Aamir Khan
-
అవును.. ఆమెతో డేటింగ్లో ఉన్నా: అమిర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాను ప్రస్తుతం రిలేషన్లో ఉన్నట్లు వెల్లడించారు. తన స్నేహితురాలితో డేటింగ్లో ఉన్నమాట వాస్తవమేనని వెల్లడించారు. ముంబయిలో నిర్వహించిన తన పుట్టినరోజు వేడుకల ముందు ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన ఈ విషయాన్ని పంచుకున్నారు. తన స్నేహితురాలు గౌరీ స్ప్రాట్‌తో ఏడాదిగా డేటింగ్లో ఉన్నట్లు తెలిపారు. తాను దాదాపుగా 25 ఏళ్ల నుంచి తెలుసని అమిర్ స్పష్టం చేశారు.గౌరీ స్ప్రాట్ ప్రస్తుతం బెంగళూరులో నివసిస్తున్నట్లు అమిర్ ఖాన్ వెల్లడించారు. అంతేకాకుండా తన ప్రొడక్షన్ బ్యానర్లో పనిచేస్తోందని వివరించారు. ఆమెతో పాటు ఆరేళ్ల కుమారుడు కూడా ఉన్నారని వివరించారు. ఆమె తన కుటుంబ సభ్యులను కూడా కలిసిందని.. మా రిలేషన్ గురించి వారు సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఆమెతో రిలేషన్లో తాను నిబద్ధతతో, సంతోషంగా ఉన్నానని అమిర్ ఖాన్ పేర్కొన్నారు. 'లగాన్', 'దంగల్' లాంటి కొన్ని చిత్రాలను మాత్రమే గౌరీ స్ప్రాట్ చూశారని అన్నారు. తనకు 'సూపర్ స్టార్' అనే లేబుల్‌ను ఉండడాన్ని తాను నమ్మడం లేదని చెప్పినట్లు ఈ సందర్భంగా అమిర్ ఖాన్ గుర్తు చేసుకున్నాడు.తన స్నేహితులు సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్‌లను పుట్టినరోజు విందుకు ఆహ్వానించినట్లు అమిర్ ఖాన్ తెలిపారు. ఈ డిన్నర్ పార్టీకి గౌరీ స్ప్రాట్ వచ్చిందని వెల్లడించారు. ఆమె సగం తమిళియన్ కాగా.. మరో సగం ఐరిష్ మహిళ అని అన్నారు. ఆమె తాత స్వాతంత్ర్య సమరయోధుడని అమిర్ పేర్కొన్నారు.కాగా.. అమిర్ ఖాన్ అంతకుముందే చిత్ర నిర్మాత కిరణ్ రావును పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జూలై 2021లో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ దంపతులకు ఆజాద్ రావ్ ఖాన్ అనే కుమారుడు ఉన్నాడు. మొదట మన సూపర్ స్టార్ రీనా దత్తాను వివాహం చేసుకున్నారు. వీరికి ఐరా ఖాన్, జునైద్ ఖాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమెతో 2002లో విడిపోయారు. -
సినిమా వ్యాపారాన్ని మనమే చంపేశాం: ఆమిర్ ఖాన్
‘‘గతంలో ఏ సినిమా చూడాలనుకున్నా థియేటర్‌కి వెళ్లేవాణ్ణి. ఎందుకంటే మూవీస్ చూసేందుకు నాకు మరో చాయిస్ లేదు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సినిమాలు విడుదలైన ఎనిమిది వారాలకే ఓటీటీల్లో రిలీజ్ చేసి, మన సినిమా వ్యాపారాన్ని మనమే చంపేశాం’’ అని బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్(Aamir Khan) ఆగ్రహావేదన వ్యక్తం చేశారు.ఈ నెల 14న ఆమిర్ ఖాన్ బర్త్ డేని పురస్కరించుకుని ‘పీవీఆర్ ఐనాక్స్’ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. ‘ఆమిర్ ఖాన్: సినిమా కా జాదూగర్’ పేరుతో ఆయన హిట్ సినిమాలను ప్రదర్శిస్తోంది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమిర్ ఖాన్, రచయిత జావేద్ అక్తర్ పాల్గొన్నారు. ‘‘గతంతో పోలిస్తే ప్రస్తుతం హిందీ చిత్రాలు ప్రేక్షకులను అలరించలేకపోతున్నాయి.బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం లేని దక్షిణాది నటుల సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రూ. 600 నుంచి 700 కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తున్నాయి. మన సినిమాలను కూడా దక్షిణాది దర్శకులు తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్‌కి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది?’’ అంటూ ఆమిర్ ఖాన్‌ను ప్రశ్నించారు జావేద్ అక్తర్. ఇందుకు ఆమిర్ స్పందిస్తూ– ‘‘దక్షిణాది, ఉత్తరాది చిత్రాలు అనే విషయం సమస్యే కాదు... దర్శకులప్రాంతీయ నేపథ్యం కూడా అప్రస్తుతం.సినిమా విడుదలైన ఎనిమిది వారాలకే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నాం. ఓటీటీలో ఎన్నిసార్లయినా ఫ్రీగా చూసే వీలుండటంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గించేశారు. ఒక సినిమాని రెండు సార్లు ఎలా అమ్మాలో నాకు తెలియడం లేదు. థియేటర్లలో విడుదలైన మూడు లేదా నాలుగు నెలల తర్వాత ఓటీటీల్లో రిలీజ్ చేయాలి.అప్పుడే థియేట్రికల్ బిజినెస్ బాగుంటుంది. ప్రేమ, కోపం, పగ వంటి ఎమోషన్స్ మీద బాలీవుడ్ రచయితలు, డైరెక్టర్స్ ఎక్కువ ఫోకస్ చేయడం లేదు. కేవలం వినో దానికే పెద్ద పీట వేస్తున్నారు. పైగా మూలాలను మర్చిపోతున్నారు. దక్షిణాది చిత్రాల్లాగా భావోద్వేగాలను మిళితం చేయలేపోతున్నారు’’ అని పేర్కొన్నారు. -
బాలీవుడ్లో దక్షిణాది సినిమాల హవా.. అసలేం జరుగుతోందన్న జావేద్ అక్తర్
బాలీవుడ్ ప్రముఖ సినీ రచయిత జావేద్ అక్తర్ సంచలన కామెంట్స్ చేశారు. హిందీ సినిమాల్లో ఏ మాత్రం కొత్తదనం కనిపించడం లేదని అన్నారు. తాజాగా ఓ డిబేట్‌కు హాజరైన ఆయన అమీర్ ఖాన్‌తో కలిసి బాలీవుడ్ ఇండస్ట్రీపై మాట్లాడారు. హిందీ సినిమాల్లో నాణ్యత రోజు రోజుకు పూర్తిగా తగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బాలీవుడ్ సినిమాలు ప్రేక్షకులతో అన్ని సంబంధాలను కోల్పోయాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.ముఖ్యంగా దక్షిణాది నుంచి వస్తున్న సినిమాలు బాలీవుడ్లో సత్తా చాటుతున్నాయని జావేద్ అక్తర్ తెలిపారు. కనీసం ప్రేక్షకులకు తెలియని నటులతో తీసిన దక్షిణ భారత చిత్రాలు హిందీలో విడుదలై రూ. 600 నుంచి 700 కోట్ల వ్యాపారం చేస్తున్నాయని వెల్లడించారు. చివరికి మన సినిమాలను సైతం సౌత్ డైరెక్టర్స్ తీస్తున్నారని పేర్కొన్నారు. అసలు బాలీవుడ్‌కు ఏమైంది? అని జావేద్ అక్తర్ ప్రశ్నించారు.అయితే జావేద్ అక్తర్ కామెంట్స్‌పై ఇదే డిబేట్లో పాల్గొన్న అమిర్ ఖాన్ స్పందించారు. ఇక్కడ సమస్య ఉత్తరాది, దక్షిణాది కాదని అన్నారు. మనం ఎదుర్కొంటున్న సమస్య వేరే విషయమని తెలిపారు. దయచేసి మా సినిమాని చూడండి అని ప్రేక్షకులను అభ్యర్థించే ఏకైక ఇండస్ట్రీ మనదే.. లేదంటే ఎనిమిది వారాల్లో మీ ఇంట్లోనే ఓటీటీలో చూసే అవకాశం కల్పిస్తాం.. ఇదే బాలీవుడ్ బిజినెస్ మోడల్ అని అమీర్ ఖాన్ అన్నారు. ఓటీటీకి ఒకసారి సబ్స్క్రిప్షన్ చెల్లిస్తే చాలు సినిమాను ఎన్నిసార్లైనా వీక్షించవచ్చని తెలిపారు. ఒకే ఉత్పత్తిని రెండుసార్లు ఎలా అమ్మాలో నాకు తెలియదంటూ మాట్లాడారు. గతంలో ఓటీటీలు లేకపోవడం వల్ల థియేటర్లకు వెళ్లి సినిమాలు చేసేవాళ్లమని.. కానీ ఇప్పుడు మనం ఎక్కడైనా సినిమాలు చూడవచ్చని తెలిపారు. ఇప్పుడు థియేటర్లకు వెళ్లవలసిన అవసరం లేదు.. మన సొంత వ్యాపార నమూనాతో మన సినిమాలను చంపుకుంటున్నామని అమిర్ ఖాన్ అన్నారు.హిందీ సినిమా రచయితలు, దర్శకులు ఒత్తిడికి గురికాకుండా కంటెంట్‌పై దృష్టి పెట్టాలని అమిర్ ఖాన్ సూచించారు. వారు తమ మూలాలను, ప్రాథమిక భావోద్వేగాలను మరచిపోయారని అన్నారు. నాలో నుంచి వచ్చేదాన్ని మాత్రమే నేను చేయగలను.. అది హిట్ అవుతుందా లేదా ఫ్లాప్ అవుతుందా అని నేను ఆలోచించనని అమీర్ అన్నారు. కాగా.. ఇటీవల హన్సల్ మెహతా, వివేక్ అగ్నిహోత్రి కూడా హిందీ సినిమా ప్రస్తుత స్థితిపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. బాలీవుడ్ గ్రాఫ్ పడిపోతోందని అగ్నిహోత్రి వ్యాఖ్యానించగా.. హిందీ చిత్ర పరిశ్రమకు రీసెట్ అవసరమని మెహతా మాట్లాడారు. -
అమిర్ ఖాన్‌తో పెళ్లి.. మా పేరేంట్స్ షాకయ్యారు: కిరణ్ రావు
దర్శకనిర్మాత కిరణ్‌రావు గురించి బాలీవుడ్లో పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్‌కు మాజీ భార్యగా అందరికీ సుపరిచితమే. 2005లో ఆమిర్.. కిరణ్ రావును రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఐవీఎఫ్- సరోగసి పద్ధతి ద్వారా 2011లో ఆజాద్ అనే కుమారుడు జన్మించాడు. దాదాపు 16 ఏళ్లపాటు అన్యోన్యంగా ఉన్న వీరిద్దరు 2021లో విడాకులు తీసుకున్నారు. భార్యా, భర్తలుగా విడిపోయినా స్నేహితులుగా కలిసిమెలిసి ఉంటున్నారు. కుటుంబానికి సంబంధించిన కార్యక్రమాల్లో కలిసి పాల్గొంటున్నారు. గతేడాది లపతా లేడీస్ మూవీతో సూపర్ హిట్ అందుకున్నారు కిరణ్ రావు.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కిరణ్ రావు తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అమీర్‌ఖాన్‌తో పెళ్లి విషయం గురించి మా తల్లిదండ్రులతో చెప్పితే వారంతా షాక్‌కు గురయ్యారని తెలిపింది. నా పేరేంట్స్ ఆందోళన చెందారని వివరించింది. అంతేకాదు తన నిర్ణయాన్ని మరోసారి ఆలోచించుకోవాలని చెప్పారని వెల్లడించింది. అమీర్ గొప్ప నటుడని.. అతనికున్న పేరు, ప్రతిష్టలతో నీపై ఒత్తిడి ఉంటుందని సూచించారు. అయినప్పటికీ అమిర్ ఖాన్‌ను పెళ్లాడేందుకు నిర్ణయించుకున్నట్లు కిరణ్ రావు తెలిపారు. అమిర్ గొప్ప వ్యక్తి అని ఆమె కొనియాడారు. కాగా.. గతేడాది అమిర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ పెళ్లికి కిరణ్ రావు హాజరయ్యారు. -
మా ఆయన సాఫ్ట్వేర్ ఇంజినీర్ కాదు.. అమ్మాయిల బ్రోకర్
నెల్లూరు: ఒకతను తాను సాఫ్ట్వేర్ ఇంజినీర్‌నని నమ్మించి రూ.లక్షల్లో కట్న కానుకులు తీసుకుని ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. కొద్దిరోజులు ఆమెకు ఎలాంటి అనుమానం రాకుండా నటించాడు. అనంతరం భార్యను చిత్రహింసలకు గురి చేయసాగాడు. ఎందుకిలా చేస్తున్నాడో అర్థం కాని భార్య.. భర్త ప్రవర్తనను నిశితంగా పరిశీలించగా అసలు విషయం తెలిసి నిర్ఘాంతపోయింది. భర్త సాఫ్ట్వేర్ ఇంజినీర్ కాదని యువతుల బ్రోకర్ అని తేలడంతో కన్నీటి పర్యంతమైంది. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు మెక్లెన్స్ రోడ్డుకు చెందిన ఓ యువతికి ఆమె పెద్దలు మ్యాట్రిమోని ద్వారా వివాహ సంబంధాలు చూస్తుండగా.. విజయవాడ ప్రాంతానికి చెందిన అమీర్‌ఖాన్ పరిచయమాయ్యాడు. తాను సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాని, నెలకు రూ.80 వేలు జీతమని నమ్మించాడు. ఇరు కుటుంబాల అంగీకారంతో ఆ యువతికి 2023 సంవత్సరం ఫిబ్రవరి 26వ తేదీన అమీర్‌ఖాన్‌తో వివాహం జరిగింది. ఆ సమయంలో యువతి కుటుంబ సభ్యులు రూ.15 లక్షల నగదు, 13 సవర్ల బంగారు కట్నకానుకుల కింద ఇచ్చారు. రెండునెలలపాటు వారి వైవాహిక జీవితం సంతోషంగా సాగింది.చదవండి: కుటుంబ పరువు కోసం కన్న కూతురినే కడతేర్చిన తండ్రిప్రవర్తనలో మార్పుక్రమంగా అమీర్‌ఖాన్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. భార్యను చిత్రహింసలకు గురి చేయసాగాడు. గంటల తరబడి ఒంటరిగా గదిలో ఉంటూ ఆమెను పూర్తిగా పట్టించుకోవడం మానేశాడు. దీంతో అతడి ప్రవర్తనపై భార్యకు అనుమానం వచ్చింది. ఓ రోజు అతను బాత్రూమ్కు వెళ్లిన సమయంలో ఆమె రూమ్ శుభ్రం చేస్తుండగా మంచం పక్కనే పెద్ద సంఖ్యలో సెల్ఫోన్లు ఉండటాన్ని గమనించింది. ఒకటి తీసుకుని అందులోని నంబర్లకు కాల్ చేసింది. అవతలి వాళ్లు చెప్పిన మాటలకు ఆమె నిర్ఘాంతపోయింది. అమీర్‌ఖాన్ అమ్మాయిల బ్రోకర్ అనే విషయం బయటపడింది. దీంతో భర్తను ప్రశ్నించగా కోపోద్రిక్తుడైన అతను ఆమైపె దాడి చేశాడు. అత్తమామలు, ఆడబిడ్డ సైతం దుర్భాషలాడారు. అదనపు కట్నం కోసం ఆమెను చిత్రహింసలు పెట్టారు. ఇటీవల ఇంట్లో నుంచి గెంటేశారు. దీంతో బాధిత మహిళ నెల్లూరులోని తల్లిదండ్రుల వద్దకు చేరుకుని బోరున విలపించింది. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌నని తమను నమ్మించి మోసగించిన భర్త, అత్తింటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె బుధవారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామని చిన్నబజార్ ఇన్స్పెక్టర్ చిట్టెం కోటేశ్వరరావు తెలిపారు. -
'మీ మాటలు ఎప్పటికీ గుర్తుంచుకుంటాను'.. అమిర్ ఖాన్‌తో డ్రాగన్ హీరో
జీవితం ఊహించలేనిది.. ఇలా అన్నది ఎవరో తెలుసా? అది తెలుసుకోవాలంటే ముందుగా యువ నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ గురించి చెప్పాలి. ఈయన కోమాలి చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యి హిట్ కొట్టారు. ఆ తరువాత మరో చిత్రానికి దర్శకత్వం వహిస్తారని అందురూ ఎదురు చూశారు. అలాంటిది హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అలా ఈయన స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన చిత్రం లవ్ టుడే. ఈ చిత్రం పెద్ద హిట్ అయ్యి ఏకంగా రూ. 100 కోట్ల క్లబ్లో చేరింది. ఆ తరువాత ఈయనకు వరుసగా అవకాశాలు తలుపు తడుతున్నాయి.అలా తాజాగా ఈయన కథానాయకుడిగా నటించిన చిత్రం డ్రాగన్. ఏజీఎస్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రాన్ని ఓ మై గాడ్ చిత్రం ఫేమ్ అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించారు. ఈ నెల 21వ తేదీన తెరపైకి వచ్చిన ఈ చిత్రం సంచలన విజయం వైపు పరుగులు తీస్తోంది.ఇలాంటి పరిస్థితుల్లో నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్‌ను కలవడం ఆసక్తిగా మారింది. ప్రదీప్ రంగనాథన్ తమిళంలో నటించి, దర్శకత్వం వహించిన లవ్ టుడే చిత్రాన్ని హిందీలో రీమేక్ చేశారు. దీనికి ప్రదీప్ రంగనాథన్ సహ నిర్మాత కావడం గమనార్హం. అందులో అమీర్‌ఖాన్ వారసుడు జునైత్ ఖాన్, శ్రీదేవి వారసురాలు ఖుషీ కపూర్ జంటగా నటించారు. అయితే ఈ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదన్నది గమనార్హం.ఇలాంటి పరిస్థితిలో ప్రదీప్ రంగనాథన్ బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్‌ను చెన్నైలో కలవడం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఒక వేళ డ్రాగన్ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసే ఆలోచనతో ఆయన్ని కలిశారా? లేక మరోదైన విషయం కోసం కలిశారా? అన్న చర్చ జరుగుతోంది. అయితే అమీర్‌ఖాన్ ప్రస్తుతం నటుడు రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ చిత్రంలో ప్రత్యేక పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే.అదే విధంగా అనారోగ్యానికి గురైన ఆయన తల్లి చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమెను పరామర్శించడానికి ప్రదీప్ రంగనాథన్ వెళ్లారా? అనే చర్చ కూడా జరుగుతోంది. ఏదేమైనా అమీర్‌ఖాన్‌తో ఉన్న ఫొటోను సామాజిక మాధ్యమాలకు విడుదల చేసిన ప్రదీప్ రంగనాథన్ అందులో.. జీవితం ఊహించలేనిది అని నేను ఎప్పుడూ చెబుతాను.. మీ అద్భుతమైన మాటలకు ధన్యవాదాలు అమిర్ ఖాన్ సార్.. జీవితాంతం దాన్ని గుర్తుంచుకుంటాను అని పోస్ట్ చేశారు. కాగా ప్రస్తుతం ఈయన విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో ఎల్ఐకే చిత్రంలో నటిస్తున్నారు. Life is unpredictable as i always say :) Thankyou for your wonderful words #aamirkhan sir . Will cherish it for life ❤️ pic.twitter.com/HPjpJLvDN2— Pradeep Ranganathan (@pradeeponelife) February 23, 2025 -
గజినీ 2 తో 1000 కోట్లు కొట్టాలి
-
'అమిర్ ఖాన్‌తో వెయ్యి కోట్ల సినిమా'.. తండేల్ ఈవెంట్లో అల్లు అరవింద్ కామెంట్స్
అక్కినేని నాగచైతన్య తండేల్(Thandel Movie) మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్(Allu Aravind) ఆసక్తికర కామెంట్స్ చేశారు. అమిర్ ఖాన్(Amir Khan) గజిని (Ghajini)సినిమాను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అప్పట్లో గజిని రూ.100 కోట్ల క్లబ్లో చేరిన తొలి భారతీయ చిత్రంగా నిలిచిందన్నారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే అమిర్ ఖాన్ మాతో ఛాలెంజ్ చేశారని గుర్తు చేసుకున్నారు. కచ్చితంగా వందకోట్లు రాబడుతుందని అన్నారని.. అందుకే మేం ప్రమోట్ చేసినట్లు అల్లు అరవింద్ వెల్లడించారు. ఇవాళ ముంబయిలో జరిగిన తండేల్ హిందీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు బాలీవుడ్ హీరో అమిర్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.అయితే ఈవెంట్లో అల్లు అరవింద్ తన మనసులోని మాటను బయటపెట్టారు. అప్పుడు రూ.100 కోట్లు ఎక్కువని.. ఇప్పుడైతే రూ.1000 కోట్లు రాబట్టే సినిమా తీయాలనుందని ఆయన అన్నారు. అది గజిని-2 కూడా కావొచ్చని అరవింద్ నవ్వుతూ మాట్లాడారు. అయితే కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన గజిని చిత్రాన్ని హీందీలో రీమేక్ చేశారు. తమిళంలో సూపర్‌హిట్‌గా నిలిచిన గజిని.. బాలీవుడ్‌లోనూ సత్తా చాటింది. మరోవైపు గజిని-2 కూడా ఉంటుందని గతంలో సూర్య హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.కాగా.. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన పాన్ ఇండియా చిత్రం తండేల్. ఈ మూవీ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. చందు మొండేటి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మత్స్యకార బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీని తెరకెక్కించారు. ఇటీవల తెలుగులో ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా హిందీలోనూ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని గీతా ఆర్స్ట్ బ్యానర్లో బన్నీవాసు నిర్మించారు. -
ఆ స్టార్ హీరోకున్నంత సినిమా నాకు లేదు, అది నా వల్ల కాదు: మాధవన్
హీరో మాధవన్ (R Madhavan) తమిళంతోపాటు తెలుగు, హిందీలోనూ పలు సినిమాలు చేశాడు. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్‌తో 3 ఇడియట్స్ మూవీ చేశాడు. ఇది బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. ఈ జర్నీలో ఆమిర్‌ను దగ్గరి నుంచి చూసిన మాధవన్.. ఆయనలా తను అస్సలు ఉండలేనంటున్నాడు. ఆ నాటి జ్ఞాపకాలను తాజా ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు.ఏదీ ఫ్రీగా రాదనుకోమాధవన్ మాట్లాడుతూ.. ఆమిర్ ఖాన్ పర్సు వెంటపెట్టుకుని వెళ్లడు. తన స్టార్డమ్ వల్ల అలా ఉండగలుగుతున్నాడు. ఆయనకు ఏది కావాలన్నా పక్కనున్న జనాలు తీసుకొస్తారు. అలా అని ఏదీ ఫ్రీగా రాదనుకోండి.. ఆ చుట్టుపక్కన ఉండే జనాలకు ఎలాగో ఆమిర్ ఖాన్ డబ్బు చెల్లించాల్సిందే! కానీ నాకంత సినిమా లేదు. నేను ఒంటరిగా వెళ్లడానికే ఎక్కువ ఇష్టపడతాను. స్వేచ్ఛగా తిరగడం ఇష్టం. జనాలతో కలవడం ఇష్టం. ఎంత ఖర్చు పెడుతున్నాననేది చూసుకోను. నచ్చినట్లు బతికేస్తా.. ఏది కావాలనిపిస్తే అది కొనేస్తాను.(చదవండి: జైలుకు వెళ్లొచ్చిన హీరోయిన్‌కు సన్యాసమా? అంతా పబ్లిసిటీ కోసమే!)ఖర్చులను అదుపులో పెట్టుకోలేనుఅలా అని నా బడ్జెట్‌కు మించినవాటి జోలికి వెళ్లను. ఖర్చుల విషయంలో కొద్దిగా కంట్రోల్ చేసుకోలేను.. కానీ నాకున్న పరిధిలో జీవిస్తూ కాస్తంత ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నాను. నాకేదైనా పెద్ద కారు నచ్చిందనుకోండి. అది నా బడ్జెట్లో రాలేదన్నప్పుడు కొనడానికి ఇష్టడపను అని చెప్పుకొచ్చాడు. అయితే అతడి ఖర్చులు చూసి భార్య సరిత తిడుతూ ఉంటుందట. ఈ విషయం గురించి చెప్తూ.. నా భార్య నేనొక మూర్ఖుడిని అనుకుంటుంది. నాకు డబ్బులు పొదుపుగా వాడటం తెలియదని తిడుతూ ఉంటుంది అని పేర్కొన్నాడు.సినిమామాధవన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం హిసాబ్ బరాబర్ . అశ్వని ధర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో కీర్తి కుల్హరి, నీల్ నితిన్ ముకేశ్, రష్మీ దేశాయ్, ఫైజల్ రషీద్ కీలక పాత్రల్లో నటించారు. ఈ థ్రిల్లర్ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజైంది. జనవరి 24 నుంచి జీ5లో ప్రసారమవుతోంది.చదవండి: సిండికేట్‌లో వెంకీమామ, బిగ్‌బీ, ఫహద్..? ఆర్జీవీ ఏమన్నారంటే? -
ఆ థెరపీ పేరెంట్స్‌ని అర్థం చేసుకోవడానికి సహాయపడింది..!
అమీర్ ఖాన్- రీనా దత్త కూతురుగా ఇరా ఖాన్ సినీ ప్రియులకు సుపరిచితమే. ఆమె‘మెంటల్ హెల్త్ సపోర్ట్ ఆర్గనైజేషన్’ సంస్థ వ్యవస్థాపకురాలు, సీఈవో కూడా. తన మానసిక ఆర్యోగ్యం(Mental health) గురించి బహిరంగంగానే మాట్లాడుతంటంది. తాను చాలా డిప్రెషన్‌కి గురయ్యానని కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పకొచ్చింది కూడా. దేని వల్ల తాను డిప్రెషన్‌కి గురయ్యింది, బయటపడేందుకు తీసుకన్న చికిత్స తన జీవితాన్ని ఎలా మార్చేసిందో సోషల్‌మీడియా వేదికగా షేర్ చేసుకుంది. అమీర్ ఖాన్(Aamir Khan) రీనా దత్తాలు 1986లో వివాహం చేసుకున్నారు. దగ్గర దగ్గర 16 ఏళ్ల వైవాహిక బంధానికి 2002లో స్వస్తి పలికి విడిపోయారు. ఇక వారి ఇద్దరికి కలిగిన సంతానమే జునైద్ ఖాన్, ఇరా ఖాన్. ఇలా ఈ దంపతులు విడిపోవడం వారి కూతురు ఇరాఖాన్(Ira Khan)పై తీవ్ర ప్రభావమే చూపించింది. నిజానికి తల్లిదండ్రులు విడిపోతే ఆ ప్రభావం పిల్లలపై గట్టిగానే పడుతుంది. అయితే అది కొందరిలో ఆత్మనూన్యత భావానికి లేదా నిరాశ నిస్ప్రుహలకి దారితీస్తుంది. ఇక్కడ ఇరాఖాన్ కూడా అలానే తీవ్రమైన డిప్రెషన్ బారిన పడింది. తాను ఆ సమస్యతో బాధపడుతన్నానని అర్థం చేసుకోవడానికి చాలా సమయం పట్టింది. దీన్నుంచి బయటపడేందుకు ఎంతగానో పోరాడింది. అందుకోసం ఆమె తీసుకున్న థెరపీ(Therapy) మెదట తాను ఈ సమస్యతో బాధపడుతున్నట్లు అంగీకరించేలా చేసింది. ఆ తర్వాత తన తల్లిదండ్రులు బాంధవ్యం గురించి ఓ స్పష్టమైన అవగాహన కలిగించింది. వాళ్లు కేవలం తన తల్లిదండ్రులుగా మాత్రమే చూడకూడదని, వాళ్లూ మనుషులే, తమకంటూ వ్యక్తిగత ఇష్టాలు ఉంటాయి. వారి సంతానంగా తాను గౌరవించాలని తెలుసుకుంది ఇరా. అలా తల్లిదండ్రులను పూర్తిగా అర్థం చేసుకుని డిప్రెషన్‌ను జయించే ప్రయత్నం చేశాను. పిల్లలకు వారి పేరెంట్స్‌తో సన్నిహితంగా ఉండమని ఎవ్వరూ చెప్పారు. ఆ పని మనమే చేయాలి. అదే మనకు మనో ధైర్యాన్ని, శక్తిని అందిస్తుందని సోషల్ మీడియా పోస్ట్‌లో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట తెగ వైరల్‌గా మారింది. కాగా, ఇటీవలే ఇరాఖాన్ తన ప్రియడు ఫిట్నెస్ ట్రైనర్ నుపుర్ శిఖరేను పెళ్లిచేసుకుని వివాహం బంధంలోకి అడుగు పెట్టింది. (చదవండి: Maha Kumbh 2025: నాగ సాధువుగా తొలి విదేశీయుడు..!) -
ఈ హీరోయిన్ను చూస్తుంటే శ్రీదేవిని చూసినట్లే ఉంది: ఆమిర్ ఖాన్
ఆరంభం అదిరిపోతే ఆ కిక్కే వేరుంటుంది. ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ (Junaid Khan) మహారాజ్ చిత్రంతో నటుడిగా పరిచయమయ్యాడు. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో గతేడాది విడుదలై ట్రెండింగ్‌లో నిలిచింది. తొలి సినిమానే సక్సెస్ సాధించాడని ప్రశంసలు సైతం అందుకున్నాడు. ప్రస్తుతం జునైద్.. లవ్యాపా మూవీ (Loveyapa Movie) చేస్తున్నాడు. ఇందులో దివంగత నటి శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. వీరిద్దరూ వెండితెరపై కనిపించబోయే తొలి చిత్రం ఇదే కావడం విశేషం!సాంగ్ రిలీజ్ఖుషి గతంలో ద ఆర్చీస్ అనే సినిమా చేసింది. కానీ ఇది కూడా నేరుగా ఓటీటీలోనే విడుదలైంది. ఇకపోతే లవ్యాపా నుంచి ఇటీవలే లవ్యాపా హో గయా అనే పాట రిలీజ్ చేశారు. ఇది చూసిన జనాలు పాట బాగుంది, కానీ ఈ లవ్‌ట్రాక్ మాత్రం కాస్త విచిత్రంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. అయితే జునైద్ తండ్రి, స్టార్ హీరో ఆమిర్ ఖాన్ (Aamir Khan).. పాట మాత్రమే కాదు సినిమా కూడా అదిరిపోయిందంటున్నాడు.శ్రీదేవిని చూసినట్లే ఉందితాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమిర్ మాట్లాడుతూ.. లవ్పాయా సినిమా రఫ్ కట్ చూశాను. మూవీ చాలా బాగుంది. వినోదాత్మకంగా ఉంది. నాకు నచ్చింది. సెల్ఫోన్ల వల్ల మన జీవితాలు ఎలా అయిపోతున్నాయి? ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయనేది చక్కగా చూపించారు. అందరూ బాగా నటించారు. సినిమాలో ఖుషిని చూస్తుంటే శ్రీదేవి (Sridevi) ని చూసినట్లే ఉంది. శ్రీదేవికి నేను పెద్ద అభిమానిని. ఆవిడ ఎనర్జీ నాకు అక్కడ కనిపించింది అని చెప్పుకొచ్చాడు.(చదవండి: శుభవార్త చెప్పిన హీరోయిన్.. పట్టలేనంత సంతోషం, కొంత నిరాశ!)మరీ ఇంత అబద్ధమాడాలా?ఇది చూసిన నెటిజన్లు ఖుషిని గొప్ప నటి శ్రీదేవితో పోల్చవద్దని వేడుకుంటున్నారు. ప్లీజ్ యార్.. మరీ ఇంత పెద్ద అబద్ధం చెప్పాల్సిన పని లేదు, పిల్లలపై ప్రేమతో ఏదైనా అనేస్తావా?.. అని పలురకాలుగా కామెంట్లు చేస్తున్నారు. లవ్యాపా విషయానికి వస్తే.. తమిళ హిట్ మూవీ లవ్ టుడేకు ఇది రీమేక్‌గా తెరకెక్కింది. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించగా ఫాంటమ్ స్టూడియోస్, ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 7న ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. మరి ఈ కొత్త హీరోహీరోయిన్లను ప్రజలు ఏమేరకు ఆదరిస్తారో చూడాలి!ఖుషి అక్క ఆల్రెడీ సత్తా చాటుతోంది!ఇప్పటికే ఖుషి అక్క జాన్వీ కపూర్ బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా రాణిస్తోంది. సౌత్‌లో దేవర మూవీతో కుర్రాళ్ల మనసులో గిలిగింతలు పెట్టింది. రామ్చరణ్తోనూ ఓ సినిమా చేస్తోంది. ఈ ముద్దుగుమ్మల తల్లి శ్రీదేవి అతిలోక సుందరిగా ప్రేక్షకల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకుంది.గొప్ప నటి శ్రీదేవితెలుగులో కార్తీకదీపం, ప్రేమాభిషేకం, ఆఖరి పోరాటం, జగదేకవీరుడు అతిలోక సుందరి వంటి చిత్రాలతో అలరించింది. దక్షిణాది చిత్రాలతో పాటు హిందీలోనూ అగ్రకథానాయికగా స్టార్డమ్ సంపాదించుకుంది. 2013లో శ్రీదేవిని భారతీయ ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. అయితే 2018లో ఆమె ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోయింది. చదవండి: సంధ్య థియేటర్ ఘటన: శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అర్జున్ -
అమీర్ ఖాన్ తో టాలీవుడ్ డైరెక్టర్.. ఫిక్స్ అయినట్లేనా?
-
వంశీ స్టోరీ లైన్ కి అమీర్ ఖాన్ ఫిదా ...
-
'ట్రైలర్ చూడగానే షాకయ్యా'.. కన్నడ చిత్రంపై అమిర్ ఖాన్ ప్రశంసలు!
కన్నడ స్టార్ ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో వస్తోన్న చిత్రం ‘యుఐ: ది మూవీ’. ఈ మూవీని ఇంతకు ముందెన్నడు రాని డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ విడుదల చేయగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. చాలా రోజుల విరామం తర్వాత ఉపేంద్ర నటిస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.తాజాగా ఈ మూవీ ట్రైలర్ వీక్షించిన బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ ప్రశంసలు కురిపించారు. ట్రైలర్ చూడగానే షాకయ్యానని తెలిపారు. అద్భుతంగా ఉందని.. కచ్చితంగా సూపర్‌హిట్‌గా నిలుస్తుందని కొనియాడారు. హిందీ ఆడియన్స్‌ను సైతం ఈ సినిమా మెప్పిస్తుందని అమిర్ ఖాన్ కొనియాడారు. అమిర్ మాట్లాడిన వీడియోను ఉపేంద్ర తన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. కాగా.. ఈ సినిమా ఈ నెల 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయనున్నారు.కాగా.. అమీర్ ఖాన్, ఉపేంద్ర ప్రస్తుతం జైపూర్ చేరుకున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీలో వీరిద్దరు కనిపించనున్నారు. ఈ సందర్భంగా ఉపేంద్ర సినిమాను ఉద్దేశించి మాట్లాడారు. కాగా.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న కూలీలో అమీర్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.Dear Aamir sir, it was a dream come true moment to meet and seek your blessings for UI The Warner Movie 🙏thanks for your love and support ❤️#UiTheMovieOnDEC20th#Aamirkhan#UppiDirects #Upendra @nimmaupendra #GManoharan @Laharifilm @enterrtainers @kp_sreekanth… pic.twitter.com/EcPcIVgS8z— Upendra (@nimmaupendra) December 11, 2024 -
థర్టీ ఇయర్స్ తర్వాత...
‘కూలీ’ సినిమా కోసం దాదాపు మూడు దశాబ్దాల తర్వాత రజనీకాంత్, ఆమిర్‌ఖాన్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘కూలీ’. ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, శ్రుతీహాసన్ , సత్యరాజ్, రెబ్బా మౌనికా జాన్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. కాగా ఈ చిత్రంలోని మరో కీలక పాత్రలో ఆమిర్‌ఖాన్ నటిస్తున్నారు. ‘కూలీ’ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ చిత్రీకరణ జైపూర్‌లో మొదలైందని కోలీవుడ్ సమాచారం.రజనీ, ఆమిర్‌తో పాటుగా ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు మేకర్స్. ‘కూలీ’ సినిమాలో ఆమిర్‌ఖాన్ నటిస్తారనే ప్రచారం గతంలో సాగింది. తాజాగా ఆయన జైపూర్‌కు వెళ్లడంతో ఈ మూవీలో ఓ రోల్లో నటిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. 1995లో వచ్చిన ‘అతంక్ హీ అతంక్’ సినిమాలో రజనీకాంత్, ఆమిర్‌ఖాన్ లీడ్ రోల్స్‌లో నటించిన సంగతి తెలిసిందే. థర్టీ ఇయర్స్ తర్వాత ఇప్పుడు ‘కూలీ’ కోసం రజనీకాంత్, ఆమిర్‌ఖాన్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ‘కూలీ’ మే 1న రిలీజ్ కానుందని టాక్. -
జైపూర్‌కు కూలీ
జైపూర్ వెళ్లనున్నారు కూలీ. రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కూలీ’. ఈ చిత్రంలో నాగార్జున, శ్రుతీహాసన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్, హీరోయిన్ రెబ్బా మౌనికా జాన్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. కాగా ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ జైపూర్‌లో జరగనుందని, ఈ షెడ్యూల్లో రజనీకాంత్, ఆమిర్ ఖాన్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం. ఈ షెడ్యూల్‌తో సినిమా దాదాపు పూర్తవుతుందట. కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ‘కూలీ’ సినిమాను కార్మిక దినోత్సవం సందర్భంగా మే 1న రిలీజ్ చేసే ఆలోచనలో యూనిట్ ఉందని సమాచారం. -
సినిమాలు మానేద్దామనుకున్నా.. తనవల్లే..: ఆమిర్ ఖాన్
కరోనా సమయంలో జనజీవనం స్తంభించిపోయింది. ఎంతోమంది బతుకులు ఆగమయ్యాయి. ఉద్యోగాలు ఊడిపోయాయి. రేపనేది ఉంటుందా? లేదా? అన్న సందిగ్ధం.. అంతటా విషాదం.. ఆ పరిస్థితుల్లో తనకు సినిమాలు మానేయాలన్న ఆలోచన వచ్చిందంటున్నాడు బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్.కరోనా సమయంలో..అతడి మాజీ భార్య కిరణ్ రావు తెరకెక్కించిన లాపతా లేడీస్ ఆస్కార్ కోసం ‘బెస్ట్ ఫారిన్ ఫిల్మ్’ కేటగిరీలో మన దేశం నుంచి అఫిషియల్ ఎంట్రీగా వెళ్లనుంది. లాపతా లేడీస్‌ను లాస్ట్ లేడీస్‌గా మార్చేసి.. అమెరికాలో ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంలో ఆమిర్ ఖాన్ తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడాడు. 'కరోనా సమయంలో పని లేక ఇంట్లోనే కుటుంబసభ్యులతో ఎక్కువ సమయం గడిపాను. భావోద్వేగానికి లోనయ్యా..ఇంతకాలం బిజీగా ఉండి రిలేషన్షిప్స్కు సరైన సమయం కేటాయించలేదేమో అనిపించింది. ఒకరకంగా చెప్పాలంటే చాలా బాధపడ్డాను, భావోద్వేగానికి గురయ్యాను. ఇక సినిమాలు ఆపేద్దామనుకున్నాను. అప్పుడు కిరణ్.. మరోసారి ఆలోచించుకోమని చెప్పింది. సినిమాలు లేకుండా నేను ఉండలేననే విషయాన్ని అర్థమయ్యేలా చెప్పింది. దీంతో తిరిగి సినిమాల్లో నటించడానికి సిద్ధమయ్యా' అని ఆమిర్ చెప్పుకొచ్చాడు. -
చింపాంజీ దాడి.. ఆ హీరోనే రక్షించాడు: ఆమిర్ ఖాన్
సినిమా షూటింగ్లో కొన్నిసార్లు ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలు పోవడం ఖాయం. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ ఓసారి చావు అంచులదాకా వెళ్లొచ్చాడట! ఆ సమయంలో అజయ్ దేవ్‌గణ్ అతడిని కాపాడాడు. వీళ్లిద్దరూ 1997లో వచ్చిన కామెడీ మూవీ ఇష్క్‌లో నటించారు. కాజోల్, జూహీ చావ్లా హీరోయిన్స్‌గా యాక్ట్ చేశారు.చింపాంజీ దాడితాజాగా ఓ ఈవెంట్లో పాల్గొన్న ఆమిర్ ఖాన్, అజయ్ 'ఇష్క్' మూవీ షూటింగ్లో జరిగిన ఓ ఘటన గురించి గుర్తు చేసుకున్నారు. ముందుగా ఆమిర్ మాట్లాడుతూ.. మేము తరచూ కలుసుకోము. కానీ కలుసుకున్నప్పుడు మాత్రం అజయ్ నాపై ఎంతో ప్రేమ చూపిస్తుంటాడు. ఇష్క్ సినిమాలో ఓ సీన్ చిత్రీకరించేటప్పుడు ఒక చింపాజీ సడన్‌గా నాపై దాడి చేసేందుకు ప్రయత్నించింది అన్నాడు. పారిపోండి అంటూ ఒకటే పరుగుఇంతలో అజయ్ కలుగజేసుకుంటూ.. చింపాజీ కుదురుగానే కూర్చుంది. ఆమిర్ ఎప్పుడైతే దానిపై నీళ్లు చిలకరించి విసుగు తెప్పించాడో అప్పుడే సమస్య మొదలైంది. అది వెంటపడటంతో పారిపోండి పారిపోండి అని అరుస్తూ పరిగెత్తాడు అని తెలిపాడు. అప్పుడు నన్ను అజయే రక్షించాడంటూ ఆమిర్ పగలబడి నవ్వాడు.చదవండి: బిగ్‌బాస్ నుంచి పిలుపు.. ఆ అవమానాలు నా వల్ల కాదు: నటుడు -
గజినిలా మారిపోయిన ఓరీ.. సడన్‌గా ఎందుకిదంతా?
అల్లాటప్పాగా తిరుగుతూ, చిత్రవిచిత్రంగా పోజులిస్తూ ఫేమస్ అయ్యాడు ఓరీ. బాలీవుడ్ పార్టీలకు హాజరవుతూ, అక్కడున్నవారితో ఫోటోలు దిగుతూ రెండు చేతులా సంపాదించుకుంటున్నానంటాడు. తాజాగా ఇతడు బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్‌లా మారిపోయాడు. ఆమిర్ సినిమా లుక్స్‌ను రీక్రియేట్ చేస్తూ స్పెషల్ ఫోటోషూట్ చేశాడు.ఆ పోస్టర్లను రీక్రియేట్ చేసిన ఓరీసినిమా టైటిల్స్‌లోనూ తన పేరును ఇరికించేశాడు. ఈ పోస్టర్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన గజిని, తారే జమీన్ పర్, లగాన్, దిల్ చహ్తా హై, రంగ్‌దే బసంతి, తలాష్, 3 ఇడియట్స్, మంగళ్ పాండే, పీకే, దంగల్, రాజా హిందుస్తానీ ఇలా అన్ని సినిమా పోస్టర్లను రీక్రియేట్ చేశాడు. దీని గురించి ఓరీ మాట్లాడుతూ.. '18 ఏళ్లకంటే చిన్నవారికి ఆమిర్ ఖాన్ సినిమాలు తెలిసి ఉండకపోవచ్చు. అందుకోసమే ఇదంతా..ఉదాహరణకు తారే జమీన్ పర్ వచ్చి 17 ఏళ్లవుతోంది. ఇప్పుడు 17 ఏళ్ల వయసున్న వారికి ఈ సినిమా తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే అప్పుడే కదా వాళ్లు ఈ లోకంలో అడుగుపెట్టింది. యంగ్ జెనరేషన్‌లోని చాలామందికి ఈ సినిమాలన్నీ తెలిసి ఉండవు. అలాంటివారికి ఆమిర్ గురించి, ఆయన టాలెంట్ గురించి కచ్చితంగా తెలియాలనే ఇలా చేశాను.బహుముఖ ప్రజ్ఞాశాలిఅనుకున్నట్లుగానే అందరిలోనూ ఈ సినిమాల గురించి తెలుసుకోవాలన్న ఉత్సుకతను ప్రేరేపించాను. ఆమిర్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. తన చిత్రాల ద్వారా ఏదో ఒక సందేశాన్ని సమాజానికి ఇచ్చేవారు. మూవీలో నటించడమే కాకుండా నిర్మాతగా, డైరెక్టర్‌గానూ పని చేశాడు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. కానీ ఇంతవరకు ఆయనను కలుసుకోలేదు.ఎంత ఖర్చయిందంటే?ఈ మూవీ పోస్టర్లు రీక్రియేట్ చేయడానికి నాకు రూ.1.5 లక్షలు ఖర్చయింది. ప్రతి పోస్టర్‌కు హెయిర్‌స్టైల్ మారిపోతూ ఉండాలి. అదే అన్నింటికంటే కష్టంగా అనిపించింది. ఈ సినిమాలన్నింటిలో నాకు బాగా నచ్చినది గజిని' అని చెప్పుకొచ్చాడు. View this post on Instagram A post shared by Orhan Awatramani (@orry) చదవండి: అద్దె కట్టేందుకు డబ్బుల్లేవు.. అయినా పైసా తీసుకోకుండా ఐటం సాంగ్స్! -
2 వేల కోట్లు వసూలు చేస్తే.. మాకిచ్చింది కోటే..!
-
గజిని సీక్వెల్ లో అమీర్ ఖాన్, సూర్య
-
కిశోర్‌కుమార్ బయోపిక్‌లో..?
ప్రముఖ దివంగత గాయకుడు– నటుడు కిశోర్ కుమార్ బయోపిక్ కోసం హిందీ చిత్ర పరిశ్రమలో కొంతకాలంగా సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే కిశోర్ కుమార్‌గా ఎవరు నటిస్తారనే విషయంపై స్పష్టత రావడం లేదు. పైగా ఎప్పటికప్పుడు పేర్లు మారుతున్నాయి. తొలుత అక్షయ్ కుమార్ పేరు వినిపించింది. ఆ తర్వాత రణ్‌బీర్ కపూర్ పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఆమిర్ ఖాన్ పేరు బీ టౌన్లో గట్టిగా వినిపిస్తోంది. కిశోర్ కుమార్ బయోపిక్కు అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తారని, భూషణ్ కుమార్ నిర్మిస్తారని ఎప్పట్నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ బయోపిక్ గురించి ఇటీవల ఆమిర్ ఖాన్ – అనురాగ్ బసుల మధ్య చర్చలు జరిగాయని, త్వరలోనే ఈ ్ర΄ాజెక్ట్ గురించి ఓ అధికారిక ప్రకటన వచ్చే చాన్స్ ఉందని భోగట్టా. మరోవైపు ‘చార్ దిన్ కీ జిందగీ, గజిని 2, ఉజ్వల్ నికమ్ బయోపిక్, ఓ సూపర్ హీరో ఫిల్మ్ (దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌తో) చిత్రాలు కూడా ఆమిర్ ఖాన్ చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. మరి... ఆమిర్ ఖాన్ నెక్ట్స్ ్ర΄ాజెక్ట్ ఏంటి? అనే ప్రశ్నకు సమాధానం కావాలంటే కొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు. ఇక ఆమిర్ నటించిన ‘సితారే జమీన్ పర్’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. -
రూ.2000 కోట్లు వస్తే.. మాకు రూ.కోటి మాత్రమే ఇచ్చారు: బబిత
ఆమిర్ ఖాన్ 'దంగల్' సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహావీర్ ఫొగాట్ అనే వ్యక్తి జీవితం ఆధారంగా దీన్ని తెరకెక్కించారు. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర రూ.2000 కోట్లు వరకు వసూళ్లు వచ్చాయి. అయితే తమ కుటుంబానికి మాత్రం రూ.కోటి మాత్రమే ఇచ్చారనే విషయాన్ని బబిత ఫొగాట్ బయటపెట్టింది.న్యూస్ 24 ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బబిత మాట్లాడుతూ.. తమ కుటుంబానికి రూ.కోటి ఇచ్చిన విషయాన్ని బయటపెట్టింది. ప్రాజెక్ట్‌లోకి ఆమిర్ ఖాన్ రాకముందే ఈ ఒప్పందం జరిగినట్లు చెప్పుకొచ్చింది. ఇంత మొత్తమే వచ్చినందుకు తమకు ఎలాంటి బాధ లేదని, ఎందుకంటే తన తండ్రి మహావీర్ ఫొగాట్.. ప్రజల ప్రేమ దక్కిచే చాలని చెప్పినట్లు గుర్తు చేసుకుంది.(ఇదీ చదవండి: అవినాష్ సరదా.. నిజంగానే డోర్ తెరిచిన బిగ్‌బాస్)హర్యానాకు చెందిన మహావీర్ ఫొగాట్.. రెజ్లింగ్‌లో అనుకున్నంత సక్సెస్ కాలేకపోయాడు. దీంతో తనకు పుట్టే కొడుకుల్ని మంచి రెజ్లర్ చేద్దామని అనుకున్నారు. కూతుళ్లు పుట్టేసరికి తొలుత బాధపడ్డాడు గానీ తర్వాత ఎన్నో అవమానాలు ఎదుర్కొని మరీ వాళ్లని రెజ్లర్స్‌గా తీర్చిదిద్దాడు. అద్భుతమైన డ్రామా వర్కౌట్ అయిన ఈ మూవీ.. మన దేశంతో పాటు చైనా, జపాన్‌లోనూ మంచి వసూళ్లు సాధించింది.మహావీర్ ఫొగాట్ రెండో కూతురే బబిత. 2010 కామన్వెల్త్ గేమ్స్‌లో వెండి పతకం సాధించింది. 2014లో బంగారం అందుకుంది. 2012లో ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో కాంస్యం అందుకుంది. 2016 ఒలింపిక్స్‌లో పాల్గొంది గానీ పతకం కొట్టలేకపోయింది. 2019లో రెజ్లింగ్‌కి రిటైర్మెంట్ ఇచ్చేసి రాజకీయాల్లో చేరింది. ప్రస్తుతం బీజేపీలో ఉంది.(ఇదీ చదవండి: ఉదయనిధి స్టాలిన్ రూ. 25 కోట్లు చెల్లించాల్సిందే.. కోర్టుకెళ్లిన నిర్మాత)2000 करोड़ की फिल्म, फोगाट परिवार को मिला सिर्फ 1 करोड़◆ बबीता फोगाट का चाय वाला इंटरव्यू मानक गुप्ता के साथ ◆ पूरा इंटरव्यू: https://t.co/LPKn1lwMLb@ManakGupta #ManakKaRapidFire @BabitaPhogat | #ChaiWalaInterview pic.twitter.com/Fgt843zYE1— News24 (@news24tvchannel) October 22, 2024 -
కాంబినేషన్ సెట్?
బాలీవుడ్ అగ్ర హీరో ఆమిర్ ఖాన్ , తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుందనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. ఈ కథ విషయమై ఇటీవల ఆమిర్ ఖాన్ , లోకేష్ పలుమార్లు చర్చించుకున్నారట. ప్రస్తుతం వీరిద్దరికి ఉన్న కమిట్మెంట్స్ పూర్తయిన తర్వాత ఈ సినిమాపై అధికారిక ప్రకటన రావచ్చని, 2026లో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయని బాలీవుడ్లో ప్రచారం సాగుతోంది. అంతేకాదు.. ఈ సినిమా సూపర్‌హీరో జానర్లో ఉంటుందట. మరి.. ఆమిర్, లోకేష్ కాంబినేషన్ సెట్ అవుతుందా? వేచి చూడాలి. ఇదిలా ఉంటే.. రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కూలీ’ చిత్రంలో ఆమిర్ ఖాన్ ఓ అతిథి పాత్ర చేస్తున్నారనే టాక్ కూడా తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. -
గ్యాప్ ఇవ్వలా... వచ్చింది
నచ్చిన కథ దొరక్క కొందరు, చేసే పాత్రకు తగ్గట్టు మేకోవర్ అవ్వాలని మరికొందరు, వ్యక్తిగత జీవితంతో ఇంకొందరు... ఇలా కారణాలు ఏమైనా యాక్టర్స్ కెరీర్లో కొన్నిసార్లు గ్యాప్‌లు వస్తుంటాయి. వారికి ఇష్టం ఉన్నా లేకున్నా ఈ గ్యాప్‌ను ఫిల్ చేయలేని పరిస్థితి ఎదురవుతుంది. ఇలాంటి గ్యాప్‌ల కారణంగా ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్‌పై కనిపించకుండా ‘గ్యాప్ ఇవ్వలా... వచ్చింది’ అంటున్న కొందరు బాలీవుడ్ హీరోల గురించి తెలుసుకుందాం.స్పీడ్ బ్రేకర్ గత ఏడాది బాక్సాఫీస్‌ను ఓ ఊపు ఊపేశారు షారుక్ ఖాన్. 2023లో షారుక్ ఖాన్ హీరోగా చేసిన ‘పఠాన్, జవాన్’ రూ. వెయ్యి కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను అధిగమించగా, ‘డంకీ’ రూ. 450 కోట్ల కలెక్షన్స్‌ను సాధించిందని లెక్కలు చెబుతున్నాయి. ఇలా ఈ మూడు చిత్రాలతో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గత ఏడాది రూ. 2,500 కోట్ల కలెక్షన్స్ పైగా రాబట్టగలిగారు షారుక్. కానీ ఈ ఏడాది షారుక్ జోరుకు స్పీడ్ బ్రేకర్ పడింది. 2024లో సిల్వర్ స్క్రీన్‌ని మిస్ చేసుకున్నారు షారుక్. సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో షారుక్ ఖాన్ హీరోగా ‘కింగ్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో షారుక్ తనయ సుహానా ఖాన్ మరో లీడ్ రోల్లో నటిస్తారు. ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ పూర్తి కాకపోవడంతో ఇంకా ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లలేదు. ‘కింగ్’ 2025 ద్వితీయార్ధంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ది బుల్ మిస్ అయ్యాడు ‘కిసీ కీ భాయ్ కిసీ కీ జాన్, టైగర్ 3’... ఈ రెండు సినిమాలతో సల్మాన్ ఖాన్ గత ఏడాది వెండితెరపై కనిపించారు. ఇదే జోష్‌లో ఈ ఏడాది ఈద్‌కు సల్మాన్ ఖాన్ సినిమా ఒకటి రిలీజ్ అవుతుందని అనుకున్నారు ఆయన ఫ్యాన్స్. కానీ కుదర్లేదు. ‘షేర్షా’ ఫేమ్ విష్ణువర్ధన్తో సల్మాన్ ఖాన్ చేయాల్సిన ‘ది బుల్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమా సరైన సమయంలో సెట్స్ పైకి వెళ్లలేదు. దాంతో ఈ ఏడాది సల్మాన్ ఖాన్ వెండితెరపై కనిపించలేకపోయారు. ఇదిలా ఉంటే... ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్‌తో సల్మాన్ ఖాన్ ‘సికందర్’ అనే యాక్షన్ ఫిల్మ్ చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఈద్ సందర్భంగా రిలీజ్ కానున్నట్లు యూనిట్ ప్రకటించింది. మరోవైపు దర్శకుడు విష్ణువర్ధన్తో సల్మాన్ చేయనున్న చిత్రం కూడా 2025లోనే రిలీజ్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. సో.. వచ్చే ఏడాది రెండుసార్లు సల్మాన్ తెరపై కనిపిస్తారని ఊహించవచ్చు. రెండేళ్లు పూర్తయినా... రెండేళ్లు దాటిపోయింది ఆమిర్ ఖాన్ బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించి. 2022లో చేసిన ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా (హాలీవుడ్ ఫిల్మ్ ‘ఫారెస్ట్ గంప్’కి హిందీ రీమేక్) తర్వాత ఆమిర్ వెంటనే మరో సినిమా ఒప్పుకోలేదు. మరోవైపు తన కుమార్తె ఐరా ఖాన్ పెళ్లి పనులతో కొన్నాళ్లు ఆమిర్ ఖాన్ బిజీ అయ్యారు. దాంతో ఆయన తాజా చిత్రం ‘సితారే జమీన్ పర్’ లేట్‌గా సెట్స్‌పైకి వెళ్లింది. ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబరులో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ వచ్చే ఏడాదికి వాయిదా వేశారని సమాచారం. భారీ చిత్రంతో... ‘యానిమల్’ సినిమాతో గత ఏడాది బ్లాక్‌బస్టర్ అందుకున్నారు రణ్‌బీర్ కపూర్. అయితే గత ఏడాది ‘తు ఝూతీ మై మక్కర్’ చిత్రంతో ఓ ఫ్లాప్ కూడా అందుకున్నారు ఈ హీరో. ఇక ఈ ఏడాది థియేటర్స్‌లో కనిపించకుండా బ్రేక్ తీసుకున్నారు. భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందుతున్న ‘రామాయణ్’ సినిమాతో ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్ బిజీగా ఉన్నారు. నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయిపల్లవి, యశ్ వంటి స్టార్స్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఇది భారీ చిత్రం కాబట్టి షూట్‌కి ఎక్కువ సమయం పడుతుంది. దాంతో ఈ ఏడాది తెరపై కనిపించలేదు రణ్‌బీర్. రెండు భాగాలుగా ఈ సినిమా రూపొందుతోందని, తొలి భాగం 2025లో రిలీజ్ అవుతుందని సమాచారం. అలాగే సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రణ్‌బీర్ హీరోగా నటిస్తున్న ‘లవ్ అండ్ వార్’ 2026లో విడుదల కానుంది. పర్సనల్ టైమ్ రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఏ చిత్రం కూడా ఈ ఏడాది రిలీజ్ కావడం లేదు. ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ చిత్రం గత ఏడాది జూలైలో రిలీజ్ అయింది. అయితే వెంటనే మరో మూవీకి సైన్ చేయలేదు రణ్వీర్. ఫిబ్రవరి చివర్లో తాము తల్లిదండ్రులం కాబోతున్న విషయాన్ని రణ్వీర్ సింగ్–దీపికా పదుకోన్ వెల్లడించారు. సో... పర్సనల్ లైఫ్‌కు రణ్వీర్ టైమ్ కేటాయించారు. ఆ తర్వాత ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ ‘డాన్ 3’ సినిమాను ప్రకటించారు. కానీ ఈ చిత్రం 2025లోనే రిలీజ్ అవుతుంది. కాగా అజయ్ దేవగన్ హీరోగా నటించిన ‘సింగమ్ ఎగైన్’ సినిమాలో మాత్రం రణ్వీర్ ఓ గెస్ట్ రోల్ చేశారు. ఈ చిత్రం దీపావళికి రిలీజ్ కానుంది. ఇక దీపికా పదుకోన్ ఈ ఏడాది సెప్టెంబరులో ఓ పాపకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే,. బిజీ బిజీ... కానీ! ‘గదర్ 2’తో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించి, మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు సీనియర్ హీరో సన్నీ డియోల్. 2023లో రిలీజైన ‘గదర్ 2’ సక్సెస్‌తో సన్నీ డియోల్‌కు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం ‘బోర్డర్ 2, లాహోర్ 1947, రామాయణ్’ (కీలక పాత్రధారి)లతో పాటు తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న సినిమాలతో బిజీగా ఉన్నారు సన్నీ. ఈ సినిమాల చిత్రీకరణ ఈ ఏడాదే ఆరంభమైంది. కానీ ఈ ఏడాది సన్నీ థియేటర్స్‌లోకి వచ్చే చాన్సెస్ కనిపించడం లేదు. అయితే 2025లో ఆయన మూడు చిత్రాలతో కనిపించే అవకాశం ఉంది. -
అప్పుడు నా కల నిజం అవుతుంది : కిరణ్ రావ్
హిందీ హిట్ ఫిల్మ్ ‘లాపతా లేడీస్’ ఆస్కార్ బరిలో నిలిస్తే తన కల నిజమౌతుందని దర్శక–నిర్మాత కిరణ్ రావ్ అన్నారు. నితాన్షి గోయెల్, ప్రతిభ ప్రధాన పాత్రధారులుగా స్పర్శ్ శ్రీవాస్తవ, రవికిషన్ ఇతర కీలక పాత్రల్లో నటించిన హిందీ చిత్రం ‘లాపతా లేడీస్’. ఆమిర్ ఖాన్, కిరణ్ రావ్, జ్యోతిదేశ్ పాండే నిర్మించిన ఈ చిత్రం 2024 మార్చిలో విడుదలై, సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. మహిళా సాధికారత, సమానత్వం వంటి అంశాలతో సాగే ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ‘‘ఆస్కార్‌కు ఈ సినిమాని పంపితే నా కల నిజం అవుతుంది. కానీ ఇందుకు కొన్ని విధి విధానాలు ఉన్నాయి. అయితే ఆస్కార్‌కు పంపే సినిమాలను ఎంపిక చేసేవారు మంచి చిత్రాలను ప్రోత్సహిస్తారనే నమ్మకం ఉంది’’ అని కిరణ్ రావ్ పేర్కొన్నారు. మరి... భారతదేశం తరఫున అధికారిక ఎంట్రీగా ఆస్కార్ అవార్డ్స్లోని ఉత్తమ విదేశీ విభాగంలో ‘లాపతా లేడీస్’ ఎంపిక అవుతుందా? అసలు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎఫ్ఐ) కమిటీ ఫైనల్‌గా ఆస్కార్ బరికి ఏ భారతీయ చిత్రాన్ని పంపిస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇక 97వ ఆస్కార్ వేడుక మార్చిలో జరగనుంది. -
రజినీకాంత్ సినిమాలో విలన్ గా అమీర్ ఖాన్
-
మళ్లీ పెళ్లి చేసుకోవడం కష్టమే: ఆమిర్ ఖాన్
‘‘ప్రస్తుతం నా వయసు 59 ఏళ్లు. ఈ ఏజ్‌లో మళ్లీ పెళ్లి చేసుకోవడమంటే కష్టమే. ఎందుకంటే ఇప్పుడు నాకంటూ ఎన్నో బాధ్యతలు ఉన్నాయి’’అన్నారు హీరో ఆమిర్ ఖాన్. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్గా పేరు తెచ్చుకున్న ఆమిర్ ఖాన్ తాజాగా నటి రియా చక్రవర్తి నిర్వహిస్తున్న ఓ టీవీ షోలో పాల్గొన్నారు. వివాహ బంధం సక్సెస్ కావాలంటే ఏం చేయాలి? అనే ప్రశ్నకు ఆమిర్ ఖాన్ బదులిస్తూ..‘‘ఒక బంధం సక్సెస్ లేదా ఫెయిల్యూర్ అనేది ఇద్దరు వ్యక్తులపై ఆధారపడి ఉంటుంది. వివాహ బంధం విషయంలో నేను రెండుసార్లు ఫెయిల్ అయ్యాను. అందుకే పెళ్లి విషయంలో నా సూచనలు తీసుకోకపోవడం మంచిది.నన్ను నేను మరింత బెటర్‌గా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాను. అలాగని నాకు ఒంటరిగా జీవించడం ఇష్టం ఉండదు. నాకంటూ ఒక భాగస్వామి ఉండాలని కోరుకుంటా. నా మాజీ సతీమణులు రీనా దత్తా, కిరణ్ రావులతో ఇప్పటికీ నాకెంతో మంచి అనుబంధం ఉంది. నా దృష్టిలో మేమంతా ఒకే కుటుంబం’’ అన్నారు. ‘మీకు మళ్లీ పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా?’ అనే ప్రశ్నకు ఆమిర్ ఖాన్ స్పందిస్తూ.. ‘‘ప్రస్తుతం నా వయసు 59 ఏళ్లు. ఈ ఏజ్‌లో మళ్లీ పెళ్లి చేసుకోవడమంటే కష్టంగా ఉంటుంది.ఎందుకంటే ఇప్పుడు నాకంటూ ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. నా కుటుంబం, పిల్లలు, తోబుట్టువులు.. ఇలా చాలామందితో ఆప్యాయంగా కలిసిమెలిసి ఉంటున్నాను. అందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని ఆమిర్‌ఖాన్ తెలిపారు. కాగా ఆమిర్ ఖాన్–రీనా దత్తా 2002లో, ఆమిర్– కిరణ్‌రావు 2021లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. -
ఈ వయసులో మూడో పెళ్లి కష్టమేమో! కానీ..: ఆమిర్ ఖాన్
బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ మూడో పెళ్లి చేసుకోబోతున్నాడంటూ ఆ మధ్య జోరుగా ప్రచారం నడిచింది. కానీ అది కార్యరూపం దాల్చలేదు. పోనీ, అలాంటి ఉద్దేశం ఏదైనా ఉందా? అన్న ప్రశ్నకు తాజాగా బదులిచ్చాడు. ఓ షోలో మాట్లాడుతూ.. ప్రస్తుతం నా వయసు 59. ఈ సమయంలో మళ్లీ పెళ్లి చేసుకోవడమనేది కష్టమే! ఇప్పుడు నాకంటూ ఎన్నో బంధాలున్నాయి. ఒకే కుటుంబం..నా కుటుంబం, పిల్లలు, తోబుట్టువులు.. ఇలా చాలామందితో ఆప్యాయంగా కలిసిమెలిసి ఉంటున్నాను. అందుకు చాలా సంతోషంగా ఉంది. నన్ను నేను మరింత బెటర్‌గా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాను. అలా అని నాకు ఒంటరిగా ఉండటం అస్సలు నచ్చదు. ఒక తోడు కావాలి. నా మాజీ భార్యలు రీనా, కిరణ్‌తో క్లోజ్‌గానే ఉంటాను. మేమంతా ఒకే కుటుంబంలా కలిసుంటాం అని చెప్పుకొచ్చాడు.సలహా ఇచ్చేందుకు నిరాకరణవైవాహిక బంధం గురించి జనాలకు ఏదైనా సలహా ఇస్తారా? అన్న ప్రశ్నకు.. నా రెండు పెళ్లిళ్లు విఫలమయ్యాయి. అలాంటి నన్ను పట్టుకుని పెళ్లి గురించి సలహా ఇవ్వమని అడగొద్దని సూచించాడు. ఇకపోతే ఆమిర్ గతంలో రీనా దత్తాను పెళ్లి చేసుకున్నాడు. 16 ఏళ్లపాటు కలిసున్న వీరు 2002లో విడిపోయారు. రెండు పెళ్లిళ్లు విఫలంఅనంతరం దర్శకురాలు కిరణ్ రావును పెళ్లాడాడు. కానీ వీళ్లిద్దరు కూడా భార్యాభర్తలుగా కలిసుండలేకపోయారు. విడాకులు తీసుకున్నారు. సినిమాల విషయానికి వస్తే ఆమిర్ ప్రస్తుతం సితారె జమీన్ పర్ మూవీ చేస్తున్నాడు.చదవండి: ప్రియుడిని పెళ్లాడిన రామ్ చరణ్ హీరోయిన్.. ఫోటోలు వైరల్! -
విడాకులు తీసుకున్నా.. కానీ హ్యాపీగానే ఉన్నా: స్టార్ హీరో భార్య
బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఆమిర్ ఖాన్ ఒకరు. కొన్నేళ్ల క్రితం వరకు అడపాదడపా సినిమాలు చేస్తూ వచ్చాడు. కానీ 'లాల్ సింగ్ చద్దా' ఘోరమైన డిజాస్టర్ కావడంతో తాత్కాలికంగా యాక్టింగ్ పక్కనబెట్టేశాడు. ఇక ఈ మూవీ షూటింగ్ టైంలోనే భార్య కిరణ్ రావ్ నుంచి విడాకులు తీసుకున్నాడు. ఇది జరిగి దాదాపు మూడేళ్లు అవుతున్నా సరే కిరణ్ ఇంకా ఆ జ్ఞాపకాల్లో ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. డివోర్స్ తీసుకున్నా కానీ తను సంతోషంగానే ఉన్నానని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?)'మనం ఎప్పటికప్పుడు మారుతూనే ఉన్నాం. అలానే బంధాలు అనేవి కొత్త రూపు సంతరించుకోవాలి. ఆమిర్ నా జీవితంలోకి రాకముందు నేను చాలా ఏళ్లపాటు ఒంటరిగానే ఉన్నాను. ఆ ఒంటరితనాన్ని నేను ఎంజాయ్ చేశా. కానీ ఇప్పుడు నాకు ఆజాద్ (కొడుకు) తోడుగా ఉన్నాడు. కాబట్టి నేను ఒంటరి కాదు. చాలామంది విడాకులు తీసుకున్నా తర్వాత ఒంటరిగా ఉండలేక సతమతమవుతుంటారు. నాకు ఆ విషయంలో భయం లేదు. ఎందుకంటే ఇరు కుటుంబాలు నాకు ఇప్పటికీ అండగా ఉన్నాయి. చెప్పాలంటే ఇది సంతోషకరమైన విడాకులు' అని కిరణ్ రావ్ చెప్పుకొచ్చింది.కిరణ్ రావ్ ఈ మధ్య కాలంలో అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు. 'యానిమల్' రిలీజ్ టైంలో పరోక్షంగా మూవీపై సెటైర్ వేశారు. దీంతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈమెకు కౌంటర్ ఇచ్చేశాడు. దీంతో ఈమె సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. కిరణ్ రావ్ దర్శకత్వం వహించిన 'లాపతా లేడీస్'.. ఈ ఏడాది రిలీజైన సినిమాల్లో బెస్ట్ అని చెప్పొచ్చు. కొత్తగా పెళ్లయిన ఓ అమ్మాయి, భర్త నుంచి తప్పిపోతే ఏం జరిగిందనేదే స్టోరీ. ఇదంతా పక్కనబెడితే ఇప్పుడు మరోసారి తన విడాకులు గురించి మాట్లాడి వార్తల్లో నిలిచింది.(ఇదీ చదవండి: 'హాట్ స్పాట్' సినిమా రివ్యూ (ఓటీటీ)) -
లాల్ సింగ్ చద్దా.. నన్ను ఆడిషన్ చేశారు.. కానీ!: ఆమిర్ తనయుడు
ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం లాల్ సింగ్ చద్దా. ఇందులో నాగచైతన్య ఓ ముఖ్య పాత్ర పోషించాడు. అయితే ఆమిర్ చేయాల్సిన పాత్ర కోసం ముందుగా తనను ఆడిషన్ చేశారని చెప్తున్నాడు ఆయన తనయుడు, నటుడు జునైద్ ఖాన్. జునైద్ ఇటీవలే మహారాజ్ అనే చిత్రంతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. నిజానికి లాల్ సింగ్ చద్దా కోసం నన్ను ఆడిషన్ చేశారు. ఈ మూవీ నేను చేస్తే బాగుండని నాన్న ఎంతగానో అనుకున్నారు. కానీ కుదరలేదు అని తెలిపాడు.కుమారుడికి స్క్రీన్ టెస్ట్ఈ విషయాన్ని ఆమిర్ గతంలోనూ వెల్లడించాడు. లాల్ సింగ్ చద్దా కోసం మొదటగా జునైద్‌కు స్క్రీన్ టెస్ట్ చేశారని తెలిపాడు. కాగా లాల్ సింగ్ చద్దాలో కరీనా కపూర్, మోనా సింగ్ కీలక పాత్రల్లో నటించారు. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ 1994లో వచ్చిన ఫారెస్ట్ గంప్ అనే హాలీవుడ్ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది. ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. మహారాజ్ సినిమా..మహారాజ్ మూవీ విషయానికి వస్తే.. 1862లో జరిగిన యదార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. సిద్దార్థ్ మల్హోత్రా దర్శకత్వం వహించగా యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్ నిర్మించింది. జైదీప్ అహ్లావత్, షాలిని పాండే కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది.చదవండి: మహేష్ – రాజమౌళి మూవీ: విలన్‌గా స్టార్ హీరో! -
విడిపోయినా కలిసికట్టుగానే.. మాజీ భార్యతో హీరో ఫన్డే
భార్యాభర్తలు విడాకులు తీసుకున్నాక ఒకరి ముఖం మరొకరు చూడటానికే ఇష్టపడరు. అలాంటిది సన్నిహితంగా మెదులుతారా? సమస్యే లేదు! కానీ బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్, దర్శకురాలు కిరణ్‌రావు మాత్రం విడిపోయినా సరే దంపతుల్లా కలిసి షికార్లకు, హాలీడే ట్రిప్పులకు వెళ్తున్నారు. వీళ్లను చూసిన వారెవరూ డివోర్స్డ్ కపుల్ అనుకోనే అనుకోరు.వీరిద్దరూ తమ కుమారుడు ఆజాద్‌తో కలిసి జూన్ 30న బయటకు వెళ్లారు. సండేను ఫండేగా ఎంజాయ్ చేసిన వీళ్లు రావ్- ఖాన్ హాలీడే అని రాసుకొచ్చారు. ఫ్రెండ్స్‌తో కలిసి ఓ ఫోటోల కూడా దిగారు. ఇకపోతే ఆమిర్ ఖాన్ ఇటీవలే తన తల్లి జీనత్ హుస్సేన్ 90వ బర్త్‌డే గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశాడు. ఈ పుట్టినరోజు వేడుకలు స్పెషల్‌గా ఉండాలని బంధువులు, జీనత్ స్నేహితుల ఇంటికి వెళ్లి మరీ సెలబ్రేషన్స్‌కు ఆహ్వానించాడు. అలా జీనత్ బర్త్‌డే కాస్తా ఆత్మీయ సమ్మేళనంగా మారింది. ఈ వేడుకల్లో ఆమిర్ ఇద్దరు మాజీ భార్యలు కిరణ్ రావు, రీనా దత్తా కూడా ఉన్నారు.చదవండి: ఈ కుర్రాడ్ని గుర్తుపట్టారా? ప్రముఖ నిర్మాత అల్లుడు, టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ -
మరో లగ్జరీ అపార్ట్మెంట్ కొన్న స్టార్ హీరో.. ఎన్ని కోట్ల ఖరీదంటే?
రీసెంట్ టైంలో స్టార్ హీరోహీరోయిన్లు చాలామంది కొత్త ఇల్లు కొనేసి, ఓ ఇంటి వాళ్లవుతున్నారు. ఇదివరకు బాలీవుడ్ బ్యూటీస్ ఎక్కువ మంది బంగ్లా లేదా ఫ్లాట్ కొనడంలో కాస్త ముందుండేవాళ్లు. ఇప్పుడు ఈ లిస్టులోకి హీరో ఆమిర్ ఖాన్ కూడా చేరిపోయాడు. ఇప్పటికే అరడజనుకి పైగా ఇళ్లని కొనుగోలు చేసిన ఇతడు.. తాజాగా మరో ఖరీదైన అపార్ట్మెంట్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ తెలుగు సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)ముంబైలోని చాలా ఖరీదైన ప్రాంతంగా పేరున్న పలిహలి ఏరియాలో ఓ సూపర్ లగ్జరీ రెడీ టూ మూవ్ అపార్ట్‌మెంట్‌ని ఆమిర్ ఖాన్ ఇప్పుడు కొన్నట్లు సమాచారం. దీని విలువ దాదాపు రూ.9.75 కోట్లు అని, జూన్ 25నే దీని కొనుగోలు పూర్తయిందని తెలుస్తోంది. ఇందుకోసం రూ.58.5 లక్షల స్టాంప్ డ్యూటీ, రూ.30 వేల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాడని జాతీయ న్యూస్ సైట్లు రాసుకొచ్చాయి.ఇదిలా ఉండగా ఇప్పటికే ఆమిర్ ఖాన్‌కి ముంబైలోని మెరీనా, బాంద్రాలో సముద్రం ఒడ్డున, పంచగనిలో ఫామ్ హౌస్ ఉన్నాయి. అలానే ఉత్తరప్రదేశ్, ఢిల్లీలోనూ ఆస్తులు ఉన్నట్లు సమాచారం. 'లాల్ సింగ్ చడ్డా' తర్వాత యాక్టింగ్ పక్కనబెట్టేసిన ఆమిర్.. ప్రస్తుతం నిర్మాతగా మాత్రమే సినిమాలు చేస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం రెండో భార్య కిరణ్ రావ్‌కి విడాకులు ఇచ్చేసి ఒంటరిగా ఉంటున్నాడు.(ఇదీ చదవండి: జైలులో హీరో దర్శన్.. ఇతడికి సపోర్ట్‌గా టాలీవుడ్ హీరో) -
నాన్న సలహాలు లైట్ తీసుకున్నాం, ఇది తన మూవీ కాదు!: ఆమిర్ కుమారుడు
బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఆమిర్ ఖాన్ ఒకరు. లగాన్, దంగల్, పీకే, గజిని, 3 ఇడియట్స్, రంగ్‌దే బసంతి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన కెరీర్లో భారీ బ్లాక్‌బస్టర్ హిట్లు చాలానే ఉన్నాయి. తను చూడని విజయాలంటూ ఏమీ లేవు. ఆయన కుమారుడు జునైద్ ఖాన్ ఇటీవలే మహారాజ సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. స్క్రీన్‌టెస్ట్‌కు పిలిచారుఎంతో అనుభవం ఉన్న ఆమిర్ ఈ మూవీ చూసి కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చాడట. కానీ అవన్నీ తామసలు లెక్క చేయలేదంటున్నాడు జునైద్. 'డైరెక్టర్ సిద్దార్థ్ మల్హోత్రా ఒకసారి స్క్రీన్‌టెస్ట్ చేయాలని రమ్మన్నాడు. అలా మహారాజ మూవీకి నన్ను తీసుకున్నారు. బహుశా దర్శకనిర్మాతలు నన్ను రొమాంటిక్ నటుడిగా చూడలేదేమో! అందుకే ఇలాంటి కాన్సెప్ట్‌కు ఎంచుకున్నారు. నాన్నతో ఎక్కువగా చెప్పలేదుఎందుకో తెలీదు గానీ ఈ మూవీకి ముందు కొంత రాద్ధాంతం జరిగింది. అయితే ఈ చిత్రం ద్వారా మేము ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనుకోలేదు. మహారాజ గురించి మా నాన్నతో ఎక్కువగా చర్చించలేదు. ఎందుకంటే ఆయన తన పనిలోనే ఎప్పుడూ బిజీగా ఉంటాడు. పైగా ఇది తన సినిమా కానే కాదు. నాన్న సలహాలుఅంతా అయ్యాక సిద్దార్థ్ సర్, నిర్మాత ఆదిత్య చోప్రా సర్ నాన్నకు సినిమా చూపించారు. తనకు సినిమా నచ్చింది. అలాగే కొన్ని సూచనలు ఇచ్చారు. వాటిలో కొన్ని సలహాలు తీసుకుని పాటించారు. మరికొన్ని లైట్ తీసుకున్నారు. ఆయన కూడా మా సినిమాలో మరీ అంత జోక్యం చేసుకోలేదు. కానీ మాకేదైనా డౌట్ ఉందంటే మాత్రం దాన్ని టక్కున తీర్చేవారు' అని జునైద్ చెప్పుకొచ్చాడు. చదవండి: ‘ఏం జరిగిందో మీకే తెలియాలి'.. తిరుమలలో నటి హేమ వ్యాఖ్యలు -
రూ. 6300 కోట్లతో రిచెస్ట్ హీరోగా షారూఖ్ : మరి ఐకాన్ స్టార్ సంపద ఎంత?
బాలీవుడ్ సూపర్ స్టార్ కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ దేశంలోనే అత్యంత సంపన్న నటుడిగా నిలిచాడు. దశాబ్దాల కరియర్లో అనేక బ్లాక్ బ్లస్టర్లు, సూపర్‌హిట్ మూవీలతో బాక్సాఫీసు కలెక్షన్లలో దుమ్ము రేపి రారాజుగా నిలిచాడు. ఇటీవలి కాలంలో కొన్ని ఫ్లాప్ మూవీలు, సౌత్ సినిమా హవా ఉన్నప్పటికీ, 'జవాన్' ,పఠాన్' సినిమాల విజయవంతంతో షారుఖ్ ఖాన్ నికర విలువ గణనీయంగా పెరిగింది. అందుకే సంపాదనలో టాప్‌లో నిలిచాడు.ఇటీవల, IMDb డేటా సహాయంతో, ఫోర్బ్స్ భారతదేశంలోని టాప్ టెన్ ధనవంతుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఉత్తర ,దక్షిణ భారత నటీనటులు ఉన్నారు. ఈ జాబితాలో ఏకంగా 6300 కోట్ల నికర విలువో షారూఖ్ ఖాన్ టాప్‌లో నిలిచాడు. అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, అల్లు అర్జున్, రజనీకాంత్ వంటి ఇతర నటీనటులు ఈ జాబితాలో ప్రముఖ స్థానాల్లో ఉన్నారు. షారూఖ్ కరియర్లో జవాన్, పఠాన్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ.20000 కోట్లకు పైగా వసూలు చేశాయి. ‘డుంకీ’ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే సాధించింది..ఇక ఈ లిస్ట్‌లో రూ. 2900 కోట్ల నికర సంపదతో స్టార్హీరో సల్మాన్ ఖాన్ రెండో స్థానంలో నిలిచారు. సల్మాన్ చిత్రం ‘టైగర్ 3’ ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 466.63 కోట్లను వసూలు చేసింది.అక్షయ్ కుమార్ నికర విలువ దాదాపు 2500 కోట్లు ఉంటుందని అంచనా. 'OMG 2' కుమార్ అతిథి పాత్రను చూసింది , ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 221 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ నటుడు తరువాత చిత్రం 'వెల్కమ్ టు ది జంగిల్.'ఇక బాలీవుడ్ మరో సూపర్ స్టార్ అమీర్ ఖాన్1862 కోట్ల నికర సంపదతో నాలుగో స్థానంలో నిలిచాడు. విజయ్ నికర విలువ దాదాపు రూ. 474 కోట్లుగా లెక్కించారు. రజనీకాంత్ నికర విలువ దాదాపు 430 కోట్లు. టాలీవుడ్‌కి సంబంధించి పుష్ప సినిమాతో కలెక్షన్ల సునామీ రేపిన ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నికర విలువ 350 కోట్లుగా ఉండగా, ప్రభాస్ నికర విలువ 241 కోట్ల రూపాయలు. అజిత్ కుమార్ నికర విలువ రూ.196 కోట్లు. కమల్ హాసన్ 150 కోట్ల రూపాయలతో 10వ స్థానంలో నిలిచారు. -
సితారే జమీన్ పర్ పూర్తి
ఆమీర్‌ఖాన్ హీరోగా నటించి, నిర్మించిన తాజా చిత్రం ‘సితారే జమీన్ పర్’. జెనీలియా హీరోయిన్ గా నటించారు. ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ తాజాగా పూర్తయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు ఆర్ఎస్ ప్రసన్న.అంతేకాదు.. ‘సితారే జమీన్ పర్’ సినిమాని ఈ డిసెంబరులో విడుదల చేయాలనుకుంటున్నారట మేకర్స్. ఆమీర్‌ఖాన్ నటించిన ‘తారే జమీన్ పర్’ (2007) సినిమాకు సీక్వెల్‌గా ‘సితారే జమీన్ పర్’ తెరకెక్కుతోందట. ఆ సినిమాలో ఓ బాలుడిలో స్ఫూర్తి నింపే పాత్ర చేశారు ఆమీర్‌ఖాన్ . అయితే ‘సితారే జమీన్ పర్’ లో ఆమీర్‌ఖాన్ పాత్రను పిల్లలే మోటివేట్ చేస్తారని, ఇదే ఈ సినిమా బేసిక్ స్టోరీ అనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. -
అమ్మ కోసం స్టార్ హీరో గ్రాండ్ పార్టీ : 200 మందికి పైగా అతిథులు
బాలీవుడ్ 'మిస్టర్ పర్ఫెక్షనిస్ట్' ఆమీర్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సినిమాల ఎంపిక లోనూ, అద్భుతమైన నటనలోనూ అతనికి అతనే సాటి. మూడు పదుల తన సినిమా కరియర్లో ఎన్నో క్లాస్, మాస్ సినిమాలను అందించడమే కాదు, అనేక అవార్దులను కూడా సొంతం చేసుకున్నాడు. ఫ్యామిలీ , పిల్లలు, ఇరా, జునైద్, ఆజాద్ పట్ల బాధ్యతగా ఉండే ఆమీర్ తాహిర్ హుస్సేన్, జీనత్ హుస్సేన్‌లకు మంచి కుమారుడు కూడా పేరు తెచ్చుకున్నాడు. తాజాగా తన తల్లి 90వ పుట్టిన రోజును అత్యంత ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నాడట. దీనికి సంబంధించి వార్త హల్చల్ చేస్తోంది.ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం, జూన్ 13, అమీర్ తల్లి జీనత్ హుస్సేన్ బర్త్‌డే. ఈ నేపథ్యంలో గ్రాండ్ పార్టీని ప్లాన్ చేశాడట. కుటుంబ సభ్యులు స్నేహితులతో కూడిన 200 మందికి పైగా అతిథులతో గ్రాండ్ పార్టీ ఇస్తున్నట్టు సమాచారం. ముంబై నివాసంలో ఈ పార్టీ జరగనుంది. బనారస్, బెంగళూరు, లక్నో, మైసూర్ తదితర నగరాల నుండి తరలి రానున్నారు.2022లో అమీర్ ఖాన్ తల్లి జీనత్ హుస్సేన్ తీవ్రమైన గుండెపోటుకు గురయ్యారు. ఈ క్రమంలో తన తల్లిని జాగ్రత్తగా చూసుకున్నాడు. దాదాపు ఏడాది పాటు చికిత్స తీసుకుని, కోలుకున్న సందర్భంగా అందర్నీ కలిసేందుకు ఆమె పుట్టిన రోజుకంటే మంచి సందర్భం ఏముంటుందని భావించారట. కాగా గతంలో మదర్స్ డే సందర్భంగా తన తల్లిని బెస్ట్ మామ్ ఇన్‌ద వరల్డ్ అంటూ పేర్కొన్నాడు. ఈ సందర్బంగా కొన్ని ఫోటోలను అభిమానులతో పంచుకున్నాడు ఆమీర్. -
రెంట్ కోసం ఉద్యోగం చేయాల్సి వచ్చింది.. స్టార్ హీరో మాజీ భార్య!
బాలీవుడ్ డైరెక్టర్ కిరణ్ రావు ఇటీవల లపత్తా లేడీస్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చారు. కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం ఓటీటీలో విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. ఏకంగా రణ్‌బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా బ్లాక్‌బస్టర్ మూవీని దాటేసింది. కొద్ది రోజుల్లోనే టాప్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. అమిర్ ఖాన్ మాజీ భార్య అయిన కిరణ్ రావు 2010లో ధోబీ ఘాట్ మూవీతో దర్శకురాలిగా ఎంట్రీ ఇచ్చారు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆమె ఇండస్ట్రీలో తొలినాళ్లలో ఎదుర్కొన్న ఇబ్బందులను పంచుకున్నారు. ముంబయిలో బతికేందుకు చాలా ఉద్యోగాలు చేయాల్సి వచ్చిందని తెలిపారు. అధిక జీవన వ్యయాన్ని తట్టుకునేందుకు రెండు, మూడు ఉద్యోగాలు చేశానని వెల్లడించారు.కిరణ్ రావు మాట్లాడుతూ..'ముంబయిలో ఖర్చులు ఎక్కువ కావడంతో చాలా ఉద్యోగాలు చేశా. కేవలం ఇంటి అద్దె కోసమే అడ్వర్టైజింగ్ సంస్థల్లో పనిచేశా. లగాన్ లాంటి ఫీచర్ ఫిల్మ్‌కు పని చేసినప్పుడు నాకు ఎలాంటి డబ్బులు రాలేదు. అడ్వర్టైజింగ్ జాబ్స్‌తో వచ్చే డబ్బుతోనే ముంబయిలో నివసించా. ఆ ఉద్యోగాల వల్లే కంప్యూటర్లు, కారు వంటి ఖరీదైన వస్తువులు కొన్నా. మా నాన్న నుంచి లక్ష రూపాయలకు మొదటి కారు కొన్నా' అని తెలిపింది. కాగా.. కిరణ్ రావు.. హీరో అమిర్ ఖాన్‌కు పెళ్లైన సంగతి తెలిసిందే. కానీ ఆ తర్వాత వీరిద్దరు విడిపోయారు. -
లపతా లేడీస్ అచ్చం నా సినిమాలా ఉంది: డైరెక్టర్ తీవ్ర ఆరోపణలు
అమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వంలో వచ్చిన చిత్రం లపతా లేడీస్. థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మంచి టాక్ రావడంతో ఓటీటీలో దుమ్ములేపుతోంది. ఇటీవలే యానిమల్ చిత్రాన్ని దాటేసి అత్యధిక వ్యూయర్షిప్ను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు అమిర్ ఖాన్ కూడా నిర్మాతగా ఉన్నారు. అయితే సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోన్న ఈ సినిమాపై ప్రముఖ డైరెక్టర్, జాతీయ అవార్డ్ గ్రహీత అనంత్ మహదేవన్ చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. ఈ సినిమాలో సీన్స్ అచ్చం గున్గట్ కే పట్ ఖోల్ లాగే ఉన్నాయని అన్నారు.తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనంత్ మహదేవన్ మాట్లాడుతూ.. 'లపతా లేడీస్ చూశా.. ప్రారంభం నుంచి సినిమాలో చాలా సీన్స్ ఓకేలా ఉన్నాయి. మా సినిమాలో సిటీకి చెందిన ఓ అబ్బాయి పెళ్లి చేసుకోవడానికి గ్రామానికి వెళ్తాడు. ఘున్‌ఘట్ రైల్వే స్టేషన్లో వధువును బెంచ్‌పై వేచి ఉండమని చెప్పి బయటికి వెళ్తాడు. ఆ తర్వాత తిరిగి వచ్చి మరో వధువుతో చేరతాడు. ఆ మహిళ ఘున్ఘట్లో ఉన్నందున పోలీసులు ఆమె ఫోటోను చూసే సన్నివేశం నా సినిమాలో ఉంది. ఇందులో పోలీసు పాత్రలో మరొకరు ఉన్నారు అంతే. మిగిలినదంతా సేమ్ టూ సే మ్. అంతే కాకుండా రైల్వే స్టేషన్లో వధువు ముసుగుతో కప్పి ఉన్న సీన్ అంతా మా సినిమాలాగే ఉంది.' అని అన్నారు. కొన్ని నెలల క్రితం వరకు యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్న ఘున్‌ఘట్ కే పట్ ఖోల్ చిత్రం ఇప్పుడు లేదన్నారు.స్పందించిన రైటర్లపతా లేడీస్ కథ రాసిన బిప్లబ్ గోస్వామి ఈ విషయంపై స్పందించారు. నేను దశాబ్దం క్రితమే ఈ కథ రాశానని తెలిపారు. నా కథ, స్క్రిప్ట్, డైలాగ్స్, క్యారెక్టరజేషన్, సీన్స్ అన్నీ వంద శాతం ఒరిజినల్‌గా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కథను ఎక్కడి నుంచి స్ఫూర్తి పొందలేదని అన్నారు. అంతేకాకుండా అనంత్ మహదేవన్ జీ సినిమాని చూడలేదని వెల్లడించారు. ఈ చిత్రాన్ని 2001లో జరిగిన లపాతా లేడీస్ రైలు ప్రయాణంలో విడిపోయే ఇద్దరు యువ వధువుల కథ ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, కిండ్లింగ్ పిక్చర్స్, జియో స్టూడియోస్ బ్యానర్‌పై అమీర్ ఖాన్, కిరణ్ రావు, జ్యోతి దేశ్ పాండే నిర్మించారు. ఈ చిత్రం మార్చి 1న థియేటర్లలో విడుదలైంది. ఆ తర్వాత నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ అవుతోంది. -
'స్టార్ హీరోతో లవ్.. పేరెంట్స్ బలవంతం వల్లే పెళ్లి చేసుకున్నా'
లవ్ మ్యారేజ్.. అరేంజ్డ్ మ్యారేజ్.. దాదాపు ఈ రెండే అందరికీ తెలుసు.. అయితే సహజీవనం చేశాకే పెళ్లి చేసుకోమని సీనియర్ నటి జీనత్ అమన్ ఆ మధ్య కొత్త విధానాన్ని తెరపైకి తీసుకొచ్చింది. దీన్ని ఇప్పటికే కొందరు పాటిస్తుండగా ఓ బాలీవుడ్ స్టార్ జంట ఎప్పుడో ఫాలో అయింది. ఆమిర్ ఖాన్- కిరణ్ రావు.. వివాహానికి ముందు కలిసున్నారు.పేరెంట్స్ బలవంతం వల్లే..తాజాగా ఓ ఇంటర్వ్యూలో కిరణ్ రావు మాట్లాడుతూ.. నిజాయితీగా చెప్తున్నా.. నేను, ఆమిర్ ఏడాదిపాటు సహజీవనం చేశాము. పేరెంట్స్ బలవంతం వల్ల పెళ్లి చేసుకున్నాం. వివాహం అనే ఇన్స్టిట్యూట్లో భార్యాభర్తలుగా, విడివిడిగానూ పని చేస్తే అది చాలా బాగా వర్కవుట్ అవుతుంది.కోతులుగా ఉన్నప్పుడు..కానీ ఈ పెళ్లి అనేది అమ్మాయిలను ఎంతగా అణిచివేస్తుందనేది మాత్రం ఎవరూ మాట్లాడరు. అమెరికన్ సైకాలిజస్ట్ ఎస్తర్ పెరల్ దీని గురించి అద్భుతమైన పుస్తకం రాశాడు. మనం కోతులుగా జీవించినప్పుడు కలిసున్నాం. తర్వాత కాలక్రమేణా మానవులు కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశారు. పెళ్లి వల్ల మహిళలపై ఒత్తిడిదానివల్ల మహిళలపై ఒత్తిడి పెరిగింది. కుటుంబాన్ని చూసుకోవాలి. అందరూ కలిసుండేందుకు తోడ్పడాలి. పని చేయాలి. దీనికితోడు అత్తామామ, ఆడపడుచులు సహా భర్త వైపు కుటుంబీకులందరితో టచ్‌లో ఉండాలి. ఇలా ఆ మహిళ దగ్గరి నుంచి ఎన్నో ఆశిస్తూ తనపై ఒత్తిడి పెంచుతారు' అని చెప్పుకొచ్చింది.అప్పుడు పరిచయం మాత్రమేకాగా ఆమిర్.. కిరణ్ రావు 'లగాన్' సినిమా సెట్స్‌లో కలుసుకున్నారు. ఈ మూవీలో ఆమిర్ హీరోగా నటించగా కిరణ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా వ్యవహరించింది. అప్పుడు పరిచయం మాత్రమే ఏర్పడింది. ఆమిర్ మంగళ్ పాండే, కిరణ్ రావు స్వదేశ్ సినిమా చేస్తున్న సమయంలో కమర్షియల్ యాడ్స్‌కు కలిసి పని చేశారు. డేటింగ్.. పెళ్లిఅప్పుడు వీరి మధ్య ప్రేమ చిగురించింది. అలా 2004లో డేటింగ్ చేయగా 2005లో పెళ్లి చేసుకున్నారు. 2011లో సరోగసి ద్వారా ఆజాద్ అనే కుమారుడికి పేరెంట్స్ అయ్యారు. 2021లో ఆమిర్- కిరణ్ విడిపోయారు.చదవండి: పవిత్ర-చందు మరణం.. అదే అసలు కారణమన్న నరేశ్ -
మూడో పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం ఏమైనా..?
ఇండస్ట్రీలో రెండు పెళ్లిళ్లు అనేవి కామన్ అయిపోయాయి. బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ సైతం రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు.. ఇద్దరికీ విడాకులిచ్చాడు. మొదట 1986లో రీనా దత్తాను వివాహం చేసుకున్నాడు. వీరికి జునైద్ అనే కుమారుడు, ఇరా ఖాన్ అనే కూతురు సంతానం. అంతా బానే ఉందనుకున్న సమయంలో 2002లో ఆమిర్ దంపతులు విడాకులు తీసుకున్నారు.విడాకులు2005లో ఆమిర్.. కిరణ్ రావును పెళ్లాడాడు. సరోగసి ద్వారా ఆజాద్ రావు అనే కుమారుడికి పేరెంట్స్ అయ్యారు. కానీ ఈ బంధమూ ఎంతోకాలం నిలవలేదు. 2021లో విడిపోయారు. ఇద్దరు భార్యలతో వైవాహిక బంధాన్ని తెంచుకున్నప్పటికీ స్నేహ బంధాన్ని మాత్రం కొనసాగిస్తున్నాడు. ఎటువంటి గొడవలు, చికాకులు లేకుండా ఇప్పటికీ ఆప్యాయంగా ఒకరినొకరు పలకరించుకుంటారు. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతున్న ద గ్రేట్ ఇండియన్ కపిల్ షోకి ఆమిర్ హాజరయ్యాడు.షోలో ఆమిర్ఈ మేరకు ఓ ప్రోమో వదిలారు. ఇందులో ఆమిర్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తను నటించిన లాల్ సింగ్ చద్దా, థగ్స్ ఆఫ్ హిందుస్తాన్.. రెండు సినిమాలూ వర్కవుట్ కాలేదన్నాడు. అక్కడున్న హోస్ట్ కపిల్ శర్మ.. అవి పెద్దగా ఆకట్టుకోకపోయినా ఇప్పుడు రిలీజ్ చేసే సినిమాల బిజినెస్ మాత్రం బాగానే జరుగుతోంది కదా అని పంచ్ వేశాడు.టైం వేస్ట్!ఇంతలో అర్చన పూరన్ సింగ్ మాట్లాడుతూ.. అవార్డు షోలకు ఎందుకు రారని ప్రశ్నించింది. ఇందుకు ఆమిర్.. సమయం చాలా విలువైనది.. ప్రతి ఒక్కరూ దాన్ని కచ్చితంగా వాడుకోవాలి అని చెప్పుకొచ్చాడు. ఇంతలో కపిల్.. సెటిల్ అవుదామని అనుకోవడం లేదా? అంటూ పరోక్షంగా మూడో పెళ్లి గురించి ప్రస్తావించాడు. అందుకు ఆమిర్ పెద్దగా నవ్వేసి ఊరుకున్నాడు. ప్రస్తుతం ఆమిర్ లాహోర్ 1947 అనే సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. Ab hogi comedy ki dangal with one and only Aamir Khan 😁Dekho #TheGreatIndianKapilShow this Saturday 8 pm sirf Netflix par ✨ pic.twitter.com/ukDIKk0U2D— Netflix India (@NetflixIndia) April 24, 2024 చదవండి: పెద్ద కూతురి పెళ్లి.. ఫోటోలు షేర్ చేసిన దర్శకనటుడు -
నాకు చాలాసార్లు అబార్షన్ అయింది: స్టార్ హీరో మాజీ భార్య
దర్శకనిర్మాత కిరణ్‌రావు.. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్‌కు మాజీ భార్య. 2005లో ఆమిర్.. కిరణ్‌ను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఐవీఎఫ్- సరోగసి పద్ధతి ద్వారా 2011లో ఆజాద్ అనే కుమారుడు జన్మించాడు. ఏళ్లపాటు అన్యోన్యంగా ఉన్న ఆమిర్ దంపతులు 2021లో విడాకులు తీసుకున్నారు. భార్యాభర్తలుగా విడిపోయినా స్నేహితులుగా కలిసిమెలిసి ఉంటున్నారు. అప్పుడే ఆజాద్.. తాజాగా కిరణ్ రావు.. పెళ్లి తర్వాత తను ఎదుర్కొన్న చేదు అనుభవాలను వెల్లడించింది. దోబి ఘాట్ సినిమా (2011) సమయంలో ఆజాద్ పుట్టాడు. అప్పటికే నేను పిల్లలు కావాలని ఎంతగా ప్రయత్నించానో..! ఆ ఐదేళ్లలో ఎన్నోసార్లు అబార్షన్ అయింది. శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింది. ఒక పిల్లాడు/పాపను పొందడం ఇంత కష్టమా.. అనిపించింది. పదేళ్లు సినీ ఇండస్ట్రీకి దూరం బిడ్డను కనాలని చూస్తున్న నాకు ఐవీఎఫ్- సరోగసి ద్వారా ఆజాద్ జన్మించడంతో సంతోషమేసింది. తల్లిగా తనను ప్రేమగా పెంచాలని డిసైడయ్యాను. తనతో జీవితాన్ని ఆనందంగా గడిపాను. అవి నా జీవితంలోనే ఉత్తమమైన రోజులు. పదేళ్లు సినిమాకు దూరంగా ఉన్నందుకు నాకెలాంటి బాధా లేదు. ఎందుకంటే ఆ రోజుల్ని నేను ఆజాద్‌కి కేటాయించాను అని చెప్పుకొచ్చింది. కాగా కిరణ్ రావు ఇటీవలే లాపతా లేడీస్ సినిమాతో దర్శకురాలిగా రీఎంట్రీ ఇచ్చింది. చదవండి: నూకరాజు- ఆసియా బ్రేకప్? జబర్దస్త్ కమెడియన్ ఏమన్నాడంటే.. -
అది ఫేక్ వీడియో.. పోలీసులకు ఫిర్యాదు చేసిన అమీర్ ఖాన్
ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ 'అమీర్ ఖాన్' రాబోయే లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌కు ఓటు వేయాలని ప్రజలను కోరుతున్నట్లు తెలిపే ఒక నకిలీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై ఖాన్ స్పందించారు. బాలీవుడ్ నటుడు 'అమీర్ ఖాన్' రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్నట్లు వస్తున్న వీడియోలు ఫేక్ అని కొట్టి పారేశారు. ఏ ఒక్క రాజకీయ పార్టీతో తనకు సంబంధం లేదని, ఏ పార్టీని తాను ప్రమోట్ చేయలేదని స్పష్టం చేశారు. నా 35 సంవత్సరాల కెరీర్లో ఏ రాజకీయ పార్టీని ఎన్నడూ ఆమోదించలేదని పేర్కొన్నారు. ఎన్నికలలో.. ఎన్నికల సంఘం కోసం ప్రచారం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి మాత్రమే ప్రయత్నం చేసినట్లు వివరించారు. మిస్టర్ ఖాన్ ఒకే పార్టీని ప్రమోట్ చేస్తున్నాడని ఆరోపిస్తూ ఇటీవల వైరల్ అవుతున్న వీడియోలు నకిలీవని ప్రకటించారు. దీనిపైన ముంబై పోలీసుల సైబర్ క్రైమ్ సెల్లో ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్లు ఖాన్ పేర్కొన్నారు. శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే 2024 లోక్‌సభ ఎన్నికల కోసం ఓటర్లకు అమీర్ ఖాన్ సందేశం ఇచ్చారు. భారతీయులందరూ బయటకు వచ్చి ఓటు వేయాలని, ఎన్నికల ప్రక్రియలో భాగం కావాలని కోరారు. అయితే ఇప్పటికి సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసినట్లు తెలిసింది. भारत का हर नागरिक लखपति है क्योंकि सबके पास काम से कम 15 लाख तो होने ही चाहिए .. क्या कहा आपके अकाउंट में 15 लाख नहीं है.. तो आपके 15 लाख गए कहां ??? तो ऐसे जुमलेबाजों से रहे सावधान नहीं तो होगा तुम्हारा नुकसान 🇮🇳🇮🇳🇮🇳देशहित में जारी🇮🇳🇮🇳🇮🇳 pic.twitter.com/hJkEFEL5vG — Mini Nagrare (@MiniforIYC) April 14, 2024 -
టాలీవుడ్ డైరెక్టర్ గురించి విన్నా.. ఆ సినిమా తప్పకుండా చూస్తా: కిరణ్ రావు
బాలీవుడ్ డైరెక్టర్ కిరణ్‌రావు పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవల లపట్టా లేడీస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కిరణ్ రావు టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా యానిమల్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. అతని క్రాఫ్ట్ అద్భతంగా ఉంటుందని.. యానిమల్ సినిమాను చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు తెలిపింది. తన సినిమా లపట్టా లేడీస్‌కు అభిమానుల నుంచి విశేష స్పందన వస్తోందని తెలిపింది. కిరణ్ రావు మాట్లాడుతూ..'లాపట్టా లేడీస్ సినిమాకు విశేషమైన స్పందన వచ్చింది. మీ అభిమానానికి నా ధన్యవాదాలు. ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించారు. ఈ రోజుల్లో ప్రేక్షకులు యాక్షన్‌తో కూడిన భారీ చిత్రాలనే ఇష్టపడుతున్నారు. యానిమల్ లాంటి సినిమాను నేను చూడాలనుకుంటున్నా. అది అవసరం. ప్రజలు ఇష్టపడినందున యానిమల్ హిట్‌గా నిలిచింది. సందీప్ రెడ్డి వంగా క్రాఫ్ట్ చాలా బాగుందని విన్నాను. రణబీర్ కపూర్ కూడా మంచి నటుడు. ఈ సినిమా చూసేందుకు ఆసక్తిగా ఉన్నా.' అని అన్నారు. -
నా భర్త మొదటి విడాకులు.. కారణం నేను కాదు: స్టార్ హీరో మాజీ భార్య
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొంతలో కొంత తెలుసు. అప్పట్లో రీనా దత్తా అనే నిర్మాతని పెళ్లి చేసుకున్నాడు. దాదాపు 16 ఏళ్లపాటు కలిసున్లారు. కానీ ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు. ఇది జరిగిన కొన్నేళ్లకు కిరణ్ రావ్ అనే దర్శకురాలితో ఏడడుగులు వేశాడు. అయితే తొలి భార్య నుంచి విడిపోవడానికి రెండో భార్యనే కారణమని చాలామంది విమర్శలు చేశారు. ఇప్పుడు ఈ విషయమై స్వయంగా కిరణ్ రావ్ స్పందించింది. (ఇదీ చదవండి: స్టార్ హీరో సూర్య దంపతుల మొత్తం ఆస్తి అన్ని కోట్లా?) ''లగాన్' షూటింగ్ టైంలోనే నేను-ఆమిర్ కనెక్ట్ అయ్యామని చాలామంది భావిస్తున్నారు. కానీ అది నిజం కాదు. 'స్వేడ్స్' సినిమా చేస్తున్నప్పుడు మళ్లీ కలిశాం. కొన్ని కూల్ డ్రింక్ యాడ్స్ చేస్తూ దగ్గరయ్యాం. 'లగాన్' చేసిన 3-4 ఏళ్ల వరకు మేమిద్దరం కనీసం టచ్‌లో కూడా లేము. ఇంకా చెప్పాలంటే 'లగాన్' షూటింగ్ టైంలో ఒకటో రెండుసార్లు మాట్లాడి ఉంటా అంతే! 2004లో మేము డేటింగ్ మొదలుపెట్టాం. కానీ చాలామంది 'లగాన్' టైంలోనే దగ్గరయ్యామని.. ఆమిర్, రీనాకు విడాకులు ఇచ్చేయాడానికి నేనే కారణమని అంటున్నారు. కానీ అదంతా అబద్ధం' అని కిరణ్ రావు చెప్పుకొచ్చింది. లగాన్ సినిమా 2001లో రిలీజైంది. ఇది వచ్చిన తర్వాత ఏడాది తర్వాత అంటే 2002లో ఆమిర్ ఖాన్.. తన మొదటి భార్య రీనా దత్తాకు విడాకులు ఇచ్చేశాడు. 2005లో దర్శకురాలు కిరణ్ రావుని పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఆమిర్, తన తొలి భార్యకు విడాకులు ఇవ్వడానికి రీనానే కారణమనే విమర్శలు వచ్చాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. (ఇదీ చదవండి: ఇంతలా ఎప్పుడు నవ్వుకున్నానో గుర్తులేదు: మహేశ్ బాబు) -
అంబానీ ప్రీవెడ్డింగ్.. త్రీ ఖాన్స్‌కు భారీగా పారితోషికం?!
బాలీవుడ్ సెలబ్రిటీలందరినీ ఒక్కచోటకు చేర్చడం.. అది కూడా బస్సెక్కించి మరీ ఈవెంట్‌కు తీసుకురావడం ఒక్క అంబానీకే సాధ్యమైంది. తారలు సైతం తమ ఇంటి పెళ్లిలాగే భావించి అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో తెగ సందడి చేశారు. ఆటపాటలతో అలరించారు. అయితే అందరినీ కట్టిపడేసిన అంశం ఏదైనా ఉందా? అంటే త్రీఖాన్స్ డ్యాన్స్ చేయడమే! స్టేజీపై డ్యాన్స్.. ఎప్పుడూ బిజీగా ఉండే షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్.. అన్నదమ్ముల్లాగా కలిసి డ్యాన్స్ చేయడంతో అభిమానులంతా ఫుల్ ఖుషీ అయ్యారు. ఇందుకోసం డబ్బులు కూడా బాగానే తీసుకుని ఉండొచ్చంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీరితో కలిసి స్టెప్పేసిన రామ్‌చరణ్‌కు కూడా ఎంతో కొంత ఇచ్చే ఉంటారని ఎవరికి వారు అభిప్రాయపడుతున్నారు. కానీ బీటౌన్‌లో మాత్రం ప్రచారం మరోలా ఉంది. చరణ్‌తో పాటు ఈ ఖాన్స్ త్రయానికి డబ్బులే ఇవ్వలేదట! సంతోషంతోనే.. 'వారిని ఒకే స్టేజీపైకి తీసుకురావాలని అప్పటికప్పుడు అనుకున్నారు. ఎవరూ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. అంబానీ అంత గ్రాండ్‌గా ఆతిథ్యం ఇచ్చినప్పుడు అతిథులు డబ్బులు అడగ్గలరా? ఆ హీరోలు సంతోషంతో అలా డ్యాన్స్ చేశారంతే.. కానీ డబ్బులు మాత్రం తీసుకోలేదు' అని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అంబానీ ఇచ్చిన ఆతిథ్యాన్ని మెచ్చిన హీరోలు ఫ్రీగా డ్యాన్స్ చేశారన్నమాట! అయినా ఇది ప్రీవెడ్డింగ్ కాబట్టి డిమాండ్ చేయలేదేమో.. పెళ్లికి అసలు, వడ్డీ.. అంతా కలిపి అడుగుతారని.. అప్పటిదాకా ఓపిక పట్టండని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. #RamCharan kaha hai tu.. They are treating him like his own. How beautiful 😍. pic.twitter.com/s7hXwrBP6N — अपना Bollywood🎥 (@Apna_Bollywood) March 3, 2024 చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేస్తున్న థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? -
తెలుగు పాటకు 'త్రీ ఖాన్స్' డ్యాన్స్.. ఫిదా అవుతున్న బాలీవుడ్
జామ్‌నగర్‌లో భారత కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల ప్రీవెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎన్కోర్ హెల్త్‌కేర్ సీఈఓ వీరేన్ మర్చంట్ కుమార్తె అయిన రాధికతో వివాహం జరగనుండగా ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమయ్యయి. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు సినీ తారలు, పలువురు ప్రముఖులతో పాటు దేశ విదేశాల్లోని అతిరథ మహారథులు గుజరాత్‌లోని జామ్‌నగర్ చేరుకున్నారు. మార్చి 1 నుంచి ప్రారంభమైన ఈ వేడుకలు నేటితో ముగియనున్నాయి. ఈ వేడుకల్లో బాలీవుడ్ నటులు షారూక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్, దీపికా పదుకొణే.. అంతర్జాతీయ ప్రముఖులు పాప్ సింగర్ రిహన్నా, అమెరికన్ గాయని, గేయ రచయిత జే బ్రౌన్, వాయిద్యాకారుడు బాసిస్ట్ ఆడమ్ బ్లాక్‌స్టోన్ సందడి చేశారు. బాలీవుడ్లో త్రీ ఖాన్స్గా గుర్తింపు ఉన్న షారూక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్లు ఒకే ఫ్రేమ్‌లో చాలా రోజుల తర్వాత కనిపించడంతో బాలీవుడ్ సినీ అభిమానులు సంతోషిస్తున్నారు. వారి ముగ్గురిని ఒకే స్టేజీపై కలపగల వ్యక్తి అంబానీ మాత్రమే అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. రామ్ చరణ్, జూ ఎన్టీఆర్ నటించిన RRR చిత్రంలోని 'నాటు నాటు' పాటకు త్రీ ఖాన్స్ వేసిన స్టెప్పులకు అతిథులు ఫిదా అయ్యారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. ఇకపోతే అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల వివాహం ఇదే ఏడాది జులైలో జరగనుంది. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) -
దంగల్ ఆడిషన్.. నన్ను సెలక్ట్ చేయలేదు: హీరోయిన్
ఎక్కువ ఏళ్లు ఇండస్ట్రీలో నెట్టుకురావడం అనేది అంత ఈజీ కాదు! కానీ అది అసాధ్యమేమీ కాదని, తలుచుకుంటే సుసాధ్యమవుతుందని నిరూపించింది బాలీవుడ్ నటి అవనీత్ కౌర్. చిన్నప్పుడు 'డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్స్' షోలో చిన్ని డ్యాన్సర్‌గా అలరించింది. ఎనిమిదేళ్ల వయసులోనే పలు డ్యాన్స్ రియాలిటీ షోలలో పాల్గొంది. తర్వాతి కాలంలో డ్యాన్సర్‌గానే కాకుండా నటిగానూ అలరిస్తూ వస్తోంది. ఆ సినిమాలకు రిజెక్ట్.. మేరీ మా, సావిత్రి ఏక్ ప్రేమ్ కహాని సీరియల్స్‌తో ప్రేక్షకులకు దగ్గరైంది. అలాద్దీన్ సీరియల్లో హీరోయిన్గా నటించి ఫుల్ క్రేజ్ సంపాదించింది. అలా వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. బ్రూనీ, ఏక్తా, మర్దానీ 2 వంటి సినిమాలతో పాటు పలు సిరీస్‌లలోనూ యాక్ట్ చేసింది. అయితే కొన్ని ఆడిషన్స్‌లో తనను రిజెక్ట్ చేశారంటోందీ బ్యూటీ. తాజాగా ఆమె స్టార్ హీరో నిర్మించిన లాల్పట్టా లేడీస్ సినిమా ప్రీమియర్‌కు హాజరైంది. ఈ క్రమంలో అక్కడున్న ఆమిర్‌ను కలిసింది. ఆడిషన్స్‌కు వెళ్లినప్పుడు కలిశా అయితే ఆయన్ను కలవడం ఇదే మొదటిసారి కాదని చెప్పుకొచ్చింది. దంగల్, సీక్రెట్ సూపర్‌స్టార్ సినిమాల ఆడిషన్స్‌కు వెళ్లానని, అప్పుడు ఆయన్ను కలిశానంది. ఆ రెండు సినిమాలకు ఆడిషన్ ఇచ్చానని, వర్క్‌షాప్‌కు కూడా వెళ్లానని కానీ తనను సెలక్ట్ చేయలేదని తెలిపింది. అయితే ఆమిర్ మాత్రం తనను మెచ్చుకున్నాడని చెప్తూ ఉబ్బితబ్బిబైపోయింది. అందుకు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. View this post on Instagram A post shared by Avneet Kaur (@avneetkaur_13) చదవండి: మనసు మార్చుకున్న బ్యూటీ.. బోల్డ్ సీన్స్‌కు పచ్చజెండా.. ఆ సీన్ అందుకే చేశానంటూ.. -
ఒకరంటే ఒకరికి గౌరవం.. ఒక్కసారి కూడా గొడవపడలే!
విడాకులెందుకు తీసుకుంటారు? సఖ్యత లేకో, భేదాభిప్రాయాలు రావడం వల్లో, గొడవలు తలెత్తడం వల్లో, ప్రేమ తగ్గిపోవడం వల్లో.. దూరమవుతూ ఉంటారు. కానీ ఈ మాజీ సెలబ్రిటీ జంట మాత్రం మాకసలు గొడవలే లేవని, ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్లమంటోంది. స్టార్ హీరో ఆమిర్ ఖాన్, నిర్మాత కిరణ్ రావు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పటికే ఆమిర్.. రీనా దత్తాను ళ్లి చేసుకుని విడాకులిచ్చాడు. ఇది అతడికి రెండో పెళ్లి. విడాకులు తీసుకునేముందు గొడవ? ఆమిర్-కిరణ్.. సరోగసి ద్వారా 2011లో ఆజాద్ రావుకు తల్లిదండ్రులయ్యారు. అయితే ఏమైందో ఏమోకానీ 2021లో వీరు విడిపోయారు. విడాకులు తీసుకునేముందు గొడవపడ్డారా? అంటే అలాంటిదేం లేదంటోంది కిరణ్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నా మాజీ భర్తతో నేను బాగానే ఉంటాను. తల్లిదండ్రులుగా నా కొడుకును మేమిద్దరం బాగా చూసుకుంటాం. చాలామంది పెళ్లి అంటేనే పెద్ద తలనొప్పి అంటుంటారు. ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాలంటారు. నేను కూడా అలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశాను. మా అనుబంధం అలాంటిది కానీ ఆమిర్, నేను మాత్రం ఎప్పుడూ గొడవపడలేదు. వినడానికి వింతగా అనిపిస్తుందేమో కానీ. నిజంగానే మేము పోట్లాడుకోలేదు. కొన్నిసార్లు అభిప్రాయ భేదాలు వచ్చావి కానీ ఎన్నడూ గొడవపడలేదు. మేము ఒకరినొకరం ఎంతో గౌరవించుకుంటాం, ఒకరినొకరం ఎంతో అర్థం చేసుకుంటాం. ఒకరు చెప్పేది మరొకరు వింటుంటాం. బహుశా దానివల్లే మా మధ్య ఎలాంటి సమస్యలు ఎదురవలేదు. మా అనుబంధం అలాంటిది. అల్లకల్లోలానికి దారితీసే గొడవలు, చర్చలు ఎప్పుడూ జరగలేదు అని చెప్పుకొచ్చింది. ఇది విన్న నెటిజన్లు.. అలాంటప్పుడు ఎందుకు విడాకులు తీసుకున్నారో? మరి అని సెటైర్లు వేస్తున్నారు. చదవండి: బేబీ బంప్లో మౌనిక.. పిల్లా నువ్వంటే ప్రాణమన్న మనోజ్ -
హనీమూన్‌లో స్టార్ హీరో కూతురు.. బీచ్‌లో విన్యాసాలు!
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ ఇటీవలే పెళ్లి పీటలెక్కింది. ఫిట్నెస్ ట్రైనర్ నుపుర్ శిఖరేను పెళ్లాడింది. గతేడాది నిశ్చితార్థం జరగ్గా ఈ ఏడాది ప్రారంభంలో వీరి వివాహం జరిగింది. ఒకసారి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఉదయ్‌పూర్‌లో ఘనంగా పెళ్లి వేడుక జరుపుకున్నారు. ఈ మధ్యే కొత్త జంట హనీమూన్‌కు ఇండోనేషియా చెక్కేసింది. అక్కడ కూడా వర్కవుట్స్ వదలడం లేదు నుపుర్. హనీమూన్‌లో భాగంగా ఏయే ప్రదేశాలకు వెళ్తున్నారో ఆ అన్నిచోట్లా ఎక్సర్సైజ్లు చేస్తున్నాడు. ఒలంపిక్స్‌కు వెళ్లు ఇందుకు సంబంధించిన ఫోటోలను ఐరా సోషల్ మీడియాలో షేర్ చేసింది. నీ హనీమూన్ ఎలా ఉంది? అని భర్తను కొంటెగా అడుగుతూ క్యాప్షన్ పెట్టింది. ఈ పోస్ట్ వైరల్‌గా మారగా నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. హనీమూన్ ఎంజాయ్ చేయకుండా ఈ యోగా ఏంట్రా బాబూ.. ఈయన్ను ఒలంపిక్స్‌కు పంపించండి, ఐరా నువ్వు పెళ్లాడింది మనిషిని కాదు, కోతిని అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఆమిర్ దగ్గరే పని చేసి అతడి కూతురికే లైన్.. కాగా నుపుర్ శిఖరే.. బాలీవుడ్‌లోని పలువురు సెలబ్రిటీలకు ఫిటెన్స్ ట్రైనింగ్ ఇచ్చాడు. అలా ఆమిర్ ఖాన్ దగ్గర కొంతకాలంపాటు ఫిట్నెస్ కోచ్‌గా పనిచేశాడు. ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ ప్రేమకు పెద్దలు పచ్చజెండా ఊపడంతో ఇద్దరూ ఒక్కటయ్యారు. జనవరిలో వీరి పెళ్లి, రిసెప్షన్ వేడుకలు జరిగాయి. View this post on Instagram A post shared by Ira Khan (@khan.ira) చదవండి: ఎదురుచూపులకు బ్రేక్.. 19 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి సూపర్ హిట్ మూవీ -
విడాకులైతే కలిసి ఉండొద్దా.. మాదంతా ఒకే కుటుంబం: ఆమిర్ మాజీ భార్య
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ పెళ్లి ఇటీవలే ఘనంగా జరిగింది. కూతురు ఇష్టపడ్డవాడితోనే దగ్గరుండి పెళ్లి జరిపించాడు ఆమిర్. ఈ వివాహ వేడుకకు అతడి మాజీ భార్యలు రీనా దత్తా(ఇరా ఖాన్ తల్లి), కిరణ్ రావు హాజరై సందడి చేశారు. అంతా ఒకే కుటుంబంలా కనిపించి కనువిందు చేశారు. తాజాగా కిరణ్.. ఆమిర్, రీనాలతో తన అనుబంధం గురించి మాట్లాడింది. 'నేను జనాలను ఈజీగా కలుపుకుపోతాను. నా కుటుంబం కూడా ఇరా పెళ్లికి హాజరైంది. అందరం కలిసే ఉంటాం.. దీని గురించి మనం మరీ లోతుగా ఆలోచించాల్సిన పని లేదు. మేమంతా ఒక కుటుంబం. మేము ఒక్కచోటకు చేరినప్పుడల్లా అంతా కలిసే భోజనం చేస్తుంటాం. అలాగే ఒకేచోట నివసిస్తుంటాం. మా అత్తయ్య పై ఫ్లోర్లో ఉంటుంది. తనంటే నాకెంతో ఇష్టం. రీనా పక్కింట్లో ఉంటుంది. ఆమిర్ కజిన్ నుజత్ కూడా దగ్గర్లోనే ఉంటుంది. మాకు ఒకరంటే ఒకరికి ఇష్టం. అందుకే ఇలా కలిసుంటాం. రీనా, నుజత్తో బయట చక్కర్లు కొడుతుంటాను కూడా! ఆమిర్‌తో కూడా వెళ్తూ ఉంటాను. పగప్రతీకారంతో విడాకులు తీసుకోలేదు విడాకులైనంత మాత్రాన ఈ ప్రేమానుబంధాలను వదులుకోవాల్సిన అవసరం లేదు. ఆమిర్, నేను పగ ప్రతీకారాలతో విడాకులు తీసుకోలేదు. భార్యాభర్తలుగా విడిపోయినప్పటికీ కుటుంబంగా కలిసే ఉన్నాం. ఇలాంటి అనుబంధం లేకపోతే మనల్ని మనమే కోల్పోతాం' అని చెప్పుకొచ్చింది. కాగా ఆమిర్ ఖాన్, కిరణ్ రావు 2005లో పెళ్లి చేసుకున్నారు. సరోగసి ద్వారా 2011లో తనయుడు ఆజాద్ రావు జన్మించాడు. 2021లో వీరు విడాకులు తీసుకున్నారు. చదవండి: నా సినిమా చూడండంటూ కన్నీళ్లు పెట్టుకున్న సోహైల్ బతికే ఉన్నానని ట్విస్ట్ ఇచ్చిన పూనమ్ పాండే.. ఇదంతా ఎందుకు చేసిందంటే? -
ఆ బాలీవుడ్ స్టార్‌తో నన్ను పోల్చవద్దు: హీరో
తమిళ హీరో ఆర్జే బాలాజి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సింగపూర్ సెలూన్. మీనాక్షిచౌదరి హీరోయిన్గా నటించిన ఇందులో సత్యరాజ్, లాల్, అరవిందస్వామి ముఖ్య పాత్రలు పోషించారు. గోకుల్ దర్శకత్వం వహించగా వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేశ్ నిర్మించారు. గత నెల 25న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. గురువారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్‌ల్యాబ్‌లో సింగపూర్ సెలూన్ సక్సెస్‌మీట్ నిర్వహించారు. అలాంటి వ్యక్తి లైఫ్‌లో ఉంటే బాగుండు ఈ సందర్భంగా ఆర్జే బాలాజి మాట్లాడుతూ.. సింగపూర్ సెలూన్ చిత్ర విజయం సంతోషాన్ని కలిగించిందన్నారు. ఈ మూవీలోని అరవిందస్వామి పాత్రను చూసి ఇలాంటి వ్యక్తి తమ జీవితంలోకి వస్తే బాగుండని చాలా మంది అనుకున్నారన్నారు. అంత ఉత్తమ నటనను ప్రదర్శించిన అరవిందస్వామికి ధన్యవాదాలు తెలిపారు. తొలివారంలో ప్రేక్షకులకు నచ్చేసిన ఈ చిత్రం రెండో వారంలో కూడా మంచి వసూళ్లు రాబట్టాలనే ఈ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశామన్నారు. ఆయనతో పోల్చొద్దు నటుడు చిన్ని జయంత్ తనను సౌత్ ఇండియన్ అమీర్ ఖాన్ అని పేర్కొనడంతో భయం కలిగిందన్నారు. ఆయన లెజెండ్ అని, ఆయనతో తనను పోల్చరాదన్నారు. తనలోని నటనను బయటకు తీసిన దర్శకుడు గోకుల్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానన్నారు. నిర్మాత ఐసరి గణేశ్ తనకు తండ్రి లాంటివారని, ఎల్కేజీ 2, మూక్కుత్తి అమ్మన్ 2 చిత్రాలను చేయాలన్న ఆలోచన ఉందని, వాటిని ఐసరి గణేశ్ సంస్థలోనే చేస్తానని చెప్పారు. చదవండి: 'దమ్ మసాలా' సాంగ్‌కు సితార డ్యాన్స్.. మిలియన్లకొద్ది వ్యూస్ -
ఇటు హీరోగా... అటు నిర్మాతగా...
నటుడిగా ఆమిర్ ఖాన్ మేకప్ వేసుకుని దాదాపు రెండేళ్లవుతోంది. ‘లాల్‌సింగ్ చద్దా’ (2022)లో చేసిన టైటిల్ రోల్, ‘సలామ్ వెంకీ’ (2022)లో చేసిన అతిథి పాత్ర తర్వాత ఆమిర్ ఖాన్ నటుడిగా మేకప్ వేసుకోలేదు. ఫైనల్‌గా ఫిబ్రవరిలో కెమెరా ముందుకు రానున్నారు. హీరోగా ‘సితారే జమీన్ పర్’ అంగీకరించారు ఆమిర్. ఫిబ్రవరి 2న ఈ చిత్రం షూటింగ్‌ని ఆరంభించాలనుకుంటున్నారు. కొన్ని నెలలుగా ఈ చిత్రంలోని పాత్ర కోసం ప్రిపేర్ అవుతున్నారు ఆమిర్ ఖాన్. పలు లుక్స్ ట్రై చేసి, చివరికి ఒకటి ఖరారు చేశారు. అలాగే పలుమార్లు స్క్రిప్ట్‌ని చదివారు. అన్నీ సంతృప్తికరంగా అనిపించడంతో ఫిబ్రవరిలో చిత్రీకరణ ప్లాన్ చేశారు. ఆర్.ఎస్. ప్రసన్న దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రానికి 70 నుంచి 80 రోజులు డేట్స్ ఇచ్చారు ఆమిర్. ఈ చిత్రాన్ని క్రిస్మస్కి విడుదల చేయాలనుకుంటున్నారు. సన్నీ డియోల్ హీరోగా.. నిర్మాతగా ‘లాహోర్: 1947’ చిత్రాన్ని నిర్మించనున్నారు ఆమిర్ ఖాన్. రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వంలో సన్నీ డియోల్ హీరోగా ఈ చిత్రం రూపొందనుంది. ఇందులో ఆమిర్ ఖాన్ అతిథి పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఈ సినిమా మాత్రమే కాదు.. ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్‌లో (ఏకేపీ) మరో రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి ఆమిర్ భార్య కిరణ్ రావ్ దర్శకత్వంలో రూపొందిన ‘లాపతా లేడీస్’. ఈ ఏడాది ప్రథమార్ధంలో ఈ చిత్రం విడుదల కానుంది. మరోటి ‘ప్రీతమ్ ప్యారే’. సంజయ్ శ్రీవాస్తవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆమిర్ బుక్ న్యారేటర్గా అతిథి పాత్ర చేశారు. ఈ చిత్రం కూడా ప్రథమార్ధంలోనే విడుదల కానుంది. ఈ చిత్రం నిర్మాణ బాధ్యతలను ఆమిర్ తనయుడు జునైద్ ఖాన్ చేపట్టడం విశేషం. ఇలా హీరోగా, ఏకేపీ నిర్మించే చిత్రాలతో ఆమిర్ బిజీ. -
వైభవంగా స్టార్ హీరో కుమార్తె రిసెప్షన్, సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
-
స్టార్ హీరో కుమార్తె పెళ్లి రిసెప్షన్: బీటౌన్ స్టార్లు, క్రికెటర్ల సందడి
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్‌ఖాన్ కుమార్తె ఇరా ఖాన్, ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ నూపుర్ శిఖరే పెళ్లి సందడి గత వారం రోజులుగా ఒకటే సందడి చేస్తోంది. వీరి ప్రీ వెడ్డింగ్వేడుకలు, బారాత్, రిజిస్టర్ మ్యేరేజ్, ఆతరువాత ఉంగరాలు మార్చుకుని ఇలా రెండు రకాలుగా చేసుకున్న పెళ్లి వార్తలు, ఫోటోలు, వీడియోలో సోషల్ మీడియాలో సదడి చేస్తున్నాయి. మాపెళ్లి మా ఇష్టం: ముఖ్యంగా ఎలాంటి హంగామా లేకుండా జాగింగ్ చేసుకుంటూ మండపానికి వచ్చిన వరుడు నూపుర్, పట్టుచీరలు, నగల హడావిడి లేకుండా పెళ్లికుమార్తె ఇర్ఖాన్ చాలా ప్రత్యేకంగా నిలిచారు. సోషల్ మీడియా ట్రోలింగ్స్‌ను పట్టించుకోకుండా తమదైన శైలిలో, తమకు నచ్చినట్టు పెళ్లి చేసుకునే తమ ప్రత్యేకతను చాటుకున్నారు. దీంతో ఈ జంటలు పలువురు శుభాకాంక్షలు అందించారు. Hassan sisters gives respect to legendary actor Dharmendra at Aamir Khan's daughter Ira Khan and Nupur Shikhare's wedding reception 😍#ShrutiHaasan #Dharmendra #AamirKhan #IraKhan #Celebrities #celebrity #IraKhanWedding #NupurShikhare #Bollywood #CelebrityClicks pic.twitter.com/EmFIvfZZh3 — sdn (@sdn7_) January 13, 2024 పెళ్లి తరువాత జైపూర్, ముంబై వేదికగా ఇచ్చని రిసెప్షన్ వేడుకు కూడా టాక్ ఆఫ్‌ది టౌన్‌గా మారాయి. జైపూర్ వెళ్ల లేని వారు, ముంబైలో, ముంబైకి రావడం వీలు కాని వారు జైపూర్‌లో ఈ రిసెప్షన్‌కు హాజరైన పలువురు రాజకీయ సినీ ప్రముఖులు నూతన వధూవరులను ఆశీర్వించారు. తాజాగా (జనవరి 13న) ముంబైలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (ఎన్ఎంఏసీసీ)లో వచ్చిన విందుకు పలువురు బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రీటీలు, క్రీడారంగ ప్రముఖులతో పాటు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే కూడా హాజరు కావడం విశేషం. Maharashtra CM Eknath Shinde attends Aamir Khan's daughter Ira Khan and Nupur Shikhare's wedding reception 😍#EknathShinde #Maharashtra #AamirKhan #IraKhan #Celebrities #celebrity #IraKhanWedding #NupurShikhare #Bollywood #CelebrityClicks pic.twitter.com/OvcFQfVREK — sdn (@sdn7_) January 13, 2024 ఇంకా బాలీవుడ్లో ఖాన్ త్రయంగా పేరొందిన షారుఖ్, సల్మాన్ ఇద్దరూ అమీర్‌ఖాన్‌తో కలిసి సందడి చేశారు. ఇంకా అలనాటి, నేటి మేటి నటులు అందరూ ఈ వేడుకకు విచ్చేసి ఇరా, నూపుర్ జంటకు అభినందనలు తెలిపారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ కూడా ఈ ఈవెంట్‌కు హాజరైనారు. ఇంకా స్టార్ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, శిఖర్ ధావన్, ఆస్కార్ విజేత, సంగీత దర్శకుడు ఆర్ రెహ్మాన్ మరింత ఆకర్షణగా నిలిచారు. -
Ira Khan-Nupur Shikhare: గ్రాండ్‌గా మరోసారి పెళ్లి చేసుకున్న అమీర్ ఖాన్ కూతురు (ఫోటోలు)
-
'స్టార్ హీరో కూతురు అయ్యుండి.. ఇలాంటి బట్టలు వేసుకుందేంటి'?
ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైన వేడుక. ఆరోజు మరింత అందంగా, ప్రత్యేకంగా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు? ఇక సెలబ్రిటీల విషయానికి వస్తే.. వారికి సంబంధించిన ప్రతీ విషయాన్ని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. వారి వివాహ వేడుకకు ఎలాంటి దుస్తులు, ఆభరణలు ధరిస్తారు అని తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఆరాటపడుతుంటారు. దీనికి తగ్గట్లు గానే కొన్ని నెలల ముందు నుంచే తారలు ప్రముఖ డిజైనర్లతో ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుంటారు. అయితే ఎంత ప్రత్యకంగా కనిపించాలని ఆరాటపడినా కొన్నిసార్లు మిస్‌ఫైర్ అవుతుంటుంది. బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ కూతురు ఇరాఖాన్ విషయంలోనూ ఇదే జరిగిందని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. గత రాత్రి(జనవరి3)న ప్రియుడు, ఫిట్నెస్ ట్రైనర్ నుపుర్ శిఖర్‌తో ఇరాఖాన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాళ్లు ధరించిన కాస్ట్యూమ్స్‌పై సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ నడుస్తుంది. వరుడు బ్లూ కలర్ షేర్వానీలో కనిపించగా, వధువు ఇరాఖాన్ సింపుల్‌గా పటియాలా-చోలి దుస్తుల్లో కనిపించింది. అయితే స్టార్ హీరో కూతురు అయ్యిండి ఇలాంటి బట్టలు వేసుకుందేంటి? అర్జెంట్‌గా ఈమెకు స్టైలిస్ట్ అవసరం ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Pinkvilla (@pinkvilla) ఎంత సింప్లిసిటీ ప్రదర్శించినా పెళ్లంటే కాస్తైనా గౌరవం ఉండాలి కదా? జాగింగ్ చేస్తూ నుపుర్ పెళ్లి వేడుకకు రావడం ఏంటి? జిమ్ డ్రెస్‌లో పెళ్లి తంతు ముగించడం ఏంటి? కనీసం బట్టలు అయినా పద్దతిగా వేసుకున్నారా అంటే అదీ లేదు. ఇదేదో కొత్తరకం స్టైల్ అనుకుంటున్నారేమో, చూడటానికి చాలా అసహ్యంగా కనిపిస్తుంది మీ డ్రెస్సింగ్ అంటూ కొత్త జంటపై విమర్శలు గుప్పిస్తున్నారు.ఇంతకుముందు అయితే ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా పెళ్లి దుస్తుల్లో సంప్రదాయక ఎరుపురంగు ఉండేలా చూసుకునేవారు. కానీ ఈమధ్య కాలంలో సెలబ్రిటీలు పెళ్లికి కొంచెం ట్రెండు మార్చి డిఫరెంట్ కలర్స్‌ని ఎంచుకున్నారు. అనుష్క శర్మ నుంచి పరిణితి చోప్రా వరకు.. ఈ మధ్య కాలంలో ఎక్కువగా పేస్టల్ కలర్స్ ట్రెండ్ అవుతున్నాయి. కానీ ఇరాఖాన్ ఇలా నీలం రంగు దుస్తుల్లో, కొల్హాపురి చప్పల్స్‌తో కొత్త ట్రెండ్‌ని క్రియేట్ చేసింది. అయినా ఎవరి వ్యక్తిగత ఇష్టాలు, అభిప్రాయాలు వారివి. నిజం చెప్పాలంటే ఈ జంట హంగు, ఆర్భాటాలతో కాకుండా సింపుల్‌గా పెళ్లి చేసుకోవడం ఆదర్శమని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) -
స్టార్ హీరో కూతురి పెళ్లి.. బనియన్ మీదే వివాహం!
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్- నిర్మాత రీనా దత్తాల కూతురు ఇరా ఖాన్ పెళ్లి పీటలెక్కింది. తన ప్రియుడు, ఫిట్నెస్ ట్రైనర్ నుపుర్ శిఖరేను వివాహం చేసుకుంది. బుధవారం(జనవరి 3న) నాడు ముంబైలోని ఫైవ్ స్టార్ హోటల్లో ఇరు కుటుంబాలు, దగ్గరి బంధుమిత్రుల సమక్షంలో వీరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. అదే రోజు గ్రాండ్‌గా రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు. జాగింగ్ చేస్తూ మండపానికి.. ఇక వరుడు ఫిట్నెస్ ట్రైనర్ కావడంతో పెళ్లి జరిగే చోటుకు జాగింగ్ చేసుకుంటూ వచ్చాడు. దాదాపు 8 కి.మీ. జాగింగ్ చేసుకుంటూ వచ్చిన అతడు దుస్తులు కూడా మార్చుకోకుండా టీషర్ట్‌పైనే పెళ్లి వేడుకలు కానిచ్చేశాడు. రిసెప్షన్‌కు మాత్రం కొత్త బట్టల్లో దర్శనమిచ్చాడు. ఈ పెళ్లిలో ఆమిర్ ఖాన్ ఇద్దరు మాజీ భార్యలు సందడి చేశారు. రెండో మాజీ భార్య అయిన కిరణ్ రావుకు ఆప్యాయంగా నుదుటన ముద్దు పెడుతూ ఫోటోలకు పోజిచ్చాడీ హీరో. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇకపోతే సెలబ్రిటీలు, సన్నిహితుల కోసం ఈ నెల 13న ముంబైలో గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. 2022లో ఎంగేజ్మెంట్.. కాగా నుపుర్ శిఖరే.. ఆమిర్ ఖాన్‌కు ఫిట్నెస్ ట్రైనర్‌గా పని చేశాడు. అలా అతడికి ఇరాతో పరిచయం ఏర్పడింది. కరోనా సమయంలో ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 2022 నవంబర్‌లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇన్నాళ్లకు వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు. ఇదిలా ఉంటే అమీర్ ఖాన్, మొదటి భార్య రీనా దత్తాల సంతానమే ఇరా ఖాన్. ఆమిర్- రీనా దంపతులకు జునైద్ ఖాన్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. రీనాతో విడాకులు తీసుకున్న తర్వాత ఆమిర్.. 2005లో కిరణ్ రావును పెళ్లి చేసుకున్నాడు. వీరు కూడా 2022లో విడిపోయారు. After marriage ceremony of daughter #IraKhan during photoshoot #AamirKhan kisses #KiranRao what a moment love and Peace 🥰🥰#NupurShikhare #ReenaDutta #celebrity #wedding #celebration pic.twitter.com/lrUEUR7wB5 — sdn (@sdn7_) January 4, 2024 View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి: విజయ్ సినిమాలో ఇన్ని సర్‌ప్రైజులా.. ఫ్యాన్స్‌కు పండగే! -
అమీర్ ఖాన్ మాస్టర్ ప్లాన్.. రూ. 500 కోట్లు టార్గెట్!
బాలీవుడ్ స్టార్ హీరో, మిస్టర్ ఫర్ఫెక్ట్గా పిలిచే అమీర్ ఖాన్ (Bollywood hero Aamir Khan) మాస్టర్ ప్లాన్ వేశారు. ముంబైలో తనకు చెందిన ఓ ప్రాపర్టీని రీడెవలప్‌మెంట్‌కు ఇచ్చారు. దీని టార్గెట్ రూ. 500 కోట్లు అని తెలుస్తోంది. ముంబైలో అమీర్ ఖాన్ నివాసం ఉంటున్న ప్రాపర్టీ రీడెవలప్‌మెంట్‌ను చేపట్టనున్నట్లు ప్రాపర్టీ డెవలపర్ మ్యాన్ ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ (MICL) తాజాగా తెలిపింది. ఈ ఆస్తి ముంబైలోని బాంద్రా (పశ్చిమ) ప్రాంతంలోని పాలి హిల్‌లో ఉన్న విర్గో కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి చెందినది. ఇందులో 24 ఫ్లాట్లు ఉన్నాయి. వీటిలో అమిర్ ఖాన్‌కు తొమ్మిది ఫ్లాట్లు ఉన్నాయి. రూ. 500 కోట్లు టార్గెట్ అమీర్ ఖాన్ ప్రాపర్టీ రీడెవలప్మెంట్ ఒప్పందం నిబంధనలను మాత్రం మ్యాన్ ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ వెల్లడించలేదు. ప్రాపర్టీలో 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టి విక్రయించడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్ట్ నుంచి రూ. 500 కోట్ల టాప్‌లైన్‌ను లక్ష్యంగా చేసుకుంది. ప్రాజెక్ట్‌లో లగ్జరీ 4బీహెచ్‌కే, 5 బీహెచ్‌కే అపార్ట్‌మెంట్‌ను అభివృద్ధి చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఇది 2024 మధ్యలో ప్రారంభం కానుంది. -
ఆ స్టార్ హీరోను గట్టిగా లాగిపెట్టి కొట్టా.. అందరూ షాక్..: నటి
బాలీవుడ్ నటి మోనా సింగ్.. 3 ఇడియట్స్ మూవీలో కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాలో ఆమెపై ఓ కీలకమైన సన్నివేశం ఉంటుంది. పురిటినొప్పులతో బాధపడుతున్న ఆమెకు హీరో ఆమిర్ ఖాన్.. వీడియో కాల్లో ప్రియురాలు ఇచ్చే సలహాలతో డెలివరీ చేస్తాడు. ఈ సీన్ సినిమాలో విపరీతంగా పండింది. తాజాగా ఈ సన్నివేశం గురించి చెప్పుకొచ్చింది మోనా సింగ్. హీరోనే కొట్టమన్నాడు.. '3 ఇడియట్స్‌లో నేను పురిటి నొప్పులతో టేబుల్‌పై పడుకుని అల్లాడిపోయే ఓ సన్నివేశం ఉంటుంది. ఆ సీన్ చిత్రీకరించేటప్పుడు అందరూ వారివారి అనుభవాలను చెప్పారు. నా భార్య ఇలా చేసింది.. అని చెప్పుకుంటూ పోతున్నారు. రాజ్‌కుమార్ హిరానీ సర్ అయితే తన భార్య తన్నిందని చెప్పాడు. మాధవన్ తన భార్య కొరికిందన్నాడు. అయితే ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండని అడిగాను. అందుకు ఆమిర్ సర్.. మోనా, నువ్వు నన్ను కొట్టు అన్నాడు. సరేనని, చెంప మీద కొట్టాను. యాక్టింగ్‌లో లీనమైపోయాడు.. కానీ అతడు గట్టిగా కొట్టమని హెచ్చరించాడు. నేను నా బలం కూడదీసుకుని లాగిపెట్టి కొట్టాను. దీంతో ఆయన బాడీగార్డ్ షాకై నన్ను అలానే చూస్తూ ఉండిపోయాడు. ఆమిర్ సర్ మాత్రం తన యాక్టింగ్‌లో లీనమైపోయాడు. ఆ సన్నివేశం చాలా సహజంగా రావాలనుకున్నాడు, అనుకున్నట్లుగానే అంతే సహజంగా వచ్చింది. ఈ సినిమాలో నటించిన స్టార్స్ మాతో పాటు రిహార్సల్స్ చేసేవారు. స్టార్స్‌లా ఫీలయ్యేవారే కాదు' అని చెప్పుకొచ్చింది మోనా. ఈ సినిమా సంచలన విజయంతో పాటు మూడు జాతీయ అవార్డులు సాధించింది. చదవండి: ప్రముఖ నటి కన్నుమూత... బెడ్‌పై లేవలేని స్థితిలో ఉన్నప్పటికీ... చివరి వీడియో -
Ira Khan And Nupur Shikhare's Pre-Wedding: అమీర్ ఖాన్ ఇంట పెళ్లి సందడి.. ఐరా-నిపుర్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ షురూ (ఫొటోలు)
-
ఆమిర్‌కు జోడీగా?
‘సై’, ‘బొమ్మరిల్లు’, ‘ఆరెంజ్’ వంటి చిత్రాలతో హీరోయిన్గా జెనీలియా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. రితేష్ దేశ్‌ముఖ్‌ని పెళ్లి చేసుకుని, ఇద్దరు బిడ్డలకు తల్లయిన జెనీలియా చాలా గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాలు ఒప్పుకుంటున్నారు. ఈ క్రమంలో ఆమిర్ ఖాన్‌కు జోడీగా ఆమె ఓ సినిమాలో ఎంపికయ్యారని బాలీవుడ్ టాక్. ఆమిర్ ఖాన్ తాజా చిత్రం ‘సితారే జమీన్ పర్’ చిత్రంలో హీరోయిన్ పాత్రకు జెనీలియాను తీసుకున్నారని, ఆర్ఎస్ ప్రసన్న ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని సమాచారం. మరి.. ఆమిర్‌కు జోడీగా జెనీలియా కనిపిస్తారా? చూడాలి. మరోవైపు దశాబ్దం తర్వాత ‘జూనియర్’ అనే తెలుగు సినిమాలో జెనీలియా కీలక పాత్ర చేస్తున్నారు. ఇక 2012లో రానా హీరోగా వచ్చిన ‘నా ఇష్టం’ తెలుగులో హీరోయిన్గా జెనీలియా నటించిన చివరి చిత్రం. -
స్టార్ హీరో కుమారుడితో సాయి పల్లవి.. లైన్ క్లియర్
సౌత్ ఇండియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న లేడీ పవర్‌స్టార్ సాయిపల్లవికి విపరీతమైన అభిమానులు ఉన్నారు. సంపాదించిన సాయి పల్లవి ఇప్పుడు హిందీలో ఆరంగేట్రం చేయనున్నారు. తన నటనతో పాటు అద్భుతమైన డ్యాన్స్‌తో విశేష క్రేజ్ సొంతం చేసుకున్న సాయి పల్లవి బాలీవుడ్‌లోకి అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా బాలీవుడ్ మీడియాలో ప్రస్తుతం ఆమె పేరు మార్మోగుతోంది. (ఇదీ చదవండి: Harsha Sai: సినిమా ప్రకటించిన హర్షసాయి.. నిర్మతలుగా సీఎం బంధువుతో పాటు బిగ్‌బాస్ బ్యూటీ) బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ త్వరలోనే తెరంగేట్రం చేయబోతున్నాడు. ఆయన నటిస్తున్న తొలి చిత్రాన్ని యశ్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇది పూర్తికాకముందే జునైద్ హీరోగా మరో చిత్రం ఖరారైందని, అందులో హీరోయిన్గా సాయి పల్లవిని ఎంపిక చేశారంటూ వార్తలొస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అయింది అని కూడా వార్తలు రాస్తున్నారు. దీనికి సునీల్ పాండే దర్శకత్వం వహిస్తున్నాడు అని, ఇది ఒక ప్రేమ కథా చిత్రం అని కూడా అంటున్నారు. బాలీవుడ్లో పలు సినిమాలకు అసిస్టెంట్ దర్శకుడిగా అమిర్ ఖాన్ కుమారుడు జునైద్ పనిచేశాడు. ఈ మేరకు లాస్ ఏంజిల్స్‌లోని ఓ డ్రామా స్కూల్లో కొన్నాళ్లు శిక్షణ తీసుకున్నాడు. తన తండ్రి నటించిన ‘పీకే’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పనిచేశాడు. సాధారణంగా మీడియాకు దూరంగా ఉండే అతను ఇప్పుడు హీరోగా తెరపై కనిపించనున్నాడు. తన తండ్రి పేరు చెప్పకుండా మొదటి సినిమా అవకాశాన్ని దక్కించుకున్నాడు. అలా సుమారు 20 సార్లు తిరస్కరణకు గురి అయిన తర్వాత సినిమా అవకాశం దక్కించుకున్నాడు. నేచురల్ హీరోయిన్ సాయి పల్లవి గురించి తెలిసిందే. అందం కాదు అభినయమే ఆమెకు ముఖ్యం. ఎప్పుడూ పాజిటివ్‌గా స్మైల్‌తో ఆకట్టుకునే ఈ బ్యూటీ. వెండితెరపై తన పాత్రలకు ప్రాణం పోస్తుంది. అయితే గత కొద్దిరోజులుగా స్క్రీన్‌పై తక్కువుగా కనిపిస్తున్న ఆమె. చివరగా 2022లో విరాట్ పర్వం, గార్గి చిత్రాలతో మెరిసింది. ప్రస్తుతం శివకార్తికేయన్‌తో ఓ సినిమా చేస్తోంది. తాజాగా ఆమె ఈ బాలీవుడ్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. -
అమ్మానాన్నల విడాకులు.. డిప్రెషన్‌కి వెళ్లాను: అమీర్ ఖాన్ కూతురు
మానసిక అనారోగ్యం వెంటనే తెలియదు. తమకు మానసిక అనారోగ్యం ఉంది అని చాలామంది తామే అంగీకరించరు. కుటుంబ సభ్యులు గమనించినా నామోషి వల్ల వైద్యుని దగ్గరకు తీసుకెళ్లరు. ‘వైద్యులే ఇంటింటికి వెళ్లి చెక్ చేస్తే చాలా సమస్యలు తెలుస్తాయి’ అంటుంది ఇరా ఖాన్. ఆమిర్ ఖాన్ కూతురైన ఇరా ఖాన్ మానసిక సమస్యలతో బాధ పడుతూ తనలా బాధ పడేవారి కోసం ‘అగత్సు ఫౌండేషన్’ స్థాపించి మానసిక ఆరోగ్య ప్రాముఖ్యతను ప్రచారం చేస్తోంది. బాంద్రాలోని పాలీ విలేజ్‌లో ఉంటుంది రెండంతస్తుల అగత్సు ఫౌండేషన్. ముంబైలో ముఖ్యంగా బాంద్రాలో ఉన్న మానసిక సమస్యల బాధితులు అక్కడికి వచ్చి సహాయం పొందవచ్చు. చుట్టుపక్కల బస్తీల్లో ఉన్నవారు కూడా వచ్చి అందులోని కమ్యూనిటీ సెంటర్లో వైద్య సహాయం పొందవచ్చు. నిజానికి మానసిక వైద్యం, కౌన్సిలింగ్, థెరపీ కొంచెం ఖరీదుతో కూడినవి. కాని ఇక్కడ 50 రూపాయల నుంచి 750 రూపాయల లోపు ఎంతైనా ఫీజు కట్టవచ్చు. ఇక్కడ నలుగురు సైకియాట్రిస్ట్‌లు ఉంటారు. వైద్యసూచనలు చేస్తారు. దీనికి తోడు నిర్ణీత రోజులలో బాంద్రాలో డోర్ టు డోర్ తిరిగి ఇళ్లల్లో ఉన్నవాళ్ల మానసిక సమస్యలను తెలుసుకుని వైద్య సహాయం ఎంత అవసరమో చెబుతారు. ఈ పనులన్నీ మంచి ఫలితాలను ఇస్తున్నాయి. అగత్సు ఫౌండేషన్ స్థాపించి ఈ పనంతా చేస్తున్న వ్యక్తి ఇరా ఖాన్. ఆమిర్ ఖాన్– రీనా దత్తా (మొదటి భార్య)ల కుమార్తె. ‘శరీరానికే కాదు.. మనసుకూ గాయాలవుతాయి. ఆ గాయాల వల్ల మనసు ప్రభావితం అవుతుంది. దానికి సరైన వైద్య సహాయం అందాలి’ అంటుంది ఇరా ఖాన్. స్వయంగా బాధితురాలు ‘మా కుటుంబంలో మానసిక సమస్యలు ఉన్నాయి. నా మానసిక సమస్యకు అనువంశికత కొంత కారణం అనుకుంటాను. నాకు 12వ ఏట స్కూల్లో ఉన్నప్పటి నుంచే డిప్రెషన్ సూచనలు కనిపించాయి. అయితే గుర్తించలేదు. ఇంటర్ తర్వాత నెదర్లాండ్స్‌లో లిబరల్ ఆర్ట్స్ చదవడానికి వెళ్లినప్పుడు నేను తీవ్ర డిప్రెషన్‌తో బాధ పడ్డాను. రోజంతా ఏడుస్తూ... నిద్రపోతూ ఉండేదాన్ని. నా డిప్రెషన్‌కు నా తల్లిదండ్రుల విడాకులు వేసిన ప్రభావం కూడా కారణం కావచ్చు. అక్కడ నేను చదువు డిస్కంటిన్యూ చేసి ఇండియా వచ్చి ఒక సంవత్సరం బ్రేక్ తీసుకున్నాను. మళ్లీ వెళ్లి జాయిన్ అయినా చదవలేకపోయాను. 2018లో చదువు మానేసి ఇండియా వచ్చేశాను. ఇక్కడకు వచ్చాక నా బాధ లోకానికి చెప్పాలనిపించింది. 2019లో మొదటిసారి నా డిప్రెషన్ గురించి చెప్పాను. ఇందుకు నా తల్లిదండ్రులు అడ్డు చెప్పలేదు. నాకు వారెంతో సపోర్ట్‌గా నిలిచారు. అంతేకాదు మానసిక ఆరోగ్యం విషయంలో చాలా మంది చూపే నిర్లక్ష్యానికి ముగింపు పలికే చైతన్యం కోసం పని చేయాలంటే అందుకూ సపోర్ట్ చేశారు. అలా ఈ అగత్సును మొదలెట్టాను’ అని తెలిపింది ఇరా ఖాన్. మానసిక శుభ్రత ‘మనందరికీ శారీరక శుభ్రత తెలుసు. అలాగే మానసిక శుభ్రత కూడా ఉండాలి. భావోద్వేగాల శుభ్రత ఉండాలి. నా విషయమే చూడండి... డబ్బుంది.. తల్లిదండ్రుల సపోర్ట్ ఉంది... మంచి వైద్య సహాయం ఉంది... అయినా సరే డిప్రెషన్ నన్ను చావగొట్టింది. అలాంటిది పై మూడింటిలో ఏది లేకపోయినా అలాంటి వారు ఎంత బాధ పడుతుంటారో అర్థం చేసుకోవాలి. ప్రభుత్వ పరంగా, ప్రయివేటుగానూ ప్రజల మానసిక ఆరోగ్యం గురించి చేయవలసిన పని చాలా ఉంది. యాంగ్జయిటీ, డిప్రెషన్ వంటి వాటిని మనసును శుభ్రం చేసుకోవడం వల్ల తొలగించుకోవాలి. ఇందుకు చేయవలసిన పనులతో పాటు మందులు కూడా తీసుకోవాల్సి రావచ్చు. మేం ఏం చేస్తామంటే ఒక మానసిక సమస్యతో బాధపడుతున్నవారిని అలాంటి సమస్యతోనే బాధ పడుతున్నవారితో కలుపుతాము. వారంతా ఒక కమ్యూనిటీ అవుతారు. ఒకరికొకరం సాయంగా దీనిపై పోరాడవచ్చనే ధైర్యం తెచ్చుకుంటారు. ఆ విధంగా మేము పని చేస్తాం’ అంటుంది ఇరా ఖాన్. గమనించుకోవాలి ‘మానసిక సమస్యలు పునరావృత్తం అవుతుంటాయి. మీరు ఏం చేస్తే సమస్య అధికమవుతుంది, ఏం చేయకపోతే సమస్య తక్కువ అవుతుంది గమనించుకోవాలి. ఎన్ని రోజులకొకమారు సమస్య కనపడుతూ ఉంది... ఎన్నాళ్లకు దూరమవుతుంది ఇదంతా గమనించుకుని మనకు మనమే సమస్య పై పోరాడాలి. మంచి నిద్ర అలజడి తగ్గిస్తుంది. నిద్ర సరిగా పట్టేలా చూసుకోవాలి’ అంటుంది ఇరా ఖాన్. మానసిక సమస్యలను దాచుకోవద్దని, అవి శారీరక సమస్యల్లాంటివేనని చెబుతోంది ఇరా ఖాన్. ‘సెలబ్రిటీ కూతురినై ఉండి నేను బయటకు చెప్పినప్పుడు మీరు కూడా చెప్పండి. సహాయం పొందండి’ అని కోరుతోందామె. -
పార్టీలో పూటుగా తాగారు.. తెల్లారేసరికి ఆమిర్ చేతికి సల్మాన్ బ్రేస్లెట్!
ఈ ఏడాది ఈద్ పండగను బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఎంతో ఘనంగా నిర్వహించాడు. సెలబ్రిటీలను వేడుకకు పిలిచి విందు ఏర్పాటు చేశాడు. ఆ సమయంలో సల్మాన్.. ఆమిర్ ఖాన్‌తో కలిసి దిగిన ఫోటోను సైతం సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే ఈ పార్టీ ముగిసిన తెల్లారి సల్మాన్ చేతికి ఉండాల్సిన బ్రాస్లెట్ ఆమిర్ చేతికి ఉందట. యూట్యూబర్ జబి కోయ్ ఆ పార్టీలో జరిగిన ఆసక్తికర సంఘటనను తాజాగా అభిమానులతో పంచుకున్నాడు. ఆమిర్ ఖాన్‌తో మీటింగ్ అనే వ్లాగ్‌లో యూట్యూబర్ జబి కోయ్ మాట్లాడుతూ.. "ఆమిర్ ఖాన్‌ను కలవడానికి వెళ్లినప్పుడు ఆయన చేతికి సల్మాన్ ధరించే బ్రేస్లెట్ ఉండటం చూశాను. అది తన చేతికి ఎలా వచ్చిందని అడిగాను. అందుకు ఆమిర్ మాట్లాడుతూ.. 'రాత్రంతా సల్మాన్, నేను హుషారుగా తిరుగుతూ ఉన్నాం. అతడి సినిమా చూసి ఎంజాయ్ చేశాం. పార్టీలో తను మందు తాగాడు, నేను కూడా తాగాను. తాగిన మైకంలో అతడి బ్రేస్లెట్ నాకు ఇచ్చాడు. మనం ఒకరికొకరం ఎంతోకాలంగా తెలుసు. నువ్వు నా బ్రోవి. అందుకే దీన్ని నీకు అప్పగిస్తున్నా, ఎప్పటికీ దాన్ని అలాగే భద్రంగా ఉంచుకో.. అంటూ నా చేతికిచ్చాడు. కానీ మరుసటి రోజు నిద్ర లేచాక ఆ బ్రేస్లెట్ ఇంకా నా చేతికే ఉండేసరికి కంగారుపడ్డాను. పొరపాటున దీన్ని ఎక్కడైనా పడేసుకుంటే దానికి నేను బాధ్యత వహించాల్సి వస్తుంది. అందుకే తిరిగిచ్చేదామనుకున్నా, కానీ అలా చేయలేకపోతున్నాను' అని చెప్పుకొచ్చాడు. అయితే ఎక్కడికి వెళ్లినా అందరూ అదే బ్రాస్లెట్ గురించి అడుగుతుండటంతో ఆమిర్ కాస్త ఇబ్బందిపడుతున్నాడు" అని చెప్పాడు జబి కోయ్. సల్మాన్ సోదరి అర్పితా ఖాన్- ఆయుష్ శర్మ ఇచ్చిన ఈద్ పార్టీలో ఆమిర్ తన చేతికి బ్రేస్‌లెట్‌తో హాజరయ్యాడు. View this post on Instagram A post shared by Salman Khan (@beingsalmankhan) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి: మా నాన్న మమ్మల్ని టార్చర్ పెడుతున్నాడు, ఇప్పటికైనా నమ్ముతారా?: హీరోయిన్ -
4 గంటలు ఏడ్చేదాన్ని, 10 గంటలు నిద్రపోయేదాన్ని: స్టార్ హీరో కూతురు
పెళ్లి ఎంత ఆర్భాటంగా చేసుకున్నా చాలామంది కలకాలం కలిసి ఉండలేకపోతున్నారు. సెలబ్రిటీలైతే ఫ్రెండ్షిప్లో కటీఫ్ చెప్పుకున్నంత ఈజీగా విడాకులు తీసుకుంటున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కూడా ఇలా ఒకటి కాదు రెండు విడాకులు తీసుకున్నాడు. మొదట్లో రీనా దత్తాను పెళ్లాడిన అతడు 2002లో ఆమెకు విడాకులిచ్చాడు. అనంతరం కిరణ్ రావును పెళ్లాడిన ఈ హీరో 15 ఏళ్లపాటు తనతో కలిసి ఉండి 2021లో ఆమెకు కూడా విడాకులిచ్చేశాడు. ప్రస్తుతం సింగిల్‌గానే ఉంటున్నాడు. అయితే ఆమిర్ ఖాన్ మొదటి విడాకుల వల్ల తాను ఎంతగానో డిస్టర్బ్ అయ్యానంటోంది అతడి కూతురు ఇరా ఖాన్. ఇటీవలే ఆమె మానసిక ఆరోగ్యాన్ని అందించడమే లక్ష్యంగా అగస్తు సంస్థను స్థాపించింది. ఈ సందర్భంగా ఇరా ఖాన్ మాట్లాడుతూ.. ఒకానొక సమయంలో తను కూడా మానసికంగా క్షోభకు గురయ్యానని చెప్పుకొచ్చింది. 'అమ్మానాన్న విడిపోయినప్పుడు నేనంత ప్రభావితం కాలేదు. కానీ ఏదో తెలియని బాధ మాత్రం నన్ను దహించివేసింది. ఈ విషయాన్ని నేను ఎవరికీ చెప్పలేదు, ఎందుకంటే చెప్తే వాళ్లు బాధపడతారని! ఏడాదిన్నరపాటు ఒకరకమైన డిప్రెషన్లో ఉండిపోయాను. నాలుగు రోజులపాటు తిండి కూడా మానేశాను. రోజులో నాలుగు గంటలు ఏడ్చేదాన్ని, 10 గంటలు పడుకునేదాన్ని. ప్రతి 8-10 నెలలకు ఒకసారి మానసికంగా మరింత ఆందోళన చెందేదాన్ని. ఇది పాక్షికంగా జన్యుపరమైనదే! నా కుటుంబంలో కొందరికి మానసిక రుగ్మతలున్నాయి. ఈ మానసిక వ్యాధిని గుర్తించడానికి నాకు చాలా సమయం పట్టింది. నేను కూడా ఆరోగ్యపరంగా ఎటువంటి మంచి నిర్ణయాలు తీసుకోలేదు. అందుకే నెమ్మదిగా డిప్రెషన్ ఊబిలో కూరుకుపోయాను. గతేడాది జూలైలో తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనయ్యాను. అప్పుడు నేను మందులు కూడా తీసుకోవడం మానేశా, ఒక్కసారిగా బరువు పెరిగాను. ఆ తర్వాత డిప్రెషన్‌తో పోరాడేలా నన్ను నేను సన్నద్ధం చేసుకున్నాను' అని ఇరా ఖాన్ చెప్పుకొచ్చింది. కాగా ఆమిర్- రీనా దత్తాల రెండో కూతురు ఇరా ఖాన్. ఇరా కంటే ముందు వీరికి జునైద్ అనే కుమారుడున్నాడు. ఆమిర్- కిరణ్ రావులకు ఆజాద్ అనే తనయుడున్నాడు. చదవండి: గుండుతో ఢీ కొట్టేందుకు రెడీ అయిన స్టార్స్ -
అటు మాజీభార్య ఇటు ప్రేయసి.. మధ్యలో ఆమిర్‌ఖాన్!
బాలీవుడ్ మిస్టర్ ఫెర్ఫెక్ట్ అనగానే అందరికీ హీరో ఆమిర్‌ఖాన్ గుర్తొస్తాడు. డిఫరెంట్ స్టోరీలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తుండేవాడు. అయితే గతేడాది 'లాల్ సింగ్ చద్దా' సినిమాతో దెబ్బ గట్టిగా తగిలింది. బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం దారుణంగా ఫెయిలయ్యేసరికి ఆలోచనలో పడిపోయాడు. కొన్నాళ్లపాటు నటన, సోషల్ మీడియాకు బ్రేక్ ఇస్తున్నట్లు ప్రకటించాడు. అలా అని ఖాళీగా ఏం లేడు. చేతినిండా సినిమాలతో బిజీగానే ఉన్నాడు. (ఇదీ చదవండి: అభిమానుల్ని మోసం చేస్తున్న స్టార్ హీరోలు!) మాజీభార్యతో కలిసి ఆమిర్ ఖాన్.. తొలుత నిర్మాత రీనా దత్తాని పెళ్లి చేసుకున్నాడు. 16 ఏళ్లపాటు కాపురం చేసిన ఈ జంట.. 2002లో విడిపోయింది. 2005లో డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కిరణ్ రావ్ ని పెళ్లి చేసుకున్న ఆమిర్.. ఈమెతోనూ 16 ఏళ్లు సంసారం చేసి 2021లో విడాకులు ఇచ్చేశాడు. రిలేషన్ లో విడిపోయినప్పటికీ.. ఫ్రొఫెషనల్ గా వీళ్లు కలిసే పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆమిర్ నిర్మాణంలో కిరణ్ ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తోంది. త్వరలో ఇది విడుదల కానుంది. రూమర్ గర్ల్‌ఫ్రెండ్‌తోనూ ప్రస్తుతం ఆమిర్ ఖాన్.. 'దంగల్' ఫేమా ఫాతిమా సనా షేక్ తో రిలేషన్ లో ఉన్నాడని, త్వరలో పెళ్లి చేసుకుంటాడని గత కొన్నాళ్లుగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఈ విషయం పక్కనబెడితే.. ఆమిర్ ఖాన్ ప్రస్తుతం నిర్మిస్తున్న నాలుగు మూవీస్ లోని ఒక దానిలో ఫాతిమా హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ సూపర్ హిట్ 'జయజయజయహే' రీమేక్ గా దీన్ని తీస్తున్నారు. ఇది కూడా త్వరలో రిలీజ్ కానుంది. అటు మాజీ భార్య ఇటు ప్రేయసిని ఆమిర్ ఖాన్ భలే బ్యాలెన్స్ చేస్తున్నాడని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. (ఇదీ చదవండి: సలార్-కేజీఎఫ్ కనెక్షన్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత) -
ఆ హీరోయిన్‌తో సన్నిహితంగా అమీర్ ఖాన్.. వీడియో లీక్
-
త్వరలోనే అమీర్ ఖాన్ మూడో పెళ్లి? కూతురు వయసున్న ఆమెతో..
సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, బ్రేకప్‌లు కామనే. పెళ్లి వరకు వచ్చి ఆగిపోయిన జంటలు ఎన్నో ఉన్నాయి. ప్రేమలో చాలాకాలం మునిగితేలి పెళ్లి చేసుకున్నాక విడిపోయిన జంటలు కూడా ఎన్నో ఉన్నాయి.తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో గురించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన లాల్ సింగ్ చద్దా ఘోర పరాజయం చెందడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే ఆయన త్వరలోనే మూడో పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దంగల్ సినిమాలో అమీర్‌కు కూతురిగా నటించిన ఫాతిమా సనాషేక్‌తో కొంతకాలంగా డేటింగ్లో ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో ఇద్దరూ చెట్టాపట్టేసుకొని పలుమార్లు మీడియా కంట పడ్డారు. ఇటీవల అమీర్ కూతురు ఇరాఖాన్ ఎంగేజ్మెంట్ వేడుకలోనూ ఫాతిమా సందడి చేసింది. తాజాగా ఇద్దరూ కలిసి ఉన్న ఓ వీడియో నెట్టింట లీక్ అయ్యింది. ముంబైలో వీరిద్దరూ కలిసి పికిల్ బాల్ ఆడారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో మరోసారి అమీర్ ఖాన్ పెళ్లి వార్తలు హాట్‌టాపిక్‌గా మారాయి. దీనికి తోడు అమీర్ ఖాన్ త్వరలోనే దంగల్ నటిని పెళ్లాడనున్నట్లు ప్రముఖ సినీ క్రిటిక్ ఉమైర్ సంధు ట్వీట్ చేశాడు. కాగా 1986లో రీనా దత్తను పెళ్లి చేసుకున్న అమీర్ 2002లో విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత కిరణ్ రావును 2005లో పెళ్లి చేసుకోగా 2021లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. -
రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యాలపై వ్యాజ్యం.. బెట్టింగ్‌ను ప్రోత్సహిస్తున్నారంటూ..!
టీమిండియా క్రికెటర్లు రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యాలతో పాటు బీసీసీఐ తాజా మాజీ బాస్ సౌరవ్ గంగూలీ, బాలీవుడ్ నటుడు ఆమీర్ ఖాన్ తదితరులపై బీహార్‌కు చెందిన సామాజిక కార్యకర్త తమ్మనా హష్మీ ముజఫర్‌పూర్ జిల్లా కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలు చేశారు. వీరంతా ఐపీఎల్‌కు సంబంధించిన ఆన్లైన్ గేమ్ ప్రమోషన్లలో పాల్గొనడం ద్వారా గ్యాంబ్లింగ్‌ను ప్రోత్సహిస్తున్నారంటూ హష్మీ ఆరోపించారు. పై పేర్కొన్న సెలబ్రిటీలు ఆకర్షణీయమైన బహుమతులతో దేశంలోని యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని, దీనివల్ల ప్రజలు, ముఖ్యంగా యువత జూదానికి బానిసలైపోతున్నారని హష్మీ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఎంతో బాధ్యతగా ఉంటూ దేశానికి ఆదర్శంగా ఉండాల్సిన వీరు తమను తాము జూదంలో భాగం చేసుకుంటూ యువతకు చెడు వర్తమానం పంపుతున్నారని అన్నారు. ఇలా చేయడం దేశ యువత భవిష్యత్తుతో ఆడుకోవడమేనని తెలిపారు. హష్మీ దాఖలు చేసిన ఈ పిల్‌పై కోర్టు ఏప్రిల్ 22న విచారణ చేపట్టనుంది. కాగా, హష్మీ గతంలో కూడా పలువురు ప్రముఖులపై పిల్లు దాఖలు చేశారు. -
ఆమిర్‌ను ట్రోల్ చేసిన టీమిండియా క్రికెటర్స్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సహా ఇతర క్రికెటర్లు బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్ ఖాన్‌ను ట్రోల్ చేయడం ఆసక్తి కలిగించింది. 2009లో రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో ఆమిర్ ఖాన్, ఆర్. మాధవన్, శర్మన్ జోషి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన త్రీ ఇడియట్స్(3 Idiots) సినిమా గుర్తుందిగా. భారతీయ విద్యావ్యవస్థపై సెటైర్లు, ర్యాంకుల పేర్లతో విద్యార్థులు సంఘర్షణకు గురవ్వడం లాంటివి చాలా చక్కగా చూపించారు ఈ సినిమాలో. ఇండియన్ బ్లాక్బాస్టర్గా నిలిచిన 'త్రీ ఇడియట్స్' సినిమా అప్పట్లో ఒక సంచలనం. 2016లో ఆమిర్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ 'త్రీ ఇడియట్స్'కు సీక్వెల్ ఉంటుందని.. రాజ్‌కుమార్ హిరానీ నాకు చిన్న హింట్ ఇచ్చారని పేర్కొన్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ చిత్రం పట్టాలెక్కలేదు. అయితే తాజాగా ఆమిర్, మాధవన్, శర్మన్ జోషిలు కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకే వేదికను పంచుకోవడం ఆసక్తి రేపింది. త్రీ ఇడియట్స్‌కు సీక్వెల్ ఉంటుందని చెప్పడానికే ప్రెస్ కాన్ఫరెన్స్ అనుకున్నారు అక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులు. కానీ వారిని ఆశ్చర్యానికి గురి చేస్తూ తాము క్రికెట్ ఆడబోతున్నట్లు ఆమిర్ పేర్కొన్నాడు. పనిలో పనిగా టీమిండియా క్రికెటర్ల ఆటతీరును తప్పుబడుతూ ట్రోల్ చేశారు. తాము క్రికెట్లోకి ఎంటర్ ఇస్తున్నామని.. ఎందుకంటే క్రికెటర్లు మా బిజినెస్(అడ్వర్టైజ్మెంట్)లోకి ఎంట్రీ ఇచ్చారు కాబట్టి అంటూ ఆమిర్ పేర్కొన్నాడు. అయితే ఇదంతా కేవలం ఫన్నీ కోసమే. మార్చి 31న ప్రారంభం కానున్న ఐపీఎల్ 16వ సీజన్‌కు సంబంధించి ఒక ప్రమోషన్ వీడియోను షూట్ చేశాడు. డ్రీమ్ ఎలెవెన్, ఐపీఎల్ కోసం ఈ వీడియోను షూట్ చేశారు. మేం యాక్టింగ్‌లో బిజీగా ఉన్నప్పటికి క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నాం అని ఆమిర్, మాధవన్, శర్మన్‌లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోనూ చూసిన టీమిండియా క్రికెటర్లు ఆమిర్ ఖాన్‌ను ఫన్నీగా ట్రోల్ చేశారు. రోహిత్ శర్మ స్పందిస్తూ.. ''సినిమాలో క్రికెట్ ఆడినంత మాత్రానా క్రికెటర్ అయిపోడు''.. ''ఒక హిట్ సినిమాకు రెండేళ్లు తీసుకుంటే హిట్‌మ్యాన్‌లు అయిపోలేరు'' అంటూ ట్రోల్ చేశాడు. ''మాటలు చెప్పడం ఈజీ.. ఆడడం కష్టం.. ఎప్పుడు తెలుసుకుంటావు ఆమిర్ జీ'' అంటూ అశ్విన్ ఫన్నీ కామెంట్ చేశాడు. ఇక హార్దిక్ పాండ్యా స్పందిస్తూ.. ''ఒక్క బౌన్సర్‌తో మీ ముగ్గురు గ్రౌండ్‌లోనే కుప్పకూలడం ఖాయం'' అంటూ నవ్వుతూ పేర్కొన్నాడు. #3Idiots ka Press Conference... Cricket Pe?!?! This #Cricket season, #SabKhelenge! . . .#Dream11 @ImRo45 @hardikpandya7 @ashwinravi99 @TheSharmanJoshi pic.twitter.com/r0NSoz8IOj — Dream11 (@Dream11) March 25, 2023 చదవండి: ఒక్కడికి సీరియస్‌నెస్ లేదు; థర్డ్ అంపైర్‌కు మెంటల్ ఎక్కించారు -
అల్లు అర్జున్ ఇంట్లో అమిర్ ఖాన్ సందడి
-
ఫారిన్ స్టోరీ.. బాలీవుడ్ మూవీ
విదేశీ కథలపై హిందీ దర్శక–నిర్మాతలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. దాదాపు పది విదేశీ చిత్రాలు రీమేక్ రూపంలో హిందీ తెరపై కనిపించనున్నాయి. ఆ ఫారిన్ చిత్రాల్లోని కథలు ఇండియన్ ఆడియన్స్‌కు దగ్గరగా ఉండటంతో రీమేక్ చేస్తున్నారు. ఇక ఫారిన్ స్టోరీతో రీమేక్ అవుతున్న బాలీవుడ్ మూవీస్ గురించి తెలుసుకుందాం. స్పానిష్ స్పోర్ట్స్ అండ్ కామెడీ డ్రామా ‘చాంపియన్స్’ (2018) హిందీ రీమేక్‌ను నిర్మించే ఆలోచనలో ఉన్నట్లుగా ఆమిర్ ఖాన్ ఇటీవల ఓ సందర్భంలో పేర్కొన్న సంగతి గుర్తుండే ఉంటుంది. అయితే ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ మెయిన్ లీడ్ రోల్ చేయనున్నారని తెలుస్తోంది. ఇటీవల ఈ సినిమా కోసం ఆమిర్, సల్మాన్‌లు కలిసి చర్చించుకున్నారు. ఈ చిత్రానికి ఆమిర్ నిర్మాతగా మాత్రమే వ్యవహరించాలనుకుంటున్నారట. ఒకవైపు ఈ రీమేక్ గురించి చర్చిస్తూనే మరోవైపు సౌత్ కొరియన్ డిటెక్టివ్ డ్రామా ‘వెటరన్’ (2015) హిందీ రీమేక్‌లో నటించేందుకు సల్మాన్ ఖాన్ ఆసక్తి చూపిస్తున్నారని టాక్. ‘వెటరన్’ హిందీ రీమేక్ హక్కులను బాలీవుడ్ దర్శక –నిర్మాత అతుల్ అగ్ని హోత్రి దక్కించుకున్నారు. ఇక అమెరికన్ కామెడీ డ్రామా ‘ది ఇంటర్న్’ (2015) హిందీ రీమేక్‌లో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్ లీడ్ రోల్స్ చేయనున్నారు. ఈ రీమేక్‌కి అమిత్ శర్మ దర్శకత్వం వహించనున్నారు. అయితే ఈ సినిమా ప్రకటన ఎప్పుడో వచ్చినప్పటికీ ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. ఈ సినిమా నుంచి దీపికా తప్పుకునే ఆలోచనలో ఉన్నారని, అందుకే షూటింగ్ ఆరంభించలేదని టాక్. కాగా, ఫ్రెంచ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ట్రాన్స్పోర్టర్’ (2002) హిందీ రీమేక్ రైట్స్‌ను దక్కించుకున్నారు నిర్మాత విశాల్ రానా. ఇందులో హృతిక్ రోషన్, రణ్వీర్ సింగ్, టైగర్ ష్రాఫ్లలో ఎవరో ఒకరు నటిస్తారనే టాక్ వినిపిస్తోంది. అలాగే అమెరికన్ సూపర్‌హిట్ యాక్షన్ ఫ్రాంచైజీ ‘ర్యాంబో’ రీమేక్‌లో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించనున్నారని ప్రకటన వచ్చిoది. ఇక షాహిద్ కపూర్ హీరోగా అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో ‘బ్లడీ డాడీ’ అనే సినిమా రూపొందుతోంది. ఇది ఫ్రెంచ్ ఫిల్మ్ ‘స్లీప్‌లెస్ నైట్’ (2011)కు రీమేక్ అనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. అదే విధంగా సౌత్ కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ ‘బ్లైండ్’ (2011) హిందీ రీమేక్‌లో సోనమ్ కపూర్ లీడ్ రోల్ చేస్తున్నారు. అలాగే ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ ‘కోడ’ (2021) రీమేక్‌ను దర్శకుడు విశాల్ బాల్ తెరకెక్కించనున్నారని, అమెరికన్ మార్షల్ ఆర్ట్స్ ఫిల్మ్ ‘కిల్ బిల్’ (2003) రీమేక్ అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో రూపొందనుందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఇలా విదేశీ చిత్రాల హిందీ రీమేక్ జాబితాలో మరికొన్ని కూడా ఉన్నాయి. -
ఆమిర్ ఖాన్ ఆరోగ్యంపై ఫ్యాన్స్ ఆందోళన! ఆయనకు ఏమైంది?
బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ కొంతకాలంగా బయటకు రావడం లేదు. ఇటీవల ఆయన నటించిన లాల్ సింగ్ చద్ధా మూవీ అనంతరం ఆయన మీడియా ముందుకు పెద్దగా రావడం లేదు. అలాగే షూటింగ్స్‌లో సైతం పాల్గొనడం లేదనే సమాచారం. ఈ నేపథ్యంలో రీసెంట్గా ఓ జైపూర్ జరిగిన ఓ పెళ్లి వేడుకలో ఆమిర్ ఖాన్ సందడి చేశారు. చదవండి: మహేశ్ మేకప్ మ్యాన్ ఇంట విషాదం.. స్వయంగా వెళ్లి పరామర్శించిన నమ్రత! రాజస్థాన్‌లో జరిగిన ప్రముఖ ఆసియానెట్ కె మాధవన్ కుమారుడి వివాహానికి కమల్ హాసన్, అక్షయ్ కుమార్, అమీర్ ఖాన్, మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్, కరణ్ జోహార్ హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియా బాగా వైరల్ అవుతున్నాయి. స్టార్స్ అంత ఒకే వేదికపై కనిపించడంతో ఫ్యాన్స్‌కు కనుల విందుగా ఉంది. ఈ వివాహ వేడుకులో అక్షయ్, మోహన్ లాల్లు డాన్స్ చేస్తుండగా పక్కనే ఆమిర్ నిలబడి కనిపించాడు. చదవండి: అందుకే సినిమాలు చేయడం మానేశా: నటి హేమ అయితే అక్కడ ఆయన చేతితో స్టిక్ పట్టుకుని ఉన్నాడు. ఆయన చేతితో స్టిక్ పట్టుకుని జాగ్రత్తగా నడుస్తూ కనిపించాడు. దీంతో ఆయనకు ఏమైందా అని అభిమానులంత ఆందోళణ వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఎందుకు స్టిక్ పట్టుకుని నడుస్తున్నారు? ఆయన కాలికి ఏమైంది? అంటూ ఫ్యాన్స్, నెటిజన్ల నుంచి ప్రశ్న వర్షం కురుస్తోంది. అయితే ఆమిర్‌కు ఏమైందనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. మరి దీనిపై ఆమిర్ స్పందించాలని, తన ఆరోగ్యంపై అప్డేట్ ఇవ్వాలని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
సల్మాన్.. ఆమిర్... ఓ సినిమా!
సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్లు కలిసి ఓ సినిమా చేయనున్నారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. స్పానిష్ ఫిల్మ్ ‘చాంపియన్స్’ హిందీ రీమేక్‌ను నిర్మించి, నటించా లనుకున్నారు ఆమిర్. అయితే ఇప్పుడు ఈ రీమేక్‌కు సల్మాన్ ఖాన్ బాగుంటారని భావించారట. ఈ సినిమా గురించి చర్చించడానికి సల్మాన్‌ను ఇంటికి ఆహ్వానించారట ఆమిర్. కాగా తాను నటించిన ‘ది ఫారెస్ట్ గంప్’ హిందీ రీమేక్ ‘లాల్‌సింగ్ చడ్డా’ సరిగ్గా ఆడకపోవడంతో వెంటనే మరో రీమేక్‌లో నటించాలనే నిర్ణయాన్ని ఆమిర్ మార్చుకున్నారట. అందుకే హీరోగా నటించాల్సిందిగా సల్మాన్‌ను రిక్వెస్ట్ చేశారని టాక్. -
ఎన్టీఆర్ కు విలన్ గా మిస్టర్ పర్ఫెక్ట్
-
Year End 2022: అక్కడ హిట్.. ఇక్కడ ఫట్.. ఫ్లాప్ రీమేక్ చిత్రాలివే
విదేశీ తెరపై హిట్టయిన సినిమా ఇక్కడ కూడా హిట్టవుతుందా? అంటే ‘గ్యారంటీ’ ఇవ్వలేం. అందుకు ఉదాహరణ ఈ ఏడాది విడుదలైన దాదాపు అరడజను చిత్రాలు. అక్కడ హిట్టయిన చిత్రాలు రీమేక్ రూపంలో వచ్చి, ఇక్కడ ఫట్ అయ్యాయి. ఆ రీమేక్ చిత్రాలను రౌండప్ చేద్దాం. అరడజను ఆస్కార్ అవార్డ్స్ సాధించిన హాలీవుడ్ ఫిల్మ్ ‘ది ఫారెస్ట్‌గంప్’ (1994) హిందీలో ‘లాల్‌సింగ్ చడ్డా’గా రీమేక్ అయింది. టైటిల్ రోల్‌ను ఆమిర్ ఖాన్ చేయగా, అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో నాగచైతన్య ఓ కీ రోల్ చేశారు. హిందీలో చైతూకు ఇదే తొలి చిత్రం. భారీ అంచనాల మధ్య ఈ ఏడాది ఆగస్టు 11న రిలీజైన ఈ ఎమోషనల్ కామెడీ డ్రామా ఫిల్మ్‌కు బాక్సాఫీస్ వద్ద నిరాశే ఎదురైంది. లాల్‌సింగ్ చడ్డా జీవితంలో ఎలాంటి ఘటనలు జరిగాయి? దేశవ్యాప్తంగా జరిగిన ఘటనల వల్ల అతని జీవితం ఎలా ప్రభావితం అయింది? అనే అంశాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఇక ఈ ఏడాది అరడజను సినిమాలతో (హిందీలో ‘లూప్ లపేట’, ‘శభాష్ మిథు’, ‘దోబార’, ‘తడ్కా’, ‘బ్లర్’ తెలుగులో ‘మిషన్ ఇంపాజిబుల్) ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేశారు తాప్సీ. ఈ ఆరులో మూడు సినిమాలు ‘లూప్ లపేట, దోబార, బ్లర్’ విదేశీ చిత్రాలకు రీమేక్. 1988లో వచ్చిన జపాన్ హిట్ ఫిల్మ్ ‘రన్ లోలా రన్’కు హిందీ రీమేక్‌గా ‘లూప్ లపేట’ తెరకెక్కింది. ఆకాష్ భాటియా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 4న రిలీజైంది. యజమాని డబ్బును పోగొట్టి, చిక్కుల్లో పడ్డ తన ప్రియుడి కోసం గాయపడ్డ ఓ రన్నింగ్ అథ్లెట్ ఎలాంటి సాహసాలు చేసింది? ఆమెకు ఎలాంటి ప్రమాదాలు ఎదురయ్యాయి? ఎలా ఎదుర్కొంది? అన్నదే ‘లూప్ లపేట’ కథాంశం. ఇక స్పానిష్ చిత్రాలైన సైన్స్ ఫిక్షన్ మిస్టరీ థ్రిల్లర్ ‘మిరాజ్’ (2018) ఆధారంగా ‘దోబార (2:12)’, స్పానిస్ హారర్ థ్రిల్లర్ ‘లాస్ ఓజోస్ దే జూలియా (2010) ఆధారంగా ‘బ్లర్’ చిత్రాలు రూపొందాయి. అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన ‘దోబార’ ఆగస్టు 19న రిలీజైంది. పాతికేళ్ల క్రితం ఓ అమ్మాయి చూస్తుండగానే పిడుగు పాటుతో ఒకరు మరణిస్తారు. ఆ అమ్మాయి పెద్దయ్యాక ఆ పరిస్థితులే పునరావృతమై ఓ పన్నెండేళ్ల బాలుడు చిక్కుల్లో పడతాడు. ఓ టీవీ సెట్ ఆధారంగా ఆ బాలుడిని ఈ యువతి ఎలా కాపాడగలిగింది? అన్నదే ‘దోబార’ కథనం. ఇక ‘బ్లర్’ విషయానికి వస్తే... అజయ్ భాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తాప్సీ ద్విపాత్రాభినయం చేశారు. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబరు 9 నుంచి జీ5 ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రకథ విషయానికి వస్తే.. గాయత్రి, గౌతమి కవలలు. కానీ ఇద్దరూ దృష్టి లోపంతో బాధపడుతుంటారు. అయితే హఠాత్తుగా గౌతమి మరణిస్తుంది. గౌతమి మరణానికి దారితీసిన పరిస్థితులను గాయత్రి తెలుసుకోవాలనుకుంటుంది? ఈ ప్రయత్నంలో ఆమెకు ఎదురైన సవాళ్లు ఏంటి? అనే అంశాల నేపథ్యంలో ‘బ్లర్’ చిత్రం సాగుతుంది. విదేశీ కథలతో తాప్సీ చేసిన ఈ మూడు చిత్రాలూ ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఇక ఈ ఏడాది సెప్టెంబరులో విడుదలైన తెలుగు చిత్రం ‘శాకినీ డాకినీ’ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. రెజీనా, నివేదా థామస్ టైటిల్ రోల్స్ చేసిన ఈ సినిమాకు సుధీర్ వర్మ దర్శకుడు. 2017లో వచ్చిన సౌత్ కొరియన్ హిట్ ఫిల్మ్ ‘మిడ్నైట్ రన్నర్స్’కు రీమేక్‌గా ‘శాకినీ డాకినీ’ తెరకెక్కింది. అక్రమాలకు ΄ాల్పడే ఓ ముఠా ఆటను ఇద్దరు ట్రైనీ ΄ోలీసాఫీసర్లు ఎలా అడ్డుకున్నారు? అన్నదే ఈ చిత్రకథాంశం. -
Year End 2022: అలరించని బీటౌన్ స్టార్స్.. వందల కోట్ల నష్టాలు!
బాలీవుడ్ ఇండస్ట్రీ అంటే..ఖాన్ త్రయం పేరు వినిపిస్తుంది. తర్వాత అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోలు కూడా తమ రేంజ్ చూపిస్తున్నారు. అయితే ఈ ఏడాది బాక్సాఫీసు ముందు వీళ్ల ప్రతాపాలు ఏవీ చెల్లుబాటు కాలేదు. సినిమ టాక్ ఎలా ఉన్నా ఈ స్టార్లు..ఓ మోస్తారు కలెక్షన్లు రాబడుతుంటారు. కానీ ఇప్పుడు మినిమం వసూళ్లు కూడా రాబట్టలేకపోతున్నారు. వందల కోట్ల నష్టాలు తీసుకొస్తున్నారు. ఈ ఏడాదిలో భారీ అంచనాల మధ్య విడుదలై వందల కోట్ల నష్టాలు మిగిల్చిన సినిమాలపై ఓ లుక్కేయండి ఆమిర్ ఖాన్ పేరు చెప్తే..పర్ఫెక్షన్ గుర్తుకు వస్తుంది. ఇంతటి మిస్టర్ పర్ఫెక్షనిస్టు కూడా ఈ ఏడాది బాలీవుడ్‌కు బలం తీసుకురాలేకపోయాడు. పీకే,దంగల్ లాంటి సినిమాలతో ఇండియన్ బాక్సాఫీసును తిరగరాసిన ఆమిర్ థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ తో గట్టి దెబ్బే తిన్నాడు. క్రిటిక్స్‌తో పాటు..కామన్ ఆడియన్..ఈ సినిమాను చూసి పెదవి విరిచేశారు. ఈ ఇ ఏడాదిలో వచ్చిన లాల్ సింగ్ చద్దా అయితే దారుణమైన అపజయాన్ని మూటగట్టుకుంది. దీంతో సినిమాలకు కొంత కాలం గ్యాప్ తీసుకున్నాడు అమిర్ ఈ ఇయర్ ఖాన్ త్రయంలో మరో ఇద్దరు హీరోలు బాక్సాఫీసుకు దూరంగా ఉన్నారు. అపజయాల పరంపర కొనసాగిస్తున్న..షారుఖ్ ఖాన్ పెద్ద బ్రేక్ తీసుకొని వరసగా సినిమాలు చేస్తున్నాడు. 2022 మొత్తం షూటింగ్లకే పరిమితమయ్యాడు. సల్లూ బాయ్ కూడా చిరంజీవి గాడ్ ఫాదర్ హిందీ డబ్బింగ్‌తో అక్కడి ఆడియన్స్‌కు కనిపించాడు. కానీ ఈ ఖండల వీరుడు ఉన్నా కూడా అక్కడ ఫలితం లేకుండా పోయింది. సంవత్సరానికి మూడు నాలుగు సినిమాలు చేస్తూ..సునాయసంగా వందల కోట్లు సంపాదిస్తున్నాడు ఖిలాడి అక్షయ్ కుమార్. ఈ ఏడాదిలో ఈయన నటించిన సినిమాలు..భారీ నష్టాలు తీసుకొచ్చాయి. ఆరు సినిమాలు విడుదలైతే..ఒక్క సినిమా కూడా డబ్బులు రాబట్టలేకపోయింది. ఓటీటీలో వచ్చిన అత్రంగిరే ,కట్‌పత్లీ ఆకట్టుకోలేకపోయాయి. థియేటర్లలో విడుదలైన బచ్చన్ పాండే,సామ్రాట్ పృథ్వీరాజ్,రక్ష బందన్,రామ్ సేతు లాంటి సినిమాలు బయ్యర్లకు తీవ్ర నష్టాన్ని తీసుకొచ్చాయి. హృతిక్ రోషన్ విక్రమ్ వేదా,షాహిద్ కపూర్ జెర్సీ, టైగర్ ష్రాప్ ‘హీరో పంతీ 2’, అయుష్మాన్ ఖురానా ‘ఆన్ యాక్షన్ హీరో’, రణ్వీర్ సింగ్ ‘జయేష్ భాయ్ జోర్దార్’, కంగనా రనౌత్ ‘ధాకడ్’, రణ్‌బీర్ కపూర్ ‘షంషెరా’, వరుణ్ దావాన్ ‘బేడియా’ లాంటి మూవీస్..ఈ ఇయర్ అంచనాలతో విడుదల అయ్యాయి. అయితే..ఒక్క సినిమా కూడా ఆడియన్స్‌ను థియేటర్లలోకి రప్పించలేకపోయింది. -
ఆఫీసుల్లో చీపుర్లకు బదులు వాక్యూమ్ క్లీనర్లు వాడమని వాడమని చెప్పాగా!
ఆఫీసుల్లో చీపుర్లకు బదులు వాక్యూమ్ క్లీనర్లు వాడమని వాడమని చెప్పాగా! -
ఎవరో గుర్తుపట్టారా? అబ్బే, ఆయన మాత్రం కాదు!
పై ఫొటోలో ఉంది ఎవరో గుర్తుపట్టారా? విలక్షణ నటుడు జగపతిబాబు అనుకుంటే తప్పులో కాలేసినట్లే! మరింకెవరునుకుంటున్నారా? బాలీవుడ్ బడా హీరో ఆమిర్ ఖాన్. తన ప్రొడక్షన్ ఆఫీస్‌లో ఆమిర్ హిందూ సాంప్రదాయం ప్రకారం పూజా కార్యక్రమాలు చేపట్టాడు. మాజీ భార్య కిరణ్ రావుతో కలిసి ఈ పూజ పూర్తి చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో ఆమిర్ నుదుటన బొట్టుతో, చేతికి కంకణంతో, అదే చేత్తో కలశం పట్టుకుని కనిపించాడు. ఇది చూసిన నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. 'హిందూ సాంప్రదాయాలను గౌరవించినట్లు సడన్‌గా నాటకం మొదలుపెట్టాడేంటి?', 'నీ సినిమాలు ఫ్లాప్, నువ్వూ ఫ్లాప్.. మళ్లీ కొత్తగా ఇదేంటో', 'ఇండస్ట్రీ నిన్ను బయటకు గెంటేయకుండా ఉండేందుకు ఇలా ప్లాన్ చేశావన్నమాట' అంటూ కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. మరికొందరు మాత్రం 'ఆమిర్, కిరణ్.. మీ ఇద్దరినీ మేమెల్లప్పుడూ గౌరవిస్తాం' అని మద్దతుగా నిలుస్తున్నారు. కాగా ఆమిర్-కిరణ్‌లు గతేడాది వైవాహిక బంధానికి స్వస్తి పలికారు. భార్యాభర్తలుగా విడిపోయినప్పటికీ స్నేహితులుగా మాత్రం ఇద్దరూ కలిసిమెలిసి ఉంటున్నారు. ఇకపోతే ఆమిర్ నటించిన లాల్‌సింగ్ చడ్డా బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా చతికిలపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కుటుంబానికి సమయం కేటాయించిన ఆయన ఏడాది తర్వాతే సినిమాల్లో నటించనున్నాడు. Guess the man in the pic.. pic.twitter.com/z0QugsVLYx — 𝐒𝐚𝐠𝐚𝐫 𝐆𝐨𝐮𝐝 (@Sagar4BJP) December 8, 2022 చదవండి: బ్రేకప్దాకా వెళ్లాను, ఎవరికీ కనిపించకుండా పోదామనుకున్నా: సిరి నన్నెవరూ బ్యాన్ చేయలేదు: రష్మిక మందన్నా -
అప్పుల వాళ్లు ఇంటి మీదకు వచ్చారు, ఏం చేయలేక ఏడ్చేశా: ఆమిర్
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్‌ఖాన్ కన్నీరు పెట్టుకున్నాడు. రీసెంట్గా ఓ చానల్‌తో ముచ్చటించిన ఆయన తన చిన్నతనంలో గడ్డు పరిస్థితులను చూశానంటూ ఆసక్తికరవ్యాఖ్యాలు చేశాడు. ఈ సందర్భంగా ఇంటర్య్వూలో ఆయన మాట్లాడుతూ తన బాల్యంలో జరిగిన ఓ చేదు సంఘటనను పంచుకున్నాడు. తన చిన్నతనంలో ఇంటి మీదకి అప్పుల వాళ్లు వచ్చినప్పుడు తాను ఏమీ చేయలేక ఏడ్చేశానంటూ కన్నీటి పర్యంతరమయ్యాడు. ఈ మేరకు ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ.. ‘అప్పుడు నాకు 10 సంవత్సరాలు. ఆ సంవత్సరం నాన్న తాహిర్ హుస్సేన్ లాకెట్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం కోసం ఆయన జితేంద్ర, రేఖ, ఖాదర్ ఖాన్ వంటి స్టార్ నటీనటులనే తీసుకున్నారు. నాన్న పెద్ద నిర్మాత కాకపోవడంతో వారు సరిగ డేట్స్ ఇచ్చేవారు కాదు. దాంతో ఈ సినిమా పూర్తవడానికి దాదాపు 8 ఏళ్లు పట్టింది. నాన్న దగ్గర డబ్బులు అయిపోయి మేం రోడ్డు మీద పడేస్థితికి వచ్చాం’ అంటూ కన్నీరు పెట్టుకున్నాడు. అనంతరం ‘‘అప్పులిచ్చిన వాళ్లు ఇంటి మీదకు వచ్చి డబ్బులెప్పుడిస్తారంటూ నాన్నను నిలదీసేవారు. ‘నటీనటులు నాకు డేట్స్ ఇవ్వడం లేదని, సినిమా పూర్తైతేనే చేతికి డబ్బులు వస్తాయి’ అని నాన్న వారిని బతిమాలేవారు. కానీ అది వారికి అనవసరం కదా. అప్పుడు నేను చిన్నవాడిని అయినందున ఏం చేయలేని పరిస్థితి. దీంతో నేను ఏం చేయలేక ఏడ్చేశాను. ఆ సమయంలో నాన్న పడ్డ కష్టాలను చూస్తే నాకు కన్నీరు ఆగలేదు. నటీనటులకు రెమ్యూనరేషన్ పూర్తిగా ఇవ్వకపోవడంతో వారు షూటింగ్‌లకు వచ్చేవారు కాదు. దాంతో నాన్న వారిని బ్రతిమిలాడేవారు’’ అంటూ నాటి చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్ని భావోద్వేగానికి లోనయ్యాడు. కాగా రీసెంట్గా లాల్ సింగ్ చద్దా మూవీతో అలరించిన ఆమిర్ ప్రస్తుతం స్పానిష్ మూవీ రీమేక్‌లో నటిస్తున్నాడు. చదవండి: బిగ్‌బాస్ 6: హాట్‌టాపిక్‌గా ఫైమా రెమ్యునరేషన్! 13 వారాలకు ఎంతంటే? ఆసక్తికర సంఘటన.. నెక్ట్స్ మహానటి ఎవరు? ఆ స్టార్ హీరోయిన్ పేరు చెప్పిన అల్లు అరవింద్, సురేశ్ బాబు -
బాయ్‌ఫ్రెండ్‌తో ఆమిర్ ఖాన్ కూతురు ఎంగేజ్మెంట్.. ఫోటోలు వైరల్
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కూతురు ఇరాఖాన్ నిశ్చితార్థ వేడుకలు ముంబైలో ఘనంగా జరిగాయి. ప్రియుడు, ఫిట్నెస్ ట్రైనర్ నుపుర్ శిఖారేతో కొంతకాలంగా డేటింగ్లో ఉన్న ఇరాఖాన్ ఇటీవలె తన రిలేషన్‌షిప్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలెక్కనున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ముంబైలో ఎంగేజ్మెంట్ వేడకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమీర్‌ఖాన్ సహా బంధుమిత్రులంతా హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ వేడుకలో ఇరాఖాన్ రెడ్గౌనులో మెరిసిపోగా, నుపుర్ బ్లాక్ సూట్లో కనిపించాడు. అయితే ఈ ఎంగేజ్మెంట్ పార్టీలో నటి ఫాతిమా సనాషేక్ హాజరు కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. `థగ్స్ ఆఫ్ హిందూస్థాన్` నుంచి అమీర్ ఖాన్, ఫాతిమా ప్రేమలో ఉన్నట్టు రూమర్స్ వినిపించాయి. ఆమిర్ తన రెండో భార్య కిరణ్ రావు నుంచి విడాకులు తీసుకోవడానికి కూడా ఫాతిమానే కారణం అంటూ టాక్ వినిపించింది. ఇప్పుడు మరోసారి వీరి రిలేషన్షిప్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. -
సినిమాలకు బ్రేక్: స్టార్ హీరో అనూహ్య నిర్ణయం
నెరిసిన గడ్డం, తెల్లజుట్టుతో దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు స్టార్ హీరో ఆమిర్ ఖాన్. లాల్‌సింగ్ చడ్డా ఫెయిల్యూర్ తర్వాత తొలిసారి ఓ ఈవెంట్లో ప్రత్యక్షమయ్యాడాయన. తన చిన్ననాటి స్నేహితులు నిర్వహించిన ఓ కార్యక్రమానికి ఈ హీరో ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ సందర్భంగా అతడు.. తాత్కాలికంగా సినిమాలు మానేస్తున్నట్లు ప్రకటించాడు. 'ఒక నటుడిగా సినిమా చేస్తున్నప్పుడు జీవితంలో నెక్స్ట్ ఇంకేం జరగదు, ఏదో కోల్పోయాను అన్న ఫీలింగ్ వస్తోంది. నిజానికి లాల్‌సింగ్ చడ్డా తర్వాత ఛాంపియన్స్ మూవీ చేయాల్సి ఉంది. ఇది ఓ అద్భుతమైన కథ. కానీ ఆ సినిమా చేయాలని లేదు. ముందు నాకు విశ్రాంతి కావాలనిపిస్తోంది. నా తల్లితో, పిల్లలతో, కుటుంబంతో కలిసి సంతోషంగా గడపాలనుంది. 35 ఏళ్లుగా సినిమాలు చేస్తూనే ఉన్నా. నిరంతరం పని గురించే ఆలోచించాను. కానీ అది కరెక్ట్ కాదనిపిస్తోంది. నాకు దగ్గరైన మనుషుల గురించి కూడా ఆలోచించాల్సింది. వారితో కలిసి జీవితాన్ని మరో యాంగిల్లో చూసేందుకు ఇదే సరైన సమయం అనిపిస్తోంది. కాబట్టి మరో ఏడాదిన్నరదాకా నటుడిగా కెమెరా ముందుకు వెళ్లే ప్రసక్తే లేదు' అని తేల్చి చెప్పాడు ఆమిర్. మరి ఛాంపియన్స్ సినిమా సంగతి ఏంటంటారా? దానిపై ఆమిర్ స్పందిస్తూ.. 'నిర్మాతగా నేను నా పనులు నిర్వర్తిస్తూనే ఉంటాను. కాబట్టి నటుడిగా కాకపోయినా ఛాంపియన్స్‌కు నేను నిర్మాతగా ఉంటాను. వేరే యాక్టర్‌ను లీడ్ రోల్ చేయమంటాను. అంతా సవ్యంగానే జరుగుతుందని భావిస్తున్నా. ప్రస్తుతానికైతే నేను నా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయాలి' అని చెప్పుకొచ్చాడు. చదవండి: బిగ్‌బాస్: బాలాదిత్య, వాసంతి పారితోషికం ఎంతో తెలుసా? యంగ్ హీరో నాగశౌర్యకు అస్వస్థత -
మాపై అలాంటి ముద్ర వేస్తారు..హీరోలను అలా అనరెందుకు: నటి
బాలీవుడ్ నటి రవీనా టాండన్ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. బాలీవుడ్ లో మోస్ట్ గ్లామరస్ హీరోయిన్స్ లో రవీనా ఒకరు. అందం, అభినయంతో రవీనా బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.90ల్లో స్టార్ హీరోయిన్గా ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. అప్పట్లో ఆమె నటించిన ప్రతి సినిమా హిట్లే. దీంతో ఆమెకు లెక్కలేనంతమంది అభిమానులు ఉండేవారు. ఇక తెలుగులోనూ సత్తా చాటిన రవీనా టాండన్ ఇటీవలె కెజిఎఫ్-2 సినిమాలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ మీడియాతో ముచ్చటించిన ఆమె హీరో, హీరోయిన్ల విషయంలో తేడాలు చూపిస్తుండటంపై మండిపడింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హీరోలు ఒక్కో సినిమాకు రెండు, మూడేళ్ల గ్యాప్ తీసుకుంటారు. కానీ హీరోయిన్స్ కొద్ది రోజులు కనిపించకున్నా…సెకండ్ ఇన్నింగ్స్ అని ముద్ర వేస్తారు. మాధురీ దీక్షిత్‌ను 90ల కాలం నాటి సూపర్ స్టార్ అని మీడియాలో కథనాలు వేస్తారు. మరి అప్పటి నుంచి పని చేస్తున్న సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ల గురించి అలా అనరెందుకు? హీరో, హీరోయిన్ల విషయంలో చూపిస్తున్న ఈ అసమానతను అంతం చేయాలి అంటూ వాపోయింది రవీనా. -
సినీ తారలపై బాబా రాందేవ్ సంచలన వ్యాఖ్యలు
లక్నో: యోగా గురువు బాబా రాందేవ్ బాలీవుడ్ ఇండస్ట్రీపై తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో శనివారం ఏర్పాటు చేసిన ఆర్యవీర్, వీరాంగన సదస్సులో రాందేవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలీవుడ్, డ్రగ్స్ వాడకంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటాడని ఆరోపించారు. ఆమిర్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటారా? లేదా? అనేది తనకు తెలియదన్నారు. షారుక్ ఖాన్ కొడుకు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడి జైలుకు వెళ్లి వచ్చినట్లు పేర్కొన్నారు. ఇక హీరోయిన్ల గురించి ప్రస్తావిస్తూ.. వాళ్ల గురించి దేవుడికి మాత్రమే తెలుసని అన్నారు. యావత్ బాలీవుడ్ ఇండస్ట్రీ డ్రగ్స్ గుప్పిట్లో చిక్కుకుందని ఆరోపించారు. ‘సినిమా పరిశ్రమను డ్రగ్స్ చుట్టుముట్టింది. రాజకీయాల్లో కూడా డ్రగ్స్ అడుగుపెట్టింది. ఎన్నికల సమయంలో మద్యం పంపిణీ జరుగుతోంది. డ్రగ్ అడిక్షన్ నుంచి భారత్‌ను విముక్తి చేసేందుకు మనమంతా కట్టుబడి ఉండాలి. దీని కోసం మేము ఉద్యమం చేస్తాం’ అని వెల్లడించారు. రాందేవ్ చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అకాల మరణానంతరం బీటౌన్ స్టార్స్ డ్రగ్స్ వాడకంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో రాందేవ్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 'Salman Khan भी लेता है Drugs, Actresses का तो भगवान ही मालिक है' बाबा रामदेव का Bollywood Industry पर आरोप मुरादाबाद में दिया भाषण pic.twitter.com/GH1PgKi9zi — News24 (@news24tvchannel) October 15, 2022 -
ఫిట్నెస్ ట్రైయినర్తో స్టార్ హీరో కూతురు ప్రేమాయణం, త్వరలో పెళ్లి!
బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ తండ్రి ఫిట్నెస్ ట్రైనర్ నుపుర్ శిఖారేతో కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిసి పండగలు, స్పెషల్ డేస్‌ను సెలబ్రెట్ చేసుకున్న ఫొటోలను తరచూ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది. అయితే దీనిపై ఎప్పుడూ ఐరా అధికారిక ప్రకటన ఇవ్వలేదు. తాజాగా తమ రిలేషన్‌పై ఐరా అధికారిక ప్రటకన ఇచ్చింది. ఈ సందర్భంగా తాను ఎస్ చెప్పానంటూ ఐరా ఓ క్యూట్ వీడియో షేర్ చేసింది. చదవండి: టీటీలో సినిమాల జాతర.. ఈ ఒక్కరోజే 14 చిత్రాల సందడి ఇందులో నుపుర్ ఐరాకు రింగ్ తొడుగుతూ ప్రపోజ్ చేసినట్లు కనిపించాడు. సైక్లింగ్ పోటీలో భాగంగా నుపుర్ ఇటీవల విదేశాలకు వెళ్లాడు. అతనికి తోడుగా ఐరా కూడా వెళ్లింది. ఇక పోటీలు ముగిసిన వెంటనే ప్రియురాలి వద్దకు వచ్చిన నుపుర్ ఆమెను హత్తుకుని ముద్దాడాడు. అనంతరం మోకాలిపై కూర్చొని ‘ నన్ను పెళ్లి చేసుకుంటావా’ అని ఉంగరం తొడుగుతూ ప్రపోజ్ చేశాడు. ఇక వెంటనే ఐరా మురిసిపోతూ ప్రియుడికి తన చేయి అందించింది. ఇక ఈ వీడియో ఆమె షేర్ చేస్తూ ‘నేను ఎస్ చెప్పాను’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. చదవండి: కొడుకు చంద్రహాస్‌పై ట్రోల్స్.. నటుడు ప్రభాకర్ షాకింగ్ రియాక్షన్ తన పోస్ట్‌పై పలువురు బాలీవుడ్ సినీ సెల్రబెటీలు స్పందిస్తూ ఈ లవ్ బర్డ్స్‌కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదంత చూస్తుంటే త్వరలోనే ఈ ప్రేమ జంట పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతుందని తెలుస్తోంది. కాగా కొన్నేళ్లకు ఆమీర్‌కు నుపుర్ ఫిట్నెస్ ట్రెయినర్‌గా పనిచేస్తున్నాడు. ఈక్రమంలోనే నుపుర్‌తో ఐరాకు పరిచయం ఏర్పడింది. తొలుత స్నేహితులు ఉన్న వీరిద్దరు ప్రేమలో పడ్డారు. 2020 నుంచి వీరిద్దరూ రిలేషన్లో ఉండగా.. తాజాగా తమ బంధాన్ని అధికారికం చేసుకున్నారు ఈ లవ్‌బర్డ్స్. View this post on Instagram A post shared by Ira Khan (@khan.ira) -
ఈ–నగ్గెట్స్ ప్రమోటర్ల నివాసాల్లో సోదాలు
న్యూఢిల్లీ/కోల్‌కతా: మనీ లాండరింగ్ కేసు విచారణలో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు కోల్‌కతాకు చెందిన మొబైల్ గేమింగ్ యాప్ కంపెనీ ప్రమోటర్ల నివాసాల్లో శనివారం సోదాలు నిర్వహించారు. దాదాపు రూ.17 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. బెడ్‌పై పేర్చిన రూ.2000, రూ.500, రూ.200 నోట్ల కట్టల ఫొటోను ఈడీ విడుదల చేసింది. అమీర్ ఖాన్, అతడి కుమారుడు నెజార్ అహ్మద్ ఖాన్ కలిసి ‘ఈ–నగ్గెట్స్ పేరిట మొబైల్ గేమింగ్ యాప్ ప్రారంభించారు. వారితోపాటు మరికొందరు ఈ కంపెనీ ప్రమోటర్లుగా వ్యవహరిస్తున్నారు. వారికి చెందిన దాదాపు 6 నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టామని ఈడీ ఒక ప్రకటనలో వెల్లడించింది. రూ.17 కోట్ల నగదు లభ్యమైందని, నోట్ల కట్టల లెక్కింపు ఇంకా కొనసాగుతోందని పేర్కొంది. ఈ–నగ్గెట్స్ కంపెనీ గేమింగ్ యాప్ ద్వారా ప్రజల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి, వాటిని తిరిగి వెనక్కి తీసుకొనే అవకాశం ఇవ్వకుండా మోసం చేస్తోందంటూ ఫెడరల్ బ్యాంకు అధికారులు కోల్‌కతా కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు కంపెనీతోపాటు ప్రమోటర్లపై కోల్‌కతా పోలీసులు 2021 ఫిబ్రవరిలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించింది. గేమింగ్ యాప్ కంపెనీ ప్రమోటర్ల నివాసాల్లో ఈడీ సోదాలకు, రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత, రాష్ట్ర మంత్రి ఫిర్హాద్ హకీం చెప్పారు. బీజేపీయేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే ఈడీ సొదాలు జరుగుతుండడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇష్టారాజ్యంగా దోచుకుంటున్న వ్యాపారవేత్తలపై ఎందుకు చర్యలు చేపట్టడం లేదని నిలదీశారు. కేంద్ర దర్యాప్తు సంస్థల దాడుల వల్ల బెంగాల్‌కు పెట్టుబడులు రాకుండా పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. -
ఓటీటీలో లాల్‌సింగ్ చడ్డా, ఎప్పటినుంచంటే?
బాలీవుడ్ టైం బాగోలేదో లేదంటే ఇప్పుడు వస్తున్న కథల్లో క్వాలిటీ లేదో గానీ అక్కడ బడా హీరోల సినిమాలు అస్సలు వర్కవుట్ కావడం లేదు. అక్షయ్ కుమార్ 'రక్షా బంధన్', ఆమిర్ ఖాన్ 'లాల్ సింగ్ చడ్డా', రణ్‌బీర్ కపూర్ 'షంషేరా'.. బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పొందాయి. ఇప్పటికే షంషేరా అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం అవుతుండగా రక్షా బంధన్ కూడా త్వరలో జీ5లో ప్రసారం కానుందంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా లాల్‌సింగ్ చడ్డా కూడా ఓటీటీలోకి వచ్చేస్తోందట! ఆగస్టు 11న విడుదలైన ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ గిరీశ్ జోహార్ ఈ విషయాన్ని తెలియజేస్తూ ట్వీట్ చేశాడు. లాల్‌సింగ్ చడ్డా నెట్‌ఫ్లిక్స్‌లో అక్టోబర్ 20 నుంచి స్ట్రీమ్ కానుందని ప్రకటించాడు. నిజానికి ఆమిర్ ఖాన్ ఈ సినిమా రిలీజైన ఆరు నెలల తర్వాతే ఓటీటీలోకి తెస్తామని మొదట ప్రకటించాడు. కానీ సినిమా ఫలితం తారుమారు కావడంతో నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే! As per trade buzz... to minimise losses .. the OTT premiere of #LaalSinghChaddha will be on 20th Oct on #Netflix instead of the post 6months theatrical release, as announced by #AamirKhan earlier ! @AKPPL_Official pic.twitter.com/iyWHg5mlCt — Girish Johar (@girishjohar) September 6, 2022 చదవండి: బిగ్‌బాస్‌కు వెళ్తానంటే ఆపేందుకు ప్రయత్నించారు: చలాకీ చంటి సుష్మిత: ఓ వైపు బ్రేకప్ రూమర్స్.. మరోవైపు మాజీ బాయ్‌ఫ్రెండ్స్‌తో పార్టీలో ఎంజాయ్ -
బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా ‘లాల్‌సింగ్ చడ్డా’.. ఆమిర్ ఖాన్ కీలక నిర్ణయం
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన 'లాల్‌సింగ్ చడ్డా’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. ఈ ఏడాది ఆగస్ట్ 11న విడుదలైన ఈ చిత్రానికి తొలి రోజు నుంచి నెగెటివ్ టాక్ వచ్చింది. దీంతో రెండో రోజు నుంచే థియేటర్స్ అన్ని ఖాలీ అయిపోయాయి. దాదాపు రూ.180 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. ఇప్పటి వరకు రూ.70 కోట్ల కలెక్షన్స్ మాత్రమే రాబట్టి ఆమిర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం మిగిల్చిన నష్టాన్ని పూడ్చడానికి తాజాగా ఆమిర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం తాను తీసుకున్న రూ.50 కోట్ల రెమ్యునరేషన్‌ని తిరిగి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాడట. తోటి నిర్మాతలకు ఇబ్బంది కలిగించొద్దనే ఆమిర్ ఈ నిర్ణయం తీసుకున్నాడట. ఈ నిర్ణయంతో ఆమిర్‌కు మొత్తంగా రూ.100 కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. (చదవండి: నాన్న రోడ్డుపై పరుగెత్తించి కొట్టారు.. నాగబాబు నలిగిపోయాడు: చిరంజీవి) అద్వెత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కరీనా కపూర్, అక్కినేని నాగ చైతన్య కీలక పాత్రలు పోషించారు. వైయకామ్ స్టూడియోస్, పారామౌంట్ పిక్చర్స్, ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆమిర్ ఖాన్, కిరణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంధారే లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. -
Laal Singh Chaddha: సినిమా అట్టర్ ఫ్లాప్.. కలెక్షన్స్‌లో రికార్డు
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన తాజా చిత్రం 'లాల్‌సింగ్ చడ్డా’. ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ ‘ఫారెస్ట్ గంప్’కు హిందీ రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రంపై బాలీవుడ్ భారీ ఆశలు పెట్టుకుంది. వరుసగా డిజాస్టర్లతో సతమతమవుతున్న బాలీవుడ్ బాక్సాఫీస్‌కు ఊపిరి అందిస్తుందని భావించారు. కానీ ఆగస్ట్ 11న విడుదలైన ఈచిత్రం భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఆమిర్ ఖాన్ ఈ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా.. ఆ ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఇండియాలో దాదాపు రూ.60 కోట్లను మాత్రమే వసూలు చేసి ఆమిర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. (చదవండి: తారక్ వల్లే నా పెళ్లి జరిగింది: ప్రముఖ నిర్మాత కూతురు) అయితే విదేశాల్లో మాత్రం ‘లాల్‌సింగ్’ రికార్డు సృష్టించాడు. ఈ ఏడాది విదేశాల్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన హిందీ చిత్రంగా ‘లాల్‌సింగ్ చడ్డా’ నిలిచింది. ఓవర్సీస్లో 7.5 మిలియన్ల డాలర్స్ కలెక్ట్ చేసి గంగూబాయి కతియావాడి (7.47 మిలియన్స్ డాలర్స్), భూల్ భూలయ్య 2(5.88 మిలియన్స్ డాలర్స్) పేరిట ఉన్న రికార్డును చెరిపేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటి వరకు రూ.126 కోట్లను వసూలు చేసింది. అద్వెత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కరీనా కపూర్, అక్కినేని నాగ చైతన్య కీలక పాత్రలు పోషించారు. వైయకామ్ స్టూడియోస్, పారామౌంట్ పిక్చర్స్, ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆమిర్ ఖాన్, కిరణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంధారే లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. -
ఖాన్స్‌కి ఏమైంది... మరీ ఇంత దారుణమా?
ఒకప్పుడు బాలీవుడ్ అంటే ఖాన్స్.. ఖాన్స్ అంటే బాలీవుడ్. కానీ ఇప్పుడు ఖాన్స్ పని అయిపోయింది. వారి నుంచే సినిమాలను ప్రేక్షకులు ఆదరించడం లేదు. నాలుగేళ్ల క్రితం షారుఖ్ ఖాన్ ‘జీరో’లో నటించి బాక్సాఫీస్ దగ్గర పూర్తిగా జీరోగా మారాడు. ఇప్పుడు ఆమిర్ ఖాన్ ‘లాల్‌సింగ్ చడ్దా’లో నటించి తన కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌ను చూశాడు. ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ ‘ఫారెస్ట్ గంప్’కు హిందీ రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రంపై బాలీవుడ్ భారీ ఆశలు పెట్టుకుంది. వరుసగా డిజాస్టర్లతో సతమతమవుతున్న బాలీవుడ్ బాక్సాఫీస్‌కు ఊపిరి అందిస్తుందని భావించారు. తీరా చూస్తే ‘లాల్‌సింగ్ చడ్డా’ అట్టర్ ఫ్లాప్ అయింది. (చదవండి: సల్మాన్‌పై మరోసారి విరుచుకుపడ్డ మాజీ ప్రేయసి) 2000 లో ఆమిర్ నటించిన ‘మేళ’అతని కెరీర్ లోబిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ‘ఇప్పుడు ఆ రికార్డ్ ను లాల్ సింగ్ చడ్డా’ బద్దలు కొట్టాడు అంటోంది బాలీవుడ్. వారం రోజులు థియేటర్ లో ఉన్నా,60 కోట్ల మార్క్ దాటలేకపోయింది. ఇండిపెన్డెన్స్ డే వీకెండ్ కలిసొచ్చింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ మాత్రం వసూళ్లు కూడా వచ్చి ఉండాల్సింది కాదు అంటోంది బాలీవుడ్. ఒకప్పుడు బాలీవుడ్ బ్యాక్ బోన్ గా నిలిచారు ఖాన్స్. కాని ఇప్పుడు ఆ ప్రాభవం లేదు. షారుఖ్ కంప్లీట్ గా బాక్సాఫీస్ రేస్ నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు ఆమిర్ ఆరేళ్లలో రెండు డిజాస్టర్లు కొట్టి ప్రేక్షకుల నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు. ఇక మిగిలింది సల్మాన్ ఖాన్ మాత్రమే. ప్రస్తుతం సల్మాన్ మాత్రమే ఫామ్ కొనసాగిస్తున్నాడు. నెక్ట్స్ ఇయర్ ఈద్ కు టైగర్ 3ని రిలీజ్ చేస్తున్నాడు. ఈ సినిమా పై బాలీవుడ్ చాలా నమ్మకాలే పెట్టుకుంది. అసలు ఈ ఖాన్స్‌కి ఏమైంది.. ఎందుకు ఇలాంటి చిత్రాల్లో నటిస్తున్నారని ఫాన్స్ మదన పడుతున్నారు. ఇప్పటికైనా మంచి సబ్జెక్ట్‌ని ఎంచుకొని తిరిగి ఫామ్‌లోకి రావాలని కోరుకుంటున్నారు. -
కరీనాకు ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ చురక, ఆమె కామెంట్స్‌పై ఘాటు స్పందన
‘బాయ్‌కాట్ లాల్ సింగ్ చడ్డా’ వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఈ విషయంలో ఆమిర్ ఖాన్‌కు మద్ధతు తెలిపేందుకు ముందుకు వస్తున్న హీరోలకు సైతం బాయ్‌కాట్ సెగ తాకుతోంది. అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్లు ఆమిర్‌కు సపోర్ట్ చేయడంతో వారి సినిమాలను కూడా బహిష్కరించాలంటూ నెటిజన్లు ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉంటే లాల్ సింగ్ చడ్డాకు వసూళ్లు పడిపోవడంపై ఇటీవల ఓ ఇంటర్య్వూలో కరీనా ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ‘లాల్ సింగ్ చడ్డా’ మంచి సినిమా అని, ఇలాంటి చిత్రాన్ని ఎందుకు బహిష్కరిస్తున్నారో అర్థం కావడం లేదంది. చదవండి: ఇప్పటికీ నాతో వారు నటించేందుకు సంకోచిస్తున్నారు: నటి ఆవేదన అంతేకాదు మూడేళ్ల పాటు 250 మంది ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారని వాపోయింది కరీనా. అయితే ఆమె వ్యాఖ్యలపై ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి స్పందించాడు. బాలీవుడ్ డాన్లుగా నటులు వ్యవహరించి, హిందూ ఫోబియాతో చిన్న సినిమాలు రిలీజ్ కాకుండా ఆగిపోయినప్పుడు మీరెక్కడికెళ్లారు అని ప్రశ్నించాడు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ‘చిన్న సినిమాలు, మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను బాలీవుడ్ డాన్లుగా పిలవబడే నటులు అడ్డుకున్నప్పుడు, ఆ చిత్రాలకు థియేటర్లకు ఇవ్వకుండా ఆపేసినప్పుడు మీరెందుకు స్పందించలేదు. Why nobody from Bollywood raises voice when the Kings of Bollywood boycott, ban & destroy careers of so many outsider actors, directors, writers? The day common Indians get to know the ARROGANCE, FASCISM & HINDUPHOBIA of the Dons of Bollywood, they’ll drown them in hot coffee. — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) August 13, 2022 దానివల్ల ఎందరో ప్రతిభ కలిగిన నటులు, దర్శకులు, రచయితల జీవితాలు నాశమయ్యాయి కదా! ఆ సినిమాలకు పని చేసింది కూడా 250 మంది పేద ప్రజలే’ అంటూ కౌంటర్ ఇచ్చాడు. అలాగే మరొ ట్వీట్లో ‘బాలీవుడ్ డాన్ల ఆహంకారం, హిందూ ఫోబియా గురించి భారతీయులకు తెలిసినప్పుడు వారిని వేడి కాఫీ ముంచేస్తారు’ అంటూ ఘాటూ వివేక్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా అమీర్ ఖాన్, కరీనా కపూర్లు హీరోహీరోయిన్లుగా నటించిన ‘లాల్‌సింగ్ చడ్డా’ ఆగష్టు 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాలీవుడ్ హీరో నాగా చైతన్య కీ రోల్ పోషించాడు. భారీ అంచనాల మధ్య విడుదలై ఈ చిత్రం అశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. చదవండి: సల్మాన్‌పై మరోసారి విరుచుకుపడ్డ మాజీ ప్రేయసి When Good Content Small films are sabotaged, boycotted by the Dons of Bollywood, when their shows are taken away by Multiplexes, when critics gang up against small films… nobody thinks of 250 poor people who worked hard on that film. #Bollywood — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) August 13, 2022 -
బాలీవుడ్‌కు బాయ్‌కాట్ సెగ, మరో స్టార్ హీరోపై విరుచుకుపాటు
ప్రస్తుతం బాలీవుడ్‌కు బాయ్‌కాట్ సెగ అట్టుకుంది. నిన్న మొన్నటి వరకు మిస్టర్ ఫర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ సినిమాలను బహిష్కరించాలంటూ సోషల్ మీడియాలో విసృత ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. దేశంలో అశాంతి ఉందంటూ గతంలో ఆమిర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలకు గాను నెటిజన్లు, పలు సంఘాలు ఆయనపై మండిపడ్డాయి. దీంతో ఆయన లేటెస్ట్ మూవీ లాల్సింగ్చద్ధాను బాయ్‌కాట్ చేయాలంటూ హ్యాష్ ట్యాగ్‌ను వైరల్ చేస్తున్నారు. చదవండి: సింగర్ రాహుల్ జైన్‌పై అత్యాచారం కేసు దీంతో తనని క్షమించాలని, తన చిత్రం చూడాల్సిందిగా ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి చేశాడు ఆమిర్. అయినప్పటికి లాల్‌సింగ్ చద్ధా చూసేందుకు ఎవరు ఆసక్తి చూపడం లేదు. ఈ క్రమంలో ఆమిర్‌కు మరో స్టార్ హీరో మద్దతు ఇవ్వడంతో ఆయన సినిమాను సైతం బాయ్‌కాట్ చేయాలంటే ప్రచారం చేస్తున్నారు నెటిజన్లు. ఆయన ఎవరో కాదు బాలీవుడ్ ‘గ్రీకువీరుడు’ హృతిక్‌రోషన్. యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న హృతిక్ ఇటీవల ట్విట్టర్ వేదికగా ఆమిర్‌కు సపోర్ట్ చేశాడు. ‘ఇప్పుడే లాల్ సింగ్ చద్ధా చూశా. Just watched LAAL SINGH CHADDA. I felt the HEART of this movie. Pluses and minuses aside, this movie is just magnificent. Don’t miss this gem guys ! Go ! Go now . Watch it. It’s beautiful. Just beautiful. ❤️ — Hrithik Roshan (@iHrithik) August 13, 2022 ఈ సినిమా హృదయాన్ని హత్తుకునేలా ఉంది. ప్లస్‌లు, మైనస్‌లను పక్కన పెడితే ఈ చిత్రం చాలా అద్భుతంగా ఉంది. దీన్ని అస్సలు మిస్ చేయకండి, ఇప్పుడే వెళ్లి సినిమా చూడండి’ అని ట్వీట్ చేశాడు. దీంతో నెటిజన్లు ఆయనపై విరుచుపడుతున్నారు. ద కశ్మీర్ ఫైల్స్ సినిమా చూడాలని అప్పుడేందుకు ట్వీట్ చేయలేదని ప్రశ్నిస్తున్నారు. కశ్మీర్ ఫైల్స్ చిత్రానికి ఎందుకు మద్దతు ఇవ్వలేదంటూ హృతిక్‌పై మండిపడుతున్నారు. అంతేకాదు ఆయన తదుపరి చిత్రం విక్రమ్ వేదను బహిష్కరించాలంటూ హృతిక్‌కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ‘బాయ్కాట్విక్రమ్వేద’ అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. చదవండి: చాలా కష్టాలు పడ్డా.. జీవితం చాలా పాఠాలు నేర్పింది: హీరోయిన్ #TheKashmirFiles support would have been #Secular but #LalSinghChadha is a Gem ? How many such Yum Cee in #Bollywood who lick the boots of Ant! Nat!0n@ls ?? https://t.co/sIZaa2cSPf — JP 🇮🇳 (@JPulasaria) August 13, 2022 Where were you at the time of the Kashmir Files release? Underground?#BoycottLalSinghChaddha #BoycottLaalSinghChaddha #BoycottVikramVedha https://t.co/1Hoxus9S8R — Ronak Patel (@ronakom) August 14, 2022 Did you watch #KashmirFiles ? You and your ex wife are spreading dirt of dirty marital affairs on media stop this non sense 1st our kids are getting wrongly affected u #BollywoodDirt https://t.co/Xq2WoDlETV — MAHENDRA JAIN 🇮🇳 (@mahendra3) August 14, 2022 Gone#BoycottVikramVedha #BoycottVikramVeda U will taste this too in September and that time Aamir Khan will write Guys watch Vikram Vedha It's an amazing movie Bas tum logon ko ab ek dusre ki movie dekh kar Mann behelana hai😂😂 https://t.co/DzVbRG1r4c — RiseOfBurnol🇮🇳 (@RiseofBurnol) August 14, 2022 Kashmir files ke time kaha tha 🧐your heart 🤡 https://t.co/0RcjzIZ0QV — ๑ N⁷๑ ||🇮🇳•••♩♪♬♫ (@THEKOOISH) August 13, 2022 -
మళ్లీ అదే మోసం.. ఆశలన్నీ ‘లైగర్’పైనే
బాలీవుడ్‌కు వరుసగా షాక్స్ తగులుతూనే ఉన్నాయి. అక్కడి హీరోలు వరుస పెట్టి ఉత్తరాది ఆడియెన్స్ కు షాక్స్ ఇస్తూనే ఉన్నారు. యంగ్ హీరోలు సరేసరి కనీసం స్టార్ హీరోలైనా కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ లో నటిస్తారు అంటే ఆమిర్ ఖాన్ లాంటి హీరో కూడా మోసం చేసేసాడు.మొత్తంగా నార్త్ సైడ్ ఫిల్మ్ బిజినెస్ ఇప్పట్లో గాడిన పడే అవకాశాలే కనిపించడం లేదు. (చదవండి: కావాలనే టార్గెట్ చేశారు.. అందుకే ఓపెనింగ్స్ తగ్గాయి: కరీనా కపూర్) కొన్నేళ్లుగా బాలీవుడ్ బాక్సాఫీస్ ను శాసిస్తున్న హీరోలు ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్. ఇండిపెన్డెన్స్ డే వీకెండ్ కావడంతో ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఒకేసారి బాక్సాఫీస్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆగస్ట్ 11న ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చెడ్డా’గా వస్తే, అక్షయ్ ఏమో ‘రక్షా బంధన్’ అంటూ సెంటిమెంట్ మూవీ తీసుకొచ్చాడు. ఇద్దరు స్టార్ హీరో పూర్తిగా పడిపోయిన బాలీవుడ్ బిజినెస్ ను నిలబెడతారని అందరూ అనుకున్నారు. కానీ వీరిద్దరు తీసుకొచ్చిన సినిమాలు ఉత్తరాది వారికి అస్సలు నచ్చలేదు. దాంతో తొలి రోజు వసూళ్లు దారుణంగా వచ్చాయి. ఆమిర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా తొలి రోజు ఇండియా వరకు చూసుకుంటే 12 కోట్లు అట. మొత్తంగా శనివారం వరకు అంటే మూడు రోజుల్లో ఈ చిత్రం రూ. 27.5 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక అక్షయ్ కుమార్ రక్షా బంధన్ తొలి రోజు వసూళ్లు 8 కోట్లు దాటాయట. ఇప్పటి వరకు ఈ సినిమా రూ. 21.60 కోట్లు వసూలు చేసిందట. మొత్తంగా ఇద్దరు స్టార్ హీరోలు కలసి వచ్చినా బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర తొలిరోజు పట్టుమని 20 కోట్లు దాటించలేకపోయారు. ముఖ్యంగా ఆమిర్ ఖాన్ ఈ రేంజ్ లో డిజప్పాయింట్ చేస్తాడని బీటౌన్ అస్సలు ఊహించలేదు. (చదవండి: ‘లాల్‌సింగ్ చడ్డా’ మూవీ రివ్యూ) ఈ సిచ్యూవేషన్ లో బాలీవుడ్ బాక్సాఫీస్ ను ఆదుకునేది ఎవరూ అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ నుంచి వెళ్తున్న మరో పాన్ ఇండియా ఫిల్మ్ ‘లైగర్’ తప్పకుండా హిందీ మార్కెట్ కు కొంత లైఫ్ ఇస్తుందని అక్కడి ఇండస్ట్రీ వర్గాలు ఆశలు పెట్టుకున్నాయి. కరణ్ జోహర్ లాంటి పెద్ద నిర్మాత బ్యానర్ నుంచి మూవీ రిలీజ్ అవుతుండం, విజయ్ దేవరకొండ ప్రమోషన్స్ కు జనం ఎగబడుతుండటం చూస్తుంటే లైగర్ ఓపెనింగ్స్ వేరే లెవల్లో ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అందుకే లాల్ సింగ్ చద్దా, రక్షా బంధన్ నిరాశపరిచినా లైగర్ వస్తున్నాడు కదా అనే కాన్ఫిడెన్స్ బీటౌన్ ఎగ్జిబీటర్స్ లో కనిపిస్తోంది. -
కావాలనే టార్గెట్ చేశారు.. అందుకే ఓపెనింగ్స్ తగ్గాయి: కరీనా కపూర్
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ హీరోగా నటించిన తాజా చిత్రం 'లాల్‌సింగ్ చడ్డా'. కరీనా కపూర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో నాగచైతన్య కీలక పాత్రలో నటించారు. అద్వెత్ చందన్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. తాజాగా ఈ వ్యవహారంపై కరీనా కపూర్ స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో లాల్ సింగ్ చడ్డా ఓపెనింగ్స్‌పై ఆమె మాట్లాడుతూ.. 'కొందరు కావాలనే ఈ సినిమాను టార్గెట్ చేశారని ఆరోపించింది. కేవలం ఒక్కశాతం ప్రేక్షకులే ఇలా చేస్తున్నారు. విడుదలకు ముందే ‘బాయ్‌కాట్ లాల్ సింగ్ చద్దా’ అంటూ దుష్ప్రచారం చేశారు. ఆ వ్యతిరేక ప్రచారం వల్లే ఓపెనింగ్స్ తగ్గాయి. ఈ సినిమాను బహిష్కరిస్తే మంచి సినిమాను దూరం చేసినవారవుతారు. మూడేళ్లు ఈ సినిమా కోసం కష్టపడ్డాం. దయచేసి మా సినిమాను బహిష్కరించకండి' అంటూ కరీనా విఙ్ఞప్తి చేసింది. -
ఈ సినిమాలకు దారుణంగా పడిపోయిన వసూళ్లు.. కారణం ఇదే
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన తాజా చిత్రం 'లాల్‌సింగ్ చద్ధా'. బెబో కరీనా కపూర్, అక్కినేని నాగ చైతన్య కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ ‘ఫారెస్ట్ గంప్’కు హిందీ రీమేక్‌గా తెరకెక్కించారు. ఈ చిత్రానికి అద్వెత్ చందన్ దర్శకత్వం వహించారు. వైయకామ్ స్టూడియోస్, పారామౌంట్ పిక్చర్స్, ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆమిర్ ఖాన్, కిరణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంధారే లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, సాంగ్స్, ట్రైలర్‌తో చిత్రంపై మంచి హైప్ ఏర్పడింది. భారీ అంచనాల మధ్య ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం. అయితే 'లాల్ సింగ్ చద్ధా' విడుదలైన తొలిరోజు నుంచే నెగెటివ్ టాక్‌ను మూటగట్టుకుంది. అనుకన్నంత స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. సినిమా రిలీజ్ రోజైన గురువారం 11. 70 కోట్లను రాబట్టిన ఈ చిత్రం రెండో రోజు శుక్రవారం 7.26 కోట్లకు పడిపోయింది. మొత్తంగా 'లాల్ సింగ్ చద్ధా' తొలి రెండు రోజుల్లో రూ. 18.96 కోట్లను మాత్రమే రాబట్టగలిగింది. అంటే కనీసం రూ. 20 కోట్ల మార్క్‌ను కూడా చేరుకోలేకపోయింది. కాగా సినిమా ప్రమోషన్స్ ప్రారంభం నుంచే 'బాయ్‌కాట్ బాలీవుడ్'లో భాగంగా 'లాల్ సింగ్ చద్ధా'పై సోషల్ మీడియాలో నెగెటివిటీ ఎక్కువగా ప్రచారం. 'బాయ్‌కాట్ లాల్ సింగ్ చద్ధా' అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్ కూడా అయింది. అమీర్ ఖాన్ సినిమా ఇలా తక్కువ వసూళ్లు సాధించడానికి ఈ ట్రెండింగే కారణంగా తెలుస్తోంది. #LaalSinghChaddha falls flat on Day 2... Drop at national chains... Mass pockets face steep fall... 2-day total is alarmingly low for an event film... Extremely crucial to score from Sat-Mon... Thu 11.70 cr, Fri 7.26 cr. Total: ₹ 18.96 cr. #India biz. Note: #HINDI version. pic.twitter.com/9hwygm6Jrm — taran adarsh (@taran_adarsh) August 13, 2022 అలాగే 'బాయ్‌కాట్ బాలీవుడ్' సెగ ప్రభావం ఈ సినిమాతో పాటు మరో స్టార్ హీరో అక్షయ్ కుమార్ చిత్రంపై కూడా పడింది. అన్నాచెళ్లెల్ల అనుబంధంగా తరకెక్కిన 'రక్షా బంధన్' చిత్రం కూడా ఆగస్టు 11నే విడుదలైంది. తొలి రోజైన గురువారం రూ. 8.20 కోట్లను సాధించిన 'రక్షా బంధన్' రెండో రోజు శుక్రవారం రూ. 6.40 కోట్లతో సరిపెట్టుకుంది. మొత్తంగా అమీర్ ఖాన్ చిత్రం కంటే తక్కువగా రూ. 14.60 కోట్ల కలెక్షన్లతో నెమ్మదిగా ముందుకుసాగుతోంది. ఈ రెండు చిత్రాల కలెక్షన్లను బట్టి చూస్తే 'బాయ్‌కాట్ బాలీవుడ్' ప్రభావం భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. #RakshaBandhan declines on Day 2... National chains remain extremely low... Mass belt is driving its biz... 2-day total is underwhelming... Needs to have a miraculous turnaround from Sat-Mon... Thu 8.20 cr, Fri 6.40 cr. Total: ₹ 14.60 cr. #India biz. pic.twitter.com/WaJtvW8SJY — taran adarsh (@taran_adarsh) August 13, 2022 -
ఆళ్ల సినిమాలు చూడొద్దంతే.. ఇప్పుడిదే నడుస్తోంది!
బాలీవుడ్లో బాయ్‌కాట్ ట్రెండ్ నడుస్తోంది. తాజాగా ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన లాల్ సింగ్ చద్దా సినిమాను బాయ్‌కాట్ చేయాలని గత కొద్ది రోజులుగా ట్విటర్లో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ సినిమా ఫ్లాప్ కావడానికి ఇది కూడా ఒక కారణమన్న వాదన అప్పుడే మొదలైంది. ఆమిర్.. ట్రోలింగ్ గతంలో పీకే సినిమాలో ఇతర గ్రహం నుంచి భూమికి వచ్చిన పాత్రలో ఆమిర్ నట్టించారు. కళ్లను పెద్దవిగా చేసి, వెడల్పాటి చెవులతో చిత్రమైన హావభావాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తాజా సినిమాలోనూ ఇలాగే నటించారని కొందరు విమర్శిస్తుంటే.. సిక్కులను చిత్రీకరించిన తీరు బాలేదంటూ ఆ సామాజిక వర్గానికి చెందిన వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమిర్‌ను హిందు వ్యతిరేకిగా పేర్కొంటూ #BoycottLaalSinghChaddha హ్యాష్‌టాగ్‌తో ట్విటర్లో నెటిజనులు ట్రోల్ చేశారు. భారత సైన్యాన్ని అగౌరవపరిచారని మరి కొందరు అలిగారు. తన చిత్రాన్ని బహిష్కరించవద్దని ఆమిర్ ఖాన్ పబ్లిగ్గా కన్నీళ్లు పెట్టుకున్నా నిరసనకారులు శాంతించలేదు. అయితే బాయ్‌కాట్ బాలీవుడ్‌కు కొత్తేమి కాదు. గతంలోనూ, ఇప్పుడు కూడా పలు చిత్రాలు ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్నాయి. గతంలో ఆమిర్‌ఖాన్ దంగల్, దీపికా పదుకోన్ పద్మావత్ సినిమాల విడుదల సమయంలోనూ ఇలాంటి ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. అయితే ఈ రెండు సినిమా ఘన విజయం సాధించడం విశేషం. అక్షయ్‌కు తప్పని తలనొప్పి ఇక లాల్ సింగ్ చద్దాతో పాటే విడుదలైన అక్షయ్ కుమార్ 'రక్షా బంధన్' సినిమా కూడా బహిష్కరణాస్త్రాన్ని ఎదుర్కొంది. ఈ సినిమా రచయిత్రి కనికా ధిల్లాన్ గతంలో హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో #BoycottRakshaBandhanMovie హ్యాష్‌టాగ్‌తో ట్విటర్లో ప్రచారం చేశారు. అయితే వివాదస్పద ట్వీట్లను తొలగించి నిరసనకారులను చల్లబరిచే ప్రయత్నం చేశారు కనికా ధిల్లాన్. సినిమాలు చూడొద్దంటూ ప్రచారం చేయడం సమంజసం కాదని హీరో అక్షయ్ కుమార్ కూడా విన్నవించుకున్నాడు. అయితే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినట్టు తెలుస్తోంది. తాప్సి సినిమా చూడొద్దు అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన దొబారా మూవీని చూడొద్దంటూ సోషల్ మీడియాలో ప్రచారం షురూ అయింది. అనురాగ్, తాప్సి తీరు నచ్చని సంప్రదాయవాదులు ట్విటర్లో వారికి వ్యతిరేకంగా #CancelDobaaraa హ్యాష్‌టాగ్‌తో ట్రోలింగ్ చేస్తున్నారు. ఆగస్టు 19న విడుదలవుతున్న ఈ సినిమాను బాయ్‌కాట్ చేయాలని ట్విటర్ వేదికగా పిలుపునిస్తున్నారు. బాయ్‌కాట్ ప్రచారాన్ని అనురాగ్, తాప్సి చాలా తేలిగ్గా తీసుకున్నారు. (క్లిక్: 'పోకిరి' స్పెషల్ షో.. దిమ్మతిరిగే కలెక్షన్స్ వసూలు) ఒటీటీలనూ వదలడం లేదు అలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన డార్లింగ్స్ సినిమా ఆగస్టు 5న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ సినిమా కూడా బాయ్‌కాట్ ప్రచారాన్ని ఎదుర్కొంది. #BoycottAliaBhatt హ్యాష్‌టాగ్‌తో అలియా భట్‌పై అక్కసు వెళ్లగక్కారు కొంతమంది. పురుషులను కించేపరిచేలా సినిమా తీసిన అలియా భట్ని అందరూ బహిష్కరించాలని పిలుపునిచ్చారు. పురుషులపై గృహ హింస అనేది బాలీవుడ్‌కు నవ్వులాటగా ఉందని ఫైర్ అవుతున్నారు. గౌరీ ఖాన్, గౌరవ్ వర్మతో కలసి అలియా భట్ నిర్మించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ప్రారంభ వారాంతంలోనే 10 మిలియన్లపైగా వాచ్ అవర్స్ నమోదు చేసి దూసుకుపోతోంది. (క్లిక్: ట్విటర్లో తెగ ట్రెండ్ అవుతున్న దిల్‌రాజు.. కారణమిదే!) `బ్రహ్మాస్త్ర`పై నిషేధాస్త్రం రణ్‌బీర్ కపూర్, అలియాభట్ జంటగా నటిస్తున్న `బ్రహ్మాస్త్ర` మూవీ ట్రైలర్ అలా రిలీజైందో లేదో వెంటనే బాయ్కాటర్లు రెడీ అయిపోయారు. #BycottBrahmastra ట్యాగ్‌తో వ్యతిరేక ప్రచారం మొదలెట్టేశారు. హీరో రణబీర్ కపూర్ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించారని ట్విటర్ వేదికగా ఏకీపారేశారు. కాగా, ఈ సినిమాలో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, నాగార్జున కీలక పాత్రల్లో కనిపించనున్నారు. (క్లిక్: ‘సీతారామం’ నేను చేయాల్సింది.. నాగార్జున) -
‘లాల్‌సింగ్ చడ్డా’ మూవీ రివ్యూ
టైటిల్ : లాల్‌సింగ్ చడ్డా నటీనటులు : ఆమిర్ ఖాన్, కరీనా కపూర్, నాగచైతన్య, మోనా సింగ్ తదితరులు నిర్మాణ సంస్థలు: వైయకామ్ స్టూడియోస్, పారామౌంట్ పిక్చర్స్, ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మాతలు:ఆమిర్ ఖాన్, కిరణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంధారే దర్శకత్వం: అద్వెత్ చందన్ సంగీతం : ప్రీతమ్ సినిమాటోగ్రఫీ: సేతు విడుదల తేది:ఆగస్ట్ 11,2022 దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్‌ఖాన్ నటించిన తాజా చిత్రం ‘లాల్‌సింగ్ చడ్డా’. కరీనా కపూర్, అక్కినేని నాగ చైతన్య కీలక పాత్రలు పోషించారు. ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ ‘ఫారెస్ట్ గంప్’కు హిందీ రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రానికి అద్వెత్ చందన్ దర్శకత్వం వహించారు. తెలుగులో ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి సమర్పించడం.. నాగచైతన్య కీలక పాత్ర పోషించడంతో టాలీవుడ్లో కూడా ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో పాటు సినిమాపై అసక్తిని పెంచేశాయి. భారీ అంచనాల మధ్య నేడు(ఆగస్ట్ 11) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘లాల్‌సింగ్ చడ్డా’మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ‘లాల్‌సింగ్ చడ్డా’ కథేంటంటే.. ఈ కథంతా 1975 నుంచి మొదలవుతుంది. లాల్‌సింగ్ చడ్డా(ఆమిర్ ఖాన్)..అంగవైకల్యంతో పుడతాడు. సరిగా నడవలేడు. అతనికి ఐక్యూ(IQ) కూడా తక్కువే. కానీ అతని తల్లి (మోనా సింగ్)మాత్రం కొడుకుని అందరి పిల్లలా పెంచాలనుకుంటుంది. ప్రత్యేకమైన పాఠశాలకు పంపకుండా సాధారణ పిల్లలు చదువుకునే స్కూల్‌కే పంపుతుంది. అక్కడ అందరూ హేళన చేస్తు అతనితో దూరంగా ఉంటే..రూప(కరీనా కపూర్) మాత్రం అతనితో స్నేహం చేస్తుంది. తల్లి చెప్పే మాటలు.. రూప ప్రోత్సాహంతో లాల్ సాధారణ వ్యక్తిలాగే ఉంటాడు. తనకు అంగవైకల్యం ఉన్నదన్న విషయాన్నే మర్చిపోతాడు. ఓ సందర్భంలో రూప చెప్పే మాటలతో పరుగెత్తడం మొదలుపెడతాడు. ఎంతలా అంటే.. ప్రతి రన్నింగ్ రేస్‌లో విజయం సాధించేలా. అలాగే కాలేజీ విద్యను పూర్తి చేసి తన తండ్రి, తాత, ముత్తాతల మాదిరే ఆయన కూడా ఆర్మీలో జాయిన్ అవుతాడు. జవాన్‌గా లాల్ దేశానికి చేసిన సేవ ఏంటి? యుద్దంలో ప్రాణాలు కోల్పోయిన తన స్నేహితుడు బాలు అలియాస్ బాలరాజు(నాగచైతన్య)చివరి కోరిక ఏంటి? ఆ కోరికను లాల్ నెరవేర్చాడా లేదా? చిన్ననాటి స్నేహితురాలు రూప పెద్దయ్యాక పడిన కష్టాలేంటి? ఆపదలో ఉన్న సయమంలో లాల్ ఆమెకు ఎలా తోడుగా నిలిచాడు? తన అమాయకత్వంతో పాకిస్తాన్ ఉగ్రవాది మహ్మద్బాయ్ని ఎలా మంచి వాడిగా మార్చాడు? లాల్ తన జీవిత ప్రయాణంలో నేర్చుకున్న సత్యాలు ఏంటి? అనేదే తెలియాలంటే థియేటర్స్‌లో లాల్‌సింగ్ చడ్డా’సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ ‘ఫారెస్ట్ గంప్’కు హిందీ రీమేకే ‘లాల్‌సింగ్ చడ్డా’. మాతృకకు ఎలాంటి భంగం కలకుండా..భారతీయ నేటివిటికి తగ్గట్టుగా చిన్న చిన్న మార్పులు చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు అద్వెత్ చందన్. అయితే అది తెరపై వర్కౌట్ కాలేదు. స్క్రీన్‌ప్లే, నిడివి సినిమాకు పెద్ద మైనస్. కథంతా ఒకే మూడ్‌లో సింపుల్‌గా సాగుతుంది. 1975 నుంచి 2018 వరకు భారత్‌లో జరిగిన కొన్ని సంఘటలను గుర్తు చేస్తూ కథనాన్ని నడిపించాడు. సినిమా ప్రారంభం నుంచే నెమ్మదిగా సాగుతుంది. లాల్ ఆర్మీలో జాయిన్ అయిన తర్వాత కొంచెం ఆసక్తిగా సాగుతుంది. బాలరాజుతో పరిచయం.. బనియన్, చెడ్డి బిజినెస్ అంటూ ఇద్దరు చెప్పుకునే కబుర్లు కొంచెం కామెడీని పండిస్తాయి. కార్గిల్ వార్ సన్నివేశాలు మినహా మిగతావేవి అంతగా ఆకట్టుకోలేవు. ఎమోషనల్ సీన్‌తో ఇంటర్వెల్ పడుతుంది. ఇక సెకండాఫ్‌లో కూడా కథనం నెమ్మదిగా సాగడం, ఎమోషనల్ సీన్స్గా తేలిపోవడంతో ప్రేక్షకులు బోరింగ్ ఫీలవుతారు. ముఖ్యంగా చివరి 20 నిమిషాలు అయితే చిరాకు తెప్పిస్తాయి. రొటీన్ స్టోరీకి రొటీన్ క్లైమాక్స్ మరింత మైనస్. స్క్రిప్ట్ రైటర్‌గా అతుల్ కులకర్ణి మాతృకకు ఎలాంటి భంగం కలగకుండా మన దేశ చరిత్రని, సంస్కృతిని సీన్స్ లో నింపే ప్రయత్నం చేసి సక్సెస్ అయితే.. దానిని తెరకెక్కించడంలో దర్శకుడిగా అద్వైత్ ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. ఎవరెలా చేశారంటే.. ఏ పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేయడం ఆమిర్‌కు అలవాటు. ఈ చిత్రంలో కూడా ఆమిర్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. లాల్‌సింగ్ చడ్డా పాత్రలో జీవించేశాడు. కథనంతా తన భుజాన వేసుకొని ముందుకు నడిపించాడు. అయితే ఈ చిత్రంలో ఆయన పోషించిన పాత్ర ‘పీకే’సినిమాను గుర్తుచేస్తుంది. రూప పాత్రలో కరీనా కపూర్ ఒదిగిపోయింది. అయితే.. ఆమె పాత్ర పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. మధ్య మధ్యలో ఇలా వచ్చి అలా వెళ్తుంది. ఇక జవాన్ బాలరాజు పాత్రతో నాగచైతన్య ఒదిగిపోయాడు. నటుడిగా మరింత ఇప్రూవ్ అయ్యాడనే చెప్పాలి. ఇక లాల్ తల్లి పాత్రలో మోనాసింగ్ తనదైన నటనతో ఆకట్టుకుంది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. ప్రీతమ్ పాటలు బాగున్నాయి. తనూజ్ టికు నేపథ్య సంగీతం జస్ట్ ఓకే.సత్యజిత్ పాండే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు చాలా పని చెప్పాల్సింది. ముఖ్యంగా సెకండాప్లో కొన్ని సీన్స్‌ని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. మొత్తంగా ‘ఫారెస్ట్ గంప్’ చిత్రాన్ని చూడకుండా, ఆమిర్ నటనని ఇష్టపడేవారికి మాత్రం ఈ చిత్రం కాస్తో కూస్తో నచ్చే అవకాశం ఉంది. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘లాల్‌సింగ్ చడ్డా’ ట్విటర్ రివ్యూ
ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘లాల్‌సింగ్ చడ్డా’. కరీనా కపూర్, అక్కినేని నాగ చైతన్య కీలక పాత్రలు పోషించారు. ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ ‘ఫారెస్ట్ గంప్’కు హిందీ రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రానికి అద్వెత్ చందన్ దర్శకత్వం వహించారు. వైయకామ్ స్టూడియోస్, పారామౌంట్ పిక్చర్స్, ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆమిర్ ఖాన్, కిరణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంధారే లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తుండటంతో టాలీవుడ్లో కూడా ‘లాల్‌సింగ్ చడ్డా’పై క్యూరియాసిటి పెరిగింది. దానికి తోడు ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన లభించడంతో పాటు సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. భారీ అంచనాల మధ్య నేడు(ఆగస్ట్ 11) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల బొమ్మ పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. లాల్‌సింగ్ చడ్డా స్టోరీ ఏంటి? ఎలా ఉంది? లాల్సింగ్గా ఆమిర్ ఏ మేరకు ఆకట్టుకున్నాడు తదితర విషయాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. #LaalSinghChadda.What a Beautiful film. You get sucked in and taken on a wonderful journey.This HAS to be watched in a theatre to experience it. #AamirKhan best performance to date. #KareenaKapoor #MonaSingh top notch.Beautifully directed by #AdvaitChandan.Must watch ! pic.twitter.com/8MOJteQSY7 — Jaaved Jaaferi (@jaavedjaaferi) August 10, 2022 ‘లాల్‌సింగ్ చడ్డా’ బ్యూటీఫుల్ ఫిల్మ్. థియేటర్స్‌లో చూడాల్సిన సినిమా ఇది. ప్రేక్షకులు ఓ అందమైన ప్రయాణంలో మునిగిపోతారు. లాల్సింగ్గా ఆమిర్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. అద్వెత్ చందన్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. #LaalSinghChaddha is all sorts of wonderful! Watched a proper Hindi motion picchar after a long time. Advait Chandan’s craft is commendable, and Atul Kulkarni’s adaptation of #ForrestGump hits all the right notes. Lump in throat, many smiles guaranteed. It’s all heart. ♥️ #LSC pic.twitter.com/N64r3UUYp8 — Aniruddha Guha (@AniGuha) August 10, 2022 చాలా రోజుల తరువాత హిందీలో ఓ మంచి సినిమా చూశామంటూ నెటిజన్స్ చెబుతున్నారు. హృదయాన్ని హత్తుకునేలా లాల్ సింగ్ చడ్డా మూవీ ఉందంటూ ట్వీట్స్ చేస్తున్నారు. ఫస్టాఫ్ ఫ్లాట్‌గా ఉందని, ఇంటర్వెల్ సీన్ కూడా అందరిని ఆకట్టుకుంటుందని చెబుతున్నారు. ఇక సెకండ్ హాఫ్ మొత్తం మంచి ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎమోషనల్ టచ్ తో ఆకట్టు కున్నారంటూ కామెంట్ చేస్తున్నారు. Review #LaalSinghChaddha : BLOCKBUSTER!!! I have no words to express the beauty of this heart touching film. One of the very best films of Aamir after 3 Idiots. The screenplay is significantly enhanced as per taste of Indian audience and it will be loved Rating: 4.5(Must Watch) — Amit Lalwani (@AmitLal98119576) August 10, 2022 all my love and support to aamir khan, kareena kapoor khan & all the cast of #laalsinghchadda, really wish you only the best and hope you will have a very positive answer from the audience ❤🙏 good luck ! pic.twitter.com/iwRWHfxo9Q — Ashh-Loove ♡♡♡ (@AishRanliaLoove) August 10, 2022 Loved #LaalSinghChaddha #KareenaKapoorKhan is brilliant. #aamirKhan outstanding. Advait has made a superb film. Don’t miss this one guys. pic.twitter.com/rdn5aGC0Fm — kunal kohli (@kunalkohli) August 10, 2022 Thinking of watching #LalSinghChadha because Amir's acting is phenomenal — Alec (@alec_lakra) August 10, 2022 I will watch #LalSinghChadha bcz I want to ensure the hate mongers stands defeated .. India had made some of the finest and boldest subjects but wht we see today everyone is scared to pick relevant subjects. — نورالدین🇮🇳 (@MeMumbaikar42) August 10, 2022 -
Laal Singh Chaddha: ‘ బాలరాజు’ నాకు చాలా స్పెషల్: నాగచైతన్య
‘లాల్‌సింగ్ చడ్డా’నటించడానికి డేట్స్ ఖాలీగా ఉన్నాయా అని ఒకరు ఫోన్ కాల్ చేసి అడిగారు. ఆమిర్ ఖాన్ సినిమాలో నేను నటించడమేంటి? అది ఫేక్ కాల్ అని పట్టించుకోలేదు. కానీ తర్వాత ఆమిర్ ఖాన్, డైరెక్టర్ అద్వైత్ చందన్ వీడియో కాల్ చేసి మాట్లాడినప్పుడు ఎగ్జైటింగ్ అనిపించింది. బాలరాజు పాత్ర నచ్చి వెంటనే ఓకే చెప్పాను’అన్నారు యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య. ఆమిర్ ఖాన్ లీడ్ రోల్లో అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’. ఈ చిత్రంలో నాగచైతన్య కీలక పాత్ర చేశారు. ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ ‘ఫారెస్ట్ గంప్’కు హిందీ రీమేక్‌గా వస్తున్న ‘లాల్‌సింగ్ చడ్డా’ ఆగస్ట్11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. తెలుగులో ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్నాడు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా నాగచైతన్య మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► ఈ చిత్రంలో నా పాత్ర పేరు బాలరాజు. దాదాపు 30 నిమిషాల నిడివి ఉన్న బాలరాజు క్యారెక్టర్ నాకు స్పెషల్ గా అనిపించింది. 1948 లో తాతగారు ఈ టైటిల్ పేరుతో నటించిన చిత్రం సూపర్ హిట్ అయ్యిందని. నాకు చాలా హ్యాపీ అనిపించడమే కాక బ్లెస్సింగ్స్ కూడా ఉన్నట్టు అనిపించింది. ► ఆమిర్ ఖాన్ లాంటి వారితో కలసి నటించడం చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను. ఆయనతో నటించడం ద్వారా నేను ఎంతో నేర్చుకొన్నాను. ఆయన ఆన్ సెట్ లో,ఆఫ్ సెట్ లో ఉన్నా కూడా ఒకేలా ఉంటారు. కెమెరా ఆఫ్ చేసినా కూడా ఆయన పాత్ర నుంచి బయటకు రారు అంత డెడికేటెడ్ గా ఉంటారు. కొన్ని సినిమాలు చేసిన తరువాత అందులో చేసిన ఎక్సపీరియన్స్ , మూమెంట్స్ లైఫ్ లాంగ్ మనకు నేర్పిస్తుంటాయి. అలాంటిదే ఈ సినిమా. ► సినిమాలో లాల్ పాత్రలో నటించిన అమీర్ కు ఎన్ని కష్టాలు వచ్చినా బయటికి చూపించకుండా అద్భుతంగా నటించాడు. అమీర్ ఖాన్ గారు చాలా డిసిప్లేన్ పర్ఫెక్షన్ ఉన్నటువంటి వ్యక్తి. తనతో నటించడం వలన తననుంచి చాలా నేర్చుకున్నాను.అమీర్ లాంటి యాక్టర్ పక్కన చేయడం వలన చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను. ► గుంటూరు జిల్లాలోని బోడిపాలెం దగ్గర పుట్టిన బాలరాజు అర్మీ లో జాయిన్ అయిన విధానం ఇందులో చాలా చక్కగా చూపించడం జరుగుతుంది.ఇందులో తెలుగు నేటివిటీ చాలావరకూ కనిపిస్తుంది. ఈ సినిమాను తెలుగు జిల్లాలలో కూడా షూటింగ్ చేయడం జరిగింది. ► ఈ సినిమాని చిరంజీవి గారు పర్సనల్ గా తీసుకొని విడుదల చేయడం చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఇప్పటివరకు ఈ సినిమా చూసిన వారందరూ చాలా బాగుందని రివ్యూస్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చడమే కాకుండా చూసిన ప్రతి ఇండియన్ కూ రిలేట్ అవుతుంది. ► ‘వెంకీమామ’లో నేను ఆర్మీ క్యారెక్టర్ చేసినా దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. ఈ చిత్రంలో కార్గిల్ లో జరిగిన ఒక సీన్ ను తీసుకొని చేయడం జరిగింది.ఇందులో కార్గిల్ వార్ సీక్వెన్స్ ఉంటాయి. హిందీలో ఇది నా ఫస్ట్ డబ్ల్యు మూవీ. అక్కడ కూడా నా మార్కెట్ పెరుగుతుంది కాబట్టి చాలా ఆనందంగా ఉన్నా కూడా పాన్ ఇండియా మూవీ అవ్వడంతో నాకు చాలా నెర్వస్ గా కూడా ఉంది. ► ఇండస్ట్రీ అనేది చాలా క్రియేటివిటీ ఫీల్డ్. టెక్నికల్ గా ఇక్కడికి అక్కడికి తేడా అనేది ఏమీ లేదు. ఒకదానికి ఒకదానికి నేనెప్పుడూ కంపేర్ చేసుకోను. ఒక్కో డైరెక్టర్‌కి ఒక్కొక్క విజనరీ, క్రియేటివిటీ ఉంటుంది. అంతే కానీ వారిని వీరిని కంపెర్ చేసుకోలేను. డైరెక్టర్ అద్వైత్ చందన్ చాలా మంచి డైరెక్టర్ తను నాకు చాలా బాగా గైడ్ చేశాడు. ► నాకు స్పెషల్ క్యారెక్టర్ చేయడం అంటే చాలా ఇష్టం. ఇప్పటివరకు నేను స్పెషల్ క్యారెక్టర్స్ అంటూ ఏమి చేయలేదు. ఇందులోనే మొదటిది. ఇకముందు కూడా ఇలాంటి మంచి క్యారెక్టర్ వస్తే చేస్తాను. -
అమీర్ ఖాన్ నుంచి చాలా నేర్చుకున్నా: నాగ చైతన్య
అమీర్‌ఖాన్ కథానాయకుడిగా నటిం, సొంతంగా నిర్మించిన చిత్రం లాల్ సింగ్ చడ్డా. కరీనాకపూర్ నాయికగా నటింన ఈ త్రం ద్వారా టాలీవుడ్ స్టార్ నటుడు నాగచైతన్య ప్రత్యేక పాత్రలో బాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. కులకర్ణీ కథను అందింన ఈ త్రానికి అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 11వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. కాగా చిత్రాన్ని తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం మధ్యాహ్నం చెన్నైలోని సత్యం థియేటర్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ అమీర్ ఖాన్ తన అభిమాన నటుడన్నారు. లాల్ సింగ్ చద్దా చిత్రాన్ని తమిళనాడులో విడుదల చేయా ల్సిందిగా ఆయనే స్వయంగా వీడియో కాల్ చేసి కోరారని, మరో మాట లేకుండా అందుకు అంగీకరింనట్లు చెప్పారు. తాను సినిమా చూశాననీ అద్భుతంగా ఉందన్నారు. తమిళ నేటివిటీకి తగ్గట్టుగా చిన్న చిన్న సచనలు చేయగా వాటిని అమలు పరచారన్నారు. చిత్రాన్ని సాధ్యమైనంత వరకు అత్యధిక థియేటర్లల్లో విడుదల చేస్తామని అమీర్ ఖాన్‌కు మాట ఇస్తున్నాని అన్నారు. అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. రచయిత కులకర్ణి సుమారు 14 ఏళ్లుగా ఈ చిత్ర కథపై దృష్టి పెట్టారని, తానూ ఏడాదిన్నర పాటు ఈ కథతో ట్రావెల్ చేసినట్లు చెప్పారు. కథ నచ్చడంతో సినిమా చేశామన్నారు. ఉదయనిధి స్టాలిన్ రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ తమ చిత్రాన్ని తమిళనాట విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రం తమిళ ప్రేక్షకులకు నచ్చుతుందనే అభిప్రాయాన్ని అమీర్ ఖాన్ వ్యక్తం చేశారు. నటుడు నాగచైతన్య మాట్లాడుతూ.. తాను చెన్నై కుర్రాడినేనని, 18 ఏళ్లు ఇక్కడే పెరిగానని అన్నారు. చిత్ర ప్రమోషన్లో భాగంగా తొలిసారి చెన్నైకి రావడం సంతోషకరం అన్నారు. లాల్ సింగ్ చడ్డా చిత్రంలో నటించే అవకాశం కల్పించిన అమీర్ ఖాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన నుంచి చాలా నేర్చుకున్నానని అన్నారు. -
మీడియాకు క్షమాపణలు చెప్పిన అమీర్ ఖాన్.. ఎందుకంటే
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమిర్ ఖాన్ నటించిన తాజా చిత్రం లాల్ సింగ్ చడ్డా. ఆగస్టు 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీ అయిపోయింది మూవీ టీం. ఇందులో భాగంగా చెన్నైలో ఓ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. అయితే అనుకోని కారణాలతో ఈ ఈవెంట్ ఆలస్యం కావడంతో తమిళ మీడియాకు అమిర్ ఖాన్ క్షమాపణలు చెప్పారు. లాల్ సింగ్ చడ్డా అందరి హృదయాలను హత్తుకునేలా ఉంటుందని పేర్కొన్నాడు. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్, పారామౌంట్ పిక్చర్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నాగ చైతన్య బాలరాజుగా కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్నారు. -
నిజంగా ఆమిర్ ఖాన్ ఎవరో తెలియదు: బాలీవుడ్ నటుడు
ఆమిర్ ఖాన్.. బాలీవుడ్ ప్రేక్షకులకే కాదు టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ఈ పేరు తెలుసు. అంత పెద్ద స్టార్ హీరో ఈయన. ఆమిర్ నటించిన దంగల్ మూవీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన ఇండియన్ చిత్రాల్లో టాప్ ప్లేస్‌లో ఉంది. ఇక ఎప్పుడూ విలక్షణ పాత్రలు ఎంచుకునే ఈ స్టార్ హీరో ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా మూవీతో థియేటర్లలో అడుగుపెట్టబోతున్నాడు. ఇదిలా ఉంటే అసలు ఆమిర్ ఖాన్ ఎవరో తనకు తెలీదంటున్నాడు బాలీవుడ్ నటుడు అన్ను కపూర్. అతడు నటించిన క్రాష్ కోర్స్ వెబ్ సిరీస్ శుక్రవారం అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. ఈ సందర్భంగా చిత్రప్రమోషన్స్లో పాల్గొన్న అతడికి ఆమిర్ ఖాన్ మూవీ లాల్ సింగ్ చద్దా గురించి అడిగారు. దీనికి కళ్లు చిట్లించుకున్న ఆయన అసలు ఆమిర్ ఖాన్ ఎవరని తిరిగి ప్రశ్నించాడు. అతడెవరో తెలియనప్పుడు, అతడి సినిమాలు తనకెలా తెలుస్తాయన్నాడు. ఆ మాటలతో అక్కడున్నవారు ఒక్కసారిగా షాకయ్యారు. తాను సినిమాలు చూడనని, తనవే కాకుండా ఎవరి మూవీస్ కూడా చూడనని తెలిపాడు. నిజంగానే తనకు ఆమిర్ ఖాన్ ఎవరో తెలియదని, అలాంటప్పుడు అతడి గురించి నేనేం చెప్పగలుగుతానన్నాడు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం బీటౌన్‌లో వైరల్‌గా మారాయి. చదవండి: బిగ్‌బాస్ షోలో పాల్గొనబోయే కంటెస్టెంట్లు వీరే.. ప్రియుడి ఇంట్లో అత్తతో కలిసి పూజ చేసిన జోర్దార్ సుజాత! -
నా మాజీ భార్యలను వారానికోసారి కలుస్తా: ఆమిర్ ఖాన్
వేడి వేడి పొగలు కక్కే కాఫీ అంటే చాలామందికి ఇష్టం. అలాగే వాడివేడి ప్రశ్నలతో సెలబ్రిటీలను ఉక్కిరిబిక్కిరి చేసే కాఫీ విత్ కరణ్ షో అంటే కూడా ఇష్టపడేవారు ఎందరో! అందుకే ఆరు సీజన్లు విజయవంతంగా పూర్తిగా చేసుకుంది కాఫీ విత్ కరణ్. ప్రస్తుతం ఏడో సీజన్ సక్సెస్‌ఫుల్‌గా ఓటీటీ ప్లాట్‌ఫామ్ హాట్‌స్టార్‌లో రన్ అవుతోంది. ఈసారి ఈ షోకి లాల్ సింగ్ చద్దా టీం ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ వచ్చారు. వారికి గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పిన కరణ్.. వారిని నవ్విస్తూనే మరోపక్క సీక్రెట్స్ గుట్టు లాగాడు. ఈ సందర్భంగా ఆమిర్ మాట్లాడుతూ.. 'తన రిలేషన్షిప్లో ప్రేమ, గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవడం ఉన్నాయే తప్ప క్రూరమైన క్షణాలంటూ ఏమీ లేవు. నా మాజీ భార్యలిద్దరి మీద నాకెంతో గౌరవం ఉంది. ఇప్పటికీ మేమంతా ఓ కుటుంబంలా ఉంటాము. మేము ఎంత బిజీగా ఉన్నా వారానికోసారైనా తప్పకుండా అందరం కలుసుకుంటాం. మామధ్య కేరింగ్, ప్రేమాభిమానాలు అలాగే ఉన్నాయి' అని చెప్పుకొచ్చాడు. కాగా ఆమిర్- రీనా 1986 ఏప్రిల్ 18న ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. 16 ఏళ్ల వైవాహిక బంధం తర్వాత వీరిద్దరూ విడిపోయారు. 2002లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత దర్శకనిర్మాత కిరణ్‌రావును ప్రేమించాడు ఆమిర్. 2005లో వీరు పెళ్లి కూడా చేసుకున్నారు. ఈ దంపతులకు ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ఆజాద్ రావు ఖాన్ జన్మించాడు. 2021లో వీరు కూడా విడాకులు తీసుకున్నారు. చదవండి: భర్తకు పాదపూజ చేసిన హీరోయిన్‌పై ట్రోలింగ్, ప్రణీత ఏమందంటే? నటితో అమర్దీప్ నిశ్చితార్థం, వీడియో వైరల్ -
శృంగారంపై ప్రశ్న.. హీరోయిన్ సమాధానం ఏంటంటే?
Koffee With Karan 7: Kareena Kapoor Answer To Karan Johar Question: బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్‌గా సక్సెస్ అయిన షో 'కాఫీ విత్ కరణ్' టాక్ షో. ఇప్పటికీ ఈ షో 6 సీజన్లు పూర్తి చేసుకుని ప్రస్తుతం ఏడో సీజన్‌తో దూసుకుపోతోంది. ఈ సీజన్లో పార్టిస్పేట్ చేసిన సెలబ్రిటీలతో అనేక రహస్యాలను బయటపెడుతున్నాడు ఈ స్టార్ ప్రోడ్యూసర్. ఇటీవలిటీ ఎపిసోడ్లో జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ అన్నదమ్ములతో డేటింగ్ చేయడం, విజయ్ దేవరకొండ కారులో శృంగారం చేయడం వంటి విషయాలతోపాటు సమంత, అక్షయ్ కుమార్ వ్యాఖ్యలు ఆసక్తిరేపాయి. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో ఐదో ఎపిసోడ్ ప్రొమోను బయటకు వదిలారు. ఈ ఎపిసోడ్లో 'లాల్ సింగ్ చద్దా' హీరోహీరోయిన్లు అమీర్ ఖాన్, కరీనా కపూర్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా 'పిల్లలు పుట్టాక సంతృప్తికర లైంగిక జీవితం అనేది నిజమా? కల్పితమా?' అని కరణ్ జోహర్ అడిగిన ప్రశ్నకు 'మీకు తెలియదా?' అని కరీనా కపూర్ ధీటుగా సమాధానమిచ్చింది. దీంతో 'మా అమ్మ ఈ షో చూస్తారు. ఇలా నా లైంగిక జీవితం గురించి మాట్లాడటం బాగుండదేమో?' అని కరణ్ చెప్పగా వెంటనే 'మీరు ఇతరుల లైంగిక జీవితం గురించి మాట్లాడటాన్ని మాత్రం మీ అమ్మగారు పట్టించుకోవడం లేదు కదా' అని అమీర్ అనడంతో షోలో నవ్వులు కురిశాయి. చదవండి: హీరోయిన్ మేనకోడలు, కాంగ్రెస్ నాయకుడి కుమార్తె మృతి.. హీరోయిన్‌కు ముద్దు పెట్టిన హీరో.. కంట్రోల్ చేసుకోవాలని ట్వీట్ కాగా అమీర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'లాల్ సింగ్ చద్దా'లో నాగ చైతన్య కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. హాలీవుడ్ సూపర్ హిట్ అయిన 'ఫారెస్ట్ గంప్'కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. చదవండి: నాగార్జునతో 'విక్రమ్' లాంటి సినిమా చేయాలని ఉంది: డైరెక్టర్ బికినీ దుస్తుల్లో వేదిక రచ్చ.. సినిమా అవకాశాల కోసమేనా? -
నా సినిమాను బాయ్‌కాట్ చేయొద్దు: అమీర్ ఖాన్
Aamir Khan Reacts To Boycott Laal Singh Chaddha Twitter Trend: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమిర్ ఖాన్, కరీనా కపూర్ మరోసారి జోడిగా నటించిన చిత్రం 'లాల్‌సింగ్ చద్దా'. హాలీవుడ్లో సూపర్ హిట్టయిన 'ఫారెస్ట్ గంప్' మూవీకి రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాకు అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. టాలీవుడ్ గుడ్ బాయ్ నాగ చైతన్య కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు ఇటీవల బాయ్‌కాట్ సెగ తగిలింది. 'లాల్ సింగ్ చద్దా' సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేశారు. తాజాగా ఈ బాయ్‌కాట్ నిరసనపై అమీర్ ఖాన్ స్పందించాడు. తన చిత్రాన్ని ఎవరూ బహిష్కరించవద్దని కోరాడు. ''నాపై, నా సినిమాకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతున్నందుకు చాలా బాధగా ఉంది. నాకు భారతదేశం అంటే ఇష్టం లేదని కొంతమంది మనసుల్లో చాలా గట్టిగా నాటుకుపోయింది. అందుకు నాకు చాలా విచారంగా ఉంది. నేను నా దేశాన్ని గౌరవించనని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్లకు నేను చెప్పాల్సింది ఒక్కటే.. మీరు ఎంతో దృఢంగా నమ్ముతున్న ఈ విషయంలో ఎలాంటి వాస్తవం లేదు. నా గురించి అలాంటి ప్రచారాలు జరగడం చాలా దురదృష్టకరం. దయచేసి నా సినిమా చూడండి. బహిష్కరించవద్దు'' అని అమీర్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశాడు. Don't feel safe here then why release movie here? Go to your safe place as we know where you're heart lies#BoycottLaalSinghChaddha pic.twitter.com/ezhxuttiEp — hindu_unnity (@hindu_unitty) August 1, 2022 Would you support ?#BoycottbollywoodForever#BoycottLaalSinghChaddha pic.twitter.com/Y4plcIiSaZ — Jaydip Dhameliya (@Jaydip_2001) July 30, 2022 #BoycottLaalSinghChaddha Who do you want on screen Choose please #BoycottbollywoodForever pic.twitter.com/bx49oBZ03s — सदैव देश प्रथम (@afighteroftruth) July 30, 2022 Internet never forgets. #BoycottLaalSinghChaddha pic.twitter.com/6CP35cgWP4 — Punit Doshi (@doshipunit) July 22, 2022 Support only those who support you.#JusticeForKanhaiyaLal#BoycottLaalSinghChaddha pic.twitter.com/jKzR8M1AgG — Kreately.in (@KreatelyMedia) July 1, 2022 #BoycottLaalSinghChaddha What your opinion about movie: Amir lal singh chaadi movie pic.twitter.com/mgT9aU2RjU — vaibhav pandey (@vaibhav06457792) July 30, 2022 -
ఆసక్తికరంగా ‘లాల్‌సింగ్ చడ్డా’ థీమ్ పోస్టర్
ఆమిర్ ఖాన్ హీరోగా అద్వైత్ చందన్ దర్శకత్వంలో రూపొందిన హిందీ చిత్రం ‘లాల్‌సింగ్ చడ్డా’. కరీనా కపూర్, నాగచైతన్య కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు ఆమిర్ ఖాన్ ఓ నిర్మాత. తెలుగులో ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్నాడు.ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ ‘ఫారెస్ట్ గంప్’కు హిందీ రీమేక్‌గా ఈ ‘లాల్‌సింగ్ చడ్డా’రూపొందింది . ఇందులో టాలీవుడ్ యువ హీరో నాగ చైతన్య బాలరాజు గా కీలక పాత్రలో అమీర్ ఖాన్ తో కలిసి సైనికుడిగా కనిపిస్తున్నారు. (చదవండి: తన ఫస్ట్ లవ్ స్టోరిని బయటపెట్టిన మెగాస్టార్ చిరంజీవి..) ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి థిమ్ పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్.మనం కథలోనా, కథే మనలోనా, ఏంటో ఈ విచిత్రం అనే పదాలుతో తయారైనా ఈ పోస్టర్ ప్రస్తుతం ప్రేక్షక వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. -
తన ఫస్ట్ లవ్ స్టోరిని బయటపెట్టిన మెగాస్టార్ చిరంజీవి..
Chiranjeevi Says He Fell In Love At 7th Standard: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమిర్ ఖాన్, కరీనా కపూర్ జోడిగా నటించిన చిత్రం 'లాల్‌సింగ్ చద్దా'. సూపర్ హిట్టయిన హాలీవుడ్ మూవీ 'ఫారెస్ట్ గంప్'కు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ గుడ్ బాయ్ నాగ చైతన్య కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ పాపులర్ డైరెక్టర్ అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 11న ప్రేక్షకులను పలకరించనుంది. అలాగే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్న ఈ చిత్రం తెలుగు ట్రైలర్ ఇటీవల విడుదల కాగా మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. మూవీ విడుదల తేది దగ్గరపడనుండటంతో సినిమా ప్రమోషన్స్‌లో వేగం పెంచింది చిత్రబృందం. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిరంజీవి, అమీర్ ఖాన్, నాగ చైతన్యలను టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇంటర్వ్యూ చేశారు. త్వరలో టెలీకాస్ట్ కానున్న ఈ ఇంటర్వ్యూ ప్రొమోను విడుదల చేశారు. ఈ ప్రొమోలో ఎన్నో ఆసక్తికర విషయాలను, నవ్వులను పంచుకున్నారు. 'లాల్ సింగ్ చద్దాలో అమీర్ ఖాన్ ఒక చిన్న పిల్లాడిలా, కాలేజ్ స్టూడంట్లా, ఆర్మీ ఆఫీసర్లా కనిపిస్తారు. ఈ టాన్స్ఫర్మేషన్ ఎలా జరిగింది' అని నాగార్జున ప్రశ్నించారు. దానికి వీఎఫ్ఎక్స్ వాళ్లు అంతా చేశారని అమీర్ ఖాన్ చెప్పగా.. 'ఈ మాటలు ఎడిట్ చేయండి' అని చిరంజీవి చెప్పడం సరదాగా ఉంది. చదవండి: ప్రియుడితో బర్త్‌డే వేడుకలు!.. ఫొటోలతో దొరికిపోయిన హీరోయిన్ ఈ క్రమంలోనే 'ఈ సినిమాలో పదేళ్ల వయసులోనే హీరో ప్రేమలో పడతాడు' అని నాగార్జున అన్న వెంటనే.. 'మీరు తొలిసారి ఎప్పుడు ప్రేమలో పడ్డారు?' అని చిరుని అమీర్ ఖాన్ అడుగుతారు. అప్పుడు చిరంజీవి 'ఏడో తరగతిలో ఉన్నప్పుడు ప్రేమలో పడ్డాను. ఒక అమ్మాయి సైకిల్ తొక్కడం అంటే మా మొగల్తూరులో చాలా ఆశ్చర్యంగా ఉండేది. అలాంటిది ఆ అమ్మాయి పట్టుకుంటే నేను సైకిల్ తొక్కేవాడిని. అప్పుడు సైకిల్ తొక్కడంపై కాన్సంట్రేషన్ పక్కన పెట్టి ఆమెను చూసేవాన్ని. అప్పుడు ఆమె ముందు చూడు అంటూ నా ముఖాన్ని ముందుకు తిప్పేది' అని తెలిపారు. చదవండి: కాజోల్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం.. అజయ్ దేవగణ్ స్పెషల్ పోస్ట్ అలాగే చిరంజీవితో సినిమా చేయాలని ఉందని అమీర్ ఖాన్ తెలిపారు. మెగాస్టార్‌తో డైరెక్షన్, లేదా ప్రొడక్షన్లో సినిమా చేస్తానని అమీర్ అన్నారు. అప్పుడు చిరంజీవి 'టేక్ వన్ ఓకే కాదు కదా..' అని అనండతో అమీర్ నవ్వేశారు. తర్వాత 'ప్రొడక్షన్ ఓకే. డైరెక్షన్ మాత్రం ఒప్పుకోవద్దు' అని నాగార్జున సలహా ఇచ్చారు. ఈ క్రమంలోనే అమీర్ ఖాన్ చిత్రాల్లో ఏదైనా రీమేక్ చేయాలంటే ఏ సినిమా తీస్తారు అని చిరంజీవిని అడిగిన ప్రశ్నకు 'ఏ మూవీ తీయను' అని సమాధానమిచ్చారు. ఇలా ఆద్యంతం నవ్వులతో, ఆసక్తిగా ఈ ప్రొమో సాగింది. మరీ మరిన్ని ఆసక్తికర విషయాలేంటో తెలుసుకోవాలంటే పూర్తి ఇంటర్వ్యూ టెలీకాస్ట్ అయ్యేవరకు వేచి చూడాల్సిందే. -
లాల్ సింగ్ చద్దా: నాగ చైతన్య స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన మూవీ టీం
ఆమిర్ ఖాన్ లీడ్ రోల్లో అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’. ఆగస్ట్ 11న ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రంలో అక్కినేని నాగచైతన్య బాలరాజుగా కనిపించనున్నాడు. ఇటీవల చైకి సంబంధించిన లుక్ చిత్ర బృందం విడుదల చేసింది. ఈ మూవీతోనే నాగ చైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. దీంతో చై పాత్రపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. కాగా అందరి అంచనాలకు తగ్గట్టుగానే ‘లాల్ సింగ్ చద్దా’లో చై పాత్ర ఉండబోతుందని ఇటీవల చిత్ర బృందం వదిలిన స్పెషల్ వీడియో చూస్తుంటే అర్థమవుతుంది. చదవండి: వారి కుక్కలకు కూడా స్పెషల్ రూం ఇస్తారు: జయసుధ షాకింగ్ కామెంట్స్ ఈ మూవీలో తన పాత్ర కోసం చై ఎలా మేకోవర్ అయ్యాడు, షూటింగ్ సెట్లో ఎంతగా కష్టపడ్డాడో చూపిస్తూ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఇక ఈ వీడియోలో ఆమిర్ ఖాన్, డైరెక్టర్, ఇతర మూవీ సిబ్బంది చైని పొగడ్తలతో ముంచేస్తారు. ఈ వీడియో ప్రారంభంలో నాగ చైతన్య మాట్లాడుతూ.. ఈ కథ నా దగ్గరికి వచ్చినప్పుడ నా పాత్ర పేరు బాల అని చెప్పారు. ఏపీలోని బోడిపాలెం నుంచి ఆర్మీలో చేరేందుకు వచ్చిన యువకుడిగా కనిపిస్తాను. చాలా మంది పేర్లకు ముందు వారి ఇంటిపేరుగా ఊరి పేర్లు కూడా జత చేసి ఉంటాయి. అలా నా పేరు బాలరాజు బోడిపాలెం అని ఇంటిపేరు పెట్టాం. ఈ పేరును ఆమిర్ సర్‌తో సహా చిత్ర బృందం మొత్తం ఫైనల చేసింది. ఇదే పేరుతో తాతాగారి సినిమా పేరు బాలారాజు ఉండటం విశేషం’ అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే మూవీ షూటింగ్ అయిపోయిందని డైరెక్టర్ చెప్పడంతో చాలా బాధపడ్డాను. షూటింగ్ జరిగినన్ని రోజులు నన్ను నేను మర్చిపోయా. కొత్త ప్రపంచాన్ని చూశాను. ప్రతి క్షణాన్ని ఆస్వాదించాం’ అని ఆనందం వ్యక్తం చేశాడు. నాగ చైతన్యతో కలిసి పనిచేయడంపై ఆమిర్ మాట్లాడుతూ.. ‘చైతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. చదవండి: నోట్లో సిగరెట్, చెవికి పోగు.. అల్లు అర్జున్ న్యూ లుక్ వైరల్ ఎప్పుడూ యూనిట్‌తో కలిసి పని చేస్తాడు. ఎప్పుడైన, ఎలాంటి పరిస్థితులోనైనా, ఏ షాట్‌లోనైనా నటించడానికి సిద్ధంగా ఉంటాడు’ అంటూ ప్రశంసించాడు. డైరెక్టర్ అద్వైత్ చందన్ మాట్లాడుతూ.. ‘చై చాలా మంచి నటుడు. తన డైలాగ్ డెలివరి అద్భుతం. కొన్నిసార్లు హిందీ నటులు కూడా ఇబ్బంది డైలాగ్‌ను అతడు సింగిల్ షాట్లో చెప్పి ఆశ్చర్యపరుస్తాడు. చై చాలా హంబుల్ పర్సన్’ అని అన్నాడు. ఇక మిగతా క్రూడ్‌లో మాట్లాడుతూ.. నాగ చైతన్య లాంటి నటుడుతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందని, చాలా మంచి వ్యక్తి అంటూ కొనియాడారు. ఎప్పడు విసుక్కొడని, చాలా సహనంతో ఉంటాడన్నారు. -
‘గాడ్ ఫాదర్’లో నన్ను కాదని సల్మాన్‌ను ఎందుకు తీసుకున్నారు’ చిరును ప్రశ్నించిన ఆమిర్
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ జోడిగా నటించిన చిత్రం 'లాల్‌సింగ్ చద్దా'. హాలీవుడ్ మూవీ 'ఫారెస్ట్ గంప్'కు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ గుడ్ బాయ్ నాగ చైతన్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది. అలాగే ఈ చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్నారు. ఈ మూవీ తెలుగు ట్రైలర్‌ను ఆదివారం చిరంజీవి లాంచ్ చేశారు. చదవండి: కదలలేని స్థితిలో కైకాల, బెడ్‌పైనే కేక్ కట్ చేయించిన చిరు.. ఫొటోలు వైరల్ ఈ సందర్భంగా తెలుగు డైరెక్టర్లపై చిరంజీవి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఇదిలా ఉంటే ‘గాడ్ ఫాదర్’ మూవీలో తనని కాకుండా సల్మాన్ ఖాన్‌ను తీసుకోవడంపై చిరును ప్రశ్నించిన విషయాన్ని ఆమిర్ ఈ సందర్భందగా గుర్తు చేసుకున్నాడు. అయితే గతంలో చిరంజీవి తనని తెలుగు సినిమాల్లో నటించాలని ఉందా? అడిగినట్లు చెప్పారని, అయితే దానికి తాను ‘మీ సినిమాలో నటించాలని ఉంది’ అని చెప్పడంతో తప్పకుండా అవకాశం ఇస్తానని చిరంజీవి చెప్పారన్నారు. చదవండి: ‘కత్రినా నా భార్య’ అంటూ వీడియోలు, ఫొటోలు.. నిందితుడి అరెస్ట్ కానీ ‘గాఢ్ ఫాదర్’ చిత్రంలో సల్మాన్ ఖాన్‌ను తీసుకున్నామని చిరంజీవి తనకు తర్వాత ఫోన్ చేసి చెప్పగా.. దానికి తాను ‘నన్ను కాకుండా సల్మాన్‌ను ఎందుకు తీసుకున్నారు’ అని అడిగినట్టు చెప్పారు. అందుకు చిరంజీవి... ఇది హృదయం, బుద్ధిబలానికి సంబంధించిన పాత్ర కాదని, కండబలానికి ప్రాముఖ్యత ఉన్న పాత్ర కావడంతో సల్మాన్‌ను ఎంపిక చేసుకున్నామని చిరు వివరించారని ఆమిర్ చెప్పుకొచ్చారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
ముందే స్క్రిప్ట్ ఇస్తే నటులు ఇంకా బాగా చేస్తారు: చిరంజీవి
-
టాలీవుడ్ డైరెక్టర్లకు చిరంజీవి చురకలు..
Chiranjeevi Shocking Comments On Tollywood Directors: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ జోడిగా నటించిన చిత్రం 'లాల్‌సింగ్ చద్దా'. హాలీవుడ్ మూవీ 'ఫారెస్ట్ గంప్'కు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ గుడ్ బాయ్ నాగ చైతన్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది. అలాగే ఈ చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్నారు. తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ లాంచ్ ఆదివారం (జులై 24) గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్లో ట్రైలర్ లాంచ్ చేసిన చిరంజీవి టాలీవుడ్ దర్శకులను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో అమీర్ ఖాన్ నటన గురించి ఎంతో గొప్పగా చెప్పారు. అమీర్‌లా తమకు చేయాలని ఉన్నా పలు పరిధుల వల్ల తాము చేయలేకపోతున్నామని చిరు చెప్పిన విషయం తెలిసిందే. అలాంటి పరిధుల గురించి ఈ కార్యక్రమంలో చిరంజీవి తెలిపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పలువురు టాలీవుడ్ డైరెక్టర్లకు చురకలు అంటించారు. ''కొందరు డైరెక్టర్లు షూటింగ్ స్పాట్లో అప్పటికప్పుడు డైలాగ్‌లు ఇస్తున్నారు. ఇది నటులను చాలా ఇబ్బంది పెడుతోంది. నాకు కూడా చాలా సార్లు ఇలాంటి అనుభవం ఎదురైంది. స్క్రిప్ట్ విషయంలో డైరెక్టర్లు మరింత శ్రమించాలి. స్క్రిప్ట్ గురించి మిగతా టెక్నిషియన్స్‌కు ముందుగానే తెలిస్తే వారు పనిచేసే విధానం వేరు. దానికి వచ్చే ఫలితం వేరేలా ఉంటుంది. ఆ ఫలితం సినిమాపై చూపిస్తుంది. చదవండి: చిరంజీవికి పానీపూరి తినిపించిన అమీర్ ఖాన్.. అప్పుడెందుకు గుర్తుకు రాలేదు.. చిరుపై అమీర్ ఖాన్ వ్యాఖ్యలు ఏమైపోయిందంటే.. సినిమాలో ప్రధాన హీరోకు సీన్స్ తెలుసేమో గానీ, అప్పుడే వచ్చిన కమెడియన్స్‌కు గానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకు మాత్రం తెలియదు. అప్పటికప్పుడు ఆ డైలాగ్‌లు చెప్పి చేయించడంతో ఇన్వాల్వ్మెంట్ అంతంతమాత్రంగానే ఉంటుంది. అందుకే వర్క్‌షాప్‌లు నిర్వహించాలి. ముందుగా డైలాగ్‌లు ఇవి అని చెప్పాలి. ఆ డైలాగ్‌లు ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయాలి. గదిలో రౌండ్టేబుల్పై కూర్చొని ఆ సీన్లు అనుకుని వాళ్లు గనుక చేయగలిగితే తర్వాత సెట్స్‌కు వెళ్లాక నా డైలాగ్ ఏంటని.. అది ఎలా గుర్తుంచుకోవాలని.. డైలాగ్ గుర్తుపెట్టుకోవండపై మనసు పెట్టక్కర్లేదు. అప్పుడు కేవలం నటనపైనే మనసు పెడితే చాలు. అది రావాలి. ఇదే వారు చేసేది (అమీర్ ఖాన్ గురించి)'' అని చిరంజీవి పేర్కొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: తన సినిమానే చూస్తూ నిద్రపోయిన స్టార్ హీరోయిన్.. అతని ప్రేయసి గురించి చెప్పేసిన చిరంజీవి.. -
‘లాల్‌సింగ్ చడ్డా’ ప్రెస్‌మీట్ (ఫోటోలు)
-
అప్పుడెందుకు గుర్తుకు రాలేదు.. చిరుపై అమీర్ ఖాన్ వ్యాఖ్యలు
‘‘అమిర్ ఖాన్ చేసే ప్రయోగాత్మక పాత్రలను నేను చేయలేను. నా సినిమాలు జనరంజకంగా, జనామోదంగా ఉండాలని ప్రయత్నిస్తుంటాను. నా ప్రమేయం లేకుండా కొన్ని సినిమాలు జరిగిపోతుంటాయి. ఆమిర్ ఖాన్ ‘లాల్‌సింగ్ చడ్డా’ను నేను సమర్పిస్తున్నందుకు గర్వపడుతున్నాను. అలాంటి కంటెంట్, ఎమోషన్ సినిమాలో ఉంది. కన్నీళ్లు పెట్టుకోం కానీ సినిమా చూస్తున్నప్పుడు చాలా చోట్ల కంటతడి, గుండె తడి ఉంటూనే ఉంటుంది’’ అని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. అమిర్ ఖాన్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘లాల్‌సింగ్ చడ్డా’. ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ ‘ఫారెస్ట్ గంప్’కు హిందీ రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రానికి అద్వైత్ చందన్ దర్శకుడు. కరీనా కపూర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో నాగచైతన్య కీలక పాత్ర చేశారు. ఈ సినిమా ఆగస్టు 11న రిలీజ్ కానుంది. తెలుగులో చిరంజీవి సమర్పిస్తున్నారు. ఆదివారం (జులై 24) హైదరాబాద్‌లో జరిగిన వేడుకలో ‘లాల్‌సింగ్ చడ్డా’ తెలుగు ట్రైలర్‌ను చిరంజీవి, ఆమిర్ ఖాన్ రిలీజ్ చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘2019లో జపాన్ ఎయిర్‌పోర్ట్‌లో నేను, అమిర్ కలిశాం. అప్పుడు ‘ఫారెస్ట్ గంప్’ను రీమేక్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ రీమేక్ ఆమిర్‌కు అవసరమా? అనే ఫీలింగ్ వచ్చింది కానీ ఆయన ప్యాషన్ చూసి కరెక్ట్ అనిపించింది. మనకు టామ్ హాంక్స్ (‘ఫారెస్ట్‌గంప్’లో హీరోగా నటించిన హాలీవుడ్ నటుడు) అంటే ఎవరో కాదు.. ఆమిర్ ఖాన్నే. ‘3 ఇడియట్స్’, ‘లగాన్’, ‘పీకే’ ‘దంగల్’.. ఇలా డిఫరెంట్ చిత్రాలు చేశారు ఆమిర్. ఇంత తపన ఉన్న నటుడు ఇండియాలో ఒక్క ఆమిర్ ఖానే ఉన్నారు. సినిమా మేకింగ్‌లో కర్త, కర్మ తానే అవుతారు. ఇలాంటి యూనిక్ స్టైల్ ఇండియాలో ఏ యాక్టర్లోనూ లేదు. మేం కూడా చేయాలనుకుంటాము. కానీ పరిమితులు ఉంటాయి. సో.. ఆయనలా మేం చేయలేం. అందుకే ఆయన అడగ్గానే ఆబ్లిగేషన్‌తో కాదు.. ఎంతో హానర్‌గా ‘లాల్‌సింగ్ చడ్డా’ని సమర్పించడానికి ఒప్పుకున్నాను’’ అన్నారు. అమిర్ ఖాన్ మాట్లాడుతూ.. ‘‘లాల్‌సింగ్ చడ్డా’ చూసి, నచ్చితే సమర్పించమని చిరంజీవిగారిని కోరాను. ఇప్పటివరకు ఏ సినిమాకూ ఆయన సమర్పకులుగా లేరని నాకు తెలుసు. మా సినిమాకు సమర్పకులుగా ఉన్నందుకు ఆయనకు ధన్యవాదాలు. నాగచైతన్య క్రమశిక్షణ చూసి, తనను బాగా పెంచారని చైతన్య అమ్మ లక్ష్మీగారికి ఫోన్ చేసి, మాట్లాడాను. ఈ సినిమాను మా అమ్మగారు చూశారు. ‘ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదు’ అన్నారామె. నా కూతురు ఐరా ఎమోషనల్ పర్సన్. ఈ సినిమాను తను ఇంకా చూడలేదు ’’ అని తెలిపారు. నాగచైతన్య మాట్లాడుతూ .. ‘‘ఈ చిత్రంలో గుంటూరుకు చెందిన బాలరాజు పాత్ర చేశాను. ఈ సినిమా కోసం వర్క్‌షాప్స్ చేశాం. ఇలా చేయడం నాకు కొత్త. ఈ సినిమాలో నా పాత్ర దాదాపు 30 నిమిషాలు ఉంటుంది. కొన్ని సినిమాల్లో పాత్ర ఎంతసేపు ఉందని కాదు.. కొన్ని మూమెంట్స్‌ను, ఎక్స్‌పీరియన్స్‌ను నేర్పిస్తాయి. యాక్టర్‌గా ఈ సినిమా నాకో ఇన్వెస్ట్మెంట్. ఆర్టిస్టుగా హెల్ప్ అవుతుందని ఈ సినిమా చేశాను’’ అని పేర్కొన్నారు. చిరంజీవి: ఒకప్పుడు భారతీయ సినిమా అంటే హిందీ సినిమా అన్నట్లుగా చూపించారు. తెలుగు యాక్టర్‌గా కాదు... నేను ఇండియన్ యాక్టర్ అనిపించుకోవాలని హిందీలో ‘ప్రతిబంధ్, ఆజ్ కా గూండా రాజ్, జెంటిల్మెన్’ సినిమాలు చేశాను. కమల్‌హాసన్ ‘ఏక్ దూజే కే లియే’ వంటివి చేశారు. అయినా సౌత్ యాక్టర్స్‌గానే చూశారు. విశ్వనాథ్‌గారి ‘శంకరాభరణం’ నుంచి తెలుగు సినిమాకు గుర్తింపు వచ్చినా.. తర్వాత అలాంటి గుర్తుంపు వచ్చింది లేదు. రాజమౌళి ఆ హద్దులు చెరిపేశారు. సౌత్, నార్త్ అనే తేడాలు పోయాయి. ఏ భాషలో తీసినా సరే అది ఇండియన్ సినిమాయే. ఇలాంటి వాతావరణం రావాలని తపన పడ్డాను. అమిర్ ఖాన్: చిరంజీవిగారు బాధపడ్డ ఆ సందర్భం గురించి నేను చదివాను. ఓ హిందీ యాక్టర్ అయిన నేను ఇప్పుడు ఆయన హెల్ప్ కోసం ఇక్కడికి వచ్చాను. దక్షిణాది సినిమాలు ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’, ‘కేజీఎఫ్’లకు మంచి ఆదరణ లభించింది. నాకు తెలుగు సినిమా చేయాలని ఉంది. చిరంజీవిగారికి ఓసారి ఫోన్ చేసినప్పుడు సల్మాన్ తన సినిమాలో నటిస్తున్నట్లుగా చెప్పారు. నేను ఎందుకు గుర్తు రాలేదని ఆయనతో అన్నాను. -
తన సినిమానే చూస్తూ నిద్రపోయిన స్టార్ హీరోయిన్..
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ 57 ఏళ్ల వయసులో లీడ్ రోల్లో నటించిన చిత్రం 'లాల్‌సింగ్ చద్దా'. హాలీవుడ్ మూవీ 'ఫారెస్ట్ గంప్'కు రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రంలో అక్కినేని నాగచైతన్య కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. బాలీవుడ్ బెబో కరీనా కపూర్ హీరోయిన్గా అలరించనున్న ఈ సినిమాకు అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఆగస్టు 11న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుండగా ప్రీమియర్ షోలు రన్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల ఓ ప్రీమియర్ షోకు అమీర్ ఖాన్, ఆయన మాజీ భార్య కిరణ్ రావుతోపాటు కరీనా కపూర్ కూడా హాజరైంది. అయితే లాల్ సింగ్ చద్దా సినిమాను అమీర్ ఖాన్, కిరణ్ రావు ఎంతో ఆసక్తిగా వీక్షిస్తుంటే కరీనా కపూర్ మాత్రం నిద్రపోతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలో అమీర్ ఖాన్ మధ్యలో కూర్చోగా, ఆయన ఎడమ వైపు కిరణ్ రావు, కుడివైపు కరీనా కపూర్ కూర్చొని ఉన్నారు. ఈ పిక్లోనే కరీనా కపూర్ నిద్రపోవడం చూసిన నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. 'లాల్ సింగ్ చద్ధా చిత్రం చాలా బోరింగ్‌గా ఉన్నట్లుంది. అందుకే కరీనా నిద్రపోతోంది', 'ఫారెస్ట్ గంప్ సినిమాను అమీర్ చూడలేదేమో.. అందుకే బాగా ఎమోషనల్ అవుతున్నాడు' అంటూ ట్రోల్ చేస్తున్నారు. చదవండి: నూలుపోగు లేకుండా రణ్వీర్ సింగ్.. మానసిక రోగి అంటూ బ్యానర్లు శ్రీదేవి చెప్పిన బ్యూటీ టిప్.. ఇప్పటికీ అదే ఫాలో అవుతున్న జాన్వీ and kareena kapoor slept because of her own screentime in the film — Saharsh (@whysaharsh) July 21, 2022 చదవండి: చిరంజీవికి పానీపూరి తినిపించిన అమీర్ ఖాన్.. -
నేను తొందరపడలేదు.. గర్వపడి చేస్తున్నా: చిరంజీవి
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ జోడిగా నటించిన చిత్రం 'లాల్‌సింగ్ చద్దా'. హాలీవుడ్ మూవీ 'ఫారెస్ట్ గంప్'కు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ గుడ్ బాయ్ నాగ చైతన్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది. అలాగే ఈ చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్నారు. తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ లాంచ్ ఆదివారం (జులై 24) గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్లో 'లాల్‌సింగ్ చద్దా' తెలుగు ట్రైలర్‌ను చిరంజీవి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవితోపాటు అమీర్ ఖాన్, నాగ చైతన్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ అమీర్ ఖాన్ భారతీయ సినిమాకు ఒక ఖజానా. ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో గొప్ప నటుడు అనిపించుకున్నాడు. అమీర్ ఖాన్ నడక, నడవడిక అంటే నాకు చాలా ఇష్టం. అమీర్ ఖాన్‌లాగా మేం చేయాలనుకుంటాం. కానీ మాకున్న పరిధుల వల్ల చేయలేకపోతున్నాం. చదవండి: కేటీఆర్ గారూ.. త్వరగా కోలుకోవాలంటే ఈ చిత్రం చూడండి.. నూలుపోగు లేకుండా రణ్వీర్ సింగ్.. మానసిక రోగి అంటూ బ్యానర్లు అమీర్ నటనకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఆయనపై ఉన్న ప్రేమ, బాధ్యతతో ఈ సినిమాకు సమర్పకుడిగా ఉన్నా. నేను తొందరపడి ఈ సినిమా ఒప్పుకోలేదు. గర్వపడి విడుదల చేస్తున్నా అని చిరంజీవి తెలిపారు. ఈ ఈవెంట్లో అమీర్ ఖాన్‌తో నాగ చైతన్య తెలుగు డైలాగ్ చెప్పించి అలరించాడు. అలాగే చిరంజీవికి అమీర్ ఖాన్ పానీపూరి తినిపించాడు. చదవండి: శ్రీదేవి చెప్పిన బ్యూటీ టిప్.. ఇప్పటికీ అదే ఫాలో అవుతున్న జాన్వీ -
మాజీ భార్యతో కలిసి డైరెక్టర్లకు విందు ఇచ్చిన స్టార్ హీరో..
Aamir Khan Special Dinner To Russo Brothers: కోలీవుడ్ స్టార్ హీరోల్లో ధనుష్ ఒకరు. తమిళ చిత్రపరిశ్రమలోనే కాకుండా తెలుగులోనూ అభిమానులను సంపాదించుకున్నాడు. వరుస సినిమాలతో దూసుకుపోతున్న ధనుష్ తాజాగా నటించిన చిత్రం 'ది గ్రే మ్యాన్'. స్టార్ హాలీవుడ్ డైరెక్టర్లు రూసో బ్రదర్స్ (జో రూసో-ఆంటోనీ రూసో) దర్శకత్వం వహించిన ఈ మూవీ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వేదికగా జులై 22 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా, అలాగే ధనుష్‌తో కలిసి ఈ మూవీని వీక్షించేందుకు రూసో బ్రదర్స్ ఇండియా వచ్చిన విషయం తెలిసిందే. ఈ హాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు భారతదేశానికి మొట్ట మొదటిసారిగా రావడంతో మంచి ఆతిథ్యం అందించాడు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్. గురువారం (జులై 21) ఇండియా వచ్చిన ఈ అన్నదమ్ములను స్వయంగా వారి ఇంటికి ఆహ్వానించి ప్రత్యేక విందు ఇచ్చాడు. ఈ పార్టీలో హీరో ధనుష్‌తోపాటు అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు కూడా సందడి చేశారు. అయితే అమీర్-కిరణ్ రావు విడాకులు తీసుకుని విడిపోయిన విషయం తెలిసిందే. వివాహ బంధంతో విడిపోయిన స్నేహితులుగా ఎప్పుడూ కలిసే ఉంటామని అమీర్ చెప్పిన మాటలకు ఈ సంఘటన అద్దం పట్టేలా ఉంది. ఇక ఈ విందులో అతిథులకు ప్రత్యేకమైన గుజరాతీ వంటకాలను రుచి చూపించాడని టాక్. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. చదవండి: 36 ఏళ్ల క్రితం సినిమాలకు సీక్వెల్.. ఈ హీరోలకు కమ్‌బ్యాక్ హిట్.. బేబీ బంప్‌తో అలియా భట్ !.. లీకైన ఫొటోలు.. 9 సార్లు పిల్లలను కోల్పోయిన స్టార్ హీరోయిన్.. View this post on Instagram A post shared by Laal Singh Chaddha (@aamirkhanuniverse) -
బాలరాజుగా నాగ చైతన్య.. ఫస్ట్‌లుక్ చూశారా?
ఆమిర్ ఖాన్ లీడ్ రోల్లో అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’. ఈ చిత్రంలో అక్కినేని నాగచైతన్య కీలక పాత్ర చేశారు. ఆగస్ట్ 11న ఈ చిత్రం రిలీజవుతోంది. తెలుగులో చిరంజీవి సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో నాగచైతన్య లుక్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ‘‘లాల్‌సింగ్ చద్దా చెడ్డీ బడ్డీ ‘బాలరాజు’ను మీకు పరిచయం చేస్తున్నా.. అలనాటి బాలరాజు (అక్కినేని నాగేశ్వరరావు) మనవడు మన నాగచైతన్యనే ఈ బాలరాజు’’ అని పేర్కొన్నారు చిరంజీవి. చదవండి: ఆమె నా హృదయం ముక్కలు చేసింది: నాగ చైతన్య ‘లాల్ సింగ్ చడ్డా’, చెడ్డీ బడ్డీ ‘బాలరాజు’ ని మీకు పరిచయం చేస్తున్నాను. అలనాటి ‘బాలరాజు’ మనవడు మన అక్కినేని నాగ చైతన్యే ఈ బాలరాజు. @chay_akkineni Introducing #Balaraju from #LaalSinghChaddha #AamirKhan @AKPPL_Official @Viacom18Studios #LaalSinghChaddhaOnAUG11th pic.twitter.com/1cVgbURrZx — Chiranjeevi Konidela (@KChiruTweets) July 20, 2022 -
చిరంజీవి సమర్పణలో హిందీ చిత్రం.. తెలుగులో..
పాత్రకు తగిన ఆహార్యం, నటనతో మెప్పిస్తాడు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్. 57 ఏళ్ల వయసులో ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'లాల్‌సింగ్ చద్దా'. హాలీవుడ్ మూవీ 'ఫారెస్ట్ గంప్'కు రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రంలో అక్కినేని నాగచైతన్య కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 11న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటివరకు ఈ మూవీ హిందీలో మాత్రమే వస్తున్నట్లు తెలుసు. అయితే ఇప్పుడు ఈ సినిమా తెలుగు వెర్షన్ కూడా రాబోతుంది. ఈ తెలుగు వెర్షన్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేయనున్నారు. చిరంజీవి సమర్పణలో 'లాల్ సింగ్ చద్దా' తెలుగులో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు రానుంది. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా చిరంజీవి తెలిపుతూ ఆనందం వ్యక్తం చేశారు. కాగా, ఇటీవల ఈ చిత్రాన్ని అమీర్‌ఖాన్‌తో కలిసి తన నివాసంలో చిరంజీవి స్పెషల్‌గా వీక్షించిన విషయం తెలిసిందే. ఈ సినిమా చిరుకి నచ్చి తెలుగులో విడుదల చేస్తానని అమీర్ ఖాన్ కోరారు. అందుకు అమీర్ ఖాన్ కూడా అంగీకారం తెలపడంతో తెలుగులోనూ రిలీజ్ చేయనున్నారు చిరు. చదవండి: మళ్లీ పొట్టి దుస్తుల్లో రష్మిక పాట్లు.. వీడియో వైరల్ అలియా భట్‌కు కవలలు ? రణ్‌బీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. 'ఇది ఒక ఎమోషనల్ స్టోరీ. నా ప్రియమిత్రుడు అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా చిత్రాన్ని తెలుగు వెర్షన్లో విడుదల చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది' అని చిరంజీవి ట్వీట్ చేశారు. చదవండి: చోర్ బజార్లో రూ.100 పెట్టి జాకెట్ కొన్నా: స్టార్ హీరో Feel very privileged to present the Telugu version of my dear friend #AamirKhan ‘s wonderful emotional roller coaster #LaalSinghChaddha Our Telugu audiences are surely going to love him ! pic.twitter.com/Tb2apAaJrz — Chiranjeevi Konidela (@KChiruTweets) July 16, 2022 Fascinating how a chance meeting & a little chat with my dear friend #AamirKhan @Kyoto airport - Japan, few years ago led to me becoming a part of his dream project #LaalSinghChaddha Thank You #AamirKhan for the exclusive preview at my home.Heartened by your warm warm gesture! pic.twitter.com/hQYVZ1UQ5m — Chiranjeevi Konidela (@KChiruTweets) July 16, 2022 -
చిరంజీవి ఇంట్లో ఆమిర్ ఖాన్ లాల్‌సింగ్ చద్దా స్పెషల్ ప్రీమియర్
-
మెగాస్టార్ ఇంట్లో ఆమిర్ ఖాన్ లాల్‌సింగ్ చద్దా స్పెషల్ ప్రీమియర్
పాత్ర ఎలా డిమాండ్ చేస్తే అలా మారిపోతుంటాడు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్. 57 ఏళ్ల వయసులో ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం లాల్‌సింగ్ చద్దా. ఇందులో అక్కినేని నాగచైతన్య కీలక పాత్రలో నటించాడు. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 11న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో టాలీవుడ్ ప్రముఖుల కోసం ఓ ప్రత్యేక షో వేశాడు ఆమిర్. ఏకంగా చిరంజీవి ఇంట్లోనే లాల్‌సింగ్ చద్దా ప్రీమియర్ వేశాడు. చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, సుకుమార్, నాగచైతన్య.. ఆమిర్‌తో కలిసి సినిమా వీక్షించారు. అనంతరం దీనికి సంబంధించిన ఓ వీడియోను మెగాస్టార్ ట్విటర్లో షేర్ చేశాడు. 'కొన్ని సంవత్సరాల క్రితం నా ప్రియమైన స్నేహితుడు అమీర్‌ఖాన్‌ను జపాప్లోని క్యోటో విమానాశ్రయంలో కలిశాను. అప్పుడు జరిగిన ఒక మీటింగ్, చిన్న చాట్ ఎంతో మనోహరమైనది. నా ఇంట్లో లాల్ సింగ్ చద్దా ప్రత్యేక ప్రివ్యూ ఇచ్చినందుకు ఆమిర్‌ఖాన్‌కి ధన్యవాదాలు. అద్భుతమైన సినిమా తీశావు. లాల్ సింగ్ చద్దా తెలుగు వెర్షన్‌ను ప్రదర్శించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయనను మన తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు' అని రాసుకొచ్చాడు. చదవండి: రెమ్యునరేషన్ లెక్కలు బయటపెట్టిన కీర్తి బాలీవుడ్ స్టార్లను విమర్శించిన డైరెక్టర్‌పై నెటిజన్ల ఆగ్రహం -
షూటింగ్లో ప్రమాదాలు.. అయినా ‘తగ్గేదే లే’ అంటున్న హీరోలు
స్క్రీన్‌పై హీరో రిస్కీ ఫైట్స్ చేస్తుంటే ఫ్యాన్స్‌కి ఫీస్ట్. అందుకే ఫ్యాన్స్ కోసం కూడా హీరోలు రిస్కులు తీసుకుంటుంటారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి ప్రమాదాలు జరుగుతుంటాయి. అలా ఈ మధ్య షూటింగ్లో గాయపడిన హీరోలు కొందరు ఉన్నారు. డాక్టర్ విశ్రాంతి తీసుకోమన్నా ‘తగ్గేదే లే’ అంటూ షూటింగ్‌కి హాజరు అయ్యారు. ఆ హీరోల గురించి తెలుసుకుందాం. మనుషులకు దొరక్కుండా జాగ్రత్తగా జారుకునే పనిలో ఉన్నారు రవితేజ. ఎత్తయిన మేడల మీద నుంచి దూకడం, ఎత్తుపల్లాలు ఉన్న రోడ్డు మీద పరిగెత్తడం, అడ్డం వచ్చినవారిని ఇరగ్గొట్టడం... ఇదే పని. ఇదంతా ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా కోసమే. వంశీ దర్శకత్వంలో స్టూవర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో నాగేశ్వరరావు పాత్రను రవితేజ చేస్తున్నారు. దొంగ పాత్ర కాబట్టి సినిమాలో యాక్షన్ పార్ట్ ఎక్కువ. ఓ రిస్కీ ఫైట్ తీస్తున్నప్పుడు రవితేజ గాయాలపాలయ్యారు. ఫలితంగా పది కుట్లు వరకూ పడ్డాయి. అయినా రెస్ట్ తీసుకోకుండా రవితేజ షూటింగ్లో పాల్గొన్నారు. ఇక రవితేజలానే గోపీచంద్ కూడా తన తాజా చిత్రం షూటింగ్లో గాయపడ్డారు. ఈ మూవీ కోసం మైసూర్లో ఓ టెంపుల్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌లో గోపీచంద్ పాల్గొన్నప్పుడు కాలుజారి ఎత్తయిన ప్రదేశం నుంచి జారిపడ్డారు. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ చిత్రాల తర్వాత హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్లో ఈ సినిమా రూపొందుతోంది. ఇక ఎంత రిస్కీ ఫైట్‌ని అయినా డూప్ లేకుండా చేస్తుంటారు హీరో విశాల్. ఇప్పటికే పలు చిత్రాల షూటింగ్స్‌లో ఆయన గాయపడ్డారు. తాజాగా ‘లాఠీ’ సినిమా షూటింగ్ సెట్లో ఒక్కసారి కాదు.. పలుమార్లు ప్రమాదం బారినపడ్డారు. ఈ చిత్రంలో విశాల్‌ది పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. ఫైట్స్ కూడా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. ఈ ఒక్క సినిమా సెట్లోనే ఎక్కువసార్లు గాయపడినా షూటింగ్‌కి బ్రేక్ ఇవ్వకుండా చేస్తున్నారు విశాల్. మరోవైపు ‘కార్తికేయ 2’ కోసం యాక్షన్ సీన్ చేస్తున్నప్పుడు హీరో నిఖిల్ గాయపడ్డారు. ఈ ప్రమాదంలో చీలమండ బెణకడంతో డాక్టర్లు కొన్ని రోజులు విశ్రాంతి కూడా సూచించారు. చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా నటించిన ‘కార్తికేయ’ (2014)కి సీక్వెల్‌గా ‘కార్తికేయ 2’ రూపొందుతోంది. చందూనే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇంకా సెట్స్‌లో ఉన్న కొన్ని చిత్రాల షూటింగ్స్‌లో గాయపడిన హీరోలు ఉన్నారు. పెయిన్ కిల్లర్‌తో... బాలీవుడ్లో ఆమిర్ ఖాన్ని ‘మిస్టర్ పర్ఫెక్షనిస్ట్’ అంటారు. పాత్ర ఎలా డిమాండ్ చేస్తే ఫిజిక్‌ని అలా మార్చేస్తుంటారు ఆమిర్. అందుకు ఒక ఉదాహరణ ‘దంగల్’. ఇక 57ఏళ్ల వయసులోనూ ఆయన రిస్క్ తీసుకున్న తాజా చిత్రం ‘లాల్‌సింగ్ చద్దా’. ఈ చిత్రం షూటింగ్లో లాంగ్ రన్ చేసే చేజింగ్ సీన్ ఒకటి ఉంది. ఆ సీన్ చేస్తున్నప్పుడు ఆమిర్ కాలికి గాయమైంది. ఫిజియోథెరపీ చేయించుకోవాల్సిన పరిస్థితిలో పెయిన్ కిల్లర్లు తీసుకుని, బ్రేక్ తీసుకోకుండా షూటింగ్ చేశారు ఆమిర్ ఖాన్. -
షూటింగ్లో గాయాలు, అయినా లెక్క చేయని హీరో
బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ షూటింగ్లో గాయపడ్డాడు. ప్రస్తుతం అతడు లాల్ సింగ్ చద్దా సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. తాజాగా అతడు లాంగ్ రన్నింగ్ చేసే సీన్లో కాలికి గాయమైంది. అయినప్పటికీ ఆమిర్ ఆ గాయాన్ని లెక్క చేయలేదట. ఫిజియోతెరపీ చేయించుకోవాలి, హాస్పిటల్‌కు వెళ్దామని అక్కడున్నవాళ్లు సూచించినప్పటికీ కేవలం పెయిన్ కిల్లర్స్ వేసుకుని తన పరుగు కొనసాగించాడట. ఎంత నొప్పిగా అనిపించినా దాన్ని పంటి కింద భరించి సీన్ కంప్లీట్ చేశాడట. అందుకే కాబోలు ఆమిర్‌ను మిస్టర్ పర్ఫెక్ట్ అంటుంటారు. కాగా లాల్ సింగ్ చద్దా సినిమాను ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ బ్యానర్‌పై కిరణ్ రావు నిర్మిస్తున్నారు. ఫారెస్ట్ గంప్‌కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కరీనా కపూర్, మోనా సింగ్, నాగచైతన్య ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 11న విడుదల కానుంది. చదవండి: అక్కడింకా మొదటి సినిమానే, అయినా రెమ్యునరేషన్ మాత్రం డబుల్.. షాకింగ్.. రియాపై ఎన్సీబీ చార్జిషీట్, పదేళ్లు జైలు శిక్ష తప్పదా? -
ఆమిర్‌తో పోటీపడుతున్న అక్షయ్.. పెద్ద సాహసమే!
అక్షయ్ కుమార్‌కు ఈ ఏడాది కలిసి రావడం లేదు.గద్దలకొండ గణేష్ హిందీ రీమేక్ బచ్చన్ పాండే ఆర్ ఆర్ ఆర్ మేనియాలో కొట్టుకుపోయింది. ఇక సమ్రాట్ పృథ్వీరాజ్, భూల్ భూలయ్య - 2 హంగామా మధ్య కనిపించలేదు.ఇంత బ్యాడ్ ఫేజ్ లోనూ అక్షయ్ కొత్త సినిమాను వెంటనే రిలీజ్ చేస్తున్నాడు.ఆ మూవీనే రక్షాబంధన్. ఆగస్ట్ 11న రక్షాబంధన్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాడు అక్షయ్. అయితే సరిగ్గా ఇదే రోజును ఆమిర్ ఖాన్ నటిస్తోన్న లాల్ సింగ్ చెద్దా రిలీజ్ అవుతోంది.2018లో తగ్స్ ఆఫ్ హిందుస్తాన్ డిజాస్టర్ తర్వాత బాగా సమయం తీసుకుని ఆమిర్ నటించిన చిత్రమిది.పైగా భారీ ఎత్తున ప్రమోషన్ నిర్వహిస్తున్నాడు.ఆమిర్ ఖాన్ మూవీకి హిట్ టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద వందల కోట్లు కురుస్తాయి.ఆ విషయం ధూమ్ 3, పీకే, దంగల్ లాంటి చిత్రాలు నిరూపించాయి.అలాంటి ఆమిర్ ఖాన్ తో అక్షయ్ పోటీకి దిగడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.అసలే ఫ్లాపుల్లో ఉన్న ఖిలాడి డైరెక్ట్ గా మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ తో పోటీకి దిగడం కరెక్ట్ కాదని బాలీవుడ్ ట్రేడ్ పండితులు చెప్పుకొస్తున్నారు. మరి అక్షయ్ ప్లాన్ ఏంటి అనేది అతనే చెప్పాల్సి ఉంది. అసలే ఈ మధ్య బాలీవుడ్‌కి కలెక్షన్స్ రావడం లేదు. ఈ దశలో మరో హీరోతో పోటీ పడుతూ సినిమా రిలీజ్ అంటే పెద్ద సాహసమే అని చెప్పాలి. -
స్టార్ హీరోలకు చుక్కలు చూపిస్తున్న ఆడియెన్స్
బాలీవుడ్ లో వింత ట్రెండ్ కొనసాగుతోంది. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న స్టార్స్ నటించిన మూవీస్ కు మినియం కలెక్షన్స్ ఉండటం లేదు.లేడీ సూపర్ స్టార్ కంగనా నటించిన భారీ బడ్జెట్ ఫిల్మ్ ధాకడ్ ఇటీవలే అక్కడ రిలీజైంది. సుమారు 100 కోట్లు పెట్టి సినిమా తీస్తే ఈ మూవీ పట్టుమని 3 కోట్లు రాబట్టుకులేకపోయింది.అన్నిటికంటే కంగనాకు పెద్ద అవమానం ఏంటంటే సినిమా రిలీజైన 8వ రోజున కేవలం 20 టికెట్లు అమ్ముడుపోవడం ఆమె జీర్ణించుకోలేకపోతోంది. జెర్సీ విషయంలో షాహిద్ కపూర్,జాయేష్ భాయ్ జోర్దార్ తో రణవీర్ సింగ్, ధాకడ్ తో కంగనా ఆడియెన్స్ నుంచి అవుట్ రైట్ రిజెక్షన్ ఎదుర్కొన్నారు. బాలీవుడ్ లో మినిమం గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న ఆయుష్మాన్ ఖురానా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ అనేక్ కూడా బాక్సాఫీస్ వద్ద 5 కోట్లు మార్క్ దాటేందుకు అష్టకష్టాలు పడుతోంది. థియేటర్స్ కు వచ్చిన సినిమాల సంగతి ఇలా ఉంటే థియేటర్ కు వచ్చేందుకు రెడీ అవుతున్న మరికొన్ని సినిమాలను ర్యాగింగ్ చేస్తున్నారు నెటిజన్స్. ఆమిర్ ఖాన్ నటించిన కొత్త చిత్రం లాల్ సింగ్ చద్దా ఆగస్ట్ లో రిలీజ్ అవుతోంది. 2018లో తగ్స్ ఆఫ్ హిందుస్తాన్ డిజాస్టర్ కావడంతో కొంత సమయం తీసుకుని ఆమిర్ ఈ చిత్రంతో తిరిగొస్తున్నాడు. హాలీవుడ్ క్లాసిక్ ఫారెస్ట్ గంప్ అఫీసియల్ రీమేక్ లాల్ సింగ్ చెద్దా. తెలుగు నటుడు నాగ చైతన్య ముఖ్యపాత్రలో పోషించాడు. ప్రమోషన్స్ లో భాగం యూనిట్ ఇటీవలే ఐపీఎల్ ఫైనల్లో ట్రైలర్ రిలీజ్ చేసింది. ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ పై కూడా బాలీవుడ్ లో ట్రోలింగ్ స్టార్ట్ అయింది. మూవీలో ఆమిర్ ఖాన్ క్యారెక్టర్ గతంలో వచ్చిన పీకే, ధూమ్ 3 చిత్రాల్లో కనిపించిన విధంగానే ఉందంటున్నారు నెటిజన్స్. అంతేకాదు ఈ మూవీ గతంలో సల్మాన్ ఖాన్ నటించిన ట్యూబ్ లైట్ దారిలోనే ఉందంటూ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ కు చుక్కలు చూపించడం స్టార్ట్ చేశారు. -
Laal Singh Chaddha Trailer: తలరాతను ఎలా రాస్తారు ?
Aamir Khan's Laal Singh Chaddha Trailer: ఆమిర్‌ఖాన్ హీరోగా అద్వైత్ చందన్ దర్శకత్వంలో రూపొందిన హిందీ చిత్రం ‘లాల్‌సింగ్ చద్దా’. కరీనా కపూర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో నాగచైతన్య ఓ కీలక పాత్రలో నటించారు. ‘ఎక్స్‌పీరియన్స్‌ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ఏ సింపుల్మేన్’ అంటూ ‘లాల్ సింగ్ చద్దా’ హిందీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికే పోస్టర్లు, పాటలతో సినిమా ఆసక్తిని పెంచిన చిత్ర యూనిట్ ఉత్కంఠంగా సాగుతున్న టీ20 ఫైనల్ మ్యాచ్‌లో ఈ ట్రైలర్‌ను ప్రదర్శించింది. అనంతరం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. ఆద్యంతం ఆసక్తింగా సాగిన ఈ ట్రైలర్లో ఆమీర్ ఖాన్, నాగ చైతన్య లుక్ కొత్తగా ఉంది. ఈ సినిమాలో అభిమానులకు కోరుకున్నట్లు అన్ని రకాల ఎలిమెంట్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ హిందీతోపాటు దక్షిణాది భాషల్లో ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ ‘ఫారెస్ట్‌గంప్’కు హిందీ రీమేక్‌గా రూపొందింది. Experience the extraordinary journey of #LaalSinghChaddha, a simple man whose heart is filled with love, hope and warmth.#LaalSinghChaddhaTrailer out now! Releasing in cinemas worldwide on 11th Aug.https://t.co/yahghWFhJA — Aamir Khan Productions (@AKPPL_Official) May 29, 2022 -
విడాకుల తర్వాత కలిసి పార్టీకెళ్లిన మాజీ దంపతులు
విడాకుల తర్వాత మరోసారి కలిసి దర్శనమిచ్చారు ఆమిర్ ఖాన్, కిరణ్‌రావు. ఆ మధ్య తమ కుమారుడు ఆజాద్ రావు ఖాన్ బర్త్‌డేను కలిసి సెలబ్రేట్ చేసిన ఈ మాజీ దంపతులు తాజాగా నిర్మాత కరణ్ జోహార్ బర్త్‌డే పార్టీలో కలిసి దర్శనమిచ్చారు. ఆమిర్ బ్లూ డ్రెస్‌లో రాయల్ లుక్‌లో కనిపిస్తే కిరణ్ రావు సిల్వర్ డ్రెస్సులో ధగధగ మెరిసిపోయింది. రెడ్ కార్పెట్‌పై కలిసి నిలబడ్డ ఈ ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తూ ఫొటోలకు పోజులివ్వడం గమనార్హం. ఇది చూసిన ఓ అభిమాని అదేంటి? వీళ్లు విడాకులు తీసుకోలేదా? అని ప్రశ్నించాడు. దీనికి ఇతర ఫ్యాన్స్ స్పందిస్తూ.. 'మీరింకా ఎదగాలి బాబూ.. వాళ్లు విడాకులు తీసుకున్నమాట వాస్తవమే. అంతమాత్రానికి ఫ్రెండ్స్‌గా ఉండకూడదా? శత్రువులుగా మిగిలిపోవాలా? కాస్త బుద్ధిపెట్టి ఆలోచించండి', 'విడాకులు తీసుకున్నాక కూడా ఇద్దరూ మాట్లాడుకోవచ్చు. పైగా పిల్లలు ఉన్నప్పుడు వారు స్నేహంగా మెదలడం అత్యవసరం. విడిపోయిన అందరూ బద్ధ శత్రువులు అవుతారనుకోవద్దు' అని సమాధానమిచ్చారు. కాగా గతేడాది ఆమిర్, కిరణ్ విడాకులు తీసుకున్నారు. ఆమిర్ సినిమాల విషయానికి వస్తే అతడు ప్రధాన పాత్రలో నటించిన లాల్ సింగ్ చద్దా ఆగస్టు 11న రిలీజ్ కానుంది. View this post on Instagram A post shared by Karan Johar (@karanjohar.fan) చదవండి: కమెడియన్ కిరాక్ ఆర్పీ ఎంగేజ్మెంట్ టాలీవుడ్లో విషాదం, ప్రముఖ నిర్మాత కన్నుమూత -
ఆమిర్ ఖాన్ కూతురు బర్త్‌డే పార్టీ, బికినీలో కేక్ కటింగ్!
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కూతురు ఇరాఖాన్ ఆదివారం(మే 8న) 25వ పుట్టినరోజు జరుపుకుంది. ఈ సందర్భంగా తన కుటుంబంతో కలిసి బర్త్‌డే పార్టీ చేసుకుంది. అయితే ఈ వేడుకల్లో ఇరా బికినీలో కేక్ కట్ చేయడం విశేషం. ఆమిర్, ఆజాద్ కూడా షర్ట్ లేకుండా ఉండటాన్ని బట్టి వారు అప్పుడే స్విమ్మింగ్ పూల్‌లో నుంచి బయటకు వచ్చి బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ బర్త్‌డే పార్టీలో తల్లి రీనా దత్తా కూడా ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. బికినీలో కూడా బర్త్‌డే జరుపుకుంటారా? అని కొందరు సర్ప్రైజ్ అవుతుంటే పేరెంట్స్‌తో ఆ డ్రెస్‌లో వేడుక చేసుకోవడానికి కొంచెం కూడా సిగ్గు లేదా? అని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇరా ఖాన్ ప్రియుడు నుపూర్ ప్రేయసితో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. కాగా ఇరా ఖాన్ ఇటీవలే యాంగ్జైటీతో బాధపడుతున్న విషయాన్ని చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే! సరిగా ఊపిరి తీసుకోలేకపోతున్నానని, మాటిమాటికీ ఏడుపొస్తుందని తన మానసిక సమస్యను వివరించింది. View this post on Instagram A post shared by Popeye ⚓ (@nupur_shikhare) చదవండి: కేజీఎఫ్ 2: 'అమ్మ పాట' ఫుల్ వీడియో చూశారా ? ఫహద్ ఫాజిల్ 'దొంగాట' రివ్యూ.. ఎలా ఉందంటే ? -
సమంత వర్సెస్ నాగచైతన్య, ఫలితం ఎలా ఉండనుందో?
Samantha Vs Naga Chaitanya: బాక్సాఫీసు వద్ద టాలీవుడ్ మాజీ కపుల్స్ పోటీ పడబోతున్నారు. హీరో నాగచైతన్య తొలిసారి హిందీలో నటించిన ఈ చిత్రం లాల్ సింగ్ చద్దా, సమంత తాజా చిత్రం యశోదలు ఒక్కరోజు తేడాతో బిగ్‌స్క్రీన్ వద్ద పోటీపడనున్నాయి. దీంతో వీరి ఫాలోవర్సతో పాటు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఒక్కసారే రిలీజ్ కాబోతున్న వీరి సినిమాలు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయోనంటూ నెటిజన్లు చర్చికుంటున్నారు. సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘యశోద’ చిత్రం ఆగస్ట్ 12న విడుదల కాబోతోంది. చదవండి: రూ. 400 కోట్ల క్లబ్‌లోకి కేజీయఫ్ 2, హిందీలో ఈ 2 దక్షిణాది సినిమాలే టాప్ దర్శక ద్వయం హరి-హరీశ్‌లు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో కనిపించబోతోంది. మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. నాగచైతన్య హిందీ డెబ్యూ చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’ ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలో ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ ప్రధాన పాత్రలను పోషించగా... నాగచైతన్య కీ రోల్ పోషించాడు. మరి ఈ సినిమాల అదే డేట్‌కు వస్తాయా? లేక విడుదల తేదీలో మార్పులు చేసుకుంటాయా? చూడాలి. మరోవైపు చై సోదరుడు అఖిల్ నటించిన ఏజెంట్ చిత్రం యశోద మూవీ రోజునే విడుదల కాదనుంది. యశోద, ఏజెంట్లు రెండు అగష్టు 12న థియేటర్లో విడుదల కానున్నాయి. చదవండి: ఉపాసన.. నా మైండ్లోనూ అదే ఉంది, కానీ మనం కొద్ది రోజులు ఆగాల్సిందే! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1571342813.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మేకప్‌మెన్‌గా మారిపోయిన ఆమిర్‌ఖాన్!
బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ మేకప్‌మెన్‌గా మారిపోయాడు. ఎందుకు? ఎవరికోసం? అనుకుంటున్నారా? తన ముద్దుల కూతురు ఇరా కోసం! ఈ విషయాన్ని స్వయంగా ఇరానే వెల్లడించింది. 'నాకు మేకప్ ఎవరు వేశారో తెలుసా? ఇంకెవరు మా నాన్నే. నాకంటే బాగా మేకప్ వేస్తానని చెప్పాడు. చివరకు ఆ మాటను నిజం చేసి చూపించాడు. ఎవరికైనా యూట్యూబ్ ట్యుటోరియల్స్ కావాలా?' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో తండ్రితో దిగిన ఫొటోలను పోస్ట్ చేసింది. ఆమిర్ తన ముఖానికి మేకప్ వేస్తే ఇరా మాత్రం ఆమిర్ తలకు హెయిర్ బ్యాండ్ పెట్టి నవ్వేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. వీరి అనుబంధాన్ని చూసిన ఫ్యాన్స్ ఆమిర్ ఉత్తమ తండ్రి, లవ్ యూ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆమిర్ నటించిన తాజా చిత్రం 'లాల్‌సింగ్ చద్దా'. ఫారెస్ట్ గంప్‌కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ మూవీలో కరీనా కపూర్, నాగచైత్య, అద్వైత్ చందన్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Ira Khan (@khan.ira) చదవండి: 'నువ్వు యాక్టరేంటి? నిన్ను తీసుకుంటే మాకన్నీ నష్టాలే' -
3-4 ఏళ్లుగా సిల్వర్ స్క్రీన్‌కి దూరమైన స్టార్ హీరోలు, ఎందుకంటే..
కోవిడ్‌కి రెండేళ్లు.. ఈ రెండేళ్లల్లో లాక్డౌన్ కారణంగా సినిమాల విడుదల వాయిదా పడింది. ఈ వాయిదాల వల్ల కొందరు స్టార్ హీరోలు దాదాపు రెండేళ్లు స్క్రీన్‌పై కనిపించలేదు. బాలీవుడ్లో ఆమిర్, షారుక్, హృతిక్, షాహిద్, రణ్‌బీర్ అయితే వెండితెరపై కనిపించి మూడు నాలుగేళ్లవుతోంది. ఎందుకింత గ్యాప్? ‘అల వైకుంఠపురములో’ సినిమాలో ‘ఏంట్రోయ్ గ్యాప్ ఇచ్చావ్’ అని తండ్రి పాత్రధారి అంటే.. హీరో అల్లు అర్జున్ ‘ఇవ్వలా.. వచ్చింది’ అంటాడు. ఈ ఐదుగురి హీరోల విషయం కూడా అంతే.. ‘గ్యాప్ఇవ్వలా... వచ్చింది’. ఆ గ్యాప్‌కి కారణం, ఈ ఏడాది ఈ ఐదుగురూ కనిపించనున్నసినిమాల గురించి తెలుసుకుందాం. ఫైటర్ కాదు... వేరే! హృతిక్ రోషన్ వెండితెరపై కనిపించి మూడేళ్లు కావొస్తోంది. టైగర్ ష్రాఫ్‌తో కలిసి హృతిక్ చేసిన ‘వార్’ సినిమా 2019 అక్టోబరులో రిలీజైంది. ఈ చిత్రదర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్‌తోనే ‘ఫైటర్’ సినిమా కమిటయ్యారు హృతిక్.. ఈ ఏడాది డిసెంబరులో వెండితెరపైకి రావాల్సిన ‘ఫైటర్’ కాస్త లేట్‌గా వచ్చే ఏడాది సెపె్టంబరుకు షిఫ్ట్ అయ్యాడు. అయితే వేరే సినిమా ద్వారా హృతిక్ ఈ ఏడాది తెరపై కనిపిస్తారు. తమిళంలో హిట్ సాధించిన ‘విక్రమ్ వేదా’ చిత్రంలో వేదగా నటిస్తున్నారు హృతిక్. విక్రమ్‌గా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. తమిళ మాతృకకు దర్శకత్వం వహించిన పుష్కర్ గాయత్రి ద్వయమే హిందీ రీమేక్‌ను తీస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 30న రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే.. హృతిక్ రోషన్ తండ్రి, దర్శక – నటుడు రాకేష్ రోషన్ క్యాన్సర్ బారిన పడి కోలుకుంటుండటం, కోవిడ్ ఎఫెక్ట్ వంటి అంశాలు హృతిక్ షూటింగ్ షెడ్యూల్స్‌కి కాస్త గ్యాప్ పడేలా చేశాయి. మరో వారంలో... ఒక హిట్ తర్వాత గ్యాప్ తీసుకోకుండా ఇంకో హిట్ ఇవ్వాలనే పట్టుదలతో షాహిద్ కపూర్ ‘జెర్సీ’ రీమేక్ అంగీకరించారు. తెలుగులో మంచి విజయం సాధించిన ‘అర్జున్‌రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్‌సింగ్’లో టైటిల్ రోల్ చేసి, అద్భుతమైన హిట్ అందుకున్నారు షాహిద్ కపూర్. 2019లో ఈ సినిమా విడుదలైంది. వెంటనే మరో తెలుగు హిట్ మూవీ ‘జెర్సీ’కి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు షాహిద్. గత ఏడాదే విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడుతూ పడుతూ ఫైనల్‌గా మరో వారంలో ఈ నెల 14న రిలీజ్‌కు రెడీ అయ్యింది. తెలుగు ‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరియే హిందీ రీమేక్‌కి కూడా దర్శకత్వం వహించారు. లాల్ వచ్చేస్తాడా? ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ (2018)... అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్ కాంబినేషన్లో రూపొందిన తొలి సినిమా ఇది. అది కూడా 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో.. కానీ ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని సాధించలేదు. ఎన్నో అంచనాలతో ఆమిర్ ఈ సినిమా చేశారు. రిజల్ట్ షాక్ ఇవ్వడంతో తన తదుపరి చిత్రానికి ఆమిర్ ఖాన్ కాస్త టైమ్ తీసుకున్నారు. కొన్ని కథలు విన్న తరువాత ఫైనల్‌గా ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ ‘ఫారెస్ట్ గంప్’ను హిందీ (‘లాల్‌సింగ్ చద్దా’) లో రీమేక్ చేయాలని ఆమిర్ నిర్ణయించుకున్నారు. 2019లో ఈ సినిమా షూటింగ్ ఆరంభించారు. 2020లో కోవిడ్ ఆరంభమైంది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే కరీనా కపూర్ తల్లి కావడం, కీలక పాత్ర చేయాల్సిన విజయ్ సేతుపతి తప్పుకోవడం వంటివి కూడా షూటింగ్‌కి ఆటంకం కలిగించాయి. విజయ్ సేతుపతి చేయాల్సిన పాత్రను నాగచైతన్య చేశారు. ఎట్టకేలకు షూటింగ్ పూర్తయ్యాక విడుదల చేయాలనుకున్న ప్రతిసారీ లాక్డౌన్ వల్ల లాల్ రావడానికి కుదరలేదు. ఈ ఏడాది ఆగస్టు 11న విడుదల చేస్తున్నామని ఇటీవల చిత్రయూనిట్ ప్రకటించింది. మరి... ఈసారి చెప్పిన తేదీకి లాల్ వచ్చేస్తాడా చూడాలి మరి. జీరో ఎఫెక్ట్ ఆమిర్లానే షారుక్ ఖాన్‌ది కూడా సేమ్ స్టోరీ. షారుక్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘జీరో’ (2018) చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాలేదు. ఆ ఎఫెక్ట్‌తో తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను ఫైనలైజ్ చేయడం కోసం చాలా ఎక్కువ టైమే తీసుకున్నారు షారుక్. కథ నిర్ణయించుకునే విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకున్నారు. ఎందరో దర్శకుల దగ్గర కథలు విని, ఫైనల్‌గా ‘వార్’లాంటి హిట్ సినిమా తెరకెక్కించిన దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్‌కు చాన్స్ ఇచ్చారు షారుక్. వీరిద్దరి కాంబినేషన్లో రూపొందిన ‘పటాన్’ చిత్రం రిలీజ్ ఈ ఏడాది నుంచి వచ్చే ఏడాది జనవరి 23కి వాయిదా పడింది. ‘‘బాగా ఆలస్యం అవుతోందని నాకు తెలుసు. కానీ ఈసారి జనవరి 23ని గుర్తుపెట్టుకోండి’’ అంటూ ‘పటాన్’ రిలీజ్ డేట్ సందర్భంగా షారుక్ అన్నారు. ఇదిలా ఉంటే.. మాధవన్ ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’(జూలై 1 రిలీజ్), రణ్‌బీర్ కపూర్ ‘బ్రహ్మస్త్ర’ (సెప్టెంబర్ 9న రిలీజ్) చిత్రాల్లో షారుక్ అతిథిగా వెండితెరపై కనిపించనున్నారు. ఇది ఆయన అభిమానులు కాస్త హ్యాపీ ఫీలయ్యే విషయం. బ్రహ్మాస్త్రం అంటూ... 2018లో సంజయ్‌దత్ బయోపిక్ ‘సంజు’తో మంచి హిట్టే అందుకున్నారు రణ్‌బీర్ కపూర్. కానీ ఇప్పటివరకు అంటే నాలుగు సంవత్సరాలుగా సిల్వర్ స్క్రీన్‌పై రణ్‌బీర్ మిస్సయ్యారు. ‘సంజు’ తర్వాత రణ్‌బీర్ చేసిన ‘బ్రహ్మస్త్ర’ మైథాలజీ ట్రయాలజీ ఫిల్మ్ కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కోసం ఎక్కువ టైమ్ పట్టింది. 2020లో రణ్‌బీర్ తండ్రి, ప్రముఖ నటులు రిషి కపూర్ మరణించడం, ఇదే సమయంలో కోవిడ్ ఎఫెక్ట్ వంటి అంశాలతో ‘బ్రహ్మస్త్ర’ షెడ్యూల్స్ తారుమారయ్యాయి. ఫైనల్‌గా ఈ సినిమా తొలి భాగం ‘బ్రహ్మస్త్ర’ : శివ’ ఈ సెప్టెంబరు 9న విడుదల కానుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, నాగార్జున కీలక పాత్రలు చేశారు. అలాగే ‘బ్రహ్మాస్త్రం’ అంటూ తెలుగులో వస్తున్న ఈ సినిమాకు దర్శకుడు రాజమౌళి సమర్పకులు కావడం విశేషం. (చదవండి: మానసిక వేదన, సూసైడ్ చేసుకుందామనుకున్నా) ఈ ఐదుగురే కాదు.. కోవిడ్ కారణంగా, వేరే కారణాల వల్ల మరికొందరు బాలీవుడ్ హీరోలు సిల్వర్ స్క్రీన్కు మూడు నాలుగేళ్లపాటు దూరమయ్యారు. ఇప్పుడు కోవిడ్ పోయిందోచ్ అంటున్నారు. సో... గ్యాప్ కూడా పోతుందనుకోవచ్చేమో! -
సినిమాల నుంచి ఆమిర్ ఖాన్ రిటైర్మెంట్? రివీల్ చేసిన హీరో
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్‌ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్గా పేరున్న ఆమిర్ సినిమాల నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలనుకున్నానని చెప్పి షాకింగ్ న్యూస్ చెప్పారు. ఆమిర్ ఖాన్ నటించిన తాజా చిత్రం లాల్ సింగ్ చద్దా త్వరలోనే విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ టీం చిత్ర ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ.. 'ఒకానొక సమయంలో పిల్లలతో సమయం గడపలేకపోతున్నాననిపించింది. వారికి ఏం కావాలో నాకు తెలియడం లేదు. అదే పెద్ద సమస్యగా మారింది. ఈ విషయం నాకు అర్థమవ్వడానికి చాలా కాలం పట్టింది. ఆ సమయంలో నామీదే కాదు, సినిమా మీద కూడా కోపం వచ్చింది. సినిమాలే నాకు, నా కుటుంబానికి మధ్య గ్యాప్ అని అర్థం అర్థమయ్యింది. అందుకే సినిమాలకు గుడ్‌బై చెప్పాలనుకున్నా. అంతేకాకుండా సినిమాల నిర్మాణం నుంచి తప్పుకోవాలనుకున్నాను. గతంలోనే నా రిటైర్మెంట్ ప్రకటించానుకున్నా. కానీ లాల్ సింగ్ చద్దా సినిమా మార్కెటింగ్ స్టంట్‌గా ప్రేక్షకులు భావిస్తారని అప్పుడు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాను. సాధారణంగానే నేను సినిమా సినిమాకి మధ్య 3-4ఏళ్లు విరామం తీసుకుంటాను. కాబట్టి లాల్ సింగ్ చద్దా సినిమా తర్వాత మూడు, నాలుగేళ్ల వరకు ఎవరికీ ఇబ్బంది ఉండదు. అలా నేను నిశ్శబ్దంగా సినిమాల నుంచి తప్పుకోవచ్చు అనుకున్నా. ఇదే విషయాన్ని భార్య, పిల్లలకు చెబితే నేను తప్పు చేస్తునన్నారు. వ్యక్తిగత, వృత్తి జీవితాలకి మధ్య బ్యాలెన్స్ పాటించాలని సూచించారు. కిరణ్ అయితే నా నిర్ణయం విని ఏడ్చేసింది. సినిమా లేకుండా నన్ను ఊహించుకోలేనని చెప్పింది. అలా లాక్డౌన్ రెండేళ్లలో చాలా జరిగాయి. రిటైర్మెంట్ గురించి ఎన్నోరకాలుగా ఆలోచించాను. ఇండస్ట్రీకి దూరమై మళ్లీ వచ్చాను' అంటూ చెప్పుకొచ్చారు. -
'ది కశ్మీర్ ఫైల్స్' మూవీపై ఆమిర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన 'ది కశ్మీర్ ఫైల్స్' ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే 100 కోట్ల మైలురాయిని అధిగమించిన ఈ చిన్న చిత్రం రూ.150 కోట్లు అందుకునే దిశగా పరుగులు తీస్తోంది. తాజాగా ఈ సినిమాపై బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ ప్రశంసలు కురిపించాడు. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌లో భాగంగా ఢిల్లీలో నిర్వహించిన ఓ వేడుకకు ఆమిర్ ఖాన్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ది కశ్మీర్ ఫైల్స్ సినిమాను వీక్షించారా? అన్న ప్రశ్నకు ఆమిర్ స్పందిస్తూ ఇప్పటివరకు ఈ సినిమాను చూడలేదు కానీ తప్పకుండా చూసి తీరతానన్నాడు. ఇది మన చరిత్రకు నిదర్శనమని కితాబిచ్చాడు. కశ్మీర్ పండిట్లకు అలా జరగడం నిజంగా బాధాకరమని విచారం వ్యక్తం చేశాడు. ఇలాంటి సినిమాలను ప్రతి ఒక్క భారతీయుడు చూసి తీరాలని పేర్కొన్నాడు. కశ్మీర్ ఫైల్స్ విజయవంతం అయినందుకు సంతోషంగా ఉందన్నాడు. చదవండి: ఇది నేను కాదంటున్న వర్మ, అబద్ధాలు చెప్పడం కూడా రావట్లేదా? అంటున్న నెటిజన్లు -
ఎత్తిన బాటిల్ దించకుండా తాగేవాడిని: అమీర్ ఖాన్
Aamir Khan Given Up Alcohol Says He Down The Entire Bottle At Times: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ మార్చి 14న 57వ ఏట అడుగుపెట్టాడు. 1988లో 18 ఏళ్ల వయసులో ఖయామత్ సే ఖయామత్ తక్ సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమకు పరిచయమైన అమీర్ ఖాన్ ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇటీవల తన కుటుంబం, ఆధ్యాత్మికత, మతం వంటి తదితర అంశాలపై మాట్లాడారు. ఓ ఇంటర్వ్యూలో తనకున్న మద్యం అలవాటు గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. చదవండి: రెండుసార్లు విడాకులు: తొలిసారి స్పందించిన ఆమీర్ ఖాన్ 'నేను ఇంతకుముందు అప్పుడప్పుడు డ్రింక్ చేసేవాడిని. కొంతమంది రెండు పెగ్గులు తీసుకుంటారు. కానీ రెగ్యూలర్‌గా తాగుతారు. నేను అలాంటి వాళ్లలో ఒకరిని కాదు. నేను అకెషనల్గా అప్పుడప్పుడు మాత్రమే తాగేవాడిని. కాకపోతో తాగడానికి కూర్చున్నప్పుడు బాటిల్ మొత్తం పూర్తి చేసేవాడిని. అది కొంచెం కరెక్ట్ కాదని నాకు అనిపించింది. మీరు మత్తులో ఉన్నప్పుడు ఏవైనా రిగ్రీట్ ఫీల్ అయ్యేటువంటి పనులు చేశారా అని ఆలోచించుకోవాలి. నేనైతే అలా ఏం చేయలేదు. కానీ మనం సొంత నియంత్రణను కోల్పోవడమనేది నాకు నచ్చలేదు. అందుకే ఇకపై నేను తాగను.' అని అమీర్ ఖాన్ తెలిపాడు. చదవండి: సినిమా చూసి ఏడ్చేసిన స్టార్ హీరో, టీ షర్ట్‌తో కన్నీళ్లు తుడుచుకుంటూ.. అలాగే తన కుటుంబ బాధ్యతలు, వ్యక్తిగత జీవితం, కెరీర్ గురించి కూడా అమీర్ చెప్పుకొచ్చాడు. 'ఎక్కడో నాకు అనిపించింది. నేను సరిగా నా బాధ్యతలను నిర్వర్తించలేదని. నా తల్లిదండ్రులు, నా తోబుట్టువులు, నా మొదటి భార్య రీనా, తన తల్లిదండ్రులు, రెండో భార్య కిరణ్, తన తల్లిదండ్రులు, నా పిల్లలు వీళ్లందరూ నాకు చాలా సన్నిహితులు. నేను చిత్ర పరిశ్రమలో చేరినప్పుడు నాకు 18 ఏళ్లు. నేను చాలా నేర్చుకుని, చాలా చేయాలనుకున్నాను. ఈరోజు నాకు సన్నిహితంగా ఉన్న వ్యక్తులకు నేను కోరుకున్న విధంగా చేయలేకపోయాను. వారికి తగిన సమయం ఇవ్వలేకపోయానని నాకు అనిపించింది.' అని అమీర్ పేర్కొన్నాడు. -
రెండుసార్లు విడాకులు: తొలిసారి స్పందించిన ఆమీర్ ఖాన్
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ గతేడాది విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. 2021లో కిరణ్ రావు-ఆమీర్‌ఖాన్ విడాకుల వ్యవహారం అప్పట్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. డివోర్స్‌పై ఇద్దరూ సైలెంట్‌గానే ఉన్నారు. అయితే తాజాగా తొలిసారి ఆమీర్ ఖాన్ తన విడాకులపై స్పందించాడు. మా విడాకుల గురించి ప్రజలు అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే సాధారణంగా డివోర్స్ తర్వాత ఒకరిని మరొకరు పట్టించుకోరు. నిజానికి ఒకరిపై మరొకరికి కోపం ఉంటుంది. చదవండి: మాజీ భార్య నుంచి బెస్ట్ బర్త్‌డే గిఫ్ట్: ఆమీర్ ఖాన్ కానీ మేం మాత్రం అలా కాదు. వివాహ వ్యవస్థకి గౌరవం ఇవ్వాలని కోరుకున్నాం. దాని గురించి ఎంతో చర్చించాం. అందుకే విడిపోయిన తర్వాత కూడా స్నేహితులుగా ఉండాలని నిర్ణయించుకున్నాం. నిజానికి నా ఇద్దరు మాజీ భార్యలతో నాకు ఇప్పటికీ మంచి అనుబంధం ఉండటం నా అదృష్టం. రీనా, కిరణ్, సత్యజిత్ భత్కల్‌తో కలిసి ఓ ఫౌండేషన్ స్థాపించాం. ఇప్పటికీ ఆ ప్రాజెక్ట్ కోసం అందరం కలిసే పనిచేస్తున్నాం. అలాగే మా పిల్లల విషయంలో కూడా తల్లిదండ్రులుగా బాధ్యతను నిర్వహిస్తున్నాం అని చెప్పుకొచ్చారు. కాగా కిరణ్ రావు కంటే ముందే రీనా దత్తాతో 1986లో ఆమీర్ ఖాన్ వివాహం జరిగింది. కానీ 2002లో వీరిద్దరూ విడిపోయారు. అనంతరం 2005లో ఆమీర్ ఖాన్ కిరణ్ రావును పెళ్లాడారు. 15ఏళ్ల వైవాహిక బంధం అనంతరం ఈ జంట విడిపోయింది. చదవండి: బాహుబలి-3పై అప్డేట్ ఇచ్చిన ప్రభాస్, రాజమౌళి -
మాజీ భార్య నుంచి బెస్ట్ బర్త్‌డే గిఫ్ట్: ఆమీర్ ఖాన్
ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్‌కు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం ఆమిర్ ఖాన్ 57వ బర్త్‌డే. ఈ సందర్భంగా ప్రమఖులు సహా నెటిజన్ల నుంచి ఆయనకు బర్త్‌డే విషెస్ అందుతున్నాయి. ఈ నేపథ్యంలో తన మాజీ భార్య కిరణ్ రావు నుంచి ఇటీవలె ఓ బహుమతి అందిందని, అది తన జీవితంలోనే ఉత్తమమైన గిఫ్ట్ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రీసెంట్గా కిరణ్‌తో మాట్లాడాను. ఈ క్రమంలో నా లోపాలు, బలహీనతల గురించి ఓ లిస్ట్ తయారు చేయమని చెప్పాను. ఆమె నాకు ఓ 10-12 పాయింట్స్‌తో ఓ జాబితా తయారు చేసి ఇచ్చింది. అది నా లైఫ్‌లోనే బెస్ట్ బర్త్‌డే గిఫ్ట్ అని అమీర్ ఖాన్ చెప్పుకొచ్చారు. కాగా 2021లో అమిర్ ఖాన్- కిరణ్ రావు విడిపోయిన సంగతి తెలిసిందే. 15 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ ఇకపై తాము భార్యాభర్తలం కాదని సోసల్ మీడియా వేదికగా ప్రకటించారు. 'ఇకపై మేం భార్యాభర్తలం కాదు. కానీ ఒకరికొకరం ఫ్యామిలీగా, పేరెంటింగ్ బాధ్యతలను కలసి పంచుకుంటాం’ అని ఆమిర్, కిరణ్ రావులు ఓ ప్రకటనలో పేర్కొన్న సంగతి తెలిసిందే. -
మై గాడ్, మాటలు రావడం లేదంటూ ఏడ్చేసిన స్టార్ హీరో
బిగ్‌బీ అమితాబ్ నటించిన తాజా చిత్రం 'ఝండ్'. నాగరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత భూషణ్ కుమార్ నిర్మించారు. తాజాగా ఈ సినిమాను ప్రైవేట్ స్క్రీనింగ్‌లో స్టార్ హీరో ఆమిర్ ఖాన్‌కు చూపించింది చిత్రయూనిట్. ఝండ్ సినిమా చూడటం పూర్తవగానే ఆమిర్ భావోద్వేగానికి లోనయ్యాడు. '20 - 30 ఏళ్లుగా మనం నేర్చుకున్నదానికి ఇది బ్రేక్ ఇస్తుంది. వాటే ఫిలిం, మై గాడ్. సినిమా అత్యద్భుతంగా ఉంది. ఇండియాలోని పిల్లల ఎమోషన్స్‌ను మీరు చూపించిన విధానం చాలా బాగుంది. ఆ పిల్లలు కూడా చాలా బాగా నటించారు. నాకు మాటలు రావడం లేదు' అని చెప్తూ కళ్ల నుంచి ఉబికి వస్తున్న నీళ్లను టీ షర్ట్‌తో తుడుచుకుంటూ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చాడు. మూవీలో నటించిన పిల్లలను సైతం మెచ్చుకున్నాడు. అమితాబ్ కెరీర్‌లోని ఉత్తమ చిత్రాల్లో ఇది కూడా ఒకటిగా నిలిచిపోతుందని ప్రశంసలు కురిపించాడు ఆమిర్. అనంతరం ఝండ్ చిత్రయూనిట్‌ను ఆప్యాయంగా హత్తుకుని అభినందించాడు. కాగా మురికివాడలో నివసించే పిల్లలను ఫుట్‌బాల్ టీమ్‌గా ఏర్పాటు చేసిన సామాజికవేత్త విజయ్ బార్సే జీవిత కథ ఆధారంగా ఝండ్ తెరకెక్కింది. ఈ సినిమా మార్చి 4న విడుదలవుతోంది. -
ఆ విషయంలో తగ్గేదే లే అంటున్న ఆమిర్ ఖాన్!
‘లాల్‌సింగ్ చద్దా’ సినిమా రిలీజ్ డేట్ విషయంలో వెనక్కి తగ్గేదే లే అంటున్నారు ఆమిర్ ఖాన్. అద్వైత్ చందన్ దర్శకత్వంలో ఆమిర్ ఖాన్, కరీనా కపూర్, నాగచైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘లాల్‌సింగ్ చద్దా’. వయాకామ్ స్టూడియోస్, ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 14న విడుదల చేయనున్నట్లు గత ఏడాది నవంబరులో చిత్రబృందం ప్రకటించింది. అయితే ఇదే తేదీన యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ సినిమా విడుదలకు షెడ్యూలైంది. ఈ నేపథ్యంలో ‘లాల్‌సింగ్ చద్దా’ విడుదల వాయిదా పడొచ్చనే ఊహాగానాలు మరోసారి తెరపైకి వచ్చాయి. దీంతో ‘లాల్‌సింగ్ చద్దా’ విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని, ఏప్రిల్ 14నే విడుదల చేస్తామని చిత్రబృందం మరోసారి స్పష్టం చేసింది. ఇక 1994లో వచ్చిన హాలీవుడ్ ఫిల్మ్ ‘ది ఫారెస్ట్ గంప్’కు హిందీ రీమేక్‌గా ‘లాల్‌సింగ్ చద్దా’ తెరకెక్కిన సంగతి తెలిసిందే. -
Aamir Khan- Kiran Rao: కొందరు విడిపోయినా మారరు! కాబట్టి....
Parents Separation: How It Will Affect Children Psychiatrist Suggestions: ‘మనం ఒకరికి ఒకరం సరిపడే భార్యాభర్తలం కాలేకపోయాం. కనీసం పిల్లలకు ఉత్తమంగా నిలిచే తల్లిదండ్రులుగా అయినా ఉందాం’ ఇదీ విడాకులు తీసుకుంటున్న భార్యాభర్తలు మొదటగా ఆలోచించాల్సింది. ఇవాళ రేపు విడాకుల ఆప్షన్‌ను ఎంచుకోవడానికి భార్యాభర్తలు పెద్దగా ఆలోచించడం లేదు. కాని ‘మా ఆలోచనంతా పిల్లల గురించే’ అంటున్నారు. ‘మేము ఒకరికొకరం అక్కర్లేదు. కాని మా పిల్లలకు మేము కావాలి. ఏం చేయమంటారు’ అని నిపుణుల దగ్గరకు సలహా కోసం వస్తుంటారు. వీరితో సమస్య లేదు. సమస్యల్లా ‘ఆమె దగ్గర ఉంటే పిల్లవాడు పాడైపోతాడు’ అని తండ్రి అనుకున్నా ‘అతని దగ్గర అమ్మాయి ఉంటే చదువు అబ్బకుండా పోతుంది’ అని తల్లి అనుకున్నా పరేషాన్ మొదలవుతుంది. సపరేషన్ అంటేనే ఒక పరేషన్. మళ్లీ పిల్లలతో ఆ పరేషాన్ అవసరమా? మాట వినే భార్యాభర్తలు ‘కొందరు భార్యాభర్తలు విడిపోయినా పిల్లల కోసం బుద్ధిగా మాట వింటారు. వీరికి మేము పిల్లలు కోరుకున్నప్పుడల్లా కలిసి కనిపించండి అని సలహా ఇస్తుంటాం. బర్త్‌డే కలిసి చేయండి... స్కూలు యానివర్సరీకి కలిసి వెళ్లండి... స్పోర్ట్స్డేకు వెళ్లండి. వీక్లీ విజిట్స్‌ను అడ్డుకోకండి. పిల్లవాడి ఎదుట తల్లి తండ్రిని, తండ్రి తల్లిని చిన్నబుచ్చే విధంగా మాట్లాడకండి అని చెబుతాం. వారు వింటారు. పెద్దగా సమస్య ఉండదు’ అంటారు సైకియాట్రిస్ట్ డాక్టర్ కల్యాణ చక్రవర్తి. కాని సమస్య అంతా మాట వినని భార్యాభర్తల గురించే. విడిపోయినా మారరు కొందరు భార్యాభర్తలు విడిపోయినా మారరు. విడాకులకు ముందు తిట్టుకుంటారు. విడాకులు అయ్యాక కూడా తిట్టుకుంటారు. ఇది పిల్లల మీద ఎంత మానసిక ఒత్తిడి కలిగిస్తుందో ఆలోచించరు. విజిట్స్‌కు వచ్చినప్పుడు ‘మీ అమ్మ ఇదా నేర్పింది’ అని అంటారు. లేదా ‘మీ నాన్న బుద్ధులే నీకూ వచ్చాయి’ అంటారు. దాంతో తల్లి కరెక్టా తండ్రి కరెక్టా అనేది అర్థం కాక పిల్లల్లో స్పిరిట్ పర్సనాలిటీ వస్తుంది. సమాజాన్ని ఎదుర్కొనే ఆత్మవిశ్వాçసం ఏర్పడదు. ఇంకొందరు మరీ దారుణంగా వ్యవహరిస్తారు. తల్లినో తండ్రినో ఎలాగైనా దూరం చేయాలి అని పిల్లల్ని దాచేయడం.... తల్లి/తండ్రి నీడ పడనంత దూరంగా తీసుకెళ్లిపోవడం... ఆ పిల్లల్లో తల్లి/తండ్రి పట్ల చేదు ఎక్కించడం. ఇది నేరం. పిల్లలకు తల్లి ప్రేమ, తండ్రి ఆప్యాయత దూరం చేసే హక్కు ఎవరికీ లేదు. కొన్నిసార్లు బంధువులు, తాతయ్య అమ్మమ్మ నానమ్మలు కూడా విషం నూరిపోయడానికి చూస్తారు. పిల్లల హితం కోరుకునే తల్లిదండ్రులైతే వీటిని వేటినీ ఎంకరేజ్ చేయకూడదు. విడిపోయాక పాత గాయాలను రేపి పిల్లల మనసు పాడు చేయకూడదు అనుకోవాలి. పిల్లలకు కొత్త జీవితం భార్యాభర్తలు విడిపోయాక పిల్లల దగ్గర నేను గెలవాలి అంటే నేను గెలవాలి అనుకోవడం ప్రమాదం. నేనే మంచి అనిపించుకోవడం కూడా సరి కాదు. ఎవరు మంచో ఎవరు చెడో కేవలం ఆ భార్యాభర్తలకు మాత్రమే తెలుస్తుంది. పిల్లలకు అది చెప్పినా అర్థం కాదు. వాళ్లకు అది అనవసరం కూడా. వాళ్లకు సంబంధించి జీవితంలో పెద్ద నష్టం జరిగిపోయింది తల్లిదండ్రులు విడిపోవడం వల్ల. కాని వారిలో ఒకరిని ఎలాగైనా దూరం చేయాలనుకోవడం ఇంకా నష్టం కలిగించడం. ‘మీరు పిల్లల కోసం ఈగోను తగ్గించుకోవాలి. మంచి తల్లిని మంచి తండ్రిని అనిపించుకోవడానికి చూడాలి. కొత్త జీవితం కోసం మీరు విడిపోయారు. మీ పిల్లలకు కూడా ఒక కొత్త జీవితం ఇద్దాం అనుకోవాలి... అని తల్లిదండ్రులకు సూచిస్తాం’ అంటారు డాక్టర్ కల్యాణ చక్రవర్తి. ఆమిర్ ఖాన్, కిరణ్‌రావులు తమ కుమారుడు ఆజాద్ రావు ఖాన్ పుట్టిన రోజును కలిసి జరపాలని నిశ్చయించుకోవడం మంచి విషయం. పుట్టినరోజునాడు తల్లిదండ్రుల సమక్షంలో ఉండాలని పిల్లలు అనుకుంటారు. ఆ ఆనందం పొందే హక్కు వారికి ఉంది. వారి ప్రపంచం బుజ్జిది. అందమైనది. అమాయకమైనది. అందులో అమ్మా నాన్నలే హీరో హీరోయిన్లు. వారు నిజ జీవితంలో విడిపోయినా ఊహల్లో అప్పుడప్పుడు వాస్తవికంగా కలిసి కనిపిస్తే వారికి ఊరట. ఆ ఊరట కలిగించడం విడాకులు పొందిన ప్రతి భార్యాభర్తల బాధ్యత. పొసగని భార్యాభర్తలు కావడం తప్పు కాదు. కాని మంచి తల్లిదండ్రులు కాకపోవడం మాత్రం ముమ్మాటికీ తప్పే. ఆ తప్పు జరగనివ్వకండి. -
‘కేజీఎఫ్ 2’టీమ్‌కు ఆమిర్ ఖాన్ క్షమాపణలు.. యశ్‌కు ఫోన్ కాల్!
‘కేజీఎఫ్ 2’ టీమ్‌కు బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ క్షమాపణలు చెప్పారు. అంతేకాదు ఆ మూవీ హీరో యశ్‌తో పాటు డైరెక్టర్ ప్రశాంత్ నీల్, నిర్మాత విజయ్ కిరంగదుర్లకు క్షమాపణ లేఖలు రాస్తూ.. ‘కేజీఎఫ్ 2’చిత్రానికి తాను కూడా ప్రచారం చేస్తానని చెప్పారట. అదేంటి ఆమిర్ ఎందుకు సారీ చెప్పారు? ‘కేజీఎఫ్ 2’ఆయన ఎందుకు ప్రచారం చేస్తారు? అనే కదా మీ డౌటానుమానం. వివరాల్లోకి వెలితే.. ఆమిర్ ఖాన్ హీరోగా అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘లాల్‌సింగ్ చద్దా’. ఈ మూవీలో కరీనా కపూర్, నాగచైతన్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ విడుదల తేదిని కూడా ప్రకటించారు మేకర్స్. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఏప్రిల్ 14, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అదే రోజు(ఏప్రిల్ 14) కేజీఎఫ్ 2 కూడా విడుదల కానుంది. ఈ తేదిని గతంలో కేజీఎఫ్ 2 బృందం ప్రకటించింది. ఈ చిత్రంపై కూడా దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఒకే రోజున రెండు పెద్ద సినిమాలు విడుదలైతే బాక్సాఫీస్ వసూళ్లను షేర్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆమిర్ ఖాన్ ‘కేజీఎఫ్ 2’టీమ్‌కు క్షమాపణలు చెప్పారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘తప్పనిసరి పరిస్థితిలో ఏప్రిల్ 14న లాల్‌సింగ్ చద్దాను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నాం. కేజీఎఫ్ 2 నిర్మాత విడుదల తేదీని ప్రకటించారని తెలిసి కావాలనే మేము ఆ రోజును ఎంచుకోలేదు. విడుదల తేదీని ప్రకటించే ముందు ‘కేజీఎఫ్2’ నిర్మాత విజయ్ కిరంగదుర్, దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యశ్‌లకు క్షమాపణ చెబుతూ లేఖ రాశా. యశ్‌తో ఫోన్లో కూడా మాట్లాడాను. ‘కేజీఎఫ్, లాల్‌సింగ్ చద్దా’ రెండు వేర్వేరు జోనర్లకు సంబంధించిన చిత్రాలు. ప్రేక్షకులు రెండు సినిమాలను ఆదరిస్తారు. ‘కేజీఎఫ్ 2’కు నేనే స్వయంగా ప్రచారం చేస్తా. ఆ చిత్రం అంటే నాకు చాలా ఇష్టం. ‘కేజీఎఫ్ 2’కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది అభిమానుల్లో నేను ఒకడిని. ఏప్రిల్ 14న థియేటర్స్‌లో ఆ సినిమా చూస్తా’అని ఆమిర్ తెలిపారు. మరి ఒకే రోజున వస్తున్న ఈ రెండు చిత్రాలలో ప్రేక్షకులు దేనికి బ్రహ్మరథం పడతారో చూడాలి. -
విడుదల తేదిలలో కన్ఫ్యూజన్.. నాలుగు సినిమాలు వాయిదా
విడుదల తేదీల విషయంలో తెలుగు పరిశ్రమలోనే కాదు.. ఇతర భాషల్లోనూ కాస్త కన్ఫ్యూజన్ ఉంది. ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా నాలుగు హిందీ చిత్రాల విడుదల వాయిదా పడటం హాట్ టాపిక్ అయింది. శనివారం ఈ నాలుగు చిత్రాల కొత్త విడుదల తేదీని ఆయా చిత్రబృందాలు అధికారికంగా ప్రకటించాయి. ఆ విశేషాల్లోకి వెళితే... వచ్చే ఏడాది ఫిబ్రవరి విడుదలకు సిద్ధమైన ‘లాల్‌సింగ్ చద్దా’ రిలీజ్ ఏప్రిల్ 14కి వాయిదా పడింది. ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ ‘ది ఫారెస్ట్‌గంప్’కు హిందీ రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రంలో ఆమిర్ ఖాన్ హీరోగా నటించారు. అద్వైత్ చందన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నాగచైతన్య ఓ కీలక పాత్ర చేశారు. వాయిదా లిస్ట్‌లో ఉన్న మరో సినిమా షాహిద్ కపూర్ నటించిన ‘జెర్సీ’ (తెలుగు ‘జెర్సీ’కి రీమేక్). అలాగే వరుణ్ ధావన్, కియారా అద్వానీ హీరోహీరోయిన్లుగా నటించిన ‘జగ్ జగ్ జీయో’, రాజ్‌కుమార్ రావ్ ‘హిట్’ (తెలుగు ‘హిట్’కి రీమేక్) చిత్రాల కొత్త విడుదల తేదీలు కూడా శనివారం ఖరారయ్యాయి. ‘జెర్సీ’ డిసెంబరు 31న, ‘జగ్ జగ్ జీయో’ వచ్చే ఏడాది జూన్ 24న, హిందీ ‘హిట్’ 2022 మే 20న విడుదల కానున్నాయి. వీటితో పాటు మరికొన్ని హిందీ చిత్రాలు వాయిదా పడే అవకాశం ఉన్నట్లు బీ టౌన్ టాక్. -
'లాల్ సింగ్ చద్దా' విడుదల మళ్లీ వాయిదా.. ఎప్పుడంటే..?
Aamir Khan Laal Sing Chaddha New Release Date Out: బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా' ఇప్పుడు ప్రేమికుల దినోత్సవానికి బదులు ఏప్రిల్ 14, 2022న థియేటర్లలోకి రానుంది. ఈ విషయమై మేకర్స్ శనివారం ప్రకటించారు. ఈ చిత్రం టామ్ హాంక్స్ నటించిన 1994 హాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'ఫారెస్ట్ గంప్'కి రీమేక్. ఇంతకుముందు అమీర్‌తో కలిసి 'సీక్రెట్ సూపర్‌స్టార్' (2017) తీసిన అద్వైత్ చందన్ ఈ హిందీ వెర్షన్‌కు దర్శకత్వం వహించారు. ఈ సినిమా అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్‌లో బ్యానర్లో రానుంది. అమీర్ ఖాన్, కరీనా కపూర్‌తో ఉన్న కొత్త పోస్టర్‌ను ట్విటర్లో షేర్ చేసింది ప్రొడక్షన్ బ్యానర్. We are happy to share our new poster and our new release date :) #LaalSinghOnBaisakhi#AamirKhan #KareenaKapoorKhan #AdvaitChandan @atul_kulkarni @ipritamofficial @OfficialAMITABH #KiranRao @Viacom18Studios @chay_akkineni #MonaSingh #ManavVij #SatyajitPande #HemantiSarkar pic.twitter.com/VOz3RBjHZz — Aamir Khan Productions (@AKPPL_Official) November 20, 2021 'మా కొత్త పోస్టర్, మా కొత్త విడుదల తేదిని ప్రకటించడం మాకు సంతోషంగా ఉంది' అని అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్ ట్వీట్ చేసింది. కరోనా వైరస్ కారణంగా లాల్ సింగ్ చద్దా చాలా సార్లు వాయిదా పడింది. ఈ చిత్రం 2021 క్రిస్మస్కు విడుదల కావాల్సింది. అయితే కొవిడ్ వల్ల షూటింగ్ నిలిపివేయడంతో ఆలస్యమైంది. టీమ్ ప్రొడక్షన్ సెప్టెంబర్‌లో పూర్తైంది. విన్స్టన్ గ్రూమ్ 1986 నవల ఆధారంగా 'ఫారెస్ట్ గంప్' ని తెరకెక్కించారు. 'లాల్ సింగ్ చద్దా' సినిమాకు ఎరిక్ రోత్, రచయిత అతుల్ కులకర్ణి స్క్రీన్‌ప్లే అందించారు. ఈ చిత్రంలో నాగ చైతన్య, మోనా సింగ్ తదితరులు కూడా నటించారు. -
ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? అప్పట్లో దివ్య భారతిని మైమరిపించారు
Mamta Kulkarni Recent Photos: ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?.. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళంతో పాటు బెంగాళీ చిత్రాల్లో ఆమె ఒకప్పటి అగ్ర హీరోయిన్. దాదాపు స్టార్ హీరోలందరి సరసన ఆమె నటించారు. అచ్చం దివ్వభారతిని తలపించే ఈ నటి ఎవరో ఇప్పటికైన గుర్తోచ్చిందా. ఇంకా ఆమె గురించి చెప్పాలంటే అప్పట్లో ఆమె ఇచ్చిన టాప్‌లెస్ ఫొటోషూట్‌తో వివాదంలో చిక్కుకున్నారు. దీంతో ఆమె భారీగానే జరిమాన చెల్లించాల్సి వచ్చింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. 1990లో తన అందంతో కుర్రకారు మతి పొగొట్టిన హీరోయిన్ మమత కులకర్ణి. అయితే ఇప్పుడు ఆమె ప్రస్తావన ఎందుకు వచ్చిందాని ఆలోచిస్తున్నారా? అగ్ర హీరోయిన్గా రాణిస్తూనే ఒక్కసారిగా ఆమె తెరపై కనుమరుగయ్యారు. 2016లో పలు వివాదాలు ఆమెను చుట్టుముట్టాయి. అనంతరం ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయిన మమత ఆ తర్వాత ఎక్కడ ఉన్నారు, ఏమైపోయారని అప్పట్లో ఆమె ఫ్యాన్స్ ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో మమత తన లెటెస్ట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీంతో మరోసారి ఆమె వార్తల్లో నిలిచారు. 1990లో స్టార్ హీరోయిన్గా రాణించిన ఆమె తెలుగులో నటించిన చిత్రాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. హీరో ప్రశాంత్ ‘ప్రేమ శిఖరం’ మూవీతో ఆమె టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఈ మూవీలో ముందుగా దివంగత నటి దివ్వ భారతి నటించాల్సి ఉంది. కానీ ఆమె మృతి చెందడంతో అచ్చం తనలా ఉన్న మమత కులకర్ణిని ఈ సినిమాలో తీసుకున్నారు. అప్పటికే ఆమె బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగారు. ఆ తర్వాత మమత.. మోహన్ బాబు సరసన ‘దొంగ పోలీస్’, ‘బ్రహ్మ’ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అలాగే హిందీలో కూడా పలువురు స్టార్ హీరోల సరసన కూడా నటించారామె. సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, సైఫ్ అలీఖాన్, అజయ్ దేవగణ్, షారుఖ్ ఖాన్ వంటి స్టార్ హీరోలతో ఆమె స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అలా తన కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ఓ ఎన్ఆర్ఐని వివాహం చేసుకుని న్యూయార్క్‌లో సెటిల్ అయ్యారు. ఆ తర్వాత వైవాహిక బంధంలో కలతలు రావడంతో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆనంతరం కొంతకాలానికి మమత కులకర్ణి అంతర్జాతీయ డ్రగ్స్ వ్యాపారి విక్కీ గోస్వామిని వివాహం చేసుకున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే దీనిపై స్పష్టత లేదు. కానీ 2016లో విక్కీ గోస్వామి అరెస్ట్ తర్వాత మమత యుఎస్ డ్రగ్స్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ (DEA) స్కానర్ కిందకు వచ్చింది. ఆ తర్వాత మమతా కులకర్ణిని డీఈఏ వాంటెడ్‌గా ట్యాగ్ చేసింది. View this post on Instagram A post shared by mamta kulkarni (@mamtakulkarni201972_official) View this post on Instagram A post shared by mamta kulkarni (@mamtakulkarni201972_official) -
శృంగారం గురించి మాట్లాడాలంటే జనాలకి భయం: నటి
ఆమీర్ ఖాన్ హీరోగా నటించిన ‘దంగల్’ మూవీలో ఓ ముఖ్య పాత్రలో నటించి యాక్ట్రెస్ సాన్యా మల్హోత్రా మంచి గుర్తింపు పొందింది. అనంతరం సినిమాలు, షోలు చేస్తూ కెరీర్లో ముందుకు సాగుతోంది. ఈ బ్యూటీ తాజాగా ‘ససురల్ వండర్ ఫూల్’ అనే రొమాంటిక్ కామెడీ షోలో అషిమా అనే పాత్ర పోషిస్తోంది. ఇది అడిబుల్ ప్రసారమయ్యే ఓ పాడ్‌కాస్ట్. భారత్‌లో జనాలు శృంగారం గురించి మాట్లాడాలంటే భయపడతారని ఈ భామ తెలిపింది. షో గురించి ఈ బ్యూటీ ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ.. ‘ఇప్పటి వరకూ శృంగారమనే పదం భారత్‌లో నిషిద్ధం. కానీ ఇటీవల సినిమా, ఇతర డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌ల వల్ల కొద్దిగా మార్పు వస్తోంది. అందుకే ‘ససురల్ వండర్ ఫూల్’ వంటి స్టోరీస్‌ని రూపొందించేందుకు క్రియేటర్స్ ముందుకు వస్తున్నార’ని తెలిపింది. సాన్యా తన షో గురించి మాట్లాడుతూ.. ‘ఇందులో నేను చేసే ‘అషిమా’ పాత్రకి శృంగారం అనే పదం వాడాలంటే ఇబ్బంది పడుతుంది. అలాంటిది తన భర్త, ఇతర కుటుంబ సభ్యులు దానికి సంబంధించిన క్లీనిక్ని నడుపుతుంటే.. ఆమె పరిస్థితి ఎంటానేది స్టోరీ’ అని చెప్పింది. మేం ఈ షోతో కొంత మందినైనా మార్చగలమని ఆశిస్తున్నామని తెలిపింది. దీని స్ఫూర్తితో కొందరైనా సరే ఇలాంటి విషయాలను బహిరంగంగా మాట్లాడతారని అనకుంటున్నామని పేర్కొంది. చర్చిస్తారనుకుంటున్నాం. చదవండి: సినిమాలకి గుడ్ బై చెప్పిన రెండేళ్లకి.. సోషల్ మీడియాలో ‘దంగల్’ నటి -
సినిమాలకి గుడ్ బై చెప్పిన రెండేళ్లకి.. సోషల్ మీడియాలో ‘దంగల్’ నటి
ఆమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన బాలీవుడ్ మూవీ ‘దంగల్’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో.. అందులో చిన్నప్పటి గీతా ఫోగట్‌గా నటించిన జైరా వసిమ్ అంతకంటే ఎక్కువ పాపులారిటీ సాధించింది. సినిమా సక్సెస్ తర్వాత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడమే కాకుండా మంచి అవకాశాలు సైతం ఆమె తలుపుతట్టాయి. వాటిన్నింటినీ కాదంటూ సినిమాలకి గుడ్‌బై చెప్పింది ఈ నటి. అయితే రెండేళ్ల తర్వాత తాజాగా జైరా వసిమ్ మళ్లీ సోషల్ మీడియాలో అభిమానులను పలకరించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో బుర్ఖాలో ఉన్న తన ఫోటో ఒకటి షేర్ చేసింది జైరా. పోస్ట్ చేసిన గంటలోనే ఈ పిక్కి 60వేలకి పైగా లైక్స్ వచ్చాయి. అయితే తన విశ్వాసాలకి ఈ గ్లామర్ ప్రపంచం సరిపోదంటూ 2019లో బాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసింది. సోషల్ మీడియాలో, నెట్టింట్లో ఉన్న తన ఫోటోలన్నింటినీ తొలగించాలని ఫ్యాన్స్‌ని కోరింది. కాగా చాలా కాలం తర్వాత ఇలా సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడంతో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. చదవండి: కొడుకు కోసం మళ్లీ కలిసిన బాలీవుడ్ మాజీ జంట View this post on Instagram A post shared by Zaira Wasim (@zairawasim_) -
ఆమిర్ ఖాన్ యాడ్‌పై తీవ్ర దుమారం
Boycott CEAT Trending in Twitter: సినిమాలు, వెబ్ సిరీస్‌లను వివాదాస్పద కాన్సెప్ట్‌లు, సీక్వెన్స్‌లతో తెరకెక్కించడమే కాదు.. అప్పుడప్పుడు అడ్వర్టైజ్మెంట్ల రచ్చ ద్వారానూ వార్తల్లో నిలుస్తోంది బాలీవుడ్. ముఖ్యంగా సున్నితమైన అంశాల్ని టచ్ చేయడం ద్వారా సోషల్ మీడియాలో నెటిజన్ల ఆగ్రహానికి గురికావాల్సి వస్తోంది. ఈమధ్య వివాహ దుస్తులమ్మే ఓ బ్రాండ్ నటి అలియా భట్‌తో తీసిన ‘కన్యాదాన్’ అడ్వర్టైజ్మెంట్ తీవ్ర విమర్శలపాలైన సంగతి తెలిసిందే. ఆ వేడి చల్లారకముందే బాలీవుడ్ సీనియర్ హీరో ఆమిర్ ఖాన్ యాక్ట్ చేసిన ఓ యాడ్‌పై తీవ్ర దుమారం నడుస్తోంది. ఆమిర్ ఖాన్ నటించిన సీయట్ టైర్ల కంపెనీ యాడ్ ఒకటి ఈమధ్య రిలీజ్ అయ్యింది. ‘‘రోడ్లు ఉంది పటాసులు(టపాకులు) పేల్చడానికి కాదు’’ అంటూ తన ఎదురుగా ఉన్న జనాలకు క్లాస్ పీకుతూ.. సదరు టైర్ల యాడ్‌ను ప్రమోట్ చేశాడు. అయితే అమీర్ ఖాన్ ఈ యాడ్ చేయడం, పైగా తమ మతాన్ని కించపరిచేదిగా ఉందంటూ కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. ఆ అభ్యంతరాలు తారాస్థాయికి చేరగా.. సీయట్ను బాయ్‌కాట్ చేయాలంటూ Boycott_Hinduphobic_CEAT వేల ట్వీట్లు, రీట్వీట్లతో నింపేస్తున్నారు. ఈ యాడ్ చేసింనందుకు నటుడు ఆమిర్ ఖాన్ క్షమాపణలు చెప్పాలని, యాడ్‌ను తొలగించాలని సీయట్ కంపెనీని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. ఇక కొందరైతే ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయెంకాను ఇందులోకి తీసుకొస్తున్నారు. గతంలోనూ ఇలా సున్నితమైన అంశాలపై హర్ష గోయెంకా అనుచిత ట్వీట్లు వేశాడని, ఆ టైంలోనూ బాయ్‌కాట్ ఉద్యమం నడిచిందని కొందరు స్క్రీన్ షాట్లను రీట్వీట్లు చేస్తున్నారు. మతాన్ని, పండుగల్ని కించపరిచేలా సీయట్ కంపెనీ యాడ్స్ తీయాల్సిన అవసరం, అందులో ఆమిర్ ఖాన్ లాంటి స్టార్ నటించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు చాలామంది. Hello @CEATtyres The chairman of your parent company has such views on Hinduism and it's traditions We have many alternative tyre companies in India MRF, JK, Apollo So there won't be any problem for us if we #BoycottCEAT We need an unconditional apology from him ✌🏼 pic.twitter.com/Qr7UjGYDjC — Anish (@Aniiiiish) April 14, 2021 చదవండి: అండర్వేర్ యాడ్.. ఏం మెసేజ్ ఇద్దామని రష్మిక? -
‘గ్రీన్’ చాలెంజ్‌లో మొక్కలు నాటిన ఆమిర్‌ఖాన్
సాక్షి, హైదరాబాద్: ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో భాగంగా బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్‌ఖాన్ ఆదివారం బేగంపేట విమానాశ్రయంలో మొక్కలు నాటారు. ప్రస్తుతం ఆమిర్‌ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా సహనటుడు, టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్‌తో కలిసి విమానాశ్రయంలో ఆయన మొక్కలు నాటారు. జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను ఈ సందర్భంగా ఆమిర్‌ఖాన్ అభినందించారు. ‘మనందరం తప్పనిసరిగా మొక్కలు నాటాలి. అప్పుడే భవిష్యత్ తరాలు జీవించడానికి అవకాశం ఇచ్చినవాళ్లమవుతాం. మొక్కలు నాటడాన్ని నిత్య జీవితంలో భాగంగా చేసుకోవాలి’అని పిలుపునిచ్చారు. -
సినిమా గురించి చెప్పుకుంటే ఆ కిక్కే వేరు
‘‘కరోనా సమయంలో ఏదైనా టీజర్, ట్రైలర్ రిలీజ్ చేయమంటే ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఓ బటన్ నొక్కి, దాని గురించి విష్ చెబితే అయిపోతుంది. అయితే ఇలా వచ్చి కళాభిమానుల్ని, ప్రేక్షకుల్ని కలుసుకుంటూ ఈ క్లాప్స్ వింటూ ఆ సినిమా గురించి చెప్పుకుంటే ఆ కిక్కే వేరు’’ అని హీరో చిరంజీవి అన్నారు. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవ్ స్టోరి’. కె. నారాయణ్ దాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలకానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన ‘లవ్ స్టోరీ అన్ ప్లగ్డ్’ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ–‘‘నారాయణ్ దాస్‌గారితో 1980 నుంచి నాకు మంచి సంబంధాలున్నాయి. వారి అబ్బాయి సునీల్ నారంగ్ తండ్రికి మించిన తనయుడయ్యాడు. ‘లవ్ స్టోరీ’ అనగానే చాలా ఆసక్తి కలిగింది.. ఎందుకంటే ప్రేమకథా చిత్రాలు చూసి చాలా రోజులైంది. నా మిత్రుడు నాగార్జున కొడుకు నాగచైతన్య వెరీ కూల్ బాయ్. యంగ్‌స్టర్స్ అంతా ఎగసి పడుతుంటారు.. కానీ ఎప్పుడూ కంపోజ్డ్గా ఉంటాడు చైతన్య. కూల్ ఫాదర్‌కి (నాగా ర్జున) కూల్ సన్ నాగచైతన్య. తను నిలకడగా వెళుతుంటాడు.. అది ఇండస్ట్రీలో సుస్థిర స్థానం సంపాదించుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. నా మిత్రుడు ఆమిర్‌ఖాన్, నాగచైతన్య నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నా. సాయిపల్లవిని తొలిసారి మా వరుణ్ తేజ్ ‘ఫిదా’చిత్రంలో చూశాను. ఆ సినిమా రిలీజ్ అయ్యాక వరుణ్ వచ్చి, ‘డాడీ.. డ్యాన్స్ ఎలా చేశాను నేను’ అన్నాడు. ‘సారీ రా.. నేను నిన్ను చూడలేదు.. సాయిపల్లవిని మాత్రమే చూశా’ అన్నాను. నా సినిమాలో చెల్లెలి పాత్ర కోసం సాయిపల్లవిని అడిగారు.. అయితే తను కుదరదు అంది.. నేను కూడా అదే కోరుకున్నా. ఎందుకంటే అంత మంచి డ్యాన్సర్‌తో నేను డ్యాన్స్ చేయాలనుకుంటాను కానీ ‘చెల్లెమ్మా’ అని పిలవగలనా?.. పిలవలేను. నా పక్కన రొమాంటిక్ హీరోయిన్గా చేయగలిగితే ఓకే. శేఖర్ కమ్ముల ఎవరి వద్దా పనిచేయకపోయినా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయ్యాడు. ‘లవ్ స్టోరీ’ ప్రేక్షకులను అలరిస్తుందనడంలో నో డౌట్’’ అన్నారు. హీరో ఆమిర్‌ఖాన్ మాట్లాడుతూ – ‘‘లవ్ స్టోరీ’ ట్రైలర్ చూసి, బాగుందని చైతూకు(నాగచైతన్య) మెసేజ్ చేశా. నా ‘లాల్‌సింగ్ చద్దా’ చిత్రంలో తను నటించారు. నా సినిమా సెట్స్‌లో చైతన్యను ఫస్ట్‌టైమ్ చూసినప్పుడు ఎన్నో సంవత్సరాలుగా అనుబంధం ఉన్న ఫీలింగ్ కలిగింది. చైతూ చాలా మంచి వ్యక్తి, సౌమ్యుడు, సంస్కారవంతుడు. ‘లవ్ స్టోరీ’ చిత్రాన్ని థియేటర్స్‌లోనే చూస్తాను. ముంబయ్‌లో థియేటర్స్‌లో స్క్రీనింగ్‌కు ఇబ్బందులు ఉంటే అధికారుల అనుమతితో ప్రత్యేక స్క్రీనింగ్‌లో అయినా చూస్తాను’’ అన్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ–‘‘లవ్ స్టోరీ’ ట్రైలర్ చూస్తుంటే నాగ చైతన్య, సాయి పల్లవి బాగా నటించారని తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాలు విడుదల చేసేందుకు చాలా మంది నిర్మాతలు భయపడతున్నారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మెరుగుపడ్డాయి. తమ సినిమాను థియేటర్లోనే విడుదల చేసేందుకు ముందుకొచ్చిన ‘లవ్ స్టోరీ’ నిర్మాతలకు అభినందనలు. ఇండస్ట్రీపై ఆధారపడి ఎంతో మంది కార్మికులు జీవిస్తున్నారు. వాళ్లు బాగుండాలంటే సినిమా అన్ని సెక్టా ర్లలో పుంజుకోవాలి’’ అన్నారు. ‘‘ఈ వేడుకకి వచ్చిన చిరంజీవి, ఆమిర్ ఖాన్‌గార్లకు థ్యాంక్స్. నాగచైనత్య, సాయిపల్లవి, శేఖర్ కమ్ములతో పాటు మా ‘లవ్ స్టోరీ’ చిత్ర యూనిట్‌కి అభినందనలు’’ అన్నారు కె. నారాయణ్ దాస్ నారంగ్. నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘మీరు(చిరంజీవి) నాకు ఆన్‌స్క్రీన్ మెగాస్టార్. ఆఫ్ స్క్రీన్ మెగా హ్యూమన్ బీయింగ్. కరోనా కష్టకాలంలో మీరు ఇండస్ట్రీకి సపోర్ట్ చేసిన తీరు స్ఫూర్తిదాయకం. ‘లవ్ స్టోరీ’ ట్రైలర్ చూసి, అభినందించి ఈ వేడుకకు వస్తానని ఆమిర్ఖాన్గారు వచ్చారు. ‘లాల్‌సింగ్ చద్దా’ సినిమా కోసం 45 రోజులు షూటింగ్లో పాల్గొన్నాను. ఆ సమయంలో ఆమిర్‌గారి నుంచి నేను నేర్చుకున్న విషయాలు నాకు జీవితాంతం ఉపయోగపడతాయి. ‘లవ్ స్టోరీ’ లో ఇంతలా పెర్ఫార్మ్ చేశానంటే అందుకు కారణం శేఖర్ కమ్ములగారే. సినిమాను థియేటర్స్‌లో విడుదల చేస్తున్నందుకు మా నిర్మాతలకు ధన్యవాదాలు. యాభైఏళ్ల క్రితం తాతగారి (అక్కినేని నాగేశ్వరరావు) ‘ప్రేమ్‌నగర్’ సినిమా విడుదలైన తేదీనే ‘లవ్‌స్టోరీ’ వస్తోంది.. అన్నీ రాసిపెట్టినట్లుగా అనిపిస్తోంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు శరత్ మరార్, భరత్ నారంగ్, అభిషేక్ అగర్వాల్, కెమెరామెన్ విజయ్ సి.కుమార్, సంగీత దర్శకుడు పవన్ సి.హెచ్, ఎడిటర్ మార్తాండ్ కె.వెంకటేష్, పాటల రచయితలు భాస్కర భట్ల, సురేంద్ర, ఆదిత్య మ్యూజిక్ అధినేత ఉమేష్ గుప్తా, నటి ఈశ్వరీ రావు తదితరులు పాల్గొన్నారు. ‘‘కొన్ని దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమ సక్సెస్ రేట్ మహా అయితే 20శాతం. ఈమాత్రం దానికే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుందనుకుంటారు. కానీ, కష్టాలు పడేవారు, సాధక బాధకాలు అనుభవించే వారు, రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో ప్రత్యక్షంగా వేల మంది, పరోక్షంగా లక్షల మంది ఉన్నారు. ఇలాంటి వారంతా కలిస్తేనే ఇండస్ట్రీ తప్ప ఓ నలుగురైదుగురు హీరోలు, నిర్మాతలు, డైరెక్టర్లు కలిస్తే కాదు. కరోనా సమయంలో షూటింగ్స్ ఆగిపోవడంతో కార్మికులు ఎలాంటి ఇబ్బందులు పడ్డారనేది ప్రత్యక్షంగా చూశాం. ఏ విపత్తు వచ్చినా సాయానికి ముందుండేది మా సినిమా ఇండస్ట్రీనే అని గర్వంగా చెప్పగలను. అలాంటి ఇండస్ట్రీ ఈ రోజున సంక్షోభంలో పడిపోయింది.. సినిమా నిర్మాణం ఖర్చు పెరిగిపోయింది.. ఈ వేదికగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను మా విన్నపాల పట్ల సానుకూలంగా స్పందించి నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను’’ – చిరంజీవి -
మొక్కలు నాటిన అమీర్ ఖాన్, నాగచైతన్య.. ఫోటోలు వైరల్
పర్యావరణం పచ్చగా ఉండాలనే దృఢ సంకల్పంతో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’కి విశేష స్పందన లభిస్తోంది. స్టార్ నటుల నుంచి సామాన్యుల వరకు ఈ మహోత్తర కార్యక్రమంలో భాగస్వామ్యులవుతున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ విలక్షణ చిత్రాల హీరో అమీర్ ఖాన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటారు. ఆదివారం హైదరాబాద్ చేరుకున్న మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్, తన లాల్ సింగ్ చద్ధా సహానటుడు, టాలీవుడ్ యంగ్ టర్క్ అక్కినేని నాగచైతన్య, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌తో కలిసి బేగంపేట ఎయిర్ పోర్ట్ లో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఎన్నో ఛాలెంజ్ లను మనం చూసాం కానీ, మొక్కలు నాటాలనే అద్భుతమైన ఛాలెంజ్ ను మనకు అందించిన ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మనందరం తప్పనిసరిగా మొక్కలు నాటాలి, వాటిని బాధ్యతగా పెంచాలి. అప్పుడే మన భవిష్యత్ తరాలకు మనం జీవించడానికి అవకాశం ఇచ్చినవాళ్లం అవుతాం. దీన్ని ఒక కార్యక్రమంగా కాకుండా.. నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని ప్రతీ ఒక్కరిని వేడుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో రామ్మోహన్ రావు, రాఘవ తదితరులు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘లాల్ సింగ్ చద్దా’: ముగిసిన షూటింగ్, రిలీజ్ ఎప్పుడంటే..
‘లాల్‌సింగ్’ ప్రయాణం ముగిసింది. ఆమిర్‌ఖాన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘లాల్‌సింగ్ చద్దా’. టైటిల్ రోల్లో ఆమిర్, హీరోయిన్గా కరీనా కపూర్ నటిస్తున్న ఈచిత్రంలో అక్కినేని హీరో నాగచైతన్య కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అద్వైత్ చందన్ దర్శకత్వంలో రెండేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా షూటింగ్ ముగిసిన సందర్భంగా సెట్లో చిత్రబృందం కేక్ కట్ చేసి సెలబ్రెట్ చేసుకున్నారు. దేశవ్యాప్తంగా వందకుపైగా లొకేషన్లలో చిత్రీకరణ జరిపారు. వాటిలో తెలుగు రాష్రాల్లోని కాకినాడ, అమలాపురం, హైదరాబాద్ లొకేషన్లు కూడా ఉన్నాయి. 170 రోజులు షూటింగ్ జరిపారు. లాక్డౌన్ పరిస్థితుల వల్ల చిత్రీకరణ ఆలస్యమైంది. ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ ‘ఫారెస్ట్ గంప్’కు హిందీ రీమేక్‌గా రపొందిన ‘లాల్‌సింగ్ చద్దా’ చిత్రాన్ని క్రిస్మస్ సందర్భంగా ఈ ఏడాది డిసెంబరులో విడుదల చేయాలనుకుంటున్నారు.