మున్సిపల్ కార్యనిర్వాహక అధికారి కుమారి ఎ.శొశ్య రెడ్డి ఆదేశం మేరకు మల్స్పల్ కార్యనిర్వాహక అధికారి కృతిబాస్ సాహు, జూనియర్ ఇంజినీర్ ప్రతాప్ చంద్ర ఆచార్య, జగన్నాథ్ సాగర్ ట్రస్టు సభ్యులు ఆ ప్రాంతాన్ని సందరిశంచారు. ఆక్రమణల తొలగింపు, పైన, పట్టణంలో మురికి కాల్వల నుంచి సాగర్లోనికి వస్తున్న నీటిని నిరోధించేందుకు ట్రస్టు సభ్యులు మున్సిపల్ అధికారులతో చర్చించారు. -
దద్దరిల్లిన సభ
శనివారం శ్రీ 8 శ్రీ మార్చి శ్రీ 2025విపక్షాల దాడి..● అంచెలంచెలుగా సభ వాయిదా ● ప్రభుత్వ నిర్లక్ష్యం తగదని ప్రతిపక్షాల ఆందోళన భువనేశ్వర్: రాష్ట్ర శాసన సభలో రెండో దశ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. సభా కార్యక్రమాలు ఆరంభం నుంచి సభలో యుద్ధ వాతావరణం నెలకొంది. ప్రధాన విపక్షం బిజూ జనతా దళ్, కాంగ్రెసు సభ్యులు స్పీకర్‌ను చుట్టుముట్టారు. సభా కార్యకలాపాల నిర్వహణకు ఏమాత్రం అవకాశం లేని పరిస్థితులతో ప్రశ్నోత్తరాలకు గండి పడింది. అది మొదలుకొని సభా కార్యకలాపాల్ని స్పీకరు అంచెలంచెలుగా వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ నెల 5న పంచాయతీ రాజ్ దివస్‌గా నిర్వహించాల్సిన మాజీ ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ జయంతి కార్యక్రమం రద్దు చేయడంతో పాటు ప్రభుత్వ సెలవు తొలగించిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితిని ప్రతిపక్ష బిజూ జనతా దళ్ సభ్యులు తీవ్రంగా నిరసిస్తూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో స్పీకరు పోడియం చుట్టుముట్టారు. విపక్ష నేత నవీన్ పట్నాయక్ మౌనం వహించి దళం సభ్యుల వ్యతిరేకతని ప్రోత్సహించారు. దివంగత బిజూ పట్నాయక్ జాతీయ స్థాయి చరిత్రకారునిగా తనకంటూ ప్రత్యేక ఉనికిని ఆవిష్కరించిన నేత. ఆయనకు బిజూ జనతా దళ్‌కు పరిమితం చేసి అగౌరవపరచడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రతీక అని బీజేడీ విరుచుకు పడింది. బిజూ పట్నాయక్‌ను అగౌరవపరచడం ఆమోదయోగ్యం కాదని, వారు చేసిన నినాదాలతో శాసన సభ మారు మోగింది. రాష్ట్రంలో మహిళలపై హింసాత్మక సంఘటనలు పెచ్చుమీరాయని, బాలికలకు కనీసం విద్యా సంస్థల్లో రక్షణ లేకుండా పోయిన దయనీయ పరిస్థితులు తాండవిస్తున్నాయని దుమ్మెత్తిపోశారు. మహిళలకు భద్రత, రక్షణ కల్పించడంపట్ల రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని కాంగ్రెసు సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చర్యపై నిరసనగా వీరంతా స్పీకరు పోడియం చుట్టుముట్టారు. తారా ప్రసాద్ బాహిణీపతి ఆధ్వర్యంలో కాంగ్రెసు సభ్యులు స్పీకర్ పోడియం ఎక్కడానికి విఫల యత్నం చేశారు. నిరసనలు, నినాదాల మధ్య అమూల్యమైన ప్రశ్నోత్తరాల సమయం నిర్వహణ అసాధ్యమైంది. ఈ కార్యక్రమం ప్రారంభమైన స్వల్ప వ్యవధిలో విపక్షాల దాడి తార స్థాయికి చేరడంతో సభా కార్యకలాపాల్ని తొలుత మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేసినట్లు స్పీకర్ సురమా పాఢి సభను వాయిదా వేశారు. ఆ తర్వాత కూడ పరిస్థితి ఏమాత్రం కుదుట పడలేదు. దాదాపు పావు గంట సేపు విపక్షాల దాడి నియంత్రించేందుకు స్పీకరు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. బిజూ పట్నాయక్‌కు అగౌరవం నినాదంతో బీజేడీ, మహిళలకు భద్రత లేదనే ఆరోపణతో కాంగ్రెసు సభ్యుల వ్యతిరేకతని అడ్డుకునే పరిస్థితి లేక తిరిగి సాయంత్రం 4 గంటల వరకు మరోసారి సభని వాయిదా వేశారు. న్యూస్‌రీల్ -
30 నుంచి పోర్ట్ బ్లెయిర్‌కు విమాన సేవలు
భువనేశ్వర్: స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం (బీపీఐఏ) నుంచి ఘజియాబాద్ మరియు పోర్ట్ బ్లెయిర్ ప్రాంతాలకు ప్రత్యక్ష విమానయాన సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఈనెల 30వ తేదీ నుంచి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. భారత ప్రభుత్వ కొత్త గమ్యస్థాన విధానం ప్రకారం ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ నిత్యం ఈ సేవలను నిర్వహిస్తుందని తెలిపారు. రాజధాని నగరం భువనేశ్వర్ నుంచి మరో రెండు నగరాలకు కొత్తగా ప్రత్యక్ష విమానయాన అనుసంధానంపై సీఎం మోహన్‌చరణ్ మాఝీ హర్షం వ్యక్తం చేశారు. -
సెలవు రద్దుపై బీజేడీ శ్రేణుల నిరసన
భువనేశ్వర్: బిజూ పట్నాయక్ జయంతి సందర్భంగా నిర్వహించాల్సిన పంచాయతీరాజ్ దినోత్సవం వేడుకలకు ప్రస్తుత ప్రభుత్వం అకస్మాతుగా తెర దించింది. ఈ చర్యతో బిజూ జనతా దళ్ తీవ్ర మనస్తాపానికి గురైంది. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారహితంగా మారిందని బిజూ జనతా దళ్ కార్యకర్తలు ఆగ్రహించారు. క్యాలెండర్లో సెలవు దినంగా ప్రకటించినా, దాన్ని ప్రకటించలేదు. ఈ చర్యలకు వ్యతిరేకంగా గురువారం బిజూ జనతా దళ్ రాష్ట్ర వ్యాప్తంగా బిజూ పట్నాయక్ పట్ల జరిగిన అగౌరవానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగింది. లక్షలాది ఒడియా ప్రజల ప్రియతమ నాయకుడికి జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా బీజేడీ ఈ ఆందోళనకు దిగింది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని ప్రతిపక్ష నేత నవీన్ పట్నాయక్ తీవ్రంగా విమర్శించారు. రాష్ట్ర చరిత్రకారుని జయంత్యుత్సవాన్ని మసకబారించడం విచారకరమని ఆయన వ్యాఖ్యానించారు. తాల్చేర్ ఎన్టీపీసీ, హాల్, రౌర్కెలా నిట్, ఓయూఏటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల ఆవిష్కర్త పట్ల రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీవ్ర అన్యాయాన్ని బిజూ జనతా దళ్ సహించేది లేదని నినాదాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా ప్రధాన కార్యాలయాల్లో ఈ ఆందోళన తీవ్ర స్థాయిలో నిర్వహించారు. నయాగడ్ ప్రాంతంలో బీజేడీ ఆందోళనకారులు కలెక్టరు కార్యాలయం గేటు తాళాలు విరగొట్టి లోనికి చొరబడి అలజడి రేపారు. మల్కన్‌గిరిలో.. మల్కన్‌గిరి: ఒడిశా ప్రభుత్వం మార్చ్ 5 వ తేదీన పంచాయతీ రాజ్ దినోత్సవం జరుపుకోకపోవడంపై బీజేడీ కార్యకర్తలు మల్కన్‌గిరిలో నిరసన తెలిపారు. బీజేపీ నేతలు ఒడిశా ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీశారని అన్నారు. 1991లో మొదట ఒడిశాలో బిజుపట్నాయిక్ పంచాయతీ రాజ్‌ను అమలు చేస్తే దేశవ్యాప్తంగా 1992లో అమలు చేశారని గుర్తు చేశారు. నిరసన సభలో జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సమారి టంగులు, మల్కన్‌గిరి మాజీ ఎమ్మెల్యే మనాస్ మడ్కామి, మల్కన్‌గిరి పూరపాలక అధ్యక్షుడు మనోజ్ బారిక్ ,ఉపాధ్యక్షరాలు కవితా మోహంతి తదితరులు పాల్గొన్నారు. భువనేశ్వర్: కటక్ నగరంలో బీజేడీ కార్యకర్తల ఆందోళన పర్లాకిమిడి: జన నాయకుడు, దివంగత ముఖ్యమంత్రి బిజూ పట్నాయిక్ జయంతి నాడు పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినాన్ని రద్దు చేయడం మహానాయకున్ని అవమానించినట్టేనని బీజేడీ ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి అన్నారు. స్థానిక హైస్కూల్ జంక్షన్ వద్ద బిజూ పట్నాయిక్ విగ్రహానికి పూలమాలలు వేసి బీజేడీ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. రాజవీధి ఆటో జంక్షన్ వద్ద టైర్లు కాల్చారు. ఈ నిరసనలో బీజేడీ జిల్లా అధ్యక్షుడు జగబంధు దాస్, కాశీనగర్ బ్లాక్ చైర్మన్ బల్ల శాయమ్మ, గుసాని సమితి చైర్మన్ ఎన్.వీర్రాజు, గుమ్మా సమితిల చైర్మన్లు, ఎం.కృష్ణారావు, గుసాని జెడ్పీటీసీ ఎస్.బాలరాజు, జిల్లా పరిషత్ అధ్యక్షుడు గవర తిరుపతి రావు, బసంత్ దాస్, రాష్ట్ర బిజేడీ సాధారణ కార్యదర్శి ప్రదీప్ నాయక్, బిజేడి పార్టీ ఉపాధ్యక్షులు లక్ష్మీకాంత పోరిచ్చా, మహిళా బీజేడీ నాయకురాలు సంజుక్తా బెహరా తదితరలు పాల్గొన్నారు. -
అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు
జయపురం: వేసవి కాలంలో అడవుల్లో సంభవించే అగ్ని ప్రమాదాలను నివారించేందుకు అటవీ విభాగ అధికారులు మంచ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. అడవుల్లో ఎక్కడ అగ్నిప్రమాదం సంభవించినా వెంటనే తెలుసుకునేందుకు మంచ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు జయపురం అటవీ రేంజర్ సచ్చిదానంద పొరిడ వెల్లడించారు. మొదటిసారిగా పినాంగి సంరక్షణ అడవిలో గురువారం మంచ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. త్వరలోనే కొరాపుట్ ఘాట్ రోడ్డు, పాత్రోపుట్ ప్రాంతాల్లో మంచ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అడవులను అగ్నిప్రమాదాల నుంచి రక్షించేందుకు కొండలపై మంచ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మంచ్ ఎత్తు 15 అడగుల ఉంటుందని, మంచ్‌పై కూర్చొనేందుకు పది అడుగుల వెడల్పుతో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మంచ్‌పై అటవీ ఉద్యోగులు కూర్చుంటారని, ఉదయం 7 నుంచి రాత్రి 10 గంటల వరకు మంచ్‌పై చుట్టూ పరిశీలిస్తారన్నారు. ఎక్కడ అగ్ని ప్రమాదం జరిగినా తెలుసుకుని వెంటనే అటవీ విభాగ అధికారులు తెలియజేస్తారన్నారు. వెంటనే మంటలను ఆర్పేందుకు చర్యలు చేపట్టటం జరుగుతుందన్నారు. -
సుభద్ర పథకంపై అవగాహన
రాయగడ: రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఆర్థిక సాయాన్ని అందించేందుకు తీసుకొచ్చిన సుభద్ర పథకంపై అందరికీ అవగాహన కలిగేలా జిల్లా యంత్రాంగం చైతన్య, ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా జిల్లాలోని కొలనారలో గురువారం ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా జిల్లాలోని కల్యాణ సింగుపూర్ సమితి పరిధి నియమగిరి పర్వత ప్రాంతాల్లో నివసిస్తున్న డొంగిరియా తెగకు చెందిన ఆదివాసీలు సైతం ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ర్యాలీలో బీరీనా ప్రధాన్, సీడీపీవో బిజయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. -
బీజేడీ శ్రేణుల నిరసన
రాయగడ: మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ బిజు పట్నాయక్ జయంతిని పురష్కరించుకుని ఏటా మార్చి 5 న జరుపుకునే పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని రద్దు చేయడంపై ఆ పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. స్థానిక కొత్త బస్టాండ్ వద్ద గల బిజు పట్నాయక్ విగ్రహం వద్ద బీజేడీ నాయకులు, మహిళా కార్యకర్తలు ప్లకార్డులు పట్టుకుని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేశారు. జననాయకుడు బిజుకి బీజేపీ ఇస్తున్న గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. సుమారు రెండు గంటల పాటుగా నిర్వహించిన నిరసన కార్యక్రమంలొ ఆ పార్టీ మాజీ మంత్రి లాల్ బిహారి హిమిరిక, సీనియర్ నాయకులు, జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు గంగాధర్ పువ్వల, సుజాత పాలొ తదితరులు పాల్గొన్నారు. -
నేడు జమ్మి ఎల్లమ్మ జాతర
జయపురం: స్థానిక గోపబంధు నగర్లో శుక్రవారం జమ్మి ఎల్లమ్మ జాతర నిర్వహించనున్నారు. గత గురువారం నుంచి ఇక్కడ ఉత్సవం జరుగుతోంది. శుక్రవారం గోపబందు నగర్ నుంచి పట్టణ ప్రధాన మార్గంలోగల బంకమఠం వద్ద జాతర ముగియనుంది. ఈ సందర్భంగా బాల బాలికలు ఉదయానే ప్రతి ఇంటికి వెళ్లి జోగి దండుతారు. వాటిని జమ్మి ఎల్లమ్మ జాతరలో సమర్పిస్తారు. తెలుగు వారు సిర్లి పండగగా పిలుస్తారు. 230 కిలోల గంజాయి స్వాధీనం మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా బలిమెల పోలీసులు బుధవారం రాత్రి 15 బస్తాల్లోని 230 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బలిమెల పోలీసు స్టేషన్ పరిధిలో గల నీలకంబేరు పంచాయతీ కండాగూఢ గ్రామం అడవిలో 15 బస్తాల గంజాయి ఉందని బలిమెల ఐఐసీ ధీరజ్ పట్నాయక్‌కు సమాచారం రావడంతో ఆయన బుధవారం రాత్రి తన సిబ్బందితో వెళ్లి దాడి చేశారు. వారి రాకను గమనించి గంజాయి బ్యాచ్ పరారైపోయింది. పోలీసులు బస్తాలు స్వాధీనం చేసుకుని గురువారం తూకం వేయగా 230 కిలోలు కనిపించింది. మొత్తం 15 బస్తాల్లో దీని విలువ రూ.30 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. దుకాణాలు దగ్ధం భువనేశ్వర్: పారాదీప్ ప్రాంతంలో 3 దుకాణాలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో దుకాణదారులు గాయపడ్డారు. స్థానిక దోఛొక్కి గ్యారేజీలో మంటలు చెలరేగడంతో 3 దుకాణాలకు మంటలు వ్యాపించాయి. ఈ మంటలు ఆర్పే ప్రయత్నంలో దుకాణదారులకు గాయాలయ్యాయి. కుజంగ్ అగ్నిమాపక దళం ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసింది. అత్యాచారం కేసులో నిందితుడి అరెస్టు రాయగడ: అత్యాచారం కేసుకు సంబంధించి జిల్లాలోని కాసీపూర్ సమితి టికిరి పోలీసులు ఒక నిందితుడిని అరెస్టు చేసి గురువారం కోర్టుకు తరలించారు. అరైస్టెన వ్యక్తి టికిరి పంచాయతీలోని కలియాకొన గ్రామానికి చెందిన ప్రకాష్ మాఝిగా గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. కలియాకొన గ్రామానికి చెందిన ఒక దివ్యాంగురాలు తన తల్లితో కలిసి గ్రామ సమీపంలోని అడవిలో కట్టెలు తీసుకొచ్చేందుకు వెళ్లింది. ఆ సమయంలో దివ్యాంగురాలు ఒక చెట్టుకింద ఉండడం గమనించిన ప్రకాష్ ఆమెకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేశాడు. దీంతో మానసిక దివ్యాంగురాలైన తన కూతురుపై అత్యాచారం చేశాడని బాధితురాలి తల్లి టికిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. -
ఏప్రిల్ 2న పాఠశాలల్లో ’ప్రవేశ ఉత్సవ్’
భువనేశ్వర్ : ఏప్రిల్ 1 నుంచి 2025–26 విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 2న అన్ని పాఠశాలల్లో కొత్త విద్యా విధానం (ఎన్ఈపీ) రాష్ట్ర వ్యాప్త ప్రచార కార్యక్రమం చేపడుతోంది. ఈ నేపథ్యంలో పాఠశాలల్లో ప్రవేశ ఉత్సవ్, అక్షరాభ్యాసం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు రాష్ట్ర పాఠశాలలు, సామూహిక విద్యా విభాగం మంత్రి నిత్యానంద గోండ్ తెలిపారు. ఈ ప్రచారంలో తల్లిదండ్రులు, ప్రజా ప్రతినిధులు, సీనియర్ ప్రభుత్వ అధికారులు, పుర ప్రముఖులు పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 3 నుంచి 5 వరకు పాఠశాల స్థాయి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాల్లో ప్రత్యేకంగా ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొంటారు. ఈ మేరకు రాష్ట్ర పాఠశాలలు మరియు సామూహిక విద్యా శాఖ కమిషనర్ కమ్ కార్యదర్శి షాలిని పండిట్ అన్ని జిల్లా కలెక్టర్లు మరియు మేజిస్ట్రేట్లకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ శిశు వాటిక మరియు ఒకటో తరగతిలో చేరే విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేకంగా ఆహ్వానించనున్నారు. ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు రాష్ట్ర స్థాయిలో ఆహ్వాన పత్రాలు పిల్లల కుటుంబాలకు పంపిణీ చేస్తారు. ప్రవేశ ఉత్సవ్‌ను విజయవంతంగా జరుపుకోవడానికి, ప్రతి ప్రాథమిక పాఠశాల పరివాహక ప్రాంతంలోని శిశు వాటిక, 1వ తరగతిలో ప్రవేశించే విద్యార్థులను జాబితా చేయాలని జిల్లా యంత్రాంగాన్ని కోరింది. జిల్లా యంత్రాంగం గుర్తించిన విద్యార్థుల సంఖ్య ప్రకారం ఆహ్వాన పత్రాలు ముద్రించి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తారు. జిల్లా యంత్రాంగం మండల, జిల్లా విద్యాధికారులు మరియు ఇతర వాటాదారులతో సమన్వయం చేసుకుని మండల, జిల్లా స్థాయిలో ఏప్రిల్ 2, 2025న అన్ని పాఠశాలల్లో ప్రవేశ ఉత్సవ్, అక్షరాభ్యాసం నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో ప్రత్యక్షంగా పాలుపంచుకునేందుకు ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, స్థానిక ప్రముఖులను అతిథులుగా ఆహ్వానిస్తారు. ఈ ఏడాది జనవరి నెల నుండి రాష్ట్రంలో జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) 2020 అమలును పాఠశాల, సామూహిక విద్యా శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చొరవలో భాగంగా జాతీయ పాఠ్య ప్రణాళిక విధానం (ఎన్సీఎఫ్) మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర పాఠ్య ప్రణాళిక విధానం అమలు చేయనున్నట్లు విభాగం పేర్కొంది. -
ముఖ్యమంత్రి గృహ ప్రవేశం
భువనేశ్వర్: రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి అధికారిక భవనంలో గృహ ప్రవేశం చేశారు. గురువారం ఉదయం 10.47 గంటల సుముహూర్తంలో కుటుంబ సమేతంగా ఈ భవనంలోనికి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా నూతన భవనంలో ప్రత్యేక హోమాదులు నిర్వహించారు. పూరీ నుంచి విచ్చేసిన ప్రత్యేక పురోహిత బృందం ఈ పూజాదులు నిర్వహించారు. స్థానిక రాజ్ భవన్, ఏజీ స్క్వేర్ మధ్య నగరం నడి బొడ్డున ముఖ్యమంత్రి అధికారిక భవనం రెండంతస్తుల భవన సముదాయం నెలకొని ఉంది. 25 ఏళ్ల తర్వాత.. దాదాపు 25 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి అధికారిక భవనం కొత్త శోభని సంతరించుకోవడం విశేషం. సుమారు రెండున్నర దశాబ్దాలుగా ఈ భవనం ఖాళీగా పడి ఉంది. దీంతో పూర్తిగా పాతబడి సుమారు శిథిలావస్థకు చేరింది. 2000 సంవత్సరం నుండి, నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నుంచి ముఖ్యమంత్రి అధికారిక భవనం ఖాళీగా ఉంది. మాజీ ముఖ్యమంత్రి తన సొంత ప్రైవేట్ నివాసంలో నివసించడానికి ఎంచుకోవడంతో ఈ పరిస్థితి చోటు చేసుకుంది. ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు (ఎల్ఓపీ) నవీన్ పట్నాయక్ తన సుదీర్ఘ 24 సంవత్సరాల పదవీ కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన వ్యక్తిగత ఇల్లు నవీన్ నివాస్ నుంచి రాష్ట్ర పాలన కార్యకలాపాలు నిర్వహించారు. తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ నిర్మించిన భవనం నవీన్ నివాస్ నుంచి పావు శతాబ్దం పాటు అన్ని అధికారిక, పరిపాలనా పనులు చివరి వరకు నిర్వహించారు. నవీన్ పట్నాయక్ పదవీకాలానికి ముందు ముఖ్యమంత్రి అధికారిక భవనం ముఖ్యమంత్రుల నివాసంతో నిత్యం హడావుడిగా ఉండేది. ఆయనకు ముందు మాజీ ముఖ్యమంత్రులు జేబీ పట్నాయక్, గిరిధర్ గొమాంగొలకు ఈ భవనం నివాసంగా ఉండేది. పునరుద్ధరణ ముఖ్యమంత్రి నివాసం చాలా కాలంగా నిరుపయోగంగా ఉండటంతో ప్రభుత్వం ఎనిమిది నెలల పాటు దీర్ఘ కాలం శ్రమించి భారీ పునరుద్ధరణ ప్రాజెక్టును చేపట్టాల్సి వచ్చింది. భారీ వ్యయ ప్రయాసలతో ఆ నివాసాన్ని మళ్లీ నివాసయోగ్యంగా పునరుద్ధరించారు. పునరుద్ధరించిన ఈ భవనంలో బహుళ సమావేశ గదులు, భద్రత కోసం ఒక వాచ్ టవర్ మరియు ముందు భాగంలో విశాలమైన ఆకర్షణీయమైన తోట సాదరంగా స్వాగతం పలుకుతుంది. మోహన్ చరణ్ మాఝీ ఇప్పుడు అధికారికంగా నివాసానికి మారడంతో ముఖ్యమంత్రి నివాసం పావు శతాబ్దం నిద్రాణస్థితి తర్వాత మరోసారి రాజకీయ కార్యకలాపాల కేంద్రంగా మారింది. పవిత్ర హోమాదులతో గృహ ప్రవేశం పూరీ నుంచి వచ్చిన 11 మంది బ్రాహ్మణ పూజారుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి అధికారిక భవనం గృహ ప్రవేశం పూజాదులు అత్యంత నియమ నిష్టలతో నిర్వహించారు. హిందూ ఆచార సంప్రదాయాల ప్రకారం తొలుత ఆవు, దూడని ఇంటిలోకి అడుగు పెట్టించారు. ఈ ఆచారం కొత్త ఇంటికి శ్రేయస్సు, సానుకూల శక్తిని కూడగడుతుందని ముఖ్యమంత్రి నమ్మకం వ్యక్తం చేశారు. దీని తర్వాత ముఖ్యమంత్రి దంపతులు కుటుంబ సమేతంగా గృహ ప్రవేశం నిర్వహించారు. పంచాంగం గణాంకాల ప్రకారం గురువారం ఉదయం 10.47 గంటలకు సీఎం మాఝీ తన కుటుంబంతో కలిసి నివాసంలోకి అధికారికంగా ప్రవేశించారు. ముఖ్యమంత్రి అధికారిక భవనానికి పూర్వ కళ -
బిజూ విగ్రహాన్ని ఆవిష్కరించాలి
జయపురం: మాజీ ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ విగ్రహాన్ని వెంటనే ఆవిష్కరించాలని బీజేడీ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం సాయంత్రం విక్రమనగర్లో గల బీజేడీ పార్టీ భవనంలో పార్టీ సీనియర్ నేత బాలా రాయ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి రబినారాయణ నందో ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పంచాయతీ రాజ్ దినోత్సవ తేదీని ముఖ్యమంత్రి మోహణ మఝి మార్పుచేయటాన్ని మాజీ మంత్రి నందో ఖండించారు. బిజూ పేరు వింటే బీజేపీ భయపడుతుందన్నారు. బిజూ జయంతి రోజున పంచాయతీ రాజ్ దినోత్సవం జరుగుతుండేదని, ఆ తేదీని మార్చటం సరికాద ధ్వజమెత్తారు. ఈ చర్య బిజూను అవమాన పరచటమేనన్నారు. బిజూ పట్నాయక్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు. ఏప్రిల్ 17వ తేదీ లోగా బిజూ విగ్రహాన్ని ఆవిష్కరించకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. మున్సిపల్ వైస్ చైర్పర్సన్ బి.సునీత, మాజీ చైర్మన్ సూర్యనారాయణ రథ్, మాజీ కౌన్సిలర్ దుర్గా మిశ్ర, బీజేడీ నేతలు రమాకాంత రౌళో, నాగరాజు దొర, అనూప్ కుమార్ పాత్రో, బిష్ణు ప్రసాద్ పాత్రో, వివేకానంద పట్నామక్, శివ పట్నామక్, బాలంకి రావు, హర ప్రసాద్ మిశ్ర, బీజేడీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
ముగిసిన మెట్రిక్యులేషన్ పరీక్షలు
భువనేశ్వర్: రాష్ట్ర మాధ్యమిక విద్యా బోర్డు బీఎస్ఈ ఆధ్వర్యంలో పదో తరగతి (మెట్రిక్యులేషన్) వార్షిక పరీక్షలు గురువారంతో ముగిశాయి. త్వరలో జవాబు పత్రాలు దిద్దే మూల్యాంకనం ప్రక్రియకు సన్నాహాలు చేస్తున్నారు. అంచెలంచెలుగా ఒక్కో ప్రక్రియ ముగించి మే నెల మొదటి వారంలో పరీక్ష ఫలితాలు వెల్లడించేందుకు చురుగ్గా సన్నాహాలు చేస్తున్నట్లు బీఎస్ఈ అధ్యక్షుడు శ్రీకాంత్ తొరాయ్ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,133 కేంద్రాల్లో పరీక్షలు సజావుగా పూర్తయ్యాయి. ఈ నెల 19 నుంచి మూల్యాంకనం ప్రారంభమవుతుందని తెలిపారు. మెట్రిక్యులేషన్ ఫలితాలను మే నెల మొదటి వారంలో ప్రకటిస్తామన్నారు. ప్రకృతి వైపరీత్యాలు లేదా ఇతర అనివార్య పరిస్థితుల కారణంగా ఎలాంటి అవాంతరం తలెత్తకుంటే ముందస్తు ప్రణాళిక ప్రకారం ఫలితాలను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు సహకరించిన అన్ని జిల్లాల కలెక్టర్లు, ప్రభుత్వ అధికారులు, పోలీసు దళాలు, మీడియా వ్యక్తులకు అధ్యక్షుడు కృతజ్ఞతలు తెలిపారు. చర్యలు ఫలప్రదం ఈ ఏడాది పరీక్షల నిర్వహణ పురస్కరించుకుని ప్రశ్న ప్రతాల లీకేజి అరికట్టేందుకు కట్టుదిట్టంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో బార్ కోడ్లు, ఎన్క్రిప్టెడ్ సెక్యూరిటీ నంబర్లు, వాటర్‌మార్క్‌లతో సహా బోర్డు తీసుకున్న వివిధ భద్రతా చర్యలు లీకేజీలు, ఇతర అంతరాయాలను నివారించడంలో విజయవంతమయ్యాయని ఆయన పేర్కొన్నారు. బోర్డు లైవ్ ఫీడ్ ద్వారా పరీక్షా కేంద్రాల కార్యకలాపాలను పర్యవేక్షించే విస్తృతమైన సెంట్రల్ కమాండ్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ సంవత్సరం నిర్వహించిన మెట్రిక్యులేషన్ పరీక్షలకు 5 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో మాధ్యమ, స్టేట్ ఓపెన్ స్కూల్ సర్టిఫికెట్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు కూడా ఉన్నారు. రాష్ట్రం అంతటా 3,133 కేంద్రాలలో నిత్యం ఉదయం 9 గంటల నుండి 11.30 గంటల వరకు ఈ పరీక్షలు జరిగాయి. మే నెల మొదటి వారంలో ఫలితాలు త్వరలో మూల్యాంకనం -
నీలకంఠ సాగర్ అభివృద్ధి పనులపై అసంతృప్తి
జయపురం: జయపురంలో మరో చారిత్రిక పెద్ద చెరువు నీలకంఠ సాగర్ పునరుద్ధరణ, సౌందరీకరణ పనులు సగంలో ఆగిపోయాయి. గురువారం జయపురం సబ్ కలెక్టర్, మున్సిపాలిటీ కార్యనిర్వాహక అధికారి అక్కవరం శొశ్యా రెడ్డి నీలకంఠ సాగర్‌ను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. మున్సిపల్ చైర్మన్ నరేంద్ర కుమార్ మహంతి, మున్సిపల్ ఇంజినీర్ ఉన్నారు. నీలకంఠ సాగర్ పనులు పరిశీలించిన సబ్ కలెక్టర్ తీవ్ర అసంతప్తి వ్యక్తం చేశారు. వెంటనే పనులు పూర్తిచేయాలని, కంట్రాక్టర్‌కు నోటీసు పంపాలని ఇంజినీర్‌ను ఆదేశించారు. మూడేళ్లుగా నీలకంఠ సాగర్ పనులు జరుగుతున్నాయి. నేటికీ ప్రహరీ పనులు పూర్తి కాలేదు. మట్టి తీత, బురద తొలగింపు పనులు కూడా పూర్తి కాలేదు. పునరుద్ధరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. గతేడాది డిసెంబర్లో జిల్లా కలెక్టర్ వి.కీర్తి వాసన్ నీలకంఠ సాగర్‌ను సందర్శించి పనులు వెంటనే పూర్తిచేయాలని కంట్రాక్టర్‌ను ఆదేశించారు. అయినా పనులు సాగటంలేదు. 22 ఎకరాల నీలకంఠ సాగర్‌లో 16 ఎకరాల్లో బురద తొలగించారని తెలుస్తుంది. నీలకంఠ సాగర్ సుందరీకరణలో నాలుగు పక్కల పాద రస్తా, పార్క్, ఓపెన్ జిమ్, జలాశయం మధ్యలో వ్యూ పోయింట్ ఏర్పాటు చేయనున్నారు. ఈ కంట్రాక్ట్ను నేషనల్ బిల్డింగ్ కన్ట్రక్షన్ వారు టెండర్లో దక్కించుకున్నారు. ఈ సంస్థ వారు సబ్ కంట్రాక్టర్లకు ఇచ్చినట్లు తెలిసింది. రూ.9 కోట్ల 58 లక్షల వ్యయంతో నీలకంఠ సాగర్ పునరుద్ధరణ, సౌందర్యీకరణ పనులు చేపట్టారు. ఈ పనులను ఏప్రిల్ నెలలోగా పూర్తి చేయాలని కంట్రాక్టర్‌ను సబ్‌కలెక్టర్ ఆదేశించారు. -
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా మల్కన్‌గిరి సమితి చందన్గూడ గ్రామం వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. పదో తరగతి పరీక్షల చివరి రోజు కావడంతో విక్రమ్ సర్దార్(15) మరో విద్యార్థితో కలిసి బయల్దేరాడు. ఈ బాలుడు మల్కన్‌గిరి సమితి పద్మాగిరి పంచాయతీలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాడు. వీరికి సీరాపల్లి పాఠశాలలో సెంటర్ పడింది. దీంతోబైక్పై వెళ్తుండగా పికప్ వ్యాన్ ఢీకొట్టడంతో తలకు బలంగా గాయమైంది. అక్కడే స్పృహ కోల్పోయాడు. స్థానికులు వెంటనే మల్కన్‌గిరి ఆస్పత్రికి తరలించగా విక్రమ్ చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మల్కన్‌గిరి ఐఐసీ రీగాన్‌కీండో ఆస్పత్రికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం తర్వాత తల్లిదండ్రులకు అప్పగించారు. -
భారీగా గంజాయి స్వాధీనం
జయపురం: జయపురం సబ్ డివిజన్ బొయిపరిగుడ సమితి దట్టమైన అడవుల్లో భారీగా గంజాయి బస్తాలను బొయిపరిగుడ పోలీసులు పట్టుకున్నారు. గంజాయి 11 క్వింటాళ్ల 58 కేజీల 600 గ్రాములు ఉన్నట్లు పోలీసు అధికారి దీపాంజళీ ప్రదాన్ గురువారం వెల్లడించారు. బుధవారం కొంత మంది గ్రామీణులు అడవిలో వెళ్తుతుండగా వారికి ఒకచోట తెల్లని సంచులు తుప్పల్లో ఉండటం కని పించింది. వెంటనే వారు బొయిపరిగుడ పోలీసులకు సమాచారం అందించారు. పోలీస్ అధికారి దీపాంజళీ ప్రదాన్ ఆదేశాల మేరకు వెంటనే వెళ్లి దర్యాప్తు చేపట్టినట్లు సబ్ఇన్స్పెక్టర్ కష్ణ చంద్ర సెఠి తెలిపారు. ఇన్స్పెక్టర్ తన టీమ్‌తో బొయిపరిగుడ సమితి సెమిలిపొదర్ ప్రాంతంలోని దట్టమైన ఆడవుల్లో దాడులు చేశారు. వారికి గంజాయి బస్తాలు కనిపించగానే అప్రమత్తమై ఎవరు కనిపించినా ఎదుర్కొనేందుకు సన్నద్ధమయ్యారు. సమీపంలో ఎవరూ కనించకపోవటంతో బస్తాలను విప్పి చూడగా గంజాయి బయటపడింది. బస్తాలను పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లి తూకం వేయించారు. గంజాయిని దాచిన మాఫియాలో ఎవరూ పట్టబడలేదని పోలీసులు వెల్లడించారు. గంజాయిని ఇతర ప్రాంతాల వారికి అమ్మేందుకు మాఫీయా ఎవరికీ కనిపించకుండా అడవిలో దాచి పెట్టారని, నిందితులను త్వరలో పట్టుకుంటమని పోలీసు అధికారి ప్రదాన్ వెల్లడించారు. -
నదుల అనుసంధానానికి కేటాయింపులేవీ?
కవిటి: వంశధార, బాహుదా నదుల అనుసంధానానికి తాజా బడ్జెట్లో ఎటువంటి కేటాయింపులు చేయకపోవడం దారుణమని ఎమ్మెల్సీ నర్తు రామారావు అన్నారు. గురువారం శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే, నదులను అనుసంధానం చేసే కార్యక్రమాలు చేపడతామని ఎన్నికల ముందు అట్టహాసంగా ప్రకటనలు చేసిన చంద్రబాబు ఇప్పుడు ఆ విషయాన్నే విస్మరించడం సరికాదన్నారు. ముఖ్యంగా ఇచ్ఛాపురం నియోజకవర్గ ప్రజలకు, రైతాంగానికి ఎంతో అవసరమైన వంశధార నది జలాలను బాహుదాకు అనుసంధానం చేసేందుకు బడ్జెట్లో ఒక రూపాయి కూడా కేటాయింపులు చేపట్టకపోవడం అన్యాయమన్నారు. కేవలం వర్షాధారం మీదే వ్యవసాయ రంగం కొనసాగుతోందన్నారు. 10న అప్రెంటీస్ మేళా ఎచ్చెర్ల క్యాంపస్ : ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐలో ఈ నెల 10న ప్రధాన మంత్రి జాతీయ అప్రెంటీస్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ ఎల్.సుధాకరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఏడు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు ఈ మేళాకు హాజరవుతారని చెప్పారు. ఉదయం 9 గంటల నుంచి రిజస్ట్రేషన్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు ఆధార్, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని కోరారు. భక్తుడిపై దాసుడి దురుసు ప్రవర్తన సంతబొమ్మాళి: తక్కువ డబ్బులు పల్లెంలో పెట్టానని ఆగ్రహిస్తూ సంతబొమ్మాళి మండలం హనుమంతునాయుడుపేట పంచాయతీ పోతునాయుడుపేట గ్రామానికి చెందిన రెయ్యమ్మ దాసుడు (పరపటి రాము) తనపై దాడి చేశాడని టెక్కలి మండలం బొరిగిపేట గ్రామానికి చెందిన రోణంకి ధర్మారావు ఆవేదన వ్యక్తం చేశాడు. గురువారం దాసుడి వద్దకు వెళ్లి పళ్లెంలో పండ్లు, రూ.50 పెట్టగా.. ఇంత తక్కువ ఇస్తావా అంటూ ఆగ్రహిస్తూ పండ్లు, డబ్బులను బయటకు విసిరేశాడని, ఇదేంటని ప్రశ్నిస్తే దాడిచేసి సెల్‌ఫోన్ లాక్కున్నాడని వాపోయాడు. సెల్‌ఫోన్ తిరిగిచ్చేయాలని కోరితే అనుచరులు బయటకు గెంటేశారని, కొంతసేపటి తర్వాతే తిరిగిచ్చారని చెప్పాడు. కాగా, ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఆరా తీశారు. బార్ కౌన్సిల్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా కేంద్రంలోని జిల్లా న్యాయవాదుల బార్ కౌన్సిల్ ఎన్నికలకు నోటిఫికేషన్ గురువారం విడుదలైంది. ఏడాదికి ఒకసారి జరిగే ఈ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్‌ను ప్రస్తుత అధ్యక్ష, కార్యదర్శులు కె.ఈశ్వరరావు, వై.ప్రసన్నకుమార్ ప్రకటించారు. ఈ నెల 10న ఎన్నికల అధికారిని నియామకం, 17న నామినేషన్ల స్వీకరణ, 19న నామినేషన్లు పరిశీలన, 20న నామినేషన్ల ఉపసంహరణ, 21న పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా విడుదల చేస్తారు. 27న ఉదయం 10 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఫలితాలు విడుదల చేస్తారు. కార్యవర్గంలో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శి, మహిళా ప్రతినిధులు తదితర సభ్యులను ఎన్నుకుంటారు. లిఫ్ట్ ఇచ్చి.. పుస్తెలతాడు కొట్టేసి.. ● మానంపేట వద్ద చైన్‌స్నాచింగ్ ● వృద్ధురాలికి స్వల్ప గాయాలు జి.సిగడాం: మండలంలోని మర్రివలస గ్రామంలో వృద్ధురాలి మెడలో పుస్తెలతాడును గుర్తు తెలియని వ్యక్తి తెంచుకుపోయిన ఘటన గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మర్రివలసకు చెందిన పలిశెట్టి కన్నమ్మ మానంపేట గ్రామానికి నడిచి వెళ్తుండగా అటువైపు బైక్‌పై వెళ్తున్న వ్యక్తికి లిఫ్ట్ అడిగింది. మానంపేట వద్ద దిగి నడుచుకుంటూ వెళ్తుండగా వెనకి నుంచి వచ్చి ముఖంపై కారంజల్లి మెడలో తులన్నర బంగారు పుస్తెలతాడును తెంచుకుని బైక్‌తో పరారయ్యాడు. ఈ ఘటనలో వృద్ధురాలికి స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ ఎం.అవతారం, ఎస్ఐ మధుసూదనరావు ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
నెలాఖరులోగా వక్ఫ్ ఆస్తుల సర్వే
విజయనగరం అర్బన్: జిల్లాలోని వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని, దీనిలో భాగంగా ఈ నెలాఖరులోగా స్థలాల సర్వేను పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. ఈ మేరకు జిల్లా స్థాయి వక్ఫ్ పరిరక్షణ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ చాంబర్లో గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో వక్ఫ్ స్థలాల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వక్ఫ్ స్థలాలు అన్యాక్రాంతం అవకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. జిల్లాలో మైనారిటీ సంక్షేమశాఖ రికార్డుల ప్రకారం మొత్తం 96 వక్ఫ్ స్థలాలను గుర్తించినట్లు చెప్పారు. మొత్తం ఆ స్థలాల వివరాలను వెంటనే సంబంధిత ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లకు అందజేయాలని వక్ఫ్, మైనారిటీ శాఖాధికారులకు సూచించారు. అలాగే ఇవే కాకుండా రెవెన్యూ, టౌన్ రికార్డుల్లో ఉన్న మొత్తం వక్ఫ్ స్థలాల వివరాలను సేకరించి, వాటిని సర్వే చేసి, నమూనా పటాలతో సహా ఈ నెలాఖరుకు అందజేయాలని, అనంతరం ఈ స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. డీఆర్ఓ ఎస్.శ్రీనివాసమూర్తి, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు. -
నరసన్నపేటలో దొంగలు హల్చల్
నరసన్నపేట: మండల కేంద్రం నరసన్నపేటలో బుధవారం రాత్రి దొంగలు హల్చల్ సృష్టించారు. పట్టణ శివారులో జాతీయ రహదారి సర్వీసు రోడ్డుకు ఆనుకొని ఉన్న శ్రీనివాసనగర్‌లో రెండు ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డారు. తొలుత వీధిలో ఉన్న సీసీ కెమెరాల వైర్లు కట్ చేసి పట్నాల నాగేశ్వరరావు ఇంట్లో చొరబడ్డారు. నాగేశ్వరరావు కుటుంబం దైవ దర్శనాల టూర్లో ఉండటంతో ఇదే అదునుగా బీరువాను తెరిచి చిందరవందర చేశారు. ఇంటి ముందు సీసీ కెమెరాను ధ్వంసం చేశారు. ఇంట్లో ఏయే వస్తువులు చోరీకి గురయ్యాయో నాగేశ్వరరావు కుటుంబం తిరిగి వస్తే తప్ప స్పష్టత రాదు. ఈ ఇంటికి సమీపంలో ఉంటున్న పోలాకి మండలం రేవు అంప్లాం పంచాయతీ కార్యదర్శి టి.దుర్గాప్రసాద్ ఇంట్లో కూడా దుండగులు చోరీకి ప్రయత్నించారు. అక్కడ ఏమీ దొరక్కపోవడంతో గేటు విరగ్గొట్టి వెళ్లిపోయారు. గురువారం విషయం తెలుసుకున్న నరసన్నపేట ఎస్ఐ దుర్గాప్రసాద్ చోరీకి గురైన ఇళ్లను పరిశీలించారు. కాగా, దేవుడు బొమ్మలతో మూడు చక్రాల రథాలపై కొందరు వచ్చారని, చోరీ వీరి పనే అయి ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు. -
సంతాన దత్తత స్వీకార చట్టంపై అవగాహన
పర్లాకిమిడి: జిల్లా శిశు సురక్షా యూనిట్ ఆధ్వర్యంలో జిల్లా ముఖ్యవైద్యాధికారి కార్యాలయం మీటింగ్ హాల్లో సంతాన దత్తత స్వీకార నూతన చట్టం–2022, మైనర్ బాలికల ఎర్లీ ప్రెగ్నెన్సీని అరికట్టడంపై అధికారులు సమావేశంలో కూలంకషంగా చర్చించారు. జిల్లాలో మైనర్ బాలికల ప్రెగ్నెన్సీ సంఘటనలు అరికట్టాలని, అలాగే వారి సంతానం స్వీకరించే హక్కు ప్రైవేటు వ్యక్తులకు గానీ సంస్థలకు గానీ లేవని అదనపు జిల్లా మేజిస్ట్రేట్ రాజేంద్ర మింజ్ అన్నారు. దురదృష్టవశాత్తు మెడికల్‌లో మైనర్ బాలిక నెలలు నిండకుండా ప్రెగ్నెంట్ అయ్యి శిశువుకు జన్మనిస్తే.. మెడికల్ అధికారులు, ఇతర దత్తత కేంద్రాలు శిశు సురక్షా యూనిట్‌కు సమాచారం ఇవ్వాలని అన్నారు. బాల్యవివాహాలు, కుమారీ మాతృత్వ ఘటనలు తగ్గించడానికి అధికారులు తగు చర్యలు తీసుకోవాలని సీడీఎంఓ డాక్టర్ ఎంఎం అలీ అన్నారు. సమావేశంలో జిల్లా శిశు సురక్షా సమితి అధ్యక్షులు అశ్వినీ కుమార్ మహాపాత్రో, జిల్లా శిశు సురక్షా అధికారి అరుణ్ కుమార్ త్రిపాఠి, సబ్ డివిజనల్ పోలీసుఅధికారి మాధవానంద నాయక్, జిల్లా మహిళా సంక్షేమ శాఖ అధికారిని మనోరమాదేవి, సాధన వ్యక్తి ఘాసిరాం పండా, మరియు చైల్డ్‌లైన్, ఒన్ స్టాప్ సెంటర్ అధికారులు పాల్గ్గొన్నారు. -
తొలిరోజు ఆరు నామినేషన్లు
జయపురం: జయపురం బార్ అసోసియేషన్ ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం ప్రారంభమైంది. నామినేషన్ల మొదటి రోజు ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అధ్యక్ష పదవికి అజిత్‌కుమార్ సాహు తన నామినేషన్‌ను ఎన్నికల అధికారి దాసరథి పట్నాయక్‌కు సమర్పించారు. కార్యదర్శి పదవికి సచిదానంద మిశ్ర, ఉపాధ్యక్ష పదవికి నబీన చంద్ర సాహు, ప్రసాద్ చంద్ర బిడిక నామినేషన్లను ఎన్నికల అధికారికి అందజేశారు. సహాయ కార్యదర్శి పదవికి అంజన సింగ్, కోశాధికారి పదవికి బి.రామనుజ ప్రసాద్ నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల స్వీకరణలో ఎన్నికల అధికారి దాసరథి పట్నాయక్‌కు న్యాయవాదులు జ్యోతిరంజన్ పూజారి, ఎస్.ఎస్.సుందరమ్ సహకరించారు. తేనెటీగల దాడిలో 20 మందికి గాయాలు జయపురం: సబ్ డివిజన్ పరిధి బొరిగుమ్మ సమితి పాత బొరిగుమ్మ గ్రామంలో బుధవారం అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలో ఒక పెళ్లి జరుగుతున్న సమయంలో గ్రామ దేవతకు పూజలు చేస్తుండగా ఒక్కసారిగా తేనెటీగలు పూజా మందిరంలోకి వచ్చి దాడి చేశాయి. ఈ దాడిలో సుమారు 20 మందికి పైగా గాయపడ్డారు. గాయపడినవారిని బొరిగుమ్మ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు చికిత్స అందించి, కోలుకోవడంతో డిశ్చార్జి చేశారు. అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట పర్లాకిమిడి: కాశీనగర్ సమితి కె.సీతాపురం పంచాయతీ దేవుదళ గ్రామంలో గురువారం అభయాంజనేయ మందిరంలో స్వామి వారి విగ్రహాన్ని పురుషోత్తం వరప్రసాద్ దంపతులు ప్రతిష్టించారు. ఈ కార్యక్రమానికి గ్రామపెద్దలతోపాటు దేవాది రాజేష్‌కుమార్, కాశీనగర్ సమితి అధ్యక్షురాలు బల్ల శాయమ్మ, తదితరులు పాల్గొన్నారు. మహిళాభ్యున్నతికి తోడ్పాటు శ్రీకాకుళం అర్బన్ : మహిళాభ్యున్నతికి నాబార్డు అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థిక శక్తిగా ఎదగాలని నాబార్డు డీడీఎం కె.రమేష్ అన్నారు. శ్రీకాకుళం పట్టణంలో నాబార్డు, ఐసీడీఎస్ సంయుక్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు గురువారం ఐసీడీఎస్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యం, స్వయం ఉపాధి అభివృద్ధి అంశాలపై మహిళలు ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ బి.శాంతిశ్రీ, డీఆర్డీఏ డీపీఎం ఏ.శ్రీగౌరి, సీఐ టి.త్రినేత్రి, కేవీకే శాస్త్రవేత్తలు డాక్టర్ అనూష, డాక్టర్ వి.సునీత, సీడీపీవో శోభారాణి, డీసీసీబీ మేనేజర్ సంధ్యారాణి, ఝాన్సీ, లలిత, ఎఫ్పీఓలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. -
సాంకేతిక అంశాలపై పట్టు అవసరం
ఎచ్చెర్ల క్యాంపస్: విద్యార్థుల్లో సాంకేతిక అంశాలపై పట్టు అవసరమని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఎం.విజయ్‌కుమార్ అన్నారు. శ్రీకాకుళం ఆర్జీయూకేటీ క్యాంపస్ (ఎస్ఎంపురం)లో మూడు రోజుల పాటు నిర్వహించనున్న టెక్నికల్ ఫెస్ట్ టెక్నివేర్ను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజ్ఞానం, వినోదం, సాంకేతిక అంశాల అవగాహన ఆధారంగా కార్యక్రమం జరుగుతుందని, 600 కళాశాలలను ఆహ్వానించామని చెప్పారు. ఐఐటీ, ఎన్ఐటీ ప్రొఫెసర్లు, సాంకేతిక నిపుణులను రిసోర్సుపర్సన్లుగా ఆహ్వానించినట్లు తెలిపారు. ప్లేస్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టిపెట్టినట్లు చెప్పారు. -
దశాబ్దాలు గడుస్తున్నా.. జంఝాటం వీడటం లేదు. జంఝావతి కంఠ ఘోష ఎవరికీ వినిపించడం లేదు. ఒడిశా మడత పేచీ.. ఇక్కడి రైతులకు శాపంగా మారింది. ప్రస్తుతం అటు ఒడిశాతో పాటు.. ఇటు ఏపీలోనూ కేంద్రం మద్దతుతో నడుస్తున్న ప్రభుత్వాలే ఉన్నాయి. వివాదం పరిష్కారానికి ఇదే సరైన సమయ
●పట్టించుకోని కూటమి ప్రభుత్వం ●బడ్జెట్లోనూ అరకొర కేటాయింపులు ●ఒడిశాతో చర్చలకు ఇదే సమయమంటున్న రైతులు సాక్షి, పార్వతీపురం మన్యం: కొమరాడ మండలం రాజ్యలక్ష్మీపురం వద్ద జంఝావతి ప్రాజెక్టుకు 1976లో శ్రీకారం చుట్టారు. అప్పట్లో రూ.15.51 కోట్ల అంచనా వ్యయంతో దీనిని ప్రారంభించారు. కొమరాడ, గరుగుబిల్లి, పార్వతీపురం, సీతానగరం, మక్కువ మండలాలకు నీటిని అందించాలన్నది దీని ప్రధాన ఉద్దేశం. వాస్తవానికి ఒడిశాలో వర్షాలు కురిస్తేనే నదిలో నుంచి వచ్చిన నీటిని ఇక్కడ ఒడిసిపట్టవచ్చు. జలాశయం పూర్తయితే ఒడిశా రాష్ట్రంలోని మూడు గ్రామాలతోపాటు.. కొంత అటవీ ప్రాంతం ముంపు బారిన పడతాయి. దీంతో గేట్ల ఏర్పాటు సవాల్‌గా మారింది. ఇరు రాష్ట్రాల మధ్య వివాదమై కూర్చొంది. గతంలో పలు దఫాలు ఇరు రాష్ట్రాల మధ్య చర్చలు జరిగాయి. నగుల్లువలస, చీకటిలోవ, పిల్లిగుడ్డి గ్రామాల వారికి పునరావాసంతోపాటు.. నష్టపోతున్న ప్రాంతానికి పరిహారం ఇచ్చేందుకు కూడా ఏపీ ప్రభుత్వం ముందుకొచ్చింది. గేట్ల ఏర్పాటుకు మాత్రం ఒడిశా ప్రభుత్వం అంగీకరించలేదు. స్పిల్‌వే దగ్గర పనులు చేసుకునేందుకు మాత్రమే అంగీకరించింది. దీంతో 1980వ దశకంలో కొమరాడ మండలంలోని జంఝావతి ఎగువ, దిగువ కాలువల నుంచి 24 వేల ఎకరాలకు సాగునీరందించడమే లక్ష్యంగా రూ.124 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు పనులు చేపట్టారు. ఎనిమిది వేల ఎకరాలకు మాత్రమే నీరు ఇవ్వగలిగారు. అప్పటి నుంచి ప్రాజెక్టు పూర్తిస్థాయిలో పూర్తి కాకపోవడంతో రైతులకు అరకొర సేవలే అందుతున్నాయి. ఒడిశా ప్రభుత్వంతో చర్చలు సఫలమైతే ఇక్కడి రైతాంగానికి మేలు చేకూరుతుంది. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కూడా ఈ సమస్యపై దృష్టి సారించారు. ఒడిశా ప్రభుత్వంతో చర్చలు జరిపారు. అటు నుంచి సానుకూలత రాకపోవడంతో సమస్య కూడా అలానే ఉండిపోయింది. అసలే వివాదం.. ఆపై అరకొర కేటాయింపులు పూర్తిస్థాయిలో పనులు జరగకపోవడం వల్ల శివారు భూములకు సాగునీరు అందని పరిస్థితి ఉంది. 27,790 కిలోమీటర్ల పొడవు ఉన్న ఎగువ కాలువ ద్వారా కొమరాడ, పార్వతీపురం, సీతానగరం మండలాలల్లో 12 వేల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. కొమరాడ మండలం డంగభద్ర వద్ద పెద్ద బండరాయి ఉండటంతో నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడింది. దిగువ కాలువ నుంచి ఎగువ కాలువకు నీరును ఎత్తిపోసేందుకు ఏర్పాటు చేసిన పథకం మరమ్మతులకు గురైంది. దీనివల్ల కేవలం 700 ఎకరాలకు మాత్రమే నీరందే పరిస్థితులు ఉన్నాయి. దిగువ కాలువ ద్వారా గరుగుబిల్లి, పార్వతీపురం, కొమరాడ, సీతానగరం మండలాల్లోని 12 వేల ఎకరాలకు సాగునీరందాల్సి ఉంది. కాలువ పనులు జరిగినా నీరు మళ్లించే మదుముల వద్ద షట్టర్లు ఏర్పాటు చేయలేదు. పంటభూములకు సాగునీరు చేరేలా పిల్ల కాలువలనుతవ్వాల్సి ఉంది. కొన్నిచోట్ల యూటీలు నిర్మించాలి. ఈ పనులకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించాల్సి ఉన్నా.. కూట మి ప్రభుత్వం కనీసం దృష్టి సారించడం లేదు. ఇటీవల కూటమి ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్లో జంఝావతి ప్రాజెక్టుకు కనీస నిధులు కేటాయించక పో వడం పట్ల ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి తీవ్ర స్థాయిలో ఖండించింది. ప్రాజెక్టు వద్ద నిరసన వ్యక్తం చేసింది. జంఝావతికి బడ్జెట్లో ఎటువంటి ప్రాధాన్యత లేకపోవడం దారుణమని చెరువుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మరిశర్ల మాల తీ కృష్ణమూర్తి నాయుడు, ప్రతినిధులు వి.దాలినాయుడు, వి.శ్రీహరి, టి.ప్రభాకరరావు, బి.కృష్ణ అన్నారు. ఇది పూర్తిగా ఈ ప్రాంత ప్రజాప్రతినిధుల వైఫల్యమేనని విమర్శించారు. రెండు రాష్ట్రాల్లోనూ కూటమి అనుకూల ప్రభుత్వాలే ఉన్నాయని.. ఒడిశాతో ఉన్న అతి చిన్న సమస్యను పరిష్కరించడానికి ఇదే మంచి సమయమని తెలిపారు. పాలకులు ఆ దిశగా ఆలోచించకపోవడం బాధాకరమన్నారు. ఆస్ట్రియా సాంకేతికతతో రబ్బరు డ్యాం.. 2006లో ఆస్ట్రియా సాంకేతికతతో నాటి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఇక్కడ రబ్బరు డ్యాం ఏర్పాటు చేసింది. దీని ద్వారా 12 వేల ఎకరాలకు నీరివ్వాలని భావించారు. 3.60 కిలోమీటర్ల లింకు కాలువను తవ్వి, డిస్ట్రిబ్యూటరీతో అనుసంధానించడం ద్వారా మరో 12 వేల ఎకరాలకు తరలించాలని నిర్ణయించారు. ఈ మేరకు 650 హార్స్ పవర్ గల మూడు మోటార్లను, ప్రత్యేకంగా విద్యుత్తు సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. తాత్కాలికంగానైనా చేపట్టిన ఈ ప్రక్రియ వల్లే 15 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. -
భూములు లాక్కుని కడుపు కొట్టొద్దు
● బైపాస్ నిర్వాసితుల సమావేశం ● భూమి ధర పెంచాలని రైతుల పట్టు శృంగవరపుకోట: మాకు జీవనాధారమైన భూములు లాక్కుని కడుపు కొట్టకండి. అడిగిన ధర ఇవ్వకుండా మా భూములు లాక్కుంటే మేం ఏం కావాలి. ప్రభుత్వమే భూములు లాక్కుంటామంటే ఎవరికి చెప్పుకోవాలంటూ నిర్వాసిత రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ–బొడ్డవర జాతీయ రహదారి 516బి రహదారి విస్తరణ, అభివృద్ధి పనుల్లో భాగంగా మండలంలోని కొత్తూరు నుంచి కాపుసోంపురం వరకు కొత్తగా నిర్మాణం చేయనున్న బైపాస్ రహదారి ఏర్పాటులో భూములు కోల్పోతున్న రైతులతో ఆర్డీవో సూచనల మేరకు స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ల్యాండ్ అక్విజిషన్ డీటీలు కె.హరికిరణ్, ఎస్.కోట ఇన్చార్జ్ తహసీల్దార్ కె.భరత్‌కుమార్ గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డీటీ హరికిరణ్ మాట్లాడుతూ రైతుల నుంచి భూమిని ఐదు కేటగిరిలుగా తీసుకుంటామని, ఎస్ఆర్ఓ నిర్ధారించిన మార్కెట్ఽ ధర కన్నా రెండున్నర రెట్లు అధికంగా చెల్లిస్తామని చెప్పారు. ముందుగా అవార్డు ప్రకటించి, నగదు చెల్లించిన తర్వాత పనులు ప్రారంభిస్తారని రైతుల ప్రశ్నకు బదులు చెప్పారు. దీనిపై పలువురు రైతులు మాట్లాడుతూ ఐదు రెట్లు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇటీవల ప్రభుత్వం, స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖలు ఫిబ్రవరిలో పెంచిన భూముల ధరల ఆధారంగా పరిహారం చెల్లించాలని కోరారు. దీనిపై డీటీ హరికిరణ్ బదులిస్తూ నోటిఫికేషన్ ఇచ్చే తేదీ నాటికి ఉన్న మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం చెల్లిస్తామని, గజాల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నా, ఎస్ఆర్ఓ రికార్డుల్లో గజా ల్లో నమోదై ఉంటేనే గజాల్లో చెల్లింపులు చేస్తారని చెప్పారు. రెవెన్యూ రికార్డుల్లో యాజమాన్య హక్కులు ఉన్న వారికే చెల్లింపులు చేస్తారని చెప్పారు. ‘పరిహారం పెంపు అధికారం లేదు మేము జిల్లా అధికారులం కాదు. ఏమీ చేయలేం. మీ వినతులు జిల్లా అధికారులకు వివరిస్తాం అంటూ అధికారులు రైతుల డిమాండ్లకు బదులిచ్చారు. దీంతో రైతులు మాట్లాడుతూ నోటిఫికేషన్ ఇచ్చిన రోజు మాకు చెప్పి ఇచ్చారా? మా ఆస్తి తీసుకుని మా ఉపాధి లాక్కునేటప్పుడు మీ ప్రభుత్వాలు నిర్ణయించిన మార్కెట్ ధర అడిగితే ఇవ్వరా? ఇదెక్కడి న్యాయం, మా కుటుంబాలు ఏం కావాలి అంటూ భోరుమన్నారు. కొందరు రైతులు అధికారులకు దండాలు పెట్టి మాకు న్యాయం చేయండి, మా కడుపులు కొట్టకండి అంటూ మొరపెట్టుకున్నారు. రైతులు తమ అంగీకారం చెప్పకపోవడంతో అసంపూర్తిగానే సమావేశం అయ్యిందని పించారు. సమావేశంలో పలువురు రైతులు, వీఆర్వోలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
హోమ్‌గార్డు కుటుంబానికి పోలీస్ శాఖ ‘చేయూత
విజయనగరం క్రైమ్: జిల్లా పోలీస్‌శాఖలో పని చేసి, ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన హోమ్‌గార్డు కుటుంబానికి పోలీస్ శాఖ చేయూత అందించింది. ఈ మేరకు ఎస్పీ వకుల్ జిందల్ తన కార్యాలయంలో గురువారం హోమ్ గార్డు కుటుంబానికి సుమా రు రూ.3 లక్షల చెక్కును అందజేశారు. ఏడాది పొడవునా హోమ్‌గార్డు సిబ్బంది పోగు చేసిన ఒక్క రోజు డ్యూటీ అలవెన్స్ చెక్కును జిల్లా పోలీసు కార్యాలయంలో హోంగార్డు భార్య వి.సత్యవతికి ఎస్పీ అందజేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, హోమ్గార్డ్స్ ఇన్చార్జ్ ఆర్ఐ ఆర్.రమేష్‌కుమార్, డీపీఓ సూపరింటెండెంట్ ఏఎస్వీ ప్రభాకరరావు, పోలీసు కుటుంబసభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. సెంచూరియన్‌లో ఘనంగా జాతీయ ఫార్మసీ విద్యా దినోత్సవం నెల్లిమర్ల రూరల్: మండలంలోని టెక్కలి సెంచూరియ న్ విశ్వ విద్యాలయంలో జాతీయ ఫార్మసీ విద్యా దినో త్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఔషధ విద్యకు పునాది వేసిన ప్రొఫెసర్ మహాదేవ్ లాల్ ష్రాఫ్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్ర పఠానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వీసీ ప్రొఫెసర్ ప్రశాంత కుమార్ మహంతి మాట్లాడుతూ ఈ ఏడాది ఫార్మా, పార్మసీ ప్రాక్టీస్‌లో వ్యవస్థాపక స్టార్టప్‌లు ప్రోత్సహించడమే ప్రధాన అజెండాగా ప్రభుత్వం పేర్కొందని, ఆ దిశగా విద్యార్ధులు సన్నద్ధం కావాలని సూచించారు. శిక్షణ ప్రారంభం రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి శాఖ ఆదేశాల మేరకు సెంచూరియన్‌లో రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్యామ్‌ప్రసాద్ గురువారం ప్రారంభించారు. గ్రామీణ యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకువెళ్తున్నామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. కుక్కల దాడిలో 10 మేక పిల్లల మృతి మెంటాడ: లోతుగెడ్డ గ్రామంలో కర్రి అక్కయ్యకు చెందిన 10 మేక పిల్లలు కుక్కల దాడిలో మృత్యువాత పడ్డాయి. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన అక్కయ్య పిట్టాడ గ్రామానికి మేకల మందను మేత కోసం తీసుకువెళ్లి మేక పిల్లలను గూడులో ఉంచాడు. ఆ గూడుపై కుక్కలు దాడి చేసి 10 మేక పిల్లలును చంపివేశాయి. మృతి చెందిన మేక పిల్లల విలువ సుమారు 50 వేల రుపాయలు ఉంటుందని ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు, -
పన్నుల చెల్లింపులో నెల్లిమర్ల ఫస్ట్
● పట్టణాల్లో ఆస్తి పన్ను వసూళ్లలో అధికారులు బిజీ ● 73.96 శాతం వసూళ్లతో నెల్లిమర్ల నగర పంచాయతీ ముందంజ ● నాలుగు పట్టణాల్లో పన్ను డిమాండ్ రూ.51.37 కోట్లు ● ఇప్పటివరకు వసూలైనది రూ.28.56 కోట్లు ● బకాయిదారులకు రెడ్ నోటీసులు జారీ చేస్తున్న యంత్రాంగం విజయనగరం: ఆస్తి పన్ను చెల్లింపులో నెల్లిమర్ల నగరపంచాయతీ ప్రజలు జిల్లాలో ముందంజలో ఉన్నారు. ఆర్థిక సంవత్సరం ముగింపు గడువు (మార్చి 31) దగ్గర పడుతుండడంతో ఆస్తి పన్ను వసూళ్లలో కార్పొరేషన్, మున్సిపల్, నగర పంచాయతీ అధికారులు నిమగ్నమయ్యారు. మొండిబకాయిల వసూళ్లే లక్ష్యంగా నోటీసులు జారీ చేస్తున్నారు. పన్నులు చెల్లించి పట్టణాల అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నారు. విజయనగరం జిల్లా పరిధిలోని విజయనగరం కార్పొరేషన్‌తో పాటు బొబ్బిలి మున్సిపాలిటీ, నెల్లిమర్ల, రాజాం నగర పంచాయతీల్లో 2024–25 ఆర్థిక సంవత్సరానికి డిమాండ్ రూ.51.37 కోట్లు కాగా ఇప్పటివరకు రూ.28.56 కోట్లు వసూలు చేశారు. మొత్తం డిమాండ్‌లో 55.59 శాతం మున్సిపల్ ఖజానాకు చేరింది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు మొదటి విడత, అక్టోబర్ నుంచి మార్చి వరకు రెండో విడతగా పన్నులు వసూలు చేయడం సహజం. ఇప్పటి వరకు నెల్లిమర్ల నగర పంచాయతీ 73.96 శాతం వసూళ్లు చేసి మొదటి స్థానంలో నిలవగా.. 60.91 శాతం వసూళ్లతో బొబ్బిలి మున్సిపాలిటీ రెండవ స్థానంలో, 59 శాతం వసూళ్లతో రాజాం మూడవ స్థానంలో, 53.95 శాతం వసూళ్లతో విజయనగరం కార్పొరేషన్ చివరి స్థానంలో ఉంది. నీటిపన్ను వసూళ్లలో సైతం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోలేదు. సిబ్బందిపై ఉన్నతాధికారులు ఒత్తిడి పెంచడంతో క్షేత్రస్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి పన్నుల వసూళ్లకు శ్రీకారం చుట్టారు. ● బకాయిదారులపై కొరడా.. ఆర్థిక సంవత్సరం ముగింపు గడువు దగ్గర పడుతుండడంతో పన్నుల వసూలుకు బకాయిదారులపై అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. మొండి బకాయిదారుల జాబితాను సిద్ధంచేసి రెడ్ నోటీసులు జారీ చేస్తున్నారు. అప్పటికీ స్పందించకుంటే ఇంటికి వేసిన తాగునీటి కుళాయి కనెక్షన్లను తొలగిస్తున్నారు. పన్ను బకాయి దారుల జాబితాలను కార్పొరేషన్/మున్సిపల్ కార్యాలయాలతో పాటు అన్ని సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నారు. దీర్ఘకాలికంగా బకాయిపడిన వారి దుకాణాలను సీజ్ చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పన్నుల వసూళ్లపై యంత్రాంగం ఒత్తిడి చేస్తోందన్న చర్చ పట్టణాల్లో సాగుతోంది. పన్నలు చెల్లించాలి స్థానిక సంస్థల అభివృద్ధికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయమే కీలకం. ఆదాయం వస్తేనే అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఆస్కారం ఉంటుంది. ఆర్థిక సంవత్సరం ముగింపు గడువు దగ్గర పడుతోంది. ప్రజలంతా సహకరించి పన్ను బకాయిలు చెల్లించాలి. ఆన్లైన్లోను, మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటర్లలో పన్ను చెల్లించి రసీదు పొందాలి. లేని పక్షంలో మున్సిపల్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటాం. – పల్లి నల్లనయ్య, కమిషనర్, విజయనగరం కార్పొరేషన్ -
నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్‌కు పేర్లు నమోదు చేసుకోవాలి
పార్వతీపురం: నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు యువత తమ వివరాలను నమోదు చేసుకోవాలని నెహ్రూ యువ కేంద్రం జిల్లా కె. వెంకట్ ఉజ్వల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత దేశ అభివృద్ధిలో యువత భాగస్వామ్యం కావాలని, యువత మేధాశక్తిని ఉపయోగించడంలో ప్రపంచంలో కెల్లా మన దేశం ప్రథమ స్థానంలో ఉండాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంకల్పిస్తున్నట్లు తెలిపారు. 18 నుంచి 25ఏళ్ల వయస్సు కలిగిన వారు ఈ యూత్ పార్లమెంట్ పోటీల్లో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. యువత మై భారత్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని తరువాత ఒక్క నిమిషం నిడివి కలిగిన ‘‘వాట్ డజ్ వికసిత్ భారత్ మీన్ టూ యూ’’ అనే అంశంపై వీడియో చేసి మార్చి 9 అర్ధరాత్రిలోపు మై భారత్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని సూచించారు. స్క్రీనింగ్ చేసి జిల్లా స్థాయిలో ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. జిల్లాస్థాయిలో వన్‌నేషన్, వన్ ఎలక్షన్, పేవింగ్ ది వేఫర్ వికసిత్ భారత్ అనే అంశంపై మూడు నిమిషాలు మాట్లాడాలని యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు సంస్థ రూపొందించిన వీడియోను వీక్షించేందుకు క్యూఆర్‌కోడ్‌ను అందుబాటులో ఉంచినట్లు తెలియజేశారు. -
ఓపెన్ హౌస్‌తో పోలీస్ వ్యవస్థ్ధపై అవగాహన
పార్వతీపురం రూరల్: మహిళ సాధికార వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని చాకలి బెలగాంలో ఉన్న పోలీస్‌శాఖ మల్టీఫంక్షన్ హాల్ ఆవరణంలో గురువారం ఓపెన్ హౌస్ ఫర్ ఉమెన్ కార్యక్రమాన్ని జిల్లా పోలీస్‌శాఖ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఎస్పీ మాధవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల ఽభద్రతే ప్రాధాన్యంగా పోలీసుశాఖ నిరంతరం పనిచేస్తుందని మార్చి 8వ తేదీన జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురష్కరించుకుని మహిళ సాధికార వారోత్సవాలను పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. పోలీస్‌శాఖ శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా వినియోగించే ఆయుధాలను, పోలీస్‌శాఖలో కీలకమైన సాంకేతిక వ్యవస్థను, నేరస్థలంలో సాక్ష్యాలను సేకరించేందుకు క్లూస్‌టీమ్ ఉపయోగించే పరికరాలు, డాగ్‌స్క్వాడ్ పనితీరును కార్యక్రమంలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి కళాశాల విద్యార్థినులు, అంగన్వాడీ కార్యకర్తలు, మహిళా పోలీస్‌సిబ్బంది హాజరయ్యారు. కార్యక్రమంలో ఎస్పీ స్వయంగా కొన్ని ఆయుధాలు వినియోగించే పద్ధతులను మహిళలకు వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన జాగిలాల విన్యాసాలు చూపరులను అబ్బురపరిచాయి. కార్యక్రమంలో ఏఎస్పీ అంకిత సురానా, డీఎస్పీ థామస్ రెడ్డి, ఆర్ఐలు రాంబాబు, నాయుడు, టౌన్ సీఐ మురళీధర్, రూరల్ ఎస్సై సంతోషి, శాఖాపరమైన సిబ్బంది పాల్గొన్నారు. -
8న సబ్ జూనియర్ కబడ్డీ జట్ల ఎంపిక
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న సబ్‌జూనియర్స్ బాల, బాలికల కబడ్డీ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారుల ఎంపిక పోటీలు ఈనెల 8వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి కేవీ ప్రభావతి గురువారం తెలిపారు. నగరంలోని సిటీ క్లబ్ ఆవరణలో ఆ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఎంపిక పోటీలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఎంపిక పోటీల్లో 16 సంవత్సరాలలోపు వయస్సు కలిగి ఉండి 55 కేజీల బరువు కలిగిన క్రీడాకారులు మాత్రమే పాల్గొనేందుకు అర్హులుగా పేర్కొన్నారు. జిల్లా జట్ల ఎంపికల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఈనెల 14 నుంచి 16వ తేదీ వరకు కడప జిల్లాలో జరగబోయే అంతర్ జిల్లాల పోటీలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం కల్పించనున్నట్లు తెలిపారు. అర్హత, ఆసక్తిగల క్రీడాకారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఫోన్ 9949721949 నంబర్‌ను సంప్రదిం చాలని కోరారు. గంజాయితో ఇద్దరి అరెస్ట్నెల్లిమర్ల: గంజాయి లావాదేవీలు చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్సై బి.గణేష్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఒడిశాలోని రాయగడ నుంచి గంజాయిని నెల్లిమర్ల పట్టణంలోని చంపావతి నది తీరంలో థామస్ పేట గ్రౌండ్ వద్దకు తరలిస్తున్న వ్యక్తి, దానిని కొనుగోలు చేసిన వ్యక్తిని పట్టుకుని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నెల్లిమర్లకు చెందిన వ్యక్తి గంజాయిని చిన్నచిన్న ప్యాకెట్ల రూపంలో వినియోగ దారులకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. వారిద్దరి దగ్గర సుమారు ఒక కేజీ 160 గ్రాముల గంజాయిని సీజ్ చేసి అరెస్టు చేసినట్లు చెప్పారు. రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతిపార్వతీపురం రూరల్: మండలంలోని జమ్మిడివలస గ్రామానికి చెందిన కర్రి ప్రసాద్(39) రైలు నుంచి ప్రమాదవశాత్తు జారి పడి గురువారం మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించి మృతుడి బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పరీక్ష నిమిత్తం విజయవాడ వెళ్లి తిరిగి స్వగ్రామానికి ట్రైన్లో వస్తుండగా మార్గమధ్యంలో అనకాపల్లి వద్ద ప్రమాదవశాత్తు జారి పడి మృతిచెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మృతుడు ఆర్మీలో పనిచేసి ఉద్యోగ విరమణ చేశాడు. కుటుంబ పెద్దదిక్కును కోల్పోవడంతో కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. రెండు బైక్‌లు ఢీకొని వ్యక్తి ..రామభద్రపురం: మండలం పరిధిలోని తారాపురం టీకాల లచ్చన్న గుడి వద్ద గురువారం రెండు బైక్‌లు ఢీ కొని ఒకరు మృతిచెందగా మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రామ్‌గోపాల్ గౌతం, సాన్వర్ ప్రసాద్ వర్మ స్నేహితులు. వారిద్దరూ కొన్ని నెలల క్రితం జీవనోపాధి కోసం సాలూరుకు వచ్చి కొత్తభవనాలకు పుట్టీలు, సీలింగ్‌లు వేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఉత్తరప్రదేశ్‌లోని సొతూరుకు వెళ్తానని బొబ్బిలి రైల్వేస్టేషన్లో డ్రాప్ చేయమని రామ్‌గోపాల్‌ను ప్రసాద్ వర్మ కోరడంతో ఇద్దరూ కలిసి ద్విచక్రవాహనంపై బొబ్బిలి రైల్వేస్టేషన్‌కు బయల్దేరి వెళ్తున్నారు. సరిగ్గా తారాపురం టీకాల లచ్చన్న గుడి వద్దకు వచ్చేసరికి వారికంటే ముందుగా ద్విచక్రవాహనంపై వెళ్తున్న అనకాపల్లి జిల్లా రామవరం గ్రామానికి చెందిన రామదాసు సొంతూరుకు వెళుతూ గుడిలో అమ్మవారిని దర్శించుకుందామని బైక్ స్లో చేశాడు. ఇంతలో వెనకనుంచి వస్తున్న ఇద్దరు స్నేహితులు ముందున్న బైక్‌ను ఢీకొట్టడంతో బైక్ వెనుక కూర్చున్న ప్రసాద్ వర్మ(42) ప్రమాదవశాత్తు తుళ్లిపోయి రోడ్డు దెబ్బతిన్నాడు. దీంతో తలకు తీవ్రగాయం కాగా, రామ్‌గోపాల్ గౌతమ్‌కు, రామదాసుకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం తెలుసుకున్న ఎస్సై వి.ప్రసాదరావు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రథమ చికిత్స నిమిత్తం గాయపడిన ముగ్గురిని బాడంగి సీహెచ్‌సీకి తరలించారు. అక్కడికి చేరుకునే సరికి ప్రసాద్ వర్మ మృతిచెందాడని వైద్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు ఎస్సై ప్రసాదరావు కేసే నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోక్సో కేసు నమోదు బొండపల్లి: మండలంలోని ఒక గ్రామానికి చెందిన బాలుడు మరో గ్రామానికి చెందిన బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు బాధిత బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై యు.మహేష్ తెలిపారు. బాలికతో పాటు బాలిక తల్లి దండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు నిర్వహించి కేసు నమోదు చేసినట్లు చెప్పారు. -
ఫిషింగ్ హార్బర్లో భారీ అగ్ని ప్రమాదం.. 30 బోట్లు దగ్ధం
భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రంలోని ఫిషింగ్ హార్బర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పారాదీప్ ఫిషింగ్ హార్బర్లో మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 30 ఫిషింగ్ బోట్లు దగ్థం.. కోట్లలో ఆస్తి నష్టం వాటిలినట్లు తెలుస్తోంది. ఈ సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది హుటాహుటీనా అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. -
డీసీపీగా జగ మోహన్ మీనా బాధ్యతల స్వీకరణ
భువనేశ్వర్: భువనేశ్వర్ కొత్త డీసీపీగా జగ మోహన్ మీనా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన 2013 సంవత్సరపు ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి. ఇప్పటివరకూ డీసీపీగా విధులు నిర్వహించిన పినాక్ మిశ్రా నుంచి జగమోహన్ మీనా బాధ్యతలు చేపట్టారు. కటక్ నగర డీసీపీగా కూడా ఈయన పని చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, నేరస్తుల కదలికలపై గట్టి నిఘా వేస్తామన్నారు. దీనికోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. సమాన్యులకు సైతం పోలీసు సేవలు అందిస్తామన్నారు. ఇందులో భాగంగా భువనేశ్వర్ ప్రజల కోసం 82803 38302 నంబర్‌ను అందుబాటులో ఉంచుతామన్నారు. ఎవరికై నా తమ సేవలు అవసరమైతే ఈ నంబర్‌ను సంప్రదించాలని, వాట్సాప్ ద్వారా కూడా సమస్యలను తెలియజేయవచ్చునన్నారు. నాలుగు గంటలు జగన్నాథుని దర్శనం నిలిపివేత భువనేశ్వర్: పూరీ జగన్నాథ మందిరంలో బుధవారం సాయంత్రం మూల విరాట్టు దర్శనాన్ని నాలుగు గంటలపాటు తాత్కాలికంగా నిలిపి వేశారు. రత్న వేదికపై కొలువు దీరిన బలభద్ర స్వామి, దేవీ సుభద్ర, జగన్నాథుని మూల విరాట్టులకు శ్రీ ముఖ సింగారం సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా సాయంత్రం ఆరు నుంచి రాత్రి పది గంటల వరకు భక్తులకు స్వామి దర్శనాన్ని నిలిపి వేసినట్లు దేవస్థానం అధికార యంత్రాంగం తెలిపింది. మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యం ● రుణ మేళాలలో ఎమ్మెల్యే రూపు బొత్ర జయపురం: జయపురం సబ్ డివిజన్ బొరిగుమ్మ సమితి కార్యాలయ ప్రాంగణంలో మిషన్ శక్తి మేగా రుణ మేళా బుధవారం నిర్వహించారు. సమితి బీడీఓ సంధ్య సమరత్ పర్యవేక్షణలో జరిగిన మేళాకు కొట్‌పాడ్ ఎమ్మెల్యే రూపు బొత్ర ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల ఆర్థిక ఉన్నతికి రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తుందని వెల్లడించారు. సుభద్ర పథకంలో ప్రతి మహిళకు ఏడాదికి రూ.10 వేల చొప్పున ఐదేళ్లలో రూ.50 వేలు వారి ఖాతాల్లో వేస్తుందన్నారు. మహిళలకు అందజేస్తున్న ఆర్థిక సహాయం, రుణాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. బొరిగుమ్మ సమితిలోని 110 మహిళా స్వయం సహాయక గ్రూపులకు రూ.4 కోట్ల 10 లక్షల 80 వేల చెక్‌ను అందజేశారు. నాలుగు స్వయం సహాయక గ్రూపులకు రూ.పది లక్షల చొప్పున రుణం అందజేశారు. సమితి కో ఆర్డినేటర్ దేవేంద్రకుమార్ పండా పర్యవేక్షించారు. అడుగంటిన చెరువు! పర్లాకిమిడి: పట్టణంలో బలుంకేశ్వర ఆలయం వద్ద వున్న పుష్కరిణి కాలక్రమేణా ఏపుగా గడ్డి, పిచ్చి మొక్కలుపెరిగి ఎండిపోయింది. పట్నాయక్ చెరువుగా పిలువబడే ఈ పుష్కరిణిలో ఒకప్పుడు చాలామందికి వేసవిలో స్నానాలు ఆచరించడం, చేపల చెరువుగా పేరుగాంచింది. పచ్చకామర్లు వ్యాధిగ్రస్తులు ఈ పుష్కరిణిలో స్నాణం చేస్తే అనారోగ్యం నుంచి విముక్తి అవుతారన్న నమ్మకం వుండేది. కాలక్రమేణ ఈ పుష్కరిణి ఆక్రమణలకు గురుకావడం, పునరుద్ధరణ పనులు చేపట్టకపోవడంతో కుసించుకుపోయింది. చెరువు పుణరుద్ధరణకు పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి స్థానికులతో చర్చించి తగు చర్యలు చేపడతామని అన్నారు. -
దోపిడీ దొంగల అరెస్టు
జయపురం: కత్తితో బెదిరించి డబ్బులు దోచుకున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు జయపురం పట్టణ పోలీసు అధికారి ఈశ్వర తండి బుధవారం వెల్లడించారు. అరెస్టయిన వారిలో ఒడియామేదరి వీధికి చెందిన సునీల్ పొరజ అలియాస్ లాలు, సౌరగుడ సమీపంలో ఉంటున్న ప్రభీర్ హరిజన్ ఉన్నట్లు తెలిపారు. ఈ నెల 1న బొరిగుమ్మ సమితి సేమలగుడ పంచాయతీ నకులగుడ గ్రామానికి చెందిని జుధిష్టర్ మాలి స్నేహితుడు బైక్ సర్వీసింగ్ కోసం జయపురం వచ్చాడు. బైక్ సర్వీసింగ్ అనంతరం మధ్యాహ్నం భోజనం చేసి తమ గ్రామానికి బయలుదేరాడు.ఆ సమయంలో జయపురం గాంధీ చౌక్ సమీపంలో ముగ్గురు దుండగులు స్కూటీపై వచ్చారు. జుధిస్టర్ను ఫోన్ ఇచ్చేయాలని బెదిరించారు. అందుకు అంగీకరించకపోవడంతో అతడిని కొట్టి అతడి చేతులు వెనక్కి విరచి కత్తి చూపి ఏడు వేల రూపాయలు దోచుకుపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అక్కడి సీసీ టీవీలను పరిశీలించి దుండగులు వచ్చిన స్కూటీ నంబర్ ఆధారంగా యజమానిని గుర్తించారు. అతడిని ప్రశ్నించగా తెలిసిన వ్యక్తికి స్కూటీ ఇచ్చానని వెల్లడించాడు. తమదైన శైలిలో పోలీసులు ప్రశ్నించగా దోపిడీ సూత్రధారి సునీల్ పొరజ అని గుర్తించారు. బైక్‌లు తీసుకెళ్లి దొంగతనాలు చేయడం సునీల్‌కు అలవాటని, గతంలోనూ ఇలా దొంగతనాలు చేశాడని పోలీసు అధికారి వెల్లడించారు. అతడితో పాటు ప్రభీర్ను అరెస్టు చేసినట్లు చెప్పారు. కేసుని ఏఎస్ఐ రమేష్ చంద్ర మహాపాత్రో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
సాక్ష్యం చెబుతాడని ప్రాణం తీశారు
పర్లాకిమిడి: మాజీ వార్డు మెంబరు తిరిసింగి ముఠామఝి హత్య కేసును అడవ పోలీసులు ఛేదించారు. ఇందులో ప్రమేయమున్న నలుగురు నిందితులును అరెస్టు చేసినట్టు జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ పండా బుధవారం రాణిపేట డి.పి.ఓ.కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. మోహానా బ్లాక్ అడవ పి.ఎస్.పరిధి కటమా వాటర్ ట్యాంకు వద్ద ఈ నెల 3న ఉదయం పాణిగండ గ్రామం నుంచి వస్తున్న తిరిసింగి ముఠామఝిని నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు పదునైన టంగియా, రాయితో కొట్టి చంపారు. మృతుడి భార్య చబితా ముఠామఝి (తువ్వాబడి గ్రామం) అడవ పోలీసు ష్టేషన్లో ఫిర్యాదు చేయగా.. డీఎస్పీ అమితాబ్ పండా, అడవ ఐఐసీ, సుభ్రాంత్ పండా కేసు దర్యాప్తుచేశారు. ముఠా మఝి, సురేష్ మఝి మధ్య పాతకక్షల నేపథ్యంలో హత్య జరిగినట్టు గుర్తించారు. కేసుకు సంబంధించి సురేష్ మఝి (జడింగి), శ్యాంసన్ మల్లిక్ (కంధమాల్), మనోజ్ మఝి(పజిగుడి), బిశ్వరంజన్ ఉత్తాన సింగ్(తువ్వాబడి)లను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు సురేష్ మఝి సోదరుడు, మాజీ మావోయిస్టు ఎ.కె.47తో ఒకర్ని కాల్చినపుడు మృతుడు ముఠామఝి సాక్షిగా ఉన్నాడు. 2021లో జరిగిన ఈ కేసులో సురేష్ మఝి సోదరుడు అరెస్టయ్యాడు. ఇప్పుడు తుది విచారణలో ఉండగా ముఠా మఝి కోర్టులో సాక్ష్యం ఇవ్వనున్నాడని తెలిసి నిందితులు ఈ హత్యకు పాల్పడ్డారు. నిందితుల వద్ద నుంచి బైక్, ఐదు సెల్ఫోన్లు, మూడు వేటకత్తులు (టంగియా) స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ పండా తెలిపారు. నిందితులను గురువారం కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. విలేకరుల సమావేశంలో డీఎస్పీ అమితాబ్ పండా, అడవ పోలీసులు పాల్గొన్నారు. తిరిసింగి ముఠామఝి హత్యకేసును ఛేదించిన పోలీసులు నలుగురు నిందితుల అరెస్టు -
యువకుడి అనుమానాస్పద మృతి
రాయగడ: యువకుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. జిల్లాలోని గుణుపూర్ పాతబస్టాండు సమీపంలో ఉన్న గొలావీధి వద్ద యువకుని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడు గుణుపూర్‌కు చెందిన కరాల్ రాజు (38)గా గుర్తించారు. మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు, క్లూస్ టీం సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుని గొంతు వద్ద గాయాం ఉండడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దర్యాప్తు చేపట్టిన పోలీసులు కుటుంబ కలహాల కారణంగా యువకుడు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వస్తేనే మృతికి కారణం తెలుస్తోందని పోలీసులు తెలిపారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
‘సుభద్ర’తో మహిళాభ్యున్నతి
భువనేశ్వర్: రాష్ట్ర ప్రభుత్వం సుభద్ర యోజన పట్ల అవగాహన పెంపొందించేందుకు నడుం బిగించింది. ఈ పథకంపై మహిళలకు విస్తృత అవగాహన కల్పించేందుకు బుధవారం రాజధాని నగరం భువనేశ్వర్ నుంచి ర్యాలీ ప్రారంభించింది. అర్హులైన ప్రతి ఒక్కరూ లబ్ధిదారులుగా చేరాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. సుభద్ర యోజన శ్రేయస్సు ఫలాలు ప్రతి మహిళ అందుకోవాలనే సందేశంతో నగరం వ్యాప్తంగా బీదల ప్రభావిత ప్రాంతాల్లో సుభద్ర ఊరేగింపు నిర్వహించారు. స్థానిక ఖండగిరి కూడలి నుంచి ప్రారంభమై జొగొమొరా వీధి వరకు ఈ కార్యక్రమం కొనసాగింది. కార్యక్రమంలో ఏకామ్ర నియోజకవర్గ ఎమ్మెల్యే బాబు సింగ్, నగర మేయర్ సులోచన దాస్, కమిషనర్ రాజేష్ ప్రభాకర్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిడా మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి పథకం వర్తింపజేస్తామని చెప్పారు. దరఖాస్తు గడువు ఈ నెలాఖరుతో ముగియనున్నందున అర్హులంతా చేరాలని కోరారు. ఈ నేపథ్యంలోనే ఇంటింటా సర్వే చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న 1.8 కోట్ల మంది మహిళల్లో 1.20 కోట్ల మంది మహిళలకు తొలి విడత కింద ఐదో దశ పంపిణీ గురువారం జరుగుతుందని తెలిపారు. -
ఆశ్రమ పాఠశాల ఘటనపై విచారణ చేయాలి
● కాంగ్రెస్ నాయకుల డిమాండ్మల్కన్గిరి: మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ సమితి దీసారీగూడ ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని గర్భం దాల్చి.. గత నెల 24వ తేదీన బిడ్డకు జన్మనిచ్చిన ఘటనపై ఉన్నతస్థాయి విచారణ చేపట్టాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక డీసీసీ కార్యాలయంలో బుధవారం విచారణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ముదుంగా విద్యార్థిని చదివిన పాఠశాలను సందర్శించి ప్రధానోపాధ్యాయుడుతో మాట్లాడారు. అలాగే వసతి గృహంలో బాలికల ఆరోగ్య సేవకురాలతో చర్చించారు. అనంతరం బాలిక స్వగ్రామానికి వెళ్లి తల్దిదండ్రులతో చర్చించారు. ఆశ్రమ పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థిని తల్లి అయిందని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ ఆశీష్ ఈశ్వర్ కూడా కలిసి సంఘటనపై విచారణ వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ స్పందిస్తూ.. విచారణ చేస్తామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విచారణ కమిటీలో చిత్రకొండ ఎమ్మెల్యే మంగు ఖీలో, మాజీ మంత్రి నాగేంద్రప్రసాద్, గుణుపురం ఎమ్మెల్యే సత్యజిత్ గమాంగో, నాయ్యవాది మానస్ మల్లిక్, పాలిపిక మాఝి, నవరంగ్‌పూర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి భుజబల్ మాఝి, మల్కన్‌గిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గోవిందపాత్రో తదితరులున్నారు. -
త్వరలో జగన్నాథ్ సాగర్ పునరుద్ధరణ పనులు
జయపురం: జయపురంలో చారిత్రిక జగన్నాఽథ్ సాగర్ పురుద్ధరణ, సౌందర్యీకరణ పనులు పది రోజుల్లో పునఃప్రారంభం కానున్నాయని జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి వెల్లడించారు. బుధవారం జయపురంలోని తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. పునరుద్ధరణ పనుల కోసం గత నెల 24వ తేదీన ప్రభుత్వం రూ. 9.25 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. గతంలో సాగర్ పునరుద్ధరణ పనులను మహిళా స్వయం సహాయక గ్రూపువారు చేపట్టారని.. అయితే నిధుల కొరత కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయినట్టు వివరించారు. ఆ పనులలో అవినీతి జరిందని కొంతమంది ఆరోపించారని అన్నారు. ఆరోపణలపై విచారణకు ప్రభుత్వం ఒక కమిటీని వేసిందన్నారు. ఆ కమిటీ తన రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించిందని.. సాగర్ పనులలో ఎటువంటి అవినీతి జరుగలేదని వెల్లడైందని ఎమ్మెల్యే వివరించారు. మూడు నెలల్లో పునరుద్ధరణ పనులు పూర్తయ్యే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. సాగర్ సౌందర్యీకరణ పనులు పూర్తయితే జగన్నాథ్ సాగర్‌ను ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా రూపొందించగలమన్నారు. జగన్నాథ్ సాగర్ నాలుగు వైపులా గతంలో ఆక్రమణలు జరిగాయని..అయితే అప్పట్లో నోరు విప్పనివారు నేడు విమర్శలు చేయడం తగదన్నారు. ఆ నాడు తాను ఆక్రమణలను వ్యతిరేకించానని కాని ప్రభుత్వం మిన్నకుందని వెల్లడించారు. మత్య్స విభాగం ఆధీనంలోని 25 ఎకరాల సాగర్ స్థలం సాగర్‌లో మమేకం చేస్తామని వెల్లడించారు. జగన్నాథ్ సాగర్ సౌందర్యీకరణ, ఉన్నతే తన ధ్యేయమన్నారు. సమావేశంలో జయపురం మున్సిపల్ చైర్మన్ నరేంద్రకుమార్ మహంతి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నిహార్ బిశాయి పాల్గొన్నారు. -
జన హృదయ నేత బిజూ
భువనేశ్వర్: రాష్ట్ర చరిత్రకారునిగా పేరొందిన దివంగత ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ పట్ల రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అగౌరవ భావం ప్రదర్శించిందని విపక్ష నేత నవీన్ పట్నాయక్ తీవ్ర మనస్తాపం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు రావొచ్చు, పోవచ్చు కానీ ఒడియా ప్రజల హృదయాల్లో బిజూ పట్నాయక్ చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పారు. బిజూ పట్నాయక్ విలువని దిగజార్చే ప్రయత్నాలు జరగడం అత్యంత విచారకరమని పేర్కొన్నారు. బిజూ బాబు జాతీయ నాయకుడు కాదు, అంతర్జాతీయ నాయకుడని గుర్తు చేశారు. స్థానిక శంఖ్ భవన్లో బుధవారం నిర్వహించిన బిజూ జయంతి సభలో పాల్గొని నవీన్ పట్నాయక్ ప్రసంగించారు. కాగా, ఏటా మార్చి 5వ తేదీన బిజూ జయంతి పురస్కరించుకుని నిర్వహించే పంచాయతీరాజ్ దివస్ వేడుకలను వేరే తేదీకి మార్చడంపై బిజూ అభిమానులు, అనుచరుల్లో తీవ్ర అసంతృప్తి రగులుతోంది. ప్రభుత్వాల మార్పు చేర్పులతో చరిత్రకారుల ఘనత నీరుగారిపోయే విచారకర పరిస్థితులు ఎన్నడు చూడనట్లు ఈ వర్గం వ్యాఖ్యానిస్తోంది. బిజూ పట్నాయక్‌కు ఘన నివాళులు రాయగడ: ఒడిశా వరపుత్రుడు, మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ బిజూ పట్నాయక్ 109వ జయంతిని బీజేడీ పార్టీ శ్రేణులు బుధవారం ఘనంగా జరుపుకున్నారు. స్థానిక కొత్త బస్టాండు వద్ద గల బీజూ పట్నాయక్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి లాల్ బిహారి హిమిరిక, సీనియర్ నాయకులు బ్రజసుందర్ నాయక్, సుజాత పాలొ, అనసూయా మాఝి, మున్సిపల్ చైర్మన్ మహేష్ పట్నాయక్, కార్యకర్తలు పాల్గొన్నారు. పర్లాకిమిడిలో... పర్లాకిమిడి: బిజూ పట్నాయిక్ జయంతి సందర్భంగా పర్లాకిమిడి హైస్కూల్ జంక్షన్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి బీజేడీ నాయకులు, ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి పూలదండలు వేసి నివాళులర్పించారు. బిజూ పట్నాయక్ అమర్ రహే అని నినదించారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు ఎమ్మెల్యే రూపేష్ పండ్లు, మిఠాయిలు పంచిపెట్టారు. హైటెక్ ప్లాజాలోని బీజేడీ పార్టీ కార్యాలయంలో బీజూ పట్నాయక్ జయంతి సందర్భంగా కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటుచేశారు. జిల్లా పరిషత్ అధ్యక్షులు గవర తిరుపతిరావు, రాష్ట్ర బీజేడీ సాధారణ కార్యదర్శి ప్రదీప్ నాయక్, బసంత్ దాస్, పురపాలక అధ్యక్షురాలు నిర్మలా శెఠి, పట్టణ బీజేడీ అధ్యక్షులు సితేంద్ర మహాపాత్రో, జెడ్పీటీసీ సభ్యుడు (గుసాని) యస్.బాలరాజు, గుసాని సమితి అధ్యక్షులు ఎన్.వీర్రాజు, కాశీనగర్ ససిమితి అధ్యక్షురాలు బల్ల శాయమ్మ పాల్గొన్నారు.ఫారెస్టు పార్కులో శ్రద్ధాంజలి.. స్థానిక ఫారెస్ట్ పార్క్‌లో జరిగిన బిజూ జయంతి వేడుకల్లో ప్రతిపక్ష నాయకుడు, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. బిజూ పట్నాయక్‌కు నివాళులు అర్పిస్తూ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని గుర్తించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. 1993 నుంచి చరిత్రాత్మకంగా జరుపుకునే ఒక రోజుకు గుర్తింపుని తొలగించడం విచారకరమన్నారు. క్రీడా అవార్డులు, విమానాశ్రయం వంటి ప్రముఖ సంస్థల పేర్లుని రాష్ట్ర ప్రభుత్వం మార్చే ప్రయత్నాలపై నవీన్ ఘాటుగా స్పందించారు. బిజూ బాబు విగ్రహం విధ్వంసానికి పాల్పడిన వారి వ్యతిరేకంగా బాధ్యులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. దివంగత నేత బిజూ పట్నాయక్ ఆవిష్కరించిన పారాదీప్ పోర్టు, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్), తాల్చేరు నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ), రౌర్కెలా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) వంటి ముఖ్యమైన పారిశ్రామిక మరియు విద్యా సంస్థలను మూసివేయగలరా? అని నవీన్ బీజేపీకి సవాల్ విసిరారు. ప్రస్తుత పరిపాలన సంకుచిత దృక్పథంతో కూడిన రాజకీయాలతో కొనసాగుతోందని విమర్శించారు. పంచాయతీరాజ్ వ్యవస్థను స్థాపించడం నుంచి మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే దిశలో బిజూ పట్నాయక్ కృషి చిరస్మరణీయమని గుర్తు చేశారు. ఒడిశా అభివృద్ధిలో బిజూ పట్నాయక్ పాత్రను, ఇండోనేషియా స్వాతంత్య్ర పోరాటానికి మద్దతు ఇవ్వడం, యునెస్కో కళింగ అవార్డు వంటి అంతర్జాతీయ సహకారాలను ఈ సందర్భంగా నవీన్ పట్నాయక్ గుర్తు చేశారు. -
తాగునీటి ప్రాజెక్ట్ పనుల పరిశీలన
మల్కన్‌గిరి: జిల్లాలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, తాగునీటిశాఖ మంత్రి రవి నారాయణ్ నాయక్ బుధవారం పర్యటించారు. వెంకటపాలెంలోని తాగునీటి ప్రాజెక్ట్ పనులను పరిశీలించారు. తర్వగా పూర్తిచేయ్యాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. అనంతరం కలిమెల సమితిలోని ప్రాజెక్ట్ పురోగతిపై సమీక్షించారు. ఈ ప్రాజెక్ట్ కోసం రూ.37 కోట్లు వ్యయం చేయడం జరిగిందన్నారు. దీని ద్వారా ఐదు గ్రామ పంచాయతీల్లోని 5,865 ఇళ్లకు తాగునీరు సరాఫరా అవుతుందన్నారు. తొలిత జిల్లాలో జరుగుతున్న బోడ జాతర సందర్భంగా కలిమెల సమితి మాన్యంకొండ గ్రామంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కలెక్టర్ ఆశీష్ ఈశ్వర్ పటేల్, మల్కన్‌గిరి ఎమ్మెల్యే నర్సింగ్ మడ్కమి, బీజేపీ అధ్యక్షుడు ఆశోక్ పరిడా తదితరులు పాల్గొన్నారు. -
516 పెన్నులతో అలంకరణ
నరసన్నపేటలోని వెంకటేశ్వర ఆలయం సమీపంలో ఉన్న లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారికి బుధవారం 516 పెన్నులతో అర్చన చేశారు. అనంతరం వాటిని తోరణంగా అలంకరించారు. అర్చకులు భాస్కరబట్ల జగదీశ్వర శర్మ పూజా కార్యక్రమం పూర్తయ్యాక పదో తరగతి విద్యార్థులకు ఈ పెన్నులు పంపిణీ చేశారు. – నరసన్నపేట పీజీ మూడో సెమిస్టర్ ఫలితాలు విడుదల ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం, అనుబంధ కళాశాలల పోస్టు గ్రాడ్యుయేషన్ మూడో సెమిస్టర్ ఫలితాలను బుధవారం ఎగ్జామినేషన్స్ డీన్ ఎస్.ఉదయ్‌భాస్కర్ విడుదల చేశారు. ఫలితాలను వర్సిటీ వెబ్సైట్, జ్ఞానభూమి పోర్టల్‌లో అందుబాటులో ఉంచారు. రీవాల్యుయేషన్‌కు 15 రోజుల్లోగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎకనామిక్స్, ఇంగ్లీష్, రూరల్ డెవలప్మెంట్, తెలుగు, ఎంకాం, ఎంబీఏ, ఎంఈడీ, ఎంఎల్ఐఎస్సీ, జువాలజీ, ఎంజేఎంసీ, మైక్రోబయోలజీ కోర్సుల్లో శతశాతం ఉత్తీర్ణత నమోదైంది. కంప్యూటర్ సైన్స్‌లో 22 మందికి 18 మంది, అప్లయిడ్ మ్యాథ్స్‌లో 8 మందికి ఏడుగురు, ఎనలాటికల్ కెమిస్ట్రీలో 41 మందికి 40 మంది, బయోటెక్నాలజీలో 25 మందికి 24 మంది, ఫిజిక్స్‌లో 12 మందికి 8 మంది, ఆర్గానిక్ కెమిస్ట్రీలో 185 మందికి 118 మంది, గణితంలో 15 మందికి 14 మంది ఉత్తీర్ణత సాధించారు. నేడు మద్యం షాపుల లాటరీ శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా లో గీత, సొండి కులా లకు కేటాయించిన 18 మద్యం షాపులకు గురువారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ చేతుల మీదుగా గురువారం ఉదయం 10 గంటలకు డ్రా తీయనున్నారు. ఈ మేరకు శ్రీకాకులం ఆర్ట్స్ కళాశాల సమీపంలోని అంబేడ్కర్ ఆడిటోరియానికి ఉదయం ఎనిమిది గంటలకల్లా దరఖాస్తుదారులు హాజరుకావాలని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి సీహెచ్.తిరుపతినాయుడు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నూతన మద్యం పాలసీ (2024–26)లో భాగంగా జిల్లాలో గీత, సొండి కులాల వారికి పదిశాతం మద్యం దుకాణాలు ప్రభుత్వం కేటాయించిన సంగతి తెలిసిందే. జిల్లాలో 18 షాపులకు 203 దరఖాస్తులు అందాయి. మొదటగా ఫిబ్రవరి 10న డ్రా తీయాలని నిర్ణయించినా ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా వేశారు. పీడీఎస్ బియ్యం పట్టివేత గార : మండల పరిధిలోని అంపోలు జంక్షన్ వద్ద విజిలెన్సు, ఎన్ఫోర్సుమెంట్ అధికారులు సంయుక్తంగా జరిపిన దాడుల్లో 54 బస్తాల పీడీఎస్ బియ్యం పట్టుకున్నారు. బుధవారం సాయంత్రం సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా అక్రమంగా బియ్యం రవాణా చేస్తూ వాహనం పట్టుబడిందని విజిలెన్సు అధికారులు యు.వెంకటేష్, ఎస్సై రామారావు తెలిపారు. నడగాం గ్రామానికి చెందిన పొట్నూరు శ్రీరామమూర్తి స్థానికంగా బియ్యం సేకరించి నడగాం పరిసర ప్రాంతాల్లోని కోళ్లఫారాలకు రవాణా చేస్తున్నట్టు గుర్తించామని చెప్పారు. విజిలెన్సు ఎస్పీ బి.ప్రసాదరావు ఆదేశాల మేరకు పీడీఎస్ అక్రమ రవాణాదారులపై నిఘా ఉంచామని, పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇస్కాన్.. ప్రదర్శన అదిరెన్.. ఇందిరా విజ్ఞాన్‌భవన్‌లో శ్రీకాకుళం ఇస్కాన్, జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మందిరం ఆధ్వర్యంలో జరుగుతున్న హరేకృష్ణ ఉత్సవ్‌లో భాగంగా బుధవారం విదేశీయులు ప్రదర్శించిన వామనావతార వైభవం అబ్బురపరిచింది. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు కళ్లకు కట్టినట్లు నాటకం ప్రదర్శించారు. –శ్రీకాకుళం కల్చరల్ -
దివ్యాంగులపై దయ లేదాయె..!
● టెక్కలి ఆస్పత్రిలో దివ్యాంగుల అవస్థలు ● పింఛన్ల పునఃపరిశీలన పేరిట తిప్పిస్తున్నారని ఆవేదన టెక్కలి: టెక్కలి జిల్లా ఆసుపత్రిలో దివ్యాంగులు అవస్థలు పడ్డారు. ఆస్పత్రిలో కొద్ది రోజులుగా చేపడుతున్న పింఛన్ల పునఃపరిశీలన ప్రక్రియలో భాగంగా బుధవారం సంతబొమ్మాళి, పాతపట్నం మండలాల నుంచి సుమారు 50 మంది వరకు దివ్యాంగులు చేరుకున్నారు. అయితే పునఃపరిశీలన ప్రక్రియ ఆపివేశామంటూ అక్కడ సిబ్బంది చెప్పడంతో ఆందోళనకు గురయ్యారు. వారం రోజుల క్రితం అనేక ప్రయాసలతో పునఃపరిశీలన కోసం వస్తే 5వ తేదీన రావాలని చెప్పారని.. తీరా మండుటెండలో అవస్థలు పడుతూ వస్తే ఇప్పుడు తాత్కాలికంగా నమోదు ఆపివేశారని చెప్పడం భావ్యం కాదంటూ పింఛన్‌దారులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామాల నుంచి ఇక్కడకు రావాలంటే ఆటోల్లో అనేక ఇబ్బందులు పడాల్సిన దుస్థితి ఉందని వాపోయారు. తమకు ఎటువంటి సమాచారం లేకుండా ఇలా అకస్మాత్తుగా నమోదు ఆపివేయడం సరికాదని నిరాశగా వెనుదిరిగారు. కాగా, పింఛన్ల పునఃపరిశీలన తాత్కాలికంగా ఆపేసిన విషయం తెలియక దివ్యాంగులు అవస్థలు పడాల్సి వచ్చింది. ఆస్పత్రిలో త్వరలోనే పునఃపరిశీలన ప్రారంభించనున్నట్లు సమాచారం. -
గోకార్టింగ్ సీజన్–2 ప్రారంభం
టెక్కలి: ఆటో మొబైల్ రంగంలో నూతన సాంకేతిక ఆవిష్కరణల దిశగా విద్యార్థులు ఆలోచనలు చేయాలని హైదరాబాద్‌కు చెందిన డీప్‌లూప్ టెక్నాలజీ సీఈవో కుసుమంచి సూర్యప్రకాశ్ కోరారు. టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల వేదికగా జాతీయ స్థాయి గోకార్టింగ్ సీజన్–2 పోటీలను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆటో మొబైల్ రంగంలో నూతన సాంకేతిక ఆవిష్కరణలు చేసిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఎన్నో వ్యయ ప్రయాసలతో పోటీలు నిర్వహిస్తున్న ఆదిత్య కళాశాలకు అలాగే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, ఒడిశా ప్రాంతాల నుంచి విచ్చేసిన విద్యార్థులను అభినందించారు. కళాశాల కార్యదర్శి ఎల్.ఎల్.నాయుడు, కోశాధికారి టంకాల నాగరాజు, డైరెక్టర్ వి.వి.నాగేశ్వరరావులు మాట్లాడుతూ.. తమ కళాశాలలో జాతీయ స్థాయి గోకార్టింగ్ పోటీలు రెండోసారి నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. మొత్తం 16 బృందాలు పాల్గొంటున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో గోకార్టింగ్ కన్వీనర్ ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు, కో–కన్వీనర్లు డి.శ్రీరాములు, ఈసీఈ హెచ్‌వోడీ వి.అశోక్‌కుమార్, సీఎస్ఈ హెచ్‌వోడీ వై.రమేష్, ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్లు రఘువీర్, విద్యార్థి కన్వీనర్లు పి.ఉదయ్‌కుమార్, బి.సాయి సాకేత్ తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం దళారుల పాలు
● కొనుగోలు లక్ష్యాలను తగ్గించి రైతులను ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం● ఒడిశా ధాన్యంతో టార్గెట్ పూర్తి చేశారంటున్న రైతులు● క్షేత్రస్థాయి పరిస్థితి గమనించని అధికారులు ఆమదాలవలస మండలం దూసిపేట పొలాల్లో ఉన్న వరి కుప్పలు శ్రీకాకుళం పాతబస్టాండ్: అన్నదాత ఆరుగాలం కష్టించి పండించిన పంట దళారుల పాలవుతోంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో వరి కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. పంట దిగుబడిని గుర్తించడంలో లోపం, కొనుగోలు లక్ష్యాలు తక్కువగా పెట్టుకోవడం, ఆ లక్ష్యాలు నెరవేర్చేందుకు ఒడిశా ధాన్యం కొనడం వంటి తప్పిదాలు మన రైతుల పుట్టి ముంచాయి. ఎవరూ ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో చివరకు మిల్లర్లు, మధ్యవర్తులతోనే బేరం కుదుర్చుకోవాల్సిన దుస్థితి రైతన్నలకు ఎదురవుతోంది. లక్ష్యం నిర్ణయంలోనే కుట్ర జిల్లాలో ఈ ఏడాది 3,60,325 ఎకరాల్లో వరి పండించారు. అయితే ఈ ఏడాది పంటలు ఆలస్యంగా వేసినా, దిగుబడి చాలా వరకు అనుకూలంగానే వచ్చింది. సుమారుగా ఈ ఏడాది వరి 8 లక్షల మెట్రిక్ టన్నుల పై బడి దిగుబడి వచ్చింది. అయితే కోనుగోలు లక్ష్యాన్ని కేవలం 4.90 లక్షల మెట్రిక్ టన్నులుగానే నిర్ధారించారు. అంచనాలు కావాలనే తక్కువ వేసి, కొనుగోలు టార్గెట్లు తగ్గించారు. జిల్లాలో వరి పండించే రైతులు సుమారుగా 2.5 లక్షల మంది ఉన్నారు. అయితే ఇప్పటి వరకు కేవలం 99 వేల మంది రైతులు మాత్రమే పంటను విక్రయించారు. మిగిలిన వారు ధాన్యం విక్రయించే పరిస్థితి లేదు. గ్రామాల్లో దళారులు ధాన్యం కొనుగోలు టార్గెట్లు పూర్తయిపోయాయని అధికారులు చెబుతుండడంతో.. దళారులు ఈ పరిస్థితిని అలుసుగా తీసుకున్నారు. దళారుల్లో అధిక శాతం మంది అధికార పక్షానికి చెందిన వారే. వీరు మిల్లర్లతో మిలాఖత్ కావడం వల్ల ధాన్యం సగం ధర మాత్రమే పలుకుతోంది. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో దళారు లు నేరుగా రైతుల వద్దకు వెళ్లి సగం ధరకే ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. దీనికి తోడు పీపీసీ కేంద్రాలు టార్గెట్ పూర్తి చేసే నెపంతో ఒడిశా ధాన్యం తీసుకువచ్చినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. సివిల్ సప్లై అధికారులు కూడా సహకరించడంతో టార్గెట్లు సజావుగా పూర్తయిపోయాయని అంటున్నారు. ధాన్యం అమ్మలేకపోతున్నాం.. రాష్ట్రంలో గత ఐదేళ్లు ఈ పరిస్థితి లేదు. పీపీసీ కేంద్రాలు, రైతు భరోసాకేంద్రాల ద్వారా నేరుగా ధాన్యంను కళ్లం వద్దకు వచ్చి తీసుకెళ్లేవారు. ఈ ఏడాది ఆర్బీకేలు, పీపీసీ కేంద్రాలు, సివిల్ సప్లై అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ధాన్యం కొనడం లేదు. టార్గెట్లు అయిపోయాని అంటున్నారు. ఖరీఫ్‌లో పండించిన ధాన్యం అమ్మలేని పరిస్థితి. – బి.వెంకటరమణ, వాకలవలస, శ్రీకాకుళం మండలం అపరాలు పండేంత వరకు.. జిల్లాలోని పలు మండలాల్లో ఫిబ్రవరి నెలాఖరు వరకు వరి నూర్చే పరిస్థితి లేదు. వరి చివరి కాలంలో ఆ పొలాల్లో మినుగులు, పెసలు వంటి అపరాలు పంటలు వేస్తారు. అవి పండేంత వరకు అక్కడే వరి కుప్పలు పెడుతున్నారు. అపరాలు పంటలు మార్చిలో చేతికి వస్తాయి. అప్పుడు వరి, అపరాలు రెండింటినీ నూర్పు యంత్రాల సాయంతో నూర్చడానికి చాలా మంది ప్రణాళిక వేసుకున్నారు. ప్రధానంగా నాగావళి, వంశధార తీరంలో ఉన్న మండలాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. -
జమ్మూకాశ్మీర్‌లో సిక్కోలు జవాన్ మృతి ●
● ఏకే–47తో కాల్చుకుని చనిపోయినట్లు అనుమానాలు ● సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నేడు వజ్రపుకొత్తూరు: మండలంలోని అమలపాడు గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ నాయక్ బచ్చల తిరుపతిరావు(26) జమ్మూకాశ్మీర్‌లో మృతి చెందాడు. ఏకే–47 గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్తే.. అమలపాడుకు చెందిన బచ్చల వెంకటరావు, కామేశ్వరి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు గోవింద గ్రామంలోనే నివాసం ఉంటుండగా.. చిన్న కుమారుడు తిరుపతిరావు 2017లో ఇండియన్ ఆర్మీలో చేరాడు. తండ్రి వెంకటరావు సైతం బీఎస్ఎఫ్లో జవాన్‌గా విధులు నిర్వహించారు. తిరుపతిరావుకు ఇటీవలే గ్రామానికి చెందిన అమ్మాయితో పెళ్లి నిశ్చయమైంది. ముందుగా ఇల్లు నిర్మించాలని భావించి కొంతమేర అప్పులు చేశారు. తర్వాత వివిధ కారణాలతో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. ఈ క్రమంలో జమ్మూ కాశ్మీర్‌లోని 8 ఆర్ఆర్ మద్రాస్ రెజిమెంట్ తరఫున ఈ నెల 4న ఎల్ఓసీ వద్ద తిరుపతిరావు విధులు నిర్వహిండగా ఒక్కసారిగా గన్ పేలిన శబ్దం వినిపించింది. వెంటనే ఆర్మీ అధికారులు వెళ్లి పరిశీలించగా తిరుపతిరావు ఏకే–47తో కాల్చుకుని చనిపోయినట్లు గుర్తించారు. అయితే మృతికి గల కారణాలు నిర్ధారించలేదు. అప్పులు ఎక్కువైపోవడం, వచ్చిన జీతం మిగలకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్ బెట్టింగ్‌లు కూడా కారణం కావచ్చనని మరికొందరు చెబుతున్నారు. తిరుపతిరావు మృతదేహం గురువారం అమలపాడుకు రానుంది. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయని గ్రామస్తులు తెలిపారు. పింఛన్లు నిలిపివేయడంపై ఆరా సంతబొమ్మాళి: సంతబొమ్మా ళి పంచాయతీ నరిగిపెంట గ్రామానికి చెందిన పది మందికి పింఛన్లు ఇవ్వకుండా నిలిపివేయడంపై డిప్యూటీ సీఈవో సత్యనారాయణ ఆరా తీశారు. పింఛన్లు ఆపేశారు మహాప్రభో.. అంటూ బుధవారం సాక్షిలో కథనం ప్రచురితం కావడంతో ఆయన స్పందించారు. పింఛన్ల డేటాను తీసుకుంటానని, ఎంపీడీఓతో మాట్లాడి వివరాలు తెలుసుకుంటానని చెప్పారు. -
కన్నుమూత
కళాప్రవీణ బండారు చిట్టిబాబు చిట్టిబాబు పార్థివదేహానికి నివాళులు అర్పిస్తున్న ప్రముఖ గాయకులు బి.ఎ.నారాయణ, మండపాక శారద శ్రీకాకుళం కల్చరల్: లలిత సంగీతానికి ఎనలేని సేవలు అందించిన ప్రముఖ సంగీత కళాకారుడు బండారు చిట్టిబాబు(89) బుధవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కన్నుమూశారు. హార్మోనియం కళాకారుడిగా, ఆర్కెస్ట్రా నిర్వాహకుడిగా సుమారు ఏడు దశాబ్దాల పాటు కళామతల్లి సేవలో తరిస్తూ ఎంతో మంది గాయకులను తీర్చిదిద్దారు. 1936లో బండారు సత్యనారాయణ, వరాలమ్మ దంపతులకు 5వ సంతానంగా జన్మించిన చిట్టిబాబు సంగీతంలో అసమాన ప్రతిభతో రాణించారు. 400కుపైగా లలిత గీతాలకు స్వరకల్పన చేశారు. ప్రముఖ సినీ నటులు రావి కొండలరావు, తిమ్మరాజు శివరావుల సహకారంతో 1955లో సుకుమార్ ఆర్కెస్ట్రాను నెలకొల్పారు. సినీ రచయితలు దేవులపల్లి, ఆరుద్ర, సినారే, జొన్నవిత్తుల, దూసి ధర్మారావు తదితరులు రచించిన లలిత గీతాలకు స్వరకల్పన చేస్తూ హార్మొనియంపై వాయిద్య సహకారం అందించారు. ‘అంటరాని వారు ఎవరంటే’, ‘ఏది హిందూ.. ఏది ముస్లిం’ వంటి పాటలను జాతీయ భాషల్లో కూడా స్వరపరిచారు. ప్రముఖ సినీ గాయకులు జి.ఆనంద్, బి.ఎ.నారాయణలతో కలిసి రథసప్తమి సందర్భంగా ఏకాంత సేవ నిర్వహించారు. 1974లో రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పతకం, 1983లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా కళాప్రవీణ బిరుదులు అందుకున్నారు. 1984లో రాష్ట్ర సంగీత నాటక అకాడమీ సభ్యునిగా ఎనలేని సేవలు అందించారు. ఈయన కుమారుడు బండారు రమణమూర్తి తబలా కళాకారుడిగా ఏ–గ్రేడ్ ఆర్టిస్టుగా పేరుగాంచారు. 70 ఏళ్లుగా సంగీత సేవ నివాళులర్పించిన ప్రముఖులు ప్రముఖుల సంతాపం.. చిట్టిబాబు మృతి సంగీతానికి తీరని లోటని గాయకులు నిక్కు అప్పన్న, రెడ్‌క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు, తరుణి కృష్ణ సంస్థ ప్రతినిధులు మండా శ్రీనివాసరావు, ఎం.వి.కామేశ్వరరావు, ఉపనిషన్మందిరం అధ్యక్షుడు గుమ్మా నగేష్, సుమిత్రా కళాసమితి అధ్యక్షుడు ఇప్పిలి శంకరశర్మ, రంగస్థల కళాకారుల సమాఖ్య గౌరవ అధ్యక్షుడు ఎల్.రామలింగస్వామి, చిట్టి వేంకటరావు, రామచంద్రదేవ్, పన్నాల నరసింహమూర్తి, ప్రముఖ గాయకులు బి.ఏ.నారాయణ, మండపాక శారద, కె.ఎల్.ఎన్ మూర్తి, కళ్యాణం రామ్మోహన్రావు, తదితరులు సంతాపం తెలియజేశారు. -
బొత్ర సేవలు మరువలేనివి
జయపురం: సమాజ సేవకుడు, విద్యాదాత, కవి, రచయిత, పాత్రికేయుడు, స్వర్గీయ ప్రభుదాన్ బొత్ర సేవలు మరువలేనివి అని పలువురు వక్తలు కొనియాడారు. బుధవారం ప్రభుదాన్ బొత్ర స్మృతి సంసద్, ఫోరెన్స్ నైటెంగేల్ ఏఎన్ఎం శిక్షణ కేంద్రం జయపురం సంయుక్తంగా బొత్ర నాల్గో వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ఫోరెన్స్ నైటెంగేల్ ఏఎన్ఎం శిక్షణ కేంద్రం సభాగృహంలో డాక్టర్ సుదాంశు శేఖర్ పట్నాయక్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ సాహితీ వేత్త, డాక్టర్ సురేష్ దాస్ ముఖ్యఅతిథిగా పాల్గొని బొత్ర పత్రికా రంగానికి, సాహిత్య రంగానికి అందించిన సేవలు వివరించారు. -
బిజూ ఆశయాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి
జయపురం: మాజీ ముఖ్యమంత్రి బిజయానంద పట్నాయక్ ఉరఫ్ బిజూ పట్నాయక్ జయంతిని జయపురం బీజేడీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. బుధవారం స్థానిక బిజూ రాజనగర్ కూడలి వద్ద బిజూ విగ్రహానికి బీజేడీ నేత, జయపురం మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ సూర్యనారాయణ రథ్ (మున్న రథ్), తదితరులు నివాళులర్పించారు. జిల్లా కేంద్ర హాస్పిటల్‌కు వెళ్లి రోగులకు పండ్లు, స్వీట్లు పంచారు. బిజూ పట్నాయక్ రాష్ట్రానికి, దేశానికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆవిష్కరణకు నోచుకోని విగ్రహం బిజూ విగ్రహాన్ని జయపురం మున్సిపాలిటీ అధికారులు రెండేళ్ల క్రితం తయారుచేయించారు. నేటికీ ఆవిష్కరణకు నోచుకోలేదు. ఇది బిజూ పట్నాయక్‌ను అవమానించటమేనని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మున్సిపాలిటీ కౌన్సిల్లో మెజారిటీ బీజేడీకి ఉన్నా విగ్రహాన్ని పట్టణంలో ఆవిష్కరించలేదు. విగ్రహం మున్సిపాలిటీ కార్యాలయం ఆవరణలోనే ఉంది. -
యువకుడి కిడ్నాప్
● తుపాకీ గురి పెట్టి యువకుడి అపహరణ ● రూ.25 లక్షలు డిమాండ్ జయపురం: జయపురం సమితి, ఉమ్మిరీ గ్రామ పంచాయతీ సౌరగుడ గ్రామం అభిషిత్ సవుర అనే యువకుడిని తుపాకీతో బెదిరించి కిడ్నాప్ చేశారని, తమను రూ.20 లక్షలు చెల్లించాలని అడుగుతున్నారని బాధితుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సదర్ పోలీసు అధికారి సచీంధ్ర ప్రధాన్ మంగళవారం వెల్లడించారు. పోలీసు అధికారి వివరణ ప్రకారం.. ఈ నెల 2 వ తేదీ సాయంత్రం అభిషిత్ అతడి స్నేహితుడు కలసి బహిర్భూమి కోసం సాయిమందిర సమీప ధన్పూర్ బ్రాంచ్ కెనాల్ కు వెళ్లారు. ఆ సమయంలో కొంతమంది దుండగులు ఒక కారులో వచ్చారు. వారు ముఖం కప్పుకుని ఉన్నారు. వారు తుపాకీ చూపి బెదిరించి అభిషిత్ను తీసుకెళ్లిపోయారు. వారు పేపరు మిల్లు మార్గం మీదుగా వెళ్లినట్లు గుర్తించారు. 3వ తేదీన దుండగులు అభిషిత్ ఇంటిలో ఒకరి ఫోనుకు ఫోను చేసి రూ.20 లక్షలు ఇవ్వాలని లేదంటే అభిషిత్ను చంపేస్తామని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. జయపురం సదర్ పోలీసు స్టేషన్ పరిధి గగణాపూర్ పోలీసు సంటి అధికారి సబ్ఇన్స్పెక్టర్ రాజ కిశోర్ బారిక్ కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. -
కొరాపుట్ పంటలకు ప్రత్యేక గుర్తింపు
జయపురం: కొరాపుట్ రైతులు పండించే పంటలకు ప్రత్యేక గుర్తింపు ఉందని జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి అన్నారు. స్థానిక దసరాపొడియ మైదానంలో నిర్వహిస్తున్న కృషి యంత్ర మేళ మంగళవారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు అన్ని రకాల పంటల సాగుకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ప్రభుత్వం సైతం రైతుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. రైతులు వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించేందుకు యంత్రాల వినియోగం అవసరమని పేర్కొన్నారు. నవరంగపూర్ జిల్లా వ్యవసాయ విభాగ విశ్రాంత అధికారి జి.వెంకట రెడ్డి మాట్లాడుతూ.. ఆధునిక ప్రణాళికతో మొక్కజొన్న పంటసాగును రైతులకు వివరించారు. అనంతరం ఉత్తమ రైతులను సన్మానించారు. జిల్లా వ్యవసాయ అధికారి గోకుల చంద్ర ప్రధాన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కృషి యంత్ర విభాగ అధికారి సంతోష్ కుమార్ మిశ్ర, నందపూర్ వ్యవసాయ అధికారి ఎన్.ప్రకాశరావు, ఎస్పీ రోహిత్ వర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ మేళాలో దాదాపు రూ.5.3 కోట్ల యంత్రాలు అమ్ముడైనట్లు అధికారులు వెల్లడించారు.