
కదలలేని.. మెదలలేని.. పెదవి విప్పి పలకలేని ఆ శిలలు జీవన రాగాలాపనలో నిమగ్నమయ్యాయా? చిత్రకారుడి కుంచె బండరాళ్లకు ప్రాణాలు పోసిందా? అన్నచందంగా ఉన్నాయి ఆ శిలా చిత్రాలు

గచ్చిబౌలిలోని ఓల్డ్ ముంబై రోడ్డు నుంచి ఖాజాగూడ వెళ్లే లింక్ రోడ్డు మధ్య వివిధ ఉన్న బండరాళ్లపై జంతువులు, పక్షులు.. ఇతర చిత్రాలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు

శిలలపై చిత్రాలకు జీవం పోశారు. ఒక్కో చిత్రం ఒక్కో దృశ్య కావ్యంగా మలిచారు. ఈ దారిలో వెళ్లేవారిని ఇవి ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. – సాక్షి,స్టాఫ్ ఫొటోగ్రాఫర్



















