
బుల్లితెర కమెడియన్ యాదమ్మరాజు ఇటీవలే తండ్రయ్యాడు.

యాదమ్మరాజు -స్టెల్లా దంపతులకు గతేడాది డిసెంబర్ పాప పుట్టింది. వారు కోరుకున్నట్లుగా కూతురే జన్మించడంతో తెగ సంతోషపడిపోయారు.

పసిబిడ్డను ఆడిస్తూ ఎంతగానో మురిసిపోతున్నారు. ఇటీవల తనకు గిఫ్టీ అని నిక్‌నేమ్ పెట్టారు.

తాజాగా నామకరణం ఫంక్షన్ చేశారు. ఈ సందర్భంగా గిఫ్టీని ఊయలలో వేసి తనకు జనిస్సా రాజ్ అని పేరు పెట్టారు.

తన కూతురి పేరును రివీల్ చేస్తూ స్టెల్లా భావోద్వేగానికి లోనైంది.

క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారంలో ఈ వేడుక జరిగింది.

ఈ కార్యక్రమానికి అమర్దీప్-తేజస్విని, కమెడియన్స్ ఎక్స్‌ప్రెస్ హరి, భాస్కర్ సైతం హాజరయ్యారు.








