Sakshi Special
-
నా ఐస్‌క్రీమ్ తినేసింది అమ్మను అరెస్ట్ చేయండి
జీవితంలో కొన్ని పనులు చేయకూడదంటారు. అందులో కొత్తది ఒకటి వచ్చి చేరింది. అదేంటంటే చిన్నారుల చేతుల్లోని ఐస్‌క్రీమ్‌ను పొరపాటున కూడా దొంగలించకూడదు. దొంగలిస్తే పోలీసులు ఖచ్చితంగా వస్తారు. భారత్‌లో వస్తారో లేదో తెలీదుగానీ అమెరికాలో మాత్రం ఖచ్చితంగా వస్తారు. అరెస్ట్చేస్తారో లేదో తెలీదుగానీ వారు అవాక్కవడం మాత్రం ఖాయం. ఇటు చిన్నారి తల్లి, అటు పోలీసులు సైతం కొద్దిసేపు నవ్వుకున్న సరదా ఉదంతం అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రంలోని మౌంట్ ప్లీసాంట్ పట్టణంలో గత మంగళవారం జరిగింది. అటు దొంగతనం.. ఇటు 911కు ఫోన్ ఇష్టంగా తింటున్న ఐస్‌క్రీమ్‌ను కన్న తల్లి గభాలున లాక్కుని తినేసే సరికి నాలుగేళ్ల బుడతడికి పట్టరాని కోపం వచ్చింది. ఏడ్వడం మానేసి తల్లికి ఎలాగైనా గుణపాఠం నేర్పాలని నిశ్చయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా, న్యాయం కోసం ఫోన్లైన్లో పోలీసుల తలుపు తట్టాడు. 911 నంబర్‌కు ఫోన్‌చేసి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పాడు.నాలుగేళ్ల పిల్లాడు చెబుతున్న దాంట్లో నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు ఇద్దరు మహిళా పోలీసులు రంగంలోకి దిగారు. అంతకుముందు పిల్లాడు, పోలీసుల మధ్య కొద్దిసేపు ఫోన్ సంభాషణ జరిగింది. ఇప్పుడా ఆడియో సంభాషణ రికార్డ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. చిన్నారి వాదన విన్న వారంతా తెగ నవ్వుకున్నారు.అమ్మను తీసుకెళ్లండి911 డిస్పాచ్ విభాగంలో ఉన్న పోలీసు ఒకరు ఈ పిల్లాడి ఫోన్‌కాల్‌కు స్పందించారు. సమస్య ఏంటని ప్రశ్నించారు. ‘‘మా అమ్మ చెడ్డదైపోయింది’’అని చెప్పాడు. సరేగానీ అసలేమైందని అధికారి అడగ్గా.. ‘‘వెంటనే వచ్చి మా అమ్మను బంధించండి’’అని సమాధానమిచ్చాడు. లాక్కుని ఐస్‌క్రీమ్ తింటున్న తల్లి.. పిల్లాడు పోలీసులకు ఫోన్‌చేయడం చూసి అవాక్కైంది. వెంటనే తేరుకుని పిల్లాడి నుంచి ఫోన్ లాక్కుని ‘‘ఫోన్ చేయాల్సిన పెద్ద విషయం ఏమీ లేదండి. మా అబ్బాయి వయసు కేవలం నాలుగేళ్లు మాత్రమే. వీడి ఐస్‌క్రీమ్ తిన్నాను. అందుకే మీకు ఫోన్‌చేసి ఉంటాడు’’అని చెప్పింది. వీళ్లు ఓవైపు మాట్లాడుతుంటే పిల్లాడు మాత్రం తన వాదనను కొనసాగించాడు.ఐస్‌క్రీమ్ లాక్కుని అమ్మ పెద్ద తప్పు చేసిందని పిల్లాడు అరవడం ఆ ఫోన్‌కాల్‌లో రికార్డయింది. విషయం అర్థమై నవ్వుకున్న పోలీసులు 911 నిబంధనల ప్రకారం పిల్లాడి ఇంటికెళ్లారు. పోలీసుల రాక గమనించి పిల్లాడు మళ్లీ వాళ్లకు నేరుగా ఫిర్యాదుచేశాడు. అమ్మను అరెస్ట్‌చేసి జైలుకు తీసుకెళ్లాలని డిమాండ్చేశాడు. ‘‘సరే. మీ అమ్మను నిజంగానే జైళ్లో వేస్తాం. నీకు సంతోషమేగా?’’అని పోలీసులు అడగ్గా.. ‘‘వద్దు వద్దు. నాకు కొత్త ఐస్‌క్రీమ్ ఇస్తే సరిపోతుంది’’అని అసలు విషయం చివరకు చెప్పాడు. దీంతో పిల్లాడి ఐస్ గోల అక్కడితో ఆగింది. అయితే రెండు రోజుల తర్వాత పోలీసులు మళ్లీ ఆ పిల్లాడి ఇంటికొచ్చారు. మళ్లీ ఎందుకొచ్చారబ్బా అని సందేహంగా చూస్తున్న పిల్లాడి చేతిలో పోలీసులు పెద్ద ఐస్‌క్రీమ్‌ను పెట్టారు. దాంతో చిన్నారి సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. ఈ ఐస్‌క్రీమ్ వృత్తాంతాన్ని పోలీసులు మీడియాకు వెల్లడించడంతో ఈ విషయం అందరికీ తెల్సింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బంగారు అవకాశం.. హద్దు ఆకాశం
ఎన్నాళ్లుగానో మదిలో మెదులుతున్న రూపం కళ్ల ముందు కదలాడే క్షణాలవి.. ఎన్నో కలలు, మరెన్నో ఆశల ప్రతిరూపాలుగా వాహనాలు మెరుపులా దూసుకెళ్లే అపురూప ఘడియలవి. గోకార్టింగ్ అంటే కేవలం వాహనాల పోటీ కాదు. ఎంతో ఇష్టపడి తయారు చేసుకున్న మోడల్, కష్టపడి తయారు చేసుకున్న ఇంజిన్, వాహనంలో ప్రతి విభాగంపై సొంత ముద్ర.. ఇలా ప్రతి అంశంలోనూ విద్యార్థులు తమను తాము చూసుకుంటారు. పోటీలో బండి పరుగులు పెడుతుంటే చూసి మురిసిపోతారు. ఓ కొత్త వాహనానికి పురుడు పోసే దశను గుండెతో ఆస్వాదిస్తారు. టెక్కలి: శ్రీకాకుళం జిల్లాలో జరిగిన జాతీయ స్థాయి గోకార్టింగ్ పోటీలు ఇంజినీరింగ్ విద్యార్థుల మనసు దోచుకున్నాయి. ఆటోమొబైల్ రంగంలో ఎదగాలనుకునే విద్యార్థులకు ఈ పోటీలు ఒకరకంగా తొలి పరీక్ష లాంటివి. ఈ పోటీలు నిర్వహించడం, అందులో పాల్గొనడం, వాహనాలు తయారు చేయడం ఆషామాషీ విషయం కాదు. చాలారకాల దశలు దాటాకే బండిని ట్రాక్ మీదకు ఎక్కించాలి. గోకార్టింగ్ పోటీలు ఎందుకు నిర్వహిస్తారు..? ఆటోమొబైల్ రంగంపై ఆసక్తి కలిగిన ఇంజినీరింగ్ విద్యార్థుల్లో అంతర్లీనంగా ఉండే సృజనకు పరీక్ష పెట్టేందుకే ఈ గోకార్టింగ్ పోటీలు నిర్వహిస్తారు. ఇందులో రెండు రకాల వాహనాలు తయారు చేస్తారు. వాటిలో సీవీ(ఇంజిన్‌తో తయారుచేసినవి) ఈవీ(ఎలక్ట్రికల్ వాహనాలు) ఉంటాయి. వాహనాల తయా రీతో పాటు బిజినెస్ ఆలోచనలు సైతం పంచుకునే విధంగా ఈ గోకార్టింగ్ పోటీలు నిర్వహిస్తారు. అర్హతలు ఉండాల్సిందే.. గోకార్టింగ్ పోటీల్లో పాల్గొనాలంటే కళాశాల స్థాయి లో ‘మోటార్ స్పోర్ట్ కార్పొరేషన్’ తయారు చేసిన రూల్ బుక్ ఆధారంగా గ్రాఫికల్‌గా డిజైన్ చేస్తూ వాహనాన్ని తయారుచేయాలి. ఆ తర్వాత పోటీల్లో పాల్గొనేందుకు ఆయా కళాశాలలు నిర్వహించే ఆన్లైన్ పరీక్ష ఉత్తీర్ణత సాధించాలి. పోటీల్లో పాల్గొనే ముందు కూడా డిజైనింగ్ చెక్, ఇన్నోవేషన్ చెకింగ్‌లో భాగంగా కొత్తగా ఐఓటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్), ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారిత ఆలోచనలకు ప్రాముఖ్యతనిస్తారు. అలాగే బ్రేక్ టెస్ట్, లోడ్ టెస్ట్, స్పీడ్ టెస్ట్, స్టీరింగ్ టెస్ట్ తో పాటు ఇండ్యూరేషన్ టెస్ట్కూడా చేస్తారు. చివరగా బిజినెస్ రౌండ్లోనూ నెగ్గితేనే అర్హత సాధించినట్టు. ఒక్కో వాహనానికి 20 నుంచి 30 మంది టీమ్ సభ్యులు ఉంటారు. వారిలో కెపె్టన్, రైడర్, కో రైడర్ ఉంటారు. వాహనం తయారీ » గోకార్టింగ్ వాహనం తయారీకి సుమారు రూ. 70వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చవుతుంది. »ఇందులో సీవీ వాహనాలను పూర్తిగా ఇంజిన్‌తో తయారు చేస్తారు. ఇంజిన్, మోటారు, వీల్స్, స్టీరింగ్, ఇతర పార్టులు ఉంటాయి. »ఈవీ వాహనాలను బ్యాటరీ ఆధారంగా తయారుచేస్తారు. దీనికి బ్యాటరీ, వీల్స్, స్టీరింగ్, మోటారు ఇతర పార్టులు ఉంటాయి. ఒక్కో వాహనం సుమారు 80 నుంచి 100 కిలోల వరకు బరువు ఉంటుంది. అఫిడవిట్ కచ్చితం.. గోకార్టింగ్ పోటీల్లో రైడర్ల పాత్ర కీలకం. కానీ రైడర్‌గా మారాలంటే విద్యార్థి తల్లిదండ్రులు, కళాశాల సిబ్బంది నుంచి అఫిడవిట్‌ను సమర్పించాల్సిందే. గోకార్టింగ్ తో వచ్చే అవకాశాలు గోకార్టింగ్ పోటీల్లో పాల్గొనే అవకాశం రావడమే విద్యార్థుల విజయానికి తొలిమెట్టు లాంటిది. వాటి లో ప్రముఖ కోర్ కంపెనీల్లో ఉద్యోగవకాశాలు, ఆటోమొబైల్ రంగంలో సొంతంగా వ్యాపారం చేయాలనే ఆలోచన ఉన్న వారికి ప్రాథమిక ప్లాట్‌ఫామ్‌గా గోకార్టింగ్ ఉపయోగపడుతుంది. ప్రమాదమైనా ఇష్టమే.. గోకార్టింగ్ లో రైడింగ్ ప్రమాదకరమైనప్పటికీ ఎంతో ఆసక్తిగా ఉండడం వలన రైడర్‌గా మారాను. 60 ఓల్ట్స్ బ్యాటరీ సామర్థ్యంతో వాహనం తయారుచేశాం. మా కళాశాల ప్రిన్సిపాల్ కె.వీ.ఎన్.సునీత, ఫ్యాకల్టీ లు రూపత్, గోపీకృష్ణ సహకారంతో గోకార్టింగ్ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నాం. అందరి సహకారంతో ఈవీ వెహికల్ రైడ్‌లో మొదటి స్థానంలో నిలిచాం. – జననీ నాగరాజన్, రైడర్, బీవీఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాల, హైదరాబాద్. రెండు సార్లు రైడర్‌గా మొదటి స్థానం మా కళాశాల సీనియర్స్ ఇన్స్పిరేషన్తో గోకార్టింగ్ రైడర్ గా పోటీల్లో పాల్గొంటున్నాను. 150 సీసీ పల్సర్ ఇంజిన్‌తో వాహనం తయారుచేశాం. రైడర్‌గా రెండు సార్లు మొదటి స్థానంలో నిలిచాం. మాది మధ్య తరగతి కుటుంబం. మా నాన్న ఆటోడ్రైవర్, అమ్మ గృహిణి. భవిష్యత్‌లో మంచి కోర్ కంపెనీలో ఉద్యోగం సాధించడమే లక్ష్యం. – వి.సునీల్, రైడర్, రఘు ఇంజినీరింగ్ కళాశాల, విశాఖపట్టణం -
అద్భుతమైన ఇంజనీరింగ్ శైలి..
కోరుట్ల: పెద్ద పెద్ద రాతి స్తంభాలు.. వాటిపై శిలాఫలకాలతో శ్లాబ్ వంటి నిర్మాణాలు. అక్కడక్కడ చిన్నచిన్న విశ్రాంతి గదులు. దుస్తులు మార్చుకునేందుకు అనువైన నిర్మాణాలు. మూడు అంతస్తుల నిర్మాణం. భూమిపై కనిపించేది కేవలం ఒక అంతస్తు మాత్రమే.. మిగిలిన రెండు అంతస్తుల నిర్మాణం భూగర్భంలోకి వెళ్లిపోయింది. క్రీ.శ. 957–1184 మధ్య కాలం నాటి శిల్పుల ఇంజనీరింగ్ శైలికి నిదర్శనంగా నిలిచిన అద్భుతమైన నిర్మాణం జగిత్యాల జిల్లాలోని కోరుట్లలో ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. జైన చాళుక్యుల కాలంలో.. క్రీ.శ. 1042–1068 వరకు వేములవాడ రాజధానిగా పరిపాలన సాగించిన జైన చాళుక్యుల కాలంలో ఈ మెట్ల బావి నిర్మించినట్లు సమాచారం. 7–10వ శతాబ్ది వరకు పరిపాలన సాగించిన కల్యాణి చాళు క్యులు, రాష్ట్రకూటుల హయాంలోనూ ఈ మెట్ల బావి (Stepwell) ఆ కాలం నాటి రాజవంశీయుల స్నానాలకు, విశ్రాంతి తీసుకోవడానికి, ఈత నేర్చుకోవడానికి వినియోగించారని చెబుతారు. ఈ మెట్ల బావిలోని రాతి స్తంభాలపై చెక్కిన తీరు అమోఘం. రాతి స్తంభాల కింది భాగంలో భూగర్భమార్గంలో రాజకోటను చేరుకోవడానికి సొరంగం వంటి మెట్ల నిర్మా ణం ఉన్నట్లుగా ప్రచారంలో ఉంది. రాజవంశీయుల కాలంలో నిషిద్ధ ప్రాంతంగా ఉన్న ఈ మెట్ల బావి ప్రస్తుతం కోరుట్ల (Korutla) మున్సిపల్ అధీనంలో ఉంది. ఎక్స్‌లెన్స్ సర్టిఫికెట్ కోరుట్లలోని మెట్ల బావిలో స్నానాలకు వచ్చే రాజవంశీయులకు దుస్తులు మార్చుకోవడానికి అనువుగా మెట్లబావి రెండవ అంతస్తులో చిన్నచిన్న గదులుండటం గమనార్హం. వీటితో పాటు విశ్రాంతి తీసుకోవడానికి మెట్ల బావి చుట్టూ రాతి స్తంభాల మీద నిలబెట్టిన శిలాఫలకాలతో పెద్ద వసారా ఉంది. మెట్ల బావి (stair well) చుట్టూ దీపాలు వెలిగించడానికి అవసరమైన చిన్నపాటి గూళ్లు ఉన్నాయి. మెట్లబావిపై భాగంలో ఉన్న మెట్లకు వెంబడి ఎడమ వైపు ఉన్న ఓ రాతిపై శిలాశాసనం (Epigraphy) ఉంది. ఈ శిలాశాసనం సంపూర్ణంగా చదవడానికి వీలు కానట్లుగా సమాచారం. ఈ మధ్య కాలంలో దెబ్బతిన్న కోరుట్ల మెట్లబావిని మున్సిపల్ ఆధ్వర్యంలో బాగు చేయించి కొత్త సొబగులద్దారు. దీంతో ఈ మెట్లబావికి ఇండి గ్లోబల్ నెట్వర్క్ నుంచి 2022–23 సంవత్సరంలో ఎక్స్‌లెన్స్ సర్టిఫికెట్ దక్కింది. చదవండి: వెండితెరపై మానుకోట -
స్వర్గం భూమ్మీదకు వచ్చిందా?.. అందాల లోకం.. వారెవ్వా వనాటు
స్వర్గం ఎలా ఉంటుందో ఎవడికి తెలుసు?. ఎవరో వర్ణిస్తే కానీ ఊహించుకోవడం తప్పించి!. ఒకవేళ అది భూమ్మీద గనుక ఉంటే.. అది అచ్చం ‘వనాటు’(Vanuatu)లాగే ఉంటుందని లలిత్ మోదీ అంటున్నారు. ఐపీఎల్ సృష్టికర్త కారణంగా ఇప్పుడు ఈ దేశం పేరు తెగ వినిపించేస్తుండగా.. దాని గురించి వెతికే వాళ్ల సంఖ్యా ఒక్కసారిగా పెరిగిపోయింది.ఆర్థిక నేరగాడికి అభియోగాలు ఎదుర్కొంటున్న లలిత్ మోదీ 2010లో దేశం విడిచి లండన్ పారిపోయారు. అయితే ఆయన్ని వెనక్కి రప్పించే ప్రయత్నాలు భారత్ ముమ్మరంగా చేయగా.. ఆయన తెలివిగా వనాటు పౌరసత్వం పొందారు. అయితే ఈ విషయం తెలియడంతో ఆ దేశం ఆయన పౌరసత్వాన్ని రద్దు చేసింది. ఇది ఇక్కడితోనే ఆగలేదు. లలిత్ మోదీ పౌరసత్వాన్ని రద్దు చేసినట్లు వనాటు ప్రధాని జోథం నపాట్ స్వయంగా ప్రకటించారు. ఆ ప్రకటన వెలువడిన కాసేపటికే.. ఎక్స్ వేదికగా లలిత్ ఓ పోస్ట్ చేశారు.‘‘వనాటు ఒక అందమైన దేశం, స్వర్గంలా ఉంది. మీ పర్యటనల జాబితాలో దీన్ని చేర్చాల్సిందే’’ అని సందేశం ఉంచారు. దీంతో నెటిజన్స్ ఆయన కామెంట్ సెక్షన్లో సరదా కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వనాటు అందాల గురించి ఆరా తీస్తున్నారు.వనాటు.. ఎక్కడుంది?ఉత్తర ఆస్ట్రేలియాకు 1,750 కిలోమీటర్ల దూరంలో దక్షిణ పసిఫిక్ మహా సముద్రంలో ఉంది ఈ ద్వీప దేశం. మొత్తం 83 చిన్న చిన్న ద్వీపాల సముదాయంగా వై(Y) ఆకారంలో ఉంటుందీ దేశం. ఇందులో 65 ద్వీపాల్లో మాత్రమే ప్రజలు జీవిస్తున్నారు. ఎఫేట్ ఐల్యాండ్‌లో ఉండే పోర్టువిల్లా నగరం ఆ దేశ రాజధాని. పశ్చిమంగా ఫిజీ దేశం, ఇతర దిక్కుల్లో సాలామాన్ ద్వీపాలు, న్యూ కాలేడోనియా ఉన్నాయి. ఒకప్పుడు బ్రిటిష్ఫ్రెంచ్ సంయుక్త పాలనలో ఇది బానిస దేశంగా ఉండేది. 1980 జులై 30న వనాటు స్వాతంత్రం పొందింది. కరెన్సీ వనాటు వాటు. ప్రస్తుత జనాభా దాదాపు మూడున్నర లక్షలు. ‘‘దేవుడితో మేం నిలబడతాం’’ అనేది ఆ దేశపు నినాదం.అగ్నిపర్వతాలు.. భూకంపాల నేలఈ ద్వీప దేశంలో అగ్నిపర్వతాలు ఉన్నాయి. వీటిల్లో కొన్ని క్రియాశీలకంగా కూడా ఉన్నాయి. సంవత్సరంలో సుదీర్ఘంగా వేసవి వాతావరణంతో పొడిగా ఉంటుంది అక్కడ. అయితే నవంబర్-ఏప్రిల్ మధ్య వర్షాలు, తుపాన్లు సంభవిస్తుంటాయి. ఫసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌లో ఉండడం మూలంగా భూ కంపాలు షరామాములుగా మారాయి. అయితే కిందటి ఏడాది డిసెంబర్లో 7.3 తీవ్రతతో వచ్చిన భూకంపం ఆ దేశానికి తీవ్ర నష్టం కలిగించింది. ఈ భూకంపంలో 14 మంది చనిపోగా.. 265 మంది తీవ్రంగా గాయపడ్డారు. అందాల లోకం.. వనాటులో ఉన్న వృక్ష, జంతు సంపద అత్యంత అరుదైంది. ఈ భూమ్మీద ఎక్కడా కనిపించని జీవ జాతులు ఉన్నాయక్కడ. ఎటు చూసినా.. దట్టమైన అడవులు, జలపాతాలు, అందమైన సముద్రం.. నిర్మానుష్యమైన తీరాలు, కొన్ని ద్వీపాల్లో లాగున్లూ.. ఓ ప్రత్యేక అనుభూతిని పంచుతాయి. సహజ సౌందర్యం, జీవ వైవిధ్యం.. వనాటును ప్రపంచ పర్యాటక జాబితాలో ‘ప్యారడైజ్ ఆఫ్ ది ఎర్త్’గా నిలబెట్టాయి.టూరిజం కోసమే..టూరిజం, వ్యవసాయం ఇక్కడి ప్రజల ప్రధాన ఆదాయ వనరులు. అలాగే జనాభాలో గ్రామీణ జనాభా ఎక్కువ. 80 శాతం వ్యవసాయమే చేస్తుంటారు. కావా పంట ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతుంది. పర్యాటకం ద్వారా వచ్చే ఆదాయం ఆ దేశ జీడీపీలో 65 శాతంగా ఉంది. పర్యాటకం మీద ఆధారపడిన ప్రజలు కావడంతో.. పర్యాటకులను మర్యాదలతో ముంచెత్తారు. అలాగే.. సంప్రదాయాలకు అక్కడి ప్రజలు పెద్ద పీట వేస్తుంటారు. పెంటెకాస్ట్ ఐల్యాండ్‌లో స్థానికులు ల్యాండ్ డైవింగ్ క్రీడ నిర్వస్తుంటారు. బొంగులలాంటి నిర్మాణలను ఎత్తుగా పేర్చి.. చెట్ల తీగలతో సాయంతో బంగీ జంప్లా కిందకు దూకుతారు. ఎవరి తల భూమికి మొదట తాకితే వాళ్లు విజేతలు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు చేసే ఈ ప్రయత్నాల్లో.. పాపం ఒక్కోసారి ప్రాణాలు పొగొట్టుకుంటారు కూడా. పన్నులు లేవు, కానీ..వనాటులో ఎలాంటి పన్నులు విధించరు. ఈ కారణంగా అంతర్జాతీయ నియంత్రణ సంస్థలు ఈ దేశంపై ప్రత్యేక దృష్టి సారించాయి. అదే టైంలో.. వనాటు ఆర్థిక నేరాలకు అడ్డా కూడా. మనీలాండరింగ్‌కు సంబంధించిన చట్టాలు కూడా అక్కడ బలహీనంగా ఉండడమే ప్రధాన కారణం. ఆర్థిక నేరాలతో పాటు డ్రగ్స్.. ఆయుధాల అక్రమ రవాణాలకు ఇది అడ్డాగా మారింది. ఈ కారణంగానే పైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఈ దేశాన్ని గ్రే లిస్ట్‌లో చేర్చింది. అలాగే.. 2017లో వెలుగు చూసిన ప్యారడైజ్ పేపర్స్ లీక్.. అక్కడి అక్రమ సంపద వ్యవహారాలను బయటపెట్టింది. ఇక.. 2001 ఏప్రిల్‌లో అప్పటి ప్రధాని బరాక్ సోప్ ఫోర్జరీ కేసులో చిక్కుకున్నారు. భారత్‌కు చెందిన వ్యాపారవేత్త అమరేంద్ర నాథ్ ఘోష్‌కు వందల కోట్ల విలువ చేసే పైనాన్షియల్ గ్యారెంటీలను అనధికారికంగా కట్టబెట్టారని బరాక్‌పై అభియోగాలు వచ్చాయి. ఈ కారణంతో ఆయన అదే ఏడాది తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే.. ప్రపంచం దృష్టిలో ఏర్పడిన ఈ మచ్చని.. కఠిన చట్టాల ద్వారా తొలగించుకునే పనిలో ఉంది ఈ సుందర ద్వీప దేశం. -
కెనడా తదుపరి ప్రధానిగా మార్క్ కార్నీ
టొరంటో: కెనడా సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌గా గతంలో సేవలందించిన బ్యాంకింగ్ రంగ ప్రముఖుడు మార్క్ కార్నీను కెనడా ప్రధానమంత్రి పీఠం వరించింది. ప్రస్తుత ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో రాజీనామా చేస్తానని జనవరిలో ప్రకటించిన నేపథ్యంలో పాలక లిబిరల్ పార్టీ నూతన సారథి కోసం ఎన్నికలు నిర్వహించగా కార్నీ ఘన విజయం సాధించారు. దాంతో తదుపరి ప్రధానమంత్రిగా 59 ఏళ్ల కార్నీ త్వరలో బాధ్యతల స్వీకరించనున్నారు. ట్రంప్ సారథ్యంలోని అమెరికాతో కెనడా వాణిజ్యయుద్ధానికి దిగిన వేళ కెనడా ప్రధాని పగ్గాలు కార్నీ చేపడుతుండటం గమనార్హం. ఆదివారం లిబరల్ పార్టీ సారథ్యం కోసం జరిగిన ఓటింగ్‌లో కార్నీ 1,31,674 ఓట్లు సాధించారు. మొత్తం ఓట్లలో ఏకంగా 85.9 శాతం ఓట్లు కార్నీ కొల్లగొట్టడం విశేషం. గతంలో మహిళా ఉపప్రధానిగా సేవలందించిన క్రిస్టినా ఫ్రీలాండ్ రెండోస్థానంలో సరిపెట్టుకున్నారు. ఈమెకు కేవలం 11,134 ఓట్లు పడ్డాయి. అంటే మొత్తం ఓట్లలో కేవలం 8 శాతం ఓట్లు ఈమెకు దక్కాయి. గవర్నమెంట్ హౌస్ లీడర్ కరీనా గౌల్డ్(4,785 ఓట్లు) మూడో స్థానంతో, వ్యాపా ర అనుభవం ఉన్న నేత ఫ్రాంక్ బేలిస్(4,038) నాలుగో స్థానంతో సరిపెట్టు కున్నారు. మొత్తం 1,51,000 మందికిపైగా పార్టీ సభ్యులు ఓటింగ్‌లో పాల్గొన్నారు.పదవీ స్వీకారం ఎప్పుడు ?పార్టీ ఎన్నికల్లో గెలిచినా వెంటనే కార్నీ ప్రధాని పీఠంపై కూర్చోవడం కుదరదు. ట్రూడో ప్రధానిగా రాజీనామా చేసి గవర్నర్ జనరల్‌కు సమర్పించాలి. కెనడా ఒకప్పుడు బ్రిటన్ వలసరాజ్యం కావడంతో ప్రస్తుత బ్రిటన్ రాజు కింగ్ ఛార్లెస్–3 సమ్మతితో గవర్నర్ జనరల్.. కార్నీతో నూతన ప్రధానిగా ప్రమాణంచేయిస్తారు. అయితే అక్టోబర్ 20వ తేదీలోపు కెనడాలో సాధారణ ఎన్నికలు చేపట్టాల్సిఉంది. అందుకే కార్నీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించగానే ఎన్నికలకు పిలుపిచ్చే వీలుంది.ట్రంప్‌ను నిలువరిద్దాంపార్టీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించాక వందలాది మంది మద్దతుదారులనుద్దేశించి కార్నీ ప్రసంగించారు. అమెరికా దిగు మతి టారిఫ్‌ల పెంపు అంశాన్ని ప్రస్తావించారు. ‘‘ ఇకపై ఏమాత్రం నమ్మలేని దేశం(అమెరికా) మనకు గడ్డు పరిస్థితు లను తీసుకొచ్చింది. అయినాసరే మనం ఈ పరిస్థితిని దీటుగా ఎదుర్కోగలం. అమెరికా దిగుమతి టారిఫ్‌లకు దీటుగా మనం కూడా టారిఫ్‌లు విధిస్తాం. మమ్మల్ని అమెరికా గౌరవించేదాకా ఇవి కొనసాగుతాయి. అమెరికన్లు మా సహ జవనరులు, భూములు, నీళ్లు, ఏకంగా మా దేశాన్నే కోరుకుంటున్నారు. ఏ రూపంలోనూ కెనడా ఎప్పటికీ అమెరికాలో భాగం కాబోదు. ట్రంప్ గెలవకుండా నిలువరిద్దాం’’ అని వందలాది మంది మద్దతుదారులను ద్దేశించి కార్నీ ప్రసంగించారు.బ్యాంకర్ పొలిటీషియన్కెనడా, బ్రిటన్‌లోని సెంట్రల్ బ్యాంక్‌లకు సారథ్యం వహించి అపార బ్యాంకింగ్ అనుభవం గడించిన మార్క్ కార్నీ ఇప్పుడు కెనడా ప్రధానిగా కొత్త పాత్ర పోషించనున్నారు. బ్యాంక్ ఆఫ్ కెనడా గవర్నర్ హోదాలో 2008లో ఆర్థిక సంక్షోభం నుంచి కెనడాను గట్టెక్కేలాచేసి శెభాష్ అనిపించుకున్నారు. వలసలు, అధికమైన ఆహార, ఇళ్ల ధరలతో ప్రస్తుతం కెనడా సతమవుతున్న వేళ ట్రంప్ టారిఫ్ యుద్ధానికి తెరలేప డంతో కార్నీ తన బ్యాంకింగ్ అనుభవాన్ని పరిపాలనా దక్షతగా మార్చాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.హార్వర్డ్‌లో ఉన్నత విద్య: 1965 మార్చి 16వ తేదీన వాయవ్య కెనడాలోని ఫోర్ట్‌స్మిత్ పట్టణంలో కార్నీ జన్మించారు. తర్వాత ఆల్బెర్టా రాష్ట్రంలోని ఎడ్మోంటెన్‌లో పెరిగారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో 1988లో ఉన్నతవిద్య పూర్తిచేశారు. ఈయనకు ఐస్ హాకీ అంటే చాలా ఇష్టం. కాలేజీ రోజుల్లో ఐస్హాకీ బాగా ఆడేవారు. తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆర్థికశాస్త్రంలో పీహెచ్డీ సాధించారు. బ్రిటన్‌కు చెందిన ఆర్థికవేత్త డయానా ఫాక్స్‌ను పెళ్లాడారు. వీళ్లకు నలుగురు కుమార్తెలు. కెనడా పౌరసత్వంతోపాటు ఈయనకు ఐరిష్, బ్రిటిష్ పౌరసత్వం కూడా ఉంది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌కు గవర్నర్‌గా పనిచేసినకాలంలో తొలిసారిగా బ్రిటన్ పాస్‌పోర్ట్ సంపాదించారు. గోల్డ్‌మ్యాన్ శాక్స్‌లో దశాబ్దానికిపైగా పనిచేశారు. లండన్, టోక్యో, న్యూయార్క్, టొరంటోలో పనిచేశారు. తర్వాత 2003లో బ్యాంక్ ఆఫ్ కెనడాలో డిప్యూటీ గవర్నర్‌గా పనిచేశారు.3 శతాబ్దాల్లో తొలిసారిగా: 2013 నుంచి ఏడేళ్లపాటు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ గవర్నర్‌గా సేవలందించారు. 1694లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌ను స్థాపించగా గత 300 సంవత్సరాల్లో ఆ బ్యాంక్‌కు గవర్నర్‌గా ఎన్నికైన తొలి బ్రిటీషేతర వ్యక్తిగా 2013లో కార్నీ చరిత్ర సృష్టించారు. బ్రెగ్జిట్ వేళ బ్రిటన్ ఆర్థికసంక్షోభంలో కూరుకుపోకుండా బ్యాంకర్‌గా కార్నీ సమర్థవంత పాత్ర పోషించారు. 2020లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌ను వీడాక ఐక్యరాజ్యసమితిలో వాతావరణ మార్పులు, ఆర్థిక అంశాలపై ప్రత్యేక దౌత్యవేత్తగా సేవలందించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
47 ఏళ్ల క్రితం ఆఖరి ఉరి
ప్రణయ్ హత్య కేసులో తీర్పు వెలువడింది. ఏ2గా సుభాష్ శర్మను కోర్టు దోషిగా నిర్ధారిస్తూ మరణశిక్ష విధించింది. అయితే శిక్ష అమలు కావడానికి మూడు అంకాలు దాటాల్సి ఉంటుంది. ఇక్కడ తెరపైకి వచ్చే అంశం ఏమిటంటే.. ప్రస్తుతం రాష్ట్రంలోని ఏ జైలులోనూ గ్యాలోస్ (ఉరికంబం ఉండే ప్రాంతం సాంకేతిక నామం) లేదు. తలారులుగా పిలిచే హ్యాంగ్ మన్ పోస్టులు అసలే లేవు.రాష్ట్రపతి వరకు అప్పీల్‌కు చాన్స్..ప్రస్తుతం ట్రయల్ కోర్టు సుభాష్ శర్మకు మరణశిక్ష విధించింది. అతను ఈ తీర్పును హైకోర్టులో సవాల్ చేసే అస్కారం ఉంది. అంతేకాదు ట్రయల్ కోర్టు కూడా ఈ శిక్ష విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకువెళ్తుంది. ఈ క్రమంలో ‘రిఫర్డ్ ట్రయల్’గా పిలిచే విధానంలో హైకోర్టు విచారణ చేయవచ్చు. మరణశిక్షను హైకోర్టు సమర్థిస్తే.. సుప్రీంకోర్టులో అప్పీల్ చేయవచ్చు. అక్కడా చుక్కెదురైతే క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతికి విజ్ఞప్తి చేయవచ్చు. రాష్ట్రపతి తిరస్కరిస్తే.. దోషులకు విధించిన మరణశిక్ష పూర్తిగా ఖరారైనట్లే. దీంతో శిక్ష విధించినన్యాయస్థానానికి సంబంధించిన రాష్ట్రంలో.. మరణశిక్షను అమలు చేస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో 47 ఏళ్ల క్రితం..ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి సంబంధించి ఆఖరి ఉరిశిక్షను 47 ఏళ్ల క్రితం ముషీరాబాద్ సెంట్రల్ జైలులో అమలు చేశారు. 1978లో భారత వైమానిక దళంలో పనిచేసిన ఎయిర్‌మన్ రామవతార్ యాదవ్‌పై హత్య కేసు నిరూపితమై, మరణశిక్ష ఖరారు కావడంతో ఉరి తీశారు. అప్పట్లో ముషీరాబాద్ సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్‌గా ఉన్న సుబ్బారెడ్డి పర్యవేక్షణలో శిక్షను అమలైంది. తర్వాతి కాలంలో ముషీరాబాద్ సెంట్రల్ జైలును చర్లపల్లి ప్రాంతానికి మార్చారు.ఇక్కడ జైలు నిర్మిస్తున్నప్పుడు గ్యాలోస్ (ఉరికంబం) కోసం ఓ ప్రాంతాన్ని ఎంపిక చేసినా ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉరికంబం ఉన్న జైలు ఒక్క రాజమండ్రి సెంట్రల్ జైలు మాత్రమే. ఇక తెలంగాణ జైళ్ల శాఖలో హ్యాంగ్‌మన్‌గా పిలిచే తలారీ పోస్టులు లేవు. చాలా ఏళ్లుగా ఉరిశిక్ష అమలు లేకపోవడంతో కొందరు హెడ్–వార్డెర్లకే ఈ అంశంలో ప్రాథమిక శిక్షణ ఇస్తున్నారు.రాజమండ్రి జైల్లో 49 ఏళ్ల క్రితం...రాజమండ్రి సెంట్రల్ జైలులో చివరిసారిగా 1976 ఫిబ్రవరిలో ఉరిశిక్షను అమలు చేశారు. ఓ హత్య కేసులో దోషిగా తేలిన అనంతపురం జిల్లాకు చెందిన నంబి కిష్టప్పను ఉరి తీశారు. తర్వాత కొందరు ఖైదీలను ఉరిశిక్ష అమలు కోసం ఈ జైలుకు తరలించినా అమలు కాలేదు. 1875 నుంచీ గ్యాలోస్ ఉండి, ఇప్పటికీ కొనసాగుతున్న కేంద్ర కారాగారం రాజమండ్రి సెంట్రల్ జైల్ మాత్రమే.స్వాతంత్య్రం అనంతరం దేశవ్యాప్తంగా వివిధ కారాగారాల్లో దాదాపు 100 మందిని ఉరితీశారు. అందులో అత్యధికంగా 42 శిక్షలను రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే అమలు చేశారు. ఉరి అమలుకు ముందు సదరు ఖైదీని ఆఖరి కోరిక ఏమిటని అడగటం ఆనవాయితీ. కిష్టప్ప తన ఆఖరి కోరికగా లడ్డూ తింటానని కోరగా.. జైలు అధికారులు అతడికి లడ్డూలు అందించారు. రాజమండ్రి జైలు తలారీ ధర్మరాజు ఆ ఉరి తీశారు.అదో ప్రత్యేకమైన గ్యాలోస్..రాజమండ్రి సెంట్రల్ జైల్లోని గ్యాలోస్ 1980 వరకు ప్రధాన ద్వారం పక్కనే బహిరంగ ప్రదేశంలో ఉండేది. ఉరిశిక్ష అమలు తర్వాత మృతదేహాన్ని ఉరికంబం కింద ఉండే ప్రత్యేక చాంబర్లో దింపుతారు. అక్కడి నుంచి నేరుగా ట్రే ద్వారా సంబంధీకులకు అప్పగించాలని, మృతదేహాన్ని జైలుగదుల మీదుగా బయటికి తీసుకురావద్దనే ఉద్దేశంతో అలా ఏర్పాటు చేశారు. 1980 తర్వాత గ్యాలోస్‌ను అడ్మినిస్ట్రేటివ్ భవనం పరిసరాల్లోకి మార్చారు.2013లో ఈ గ్యాలోస్ ఉన్న ప్రాంతంలోనే రూ.7.5 కోట్లతో కొత్తగా పరిపాలనా భవనాన్ని నిర్మించారు. అయితే గ్యాలోస్‌ను అక్కడి నుంచి మార్చడం ఇష్టం లేక భవనం కింద భూగర్భంలో ఏర్పాటు చేశారు. ఈ తరహా గ్యాలోస్ కలిగిన కారాగారం దేశంలో మరోటి లేదు. అంతేకాదు నిర్మాణాలు ఎన్ని మారినా ఇప్పటికీ బ్రిటిష్ కాలం నాటి ఇనుప ఉరికంబాన్నే వినియోగిస్తున్నారు. తరచూ దీనికి నూనె రాస్తూ దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. -
ఎవరికి వారే.. వేసవి వ్యూహాలు
మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా 2024 జనవరిలో ఆపరేషన్ కగార్ (ఫైనల్ మిషన్)ను కేంద్ర బలగాలు చేపట్టాయి. ఈక్రమంలోనే బస్తర్ అడవుల్లో నెత్తురు ఏరులై పారింది. ఎదురుకాల్పుల్లో 300 మందికి పైగా మావోయిస్టులు చనిపోయారు. అయితే ప్రభుత్వ దళాల దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు మావోయిస్టులు (Maoists) ఎదురుదాడులకు సిద్ధమయ్యారని సమాచారం అందుతోంది. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంవేసవి వ్యూహం..వేసవి (Summer) సమీపించడంతో ఆకులు రాలిపోయి అడవులు వెలవెలబోతాయి. దీంతో ప్రతి వేసవిని మావోయిస్టులు గడ్డుకాలంగానే పరిగణిస్తారు. అడవిలో చాటు తగ్గిపోవడంతో పాటు నీటి వనరుల లభ్యత పరిమితంగా ఉంటుంది. దీంతో అడవుల్లోకి పోలీసులు, భద్రతా దళాలు చొచ్చుకురాకుండా ‘ట్యాక్టిక్ కౌంటర్ అఫెన్సివ్ క్యాంపెయిన్’ పేరుతో ముందుగానే ఎదురుదాడులకు దిగే వ్యూహాన్ని ఆ పార్టీ అమలు చేస్తోంది. కానీ పెరిగిన నిర్బంధం వల్ల ప్రస్తుతం బస్తర్ అడవుల్లో మావోయిస్టులు, వారి సానుభూతిపరులకు మధ్య సంబంధాలు గతంలో పోలిస్తే తగ్గిపోయాయి. సానుభూతిపరుల నుంచి అవసరమైన మేర సాయం అందే పరిస్థితి లేదు. ఈ లోటును పూడ్చుకునేందుకు తమ సాయుధ బలగాలనే ఏకం చేసి వ్యూహాత్మక దాడులు చేయాలనే ప్లాన్‌లో మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం.ఏకమవుతున్న దళాలు.. బస్తర్ అడవులు కేంద్రంగా కేంద్ర కమిటీతో పాటు వివిధ రాష్ట్రాలు, ఏరియా కమిటీలు పనిచేస్తున్నాయి. ఈ కమిటీలకు రక్షణగా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి చెందిన సాయుధులు రక్షణ కల్పిస్తున్నారు. దీనికి తోడు ప్రతి కమిటీకి సాయుధ దళాలు ఉంటాయి. వేసవి ప్రతికూల పరిస్థితుల్లో ప్రభుత్వ భద్రతా బలగాలను ఎదుర్కోవాలంటే దళాలు వేర్వేరుగా కాకుండా కలిసికట్టుగా దాడులు చేయాలనే వ్యూహానికి మావోలు పదును పెడుతున్నట్టు సమాచారం. ఈ మేరకు దండకారణ్యం, అబూజ్మడ్ అడవుల్లో తమకు పట్టున్న ప్రాంతానికి వివిధ దళాలు చేరుకున్నట్టు తెలుస్తోంది.సురక్షితంగా ఎంట్రీ–ఎగ్జిట్.. ఒకప్పుడు రెడ్ కారిడార్ అంటే నేపాల్ నుంచి దక్షిణ భారతదేశం వరకు ఉండేది. ప్రస్తుతం బస్తర్ అడవులు మాత్రమే మిగిలాయి. ఇందులోనూ చాలా ప్రాంతం భద్రతా దళాల అధీనంలోకి వెళ్లింది. అయినప్పటికీ దక్షిణ బస్తర్, ఏవోబీ, ఛత్తీస్‌గఢ్ – మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు ఇప్పటికీ మావోల గుప్పిట్లోనే ఉన్నాయి. దీంతో తమకు పట్టు ఉన్న ప్రాంతానికి చేరుకుంటున్న దళాలు... ఆయా ప్రాంతాల నుంచి ఎంట్రీ, ఎగ్జిట్, రిట్రీవ్ రూట్లు సేఫ్‌గా ఉండేలా ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. తమ స్థావరాల సమీపంలోకి భద్రతా దళాలు వస్తే భీకరంగా ఎదురుదాడి చేయాలని మావోయిస్టులు లక్ష్యంగా పెట్టుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. జవాన్ల జోరు తగ్గిందా? ఈ ఏడాది ఆరంభంలో జనవరి 16, 21, ఫిబ్రవరి 9న భారీ ఎన్కౌంటర్లు జరిగాయి. ఈ ఘటనల్లో 80 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి సైతం ప్రాణాలు కోల్పోయారు. కానీ గడిచిన నెలరోజులుగా భారీ ఎన్కౌంటర్లు ఎక్కడా జరగలేదు. నక్సలైట్ల వేసవి వ్యూహాలను పసిగట్టడం వల్లనే గడిచిన నెల రోజులుగా గాలింపు చర్యలను భద్రతా దళాలు ఆచితూచి చేపడుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దూకుడుగా అడవుల్లోకి వెళ్లి మావోయిస్టుల వలలో చిక్కితే భారీగా ప్రాణనష్టం జరగడంతో పాటు జవాన్ల ఆత్మస్థైర్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. అందువల్లే కూంబింగ్‌కు సమాంతరంగా బేస్ క్యాంపులను సుస్థిరం చేయడం, కొత్తగా అధీనంలోకి వచ్చిన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై భద్రతా దళాలు ఫోకస్ చేస్తున్నాయి. కవ్వింపు చర్యలు తీవ్ర నిర్బంధం కొనసాగుతున్నప్పటికీ మార్చి 6న దంతేవాడ జిల్లా కేంద్రానికి 40 కి.మీ. దూరంలో బస్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టులు ప్రజాకోర్టు నిర్వహించారు. విప్లవ ద్రోహులుగా పేర్కొంటూ అక్కడ కొన్ని కుటుంబాలను ఊరు వదిలి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. గాలింపు చర్యల్లో భద్రతా దళాల దూకుడు తగ్గడంతో వారిని రెచ్చగొట్టి అడవుల్లోకి రప్పించేందుకే మావోయిస్టులు ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మావోయిస్టుల ప్రింటింగ్ సామగ్రి స్వాధీనందుమ్ముగూడెం: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా చింతల్నార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గోమ్గూడ క్యాంపు బలగాలు ఆదివారం మావోయిస్టుల ప్రింటింగ్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. గోమ్గూడ క్యాంపు నుంచి డీఆర్జీ, కోబ్రా, 241 బెటాలియన్, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా మావోయిస్టుల కోసం గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో గోమ్గూడ క్యాంపు పరిధిలోని జాలేర్గూడ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు స్పైక్(పదునైన కడ్డీలు)లను ఏర్పాటు చేశారు. వాటిని తొలగించుకుంటూ గాలిస్తుండగా.. మావోయిస్టులకు చెందిన ప్రింటింగ్ స్థావరం బయటపడింది. అక్కడ మావోయిస్టులు దాచిపెట్టిన ప్రింటర్లు, ఇన్వర్టర్ యంత్రాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. చదవండి: మావోయిస్టులకు లొంగుబాటే శరణ్యమా? -
షార్ట్ ఫిలిమ్స్ నుంచి సినిమాల వరకు..
మహబూబాబాద్ అర్బన్: మానుకోట జిల్లా అనగానే మొదట గుర్తుకువచ్చేది క్రీడలు.. అంతేనా.. విద్య, ఉద్యమాలు, పోరాటాల్లో.. పాటల రచయితలు, సంగీత దర్శకులు, ఫొటోగ్రాఫర్లు, కళాకారులుగా.. ఇలా ఎందరో సత్తా చాటుతున్నారు. మిర్చి, పసుపు, పత్తి పంటల్లో రాణిస్తున్నారు. కలెక్టర్, ఎస్పీ, పోలీస్, జవాన్, నేవీ తదితర అనేక రంగాల్లో వెలుగుతున్నారు. మానుకోట (Manukota) ముద్దుబిడ్డలుగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. జిల్లా నుంచి సినీరంగంలోనూ గుర్తింపు తెచ్చుకున్న కళాకారులు కోకొల్లలు. చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ.. పాటలు పాడుతూ ఎదుగుతున్నారు. చిన్న సినిమాలకు తొలుత సంగీతం అందించి ప్రస్తుతం పెద్దపెద్ద హీరోల సినిమాలకు పనిచేస్తున్నారు. వీడియో, కెమెరామెన్, సినిమా ఫొటోగ్రఫీ, అసోసియేట్ డైరెక్టర్ వరకు అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. దాశరథి నుంచి.. మానుకోట జిల్లా నుంచి మొదట సినిమారంగంలో చిన్నగూడూరుకు చెందిన దాశరథి కృష్ణమాచార్యులు ప్రవేశించారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’అని తెలంగాణ ఉద్యమానికి ప్రేరణ అందించిన కవి ఆయన. తెలుగు సినిమాలకు గేయ రచయితగా రాణించారు. ‘కన్నె వయసు’సినిమాలో ‘ఏ దివిలో విరిసిన పారిజాతమో..’ పాట రాశారు. తోట రాముడు సినిమాలో ‘ఓ బంగరు రంగుల చిలకా పలకవే..’అనే పాట కూడా రాశారు. మానుకోట జిల్లా (Manukota District) కేంద్రం గుమ్ముడూరుకు చెందిన గోడిశాల జయరాజు సినీగేయ రచయిత, కవి. ప్రకృతిపై కథలు, గేయాలు రాశారు. అవి తెలుగు, హిందీ, ఇంగ్లిష్, కన్నడ సహా అనేక భాషల్లోకి అనువాదమై విస్తృత ప్రాచుర్యం పొందాయి. జయరాజు మొదట ‘అడవిలో అన్న’ సినిమాలో ‘వందనాలమ్మ’ పాట రాశారు. ‘దండోరా’ సినిమాలో ‘కొండల్లో కోయిల పాటలు పాడాలి’ అనే పాట రాశారు. కేసముద్రం మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన జె.కె.భారవి (సుదర్శన భట్టాచార్య) తెలుగు సినీ రచయితగా, దర్శకుడు, పాటల రచయితగా పేరొందారు. కన్నడ సినీరంగంలోనూ పేరు తెచ్చుకున్నారు. అన్నమయ్య, లవ్‌స్టోరీ, శ్రీమంజునాథ, శ్రీరామదాసు, పాండురంగడు, శక్తి, ఓం నమో వేంకటేశాయ, చిటికెల పందిరి, జగద్గురు ఆదిశంకర తదితర సినిమాల్లో నటుడిగా, రచయితగా, దర్శకుడిగా పని చేశారు. ఆత్రేయ ప్రియశిష్య పురస్కారం అందుకున్నారు. మానుకోట మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన సంగీత దర్శకుడు చక్రధర్ రచయితగా, గాయకుడిగా, నటుడిగా రాణించారు. మొదట ‘పండు వెన్నెల’ అనే మ్యూజిక్ ఆల్బమ్ చేశారు. చిరునవ్వుతో, ఇడియట్, శివమణి, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, సత్యం, దేశముదురు, నేనింతే, చక్రం, ఆంధ్రావాలా, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం తదితర 85 చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేసి నంది అవార్డు అందుకున్నారు. బయ్యారం మండల గౌరారం గ్రామానికి చెందిన బొబ్బిలి సురేశ్ (Bobbili Suresh) సినీరంగంలో రాణిస్తున్నారు. నీదీ నాదీ ఒకే కథ, జార్జ్‌రెడ్డి, తోలుబొమ్మలాట, తిప్పర మీసం, గువ్వా గోరింక, విరాటపర్వం, చిల్బ్రో, టెన్త్‌క్లాస్ డైరీస్, మళ్లీ పెళ్లి తదితర సినిమాలకు సంగీత దర్శకుడిగా పని చేశారు. చదవండి: రాజమౌళి- మహేశ్ సినిమా.. ఒక్క లీక్ ఎంతపని చేసింది జిల్లా కేంద్రానికి చెందిన కందుకూరి అనిల్‌కుమార్ మొదట ప్రైవేట్ ఆల్బమ్ పాటలకు నృత్య దర్శకునిగా పని చేశారు. తరువాత పీపుల్స్‌వార్, పోలీస్ వెంకటరామయ్య, దండకారణ్యం సినిమాలకు నృత్య దర్శకత్వం వహించారు. తొర్రూరు పట్టణ కేంద్రానికి చెందిన గిద్దె రాంనర్సయ్య.. తెలంగాణ ఉద్యమంలో పలు గీతాలు ఆలపించారు. ఉద్యమంలో ఎంతో మందిని తన పాటలతో ఉత్తేజ పరిచారు.కంబాలపల్లి గ్రామానికి చెందిన గుర్రాల ఉదయ్ (Gurrala Uday) జేఎన్టీయూలో బ్యాచ్‌లర్ ఆఫ్ ఫొటోగ్రఫీ కోర్సు పూర్తి చేశారు. మొదట షార్ట్ ఫిలిమ్స్ తీశారు. ‘స్వేచ్ఛ’సినిమాతో సినీరంగంలోకి డైరెక్టర్‌గా అడుగుపెట్టారు. ఉత్తమ డైరెక్టర్ అవార్డు అందుకున్నారు. జంగిలిగొండ గ్రామానికి చెందిన రాజమౌళి (Rajamouli) బుల్లితెర షోల్లో నటించారు. భోళాశంకర్, ధమాక, బంగారు బుల్లోడు, అనుభవించు రాజా, చోర్ బజార్, సిల్లి ఫెలోస్ తదితర సినిమాల్లోనూ నటించారు.తెలంగాణ యాసపై సినిమాలు చేస్తా నాకు మొదట సినిమాల్లో అవకాశం కల్పించింది ఆర్.నారాయణమూర్తి. ప్రకృతితో.. నాకూ ఉన్న అనుబంధాన్ని నా పాటల్లో వివరించా. భవిష్యత్‌లో సినిమాల్లో రచనలు చేసే అవకాశం వస్తే వదులుకోను. నా ప్రతిభను మాజీ సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా గుర్తించి అవార్డు అందజేశారు. తెలంగాణ యాస, భాషపై మరిన్ని సినిమాలు చేస్తాను. – గొడిశాల జయరాజ్, సినీ రచయిత ‘స్వేచ్ఛ’షార్ట్ ఫిలింతో ప్రవేశం మొదట ‘స్వేచ్ఛ’షార్ట్ ఫిలింతో సినిమా రంగంలోకి అడుగు పెట్టాను. చిన్న చిన్న సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నాను. నేను రూపొందించిన ‘మేల్’సినిమా.. బెస్ట్ ఫిలిం స్క్రీన్‌ప్లే న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డుకు నామినేట్ అయింది. – గుర్రాల ఉదయ్, డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ ఆస్కార్ అవార్డు లక్ష్యం సినీరంగంలో మొదటి సినిమాతోనే నాకు మంచి గుర్తింపు వచ్చింది. భవిష్యత్‌లో పెద్ద పెద్ద హీరోలకు మంచి సంగీతం అందించి గుర్తింపు తెచ్చుకుని ఆస్కార్ అవార్డు అందుకోవాలన్నది నా కోరిక. ఇప్పటి వరకు నాకు చేయూతనిచ్చిన దర్శకులు, నిర్మాతలకు రుణపడి ఉంటా. – సురేష్ బొబ్బిలి, సంగీత దర్శకుడు కొత్తవారికి అవకాశమిస్తా టీవీ షోలు, సినీరంగంలో ఎంతో కష్టపడ్డాను. సినీ ప్రేక్షకులు, జిల్లా ప్రజల ఆశీస్సులతో ఇంతటి వాడినయ్యాను. నటనలో నైపుణ్యం ఉన్న వారికి కచ్చితంగా అవకాశం కల్పిస్తాను. పేద ప్రజలకు నా వంతుగా సేవ చేస్తున్నాను. – రాజమౌళి, జబర్దస్త్ నటుడు -
గర్భిణులు పారాసిటమాల్ వాడితే... పిల్లల్లో ఏడీహెచ్‌డీ!
కొందరు పిల్లలు చదువుతో పాటు ఆటపాటలు, అల్లరిలోనూ చురుగ్గా ఉంటారు. మరికొందరు మరీ అతి చురుకుదనం చూపిస్తారు. ఏదైనా ఇట్టే చేయగలమనే ధీమా వాళ్లలలో తొణికిసలాడుతుంది. అలా శక్తికి మించిన పనులు చేసి సమస్యలు కొని తెచ్చుకుంటుంటారు. అలాంటి ఈ పిల్లలు దేనిపైనా ఎక్కువ సేపు దృష్టి పెట్టలేరు. ఆలోచన కంటే ఆవేశంతోనే పనులు చేస్తుంటారు. పర్యావసానాలను కూడా పట్టించుకోరు. ఇలాంటి వాళ్లు అటెన్షన్ డిఫిసిట్ హైపరాక్టివిటీ డిజార్టర్ (ఏడీహెచ్‌డీ)తో బాధపడుతున్నట్టు! పారాసిటమాల్గా పిలిచే అసిటమినోఫిన్ను గర్భిణులు అతిగా వాడితే పిల్లల్లో ముప్పు మూడింతలు పెరుగుతుందని తాజా అధ్యయనంలో తేలింది. తలనొప్పికి, జ్వరానికి పారాసిటమాల్ వాడటం మన దగ్గర పరిపాటి. ఇది జ్వరంతో పాటు ఓ మాదిరి ఒంటి నొప్పులను కూడా తగ్గిస్తుంది. కానీ నొప్పి గర్భంతో ఉన్నప్పుడు ఈ మాత్రను అతిగా వాడితే పుట్టబోయే పిల్లల మెదడు ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం పడుతున్నట్టు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ పరిశోధకుల తాజా అధ్యయనంలో వెల్లడైంది. గర్భంతో ఉన్న 307 మంది నల్లజాతి మహిళల్లో పారాసిటమాల్ వాడినప్పుడు ఒంట్లో రక్తప్రవాహ రేట్లు, రక్తంలో ఈ ఔషధ పాళ్లను గమనించారు. వాటిని అతిగా వాడిన వారికి పుట్టిన చిన్నారుల్లో మిగతా పిల్లలతో పోలిస్తే ఏడీహెచ్‌డీ ముప్పు మూడు రెట్లు అధికమని తేలింది. అమ్మాయిలైతే పదేళ్ల లోపు ఏడీహెచ్‌డీ బారిన పడే ముప్పు ఏకంగా ఆరు రెట్లు ఎక్కువని అధ్యయనకారులు తెలిపారు. కనుక తప్పని పరిస్థితుల్లో మాత్రమే పారాసిటమాల్ వాడాలని సూచించారు. అధ్యయన వివరాలు ‘నేచర్ మెంటల్ హెల్త్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. దశాబ్దాలుగా వాడకం ‘‘అసిటమినోఫిన్ను దశాబ్దాలుగా వాడుతున్నారు. గర్భిణుల్లో పిండం తాలూకు మెదడు, నాడీవ్యవస్థ ఎదుగుదలపై అసిటమినోఫిన్ ప్రభావంపై ఇంతవరకు ఎలాంటి పరిశోధనలూ జరగలేదు. తాజా పరిశోధన నేపథ్యంలో గర్భిణుల పారాసిటమాల్ వాడకంపై అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మిని్రస్టేషన్ (ఎఫ్‌డీఏ) విభాగం పునఃసమీక్ష జరపాల్సిన అవసరం ఏర్పడింది. దీనిపై అమెరికా ప్రభుత్వం ఆలోచించాలి’’ అని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్లో పిల్లల వైద్య నిపుణురాలు షీలా సత్యనారాయణ చెప్పారు. అయితే, ‘‘ప్రస్తుత పరిశోధన ఫలితాలతో బెంబేలెత్తాల్సిన పని కూడా లేదు. దీనిపై మరింత విస్తృత అధ్యయనం జరగాల్సి ఉంది’’ అని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం గర్భిణులకు పారాసిటమల్‌ను తప్పనిసరైతేనే, అదీ తక్కువ డోసులోనే వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. తాజా అధ్యయనం నేపథ్యంలో ఎఫ్‌డీఏతో పాటు యూరోపియన్ మెడికల్ ఏజెన్సీ, అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఒబ్్రస్టిటీíÙయన్స్, గైనకాలజిస్ట్స్, ది సొసైటీ ఆఫ్ ఓబ్స్ట్రిటీíÙయన్స్ అండ్ గైనకాలజిస్ట్స్ ఆఫ్ కెనడా, ది సొసైటీ ఆఫ్ మెటర్నల్ –ఫీటల్ తదితరాలు పునరాలోచనలో పడే వీలుంది. అయితే గర్భిణులు అసిటమినోఫిన్ వాడితే పిల్లలకు ఏడీహెచ్‌డీ వస్తుందని నిరూపణ కాలేదని ఎఫ్‌డీఏ అధికారులు 2015లో తేల్చడం గమనార్హం. – వాషింగ్టన్ -
ఉడ్తా కేరళ!
అందమైన అడవులు, కొండలు, లోయలతో దేవుడు తీరిగ్గా తీర్చిదిద్దినట్టుగా ఉండే కేరళ మాదకద్రవ్యాల మత్తులో కూరుకుపోతోంది. రాష్ట్రాన్ని డ్రగ్స్ భూతం కబళిస్తోంది. చివరికి స్కూలు విద్యార్థులు కూడా డ్రగ్స్‌కు బానిసలవుతున్న పరిస్థితి! మాదకద్రవ్యాల వాడకంలో పంజాబ్‌ను కూడా దాటేసి దేశంలో తొలి స్థానంలో నిలిచింది. కేరళలోని కడక్కవూర్‌లో ఓ మహిళ డ్రగ్స్ మత్తులో టీనేజీ వయసున్న కన్న కొడుకుపైనే లైంగిక దాడులకు పాల్పడింది. దాంతో సహించలేక మరో కొడుకు ఆమెను చంపేశాడు! సంచలనం రేపిన ఈ ఘటన రాష్ట్రంలో సింథటిక్ డ్రగ్స్ విజృంభణకు ఉదాహరణ మాత్రమే.కేరళలో ఏ మూలన చూసినా డ్రగ్స్ ఘాటు గుప్పున కొడుతోందని నార్కోటిక్ గణాంకాలు చెబుతున్నాయి. 2024లో రాష్ట్రవ్యాప్తంగా నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ చట్టం,1985 కింద ఏకంగా 24,517 కేసులు నమోదయ్యాయి. డ్రగ్స్ అతి వాడకానికి మారుపేరుగా మారిన పంజాబ్‌లో నమోదైంది 9,734 కేసులే! ‘‘సింథటిక్ డ్రగ్స్ రాష్ట్రంలోకి అడుగుపెట్టకుండా కఠిన చట్టాలు చేయాల్సిన సమయమొచి్చంది. స్కూళ్ల ప్రాంగణాల్లోనూ డ్రగ్స్ బయటపడుతున్నాయి’’ అని కేరళ హైకోర్టు జస్టిస్ వీజీ అరుణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు పరిస్థితికి అద్దం పడుతున్నాయి.330 శాతం అధికం 2021 నుంచి చూస్తే మూడేళ్లలో కేరళలో డ్రగ్స్ కేసులు 330 శాతం పెరిగాయి. నమోదవని ఘటనలు మరెన్నో రెట్లు ఉంటాయని చెబుతున్నారు. రాష్ట్రంలో తరచూ భారీ పరిమాణంలో మత్తుపదార్థాలను పోలీసులు స్వా«దీనం చేసుకుంటున్నారు. గతంలో స్థానికంగా దొరికే గంజాయి సేవించేవారు. ఇప్పుడు సింథటిక్ డ్రగ్స్ వైపు మళ్లుతున్నారని స్వయంగా హైకోర్టు న్యాయమూర్తే వాపోయారు. దీనిపై అసెంబ్లీలో రెండుసార్లు చర్చించడమే గాక సమస్య పార్లమెంటులోనూ ప్రస్తావనకు వచ్చింది. ఎన్నెన్ని విషాదాలో...! డ్రగ్స్‌కు బానిసలైన వారి కుటుంబాల్లో ఆనందం ఆవిరవుతోంది. యువత, ముఖ్యంగా మైనర్లు మత్తులో తూగుతున్నారు..→ కాలికట్ జిల్లాలో మత్తుకు బానిసైన పాతికేళ్ల ఆశిఖ్ తన తల్లినే నరికి చంపాడు. పైగా ‘నాకు జన్మనిచి్చనందుకు శిక్షించా’ అంటూ డ్రగ్స్ మత్తు లో చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్‌గా మా రింది.→ త్రిసూర్‌లో మరో పాతికేళ్ల వ్యక్తి తల్లి నాలుక కోసేశాడు. జనవరి 1న త్రిసూర్‌లోనే 14, 16 ఏళ్ల టీనేజర్లు బహిరంగంగా డ్రగ్స్ తీసుకుంటూ హల్చల్ చేశారు. వారించిన 30 ఏళ్ల వ్యక్తిని అత్యంత దారుణంగా చంపేశారు.→ తమ అబ్బాయి డ్రగ్స్ వ్యసనాన్ని వదిలించలేకపోతున్నామంటూ పథినంతిట్ట జిల్లాలో ఒక వృద్ధ జంట ఆత్మహత్య చేసుకోవడం అందర్నీ కంటతడి పెట్టించింది.→ డ్రగ్స్ మానేయమన్న అక్క ముఖాన్ని బ్లేడుతో చెక్కేశాడో తమ్ముడు. మరో ప్రబుద్ధుడు మందలించిన తండ్రిపైనే దాడికి దిగాడు. ఇంకొకడు డ్రగ్స్ కొనేందుకు డబ్బివ్వలేదని తల్లినే చితకబాదాడు.→ డ్రగ్స్ తీసుకుంటూ టీచర్లకు పట్టుబడి, విషయం ఇంట్లో చెప్పొద్దని వాళ్లనే బెదిరిస్తున్న విద్యార్థులకు కొదవే లేదు. డార్క్‌వెబ్, క్రిప్టోకరెన్సీలో లావాదేవీలు డ్రగ్స్‌ను ముఠాలు పోలీసులకు చిక్కకుండా అత్యాధునిక సాంకేతికతను వాడుతున్నాయి. డార్క్‌వెబ్, క్రిప్టోకరెన్సీ, వాట్సాప్ గ్రూప్‌ల్లో లావాదేవీలు సాగిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. కేరళలో డ్రగ్ సరఫరా చేసే హాట్స్పాట్లు ఏకంగా 1,300కు పైగా ఉన్నట్లు చెబుతున్నారు. కొకైన్, హషి‹Ù, బ్రౌన్ షుగర్, హెరాయిన్ వాడకం ఎక్కువగానే ఉన్నా మిథేలిన్ డైఆక్సీ మిథాఫెటమైన్ (ఎండీఎంఏ) వీటన్నింటినీ మించిపోయింది. దీని వాడకం ఏడాదిలోనే ఏకంగా 65 శాతం పెరిగింది. ఎండీఎంఏ, మెథ్ వేరియంట్ డ్రగ్స్ బెంగళూరు, చెన్నై నుంచి కేరళలోకి వస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. 590 కిలోమీటర్ల సముద్రతీరం కూడా డ్రగ్స్ సరఫరాకు రాచమార్గంగా మారింది. జర్మనీ, ఫ్రాన్స్, థాయిలాండ్ దేశాల నుంచి డార్క్‌వెబ్ ద్వారా క్రిప్టో కరెన్సీని విక్రయించి బదులుగా కొరియర్ల ద్వారా డ్రగ్స్ తెప్పిస్తున్నారు.నాలుగేళ్లలో 93,599 అరెస్టులు! కేరళలో 2023లో ఏకంగా 30,697, 2024లో 24,517 డ్రగ్స్ కేసులు నమోదయ్యాయి. గత నాలుగేళ్లలో 87,101 కేసులు నమోదయ్యాయి. వీటిలో 93,599 మందిని అరెస్టు చేశారు. అంతకుముందు నాలుగేళ్లలో 37,228 కేసులు నమోదవగా 41,378 మందిని అరెస్టు చేసినట్టు సీఎం విజయన్ అసెంబ్లీలో చెప్పారు. గత జనవరిలో 2,000 డ్రగ్స్ కేసులు నమోదయ్యాయి.క్యాండీలు, ఐస్క్రీంల రూపంలో... సింథటిక్ డ్రగ్స్ వాడేవారిలో సమాజంలోని అన్నివర్గాల వారూ ఉన్నారు. విద్యార్థుల నుంచి వైద్యుల దాకా వాటికి బానిసలవుతున్నారు. ఎవరూ గుర్తు పట్టకుండా చాక్లెట్ల నుంచి ఐస్క్రీంల దాకా నానారకాలుగా వీటిని విక్రయిస్తున్నారు. పైగా వీటికి విద్యాసంస్థలే అడ్డాలుగా మారుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దాంతో తల్లిదండ్రులు భయంతో వణికిపోతున్నారు. తమ పిల్లలు డ్రగ్స్‌కు అలవాటు పడ్డారేమో తేల్చుకోవడానికి టెస్ట్ కిట్లు కొనుగోలు చేస్తున్నారు. దాంతో వాటి అమ్మకాలు విపరీతంగా పెరిగాయి.సూపర్‌బైక్‌లపై డెలివరీ... స్మార్ట్ ఫోన్లో, వాట్సాప్ గ్రూప్‌లోనూ మెసేజ్ చేస్తే పావుగంటలోపే సూపర్ బైక్‌లపై వచ్చి మరీ డ్రగ్స్ డెలివరీ చేసే స్థాయికి కేరళ ఎదిగిందని అసెంబ్లీలో విపక్ష నేత ఇటీవలే ఎద్దేవా చేశారు. పెడ్లర్లు డ్రగ్స్ సరఫరాకు తప్పుడు/నకిలీ నంబర్ ప్లేట్లున్న సూపర్‌బైక్‌లను వాడుతున్నారు. పోలీసులకు చిక్కకుండా వాటిపై మెరుపు వేగంతో దూసుకెళ్తున్నారు. తోటి పెడ్లర్ల పోటీని తట్టుకునేందుకు, వేగంగా సరకు డెలివరీకి రాత్రిళ్లు ఈ బైక్‌లను వాడుతున్నట్టు ఎక్సయిజ్, పోలీసు విభాగాలు చెబుతున్నాయి. డ్రగ్స్ ముఠాలు 18–24 ఏళ్ల వారినే డెలీవరీకి ఎంచుకుంటున్నారు. ఒక ప్యాకెట్‌కు రూ.1,000, రోజంతా డెలీవరీ చేస్తే రూ.4,000 ఇస్తున్నారు. ఫ్యామిలీ అని భ్రమింపజేసేలా బైక్ వెనక మహిళను కూర్చోబెట్టుకుంటున్నారు. టీనేజర్లనే డ్రగ్స్ పెడ్లర్లుగా ఈ ముఠాలు వాడుకుంటున్నాయి. పోకిరీలతో పరిచయాలు కాకుండా తల్లిదండ్రులే తమ పిల్లలపై కన్నేసి ఉంచాలి– రిటైర్డ్ ఎస్పీ కేజీ సిమాన్ కేరళలో పదేళ్ల విద్యార్థులు కూడా గ్యాంగ్ ఫైట్లకు దిగుతున్నారు. కనీసం 10 నుంచి 15 క్రిమినల్ కేసులున్న విద్యార్థి నాయకులను ఆదర్శంగా తీసుకుంటున్నారు– కేరళ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‘‘అత్యధిక అక్షరాస్యతా రేటు, ఉన్నత విద్యార్హతలున్నా ఉపాధి లేక కేరళలో యువత నైరాశ్యంతో డ్రగ్స్ బారిన పడుతోంది’’ – ఐరాస అభివృద్ధి కార్యక్రమం (యూఎన్డీపీ) ఆసియా–పసిఫిక్ రీజియన్ మాజీ సలహాదారు జి.ప్రమోద్‌కుమార్– సాక్షి, నేషనల్ డెస్క్ -
మావోలకు లొంగుబాటే శరణ్యమా?
సాక్షి, హైదరాబాద్: భద్రతా బలగాల భారీ వేట.. వృద్ధాప్యానికి చేరిన మావోయిస్టు (Maoist) అగ్ర నాయకులు.. తరుముకొస్తున్న ఆపరేషన్ కగార్ డెడ్‌లైన్... వెరసి అన్నల్లో అంతర్మథనం మొదలైందనే చర్చ జరుగుతోంది. దశాబ్దాల ఉద్యమ చరిత్ర కలిగిన మావోయిస్టులకు గత మూడేళ్లుగా కోలుకోలేని ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఒక్కో ఎన్కౌంటర్లో పదుల సంఖ్యలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో పూర్తి పట్టున్న ప్రాంతాలు సైతం సాయుధ పోలీసు బలగాల చేతిలోకి వెళ్లిపోతున్నాయి. దీంతో కొందరు మావోయిస్టులు లొంగుబాట పట్టారు. గత నెలన్నరరోజుల్లో తెలంగాణ (Telangana) పోలీసుల ఎదుట కొందరు కీలక నాయకులు లొంగిపోయిన విషయం తెలిసిందే.ఇటీవల మావోయిస్టు పార్టీ డీవీసీఎం పుల్సం పద్మ అలియాస్ ఊరే అలియాస్ గంగక్క ములుగు ఎస్పీ శబరీష్ ఎదుట లొంగిపోయారు. ఈమె దివంగత మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కటకం సుదర్శన్ భార్య. పద్మ 27 ఏళ్ల తన అజ్ఞాత జీవితాన్ని విడిచి 52 ఏళ్ల వయసులో జనజీవన స్రవంతిలో కలిశారు. అలాగే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్ కొసా ప్రొటెక్షన్ గ్రూప్ కమాండర్ వంజెం కేషా అలియాస్ జిన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఎదుట లొంగిపోయింది. లొంగిపోయిన మావోయిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పునరావాస పథకాలకు కొందరు ఆకర్షితులవుతున్నారు.మరోవైపు మావోయిస్టు పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత రావడం, ఆరోగ్యం కూడా సహకరించకపోవడంతో కేషా లొంగిపోయిందని...ఆమె లొంగుబాటు సందర్భంగా అంబర్ కిశోర్ ఝా వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు కేషాతోపాటు ఇటీవల కొందరు మావోయిస్టుల లొంగుబాట్ల వెనుకున్న పరిస్థితికి అద్దం పడుతున్నాయని పలువురు విశ్లేషిస్తున్నారు. ఇలా పలు కీలక స్థానాల్లో పనిచేసిన మావోయిస్టు సీనియర్ నాయకులు వరుస లొంగుబాట్లపై సర్వత్రా చర్చ జరుగుతోంది. తెలంగాణలో గతేడాది 41 మంది సరెండర్ 2024లో తెలంగాణ పోలీసుల ఎదుట 41 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ఒకరు స్పెషల్ జోనల్ కమిటీ, ఒకరు స్టేట్ కమిటీ సభ్యుడు, 16 మంది ఏరియా కమిటీ సభ్యులు, మిగిలినవారు పలు కేడర్లకు చెందినవారు. 85 మంది మావోయిస్టులను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. నాయకుల వయో‘భారం’మావోయిస్టు పార్టీకి గుండెకాయ వంటి సెంట్రల్ కమిటీ సభ్యుల్లో దాదాపు అంతా ఐదు పదుల వయసు దాటినవారే ఉన్నారు. మావోయిస్టులను ముందుండి నడిపించాల్సిన అగ్రనాయకత్వం వయోభారంతోపాటు తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్టు సమాచారం. పైగా తెలంగాణ రాష్ట్ర కమిటీలోనూ స్థానికులకంటే ఇతర రాష్ట్రాలవారే ఎక్కువగా ఉన్నారు. వీరిలోనూ కీలక నేతలు కూడా వయసులో పెద్దవారే. వీరంతా ప్రస్తుతం సాయుధ పోలీసు బలగాల నుంచి ఎదురవుతున్న ప్రతిఘటనను సమర్థంగా ఎదుర్కోలేని పరిస్థితి. ఇలా ప్రతి అంశంలోనూ మావోయిస్టులకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీంతో కిందిస్థాయి నాయకత్వానికి భరోసా ఇచ్చి నడిపించేవారు లేకుండాపోయారు. మరికొన్ని ప్రధాన లొంగుబాట్లు ఇలా...ఈ ఏడాది ఫిబ్రవరి 12న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్‌రాజ్ ఎదుట ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన 19 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ ఏడాది జనవరి 18న చర్ల పోలీస్‌స్టేషన్‌లో కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్‌రాజ్ ఎదుట ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 21 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ ఏడాది జనవరి 11న జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్‌ఖేర్ ఎదుట ఒక మావోయిస్టు లొంగిపోయాడు. ఈ ఏడాది జనవరి 2న మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ భార్య విమల చంద్ర సీదం అలియాస్ తారక్క గడ్చిరోలిలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ నేషనల్ పార్క్ ఏరియా కమిటీ సభ్యురాలు అలువ స్వర్ణ 2024 డిసెంబర్ 25న ములుగు ఎస్పీ శబరీష్ ఎదుట లొంగిపోయారు. అక్టోబర్ 2, 2024లో పెదబయలు ఏరియా కమిటీకి చెందిన 17 మంది మావోయిస్టులు పాడేరు జిల్లా ఎస్పీ అమిత్‌బర్దర్ ఎదుట లొంగిపోయారు. డిసెంబర్ 10 2023న ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాల్లో 20 మంది మావోయిస్టులు స్థానిక ఎస్పీ ఎదుట లొంగిపోయారు. జనవరి 1, 2022న సుక్మా జిల్లా పోలీసుల ఎదుట 44 మంది లొంగిపోయారు. జనవరి 28, 2022న విశాఖపట్నం పోలీసుల ఎదుట 60 మంది మావోయిస్టులు లొంగిపోయారు. -
Sakshi Excellence Awards 2025: సినీ ప్రతిభకు క్లాప్స్
తెలుగు ప్రజల ప్రాథమిక వినోదం సినిమా. ప్రతి శుక్రవారం కొత్త రిలీజుకై ఎదురు చూసే ప్రేక్షకులు తమ ఇష్టాఇష్టాలతో జాతకాలు మారుస్తుంటారు. వీరిని మెప్పించేందుకు హీరో, హీరోయిన్లు, నిర్మాత–దర్శకులు అనుక్షణం కొత్త ఆలోచనలు చేస్తుంటారు. 2023 ఎన్నో ఘనవిజయాలను చూసింది. అలాగే 2024లోనూ తెలుగు సినిమా ఘన విజయాలు చూసింది... ఘనతలు సాధించింది. చంద్రమోహన్ వంటి గొప్ప నటుణ్ణి కోల్పోయింది. అందుకే చంద్రమోహన్‌కు నివాళి అర్పిస్తూ ఈ వేడుకను నిర్వహించింది ‘సాక్షి’. వేయి చిత్రాల్లో నటించిన గొప్ప నటి రమాప్రభకు ‘లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు’ బహూకరించడం తనను తాను గౌరవించుకోవడంగా భావిస్తోంది ‘సాక్షి’. మాతో పాటు మీరూ క్లాప్స్ కొడుతూ వేడుకలోకి రండి.‘సాక్షి’ టీమ్‌కి ధన్యవాదాలు. యాక్చువల్లీ... ఇది నాకు సర్ప్రైజ్. ఈ అవార్డుని అసలు ఊహించలేదు. నేను కాలేజీలో లెక్చరర్‌గా చేస్తూ... జాబ్ వదిలేసి సినిమాల్లోకి వద్దామనుకున్నప్పుడు ... నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించిన నా గురువు రామ్మోహన్రావుగారికి ఈ అవార్డు అంకితం ఇస్తున్నాను. థ్యాంక్యూ... సార్. మీ లవ్ అండ్ సపోర్ట్‌కి. – 2024 ‘తెలుగు పర్సన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకున్న సందర్భంగా దర్శకుడు సుకుమార్∙అవార్డు అందుకుంటున్న సుకుమార్ మా హీరో బన్నీ (అల్లు అర్జున్), నిర్మాతలు నవీన్, రవిగార్లు, దేవిశ్రీ ప్రసాద్‌లతో పాటు నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ ఎంతో సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్. ‘పుష్ప 2’ థ్యాంక్స్ మీట్లో నేను కొందరికి థ్యాంక్స్ చెప్పలేకపోయాను. సెట్స్‌లో నాతోపాటు ఏకధాటిగా పని చేసిన పాండు, ఆర్ట్ అసిస్టెంట్ మధు, నాతోపాటు ఐదేళ్లు వేరే సినిమా చేయకుండా పని చేసిన కూలీ గ్యాంగ్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు. సహ నిర్మాతలు ప్రవీణ్, సతీష్గార్లు, ప్రశాంతిగారికి థ్యాంక్స్. – ‘పుష్ప 2’కి పాపులర్ డైరెక్టర్ అవార్డు అందుకున్న సందర్భంగా సుకుమార్నా సినిమా ప్రయాణం చాలా పెద్దది. నేను ఇండస్ట్రీకి వచ్చి 63 సంవత్సరాలు అయింది. ఈ పెద్ద ప్రయాణంలో ఐదు తరాలతో కలిసి నటించాను. అలాంటి నాకు ఈ జీవిత సాఫల్య పురస్కారం ఇచ్చినందుకు ‘సాక్షి’ యాజమాన్యానికి, భారతీగారికి ధన్యవాదాలు. సరైన సమయంలో... సరైన వయసులో నాకు ఈ అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్యూ భారతమ్మా. – నటి రమాప్రభ‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్’ సందర్భంగా దివంగత చంద్రమోహన్‌గారికి నివాళి అర్పిస్తూ, మా కుటుంబాన్ని ఆహ్వానించినందుకు ‘సాక్షి’ మీడియా గ్రూప్‌కి కృతజ్ఞతలు. నేను, మా పెద్దమ్మాయి మీనా మోహన్, మా చిన్నమ్మాయి డాక్టర్ మాధవి హైదరాబాద్‌లో లేకపోవడం వల్ల వ్యక్తిగతంగా ఈ వేడుకకి హాజరు కాలేకపోయాం. మా తరఫున మా మేనల్లుడు శివలెంక కృష్ణప్రసాద్ ఈ వేడుకలో పాల్గొని, మా అందరి తరఫున కృతజ్ఞతలు చెబుతారు. – జలంధర, చంద్రమోహన్ సతీమణిచంద్రమోహన్గారి రెండో అక్క కొడుకుని నేను. 1978లో ‘సీతామాలక్ష్మి’ సినిమా సమయంలో ఆయన వద్దకు నేను ఉద్యోగం కోసం వెళ్లాను. అప్పుడు ఆయన నా వ్యక్తిగత విషయాలు చూసుకో అన్నారు. అలా మావయ్య వద్ద చేరాను. ‘నిర్మాత కావొద్దు... టెక్నీషియన్‌గా అయినా పర్వాలేదు’ అని కూడా ఆయన అన్నారు. కానీ, నేను మాత్రం నిర్మాతగా నా తొలి సినిమానే మావయ్య, రాజేంద్రప్రసాద్‌లతో ‘చిన్నోడు పెద్దోడు’ తీశా. ఆ తర్వాత బాలకృష్ణగారితో ‘ఆదిత్య 369’తో పాటు నాలుగు సినిమాలు చేశాను. ఈ మధ్య కాలంలో ‘యశోద’ మూవీ తీశాను. చంద్రమోహన్‌గారు 1965లో ఇండస్ట్రీకి రాగా 1966లో మొదటి మూవీ చేశారు. మన తెలుగు వాళ్లే కాకుండా మిగతా భాషల్లో కూడా ఆయనకి అప్రిషియేషన్ ఉండేది. శివాజీ గణేశన్, ఎంజీఆర్గార్లతో పాటు అందరూ ఆయన్ని అభినందించేవారు. 1977–78 నుంచి ఆయన పూర్తి స్థాయిలో హీరోగా మారి దాదాపు 160 సినిమాలు చేశారు. దాదాపు 54 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ ఎన్నో పాత్రలు వేశారు. మావయ్యగారి ‘సుఖ దుఃఖాలు’ మూవీ చూసి, మహానటుడు ఎస్వీ రంగారావుగారు మావయ్యతో ‘బాంధవ్యాలు’ అనే సినిమా నిర్మించారు. చంద్రమోహన్గారిలాంటి మంచి నటుడికి, మంచి వ్యక్తికి మేనల్లుడు కావడం నా అదృష్టం. మావయ్య నటనని, చిత్రసీమకు ఆయన చేసిన సేవలను పురస్కరించుకుని గుర్తింపు ఇచ్చినందుకు ‘సాక్షి’ మేనేజ్మెంట్కి మా కుటుంబం తరఫున కృతజ్ఞతలు. – నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‘పుష్ప 2’ చిత్రానికి ఇది తొలి అవార్డు. ‘సాక్షి’ అవార్డుతోప్రారంభం అయింది. ఇక్కడి నుంచి ఇంకా చాలా అవార్డులు రావాలని, వస్తాయని నమ్ముతున్నాను. పదేళ్ల క్రితం ‘శ్రీమంతుడు’ చిత్రానికి ఇదే వేదికపై ఇదే ‘సాక్షి’ అవార్డుని భారతీగారు తన గోల్డెన్ హ్యాండ్స్‌తో ఇచ్చారు. అప్పటి నుంచి మా ప్రయాణం సినిమా సినిమాకి పెరుగుతూ వస్తోంది. ‘సాక్షి’ మొదటి అవార్డుతో మొదలైన మా ప్రయాణంలో ఇప్పటికి మా మైత్రీ మూవీ మేకర్స్‌కి దాదాపు 50 నుంచి 100 అవార్డులు వివిధ సంస్థల నుంచి వచ్చాయి. అందులో జాతీయ అవార్డు కూడా ఉండటం గొప్పగా భావించే అంశం. థ్యాంక్యూ వెరీ మచ్ టు ‘సాక్షి’. ‘పుష్ప 2’ని బెస్ట్ ఫిల్మ్‌గా ఎంపిక చేసిన జ్యూరీకి కృతజ్ఞతలు. మా హీరో అల్లు అర్జున్‌కి బెస్ట్ యాక్టర్‌గా ‘సాక్షి’ అవార్డు రావడం హ్యాపీగా ఉంది. అల్లు అర్జున్‌గారు ఇక్కడ ఉండి ఉంటే తప్పకుండా వచ్చి అవార్డు తీసుకునేవారు. ఆయన తర్వాతి సినిమా ట్రాన్స్ఫర్మేషన్ కోసం సిద్ధం అవుతుండటం వల్ల రాలేకపోయారు. – నిర్మాత యలమంచిలి రవిశంకర్‘లక్కీ భాస్కర్’లో నా నటనని గుర్తించి ‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డు’ ఇచ్చినందుకు థ్యాంక్స్. ఈ అవార్డు అందుకోవడం గౌరవంగా ఉంది. ఇది నాకు తొలి అవార్డు కావడంతో ఎక్స్ట్రా స్పెషల్. మా నిర్మాతలు చినబాబు, నాగవంశీగార్లకు, సుమతి వంటి మంచి పాత్ర ఇచ్చిన డైరెక్టర్ వెంకీ అట్లూరిగారికి థ్యాంక్స్. ఈ అవార్డు నా జీవితంలో ఓ భాగం. – హీరోయిన్ మీనాక్షీ చౌదరి నాకు ఇది తొలి అవార్డు. ‘క’ సినిమాని నిర్మించిన చింతా గోపాలకృష్ణా రెడ్డిగారికి, నాకు ఇంత మంచి సినిమా ఇచ్చిన దర్శకులు సుజీత్, సందీప్‌లకు ధన్యవాదాలు. ‘క’కి పని చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ థ్యాంక్స్. పీపుల్స్ ఛాయిస్ అవార్డు రావడం ఆనందంగా ఉంది. నన్ను ఆదరించి, సపోర్ట్ చేసిన ప్రేక్షకులందరికీ ఈ అవార్డుని అంకితం ఇస్తున్నాను. నన్ను గుర్తించి అవార్డు ఇచ్చిన ‘సాక్షి’కి కృతజ్ఞతలు. – హీరో కిరణ్ అబ్బవరంమా ‘హను–మాన్’ సినిమానిప్రోత్సహించిన ఆడియన్స్‌కు, ఎఫర్ట్స్ పెట్టిన దర్శకుడు ప్రశాంత్, మమ్మల్ని నమ్మిన నిర్మాత నిరంజన్ రెడ్డిగారికి థ్యాంక్స్. ఇలా అవార్డ్స్‌తో ప్రతిభనుప్రోత్సహిస్తున్నందుకు ‘సాక్షి’ యాజమాన్యానికి థ్యాంక్స్. సుకుమార్‌గారి చేతుల మీదగా అవార్డు అందుకోవడం హ్యాపీ. నేపాల్, చైనా–టిబెట్ బోర్డర్ లొకేషన్స్‌లో మా సినిమా షూటింగ్ జరిపినప్పుడు అక్కడి వారు... ఇది ఏ సినిమా అంటే.. తెలుగు సినిమా అన్నాం. వెంటనే వాళ్లు ‘హో పుష్ప’ అన్నారు. మేం ‘పుష్ప’ టీమ్ కాదు కానీ ‘పుష్ప’ సినిమా తీసిన ల్యాండ్ నుంచి వచ్చాం అని చె΄్పాం. – హీరో తేజ సజ్జా‘క’ సినిమాకు మాకు అవకాశం ఇచ్చిన నిర్మాత గోపాలకృష్ణా రెడ్డిగారు, మమ్మల్ని నమ్మిన కిరణ్ అబ్బవరంగారికి థ్యాంక్స్. ‘సాక్షి’కి చాలా థ్యాంక్స్. ఇది మా ఫస్ట్ అవార్డు. మాకెంతో ప్రత్యేకం. కంటెంట్‌ను నమ్మి సినిమా తీద్దామనుకున్నాం. స్ట్రాంగ్ కంటెంట్ చెబుదామనుకున్నాం... కంటెంట్‌ను నమ్మి చేసినందుకు మమ్మల్ని ఇక్కడివరకు తీసుకొచ్చిన తెలుగు ఆడియన్స్‌కు ధన్యవాదాలు. ఈ అవార్డును వారికి అంకితం ఇద్దామనుకుంటున్నాం. – దర్శకులు సుజిత్ అండ్ సందీప్ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును ఇచ్చిన ‘సాక్షి’కి థ్యాంక్స్. మా అమ్మానాన్నలకు, యూ ట్యూబ్ ద్వారా ఎంతో నేర్పించిన షార్ట్ ఫిల్మ్ మేకర్స్‌కి, ఎలా సినిమా తీయాలో నేర్పించిన ప్రతి దర్శకుడికి ధన్యవాదాలు. ప్రతి డెబ్యూ డైరెక్టర్ పడే కష్టాలన్నీ పడ్డాను. రైట్ స్క్రిప్ట్‌కి, రైట్ ప్రొడ్యూసర్ అవసరం అంటారు. నిహారిక కొణిదెల, ఫణి ఎడపాకగార్ల ద్వారా ఆ అవకాశం దక్కింది. ‘ఇది చిన్న సినిమా (‘కమిటీ కుర్రోళ్లు) కాదు.. ఎంత బడ్జెట్ కావాలో అంత పెడతాం’ అన్నారు. అందుకే ఈ అవార్డు నిహారిక, ఫణిగార్లకు అంకితం. – దర్శకుడు యదు వంశీ‘నాకు ఫస్ట్ క్లాస్‌లో సాంస్కృతిక విభాగంలో బహుమతి ఇచ్చారు. నాకు ఊహ తెలిశాక అది ఫస్ట్ అవార్డు కావడంతో ఇప్పటికీ గుర్తు. ఇప్పుడు నా సినిమా (‘డ్రింకర్ సాయి’)కి హీరోగా ‘సాక్షి’ అవార్డు రావడం హ్యాపీగా ఉంది. ‘సాక్షి’కి థ్యాంక్స్. ఈ అవార్డు జీవితాంతం గుర్తుండిపోతుంది. 2025లో నా తొలి హ్యాపియెస్ట్ మూమెంట్ ఇది. – హీరో ధర్మఇలాంటి అవార్డులు ఇచ్చినప్పుడు సరికొత్త కథలు రావడానికిప్రోత్సాహకంగా ఉంటుంది. దర్శకుడిగా నాకిది (‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’) తొలి సినిమా అయినప్పటికీ చాన్స్ ఇచ్చిన గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద బ్యానర్‌కి థ్యాంక్స్. – డైరెక్టర్ దుష్యంత్ఈ అవార్డు ఇచ్చినందుకు ‘సాక్షి’కి థ్యాంక్స్. ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ని ఆదరించిన ప్రేక్షకులకూ మరోసారి ధన్యవాదాలు. – నిర్మాత ధీరజ్ మొగిలినేనిమా సినిమాకి అవార్డు ఇచ్చినందుకు ‘సాక్షి’కి, భారతీ మేడమ్‌కి ధన్యవాదాలు. – హీరో సుహాస్వ] ూ దర్శక–నిర్మాతలకు, గీతా ఆర్ట్స్‌కి, ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ని సపోర్ట్ చేసిన ఆడియన్స్‌కి థ్యాంక్స్ – హీరోయిన్ ఎన్. శివాని‘హాయ్ నాన్న’ విడుదలై చాలా రోజులు గడిచిపోయాయి. కానీ, ఆ సినిమా గెలుచుకుంటున్న ప్రేమ, అవార్డులు, రివార్డులు... ఇలా కొనసాగుతూనే ఉన్నాయి. మరోసారి ఈ మూవీని సెలబ్రేట్ చేస్తున్నందుకు ‘సాక్షి’కి, జ్యూరీ మెంబర్లకు కృతజ్ఞతలు. మా సినిమాని వివిధ విభాగాల్లో ఎంపిక చేసినందుకు, అలాగే నన్ను బెస్ట్ యాక్టర్‌గా ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు. నేను వేరే దేశంలో ఉండటం వల్ల అవార్డు ఫంక్షన్‌కి రాలేకపోయాను. – హీరో నాని‘హాయ్ నాన్న’ విడుదలై ఏడాదికి పైగా అయినప్పటికీ ఇప్పటికీ ప్రేక్షకులు అదే అభిమానం చూపిస్తుండటం అపురూపమైనది. బెస్ట్ యాక్ట్రస్‌గా ఈ అవార్డు ఇచ్చినందుకు ‘సాక్షి’కి కృతజ్ఞతలు. నేను ఫంక్షన్‌కి రానందుకు క్షమించాలి. నాని, శౌర్యువ్, బేబి కియారా, నిర్మాతలు, సంగీత దర్శకుడు... ఇలా వీరందరూ లేకుంటే ఈ సినిమా ఉండేది కాదు. – హీరోయిన్ మృణాల్ ఠాకూర్‘హాయ్ నాన్న’కి ఈ అవార్డు ఇచ్చిన ‘సాక్షి’కి, భారతీగారికి ధన్యవాదాలు. ఎన్నో అవార్డులు గెలుచుకున్నాం. ఫిల్మ్‌ఫేర్, ఐఫా, సైమా అవార్డులొచ్చాయి. వీటన్నిటికన్నా ఒక తెలుగు అవార్డు (సాక్షి ఎక్సలెన్స్) అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డుని నా నిర్మాతలకి, నటీనటులకి, సాంకేతిక నిపుణులకు అంకితం ఇస్తున్నా... ప్రత్యేకించి నానీగారికి. ఎందుకంటే ఒక కొత్త డైరెక్టర్ని నమ్మి ఇలాంటి ఒక సున్నితమైన కథ, అందులోనూ ‘దసరా’ లాంటి సినిమా తర్వాత ఆయన ‘హాయ్ నాన్న’ని ఒప్పుకుని చేసినందుకు రుణపడి ఉంటాను. – డైరెక్టర్ శౌర్యువ్మా సినిమాకి అవార్డు ఇచ్చిన సాక్షి యాజమాన్యానికి, జ్యూరీ మెంబర్లకు థ్యాంక్స్. ‘బలగం’ అనేది పీపుల్స్ ఛాయిస్ మూవీ. ఈ సినిమా క్రెడిట్ వేణుకి దక్కుతుంది. – నిర్మాత హన్షితా రెడ్డి‘బలగం’ చిత్రానికి పీపుల్స్ ఛాయిస్ విభాగంలో అవార్డు అందించిన ‘సాక్షి’వారికి థ్యాంక్స్. వైఎస్ రాజశేఖర రెడ్డిగారు మా నాన్నకి చాలా క్లోజ్. మా ఆటోమొబైల్ బిజినెస్‌లో ఓ షాప్ ఓపెనింగ్‌ని రాజశేఖర రెడ్డిగారి చేతుల మీదుగా చేయించాలని మా నాన్న మూడు నెలలు వేచి ఉండి, ఆయన చేతుల మీదుగానేప్రారంభింపజేశారు. ఇప్పుడు మేం నిర్మించిన ‘బలగం’కి వాళ్ల సంస్థ (సాక్షి) నుంచి మాకు అవార్డు రావడం, అది కూడా మా ఫస్ట్ మూవీ కావడం హ్యాపీగా ఉంది. – నిర్మాత హర్షిత్ రెడ్డి‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్’ టెన్త్ ఎడిషన్‌లో అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డు మాకో మధురమైన అనుభూతి. ‘బేబీ’ సక్సెస్‌కు కారణమైన నా స్నేహితుడు సాయి రాజేశ్‌కు మరోసారి కృతజ్ఞతలు. – నిర్మాత ఎస్కేఎన్ ‘సాక్షి ఎక్సలెన్స్’ అవార్డు తీసుకోవడం, పైగా బెస్ట్ క్రిటికల్లీ ఎక్లై్లమ్డ్ ఫిల్మ్‌కు తీసుకోవడం అనేది ఇంకా సంతోషం. – దర్శకుడు సాయి రాజేశ్2023 నా లైఫ్‌లో స్పెషల్ ఇయర్. మా ‘బేబీ’ ద్వారా మాకు చాలా లవ్, ఎంకరేజ్మెంట్ దొరికింది. ‘బేబీ’ సినిమా నా లైఫ్‌లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ‘బెస్ట్ డెబ్యూ యాక్ట్రస్’ అవార్డు ఇచ్చిన ‘సాక్షి’కి ధన్యవాదాలు. ఈ అవార్డు తీసుకోవడం చాలా ఎంకరేజింగ్‌గా, మోటివేటివింగ్గా ఉంది. – హీరోయిన్ వైష్ణవీ చైతన్య ‘బలగం’ వంటి ఒక మించి కథని నమ్మి నాకు అన్ని రకాలుగా సహకారం అందించి, నన్ను ముందుకు నడిపించిన ‘దిల్’ రాజు, హన్షిత, హర్షిత్, శిరీష్గార్లకు ధన్యవాదాలు. జీవితాంతం వీళ్లందరికీ రుణపడి ఉంటాను. జీవితాంతం గుర్తుంచుకునే మరపురాని అనుభూతిని ఇచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్... అలాగే వారికి జన్మజన్మలు రుణపడి ఉంటాను. మా ‘బలగం’ విజయం కానీ, ఏ అవార్డు అయినా కానీ మా యూనిట్ అందరికీ దక్కుతుంది. – దర్శకుడు వేణు యెల్దండినన్ను నమ్మిన నిర్మాత నాగవంశీగారికి ఈ అవార్డు (బెస్ట్ డెబ్యూ డైరెక్టర్)ని అంకితం ఇస్తున్నాను. అలాగే మా ‘మ్యాడ్’ ముగ్గురు హీరోలకి, నిర్మాత చినబాబుగారికి, ఎడిటర్ నవీన్ నూలిగార్లకు థ్యాంక్స్. ‘మ్యాడ్ 2’ కూడా రాబోతోంది. టీజర్ కూడా విడుదలైంది. ఈ చిత్రం కూడా తొలి భాగం అంత క్రేజీగా ఉంటుంది. దయచేసి అందరూ చూడండి. ఇది నా మొదటి అవార్డు.. చాలా ప్రత్యేకం. ‘సాక్షి’కి ప్రత్యేక కృతజ్ఞతలు. – డైరెక్టర్ కల్యాణ్ శంకర్ -
స్మగ్లింగ్.. కోడి గుడ్డేం కాదు!
కెనడా, మెక్సికో నుంచి అమెరికాలోకి అక్రమంగా తరలిస్తూ సరిహద్దుల్లో భారీగా పట్టుబడుతున్న ఉత్పత్తుల సంఖ్య కొద్ది నెలలుగా భారీగా పెరిగిపోయింది. అయితే అవేమిటో తెలుసా? ఎప్పట్లా ఫెంటానిలో, ఇతరేతర డ్రగ్సో కాదు. పౌల్ట్రీ ఉత్పత్తులు! ఆశ్చర్యంగా ఉన్నా నిజమిది. పైగా వాటిలోనూ సింహ భాగం గుడ్లే కావడం విశేషం!! నానాకష్టాలూ పడి డ్రగ్స్‌ను దేశం దాటించేకంటే స్మగ్లింగ్ నెట్వర్కులకు ఇదే మాంచి లాభసాటి బేరంగా కన్పిస్తోందట. అమెరికాను అతలాకుతలం చేస్తున్న గుడ్ల కొరత తీవ్రతకు ఈ ఉదంతం అద్దం పడుతోంది. కెనడా, మెక్సికోల నుంచి అమెరికాలోకి ఫెంటానిల్ తదితర డ్రగ్స్ విచ్చలవిడిగా స్మగ్లింగ్ అవుతుండటం పరిపాటి. అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఇది డొనాల్డ్ ట్రంప్‌కు పెద్ద ప్రచారాస్త్రంగా మారింది కూడా. కెనడాపై టారిఫ్‌ల యుద్ధానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా కూడా ఫెంటానిల్ నిలిచింది. కానీ కొద్ది నెలలుగా కెనడా నుంచి గుడ్లు తదితర పౌల్ట్రీ ఉత్పత్తుల స్మగ్లింగ్ డ్రగ్స్‌ను కూడా మించిపోయిందంటూ అమెరికా అధికారులే ముక్కున వేలేసుకుంటున్నారు. గుడ్లే అమెరికన్లకు ప్రధానమైన బ్రేక్‌ఫాస్ట్. ఉదయాన్నే ఆమ్లెట్లుగానో, మరో రూపంలో గుడ్లు తిన్నాకే వారికి రోజు మొదలవుతుంది. వారి బ్రేక్‌ఫాస్ట్ అవసరాలు కాస్తా బ్లాక్మార్కెటర్లకు కాసుల పంటగా మారుతుండటం విశేషం!డ్రగ్స్ కంటే 10 రెట్లు! 2024 అక్టోబర్‌తో పోలిస్తే ప్రస్తుతం కెనడా నుంచి డెట్రాయిట్ గుండా అమెరికాలోకి అక్రమంగా గుడ్లు తరలిస్తున్న వారి సంఖ్య 36 శాతం పెరిగినట్టు అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ గణాంకాలు చెబుతున్నాయి. ఇక మెక్సికో సరిహద్దులకు అతి సమీపంలో ఉండే శాన్‌డీగో వద్ద ఈ ఉదంతాలు ఏకంగా 158 శాతం పెరిగిపోవడం విశేషం. 2024 అక్టోబర్ నుంచి అమెరికా సరిహద్దులను దాటించే ప్రయత్నంలో పౌల్ట్రీ ఉత్పత్తులు పట్టుబడ్డ ఉదంతాలు 3,768కి పైగా నమోదయ్యాయి. ఇదే సమయంలో ఫెంటానిల్ పట్టుబడ్డ ఉదంతాలు కేవలం 352 మాత్రమే కావడం విశేషం. పెరుగుతున్న ఫ్లూ రిస్క్! బర్డ్ ఫ్లూ దెబ్బకు కొన్నేళ్లుగా ఉత్తర అమెరికా ఖండమంతా అతలాకుతలమవుతోంది. కెనడాలో దీని తీవ్రత తక్కువగా ఉన్నా అమెరికా బాగా ప్రభావితమైంది. అక్కడ రెండు మూడేళ్లుగా కోట్లాది కోళ్లను హతమార్చాల్సి వచ్చింది. ఇది క్రమంగా దేశవ్యాప్తంగా తీవ్ర గుడ్ల కొరతకు దారితీసింది. దాంతో గుడ్ల ధరలు చుక్కలనంటుతున్నాయి. డజనుకు 5 డాలర్ల మార్కును దాటేసి ఆల్‌టైం రికార్డు సృష్టించాయి. షికాగో, శాన్ఫ్రాన్సిస్కో వంటి పలు ప్రధాన నగరాల్లోనైతే డజను గుడ్లు ఏకంగా 9 నుంచి 10 డాలర్ల దాకా పలుకుతున్న పరిస్థితి! గుడ్ల సంక్షోభం చేయి దాటిపోయిందని స్వయానా అధ్యక్షుడు ట్రంపే అంగీకరించారు! ఈ ఏడాది చివరకల్లా గుడ్ల ధరలు కనీసం మరో 50 శాతం దాకా పెరగవచ్చని అంచనా. దాంతో కొద్ది నెలలుగా స్మగ్లర్ల కన్ను గుడ్లపై పడింది. కెనడా నుంచి అమెరికాలోకి వాటి అక్రమ రవాణా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోంది. అయితే దీనివల్ల బర్డ్ ఫ్లూతో పాటు ఇతరత్రా రోగాల రిస్కు పెరిగిపోతోందని అమెరికా ఆందోళన చెందుతోంది. కోళ్లు, గుడ్ల స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపేందుకు కెనడా, మెక్సికో సరిహద్దుల వద్ద నిఘాను మరింత కఠినతరం చేయాలంటూ ట్రంప్ సర్కారు తాజాగా ఆదేశాలు జారీచేసింది!అమెరికాలో అద్దెకు కోళ్లు గుడ్ల సంక్షోభం పుణ్యమా అని అమెరికాలో ఇప్పుడు కోడి పెట్టలను అద్దెకిచ్చే సరికొత్త వ్యాపారం పుట్టుకొచి్చంది. అది ఇప్పుడక్కడ యమా జోరుగా సాగుతుండటం విశేషం. డజను గుడ్లకు 5 నుంచి 10 డాలర్ల దాకా పెట్టాల్సి రావడం అమెరికన్లను కలవరపరుస్తోంది. దీనికి బదులు ఇంటి పెరళ్లలో కోడిపెట్టలను సాకేందుకు వాళ్లు మొగ్గుచూపుతున్నారు. దాంతో దేశవ్యాప్తంగా కోడిపెట్టలకు చెప్పలేనంత డిమాండ్ ఏర్పడింది. దీన్ని సొమ్ము చేసుకునేందుకు రెంట్ ద చికెన్ వంటి పేర్లతో ఏకంగా కంపెనీలే పుట్టుకొచ్చాయి. ఆర్నెల్ల ప్రాతిపదికన కోడిపెట్టలను అద్దెకిస్తున్నాయి. కనీస అద్దె ప్యాకేజీలు 300 డాలర్ల నుంచి మొదలవుతున్నాయి. ఇందులో భాగంగా రెండు పెట్టలతో పాటు వాటికి ఆర్నెల్ల పాటు కావాల్సిన దాణాను కూడా కంపెనీలే ఇస్తాయి. కోళ్ల గూడు కూడా సమకూరుస్తాయి. ఆరోగ్యకరమైన పెట్ట వారానికి ఐదారు దాకా గుడ్లు పెడుతుంది. ఆ లెక్కన రెండు కోళ్లు ఆర్నెల్లకు కనీసం 250 గుడ్లు పెడతాయన్నమాట. వాటిని మార్కెట్లో కొనాలంటే ప్రస్తుత రేట్లను బట్టి కనీసం 80 నుంచి 160 డాలర్లకు పైనే పెట్టాల్సి ఉంటుంది. కోళ్లను సాకడం ద్వారా ఏ రోజుకు ఆ రోజు తాజా గుడ్లు దొరుకుతుండటం అమెరికన్లను బాగా ఆకర్షిస్తోంది. అంతేగాక గుడ్లను పొదిగించి కోళ్ల సంఖ్యను ఇబ్బడిముబ్బడిగా పెంచుకుంటున్నారు. కాంట్రాక్టు ముగిశాక అవి వారికే సొంతమవుతున్నాయి. వాటిని అద్దెకిస్తూ సైడ్ వ్యాపారం చేస్తున్న వారికి కూడా కొదవ లేదు. దొరికితే జరిమానాలుఅమెరికాలోకి గుడ్లు, ఇతర ప్రాసెస్ చేయని పౌల్ట్రీ ఉత్పత్తుల రవాణా చట్టవిరుద్ధం. ఫ్లూ తదితర ఆందోళనలే ఇందుకు కారణం. వీటిని దేశంలోకి తరలించే ప్రయత్నంలో పట్టుబడితే 300 డాలర్ల దాకా జరిమానా విధిస్తారు. ‘‘ఇరు దేశాలకూ కొన్నేళ్లుగా నిద్ర లేకుండా చేస్తున్న ఫెంటానిల్ వంటి డ్రగ్స్ కంటే కూడా కెనడా నుంచి అమెరికాలోకి గుడ్ల అక్రమ రవాణాయే పెరిగిపోతోందంటే ఆశ్చర్యంగానే ఉంది. కానీ కళ్లెదుట కన్పిస్తున్న వాస్తవమిది’’ అన్నారు కెనడా చాంబర్ ఆఫ్ కామర్స్ పాలసీ చీఫ్ మాథ్యూ హోమ్స్. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Sakshi Excellence Awards 2025: సామాజిక స్ఫూర్తికి సెల్యూట్
సమాజం ఆర్థిక సూత్రాల పై ఆధారపడి నడుస్తున్నట్టు కనిపించినా దానికి హృదయం, స్పందన ఇచ్చేది మాత్రం సామాజిక, సాంస్కృతిక అంశాలే. ‘ఇలా మారాలి’ అని సామాజిక సేనానులు బోధ చేస్తే, ‘ఇలా వికాసం పొందాలి’ అని సాంస్కృతిక సారథులు దారి చూపుతారు. సామాజిక చైతన్యం, సాంస్కృతిక వికాసం లేని సమాజంలో సంపద కేవలం పటాటోపం మాత్రమే. అందుకే అర్థవంతమైన సమాజం కోసం గత పది సంవత్సరాలుగా సాక్షి మీడియా గ్రూప్ ‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్’ నిర్వహిస్తోంది. సామాజిక రంగంలో, కళారంగంలో విశిష్ట రీతిలో పని చేస్తున్న వారికి అవార్డ్స్ ఇచ్చి గౌరవిస్తోంది. ఈ పరంపరలో 2023కు గాను ఫిబ్రవరి 28 శుక్రవారం హైదరాబాద్‌లో ఘనమైన వేడుక నిర్వహించింది. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ వేడుకలో వై.ఎస్.భారతి రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేశారు. సాక్షి మీడియా గ్రూప్ డైరెక్టర్లు, ఎడిటర్, విశిష్ట అతిథులు పాల్గొన్న వేడుక అవార్డు గ్రహీతలకు జీవితకాల అనుభూతిగా మారింది.సమాజంలో ఉన్నటువంటి అనేక మంది సేవకు గుర్తింపు రావడం అంటే సామాన్య విషయం కాదు. వారు ఆయా రంగాల్లో చేసిన సేవను గౌరవించడానికి ఈ అవార్డులు ఇస్తున్నారు. సమాజానికి సేవ చేసిన వారికి ఇలాంటి గౌరవం ఇవ్వడం అభినందనీయం. సాక్షి గ్రూప్‌నకు, ముఖ్యంగా భారతీరెడ్డి గారికి అభినందనలు.– బండారు దత్తాత్రేయ, హరియాణ గవర్నర్సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమంలో భాగస్వామి కావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవార్డుల కార్యక్రమంతో నాకు 10 ఏళ్ల అనుబంధం ఉంది. జ్యూరీలో నన్ను భాగస్వామిని చేసినందుకు కృతజ్ఞతలు. అసామాన్య ప్రతిభ చూపే వారిలో ఉత్తములను ఎంపిక చేయడం కత్తిమీద సాములాంటిది. ఇందుకోసం సాక్షి టీమ్ ఎంతో కష్టపడ్డారు. ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై రీసెర్చ్ చేసి పెద్ద నోట్స్ సిద్ధం చేశారు. మేం ఎలా ముందుకు సాగాలో తెలియజెప్పేందుకు వారు పడిన కష్టం ఎంతో గొప్పది. ఎలాంటి పక్షపాతం లేకుండా అవార్డులకు ఎంపిక చేసే విధానం సాక్షిలో నాకు కనిపించిన గొప్పదనం. అవార్డులు తీసుకున్న వారందరికీ నా అభినందనలు.– శాంతా సిన్హా, జ్యూరీ చైర్పర్సన్మట్టిని పట్టుకున్నా బంగారమే అవుతుందని నిరూపించాడు కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన మావురం మల్లికార్జున్‌రెడ్డి. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేసిన తరువాత వ్యవసాయం మీదున్న ఆసక్తితో తన 12 ఎకరాల భూమికి తోడు మరో 5 ఎకరాలు కౌలుకు తీసుకుని సేంద్రియ వ్యవసాయం ప్రారంభించారు. వరి, అల్లం, మిర్చి సాగు చేస్తూ మరోవైపు దేశీ ఆవులు, కోళ్లు పెంచుతూ సమీకృత వ్యవసాయానికిప్రాచుర్యం కల్పిస్తున్నారు. ఆయనను ‘ఎక్సలెన్స్ ఇన్ ఫార్మింగ్ అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.మావురం మల్లికార్జున్ రెడ్డి, సేంద్రియ వ్యవసాయంభద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ సర్జన్‌గా పని చేస్తున్న హర్షవర్ధన్ ఒక డాక్టర్‌గా విధులు నిర్వహిస్తూనే తన ప్రజా వైద్యశాలలో కేవలం ఒక్క రూపాయి ఫీజుతో కార్పోరేట్ హాస్పిటల్ స్థాయి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఏజెన్సీప్రాంత నిరుపేదలకు ఆయనొక ఆపద్బాంధవుడు. అవసరమైనవారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా సర్జరీలు చేస్తుంటారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్న డాక్టర్ హర్షవర్థ్దన్ ను ‘ఎక్సలెన్స్ ఇన్ హెల్త్ కేర్ అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.హర్షవర్థన్, ఆరోగ్య సంరక్షణచెక్కుచెదరని సంకల్పం ఉంటే సాధ్యం కానిదేమీ లేదు అని నిరూపించారు నెల్లూరుకు చెందిన సుహాస్. ఫార్మసీలో పీహెచ్డీ చేసి 3 లక్షల రూపాయల పెట్టుబడితో చిన్న ఐస్‌క్రీమ్ స్టోర్ప్రారంభించిన సుహాస్ ఇప్పుడు ఏడు రాష్ట్రాల్లో 120కి పైగా స్టోర్లకు విస్తరించారు. 14 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించారు. ఆర్గానిక్ ఐస్‌క్రీమ్ తయారు చేస్తూ ఆదరణ పొందారు. సుహాస్ బి షెట్టిని ‘బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ – స్మాల్ అండ్ మీడియం అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.సుహాస్ బి శెట్టి, చిన్న/మధ్య తరహా వాణిజ్యంవీధి బాలలను చేరదీసి ఆశ్రయం కల్పించి తగిన పౌష్టికాహారం అందించి బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దాలనే సమున్నత ఆశయంతో పని చేస్తోంది రెయిన్ బో హోమ్స్ప్రోగ్రాం సంస్థ్థ. దేశవ్యాప్తంగా పది నగరాల్లో ఇప్పటివరకు 14,996 మంది వీధి బాలలు, 5,557 మంది చిన్నారులు, యువతీ, యువకులకు ఆశ్రయం కల్పించింది. రెయిన్ బో హోమ్స్ ప్రోగ్రామ్ సంస్థను ‘ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.కె. అనురాధ, విద్యారంగంమట్టిని పట్టుకున్నా బంగారమే అవుతుందని నిరూపించాడు కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన మావురం మల్లికార్జున్‌రెడ్డి. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేసిన తరువాత వ్యవసాయం మీదున్న ఆసక్తితో తన 12 ఎకరాల భూమికి తోడు మరో 5 ఎకరాలు కౌలుకు తీసుకుని సేంద్రియ వ్యవసాయంప్రారంభించారు. వరి, అల్లం, మిర్చి సాగు చేస్తూ మరోవైపు దేశీ ఆవులు, కోళ్లు పెంచుతూ సమీకృత వ్యవసాయానికి ప్రాచుర్యం కల్పిస్తున్నారు. ఆయనను ‘ఎక్సలెన్స్ ఇన్ ఫార్మింగ్ అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.మావురం మల్లికార్జున్ రెడ్డి, సేంద్రియ వ్యవసాయంభద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ సర్జన్‌గా పని చేస్తున్న హర్షవర్ధన్ ఒక డాక్టర్‌గా విధులు నిర్వహిస్తూనే తన ప్రజా వైద్యశాలలో కేవలం ఒక్క రూపాయి ఫీజుతో కార్పోరేట్ హాస్పిటల్ స్థాయి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఏజెన్సీప్రాంత నిరుపేదలకు ఆయనొక ఆపద్బాంధవుడు. అవసరమైనవారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా సర్జరీలు చేస్తుంటారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్న డాక్టర్ హర్షవర్థ్దన్ ను ‘ఎక్సలెన్స్ ఇన్ హెల్త్ కేర్ అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.హర్షవర్థన్, ఆరోగ్య సంరక్షణచెక్కుచెదరని సంకల్పం ఉంటే సాధ్యం కానిదేమీ లేదు అని నిరూపించారు నెల్లూరుకు చెందిన సుహాస్. ఫార్మసీలో పీహెచ్డీ చేసి 3 లక్షల రూపాయల పెట్టుబడితో చిన్న ఐస్‌క్రీమ్ స్టోర్ప్రారంభించిన సుహాస్ ఇప్పుడు ఏడు రాష్ట్రాల్లో 120కి పైగా స్టోర్లకు విస్తరించారు. 14 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించారు. ఆర్గానిక్ ఐస్‌క్రీమ్ తయారు చేస్తూ ఆదరణ పొందారు. సుహాస్ బి షెట్టిని ‘బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ – స్మాల్ అండ్ మీడియం అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.సుహాస్ బి శెట్టి, చిన్న/మధ్య తరహా వాణిజ్యంచదరంగంలో ఎత్తుకు పై ఎత్తు వేసి...ప్రత్యర్థిని చిత్తు చేయాలి.. అలాంటి టాలెంట్ పుష్కలంగా ఉన్న అర్జున్ చెస్‌లో అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతున్నారు. హన్మకొండకు చెందిన అర్జున్ గుజరాత్లో జరిగిన జాతీయ చాంపియన్ షిప్లో అండర్ 13 విభాగంలో గోల్డ్ మెడల్ గెలుచుకుని తన విజయయాత్రనుప్రారంభించారు. 2015 ఏషియన్ యూత్ చాంపియన్ షిప్లో రజతం గెలిచి తొలి అంతర్జాతీయ పతకం సొంతం చేసుకున్నారు. 2018లో 14 ఏళ్ల వయసులో గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించి తెలంగాణ నుంచి జీఎం హోదా పొందిన మొదటి ఆటగాడిగా చరిత్ర సృష్టించారు. అర్జున్ ను ‘యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్–స్పోర్ట్స్ అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.అర్జున్ ఎరిగైసి, క్రీడలుఅడవులు అంతరించి పర్యావరణ సంక్షోభం ఏర్పడుతున్న ఈ కాలంలో అడవినే సృష్టించడానికి ముందుకు వచ్చిన వ్యక్తి దుశర్ల సత్యనారాయణ. సూర్యాపేట జిల్లా రాఘవపురంలో 70 ఎకరాల వ్యవసాయ భూమిని అడవిగా మార్చేశారాయన. ఆయన కృషి ఫలితంగా లక్షల చెట్లు ఊపిరి తీసుకుంటూ ఉండగా వాటితో పాటు నెమళ్లు, జింకలు, నక్కలు, అడవి పందులు... నీడ పొందుతున్నాయి. పక్షులు, జంతువుల కోసం ఆ అడవిలోనే ఏడు చెరువులు తవ్వించిన సత్యనారాయణను ‘ఎక్సలెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.దుశర్ల సత్యనారాయణ, పర్యావరణంభద్రాచలంకు చెందిన గొంగడి త్రిష క్రికెట్లో కొత్త తారగా అవతరించింది. ఎనిమిదేళ్ల వయసులో జిల్లాస్థాయి అండర్ 16 జట్టుకు ఆడి ‘ప్లేయర్ ఆఫ్ ద సీరిస్’ గా నిలిచింది. పన్నెండేళ్ల వయసులో హైదరాబాద్ మహిళల క్రికెట్ జట్టుకు ఎంపికైన త్రిష బీసీసీఐ ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు’ను గెలుచుకుంది. ఆల్ రౌండర్‌గా పేరు తెచ్చుకున్న ఈ లెగ్ స్పిన్నర్ ఐసీసీ అండర్–19 మహిళల టి 20 వరల్డ్ కప్–2025లో సెంచరీ చేసి రికార్డులు బ్రేక్ చేసింది. గొంగడి త్రిషను ‘యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్– స్పోర్ట్స్ అవార్డు’తో సత్కరించింది సాక్షి.త్రిష, క్రీడలుఖమ్మం జిల్లా కారేపల్లికి చెందిన మద్దెబోయిన మానస పుట్టుకతోనే అంధురాలు. ఇరుగు పొరుగువారి మాటలకు మానసగాని ఆమె తల్లిదండ్రులుగాని కొంచెం కూడా వెరవలేదు. డిగ్రీ వరకు చదివిన మానస తానెవరికీ తక్కువ కాదు అని పోటీ పరీక్షలపై దృష్టి సారించారు.ఇంటి వద్దనే సొంతంగా ప్రిపరేషన్ మొదలు పెట్టి గ్రూప్–4 ఉద్యోగానికి ఎంపికై తన కలను నెరవేర్చుకున్నారు. ఎందరికో ఆదర్శంగా నిలిచిన మానసను ‘ యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్ ఎడ్యుకేషన్ అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.మద్దెబోయిన మానస, విద్యారంగంవరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన దీప్తికి పుట్టుకతో జన్యుపరమైన బలహీనత ఉంది. అయినా స్కూల్లో తోటి విద్యార్థులతో సమానంగా ఆటల్లో పాల్గొనేది. ఆమె ప్రతిభను గుర్తించిన కోచ్ రమేశ్ పారా అథ్లెట్‌గా ట్రెయినింగ్ ఇచ్చారు. ఇక ఆ తరువాత మొదలైంది పతకాల వేట. 2024లో జపాన్ లో జరిగిన పారా అథ్లెటిక్స్ ప్రపంచ ఛాంపియన్ షిప్లో 400 మీటర్ల టి20 విభాగంలో స్వర్ణ పతకం గెలుచుకోవడమే కాకుండా ప్రపంచ రికార్డును నెలకొల్పారు దీప్తి. దీప్తి జీవాంజిని స్పోర్ట్స్ కేటగిరిలో ‘యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.జీవాంజి దీప్తి, క్రీడలుపెద్ది శంకర్ గౌడ్ ‘రెడీ టు సర్వ్ ఫౌండేషన్’ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి 2011లో వనస్థలిపురంలో ఒక ఓల్డేజ్ హోమ్ప్రారంభించారు. ఏ ఆసరా లేని వృద్ధులకు ఆశ్రయం కల్పించి ఉచిత భోజన, వైద్య సేవలు అందచేస్తోంది ఈ సంస్థ. ప్రముఖ హాస్పిటల్స్ యాజమాన్యాలను ఒప్పించి అక్కడి వైద్యుల చేత వృద్ధులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహిస్తూ అవసరమైన మెడిసిన్స్ ఉచితంగా ఇస్తున్నారు. పెద్ది శంకర్ గౌడ్‌ను ‘యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్ సోషల్ సర్వీస్’ అవార్డుతో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.పెద్ది శంకర్, సామాజిక సేవమద్దినేని ఉమామహేష్.. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు కొల్లగొడుతున్న ఇరవయ్యేళ్ల షూటర్. స్వస్థలం విజయవాడ. బెంగుళూరులో జరిగిన ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో గోల్డు మెడల్ సాధించాడు. 2022లో జర్మనీలో జరిగిన ISSF జూనియర్ వరల్డ్ కప్‌లో, 2024లొ ఢిల్లీలో జరిగిన FISU వాల్డ్ యూనివర్సిటీ ఛాంపియన్ షిప్ మెన్స్ టీమ్ ఈవెంట్లో స్వర్ణ పతకాలు సాధించాడు. ఉమా మహేష్‌ను ‘స్పోర్ట్స్ కేటగిరిలో యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు’తో సత్కరించింది సాక్షి.మద్దినేని ఉమా మహేష్, క్రీడలుఇస్రో మాజీ శాస్త్రవేత్తలైన పవన్ కుమార్ చందన, నాగభరత్ కలిసి 2018లో స్కైరూట్ ఏరోస్పేస్నుప్రారంభించారు. ఇది భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ అంతరిక్ష ప్రయోగాల స్టార్టప్ కంపెనీ. అంతరిక్షాన్ని అందరికీ చేరువ చేయాలనే లక్ష్యంతో విక్రమ్–సిరీస్ ప్రయోగ వాహనాలను అభివృద్ధి చేస్తోంది స్కైరూట్. ఈ కంపెనీలో 350కు పైగా ప్రతిభావంతమైన అంతరిక్ష నిపుణులు పని చేస్తున్నారు. అంతరిక్ష పరిశోధనలను సరళతరం చేస్తున్న స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీని ‘ఎక్సలెన్స్ ఇన్ స్టార్టప్ అవార్డు’తో సత్కరిస్తోంది సాక్షి మీడియా గ్రూప్.పవన్ చందన, నాగ భరత్, స్టార్టప్తలసీమియా... చిన్నారుల పాలిట శాపమైన ఈ వ్యాధికి వైద్యం చేయించలేక తల్లడిల్లుతున్న తల్లిదండ్రులకు అండగా నిలిచారు పొద్దుటూరి అనిత. ఖమ్మంలో ఆర్టీసీలో కండక్టర్‌గా పనిచేస్తూనే తలసీమియాతో బాధపడుతున్న చిన్నారుల కోసం సంకల్ప పేరిట ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. విరివిగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ తలసేమియా గురించి... రక్త దానం ఆవశ్యకత గురించి అవగాహన కల్పిస్తున్నారు. పొద్దుటూరి అనితను ‘ఎక్సలెన్స్ ఇన్ సోషల్ డెవలప్మెంట్ అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.అనితప్రొద్దుటూరి, సామాజిక సేవచంద్రకాంత్ సాగర్ పుట్టుకతోనే 90 శాతం శారీరక లోపంతో జన్మించారు. అయినా ఏనాడూ కుమిలిపోలేదు. వీల్‌చైర్ నుంచే 2019లో ప్రణవ్ ఎంటర్ప్రైజెస్ పేరుతో పరిశ్రమ ఏర్పాటు చేసి పర్యావరణహిత సంచులు, సర్జికల్ మాస్కులు, పెన్నులు, పెన్సిళ్లు తయారు చేస్తూ పది మంది దివ్యాంగులకు ఉపాధి కల్పిస్తున్నారు. ప్రస్తుతం వారి టర్నోవర్ 25 లక్షలు. చంద్రకాంత్ సాగర్ని ‘బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ కేటగిరీ’లో స్పెషల్ జ్యూరీ రికగ్నేషన్ అవార్డుతో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.చంద్రకాంత్ సాగర్, చిన్న/మధ్య తరహా వాణిజ్యండొక్కరి రాజేశ్ గుండె ధైర్యం, త్యాగం దేశాన్నే కాదు తెలుగు వారిని కూడా గర్వపడేలా చేసింది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం చెట్లతాండ్ర గ్రామానికి చెందిన డొక్కరి రాజేశ్ 2018లో ఆర్మీలో చేరి తండ్రి కలను నిజం చేశారు. మూడేళ్లలోనే నాయక్ స్థాయికి ఎదిగారు. సెలవుపై స్వగ్రామానికి వచ్చినప్పుడల్లా పేద విద్యార్థుల చదువు కోసం ఖర్చుపెట్టేవారు. 2024 జూలై 15న జమ్ము కాశ్మీర్‌లోని దోడా జిల్లాలో ఉగ్రవాదులను ఎదుర్కొంటూ వీరమరణం పొందారు. వీర జవాన్ డొక్కరి రాజేశ్‌కు సాక్షి ఎక్సలెన్స్ – పొస్తమస్ అవార్డును ఆయన కుటుంబ సభ్యులకు అందించింది సాక్షి మీడియా గ్రూప్.డొక్కరి రాజేష్ తల్లిదండ్రులు, అమర సైనికుడు→పురస్కార గ్రహీత చంద్రకాంత్‌తో భారతీరెడ్డి ∙‘సాక్షి’ మీడియా గ్రూప్ ప్రతినిధులతో ముఖ్య అతిథి బండారు దత్తాత్రేయడొక్కరి రాజేష్ తల్లిదండ్రులకు పురస్కారం అందిస్తూ... -
అలలపై కలల విహారం
అలలపై తేలియాడుతూ ప్రయాణం.. గమ్యం చేరే వరకు ఎక్కడా బోర్ కొట్టకుండా ఆటలు, పాటలు, విందులు, వినోదాల్లాంటి బోలెడన్ని సరదాలు.. కళ్లు చెదిరే ఇంటీరియర్లతో అందమైన గదులు.. ప్రయాణ బడలిక తెలియనివ్వని పాన్పులు.. ఒకవేళ అలసటకు గురైతే స్పా, మసాజ్ లాంటి సర్వీసులు.. ఉన్న చోటే బోలెడంత షాపింగ్ చేసుకొనే అవకాశం.. ఇంకా ఈత కొలనులు.. జిమ్‌లు.. ఇలా ఒకటేమిటి ఇంద్రభవనం లాంటి సకల విలాసాలతో కూడిన నౌకల్లో విహారయాత్రలంటే ఎవరికి ఇష్టం ఉండదు.అందుకే దేశంలో లగ్జరీ క్రూజ్ టూరిజం సరికొత్త ట్రెండ్‌గా మారింది. పర్యాటకులను ఆనంద‘సాగరం’లో ముంచెత్తే అనుభూతులు పంచుతోంది. ఇంకేం.. జీవితాంతం గుర్తుండిపోయే సముద్రమంత లోతైన జ్ఞాపకాలు కావాలనుకుంటే ‘సీ’కేషన్కు సిద్ధమైపోండి. గెట్ సెట్ క్రూజ్!! దేశంలో క్రూజ్ పర్యాటకం క్రమంగా పుంజుకుంటోంది. డెస్టినేషన్ వెడ్డింగ్స్, ప్రైవేటు పార్టీలు, కంపెనీల గెట్ టు గెదర్ వంటి కార్యక్రమాలకు కూడా క్రూజ్‌లు వేదికలుగా మారుతున్నాయి. ప్రస్తుతం దేశంలో క్రూజ్ ప్రయాణికుల సంఖ్య 4.5 లక్షలు దాటింది. కార్డీలియా క్రూజెస్ అనే స్వదేశీ సంస్థ 2021 సెపె్టంబర్లో సుమారు 2 వేల మంది ప్రయాణికుల సామర్థ్యంగల ‘ఎంప్రెస్’నౌక ద్వారా భారత్‌లో తొలిసారిగా లగ్జరీ క్రూజ్ పర్యాటకానికి తెరతీసింది.బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రాల్లో క్రూజ్ యాత్రలు నిర్వహిస్తోంది. పశ్చిమ తీరంలో ముంబై హోమ్ పోర్టుగా సెపె్టంబర్–జూన్ మధ్య గోవా, కొచ్చి, లక్షదీవులకు... జూన్–సెప్టెంబర్ మధ్య తూర్పు తీరంలో చెన్నై హోమ్ పోర్ట్‌గా క్రూజ్ ట్రిప్పులు తిప్పుతోంది. 2023 జూన్‌లో భారత్ నుంచి శ్రీలంకకు జర్నీతో విదేశీ క్రూజ్ సర్విసులను ప్రారంభించిన ఘనతను కూడా కార్డీలియా సొంతం చేసుకుంది.ఇప్పుడు ఏటా చెన్నై–శ్రీలంక మధ్య జూన్–సెపె్టంబర్ నెలల్లో కార్డీలియా ’ఎంప్రెస్‘విహారయాత్రలను నిర్వహిస్తోంది. గమ్యస్థానాల్లో వాటర్ అడ్వెంచర్లు, జంగిల్ సఫారీలు, ఆన్‌షోర్ సిటీ టూర్, అవుట్డోర్ పర్యటనలను కూడా అందిస్తోంది. దేశీయ గమ్యస్థానాలకు పర్యాటకుల ఆక్యుపెన్సీ 85 శాతం మేర ఉంటోందని.. వేసవి సెలవుల్లో టికెట్లు పూర్తిగా బుక్ అయిపోతున్నాయని కంపెనీ సీఈఓ జుర్గెన్ బైలోమ్ చెబుతున్నారు. కొత్త రూట్లు, గమ్యస్థానాలకు విస్తరణ నేపథ్యంలో భారతీయ క్రూజ్ ట్రాఫిక్ 25–30 శాతం పెరిగే అవకాశం ఉందన్నారు. కేంద్రం దన్ను.. దేశంలో సముద్ర క్రూజ్ పర్యాటకులను 2029 నాటికి ఏటా 10 లక్షల మంది స్థాయికి చేర్చడంతోపాటు ఈ రంగంలో 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేలా ఐదేళ్ల భారత్ క్రూజ్ మిషన్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా 10 సముద్ర క్రూజ్ టెర్మినల్స్, 100 రివర్ క్రూజ్ టెర్మినల్స్ నిర్మించాలనేది ప్రభుత్వ లక్ష్యం.ప్రపంచస్థాయి మౌలిక వసతులతోపాటు పర్యాటక ప్రదేశాలను మరింతగా అభివృద్ధి చేయనున్నారు. బడ్జెట్లో కూడా క్రూజ్ పరిశ్రమ వృద్ధికి ప్రోత్సాహకాలు ఇవ్వడం విశేషం. గంగ, బ్రహ్మపుత్ర నదుల్లో ఇప్పటికే రివర్ క్రూజ్ సర్విసులు ప్రారంభమయ్యాయి. కృష్ణా, గోదావరి, నర్మద, కావేరి నదుల్లోనూ ఈ సర్విసులను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రివర్ క్రూజ్ పర్యాటకులను 2029 నాటికి ఏటా 15 లక్షలకు పెంచాలనేది మిషన్ లక్ష్యం.వైజాగ్ హాట్ డెస్టినేషన్... జూలైలో మళ్లీ క్రూజ్ రెడీ2022లో తొలిసారి కార్డీలియా క్రూజెస్ ‘ఎంప్రెస్’నౌక విశాఖ–చెన్నై మధ్య సముద్ర విహారంతో పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచింది. గతేడాది ‘ద వరల్డ్’అనే విదేశీ లగ్జరీ క్రూజ్ షిప్ గ్లోబల్ టూరిస్టులను విశాఖకు తీసుకొచ్చింది. ఇక్కడ సకల సౌకర్యాలతో నిర్మించిన అంతర్జాతీయ క్రూజ్ టెర్మినల్‌లో లంగరేసింది. ఈ ఏడాది మళ్లీ జూలైలో కార్డీలియా ఎంప్రెస్ నౌక వైజాగ్–పుదుచ్చేరి–చెన్నై మధ్య ట్రిప్పులకు రెడీ అవుతోంది.సుమారు రూ. 100 కోట్ల వ్యయంతో విశాఖ పోర్టులో నిర్మించిన ఇంటర్నేషనల్ క్రూజ్ టెర్మినల్ నుంచి నౌకల రాకపోకలు మొదలవడంతో క్రూజ్ పర్యటకానికి కూడా వైజాగ్ హాట్ డెస్టినేషన్‌గా నిలుస్తోంది. షిప్ ఆకారంలో నిర్మించిన ఈ టెర్మినల్‌లోని బెర్త్‌లో 2,500 మంది సామర్థ్యంతో కూడిన భారీ క్రూయిజ్లను లంగరేయొచ్చు. త్వరలో ఇక్కడి నుంచి సింగపూర్, మలేసియా, థాయ్‌లాండ్, శ్రీలంక తదితర దేశాలకు క్రూజ్ సర్వీసులు ప్రారంభించేందుకు పలు క్రూజ్ కంపెనీలతో సంప్రదింపులు జరుగుతున్నాయి.విదేశీ క్రూజ్‌ల క్యూఇటలీకి చెందిన కోస్టా క్రూజెస్ తొలిసారిగా 2023లో భారత్ పర్యాటకులకు అంతర్జాతీయ స్థాయి క్రూజ్ అనుభూతితోపాటు ఇటాలియన్ ఆతిథ్యాన్ని రుచి చూపించింది. ముంబై, కొచ్చి, గోవాతోపాటు లక్షదీవుల మధ్య మొత్తం 23 ట్రిప్పులు నిర్వహించింది. మొత్తం 14 అంతస్తులు (డెక్‌లు), 3,780 మంది ప్రయాణికుల సామర్థ్యంతో కోస్టా సెరీనా క్రూజ్ భారత సముద్ర జలాల్లో విహరించిన అతిపెద్ద నౌకగా రికార్డుకెక్కింది.ఆసియా పసిఫిక్ కార్యకలాపాల కోసం భారత్‌ను ప్రధాన కేంద్రంగా చేసుకోవడంపై దృష్టి పెడుతున్నామని కోస్టా క్రూజెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాబర్టో అల్బెర్టీ వెల్లడించారు. క్రూజ్ టూరిజానికి ప్రభుత్వ ప్రోత్సాహంతో మరిన్ని క్రూజ్ కంపెనీలు భారత్‌కు క్యూ కట్టనున్నాయి. వచ్చే ఏడాది నుంచి ‘రిసార్ట్ వరల్డ్ వన్’క్రూజ్ లైనర్ మన దేశంలో సెయిలింగ్‌కు సై అంటోంది. రాయల్ కరీబియన్, డిస్నీ తదితర దిగ్గజ క్రూజ్ లైనర్లు కూడా భారత మార్కెట్లోకి అడుగుపెట్టే ప్రణాళికల్లో ఉన్నాయి.ఇక అలలపై ఆగ్నేయాసియా చుట్టేయొచ్చు! భారత క్రూజ్ పరిశ్రమ ఇక అంతర్జాతీయంగానూ సత్తా చాటనుంది. కార్డీలియా తొలిసారిగా భారత్ నుంచి ఆగ్నేయాసియాలోని ప్రముఖ పర్యాటక దేశాలకు జూలైలో క్రూజ్ జర్నీ ప్రారంభిస్తోంది. ఇందుకోసం 2,500 మంది సామర్థ్యంగల రెండు కొత్త క్రూజ్లను కొననుంది. చెన్నై నుంచి మొదలయ్యే ఈ 10 రోజుల ట్రిప్‌లో థాయ్‌లాండ్ (ఫుకేట్), మలేసియా (కౌలాలంపూర్, లంకావీ)ల మీదుగా సింగపూర్ చేరుకోవచ్చు.అలాగే సింగపూర్ నుంచి మొదలై అవే డెస్టినేషన్లను కవర్ చేస్తూ చెన్నై చేరేలా టూర్లను ప్లాన్ చేశారు. ఇప్పటికే కార్డీలియా వెబ్సైట్ (www.cordeliacruises) తోపాటు ప్రముఖ ట్రావెల్ పోర్టల్స్‌లో బుకింగ్స్ మొదలయ్యాయి. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రాలను చుట్టేయడంతోపాటు గమ్యస్థానాల్లో సిటీ టూర్స్, ఆన్‌షోర్ పర్యటనలతో ఒకే ట్రిప్‌లో మూడు దేశాలను కవర్ చేసే అవకాశం ఉంటుంది.ప్యాకేజీలు ఇలా... కార్డీలియా ‘ఎంప్రెస్షిప్లో మధ్యతరగతి కుటుంబం సైతం లగ్జరీ క్రూజ్ జర్నీ చేసేవిధంగా రకరకాల రూమ్‌లు, ఆఫర్లు, గ్రూప్ ప్యాకేజీలు ఉన్నాయి. ఉదాహరణకు చెన్నై–విశాఖ మధ్య ఇద్దరు పెద్దవాళ్లకు రెండు రాత్రులు, 3 పగళ్ల ప్యాకేజీ ధరలు (పన్నులన్నీ కలిపి) చూస్తే...అన్లిమిటెడ్ ఫుడ్, ఎంటర్టైన్మెంట్తో మూడు రోజులపాటు ఫైవ్ స్టార్ లగ్జరీ సముద్ర ప్రయాణ అనుభూతిని సొంతం చేసుకోవచ్చు. జర్నీ రూట్, ఎంత మంది, ఎన్ని రోజులు (3, 5 నైట్స్ ప్యాకేజీలు) అనేదాన్ని బట్టి రేట్లు మారతాయి. 12 ఏళ్ల లోపు పిల్లలకు షరతులకు లోబడి ఉచిత ప్రయాణ (పన్నులు కాకుండా) ఆఫర్ ఉంది. ధర ఎక్కువైనా మరింత లగ్జరీ, సౌకర్యాలు కోరుకునేవారికి సూట్, చైర్మన్ సూట్ కూడా ఉన్నాయి.విదేశీ టూర్ల విషయానికొస్తే... చెన్నై నుంచి శ్రీలంకకు (హంబన్‌టోట, ట్రింకోమలీ, జాఫ్నా), తిరిగి చెన్నై (5 నైట్స్, 6 డేస్ రౌండ్ ట్రిప్) జర్నికి ఇద్దరు పెద్దవాళ్లకు చార్జీ దాదాపు రూ. లక్ష పడుతుంది. అలాగే చెన్నై నుంచి సింగపూర్ (ఫుకెట్, లంకావీ, కౌలాలంపూర్ మీదుగా వన్‌వే ట్రిప్ – 10 నైట్స్, 11 డేస్) ట్రిప్‌కి చార్జీ రూ.2,21,745 అవుతుంది. పన్నులతో కలిపి, ఇంటీరియర్ స్టేట్‌రూమ్ ప్యాకేజీలు ఇవి.క్రూజ్ లెక్కలు ఇలా.. 3 కోట్లు: ప్రపంచవ్యాప్తంగా ఏటా క్రూజ్ జర్నీ చేస్తున్న పర్యాటకుల సంఖ్య (సుమారుగా) 30 బిలియన్ డాలర్లు: క్రూజ్ జర్నీ మార్కెట్ విలువ45 బిలియన్ డాలర్లు: 2029 నాటికి క్రూజ్ జర్నీ మార్కెట్ విలువ అంచనా4.5 లక్షలు: దేశంలో ప్రస్తుతం క్రూజ్ ప్రయాణికుల సంఖ్య5.3 లక్షలు: ఇప్పటిదాకా కార్డీలియా ఎంప్రెస్‌లో విహరించిన పర్యాటకులు -
టారిఫ్ వార్.. ఎవరికి లాభం?
అన్నట్టుగానే భారత్‌పైనా సుంకాల మోతకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెర తీశారు. ఏప్రిల్ 2 నుంచి పరస్పర సుంకాలు తప్పవని పునరుద్ఘాటించారు. దీని ప్రభావం మనపై ఏ మేరకు ఉండనుందంటూ జోరుగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే అమెరికా మనకు అతి పెద్ద వాణిజ్య భాగస్వామి. అందుకే అగ్ర రాజ్యంతో టారిఫ్‌ల రగడకు తెర దించేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఇప్పటికే అమెరికాలో పర్యటిస్తున్నారు. ఇరు దేశాలకు ఆమోదయోగ్యమైన ద్వైపాక్షిక వర్తక ఒప్పందం (బీటీఏ)పై చర్చలు జరుపుతున్నారు. ఈలోగా పలు అమెరికా ఉత్పత్తులపై టారిఫ్‌లను వీలైనంతగా తగ్గిస్తూ భారత్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ తదితర ఉత్పత్తులపైనా టారిఫ్ కోతలు ప్రకటించే అవకాశం కన్పిస్తోంది. ఏ మేరకు సుంకాలు? సుంకమంటే ఒక దేశం మరో దేశం నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై విధించే పన్ను. భారత ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న సుంకాలు సగటున 4 నుంచి 5 శాతం మించడం లేదు. భారత్ మాత్రం అమెరికా ఉత్పత్తులపై సగటున 18 శాతం పై చిలుకు దిగుమతి సుంకాలు విధిస్తోంది. లగ్జరీ కార్లు, కెమికల్స్, ఎల్రక్టానిక్స్‌పై 125 శాతం, మద్యం మీదైతే ఏకంగా 150 శాతం దాకా వసూలు చేస్తోంది! ఈ తేడాలను సరిచేయకుంటే ఏప్రిల్ 2 నుంచి తామూ అంతే మొత్తం బాదుతామని ట్రంప్ బెదిరిస్తున్నారు. అమెరికాపై ప్రధానంగా ఆధారపడ్డ భారత ఎగుమతిదారులపై ఇది గట్టి ప్రభావమే చూపనుంది. ముఖ్యంగా మన ఇనుము, ఉక్కు, జౌళి ఎగుమతులపై ప్రభావం తీవ్రంగా ఉండనుంది. దిద్దుబాటు చర్యలేవీ తీసుకోని పక్షంలో 25 బిలియన్ డాలర్ల విలువైన భారత ఎగుమతులపై ప్రభావం పడవచ్చని అంచనా. అయితే మన జీడీపీలో అమెరికా ఎగుమతుల వాటా కేవలం 2.2 శాతమే. కనుక భారత్ మరీ అంతగా బెంబేలెత్తిపోవాల్సిన పని లేదన్నది ఆర్థికవేత్తల మాట. ‘‘భారత్ వంటి అతిపెద్ద మార్కెట్‌ను అమెరికా విస్మరించలేదు. అక్కడి ఈ కామర్స్ కంపెనీలు, బ్యాంకులు, ఆర్థిక సేవలు, టెక్నాలజీ సంస్థలకు భారత మార్కెట్ అంటే భారీ ఆసక్తి. సోషల్ నెట్వర్కింగ్ కంపెనీలకూ భారత్ ప్రధానమే’’ అని వారంటున్నారు. అమెరికాతో భారత్ వాణిజ్యమెంత? అమెరికాకు అతి పెద్ద ఎగుమతిదారుల్లో భారత్ ఒకటి. 2024లో ఆ దేశానికి 87.4 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేసింది. అమెరికా నుంచి 41.8 బిలియన్ డాలర్ల దిగుమతులు మాత్రమే చేసుకుంది. ఈ వాణిజ్య లోటునూ ట్రంప్ ప్రశి్నస్తున్నారు. దీన్ని పూడ్చాల్సిందేనని పట్టుబడుతున్నారు. మనకు మేలే! ట్రంప్ తెర తీసిన టారిఫ్ వార్ అంతిమంగా భారత్‌కే లబ్ధి చేకూరుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. చైనా, కెనడా, మెక్సికో తదితర దేశాలపై అమెరికా ఇప్పటికే సుంకాలను పెంచడం తెలిసిందే. బదులుగా అమెరికాపై ప్రతీకార సుంకాలు తప్పవని ఆ దేశాలు కూడా స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో ఆయా దేశాల నుంచి అమెరికాకు ఎగుమతులు బాగా తగ్గేలా కని్పస్తున్నాయి. ఇది భారత్‌కు సానుకూలంగా మారుతుందని, మనం మరిన్ని ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేసేందుకు వీలు కలుగుతుందని ఆర్థికవేత్తలు అంటున్నారు. ట్రంప్ తొలి హయాంలో కూడా చైనాపై సుంకాలు పెంచడంతో భారత్ బాగా లాభపడింది. ఈసారి కూడా అమెరికాకు మన మిర్చి, జౌళి తదితర ఉత్పత్తుల ఎగుమతులు బాగా పెరిగే అవకాశముంది. ఇప్పటికే చర్యలు అమెరికాపై విధిస్తున్న సుంకాల తగ్గింపుకు భారత్ ఇప్పటికే చర్యలు తీసుకుంటోంది... → ఇటీవలి బడ్జెట్లో స్మార్ట్ ఫోన్ దిగుమతులపై ప్రకటించిన 15–16 శాతం సుంకాల నుంచి అమెరికాను మినహాయించాలని కేంద్రం భావిస్తోంది.→ వైద్య పరికరాలు, లగ్జరీ మోటార్ సైకిళ్ల వంటి పలు అమెరికా ఉత్పత్తులపై టారిఫ్‌లను తగ్గించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.→ వాణిజ్య లోటును తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా అమెరికా నుంచి రక్షణ, చమురు తదితర ఉత్పత్తుల దిగుమతులను ఇతోధికంగా పెంచేందుకు ట్రంప్–మోదీ భేటీలో అంగీకారం కూడా కుదిరింది. → ఏఐజీ వంటి అమెరికా బీమా దిగ్గజాలకు లబ్ధి చేకూర్చేలా ఆ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 100 శాతానికి పెంచుతూ తాజా బడ్జెట్లో కేంద్రం నిర్ణయం తీసుకుంది.→ భారత ఔషధాలపై అమెరికా ఎలాంటి సుంకాలూ వసూలు చేయడం లేదు. కనుక అమెరికా ఔషధ దిగుమతులపై భారత్ విధిస్తున్న 10 శాతం సుంకాన్ని కూడా ఎత్తేయాలని ఫార్మా సంస్థలు సూచిస్తున్నాయి. → అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న పలు వ్యవసాయోత్పత్తులపై ఏకంగా 42 నుంచి 120 శాతం దాకా సుంకాలున్నాయి. వీటిని కూడా బాగా తగ్గించే అవకాశముంది. త్వరలో ఒప్పందం: భారత్ న్యూఢిల్లీ/వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుని తాజా ప్రకటనపై భారత్ ఆచితూచి స్పందించింది. అగ్ర రాజ్యంతో వాణిజ్య బంధాన్ని మరింత పటిష్టం చేసుకోవడమే తమ లక్ష్యమని పేర్కొంది. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ) ద్వారా టారిఫ్, టారిఫేతర అడ్డంకులను తగ్గించుకునేందుకు కృషి చేస్తున్నట్టు వివరించింది. దీన్ని ఇరు దేశాలకూ ఆమోదనీయ రీతిలో పరిష్కరించుకుంటామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్«దీర్ జైస్వాల్ శుక్రవారం ఒక ప్రకటనలో విశ్వాసం వెలిబుచ్చారు.సుంకాల తగ్గింపుకు భారత్ ఒప్పుకుంది: ట్రంప్ అమెరికాపై సుంకాలను భారీగా తగ్గించేందుకు భారత్ అంగీకరించినట్టు ట్రంప్ వెల్లడించారు. శుక్రవారం ఉదయం వైట్‌హౌస్ ఓవల్ కార్యాలయంలో ఈ మేరకు ప్రకటించారు. అమెరికాపై ఇన్నాళ్లుగా భారత్ విధిస్తున్న హెచ్చు సుంకాలను తాను బయట పెట్టడమే ఇందుకు కారణమని చెప్పుకొచ్చారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మాయమయ్యాడు.. మామూలు మనిషి
ఒకప్పడు ఎటు చూసినా బంధాలు..అను బంధాలు..ఆత్మీయతలు.. అనురాగాలు.. విలసిల్లేవి.. ప్రపంచీకరణ పుణ్యమాని.. మనిషిలో స్వార్థం పెరిగి మాన సంబంధాలు కనుమరుగవుతున్నాయి. తన జీవితం తనదే, పొరుగువారితో పనేముందన్న రీతి లో మానవుడు సాగుతున్నాడు. యాంత్రిక జీవనం గడుపుతున్నాడు.. మచ్చుకైనా మానవత్వం కనిపించకపోవడంతో మామూలు మనిషి మాయమైపోయాడనక తప్పదు. నేటి మానవ సంబంధాలపై ప్రత్యేక కథనం. పలమనేరు: మానవ సంబంధాలను మంటగలిపి కేవలం తమ స్వార్థం చూసుకుంటున్న మనుషులు సమాజంలో ఎక్కువైపోయారు. గమ్యం తెలియని జీవన పయనమెటో తెలియని గందరగోళం నెలకొంది. సమాజంలో మంట కలుస్తున్న మానవత్వాన్ని మేలు కొల్పాల్సిన అవరసం ఎంతైనా ఉంది. గత ఏడాదిలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అందరూ ఉండి అనాథల్లా మారి కనీసం అంత్యక్రియలకు నోచుకోని పదిమందికి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు దహనసంస్కారాలు చేశారంటే సమాజంలో ఎలాంటి మావనీయ సంబంధాలున్నాయే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మానవ సంబంధాలెలా ఉన్నాయంటే? పలమనేరు మండలంలోని మొరం పంచాయతీకి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి తన కుటుంబంతో బెంగళూరులో కాపురముంటున్నారు. అనారోగ్యంతో అతని తల్లి మృతి చెందింది. దీంతో ఆ ఇంటి యజమాని మానవత్వం లేకుండా తన ఇంట్లో శవాన్ని పెట్టకుండా అడ్డుకున్నాడు. దీంతో విధిలేక వారు స్వగ్రామానికి తీసుకొచ్చారు. బయట చనిపోయినవారు గ్రామంలోకి రాకూదనే సంప్రదాయంతో శవాన్ని ఊరిబయటే పెట్టి ఆపై అంత్యక్రియలను నిర్వహించారు. పలమనేరు సమీపంలోని సాయినగర్‌లో ఓ ఉద్యోగి సొంత ఇంటిని నిర్మించుకుని పదేళ్లుగా కాపురముంటున్నాడు. ఆయన ఇప్పటివరకు ఇరుగుపొరుగు వారితో మాట్లాడలేదు. ఎరింటికీ వెళ్లలేదు. ఆ వీధిలో ఎవరికైనా కష్టమొచ్చినా సాయం చేయలేదు. పొద్దున ఆఫీసుకెళ్లడం పొద్దుపోయాక ఇంటికి రావడం తప్ప అతనికి ఎవరితోనూ సంబంధం లేని జీవితం గడుపుతున్నారు. మారిన బతుకులు ఒకటో తరగతి నుంచి కార్పొరేట్ స్కూల్ ఆపై కాలేజీ, మళ్లీ కుటుంబానికి దూరంగా పిల్లల చదువులు. ఆపై ఉద్యోగం రాగానే వారి జీవితం వారిది. ఇక ఇళ్లల్లోని పెద్దలను పిల్లలే వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్నారు. దీంతో కుటుంబ విలువలు తెలియని పిల్లలు ఎవరికివారేఅన్న భావనతో తమ బతుకులకు అంకితమైపోతున్నారు. స్మార్ట్ఫోన్ల పుణ్యమాని మానవ సంబంధాల పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. గతంలో ఓ గ్రామంలో వంద కుటుంబాలుంటే కనీసం 20 కుటుంబాలన్నా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు ఊరికి రెండు, మూడు కుటుంబాలు సైతం కలిసి ఉండడం లేదు. సచ్చినా బాధపడే వారెవరు? సొంత కుటుంబసభ్యులు ఎవరైనా మృతి చెందితే కనీసం కొన్నేళ్లపాటు బాధపడే రోజులు గతంలో కనిపించేవి. కానీ ఇప్పుడు సొంత కుటుంబసభ్యులు చనిపోయినా కేవలం రెండు మూడు రోజులే బాధ, ఆపై అసలు పట్టించుకోరు. మాయమవుతున్న మానవసంబంధాలు ఎవరు ఏమైతే నాకేంటి నా కుటుంబం బాగుంటే చాలనే స్వార్థం ఎక్కువైంది. ఆఖరికి తన సొంత అమ్మా నాన్న, అక్కా చెల్లి, అన్నదమ్ములను సైతం పట్టించుకోవడం లేదు. గతంలో గ్రామంలో ఎవరి ఇంట్లోనైనా శుభ, అశుభకార్యాలు జరిగితే పనులు చేసేందుకు ఇంటికోమనిషి వెళ్లేవారు. ఇప్పుడు పెళ్లికి సైతం రావడంలేదు. దీంతో శుభ, అశుభ కార్యక్రమాలకు ఈవెంట్ మేనేజర్లే దిక్కుగా మారారు. నాటి పలకరింపులు కరువు గతంలో ఇంటికి ఎవరైనా బంధువులొస్తే గంటల తరబడి పలకరింలుండేవి. ఆపై బంధువులకు విందుభోజనం చేసిపెట్టేవాళ్లం. ఇప్పుడు ఎవరైనా బంధువులు ఇంటికోస్తే నిమిషం పలకరింపు, బిజీగా ఉన్నాం ఇంకోసారి వస్తాంలేనంటూ పదినిమిషాల్లో వెళ్లడం కనిపిస్తోంది. మన ఇంట్లోని వారు సైతం బంధువులతో మాట్లాడకుండా స్మార్ట్ఫోన్లకు అతక్కుపోయి ఉంటున్నారు . – లక్ష్మీపతినాయుడు, బురిశెట్టిపల్లి, బైరెడ్డిపల్లి మండలం కష్టమొస్తే పలకరించేవాళ్లుండాలయ్యా! గతంలో ఎవరికైనా కష్టం వస్తే ఇంటిపక్కనున్నవారో స్నేహితులో మంచి సలహా చెప్పి సమస్యకు పరిష్కారం చూపేవారు. ఇప్పుడు ఆత్మీయ పలకరింపులు లేవు. ఎవరు చూసినా వారి పనుల్లో బిజీబీజీ. రోడ్డుపై ప్రమాదం జరిగినా మనకెందుకులే, కేసవుతుందని వెళ్లిపోయే సమాజమిది. అమ్మా,నాన్న, బిడ్డలకంటే ఎక్కువగా సోషల్‌మీడియాతో గడుపుతున్నారు. – పుష్పరాజ్, రిటైర్డ్ టీచర్, పలమనేరు -
నల్లమల.. వన్యప్రాణుల ఖిల్లా
ప్రకృతి అందాలకు నల్లమల అటవీ ప్రాంతం ఆలవాలమైంది. ఎటు చూసినా ఆకాశాన్నంటే చెట్లు, బెబ్బులి గర్జనలు, నెమళ్ల నాట్యాలు, అరుదైన పక్షుల కిలకిలా రావాలు, అటు నుంచి ఇటు పరిగెత్తే జింకలు, సెలయేళ్లు, పర్యాటక ప్రదేశాలకు నల్లమల అటవీ ప్రాంతం నెలవుగా మారింది. ప్రతి ఏడాది మార్చి 3న ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. ప్రజలకు వణ్యప్రాణుల సంరక్షణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తారు.మార్కాపురం:నల్లమల అటవీ ప్రాంతం ప్రకాశం, గుంటూరు, కర్నూలు జిల్లాల పరిధిలో సుమారు 6.50 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉంది. ఈ అటవీ ప్రాంతంలో 87కు పైగా రాయల్ బెంగాల్ టైగర్లు, సుమారు 400 కు పైగా చిరుతలు తిరుగుతున్నాయి. వీటితోపాటు వందల సంఖ్యలో దుప్పులు, జింకలు, నీల్గాయ్లు, ఎలుగుబంట్లు ఉన్నాయి.వీటితోపాటు ఆకాశంలో 4 నుంచి 5 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతూ క్షణాల్లో భూమిమీద తిరిగే వన్యప్రాణులను తినే అరుదైన క్రస్టడ్ హక్ ఈగల్ (నల్లపాముల గద్ద), షార్టు టోడోస్ స్నేక్ఈగల్, హనీబజర్, క్రస్టడ్ సర్పెంట్ ఈగల్‌లు సంచరిస్తున్నాయి. ఇక రష్యా నుంచి 8 వేల కిలోమీటర్లు ప్రయాణించి నల్లమలకు వచ్చే మాన్టెగ్యూష్ హారియర్, పాలిడ్ హ్యారియర్ తదితర పక్షులకు కూడా నల్లమల ప్రాంతం నివాసంగా మారింది. మార్కాపురానికి చుట్టుపక్కల నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న పెద్దదోర్నాల, పుల్లలచెరువు, యర్రగొండపాలెం, పెద్దారవీడు, అర్ధవీడు, గిద్దలూరు తదితర మండలాల్లో అటవీ సమీప గ్రామాలున్నాయి. పెద్దదోర్నాల మండలంలోని నల్లగుంట్ల, వై చర్లోపల్లి, తుమ్మలబైలు, శ్రీశైల శిఖరం, బొమ్మలాపురం, ఘాట్‌రోడ్డు, అర్ధవీడు మండలంలోని వెలగలపాయ, మాగుటూరు తాండ, గన్నెపల్లి, లక్ష్మీపురం, దొనకొండ, మార్కాపురం మండలం గొట్టిపడియ, పెద్దారవీడు మండలం గుండంచర్ల తదితర గ్రామాల సమీపాల్లోకి వన్యప్రాణులు తరచుగా వస్తుంటాయి. ముఖ్యంగా పెద్దపులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, జింకలు, నెమళ్లు సంచరిస్తున్నాయి. అటవీశాఖ అధికారులు వన్యప్రాణుల సంరక్షణకు అన్నీరకాల చర్యలు తీసుకుంటున్నారు. పెద్దపులులు, చిరుతలకు అడవిలోనే నీటి సమస్య లేకుండా సోలార్ సాసర్పిట్లు ఏర్పాటుచేసి అధికారులు నీటి సమస్య తీర్చారు. నల్లమల పరిధి పెరిగిపోతోంది. గతంలో ఏపీలోని ప్రకాశం, గుంటూరు, కర్నూల్, తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్గొండ తదితర జిల్లాలతో అనుసంధానంగా ఉండగా ఇప్పుడు శేషాచలం అడవులను కలుపుతూ ఎన్ఎస్టీఆర్ (నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ ఫారెస్టు), శేషాచలం అడవులను కలిపి టైగర్ కారిడార్ ఏర్పాటైంది. నల్లమల అడవిలోని పెద్దపులులు కడప మీదుగా వనిపెంట, ఒంటిమిట్ట తదితర ప్రాంతాల్లో ఉన్న శేషచలం అడవుల్లో కూడా సంచరిస్తున్నాయి. దీంతో నల్లమల పరిధి 8 వేల చదరపు కిలోమీటర్ల నుంచి 16 వేల చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. సుమారు 1000 మంది సిబ్బందిని, 85 బేస్ క్యాంపులను ఏర్పాటు చేశారు. పులుల సంరక్షణకు తీసుకునే చర్యల వలన పులుల సంఖ్య పెరగడం విశేషం. ఆకట్టుకుంటున్న జంగిల్ సఫారీ..దోర్నాల నుంచి శ్రీశైలం మధ్య అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జంగిల్ సఫారీ పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ జంగిల్ సఫారీని చూడొచ్చు. అటవీశాఖాధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంలో నల్లమల అటవీ ప్రాంతంలో సుమారు 25 కిలోమీటర్ల వరకూ ప్రయాణించవచ్చు. జింకలు, నెమళ్లు, పలురకాల పక్షిజాతులు కనిపిస్తాయి. ఇందులో పులికుంట వద్ద వ్యూ పాయింట్ వద్ద కాసేపు వాహనాన్ని ఆపుతారు. పెద్దపులులు, చిరుతలు ఇక్కడికి తరచుగా వచ్చి నీళ్లు తాగుతాయి. ఇక కొండ చిలువలు, పెద్ద పెద్ద చెట్లకు చుట్టుకుని కనిపిస్తాయి. జంగిల్ సఫారీ అద్భుతంనల్లమల అటవీ ప్రాంతంలో దోర్నాల నుంచి శ్రీశైలం మధ్యలో అటవీశాఖ వారు ఏర్పాటు చేసిన జంగిల్ సఫారీ చాలా అద్భుతం. విజ్ఞానంతోపాటు వినోదాన్ని కూడా అందిస్తుంది. ప్రతి ఒక్కరూ సెలవు రోజుల్లో పిల్లలను తీసుకుని జంగిల్ సఫారీకి వెళితే అన్నీ రకాల వన్యప్రాణులను మనం చూడవచ్చు. – జీఎల్ రమేష్ బాబు, టీచర్ మార్కాపురం -
గుడ్లు తేలేస్తున్న అమెరికా
కనీవినీ ఎరగని కొరత. ఆకాశాన్నంటిన ధరలు. అంతంత పెట్టయినా కొందామంటే వాటిపైనా ఆంక్షలు. మొత్తమ్మీద అగ్ర రాజ్యం అక్షరాలా ‘గుడ్లు’ తేలేస్తోంది. తీవ్ర గుడ్ల కొరతతో అమెరికా కొద్ది నెలలుగా సతమతమవుతోంది. రోజులు గడుస్తున్న కొద్దీ సమస్య మరింత తీవ్రతరమవుతోందే తప్ప తెరిపిన పడే సూచనలే కన్పించడం లేదు...! దాంతో అమెరికన్లలో అత్యధికులకు ఉదయం పూట అల్పాహారమైన గుడ్లు ఒక్కసారిగా విలాస వస్తువుగా మారిపోయిన దుస్థితి! ఎందుకీ సమస్య? అమెరికాలో కొద్ది నెలల క్రితం మొదలైన గుడ్ల కొరత నానాటికీ పెరిగిపోతోంది. బర్డ్‌ఫ్లూగా పిలిచే హెచ్5ఎన్1 తీవ్రతే ఇందుకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. తొలుత కెనడాలో తలెత్తిన ఈ మహమ్మారి 2022లో అమెరికాలో ప్రవేశించింది. చూస్తుండగానే 50 రాష్ట్రాలకు విస్తరించింది. దీని వ్యాప్తిని అడ్డుకునేందుకు ఈ మూడేళ్లలో ఏకంగా 16 కోట్ల గుడ్లు పెట్టే కోళ్లను చంపేయాల్సి వచ్చింది. 2024లోనే 3 కోట్ల కోళ్లను చంపేశారు. వీటిలో 1.7 కోట్ల కోళ్లను కేవలం గత నవంబర్, డిసెంబర్ మాసాల్లోనే అంతమొందించారు. అలా 2025 జనవరి నాటికి అమెరికాలో గుడ్లు పెట్టే కోళ్ల సంఖ్య 30 కోట్లకు పరిమితమైంది. ఐదేళ్ల క్రితంతో పోలిస్తే ఇది ఏకంగా 11 శాతం తగ్గుదల! అలా మొదలైన గుడ్ల కొరత కొద్ది నెలలుగా తీవ్ర రూపు దాలి్చంది. కొద్ది రోజులుగా డజను గుడ్లు్ల ఏకంగా 5 డాలర్లకు చేరినట్టు బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ వెల్లడించింది. అంటే 435 రూపాయలు. ఒక్క గుడ్డు రూ.36 అన్నమాట. ఇది అమెరికా చరిత్రలోనే ఆల్‌టైం గరిష్టం! అంతేకాదు, షికాగో, న్యూయార్క్, శాన్ఫ్రాన్సిస్కో వంటి పలు పెద్ద నగరాల్లోనైతే డజను గుడ్ల ధర ఏకంగా 8 నుంచి 10 డాలర్ల దాకా ఎగబాకింది!! దాంతో గుడ్ల కొనుగోలుపై పరిమితి విధిస్తూ రెండు నెలల క్రితం తీసుకున్న నిర్ణయాన్ని పలు సూపర్మార్కెట్లు ఇప్పటికీ కొనసాగిస్తున్నాయి. కొన్నిచోట్ల అయితే ఒక్కో కస్టమర్‌కు గరిష్టంగా 2 గుడ్లే అమ్ముతున్నాయి! డెన్సీస్, వాఫుల్ హౌస్ వంటి రెస్టారెంట్ చెయిన్లు ఒక్కో గుడ్డుపై 50 సెంట్ల సర్‌చార్జీ కూడా వడ్డిస్తున్నాయి!ధరలు మరింత పైపైకే? సమీప భవిష్యత్తులో కూడా గుడ్ల ధరలు తగ్గే పరిస్థితి కన్పించకపోవడం అమెరికన్లను మరింత కలవరపెడుతోంది. కోళ్ల కొరతను అధిగమించడానికే కనీసం మరికొద్ది నెలలు పట్టవచ్చని చెబుతున్నారు. అప్పటిదాకా పరిస్థితి ఇంతేనని సమాచారం. గత జనవరిలోనే గుడ్ల ధరలు ఏకంగా 15 శాతం ఎగబాకాయి. గతేడాదితో పోలిస్తే ఇప్పటికే సగానికి సగం పెరిగిపోయాయి. ఇది ఇక్కడితో ఆగదని, ఈ ఏడాది గుడ్ల ధరలు కనీసం 40 శాతానికి పైగా పెరగవచ్చని అమెరికా వ్యవసాయ శాఖ అంచనా వేసింది! ట్రంప్ సర్కారు కూడా పరోక్షంగా అదే చెప్పింది. ‘‘ఏడాదిన్నరలోగా డజను గుడ్ల ధర ఎప్పట్లా 2 డాలర్ల లోపుకు దిగొచ్చేలా చర్యలు తీసుకుంటాం’’ అని వ్యవసాయ మంత్రి బ్రూక్ రోలిన్స్ చెప్పుకొచ్చారు! దాంతో గుడ్ల కొరతను అధిగమించేందుకు తుర్కియే వైపు చూస్తోంది. గతంలో కెనడా, నెదర్లాండ్స్, బ్రిటన్, చైనా నుంచీ అమెరికా గుడ్లను దిగుమతి చేసుకున్నా కొన్నేళ్లుగా ఒక్క తుర్కియేకే పరిమితమైంది. ఆ దేశం నుంచి ఈ ఏడాది కనీసం 42 కోట్ల గుడ్లను దిగుమతి చేసుకోవాలని భావిస్తోంది. అయినా పెద్దగా ఒరిగేదేమీ ఉండబోదని పరిశీలకులు పెదవి విరుస్తున్నారు. ఫ్లూ సమస్య ఇలాగే కొనసాగితే దాని తాలూకు లోటును, ఉత్పత్తి నష్టాలను భర్తీ చేసుకోవడానికే ఈ దిగుమతులు చాలవని చెబుతున్నారు.ఇవీ లెక్కలు..→ అమెరికాలో ఏటా సగటున 9,000 కోట్లకు పైగా గుడ్లు ఉత్పత్తవుతాయి. → ఫ్లూ కారణంగా మూడేళ్లలో 14 కోట్ల కోళ్లను చంపేయాల్సి వచ్చింది. → 2021లో 1.6 డాలర్లున్న డజను గుడ్ల ధర ఇప్పుడు 5 డాలర్లను దాటేసింది. → 2024లో తుర్కియే నుంచి 7 కోట్ల గుడ్లు దిగుమతి చేసుకున్నారు. → ఈసారి ఏకంగా 42 కోట్ల గుడ్లు దిగుమతి చేసుకోనున్నారు. ఇది దేశ చరిత్రలోనే అత్యధికం! → అయినా డిమాండ్‌ను తట్టుకోవడానికి ఇది ఏమాత్రమూ చాలదంటున్నారు.ట్రంప్ బిలియన్ డాలర్ ప్లాన్ గుడ్ల కొరతను అధిగమించి వాటి ధరలను నేలకు దించేందుకు బిలియన్ డాలర్ల ప్రణాళికను అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదిస్తున్నారు. అందులో ఏమున్నాయంటే... → బర్డ్‌ఫ్లూ వ్యాప్తిని అడ్డుకునేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు. → బర్డ్‌ఫ్లూ చికిత్స, వ్యాక్సిన్ల అభివృద్ధి తదితరాలకు 10 కోట్ల డాలర్లు → పౌల్ట్రీఫారాల యజమానులకు ఆర్థిక సాయానికి 40 కోట్ల డాలర్లు → దిగమతుల ద్వారా ప్రస్తుత డిమాండ్‌ను తట్టుకుని కొరతను అధిగమించడంబైడెన్ సర్కారు ఏం చేసింది? ఫ్లూపై పోరుకు బైడెన్ ప్రభుత్వం మూడేళ్లలో 150 కోట్ల డాలర్లు వెచ్చించింది. ఫ్లూ బారిన పడ్డ కోళ్లను అంతమొందిస్తూ వచ్చింది. ఈ వైరస్ మనుషులకు పాకకుండా చూసేందుకు 60 కోట్ల డాలర్లు కేటాయించింది. వ్యాక్సిన్ల వృద్ధి తదితరాలపై దృష్టి పెట్టింది. ఎంత చేసినా గుడ్ల కొరత నానాటికీ పెరుగుతూనే వచ్చింది. బైడెన్ ప్రభుత్వ అర్థంలేని చర్యల వల్లే సమస్య విషమించిందని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఆయన చర్యలతో పరిస్థితి ఎంతో కొంత అదుపులోకి రాగలదని పౌల్ట్రీ పరిశ్రమ వర్గాలు ఆశాభావంతో ఉండటం విశేషం.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆలివ్ రిడ్లే..బతకాలిలే..
సాగర గర్భంలో తల్లులు, ఎక్కడో దూరంగా తీరంలో పిల్లలు.. ఆ తల్లీపిల్లలు కలుసుకోవడానికి సవాలక్ష ఆటంకాలు. ప్రకృతి వైపరీత్యాలు, జంతువుల దాడులు, ఆకతాయిల వికృత చేష్టలు అన్నీ తట్టుకుని నిలబడితేనే ఆ పిల్లలు కడలి గర్భంలోకి వెళ్లగలవు. లేదంటే అండంలో ఉన్నప్పుడే ఆయుష్షు తీరిపోతుంది. ఇలాంటి ఆపత్కాలంలో ఉన్న ఆలివ్ రిడ్లే తాబేలు పిల్లల ఆయుష్షుకు అటవీ శాఖ, ట్రీ ఫౌండేషన్ ప్రతినిధులు అండగా నిలబడుతున్నారు. తీరంలో గుడ్లను సంరక్షించి అవి పొదిగి పిల్లలు బయటకు వచ్చే వరకు జాగ్రత్తగా చూసి.. బుల్లి బుల్లి తాబేలు పిల్లలు ఆనందంగా సముద్రంలోకి వెళ్లడాన్ని మురిపెంగా చూస్తున్నారు. సోంపేట: సముద్రంలో లక్షలాది జీవులు నివాసం ఉంటాయి. అందులో సముద్రానికి మేలు చేసే జాతుల్లో ఆలివ్‌రిడ్లే తాబేళ్లు ఒక జాతి. ఆ రకం తాబేళ్లు గుడ్లు పెట్టుకునేందుకు మన తీరాలను అనువుగా ఎంచుకున్నాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత సముద్ర తీరానికి వచ్చి తీరంలో గొయ్యి తవ్వి గుడ్లు పెడతాయి.అనంతరం వాటిని కప్పేసి సముద్రంలోకి వెళ్లిపోతాయి. తీరంలో గుడ్లు పెట్టడానికి అనువైన స్థలం చూసుకుని గుడ్లు పెడుతుంటాయి. అలా వచ్చినప్పుడు బోట్లు తగిలి కొన్ని తాబేళ్లు చనిపోతుంటాయి. ప్రస్తుతం ఆలివ్‌రిడ్లే తాబేళ్లు అంతరించి పోయే ప్రమాదంలో ఉండడంతో అటవీశాఖ పలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో తాబేళ్ల సంరక్షణకు నడుం బిగించింది. 50 నుంచి 150 గుడ్లు సాధారణంగా ఈ జాతి తాబేళ్లు 50 నుంచి 150 వరకు గుడ్లు పెడుతుంటాయి. అర్ధరాత్రి 2 గంటల నుంచి ఉదయం 5 గంటల లోపు తీరానికి చేరుకుని ఇసుకలో గోతులు తవ్వి వాటిలో గుడ్లు పెట్టి, తిరిగి వాటిపై ఇసుక కప్పి తల్లి తాబేళ్లు సముద్రంలోకి వెళ్లిపోతాయి. ప్రత్యేక జీవులు ఆలివ్ రిడ్లే తాబేళ్లు చాలా ప్రత్యేకమైనవి. వీటికి స్థిర నివాసం ఉండదు. రెండు అడుగుల పొడవు, సుమారు 150 కిలోలు పైన బరువు ఉండే తాబేళ్లు ఆహార అన్వేషణ, గుడ్లు పెట్టడం, సంతానోత్పత్తి కోసం సుమారు 20 వేల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. డిసెంబర్ నుంచి మార్చి రెండో వారం వరకు ఎక్కువగా గుడ్లు పెడుతుంటాయి. గుడ్లకు సంరక్షణ.. తీరంలో తాబేళ్లు గుడ్లు పెట్టి వెళ్లిపోయాక శ్రీకాకుళం జిల్లాలో అటవీ శాఖ అధికారులు, ట్రీ ఫౌండేషన్ సౌజన్యంతో గుడ్లను సంరక్షణ కేంద్రాలకు తరలిస్తున్నారు. జిల్లాలో మొత్తం మూడు డివిజన్ల పరిధిలో 16 సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇచ్ఛాపురం నియోజక వర్గంలో 7 కేంద్రాలు ఏర్పాటు చేశారు. నియోజక వర్గంలోని సోంపేట మండలం బట్టిగళ్లూరు, బారువ పేట, ఇస్కలపాలేం, కవిటి మండలం కళింగపట్నం, బట్టివాని పాలేం, సీహెచ్ కపాçసుకుద్ది, ఇచ్ఛాపురం మండలం డొంకూరులో సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. గత సంవత్సరం జిల్లాలో 1,59,403 గుడ్లు సేకరించి 1,44,981 పిల్లలుగా తయారు చేసి సముద్రంలోకి విడిచిపెట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది గత ఏడాది కంటే ఎక్కువ పిల్లలను తయారు చేసి సముద్రంలోకి విడిచి పెట్టడానికి చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఇప్పటి వరకు శ్రీకాకుళం, టెక్కలి, కాశీబుగ్గ డివిజన్ల పరిధిలో 452 నెట్లు ఏర్పాటు చేసి 53,400 గుడ్లు సేకరించారు. సుమారు 40 రోజుల పాటు రక్షణ వలయంలో ఉంచి గుడ్లు పిల్లలుగా మారిన తర్వాత వాటిని సురక్షితంగా సముద్రంలోకి విడిచిపెడతారు. మత్స్యకారులు సహకరించాలి తాబేలు గుడ్లను సంరక్షించడానికి అటవీ శాఖా ధికారులు, ట్రీ ఫౌండేషన్ ప్రతినిధులకు మత్స్యకారులు సహకరించాలి. అంతరించే స్థితి లో ఉన్న ఆలివ్‌రిడ్లే తాబేళ్లను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. గుడ్లను సంరక్షించే బాధ్యత అటవీ శాఖ తీసుకుంటుంది. గత ఏడాది సుమారు లక్షా యాభై వేల పిల్లలను సముద్రంలోకి విడిచిపెట్టాం. ఈ ఏడాది అంతకన్నా ఎక్కువ పిల్లలను సముద్రంలోకి విడిచిపెట్టడానికి చర్యలు తీసుకుంటున్నారు. – నాగరాజు, జిల్లా అటవీ శాఖాధికారి గుడ్లను సంరక్షించడం ఆనందం గత కొన్నేళ్లుగా అటవీ శాఖాధికారుల సౌజన్యంతో ట్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆలివ్ రిడ్లే తాబేళ్ల గుడ్లు సేకరించి, వాటిని పిల్లలుగా తయారు చేసి సముద్రంలోకి విడిచి పెట్టడం ఆనందంగా ఉంది. జిల్లాలో మత్స్యకారులు సహాయ సహకారాలు అందించడంతో ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది. – కె.సోమేశ్వరరావు, ట్రీ ఫౌండేషన్ జిల్లా కోఆర్డినేటర్ -
ఏనుగు మళ్లీ జూలు విదిలిస్తుందా?
వూలీ మమోత్.. భారీ ఆకారంతో, సింహం జూలును తలపించేలా తొండం నుంచి తోకదాకా దట్టమైన రోమాలతో భీకరంగా ఉండే ఏనుగు అది. అలాంటి ఏనుగును పునః సృష్టించేందుకు.. ఒక ‘ఎలుకంత’ ముందడుగు పడింది.తల నుంచి తోకదాకా నిండా దట్టమైన రోమాలతో కూడిన ఎలుక జీవం పోసుకుంది. అమెరికాకు చెందిన బయోటెక్నాలజీ సంస్థ ‘కొలోస్సల్ బయోసైన్సెస్’ శాస్త్రవేత్తలు చేసిన ఈ చిత్రమైన పరిశోధన ఏమిటో తెలుసుకుందామా... –సాక్షి, సెంట్రల్డెస్క్ధ్రువ ప్రాంత మంచులో దొరికిన ఆనవాళ్లతో..భూమ్మీద తిరుగాడి, కాలక్రమేణా అంతరించిపోయిన అరుదైన జీవులను పునః సృష్టి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ‘కొలోస్సల్ బయోసైన్సెస్’ శాస్త్రవేత్తలు వూలీ మమోత్ ఏనుగులకు తిరిగి ప్రాణం పోసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఉత్తర ధ్రువ ప్రాంతపు మంచులో దొరికిన వూలీ మమోత్ అవశేషాల్లోని జన్యువులను, ప్రస్తుతమున్న సాధారణ ఆసియన్ ఏనుగుల జన్యువులను పోల్చి చూశారు. మమోత్‌లలో దట్టమైన వెంట్రుకలకు కారణమైన జన్యువులను గుర్తించారు. దీనికి సంబంధించి తొలుత ఎలుకలపై ప్రయోగాలు చేపట్టారు. ‘‘అంతరించిపోయిన ఒకనాటి జీవులను పునః సృష్టించగలం అనేందుకు ఈ ఎలుకలు సజీవ సాక్ష్యం. భవిష్యత్తులో ఈ టెక్నాలజీతో వూలీ మమోత్‌లను పుట్టించి, ప్రకృతిలోకి వదిలిపెట్టగలం..’’అని కొలోస్సల్ సంస్థ చీఫ్ సైన్స్ ఆఫీసర్ బెత్ షాపిరో పేర్కొన్నారు.1 ధ్రువ ప్రాంతపు మంచులో దొరికిన వూలీ మమోత్ అవశేషాల నుంచి జన్యువులను సేకరించారు.2 ఇప్పుడున్న ఆసియా ఏనుగుల జన్యువులతో, వూలీ మమోత్ జన్యువులను పోల్చి తేడాలను గుర్తించారు.3 ఎలుక పిండ కణాలను తీసుకుని.. వాటిలో పైచర్మం, వెంట్రుకలు, వాటి పొడవు, మందం తదితర లక్షణాలను నియంత్రించే ఎనిమిది జన్యువుల్లో.. మమోత్‌ల జన్యువుల తరహాలో మార్పులు చేశారు.4 ఈ జన్యుమార్పిడి చేసిన పిండ కణాలను కొన్ని సాధారణ ఎలుకల గర్భంలో ప్రవేశపెట్టారు.5 నిండా దట్టమైన రోమాలతో, అతి శీతల వాతావరణాన్ని కూడా తట్టుకోగలిగిన ‘ఊలు ఎలుకలు’ జన్మించాయి. -
ఈ ‘సర్వీసెస్’ మీ కోసమే...
సాక్షి, హైదరాబాద్: నిరుపేద కుటుంబానికి చెందిన చిన్నారిపై అత్యాచారం జరిగింది.. పోలీసులు కేసు నమోదు చేశారు.. న్యాయస్థానంలో విచారణ సాగుతోంది.. తీర్పు వచ్చే వరకు ఆమె భవిష్యత్ ఏంటి? కోర్టుటంటే ఏంటో తెలియని ఆ పేదలు ఎలా అక్కడికి వెళ్లగలరు? మానసికంగా కుంగిపోయిన ఆ చిన్నారికి ఎవరు ధైర్యం చెబుతారు? కౌన్సెలింగ్ ఎవరు ఇప్పిస్తారు?.. ఇలాంటి ప్రశ్నలకు జవాబే తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ (టీఎస్ఎల్ఎస్ఏ). ఒకటి కాదు.. రెండు కాదు.. జువెనైల్ జస్టిస్, డ్రగ్స్, మానవ అక్రమ రవాణా, కార్మిక చట్టాలు, సైబర్ నేరాలు, ప్రజల ప్రాథమిక హక్కులు, ప్రభుత్వ పథకాలు.. ఇలా అనేక సేవలను న్యాయ సేవాధికార సంస్థ అందిస్తోంది. అయితే, ఈ సేవలు మారుమూల పల్లెలకు సరిగా చేరడం లేదన్న భావనతో సంస్థ కొత్త ఆలోచన చేసింది ఆయా అంశాలతో లీగల్ సర్వీసెస్ అథారిటీ, రాష్ట్ర ఫిల్మ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో డి.సాయిప్రసాద్ దర్శకత్వంలో ఈ 10 లఘు చిత్రాలు రూపొందించింది. వీటిని రాష్ట్రంలోని అన్ని సినిమా థియేటర్లలో ప్రదర్శిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. న్యాయ సేవాధికార సంస్థ అందించే సేవలు, న్యాయ సాయం సమాజంలోని అట్టడుగు వర్గాలకు చేరాలన్నదే లక్ష్యం. వీరందించే ఆర్థిక సాయం కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం లేదు. లఘు చిత్రాల ద్వారా ప్రజల్లో సంస్థ అందించే సేవలు, న్యాయ సాయం గురించి అవగాహన పెరుగుతోంది. నిజ జీవితంలో జరిగిన అంశాల ఆధారంగా రూపొందించిన ఈ లఘు చిత్రాలను చూస్తే.. తమ సమస్య ఏంటి? ఎవరిని, ఎలా ఆశ్రయించాలి? ఎలా సాయం పొందాలి? అనేది తెలిసిపోతుంది. ఆ చిత్రాలేంటి.. సాయం ఎలా చేస్తారో తెలుసుకుందాం...తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఫోన్: 040 – 23446723E-mail : telenganaslsa@gmail.comవిడుదల... కొత్తగా ఓ భార్యభర్తలు ఓ ఇంటిలో దిగారు. ఎప్పుడూ భార్య బయటికి వచ్చేది కాదు. భర్త ఆఫీస్‌కు వెళ్లేటప్పుడు రోజూ ఇంటికి తాళం వేసుకుని వెళ్లేవాడు. చుట్టుపక్కల వారికి ఎలాంటి అనుమానం రాకుండా ప్రవర్తించేవాడు. కానీ, ఇంటి పక్కనే ఉండే ఓ మహిళకు అతని ప్రవర్తనపై అనుమానం వచ్చింది. దీంతో న్యాయ సేవాధికార సంస్థ పారా లీగల్ వలంటీర్‌ను సమాచారం ఇచ్చింది. వారు పోలీసుల సహకారంతో తాళం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. భార్యను చైన్‌తో కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి ఉండటాన్ని చూసి వారు షాకయ్యారు. వెంటనే వారు ఆ భార్యకు విముక్తి ప్రసాదించి సఖి కేంద్రంలో చేర్పించారు. వైద్య చికిత్స అందించడంతోపాటు జీవనోభృతి కల్పించారు. ఆ భర్తను అరెస్టు చేసి, శిక్ష పడేలా చర్యలు తీసుకున్నారు. ఆమె ఆనందంగా జీవించేలా ఏర్పాట్లు చేశారు. అంకురం.. పారా లీగల్ వలంటీర్ ఓ హోటల్లో చిన్నారి పని చేయడం చూసి యజమానిని హెచ్చరించాడు. పనిలో తీసేసిన ఆ చిన్నారిని వ్యభిచార గృహానికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. విషయం తెలుసుకున్న వలంటీర్ పోలీసుల సహకారంతో ముఠా గుట్టు రట్టు చేశారు. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని కటకటాల్లోకి పంపించారు. ఆ చిన్నారితోపాటు చాలామంది చిన్నారులకు జీవితాన్నిచ్చారు. వారంతా చదువుకునేలా న్యాయసేవాధికార సంస్థ ఏర్పాటు చేసింది. సీత కథ.. గిరిజన గ్రామం. చదువుకోవాలని ఎంతో ఆశపడిన బాలికకు 16 ఏళ్లకే తల్లిదండ్రులు వివాహం చేశారు. కాపురం అంటే ఏంటో తెలియని వయసులో అత్త మామలు, భర్త పెట్టే వేధింపులు భరించలేక ఇంట్లోంచి పారిపోయి నగరానికి వచ్చింది. పని ఇప్పిస్తానని చెప్పి ఓ వ్యక్తి ఆమె వద్ద ఉన్న నగలు, డబ్బులు తీసుకుని ఉడాయించాడు.అయితే కట్టుబాట్లు అంటూ తిరిగి ఆ బాలికను గ్రామంలోకి అనుమతించలేదు. విషయం న్యాయసేవాధికార సంస్థకు తెలిసింది. తొలుత సఖి కేంద్రానికి తరలించి.. చదువుకునేందుకు చర్యలు చేపట్టింది. తర్వాత ఊరి పెద్దలతో మాట్లాడి బాలికను అనుమతించేలా చేశారు. బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కల్పించారు. ప్రేరణ... పాఠశాలకు వెళ్లి అందరిలా చదువుకోవాలని ఉన్నా.. ఇళ్లలో పనిచేసేది ఓ బాలిక. పనికి వెళితేనే పైసలు వస్తయని, చదువుకుంటే డబ్బులేం రావని తల్లి చెబుతుండేది. పని చేసే చోట ఓ వృద్ధుడు చదివిస్తానని మాయమాటలు చెబుతూ గర్భవతిని చేశా డు. ఎవరికైనా విషయం చెబితే పుస్తకాలు కొనివ్వనని బెదిరించాడు. ఎలా అయినా చదువుకోవాలని తపన పడిన చిన్నారి అతని బాధలన్నీ భరించింది. బాలిక గర్భిణి అని తెలుసుకున్న తల్లిదండ్రులు అల్లాడిపోయారు. న్యాయసేవాధికార సంస్థను సంప్రదించారు. అబార్షన్ చేసే అవకాశం కూడా లేకపోవడంతో బాలిక, పసికందు సంరక్షణ చర్యలు తీసుకున్నారు. పోక్సో చట్టం కింద జైలుకు పంపి నా... నిందితుడు కేసు విచారణలో ఉండగానే మృతి చెందాడు. ఆ బాలిక భవిష్యత్ అంధకారం కాకుండా న్యాయ సేవాధికార సంస్థ ఆర్థిక సాయం చేసింది. వల... ఓ యువతి.. తల్లి ప్రోత్సాహంతో రీల్స్, షార్ట్స్ అంటూ వీడియోలు పోస్టు చేసేది. ఆమె ఉత్సాహం, వ్యూస్ చూసిన సైబర్ నేరగాళ్లు ఆమె ఐడీని హ్యాండిల్ చేస్తామని చెప్పారు. మురిసిపోయిన ఆమె తన వ్యక్తిగత వివరాలన్నీ తెలియజేసింది. వాళ్లు ఏమీ చెబితే అది చేయడం ప్రారంభించింది. ఎంత డబ్బు అడిగినా ఇస్తారని తెలుసుకున్న సైబర్ నేరగాళ్లు.. ఓ రోజు ఫేస్ మార్ఫింగ్ చేసి న్యూడ్ వీడియో, ఫొటోలను ఆమెకు పంపించారు. అడిగినంత డబ్బు ఇవ్వకుంటే సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బెదిరించారు. తండ్రికి విషయం చెప్పడంతో న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించారు. తొలుత 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేశారు. న్యాయ సాయం అందించి, ఫేక్ ఏజెన్సీ వాళ్లను పట్టకునేలా సంస్థ చర్యలు చేపట్టింది. ముందడుగు... కాలేజీకి వెళ్లే ఓ విద్యార్థి మాదక ద్రవ్యాలకు బానిసయ్యాడు. డ్రగ్స్ తీసుకుంటే బాగా చదువుకోవచ్చని స్నేహితులు చెప్పిన మాటలు నమ్మి ఊబిలో కూరుకుపోయాడు. చదువు సంగతి అటుంచితే.. ఆరోగ్యం పూర్తి దెబ్బతినే వరకు తెచ్చుకున్నాడు. ఓ రోజు పోలీసుల వలకు ముఠా చిక్కింది. పెడ్లర్లకు కోర్టు కఠిన శిక్ష విధించింది. న్యాయ సేవాధికార సంస్థ విద్యార్థులను డీఅడిక్షన్ సెంటర్‌కు పంపింది. ఇప్పుడు వారు డ్రగ్స్‌కు దూరంగా సాధారణ జీవనం సాగిస్తున్నారు. సంకల్పం... తోపుడు బండ్లపై, గంపల్లో వ్యాపారం చేసుకునే వారి వద్ద బేరమాడి తక్కువ రేటుకు కొంటాం. రోజువారీ వడ్దీకి తెచ్చి ఎండనక, వాననక.. కష్టపడి వందో.. రెండు వందలో ఇంటికి తీసుళ్తే తప్ప పూట గడవదు. ఇలా ఓ మహిళ డబ్బు తీసుకుని ఓ రోజు డబ్బు చెల్లించకపోవడంతో వడ్డీ వ్యాపారి ఆ వ్యాపారాన్ని నాశనం చేశాడు. న్యాయసేవాధికార సంస్థను సంప్రదించడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి తెలియజేశారు. మెప్మా ద్వారా రుణం ఇప్పించారు. స్టాల్ పెట్టించి సొంత వ్యాపారం పెట్టుకునే భరోసా కల్పించారు. ఇలా పథకాలతో నెలనెలా వేలల్లో సంపాదిస్తున్న వారెందరో ఉన్నారు.. సంరక్షణ...ఏకాంతంగా ఆడుకుంటున్న ఓ మగ, ఆడబిడ్డపై ఓ దుర్మార్గుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. కాస్త ఊహ తెలిసిన బాధిత చిన్నారి ఇచ్చిన సమాచారం మేరకు అతన్ని అరెస్టు చేశారు. పోక్సో చట్టం కింద కటకటాల్లోకి పంపారు. చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించిన న్యాయ సేవాధికార సంస్థ కౌన్సెలింగ్ కూడా ఇప్పించింది. ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులో నేరుగా జడ్జి ఆ చిన్నారులతో మాట్లాడారు. ఏం జరిగిందో ఆ చిన్నారులు భయపడుతూనే వివరించారు. దుర్మార్గుడిని కూడా గుర్తించడంతో రెండు కేసుల్లో కఠిన శిక్షలు పడ్డాయి. న్యాయ సేవాధికార సంస్థ నుంచి బాధితులకు పరిహారం అందించారు. అందరిలా వారు జీవించేందుకు ఏర్పాట్లు చేశారు. అంకురం.. పారా లీగల్ వలంటీర్ ఓ హోటల్లో చిన్నారి పని చేయడం చూసి యజమానిని హెచ్చరించాడు. పనిలో తీసేసిన ఆ చిన్నారిని వ్యభిచార గృహానికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. విషయం తెలుసుకున్న వలంటీర్ పోలీసుల సహకారంతో ముఠా గుట్టు రట్టు చేశారు. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని కటకటాల్లోకి పంపించారు. ఆ చిన్నారితోపాటు చాలామంది చిన్నారులకు జీవితాన్నిచ్చారు. వారంతా చదువుకునేలా న్యాయసేవాధికార సంస్థ ఏర్పాటు చేసింది. గెలుపు.. మొబైల్‌కు వచ్చిన లింక్‌ను చదివిన మహిళ పార్ట్ టైమ్ జాబ్‌కు ఓకే కొట్టింది. వెయ్యి, రెండు వేల వరకు బాగానే వేసిన సైబర్ నేరగాళ్లు ఆదాయపు పన్ను అంటూ తొలుత లక్ష, తర్వాత మరో లక్ష చెల్లించాలన్నారు. వారి ఊబిలో ఇరుక్కుపోయిన మహిళ అడిగినప్పుడల్లా డబ్బు ట్రాన్స్ఫర్ చేసింది. ఆ నగదు తన అకౌంట్లోనే చూపిస్తుండటంతో అనుమానం రాలేదు. ఇలా వివాహం కోసం దాచిన రూ.50 లక్షలు బదిలీ చేసింది. ఆ తర్వాత కానీ మోసపోయానని ఆమె తెలుసుకోలేదు. ఆత్మహత్యకు యత్నించిన ఆ మహిళను తండ్రి కాపాడి సైబర్ పోలీసులను ఆశ్రయించారు. సరైన సమయంలో పోలీసులను సంప్రదించడంతో వారు ఆ డబ్బును రికవరీ చేయగలిగారు. గతంలో 2 శాతమే ఉన్న ఈ రికవరీ రేటు ప్రస్తుతం 20 శాతానికి పెరిగింది. వెంటనే సంప్రదిస్తే ఫలితం వచ్చే అవకాశమెక్కువ. జోజో పాపాయి... పురిటిలోనే తల్లిని కోల్పోయిన చిన్నారికి పాల కోసం రోజు కిలోమీటర్ల దూరం వెళ్లేవారు తాత. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా గేదెను కొనుక్కొనేందుకు ఆర్థికంగా సహకరించలేదు. న్యాయ సేవాధికార సంస్థకు విషయం తెలియడంతో ఆ తాతను అధికారుల వద్దకు తీసుకెళ్లారు. గిరిజన సంక్షేమ శాఖ సహాయ గిరిజన అభివృద్ధి అధికారి సహకారంతో ఆవును అందించారు. పసికందు ఆకలి తీర్చడానికి చర్యలు చేపట్టారు. టీకాలు, ఇతర పోషకాహారం కూడా ఇంటికే అందించే ఏర్పాటు చేశారు. తస్మాత్ జాగ్రత్త.. ఉదయం లేచింది మొదలు ఫోన్‌తోనే గడిపేవారు ఎందరో. కొందరు ఆర్థిక అవసరాల కోసం లోన్ యాప్‌లను సంప్రదిస్తున్నారు. ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం లేదని చెబుతూ బురిడీ కొట్టిస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు వడ్డీ వసూలు చేస్తున్నారు. లోన్ యాప్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడే ‘ఓకే’ కొట్టడంతో మన ఫోన్లో ఉన్న డేటా అంతా వారికి చేరుతుంది. మన ఫొటోలు, వీడియోలు కూడా.. తీసుకున్న లోన్ మొత్తం కట్టినా వేధింపులు ఆగలేదు. ఓ వ్యక్తి అక్క వివాహం కోసం లోన్ తీసుకున్నాడు. సైబర్ నేరగాళ్లు అక్క ఫోటోలను మార్ఫింగ్ చేసి పంపారు. దీంతో అతడు న్యాయసేవాధికార సంస్థను సంప్రదించగా.. సైబర్ పోలీసులు అతని ఫోన్‌ను వాచ్ చేసి నేరగాళ్లను అరెస్టు చేశారు. బంధ విముక్తులను చేసి...ఇదే నాగర్‌కర్నూల్‌లో రూ.15 వేల అప్పు కట్టలేదని గిరిజన భార్యాభర్తలను నిర్భందించి, పనిలో పెట్టుకున్నాడు ఓ వ్యక్తి. విషయం తెలుసుకున్న జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కార్మికులకు అందిస్తున్న పథకం కింద ఇద్దరికీ రూ.30 వేల చొప్పున 2024, డిసెంబర్లో అందించింది. వారిని బంధవిముక్తులను చేసింది.నాంది... ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే ఇంటికే భోజనం, సరుకులు తెచ్చే యాప్‌లు ఎన్నో ఉన్నాయి. మరి వాటిలో పని చేస్తున్న కార్మికుల పరిస్థితి ఏంటి? వారిని పనిలోంచి తీసేయడం, శ్రమ దోపిడీ జరిగితే ఎక్కడికి వెళ్లాలి.. ఎవరిని సంప్రదించాలి? కార్మిక చట్టం ప్రకారం యాప్ ఆధారిత కార్మికుల పరిస్థితిని సమర్థవంతంగా మెరుగుపర్చడానికి చట్టపరమైన చర్యల ప్రత్యేక బ్లూప్రింట్ అవసరమని న్యాయ సేవాధికార సంస్థ ప్రతిపాదించింది. అసంఘటితరంగ కార్మికుల హక్కుల రక్షణకు అండగా నిలుస్తోంది. మానసిక వేదనకు పరిష్కారం బాధితులకు న్యాయం చేయడం కోసం చివరి వరకు ప్రయత్నించాలన్నది సుప్రీంకోర్టు పిలుపు. లీగల్ సర్వీసెస్ అథారిటీ (Telangana State Legal Services Authority) సేవలు దేశవ్యాప్తం కావాలని ఆకాంక్ష. అట్టడుగు వర్గాలకు న్యాయ సేవలు అందాలి. కులం, మతం లేదా ఆర్థిక స్తోమత లేని కారణంగా న్యాయం పొందలేకపోవడం సరికాదు. రూపాయి ఖర్చు లేకుండా లీగల్ సర్వీసెస్ అథారిటీ సేవలు అందిస్తుంది. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయితోపాటు గ్రామాల్లో వలంటీర్లు అందుబాటులో ఉంటారు.న్యాయసాయమే కాదు.. పథకాల వర్తింపుపైనా సమాచారం ఇస్తారు. అంతేకాదు.. ఏదైనా ఆస్తిని కొనుగోలు చేయాలన్నా న్యాయ సాయం చేస్తారు. ఎలాంటి నేరం జరిగినా బాధితులను ఆర్థికంగా, మానసికంగా అండగా ఉంటారు. ఎలాంటి నేరం జరిగితే.. ఎలా సాయం పొందవచ్చు అని ప్రజలు తెలుసుకునేందుకే రియల్ స్టోరీల ఆధారంగా లఘు చిత్రాలను రూపొందించాం. గతంలో రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీ సభ్య కార్యదర్శిగా పనిచేసిన (ప్రస్తుత ఎఫ్ఏసీ రిజిస్ట్రార్ జనరల్) ఎస్.గోవర్ధన్‌రెడ్డి ఈ చిత్రాల రూపకల్పనలో కీలక పాత్ర వహించారు. మార్ఫింగ్ వీడియోలు, అత్యాచారాల్లాంటి ఘటనల్లో ఆర్థిక సాయం అందించొచ్చు.. నేరగాళ్లకు శిక్ష పడొచ్చు.. కానీ, బాధితుల మానసిక వేదనను అర్థం చేసుకునేవారు ఉండరు. అలాంటి సమస్యలను పరిష్కరించడంలో అథారిటీ కీలక పాత్ర పోషిస్తోంది. చిన్నారులపై జరిగే అఘాయిత్యాలకు ప్రభుత్వం మరింత ముందుకొచ్చి చర్యలు చేపట్టాలి. – డి.సాయిప్రసాద్, లఘు చిత్రాల దర్శకుడు బాధితుల సంక్షేమానికి చర్యలు న్యాయసేవాధికార సంస్థ అంటే.. న్యాయ సేవలు ఒకటే కాదు. సంక్షేమ ఫలాలు బాధితులకు అందేలా చర్యలు తీసుకున్నాం. నేరం జరిగినప్పుడు బాధితుల వేదనను గుర్తించి నష్ట పరిహారం అందిస్తున్నాం. ప్రభుత్వం ద్వారా వారికి లబ్ధి చేకూరుస్తున్నాం. కేసు విచారణకు న్యాయ సాయంతోపాటు తీర్పు వచ్చే వరకు అండగా నిలుస్తున్నాం. రాష్ట్రస్థాయిలో టీఎస్ఎల్ఎస్ఏను, జిల్లాల్లో డీఎల్ఎస్ఏను, మండలాల్లో మండల లీగల్ సర్వీసెస్ కమిటీని సంప్రదించి సాయం పొందవచ్చు. బాధితులు ఈ కేంద్రాలకు వెళ్లి న్యాయపరమైన సలహాలు కోరవచ్చు. ప్రతీచోట పారా లీగల్ వలంటీర్లు, న్యాయవాదులుంటారు. రాలేని పరిస్థితి ఉంటే నేరుగా మేమే వారి దగ్గరికి వెళ్లి సాయం అందిస్తున్నాం. బాధితులే కాదు.. వారు సాయం అర్థించే పరిస్థితిలో లేకుంటే, వారి తరఫున ఎవరు సమాచారం ఇచ్చినా చేయూత అందించేందుకు కృషి చేస్తాం. మీకు వచ్చిన భాషలో దరఖాస్తుతో వలంటీర్లను లేదా అధికారులను ఆశ్రయించవచ్చు. న్యాయ సాయం తప్ప ఇతర సేవలను వినియోగించుకునే వారు చాలా తక్కువ. ఎక్కడ, ఎలా వాటిని పొందాలో చాలామందికి తెలియదు. సంస్థ సేవలు అట్టడుగు ప్రజానీకానికి, మారుమూల గ్రామాలకు చేరాల్సిన అవసరం ఉంది. అవసరం ఉన్న వారిలో ఎక్కువ మంది ఆ సేవలు పొందగలిగినప్పుడే నిజమైన సార్థకత చేకూరుతుంది. – సీహెచ్. పంచాక్షరి, సభ్య కార్యదర్శి, టీఎస్ఎల్ఎస్ఏ -
ట్రంప్ ఎత్తుకు అరబ్ దేశాల పైఎత్తు
కైరో: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వా«దీనం ప్రతిపాదనకు అరబ్ దేశాలు చెక్ పెట్టాయి. ‘మిడిల్ ఈస్ట్ రివేరా’విజన్‌కు భిన్నంగా గాజా పునర్నిర్మాణ ప్రణాళికను విడుదల చేశాయి. 53 బిలియన్ డాలర్ల వ్యయంతో రూపొందించిన ఈ ప్రతిపాదనను అరబ్నాయకులు ఆమోదించా రు. యుద్ధానంతర ప్రణాళికను ఈజిప్టు ప్రతిపాదించింది, దీని ప్రకారం పాలస్తీనా అథారిటీ (పీఏ) పరిపాలన కింద గాజా పునర్నిర్మాణం జరుగుతుంది. గాజాను అమెరికా అ«దీన ప్రాంతంగా మార్చేందుకు ట్రంప్ చేసిన ప్రణాళికకు ఇది కౌంటర్. ట్రంప్ గాజా స్వా«దీన ప్రతిపాదనకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరోసారి మద్దతు తెలిపిన మరుసటి రోజే కైరోలో అరబ్ లీగ్ సదస్సు జరిగింది. ముగింపు సమావేశంలో ఈ గాజా పునర్నిర్మా ణం కోసం ‘సమగ్ర అరబ్ ప్రణాళిక’ను ఆయా దేశా ల నేతలు ప్రకటించారు. అంతేకాదు ఈ ప్రణాళికకు అంతర్జాతీయ మద్దతుకు పిలుపునిచ్చారు. భూభాగ పునర్నిర్మాణానికి నిధులు సమకూర్చడానికి ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రాజెక్టు కోసం అన్ని దేశాలు, ఆర్థిక సంస్థల నుంచి సహకారాన్ని స్వీకరిస్తామని పేర్కొన్నారు. 112 పేజీల డాక్యుమెంట్ పాలస్తీనియన్ల తరలింపు, గాజాను అమెరికా పునర్నిర్మించాలన్న ట్రంప్ ఆకాంక్షకు ప్రత్యామ్నాయంగా ఈజిప్టు, జోర్డాన్, గల్ఫ్ అరబ్ దేశాలు దాదాపు నెల రోజులుగా సంప్రదింపులు జరుపుతున్నాయి. గాజా నుంచి పాలస్తీనియన్లను సామూహికంగా తరలించడాన్ని అరబ్ దేశాలు తిరస్కరించాయి. తామే ఆ బాధ్యతలు తీసుకున్నాయి. ‘గాజా పునర్నిర్మాణ ప్రణాళిక’పేరుతో 112 పేజీల డాక్యుమెంట్‌ను రూపొందించాయి. గాజాను తిరిగి ఎలా అభివృద్ధి చేయనున్నారనే మ్యాప్‌లు, ఇల్లు, ఉద్యానవనాలు, కమ్యూనిటీ సెంటర్లకు సంబంధించిన ఏఐ జనరేటెడ్ చిత్రాలతో తయారు చేశారు. అలాగే వాణిజ్య నౌకాశ్రయం, టెక్నాలజీ హబ్, బీచ్ హోటళ్లు, విమానాశ్రయం కూడా ఉన్నాయి. స్వాగతించిన హమాస్..శిఖరాగ్ర సమావేశం ప్రణాళికను, సహాయక చర్యలు, పునర్నిర్మాణం, పాలనను పర్యవేక్షించడానికి తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు హమాస్ తెలిపింది. అంతేకాదు.. కమిటీలో తమ అభ్యర్థులను ఉంచబోమని ప్రకటించింది. అయితే పీఏ పర్యవేక్షణలో పనిచేసే కమిటీ విధులు, సభ్యులు, ఎజెండాకు తన సమ్మతిని తెలియజేయాల్సి ఉంటుంది. కమిటీలో ఉండబోయే వ్యక్తుల పేర్లను నిర్ణయించినట్లు ఈజిప్టు విదేశాంగ మంత్రి బదర్ అబ్దెలాటీ మంగళవారం రాత్రి తెలిపారు. పీఏకు నాయకత్వం వహిస్తున్న పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ మాట్లాడుతూ ఈజిప్టు ఆలోచనను తాను స్వాగతిస్తున్నానని, పాలస్తీనా నివాసితులను తరలించని ఇలాంటి ప్రణాళికకు మద్దతు ఇవ్వాలని ఆయన ట్రంప్‌ను కోరారు. పరిస్థితులు అనుకూలిస్తే అధ్యక్ష, పార్లమెంటరీ ఎన్నికలను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఎన్నికల ప్రణాళికను సైతం హమాస్ స్వాగతించింది. తిరస్కరించిన అమెరికా.. అరబ్ నాయకులు ఆమోదించిన గాజా పునర్నిర్మాణ ప్రణాళికను ట్రంప్ ప్రభుత్వం తిరస్కరించింది, ఈ భూభాగంలోని పాలస్తీనా నివాసితులను పునరావాసం కల్పిచి, అమెరికా యాజమాన్యంలోని ‘రివేరా’గా మార్చే తన పాత విజన్‌కే అమెరికా అధ్యక్షుడు కట్టుబడి ఉన్నారని తెలిపింది. గాజా ప్రస్తుతం నివాసయోగ్యంగా లేదని, శిథిలాలు, పేలని ఆయుధాలతో కప్పబడిన భూభాగంలో నివాసితులు జీవించలేరని జాతీయ భద్రతా మండలి ప్రతినిధి బ్రియాన్ హ్యూస్ మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రాంతంలో శాంతి, శ్రేయస్సును తీసుకురావడానికి మరిన్ని చర్చల కోసం తాము ఎదురు చూస్తున్నామన్నారు. తోసిపుచ్చిన ఇజ్రాయెల్.. ఈజిప్టు ప్రణాళికను ఇజ్రాయెల్ తోసిపుచ్చింది. కాలం చెల్లిన దృక్పథాలతో ఉందని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రక టనలో విమర్శించింది. పీఏఐ ఆధారపడటా న్ని తిరస్కరించింది. ప్రణాళిక హమాస్‌కు అధికారాలిచ్చేదిగా ఉందని ఆరోపించింది. హమా స్ సైనిక, పాలనా సామర్థ్యాలను నాశనం చే యడమే తమ లక్ష్యమని, ముందు హమాస్ సై నిక ఉపసంహరణకు అంగీకరించేలా చేయాల ని డిమాండ్ చేసింది. అది తప్ప మరేదీ తమకు ఆమోదయోగ్యం కాదని వెల్లడించింది. -
సోలో ట్రిప్‌కే అతివల ఆసక్తి
సాక్షి, అమరావతి: పర్యాటకుల అభిరుచి కొత్త పుంతలు తొక్కుతోంది. వర్తమాన జీవితంలో సంతోషానికే ప్రాధాన్యత పెరుగుతోంది. ఈ క్రమంలోనే 2025 సంవత్సరం మహిళల సోలో ప్రయాణాలకు కేరాఫ్‌గా మారనుంది. దీనికితోడు వెల్నెస్ రిట్రీట్లు, పాప్ సంస్కృతి ప్రేరేపిత టూర్లపై ఆసక్తి కనిపిస్తోంది. వీసా ప్రాసెసింగ్ ప్లాట్‌ఫామ్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. ఈ ఏడాది అత్యంత ముఖ్యమైన ట్రెండ్లలో ‘సోలోగా మహిళా ప్రయాణం’ ఒకటిగా నిలుస్తోంది. 2024లో సోలో వీసాలకు దరఖాస్తు చేసిన మహిళలు 30 శాతం ఉంటే.. ఈ ఏడాది 37 శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తోంది. సుమారు 25–40 ఏళ్ల మధ్య మహిళలు సోలో ట్రిప్‌లను ఉద్యమంగా చేపట్టబోతున్నట్టు నివేదిక స్పష్టం చేసింది. బాలి, థాయ్‌లాండ్, జపాన్ వంటి గమ్యస్థానాలలో సాహస యాత్రల ద్వారా తమ అన్వేషణను చేపట్టాలని భావిస్తున్నట్టు తేలింది.పర్యాటక శక్తి కేంద్రంగా ఆసియాప్రపంచ ప్రయాణ రంగంలో ఆసియా ఆధిపత్యం కొనసాగుతోంది. థాయ్‌లాండ్, జపాన్, వియత్నాంతో పాటు ఇండోనేషియా 2025లో అత్యంత పర్యాటక రద్దీని ఎదుర్కోనుంది. వీసా రహిత విధానాలు, వివిధ ఎక్స్‌పోలు లక్షలాది మంది సందర్శకులను ఆకర్షించనుంది. సింగపూర్‌కు చెందిన డిస్నీ క్రూయిజ్‌కు 27 శాతానికిపైగా డిమాండ్ పెరగనుంది. నోరూరించ రుచుల కోసంప్రయాణ ప్రణాళికలో ఆహారం ప్రధాన భాగంగా మారుతోంది. 2025లో వంటకాల పర్యాటకం గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు. ఇటలీ ట్రఫుల్ ఫెస్టివల్, థాయ్‌లాండ్ సాంగ్‌క్రాన్ ఫుడ్ ఫెస్టివల్ వంటి ఐకానిక్ ఈవెంట్లు ప్రపంచవ్యాప్తంగా ఆహార ప్రియులను ఆకర్షిస్తున్నాయి. అదే సమయంలో స్లోవేనియా, లావోస్, ఫారో దీవులు వంటి ఆఫ్‌బీట్ గమ్యస్థానాలు సాహస యాత్రల అనుభవాలను మహిళలు కోరుకుంటున్నారు.ఆరోగ్యకర ప్రయాణంప్రయాణికులు తమ శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. బాలి, తైవాన్ వంటి ప్రశాంతమైన గమ్యస్థానాలలో యోగా, ధ్యాన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఎక్కువ ప్రాంతాలను చుట్టిరావడం కంటే ఒకే ప్రాంతంలో అనుభూతులను పూర్తిగా ఆస్వాదించేలా ‘స్లో ట్రావెలింగ్’ భావనను అలవర్చుకుంటున్నారు. మరోవైపు పాప్ సంస్కృతి ప్రయాణాన్ని ఇంతకు ముందెన్నడూ లేనివిధంగా ఇష్టపడుతున్నారు. అభిమానులు తమకు ఇష్టమైన సినిమాలు, ప్రదర్శనలు, సంగీత కార్యక్రమాల నుంచి ప్రేరణ పొంది టూర్లను ప్లాన్ చేసుకుంటున్నారు. -
కన్నా.. కన్నవాళ్లంరా..
చిత్రంలో కనిపిస్తున్నామె పేరు రామేశ్వరమ్మ(65). ఈమెది మాడ్గుల మండల కేంద్రం. భర్త బ్రహ్మచారి 23 ఏళ్ల క్రితం చనిపోయాడు. ఐదుగురు కుమార్తెలు. ఒక కుమారుడు. ఆమెకు ఏకైక ఆధారం భర్త సంపాదించిన ఇల్లు ఒక్కటే. ఎవరికీ తెలియకుండా కుమారుడు ఇంటిని తన పేరున రాయించుకున్నాడు.ఆ తర్వాత తల్లి సహా ఇద్దరు చెల్లెళ్లను ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్డాడు. దీంతో న్యాయం చేయాలని కోరుతూ రామేశ్వరమ్మ ఏడాది క్రితం ఇబ్రహీంపట్నం ఆర్డీఓను ఆశ్రయించింది. ఇప్పటికీ న్యాయం దక్కలేదు. తలదాచుకునేందుకు ఇల్లు లేకపోవడంతో వీధుల్లో బతుకీడుస్తోంది. సాక్షి, రంగారెడ్డి జిల్లా: జీవిత చరమాంకంలో అండగా నిలబడాల్సిన కన్నబిడ్డలు.. ఆ తల్లిదండ్రుల పాలిట కర్కోటకులుగా ప్రవర్తిస్తున్నారు. పెన్షన్ డబ్బులు ఇవ్వాలంటూ కొందరు.. ఉన్న ఇళ్లు, భూములు, ఇతర ఆస్తులు రాసి ఇవ్వాలంటూ మరికొందరు వేధిస్తున్నారు. ఇంకొందరు ప్రత్యక్ష దాడులకు పాల్పడటంతోపాటు బలవంతంగా ఇంటి నుంచి బయటకు గెంటేస్తున్నారు.విధిలేని పరిస్థితుల్లో కొంతమంది జిల్లా వయోవృద్ధుల సంక్షేమ శాఖను ఆశ్రయించి, న్యాయం పొందుతుండగా, మరికొంత మంది ఆత్మాభిమానం చంపుకొని జీవించలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే 2023–24లో 1,105 ఫిర్యాదులు అందగా, వాటిలో 979 కేసులు పరిష్కారమయ్యాయి.ఈ ఏడాది జనవరి 25 వరకు 107 ఫిర్యాదులు అందగా, 69 పరిష్కారం అయ్యాయి. నిజానికి ప్రొటెక్షన్ ఆఫ్ పేరెంట్స్ అండ్ మెయింటెనెన్స్ 2007 యాక్ట్ ప్రకారం ఫిర్యాదు చేసిన 90 రోజుల్లోనే తుది తీర్పు ఇవ్వాల్సి ఉన్నా.. మెజారిటీ కేసుల్లో రెండు మూడేళ్లైనా విచారణ పూర్తి కావడం లేదు. కఠినచర్యలు తప్పవు వనస్థలిపురం సచివాలయనగర్‌కు చెందిన వృద్ధురాలు కె.రత్నమణి ఇటీవల జిల్లా వయోజన వృద్ధుల సంక్షేమశాఖను ఆశ్రయించింది. కొడుకు అమృతరాజ్, కోడలు పద్మ తన ఆస్తులను లాగేసుకుని ఆ తర్వాత తన సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. జిల్లా అదనపు కలెక్టర్ ఇప్పటికే ఈ అంశంపై విచారణ జరిపి, తుది ఉత్తర్వులు కూడా జారీ చేశారు.ఇలా ఇప్పటికే ఎనిమిది కేసుల్లో తీర్పులు ఇచ్చాం. వృద్ధులు/తల్లిదండ్రులపై ప్రత్యక్ష దాడులకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయిస్తాం. బాధితులకు పూర్తి రక్షణ కల్పిస్తాం. ఆర్డీఓతో విచారణ జరిపించి..వారిచ్చే నివేదిక ఆధారంగా తుది ఆదేశాలు జారీ చేస్తున్నాం. ఇప్పటికే మెజారిటీ కేసులను పరిష్కరించాం. – సంధ్యారాణి, రంగారెడ్డి జిల్లా వయోవృద్ధుల సంక్షేమ విభాగం అధికారిసత్వర న్యాయం చేయాలి విచారణ పేరుతో ఏళ్ల తరబడి కేసును సాగదీస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న తల్లిదండ్రులను చాలా మంది పిల్లలు భారంగా భావిస్తున్నారు. ఇలాంటి వారి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఆస్పత్రిని ఏర్పాటు చేయాలి. వృద్ధులపై దాడులకు పాల్పడే కొడుకులు, కోడళ్లపై కఠినచర్యలు తీసుకోవాలి. అప్పుడే సమాజంలో వృద్ధులకు రక్షణ పెరుగుతుంది. – మధుసూదన్‌రావు, అధ్యక్షుడు, తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్తల్లిదండ్రుల మైండ్‌సెట్ మారాలి పిల్లలకు స్వేచ్ఛ ఇస్తే ఎక్కడ పాడవుతారో అనే భయం తల్లిదండ్రుల్లో ఉంది. తన తర్వాత తన ఆస్తి తన పిల్లలకే చెందుతుందని చెబుతుంటారు. సొంతకాళ్లపై నిలబడకుండా చేస్తున్నారు. దీంతో వారు తమ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి చివరకు తనకే వస్తుందనే భావనలో ఉండిపోతున్నారు.బలవంతంగా ఆస్తులన్నీ తమ పేరుపై రాయించుకొని చివరకు వారిని ఇంటి నుంచి గెంటివేస్తున్నారు. నిజానికి తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులపై పిల్లలకు హక్కులుండవు. తాత నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులపైనే పిల్లలకు హక్కులు ఉంటాయి. విదేశీయుల మాదిరిగా ఇండియన్ పేరెంట్ మైండ్‌సెట్ కూడా మారాలి. అప్పుడే ఆస్తి వివాదాలు, గొడవలు తగ్గుతాయి – విశేష్, సైకాలజిస్ట్ -
లక్షల మంది చిన్నారుల ప్రాణదాత అస్తమయం
కారణజన్ములు అత్యంత అరుదుగా పుడతారని ప్రపంచవ్యాప్తంగా విశ్వసిస్తారు. ఆ విశ్వాసాన్ని నిజంచేస్తూ లక్షలాది మంది పసిపాపల ప్రాణాలను నిలబెట్టిన జేమ్స్ క్రిస్టఫర్ హారిసన్ తుదిశ్వాస విడిచారు. రక్తంలోని ప్లాస్మాను 1,173 సార్లు దానంచేసి అందులోని అరుదైన యాంటీ–డి యాంటీబాడీతో దాదాపు పాతిక లక్షల మంది చిన్నారులను కాపాడిన ప్రాణదాతగా ఘన కీర్తులందుకున్న హారిసన్(88) గత నెల 17వ తేదీన ఆ్రస్టేలియాలోని న్యూ సౌత్ వేల్స్లో తుదిశ్వాస విడిచిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నర్సింగ్ హోమ్‌లో నిద్రలోని ఆయన శాశ్వత నిద్రలోకి జారుకున్నారని వైద్యులు తెలిపారు. ఆస్ట్రేలియాకు చెందిన హారిసన్‌ను అందరూ ‘మ్యాన్ విత్ ది గోల్డెన్ ఆర్మ్’అని గొప్పగా పిలుస్తారు. ఏమిటీ ప్రత్యేకత? మానవ రక్తంలో పాజిటివ్, నెగిటివ్ అని రెండు రకాల వర్గీకరణలు ఉన్నాయి. దీనిని రీసస్(ఆర్‌హెచ్)ఫ్యాక్టర్ అని కూడా అంటారు. ఆర్‌హెచ్ నెగిటివ్ రక్తమున్న మహిళ, ఆర్‌హెచ్ పాజిటివ్ ఉన్న వ్యక్తి కారణంగా గర్భం దాలిస్తే పుట్టబోయే బిడ్డకు ఆర్‌హెచ్ పాజిటివ్ ఉండే ఛాన్సుంది. దీంతో కొన్ని సార్లు ప్రాణాంతకమైన సమస్య తలెత్తుతుంది. తల్లి ఎర్ర రక్తకణాలు పుట్టబోయే బిడ్డ రక్తకణాలపై దాడిచేసి కొత్త వ్యాధిని సృష్టిస్తాయి. దీనినే హీమోలైటిక్ డిసీజ్ ఆఫ్ ది న్యూబార్న్(హెచ్డీఎన్)గా పిలుస్తారు. అంటే పుట్టబోయే/పుట్టిన బిడ్డలో ఎర్రరక్త కణాలు అత్యంత వేగంగా క్షీణించిపోతాయి.దీంతో బిడ్డకు రక్తహీనత సమస్య రావడం, గుండె వైఫల్యం చెందడంతోపాటు ప్రాణాలు పోయే అవకాశాలు చాలా అధికం. హెచ్డీఎన్ సమస్యతో ఆ్రస్టేలియాలో ప్రతి ఏటా వేలాది మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. అయితే జేమ్స్ హారిసన్లోని రక్తంలో అరుదైన యాంటీ–డీ యాంటీబాడీని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈయన రక్తం ప్లాస్మా నుంచి సేకరించిన యాంటీబాడీతో ఔషధాన్ని తయారుచేసి దానిని ఆర్‌హెచ్‌డీ సమస్య ఉన్న గర్భిణులకు ఇచ్చారు.దీంతో పిండస్థ దశలోని చిన్నారుల ప్రాణాలు నిలబడ్డాయి. ఇలా 1967వ సంవత్సరం నుంచి ఎప్పటికప్పుడు హారిసన్ తన ప్లాస్మాను దానం చేస్తూనే ఉన్నారు. ఆస్ట్రేలియాలో 81 ఏళ్లు దాటిన వాళ్లు ప్లాస్మా దానం చేయకూడదనే నిబంధన ఉంది. దాంతో ఆయన తన 82వ ఏట ప్లాస్మా దానాన్ని ఆపేశారు. అప్పటికే ఆయన 1,173 సార్లు ప్లాస్మాను దానంచేశారు. దాని సాయంతో ఒక్క ఆస్ట్రేలియాలోనే దాదాపు 24 లక్షల మంది పసిపాపలను కాపాడటం విశేషం. ఆరు దశాబ్దాలపాటు దానం 1936 డిసెంబర్ 27న హారిసన్ జన్మించారు. 14వ ఏట అంటే 1951 ఏడాదిలో హారిసన్‌కు ఛాతిలో పెద్ద శస్త్రచికిత్స జరిగింది. అప్పుడు పెద్దమొత్తంలో రక్తం అవసరమైంది. ఇతరుల రక్తదానంతో బతికానన్న కృతజ్ఞతాభావం ఆయనలో ఆనాడే నాటుకుపోయింది. బ్రతికినంతకాలం రక్తదానం చేయాలని నిర్ణయించుకున్నారు. నిబంధనల ప్రకారం 18 ఏళ్లు నిండిన తర్వాతే రక్తదానం ఇవ్వడం మొదలెట్టారు. ఇలా దాదాపు 60 ఏళ్లపాటు ప్లాస్మాను దానంచేశారు.ప్రతి రెండు వారాలకోసారి ప్లాస్మా దానమిచ్చారు. అత్యధిక సార్లు ప్లాస్మా దానం చేసిన వ్యక్తిగా 2005లో ఆయన ప్రపంచ రికార్డ్ సృష్టించారు. 2018 మే11వ తేదీన చివరిసారిగా ప్లాస్మా దానంచేశారు. న్యూ సౌత్ వేల్స్(ఎన్ఎస్డబ్ల్యూ) జాతీయ యాంటీ–డీ కార్యక్రమంలో వ్యవస్థాపక సభ్యునిగా హారిసన్ ఉన్నారు. ఇన్నేళ్లలో ఎన్ఎస్డబ్ల్యూ తయారుచేసిన యాంటీ–డీ ప్రతి బ్యాచ్‌లో ఒక్క డోస్ అయినా హారిసన్ది ఉండటం విశేషం.లక్షల ప్రాణాలు కాపాడి రికార్డ్ సృష్టించారని గతంలో మీడియా ఆయన వద్ద ప్రస్తావించగా నవ్వి ఊరుకున్నారు. ‘‘రికార్డ్ సృష్టించడం అంటూ ఏదైనా జరిగిందంటే అది కేవలం ఆ దాతృత్వ సంస్థ చేసిన విరాళాల వల్లే. ఇందులో నా పాత్ర ఏమీ లేదు’’అని నిగర్విలా మాట్లాడారు. నేనూ బతికా: కూతురు హారిసన్ మరణంపై ఆయన కూతురు ట్రేసీ మెలోషి ప్ మాట్లాడారు. ‘‘మా నాన్న ఇన్నిసార్లు దానం చేసి కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఆయన అందించిన యాంటీ–డీ డోస్‌తో ఎంతో మంది బ్రతికారు. అందులో నేను కూడా ఉన్నా’’అని ట్రేసీ అన్నారు. ఈ డోస్ పొందిన వారిలో హారిసన్ మనవళ్లు, మనవరాళ్లు కూడా ఉండటం విశేషం. 14 ఏళ్ల వయసులో ఆపరేషన్ వేళ తీవ్రస్థాయిలో రక్తం ఎక్కించుకోవడం వల్లే హారిసన్ ఈ అరుదైన లక్షణాన్ని సంతరించుకున్నారని కొందరి వాదన. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆ సముద్ర ప్రవాహం... నెమ్మదిస్తోంది!
పర్యావరణ మార్పుల తాలూకు విపరిణామాలు ఊహాతీత వేగంతో ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ధ్రువాల వద్ద మంచు ఎన్నడూ లేనంత వేగంతో కరిగిపోతుండటం కొన్నేళ్లుగా మనమంతా చూస్తున్న భయానక పరిణామమే. ఇది మరో పెను ప్రమాదానికి కూడా దారి తీస్తోందని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. అంటార్కిటికాలో అత్యంత బలమైన సముద్ర ప్రవాహ గతి కొన్నేళ్లుగా క్రమంగా నెమ్మదిస్తూ వస్తోందని వెల్లడించింది. అంటార్కిటికా వద్ద భారీ మంచు ప్రమాదకర వేగంతో కరుగుతుండటమే ఇందుకు కారణమని వివరించింది. ప్రపంచ వాతావరణాన్ని క్రమబదీ్ధకరించడంలో ఈ ప్రవాహానిదే అతి కీలకపాత్ర. అంతేగాక మహాసముద్రాల ప్రవాహాల గతి కూడా చాలావరకు ఈ ప్రవాహ గతిమీదే ఆధారపడి ఉంటుంది. ‘‘లక్షలాది ఏళ్లుగా సమతుల్యంగా కొనసాగుతూ వస్తున్న అత్యంత సంక్లిష్టమైన ఈ ప్రవాహం కూడా పర్యావరణ మార్పుల దెబ్బకు గాడి తప్పుతుండటం అత్యంత ఆందోళనకరం. ఇదిలాగే కొనసాగితే మానవాళి ఊహాతీతమైన పర్యావరణ విపత్తులు ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని అధ్యయనం హెచ్చరించింది. ఏసీసీ... పెట్టనికోట! ప్రపంచ పర్యావరణ సమతుల్యతకు అంటార్కిటికా అత్యంత కీలకమైనది. అంటార్కిటిక్ సర్కంపొలార్ కరెంట్ (ఏసీసీ)గా పిలిచే అక్కడి మహాసముద్ర ప్రవాహం ఈ విషయంలో పెద్దన్న పాత్ర పోషిస్తుంటుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత బలమైన సముద్ర ప్రవాహం! పశ్చిమం నుంచి తూర్పుగా అంటార్కిటికా మహాసముద్రం పొడవునా సాగే ఈ ప్రవాహం ప్రపంచ వాతావరణాన్ని, ఇతర సముద్ర ప్రవాహాల గతిని నిత్యం నియంత్రిస్తూ ఉంటుంది. అంతేగాక ప్రధానంగా వేటాడే తత్వముండే ఇతర ప్రాంతాల్లోని సముద్ర జీవరాశులు అంటార్కిటికా జలాల్లోకి ప్రవేశించకుండా ప్రాకృతిక అడ్డుగోడలా కూడా ఏసీసీ నిలుస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే మానవాళి మనుగడకు ఇది పెట్టనికోట వంటిది. గ్లోబల్ వార్మింగ్ తదితరాల దెబ్బకు అంటార్కిటికాలోని అపారమైన మంచు కొన్నేళ్లుగా శరవేగంగా కరుగుతోంది. దాంతో అపార స్వచ్ఛ జలరాశి నిరంతరం సముద్రంలోకి పోటెత్తుతోంది. దాని దెబ్బకు అంటార్కిటికా మహాసముద్రంలో లవణీయత, నీటి సాంద్రత మార్పుచేర్పులకు లోనవుతున్నాయి. ఇదంతా అంతిమంగా ఏసీసీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దాని ప్రవాహ గతి నానాటికీ నెమ్మదిస్తూ వస్తోంది.ఇలా చేశారుఏసీసీ ప్రవాహ గతిలో మార్పు లపై ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్కు చెందిన పరిశోధకుల బృందం పరిశోధన చేసింది. అధ్యయనంలో భాగంగా పలు అంశాలపై సైంటిస్టులు లోతుగా దృష్టి పెట్టారు. ఆ్రస్టేలియాలోనే అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ జీఏడీఐ సాయంతో సముద్ర ప్రవాహాల్లో మార్పులు తదితరాలను కచి్చతంగా లెక్కగట్టారు. హెచ్చు రెజల్యూషన్‌తో కూడిన సముద్ర, యాక్సెస్–ఓఎం2–01 క్లైమేట్ మోడల్ సేవలను కూడా ఇందుకు వాడుకున్నారు. మహాసముద్ర ప్రవాహాలపై మంచు, స్వచ్ఛ జలరాశి ప్రభావం, తద్వారా వేడిని మోసుకుపోయే సామర్థ్యంలో హెచ్చుతగ్గులు తదితరాలను నిశితంగా పరిశీలించారు. అంతిమంగా ఇవన్నీ ఉష్ణోగ్రత, లవణీయత, పవనాల గతి తదితరాల్లో ఎలాంటి మార్పులకు కారణమవుతాయో గమనించారు. మంచు కరిగి సముద్రంలోకి చేరే అపార జలరాశి ఏసీసీ ప్రవాహాన్ని వేగవంతం చేస్తుందన్న గత పరిశోధనల ఫలితాలు సరికావని స్పష్టం చేశారు. అందుకు పూర్తి విరుద్ధంగా ఏసీసీ ప్రవాహ గతి బాగా నెమ్మదిస్తోందని తేల్చారు. తాజా పరిశోధన ఫలితాలను ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ లెటర్స్‌లో ప్రచురించారు. పెను విపత్తులే...! ఏసీసీ ఒకరకంగా ప్రపంచ వాతావరణ సమతుల్యతకు ఇంజిన్ వంటిదని అధ్యయన బృంద సభ్యుడైన అసోసియేట్ ప్రొఫెసర్ భిషగ్దత్త గయేన్ వివరించారు. ‘‘మహాసముద్రాలన్నింటికీ కన్వేయర్ బెల్ట్ మాదిరిగా ఏసీసీ పని చేస్తుంది. వేడిమి, కార్బన్ డయాక్సైడ్తో పాటు సముద్రంలోని జీవరాశుల మనుగడకు అత్యంత కీలకమైన పలు పోషకాలు తదితరాలు పసిఫిక్, అట్లాంటిక్, హిందూ తదితర మహాసముద్రాల మధ్య సజావుగా పంపిణీ అయ్యేలా చూస్తుంది. అది గనక పడకేసిందంటే జరిగే విపరిణామాలు అన్నీ ఇన్నీ కావు’’ అని ఆయన స్పష్టం చేశారు. అవేమిటంటే... → ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల్లో తీవ్రమైన హెచ్చుతగ్గులు → పలు ప్రాంతాల్లో అత్యంత వేడిమి, ఆ వెనకే అతి శీతల పరిస్థితులు → సముద్ర జలాల్లో లవణీయత పరిమాణం నానాటికీ తగ్గిపోవచ్చు → ఫలితంగా గ్లోబల్ వార్మింగ్ ప్రక్రియ మరింత వేగం పుంజుకోవచ్చు → ఇతర ప్రాంతాల సముద్ర జలాలకే పరిమితమైన నాచు, కలుపు మొక్కలు, మొలస్కా వంటి జీవులు అంటార్కిటికాలోకి ప్రవేశించవచ్చు. అదే జరిగితే అక్కడి జీవావరణ వ్యవస్థ దెబ్బ తింటుంది. ఇవి అంతిమంగా పెంగి్వన్ల వంటి స్థానిక జీవరాశుల ఆహార వనరులకు కూడా ఎసరు పెట్టవచ్చు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కంపెనీల బాండ్ బాజా!
ఎఫ్ఐఐల అమ్మకాలు ఆగటం లేదు. మార్కెట్లు పడిపోతున్నాయి. దీంతో చాలా కంపెనీల షేర్లు ఏడాది కనిష్టానికి వచ్చేశాయి. మిగిలిన పెట్టుబడి సాధనాల్లో... బంగారం పెరుగుతున్నా... ధరల్లో ఊగిసలాట తప్పదు. రియల్ ఎస్టేట్ అంతంత మాత్రంగానే ఉంది. బ్యాంకు డిపాజిట్లు సురక్షితమే కానీ... వడ్డీ రేట్లు తక్కువ. మరి వీటికన్నా ఎక్కువ వచ్చే ప్రభుత్వ బాండ్లు బెటరా? లేకపోతే అంతకన్నా కాస్త ఎక్కువ గిట్టుబాటయ్యే ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల బాండ్లు బెటరా? రాబోయే వారం పది రోజుల్లో పలు ప్రభుత్వ కంపెనీలు సైతం బాండ్లు జారీ చేయటానికి ముందుకొస్తున్న నేపథ్యంలో... వాటి లాభనష్టాలు, రిసు్కల గురించి తెలుసుకుందాం...వడ్డీ రేట్లు పెంచుతూ లిక్విడిటీని రిజర్వు బ్యాంకు కట్టడి చేస్తోంది. దీంతో అప్పుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సహా పలు కంపెనీలు బాండ్ల జారీకి వస్తున్నాయి. ఈ తాకిడి ఎంతలా అంటే... ఈ ఒక్కవారంలోనే కంపెనీలు రూ.30 వేల కోట్ల విలువైన బాండ్లు జారీ చేస్తున్నాయి. వీటిలో ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఇరెడా) 7.40 శాతం వడ్డీతో 11 ఏళ్ల కాలానికి రూ.820 కోట్లు సమీకరించగా... నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) ఏడేళ్ల కాలానికి 7.35 శాతం వడ్డీ రేటుతో రూ.4,800 కోట్లు సమీకరించింది. ఇక ఆర్ఈసీ 7.99 శాతం వడ్డీతో నిరవధిక బాండ్లను జారీ చేసింది. రూ.2,000 కోట్లు సమీకరించాలనుకున్నా రూ.1,995 కోట్లే చేయగలిగింది. ఇక రాబోయే రోజుల్లో నాబార్డ్ పదేళ్ల కాలానికి రూ.7,000 కోట్లు, సిడ్బి నాలుగేళ్ల కాలానికి రూ.6,000 కోట్లు, పీఎఫ్సీ నాలుగేళ్లకు రూ.4 వేల కోట్లు సమీకరించనున్నాయి. జనవరిలో ట్రంప్ టారిఫ్‌ల ప్రకటన, భౌగోళిక అనిశి్చతుల నేపథ్యంలో బాండ్ మార్కెట్ భయపడింది. వడ్డీ రేట్లు పెరిగాయి. ఆర్బీఐ సైతం వడ్డీ రేట్లు పెంచి లిక్విడిటీని కట్టడి చేసింది. దీంతో ప్రభుత్వ బాండ్లపై ఈల్డ్‌లు (రాబడి) 0.5 శాతం వరకూ పెరిగాయి. దీంతో కార్పొరేట్లు మరింత ఎక్కువ వడ్డీని ఆఫర్ చేయాల్సి వచి్చంది. ప్రస్తుతం ప్రభుత్వ బాండ్ల ఈల్డ్ 7.1 శాతం నుంచి 7.3 శాతం మధ్య ఉండగా... ప్రైవేటు కంపెనీలు అంతకన్నా ఎక్కువ కూపన్ రేటును ఆఫర్ చేయాల్సి వస్తోంది. నిరవధిక బాండ్లు అంటే..సాధారణంగా పెర్పెట్యువల్ బాండ్లుగా పిలిచే ఈ బాండ్లకు నిర్ణీత కాలమంటూ ఏదీ ఉండదు. ఒక కంపెనీ ఈ రకమైన బాండ్లను జారీ చేస్తే... కాలపరిమితి ఉండదు కనుక ఏడాదికోసారి చొప్పున నిరవధికంగా వడ్డీని చెల్లిస్తూ పోతాయి. ఒకవేళ వాటిని బైబ్యాక్ చెయ్యాలని భావిస్తే అప్పుడు ప్రకటన ఇచి్చ... తమ బాండ్ల ప్రిన్సిపల్ మొత్తాన్ని చెల్లించి వెనక్కి తీసుకుంటాయి. అప్పటిదాకా వడ్డీ మాత్రం చెల్లిస్తుంటాయి. ప్రిన్సిపల్ మొత్తాన్ని తిరిగి పొందటానికి కాలపరిమితి ఉండదు కనుక వీటికి వడ్డీ రేటు కూడా ఎక్కువే ఉంటుంది. గమనించాల్సింది ఏంటంటే...బాండ్లలో ఇన్వెస్ట్ చేసేవారు గమనించాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే... ఆ బాండ్లకు బాగా రేటింగ్ ఉండి, చురుగ్గా ట్రేడయితేనే సెకండరీ బాండ్ మార్కెట్లో వెంటనే విక్రయించగలం. రేటింగ్ తక్కువగా ఉన్న బాండ్లయినా, నిరవధిక బాండ్లయినా విక్రయించటం అంత ఈజీ కాదు. పైపెచ్చు విక్రయించేటపుడు వాటి ధర అప్పటి వడ్డీ రేట్లపై ఆధారపడి ఉంటుంది. మీరు కొన్నపుడు వడ్డీరేట్లు తక్కువ ఉండి ఆ తరవాత పెరిగాయనుకోండి. మీ బాండ్ల ధర కూడా తగ్గుతుంది. అదే రివర్స్‌లో మీరు కొన్నాక వడ్డీ రేట్లు తగ్గితే.. మీ బాండ్లకు ఎక్కువ వడ్డీ వస్తుంది కనక వాటికి గిరాకీ ఉంటుంది. ఈ అంశాలు దృష్టిలో పెట్టుకుంటే బాండ్లలోనూ ఇన్వెస్ట్ చేయొచ్చు.ప్రభుత్వ సావరిన్ బాండ్లు→ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేస్తాయి కనుక చాలా తక్కువ రిస్కు ఉంటుంది. → సురక్షితం కనుక... తక్కుక వడ్డీని ఆఫర్ చేస్తాయి. కానీ బ్యాంకు డిపాజిట్లతో పోలిస్తే వడ్డీ కాస్తంత ఎక్కువ ఉంటుంది. → డిపాజిట్ల మాదిరి ఎప్పుడు కావాలంటే అప్పుడు క్యాన్సిల్ చేసుకోలేరు. కానీ బాండ్ మార్కెట్లో ట్రేడవుతాయి కనుక అప్పటి ధరకు విక్రయించుకోవచ్చు. → ఏడాదికోసారి వడ్డీ మన ఖాతాలో ఠంచనుగా పడుతుంది. ప్రైవేటు, ప్రభుత్వ కంపెనీల బాండ్లు→ కంపెనీలు తమ సొంత పూచీకత్తుపై జారీ చేస్తాయి. వాటి పనితీరుపై ఆధారపడి ఉంటాయి కనుక రిస్కు కాస్తంత ఎక్కువ. → రిస్కు ఎక్కువ కనుక ప్రభుత్వ బాండ్ల కన్నా వడ్డీ కాస్త ఎక్కువే. → వీటిని కూడా ప్రభుత్వ బాండ్ల మాదిరి ఎప్పుడు కావాలంటే అప్పుడు బాండ్ మార్కెట్లో విక్రయించుకునే అవకాశం ఉంటుంది. → వీటి రేటింగ్‌ను బట్టి వడ్డీ ఉంటుంది. ట్రిపుల్ ఏ బాండ్లకు కాస్త తక్కువగా... రేటింగ్ తగ్గుతున్న కొద్దీ వడ్డీ పెరిగేలా ఉంటాయి. → కాకపోతే తక్కు రేటింగ్ ఉన్న బాండ్లకు రిస్కు కూడా ఎక్కువని గమనించాలి. – సాక్షి, బిజినెస్ ప్రతినిధి -
ఈజీగా ఇంటర్నేషనల్ జర్నీ
విమానం మిస్సవుతుందనే భయం లేదు. నిశ్చింతగా బయలుదేరవచ్చు. గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాయాల్సిన అవసరం లేదు. ఎలాంటి నిరీక్షణ లేకుండా ఇమిగ్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ – ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రామ్ (ఎఫ్టీఐ–టీటీపీ) హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సత్ఫలితాలిస్తోంది.ఉద్యోగాలు, వ్యాపారాల రీత్యా విదేశాలకు క్రమం తప్పకుండా ప్రయాణించేవారికి ఇది ఎంతో ఉపయోగపడుతోంది. సాధారణ ఇమిగ్రేషన్ క్యూలైన్లకు వెళ్లవలసిన అవసరం లేకుండా ఫాస్ట్‌ట్రాక్ ఇమిగ్రేషన్ ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా ప్రవేశ, నిష్క్రమణ ఈ–గేట్లను ఏర్పాటు చేశారు. – సాక్షి, హైదరాబాద్నమ్మకమైన ప్రయాణికుల కోసమే..హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతిరోజూ సుమారు 70 వేల మందికి పైగా డొమెస్టిక్ (దేశీయ), ఇంటర్నేషనల్ (అంతర్జాతీయ) ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. వీరిలో 10 వేల మందికి పైగా విదేశాలకు వెళ్లి వచ్చేవారు ఉన్నారు. వీరిలో తరచూ ప్రయాణించేవారికి ఈ ఫాస్ట్‌ట్రాక్ విధానం ఎంతో ఉపయుక్తంగా ఉంది. టూరిస్టులు, రెండుమూడేళ్లకోసారి విదేశీ ప్రయాణం చేసేవాళ్లు ఈ సేవలను వినియోగించుకోలేరని, తరచూ రాకపోకలు సాగించే నమ్మకమైన ప్రయాణికుల కోసమే దీనిని అందుబాటులోకి తెచ్చామని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అధికారి ఒకరు తెలిపారు.‘ఇది భారతీయ పాస్ట్‌పోర్ట్‌లు, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డులు కలిగిన వాళ్ల కోసం ప్రవేశపెట్టిన సాంకేతిక వ్యవస్థ. ఇమిగ్రేషన్ చెక్ కోసం క్యూలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ప్రత్యేక వ్యవస్థ ద్వారా ఈ ప్రక్రియను ముగించి రాకపోకలు సాగించవచ్చు’అని ఆయన చెప్పారు.ఇప్పటివరకు 500 మందికి పైగా ఎఫ్టీఐ–టీటీపీలో వివరాలను నమోదు చేసుకున్నట్లు తెలిపారు. రోజూ 10 – 15 మంది వరకు ఈ సేవలను వినియోగించుకుంటున్నారని, రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. వీరికోసం ప్రత్యేకంగా 8 గేట్లను వినియోగిస్తున్నామని తెలిపారు.దరఖాస్తు ఇలా..ఫాస్ట్‌ట్రాక్ ఇమిగ్రేషన్ వ్యవస్థను ఉపయోగించుకోవాలంటే www.ftittp.mha.gov.in వెబ్సైట్లో ప్రయాణికులు తమ వివరాలు నమోదు చేసుకోవాలి. పాస్‌పోర్ట్ కనీసం 6 నెలల చెల్లుబాటును కలిగి ఉండాలి. దరఖాస్తు సమయంలోనే పాస్‌పోర్ట్‌ను అప్లోడ్ చేసి, ఇతర అన్ని వివరాలు నమోదు చేయాలి. భద్రతాపరమైన తనిఖీల అనంతరం ఎఫ్టీఐ–టీటీపీ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ఈ సమాచారాన్ని ఇమిగ్రేషన్ బ్యూరో పరిశీలించి ఆమోదిస్తే, ఆ సమాచారం ప్రయాణికుల మొబైల్ ఫోన్‌కు ఎస్సెమ్మెస్ రూపంలో వస్తుంది. ఈ మెయిల్‌కు కూడా సందేశం వస్తుంది. వేలిముద్రలు, ఫొటో వంటి బయోమెట్రిక్ వివరాలను నమోదు చేసేందుకు ఎయిర్‌పోర్టులోని ప్రత్యేక కౌంటర్లలో సంప్రదించవలసి ఉంటుందని అధికారులు తెలిపారు.సేవలు ఇలా.. ⇒ ఫాస్ట్‌ట్రాక్ ఇమిగ్రేషన్ సదుపాయం కలిగిన ప్రయాణికులు వీసా తనిఖీ పూర్తయిన తరువాత బోర్డింగ్ పాస్ కోసం రిజిస్టర్డ్ ప్యాసింజర్ చెక్–ఇన్ కౌంటర్లో సంప్రదించాలి. ⇒ బోర్డింగ్ పాస్ తీసుకున్న తరువాత ఇమిగ్రేషన్ కోసం వీరికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ–గేట్ల వద్దకు వెళ్లాలి. ⇒ మొదటి గేట్ వద్ద పాస్‌పోర్ట్, బోర్డింగ్ పాస్ స్కానింగ్ పూర్తవుతుంది. దీంతో రెండో ఈ–గేట్‌కు అనుమతి లభిస్తుంది. ⇒ రెండో ఈ–గేట్ వద్ద ప్రయాణికుడి ముఖాన్ని స్కాన్ చేస్తారు. ధ్రువీకరణ అనంతరం ఇమిగ్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. ప్రయోజనాలు ఇవీ.. ⇒ సాధారణ ఇమిగ్రేషన్ ప్రక్రియలో వివిధ దేశాలకు వెళ్లే ప్రయాణికులంతా ఒకే క్యూలైన్లో వెళ్లవలసి ఉంటుంది. అందువల్ల ఎక్కువ సమయం పడుతుంది. ఒక్కోసారి అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటే గంటకు పైగా పడిగాపులు తప్పవు.⇒ అంతర్జాతీయ ప్రయాణికులు విమానం బయలుదేరడానికి 3 గంటల ముందే ఎయిర్‌పోర్టుకు చేరుకోవాలి. ఆ తరువాత సంబంధిత ఎయిర్‌లైన్స్‌లో క్యూలో వేచి ఉండి బోర్డింగ్ పాస్ తీసుకోవాలి. అదే సమయంలో లగేజ్ చెక్ –ఇన్ ఉంటుంది. ఆ తరువాత వరుసగా భద్రతా తనిఖీలు, ఇమిగ్రేషన్ లైన్లలోకి వెళ్లాలి. ఈ ప్రక్రియ పూర్తవడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఎఫ్టీఐ టీటీపీ వ్యవస్థలో ముందే వివరాలు నమోదు చేసుకోవడం వల్ల సాధారణ భద్రతా తనిఖీల అనంతరం నేరుగా ఈ–గేట్ ద్వారా ఇమిగ్రేషన్ పూర్తి చేసుకొని వెళ్లవచ్చు. డిజియాత్ర మొబైల్ యాప్ ఉన్న ప్రయాణికులు బోర్డింగ్పాస్ను ఆన్లైన్లోనే పొందవచ్చు. -
భారీ లెక్కలు.. ఫీజు బేరాలు!
గత మూడేళ్ల కాలంలో ప్రవేశ పెట్టిన పలు కొత్త కోర్సులు, మౌలిక సదుపాయాల కల్పన కారణంగా ఖర్చు బాగా పెరిగిపోయిందని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు చెబుతున్నాయి. వార్షిక ఫీజులను ఈ ఏడాది భారీగా పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ మండలి (టీజీఎఫ్ఆర్సీ) ముందు ఈ మేరకు ప్రతిపాదనలు సమర్పించాయి. మరోవైపు ప్రభుత్వ పెద్దలతోనూ ఫీజుల పెంపు విషయమై యాజమాన్యాలు లాబీయింగ్ చేస్తున్నట్టు తెలిసింది.ఖర్చులు పరిశీలించే ఆడిటింగ్ వ్యవస్థతో దొడ్డిదారిన సంప్రదింపులు జరుపుతున్నాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ప్రైవేటు కాలేజీలు అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది కన్వీనర్ కోటా ఫీజులు దాదాపు రెట్టింపు అయ్యే అవకాశం ఉందని ఉన్నత విద్యా మండలి వర్గాలు చెబుతున్నాయి. అప్పుడు మేనేజ్మెంట్ కోటా సీట్ల ఫీజులు కూడా పెరుగుతాయని అంటున్నారు. – సాక్షి, హైదరాబాద్ప్రతిపాదనలు పరిశీలిస్తున్న ఎఫ్ఆర్సీ బీటెక్, బీఫార్మసీ, అగ్రికల్చర్ కాలేజీల ఫీజులను ఎఫ్ఆర్సీ ప్రతీ మూడేళ్ళకోసారి సమీక్షిస్తుంది. 2022లో కొత్త ఫీజులను నిర్ణయించారు. ప్రస్తుతం ఇవే అమల్లో ఉన్నాయి. 2022–23లో నిర్ణయించిన ఫీజులు అప్పట్లో ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు ఆఖరి సంవత్సరం వరకూ వర్తిస్తాయి. కాగా 2025–26కు కొత్త ఫీజులను ఖరారు చేసేందుకు గాను ఆడిట్ నివేదికలు ఇవ్వాలని గత ఏడాది ఆగస్టులోనే ఎఫ్ఆర్సీ యాజమాన్యాలను ఆదేశించింది. దీంతో 157 కాలేజీలు కొత్త ఫీజులతో మండలికి ప్రతిపాదనలు సమర్పించాయి.గత మూడేళ్లలో కొత్తగా వచ్చిన కోర్సుల కోసం, మౌలిక వసతులు, బోధన సిబ్బంది కోసం భారీగా ఖర్చు చేశామని జమా ఖర్చుల్లో పేర్కొన్నాయి. ఈ ప్రతిపాదనలను మండలి నేతృత్వంలోని ఆడిట్ బృందాలు పరిశీలిస్తాయి. ఆ తర్వాత యాజమాన్యాలతో మండలి చర్చలు జరిపి ఫీజులను నిర్ణయిస్తుంది. దీనికి ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత కొత్త ఫీజులు అమలులోకి వస్తాయి. 2025–26, 2026–27, 2027–28 వరకూ కొత్త ఫీజులు అమల్లో ఉంటాయి. కొత్త విద్యా సంవత్సరం సమీపిస్తున్న నేపథ్యంలో ఎఫ్ఆర్సీ ఈ ప్రక్రియను వేగవంతం చేసింది.వంద శాతం పెంచాల్సిందేఈసారి ఫీజులు భారీగా పెంచాల్సిందేనని ప్రైవేటు కాలేజీలు పట్టుబడుతున్నాయి. 157 కాలేజీలకు గాను 60 కాలేజీల్లో ప్రస్తుతం రూ. 1.40 లక్షలకు పైనే ఫీజు ఉంది. వీటిని ఈసారి రెట్టింపు చేయాలని కోరుతున్నాయి. 33 కాలేజీల్లో రూ.75 నుంచి రూ.1.15 లక్షల వరకూ ఫీజులున్నాయి. ఈ కాలేజీలు రూ.1.10 లక్షల నుంచి రూ.1.60 లక్షల వరకూ పెంచాలని ప్రతిపాదించాయి. రూ.50 వేల లోపు ఉన్న మిగతా కాలేజీలు కనీస ఫీజు రూ.75 వేలు చేయాలని పట్టుబడుతున్నాయి.మూడేళ్ళ క్రితం కొన్ని కాలేజీల ఫీజులు భారీగా పెరిగాయి. వసతులు, బోధన సిబ్బంది పరిశీలన అనంతరం కొన్నింటికి తగ్గించారు. ఎంజీఐటీ ఫీజు రూ.1.08 లక్షల నుంచి రూ.1.60 లక్షలకు పెరిగింది. నారాయణమ్మ ఫీజు రూ.1.22 లక్షల నుంచి రూ. లక్షకు తగ్గించారు. సీబీఐటీ ఫీజును తొలుత రూ.1.34 లక్షల నుంచి రూ.1.73 లక్షలకు పెంచారు. తర్వాత ఆడిట్ నివేదిక ప్రకారం సవరించి రూ.1.15 లక్షలకు తగ్గించారు. కాలేజీ కోర్టును ఆశ్రయించడంతో అనంతరం రూ.1.65 లక్షలుగా ఖరారు చేశారు. కొన్ని కాలేజీల ఫీజులు అసలు పెంచలేదు. ఇవి ఈసారి ఫీజుల పెంపు కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. కొత్త కోర్సులు వచ్చాయి..ఖర్చు పెరిగిందిరాష్ట్రంలోని ప్రైవేటు కాలేజీల్లో లక్షకు పైగా ఇంజనీరింగ్ సీట్లు ఉంటే, ఇందులో 61 వేల సీట్లు సీఎస్ఈ, ఇతర కొత్త కంప్యూటర్ కోర్సులవే ఉన్నాయి. కాగా కొత్త కోర్సుల కోసం భారీగా ఖర్చు చేశామని కాలేజీలు అంటున్నాయి. లైబ్రరీ, లేబొరేటరీ, ఇతర మౌలిక వసతుల నేపథ్యంలో ఈ మూడేళ్ళలో 80 శాతం వ్యయం పెరిగిందని చెబుతున్నాయి. ఏఐ, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సుల ఫ్యాకల్టీకి అత్యధిక వేతనాలు చెల్లిస్తున్నట్టు జమా ఖర్చుల్లో పేర్కొన్నాయి.తీవ్ర వ్యతిరేకతప్రైవేటు కాలేజీల ప్రతిపాదనలపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రైవేటు అధ్యాపక సంఘాలు, విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మౌలిక వసతులు ఈ మూడేళ్లలో ఎక్కడా పెరగలేదని, చాలా కాలేజీల్లో సరిపడా ఫ్యాకల్టీ లేదని అంటున్నాయి. ఆడిట్ వ్యవస్థతో పాటు ప్రభుత్వం అన్నీ సమగ్రంగా పరిశీలించిన తర్వాతే ఫీజులపై నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాయి.వేతనాలే ఇవ్వడం లేదు చాలా కాలేజీలు ఉద్యోగులకు సరిగా వేతనాలు ఇవ్వడం లేదు. ఒక్కసారి బ్యాంకు లావాదేవీలు పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుంది. కొత్త కోర్సులు వచ్చినా, సీట్లు పెరిగినా, నైపుణ్యం ఉన్న సిబ్బందిని నియమించలేదు. కాలేజీల్లో ఎలాంటి మౌలిక వసతులు ఉన్నాయో అధికారులు పరిశీలించాలి. తప్పుడు నివేదికలు ఇచ్చిన కాలేజీలపై చర్యలు తీసుకోవాలి. – అయినేని సంతోష్‌కుమార్ (ప్రైవేటు సాంకేతిక కాలేజీల అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు)తప్పుడు లెక్కలు ఆమోదించొద్దు ప్రైవేటు కాలేజీలు తప్పుడు ప్రతిపాదనలతో ఫీజుల పెంపునకు ప్రయత్నిస్తున్నాయి. వీటిని గుడ్డిగా ఆమోదించవద్దు. దీనివల్ల పేద విద్యార్థికి చదువు దూరమయ్యే ప్రమాదం ఉంది. ఎఫ్ఆర్సీ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. – టి.నాగరాజు (ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) -
డ్రోన్ లేడీ!
ఆసక్తి ఉంటే అవకాశాలను అందిపుచ్చుకుని ఆర్థికంగా ఎదగవచ్చని... ప్రత్యేక గుర్తింపు పొందవచ్చని నిరూపించారు వైఎస్సార్ జిల్లా కమలాపురం మున్సిపాలిటీలోని కె.అప్పాయపల్లె గడ్డ వీధికి చెందిన నామాల జ్యోత్స్న. పొదుపు సంఘంలో క్రియాశీలకంగా ఉన్న ఆమె డ్రోన్ పైలట్‌గా ఎదిగారు. తొమ్మిది మండలాల్లోని పొలాలకు డ్రోన్ ద్వారా పురుగుమందులు పిచికారి చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. స్థానికంగా డ్రోన్ మహిళగా గుర్తింపు పొందారు. –కమలాపురంరూ.3లక్షల వరకు వచ్చాయినేను కలలో కూడా డ్రోన్ పైలట్ అవుతానని అనుకోలేదు. ఇప్పటి వరకు కమలాపురం, చెన్నూరు, వల్లూరు, సీకే దిన్నె, కడప, వేముల, సిద్ధవటం, మైదుకూరు, ఖాజీపేట మండలాల్లో డ్రోన్ ద్వారా పురుగుమందులు పిచికారి చేశాను. ఎకరాకు రూ.400 తీసుకుంటున్నా. తొమ్మిది మండలాల్లో 58 రోజుల్లో దాదాపు 700 ఎకరాల్లో పురుగుమందులు పిచికారి చేశా. రూ.3లక్షల వరకు ఆదాయం వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. – నామాల జ్యోత్స్న, కె.అప్పాయపల్లె, కమలాపురం, వైఎస్సార్ జిల్లాపొదుపు సంఘం నుంచి ఢిల్లీ వరకుదేశవ్యాప్తంగా 100 జిల్లాల్లోని పంట పొలాల్లో డ్రోన్ల ద్వారా పురుగుమందులు పిచికారి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాటిలో వైఎస్సార్ జిల్లా ఒకటి. వైఎస్సార్ జిల్లా నుంచి కమలాపురానికి చెందిన జ్యోత్స్నను డ్రోన్ పైలట్‌గా ఎంపిక చేశారు. ఆమె కమలాపురంలోని ‘నికితా’ పొదుపు సంఘం లీడర్‌గా ఉన్నారు. గ్రూప్ లీడర్‌గా బాగా పనిచేస్తున్న జ్యోత్స్నను డీఆర్డీఏ అధికారులు గుర్తించి కరోనా కాలంలో క్రిషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) ద్వారా కమలాపురంలో మినీ నర్సరీని ఏర్పాటు చేయించారు. ఆమె బంతి, నిమ్మ, గుమ్మడి, వంగ, మిర్చి, వరి నారు పెంచి రైతులకు విక్రయిస్తున్నారు.ప్రకృతి వ్యవసాయం ద్వారా తన పొలంలో పంటలు పండించి ఆదాయం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మహిళలను డ్రోన్ పైలట్లుగా తయారు చేసేందుకు ప్రవేశ పెట్టిన ‘లక్పతి దీదీ’ పథకానికి కూడా జ్యోత్స్నను అధికారులు ఎంపిక చేశారు. ఆమె 2023 డిసెంబర్ 11 నుంచి 22 వరకు హైదరాబాద్‌లో శిక్షణ పొందారు. లక్పతి దీదీ పథకాన్ని 2024 మార్చిలో ప్రధాని మోదీ ప్రారంభించారు. గుంటూరులో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో ఆమెకు సర్టిఫికెట్‌తోపాటు డ్రోన్ అందజేశారు. మార్చి 27న అధికారికంగా ఆమె ఇంటికి డ్రోన్ వచ్చింది. ఇప్పటి వరకు ఆమె 58 రోజులపాటు డ్రోన్ ఉపయోగించి పురుగుమందులు పిచికారి చేసి రూ.3లక్షల వరకు ఆదాయం పొందారు.స్వాతంత్య్ర దిన వేడుకలకు హాజరు..ఢిల్లీలో 2024 ఆగస్టు 15న జరిగిన స్వాతంత్య్ర దిన వేడుకలను తిలకించేందుకు డ్రోన్ పైలట్లకు కేంద్రం ప్రత్యేక ఆహ్వానం పంపింది. వైఎస్సార్ జిల్లా నుంచి జ్యోత్స్న వెళ్లి స్వాతంత్య్ర దిన వేడుకలను తిలకించారు. ఇది తన జీవితంలో మరపురాని ఘట్టమని ఆమె తెలిపారు. కడపలో 2024, జనవరి 26న జరిగిన రిపబ్లిక్ డే ఉత్సవాల్లో డీఆర్డీఏ తరఫున ఆమె డ్రోన్ ఎగురవేసి రూ.25వేలు నగదు బహుమతి పొందారు. -
గగనాన్ని జయించినా..
సూళ్లూరుపేట: భారత క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహ ప్రయోగాల్లో ఇస్రో బాలారిష్టాలను దాటలేకపోతోంది. ఇప్పటికే 7 ఉపగ్రహాలను ప్రయోగించినా అనుకోని సాంకేతిక అవాంతరాలతో సత్ఫలితాలను సాధించలేకపోతోంది. భారత క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహ (ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం) వ్యవస్థలో ఇంకా తప్పటడుగులు పడుతూనే ఉన్నాయి. ఈ ఏడు ఉపగ్రహాల సిరీస్‌లో ఐఆర్ఎన్ఎస్ఎస్–1 ఉపగ్రహం సాంకేతిక లోపంతో పని చేయడం లేదు.దీనిస్థానంలో 2017 ఆగస్ట్ 31న ఐఆర్ఎన్ఎస్ఎస్–1హెచ్ పేరుతో చేసిన ప్రయోగం విఫలమైంది. మళ్లీ ఐఆర్ఎన్ఎస్ఎస్–1ఐ ఉపగ్రహాన్ని ప్రయోగించి ఐఆర్ఎన్ఎస్ఎస్–1ఏ స్థానంలో ప్రవేశపెట్టినప్పటికీ సొంత నావిగేషన్ వ్యవస్థ అందుబాటులోకి రాలేదు. ఇదిలావుండగానే ఈ నావిగేషన్ వ్యవస్థలో సెకండ్ జనరేషన్ శాటిలైట్ వ్యవస్థ పేరుతో నావిక్–01 ఉపగ్రహాన్ని 2023లో ప్రయోగించారు. ఈ ఏడాది జనవరి 31న నావిక్–02 ఉపగ్రహాన్ని ప్రయోగించారు. నావిగేషన్ ఉపగ్రహాల శ్రేణిలో కొన్నింటికి కాలపరిమితి ముగియనుండటంతో వాటి స్థానంలో నావిక్ ఉపగ్రహాలను ప్రవేశపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. నావిక్–02 ఉపగ్రహం జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ నుంచి జియో ఆర్బిట్‌లోకి ఇంకా చేరలేదు. ఉపగ్రహంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అపోజి ఇంధనాన్ని మండించేందుకు ఆక్సిడైజర్ వాల్‌్వలు తెరుచుకోకపోవడం వల్ల కక్ష్య దూరాన్ని పెంచలేకపోతున్నారు. ఈ ఉపగ్రహం కూడా విఫలమైనట్టుగానే ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీంతో భారతదేశానికి సొంత నావిగేషన్ వ్యవస్థ ఎప్పటికి అందుబాటులోకి వస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది.7 ఉపగ్రహాల అవసరాన్ని గుర్తించి..భారతదేశానికి పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నావిగేషన్ సిస్టం తయారు చేసుకోవడానికి ఏడు ఉపగ్రహాల అవసరాన్ని 2006లో ఇస్రో గుర్తించింది. దీనికి రూ.3,425 కోట్ల వ్యయం అవుతుందని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. దీనికి కేంద్రం ఆమోద ముద్ర వేసి బడ్జెట్లో నిధులు కూడా కేటాయించింది. భారత క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థలో మొత్తం ఏడు ఉపగ్రహాలకు రూ.1,000 కోట్లు, రాకెట్లకు రూ.1,125 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ చేపట్టారు. ఈ ఉపగ్రహ వ్యవస్థకు ప్రత్యేకంగా బెంగళూరు సమీపంలోని బైలాలు అనే ప్రాంతంలో రూ.1,300 కోట్లతో గ్రౌండ్ స్టేషన్ నిర్మాణం కూడా చేశారు.సొంత నావిగేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి 2006లోనే ప్రణాళికలు సిద్ధం చేసుకుని 2013 జూన్ 1న ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం (ఐఆర్ఎన్ఎస్ఎస్–1ఏ) ఉపగ్రహ ప్రయోగంతో శ్రీకారం చుట్టారు. 2014 ఏప్రిల్ 4న ఐఆర్ఎన్ఎస్ఎస్–1బీ, అక్టోబర్ 16న ఐఆర్ఎన్ఎస్ఎస్–1సీ, 2015 మార్చి 28న ఐఆర్ఎన్ఎస్ఎస్–1డీ, 2016 జనవరి 20న ఐఆర్ఎన్ఎస్–1ఈ, మార్చి 10న ఐఆర్ఎన్ఎస్ఎస్–1ఎఫ్, ఏప్రిల్ 28న ఐఆర్ఎన్ఎస్ఎస్–1జీ ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.ఇందులో 1ఏ ఉపగ్రహంలో సాంకేతిక లోపం తలెత్తడంతో దీని స్థానంలో 2017 ఆగస్ట్ 31న ఐఆర్ఎన్ఎస్ఎస్–1హెచ్ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. అది విఫలమైంది. తిరిగి 2018 ఏప్రిల్ 12న ఐఆర్ఎన్ఎస్ఎస్–1ఐ ఉపగ్రహాన్ని 1ఏ ఉపగ్రహం స్థానంలో రీప్లేస్ చేశారు. ఇందులో కొన్ని ఉపగ్రహాలకు కాల పరిమితి కూడా ముగియనుండటంతో నావిగేషన్ వ్యవస్థను బలోపేతం చేయడానికి సెకండ్ జనరేషన్ పేరుతో నావిక్–01 సిరీస్‌లో ఐదు ప్రయోగాలకు శ్రీకారం చుట్టగా.. వీటిలో రెండు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇందులో ఒకటి ఉపగ్రహం కక్ష్యలోకి వెళ్లినప్పటికీ దాన్ని భూమికి 36 వేల కిలోమీటర్ల దూరంలోని జియో ఆర్బిట్‌లోకి పంపే ప్రక్రియ సాంకేతిక లోపంతో ఆగిపోయింది. చిన్నచిన్న అవాంతరాలతో తప్పని ఇబ్బందులునావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థలోని 7 ఉపగ్రహాల్లో 3 ఉపగ్రహాలు భూమికి 36 వేల కిలోమీటర్లు ఎత్తులోని భూస్థిర కక్ష్యలో 34 డిగ్రీలు, 83 డిగ్రీలు, 130.5 డిగ్రీ తూర్పు రేఖాంశాల వద్ద కక్ష్యలో ఉండి పనిచేస్తాయి. మిగతా నాలుగు ఉపగ్రహాలు భూమధ్య రేఖలను ఖండించే భూస్థిర కక్ష్యలోనే 55 డిగ్రీలు, 115 డిగ్రీల తూర్పు భూమధ్య రేఖాతలానికి 31 డిగ్రీల వాలుతో ఉండే కక్ష్యలో 12 ఏళ్లపాటు సేవలందిస్తాయి.భూస్థిర కక్ష్యలో వివిధ స్థానాల్లో ఉండి పనిచేయడం ప్రారంభించి స్వదేశీ దిక్సూచి వ్యవస్థను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాల్లో లోపాలు తలెత్తడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భూమి, జల, వాయు మార్గాల స్థితిగతులు దిక్కులు తెలియజేయడం, ఆపద సమయాల్లో భూగోళానికి సంబంధించిన సమాచారం, వాహన చోదకులకు దిశానిర్దేశం, ఇంటర్నెట్తో అనుసంధానం, భారత విమానయాన, నౌకాయాన మార్గాలకు, సైనిక అవసరాలకు కూడా ఈ ఉపగ్రహ వ్యవస్థ అందుబాటులోకి తెచ్చేందుకు నావిగేషన్ సిరీస్ ఉపగ్రహాలను ప్రయోగిస్తూనే ఉన్నప్పటికీ చిన్న చిన్న అవాంతరాల వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే భారతదేశం అంచునుంచి సుమారు 1,500 కిలోమీటర్ల పరిధి వరకు ఈ సేవలు విస్తరించి పనిచేస్తుంది. -
దేశీ మద్యం గుబాళింపులు
ప్రపంచంలో విస్కీని అత్యధికంగా వాడేది భారత్‌లోనే. విశ్వవ్యాప్తంగా తయారయ్యే వీస్కీలో దాదాపు సగం మన దేశంలోనే ఖర్చయిపోతోంది. విస్కీ, రమ్, జిన్, ఓడ్కా, బ్రాండీ... ఇలా అన్ని రకాలూ కలిపి భారత్‌లో మద్యం మార్కెట్ విలువ ఏకంగా రూ.4.59 లక్షల కోట్లకు చేరింది. మరో మూడేళ్లలో రూ.5.59 లక్షల కోట్లకు చేరుకోవచ్చని అంచనా. ఇంతటి భారీ మార్కెట్లో దేశవాళీ మద్యం కూడా తన హవా కొనసాగిస్తోంది. విదేశీ మూలాలున్న విస్కీ, బ్రాండీ, ఓడ్కా లాంటి వాటితో పోలిస్తే స్థానిక రకాలను ప్రేమించే మద్యం ప్రియులు ఎక్కువైపోయారు. వారి అభిరుచికి తగ్గట్లు స్థానిక రకాలకూ స్థానం కల్పించడం బార్లలో ఇప్పుడు పెద్ద ట్రెండ్‌గా మారింది. ఈ ధోరణి నానాటికీ పెరుగుతోందనేందుకు పెరిగిన దేశవాళీ సరకు అమ్మకాలే నిదర్శనం.టోంగ్బా.. జుడియా సిక్కిం, పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లలో టోంగ్బా అనే స్థానిక మద్యం మద్యపాన ప్రియులకు మహా ఇష్టం. అస్సాంలో జుడియా, మణిపూర్‌లో సేక్మాయ్ యూ... ఇలా స్థానిక రుచులకు జనం నానాటికీ ఫిదా అవుతున్నారు. ఇక గోవాలో ఫెనీ చాలా ఫేమస్. ఈ స్థానిక మద్యాన్ని పులియబెట్టిన జీడిపప్పుల నుంచి తయారుచేస్తారు. గోవాలో ఏ మూలన చూసినా, ఏ బార్లో చూసినా విదేశీ మద్యంతో పాటు ఫెనీ కూడా అమ్ముతారు. పలు రాష్ట్రాల నుంచి వచి్చన పర్యాటకులతోపాటు విదేశీ సందర్శకులు కూడా దీన్ని టేస్ట్ చేయకుండా వదిలిపెట్టరు. అందుకే ఇప్పుడక్కడ దీని విక్రయాలు గతంలో పోలిస్తే బాగా పెరిగాయి. ‘‘పోర్చుగీస్ మూలాలున్న ఫెనీకి స్థానిక రుచిని కలపడంతో గోవా సంస్కృతిలో భాగంగా మారింది’’ అని మిస్టర్ బార్ట్రెండర్గా ఇన్‌స్టాలో ఫేమస్ అయిన కాక్టేల్ నిపుణుడు నితిన్ తివారీ చెప్పారు. దేశవ్యాప్తంగా మారిన టేస్ట్శతాబ్దాల చరిత్ర ఉన్న స్థానిక మద్యం రకాలకు దేశవ్యాప్తంగా ప్రాధాన్యం పెరుగుతోంది. దాంతో అవి బార్లలోనూ అందుబాటులోకి వస్తున్నట్టు తులీహో సీఈఓ, 30బెస్ట్బార్స్ ఇండియా, ఇండియా బార్టెండర్ వీక్ సహ వ్యవస్థాపకుడు విక్రమ్ ఆచంట చెప్పారు. ఈ ట్రెండ్ గతేడాది నుంచి మొదలైందని నెట్‌ఫ్లిక్స్ మిడ్నైడ్ ఆసియా కన్సల్టెంట్, ప్రముఖ కాక్టేల్ నిపుణుడు అమీ ష్రాఫ్ వెల్లడించారు. ‘‘స్థానిక మద్యానికి జై కొట్టడానికి ప్రధాన కారణం సోషల్ మీడియాలో యువత చేస్తున్న ప్రచారమే. హిమాచల్‌లో ధాన్యం, గింజలను ఉడకబెట్టి తయారుచేసే రైస్ వైన్ వంటి స్థానిక రకాలకు ఇప్పుడిప్పుడే డిమాండ్ పెరుగుతోంది’’ అని పీసీఓ, ఢిల్లీ జనరల్ మేనేజర్ వికాస్ కుమార్ చెప్పారు. ‘‘ఇదేదో గాలివాటం మార్పు కాదు. పక్కాగా వ్యవస్థీకృతంగా జరుగుతోంది. దేశవాళీ మద్యానికి గుర్తింపు తేవాలని ఇక్కడి కంపెనీలు నడుం బిగించాయి’’ అని డియాజియో ఇండియా చీఫ్ ఇన్నోవేటివ్ ఆఫీసర్ విక్రమ్ దామోదరన్ అన్నారు. విలాస వస్తువుగా..‘‘ఇండియా అగావే, ఫెనీ, మహువా వంటి స్థానిక మద్యం ఆయా ప్రాంతాల్లో మాత్రమే లభిస్తోంది. ఆ రకం కావాలంటే అక్కడికి వెళ్లాల్సిందే. అయినా సరే, రానుపోను ఖర్చులు, బస, ఇతరత్రా ఖర్చులను కూడా లెక్కచేయకుండా ప్రత్యేకంగా అక్కడిదాకా వెళ్లి మద్యం సేవించి రావడం ట్రెండ్‌గా మారింది. దీంతో స్థానికేతరులకు స్థానిక మద్యం కూడా విలాస వస్తువుగా మారుతోంది’’ అని మాయా పిస్టోలా అగావెపురా మద్యం సంస్థ మహిళా సీఈఓ కింబర్లీ పెరీరా చెప్పారు. ‘మహువా రకం మద్యం బ్రిటన్‌కు భారత్ వలసరాజ్యంగా మారకముందు చాలా ఫేమస్. తర్వాత మరుగున పడింది. ఇప్పుడు కొందరు దాంట్లో పలు రుచులు తెస్తున్నారు. వాటిని కాక్టేల్ నిపుణులు మరింత మెరుగుపరుస్తున్నారు. సిక్స్ బ్రదర్స్ మహువా పేరుతో దేశంలోనే తొలిసారిగా లగ్జరీ మహువా మద్యం తెస్తున్నాం’’ అని సౌత్ సీస్ డిస్టిలరీస్ డైరెక్టర్ రూపీ చినోయ్ చెప్పారు. అయితే, ‘‘స్థానిక మద్యం మొత్తానికీ వర్తించే సింగిల్ బ్రాండ్ అంటూ ఇప్పటికైతే ఏమీ లేదు. ఈ సమస్య పరిష్కారమైతే లైసెన్సింగ్ సమస్యలు తీరతాయి. అప్పుడు దేశవాళీ మద్యం అమ్మకాలు, నాణ్యత పెరుగుతాయి’’ అని ఈ రంగ నిపుణులు చెబుతున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఫండ్స్‌లో ‘సిప్’ చేస్తున్నారా..?
‘‘స్మాల్, మిడ్‌క్యాప్‌లో సిప్‌లను ఇక నిలిపేయాల్సిన సమయం వచ్చిందని భావిస్తున్నా. ఎందుకంటే వాటి వేల్యుయేషన్లు చాలా అధిక స్థాయిలో ఉన్నాయి’’ మ్యూచువల్ ఫండ్స్‌లో దశాబ్దాల అనుభవం ఉన్న వెటరన్ ఫండ్ మేనేజర్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ సీఈవో ఎస్.నరేన్ తాజాగా చేసిన సంచలనాత్మక వ్యాఖ్యలు ఇవి. దీంతో స్మాల్, మిడ్‌క్యాప్ విభాగంలో మరింత అమ్మకాల ఒత్తిడి పెరిగిపోయింది. నరేన్ వ్యాఖ్యలు ఇన్వెస్టర్లలో ఆందోళనకు దారితీశాయి. సిప్పై సందేహాలు ఏర్పడ్డాయి. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఈక్విటీ ఫండ్స్‌లోకి నెలవారీ రూ.26 వేల కోట్లకు పైనే పెట్టుబడులు వస్తున్నాయి. దీర్ఘకాల ఆర్థిక లక్ష్యాలకు కావాల్సినంత సమకూర్చుకునేందుకు సిప్ మెరుగైన సాధనమన్న నిపుణుల సూచనలు, ఫండ్స్ పరిశ్రమ ప్రచారంతో ఇన్వెస్టర్లలో దీనిపై ఆకర్షణ పెరిగిపోయింది. వేతన జీవులతోపాటు హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్ (హెచ్ఎన్ఐలు/ధనవంతులు) సైతం సిప్‌కు జై కొడుతున్నారు. అన్ని కాలాలకూ అనువైన సాధనంగా సిప్‌ను భావిస్తుంటే, దీనిపై నరేన్ వ్యాఖ్యలు అయోమయానికి దారితీశాయి. ఈ తరుణంలో అసలు సిప్ దీర్ఘకాల లక్ష్యాల సాధనకు ఏ మేరకు ఉపకరిస్తుంది? ఇందులో ప్రతికూలతలు ఉన్నాయా? తదితర అంశాలపై నిపుణులు ఏమంటున్నారో తెలిపే కథనమిది... సిప్ అంటే..? నిర్ణిత మొత్తం, నిర్ణిత రోజులకు ఒకసారి చొప్పున ఎంపిక చేసుకున్న పథకంలో ఇన్వెస్ట్ చేయడానికి వీలు కల్పించేదే సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్). రోజు/వారం/పక్షం/నెల/మూడు నెలలకోసారి సిప్ చేసుకోవడానికి ఫండ్స్ అనుమతిస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల వద్ద 10.26 కోట్ల సిప్ ఖాతాలుంటే.. వీటి పరిధిలో జనవరి చివరికి మొత్తం రూ.13.12 లక్షల కోట్ల నిర్వహణ ఆస్తులు (ఏయూఎం) ఉన్నాయి. మొత్తం ఈక్విటీ ఫండ్స్ నిర్వహణ ఆస్తుల్లో సిప్‌కు సంబంధించే 40 శాతానికి పైగా ఉన్నాయి. పొదుపు–మదుపులో క్రమశిక్షణ సిప్‌తో నిర్బంధ పొదుపు, మదుపు సాధ్యపడుతుంది. ఇన్వెస్టర్ ప్రమేయం లేకుండా ప్రతి నెలా నిర్ణిత తేదీన నిర్ణీత మొత్తం పెట్టుబడిగా మారిపోతుంది. సిప్ కాకుండా.. ఇన్వెస్టర్ వీలు చూసుకుని ఏక మొత్తంలో పెట్టుబడి పెట్టాలంటే ఎక్కువ సందర్భాల్లో సాధ్యపడకపోవచ్చు. దీర్ఘకాల లక్ష్యాల సాధనకు కావాల్సింది క్రమశిక్షణ. అది సిప్ ద్వారా సాధ్యపడుతుంది.దీర్ఘకాలంలో సంపద సృష్టి 10 ఏళ్లలో కారు కొనుగోలు. 15–20 ఏళ్లలో పిల్లల ఉన్నత విద్య, 25 ఏళ్లకు పిల్లల వివాహాలు, అప్పటికి సొంతిల్లు.. ఇలా ముఖ్యమైన లక్ష్యాలను ప్రణాళికాబద్ధమైన పెట్టుబడులతో సాకారం చేసుకోవచ్చు. ఇలా ప్రతి లక్ష్యానికి నిర్ణీత కాలం అంటూ ఉంది. అన్నేళ్లలో అంత సమకూర్చుకునేందుకు ప్రతి నెలా, ప్రతి ఏటా ఎంత చొప్పున ఇన్వెస్ట్ చేయాలన్నది నిపుణుల సాయంతో తెలుసుకోవాలి. వారు చెప్పిన విధంగా.. మార్కెట్ అస్థిరతలను పట్టించుకోకుండా నియమబద్ధంగా సిప్ పెట్టుబడి చేసుకుంటూ వెళ్లిపోవడమే. దీనివల్ల కాంపౌండింగ్ ప్రయోజనం లభిస్తుంది. కాలాతీతం.. ఈక్విటీ మార్కెట్లు ఎప్పుడు ఎటు వైపు చలిస్తాయో ఇదమిత్థంగా ఎవరూ చెప్పలేరు. ఈ స్థాయి నుంచి ఇంకా పెరుగుతాయని, ఫలానా స్థాయి నుంచి కరెక్షన్కు వెళతాయని.. దిద్దుబాటులో ఫలానా స్థాయిల నుంచి మద్దతు తీసుకుని తిరిగి ర్యాలీ చేస్తాయని.. గమనాన్ని ఎవరూ కచి్చతంగా అంచనా వేయలేరు. మార్కెట్లు సహేతుక స్థాయిలో దిద్దుబాటుకు గురైనప్పుడు ఇన్వెస్ట్ చేస్తే అక్కడి నుంచి దీర్ఘకాలంలో పెట్టుబడిపై అద్భుత రాబడులు వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, దిద్దుబాటు సమయంలో ఎప్పుడు, ఏ స్థాయిల వద్ద ఇన్వెస్ట్ చేయాలనేది సాధారణ రిటైల్ ఇన్వెస్టర్లకు అర్థం కాని విషయం. లమ్సమ్ (ఏకమొత్తం) ఇన్వెస్ట్ చేస్తుంటే, ఒకవేళ మార్కెట్లు గరిష్టాల్లో ఆ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టడం సరైన నిర్ణయం అనిపించుకోదు. ఎందుకంటే అక్కడి నుంచి మార్కెట్లు పతనాన్ని చూస్తే.. రాబడి చూడడానికి చాలా కాలం పట్టొచ్చు. విసిగిపోయిన ఇన్వెస్టర్ నష్టానికి తన పెట్టుబడిని వెనక్కి తీసుకునే ప్రమాదం లేకపోలేదు. ఇలాంటి సమస్యలన్నింటికీ పరిష్కారమే సిప్. మార్కెట్ ర్యాలీ చేస్తోందా? లేక పతనం అవుతోందా? అన్నదానితో సంబంధం లేదు. ఒక పథకంలో ప్రతి నెలా 1వ తేదీన రూ.5,000 ఇన్వెస్ట్ చేయాలని సిప్ దరఖాస్తు సమరి్పస్తే.. కచి్చతంగా ప్రతి నెలా అదే తేదీన బ్యాంక్ ఖాతా నుంచి ఆ మొత్తం డెబిట్ అయి పెట్టుబడి కింద మారుతుంది. దీనివల్ల కొనుగోలు వ్యయం సగటుగా మారుతుంది. ఉదాహరణకు ఎఫ్ అనే పథకంలో రూ.2,000 సిప్ చేస్తున్నారు. ఆ ఫండ్ యూనిట్ ఎన్ఏవీ 2025 జనవరి 1న రూ.40గా ఉంది. దీంతో 50 యూనిట్లు వస్తాయి. ఫిబ్రవరి 1కి కరెక్షన్ వల్ల అదే ఫండ్ ఎన్ఏవీ 34కు తగ్గింది. దీంతో 58.82 యూనిట్లు వస్తాయి. జనవరి నెల సిప్‌తో పోలి్చతే ఫిబ్రవరిలో దిద్దుబాటు వల్ల 8.82 యూనిట్లు అదనంగా వచ్చాయి. మార్చి1న ఫండ్ యూనిట్ ఎన్ఏవీ ఇంకా తగ్గి రూ.32కు దిగొస్తే.. అప్పుడు 62.5 యూనిట్లు వస్తాయి. ఈక్విటీ విలువల్లో మార్పులకు అనుగుణంగా ఫండ్ ఎన్ఏవీ మారుతుంటుంది. దీనికి అనుగుణంగా సిప్ కొనుగోలు సగటు ధర తగ్గుతుంది. దీనివల్ల 10–15–20 ఏళ్లు అంతకుమించిన కాలాల్లో మంచి రాబడులకు అవకాశం ఉంటుందని గత చరిత్ర చెబుతోంది.స్వల్ప మొత్తం... చాలా పథకాల్లో ఏకమొత్తంలో పెట్టుబడి పెట్టాలంటే కనీసం రూ.5,000 అవసరం, కొన్ని పథకాలకు ఇది రూ.1,000గా ఉంది. అదే సిప్ రూపంలో అయితే రూ.500 స్వల్ప మొత్తంతో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఇటీవలే రూ.250 సిప్‌ను (జన్నివే‹Ù) ప్రారంభించింది. రోజువారీ/వారం వారీ అయితే రూ.100 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.కేవలం ఈక్విటీలకేనా..? సిప్ ప్రయోజనం ఎక్కువగా ఈక్విటీ పెట్టుబడులపైనే లభిస్తుంది. డెట్ పెట్టుబడులపై రాబడి వడ్డీ రేట్లపై ఆధారపడి ఉంటుంది. ఈ వడ్డీ రేట్లు ఈక్విటీలంత చంచలంగా ఉండవు. నిర్ణిత సైకిల్ ప్రకారం రేట్లు చలిస్తుంటాయి. డెట్ ఫండ్స్‌లోనూ సిప్ చేసుకోవచ్చు. దీనివల్ల ఈక్విటీల మాదిరి అస్థిరతలను అధిగమించి, రాబడులు పెంచుకునే ప్రత్యేక ప్రయోజనం ఉండదు. డెట్, ఈక్విటీ కలయికతో కూడిన హైబ్రిడ్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్, గోల్డ్ ఫండ్స్‌లో సిప్‌తో మెరుగైన ప్రతిఫలం పొందొచ్చు. సౌలభ్యం.. సిప్ కోసం సమ్మతి తెలిపామంటే.. కచి్చతంగా పెట్టుబడి పెట్టి తీరాలనేమీ లేదు. వీలు కానప్పుడు, లేదా పథకం పనితీరు ఆశించిన విధంగా లేనప్పుడు ఆ సిప్‌ను నిలిపివేసే స్వేచ్ఛ, వెసులుబాటు ఇన్వెస్టర్లకు ఎప్పుడూ ఉంటుంది. మార్కెట్‌తో ముడిపడి.. ప్రతి నెలా రూ.1,000 చొప్పున గత ఐదేళ్లలో రూ.60 వేలు ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేశారని అనుకుందాం. ఏటా 15 శాతం కాంపౌండెడ్ రాబడి వస్తే ఐదేళ్లకు ఆ మొత్తం రూ.90 వేలకు చేరుతుంది. సరిగ్గా ఆ సమయంలో మార్కెట్ 25 శాతం పడిపోయిందనుకుంటే.. రూ.90 వేల పెట్టుబడి కాస్తా.. రూ.67,500కు తగ్గుతుంది. నికర రాబడి రూ.7,500కు తగ్గిపోతుంది. దీంతో వచ్చే వార్షిక కాంపౌండెడ్ రాబడి 4.5 శాతమే. డెట్ సెక్యూరిటీల కంటే తక్కువ. చారిత్రక డేటాను పరిశీలిస్తే లార్జ్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లోనూ పలు సందర్భాల్లో ఐదేళ్ల సిప్ రాబడులు 5 శాతం కాంపౌండెడ్గానే (సీఏజీఆర్) ఉన్నట్టు తెలుస్తుంది. ప్రతికూల రాబడులు వచి్చన సందర్భాలూ ఉన్నాయి. అదే మిడ్, స్మాల్‌క్యాప్ పెట్టుబడులపై ఈ ప్రభావం ఇంకా అధికంగా ఉంటుంది.అనుకూలం/అననుకూలం→ 10 ఏళ్లు అంతకుమించిన కాలానికి, అవసరమైతే 20 ఏళ్లపాటు పెట్టుబడిని కొనసాగించే వెసులుబాటు ఉన్న వారికే సిప్ అనుకూలం. → అధిక రిస్క్ తీసుకునే వారే మిడ్, స్మాల్ క్యాప్‌లో సిప్ చేసుకోవాలి. → సిప్‌తో సగటు కొనుగోలు ధర తగ్గుతుందన్నది సాధారణంగా చెప్పే భాష్యం. కానీ, ఈక్విటీలు కొంత కాలం పాటు భారీ దిద్దుబాటు అన్నదే లేకుండా అదే పనిగా ర్యాలీ చేస్తూ వెళ్లి.. అక్కడి నుంచి భారీ పతనంతో కొన్నేళ్లపాటు బేర్ గుప్పిట కొనసాగితే రాబడులు కళ్లజూసేందుకు కొన్నేళ్లపాటు వేచి చూడాల్సి రావచ్చు. → సిప్ మొదలు పెట్టిన తర్వాత మార్కెట్లు కుదేలైతే.. పెట్టుబడి విలువ క్షీణతను ఎంత వరకు భరించగలరు? అని ప్రశి్నంచుకోవాలి. 50–60 శాతం పడిపోయినా ఓపిక వహించే వారికే అనుకూలం. → ‘ఈక్విటీ పెట్టుబడులు సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్’ అన్న హెచ్చరికను కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. మార్కెట్ల పనితీరు మెరుగ్గా ఉంటేనే సిప్పై మెరుగైన రాబడి వస్తుంది. అంతేకానీ సిప్పై లాభానికి గ్యారంటీ లేదు.అధిక రాబడులు ఎలా ఒడిసిపట్టాలి..? సిప్ చేస్తూనే.. మార్కెట్ పతనాల్లో పెట్టుబడిని రెట్టింపు చేయాలి. ఉదాహరణకు ప్రతి నెలా రూ.5,000 సిప్ చేస్తుంటే.. మార్కెట్ దిద్దుబాటు సమయంలో రూ.10,000 చొప్పున ఇన్వెస్ట్ చేయాలి. దిద్దుబాటు ముగిసి, బుల్ ర్యాలీ మొదలైన తర్వాత అదనపు సిప్‌ను నిలిపివేసుకోవచ్చు. 10 ఏళ్లకు మించిన సిప్ పెట్టుబడులపై రాబడిని స్వల్ప స్థాయి కరెక్షన్లు తుడిచి పెట్టేయలేవు. అదే 15–20 ఏళ్లు, అంతకుమించిన దీర్ఘకాలంలో రాబడులు మరింత దృఢంగా ఉంటాయి. ఒకవేళ పెట్టుబడిని ఉపసంహరించుకునే సమయంలో మార్కెట్ కరెక్షన్లోకి వెళితే, తిరిగి కోలుకునే వరకు లక్ష్యాన్ని వాయిదా వేసుకోవడమే మార్గం. ఇలాంటి పరిస్థితిని నివారించాలంటే.. ఆర్థిక లక్ష్యానికి రెండేళ్ల ముందు నుంచే క్రమంగా సిప్ పెట్టుబడులను విక్రయిస్తూ డెట్‌లోకి పెట్టుబడులు మళ్లించాలి. చివరి మూడేళ్ల పాటు ఈక్విటీ పథకంలో కాకుండా డెట్ ఫండ్‌లో సిప్ చేసుకోవాలి. ప్రత్యామ్నాయాలు.. పెట్టుబడులు అన్నింటినీ ఈక్విటీలకు కేటాయించుకోకూడదు. ఈక్విటీ, డెట్, బంగారం, రీట్, ఇని్వట్లతో కూడిన పోర్ట్‌ఫోలియో ఉండాలి. ఈక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్స్, గోల్డ్ ఫండ్స్‌లో వేర్వేరుగా పెట్టుబడి పెట్టుకోవాలి. ఆర్థిక ప్రతికూల పరిస్థితుల్లో పెట్టుబడుల ఉపసంహరణ అవసరమైతే ఈక్విటీ పెట్టుబడులను కదపకుండా.. డెట్, గోల్డ్ తదితర ఫండ్స్ నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకోవచ్చు. సిప్ ఎప్పుడు స్టాప్ చేయాలి? → ఒక పథకం గతంలో మెరుగైన రాబడి ఇచి్చందని అందులో ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తుంటారు. భవిష్యత్తులోనూ అదే స్థాయి రాబడిని ఆ పథకం నుంచి ఆశిస్తుంటారు. ఒక పథకం 3, 5, 10 ఏళ్లలో సగటున మెరుగైన ప్రతిఫలం ఇచ్చి ఉండొచ్చు. కానీ ఆయా కాలాలను మరింత లోతుగా విశ్లేషిస్తే మధ్యలో ఒక్కో ఏడాది తక్కువ, ప్రతికూల రాబడులు ఇచి్చన సందర్భాలూ ఉంటాయి. సిప్ మొదలు పెట్టిన తొలి ఏడాదే రాబడిని ఆశించడం అన్ని వేళలా అనుకూలం కాదు. కనీసం రెండు మూడేళ్లకు గానీ పథకం అసలు పనితీరు విశ్లేషణకు అందదు. అందుకే ఒక పథకం ఎంపిక చేసుకునే ముందు.. ఆ విభాగంలోని ఇతర పథకాలతో పోల్చి చూసినప్పుడు రాబడి మెరుగ్గా ఉందా? కనీసం సమానంగా అయినా ఉందా అన్నది నిర్ధారించుకోవాలి. → ఒక ఫండ్ మేనేజర్ పనితీరు నచ్చి పథకంలో సిప్ చేయడం మొదలు పెట్టారు. తర్వాతి కాలంలో ఆ మేనేజర్ మరో సంస్థకు మారిపోయారు. అప్పుడు కొత్తగా వచ్చిన ఫండ్ మేనేజర్ చరిత్రను ట్రాక్ చేయాలి. → పై రెండు ఉదాహరణల్లోనూ పథకం పనితీరు ఆశించిన విధంగా లేకపోతే సిప్ నిలిపివేయొచ్చు. ప్రతికూల రాబడులు ఇటీవలి మార్కెట్ పతనంతో 26 స్మాల్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో ఏడాది కాల సిప్ పెట్టుబడులపై రాబడి ప్రతికూలంగా మారింది. అంటే నికర నష్టంలోకి వెళ్లింది. క్వాంట్ స్మాల్‌క్యాప్ ఫండ్‌లో సిప్ పెట్టుబడిపై ఎక్స్ఐఆర్ఆర్ (రాబడి) మైనస్ 22.45 శాతంగా మారింది. మహీంద్రా మాన్యులైఫ్ స్మాల్‌క్యాప్ ఫండ్‌లో మైనస్ 21.84 శాతంగా మారింది. ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్ కంపెనీస్ ఫండ్ ఎక్స్ఐఆర్ఆర్ మైనస్ 18.25 శాతంగా ఉంది. ఇవే పథకాలు రెండేళ్లు, మూడేళ్లు, ఐదేళ్ల సిప్‌లపై డబుల్ డిజిట్ రాబడులు అందించడం గమనార్హం. దశాబ్దాల పాటు కుదేలైతే..? జపాన్ ‘నికాయ్ 225’ ఇండెక్స్ 1989 డిసెంబర్లో చూసిన 38,271 గరిష్ట స్థాయి నుంచి 2009 ఫిబ్రవరిలో 7,416 కనిష్ట స్థాయికి పతనమైంది. నెమ్మదిగా కోలుకుంటూ 35 ఏళ్ల తర్వాత.. 2024 మార్చిలో తిరిగి 1989 నాటి గరిష్ట స్థాయిని అధిగమించింది. రియల్ ఎస్టేట్ బబుల్ బద్దలు కావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. 1989 డిసెంబర్ నాటి ముందు వరకు సిప్ లేదా లమ్సమ్ రూపంలో జపాన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకుని, దీర్ఘకాలం పాటు వేచి చూసే అవకాశం లేని వారు.. ఆ తర్వాత నష్టానికి అమ్ముకోవాల్సిన పరిస్థితిలో ఉండిపోయారు. స్టాక్ మార్కెట్ ర్యాలీ ఆర్థిక వృద్ధిపైనే ఆధారపడి ఉంటుంది. జపాన్ ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలం పాటు స్తబ్దుగా కొనసాగడం వల్లే ఇన్నేళ్లపాటు అక్కడి మార్కెట్ ర్యాలీ చేయలేదు. ప్రస్తుతం చైనాలోనూ ఇలాంటి వాతావరణమే నడుస్తోంది. అలాంటి పరిస్థితులు భారత్ మాదిరి వర్ధమాన దేశాలకు అరుదు. నరేన్ ఏం చెబుతున్నారు? అర్థం, పర్థం లేని అధిక విలువలకు చేరిన అస్సెట్ క్లాస్‌లో (అది స్మాల్ లేదా మిడ్ లేదా మరొకటి అయినా) ఇన్వెస్ట్ చేస్తే ఆ తర్వాత కొన్నేళ్ల పాటు ఆ సిప్‌లపై రాబడి రాదన్నది నరేన్ విశ్లేషణగా ఉంది. ఇందుకు 2006 నుంచి 2013 మధ్య కాలాన్ని ప్రస్తావించారు. ఆ కాలంలో స్మాల్, మిడ్‌క్యాప్ ఫండ్స్‌లో సిప్ చేసిన వారికి ఎలాంటి రాబడులు రాలేదని చెప్పారు. కనీసం 20 ఏళ్లపాటు తమ పెట్టుబడులను కొనసాగించే వారికే స్మాల్, మిడ్‌క్యాప్ పెట్టుబడులకు మంచి వేదికలు అవుతాయన్నారు. అంతకాలం పాటు ఆగలేని వారికి మల్టిక్యాప్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్ లేదా మల్టీ అస్సెట్ ఫండ్స్ అనుకూలమని చెప్పారు. నరేన్ అభిప్రాయాలతో ఎడెల్వీజ్ మ్యూచువల్ ఫండ్ సీఈవో రాధికా గుప్తా విభేధించారు. ‘‘2006 గరిష్టాల నుంచి 2013 కనిష్టాల మధ్య రాబడులను చూస్తే అంత మంచిగా కనిపించవు. కానీ, మార్కెట్లో అలాంటివి సాధారణమే. మార్కెట్లో సంపద సృష్టి జరగాలంటే కనీసం 10 ఏళ్లు అంతకుమించిన కాలానికి సిప్ ద్వారా పెట్టుబడి పెట్టుకోవడం అవసరం’’ అని రాధికా గుప్తా సూచించారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
వన్యప్రాణులతో హాయ్.. హాయ్
ఠీవిగా నడిచే సింహం...మెడ సాగదీసే జిరాఫీ,.. ఘీంకరించే ఏనుగులు...గాల్లో బెలూన్లను అందుకునే డాల్ఫీన్స్... ఇలా వివిధ రకాల జంతువులను వాటి సహజ ఆవాసాలను పోలి ఉండే వాతావరణంలో దగ్గరగా వీక్షిస్తూ ఉల్లాసంగా గడిపేలా ఇండోనేసియా పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఇవేకాక... చిన్నారులను సైతం ఆకట్టుకునేలా సెంట్రల్జావా, సోలో సఫారీ డినోరైడ్, సవన్నాజిప్లైన్, గోకార్ట్ వంటివి ఏర్పాటు చేసింది.సాక్షి, అమరావతి: వన్యప్రాణి పర్యాటకంపై ఇండోనేసియా దృష్టి సారించింది. ప్రకృతి ఒడిలోకి పర్యాటకులను ఆహ్వానిస్తోంది. ఆసియాలో... ఆఫ్రికాను పోలిన సఫారీ అనుభవాన్ని అందిస్తోంది. వీసా నిబంధనలను సైతం సరళతరం చేసింది. 2025 నాటికి కోటిన్నర మంది విదేశీ పర్యాటకులను ఆకర్షించాలనేది లక్ష్యం. ఈక్రమంలో భారతీయ మార్కెట్‌పైనే ఎక్కువ ఆశలు పెట్టుకుంది. దీంతో ఇప్పుడు భారత్‌తో సహా 97 దేశాలకు చెందిన ప్రయాణికులు ఆన్లైన్లో వీసాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇకపై ఈ–వీసా ఆన్ అరైవల్స్‌లో ఇండోనేసియా చుట్టిరావచ్చు. వాస్తవానికి ఇండోనేసియా ఇన్»ౌండ్ వేగంగా విస్తరిస్తోంది. భారత్ నుంచి వచ్చే ప్రయాణికులతో గణనీయమైన వృద్ధిని సాధిస్తోంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్–2024 డేటా ప్రకారం ఇండోనేసియాను సందర్శించే భారతీయ పర్యాటకుల సంఖ్య 7.10 లక్షలకు చేరుకుంది. ఇది గతేడాదికంటే 17.20 శాతం పెరుగుదలను నమోదు చేయడం విశేషం. కుటుంబంతో సహా విహార, సాహస యాత్రలు, బీచ్ అందాలు, సాంస్కృతిక పర్యటనల సమ్మేళనంతో ఇండోనేసియా భారతీయ పర్యాటకులకు స్వాగతం పలుకుతోంది. ఈ క్రమంలోనే ‘తమన్ సఫారీ’ ఒక ప్రధాన వన్యప్రాణుల గమ్యస్థానంగా మారింది. కంగారూలూ కనిపిస్తాయితమన్ సఫారీ ప్రిజెన్లో ప్రయాణికులకు ఆ్రస్టేలియా వన్యప్రాణులను పరిచయం చేస్తుంది. కంగారూలు, వొంబాట్స్, ఈములతో పాటు త్వరలో కోలాస్ వంటి జంతువులు సందర్శించవచ్చు. ఇక్కడ చిన్నచిన్న ఏటీవీ వాహనాల్లో సాహస యాత్రలు కూడా చేయవచ్చు. సెంట్రల్ జావా, సోలో సఫారీ డినోరైడ్, సవన్నా జిప్‌లైన్, గోకార్ట్ వంటివి చిన్నారులకు మంచి అనుభవాలను అందిస్తున్నాయి. సింహాలను చూస్తూ భోజనం చేయవచ్చు. తమన్ సఫారీ బాలిలో కొమోడో డ్రాగన్లు, ఒరంగుటాన్లు (కోతిజాతి), స్టార్లింగ్ పక్షుల అందాలను వీక్షించొచ్చు. ప్రిడేటర్ ఫీడింగ్ సెషన్లు, జీప్ సఫారీలు వంటి సాహస యాత్రలు ఉంటాయి. నీటి కింద భోజనం చేస్తూ వరుణ షో, అగుంగ్షోల ద్వారా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో సంస్కృతి ప్రదర్శనలు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తాయి. జకార్తా అక్వేరియం సఫారీలో మెరై్మడ్ షోలు, అక్వాట్రెక్కింగ్, అండర్ వాటర్ ఫాంటసీ డైనింగ్లు ఉంటాయి. వీటితో సఫారీల్లో విభిన్న ఆహార ప్రాధాన్యతలను అందిస్తున్నాయి. సందర్శకులకు మొక్కల ఆధారిత వంటకాలనూ అందిస్తున్నాయి.ఆకట్టుకుంటున్న బహుళ సఫారీ పార్కులు వివిధ దేశాల్లో ఉన్న జూ మాదిరిగా కాకుండా ఆఫ్రికా తరహాలో జంతువుల మధ్య వాహనాల్లో ప్రయాణిస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించేలా ‘తమన్ సఫారీ’ సాహస యాత్రను తలపిస్తోంది. ఇక్కడ జంతువులను వాటి సహజ ఆవాసాలను పోలి ఉండే వాతావరణంలో వీక్షించవచ్చు. పర్యాటకులను ఆకర్షించే లక్ష్యంతో ఇండోనేసియా... ప్రధాన విమానాశ్రయాలు, పర్యాటక కేంద్రాలకు సమీపంలోనే సఫారీలను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం ఇండోనేసియాలో బహుళ సఫారీ పార్కుల యాత్రలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో తమన్ సఫారీ బోగోర్ (పశ్చిమ జావా), తమన్సఫారీ ప్రిజెన్ (తూర్పు జావా), తమన్ సఫారీ బాలి, సోలో సఫారీ (సెంట్రల్ జావా), జకార్తా అక్వేరియం సఫారీ సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. నైట్ సఫారీ..24 గంటలూ సాహసం! ఇండోనేసియా సఫారీల్లో ప్రతిదానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇందులో తమన్ సఫారీ బోగోర్ 24 గంటల పాటు వన్యప్రాణుల మధ్య సాహసయాత్రలను నిర్వహిస్తోంది. అందుకే అత్యధిక సందర్శకులు దీనికే క్యూ కడుతున్నారు. ప్రయాణించే వాహనంలో భోజన సదుపాయాలు సైతం కల్పిస్తుండటంతో రోజంతా చుట్టిరావచ్చు. సింహాలు, జిరాఫీలు, ఏనుగులతో పాటు వివిధ దేశాల జంతువులను చూడొచ్చు. దీనికి తోడు డాల్ఫీన్లతో ఈతకొట్టడం, పెంగ్విన్లకు ఆహారం అందించడం వంటి అనుభవాలు పొందవచ్చు. ముఖ్యంగా పర్యాటకులు రాత్రిపూట కూడా వన్యప్రాణులను చూసేలా నైట్ సఫారీ ఉంది. అక్కడే రిసార్టుల్లో బస చేసేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. -
వీసా గోల్డెన్ చాన్సేనా?
గోల్డ్ కార్డ్ వీసా.. ప్రపంచవ్యాప్తంగా కొత్త చర్చకు దారితీసిన టాపిక్ ఇది. అత్యంత గౌరవంగా భావించే అమెరికా పౌరసత్వం (US Citizenship) కోసం ట్రంప్ సర్కార్ తెచ్చిన ఈ కొత్త విధానం ఎంత మందిని ఆకట్టుకుంటుంది? అమెరికన్ కంపెనీలు ఈ పథకాన్ని ఉపయోగించి భారతీయులు సహా విదేశీ విద్యార్థులను, ప్రతిభావంతులను నియమించుకోవచ్చని ట్రంప్ అన్నారు. ట్రంప్ కేవలం పౌరసత్వ కలను అమ్ముకోవడం ద్వారా లాభం పొందాలని కోరుకోవడం లేదు. అమెరికన్ కంపెనీలు మంచి నిపుణులను నియమించుకోవడానికి వీలవుతుందని అంటున్నారు. వ్యాపారం పరంగా ఈ ఆఫర్ అమెరికన్ కంపెనీలకు ఆకర్షణీయమేనా? భారతీయులకు ప్రయోజనం చేకూరుస్తుందా? ఒక కోటి గోల్డ్ కార్డులు అమ్మడం ద్వారా అమెరికా (America) అప్పులు తొలగిపోతాయని ట్రంప్ పేర్కొంటున్నారు. కానీ రూ.43.7 కోట్ల విలువైన వీసాను కొనగలిగే అతి ధనవంతులు అమెరికా వెలుపల ఎంతమంది ఉన్నారనేదే ఇక్కడ ప్రశ్న. మరోవైపు పౌరసత్వం సరే.. పన్ను నిబంధనలపై అనిశ్చితి కారణంగా గోల్డ్‌కార్డు (Gold Card)ను తీసుకునేవారు తక్కువగా ఉంటారని నిపుణులు అంటున్నారు. – సాక్షి, బిజినెస్ బ్యూరోట్రంప్ లక్ష్యం అంత సులభమేమీ కాదు..ఒక కోటి గోల్డ్ కార్డుల అమ్మకాలు అమెరికా రుణభారాన్ని తుడిచిపెట్టగలవని ట్రంప్ అంటున్నారు. కానీ ఏకంగా రూ.43.7 కోట్లు వెచ్చించగల స్తోమత ఉన్న ధనవంతులు అమెరికా వెలుపల ఎంత మంది ఉన్నారు? క్రెడిట్ స్విస్ గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ ప్రకారం 2022లో ప్రపంచవ్యాప్తంగా 5–10 మిలియన్ డాలర్ల సంపద పరిధిలోని ధనికుల సంఖ్య 51 లక్షలు. ఇందులో 10 మిలియన్ డాలర్లకుపైగా ఉన్నవారు 28లక్షల మంది. ఇలాంటప్పుడు ఒక కోటి మంది గోల్డ్‌కార్డ్ కొనుగోలుదారులను పొందడం సాధ్యమయ్యేదేనా? అన్న సందేహాలు వస్తున్నాయి. రష్యా, చైనా, ఆగ్నేయాసియా నుంచి ధనవంతులు డబ్బు సంచులతో అమెరికాకు వస్తారని ట్రంప్ ఆశిస్తున్నారేమోగానీ.. విదేశీ బిలియనీర్లు గోల్డ్ కార్డ్‌ను తీసుకుంటారా? అని ఇమిగ్రేషన్ నిపుణులే పేర్కొంటున్నారు. గోల్డ్కార్డ్పై తలెత్తుతున్న ప్రశ్నలెన్నో.. » ఈ కార్యక్రమం ద్వారా అమెరికన్ పౌరసత్వాన్ని అమ్మకానికి పెట్టడం, యోగ్యత కంటే డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వడం వంటివాటిని ప్రతిభావంతులైన నిపుణుల ఖర్చుతో ధనవంతుల అవసరాలను తీర్చడంగా చూడవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. » గోల్డ్ కార్డుల వల్ల బలమైన నియంత్రణ, తనిఖీలు లేనప్పుడు పెట్టుబడి అంశంతో కూడిన ఇమిగ్రేషన్ కార్యక్రమాలు మనీలాండరింగ్‌కు, విదేశాల ప్రభావానికి గురయ్యే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఇది రష్యన్ సామ్రాజ్యవాదులకు అమెరికా తలుపులు తెరుస్తుందా అని అడిగినప్పుడు ట్రంప్ ఉదాసీనంగా సమాధానమిచ్చారు. ‘అవును. నాకు కొందరు రష్యన్ సామ్రాజ్యవాదులు తెలుసు. వారు చాలా మంచి వ్యక్తులు’అని పేర్కొన్నారు. » ఉద్యోగాలను సృష్టించే సంస్థలలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేకుండా గోల్డ్ కార్డ్ వస్తే.. చాలా మంది ధనవంతులు యూఎస్ ఆర్థిక వ్యవస్థకు ఎటువంటి తోడ్పాటు ఏమీ ఇవ్వకుండా నివాసం ఉండవచ్చనే ఆందోళనలు ఉన్నాయి. » కెనడాలో ఇలాంటి కార్యక్రమాన్ని తక్కువ పెట్టుబడితోనే ప్రారంభించారు. కానీ అది విపరీతంగా దుర్వినియోగం కావడంతో రద్దు చేశారు. ముందున్న సవాళ్లు రెండు.. ప్రతినిధుల సభ కాంగ్రెస్‌లో.. వలస విధానంలో ఏదైనా ముఖ్య మార్పును అమెరికా ప్రతినిధుల సభ కాంగ్రెస్ ఆమోదించాలి. ప్రస్తుతం రిపబ్లికన్ పార్టీ కి ఉభయ సభలలో మెజారిటీ ఉంది. కానీ అమెరికన్ పౌరసత్వాన్ని అమ్ముకుంటున్నారన్న ఆరోపణల నేపథ్యంలో అందరు రిపబ్లికన్లు సమర్థించకపోవచ్చు. డెమొక్రాట్లు ఈ ప్రతిపాదనను దాదాపుగా వ్యతిరేకిస్తారు. కోర్టులలో..అమెరికాలో చాలా చట్టపరమైన సవాళ్లు వీసా కార్యక్రమాల నిర్వహణ నుంచే ఉత్పన్నమవుతాయి. ట్రంప్ గోల్డ్ కార్డ్ ఎలాంటి చట్టపర సవాళ్లను ఎదుర్కొంటుందో ఊహించడం కష్టమేనని నిపుణులు అంటున్నారు. భారతీయులు–గోల్డ్ కార్డ్..కాన్సులర్ ప్రాసెసింగ్ ఉపయోగించి 2022–23లో ఈబీ–5 కార్యక్రమం ద్వారా 631 మంది భారతీయులు మాత్రమే యూఎస్ గ్రీన్‌కార్డులను పొందారు. ఈ పథకానికి రూ.9.17 కోట్లు పెట్టుబడి మాత్రమే అవసరం. అలాంటిది రూ.43.7 కోట్లపైన చెల్లించి గ్రీన్‌కార్డ్ కొనాలనే ఆలోచన చాలా మంది భారతీయులకు ఆకర్షణీయంగా కనిపించే అవకాశం లేదని యూఎస్ న్యాయవాది, అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ సభ్యురాలు రవనీత్ కౌర్ బ్రార్ అభిప్రాయపడ్డారు. గోల్డ్ కార్డ్ వీసా అంటే? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ను ఈ వారమే ఆవిష్కరించారు. ఇది విదేశీ పెట్టుబడిదారులకు అమెరికా పౌరసత్వం పొందేందుకు రాచమార్గం. అమెరికా గ్రీన్కార్డ్కు ఖరీదైన ప్రత్యామ్నాయం కూడా. గోల్డ్ కార్డ్ కోరుకునేవారు యూఎస్ ప్రభుత్వానికి 5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.43.7 కోట్లు) చెల్లించాలి. ఈ వీసా విధివిధానాలు రెండు వారాల్లో వెలువడనున్నాయి. గోల్డ్ కార్డ్ హోల్డర్లు అమెరికా వెలుపల సంపాదించిన ఆదాయంపై పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. దేశీయంగా (యూఎస్‌లో) ఆర్జించే ఆదాయాలపై పూర్తి పన్నులు చెల్లించాల్సి ఉంటుందని ట్రంప్ స్పష్టం చేశారు. గోల్డ్‌కార్డుల విక్రయం ద్వారా పెద్ద పన్ను చెల్లింపుదారులు, ఉద్యోగ సృష్టికర్తలు అమెరికాకు సమకూరుతారని ట్రంప్ అన్నారు. అప్పుల భారం తగ్గించుకునేందుకు.. గోల్డ్ కార్డ్ విధానం అమెరికా రుణాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘మేం కోటి కార్డులు అమ్మితే 50 ట్రిలియన్ డాలర్లు (రూ.43,70,00,000 కోట్లు) సమకూరుతుంది. మాకు 35 ట్రిలియన్ డాలర్ల (రూ.30,59,00,000 కోట్లు) అప్పు ఉంది’’అని ఆయన పేర్కొన్నారు. అసాధారణ ప్రతిభ ఉన్న దరఖాస్తుదారులను స్పాన్సర్ చేయడం కోసం కంపెనీలను అనుమతించే నిబంధనలను గోల్డ్ కార్డ్‌లో చేర్చవచ్చని ట్రంప్ చెప్పారు. యాపిల్ వంటి సంస్థలు తాము నియమించుకోవాలనుకునే అగ్రశ్రేణి ప్రతిభావంతులకు గోల్డ్ కార్డులను స్పాన్సర్ చేయవచ్చన్నారు. ఆ రెండింటి మధ్య వ్యత్యాసం ఇదే.. ప్రస్తుత ఈబీ–5 వీసా స్థానంలో గోల్డ్ కార్డ్ రానుంది. యూఎస్ సిటిజన్‌షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్ నిర్వహించే ఈబీ–5 ఇమిగ్రెంట్ ఇన్వెస్టర్ ప్రోగ్రామ్‌ను 1990లో అమెరికా ప్రజాప్రతినిధుల సభ అయిన కాంగ్రెస్ రూపొందించింది. విదేశీ పెట్టుబడిదారుల ద్వారా అమెరికాలో ఉద్యోగ సృష్టి, మూలధన పెట్టుబడి ద్వారా ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు దానిని అమలు చేస్తున్నారు. ఈబీ–5 వీసా కోసం 10,50,000 డాలర్ల (రూ.9.17 కోట్లు) పెట్టుబడి అవసరం. ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాల్లో అయితే 8,00,000 డాలర్లు (రూ.6.99 కోట్లు) పెట్టుబడి పెట్టినా సరిపోతుంది. దీనికితోడు కనీసం 10 మంది అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించాలి. దీనిద్వారా సాధారణంగా 3–5 ఏళ్లలో గ్రీన్‌కార్డ్ అందుకోవచ్చు. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్న 2019లో ఈ పరిమితిని 9,00,000 డాలర్లకు (రూ.7.8 కోట్లకు) పెంచాలన్న ప్రయత్నం జరిగింది. కానీ ఫెడరల్ కోర్టు అడ్డుకుంది. అమెరికా ఏటా 10,000 ఈబీ–5 వీసాలను జారీ చేస్తోంది. ప్రతి దేశానికి గరిష్టంగా 7% వీసాలు ఇస్తారు. ఈబీ–5 వీసా కావాల్సినవారు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అదే కొత్త గోల్డ్ కార్డ్ అయితే ఒకసారి కొనుక్కుంటే చాలు. పెట్టుబడి, ఉద్యోగ కల్పన భారం ఉండదు. దశాబ్దంలో 3,800 మంది.. హెచ్–1బీ, ఈబీ–2, లేదా ఈబీ–3 వీసాలపై యూఎస్‌లో ఉన్న భారతీయ వలసదారులు గోల్డ్ కార్డ్ వీసా కోసం దరఖాస్తు చేసుకుని అక్కడి పౌరసత్వాన్ని అందుకోవచ్చు. వర్క్ వీసాలు, ముఖ్యంగా హెచ్–1బీ వీసాల కోసం భారత్ నుంచి అత్యధిక డిమాండ్ ఉంది. గోల్డ్ కార్డ్ వీసా హోల్డర్ల రాక వల్ల.. ఇతర వీసా హోల్డర్లు గ్రీన్‌కార్డుల కోసం వేచిఉండాల్సి వస్తుందనే ఆందోళన ఉంది. అమెరికాలో గ్రీన్‌కార్డ్ (శాశ్వత చట్టపర నివాస అనుమతి) కోసం వేచి ఉండే సమయం భారతీయులకు చాలా ఎక్కువ. కొన్నిసార్లు దశాబ్దాల సమయం పడుతోంది. అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులకు ఓ–1 వీసా మెరుగైన ప్రత్యామ్నాయమని.. దానిద్వారా సులభంగా ఈబీ–1 గ్రీన్కార్డ్లోకి మారవచ్చని ఇమిగ్రేషన్ నిపుణులు చెబుతున్నారు. ఇది ఇతర ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డ్ విభాగాల్లా కాకుండా తక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉంటుందని పేర్కొంటున్నారు. ఇక వ్యాపార సంస్థల యజమానులు, కీలక స్థానాల్లో ఉన్న ఉద్యోగులు ఎల్–1 వీసాను పరిగణించవచ్చు. ఈబీ–5 వీసా కోసం చూస్తున్నవారు ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో.. దానిని రద్దు చేయడానికి ముందే త్వరపడాలనే ఆత్రుత కనిపిస్తోంది. అయితే ఈబీ–5 వీసా రద్దు చేయాలంటే అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం అవసరమని ఇమిగ్రేషన్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గత దశాబ్దంలో దాదాపు 3,800 మంది భారతీయులు ఈబీ–5 వీసాతో అమెరికా వెళ్లారని అంచనా. 100కుపైగా దేశాల్లో సంపన్నులకు గోల్డెన్ వీసాలు ప్రపంచవ్యాప్తంగా 100కుపైగా దేశాలు సంపన్నులకు గోల్డెన్ వీసాలు ఇస్తున్నాయి. యూరప్, ఇతర ప్రాంతాల్లోని చాలా దేశాలు పెట్టుబడి కార్యక్రమాల ద్వారా పౌరసత్వాన్ని ఆఫర్ చేస్తున్నాయి. తమ దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదపడే వారికి మాల్టా పౌరసత్వాన్ని అందిస్తోంది. ఆ విధానం ఉత్తమమైనదని హ్యాన్లీ సిటిజన్‌షిప్ ప్రోగ్రామ్ ఇండెక్స్ పేర్కొనడం గమనార్హం. మాల్టా పౌరసత్వం పొందాలంటే కనీసం €6,00,000 యూరోల (రూ.5.45 కోట్లు) పెట్టుబడితోపాటు అక్కడ కనీసం 36 నెలల పాటు నివాసం ఉండాలి. లేదా 12 నెలలు అక్కడ నివసించిన తర్వాత €7,50,000 యూరోలు (రూ.6.82 కోట్లు) ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. హ్యాన్లీ ఇండెక్స్ టాప్–10 జాబితాలో ఆ్రస్టియా, గ్రెనాడా, యాంటీగ్వా అండ్ బాబూడా, నౌరూ, సెయింట్ కిట్స్ ఉన్నాయి. తమ లాభాలను పెంచుకోవాలని చూస్తున్న అంతర్జాతీయ వ్యాపారులకు ఇవి ఆకర్షణీయ పన్ను స్వర్గధామాలు (ట్యాక్స్ హెవెన్స్) కూడా. ఇక హ్యాన్లీ గ్లోబల్ రెసిడెన్స్ ప్రోగ్రామ్ ఇండెక్స్ జాబితాలో గ్రీస్ అగ్రస్థానంలో ఉంది. తరువాతి స్థానాన్ని స్విట్జర్లాండ్ కైవసం చేసుకుంది. సంపన్న భారతీయులకు ఇష్టమైన గమ్యస్థానంగా నిలిచిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కనీసం 5,45,000 డాలర్ల (రూ.4.76 కోట్లు) పెట్టుబడితో గోల్డెన్ వీసా రెసిడెన్స్ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తోంది. -
అంతర్జాతీయ ఆవాసం!
అవును. ఈ బుల్లి ఇల్లు నిజంగానే రెండు దేశాల పరిధిలో విస్తరించింది! ఈ గమ్మత్తైన ఇల్లు ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్‌లోని లోంగ్వా గ్రామంలో ఉంది. ఇది కాస్త భారత్‌లో, మిగతా భాగం మయన్మార్ పరిధిలో ఉంటుంది! భారత్, మయన్మార్ సరిహద్దు సరిగ్గా ఈ గ్రామం నడుమగా పోవడమే దీనికి కారణం. ప్రధాన ద్వారానికి ఆ పక్క సగంపై నాగాలాండ్ (భారత్), ఈ పక్క సగంపై సగాయింగ్ (మయన్మార్) అని రాసి ఉంటుంది కూడా. ఇంటి బయట ఠీవిగా నుంచున్నది దాని యజమాని టోనెయ్ ప్వాంగ్. అన్నట్టూ, ఆయన స్థానిక కోన్యాక్ నాగా గిరిజన తెగ నాయకుడు కూడా. ఆరకంగా చూస్తే ఆయన నివాసం లోంగ్వా గ్రామం మొత్తానికీ రాజప్రాసాదం వంటిదన్నమాట. ఈ ఇంటికి 100 ఏళ్ల పై చిలుకు చరిత్ర ఉంది. అంతర్జాతీయ సరిహద్దు మాత్రం 1971లో పుట్టుకొచ్చింది. ప్వాంగ్ ఇంటిని రెండు దేశాలకూ చెందేలా విడదీసింది. ‘‘అంతర్జాతీయ సరిహద్దు 50 ఏళ్ల కింద పుట్టుకొచ్చింది. మా ఇల్లు అంతకు 50 ఏళ్ల ముందునుంచే ఉంది. సరిహద్దు భూభాగాన్ని విభజిస్తుందేమో గానీ ఇది మా పూరీ్వకుల ఆవాసం. ఇందులో ఉండేందుకు మాకు ఎలాంటి ఇబ్బందీ ఎదురవడం లేదు’’ అంటారు ప్వాంగ్. ఈ ఊళ్లోని వాళ్లంతా భారతీయులే. అందరికీ ఓటు హక్కు కూడా ఉంది. అయినా వారికి మయన్మార్ నుంచి పలు సంక్షేమ పథకాలు అందుతుండటం విశేషం! ఈ ఊళ్లో రెండు దేశాల సైన్యాలూ గస్తీ కాస్తుంటాయి. అంతేకాదు. ఈ ప్రాంతంలో భారత్, మయన్మార్ ప్రజలు వీసా తదితరాలేవీ అవసరం లేదు. -
124 ఏళ్లలో కెల్లా అత్యంత వేడి ఫిబ్రవరి
ఈసారి ఎండలు అప్పుడే దంచికొడుతున్నాయి. ఎండాకాలం ఇంకా మొదలైనా కాకుండానే ఠారెత్తిస్తున్నాయి. ఆ క్రమంలో గత 124 ఏళ్లలో అత్యంత వేడిమి ఫిబ్రవరిగా గత మాసం కొత్త రికార్డు సృష్టించింది. గత నెలలో సగటున 22 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. 1901 తర్వాత ఫిబ్రవరిలో ఈ స్థాయి సగటు నమోదవడం ఇదే తొలిసారి. అంతేకాదు, చరిత్రలోనే తొలిసారిగా ఈ ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు ఏకంగా 15 డిగ్రీల పై చిలుకు నమోదై సరికొత్త రికార్డు నెలకొల్పాయి. అంతేగాక సగటు గరిష్ట ఉష్ణోగ్రత విషయంలో 2023 ఫిబ్రవరి నెలకొల్పిన రికార్డును కూడా గత నెల దాదాపుగా అధిగమించినంత పని చేసింది! దీనిపై పర్యావరణవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణ మార్పుల తాలూకు విపరిణామాలకు ఈ ఉష్ణ ధోరణులు తాజా నిదర్శనమని వారు చెబుతున్నారు. 20 ఏళ్లు వరుసగా చరిత్రలోనే అత్యంత వేడిమి దశాబ్దాలుగా రికా ర్డులు సృష్టించిన వైనాన్ని వారు గుర్తు చేస్తున్నారు. అకస్మాత్తుగా వరుణుడు కరుణిస్తే తప్ప వచ్చే మూడు నెలలు ప్రచండమైన ఎండలు తప్పవని సైంటిస్టులు జోస్యం చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వారెవ్వా... వాస్తు శిల్పి!
మనం ఒక పురాతన దేవాలయానికి వెళతాం. ఆ దేవాలయం అద్భుత నిర్మాణం గురించి చర్చించుకుంటాం. ఆధునిక ప్రపంచంలో ఒక నగరానికి వెళతాం. అక్కడి ఆకర్షణీయమైన భవనాల గురించి మాట్లాడుకుంటాం. మన ఆఫీసులో ఏర్పాటు చేసిన వసతుల గురించి గర్వంగా చెప్పుకుంటాం. అప్పుడూ.. ఇప్పుడూ.. ఎప్పుడూ... ఈ ఆకర్షణీయమైన నిర్మాణ రూపకల్పలో కీలక వ్యక్తి.. అప్పటి వాస్తు శిల్పి... ఇప్పటి ఆర్కిటెక్ట్. ఆధునిక సమాజంలో ఆర్కిటెక్ట్ డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది.చాలా బిజీ ప్లేస్‌లో ఉన్న ఒక చిన్న స్థలంలో సైతం అద్భుత, ఆకర్షణీయమైన వాణిజ్య నిర్మాణ రూపకల్పన వారి ప్రత్యేకం. తక్కువ చోటైనా... అన్ని సదుపాయాలతో చక్కటి ఇంటి నిర్మాణానికి డిజైన్ వేయడం వారి ప్రతిభ. మన కలలను నిజం చేయగల సామర్థ్యం వారి సొంతం. ఇవే అంశాలు వారిని ఇప్పుడు ప్రత్యేక స్థానంలో నిలబెడుతున్నాయి. జాబ్ మార్కెట్ డిమాండ్ విషయంలో ఇంజనీర్లను కాదని వారిని అగ్ర స్థానాన నిలబెడుతోంది. – సాక్షి, సెంట్రల్ డెస్క్ఆర్కిటెక్ట్లు ఇప్పుడు దేశంలో అత్యధిక డిమాండ్ ఉన్న నిపుణులుగా మారారు. ప్రపంచంలో నంబర్ వన్ జాబ్ సైట్, గ్లోబల్ జాబ్ మ్యాచింగ్, హైరింగ్ ప్లాట్‌ఫామ్– ఇండీడ్ఙ్ ‘బెస్డ్ జాబ్స్ ఫర్ 2025 ఇన్ ఇండియా’ పేరుతో విడుదల చేసిన నివేదిక ఇదే విషయాన్ని చెబుతోంది. పలు రంగాలను పరిశీలిస్తే, ఉపాధి అవకాశాల పెరుగుదల రేటు ఆర్కిటెక్ట్ విభాగంలో ఏకంగా 81 శాతంగా ఉందంటే ప్రస్తుత సమాజంలో వారి ప్రాధాన్యత అర్థం అవుతుంది.నివేదిక ప్రకారం వారి సగటు వార్షిక వేతనం రూ.14,95,353. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నిపుణులకు ఉన్న డిమాండ్‌తో పోల్చితే భారత్ కార్పొరేట్ రంగంలో ఆర్కిటెక్ట్‌ల డిమాండ్ అధికంగా ఉన్నట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం, మార్కెట్ అవసరాల్లో వచ్చిన మార్పులకు ఇది ప్రతిబింబం. ప్రత్యేకత ఎందుకు?ఆర్కిటెక్ట్ లను ఇంజనీర్లతో పోల్చి కొందరు వారిని తక్కువగా అర్థం చేసుకుంటారు. కానీ వాస్తవానికి ఇంజనీర్లతోపాటు ఆర్కిటెక్ట్‌లు కూడా ఒక భవనాన్ని రూపుదిద్దడానికి ఎంతో అవసరం. అందమైన, బలమైన, సుస్థిరమైన భవనాల రూపకల్పనలో ఇంజనీర్‌తో పాటు ఆర్కిటెక్ట్ పాత్ర కూడా ఎంతో కీలకం. ఆర్కిటెక్టŠస్ భవనాన్ని కేవలం నిర్మాణం కోణంలోనే కాకుండా, దానిని అందంగా, వినియోగదారులకు అనువుగా డిజైన్ చేస్తారు. వారు ఫంక్షనాలిటీ అలాగే ఎస్తెటిక్ని సమతుల్యం చేస్తారు. ఇంజనీర్ పటిష్ట నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తే, ఆర్కిటెక్ట్ అందమైన, వినియోగదారులకు అనువైన ప్రదేశాలను సృష్టిస్తారు. కస్టమర్ అవసరాలు, ఆర్థిక పరిమితులు, పర్యావరణ అంశాలు, నగర విస్తరణ– ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేస్తారు. ఆర్కిటెక్టŠస్ కొత్త, విభిన్నమైన డిజైన్ ఆలోచనలను ప్రతిపాదిస్తారు. ఇంజనీర్లు వాటిని సాధ్యమయ్యేలా చేస్తారు. ఇంకా చెప్పాలంటే ఆర్కిటెక్టŠస్ సృజనాత్మకతను జోడించి వినూత్నమైన భవనాలు రూపొందిస్తారు. ఇంజనీర్లు వాటిని ప్రాక్టికల్‌గా మార్చుతారు. ఆధునికతతో అగ్రస్థానంఉద్యోగ నియామకాలు, జీతం పోకడలు, వృద్ధి అవకాశాలు, వేగవంతమైన పట్టణీకరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, స్థిర, ఆకర్షణీయ మైన నిర్మా ణాలు, ప్రాధాన్యతలు ఇలా ఎన్నో అంశాలు ఆర్కిటెక్ట్‌ను జాబ్ మార్కెట్ డిమాండ్‌లో అగ్రభాగాన నిలబెట్టింది. మెట్రోల విస్తరణ, స్మార్ట్ నగరాల రూపకల్పన, పర్యావరణ సానుకూలతలు అలాగే పర్యావరణానికి అనుకూలమైన ఇంధన సమర్థ వినియోగ కార్యాలయాల నిర్మాణాలు వంటి ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకుని భారత్ కార్పొరేట్ కార్యాలయ స్థలాలలో పెట్టుబడి పెడతాయి, ఆర్కిటెక్ట్‌లు ఈ పరివర్తనకు కేంద్రంగా ఉండడం గమనార్హం.కీలక పాత్రకస్టమర్ అవసరాలను అర్థం చేసుకుని, వారి అభిరుచులకు అనుగుణంగా డిజైన్ చేయడం వీరి ప్రత్యే కత. నియమాలు, భద్రతా ప్రమాణాలు పాటించడం, ప్రభుత్వం, మున్సిపల్ కార్పొరేషన్ల అనుమతుల కోసం సమర్పించాల్సిన ప్లాన్లు సిద్ధం చేయడం, సంపదను, వనరులను సమర్థవంతంగా వినియోగించడం, భవనం నిర్మాణాన్ని, తక్కువ ఖర్చుతో, ఎక్కువ ప్రయోజనం కలిగేలా ప్లానింగ్ చేయడం, ప్రా జెక్ట్‌ను విజయవంతంగా పూర్తి చేయడానికి అన్ని విభాగాలతో సమన్వయం, ఆధునిక సమాజంలో గ్రీన్ బిల్డింగ్స్, ఎనర్జీ–ఎఫిషియెంట్ డిజైన్ల రూపకల్పన.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆధు నిక నిర్మాణ రంగంలో వారి పాత్ర అపారం. డిమాండ్ ఎక్కడ?» వ్యక్తిగత ఇళ్ల నిర్మాణం» అపార్ట్మెంట్లు, షాపింగ్ మాల్స్, ఆఫీస్ బిల్డింగ్లు» రోడ్లు, బ్రిడ్జీలు, గవర్నమెంట్ భవనాల వంటి ప్రభుత్వ ప్రాజెక్టులు » మల్టీనేషనల్ కంపెనీల క్యాంపస్ డిజైన్లు» మ్యూజియం, హోటల్స్, ఎయిర్పోర్ట్, స్టేడియం, దేవాలయాల వంటి ప్రత్యేక భవనాల డిజైన్ఇంజనీర్లు భవనానికి ప్రాణం పోసే గుండె లాంటి వారు అయితే, ఆర్కిటెక్ట్ ఆ భవనానికి జీవం పోసే ఆత్మ. ఆర్కిటెక్ట్ లేకపోతే భవనాలు కేవలం ‘నిర్మాణాలు’గానే ఉంటాయి. అందమైన, ఆకర్షణీయమైన వినియోగదారులకు అనుకూలమైన, చిరస్థాయిగా నిలిచే నిర్మాణాలను రూపొందించేది ఆర్కిటెక్ట్‌లే!ఆర్కిటెక్ట్ కావాలంటే?భారతదేశంలో ఆర్కిటెక్ట్‌గా పనిచేయాలంటే బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బీ.ఆర్క్) అనే 5 సంవత్సరాల కోర్సు పూర్తి చేయాలి. దీనికి నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ (నాటా) లేదా జేఈఈ పేపర్ 2 ద్వారా అర్హత పొందాలి. -
ఊరు, ఇల్లు వదిలి.. అక్కడ అందరిదీ ఇదే పరిస్థితి!
ఈ చిత్రంలోని దంపతులు కీలుకత్తుల యాదయ్య, మంగమ్మ.. నర్సిరెడ్డిగూడెంలో వ్యవసాయం చేసుకొంటూ జీవనం సాగిస్తున్నారు. శివన్నగూడ రిజర్వాయర్ కట్ట నిర్మాణంతో నర్సిరెడ్డిగూడెం గ్రామానికి రాకపోకలు నిలిచిపోనున్నాయి. అధికారులు బలవంతంగా ఊరిని ఖాళీ చేయిస్తుండటంతో ఉన్న ఊరిని.. ఇన్నాళ్లూ తలదాచుకున్న ఇంటిని ఖాళీ చేసి, శివన్నగూడలో అద్దెకు తీసుకున్న ఇంటికి వెళ్లిపోయారు. ఇప్పుడీ ఊళ్లో చాలామందిది ఇదే పరిస్థితి.సాక్షి ప్రతినిధి, నల్లగొండ: పుట్టి పెరిగిన ఊరు కన్నతల్లిలాంటిది అంటారు. ఏ కారణం చేతనైనా ఉన్న ఊరిని వదిలిపెట్టి వెళ్లాల్సి వస్తే.. ఆ బాధ వర్ణనాతీతం. అందునా బలవంతంగా ఊరి నుంచి పంపించే పరిస్థితి వస్తే కలిగే వేదన చెప్పనలవికాదు. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం నర్సిరెడ్డిగూడెం గ్రామస్తులు ఇప్పుడదే బాధను అనుభవిస్తున్నారు. డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా మర్రిగూడ మండలంలో శివన్నగూడ రిజర్వాయర్ (Shivannaguda Reservoir) నిర్మిస్తున్నారు. ఈ రిజర్వాయర్ కట్ట నిర్మాణంతో నర్సిరెడ్డిగూడెం గ్రామానికి వచ్చే రోడ్డు పూర్తిగా పోతోంది. కట్ట నిర్మాణం పూర్తయితే గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి. ఈ నేపథ్యంలో అధికారులు గ్రామాన్ని ఖాళీ చేయిస్తున్నారు. అయితే, పూర్తిస్థాయిలో పునరావాసం కల్పించకుండానే ఉన్న ఊరి నుంచి తమను తరిమేస్తున్నారని నర్సిరెడ్డిగూడెం (Narsi Reddy Gudem) వాసులు ఆరోపిస్తున్నారు. వీరికి అధికారికంగా ఇళ్ల స్థలాలను కూడా అప్పగించలేదు. చాలామంది గ్రామస్తులు వేరేచోట ఇళ్లు కట్టుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాము ఎక్కడికి వెళ్లాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్కరికి ఒక్కో రకంగా పరిహారం శివన్నగూడ ప్రాజెక్టు పనులకు మాజీ సీఎం కేసీఆర్ (KCR) 2015, జూన్ 12వ తేదీన శంకుస్థాపన చేశారు. 14.5 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌ను నిర్మించాలని అనుకున్నా పలు కారణాలతో 11.5 టీఎంసీలకు కుదించారు. రిజర్వాయర్ నిర్మాణం కోసం 3,465 ఎకరాల భూసేకరణ చేపట్టారు. అందులో పట్టా భూములు 2,900 ఎకరాలు ఉండగా, మిగతావి ప్రభుత్వ భూములు. పట్టా భూములకు మొదట్లో ఎకరానికి రూ.4.15 లక్షలు, ఆ తరువాత ఎకరానికి రూ.5.15 లక్షల చొప్పున చెల్లించారు. చదవండి: ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో 'మరో సొరంగం'! ప్రస్తుతం ఎకరానికి రూ.8 లక్షలకు పైగా చెల్లిస్తున్నారు. ఈ రిజర్వాయర్ కింద నర్సిరెడ్డిగూడెం, చర్లగూడెం, వెంకేపల్లి, వెంకేపల్లి తండాలు ముంపునకు గురవుతున్నాయి. రాంరెడ్డిపల్లి, శివన్నగూడ, ఖుదాబాక్షపల్లి గ్రామాల రైతుల భూములు కూడా సేకరించారు. అయితే, భూములకు పరిహారం ఒక్కొక్కరికి ఒక్కోరకంగా ఇవ్వడంపై గ్రామస్తులు నిరసన వ్యక్తంచేస్తున్నారు. అందరికీ పెంచిన పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు.ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, ఇళ్ల స్థలాలు ఈ నాలుగు ముంపు గ్రామాల్లోని 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద రూ.7.61 లక్షలు ఇచ్చారు. అయితే, సర్వే సమయంలో అందుబాటులో లేని కొంతమందికి అదీ అందలేదు. వీరికి చింతపల్లి మండల కేంద్రంలో ప్లాట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. నర్సిరెడ్డిగూడెంలోని 289 కుటుంబాలకుగాను 257 కుటుంబాలకే ఇచ్చారు. ఇంకా 32 కుటుంబాలకు అధికారికంగా ప్లాట్లను కేటాయిస్తూ పత్రాలు అందజేయలేదు. ఇప్పుడు కట్ట నిర్మాణం పేరుతో గ్రామాన్ని ఖాళీ చేయిస్తుండటంతో చేసేదేం లేక ఆ కుటుంబాలు వేరే ప్రాంతాల్లో అద్దె ఇళ్లకు మారిపోతున్నారు. నా కుమారుడికి ప్లాట్ ఇస్తలేరు నాకు ఇద్దరు కొడుకులు, ఒక కుమారుడికి ప్లాట్ ఇస్తామని హామీ ఇవ్వకపోవటంతో నర్సిరెడ్డిగూడెంలో మా ఇంటి దగ్గరే ఉంటున్నా. అధికారులు వెళ్లమంటున్నారు. నా కొడుక్కి ఇంటి స్థలం ఇస్తామని చెప్పే వరకు వెళ్లను. మాకు ఆరు ఎకరాల భూమి ఉండగా, ఒక్కో ఎకరానికి రూ.5.15 లక్షలే ఇచ్చారు. – కీలుకత్తుల సోమమ్మపట్టాలు ఇవ్వలేదు ఊరి నుంచి పంపిస్తే శివన్నగూడలో ఇల్లు కిరాయికి తీసుకొని ఉంటున్నాం. చింతపల్లి మండలంలో ఇండ్లను కేటాయించారు.. కానీ ఇంటి పట్టాలు ఇవ్వలేదు. ఈలోగానే ఊరు ఖాళీ చేయాలని చెప్పి పంపించేశారు. ఇంటి స్థలాలకు పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి. – బల్లెం పద్మమ్మ కిరాయి ఇంట్లో ఉంటున్నాం మా ఊరి జ్ఞాపకాలను మరువలేకపోతున్నాం. ఇప్పుడు సొంత ఇల్లు లేకుండా పోయింది. శివన్నగూడలో ఇల్లు కిరాయికి తీసుకొని ఉంటున్నాను. కిరాయి చెల్లిస్తామని అధికారులు చెబుతున్నారు. ఉన్న ఆరెకరాలు ప్రాజెక్టులో పోయింది. మొదటగా ఎకరానికి రూ.4.15 లక్షలు, తరువాత రూ.5.15 లక్షల చొప్పున మాత్రమే ఇచ్చారు. – సుంకరి జంగయ్య -
ఆ‘పాత’ నావ
ఇదేమిటో తెలుసా? అలనాటి భారతీయ నౌకా పాటవానికి నిదర్శనం. వేల ఏళ్ల క్రితమే సముద్రాలపై రాజ్యం చేసిన వైనానికి తిరుగులేని గుర్తు. ఐదో శతాబ్దం దాకా సముద్రాలపై భారతీయులకు ఆధిపత్యం కట్టబెట్టిన విశాలమైన నావలివి. ఇనుము వాడకుండా కేవలం కలప దుంగలు, చెక్క, తాళ్లు తదితరాలతో వీటిని తయారు చేసేవారు. అయినా ఇవి అత్యంత ప్రతికూల వాతావరణాలను కూడా తట్టుకుంటూ సదూర సముద్రయానాలకు ఎంతో అనువుగా ఉండేవి. ఈ భారతీయ నావలకు అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా యమ గిరాకీ ఉండేదట. ఇంతటి చరిత్ర ఉన్న పురాతన భారతీయ నావకు వాయుసేన, కేంద్ర సాంస్కృతిక శాఖ ఇప్పుడిలా ప్రాణం పోశాయి. వారి ఆలోచనలకు రూపమిస్తూ గోవాకు చెందిన నౌకా నిర్మాణ సంస్థ హోడీ ఇన్నొవేషన్స్ అచ్చం అలనాటి విధానంలోనే దీన్ని రూపొందించింది. బాబు శంకరన్ సారథ్యంలో కేరళకు చెందిన నిపుణులైన పనివాళ్లు అహోరాత్రాలు శ్రమించి దీన్ని పూర్తి చేశారు. అప్పట్లో మాదిరిగానే ఈ నావను ముందుగా రెండు అర్ధ భాగాలుగా నిర్మించారు. తర్వాత కొబ్బరి నార నుంచి అల్లిన తాళ్ల సాయంతో ఒడుపుగా ఒక్కటిగా బిగించారు. సముద్ర జలాల్లో తడిసి పాడవకుండా నావ అడుగు, పక్క భాగాలకు అప్పటి పద్ధతుల్లోనే సార్డిన్ ఆయిల్ తదితరాలతో పూత పూశారు. మన్నిక కోసం టేకు, పనస వంటి చెక్కలు మాత్రమే వాడారు. ఈ తరహా భారతీయ నావల హవా క్రీస్తుశకం ఐదో శతాబ్ది దాకా ప్రపంచమంతటా నిరి్నరోధంగా సాగింది. ఆ ఘన వారసత్వాన్ని పునరుద్ధరించే ప్రయత్నంలో ఇదో ముందడుగని నేవీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఆ‘పాత’నావకు ఇంకా పేరు పెట్టాల్సి ఉంది. ఇది బుధవారం ఘనంగా జలప్రవేశం చేసింది. ఈ ఏడాది చివర్లో 15 మంది నేవీ అధికారులతో ప్రాచీన సముద్ర మార్గాల్లో ఈ నావ మస్కట్, ఇండొనేసియాలకు తొలి ప్రయాణం ప్రారంభించనుంది. దీన్ని నడిపే విధానం తదితరాలపై వారు ముందస్తు శిక్షణ కూడా పొందనున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇండియాలో క్యాన్సర్ విస్ఫోటం
దేశంలో క్యాన్సర్ తీవ్రత ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతోందని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) ఆందోళన వ్యక్తంచేసింది. ప్రతి ఐదుగురు క్యాన్సర్ బాధితుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోతున్నట్లు వెల్లడించింది. పురుషులతో పోలిస్తే మహిళలే అధికంగా క్యాన్సర్ బారినపడుతున్నట్లు తెలియజేసింది. భవిష్యత్తులో క్యాన్సర్ కేసుల సంఖ్య భారీగా పెరగనుందని హెచ్చరించింది. ఈ మేరకు ఐసీఎంఆర్ తాజాగా విడుదల చేసిన నివేదికను లాన్సెట్ జర్నల్‌లో ప్రచురించారు. గ్లోబల్ క్యాన్సర్ అబ్జర్వేటరీ–2022 అంచనాల ఆధారంగా గణాంకాలు రూపొందించారు. ఇందుకోసం 36 రకాల క్యాన్సర్లు, నాలుగు రకాల వయసు గ్రూప్‌లను పరిగణనలోకి తీసుకున్నారు. → ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసుల్లో ఇండియా మూడోస్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాల్లో అమెరికా, చైనా ఉన్నాయి. → క్యాన్సర్ సంబంధిత మరణాల్లో చైనాది మొదటిస్థానం కాగా ఇండియాది రెండోస్థానం. → ఇండియాలో బ్రెస్ట్ క్యాన్సర్ బాధితుల్లో మహిళలే అధికంగా ఉంటున్నారు. → పురుషులు, మహిళల్లో లంగ్ క్యాన్సర్ వల్ల అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయి. → భారత్‌లో అధిక జనాభా కారణంగా మొత్తం క్యాన్సర్ రేటు తక్కువగా కనిపిస్తోంది. → యువతీ యువకుల కంటే వృద్ధులకు క్యాన్సర్ ముప్పు అధికంగా పొంచి ఉంది. → ప్రస్తుతం దేశంలో యువ జనాభా అధికంగా ఉంది. రానున్న రోజుల్లో వృద్ధుల జనాభా పెరిగిపోనుంది. తద్వారా క్యాన్సర్ రేటు సైతం పెరగనుంది. → మధ్య వయసు్కలు, వృద్ధులతో పోలిస్తే చిన్నారులు, యువతకు క్యాన్సర్ ముప్పు అంతగా లేదు. → మహిళల్లో క్యాన్సర్ సంబంధిత మరణాలు ప్రతిఏటా 1.2 శాతం నుంచి 4.4 శాతం పెరుగుతున్నాయి. పురుషుల్లో ఇది 1.2 శాతం నుంచి 2.4 శాతంగా ఉంది. → 2022 నుంచి 2050 వరకు క్యాన్సర్ సంబంధిత మరణాల రేటు 64.7 శాతం నుంచి 109.6 శాతానికి పెరిగే అవకాశం కనిపిస్తోంది. → దేశంలో 2012 నుంచి 2022 వరకు క్యాన్సర్ కేసులు 36 శాతం పెరిగాయి. 2012లో 10.1 లక్షల కేసులు నమోదు కాగా, 2022లో 13.8 లక్షల కేసులు నమోదయ్యాయి. → అదే సమయంలో క్యాన్సర్ సంబంధిత మరణాలు 30.3 శాతం పెరిగాయి. 2021లో 6.8 లక్షల మంది, 2022లో 8.9 లక్షల మంది క్యాన్సర్ వల్ల మృతిచెందారు. → క్యాన్సర్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నవారిలో ఏకంగా 70% మంది మధ్య వయస్కులు, వృద్ధులే ఉంటున్నారు. → క్యాన్సర్ నియంత్రణపై ప్రభుత్వాలు తక్షణమే దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. క్యాన్సర్ కేసులు, మరణాల సంఖ్య పెరిగిపోతుండడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై పెనుభారం పడుతోందని పేర్కొంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సింహపురి ఆభరణాలు భళా..
స్వర్ణాభరణాల తయారీలో దక్షిణాది రాష్ట్రాల్లో సింహపురి రెండో స్థానాన్ని ఆక్రమించింది. ఇక్కడ లభించే వినూత్న డిజైన్లకు దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. స్థానికంగా స్థిరపడిన మార్వాడీలు, జైన్లు.. ఇక్కడి వారు అందించే ముడిసరుకుతో ఆభరణాలను తయారు చేస్తూ స్వర్ణకారులు, ముస్లింలు ఉపాధి పొందేవారు. అయితే కాలక్రమేణా వీరి స్థానాన్ని బెంగాలీలు ఆక్రమిస్తున్నారు. ఫలితంగా ఎన్నో ఏళ్లుగా ఇదే వృత్తిని నమ్ముకున్న తయారీదారులు ప్రస్తుతం జీవనోపాధి కోల్పోయి నానా అగచాట్లు పడుతున్నారు. నెల్లూరు (పొగతోట): స్వర్ణాభరణాల తయారీకి కేరాఫ్‌గా నెల్లూరు నిలుస్తోంది. దక్షిణాదిలో కోయంబత్తూరు తర్వాతి స్థానం నెల్లూరుదే కావడం విశేషం. చెన్నై సైతం మూడో స్థానంలో ఉందంటే ఇక్కడ రూపొందించే ఆభరణాలకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి 50 ఏళ్ల నుంచే జిల్లాలో నిష్ణాతులు పాతుకుపోయారు. పెద్ద, చిన్న, అతి సూక్ష్మ ఆభరణాల తయారీలో ఇక్కడి స్వర్ణకారులు ప్రావీణ్యం సాధించారు. అర గ్రాము, గ్రాముతో చిన్న కమ్మలు, నెక్లెస్‌లు, స్టోన్ ఐటెమ్స్‌ను రూపొందించడంలో చేయి తిరగడంతో వీటిని సింగపూర్, మధ్య ప్రాచ్య దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. జిల్లాలో నెలకు రూ.500 కోట్లకుపైగా వ్యాపారం జరుగుతోందని అంచనా. జిల్లాలో ఇలా.. ఆభరణాలను తయారు చేసే స్వర్ణకారులు జిల్లాలో సుమారు 15 వేల మందికిపైగా ఉన్నారు. చిన్న, పెద్ద బంగారు షాపులు నగరంలో వెయ్యికిపైగా ఉన్నాయి. స్వర్ణాభరణాలను తయారు చేయడంలో ప్రారంభంలో స్థానిక స్వర్ణకారులు, అనంతరం ముస్లింలు, ప్రస్తుతం బెంగాలీలు ముందంజలో ఉన్నారు. చేతితో తయారుచేసే బంగారు ఆభరణాలను ప్రజలు అమితంగా ఇష్టపడుతున్నారు. అదే ముంబై, కోయంబత్తూర్ తదితర ప్రాంతాల్లో మెషీన్ కటింగ్‌తో తయారు చేస్తున్నారు. నగరంలోని ఆచారివీధి, చిన్నబజార్, కొరటాల వీధి, గిడ్డంగివీధి, కాకర్ల వీధి, కుక్కల గుంట, మండపాల వీధిలో వేలాది మంది స్వర్ణకారులు జీవనోపాధి పొందుతున్నారు. అధిక శాతం షాపులనూ ఆయా ప్రాంతాల్లోనే ఏర్పాటు చేశారు. కాలానుగుణంగా మార్పులు స్వర్ణకారులకు ముడి సరుకును మార్వాడీలు, జైన్లు, స్థానికులు అందజేస్తారు. స్వర్ణకారులుండే రోజుల్లో వంద గ్రాముల బంగారానికి 8 గ్రాముల తరుగు, కూలిని అందించేవారు. ఇలా వంద గ్రాముల బంగారాన్ని ఇస్తే 92 గ్రాములతో ఆభరణాలను తయారుచేసేవారు. ఫలితంగా స్వర్ణకారులకు 8 గ్రాముల బంగారం, కూలి లభించేది. అనంతరం తయారీలో ముస్లింలు ప్రవేశించారు. ఆ సమయంలో కూలిని ఎత్తేసి తరుగును మాత్రమే ఇచ్చేవారు. గోల్డ్ మాఫియా ఆగడాలు జిల్లాలో గోల్డ్ మాఫియా ఆగడాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. బడా నేతల సహకారంతో ప్రభుత్వానికి ఎలాంటి పన్నులు చెల్లించకుండానే రూ.కోట్ల విలువైన బంగారు ఆభరణాలను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. జిల్లాలో తయారు చేస్తున్న రాళ్లు, ఫ్యాన్సీ ఐటమ్స్ నగలకు దేశ వ్యాప్తంగా ప్రత్యేక డిమాండ్ ఉండటంతో ఇతర రాష్ట్రాలకు చెందిన బడా వ్యాపారులు దొడ్డిదారిన తీసుకొచ్చి తయారీ అనంతరం అదే మార్గంలో అక్రమంగా తరలిస్తున్నారు. అధికారులు, పోలీసులకు ప్రతి నెలా ముడుపులు అందుతుండటంతో నామమాత్రపు తనిఖీలు చేసి చేతులు దులుపుకొంటున్నారు. పెండింగ్‌లో ఎఫ్ఐఆర్లు బంగారు ఆభరణాలను తయారు చేసేందుకు వచ్చిన బెంగాలీల్లో అధిక శాతం మంది పూర్తి వివరాల్లేకుండానే ఉంటున్నారు. బంగారు ఆభరణాల చోరీలకు సంబ«ంధించిన ఎఫ్ఐఆర్లు సంతపేట పోలీస్‌స్టేషన్‌లో అధిక శాతం పెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు వీటిని తయారు చేసే దుకాణంలో సీసీ ఫుటేజ్‌లు అందుబాటులో ఉన్నా, అపహరించిన వారిని పట్టుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారు. జిల్లాలో నైపుణ్యమున్న స్వర్ణకారులు కార్మికులుగానే మిగిలిపోతున్నారు. వీరి జీవితాల్లో వెలుగులు రావడంలేదు. బెంగాల్ నుంచి తయారీదారులను ఆహ్వా నించి సూక్ష్మ బంగారు ఆభరణాలను రూపొందించడాన్ని ప్రారంభించారు. సూక్ష్మ, పలచటి ఆభరణాలపై ఎక్కువ మంది ఆసక్తి చూపడంతో అధిక శాతం మంది రావడం ప్రారంభించారు. తయారీలో ప్రస్తుతం వీరే కీలకంగా వ్యవహరిస్తున్నారు. వీరికి ప్రస్తుతం తరుగుగా ఐదు గ్రాములను ఇస్తున్నారు. వీరి రంగప్రవేశంతో స్వర్ణకారులు, ముస్లింలు ఉపాధి కోల్పోయారు. ఫలితంగా ఆటోలు తోలుకుంటూ, కూరగాయలు, పండ్ల వ్యాపారాలు, బడ్డీ కొట్లు నడుపుకొని జీవనం సాగిస్తున్నారు.సందట్లో సడేమియాగా మధ్యవర్తులుబంగారు ఆభరణాల తయారీలో మధ్యవర్తులుగా చిన్నబజార్, పెద్దబజార్ తదితర ప్రాంతాలకు చెందిన కీలక వ్యక్తులను ఏర్పాటు చేసుకున్నారు. మధ్యవర్తులు సూచించిన వ్యక్తులకే బంగారాన్ని ఆభరణాల తయారీ నిమిత్తం ఇస్తారు. తయారీదారులకొచ్చే తరుగులో కొంత భాగాన్ని వీరు తీసుకుంటున్నారు. మరోవైపు కొన్ని చోట్ల కీలకంగా ఉండే వ్యక్తులకు బంగారు ముడి సరుకును ఇస్తున్నారు. వీరు బెంగాలీలతో బంగారు ఆభరణాలను తయారు చేయించి తిరిగి అందజేస్తున్నారు. -
కొంచెం అతి ఖర్చుకు 100 కోట్ల మంది దూరం
ఆసియాలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్‌లో వినియోగదారుల వర్గం పెరగడం లేదు. సంపన్నుల సంపద మాత్రమే పెరుగుతోంది. ఏకంగా 100 కోట్ల మంది వద్ద వస్తువులు, సేవల మీద వెచ్చించేందుకు డబ్బు లేదు! బ్లూమ్ వెంచర్స్ సంస్థ నివేదిక ఈ మేరకు వెల్లడించింది. 143 కోట్ల జనాభాలో అత్యవసరం కాని వస్తువులు, సేవలపై, అంటే ఓ మాదిరి విలాసాలపై ఖర్చు చేసే ప్రజల సంఖ్య చాలా తక్కువని తెలిపింది. వెంచర్ క్యాపిటల్ నివేదిక ప్రకారం దేశంలో 13 నుంచి 14 కోట్ల మందే ‘వినియోగ వర్గం’గా ఉన్నారు. కనీసావసరాలకు మించి కొనుగోలు చేయగల సామర్థ్యం వీరికే ఉంది. ఈ వినియోగదారుల వ్యయంపైనే దేశ జీడీపీ ఎక్కువగా ఆధారపడి ఉందని నివేదిక పేర్కొంది. డిజిటల్ చెల్లింపుల సౌలభ్యంతో ఎక్కువ వెచ్చిస్తున్నా చాలావరకు అది అత్యవసర సేవల కోసమే ఉంటోందని తెలిపింది. కొత్త స్టార్టప్‌ల సేవలకు వారు డబ్బు వినియోగించడం లేదని తెలిపింది. భారత్‌లో వినియోగదారుల మార్కెట్ విస్తృతంగా విస్తరించడం లేదని, సంపన్నుల సంఖ్య పెరగడం లేదని, ఉన్నవారే మరింత సంపన్నుల వుతున్నా రని ఈ సర్వే మరోసారి తేల్చిందని నిపుణులంటున్నారు. ఈ మార్పు వ్యాపార ధోరణులను ప్రభావితం చేస్తోందని చెబుతున్నారు.మధ్యతరగతిపై రోకటిపోటు1990లో జాతీయాదాయంలో 34 శాతంగా ఉన్న భారతీయ సంపన్నుల వాటా ఇప్పుడు ఏకంగా 57.7 శాతానికి పెరిగింది. దిగువ సగం జనాభా వాటా 22.2 శాతం నుంచి 15 శాతానికి పడిపోయింది. ఆర్థిక పొదుపు కూడా క్షీణిస్తోంది. మెజారిటీ భారతీయుల రుణాలు పెరుగుతున్నాయి. ఆర్థికంగా ఎదుగుతున్న వినియోగదారులు కొనుగోళ్ల కోసం దాదాపుగా రుణాలపై ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో అరక్షిత రుణాల నిబంధనలను ఆర్బీఐ కఠినతరం చేయడం వారిని బాగా ప్రభావితం చేస్తోంది. వినియోగదారుల డిమాండ్‌కు ప్రధాన చోదకశక్తిగా ఉన్న మధ్యతరగతి కుంచించుకుపోతోంది. దేశంలో పన్ను చెల్లించే మధ్య తరగతిలో సగం మందికి దశాబ్దం కాలంగా వేతనాల్లో పెరుగుదల లేదు. పైపెచ్చు ద్రవ్యోల్బణంతో పోలిస్తే వారి ఆదాయాలు సగానికి పడిపోయాయి. ఈ ఆర్థిక మాంద్యం మధ్యతరగతి పొదుపును దాదాపుగా నాశనం చేసేసింది. భారతీయ కుటుంబాల నికర ఆర్థిక పొదుపు 50 ఏళ్ల కనిష్టానికి చేరిందని ఆర్బీఐ పదేపదే చెబుతోంది. దాంతో మధ్యతరగతి గృహ వ్యయాలతో ముడిపడ్డ ఉత్పత్తులు, సేవలకు మున్ముందు గడ్డుకాలమేనని నివేదిక సూచిస్తోంది.ఏఐ దెబ్బ...సాంకేతికత, యాంత్రీకరణ దెబ్బకు వైట్ కాలర్ ఉద్యోగాలు శరవేగంగా మాయమవుతున్నట్టు మార్సెలస్ నివేదిక హెచ్చరిస్తోంది. క్లరికల్, సెక్రటేరియల్ పోస్టులను క్రమంగా కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థలు భర్తీ చేస్తున్నాయి. దాంతో తయారీ రంగంలో పర్యవేక్షక ఉద్యోగాలూ తగ్గుతున్నాయి. ఏఐ తాలూకు ఈ దుష్ప్రభావం గురించి ఆర్థిక సర్వే–2025 కూడా పేర్కొంది. ఏఐ వల్ల ఉత్పాదకత పెరుగుతున్నా కార్మికులపై ఆధారపడే మన ఆర్థిక వ్యవస్థను ఇది దెబ్బ తీస్తుందని హెచ్చరించింది. వృద్ధిని కూడా ఇది దెబ్బ తీస్తుందని ఐఎంఎఫ్ హెచ్చరించింది. పరిస్థితిలో మార్పు రావాలంటే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు, విద్యా సంస్థల మధ్య సహకారం, సమగ్ర విధానం అవసరమని నివేదిక పేర్కొంది. ఉద్యోగాలపై ఏఐ ప్రభావం విషయంలో అలసత్వం చూపితే భారత్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
దారి చూపే చుక్కాని
‘ఆడపిల్లలకు పెద్ద చదువులు ఎందుకు?’ అనుకునే కాలం. ‘ఆడపిల్లలకు సైన్స్ కష్టం’ అనుకునే కాలం. ఎన్నో అనుమానాలు, అవమానాలు, అడ్డంకులను అధిగమించి ఆ తరం మహిళలు సైన్స్‌లో సత్తా చాటారు. ‘ఇండియన్ విమెన్ సైంటిస్ట్స్ అసోషియన్’ ను స్థాపించారు. గోల్డెన్ జూబ్లీ పూర్తి చేసుకున్న ఈ సంస్థ ఈ తరం మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది.‘కొందరు మహిళలు సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదు. మేము మాత్రం అలా ఎప్పుడూ భయపడలేదు. మమ్మల్ని మేము నిరూపించుకోవడానికి ఎంతో కష్టపడ్డాం’ అంటుంది 91 సంవత్సరాల డా.సుధా పాధ్యే. ‘ఇండియన్ విమెన్ సైంటిస్ట్స్ అసోసియేషన్’ వ్యవస్థాపకులలో ఆమె ఒకరు. ల్యాబ్‌లో 76 ఏళ్ల డాక్టర్ భక్తవర్ మహాజన్ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ ‘ఇండియన్ విమెన్ సైంటిస్ట్స్ అసోసియేషన్’కు దేశవ్యాప్తంగా పదకొండు శాఖలు ఉన్నాయి. రెండు వేలమంది సభ్యులు ఉన్నారు. ముంబైలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో నిర్వహించే రకరకాల కార్యక్రమాల్లో పిల్లలు, మహిళలు ఉత్సాహంగా పాల్గొంటారు.ఇంటిపనికి, వృత్తిపనికి మధ్య సమన్వయం చేసుకోలేని ఎంతోమంది మహిళలకు, కొత్తగా వృత్తిలోకి వచ్చిన మహిళలకు ఆర్గనైజేషన్‌కు సంబంధించి డే కేర్ అండ్ హెల్త్ కేర్ సెంటర్, చిల్డ్రన్స్ నర్సరీ, 160 పడక ల విమెన్స్ హాస్టల్ అండగా ఉంటుంది.‘ఈ సంస్థ మాకు రెండో ఇల్లు’ అంటుంది అసోసియేషన్ మాజీ అధ్యక్షురాలు డా.రీటా ముఖోపాధ్యాయ.ముప్ఫై తొమ్మిది ఏళ్ల డా. సెరెజో శివ్‌కర్ నుంచి 81 ఏళ్ల డా.సునీత మహాజన్ వరకు శాస్త్రవేత్తల మధ్య ఎంతో వయసు తేడా ఉండవచ్చు. అయితే సైన్స్ అద్భుతాల పట్ల ఉన్న ఆసక్తి, గౌరవం సభ్యులందరినీ ఒకేతాటిపై తీసుకువచ్చింది.‘కొద్దిమంది మా సంస్థ విలువను గుర్తించడానికి ఇష్టపడక పోవచ్చు. ఆడవాళ్లు కాలక్షేప కబుర్లు చెప్పుకునే కార్యాలయం అని వెక్కిరించవచ్చు. అయితే అలాంటి వారు మా సంస్థ కార్యక్రమాలను దగ్గరి నుంచి చూపినప్పుడు వారిలో తప్పకుండా మార్పు వస్తుంది’ అంటుంది డా. రీటా ముఖోపాధ్యాయ.‘ఇండియన్ విమెన్ సైంటిస్ట్స్ అసోసియేషన్ ఏం సాధించింది?’ అనే ఏకైక ప్రశ్నకు ఎన్నో స్ఫూర్తిదాయకమైన జవాబులు ఉన్నాయి.సైన్స్ అంటే భయపడే అమ్మాయిలలో ఆ భయాన్ని పోగొట్టి సైన్స్‌ను ఇష్టమైన సబ్జెక్ట్ చేయడం నుంచి కుటుంబ బాధ్యతల భారం వల్ల ఉద్యోగం వదులుకోవాలనుకున్న వారికి అండగా నిలబడి పరిష్కార మార్గం చూపడం వరకు ఈ సంస్థ ఎన్నో చేసింది ‘ఇండియన్ విమెన్ సైంటిస్ట్స్ అసోసియేషన్’ అనేది ఎన్నో తరాల మహిళా శాస్త్రవేత్తల అనుభవ జ్ఞానసముద్రం. ఈ తరానికి దారి చూపే చుక్కాని.ఎన్నో అనుభవాలు, మరెన్నో జ్ఞాపకాలుఅసోసియేషన్ బిల్డింగ్‌లోకి అడుగు పెడితే ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. ఎందరో మహిళా శాస్త్రవేత్తలు, ఎన్నో అనుభవాలు, విలువైన జ్ఞాపకాలకు ఈ భవనం చిరునామా. ఇక్కడికి వస్తే కాలం వెనక్కి వెళ్లవచ్చు. ముందున్న కాలాన్ని చూడవచ్చు. స్థూలంగా చె΄్పాలంటే ‘ఇండియన్ విమెన్ సైంటిస్ట్స్ అసోసియేషన్’ సైన్స్ పట్ల ఈ తరంలో ఆసక్తిని, అనురక్తిని రేకెత్తించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది.– డా. సెరెజో శివ్‌కర్, శాస్త్రవేత్త -
TN Vs Centre: భాషా యుద్ధం.. ఇది ఈనాటిదేం కాదు!
జాతీయ విద్యా విధానం(National Education Policy 2020) అమలు విషయంలో.. తమిళనాడు వర్సెస్ కేంద్ర ప్రభుత్వం వ్యవహారం మరింత ముదురుతోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తాజాగా సంచలన ఆరోపణలు చేయగా.. బీజేపీ అంతే ధీటుగా బదులిచ్చింది. బలవంతంగా హిందీ భాషను రుద్ది.. స్థానిక భాషలను కనుమరుగయ్యే స్థాయికి చేర్చారంటూ ఆరోపిస్తున్నారాయన. సోదరీసోదరీమణుల్లారా.. గత 100 సంవత్సరాల్లో ఎన్ని భాషలను హిందీ మింగేసిందో తెలుసా? భోజ్‌పురి, మైథిలీ, అవాదీ, బ్రజ్, బుంధేలీ, ఖుమావోని, మఘాహి, మార్వారీ, మాల్వీ, ఛత్తీస్‌ఘడీ, అంగిక, సంతాలి, హో, ఖారియా, ఖోర్థా, కుర్మాలీ, ముండారీ, కురుఖ్.. ఇలా పాతికకుపైగా నాశనం చేసింది. ఇంకోన్ని భాషలు తమ మనుగడ కోసం పోరాడుతున్నాయి. ఏకపక్షంగా హిందీని రాష్ట్రాలపై రుద్దేయాలన్న నిర్ణయం.. పురాతన భాషలను తుడిచి పెట్టేస్తోంది. ఉత్తర ప్రదేశ్, బీహార్లు హిందీకి గుండెకాయలు అని చెబుతుంటారు. కానీ, ఆ రాష్ట్రాల్లో అసలైన భాషలు అంతరించే స్థితికి చేరుకున్నాయి అని స్టాలిన్ పోస్ట్ చేశారు. హిందీ అమలు విషయంలో తమిళ రాజకీయ పార్టీలు చేస్తున్న విమర్శలు అర్థంలేనివని.. కేవలం 2026 ఎన్నికల్లో లాభం కోసమే పాకులాడుతున్నాయని కేంద్రం డీఎంకే ప్రభుత్వంపై మండిపడుతోంది. అయితే స్టాలిన్ ఈ విమర్శలను కూడా తిప్పికొట్టారు. తమిళనాడుకు మాత్రం ఆ నిర్ణయం(NEP) ఏవైపు దారి తీస్తుందో తెలుసని, అందుకే అమలు చేయబోమంటూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారాయన.My dear sisters and brothers from other states,Ever wondered how many Indian languages Hindi has swallowed? Bhojpuri, Maithili, Awadhi, Braj, Bundeli, Garhwali, Kumaoni, Magahi, Marwari, Malvi, Chhattisgarhi, Santhali, Angika, Ho, Kharia, Khortha, Kurmali, Kurukh, Mundari and… pic.twitter.com/VhkWtCDHV9— M.K.Stalin (@mkstalin) February 27, 2025ఇదిలా ఉంటే.. స్టాలిన్ ఆరోపణలను కేంద్రం తోసిపుచ్చింది. ఆయన(Stalin) వాదన అసంబద్ధంగా(Silly)గా ఉందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. తొలుత జాతీయ విద్యావిధానం అమలు చేస్తామని తమిళనాడు కూడా అంగీకరించిందని, ఆపై రాజకీయ లబ్ధి కోసమే యూటర్న్ తీసుకుందని మండిపడ్డారాయన. ఇక.. ఎన్ఈపీ అమలుకు సన్నద్ధంగా లేకపోవడం వల్లే తమిళనాడుకు వచ్చే రూ. 2,400 కోట్ల ఫండ్‌ను కేంద్రం ఆపేసిందన్న ఆరోపణలనూ మంత్రి ధర్మేంద్ర తోసిపుచ్చారు. ఎన్ఈపీ ప్రకారం రాష్ట్రాలు తమకు నచ్చిన భాషలను అమలు చేసే అవకాశం ఉందని, కానీ తమిళనాడు ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం అనవసరమైన రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు.హిందీ భాష అమలు విషయంలో కేంద్రం గనుక తమ రాష్ట్రంపై బ్లాక్‌మెయిల్‌కు పాల్పడితే.. మరో భాషా యద్ధానికి(Language War) సిద్ధమంటూ సీఎం స్టాలిన్, ఆయన తనయుడు.. డిప్యూటీ సీఎం ఉదయ్‌నిధి స్టాలిన్ కేంద్రాన్ని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాడు ఏం జరిగిందో ఓసారి పరిశీలిస్తే..అప్పటి నుంచే అనుమానాలుభారత రాజ్యాంగం ప్రకారం 15 ఏళ్లపాటు హిందీతో పాటు ఇంగ్లీష్‌ను అధికారిక ఉత్తర్వుల కోసం వినియోగించాలని కానిస్టిట్యూట్ అసెంబ్లీ నిర్ణయించింది. దీని ప్రకారం.. జనవరి 26, 1950 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. అయితే 1965లో ఆ గడువు పూర్తి కావడంతో.. హిందీయేతర రాష్ట్రాలు ఆందోళన బాట పట్టాయి. బలవంతంగా తమ రాష్ట్రాల్లో హిందీ భాషను అమలు చేస్తారేమో అని ఉద్యమాలు మొదలుపెట్టాయి. తమిళ సంప్రదాయాలతో పాటు భాషప్రతిపాదికన మద్రాస్ గడ్డపై ద్రవిడ ఉద్యమం జరిగింది. అలాంటి చోట హిందీ భాష ప్రవేశపెట్టడంపై దశాబ్దాల నుంచే వ్యతిరేక ఉద్యమం నడుస్తోంది. 1965లో తమిళనాడులో డీఎంకే ఆధ్వర్యంలో భారీ హిందీ భాష అమలు వ్యతిరేక ఉద్యమం జరగ్గా.. అది హింసాత్మక మలుపు తీసుకుంది. హిందీ భాష అమలును వ్యతిరేకిస్తూ.. ఎంతో మంది బలిదానం చేసుకున్నారు. ఈ పరిణామం కాంగ్రెస్‌ను తమిళనాడులో అధికార పీఠం నుంచి దించేయడానికి ఓ కారణమైంది. తమిళనాడులో రెండు భాషలే..సీఎన్ అన్నాదురై నేతృత్వంలోని తొలి డీఎంకే ప్రభుత్వం.. 1968లో తమిళనాడు కోసం ఓ విద్యావిధానాన్ని ప్రవేశపెట్టింది. అందులో ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం తమిళం, ఆంగ్లం మాత్రమే బోధించాలని ఉంది. అయితే అదే సమయంలో ఇందిరా గాంధీ హయాంలోని కేంద్ర ప్రభుత్వం కొఠారి కమిషన్(1964-66) నివేదిక ఆధారంగా తొలిసారి జాతీయ విద్యా విధానం ప్రవేశపెట్టింది. సమాన విద్యావకాశాలను ప్రొత్సహించడంతో పాటు జాతీయ సమైక్యతను ప్రతిబింబించేలా మూడు భాషల ఫార్ములాను ప్రవేశపెట్టాలని సదరు కమిషన్ సూచించింది. దీని ప్రకారం.. హిందీ, ఇంగ్లీష్‌తో పాటు స్థానిక భాషలను సూచించింది. అయితే ఆ టైంలోనూ హిందీ తప్పనిసరి కాదని కేంద్రం చెప్పినా.. ఆ విద్యావిధానాన్ని తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకించింది.👉1968లో ఇందిరా గాంధీ హయాంలో మొదటి జాతీయ విద్యా విధానం ప్రవేశపెట్టబడింది. 14 ఏళ్లలోపు వారికి తప్పనిసరి విద్య, శాస్త్ర విజ్ఞాన రంగాలపై అవగాహన ద్వారా ఆర్థిక అభివృద్ధి, సమాన విద్యావకాశాలు, టీచర్లకు శిక్షణ.. ఇతర అంశాలతో కొఠారి కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ పాలసీని అమల్లోకి తెచ్చింది. ఇందులో మూడు భాషల విధానం తీసుకొచ్చింది కేంద్రం. 👉ఇక.. 1986లో రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న టైంలో మరోసారి ఎన్ఈపీ తెరపైకి వచ్చింది. ఈసారి మూడు భాషల అంశం లేకుండా.. కేవలం విద్యా ప్రమాణాలను మెరుగుపర్చడంతో పాటు అన్ని వయసుల వారికి విద్యను అందించడం మీదనే ఫోకస్ చేసింది.👉ముచ్చటగా మూడోసారి.. పీవీ నరసింహారావు హయాంలో ప్రవేశపెట్టారు. అయితే.. 1986 ఎన్ఈపీకే కొన్ని మార్పులుచేర్పులు చేశారు. సమకాలీన సవాళ్లను ప్రస్తావిస్తూ.. విద్యా వ్యవస్థను పటిష్టం చేయడంపై ఆయన దృష్టిసారించారు.ఇక.. దేశ విద్యా వ్యవస్థలో సంస్కరణలు తెచ్చే ఉద్దేశంతో.. 2020, జులై 29వ తేదీన జాతీయ విద్యా విధానాన్ని ఎన్డీయే ప్రభుత్వం ప్రకటించింది. తద్వారా 1986 జాతీయ విద్యా విధానాన్ని(ఇప్పుడు అమల్లో ఉన్నదే) సమూలంగా మార్చేసింది. జులై 29, 2020లో అప్పటి కేబినెట్ నూతన విద్యా విధానానికి ఆమోద ముద్ర వేసింది. ప్రస్తుతం 10+2గా ఉన్న బేసిక్ అకడమిక్ వ్యవస్థను.. 5+3+3+4గా మార్పు చేయడంతో పాటు పలు కీలక సంస్కరణలు తీసుకొచ్చింది. ఈ ఎన్ఈపీ ప్రకారం.. మూడు లాంగ్వేజ్ ఫార్ములా అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో హిందీ కూడా ఉంది. కానీ.. ఇది బలవంతపు నిర్ణయం కాదని కేంద్రం మొదటి నుంచి చెబుతోంది. రాష్ట్రాలు, రీజియన్లు, విద్యార్థులు తమకు నచ్చి భాషలను ఎంచుకునే వీలు ఉంటుందని చెబుతూ వస్తోంది. అయితే ఇది తమ మాతృభాషకు దొడ్డిదారిన ముప్పు కలిగించే ప్రయత్నమేనని తమిళనాడు అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ విధానం అమలు చేయబోమని చెబుతోంది. ఇక 2026లో ఈ విద్యావిధానం అమల్లోకి రానుంది. -
40 ఏళ్ల తరువాత తల్లిని చేరిన కూతురు
ఐదు రోజుల పసికూనగా వెళ్లిపోయిన కూతురు 40 ఏళ్ల తరువాత తల్లి ముందు నిలబడితే.. ఆ ఆనందానికి అవధులు ఉండవు కదా! ఈ అంతులేని సంతోషానికి ఇటీవల వేదికయ్యింది చిలీలోని శాన్ ఆంటోనియో. వివరాల్లోకి వెళ్తే.. 40 ఏళ్లకిందట.. శాన్ అంటోనియాకు చెందిన 24 ఏళ్ల ఎడిటా బిజామాకు అప్పటికే ఇద్దరమ్మాయిలు. మూడో సారి కుమార్తె పుట్టింది. పిల్లల్లో పేదరికాన్ని తగ్గించడానికి అప్పటి అగస్టో పినోచెట్ నాయకత్వంలోని సైనిక నియంతృత్వ ప్రభుత్వం అంతర్జాతీయ దత్తతలే మార్గమని భావించింది. అట్లా దాదాపు 20వేల మంది పిల్లలను బలవంతపు దత్తత ఇచ్చింది. బిడ్డ కడుపులో ఉండగా.. బిజామా సైతం దత్తతకు అంగీకరించింది. కానీ.. పాప పుట్టిన తరువాత పంపించడానికామె ఒప్పుకోలేదు. ‘ఉద్యోగం లేదు, ఇల్లు లేదు, స్థిరత్వం లేదు. పిల్లలను ఎలా పెంచుతావ్’అంటూ ప్రశ్నించిన ప్రభుత్వాధికారులు ఆమె ఐదు రోజుల కూతురిని తీసుకెళ్లిపోయారు. బిజామా కుటుంబంలోని చాలా మందికి ఈ విషయం కూడా తెలియదు. కానీ పేగు తెంచుకు పుట్టింది కదా.. బిజామా బిడ్డకోసం రోదిస్తూనే ఉంది. వెదకడానికి కనీసం పేరు తెలియదు. మార్గం కూడా లేదు. మరోవైపు.. ఆమె కూతురు అడామరీ గార్సియా ఫ్లోరిడాలో పెరిగింది. ఇప్పుడు ప్యూర్టో రికోలో నివసిస్తోంది. తనను దత్తత తీసుకున్నారని చిన్నతనం నుంచే తెలుసు. కానీ కన్న తల్లిదండ్రులను కలుసుకోవడమెలాగో తెలియదు. అలాంటి సమయంలో ఆమె ఫ్రెండ్ ఒకరు.. శిశువుగా దత్తతకు వచ్చి.. చిలీలోని తన సొంత కుటుంబాన్ని కలుసుకున్న టెక్సాస్ అగ్నిమాపక అధికారి టేలర్ గ్రాఫ్ గురించి చెప్పారు. అలాంటివారికోసం సాయం చేసేందుకు ఆయన ఏర్పాటు చేసిన ‘కనెక్టింగ్ రూట్స్’స్వచ్ఛంద సంస్థ గురించి వివరించారు. వెంటనే ఆ సంస్థను కలిసింది గార్సియా. కుటుంబం గురించి తెలుసుకోవడానికి గార్సియా తపన చూసి.. ఆమెను దత్తత తీసుకున్న తల్లిదండ్రులు సైతం ప్రోత్సాహమందించారు. సోదరి బర్త్ సరి్టఫికెట్ ద్వారా కుటుంబ వివరాలు తెలిసాయి. అయినా.. డీఎన్ఏ పరీక్షతో బిజామానే గార్సియా కన్నతల్లని కనెక్టింగ్ రూట్స్ నిర్ధారించింది. వెంటనే మొదటిసారి జూమ్ ద్వారా మాట్లాడుకున్నారు. గార్సియాది ప్యూర్టో రికన్ స్పానిష్, మయామీ యాస. కానీ తల్లి, అక్కలది విలక్షణమైన చిలీ యాస. మొదటిసారి సంభాషణ కష్టమే అయ్యింది. ఒకరినొకరు చూసుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు. గతవారం కుటుంబం చెంతకు చేరుకుంది గార్సియా. 41 ఏళ్ల గార్సియాకు తల్లికి, ఇద్దరు అక్కలకు దగ్గరకు పోలికలున్నాయి. అంతేకాదు.. పెద్దక్కకు ఇష్టమున్నట్టే ఆమెకూ కుక్కలంటే చాలా ఇష్టం. ఇప్పుడు గార్సియా చిలీయాస, వంటకాలు, సంగీతం అన్నింటినీ నేర్చుకుంటోంది. అక్కలతో ఎక్కువకాలం గడపాలని నిర్ణయించుకుంది. కనెక్టింగ్ రూట్స్ ఈ ఏడాది చిలీకి తీసుకువచి్చన ఐదుగురు దత్తతదారుల్లో గార్సియా ఒకరు. ఇది ఆ ఎన్జీవో చేసిన నాలుగవ పునరేకీకరణ. ఎన్జీవో చర్యలకు ప్రభుత్వం మద్దతు ఇస్తోంది. 40 ఏళ్ల కిందట దత్తతకు పోవడంతో ఇప్పుడు తల్లులు పెద్దవారవుతున్నారు. కొందరు చనిపోయారు. అందుకే ఆలస్యం కాకముందే సాధ్యమైనన్ని ఎక్కువ కుటుంబాలను తిరిగి కలపాలని లక్ష్యంగా పెట్టుకుంది కనెక్టింగ్ రూట్స్. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బిడ్డ చదువెలా ఉంది సారూ!
సాక్షి, అమరావతి: దేశంలో పిల్లల విద్య, భవిష్యత్తుపై తల్లిదండ్రుల శ్రద్ధ నానాటికీ పెరుగుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రజలు చదువు విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తమ బిడ్డలు బడికి వెళ్లారా.. ఎలా చదువతున్నారు.. ఇంటి వద్ద ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలను టీచర్లను అడిగి తెలుసుకొంటున్నారు. అంతే కాదు.. వారూ అక్షర జ్ఞానం పెంచుకుంటున్నారు. ఒకప్పుడు కేవలం రోజువారీ పనుల మీదే దృష్టి పెట్టే తల్లిదండ్రులు పిల్లల చదువుపై అంతగా శ్రద్ధ పెట్టే వారు కాదు. బడుల్లో తల్లిదండ్రుల సమావేశాలు పెట్టినా పెద్దగా హాజరయ్యేవారు కాదు. ఇప్పుడు పరిస్థితి మారింది. 46.6 శాతం తల్లులు స్కూళ్లకు వెళ్లి పిల్లల చదువుపై ఆరా తీస్తున్నారు. వారు కూడా పనులు చేసుకుంటూనే పిల్లలతో సమానంగా చదువుకుంటున్నారు. ‘వార్షిక స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ (అసర్)– 2024’ సర్వే నివేదిక ఈ విషయాలు వెల్లడించింది. గ్రామీణ భారత్‌లో పాఠశాలకు వెళ్లే వయసు గల పిల్లలు (5 నుంచి 16 ఏళ్లు) ఉన్న తల్లులు విద్యా రంగంపై మంచి అవగాహనతో ఉన్నారని ఆ నివేదిక తెలిపింది. 2016లో జాతీయ స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో 29.4 శాతం మంది తల్లులు మాత్రమే ఇలా బడిబాట పడితే.. 2024 నాటికి ఆ సంఖ్య 46.6 శాతానికి పెరిగినట్టు పేర్కొంది. తల్లుల్లో 10వ తరగతి మించి చదువుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతున్నట్టు పేర్కొంది. ఎనిమిదేళ్ల క్రితం గ్రామాల్లో పదో తరగతి చదువుకున్న తల్లులు 9.2 శాతం ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 19.5 శాతం పెరిగిందని తెలిపింది. పదో తరగతి దాటి చదివిన తండ్రుల శాతం పెరుగుదల 2016లో 17.4 శాతం ఉండగా 2024లో 25 శాతానికి చేరువైంది. పదో తరగతి దాటి చదివిన తల్లులు, తండ్రుల శాతం మధ్య అంతరమూ గత ఎనిమిదేళ్లలో తగ్గిందని, 2016లో తల్లులకంటే తండ్రులు 8 శాతం ఎక్కువుంటే, 2024 నాటికి సుమారు 5 శాతానికి తగ్గినట్టు నివేదిక పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో సైతం 23 శాతం మంది బడుల్లో జరిగే కార్యక్రమాలకు హాజరవుతుండడంతో పాటు పిల్లలతో సమానంగా విద్యనభ్యసిస్తున్నట్టు ప్రకటించింది. జాతీయ స్థాయిని మించి రాష్ట్రంలో ప్రగతి పదో తరగతికి మించి విద్యావంతులైన తల్లులు గతంలో జాతీయ సగటుకంటే ఎక్కువగా కేరళలోనే అధికంగా ఉండేవారని, ఇప్పుడు ఈ జాబితాలో హరియాణా, హిమాచల్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక కూడా చేరినట్లు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో 2016లో పదో తరగతికి మించి చదివిన తల్లులు 10.4 శాతం ఉండగా 2024లో 22.8 శాతానికి పెరిగినట్లు తెలిపింది. తల్లులు విద్యావంతులు కావడంతో చదువు అవసరాన్ని గుర్తించారని నివేదిక వివరించింది. పిల్లల భవిష్యత్తు బాగుండాలన్న ఆలోచన పెరగడంతోపాటు ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రోత్సాహక కార్యక్రమాలు కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నట్లు పేర్కొంది. గతంలో ఈ ప్రగతి కేరళలో మాత్రమే కనిపించేదని, ఇప్పుడు దేశంలో పలు రాష్ట్రాల్లో చదువుకునే తల్లులు పెరుగుతున్నట్టు వెల్లడించింది. సర్వే ఇలా.. అసర్ సర్వే కోసం ప్రథమ్ సంస్థ దేశంలోని 605 జిల్లాల్లో 17,997 గ్రామాల్లో 3,52,028 గృహాలను సందర్శించింది. 15,728 పాఠశాలల్లోని వివిధ తరగతుల్లో 6,49,491 మంది పిల్లల చదువులు, వారి తల్లిదండ్రుల పర్యవేక్షణను పరిశీలించింది. చదువులో పిల్లల రాణింపు, విషయ పరిజ్ఞానంతో పాటు తల్లిదండ్రులు విద్యా ప్రగతని అంచనావేసి నివేదిక రూపొందించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సంస్థ 390 గ్రామాల్లో 7,721 నివాసాలను సర్వే చేసి, 3 నుంచి 16 ఏళ్ల మధ్య వయసు గల 12,697 మంది పిల్లలను పరీక్షించింది. -
శివరాత్రి వేళ ముక్కంటి వైభవం
రాష్ట్రంలోని శైవక్షేత్రాలు శివనామ స్మరణతో మార్మోగాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బుధవారం వేకువజాము నుంచే శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నదులు, పుష్కరిణిలలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు భోళాశంకరుడిని దర్శించుకునేందుకు బారులు తీరారు. ఆదిదేవునికి అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారికి కుంకుమ పూజలు జరిపారు. అనేకచోట్ల రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిపారు.లింగోద్భవ కాలం అనంతరం పార్వతీపరమేశ్వరుల కల్యాణోత్సవాలు నేత్రపర్వంగా సాగాయి. శ్రీశైలం, శ్రీకాళహస్తి, పంచారామ క్షేత్రాలతోపాటు కోటప్పకొండ త్రికూటేశ్వరస్వామి ఆలయం భక్తులతో సందడిగా మారాయి. ‘ఓం నమశ్శివాయ’ అంటూ భక్తులు కైలాసనాథుడికి తమ కోరికలను విన్నవించుకున్నారు. – సాక్షి నెట్వర్క్శ్రీశైలానికి వెల్లువెత్తిన భక్తజనం శ్రీశైలంలో ఆదిదేవుడి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. దేశం నలుమూలల నుంచి వెల్లువలా తరలివచ్చిన భక్తులతో శ్రీగిరి క్షేత్రం జనసంద్రమైంది. మల్లన్న, భ్రామరీలకు దేవస్థానం విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. లింగోద్భవ సమయంలో మల్లన్నకు పాగాలంకరణ జరిపారు. పండితులు, ప్రధాన అర్చకులు జ్యోతిర్లింగ మల్లికార్జునుడికి లింగోద్భవకాల మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకానికి శ్రీకారం చుట్టారు. శంభో శివ శంబో ఓం నమశ్శివాయ అంటూ భక్తుల శివనామస్మరణ నలుమూలల నుంచి ధ్వనించింది. ప్రకాశం జిల్లా హస్తినాపురానికి చెందిన చేనేత కార్మికుడు ఫృధ్వి సుబ్బారావు స్వామివారి గర్భాలయ విమాన గోపురాన్ని, ముఖమండపంపై ఉన్న 14 నందులను కలుపుతూ పాగాలంకరణ చేశారు. బుధవారం అర్ధరాత్రి 12 గంటలకు శివపార్వతులకు పట్టువ్రస్తాలు, బంగారు ఆభరణాలు, పరిమళపూలతో అలంకరించారు. వేదమంత్రాల నడుమ ఆది దంపతులు ఒక్కటైన కల్యాణ ఘడియల్లో క్షేత్రమంతటా శివనామ స్మరణలు హోరెత్తాయి. ప్రభల ఉత్సవం కనుల పండువగా సాగింది.కోటప్పకొండపై కోలాహలం ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండపై వెలసిన త్రికోటేశ్వర స్వామి క్షేత్రం భక్తజనంతో నిండిపోయింది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దఎత్తున స్వామి దర్శనం కోసం తరలివచ్చారు. వేకువజామున 3 గంటలకు తీర్థబిందెతో స్వామికి అభిషేకాలు నిర్వహించారు. త్రికూటాద్రి పర్వతంపై కొలువై ఉన్న మహానందీశ్వరునికి పంచామృతాభిషేకాలు జరిపారు. ప్రభల ఉత్సవం కోలాహలంగా జరిగింది. 20 భారీ విద్యుత్ ప్రభలతోపాటు చిన్న చిన్న ప్రభలు ప్రభల నిధికి చేరాయి. దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువ్రస్తాలు సమర్పించారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వి.సుజాత, జస్టిస్ కె.సురేష్ రెడ్డి, జస్టిస్ కృష్ణమోహన్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్రమంత్రి టీజీ భరత్, ప్రభుత్వ విప్ జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యేలు పత్తిపాటి పుల్లారావు, చదలవాడ అరవింద్‌బాబు, యరపతినేని శ్రీనివాసరావు, బి.రామాంజనేయులు, కొలికిపూడి శ్రీనివాసరావు, మాజీ మంత్రి మేరుగు నాగార్జున, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు త్రికోటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. పంచారామాలకు పోటెత్తిన భక్తులుఉమ్మడి గుంటూరు జిల్లా అమరావతి, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, పాలకొల్లు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని సామర్లకోట, ద్రాక్షారామంలోని పంచారామ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. అమరావతిలోని అమరారామంలో ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు పవిత్ర కృష్ణా నదిలో స్నాన మాచరించి అమరేశ్వరాలయంలో దీపాలు వెలిగించి ఏకాదశ రుద్రాభిషేకాలను, అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. అమరేశ్వరుడిని హైకోర్టు న్యాయమూర్తులు జ్యోతిర్మయి, సుమతి, రవినాథ్ తివారి, రిటైర్డ్ న్యాయమూర్తి శ్యాంప్రసాద్, ప్రభుత్వ సలహాదారు అర్పీ ఠాకూర్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్యేలు భాష్యం ప్రవీణ్, జగన్మోహనరావు, పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ దర్శించుకున్నారు. భీమవరం గునుపూడిలోని ఉమాసోమేశ్వర జనార్దనస్వామి ఆలయం (సోమారామం)లో విశేష అభిషేకాలు, పూజలు, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, పంచామృతాభిషేకాలు చేశారు. శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు, డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు క్షేత్రాన్ని దర్శించుకున్నారు. పాలకొల్లులోని క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో విశేష అభిషేకాలు, మహన్యాసపూర్వక అభిషేకాలు నిర్వహించారు. రాత్రి 8.35 గంటలకు జగజ్జ్యోతి వెలిగించారు. రాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయంలో స్వామివారికి మల్లన్న పాగా అలంకరించారు. అనంతరం లక్షపత్రి పూజ నిర్వహించారు.ద్రాక్షారామం, సామర్లకోట సమీపంలోని భీమారామం క్షేత్రాలను దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఏలూరు జిల్లా పోలవరం మండలంలోని పట్టిసీమ శివక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. పవిత్ర గోదావరి నదిలో పుణ్య స్నానమాచరించి భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామిని దర్శించుకున్నారు. పితృదేవతలకు పిండ ప్రదానాలు చేసి గోదావరిలో మైల తెప్పలు వదిలారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా మురమళ్లలో భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి, కోటిపల్లి రాజరాజేశ్వరీ సమేత సోమేశ్వరస్వామి, పిఠాపురం నియోజకవర్గంలోని పాదగయ, రాజమహేంద్రవరంలోని ఉమా మార్కండేయేశ్వరస్వామి, కోటి లింగేశ్వర స్వామి తదితర ఆలయాల్లో లింగోద్భవ అభిషేకాలకు భక్తులు పోటెత్తారు. కొవ్వూరులోని గోష్పాద క్షేత్రం, గోదావరి ఘాట్లలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గామల్లేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు జరిపారు.శ్రీకాళహస్తికి పోటెత్తిన భక్తజనంతిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వరాలయానికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఇంద్ర విమానం, చప్పర, నంది, సింహ వాహనాలపై మాడ వీధుల్లో విహరించారు. భక్తులు కర్పూర హారతులు పట్టారు. రాత్రి శివయ్య జాగరణకు వేలాది మంది భక్తులు శ్రీకాళహస్తికి చేరుకున్నారు. అర్ధరాత్రి దాటాక లింగోద్భవ దర్శనం ప్రారంభమైంది. హీరో మంచు విష్ణు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా, చిత్రబృందం స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. తిరుమలలోనూ శివరాత్రి సందడి తిరుమలలోని గోగర్భం సమీపంలో వెలసిన రుద్రుని రూపమైన క్షేత్రపాలకుడికి అభిషేకం నిర్వహించారు. క్షేత్రపాలకుడి శిల వద్ద పాలు, పెరుగు, చందనం, పన్నీరు, కొబ్బరి నీళ్లు తదితర ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఆ తర్వాత నైవేద్యం సమరి్పంచారు.యనమలకుదురులో సందడిగా ప్రబోత్సవం కృష్ణా జిల్లా యనమలకుదురు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వరస్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. భక్తుల సందడితో శివగిరి పై ఉత్సవ శోభ ఏర్పడింది. భక్తులు బుధవారం మహాశివరాత్రి పర్వదినంతో వేకువజామునే కొండ పై వేంచేసి ఉన్న స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా గ్రామంలో ప్ర¿ోత్సవం ఆకట్టుకుంది. సాయంత్రం 6 గంటలకు రాతిచక్రాల రథం పై ఏర్పాటు చేసిన దేవుడి ప్రభ కొండ చుట్టూ ఊరేగించారు. గ్రామంలో దాదాపు 50 ప్రభలు రంగురంగు కాగితాలు, విద్యుత్ దీపాలతో అలంకరించారు. మండపం సెంటర్లో 70 అడుగుల ప్రభ ఏర్పాటు చేశారు. గ్రామంలో ప్రభలు రాత్రి పొద్దుపోయే వరకు ప్రదర్శించారు. -
అందమైన బంధానికి అపురూపం
కోటి ఆశలతో, వేల ఊసులతో ఒక్కటయ్యే అనుబంధం. నమ్మకమనే ఆస్తిని ఇద్దరి భుజస్కంధాలపై మోయాలనే మాటకు అసలైన అర్థం పెళ్లి. అంతటి ముఖ్యమైన ఘట్టంలోని మధుర క్షణాలు, జ్ఞాపకాలను పదిలంగా దాచుకునేందుకు నేటితరం ఆసక్తి చూపుతోంది. ఓ వైపు కల్యాణ మండపం, విందు.. మరోవైపు అందంగా.. ఆధునికంగా చిత్రాలు, వీడియోల చిత్రీకరణకు ఎంత ఖర్చయినా వెనకాడటం లేదు. ఇందుకోసం కొత్తగా ‘ప్రీ వెడ్డింగ్ షూట్’కు యువత ఆసక్తి చూపిస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో పెళ్లి చేసుకుంటున్న జంటలు ప్రీ వెడ్డింగ్ షూట్ (Pre Wedding Shoot) వైపు మొగ్గు చూపుతున్నారు. అందమైన ఊహలు, దివ్యమైన ఆలోచనలకు రూపాన్నిచ్చేలా.. చక్కటి రూపం కల్పిస్తుండడంతో ఈ సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వధూవరుల ఇళ్లకు పరిమితమవ్వకుండా.. పచ్చదనంతో నిండిన అందమైన ప్రాంతాలకు వెళ్తున్నారు. – తొర్రూరువెడ్డింగ్ షూట్ కొత్తపుంతలు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హనుమకొండ, వరంగల్ (Warangal), కాజీపేట, నర్సంపేట, మహబూబాబాద్, భూపాలపల్లి తదితర పట్టణాల్లో ఫొటో, వీడియోగ్రఫీ కొత్త పుంతలు తొక్కుతోంది. ‘ప్రీ వెడ్డింగ్ షూట్’కు ప్రత్యేక చిత్రాలను తీయించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వీడియో, ఫొటోగ్రాఫర్లతో ఒప్పందం కుదుర్చుకునే ముందు.. గతంలో వారు తీసిన వీడియోలను చూశాకే బుక్ చేసుకుంటున్నారు. గతంలో కేవలం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, వ్యాపార, వాణిజ్య, రాజకీయ నాయకుల పిల్లలు మాత్రమే వీటికి ప్రాధాన్యం ఇచ్చేవారు. ప్రస్తుతం అందరిలో ఆసక్తి పెరగడంతో ఆయా ప్రాంతాల్లో కొత్త విధానానికి మొగ్గు చూపుతున్నారు. అందమైన కావ్యంలా..అందమైన ప్రదేశంలో ఫొటో.. వీడియో షూట్లకు నవ వధూవరులు ఆసక్తి చూపుతున్నారు. వివాహానికి ముందే వధూవరులు తమ హావభావాలు, సంభాషణలు, సాన్నిహిత్యాన్ని చిత్రీకరించుకుంటున్నారు. భిన్న కోణాల్లో చూసుకుని మురిసిపోయేందుకు.. రేపటి తరానికి చూపించేందుకు ఎంత వ్యయమైనా వెచ్చించేందుకు సిద్ధమవుతున్నారు. ‘ప్రీ వెడ్డింగ్ షూట్’ ద్వారా ఆధునిక కెమెరాలతో ఓ సినిమా పాటలా చిత్రీకరిస్తున్నారు.అత్యాధునిక కెమెరాలతో చిత్రీకరణ..ప్రీ వెడ్డింగ్ షూట్‌ను చిత్రీకరించేందుకు హైడెన్సిటీ (హెచ్డీ) టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఈ మేరకు డీఎస్ఎల్ఆర్, డ్రోన్, 5డీ, మార్క్ 3, మార్క్ 4, సోని, 1 డీఎక్స్, 1 డీఎక్స్ మార్క్ తదితర కెమెరాలను ఉపయోగిస్తున్నారు. ఒక షూట్ చేయడానికి కనీసం నలుగురు కెమెరామన్లు పని చేస్తున్నారు. డ్రోన్ కెమెరాలను కూడా వినియోగిస్తున్నారు. ఒక్కొక్క కెమెరాకు ఒక్కొక్క లెన్స్‌లను ఉపయోగించి వధూవరులపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మూడు నుంచి 4 నిమిషాల నిడివిగల పాటకు సుమారు 2 నుంచి 3 రోజుల పాటు పని చేస్తారు. ఒక పాటకు ఒక్కోసారి ప్రదేశాలను కూడా మార్చాల్సి ఉంటుంది. ప్రదేశం మారిన సమయంలో దుస్తులను మార్చుకోవడం, మేకప్ వంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వడంతో సమయం ఎక్కువ పడుతుంది.ఎడిటింగ్ కీలకం..వధూవరులపై సన్నివేశాల చిత్రీకరణ కెమెరామెన్ల ఆలోచన, సృజనాత్మకతను బట్టి ఉంటుంది. ఒక్కోసారి వధూవరుల ఆలోచనలకూ ప్రాధాన్యమిస్తారు. చిత్రీకరణకు 2 నుంచి 3 రోజుల సమయం పట్టినా దాన్ని పాట రూపంలో తీసుకొచ్చేందుకు ఎంతో శ్రమించాల్సి ఉంటోంది. ఎడిటింగ్‌కు కనీసం 10 రోజుల సమయం పడుతుంది. ఈ మేరకు సీన్‌కట్, ఈడీఎస్, ప్రీమియర్, ఆప్టర్ ఎఫెక్ట్స్ వంటి సాఫ్ట్వేర్లు ఉపయోగిస్తారు.వివిధ ప్రాంతాల్లో చిత్రీకరణ..ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రకృతి రమణీయ ప్రదేశాల్లో షూటింగ్ జరుపుతున్నారు. లక్నవరం చెరువు, రామప్ప లేక్, పాకాల చెరువు, కాకతీయ మ్యూజికల్ గార్డెన్, గోవిందరాజుల గుట్ట, ఏటూరునాగారం అభయారణ్యం, పాకాల అభయారణ్యం, వేయిస్తంభాల గుడి, కాకతీయ రాక్ గార్డెన్, భద్రకాళి టెంపుల్ తదితర ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాలలో ప్రీ వెడ్డింగ్ షూట్ నిర్వహిస్తున్నారు.లక్షలు ఖర్చయినా లక్షణంగా..గతంలో పెళ్లికి ఫొటోలు, వీడియో తీయించుకోవాలంటే తెలిసిన ఫొటోగ్రాఫర్లకు చెప్పుకునేవాళ్లు. కానీ ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కేవలం ప్రీ వెడ్డింగ్ షూట్ కాకుండా ఆల్బమ్‌లు, వీడియోలు అన్ని కలిపి ప్యాకేజీగా తీసుకుంటున్నారు. దీనికి రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు పలు రకాల ప్యాకేజీలున్నాయి. ఇందులో ప్రీ వెడ్డింగ్ షూట్, పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ కూడా ఉంటాయి. వివాహానికి కొద్ది రోజుల ముందు, వివాహమైన తర్వాత రెండు రోజుల పాటు ప్రత్యేకంగా షూటింగ్ చేసి వీడియోలను చిత్రీకరిస్తున్నారు.వాట్సాప్, ఫేస్బుక్లో షేరింగ్..గతంలో వివాహాలంటే చాలా రోజుల ముందు నుంచే హడావుడి మొదలయ్యేది. బంధువులు, స్నేహితులకు శుభలేఖల పంపిణీ చేయడం పెద్ద ప్రహసనంగా మారిపోయేది. కానీ ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ పుణ్యమా.. అని ఆ శ్రమ లేకుండా పోయింది. ప్రీ షూట్ చేశాక పెళ్లికి ముందు తమ సమీప బంధువులు, స్నేహితులకు అందరికీ వాట్సాప్, ఫేస్బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో పంపుకొంటున్నారు. ఈ డిజిటల్ ఆహ్వానాన్నే పెళ్లి కార్డుగా ఉపయోగిస్తున్నారు.పెరిగిన ఉపాధి..ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లకు పెళ్లిళ్ల సీజన్లో మాత్రమే పని ఉండేది. ప్రస్తుతం ట్రెండ్ నడుస్తుండటంతో వారికి గిరాకీ పెరిగింది. ప్రీ వెడ్డింగ్ షూట్ల వల్ల పెళ్లికి ముందు, తర్వాత కూడా చేతినిండా పని దొరుకుతుంది. సమర్థవంతులైన ఫొటోగ్రాఫర్లు బృందాలుగా ఏర్పడి వేడుకలను నిర్వహిస్తున్నారు. యువతరం ఆసక్తి పెరగడంతో నాణ్యతతో కూడిన అత్యాధునిక కెమెరాలను ప్రీ వెడ్డింగ్ షూట్‌కు వినియోగిస్తున్నారు. ఉపాధి పొందుతున్నారు. -
పాపం పాలపిట్ట
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో దసరా పండుగ పూర్తయ్యేది రంగురంగుల పాలపిట్టను దర్శించిన తర్వాతే. అందుకే అది రాష్ట్ర పక్షిగా కూడా అయ్యింది. అయితే, ఎంతో పవిత్రంగా భావించే పాలపిట్ట (Palapitta) ఈ మధ్య కనిపించటమే లేదు. దేశంలోని అంతరించిపోతున్న పక్షుల జాబితాలో పాలపిట్ట కూడా చేరిపోయింది. ‘రైతు నేస్తం’గా పిలిచే పాలపిట్ట పూర్తిగా అంతరించిపోకుండా కాపాడేందుకు తాజాగా ప్రభుత్వం నడుం బిగించింది.ప్రమాదం అంచున..ఆకర్షణీయమైన ప్రత్యేక రంగులతో ఇట్టే ఆకట్టుకునే రంగురంగుల పక్షి పాలపిట్ట. దీనిని ఇండియన్ రోలర్ (Indian roller), బ్లూ జే అని కూడా పిలుస్తారు. రెక్కలు విచ్చుకున్నప్పుడు ముదురు, లేత నీలం రంగు డామినేట్ చేస్తూ... తెలుపు, గోధుమ, నలుపు రంగులతో ఈ పక్షి ప్రత్యేకంగా కనిపిస్తుంది. మామూలు సమయంలో 30–34 సెం.మీ (12–13 అంగుళాలు), రెక్కలు విచ్చుకున్నప్పుడు 65–74 సెం.మీ (26–29 అంగుళాలు) పొడవు, 166–176 గ్రాముల బరువుతో చూడముచ్చటగా ఉంటుంది. ఏడాది క్రితం విడుదలైన ‘స్టేట్ ఆఫ్ ఇండియాస్ బర్డ్స్ రిపోర్ట్’లో సంఖ్య తగ్గిపోతున్న పక్షి జాతుల్లో వీటిని కూడా చేర్చారు. అంతకుముందు ఏడాదితో పోల్చితే వీటి సంఖ్య 30 శాతం తగ్గినట్లు వెల్లడైంది. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) నివేదికలో రెడ్ లిస్ట్ రీఅసెస్మెంట్ కోసం పాలపిట్టను సిఫార్సు చేశారు. తెలంగాణతోపాటు ఏపీ, కర్ణాటక, ఒడిశా, బిహార్ (Bihar) రాష్ట్రాల్లో కూడా పాలపిట్టను రాష్ట్ర పక్షిగా గుర్తించారు. పాలపిట్ట పరిరక్షణకు ప్రణాళికపాలపిట్టల సంఖ్య తగ్గిపోవటానికి ప్రధాన కారణం గ్లోబల్ వార్మింగ్, కాలుష్యం, మొబైల్ టవర్ల ద్వారా వస్తున్న రేడియేషన్ (Radiation) అని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. దసరా, ఉగాది పండుగల సమయంలో కొందరు వీటిని బంధించి పట్టణాల్లో ప్రదర్శించి డబ్బులు వసూలు చేస్తుండడం కూడా వాటికి ప్రాణసంకటంగా మారుతోంది. ప్రమాదాన్ని గుర్తించిన ప్రభుత్వం పాలపిట్టను రక్షించేందుకు చర్యలకు ఉపక్రమించింది. చదవండి: హైదరాబాద్ జూ పార్కు ఎంట్రీ టికెట్ ధరల పెంపుతాజాగా జరిగిన రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ బోర్డు సమావేశంలో పాలపిట్ట సంరక్షణకు ప్రణాళిక సిద్ధం చేయాలని అటవీ శాఖా మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. అటవీచట్టం షెడ్యూల్–4లో పాలపిట్ట ఉండడంతో దానిని బంధించడం, హింసించడం వంటివి చేస్తే నాన్‌బెయిలబుల్ కేసులతో పాటు మూడేళ్ల జైలుశిక్ష, రూ.25 వేల వరకు జరిమానా విధించే వీలుంది. దీంతో పాలపిట్ట సంరక్షణకు చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.రైతు నేస్తంపాలపిట్టలు రైతు నేస్తాలు. ఇవి వలస పక్షులు కావు. భారత్, ఇరాక్, థాయ్‌లాండ్‌లో అధికంగా కనిపిస్తాయి. చిన్న కప్పలు, మిడతలు, కీచురాళ్లు వంటి వాటిని వేటాడి తింటుంటాయి. వీటి జీవితకాలం 17–20 ఏళ్లు. చెట్ల తొర్రల్లో గూళ్లు పెట్టి మూడు నుంచి ఐదు గుడ్ల వరకు పెడతాయి. వీటి ప్రత్యుత్పత్తి కాలం వాటి ఆవాస ప్రాంతాలను బట్టి ఫిబ్రవరి–జూన్ నెలల మధ్యలో ఉంటుంది. ఈ పక్షులు పంట పొలాలు, తోటలు, ఉద్యా నవనాల్లో తెగుళ్లను ఆహారంగా తీసుకుంటాయి. పంటలను నష్టపరిచే కీటకాలు, సరీసృపాలు, ఉభయ చరాలను వేటాడి తింటూ రైతులకు పరోక్షంగా సహకారం అందిస్తాయి. అందుకే వీటిని రైతునేస్తాలు అని పిలుస్తారు.పంటల సాగు తగ్గటంవల్లే..కొంతకాలంగా పాలపిట్టలు అంతగా కనబడడం లేదు. హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోనూ రియల్ ఎస్టేట్ విస్త రణ, నగరాలు, పట్టణాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో వ్యవసాయం నిలిచిపోవడంతో వాటి ఆవాస ప్రాంతాలకు ఇబ్బందులు తలెత్తాయి. పంటల రక్షణకు పురుగుమందులు అధికంగా వినియోగించటం కూడా ఈ పక్షుల సంఖ్య తగ్గటానికి కారణం. – హరికృష్ణ ఆడెపు, హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ అధ్యక్షుడు.పూర్తిగా అంతరించకపోవచ్చు..పాలపిట్టలు మను షులు, జనావాసా లకు దూరంగా ఉండేందుకు ఇష్టపడతాయి. అందువల్ల వాటి కచ్చితమైన సంఖ్యను తెలుసుకో వడం కష్టమే. పాలపిట్ట జాతి పూర్తిగా అంతరించిపోతుందని భావించడానికి లేదు. – డా. సాయిలు గైని, బయో డైవర్సిటీ నిపుణుడు. -
చిన్నవయసులోనే గుండెపోటు.. ఎందుకొస్తుందో తెలుసా?
దేశంలో ఇటీవలి కాలంలో చిన్న వయసులోనే గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. గతంలో ఈ తరహాలో గుండెపోటు, స్ట్రోక్, గుండె, ధమనుల వ్యాధులు వృద్ధులలో మాత్రమే కనిపించేవి. కానీ ఇప్పుడు పాతికేళ్లలోపువారిలోనూ గుండపోటు కేసులు వెలుగు చూస్తున్నాయి. దీనికి కారణమేమిటి? వైద్యులు ఏమంటున్నారు?పురుషుల్లోనే అధికంఇండియన్ హార్ట్ అసోసియేషన్ తెలిపిన వివరాల ప్రకారం గత కొన్నేళ్లుగా 50 ఏళ్లలోపు వయసుగల వారిలో గుండెపోటు ముప్పు 50 శాతం, 40 ఏళ్లలోపు వారిలో 25 శాతం మేరకు పెరిగింది. అయితే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో.. మహిళల్లో గుండెపోటు కేసులు చాలా తక్కువని తెలిపింది. పురుషులు ఎక్కువగా గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొంది. ధూమపానం, మద్యపానం అనేవి యువతలో హృదయ సంబంధ వ్యాధులకు కారణంగా నిలుస్తున్నాయి. ఈ వ్యసనాల కారణంగా శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. ఫలితంగా ఇది కరోనరీ హార్ట్ డిసీజ్‌కు దారితీస్తుంది. అధికంగా మద్యం సేవించడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఇది రక్త నాళాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తుంది. ఫలితంగా గుండెపోటు ముప్పు పెరుగుతుంది.కారణాలివే..👇👉ఆహారపు అలవాట్లుఈ రోజుల్లో ప్రతి రంగంలోనూ పని ఒత్తిడి మరింతగా పెరిగింది. దీంతో యువత తమ ఆహారపు అలవాట్లు, దినచర్యపై తగిన శ్రద్ధ చూపడం లేదు. ఇది పలు రకాల గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తోంది. జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం వల్ల యువత ఆరోగ్యం దెబ్బతింటోంది. దీని కారణంగా శరీరంలోని కేలరీల పరిమాణం పెరుగుతుంది. ఇది గుండెపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.👉అధిక పని ఒత్తిడిమానసిక ఒత్తిడి కూడా గుండెపోటుకు కారణంగా నిలుస్తోంది. పని భారం అనేది నేరుగా రక్త నాళాలను ప్రభావితం చేస్తుంది. ఫలితంగా యువకులు, మధ్య వయస్కులు రక్తపోటు వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. నిద్రలేమితో బాధపడేవారికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పలు పరిశోధనల్లో వెల్లడయ్యింది. ఎనిమిది గంటల కన్నా తక్కువ సమయం నిద్రపోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.👉మధుమేహం యువతలో గుండె జబ్బులకు మధుమేహం (డయాబెటిస్) కూడా ఒక ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో డయాబెటిస్ రోగులు అత్యధికంగా ఉన్నారు. 2019లో భారతదేశంలో 7.7 కోట్ల మంది డయాబెటిక్ బాధితులు ఉన్నారని పలు గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2045 నాటికి డయాబెటిస్ రోగుల సంఖ్య 13 కోట్లకు పైగా పెరుగుతుందనే అంచనాలున్నాయి.జిమ్, డ్యాన్స్ సమయంలోనే ఎందుకంటే..అధికంగా శారీరక శ్రమ చేయడం వలన గుండె ధమనులలో అథెరోస్క్లెరోటిక్ ప్లేక్ చీలిపోయే ప్రమాదం మరింతగా పెరుగుతుంది ఇది గుండెపోటుకు దారితీస్తుంది. కఠినమైన వ్యాయామాలు చేస్తున్న సందర్భంలో ఛాతీపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది రక్తపోటును పెంచుతుంది. అలాగే గుండెపోటు ముప్పు కూడా మరింతగా పెరుగుతుంది. అందుకే నిపుణుల సలహా మేరకు, వారి పర్యవేక్షణలో మాత్రమే వ్యాయామం చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అదేవిధంగా నృత్యం చేసే సమయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. నృత్యం చేసే సమయంలో హృదయ స్పందన పెరుగుతుంది. దీంతో గుండెపై ఒత్తిడి ఏర్పడుతుంది. ఊబకాయం కలిగివారు, అధిక రక్తపోటుతో బాధపడుతున్నవారు ఎక్కువ స్టెప్స్ కలిగిన నృత్యం చేస్తున్నప్పుడు వారు గుండెపోటుకు గురయ్యే అవకాశం ఉంది. అకస్మాత్తుగా గుండె ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది.ఈ లక్షణాలు కనిపిస్తే.. జాగ్రత్తపడండిఛాతీ, వీపు, గొంతు, దవడ లేదా రెండు భుజాలలో తరచూ నొప్పిగా అనిపిస్తుంటే వెంటనే వైద్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం. అలాగే ఉన్నట్టుండి చెమటలు పడుతున్నా, ఊపిరి ఆడటం కష్టంగా అనిపించినా, రెండు అడుగులు కూడా వేయలేనంత నీరసంగా అనిపించినా వెంటనే వైద్య నిపుణులను కలుసుకోవాలి. ఇదేవిధంగా ఛాతీలో, ఉదరంలో గ్యాస్ ఏర్పడినా, విపరీతమైన అలసట లేదా తల తిరుగుతున్నట్లు ఉన్నా ఆలస్యం చేయకుండా వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. ఛాతీ నొప్పి, విశ్రాంతి లేకపోవడం, శ్వాస సమస్యలు లేదా వేగంగా శ్వాస తీసుకోవడం మొదలైనవి గుండెపోటు సంబంధిత లక్షణాలు కావచ్చని గుర్తించాలని, ఇటువంటి సందర్భాల్లో అప్రమత్తంగా వ్యవహరించడం అత్యవసరమని వైద్యులు సూచిస్తున్నారు.గుండెలో సమస్యలు👉హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతిగుండె కండరాలు గట్టిపడే జన్యుపరమైన రుగ్మత. దీని వలన గుండె రక్తాన్ని సమర్ధవంతంగా పంప్ చేయలేకపోతుంది.👉డైలేటెడ్ కార్డియోమయోపతి దీనిలో ఎడమ జఠరిక పెద్దదిగా, బలహీనంగా మారుతుంది. ఇది గుండెకు రక్తాన్ని సమర్థవంతంగా ప్రసరింపజేసే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.👉అరిథ్మోజెనిక్ రైట్ వెంట్రిక్యులర్ డిస్ప్లాసియా దీనిలో కొవ్వు లేదా పీచు కణజాలం గుండె కండరాలకు ఇబ్బంది కలిగిస్తుంది. ఇది రక్త ప్రవాహానికి అంతరాయం కలిగిస్తుంది. ప్రాణాంతక అరిథ్మియా ముప్పును మరింతగా పెంచుతుంది.ముందుగా చేసే పరీక్షలివే..👉ఎకోకార్డియోగ్రఫీ (ఎకో) గుండె పనితీరునంతటినీ అంచనా వేయడానికి చేసే గుండె సంబంధిత అల్ట్రాసౌండ్ ఇమేజింగ్ ఇది.👉స్ట్రెస్/ట్రెడ్మిల్ పరీక్ష శారీరక శ్రమ చేసే సమయంలో గుండె ఎలా స్పందిస్తుందో ఈ పరీక్ష అంచనా వేస్తుంది. గుండె సంబంధిత సమస్యలను గుర్తిస్తుంది.👉జెనెటిక్ పరీక్ష ఆకస్మిక గుండెపోటు, వారసత్వంగా వచ్చిన గుండె సంబంధిత సమస్యలు, కుటుంబ చరిత్రను పరిశీలిస్తారు.👉హోల్టర్ పర్యవేక్షణ హోల్టర్ మానిటర్ అనేది హృదయ స్పందనను రికార్డ్ చేస్తుంది. ఇది గుండె సంబంధిత అసాధారణ సంకేతాలను తనిఖీ చేస్తుంది. బాధితులకు అవసరమైనప్పుడు వైద్యులు 24 గంటల హోల్టర్ పర్యవేక్షణను సూచిస్తుంటారు.వెంటనే ఏం చేయాలంటే..అకస్మాత్తుగా గుండె ఆగిపోయినప్పుడు సీపీఆర్ అనేది ప్రాణాలను కాపాడుతుంది. సీపీఆర్ చేయడం ద్వారా మెదడు, ఇతర ముఖ్యమైన అవయవాలకు ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని ప్రవహింపజేస్తుంది. కణజాల మరణాన్ని కొంతసేపటి వరకూ నివారిస్తుంది. సీపీఆర్ అందని పక్షంలో ఐదు నిమిషాల్లో మెదడు దెబ్బతినే అవకాశం ఉంది. ఎనిమిది నిమిషాల తర్వాత మరణం దాదాపు ఖాయమని వైద్యులు చెబుతున్నారు.అత్యవసర సేవలకు కాల్ఎవరైనా అకస్మాత్తుగా కుప్పకూలిపోతే పక్కనే ఉన్నవారు ఆ వ్యక్తిని కదిలిస్తూ ‘బాగున్నారా?’ అని గట్టిగా అడగాలి. వెంటనే అత్యవసర సేవలకు కాల్ చేయాలి. బాధితులు శ్వాస తీసుకుంటున్నాడా లేదా అనేది గుర్తించాలి. బాధితుడు శ్వాస తీసుకోకవడం లేదని గుర్తిస్తే అతని ఛాతీ మధ్యలో గట్టిగా వేగంగా అదమండి. నిమిషానికి 100 నుండి 120 సార్లు ఇలా చేయాలి. సీపీఆర్‌లో శిక్షణ పొందినవారు 30 కంప్రెషన్ల తర్వాత రెస్క్యూ శ్వాసలను అందించగలుగుతారు. శిక్షణ పొందనివారు ఛాతీ కంప్రెషన్లను కొనసాగించాలి. అదేవిధంగా వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించాలి.ఇది కూడా చదవండి: Mahakumbh: చివరి పుణ్యస్నానాలకు పోటెత్తిన జనం.. తాజా ఫొటోలు -
భవిష్యత్ భయాలు
ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పిల్లల ఫీజులు, తల్లిదండ్రుల వైద్య ఖర్చులు ఏటా తడిసి మోపెడవుతున్నాయి. నిత్యావసరాల ధరలు సరేసరి.. కానీ, ఆ స్థాయిలో ఆదాయాలు పెరగటంలేదు. వచ్చే సంపాదనలోనే ఎంతో కొంత భవిష్యత్ కోసం పొదుపు చేస్తున్నా.. అవి ఏమూలకూ సరిపో వటంలేదు.. ఇదీ నేడు సగం మంది భారతీయుల ఆవేదన. ముఖ్యంగా 35 – 54 ఏళ్ల మధ్య వయసున్న భారతీయులు భవిష్యత్‌పై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పొదుపు, ఖర్చులపై యూ గౌ, ఎడిల్వీస్ లైఫ్ ఇన్సూరెన్స్ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. – సాక్షి, హైదరాబాద్అధ్యయనంలోని కీలకాంశాలు..» దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లోని 4,000 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. వారిలో 94 శాతం మంది భవిష్యత్ కోసం సవివరమైన ఆర్థిక ప్రణాళిక లేదా ఒక మోస్తరు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు.» సర్వేలో పాల్గొన్నవారిలో సగానికిపైగా తాము చేస్తునపొదుపు భవిష్యత్ అవసరాలకు సరిపోదని ఆందోళన వ్యక్తంచేశారు.» పక్కా ఆర్థిక ప్రణాళిక రూపొందించుకున్నా చివరకు అది పూర్తిస్థాయిలో అక్కరకు రావడం లేదని తెలిపారు.» వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, వయసు పెరుగుతున్న పిల్లల ఆర్థిక అవసరాలను తీర్చడంలో నిమగ్నమైన 35–54 ఏళ్ల లోపువారిలో 60 శాతం మంది తమ పొదపు భవిష్యత్ అవసరాలకు సరిపోదని అంగీకరించారు.» వివిధ రూపాల్లో ఎదురయ్యే అత్యవసరాలను ఎదుర్కొనే విషయంలో పొదుపు సొమ్ము సరిపోక అప్పులు చేయాల్సి వస్తోందని ఎక్కువ మంది చెప్పారు.» అనారోగ్య సమస్యలు, విద్య, ఇంటికి మరమ్మతులు వంటివాటికి అన్నిరకాల రుణాలను వినియోగించుకుంటుండటంతో దీర్ఘకాలిక ఆకాంక్షలు నెరవేర్చుకునే విషయంలో ఇబ్బందులు తప్పడం లేదని తెలిపారు.» భవిష్యత్ అవసరాలకు పనికి వస్తుందనే ఆశతో పలు మార్గాల్లో పెట్టుబడులు పెడుతున్నా.. అది అవసరానికి చేతికి రావటంలేదని కొంతమంది పేర్కొన్నారు. » భవిష్యత్‌లో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేమని సర్వేలో పాల్గొన్న 35 – 54 ఏళ్ల మధ్య వయస్కుల్లో సగంమందికి పైగా అభిప్రాయపడ్డారు. భవిష్యత్ ఆర్థిక అవసరాలను తీర్చేందుకు జీవిత బీమా వంటి మార్గాలను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.రెండు రకాల సవాళ్లురెండు తరాలవారిని (తల్లి దండ్రులు, పిల్లలు) ఆదుకోవాల్సిన బాధ్యతల మధ్య ‘సాండ్విచ్ జనరేషన్’ (35 – 54 ఏళ్ల మధ్యవారు) నలిగిపోయే పరిస్థితి ఎదురవుతోంది. పెద్దలకు ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినపుడు తగిన విధంగా ఖర్చు చేయడం, పెరుగుతున్న పిల్లలకు నాణ్యమైన విద్యను అందించటం వీరికి సవాల్‌గా మారుతోంది. –సుమిత్ రాయ్, ఎండీ–సీఈవో, ఎడిల్వీస్ లైఫ్ ఇన్సూరెన్స్. -
ఉద్యోగానికి ‘ఇంటర్న్’ బాట
సాక్షి, ఎడ్యుకేషన్: దేశంలోని యువతకు ఉద్యోగ సాధన కోసం అవసరమయ్యే క్షేత్రస్థాయి నైపుణ్యాలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం గత ఏడాది అమల్లోకి తెచ్చిన ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్ స్కీమ్ (పీఎంఐఎస్)కు ఆదరణ లభిస్తోంది. పదో తరగతి, ఇంటర్మిడియెట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ వంటి కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ఆన్ జాబ్ ట్రైనింగ్ అవకాశం కల్పించడంతోపాటు నెలకు రూ.5 వేలు చొప్పున స్టైపెండ్ కూడా అందించడం ఈ పథకం ప్రత్యేకత. ఏడాది పాటు ఉండే ఈ ఇంటర్న్‌షిప్‌ను పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల్లోనూ పూర్తి చేసే అవకాశం ఉండటం గమనార్హం. దీనివల్ల తగిన నైపుణ్యాలు సమకూరి, మంచి ఉద్యోగంలో స్థిరపడేందుకు అవకాశం ఉంటుంది.28,141 మందికి శిక్షణ కేంద్రం గతేడాది బడ్జెట్లో ఆమోదం లభించి, అక్టోబర్ నుంచి అమల్లోకి వచ్చిన పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ తొలి దశలో 28,141 మందికి ఇంటర్న్‌షిప్ అవకాశాలు లభించాయి. ఈ స్కీమ్ కింద దేశంలో ఏటా 1.25 లక్షల మంది యువతకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా భాగస్వామ్య సంస్థల నుంచి 1.27 లక్షల ఆఫర్లు వచ్చాయి. వాటి కోసం 6.21 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. 82,077 మందిని కంపెనీలు ఎంపిక చేసుకుని ఇంటర్న్‌షిప్ ఆఫర్ చేశాయి. అయితే 28,141 మంది మాత్రమే ఆఫర్లను తీసుకుని ఆయా సంస్థల్లో శిక్షణకు హాజరయ్యారు.24 రంగాల సంస్థల్లో అవకాశాలుపీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్‌లో భాగంగా 24 రంగాలకు చెందిన సంస్థలు అభ్యర్థులకు ఇంటర్న్‌షిప్‌ను అందిస్తున్నాయి. బీఎఫ్ఎస్ఐ, హాస్పిటాలిటీ, ఆటోమోటివ్, ఎఫ్ఎంసీజీ, మ్యాన్యుఫ్యాక్చరింగ్ రంగాలకు చెందిన ప్రముఖ సంస్థలు కూడా ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ వంటి ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలతోపాటు హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ వంటి బ్యాంకింగ్ రంగ సంస్థలు, పలు ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఉండటం గమనార్హం.ట్రెయినీలకు స్టైఫండ్ కూడా.. పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ కింద ఎంపికై వివిధ సంస్థల్లో చేరినవారికి కేంద్ర ప్రభుత్వం స్టైఫండ్ ఇస్తుంది. తొలి దశలో 28,141 మంది ఇంటర్న్ ట్రైనీల బ్యాంకు ఖాతాల్లో వన్ టైమ్ గ్రాంట్ కింద రూ.4.38 కోట్లు, 2024 డిసెంబర్ వరకు రూ.1.3 కోట్ల స్టైఫండ్‌ను జమ చేసినట్లు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ ప్రకటించింది.పీఎంఐఎస్‌కు అర్హతలివీ.. పీఎం ఇంటర్న్‌షిప్ పథకం కోసం దరఖాస్తు చేసుకునేవారు 21 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య వయసులో ఉండాలి. వారి కుటుంబ వార్షికాదాయం రూ. 8 లక్షల లోపు ఉండాలి. ఎలాంటి ఉద్యోగం లేని యువతకు వారి విద్యార్హతలకు తగినట్టుగా ఏడాది పాటు ఆన్ జాబ్ ఆన్ ట్రైనింగ్/ఇంటర్న్‌షిప్ కల్పిస్తారు. ఐదేళ్ల వ్యవధిలో కోటి మంది యువతకు దేశంలోని టాప్–500 కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైనవారికి నెలకు రూ.5 వేలు స్టైపెండ్ ఇస్తారు. ఇందులో రూ.4.5 వేలను కేంద్ర ప్రభుత్వం, మరో రూ.500ను ఆయా సంస్థలు సీఎస్ఆర్ కింద భరిస్తాయి.విస్తృతం చేయాలి.. పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్‌ను టాప్–500 సంస్థలకేకాకుండా ఇతర సంస్థలకు కూడా విస్తరింపజేయాలి. దీనివల్ల ఔ త్సాహికులు తమ సమీప ప్రాంతాల్లోని సంస్థల్లో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం మెరుగవుతుంది. సుదూర ప్రాంతాల్లోని సంస్థల్లో ఇంటర్న్ ట్రైనీగా అవకాశం లభించినా.. నివాస ఖర్చులు, ఇతర కోణాల్లో ఆసక్తి చూపని పరిస్థితి ఉంది. మరోవైపు విద్యార్థులు కూడా వ్యక్తిగత హద్దులు ఏర్పరచుకుని మెలగడం కూడా సరికాదని, అవకాశమున్న చోటికి వెళ్లాలని గుర్తించాలి. – టి.మురళీధరన్, టీఎంఐ నెట్వర్క్ చైర్మన్ఏపీలో 4,973, తెలంగాణలో 7,913 మందికి చాన్స్జాతీయ స్థాయిలో అమలు చేస్తున్న ఈ స్కీమ్‌లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో 4,973 మందికి, తెలంగాణలో 7,913 మందికి ఇంటర్న్‌షిప్ ఆఫర్లు వచ్చాయి. మొత్తంగా తమిళనాడుకు చెందినవారికి అత్యధికంగా 14,585 మందికి ఇంటర్న్‌షిప్ ఆఫర్ లభించింది. మహరాష్ట్ర (13,664 ఆఫర్లు), గుజరాత్ (11,690 ఆఫర్లు), కర్ణాటక (10,022 ఆఫర్లు), ఉత్తరప్రదేశ్ (9,027) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.మొత్తం 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి 1,27,508 ఆఫర్లు అందుబాటులో ఉన్నట్టు పేర్కొన్న కంపెనీలు.. 82,077 మందిని ఇంటర్న్‌షిప్ కోసం ఎంపిక చేశాయి.రెండో దశకు దరఖాస్తులు షురూ..⇒ పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ రెండో దశ దరఖాస్తుల ప్రక్రియ కూడా మొదలైంది. ఇందులో 1,26,557 అవకాశాలు అందుబాటులో ఉంచారు. వీటిలో ఆంధ్రపదేశ్‌కు 4,715; తెలంగాణకు 5,357 కేటాయించారు. అభ్యర్థులు https://pminternship.mca.gov.in/login/ వెబ్సైట్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలి. తమ అర్హతలు, ఆసక్తి ఉన్న రంగాలను ఎంచుకోవాలి.⇒ఈ స్కీమ్‌లో అర్హతల వారీగా అవకాశాల సంఖ్యను సైతం పేర్కొన్నారు. డిగ్రీ పూర్తిచేసిన వారికి 36,901, టెన్త్ చదివిన వారికి 24,696, ఐటీఐ ఉత్తీర్ణులకు 23,269, డిప్లొమా ఉత్తీర్ణులకు 18,589; ఇంటర్మిడియెట్ / 12వ తరగతి ఉత్తీర్ణులకు 15,412 అవకాశాలను అందుబాటులో పెట్టారు. రెండో దశలో అభ్యర్థులకు ఇవి అందుబాటులో ఉంటాయి. -
విద్యుత్ వాహనాల జోరు
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. 2021లో మొత్తం వాహనాల రిజిస్ట్రేషన్లలో ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్లు కేవలం 2 శాతం కన్నా తక్కువగానే ఉండగా.. 2024లో 7 శాతానికి పైగా నమోదైందని ఆర్బీఐ విడుదల చేసిన బులెటిన్ వెల్లడించింది. 2024లో మొత్తం వాహనాల రిజిస్ట్రేషన్లలో త్రిపురలో అత్యధికంగా 8.5 శాతం ఎలక్ట్రిక్ వాహనాలు ఉండగా..ఢిల్లీలో 8.2 శాతం, గోవాలో 7.1 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 2.3 శాతం ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్ట్రేషన్ అయినట్టు ఆ బులెటిన్ పేర్కొంది. కేంద్రం ఇన్నోవేషన్ వెహికల్ ప్రోత్సాహం పథకాన్ని గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభించడంతో పబ్లిక్ చార్జింగ్ స్టేషన్ల సంఖ్య పెరుగుతోందని బులెటిన్ తెలిపింది. 2024లో అత్యధికంగా కర్ణాటకలో 5,765, మహారాష్ట్రలో 3,728, ఉత్తరప్రదేశ్‌లో 1,989 పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటైనట్టు పేర్కొంది. –సాక్షి, అమరావతి -
అపురూపాల మంత్రపురి
మంథని: పెద్దపల్లి జిల్లా మంథని (Manthani) ప్రాచీన పట్టణం. సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు. ఆ గ్రామంలో ప్రజల ఆహారపు అలవాట్లు, వినియోగించే వస్తువులు.. ఇలా అన్నీ భిన్నంగానే ఉంటాయి. ఉన్నతోద్యోగాలు, ఉపాధి కోసం.. మంత్రపురి (Mantrapuri) వాసులు ప్రపంచంలోని వివిధ దేశాల్లో స్థిరపడిపోయారు. సమాజంలో మార్పులకు ఇక్కడి ప్రజలు కూడా అలవాటు పడిపోతున్నారు. కానీ మంథనిలోని సీతారామ సేవా సదన్ స్వచ్ఛంద సేవా సంస్థ.. ఈ గ్రామస్తులు తరతరాలుగా వినియోగించిన విలువైన పురాతన వస్తు సామగ్రిని భవిష్యత్తరాలకు అందించేందుకు కృషి చేస్తోంది. అందుకోసం మంత్రపురిలోని పురాతన ఇళ్లు, వాటిలోని వస్తుసామగ్రి, వంటలు, వ్యవసాయ.. తదితర అవసరాలకు ఉపయోగించే పురాతన వస్తువులను సేకరించి ప్రదర్శించేందుకు మంత్రపురి దర్శన్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో పురాతన వంటసామగ్రి, ధాన్యం నిల్వచేసే గాదెలు, కొలతలు, ప్రమాణాల పరికరాలు, వ్యవసాయ పరికరాలు, ఎండ, వేడి, చలిని తట్టుకునేలా సొనార్చి (మిద్దె), పాలతం.. తదితర సుమారు ఐదు వందల రకాల వస్తువులను ప్రదర్శనగా ఉంచారు. ఇందు కోసం ఓ ఇంటిని ప్రత్యేకంగా నిర్మించారు. ప్రజల సందర్శనార్థం రోజూ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ ప్రదర్శన శాలను తెరిచి ఉంచుతున్నారు. వివిధ దేశాల్లో స్థిరపడి స్వస్థలానికి వచ్చిన ప్రవాసులు.. ఈ పురాతన వస్తువులను దర్శించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. మంథనితోపాటు చుట్టు పక్కల ప్రాంతాల విద్యార్థులకు ఇందులో అవకాశం కల్పిస్తున్నారు. పురాతన వస్తుసామగ్రి సేకరణకు దాదాపు మూడేళ్లకు పైగా సమయం పట్టిందని, మరో 50 ఏళ్లు ఇవి ఉండేలా ఇంటిని నిర్మించామని సేవా సదన్ (Seva Sadan) వ్యవస్థాపకుడు గట్టు నారాయణ గురూజీ, అధ్యక్షుడు కర్నే హరిబాబు తెలిపారు.ఎన్టీపీసీ, సింగరేణిలో ప్రదర్శన మంత్రపురి దర్శన్‌లోని తాళపత్ర గ్రంథాలతోపాటు ఇతర పురాతన వస్తువులను ఎన్టీపీసీ, సింగరేణి సంస్థ ఉన్నతాధికారులు తీసుకెళ్లి తమ కార్యాలయాల్లో ప్రదర్శనకు ఉంచారు. ఇలా పలుమార్లు పలు సంస్థలు.. ఇతర ప్రాంతాల వారు వచ్చి ఈ పురాతన వస్తువులను తీసుకెళ్లి తమ కార్యాలయాల్లో ప్రదర్శిస్తున్నారు. ఆ తర్వాత మళ్లీ తీసుకొచ్చి మంత్రపురి దర్శన్ నిర్వాహకులకు అప్పగిస్తున్నారు.చదవండి: మల్లన్నగుట్టే.. చిన్న శ్రీశైలంనేటితరం కోసం.. భారతీయ ఆచారాలు, వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ప్రకృతిలో లభించే అనేక వస్తువులు కనుమరుగవుతున్నాయి. ఈక్రమంలో నాటి కుటీర, గ్రామీణ వ్యవస్థ, వస్తువులను నేటితరానికి చూపించాలనే ఆకాంక్షతోనే గట్టు నారాయణ గురూజీ ఈ అవకాశం కల్పించారు. విద్యార్థులు, యువత అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. -
మల్లన్నగుట్టే.. చిన్న శ్రీశైలం
రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిధానపల్లి (Nidhanapalle) గ్రామ శివారులోని మల్లన్నగుట్ట (mallanna gutta) చిన్న శ్రీశైలంగా పేరొందింది. గుట్టపై ఉన్న ప్రధాన దేవాలయంలో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి కొలువై ఉన్నాడు. క్షేత్రం ఎగువభాగంలోని గుహాంతరాళమున మహామునుల తపో స్థలములు, స్వామివారి పుట్టులింగములు ఉండటం మల్లన్నగుట్ట ప్రత్యేకత. మునుల తపస్సు చేత ప్రసిద్ధి చెందిన గుట్టపై కొలువై ఉన్న మల్లికార్జునస్వామి భక్తుల కొంగుబంగారమై కోరిన కోర్కెలు తీరుస్తాడని ప్రజల నమ్మకం. ప్రతీ సంవత్సరం మాఘమాసం బహుళ త్రయోదశి నుంచి పాల్గుణమాసం విదియ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను కనుల పండువగా నిర్వహిస్తారు. గుట్టపై నిద్రిస్తే రోగాలు మాయం మల్లన్నగుట్టపై సువిశాలమైన మైదానం ఉంది. హైదరాబాద్, వరంగల్ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. పరిసర గ్రామాల ప్రజలు వివిధ పర్వదినములలో స్వామివారి దర్శనం కోసం పరితపిస్తుంటారు. నూతన కార్యక్రమాలను గుట్టపై గల దేవాలయంలో పూజలు నిర్వహించి ప్రారంభిస్తారు. ఎంతటి క్లిష్టమైన ఆపదల నుంచైనా భగవంతుడు తమను రక్షిస్తాడని భక్తుల ప్రగాఢమైన నమ్మకం. గుట్టపై నిద్రచేస్తే ఆయురారోగ్యములు, భోగ భాగ్యాలు పొందుతామని ప్రజలు విశ్వసిస్తారు. కోనేరు నీటితో సకల శుభాలు గుట్టపైకి వెళ్లేమార్గంలో సహజ సిద్ధమైన కోనేరు ఉంది. కోనేటిలో ఏడాది పొడవునా నీరు ఉంటుంది. కోనేటి నీటిని ప్రజలు పరమ పవిత్రంగా భావిస్తారు. కోనేటిలోని నీటిని తీసుకెళ్లి పంటలపై చల్లితే చీడపీడలు తొలగి పంటలు సమృద్ధిగా పండుతాయని, పశువులపై చల్లితే పుష్కలంగా పాలు ఇస్తాయని, రోగాలు మాయమవుతాయని ప్రజల విశ్వాసం. మెరుగైన రోడ్డు సౌకర్యం నిధానపల్లి మల్లన్నగుట్ట(చిన్న శ్రీశైలం) చిట్యాల– భువనగిరి రోడ్డుకు సమీపంలో ఉంటుంది. గుట్టపైకి వాహనాలు వెళ్లడానికి ఘాట్‌రోడ్డు ఉంది. వాహనాల పార్కింగ్‌కు విశాలమైన మైదానం ఉంది. గత ఏడాది మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన సొంత డబ్బులతో ప్రధాన దేవాలయం చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేయడానికి బండరాళ్లను తొలగింపజేశారు. (Shivaratri 2025 : శివరాత్రికి, చిలగడ దుంపకి ఉన్న సంబంధం ఏమిటి?) ఈ ఏడాది జరిగే బ్రహ్మోత్సవాల వివరాలు ఈనెల 26న గణపతి పూజ, స్వస్తివాచనము, అంకురార్పణ, బ్రహ్మకలశ స్థాపనలు, ధ్వజారోహణం, ఉత్సవాల విగ్రహాలు గుట్టపైకి వేం చేయుట 27న స్వామివారి ఆర్జిత సేవలు, ప్రభోత్సవం, షావలు, రాత్రి కల్యాణ మహోత్సవం 28న రుద్ర చండీహవనం, అన్న ప్రసాద వితరణ, వీరభద్రేశ్వరస్వామి పూజ, ఖడ్గాలు, ప్రభల ఊరేగింపు, భద్రకాళి అమ్మవారి పూజ తెల్లవారుజామున అగ్నిగుండాల మహోత్సవం 29న గెలుపు, మహదాశీర్వచనములు ఉంటాయి.చదవండి: కనువిందు.. ఇందూరు చిందు అత్యంత మహిమాన్వితుడు మల్లన్నగుట్టపై కొలువై ఉన్న శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి పట్ల పరిసర ప్రాంత ప్రజలకు అపారమైన నమ్మకం. ఇక్కడ కొలువై ఉన్న స్వామివారు అత్యంత మహిమాన్వితుడు. బాధల నుంచి విముక్తి కలిగించే దైవమని భక్తుల నమ్మకం. ఏటా బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. –బేతోజు సత్యనారాయణశాస్త్రి, ప్రధానార్చకుడు చదవండి: Mahashivratri 2025: శివరాత్రికి ఉపవాసం, ఇంట్రస్టింగ్ టిప్స్ -
13 ఏళ్లు రాజకీయాలకు దూరం.. రీఎంట్రీలో అదిరే విజయం
ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో పార్టీ ఓడింది. ఆ మాత్రానికే అంతర్జాతీయ మీడియా సంస్థలు ఆయన్నో ఫెయిల్డ్ పొలిటీయన్గా అభివర్ణించాయి. మరోవైపు సొంత అధిష్టానం సైతం ఆయన నాయకత్వంపై బలమైన విమర్శలు చేసింది. వాటిని ఆయన తట్టుకోలేక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఈలోపు దేశాన్ని తీవ్ర సంక్షోభాలు వచ్చి పడ్డాయి. అనూహ్యంగా.. మళ్లీ ఆయనకే నాయకత్వ పగ్గాలు అప్పజెప్పింది. అధికార పక్షంపై ప్రజా వ్యతిరేకత.. అదే సమయంలో ఆయన విధానాలు ప్రజలను ఆకర్షించగలిగాయి. అద్భుత విజయంతో జర్మనీ ఛాన్స్లర్ పీఠంపై ఫ్రెడరిక్ మెర్జ్‌ను కూర్చోబెట్టబోతున్నాయి. 69 ఏళ్ల ఫ్రెడరిక్ మెర్జ్ జర్మనీ. క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్(CDU) తరపున అక్కడి ప్రభుత్వంలో ఎలాంటి కీలక పదవులు, బాధ్యతలు చేపట్టిన దాఖలాలు లేవు. మరి అలాంటి వ్యక్తికి నేరుగా.. జర్మనీ ఛాన్స్‌లర్‌గా అవకాశం ఎందుకు దక్కబోతోంది?. 👉ఫ్రెడరిక్ మెర్జ్(Fedrich Merz).. 1955, నవంబర్ 11న బ్రిలన్లో జన్మించారు. వాళ్లది న్యాయవాద నేపథ్యం ఉన్న కుటుంబం. బోన్, మార్బర్గ్ యూనివర్సిటీల్లో న్యాయవిద్య పూర్తి చేశారు. 1975 నుంచి 76 దాకా మిలిటరీలో పని చేశారు. న్యాయమూర్తిగా, ఆపై కార్పొరేటర్ లాయర్గానూ పని చేశారు👉1972లో క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్(CDU Party)లో చేరారు. 1989లో తొలిసారి యూరోపియన్ పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. 1994లో హోచ్సౌర్లాండ్క్రీస్ నియోజకవర్గం నుంచి జర్మనీ ముఖ్య సభ బుండెస్టాగ్‌కు తొలిసారి ఎన్నికయ్యారు. జర్మనీ పార్లమెంట్లో బుండెస్టాగ్, బుండెస్రాట్ సభలు ఉంటాయి. ఇవి మన లోక్‌సభ, రాజ్యసభలను పోలి ఉంటాయి.👉2000 సంవత్సరంలో ఆయన రాజకీయ ప్రస్థానం కీలక మలుపు తిరిగింది. అప్పటి సీడీయూ అధినేత్రి.. జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్(Angela Merkel) సీడీయూ పార్లమెంటరీ నేతగా మెర్జ్‌కు బాధ్యతలు అప్పజెప్పారు. అయితే.. రెండేళ్ల తర్వాత మెర్కెల్ ఆయన్ని పక్కనపెట్టారు. అందుకు కారణాలు లేకపోలేదు. 👉2002లో జరిగిన జనరల్ ఫెడరేషన్ ఎన్నికల్లో సీడీయూపై స్వల్ప ఆధిక్యంతో సోషల్ డెమోక్రటిక్ పార్టీ విజయం సాధించింది. ఈ ఓటమిని ఏంజెలా మెర్కెల్ జీర్ణించుకోలేకపోయారు. మరోవైపు.. అంతర్జాతీయ మీడియా సంస్థలు ఫ్రెడరిక్ మెర్జ్‌ను విఫల నాయకుడిగా ఏకిపారేశాయి. అదే టైంలో.. 👉ఒకే పార్టీ అయినప్పటికీ ఏంజెలా మెర్కెల్‌కు ఫ్రెడరిక్ మెర్జ్ నడుమ రాజకీయ సిద్ధాంతాలపరంగా బేధాలున్నాయి. పదహారేళ్ల పాటు(2005 నుంచి 2021) జర్మనీ ఛాన్సలర్‌గా పని చేసిన మెర్కెల్ సెంట్రిస్ట్ కావడం.. మెర్జ్ సంప్రదాయ రాజకీయవాది, పైగా అతిమితవాద పార్టీ మద్ధతుదారుడు కావడం గమనార్హం. ఈ క్రమంలో.. జనరల్ ఫెడరేషన్ ఎన్నికల ఓటమిని సాకుగా చూపించి ఆయన్ని పార్లమెంటరీ నేత పదవి నుంచి తప్పించారని అప్పట్లో ఆమెపై సీడీయూలోనే విమర్శలు వచ్చాయి. 👉కొన్నాళ్ల సీడీయూలోనే క్రియాశీలకంగా వ్యవహరించిన ఆయన.. 2009లో రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు. తిరిగి న్యాయవాది వృత్తిలో కొనసాగుతూనే.. మరోవైపు లాబీయిస్ట్ అవతారం ఎత్తారు. జర్మనీ బ్లాక్‌రాక్ సూపర్వైజరీ బోర్డు చైర్మన్‌గానూ వ్యహరించారు.👉ఈలోపు ఏంజెలా మెర్కెల్ రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించే టైంలో.. సీడీయూకి నాయకత్వం వహించేది ఎవరనే చర్చ జోరుగా చర్చ నడిచింది. 2018, 2021 రెండుసార్లు సీడీయూ నాయకత్వం మారగా.. ఆ రెండుసార్లు ఫ్రెడరిక్ మెర్జ్ పేరే వినిపించింది. కానీ, 👉అన్నెగ్రెట్ క్రాంప్(2018-21), అర్మిన్ లాస్చెట్(2021-22)లు ఆ అవకాశం దక్కించుకున్నారు. చివరకు.. 2022లో ఫ్రెడరిక్ మెర్జ్‌కు ఉన్న రాజకీయ అనుభవం పరిగణనలోకి తీసుకుని, ఆయన కన్జర్వేటివ్ విధానాలకే ఓటేస్తూ నాయకత్వ బాధ్యతలను సీడీయూ అప్పగించింది.👉2022లో రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన ఫ్రెడరిక్ మెర్జ్.. బుండెస్టాగ్‌లో ప్రతిపక్ష నేతగా దూకుడుతనం ప్రదర్శించారు. అదే సమయంలో.. ప్రస్తుత ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ నేతృతంలోని సోషల్ డెమొక్రటిక్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబికింది. ఈ క్రమంలో.. ప్రజాకర్ష విధానాలను ప్రదర్శించారు మెర్జ్. 👉దశాబ్దాలుగా జర్మనీ ఆర్థిక, దౌత్యపరమైన సంక్షోభాల్లో కొట్టుమిట్టాడుతోంది. ఇలాంటి తరుణంలో మెర్జ్ అక్కడి ప్రజలకు ఓ ఆశాకిరణంగా కనిపించారు. 👉 తాజాగా ఆదివారం జరిగిన జర్మనీ పార్లమెంటరీ ఎన్నికల్లో..ఫ్రెడరిక్ మెర్జ్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ కూటమి సీడీయూ+సీఎస్‌యూ(Christian Social Union in Bavaria) విజయం ఖాయంగా కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్ అంచనాలు ఈ విషయాన్ని ఖరారు చేశాయి. విశ్వసనీయుడిచేత జర్మనీ పాలించబడబోతోంది అని ఆయన మద్ధతుదారులు సంబురాలు చేస్తున్నారు. అయితే.. ఎన్నికల ఫలితాలు ఇవాళే వెల్లడి కానున్నాయిఅయితే మెర్జ్ విధానాలపై విమర్శలు లేకపోలేదుశరణార్థులను వెనక్కి తిప్పి పంపాలన్నది ఆయన అభిమతం. అయితే ఆయన ఇమ్మిగ్రేషన్ పాలసీని ఏంజెలా మెర్కెల్ లాంటి వాళ్లే బహిరంగంగా వ్యతిరేకిస్తున్నారు. అతి మితవాద మద్దతుదారుడిగా ఉన్న మెర్జ్.. అల్టర్నేటివ్ ఫర్ జెర్మనీ(AfD) పార్టీతోనే ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పరిణామాన్ని సీడీయూలో కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు మెర్జ్ రూపొందిచిన ఆర్థిక విధానాలు.. ధనవంతులకు.. కార్పొరేట్ కంపెనీలకు మేలు చేసేలా ఉండడం మరో మైనస్అన్నింటికి మంచి.. వ్యాపార ధోరణితో కూడిన ఆయన నాయకత్వ లక్షణంపై అటు విమర్శలతో పాటు ఇటు పొగడ్తలూ వినిపిస్తుంటాయిఫ్రెడరిక్ మెర్జ్ జర్మనీ ఛాన్సలర్ కావడం ఏంజెలా మెర్కెల్ ఇప్పుడు ఏమాత్రం ఇష్టం లేదు. అయితే ఓ సీనియర్ నేతగా సీడీయూ ఆమె అభిప్రాయం మాత్రమే పరిగణనలోకి తీసుకుంటుంది అంతే.:: సాక్షి వెబ్‌డెస్క్ -
మల్లన్నకు పొందూరు పాగా
మహా శివరాత్రి వస్తోందంటే చాలు ఆ గ్రామాల్లో ఒకటే సందడి. దాదాపు ఒకటిన్నర నెలల ముందే అక్కడి చేనేత కార్మికులందరూ మిగతా అన్ని కార్యక్రమాలు పక్కనపెట్టేసి ఒకే ఒక్క కార్యక్రమంపై దృష్టి పెడతారు. అదే శ్రీశైల మల్లన్న స్వామికి సమర్పించేందుకు ప్రత్యేక వస్త్రం తయారీ. నేత పని పూర్తయిన తరువాత ప్రత్యేక పూజలు ఊరేగింపులు నిర్వహించి ప్రత్యేక వస్త్రాన్ని శ్రీశైలానికి తీసుకువెళతారు. ఈ పుణ్యక్రతువు పూర్తయింది. ప్రత్యేక వస్త్రం శ్రీశైలానికి బయల్దేరింది. పరమ పవిత్రమైన శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జున స్వామికి శివరాత్రికి సిక్కోలు.. తలపాగాలు, ఇతర వ్రస్తాలు పంపనుంది. ఎన్నో ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఈ ఏడాది కూడా తలపాగా వస్త్రాలు పంపించేందుకు పొందూరుతో పాటు జిల్లా నుంచి పలు ఊళ్లు సిద్ధమయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో పొందూరు, బూర్జ, ఆమదాలవలస, ఉప్పెనవలస, లావేరు గ్రామాల నుంచి వ్రస్తాలను శివరాత్రికి మల్లికార్జున స్వామికి సమర్పించనున్నారు. ఈ ఏడాది స్థానిక చేనేతవాడకు చెందిన బనిశెట్టి శ్రీనివాసరావు పొందూరు నుంచి తలపాగాను సమర్పించనున్నారు. చేనేత, జౌళి శాఖ ద్వారా బనిశెట్టి శ్రీనివాసరావు తలపాగా వస్త్రాలను శ్రీశైలం మల్లన్నకు సమర్పించడానికి దరఖాస్తులు చేసుకున్నారు. బనిశెట్టి ఆంజనేయులు మూడు తలపాగా వస్త్రాలను గుడివాడ, ఒంగోలు, వెంకటగిరి వాళ్లకు నేశారు. శివయ్యకు తలపాగా, అమ్మవారికి చీర, శనగల బసవన్న, వినాయకుడికి పంచె, నవనందులను, గాలి గోపురాన్ని అలంకరించేందుకు వ్రస్తాలను నేశారు. – పొందూరుచరిత్ర సృష్టించిన ముఖలింగం.. » వాండ్రంగి వీధికి చెందిన ఆకాశం ముఖలింగం 33 సార్లు శ్రీశైలం వెళ్లి మల్లన్నకు వ్రస్తాలను సమర్పించి చరిత్ర సృష్టించారు. » లావేటి వీధికి చెందిన బూడిద చిన్నారావు 21 సార్లు స్వామికి వ్రస్తాలను సమర్పించారు. » వ్రస్తాలను తీసుకొచ్చే పొందూరు కార్మికులకు వసతి, భోజన సదుపాయాలను, ఇతర సౌకర్యాలను కల్పిస్తారు.ఊరేగింపు ఆమదాలవలస రూరల్: మందరాడ గ్రామానికి చెందిన దేవాంగులు నేసిన శ్రీశైల మల్లన్న తలపాగాను శ్రీనివాసాచార్యులపేట గ్రామ పురవీధుల్లో ఊరేగించి శివాలయం ప్రాంగణంలో ఉంచారు. మహా శివరాత్రి నాడు శ్రీశైల శిఖరానికి ఈ పాగా చుడతామని నేత కార్మికులు తెలిపారు. ముందుగా గ్రామాల్లో తలపాగాను ఊరేగిస్తూ ప్రత్యేక పూజలు చేస్తూ శ్రీశైలం మల్లన్న సన్నిధికి చేరుస్తామని చెప్పారు. కార్యక్రమంలో బొడ్డేపల్లి గౌరీపతి, కె.ప్రసాద్‌రావు, కె.తవుడుబాబు, జి.పకీర్ తదితరులు పాల్గొన్నారు. నిష్టతో నేశాం.. ఎంతో నియమ, నిష్టల తో శ్రీశైలం మల్లన్నకు తలపాగా వ్రస్తాలను నేశాం. ఈ వ్రస్తాలను నేస్తున్నంత సేపు శివనామస్మరణలోనే ఉన్నాం. ఉపవాస దీక్షలోనే వ్రస్తాలను పూర్తిచేశాం. ఏటా వ్రస్తాలను నేసే మహాభాగ్యం మాకు దక్కుతుండటం ఎంతో సంతోషంగా ఉంది. – బనిశెట్టి శ్రీనివాసరావు, చేనేత కార్మికుడు, పొందూరువ్రస్తాలను సమర్పిస్తారిలా..»మల్లికార్జున స్వామికి 366 మూరల (160 మీటర్లు) పొడవు 48 సెంటీమీటర్లు వెడల్పు ఉన్న తలపాగా. » భ్రమరాంబ అమ్మవారికి 6 మీటర్లు పసుపు అంచు చీర.» శనగల బసవన్న (నందీశ్వరుడు)కు 6 మీటర్ల అరుణ వర్ణ అంచు పంచె.» వినాయకుడికి 6 మీటర్లు ఎరుపు అంచు పంచెలను నేశారు. ఈ వ్రస్తాలను శివలింగాకారంలో మలిచారు. » ప్రతి రోజూ తల పాగా, వ్రస్తాల వద్ద భజనలు చేస్తున్నారు. చేనేత వాడలోని ప్రజలంతా పూజలు నిర్వహిస్తున్నారు.» శివరాత్రి రోజున లింగోద్భవ కాలానికి ముందు..అంటే రాత్రి 10 నుంచి 12 గంటల మధ్య దేవాలయంలో ప్రవేశాలు నిలిపివేసి, లైట్లన్నీ ఆర్పేస్తారు.» మహాశివరాత్రికి రెండు రోజుల ముందు ఈ వ్రస్తాలను శ్రీశైలం తీసుకొని వెళ్తారు. దేవాంగులు సమర్పించనున్న వ్రస్తాలను మహాశివరాత్రి రోజున స్వామికి అలంకరిస్తారు. » ఒక వస్త్రంతో తలపాగా చుట్టి మిగిలిన వ్రస్తాలను నవ నందులకు, గాలి గోపురానికి అలంకరిస్తారు. పవిత్ర వ్రస్తాలను తీసుకుని ఆదివారం ఆయా నేతకారులు శ్రీశైలానికి బయల్దేరారు. -
స్థూల భారతం.. మందుల మార్గం!
జీవన శైలిలో మార్పులు, శరీరానికి వ్యాయామం లేకపోవడం, జంక్ ఫుడ్ వినియోగం పెరగడంతో.. మన దేశంలో స్థూలకాయుల సంఖ్య ఏటేటా మరింతగా పెరిగిపోతోంది. ‘నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్)’2022 ప్రకారం ప్రతి నలుగురు భారతీయుల్లో ఒకరు అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. దాదాపు 8 కోట్ల మంది ఇప్పటికే స్థూలకాయుల కేటగిరీలోకి చేరగా.. మరో 3 కోట్ల మంది వయోజనులు పొట్ట చుట్టూ అధిక కొవ్వు వంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్టు అంచనా. ఒబేసిటీ అత్యధికంగా ఉన్న టాప్–10 దేశాల జాబితాలోకి భారత్ కూడా చేరిపోయింది. దీంతో అంతర్జాతీయ ఫార్మా దిగ్గజాలు కూడా మన దేశం వైపు చూస్తున్నాయి. ఇప్పటికే బరువు తగ్గించే పలు రకాల మందులు మార్కెట్లో ఉండగా.. మరికొన్ని ఔషధాలు మన మార్కెట్లోకి రానున్నాయి.– సాక్షి, బిజినెస్ డెస్క్మూడింతలు పెరిగిన మార్కెట్.. ఒబేసిటీ చికిత్సలో ఉపయోగించే ఔషధాలను జీఎల్పీ–1 (గ్లూకగాన్ తరహా పెప్టైడ్ రిసెప్టర్ ఎగోనిస్ట్స్)గా వ్యవహరిస్తారు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను, ఆకలిని నియంత్రించే హార్మోన్లుగా పనిచేస్తాయి. పొట్ట నిండుగా ఉన్నట్లుగా మెదడుకు సంకేతాలు పంపించి, పొట్ట ఖాళీ అయ్యే ప్రక్రియను నెమ్మదింపజేసి, బరువు తగ్గించుకునేందుకు తోడ్పడతాయి. అంతర్జాతీయంగా యాంటీ–ఒబేసిటీ ఔషధాల అమ్మకాలు 2024లో సుమారు 13 బిలియన్ డాలర్లుగా ఉండగా... 2035 నాటికి 105 బిలియన్ డాలర్లకు చేరొచ్చని పరిశ్రమ వర్గాల అంచనా. మన దేశంలోనూ బరువు తగ్గించే మందులకు డిమాండ్ పెరుగుతోంది.2020 నవంబర్‌లో వీటి అమ్మకాలు రూ.137 కోట్లుగా ఉంటే.. 2024 నవంబర్ నాటికి రూ.535 కోట్లకు చేరాయి. అంటే సుమారు 290 శాతం పెరిగింది. ఒబేసిటీ సర్జరీ సొసైటీ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం బరువు తగ్గేందుకు చేయించుకునే సర్జరీలు 2004లో సుమారు 200 మాత్రమేకాగా... 2019 నాటికి ఏకంగా 100 రెట్లు పెరిగి 20,000కు చేరుకున్నాయి. స్థూలకాయంతో బాధపడుతున్నవారిలో హైపర్‌టెన్షన్, మధుమేహం, కాలేయ వ్యాధులు వంటి సమస్యలూ వస్తాయి. వీటి చికిత్సల్లో ఉపయోగించే ఔషధాలకూ డిమాండ్ పెరిగిపోతోంది.ఖరీదైన వ్యవహారంగా చికిత్స..యాంటీ–ఒబేసిటీ చికిత్స ఆషామాషీ వ్యవహారం కాదని డాక్టర్లు చెబుతున్నారు. సాధారణంగా ఈ చికిత్సలకు నెలకు రూ.40,000 నుంచి రూ.50,000 వరకు ఖర్చవుతుందని అంటున్నారు. ఈ ఔషధాలను దీర్ఘకాలంపాటు తీసుకుంటేనే ఫలితాలు కనిపిస్తాయని, మధ్యలో ఆపేస్తే అప్పటిదాకా చేసినదంతా వృథా అవుతుందని పేర్కొంటున్నారు. అంతేకాదు ఒకే మందు అందరికీ పనిచేయదని... శరీరతత్వాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కో రకం ఔషధం వాడాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.ఇక యాంటీ ఒబేసిటీ మందులతో కొన్ని దుష్ఫలితాలకూడా వచ్చే అవకాశం ఉండటంతో.. చాలా మంది మధ్యలోనే ఆపేస్తూ ఉంటారు. కొన్నిరకాల ఔషధాలను దీర్ఘకాలం ఉపయోగిస్తే ఇతర దు్రష్పభావాలు తలెత్తవచ్చనే అభిప్రాయం కూడా ఉంది. అయినా మన దేశంలో యాంటీ ఒబేసిటీ ఔషధాల వినియోగం పెరుగుతోంది. సెమాగ్లూటైడ్, లిరాగ్లూటైడ్, డ్యూలాగ్లూటైడ్, ఒర్లిస్టాట్, టిర్జెప్టైడ్ వంటి ఫార్ములాల ఆధారిత ఔషధాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది.అంతర్జాతీయ కంపెనీల కన్ను.. భారత్‌లో బరువు తగ్గే మందులకు డిమాండ్ నెలకొనడంతో.. అంతర్జాతీయ ఫార్మా కంపెనీలు మన దేశంపై దృష్టి పెడుతున్నాయి. డెన్మార్క్ కంపెనీ నొవో నోర్డిస్క్కు చెందిన ఓరల్ సెమాగ్లూటైడ్ ట్యాబ్లెట్ రైబెల్సస్ను 2022లో దేశీ మార్కెట్లో ప్రవేశపెట్టగా.. అది 65 శాతం యాంటీ–ఒబేసిటీ మార్కెట్‌ను ఆక్రమించింది. దీంతో సెమాగ్లూటైడ్ ఇంజెక్షన్లను కూడా భారత్‌లో ప్రవేశపెట్టేందుకు ఆ కంపెనీ కసరత్తు చేస్తోంది. వెగోవీ, ఒజెంపిక్ వంటి ఔషధాల వినియోగం కూడా మనదేశంలో భారీగానే ఉంటోంది. మరింత బాగా పనిచేస్తా యని పేరుండి.. మన దగ్గర విక్రయించని కొన్ని ఔషధాలను అనధికారిక మార్గాల్లో తెప్పించుకునే ధోరణి కూడా పెరుగుతోంది. ఇక అమెరికాకు చెందిన ఎలై లిల్లీ కంపెనీ సైతం టిర్జిప్టైడ్ ఆధారిత మౌంజారో ఔషధాన్ని మార్కెట్లోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మన దేశీయ కంపెనీలు కూడా బరిలోకి దిగుతున్నాయి. గ్లెన్‌మార్క్ ఇప్పటికే లిరాగ్లూటైడ్ జనరిక్ వెర్షన్‌ను ప్రవేశపెట్టగా.. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా తదితర కంపెనీలు పేటెంట్ ముగిసిన జీఎల్పీ–1 ప్రత్యామ్నాయాల మీద పని చేస్తున్నాయి. సన్ ఫార్మా కూడా ఈ విభాగంలో కొత్త మాలిక్యూల్‌పై పరిశోధన చేస్తోంది. -
మహా ’కాసుల’ మేళా!
సాక్షి, బిజినెస్ బ్యూరో: మహా కుంభమేళా కాసులు కురిపిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు కోట్లాది మంది భక్తులను ఆకర్షిస్తున్న ఈ వేడుక.. వస్తువులు, సేవల ద్వారా రూ.3 లక్షల కోట్లకు పైగా వ్యాపారం నమోదు చేయనుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) అంచనా వేసింది. ఇది భారత్‌లో అతిపెద్ద ఆర్థిక కార్యక్రమాలలో ఒకటిగా నిలిచిందని సీఏఐటీ సెక్రటరీ జనరల్, చాందినీ చౌక్ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. 144 ఏళ్లకోసారి జరిగే మహా కుంభమేళా జనవరి 13న ప్రారంభం కాగా ఈ నెల 26 వరకు కొనసాగనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద మతపర, ఆధ్యాత్మిక సమావేశంగా గుర్తింపు పొందిన ఈ కుంభమేళాలో కోట్లాదిమంది భక్తులు పాల్గొన్నారు. అంచనాలను మించి..విశ్వాసం, ఆర్థిక వ్యవస్థ మధ్య సంబంధాన్ని ఈ కార్యక్రమం దృఢంగా నిర్వచించిందని ఖండేల్వాల్ అన్నారు. ‘డైరీలు, క్యాలెండర్లు, జనపనార సంచులు, స్టేషనరీ తదితర మహాకుంభ నేపథ్య ఉత్పత్తులకు డిమాండ్ పెరగడం స్థానిక వాణిజ్యాన్ని పెంచుతోంది. కచి్చతమైన బ్రాండింగ్ కారణంగా అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. మహా కుంభమేళా ప్రారంభానికి ముందు 40 కోట్ల మంది ప్రజలు వస్తారని అంచనా వేశారు.అలాగే దాదాపు రూ.2 లక్షల కోట్ల విలువైన వ్యాపార లావాదేవీలు జరుగుతాయని భావించారు. అయితే దేశవ్యాప్తంగా నెలకొన్న అపూర్వ ఉత్సాహం కారణంగా.. ఉత్సవాలు ముగిసే నాటికి ఇంకా భారీ సంఖ్యలో ఈ మహా కుంభమేళాలో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. తద్వారా భారీ స్థాయిలో రూ.3 లక్షల కోట్లకు పైగా వ్యాపారం నమోదు అయ్యే అవకాశం ఉందని ఖండేల్వాల్ చెప్పారు. భారీగా ఆర్థిక కార్యకలాపాలుఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు ఈ కార్యక్రమం గణనీయ ప్రోత్సాహాన్ని అందించిందని, కొత్త వ్యాపార అవకాశాలను సృష్టించిందని సీఏఐటీ వెల్లడించింది. ఆతిథ్యం, వసతి, ఆహారం, పానీయాలు, రవాణా, మతపర దుస్తులు, పూజా సామగ్రి, హస్తకళలు, వ్రస్తాలు, దుస్తు లు, వినియోగ వస్తువులు, ఆరోగ్య సంరక్షణ, వెల్నెస్ సేవలు, మీడియా, ప్రకటనలు, వినోదం, పౌర సేవలు, టెలికం, మొబైల్, ఏఐ ఆధారిత సాంకేతికత, సీసీటీవీ కెమెరాలు, ఇతర పరికరాలు వంటి అనేక వ్యాపార విభాగాల్లో పెద్ద ఎత్తున ఆర్థిక కార్యకలాపాలు నమోదయ్యాయని వివరించింది. 150 కిలోమీటర్ల పరిధిలో లబ్ధిమహాకుంభ మేళా ఆర్థిక ప్రయోజనాలు ప్రయాగ్‌రాజ్‌కు మాత్రమే కాకుండా 150 కిలోమీటర్ల పరిధిలో ఉన్న నగరాలు, పట్టణాలకు కూడా విస్తరించాయి. అయోధ్య, వారణాసి, ఇతర మతపర ప్రదేశాలకు యాత్రికులు వెల్లువెత్తారు. మహాకుంభ మేళా భారత్‌లో వ్యాపారం, వాణిజ్యం, సాంస్కృతిక వ్యవస్థ రూపురేఖలను సానుకూలంగా మారుస్తుందని, ఏళ్ల తరబడి కొత్త రికార్డును సృష్టిస్తుందని భావిస్తున్నారు. -
Russia-Ukraine war: యుద్ధం @ మూడేళ్లు
ఉక్రెయిన్. రష్యా దురాక్రమణ జెండా ఎగరేసి దూసుకురావడంతో అస్థిత్వమే లక్ష్యంగా సర్వశక్తులూ ఒడ్డి పోరాడుతున్న పొరుగుదేశం. అణ్వస్త్ర సామర్థ్యం, అమేయ సైన్యంతో కొద్దికొద్దిగా ఆక్రమించుకుంటూ వస్తున్న రష్యాను నిలువరించేందుకు ఉక్రెయిన్ యుద్ధంచేస్తూ శతథా ప్రయత్నాలు చేయబట్టి రేపటికి సరిగ్గా మూడేళ్లు. ఈ మూడేళ్లలో రష్యా కన్నెర్రజేసి వేలాది సైన్యంతో చేస్తున్న భీకర గగనతల, భూతల దాడుల్లో ఉక్రెయిన్‌లో సాధారణ ప్రజల వేలాది కలల సౌధాలు పేకమేడల్లా కూలి నేలమట్టమయ్యాయి. వేలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. శివారు గ్రామాలు, పట్టణాలన్నీ మరుభూములుగా మారిపోయాయి. ఎక్కడ చూసినా మరణమృదంగం నిరాటంకంగా వినిపిస్తోంది. సైనికులు పిట్టల్లా రాలిపోయారు. మార్షల్ లా ప్రయోగించి జెలెన్స్కీ ప్రభుత్వం యువత మొదలు నడివయసు వారిదాకా దమ్మున్న వారందరినీ రణక్షేత్రంలోకి దింపి పోరాటం చేయిస్తోంది. దశాబ్దాల నాటి దౌత్య ఒప్పందాలను ఉల్లంఘించిందని, నాటోలో చేరాలనుకుంటోందని పలు సాకులు చూపి రష్యా సమరశంఖం పూరించింది. దీంతో హఠాత్తుగా యుద్ధంలో కూరుకుపోయినా ఉక్రెయిన్ తన మిత్రబృందం నుంచి అందుతున్న అధునాతన ఆయుధాలతో రష్యాను సైతం సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తూ లక్షలాది మంది రష్యన్ సైనికులను నేలకూల్చింది. దీంతో అణ్వస్త్ర బూచి చూపించి భయపెడుతున్న పుతిన్‌కు యుద్ధాన్ని ఆపడమే ఉత్తమమని అగ్రరాజ్య నయా నాయకుడు డొనాల్డ్ ట్రంప్ టెలీఫోన్ మంతనాలు చేయడంతో యుద్ధం మొదలైన మూడేళ్ల తర్వాత తొలిసారిగా కీలక మలుపు తీసుకుంది. వాస్తవానికి ఈ మలుపు తుది మలుపు అని, ట్రంప్ పట్టుదలతో యుద్ధాన్ని ఆపబోతున్నారని అంతర్జాతీయ విశ్లేషణలు వెలువడుతున్నాయి. 36 నెలల తర్వాత అయినా ఉక్రెయిన్ ఊపిరి పీల్చుకుంటుందో లేదోనని, యుద్ధప్రభావిత విపరిణామాలతో తిప్పలుపడుతున్న ఎన్నో ప్రపంచదేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.అత్యంత భీకర ఘర్షణరెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్‌లో వెలుగుచూసిన అతిపెద్ద వైరం ఇదే. వాస్తవానికి తాజా యుద్ధానికి పునాదులు పదేళ్ల క్రితమే పడ్డాయి. 2014లో ఉక్రెయిన్‌లోని క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా ఉన్నపళంగా ఆక్రమించుకుంది. ఆనాటి నుంచి ఇరుదేశాల మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి. ఆ తర్వాత 2022 ఫిబ్రవరి 24వ తేదీన ఉక్రెయిన్ పైకి రష్యా దండయాత్ర మొదలెట్టింది. వందల కొద్దీ చిన్నపాటి క్షిపణులు ప్రయోగిస్తూ వేలాది సైనికులను కదనరంగంలోకి దింపింది. తొలిరోజుల్లో రాజధాని కీవ్‌దాకా దూసుకొచ్చి భీకర దాడులు చేసిన రష్యా ఆ తర్వాత ఆక్రమణ వేగాన్ని అనూహ్యంగా తగ్గించింది. ఉక్రెయిన్ వైపు నుంచి ప్రతిఘటన కూడా దీనికి ఒక కారణం. ఉక్రెయిన్ తొలినాళ్లలో యుద్ధంలో తడబడినా ఆ తర్వాత అగ్రరాజ్యం, యూరప్ దేశాల ఆర్థిక, ఆయుధ, నిఘా బలంతో చెలరేగిపోయింది. ధాటిగా దాడులు చేస్తూ పుతిన్ పటాలానికి ముచ్చెమటలు పట్టించింది. దీంతో మరింత శక్తివంతమైన ఆయుధాలను రష్యా బయటకుతీయక తప్పలేదు. దీంతో డ్రోన్లకు ఉక్రెయిన్ పనిచెప్పింది. దృఢత్వానికి చిరునామా అయిన అత్యంత ఖరీదైన వేలాది రష్యన్ యుద్ధట్యాంక్‌లను సైతం సులువుగా చవకైన డ్రోన్లతో పేల్చేసి జెలెన్స్కీ సేన పలు యుద్ధక్షేత్రాల్లో పైచేయి సాధించింది. 18 శాతం ఆక్రమణఅంతర్జాతీయ మీడియా కథనాలు, రష్యా, ఉక్రెయిన్ ఉన్నతాధికారులు పలు సందర్భాల్లో వెల్లడించిన గణాంకాలను బట్టి చూస్తే ఇప్పటిదాకా రష్యా ఉక్రెయిన్‌లోని కేవలం 18 శాతం భూభాగాన్ని మాత్రమే ఆక్రమించుకోగలిగింది. కీవ్, లివివ్, డినిప్రో, ఒడెసా వంటి ప్రధాన నగరాలపై దాడి ప్రభావం లేదు. అమెరికా, ఇతర మిత్ర దేశాల నుంచి ఉక్రెయిన్‌కు అందుతున్న భారీ ఆయుధాలే ఇందుకు ప్రధాన కారణం. ఎప్పటికప్పుడు ఆయుధాలు, మందుగుండు, సైనిక ఉపకరణాలు, ఆర్థిక సాయం అందడంతోపాటు అంతర్జాతీయంగా లభిస్తున్న నైతిక మద్దతుతో రెట్టించిన ఉత్సాహంతో ఉక్రెయిన్ సైనికులు కదనరంగంలో ధైర్యంగా ముందడుగు వేయగల్గుతున్నారు. యుద్ధంలో రష్యా దాదాపు ఏకాకిగా మారింది. రహస్యంగా ఉత్తరకొరియా, చైనా, ఇరాన్ వంటి దేశాల నుంచి ఆయుధాలు, డ్రోన్లు తదితర ఆయుధాలు, కిరాయి సైనికులు తప్పితే రష్యాకు బయటి దేశాల నుంచి ఎలాంటి సాయం అందట్లేదు. అమెరికా తదితర దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షల కత్తి గుచ్చాయి. సొంత దేశంలోనూ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న రష్యన్లు కోట్లలో ఉన్నారు. యుద్ధం కారణంగా విదేశీ వస్తువుల లభ్యత తగ్గి, డిమాండ్ పెరిగింది. దీంతో ద్రవ్యోల్బణం పెరిగి రష్యన్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆయుధం చేతికిచ్చి యుద్ధానికి పుతిన్ పంపిస్తాడన్న ముందస్తు అంచనాతో తొలినాళ్లలోనే వేలాది మంది యువ రష్యన్లు దేశం నుంచి పారిపోయారు. చివరకు ఖైదీలు, నిందితులను సైతం పుతిన్ సైన్యంలో చేరి్పంచుకుని ఉక్రెయిన్‌తో పోరాటం చేయిస్తున్నారు.అన్ని రంగాలు తిరోగమనం నష్టాలు చెప్పకపోయినా అంతర్జాతీయంగా తగ్గిన వాణిజ్యంతో ఉక్రెయిన్ నష్టాలు చరిత్రలో ఎన్నడూ చూడని స్థాయికి చేరుకున్నాయని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. బాంబు దాడుల్లో ఆనకట్టలు, రహదారులు, భవనాలు, వ్యవసాయ క్షేత్రాలు, పాఠశాలలు, కర్మాగారాలు ఇలా మౌలికవసతుల వ్యవస్థ బాగా దెబ్బతింది. వ్యవసాయం తగ్గిపోయింది. నిరుద్యోగం పెరిగింది. ఇలా ఎన్నో రంగాలు తిరోగమన పథంలో పయనిస్తున్నాయి. దేశ జీడీపీకి వందల బిలియన్ డాలర్ల నష్టం చేకూరింది. వాణిజ్య, పరిశ్రమ రంగానికి సంబంధించి దాదాపు రూ.15 లక్షల కోట్లు, వ్యవసాయ రంగానికి రూ.5.8 లక్షల కోట్ల నష్టాలు వాటిల్లాయి. రవాణా, వాణిజ్యం, ఎగుమతులు, వ్యవసాయం, విద్యుత్, పరిశ్రమల రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి వందల బిలియన్ డాలర్ల నిధులు అవసరమవుతాయని ఓ అంచనా. ఉక్రెయిన్‌కు మిత్ర దేశాల నుంచి భారీ స్థాయిలో సాయం అందుతున్నా అది ఎక్కువగా సైనిక, రక్షణపర సాయమే తప్పితే సాధారణ ప్రజల జీవితాలను బాగుచేసేది కాదు. దీంతో యుద్ధంలో ఉక్రెయిన్ తన భూభాగాలను మాత్రమే కాదు భవిష్యత్తును కొంత కోల్పోతోందనేది వాస్తవం. ఉక్రెయిన్‌కు అపార ఆస్తినష్టం రష్యా వైపు సైనికులు, ఆయుధాల రూపంలో నష్టం కనిపిస్తుంటే ఉక్రెయిన్ వైపు అంతకుమించి ఆస్తినష్టం సంభవించింది. లక్షల కోట్ల రూపాయల విలువైన భవనాలు నేలమట్టమయ్యాయి. పెద్ద సంఖ్యలో జనావాసాలపై దాడులతో పెద్దసంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇక దాదాపు లక్షకుపైగా ఉక్రెయిన్ సైనికులు చనిపోయినట్లు తెలుస్తోంది. దాదాపు 4 లక్షల మంది సైనికులు గాయాలపాలయ్యారు. ఇక స్వస్థలాలు సమరక్షేత్రాలుగా మారడంతో లక్షలాది మంది స్వదేశంలోనే యుద్ధంజాడలేని సుదూర ప్రాంతాలకు తరలిపోయారు. పక్కనే ఉన్న పోలండ్, రొమేనియా దేశాలుసహా అరడజనుకుపైగా దేశాలకు దాదాపు 60 లక్షల మంది శరణార్థులుగా వలసవెళ్లారు. దాదాపు ఉక్రెయిన్ వైపు యుద్ధంలో ఎంత నష్టం జరిగిందనేది స్పష్టంగా తెలీడం లేదు. అమెరికా సహా యూరప్ దేశాల ప్రభుత్వాలు, ఆయా దేశాల్లోని ప్రధాన మీడియా సంస్థలు సైతం ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తున్నాయి. దీంతో ఉక్రెయిన్ సైన్యం, పౌరుల్లో నైతిక స్థైర్యం సడలకూడదనే ఉద్దేశంతో యుద్ధ నష్టాలను తక్కువ చేసి చూపిస్తున్నాయని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.యుద్ధంలో రక్తమోడుతున్న రష్యాఅణ్వ్రస్తాలు లేకున్నా ఉక్రెయిన్‌తో యుద్ధం అంత తేలిక కాదని పుతిన్‌కు రానురాను అర్థమైంది. రష్యాకు తగ్గట్లు ఉక్రెయిన్ సైతం అధునాతన యుద్ధవ్యూహాలను అమలుచేస్తుండటంతో రష్యా వైపు నష్టం భారీగానే ఉంది. అంతర్జాతీయ యుద్ధ పరిశీలనా బృందాలు, సంస్థలు, వార్తాసంస్థల నివేదికలు, అంచనాల ప్రకారం యుద్ధంలో ఏకంగా 8,66,000 మంది రష్యా సైనికులు చనిపోయారు. ఉక్రెయిన్ విషయంలో చూస్తే కేవలం లక్షకుపైగా సైనికులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఏకంగా 10,161 రష్యన్ యుద్ధ ట్యాంకులను ఉక్రెయిన్ ధ్వంసంచేసింది. ఉక్రెయిన్‌లో ఎన్నికలొచ్చేనా?రష్యా దాడులు మొదలెట్టగానే జెలెన్స్కీ తమ దేశంలో మార్షల్ లా ప్రయోగించారు. సైనికపాలన వంటి అత్యయిక స్థితి అమల్లో ఉన్న కారణంగా ఉక్రెయిన్‌లో ఇప్పట్లో ఎన్నికలు సాధ్యంకాదు. ఒకవేళ ఎన్నికలు నిర్వహించాలంటే పార్లమెంట్లో ఏకాభిప్రాయ నిర్ణయం ద్వారా మార్షల్ లాను తొలగించాలి. యుద్ధం జరుగుతుండగా మార్షల్ లాను చట్టప్రకారం తొలగించడం అసాధ్యం. దీంతో ఇప్పట్లో ఎన్నికలు కష్టమని భావిస్తున్నారు. ఒకవేళ ఎన్నికలు నిర్వహించినా జెలెన్స్కీ జాతీయభావం, యుద్ధంలో రష్యాను దీటుగా ఎదుర్కొంటున్నానని చెప్పి మళ్లీ అధికారం కైవసం చేసుకుంటారని విపక్ష పారీ్టలు విమర్శిస్తున్నాయి. యుద్ధంలో ట్రంప్‌కార్డ్ జెలెన్స్కీ మొండిపట్టుదలతో యుద్ధాన్ని ఇక్కడిదాకా తెచ్చారని సంచలన ఆరోపణలు చేసిన అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్ వడివడిగా తీసుకుంటున్న నిర్ణయాలు యుద్ధమేఘాలను శాశ్వతంగా తరిమేస్తాయన్న ఆశలు ఒక్కసారిగా చిగురించాయి. తొలిసారిగా రష్యా విదేశాంగ మంత్రి స్థాయి కీలక నేతలతో ఇటీవల మొదలైన చర్చల ప్రక్రియను ఇప్పుడు యుద్ధంలో కీలకదశగా చెప్పొచ్చు. మంతనాలు మరింత విస్తృతస్థాయిలో జరిగితే మూడేళ్ల యుద్ధానికి ముగింపు ఖాయమనే విశ్లేషణలు పెరిగాయి. ఇప్పటిదాకా ఆక్రమించిన ప్రాంతం రష్యాకే చెందుతుందని, ఇప్పటి ‘వాస్తవాదీన రేఖ’నే అంగీకరిస్తూ జెలెన్స్కీని ఒప్పించాలని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ డీల్‌కు ఒప్పకోకపోతే మిత్రదేశాల నుంచి ఎలాంటి సాయం అందకుండా అడ్డుకుంటానని ట్రంప్ హెచ్చరించి జెలెన్స్కీని దారికి తెస్తారని భావిస్తున్నారు. అధునాతన ఆయుధాలతో దూసుకొస్తున్న రష్యా సేనలను అడ్డుకోవాలంటే ఉక్రెయిన్‌కు విదేశీ ఆయుధసాయం తప్పనిసరి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో జెలెన్స్కీ అమెరికా పెట్టే షరతులకు ఒప్పకోక తప్పదని, యుద్ధం ఒక రకంగా ముగింపు దిశలో పయనిస్తోందని వార్తలొచ్చాయి. యుద్ధం అంకెల్లో.. చనిపోయిన రష్యా సైనికులు 8,66,000కుపైగా చనిపోయిన ఉక్రెయిన్ సైనికులు 1,00,000కుపైగా ఇప్పటిదాకా రష్యా ఆక్రమించుకున్న ఉక్రెయిన్ ప్రాంతం 18 శాతం సగటున రోజుకు రష్యా ఆక్రమణ రేటు 16.1 చదరపు కిలోమీటర్లు ఉక్రెయిన్‌కు యూరప్ దేశాల నుంచి అందిన ఆర్థిక సాయం రూ. 14 లక్షల కోట్లు యూరోపియన్ యూనియన్ ఉక్రెయిన్‌కు ఇచ్చిన రుణాలు రూ. 2 లక్షల కోట్లు– సాక్షి, నేషనల్ డెస్క్ -
మరుగుజ్జు గెలాక్సీల్లోనూ భారీగా బ్లాక్‌హోల్స్!
తెనాలి: అమెరికాలోని సాల్ట్‌లేక్ సిటీలోని ఉటా విశ్వవిద్యాలయంలో పోస్ట్ డాక్టోరల్ పరిశోధన చేస్తున్న గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త డాక్టర్ రాగదీపిక పుచ్చా బ్లాక్‌హోల్స్‌కు సంబంధించిన అద్భుతమైన అంశాన్ని ఆవిష్కరించారు. దాదాపు అన్ని భారీ గెలాక్సీల కేంద్రాల్లోనూ సూపర్ మాసివ్ బ్లాక్‌హోల్స్ ఉన్నట్టు ఇప్పటికే కనుగొనడం జరిగింది. అయితే మరుగుజ్జు గెలాక్సీల్లోనూ పెద్దసంఖ్యలో 2,500 బ్లాక్‌హోల్స్‌ను కనుగొని, వాటిల్లోనూ బ్లాక్‌హోల్స్ సర్వసాధారణమని రాగదీపిక తేల్చారు. ‘గెలాక్సీలు ముందా? బ్లాక్‌హోల్స్ ముందా?’ అనే శాస్త్ర ప్రపంచం ఎదుట ఉన్న పెద్ద పజిల్ అన్వేషణలో ఇదో పెద్ద ముందడుగని రాగదీపిక చెప్పారు. తన పరిశోధన అంశాలను ఇటీవల అమెరికాలో విడుదల చేసిన ఆమె, ఈ సందర్భంగా ఆయా వివరాలను ‘సాక్షి’కి పంపారు. కొన్ని వివరాలను పరిశీలిస్తే..» ఆరిజోనా, మాయల్ టెలిస్కోపీలోని ‘డార్క్ ఎనర్జీ స్పె్రక్టాస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్’ (దేశీ) ప్రాజెక్టు 30 మిలియన్ గెలాక్సీలను పరిశీలిస్తోంది. » ఈ క్రమంలో ఎప్పటికప్పుడు డేటాను భద్రపరుస్తోంది. » ‘మరుగుజ్జు గెలాక్సీలు’ వ్యవస్థల్లో బ్లాక్‌హోల్స్ (కృష్ణబిలాలు) అన్వేషణలో ఉన్న డాక్టర్ రాగదీపిక నేతృత్వంలోని బృందం ‘దేశీ’ సేకరణలోని అంశాలను పరిశోధించింది. » ఆ అధ్యయనంలో భాగంగా దాదాపు 1,15,000 మరుగుజ్జు గెలాక్సీల్లో దాదాపు రెండు శాతం క్రియాశీల బ్లాక్‌హోల్స్‌ను కనుగొంది. » భారతదేశానికి చెందిన నోబెల్ బహుమతి గ్రహీత ఎస్.చంద్రశేఖర్ 50 ఏళ్ల క్రితం తొలిసారి బ్లాక్‌హోల్స్ సమాచారాన్ని అందించారు. దేశం తరఫున ఏకైక తెలుగమ్మాయి... మరుగుజ్జు నక్షత్ర మండలాల (డ్వార్ఫ్ గెలాక్సీస్)పై భారతదేశం నుంచి పరిశోధన చేస్తున్న ఏకైక తెలుగమ్మాయి రాగదీపిక పుచ్చా. సొంతూరు తెనాలి. తండ్రి రాజగోపాల్ కేంద్ర సర్వీసులో విశ్రాంత సివిల్ ఇంజినీరు. తల్లి కనకదుర్గ శాస్త్రీయ సంగీతం (వీణ) గురువు. పశ్చిమబెంగాల్లోని శాంతినికేతన్ విశ్వవిద్యాలయం విశ్వభారతిలో అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్‌లో టాపర్‌గా నిలిచారు రాగదీపిక. అహ్మదాబాద్, నైనిటాల్, ముంబైలోని ప్రసిద్ధ పరిశోధన సంస్థల్లో సమ్మర్ ఇంటర్న్‌షిప్ చేసి, చివరి ఏడాది బెంగళూరులోని ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్’లో ‘సూర్యుడి మచ్చలు’పై థీసిస్ చేశారు. జర్మనీలోని ‘మాక్స్ ఫ్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోలార్ సిస్టమ్ రీసెర్చ్’లో గెస్ట్ సైంటిస్ట్‌గా సూర్యుడిపై పరిశోధనలు కొనసాగించారు. యూనివర్శిటీ ఆఫ్ ఆరిజోనాలో ‘ఆ్రస్టానమి అండ్ ఆస్ట్రో ఫిజిక్స్’లో ఎంఎస్ చేశారు. 2023లో అదే యూనివర్శిటీ నుంచి ‘మరుగుజ్జు గెలాక్సీలు–బ్లాక్‌హోల్స్’పై డాక్టర్ స్టెఫానీ జునో, డాక్టర్ అర్జున్ డే మార్గదర్శకత్వంలో సమర్పించిన థీసిస్‌కు పీహెచ్డీ స్వీకరించారు. శాస్త్ర ప్రపంచంలో ఇదే తొలిసారి మరుగుజ్జు గెలాక్సీల్లో బ్లాక్‌హోల్స్‌ను ఇంత భారీ సంఖ్యలో కనుగొనటం శాస్త్ర ప్రపంచంలో ఇదే ప్రథమం. మా బృందం నాలుగు వేలకన్నా ఎక్కువ గెలాక్సీల్లోని బ్లాక్‌హోల్స్ ద్రవ్యరాశిని కూడా నిర్ణయించింది. సూర్యుడి కంటే దాదాపు 1,000 నుంచి మిలియన్ రెట్ల ద్రవ్యరాశి కలిగిన ఇంటర్మీడియట్ బ్లాక్హోల్స్నూ శోధించింది. ‘దేశీ’ డేటాతో మా బృందం దాదాపు 300 డిటెన్షన్లను ఆవిష్కరించింది. దీని ఫలితంగా విశ్వంలో మొదటి బ్లాక్çహోల్స్ సాపేక్షికంగా తేలికైనవని తెలుస్తోంది. ‘దేశీ’తో ఇప్పటివరకు గెలాక్సీలలో అతి తక్కువ ద్రవ్యరాశి గల 2,500 బ్లాక్‌హోల్స్‌ను మేం కనుగొన్నాం. ఇది ఉత్తేజకరమైన ఫలితం. గెలాక్సీలు...బ్లాక్‌హోల్...వీటిలో ఏది ముందు? అనేది శాస్త్ర ప్రపంచానికి పెద్ద ప్రశ్న. గెలాక్సీలు, బ్లాక్‌హోల్స్ పరిణామ క్రమాన్ని విశ్లేషించటానికి, విశ్వంలో తొలి బ్లాక్‌హోల్స్ ఎలా ఏర్పడ్డాయనేది తెలుసుకునేందుకు మా అధ్యయనం ఉపకరిస్తుంది. బ్లాక్‌హోల్స్‌ను విడిగా కాకుండా ఒక సమూహంగా అధ్యయనం చేయడాన్ని ఇక ప్రారంభించవచ్చు. – డాక్టర్ రాగదీపిక పుచ్చా, ఖగోళ శాస్త్రవేత్త -
హీరోలా ఎగిరే జీరో..
ట్రాఫిక్‌జామ్‌లకు భయపడి కారును బయటకు తీయాలంటేనే భయపడుతున్నారా? అయితే మీ లాంటి వారి కోసమే ఓ ఎగిరే కారు సిద్ధమవుతోంది. అమెరికాకు చెందిన అలెఫ్ ఏరోనాటిక్స్ అనే ఆటోమోటివ్, ఏవియేషన్ సంస్థ సరికొత్త ఫ్యూచర్ కారును అభివృద్ధి చేస్తోంది. రోడ్డుపై రయ్యిమని దూసుకెళ్లగలగడంతోపాటు అవసరమైనప్పుడు అమాంతం పైకి ఎగిరి వెళ్లగల కారును సిద్ధం చేస్తోంది.తాజాగా మోడల్ జీరో అనే కారును ప్రయోగాత్మకంగా కాలిఫోర్నియాలోని ఓ రోడ్డుపై విజయవంతంగా పరీక్షించింది. అందుకు సంబంధించిన వీడియోను సంస్థ నెటిజన్లతో పంచుకుంది. ఆ వీడియోలో మోడల్ జీరో కారు రోడ్డుపై కాస్త దూరం ప్రయాణించి ఆపై నిట్టనిలువుగా టేకాఫ్ అయి ముందున్న కారు పైనుంచి ఎగురుతూ ముందుకు సాగింది. అనంతరం మళ్లీ రోడ్డుపై దిగి ముందుకు కదిలింది. –సాక్షి, సెంట్రల్ డెస్క్ఎలా సాధ్యమైంది?సాధారణ కార్లలో బానెట్‌లో ఇంజన్ ఉంటే మోడల్ జీరో కారులో మాత్రం నాలుగు చిన్న ఇంజన్లను వాటి చక్రాల వద్ద కంపెనీ అమర్చింది. వాటి సాయంతో సాధారణ ఎలక్ట్రిక్ కారులాగానే ఈ కారు రోడ్డుపై దుసుకెళ్తోంది. ఇక ఖాళీగా ఉన్న బానెట్, డిక్కీలలో మొత్తం ఎనిమిది ప్రొపెల్లర్లను సంస్థ ఏర్పాటు చేసింది. వేర్వేరు వేగములతో వేటికవే విడివిడిగా పరిభ్రమించగలగడం ఈ ప్రొపెల్లర్ల్ల ప్రత్యేకత. ఫలితంగా కారు ఏ దిశలో అయినా ఎగరడం సాధ్యం అవుతోంది. ఇందుకోసం డిస్ట్రిబ్యూటెడ్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ టెక్నాలజీని కంపెనీ ఉపయోగించింది. కారు ఫ్రేమ్ కోసం కార్బన్ ఫైబర్ వాడటంతో బరువు 385 కిలోలకే పరిమితమైంది. ప్రస్తుత నమూనా గాల్లో సుమారు 177 కి.మీ. దూరం ప్రయాణించగలదని.. రోడ్డుపై మాత్రం 56 కి.మీ. దూరం వెళ్లగలదని అలెఫ్ ఏరోనాటిక్స్ వివరించింది. రెండు సీట్లుగల మోడల్ ఏ రకం కారు రోడ్డుపై సుమారు 320 కి.మీ. దూరం ప్రయాణించగలదని.. గాల్లో 177 కి.మీ. దూరం వెళ్లగలదని తెలిపింది. ఫ్లయింగ్ కార్లకన్నా భిన్నమైనది..ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే అభివృద్ధి దశలో ఉన్న ఫ్లయింగ్ కార్లకన్నా తాము రూపొందిస్తున్న కారు భిన్నమైనదని అలెఫ్ ఏరోనాటిక్స్ తెలిపింది. ఈవీటాల్ ఫ్లయింగ్ ట్యాక్సీల వంటి కార్లు టేకాఫ్ కోసం రోడ్డును రన్ వేలాగా ఉపయోగిస్తాయని.. కానీ తాము అభివృద్ధి చేస్తున్న కారు మాత్రం రోడ్డుపై నిట్టనిలువుగా టేకాఫ్ తీసుకోగలదని పేర్కొంది. సాధారణ ప్రజలు ఈ కారును వాడటం ఎంతో సులువని.. కేవలం 15 నిమిషాల్లో కారులోని కంట్రోల్స్‌పై పట్టు సాధించొచ్చని కంపెనీ సీఈఓ జిమ్ డకోవ్నీ పేర్కొన్నారు. ‘రైట్ బ్రదర్స్ విమాన వీడియో తరహాలో మా కారు ప్రయోగ వీడియో మానవాళికి సరికొత్త రవాణా సాధ్యమని నిరూపిస్తుందని భావిస్తున్నా’అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ధర ఎక్కువే..మోడల్ ఏ రకం కారుపై కంపెనీ ఇప్పటికే ప్రీ ఆర్డర్లు తీసుకుంటోంది. రోల్స్ రాయిస్, బెంట్లీ, ఆస్టన్ మార్టిన్ వంటి లగ్జరీ కార్ల తరహాలోనే ఈ కారు ధరను సుమారు రూ. 2.57 కోట్లుగా కంపెనీ ఖరారు చేసింది. అయితే భవిష్యత్తులో భారీ స్థాయిలో ఉత్పత్తి చేపట్టి సామాన్యులకు అందుబాటు ధరలో ఉండేలా సుమారు రూ. 27.35 లక్షలకు కారును అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. -
సుంకాల భారం అమెరికాపైనే!
ఔషధాలు, ఆటోమొబైల్, సెమికండక్టర్ దిగుమతులపై దాదాపు 25 శాతం లేదా అంతకంటే ఎక్కువ సుంకాలను విధించాలని యోచిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించిన సంగతి తెలిసిందే. భారత్ నుంచి ఔషధ ఎగుమతుల్లో యూఎస్ మార్కెట్ తొలి స్థానంలో ఉంది. అలాగే అమెరికా వినియోగిస్తున్న జనరిక్స్‌లో దాదాపు సగం వాటా భారత్ సమకూరుస్తోంది. దీంతో ట్రంప్ ని ర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.ఔషధ దిగుమతులపై ఆధారపడ్డ యూఎస్ ప్రతీకార పన్నుల విషయంలో ఒక అడుగు వెనక్కి వేసే అవకాశమే ఉందని భారతీయ ఫార్మా కంపెనీలు, నిపుణులు కుండబద్దలు కొడుతున్నారు. యూఎస్ వెలుపల అత్యధిక యూఎస్ఎఫ్డీఏ ఆమోదం పొందిన ఔషధ తయారీ ప్లాంట్లు ఉన్నది భారత్‌లోనే. పైగా ఇప్పటికిప్పుడు డిమాండ్‌కు తగ్గట్టుగా మందులను సరఫరా చేసే స్థాయిలో అక్కడి కంపెనీల సామర్థ్యం లేదు. ఇదంతా ఒక ఎత్తైతే ఒకవేళ ఔషధాలపై ప్రతీకార పన్నులు విధిస్తే తమపై ప్రభావం తక్కువేనని, దిగుమతుల భారం యూఎస్పైనే ఉంటుందని భారతీయ కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. – సాక్షి, బిజినెస్ బ్యూరోప్రధాన మార్కెట్‌గా యూఎస్.. భారత్ నుంచి ఎగుమతి అవుతున్న ఔషధాల్లో తొలి స్థానంలో ఉన్న యూఎస్ వాటా ఏకంగా 30 శాతంపైనే ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో మన దేశం నుంచి రూ.75,385 కోట్ల విలువైన ఔషధాలు యూఎస్‌కు చేరాయి. ఇక యూఎస్ నుంచి భారత్‌కు వచ్చిన మందులు కేవలం రూ.5,199 కోట్ల విలువైనవి మాత్రమే. 2023–24లో భారత్ నుంచి వివిధ దేశాలకు మొత్తం ఔషధ ఎగుమతులు రూ.2,40,887 కోట్లు. ఇందులో జనరిక్ ఫార్ములేషన్స్ (ఫినిష్డ్ డోసేజ్) రూ.1,64,635 కోట్లు. అంతర్జాతీయంగా జనరిక్స్ మార్కెట్ పరిమాణం రూ.39,85,900 కోట్లు. 2030 నాటికి ఇది రూ.68,45,350 కోట్లకు చేరుకుంటుందన్న అంచనాలు ఉన్నాయి. ఆ సమయానికి భారత మార్కెట్ ఎగుమతులతో కలుపుకుని రూ.9,53,150–10,39,800 కోట్ల స్థాయికి చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది రూ.4,76,575 కోట్లు. చవకగా నాణ్యమైన ఔషధాలు.. నాణ్యమైన ఔషధాలను చవకగా తయారు చేయడం భారతీయ జనరిక్ కంపెనీల ప్రత్యేకత. కోట్లాది రూపాయలు వెచ్చించి యూఎస్ఎఫ్డీఏ అప్రూవల్స్ దక్కించుకున్న కంపెనీలు.. యూఎస్‌లో ఉన్న అపార అవకాశాలను కాదనుకునేందుకు సిద్ధంగా లేరని ఓ కంపెనీ ప్రతినిధి అన్నారు. ఎఫ్‌డీఏ ఆమోదం అంటేనే ప్రతిష్టగా భావిస్తారని అన్నారు. భారతీయ మందుల కారణంగా 2013–2022 మధ్య యూఎస్ ఆరోగ్య రంగం రూ.1,12,64,500 కోట్లు ఆదా చేసిందని నివేదికలు చెబుతున్నాయని ఫార్మెక్సిల్ డైరెక్టర్ జనరల్ రాజ భాను తెలిపారు. నూతన, వినూత్న ఔషధాలను యూఎస్ నుంచి భారత్ దిగుమతి చేసుకుంటోంది. సిద్ధం కావడానికి నాలుగేళ్లు.. యూఎస్ఎఫ్డీఏ ఆమోదం కలిగిన తయారీ ప్లాంట్లు భారత్‌లో 650 దాకా ఉన్నాయి. ఈ ధ్రువీకరణ రావాలంటే ప్రమాణాలకు తగ్గట్టుగా ప్లాంటును సిద్ధం చేయడం, ఏఎన్‌డీఏ ఆమోదం, అనుమతులకు నాలుగేళ్లు పడుతుంది. ఇప్పటికిప్పుడు మరో దేశం నుంచి ఔషధాలను దిగుమతి చేసుకుందామని అనుకున్నా యూఎస్‌కు సాధ్యం కాదు. కోవిడ్ మహమ్మారి సమయంలో చైనా, భారత్‌లో ఎఫ్‌డీఏ తనిఖీలు ఆలస్యం అయ్యాయి. దీంతో సరఫరా తగ్గి యూఎస్‌లో ఔషధాల కొరత వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో టారిఫ్‌లు విధించే అవకాశాలు లేవనే చెప్పవచ్చు. యూఎస్ నుంచి వచ్చే ఔషధాలపై దిగుమతి సుంకాన్ని భారత్ ఎత్తివేసే చాన్స్ ఉంది. యూఎస్‌లో తయారీ ప్లాంట్లు పెట్టాలన్నా అంత సులువు కాదు. – రవి ఉదయ భాస్కర్, మాజీ డైరెక్టర్ జనరల్, ఫార్మెక్సిల్వినియోగదారులపైనే భారం.. భారత్ నుంచి దిగుమతయ్యే ఔషధాలపై అమెరికా ప్రస్తుతం కేవలం 0.1 శాతం సుంకాన్ని విధిస్తోంది. ఇందుకు విరుద్ధంగా భారత్ 10 శాతం వసూలు చేస్తోంది. యూఎస్ వినియోగిస్తున్న జనరిక్స్‌లో సింహ భాగం భారత్ సమకూరుస్తోంది. భారత్‌లో తయారైన యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్పై (ఏపీఐ) యూఎస్ ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. ప్రతిపాదిత ప్రతీకార సుంకాలు కొన్ని జనరిక్స్ లాభదాయకతను ప్రభావితం చేయవచ్చు. కానీ ఆ భారాన్ని తుది వినియోగదారులకు బదిలీ చేసే అవకాశం ఉంది. – శ్రీనివాసరెడ్డి, చైర్మన్, ఆప్టిమస్ గ్రూప్ఏపీఐ కంపెనీలకు.. సుంకాలు విధిస్తే ఔషధాలు ప్రియం అవుతాయి. ఇదే జరిగితే యూఎస్ ప్రజలపైనే భారం పడుతుంది. అయితే దీని ప్రభావం ఫినిష్డ్ డోసేజ్ కంపెనీలపైనే ఉంటుంది. ఇక ఏపీఐ త యారీ సంస్థలకు మంచి రోజులు రానున్నాయి. భారత కంపెనీల నుంచే వీటి దిగుమతికి యూఎస్ ఆసక్తిగా ఉండడమే ఇందుకు కారణం. ప్రధానంగా ఆంకాలజీ విభాగంలో అవకాశాలు ఎక్కువ. యూఎస్ఎఫ్డీఏ ఆమోదం ఉన్న కంపెనీలకు ప్రయోజనం చేకూరుతుంది. – ఆళ్ల వెంకటరెడ్డి, ఎండీ, లీ ఫార్మా -
World Richest: శత్రు దుర్భేద్యం.. అత్యంత ధనిక దేశం
ఈ భూమ్మీద అత్యంత ధనికుడు ఎవరు?.. ప్రస్తుతానికైతే అపరకుబేరుల జాబితాలో 384 బిలియన్ డాలర్లతో ఇలాన్ మస్క్ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. మరి ప్రపంచంలో అధిక దేశం ఏది?.. జీడీపీ పరంగా చూసుకుంటే యూరప్ దేశం లగ్జెంబర్గ్. అలాంటప్పుడు మళ్లీ ధనిక దేశం, మస్క్ కంటే ధనికుడు అనే మాట ఎందుకు వస్తుందంటారా?.. అక్కడికే వస్తున్నాం.. ఇలాన్ మస్క్(Elon Musk), మార్క్ జుకర్‌బర్గ్, జెఫ్ బెజోస్‌ల పేర్లే అత్యంత ధనికుల లిస్ట్‌లో ఎప్పుడూ కనిపిస్తుంటుంది. వీళ్లతో పాటు మరో నలుగురైదుగురి పేర్లే ఈ జాబితాలో పైకి కిందకి తారుమారు అవుతుంటాయి. అయితే వాస్తవ ప్రపంచానికి కాస్త దూరంగా వెళ్తే.. ఇలాంటి ధనికులు వందల మంది కలిసొచ్చినా కూడా ఆయన సంపదకు దరిదాపుల్లో కూడా కనిపించరు!. ఆయన పేరే టీచల్లా.టీచల్లా.. వకాండా(Wakanda) అనే దేశానికి రాజు. ఈ దేశం ఆఫ్రికాలో ఉంది. ఈ భూమ్మీద అత్యంత సురక్షితమైన.. శత్రు దుర్భేద్యమైన దేశంగా వకాండాకు పేరుంది. అక్కడ దొరికే వైబ్రేనియం అనే మెటల్ కారణంగా ఆ రాజుకు, ఆ దేశానికి వెలకట్టలేనంత సంపద రాగలిగింది. ఇప్పుడే కాదు. ఇంకా కొన్ని వందల ఏళ్లు గడిచినా ఆ సంపద విలువను ఎవరూ అందుకోలేరంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ దేశం కల్పితం మాత్రమే. మార్వెల్ కామిక్స్, ఆ సిరీస్‌లో వచ్చే సినిమాలు చూసిన వాళ్లకు బాగా పరిచయం ఉన్న పేరు. రాజుగా కన్నా బ్లాక్ పాంథర్ అనే సూపర్ హీరోగానే ఆయన ఈ ప్రపంచానికి సుపరిచితుడు. కల్పిత దేశమైన వకాండలో వైబ్రేనియం(Vibranium) అనే అత్యంత అరుదైన.. అతివిలువైన ఖనిజం ఉంటుంది. దాని సాయంతో ఈ భూమ్మీద ఏ దేశానికి కూడా సాధ్యపడని అత్యాధునిక టెక్నాలజీని ఈ దేశం ఉపయోగిస్తుంటుంది. అలా.. ఈ భూమ్మీద అత్యంత ధనిక దేశంగా వకాండా నిలిచింది.ఇంతకీ టీచల్లా(బ్లాక్‌పాంథర్) సంపద ఎంతో తెలుసా?.. అక్షరాల 90 ట్రిలియన్ డాలర్లు. అయితే కొన్ని కామిక్ పుస్తకాల్లో మాత్రం ఆయన సంపద కేవలం 500 బిలియన్ డాలర్లుగా ఉంది. అంటే ఏరకంగా చూసుకున్నా కూడా.. టీచల్లానే ఈ భూమ్మీద అత్యంత ధనికుడన్నమాట. ఇక వ్రైబేనియం కారణంగా వకాండ ఈ భూమ్మీదే అత్యంత ధనికమైన దేశంగా నిలిచింది.వకాండాలో రకరకాల తెగలు ఉంటాయి. బ్లాక్ పాంథర్ అనే బలమైన సంరక్షణలో ఆ దేశం ఉంటుంది. అక్కడి తెగల ప్రజలు చిన్నాపెద్దా తేడా లేకుండా యుద్ధ శిక్షలో ఆరితేరి ఉంటాయి. వాటి మధ్య ఎన్ని వైరాలున్నా.. దేశ భద్రతకు ముప్పు వాటిల్లితే మాత్రం ఏకతాటికి వస్తుంటాయి. ఈ భూమ్మీద అత్యంత సురక్షితమైన దేశంగా వాకాండాకు పేరుంది. అందుకు కారణాలు లేకపోలేదు.తమ భూభాగంలో దొరికే వైబ్రేనియంతోనే అత్యాధునిక ఆయుధ సంపత్తిని, రక్షణ వ్యవస్థలను తయారు చేసుకుంటుంది ఆ దేశం. పటిష్టమైన నిఘా వ్యవస్థ, కంటికి కనిపించని రక్షణ వలయం ఏర్పాటు చేసుకుని శత్రువుల నుంచి తమ దేశాన్ని రక్షించుకుంటోంది.అత్యంత ఖరీదైన సహజ సంపద ఉన్నందున.. కొన్ని తరాలపాటు ప్రపంచ దేశాలకు వీలైనంత దూరంగా ఉంటూ ఐసోలేషన్ పాటిస్తూ వచ్చింది ఆ దేశం. అయితే టీచల్లా రాజు అయ్యాక ఆ పరిస్థితి మారింది. వర్తక వాణిజ్య ఒప్పందాల, దౌత్యపరమైన సంబంధాల కోసం ప్రపంచ దేశాలకు వకాండా తలుపులు తెరిచాడాడు. అలాగే.. అగ్రదేశాలకూ వకాండా నుంచి అత్యాధునికమైన సాంకేతికత సాయం కూడా అందింది. దీంతో వకాండా ఆర్థిక అభివృద్ధి .. ఈ భూమ్మీద మరేయితర దేశం అందుకోనంత స్థాయికి చేరింది. అదే సమయంలో వైబ్రేనియం మీద కొన్ని దేశాలు, వ్యక్తులు కన్నేయడంతో వకాండాకు శత్రువులను సంపాదించి పెట్టింది కూడా.మైక్రోసాఫ్ట్ నెట్వర్క్)MSN) డాటా ప్రకారం.. డీసీ సూపర్ హీరో బ్రూస్ వేన్(బ్యాట్మన్) సంపద విలువ 9.2 బిలియన్ డాలర్లు కాగా, మార్వెల్ తరఫున టోనీ స్టార్క్(ఐరన్ మ్యాన్) సంపద విలువ 12.4 బిలియన్ డాలర్లు వీళ్లతో పాటు ప్రొఫెసర్ ఎక్స్, అక్వామాన్లు కూడా ఈ జాబితాలో ఉన్నారు. అలాగే సూపర్ విలన్లలో విక్టర్ వోన్ డూమ్ సంపద 100 బిలియన్ డాలర్లు కాగా, లెక్స్ లూథోర్ సంపద విలువ 75 బిలియన్ డాలర్లు. అంటే మొత్తం సూపర్ హీరోల ప్రపంచంలోనూ టీచల్లా రిచ్చెస్ట్ అన్నమాట. అయితే వాస్తవ ప్రపంచంలోనూ వెలకట్టలేని సంపదతో ఓ ధనికుడు ఉన్నాడని మీకు తెలుసా?ఒక మహా చక్రవర్తి.. మానవజాతి చరిత్రలో అంతటి సంపద కలిగిన మరో వ్యక్తి ఇప్పటి వరకు లేరు. ఆయనే మన్సా మూసా (Mansa Musa). ఆఫ్రికాలోని ప్రస్తుత మాలి, సెనెగల్, గాంబియా, గినియా, నైగర్, నైజీరియా, చాద్, మారిటేనియా తదితర దేశాలతో కూడిన విశాల ‘మాలి’ సామ్రాజ్యాన్ని ఈయన పాలించాడు. ప్రస్తుత మాలిలోని టింబుక్టును నిర్మించింది ఆయనే. క్రీ.శ. 1312 నుంచి 1337 వరకు ఆయన పాలనలో మాలి ఖ్యాతి ప్రపంచానికి తెలిసింది. మూసా సామ్రాజ్యంలో బంగారు, ఉప్పు గనులు ఎక్కువగా ఉండేవి. ప్రత్యేకించి బంగారు గనులు ఎక్కువగా ఉండటంతో బంగారం వేల టన్నుల్లో ఈయన ఖజానాలో ఉండేది. వీటిని ఇతర దేశాలకు ఎగుమతి చేయడంతో భారీగా సంపద దేశానికి తరలివచ్చింది. ప్రస్తుతం ఈ భూమ్మీద అందరి దగ్గర ఉన్న సంపదను కలిపినా.. అప్పట్లో ఆయన ఒక్కడి దగ్గర ఉన్న సంపదే ఎక్కువట!!. అంతేకాదు.. హజ్ యాత్రకు ఆయన దాదాపు లక్షమంది పరివారంతో బయలుదేరినట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఆ సమయంలో ఆయన ఈజిప్ట్‌లో పంచిన బంగారంతో.. ఆ దేశంలో బంగారం విలువ పడిపోయిందట!. అలాగే ప్రపంచంలోనే ఇంత ఖరీదైన యాత్ర ఇప్పటివరకు లేదు. మూసా 1337లో కన్నుమూశారు. అనంతరం వచ్చిన పాలకులు అసమర్థులు కావడంతో మూసా నిర్మించిన మహాసామ్రాజ్యం విచ్ఛిన్నం కాగా, ఆ సంపదను కొల్లగొట్టుకుని పోయారు. -
చింత.. నిశ్చింత..
సాక్షి, పుట్టపర్తి: అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో అనేక గ్రామాల ప్రజలు చింత చెట్టును నమ్ముకుని నిశ్చింతగా జీవనం సాగిస్తున్నారు. మడకశిర నియోజకవర్గంలో దశాబ్దాల తరబడి దాదాపు 20 వేల కుటుంబాలు చింతచెట్లనే నమ్ముకుని జీవనం సాగిస్తున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా 334 గ్రామాలు ఉండగా.. సుమారు 2 లక్షల చింతచెట్లు (Tamarind Trees) ఉన్నాయి. ప్రధాన మార్కెట్ అయిన హిందూపురం (Hindupur) మార్కెట్‌కు వచ్చే సరుకులో అత్యధికంగా మడకశిర నుంచే వస్తుంది. గత మూడేళ్ల నుంచి చింత రైతులకు కూలీ వ్యయం బాగా పెరిగింది. చింతపండు ధర మాత్రం యథావిధిగా ఉండటంతో ఆశించిన స్థాయిలో లాభాలు రావడం లేదని రైతులు చెబుతున్నారు. చింతకాయలు కోసేందుకు కూలీలకు రోజుకు రూ.800 చొప్పున ఇవ్వాలి. మిగతా నూర్పిడి పనులకు అయితే రోజుకు రూ.300 ఇస్తారు.చింతపండును శుద్ధి చేసి మార్కెట్‌కు తరలించేందుకు క్వింటాల్‌కు రూ.2 వేల చొప్పున అదనంగా భరించాల్సి ఉంటుంది. పండు బాగా ఉంటే నాణ్యత ఆధారంగా క్వింటాల్ రూ.30 వేల వరకు ధర పలుకుతుంది. సరుకు బాగా లేకపోతే ధరలో వ్యత్యాసం ఉంటుంది. కొందరు సరిగా శుద్ధిచేయలేక తక్కువ ధరకు విక్రయిస్తుంటారు. హిందూపురం యార్డ్‌లో విక్రయాలు.. ఏటా ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు వారానికి రెండు రోజులు (సోమ, గురు) చొప్పున హిందూపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో చింతపండు విక్రయాలు జరుగుతాయి. సీజన్లో గరిష్టంగా 28 సార్లు అమ్మకాలు ఉంటాయి. మార్కెట్ యార్డులో సుమారు 70 ట్రేడ్ ఏజెన్సీలు ఉన్నాయి. ఒక్కో ఏజెన్సీ నుంచి సగటున 100 టన్నుల చింతపండు ఎగుమతి అవుతుంది. అందులో సగంపైగా మడకశిర నియోజకవర్గం నుంచి వస్తుండటం విశేషం. మిగతా సరుకు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి చేరుతుంది. సీజన్ ముగిశాక శీతల గిడ్డంగుల్లోకి.. రైతుల నుంచి సేకరించిన సరుకును హిందూపురం మార్కెట్లో బాక్సుల్లో నింపి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. సీజన్ పూర్తయ్యే లోగా మిగిలిన సరుకును స్థానికంగా ఉన్న శీతల గిడ్డంగుల్లో నిల్వ ఉంచుతారు. లారీ చింతపండుకు ఏడాదికి రూ.25 వేలు చొప్పున అద్దె చెల్లించి శీతల గిడ్డంగుల్లో నిల్వ ఉంచుతారు. మడకశిరకు సమీపంలోనే హిందూపురం ఉండటంతో రైతులకు రవాణా ఖర్చులు కూడా కలిసివస్తాయి. ఈ సారి ఖర్చు పెరిగింది గతంతో పోలిస్తే ఈసారి ధరలు స్థిరంగా ఉన్నాయి. నేను 16 ఏళ్ల నుంచి చింత చెట్ల నుంచి ఫలసాయం పొందుతున్నా. ప్రతి ఏటా లాభాలు వచ్చేవి. అయితే ఈసారి మాత్రం ఖర్చు పెరిగింది. ఆశించిన స్థాయిలో ఆదాయం రాలేదు. స్థానికంగా మార్కెట్ సౌకర్యం కల్పిస్తే రవాణా ఖర్చులు మిగులుతాయి. – రైతు జయరామప్ప, మెట్టబండపాళ్యం, మడకశిర మండలం దిగుబడి తగ్గింది మా తోట చుట్టూ 25 చింత చెట్లు ఉన్నాయి. ఈ ఏడాది వింత రోగం వచ్చి దిగుబడి తగ్గింది. అందుకే ఒక్కో చెట్టును రూ.2 వేల చొప్పున వ్యాపారికి అమ్మేశాను. దిగుబడి బాగా ఉండి ఉంటే చెట్టు రూ.3 వేలు పైగా ధర పలికేది. – వీరాముద్దప్ప, మద్దనకుంట, అమరాపురం మండలం చింతపండు మార్కెట్ – హిందూపురం లావాదేవీలు – ప్రతి సోమ, గురువారం సీజన్ – ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ యార్డ్‌లో ట్రేడ్ ఏజెన్సీలు – 70 ఒక్కో ఏజెన్సీ నుంచి – 100 టన్నులవరకు ఎగుమతి -
సముద్రమంత ఆత్మవిశ్వాసం
‘ఎగిసే అలలతో పోరాటం.. అమ్మాయిలకు సాధ్యమయ్యే పనేనా’ అనే చిన్నపాటి ఆలోచనలను కూడా దరిచేరనివ్వడం లేదు నవతరం. ఆకాశమే హద్దుగా నీటి మీదనే తమ కలలను సాకారం చేసుకుంటున్నారు. క్లిష్టమైన సెయిలింగ్ క్రీడా పోటీలలో తమ సత్తా చాటుతున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. హైదరాబాద్ వాసులైన ఈ యువ సెయిలర్ల సాహసం ఎంతోమందికి స్ఫూర్తిని కలిగిస్తుంది.హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉండే పూతన మాన్య రెడ్డి మొదట స్కూల్ స్థాయిలో స్విమ్మింగ్ నేర్చుకుంది. స్విమ్మింగ్ పోటీలో పాల్గొంటూ సెయిలింగ్‌పై ఆసక్తి కలిగి, శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టింది. సెయిలింగ్‌కి అనుకూలమైన వాతావరణం కోసం గోవా, మైసూర్..లలో ప్రాక్టీస్ చేసింది. సీనియర్లు ఉపయోగించే బోటుకు మారి, జాతీయ స్థాయిలో ఇప్పటికే 5 పతకాలు సొంతం చేసుకుంది. షిల్లాంగ్ నేషనల్ ర్యాంకింగ్ రెగెట్టా, తెలంగాణ జాతీయ జూనియర్ రెగెట్టాలోనూ కాంస్యాలను సాధించింది. థాయ్‌లాండ్, పోర్చుగల్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్ నుంచిప్రాతినిధ్యం వహించింది. ఇటీవల మలేషియాలోని లంకాగ్వి అంతర్జాతీయ సెయిలింగ్ పోటీలో పాల్గొని, బంగారు పతకాన్ని సాధించింది.సాహసాలు చేసే శక్తిని ఇస్తుంది ఈ క్రీడల్లో పాల్గొనడానికి చాలా శక్తి కావాలని, ఆరోగ్యసమస్యలు వస్తాయని, ఆడపిల్లలకు సరైనది కాదని చాలామంది నిరాశ పరిచారు. కానీ, సెయిలింగ్ ఎంత ఉత్సాహవంతమైన క్రీడనో, సాహసాన్ని ప్రదర్శించడమే కాదు సముద్రమంత ఆత్మవిశ్వాసాన్ని కూడా ఇస్తుందని తెలిసింది. అంతేకాదు భవిష్యత్తు ఎంతో ఉత్తమంగా మార్చుకునే అవకాశాలనూ ఇస్తుంది. ఒలింపిక్స్ సెయిలింగ్ పోటీలో పాల్గొని పతకాలని సాధించేందుకు కృషి చేస్తున్నాను. ట్రైనింగ్, పోటీలు.. అంటూ నీళ్లతోనే మా సావాసం కాబట్టి అందుకు తగిన వ్యాయామం, సమతుల ఆహారం పట్ల జాగ్రత్తలు తీసుకుంటాను. లెవన్త్ గ్రేడ్ చదువుతున్నాను. వాయిలెన్ మరో ఇష్టమైన హాబీ, స్కూల్ ఎన్జీవోలో యాక్టివ్ మెంబర్ని.– పూతన మాన్యరెడ్డినీళ్లు చూస్తే భయం వేసిందినాలుగేళ్ల క్రితం మా స్కూల్లో ‘సెయిలింగ్‌లో శిక్షణ ఇస్తున్నార’ని చెబితే, ఆసక్తితో నా పేరు ఇచ్చాను. మొదట నీళ్లను చూస్తే భయం వేసింది. కానీ, ఒక్కసారి నీటిలో ప్రయాణించాక, మరోసారి పాల్గొనేలా ఆసక్తి కలిగింది. సెయిలింగ్ ఖర్చుతో కూడుకున్న క్రీడ. యాట్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ మాకు సపోర్ట్ చేస్తోంది. మా అమ్మ వంటలు చేస్తూ మమ్మల్ని చదివిస్తోంది. మా చదువుకు క్రీడలు కూడా తోడయితే మరిన్ని విజయాలు సాధించవచ్చు.. అని తెలుసుకున్నాం. అందుకే ధైర్యంగా నీటి అలలపై మమ్మల్ని మేం నిరూపించుకుంటున్నాం.– కొమరవెల్లి దీక్షితఅక్కను చూసి...అక్కను చూసి నేనూ సెయిలింగ్ స్పోర్ట్స్‌లోకి వచ్చేశాను. అండర్–15 కేటగిరీలో పాల్గొంటున్నాను. మలేషియాలో జరిగిన సెయిలింగ్ పోటీలో వివిధ దేశాల నుంచి వచ్చిన 102 మంది సెయిలర్స్ పాల్గొన్నారు. ఒమన్‌లో జరిగిన పోటీలో రజత పతకం సాధించాను. – కొమరవెల్లి లహరిభారత్తో పాటు సౌత్కొరియాలలో జరిగిన అంతర్జాతీయ సెయిలింగ్ పోటీలో పాల్గొని స్వర్ణ, ర జిత పతకాలు సాధించిన ఈ అక్కాచెల్లెళ్లకు హైదరాబాద్‌లోని సెయిలింగ్ యాట్ క్లబ్ మద్దతునిస్తోంది.హైదరాబాద్ ఈస్ట్మారేడ్పల్లిలో ఉంటున్న ప్రీతి కొంగర ఓపెన్ డిగ్రీ చేస్తూ సీనియర్ సెయిలింగ్ స్పోర్ట్స్‌లో సంచనాలు సృష్టిస్తోంది. చైనాలో జరిగిన ఏషియన్ క్రీడలో పాల్గొంది. హైదరాబాద్, ముంబైలలో జరిగిన నేషనల్ ఛాంపియన్‌షిప్‌లలో రజత, స్వర్ణ పతకాలు సాధించింది.పేదరికం అడ్డుకాదు‘11 ఏళ్ల వయసులో సెయిలింగ్‌లోకి అడుగుపెట్టాను. సెయిలింగ్ అనేది చాలా ఓర్పుతో కూడుకున్న క్రీడ. దీనికి ఫిట్నెస్ చాలా అవసరం. ట్రైనింగ్‌లో భాగంగా రోజూ 4–5 గంటలుప్రాక్టీస్ చేస్తాను. ఈ క్రీడలో అబ్బాయిలు ఎంత కష్టపడాలో, అమ్మాయిలూ అంత కష్టపడాల్సిందే. అన్ని స్పోర్ట్స్ కన్నా ఇది చాలా భిన్నమైంది. సవాల్‌తో కూడుకున్నది. అందుకే సెయిలింగ్ని ఎంచుకున్నాను. ఏప్రిల్‌లో జరగబోయే ఒలింపిక్ సెయిలింగ్‌లో పాల్గొనడానికి శిక్షణ తీసుకుంటున్నాను.– ప్రీతి కొంగర– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
జీలుగు నీరా.. లాభాలు ఔరా
రంపచోడవరం: నీరా చూసేందుకు కొబ్బరినీళ్లలా ఉంటుంది. సూర్యోదయానికి ముందు చెట్టు నుంచి తీసినదాన్ని నీరా అంటారు. పోషకాలు, ఔషధ గుణాలు మెండుగా ఉండే ఈ పానీయాన్ని ఇష్టపడనివారు ఉండరు. ఇప్పటికే అల్లూరి జిల్లాలో తాటి చెట్ల నుంచి నీరా (Neera) సేకరిస్తున్నారు. జీలుగు నీరాను కూడా శాస్త్రీయ పద్ధతుల్లో సేకరించేందుకు పందిరిమామిడి కేవీకే (pandirimamidi Krishi Vigyan Kendra) శాస్త్రవేత్తలు ఇటీవల పలు పరిశోధనలు జరిపారు. ఇప్పటి వరకు తాటిపై పరిశోధనలు పందిరిమామిడి కేవీకే శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు తాటిపై మాత్రమే పరిశోధనలు చేశారు. తాటి నుంచి నీరా సేకరణ, దానితో వివిధ ఆహార ఉత్పత్తులు తయారు చేయడంలో మంచి ఫలితాలను సాధించారు. జిల్లాలో తాటితో పాటు జీలుగు చెట్లు (Jeelugu Tree) అధిక సంఖ్యలో ఉండడంతో జీలుగు చెట్టు నుంచి నీరా సేకరణ, ఇతర ఉత్పత్తుల తయారీపై కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రాజేంద్రప్రసాద్ దృష్టి సారించారు. కలెక్టర్ దినేశ్‌కుమార్ ఆదేశాలతో ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది.నీరా... చెట్టు నుంచి సహజంగా లభించే అద్భుత పానీయం... పోషక విలువలెన్నో ఉన్న ఆరోగ్య ప్రదాయిని. జిల్లాలో అధిక సంఖ్యలో ఉన్న జీలుగు చెట్ల నీరాపై పందిరి మామిడి కేవీకే శాస్త్రవేత్తలు పలు పరిశోధనలు చేశారు. నీరా నుంచి సిరప్, బెల్లం, ఇతర పదార్థాలు తయారు చేసి మార్కెటింగ్ చేసి, తద్వారా గిరిజనులకు అధిక ఆదాయాన్ని సమకూర్చాలని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ఇటీవల పందిరి మామిడి కేవీకేను సందర్శించిన అల్లూరి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. సేకరణఇలా.. సూర్యోదయానికి ముందే తాటి, జీలుగు చెట్ల గెలలను ట్యాపింగ్ చేసి, కూలింగ్ ఉండే విధంగా కవర్లను, కూలింగ్ క్యాన్లను ఏర్పాటు చేసి నీరాను సేకరిస్తారు. చెట్ల నుంచి వచ్చిన ద్రవం చల్లదనంలో కాకుండా ఎక్కువ సేపు బయట ఉంటే కల్లుగా మారుతుంది. శాస్త్రవేత్తలు కల్లుగా కాకుండా నీరాగా తీసే విధంగా ఆధునిక టెక్నాలజీతో చేసిన పరిశోధనలు మంచి ఫలితాలిచ్చాయి. నీరాతో తయారు చేసిన పదార్థాలలో మంచి పోషక విలువలు ఉంటాయి. జీలుగు చెట్లు సముద్ర మట్టానికి 450 నుంచి 500 మీటర్ల ఎత్తు గల కొండ ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి. మారేడుమిల్లి, వై.రామవరం అప్పర్ పార్ట్ సముద్రమట్టం కంటే ఎత్తులో ఉండడంతో ఈ ప్రాంతంలో జీలుగు చెట్లు అధికంగా ఉన్నాయి.సిరప్, బెల్లం తయారీకేవీకే శాస్త్రవేత్తలు జీలుగు నీరాతో సిరప్, బెల్లం తయారు చేశారు. నీరాను మంట మీద సుమారు మూడు గంటల వరకు మరగపెడతారు. దాని నుంచి మంచి ఆరోమా వస్తూ చిక్కపడిన తరువాత పానకం దశలో ఉండగా మంటమీద నుంచి తీసివేస్తే సిరప్గా తయారవుతుంది. పంచదార,చెరకు బెల్లానికి ప్రత్యామ్నాయంగా దీనిని వినియోగించవచ్చు.ఎన్ని రోజులైన నిల్వ ఉంటుంది. జీలుగు నీరాను మూడున్నర గంటల మరగపెడుతూ పానకం దశ దాటిన తరువాత, ఎక్కువ సేపు కలుపుతూ ఉంటే పాకం గట్టిపడి బెల్లంగా మారుతుంది. వీటిని స్వీట్ల తయారీలో ఉపయోగించవచ్చు.తాటికంటే అధికంగా కల్లు ఉత్పత్తి జిల్లాలో మారేడుమిల్లి, వై.రామవరం అప్పర్ పార్ట్ మినహా అన్ని చోట్ల తాటి చెట్లు విరివిగా కనిపిస్తాయి. ఒక తాటి చెట్టు నుంచి రోజుకు నాలుగైదు లీటర్ల వరకు మాత్రమే కల్లు సేకరించగలరు. అదే జీలుగు చెట్టు నుంచి రోజుకు 40 నుంచి 60 లీటర్ల వరకు కల్లు ఉత్పత్తి అవుతుంది. తాటి కల్లును సొంతంగా వాడుకోవడంతో పాటు ఎక్కువగా ఉంటే దాని నుంచి చిగురు (కల్లును మరగబెట్టి ఆవిరి నుంచి తయారు చేసే సారా) తయారు చేసుకుంటారు. జీలుగు కల్లును మాత్రం గిరిజనుల నుంచి సేకరించి జిల్లాలో నలుమూలలతో పాటు మైదాన ప్రాంతాలకు వ్యాపారులు రవాణా చేస్తున్నారు. ఎక్కువ మొత్తంలో జీలుగు కల్లు లభించడమే ఇందుకు ప్రధాన కారణం.చదవండి: ఆధునిక రుషుల తపోవనంనీరా సేకరణ, ఉత్పత్తులపై శిక్షణ జీలుగు నీరా, ఉత్పత్తుల తయారీపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు వైఎస్సార్ ఉద్యానవన విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ జి.గోవిందరాజులు చర్యలు తీసుకున్నారు. ఇటీవల కేవీకేను సందర్శించిన కలెక్టర్ దినేశ్‌కుమార్‌కు జీలుగు నీరా గురించి వివరించడంతో ఆయన వెంటనే స్పందించి, జిల్లాలో ఎన్ని జీలుగు చెట్లు ఉన్నాయో సమగ్ర సర్వే నిర్వహించాలని దిశ నిర్దేశం చేశారు. నీరా ఉత్పత్తిని జిల్లా అంతా విస్తరించేలా చర్యలు తీసుకోవాలని, అందుకు ప్రణాళికలు తయారీ చేయాలని ఆదేశించారు. తాటి, జీలుగులను కలిపి ఒక బోర్డు ఏర్పాటు చేస్తే భవిష్యత్‌లో మంచి ఫలితాలు ఉంటాయి. –డాక్టర్ రాజేంద్రప్రసాద్, కేవీకే కోఆర్డినేటర్,సీనియర్ శాస్త్రవేత్త, పందిరిమామిడిజీలుగు చెట్లపై సర్వే జిల్లాలో మారేడుమిల్లి, వై.రామవరం, చింతూరు, రాజవొమ్మంగి, పాడేరు, కొయ్యూరు, అరకు, చింతపల్లి ,జీకే వీధి, డుంబ్రిగుడ తదితర మండలాల్లో ఈ చెట్లు అధికంగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఎన్ని చెట్లు ఉన్నాయో సర్వే చేయనున్నారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా జీలుగు నీరా సేకరణకు కార్యాచరణ రూపొందిస్తారు. కొంతమంది రైతులను కలిపి ఒక యూనిట్‌గా ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చి, శాస్త్రీయంగా నీరా సేకరణ జరిపేందుకు చర్యలు తీసుకోనున్నారు. -
కనువిందు.. ఇందూరు చిందు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జానపద కళారూపాల్లో చిందు బాగోతానికి ప్రత్యేక స్థానముంది. చిందు బాగోతాన్ని బతికించేందుకు ఇందూరు జిల్లా కళాకారులు ఎనలేని కృషి చేస్తున్నారు. ‘చిందు కళాసింధు’గా పేరొందిన బోధన్ ప్రాంతానికి చెందిన చిందుల ఎల్లమ్మ వారసత్వాన్ని.. జక్రాన్‌పల్లి మండలం మునిపల్లి గ్రామానికి చెందిన పులింటి శ్యామ్ (చిందుల c) కుటుంబం కొనసాగిస్తోంది. చిందుల శ్యామ్‌కు పద్మశ్రీ అవార్డు కోసం 2018లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. శ్యామ్ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వేలాది ప్రదర్శనలు ఇచ్చారు. 2021లో శ్యామ్ మరణించగా.. ఆయన కుటుంబం ఈ కళను బతికించేందుకు కృషి చేస్తోంది. శ్యామ్ కుమారులు పులింటి కృష్ణయ్య, గంగాధర్, కృష్ణయ్యతో పాటు డిగ్రీ చదువుతున్న కుమార్తె పులింటి శరణ్య సైతం చిందు బాగోతం ప్రదర్శనలిస్తోంది. అయిదో ఏట నుంచే శరణ్య చిందు కళను ప్రదర్శిస్తోంది. ఈ కళను బతికించడమే తన లక్ష్యమని శరణ్య చెబుతోంది. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో 40 బృందాలు, నిర్మల్, కరీంనగర్, నల్లగొండ, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో మరో 70 బృందాలు మాత్రమే ఉన్నాయి. ఒక్కొక్క బృందంలో 10 నుంచి 20 మంది కళాకారులు ఉన్నారు.» 1981లో పేరిణి శివతాండవం కళాకారుడు నటరాజ రామకృష్ణ ఆధ్వర్యంలో చిందు బాగోతంపై నిజామా బాద్ జిల్లాలో సర్వే చేశారు. అప్పటి నుంచి గుర్తింపు వచ్చింది. 1983లో చిందు బాగోతం మేళాను నిర్వహించగా ఇందూరు జిల్లా కళా కారులు నాయకత్వం వహించారు. 1986లో ఢిల్లీలో అప్నా ఉత్సవ్‌లో ఆర్మూర్ ప్రాంత చిందు కళాకారుల ప్రదర్శ నను అప్పటి ప్రధాని రాజీ వ్‌గాంధీ, రష్యా నేత మిఖాయిల్ గోర్బ చేవ్‌లు తిలకించి అభినందించారు.» చిందు బాగోతానికి నేపథ్యగానం ఉండ దు. పురాణాలను ఆకళింపు చేసుకుని.. సన్నివేశాలకు అనుగుణంగా భావోద్వేగా లను ప్రదర్శిస్తుంటారు. ఈ కళాకారులు తమ ఆభరణాలను ‘పాణికి’ (పునికి) కర్రతో తయారు చేసుకుంటారు. వీటి తయారీకి ఆరునెలల సమయం పడుతుంది. చిందు బాగోతానికి సంబంధించి నిజా మాబాద్, నిర్మల్ కళాకారులు తమకే ప్రత్యే కమైన సూర్యకిరీటం వినియోగిస్తున్నారు. వీటితో పాటు భుజకీర్తులు(శంఖు చక్రా లు), కంఠసరి, పెద్దపేరు, చిన్నపేరు. జడ ల చిలుకలు, మల్లెదండలు, చేదస్తాలు, దు స్తులు ఉపయోగిస్తున్నారు. రామాయణం, మహాభారతం, భాగవతం కథలతో కళా ప్రదర్శనలు ఇస్తున్నారు. ప్రస్తుతం సాంస్కృతిక, దేవాదాయ శాఖలు సూచించిన చోట్ల ప్రదర్శనలు ఇస్తున్నారు. ఇక చిందు బాగోతానికి చిరునామాగా ఉన్న చిందుల ఎల్లమ్మకు.. ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ప్రతి ష్టాత్మక ‘హంస’ అవార్డుతో సత్కరించింది. చిందు బాగోతంలో స్త్రీ పాత్రలను సై తం పురుషులే ధరిస్తారు. అయితే చిందుల ఎల్లమ్మ మాత్రం.. స్త్రీ పాత్రలతో పాటు అన్నిరకాల పురుష పాత్రలు ధరించి ఈ కళకు చిరునామాగా నిలవడం విశేషం.రాత్రిపూట రారాజులం.. తెల్లారితే బిచ్చగాళ్లం..ప్రాచీన కళను బతికిస్తున్న మమ్మల్ని ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలి. ప్రదర్శనలకు వెళ్తే.. రాత్రి పూట రారాజులం.. తెల్లవారితే బిచ్చగాళ్లం అనేలా మా పరిస్థితి తయారైంది. గురుశిష్య పరంపరలో నేర్చుకుని కళను బతికించేవారు వేళ్లమీద లెక్కపెట్టే సంఖ్యలోనే ఉన్నారు. వారసులే చిందు కళను బతికిస్తూ వస్తున్నారు. కళను బతికించేందుకు ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. – పులింటి కృష్ణయ్య, మునిపల్లి, జక్రాన్‌పల్లి మండలం, నిజామాబాద్ జిల్లా -
టెర్మినల్ నుంచి బంక్ దాకా ప్రతీ చుక్కకూ లెక్క!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహనంలో ఇంధనం కావాల్సి వస్తే సమీపంలోని ఫిల్లింగ్ స్టేషన్‌కు వెళతాం. పెట్రోల్ లేదా డీజిల్ కావాల్సినంత కొట్టించి డబ్బులు కట్టి బయటకు వస్తాం. ఇందులో కొత్తేమి ఉంది అనే కదా మీ సందేహం. అక్కడికే వస్తున్నాం.. ఎక్కడో తయారైన ఇంధనం వేలాది కిలోమీటర్లు ప్రయాణం చేసి మనదాకా వస్తోంది. ఈ ప్రయాణంలో నాణ్యత, పరిమాణంలో ఎటువంటి రాజీ లేకుండా కస్టమర్‌కు కల్తీ లేని ఇంధనం చేరేందుకు చమురు కంపెనీలు, డీలర్లు నిరంతరం తీసుకుంటున్న చర్యల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? రిఫైనరీ నుంచి టెర్మినల్.. అక్కడి నుంచి ఫిల్లింగ్ స్టేషన్ (Filling Station). ఇలా వినియోగదారుడి వాహనంలోకి ఇంధనం చేరే వరకు కంపెనీల నిఘా కళ్లు వెంటాడుతూనే ఉంటాయన్న సంగతి చాలా మందికి తెలియదు. తేడా వస్తే రద్దు చేస్తారు.. చక్రం తిరిగితేనే వ్యవస్థ పరుగెడుతుంది. ఇంధన అమ్మకాలు పెరిగాయంటే ఆర్థిక వ్యవస్థ బాగున్నట్టు. అందుకే ఆయిల్ కంపెనీలు బాధ్యతగా వ్యవహరిస్తున్నాయి. సాంకేతికతను ఆసరాగా చేసుకుని దేశంలోని మారుమూలన ఉన్న పల్లెకూ నాణ్యమైన ఇంధనాన్ని చేర్చాలన్న సంకల్పంతో పనిచేస్తున్నాయి. పరిమాణంలో తేడా రాకుండా న్యాయబద్ధంగా కస్టమర్ చెల్లించిన డబ్బులకు తగ్గట్టుగా ఇంధనం అందిస్తున్నాయి. పైగా ప్రభుత్వ నియంత్రణలోనే చమురు వ్యాపారాలు సాగుతుంటాయి. దీంతో రెవెన్యూ, పోలీసు, తూనికలు కొలతల శాఖకు చెందిన అధికారులు సైతం తనిఖీలు చేపడుతుంటారు. ఈ క్రమంలో ఏమాత్రం తప్పు జరిగినా ఆయిల్ కంపెనీలు కఠిన చర్యలకు దిగుతున్నాయి. ఫిల్లింగ్ స్టేషన్లో స్టాక్‌లో కొద్ది తేడా వచ్చినా భారీ జరిమానా లేదా డీలర్షిప్ రద్దుకు వెనుకాడడం లేదు. ఇంధనం రవాణా చేసే ఏజెన్సీలు చేతివాటం ప్రదర్శిస్తే బ్లాక్ లిస్టులో పెడతాయి. దేశవ్యాప్తంగా ఉన్న 88 వేల బంకుల్లో ఎక్క డో ఒక దగ్గర జరిగిన తప్పును మొత్తం పరిశ్రమకు ఆపాదించకూడదన్నది కంపెనీలు, డీలర్ల వాదన. ఫిల్లింగ్ స్టేషన్లలో ఇవి తప్పనిసరి → మంచి నీరు → వాష్ రూమ్స్ → ఫిర్యాదుల పుస్తకం → ఫస్ట్ ఎయిడ్ → ఫ్రీ ఎయిర్ కోసం టైర్ ఇన్‌ఫ్లేటర్ → సీసీ కెమెరాలు → ఫైర్ ఎక్స్టింగ్విషర్, ఇసుకటెర్మినల్ నుంచి బంక్ దాకా.. అయిల్ కంపెనీకి చెందిన టెర్మినల్స్ నుంచి వివిధ ప్రాంతాల్లోని బంకులకు ఇంధనం సరఫరా అవుతుంది. ఇంధనం కేటాయించగానే సంబంధిత ఫిల్లింగ్ స్టేషన్ (బంక్) యజమానికి ఆయిల్ టెర్మినల్ నుంచి సందేశం వెళుతుంది. అలాగే ట్యాంకర్ బయలుదేరగానే, బంక్‌కు చేరిన వెంటనే మెసేజ్ వస్తుంది. టెర్మినల్ నుంచి బంక్ వరకు ట్యాంకర్ ప్రయాణాన్ని జీపీఎస్ (GPS) ఆధారంగా ట్రాక్ చేస్తారు. ఇచ్చిన రూట్ మ్యాప్‌లోనే ట్యాంకర్ వెళ్లాలి. మరో రూట్లో వెళ్లినట్టయితే తదుపరి లోడ్‌కు అవకాశం లేకుండా ఆ వాహన ఏజెన్సీని బ్లాక్ చేస్తారు. నిర్ధేశించిన ప్రాంతంలోనే డ్రైవర్లు భోజనం చేయాల్సి ఉంటుంది. మార్గ మధ్యలో వాహనం ఆపినా కారణం చెప్పాల్సిందే. ఇక బంక్ వద్దకు ట్యాంకర్ చేరగానే నిర్ధేశించిన స్థలంలో కాకుండా మరెక్కడైనా పార్క్ చేసినా ఫిల్లింగ్ స్టేషన్‌పై చర్యలుంటాయి. బంక్ యజమాని ఓటీపీ ఇస్తేనే ట్యాంకర్ తెరుచుకుంటుంది. అన్లోడ్ అయ్యాక ట్యాంకర్లో నిల్ స్టాక్ అని కంపెనీకి సమాచారం ఇవ్వాలి. ఫిల్లింగ్ స్టేషన్లో ఇలా.. బంకులోని ట్యాంకులో ఎంత ఇంధనం మిగిలి ఉంది, లోడ్ ఎంత వచ్చింది, అమ్మకాలు.. అంతా పారదర్శకం. గణాంకాలు అన్నీ ఎప్పటికప్పుడు కంపెనీ, డీలర్ వద్ద ఆన్లైన్లో దర్శనమిస్తాయి. ట్యాంకర్ తీసుకొచ్చిన స్టాక్‌లో తేడా ఉంటే ఇన్వాయిస్పైన వివరాలు పొందుపరిచి కంపెనీకి సమాచారం ఇవ్వాలి. ఇలా ప్రతీ చుక్కకూ లెక్క ఉంటుంది. మీటర్ తిరిగిన దానికి తగ్గట్టుగా బంకు ట్యాంకులో ఖాళీ కావాలి. స్టాక్‌లో తేడా 2 శాతం మించకూడదు. మించితే జవాబు చెప్పాల్సిందే. అంతేకాదు రూ.3 లక్షల వరకు పెనాల్టీ భారం తప్పదు. తరచుగా కంపెనీకి చెందిన సేల్స్ ఆఫీసర్ తనిఖీ చేస్తుంటారు. థర్డ్ పార్టీ నుంచి, అలాగే ఇతర ఆయిల్ కంపెనీల నుంచి కూడా తరచూ తనిఖీలు ఉంటాయి. ఆ మూడు సంస్థలదే.. దేశంలో మొత్తం ఇంధన రిటైల్ పరిశ్రమలో ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలైన బీపీసీఎల్, ఐవోసీఎల్, హెచ్‌పీసీఎల్ వాటా ఏకంగా 90% ఉంది. కంపెనీల వెబ్‌సైట్స్ ప్రకారం ఐవోసీఎల్కు 37,500లకుపైగా, బీపీసీఎల్‌కు 22,000ల పైచిలుకు, హెచ్‌పీసీఎల్‌కు 17,000 లకుపైగా ఫ్యూయల్ స్టేషన్స్ ఉన్నాయి. ప్రైవేటు సంస్థలు జియో–బీపీ, నయారా, షెల్ సైతం ఈ రంగంలో పోటీపడుతున్నాయి. చదవండి: రోడ్డుపై, నీటిపై నడిచే వెహికల్దేశవ్యాప్తంగా నిర్వహణ మాత్రమే బంకుల యజమానులది. మౌలిక వసతుల ఏర్పాటు, మెషినరీ, ఇంధనంపై సర్వ హక్కులూ పెట్రోలియం కంపెనీలదేనని వ్యాపారులు చెబుతున్నారు. నిర్వహణకుగాను ప్రతి నెల డీలర్‌కు వేతనం కింద కంపెనీలు రూ.27,500 చెల్లిస్తున్నాయి. డీలర్లకు లీటరు పెట్రోల్ అమ్మకంపై రూ.3.99, డీజిల్‌పై రూ.2.51 కమిషన్ ఉంటుంది.వేగానికీ పరిమితులు.. ట్యాంకర్ గంటకు 60 కిలోమీటర్ల వేగాన్ని మించకూడదు. ఒక్క వాహనం నిబంధనలు అతిక్రమించినా ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీనే రద్దు చేస్తారు. టెర్మినల్ నుంచి సుదూర ప్రాంతంలో ఫిల్లింగ్ స్టేషన్ ఉన్నట్టయితే.. డ్రైవర్లకు భోజనానికి 45 నిముషాలు, టీ తాగడానికి 15 నిముషాలు సమయం ఇస్తారు. నిర్ధేశిత సమయం మించితే కంపెనీ నుంచి ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ యజమానికి మెయిల్, ఎస్ఎంఎస్ వెళుతుంది. ఆలస్యానికి కారణం తెలపాల్సిందే. రాత్రి 12 నుంచి ఉదయం 5 మధ్య రవాణా నిషేధం. వయబిలిటీ స్టడీలో లోపాలు.. మోసాలకు తావు లేకుండా కస్టమర్లకు నాణ్యమైన ఇంధనం అందుతోందనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే పెట్రోల్ బంక్ ఏర్పాటు కోసం ఇచ్చే ప్రకటనలో సంబంధిత ప్రాంతంలో ఇంత మొత్తంలో విక్రయాలు జరుగుతాయని కంపెనీ ఇచ్చే అంకెలకు, వాస్తవ అమ్మకాలకు భారీ వ్యత్యాసం ఉంటోంది. వయబిలిటీ స్టడీ సక్రమంగా జరగడం లేదు. ప్రకటన ఆధారంగా ముందుకొచ్చి బంక్ ఏర్పాటు చేసి నష్టాలు మూటగట్టుకుంటున్న యజమానులు ఎందరో. – మర్రి అమరేందర్ రెడ్డి, తెలంగాణ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్. బంకు యజమానులే బాధ్యులా? డ్రైవర్లు ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా వర్షాకాలంలో ట్యాంకర్ లోపలికి నీరు చేరే అవకాశం ఉంది. ఇథనాల్ మిశ్రమంలో తేడాలున్నా సమస్యకు దారి తీస్తుంది. బంకుల్లోని ట్యాంకులు స్టీలుతో తయారయ్యాయి. తుప్పు పడితే ట్యాంకులో చెమ్మ చేరుతుంది. ఇదే జరిగితే ఆ నీరు కాస్తా బంకులోని ట్యాంకర్‌కు, అక్కడి నుంచి కస్టమర్ వాహనంలోకి వెళ్లడం ఖాయం. ఈ సమస్యకు పరిష్కారంగా హెచ్డీపీఈతో చేసిన ట్యాంకులను బంకుల్లో ఏర్పాటు చేయాల్సిందిగా విన్నవిస్తున్నా కంపెనీల నుంచి స్పందన లేదు. రవాణా ఏజెన్సీ తప్పిదం, మౌలిక వసతుల లోపం వల్ల సమస్య తలెత్తినా బంకు యజమానిని బాధ్యులను చేస్తున్నారు. – రాజీవ్ అమరం, జాయింట్ సెక్రటరీ, కన్సార్షియం ఆఫ్ ఇండియన్ పెట్రోలియం డీలర్స్. -
కెంటకీకి కేఎఫ్‌సీ గుడ్‌బై
కెంటకీ ఫ్రైడ్ చికెన్. క్లుప్తంగా కేఎఫ్‌సీ. పరిచయమే అక్కర్లేని ప్రపంచ ప్రసిద్ధ బ్రాండ్. ఈ ఫుడ్ జాయింట్ దిగ్గజానికి పిల్లల నుంచి పండు ముసలి దాకా లెక్కలేనంత మంది అభిమానులు! అమెరికాకు చెందిన ఈ బ్రాండ్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఇంతకాలం తన కేరాఫ్‌గా నిలిచిన కెంటకీలోని లూయిస్విల్లే నుంచి టెక్సాస్‌లోని ప్లానోకు ప్రధాన కార్యాలయాన్ని తరలిస్తోంది. కొన్ని కార్యకలాపాలు మాత్రం కెంటకీ నుంచి ఇకముందూ కొనసాగుతాయని యాజమాన్యం ప్రకటించింది. కేఎఫ్‌సీ నిర్ణయంపై కెంటకీ రాష్ట్ర గవర్నర్ ఆండీ బెషెర్ విచారం వెలిబుచ్చారు. ఈ విషయం తెలిస్తే బహుశా ఆ సంస్థ వ్యవస్థాపకుడు కల్నల్ హార్లండ్ శాండర్స్ కూడా బాధపడి ఉండేవాడన్నారు. ‘‘ఆ కంపెనీ పేరే మా రాష్ట్రంతో మొదలవుతుంది. తన ఉత్పత్తుల విక్రయానికి మా రాష్ట్ర సంస్కృతిని, వారసత్వాన్ని ఉపయోగించుకుంది’’అని చెప్పు కొచ్చారు. పరిశ్రమలు, సంస్థలపై పన్నుల భారాన్ని టెక్సాస్ కొన్నే ళ్లుగా బాగా తగ్గించింది. దాంతో పాటు అక్కడి వ్యాపార అనుకూల వాతావరణానికి అమె రికన్ కంపెనీలు ఆకర్షితమవుతున్నాయి. పెద్ద సంఖ్యలో ఆ రాష్ట్ర బాట పడుతున్నాయి. కేఎఫ్‌సీని 1930ల్లో కెంటకీలోని కోర్బిన్లో ఓ సరీ్వస్ స్టేషన్ దగ్గర ఫ్రైడ్ చికెన్ చిన్న దుకాణంగా శాండర్స్ మొదలు పెట్టారు. దాని రుచికి జనాలు ఫిదా కావడంతో చూస్తుండగానే యమా పాపులరైంది. ఇప్పుడు 145కు పైగా దేశాల్లో సంస్థకు ఏకంగా 24 వేల పై చిలుకు ఔట్‌లెట్లున్నాయి! ప్రతి కేఎఫ్‌సీ షాపు ముందూ కన్పించే గమ్మత్తైన ఫేసు దాని వ్యవస్థాపకుడు శాండర్స్దే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆధునిక రుషుల తపోవనం
సాక్షి ప్రతినిధి, కడప: స్వచ్ఛంద సేవా సంస్థల్లో రామకృష్ణ మిషన్ ప్రపంచ స్థాయిలో నెంబర్ వన్‌గా నిలుస్తోంది. అటు ఆధ్యాత్మిక చింతన..ఇటు సమాజం పట్ల బాధ్యతతో సేవలందించడమే కాకుండా విద్య, వ్యవసాయం, విలువలను పెంపొందించేందుకు నిరంతరం కృషి చేస్తోంది. కడపలోని చెన్నూరు బస్టాండ్ సమీపంలో 1910లో రామకృష్ణ సమాజాన్ని ఏర్పాటు చేశారు. అందులో గ్రంథాలయాన్ని నిర్వహించారు. 1992లో రామకృష్ణ సేవా సమితిని భక్తులంతా కలిసి ఏర్పాటు చేసుకున్నారు. 2004 నుంచి దానిని రామకృష్ణ మఠంలో మార్చారు. రెండతస్తుల్లో గ్రంథాలయం, ఆధ్యాత్మిక బోధనలు నిర్వహించారు. 2007లో పుట్లంపల్లె వద్ద అప్పటి సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మఠం నిర్మాణానికి స్థలం ఇచ్చారు. అందులో 2007లో రామకృష్ణ మిషన్ ఏర్పాటైంది. పేదలు, అనాథ బాలలతో బాలకాశ్రామం నిర్వహిస్తున్నారు. వివేకానంద విద్యానికేతన్ పేరిట 7వ తరగతి వరకు మిషన్ ఆవరణంలో పాఠశాలను ఏర్పాటు చేశారు. అదే ఆవరణంలో వివేకానందుని పేరిట భారీ ఆడిటోరియం ఏర్పాటు చేశారు. ఇందులో ఆధ్యాత్మిక, సామాజిక సభలను కొనసాగిస్తున్నారు. ప్రధాన ద్వారానికి ఎదురుగా స్వామిజీ, బ్రహ్మచారుల గృహాలున్నాయి. ఆశ్రమమంతా నిరంతరం ప్రశాంతంగా పూల, పండ్ల తోటలతో ఆహ్లాదంగా ఉంటుంది. ప్రధాన ద్వారం వద్ద ప్రత్యేకంగా ఆధ్యాత్మిక పుస్తకాల విక్రయాల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 2012లో ఏర్పాటు చేసిన విశ్వజనీన ఆలయం రామకృష్ణ మిషన్‌కు తలమానికంగా నిలుస్తోంది. ఇందులో అన్ని మతాలకు చెందిన చిత్రపటాలు, వారు తమ మతాచారం ప్రకారం ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా వేదికలు ఉంటాయి. సేవలు–మిషన్ ఆధ్వర్యంలో ‘విద్య’ పేరిట నైతిక విలువలుగల విద్యాబోధన గురించి పాఠశాలలు, కళాశాలల్లో మిషన్ ప్రతినిధులు శిక్షణా శిబిరాలు నిర్వహిస్తుంటారు. ఆశ్రమ ఆవరణంలో యేటా రెండుమార్లు మూడు నుంచి వారం రోజులపాటు యువ రైతులకు పంటలు, దిగుబడిపై నిపుణులైన వారితో శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. యేటా ఉపాధ్యాయులకు విలువలుగల విద్యాబోధనపై మూడు రోజులపాటు శిక్షణా శిబిరాలను నిర్వహిస్తున్నారు. కాగా, ఫిబ్రవరి 18న జరిగిన రామకృష్ణ పరమహంస జయంతి నేపథ్యంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపట్టారు. -
ఊరంతా బంధువులే
నేటి ఆధునికయుగంలో బంధాలు.. అనుబంధాలు తగ్గిపోతున్నాయి. అయితే ఆ గ్రామమంతా కలిసికట్టుగా ఉంటోంది. అన్నింట్లో పాలుపంచుకుంటున్న ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. దాదాపు 500 ఏళ్ల క్రితం వలస వచ్చిన ఓ కుటుంబం... ఇప్పుడు 228 ఇళ్లుగా మారి ఓ పంచాయతీగానే రూపాంతరం చెందింది. అదే నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని ‘పల్లెగడ్డ’గ్రామం.మరికల్: ఒకే కులం.. ఒకే మాటతో గ్రామంలో ఏ చిన్న సమస్య వచ్చినా అన్న.. తమ్మి, మామ, అల్లుడు అని పలకరిస్తూ కలిసికట్టుగా పరిష్కరించుకుంటారు పల్లెగడ్డ వాసులు. ఒక ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే అందరూ అక్కడే ఉండి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఎవరైనా చనిపోతే ఊరంతా ఉపవాసం ఉండి అంత్యక్రియలు నిర్వహిస్తారు. 500 ఏళ్ల క్రితం మరికల్ గ్రామంలో ముదిరాజ్ కులంలోని కట్టెకొండ గోత్రానికి చెందినవారు ఉండేవారు. వీరి వ్యవసాయ భూములు మరికల్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో ఎత్తయిన ప్రాంతంలో ఉండేవి.దీంతో కట్టెకొండ గోత్రానికి చెందిన ఓ వ్యక్తి మరికల్ నుంచి అక్కడకు వెళ్లి ఓ గుడిసె వేసి నివాసం ఏర్పరుచు కున్నాడు. కాలక్రమంలో ఈ కుటుంబంలో ముగ్గురు అన్నదమ్ములు పుట్టి మూడు తరాలుగా విడిపోయి ఇళ్లు నిర్మించుకోవడంతో ఒక చిన్న పల్లెగా అవతరించింది. ఆనాడు మరికల్ పరిధిలోనే ఈ గ్రామం ఉండటంతో పల్లెగడ్డగా పేరుగాంచింది. ఒక ఇంటిలో మూడు తరాలుగా విడిపోయిన అన్నదమ్ములే వారసత్వంగా కుటుంబాలు పెరిగి.. నేడు ఇక్కడ 228 ఇళ్లు నిర్మించుకున్నారు. గ్రామంలో ప్రస్తుతం 1,260 జనాభా ఉండటంతో మరికల్ నుంచి విడిపోయి ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పడింది. గ్రామంలో 349 మంది స్త్రీలు, 357 మొత్తం కలిపి 706 మంది ఓటర్లు ఉన్నారు.75 శాతం పిల్లలు ప్రభుత్వ పాఠశాలలోనే చదువు కుంటున్నారు. గ్రామ శివారులో 1,245 ఎకరాల వరకు భూమి ఉంది. ఇక్కడ 90 శాతం మంది వ్యవసా యంపై ఆధారపడి జీవనం సాగిస్తుండగా, 10 శాతం మంది మాత్రమే ఇతర వ్యాపారాలు చేస్తున్నారు. ఆపద వస్తే సాయంగ్రామమంతా ఒకే కులంవారు ఉండటంతో అందరూ ఐక మత్యంతో ఉంటున్నారు. గ్రామంలో పెళ్లిళ్లు చేయడానికి దేవాలయం లేకపోవడంతో గ్రామస్తులు కలిసి చందాలు వేసుకొని శివాలయం, ఆంజనేయస్వామి ఆలయాలను నిర్మించుకున్నారు. ఎవరికైనా ఆపద వస్తే సాయం చేస్తారు. ఆనందంగా ఉంది.. మా పూర్వీకులు చెప్పిన ప్రకారం ఇప్పటికే ఏడు తరాలు దాటినట్టు తెలిసింది. ఒకే కులం పేరుతో ఇక్కడ నివసించడం ఆనందంగా ఉంది. గ్రామంలో ఎవరికి ఆపద వచ్చినా, అందరూ కలిసి వారి బాధను పంచుకుంటాం. వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాం. – హన్మంతు శ్రీవారి సేవకులం15 ఏళ్ల నుంచి టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతి దేవ స్థానంలో నిర్వహించే కార్య క్రమాలకు గ్రామం నుంచి మూడు టీంలుగా వెళతాం. అక్కడే వారం రోజులు ఉండి శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు సేవలు చేస్తాం. అన్నదానం, లడ్డూ్డ తయారీ, అఖండ భజన కార్యక్రమాలు నిర్వహించడంతో మా గ్రామానికి ప్రత్యేక గౌరవం దక్కింది. –శ్రీరామ్ -
రెక్కల గుర్రంపై... విశాఖకు ఎగిరొచ్చిన జల కన్యలు
చందమామ కథల్లో విన్న జలకన్యలు కళ్ల ముందు ప్రత్యక్షమై ‘హాయ్’ అని పలకరిస్తే ఎలా ఉంటుంది? సినిమాల్లోనే చూసిన రంగుల వెలుగుల జలకన్యలు ‘పదండి మా లోకంలోకి’ అని ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది? ఆశ్చర్యం, ఆనందం, అద్భుతం సొంతమై మరో ప్రపంచంలోకి తీసుకువెళుతుంది. విశాఖ ఎక్స్పో– 2025 మెర్మైడ్స్ (జల కన్యలు) ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఎక్కడెక్కడి నుంచో విశాఖకు రెక్కలతో ఎగిరొచ్చిన జలకన్యల పరిచయం...చిన్నతనంలో కథలు, కార్టూన్లలో జలకన్యలను చూసి తెగ సంతోషించేది ఫిలిప్పీన్స్‌కి చెందిన కినా. ‘జలకన్యలు’ నిజం అనే భావనతోనే పెరిగింది. తాను కూడా వారిలా మారాలని బలంగా అనుకుంది. తరువాత కాలంలో స్కూబా డైవింగ్‌లో శిక్షణ తీసుకుంది. సముద్రంలో కూడా ఈద గలిగే నైపుణ్యాన్ని సొంతం చేసుకున్న కినా మెర్మైడ్ప్రొఫెషన్ ఎంచుకుంది. ‘శ్వాసను మన ఆధీనంలో ఉంచుకోవడం ఎంతో ప్రధానం’ అంటున్న కినా నాలుగు సంవత్సరాలుగా ఈ రంగంలో ఉంది. మెర్మైడ్ ఇన్‌స్ట్రక్టర్‌గా విద్యార్థులకు శిక్షణ ఇస్తోంది.‘మెర్మైడ్గా నీటిలో ఈదుతూ ప్రేక్షకులను అలరించాలంటే ఎప్పుడూ చిరునవ్వుతో ఉండాలి. దీనికి మంచినిద్ర, తగినంత వ్యాయాయం అవసరం. నిత్యం ఉదయంవేళల్లో స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్లు, యోగా చేస్తాము. దీనివల్ల నీటిలో ఎక్కువ సమయం శ్వాస తీసుకోకుండా ఉండటం సాధ్యపడుతుంది. ప్రత్యేకమైన మాస్క్, ఇయర్ ప్లగ్స్, ప్రత్యేకమైన సూట్, నడుముకి 2 నుంచి 4 కేజీల బరువుండే బెల్ట్, ఫిన్ వంటివి ధరిస్తాము’ అంటుంది ఫిలిప్పీన్స్ కు చెందిన రుత్.ఇటలీకి చెందిన క్లియోప్రొఫెషనల్ సింగర్. చిన్నప్పటి నుంచి మెర్మైడ్స్ అంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే పాటకు వీడ్కోలు చెప్పి శిక్షణ తరువాత మెర్మైడ్ ప్రొషెషన్లోకి వచ్చింది. ‘మమ్మల్ని చూసిన తరువాత చిన్నారుల మోముల్లో కనిపించే చిరునవ్వులు ఎంతోసంతోషాన్ని, వృత్తిపరమైన సంతృప్తిని ఇస్తాయి. మా వృత్తిలో గౌరవప్రదమైన వేతనం ఉంటుంది’ అంటుంది క్లియో.ఫిజికల్ థెరపిస్ట్‌గా ఫిలిప్పీన్స్‌లోని హాస్పిటల్స్‌లో రెండేళ్లు పనిచేసిన విరోనికకు మెర్మైడ్ప్రొఫెషన్ అనేది చిన్ననాటి కల. తన కలను సాకారం చేసుకోవడమే కాదు రెండువృత్తులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతోంది. ‘భారత్‌లో మమ్మల్ని బాగా ఆదరించారు’ అంటుంది విరోనిక.మూవీ థియేటర్ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకున్న ఇటలీకి చెందిన క్లియో మెర్మైడ్ ప్రొఫెషన్లోకి రావడం ద్వారా తన చిన్నప్పటి కలను నెరవేర్చుకుంది. ప్రేక్షకుల నుంచి వచ్చే స్పందన, వృత్తిపరమైన సంతృప్తి, సంతోషాల మాట ఎలా ఉన్నా....ఇది ఆషామాషీ వృత్తేమీ కాదు. నిత్యం రెండు నుంచి నాలుగు గంటల సమయం నీటిలో ఉండాల్సి ఉంటుంది. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గిపోతుంది.హైపోథేమియా, హైకోక్సియావంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పరిశుభ్రమైన నీరు లేని పక్షంలో చర్మసమస్యలు వస్తాయి. చర్మ, కేశ సంరక్షణకు ఎక్కువ శ్రద్ధ వహిస్తూ ఖర్చు చేయాల్సి వస్తుంది. నీటిలో దిగే సమయంలో శరీరానికి వివిధ లోషన్లు పూసుకుంటారు. పైభాగంలో ఉంచే లైట్ల నుంచి వచ్చే వేడిని దృష్టిలో పెట్టుకొని సన్‌స్క్రీన్ వాడతారు. కాళ్లకు ఉపయోగించే ప్రత్యేకమైన తోక వంటి పరికరం వల్ల కాళ్లపై గాయాలు కావడం అనేది సర్వసాధారణం.నాలుగు దశల శిక్షణమెర్మైడ్ప్రొఫెషన్ కోసం ప్రాథమిక స్థాయి, ఓషన్ మెర్మైడ్, అడ్వాన్స్డ్, ఇన్స్ట్రక్టర్...నాలుగు దశల్లో శిక్షణ ఉంటుంది. తొలి దశలో ఈత కొట్టడంలోప్రాథమిక సూత్రాలు, రెండోదశలో సముద్రంలో, ద్వీపాలలో ఈత కొట్టడం, మూడోదశలో మరింత నైపుణ్యంతో ఈత కొట్టడం నేర్పిస్తారు. నాల్గవ దశలో ఈతలో, మెర్మైడ్స్గా ఉపాధిని పొందడానికి వచ్చే వారికి అవసరమైన శిక్షణ అందించే ఇన్‌స్ట్రక్టర్‌గా మారడానికి అవసరమైన శిక్షణ ఇస్తారు.– వేదుల నరసింహంఎ.యూ. క్యాంపస్, సాక్షి, విశాఖపట్నంఫోటోలు: ఎం.డి. నవాజ్ -
Madipadiga Annapurna: టెంఫుల్ హార్ట్
‘లివింగ్ టెంపుల్(Living Temple)’ అనేది మన హెరిటేజ్‌ను సెలబ్రేట్ చేయడమే! టెంపుల్ ఆర్ట్‌కి సంబంధించిన పలు కళాకారులంతా ఒకే వేదిక మీదకు వచ్చి ఒక డైలాగ్‌కు స్పేస్ ఇవ్వబోతున్నారు. ఇదిప్పుడు మనకు చాలా అవసరం. గుడి అనగానే గుర్తొచ్చేది దేవుడు, మొక్కులు, టెంకాయలు! కానీ గుడి అంటే సకల కళా నిలయం! జీవనశైలిని ఈస్తటిక్ లెన్స్‌లో చూపించే కాన్వాస్! నాడు వాస్తు, శిల్పం, చిత్రం, సంగీతం, నృత్యం అన్నిటికీ గుడే వేదిక.. వాటిని నేర్పే బడి కూడా! దాని ఆవరణలోని కొలను ఆధారంగా సాగూ సాగేది! అంటే సంస్కృతిని సంరక్షించే ఆలయంగానే కాదు సంపద పెంచే వనరుగానూ భాసిల్లింది!మారిన కాలంలో గుడికి ప్రాముఖ్యం తగ్గకపోయినా దాన్ని చూసే మన ఈస్తటిక్ లెన్సే మసకబారాయి! అయినా టెంపుల్ ఆర్ట్ (Temple Art) స్ఫూర్తితో ఆ ఘనమైన సాంస్కృతిక చరిత్రను పరిరక్షిస్తున్న కళాకారులు ఉన్నారు! దేశంలో ఎక్కడెక్కడో ఉన్న అలాంటి 31 మంది కళాకారులు అందరినీ ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి వాళ్ల కళారూపాలతో ‘లివింగ్ టెంపుల్’ పేరుతో మూడు రోజుల ఉత్సవాన్ని నిర్వహించబోతున్నారు క్యురేటర్ మడిపడిగ అన్నపూర్ణ! ఎప్పుడు... ఫిబ్రవరి 28 నుంచి మార్చి రెండు వరకు! ఎక్కడ... టీ వర్క్స్, హైదరాబాద్!అసలీ అన్నపూర్ణ ఎవరు?హైదరాబాద్‌లోనే పుట్టి, పెరిగిన అన్నపూర్ణ విజువల్ ఆర్ట్స్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేశారు. ఆమెకు స్ఫూర్తి.. తొలి గురువు తండ్రి రోహిణీ కుమార్. ఆయన వృత్తిరీత్యా పెయింటరే అయినప్పటికీ సొంతంగా అడ్వర్టయిజింగ్ ఏజెన్సీ ప్రారంభించి దాన్నే వృత్తిగా చేసుకున్నారు. దాంతో ఉగ్గుపాల నాడే అన్నపూర్ణకు టెంపుల్ ఆర్ట్‌ను పరిచయం చేశారు. కూతురు పెరుగుతున్న కొద్దీ ఆ కళ విశిష్టతను వివరిస్తూ వచ్చారు. కళలను, మనిషి జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తున్న వేదికగా గుడిని చూపించారు. ప్రతి ఆరునెలలకు ఒక పర్యాటక ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడి టెంపుల్ ఆర్ట్, జీవనశైలి మీదప్రాక్టికల్ జ్ఞానాన్నందించేవారు.ఒక్కమాటలో కూతురికి ఈస్తటిక్ లెన్స్‌లో ప్రపంచాన్ని పరిచయం చేశారని చెప్పాచ్చు. ఆ ఆసక్తితోనే అన్నపూర్ణ ఆర్ట్స్‌లో చేరారు. అయితే అకడమిక్స్‌లో నాన్న చెప్పినంత ఘనమైన స్థానం కనిపించలేదు మన ఆర్ట్, కల్చర్‌కి. పాశ్చాత్య కళానైపుణ్యంతోనే నిండిపోయి ఉంది సిలబస్ అంతా! మన కళల పట్ల నిర్లక్ష్యమో.. పెద్దగా పరిగణించకపోవడమో.. లేదంటే బ్రిటిష్ వాళ్లు నిర్ధారించిన అకడమిక్స్ అయ్యుండటమో.. కారణమేదైనా మన కళాసంస్కృతి గొప్పదనమైతే తెలియకుండా పోయింది. కాలగమనంలో చాలా గుళ్ల స్వరూప స్వభావాలూ మారిపోయాయి. వాస్తు శిల్ప చిత్రలేఖన సంపద మిగిలి ఉన్న గుళ్లల్లో సంగీతం, నాట్య కళల ఊసు లేదు. భవిష్యత్ తరాలకు అందాల్సిన ఆ సాంస్కృతిక వారసత్వ సంపద చెల్లాచెదురైంది. దాన్ని కాపాడాలి.. పరిరక్షించాలనే తపన పట్టుకుంది అన్నపూర్ణకు. చదువైపోయాక క్యురేటర్‌గా చేరినా.. ఆర్ట్ షోలు నిర్వహిస్తున్నా.. చిత్తమంతా టెంపుల్ ఆర్ట్ మీదే! ఆర్ట్ షోలు చేస్తున్న క్రమంలోనే దేశంలోని పలుప్రాంతాల్లో.. వాళ్ల వాళ్ల శైలిలో టెంపుల్ ఆర్ట్‌ను సాధన చేస్తున్న కళాకారులున్నారని తెలిసింది అన్నపూర్ణకు. అప్పుడు వచ్చింది ఆమెకు ‘లివింగ్ టెంపుల్’ ఆలోచన!రెండేళ్ల శ్రమఆ ఆలోచన వచ్చిన నాటి నుంచి టెంపుల్ ఆర్ట్ మీద పరిశోధన మొదలుపెట్టారు అన్నపూర్ణ. భారతదేశమంతా పర్యటించారు. శిథిలావస్థలోని గుళ్ల వాస్తుశిల్పాన్ని పునర్నిర్మిస్తున్న ఆర్కిటెక్ట్స్, విరిగిపోయిన విగ్రహాలను టెక్నాలజీ సహాయంతో తిరిగి చెక్కుతున్న.. రూపాలు చెదిరిన శిల్పాలను సాంకేతిక సహాయంతో తీర్చిదిద్దుతున్న శిల్పకారులు, చెదిరిపోయిన పెయింటింగ్స్ కు రంగులద్దుతూ పునరుద్ధరిస్తున్న చిత్రకారులు, గుళ్లల్లో పుట్టిన గాన.. నాట్య కళలను ఇంకా పోషిస్తున్న కళాకారుల కళారూపాలను చూశారు. వాళ్లలో విదేశీ కళాకారులూ ఉన్నారు. అందరూ సుప్రసిద్ధులే! అలాంటి 31 మంది కళాకారులను సంప్రదించారామె.వాళ్లకు తన ‘లివింగ్ టెంపుల్’ కాన్సెప్ట్‌ను వివరించారు. సంతోషంగా ఒప్పుకున్నారు. ఆ ఉత్సవానికి హైదరాబాద్‌నే వేదికగా చేయాలనుకున్నారు. టీ వర్క్స్ప్రాంగణాన్నివ్వడానికి తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకుంది. ఇప్పుడు అన్నపూర్ణ ఆ ఏర్పాట్లలోనే ఉన్నారు. ఏదో అనుకున్నామా.. చేశామా అన్నట్టు కాకుండా ఈ వేడుక ఒక స్ఫూర్తిని, ఫలితాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నారు అన్నపూర్ణ. కళాకారులు, ప్రజలు, ప్రభుత్వాలు అందరూ కలిసి టెంపుల్ ఆర్ట్ పరిరక్షణకు అడుగులు వేయాలి, ఆ సాంస్కృతిక వారసత్వ సంపదను మన భావితరాలకు అందించాలి.. ఫైన్ ఆర్ట్స్ సిలబస్‌లో మన కళలకూ సముచిత స్థానం ఉండాలన్నదే దాని ఉద్దేశం. ఆశయం! అందుకే ఈ ఉత్సవాన్ని ప్రతి సంవత్సరం జరపాలనుకుంటున్నారు.చదవండి: రెక్కల గుర్రంపై.. విశాఖకు ఎగిరొచ్చిన జల కన్యలుఈ యజ్ఞం గురించి తెలుసుకున్న తమిళనాడు (Tamil Nadu).. వచ్చే ఏడాది తను ఆతిథ్యమివ్వడానికి ఉత్సాహపడింది. ‘లివింగ్ టెంపుల్’ అనేది మన హెరిటేజ్‌ను సెలబ్రేట్ చేయడమే! టెంపుల్ ఆర్ట్‌కి సంబంధించిన పలు కళాకారులంతా ఒకే వేదిక మీదకు వచ్చి ఒక డైలాగ్‌కు స్పేస్ ఇవ్వబోతున్నారు. ఇదిప్పుడు మనకు చాలా అవసరం. ఇంకో విషయం.. టెంపుల్ అనగానే ఇదొక మతానికి సంబంధించిన సెలబ్రేషన్‌గా అనుకోవద్దు. ఇది మన దేశ సంస్కృతికి సంబంధించినది. మన ఆలయాలు పరిరక్షించిన పర్యావరణానికి సంబంధించినది. దాన్ని మళ్లీ పునరుద్ధరించడమే ఈ సెలబ్రేషన్ ఉద్దేశం’ అంటారు అన్నపూర్ణ. ఆమె పనిని ఫుల్ హార్ట్‌తో స్వాగతిద్దామా!– సరస్వతి రమ -
ఇంటర్, ఇంజనీరింగ్ కోర్సుల పేరిట ‘ముందస్తు’ దోపిడీ
హలో సార్... మీ పాప మౌనిక పదవ తరగతి చదవుతున్నది కదా..!. ఇంటర్‌కు ఏం ప్లాన్ చేస్తున్నారు సార్? మాది ఫలనా కార్పొరేట్ కాలేజీ. ఐఐటీ, ఈపీసెట్ కోచింగ్, ఏసీ, నాన్ ఏసీ స్పెషల్ బ్యాచ్‌లు ఉన్నాయి. హాస్టల్ సౌకర్యం కూడా ఉంది. ఇప్పుడు జాయిన్ అయితే ఫీజులో కొంత డిస్కౌంట్ ఉంటుంది. పరీక్షల తర్వాత సీట్లు కష్టం. అర్హత పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఫీజులు పెరుగుతాయి. ముందుగా సీటు రిజర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఒకసారి కాలేజీ క్యాంపస్‌కు విజిట్ చేసి చూడండి.సార్ గుడ్ ఈవెనింగ్, కార్తీక్ ఫాదరేనా? మీ అబ్బాయి ఇంటర్మీడియట్ (Intermediate) చదువుతున్నాడు కదా. బీటెక్ (BTECH) కోసం ఏం ప్లాన్ చేశారు. తమిళనాడు, కేరళలోని ఫలానా యూనివర్సిటీల్లో బీటెక్ కంప్యూటర్ సైన్స్, ఏఐఎంల్, డేటాసైన్స్, మెకానికల్ తదితర కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఆసక్తి ఉంటే చెప్పండి.. రాయితీలు ఇప్పిస్తాం... ...టెన్త్, ఇంటర్ చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఇప్పుడు ఇలాంటి ఫోన్ల బెడద రిగింది. కనీసం బోర్డు పరీక్షలు కూడా కంప్లీట్ కాకముందే కార్పొరేట్ కాలేజీలు (Corporate Colleges) బేరసారాలు ప్రారంభించాయి. అడ్డగోలు ఫోన్లు, ఆఫర్లతో తల్లిదండ్రులను అయోమయానికి గురిచేస్తున్నాయి. పరీక్షలు కూడా రాయకుండా అడ్మిషన్లు ఎలా తీసుకోవాలి..తీసుకోకుంటే ఫీజులు ఇంకా పెరుగుతాయేమో అని వారు ఆందోళనకు గురవుతున్నారు. సాక్షి, హైదరాబాద్: పదవ తరగతి, ఇంటర్ పరీక్షలు ప్రారంభం కాకుండానే.. ముందస్తు అడ్మిషన్లతో కార్పొరేట్ కళాశాలలు హడావుడి చేస్తున్నాయి. అనుమతి లేకుండా విద్యార్థుల డేటాను సంపాదించి వారి తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తూ వల విసురుతున్నారు. ఫోన్లే కాకుండా వాట్సాప్‌లకు అడ్మిషన్ల మెసేజ్‌లు పంపుతున్నారు. వీటికి ఎక్కువగా తల్లిదండ్రులు ప్రభావితమవుతున్నారు. ముందుగా మేల్కోకుంటే ఫీజులు ఎక్కడ పెంచుతారోనని వారు ఆందోళన చెందుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని అందిన కాడికి దోచుకునేందుకు కార్పొరేట్ ఇంటర్, ఇంజనీరింగ్ కళాశాలలు గాలం వేస్తున్నాయి. ఆకట్టుకునేలా బ్యాచ్‌కో పేరు పెట్టి రంగు రంగుల బ్రోచర్లు చూపి మంచి భవిష్యత్తు అంటూ ఆశల పల్లకిలో విహరింపజేస్తూ రూ.లక్షల్లో ఫీజులు బాదేస్తున్నారు. మరోవైపు పీఆర్ఓలు... వచ్చే విద్యా సంవత్సరం అడ్మిషన్ల కోసం పలు విద్యాసంస్థల పీఆర్ఓలు కూడా రంగంలోకి దిగారు. విద్యార్థుల తల్లిదండ్రులు కొద్దిగా ఆసక్తి కనబర్చినా చాలు విద్యార్థుల ఇళ్ల వద్దకు క్యూ కడుతున్నారు. నామినల్ రోల్ ద్వారా విద్యార్థుల వివరాలు ఫోన్ నెంబర్లు, చిరునామా సేకరిస్తున్నారు. వాటి కోసం సంబంధిత విభాగాల ఇన్చార్జిలకు విందులు, నజరానాలు సమకూర్చుతున్నారు. నిబంధనల ప్రకారం విద్యార్థుల వివరాలు ఎవరికి ఇవ్వరాదు. కానీ కాసులకు కక్కుర్తి పడి కింది స్థాయి సిబ్బంది కొందరు విద్యార్థుల సమాచారం అందిస్తున్నారు. దీంతో పీఆర్ఓ ఉదయం నుంచి రాత్రి వరకు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి బ్రోచర్లు ఇవ్వడం.. కళాశాలల గురించి వివరిస్తూ తల్లిదండ్రులను ఆకట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అడ్మిషన్లు ఎక్కువగా చేసిన వారికి ఇన్సెంటివ్ అవకాశం ఉండటంతో పోటీపడుతున్నారు.నిబంధనలకు విరుద్ధంగా సాధారణంగా పదో తరగతి, ఇంటర్ పరీక్షల ఫలితాలు వెలువడిన తర్వాతనే అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశాల ప్రక్రియ నిర్వహిస్తున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఇక ఈసారి గతేడాది కంటే ఫీజులు అధికంగా చెబుతున్నట్లు తెలుస్తోంది. కనీసం 20 శాతం అధికంగా ఫీజుల దోపిడీకి కళాశాలలు సిద్ధమయ్యాయి. ఇంటర్‌కు సంబంధించి ‘సూపర్, స్టార్, సీఓ’ బ్రాంచ్‌ల పేరిట కొన్ని కళాశాలలు ఏడాదికి రెండున్నర నుంచి మూడు లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. ఇక ఇంజనీరింగ్ కోర్సులకు రూ.ఐదు నుంచి రూ.10 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇదీ చదవండి: బడి బయటే బాల్యం -
చారిత్రక దారి.. 300 ఏళ్ల మెట్లబావి
నాటి చారిత్రక కట్టడాలు నేటి తరానికి గొప్ప సంపద. గతాన్ని చూడని ఇప్పటి జనానికి అలనాటి నిర్మాణాలే సజీవ సాక్ష్యాలు. దశాబ్దాల కాలం నాటి నిర్మాణాలు చెక్కుచెదరకుండా ఇప్పటికీ పటిష్టంగానే ఉండటం అప్పటి సాంకేతికతకు నిదర్శనం. యంత్రాలు, ఇతర నిర్మాణ పనిముట్ల గురించి తెలియని సమయంలో కేవలం మానవుల తెలివితో చేపట్టిన నిర్మాణాలు నేటి సాంకేతికత కంటే చాలా పటిష్టంగా ఉన్నా యి. అలాంటి వారసత్వ సంపద ఎక్కడ ఉన్నా గుర్తించి రక్షించుకోవాల్సిన అవసరం ఉంది.రాజధానికి 52 కి.మీ. దూరంలో..హైదరాబాద్‌కు (Hyderabad) సరిగ్గా 52 కి.మీ. దూరంలో 65వ నెంబరు జాతీయ రహదారిపై విజయవాడ (Vijayawda) మార్గంలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ (Choutuppal) మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం (Lingojigudem) గ్రామం ఉంది. ఈ గ్రామంలో జాతీయ రహదారి వెంట ప్రస్తుతం ఉన్న సాయిబాబా దేవాలయాన్ని గతంలో గోసాయిమఠంగా పిలిచేవారు. దశాబ్దాల కిందట ఈ మఠాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. దేవాలయం వెనుక భాగాన దిగుడుబావి (మెట్లబావి) ఉంది. ఆ దిగుడు బావిని 300 ఏళ్ల కిందట అప్పటి రాజులు నిర్మించారు. ఎంతో గొప్ప సాంకేతికతతో నిర్మించిన ఈ బావి ఇప్పటికీ చెక్కు చెదరలేదు. దశాబ్దాలుగా నిరుపయోగంగా ఉండటంతో కొంత మేరకు నిర్మాణాలు దెబ్బతిన్నాయే తప్పిస్తే మిగతా కట్టడాలన్నీ యథావిధిగా ఉన్నాయి. రాజుల కాలంలో దిగుడుబావి నిర్మాణందిగుడుబావి (మెట్లబావి) గొప్ప చరిత్ర కలిగి ఉంది. అప్పట్లో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజులు ఇక్కడ విశ్రాంత మందిరాన్ని నిర్మించుకున్నారని, ఆ విశ్రాంత మందిరానికి అనుసంధానంగా అన్ని రకాల సౌకర్యాలతో ఈ దిగుడుబావిని నిర్మించి ఉంటారని స్థానికులు చెబుతున్నారు. దిగుడుబావి పరిసరాల్లోని రాజు భూములు కాలక్రమేణా స్థానికులకు వచ్చాయి. పూర్తిగా రాళ్లతోనే..ఈ దిగుడుబావిని పూర్తిగా రాళ్లతోనే నిర్మించారు. తూర్పున 6 అడుగుల వెడల్పు, దిగువకు 20 అడుగులు, ఉత్తరంలో 10 అడుగుల వెడల్పు ప్రకారం మొత్తంగా దిగువకు 60 అడుగుల మేర మెట్లు ఏర్పాటు చేశారు. మెట్ల మార్గాన్ని గ్రానైట్ రాళ్లతో అందంగా తీర్చిదిద్దారు. 30 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవు, 80 అడుగుల లోతుతో ఈ బావిని నిర్మించారు. భూమి నుంచి 25 అడుగుల దిగువన బావిలో ప్రత్యేకంగా ఆర్చీలతో మూడు గదులు ఏర్పాటు చేశారు. బావిలో స్నానాలు చేశాక దుస్తులు మార్చుకునేందుకు ఈ గదులను నిర్మించారు. ఆ గదులు ప్రత్యేకంగా మహిళలు (నాటి రాణులు) వినియోగించేవిగా తెలుస్తోంది. పొలాలకు సాగునీరు, స్థానిక ప్రజానీకానికి తాగు నీరు అందించడంతో పాటు ప్రజలు స్నానాలు చేసేందుకు అనువుగా బావిని నిర్మించారు. గోసాయి మఠంగా ప్రత్యేక గుర్తింపుచౌటుప్పల్ పట్టణ కేంద్రానికి తూర్పున 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న లింగోజిగూడెం గ్రామం ఒకప్పుడు గోసాయిమఠంగానే గుర్తింపు పొందింది. కొన్నేళ్ల కిందట గోసాయిదొర అనే వ్యక్తి హైదరాబాద్–విజయవాడ 65వ నంబర్ జాతీయ రహదారికి ఆనుకొని ప్రస్తుతం సాయిబాబా దేవాలయం ప్రాంతంలో మఠాన్ని ఏర్పాటు చేశాడు. పలు ప్రాంతాలకు ప్రయాణాలు చేసే బాటసారులు అలసిపోయిన సందర్భాల్లో విశ్రాంతి తీసుకోవడంతోపాటు అక్కడే విడిది చేసేందుకు అనువుగా అందులో వసతులు ఉండేవని స్థానికులు గుర్తుచేస్తున్నారు. అప్పట్లో ఆర్టీసీ బస్సులు కూడా గోసాయిమఠం స్టేజీ అంటేనే ఆగేవంటే ఎంత ప్రాముఖ్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆలయానికి ప్రస్తుతం రెండు ఎకరాలకుపైగా స్థలం అందుబాటులో ఉంది.మెట్లబావి పరిరక్షణకు ముందుకొచ్చిన హెచ్ఎండీఏశతాబ్దాల కాలంనాటి మెట్లబావి గురించి సాక్షి దినపత్రిక వెలుగులోకి తెచ్చింది. అందుకు సంబంధించి 2022, ఫిబ్రవరి 14న ప్రత్యేకమైన కథనాన్ని ప్రచురించింది. ఆ కథనానికి అప్పటి మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్‌కుమార్ స్పందించారు. వెంటనే మెట్లబావి విషయాన్ని తెలుసుకుని మరమ్మతులు చేయాలని హెచ్ఎండీఏ (HMDA) అధికారులను ఆదేశించారు. అందుకోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. అలా ఈ మెట్లబావిని సుందరీకరించారు. అనంతరం ఏప్రిల్ 14న దీన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఆ మెట్లబావి బాధ్యతలు హెచ్ఎండీఏ చూసుకుంటోంది. అయితే ఆ ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటక ప్రాంతంగా మార్చాలని ప్రజలు కోరుతున్నారు.ఇదీ చదవండి: రాజాబావి.. రాజసం ఏదీ?కేంద్రమంత్రుల దృష్టికి తీసుకెళ్తాం పురాతన మెట్లబావి అభివృద్ధి అంశాన్ని కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కుమార్ దృష్టికి తీసుకెళ్తాం. పర్యాటక ప్రాంతంగా మారితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. పురాతన కట్టడాలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. మూడొందల ఏళ్ల కిందట నిర్మించిన మెట్లబావి మా గ్రామంలో ఉండటం మాకెంతో గర్వకారణం. ప్రభుత్వం, మున్సిపల్ శాఖ నిరంతరం పర్యవేక్షించాలి. – రమనగోని శంకర్, మాజీ సర్పంచ్, లింగోజిగూడెం -
ఐదు భాషల్లో అనర్గళంగా!
శాంతిపురం: ఒక దీపం అనంత దీపాలను వెలిగించినట్టు.. తపన ఉన్న ఓ ఉపాధ్యాయుడు తలిస్తే వందల, వేల మంది విద్యార్థులను ప్రతిభావంతులుగా ఎలా తీర్చిదిద్దవచ్చన్నది చిత్తూరు జిల్లా (Chittoor District) శాంతిపురం, శెట్టేపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల చాటుతోంది. మారుమూల గ్రామంలో ఉన్న ఈ స్కూలు విద్యార్థులు బహుభాషలపై తమ ప్రత్యేకతను చాటుకొంటున్నారు. పాఠ్యాంశాల్లోని తెలుగు (Telugu), ఇంగ్లీషు, హిందీ భాషలతో పాటు కన్నడం, తమిళం, మలయాళీ (Malayalam) భాషలు ఇక్కడి విద్యార్థులు సులువుగా రాయటం, చదవడం, మాట్లాడడం చేస్తున్నారు. ఒక భాషలోని పద్యాలు, రచనలను మరో భాషలోకి అనువాదం చేయగలుగుతున్నారు. ప్రత్యేక పరీక్షల్లో ఉత్తీర్ణత అధికారుల అనుమతితో ఆయా భాషల్లో ప్రావీణ్యులైన ఉపాధ్యాయులు పాఠశాలకు వచ్చి విద్యార్థుల భాషాపరిజ్ఞానంపై ప్రత్యేక పరీక్షలు నిర్వహించారు. గుడుపల్లి ఏపీ మోడల్ స్కూలు ఉపాధ్యాయుడు షిజో మైకెల్ మలయాళంపై, గుడుపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం ఎస్కే.మణి తమిళంపై, కర్ణాటకలోని వేమన విద్యా సంస్థల ఉపాధ్యాయురాలు ఎస్వనజాక్షి కన్నడ భాషపై మొత్తం 94 మంది విద్యార్థుల స్థాయిలను ఇటీవల పరీక్షించారు. వీరిలో కన్నడంలో 93 మంది, మలయాళంలో 45 మంది, తమిళంలో 36 మంది సంతృప్తికర ప్రతిభను చాటుకున్నారు. ప్రధానోపాధ్యాయుని సంకల్పం ఇక్కడ ప్రధానోపాద్యాయుడుగా ఉన్న తీగల వెంకటయ్య భాషల పట్ల ఆసక్తితో రూపకల్పన చేసిన కార్యక్రమం విద్యార్థులను బహుభాషా కోవిదులుగా తయారు చేస్తోంది. తీరిక వేళల్లో హెచ్ఎం ఇస్తున్న తర్ఫీదు, మిగతా ఉపాధ్యాయుల సహకారం అందిపుచ్చుకుని అన్ని బాషల్లోనూ తమ పట్టును పెంచుకొంటున్నారు. మాతృభాష (Mother Tongue) వస్తే మరెన్ని భాషలైనా నేర్వవచ్చనే ఆలోచనతో హెచ్ఎం తీగల వెంకటయ్య ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి తన ప్రత్యేక బోధనా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.చదవండి: సోలో లైఫే సో బెటరూ అంటున్న యువతులు! 6, 7, 8, 9 తరగతుల వారికి భాషల గురించి చెప్పి, కేవలం 26 సరళమైన పదాలతో బోధన ప్రారంభించారు. ఎవరైనా ఉపాధ్యాయులు లేని సమయంలో వారి తరగతులను తీసుకుని విద్యార్థులకు దీనిపై పాఠాలు చెప్పారు. విద్యార్థులు కూడా ఇతర భాషలు నేర్చుకోవటంపై ఆసక్తి చూపడంతో సొంత ఖర్చులతో వారికి మలయాళం, తమిళం, కన్నడ పుస్తకాలను కొనిచ్చారు. ఈ ఆసరాను అందిపుచ్చుకున్న పిల్లలు ఆయా భాషలపై సులువుగా పట్టు సాధిస్తున్నారు. నా విశ్వాసం పెరిగింది ప్రైమరీ స్కూలు రోజుల నుంచి భాషలే నాకు ఇబ్బందిగా ఉండేవి. అక్కడ తెలుగు, ఇంగ్లీషు ఉంటే 6వ తరగతిలో చేరగానే వాటికి హిందీ కూడా తోడయ్యి అంతా అయోమయంగా ఉండేది. కానీ సులువుగా భాషలు నేర్చుకునే టెక్నిక్ తెలుసుకున్న తర్వాత తెలుగు, ఇంగ్లీషు, హిందీతో పాటు కన్నడ, తమిళం కూడా నేర్చుకొంటున్నాను. నాపై నాకు విశ్వాసం పెరిగింది. – బీ.రామాచారి, 8వ తరగతిఎన్ని భాషలైనా నేర్వవచ్చు నేను రూపొందించిన ప్రాజెక్టు నమూనాతో 20–25 రోజుల్లోపు ఏ బాషలైనా నేర్చుకోవచ్చు. అందరు విద్యార్థులకు దక్షిణ భారత భాషలను నేర్పితే వారి నిత్య జీవనంలో అది ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుంది – తీగల వెంకటయ్య, హెచ్ఎం5 భాషలు నేర్చుకొంటున్నా కొత్త భాషలను సులువుగా నేర్చుకోవటం భలే సరదాగా ఉంది. ఏడాది క్రితం వరకూ తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషల్లోని పాఠ్యాంశాలు నేర్చుకోవటానికే కష్ట పడేదాన్ని. కానీ మా హెడ్మాస్టర్ చెప్పిన విధానం పాటించటంతో ఆ భాషలతో పాటు మలయాళం, తమిళం, కన్నడ కూడా సులువుగా నేర్చుకున్నాను. ఇదే ప్రేరణతో భవిష్యత్తులో నేను భాషా పండిట్ అవుతాను. – కె.ధరణి, 9వ తరగతివిస్తరిస్తే బాగుంటుంది వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకుని, విద్యార్థుల మిగతా పాఠ్యాంశాలకు ఇబ్బంది కలగకుండా మా హెచ్ ఎం చేసిన ప్రయోగం సత్ఫలితాలను ఇచ్చింది. విద్యాశాఖ ఉన్నత అధికారులు ఈ నమూనాను పరిశీలించి మిగతా స్కూళ్లకు కూడా విస్తరిస్తే బాగుంటుంది. ఇంగ్లీషు, హిందీలకు అదనంగా పాఠశాలకు ఒక్క ఉపాధ్యాయుడిని కేటాయించినా కనీసం మరో మూడు భాషలు పిల్లలకు నేర్పవచ్చు. పోటీ ప్రపంచంలో కేవలం భాషలపై అవగాహన లేకపోవటం వల్లే చాలా మంది సరైన ఉద్యోగాలు పొందలేక పోతున్నారు. – నాగభూషణం, ఇంగ్లీష్ టీచర్ -
అక్రమ వలసదార్లలో కన్నీటి వరదే
చండీగఢ్: ఏజెంట్ల మాటలు నమ్మి, రూ.లక్షలు సమర్పించుకొని, అందమైన జీవితాన్ని ఊహించుకుంటూ కోటి కలలతో అమెరికా దారిపట్టిన యువతకు చివరకు కన్నీళ్లే మిగిలాయి. ఉత్త చేతులతో, అవమానకర రీతితో స్వదేశానికి చేరుకోవాల్సి వచ్చింది. చట్టబద్ధంగా అమెరికాకు తీసుకెళ్తామంటూ ఏజెంట్లు, సబ్ ఏజెంట్లు చెప్పిన కల్లబొల్లి కబుర్లు నమ్మినందుకు అష్టకష్టాలు ఎదుర్కోన్నామని, ప్రత్యక్ష నరకం చూశామని అమెరికా నుంచి తిరిగివచ్చిన భారతీయ అక్రమవలసదార్లు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. తొలి విడతలో భాగంగా 104 మంది అమెరికా సైనిక విమానంలో ఈ నెల 5వ తేదీన , రెండో విడతలో భాగంగా 116 మంది శనివారం రాత్రి పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. మూడో విడతలో భాగంగా మరో 112 మంది ఆదివారం రాత్రి అమృత్‌సర్‌లో అడుగుపెట్టారు. ఇప్పటిదాకా మూడు విడతల్లో 332 మంది ఇండియాకు చేరుకున్నారు. పలువురు యువకులు తమ కన్నీటి గాథను మీడియాతో పంచుకున్నారు. సరైన తిండి లేదు, నిద్ర లేదుమన్దీప్ సింగ్(38) కుటుంబం అమృత్‌సర్‌లో నివసిస్తోంది. తన కుటుంబానికి చక్కటి జీవితం అందించడానికి అమెరికా వెళ్లి, ఏదైనా ఉద్యోగం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇతర యువకుల తరహాలోనే ఏజెంట్ వలలో చిక్కాడు. ఏజెంట్‌కు రెండు విడతల్లో మొత్తం రూ.40 లక్షలు చెల్లించాడు. ఇంకేముంది అమెరికాకు పయనం కావడమే అని ఏజెంట్ ఊరించాడు. అధికారికంగా కాకుండా అడ్డదారిలో(డంకీ రూట్) తీసుకెళ్లాడు. సబ్ ఏజెంట్లకు మణిదీప్‌ను అప్పగించాడు. మన్‌దీప్‌ను మొదట అమృత్సర్ నుంచి విమానంలో ఢిల్లీకి, అక్కడి నుంచి ముంబైకి, తర్వాత ఆఫ్రికాలోని నైరోబీకి, అనంతరం ఆమ్స్టర్డ్యామ్, సురినామ్‌కు చేర్చారు. అక్కడ సబ్ ఏజెంట్లు రూ.20 లక్షలు డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యుల ద్వారా ఆ డబ్బు చెల్లించక తప్పలేదు. సిక్కు మతస్థుడైన మన్దీప్ గడ్డాన్ని తొలగించారు. మన్‌దీప్‌తోపాటు మరికొందరు వలసదార్లను ఒక వాహనంలో గయనాకు తీసుకెళ్లారు. తర్వాత బొలీవియా, ఈక్వెడార్‌కు చేర్చారు. తర్వాత పనామా అడవుల్లో అడుగుపెట్టారు. విష సర్పాలు, మొసళ్లతో సావాసం చేస్తూ రోజుల తరబడి దట్టమైన అడవిలో నడిపించారు. 13 రోజులపాటు అడవిలోనే నడక సాగించారు. కాలువలు దాటుకుంటూ ముందుకెళ్లారు. సరైన తిండి కూడా లేదు. సగం కాల్చిన రొట్టెలు, నూడుల్స్‌తో కడుపు నింపుకున్నారు. కంటి నిండా నిద్రలేదు. రోజుకు 12 గంటలు నడిచారు. పనామా దాటిన తర్వాత కోస్టారికా, తర్వాత హోండూరస్కు చేరుకున్నారు. అక్కడ వారికి వరి అన్నం లభించింది. చివరకు నికరాగ్వా, గ్యాటెమాలా నుంచి మెక్సికో చేరారు. జనవరి 27వ తేదీన మెక్సికోలోని తిజువానా నుంచి అమెరికా భూభాగంలోకి ప్రవేశిస్తుండగా, యూఎస్ సరిహద్దు పెట్రోలింగ్ దళం అదుపులోకి తీసుకుంది. మణిదీప్‌ను అరెస్టు చేసి, డిటెన్షన్ క్యాంప్‌లో నిర్బంధించి, విచారణ ప్రారంభించారు. అక్రమ మార్గంలో అమెరికాలో అడుగుపెట్టేందుకు ప్రయత్నించినట్లు అభియోగాలు మోపారు. అక్రమ వలసదార్లను వారి స్వదేశాలకు బలవంతంగా తిప్పి పంపిస్తూ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో మన్దీప్ స్వదేశానికి చేరుకున్నాడు. ప్రాణాలతో బయటపడతానని అనుకోలేదని మణిదీప్ చెప్పాడు. తలపాగాను చెత్తబుట్టలో పడేశారు అమృత్‌సర్‌కు తిరిగొచ్చిన 23 ఏళ్ల జతీందర్ సింగ్‌ది మరో గాధ. ‘‘స్నేహితులు చెప్పడంతో గత నవంబర్‌లో ఏజెంట్ కలిశా. రూ.50 లక్షలిస్తే అమెరికా పంపిస్తానన్నాడు. మాకున్న 1.3 ఎకరాల భూమి అమ్మి ఏజెంట్‌కు అడ్వాన్స్‌గా రూ.22 లక్షలు కట్టా. పెళ్లయిన నా అక్కచెల్లెళ్లు తమ బంగారు నగలమ్మి మరీ చేతికిచ్చిన డబ్బును ఏజెంట్‌కు ఇచ్చేశా. మూడ్రోజులు పనామా అడువులను దాటాకా మెక్సికోకు విమానంలో తీసుకెళ్తానన్నాడు. మెక్సికో సరిహద్దు నగరం తిజువానా నుంచి అమెరికాలోకి తీసుకెళ్తానన్నాడు. కానీ మధ్యలోనే వదిలేశాడు. పనామా అడవుల్ని దాటడం చాలా కష్టం. మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయిన తోటివారిని చూస్తూనే అతికష్టంమ్మీద అడవుల్ని దాటా. ఎలాగోలా అమెరికా సరిహద్దు దాటితే వెంటనే బోర్డర్ పోలీసులు బంధించి నిర్బంధ కేంద్రంలో పడేశారు. సంప్రదాయ తలపాగాను తీయొద్దని బతిమాలినా వినలేదు. తీసి చెత్తబుట్టలో పడేశారు. సరైన తిండి పెట్టలేదు. ఉదయం, రాత్రి ఒక లేస్ చిప్స్ ప్యాకెట్, ప్రూటీ జ్యూస్ చిన్న బాటిల్ ఇచ్చారు. అదే ఆహారం. గదిలో ఎయిర్ కండీషనర్ ఉష్ణోగ్రత బాగా పెంచి వేడికి చర్మం ఎండిపోయేలాగా చేశారు. భారత్‌కు తిరిగొచ్చేటప్పుడు సైనిక విమానంలో కాళ్లు కట్టేశారు. తినడానికి, బాత్రూమ్కు పోవడానికి కూడా చాలా కష్టమైంది. ఏకధాటిగా 36 గంటలు చేతులకు బేడీలు వేశారు. అమృత్‌సర్‌లో దిగడానికి 10 నిమిషాల ముందు మాత్రమే చేతులకు బేడీలు తీశారు’’అని జతీందర్ సింగ్ చెప్పారు. ఆహారం, నీరు అడిగితే దాడులే పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాకు చెందిన లవ్‌ప్రీత్ సింగ్‌ది మరో దీనగాథ. ఏడాది క్రితం ఇంటి నుంచి బయటకు వచ్చాడు. అమెరికా కలతో ఏజెంట్ల చేతికి చిక్కాడు. పనామా అడవుల గుండా ప్రయాణించి, మెక్సికో నుంచి అమెరికా సరిహద్దు దాటేందుకు ప్రయతి్నస్తుండగా, అక్కడి అధికారులు అరెస్టు చేశారు. పనామా అడవులు చాలా ప్రమాదకరంగా ఉంటాయని, అడుగడుగునా పాములు, క్రూరమృగాలు, మొసళ్లు తారసపడుతుంటాయని చెప్పాడు. వాటి నుంచి తప్పించుకొని ముందుకెళ్లడం నిజంగా సాహసం చేయడమేనని అన్నాడు. ఆహారం, మంచినీరు అడిగితే ఏజెంట్లు దారుణంగా కొట్టారని, దూషించారని ఆవేదన వ్యక్తం చేశాడు. అయినప్పటికీ అన్నీ భరించామని పేర్కొన్నాడు. ఆస్తులు అమ్మేయాల్సి వచ్చింది అమృత్సర్ జిల్లాకు చెందిన జసూ్నర్ సింగ్‌కు అమెరికాలో ఉద్యోగం సంపాదించుకోవాలన్నది ఒక కల. అందుకోసం ఏజెంట్‌కు రూ.55 లక్షలు చెల్లించాడు. అందుకోసం కొన్ని ఆస్తులు, వాహనాలు, ఇంటి స్థలం అమ్మేయాల్సి వచ్చింది. డంకీ రూట్లో అమెరికాకు చేరుకోగానే అక్కడి అధికారులు అరెస్టు చేసి, వెనక్కి పంపించారు. కపుర్తలా జిల్లాకు చెందిన 20 ఏళ్ల నిశాంత్ సింగ్‌కు సైతం ఇలాంటి అనుభవమే ఎదురైంది. దట్టమైన అడవిలో 16 రోజులు నడిచానని అన్నాడు. కేవలం నీరు తాగుతూ ప్రాణాలు నిలబెట్టుకున్నానని పేర్కొన్నాడు. తనను అమెరికా పంపించడానికి తన కుటుంబం రూ.40 లక్షలు ఖర్చు చేసిందని వెల్లడించాడు. -
సిరుల చీపురు
సాక్షి, పాడేరు: మనం ఇళ్లలో వాడే చీపురు పంట గిరిబిడ్డలకు జీవనాధారం. ఏజెన్సీలోని హుకుంపేట, డుంబ్రిగుడ, పెదబయలు, మంచంగిపుట్టు, అరకులోయ, జి.మాడుగుల, పాడేరు, సీతంపేట, కురుపాం, గుమ్మలక్ష్మీపురం, సాలూరు, పార్వతీపురం తదితర ప్రాంతాల్లో వేల కుటుంబాలు చీపురు పంటను సాగుచేస్తూ ఉపాధి పొందుతున్నాయి. పూర్వం దట్టమైన అడవుల్లో మాత్రమే కనిపించే కొండచీపురు మొక్కలు నేడు మన్యం అంతా విస్తరించాయి.కొండపోడు, మెట్ట భూముల్లో గిరిజనులు చీపురు పంటను సాగుచేస్తున్నారు. డిసెంబర్, జనవరి నెలల్లో ఈ పంట చేతికి వస్తుంది. చీపురు గడ్డి (Broom grass) శాస్త్రీయనామం “థైసెలోలెనా మాక్సిమా’ ఈ మొక్కలు హిమాలయాల్లోని ఎత్తయిన ప్రాంతాలు, దేశంలోని తూర్పు, ఈశాన్య ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తాయి. మన ప్రాంతానికి దీన్ని వలస మొక్కగా చెప్పవచ్చు. చీపురుతో స్వయం సమృద్ధి కొండచీపుర్లకు దేశవ్యాప్తంగా ఆదరణ ఉంది. ప్రస్తుతం చీపురు పంట దిగుబడికి రావడంతో పుల్లలను సేకరిస్తున్న గిరిజనులు వాటిని బాగా ఎండబెట్టి, కట్టలు కట్టి మండల కేంద్రాలు, వారపుసంతల్లో అమ్ముతున్నారు. చీపురు కట్టల తయారీలో గిరిజన కుటుంబాలు ఇంటిల్లిపాదీ కష్టపడతాయి. మహిళలు కూడా చీపురు సేకరణ, కట్టలు కట్టడం అలవాటు చేసుకున్నారు.చీపురు కట్టకు మార్కెట్లో రూ.40 నుంచి రూ.50 వరకు ధర పలుకుతోంది. ఎకరానికి కనీసం 2వేల వరకు చీపురు కట్టలు తయారవుతాయి.దీంతో ప్రతి గిరిజన రైతు ఏడాదికి రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు సంపాదిస్తున్నాడు. కొంతమంది గిరిజన రైతులు నేరుగా విశాఖపట్నం,గాజువాక, విజయనగరం, రాజమండ్రి వంటి మైదాన ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఏటా ఏజెన్సీ అంతటా కొండచీపుర్ల అమ్మకాలు భారీగా జరుగుతాయి. ప్రస్తుతం మన్యం (Manyam) సంతల్లో వ్యాపారులంతా పోటాపోటీగా కొనుగోలు చేస్తుండటంతో చీపురు అమ్మకాల ద్వారా గిరిజన రైతులు మంచి ఆదాయం పొందుతున్నారు.అడవిలోకి వెళ్లి పుల్ల, పుల్ల ఏరుకుని ఇంటికి తెచ్చి చీపురు కట్టలుకట్టి సంతల్లో అమ్ముకునేవారు. దట్టమైన అడవుల్లో చీపురు పుల్లల సేకరణ గిరిబిడ్డలకు నిరంతర సవాలే. నిత్యం క్రూర మృగాలు, విషసర్పాలతో పోరాటమే. సేకరణ మరీ కష్టంగా మారుతుండటం, రోజురోజుకూ గిరాకీ పెరుగుతుండటంతో ఆ చీపురు మొక్కల్ని తమ సమీపంలోని కొండవాలుల్లో పెంచడం మొదలు పెట్టారు. అలా ప్రారంభమైన చీపుర్ల సాగు ప్రస్తుతం ఏజెన్సీలో సుమారు వెయ్యి ఎకరాల వరకు విస్తరించింది.చీపురు పంటతో మంచి ఆదాయం కొండచీపురు పంట ద్వారా మా గ్రామంలోని అన్ని గిరిజన కుటుంబాలకు మంచి ఆదాయం లభిస్తోంది. మెట్ట,కొండపోడులో చీపురు సాగు చేస్తున్నాం.ఎకరం పంట ద్వారా సుమారు 2వేల వరకు చీపురు కట్టలు తయారు చేస్తాం. పంట సేకరణ, కట్టలు కట్టడం కష్టం తప్ప చీపురు సాగుకు ఎలాంటి పెట్టుబడి లేదు. – పాంగి అప్పన్న, మేభ గ్రామం సూకురు పంచాయతీ, హుకుంపేటమహిళలకు స్వయం ఉపాధి చీపురుపంట సాగుతో సీజన్లో మహిళలకు స్వయం ఉపాధి లభిస్తోంది. సంక్రాంతి పండుగ దాటిన నాటి నుంచి మే నెల వరకు చీపురు కట్టలను సంతల్లో అమ్మకాలు జరుపుతాం, వీటి అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంలో సగం మహిళలమే తీసుకుని ఆసొమ్ముతో పలు వస్తువులు కొనుక్కుంటాం.గత పదేళ్ల నుంచి కొండచీపురు పంటను సాగుచేసుకుంటున్నాం.చీపురు పంట ఆరి్ధకంగా ఏటా మా కుటుంబాలను ఆదుకుంటోంది. – జన్ని సన్యాసమ్మ, గిరిజన మహిళా రైతు -
జర్మనీ విజేత ఎవరు?.. ఈసారి ఎన్నికలు ఎందుకంత ప్రత్యేకం?
జర్మనీ చాన్స్‌లర్ ఒలాఫ్ షోల్జ్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోవడంతో అనివార్యమైన ఎన్నికలు ఇప్పుడు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఫ్రెడరిక్ మెర్జ్ సారథ్యంలోని క్రిస్టియన్ డెమొక్రటిక్ యూనియన్(సీడీయూ), మార్కస్ సోడర్ సారథ్యంలోని క్రిస్టియన్ సోషల్ యూనియన్(సీఎస్‌యూ) కూటమి ఈసారి హాట్ ఫేవరెట్‌గా బరిలో దిగుతోంది. ఈసారి ఈ కూటమికే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని వార్తలొచ్చాయి. మరోవైపు 2010 దశకంలో జర్మనీలోకి వలసలు పోటెత్తడంతో ఉద్యమంగా మొదలై ఇప్పుడు అతివాద పార్టీగా ఎదిగిన ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ(ఏఎఫ్‌డీ) పార్టీ సైతం మళ్లీ ఎన్నికల బరిలో నిలిచింది. జర్మనీలోకి పోటెత్తుతున్న అక్రమ వలసలకు అడ్డుకట్టవేయడం, ఆర్థికవ్యవస్థను పరుగులెత్తించే సత్తా ఉన్న పార్టీకే ఈసారి ఓటర్లు పట్టంకట్టనున్నారు. ఫిబ్రవరి 23వ తేదీన జరగనున్న ఎన్నికల్లో వలసలు, ఆర్థిక వ్యవస్థ మాత్రమే ప్రధాన అంశాలుగా ఉన్నాయి. బండేస్టాగ్(జర్మనీ పార్లమెంట్)లో అధికార పీఠంపై కూర్చునేది ఎవరనే అంశం ఇప్పుడు జర్మనీ అంతటా తీవ్ర చర్చనీయాంశమైంది. ఎన్నడూలేనంతగా జర్మనీలో జనసమ్మర్థ ప్రదేశాల్లో దాడి ఘటనలు ఎక్కువయ్యాయి. అక్రమ వలసదారులే ఈ దాడులకు పాల్పడుతున్నారన్న ఆగ్రహావేశాలు స్థానికుల్లో పెరిగాయి. దీంతో అక్రమ వలసదారుల కట్టడి, శరణార్థులుగా గుర్తింపునకు సంబంధించిన నిబంధనలు కఠినతరం చేయడం వంటి డిమాండ్లు ఓటర్లలో ఎక్కువయ్యాయి. మాన్‌హైమ్, జోలింగన్, మాగ్డీబర్గ్, అషాఫన్బర్గ్ నగరాల్లో దాడి ఘటనలతో అక్రమవలస ఇప్పుడు∙కీలకాంశమైంది. ఇటీవల మ్యూనిక్‌లో అఫ్గాన్ పౌరుడు వేగంగా కారు పోనివ్వడంతో జర్మనీ జాతీయురాలు, ఆమె రెండేళ్ల కూతురు తీవ్రంగా గాయపడిన ఘటనతో అక్రమ వలసదారుల కట్టడి అంశాన్ని ప్రధాన పార్టీలన్నీ ప్రచార అస్త్రాలుగా మార్చుకున్నాయి. ఈసారి ఐదుగురు ఛాన్స్లర్ పదవి కోసం పోటీపడుతున్నారు.ఫ్రిడిష్ మెర్జ్..క్రిస్టియన్ డెమొక్రటిక్ యూనియన్(సీడీయూ) అధినేత ఫ్రిడిష్ మెర్జ్ వైపు ఎక్కువ మంది ఓటర్లు మొగ్గుచూపే వీలుంది. ఆరున్నర అడుగుల ఎత్తు 69 ఏళ్ల వయస్సున్న మెర్జ్ 2002 ఏడాదిలో ఏంజెలా మెర్కల్ ప్రభుత్వంలో పనిచేశారు. తర్వాత రాజకీయాలు వదిలేసి పలు పెట్టుబడుల బ్యాంకుల బోర్డుల్లో సేవలందించారు. తర్వాత మళ్లీ సీడీయూ పార్టీలో చేరి పార్టీ నాయకత్వ పోరులో 2018లో మెర్కెల్, 2021లో ఆర్మిన్ లాషెట్ చేతిలో ఓటమిని చవిచూశారు. ఈసారి ‘‘ జర్మనీలో ఉన్నందుకు మరోసారి గర్వపడదాం’’ నినాదంతో సీడీయూ చీఫ్‌గా ఎన్నికల బరిలో దిగుతున్నారు. ‘‘దేశ సరిహద్దులను పటిష్టంచేస్తా. వలసలను కట్టడిచేసేలా శరణార్థి నిబంధనలను కఠినతరం చేస్తా. పన్నులు తగ్గిస్తా. సంక్షేమ పథకాల కోసం 50 బిలియన్ యూరోలను ఖర్చుచేస్తా’’ అని హామీలు గుప్పించారు.ఒలాఫ్ షోల్జ్..సోషల్ డెమొక్రటిక్ పార్టీ నేత అయిన ఒలాఫ్ షోల్జ్ ఇప్పటికే మూడేళ్లకు పైగా దేశ చాన్స్‌లర్‌గా సేవలందించారు. అయితే కూటమి సర్కార్‌ను నిలబెట్టుకోలేకపోయారు. రెండు నెలల క్రితం బలపరీక్షలో ఓడిపోయారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రత్యక్షంగా జర్మనీ ఆర్థికవ్యవస్థపై విపరిణామాలు చూపడంతో ఒలాఫ్ షోల్జ్ ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింది. అది చివరకు ప్రభుత్వం కూలడానికి కారణమైంది. గత ఏడాది జరిగిన విశ్వాస పరీక్షలో 733 మంది సభ్యులున్న సభలో కేవలం 207 ఓట్లు సాధించడం తెల్సిందే. దీంతో అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్ పార్లమెంట్‌ను రద్దుచేసి ఎన్నికలకు పిలుపునిచ్చారు.ఎలీస్ వీడెల్..2013లో ఏఎఫ్‌డీ పార్టీని ఏర్పాటు చేసినప్పటి నుంచి పార్టీ తరఫున చాన్స్‌లర్ పదవి కోసం 46 ఏళ్ల నాయ కురాలు ఎలీస్ వీడెల్ పోటీపడుతున్నారు. ఈమెకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మద్దతు ఉంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇటీవల మ్యూనిక్‌కు వచ్చిన ప్పుడు ఈమెతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈమె కు యువతలో పెద్ద క్రేజ్ ఉంది. ‘‘వలసలు.. ఇమ్మిగేషన్కు విరుగుడుగా రిమిగ్రేషన్(తిరిగి పంపేయడం) తీసుకొస్తా. జర్మనీపై రష్యా ఆంక్షలను ఎత్తేసేలా కృషిచేస్తా. ధ్వంసమైన నార్డ్ స్ట్రీమ్ పైప్‌లైన్‌ను పునరుద్ధరిస్తా’’ అని ఎలీస్ పలు ఎన్నికల హామీ గుప్పించారు. రాబర్ట్ హబెక్..మూడు దశాబ్దాల క్రితం పర్యావరణ ఉద్యమంగా మొదలైన రాజకీయ పార్టీగా అవతరించిన ‘ది గ్రీన్స్/అలయన్స్ 90’ పార్టీకి సారథ్యం వహిస్తున్న 55 ఏళ్ల రాబర్ట్ హబెక్ సైతం చాన్స్‌లర్ రేసులో నిలిచారు. షోల్జ్ ప్రభుత్వంలో ఈయన వైస్ ఛాన్స్‌లర్‌గా, ఆర్థికశాఖ మంత్రిగా సేవలందించారు. ‘‘పునరుత్పాదక ఇంధన విధానాలకు పట్టం కడతా. అధికారంలోకి వస్తే ఉక్రెయిన్‌కు సాయం కొనసాగిస్తా. అణువిద్యుత్ శక్తి ఉత్పత్తిని తగ్గిస్తా. పవన విద్యుత్‌కు పాతరేస్తా’’ అని ఎన్నికల హామీ ఇచ్చారు. సారా వాగెన్ కనెక్ట్రష్యాకు మద్దతు పలుకుతూ తూర్పు జర్మనీలో బలమైన ఓటు బ్యాంక్‌ను సాధించిన ‘ది సారా వాగెన్ కనెక్ట్ –రీజన్ అండ్ జస్టిస్ పార్టీ(బీఎస్‌డబ్ల్యూ)’ సైతం చాన్స్‌లర్ పదవిపై కన్నేసింది. బీఎస్‌డబ్ల్యూ సహ వ్యవస్థాపకురాలు సారా వాగెన్ కనెక్ట్ తమ పార్టీ.. ఏఎఫ్‌డీకి అసలైన ప్రత్యామ్నాయ పార్టీ అని చెబుతున్నారు. ఏఎఫ్‌డీ తరహాలోనే అక్రమ వలసలపై బీఎస్‌డబ్ల్యూ పార్టీ ఉద్యమిస్తోంది. అయితే ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు అనుకూలంగా మాట్లాడుతుండటంతో ఈ ఎన్నికల్లో పార్టీ గెలుపు కష్టమని అంచనాలు వెలువడ్డాయి. ఓటింగ్ ఎలా చేపడతారు?18 ఏళ్లు దాటిన వారంతా ఓటేయొచ్చు. అయితే ప్రతి ఒక్కరు రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న 299 పార్లమెంట్ నియోజకవర్గాల కోసం ఒక ఓటు వేయాలి. దేశంలో 16 రాష్ట్రాలు ఉండగా ఓటరు తన సొంత రాష్ట్రం కోసం మరో ఓటు వేయాల్సి ఉంటుంది. రెండో ఓటులో కనీసం 5 శాతం ఓట్లను సాధించిన పార్టీ సభ్యులకు నేరుగా పార్లమెంట్లో సభ్యత్వం కోరే అర్హత ఉంటుంది. సంస్కరించిన పోలింగ్ విధానాన్ని తొలిసారిగా ఈ ఏడాది నుంచే అమలుచేయనున్నారు. దీంతో పార్లమెంట్లో ఇన్నాళ్లూ ఉన్న 733 సీట్లు తగ్గిపోయి 630కి చేరుకోనున్నాయి. అత్యధిక సీట్లను సాధించిన పార్టీ లేదా కూటమి నుంచి చాన్స్‌లర్‌ను ఎన్నుకుంటారు. ప్రస్తుతం మైనారిటీ సంకీర్ణ ప్రభుత్వం తాత్కాలికంగా అధికారంలో ఉంది. ఈసారి సీడీయూ, సీఎస్‌యూ కూటమి విజయం సాధించవచ్చని ఎన్నికల పండితులు విశ్లేషిస్తున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
వరి చేలోనే కూరగాయలు, చేపలు!
మాగాణి చేను అనగానే మనకు ఒక్క వరి పంట (Paddy) మాత్రమే మదిలో మెదులుతుంది. అయితే, మాగాణి పొలంలో వరి పంటతో పాటు కూరగాయ పంటలు, చేపల సాగు (aquaculture) కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించుకునే సరికొత్త సమీకృత సేద్య నమూనా ఇది. కాకినాడ జిల్లా (Kakinada District) పిఠాపురం మండలం పి.రాయవరం గ్రామానికి చెందిన యువ రైతు కరుపురెడ్డి వెంకటేష్ నమూనా క్షేత్రం ఇందుకు ఒక ఉదాహరణ. 1.20 ఎకరాల భూమిలో వరితో పాటు అనేక రకాల కూరగాయ పంటలు, కందకంలో చేపల సాగు దర్శనమిస్తాయి. ఏడాదికి ఎకరం వరి సాగులో సాధారణంగా రూ. 40 వేల ఆదాయం వస్తుంది. అయితే, సమీకృత ప్రకృతి వ్యవసాయం చేస్తున్న వెంకటేష్ రూ. లక్షకు పైగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాల ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఈయన వ్యవసాయ క్షేత్రంలో శిక్షణ పొందుతున్నారు. ఇతర రాష్ట్రాల రైతులకు సైతం ఆదర్శంగా నిలిచారు.ఎకరానికి రూ. లక్ష ఆదాయంవెంకటేష్ వ్యవసాయ క్షేత్రం విసీర్ణం ఎకరం 20 సెంట్లు. కాగా, చుట్టూతా విశాలమైన గట్టు 55 సెంట్లలో, గట్టు పక్కనే చుట్టూతా 20 సెంట్లలో తవ్విన కందకంలో చేపల పెంపకం, మధ్యలో మిగిలిన 45 సెంట్ల విస్తీర్ణంలో వరి పంట పండిస్తున్నారు. మాగాణిలో ఒకే పంటగా వరి సాగు చేస్తే ఎకరానికి మహా అయితే రూ.40 వేల ఆదాయం వస్తుంది. దీనికి భిన్నంగా తన పొలంలో గట్టు మీద పండ్ల చెట్లు, కూరగాయ పంటలు, ఆకు కూరలు.. గట్టు పక్కనే తవ్విన కందకం (లేదా కాలువ)లో చేపలు పెంచుతున్నారు. మధ్యలోని పొలంలో వరి సాగు చేస్తున్నారు. ఈ విధంగా సమీకృత ప్రకృతి సేద్యం ద్వారా ఎకరానికి ఏడాదికి రూ.లక్ష ఆదాయం సంపాదిస్తున్నారు. మాగాణి పొలాల్లో కూడా వరి తప్ప వేరే పండదు అనే అపోహను వదిలిపెట్టి పలు రకాల పంటలు పండించుకోవటం ద్వారా ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలో ఈ సమీకృతి ప్రకృతి సేద్య నమూనా తెలియజెప్తోంది. వెంకటేష్ వ్యవసాయ క్షేత్రం రైతులకు, ఇతర సిబ్బందికి రాష్ట్ర స్థాయి శిక్షణ ఇవ్వటానికి కూడా ఉపయోగపడుతుండటం విశేషం. – విఎస్విఎస్ వరప్రసాద్, సాక్షి, పిఠాపురంఇతర రైతులకు ఆదర్శంయువ రైతు వెంకటేష్ సమీకృత ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వరితో పాటు చేపలు, కూరగాయ పంటల సాగుపై ఆసక్తి చూపటంతో శిక్షణ ఇచ్చాం. ఆచరణలో పెట్టి, మంచి ఫలితాలు సాదించి ఇతర రైతులకు ఆదర్శంగా నిలిచారు. ఆయన పొలాన్నే రైతులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రదర్శన క్షేత్రంగా వినియోగిస్తున్నాం. – ఎలియాజర్ (94416 56083), జిల్లా ప్రకృతి వ్యవసాయ శాఖ అధికారి, కాకినాడరెండేళ్లలోనే మంచి ఫలితాలునాకున్న 1.2 ఎకరాల పొలంలో గతంలో వరి మాత్రమే సాగు చేసే వాడిని. ఏడాదికి పెట్టుబడి పోను అతి కష్టం మీద రూ. 40 వేల వరకు ఆదాయం వచ్చేది. ఆ దశలో 2020లో మా జిల్లాలో చేపట్టిన పకృతి వ్యవసాయం చేయాలనిపించి ప్రకృతి వ్యవసాయ విభాగం జిల్లాప్రాజెక్టు మేనేజర్ ఎలియాజర్ను సంప్రదించాను. ఆయన నా ఆసక్తిని గమనించి దుర్గాడ రైతు గుండ్ర శివ చక్రం ద్వారా నాకు సమీకృత సాగుపై శిక్షణ ఇప్పించారు. సార్వా వరి కోసిన తర్వాత, అదేవిధంగా దాళ్వా పంట కోసిన తర్వాత నేలను సారవంతం చేసే 20 రకాల పచ్చిరొట్ట పంటలను పెంచి, కలిదున్నేస్తున్నా. దీని వల్ల భూమి సారవంతమవుతోంది. ఎద్దులతోనే దుక్కి, దమ్ము చేస్తాం. జీవామృతం, ఘనజీవామృతం, కషాయాలు వాడుతున్నాం. రెండేళ్లలోనే మంచి ఫలితాలు వచ్చాయి. మా కుటుంబానికి వాడుకోగా మిగిలిన కూరగాయల ఇతరులకు ఇస్తున్నాం. బొచ్చె, కొర్రమీను వంటి చేపల పెంపకం ద్వారా అదనపు ఆదాయం వస్తోంది. రసాయనాలు వాడకుండా పెంచటం వల్ల మా పంటలకు మంచి డిమాండ్ ఉంటోంది. సంతృప్తికరంగా ఆదాయం పొందటంతో పాటు రైతుల శిక్షణ కేంద్రంగా మా పొలం మారినందుకు చాలా సంతోషంగా ఉంది. – కరుపురెడ్డి వెంకటేష్ (63024 19274),పి.రాయవరం, పిఠాపురం మండలం, కాకినాడ జిల్లా -
కాకతీయుల కాలంలోని అద్భుతమైన నిర్మాణం
జూలూరుపాడు: సుమారు ఏడు శతాబ్దాల క్రితం కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక కట్టడం కనుమరుగవుతోంది. కాకతీయుల కాలంలో తాగునీటి అవసరాలు, శత్రు సైన్యాల నుంచి తమను రక్షించుకోవడానికి దట్టమైన అడవి ఉన్న జూలూరుపాడు (Julurpadu) ప్రాంతంలో రాజాబావిని రాతికట్టడంతో నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. సువిశాలమైన రాజాబావికి రెండు వైపులా నివాసం కోసం గదులు నిర్మించి ఉంటారని తెలుస్తోంది. ఈ బావి పైభాగాన తూర్పు, పడమరకు ఎదురెదురుగా 10 గదులు నిర్మించారు. బావిలోకి దిగేందుకు 30 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పుతో రాళ్లతో మెట్లు నిర్మించారు. ఈ బావి చుట్టూ 8 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు గల పైకప్పు ఒకేరాయిలా కనిపిస్తోంది. పూడిక మట్టితో నిండిపోవడంతో బావి లోతు ఎంత అనేది తెలియడం లేదు. సున్నం, రాళ్లతో నిర్మించిన ఈ ప్రాచీన కట్టడం నేటికీ చెక్కుచెదరలేదు. అయితే, గుప్తనిధుల కోసం తవ్వకాలు, చెత్తాచెదారం పేరుకుపోవడం, బావిలో పూడిక పెరగడంతో నానాటికీ వైభవం కోల్పోతున్నా సంరక్షణపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. దండయాత్రల నుంచి రక్షణకు.. శత్రువులు దండయాత్ర చేసినప్పుడు రక్షణ కోసం కాకతీయ రాజులు (Kakatiya Kings) పలు ప్రాంతాల్లో సొరంగ మార్గాలు ఏర్పాటు చేసుకునేవారని చరిత్ర చెబుతోంది. ఇందులో భాగంగానే వివిధ ప్రాంతాల మీదుగా సొరంగ మార్గాల ద్వారా ఖమ్మం ఖిలాకు వచ్చేవారని, కాకతీయుల రాజధాని అయిన ఓరుగల్లు (వరంగల్)కోటకు, పాత ఖమ్మం (Khammam) జిల్లాలోని జూలూరుపాడు రాజుల బావి, భేతాళపాడు గుట్టలపై ఉన్న కోట వరకు వచ్చేవారని తెలుస్తోంది. జూలూరుపాడు నుంచి పాపకొల్లులోని పుట్టకోట, చండ్రుగొండ మండలం బెండాలపాడు గుట్టల్లో వెలిసిన శ్రీవీరభద్రస్వామి, కనగిరి గుట్టల్లోని ఆలయాలు, అప్పట్లో సైనికులు తలదాచుకునేందుకు ఏర్పాటు చేసిన కొన్ని స్థావరాలు నేటికీ కనిపిస్తాయి. అక్కడ ఉన్న సొరంగ మార్గాల ద్వారా శత్రువుల నుంచి రక్షణ పొందటంతోపాటు, శత్రువులపై మెరుపు దాడులు నిర్వహించేందుకు ఈ మార్గాలను ఉపయోగించుకునేవారు.గుప్తనిధుల కోసం తవ్వకాలు.. కాకతీయ రాజులు వజ్ర వైఢూర్యాలు, బంగారు అభరణాలను ఈ బావిలో భద్రపరిచే వారని నమ్ముతుంటారు. బావిలో గుప్త నిధులు ఉన్నాయనే ప్రచారంతో ఏడేళ్ల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు బావి పైభాగాన ఉన్న గదుల్లో తవ్వకాలు జరిపారు. ఈ క్రమంలో క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు కనిపించినా అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమార్కులు యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో చారిత్రక కట్టడం ధ్వంసానికి గురవడంతో బావి ఆనవాళ్లు భావితరాలకు కన్పించకుండా పోయే పరిస్థితి ఏర్పడనుంది. తగ్గని నీటిమట్టం.. బావి నీటిని గతంలో ఈ ప్రాంత వాసులు తాగునీటిగా ఉపయోగించేవారు. బావిలో నీటిమట్టం తరగకపోవడంతో, బావిలో ఏమైనా గుప్త నిధులు ఉన్నాయా అని తెలుసుకునేందుకు కొన్నేళ్ల క్రితం గ్రామస్తులు ఆయిల్ ఇంజిన్లు పెట్టి నీటిని 15 రోజుల పాటు పంటలకు వినియోగించినా నీటిమట్టం ఎంతమాత్రం తగ్గలేదు. దీంతో గ్రామస్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. బావిలోకి దిగుడు మెట్లు, బావి చుట్టూ తిరగటానికి వీలుగా ప్లాట్‌ఫామ్ ఉన్నాయి. ఈ తరం ఇంజనీర్లకు సైతం అంతు చిక్కని అద్భుత సాంకేతిక నైపుణ్యంతో రాతిబావిని నిర్మించడం విశేషం. అలాంటి బావి పాలకులు, అధికారుల నిర్లక్ష్యానికి గురవుతూ పూడిక మట్టి, ముళ్ల పొదలతో నిండిపోయింది. బావి చుట్టూ ఉన్న స్థలం కూడా ఆక్రమణకు గురికావడంతో ముళ్ల పొదలు, చెట్లతో కళావిహీనంగా మారింది. చారిత్రక సంపద ధ్వంసం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. రాజాబావి నీళ్లు తాగే వాళ్లం 40 ఏళ్ల క్రితం రాజాబావి నీళ్లు తాగే వాళ్లం. వేసవి కాలంలో కూడా నీళ్లు బాగా ఉండేవి. ఈ నీటిని పంటల సాగుకూ ఉపయోగించేవారు. ప్రస్తుతం పూడికతో నిండిపోవడంతో పాటు ముళ్ల పొదలు, చెట్లు పెరగడంతో అటువైపు ఎవరూ వెళ్లడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మరమ్మతులు చేయాలి. – చిన్నకేశి వెంకటేశ్వర్లు, జూలూరుపాడు చారిత్రక కట్టడాన్ని కాపాడాలి వందల ఏళ్ల నాటి చారిత్రక కట్టడం కనుమరుగు కాకుండా చూడాలి. రాజాబావి ధ్వంసమవుతుండటంతో భావితరాలకు కన్పించకుండాపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి చారిత్రక సంపదను రక్షించేందుకు ప్రభుత్వం, అధికారులు చర్యలు చేపట్టాలి. – తాళ్లూరి వెంకటేశ్వర్లు, జూలూరుపాడు బావి అభివృద్ధికి చర్యలు చేపట్టాలి రాజాబావి అభివృద్ధికి అధికారులు చర్యలు తీసుకోవాలి. కొన్ని దశాబ్దాలుగా అధికారులు పట్టించుకోకపోవడంతో ముళ్ల పొదలు, చెట్లతో నిండి కళావిహీనంగా మారింది. దీన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. – నర్వనేని పుల్లారావు, జూలూరుపాడు చదవండి: వరంగల్ పేరు ఎలా వచ్చిందంటే..పురాతన సంపదను కాపాడతాం కాకతీయుల కాలం నాటి పురాతన కట్టడమైన రాజా బావిని కాపాడుతాం. ఈ సమస్యను ఉన్నతాధికారులు, పర్యాటక శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. స్థానిక గ్రామ పంచాయతీ నుంచి ఏమైనా చేయవచ్చేమో పరిశీలిస్తాం. ముళ్ల పొదలు, చెట్లు తొలిగించి, పూర్వవైభవం వచ్చేలా చర్యలు చేపడతాం. – డి.కరుణాకర్‌రెడ్డి, ఎంపీడీఓ జూలూరుపాడు -
ఆదిమ బాలుని ఆగమనం
నేటి ఆధునిక ప్రపంచానికి దూరంగా జీవించే ఎన్నో ఆదిమజాతులకు బ్రెజిల్‌లోని అమెజాన్ నదీ పరివాహక ప్రాంతం ఆవాసంగా ఉంది. ఆ ఆదిమజాతుల కట్టూ»ొట్టూ, ఆచరవ్యవహారాలు, ఆహార నియమాలు ఎవరికీ తెలీదు. బ్రెజిల్ ప్రభుత్వం కూడా ఎవరికీ చెప్పదు. ఆధునిక పోకడల బారిన పడకుండా ఆ జాతులను తమ మానాన వారి బతకనివ్వాలని బ్రెజిల్ ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకుంది. అందుకే అలాంటి ఆదిమజాతులు ఆవాసాల వైపు ఎవరినీ వెళ్లనివ్వదు. అయితే అనుకోకుండా ఆ ఆదిమజాతుల్లో ఒక గిరిజనజాతికి చెందిన వ్యక్తి వాళ్ల ప్రపంచం నుంచి బాహ్య ప్రపంచంలోకి వచ్చాడు. వెంట రెండు చిన్న దుంగలను తెచ్చుకున్నాడు. మంట రాజేయడానికి అగ్గి కావాలని అభ్యర్థించాడు. ఈ అరుదైన ఘటన గత బుధవారం నైరుతి అమెజాన్‌లోని పురూస్ నదీతీరం వెంట బెలారోసా అనే కుగ్రామంలో జరిగింది. బుధవారం రాత్రి ఏడు గంటల సమయంలో ఒక గిరిజన వ్యక్తి ఒంటిపైభాగంపై ఎలాంటి ఆచ్చాదన లేకుండా కాళ్లకు చెప్పులు లాంటివి ఏమీ లేకుండా నడుచుకుంటూ కుగ్రామానికి చేరుకున్నాడు. సంబంధిత వీడియోను అసోసియేటెడ్ ప్రెస్ న్యూస్ఏజెన్సీ సంపాదించింది. ఆ వీడియోలో ఆ గిరిజన వ్యక్తి పూర్తి ఆరోగ్యవంతంగా, నెమ్మదస్తుడిగా కనిపించాడు. గ్రామస్థులను అగ్గి కావాలని అడిగాడు. దీంతో వాళ్లు ఒక లైటర్‌ను ఇచ్చి దీంతో అగ్గిరాజేసుకోవాలని సూచించారు. అయితే అతనికి లైటర్‌ను ఎలా వెలిగించాలో అర్థంకాలేదు. దానిని ఎలా వాడాలో స్థానికులు ఎంతలా విడమరిచి, వివరించి చూపినా అతనికి అర్థంకాలేదు. ఈలోపు బ్రెజిల్ దేశ ఆటవిక, ఆదివాసీ, గిరిజన సంబంధ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ‘ఫునాయ్’ అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకుని ఆ మనిíÙని తమ కార్యాలయానికి తీసుకెళ్లారు. స్థానికులతో ఉండటంతో స్థానికులకు ఉన్న అంటురోగాలు, ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియా ఏమైనా సోకాయో లేదో అని నిర్ధారించుకుని గురువారం సాయంత్రం కల్లా తిరిగి ఆ ఆదిమజాతి ఆవాసానికి సురక్షితంగా పంపేశారు. ఆదిమజాతులు శతాబ్దాలుగా బయటి వ్యక్తుతో కలవని కారణంగా వారిలో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. ఆధునిక జీవనశైలికి అలవాటుపడ్డ సాధారణ ప్రజల్లో అన్ని రకాల అంటురోగాలకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు పోగుబడి ఉంటాయి. ఇవి పొరపాటున ఆదిమజాతులకు సోకినా చాలా ప్రమాదం. గతంలో జరిగిన ఇలాంటి ఉదంతాల్లో కొన్ని జాతులు హఠాత్తుగా రోగాలపాలై సగం జనాభా అంతరించిపోయింది. అందుకే అతడిని ఎవరితోనూ కలవనీయకుండా విడిగా ఉంచి 24 గంటల్లోపు తిరిగి అతని జాతి ఆవాసానికి పంపేశారు. స్థానికులు అతను వచ్చిన మార్గం గుండా వెళ్లి ఆదిమజాతులను కలవకుండా ఉండేందుకు ఫునాయ్ అధికారులు చర్యలు చేపట్టారు. గతంలో ఇలా ఎవరైనా గిరిజనులు బాహ్యప్రపంచంలోకి పొరపాటున వస్తే వారిని మెమోరియా గ్రాండే ఆదిమ,పర్యావరణ పరిరక్షణా స్థావరానికి తీసుకెళ్లి సపర్యలు చేసి పంపేస్తారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తెలుసుకుంటే లాభం...మలుచుకుంటే అ'ధనం'
గిరిజనుల ఆర్థిక పరిస్థితిలో మార్పు తేవాలి, వారి ఆదాయం రెట్టింపుకావాలన్న లక్ష్యంతో పందిరిమామిడి కృషి విజ్ఞాన కేంద్రం (Krishi Vigyan Kendra) పనిచేస్తోంది. ఇందుకోసం గిరిజనులకు అందుబాటులో ఉండే వనరుల వినియోగం, విలువ ఆధారిత ఉప ఉత్పత్తుల తయారీపై శిక్షణ ఇస్తోంది. దీనిలో భాగంగా జిల్లాలో లభించే పనస పండ్లతో పసందైన వంటకాల తయారీ, మార్కెటింగ్‌పై శిక్షణ అందిస్తోంది. మార్చి నెలలో రెండో బ్యాచ్‌కు శిక్షణ ఇవ్వనున్నారు. పసన పండ్ల లాభాలు తెలియజేసి, వాటి నుంచి అదనంగా ఆదాయం సమకూర్చుకునేలా శిక్షణ అందజేయనున్నారు.రంపచోడవరం: అల్లూరి సీతారామరాజు జిల్లాలో విరివిగా లభించే పనసకాయలతో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీలో పందరిమామిడి (Pandarimamidi) కృషి విజ్ఞాన కేంద్రం గిరిజనులకు అవగాహన కల్పిస్తోంది. పనస తొనలతో వివిధ రకాల ఆహార పదార్థాలు తయారు చేయడంలో ఇప్పటికే ఒక దఫా 30 మందికి శిక్షణ ఇచ్చారు. ఈ ఏడాది మార్చిలో మరో బ్యాచ్‌కు శిక్షణ ఇచ్చేందుకు కేవీకే ప్రణాళిక సిద్ధం చేసింది. రెండు లక్షల చెట్లు జిల్లాలో రెండు లక్షల వరకు పనస చెట్లు ఉన్నట్టు ఉద్యానవన శాఖాధికారుల అంచనా. మారేడుమిల్లి, వై.రామవరం, రంపచోడవరం, అడ్డతీగల, చింతూరు, పాడేరు, చింతపల్లి, అరకు (Araku) తదితర 19 మండలాల్లో పనస చెట్లు ఎక్కువగా ఉన్నాయి. గిరిజనులు తోటలుగానే కాకుండా ఇళ్ల వద్ద, పంట పొలాల్లో కూడా పనసను పెంచుతారు. పనస కాయల (Jack Fruit) దిగుబడి ఫిబ్రవరిలో ప్రారంభమై మే వరకు లభిస్తాయి. పనస మొదటి దశలో తొనలు, విత్తనాలు(పనస పిక్కలు) తయారు కావు. వీటిని ఎక్కువగా కూరలు, పచ్చళ్ల తయారీకి ఉపయోగిస్తారు. గింజలు అభివృద్ధి చెందే దశలో కూడా కూర పనసగా ఉపయోగిసా్తరు. తొనలు వచ్చినా తీí³, వాసన లేకుండా ఉంటాయి. వీటిని చిప్స్ తయారీలో ఉపయోగిస్తారు. పనస తొక్కు పచ్చడి, బజ్జీలు, పకోడి, బిర్యానీ, హల్వా, చాక్లెట్స్, తాండ్ర, జామ్, జ్యూస్, ఐస్‌క్రీమ్, పనస పిక్కల పిండితో పూరీలు, అప్పడాలు తయారు చేయవచ్చు. కేవీకే శాస్త్రవేత్తలు వీటి తయారీపై ఇప్పటికే గిరిజన యువతకు శిక్షణ ఇచ్చారు. ఆర్థిక భరోసా జిల్లాలో మేలుజాతి పనస ఉత్పత్తులు సీజన్లో లభిస్తాయి. అనేక పోషక విలువలు ఉన్న పనసను గిరిజనులు వారపు సంతల్లో, గ్రామాలకు వచ్చే వ్యాపారులకు తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. కొనుగోలు దారులులేకపోతే పశువులకు ఆహారంగా వేస్తున్నారు. గిరిజన రైతులు గరిష్ట ధర పొందలేకపోతున్నారు. గతంలో కృషి విజ్ఞాన కేంద్రంలో శిక్షణ పొందిన పలువురు ఉప ఉత్పత్తులు తయారు చేసి వారపు సంతల్లో విక్రయిస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. పోషక విలువలెన్నో.. పనసలో మెండైన పోషక విలువలు ఉన్నాయి. విటమిన్లు, పీచుపదార్థం, ఖనిజ లవణాలు ఉన్నాయన్నారు. దీంతో పనస ఉప ఉత్పత్తులకు మార్కెట్లో డిమాండ్ ఉంది. గిరిజన యువత కొద్దిపాటి మెలకువలు పాటిస్తే పనసకాయలతో పచ్చడి, చిప్స్, పనస జ్యూస్, జామ్తోపాటూ పలు రకాల ఉత్పత్తులు తయారు చేయవచ్చని కేవీకే శాస్త్రవేత్తలు తెలిపారు. నోరూరించే చాక్లెట్లు పనస తొనలతో తయారు చేసే చాక్లెట్లు చాలా రుచిగా ఉంటాయి. వీటిని చాలా సులభంగా తయారు చేయవచ్చు. కేజీ పనస తొనలను వేడి నీటిలో ఉడికించి, గుజ్జుగా తయారు చేసుకోవాలి. గిన్నెలో నెయ్యి వేసుకుని పనసగుజ్జు, కరిగించిన పాలపొడి, వేయించిన కోకో పౌడరు, పంచదార వేసి కాసేపు వేయించుకోవాలి. చల్లారిన తరువాత ముక్కలుగా చేసుకోవాలి. అంతే.. పనస చాక్లెట్లు సిద్ధమవుతాయి.చదవండి: వైజాగ్‌పై చంద్రబాబు సర్కారు శీతకన్ను!కరకరలాడే చిప్స్పచ్చి పనస తొనలతో వీటిని తయారు చేస్తారు. అర కేజీ తొనల నుంచి పిక్కలు వేరు చేయాలి. తరువాత అర ఇంచీ మందంతో పొడవుగా కోయాలి. కోసిన పనస తొనల ముక్కలను గుడ్డలో కట్టి మరిగించిన నీళ్లలో రెండు నిమిషాల పాటు ఉంచి బయటకు తీయాలి.తరువాత వాటిని అరబెట్టుకోవాలి. ఒక పాత్రలో నూనె వేసి తగినంత పసుపు వేసి మరిగించాలి. నూనె బాగా మరిగిన తరువాత అరబెట్టుకొన్న పనస తొనల ముక్కలను వేయించాలి. వాటిపై ఉప్పు,కారం జల్లుకుంటే వేడివేడి చిప్స్ రెడీతాండ్ర తయారీ ఇలా పిక్కలు వేరు చేసిన కేజీ పనస తొనలను వేడినీళ్లలో వేసుకుని మరిగించుకోవాలి. మెత్తబడిన పనస తొనలను మిక్సర్‌లో వేసుకొని గుజ్జుగా చేసుకోవాలి. ట్రేలలో సమాంతరంగా ఈ గుజ్జును వేసుకోవాలి. తేమ ఆరే వరకు ఎండలోగాని, డ్రయర్ల గాని ఉంచుకోవాలి. తేమ ఆరిపోతే తాండ్ర ట్రేలో నుంచి సులభంగా వస్తుంది. వీటితో పాటు మరికొన్ని విలువ ఆధారిత ఉత్పత్తులపై శిక్షణ ఇవ్వనున్నారు.మార్చిలో మరోదఫా శిక్షణ పందిరిమామిడి కేవీకేలో మార్చి నెలలో మారోమారు పనసతో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై శిక్షణ ఇవ్వనున్నాం. ఈ ఏడాది ఏజెన్సీలో 25 ఎకరాల్లో పనస మొక్కలు నాటించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. జిల్లాలో అధిక సంఖ్యలో పనసపండ్లు లభిస్తున్నా గిరిజనులు పూర్తిస్థాయిలో ఆదాయం పొందలేకపోతున్నారు. పనసతో విలువ ఆధారిత ఉత్పత్తులకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. గిరిజన యువతను ఆ దిశగా ప్రోత్సహించేందుకు కేవీకే కృషి చేస్తోంది. – క్రాంతి, ఉద్యానవన శాస్త్రవేత్త, కేవీకే, పందిరిమామిడి -
సీఈవో... జీతాలు అదరహో
కాలు బయటపెడితే ఖరీదైన కార్లు, చార్టర్డ్ విమానాల్లో ప్రయాణం.. రాత్రి పగలు అన్న తేడా లేకుండా నిత్యం కనిపెట్టుకొని ఉండే సేవకులు.. జీ హుజూర్ అనే యాజమాన్యాలు.. వీటన్నింటికీ మించి వందల కోట్ల రూపాయల వేతనాలు.. ప్రపంచ టాప్ కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ల జీవితమిది. కంపెనీని లాభాల్లో నడిపించగలడు అని నమ్మితే ఎంత వేతనం, ఎన్ని సౌకర్యాలైనా ఇచ్చి సీఈవోగా నియమించుకునేందుకు కంపెనీలు వెనుకాడటంలేదు.అందుకే కొందరు సీఈఓలు కళ్లు చెదిరే వేతనాలు అందుకుంటున్నారు. అందుకు ఉదాహరణ స్టార్‌బక్స్ సీఈవో బ్రియాన్ నికోల్. ఆయన వారంలో మూడు రోజులే ఆఫీస్‌కు వస్తారు. అది కూడా 1,600 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆఫీస్‌కు చేరుకుంటారు. ప్రయాణం, నివాసం.. ఇలా అన్ని ఖర్చులూ కంపెనీయే భరిస్తుంది. ఆయన ఏడాదికి 113 మిలియన్ డాలర్ల (రూ.971 కోట్లు) ప్యాకేజీ అందుకుంటున్నారు. బ్రియాన్ అమెరికాలోని టాప్–20 సీఈఓల్లో ఒకరు. ఎందుకంత అధిక వేతనాలు? భారత కంపెనీలు చాలా వేగంగా వృద్ధి చెందుతూ, అంతర్జాతీయంగా కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. ఫలితంగా అంతర్జాతీయ కంపెనీలకు పోటీగా దేశీ సీఈఓలకు సైతం అధికంగా పారితోషికాలు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగుల్లో టాప్ బాస్ అయిన సీఈఓనే కంపెనీ వ్యాపార విజయాలకు సూత్రధారి.కంపెనీలను విజయపథంలో నడపగలిగే సీఈఓలకు అంతర్జాతీయంగా అధికడిమాండ్ ఉంది. వారిని పారితోషికాలతో ప్రసన్నం చేసుకునేందుకు కంపెనీ బోర్డులు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవటంలేదు. సీఈఓల పారితోíÙకం షేర్ల కేటాయింపు రూపంలోనూ ఉంటుంది. షేర్ల ధరలు పెరగడం వారి పారితోíÙకాన్ని మరిన్ని రెట్లు చేయగలదు.భారత్‌లో సగటు నెల వేతనం 10 కోట్లుభారత్‌లో సీఈవోల సగటు నెల వేతనం రూ.10 కోట్లుగా ఉంది. అమెరికాలో ఇది 14–15 మిలియన్ డాలర్లు (రూ. 129 కోట్లు) కోట్లు. అమెరికా కంపెనీల్లో సీఈఓ వేతనం సగటు ఉద్యోగి వేతనం కంటే 160–300 రెట్లు ఎక్కువగా ఉంది. మనదేశంలో నిఫ్టీ –50 కంపెనీల్లో సగటు ఉద్యోగి కంటే సీఈవో వేతనం 260 రెట్లు అధికం. -
‘నియర్’ వెరీ డియర్
‘నియర్’ అనుభవంతో దాన్ని అడ్డుకునే పనిలో నాసా సరిగ్గా 24 ఏళ్ల క్రితం భూమి నుంచి ప్రయోగించిన ఒక అంతరిక్ష నౌక అనూహ్యంగా ఒక గ్రహశకలంపై దిగింది. దానికి ఆ సామర్థ్యం ఏమాత్రమూ లేకపోయినా రాతితో కూడిన నేలపై అతి సున్నితంగా లాండైంది. అన్ని ప్రతికూలతలను తట్టుకుంటూ అక్కడి నుంచి రెండు వారాల నిక్షేపంగా పనిచేసింది. సదరు అస్టరాయిడ్కు సంబంధించిన విలువైన డేటాను భూమికి చేరవేసింది. గ్రహంపై కాకుండా ఓ గ్రహశకలంపై కాలుమోపిన తొలి స్పేస్‌క్రాఫ్ట్‌గా చరిత్ర సృష్టించింది. ఇదంతా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అప్పట్లో ప్రయోగించిన నియర్ ఎర్త్ అస్టరాయిడ్ రెండీవ్ (నియర్) స్పేస్‌క్రాఫ్ట్ గురించే. ‘2024 వైఆర్4’ అనే గ్రహశకలం భూమి వైపుగా శరవేగంగా దూసుకొస్తున్న నేపథ్యంలో నాసా సైంటిస్టులు నాటి నియర్ ఘనతను మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. వైఆర్4 భూమిని ఢీకొనే అవకాశాలు 2 శాతం దాకా ఉన్నట్టు వారు అంచనా వేస్తున్నారు. ఇది బహుశా 2032లో జరిగే చాన్సుందట. భూమికేసి రాకుండా దాన్ని దారి మళ్లించాలని భావిస్తున్నారు. ఆ ప్రయత్నాల్లో నాడు ‘నియర్’ అందించిన వివరాలు ఎంతగానో ఉపయోగపడవచ్చని చెబుతున్నారు. అలా జరిగింది... భూమికి 35.5 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘433 ఏరోస్’ అనే ఎస్–క్లాస్ గ్రహశకలం లక్షణాలు, అందులోని ఖనిజాలు, అయస్కాంత క్షేత్రం తదితరాలను అధ్యయనం చేయాలని నాసా భావించింది. దాని చుట్టూ కక్ష్యలో పరిభ్రమించే లక్ష్యంతో నియర్ స్పేస్‌క్రాఫ్ట్‌ను 1996 ఫిబ్రవరి 17న ప్రయోగించింది. అంతరిక్షంలో వెళ్లిన ఏడాదికి అది అస్టరాయిడ్ ఉపరితలానికి 1,200 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. అక్కణ్నుంచి మరింత ముందుకెళ్లి ఏరోస్ చుట్టూ కక్షలోకి తిరగాల్సి ఉండగా నియర్ జాతకమే తిరగబడింది. 1998 డిసెంబర్ 20న సాంకేతిక లోపం తలెత్తింది. ఇంజన్ బర్న్ కారణంగా నియర్ అనుకున్నట్లుగా పనిచేయలేని పరిస్థితి! దాంతో బ్యాకప్ ఇంధనం సాయంతో దాన్ని ఏకంగా అస్టరాయిడ్పైనే దించాలని నాసా నిర్ణయించింది. ఆ ఆదేశాలకు అనుగుణంగా నియర్ 2001 ఫిబ్రవరి 12న ఏరోస్కు అత్యంత సమీపానికి చేరుకుంది. చివరికి నెమ్మదిగా ఏరోస్పై దిగి చరిత్ర సృష్టించింది. ఒక అంతరిక్ష నౌక గ్రహశకలాన్ని తాకడం అదే మొదటిసారి. అలా నియర్ కాస్తా సైంటిస్టులకు వెరీ డియర్గా మారిపోయింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇలాగేనా రెస్క్యూ?
సాక్షి, హైదరాబాద్: ఇటీవల యాదాద్రి భువనగిరి జిల్లాలోకి ఓ అడవిదున్న తప్పిపోయి వచ్చింది. అయితే దాన్ని సజీవంగా పట్టుకునేందుకు చేసిన రెస్క్యూ ఆపరేషన్ విఫలమైంది. పది రోజులపాటు ఈ దున్న కదలికలను ఆ జిల్లా పరిసరాల్లో అటవీశాఖ అధికారులు గుర్తించినా, జీవించి ఉండగా పట్టుకోలేకపోయారనే విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోయే జాతికి చెందిన ఆ అడవిదున్న (ఇండియన్ బైసన్) మృతి చెందడం పట్ల పర్యావరణవేత్తలు, జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తంచేశారు. అరుదైన జంతువులు, వన్య›ప్రాణులను రక్షించాల్సిన అటవీశాఖ సన్నద్ధత, సంసిద్ధత, పరిమితులను ఈ ఘటన స్పష్టం చేస్తోందంటున్నారు. గతంలోనూ ఓ చిరుత, కొన్ని జంతువుల రెస్క్యూలో అటవీ అధికారులు, సిబ్బంది విఫలమైన విషయాన్ని గుర్తుచేసుకుంటున్నారు. రెస్క్యూలో అటవీశాఖకు ఓ స్పష్టమైన విధానం, కార్యాచరణ లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు, ఆపదలో ఉన్న జంతువులు, వన్యప్రాణులను కాపాడేందుకు, వెంటనే స్పందించేందుకు క్విక్ రెస్పాన్స్ టీమ్ (క్యూఆర్టీ) ఏర్పాటు చేస్తున్నామంటూ గతంలో చేసిన ప్రకటనలు కాగితాలకే పరిమితమయ్యాయి. అసలేం జరిగిందంటే..మేత, నీటికోసం వెతుక్కుంటూ దారితప్పిన దున్న చౌటుప్పల్ మండలం చిన్నకోడూరు గ్రామ సరిహద్దుల్లో కొందరికి కనిపించింది. ఎక్కడ జనవాసాల్లోకి వస్తుందోననే భయంతో దాన్ని బైక్‌లు, ఇతర వాహనాలపై నాలుగు గంటలపాటు వెంబడించారు. అప్పటికే ఆకలి, దప్పికతో ఉన్న దున్న పరిగెడుతూ డీ హైడ్రేషన్‌కు గురైంది. నోటి నుంచి నురగలు కక్కుతూ దయనీయస్థితికి చేరింది. దాన్ని రక్షించి, వైద్యం అందించి సురక్షిత ప్రాంతానికి తరలించే రెస్క్యూ టీమ్ అక్కడికి ఆలస్యంగా చేరుకుంది. వరంగల్ జూ నుంచి రెస్క్యూ టీమ్, నెహ్రూ జూపార్కు నుంచి వచ్చిన వెటరేరియన్ మత్తుమందు ఇచ్చి దున్నను నిలువరించే ప్రయత్నం చేశారు. వాహనంలోకి ఎక్కించి దానిని చికిత్స కోసం తరలిస్తున్న క్రమంలో అది అప్పటికే చనిపోయినట్టు గుర్తించారు.ఉన్నవి రెండు బృందాలే..రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్‌లోని నె హ్రూ జూపార్క్, వరంగల్‌లోని కాకతీయ జూపార్క్‌లో తాత్కాలిక ఏర్పాట్లతో రెండు బృందాలు పనిచేస్తున్నాయి. వీటికి రెస్క్యూ వెహికిల్స్, వెటరేరియన్లు ఉన్నా రు. రాష్ట్రంలో ఎక్కడ వన్యప్రాణులు, అటవీ జంతువులను కాపాడాల్సి వచ్చి నా.. ఏ ప్రాంతానికి దగ్గరగా ఉంటే అక్కడి నుంచి వాహనం, సిబ్బందిని పంపిస్తున్నారు. అయితే ఈ బృందాలు పాత బడిన వాహనాలు, పరికరాలు, సామగ్రి తోపాటు ఏవో తాత్కాలిక పద్ధతులతో నెట్టుకొస్తున్నాయి. ఇప్పుడేం చేయాలి?» రాష్ట్రంలో వన్యప్రాణులు, జంతువు లకు సంబంధించి ఎక్కడైనా అనుకో ని సంఘటన లేదా ఆపద ఎదురైనా, అడవుల్లో అగ్నిప్రమాదాల వంటి ఘ టనలు జరిగినా త్వరితంగా స్పందించేలా బృందాలను వెంటనే ఏర్పాటు చేయాలి. » పాతబడిన వాహనాలను తొలగించి, కొత్త వాహనాలను అందుబాటులోకి తేవాలి. ట్రాంకిలైజర్ గన్స్, ఇతర సామగ్రిని అందుబాటులో ఉంచాలి. » రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను కవర్ చేసేలా రెస్క్యూ బృందాలను ఏర్పాటు చేయాలి. » జంతువుల తీరుపై వెటర్నరీ డాక్టర్లకు శిక్షణ ఇచ్చి తగిన సంఖ్యలో సిబ్బందిని నియమించాలి. -
ఆ రోజు ఇల్లు కదలరు.. ముద్ద ముట్టరు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: తెలవారకముందే ఊళ్ల వెంట తిరుగుతూ పాత ఇనుప సామాగ్రి కొనుగోలు చేసి, వాటిని అమ్ముకుని పొట్టపోసుకునే ఆ కుటుంబాలు.. వారంలో ఒక రోజు మాత్రం ఇల్లు వదిలి బయటకు వెళ్లరు. ఆ రోజు ఇల్లు, వాకిలి కూడా ఊడ్చరు. పొయ్యి వెలిగించేది అసలే లేదు. రోజంతా వాళ్లు ఆధ్యాత్మిక చింతనలోనే గడుపుతారు. వాళ్లే లహరి కృష్ణ భక్తులు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రమన్నుకుచ్చ ప్రాంతంలో బుడగ జంగాల కులానికి చెందిన 110 కుటుంబాలున్నాయి. వారు దశాబ్దాలుగా శ్రీ లహరి కృష్ణ ఆధ్యాత్మిక చింతనలో గడుపుతున్నారు. ప్రతి ఇంటి ముందు లహరి కృష్ణకు సంబంధించిన జెండా ఒకటి రెపరెపలాడుతూ ఉంటుంది. ఈ సంప్రదాయంలో కొబ్బరికాయ (Coconut) కొట్టడం, అగరొత్తులు వెలిగించడం ఉండవు. ఏటా అక్టోబర్ 3న జెండా పండుగ నిర్వహిస్తారు. పండుగపూట శాకాహార భోజనం.. అదీ అందరూ ఒకే చోట చేస్తారు. ఆ 24 గంటలు ప్రత్యేకంవీరు శుక్రవారం (Friday) సాయంత్రం 6 గంటల నుంచి శనివారం (Saturday) సాయంత్రం 6 గంటల వరకు ప్రత్యేక దినచర్యను పాటిస్తారు. ఆ సమయంలో ఇంట్లో పొయ్యి వెలిగించరు. పిల్లల కోసం ముందు రోజు వండిన ఆహారంలో కొంత మిగిలించి శనివారం తినిపిస్తారు. పెద్దవాళ్లయితే ఆ రోజంతా ఏమీ తినరు. సిగరెట్, బీడీలు, మద్యం ముట్టరు. శనివారం కనీసం ఇళ్లు, వాకిళ్లు కూడా ఊడవరు. అందరూ శనివారం ఇంటి వద్దే ఉంటారు. చదవండి: ‘చెప్పు’కోలేని బాధలు.. అన్నదాత అవస్థలుఎంత పని ఉన్నా శనివారం సాయంత్రం 6 గంటల తర్వాతే బయటకు వెళతారు. శనివారం ఎవరైనా చనిపోయినా అంత్యక్రియలు కూడా చేయరు. గ్రామంలోని శ్రీ లహరి కృష్ణ స్తుతి ధ్యాన మందిరంలో శనివారం సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు ప్రార్థనలు చేస్తారు. ఆ తర్వాతే బయటకు వెళతారు. భగవద్గీత, బైబిల్, ఖురాన్.. ఇలా అన్నింటినీ పాటిస్తామని వీరు చెబుతున్నారు. అందరం నియమాలు పాటిస్తాంఇక్కడ ఉన్న వాళ్లందరూ పేద, మధ్య తరగతివారే. శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి శనివారం సాయంత్రం 6 గంటల వరకు ఇంట్లో పొయ్యి వెలిగించరు. లహరి కృష్ణ సమాజంలోని అన్ని కుటుంబాలు ఈ ఆచారాన్ని పాటిస్తాయి. – దాసరి శ్రీనివాస్, ధ్యానమందిరం నిర్వాహకుడు -
శ్వేతసౌధంలో ట్రంప్ మగ్‌షాట్
ఏదైనా కేసులో ఒక నేత అరెస్ట్ అయితే ఆ విషయాన్ని పత్రికా సమావేశంలోనో, మరే సందర్భంలోనో ప్రస్తావిస్తే ఆ నేతకు అస్సలు నచ్చదు. అసలు తనను అన్యాయంగా అరెస్ట్ చేశారని అంతెత్తున లేచి ఖండిస్తారు. అరెస్ట్నాటి ఫొటోలను ఒకవేళ మళ్లీ ఆయన ముందే పెడితే ఉగ్రరూపం దాల్చినా ఆశ్చర్య పోనక్కర్లేదు. అలాంటిది తెంపరితనానికి మారుపేరుగా నిలిచిపోయిన అగ్రరాజ్యానికి అధినేత డొనాల్డ్ ట్రంప్ ఇంకెలా స్పందిస్తారో అని చాలా మంది భావించడం సహజం. కానీ అలాంటి ఆలోచనలకు పటాపంచలు చేస్తూ, విభిన్నంగా ట్రంప్ తన అరెస్ట్ నాటి ఫొటోను పెద్ద సైజులో తీయించి చక్కగా బంగారు రంగు ఫ్రేమ్ కట్టి ఏకంగా అధ్యక్షభవనంలోనే తగిలించారు. అది కూడా ఎక్కడో కనిపించనట్లు ఓ మూలన కాకుండా నేరుగా కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీచేసే ఓవల్ ఆఫీస్ గోడకే తగిలించారు. రెండ్రోజుల క్రితం అమెరికా పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ వైట్‌హౌస్‌కు వెళ్లినప్పుడు అక్కడి మీడియా కెమెరామెన్లు ఓవల్ ఆఫీస్ అంతటినీ తమ కెమెరాల్లో బంధించిన వేళ ఈ మగ్‌షాట్ ఫొటోఫ్రేమ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఏమిటీ మగ్‌షాట్ ? 2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి జార్జియా రాష్ట్రంలో ఫలితాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై నాటి రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్‌ను అరెస్ట్‌చేశారు. ఆ సందర్భంగా 2023 ఆగస్ట్‌లో జార్జియా రాష్ట్రంలోని పుల్టన్ కౌంటీ జైలుకు వచ్చి ట్రంప్ లొంగిపోయారు. కస్టడీలోకి తీసుకునే ముందు అరెస్ట్ అయిన నిందితుడి ముఖం స్పష్టంగా తెలిసేలా దగ్గరి ఫొటో అంటే మగ్ షాట్‌ను నిబంధనల ప్రకారం తీసుకుంటారు. ట్రంప్ ఫొటో సైతం అలాగే తీశారు. మాజీ అధ్యక్షుడిని ఇలా మగ్‌షాట్ తీయడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి. దీంతో ట్రంప్ మగ్‌షాట్ ఆన్లైన్లో విపరీతంగా వైరల్ అయింది. ఆ ఫొటోను ఆనాడు ప్రఖ్యాత న్యూయార్క్ పోస్ట్ సైతం ఫ్రంట్‌పేజీలో ప్రచురించింది. ఆ ఫ్రంట్‌పేజీ కటౌట్నే ట్రంప్ ఫ్రేమ్ కట్టించారు. మగ్షాట్పై నాటి అధికార డెమొక్రాట్లు, నాటి అధ్యక్షుడు జో బైడెన్ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. అయితే ట్రంప్‌కు మద్దతుగా ఇదే మగ్‌షాట్ ఫొటోలను ఆన్లైన్లో ప్రచారానికి రిపబ్లికన్ నేతలు వాడుకున్నారు. తాజాగా మగ్‌షాట్‌ను వైట్‌హౌస్‌లో ఫ్రేమ్ కట్టిన విషయం అందరికీ తెలియడంతో వైట్‌హౌస్ డెప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ డాన్ స్కావినో ఒక పోస్ట్‌చేశారు. ‘‘హ్యాపీ వేలంటైన్ డే. అందమైన ఓవల్ ఆఫీస్‌లోకి మీకందరికీ స్వాగతం’’అని ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌చేశారు. ఈ ఫొటోఫ్రేమ్‌ను మాజీ అమెరికా అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్, ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్‌ల ఫొటోల సమీపంలో తగిలించారు. ఆనాడు అరెస్ట్ అయిన వెంటనే పూచీకత్తు మీద ట్రంప్ విడుదలయ్యారు. ఎలాగూ ఫొటో వైరల్‌గా మారడంతో దీనిని వ్యాపారవస్తువుగా ట్రంప్ మార్చేశారు. స్వయంగా ఆయన తన మగ్‌షాట్ ఫొటోల విక్రయం ద్వారా దాదాపు రూ.61 కోట్లు ఆర్జించారు. టీ–షర్ట్లు మొదలు డిజిటల్ ట్రేడింగ్ కార్డుల దాకా అన్నింటిపైనా ఈ మగ్షాట్నే ముద్రించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆఫ్రికాను చీలుస్తూ... ఆరో మహాసముద్రం
మహాసముద్రాలు ఐదు అని చిన్నప్పుడు చదువుకున్నాం. కానీ ఆరు అని మార్చుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఆఫ్రికా ఖండాన్ని రెండుగా చీలుస్తూ శరవేగంగా ఆరో మహాసముద్రం పుట్టుకొస్తోంది. ఆ క్రమంలో అక్కడి పలు దేశాలను ఆఫ్రికా నుంచి విడదీయనుంది. మరికొన్నింటిని కొత్తగా సముద్ర తీర దేశాలుగా మార్చేయనుంది. ఆఫ్రికా దిగువన జరుగుతున్న టెక్టానిక్ ప్లేట్ల కదలికల వల్ల ఇది తప్పదన్నది తెలిసిన విషయమే అయినా, అందుకు కోట్లాది ఏళ్లు పట్టవచ్చని ఇప్పటిదాకా భావించారు. కానీ తాజా పరిణామాలు చూస్తుంటే ఆరో మహాసముద్రం ఆవిర్భావానికి మహా అయితే కొన్ని వేల ఏళ్ల కంటే ఎక్కువ సమయం పట్టకపోవచ్చని పరిశోధకులు బల్ల గుద్ది చెబుతున్నారు!టెక్టానిక్ ఫలకాల కదలికల కారణంగా ఆఫ్రికా ఖండం నిలువునా చీలిపోతోంది. వేలాది ఏళ్లుగా స్థిరంగా జరుగుతూ వస్తున్న ఈ పరిణామం కొంతకాలంగా అనూహ్య రీతిలో వేగం పుంజుకుంది. ఆఫ్రికా ఖండం దిగువన నుబియన్, సోమాలీ, ఖండాంతర టెక్టానిక్ ప్లేట్లలో జరుగుతున్న కదలికలే దీనికి ప్రధాన కారణం. అవి ఏటా ఏకంగా దాదాపు ఒక సెంటీమీటర్ మేరకు దూరం జరుగుతున్నాయి! ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ సిస్టం (ఈఏఆర్ఎస్)గా పిలిచే ఈ ప్రాంతం ఇది మొజాంబిక్ నుంచి ఇథియోపియా, కెన్యా, టాంజానియా మీదుగా ఎర్రసముద్రం దాకా వేలాది కిలోమీటర్ల మేర విస్తరించింది. దాని పొడవునా భూగర్భంలో వేలాది ఏళ్లుగా అతి నెమ్మదిగా సాగుతూ వస్తున్న నిరంతర టెక్టానిక్ కదలికల పరిణామం కొన్నాళ్లుగా స్పీడందుకుంది. తూర్పు ఆఫ్రికాను నిలువునా చీలుస్తోంది. ఫలితంగా చివరికి తూర్పు ఆఫ్రికా క్రమంగా మిగతా ఖండం నుంచి పూర్తిగా విడిపోనుంది. వాటి మధ్య ఏర్పడే ఖాళీలో ఏకంగా 10 వేల బిలియన్ గ్యాలన్ల పై చిలుకు అపార జలరాశి నిండిపోయి సరికొత్త మహాసముద్రంగా రూపుదిద్దుకోనుంది. ఇందుకు సంబంధించిన నిదర్శనాలు ఇప్పటికే కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఇథియోపియాలో 2005 నాటికే ఏకంగా 60 మైళ్ల పొడవున లోతైన గుంత ఏర్పడింది. ఇది పలుచోట్ల ఏకంగా 20 మీటర్ల పై చిలుకు లోతుంది! 2018లో కెన్యాలో కూడా ఇలాంటి భారీ పగుళ్లు పుట్టుకొచ్చాయి. కారణాలెన్నో... టెక్టానిక్ కదలికలతో పాటు భూమి లోపలి పొరల్లోని శిలాజ ద్రవం తూర్పు ఆఫ్రికా చీలికను మరింత వేగవంతం చేస్తోంది. క్రమంగా లోపలి పొర పూర్తిగా పగుళ్లిచ్చి భారీ లోయల పుట్టుకకు దారితీస్తుంది. అగి్నప్రమాద కార్యకలాపాలను పెంచుతుంది. 2005లో ఇథియోపియాలో కేవలం కొన్ని వారాల వ్యవధిలోనే ఏకంగా 420కి పైగా భూకంపాలు నమోదయ్యాయి. ఈ పరిణామం సైంటిస్టులతో పాటు పరిశోధకులను కూడా ఎంతగానో ఆశ్చర్యపరిచింది. ఆఫ్రికా ఖండం దిగువ భూ ఫలకాల్లో మార్పులు శరవేగంగా జరుగుతున్నాయనేందుకు ఇది తిరుగులేని నిదర్శనమని వారంటున్నారు. ఇకపై ఆఫ్రికాలో మరిన్ని భూకంపాలు, అగి్నపర్వతాల పేలుళ్ల వంటి పరిణామాలను చూడనున్నామని తులానే వర్సిటీ జియో సైంటిస్టు సింథియా ఎబింగర్ చెప్పుకొచ్చారు. అట్లాంటిక్ ఇలాగే పుట్టింది... మహాసముద్రాల్లో వయసురీత్యా అట్లాంటిక్ అన్నింటికంటే చిన్నది. ప్రస్తుత ఆఫ్రికా ఖండం తరహా పగుళ్లే లక్షలాది ఏళ్ల క్రితం దాని పుట్టుకకు దారితీసినట్టు సైంటిస్టులు చెబుతారు. తర్వాత మళ్లీ ఇంతకాలానికి మరో మహాసముద్రం పుట్టుకకు దారి తీయగల స్థాయిలో ఓ ఖండం నిలువునా చీలుతోంది. మహాసముద్రాల ఆవిర్భావ క్రమాన్ని అర్థం చేసుకునేందుకు ఇది చాలా అరుదైన అవకాశమని సైంటిస్టులు అంటున్నారు.కొత్త ఖండం కూడా... ఆఫ్రికా చీలిక ఆరో మహాసముద్రంతో పాటు కొత్త ఖండం పుట్టుకకు కూడా దారితీయనుంది. ఎందుకంటే సోమాలియా, కెన్యా, టాంజానియా వంటి దేశాలు ఆఫ్రికా నుంచి పూర్తిగా విడిపోతాయి. ఆరో సముద్రం ఆ మధ్యలో విస్తరిస్తుంది.లక్షల్లో నిర్వాసితులు... వాతావరణ మార్పుల దెబ్బకు ఆఫ్రికా ఖండంలో ఇప్పటికే 1.5 కోట్ల మందికి పైగా నిర్వాసితులయ్యారు. ఆ ఖండంలో ఏర్పడుతున్న చీలిక వల్ల పలు దేశాల్లో జీవజాలం తీవ్రంగా ప్రభావితం అవుతుంది. దాంతో మొత్తంగా వాటి ఆర్థిక పరిస్థితులే తారుమారు కానున్నాయి. దాంతో పొట్ట చేత పట్టుకుని వలస వెళ్లే వారి సంఖ్య ఊహాతీతంగా పెరిగిపోనుంది. కొత్త మహాసముద్రం ఆఫ్రికా భౌగోళిక స్వరూపాన్నే సమూలంగా మార్చనుంది. పలు దేశాల ఆర్థిక, పర్యావరణ, మౌలిక వ్యవస్థలనే తలకిందులు చేయనుంది. చుట్టూ భూభాగాలతో కూడిన జాంబియా, ఉగాండా వంటి దేశాలు కొత్త సముద్ర తీర ప్రాంతాలు మారిపోతాయి. దాంతో కొత్త వర్తక మార్గాలు, ఆ దేశాల్లో నౌకాశ్రయాల వంటివి పుట్టుకొస్తాయి. అలా ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలే సమూలంగా మారిపోతాయి. సరికొత్త సముద్ర వాతావరణ పరిస్థితులు కొత్త ఆవాస ప్రాంతాలుగా మారతాయి. ఈ పరిణామం జీవవైవిధ్యంలో చెప్పుకోదగ్గ మార్పులకు దారి తీస్తుంది. అదే సమయంలో సముద్రమట్టంలో పెరుగుదల మరింత వేగంపుంజుకుంటుంది. భూభాగాల్లో మార్పుచేర్పులు చోటుచేసుకుంటాయి. అంతేగాక పలుచోట్ల తరచుగా తీవ్ర భూకంపాలు సంభవించవచ్చు. ఇలాంటి పరిణామాల వల్ల వచ్చిపడే తీవ్రమైన రిసు్కలను ఎదుర్కొనేందుకు పలు దేశాలు ఇప్పటినుంచే సిద్ధపడాల్సి ఉంటుంది. కొత్త మహాసముద్రం ఆవిర్భావం వేలాది ఏళ్ల తర్వాత జరిగినా ఆ క్రమంలో తలెత్తే పరిణామాలు ఆఫ్రికా ఖండంపై సమీప భవిష్యత్తు నుంచే కొట్టొచ్చినట్టుగా కన్పించడం మొదలవుతుంది. భూగోళం నిరంతరం పరిణామం చెందుతున్న తీరుకు ఈ పరిణామం మరో తాజా ఉదాహరణ. దీని ప్రభావాలను పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నంలో భూభౌతిక శాస్త్రవేత్తలు ఇప్పటికే తలమునకలయ్యారు. ఎందుకంటే తూర్పు ఆఫ్రికాలో జరుగుతున్నది కేవలం భౌగోళికపరమైన మార్పు మాత్రమే కాదు. సుదూర భవిష్యత్తులో మరిన్ని ఖండాలు విడిపోయి కొత్త మహాసముద్రాల పుట్టుక వంటివి జరిగి చివరికి మనకిప్పుడు తెలిసిన ప్రపంచమే సమూలంగా, శాశ్వతంగా మారిపోతుందనడానికి తిరుగులేని నిదర్శనం. ఆరో మహాసముద్రం ఆవిర్భావంతో ప్రపంచ భౌగోళిక స్వరూపంతో పాటు పర్యావరణ వ్యవస్థలు కూడా సమూల మార్పులకు లోనవడం ఖాయమని భూ¿ౌతిక శాస్త్రవేత్తలు కుండబద్దలు కొడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆహా.. ఏమి టీ!
రోజూ ఇంట్లో పొద్దున్నే చాయ్ చేసి కుటుంబసభ్యులకు అందించే చేతులు.. ఇప్పుడు అదే చాయ్‌తో, అదే కుటుంబానికి ఆదాయాన్ని అందిస్తున్నాయి. స్వయం ఉపాధితోపాటు మరొకరికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో స్త్రీ టీ క్యాంటీన్లు నడుపుతున్న మహిళల విజయ ప్రస్థానమిది. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ చొరవతో ఏర్పాటైన ఈ క్యాంటీన్లు విజయవంతంగా నడుస్తున్నాయి. దీంతో మరికొన్ని క్యాంటీన్ల ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధమవుతోంది. - సాక్షి ప్రతినిధి, ఖమ్మంఉపాధి కల్పనే లక్ష్యం స్వయం సహాయక సంఘాల మహిళలకు స్థిరమైన ఆదాయ మార్గం చూపించాలని భావించిన కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్.. అందుకోసం వారితో టీ క్యాంటీన్లు ఏర్పాటు చేయించాలని సంకల్పించారు. అందుకోసం అన్ని శాఖల అధికారులతో చర్చించి ముందుడుగు వేశారు. టీ క్యాంటీన్‌కు ప్రత్యేక లోగో, బ్రాండ్ తయారు చేయించారు. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా మొదటి విడతలో జిల్లాలో 41 షాపులు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. తొలి షాపును కలెక్టరేట్ వద్దే ప్రారంభించారు.కలెక్టరేట్ ఆవరణలోని క్యాంటీన్ ఆదాయంతో పోలిస్తే గేటు బయట ఏర్పాటైన స్త్రీ టీ క్యాంటీన్‌కు రెట్టింపు ఆదాయం వస్తుండటంతో ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 10, మండలాల్లో మరో 30కి పైగా మంజూరు చేశారు. ప్రస్తుతం 22 టీ క్యాంటీన్లను నడుస్తున్నాయి. మొత్తం 300 వరకు స్త్రీ టీ క్యాంటీన్లు ఏర్పాటుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటి ఏర్పాటుకు బ్యాంకు లింకేజీతో సంఘం తరఫున రూ.1.5 లక్షల వరకు రుణం అందిస్తున్నారు. సంఘంలోని మహిళలందరికీ ఒకటే కాకుండా అర్హత, ఆసక్తిని బట్టి ఒక్కొక్కరికి ఒక క్యాంటీన్ కేటాయిస్తున్నారు. నిరంతరం పర్యవేక్షణ... స్త్రీ టీ క్యాంటీన్ మంజూరు చేసే సమయంలో లబ్ధిదారులు గతంలో ఏదైనా వ్యాపారం చేశారా లేదా? అన్నది పరిగణనలోకి తీసుకున్నారు. యూనిట్ కేటాయించాక ఏ మేరకు లాభాలుంటాయనే అంశంపై రెండు నెలలపాటు మండల, జిల్లా సమాఖ్యల్లో చర్చించారు. చట్టాలు, పన్నుల చెల్లింపు, వ్యాపార నిర్వహణపై 400 మంది మహిళలకు హైదరాబాద్‌కు చెందిన నిపుణులతో శిక్షణ ఇప్పించారు. ఆపై రద్దీ ప్రాంతాలను గుర్తించి క్యాంటీన్లు ఏర్పాటుచేయించారు.అంతటితో వదిలేయకుండా మూడు నెలల పాటు వాటి నిర్వహణ, లాభాలను పరిశీలిస్తున్నారు. కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ ఈ అంశాలపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. యూనిట్లలో దివ్యాంగులకు 25 శాతం కేటాయించారు. టీతోపాటు కూల్‌డ్రింక్స్, ఇతరత్రా కలిపి కాస్త పెద్ద యూనిట్లు కూడా ఏర్పాటుచేయించాలని నిర్ణయించారు. ఇవి ఖమ్మం కార్పొరేషన్లో మూడు, మండలాల్లో 10 వరకు ఏర్పాటు కానున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిశాక ఇవి గ్రౌండ్ అవుతాయి. పదేళ్ల తర్వాత కూడా కొనసాగాలనే సంకల్పంతో ఈ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నారు.ఇంకొకరికి ఉపాధి గ్రామంలో మాకు టీ స్టాల్ ఉన్నా పెద్దగా ఆదాయం ఉండేది కాదు. కలెక్టర్ ఇచ్చిన అవకాశంతో కలెక్టరేట్ వద్ద టీ స్టాల్ పెట్టాను. ఇప్పుడు మరొకరికి ఉపాధి కల్పిస్తున్నా. నెలకు రూ.30 వేల వరకు ఆదాయం వస్తుండగా, రూ.10 వేలు మిగులుతున్నాయి. – పోతగాని రాజేశ్వరి, స్త్రీ టీ క్యాంటీన్ ఓనర్, కలెక్టరేట్ బస్టాప్, ఖమ్మం. స్వయం ఉపాధి లభించింది.. మా స్త్రీ టీ క్యాంటీన్ గతనెల 4న ప్రారంభమైంది. ప్రస్తుతం టీ, కాఫీ, అల్లం టీ అమ్ముతున్నాం. కరెంట్ సౌకర్యం రాగానే పాలు, పెరుగు కూడా అమ్ముతాం. రోజురోజుకు వ్యాపారం పుంజుకుంటోంది. మొదటి నెల రూ.50 వేలు వచి్చంది. రుణ కిస్తీ చెల్లించగా.. కొంత మిగులుతోంది. – శ్రీరంగం గీత, జలగం నగర్, నవ్య గ్రామసమాఖ్య. మహిళల ఆర్థిక ఎదుగుదల కోసమే.. మహిళలు స్వయం ఉపాధి పొందాలనే ఉద్దేశంతో స్త్రీ టీ క్యాంటీన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టాం. ప్రభుత్వం తరఫున యూనిట్ గ్రౌండింగ్ చేశాం కదా అని వదిలేయకుండా స్థల గుర్తింపు, ఏమేం అమ్మాలి, నాణ్యతపై క్షుణ్ణంగా చర్చించి, శిక్షణ ఇప్పించాకే ముందడుగు వేశాం. యూనిట్ ఏర్పాటయ్యాక నిత్యం పరిశీలిస్తూ ఏళ్ల తరబడి కొనసాగేలా చూస్తున్నాం. – ముజమ్మిల్‌ఖాన్, కలెక్టర్, ఖమ్మం. -
శాటిలైట్ టెలికం.. మన దేశంలోకి వెల్కం!
మనం ఇప్పుడు జేబులో సెల్‌ఫోన్ పెట్టుకుని గడిపేస్తున్నాం. ఎక్కడున్నా కాల్స్, మెసేజీలు పంపడం, అందుకోవడం దగ్గరి నుంచి ఇంటర్నెట్ దాకా యథాలాపంగా వాడేస్తున్నాం. కానీ అడవులు, ఎడారులు, మారుమూల ప్రాంతాల్లో మొబైల్ సేవలు సరిగా అందవు. అలాంటి చోట మంచి పరిష్కారం శాటిలైట్ టెలికం సేవలు. ఇక్కడా, అక్కడా అని లేకుండా ఎక్కడైనా సరే... సిగ్నల్స్ అందుకోగలగడం దాని ప్రత్యేకత.త్వరలోనే ఈ శాటిలైట్ టెలికం సేవలు మన దేశంలో అందుబాటులోకి రానున్నాయి. భారత టెలికం రంగం మరో మెట్టు ఎక్కబోతోంది. అయితే శాటిలైట్ ఆధారిత టెలికం సేవలు సామాన్యుడికి చేరడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా ప్రారంభదశలోనే ఉండటం, వీటి ధరలు, ఈ సాంకేతికతను వినియోగించగల హ్యాండ్ సెట్ల ధరలు ఎక్కువగా ఉండటం దీనికి కారణమని పేర్కొంటున్నారు. – నూగూరి మహేందర్, సాక్షి ప్రతినిధికాస్త ఖరీదైనవే.. శాట్‌కామ్ సేవలు ఖరీదైనవే. దేశంలో టెల్కోల హోమ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు నెలకు కనీసం రూ.400 నుంచి రూ.4,000 వరకు ఉంటాయి. అవసరాన్ని, తాహతును బట్టి ఎంచుకోవచ్చు. కానీ ఉపగ్రహ టెలికం, ఇంటర్నెట్ వ్యయాలు అంతకు 7 నుంచి 18 రెట్లు ఖరీదైనవని జేఎం ఫైనాన్షియల్స్ సంస్థ వెల్లడించింది. సైన్యం, నావికా దళం, మారుమూల ప్రాంతాల్లో వ్యాపార కార్యకలాపాలు సాగించే సంస్థలకు శాటిలైట్ కమ్యూనికేషన్స్ ఉపయోగకరం. ఆతిథ్య రంగంలో లగ్జరీ హోటళ్లు, కొండ ప్రాంతాల్లో రిసార్టులు ఏర్పాటు చేసే సంస్థలు తమ వినియోగదారుల కోసం శాటిలైట్ సేవలను వినియోగించుకునే అవకాశం ఉంది.ఈ క్రమంలో తొలుత బిజినెస్ టు బిజినెస్ విభాగంలో శాటిలైట్ టెలికం సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ప్రముఖ టెలికం కంపెనీ ప్రతినిధి ఒకరు ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు తెలిపారు. ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్ లింక్ కంపెనీ కెన్యాలో ఒక్కో యాంటెన్నాకు నెలకు 30 డాలర్లు వసూలు చేస్తోందని.. ఇతర దేశాల్లో అది 100 డాలర్లు, అంతకంటే అధికంగా ఉందని చెప్పారు. మన దేశంలో ప్రవేశపెడితే ధర ఎంతనేది తెలుస్తుందని పేర్కొన్నారు. ఇక ఇండియా మొబైల్ కాంగ్రెస్ వేదికగా యూటెల్‌శాట్ వన్‌వెబ్ తన సత్తాను ప్రదర్శించిందని.. ఆ సంస్థతో చేతులు కలిపేందుకు భారత సైన్యం ముందుకు వచ్చిందని వెల్లడించారు.రెండు సంస్థలకు లైసెన్స్.. మరొకటి వెయిటింగ్.. శాట్‌కామ్ సేవలు భారత్‌లో అందించాలంటే కంపెనీలకు ‘గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ (జీఎంపీసీఎస్)’లైసెన్స్, ‘ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్–ఆథరైజేషన్ సెంటర్ (ఇన్‌స్పేస్)’లైసెన్స్ ఉండటం తప్పనిసరి. ప్రస్తుతం కేంద్రం నుంచి వన్‌వెబ్ ఇండియా కమ్యూనికేషన్స్, జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్ సంస్థలు శాటిలైట్ కమ్యూనికేషన్స్ లైసెన్స్ దక్కించుకున్నాయి. వన్‌వెబ్ ఇండియా.. యూటెల్‌శాట్ భాగస్వామ్యంతో భారతీ ఎయిర్టెల్ ప్రమోట్ చేయగా... లక్సెంబర్గ్‌కు చెందిన ఎస్ఈఎస్ సంస్థతో రిలయన్స్ జియో చేతులు కలిపి.. జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్‌ను ప్రమోట్ చేస్తోంది.ఇప్పటికే పలు దేశాల్లో సేవలు అందిస్తున్న యూటెల్‌శాట్ వన్‌వెబ్ గుజరాత్, తమిళనాడులో బేస్ స్టేషన్లను ఏర్పాటు చేసిందని, అనుమతులు రాగానే సేవలు ప్రారంభిస్తామని భారతీ ఎంటర్ప్రైజెస్ వైస్ చైర్మన్ రాజన్ భారతీ మిత్తల్ ఇటీవలే ప్రకటించారు. ఇక జియో–ఎస్ఈఎస్కు సైతం భారత్‌లో రెండు ప్రాంతాల్లో బేస్ స్టేషన్స్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ రంగంలో టాప్‌లో ఉన్న స్టార్‌లింక్ సంస్థ 100కుపైగా దేశాల్లో ఇప్పటికే సర్విసులు ప్రారంభించింది. భారత్‌లో లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంది. అమెజాన్‌కు చెందిన కైపర్ కూడా ఇక్కడ అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి.ఎవరి సామర్థ్యం వారిదే.. తమకు భూమిచుట్టూ కక్ష్యలో 6,900కుపైగా ఇంటర్నెట్ ఉపగ్రహాలు ఉన్నాయని స్టార్‌లింక్ చెబుతోంది. యూటెల్‌శాట్ వన్‌వెబ్ ఖాతాలోని ఉపగ్రహాల సంఖ్య 635కుపై మాటే. ఇక ప్రపంచ జనాభాలో 99 శాతం మందికి వీడియో, డేటా సేవలను అందించగలిగేలా రెండు వేర్వేరు కక్ష్యలలో పనిచేస్తున్న దాదాపు 70 ఉపగ్రహాలను కలిగి ఉన్నట్టు ఎస్ఈఎస్ సంస్థ తెలిపింది. 100 కోట్లకుపైగా టీవీ వ్యూయర్స్, టాప్–10 గ్లోబల్ టెలికం కంపెనీల్లో ఏడింటికి, ప్రపంచంలోని ఆరు ప్రధాన క్రూజ్ లైన్స్‌లో ఐదింటికి తాము సేవలు అందిస్తున్నట్టు వెల్లడించింది.వైఫై తరహాలో సేవలు.. శాటిలైట్ నుంచి సిగ్నల్స్ అందుకోవడానికి చిన్న యాంటెన్నా ఏర్పాటు చేస్తారు. ఆ యాంటెన్నా వైఫై జోన్ మాదిరిగా పనిచేస్తుంది. దాని ద్వారా కాల్స్, ఎస్సెమ్మెస్‌లు చేసుకోవచ్చు. సాధారణ ఫోన్లు వాడేవారి నుంచి కాల్స్ అందుకోవాలంటే.. సంబంధిత సంస్థకు బేస్‌స్టేషన్ ఉండాలి. సాధారణ కస్టమర్ కాల్ చేస్తే ఆ బేస్‌స్టేషన్ ద్వారా శాటిలైట్‌కు, అక్కడి నుంచి యాంటెన్నా పరిధిలో ఉన్న వినియోగదారులకు కనెక్ట్ అవుతుంది. సాధారణ కాల్స్, సందేశాలకు మాత్రమే శాటిలైట్ ఆధారిత టెలికం సేవలు ఉపయుక్తం. 4జీ, కేబుల్ బ్రాడ్‌బ్యాండ్ మాదిరి వేగంగా డేటాను అందుకునే అవకాశం తక్కువ.ప్రభుత్వమే స్పెక్ట్రమ్ కేటాయించి.. శాటిలైట్ టెలికం బేస్‌స్టేషన్ పనిచేయాలంటే ప్రత్యేక స్పెక్ట్రమ్ (తరంగ దైర్ఘ్యం) కేటాయింపులు అవసరం. లైసెన్స్ పొందిన కంపెనీలకు ప్రభుత్వం ఇంకా దీనిని కేటాయించలేదు. శాటిలైట్ సేవల కోసం ప్రభుత్వం స్పెక్ట్రమ్ కేటాయిస్తుంది (అడ్మినిస్ట్రేటివ్ అలకేషన్). దీనిని అన్ని కంపెనీలు పంచుకోవాల్సి ఉంటుంది. అలాకాకుండా రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు స్పెక్ట్రమ్ వేలం వేయాలని ప్రతిపాదించాయి. విదేశీ సంస్థలు స్టార్‌లింక్, ప్రాజెక్ట్ కైపర్‌లు మాత్రం అడ్మినిస్ట్రేటివ్ కేటాయింపుల విధానం అమలు చేయాలని కోరాయి. బ్రెజిల్ గతంలో స్పెక్ట్రమ్ వేలం వేసి విఫలమై ప్రస్తుతం అడ్మినిస్ట్రేటివ్ మార్గాన్ని ఎంచుకుందని వివరిస్తున్నాయి. దీనితో మన దేశం కూడా అడ్మినిస్ట్రేటివ్ మార్గం అనుసరించాలని నిర్ణయించింది.కొన్ని ఫోన్ మోడల్స్‌లోనే అందుబాటులో.. శాటిలైట్ ఆధారిత టెలికం సేవలు అందుకోవాలంటే మొబైల్ ఫోన్లో ప్రత్యేక ఏర్పాటు తప్పనిసరి. యాపి ల్ తయారీ ఐఫోన్–14, ఆ తర్వాతి మోడళ్లు శాటిలైట్ కనెక్టివిటీని సపోర్ట్ చేస్తాయి. గూగుల్ పిక్సెల్ 9 సిరీస్, సామ్సంగ్ గెలాక్సీ ఎస్25 ఈ వరుసలో ఉన్నాయి. ఇవేగాక ప్రత్యేక శాటిలైట్ ఫోన్స్ కూడా లభిస్తాయి. ఇరీడియం 9555, ఇన్మాశాట్ ఐశా ట్ ఫోన్ 2, థురాయో ఎక్స్‌టీ–లైట్, గ్లోబల్ స్టార్ జీఎస్పీ–1700 మోడళ్లను ఎయిర్టెల్ విక్రయిస్తోంది. వీటి ధరలు రూ.70 వేల నుంచి రూ.1.20 లక్షల వరకు ఉన్నాయి. పోస్ట్ పెయిడ్ ప్లాన్ల ధర రూ.1,500 నుంచి ప్రారంభమవుతుంది. పరిమితి దాటితే ప్రతి నిమిషానికి అదనంగా చార్జీ చెల్లించాల్సి ఉంటుంది.శాట్‌కామ్ అంటే.. శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థలు (శాట్‌కామ్) డేటా, వాయిస్‌ను ప్రసారానికి, స్వీకరణకు ఉపగ్రహాలపై ఆధారపడతాయి. అదే మామూలు టెలికం సేవలు ఫైబర్ ఆప్టిక్స్, ఇతర కేబుళ్లపై ఆధారపడతాయి. శాట్‌కామ్ సేవలకు ఇటువంటి మౌలిక సదుపాయాల అవసరం లేదు. భారత్‌లో సాధారణ నెట్వర్క్ 98 శాతం భూ భాగంలో విస్తరించి ఉంది. అయితే ఈ సంప్రదాయ నెట్‌వర్క్‌లను ఏర్పా టు చేయడం ఆర్థికంగా, లాభపరంగా సాధ్యంకాని కొండలు, గుట్టలు, అడవులు, మారుమూల ప్రాంతాల్లో శాట్‌కామ్ సేవలు ప్రయోజనకరంగా ఉంటాయి. అత్యవసర పరిస్థితులు, తీవ్ర వాతావరణ పరిస్థితులలో కూడా ఇవి పనిచేయగలవు. -
కట్టుబడినందుకు కట్టడి చేశారు
అమెరికాలో దాదాపు వందకు పైగా సంచలనాత్మక కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీచేసిన డొనాల్డ్ ట్రంప్ అక్కడి అసోసియేటెడ్ ప్రెస్ వార్తాసంస్థపై కత్తిగట్టారు. అమెరికా తీరప్రాంతమైన ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’పేరును ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా’గా మారుస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. అయినాసరే పాత పేరునే తమ రోజువారీ వార్తల్లో, కథనాల్లో వినియోగిస్తామని అసోసియేటెడ్ ప్రెస్ (ఏపీ) కరాఖండీగా చెప్పింది. దీంతో అధ్యక్షుడి నిర్ణయాన్నే బేఖాతరు చేస్తారా అన్న ఆగ్రహంతో ట్రంప్ పాలనాయంత్రాంగం శుక్రవారం నుంచి ఏపీ పాత్రికేయులకు అధ్యక్షభవనం, ఎయిర్‌ఫోర్స్ వన్ అధ్యక్ష విమానంలో రిపోర్టింగ్ కోసం అనుమతి నిరాకరించింది. అన్ని దేశాల్లో దినపత్రికలు, మేగజైన్లు, ఇతర వార్తాసంస్థలకు రోజువారీ వార్తలు, కథనాలు అందించే ప్రపంచంలో అతిపెద్ద న్యూస్‌ఏజెన్సీల్లో ఏపీ కూడా ఒకటి. ఇంతటి కీలకమైన బాధ్యతలు నిర్వర్తించే తమ ప్రతినిధులను అధ్యక్షభవనం వంటి ముఖ్యమైన చోటుకు రానివ్వకపోవడంపై ‘ఏపీ’తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ఇది వార్తాస్వేచ్ఛను అడ్డుకోవడమేనని వ్యాఖ్యానించింది. దీనిపై ట్రంప్ ప్రభుత్వం స్పందించింది. ‘‘అధ్యక్షుని నిర్ణయాన్ని బేఖాతరు చేయడమంటే వార్తల్లో విభజన తెచ్చే సాహసం చేయడమే. పైగా తప్పుడు విషయాన్ని అందరికీ చేరవేయడమే. అధ్యక్షుని నిర్ణయానికి గౌరవం ఇవ్వని వ్యక్తులకు వైట్‌హౌస్‌లో, ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో తగు స్థానం లేదు. ఆ స్థానాన్ని ఇన్నాళ్లూ వైట్‌హౌస్‌లోకి రాలేక రిపోర్టింగ్ చేయలేకపోయినా ఇతర మీడియా ప్రతినిధులకు కల్పిస్తాం’’అని వైట్‌హౌస్ డెప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ టేలర్ బుడోవిచ్ వాదించారు. దీనిపై ఏపీ మళ్లీ స్పందించింది. ‘‘అమెరికన్ వినియోగదారులను మినహాయిస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా వినియోగదారులకు ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’అనే పేరు వాస్తవం. ఆ దృక్కోణంలో పాత పేరుకే కట్టుబడి ఉన్నాం. ఈ విషయంలో అధ్యక్షుడు కార్యనిర్వాహక ఉత్తర్వును ధిక్కరించినట్లుగా భావించకూడదు’’అని ఏపీ స్పష్టంచేసింది. దశాబ్దాలుగా పూల్ రిపోర్టర్‌గా.. ప్రముఖ మీడియా సంస్థల కొద్దిపాటి మీడియా ప్రతినిధులు, కెమెరామెన్లకు మాత్రమే వైట్‌హౌస్, ఎయిర్‌ఫోర్స్ వన్ వంటి కీలక ప్రదేశాల్లోకి అనుమతిస్తారు. ఇది దశాబ్దాలుగా కొనసాగుతోంది. నాటి అమెరికా అధ్యక్షుడు జేమ్స్ ఏ గార్ఫీల్డ్ హత్యోదంతం తర్వాత కొద్దిమంది మీడియా వాళ్లనే అనుమతించడం మొదలెట్టారు. ఇది 1881 ఏడాదినుంచి మొదలైంది. ఈ మీడియా బృంద సభ్యులను పూల్ రిపోర్టర్ అంటారు. ‘ఏపీ’ప్రతినిధి చాన్నాళ్లుగా ఇలా పూల్ రిపోర్టర్‌గా కొనసాగుతున్నారు. తమను లోపలికి అనుమతించకపోవడం పూర్తి వివక్షాపూరిత నిర్ణయం అని ఏపీ ప్రతినిధి ఒకరు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేయాలని ‘ఏపీ’భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్క ఏపీనే బయటకు గెంటేయడంపై వైట్‌హౌస్‌లోని ‘ది వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్(డబ్ల్యూహెచ్‌సీఏ)’తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ‘‘ప్రస్తుతానికైతే ఏపీకి బదులు రొటేషన్‌లో భాగంగా వేరే ప్రతినిధికి అవకాశం కల్పిస్తాం. సాధారణంగా ప్రతి రోజూ రొటేషన్‌లో ఏపీకి అవకాశం ఉంటుంది. కానీ ఇలా ఏకపక్షంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అమెరికా రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే. భావప్రకటనా స్వేచ్ఛకు భంగం వాటిల్లజేస్తూ ప్రభుత్వం సెన్సార్‌షిప్‌కు తెరలేపుతోంది’’అని డబ్ల్యూహెచ్‌సీఏ ఒక ప్రకటనలో తెలిపింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వరంగల్ పేరు ఎలా వచ్చిందంటే..?
ఖిలా వరంగల్: రాజులు పోయారు.. రాజ్యాలు అంతరించాయి. రాచరికపు వైభోగాలు కనుమరుగయ్యాయి. కానీ నాటి కట్టడాలు, జ్ఞాపకాలు నేటికీ చెక్కు చెదరలేదు. శతాబ్దాల చరిత్ర.. శత్రు దుర్బేధ్య నగరం.. శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది ఏకశిల కొండ. నాడు ఏకశిల నగరం, ఓరుగల్లుగా పలు పేర్లతో ప్రఖ్యాతిగాంచింది. కాలక్రమేణా దీనికి వరంగల్ (Warangal) పేరు స్థిరపడింది. వారసత్వ నగరంగా.. భారతదేశంలోని ఉత్తమ వారతస్వ నగరాల్లో ఒకటిగా ఓరుగల్లు (Orugallu) గుర్తింపు పొందింది. ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాద్ (Hyderabad) నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద నగరం. ఓరు.. అంటే ఒకటి, గల్లు.. అనే పదానికి రాయి అని అర్థాలున్నాయి. 11వ శతాబ్ధంలో ఈ అందమైన నగరాన్ని నిర్మించారు. ఈ ప్రాంతాన్ని 300 ఏళ్లు కాకతీయులు పాలించారు. ఈ కాలాన్ని స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు. రాజధానిగా చెప్పుకుంటున్న ఖిలా వరంగల్ కోట అద్భుతమైన పురాతన కట్టడాలు, అనేక స్మారక చిహ్నాలు, వాస్తు శిల్ప కళా సంపదకు నిలయం. వరంగల్ పేరు ఎలా వచ్చిందంటే.. కాకతీయుల రాజధానిగా చెప్పుకునే ఖిలా వరంగల్ కోటలో ఏకశిల గుట్ట (ఎత్తయిన రాతి కొండ)గా ఉంది. ఏక (ఒక) శిల (రాయి) ఏకశిలా నగరం.. దీన్నే ఓరు (ఒకటి) గల్లు (రాయి) అని.. ఈ ఎత్తయిన కొండ పేరుతోనే ఓరుగల్లు నగరంగా పిలుస్తుంటారు. శతాబ్దాల కాలం నుంచి ఏకశిల, ఓరుగల్లు నగరం కనుమరుగై.. ప్రస్తుతం వరంగల్‌గా పేరొందింది. అందాల కొండ ఏకశిల గుట్టను ఎక్కి చూస్తే.. నగరంతోపాటు చుట్టు పక్క గ్రామాలు, కొండలు, గుట్టలు, కనువిందు చేస్తాయి. ఈకొండపై ఆలయం, బురుజు, సైనిక స్థావరం, విశ్రాంతి గదులు, ఆనవాళ్లు నేటికీ ఉన్నాయి. ఈ కొండపై ఉన్న ఎత్తయిన బురుజుపై ఫిరంగి, భారీ తోపులు ఏర్పాటు చేశారు. శత్రు సైన్యం రాకను పసిగట్టినప్పుడు ఫిరంగులు, తోపుల్ని పేల్చడం వల్ల.. కోట చుట్టూ ఉన్న సైన్యం అప్రమత్తమయ్యేదని చరిత్రకారులు చెబుతున్నారు. కొండపై సైనిక స్థావరం హనుమకొండ పద్మాక్షి దేవాలయం కేంద్రంగా మూడు కొండలను ఏకం చేసి కాకతీయుల తొలి రాజధానిని ఏర్పాటు చేశారు. కాకతీమాత అనుగ్రహంతో గణపతి దేవ చక్రవర్తి 1199 నుంచి 1262 మధ్యకాలంలో రాజధానిని ఓరుగల్లుకు మార్చేసి 300 ఏళ్ల పాటు సుస్థిర పాలన అందించారు. తొలుత 3వేల ఆడుగుల ఎత్తయిన ఏకశిల కొండపై సైనిక స్థావరం ఏర్పాటు చేశారు. ఇందుకు కొండపై ఎత్తయిన బురుజే సాక్ష్యం. బురుజు ఎక్కేందుకు అంతర్భాగంలోనే వేర్వేరుగా మెట్ల మార్గాలు ఏర్పాటు చేశారు. మెట్ల మార్గం ఎక్కి చూస్తే నగరంతోపాటు చుట్టూ ఉన్న కొండలు గుట్టలు, అందమైన నగరం కనువిందు చేస్తాయి. బురుజుపై తోపులు పెట్టి పేల్చిన ఆనవాళ్లు నేటికీ ఉన్నాయి. సైనికులు గాయపడకుండా.. నిలువెత్తు పటిష్టమైన నాలుగు రాళ్లు నాలుగు వైపులా నిలబెట్టి ఉంటాయి. దీనిపైకి పర్యాటకులు ఎక్కి.. రాతి కట్టడాలు.. ఆహ్లాదకర వాతావరణాన్ని తిలకించి ఆస్వాదిస్తున్నారు. సైనికులకు విశ్రాంతి గదులు ఆనాడు కొండపై సైనికులకు విశ్రాంతి గదులు నిర్మించారు. ఫిరంగుల్లో మందు నింపేందుకు ప్రత్యేక గదులు వేర్వేరుగా ఉండేవని చెబుతారు. ఈ నిర్మాణాలన్నీ 20 ఏళ్ల క్రితం వరకు బాగానే ఉన్నప్పటికీ.. ఆదరణ లేక శిథిలమై కూలిపోయాయి. ఈగుట్టపైకి రహస్య సొరంగ మార్గాలు ఉండేవని.. వాటి ద్వారా చేరుకుని సైనికులకు మార్గనిర్ధేశం చేసేవారని చరిత్రకారులు చెబుతున్నారు. చదవండి: ఇజ్రాయెల్‌లో తెలుగువారి ఇక్కట్లు అభివృద్ధికి దూరంగా.. ఏకశిల గుట్ట నేటికీ అభివృద్ధికి దూరంగా ఉంది. గుట్టపై విశాలమైన ప్రాంగణం కనిపిస్తుంది. కనీసం ఐదువేల మంది ఇక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు. గుట్టపై పర్యాటకులు చల్లని వాతావరణం, ఆహ్లాదాన్ని ఆస్వాదిస్తూ.. నగర అందాలను వీక్షిస్తూ సేదదీరుతుంటారు. కానీ గుట్టపై దాహార్తి తీరేందుకు మంచినీటి సౌకర్యం లేదు. మెట్ల మార్గం ద్వారా పర్యాటకులు ఎంతో కష్టపడి ఎక్కినా.. తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యాలు లేక అవస్థలు పడుతుంటారు. ఒకే రాయితో ఏర్పడిన సుందరమైన చారిత్రక గుట్టను ఆధునికీకరిస్తే.. పర్యాటకుల రాక మరింత పెరుగుతుందని, తద్వారా స్థానిక యువతకు స్వయం ఉపాధి మెరుగుపడుతుందని స్థానికులు భావిస్తున్నారు.కొండపై ఆలయంఏకశిల కొండపై అద్భుతమైన శిల్ప కళా సౌందర్యంతో కూడిన ఓ ఆలయం ఉంది. ఆలయంలో 28 స్తంభాలతో గర్భగుడి, విశాలమైన కల్యాణ మండపం ఉంది. శిల్ప కళా సౌందర్యంతో కనిపించే ఈ ఆలయ గర్భగుడి దేవతా విగ్రహాలు లేక బోసిపోయి కనిపిస్తోంది. ఆనాడు సైనికులు సైతం ఇక్కడ శివారాధన చేసిన తర్వాతే విధుల్లో చేరేవారని చారిత్రక నిపుణులు చెబుతున్నారు. -
అసలు కథ చెప్పని ‘తండేల్’
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పద్నాలుగు నెలలు పాకిస్తాన్ జైలులో మగ్గిపోయిన 22 మంది మత్స్యకారులను విడుదల చేయించింది ఎవరు? వారిని వాఘా సరిహద్దుల నుంచి ఇంటి వరకు తీసుకొచ్చింది ఎవరు? వారి కష్టాలకు చలించిపోయి ఇచ్చిన మాట ప్రకారం రూ.5 లక్షలు ఆర్థిక సాయం చేసిందెవ్వరు? ఇంకెవరూ వలస పోకుండా, ఎవరికీ అలాంటి దుస్థితి రాకుండా శ్రీకాకుళం (Srikakulam) జిల్లాలో పోర్టు, హార్బర్, జెట్టీల నిర్మాణం మొదలుపెట్టింది ఎవరు? వలస బతుకులకు ఫుల్స్టాప్ పెట్టాలని ప్రయత్నించిందెవరు?... మత్స్యకారుల వలస జీవితం ఇతివృత్తంగా తెరకెక్కించిన ‘తండేల్’ సినిమా ఈ ప్రశ్నలన్నింటినీ మరోసారి తెర ముందు ఉంచింది. సినిమాలో సగం నిజమే చెప్పినా.., చూపించని కోణాలు ఎన్నో ఉన్నాయి. బాధితులు మాత్రం మీడియా ముందుకు వచ్చి గుండె తెరిచి వాస్తవాలు వివరించారు. తమను విడిపించి తీసుకువచ్చింది, రూ.5 లక్షలు ఆర్థిక సాయం చేసింది వైఎస్ జగన్మోహన్రెడ్డి అని విస్పష్టంగా చెప్పారు. తరాల తరబడి శ్రీకాకుళం జిల్లాను పాలిస్తున్న రాజకీయ కుటుంబాలు కలలో కూడా ఊహించని విధంగా జిల్లాలో పోర్టు పనులు ప్రారంభించడం, ఫిషింగ్ హార్బర్, జెట్టీ పనులు ప్రారంభించడం వైఎస్ జగన్ (YS Jagan) చలవేనని సోషల్ మీడియా మోతమోగిపోయేలా చెబుతున్నారు. ఇదీ జరిగింది.. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం డి.మత్స్యలేశంకు చెందిన 10 మంది, బడివానిపేటకు చెందిన ముగ్గురు, ముద్దాడకు చెందిన ఒకరు, విజయనగరం జిల్లా తిప్పలవలసకు చెందిన ఆరుగురు, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు ఇలా మొత్తం 22 మంది మత్స్యకారులు చేపల వేట కోసం 2018 జూలైలో గుజరాత్ రాష్ట్రం వీరావల్‌కు వెళ్లారు. వీరంతా ఒక బృందంగా ఏర్పడి నాలుగు పడవల్లో అరేబియా సముద్రంలోకి వెళ్లారు. పడవలు సముద్రంలో తీవ్ర ఆటుపోట్లకు గురవడంతో పొరపాటుగా పాకిస్తాన్ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించారు. 2018 నవంబర్ 28న అక్కడి కోస్టు గార్డు అధికారులకు దొరికిపోయారు. పాకిస్తాన్ అధికారులు వారందరినీ కరాచీ సబ్ జైలులో పెట్టారు. అక్కడ సరైన తిండి, దుస్తులు లేక అక్కడ వారు పడ్డ అవస్థలు వర్ణనాతీతం. జైలు అధికారులు ఉదయం ఒక్క రొట్టె ఇచ్చేవారు. మధ్యాహ్నం, రాత్రి రెండేసి రొట్టెలు ఇచ్చేవారు. వాటితోనే సరిపెట్టుకోమని చెప్పేవారు. రొట్టెలు వద్దంటే అన్నం ఇచ్చేవారు. ఆదివారం మాత్రం కొంచెం మాంసాహారం పెట్టేవారు. ఈద్ అనే స్వచ్ఛంద సంస్థ దుస్తులతో పాటు రూ.5 వేల నగదు ఇచ్చింది. అక్కడ కూలి పనులు చేస్తే కొంత డబ్బు వచ్చేది. ఆ డబ్బుతో జైల్లోనే విక్రయించే కిరాణా సరుకులు కొనుక్కొని వంట చేసుకునేవారు. అదీ అరకొర భోజనమే. ఇలా కష్టాలు అనుభవిస్తూ క్షణమొక యుగంలా గడిపారు. మరోపక్క వేటకు వెళ్లిన వీరి ఆచూకీ తెలియకపోవడంతో ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. చివరకు వారితో పాటు వేటకు వెళ్లిన మరో మత్స్యకారుడి ద్వారా వారంతా పాకిస్తాన్ అదుపులో ఉన్నట్లు తెలిసింది. దీంతో ఆ మత్స్యకారుల కుటుంబాలు తమ వాళ్ల కోసం గ్రామ సర్పంచ్ నుంచి ప్రభుత్వ పెద్దల వరకు అందరినీ ఆశ్రయించాయి. ఎవరూ పరిష్కారం చూపలేదు. పాకిస్తాన్లో మత్స్యకారులు తిండికి కూడా ఇబ్బంది పడుతున్నారని తెలిసి వారి కుటుంబీకులు తల్లడిల్లిపోయేవారు. ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్ హామీ ఆ సమయంలో నిండు గర్భిణిగా ఉన్న రామారావు అలియాస్ రాజు సతీమణి నూకమ్మ, బందీగా ఉన్న మరో మత్స్యకారుడు ఎర్రయ్య సతీమణి శిరీష మిగిలిన మత్స్యకారుల కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. గ్రామానికి చెందిన న్యాయవాది గురుమూర్తి సాయంతో జిల్లా యంత్రాంగానికి, నాయకులకు, ప్రభుత్వానికి విన్నపాలు అందజేశారు. అయినా ఫలితం లేదు. అదే సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నారు. 2018 డిసెంబర్ 2న రాజాం నియోజకవర్గం లచ్చయ్యపేట గ్రామం వద్దకు వచ్చిన వైఎస్ జగన్‌ను బాధిత మత్స్యకార కుటుంబాలు కలిశాయి. పాకిస్తాన్ జైల్లో బందీలుగా ఉన్న తమ వాళ్లను విడిపించాలని కోరాయి. అప్పటి రాష్ట్ర మంత్రి, ఎచ్చెర్ల ఎమ్మెల్యే కళా వెంకటరావును కలిసినా పట్టించుకోలేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ వెంటనే స్పందించారు. పాక్ చెరలో ఉన్న మత్స్యకారుల సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. తమ ఎంపీలను పంపిస్తానని, మత్స్యకార కుటుంబ సభ్యులు విదేశాంగ శాఖ మంత్రిని కలిసేలా చేస్తానని చెప్పారు. అధికారంలోకి వస్తే వెంటనే విడిపిస్తానని భరోసా ఇచ్చారు. జగన్ పునర్జన్మనిచ్చారు తండేల్ సినిమా హీరో పాత్రకు మూలమైన రామారావు సోదరి ముగతమ్మ. ఈమె భర్త అప్పారావు, కొడుకులు కళ్యాణ్, కిషోర్ కూడా అప్పట్లో పాక్ జైల్లో బందీ అయ్యారు. ‘తండేల్’ సినిమాలో జగన్ ప్రస్తావన లేకపోవడాన్ని చూసి ముగతమ్మ తట్టుకోలేకపోయారు. సినిమా చూసి వచ్చిన వెంటనే హాల్ బయట తన మనసులో మాటను మీడియా ముందు స్పష్టంగా చెప్పారు. తమ వారిని విడిపించి తీసుకువస్తానని చేతిలో చేయి వేసి జగన్ చెప్పారని, చెప్పినట్టుగానే తీసుకుని వచ్చారని తెలిపారు. అంతేకాకుండా ఒక్కొక్కరికీ రూ.5 లక్షలు ఆర్థిక సాయం చేశారని గుర్తు చేశారు. జగనన్నతో పాటు అప్పటి విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్, గ్రామ సర్పంచ్, సర్పంచ్ కుమార్తె, న్యాయవాది గురుమూర్తి కృషి కూడా ఉందని తెలిపారు. సినిమాలో అవేవీ లేకపోయినా బయట చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని, అందుకే అన్ని విషయాలు వివరంగా చెబుతున్నానని అన్నారు.వైఎస్ జగన్ ప్రభుత్వం చొరవతో విడుదల పాదయాత్రలో ఉన్నప్పటికీ, వైఎస్ జగన్ మత్స్యకారుల సమస్య పరిష్కారానికి కృషి చేశారు. దీంతో 2019 ఫిబ్రవరిలో మత్స్యకారుల నుంచి కుటుంబ సభ్యులకు ఉత్తరాలు రావడం మొదలైంది. ఇది కుటుంబ సభ్యులకు కొంత ఉపశమనం కలిగించినా, తిరిగి ఇంటికి వస్తారో, లేదో అన్న భయం వెంటాడుతూనే ఉండేది. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారుల విడుదలకు కేంద్రంపై ఒత్తిడి మరింతగా పెంచారు.ఆ తర్వాత కేంద్రం 370వ అధికరణం ఎత్తివేయడం, 35 (ఎ)తొలగింపు వంటి పరిణామాలతో వీరి విడుదలపై ఆశలు సన్నగిల్లాయి. అయినా వైఎస్ జగన్ పట్టువిడవకుండా ఎంపీల ద్వారా విదేశాంగ శాఖతో సంప్రదింపులు జరిపారు. దీంతో మత్స్యకారుల విడుదలకు పాకిస్తాన్ ప్రభుత్వం అంగీకరించింది. 2020 జనవరి 6న మత్స్యకారులను విడుదల చేసింది. ఆరోజు సాయంత్రం 7 గంటల సమయంలో వాఘాలోని భారత్–పాక్ సరిహద్దు వద్ద 20 మంది మత్స్యకారులను అప్పగించింది. వారికి అప్పటి వైఎస్సార్సీపీ (YSRCP) మంత్రులు, అధికారులు స్వాగతం పలికారు. మిగతా ఇద్దరు డాక్యుమెంట్లు, ఇతర సాంకేతిక కారణాల వల్ల తర్వాత విడుదలయ్యారు. విడుదలైన వారందరినీ వైఎస్సార్సీపీ నేతలు, అధికారులు ఢిల్లీ తీసుకొచ్చి అక్కడి నుంచి విమానంలో రాష్ట్రానికి తెచ్చారు. వారంతా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. జగన్ వారందరికీ స్వీట్లు తినిపించి, ఒక్కొక్కరికీ రూ.5 లక్షలు ఆర్థిక సాయం చేశారు. ఇకపై మత్స్యకారులు ఇలా వలసలు వెళ్లే అవసరం లేకుండా రాష్ట్రంలోనే పోర్టు, జెట్టీ, ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తామని భరోసా ఇచ్చారు.చెప్పినట్టుగానే హామీలు అమలు 194 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న శ్రీకాకుళం జిల్లాలో మౌలిక సదుపాయాలు లేక మత్స్యకారులు వలసపోయేవారు. దీన్ని నివారించేందుకు జిల్లాలోని మూలపేటలోనే ల్యాండ్ లార్డ్ మోడల్ విధానంలో రూ.2,949.70 కోట్లతో సీ పోర్టు తొలి దశ, బుడగట్లపాలెంలో రూ.366 కోట్లతో ఫిషింగ్ హార్బర్, మంచినీళ్లపేటలో జెట్టీ పనులకూ శ్రీకారం చుట్టారు. అధికారంలో ఉండగానే చాలా వరకు పనులు పూర్తి చేశారు. చదవండి: బాబు డేంజర్ గేమ్.. కంట్రోల్ తప్పిన లోకేష్!వేట నిషేధ కాలంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా పేరిట 17,136 మందికి రూ.10 వేలు చొప్పున సాయం అందజేశారు. మత్స్యకారుల సంక్షేమం క్షేత్రస్థాయిలో అందుతుందో తెలుసుకునేందుకు 66 మంది సాగర మిత్ర ఉద్యోగులను నియమించారు. గ్రామ సచివాలయాల్లో ఫిషరీస్ అసిస్టెంట్లను నియమించారు. ఫిష్ ఆంధ్రా షాపులను ఏర్పాటు చేశారు. కరోనా సమయంలో రూ. 3 కోట్లు ఖర్చు పెట్టి గుజరాత్ తదితర రాష్ట్రాల నుంచి 3,064 మంది మత్స్యకారులను 46 బస్సుల ద్వారా తీసుకు వచ్చారు. ఇదంతా కళ్లెదుటే జరిగింది. అయినా ఇందులో ప్రధాన ఘట్టాలను సినిమాలో చూపించలేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
‘అనాబ్ – ఎ–షాహి’ ఎక్కడోయి ?
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ముచ్చట గొలిపే పచ్చని పందిళ్లు.. పంట బాగా వస్తే ఆకుల్ని మించి గుత్తులుగా వేలాడుతూ కన్పించే పండ్లు. ఏళ్ల క్రితం హైదరాబాద్ (Hyderabad) శివారు ప్రాంతాల్లో కనువిందు చేసిన ద్రాక్ష(Grape) తోటలు ఇప్పుడు దాదాపుగా కనుమరుగయ్యాయి. ధనికుల పంటగా ప్రాచుర్యం పొందిన ద్రాక్ష పది హేనేళ్ల క్రితం మేడ్చల్, కీసర, శామీర్‌పేట్, మహేశ్వరం, మన్సాన్పల్లి, గట్టుపల్లి, బాసగూడతండా, రావిర్యాల, మంకాల్, కోళ్లపడకల్, ఆకాన్‌పల్లి, డబిల్‌గూడ, పెండ్యాల్, నాగారం (Nagaram) తదితర ప్రాంతాల్లో విరివిగా సాగయ్యేది. ఒక్కో గ్రామం పరిధిలో 350 నుంచి 400 ఎకరాల్లో ఈ తోటలు వేసే వారు.సీజన్లో శివారు ప్రాంతాల్లో వెలిసే తాత్కాలిక దుకాణాల్లో చవకగా లభించే పండ్లను నగరవాసులు ఆస్వాదించేవారు. జిల్లాలకు వెళ్లే ప్రయాణికులు బస్సుల్ని నిలిపి మరీ కిలోల కొద్దీ కొనుగోలు చేసి తీసుకెళ్లేవారు. తదనంతర కాలంలో భూగర్భ జలాలు అడుగంటి నీటి కొరత ఏర్పడటం, పెట్టుబడి ఖర్చులు రెట్టింపవడం, చీడపీడల బెడద ఎక్కవవడం, అంచనాలకు మించి నష్టాలు వస్తుండటంతో క్రమేణా ద్రాక్ష సాగు తగ్గిపోయింది.ముఖ్యంగా జాతీయ, అంతర్జాతీయ ఐటీ, అనుబంధ కంపెనీలు నగరానికి క్యూకట్టడం, నగరం విస్తరిస్తూ శివారు ప్రాంతాలు రియల్ వెంచర్లుగా మారడం, భూముల ధరలకు రెక్కలు రావడం కూడా ద్రాక్ష తోటలు కన్పించకుండా పోయేందుకు కారణమయ్యింది. అప్పట్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పదివేల ఎకరాల్లో సాగైన ద్రాక్ష తోటలు..ప్రస్తుతం కేవలం 115 ఎకరాలకే పరిమితమైపోయాయి. ప్రస్తుతం మహారాష్ట్ర, కర్ణాటక నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది.నవాబుల కాలంలో..స్వాతంత్య్రానికి ముందు నిజాం నవాబుల భవంతుల వెనుక భాగం (బ్యాక్‌యార్డ్)లో ద్రాక్ష సాగు చేసేవారు. అయితే చాలాచోట్ల ఒకటి రెండు చెట్లే కన్పించేవి. హైదరాబాద్‌లో తెల్ల ద్రాక్ష పంటకు ‘అనాబ్–ఎ–షాహి’గా నామకరణం చేశారు. టోలిచౌకిలో గద్దె రామకోటేశ్వరరావు తొలిసారిగా ద్రాక్ష పంటను సాగు చేసినట్లు చరిత్ర చెబుతోంది. సాధారణంగా సమశీతోష్ణ మండలంలో పండే పంటను హైదరాబాద్ పరిసరాల్లో పండించి ఆయన ఒకరకంగా చరిత్ర సృష్టించారు.దీంతో అప్పటి ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. అప్పట్లో ఎకరానికి ఆరు నుంచి ఏడు టన్నుల వరకు దిగుబడి సాధించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అప్పటివరకు ఉగాండా, కెన్యా, దక్షిణాఫ్రికా దేశాల్లో స్థిరపడిన వారు అక్కడి అలజడుల కారణంగా హైదరాబాద్‌కు వలస వచ్చారు. పెద్ద మొత్తంలో భూములు కొనుగోలు చేసి ’అనబిషాయి’ సాగు చేశారు. ఆంధ్ర నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చిన కొందరు కూడా ద్రాక్షను సాగు చేశారు. ఇలా పలువురు ధనవంతులు ఈ పంటపై దృష్టి సారించారు. దీంతో ఆ పంటకు ’రిచ్మెన్ క్రాప్ (ధనికుల పంట)’గా పేరొచ్చింది.‘అనాబ్–ఎ–షాహి’ అంటే ద్రాక్షలో రారాజు అని అర్థం. నిజాం కాలంలో దీనికి నామకరణం చేశారు. 2005 నుంచి తగ్గుముఖందిగుబడితో పాటు లాభాలు అధికంగా ఉండటంతో 1990 తర్వాత స్థానిక రైతులు కూడా ఈ పంట సాగు మొదలు పెట్టారు. 1991లో హైదరాబాద్ వేదికగా గ్రేప్స్ పంటపై అంతర్జాతీయ సదస్సు నిర్వహించడం గమనార్హం. కాగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ద్రాక్ష పంటకు రాజధానిగా గుర్తింపు పొందింది. ఇక్కడి రైతులను ఆదర్శంగా తీసుకుని మహారాష్ట్రలో కూడా సాగు ప్రారంభించారు. 2005 వరకు ఇక్కడి వైభవం కొనసాగింది. ఆ తర్వాత అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఒకప్పటి ఈ పంట భూములన్నీ రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారాయి. దీంతో ఒకప్పుడు నగర వాసులకు తీపిని పంచిన స్థానిక ద్రాక్ష.. ప్రస్తుతం అందుబాటులో లేకుండా పోయింది. ప్రస్తుతం మహా రాష్ట్ర నుంచి పెద్ద మొత్తంలో ద్రాక్ష దిగుమతి అవుతోంది. స్థానిక రైతులు పోటీలోనే లేని పరిస్థితి ఉంది. మెజార్టీ ఆదాయం సాగు ఖర్చుకేనేను గత 15 ఏళ్లుగా ద్రాక్ష పంటను సాగు చేస్తున్నా. ఒకసారి మొక్కను నాటితే 20 ఏళ్లపాటు దిగుమతి వస్తుంది. మొదట్లో ’థాంసన్’ వెరైటీని సాగు చేశా. తర్వాత ’మాణిక్ చమాన్’ వెరైటీని ఎంచుకున్నా. ఎకరాకు వెయ్యి మొక్కలు చొప్పున నాలుగు ఎకరాల్లో నాటా. మొక్కల ఎంపిక సహా సస్యరక్షణలో చిన్నచిన్న మెళుకువలు పాటించి నాటిన రెండేళ్లకే అనూహ్యంగా మంచి దిగుబడిని సాధించా. ప్రస్తుతం ఒక్కో చెట్టు నుంచి 20 కేజీల వరకు దిగుమతి వస్తోంది. ఎకరా పంటకు కనీసం నాలుగు నుంచి ఐదు లక్షల ఆదాయం వస్తుంది. అయితే కూలీ రేట్లు, ఎరువుల ధరలు పెరగడంతో మెజార్టీ ఆదాయం పంట సాగుకే ఖర్చవుతోంది. – కొమ్మిరెడ్డి అంజిరెడ్డి, రైతు, తుక్కుగూడఇప్పుడు పరిస్థితి మునుపటిలా లేదుఇప్పుడు పరిస్థితి మునుపటిలా లేదు. భూములూ అందుబాటులో లేవు. దీంతో ద్రాక్ష సాగు తగ్గిపోయింది. కూలీల ఖర్చులు పెరగడం, దిగుబడి సమయంలో ఈదురుగాలులు, వడగళ్ల వర్షం లాంటి వాటితో పంట నష్టపోవాల్సి వస్తోంది. మాలాంటి అనుభవం ఉన్న పాత రైతులే ద్రాక్షను సాగు చేయలేని పరిస్థితి ఉంది. ఇక కొత్తగా ఎవరైనా ప్రయత్నించినా భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. – చింతల వెంకట్‌రెడ్డి, ఒకప్పటి ద్రాక్ష రైతు, పద్మశ్రీ అవార్డు గ్రహీత -
అన్నదాత మెచ్చిన రైతుబిడ్డ
పొలాలే బడులుగా రైతులకు సరికొత్త వ్యవసాయ పాఠాలు చెబుతుంది సిద్దిపేట జిల్లా అక్కన్నపేట (Akkannapet) మండలంలోని రామవరం క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారిణి (ఏఈవో) కరంటోతు శ్రీలత. ఆమె పాఠాలు వృథా పోలేదు. సేంద్రియ ఎరువుల ప్రాధాన్యత నుంచి మల్చింగ్ (mulching) పద్ధతిలో కూరగాయల సాగు వరకు ఎన్నో విషయాలను అవగాహన చేసుకొని కొత్తదారిలో ప్రయాణిస్తున్నారు అన్నదాతలు...అక్కన్నపేట మండలం పంతులు తండాకు చెందిన శ్రీలతకు ఏఈవో ఉద్యోగం వచ్చినప్పుడు ‘నాకు ఉద్యోగం వచ్చింది’ అనే సంతోషం కంటే ‘ఈ ఉద్యోగం వల్ల ఎంతోమంది రైతులకు సహాయంగా నిలబడవచ్చు’ అనే సంతోషమే ఎక్కువ. రైతు కుటుంబంలో పుట్టిన శ్రీలతకు రైతుల కష్టాలు, నష్టాలు తెలియనివేమీ కాదు. సాగులో మెలకువలు పాటించకపోవడం వల్ల పంట దిగుబడి రాక రైతులు నష్టపోతున్నారు. అయితే మెలకువలు పాటించకపోవడం నిర్లక్ష్యం వల్ల కాదు... అవగాహన లేకపోవడం వల్లే జరుగుతోందని గ్రహించిన శ్రీలత రంగంలోకి దిగింది.ఆమె పొలం దగ్గరికి వస్తే ఎక్కడి నుంచో అగ్రికల్చరల్ ఆఫీసర్ (Agriculture Officer) వచ్చినట్లు ఉండదు. తెలిసిన వ్యక్తో, చుట్టాలమ్మాయో వచ్చినట్లుగా ఉంటుంది. ఎలాంటి బేషజాలు లేకుండా అందరితో కలిసిపోయి వారి సమస్యలు తెలుసుకుంటుంది. పొలం దగ్గరికి వచ్చినప్పుడు శ్రీలత కూడా రైతుగా మారిపోతుంది. తానే స్వయంగా ట్రాక్టర్‌తో వరి పొలం దున్నుతుంది. వరిలో కాలిబాటల ప్రయోజనాల గురించి చెబుతుంది. ఎరువులు ఎంత మోతాదులో చల్లాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రత్యక్షంగా చేసి చూపిస్తోంది. వ్యవసాయ శాస్త్రవేత్తలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ నూతన సాగు పద్ధతులను తెలుసుకుంటూ, వాటిని తన క్లస్టర్ పరిధిలోని రామవరం, గండిపల్లి, కుందన్‌వానిపల్లి, మైసమ్మవాగు తండా రైతులకు చెబుతుంటుంది. రసాయనిక మందుల వినియోగం లేకుండా సేంద్రియ పద్దతిలో సాగు చేసే విధంగా రైతులనుప్రోత్సహిస్తోంది. గిరిజన గ్రామాల్లో సైతం మల్చింగ్ పద్ధతిలో కూరగాయలు ఎక్కువగా సాగు చేసేలా చేస్తోంది. చదవండి: చేనేతను ఫ్యాషైన్ చేద్దాం!పంటల్లో అధిక దిగుబడులు సాధించడానికి రసాయన ఎరువులు మోతాదుకు మించి వాడటం వల్ల భూసారం దెబ్బతింటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని సేంద్రియ ఎరువులప్రాధాన్యత గురించి ఒకటికి పదిసార్లు చెప్పడమే కాదు సేంద్రియ ఎరువులను ఎలా తయారు చేసుకోవాలని అనే అంశంపై ప్రత్యేక వీడియోను తయారు చేసింది. జీవ ఎరువుల వినియోగంపై కూడా ప్రత్యేక వీడియోను తయారు చేసి రైతులకు అవగాహన కలిగిస్తోంది.క్షేత్రస్థాయిలోకి...రైతు అంటే నా దృష్టిలో ఒక పొలానికి యజమాని మాత్రమే కాదు... మన ఇంటి వ్యక్తి. మనకు అన్నం పెట్టే అన్నదాత. రైతుకు మంచి జరిగితే లోకానికి మంచి జరిగనట్లే. నా ఉద్యోగం ద్వారా రైతులకు ఏదో రకంగా మేలు చేసే సలహాలు, సూచనలు ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది. – శ్రీలత – గజవెల్లి షణ్ముఖరాజు, సాక్షి, సిద్దిపేట– మాలోతు శ్రీనివాస్, సాక్షి, అక్కన్నపేట -
చేనేతను ఫ్యాషైన్ చేద్దాం!
ఇకత్ చీరతో వేడుకలో వెలిగిపోతాం. నారాయణపేట మెటీరియల్‌తో డిజైనర్ బ్లవుజ్ కుట్టించుకుంటాం. మన సంప్రదాయ వస్త్రధారణ మనల్ని ఫ్యాషన్ పెరేడ్లో తళుక్కుమని తారల్లా మెరిపిస్తోంది. ఇవి ఇంత అందంగా ఎలా తయారవుతాయి. ఒక డిజైన్ని విజువలైజ్ చేసి వస్త్రం మీద ఆవిష్కరించే చేనేతకారులు ఏం చదువుతారు... ఈ ప్రశ్నలకు జవాబులు వెతికే ప్రయత్నం చేశారు మిసెస్ ఇండియా (Mrs India) విజేత సుష్మ. ఈ వస్త్రాలను నేసే చేతులను, ఆ వేళ్ల మధ్య జాలువారుతున్న కళాత్మకతను దగ్గరగా చూడాలనిపించింది. పోచంపల్లి బాట పట్టారామె. కళాత్మకత అంతా చేనేతకారుల చేతల్లోనే తప్ప వారి జీవితాల్లో కనిపించలేదు. నూటికి రెండు–మూడు కుటుంబాలు ఆర్థికంగా బాగున్నాయి. మిగిలిన వాళ్లంతా ఈ కళను తమ తరంతో స్వస్తి పలకాలనుకుంటున్న వాళ్లే. మరి... ఇంత అందమైన కళ తర్వాతి తరాలకు కొనసాగకపోతే? ఒక ప్రశ్నార్థకం. దానికి సమాధానంగా ఆమె తనను తాను చేనేతలకు ప్రమోటర్‌గా మార్చుకున్నారు. చేనేతకారుల జీవితాలకు దర్పణంగా నిలిచే డాక్యుమెంటరీలు చిత్రీకరించారు. తాను పాల్గొనే ఫ్యాషన్ పెరేడ్లు, బ్యూటీ కాంటెస్ట్‌లలో మన చేనేతలను ప్రదర్శిస్తున్నారు. ఆ చేనేతలతోనే విజయాలు సొంతం చేసుకుంటున్నారు. స్వతహాగా ఎంటర్ప్రెన్యూర్ అయిన సుష్మా ముప్పిడి (Sushma Muppidi) మన హస్తకళలు, చేనేతలను ప్రపంచవేదిక మీదకు తీసుకెళ్లడానికి మార్గం సుగమం చేశారు.వైఫల్యమూ అర్థవంతమే! చీరాలకు చెందిన సుష్మ ముప్పిడి బీటెక్, ఎంబీఏ చేశారు. కొంతకాలం గుంటూరులో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం, పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగంతోపాటు మరో ప్రైవేట్ కాలేజ్‌లో పార్ట్‌టైమ్ జాబ్ చేశారు. ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఉద్యోగం... ఈ జర్నీలో ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్. ఉద్యోగం కోసం తన హండ్రెడ్‌పర్సెంట్ ఇస్తోంది. పిల్లల కోసం గడిపే సమయం తగ్గిపోతోంది. వెనక్కి చూస్తే తనకు మిగిలిందేమిటి? సివిల్ సర్వీసెస్ ప్రయత్నం సఫలం కాలేదు. ఉనికి లేని సాధారణ ఉద్యోగంతో తనకు వచ్చే సంతృప్తి ఏమిటి? సమాజానికి పని చేయడంలో సంతృప్తి ఉంటుంది, తనకో గుర్తింపునిచ్చే పనిలో సంతోషం ఉంటుంది. ఇలా అనుకున్న తర్వాత యూత్‌లో సోషల్ అవేర్నెస్ కోసం కార్యక్రమాలు నిర్వహించారు. ఆ ప్రయాణంలో అనుకోకుండా బ్యూటీ కాంపిటీషన్లో పాల్గొనవడం విజేతగా నిలవడం జరిగింది. సోషల్ ఇనిషియేటివ్, వెల్ స్పోకెన్, బెస్ట్ కల్చరల్ డ్రెస్, మిసెస్ ఫ్యాషనిష్టా వంటి గుర్తింపులతోపాటు ‘యూఎమ్బీ ఎలైట్ మిసెస్ ఇండియా 2024’ విజేతగా నిలిచారు. ఈ ఏడాది మార్చి ఒకటిన ఇటలీలోని మిలన్ నగరంలో, ఎనిమిదవ తేదీన ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరంలో జరిగే ఫ్యాషన్ షోలలో భారత చేనేతలు అసోం సిల్క్, మల్బరీ సిల్క్లను ప్రదర్శించనున్నారు. జూన్‌లో యూఎస్, ఫ్లోరిడాలో జరిగే మిసెస్ యూనివర్సల్ వేదిక మీద మనదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు సుష్మ. ఇవన్నీ ఆత్మసంతృప్తినిచ్చే పనులు. ఇక తనకు రాబడి కోసం ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారారు. హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆఫీస్ నుంచి యూఎస్, దుబాయ్, సింగపూర్లలో డైమండ్ బిజినెస్ (Diamond Business) నిర్వహిస్తున్నారు. ‘‘జీవితంలో గెలవాలి, నా కోసం కొన్ని సంతోషాలను పూస గుచ్చుకోవాలి. నన్ను నేను ప్రశంసించుకోవడానికి సమాజానికి నా వంతు సర్వీస్ ఇవ్వాలి’’ అన్నారు సుష్మ. ‘‘వయసు దేనికీ అడ్డంకి కాదు. అంతా మన అభిరుచి మీద ఆధారపడి ఉంటుంది. మీ కలలను నిజం చేసుకోవాలంటే ఒక ముందడుగు వేయండి. సక్సెస్ అవుతామా, విఫలమవుతామా అనే సందేహాలు వద్దు. ఏ ప్రయత్నమూ చేయకపోవడం కంటే ప్రయత్నించి విఫలమైనా కూడా అది అర్థవంతమయిన వైఫల్యమే. కాబట్టి మిమ్మల్ని మీరు తగ్గించుకోకూడదు’’ అని మహిళలకు సందేశమిచ్చారు. ఇది నా చేయూత పోచంపల్లి, గద్వాల, నారాయణపేట, సిరిసిల్లలకు వెళ్లి స్వయంగా పరిశీలించాను. మన చేనేత కుటుంబాలు కళకు దూరం కాకుండా ఉండాలన్నా, ఇతరులు ఈ కళాత్మక వృత్తిని చేపట్టాలన్నా ఇది ఉపాధికి సోపానంగా ఉండాలి. అందుకోసం చేనేతలను కార్పొరేట్ స్థాయికి చేరుస్తాను. సమావేశాలకు ఉపయోగించే ఫైల్ ఫోల్డర్స్, ఇంట్లో ఉపయోగించే సోఫా కవర్స్, వేడుకల్లో ధరించే బ్లేజర్స్ వంటి ప్రయోగాలు చేసి మన చేనేతలను ప్రపంచవేదికలకు తీసుకెళ్లాలనేదే నా ప్రయత్నం. నేను ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎల్లలు దాటి విదేశాలకు విస్తరించాను. చదవండి: అన్నదాత మెచ్చిన రైతుబిడ్డకాబట్టి నాకున్న ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించుకుని మన చేనేతలను ప్రమోట్ చేయగలుగుతున్నాను. కలంకారీ కళ కోసం అయితే ప్రత్యేకంగా వర్క్‌షాప్ నిర్వహించి కలంకారీ కళాకారులకు ఉచితంగా స్టాల్స్ ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేశాను. పారిస్, యూఎస్ కార్యక్రమాల తర్వాత ఆ పని. సివిల్స్ సాధించినా కూడా ప్రత్యేకంగా ఒక అంశం మీద సమగ్రంగా పని చేయడం సాధ్యం కాకపోవచ్చు. ఇప్పుడు నేను ఒక కళాత్మక సమాజానికి ఇస్తున్న సర్వీస్ నాకు అత్యంత సంతృప్తినిస్తోంది. ప్రపంచ ఫ్యాషన్ వేదిక మీద మన భారతీయ చేనేతకు ప్రాతినిధ్యం వహించాలి. మన నేతలకు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం కల్పించాలనేది నా లక్ష్యం. – సుష్మ ముప్పిడి, మిసెస్ ఇండియా– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ప్రతినిధి -
వలపు వల.. చిక్కారో విలవిల
ఆన్లైన్లో ప్రేమ పేరిట వల వేస్తున్న సైబర్ మోసగాళ్లు.. అవతలి వ్యక్తి తమ అదీనంలోకి వచ్చినట్టు గుర్తించిన తర్వాత అసలు మోసానికి తెరతీస్తున్నారు. పలు వెబ్సైట్లు, డేటింగ్ యాప్‌లు, మ్యాట్రిమోని వెబ్సైట్లలోని సమాచారాన్ని సేకరిస్తున్న సైబర్ కేటుగాళ్లు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వాడి ఎదుటి వారికి వలపు వల వేస్తున్నారు.ఇందుకోసం వారి అభిరుచులకు తగ్గట్టుగా వ్యవహరించి మోసాలకు తెరతీస్తున్నారు. నగరంలోని ఒక సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ సంస్థ పరిశోధనలో ఇవే అంశాలు వెల్లడయ్యాయి. ఇలాంటి మోసాలకు పాల్పడే వారంతా విదేశాల్లో ఉంటూ మోసాలు చేస్తున్నారు. ఒంటరిగా ఉండే వృద్ధులు, మిలిటరీ ఉద్యోగులు, యువత ఇలా పలువర్గాలను ఈ తరహా మోసాలకు టార్గెట్‌గా ఎంచుకుంటున్నారని వారు పేర్కొంటున్నారు. - సాక్షి, హైదరాబాద్39 % సైబర్ నేరగాళ్లే..ఆన్లైన్లో ప్రేమ కోసం పరితపిస్తూ కొందరు డేటింగ్ వెబ్సైట్లు, యాప్‌లలో తమ వివరాలు నమోదు చేసుకుంటున్నారు. ఇలాంటి వారికి ఆన్లైన్లో జత కూడుతున్న వారిలో 39 శాతం మంది అవతలి వ్యక్తులు సైబర్ నేరగాళ్లే అన్న విషయం ఓ పరిశోధనలో వెల్లడైంది.అదేవిధంగా ఆన్లైన్ ప్రేమ పేరిట స్పామ్ ఫోన్‌కాల్స్, ఈ–మెయిల్స్‌లో దేశవ్యాప్తంగా ఇటీవల 400% పెరుగుదల ఉన్నట్టు తేలింది. ఇలా ఆన్లైన్లో ప్రేమ పేరుతో మోసగించేందుకు సైబర్ కేటుగాళ్లు మాటువేసి సిద్ధంగా ఉంటున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మ్యాట్రిమోని వెబ్సైట్లు, డేటింగ్‌యాప్‌ల నుంచి ఫొటోలు, వీడియోలు, ఇతర వివరాలు సేకరిస్తున్న సైబర్ నేరగాళ్లు.. ఏఐ టూల్స్‌ను వాడి తప్పుడు గుర్తింపులు సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారు. చిక్కకపోతే వారాలు.. నెలలు కూడా..ముందస్తుగానే ఎదుటి వారి వివరాలు, వారి అభిరుచులు, బలహీనతలు తెలుసుకుంటున్న సైబర్ నేరగాళ్లు ఏఐ టూల్స్‌ను వాడి అందుకు తగిన విధంగా మెసేజ్‌లు తయారు చేస్తున్నారు. ఇలాంటి మెసేజ్‌లతో ఎదుటి వ్యక్తుల్లో నమ్మకాన్ని పెంచేందుకు అవసరమైతే వారాలు, నెలలు కూడా ఓపికగా చాటింగ్ చేస్తున్నారు. ఇలా ఒకసారి నమ్మకం కుదిరిన తర్వాత అసలు మోసానికి తెరతీస్తున్నారు.‘నా ఆరోగ్యం బాగా లేదు..ఆసుపత్రికి వెళ్లేందుకు డబ్బు కావాలి, మా కుటుంబ సభ్యుడు ఒకరు ఆసుపత్రిలో ఉన్నారు..కొంచెం డబ్బులు సర్దు..తిరిగి ఇచ్చేస్తా..’ అని సెంటిమెంట్ డైలాగ్‌లతో ఎదుటి వారి నుంచి డబ్బులు దండుకుంటున్నారు. మరికొందరు సైబర్ నేరగాళ్లుఅతి ప్రేమలు నటిస్తూ..నాకు తెలిసిన ఆన్లైన్ ట్రేడింగ్ యాప్‌లో పెట్టుబడి పెట్టు..నీకు మంచి లాభాలు వస్తాయని ఊదరగొడుతూ..డబ్బులు దండుకుంటున్నారు.ఇలా వారు చెప్పిన బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు పడగానే..దాన్ని క్రిప్టోకరెన్సీగా మార్చుకుంటున్నారు. ‘మీకు ఖరీదైన గిఫ్ట్ పంపుతున్నాను..కస్టమ్స్ క్లియరెన్స్ ఫీజులు చెల్లించి ఆ బహుమతులు తీసుకో’ అంటూ కూడా మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి మోసాలు డేటింగ్ యాప్‌లకే పరిమితం కావడం లేదు. మ్యాట్రిమోని వెబ్సైట్లలోనూ 78 శాతం వరకు మహిళల పేరిట ఫేక్ ప్రొఫైల్స్‌ను తయారు చేస్తున్నట్టు అధ్యయనం వెల్లడించింది. అపరిచితులను ఆన్లైన్లో నమ్మొద్దు.. ఆన్లైన్లో పరిచయం అయి.. తర్వాత ఆర్థిక అవసరాలను చూపుతూ డబ్బు డిమాండ్ చేసే వారిని నమ్మవద్దని సైబర్ భద్రతా నిపుణులు సూచిస్తున్నారు. ఆన్లైన్ స్నేహాల్లో చాలావరకు మోసపూరితమైనవేనని గ్రహించాలని వారు గుర్తు చేస్తున్నారు. వ్యక్తిగత వివరాలు, బ్యాంకు వివరాలు తీసుకునేందుకు ప్రయత్నించినా..ట్రేడింగ్ యాప్‌లలో పెట్టుబడుల పేరిట ఒత్తిడి తెచ్చినా అది మోసమని గుర్తించాలని హెచ్చరిస్తున్నారు. -
భయాన్ని మెదడు ఎలా అధిగమిస్తుందంటే..
ప్రయోగం వివరాలను సెయిన్స్‌బరీ వెల్కమ్ సెంటర్లోని హాఫర్ ల్యాబ్‌లో పరిశోధకులు డాక్టర్ సారా మెడిరోస్, ప్రొఫెసర్ సోంజా హాఫర్ వివరించారు. ‘‘మనిషికి పుట్టుకతోనే కొన్ని భయాలుంటాయి. పెద్ద శబ్దాలు, హఠాత్తుగా తమ వైపు దూసుకొచ్చే వస్తువులను చూసి భయపడతాడు. అయితే కొన్నాళ్లకు కొన్ని భయాలు పోతాయి. చిన్నప్పుడు టపాసుల పేలుళ్లు భయపడిన వ్యక్తే ఆ తర్వాత తెగ టపాసులు కాలుస్తాడు. ఇదే తరహాలో ఎలుకలపైకి పక్షుల లాంటి వస్తువులు దూసుకొస్తున్నట్లు ప్రయోగం చేశాం. ఎగిరొచ్చే వాటి నీడ పెద్దదయ్యే కొద్దీ ఎలుకలు భయపడ్డాయి. ప్రాణభయంతో పారిపోయాయి. అయితే నీడను ఇలా పదే పదే పెద్దగా చేశాక కేవలం నీడ పరిమాణం మాత్రమే పెరగడం ఎలుకలు గమనించి, ఆ తర్వాత భయపడటం మానేశాయి. పారిపోకుండా అలాగే చూశాయి. ఇలాంటి దృగ్విషయంలో ఎలుక మెదడులోని వెంట్రో లేటరల్ జెనిక్యూలేట్ న్యూక్లియస్(వీఎల్జీఎన్) అనే ప్రాంతం క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. మెదడులోని సెరిబ్రల్ కార్టెక్స్ ప్రాంతంలో నిక్షిప్తమయ్యే దృశ్యసంబంధ సమాచారం అత్యధికంగా వీఎల్జీఎన్కు భటా్వడా అవుతోంది. ఈ సమాచారాన్ని పదేపదే విశ్లేషించాక ఫలానా అంశంలో భయపడాల్సిన పనిలేదని వీఎల్జీఎన్ నిర్ధారిస్తోందని మేం ఓ అంచనాకొచ్చాం. దృశ్యసంబంధ కార్టెక్స్ అనేది ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకునేందుకు దోహపడుతోంది. ఇలాంటి అభ్యసన జ్ఞాపకాలు వీఎల్జీఎన్లో నిక్షిప్తమవుతున్నాయి. నేర్చుకోవడం, గుర్తుంచుకోవడం, ప్రవర్తనకు సంబంధించిన అంశాల్లో సెరబ్రల్ కార్టెక్స్దే కీలకపాత్ర అని ఇన్నాళ్లూ భావించాం. కానీ అది తప్పు అని తేలింది. ఈ జ్ఞాపకాలన్నింటినీ వీఎల్జీఎన్ మాత్రమే భద్రపరుస్తోంది. దీంతో శ్వాస, గుండెలయ, స్పృహ, నిద్ర వంటి జ్ఞప్తియేతర విధులకు, అభ్యసన, ఆలోచన వంటి జ్ఞాపకశక్తి సంబంధ అంశాలకు మధ్య సంబంధం తెల్సుకునేందుకు అవకాశం చిక్కింది. వీఎల్జీఎన్ సర్క్యూట్లలో మార్పులు చేయడం ద్వారా రోగిని భయపడకుండా చేయొచ్చు. ఇందుకు సంబంధించి ఇంకా విస్తృతమైన పరిశోధనలు చేయాల్సి ఉంది’’అని శాస్త్రవేత్తలు చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆన్లైన్ నుంచి అక్షింతల దాకా
ప్రేమను.. పెళ్లితో స్థిరపరచేది అదే! అయితే దానికి బాటలు వేసేవి మాత్రం పరస్పర నమ్మకం, గౌరవాలే! అలాంటి లవ్ స్టోరే ఇది! దాదాపు ఏడేళ్లపాటు ఒకరినొకరు చూసుకోకుండా పెళ్లితో ప్రేమను గెలిపించుకున్న ఆ జంటలోని అమ్మాయి.. రైతా, ఫిన్లండ్. అబ్బాయి .. ప్రదీప్, హైదరాబాద్. ప్రేమకథా కాలం.. 1997.. స్కూలింగ్ పూర్తి చేసుకున్న రైతా ఫారిన్ లాంగ్వేజ్ కేటగిరీలో ఇంగ్లిష్ భాషను నేర్చుకుంటోంది. ఫ్లూయెన్సీ కోసం యాహూ చాట్‌లో చాటింగ్ స్టార్ట్ చేసింది. ఆన్లైన్లో ఒకరోజు ప్రదీప్ పరిచయం అయ్యాడు. సంభాషణలో ఆధ్యాత్మికం, తాత్వికం, మతపరమైన అంశాల నుంచి సామాజిక, రాజకీయ, పర్యావరణ విషయాలు, ప్రపంచ పౌరుల బాధ్యతలు వంటి వాటి మీద ప్రదీప్కున్న అవగాహనకు రైతా ముచ్చటపడింది. ప్రదీప్‌కూ రైతా పట్ల అదే భావన. నెమ్మదిగా స్నేహం పెరిగింది. వ్యక్తిగత వివరాలను పంచుకున్నారు. ప్రదీప్‌కి రైతా మీద ప్రేమ మొదలైంది. అప్పటికీ ఆ ఆన్లైన్ స్నేహం వయసు నాలుగేళ్లు. అప్పట్లో వెబ్కామ్స్ లేవు.. కాబట్టి ఒరినొకరు చూసుకోలేదు. కనీసం ఫొటోలు కూడా ఎక్సే ్చంజ్ చేసుకోలేదు. ఒక రోజు ప్రదీప్ మెయిల్ పెట్టాడు ‘రకస్తాన్ సినువా (నువ్వంటే ఇష్టం).. నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని. సంభ్రమాశ్చర్యాలు రైతాకు. ఎందుకంటే ఫిన్లండ్ లో అంత త్వరగా ఎవరూ పెళ్లి ప్రపోజల్ తీసుకురారు. అలాంటిది అబ్బాయి కనీసం తనను చూడనైనా చూడకుండా పెళ్లికి ప్రపోజ్ చేశాడు అని! ఓకే చెప్పింది. ఇద్దరిళ్లల్లో విషయం చెప్పేశారు. ప్రదీప్ జాతకంలో విదేశీ పిల్లే రాసి ఉందని, అదే జరగబోతోందని అతని తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పలేదు. కానీ రైతా వాళ్లింట్లోనే ఒప్పుకోలేదు. కారణం అక్కడ మీడియా లో ఇండియా గురించి ఉన్న వ్యతిరేక ప్రచారమే! వాళ్లను ఒప్పించే ప్రయత్నంలో.. ప్రదీప్‌ను చూస్తే ఒప్పుకుంటారు అన్న ఆశతో‘ఫిన్లండ్ రండి’ అంది రైతా. వెంటనే వీసాకు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే వీసా‘రిజెక్టయ్యింది. దాంతో‘నేనే హైదరాబాద్ వస్తాను’ అంటూ అభయమిచ్చింది రైతా! ‘ఎయ్ (.. వద్దు)’ అన్నారు ఆమె తల్లిదండ్రులు. ‘మిక్సీ (ఎందుకు)?’ అడిగింది అమ్మాయి. ‘ఇండియా సేఫ్ కాదు’ స్పష్టం చేశారు. వాదించింది రైతా. అయినా ఒప్పుకోలేదు తల్లిదండ్రులు. ఈసారి ప్రదీప్ యూకేలో చదువును బహానా (సాకు)గా మలచుకున్నాడు. వీసా ఓకే అయింది. యూకే నుంచి తేలిగ్గానే ఫిన్లండ్కి వీసా దొరికింది. రైతా ఆనందానికి అవధుల్లేవు. పరిచయం అయిన ఏడేళ్లకు ఒకరినొకరు చూసుకోబోతున్నారు. ఆ క్షణం రానేవచ్చింది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నాక ఇంకా నచ్చారు! రైతా తల్లిదండ్రులకూ నచ్చాడు ప్రదీప్! కానీ అమ్మాయి అక్కడికి వెళ్లి ఉండగలదా? అప్పటికీ ఇండియా మీద ఇంకా సానుకూలమైన అభి్రపాయానికి రాలేదు వాళ్లు. ‘ఉంటాను’ ధైర్యం చెప్పింది. ట్రయల్ గా హైదరాబాద్‌ను విజిట్ చేసింది కూడా! ఇక్కడి సోషల్ లైఫ్‌ను ఇష్టపడింది. ప్రదీప్ తల్లిదండ్రులకూ రైతా చాలా నచ్చింది. రైతా కుటుంబం కూడా హైదరాబాద్ వచ్చి, ప్రదీప్ కుటుంబాన్ని కలిసింది. అలా ఏడేళ్ల వాళ్ల ప్రేమ ఇరు కుటుంబ సభ్యుల ఆమోదం, ఆశీర్వాదంతో ఏడడుగుల బంధమైంది. వాళ్ల పెళ్లికిప్పుడు ఇరవై ఏళ్లు. నలుగురు పిల్లలు. ప్రదీప్ కోసం రైతా శాకాహారిగా మారింది. తెలుగు నేర్చుకుంది. ప్రదీప్ జీవితంలోనే కాదు బిజినెస్‌లోనూ భాగస్వామైంది. ప్రదీప్ ఫీనిష్ నేర్చుకున్నాడు. తన కోసం ఆమె చేసుకున్న, చేసుకుంటున్న సర్దుబాట్లను అతను గుర్తిస్తాడు. అమె అభి్రపాయాలను గౌరవిస్తాడు. రైతా తల్లిదండ్రులు తన కూతురు చాలా అదృష్టవంతురాలని పొంగిపోతారు. ‘‘మేమొక మాట అనుకున్నాం.. పెళ్లనే గొప్ప బంధంలోకి అడుగుపెడుతున్నాం. మనమధ్య వచ్చే ఏ తగవైనా మన రిలేషన్‌షిప్‌ని మరింత స్ట్రాంగ్ చేయాలి తప్ప వీక్ చేయకూడదు అని. దాన్నే ఆచరిస్తున్నాం!’ అని చెబుతోంది రైతా. – సరస్వతి రమ -
నగరాన్ని తలదన్నేలా మునిపల్లి..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నగరాలు, పెద్ద పట్టణాల్లో గేటెడ్ కమ్యూనిటీ సంస్కృతి ఎక్కువగా కనిపిస్తోంది. కానీ నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్ పల్లి మండలం (Jakranpally Mandal) మునిపల్లి (Munipally) గ్రామం గేటెడ్ కమ్యూనిటీ వాతావరణాన్ని తలపిస్తోంది. గ్రామంలోని ప్రధానమైన ప్రాంతంలో వెళ్తున్నప్పుడు.. నగరంలో ఉన్నామన్న భావన కలుగుతుంది. ఇక్కడ ప్రతి వీధికి నంబర్లు కేటాయించి బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రధాన, అంతర్గత రోడ్లన్నీ తారురోడ్లుగా వేశారు. రోడ్లన్నిటినీ పరిశుభ్రంగా ఉంచుతున్నారు. మొక్కలు, చెట్ల పెంపకం, నిర్వహణ ఆకట్టుకుంటోంది. గ్రామంలో భవనాలను నగరాల మాదిరిగా మంచి ఆర్కిటెక్చర్‌తో నిర్మించడం విశేషం. చాలా ఇళ్లకు సౌర విద్యుత్ (Solar Power) కంచెను ఏర్పాటు చేసుకు న్నారు. రైతులు సొంతంగా తమ సంఘం కోసం భారీ భవనం నిర్మించుకున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో షాపింగ్ కాంప్లెక్స్ (Shopping Complex) నిర్మించి అద్దెలకు ఇచ్చారు. గ్రామంలో అన్నీ రైతు కుటుంబాలే అయినప్పటికీ.. పిల్లలను ఉన్నత విద్య చదివిస్తున్నారు. ప్రధాన రహదారి నుంచి బాగా లోపలికి ఉన్న ఈ గ్రామం ఆద్యంతం గేటెడ్ కమ్యూనిటీని తలపిస్తూ ఆకట్టుకుంటోంది. -
కొత్త తరం ప్రేమలు.. జెన్‌జెడ్ ప్రేమలు
జమానా మారినా ప్రేమకు అర్థం మారదు! కానీ ఇప్పుడు ప్రేమ కూడా ఆన్‌లైన్‌కి చేరి.. ఆ బంధం కూడా ట్రెండింగ్ అయ్యి.. సాఫ్ట్వేర్ అప్డేట్స్లాగా రోజుకో కొత్త రిలేషన్షిప్ లాంచ్ అవుతోంది! బ్రెడ్‌క్రంబింగ్.. అవతలి వ్యక్తి పట్ల ఇంట్రెస్ట్.. ఫీలింగ్స్ ఉన్నట్లు, ఆ రిలేషన్షిప్ కోసం ఎంతో సమయం వెచ్చిస్తున్నట్లు నటించడమే బ్రెడ్‌క్రంబింగ్. అటెన్షన్ కోసం, అవతలి వాళ్ల మీద నియంత్రణ కోసం ఈ డ్రామా ఆడతారు. రోచింగ్.. ఒకరికి తెలియకుండా మరొకరితో ఏకకాలంలో అనేకమందితో రిలేషన్లో ఉండటం. అయితే దీన్ని జెన్ జీ చీటింగ్‌గా భావించడం లేదు. సీక్రసీ అంటోందంతే!బెంచింగ్.. అవతలి వ్యక్తిని మరోవైపు కదలనివ్వకుండా.. అలాగని తమ నుంచి కమిట్మెంట్ ఇవ్వకుండా, సీరియస్‌నెస్ చూపించకుండా అప్పడప్పుడు ఫోన్లు, మెసేజ్‌లు చేస్తూ అవతలివాళ్లను కట్టిపడేయడమే బెంచింగ్.కాన్షస్ డేటింగ్.. చుట్టూ తిరిగే వాళ్లలో ఒకరిని ఎంచుకోకుండా.. నీ వ్యక్తిత్వాన్ని గౌరవించి, నిన్ను నిన్నుగా ఇష్టపడుతూ జీవితాంతం తోడుగా, నమ్మకంగా ఉండే వ్యక్తిని వెదుక్కోవడమే కాన్షస్ డేటింగ్!కఫింగ్.. చలికాలం, సెలవులు, వాలంటైన్ వీక్.. ఇలా ప్రత్యేక సమయం, సందర్భాల్లో డేటింగ్ చేయడాన్ని కఫింగ్ అంటున్నారు. ïడ్రై డేటింగ్ .. ఆల్కహాల్ ఫ్రీ డేట్ అన్నమాట. అంటే డేటింగ్‌కి వెళ్లినప్పుడు ఆల్కహాల్ తీసుకోరు. సింగిల్స్, రిలేషన్షిప్లో ఉన్నవాళ్లు.. అందరూ ఈ డ్రై డేట్స్‌కి ప్రాధాన్యమిస్తున్నారు. సింగిల్స్ అయితే తమకు కాబోయే పార్టనర్ మందు ప్రభావానికి లోనుకాకుండా సహజంగా ఎలా ప్రవర్తిస్తాడు/ ప్రవర్తిస్తుంది అని తెలుసుకోవడానికి, అదివరకే రిలేషన్షిప్ లో ఉన్నవాళ్లయితే తమ అనుభవాలు, మంచి చెడులను చర్చించుకోవడానికి ఈ డ్రై డేట్స్‌ని ప్రిఫర్ చేస్తున్నారు. కిటెన్ఫిషింగ్ .. వ్యక్తిగత విషయాలకు సంబంధించి అబద్ధాలాడుతూ అవతలి వాళ్లను నమ్మించడం లేదా వశపరచుకోవడం. ఉదాహరణకు వయసును తగ్గించి, జీతాన్ని పెంచి చెప్పడం, సన్నగా ఉన్నప్పటి ఫొటోలు అప్లోడ్ చేయడం, ఇంజినీరింగ్ డిప్లమా చేసి, డిగ్రీ చేశానని నమ్మించడం లాంటివన్నమాట.లవ్ బాంబింగ్.. వ్యక్తిత్వంతో కాకుండా మాటలు, కానుకలు, అటెన్షన్‌తో అవతలి వ్యక్తిని గుక్క తిప్పుకోనివ్వకుండా చేయడం సిట్యుయేషన్‌షిప్.. ఇది ఫ్రెండ్షిప్కి ఎక్కువ.. రిలేషన్‌షిప్‌కి తక్కువ! అటాచ్మెంట్ ఉంటుంది. కానీ కమిట్మెంట్ ఉండదు.నానోషిప్.. పెళ్లిళ్లు, ఫంక్షన్లు, క్లబ్‌లు, పబ్‌లలో చూపులు కలిసి.. నవ్వులు విరిసి.. ఫ్లర్టింగ్ మొదలై.. అక్కడే ముగిసి అదొక తీయటి జ్ఞాపకంలా మిగిలిపోయేది!ఇంకా..ఒక బంధంలో ఉంటూనే మరొకరితో రిలేషన్ మెయిన్‌టెయిన్ చేసే ‘ఓపెన్ కాస్టింగ్’, సరిహద్దులకతీతంగా చేసే డిజిటల్ డేటింగ్ ‘వండర్ లవ్’ లేదా ‘డేటింగ్ నోమాడ్’, వాట్సాప్ మెసేజెస్ తో మాత్రమే రిలేషన్షిప్లో ఉండే ‘టెక్స్టేషన్షిప్’లాంటి బంధాలు, ఫోన్‌కాల్స్.. మెసేజెలను మెల్లగా తగ్గిస్తూ బంధం నుంచి వైదొలిగే ‘ఫేడింగ్’, ఏ సమాచారం లేకుండా హఠాత్తుగా భాగస్వామితో కమ్యూనికేషన్‌ను కట్ చేసుకోవడం, వాళ్ల జీవితంలోంచి అదృశ్యమైపోయే ‘ఘోస్టింగ్’ లాంటి అప్రకటిత బ్రేకప్‌లు, జీవితంలోంచి వెళ్లిపోయినా.. సోషల్ మీడియాలో పార్టనర్ చేసే పోస్ట్‌లను వెదుకుతూ లైక్స్ కొట్టే ‘హంటింగ్’ లాంటి గూఢచర్యాలూ ఉన్నాయి. ఇవన్నీ ఈ తరం ఫాలో అవుతున్న ‘లవ్షిప్స్!’పారదర్శకంగా ఉండాలిప్రేమించే వాళ్ల స్థాయిని కాకుండా మనస్తత్వాన్ని క్షుణ్ణంగా తెలుసుకుని, అన్ని విషయాలలో పారదర్శకంగా ఉండాలి. కుటుంబాలకు, కనీసం స్నేహితులకు కూడా చెప్పుకోలేని ప్రేమ బంధాలు చాలావరకు అబద్ధాల మీదే నిర్మితమై ఉంటాయి. నిజాయితీపరులైన ప్రేమికులను కులం, మతం వంటి కట్టుబాట్ల నుంచి రక్షించడానికి వివిధ చట్టాలు ఉన్నాయి. అలాగే ప్రేమ పేరుతో మోసం చేసే వారికీ కఠినమైన శిక్షలు ఉన్నాయి. ఆకర్షణకు లోనవకుండా భాగస్వామిని క్షుణ్ణంగా అర్థం చేసుకొని కమిట్ అవడం మంచిది. – సుధేష్ణ మామిడి, హైకోర్టు న్యాయవాది -
ప్రేమకు శ్వాస విశ్వాసమే- రకుల్
‘‘ఒక బంధం బలంగా సాగాలంటే ప్రేమ మాత్రమే సరిపోదు.. నమ్మకమూ ఉండాలి. ప్రేమకు శ్వాస విశ్వాసమే’’ అంటున్నారు రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh). జీవితంలో తాను అద్భుతమైన ‘ఫేజ్’లో ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఆ ఆనందానికి కారణం జీవిత భాగస్వామి జాకీ భగ్నానీ. బాలీవుడ్ నటుడు–నిర్మాత జాకీ భగ్నానీ(Jackky Bhagnani), రకుల్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2021లో ఈ ఇద్దరూ తమ ప్రేమ గురించి బయటపెట్టారు. 2024 ఫిబ్రవరి 21న పెళ్లి చేసుకున్నారు. నేడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’తో రకుల్ స్పెషల్ చిట్ చాట్ ... → మీరు, జాకీ ప్రేమలో ఉన్నప్పుడు జరుపుకున్న వాటిలో మరచిపోలేని ‘ప్రేమికుల దినోత్సవం’ గురించి చెబుతారా? మా ఇద్దరి కాంబినేషన్ (జాకీ నిర్మాత–రకుల్ హీరోయిన్)లో వచ్చిన మొదటి సినిమా ‘కఠ్ పుతలీ’ (2022). ఆ సినిమా అప్పుడే మేం ఫస్ట్ వేలంటైన్స్ డే జరుపుకున్నాం. మా డేటింగ్ మొదలైంది అప్పుడప్పుడే. ఓ హోటల్లోని గ్రీన్హౌస్ ఏరియాని జాకీ క్యాండిల్ లైట్ డిన్నర్‌కి తగ్గట్టుగా మార్పించాడు. ఒకవైపు గిటారిస్ట్‌లు పాడుతుంటే ఆ పాటలు వింటూ, ఆరోగ్యకరమైన విందుని ఆస్వాదించాం. జాకీ నా కోసం గులాబీ పువ్వులు, పుష్పగుచ్ఛాలు ఇచ్చాడు. అదొక అందమైన, ఆహ్లాదకరమైన రోజు. సో.. నాకెప్పటికీ ఆ వాలంటైన్స్ డే గుర్తుండి పోతుంది. → ఓ జంట మధ్య బలమైన బంధం ఉండాలంటే మీరు ఇచ్చే సలహాలు? పెద్ద టిప్ ఏంటంటే ‘నమ్మకం’. ఒకరి పట్ల మరొకరికి పూర్తి నమ్మకం ఉండాలి. ఆ నమ్మకమే బలమైన బంధానికి పునాది వేస్తుంది. రిలేష్న్షిప్లో మంచి ష్రెండ్షిప్ ఉండటం చాలా ముఖ్యం. ఎప్పుడైతే భాగస్వామిలో మంచి ఫ్రెండ్‌ని చూస్తామో, అప్పుడు ఆ బంధం బలంగా ఉంటుంది. ఎవరికైనా జీవితం చాలా సునాయాసంగా సాగాలి... ఒత్తిడిగా కాదు. హ్యాపీగా సాగాలంటే నమ్మకం, విశ్వాసం, స్నేహం ముఖ్యం. → మీ ‘బెటర్‌హాఫ్’ జాకీ భగ్నానీ గురించి కొన్ని మాటలు... జాకీ నా జీవిత భాగస్వామి కావడం నిజంగా నా అదృష్టం.. తను నా సోల్‌మేట్ కావడం ఆనందం. మా ఇద్దరి ఆలోచనలు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. మా ఇద్దరికీ ఉన్న పెద్ద తేడా ఏంటంటే నేను చాలా ‘హైపర్’, తను చాలా ‘కూల్’. నా హైపర్‌ని జాకీ ఎప్పుడూ విమర్శించింది లేదు సరికదా... పొగుడుతుంటాడు. అయినా ఒకరు హైపర్... మరొకరు కూల్... ఇలా ఉండటం కూడా బాగుంటుంది. బ్యాలెన్స్ అవుతుంది (నవ్వుతూ). నా పార్ట్నర్లో నేను బెస్ట్ ఫ్రెండ్‌ని చూశాను. మేం ఇద్దరం ఏ విషయం గురించైనా చాలా ఓపెన్‌గా మాట్లాడుకుంటాం. ఏం చేయాలన్నా చేస్తాం. ఇక మేం ఒకరికొకరం ఇచ్చుకునే సపోర్ట్ చాలా గొప్పగా ఉంటుంది. అలాగే మేం మా పార్ట్నర్ కోసం మారాల్సిన అవసరం రాలేదు. పెళ్లికి ముందెలా ఉన్నామో ఆ తర్వాతా అలానే ఉన్నాం. అందుకే మేం ఇద్దరం అదృష్టవంతులం అంటాను.→ అయితే పెళ్లి తర్వాత మీరు మారాల్సిన అవసరం రాలేదంటారా? ఏ మార్పూ లేదు. అసలు ఒకరి జీవితం పెళ్లి కారణంగా ఎందుకు మారాలి? పెళ్లి తర్వాత జీవితం మెరుగవ్వాలి. నా లైఫ్ బెటర్ అయింది. పెళ్లికి ముందు నాకు నచ్చిన పనులు చేసినట్లే ఇప్పుడూ చేస్తున్నాను. ఫీలింగ్స్‌ని దాచేయకుండా షేర్ చేసుకునేంత స్వేచ్ఛ నా సోల్‌మేట్‌తో ఉంది. అందుకే జీవితం అందంగా, ఆనందంగా ఉంది. అర్థం చేసుకునే జీవిత భాగస్వామి లభించడం ఓ అదృష్టం. అర్థం చేసుకునే వ్యక్తి పక్కన ఉన్నప్పుడు జీవితంలోని ఆ దశ అద్భుతంగా ఉంటుంది.– డి.జి. భవాని -
క్విక్ కామర్స్ ఏఐ రైడ్!
పదే పది నిమిషాల్లో డెలివరీతో రప్పా రప్పా దూసుకుపోతున్న క్విక్ కామర్స్ దిగ్గజాలు... దీని కోసం అధునాతన టెక్నాలజీని విరివిగా వాడేసుకుంటున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డేటా ఎనలిటిక్స్ వంటి సాంకేతికతల దన్నుతో కస్టమర్ల ఆర్డర్ ధోరణులు, ప్రోడక్ట్ ప్రాధాన్యతలు, ఏ సమయంలో ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నారనే అంశాలను అధ్యయనం చేయడం, డార్క్ స్టోర్ నుంచి గమ్యస్థానికి అత్యంత వేగవంతమైన రూట్‌ను ఎంచుకోవడం వంటివన్నీ చకచకా చక్కబెట్టేస్తున్నాయి.క్విక్ కామర్స్ దిగ్గజాలైన బ్లింకిట్, బిగ్‌బాస్కెట్ నౌ, జెప్టో లేదంటే స్విగ్గీ ఇన్‌స్టామార్ట్... చెప్పింది చెప్పినట్లుగా పది నిమిషాలలోపే ఆర్డర్లను అంతవేగంగా ఎలా డెలివరీ చేసేస్తున్నాయో తెలుసా? ఇప్పటికే తమ వద్దనున్న వినియోగదారుల డేటాను ఏఐతో సమర్థవంతంగా ఉపయోగించుకోవడం ద్వారానే ఇదంతా సాధ్యమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. తగినంత కన్జూమర్ సమాచారం ఉన్న క్విక్ కామ్ కంపెనీలకు ఏఐ వరప్రదాయినిగా మారుతోంది. వినియోగదారుల కొనుగోలు స్వభావం నుంచి వారు ఎంత విరివిగా ఆర్డర్ చేస్తున్నారు, ఏయే ఉత్పత్తులను ఎక్కువగా కొంటున్నారు వంటివన్నీ ఏఐ టూల్స్ రియల్ టైమ్‌లో విశ్లేషించి అందిస్తున్నాయి. అంతేకాదు దగ్గరలో ఉన్న డార్క్ స్టోర్ (క్విక్ కామ్ కంపెనీలు ప్రోడక్టులను నిల్వ ఉంచుకునే చిన్నపాటి గిడ్డంగులు) నుంచి ట్రాఫిక్ రద్దీగా ఉన్న సమయంలో, అలాగే పెద్దగా రద్దీ లేనప్పుడు గమ్యస్థానానికి అత్యంత వేగంగా చేరుకునే రూట్‌ను కూడా అధ్యయనం చేసి ఈ ఏఐ టూల్స్ నేరుగా డెలివరీ బాయ్‌కు చేరవేస్తున్నాయి.అంతా క్షణాల్లో... జెప్టో వంటి కీలక క్విక్ కామ్ సంస్థలు ఉపయోగిస్తున్న తెరవెనుక (బ్యాకెండ్) టెక్నాలజీ... ఏకకాలంలో పికర్స్, ప్యాకర్స్, ఇంకా రైడర్లను రియల్‌టైమ్‌లో కనెక్ట్ చేస్తోంది. ఒకసారి యాప్‌లో ఆర్డర్ కన్ఫర్మ్ అవ్వగానే, ఈ సిస్టమ్‌లోని అందరూ అనుసంధానమైపోతారు. ఆర్డర్‌ను పిక్ చేయడం, డిస్పాచ్ చేయడం 2 నిమిషాల్లోపే జరిగిపోతుంది. ఆపై ట్రాఫిక్, ఇంధన మైలేజీ, వాహన టెలీమెట్రీ, ప్రయాణ సమాయాల చరిత్ర, దూరం వంటి డేటాను ఉపయోగించుకుని రియల్ టైమ్ రూటింగ్ తగిన రూట్లను సూచిస్తుంది. దీనివల్ల ఆర్డర్‌ను డెలివరీ పార్టనర్ ఎంత సమయంలో కస్టమర్ చెంతకు చేర్చగలరనే అంచనా ట్రావెల్ టైమ్ (ఈటీఏ)ను పక్కాగా పేర్కొంటుంది. దీని ప్రకారం సగటున 8 నిమిషాల్లోపే ఆర్డర్ డెలివరీ జరిగేందుకు వీలవుతోందని నిపుణులు చెబుతున్నారు. 340కి పైగా డార్క్ స్టోర్లున్న జెప్టో గతేడాది డెలివరీ దూరం 1.7 కిలోమీటర్లు కాగా, ఇప్పుడిది 1.5 కిలోమీటర్లకు తగ్గించుకుంది. అంతేకాదు, 3–4 సెకెన్లలో చెకవుట్ అయ్యే విధంగా అధునాతన టెక్నాలజీలు వినియోగించే పేమెంట్ గేట్‌వే సరీ్వసులను కంపెనీ వాడుకుంటోంది. ఇక బీబీనౌ విషయానికొస్తే, ఆర్డర్ ఏ డార్క్ స్టోర్‌కు వెళ్తుందో నిర్ణయించడానికి ముందే టెక్నాలజీ రంగంలోకి దిగుతుంది. ఉదాహరణకు సదరు ప్రాంతంలో ఉన్న రైల్వే ట్రాక్‌లు, పీక్, నాన్–పీక్ టైమ్‌లో ట్రాఫిక్, రోడ్డు స్థితిగతులు, ఇప్పటిదాకా కస్టమర్ షాపింగ్ ధోరణులు, వయస్సు, ఇంటర్నెట్ కనెక్టివిటీ వంటి పలు డేటా పాయింట్లను పరిగణనలోకి తీసుకుంటామని బిగ్‌బాస్కెట్ సీఓఓ టీకే బాలకుమార్ చెప్పారు. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా బీబీనౌ రోజుకు 5 లక్షల పైగా ఆర్డర్లను ప్రాసెస్ చేస్తోంది.→ జెప్టో డార్క్ స్టోర్ నుంచి ప్రస్తుత డెలివరీ దూరం 1.5 కిలోమీటర్లు; యాప్‌లో ఆర్డర్ చెకవుట్ సమయం 3–4 సెకన్లు. → ఆర్డర్లను తగిన డార్క్ స్టోర్లకు కేటాయించేందుకు బీబీనౌ జియో స్పేషియల్ డేటాను వినియోగిస్తోంది. → పికర్లు, ప్యాకర్లు, రైడర్లను అత్యంత వేగంగా కనెక్ట్ చేయడానికి జెప్టో ఏఐ ఆల్గోరిథమ్స్ దోహదం చేస్తున్నాయి.→ యూజర్ల అభిరుచులను బట్టి ఉత్పత్తులను సిఫార్సు చేయడంలో స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ డేటా ఎనలిటిక్స్ది కీలక పాత్ర. వృథాకు చెక్.. డిమాండ్‌ను అంచనా వేయడానికి దాదాపు అన్ని క్విక్ కామ్ సంస్థలూ ఏఐ ఆల్గోరిథమ్స్, మెషీన్ లెర్నింగ్ మోడల్స్ ప్రయోజనాన్ని వాడుకుంటున్నాయి. దీనివల్ల ప్రోడక్ట్ నిల్వలను సరిగ్గా నిర్వహించేందుకు, వృథాను అరికట్టేందుకు వాటికి వీలు చిక్కుతోంది. అంతేగాకుండా, డార్క్ స్టోర్లలో ఉత్పత్తుల నిల్వలను నిరంతరం పర్యవేక్షించేందుకు క్విక్ కామ్ సంస్థలు రియల్ టైమ్ డేటాను కూడా ఎఫ్ఎంసీజీ కంపెనీలతో పంచుకుంటున్నాయి. పలు ఈ–కామర్స్ సంస్థల వృద్ధిలో కీలకంగా నిలుస్తున్న డేటా ఎనలిటిక్స్ క్విక్ కామ్‌లో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఉదాహరణకు, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ షాపింగ్ అభిరుచులు, ప్రాధాన్యతల ఆధారంగా ఒక్కో కస్టమర్‌కు ఒక్కోలాంటి యూజర్ అనుభూతిని అందించేందుకు డేటా ఎనలిటిక్స్‌ను సద్వినియోగం చేసుకుంటోంది. ‘ఇలాంటి నిర్దిష్ట (టార్గెటెడ్) విధానం వల్ల వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను సిఫార్సు చేయడానికి వీలువుతుంది. అలాగే కస్టమర్లు ఏదైనా ఉత్పత్తిని కొనుగోలు చేసే అవకాశాలను పెంచుతుంది’ అని ఈ–కామర్స్ నిపుణులు సోమ్దత్తా సింగ్ అభిప్రాయపడ్డారు.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
పెళ్లికి వెనుకాడుతున్న పడతులు!
‘పెళ్లిపై నమ్మకం లేదు.పెళ్లి చేసుకోవడమంటే స్వేచ్ఛను కోల్పోవడమే. అలా బతకడం నాకే మాత్రం ఇష్టం లేదు. ఒక్కసారి వైవాహిక జీవితంలోకి ప్రవేశించిన తర్వాత సొంత ఆలోచనలకు, అభిప్రాయాలకు, ఆకాంక్షలకు, చివరకు అభిరుచులకూ అవకాశం ఉండదు. ఇలా ఎంతోమందిని చూశాను. అందుకే పెళ్లికి దూరంగా ఉన్నాను..’ ఇది 35 ఏళ్ల విజయ (పేరు మార్చాం) బలమైన అభిప్రాయం. ఆమె ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ (Moinabad) సమీపంలోని ఓ కళాశాలలో లెక్చరర్‌గా పని చేస్తున్నారు. అక్కడే ఒక మహిళల హాస్టల్లో ఉంటున్నారు.చాలామంది మహిళలు ఇటీవలి కాలంలో వివాహ బంధం, దాంపత్య జీవితంపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పాతికేళ్ల వయసు దాటినా పెళ్లి (Marriage) ఊసు ఎత్తేందుకు కూడా ఇష్టపడని వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. విజయలా స్వతంత్రంగా జీవించాలనుకునే వారితో పాటు వృత్తిపరమైన బాధ్యతల వల్ల కొందరు, మంచి కెరీర్ (Career) కోసం ప్రయత్నించే క్రమంలో ఒత్తిడికి గురవుతూ మరికొందరు వివాహం విషయంలో నిరాసక్తతను ప్రదర్శిస్తున్నట్లు మోర్గాన్ స్టాన్లీ అధ్యయనం వెల్లడించింది. తమ జీవితాన్ని తమకు ఇష్టమైన విధంగా గడపడానికి వీలవుతుందనే భావనే ఇందుకు ప్రధాన కారణమని పేర్కొంది.ఒకవేళ పెళ్లి చేసుకున్నా పిల్లల్ని కనేందుకు ఇష్టపడటం లేదని తెలిపింది. భారత్ (India) సహా ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థ సర్వే నిర్వహించింది. 2030 నాటికి ఒంటరి మహిళల సంఖ్య 45 శాతానికి పెరగవచ్చునని అంచనా వేసింది. వీరిలో 25–44 ఏళ్ల లోపు వయసున్న వారే అత్యధిక సంఖ్యలో ఉంటారని పేర్కొంది. వ్యక్తిగత అభివృద్ధి, తాము ఎంచుకున్న రంగాల్లో పురోగతికే యువతులు ప్రాధాన్యం ఇస్తున్నారని వివరించింది. మరోవైపు కుటుంబ బాధ్యతలూ ఇందుకు కారణమవుతున్నాయి.బాధ్యతలు పంచుకుంటూ.. కెరీర్ కోసంకష్టపడుతూ.. సాధారణంగా అమ్మాయిలు 25 ఏళ్లలోపే పెళ్లిళ్లు చేసుకుంటారు. కానీ ఇటీవలి కాలంలో అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు కూడా కుటుంబ బాధ్యతలను పంచుకుంటున్నారు. తల్లిదండ్రుల బాగోగులు చూసుకుంటున్నారు. తోబుట్టువుల కెరీర్ కోసం కష్టపడుతున్నారు. అదే సమయంలో జీవితంలో స్వేచ్చను కోరుకుంటున్నారు. అల్వాల్‌కు చెందిన సుజాత (పేరు మార్చాం.) ఒక ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నారు. ‘పదేళ్ల క్రితమే నాన్న చనిపోయారు. అప్పటి నుంచి తమ్ముడు, చెల్లి, అమ్మను చూసుకోవడం నా వంతైంది. చూస్తూండగానే 40 ఏళ్లు వచ్చేశాయి..’అంటూ నవ్వేశారు ఆమె.సుజాత లాగానే చాలామంది అమ్మాయిలు కుటుంబ బాధ్యతల నేపథ్యంలో వయసు దాటి పోయిందనే భావనతో వివాహ బంధానికి దూరమవుతున్నారు. కానీ కొంతమంది యువతుల్లో స్వేచ్ఛాయుత జీవితంపై ఆసక్తి పెరుగుతోంది. వారి ఆలోచనలు, అభిప్రాయాలు వైవాహిక జీవితానికి వ్యతిరేకంగా ఉంటున్నాయి. ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన శైలజ.. ‘పెళ్లి కంటే ఆర్ధిక స్వాతంత్య్రం ఎంతో ముఖ్యం. అది లేకుండా పెళ్లి చేసుకోవడం ఆత్మహత్యాసదృశం..’అంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. ఆమె ప్రస్తుతం ఓ సాఫ్ట్వేర్ సంస్థలో పని చేస్తున్నారు. ఇప్పటికే 28 ఏళ్లు దాటాయి. అయినా ఒంటరిగానే ఉండిపోవాలని కోరుకుంటున్నారు. పిల్లలూ భారమేనా..! పెళ్లి చేసుకున్నప్పటికీ మరికొంతమంది మహిళలు పిల్లల్ని కనేందుకు వెనుకాడుతున్నారు. ‘ఈ రోజుల్లో పిల్లల్ని కనడం. పెంచడం ఎంతో ఖరీదైన విషయం. ఆ విషయంలో ఆచి తూచి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది..’ అని ఒక యువతి వ్యాఖ్యానించారు. నేను, నా స్వేచ్ఛ అనే భావన బలపడుతోంది దేశంలో అలాగే హైదరాబాద్‌లోనూ ఇలాంటి ట్రెండ్ కనిపిస్తోంది. మా అమ్మాయి పెళ్లిచేసుకోవడం లేదంటూ ఇటీవల కొందరు తల్లిదండ్రులు మా దగ్గరకు వచ్చినపుడు.. పెళ్లి ఎందుకు, ఆ అవసరం ఏమిటీ, పిల్లలు ఇతర బాదరాబందీ అంతా ఎందుకంటూ అమ్మాయిలు ప్రశ్నిస్తున్నారు. పెళ్లితో తమ స్వేచ్ఛ, కెరీర్ దెబ్బతింటుందని, ఒకవేళ వివాహానికి ఒప్పుకున్నా పిల్లలు వద్దనుకునే వాళ్లనే చేసుకోడానికి సిద్ధమని చెబుతున్నారు. కొంతమంది చదువు, ఉద్యోగాల రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉంటూ స్వేచ్ఛా జీవితం గడిపాక.. ఇక కుటుంబం, సంతానం వంటివి వద్దనుకుంటున్నారు. మనం అనే ఉమ్మడి భావన పోయి నేను, నా స్వేచ్ఛ, నా కెరీర్ అనే భావన బలపడుతోంది. తల్లిదండ్రుల కోరిక మేరకు ఇలాంటి వారికి మేం కౌన్సెలింగ్ ఇస్తున్నాం. – పి.జ్యోతిరాజా, సైకాలజిస్ట్, శ్రీదీప్తి కౌన్సెలింగ్ సెంటర్నచ్చిన వరుడు, మెచ్చిన ఉద్యోగం కోసంఎదురుచూస్తూ.. మరోవైపు నచ్చిన వరుడు లభించకపోవడం కూడా కొంతమంది అమ్మాయిలకు శాపంగా మారుతోంది. ప్రత్యేకంగా కొన్ని సామాజిక వర్గాలకు చెందిన యవతులు ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మంచి విద్యార్హతలు, ఉద్యోగం, కెరీర్ అవకాశాలు, వ్యక్తిత్వం, అభిరుచులు తమకు నచ్చినట్లు ఉంటేనే పెళ్లికి అంగీకరిస్తున్నారు. అలాంటి అబ్బాయి లభించే వరకు నిరీక్షిస్తున్నారు. మరోవైపు విదేశీ సంబంధాల కోసం ఎదురుచూసే కుటుంబాల్లోనూ అమ్మాయిలకు పెళ్లిళ్లు ఆలస్యంగా జరుగుతున్నాయి. కొంతమంది సివిల్స్, గ్రూప్స్ వంటి పోటీ పరీక్షలకు ఏళ్ల తరబడి చదువుతున్నారు. లక్ష్యాన్ని సాధించేవరకు పెళ్లికి దూరంగా ఉండాలనే భావనతో ఐదారేళ్లకు పైగా గడిపేస్తున్నారు.అప్పటికే పెళ్లి వయసు దాటిపోతోంది.చదవండి: ఏం చేయాలో అర్థం కావడం లేదు.. పారిపోవాలనిపిస్తోంది!భవిష్యత్తులో మరిన్ని సవాళ్లు!వచ్చే 10, 15 ఏళ్లలో వివాహ బంధానికి సంబంధించి మరింత ఎక్కువగా సవాళ్లు ఎదురుకావొచ్చు. ప్రస్తుతం 20 నుంచి 25 ఏళ్లు పైబడిన యువతుల్లో కొంతమంది పెళ్లి అంటే విముఖత వ్యక్తం చేస్తున్నారు. క్రమంగా ఈ ఆలోచన విధానం అమ్మాయిల్లో పెరుగుతోంది. వివాహం అనగానే బాధ్యతల్లో చిక్కుకుపోవడం, పిల్లల్ని కని వారి సంరక్షణలో, సంసార బాధ్యతల్లో మునిగిపోవడం అని అనుకుంటున్నారు. తమ స్వేచ్ఛకు, స్వతంత్రతకు భంగం వాటిల్లుతుందని భయపడుతున్నారు. ఉన్నత చదువులు చదివి, సమాజంలో మంచి ఉద్యోగం చేస్తున్నా.. మళ్లీ కుటుంబపరంగా ఎన్నో బరువు బాధ్యతలు మోయాల్సి రావడం కూడా ఇందుకు కారణమవుతోంది. అమ్మాయిల్లో పెళ్లి, పిల్లల పట్ల విముఖత పెరగడానికి పురుషుల మనస్తత్వాల్లో మార్పు రాకపోవడం కూడా ఒక కారణంగా భావించవచ్చు. – సి.వీరేందర్, సీనియర్ సైకాలజిస్ట్, యూ అండ్ మీ కౌన్సెలింగ్ సెంటర్ -
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ, హీరో రాగ్ మయూర్‌తో వాలెంటైన్స్ డే స్పెషల్
‘ప్రేమంటే ఏమిటంటే ...’’ యుగయుగాలుగా ఈ ప్రశ్నకు సమాధానం కోసం వెదుకులాట నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. ఎవరి అర్థాలు వారివి. ఎవరి అనుభూతులు, అనుభవాలు వారివి. ఎవరి భావోద్వేగాలు వారివి. అందుకే రెండు హృదయాల మధ్య ప్రేమ సరికొత్తగా కొంగొత్తగా చిగురుస్తూనే ఉంది. చిక్కావే ప్రేమ.. అంటూ కూని రాగాలు కాదు...కాదు..కోటి రాగాలు పలికిస్తుంది. అదే ప్రేమ అనే రెండక్షరాల్లోని గమ్మత్తు... మత్తు. ఈ మత్తులోకి ఎవరికి వారు ఎపుడో ఒకపుడు జారిపోవాల్సిందే. ప్రేమికుల దినోత్సవం సందర్బంగా సివరపల్లి (పంచాయత్ సిరీస్ తెలుగు రీమేక్) హీరో రాగ్ మయూర్‌తో సాక్షి.కామ్ స్పెషల్‌గా ముచ్చటించింది.సినిమాబండి సినిమాతో పాపులారిటీ తెచ్చుకున్న విలక్షణ నటుడు రాగ్ మయూర్. ముఖ్యంగా వాలెంటైన్స్ డే వీక్ మొదలైందంటే చాలు ‘స్వర మంజరీ’ అంటూ చెప్పే ఆయన డైలాగ్ గత మూడు నాలుగేళ్లుగా ట్రెండింగ్‌లో నిలుస్తోంది అంటే రాగ్ యాక్టింగ్ స్కిల్స్‌ను అర్థం చేసుకోవచ్చు. అలాగే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె సుకృతి ప్రధాన పాత్రలో నటించిన గాంధీ తాత చెట్టు సినిమాలో ఇండస్ట్రియలిస్ట్ ఏజెంట్ సతీష్ అనే పాత్రలో రాగ్ మయూర్ నటించడమే కాదు, అటు విలన్ కూడా తన ప్రతిభను చాటుకున్నాడు.ఇదీ చదవండి: MahaKumbh : బ్రహ్మాండమైన వ్యాపారం నెలకు లక్షన్నర!ఇపుడు తన కరియర్లో మైలురాయిలాంటి సివరపల్లిలో పంచాయతీ సెక్రటరీగా తన నటనతో ప్రేక్షక నీరాజనాలు అందుకుంటున్నాడు. ఇప్పటికే ఓటీటీలో జనాలను ఒప్పించి, మెప్పించిన హిందీ ‘పంచాయత్’ వెబ్ సిరీస్‌ను తెలుగులోకి రీమేక్ కూడా అదే స్థాయిలో దూసుకుపోవడం విశేషమే మరి. తెలుగు ఫ్లేవర్ మిస్ కాకుండా తెలంగాణలోని పల్లె వాతావరణంలో సాగే ఈ సిరీస్ పిల్లా, పెద్దా అందర్నీ ఆకట్టుకుంటోంది.సినిమాపై ఆయనకు ప్రేమ ఎలాపుట్టింది లాంటి వివరాలతో పాటు, నిజజీవితంలో ప్రేమ, ప్రేక్షకులతో ఆయన ప్రేమ, రాగ్ కిష్టమైన నటీ నటులు ఇలాంటి మరిన్ని విశేషాలు ఆయన సాక్షితో పంచుకున్నారు. ఈ మొత్తం చిట్‌చాట్‌ను రెండు భాగాలుగా వీడియో రూపంలో మీకు అందిస్తున్నాం. రాగ్ అందించిన ప్రేమ కబుర్లలో ఏ ఒక్కటీ మిస్ కాకుండా దీన్ని సంపూర్ణంగా వీక్షించి, మీ అభిప్రాయాలను పంచుకోండి. సాక్షి.కామ్ ప్రేమికులకు ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు. -
లంకమల అరణ్యం.. వర్థిల్లిన శైవం
బి.కొత్తకోట: అన్నమయ్య జిల్లాలోని సిద్దవటం అటవీ ప్రాంతమైన లంకమల అభయారణ్యంలో 4వ శతాబ్ది నాటి మానవుల ఆనవాళ్లు వెలుగులోకి వచ్చాక.. ఈ ప్రాంతంలో ఇంకా ఎలాంటి విశేషాలు, చరిత్ర దాగున్నాయన్న ఉత్సుకత పెరుగుతోంది. దీనికి తగ్గట్టుగా రోజుకో కొత్త విషయం బయటికి వస్తోంది. కొత్తగా సిద్దవటం అటవీశాఖ క్షేత్రాధికారిణి బి.కళావతి.. వెలుగులోకి తెచ్చిన ఫొటోల ఆధారంగా మరిన్ని విషయాలు బాహ్య ప్రపంచంలోకి వచ్చాయి. సాక్షిలో ‘ఆధ్యాత్మిక క్షేత్రం.. లంకమల’ కథనం ద్వారా పలు ఆసక్తికర అంశాలను వెలుగులోకి తేవడం తెలిసింది. ప్రస్తుతం ఆ కథనానికి మరింత బలం చేకూర్చే మరిన్ని ఆధారాలు లభ్యమయ్యాయి. ఒకే చోట గుహ, బండపై శాసనం, శిథిలమైన శివాలయాల ఆనవాళ్లు, శివుని పాద ముద్రలు, అక్కడే పైనుంచి కిందికి దూమికే జలపాతం.. ఇలా అన్నీ ఆధారాలు వెలుగులోకి వచ్చిన ఈ ప్రాంతానికి కైలాసకోనగా ప్రాచుర్యం ఉంది. అంటే శివుడు నివసించిన ప్రాంతమని అర్థం. కాబట్టి శైవం ఏ స్థాయిలో ఇక్కడ వర్దిల్లిందో దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతోంది. అందిన ఆధారాలను పురావస్తుశాఖ క్షుణ్ణంగాపరిశీలిస్తోంది. బండలపై ఆధారాలు ఈ ప్రాంతంలో శైవ క్షేత్రం వర్థిల్లిందని.. ఆనాటి శైవులు బండలపై శాసనాలు, ఇతర గీతల ద్వారా వెల్లడవుతోంది. శాసనాలను బట్టి 4వ శతాబ్దినాటి శైవులు ఇక్కడ ఉన్నట్టు నిర్ధారిస్తున్నారు. అప్పట్లో ఎలాంటి ఆయుధాలు వినియోగించారో.. తెలిపేలా బండలపై వాటి ఆకృతి తెలిపేలా చెక్కారు. మరోచోట శాసనం, పక్కనే శివలింగ ఆకారం ఉన్నాయి. ఇక్కడి శిథిల ఆలయాల నిర్మాణం కోసం చుతురస్రాకారంలో ఉండే బండలను వినియోగించారని, వాటిని బట్టి స్పష్టం అవుతోంది.పై కైలాసం.. జారే జలపాతం శైవ క్షేత్రాలున్నట్టు గుర్తించిన ప్రాంతానికి సమీపంలోనే పై కైలాసకోన ఉంది. ఇది అద్భుతమైన జలపాతం. పై నుంచి జలపాతం కిందకు దూకే ప్రాంతం అత్యంత భయంకరంగా కనిపిస్తుంది. కొండనడుమ దూకే జలపాత ప్రాంతం ప్రకృతి సౌందర్యాన్ని తలపిస్తుంది. ఈ జలపాతంపై నుంచి కిందకు జారితే కైలాసానికి చేరినట్టే. అందుకనే దీన్ని పై కైలాసంగా ప్రాచుర్యంలో ఉంది. జలపాతం దిగువన గుహలు, ఆలయాలతో కూడిన ప్రదేశమే దిగువ కైలాసకోన. అక్కడే గుహ.. ఆలయాలులంకమల మొత్తం 36 వేల హెక్టార్ల మేర విస్తరించి ఉండగా.. అందులో సిద్దవటం రేంజి పరిధిలో 26 వేల హెక్టార్ల అభయారణ్యం ఉంది. అడవిలోని కొండూరు బీటులో శైవ క్షేత్ర ఆనవాళ్లు విస్తృతంగా లభ్యమయ్యాయి. దిగువ కైలాసకోనగా పిలువబడే.. ఈ ప్రదేశంలో అర ఎకరం విస్తీర్ణంలో పదికిపైగా శివాలయాల శిథిలాలు ఉన్నాయి. వీటికి సంబంధించిన పునాదుల బండరాళ్లు, వాటి నిర్మాణం కనిపిస్తున్నాయి. పడిపోయిన గోడలు, వాటి శిథిలాలు ఉన్నాయి. దీన్ని ఆధారంగా చేసుకుంటే వాటిని ఆలయాలుగా భావిస్తున్నారు. ఈ చోటనే గుహను కూడా గుర్తించారు. ఆలయాల వద్ద పూజల నిర్వహణ, గుహలో సిద్దులు, యోగులు తపస్సు చేసుకునే వారు. ఇక్కడే శివుడ్ని ఆరాధిస్తున్న వీరుడి విగ్రహం లభ్యమైంది. ఈ ప్రాంతం దిగువ కైలాసకోనగా ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉంది. ఈ అడవికి సమీపంలో సిద్దవటం గ్రామం ఉంది. అంటే సిద్దులకు ఈ ప్రాంతం నివాసమని భావిస్తున్నారు. దీనివల్లె సిద్దవటం అని పేరొచ్చిందని చెబుతారు. -
ఊరంతా ఉద్యోగులే
మరిపెడ రూరల్: ఒకప్పుడు మారుమూల గిరిజన తండా.. ఆపై సౌకర్యాల లేమి. అయితేనేం సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని ఉన్నత చదువులు చదివారు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఇంటికొకరు ప్రభుత్వ కొలువుల్లో ఉన్నారంటే ఆశ్చ ర్యం కలుగక మానదు. అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు అన్ని హోదాల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఆ గ్రామంలో ఉన్నారు. చిన్న, సన్నకారు రైతులు కష్టపడి తమ బిడ్డలను ఉన్నత చదువులు చదివించి ప్ర భుత్వ కొలువుల్లో స్థిరపడేలా చేశారు. మరికొందరు ప్రైవేట్ రంగాల్లోనూ రాణిస్తున్నారు. ఇంతకీ ఆ గ్రామం ఏంటి అనుకుంటున్నారా.. అదే మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తండధర్మారం. పట్టణాన్ని తలపించేలా.. మారుమూల తండా అయిన తండధర్మారం.. నేడు పట్టణాన్ని తలపిస్తోంది. అన్నీ డాబాలు, రెండు, మూడు బహుళ అంతస్తుల భవనాలున్నాయి. తాతముత్తాతల నుంచి గ్రామంలో వ్యవసాయమే ప్రధాన ఆధారంగా కుటుంబాలు జీవిస్తుండేవి. ఊరి పేరులో తండా అని ఉన్నప్పటికీ అక్కడ అన్ని వర్గాల కుటుంబాలు నివసిస్తున్నారు. గ్రామంలో 267 గృహాలు, 1,160 మంది జనాభా ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లో ప్రభుత్వ కొలువుతో ఆ పల్లె విలసిల్లుతోంది. తామేమీ తక్కువ కాదంటూ ఒకరికంటే ఒకరు పోటీ పడి ఉన్నత చదువులు చదువుతూ ప్రభుత్వ కొలువులు సాధిస్తున్నారు. పూర్వ కాలంలోనే ఈ గ్రామంలో బడి పంతుళ్లు, పోలీస్ పటేల్‌గా కొలువు దీరారు. వివిధ ప్రాంతాల్లో కొలువు దీరిన ఉద్యోగులంతా సంక్రాంతి పండుగకు స్వగ్రామంలో కలుసుకొని గ్రామంలోని మహిళలు, యువతకు వివిధ పోటీలు నిర్వహిస్తుంటారు. 100 మందికిపైగా ప్రభుత్వోద్యోగులు గ్రామంలో 10, 15 ప్రభుత్వ కొలువులు ఉంటేనే గొప్ప. అలాంటిది తండధర్మారంలో 100 మందికిపైగా ప్రభుత్వ కొలువుల్లో స్థిరపడ్డారంటే మామూలు విషయం కాదు. గ్రామానికి చెందిన గుగులోతు రవినాయక్ (ఐఏఎస్) తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) మెంబర్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. గత సంవత్సరం మహబూబ్‌నగర్ కలెక్టర్‌గా కొనసాగారు. అలాగే గుగులోతు వసంత్‌నాయక్ ఆర్ అండ్ బీ ఎస్సీగా విధులు నిర్వహిస్తున్నారు. గుగులోతు సుమలత ఇటీవల ఆర్టీఏ కొలువు సాధించి ఖమ్మం జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయులు, ఫారెస్ట్, ఎక్సైజ్, పోలీస్ ఇలా అన్ని శాఖల్లోనూ కొలువై ఉన్నారు. స్వాతంత్య్రం రాకముందే.. స్వాతంత్య్రం రాక ముందే గ్రామంలో పదుల సంఖ్యలో విద్యావంతులున్నారు. ఈ క్రమంలోనే గ్రామంలోని గుగులోతు సక్రునాయక్ మొదటి బడిపంతులుగా కొలువుదీరినట్లు గ్రామస్తులు తెలిపారు. అలాగే హన్మంతునాయక్, స్వాతంత్య్ర సమరయోధుడు వెంకన్ననాయక్, గుగులోతు భగ్గునాయక్ తర్వాత బడిపంతులుగా నియమితులయ్యారు. గుగులోతు సిరినాయక్ అనే వ్యక్తి పోలీస్ పటేల్‌గా విధులు నిర్వహించారు. వీరిని ఆదర్శంగా తీసుకునే గ్రామంలోని రైతులు, కూలీలు కష్టపడి పిల్లలను ఉన్నత చదువులు చదివించారు. -
కార్పొరేట్లకు రెడ్ కార్పెట్
ప్రపంచంలోనే అతి పెద్ద విమానయాన మార్కెట్లలో భారత్‌ది మూడో స్థానం. పదేళ్ల వ్యవధిలో (2024 ఏప్రిల్ నాటికి) సీటింగ్ సామర్థ్యం 79 లక్షల నుంచి 1.55 కోట్లకు పెరిగింది. విమానయానం మరింతగా వృద్ధి చెందుతున్న అంచనాల మధ్య వేల కొద్దీ విమానాలకు ఆర్డర్లిచ్చిన ఎయిరిండియా, ఇండిగో లాంటి దిగ్గజాలు.. గణనీయంగా పెరుగుతున్న కార్పొరేట్ ప్రయాణికులపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాయి. కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ నివేదిక ప్రకారం 2023 ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా కార్పొరేట్ ట్రావెల్ మార్కెట్ (హోటళ్లు, విమానయాన సంస్థలు, రైళ్లు, క్యాబ్‌లు కలిపి) దాదాపు 10.6 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇందులో ఎయిర్‌లైన్స్ మార్కెట్ వాటా 53 శాతంగా (5.6 బిలియన్ డాలర్లు) ఉంది. కార్పొరేట్ల ప్రయాణాలు మరింతగా పెరుగుతాయన్న అంచనాల నేపథ్యంలో విమానయాన సంస్థలు కూడా ఈ విభాగంపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. ప్రత్యేక ఆఫర్లతో కార్పొరేట్, సంపన్న ప్రయాణికులను ఆకట్టుకునేందుకు దేశ విదేశ ఎయిర్‌లైన్స్ పోటీపడుతున్నాయి. ఈ క్రమంలోనే చిన్న, మధ్య తరహా సంస్థలపై (ఎస్ఎంఈ) ఎయిరిండియా దృష్టి సారించింది. సాధారణంగా మార్కెటింగ్‌పరంగా వాటిని చేరుకోవడం కొంత కష్టతరం కావడంతో, అవే నేరుగా బుకింగ్ చేసుకునేందుకు వీలు కల్పిస్తూ విడిగా పోర్టల్ ఏర్పాటు చేసింది. దీని ద్వారా బుక్ చేసుకుంటే ఆకర్షణీయమైన చార్జీలను కూడా ఆఫర్ చేస్తోంది. దీంతో పాటు విస్తారా ను విలీనం చేసుకున్న తర్వాత సేల్స్ టీమ్ పటిష్టం కావడం, నెట్వర్క్ విస్తరించడం వంటి అంశాలు కార్పొరేట్ బిజినెస్ పెంచుకునేందుకు ఎయిరిండియాకు ఉపయోగపడుతున్నాయి. గత కొన్నాళ్లుగా కంపెనీ సుమారు 1,700 పైచిలుకు కార్పొరేట్ క్లయింట్లను దక్కించుకుంది. మరోవైపు బడ్జెట్ విమానయా న సంస్థగా పేరొందిన ఇండిగో కూడా కార్పొరేట్ క్లయింట్లను ఆకట్టుకునేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా కొన్ని కీలక రూట్లలో బిజినెస్ క్లాస్‌ను ప్రవేశపెడుతోంది. గతేడాది నవంబర్‌లో ప్రారంభించిన ఈ కొత్త సర్వీసులకు మంచి స్పందన రావడంతో ఢిల్లీ–చెన్నై రూట్లో కూడా ఈ కేటగిరీని ప్రవేశపెట్టడంపై కసరత్తు చేస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. 2025 ఆఖరు నాటికి 45 విమానాల్లో బిజినెస్ క్లాస్ సీట్లు ఉంటాయని కంపెనీ సీఈవో పీటర్స్ ఎల్బర్స్ పేర్కొన్నారు. 2025 జూన్ నాటికే ఇలాంటి 94 విమానాలను సమకూర్చుకోవాలని ఎయిరిండియా లక్ష్యంగా పెట్టుకుంది. ప్రత్యేక సదుపాయాలు.. బిజినెస్ క్లాస్ ప్రయాణికులకు లగ్జరీ అనుభూతిని అందించేందుకు విమానయాన సంస్థలు పోటీపడుతున్నాయి. ఇండిగోలో సీట్ల వరుసల మధ్య స్థలం 38 అంగుళాలుగా ఉంటే, ఎయిరిండియాకు 40 అంగుళాల స్థాయిలో ఉంటోంది. ఇండిగో సీట్లు అయిదు అంగుళాల మేర రిక్లైన్ అయితే, ఎయిరిండియావి 7 అంగుళాల వరకు రిక్లైన్ అవుతాయి. ఇక రెండు ఎయిర్‌లైన్స్ చెకిన్, బోర్డింగ్, బ్యాగేజ్ హ్యాండ్లింగ్ విషయాల్లో బిజినెస్ క్లాస్ ప్రయాణికులకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నాయి.అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్ కూడా.. ఆర్థిక పరిస్థితులపై సానుకూల దృక్పథంతో ప్రయాణాలు మరింతగా పుంజుకుంటాయన్న అంచనాల నేపథ్యంలో బిజినెస్ క్లాస్‌లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్ కూడా పోటీపడుతున్నాయి. మలేసియా ఎయిర్‌లైన్స్ కొన్నాళ్ల క్రితమే తమ కార్పొరేట్ ట్రావెల్ ప్రోడక్ట్‌ను సరికొత్తగా తీర్చిదిద్దింది. అప్‌గ్రెడేషన్, అదనపు బ్యాగేజ్ అలవెన్స్ మొదలైన వాటికి రివార్డు పాయింట్లను అందించడంతో పాటు వాటిని రిడీమ్ కూడా చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. అలాగే ఎస్ఎంఈలకు ప్రత్యేక చార్జీలు, వ్యక్తిగత అవసరాలకు అనుగుణమైన తోడ్పాటు అందిస్తోంది. తమ దేశంలో సమావేశాలు, కాన్ఫరెన్సులు, ఈవెంట్లను నిర్వహించుకునేందుకు క్లయింట్లను ప్రోత్సహించేలా ట్రావెల్ ఏజెంట్లకు ఎయిర్ మారిషస్ ప్రోత్సాహకాలు ఇస్తోంది. ఈ స్కీము కింద గ్రూప్ సైజు, ప్రయాణించిన ప్యాసింజర్లను బట్టి ఒక్కొక్కరి మీద రూ. 500–1,000 వరకు కమీషన్లు ఇస్తోంది. అజర్బైజాన్, జార్జియా, కజక్‌స్తాన్, ఉజ్బెకిస్తాన్ తదితర ప్రాంతాలకు డైరెక్ట్ కనెక్టివిటీ పెరగడంతో, ఆయా దేశాలకు ప్రయాణం చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోందని థామస్ కుక్ ఇండియా వర్గాలు తెలిపాయి. థామస్ కుక్ ఇండియాకి సంబంధించి బిజినెస్ ట్రావెల్ సెగ్మెంట్ వార్షికంగా సుమారు 13 శాతం పెరిగింది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ప్రేమానుగ్రహం రాశిపెట్టుందా?
జన్మ జాతకం ఎలా ఉన్నా ప్రేమ జాతకం బాగుంటే మంచి ఆత్మిక భాగస్వామి దొరుకుతారు. సవాళ్లు విసిరే జీవితంలో ప్రేమ నిండిన బంధం చాలా అవసరం. స్త్రీ, పురుషుల మధ్య ప్రేమ వారిని ఉత్సాహంగా ముందుకు నడవడానికి కారకం అవుతుంది. జీవితాన్ని అర్థవంతం చేస్తుంది. ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే. సౌరమానం ప్రకారం ఆ రోజు దిన ఫలితాలు ఇక్కడ ఇస్తున్నాం. ఈ ఫలితాలు సంవత్సరమంతా ప్రభావం చూపిస్తాయి...మేషం (21 మార్చి–19 ఏప్రిల్)ఈ రాశి వారికిప్రాకృతిక శక్తి సహకరిస్తుంది. అంగారక గ్రహ ప్రభావం వలన ప్రేమ వృద్ధి చెందుతుంది. వీరు తాము ప్రేమించినవారి కోసం ఏదైనా ప్రత్యేకమైన ఫంక్షన్ ఏర్పాటు చేసి వారి మన్ననలు అందుకుంటారు. చాలా రొమాంటిక్ గా కాలం గడుస్తుంది. ఈ రాశి ప్రేమికులు ఈ సంవత్సరం దంపతులవుతారు. దంపతులుగా ఉన్నవారు తల్లిదండ్రులవుతారు.వృషభం (20 ఏప్రిల్– 20 మే)శుక్ర గ్రహ ప్రభావం వల్ల రొమాంటిక్ భావాలు పెరుగుతాయి. ప్రేమించిన వారి పట్ల ప్రేమ ఆప్యాయతలు అధికమవుతాయి. స్థిరపడుతాయి. ప్రేమ విషయంలో కొత్త విధానాలు అవలంబిస్తారు. ఆ కొత్త విధానాల వలన ప్రేమ సఫలీకృతం అవుతుంది. పెద్దలు మీ ప్రేమను అంగీకరిస్తారు. ఈ సంవత్సరం మంచి జీవితాన్ని గడుపుతారు.మిథునం (21 మే– 20 జూన్)బుధ గ్రహ ప్రభావం వల్ల మీరు ప్రేమించిన వారి పట్ల ప్రేమను సూటిగా చక్కగా అర్థవంతంగా తెలుపగలుగుతారు. మీ మాటలకు మీరు ఇష్టపడినవారు ప్రభావితులవుతారు. మిథునం అంటేనే జంట, ఈ సంవత్సరం ప్రేమికుల జంట పంట పండినట్టే. ఆదర్శమైన జంటగా పేరు పొందుతారు.కర్కాటకం (21 జూన్– 22 జూలై):చంద్ర గ్రహప్రభావం వల్ల మీలో ప్రేమాభిమానాలు ఉప్పొంగి మీ ప్రేమికుల పట్ల సుహృద్భావం కలిగిస్తుంది. వ్యక్తిగత సంబంధాలు మెరుగుపడతాయి. చిన్న నాటి స్నేహితులను కలుసుకుంటారు. గతంలో తెగిన బంధాలు ఇప్పుడు అతుకుతాయి.సింహం (23 జూలై– 22 ఆగస్టు)సూర్యగ్రహ ప్రభావం వల్ల మీ ఆకర్షణ శక్తి పెరుగుతుంది. మీరు ప్రేమించినవారికి ఆకర్షించగలుగుతారు. అందరూ మిమ్మల్ని అభిమానిస్తారు. మీ ప్రేమను స్పష్టంగా తెలియజేయగలుగుతారు. ఈ సంవత్సరం మీకు తిరుగు ఉండదు. అన్నిటిలో విజయమే లభిస్తుంది. మీ ప్రేమ ఫలిస్తుంది.కన్య (23 ఆగస్టు– 22 సెప్టెంబర్)ఆత్మ పరిశీలన చేసుకొని సంబంధ బాంధవ్యాలను విశ్లేషిస్తారు. మీ భావాలను బాగా తెలియజేస్తారు. ప్రేమికుల మధ్య బంధాలు బలపడతాయి. ఈ సంవత్సరం మీకు మహోన్నతంగా ఉంటుంది. విదేశీ ప్రయాణాలు చేస్తారు. చేతిలో ధనం బాగా నిలుస్తుంది. దైవబలం మీకు తోడుగా ఉంది.తుల ( 23 సెప్టెంబర్- 22 అక్టోబర్)శుక్ర గ్రహ ప్రభావం వల్ల ప్రేమికుల మధ్య సంబంధ బాంధవ్యాల సమతుల్యత పెరిగి ప్రేమ వికసిస్తుంది. ఆరోపణలు, ప్రత్యారోపణలు, డిమాండ్లు తగ్గుతాయి. ప్రేమికులు సామరస్యంగా ఉంటారు. ప్రేమలోను, వ్యాపార రంగంలోను మీదే పైచేయి అవుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. నూతన వ్యాపారాలు ఈ సంవత్సరంప్రారంభించి లాభాలు పొందుతారు.వృశ్చిక (23 అక్టోబర్– 21 నవంబర్)అంగారక ప్రభావం వల్ల ప్రేమాభిమానాలు వృద్ధి చెందుతాయి. మీరు ప్రేమించిన వారిని ఈ రోజు మీరు అయస్కాంతంలా ఆకర్షిస్తారు. లోతైన ప్రేమ గొప్ప అనుభవాలను తీసుకొస్తుంది. ఈ సంవత్సరం మీ కష్టాలు తొలగిపోయి, ఆనందం ఐశ్వర్యం లభిస్తాయి. మీరు చాలా సంతోషంగా ఉంటారు.ధనుస్సు (22 నవంబర్- 21 డిసెంబర్)గురు గ్రహ ప్రభావం వల్ల మీలో ఆశావాదం పెరుగుతుంది. దాంతో సాహస ప్రవృత్తి పెరిగి అది ప్రేమించినవారిని ఆకర్షించి కట్టిపడేసేలా చేస్తుంది.. ఆనందం వెల్లివిరుస్తుంది. సింగిల్‌గా ఉన్నవారికి ఈ సంవత్సరం మంచి ప్రేమైక భాగస్వామి తారసపడతారు. ఈ సంవత్సరం గొప్ప అభివృద్ధిని సాధిస్తారు. ప్రేమించిన వారి వల్ల మంచి జరుగుతుంది.మకరం (22 డిసెంబర్–19 జనవరి)శనిగ్రహ ప్రభావం వల్ల మీ ప్రేమ వ్యవహారం బలపడుతుంది. ప్రేమలో మీరు గతంలో ఇచ్చిన మాట, హామీలు నెరవేరుస్తారు. సింగిల్‌గా ఉన్నవారికి తగిన జోడు లభిస్తుంది. స్త్రీ వల్ల పురుషులు, పురుషుల వల్ల స్త్రీలు లాభం పొందుతారు. ఈ సంవత్సరం ఏలిననాటి శని తొలగి గొప్ప ఉన్నతిని సాధిస్తారు.కుంభం (20 జనవరి– 18 ఫిబ్రవరి)శుక్ర, యురేనస్ గ్రహ ప్రభావం వల్ల రొమాంటిక్ భావాలు ఉద్దీప్తమవుతాయి. మీలోని అసాధారణ శక్తి బంధాలను బలపరుస్తుంది. ప్రేమ విషయంలో కొత్త ఆలోచనలు కలిగిస్తుంది. సింగిల్‌గా ఉన్నవారు సంప్రదాయేతర స్థలాలలో వింత పరిచయాలను ఎదుర్కొంటారు. ప్రేమికుల వల్ల ఈ సంవత్సరం మీకు వృత్తి పరంగా మంచి అవకాశాలు వచ్చి రాణిస్తారు.చదవండి: నీకోసం ఈ లోకం బహుమానం చేసేస్తామీనం (19 ఫిబ్రవరి– 20 మార్చి)నెప్ట్యూన్ ప్రభావం వల్ల అసాధారణ భావోద్వేగం మీ హృదయానికి సరైన దారి చూపిస్తుంది. ఈరోజు మీలో సున్నితమైన ప్రేమ సానుకూల వాతావరణాన్ని కలిగిస్తుంది. ప్రేమికుల మధ్య బంధం పెరిగి కలలు సాకారమవుతాయి. సింగిల్‌గా ఉన్నవారు అనుకోకుండా సోల్‌మేట్‌ను కలుసుకుంటారు. ఎంతో కాలంగా ఉన్న అభిలాషలు ఈ సంవత్సరం తీరుతాయి. పది సంవత్సరాల వరకు మీకు తిరుగు ఉండదు.– డా. మహమ్మద్దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ -
గుండె గొంతుక లోన క్రియేటివిటీ
గు... డ్మా... ర్నిం... గ్ అంటూ... కనపడకుండా వినిపించే వారి గొంతులోని హుషారు మన మదిలో ఉత్సాహాన్ని నింపుతుంది. అప్పటివరకు నిశ్శబ్దంగా ఉన్న కాలం కూడా పరుగులు పెడుతుందా అనిపిస్తుంది. వారు నోరారా పలకరిస్తుంటే క్షణాలలో ఆత్మీయ నేస్తాలైపోతారు. గలగలా మాట్లాడేస్తూ మనలో ఒకరిగా చేరిపోతారు. ‘ప్రతిరోజూ మా వాయిస్‌ని కొత్తగా వినిపించాల్సిందే, అందుకు కొత్త కొత్త కాన్సెప్ట్‌తో మమ్మల్ని మేం సిద్ధం చేసుకోవాల్సిందే...’ అని చెబుతున్నారు రేడియో ఎఫ్.ఎమ్.లతో తమ గళంతో రాణిస్తున్న మహిళా రేడియో జాకీలు... వారితో మాటా మంతీ...– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిక్రియేటివిటీ అనుకున్నంత సులువు కాదునచ్చిన సినిమా పాటలు (Movie Songs) ఇంట్లో పాడుకుంటూ ఉండే నా గొంతు విని మాకు తెలిసినవారు రేడియోలో ట్రై చేయచ్చు కదా! అన్నారు. అంతే, ఆడిషన్స్‌కు వెళ్లి ఆఫర్ తెచ్చుకున్నాను. అయితే, అది అనుకున్నంత సులువు కాదు. ఇది చాలా క్రియేటివ్ ఫీల్డ్. చాలామందితో డీల్ చేయాల్సి ఉంటుంది. చాలా స్మార్ట్‌గా ఉండాలి. ఏ రంగంలోనైనా మంచి, చెడు అనుభవాలు ఉంటాయి. కానీ, వాటిని మోసుకుంటూ వెళితే నిరూపించుకోలేం. ఒక వైపు ఉద్యోగం చేస్తూ, మరోవైపు రేడియో జాకీగా మార్నింగ్ షో (Morning Show) చేస్తుంటాను. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కొనసాగుతూనే నటిగానూ పన్నెండు తెలుగు సినిమాల్లోనూ నటించాను. ఎక్కడ నా క్రియేటివిటీని చూపించగలనో అక్కడ నా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ, నన్ను నేను మలుచుకుంటూ నా శ్రోతలను అలరిస్తున్నాను. నా ఫ్రెండ్స్ ద్వారా థియేటర్ ఆర్టిస్ట్‌గానూ వేదికల మీద ప్రదర్శనలలో పాల్గొంటున్నాను. ఏ వర్క్ చేసినా నా సోల్ రేడియోలో ఉంటుంది. అందుకని, ఎన్ని పనులు ఉన్నా రేడియో లైఫ్‌ను వదలకుండా నా క్రియేటివిటీకి పదును పెడుతుంటాను. – ఆర్జె ప్రవళిక చుక్కల, ఆకాశవాణినవరసాలు గొంతులో పలికించాలిరేడియో (Radio) అనగానే క్యాజువల్‌గా మాట్లాడేస్తున్నారు అనుకుంటారు. కానీ, ఇందులో సృజనాత్మకత, ఉచ్చారణ, భావ ప్రకటనతో పాటు నవరసాలు పలికించాలి. కొన్ని సందర్భాలలో ఇంటి వాతావరణం సరిగా లేకపోయినా, ఎక్కడ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నా ఆ ప్రభావం వర్క్‌పై పడకూడదు. నా గొంతు వేల మంది వింటున్నారు అనే ఆలోచనతో అలెర్ట్‌గా ఉండాలి. హైదరాబాద్ బి కేంద్రంలో యువవాణి ప్రోగ్రామ్ నుంచి నేటి వరకు పద్దెనిమిదేళ్లుగా ఆకాశవాణిలో పని చేస్తున్నాను. ఇన్నేళ్ల నా అనుభవంలో సినిమాతారలు, సాహిత్యకారులు, విద్యావేత్తలు, న్యాయవాదులు, వైద్యులు... ఇలా ఇంచుమించు అన్ని రంగాలలో ఉన్న ప్రముఖుల అంతరంగాలను ఆవిష్కరించాను. చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు అందిరినీ నా వాయిస్‌తో అలంరించాను అని గర్వంగా ఉంది. ఆర్మీడే, ప్రధానమంత్రి యోజన పథకాలు, బ్యాంకు, వైద్యం, సమాజంలో బర్నింగ్ ఇష్యూస్... లాంటి వాటిని లైవ్ కవరేజ్లుగా ఇచ్చాను. బెస్ట్ ఆర్.జె. అవార్డులూ అందుకున్నాను. రేడియో అంటే గలగల మాట్లాడటమే కాదు సాంకేతిక సామర్థ్యంతో పాటు అన్ని స్థాయుల వారిని కలుపుకుంటూ పనిచేయాలి. – ఆర్జె దీప నిదాన కవి, ఆల్ ఇండియా రేడియోనన్ను నేను మార్చుకున్నానుఈ రంగంలోకి రాకముందు ఎప్పుడూ రేడియో వినలేదు. ఆడిషన్స్ జరుగుతున్నాయనే విషయం తెలిసి, ట్రై చేద్దామని వెళ్లాను. పదకొండేళ్లుగా రేడియోకి అంకితమైపోయాను. గుడ్ ఈవెనింగ్ ట్విన్సిటీస్ అని రెయిన్బోలో వర్క్ చేశాను. ఇప్పుడు వివిధ భారతిలో సాయంకాలం 5 గంటల నుంచి షో చేస్తున్నాను. సినిమా, వైరల్ న్యూస్, ట్రాఫిక్ అప్డేట్స్, యూత్ ట్రెండ్స్, గాసిపింగ్, కరెంట్ టాపిక్స్ .. ఇలా అన్నింటి గురించి చెబుతుంటాను. ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఎదుటివారిని మెప్పించేలా నన్ను నేను ఎలా మార్చుకోవాలనే విషయాలు రేడియోకి వచ్చాకే తెలుసుకున్నాను. ఏ చిన్న విషయమైనా తక్కువ సమయంలో క్రియేటివ్‌గా, ఆసక్తికరంగా అనిపించేలా చెప్పగలగడం రేడియో ఇచ్చిన వరంగా భావిస్తున్నాను. – ఆర్జె కృష్ణ కీర్తి, వివిధభారతిఉన్నతంగా తీర్చిదిద్దిందిప్రసారభారతిలో పద్దెనిమిదేళ్లుగా పని చేస్తున్నాను. రేడియో జాకీలు అనగానే నోటికివచ్చిందేదో వాగేస్తుంటారు అనుకుంటారు. కానీ, మేం ప్రతిరోజూ కొత్తదనంతో శ్రోతలకు పరిచయం అవుతాం. కంటెంట్‌ను సొంతంగా తయారు చేసుకోవడం, సృజనాత్మకతను జోడించడం, గొంతుతోనే కళ్లకు కట్టినట్టుగా వివరించడాన్ని ఓ యజ్ఞంలా చేస్తుంటాం. స్టూడియోలో కూర్చొనే కాకుండా అనాథశ్రమాలు, వృద్ధాశ్రమాలు, దివ్యాంగులు... ఇలా 52 వివిధ రకాల స్వచ్ఛందసేవా సంస్థలతో కలిసి కార్యక్రమాలు చేశాను. సినిమా కథ పేరుతో తెరవెనుక జరిగే ప్రతి కష్టాన్నీ వినిపించాను. రేడియో నన్ను ఉన్నతంగా మార్చింది. డబ్బింగ్ ఆర్టిస్ట్‌ని చేసింది. యాంకర్‌గా వేదికలపైనా, వివిధ కార్యక్రమాలను చేసే అవకాశాన్ని ఇచ్చింది. ఇన్ని అవకాశాలు ఇచ్చిన రేడియో నాకు దేవాలయంలాంటిది. – ఆర్జె స్వాతి బొలిశెట్టి, ఆల్ ఇండియా రేడియోప్రతిరోజూ హుషారే! నాకు నచ్చిన పనిని డబ్బులు ఇచ్చి మరీ చేయమంటుంటే ఎంత ఆనందంగా ఉంటుంది? ఆ ఆనందంతోనే పదేళ్లుగా రేడియో మిర్చిలో ఆర్.జె.గా చేస్తున్నాను. రోజూ చూసేవీ, వినేవీ.. నా ఫ్రెండ్స్‌కి ఎలాగైతే చెబుతానో... శ్రోతలతో కూడా అలాగే మాట్లాడుతుంటాను. కొన్నాళ్ల వరకు నా మాటలను మాత్రమే విన్నవారికి ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా కనిపిస్తున్నాను కూడా. ఆర్జె అంటే మాట్లాడటం ఒకటేనా.. నవ్వించడానికి ఏం చేయచ్చు నన్ను నేను ప్రూవ్ చేసుకుంటున్నాను. క్రియేటివిటీ ఉన్నవారే ఈ రంగంలో ఉండగలరు. ఎంత హ్యాపీగా మాట్లాడినా పర్సనల్ ఎమోషన్స్ అడ్డు పడుతుంటాయి.అలాంటప్పుడు ఆ విషయాన్ని కూడా శ్రోతలతో పంచుకుంటాను. ‘ఈ రోజు అస్సలు బాగోలేదు, ఇంట్లో డిష్యూ డిష్యూం.. కానీ ఏం చేస్తాం, ముందుగా ఓ రెండుపాటలు వినేసి లైట్ తీసుకుందాం...’ ఇలా రోజువారి అంశాలకు హ్యాపీనెస్‌ను జతచేసి శ్రోతలకు ఇవ్వడానికి తపిస్తూనే ఉంటాను. నవరాత్రుల టైమ్‌లో తొమ్మిది మంది విభిన్నరంగాలలో విజయాలు సాధించిన మహిళలతో షో చేశాను. శ్రోతల్లో కొందరిని స్టూడియోకి పిలిచి, ట్రైనింగ్ ఇచ్చి మరీ వారి చేత మాట్లాడించాం. ఆర్జె స్వాతి...తో... అని షోలో మొదలుపెట్టే మాటలు, మిర్చి శకుంతల డ్రామా.. చాలా పేరు తెచ్చాయి. కళ్లతో చూసినదాన్ని గొంతులో పలికిస్తా. అదే అందరినీ కనెక్ట్ చేస్తుంది. – ఆర్జె స్వాతి, రేడియో మిర్చిరేడియోతో ప్రేమలో పడిపోయా! ‘సిరివెన్నెల’ నైట్ షోతో నా రేడియో జర్నీప్రారంభించాను. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవెనింగ్ షోస్ అన్నీ చేస్తూ వచ్చాను. పదిహేనేళ్లుగా నేర్చుకుంటూ, పని ద్వారా ఆనందాన్ని పొందుతున్నాను. ముఖ్యమైన రోజుల్లో ప్రముఖులతో మాట్లాడుతూ షో చేస్తుంటాం. మారుతున్న ప్రేమల గురించి చర్చిస్తుంటాను. ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడుతుంటాను. ఈ రోజు ఇంత ఆనందంగా ఉన్నానంటే అది రేడియో. ఒక వ్యక్తి గొంతు మాత్రమే విని, అభిమానించడం అనేది మామూలు విషయం కాదు. ఒకమ్మాయి కొన్నేళ్లుగా నా షోస్ వింటూ ఉంది. కుటుంబపరిస్థితుల కారణంగా చనిపోవాలనుకున్న ఆ అమ్మాయి, నాతో చివరిసారిగా మాట్లాడుదామని ఫోన్ చేసింది. షో మధ్యలో ఆపేసి, ఆమెతో మాట్లాడి, ఇచ్చిన భరోసాతో ఇప్పుడు వారి కుటుంబ సభ్యురాలిగా మారిపోయాను. రేడియో సిటీలో నా జీవితాన్ని మలుపుతిప్పిన ఇలాంటి సంఘటనలు ఎన్నో. – ఆర్జె సునీత, రేడియో సిటీచదవండి: ప్రేమానుగ్రహం రాశిపెట్టుందా?క్రమశిక్షణ నేర్పించిందిచిన్నప్పుడు రేడియో వింటూ మా అమ్మను ‘ఆ రేడియోలోకి ఎలా వెళ్లాలమ్మా!’ అని అడిగేదాన్ని. కానీ, నిజంగానే రేడియో స్టేషన్‌కి వెళ్లడం, అక్కడ నుంచి నా వాయిస్‌ను శ్రోతలకు వినిపించేలా మార్చుకోవడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ అవకాశాలు రావు. వచ్చినప్పుడు మాత్రం నిలబెట్టుకోవడానికి చాలా కృషి చేయాలి. రేడియో స్టేషన్లో అడుగుపెడుతూనే బయట ప్రపంచాన్ని మరచిపోతాను. అంతగా నన్ను ఆకట్టుకుంది రేడియో. ఎఐఆర్ పరి«ధులను దాటకుండా మేం పనిచేయాల్సి ఉంటుంది. కరోనా టైమ్‌లో అయితే ఎక్కువ షోస్ చేసేవాళ్లం. ప్రజలను చైతన్యవంతం చేయడానికి, భరోసా ఇవ్వడానికి భయాలను పక్కనపెట్టేశాం. ప్రముఖులను ఇంటర్వ్యూ చేయడం, మల్టీటాలెంట్ ఉన్నవారితో పరిచయాలు ఏర్పడటం.. ఇలాంటివెన్నో రేడియో ద్వారానే సాధ్యమయ్యాయి. కాన్సెప్ట్ రాసుకోవడం, తడబాటు లేకుండా మాట్లాడటం, టైమ్ ప్రకారం షోలో పాల్గొనడం.. ఒక క్రమశిక్షణను నేర్పించింది రేడియో. – ఆర్జె లక్ష్మీ పెండ్యాల, ఆల్ ఇండియా రేడియో -
పట్టు చీరల వనం.. ధర్మవరం
సాక్షి, పుట్టపర్తి : మగువలు మెచ్చే పట్టు చీరలు.. వివాహం కోసం ప్రత్యేకంగా చీరలు, ఫంక్షన్లలో స్పెషల్ లుక్కుతో ఆకట్టుకునే డిజైన్లు తయారీలో ధర్మవరం నేతన్నలు ఆరితేరిపోయారు. తరతరాలుగా మగ్గాల పైనే తమ నైపుణ్యాన్ని రంగరించి రకరకాల పట్టుచీరలు తయారు చేస్తున్నారు. సింగిల్ త్రెడ్, డబుల్ త్రెడ్, వెండి జరీ, బంగారు జరీ చీరలు, జాకాడీ డిజైన్లతో అత్యద్భుతంగా నేసి వినియోగదారులను ఆకట్టుకుంటున్నారు. ధర్మవరంలో తయారయ్యే పట్టుచీరలు హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, చెన్నైతో పాటు విదేశాలకు సైతం ఎగుమతి అవుతున్నాయి. రాష్ట్రంలో 28 వేల మగ్గాలు ఉన్న ఏకైక ప్రాంతంగా ధర్మవరం పట్టణం ప్రథమ స్థానంలో నిలుస్తోంది. ఇక్కడి పట్టు మార్కెట్లో సగటున వారానికి రూ.100 కోట్ల వరకు పట్టుచీరల వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. ధర్మవరం పట్టణ విశిష్టతను గుర్తించి భారత ప్రభుత్వం ధర్మవరం పట్టుచీరకు భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికేషన్)ను ఇవ్వడం నేతన్నల ప్రతిభకు గర్వ కారణంగా చెప్పవచ్చు. శ్రీసత్యసాయి జిల్లాలో ధర్మవరంతో పాటు కొత్తచెరువు, గోరంట్ల, బుక్కపట్నం, సోమందేపల్లి, పెనుకొండ, హిందూపురం ప్రాంతాల్లోనూ మగ్గాలు ఉన్నాయి. ధర్మవరంలో మగ్గాలతో పాటు 18 చేనేత అనుబంధ రంగాల ద్వారా సుమారు లక్ష మంది ఉపాధి పొందుతున్నారు. ఫ్యాషన్ ప్రపంచానికి దీటుగా డిజైన్లు మారుతున్న ఫ్యాషన్ ప్రపంచానికి దీటుగా ధర్మవరంలోని డిజైనర్లు ఎప్పటికప్పుడు కొత్తరకాల డిజైన్లు రూపొందిస్తున్నారు. ధర్మవరంలో పట్టుచీరల డిజైన్లు రూపొందించడంలో సుమారు వందమంది మంచి నైపుణ్యం సంపాదించారు. వివాహాలు, ఇతర శుభకార్యాల దగ్గర నుంచి సినీ మోడళ్లు, సెలబ్రిటీల వరకు వినూత్న డిజైన్లను తయారు చేస్తున్నారు. ఒక్కో పట్టు చీర రూ.5 వేల నుంచి రూ.10 లక్షల వరకు ధర ఉంటుంది. బంగారం తాపడంతో పట్టుచీరలు తయారు చేయడం ధర్మవరం నేతన్నల ప్రత్యేకం. విదేశాలకు ఎగుమతులు ధర్మవరంలో తయారైన పట్టుచీరలు ఇతర రాష్ట్రాలతో పాటు అమెరికా, సౌదీ అరేబియా, న్యూజిలాండ్ తదితర దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. రాష్ట్రంలో తయారైన పట్టుచీరలకు ధర్మవరం పట్టుమార్కెట్ ప్రధానం. ధర్మవరం పట్టణంలో సుమారు రెండు వేల పట్టుచీరల దుకాణాలు ఉన్నాయి. ఈ సిల్క్ షాపుల ద్వారా నేతన్నల వద్ద పట్టుచీరలను కొనుగోలు చేసి, ఆపై షోరూంలకు హోల్‌సేల్‌గా ఎగుమతి చేస్తారు. వారానికి రూ.వంద కోట్ల వ్యాపారం సగటున ధర్మవరం నేసేపేటలోని మార్కెట్లో వారానికి రూ.100కోట్ల వరకు వ్యాపార లావాదేవీలు జరుగుతాయని అంచనా. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ధర్మవరం పట్టణాన్ని, చేనేత రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలని నేతన్నలు కోరుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆదరణ కరువైందని.. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఏటా నేతన్న నేస్తం పథకం కింద ఏటా రూ.24వేల లబ్ధి చేకూరేదని వివరించారు. ధర్మవరం పట్టుచీరకు భౌగోళిక గుర్తింపు ధర్మవరం నేతన్న ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం గత 2014లో ధర్మవరం పట్టుచీరలు, పావుడాలకు భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికేషన్) ఇచి్చంది. దీని ద్వారా ధర్మవరం పట్టుచీర డిజైన్లు ఎక్కడా తయారు చేయకూడదు. ఒక వేళ ఇతరప్రాంతాల్లో ధర్మవరం నేతన్నల డిజైన్లు నేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.విమానాశ్రయం వస్తే బాగుంటుంది శ్రీసత్యసాయి జిల్లా ఏర్పాటు తర్వాత ధర్మవరంలో చేనేత రంగం మరింత వృద్ధి చెందింది. అయితే పుట్టపర్తిలో విమానాశ్రయం ఆధునీకరించి.. ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తే.. వివిధ దేశాలకు పట్టుచీరల ఎగుమతులు సులభమవుతాయి. మన దేశ పట్టును ప్రపంచ స్థాయికి తీసుకెళ్లవచ్చు. ఫలితంగా వ్యాపారం మరింత ఊపందుకుంటుంది. – రంగన శ్రీనివాసులు, పట్టుచీరల వ్యాపారి, ధర్మవరం ఆధునిక ఫ్యాషన్‌కు అనుగుణంగా డిజైన్లు ప్రస్తుత ఫ్యాషన్ పోటీ ప్రపంచంలో మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త డిజైన్లు ఎప్పటికప్పుడు రూపొందిస్తున్నాం. మేము తయారు చేసే చీరలు దేశంలోని ఇతర రాష్ట్రాలకే కాక, ఎక్కువగా అమెరికా, సౌదీ దేశాలకు పంపుతుంటాం. పట్టుచీరల్లో నేను తయారు చేసిన డిజైన్లకు రాష్ట్ర స్థాయిలో రెండు, జాతీయ స్థాయిలో ఒక అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది. – నాగరాజు, క్లస్టర్ డిజైనర్, ధర్మవరంగణాంకాలు ఇలా... చేతి మగ్గాలు : 28 వేలు పట్టుచీరల దుకాణాలు : 2వేలు మగ్గాలపై ఆధారపడ్డ కుటుంబాలు : 30 వేలు మగ్గాల ద్వారా లబ్ధి పొందుతున్న వారు : లక్ష మంది అనుబంధ రంగాల ద్వారా : మరో 20 వేల మందికి ఉపాధి రోజుకు పట్టుమార్కెట్ సగటు టర్నోవర్ : రూ.7 కోట్లు శుభకార్యాల సీజన్లో వారంలో పట్టుచీరల లావాదేవీలు : రూ.100 కోట్లు -
టెక్నాలజీ ఊబిలో భారతీయులు
భారతీయులు ఉదయం లేచించి మొదలు రాత్రి పడుకునేదాకా ఎల్రక్టానిక్ డివైజ్లతో గడుపుతున్నారు. డెస్క్ టాప్‌తో మమేకమవుతారు. డెస్క్ టాప్ నుంచి తల పక్కకు తిప్పితే నేరుగా ల్యాప్‌టాప్‌లో తలదూర్చేస్తారు. ఒకవేళ ల్యాప్‌టాప్ పక్కనబెడితే స్మార్ట్‌ఫోన్ లేదంటే ట్యాబ్ లేదంటే ఇంకో డివైజ్‌కు దాసోహం అవుతున్నారు. దీంతో ఎన్నో సమస్యలు. తక్కువ నిజాలు, ఎక్కువ అబద్ధాలతో కూడిన సమాచారాన్ని మాత్రమే నమ్మడం, సోషల్‌మీడియా లో ప్రతికూల వార్తలనే ఎక్కువగా ఫాలో అవడం, ఫోన్ రింగ్ కాకపోయినా వచ్చినట్లు, మెసేజ్ రాకపోయినా వచ్చినట్లు భావించడం, అతి డివైజ్‌ల వాడకంతో సాధారణ విషయగ్రహణ సామర్థ్యం సన్నగిల్లడం, ఒంటరిగా ఉంటేనే బాగుందని అనిపించడం, వెంటనే స్పందించే గుణం కోల్పోవడం, అతి ఉద్రేకం లేదంటే నిస్సత్తువ ఆవహించడం, ఏకాగ్రత లోపం.. ఇలా ఎన్నో సమస్యలకు ఎల్రక్టానిక్ డివైజ్‌లు హేతువులుగా మారాయి. వాటి అదుపాజ్ఞల్లోకి వెళ్లకుండా వాటినే తమ అదుపాజ్ఞల్లో పెట్టుకున్న భారతీయులు కేవలం మూడు శాతమేనని తాజా సర్వే కుండబద్దలు కొట్టింది. దాదాపు 83,000 కౌన్సిలింగ్ సెషన్లు, 12,000 స్క్రీనింగ్‌లు, 42,0000 అంచనాలను పరిశీలించి చేసిన సర్వేలో ఇలాంటి ఎన్నో విస్మయకర అంశాలు వెలుగుచూశాయి. డిజిటల్ డివైజ్లతో సహవాసం చేస్తూ భారతీయులు ఏపాటి మానసిక ఆరోగ్యంతో ఉన్నారనే అంశాలతో వన్టూవన్హెల్ప్ అనే సంస్థ ‘ది స్టేట్ ఆఫ్ ఎమోషనల్ వెల్బీయింగ్,2024’అనే సర్వే చేసి సంబంధిత నివేదికను వెల్లడించింది. సగం మంది డివైజ్‌లను వదల్లేక పోతున్నారు సర్వేలో పాల్గొన్న వారిలో సగం మంది తమ ఎల్రక్టానిక్ డివైజ్‌లను వదిలి ఉండలేకపోతున్నారు. మరో పది శాతం మందికి డిజిటల్ జీవితాన్ని ఎలా సమన్వయం చేసుకోవాలో తెలీక సతమతమవుతున్నారు. మానసిక ఆరోగ్యానికి సంబంధించి కౌన్సిలింగ్ తీసుకుంటున్న వారి సంఖ్య 15 శాతం పెరిగింది. ఆదుర్తా, కుంగుబాటు, పనిచేసే చోట ఒత్తిడి వంటి ప్రధాన కారణాలతో ప్రజలు మానసిక ఆరోగ్యం బాగు కోసం నిపుణులను సంప్రతించడం పెరిగింది. వృత్తిసంబంధ అంశాల్లో సమస్యలను ఎదుర్కొంటున్న వారిలో 23 శాతం మంది తాము పనిచేసేచోట ప్రతికూల వాతావరణంలో పనిచేస్తున్నట్లు తేలింది. ఇది ఆరోగ్యవంతమైన పని వాతావరణం ఆవశ్యకతను గుర్తుచేస్తోంది. కౌన్సిలింగ్ కోసం పురుషుల్లో పెరిగిన ఆసక్తి గతంలో ఏదైనా థెరపీ చేయించుకోవాలన్నా, మానసికంగా ఒక సాంత్వన కావాలంటే ఒకరి తోడు అవసరమని మహిళలు భావిస్తుంటారు. మగాడై ఉండి థెరపీ చేయించుకోవడమేంటనే ఆలోచనాధోరణి ఇన్నాళ్లూ పురుషుల్లో ఉండేది. ఇప్పుడు ఆ ధోరణిలో కాస్తంత మార్పు వచ్చింది. గతంతో పోలిస్తే 7 శాతం మంది ఎక్కువగా పురుషులు థెరపీలు సిద్ధపడుతున్నారు. ఆర్థికసంబంధ కన్సల్టేషన్లు పొందిన వారిలో 70 శాతం మంది పురుషులే ఉన్నాయి. ఇక మానవీయ సంబంధాలకు సంబంధించిన కౌన్సిలింగ్ సెషన్లలో 60 శాతం దాకా మహిళలే కనిపించారు. యువతలో పెరిగిన మానసిక సమస్యలు ఉత్సాహంతో ఉరకలెత్తాల్సిన యువతలో నైరాశ్యం పెరుగుతోంది. 30 ఏళ్లలోపు వయసు యువతలో అత్యధికంగా ఆదుర్దా, కుంగుబాటు సమస్యలు ఎక్కువయ్యాయి. ఉద్యోగం మారాల్సి రావడం, జీవితభాగస్వామితో సత్సంబంధం కొనసాగించడం వంటి అంశాలకొచ్చేసరికి యువత ఆత్రుత, కుంగుబాటుకు గురవుతోంది. పాతికేళ్లలోపు యువతలో 92 శాతం మందిలో ఆత్రుత, 91% మందిలో కుంగుబాటు కనిపిస్తున్నాయి. ఆత్మహత్య భయాలూ ఎక్కువే ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తున్న వారి సంఖ్య గతంతో పోలిస్తే 22 శాతం పెరిగింది. తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నామని చెప్పిన వాళ్ల సంఖ్య 2023తో పోలిస్తే 17 శాతం పెరగడం ఆందోళనకరం. తమకు కౌన్సిలింగ్ అవసరమని భావిస్తున్న వారిలో సగం మంది ఇప్పటికే తీవ్రమైన భావోద్వేగ సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీంతో ఎక్కువ మందికి తక్షణం మానసిక సంబంధ తోడ్పాటు అవసరమని తెలుస్తోంది. మొత్తంగా చూస్తే భారతీయుల్లో మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన బాగా పెరిగింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రాష్ట్రపతి భవన్‌కు పెళ్లి కళ
సాక్షి, న్యూఢిల్లీ: చరిత్రలోనే మొట్టమొదటి సారిగా రాష్ట్రపతి భవన్లో పెళ్లి వేడుక జరగనుంది. ఈ నెల 12న జరిగే ఈ వేడుక కోసం యంత్రాంగం రాష్ట్రపతి భవన్‌ను ముస్తాబు చేసింది. భారీగా భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఇంతకీ పెళ్లెవరిది? అని కదా మీ సందేహం! రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కుటుంబసభ్యులదీ, సంబంధీకులదీ మాత్రం కాదు! రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వ్యక్తిగత భద్రతా అధికారి(పీఎస్వో) పూనమ్ గుప్తా పెళ్లి. పూనమ్ వినతి మేరకు ఈ వేడుకకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అనుమతినిచ్చారు. జమ్మూకశ్మీర్‌కు చెందిన సీఆర్పీఎప్ అసిస్టెంట్ కమాండెంట్ అవ్నీశ్ కుమార్, పూనమ్ గుప్తా ఓ ఇంటి వారు కానున్నారు. రాష్ట్రపతి ముర్ము సారథ్యంలో అంగరంగ వైభవంగా జరిగే ఈ కార్యక్రమానికి హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ తదితర ప్రముఖులు హాజరుకానున్నారు. జీవితాంతం గుర్తుండిపోయే కానుక మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన పూనమ్‌గుప్తా 2018 యూపీఎస్సీ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్(సీఆర్ఎఫ్) విభాగంలో 81వ ర్యాంకు సాధించారు. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్‌గా బిహార్‌లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో పని చేశారు. ఆ తర్వాత ఆమె రాష్ట్రపతి పీఎస్ఓగా నియమితులయ్యారు. జమ్మూకశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్‌గా ఉన్న అవ్నీశ్ కుమార్‌తో ఈమె వివాహం నిశ్చయమైంది. కుటుంబ సభ్యులు మధ్యప్రదేశ్ లేదా కశ్మీర్లో వివాహం చేయాలని యోచిస్తుండగా కాబోయే వధువు పూనమ్ మాత్రం సరికొత్తగా ఆలోచించారు. ‘మీకు పీఎస్ఓగా పనిచేయడం నాకెంతో ఆనందంగా ఉంది. దీనిని నేను ఒక బాధ్యతగా స్వీకరిస్తున్నాను. నాకు వివాహం నిశ్చయమైంది. రాష్ట్రపతి భవన్లో పెళ్లి చేసుకోవాలనేది నా చిరకాల కోరిక. నా కోరికను మీరు తీరుస్తారని ప్రారి్థస్తున్నాను’అంటూ రెండు నెలల క్రితం రాష్ట్రపతికి లేఖ రాశారు. ఈ లేఖపై రాష్ట్రపతి ముర్ము సానుకూలంగా స్పందించారు. ‘డియర్, పూనమ్ గుప్తా(పీఎస్వో) మీకు వివాహ శుభాకాంక్షలు. విధుల్లో మీరు కనబరుస్తున్న శ్రద్ద, బాధ్యత నాకెంతో నచ్చాయి. మీ వివాహ వేడుకను రాష్ట్రపతి భవన్లో జరిపేందుకు అనుమతి ఇస్తున్నాను’అంటూ బదులిచ్చారు. దీంతో పూనమ్గుప్తాకు రాష్ట్రపతి జీవితాంతం గుర్తుండిపోయే కానుకను ఇచ్చారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ముస్తాబవుతున్న రాష్ట్రపతి కార్యాలయం పూనమ్ అవ్నీశ్ల పెళ్లి వేడుకకు రాష్ట్రపతి కార్యాలయంలోని మదర్ థెరిస్సా క్రౌన్కాంప్లెక్స్ సిద్దమైంది. భారతీయ, సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా వేదికను అలంకరించారు. వేడుక అతి కొద్ది మంది సమక్షంలో జరగనుంది. వధూవరుల కుటుంబ సభ్యులు వంద మంది, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, సీఆర్పీఎఫ్ డీజీ, ఢిల్లీ పోలీస్ ఉన్నత అధికారులు హాజరు కానున్నట్లు తెలిసింది. చారిత్రక కట్టడం రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న రాష్ట్రపతి భవన్ చరిత్రల సమ్మేళనంతో కూడిన ఓ కళాఖండమే. మొత్తం నాలుగు అంతస్తుల్లో 340 గదులు ఉంటాయి. గదులు, కారిడార్లు, కోర్టులు, గ్యాలరీలు, సెలూన్లు, వంటశాలలు, ప్రింటింగ్ ప్రెస్, థియేటర్లు... ఇలా వీటన్నింటినీ కాలినడకన తిరుగుతూ చూడాలంటే కనీసం మూడు గంటల సమయం పడుతుంది. ఇటలీలోని క్విరినల్ ప్యాలస్ తర్వాత ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశాధినేత భవనంగా రాష్ట్రపతి భవనం నిలుస్తుంది. ప్రఖాత్య అమృత ఉద్యాన్, ఒక మ్యూజియం, గణతంత్ర, అశోక మండపాలు, రాగి ముఖం గల గోపురాలు ఉన్నాయి. ఈ భవన్లో మొట్టమొదటిగా 1948లో స్వతంత్ర భారతదేశపు మొదటి గవర్నర్ జనరల్ సి.రాజగోపాలాచారి నివసించారు. రాష్ట్రపతి భవన్లో నివసించిన మొదటి భారతీయుడిగా చరిత్రలో నిలిచారు. -
అసమానతల అంతు చూస్తారా?
విశ్వంలో ఇప్పటికీ ఎన్నో రహస్యాలు. శతాబ్దాల కాలంలో భిన్న దేశాల విభిన్న రంగాల దిగ్గజ శాస్త్రవేత్తలు ఇప్పటికి ఎన్నో సిద్ధాంతాలను రూపొందించారు. న్యూటన్ సిద్ధాంతాలు, ఐన్‌స్టీన్ సిద్ధాంతాలు ఇలా భౌతిక, రసాయన శా్రస్తాలు, గతిశక్తి, స్థితిశక్తి ఇలా ఎన్నో రకాల అంశాలకు సంబంధించి ఎన్నో పరిశోధనలు నేటి ఆధునిక ప్రపంచ అవసరాలను తీరుస్తున్నాయి. అయితే ఇప్పటికీ భౌతిక, రసాయన, ఇంజనీరింగ్ శాస్త్రవేత్తలకు కొరుకుడుపడని టర్బులెన్స్ దృగ్విషయం అన్ని రంగాలకు పెద్ద సమస్యగా మారింది. ద్రవ ప్రవాహాల్లో హఠాత్తుగా సంభవించే అసాధారణ హెచ్చుతగ్గులు, సముద్రజలాల కదలికల్లో అనూహ్య మార్పులు, రసాయనాల్లో ఊహించని ప్రతిచర్యలు, రక్తప్రవాహాల్లో హెచ్చుతగ్గులు వంటివి ఎందుకు సంభవిస్తాయో ఇప్పటికీ ఎవరికీ తెలీదు. టర్బులెన్స్ సమస్య చాలా రంగాలకు పెద్ద గుదిబండగా తయారైంది. గాల్లో ఎగిరే విమానాలు ఒక్కసారిగా టర్బులెన్స్‌కు గురై హఠాత్తుగా కిందకు పడిపోవడమో ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పడమో జరుగుతున్నాయి. వెదర్ శాటిలైట్లతో ఖచ్చితత్వంతో వాతావరణ పరిస్థితులపై ప్రభుత్వాలను వాతావరణ కేంద్రాలు హెచ్చరిస్తున్నా ఇప్పటికీ కొన్ని చోట్ల ఊహంచని తుపాన్లు అప్పటికప్పుడు ఏర్పడి భారీ ఆస్తి, ప్రాణ నష్టానికి కారణమవుతున్నాయి. సువిశాల విశ్వంలో నక్షత్రాల్లోని అయనీకరణ చెందిన అత్యంత వేడి వాయువుల్లో హఠాత్తుగా ఎందుకు మార్పులు జరుగుతున్నాయో ఖగోళ శాస్త్రవేత్తలు కూడా చెప్పలేకపోతున్నారు. మానవ కణంలో అణువుల మధ్య బంధంలోనూ హఠాత్తుగా మార్పులను చూస్తున్నాం. చివరకు కృత్రిమ గుండె పనితీరును రక్తప్రవాహంలోని టర్బులెన్స్ ప్రభావితం చేస్తూ అత్యంత సమర్థవంతమైన ఆర్టిఫీషియల్ హార్ట్ ఆవిష్కరణ అవసరమని గుర్తుచేస్తోంది. ఇలాంటి దృగ్విషయాలకు ఏకైక కారణమైన టర్బులెన్స్పై మరింత అవగాహనే లక్ష్యంగా శాస్త్రవేత్తలు నడుం బిగించారు. ఈ టర్బులెన్స్పై స్పష్టమైన అవగాహన ఉంటే సైన్స్, ఇంజనీరింగ్ పరిశ్రమల్లో మరింత మెరుగైన డిజైన్‌తో విమానాలు, కార్లు, ప్రొపెలర్లు, కృత్రిమ గుండెలు తయారుచేయడానికి, అత్యంత ఖచ్చితత్వంతో వర్షాలు, వాతావరణం, పర్యావరణ సంబంధ హెచ్చరికలు చేయడానికి వీలు చిక్కుతుంది. వేగంగా చర్యలు జరిపి.. ప్రపంచంలో ఎక్కడ ఏ ద్రవాల్లో ఈ టర్బులెన్స్ తలెత్తుతుందో తెల్సుకోవాలంటే ఆ ద్రవాల పనితీరు, కదలికలపై నిరంతర నిఘా అవసరం. వాటి చర్యను వేగవంతం చేస్తేనే టర్బులెన్స్ ఎప్పుడెప్పుడు వస్తుందో గుర్తించగలం. అందుకోసం ద్రవాల్లో రెండు సార్లు టర్బులెన్స్ సంభవిస్తే ఈ రెండు టర్బులెన్స్ మధ్య కాలంలో జరిగే మార్పులను అత్యంత ఖచ్చితత్వంతో రికార్డ్ చేయాల్సి ఉంటుంది. ఇంతకాలం సంప్రదాయక పద్ధతిలో మాత్రమే డేటాను రికార్డ్చేసేవాళ్లు. ఇకపై తొలిసారిగా అత్యంత అధునాతన క్వాంటమ్ కంప్యూటర్స్ విధానంలో అత్యంత శక్తివంతమైన సూపర్ కంప్యూటర్లలో ఈ డేటాను నమోదుచేసి విశ్లేషించనున్నారు. దీంతో సెకన్ కంటే కొన్ని కోట్ల రెట్లు తక్కువ కాలంలోనూ జరిగే మార్పులను నమోదు చేసి విశ్లేషించడం సాధ్యమవుతుంది. సంబంధిత పరిశోధన వివరాలు జనవరి 29వ తేదీన ప్రఖ్యాత సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్, ఫిజికల్ రివ్యూ రీసెర్చ్ జర్నల్లలో ప్రచురితమయ్యాయి. ‘‘సంప్రదాయక విధానాల్లో ప్రయోగాలు చేస్తే ఎప్పుడూ ఒక్కటే ఫలితం వస్తోంది. ఈసారి సంభావ్యత సిద్ధాంతాన్ని ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అల్గారిథమ్‌ను వాడి మరింత మెరుగైన ఫలితాలను రాబట్టేందుకు ప్రయతి్నస్తున్నాం. రెండు విభిన్న రసాయన మిశ్రమాలను సిములేట్ చేసి వాటిల్లో సంభవించే టర్బులెన్స్‌లను నమోదుచేయదలిచాం. సాధారణ కంప్యూటర్స్‌లో 0, 1 అనే బిట్స్ మాత్రమే వాడతారు. క్వాంటమ్ కంప్యూటింగ్‌లో క్వాంటమ్ బిట్(క్వాబిట్స్) వాడతాం. దీంతో ఒకేసారి ఒకేసమయంలో వేర్వేరు చోట్ల జరిగే మార్పులను క్వాబిట్స్ నమోదుచేస్తాయి’’అని ఆక్స్‌ఫర్ట్ విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్రవేత్త నిక్ గోరియనోవ్ చెప్పారు. కొత్త విధానంతో కంప్యూటేషన్ అత్యంత వేగవంతంగా జరుగుతుంది. ఇది మా పరిశోధనకు ఎంతో దోహదపడుతుంది’’అని ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలో పోస్ట్ డాక్టోరల్ పరిశోధకుడు జేమ్స్ బీటెల్ చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సంపూర్ణ సేంద్రియ గ్రామాలు!
ఛత్తీస్‌ఘడ్‌లోని దంతెవాడ జిల్లాలో 110 గిరిజన గ్రామాలు పిజిఎస్ సేంద్రియ సర్టిఫికేషన్ పొందాయి. సికింద్రాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సుస్థిర వ్యవసాయ కేంద్రాని(సిఎస్ఎ)కి చెందిన రీజినల్ కౌన్సెల్ ఈ సర్టిఫికేషన్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇటీవల సిఎస్ఎకు ప్రతిష్టాత్మక ‘జైవిక్ ఇండియా’ పురస్కారం దక్కింది. ఈ సందర్భంగా సిఎస్ఎ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. జీ వీ రామాంజనేయులుతో ‘సాక్షి సాగుబడి’ ముచ్చటించింది. రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపు మందుల వాడకం పూర్తిగా మానుకొని ప్రకృతి /సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పాటిస్తూ ఆరోగ్యదాయకంగా ఆహారోత్పత్తి చేసే రైతులకు ప్రత్యేక గుర్తింపునిచ్చేదే సేంద్రియ సర్టిఫికేషన్. ఈ సర్టిఫికేషన్ ద్వారా మెరుగైన ధరకు పంట దిగుబడులను అమ్ముకునే అవకాశం కలుగుతుంది. రైతు వ్యక్తిగతంగా సర్టిఫికెట్ పొందొచ్చు. నలుగురితో కలసి సహకార సంఘంగా లేదా రైతు ఉత్పత్తిదారుల సంఘంగా ఏర్పడి సమష్టిగా సేంద్రియ సర్టిఫికేషన్ పొందవచ్చు. ఒంటరిగా సర్టిఫికేషన్ పొందే కంటే సంఘంగా పొందటం సులభం. ఇంకా చెప్పాలంటే, గ్రామంలో రైతులందరూ కలసి సేంద్రియ / ప్రకృతి వ్యవసాయం దిశగా నడిస్తే పరివర్తన దశలో ఎదురయ్యే సమస్యలను సులువుగా ఎదుర్కోవచ్చు. అంతేకాదు, మార్కెటింగ్‌కు అవసరమైన సేంద్రియ సర్టిఫికేషన్‌ను ఒక గ్రామంలో రైతులంతా కలసి ఊరుమ్మడిగా అయితే తొందరగానే పొందవచ్చు. విడిగా అయితే మూడేళ్ల ప్రక్రియ. ఊళ్లో రైతులంతా కలిస్తే ఆర్నెల్లు చాలు. దీన్నే ‘లార్జ్ ఏరియా సర్టిఫికేషన్’ అని పిలుస్తున్నారు. ఈ విషయంలో ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉంది. ఛత్తీస్‌ఘడ్‌లోని దంతెవాడ జిల్లాలో గత ఐదేళ్లుగా రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకం ఐదేళ్ల క్రితమే మానేసిన 110 గ్రామాలు సేంద్రియ సర్టిఫికేషన్ గుర్తింపు పొందాయి. ఈ గ్రామాల్లోని మొత్తం 10,264 మంది రైతులు 65,279 హెక్టార్లలో సేంద్రియ పంటలు పండిస్తున్నారు. సుస్థిర వ్యవసాయ కేంద్రం (సిఎస్ఎ) రీజినల్ కౌన్సెల్ ఈ సర్టిఫికేషన్ ఇచ్చింది. చదవండి: Safer Internet Day 2025 భద్రత... బాధ్యత... గౌరవం!మరో 121 గ్రామాలకు సర్టిఫికేషన్ప్రాసెస్ వివిధ దశల్లో ఉందని సిఎస్ఎ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. రామాంజనేయులు తెలిపారు. శిక్షణ, తనిఖీలకు హెక్టారుకు రూ. 700ల చొప్పున పిజిఎస్ సర్టిఫికేషన్‌కు ఖర్చవుతుందన్నారు. గ్రామం మొత్తం సేంద్రియ సర్టిఫికేషన్ పొందటం అంత సులువేమీ కాదు. దశలవారీ పరీక్షల్లో రసాయనిక అవశేషాలు లేవని తేలితేనే సర్టిఫికేషన్ ఇస్తారు. లార్జ్ ఏరియా సర్టిఫికేషన్ రావాలంటే మొదట రైతులు గత ఐదేళ్లుగా పూర్తిగా సేంద్రియంగానే పంటలు పండిస్తున్నామని ప్రతిజ్ఞ చేయాలి. సర్పంచ్ కూడా బాధ్యత తీసుకొని డిక్లరేషన్ ఇవ్వాలి. ఆ వూళ్లో రసాయనిక ఎరువులు, పురుగు/కలుపు మందులు అమ్మే దుకాణం లేదని జిల్లా వ్యవసాయ అధికారి సర్టిఫై చెయ్యాలి. ఇవన్నీ అయ్యాక రీజినల్ కౌన్సెల్ పరీక్షలు చేసి సర్టిఫై చేస్తుంది.ప్రతిష్టాత్మక జైవిక్ ఇండియా పురస్కారంసుస్థిర వ్యవసాయ కేంద్రాని(సిఎస్ఎ)కి ఇటీవల ప్రతిష్టాత్మక జైవిక్ ఇండియా రీజినల్ కౌన్సెల్ పురస్కారం లభించింది. ఇంటర్నేషనల్ కాంపిటెన్స్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ అగ్రికల్చర్ (ఐసీసీఓఏ) గత ఐదేళ్లుగా ‘జైవిక్ ఇండియా’ పురస్కారాలను సేంద్రియ రైతులతో పాటు సర్టిఫికేషన్ సేవలందిస్తున్న రీజినల్ కౌన్సెళ్లకు కూడా ఏటేటా పురస్కారాలను ప్రదానం చేస్తోంది. బెంగళూరులో ఇటీవల జరిగిన అంతర్జాతీయ సేంద్రియ, చిరుధాన్యాల ప్రదర్శనలో జాతీయ స్థాయిలో ఉత్తమ రీజినల్ కౌన్సెల్‌గా సిఎస్ఎ ఎంపికైంది. సిఎస్ఎ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. జీవీ రామాంజనేయులు, సిఎస్ఎ ప్రోగ్రామ్ డైరెక్టర్ (సర్టిఫికేషన్) చంద్రకళ సంయుక్తంగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు.క్లైమెట్ ఛేంజ్ నేపథ్యంలో సుస్థిర సేద్యం అనివార్యంఛత్తీస్ఘడ్ దంతెవాడ జిల్లాలో ఐదేళ్లుగా రసాయనాల జోలికి పోని 110 గ్రామాల్లో రైతులందరికీ పిజిఎస్ సేంద్రియ సర్టిఫికేషన్ ఇచ్చాం. వారు ఎక్కువగా వరి ధాన్యమే పండిస్తున్నారు. ప్రభుత్వం రూ. 500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేసి, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందిస్తోంది. దేశవ్యాప్తంగా వ్యవసాయంలో రసాయనాల వాడకం విపరీతం కావటం.. భూసారం క్షీణిస్తుండటం, నీటి వనరుల లభ్యత తగ్గిపోవటం, పెచ్చుమీరిన పర్యావరణ సమస్యలు వ్యవసాయాన్ని మరింత జఠిలంగా మార్చాయి. క్లైమెట్ ఛేంజ్ నేపథ్యంలో సుస్థిర సేద్యం వైపు మారాల్సిన అనివార్యతను ఇప్పుడు అందరూ గుర్తిస్తున్నారు. అది ఏ పద్ధతిలో అన్నదే ఇప్పుడు జరుగుతున్న చర్చంతా. ఆంధ్రప్రదేశ్‌లో డా. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం(2007–08) నుంచే వ్యవసాయ రసాయనాల వాడకం తగ్గుతుండగా, గత పదేళ్లలో తెలంగాణలో 5 రెట్లు పెరిగింది. లక్ష ఎకరాల్లో సేంద్రియ సేద్యం చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదించాం. – డా. జీవీ రామాంజనేయులుఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సుస్థిర వ్యవసాయ కేంద్రం, సికింద్రాబాద్https://csa-india.org/ https://krishnasudhaacademy.org 20 ఏళ్ల క్రితం ఐఆర్ఎస్ వద్దనుకొని.. వ్యవసాయ శాస్త్రంలో పిహెచ్డి పూర్తిచేసిన డా. రామాంజనేయులు ఐసిఎఆర్లోని అగ్రికల్చర్ రీసెర్చ్ సర్వీస్ (ఎఆర్ఎస్)లో 8 ఏళ్లు సీనియర్ శాస్త్రవేత్తగా పని చేశారు. ఆ తర్వాత ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్)కు ఎంపికయ్యారు. శిక్షణా కాలంలోనే ఆ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి సేంద్రియ/ ప్రకృతి వ్యవసాయ వ్యాప్తి కోసం సుస్థిర వ్యవసాయ కేంద్రం అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. ఈ దిశగా గత 20 ఏళ్లుగా విశేష కృషి చేస్తున్నారు. సేంద్రియ పద్ధతులపై పరిశోధన చేస్తూ శిక్షణ ఇచ్చే కృష్ణసుధ అకాడమీ ఫర్ ఆగ్రోఎకాలజీ (కొండపర్వ)ని స్థాపించటంలో కూడా ఆయన కీలకపాత్ర పోషించారు. ‘ఏపీ, తెలంగాణలో 66 సహకార సంఘాలు, ఎఫ్‌పిఓలకు చెందిన 50 వేల మంది రైతులను సేంద్రియ సాగు వైపు మళ్లించే కృషి చేస్తున్నాం. ఇప్పటికే 30 వేల మందికి సేంద్రియ సర్టిఫికేషన్ ఇచ్చాం. వారి నుంచి సేకరించిన ఉత్పత్తులను టీటీడీకి అందిస్తున్నామ’ని డా.రామాంజనేయులు తెలిపారు. ఇదీ చదవండి: బిలియనీర్‌తో పెళ్లి అని చెప్పి, రూ.14 కోట్లకు ముంచేసింది : చివరికి! సేంద్రియ సర్టిఫికేషన్ ఎవరిస్తారు?సేంద్రియ / ప్రకృతి వ్యవసాయం చేపట్టిన రైతులకు, సహకార సంఘాలకు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు, గ్రామాలకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ గుర్తింపు పొందిన సంస్థలు సేంద్రియ సర్టిఫికేషన్ ఇస్తాయి. ఈ సంస్థలను రీజినల్ కౌన్సెళ్లు అంటారు. ఇలాంటి కౌన్సెళ్లు దేశంలో 76 ఉన్నాయి. రీజినల్ కౌన్సెల్ ఎన్ని రాష్ట్రాల్లో అయినా సర్టిఫికేషన్ సేవలు అందించవచ్చు. చురుగ్గా పనిచేస్తున్న రీజినల్ కౌన్సెళ్లలో సికింద్రాబాద్‌లోని సుస్థిర వ్యవసాయ కేంద్రం రీజినల్ కౌన్సెల్ ఒకటి. వ్యక్తిగతంగా ఒక రైతు గానీ, 10–15 మంది రైతుల బృందాలు / సహకార సంఘాలు / రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్పిఓల)కు పిజిఎస్ సేంద్రియ సర్టిఫికేషన్ ఇస్తారు. అందరి రైతులూ పరస్పరం బాధ్యత తీసుకోవాలి. బృందంలో ఒక్క రైతు దారితప్పినా గ్రూప్ మొత్తానికీ గుర్తింపు రద్దవుతుంది. పూర్తిగా గ్రామంలో రైతులందరికీ కలిపి కూడా సర్టిఫికేషన్ ఇస్తారు. దీన్నే లార్జ్ ఏరియా సర్టిఫికేషన్ అంటారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల మేరకు అనేక దఫాలు పరీక్షలు నిర్వహించిన తర్వాత సర్టిఫికేషన్ ఏ యేటికాయేడు ప్రదానం చేస్తారు.సర్టిఫికేషన్ రెండు రకాలుఆరోగ్యదాకమైన ఆహారోత్పత్తులను పండించే రైతులు / సంస్థలు తమ ఉత్పత్తులకు సేంద్రియ సర్టిఫికేషన్ పొందడానికి ప్రధానంగా రెండు సర్టిఫికేషన్లు ఉన్నాయి. మొదటిది.. పిజిఎస్, రెండోది.. ఎన్‌పిఓపి. ఎక్కడ అమ్మాలనుకునే దాన్ని బట్టి ఏ సర్టిఫికేషన్ అవసరమో చూసుకోవాలి. దేశంలోనే విక్రయించాలనుకుంటే పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టం (పిజిఎస్) ఇండియా సర్టిఫికేషన్ తీసుకుంటే సరిపోతుంది. కొందరు రైతులు బృందంగా ఏర్పడి, పరస్పర బాధ్యతతో తీసుకునే సర్టిఫికేషన్ ఇది. దీనికి అయ్యే ఖర్చు కొంచెం తక్కువ. విదేశాలకు ఎగుమతి చేయాలనుకుంటే నేషనల్ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ (ఎన్‌పిఓపి) థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ పొందాల్సి ఉంటుంది. వీటిల్లో ఏ సర్టిఫికేషన్ అయినా పూర్తిగా సేంద్రియ సర్టిఫికెట్ పొందటానికి మూడేళ్ల కాలం పడుతుంది. పరివర్తన దశలో తొలి రెండేళ్లకు ‘గ్రీన్’ సర్టిఫికేట్ ఇస్తారు. మూడో ఏడాది అన్ని పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చిన తర్వాత ‘ఆర్గానిక్’ సర్టిఫికేట్ ఇస్తారు. నిపుణులు, అధికారుల సమన్వయంతో రీజినల్ కౌన్సెళ్లే ఈ సర్టిఫికేషన్ సేవలు అందిస్తున్నాయి.నేరుగా అమ్మితే సర్టిఫికేషన్ అక్కర్లేదు!రసాయన రహితంగా వ్యవసాయం చేస్తూ, తాము పండించే ఉత్పత్తులను, ఎటువంటి బ్రాండ్ పేరు పెట్టకుండా, నేరుగా వినియోగదారులకు అమ్ముకునే సేంద్రియ రైతులు ఎటువంటి సేంద్రియ సర్టిఫికేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే, వారి వ్యాపారం ఏడాదికి రూ. 12 లక్షలు లోపు ఉండాలి. ఆ పరిమితి దాటితే సర్టిఫికేషన్ తీసుకోవాలి. అదేవిధంగా.. రైతు బృందాలు, కోఆపరేటివ్లు, ఎఫ్పిఓలు, వారి వద్ద నుంచి సేంద్రియ ఆహారోత్పత్తులను సేకరించే ప్రైమరీ అగ్రిగేటర్లు, స్టార్టప్‌లు కూడా వార్షిక వ్యాపారం రూ. 50 లక్షలకు లోపు ఉంటే సేంద్రియ సర్టిఫికేషన్ పొందాల్సిన అవసరం లేదు. ఈ వ్యవహారాలను ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఎఐ) అధికారులు పర్యవేక్షిస్తుంటారు. -
మన విద్యా రంగమే భేష్
‘మన విద్యా విధానం మరింత బలపడాలి. స్కూల్ స్థాయి నుంచే ఉన్నత అవకాశాలు కల్పించే విధంగా బోధన ఉండాలి. యువతకు కళాశాల స్థాయిలోనే విస్తృత బోధన సదుపాయాలు కల్పించాలి’ – మన విద్యా రంగంపై నిరంతరం వ్యక్తమవుతున్న అభిప్రాయం ఇది.అయితే దీనికి భిన్నంగా.. మన విద్యా వ్యవస్థ.. కెరీర్ అవకాశాల విషయంలో నేటి తరం యువత స్పందించడం గమనార్హం. ప్రపంచ దేశాలతో పోల్చితే మన దేశ విద్యా విధానమే బాగుంటుందనే ఆశాభావాన్ని యువత వ్యక్తం చేసింది. అదే విధంగా కెరీర్ అవకాశాల కోణంలోనూ భవిష్యత్.. బ్రహ్మాండంగానే ఉంటుందనే రీతిలో స్పందించింది.ఈ వివరాలు.. టోఫెల్, జీఆర్ఈ వంటి పరీక్షలు నిర్వహించే ప్రముఖ టెస్టింగ్ సంస్థ.. ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్)(ETS survey) నిర్వహించిన సర్వేలో వెల్లడయ్యాయి. ఈ మేరకు మొత్తం 18 దేశాల్లో 18 వేల మంది యువత అభిప్రాయాల ఆధారంగా మానవాభివృద్ధి నివేదికను ఈటీఎస్ విడుదల చేసింది. ఇందులో పలు అంశాలను స్పృశించింది.మన విద్యా వ్యవస్థ బాగుంటుంది..మన దేశ విద్యా వ్యవస్థ బాగుంటుందని 70 శాతం యువత సర్వేలో ఆశాభావం వ్యక్తం చేసింది. అలాగే భవిష్యత్తులోనూ ప్రగతి ఉంటుందని 76 శాతం మంది పేర్కొన్నారు. ఇదే సమయంలో అంతర్జాతీయంగా మాత్రం 30 శాతం మంది మాత్రమే తమ విద్యా వ్యవస్థ బాగుంటుందని అభిప్రాయపడ్డారు. 64 శాతం మంది ప్రగతిశీలత ఉంటుందని చెప్పారు.నాణ్యతతో కూడిన విద్య కష్టమే..ఒకవైపు.. మన విద్యా వ్యవస్థ బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేసిన యువత.. నాణ్యమైన విద్యను అందుకోవడం మాత్రం కష్టంగా మారిందని అభిప్రాయం వ్యక్తం చేసింది. కొన్ని వర్గాల వారే ప్రయోజనం పొందేలా విద్యావకాశాలు ఉన్నాయని ఏకంగా 78 శాతం మంది పేర్కొన్నారు. అదే విధంగా ఉపాధ్యాయుల కొరత ఉందని 74 శాతం మంది స్పష్టం చేశారు. అలాగే అత్యున్నత నాణ్యమైన కోర్సులు, విద్యా సంస్థల విషయంలో ఇప్పటికీ కొరత ఉందన్నారు.ముందంజలో నిలిచే అవకాశం..ప్రస్తుత అవకాశాలతో కెరీర్లో ముందంజలో నిలవడానికి అవకాశం ఉంటుందని 69% మంది భారత యువత అభిప్రాయం వ్యక్తం చేసింది. అంతర్జాతీయంగా ఈ సంఖ్య 59% మాత్రమే కావడం గమనార్హం. అదే విధంగా 2035 నాటికి తమ రంగాల్లో అభివృద్ధి ఉంటుందని 72% మంది ఆశాభావం వ్యక్తం చేశారు.ఉద్యోగాల కొరత..ఉద్యోగాల కొరత ఉంటుందని 40 శాతం మంది భారతీయ యువత పేర్కొనగా.. అంతర్జాతీయంగా ఇది 34 శాతంగా నమోదైంది. అదే విధంగా చదువుకోవడం ఖరీదైన విషయంగా మారిందని 33 శాతం మంది వెల్లడించారు. నూతన నైపుణ్యాలవైపు పరుగులు..మన దేశ విద్యార్థులు, ఉద్యోగార్థులు నూతన నైపుణ్యాలు అందిపుచ్చుకోవడంలో పరుగులు పెడుతున్నారని ఈటీఎస్ సర్వే వెల్లడించింది. లైఫ్ లాంగ్ లెర్నింగ్ అనేది కెరీర్ సుస్థిరతకు తోడ్పడుతుందని 91 శాతం మంది పేర్కొనడం విశేషం. అదే విధంగా యూనివర్సిటీల డిగ్రీలకంటే ఆయా విభాగాల్లో క్రెడెన్షియల్స్, సర్టిఫికేషన్స్‌కు ఎంతో ప్రాధాన్యత ఉందని 88 శాతం మంది పేర్కొన్నారు.ఏఐ.. అవకాశాల వేదిక..ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో ఉద్యోగాలకు ముప్పు ఏర్పడుతుందనే అభిప్రాయాలు వెల్లడవుతున్న పరిస్థితుల్లో.. తాజా సర్వేలో మాత్రం ఇందుకు భిన్నంగా యువత స్పందించింది. ఏఐని ముప్పుగా భావించట్లేదని, తమకు లభించిన అవకాశంగా భావిస్తున్నామని 88 శాతం మంది స్పష్టం చేయడం విశేషం. అదే విధంగా.. అంతర్జాతీయ స్థాయిలో ప్రతి పది మంది ఉద్యోగుల్లో నలుగురు.. ఏఐ లిటరసీ, మానవ సామర్థ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవడంలో ఆసక్తి చూపుతున్నారు.లాభాపేక్ష లేని సంస్థలు కూడా..దేశంలో అత్యున్నత విద్యను అందించడంలో లాభాపేక్ష లేని సంస్థలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ సంస్థలకు మన దేశం అత్యంత అనుకూల దేశంగా ఉందని.. సర్వేలో పాల్గొన్న వారిలో 26 శాతం మంది తెలిపారు. అంతర్జాతీయంగా ఈ సంఖ్య 19 శాతంగానే ఉంది.ఆ 3 స్కిల్స్ ప్రధానంగా..జాబ్ మార్కెట్లో ముందంజలో నిలవడానికి ఏఐ/డిజిటల్ లిటరసీ, సృజనాత్మకత, కమ్యూనికేషన్లు కీలకంగా నిలుస్తున్నాయని నివేదిక స్పష్టం చేసింది. ఇందుకోసం అవసరమైతే సంస్థలు శిక్షణ సదుపాయాలు కల్పించాలనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి.బోధన, మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడాలినేటి యువత వాస్తవ పరిస్థితులపై అవగాహన ఏర్పరచుకుంటున్నారు. అందుకే అప్ స్కిల్లింగ్, రీ–స్కిల్లింగ్ అవసరమని భావిస్తున్నారు. ఇందుకోసం కళాశాల స్థాయి నుంచే కృషి చేస్తున్నారు. అయితే దీనికి తగినట్లుగా మౌలిక సదుపాయాలు, బోధన అవకాశాలు మరింత మెరుగు పడాలి. అంతర్జాతీయంగా పోలిస్తే మన విద్యార్థులు ఏ దేశంలోనైనా.. ఉన్నత విద్య, ఉద్యోగ రంగాల్లో మెరుగ్గా రాణిస్తున్నారు.– రమేశ్ లోగనాథన్, ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్, కో–ఇన్నోవేషన్స్, ట్రిపుల్ఐటీ–హైదరాబాద్ -
కుంకీలతో కట్టడి సాధ్యమేనా
పలమనేరు: చిత్తూరు జిల్లాలోని కౌండిన్య అభయారణ్యంలో ఏనుగుల సమస్య(elephant problem) దశాబ్దాలుగా ఉంది. అడవిదాటి వచ్చి ఏనుగులు రైతుల పంటలను నాశనం చేస్తున్నాయి. మరోవైపు ఏనుగుల దాడుల్లో(elephant attack) జనాలు మృత్యువాత పడుతున్నారు. ఏనుగులు సైతం వివిధ కారణాలతో మరణిస్తున్నాయి. అడవిలోంచి ఏనుగులు బయటకు రాకుండా కట్టడి చేసేందుకు ఇప్పటివరకు అటవీశాఖ చేపట్టిన సోలార్ ఫెన్సింగ్, కందకాల తవ్వకం వల్ల ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది.కర్ణాటక టైప్ పేరిట గతంలో చేపట్టిన హ్యాంగింగ్ సోలార్ సిస్టం సైతం ప్రయోగాత్మకంగానే ముగిసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కుంకీ ఏనుగుల ద్వారా ఇక్కడి ఏనుగులను కట్టడి చేసేందుకు పలమనేరు మండలంలోని ముసలిమొడుగు వద్ద కుంకీ ఎలిఫెంట్(Kunki Elephant) ప్రాజెక్టు పనులు చేపడుతోంది. ఇదే తరహాలో రామకుప్పం మండలంలో ననియాల క్యాంపును గతంలో ఏర్పాటు చేసినా ఈ ఏనుగులు కనీసం అడవిలోని ఓ ఏనుగును సైతం అదుపు చేయలేదు. ఈ నేపథ్యంలో ఇక్కడికి రానున్న కుంకీ ఏనుగులు అడవి ఏనుగులను కట్టడి చేస్తాయా? అనే అనుమానం ఇక్కడి రైతుల్లో నెలకొంది. కౌండిన్యలో ఏనుగుల పరిస్థితి ఇదీ పలమనేరు, కుప్పం పరిధిలోని కౌండిన్య అభయారణ్యం 250 కి.మీ మేర మన రాష్ట్రంతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని అడవులకు ఆనుకొని ఉంది. కౌండిన్య అభయారణ్యంలో స్థిరంగా ఉన్న గుంపులు, వలస వచ్చిన గుంపులు కలిపి మొత్తం 120 వరకు ఏనుగులు సంచరిస్తున్నాయి. 1984లో ప్రభుత్వం ముసలిమొడుగు వద్ద కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చురీని ఏర్పాటు చేసింది. ఇందులోకి తమిళనాడులోని మోర్థన ఫారెస్ట్నుంచి, ననియాల, కర్ణాటకలోని బన్నేరుగట్ట, బంగారుపేట, కేజీఎఫ్, తమిళనాడులోని క్రిష్ణగిరి, హొసూరు, కావేరిపట్నం తదితర ప్రాంతాల నుంచి ఏనుగులు వస్తున్నాయి. ఏనుగులు అడవిని దాటి బయటకు రాకుండా ఉండేందుకు గతంలో రూ. 2.61 కోట్లతో బంగారుపాళ్యం మండలం నుంచి కుప్పం వరకు 142 కి.మీ మేర సోలార్‌ఫెన్సింగ్‌ను 40 కి.మీ మేర ట్రెంచ్‌లను ఏర్పాటుచేశారు. అయితే సోలార్‌ఫెన్సింగ్‌ను ఏనుగులు తొక్కి అడవిలోంచి బయటకువస్తున్నాయి. ఫెన్సింగ్ కోసం ఏర్పాటు చేసిన కమ్మీలు నాశిరకంగా ఉండటంతో వీటిని సులభంగా విరిచేస్తున్నాయి. ఇక ఎలిఫెంట్ ట్రెంచ్‌లను సైతం ఏనుగులు మట్టిని తోసి,రాళ్లున్న చోట సులభంగా అడవిని దాటి బయటికొస్తున్నాయి. ఈరెండూ విఫలమవడంతో గతేడాది కర్ణాటక మోడల్ పేరిట హ్యాంగింగ్ సోలార్‌ను పదికిలోమీటర్ల మేర ప్రయోగాత్మకంగా చేపట్టి ఆపై దీన్నీ వదిలేశారు.కుంకీల కోసం కర్ణాటకతో ఎంవోయూ ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కర్ణాటకతో ఎంవోయూ చేసుకొని అక్కడ శిక్షణపొందిన నాలుగు కుంకీ ఏనుగులను ఇక్కడికి తెప్పిస్తోంది. ఇందుకోసం రేంజి పరిధిలోని 20 మంది ఎలిఫెంట్ ట్రాకర్లను దుభారే ఎలిఫెంట్ క్యాంపునకు పంపి నెలరోజుల పాటు శిక్షణ ఇప్పించారు. దీనికోసం ముసలిమొడుగు వద్ద రూ.12లక్షల వ్యయంతో కుంకీ ఎలిఫెంట్ క్యాంపును 50 ఎకరాల్లో ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా ఏనుగుల కోసం కర్రలకంచెతో విడిది, మేతను సిద్దం చేసుకునే గదులు, చిన్నపాటి చెరువు, శిక్షణాస్థలం. క్రాల్స్( మదపుటేనుగులను మచ్చిక చేసుకొనే చెక్క గది) పనులు జరుగుతున్నాయి.మరో రూ.27 లక్షలతో హ్యాంగింగ్ సోలార్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇలా ఉండగా గతంతో రామకుప్పం వద్ద నినియాలో ఏర్పాటు చేసిన ఇలాంటి క్యాంపులో రెండు ఏనుగులున్నాయి. వీటిని చూసేందుకు పర్యాటకులు వెళుతున్నారేగానీ ఇవి అడవిలోని ఏనుగును కట్టడి చేసిన దాఖలాలు ఇప్పటిదాకా లేవు. అదే రీతిలో ఇక్కడ కుంకీలతో సమస్య తెగుతుందా? లేదా అనే సందేహం మాత్రం ఇక్కడి రైతులకు పట్టుకుంది. అసలే ఇక్కడున్న మదపుటేనుగులు (రౌడీ ఏనుగులు,పుష్పా) కుంకీ ఏనుగులపై దాడులు చేసే అవకాశం లేకపోలేదు.గుబులు రేపుతున్న ఒంటరి ఏనుగు.... పలమనేరు కౌండిన్య అభయారణ్యంలో వందకు పైగా ఏనుగులు సంచరిస్తున్నా కేవలం ఓ ఒంటరి ఏనుగు రెండునెలలుగా జనానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కేవలం వ్యవసాయపొలాల వద్ద ఉన్న ఇళ్ళను టార్గెట్ చేసి వాటిని ధ్వంసం చేస్తోంది. ఆ ఇళ్ళలోని ధాన్యం, రాగులు హాయిగా ఆరగించి వెళుతోంది. దీంతోపాటు ఆఇళ్ల వద్ద ఉన్న మనుషులపై దాడులు చేస్తోంది.వారు దొరక్కపోతే ఆ ఇళ్ల వద్ద కట్టేసి ఉన్న ఆవులు, దూడలను చంపుతోంది. దీంతో అటవీ సమీప ప్రాంతాల్లో పొలాలవద్ద కాపురాలుంటున్న వారు ఈ ఏనుగు భారినుంచి ఎలా తప్పించుకోవాలో అర్థంగాక హడలిపోతున్నారు. కాగా గత పదేళ్లలో కరెంట్ షాక్‌లు, నీటిదొనల్లో పడి, మదపుటేనుగుల రభస కారణంగా 16 ఏనుగులు చనిపోయాయి. ఏనుగుల కారణంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14మంది మృతి చెందగా 26 మందివరకు గాయపడ్డారు. అడవిని విడిచి ఎందుకొస్తున్నాయంటే... కౌండిన్య అభయారణ్యంలో ఏనుగులకు అవరసమైన ఆహారం, నీటిలభ్యత తక్కువ. ఓ ఏనుగుకు రోజుకి 900లీటర్ల నీరు, 10 హెక్టార్లలో ఫీడింగ్ అవసరం. ఆహారం తిన్నాక ఇవి రోజుకు 5మైళ్లదాకా సంచరిస్తుంటాయి. అడవిలోని దట్టమైన మోర్ధనా అభయారణ్యంలోకి ఏనుగులు వెళితే తమిళనాడు అటవీశాఖ తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిపి వీటిని మళ్లీ కౌండిన్య వైపుకు మళ్లిస్తోంది. దీంతో ఏనుగులు దట్టమైన అడవిలో ఉండటంలేదు. పొలాల్లోని చెరుకు, కొబ్బరి, మామిడి లాంటి ఆహారం కోసం ఒక్కసారి వచ్చే ఏనుగు తరచూ అదే మార్గంలో వస్తూనే ఉంటుందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.క్యాంప్ పనులు సాగుతున్నాయి పలమనేరులో కుంకీ ఎలిఫెంట్ క్యాంపుకోసం ఇప్పటికే పనులు సాగుతున్నాయి. మైసూరు సమీపంలోని దుబరే నుంచి నాలుగు కుంకీ ఏనుగులు త్వరలో రానున్నాయి. ఎలిఫెంట్ ట్రాకర్లకు ఇప్పటికే కుంకీ ట్రైనింగ్ ఇప్పించాం. ముఖ్యంగా మదపుటేనుగులు దాడులు చేయకుండా వాటికి శిక్షణనిస్తాం. దీంతో ఏనుగులను కట్టడి చేసే అవకాశం ఉంటుంది. – భరణి, డీఎఫ్‌వో, చిత్తూరుకుంకీలతోనైనా సమస్య తీరితే చాలు.. గతంలో ఏనుగులను కట్టడి చేసేందుకు చేసిన పనులన్నీ లాభం లేకుండా పోయాయి. ఇప్పుడు కుంకీ ఏనుగులంటున్నారు. వీటితోనైనా ఇక్కడ ఏనుగుల సమస్య పరిష్కారమైతే అదే పదివేలు. అయినా జనంపై దాడులు చేస్తూ యథేచ్ఛగా పంటపొలాలపై పడుతున్న మదపుటేనుగులను ఈ కుంకీ ఏనుగులు ఎంతవరకు అదుపు చేస్తాయనే విషయంపై అనుమానంగానే ఉంది. – ఉమాపతి, రైతుసంఘ నాయకులు, పలమనేరు -
రక్తపుటేరు
అర్జెంటీనాలో ఓ కాలువ ఏకంగా ఎరుపు రంగులోకి మారింది. రాజధాని బ్యూనస్ ఎయిర్ష్ సమీపంలో ఉన్న అవెల్లెనెడా మున్సిపాలిటీలోని సరండ్ కాల్వ ఒక్కసారిగా రంగు మారడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అసలేం జరిగిందంటే అర్జెంటీనా, ఉరుగ్వే మధ్య రియో డి లా ప్లాటాలోకి ప్రవహించే జలమార్గంలో స్థానిక తోలు, వస్త్ర పరిశ్రమలు విపరీతంగా రంగులు, రసాయన వ్యర్థాలను వదులుతున్నాయి. దాంతో కాల్వ ఎప్పుడూ పసుపు రంగులో కనిపిస్తూ యాసిడ్ వాసనలు వస్తుంటుంది. అలాంటిది గురువారం అవెల్లెనెడా వాసులు నిద్రలేచే సరికి అది ఉన్నట్టుండి రక్త వర్ణంలోకి మారి భయంకరంగా కనిపించడమే గాక తీవ్ర దుర్గంధం వెదజల్లింది. ఆ విపరీతమైన దుర్వాసనకే ఉలిక్కిపడి లేచామని చాలామంది వాపోయారు. కాలుష్యంపై ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని వారంటున్నారు. అర్జెంటీనా పర్యావరణ శాఖ దీనిపై స్పందించింది. రంగు మార్పుకు కారణాలను గుర్తించడానికి కాల్వ నుంచి నీటి నమూనాలను సేకరించింది. సమీప ఫ్యాక్టరీ నుంచి రంగు లీకవడం వల్లే కాల్వ నీళ్లు ఎర్నగా మారాయని అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బాబూ.. బయటకు దయచెయ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమెరికా టెక్ కంపెనీల్లో(US tech companies) ఉద్యోగుల కోత(Layoffs) కొనసాగుతోంది. ఆ దేశ టెక్ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్, సేల్స్‌ఫోర్స్, వాల్‌మార్ట్, స్ట్రైప్ తదితర సంస్థలు లేఆఫ్స్ ప్రకటించాయి. 2025లో మరిన్ని ఉద్యోగాల కోతలకు తాము సిద్ధంగా ఉన్నామని కంపెనీలు ముందస్తు సంకేతాలను చూపడంతో, యూఎస్ జాబ్ మార్కెట్ ఈ ఏడాది బలహీనపడవచ్చని నివేదికలు చెబుతున్నాయి. యూఎస్‌కు చెందిన కోచింగ్ కంపెనీ చాలెంజర్, గ్రే అండ్ క్రిస్మస్ తాజా నివేదిక ప్రకారం డిసెంబర్‌తో పోలిస్తే జనవరిలో యూఎస్‌లోని కంపెనీలు అధికంగా ఉద్యోగులను తగ్గించాయి.జనవరిలో 49,795 ఉద్యోగాల కోత పడింది. డిసెంబర్లో ప్రకటించిన 38,792తో పోలిస్తే ఇది 28 శాతం అధికం. 2024 జనవరిలో ప్రకటించిన 82,307 లేఆఫ్స్ కంటే ఈ సంఖ్య 40 శాతం తక్కువ. లాభాలు పెంచుకునేందుకు కంపెనీలు ఇన్వెస్టర్ల ఒత్తిడికి గురవుతున్నాయి. ఈ అంశమే తొలగింపునకు దారితీస్తోంది. ముఖ్యంగా కొవిడ్ సమయంలో కంజ్యూమర్ టెక్‌పై వ్యయాలు పెరగడంతో అందుకు తగ్గ సిబ్బందిని కంపెనీలు నియమించుకున్నాయి. వారిపైనే ఇప్పుడు కత్తి వేలాడుతోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సర్వే ప్రకారం 41 శాతం అంతర్జాతీయ కంపెనీలు ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్(artificial intelligence) కారణంగా వచ్చే ఐదేళ్లలో శ్రామిక శక్తిని తగ్గించుకోవాలని భావిస్తున్నాయి. కనీసం 25 కంపెనీలు.. అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్నప్పటికీ కంపెనీలు ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. జనవరిలో యూఎస్ ఆర్థిక వ్యవస్థ 3,53,000 కొత్త ఉద్యోగాలను జోడించింది. మరోవైపు మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, మెటా వంటి పెద్ద కంపెనీలు జనవరిలో తమ ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు అందజేశాయి. యూఎస్‌లో కనీసం 25కు పైగా సంస్థల్లో వేల మంది ఉద్యోగాలు కోల్పోయారని నివేదికలు చెబుతున్నాయి. పనితీరు సంతృప్తికరంగా లేని 3,600 మందిని ఈ ఏడాది తొలగిస్తున్నట్లు ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించారు. ఏఐ ఆధారిత సేవలు, పరికరాలను రూపొందించడంలో కంపెనీ ముందుకు సాగుతోందని తెలిపారు. వరుస కట్టిన సంస్థలు.. సాఫ్ట్వేర్ కంపెనీ వర్క్‌డే 1,750 మందికి ఉద్వాసన పలుకుతోంది. ఏఐ ఇందుకు కారణమని కంపెనీ తెలిపింది. వాల్‌మార్ట్ తాజాగా కాలిఫోర్నియా, ఆకన్సవ్లలోని కన్సాలిడేషన్‌లో భాగంగా వందలాది మందిని తొలగిస్తోంది. నార్త్ కరోలినాలో ఒక కార్యాలయాన్ని మూసివేస్తోంది. అమెజాన్ తన కమ్యూనికేషన్స్ యూనిట్లో డజన్ల కొద్దీ ఉద్యోగాలను కుదించింది. పనితీరు ప్రమాణాలకు అనుగుణంగా లేనందున ఉద్వాసన పలుకుతున్నట్టు మైక్రోసాఫ్ట్ తన సిబ్బందికి పంపిన నోటీసులో తెలిపింది. ఈ టెరి్మనేషన్ లెటర్స్ ప్రకారం బాధిత ఉద్యోగులు తక్షణమే ఉద్యోగాలను కోల్పోతారు. అంతేగాక వారికి ఎటువంటి ప్యాకేజీ ఉండదు. గూగుల్‌లో స్వచ్ఛందంగా.. ఆండ్రాయిడ్, పిక్సెల్, క్రోమ్, నెస్ట్ వంటి కీలక ఉత్పత్తులకు బాధ్యత వహిస్తున్న తన ప్లాట్‌ఫామ్స్, డివైజెస్ ఆర్గనైజేషన్‌లోని యూఎస్ ఆధారిత ఉద్యోగులకు గూగుల్ స్వచ్ఛంద నిష్క్రమణ ప్రోగ్రామ్‌ను ఆఫర్ చేసింది. వీరికి పరిహారం అందించనుంది. 1,000 మందిని తగ్గించాలని సేల్స్‌ఫోర్స్ యోచిస్తోంది. అలాగే ఏఐ ఆధారిత ఉత్పత్తుల్లోకి విస్తరణకు మద్దతుగా కొత్త సిబ్బందిని ఏకకాలంలో నియమిస్తోంది. జనవరి 20 నాటి అంతర్గత మెమో ప్రకారం ప్రొడక్ట్, ఇంజనీరింగ్, ఆపరేషన్స్ విభాగాల్లో 300 మంది సిబ్బందిని తొలగిస్తున్నట్లు స్ట్రైప్ ప్రకటించింది. అయితే, కంపెనీ తన మొత్తం ఉద్యోగుల సంఖ్యను 2025 చివరినాటికి 10 వేలకు పెంచాలని నిర్ణయించింది. ఖర్చులను తగ్గించుకునేందుకు వాషింగ్టన్ పోస్ట్ తన సిబ్బందిలో 4 శాతం లేదా 100 కంటే తక్కువ మందిని తొలగిస్తున్నట్టు జనవరిలో పేర్కొంది. -
పరశురామ ప్రతిష్ఠిత.. జడల రామలింగేశ్వరుడు
తెలంగాణలోని ప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో ప్రత్యేకమైనది నల్లగొండ జిల్లా చెరువుగట్టులోని పార్వతీ సమేత జడల రామలింగేశ్వరాలయం. పరమ పవిత్ర క్షేత్రంగా భక్తుల నీరాజనాలందుకుంటోంది. ఇక్కడి శివుడికి మొక్కితే ఎలాంటి బాధలైనా పోయి, ఆరోగ్యంప్రాప్తిస్తుందని నమ్ముతారు. అందుకే ఈ క్షేత్రాన్ని ఆరోగ్యక్షేత్రంగా పిలుస్తారు. 3, 5, 7, 9, 11 అమావాస్య రాత్రులు ఈ క్షేత్రంలో స్వామివారి సన్నిధిలో నిద్రిస్తే చీడపీడలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఇక్కడ అమావాస్య సమయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. అలాంటి క్షేత్రం ఇటీవలే బ్రహ్మోత్సవాలను పూర్తి చేసుకుంది. ప్రతి ఏటా మాఘ శుద్ధ పంచమి నాటి నుంచి ఆరు రోజులపాటు ఇక్కడ జాతర నిర్వహిస్తారు. ఆ సమయంలో పెద్ద సంఖ్యలో శివసత్తులు ఇక్కడకు చేరుకుంటారు. అగ్ని గుండాలు ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణ. రథ సప్తమి శివ కళ్యాణానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. లోక కల్యాణార్థం పరశురాముడు 108 క్షేత్రాల్లో స్వయంగా ప్రతిష్టించిన శివలింగాలలో ఇది చివరిదిగా ప్రతీతి. పశ్చిమాభిముఖంతో శివుడు కొలువై ఉండడం ఈ క్షేత్రం ప్రత్యేకత.పూర్వం హైహయ వంశ మూల పురుషుడు, కార్తవీర్జార్జునుడు వేటకోసం దండకారణ్యానికి వెళతాడు. అవిశ్రాంతంగా వేటాడిన పిదప బడలికకు గురైన చక్రవర్తి సపరివారంగా సమీపంలోని జమదగ్ని ఆశ్రమానికి వెళతాడు. అప్పుడు జమదగ్ని మహర్షి తన దగ్గరున్న కామధేనువు సహాయంతో అందరికి భోజనాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ ధేనువు మహత్తును మహర్షి దగ్గర అడిగి తెలుసుకున్న కార్తవీర్యార్జునుడు తనకు ఆ ధేనువును ఇవ్వాలని అడుగుతాడు. అందుకు మహర్షి తిరస్కరించడంతో కోపోద్రిక్తుడైన కార్తవీర్యార్జునుడు, జమదగ్నిని సంహరించి కామధేనువును తీసుకువెళతాడు. ఆ సమయంలో బయటకు వెళ్లి వచ్చిన పరశురాముడు జరిగిన విషయం తెలుసుకొని తన తండ్రిని చంపిన కార్తవీర్యార్జునుని పరశువు (గొడ్డలి) తో సంహరిస్తాడు. అంతేకాదు రాజులపై కోపంతో భూప్రదక్షిణం చేసి క్షత్రియ సంహారం చేస్తాడు. అనంతరం పాప పరిహారార్థం దేశం నలుమూలలా 108 శివలింగాలను ప్రతిష్టించి, ఒక్కొక్క లింగం చెంత వేల సంవత్సరాలు తపస్సు చేసి, ఆ తపోఫలాన్ని ఆ క్షేత్రానికి ధారపోసి మానవ కల్యాణానికి పాటుపడతాడు. అలా చివరగా ప్రతిష్టించిన 108వ శివ లింగం వద్ద ఎంత తపస్సు చేసినా శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో, కోపగించుకున్న పరశురాముడు తన గడ్డలితో శివలింగం ఊర్ధ్వభాగంపై ఒక దెబ్బ వేశాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, ఇంతకాలం నువ్వు తపస్సు చేసిన ప్రాంతం, ప్రముఖ శైవక్షేత్రంగా వెలుగొందుతుందని, కలియుగాంతం వరకు తానిక్కడే ఉండి భక్తులను అనుగ్రహి స్తుంటానని చెబుతారు. అనంతరం పరశురాముడు కూడా ఇక్కడే లింగాకృతి పొంది శివైక్యం పొందారని స్థల పురాణం చెబుతోంది. మూడు గుండ్ల ఆకర్షణఆలయం పక్కనే మూడు గుండ్లు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. వాటిల్లో మొదటి రెండింటినీ ఎక్కి మూడో దాన్ని చేరితే అక్కడ ఓ శివలింగం దర్శనమిస్తుంది. అయితే ఈ రాళ్లను ఎక్కేదారి క్లిష్టంగా ఉంటుంది. రాయి నుంచి రాయిని చేరే మధ్యలో ఉండే సందు చాలా ఇరుకుగా ఒక బక్కపల్చటి మనిషి అతి కష్టం మీద దాటే దారిలా కనిపిస్తుంది. ఎంత శరీరం ఉన్నవారైనా శివ నామస్మరణచేస్తూ వెళితే అందులోనుంచి అవతలికి సులభంగా చేరగలగటం శివుని మహిమకు తార్కాణంగా చెబుతారు. అయితే ప్రసుత్తం మూడు గుండ్లపైకి అందరూ వెళ్లి దర్శనం చేసుకునేందుకు ఇనప మెట్లను ఇరువైపులా ఏర్పాటు చేశారు. ఎల్లమ్మకు బోనాలుకొండపైకి కాలినడకన వెళ్లవచ్చు. మెట్లదారిలో వెళ్లే భక్తులు కాలబైరవుని దర్శనం చేసుకుంటారు. అనంతరం కోనేరుకు చేరుకొని స్నానం చేసి భక్తులు ముడుపుల గట్టు వద్దకు వెళ్లి అక్కడి చెట్టుకింద చెక్కతో చేసిన స్వామి పాదుకలను తమ శరీరం మీద ఉంచుకుని మొక్కుతారు. అనంతరం రామలింగేశ్వరస్వామిని దర్శించుకొని ఆంజనేయుడు, ఎల్లమ్మ, పరశురాములని దర్శించుకుంటారు. ఇక్కడ ఎల్లమ్మ దేవతకు బోనం తయారు చేసి నైవేద్యం సమర్పిస్తారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటారు. శివశక్తులు నాట్యాలు చేస్తుంటారు.అనంతరం భక్తులు గట్టు కింద ఉన్న పార్వతీ అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. కోరికలు నెరవేరిన వారు పల్లకి సేవ, వాహన సేవ, కోడెలు కడతారు. త్వరలో శివరాత్రికి ఇక్కడ జరగనున్న విశేష పూజలకు ముస్తాబవుతోంది ఆలయం. ఆ పేరెలా వచ్చిందంటే...రామలింగేశ్వరుని ఊర్ధ్వభాగాన పరశురాముడు గండ్ర గొడ్డలితో దెబ్బవేసిన చోట జడల వంటి రేఖలు ఉండటం వల్ల స్వామిని జడల రామలింగేశ్వరస్వామి అంటారు. చెరువు గట్టున ఉండటంతో చెరువుగట్టు జడల రామలింగేశ్వరాలయం అంటారు. కొండ దిగువన పార్వతీదేవి కొలువై ఉండటంతో పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంగా ప్రసిద్ధి కెక్కింది. కొండపై జడల రామలింగేశ్వరునికి 12వ శతాబ్దానికి చెందిన కాకతీయ గణపతిదేవ చక్రవర్తి గుహాలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయంలో తొలి ఏకాదశినాడు, కార్తీక సోమవారాల్లో, పౌర్ణమి, మహాశివరాత్రి పర్వదినాలలో కడువైభవంగా ఉత్సవాలు జరుగుతుంటాయి. అలాగే ప్రతి ఏటా అమావాస్యనాడు అన్నదానం చేస్తాం. – పోతలపాటి రామలింగేశ్వర శర్మ, ప్రధాన అర్చకులు – చింతకింది గణేష్, సాక్షి ప్రతినిధి, నల్లగొండ -
మీమ్స్ వరద...
న్యూఢిల్లీ: కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ గత రెండు పర్యాయాలు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన సందర్భాల్లో బీజేపీని విమర్శిస్తూ మీమ్స్ వెల్తువెత్తగా ఈసారి మీమ్స్ సృష్టికర్తల దృష్టంతా ఆప్ మీదనే పడింది. దీనికి తగ్గట్లు ఆప్‌ను, కేజ్రీవాల్ నేతగణాన్ని విమర్శల జడివానలో ముంచేస్తూ కుప్పలు తెప్పలుగా మీమ్స్.. సామాజిక మాధ్యమ సంద్రంలోకి కొట్టుకొచ్చాయి. ముఖ్యంగా 2023లో ఆప్ చీఫ్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దానికి కాస్తంత హాస్యం జోడించి వాట్సాప్, ఇన్‌స్టా గ్రామ్, ఫేస్బుక్, టెలిగ్రామ్‌లో జనం షేర్ చేసి ఆనందాన్ని పంచుకుంటున్నారు. ‘‘ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు బీజేపీ పలు రకాల కుట్రలు పన్నుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ రాష్ట్రంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తెగ కలలు కంటున్నారు. ఎన్ని కుట్రలు పన్నినా దిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆప్‌ను ఓడించలేరని బీజేపీ నేతలకు సైతం తెలుసు. ప్రధాని మోదీకి నేను ఒక విషయం చెప్పదల్చుకున్నా. ఢిల్లీ రాష్ట్ర ఎన్నికల్లో ఆయన మా పార్టీని ఈ జన్మలో ఓడించలేరు. దానికోసం ప్రధాని మోదీ మరో జన్మ ఎత్తాల్సి ఉంటుంది’’అని కేజ్రీవాల్ అన్నారు. 2017లోనూ కేజ్రీవాల్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ‘‘ఢిల్లీ రాష్ట్రానికి రాజకీయ పెద్దలం అంటే మేమే. మీమిచ్చే ఆదేశాలనే ఇక్కడి ప్రజలు పాటిస్తారు. ఢిల్లీని మేమే పరిపాలిస్తాం’’అని కేజ్రీవాల్ ఆనాడు అన్నారు. ఇంత బీరాలు పోయిన కేజ్రీవాల్‌నే బీజేపీ మట్టికరిపించిందంటూ కొత్త మీమ్స్ పుట్టుకొచ్చాయి. ఆప్ అటు, కాంగ్రెస్ ఇటు పరుగు పోటీలో అభ్యర్థులకు బీజేపీ, ఆప్, కాంగ్రెస్ ఎన్నికల గుర్తులు తగిలించి కొందరు నెటిజన్లు కొత్త మీమ్ సృష్టించారు. అందులో బీజేపీ, ఆప్ ముందుకు దూసుకుపోయేందుకు సిద్ధమైతే కాంగ్రెస్ వెనక్కు దూసుకుపోయేందుకు రెడీ అవుతున్నట్లు సరదా ఫొటోను సిద్ధంచేసి సామాజిక మాధ్యమాల్లోకి వదిలారు. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాలు సున్నాగా నమోదవడం తెల్సిందే. దీనిని గుర్తుతెచ్చేలా పెట్రోల్ బంక్ వద్ద వాహనదారునికి సిబ్బంది ‘‘పెట్రోల్ కొడుతున్నా. ముందు మీటర్ రీడింగ్ సున్నా వద్దే ఉంది. చెక్‌చేసుకోండి సర్’’అన్నట్లు ఒక ఫొటోను రూపొందించారు. అయితే ఆ పెట్రోల్‌లో రాహుల్‌గాంధీ పనిచేస్తున్నట్లు సరదా మీమ్‌ను సృష్టించారు. ఆప్ వైఫల్యాలకు తగు కారణాలను పేర్కొంటూ ఇంకెన్నో మీమ్స్ వచ్చాయి. ఆప్ మాజీ నాయకురాలు, రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌ను కేజ్రీవాల్ సహాయకుడు చితకబాదగా ఓటర్లు ఆప్‌ను చావుదెబ్బ తీశారని మరో మీమ్ వచి్చంది. ఐక్యత సున్నా విపక్షాల ‘ఇండియా’కూటమి అంటూ ఘనంగా ప్రకటించిన కాంగ్రెస్, ఆప్ తదితర పార్టీలు తీరా ఢిల్లీ ఎన్నికల్లో బాహాబాహీగా విమర్శలు చేసుకోవడంపైనా మీమ్స్ వచ్చాయి. రెజ్లింగ్ రింగ్‌లోకి కేజ్రీవాల్ యమా హుషారుగా దూసుకొచ్చి తొడ కొడుతుంటే ఒక్క దెబ్బతో మోదీ ఆయనను మట్టి కరిపించి బరి ఆవలికి విసిరేసినట్లు చూపే మరో మీమ్ వీడియో ఇప్పుడు తెగ వైరల్‌గా మారింది. బీజేపీ గెలుపు సంబరాలు చేసుకుంటుంటే అక్కడే ఉన్న తనను ఎవరూ మెచ్చుకోవట్లేదని స్వాతి మలివాల్ బాధపడుతుంటే దూరంగా నిల్చుని చూస్తున్న మోదీ వెంటనే అభినందనలు తెలుపుతున్నట్లు ఒక మీమ్ వీడియోను సృష్టించారు. ఎన్నికల క్రీడలో బీజేపీ, ఆప్సహా అన్ని పారీ్టలు గెలుపు కోసం ఆడుతుంటుంటే కాంగ్రెస్ మాత్రం తనకేం అక్కర్లేదన్నట్లు ఒక బెంచీపై కూర్చుని సరదాగా చూస్తున్నట్లు మరో మీమ్‌ను సృష్టించారు. మాకే ఎక్కువ ఆనందం ఈసారి గెలిచినందుకు మాకు ఆనందంగా ఉందని మోదీ, అమిత్ షా ఇద్దరూ నవ్వుకుంటుంటే.. మీ కంటే ఎక్కువ ఆనందం మాకే ఉందని అన్నా హజారే, స్వాతి మలివాల్, మరో మాజీ ఆప్ నేత కుమార్ విశ్వాస్ శర్మ చెబుతున్నట్లు ఉన్న మరో మీమ్ సైతం బాగా షేర్ అవుతోంది. ఇప్పటికే వేర్వేరు ఎన్నికల్లో ఓడిన ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్, శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, ఆప్ నేత సంజయ్ సింగ్‌లు బాధతో బనియన్, టవల్ మీద ఉన్న కేజ్రీవాల్‌కు పర్లేదులే అంటూ ఆనందంగా తీసుకొస్తున్న మీమ్ తెగ నవి్వంచేలా ఉంది. అనార్కలీలాగా ఆప్ నాయకురాలు అతిశీ సింగ్ నేలపై పడిపోతే సలీమ్లాగా కేజ్రీవాల్ వచ్చి లేపుతూ.. ‘‘లే అనార్కలీ. ఇప్పుడు మనం మన ఓటమికి ఈవీఎంలో అక్రమాలే కారణం అని కొత్త పల్లవి అందుకోవాలి’’అని ఆమెను తట్టిలేపుతున్నట్లు మరో మీమ్ ఇప్పుడు బాగా నవ్వు తెప్పిస్తోంది. గతంలో జనాన్ని కేజ్రీవాల్ తన చీపురుతో తరిమికొడితే, ఇప్పుడు జనం చీపురుకు నిప్పు పెట్టి కేజ్రీవాల్‌ను కొడుతున్నట్లు రూపొందించిన మరో మీమ్ ఇప్పుడు సోషల్‌మీడియాలో ఎక్కువగా షేర్ అవుతోంది. పార్టీ ఓటమితోపాటు ఆప్ అగ్రనేతలూ ఓటమిని చవిచూశారంటూ.. ‘‘గుడిలో ప్రసాదంగా ఏమైనా పెడతారని లోపలికి వెళితే అప్పటికే పొంగళి అయిపోయింది. సర్లే అని బయటికొస్తే అప్పటికే చెప్పులూ పోయాయి’’అంటూ ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ చెబుతున్నట్లు మరో వ్యంగ్య వీడియోను నెటిజన్లు సృష్టించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌చేశారు. -
స్వయంకృతాపరాధమే..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) మట్టికరిచింది. హ్యాట్రిక్ కొట్టలేక చతికిలపడింది. ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పరాజయం పాలయ్యారు. సీనియర్ నేతలకు సైతం ఓటమి తప్పలేదు. గౌరవప్రదమైన సంఖ్యలో సీట్లు రావడం, ముఖ్యమంత్రి ఆతిశీ నెగ్గడం కొంతలో కొంత ఊరట కలిగించిందనే చెప్పాలి. ఆప్ ఓటమికి దారితీసిన కారణాలు ఏమిటన్న దానిపై చర్చ మొదలైంది. ఆ పార్టీలోనూ అంతర్మథనం సాగుతోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఢిల్లీలో సంక్షేమ పథకాలు గొప్పగా అమలు చేశామని చెప్పుకున్నప్పటికీ ఓటర్లు కనికరించలేదు. ఆప్ ఓటమికి స్వయం కృతాపరాధమే కారణమన్న వాదన వినిపిస్తోంది. అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన పార్టీ స్వయంగా అవినీతిలో కూరుకుపోవడం ప్రజల్లో వెగటు కలిగించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసు కేజ్రీవాల్ పార్టీ కొంపముంచినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కేసులో కేజ్రీవాల్జైలుకు వెళ్లినప్పటికీ జనంలో ఏమాత్రం సానుభూతి లభించలేదు. ఫలించిన బీజేపీ ప్రచారం మద్యం కుంభకోణం వ్యవహారంలో కేజ్రీవాల్‌తోపాటు ఆప్ సీనియర్ నేతలపై కేసులు నమోదయ్యాయి. కొందరు మంత్రి పదవులకు రాజీనామా చేయాల్సి వచ్చింది. మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్ జైలుకెళ్లారు. ఎంపీ సంజయ్ సింగ్ అరెస్టయ్యారు. ఆప్ నేతల్లో చాలామందిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. తమ నాయకులపై కేసులన్నీ బీజేపీ కుట్రేనని ఆప్ పెద్దలు గగ్గోలు పెట్టినప్పటికీ జనం పట్టించుకోలేదు. ఇక కేజ్రీవాల్ నిర్మించుకున్న అద్దాల మేడ(శీష్ మహల్) దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ అంశాన్ని విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లడంలో బీజేపీ విజయవంతమైంది. అద్దాల మేడ వ్యవహారం ఎన్నికల్లో కీలక ప్రచారాంశంగా మారిపోయింది. అవినీతి రహిత, స్వచ్ఛమైన పాలన అందిస్తానంటూ అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ ఆ మాట నిలబెట్టుకోలేకపోయారు. పైకి నిరాడంబరంగా కనిపించే కేజ్రీవాల్ భారీగా ఆస్తులు పోగేసుకొని విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని బీజేపీ నేతలు చేసిన ఆరోపణలు ప్రజలను ఆలోచింపజేశాయి. ‘డబుల్ ఇంజన్’కు ఆమోదం! ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌తో ఆప్ ప్రభుత్వం తరచుగా ఘర్షణకు దిగింది. పరిపాలనా సంబంధిత అంశాల్లో ఆయనను వ్యతిరేకించడం, కేంద్ర ప్రభుత్వాన్ని ధిక్కరిస్తున్నట్లు వ్యవహరించడం జనానికి నచ్చలేదు. పరిపాలనకు అడ్డంకులు సృష్టిస్తున్నారని లెఫ్టినెంట్ గవర్నర్‌పై, కేంద్రంపై నిందలు వేసినప్పటికీ ఓటర్లు విశ్వసించలేదు. ఆప్ అంటే ఆపద అని ప్రధాని మోదీ సహా బీజేపీ అగ్రనేతలు ప్రచారం చేశారు. పచ్చి అవినీతి పార్టీ అంటూ విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రచారాన్ని ఆప్ నేతలు గట్టిగా తిప్పికొట్టలేకపోయారు. అద్దాల మేడపై ఏం సమాధానం చెప్పాలో వారికి తోచలేదు. ఢిల్లీ అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజన్ ప్రభుత్వం రావాలని బీజేపీ నేతలు పదేపదే చెప్పడం ఓటర్లపై ప్రభావం చూపినట్లు కనిపిస్తోంది. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ ప్రభుత్వం ఉంటే మేలు జరుగుతుందన్న అభిప్రాయం జనంలో నెలకొంది. బీజేపీకి ఒక్క అవకాశం ఇచ్చిచూద్దామన్న నిర్ణయానికి వారు వచ్చారు. ఢిల్లీ ఓటర్లకు ఆప్ పలు ఉచిత హామీల్చింది. అవి కూడా గట్టెక్కించలేదు. బీజేపీకి లాభించిన విపక్షాల అనైక్యత జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పాటైన ‘ఇండియా’ కూటమిలో కాంగ్రెస్, ఆప్ భాగస్వామ్య పక్షాలు. ఢిల్లీ ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీ చేయాల్సిన ఈ రెండు పార్టీలు విడివిడిగా బరిలోకి దిగాయి. గత ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసిన కాంగ్రెస్, ఆప్ ఈ ఎన్నికల్లో పరస్పరం కత్తులు దూసుకున్నాయి. ఆప్ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆప్‌ను చిత్తుచిత్తుగా ఓడించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. రెండు పార్టీలు మొత్తం 70 స్థానాల్లో తమ అభ్యర్థులను రంగంలోకి దింపాయి. బీఎస్పీ, వామపక్షాలు, ఎంఐఎం, ఆజాద్ సమాజ్ పార్టీ, ఎన్సీపీ వంటివి తమకు బలం ఉన్న చోట పోటీ పడ్డాయి. ఫలితంగా బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోయాయి. చాలాచోట్ల ఆమ్ ఆద్మీ పార్టీకి రావాల్సిన ఓట్లను కాంగ్రెస్ కొల్లగొట్టినట్లు తెలు స్తోంది. ఇండియా కూటమి పార్టీలన్నీ కలిసికట్టుగా పోటీ చేస్తే ఫలితం మరోలా ఉండేదని విశ్లేషకులు అంటున్నారు. ఏదేమైనప్పటికీ ప్రతిపక్షాల అనైక్యత కారణంగా చివరకు బీజేపీ లబ్ధి పొందింది. మార్పు కోరుకున్న జనంఆప్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేసినప్పటికీ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి పెట్టలేదన్న విమర్శలు ఉన్నాయి. పదేళ్లు పాలనలో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చలేదు. నగరంలో అస్తవ్యస్తమైన మారిన డ్రైనేజీ వ్యవస్థ, పెరిగిపోయిన కాలుష్యం, మురికికూపంగా మారిన యమునా నది, స్వచ్ఛమైన తాగునీరు, గాలి లభించకపోవడం ఓటర్లు మనసు మార్చేసింది. అంతేకాకుండా పదేళ్లుగా అధికారంలోకి కొనసాగుతున్న ఆప్‌పై సహజంగానే కొంత ప్రజావ్యతిరేకత ఏర్పడింది. జనం మార్పును కోరుకున్నారు. అవినీతి ఆరోపణలు చుట్టుముట్టడం, అభివృద్ధి లేకపోవడం కేజ్రీవాల్ విశ్వసనీయతను దిగజార్చాయి. ఈ పరిణామాలను బీజేపీ ఎంచక్కా సొమ్ము చేసుకుంది.స్తంభించిన పాలన కేజ్రీవాల్ అరెస్టు కావడం, జైలుకెళ్లడం, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం ఆప్ ప్రతిష్టను దారుణంగా దిగజార్చింది. ఆయన తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆతిశీ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కేజ్రీవాల్ తర్వాత బీజేపీని ఢీకొట్టే స్థాయి కలిగిన బలమైన నాయకులు లేకపోవడం ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రతికూలంగా మారింది. చాలామంది సీనియర్లు ఓడిపోవడంతో ఈ ఎన్నికల్లో నైతిక విజయం తమదేనని చెప్పుకొనే పరిస్థితి లేకుండాపోయింది. కేజ్రీవాల్ అరెస్టు కావడంతో పరిపాలన చాలావరకు స్తంభించింది. మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో గత ఏడాది మార్చి నెలలో ఆయన అరెస్టయ్యారు. వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయలేదు. కేంద్రం ఎదుట తలవంచబోనని తేల్చిచెప్పారు. ఈ కేసులో బెయిల్ వచ్చి జైలు నుంచి విడుదలైన తర్వాత ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. ప్రజలు ఇచ్చే నిజాయితీ సర్టిఫికెట్తో మళ్లీ ముఖ్యమంత్రి అవుతానని కేజ్రీవాల్ చెప్పినప్పటికీ అది నెరవేరలేదు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఐఐటీల ప్లేస్‌మెంట్స్.. వివరాలు గప్ చుప్
సాక్షి, ఏపీ సెంట్రల్ డెస్క్: దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)(IIT)లు. ఇంజనీరింగ్ విద్య అనగానే విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు మొదట గుర్తుకొచ్చేవి ఇవే. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో విజయం సాధించి ఐఐటీలో సీటు సాధిస్తే జాక్‌పాట్ కొట్టినట్టేనని విద్యార్థులు భావిస్తారు. బహుళజాతి సంస్థల్లో మంచి ఉద్యోగాలు పొందాలన్నా, అత్యుత్తమ వార్షిక వేతన ప్యాకేజీలు దక్కాలన్నా అది ఐఐటీలతో మాత్రమే సాధ్యమనే అభిప్రాయం సర్వత్రా ఉంది.ఈ నేపథ్యంలో ఏటా జరిగే ఆయా ఐఐటీల క్యాంపస్ ప్లేస్‌మెంట్స్(Placements)పై అంతా ఆసక్తి కనబరుస్తుంటారు. కేవలం ఇంజనీరింగ్ ఔత్సాహికులే కాకుండా మిగతా వారు కూడా ఏ స్థాయిలో ఐఐటీల విద్యార్థులు వేతన ప్యాకేజీలు దక్కించుకున్నారో తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు. అయితే ఈసారి ఎక్కువ ఐఐటీలు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ విషయంలో గోప్యత పాటిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. వివరాలు వెల్లడించింది కొన్ని ఐఐటీలే ఈ ఏడాది క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌కు సంబంధించి గతేడాది డిసెంబర్ 1నే ఆయా ఐఐటీల్లో ఆన్ క్యాంపస్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే విద్యార్థులకు ఏ స్థాయిలో వేతన ప్యాకేజీలు లభించాయో ఇప్పటివరకు కొన్ని ఐఐటీలు మాత్రమే బయటకు సమాచారాన్ని వెల్లడించాయి. ఐఐటీ కాన్పూర్, ఐఐటీ రూరీ్క, ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ–బీహెచ్‌యూ ఈ కోవలో ఉన్నాయి. ఇవి కాకుండా మిగతా ఐఐటీలన్నీ నిశ్శబ్దాన్ని పాటిస్తున్నాయి. కారణాలు ఇవేనా? క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ గురించి బయటకు సమాచారాన్ని వెల్లడించకపోవడానికి కారణం ఉందని ఐఐటీల ప్రొఫెసర్లు చెబుతున్నారు. విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించడానికి, వారి సంక్షేమం కోసమే తాము ప్లేస్‌మెంట్స్ సమాచారాన్ని వెల్లడించడం లేదని అంటున్నారు. వేతన ప్యాకేజీల గురించి ఒకరితో మరొకరు పోల్చుకోవడం వల్ల విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం çపడుతోందని.. అందుకే ఇలా చేస్తున్నామని పేర్కొంటున్నారు. ఈ మేరకు ఇటీవల జరిగిన అన్న ఐఐటీల ప్లేస్‌మెంట్స్ కమిటీ (ఏఐపీసీ) సమావేశంలో ఉద్యోగ నియామక వివరాలు, వేతన ప్యాకేజీల వివరాలు వెల్లడించవద్దని ప్రాథమికంగా ఒక నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నాయి. వారం లేదా పక్షం రోజులకోసారి.. సాధారణంగా దేశంలో ఉన్న మొత్తం 23 ఐఐటీల్లో రెండు దశల్లో క్యాంపస్ ప్లేస్మెంట్లు ఉంటాయి. డిసెంబర్లో మొదటి దశ, జనవరి – జూన్ మధ్య రెండో దశ నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగాలు సాధించినవారి సమాచారాన్ని రోజువారీ కాకుండా వారానికోసారి లేదా 15 రోజులకోసారి విడుదల చేయాలని ఐఐటీల ప్లేస్‌మెంట్స్ కమిటీల సమావేశంలో ఆయా సంస్థలు ప్రతిపాదించాయి. ప్లేస్‌మెంట్స్ గురించి మీడియాలో వచ్చే వార్తలు విద్యార్థులపై ఒత్తిడి పెంచకుండా, వారి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీయకుండా చూడాలన్నదే తమ ఏఐపీసీ కన్వీనర్ ప్రొఫెసర్ కౌశిక్ పాల్ తెలిపారు. కొత్త ఐఐటీల ప్లేస్‌మెంట్స్ నివేదికలు అప్పుడే.. చాలా ఐఐటీలు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ సమయంలో విద్యార్థులు ఉద్యోగాలు సాధించిన కంపెనీల పేర్లు, అత్యధిక, మధ్యస్థ ప్యాకేజీలు, ఆఫర్‌ను పొందిన మొత్తం విద్యార్థుల సంఖ్య, వాటిలో అంతర్జాతీయ ఆఫర్ల సంఖ్య వంటివాటి గురించి రోజూ సమాచారమిచ్చేవి. అయితే ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ ధార్వాడ్, మరికొన్ని కొత్త ఐఐటీలు 2024–25 సెషన్లో ప్లేస్మెంట్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఆగస్టు, సెప్టెంబర్‌ల్లో ఒకేసారి తుది ప్లేస్మెంట్ నివేదికను విడుదల చేయాలని నిర్ణయించుకున్నాయి. ఐఐటీల నిర్ణయానికి మద్దతు విద్యార్థుల క్యాంపస్ ప్లేస్‌మెంట్స్, అత్యధిక వార్షిక వేతన ప్యాకేజీల వివరాలను బహిర్గతం చేయకూడదనే నిర్ణయానికి పలువురు ఐఐటీ ప్రొఫెసర్లు సైతం మద్దతు తెలుపుతున్నారు. ప్లేస్మెంట్లు, మంచి ప్యాకేజీలు పొందిన విద్యార్థుల వివరాలను బహిరంగంగా వెల్లడిస్తే ఇవి.. ప్లేస్మెంట్ దక్కనివారు, మంచి పే ప్యాకేజీలు పొందనివారిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ఐఐటీ ధన్బాద్లో కెరీర్ డెవలప్మెంట్ సెంటర్ హెడ్ ప్రొఫెసర్ సౌమ్యా సింగ్ అన్నారు. విద్యార్థులు ఏమంటున్నారంటే.. మొదటి ప్రయత్నంలో మంచి ప్లేస్మెంట్ దక్కకపోతే నిరుత్సాహం చెందాల్సిన అవసరంలేదని ఐఐటీ మద్రాస్‌లో సివిల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థి రిత్విక్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఐఐటీయన్లపై మీడియా నివేదికలు ఒత్తిడి పెంచలేవన్నాడు. ఆందోళన చెందకుండా ఇతర పరీక్షలు, ఇంటర్వ్యూలపై దృష్టి సారిస్తానని స్పష్టం చేశారు.ప్రొఫెసర్లు, విద్యార్థుల మద్దతు.. ఏది ఏమైనప్పటికీ విద్యార్థుల ప్లేస్మెంట్లు, ప్యాకేజీల గురించి ఏ ఐఐటీ మీడియాకు వెల్లడించకూడదని ఏఐపీసీ అధికారికంగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని ఐఐటీల ప్రతినిధులకు ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ నిర్ణయానికి ప్రొఫెసర్లు, విద్యార్థులు కూడా మద్దతు తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఐఐటీల నిర్ణయం ఆందోళన తగ్గిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్లేస్మెంట్లు, ప్యాకేజీల వివరాలు మీడియాలో రాకపోవడం మంచిదని ఐఐటీ ఢిల్లీ విద్యార్థి ఒకరు అభిప్రాయపడ్డారు.లేదంటే తమ ఇంటి ఇరుగుపొరుగువారు తన గురించి తన తల్లిదండ్రులను ఆరా తీస్తారని.. ఇది వారిపై అనవసర ఆందోళన పెంచుతుందన్నారు. అంతేకాకుండా ఇతర విద్యార్థులతో తనను పోల్చుతారని.. ఇది కూడా తన తల్లిదండ్రులను ఒత్తిడిలోకి నెడుతుందన్నారు. ఈ నేపథ్యంలో ప్లేస్మెంట్లు, ప్యాకేజీ వివరాలను బహిరంగంగా వెల్లడించవద్దని ఐఐటీలు మంచి నిర్ణయమే తీసుకున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. -
ఐటీ ఊరటే.. గేమ్ ఛేంజర్
ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయంలో మోదీ సర్కారు తాజా బడ్జెట్లో ప్రకటించిన ఐటీ ఊరట ప్రధాన పాత్ర పోషించింది. ఈ నిర్ణయంతో రాజధాని నగరంలో ఏకంగా మూడింట రెండొంతుల దాకా ఉండే ప్రభుత్వోద్యోగులు, వేతన జీవుల్లో అత్యధికులు ఆ పార్టీవైపు మొగ్గారు. మధ్య తరగతి, పూర్వాంచల్ ఓటర్ల మద్దతు దానికి తోడైంది. వీటికి తోడు 2015, 2020ల్లో ఆప్‌కు అండగా నిలిచిన పలు వర్గాల ఓటర్లు కూడా ఈసారి కమలం పార్టీ వైపు మొగ్గారు. సాధారణంగా కేజ్రీవాల్ పార్టీకి మద్దతుదార్లయిన మహిళలు సైతం ఈసారి బీజేపీకి జైకొట్టారు. వారికి నెలకు రూ.2,500 అందిస్తామన్న హామీ బాగా పేలింది. పంజాబ్‌లో మహిళలకు నెలకు రూ.1,000 ఇస్తామన్న హామీని గెలిచాక నిలబెట్టుకోకపోవడం ఆప్‌కు ప్రతికూలంగా మారింది. ఢిల్లీలో మధ్య తరగతి ప్రజలు అధికం. ఉద్యోగాలు, చిన్నపాటి వ్యాపారాలతో వారు ఉపాధి పొందుతుంటారు. రూ.12 లక్షల వార్షిక ఆదాయానికి ఆదాయ పన్ను పూర్తిగా మినహాయిస్తూ ఢిల్లీ పోలింగ్ కేవలం నాలుగు రోజుల ముందు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో మోదీ సర్కారు ప్రకటించడం తెలిసిందే. పన్ను భారం తొలగిపోవడం ఆ ఎంతగానో ఊరటనివ్వడంతో వేతన జీవులు ఓటు రూపంలో బీజేపీ పట్ల కృతజ్ఞత చూపినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్ నుంచి వచ్చి ఢిల్లీలో స్థిరపడిన పూర్వాంచల్ ఓటర్లు మొత్తం ఓటర్లలో ఏకంగా 30 శాతం దాకా ఉంటారు. వారి ప్రగతిపై ప్రత్యేకంగా దృష్టి పెడతామన్న బీజేపీ హామీ ఆకట్టుకుంది. దీనికి తోడు యూపీ, బిహార్‌ల నుంచి పెద్ద సంఖ్యలో జనాన్ని తెచ్చి ఢిల్లీలో ఓటర్లుగా చేరి్పస్తున్నారన్న కేజ్రీవాల్ ఆరోపణలు, వారంతా ఫేక్ ఓటర్లన్న విమర్శలు పూర్వాంచల్ ప్రజలకు ఆగ్రహానికి కారణమయ్యాయి. దాంతో వారంతా బీజేపీకే ఓటేశారు. పదేళ్ల ఆప్ పాలనలో తమకు ఒరిగిందేమీ లేదంటూ ప్రజల్లో నెలకొన్న భావన కూడా కేజ్రీవాల్‌కు ప్రతికూలంగా మారింది. ఆరెస్సెస్ నిశ్శబ్ద ప్రచారం ఢిల్లీ ఎన్నికల్లో రా్ష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) బీజేపీ విజయం కోసం నిశ్శబ్దంగా పని చేసుకుంటూ వెళ్లింది. అవినీతి రహిత, పారదర్శకమైన పాలన కావాలంటే బీజేపీని గెలపించాలని సంఘ్ కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేశారు. వారు ఇంటింటా తిరిగారు. బీజేపీ గెలుపులో సంఘ్ పాత్ర తక్కువేమీ కాదు. చిన్నచిన్న సభలు వందల సంఖ్యలో నిర్వహించారు. ఆప్ ప్రభుత్వ వైఫల్యాలను సమర్థవంతంగా ఎండగట్టారు. ఢిల్లీ మోడల్ అంటూ ఆప్ నేతలు చేస్తున్న ప్రచారంలోని డొల్లతనాన్ని బయటపెట్టారు. ఇక ఆప్ ప్రభుత్వ పెద్దల అవినీతి గురించి ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పగలిగారు. రాజకీయ పార్టీల కంటే ముందే సంఘ్ కార్యకర్తలు ప్రచారం ప్రారంభించారు. మురికివాడలు, అనధికారిక కాలనీల్లోకి వేగంగా చొచ్చుకెళ్లారు. అక్కడి ప్రజలను ఆకట్టుకున్నారు. ప్రచారం చేసి పేరు ప్రతిష్టలు కోరుకోవడం, నిత్యం ప్రసార మాధ్యమాల్లో కనిపించడం సంఘ్ కార్యకర్తలకు ఇష్టం ఉండదు. తెరవెనుక నిశ్శబ్దంగా పని చేయడానికే వారు ఆసక్తి చూపుతారు. 8వ వేతన సంఘంతో లబ్ధి సరిగ్గా ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఎనిమిదో వేతన సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం బీజేపీకి లబ్ధి చేకూర్చింది. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఎనిమిదో వేతన సంఘంతో వారి వేతనాలు పెరుగనున్నాయి. నిజానికి ఉచిత పథకాలకు బీజేపీ బద్ధ వ్యతిరేకి. అయినప్పటికీ ఢిల్లీ ఎన్నికల్లో ఉచిత పథకాలకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఆప్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ యథాతథంగా అమలు చేస్తామని ప్రకటించింది. దాంతో మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ప్రజలు బీజేపీని ఆదరించారు. ఉచిత విద్యుత్, ఉచిత బస్సు వంటి పథకాలు ఎప్పటిలాగే అమలవుతాయి కాబట్టి బీజేపీకి ఓట్లు వేశారు. యమునా నదిని ఎగువన ఉన్న హరియాణా ప్రభుత్వం కలుషితం చేస్తోందంటూ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించడం వివాదాస్పదంగా మారింది. హరియాణా ప్రజలు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని హరియాణా ఓటర్లు కేజ్రీవాల్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
శాస్త్రీయ శక్తి
శాస్త్ర సాంకేతిక రంగాల్లో చాలాకాలం పురుషాధిక్యమే కొనసాగింది. ప్రఖ్యాత శాస్త్రవేత్తల పేర్లు చెప్పమంటే, ఎవరైనా అల్బర్ట్ ఐన్‌స్టీన్, థామస్ ఎడిసన్ వంటి పురుష శాస్త్రవేత్తల పేర్లే చెబుతారు కాని, ఎందరో మహిళా శాస్త్రవేత్తలు తమ తమ ఆవిష్కరణలో శాస్త్ర సాంకేతిక రంగాలను సుసంపన్నం చేసిన సంగతి మీకు తెలుసా? శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఘన విజయాలను సాధించిన మహిళా శాస్త్రవేత్తల ఆవిష్కరణలు ఎందరో యువతులను ఈ రంగాలవైపు ఆకట్టుకుంటున్నాయి, పెద్ద కలలు కనేలా చేస్తున్నాయి. బాలికలు, మహిళలకు విద్యలో, అభిరుచికి తగిన రంగాల్లో సరైన అవకాశాలు అందక వారి శక్తి సామర్థ్యాలు వృథాగా పోతున్నాయి. వారికి తగిన అవకాశాలిచ్చి ప్రోత్సహిస్తే, విభిన్నమైన ఆలోచనలతో నవీన సాంకేతికతలను సృష్టించడానికి, అభివృద్ధి చేయడానికి వీలవుతుందనేది నిపుణుల మాట.ఇందుకోసం విద్యారంగంలో బాలికలకు సమాన అవకాశాలు దక్కేలా చూడాలని; శాస్త్ర, సాంకేతిక, పరిశోధన రంగాల్లో వారి శక్తి సామర్థ్యాలను వెలికితీయాలనే ఉద్దేశంతో ప్రారంభమైన రోజే ఫిబ్రవరి 11 ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ విమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్’.. ఈ సందర్భంగా శాస్త్ర సాంకేతిక రంగాలలో ఆదర్శప్రాయులుగా చెప్పుకునే మహిళా శాస్త్రవేత్తల విజయాలు, వారి గురించిన విశేషాలతో ఈ ప్రత్యేక కథనం..అలా మొదలైంది...ప్రపంచ ప్రఖ్యాత కి నివాళిగా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు, తగిన ప్రోత్సాహం కోసం ‘ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక విభాగం (యునెస్కో)’, ‘మహిళలకు సైన్స్ కావాలి.. సైన్సుకు మహిళలు కావాలి’ అని నినాదం ఇచ్చింది. ఫిబ్రవరి 11వ తేదీని ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ విమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్’గా 2015లో ప్రకటించింది. దశాబ్దాల ఎదురుచూపు తర్వాత శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళలకు ప్రోత్సాహం లభించింది. ఇందుకోసం, ‘యునెస్కో’ ఏటా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇప్పటికీ రేడియేషన్.. నోబెల్ బహుమతి అందుకున్న మొదటి మహిళ మేరీ క్యూరీ. రెండు వేర్వేరు రంగాల్లో నోబెల్ పొందిన ఏకైక శాస్త్రవేత్త ఆమె. రేడియో ధార్మిక మూలకాలైన రేడియం, పోలోనియంలను క్యూరీ గుర్తించారు. ఆమె కనుగొన్న రేడియం పేరు మీదుగానే రేడియేషన్ పదం పుట్టింది. ఈ పరిశోధనకుగాను 1903లో ‘ఫిజిక్స్ నోబెల్’ అందుకున్నారు. తర్వాత కెమిస్ట్రీలో పరిశోధనకు 1911లో ’కెమిస్ట్రీ నోబెల్’ పొందారు. తన పరిశోధనల సమయంలో క్యూరీ ఎంతగా రేడియేషన్‌కు గురయ్యారంటే, ఆమె రాసిన నోటు పుస్తకాల నుంచి ఇప్పటికీ రేడియేషన్ వెలువడుతోంది.నోబెల్ కుటుంబం ప్రపంచంలోనే అత్యధిక నోబెల్ బహుమతులు కూడా మేరీ క్యూరీ కుటుంబం సాధించి చరిత్ర సృష్టించింది. ఆమె భర్త పియరీ క్యూరీ, కుమార్తె ఐరీన్ జోలియట్ క్యూరీ, అల్లుడు ఫ్రెడరిక్ జోలియట్, మేరీ రెండుసార్లు గెలుపొందడంతో మొత్తం కుటుంబం ఐదు నోబెల్ బహుమతులను అందుకుంది.కంప్యూటరుకు భాష నేర్పిందితొలి ఎలక్ట్రానిక్–డిజిటల్ కంప్యూటర్ ‘యూనివాక్’ను రూపొందించిన బృందంలో కీలక పాత్ర పోషించిన అమెరికన్ శాస్త్రవేత్త గ్రేస్ హెూపర్. ‘బైనరీ’ భాషలోకి మార్చే తొలి కంపైలర్ ప్రోగ్రామును ఆమె రూపొందించారు. ‘కోబాల్’ ప్రోగ్రామ్ రూపకల్పనలోనూ ఆమెది కీలకపాత్ర. అణుశక్తిచైనాలో పుట్టి, అమెరికాలో స్థిరపడి అణుశక్తి తయారీకి మార్గం చూపిన శాస్త్రవేత్త చీన్ షుంగ్ వు. అణుబాంబుల తయారీ కోసం ‘మాన్ హట్టన్ ప్రాజెక్టు’లో ఆమె కీలకపాత్ర పోషించారు. రసాయనిక ప్రక్రియల ద్వారా యురేనియం ఉత్పత్తి చేసే విధానాన్ని తొలిసారి ఆమె కనుగొన్నారు.తెలివైన సీతాకోక చిలుకమరియా సిబిల్లా కీటక శాస్త్రవేత్త. గొంగళి పురుగులు రూపాంతరం చెంది సీతాకోక చిలుకలుగా మారుతాయని నిరూపించింది. అంతేకాదు, కుళ్లిన పదార్థాలు వివిధ రకమైన పురుగులు, కీటకాలను ఉత్పత్తి చేస్తాయని కనుగొన్నది కూడా తనే! ఇలా కీటకాలపై తను చేసిన పరిశోధనలు ఎన్నో విషయాలను ప్రపంచానికి నేర్పించాయి.కోపిష్టి దేవుళ్లు కాదు వాంగ్ జెనీ ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త. అమ్మాయిలను సైన్స్ చదవడానికి అనుమతించని కాలంలోనే జెనీ, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల గురించి తెలుసుకోవడానికి ఇష్టపడింది. అప్పటి వరకు చంద్రగ్రహణాన్ని కోపిష్టి దేవుడిగా భావించడాన్ని తను నమ్మలేదు. అందుకే, తాళ్లతో ఒక భూగోళం, అద్దం, దీపాన్ని పట్టుకొని, చంద్రుడు భూమి నీడలో అదృశ్యమవుతాడని నిరూపించింది. అదే ఎంతోమంది శాస్త్రవేత్తలు, సూర్య, చంద్రగ్రహణాలపై అధ్యయనాలు చేసేలా చేసింది.వైద్యరంగానికి చికిత్స అమెరికాలో వైద్య పట్టా సంపాదించిన మొదటి మహిళ ఎలిజబెత్ బ్లాక్వెల్. డాక్టర్‌గా వైద్యరంగంలో విశేషమైన కృషి చేసింది. ఒక ప్రమాదంలో తన కంటిచూపు కోల్పోయి, సర్జన్‌ను కావాలనే తన కలను వదులుకుంది. కాని, ఆశయాన్ని కాదు. తర్వాత ఒక వైద్య కళాశాల ప్రారంభించి, ఎంతోమంది బాలికలు వైద్యులుగా మారడానికి సహాయం చేసింది.జంపింగ్ జీన్స్వారసత్వ నిర్ధారణ కోసం చేసే డీఎన్ఏ పరీక్షకు మూలమైన జన్యువులను కనుగొన్న శాస్త్రవేత్త బార్బరా మెక్‌క్లింటాక్. జన్యువుల్లో ఉత్పరివర్తనలకు, డీఎన్ఏ పరిమాణంలో మార్పులకు కారణమయ్యే ‘జంపింగ్ జీన్స్’ను కనుగొన్నందుకు వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి గెలుచుకున్నారు. సైన్స్ టీచర్ స్కూల్సైన్స్ టీచర్‌గా సాలీ రైడ్– ఎందరో బాలికలను సైన్స్ దిశగా ప్రోత్సాహించారు. తర్వాత వ్యోమగామిగా మారి, అంతరిక్షంలోకి ప్రయాణించిన మొదటి అమెరికన్ మహిళగా చరిత్ర సృష్టించారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఆమె బోధించిన ఉపగ్రహాల సిద్ధాంతాలను తర్వాతి కాలంలో చేపట్టిన అంతరిక్ష పరిశోధనల్లో ఉపయోగించారు. సాలీ ముఖ్యంగా బాలికలు అంతరిక్ష శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి దోహదపడే కార్యక్రమాలను రూపొందించారు.డైనోసార్ మేడంశిలాజ శాస్త్రవేత్త మేరీ అన్నింగ్. ఇంగ్లాండ్ సముద్రతీరంలో కొండలను అన్వేషించి, ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తి ప్లెసియోసారస్ అస్థిపంజరం ‘డగ్ ది డైనోసార్’ను కనుగొన్నారు. డైనోసార్ల గురించి మరింత తెలుసుకోవడానికి ఇది ఇతర శాస్త్రవేత్తలకు చాలా ఉపయోగపడింది.మరెందరో..సూర్యుడు సహా విశ్వంలోని నక్షత్రాలన్నీ ఎక్కువభాగం హైడ్రోజన్, హీలియంతోనే నిండి ఉన్నాయని తొలిసారిగా వెల్లడించిన అంతరిక్ష శాస్త్రవేత్త సెసిలియా పేన్ గాపోష్కిన్. అమెరికన్ అంతరిక్ష సంస్థ ‘నాసా’ కంప్యూటర్లను వినియోగించడానికి ముందు అంతరిక్ష ప్రయోగాల సమయాన్ని, కచ్చితంగా గణించి చెప్పిన ’హ్యూమన్ కంప్యూటర్’ కేథరిన్ జాన్సన్.. ఇన్సులిన్, పెన్సిలిన్, విటమిన్ బీ12 వంటి జీవరసాయనాల అణు నిర్మాణాన్ని ఎక్స్–రే క్రిస్టలోగ్రఫీ సాయంతో గుర్తించే విధానాన్ని రూపొందించిన శాస్త్రవేత్త డొరోతీ హాడ్కిన్.. ఇలా మరెందరో మహిళా శాస్త్రవేత్తలు..భారతీయుల్లోనూ..అమ్మాయిలను ఇంటి గడప కూడా దాటనివ్వని రోజుల్లోనే చాలామంది మహిళలు ఈ రంగంలో ఎన్నో విజయాలను సాధించారు. అలా ఒకసారి వెనక్కి వెళితే, పాశ్చాత్య వైద్యవిద్యను అభ్యసించిన తొలి భారతీయ మహిళ ఆనందీ బాయి, 1883లో ‘భారతదేశంలోనే వైద్యశాస్త్రంలో తొలి పట్టభద్రురాలిగా కాదంబినీ గంగూలీ చరిత్ర సృష్టించారు. రాయల్ సొసైటీకి ఎంపికైన తొలి మహిళగా గగన్ దీప్ ఎంతోమంది యువతులకు స్ఫూర్తినిచ్చారు.అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించిన కల్పనా చావ్లా; ఇటీవలి కాలంలో కోవిడ్ వైరస్ ధాటిని ముందే గుర్తించి హెచ్చరించిన భారత శాస్త్రవేత్త, డబ్ల్యూహెచ్‌వో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్యా స్వామినాథన్; మొక్కల కణాల్లో శక్తి ఉత్పాదనకు కీలకమైన ‘సైటోక్రోమ్ సీ’ అనే ఎంజైమును గుర్తించిన కమలా సొహెూనీ; క్యాన్సర్‌ను నిరోధించే ‘వింకా ఆల్కలాయిడ్స్’, మలేరియా చికిత్స కోసం వాడే ఔషధాలపై పరిశోధన చేసిన రసాయన శాస్త్రవేత్త అసీమా ఛటర్జీ; మైక్రోవేవ్ పరికరాలపై పరిశోధన చేసి, మన దేశంలో తొలి మైక్రోవేవ్ రీసెర్చ్ ల్యాబ్ నెలకొల్పిన శాస్త్రవేత్త రాజేశ్వరీ ఛటర్జీ; పుణె వైరాలజీ ల్యాబ్‌లో కోవిడ్ వైరస్‌ను వేరు చేసి, ‘కోవాక్సిన్’ రూపకల్పనకు మార్గం వేసిన ల్యాబ్ డైరెక్టర్ ప్రియా అబ్రహాం; అగ్ని–4, 5 క్షిపణుల రూపకల్పన ప్రాజెక్టుకు నాయకత్వం వహించిన శాస్త్రవేత్త టెస్సీ థామస్.. ఇలా ఎందరో మహిళా శాస్త్రవేత్తలు ఈ రంగంలో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.రోజువారీ ఆవిష్కరణలు..1 పేపర్ బ్యాగ్ యంత్రం మార్గరెట్ ఎలోయిస్ నైట్పర్యావరణ రక్షణలో భాగంగా ఉపయోగించే పేపర్ బ్యాగులను ఉత్పత్తి చేసే యంత్రాన్ని రూపొందించింది శాస్త్రవేత్త మార్గరెట్ ఎలోయిస్ నైట్ 1870లో ఈస్టర్న్ పేపర్ బ్యాగ్ కంపెనీని స్థాపించి, ఎంతోమంది మహిళలకు ఉపాధి కల్పించారు.2 కాఫీ ఫిల్టర్ మెలిట్టా బెండ్జ్ఉదయాన్నే లేచి కాఫీ తాగితే వచ్చే ఆనందం కంటే, చివర్లో మిగిలిన పొడితో కాఫీ తాగడం ఇబ్బందికరమే! మొదటిసారి పలుచటి కాగితంతో మెలిట్టా బెండ్జ్ కాఫీ ఫిల్టర్‌ను తయారుచేశారు. ఇది మరెన్నో కాఫీ ఫిల్టర్స్ తయారీకి ఆధారంగా నిలిచింది.3 విండ్ షీల్డ్ వైపర్స్ మేరీ ఆండర్సన్దుమ్ము, ధూళి, మంచు, నీరు, ఇతర పదార్థాలను వెంటనే తొలగించి, ప్రయాణం సాఫీగా సాగించే విండ్ షీల్డ్ వైపర్స్‌ను 1903లో, మేరీ ఆండర్సన్ రూపొందించారు.4 జీపీఎస్ గ్లాడిస్ వెస్ట్తెలియని ప్రాంతాలకు వెళ్లాలన్నా, వాటి గురించి తెలుసుకోవాలన్నా ఉపయోగపడే జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) ప్రోగ్రామింగ్ రూపకల్పనలో గ్లాడిస్ వెస్ట్ కీలక పాత్ర పోషించారు.5 గ్యాస్ హీటర్ అలిస్ ఎ పార్కర్శీతకాలంలో ఇంట్లో వెచ్చదనాన్ని అందించే గ్యాస్ హీటర్‌ను అలిస్ ఏ పార్కర్ రూపొందించారు. ఈ గ్యాస్ హీటర్ మరెన్నో ఎలక్ట్రికల్ హీటర్స్కు స్ఫూర్తినిచ్చింది.6 డిష్ వాషింగ్ మెషిన్ జోసెఫిన్ కోక్రాన్వంట సామాన్లను శుభ్రం చేసే, మొదటి డిష్ వాషింగ్ మెషిన్‌ను 1839లో జోసెఫిన్ కోక్రాన్ రూపొందించారు.7 వీఐఓపీ టెక్నాలజీ (వీడియో కాల్స్) మెరియన్ క్రోక్ప్రస్తుతం వీడియో కాల్స్ మాట్లాడుకోగలుగుతున్నామంటే కారణం మెరియన్ క్రోక్ .. వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో కృషి చేశారు.8 ఫ్రీక్వెన్సీ హోపింగ్ హెడీ లామర్హెడీ లామర్ గొప్ప ఆమెరికన్ నటి మాత్రమే కాదు, ఫ్రీక్వెన్సీ హోపింగ్ టెక్నాలజీని 1941లో కనుగొన్నారు. ఈ టెక్నాలజీనీ వైఫై, బ్లూటూత్‌లలో ఉపయోగిస్తున్నారు.మీకు తెలుసా?(యునెస్కో గణాంకాల ప్రకారం.. )⇒ ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలలో మహిళల శాతం 33.3%⇒ మహిళా శాస్త్రవేత్తలకు సమాన అవకాశాలిస్తున్న దేశాలు 30⇒ ‘స్టెమ్’ విభాగాల్లోని విద్యార్థుల్లో మహిళలు 35%⇒ ఇప్పటివరకు నోబెల్ పొందిన మహిళలు 22⇒ జాతీయ సైన్స్ అకాడమీలలో మహిళల శాతం 12%⇒ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అత్యాధునిక రంగాలలో మహిళల శాతం 22%సైన్స్‌లో లింగ వివక్ష మహిళలను అభివృద్ధినే కాకుండా, దేశ అభివృద్ధిని కూడా నిరోధిస్తుంది. మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉండటానికి గల కారణాలలో లింగ వివక్ష, సామాజిక ఒత్తిడి, ఆర్థిక పరిమితులు, పరిశోధనలకు నిధుల కొరత. గుర్తింపులో అసమానతలు వంటి సమస్యలను మహిళా శాస్త్రవేత్తలు ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నారు. పురుషులతో పోల్చుకుంటే మహిళా శాస్త్రవేత్తలు చేపట్టే పరిశోధనలకు నామమాత్రంగా నిధులు మంజూరవుతుంటాయి.ఇలాంటి పరిస్థితుల్లోనూ శాస్త్ర సాంకేతిక పరిశోధకుల మొత్తం సంఖ్యలో మహిళలు 33.3% ప్రాతినిధ్యం వహిస్తుండటం విశేషం. అయితే, శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందుతున్న వేగంగా, ఈ రంగాల్లో మహిళలకు లభించాల్సిన ప్రోత్సాహంలో వేగం కనిపించడం లేదు. అందుకే, శాస్త్ర సాంకేతిక రంగాలలో మహిళలకు, బాలికలకు సమాన అవకాశాలను కల్పించి, లింగ వివక్షను, వ్యత్యాసాన్ని తగ్గించే దిశగా చర్యలు తీసుకోవడం ఎంతైనా అవసరం. -
బందరు బ్యాంక్ @ 219 ఏళ్లు
సాక్షి, మచిలీపట్నం: ఒకవైపు సముద్రతీరం మరోవైపు కృష్ణమ్మ ఒడి.. ఒడ్డున వెలిసిన ప్రాచీన పట్టణం మచిలీపట్నం. ఇక్కడ ఏర్పాటు చేసిన బ్యాంక్ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని పొందింది.ఈ బ్యాంక్ ఏకంగా 218 వసంతాలు పూర్తి చేసుకొని 219వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. బ్రిటీష్ పాలనలో ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలు చెల్లించేందుకు ఏర్పాటు చేసిన ఈ బ్యాంక్ నేడు సామాన్య ప్రజలకు వివిధ రకాల సేవలందిస్తోంది.అప్పట్లో ఇది బ్యాంక్ ఆఫ్ మద్రాస్‌గా ఆవిర్భవించి.. అనంతరం ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారింది. గుంటూరు బ్యాంక్‌కు సబ్ బ్రాంచ్‌గా ఉన్న ఈ బ్యాంక్ 1908లో ప్రత్యేక బ్రాంచ్‌గా ఆవిర్భవించింది. జనవరి 1వ తేదీతో ప్రత్యేక బ్రాంచ్ ఏర్పడి 117 ఏళ్లు పూర్తయ్యాయి. బ్రిటిష్ కాలంలో ఓ వెలుగు వెలిగిన పట్టణం బ్రిటీష్‌వారు తమ పాలనకు ఎంతో అనువైన పట్టణంగా మచిలీపటా్నన్ని గుర్తించి తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ రోజుల్లో మచిలీపట్నం దేశంలో మూడో మున్సిపాలిటీగా గుర్తింపు పొందింది. ఇక్కడి నుంచి ఎందరో స్వాతంత్య్రం కోసం సాగిన పోరులో పాల్గొనడంతో పాటు రాజకీయ, సినీ, సామాజిక రంగాల్లో రాణించారు. మచిలీపట్నంలోని లక్ష్మీ టాకీస్ సెంటర్లో ఉన్న స్టేట్ బ్యాంక్‌కు ఎంతో చరిత్ర ఉంది. రిటైర్డ్ ఉద్యోగులు, చరిత్రకారుల వివరాల మేరకు.. 1806లో దీన్ని బ్యాంక్ ఆఫ్ మద్రాస్‌గా 14 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేశారు. దీనికి అనుబంధంగా ఉద్యోగులు శిక్షణ కేంద్రం కూడా నెలకొల్పారు. 1905 నుంచి గుంటూరు బ్యాంక్‌కు అనుబంధంగా సబ్ బ్రాంచ్‌గా నిర్వహించి, 1908 జనవరి 1 నుంచి ప్రత్యేక బ్రాంచ్‌గా ఏర్పాటు చేశారు.1923లో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ఏర్పడి, 1955 జూన్ 30 వరకు సేవలందించింది. అదే ఏట జూలై 1 నుంచి ఆర్బీఐలో విలీనమై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారింది. మచిలీపట్నం పేరు ఆర్బీఐలో మసులీపట్నంగా నమోదు కాగా నేటికీ అదే పేరు ఉంది. ఉద్యోగులు, పెన్షనర్ల కోసం.. బ్రిటిష్ కాలంలో ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ఇక్కడ బ్యాంక్ ఏర్పాటు చేశారు. నాడు పదిమంది లోపు మాత్రమే ఉద్యోగులు ఉండేవారు. 1955లో స్టేట్ బ్యాంక్‌గా ఏర్పడిన తరువాత ఉద్యోగుల సంఖ్య 20కి చేరింది. అప్పట్లో బ్యాంకింగ్ సేవలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే ఉండేవి. ఆ రోజుల్లో వందల్లోనే ఖాతాదారులు, పదుల్లో లావాదేవీలు జరిగేవి. నేడు 50 వేలకు పైగా ఖాతాదారులు ఉండగా రోజూ వెయ్యికి పైగా లావాదేవీలు జరుగుతున్నాయి. 1905లో ఏర్పాటు చేసిన బ్యాంక్ ఆంగ్లేయులకు అన్ని విధాలా ఉపయోగపడింది. రెండో ప్రపంచయుద్ధం (1913–1945) సమయంలో ఆంగ్లేయులు పెద్ద మొత్తంలో డబ్బు, బంగారం ఈ బ్యాంక్‌లో భద్రపరచినట్లు పెద్దలు చెబుతున్నారు. -
అతి పే.....ద్ద రేడియో జెట్
ఇదేమిటో తెలుసా? ఇప్పటిదాకా మనిషి కంటికి చిక్కిన అతి పెద్ద రేడియో జెట్. కాంతివేగంతో దూసుకెళ్లే ఎలక్ట్రో మ్యాగ్నటిక్ రేడియేషన్, అంతరిక్ష ధూళితో కూడిన ప్రవాహాలు. క్వాజార్గా పిలిచే కృష్ణబిలాల సమూహాలు నుంచి ఇవి పుట్టుకొస్తుంటాయి. వీటి ఉనికి ఇంత స్పష్టంగా చిక్కడం ఇదే తొలిసారి. ఈ రేడియో జెట్ ఏకంగా 2 లక్షల కాంతి సంవత్సరాల పొడవున పరుచుకుని ఉన్నట్టు తేలడం సైంటిస్టులనే విస్మయపరుస్తోంది. అంటే పాతపుంత కంటే రెట్టింపు పరిమాణంలో ఉంది! డర్హాంకు చెందిన పరిశోధకుల బృందం ఇంటర్నేషనల్ లో ఫ్రీక్వెన్సీ అర్రే (లోఫర్) టెలిస్కోప్ ద్వారా దీన్ని ఉనికిని కనిపెట్టింది. ఇది విశ్వం ఆవిర్భవించిన తొలినాళ్లలో ఏర్పడ్డ జే1601+3102 అనే క్వాజార్ నుంచి పుట్టుకొచ్చిన రేడియో జెట్ అని నిర్ధారణయింది. దీని పుట్టుకకు కారణమైన కృష్ణబిలం పరిమాణంలో మరీ పెద్దదేమీ కాకపోవడం సైంటిస్టులను మరింత ఆశ్చ ర్యపరుస్తోంది. అతి భారీ కృష్ణబిలాలు మా త్రమే భారీ రేడియో జెట్లకు జన్మనిస్తాయని భావించేవారు. దీనిద్వారా అతి భారీ కృష్ణబిలాల ఆవిర్భావంపై కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
హైరిస్క్ జోన్లో వందేభారత్!
కుదుపులు లేని వేగవంతమైన ప్రయాణం, ఆధునిక కప్లింగ్ సిస్టం వల్ల కోచ్‌ల మధ్య సమన్వయం, ‘కవచ్’(Kavach)ఏర్పాటుతో ప్రమాదాలకు అతి తక్కువ ఆస్కారం.. వందేభారత్ రైళ్ల(Vande Bharat) గురించి రైల్వే శాఖ చెప్పే విశేషాలివి. నిజానికి ఈ రైళ్లు హై రిస్క్ జోన్లో పరుగు పెడుతున్నాయి. ఒక్క ప్రాంతంలో తప్ప మరెక్కడా రైలు ప్రమాదాలు నివారించే కవచ్ వ్యవస్థ ఈ రైళ్లలో లేదు. ఢిల్లీ–ఆగ్రా, మధుర–పల్వాల్ సెక్షన్ల మధ్య 86 కి.మీ. నిడివిలో మాత్రమే వందేభారత్ రైళ్లు సురక్షితంగా ప్రయాణిస్తాయి.మిగతా ప్రాంతాల్లో సాధారణ రైళ్లకు ఉన్న ప్రమాద భయం వీటినీ వెంటాడుతోంది. గంటకు 50 – 70 కి.మీ. సగటు వేగంతో ప్రయాణించే సాధారణ రైళ్లు నిరంతరం ‘రిస్క్’లో ఉంటే.. 100 కి.మీ. సగటు వేగం (గరిష్టం 130 కి.మీ.)తో దూసుకెళ్లే వందేభారత్ రైళ్లు హై రిస్కులో ఉన్నాయని స్పష్టమవుతోంది. తెలంగాణ మీదుగా నడుస్తున్న ఐదు వందేభారత్ రైళ్లు ప్రమాదకరంగానే పరుగు పెడుతున్నాయి. పట్టాలపై రైళ్ల అధిక సాంద్రత, సిగ్నలింగ్ వ్యవస్థను ఆధునీకరించకపోవటం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయి. – సాక్షి, హైదరాబాద్ఆ పరికరం నిరుపయోగమే.. ప్రస్తుతం వందేభారత్ రైళ్లలో కవచ్ యంత్రాలను ఏర్పాటు చేస్తున్నారు. లోకో పైలట్ నిర్లక్ష్యంగా ఉన్నా, తప్పుడు సిగ్నల్‌తో వేరే రైళ్లకు చేరువగా దూసుకెళ్లినా రైలు తనంతట తానుగా బ్రేక్ వేసుకుంటుందనే భావన చాలా మందిలో ఉంది. కానీ, రైళ్ల లోకోమోటివ్‌లలో మాత్రమే కవచ్ యంత్రం ఉంటే నిరుపయోగమే. కవచ్ వ్యవస్థ పనిచేయాలంటే, రైలు ఇంజిన్లలో కవచ్ పరికరం ఉండటంతో పాటు, ప్రతి స్టేషన్లో కవచ్ వ్యవస్థ ఉండాలి.అక్కడి ట్రాక్ వెంట ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్స్ ఏర్పాటు చేయాలి. ట్రాక్ వెంట ఆప్టిక్ ఫైబర్ కేబుల్ ఉండాలి. వీటిని అనుసంధానిస్తూ ఆ మార్గంలో నిర్ధారిత నిడివిలో టెలికం టవర్లు ఏర్పాటు చేయాలి. ఇవన్నీ అనుసంధానమై పనిచేసినప్పుడే రైళ్లు వాటంతట అవి ప్రమాదాన్ని నివారించుకోగలవు. లోకో పైలట్లను కవచ్ వ్యవస్థ అప్రమత్తం చేస్తుంది. మిగతావి ఏవీ లేకుండా కేవలం ఇంజిన్లలో కవచ్ పరికరంతో పరుగుపెట్టే వందేభారత్‌లు ప్రమాదాన్ని నివారించుకోలేవని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. ఒకే మార్గంలో.. ఢిల్లీ–ఆగ్రా మధ్య దేశంలోనే అత్యంత వేగవంతమైన రైలు గతిమాన్ ఎక్స్‌ప్రెస్ పరుగు పెడుతోంది. దీని వేగం గంటకు 160 కి.మీ.. ఈ వేగాన్ని సాధారణ ట్రాక్ తట్టుకోలేదన్న ఉద్దేశంతో ఆ మార్గంలో 125 కి.మీ. ప్రత్యేక ట్రాక్ నిర్మించారు. అదే మార్గంలోని మధుర–పల్వాల్ సెక్షన్ల మధ్య 86 కి.మీ. మేర పూర్తిస్థాయి కవచ్ వ్యవస్థ ఏర్పాటైంది. ఆ మార్గంలో మాత్రమే రైళ్లు కవచ్ రక్షణతో ఉన్నట్టు. ఆ మార్గంలో ఒకే ఒక వందేభారత్ రైలు నడుస్తోంది.దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని లింగంపల్లి–వికారాబాద్–వాడీ సెక్షన్ల మధ్య 245 కి.మీ. మేర కవచ్ ఏర్పాటైంది. కానీ ఆ మార్గంలో వందేభారత్ రైలు తిరగటం లేదు. మన్మాడ్–ముధ్ఖేడ్–డోన్ మధ్య 959 కి.మీ... బీదర్–పర్బణి మధ్య 241 కి.మీ. మేర కవచ్ వ్యవస్థ ఏర్పాటైంది. నార్తర్న్ రైల్వే పరిధిలో కూడా కొంతమేర ఉంది. మొత్తంగా 1,548 రూట్ కి.మీ. మేర మాత్రమే ఇది ఏర్పడింది. మరో 3 వేల కి.మీ.లో పనులు జరుగుతున్నాయి. ప్రభుత్వం వందేభారత్ రైళ్లను పెంచటంపై ప్రదర్శిస్తున్న వేగం.. కవచ్ వ్యవస్థ ఏర్పాటులో చూపటం లేదు. -
‘గోల్డెన్’ హీరోనా రాబరీ విలనా?
సినిమాల్లో, కథల్లో రాజుల కాలం నాటి గుప్త నిధుల కోసం అన్వేషిస్తుంటారు. ఎన్నో కష్టాలు అనుభవించి నిధిని కనుగొంటారు. ఆ సంపదతో గొప్పవాళ్లుగా మారిపోతుంటారు. ఇదీ అలాంటిదే. కానీ నిజంగా జరిగిన కథ. సముద్రంలో టన్నులకొద్దీ బంగారంతో మునిగిపోయిన ఓడను కనిపెట్టినా.. జైలులో మగ్గుతున్న ఓ ఆధునిక ‘ట్రెజర్ హంటర్’వ్యథ. చివరికి ఓ న్యాయమూర్తి తీర్పుతో త్వరలో విడుదల కాబోతున్న బంగారం నిధి వేటగాడు, శాస్త్రవేత్త ‘టామీ గ్రగరీ థాంప్సన్’గాథ. – సాక్షి సెంట్రల్ డెస్క్ ఓ నిధి వేటగాడి నిజమైన కథ..అది 1857వ సంవత్సరం.. సుమారు 21 టన్నుల బంగారం తీసుకుని ఎస్ఎస్ సెంట్రల్ అమెరికా అనే ఓడ అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి న్యూయార్క్‌కు బయలుదేరింది. ఒక్కసారిగా విరుచుకుపడ్డ తుఫానుతో సముద్రం మధ్యలోనే ఓడ మునిగిపోయింది. ‘షిప్ ఆఫ్ గోల్డ్’గా పేరుపొందిన ఆ ఓడ, దానిలోని బంగారం కోసం ఎందరో అన్వేషిoచినా జాడ దొరకలేదు. అలా బంగారం వేటకు దిగినవారిలో శాస్త్రవేత్త టామీ గ్రెగరీ థాంప్సన్ నేతృత్వంలోని బృందం ఒకటి. అప్పటికే కొన్నేళ్లుగా పరిశోధన చేస్తున్న థాంప్సన్.. 1988లో సోనార్ సాయంతో సముద్రం అడుగున జల్లెడ పడుతుండగా ‘షిప్ ఆఫ్ గోల్డ్’జాడ పట్టేసుకున్నాడు. బంగారం కరిగించి నాణాలుగా మార్చి..అమెరికాలోని కొందరు ధనికులు థాంప్సన్ పరిశోధనకు స్పాన్సర్ చేశారు. నిధి దొరికితే ఎవరి వాటా ఎంతెంత అని ముందే ఓ మాట అనుకున్నారు. 1988లో ఓడ జాడ దొరికినా.. బంగారం నిధిని రూఢీ చేసుకుని, వెలికి తీయడానికి కొన్నేళ్లు పట్టింది. బయటికి తీసిన బంగారాన్ని కరిగించి నాణాలుగా మార్చారు. అలా మార్చిన బంగారు నాణాల్లో 500 నాణాలు మాయమయ్యాయి. అది చేసినది థాంప్సన్. వాటిని ఏం చేశాడు? తీసుకెళ్లి.. రెండు అమెరికా ఖండాల మధ్య ఉండే ‘బెలిజ్’అనే చిన్న దేశంలో ఓ ట్రస్టుకు దానమిచ్చాడు. అంతే అంతకన్నా ఒక్కముక్క కూడా బయటపెట్టలేదు. పదేళ్లుగా జైల్లోనే.. త్వరలోనే విడుదల.. అధికారులు 2015లో థాంప్సన్‌ను జైల్లో పెట్టారు. నాణాల జాడ చెప్పనంత కాలం.. రోజుకు వెయ్యి డాలర్లు (సుమారు రూ.87 వేలు) జరిమానా చెల్లించాలని ఆదేశించారు. సుమారు పదేళ్లుగా థాంప్సన్ జైల్లోనే ఉన్నారు. ఆయన చెల్లించాల్సిన జరిమానా.. 33,35,000 డాలర్లకు (మన కరెన్సీలో రూ.29 కోట్లకు) చేరింది. ఆయన మాయం చేసిన బంగారు కాయిన్ల విలువ 2.5 మిలియన్ డాలర్లు (మన కరెన్సీలో రూ.22 కోట్లు)గా అంచనా వేశారు. థాంప్సన్ పదేళ్లుగా జైల్లోనే ఉన్నారు. వయసు ఇప్పుడు 72 ఏళ్లు. ఆయన మాయం చేసిన బంగారం విలువ కంటే.. చెల్లించాలన్న జరిమానానే చాలా ఎక్కువైపోయింది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్న ఓ న్యాయమూర్తి థాంప్సన్‌ను విడుదల చేయాలని తాజాగా తీర్పు ఇచ్చారు. కానీ తన పరిశోధనకు స్పాన్సర్ చేసిన ధనికులు పెట్టిన ఓ క్రిమినల్ కేసులో థాంప్సన్ రెండేళ్ల జైలుశిక్ష అనుభవించాల్సి ఉంది. ఆ తర్వాతే బయటికొస్తాడన్నమాట. ఆ బంగారం ఎవరికి ఇచ్చినదీ ఇప్పటికీ థాంప్సన్ బయటపెట్టలేదు. ట్రస్టు ద్వారా పేదలకు సాయం కోసం ఇచ్చిన ‘గోల్డెన్’ హీరోనా? సొమ్ము దోచేసుకున్న విలనా? -
కళంకారి వెలుగు దారి
కలంకారి అనే మాట ఎంతో సుపరిచితం. అయితే ఈ సుప్రసిద్ధ కళ చరిత్ర చాలామందికి అపరిచితం. ఆ ఘనచరిత్రను ఈ తరానికి పరిచయం చేయడానికి, కలంకారీని మరింత వైభవంగా వెలిగించడానికి పూనుకుంది లీలావతి. కలంకారి అద్దకపు పనికి బోలెడంత ఓపిక కావాలి అంటారు. పరిశోధకులకు కూడా అంతే ఓపిక కావాలి. పెద్ద వస్తువు నుంచి చిన్నవాక్యం వరకు ఎన్నో ఎన్నెన్నో పరిశోధనకు ఇరుసుగా పనిచేస్తాయి. ఈ ఎరుకతో కలంకారిపై లోతైన పరిశోధన చేసిన లీలావతి.. ఆ కళపై పీహెచ్డీ పట్టా పొందిన తొలి మహిళగా ప్రశంసలు అందుకుంటోంది..కలంకారి అంటే గుర్తుకు వచ్చేది పెడన. కృష్ణాజిల్లా పెడన పట్టణంలో కలంకారి వస్త్రాలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. 2,500 సంవత్సరాల క్రితమే ప్రారంభమైన ఈ కళపై చరిత్ర అధ్యాపకురాలు గుడివాడకు చెందిన పామర్తి లీలావతి పరిశోధన చేసింది. ఈ పరిశోధనకు ఆచార్య నాగార్జున యూనివర్శిటీ నుంచి ఇటీవల పీహెచ్డీ పట్టా అందుకుంది. కలంకారిపై తొలిసారిగా పరిశోధన చేసి పీహెచ్డీ పట్టా పొందిన మహిళగా ప్రశంసలు అందుకుంటోంది.పెడనలోని బొడ్డు నాగయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చరిత్ర అధ్యాపకురాలిగా విధుల్లో చేరిన లీలావతికి సహజంగానే అక్కడి వాతావరణం వల్ల కలంకారి కళపై ఆసక్తి పెరిగింది. కళాశాలకు వెళ్లే సమయంలో కలంకారి వస్త్రాలపై ముద్రణ నుంచి కలంకారి కళాకారుల జీవన శైలి వరకు ఎన్నో విషయాలు గమనించేది. నాగార్జున యూనివర్శిటీలో కలంకారి పరిశ్రమలపైన, ఆయా కుటుంబాల సామాజిక పరిస్థితులపై ఒకసారి పరిశోధన ప్రసంగం చేసింది.ఆ ప్రసంగానికి మంచి స్పందన లభించింది. ఆ సమయంలోనే ‘కలంకారి కళ’పై పీహెచ్డీ చేయాలనే ఆలోచన వచ్చింది. నాగార్జున విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ స్టూడెంట్‌గా ప్రవేశం పొందింది. ‘కలంకారి కళకు సుదీర్ఘ చరిత్ర ఉంది. దేశవిదేశాల్లో గుర్తింపు ఉన్న కలంకారిపై ఇప్పటి వరకు ఎవరూ పరిశోధన చేయక పోవడంతో నేనే ఎందుకు చేయకూడదని నిర్ణయించుకుని ఆ దిశగా అడుగులు వేశాను’ అంటుంది లీలావతి. విజయవాడలోని పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చరిత్ర అధ్యాపకురాలిగా పనిచేస్తున్న లీలావతి కలంకారిపై మరిన్ని పరిశోధనలు చేయాలని ఆశిద్దాం. ఎన్నో దారులలో...కలంకారిపై పరిశోధనలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టా పొందడం సంతోషంగా ఉంది. కలంకారి పరిశ్రమ చరిత్ర, సంస్కృతి, దేశ విదేశాల్లో ఉన్నప్రాధాన్యం, ఆదరణ, కార్మికుల జీవన స్థితిగతులపై నా పరిశోధనలో సమగ్రంగా తెలుసుకున్నాను. పరిశోధనలో ఉన్న విశేషం ఏమిటంటే ఒక దారి అనేక దారులకు దారి చూపుతుంది. ఇలా కలంకారి గురించి అనేక కోణాలలో అనేక విషయాలు తెలుసుకోగలిగాను.– పామర్తి లీలావతి– నారగాని గంగాధర్ సాక్షి, పెడన -
రాయల నాటి రాజసానికి చిహ్నం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: చట్టూరా ప్రకృతి సోయగాలు.. కనువిందు చేసే జలపాతాలు, ప్రాచీన పుణ్యక్షేత్రాలు, కళ్లు తిప్పుకోనివ్వని శిల్పాలతో నిర్మాణాలు, తిరుమల గిరులను పోలిన ఎత్తయిన పర్వత శ్రేణులు.. అడుగడుగున కనిపించే అలనాటి రాచ మందిరాలు.. ఒకటేమిటి ఎన్నో విశిష్టతలతో నిండిన ఉదయగిరి ప్రాంతం పర్యాటక శోభకోసం ఎదురుచూస్తోంది. గత ప్రభుత్వంలో సిద్దేశ్వరం, దుర్గంపల్లి ప్రాంతాలను అటవీశాఖ ఎకో టూరిజం స్పాట్స్‌గా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు పంపింది .. ఈ లోపే ప్రభుత్వం మారడంతో ఆ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉదయగిరి దుర్గానికి ఎంతో చారిత్రక ప్రాముఖ్యత ఉంది. చోళులు, పల్లవులు, రెడ్డి రాజులు, గజపతులు, విజయనగర రాజులు, గోల్కోండ నవాబులు ఏలిన ఈ ప్రాంతం ఒకప్పుడు వైభవోపేతంగా విలసిల్లింది. కాలక్రమేణా తన ప్రాభవాన్ని పూర్తిగా కోల్పోయింది. ప్రస్తుతం అలనాటి రాచరిక పాలనకు గుర్తులుగా కనిపించే మొండి గోడలు, శిథిల రాజభవనాలు ఇక్కడ దర్శనమిస్తున్నాయి. జిల్లా కేంద్రానికి వందకిలోమీటర్ల దూరంలో, నీటి వసతిలేని మెట్ట ప్రాంతంగా ఉదయగిరి అభివృద్ధికి దూరంగా ఉండిపోయింది. తొలి సూర్యకిరణాల పడే గిరి.. ఉదయగిరి కోట సముద్ర మట్టానికి 755 అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడ ఉష్ణోగ్రత గరిష్టంగా 20 డిగ్రీలు మాత్రమే ఉంటుంది. ఉదయగిరి కోట 5 కి.మీ వ్యాసార్ధంతో తిరుమల కొండను పోలి ఉంది. పచ్చని పచ్చిక బయళ్లతో, వన్యప్రాణులతో ఇక్కడ ప్రకృతి సౌందర్యం విరాజిల్లుతూ ఉంటుంది. ఉదయ సూర్యుని తొలికిరణాలు ఈ కొండపైనే ముందుగా పడుతుండటంతో దీన్ని ఉదయగిరిగా విజయనగరం రాజలు పేరుపెట్టారు. ఈ ఉదయగిరి కోటలో శ్రీకృష్ణదేవరాయలు 18 నెలలు ఉండి పాలన సాగించారు.చారిత్రక కట్టడాలకు ప్రసిద్ధి విజయనగర రాజులు ఉదయగిరి ప్రాంతంలో దేవాలయాలు, కోనేరులు నిరి్మంచారు. శ్రీకృష్ణ దేవరాయలు నిరి్మంచిన ఆలయాలు, నవాబులు నిర్మించిన మసీదులు, రాణీ మందిరాలు, ధాన్యాగారాలు, గుర్రపు శాలలు, ఫిరంగి కోటలు, కోనేరులు, సొరంగ మార్గం నేటికీ ఉన్నాయి. ఉదయగిరి దుర్గం కింద పట్టణంలో తల్పగిరి రంగనాయకులస్వామి దేవాలయం, కృష్ణాలయం, కల్యాణమండపం నేటికీ చూపరులను ఆకర్షిస్తున్నాయి. నెల్లూరులో ఉన్న రంగనాయకుల స్వామి విగ్రహం ఉదయగిరి నుంచి తరలించిందే కావటం విశేషం. శ్రీకృష్ణ దేవరాయల పాలనకు గుర్తుగా ఉదయగిరి ట్యాంక్‌బండ్ సమీపంలో కల్యాణ మండపం, కోనేరు అలనాటి శిల్పకళా వైభవాన్ని చాటిచెబుతాయి. ఉదయగిరి నుంచి బండకిందపల్లికి వెళ్లే ఘాట్‌రోడ్డులో పాదచారుల కోసం రాతిలో తవ్విన బావి నేటికీ తానాబావిగా ప్రసిద్ధి చెందింది. అనంతరం బ్రిటిష్ పాలనలో స్టేట్ దొర నిరి్మంచిన ప్రార్థనా మందిరం, తహసీల్దారు కార్యాలయ భవనాలు నేటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. చూడదగిన ప్రదేశాలు ఉదయగిరికి 33 కి.మీ దూరంలో అత్యంత ప్రాచీనమైన, అతి శక్తివంతమైన ఘటిక సిద్ధేశ్వరం శైవక్షేత్రం ఉంది. అగస్త్య మహాముని తపోపీఠమైన ఈ క్షేత్రం శ్రీకృష్ణ దేవరాయలకు యుద్ధకాలంలో దుర్గంకు దారి చూపించింది. సిద్ధేశ్వరానికి అతి సమీపంలో ఉన్న బూసానాయుడు కోటను అభివృద్ధి చేయవచ్చు. సిద్ధేశ్వరం నుంచి మరో 30 కి.మీ దూరంలో ప్రకృతి సోయగాల నడుమ పయనిస్తూ ముందుకు వెళితే 7, 8 శతాబ్దాల్లో పల్లవుల కాలంలో అద్భుతమైన శిల్పాకళా నైపుణ్యంతో రూపుదిద్దుకున్న ఒకే రాతిపై దేవాలయం, ద్వారపాలకులు, శివలింగాలు, నందీశ్వరుడు కొలువైన భైరవకోన ఉంది. ఇక్కడ ఏడాది పొడవునా జాలువారే జలపాతాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి.. అక్కడి నుంచి మరో 24. కి.మీ ముందుకు వెళితే నారాయణస్వామి ఆలయం ఉంది. అక్కడి నుంచి మరో పది కి.మీ దూరంలో హనుముని కొండ ఉంది. అక్కడి నుంచి మరో 25 కి.మీ ముందుకు వెళితే వెంగమాంబ దేవాలయాన్ని సందర్శించవచ్చు. అభివృద్ధిని మరచిన పాలకులు ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందితే ఎంతో మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించే అవకాశముంది. గత ఐదు దశాబ్దాలుగా ఈ ప్రాంతం అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు ఉన్నాయి. ఉదయగిరి ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని చెబుతున్న పాలకులు ఆచరణలో విఫలమయ్యారు. ఎన్డీయే ప్రభుత్వంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రిగా ఉన్న సమయంలో మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఆనాటి కేంద్ర మంత్రులు అనంతకుమార్, సుష్మాస్వరాజ్‌ను ఉదయగిరి పిలిపించి హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. అప్పట్లో ఉదయగిరి ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని అంతా భావించారు. కానీ ఎందుకో ఆ హామీలు నెరవేరలేదు.ప్రతిపాదనలు చేసి.. తిరుమల కొండలను మరిపించే పర్వతశ్రేణులు, పచ్చని ప్రకృతి రమణీయతను పుణికి పుచ్చుకున్న సిద్దేశ్వరం, దుర్గంపల్లి ప్రాంతాలను టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేసేందుకు గత ప్రభుత్వం అటవీశాఖ ద్వారా ప్రణాళిక సిద్ధం చేయించింది. చిన్నపిల్లల ఆటలకు అనువుగా పార్కులు, తాగునీటి వసతి, సేదతీరేందుకు గదులు, గార్డెన్స్, జిమ్‌లు, ఫిట్నెస్ సెంటర్లు, యోగా కేంద్రాలు, ప్రకృతి అందాలు వీక్షించేందుకు వాచ్ టవర్లు, సోలార్ షెడ్స్, లైట్లు ఇలా ఒక్కో ప్రాంతంలో 45 రకాల పనులకు రూ.2.78 కోట్ల చొప్పున అంచనాలతో గత ప్రభుత్వంలో ప్రతిపాదనలు పంపించారు. ఆసమయంలో ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో ఆ ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే మనసుపెట్టి పనులు చేయించాలని స్థానికులు కోరుతున్నారు.వెయ్యేళ్ల చరిత్ర ఉదయగిరి దుర్గానికి వెయ్యేళ్ల చరిత్ర ఉంది. గత ఐదు దశాబ్దాలుగా ఉదయగిరి దుర్గాన్ని పర్యాటక కేంద్రంగా చేయాలని ఈప్రాంత ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వాలు పంపిన ప్రతిపాదనలు కాగితాలకేపరిమితమవుతున్నాయి. ఉదయగిరిని పర్యాటక కేంద్రంగా అభివృద్దిచేస్తే ఈ ప్రాంతం ఎంతో అభివృద్దిచెందుతుంది.– ఎస్కె.ఎండి.ఖాజా, చరిత్ర కారుడు, ఉదయగిరి -
రాబందు.. కనువిందు
పర్యావరణ బంధువైన నల్ల రాబందు (సినేరియన్, ఇండియన్ వల్చర్) కృష్ణా జిల్లా చినగొల్లపాలెం ఏటిపొగరులో లభ్యమైంది. వేటాడే అతిపెద్ద పక్షుల్లో ఒకటైన నల్ల రాబందు అంతరించిపోతున్న జాబితాలో ఉంది. ఈ అరుదైన పక్షి గంధం సూర్యారావు అనే మత్స్యకారుడి వద్ద అటవీ శాఖ అధికారులు గురువారం గుర్తించారు. మూడు రోజుల క్రితం నీటిలో తడిసిపోవడంతో ఎగరలేక సముద్రపు ఒడ్డున పడి ఉన్న ఈ భారీ పక్షిని సూర్యారావు ఇంటికి తీసుకొచ్చి పంజరంలో పెంచుతున్నాడు. సమాచారం అందుకున్న ఏలూరు జిల్లా అటవీశాఖ అధికారి బి.విజయ కైకలూరు అటవీశాఖ డెప్యూటీ రేంజ్ ఆఫీసర్ రంజిత్‌కుమార్, సిబ్బందిని ఘటనా స్థలానికి పంపించి దానిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పంచనామా జరిపించి నల్ల రాబందును సంరక్షణ నిమిత్తం విశాఖ జూకు తరలించారు. – కైకలూరు/కృత్తివెన్నుఅంతరించి పోవడానికి ఇదీ కారణంజంతు కళేబరాలను ఆహారంగా తీసుకుంటూ ప్రకృతి సవాళ్లను సమతుల్యం చేయడంలో రాబందుల పాత్ర కీలకం. వెటర్నరీ వైద్యుడు సుశాంత్ ఈ జాతి కనుమరుగైపోవడానికి కారణాలను వివరిస్తూ.. ‘పశువులకు గతంలో డైక్లోఫినాక్ అనే మందును ఇచ్చేవారు. ఆ పశువు చనిపోయిన తరువాత కూడా వాటి శరీర భాగాల్లో ఆ మందు నిక్షిప్తమై ఉండేది. ఆ కళేబరాన్ని తిన్న రాబందుల మూత్రపిండాలపై అది తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఈ కారణంగా రాబందులు అధిక సంఖ్యలో మృత్యువాత పడి అంతరించేపోయే దశకు చేరుకున్నాయి’ అని వివరించారు. తరువాత కాలంలో ఆ మందును నిషేధించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందన్నారు.ప్రత్యేకతలివీ..ఈ రాబందు శరీర పొడవు 3 అడుగుల 11 అంగుళాలు ఉండగా.. రెక్కల పొడవు ఒక్కొక్కటి 5 అడుగులు చొప్పున ఉన్నాయి. బరువు దాదాపు 14 కిలోలు ఉంది. ఇవి జనవరి, ఫిబ్రవరి నెలల్లో గూడు కట్టుకుని గుడ్లు పెడతాయి. వీటి జీవిత కాలం 39 ఏళ్లు. అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరంపై కూడా దీని జాడను గుర్తించారు. స్పెయిన్, పోర్చుగల్, దక్షిణ ఫ్రాన్స్, గ్రీస్, టర్కీలలో నల్ల రాబందులు ఎక్కువగా సంచరిస్తాయి. ఆఫ్ఘని స్థాన్ మీదుగా ఉత్తర భారతదేశంలోకి ఇవి ప్రవేశిస్తాయి. మంచూరియా, మంగోలియా, కొరియాలలో సంతానోత్పత్తి చేస్తాయి. నదీతీర ఆవాసాలు, పర్వత ప్రాంతాలు, కొండల్లో మృత కళేబరాలను తింటూ జీవిస్తాయి. మెడ ఈకలు బట్టతలగా ఉండటంతో దీనిని సన్యాసి రాబందు అని కూడా పిలుస్తారు.ఆశ్చర్యంగా ఉందిఈ జాతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి పైనా ఉంది. ఈ ప్రాంతంలో అరుదైన రాబందు దొరకడం ఆశ్చర్యంగా ఉంది. ఇది చిన్న వయసున్న పక్షి. దీనిని బట్టి ఈ ప్రాంతంలో ఇంకా దీనికి సంబంధించిన పక్షులు ఉండే అవకాశం ఉంది. ఇటువంటివి ఎవరికైనా కనిపిస్తే వెంటనే అధికారులకు తెలియజేయాలి. – ఎం.రంజిత్, ఫారెస్ట్ డీఆర్వోహాని కలిగించవద్దుప్రకృతిలో ఎన్నో అరుదైన జీవులు సంచరిస్తాయి. వాటిని గుర్తించినప్పుడు హాని చేయకుండా అటవీశాఖ అధికారులకు సమాచారం అందించండి. కొల్లేరు పరిసర ప్రాంతాల్లో కొండ చిలువలు కనిపిస్తున్నప్పుడు గ్రామస్తులు భయంతో వాటిపై దాడి చేస్తున్నారు. అవి విషపూరితం కావు. సమాచారం అందిస్తే సంరక్షిస్తాం. – బి.విజయ, డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్, ఏలూరు -
సహజత్వం కోల్పోతున్న నీరు
సాక్షి, సిద్దిపేట: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరను తెలంగాణ కుంభమేళాగా అభివర్ణిస్తారు. జాతర జరిగే నాలుగు రోజుల్లో కోటికి పైగా భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసి అమ్మవార్లను దర్శించుకుంటారు. అయితే భక్తులు ఉపయోగించే షాంపూలు, సబ్బుల ఇతర కెమికల్స్ వల్ల వాగులో నీరు సహజత్వాన్ని కోల్పోతోందని సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల సూక్ష్మ జీవశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ మదన్మోహన్ పరిశోధనల ద్వారా తేల్చారు. వాగులో పుణ్యస్నానాలు చేశాకే... మేడారం జాతరకు జంపన్నవాగుకు విడదీయలేని బంధం ఉంది. కాకతీయులతో యుద్ధం జరిగిన సమయంలో రోజుల తరబడి పోరాటం చేసిన సమ్మక్క కుమారుడు జంపన్న.. మేడారం పొలిమేరలో ఉన్న సంపెంగ వాగులో దూకి ఆత్మార్పణ చేసుకున్నారని చరిత్ర చెబుతోంది. ఆనాటి నుంచి ప్రజలు ఆ వాగును జంపన్నవాగుగా పిలుస్తున్నారు. భక్తజనులు జంపన్నవాగులో పుణ్యస్నానమాచరించి ఆ తర్వాత తల్లుల దర్శనానికి వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. వాగుకు ఇరువైపులా2 కిలోమీటర్ల మేర స్నానఘట్టాలు మేడారంలోని జంపన్నవాగుకు ఇరువైపులా రెండు కిలోమీటర్ల పొడవులో స్నానఘట్టాలు ఉన్నాయి. భక్తులు ఈ వాగులో స్నానం చేసేందుకు వీలుగా లక్నవరం జలాశయం నుంచి జాతర సమయాల్లో నీటిని వదులుతారు. ఈ నీరు స్నానఘట్టాల దగ్గర నిల్వ ఉండేలా ఇసుక బస్తాలతో తాత్కాలిక చెక్‌డ్యామ్‌లు నిర్మిస్తారు. మరోవైపు వాగులో ఉన్న ఇన్‌ఫిల్టరేషన్ వెల్స్ ద్వారా నీటిని తోడి స్నానఘట్టాల దగ్గర ఏర్పాటు చేసిన బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్‌కు పంపిస్తారు. భక్తులు జంపన్నవాగులో మునక వేసిన తర్వాత బ్యాటరీ ట్యాప్స్ దగ్గర స్నానాలు చేస్తారు. ఇలా కేవలం రెండు కిలోమీటర్ల పరిధిలోనే లక్షలాది మంది భక్తులు జాతర జరిగే నాలుగు రోజుల పాటు నిర్విరామంగా స్నానాలు చేస్తారు. ఈ సమయంలో ఉపయోగించే షాంపులు, సబ్బుల కారణంగా జంపన్న వాగులోని నీరు సహజత్వానికి కోల్పోతోందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దీనికి తోడు సహజమైన కుంకుమ స్థానాన్ని చాలా చోట్ల కెమికల్ కుంకుమలు ఆక్రమించడం ఈ సమస్యను మరింత తీవ్రం చేసింది. 18 శాంపిల్స్ సేకరణ గతేడాది ఫిబ్రవరి 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు మేడారం జాతర జరిగింది. ఈ సందర్భంగా జాతరకు వారం రోజుల ముందు సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల సూక్ష్మజీవశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జంపన్న వాగులో ఆరు చోట్ల, జాతర సమయంలో ఆరు చోట్ల, జాతర ముగిసిన వారం రోజులకు ఆరుచోట్ల ఇలా 18 శాంపిల్స్ సేకరించారు.వీటిని ప్రత్యేక బాటిళ్లలో తీసుకొచ్చి కళాశాలలో టెస్ట్ చేశారు. వాటి ఫలితాలు ఇలా ఉన్నాయి. సాధారణంగా అయితే పీహెచ్ 6.5 నుంచి 8.5, డిజాల్వడ్ ఆక్సిజన్(డీవో) 6 ఎంజీ కంటే ఎక్కువ (లీటరు నీటిలో), బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్(బీవోడీ) 2ఎంజీ అంతకంటే తక్కువ (లీటరు నీటిలో), బాక్టీరియా అసలు ఉండొద్దు. 24, 25 తేæదీల్లో నేపాల్‌లో ప్రజెంటేషన్ బయోటెక్నాలజీ సొసైటీ ఆఫ్ నేపాల్ ఆధ్వర్యంలో కాఠ్మాండ్లో ఈ నెల 24,25 తేదీల్లో జరిగే 3వ అంతర్జాతీ య బయోటెక్నాలజీ సదస్సుకు జంపన్న వాగులో సాముహిక పుణ్యస్నానాలతో నీటి కాలుష్యంపై చేసిన పరిశోధన పత్రం ఎంపికైంది. దీనిపై పేపర్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు డాక్టర్ మదన్మోహన్కు ఆహ్వానం అందింది.నివారణ మార్గాలుసహజత్వాన్ని కోల్పోయిన నీటిలోబ్యాక్టీరియాలు పెరుగుతాయి. ఇలాంటి నీటిలో ఎక్కువ సేపు ఉండటం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. » వాగులో నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు దిగువకు వెళ్లేలా నీటి ప్రవాహం కొంచెం ఎక్కువ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. » క్లోరినేషన్ ఎక్కువగా చేయాలి. » సబ్బు, షాంపుల వినియోగం, బట్టలు ఊతకడం, కుంకుమ వేయడాన్నినియంత్రించాలి. » జాతర నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత మళ్లీ స్నానం చేయడం వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్లు రావు అని పరిశోధన ద్వారా నిర్థారణ అయ్యింది. జాగ్రత్తలు పాటించాలి పుణ్యస్నానాలు చేయడం మంచిదే. తగు జాగ్రత్తలు పాటించాలి. పుణ్యస్నానాలు చేసే సమయంలో పూజా ద్రవ్యాలు అందులో వేయొద్దు. షాంపూలు, సబ్బులు వినియోగించడం వలన నీరు సహజత్వం కోల్పోయి కాలుష్యం అవుతుంది. దీంతో చర్మ వ్యాధులు, ఇతర ఇన్ఫెక్షన్లు వస్తాయి. – డాక్టర్ మదన్ మోహన్, సిద్దిపేట ప్రభుత్వడిగ్రీ కళాశాల సూక్ష్మజీవశాస్త్ర విభాగాధిపతి -
బిష్ణోయి స్త్రీలు..: చెట్ల కోసం తలలు ఇచ్చారు
‘పచ్చటి చెట్టు నరకకూడదు’ అని బిష్ణోయ్ తెగ మొదటి నియమం. మన దేశంలో పర్యావరణానికి మొదటి యోధులు బిష్ణోయ్ స్త్రీలే. కరువు నుంచి రక్షించే‘ఖేజ్రీ’ చెట్లను 1730లో రాజభటులు నరకడానికి వస్తే అమృతాదేవి అనే మహిళ తన తల అర్పించి కాపాడుకుంది. ఆమెతో పాటు 363 మంది బిష్ణోయిలు ఆరోజు బలిదానం ఇచ్చారు. బిష్ణోయిల పర్యావరణ స్పృహ గురించి బ్రిటిష్ రచయిత మార్టిన్ గుడ్మాన్ ‘మై హెడ్ ఫర్ ఏ ట్రీ’ పుస్తకం రాశాడు. ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’లో దాని గురించి మాట్లాడాడు. వివరాలు...అందరూ ఎండు కట్టెలు వంట కోసం నేరుగా పొయ్యిలో పెడతారు. కాని బిష్ణోయి స్త్రీలు ఆ ఎండు కట్టెలను పరీక్షించి వాటి మీద క్రిమి కీటకాలు, బెరడును ఆశ్రయించి ఉండే పురుగులు... వీటన్నింటిని విదిలించి కొట్టి అప్పుడు పొయ్యిలో పెడతారు. ప్రాణం ఉన్న ఏ జీవజాలాన్నీ చంపే హక్కు మనిషికి లేదు’ అని బిష్ణోయిలు గట్టిగా విశ్వసించడమే దీనికి కారణం. బిస్ అంటే 20. నొయి అంటే 9. బిష్ణోయిల ఆది గురువు జంభోజి వారి కోసం 29 నియమాలను ఖరారు చేశారు. వాటిని పాటిస్తారు కాబట్టి వీరిని బిష్ణోయిలు అంటారు. మరో విధంగా వీరు వైష్ణవ పథానికి చెందిన వారు కాబట్టి కూడా విష్ణోయి లేదా బిష్ణోయి అని అంటారు.కరువు నుంచి బయటపడేందుకుపశ్చిమ రాజస్థాన్‌లో జోద్పూర్, బికనిర్లు బిష్ణోయిల ఆవాసం. 15వ శతాబ్దంలో ఇక్కడ తీవ్రమైన కరువు వచ్చింది. అందుకు కారణం చెట్లు, అడవులు నాశనం కావడమేనని ఆ సమయానికి జీవించి ఉన్న గురు జంభోజి గ్రహించారు. అందుకే చెట్టును కాపాడుకుంటే మనిషి తనను తాను కాపాడుకోవచ్చునని కచ్చితమైన నియమాలను విధించారు. వాటిని శిరోధార్యంగా చేసుకున్న బిష్ణోయిలు నాటి నుంచి నేటి వరకూ గొప్ప పర్యావరణ రక్షకులుగా ఉన్నారు. వీరి ప్రాంతంలో ఉన్న ఖేజ్రీ చెట్లను, కృష్ణ జింకలను వీరుప్రాణప్రదంగా చూసుకుంటారు. జింక పిల్లలను వీరు సాకుతారు. అవసరమైతే చనుబాలు ఇస్తారు.1730 స్త్రీల ఊచకోత1730లో జోద్పూర్ రాజు అభయ్ సింగ్ కొత్త ΄్యాలస్ నిర్మాణానికి కలప కోసం సైనికులను ఖేజర్లీ అనే పల్లెకు పంపాడు. అక్కడ ఖేజ్రీ చెట్లు విస్తారం. ఆ సమయానికి మగవారంతా పశువుల మందను మేపడానికి వెళ్లి ఉన్నారు. ఊళ్లో స్త్రీలు మాత్రమే ఉన్నారు. సైనికులు చెట్లు కొట్టబోతుంటే అమృతాదేవి అనే స్త్రీ పరిగెత్తుకుంటూ వచ్చి అడ్డుపడింది. పచ్చని చెట్టును నరకకూడదు అంది. ఆమెకు ముగ్గురు కూతుళ్లు. వారంతా వచ్చి చెట్లను చుట్టుకుని నిలబడ్డారు. చాలామంది స్త్రీలు అలాగే చేశారు. సైనికులు వెర్రెత్తి పోయారు. గొడ్డలి ఎత్తారు. ‘చెట్టుకు బదులు నా తల ఇస్తాను తీసుకో’ అని గర్జించింది అమృతాదేవి. సైనికులు నిర్దాక్షిణ్యంగా ఆమెను, ఆమె కూతుళ్లను, ఆ తర్వాత మొత్తం స్త్రీ, పురుషులను కలిపి మొత్తం 363 మందిని నరికారు. ఇప్పటికీ ఆ ఊళ్లో ఆ జ్ఞాపకంగా స్మారక స్థూపం ఉంది.చలించిన రచయిత‘2020లో జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్‌కు వచ్చినపుడు ఈ ఊచకోత గురించి తెలిసింది. పర్యావరణం కోసం ఇలాప్రాణత్యాగం చేసిన స్త్రీలు లేరు. నేను ఇది పుస్తకంగా రాయాలనుకున్నాను’ అన్నాడు బ్రిటిష్ రచయిత మార్టిన్ గుడ్మాన్. 2022లో అతను లండన్ నుంచి వచ్చి ఆరు నెలల పాటు బిష్ణోయి సమూహంతో ఉండి ‘మై హెడ్ ఫర్ ఏ ట్రీ’ పుస్తకం రాశాడు. ‘నేను బిష్ణోయి గురువు జంభోజి ఏ చెట్టు కిందైతే మరణించాడో ఆ చెట్టు కిందకు వెళ్లాను. ఆ రోజు రాజస్థాన్‌లో 36 డిగ్రీల ఎండ ఉంటే లండన్‌లో 40 డిగ్రీల ఎండ వుంది. బిష్ణోయిల నుంచి ఈ ప్రపంచం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. బిష్ణోయిలు చెట్లు పెంచుతూ, కుంటలు తవ్వుతూ తమ భూమిని సస్యశ్యామలం చేసుకుంటూనే ఉన్నారు. ఇందులో స్త్రీల కృషి అసామాన్యం. వీరి వల్లే చి΄్కో ఉద్యమ ఆలోచన వచ్చిందని కూడా మనం గ్రహించాలి’ అన్నాడు మార్టిన్ గుడ్మాన్.వేటాడితే జైల్లో వేస్తాంపుస్తకం ఆవిష్కరణ వేడుకలో బిష్ణోయి ఉద్యమకర్త నరేంద్ర బిష్ణోయి కూడా పాల్గొన్నాడు. ‘రాజస్థాన్‌లో 1972, 1980 చట్టాల ప్రకారం చెట్టు కొడితే 100 రూపాయల ఫైను. ఆ రోజుల్లో 100 పెద్దమొత్తం కావచ్చు. ఇవాళ్టికీ వంద కట్టి తప్పించుపోతున్నారు. ఈ చట్టంలో మార్పు కోసం పోరాడుతున్నాం. మేము పెద్దఎత్తున చెట్లు పెంచుతుంటే అభివృద్ధి పేరుతో సోలార్ ΄్లాంట్ల కోసం ప్రభుత్వం చెట్లు కొట్టేస్తోంది. ఇంతకు మించిన అన్యాయం లేదు. గత రెండు దశాబ్దాలుగా మాప్రాంతంలో కృష్ణ జింకలను చంపిన వారు కోర్టుల్లో ఏదో చేసి తప్పించుకున్నారు. అందుకే మా కుర్రాళ్లే లా చదివి అడ్వకేట్లు అవుతున్నారు. ఇక ఎవరు వేటాడినా వారిని జైళ్లల్లో మేమే వేయిస్తాం’ అన్నాడు నరేంద్ర బిష్ణోయి. ఈ గొప్ప పర్యావరణప్రేమికులు దేశం మొత్తానికి స్ఫూర్తినివ్వాలి. – సాక్షి ప్రత్యేక ప్రతినిధి -
మార్కెట్‌కు దేశీ ఇంధనం!
సుమారు 15 ఏళ్ల తదుపరి తొలిసారి దేశీ స్టాక్ మార్కెట్లలో సరికొత్త ట్రెండ్‌కు తెరలేవనుంది. ఇటీవల దేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (డీఐఐలు) పెట్టుబడులు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐలు) అమ్మకాలను మించుతున్నాయి. దీంతో ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీలలో డీఐఐల వాటా ఎఫ్పీఐలకున్న పెట్టుబడుల విలువను అధిగమించనుంది! ఫలితంగా తొలిసారి లిస్టెడ్ కంపెనీలలో ప్రమోటర్ల తదుపరి అతిపెద్ద వాటాదారులుగా డీఐఐలు నిలవనున్నాయి. వెరసి రేసులో ఎఫ్‌పీఐలను వెనక్కి నెట్టనున్నాయి.దేశీ లిస్టెడ్ కంపెనీలలో ఈ ఏడాది ప్రమోటర్లేతర ఓనర్íÙప్లో ఆధిపత్యం చేతులు మారనుంది. 1992లో దేశీ స్టాక్ మార్కెట్లలో ఎఫ్‌పీఐలను అనుమతించాక భారీ పెట్టుబడులతో దూకుడు చూపుతున్నారు. డీఐఐల పెట్టుబడులకంటే అధికంగా ఇన్వెస్ట్ చేస్తూ దేశీ స్టాక్స్‌లో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నారు. అయితే ఇటీవల ట్రెండ్ మారుతోంది. గత నాలుగేళ్లుగా బుల్ ట్రెండ్‌తో దేశీ మార్కెట్లు సరికొత్త గరిష్టాలను తాకుతూ వచ్చాయి. ఇందుకు ప్రధానంగా దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లుగా పిలిచే మ్యూచువల్ ఫండ్స్, బీమా కంపెనీలు, పెన్షన్ ఫండ్స్ పెట్టుబడులు ప్రభావం చూపుతున్నాయి. అయితే గతేడాది అక్టోబర్ నుంచి ఎఫ్‌పీఐలు యూటర్న్ తీసుకున్నారు. ఇదే సమయంలో డీఐఐలు మరిన్ని పెట్టుబడులు కుమ్మరిస్తున్నారు. వెరసి ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీల్లో ఎఫ్‌పీఐల వాటా తగ్గుతుంటే.. డీఐఐల వాటా పెరుగుతోంది.2015తో పోలిస్తే 2025లో ఎఫ్‌పీఐలు, డీఐఐల పెట్టుబడుల విలువ మధ్య అంతరం 2009 తదుపరి అత్యంత కనిష్టానికి చేరింది. ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీలలో 2024 డిసెంబర్‌కల్లా ఎఫ్‌పీఐల వాటా 17.23 శాతానికి దిగిరాగా.. డీఐఐల వాటా 16.90 శాతానికి బలపడింది. అంటే అంతరం 33 బేసిస్ పాయింట్లు(0.33 శాతం) మాత్రమే. నిజానికి 2015లో ఎఫ్‌పీఐ, డీఐఐ వాటాల మధ్య అంతరం 1032 బేసిస్ పాయింట్లు(10.32 శాతం)గా నమోదైంది. జనవరిలోనూ ఎఫ్‌పీఐల అమ్మకాలు కొనసాగడం, పెట్టుబడుల బాటలో డీఐఐలు కొనసాగుతుండటంతో త్వరలో ఎఫ్‌పీఐలపై డీఐఐలు ఆధిపత్యం వహించనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఫండ్స్ ఆధిపత్యం డీఐఐలలో మ్యూచువల్ ఫండ్స్‌దే అగ్రస్థానంకాగా.. వీటికి రిటైల్ ఇన్వెస్టర్ల నుంచే అధిక బలం సమకూరుతోంది. గత నెల(జనవరి)లో ఎఫ్‌పీఐలు నికరంగా రూ. 78,000 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయిస్తే.. డీఐఐలు రూ. 86,000 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. ఇక 2024 అక్టోబర్–డిసెంబర్లో ఎఫ్‌పీఐలు రూ. లక్ష కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ.1.86 లక్షల కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశాయి. విలువపరంగా డీఐఐల వద్ద గల ఈక్విటీలు రూ. 73.5 లక్షల కోట్లు! ఎఫ్‌పీఐల వాటాల విలువకంటే 1.9 శాతమే తక్కువ! దశాబ్దంక్రితం ఎఫ్‌పీఐల పెట్టుబడులలో దేశీ ఫండ్స్ ఈక్విటీల విలువ సగమేకావడం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం! ఈ బాటలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువలో మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్‌లు) పెట్టుబడులు 10వ వంతుకు చేరడం విశేషం!రిటైలర్ల బలమిది ఇటీవల కొన్నేళ్లుగా రిటైల్ ఇన్వెస్టర్లు దేశీ మార్కెట్లకు తరలి వస్తున్నారు. ఎంఎఫ్‌లలో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఫలితంగా 2019లో రూ. 7.7 లక్షల కోట్లుగా నమోదైన ఫండ్స్ నిర్వహణలోని ఆస్తుల విలువ (ఏయూఎం) 2024 డిసెంబర్‌కల్లా రూ. 31 లక్షల కోట్లను తాకింది! ఇదే కాలంలో సిప్ ద్వారా పెట్టుబడులు రూ. 8,518 కోట్ల నుంచి రూ. 26,549 కోట్లకు జంప్ చేశాయి. 2024 చివరి క్వార్టర్లో రిటైలర్లు స్టాక్స్‌లో రూ. 57,524 కోట్లు ఇన్వెస్ట్ చేశారు! ఈ జోష్‌తో గతేడాది 91 కంపెనీలు ఐపీఓలతో రూ.1.6 లక్షల కోట్లకుపైగా సమకూర్చుకోవడం కొసమెరుపు!!జనవరిలో ఎఫ్‌పీఐల అమ్మకాలు రూ. 78,000 కోట్లుదేశీ ఫండ్స్ పెట్టుబడుల విలువ రూ. 86,000 కోట్లు అక్టోబర్–డిసెంబర్లో ఎఫ్‌పీఐల అమ్మకాలు రూ. లక్ష కోట్లు ఇదే కాలంలో డీఐఐల కొనుగోళ్లు రూ. 1.86 లక్షల కోట్లు –సాక్షి, బిజినెస్ డెస్క్ -
ప్రేమ పరీక్షకు వేళాయే
మనసు ముసిముసిగా నవ్వితే..ఊహ ఉప్పొంగితే..గుండె ఆనందంతో గంతులేస్తే..ఆ సందడి పేరే ప్రేమ. చిరునవ్వుతో వరమిస్తావా.. చితి నుంచి నడిచొస్తాను.. మరు జన్మకు కరుణిస్తావా.. ఈ క్షణమే మరణిస్తానంటూ ప్రేమికుల మనసు పలికే మాటల్ని ఓ సినీ కవి అద్భుతంగా చెప్పారు. నిజమే.. ప్రేమిస్తే.. ప్రపంచమంతా మనసిచ్చిన మనిషిలోనే కనిపిస్తుంది. ప్రేమిస్తే..నీడ కూడా జంట హృదయం వెన్నంటే ఉంటుంది.ఎందుకంటే.. అది ప్రేమంట అంటున్నారు ప్రేమికులు. అందుకే.. ప్రేమ పండుగను వారం రోజుల పాటు చేసుకునేలా వాలెంటైన్ వీక్ రానే వచ్చింది. గుప్పెడంత గుండెలో ఉప్పెనంత ఊహల్ని నింపేలా..అనిర్వచనీయమైన మధురానుభూతిగా చెప్పుకునే ప్రేమకు వారాల పండగ చేసుకునేందుకు కొత్తతరం లవ్‌బర్డ్స్ సిద్ధమవుతున్నారు. వారం పాటు ప్రేమానందాల్ని మూటకట్టి నచ్చిన మనసుల ముందు పెడితే..గుండె ఆనందంతో గంతులేస్తుంది..గొంతు సంబరంతో గోల చేస్తుంది.మనసు ఊహల్లో తేలే మధుమాసపు పండగను తీసుకొచ్చిందని ప్రేమ పక్షులు వలపు గూటికి చేరుకొని ఊసులాడుకుంటున్నాయి. వాలెంటైన్స్ డే రోజునే ప్రేమికులు నిజమైన పండగలా చేసుకుంటారు. కానీ..ఆ పండగనూ వారం రోజుల పాటు విభిన్నతలతో వలపు హృదయాలు విహరించేలా చేసుకోవాలనే తపన ఉన్న వారికీ ఓ వీక్ ఉంది. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజని అందరికీ తెలుసు. కానీ ఆ అసలైన పండగను వారం రోజుల పాటు జరుపుతారని కొంతమంది ప్రేమికులకే తెలుసు. ఎదలోతులో ఏ మూలనో దాగి ఉన్న ప్రేమను ఎదుటి వారికి చెప్పేందుకు ఒకటి కాదు.. ఏకంగా వారం పాటు ఒక్కో విధంగా వ్యక్తపరచవచ్చు. కానుకలు, పుష్పగుచ్ఛాలతో ఎదుటి వారి మనసుల్ని కొల్లగొట్టేందుకు ప్రేమికులు ఉవ్విళ్లూరుతుంటారు. ఆ కానుకల్ని ఒక్కో స్పెషల్ రోజున ఒక్కో విధంగా ఇస్తూ వారి ప్రేమను పొందేందుకు వచ్చిందే వాలెంటైన్ వీక్. ప్రేమికుల రోజు ముందు వారం రోజుల పాటు అంటే ఈ నెల 7 నుంచి వాలెంటైన్ వీక్‌ను ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో చూద్దాం.వాలెంటైన్ డే (ఫిబ్రవరి 14)ఇక చివరి రోజైన వాలెంటైన్ డే గురించి అందరికీ తెలిసిందే. ఎన్నో కొత్త రకాల ప్లాన్లతో మనసులు ఉరకలేస్తుంటాయి. తన భాగస్వామి ఊహించని రీతిలో బహుమతి అందించాలని, సమ్‌థింగ్ స్పెషల్‌గా ప్రేమను వ్యక్తం చేయాలని ఉవ్విళ్లూరుతుంటారు. నచ్చిన స్టైల్లో.. ఎదుటి వారి మనసు దోచేలా ప్రేమను వ్యక్తం చేయండి. ఇందుకోసం విశాఖలో ప్రధాన హోటల్స్ అన్నీ ఇప్పటికే ప్రత్యేక ప్యాకేజీలనూ ప్రకటిస్తున్నాయ్. చుట్టూ గులాబీ పూల మధ్య క్యాండిల్ లైట్ డిన్నర్లు, ప్లెజెంట్ మ్యూజిక్‌తో మైమరపించేలా ఏర్పాట్లకు సిద్ధమవుతున్నాయి. హ్యాపీ వాలెంటైన్స్ వీక్!!రోజ్ డే (ఫిబ్రవరి 7)ఎదుటి వారికి ప్రేమను వ్యక్తం చెయ్యాలంటే 90 శాతం మంది ఎంచుకునే ప్రధాన మార్గం గులాబీ. ఎర్ర గులాబీని ఇచ్చి కళ్లల్లోకి చూస్తూ ఐ లవ్ యూ చెబితే ఎదుటి వారి మనసు లోతుల్ని తాకుతుందంటారు. అందుకే ఈ వాలెంటైన్ వీక్ తొలి రోజుని రోజ్ డేగా పండగ చేసుకుంటారు. ఈ రోజున మొదటిసారిగా మీకు చాలా ఇష్టమైన వారితో కలవాలన్నా, పలకరించాలన్నా ఈ రోజ్‌డే రోజున మంచి గులాబీ ఇచ్చి ప్రపోజ్ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. విశాఖ నగరంలో చాలా మంది యువత బుధవారం రోజ్ డే సంబరాల్ని చేసుకున్నారు. వైజాగ్‌లోని రామాటాకీస్లోని ఓ ఫ్లోరిస్ట్ దుకాణంలో రోజుకి 200 నుంచి గులాబీలు అమ్ముడవుతుంటాయి. కానీ.. రోజ్ డే రోజు మాత్రం 1000 వరకూ గులాబీలు అమ్ముడు పోతాయని దుకాణ యజమాని రాజు తెలిపారు. ఇక దేశంలో ప్రతి రోజూ రూ.68.4 కోట్ల గులాబీ వ్యాపారం జరుగుతుంటుంది. వాలెంటైన్స్‌డే, రోజ్‌డే రోజు మాత్రం రూ.100 కోట్లకు చేరుకుంటుంది.ప్రపోజ్ డే (ఫిబ్రవరి 8) ప్రేమను వ్యక్తపరచాలంటే చాలా ధైర్యం కావాలి. ఆ ధైర్యం లేకపోవడం వల్లే చాలా మంది ప్రేమలు మనసు లోతుల నుంచి బయటకు వచ్చి పెదాల వద్దే నిలిచిపోతున్నాయి. ఆ రెండు మాటలు చెప్పేందుకు తటపటాయించే ప్రేమికులకు ఈ ప్రపోజ్ డే కొత్త ఉత్సాహాన్నిస్తుంది. నచ్చిన వ్యక్తిని తనకు నచ్చిన ప్రాంతానికి తీసుకెళ్లి చిన్న బహుమతి ఇచ్చి ప్రేమను వ్యక్తీకరిస్తే చాలు మనసులు పెనవేసుకునే మధుమాసం వచ్చేస్తుంది. అందుకే ఈ రోజుకి చాలా ప్రాముఖ్యమిస్తుంటారు.చాక్లెట్ డే (ఫిబ్రవరి 9) చాక్లెట్ అంటే ఇష్టంలేని వారు ఎవరుంటారు. అమ్మాయిలకు చాక్లెట్ ఇస్తే చాలు ప్రపంచాన్ని తమ చేతిలో పెట్టినట్లుగా ఎగిరి గంతేస్తారు. అందుకే చాలా మంది ప్రేమికులు తన ప్రేయసికి ప్రపోజ్ చెయ్యాలంటే ఓ ఎర్రగులాబీతో పాటు చాక్లెట్ ఇస్తుంటారు. అలాంటి వారికోసం ఈ చాక్లెట్ డే. ప్రేమ ఓకే అయితే ఓ తియ్యని వేడుక చేసుకుందాం.. మన ప్రేమకు ఇదో తీపి గుర్తుగా భావిద్దాం.. అంటూ చిన్న భావుకవితను చెబుతూ చాక్లెట్ ఇచ్చి ప్రపోజ్ చేస్తే సరి.. ఆ సంబరమంతా జీవితాంతం తీపి గురుతుగా ఉండిపోతుంది. సాధారణంగా దేశంలో ప్రతి రోజూ 3.87 లక్షల కిలోల చాక్లెట్లు అమ్ముడుపోతుంటాయి. చాక్లెట్డే రోజున మాత్రం 5 లక్షల కిలోల అమ్మకాలు పక్కా అని మార్కెట్‌దారులు అంచనా వేస్తున్నారు.టెడ్డీ డే (ఫిబ్రవరి 10) ముద్దు ముద్దుగా ఉండే టెడ్డీ బేర్‌ను చూసి ఇష్టపడని వారంటూ ఉండరు. మనసుకు హత్తుకునేలా ఉండే టెడ్డీలను ఇష్టపడే ప్రేయసి ఉంటే ఈ రోజున ఓ బొమ్మను బహుమతిగా ఇచ్చి ఆనందపరచండి. నచ్చిన రంగుని ఎంపిక చేసి మరీ కొంటే వారు పొందే ఆనందం వెలకట్టలేనిది. అర చేతిలో పట్టే టెడ్డీ నుంచి ఆరడుగులుంటే టెడ్డీ బేర్ వరకూ మార్కెట్లో వివిధ సైజుల్లో లభిస్తున్నాయి. జగదాంబా సెంటర్లోని దావూద్ టెడ్డీబేర్ దుకాణంలో గతేడాది ఇదే రోజున సుమారు 250 బొమ్మలు అమ్ముడు పోయాయంట. ఇక నగరం మొత్తం చూస్తే ఈరోజున ఎన్ని టెడ్డీబేర్లు ప్రేమికుల గుండెలపై వాలిపోతాయో అర్థం చేసుకోవచ్చు. దేశంలో సగటున ప్రతి రోజూ సగటున రూ.14.67 కోట్ల సాఫ్ట్‌టాయ్స్ వ్యాపారం జరుగుతుంది. టెడ్డీడే, వాలెంటైన్స్‌డే రోజున మాత్రం ఏకంగా రూ.25 లక్షలకు పైగా విక్రయాలు జరుగుతుంటాయని సాఫ్ట్‌టాయ్స్ కంపెనీలు చెబుతున్నాయి.ప్రామిస్ డే (ఫిబ్రవరి 11) రెండు హృదయాల మధ్య చిగురించిన ప్రేమకు నమ్మకం పునాది. చిలిపి ఉదాహరణగా చెప్పుకుంటే రెండు బిస్కెట్లను క్రీమ్ అంటిపెట్టుకొని ఉంటేనే క్రీమ్ బిస్కట్ అన్నట్లుగానే రెండు మనసుల్ని జీవితాంతం కలిపి ఉంచేది నమ్మకమే. అలాంటి నమ్మకాన్ని ఎదుటివారిలో కలిగించడానికి ఈ రోజు గొప్పదనే చెప్పుకోవాలి. నచ్చిన వ్యక్తికి దగ్గర కావడానికి, వారిలో తనపై ఉన్న ప్రేమను కలకాలం ఉంచేందుకు వాగ్దానాలు చేస్తుంటారు. ప్రేయసి మీద మీకున్న ప్రేమను ఈ రోజున వాగ్దానం చేసి తెలిపితే.. ఎదుటి వారు మీకు మరింత చేరువవుతారు.హగ్ డే (ఫిబ్రవరి 12)ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమానురాగాలు, కష్ట సుఖాలకు చిహ్నం హగ్. ఒక కౌగిలి.. కష్టాల్లో ఉన్న ఎదుటి మనసుకు సాంత్వననిస్తుంది. బాధలను దూరం చేస్తుంది. ఒత్తిడిని తగ్గించేస్తుంది. అందుకే ఈ కౌగిలింత మంత్రాన్నే యువతరం ప్రేమ మంత్రంగా పాటిస్తున్నారు. చిన్న కౌగిలింతతో వలచిన మనసు పరవశంలో ముంచేస్తూ మెప్పించేస్తున్నారు. ప్రశాంతతను కలిగించేలా ప్రేమికుడికి, ప్రేయసికి ఒక హగ్ ఇస్తే చాలు.. అందులోనే మన ప్రేమలోతుల్ని అన్వేషించగలరు. 10 నిమిషాల పాటు హగ్ చేసుకుంటే హైబీపీ కూడా అదుపులోకి వచ్చేస్తుందంట. ఆనందం కలిగినప్పుడు ఎలానో.. హగ్ చేసుకున్నప్పుడు కూడా ఆక్సిటోసిన్ అనే రసాయనం విడుదలై మనసుకి సంతోషాన్ని కలిగిస్తుంటుంది. ఒక సమస్యలో ఉన్న లవర్‌కు రోజుకు 8 హగ్‌లు ఇస్తే చాలంట. రోజుకు 12 సార్లు హగ్ చేసుకుంటే..లైఫ్ సాఫీగా సాగిపోతుందంటూ అధ్యయనాలు ప్రేమ పాఠాలు చెబుతున్నాయండోయ్. అందుకే..ఈ రోజున ఒక హగ్‌తో మీరెంతగా ప్రేమిస్తున్నారో చెప్పేసుకోవచ్చు.కిస్ డే (ఫిబ్రవరి 13) వేయి మాటలు చెప్పలేని ఓ భావాన్ని చిన్న ముద్దు చెబుతుంది. ఎదుటివారి మీద అంతులేని ప్రేమ ఉన్నా చెప్పలేని వారు చాలా మంది ఉంటారు. అలాంటి వారు ఓ తియ్యని ముద్దుతో తన ప్రేమను వ్యక్తపరిచే రోజు ఇది. అందుకే కిస్ డే రోజున మీ భాగస్వామికి జీవితాంతం గుర్తుండిపోయేలా ఓ ముద్దు ఇస్తే చాలు.. మీ ప్రేమ అలా.. నిలబడిపోతుంది. అన్నట్లు ముద్దు కూడా ఒక దివ్యౌషధమేనంట. ముద్దు పెట్టుకోవడం వల్ల మీ శరీరంలో ఎపినెర్ఫిన్ విడుదలై రక్తనాళాలు వెడల్పుగా మారి రక్త ప్రసరణ సజావుగా సాగేందుకు దోహదపడి మానసిక విశ్రాంతిని అందిస్తుంది. గుండె రేటుని పెంచడం వల్ల శరీరంలోని అన్ని భాగాలకు రక్తప్రవాహం సక్రమంగా సాగుతుంది. ఒత్తిడిలో ఉన్నప్పుడు నచ్చిన వ్యక్తికి ముద్దు పెడితే.. రక్తపోటు తగ్గుతుంది. ముద్దు వల్ల రెండు మనసుల మధ్య ప్రేమ బదిలీ అవ్వడమే కాదు.. బ్యాక్టీరియా కూడా బదిలీ అవుతుంది. ఈ బ్యాక్టీరియా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇద్దరు వ్యక్తులు చుంబించుకునే సమయంలో ఉత్పత్తయ్యే సెరోటోనిన్ డోపమైన్, ఆక్సిటోసిన్ వంటి సంతోష రసాయనాలు..ఆ ఇద్దరి వ్యక్తుల మధ్య సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది.హ్యాపీ వాలెంటైన్స్ వీక్!! -
గుడ్ల దొంగలొచ్చారు
పాత తెలుగు సినిమాల్లో కామెడీ దొంగలుంటారు. వాళ్ల పని ఊళ్లో కోళ్లు పట్టడమే. ఎత్తుకొచ్చిన, కొట్టుకొచ్చిన కోళ్లను చక్కగా వండుకు తినే వాళ్లు కొందరైతే వాటిని ఎంతకో కొంతకు అమ్ముకుని సొమ్ము చేసుకునే వాళ్లు ఇంకొదరు. అలాంటి దొంగలు ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికాలో పడ్డారు. అయితే వాళ్లు దొంగకోళ్లు పట్టేవాళ్లు కాదు. కోడిగుడ్లు కొట్టేసేవాళ్లు. పెరుగుతున్న కోడి గుడ్డు ధరను సొమ్ము చేసుకునేందుకు కొందరు ఈ ‘గుడ్ల గుటకాయస్వాహ’పథకానికి వ్యూహ రచన చేశారు. అనుకున్నదే తడవుగా ఒకే దెబ్బకు 1,00,000కుపైగా గుడ్లను కొట్టేశారు. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని గ్రీన్‌క్యాసెల్ నగరంలో పీట్ అండ్ గ్యారీస్ ఆర్గానిక్స్ ఎల్ఎల్సీ సంస్థకు చెందిన లారీ నుంచి దొంగలు ఈ గుడ్లను దొంగతనం చేశారు. వీటి విలువ దాదాపు రూ.35 లక్షలు. కొండెక్కుతున్న గుడ్డు ధర ఎవరైనా కోళ్లను దొంగతనం చేస్తారు. వీళ్లేంటి కోడిగుడ్ల వెంట పడ్డారని అనుమానం రావొచ్చు. ఇందుకు రెండు కారణాలున్నాయి. ఒకటి బర్డ్‌ఫ్లూ. రెండోది పెరుగుతున్న గుడ్ల ధర. అమెరికాలో గత రెండేళ్లుగా పలు ప్రాంతాల్లో బర్డ్‌ఫ్లూ ప్రభావం నెమ్మది నెమ్మదిగా పెరుగుతూ వస్తోంది. గత దశాబ్దకాలంలో ఇంతటి విస్తృత స్థాయిలో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ వ్యాపించడం ఇదే తొలిసారి. గతనెల లూసియానాలో మనుషులకు సైతం ప్రాణాంతకరమైన స్థాయి వేరియంట్ బర్డ్‌ఫ్లూను కనుగొన్నారు. దీంతో పౌల్ట్రీ యజమానులు ప్రతి నెలా లక్షలాది కోళ్లను చంపేస్తున్నారు. ఈ దొంగలు నిజంగానే కోళ్లను కొట్టేసి అమ్మినా జనం ‘బర్డ్‌ఫ్లూ సోకిన కోళ్లు’అని భావించి ఎవరూ కొనక పోవచ్చు. బర్డ్‌ఫ్లూ భయంతో జనం చికెన్‌లాంటి పక్షి మాంసం వాడకం తగ్గించి చాలా మటుకు గుడ్లను తింటున్నారని తెలుస్తోంది. ఇందుకు పెరుగుతున్న కోడి గుడ్ల ధరలే ప్రబల తార్కాణం. మొత్తంగా చూస్తే కోడి గుడ్డు ధర రెట్టింపు అయినట్లు వార్తలొచ్చాయి. ఈ వార్తే దొంగలను గుడ్ల చోరీకి ఉసిగొల్పింది. దుకాణాల్లో పంపిణీ కోసం లారీలో సిద్ధంగా ఉంచిన గుడ్లను శనివారం రాత్రి ఆగంతకులు ఎత్తుకెళ్లిపోయారని పోలీసులు ప్రకటించారు. కేసు నమోదుచేసి గుడ్ల దొంగల కోసం పోలీసులు తీవ్రంగా గాలింపు చేపడుతున్నారు. అయితే దొంగలు ఈపాటికి గుడ్లను ఇష్టమొచ్చిన అధిక రేటుకు అమ్ముకుని మరో గుడ్ల షాపుపై రెక్కీ నిర్వహిస్తూ ఉంటారని కొందరు నెటిజన్లు సరదా వ్యాఖ్యల పోస్ట్‌లు పెట్టారు. గుడ్ల కొరత ఏర్పడటంతో గుడ్లతో చేసే వంటకాల ధరలూ రెస్టారెంట్లు, హోటళ్లలో పెరుగుతున్నాయి. అమెరికాలో 25 రాష్ట్రాల్లో దాదాపు 2,000 చోట్ల వ్యాపారం చేస్తున్న ప్రఖ్యాత వేఫుల్ హౌస్ రెస్టారెంట్ తమ గుడ్ల వంటకాల ధరను కాస్తంత పెంచింది. ‘‘మార్కెట్లో గుడ్లు దొరకట్లేవు. ఎక్కువ ఖరీదు పెట్టి కొంటున్నాం. అందుకే ఎక్కువ ధరకు అమ్ముతున్నాం’’అని రెస్టారెంట్ తాపీగా చెబుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
స్వచ్ఛమైన తేనెకు చిరునామా చిల్లకొండయ్యపల్లి
ఒక్కో ఊరికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఇది కూడా అలాంటి ఊరే. ఈ ఊరు పేరు చెబితే చాలు నోరూరుతుంది. తియ్యని పిలుపు రారమ్మంటుంది. అదే తాడిమర్రి మండలంలోని చిల్లకొండయ్యపల్లి (Chillakondaiahpalli). వర్షాభావ పరిస్థితుల్లో వ్యవసాయంతో నష్టపోయిన రైతులు (Farmers) ఉపాధి కోసం అడవి బాట పట్టారు. కొండ, గుట్టలెక్కుతూ తేనె (Honey) సేకరించి కుటుంబాలను పోషించుకుంటున్నారు.ఉదయమే సద్దిమూట కట్టుకుని అందరూ పొలం బాట పడితే సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం (Tadimarri Mandal) చిల్లకొండయ్యపల్లి యువకులు మాత్రం అడవిబాట పడతారు. కొండ, గుట్ట, చెట్టు, చేమ చుట్టేస్తూ సేకరించిన స్వచ్ఛమైన తేనెను విక్రయించి కుటుంబాలను పోషించుకుంటున్నారు. గ్రామంలోని 25 కుటుంబాలు తేనె సేకరణను ఉపాధిగా మలచుకున్నాయి. 15 ఏళ్లుగా... తేనె సేకరణే వృత్తిగాదాదాపు 15 సంవత్సరాలుగా తేనె సేకరణనే వృత్తిగా పెట్టుకుని చిల్లకొండయ్యపల్లి యువత జీవనం సాగిస్తోంది. అప్పట్లో వ్యవసాయ పనులు లేక పోవడంతో కుటుంబాన్ని పోషించుకునేందుకు కాటమయ్య అనే వ్యక్తి తొలిసారిగా తేనె సేకరణను ఉపాధిగా మార్చుకున్నాడు. అనంతరం అదే బాటలో కొందరు యువకులు పయనించారు. అయితే వీరు సేకరించిన తేనెకు సరైన మార్కెటింగ్ లేక ఇబ్బంది పడుతుండడంతో అప్పట్లో మహాత్మాగాంధీ యువజన సంఘం మండల అధ్యక్షుడిగా ఉన్న రామలింగప్ప స్పందించి, గిట్టుబాటు ధరతో తేనె కొనుగోలు చేసేలా చెన్నకొత్తపల్లిలోని ధరణి స్వచ్చంద సంస్థతో ఒప్పందం కుదిర్చాడు. ప్రస్తుతం సంస్థ కిలో తేనెను రూ.400 చొప్పున కొనుగోలు చేస్తుండగా... స్థానికంగానే ఇతరులకు రూ.500తో విక్రయిస్తూ ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కు తున్నారు. ఉమ్మడి జిల్లాలో చిల్లకొండయ్యపల్లి తేనెకు మంచి గిరాకీ ఉంది.అన్నం పెడుతున్న అడవి.. మండలంలోని దాడితోట బీట్ పరిధిలో కునుకుంట్ల, చిల్లవారిపల్లి, దాడితోట గ్రామాలతో పాటు పుట్లూరు మండలం ఎల్లుట్ల పరిధిలో సుమారు 3,534 హెక్టార్లలో రిజర్వు ఫారెస్టు విస్తరించి ఉంది. రిజర్వు ఫారెస్టులో అటవీ అధికారులు నారేపి, ఎర్రచందనం, తవసీ తదితర మొక్కలు భారీగా నాటారు. ఇప్పుడా మొక్కలు పెద్ద వృక్షాలై తేనెపట్టులకు ఆవాసాలుగా మారాయి. ఫలితంగా రిజర్వు ఫారెస్టు ఎందరికో ఉపాధి వనరుగా మారి అన్నం పెడుతోంది. ముంగార్ల కాలం అనువైనది.. తేనె సేకరణకు ముంగార్ల కాలం అనువైనది. జూన్ ప్రారంభంతో వర్షాలు కురుస్తాయి. ఈ సమయంలో అడవులు, తోటలు పచ్చదనం సంతరించుని పుష్పాలు వికసిస్తాయి. ఆ పుష్పాల్లోని మకరందం కోసం వచ్చే తేనెటీగలు సమీపంలోనే తేనెపట్టులను ఏర్పాటు చేసుకుంటాయి. ఏడాదిలో 9 నెలల పాటు తేనె సేకరణలో ఇక్కడి యువకులు నిమగ్నమవుతారు. నెలకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఆదాయం వస్తోందని చెబుతున్నారు.చదవండి: పెళ్లి మంటపాల్లో ‘డబ్బు’ వాద్యాలుతేనె సేకరణలో కష్టాలు ఎన్నో.. తేనె ఎంత రుచిగా ఉంటుందో దానిని సేకరించడమంటే అంతకు రెట్టింపు కష్టాన్ని చవిచూడాల్సి ఉంటుంది. అయినా చిల్లకొండయ్యపల్లి యువకులు కష్టాలను లెక్కచేయడం లేదు. కళ్లముందు తేనె పట్టు కనిపిస్తే చాలు వెంటనే సేకరణలో నిమగ్నమవుతారు. ఈ క్రమంలో ముళ్లకంపలు గుచ్చుకున్నా, తేనెటీగలు కుట్టినా తమ పట్టు మాత్రం వదలరు. ఎన్ని రక్షణ చర్యలు తీసుకున్నా... తేనెటీగలు కుట్టి తీవ్ర అస్వస్థతకు లోనైన సందర్భాలు ఎన్నో ఉన్నాయని యువత తెలుపుతోంది. -
తాపం తీర్చే అమృతభాండం
సాక్షి, అమలాపురం: మండు వేసవిలో దాహం తీర్చాలన్నా, వేడెక్కిన శరీరాన్ని చల్లబరచాలన్నా, అనారోగ్యం బారిన పడితే త్వరగా కోలుకోవాలన్నా వెంటనే గుర్తుకు వచ్చేది కొబ్బరి బొండాం. కొనుగోలుచేసేవారికే కాదు.. ఉత్పత్తి చేసే రైతులకు కూడా ఇది అమృత బాండమే. మార్కెట్ ఒడిదొడుకులతో సంబంధం లేకుండా ధరలు నిలకడగా ఉండటం, కాయ సేకరణ భారం లేకపోవడంతో కొబ్బరి రైతులు (Coconut Farmers) ఇదే తమకు మేలని భావిస్తుంటారు. వేసవి సమీపిస్తుండటంతో బొండాల ధరలపైన, ఎగుమతులపైన రైతులు భారీగా ఆశలు పెట్టుకుంటున్నారు. కొబ్బరి నీళ్లలో పోషకాలు, ఎలక్ట్రోలైట్లు అధికంగా ఉంటాయి. ఒక కొబ్బరి బొండాం (Coconut) ఒక సెలైన్‌తో సమానం. బొండాంలో దాదాపు 300 మిల్లీ గ్రాముల సోడియం ఉంటుంది. శరీరానికి రోజుకు సరిపడా సోడియంను ఇది అందిస్తుంది. దీనిలో పొటాషియం, కాల్షియం, పాస్పరస్ కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇది తక్షణం శక్తిని ఇస్తుంది. ఇటీవలి కాలంలో బొండాం తాగేవారి సంఖ్య పెరిగింది. దీంతో ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి కొబ్బరి బొండాల ఎగుమతులు పెరిగాయి.మన రాష్ట్రంతో పాటు పొరుగునే ఉన్న తెలంగాణలోని ప్రధాన పట్టణాలకు ఇక్కడి నుంచి కొబ్బరి బొండాలు ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి. కొబ్బరి బొండాలకు ఒకప్పుడు వేసవి (Summer) మాత్రమే సీజన్‌గా ఉండేది. ఇప్పుడు ఏడాది పొడవునా ఎగుమతులు జరుగుతున్నాయి. ఏలూరు జిల్లాలో దెందులూరు, చింతలపూడి, జంగారెడ్డి గూడెం, తూర్పు గోదావరి జిల్లా పరిధిలో చాగల్లు, కొవ్వూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు, తాడేపల్లిగూడెం, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట, కాకినాడ జిల్లాలో ఏలేశ్వరం, తుని పరిసర ప్రాంతాల నుంచి బొండాల ఎగుమతి ఎక్కువగా జరుగుతుంది. ప్రస్తుతం రోజుకు 50 లారీలకు పైగా ఎగుమతి అవుతుండగా, వేసవి సీజన్లో రోజుకు 100 లారీల వరకు కొబ్బరి బొండాల ఎగుమతి జరుగుతుంది. ప్రస్తుతం రైతుల వద్ద ఒక్కో కొబ్బరి బొండాం ధర రూ. 12 పలుకుతోంది. కొబ్బరి కాయ ధర రూ. 14 నుంచి రూ. 15 పలుకుతోంది. దీని వల్ల బొండాం అమ్మకాలకన్నా రైతులు కాయపై దృష్టి పెట్టారు. సాధారణంగా కొబ్బరి కాయ కన్నా బొండాం ధర రూ.4 నుంచి రూ. 5 ఎక్కువ ఉంటుంది. చదవండి: పల్లె పిల్లలూ ‘స్మార్టే’! » మార్చి నుంచి కొబ్బరి బొండాలకు వేసవి సీజన్ మొదలవుతుంది. కొబ్బరి కాయకు ఇప్పుడున్న ధర మరికొద్దిరోజులు ఉంటే బొండాం ధర రూ.18 నుంచి రూ.20 వరకు చేరుతుంది. కాని దిగుబడి అధికంగా ఉండటం వల్ల బొండానికి ధర తగ్గే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. » కాయతో పోల్చుకుంటే బొండాం అమ్మకాలే రైతులకు లాభసాటిగా ఉంటాయి. బొండాం ఆరు నుంచి ఎనిమిది నెలలకు తయారవుతుంది. అదే కొబ్బరికాయ పక్వానికి రావడానికి సుమారు 12 నెలలు పడుతుంది. కాయతో పోల్చితే బొండాల వల్ల రైతులు త్వరితగతిన ఉత్పత్తి అందుకుంటారు. » కొబ్బరి కాయ రైతులే సేకరించాలి. దింపు, పోగువేత, రాశులు పోయడం ఇలా కాయకు రెండు రూపాయల వరకు ఖర్చవుతుంది. అదే బొండాలను వ్యాపారులే సొంత ఖర్చులు పెట్టుకుని దింపించుకుంటారు. దీంతో రైతులకు సేకరణ ఖర్చు తగ్గుతుంది. -
పల్లె పిల్లలూ ‘స్మార్టే’!
సాక్షి, అమరావతి: గ్రామీణ భారతంలో పిల్లలు కూడా ‘స్మార్ట్’గా తయారవుతున్నారు. స్మార్ట్ ఫోన్లు ఉపయోగించడంలో ఆరితేరిపోతున్నారని యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్(ఏఎస్ఈఆర్) వెల్లడించింది. గ్రామీణ గృహాల సర్వేలో భాగంగా ఇటీవల నిర్వహించిన ఏఎస్‌ఈఆర్‌లో పిల్లలకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను గుర్తించారు. దేశంలోని 605 జిల్లాల్లో 17,997 గ్రామాల్లోని 14 నుంచి 16 ఏళ్ల మధ్య వయసు ఉన్న 6,49,491 మంది నుంచి వివరాలు సేకరించారు. అందుబాటులో స్మార్ట్ ఫోన్లు, సొంతంగా స్మార్ట్ ఫోను కలిగి ఉండటం, వాటి ఉపయోగం, డిజిటల్ పరిజ్ఞానం తదితర అంశాలపై ప్రశ్నావళితో ఈ సర్వే నిర్వహించారు. ఏఎస్ఈఆర్ సర్వేలోని ప్రధాన అంశాలు» గ్రామీణ ప్రాంతాల్లో 14 నుంచి 16ఏళ్ల వయసులో ఉన్నవారిలో 90 శాతం మందికి స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. వారిలో 82 శాతం మందికి స్మార్ట్ ఫోన్లను ఎలా వాడాలో పూర్తిగా తెలుసు. » ఇక 14ఏళ్ల వయసు వారిలో 27 శాతం మందికి, 16ఏళ్ల వయసు వారిలో 37.8 శాతం మందికి సొంతంగా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. మిగిలిన వారు తమ కుటుంబ సభ్యుల స్మార్ట్ ఫోన్లను ఉపయోగిస్తున్నారు. » అమ్మాయిల కంటే అబ్బాయిలకు కాస్త ఎక్కువగా సొంతంగా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. 36.2 శాతం మంది అబ్బాయిలకు సొంతంగా స్మార్ట్ ఫోన్లు ఉండగా... 26.9% అమ్మాయిలకే సొంత స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. » సోషల్ మీడియా ఖాతాలను ఫాలో కావడానికి 78.8% మంది అబ్బాయిలు, 73.4శాతం మంది అమ్మాయిలు స్మార్ట్ఫోన్లను వాడుతున్నారు. » విద్యా సంబంధమైన విషయాల కోసం 57 శాతం మంది స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారు. ఈ విషయంలో కేరళ రాష్ట్రం మెరుగ్గా ఉంది. ఆ రాష్ట్రంలో 90 శాతం మంది సోషల్ మీడియా ఖాతాల కోసం స్మార్ట్ ఫోన్లను వాడుతుండగా... 80 శాతం మంది విద్యా సంబంధమైన విషయాలు తెలుసుకునేందుకు ఉపయోగిస్తున్నారు. » డిజిటల్ భద్రతపై కూడా గ్రామీణ పిల్లలకు సరైన అవగాహన ఉంది. 62 శాతం మంది పిల్లలకు ఖాతాలను బ్లాక్ చేయడం, ఫేక్ ప్రొఫైల్‌లను రిపోర్ట్ కొట్టడం తెలుసు. ఇక 55.2 శాతం మందికి తమ ప్రొఫైల్‌ను ప్రైవేటుగా ఉంచడం గురించి పూర్తి అవగాహన ఉంది. 57.7 శాతం మందికి పాస్‌వర్డ్‌లను మార్చడం తెలుసు. » పూర్తి డిజిటల్ టాస్్కల గురించి కూడా గ్రామీణ విద్యార్థులకు సరైన అవగాహన ఉంది. అలార్మ్ సెట్ చేయడం, సమాచారం కోసం అన్వేషించడం, యూ ట్యూబ్ చానళ్లను లొకేట్ చేయడం గురించి 70.2 శాతం మంది అబ్బాయిలకు, 62.2% మంది అమ్మాయిలకు పూర్తి పరిజ్ఞానం ఉంది. » స్మార్ట్ ఫోన్ల పరిజ్ఞానంలో అబ్బాయిల కంటే అమ్మాయిలు కాస్త వెనుకబడి ఉన్నారు. కానీ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో మాత్రం అబ్బాయిలతో సమానంగా, కొన్ని అంశాల్లో ఎక్కువగానే అమ్మాయిలకు స్మార్ట్ ఫోన్ల పరిజ్ఞానం ఉండటం విశేషం. గణనీయంగా పెరిగిన చదువుకున్న తల్లిదండ్రులు» ఏఎస్‌ఈఆర్‌లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో 3 నుంచి 8 ఏళ్ల పిల్లల తల్లిదండ్రులపై చేసిన అధ్యయనంలోనూ పలు ఆసక్తికర అంశాలు గుర్తించారు. » చదువుకున్న తల్లిదండ్రుల శాతం పదేళ్లలో గణనీయంగా పెరిగింది. » కనీసం ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన తల్లుల శాతం 2014లో 43 శాతం ఉండగా... 2024 నాటికి 64 శాతానికి పెరిగింది. ఇక ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన తండ్రులు 2014లో 61 శాతం ఉండగా, 2024 నాటికి 72శాతానికి పెరిగింది. » గ్రామీణ ప్రాంతాల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరుశాతం కూడా మెరుగుపడుతోంది. 2018లో విద్యార్థుల హాజరుశాతం 72.4శాతం ఉండగా, 2024 నాటికి 75.9 శాతానికి పెరిగింది. » ఉపాధ్యాయుల హాజరు శాతం 2018లో 85.1 శాతం ఉండగా, అది 2024 నాటికి 87.5 శాతానికి పెరిగింది. చదవండి: అప్పులే సరి.. సంపద ఎక్కడమరి?90% గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్న పిల్లలు74% సోషల్ మీడియా కోసమే స్మార్ట్ ఫోన్లు వాడుతున్నవారు75% చదువు కోసం స్మార్ట్ ఫోన్ వాడుతున్నవారు82% గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్ ఫోన్ వినియోగం తెలిసిన పిల్లలు -
అంతటా కడుపు ‘కోతే’!
సాధారణ ప్రసవాల సంఖ్య తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా తగ్గుతోంది. కాసుల కోసం ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆపరేషన్లు చేస్తున్నారనే ఆరోపణలు ఉండగా, ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ సిజేరియన్లే ఎక్కువగా నమోదవుతున్నాయి. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంత ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిజేరియన్లు (Cesarean) పెరిగాయి. సాధారణ ప్రసవాలపై వైద్యారోగ్య శాఖ అధికారులు అవగాహన కల్పించాల్సి ఉన్నా, ఆ దిశగా చర్యలు లేవు. గత ప్రభుత్వ హయాంలో సాధారణ ప్రసవాల పెంపునకు మొదలుపెట్టిన మిడ్‌వైవ్స్ (Midwife) సేవలు ఇప్పుడు నామమాత్రమయ్యాయి.అమ్మో సాధారణ ప్రసవమా?సాధారణ ప్రసవాల విషయంలో నొప్పులు అనుభవించాల్సి వస్తుందనే ఉద్దేశంతో కొందరు గర్భిణులు విముఖత చూపుతున్నారు. కొందరు వైద్యులు సిజేరియన్లతో భవిష్యత్‌లో సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నా పట్టించుకోవడం లేదు. శిశువు తలకిందులుగా ఉన్నప్పుడు, పెద్దగా ఉన్నప్పుడు శస్త్రచికిత్స అవసరమవుతుంది. అయితే, సాధారణ ప్రసవంతో త్వరగా దినచర్యలో భాగం కావొచ్చని, సిజేరియన్లతో దీర్ఘకాలంలో ఇబ్బందులు తలెత్తుతాయని చెబుతున్నా, గర్భిణులు, వారి కుటుంబసభ్యులు ఆపరేషన్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. మిడ్‌వైవ్స్ అంతంతేప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలను పెంచేందుకు గత ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే 2019లో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మిడ్‌వైవ్స్ సేవలను ప్రారంభించి 30 మందికి శిక్షణ ఇవ్వగా, వీరు గర్భిణులకు సాధారణ ప్రసవంతో లాభాలను వివరించి వ్యాయామాల ద్వారా ప్రసవాలకు సిద్ధం చేసేవారు. ప్రస్తుతం పలు ఆస్పత్రుల్లో సిబ్బంది కొరతతో ఇప్పుడా సేవలు అందుబాటులో లేవు. అవగాహన కల్పించక..గర్భిణిగా నమోదైనప్పటి నుంచి కాన్పు అయ్యే వరకు ప్రభుత్వ ఆస్ప త్రిలో వైద్య సేవలు పొందితే వారి ఆరోగ్యంపై డాక్టర్లకు అవగాహన ఉంటుంది. అలా కాకుండా డెలివరీ సమయంలోనే వస్తుండడంతో ఏదో ఒక సమస్య తలెత్తగానే ఆపరేషన్ చేస్తున్నారు. వైద్యారోగ్య శాఖ అధికారులు కూడా సాధారణ ప్రసవాలతో కలిగే లాభాలపై అవగాహన కల్పిస్తే ప్రయోజనం ఉంటుందని తెలిసినా, ఆ దిశగా ప్రయత్నించడం లేదు. » భద్రాచలం ఏరియా ఆస్పత్రిని పరిశీలిస్తే షిఫ్ట్‌కు ఎనిమిది మంది చొప్పున మూడు షిఫ్ట్‌ల్లో 24 మంది సిబ్బంది ఉండాలి. కానీ ఐదుగురే ఉన్నారు.» ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఏరియా ఆస్పత్రిలోనూ 8 నెలలుగా మిడ్‌వైవ్స్ సేవలు నామమాత్రమయ్యాయి. ఇక్కడ నలుగురు సిబ్బంది చేయాల్సిన మిడ్‌వైవ్స్ సేవలు ఇద్దరే చేస్తున్నారు. కుటుంబ సభ్యుల సహకారంఉండటం లేదు.. ప్రసవం కోసం భద్రాచలం ఏరియా ఆస్పత్రిలోచేరిన గర్భిణులకు సాధారణ ప్రసవం చేసేందుకే ప్రయత్నిస్తున్నాం, కానీ వారి కుటుంబసభ్యులనుంచి సహకారం ఉండటం లేదు. గర్భిణి కొద్దిసేపు నొప్పులు తట్టుకోలేకపోవడంతో కుటుంబ సభ్యులు మాపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో సాధారణ ప్రసవాల సంఖ్య తగ్గుతోంది. - డాక్టర్ రామకృష్ణ, సూపరింటెండెంట్, ఏరియా ఆస్పత్రి, భద్రాచలం.బిడ్డకు హార్ట్‌బీట్ ఎక్కువగా ఉందని.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన సత్యవతికి గతనెల 31న పురిటి నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తీసుకొస్తే పరీక్షలు చేసిన వైద్యులు బిడ్డ హార్ట్‌బీట్ ఎక్కువగా ఉందని చెప్పారు. ఆ వెంటనే ఆపరేషన్‌కు నిర్ణయించి సత్యవతికి సిజేరియన్ చేయగా మగ బిడ్డకు జన్మనిచ్చింది.- సత్యవతి,మణుగూరు,భద్రాద్రికొత్తగూడెం జిల్లా -
అదీనమా?.. పరాధీనమా?
సాక్షి ప్రతినిధి, వరంగల్: భూములను గుర్తించడంలో అధికారుల కాలయాపన వల్ల అటవీ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. పర్యావరణం, జీవవైవిధ్యానికి దోహదపడాల్సిన సామాజిక అడవుల పెంపకం ఆగిపోగా.. ఆ భూములు సైతం ఆక్రమణలకు గురయ్యాయి. రెవెన్యూ, అటవీశాఖల్లోని కొందరు అధికారుల ఉదాసీనత వల్ల అడవులు (Forest) పెరిగిన భూములు సైతం ఆక్రమణదారుల పేరిట రిజిస్ట్రేషన్ కాగా.. వారు ‘రైతుబంధు’ను సైతం పొందుతున్నారు. ఉమ్మడి వరంగల్‌లో పలుచోట్ల ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోగా, తెలంగాణ (Telangana) వ్యాప్తంగా అటవీ భూముల ఆక్రమణల వివాదాలున్నాయి. చాలాచోట్ల కోర్టుల ద్వారా పరిష్కారమయ్యాయి. భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలో 106.34 ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తులది కాదని.. అది అటవీ భూమేనని సుప్రీంకోర్టు సుమారు ఆరు నెలల కిందట తీర్పు ఇచ్చింది. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలో ఇనుపరాతి గుట్టల చుట్టూ ఆక్రమణలకు గురైన అటవీ భూములపై రెవెన్యూ, అటవీశాఖలు ఎటూ తేల్చడం లేదు. సర్వేల పేరిట సాగదీత నేపథ్యంలో రూ.కోట్ల విలువైన అటవీ భూములు స్వాదీనం చేసుకుంటారా? పరాదీనమవుతాయా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల సాయంతోనే యథేచ్ఛగా ఆక్రమణలు.. హనుమకొండ జిల్లా ధర్మసాగర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, వేలేరు మండలాల శివార్లలోని ఇనుపరాతి గుట్టల చుట్టూ అటవీశాఖ లెక్కల ప్రకారం 3,952 ఎకరాలు ఉంది. నిజాంకాలంలో మొత్తం 4 వేల ఎకరాలకుపైగా భూమిని అటవీశాఖకు అప్పగించినట్టు రికార్డుల్లో ఉంది. కొత్తపల్లి బ్లాక్‌లో 594 ఎకరాలు, దామెరలో 560, ఎర్రబెల్లిలో 820, దేవనూరులో 1,095, ముప్పారం బ్లాక్‌లో 906 ఎకరాలుగా ఉంది. కాలక్రమంలో రెవెన్యూ అధికారుల తీరు వల్ల అటవీ భూమికి చుట్టుపక్కల పట్టాలు పుట్టుకొచ్చాయి. ఈ వ్యవహారంపై కొన్నేళ్లుగా రెవెన్యూ, అటవీశాఖలు కలిసి సర్వే పేరుతో కాలయాపన చేస్తుండటంతో ఇంకా ప్రైవేటు వ్యక్తులు యథేచ్ఛగా ఆక్రమిస్తూ పట్టాలు చేసుకుంటున్నారు. రెవెన్యూ అధికారులు కొందరు సర్వేనంబర్లకు బై నంబర్లు వేసి పట్టాదారు పాసుపుస్తకాలు కూడా అందజేస్తున్నారు. గతంలో పనిచేసిన ఓ రెవెన్యూ అధికారి ఏకంగా 40 ఎకరాలకు పట్టాలు ఇచ్చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. 30 ఎకరాల వరకు ధర్మారం మండలంలోని అటవీ శివారుల్లోని భూములు కూడా కబ్జాదారుల చేతుల్లో ఉన్నాయి. పల్లగుట్ట, చాకలిగుట్ట, ఎదురుగుట్ట, పందిఅడుగుగుట్ట పరిధిలోని భూములు కొందరి కబ్జాలో ఉన్నాయి. ఏడాది క్రితం 102 ఎకరాలు కొందరికి పట్టా చేసేందుకు ప్రయత్నాలు జరగ్గా.. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో ఉన్నతాధికారులు చెక్ పెట్టారు. అయినా 40 ఎకరాల వరకు పట్టా అయ్యిందని చెబుతున్నారు. కాగా కొన్నేళ్లుగా ఈ భూములను పట్టాలు చేసుకుంటున్నవారిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులే ఎక్కువగా ఉండగా.. కొందరు ఫారెస్టు, రెవెన్యూ అధికారుల ప్రమేయంతోనే వారి రంగప్రవేశం జరిగిందన్న చర్చ సాగుతోంది. ఇదిలా వుండగా ఈ స్థలాల్లోని కొన్ని సర్వే నంబర్లలో దశాబ్దాల కిందట కొందరు చిన్న సన్నకారు రైతులకు ప్రభుత్వం భూములను అసైన్డ్ చేయగా, వారికి సైతం రెవెన్యూ అధికారులు సాగు చేసుకునేందుకు హద్దులు నిర్ణయించి ఇవ్వడం లేదు. కబ్జాదారులకు మాత్రం ముడుపులు తీసుకుని చకచకా పట్టాలు చేసేయడం వల్ల పట్టాదారులు ఇబ్బంది పడాల్సి వస్తుందంటున్నారు.తెలంగాణలో తగ్గిన అటవీ విస్తీర్ణం.. ‘ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్టు– 2023’ప్రకారం తెలంగాణలో 2021–23 మధ్యకాలంలో 100.42 చదరపు కిలోమీటర్లు అటవీ విస్తీర్ణం తగ్గింది. 2021లో 21,279.46 చ.కి.మీ.లు ఉన్న రాష్ట్ర అటవీ విస్తీర్ణం.. 2023 నాటికి 21,179.04కు తగ్గింది. ఈ తరుగుదలలో మధ్యప్రదేశ్ (371.54 చ.కి.మీ.లు), ఆంధ్రప్రదేశ్ (138.66 చ.కి.మీ.లు) తర్వాత స్థానంలో తెలంగాణ ఉంది. రాష్ట్రంలోని 33 జిల్లాలకుగాను 13 జిల్లాల్లో అటవీ విస్తీర్ణం తగ్గగా 20 జిల్లాల్లో పెరిగినట్లు నివేదిక పేర్కొంది. తగ్గిన 13 జిల్లాలలో మహబూబాబాద్‌లో 26.98 చ.కి.మీ.లు, ములుగులో 25.91 చ.కి.మీ.లు, జయశంకర్ భూపాలపల్లిలో 15.43 చ.కి.మీ.లు, వరంగల్‌లో 2.51 చ.కి.మీ.లు, జనగామలో 2.13 చ.కి.మీ.లు తగ్గింది.‘ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్టు– 2023’ప్రకారం తెలంగాణలో 2021–23 మధ్యకాలంలో 100.42 చదరపు కిలోమీటర్లు అటవీ విస్తీర్ణం తగ్గింది. 2021లో 21,279.46 చ.కి.మీ.లు ఉన్న రాష్ట్ర అటవీ విస్తీర్ణం.. 2023 నాటికి 21,179.04కు తగ్గింది. ఈ తరుగుదలలో మధ్యప్రదేశ్ (371.54 చ.కి.మీ.లు), ఆంధ్రప్రదేశ్ (138.66 చ.కి.మీ.లు) తర్వాత స్థానంలో తెలంగాణ ఉంది. రాష్ట్రంలోని 33 జిల్లాలకుగాను 13 జిల్లాల్లో అటవీ విస్తీర్ణం తగ్గగా 20 జిల్లాల్లో పెరిగినట్లు నివేదిక పేర్కొంది. తగ్గిన 13 జిల్లాలలో మహబూబాబాద్‌లో 26.98 చ.కి.మీ.లు, ములుగులో 25.91 చ.కి.మీ.లు, జయశంకర్ భూపాలపల్లిలో 15.43 చ.కి.మీ.లు, వరంగల్‌లో 2.51 చ.కి.మీ.లు, జనగామలో 2.13 చ.కి.మీ.లు తగ్గింది.ధర్మసాగర్ మండలం దేవునూర్ శివారులోని ప్రభుత్వ నోటిఫికేషన్లో ఉన్న భూములు, నోటిఫికేషన్లో లేని భూములు గుర్తించాం. ఆ భూముల్లో సాగు చేస్తున్న రైతుల వివరాలు సేకరించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. దీనిపై ఉన్నతాధికారుల ఆదేశానుసారం నిర్ణయం తీసుకుంటాం. దేవునూర్, ముప్పారం గ్రామాల శివారులోని ఇనుపరాతి గుట్టల్లో ఫారెస్ట్ అధికారులకు– రైతులకు మధ్య జరుగుతున్న వివాదం పరిష్కారమయ్యేలా ఫారెస్ట్ భూములు, రైతుల పట్టా భూములు సర్వే చేశాం. – బి.సదానందం, తహసీల్దార్, ధర్మసాగర్, హనుమకొండ జిల్లా సర్వే వివరాలు అందాల్సి ఉంది.. ఇనుపరాతి గుట్టలు, నాలుగు మండలాల పరిధిలో ఉన్న సర్వే ఇంకా కొంతమేర మిగిలి ఉంది. ధర్మసాగర్ మండలంలోని ముప్పారం, దేవనూరు, వేలేరు మండలంలోని ఎర్రబెల్లి, భీమదేవరపల్లి మండలంలోని కొత్తపల్లి, ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామాల శివారులో ఇనుపరాతి గుట్టలు ఉన్నాయి. మొత్తం ఫారెస్ట్ భూమి 3,750 ఎకరాలకుపైన ఉండాలి. ఈ భూమికి రెవెన్యూ అధికారులు హద్దులు ఏర్పాటు చేసి ఇస్తే ఫారెస్ట్ అధికారులు ఆ భూముల చుట్టూ ఫెన్సింగ్ చేస్తారు. జిల్లా ఉన్నతాధికారులు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. – భిక్షపతి, ఫారెస్ట్ రేంజ్ అధికారి, ధర్మసాగర్, హనుమకొండ జిల్లా -
పెళ్లి మంటపాల్లో ‘డబ్బు’ వాద్యాలు
‘మ్యారేజెస్ ఆర్ మేడిన్ హెవెన్’ అన్నమాట ఎంతవరకు నిజమో కానీ పెళ్లి వేడుకకు ఆకాశమే హద్దుగా మారిందన్నది మాత్రం వంద శాతం నిజం! కిందటేడు అంటే 2024లో ఒక్క నవంబర్, డిసెంబర్ నెలల్లోనే 4.8 లక్షల పెళ్లిళ్లయ్యాయి. అవి ఆరు లక్షల కోట్ల వ్యాపారం చేశాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ నివేదిక! దీని ప్రకారం ఈ మొత్తం 4.8 లక్షల్లో రూ. 3 లక్షల నుంచి రూ. కోటి వరకు ఖర్చు పెట్టిన వివాహాలున్నాయి. ఈ లెక్క చూశాక తెలిసింది కదా.. పెళ్లి ఖర్చుకు ఆకాశమే హద్దు అని! ఆచార సంప్రదాయాలు, వ్యవహారాలు, పెట్టుపోతలు ఇవన్నీ ఆడంబరాలుగా మారి పెళ్లిఖర్చును పెంచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెళ్లి అనేది ఒక పెద్ద పరిశ్రమగా మారిపోయింది. జనవరి 30 నుంచి పెళ్లి ముహూర్తాలు మొదలయ్యాయి. మార్చి 10 వరకు సందడే సందడి! ఆ సందర్భంగా మ్యారేజ్ ఇండస్ట్రీ, మధ్యతరగతి (Middle Class) మీద ప్రభావం వంటివి స్పృశిస్తూ ఒక కథనం..మన దేశంలో సగటు వివాహ ఖర్చు.. ఒక ఇంటి ఏడాది ఆదాయం కంటే మూడు రెట్లు ఎక్కువ! అది మన దేశ వెడ్డింగ్ ఇండస్ట్రీని (Wedding Industry) దాదాపు రూ. లక్షాపదమూడు కోట్లతో ప్రపంచంలోని అతిపెద్ద పరిశ్రమల్లో ఒకటిగా చేర్చింది. ఇది అమెరికా వెడ్డింగ్ మార్కెట్ (US Wedding Market) కన్నా రెండింతలు పెద్దది. కోవిడ్ తర్వాత పెళ్లి వ్యయం మరింత ప్రియం అయింది. అతిథుల సంఖ్య తగ్గింది. కానీ ఖర్చు నయా పైసా కూడా తగ్గలేదు. ఇదివరకు ఆడపిల్ల పెళ్లంటే బంధువులు, స్నేహితులు అన్నిరకాలుగా అండగా నిలిచి ఉన్నదాంట్లో ఆ వేడుకను సంప్రదాయబద్ధంగా జరిపించి తల్లిదండ్రులు తేలికపడేలా చేసేవారు. మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వారైతే ఇల్లు వాకిలి, పొలమూ పుట్రా అమ్మడమో, తాకట్టు పెట్టడమో చేసి పెళ్లి జరిపించేవారు.అప్పుడు వరకట్నాలు లాంఛనాలు, బంగారం కిందే జమయ్యేవి. ఇప్పుడా సీన్ మారిపోయింది. అమ్మాయిలూ ఉద్యోగాలు చేస్తున్నారు. పర్ఫెక్ట్ ప్లాన్‌తో ఉంటున్నారు. ఆ ప్రణాళికలో పెళ్లికీ ప్రయారిటీ ఇస్తున్నారు. హల్దీ, మెహందీ, సంగీత్, పెళ్లి కూతురు– పెళ్లికొడుకు సహా పెళ్లిని అయిదు రోజుల ఈవెంట్స్‌తో ఘనంగా జరిపించుకోవాలనుకుంటున్నారు. ఫొటోలు, వీడియోలే కాదు సోషల్ మీడియా షాట్స్, రీల్స్గానూ ప్రెజెంట్ చేయాలనుకుంటున్నారు.వీటన్నిటి ఖర్చు కోసం కొలువు తొలిరోజు నుంచే ఆదా చేయడం మొదలు పెడ్తున్నారు. అలా పెళ్లి ఖర్చును అమ్మాయిలు తమ ఖాతాలో వేసుకుంటున్నారు. కట్నకానుకలను మాత్రం తల్లిదండ్రులు తమ బాధ్యతగా భావిస్తున్నారు. అవి స్థిర, చరాస్తులుగా రూపాంతరం చెందాయి. అమ్మాయి పేరు మీదే ఉంటున్నాయి. అవీ పెళ్లి ఖర్చులో భాగమయ్యి, తల్లిదండ్రులు పెట్టే ఖర్చుల జాబితాలో చేరుతున్నాయి. అయితే ఇవి మ్యారేజ్ ఇండస్ట్రీలో కలవని అదనపు ఖర్చన్నమాట. బ్యాచిలర్.. బ్యాచిలరేట్ పార్టీలు కూడా.. దేశంలో సగటు మధ్యతరగతి కుటుంబం కూడా పెళ్లి మీద భారీగా ఖర్చుపెడుతోందంటోంది సీఏఐటీ సర్వే! తెలుగు రాష్ట్రాల్లో అయితే అది కనిష్టంగా రూ. 30 లక్షలు. పెళ్లి వేదిక, వచ్చే అతిథుల సంఖ్య, వంటకాల సంఖ్య, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, సోషల్ మీడియా రీల్స్, షాట్స్ వగైరాలను బట్టి ఈ బడ్జెట్ పెరుగుతుంది. డెస్టినేషన్ వెడ్డింగ్ (Destination Wedding) అయితే అది రూ. కోటి దాటుతోంది. ఈ ΄్యాకేజ్లో బ్యాచ్‌లర్, బ్యాచ్లరెట్ ట్రిప్స్ కూడా ఉన్నాయి.ఇప్పుడు పెళ్లి ఖర్చును వధూవరులిద్దరూ సమంగా పెట్టుకునే ఆనవాయితీ మొదలైంది. ఇది ఒకందుకు మంచి పరిణామంగానే భావించినా.. అసలు పెళ్లనేది వ్యక్తిగత లేదా రెండు కుటుంబాలకు చెందిన వ్యవహారం. దానికి అంతంత ఖర్చుపెట్టాల్సిన అవసరం ఏముందని అబీప్రాయపడుతున్నారు సోషల్ ఇంజినీర్స్. ఫలానా వాళ్ల పిల్లల పెళ్లి కన్నా గొప్పగా తమ పిల్లల పెళ్లి చేయాలని తల్లిదండ్రులు, తమ స్నేహితులు.. కొలీగ్స్ కన్నా ఘనమనిపించుకోవాలని వధూవరులు.. పోటీలకు పోతూ, ఉన్న సేవింగ్స్ అన్నీ ఊడ్చేసుకుని.. అప్పులు కూడా తెచ్చుకుని మరీ పెళ్లి చేస్తున్నారు.. చేసుకుంటున్నారు.ఎస్బీఐ సహా పేరున్న ప్రైవేట్ బ్యాంకులన్నీ పెళ్లిళ్లకు లోన్స్ ఇస్తున్నాయి. పర్సనల్ లోన్ ఖాతాను పెంచడంలో వీటి పాత్ర గణనీయం. కస్టమ్ వెడ్డింగ్ లోన్ప్రోడక్ట్స్ బ్యాంకుల డిమాండ్‌నూ పెంచుతున్నాయి. ఈ అప్పులను తీర్చడానికి ఉన్న ఆస్తులను అమ్ముకుంటున్నారు. తల్లిదండ్రులు ప్రభుత్వోద్యోగులైతే ఆ అప్పులు తీర్చడానికి అవినీతికి పాల్పడిన దాఖలాలూ ఉన్నాయంటున్నారు సోషల్ ఇంజినీర్స్. ఈ అప్పులతో కొత్త పెళ్లిజంట మధ్యలో కూడా స్పర్థలు వచ్చి విడాకుల దాకా వెళ్లిన సంఘటనలూ ఉన్నాయని చెబుతున్నారు.ఇవీ ఉన్నాయి.. ఈ ఘనమైన మాయకు ఇరుగు పొరుగు, బంధుగణం, తోటివాళ్లే కాదు సినిమాలు, సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లూ బాధ్యులు. ‘మురారి’ సినిమా వచ్చిన కొత్తలో మాట.. ఒక ప్రోగ్రెసివ్ కుటుంబంలోని అమ్మాయి ‘మురారీ’ సినిమాలో పెళ్లి సీన్స్‌కి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి.. తన పెళ్లి ఆ సినిమాలో చూపించినట్టే జరగాలని పట్టుబట్టి మరీ ఆ తరహాలోనే పెళ్లి చేసుకుంది. తల్లిదండ్రులు తమ అమ్మాయి పెళ్లికోసం అప్పట్లోనే అయిదు లక్షల రూపాయలు అప్పు చేయాల్సి వచ్చింది. ఇందులో బాలీవుడ్ పాత్రా ఉంది. ఈ మెహందీ, హల్దీ, సంగీత్, డిజైనర్ వేర్ వంటివన్నీ దాని పుణ్యమే! వెడ్డింగ్ ప్లానర్స్, డెస్టినేషన్ వెడ్డింగ్స్, థీమ్ థింగ్స్, ప్రీ వెడ్డింగ్ షూట్, రీల్స్, షాట్స్ లాంటి వాటన్నిటికీ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, ఓటీటీ సిరీస్‌ల ప్రభావం కారణమంటున్నారు ట్రెండ్ ఎనలిస్ట్‌లు.వృథా కూడా అదే స్థాయిలో!ఐక్యరాజ్యసమితి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ) ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.7 బిలియన్ టన్నులు అంటే మనిషి పండించే పంటలో మూడొంతులు వృథా అవుతోందట. ఈ వృథాలో అధిక వాటా పెళ్లిళ్లు లాంటి వేడుకలదే! అందులో మనమేం తక్కువలేం! ఈ వృథా వల్ల ఇంకొకరి ఆహారపు హక్కును మనం హరించినట్టే! అంతేకాదు.. ఈ ట్రెండ్ ధరలనూ ప్రభావితం చేసి నిత్యవసరాలను అందుకోలేనంత ఎత్తులో పెట్టేస్తోంది. ఇకో ఫ్రెండ్లీ యువత అంతా లగ్జరీ వైపే చూస్తోందని ఆందోళన చెందక్కర్లేదు. పెళ్లనేది పూర్తి వ్యక్తిగత వ్యవహారంగా భావించి రిజిస్టర్ మ్యారేజ్‌తో ఒక్కటవుతున్న జంటలూ ఉన్నాయి. తమ పెళ్లికి ఆత్మీయులు, సన్నిహితుల ఆశీస్సులు అవసరమనుకునేవారు దాన్ని కుటుంబ వేడుకకే పరిమితం చేసుకుంటున్నారు. అనవసర ఖర్చు లేకుండా, స్థానికంగా దొరికే వస్తువులతోనే పర్యావరణహితంగా మలచుకుంటున్నారు. ఈ జంటలే భవిష్యత్ జంటలకు మార్గదర్శకంగా నిలవాలని ఆశిద్దాం! ఈ మెహందీ, హల్దీ, సంగీత్, డిజైనర్ వేర్ వంటివన్నీ సినిమాల పుణ్యమే! వెడ్డింగ్ ప్లానర్స్, డెస్టినేషన్ వెడ్డింగ్స్, థీమ్ థింగ్స్, ప్రీ వెడ్డింగ్ షూట్, రీల్స్, షాట్స్ లాంటి వాటన్నిటికీ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, ఓటీటీ సిరీస్‌ల ప్రభావం కారణమంటున్నారు ట్రెండ్ ఎనలిస్ట్‌లు. – సరస్వతి రమ⇒ పెరుగుతున్న పెళ్లి ఖర్చును అదుపు చేయాల్సిందిగా 2017లో రంజిత్ రంజన్ అనే కాంగ్రెస్ ఎంపీ పార్లమెంట్లో ‘ప్రివెన్షన్ ఆఫ్ వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ ఆన్ స్పెషల్ అకేషన్స్’ అనే ప్రైవేట్ బిల్‌ను ప్రవేశపెట్టాడు. దీనిప్రకారం పెళ్లికి అతిథుల సంఖ్య వందకు, పదిరకాల వంటకాలు, కానుకల విలువ రూ. 2,500కు మించరాదు. ఎవరైనా పెళ్లి మీద రూ. 5 లక్షలకు మించి ఖర్చు పెడితే పది శాతం డబ్బును ప్రభుత్వ సంక్షేమ నిధికి ఇవ్వాలి. అలా జమ అయిన మొత్తాన్ని ప్రభుత్వం ఏటా పేదింటి ఆడపిల్లల పెళ్లికి ఖర్చుపెట్టాలి. కానీ ఈ బిల్లు ఆమోదం పొందలేదు. చదవండి: పుస్తకాలు మా ఇంటి సభ్యులు⇒ 1993లో నాటి ఒడిశా ముఖ్యమంత్రి బిజు పట్నాయక్.. పెళ్లికి ముందు పెళ్లిలో రూ. 25 వేలకు మించి ఖర్చు చేయకూడదంటూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాడు. కానీ అదీ పాస్ అవలేదు.కన్‌స్ట్రక్టివ్‌గా ఇన్వెస్ట్ చేసుకోవాలిసంపాదించుకుంటున్నాం కదాని ఉన్న సేవింగ్స్ అన్నిటినీ పెళ్లి అట్టహాసాలకే ఖర్చు చేయడం కరెక్ట్ కాదు. ఉన్న వాళ్లు ఎంత ఖర్చుపెట్టుకున్నా పర్లేదు. కాని వాళ్లను మిడిల్‌క్లాస్ పీపుల్ ఫాలో అయితేనే తర్వాత ఆర్థికంగా, ఎమోషనల్‌గా చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పులు చేసి మరీ మన చుట్టూ ఉన్నవాళ్లను మెప్పించడం వల్ల మన ఇల్లు గుల్లవడం తప్ప పైసా ప్రయోజనం ఉండదు. పెళ్లి తర్వాత ఇల్లు, పిల్లలు .. వాళ్ల చదువులు లాంటి ఎన్నో బాధ్యతలుంటాయి. వాటి కోసం సేవింగ్స్‌ని ప్లాన్ చేసుకోవాలి. కష్టపడి సంపాదించుకున్న డబ్బును ఆచితూచి మదుపు చేసుకోవాలి. దానివల్ల మనం సంతోషంగా ఉండటమే కాదు ప్రకృతి వనరులను, శ్రమను గౌరవించిన వాళ్లమవుతాం! – డాక్టర్ కస్తూరి అలివేలు, అసోసియేట్ప్రోఫెసర్, డీన్, డీజీఎస్ సెస్, హైదరాబాద్.డిమాండ్ పెరిగిందిపెళ్లి ఫొటో, వీడియోగ్రఫీలు తక్కువలో తక్కువ రెండు లక్షల నుంచి మొదలు ఈవెంట్స్ కవరేజ్‌ను బట్టి బడ్జెట్ పెరుగుతుంది. ప్రీ వెడ్డింగ్ షూట్స్ కోసం స్టూడియోస్ కూడా ఉన్నాయి. డబ్బుండి, టైమ్ లేని వాళ్లు ఆ స్టూడియోస్‌లో షూట్స్‌ని ప్రిఫర్ చేస్తుంటే.. డబ్బు, టైమ్ రెండూ ఉన్నవాళ్లు విదేశాలకూ వెళ్లి షూట్ చేయించుకుంటున్నారు. మొత్తం మీద ఫొటో, వీడియోగ్రాఫర్స్తోపాటు ఈ స్టూడియోస్కీ డిమాండ్ బాగా పెరిగింది. – వీఎన్ రాజు, వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్కాంప్రమైజ్ అవ్వట్లేదువెడ్డింగ్ సెలబ్రేషన్స్ విషయంలో ఎవరూ కాంప్రమైజ్ అవట్లేదు. కోవిడ్ తర్వాత ఈ ట్రెండ్ మరీ ఎక్కువైంది. పెళ్లికి వచ్చే అతిథులు తగ్గారు కానీ.. వేడుకల విషయంలో మాత్రం ఎవరూ వెనకడుగు వేయట్లేదు. మధ్యతరగతి వాళ్లు కూడా వెడ్డింగ్ ప్లానర్‌ని పెట్టుకుంటున్నారు. ఎంత తక్కువనుకున్నా 30 లక్షల నుంచి మొదలవుతోంది వెడ్డింగ్ బడ్జెట్. డెస్టినేషన్ వెడ్డింగ్స్ అయితే 50.. 60 లక్షలు ఇంకా ఆపై కూడా ఉంటోంది. ఇదివరకు ఈవెంట్స్ అన్నీ ఫొటోలు, వీడియోలకే పరిమితమై ఉండేవి. ఇప్పుడు రీల్స్, షాట్స్‌లో సోషల్ మీడియాలోనూ ప్రెజెంట్ చేయాలనుకుంటున్నారు.బ్రైడ్ అండ్ గ్రూమ్ కొత్త కొత్త ఐడియాలతో వచ్చి వాటిని అమలు చేయడానికి ప్లాన్లు అడుగుతున్నారు. పీర్స్ కన్నా డిఫరెంట్‌గా ఉండాలనీ, తామే ఒక కొత్త ట్రెండ్ సెట్ చేయాలనే ఆలోచనతో వస్తున్నారు. ఎంతైనా ఖర్చు పెట్టడానికి రెడీ అవుతున్నారు. దీంతో వెడ్డింగ్ ప్లానర్స్‌కి డిమాండ్ పెరుగుతోంది. వాళ్లమధ్య పోటీ కూడా ఎక్కువే ఉంటోంది. కొంచెం క్రియేటివిటీ ఉంటే చాలు వెడ్డింగ్ ప్లానర్ అనే బోర్డ్ పెట్టేసుకుంటున్నారు. – వర్ధమాన్ జైన్, వెడ్డింగ్ ప్లానర్ -
ప్రత్యక్ష దైవమా.. ప్రణామం
రామవరప్పాడు: సమస్త జీవరాశి మనుగడకూ సూర్యుడే మూలాధారం. ఉదయభానుని అరుణ కిరణ స్పర్శతోనే ప్రకృతి మేల్కొంటుంది. ప్రాణికోటికి ప్రాణప్రదాత, ఆరోగ్యదాత భాస్కరుడే. ఆటవికుల నుంచి ఆధునికుల వరకూ జాతిమతాలకు అతీతంగా ఇనబాంధవుని ఆరాధిస్తూనే ఉంటారు. భారతీయ సంస్కృతిలో కశ్యప పుత్రుని స్థానం సమున్నతం. మాఘమాసంలో శుక్లపక్షం సప్తమి తిథినాడు రథసప్తమి (Ratha Saptami) పేరుతో సూర్యజయంతిని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజున సూర్యుడు సప్తాశ్వాలు పూన్చిన రథాన్ని అధిరోహించి దక్షిణాయనాన్ని ముగించుకుని పూర్వోత్త దిశగా ప్రయాణం ఆరంభిస్తాడని భక్తుల విశ్వాసం. మాఘ సప్తమి (Magha Saptami) నుంచి రానున్న ఆరు మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. సూర్యోపాసన చేస్తే రుణ, రోగ, శత్రుబాధలు నశిస్తాయని భారతీయుల నమ్మకం. సూర్యకిరణాలు (Sun Rays) తప్పనిసరిగా శరీరంపై ప్రసరించాలి. ఇందులో భాగంగానే వైదిక సంస్కృతిలో సంధ్యావందనం, సూర్యనమస్కారాలు వంటి పలు ప్రక్రియలు ఆచరణలోకి వచ్చాయి.సూర్యనమస్కారాల విశిష్టత సూర్యనమస్కారములు ఒక అద్భుతమైన వ్యాయామ పద్దతి. సూర్య నమస్కారం అనే పేరు ఒక్కటే అయినా పన్నెండు భంగిమలతో కూడిన సూర్యనమస్కారాలలో ఒక సంక్షిష్టమైన ప్రాణాయామం, ధ్యానం, సమ్మిళితమైన వ్యాయామం ఇమిడి ఉంది. ఇందులో ఒక విశిష్టమైన ఆసన సరళి, ఒక మహోన్నతమైన శ్వాస నియంత్రణ ఒక పరమోత్కృష్ట ధ్యాన విధానం ఉన్నాయి. సూర్యనమస్కారాలు చూడటానికి సాధారణ వ్యాయామంలాగే కనిపించినా ఆచరించి చూస్తే ఒక అవ్యక్తానుభూతి కలుగుతుందని యోగ గురువులు చెబుతున్నారు. సూర్య నమస్కారాలతో మంచి ఆరోగ్యం నిత్యం సూర్య నమస్కారాలు చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగి ఆరోగ్యవంతులవుతారు. శరీరంలోని ప్రతి అంగాన్నీ ఉత్తేజపరచే ప్రక్రియలు సూర్యనమస్కారాలు. ఈ పన్నెండు ఆసనాలు వేయడం వల్ల శరీరంలోని బిగువులు తొలగడం, విషపదార్థాలు కరిగిపోవడం, దేహ కదలికలు సులువు కావడం, కీళ్లు వదులవడంతో నరాలు, కండరాల వ్యవస్థ సమతుల్యంగా పని చేస్తుంది. దృష్టి, వినికిడి, వాసన, రుచి శక్తులు పెరుగుతాయి. సూర్య నమస్కారాలతో ఎముకలు, కండరాలు బలోపేతమై మనిషి ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని శాస్త్రవేత్తలు స్వష్టం చేస్తున్నారు. వీటివల్ల బరువు తగ్గడంతోపాటు జీర్ణక్రియ మెరుగుపడటం, మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. సూర్యనమస్కారాలు శరీర భాగాలపైనే కాకుండా గ్రంధులపైనా పని చేస్తాయి. థైరాయిడ్, పారా థైరాయిడ్, పిట్యూటరీ వంటి గ్రంథులు సాధారణ స్థాయిలో పనిచేయడానికి ఇవి ఎంతో ఉపకరిస్తాయి. ఏ ఆసనంతో ఎలాంటి లబ్ధి 1,12 ఆసనాలతో శరీర సమతుల్యత సాధించవచ్చు. శ్వాసకోశ వ్యవస్థ మెరుగుపడుతుంది. వెన్నెముక, మెడ, భుజాల దగ్గర ఉన్న కండరాలు బలోపేతం అవుతాయి. 2,11 ఆసనాలతో... జీర్ణవ్యవస్థను మెరుగు పడుతుంది. వెన్నుముక, పిరుదులు బలోపేతమవుతాయి. 3,10 ఆసనాలు.. రక్తప్రసరణ పెంచుతాయి, కాలి కండరాలను బలోపేతం చేస్తాయి, గ్రంథులపై కూడా ప్రభావం చూపుతాయి. 4,9 ఆసనాలు... వెన్నెముక, చేతి మణికట్టు కండరాలను బలోపేతం చేస్తాయి. 5,8 ఆసనాలు.. గుండెను బలోపేతం చేస్తాయి. మెడ, భుజాల దగ్గర ఉండే ఒత్తిడిని తగ్గిస్తాయి. 6వ ఆసనం. మెడ, భుజాలలో ఒత్తిడిని తగ్గిస్తుంది. 7వ ఆసనం... జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. వెన్నుముక బలంగా మారడానికి ఉపకరిస్తుంది. యువతను చైతన్య పరుస్తున్నాం.. సూర్యనమస్కారాలు, యోగ ఆసనాలపై యువతకు ఉచితంగా అవగాహన కల్పిస్తున్నాం. యోగ, సూర్యనమస్కారాల విశిష్టత అందరికీ తెలియాలనే ఉద్ధేశ్యంతో యోగపై ప్రత్యేకంగా పుస్తకం రాశాను. ప్రత్యక్షంగా ఆసనాలు నేర్చుకోలేని వారి కోసం పరోక్షంగా అవగాహన కల్పించడం కోసం హై క్వాలిటీ రికార్డింగ్‌తో పర్ఫెక్ట్ టైమింగ్‌తో ఆడియో కూడా రూపొందించాను. పాఠశాలలు, కళాశాలల్లో యువత, విద్యార్థుల కోసం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఈ ఆడియో సాయంతో విజయవాడ, హైదరాబాద్‌తో పాటు అమెరికా, లండన్‌లో కూడా సెంటర్లు నడుస్తున్నాయి. వయస్సుతో నిమిత్తం లేకుండా అందరూ ఆసనాలపై ఆశక్తి పెంపొందించుకుని ఆరోగ్యంగా ఉండటమే మా లక్ష్యం. 1. నమస్కారాసనం (ఓం మిత్రాయనమః )చాతీని ముందుకు చాచి భుజాలను విశ్రాంతిగా ఉంచాలి. శ్వాస తీసుకుంటూ రెండు చేతులనూ ప్రక్కల నుంచి ఎత్తి శ్వాస వదులుతూ రెండు చేతులనూ కలుపుతూ నమస్కార ముద్రలో ఛాతీని ముందుకు తీసుకురావాలి. సూర్యునికి అభిముఖంగా నమస్కారం చేస్తున్నట్లు నిలబడి సూర్యుని నామాన్ని ఉచ్చరించాలి.2. హస్త ఉత్తానాసనం ( ఓం రవయేనమః )కొద్దిగా శ్వాస పీల్చి రెండు చేతులను పైకెత్తి వెనుకకు తీసుకురావాలి. భుజాలను చెవులకు దగ్గరగా తీసుకురావాలి. తలను, నడుమును వెనుకకు వంచాలి. ఈ ఆసనంలో మడమల నుంచి చేతివేళ్ల వరకు మొత్తం శరీరాన్ని సాగదీయాలి.3. పాదహస్తాసనం (ఓం సూర్యాయనమః)శ్వాస వదలి, వెన్నుపూసను నిటారుగా ఉంచి నడుము నుంచి ముందుకు వంగాలి. శ్వాసను పూర్తిగా వదిలేసి చేతులను పాదాల పక్కకు భూమిమీదకి తీసుకురావాలి. తలను మెకాలుకు ఆనించాలి. కాళ్లు వంచకూడదు.4. అశ్వసంచలనాసనం (ఓం భానవే నమః )ఎడమ మెకాలును వంచి పాదాన్ని నేలపై ఉంచి, కుడి పాదాన్ని వెనుకగా వేళ్లపై ఆనించి, రెండు చేతులను పైకి చాపి, నడుము పై భాగాన్నంతా వెనుకకు వంచాలి. ఈ స్థితిలో శ్వాసను పీల్చి లోపలే ఆపాలి.5. దండాసనం (ఓం ఖగాయనమః)శ్వాస తీసుకుంటూ ఎడమకాలును కూడా వెనుకకు చాచి మొత్తం శరీరాన్ని భూమికి సమాంతరంగా ఒకే లైన్లో ఉంచాలి6. సాష్టాంగ నమస్కారం (ఓం పుష్ణేనమః)ఎనిమిది అంగాలు నేలకు ఆనటం వలన దీనికి అష్టాంగ నమస్కారం అని కూడా అంటారు. రెండు కాళ్లు రెండు మోకాళ్లు, రెండు చేతులు, రొమ్ము, గడ్డం ఈ ఎనిమిది అంగాలు నేలమీద ఉంచి నడుమును కొద్దిగా పైకి లేపాలి. శ్వాసను పూర్తిగా బయటకు వదలి ఆపాలి.7. భుజంగాసనం (ఓం హిరణ్యగర్భాయనమః)ముందుకు సాగి ఛాతీని పైకిలేపి త్రాచుపాము ఆకారంలోకి తీసుకురావాలి. ఈ ఆకారంలో మోచేతులను వంచవచ్చు. భుజాలు మాత్రం చెవులకు దూరంగా ఉంచాలి. శ్వాసను పీల్చి తల వెనుకకు వంచాలి.8. పర్వతాసనం (ఓం మరీచయేనమః)ఐదవ స్థితివలెనే కాళ్లు చేతులను నేలమీద ఆనించి నడుమును పైకి ఎత్తి శ్వాస వదలి తిరిగి పీల్చాలి.9. అశ్వసంచలనాసనం (ఓం ఆదిత్యాయనమః)శ్వాస తీసుకుంటూ కుడి పాదాన్ని రెండు చేతుల మధ్యలోకి తీసుకురావాలి. ఎడమ మోకాలు నేలమీద ఉంచి తుంటి భాగాన్ని కిందికి నొక్కుతూ పైకి చూడాలి.చదవండి: ఆరోగ్యాన్ని ప్రసాదించే సూర్యారాధన!10. పాదహస్తాసనం (ఓం సవిత్రేనమః)శ్వాస వదులుతూ ఎడమపాదాన్ని ముందుకు తేవాలి. అరచేతులు భూమిమీద ఉంచాలి. అవసరమైతే మోకాలు వంచవచ్చు.11.హస్త ఉత్తానాసనం (ఓం అర్కాయనమః) శ్వాస తీసుకుంటూ ఉన్నప్పుడు వెన్నుపూసను నిటారుగా చేసి, చేతులు పైకిలేపి కొంచెం వెనుకకు వంగి తుంటి భాగాన్ని కొద్దిగా బయటకు తోయాలి.12. నమస్కారాసనం (ఓం భాస్కరాయ నమః)నిటారుగా నిలబడి ఊపిరి పీల్చుకునేటప్పుడు అరచేతులను ఒకచోటచేర్చి నమస్కారం చేయాలి. -
వలసదార్లకు దిన దిన గండం
అమెరికా.. ప్రపంచంలోని చాలా దేశాల ప్రజల్లాగే భారతీయులకూ ఓ కలల ప్రపంచం. ఆ డాలర్ డ్రీమ్స్‌ను సాకారం చేసుకోవడానికి, కుటుంబం, పిల్లలకు అందమైన భవిష్యత్ ఇవ్వడానికి ఎంతటి రిస్క్ అయినా తీసుకుంటున్నారు. ఒక్కోసారి ప్రాణాలు పోయే పరిస్థితి ఉన్నా అమెరికాకు వెళ్లే విషయంలో మాత్రం వెనుకడుగువేయట్లేరు. ఇలా ఎలాగోలా చట్టవిరుద్ధంగా వెళ్లి అక్కడ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? ఎలాంటి అవమానాలు పడుతున్నారు?డాక్యుమెంట్లు లేకుండా అక్రమంగా అమెరికా గడ్డపై అడుగుపెట్టిన వలసదారులు అమెరికాలో అనధికారిక పనులు చేసేందుకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగాలేవీ రికార్డుల్లో ఉండవు. రికార్డులో ఉండాలంటే.. వీసాలు, వర్క్ పర్మిట్లు కావాలి. ఉదాహరణకు అమెరికన్లు చేయడానికి ఇష్టపడని ఉద్యోగాలన్నమాట. దక్షిణ కాలిఫోర్నియాలోని పొలాల్లో పని ఇందులో ఒకటి. ఎక్కువ సమయం, శ్రమతో కూడుకున్న పని అయినప్పటికీ వేరే పని దొరక్క దక్షిణ అమెరికా దేశాల నుంచి వచ్చిన అక్రమ వలసదారులు ఇలాంటి పనులు చేస్తున్నారు. చట్టవిరుద్ధంగా వెళ్లిన మన భారతీయులు ఎక్కువగా గ్యాస్ స్టేషన్లు, రెస్టారెంట్లు, కిరాణా దుకాణాల్లో పనిచేస్తున్నారు. నిర్మాణ రంగంలో కార్మికులుగా, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులుగా ఉద్యోగాలు చేస్తున్నారు. అనుక్షణం భయం.. భయం ఒహాయోలోని క్లీవ్‌ల్యాండ్‌కు అక్రమంగా వలస వచ్చిన ఒక భారతీయుడు ఉదయం 6 గంటలకే గ్యాస్‌స్టేషన్‌లో పనిలో నిమగ్నమవుతాడు. రాత్రిదాకా ఒళ్లు హూనమయ్యేలా పనిచేసి బయటి తిండి తిని తన బంధువుల ఇంట్లో బేస్మెంట్లో నిద్రపోతాడు. ఇందులో కష్టమేముందని దూరం నుంచి చూసిన వాళ్లకు అనిపించొచ్చు. కానీ పని చేసినంత సేపు ఇలాంటి వారి జీవితాల్లో అంతకుమించిన నరకయాతన ఉంటుంది. రిజిస్టర్డ్ వర్క్‌ప్లేస్‌లో పనిచేయలేరు. ఎలాంటి అధికారిక శిక్షణ పొందే అర్హత ఉండదు. డ్రైవింగ్ లైసెన్స్ ఎప్పటికీ రాదు. డ్రైవింగ్ చేయలేరు. సైకిల్ తొక్కుతూ వెళ్లాల్సిందే. అది కూడా అక్కడి అధికారులకు అనుమానం వస్తే పట్టుబడతానేమోనని భయం వెంటాడుతుంది. నిరంతరం మనసులో ఏదో భయం. ఏ క్షణంలోనైనా ఏం జరుగుతుందోనన్న ఆందోళన. వస్తువులు పోయినా, ఎవరితోనైనా గొడవ జరిగినా, తననెవరైనా కొట్టినా పోలీసులకు ఫిర్యాదు చేసేందుకూ వెళ్లలేరు. పట్టుబడితే వారికే రిస్క్. అందుకే ఏం జరిగినా భరించాల్సిందే. ఇంత శ్రమ ఎందుకూ అంటే.. స్వదేశంలో మధ్య తరగతి జీవితం గడుపుతున్న తన కుటుంబానికి మంచి జీవితం ఇవ్వాలనే తపన. కుటుంబాన్ని అమెరికాకు తీసుకురావాలి. అందుకు సరిపడా సంపాదించాలి. లీగల్ రెసిడెంట్‌గా అనుమతి పొందేందుకు లాయర్‌కు పెట్టుకునేంత సంపాదించాలి. ఇలా ఎన్నో ఆశలు. అమెరికన్ అధికారుల నుంచి తప్పించుకోవడం కత్తిమీద సాము. అలాంటిది ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ నుంచి రోజూ ఏదో ఒక విధంగా తప్పించుకోవడం వారికి సర్వసాధారణమైపోతుంది. తోటి భారతీయుల సాయంతో.. అక్రమ వలసదారుల జీవితాల్లో అక్కడి తమలాంటి వాళ్ల సమూహం పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. అక్రమ వలసదారులు కనీసం సిమ్ కార్డు పొందలేరు. బంధువులు ఇచ్చిన సిమ్ కార్డులను ఉపయోగించి స్వదేశంలోని కుటుంబంతో మాట్లాడతారు. బ్యాంకు ఖాతా పొందే అవకాశమే లేదు. సెప్టెంబర్ 11న 9/11 వైమానిక దాడుల తర్వాత అమెరికాలో అన్ని నిబంధనలు కఠినం చేశారు. అందులోభాగంగా బ్యాంకింగ్ నియమాలూ మారాయి. అందుకే స్థానిక యజమానులు అక్రమ వలసదారులకు పనికి వేతనాన్ని కేవలం నగదు రూపంలోనే చెల్లిస్తారు. అదనపు ఆదాయం కోసం, తెలిసినవారి తోటల్లో పనిచేయడం, ఇళ్ల గోడలకు పెయింటింగ్ వేయడం, ఇతర పనులలో సహాయం చేస్తూ ఇంకాస్త డబ్బు సంపాదిస్తారు. అక్రమవలసదారులు అనారోగ్య సమయాల్లో ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. సాధారణంగా అమెరికా ఆసుపత్రులు చట్టవిరుద్ధమైన నివాసితులకు చికిత్సను నిరాకరించవు. కానీ డాక్యుమెంట్లు లేకపోవడం వల్ల ఆస్పత్రుల వద్ద వైద్యం కాస్త కష్టంగా ఉంటుంది. ఇందుకు ప్రత్యామ్నాయంగా అక్కడి చట్టబద్ధ భారతీయ వైద్యులను వీళ్లంతా ఆశ్రయిస్తారు. చవకగా వైద్య చికిత్సలు పొందుతారు. హెచ్–1బీ వీసాలు, గ్రీన్‌కార్డు సంపాదించిన భారతీయుల సహాయంతో ఆన్లైన్ ద్వారా స్వదేశానికి డబ్బులు పంపుతున్నారు. జీవితాలనే పణంగా పెట్టి... చాలా మంది డాక్టర్లు, నర్సులు, లాయర్లు ఇక్కడికి వచ్చి కూలీలుగా పనిచేసి డాక్యుమెంట్లు తయారు చేయించుకున్నారు. ఇలా రకరకాల పనులు చేసి.. డబ్బు సంపాదించి అనుమతి పొందిన వారు చాలా మంది తమ కుటుంబాలను కూడా అమెరికాకు తీసుకొచ్చారు. అమెరికాలోని ప్రభుత్వ పాఠశాలలు డాక్యుమెంటేషన్ అడగవు. దీంతో ఇప్పటివరకు వారి పిల్లలను తీసుకురావడం సులభమైంది. కొందరు అమెరికా వచ్చాక పిల్లలకు జన్మనివ్వడంతో వారు అమెరికా పౌరులుగా మారిపోయారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ట్రంప్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తొలిరోజే జన్మతః పౌరసత్వాన్ని రద్దుచేస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకంచేయడం తెల్సిందే. ఈ ఉత్తర్వులపై సియాటెల్ ఫెడరల్ కోర్టు స్టే విధించింది. ట్రంప్ ప్రభుత్వ బెదిరింపులు డాక్యుమెంట్లు లేని వలసదారులను అమెరికా చేరుకోకుండా ఆపలేకపోతున్నాయి. ఎన్ని భయాలున్నప్పటికీ అమెరికన్ డ్రీమ్ ప్రయత్నాలను ఆపడం లేదు. కలను నిజం చేసుకోవడానికి జీవితాలనే పణంగా పెడుతున్నారు. డాక్యుమెంట్లు లేకుండా ఎట్లా వెళ్తున్నారు? కొందరు భారతీయులు చట్టవిరుద్ధంగా అమెరికాకు వలస వెళ్లడానికి కొన్ని అక్రమ విధానాలను అవలంభిస్తున్నారు. పర్యాటక లేదా తాత్కాలిక వీసాలపై అమెరికాకు వస్తారు. ఆ వీసా గడువు ముగిసినా భారత్‌కు తిరిగిరారు. తప్పించుకు తిరుగుతారు. ఇక భూమార్గంలో వేర్వేరు దేశాలు దాటి వస్తూ చిట్టచివరకు అమెరికా గడ్డపై కాలుమోపుతారు. ‘డంకీ’రూట్‌గా దీనికి పేరు. సరిహద్దులు దాటించేసే ఏజెన్సీలకు దాదాపు 1 లక్ష డాలర్లకు పైగా చెల్లించాల్సి ఉంటుంది. సరైన విద్యార్హతలు, ఇంగ్లిష్ ప్రావీణ్యం లేని కారణంగా అమెరికా వీసా పొందలేని భారతీయులు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఇంకొందరు తొలుత అమెరికా పొరుగున్న ఉన్న కెనడాకు వచ్చి అక్కడ 76 రోజుల విజిటర్ వీసా సంపాదించి అలా అమెరికాకు వచ్చి ఇక అక్కడే తిష్టవేస్తారు. వలసదారులు సాల్వడార్, నికరాగ్వాల గుండా కూడా అమెరికాలోకి ప్రవేశిస్తున్నారు. ఇలా వేర్వేరు అక్రమ విధానాలను అవలంభించి ఇప్పటిదాకా 7,25,000 మంది అమెరికాకు చేరుకున్నట్లు తెలుస్తోంది. 2024 ప్యూ రీసెర్చ్ నివేదిక ప్రకారం అమెరికాలో డాక్యుమెంట్లు లేకుండా వచ్చిన అక్రమ వలసదారుల్లో భారతీయులు మూడో స్థానంలో ఉన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
టూర్‌కీ ఉంది ఓ ట్యాక్స్!
ఏపీ సెంట్రల్ డెస్క్: ఒత్తిడితో కూడుకున్న జీవితం నుంచి కాస్తంత సేద తీరడానికి ప్రస్తుతం దాదాపు ప్రతి ఒక్కరూ వివిధ పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తున్నారు. కొత్త ప్రదేశాలను చూడాలని.. చిల్ కావాలని కోరుకోనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎవరి ఆర్థిక స్థోమతలను బట్టి వారు దేశీయ, విదేశీ పర్యటనలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా విదేశాలకు అత్యధిక సంఖ్యలో వెళ్తున్నవారిలో భారతీయులు కూడా ఉంటున్నారు. ప్రపంచ పర్యాటకులు అత్యధికంగా సందర్శిస్తున్న వాటిలో బాలి (ఇండోనేషియా), బ్యాంకాక్ (థాయ్‌లాండ్), వెనిస్ (ఇటలీ), బార్సిలోనా (స్పెయిన్), యునైటెడ్ కింగ్డమ్ (యూకే) తదితర ప్రాంతాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు వెళ్లాలనుకుంటున్నవారిని పర్యాటక పన్నులు (టూరిస్టు ట్యాక్సెస్) కలవరపెడుతున్నాయి. విదేశాల్లోనే కాకుండా మనదేశంలోని ప్రముఖ వేసవి విడిది కేంద్రం.. కొడైకెనాల్‌లోనూ పర్యాటకులపై గ్రీన్ ట్యాక్స్ విధిస్తుండటం గమనార్హం.పర్యాటక పన్ను ఎందుకంటే.. పర్యాటక పన్నులనేవి కొత్తగా వచ్చిన కాన్సెప్ట్ కాదు. గత కొన్నేళ్లుగా, ఆమ్స్టర్డామ్, వెనిస్, బాలి తదితర నగరాలు పర్యాటక పన్నును వసూలు చేస్తున్నాయి. అక్కడ పర్యాటకుల తాకిడికి తగ్గట్టుగా మౌలిక సదుపాయాలను కల్పించడానికి, ఆయా నగరాల్లో ఇతర వసతుల కల్పనకు, పరిశుభ్రంగా ఉంచడానికి పర్యాటక పన్ను విధిస్తున్నాయి. అలాగే పర్యాటకులను ఆకట్టుకోవడానికి ఆయా కార్యక్రమాలను నిర్వహించడానికి నిధులు అవసరం కాబట్టే తాము పర్యాటక పన్నును వసూలు చేస్తున్నామని ఆయా నగరాలు చెబుతున్నాయి. ఓవర్ టూరిజంతో వచ్చే ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికే తాము టూరిస్టు ట్యాక్స్ వసూలు చేస్తున్నామని పేర్కొంటున్నాయి. ఇప్పటికే యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ఎడిన్బర్గ్ నగరం వచ్చే ఏడాది జూలై నుంచి పర్యాటక పన్నును వసూలు చేస్తామని ప్రకటించింది. ఎడిన్బర్గ్ బాటలోనే మరికొన్ని నగరాలు కూడా నడవడానికి సిద్ధమవుతున్నాయి. కలవరపెడుతున్న ఓవర్ టూరిజం.. కొన్ని దేశాలు పర్యాటకుల రాకపై ఆందోళన చెందుతుంటే మరికొన్ని దేశాలు ఓవర్ టూరిజం సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఆయా పర్యాటక ప్రాంతాల్లో ఉన్న మొత్తం జనాభా కంటే కొన్ని రెట్ల సంఖ్యలో పర్యాటకులు ఆయా ప్రాంతాలకు పోటెత్తుతున్నారు. ముఖ్యంగా బాలి (ఇండోనేషియా), బ్యాంకాక్ (థాయ్‌లాండ్), వెనిస్ (ఇటలీ), బార్సిలోనా (స్పెయిన్), ఆమ్స్టర్డామ్ (నెదర్లాండ్స్) వంటివి ఓవర్ టూరిజం సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఆ నగరాల్లో ఉన్న జనాభాను మించి సంవత్సరం పొడవునా పర్యాటకులు ఈ నగరాలకు పోటెత్తుతుండటంతో వారికి మౌలిక సదుపాయాలు కల్పించడం పెద్ద సమస్యగా మారింది. డిమాండ్‌కు తగ్గట్టు నివాస, ఆహార సదుపాయాలు కల్పించడానికి, హోటళ్ల నిర్మాణానికి పెద్ద ఎత్తున స్థలాలు అవసరం పడుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో స్థానికులకు ఇళ్ల స్థలాలు దొరకడం లేదు. ఒకవేళ దొరికినా అత్యధికంగా ధర చెల్లించాల్సి వస్తోంది.అదేవిధంగా నిత్యం పర్యాటకులతో ట్రాఫిక్ సమస్యలు సైతం తలెత్తుతున్నాయి. దీంతో స్థానికులు తమ దైనందిన పనులు చేసుకోవడానికి, ఆఫీసులకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూరప్ దేశం స్పెయిన్‌లోని బార్సిలోనాలో ఇటీవల ఓవర్ టూరిజం సమస్యను అరికట్టాలని స్థానికులు నిరసనలకు దిగడం ఇందుకు నిదర్శనం. ఇళ్ల స్థలాల కొరత, ట్రాఫిక్ సమస్యలే కాకుండా తమ ప్రాంతాలకు భారీ ఎత్తున తరలివస్తున్న పర్యాటకులతో పర్యావరణ కాలుష్యం కూడా పెరుగుతోందని స్థానికులు వాపోతున్నారు. ఆయా దేశాల పర్యాటకులు పర్యాటక ప్రాంతాలను ప్లాస్టిక్ బాటిళ్లు, ఇతర అపరిశుభ్రమైన చర్యలతో చెత్తకుప్పల్లా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యల వల్ల తమకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని.. ఓవర్ టూరిజం సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. పర్యాటకులకు మరింత భారమేనా? అయితే ఆయా దేశాల్లోని పర్యాటక ప్రాంతాల్లో టూరిస్టు ట్యాక్స్ విధించడం పర్యాటకులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని కొందరు ట్రావెల్ ఆపరేటర్లు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల పర్యాటకులపై మరింత అదనపు ఖర్చు పడుతుందంటున్నారు. పర్యాటకులపై పన్ను విధించడం వల్ల వారు పన్ను లేని వేరే కొత్త గమ్యస్థానాలపై దృష్టి సారిస్తారని అంటున్నారు. దీనివల్ల పన్ను విధిస్తున్న దేశాలకు పర్యాటకుల ద్వారా వచ్చే ఆదాయం పడిపోతుందని పేర్కొంటున్నారు. మరికొందరు ట్రావెల్ ఆపరేటర్లు మాత్రం పర్యాటక పన్ను విధించడం మంచి విషయమేనని చెబుతున్నారు. పర్యాటకులకు వసతులు కల్పించడానికి, ఓవర్ టూరిజం సమస్యను ఎదుర్కోవడానికి టూరిస్టు ట్యాక్స్ ఉండాల్సిందేనని అభిప్రాయపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని పర్యాటక పన్నులు... ⇒ ఇటలీలోని వెనిస్ పర్యాటకుల తాకిడిని నియంత్రించడానికి ‘డే–ట్రిప్పర్ ట్యాక్స్’ పేరుతో ఒక్కో పర్యాటకుడి నుంచి రోజుకు 5 యూరోలు వసూలు చేస్తోంది. ⇒ నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌లో పర్యాటకులు తమ హోటల్ బిల్లుపై 7% అదనంగా చెల్లించాల్సిందే. అంతేకాకుండా రాత్రి అక్కడే ఉంటే సిటీ ట్యాక్స్ కింద మరో 3 యూరోలు సమరి్పంచుకోవాల్సిందే. ⇒ భారత్ పొరుగు దేశం భూటాన్ సైతం పర్యాటకుల నుంచి రోజువారీ రుసుమును వసూలు చేస్తోంది. వసతి, భోజనం, సాంస్కృతిక పర్యటనలను కవర్ చేయడానికి రోజుకు 200 నుంచి 250 డాలర్లను రోజువారీ సందర్శకుల రుసుము కింద తీసుకుంటోంది. ⇒ ఓడ లేదా విమానం ద్వారా వెళ్లే అంతర్జాతీయ పర్యాటకుల నుంచి ’సయోనారా ట్యాక్స్’ కింద జపాన్ 1,000 యెన్లు వసూలు చేస్తోంది. ⇒ యూకేలోని మాంచెస్టర్‌లోని హోటళ్లలో ఒక రాత్రి నివాసం ఉంటే ప్రతి పర్యాటకుడు ఒక పౌండ్.. నైట్ ట్యాక్స్ కింద చెల్లించాల్సిందే. ⇒ స్పెయిన్‌లోని బార్సిలోనాలో వసతి రకాన్ని, ప్రదేశాన్ని బట్టి ఒక్కో రాత్రికి 4 యూరోల వరకు టూరిస్టు ట్యాక్స్ చెల్లించాలి. ⇒ గతేడాది అక్టోబర్ 1 నుంచి న్యూజిలాండ్ టూరిస్టు ట్యాక్స్‌ను ఏకంగా మూడురెట్లు పెంచింది. అంతర్జాతీయ పర్యాటకులు ఆ దేశంలో అడుగుపెడితే 135 న్యూజిలాండ్ డాలర్లను చెల్లించాల్సిందే. ⇒ భారతీయ పర్యాటకులు అత్యధికంగా వెళ్లే దేశాల జాబితాలో ఉన్న మలేషియా, ఫ్రాన్స్, జర్మనీ, స్విట్జర్లాండ్, గ్రీస్, క్రొయేషియా, ఆస్ట్రియా, బెల్జియం, బల్గేరియా, చెక్ రిపబ్లిక్, పోర్చుగల్ తదితర దేశాల్లోనూ టూరిస్టు ట్యాక్స్‌లు అమల్లో ఉన్నాయి. ⇒ గతేడాది యూకే.. ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ (ఈటీఏ)ను ప్రవేశపెట్టింది. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, కొన్ని యూరప్ దేశాల నుంచి యూకేకు రావాలనుకునేవారు ముందుగా ఈటీఏకి దరఖాస్తు చేసుకోవాలి.. అలాగే నిర్దేశిత రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధానాన్ని ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అన్ని దేశాలకు యూకే వర్తింపజేయనుంది. ⇒ ఈ ఏడాది జనవరి 1 నుంచి రష్యా పర్యాటక పన్నును ప్రవేశపెట్టింది. ⇒ ఈ ఏడాది మధ్య నుంచి థాయ్‌లాండ్ పర్యాటక పన్నును విధించడానికి సిద్ధమవుతోంది. విమానం ద్వారా తమ దేశంలో ప్రవేశించే పర్యాటకులు 300 బాత్‌లు చెల్లించాల్సి ఉంటుంది. అదే భూ లేదా సముద్ర మార్గం ద్వారా థాయ్‌లాండ్‌లో ప్రవేశిస్తే టూరిస్టు ట్యాక్స్ కొంత తక్కువ ఉంటుంది. ⇒ మనదేశంలో ప్రముఖ వేసవి విడిది కేంద్రం.. కొడైకెనాల్లో ప్లాస్టిక్ బాటిళ్లను నియంత్రించడానికి పర్యాటకుల నుంచి రూ.20 గ్రీన్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు.పర్యాటకులు ఏం చేయాలి? విదేశాల్లో ఏదైనా పర్యాటక ప్రాంతానికి వెళ్లాలనుకుంటే, ముందు ఆయా దేశాల్లో పర్యాటకులపై ఎలాంటి పన్నులు ఉన్నాయో తెలుసుకోవడం ఉత్తమమని ట్రావెల్ ఆపరేటర్లు చెబుతున్నారు. కొన్ని దేశాలు పర్యాటకులు విమానాశ్రయంలో దిగినప్పటి నుంచే పర్యాటక పన్నును వసూలు చేస్తున్నాయి. ఆ దేశంలో ఎన్ని రోజులు ఉంటారనేదాని ఆధారంగా ఈ రుసుములు ఉంటున్నాయి. మరికొన్ని దేశాలు పర్యాటకులు టూర్‌ని ముగించుకుని వెళ్లిపోతున్నప్పుడు పన్నును (డిపార్చర్ ట్యాక్స్) వసూలు చేస్తున్నాయి. కాబట్టి పర్యాటకులు తమ పర్యటనలకు ముందే ఈ ట్యాక్సుల గురించి తెలుసుకోవాలని ట్రావెల్ ఆపరేటర్లు చెబుతున్నారు.