
‘‘నా జీవితంలోని ముఖ్యమైన విషయాల్లో ప్రేమ, పెళ్లి కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతం వీటికి నా దగ్గర సమయం లేదు’’ అని అంటున్నారు హీరోయిన్ శ్రీలీల.

టాలీవుడ్లో అగ్ర హీరోయిన్లలో ఒకరైన శ్రీలీల ప్రేమలో ఉన్నారని, తన స్నేహితుడితో రిలేషన్లో ఉన్నారని ఇటీవల ఫిల్మ్నగర్లో పుకార్లు వినిపించాయి.

ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు శ్రీలీల.

తన ప్రేమ, పెళ్లి గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదని చెబుతున్నారు శ్రీలీల.

‘‘చదువు మధ్యలో ఉన్నప్పుడే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాను. వరుసగా సినిమాలు ఒప్పుకుని, బిజీ అయ్యాను. ఇలా నా వ్యక్తిగత జీవితం పై దృష్టి పెట్టలేకపోయాను’ అంటోంది.

ఇప్పుడు సినిమాలు చేస్తూనే చదువుకుంటున్నాను. చెప్పాలంటే ప్రస్తుతం నా దృష్టి మొత్తం చదువు, సినిమాలపైనే ఉంది. వేరే ఆలోచనే లేదు. భవిష్యత్లో నా వ్యక్తిగత జీవితం (ప్రేమ, పెళ్లి విషయం అయ్యుండొచ్చు) పై దృష్టి పెడతాను’’ అని పేర్కొన్నారు శ్రీలీల

ప్రస్తుతం రవితేజ, నితిన్ చిత్రాల్లో ఆమె హీరోయిన్గా నటిస్తున్నారు. అలాగే రెండు బాలీవుడ్ చిత్రాల్లోనూ ఆమె అవకాశం దక్కించుకున్నారనే టాక్ వినిపిస్తోంది.




