
మహా కుంభమేళా సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో 'ముకేశ్ అంబానీ' తన తల్లి, కుమారులు, మనుమలు/మనుమరాళ్లతో కలిసి పవిత్ర స్నానం చేశారు.

ముకేశ్ అంబానీ తన తల్లి కోకిలాబెన్, కుమారులు ఆకాశ్, ఆనంత్, కోడళ్ళు శ్లోకా, రాధికా, మనుమలు పృథ్వి, వేద, అక్కలు దీప్తి సల్గావ్కర్, నీనా కోఠారి తదితరులతో కలిసి స్నానం చేశారు.

ముకేశ్ అంబానీ అత్త పూర్ణిమాబెన్ దలాల్, మరదలు మమతాబెన్ దలాల్ కూడా పాల్గొన్నారు.

నిరంజని అఖాడాకు చెందిన స్వామి కైలాషానంద గిరిజీ మహారాజ్ గంగా పూజను నిర్వహించారు.

పూజ అనంతరం ముకేశ్ అంబానీ పరమార్థ్ నికేతన్ ఆశ్రమానికి చెందిన స్వామి చిదానంద సరస్వతీ మహారాజ్‌ను కలుసుకున్నారు.















