ACB Telangana
-
ఫార్ములా కారు రేసు కేసులో ఏసీబీ దూకుడు.. నోటీసులు జారీ
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా ఈ-కారు రేసు కేసు దర్యాప్తులో ఏసీబీ దూకుడు పెంచింది. తాజాగా ఎఫ్ఈవో కంపెనీకి ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చారు. కారులో రేసులో భాగంగా రూ.55కోట్లను ఎఫ్ఈవోకు బదిలీ చేసిన హెచ్ఎండీఏ. ఈ క్రమంలో ఎఫ్ఈవో సంస్థ సీఈవో స్టేట్మెంట్ను ఏసీబీ రికార్డ్ చేయనుంది. ఈ నేపథ్యంలో విచారణ కోసం ఏసీబీని నాలుగు వారాల సమయం కోరారు ఎఫ్ఈవో సంస్థ సీఈవో. దీంతో, ఏసీబీ ఎలాంటి నిర్ణయం చెబుతుందో తెలియాల్సి ఉంది.ఇదిలా ఉండగా.. తెలంగాణలో ఫార్ములా ఈ-కారు రేసు రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసులో నిందితులను మరోమారు విచారణకు పిలవాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఏ–1గా ఉన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుతో పాటు ఏ–2.. ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్, ఏ–3.. హెచ్ఎండీఏ మాజీ సీఈ బీఎల్ఎన్ రెడ్డిలకు నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో కేటీఆర్‌కు మరోసారి నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.ఇక, ఇప్పటికే ఈనెల 9న కేటీఆర్‌ను ఏడు గంటలపాటు విచారించిన విషయం తెలిసిందే. తాజాగా శనివారం.. కార్ రేసు నిర్వహణలో స్పాన్సర్‌గా వ్యవహరించిన ఏస్ నెక్ట్స్‌జెన్, దాని అనుబంధ సంస్థ గ్రీన్కో ఎండీ చలమలశెట్టి అనిల్‌కుమార్‌ను విచారించిన అధికారులు కీలక వివరాలు రాబట్టినట్టు తెలిసింది. రేస్ నిర్వహణ, అందుకు సంబంధించి జరిగిన ఆర్థిక లావాదేవీలు, రేస్ నుంచి సంస్థ తప్పుకోవడం.. అందుకు దారి తీసిన పరిస్థితులు ఇలా పలు కోణాల్లో ఆయన్ను అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఈసారి మరింత లోతుగా..చలమలశెట్టి ఇచ్చిన కీలక సమాచారం, గతంలో సేకరించిన పత్రాల ఆధారంగా మరోమారు కేటీఆర్‌ను లోతుగా ప్రశ్నించాలని ఏసీబీ భావిస్తున్నట్టు సమాచారం. అప్పటి మంత్రి ఆదేశాల మేరకు తాము కేవలం విధులు నిర్వర్తించామని అర్వింద్‌కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలు తమ స్టేట్మెంట్లలో పేర్కొన్నారు. ఇక కేటీఆర్.. మంత్రిగా తానే ఆదేశాలు జారీ చేశానని, రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యానే తాను ఆదేశించానని, నిధుల చెల్లింపులలో నిబంధనలు పాటించడం అన్నది అధికారులకు సంబంధించిన అంశమని పలుమార్లు స్పష్టం చేశారు. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని, మరోమారు కేటీఆర్, అర్వింద్‌కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలను విచారించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అయితే ఈసారి కేటీఆర్ విచారణ సందర్భంగా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. -
అనుమతులు లేకుండా చెల్లింపులా?.. కేటీఆర్‌పై ఏసీబీ ప్రశ్నల వర్షం
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా–ఈ కార్ రేసు నిర్వహణకు ఎలా బీజం పడింది?, నిబంధనలు ఎందుకు అతిక్రమించాల్సి వచ్చింది?, ఒప్పందాలతో పాటు నగదు చెల్లింపులకు సంబంధించిన ఫైళ్ల నిర్వ హణ ఎలా జరిగింది?, హెచ్ఎండీఏ పాలకమండలి అనుమతి లేకుండా, విదేశీ మారకద్రవ్య నిబంధనలు ఉల్లంఘించి ప్రైవేటు సంస్థకు పెద్దమొత్తం ఎలా చెల్లిస్తారు?, కేబినెట్, ఆర్థికశాఖ అనుమతి లేకుండా నిధుల మళ్లింపు ఎలా చేశారు?, ఫార్ములా–ఈ కార్ రేసు నిర్వహణతో రాష్ట్రానికి రూ.700 కోట్ల లాభం వచ్చినట్టు మీరు చెప్తున్నారు.. వాటి లెక్కలేవి?, రేసుకు సంబంధించిన ప్రకటనలతో ప్రభుత్వ సంస్థలకు ఏం లాభాలు వచ్చాయి?, టికెట్లు అమ్మడం ద్వారా వచ్చిన ఆదాయం ఎంత?..తదితర అంశాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావుపై ఏసీబీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. మంత్రిగా కేటీఆర్ తీసుకున్న నిర్ణయం, దాని తాలూకు కేబినెట్ ఆమోదం ఫైళ్ల సర్క్యులేషన్‌కు సంబంధించిన ప్రక్రియ, నిధుల బదిలీ..వంటి అంశాల కేంద్రంగా ఏసీబీ విచారణ కొనసాగినట్టు తెలిసింది. సుమారు 7 గంటల విచారణ సందర్భంగా అధికారులు పదేపదే ఒకే అంశంపై ప్రశ్నిస్తుండడంతో ‘మీరు ఎన్ని గంటలు ఈ కార్యాలయంలో కూర్చోమన్నా కూర్చుంటా..మీకు కావాలి అంటే బ్రేక్ తీసుకోండి.. కానీ అడిగిన ప్రశ్నలే పలు రకాలుగా అడగడం వలన లాభం లేదు. ప్రభుత్వం ఒకవేళ నన్ను అరెస్టు చేయమని మీకు ఆదేశాలు ఇస్తే..ఈ ప్రశ్నలు అడగడం అనే వృధా ప్రయాస మానేసి ప్రభుత్వ ఆదేశాలు అమలు చేసుకోవచ్చు..’ అని కేటీఆర్ అన్నట్టు తెలిసింది. ఏసీబీ జేడీ ఆధ్వర్యంలో స్టేట్మెంట్ రికార్డ్ ఫార్ములా–ఈ కార్ రేసు నిర్వహణకు సంబంధించిన కేసులో ఏసీబీ అధికారులు నోటీసు ఇవ్వడంతో కేటీఆర్ గురువారం ఉదయం వారి ఎదుట విచారణకు హాజరయ్యారు. కోర్టు అనుమతి నేపథ్యంలో న్యాయవాది, మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ రామచందర్‌రావుతో కలిసి ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. కోర్టు ఆదేశం ప్రకారం..విచారణ సమయంలో న్యాయవాదికి కేటీఆర్ కనిపించేలా ఏర్పాటు చేశారు. జాయింట్ డైరెక్టర్ రితిరాజ్ ఆధ్వర్యంలో మొత్తం ఐదుగురు సభ్యుల బృందం ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేసింది. బిజినెస్ రూల్స్ అధికారులు చూసుకుంటారు.. రేసు నిర్వహణ ఫైల్ కేబినెట్ ఆమోదానికి ఎందుకు పంపలేదు? అన్న అంశంపై ఏసీబీ అధికారులు పలుమార్లు ప్రశ్నించగా.. బిజినెస్ రూల్స్ గురించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఉన్నతాధికారులే చూసుకుంటారని కేటీఆర్ సమాధానం ఇచ్చినట్టు సమాచారం. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు ఏసీబీకి లేదని ఆయన పేర్కొన్నారు. రేసు కొనసాగించకపోవడం వల్ల ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టం వాటిల్లిందని.. ఒప్పందం రద్దుచేసి ప్రభుత్వానికి నష్టం చేకూర్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఈ కేసులో ఎందుకు భాగస్వామిగా చేర్చలేదని కేటీఆర్ ప్రశ్నించినట్లు సమాచారం. రేసు నిర్వహణకు కేబినెట్ ఆమోదం గురించి ఏసీబీ ప్రశ్నించినప్పుడు.. కేబినెట్ ఆమోదం లేకుండా రేసు రద్దు చేసినందుకు ముఖ్యమంత్రిని కూడా బాధ్యుల్ని చేయాల్సి వస్తుందని కేటీఆర్ అన్నట్టు తెలిసింది. ఈ రేసుకు సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలు అన్నీ, రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు తనకు ప్రభుత్వం కేటాయించిన అధికారిక ఈ–మెయిల్లో ఉన్నాయని.. ప్రస్తుతం ఆ అకౌంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం వద్దనే ఉందని స్పష్టం చేశారు. మంత్రిగా విధానపరమైన నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వంలో భాగమైన తనకు ముమ్మాటికీ ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మీరు తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన జీవోను ఏమైనా ఇచ్చిందా? అని ప్రశ్నించినప్పుడు.. సచివాలయ బిజినెస్ రూల్స్ అన్నీ సీఎస్ పరిధిలో ఉంటాయని, ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వాన్నే అడగాలని కేటీఆర్ చెప్పినట్టు తెలిసింది. ఏస్ నెక్సŠట్ జెన్ సంస్థ మొదటిసారి రేసు నిర్వహించినప్పుడు పూర్తిగా డబ్బులు చెల్లించలేదంటూ.. ఆ సంస్థ ఆర్థిక వ్యవహారాల గురించి ప్రశ్నించినప్పుడు... ప్రైవేటు సంస్థ వివరాలు తనకు తెలియదని, ఆ అంశం తన పరిధిలోనిది కాదని కేటీఆర్ చెప్పినట్లు తెలిసింది. పత్రాలతో హాజరు..రేసుతో లబ్ధిపై వివరణ ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్‌లోని ఏసీబీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న కేటీఆర్.. ఏసీబీ ప్రశ్నించేందుకు అవకాశం ఉన్న పలు అంశాలకు సంబంధించిన కొన్ని పత్రాలను తన వెంట తెచ్చుకున్నారు. ముందు ఏసీబీ సీఐయూ డీఎస్పీ, ఈ కేసు దర్యాప్తు అధికారి మాజిద్ అలీని కలిసి, దర్యాప్తునకు సంబంధించి నోటీసులు తీసుకున్నారు. అప్పటికే కేటీఆర్‌ను విచారించేందుకు సిద్ధంగా ఉన్న ఏసీబీ జేడీ బృందం.. ప్రత్యేక గదిలో కేటీఆర్‌ను ప్రశ్నించింది. కాగా ఫార్ములా ఈ రేసు నిర్వహించడానికి గల కారణాలు..రేసు నిర్వహణతో రాష్ట్రానికి ఎలాంటి లబ్ధి జరిగిందన్న అంశాలను కేటీఆర్ వివరించినట్టు తెలిసింది. రేసు నిర్వహణతో రాష్ట్రానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా జరిగిన లబ్ధికి సంబంధించి కొన్ని పత్రాలు కూడా అందజేసినట్లు సమాచారం. విచారణ మధ్యలో కాసేపు భోజన విరామం ఇచ్చారు. ఒకవైపు కేటీఆర్‌ను ప్రశ్నిస్తూనే, మరోవైపు దర్యాప్తులో భాగంగా సేకరించిన అంశాలను ఏసీబీ అధికారులు పరిశీలించినట్టు తెలిసింది. సాయంత్రం 5 గంటల వరకు కేటీఆర్‌ను ప్రశ్నించిన అధికారులు, దర్యాప్తులో భాగంగా అవసరమైతే మళ్లీ హాజరుకావాల్సి ఉంటుందని సూచించినట్టు తెలిసింది. కాగా సాయంత్రం 5.06 గంటల సమయంలో కేటీఆర్ ఏసీబీ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. అక్కడ కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. రేవంత్ రాసిచ్చిన నాలుగైదు ప్రశ్నలనే 40 రకాలుగా అడిగారు: మీడియాతో కేటీఆర్ ‘ఏసీబీ పెట్టింది చెత్త కేసు..ఇందులో విషయమే లేదు. నాలుగైదు ప్రశ్నలనే 40 రకాలుగా అడిగారు. కొత్తగా అడిగిందేమీ లేదు. రేవంత్ రాసిచ్చిన నాలుగైదు ప్రశ్నలనే అటూ ఇటూ తిప్పి అడిగారు. నాపై కేసు పెట్టి రేవంత్‌రెడ్డి ఏదైనా సాధించాలనుకుంటే అది మూర్ఖత్వమే అవుతుంది. పైసలు పంపాను అని నేనే చెబుతున్నా. డబ్బులు వచ్చాయని వాళ్లు (ఎఫ్ఈఓ) చెబుతున్నారు. ఇందులో అవినీతి ఎక్కడుందని ప్రశ్నిస్తే అధికారుల దగ్గర సమాధానమే లేదు. వాళ్లు అడిగిన అన్ని ప్రశ్నలకు నాకున్న అవగాహన మేరకు సమాధానమిచ్చా. ఎన్నిసార్లు పిలిచినా తప్పక వస్తానని చెప్పా..’ అని కేటీఆర్ తెలిపారు. అభ్యంతరం తెలిపిన డీసీపీ కేటీఆర్ మీడియాతో మాట్లాడడంపై డీసీపీ విజయ్‌కుమార్ అభ్యంతరం తెలిపారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. ‘ట్రాఫిక్ ఇబ్బంది అవుతోంది.. ఇది మీడియా పాయింట్ కాదు..ఇక్కడ మీడియా సమావేశం పెట్టొద్దు..’ అని డీసీపీ అనడంతో కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ‘నేను ఇక్కడ మాట్లాడితే ఏం నొచ్చింది. ఏం ఇబ్బంది అయ్యింది. మీడియాపై మీ దాడి ఏంది..? మీకు ఇంత భయం ఎందుకు?..’ అంటూ నిలదీశారు. అయితే మీడియా ప్రతినిధులను పోలీసులు పక్కకు నెట్టేయడంతో కేటీఆర్ అక్కడి నుంచి నిష్క్రమించారు. -
ముగిసిన కేటీఆర్ ఏసీబీ విచారణ
ముగిసిన కేటీఆర్ ఏసీబీ విచారణఫార్ములా ఈ కారు రేసు కేసులో కేటీఆర్ ఏసీబీ విచారణ ముగిసిందిఏడుగంటల పాటు కొనసాగిన విచారణమరోసారి విచారణకు రావాలని కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులుఏసీబీ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్ పైసలు పంపించానని చెబుతున్నా.. వాళ్లు పైసలు ఇక్కడే ఉన్నాయని చెప్పారు కరప్షన్ ఎక్కుడందని అడిగినా.. వాళ్ల నుంచి సమాధానం లేదుమీరు విచారణకు ఎన్నిసార్లు పిలిచినా వస్తానని ఏసీబీ అధికారులకు చెప్పాను రాజకీయ ఒత్తిడిలో పొలిటికల్ కేసు పెట్టి ఏదో చేయాలని చూస్తే అది సీఎం రేవంత్‌రెడ్డి మూర్ఖత్వమే అవుతుంది.పాపం వాళ్లు(ఏసీబీ అధికారులు) రేవంత్ రాసిచ్చిన నాలుగు ప్రశ్నల్ని అలా తిప్పి.. ఇలా తిప్పి నలబైసార్లు అడిగారుఇది అసంబద్ధమైన కేసు అని ఏసీబీ అధికారులకు చెప్పానునాకు తెలిసిన సమాచారం అంతా ఏసీబీకి ఇచ్చానువిచారణకు ఎప్పుడు పిలిచినా వస్తానుఎప్పుడు పిలిచినా సంతృప్తికర సమాధానం ఇస్తానువాళ్లు ఎప్పుడు విచారణకు పిలుస్తారో తెలియదుఏసీబీ ఆఫీస్‌లో కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్న అధికారులుఫార్ములా ఈ కారు రేసు కేసులో కేటీఆర్ విచారణ. ఏసీబీ ఆఫీస్‌లో కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్న అధికారులుఫార్ములా ఈ కార్ రేసు కేసులో కీలక పరిణామంబీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్(KTR) విచారణఈ కేసులో ఏ1గా కేటీఆర్తెలంగాణ కోర్టులో కేటీఆర్‌కు దక్కని ఊరటహైకోర్టు తీర్పుతో.. కేటీఆర్ అరెస్ట్‌కు ఏసీబీకి తొలగిన అడ్డంకులు!ఏసీబీ తదుపరి చర్యలపై ఉత్కంఠ ప్రధాన అభియోగం ఇదే.. ఫార్ములా-ఈ ఆపరేషన్స్, ఎస్ నెక్ట్స్ జెన్, పురపాలకశాఖల మధ్య 9, 10, 11, 12వ సీజన్ల కార్ రేస్‌లు నిర్వహించేలా ఒప్పందం 2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో నెక్లెస్‌రోడ్డులో తొమ్మిదో సీజన్ రేసింగ్ నిర్వహణ. అప్పటి మంత్రి కేటీఆర్ ఆమోదంతోనే కుదిరిన ఒప్పందం శాఖాధిపతిగా ఎంవోయూ చేసిన ఐఏఎస్ అర్వింద్ కుమార్ ఈ రేసు నిర్వహించిన విదేశీ సంస్థకు హెచ్ఎండీఏ నుంచి చెల్లింపులు HMDA బోర్డు, ఆర్థిక శాఖ, ఆర్బీఐల అనుమతి తీసుకోకుండానే నేరుగా రూ.55 కోట్లు చెల్లింపుముఖ్యంగా రూ.46 కోట్ల వరకు డాలర్ల రూపంలో చెల్లించారనేది ప్రధాన అభియోగం.ఆయన ఫిర్యాదుతోఫార్ములా-ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో ఏ-1గా కేటీఆర్ పేరుఏ2గా ఐఏఎస్ అర్వింద్‌కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి పుపాలకశాఖ ముఖ్యకార్యదర్శి దానకిషోర్ ఫిర్యాదు మేరకు కదలిన వ్యవహారం గవర్నర్ అనుమతి.. ఆపై ఏసీబీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఫార్ములా రేసు పూర్వాపరాలు, అనుమతి లేకుండానే హెచ్ఎండీఏ(HMDA) ఒప్పందం చేసుకోవడం, ఆర్బీఐ అనుమతి లేకుండా రూ.46 కోట్ల మేర విదేశీ కరెన్సీ చెల్లించడం వంటి వ్యవహారాలపై ఏసీబీ దృష్టి కేటీఆర్ విచారణ.. పెరుగుతున్న ఉత్కంఠఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కొనసాగుతున్న విచారణKTR విచారణ పై గంట గంటకు కొనసాగుతున్న ఉత్కంఠ..KTR ఏసీబీ విచారణ నేపథ్యంలో ఏసీబీ కార్యాలయం పరిసరాల్లో భారీగా మొహరించిన BRS శ్రేణులుఆరు గంటలుగా కొనసాగుతున్న ఏసీబీ విచారణఫిర్యాదు దారుడు దాన కిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా కొనసాగుతున్న విచారణIAS అరవింద్ కుమార్ ఇచ్చిన వాగ్మూలం ముందు ఉంచి ప్రశ్నిస్తున్న ఏసీబీFEO తో ఒప్పందాలు నగదు,బదిలీ అంశాలపై ప్రశ్నిస్తున్న ఏసీబీకేబినెట్ ఆమోదం, ఆర్ధిక శాఖ అనుమతి లేకుండా ఎందుకు నగదు బదిలీ చేశారు?ఫార్ములా ఈ కార్ రేస్ నుంచి గ్రీన్ కో తప్పుకోవడానికి కారణం ఏంటి?BRS పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోళ్లపై ప్రశ్నిస్తున్న ఏసీబీఇప్పటికే సేకరించిన పత్రాలు ముందు ఉంచి ప్రశ్నిస్తున్న ఏసీబీకేటీఆర్కు ఏసీబీ సంధించిన ప్రశ్నలు ఇవేనా?అసలు హైదరాబాద్‌లో ఫార్ములా రేస్ ప్రతిపాదన ఎవరిది? ఎవరు ఆమోదించారు?ఇక్కడే ఎందుకు నిర్వహించారు?ప్రభుత్వానికి ఏమైనా ప్రయోజనం కలిగిందా?నగదు బదిలీ చేస్తే ఇబ్బందులు వస్తాయని ఎవరైనా హెచ్చరించరా?అసలు నిబంధనలు పట్టించుకోకుండా ఎందుకు బదిలీ చేశారు?గ్రీన్కో ఎందుకు స్పాన్సర్షిప్ నుంచి వైదొలగిందినిధుల మళ్లింపు కేబినెట్ దృష్టికి ఎందుకు వెళ్లలేదు?లంచ్‌బ్రేక్ తర్వాత తిరిగి ప్రారంభమైన కేటీఆర్ విచారణకేటీఆర్ను తిరిగి విచారిస్తున్న ఏసీబీలంచ్ తర్వాత కేటీఆర్‌ను విచారిస్తున్న ఏసీబీకేటీఆర్ విచారణ.. లంచ్ బ్రేక్కేటీఆర్ ఏసీబీ విచారణకు లంచ్ బ్రేక్భోజన విరామం తర్వాత కొనసాగనున్న విచారణఇప్పటిదాకా.. మూడున్నర గంటలకు పైగా కొనసాగిన విచారణ రెండు గంటలుగా విచారణ ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్న ఏసీబీ ప్రత్యేక బృందం రెండు గంటలుగా కొనసాగుతున్న విచారణకేటీఆర్ ఓ రూంలో.. ఆయన లాయర్ మరో రూంలోరేసు ఒప్పందాలు, నగదు బదిలీపైనే ప్రధానంగా కొనసాగుతున్న విచారణకేటీఆర్కు ప్రశ్నల వర్షంఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్న అధికారులు ఓ గదిలో కేటీఆర్, పక్కనే లైబ్రరీలో ఆయన లాయర్ రామచందర్రావులాయర్కు కేటీఆర్ కనిపించేలా ఏర్పాట్లుకేటీఆర్పై ప్రశ్నల వర్షం గుప్పిస్తున్న ఏసీబీ అధికారుల బృందంHMDA నుంచి FEOకు రూ. 55 కోట్ల నగదు బదిలీపై ఆరారేసు ఒప్పందాల కోసం ఎవరిని కలిశారు? ఎప్పడెప్పుడు కలిశారు? ఎలాంటి చెల్లింపులు జరిగాయి? ఏదైనా వివాదాలు వస్తాయని ముందు జాగ్రత్తగా ఆర్బిట్రేషన్ పెట్టుకున్నారా?అని ప్రశ్నించే అవకాశం. ACB-KTR వాదనలు ఇలా.. ఏసీబీ: ఒప్పందం కుదరకముందే చెల్లింపులు జరిగాయిKTR: హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచేందుకే రూ.55 కోట్ల ఖర్చుఏసీబీ: ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ చెల్లింపులు జరిగాయిKTR: గ్రీన్కో సంస్థ వెళ్లిపోవడంతో డబ్బులు సర్దుబాటు చేశాంఏసీబీ: ఒప్పందంలో భాగం కాకపోయినా హెచ్ఎండీఏ ద్వారా చెల్లింపులుKTR: డబ్బులు ఇచ్చిన సంగతి హెచ్ఎండీఏకి తెలుసుఏసీబీ: రూ.54 కోట్ల 88 లక్షల ప్రభుత్వ నిధుల దుర్వినియోగంKTR: ఈవెంట్ ద్వారా వచ్చిన ప్రయోజనం రూ.700 కోట్లుఏసీబీ: ఫార్ములా-ఈకి రెండు విడుతల్లో రూ.45 కోట్ల చెల్లింపులుKTR: కొన్ని సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టాయిఏసీబీ: తొలి విడతలో రూ.22 కోట్ల 69 లక్షల విడుదలKTR: బ్యాటరీ వెహికిల్స్ రీపర్పస్ చేసే విధంగా జీవో తెచ్చాంఏసీబీ: మలివిడతలో రూ.23 కోట్లు చెల్లించిన హెచ్ఎండీఏKTR: మరో సంస్థ రూ.1200 కోట్ల పెట్టుబడులు పెట్టిందిఏసీబీ: ఆర్బీఐ గైడ్‌లైన్స్‌కు విరుద్ధంగా విదేశీ కంపెనీకి చెల్లింపులుKTR: మొబిలిటీ వీక్ ద్వారా ఎన్నో సంస్థలు పెట్టుబడులు పెట్టాయిప్రత్యేక గదిలో కేటీఆర్ విచారణఏసీబీ కార్యాలయంలో కొనసాగుతున్న కేటీఆర్ విచారణఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్న ఏసీబీ అధికారులుజాయింట్ డైరెక్టర్, డీఎస్పీ, సీఐల సమక్షంలో కొనసాగుతున్న విచారణవిచారణకు కేటీఆర్ లాయర్, మాజీ ఏఏజీ రామచందర్రావును లోపలికి అనుమతించిన అధికారులుఅరవింద్కుమార్తో పాటు దానకిషోర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ విచారణ?బిజినెస్ రూల్స్ ఉల్లంఘనతో పాటు నిధుల దుర్వినియోగం అభియోగాలుకేబినెట్ అనుమతి లేకుండా ఒప్పందాలు, ఆర్బీఐ అనుమతి లేకుండా చెల్లింపుల అభియోగాలపై ప్రశ్నలుఏసీబీ ఆఫీస్‌కు కేటీఆర్ఏసీబీ ఆఫీస్‌కు చేరుకున్న కేటీఆర్నందినగర్ నివాసం నుంచి ఏసీబీ ఆఫీస్‌కు చేరుకున్న కేటీఆర్కేటీఆర్ వెంట ఆయన లాయర్, మాజీ ఏఏజీ రామచంద్రరావునిఖార్సైన తెలంగాణ బిడ్డను..: కేటీఆర్నందినగర్ నివాసం వద్ద మీడియాతో కేటీఆర్తెలంగాణ ప్రతిష్టను పెంచడానికే నేను ప్రయత్నించానుహైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచడానికి ప్రయత్నించాంఈ క్రమంలోనే ఈ కార్ రేసు నిర్వహించాంమంత్రిగా తన బామర్దులకు కాంట్రాక్ట్ ఇప్పించే ప్రయత్నం నేనేం చేయలేదుఅరపైసా కూడా అవినీతి చేయలేదుఇంకా ఎన్ని కేసులైనా పెట్టుకో.. వాటిని ఎదుర్కొంటాం (సీఎం రేవంత్‌ను ఉద్దేశించి..)తెలంగాణ బిడ్డగా రాష్ట్రం కోసం పోరాడిన నాయకుడిగా స్పష్టంగా చెప్తున్నారాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్రం ప్రపంచ స్థాయిలో ఎదిగేలా పని చేశా.. మేము కుటుంబం కోసం పని చేయలేదునేను 50 లక్షల డబ్బుతో ఎమ్మెల్యే లను కొని దొరికిన దొంగను కాదునిజం నిలకడ మీద తెలుస్తది మీ వైఫల్యాలపై పోరాడింది బీఆర్ఎస్.. అందుకే మా మీద కేసులు మీ డైవర్షన్ లకు లోనుకామునేను నిఖార్సైన తెలంగాణ బిడ్డను.. ఏ తప్పు చేయలేదుఏ ప్రశ్నలు అడిగిన చెప్తం .. తెలంగాణ కోసం చస్తాను తప్ప తల వంచను ఎక్స్‌లో కేటీఆర్తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను పెంచేందుకేర్ములా ఈ కార్ రేసు నిర్వహించాంపెట్టుబడులను రప్పించేందుకు కోసం కృషి చేశాంవీటన్నింటిని ప్రజలు అర్థం చేసుకుంటారని విశ్వసిస్తున్నాఎప్పటికైనా సత్యం, న్యాయమే గెలుస్తుంది Worked tirelessly for bringing a prestigious event to India, to enhance the Brand image of Hyderabad & Telangana globallyAgenda was to make Hyderabad a pivotal hub for sustainable mobility as the world transitions towards it. Formula-E race was a part of the effort to realise… pic.twitter.com/JhqimVe9TI— KTR (@KTRBRS) January 9, 2025భారీ భద్రత ఏర్పాటుబంజారాహిల్స్లోని ఏసీబీ ఆఫీస్ వద్ద భారీ బందోబస్తుకేటీఆర్ విచారణ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా ఏర్పాటుఏసీబీ ఆఫీస్‌కు ఇరువైపులా భారీ బారికేడ్లుమరోవైపు బీఆర్ఎస్ నేతల హౌజ్ అరెస్టులుకేటీఆర్ ఇంటికి బీఆర్ఎస్ నేతల క్యూ -
కేటీఆర్‌పై ఏసీబీకి మరో ఫిర్యాదు
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు(KTR)పై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ(ACB)కి మరో ఫిర్యాదు వెళ్లింది. అవుటర్ రింగ్‌రోడ్‌లో భారీ అవినీతి జరిగిందని చెబుతూ.. బీసీ పొలిటికల్ జేఏసీ బుధవారం ఫిర్యాదు చేసింది. ఓఆర్ఆర్(ORR)లో రూ.7,380 కోట్ల అవినీతి జరిగిందని, ఆ అక్రమాలపై దర్యాప్తు జరపాలని పేర్కొంటూ మాజీ మంత్రి కేటీఆర్‌పై ఏసీబీకి ఫిర్యాదు వెళ్లింది. ‘‘ఫార్ములా ఈ రేస్ కేసుతోపాటు ఓఆర్ఆర్ అక్రమాల పై కూడా దర్యాప్తు జరపాలి. సీఎం, సీఎస్, ఈడీలతో పాటు ఇవాళ ఏసీబీకి ఫిర్యాదు చేశాం. ఓఆర్ఆర్ చుట్టూ మెయింటనెన్స్ ఖర్చు ఎక్కువగా ఉన్న ప్రాంతం అంతా హెచ్ఎండీఏ పరిధిలోనే ఉంది. ఆదయం వచ్చే రోడ్డును మాత్రం కంపెనీలకు ఇచ్చారు. ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు 2023 ఏప్రిల్ నుండి ముపై ఏళ్ళ పాటు లీజ్‌కు ఇచ్చారు. అయితే.. ఆ కంపెనీ రూ. 25 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చింది. కైటెక్స్ గార్మెన్స్ సైతం ఎక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేసింది. కైటెక్స్ కు సైతం హైదరాబాద్, వరంగల్, రంగారెడ్డి లో భూకెటాయింపులు జరిగాయి. క్విడ్ ప్రోకో(quid pro quo) ఇక్కడ చాలా స్పష్టంగా కనపడుతోంది. హెచ్ఎండీఏ నిధుల పై ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలి. నిధులు దుర్వినియోగంలో అధికారుల పాత్ర పై దర్యాప్తు జరపాలి’’ అని బీసీ పోలిటికల్ జేఏసీ నేత యుగంధర్ గౌడ్ చెప్తున్నారు.ఇదీ చదవండి: ఎన్నికల బాండ్లు.. అది క్విడ్ ప్రోకో ఎలా అవుతుంది?: కేటీఆర్ఏసీబీ నోటీసుల్లో ఏముందంటే.. ఇదిలా ఉంటే.. ఫార్ములా ఈ రేసు కేసులో ఈ నెల 9వ తేదీన విచారణకు రావాలంటూ కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. అందులో ఏసీబీ కీలకాంశాలకు ప్రస్తావించింది..‘‘విచారణకు హాజరు కాకుండా తప్పించుకోవాలని చూస్తున్నారు. ఈ నెల 6వ తేదీన విచారణకు వచ్చినప్పుడు మీ లాయర్‌ను అనుమతించాలని మీరు కోరారు. కానీ, చట్ట ప్రకారం అది సాధ్యం కాదని మీకు తెలియజేశాం. కాబట్టి, 9వ తేదీన మీ విచారణకు కూడా లాయర్‌ను అనుమతించడం కుదరదు. మీరు విచారణకు హాజరుకండి. మీరిచ్చిన సమాచారం ప్రకారం ఏం డాక్యుమెంట్లు కావాలో అడుగుతాం’’ అని ఏసీబీ పేర్కొంది. మరోవైపు విచారణకు తన లాయర్‌ను అనుమతించేలా కోర్టు నుంచి అనుమతి కోసం కేటీఆర్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. -
కడిగిన ముత్యంలా కేటీఆర్ బయటకొస్తారు: హరీష్‌రావు
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఫార్ములా ఈ రేస్ కేసులో తనపై ఏసీబీ(ACB) దాఖలు చేసిన కేసును కొట్టేయాలన్న ఆయన అభ్యర్థనను ఉన్నతన్యాయస్థానం కొట్టేసింది. ఈ పరిణామంపై తెలంగాణ రాజకీయ వర్గాలు స్పందిస్తున్నాయి.హైకోర్టు తీర్పు అనంతరం నందినగర్‌లోని కేటీఆర్ నివాసం వద్ద బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీష్‌రావు మీడియాతో మాట్లాడారు. ‘‘రేవంత్ రెడ్డివి డైవర్షన్ పాలిటిక్స్(Diversion Politics), కక్ష సాధింపు చర్యలు. ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ తరహా రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఇందులో భాగంగానే కేటీఆర్‌పై అక్రమ కేసు పెట్టారు. ఫార్ములా ఈ రేస్ కేసు వల్ల తెలంగాణకు మంచే జరిగింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం కేటీఆర్ కష్టపడ్డారు. ఈ వ్యవహారంలో అవినీతికి ఆస్కారమే లేదు. న్యాయ స్థానాలు, చట్టంపై గౌరవం ఉంది. కేటీఆర్ ఎలాంటి తప్పు చేయలేదు. అందుకే కేటీఆర్ విచారణకు సహకరిస్తానన్నారు. ఏసీబీ విచారణకు వెళ్తే.. 40 నిమిషాలు బయట నిల్చొబెట్టారు. అయినా ఆయన ఓపికగా వ్యవహరించారు. తిరిగి 9వ తేదీన విచారణకు రమ్మన్నారు. ఆ రోజు కూడా ఆయన విచారణకు హాజరవుతారు. ఇది కుట్రపూరితమైన కేసు. మేం సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నాం. ఈ కేసు నుంచి కడిగిన ముత్యంలా కేటీఆర్ బయటకు వస్తారు. మా పార్టీ వాళ్లపై రేవంత్ రెడ్డి ఇంకా కేసులు పెట్టొచ్చు. కానీ, మేం అధైర్య పడం. ఎన్ని కేసులు పెట్టినా ప్రజల తరఫున పోరాడతాం. రేవంత్ అక్రమాలకు ప్రశ్నిస్తూనే ఉంటాం.హైకోర్టు తీర్పు కాపీ ఇంకా అందలేదు. అది వచ్చాక ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై న్యాయనిపుణుల సలహా తీసుకుంటాం. సోషల్ మీడియాలో హైకోర్టు తీర్పుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కేటీఆర్‌ను విచారణ జరపమని మాత్రమే హైకోర్టు చెప్పింది. అసలు విచారణే ప్రారంభం కానప్పుడు.. ఇది తప్పుడు కేసు ఎలా అవుతుంది. కేటీఆర్‌కు శిక్ష పడుతుందంటూ బోగస్ వార్తలు ప్రచురిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు అవి మానుకుంటే మంచిది’’ అని హరీష్ అన్నారు.👉కేటీఆర్ యాక్టింగ్ చూసి సినిమా వాల్లే ఆశ్చర్యపోతున్నారు. జైలు కు పోవడానికి సిద్దం అని..ఇప్పుడు ఈ దొంగ నాటకాలు ఎందుకు.ఈ ఫార్ములా కేసు ను లొట్టపీసు కేసు అన్నది కేటీఆర్ కాదా?. జైలు కు పోయి యోగా చేస్తా అన్నది కేటీఆర్ కాదా?. తప్పే చేయలేదు , సుద్దపూస అని ఇప్పుడు కేటీఆర్ మాట్లాడుతున్నాడు. కేటీఆర్ కు చట్టం తెలియదా? అడ్వకేట్ లతో ఏసీబీ ఆఫీస్ కు ఎలా వెళ్తారు?. కోర్టు పర్మిషన్ లేకుండా అడ్వకేట్ లను ఏసీబీ అనుమతించదని తెలియదా?:::బల్మూరి వెంకట్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ👉కేటీఆర్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. ఫార్ములా ఈ రేసు.. మనీ లాండరింగ్ కేసులాగా అనిపిస్తోంది. ప్రభుత్వంలో ఉంటే ఏ తప్పైనా చేయొచ్చు అనుకుంటే పొరపాటే.:::వీహెచ్, మాజీ ఎంపీ -
కేటీఆర్‌కు బిగ్ షాక్.. వాట్ నెక్స్ట్?
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు బిగ్ షాక్ తగిలింది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఆయన వేసిన క్వాష్ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. అరెస్ట్ నుంచి రక్షణ కోరగా.. ఆ విషయంలోనూ ఊరట ఇవ్వలేదు. దీంతో వాట్ నెక్స్ట్ అనే చర్చ తెరపైకి వచ్చింది. వాస్తవానికి క్వాష్ పిటిషన్ విచారణ సమయంలో హైకోర్టు కేటీఆర్(KTR)కు ఊరట ఇచ్చింది. తీర్పు ఇచ్చేంతవరకు ఆయన్ని అరెస్ట్ చేయొద్దని కోర్టు దర్యాప్తు సంస్థలకు సూచించింది. దీంతో ఇవాళ్టి వరకు ఎలాంటి చర్యలకు అవి ఉపక్రమించలేదు. మరోవైపు.. ఈ కారణం చూపిస్తూనే ఆయన దర్యాప్తు సంస్థల నుంచి విచారణ విషయంలో ఊరట కోరారు. అయితే తాజా తీర్పు నేపథ్యంలో ఫార్ములా ఈ రేస్ కేసులో ఏం జరగబోతోందా? అనే ఉత్కంఠ బీఆర్ఎస్(BRS Party) శ్రేణుల్లో నెలకొంది. మరోవైపు కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తారా? అనే చర్చ జోరుగా నడుస్తోంది.కోర్టు తీర్పు అనంతరం బంజారాహిల్స్ నందినగర్(Nandi Nagar)లోని కేటీఆర్ నివాసం వద్ద భారీ బందోబస్తు కనిపిస్తోంది. తీర్పు వేళ ఆయన సోదరి కవితతో పాటు హరీష్‌రావు, మాజీ మంత్రులు, పలువురు కీలక నేతలు అక్కడికి చేరుకుని కేటీఆర్‌తో మంతనాలు జరుపుతున్నారు. అయితే.. ఈ తీర్పును సవాల్ చేసే యోచనలో బీఆర్ఎస్ లీగల్ టీం ఉన్నట్లు సమాచారం. హైకోర్టు ఉత్తర్వుల కాపీ ఇంకా అందలేదు. సాయంత్రంలోపు అందే అవకాశం ఉంది. అవి అందాక తదుపరి చర్యలపై ఆలోచన చేస్తాం అని లీగల్ టీం ప్రకటించింది. మరోవైపు..ఏసీబీ(ACB) ఇప్పటికే ఆయన్ని 9వ తేదీన విచారణకు రావాలంటూ రెండోసారి నోటీసులు పంపింది. తన వెంట లాయర్‌ను అనుమతించకపోవడంతో సోమవారం ఆయన విచారణకు హాజరుకాకుండానే ఏసీబీ ఆఫీస్ నుంచి వెనుదిరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. విచారణ టైంలోనే కేటీఆర్‌ను అదుపులోకి తీసుకునే అవకాశాలు లేకపోలేదు. మరోవైపు ఆయన్ని ఈ కేసులో ఈడీ సైతం విచారణ జరపాల్సి ఉంది. తాజాగా.. హైకోర్టు క్వాష్ కొట్టేయడంతో మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.ఇదీ చదవండి: కేటీఆర్ క్వాష్ కొట్టివేత, హైకోర్టు ఏం చెప్పిందంటే.. -
కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేత
హైదరాబాద్, సాక్షి: ఫార్ములా ఈ కార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు చుక్కెదురైంది. ఏసీబీ కేసును కొట్టేయాలని వేసిన క్వాష్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. ఏసీబీ దర్యాప్తులో మేం జోక్యం చేసుకోం అని తీర్పు సందర్భంగా పేర్కొంది. అయితే ఆ సమయంలో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కేటీఆర్ తరఫు న్యాయవాది కోరగా.. ఆ విజ్ఞప్తిని ధర్మాసనం పరిగణనలోకి తీసుకోలేదు. ఈ పిటిషన్‌పై ఇరు వైపులా వాదనలు విన్న ధర్మాసనం(Bench).. డిసెంబర్ 31న వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పు వెల్లడించే వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయవద్దని.. కావాలంటే విచారణ జరుపుకోవచ్చని దర్యాప్తు సంస్థలకు సూచించింది. మరోవైపు.. కోర్టు తీర్పు నేపథ్యంతోనే ఆయన ఇవాళ్టి ఈడీ విచారణ వాయిదా పడింది కూడా.ప్రభుత్వ వాదనలు ఇలా..ఏసీబీ తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘‘ఎఫ్ఐఆర్ నమోదు ప్రాథమిక అంశం మాత్రమే. అందులో పేర్కొన్న అంశాలే అంతిమం కాదు. దర్యాప్తులో తేలే విషయాల ఆధారంగా సెక్షన్లు చేరుస్తారు. రెండు నెలల క్రితమే కేసు నమోదుకు నిర్ణయించారు. కేసు నమోదు కోసం గవర్నర్ నిర్ణయానికి పంపారు. గవర్నర్ ఆమోదించాకే కేసు నమోదు చేశారు. ఫార్ములా సంస్థకు డబ్బు విదేశీ కరెన్సీలో చెల్లించారు. దీంతో హెచ్ఎండీఏపై అధిక భారం పడింది. విదేశీ కరెన్సీలో చెల్లింపు కోసం ఆర్బీఐ అనుమతి తీసుకోలేదు. ఆర్థికశాఖ అనుమతి కూడా లేదు.(గవర్నర్ అనుమతి కాపీని కోర్టు అడగడంతో ఏజీ అందజేశారు.)చెల్లింపుల్లో కేటీఆర్ పాత్ర ఏంటని ఈ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది. కేటీఆర్ పాత్ర ఏంటో దర్యాప్తులో తేలుతుందని ఏజీ తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదు అనేది దర్యాప్తు కోసమేనని వివరించారు. కేసు పూర్తి వివరాలు అభియోగపత్రంలో ఉంటాయని, రూ.56 కోట్లకు పైగా చెల్లింపుల్లో నిబంధన ఉల్లంఘన జరిగిందని ఏజీ కోర్టు దృష్టికి తెచ్చారు.దానకిశోర్ తరఫున సీనియర్ న్యాయవాది సీపీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పురపాలక శాఖ మంత్రి పర్యవేక్షణలోనే ఆ శాఖ అధికారులు విధులు నిర్వహిస్తారన్నారు. రేసింగ్‌కు సంబంధించిన చెల్లింపుల దస్త్రాన్ని అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆమోదించారని కోర్టుకు తెలిపారు. రేసింగ్ వ్యవహారంలో అన్ని రకాల నిబంధనలను ఉల్లంఘించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.బీఆర్ఎస్ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా డబ్బు చెల్లించారని కోర్టుకు ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. అవినీతి నిరోధక చట్టం, నేరపూరిత కుట్ర సెక్షన్లు నమోదు చేసినట్లు చెప్పారు. కేటీఆర్ తరఫు వాదనలు..‘‘అవినీతి నిరోధక చట్టం కింద పెట్టిన సెక్షన్లు ఈ కేసుకు వర్తించవు. ముఖ్యంగా 13(1)(a) సెక్షన్ ఈ కేసుకు వర్తించదు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని అనేందుకు ఆధారాలు లేవు. ప్రొసీజర్ పాటించలేదనడం సరైంది కాదు. 14 నెలల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రాథమిక విచారణ కూడా లేకుండా కేసు పెట్టారు. కేవలం రాజకీయ కక్షసాధింపు కోసమే కేటీఆర్‌పై కేసు పెట్టారు. ఈ కేసులో ఎన్నో తప్పులు కనిపిస్తున్నాయి. కార్ రేస్ నిర్వహణకు 2022 అక్టోబరు 25న ఒప్పందం జరిగింది. సీజన్ 10 నిర్వహణకు స్పాన్సర్ వెనక్కి తగ్గారు. రేస్ నిర్వహణలో ఇబ్బందుల నివారణకే ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఇబ్బందులు రాకూడదనే హెచ్ఎండీఏ చెల్లింపులు చేసింది.సీజన్-9 వల్ల దాదాపు రూ.700 కోట్ల లాభం వచ్చింది. ఆర్థికశాఖ అనుమతి లేదని ఏసీబీ అధికారులు అంటున్నారు. కార్ రేసింగ్ ఒప్పందాన్ని కొత్త ప్రభుత్వం ఉల్లంఘించింది. కొత్త ప్రభుత్వం డబ్బు చెల్లించకపోవడంతో ఒప్పందం రద్దయింది. ఎఫ్ఐఆర్ నమోదులో ఆలస్యానికి కారణాలు చెప్పలేదు. సుప్రీం తీర్పుల ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదులో ఆలస్యం తగదు. ఎఫ్ఐఆర్ నమోదుకు ముందు ప్రాథమిక విచారణ అవసరమని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. సుప్రీంకోర్టు తీర్పులను ఏసీబీ అధికారులు పట్టించుకోలేదు. ప్రజాప్రతినిధిపై కేసుకు ముందు ప్రాథమిక విచారణ చేయాలి. 18న ఫిర్యాదు అందగానే.. 19న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేటీఆర్ స్పెక్యులేషన్ చేసినట్టు ఎక్కడా పేర్కొనలేదు. అవినీతి ఎక్కడ జరిగిందో చెప్పలేదు. కానీ, అవినీతి నిరోధక చట్టం కింద కేసు పెట్టారు’’ అని కేటీఆర్ తరఫు న్యాయవాది సుందరం వాదనలు వినిపించారు.ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు.. ఏసీబీ వాదనలనే పరిగణనలోకి తీసుకుని కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను కొట్టేసింది. -
రేవంత్ కనుసన్నల్లోనే ఏసీబీ డ్రామా: జగదీష్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్:ఎలక్టోరల్ బాండ్ల విషయం పాత చింతకాయ పచ్చడిలాగా ఉందని మాజీ మంత్రి,బీఆర్ఎస్ నేత జగదీష్‌రెడ్డి అన్నారు. సోమవారం(జనవరి6) తెలంగాణభవన్‌లో జగదీష్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల బాండ్లకు ఏసీబీకి ఏం సంబంధం అని జగదీష్‌రెడ్డి ప్రశ్నించారు. రేవంత్ కనుసన్నల్లోనే ఏసీబీ డ్రామా ఆడుతోందని విమర్శించారు.‘గ్రీన్ కో కంపెనీ దేశంలో 7,8 పార్టీలకు ఎలక్ట్రోలర్ బాండ్లు ఇచ్చింది.కేసు రూ. 55 కోట్లు ట్రాన్స్‌ఫర్‌కు సంబంధించింది.ఇక్కడ గ్రీన్ కో కంపెనీకి ఎక్కడా లాభం జరగలేదు.ఏసీబీ కేసుకు ,గ్రీన్ కో కంపెనీకీ ఏం సంబంధం.రైతు భరోసా ఎగగ్గొట్టిన విషయం డైవర్ట్ చేయడానికే కేటీఆర్‌కు ఏసీబీ నుంచి నోటీసులు వచ్చాయన్నారు.ఈ డైవర్షన్ పాలిటిక్స్‌తో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నడపలేడు.గ్రీన్ కో కంపెనీ ఎలక్ట్రో బాండ్లు చట్టం ప్రకారం బీఆర్ఎస్ పార్టీకి వచ్చాయి.ఇందులో దాపరికాలు ఏం లేవు.రేవంత్‌రెడ్డి ఇందులో కనిపెట్టింది ఏం లేదు. కేటీఆర్‌పై కుట్ర కేసులో ప్రభుత్వానికి ప్రతిసారి షాక్ తగులుతోంది.ప్రభుత్వం బొక్క బోర్లా పడుతోంది. కేటీఆర్‌పై పనికిమాలిన చెత్త కేసు పెట్టి,చిల్లర ప్రయత్నం చేసింది ప్రభుత్వం.ప్రభుత్వం వద్దే అన్ని ఫైల్స్ ఉన్నాయి.కేటీఆర్ ఇంటిపై ఏసీబీ సోదాలు చేసి ఏవో ఫైల్స్ దొరికాయని లేనిది ఉన్నట్టు క్రియేట్ చేయాలని ఏసీబీ ప్రయత్నం చేస్తోంది.చట్టం,రాజ్యాంగం పట్ల గౌరవంతో కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. రేవంత్ కనుసన్నల్లో ఏసీబీ డ్రామా ఈ రోజు కుదరలేదు’అని జగదీష్‌రెడ్డి విమర్శించారు. ఇదీ చదవండి: ఇది రేవంత్ టీఎం చేస్తున్న దుష్ప్రచారం: కేటీఆర్ -
కేటీఆర్ ఆరోపణలపై స్పందించిన ఏసీబీ
హైదరాబాద్, సాక్షి: ఫార్ములా ఈ కార్ రేసు కేసులో తనను తన అడ్వొకేట్ల సమక్షంలోనే విచారించాలని పట్టుబట్టి.. చివరకు విచారణకు హాజరు కాకుండానే కేటీఆర్ వెనుదిరిగిన విషయం తెలిసిందే. అయితే.. వెళ్లే క్రమంలో ఆయన తన లిఖితపూర్వక స్టేట్మెంట్ను ఏసీబీ డీఎస్పీకి అందజేసి వెనుదిరిగారు. అందులో ఏముందంటే..ఏసీబీ(ACB) తనపై నమోదు చేసిన కేసులో తాను తెలంగాణ హైకోర్టు(Telangana High Court)ను ఆశ్రయించిన విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. అలాగే.. తనకు పంపిన నోటీసులు కేసుకు సంబంధించిన తన నుంచి సమాచారంతో పాటు సంబంధిత పత్రాలను ఏసీబీ కోరిందని పేర్కొన్నారాయన. అయితే.. అవి ఎలాంటి పత్రాలో స్పష్టత ఇవ్వలేదన్నారు... అవి ఎలాంటి పత్రాలో స్పష్టత ఇచ్చి.. తనకు కొంత సమయం ఇవ్వాలని కేటీఆర్(KTR) ఆ స్టేట్మెంట్ ద్వారా కోరారు. రాజ్యాంగం, చట్టం తనకు కల్పించిన హక్కులను వినియోగించుకుంటూనే.. కేసు దర్యాప్తునకు హాజరై సహకరిస్తానని తెలిపారారయన. అయితే హైకోర్టులో తాను వేసిన క్వాష్ పిటిషన్ తీర్పు రిజర్వ్‌లో ఉందని, తీర్పు వచ్చేదాకా తనకు గడువు ఇచ్చే అంశం పరిశీలించాలని ఏసీబీ డీఎస్పీని కేటీఆర్ కోరారు. ఏసీబీ.. నెక్ట్స్ ఏంటి?విచారణకు హాజరు కాకపోవడంతో పాటు తీవ్ర ఆరోపణలు చేసిన కేటీఆర్‌పై చర్యలకు ఏసీబీ ఉపక్రమించబోతోంది. ఆయనకు మరోసారి విచారణకు రావాలంటూ నోటీసులు ఇవ్వనుందని సమాచారం. కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇదే అంశాన్ని కేటీఆర్ ప్రధానంగా ప్రస్తావిస్తూ.. తనను కుట్రపూరితంగానే విచారణకు పిలిచారంటూ మండిపడ్డారు. అయితే తాము తీర్పు ఇచ్చేంత వరకు విచారణ చేసుకోవచ్చని హైకోర్టు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఏసీబీ ప్రస్తావించింది. అలాగే.. కేటీఆర్ చేసిన ఆరోపణలపైనా కోర్టులో మెమో వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక అడ్వొకేట్‌ను ఎందుకు అనుమతించలేదన్న విషయంపై ఏసీబీ అధికారులు స్పందించారు. కోర్టు ఆదేశాలు లేనందునే తాము కేటీఆర్ వెంట వచ్చిన లాయర్‌ను అనుమతించలేదని స్పష్టత ఇచ్చారు. -
‘రాజమౌళి కంటే అద్భుతంగా కథలు’.. కేటీఆర్ ఏసీబీ విచారణలో హైడ్రామా
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా ఈ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు విచారణ సందర్భంగా హైడ్రామా నడిచింది. విచారణకు తనతో పాటు తన లాయర్‌ను ఆఫీస్‌లోకి అనుమతించకపోవడంపై కేటీఆర్ నిరసన వ్యక్తం చేశారు. అధికారుల స్పందన కోసం 40 నిమిషాల పాటు ఏసీబీ ఆఫీస్ బయట ఎదురు చూసి చివరకు అనుమతి లభించకపోవడంతో వెనుదిరిగారు. వెళ్లే క్రమంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘పోలీసులను నేను నమ్మ. లాయర్లు ఉంటేనే నాకు రక్షణ. అందుకే లాయర్‌తో వచ్చా. నా లాయర్‌తో విచారణకు హాజరవుతానంటే వీళ్లకు ఇబ్బంది ఏంటి?. అడ్వొకేట్ల సమక్షంలో విచారిస్తామంటే చెప్పమనండి.. లోపలికి వెళ్తా. పోలీసులు రాజమౌళి(దర్శకుడు) కంటే అద్భుతంగా కథలు అల్లుతున్నారు. నా స్టేట్మెంట్ను ఏఎస్పీకి రాతపూర్వకంగా ఇచ్చాను’’ అంటూ అక్కడి నుంచి నేరుగా తెలంగాణ భవన్‌కు వెళ్లిపోయారాయన. ఏసీబీ విచారణలో హైడ్రామా నడవడంతో లిఖితపూర్వక స్టేట్మెంట్ ఇచ్చి సరిపెట్టిన ఆయన.. రేపటి ఈడీ విచారణకు హాజరవుతారా? అనే ఉత్కంఠ నెలకొంది.ఇందులో తప్పేంటి?: కేటీఆర్అంతకు ముందు నందినగర్ నివాసం నుంచి బంజారాహిల్స్‌లోని ఏసీబీ ఆఫీస్‌కు తన లీగల్ టీంతో చేరుకున్నారాయన. ఆ టైంలో ఆయన లాయర్‌ను పోలీసులు లోపలికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో కేటీఆర్ వాగ్వాదానికి దిగారు. ఆపై మీడియాతో మాట్లాడారు.ఫార్ములా ఈ రేసుపై మంత్రిగా నిర్ణయం తీసుకున్నా. ఏసీబీ దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి. ప్రభుత్వం కావాలనే కక్షపూర్వకంగా వ్యవహరిస్తోంది. ఈ కేసులో నన్ను అసలు విచారణకు పిలవాల్సిన అవసరం లేదు. పట్నం నరేందర్ రెడ్డి విషయంలో జరిగిందే.. నా విషయంలోనూ జరిగే అవకాశం ఉంది. నరేందర్ రెడ్డి విషయంలో తప్పుడు స్టేట్మెంట్ సృష్టించారు. అలాగే నన్ను విచారణకు పిలిచి.. నా ఇంటిపై ఏసీబీతో దాడులు చేయించాలని చూస్తున్నారు. వాళ్లే నా ఇంట్లో ఏదో ఒకటి పెట్టి ఇరికించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదో ఒకరకంగా నాపై తప్పుడు కేసు బనాయించాలని చూస్తున్నారు. నా లాయర్ నాతో పాటే విచారణకు వస్తే తప్పేంటి?. నా లాయర్‌ను అనుమతిస్తారంటే విచారణకు హాజరవుతా’’ అని బయటే అరగంటపైగా ఎదురు చూశారు. అయితే ఏసీబీ అంగీకరించకపోవడంతో ఆయన వెనుదిరిగారు.ఏసీబీది తప్పే: కేటీఆర్ లాయర్కేటీఆర్ వెంట తనను లోపలికి అనుమతించకపోవడంపై ఆయన లాయర్ సోమ భరత్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏసీబీ వైఖరిని తప్పుబట్టారాయన. లాయర్‌ను వెంట తీసుకెళ్లడం రాజ్యాంగబద్ధ హక్కు. చట్టాలన్నీ రాజ్యాంగానికి లోబడి ఉంటాయి. అని అన్నారాయన. నోటీసుల్లో.. కేటీఆర్‌కు ఏసీబీ పంపిన నోటీసుల కాపీ సాక్షి(Sakshi) సంపాదించింది. అందులో ఏసీబీ అధికారులు కీలక అంశాలను పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు విచారణకు హాజరుకావాలని కేటీఆర్‌కు సూచించారు. సెక్షన్ 13 (1),13(2) పీసీ యాక్ట్, ఐపీసీ సెక్షన్ 409,120B సెక్షన్స్ కింద ఆయనకు నోటీసులు జారీ చేశారు. మరోవైపు.. ఎఫ్ఐఆర్ కాపీలో ఏ1గా కేటీఆర్ పేరు ఉంది.బీఆర్ఎస్ నేతల సంఘీభావంఫార్ములా ఈ రేసు కేసులో విచారణకు హాజరవ్వడానికి ముందు.. కేటీఆర్‌ను పలువురు బీఆర్ఎస్ నేతలు కలిసి సంఘీభావం తెలిపారు. మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి. ఇతర బీఆర్ఎస్ నేతలు నందినగర్‌లోని నివాసానికి వెళ్లి మాట్లాడారు. మరోవైపు.. ముందస్తు జాగ్రత్త పేరుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడికౌశిక్రెడ్డిని పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు.మరోవైపు కేటీఆర్‌ను విచారించాలని.. డీజీ విజయ్‌కుమార్, డైరెక్టర్ తరుణ్ ఉదయాన్నే ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. విచారణ నేపథ్యంలో అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ఈ-ఫార్ములా కేసు కేటీఆర్ మెడకు చుట్టుకునేనా?
తెలంగాణ మాజీ మంత్రి, భారత రాష్ట్రసమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)పై కేసు నమోదు కావడం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. ఫార్ములా ఈరేసు నిర్వహణలో నిధులు దుర్వినియోగంపై పెట్టిన ఈ కేసు సమంజసమేనా? దీని ద్వారా కేటీఆర్ చిక్కుల్లో పడతారా? లేక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సెల్ఫ్ గోల్ వేసుకుంటుందా? తెలంగాణలో ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ ఉదంతం తర్వాత కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేయడం హాట్ టాపిక్ అయింది. మంత్రి హోదాలో కేటీఆర్ నిధుల దుర్వినయోగానికి పాల్పడ్డారన్నది అభియోగం. ఆ మేరకు ఆయనపై నాన్ బెయిలబుల్ సెక్షన్లతో కేసు పెట్టారు. ఇద్దరు సీనియర్ అధికారులు అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలపై కూడా కేసు నమోదైంది. కొన్ని నెలల కిందట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాంబు పేలబోతోందని ప్రకటిస్తే, రకరకాల ఊహాగానాలు సాగాయి. కేటీఆర్‌పై కేసు ఆ బాంబు అని అనుకోవాలిప్పుడు. అధికారం పోయిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం తర్వాత తీవ్రమైన ఒత్తిడికి లోనవుతోంది. కేసీఆర్ కుమార్తె కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టు అవడం పార్టీని ఇబ్బంది పెట్టింది. ఇదే టైమ్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణం వంటి వాటిపై రేవంత్ సర్కార్ విచారణ సంఘాలను వేసింది. వీటిలో కాళేశ్వరం విచారణ తీవ్రమైందనే చెప్పాలి. పలువురు ఐఎఎస్, ఇంజనీరింగ్ అధికారులు ఇప్పటికే సాక్ష్యాలు చెప్పారు. కేబినెట్ తో సంబంధం లేకుండా, డిజైన్ల ఆమోదం లేకుండా గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టు బారేజీలు నిర్మించారన్నది ఆరోపణ. మేడిగడ్డ బ్యారేజీ కుంగడంతో కేసీఆర్ ప్రభుత్వానికి సమస్యలు ఆరంభం అయ్యాయి. రేవంత్ ముఖ్యమంత్రి కాగానే దానిపై విచారణకు ఆదేశించి ఒక రిటైర్డ్ జడ్జిని కూడా నియమించారు. ఈ విచారణ క్రమంలో కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు కూడా విచారణకు హాజరవుతారా? లేదా? అన్న మీమాంస నెలకొంది. ఇవి ఇలా ఉండగా, తాజాగా అవుటర్ రింగ్ రోడ్డు టోల్ వసూలు కాంట్రాక్ట్ టెండర్ల వ్యవహారంపై కూడా రేవంత్ విచారణకు సిట్ ను నియమించారు.ఇప్పటికే ఫోన్ టాపింగ్ కేసులో కొందరు అధికారులు అరెస్టు అయ్యారు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ లను ఏదో కేసులో ఇబ్బంది పెడతారని అంతా ఊహించిందే. నిజంగా వాటిలో తప్పులు జరిగి ఉంటే వారు కేసులు ఎదుర్కోక తప్పదు. కానీ కావాలని వేధించేందుకు కేసులు పెడుతున్నారని, తాము ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ఇలాంటి కక్ష సాధింపులకు దిగుతోందని జనం భావిస్తే అది కాంగ్రెస్‌కు చేటు. ఇంతకుముందు లగచర్ల దాడి కేసులో కూడా కేటీఆర్ పేరును ఇరికించాలని ప్రభుత్వం చూసింది. కేసీఆర్ శాసనసభకు రాకపోయినా, కేటీఆర్, హరీష్ రావులు సభలో కాని, బయట కాని గట్టిగానే పోరాడుతున్నారు. వారిని వీక్ చేయడానికి సహజంగానే కాంగ్రెస్ ప్రయత్నాలు ఉంటాయని. ఇది సహజం. కేటీఆర్‌పై పెట్టిన కేసు డైవర్షన్ రాజకీయాలలో భాగమేనని బీఆర్ఎస్ విమర్శిస్తుండగా, ప్రజాధనం దుర్వినియోగమైతే చూస్తూ ఊరుకోవాలా అని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. ఏసీబీ తనపై కేసు పెట్టగానే కేటీఆర్ మీడియా సమావేశం పెట్టి పలు విషయాలు వెల్లడించారు. ఇటీవలి కాలంలో ఒక కేసు వస్తే, అందులో తనదే బాధ్యత అని ఎవరూ ధైర్యంగా చెప్పడం జరగలేదు. కాని కేటీఆర్ పూర్తిగా బాధ్యత తీసుకుని కేవలం హైదరాబాద్ ప్రతిష్ట పెంచడానికి, పెట్టుబడులు ఆకర్షించడానికి చేసిన ప్రయత్నంలో ఈ ఫార్ములా రేస్ సంస్థకు డబ్బులు చెల్లించామని స్పష్టంగా తెలిపారు. ఈ డబ్బుల చెల్లింపులో నిబంధనల ఉల్లంఘన జరిగిందని, కేబినెట్ ఆమోదం లేకుండా రూ.55 కోట్లు చెల్లించారని, అది కూడా ఆర్బీఐ అనుమతులు తీసుకోకుండా, విదేశీ మారక ద్రవ్యాన్ని చెల్లించారని రాష్ట్రానికి రూ. ఎనిమిది కోట్ల జరిమానా విధించిందని కాంగ్రెస్ చెబుతోంది. హైదరాబాద్ మెట్రో అభివృద్ది సంస్థ కు స్వతంత్రంగా నిధులు వినియోగించే స్వేచ్ఛ ఉంటుందని, అందులో ఇలాంటి క్రీడల ఏర్పాట్లకు నిధులు వెచ్చిండానికి ఆ సంస్థకు పవర్ ఉందని కేటీఆర్ చెబుతున్నారు. అసలు ఈ ఫార్ములా రేసింగ్ సంస్థకు మొత్తం డబ్బు చెల్లిస్తే అందులో అవినీతి ఏమి ఉంటుందని అంటున్నారు. దీనిపై అసెంబ్లీలో చర్చకు సిద్దమని ఆయన సవాల్ విసిరారు. సభలో చర్చ జరగలేదు కాని, రేవంత్ మాత్రం దీని గురించి ప్రభుత్వ వాదనను వివరించారు. ఈ ఫార్ములా సంస్థ కో ఫౌండర్ ఒకసారి రేవంత్ ను కలిసివెళ్లిన విషయాన్ని కేటీఆర్ బయటపెట్టారు. దీనికి రేవంత్ బదులు ఇస్తూ, ఆ సంస్థ వారే కేటీఆర్‌తో రహస్య అవగాహన ఉందని తనకు చెప్పారని, ఈ స్కామ్ రూ.55 కోట్లు కాదని, రూ.600 కోట్లు అని సంచలనాత్మకంగా వెల్లడించారు. కాగా తదుపరి వాయిదా మొత్తం చెల్లించనందుకు గాను ప్రభుత్వానికి ఈ ఫార్ములా సంస్థ నోటీసు ఇచ్చిందని కేటీఆర్ అంటున్నారు. అంతేకాక తమతో కాంట్రాక్ట్ రద్దు చేసుకున్నందుకు గాను ఆర్బిట్రేషన్ నిమిత్తం సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వేని ఆ సంస్థ నియమించుకుందని చెప్పారు. హైదరాబాద్ ఈ ఫార్ములా రేస్ నిర్వహించడం ద్వారా ప్రపంచం దృష్టిని తెలంగాణ ఆకర్షించిందని, సుమారు రూ.700 కోట్ల పెట్టుబడులు రావడానికి, మరికొంతమంది పారిశ్రామికవేత్తలు ముందుకు రావడానికి దోహద పడిందన్నది ఆయన వాదన. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం హైదరాబాద్ ఇమేజీని డామేజి చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. గతంలో చంద్రబాబు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఫార్ములా ఒన్ రేస్ నిర్వహించడానికి ప్రయత్నాలు జరిగాయి కాని సఫలం కాలేదని ఆయన గుర్తు చేశారు. కాని తాము తీసుకు వచ్చి దేశానికి, తెలంగాణకు గుర్తింపు తెచ్చామని, దీనికి సంతోషించవలసింది పోయి కేసు పెడతారా అని మండిపడ్డారు. ఈ మొత్తం విషయాన్ని పరిశీలించిన తర్వాత, కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడిన సంగతులు విన్నాక కేటీఆర్ పెద్ద తప్పు చేయలేదేమో అనిపిస్తుంది. ఒకవేళ ఏదైనా తప్పు జరిగి ఉంటే అది ప్రొసీజరల్ లోపాలు కావచ్చు అన్న భావన కలుగుతుంది. మరి దీనికి గవర్నర్ అనుమతి కూడా ఉంది కదా అని ప్రభుత్వం చెప్పవచ్చు. గవర్నర్‌కు అన్ని వివరాలు ఇవ్వకుండా తప్పుదారి పట్టించారని కేటీఆర్ ఆరోపణ. హెచ్ఎండీఏ నిధులు జాతీయ బ్యాంకు అయిన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో ఉన్నాయి. కేటీఆర్ ఆదేశాల మేరకే మున్సిపల్ శాఖ కార్యదర్శిగా ఉన్న అరవింద్ కుమార్ ఆ నిధులను ఈ ఫార్ములా సంస్థకు పంపించే ఏర్పాట్లు చేశారు. దీనికి కేబినెట్ ఆమోదం తీసుకోకపోవడానికి కారణం అప్పట్లో ఎన్నికల హడావుడి, ఎన్నికల కోడ్ ఉండడమని చెబుతున్నారు. ఈ ఫార్ములా రేసింగ్ జరిగింది వాస్తవం, ఆ సంస్థకు డబ్బు చెల్లించింది నిజం. కాకపోతే ఆర్బీఐ అనుమతి ఎందుకు తీసుకోలేదన్నది సందేహం. దానిపై బ్యాంకు అధికారులు కాని, ప్రభుత్వ అదికారులు కాని వివరణ ఇవ్వవలసి ఉంటుంది. అయినా కేటీఆర్ సంబంధిత ఫైల్ ను సీఎం ఆమోదానికి పంపి ఉంటే ఈ గొడవ ఉండేది కాదేమో! కాని ఆ రోజుల్లో ఆయన తిరుగులేని అధికారాన్ని ఎంజాయ్ చేసేవారు.మళ్లీ గెలుస్తామన్న ధీమాతో ఈ డబ్బు మంజూరు చేయించారు. కాని కథ మారింది. బీఆర్ఎస్ ఓటమిపాలు కావడంతో ఇప్పుడు ఇది మెడకు చుట్టుకుంది. అయినా కేటీఆర్‌కు ఈ సందర్భంలో పెద్ద రోల్ ఉండకపోవచ్చు. విధాన పరమైన నిర్ణయం చేశారు.అలా చేయవచ్చా? లేదా? అన్నది ఒక కోణం. ఒకవేళ అది తప్పని తేలితే కేటీఆర్ కూడా ఇబ్బంది పడతారు. ఈ కేసు నమోదైన వెంటనే ఈడీ కూడా రంగంలో దిగడం కేటీఆర్‌కు కాస్త ఆందోళన కలిగించే అంశమే. ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించి పది రోజులపాటు అరెస్టు కాకుండా రక్షణ పొందారు. ఏపీలో 201419 టరమ్ లో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో స్కామ్ జరిగింది. దానిని తొలుత ఈడీ గుర్తించింది. తదుపరి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వంలో సిఐడి అన్ని ఆధారాలు సేకరించి ఆ స్కామ్ డబ్బు షెల్ కంపెనీలకు ఎలా వెళ్లింది.. చివరికి టిడిపి ఆఫీస్ ఖాతాలోకి కూడా చేరింది వివరిస్తూ కేసు పెట్టారు. ఆ కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లవలసి వచ్చింది. అయినా చంద్రబాబు తాను తప్పు చేయలేదని వాదించారు. అంతేకాక ఆయనకు మద్దతు ఇచ్చే ఎల్లో మీడియా ఈ విషయాలన్నిటిని పక్కనబెట్టి జగన్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని ప్రచారం చేసింది. కేటీఆర్ కేసులో డబ్బు మనీ లాండరింగ్ అయినట్లు కనిపించడం లేదు. అయినా ఈడీ రంగంలోకి రావడం తో ఏమైనా అలాంటి నేరం జరిగిందా అన్న డౌటు వస్తుంది. ఈ కేసులో కేటీఆర్ అవినీతి చేశారని రుజువు చేయడం ఎంతవరకు సాధ్యపడుతుందో చూడాలి. ఇంకో సంగతి కూడా చెప్పాలి. చంద్రబాబు 2004 కి ముందు ఆపధ్దర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేబినెట్‌తో సంబంధం లేకుండా ఐఎమ్ జి భరత్ అనే సంస్థకు హైదరాబాద్ లో అత్యంత ఖరీదైన సుమారు 800 ఎకరాల భూమిని స్టేడియంల నిర్మాణానికి కేటాయించడం వివాదం అయింది. ఆ తర్వాత వచ్చిన వైఎస్ ఆర్ ప్రభుత్వం దానిని రద్దు చేసింది. అయినా ఆ వ్యవహారం కోర్టుకు వెళ్లింది. ఇప్పటికీ ఆ కేసు పరిష్కారం కాలేదు. అలాంటప్పుడు కేటీఆర్ ను ఈ కేసు ఇబ్బంది పెడుతుందా అన్నది డౌటు. ఒకవేళ హైకోర్టు స్టే తొలగిపోయి కేటీఆర్‌ను అరెస్టు చేసినా, కొద్ది రోజులపాటు జైలులో ఉండాల్సి రావచ్చు తప్ప పెద్దగా జరిగేదేమి ఉండకపోవచ్చు. ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ గట్టెక్కుతారా? లేదా అన్నది ఒక పాయింట్ అయితే రేవంత్ ప్రభుత్వం తనది పై చేయిగా రుజువు చేసుకుంటుందా? లేక సెల్ఫ్ గోల్ వేసుకుంటుందా అన్నది మరో అంశం. కేటీఆర్ తప్పు చేసినట్లు రుజువు చేసి శిక్షపడేలా చేయగలిగితే అప్పుడు కాంగ్రెస్ కు ఏదైనా ప్రయోజనం చేకూరవచ్చు. అంతవరకు కేటీఆర్‌కు, బీఆర్ఎస్కూ సానుభూతే రావచ్చన్నది ఎక్కువ మంది విశ్లేషణగా ఉందని చెప్పాలి. ఏది ఏమైనా ఈ కేసుల వివాదాలు ఎలా ఉన్నా, ఈ పరిణామాలు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీకి కొంత నష్టం చేస్తున్నాయన్నది వాస్తవం.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఫార్ములా కారు కేసులో ఈడీ, ఏసీబీ దూకుడు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫార్ములా ఈ-కారు రేస్ రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ కోర్టును ఆశ్రయించడం కేసు తీవ్రతను మరింత పెంచింది.మరోవైపు.. ఈకేసులోకి ఈడీ ఎంటర్ కావడం ఆసక్తికరంగా మారింది. ఫార్ములా ఈ-కార్ రేసింగ్‌పై ఈడీ ఈసీఐర్ నమోదు చేసింది. ఇందులో భాగంగా మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద సెక్షన్లు నమోదు చేసింది. ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ అధికారులు.. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు కేసుల వివరాల కోసం ఏసీబీకి ఈడీ లేఖ రాసింది.ఇదిలా ఉండగా.. ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. నేడు ప్రిన్సిపల్ సెక్రటరీ దానా కిషోర్ స్టేట్మెంట్ను ఏసీబీ అధికారులు రికార్డు చేయనున్నారు. హెచ్ఎండీఏ, ఏంఏయూడీలోని మరి కొంత మందిని ఏసీబీ అధికారులు విచారించనున్నారు. ఇదే సమయంలో ఫార్ములా ఈ-కారు రేసుకు సంబంధించిన ప్రతీ డాక్యుమెంట్‌ను ఏసీబీ అధికారులు పరిశీలించనున్నారు. ఎఫ్ఈవో నుంచి వచ్చిన ఈ-మెయిల్స్, ఎల్ఎఫ్ఏతో పాటు లావాదేవీల వివరాలు కూడా ఏసీబీ పరిశీలించనుంది. ఈ క్రమంలోనే నిందితులను ఏసీబీ అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు. -
ఏఈఈ నిఖేష్ అక్రమార్జనపై ఏసీబీ ఫోకస్.. బినామీగా వ్యవహరించాడా?
సాక్షి, హైదరాబాద్: నీటిపారుదల శాఖకు చెందిన ఏఈఈ నిఖేష్ కుమార్‌ను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిఖేష్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడంతో ఆయన ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్నారు. కస్టడీలో భాగంగా నాలుగు రోజుల పాటు ఆయనను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. విచారణ కోసం గురువారం నిఖేష్‌ను ఏసీబీ కార్యాలయానికి తరలించారు.నిఖేశ్ కుమార్ భారీ అక్రమార్జనపై కూపీలాగే పనిలో ఏసీబీ అధికారులు నిమగ్నమయ్యారు. అయితే, అతను మరెవరికైనా బినామీగా వ్యవహరించాడా? అనే విషయాన్నీ తేల్చే ప్రయత్నంలో ఉన్నారు. వాస్తవానికి పదేళ్ల క్రితమే నిఖేష్ కుమార్ ఉద్యోగంలో చేరినా గండిపేట ఏఈఈగా పోస్టింగ్ వచ్చాకే అతడి అక్రమార్జన ప్రారంభమైనట్లు తెలుస్తోంది. కీలకమైన ఇబ్రహీంపట్నం, మేడ్చల్, గండిపేట ఏఈఈగా పోస్టింగ్ దక్కడంతో వసూళ్లే ధ్యేయంగా పనిచేసినట్లు సమాచారం.ఇదిలా ఉండగా.. నిఖేష్ కుమార్ అక్రమ దందా వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అధికారుల ప్రాథమిక విచారణలో రోజుకు తక్కువలో తక్కువ రూ.2 లక్షలకుపైగా సంపాదించినట్లు గుర్తించారు. ఉద్యోగంలో చేరిన కొద్దిరోజుల్లోనే అక్రమార్జనకు అలవాటు పడిన నిఖేశ్ కుమార్‌తోపాటు సన్నిహితుల ఇళ్లపై ఏసీబీ బృందాలు చేసిన దాడిలో బహిరంగ మార్కెట్లో రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తించారు. రూ.17.73 కోట్ల అక్రమాస్తులు, ఒక లాకర్లోనే కిలోన్నర బంగారు ఆభరణాలు. వీటన్నింటి విలువ బహిరంగ మార్కెట్లో రూ.100 కోట్లపైమాటే. వీటన్నింటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన స్నేహితుడి బ్యాంకు లాకర్లో ఉన్న డబ్బులను కూడా అధికారులు తీసుకున్నారు.నీటి పారుదల శాఖలో 2013లో చేరిన నిఖేష్‌కుమార్ మొదట వరంగల్ జిల్లాలో పనిచేసి తర్వాత వికారాబాద్ జిల్లాకు బదిలీ అయ్యాడు. మూడేళ్ల క్రితం రంగారెడ్డి జిల్లాకు వచ్చాక నాలాలు, జలాశయాల పరిధిలో ఎఫ్టీఎల్, బఫర్జోన్లలో అక్రమ నిర్మాణాలకు నిరభ్యంతర పత్రాలు జారీ చేయడం ద్వారా అక్రమార్జనకు పాల్పడ్డాడు. దరఖాస్తులను ఫార్వర్డ్ చేసేందుకు, వాటిని క్లియర్ చేయించేందుకు భారీగా వసూళ్లు చేసి ఉన్నతాధికారుల తరపున వాటాలనూ సేకరించి, ముట్టజెప్పినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో ఉన్నతాధికారుల పాత్రపైనా ఏసీబీ ఆరా తీస్తుండటం ప్రాధాన్యం సంతరించుకొంది. -
‘కట్టలు’ తెగిన అవినీతి
సాక్షి, హైదరాబాద్: అవినీతి పుట్టలు బద్ధలవుతున్నాయి. ‘కట్టల’పాములు బయటికొస్తున్నాయి. అవినీతి నిరోధక విభాగం చేపడుతున్న వరుస తనిఖీలు, ఆకస్మిక ‘ఆపరేషన్లు’సత్ఫలితాలనిస్తున్నాయి. గతానికి భిన్నంగా ఇటీవలి కాలంలో పక్కా స్కెచ్‌తో రంగంలోకి దిగుతున్న ఏసీబీ అధికారులకు అనేక అవినీతి తిమింగలాలు చిక్కుతున్నాయి. ఏసీబీ డీజీగా సీవీ ఆనంద్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కింది స్థాయి అధికారులకు పూర్తి స్వేచ్ఛ లభించింది.దీంతో వారు దూకుడు పెంచారు. అవినీతి అధికారుల భరతం పడుతున్నారు. రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, విద్యుత్, ఆర్టీఏ.. ఇలా ఏ శాఖనూ వదలకుండా ముమ్మర దాడులు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే 105 కేసులు నమోదు చేశారు. గతంలో బాధితులు చేసే ఫిర్యాదులు, వారందించే సమాచారం ఆధారంగా అవినీతి అధికారులను ట్రాప్ చేసేవారు. ఎక్కువగా ఆదాయానికి మించి ఆస్తుల కేసుల నమోదుకే పరిమితం అయ్యేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మార్చిన ఏసీబీ అధికారులు బృందాలుగా ఏర్పడి.. ప్రత్యేకంగా ఒక డిపార్ట్మెంట్ను ఎంచుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు.అందుబాటులో ఉన్న టెక్నాలజీని వాడుకుంటూ క్షేత్ర స్థాయిలో అవినీతి అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా ‘ఆపరేషన్లు’పూర్తి చేస్తున్నాయి. ఏసీబీ డీజీ సీవీ ఆనంద్‌కు విజిలెన్స్ శాఖను సైతం అప్పగించడంతో.. ఏసీబీ తనిఖీలతో పాటు విజిలెన్స్ సోదాలూ తీవ్రమయ్యాయి. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హెచ్ఎండీఏ టౌన్‌ప్లానింగ్ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ రూ.వందల కోట్ల అవినీతి, గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్ల అవినీతి తదితర కేసులు వెలుగులోకి వచ్చాయి.ఏసీబీ ఇటీవల నమోదు చేసిన ప్రధాన కేసులు కొన్ని.. జనవరి 2024: హెచ్ఎండీఏ టౌన్ ప్లానింగ్ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసు సంచలనం సృష్టించింది. ఏసీబీ అధికారులు రూ.వందల కోట్ల అవినీతి సొమ్మును వెలికి తీయడంతో పాటు పలువురిని అరెస్టు చేశారు. ఫిబ్రవరి 2024: గిరిజన సంక్షేమ శాఖ ఇన్చార్జి సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజినీర్ జగజ్యోతి ఈ ఏడాది ఫిబ్రవరి 19న రూ. 84 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఆ అధికారి ఇంట్లో జరిపిన సోదాల్లో రూ.65 లక్షల నగదు, రెండున్నర కిలోల బంగారం దొరికింది.మార్చి 2024: మార్చిలో మహబూబాబాద్ సబ్ రిజి్రస్టార్ తస్లీమా రూ.19 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.మే 2024: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర్రావు ఇల్లు, బంధువుల ఇళ్లలో చేసిన సోదాల్లో రూ.కోట్ల ఆస్తులతో పాటు, బినామీల ఆస్తులకు సంబంధించిన పత్రాలు లభించాయి.ఆగస్టు 2024: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్ దాసరి నరేందర్ ఇంట్లో చేసిన తనిఖీల్లో రూ.2.93 కోట్ల నగదు సహా రూ. 6 కోట్లకు పైగా ఆస్తులు ఏసీబీ గుర్తించింది.డిసెంబర్ 2023: గతేడాది డిసెంబర్లో వెలుగులోకి వచ్చిన గొర్రెల పంపిణీ పథకానికి సంబంధించిన కుంభకోణంలో ఇప్పటివరకు రూ.700 కోట్ల అవినీతిని అధికారులు గుర్తించారు. మాజీ మంత్రి ఓఎస్డీ కల్యాణ్, పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓ రాంచందర్ నాయక్ సహా పలువురిని అరెస్టు చేశారు.ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తప్పించుకోలేరు: ఏసీబీ డీజీ ‘లంచం తీసుకునేవారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏసీబీ అధికారుల నుంచి తప్పించుకోలేరు..’అని ‘ఎక్స్’లో చేసిన ఓ పోస్టులో ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ హెచ్చరించారు. సోమవారం రాత్రి రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ఎంవీ భూపాల్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ మదన్‌మోహన్‌రెడ్డి రూ.8 లక్షలు లంచం తీసుకుంటూ అధికారులకు చిక్కారని తెలిపారు. -
మురికి కూపం.. పురుగుల బియ్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు సంక్షేమ హాస్టళ్లు దారుణమైన పరిస్థితుల్లో కొనసాగుతున్నాయి. విద్యార్థుల ఆరోగ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. వారికి మంచి అల్పాహారం కాని, భోజనం కాని అందడం లేదు. నాసిరకం కందిపప్పు, కూరగాయలు, పురుగులు పట్టిన బియ్యంతో వండిన ఆహార పదార్థాలనే వడ్డిస్తున్నారు. మెనూ పాటించడం లేదు. రోజూ ఇవ్వాల్సిన అరటిపండ్లు, గుడ్లు లాంటివి ఇవ్వడం లేదు. వసతి గృహాల్లో పారిశుధ్యం ఆనవాళ్లే లేవు. మరుగుదొడ్లు, స్నానాల గదులతో పాటు వంటశాలల్లోనూ అపరిశుభ్ర వాతావరణం కొనసాగుతోంది. కొన్నిచోట్ల విద్యార్థులతోనే గదులు, ఆవరణ శుభ్రం చేయిస్తున్నారు. విద్యార్థులకు సంబంధించిన రికార్డుల నిర్వహణ సరిగ్గా లేదు. మొత్తం విద్యార్థుల సంఖ్యకు, హాజరు పట్టీలో నమోదు చేసిన సంఖ్యకు, వాస్తవంగా తర గతి గదిలో ఉన్నవారి సంఖ్యకు మధ్య భారీ వ్యత్యాసం ఉంది. కొన్నిచోట్ల వార్డెన్లు అందుబాటులో లేరు. వారు ఇష్టారాజ్యంగా వచ్చి వెళుతున్నారు. మంగళవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ఈ విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఎవరికి వారు అందినంత దండుకునే వ్యవహారంగానే హాస్టళ్ల పనితీరు ఉన్న ట్లు ఈ సోదాల్లో బయటపడింది. డీజీ సీవీ ఆనంద్ ఆదేశాలతో ఏసీబీ అధికారులు, స్థానిక తూనికలు, కొలతల అధికారులు, శానిటరీ, ఫుడ్ ఇన్స్పెక్టర్లు, ఆడిటర్లతో కూడిన 10 బృందాలు.. రాష్ట్రంలోని 10 సంక్షేమ హాస్టళ్లలో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించాయి. అత్యంత అధ్వాన పరిస్థితుల మధ్య విద్యార్థులు కాలం వెల్లదీస్తున్నట్టు గుర్తించాయి. ఈ సందర్భంగా అధికారులు విద్యార్థులతో మాట్లాడారు. ఈ సోదాలపై ఏసీబీ ఒక ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్ జాంబాగ్‌లోని ఎస్సీ బాలుర హాస్టల్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లిలోని బీసీ బాలుర హాస్టల్, మహబూబ్‌నగర్ జిల్లా కోయల్కొండలోని బీసీ బాలుర వసతిగృహం, నల్లగొండ జిల్లా తిప్పర్తి ఎస్సీ బాలికల వసతి గృహం, మంచిర్యాల జిల్లా వెమ్మనపల్లిలోని ఎస్టీ బాలుర హాస్టల్, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇప్పలపల్లిలోని ఎస్సీ బాలుర హాస్టల్, జనగామలోని ఎస్సీ బాలికల హాస్టల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కారేపల్లి మండలంలోని ఎస్టీ బాలుర హాస్టల్, సిద్దిపేటలోని బీసీ బాలుర వసతిగృహం, నిజామాబాద్ కొత్తగల్లీలోని ఎస్సీ బాలికల హాస్టల్లో తనిఖీలు జరిగాయి. మెనూకు చెల్లు చీటీ.. ఖమ్మం జిల్లాలోని కారేపల్లి మండలం గాందీనగర్ గిరిజన జూనియర్ కళాశాల, గురుకుల విద్యాలయం నిర్వహణ అస్తవ్యస్థంగా ఉంది. మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయి. ప్రహరీగోడ లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. తరగతి గదులు, వంటశాలలు అపరిశుభ్రంగా ఉన్నాయి. మెనూ కూడా పాటించడం లేదు. మంగళవారం ఇద్దరు ఉపాధ్యాయులు విధులకు హాజరుకాలేదు. నాణ్యత లేని భోజనం.. నల్లగొండ జిల్లా తిప్పర్తి ఎస్సీ బాలికల హాస్టల్ మొత్తం అపరిశుభ్ర వాతావరణంలోనే ఉంది. మరుగుదొడ్లే కాదు.. వంట గది పరిస్థితీ దారుణంగా ఉంది. నాణ్యత లేని టిఫిన్, భోజనం పెడుతున్నారు. తాగునీరు కూడా బాగా లేదు. వసతి గృహంలో 52 మంది విద్యార్థులు ఉండాల్సి ఉండగా 23 మందే ఉన్నారు. రికార్డులు సక్రమంగా నిర్వహించడం లేదు. ఖర్చుల వివరాల్లేవు.. సిద్దిపేట పట్టణంలోని బీసీ విద్యార్థుల వసతి గృహంలో రిజిస్టర్ల నిర్వహణ సరిగా లేదు. విద్యార్థుల హాజరుకు సంబంధించిన పూర్తి వివరాలు లేవు. విద్యార్థులు గైర్హాజరు అయితే కేవలం చుక్క మాత్రమే పెడుతున్నారు. జూన్, జూలై నెలలకు సంబంధించిన ఖర్చు, తదితర వివరాలను రికార్డుల్లో పొందుపరచలేదు. రేకుల షెడ్డులో కిచెన్.. సిరిసిల్ల మున్సిపల్ పరిధి ఇప్పలపల్లి గ్రామ శివారులో ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే బాలుర గురుకులం కిచెన్ తాత్కాలిక రేకుల షెడ్డులో నిర్వహిస్తున్నారు. విద్యాలయం పరిసరాలు పరిశుభ్రంగా లేవు. మౌలిక సదుపాయాల లోపం కూడా ఉంది. ఆహార పదార్థాలు సీజ్ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోటగల్లీ ఎస్సీ హాస్టల్లో విద్యార్థులకు పెట్టే భోజనం సక్రమంగా లేదు. మంగళవారం తనిఖీల సందర్భంగా నాణ్యత లోపించిన ఆహార పదార్థాలను సీజ్ చేసి, ల్యాబ్‌కు తరలించారు. మూత్రశాలల నిర్వహణ సరిగా లేదు. కోడిగుడ్లు, అరటిపండ్లకు ఎగనామం జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మకంచ ఎస్సీ బాలికల ప్రీ, పోస్ట్ మెట్రిక్ వసతి గృహంలో తనిఖీల సమయంలో వార్డెన్ కవిత విధుల్లో లేరు. వసతి గృహంలో రికార్డుల పరంగా 110 మంది విద్యార్థులుంటే 73 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. తనిఖీల సమయంలో 60 మంది మాత్రమే ఉన్నారు. మెనూ ప్రకారం కోడిగుడ్లు, అరటిపండ్లు ఇవ్వడం లేదు. భోజనంలో నాణ్యత లోపించింది. టాయిలెట్లు, మరుగుదొడ్లు కంపు కొడుతున్నాయి. విద్యార్థుల హెల్త్ చెకప్‌కు సంబంధించిన ప్రొఫైల్ కార్డులు నిర్వహించడం లేదు. త్వరలో ప్రభుత్వానికి వేర్వేరు నివేదికలు! అధికారుల తనిఖీల్లో వెలుగులోకి వచ్చిన మరికొన్ని కీలక అంశాలు పరిశీలిస్తే..విద్యార్థుల గదులకు సరైన గాలి, వెలుతురు రావడం లేదు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఆహార పదార్థాల పట్టిక పాటించడం లేదు. బాలికల హాస్టళ్లల్లో బాత్రూంల పరిస్థితి అత్యంత అధ్వానంగా ఉంది. మొత్తం 18 రకాల రికార్డులు అధికారులు నిర్వహించాల్సి ఉంటుంది. అయినా ఏ ఒక్కటీ సరిగా పాటించడం లేదు. వార్డెన్లు హాస్టళ్లలోనే ఉండాలి. కానీ వారానికి ఒకరోజు లేదంటే నెలకు ఒకరోజు వచ్చి, పోతున్నారు. రిజిస్టర్లలో రాసిన దానికి అందుబాటులో ఉన్న సరుకుల పరిమాణానికి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. ఎక్కువ హాస్టళ్లలో కాలం చెల్లిన ఆహారపదార్థాలను వాడుతున్నారు. ఈ అంశాలతో పాటు ప్రభుత్వ నిధుల దురి్వనియోగంపై, హాస్టళ్ల సిబ్బందిపై తీసుకోవాల్సిన చర్యలు, హాస్టళ్లలోని ప్రస్తుత పరిస్థితులను మెరుగుపర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వేర్వేరుగా త్వరలో ప్రభుత్వానికి నివేదికలు సమరి్పంచనున్నట్టు ఏసీబీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
ఒకే రోజు 350 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో కళ్లు బైర్లు కమ్మే అక్రమాలు వెలుగు చూశాయి. ఇటీవల బదిలీపై వెళ్లిన ఓ సబ్ రిజిస్ట్రార్ వెళుతూ.. వెళుతూ పెద్ద ఎత్తున అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఏసీబీ అధికారుల దృష్టికి వచ్చింది. ఒకే రోజు ఏకంగా సుమారు 350 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసినట్లు తేలింది. ఒక్కరోజే ఈ స్థాయిలో డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేయడంతో అనుమానం వచ్చిన ఏసీబీ అధికారులు గురువారం సాయంత్రం ఈ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన విషయం విదితమే.తనిఖీలు రాత్రంతా జరిగాయి. శుక్రవారం ఉదయం ఏడు గంటల వరకు అధికారులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్లు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీలు చేస్తున్న సమయంలో కార్యాలయంలోని ఓ అధికారి రూ.96 వేల నగదును కార్యాలయం కిటికీలోంచి బయటకు విసిరేయడం కలకలం సృష్టించింది. ఈ క్రమంలో ఏసీబీ.. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు అధికారులను అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా ఉన్న 64 డాక్యుమెంట్లను ఏసీబీ సీజ్ చేసింది. ఈ డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులు నిర్ణయించారు.ప్రభుత్వ భూములకు రిజిస్ట్రేషన్లు..!ఏసీబీ అదుపులోకి తీసుకున్న అధికారులిద్దరూ ప్రభుత్వ భూములకు రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. పటాన్చెరు ప్రాంతంలో రూ.వందల కోట్లు విలువ చేసే భూములను ఈ అధికారులు రిజిస్ట్రేషన్ చేసినట్లు సమాచారం. జిల్లా ఏసీబీ అధికారులకు తెలియకుండా..ఈ తనిఖీలు నిర్వహించేందుకు హైదరాబాద్ లోని రాష్ట్ర కార్యాలయం నుంచి ఏసీబీ అధికారులు రావడం గమనార్హం. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఏసీబీ డీఎస్పీ కార్యాలయం ఉంటుంది. అయితే ఈ కార్యాలయం అధికారులకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా నేరుగా రాష్ట్ర కార్యాలయంలోని సీఐయూ విభాగం అధికారులు తనిఖీలు చేపట్టారు. -
హైదరాబాద్ జోన్: పోలీసుల్లో ఏసీబీ దాడుల టెన్షన్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పోలీసు వర్గాల్లో ఏసీబీ దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ జోన్ పరిధిలో రెండు నెలల కాలంలోనే ఏసీబీ దాడుల్లో పదుల సంఖ్యలో ఏసీబీ కేసులు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎన్నడూ లేనంతగా పోలీసు అధికారులు ఏసీబీకి చిక్కుతున్నారు.వివరాల ప్రకారం.. హైదరాబాద్ జోన్ పరిధిలో ఏసీబీ దాడుల్లో పోలీసులు వరుసగా పట్టుబడుతున్నారు. భూ వివాదాల సెటిల్మెంట్, ఫైనాన్స్ కేసుల వ్యవహారాల్లో లంచాలు తీసుకుంటూ ఓ అధికారి అరెస్ట్ అయ్యాడు. అలాగే, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర రావు ఏసీబీ చిక్కారు. సీసీఎస్ సుధాకర్ గౌడ్ లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.ఇక, కుషాయిగూడలో మూడు లక్షలు లంచం తీసుకుంటూ సర్కిల్ ఇన్స్పెక్టర్ వీరస్వామి, సబ్ ఇన్స్పెక్టర్ షఫీ, మధ్యవర్తి ఉపేందర్‌లు పట్టుబడ్డారు.తాజాగా సూరారం ఎస్ఐ ఆకుల వెంకటేశం లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు తీరు చర్చనీయాంశంగా మారింది. -
గొర్రెల స్కాంపై ఈడీ స్పీడ్.. పశుసంవర్ధక శాఖకు అధికారులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గొర్రెల పంపిణీ స్కామ్ చర్చనీయాంశంగా మారింది. ఈ స్కామ్ విచారణలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దూకుడు పెంచింది. ఇందులో భాగంగానే శుక్రవారం ఉదయం ఈడీ అధికారులు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ కార్యాలయం చేరుకున్నారు.కాగా, గొర్రెల పంపిణీ గురించి ఈడీ అధికారులు ఇప్పటికే పశుసంవర్థక శాఖకు లేఖ రాసిన విషయం తెలిసిందే. సదరు లేఖలో 10 అంశాలకు సంబంధించి వివరాలు ఇవ్వాలని కోరారు. ఇక, గొర్రెల పంపిణీ స్కామ్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా స్కామ్‌కు సంబంధించిన వివరాలను ఈడీ కోరింది.అయితే, రాష్ట్రవ్యాప్తంగా గొర్రెల పంపిణీలో రూ.1000 కోట్ల అక్రమాలు జరిగినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇక, ఈ స్కాంకు సంబంధించి ఇప్పటికే ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, గొర్రెల పంపిణీలో భాగంగా మనీ లాండరింగ్ కోణంపై ఈడీ దర్యాప్తు చేయనుంది. జిల్లాల వారీగా లబ్ధిదారుల పేర్లు, వారి చిరునామాలు, ఫోన్ నంబర్లు, బ్యాంకు ఖాతాల వివరాలు.. తదితర సమాచారం ఇవ్వాలని ఈడీ కోరింది.గొర్రెల కొనుగోళ్ల కోసం సమాఖ్య నుంచి ఏయే జిల్లాల అధికారుల ఖాతాల్లో నిధులు జమ చేశారో వారి వివరాలు, ఆయా బ్యాంకు ఖాతాల సమాచారం, లబ్ధిదారుల వాటాగా జమ చేసిన నిధులు, ఏయే ఖాతాల్లో జమ అయ్యాయి? గొర్రెల రవాణా ఏజెన్సీల సమాచారం, వాటికి జరిగిన చెల్లింపుల వివరాలు, గొర్రెలకు కొనుగోలు చేసిన దాణా, దాన్ని ఏయే లబ్ధిదారులకు పంపించారు? దీని కోసం ఎవరికి నిధులిచ్చారు.. ఇలా సమగ్ర వివరాలు ఇవ్వాలని ఈడీ కోరింది. -
ఏసీపీ ఉమామహేశ్వరరావు కేసులో బిగ్ ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో అరెస్టయిన సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు. అంతకు ముందు ఏసీబీ కార్యాలయంలో ఆయనను విచారించిన అధికారులు.. ట్యాబ్‌లో ఉన్న ఆస్తి వివరాలపై ఆరా తీశారు. బీనామీ ఆస్తులపై కూపీలాగుతున్నారు. సందీప్ అనే వ్యక్తి ఎవరు? అతనితో ఉన్న లావాదేవీలు ఏంటి? అనే కోణంలో విచారణ చేపట్టారు. ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న ఆస్తులు డాక్యుమెంట్స్ వివరాలను ఏసీబీ అధికారులు కోర్టుకు అందించారు. ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం మూడు కోట్ల ఆస్తులను ఏసీబీ గుర్తించింది.ఆస్తి విలువ అనధికారికంగా బహిరంగ మార్కెట్లో రూ. 50 కోట్ల వరకు ఉంటుందని అంచనా. పలుమార్లు సస్పెండయినా కానీ కీలక పోస్టింగ్‌లు దక్కించుకోవటంపై ఏసీబీ ఆరా తీస్తోంది. ఉమామహేశ్వరరావు వెనక ఉన్న అధికారుల అవినీతిపై ఏసీబీ విచారణ చేస్తోంది. కాగా, ఏసీబీ విచారణకు ఉమా మహేశ్వర రావు ఏమాత్రం సహకరించడం లేదని సమాచారం. ఉమామహేశ్వరరావు ఫిర్యాదుదారులనే బెదిరించి వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. ల్యాప్ టాప్‌లో దొరికిన సమాచారం ఆధారంగా ఏసీబీ విచారణ చేపట్టింది. కొందరు పోలీస్ అధికారులతో కలిసి బినామీ వ్యాపారాలు చేసినట్టు ఏసీబీ గుర్తించింది.ఉమామహేశ్వరరావుకు జ్యూడీషియల్ రిమాండ్ఉమామహేశ్వరరావుకు నాంపల్లి ఏసీబీ కోర్టు 14 రోజులు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. జూన్ 5 వరకు రిమాండ్ విధించింది. ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు. -
ఉమా మహేశ్వర ‘అక్రమ’రూపస్య
సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో (సీసీఎస్) ఏసీపీగా పని చేస్తున్న టీఎస్ ఉమామహేశ్వరరావును ఏసీబీ అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. న్యాయం కోసం వెళ్లిన వారిని ఆయన తీవ్ర ఇబ్బందులకు గురిచేసినట్టు అధికారులు గుర్తించారు.ఇక, ఏసీపీ ఉమా మహేశ్వరరావు వ్యవహారశైలిపై కూడా గతంలోనే ఫిర్యాదులు వచ్చాయి. అతనిపై ఇప్పటికే మూడుసార్లు సస్పెన్షన్ వేటుగా పడింది. అయినా కూడా ఆయన తన తీరు మార్చుకోలేదు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని సివిల్ కేసులను క్రిమినల్ కేసులుగా మార్చి లక్షల రూపాయలను కాజేశారు.సీసీఎస్‌లో బాధితులకు న్యాయం చేయాల్సిన హోదాలో ఉంటూ వారితోనే బేరసారాలాడారు. కాగా, ఓ ఎన్నారై ఫిర్యాదు చేయడానికి రావడంతో అతడిని సైతం బెదిరించి డబ్బులు దండుకున్నట్టు అధికారులు గుర్తించారు. ఇక, తోటి సిబ్బందిని బూతులు తిడుతూ, అవహేళన, వారిపై అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు చాలానే పోలీసులు చెబుతున్నారు. తన దగ్గరికి వచ్చిన ప్రతీ కేసులోనూ ఉమా మహేశ్వర రావు చేతివాటం చూపించినట్టు సమాచారం. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆయన, ఆయన బంధువుల నివాసాలపై మంగళవారం దాడులు చేశారు. తెలంగాణ, ఏపీలోని ఉమామహేశ్వరావు ఇళ్లు, ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లతో సహా మొత్తం 11 చోట్ల సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో నగదు, బంగారం, ఆస్తి పత్రాలతో పాటు రెండు బ్యాంకు లాకర్లను గుర్తించినట్లు తెలిసింది.అక్రమ ఆస్తుల కూడబెట్టుకుని నగర శివారులో విలాసవంతమైన విల్లాలు కొనుగోలు చేశారు. శామీర్‌పేటలో విల్లా, ఘట్కేసర్లో ఐడు ప్లాట్స్ కొనుగోలు చేశారు. అంతేకాకుండా తన ఇంట్లో నగదు ఉంచకుండా.. తన అత్తామామల ఇంట్లోనే డబ్బును దాచిపెట్టారు. లావాదేవీల మొత్తం సమాచారాన్ని ఆయన ట్యాబ్‌లో స్టోర్ చేసుకున్నారు. ఇక, ఉమా మహేశ్వరరావు ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో 50కోట్లకు వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇక, తెలుగు రాష్ట్రాల్లో 17చోట్ల ఆస్తులను గుర్తించారు. సోదాల్లో భాగంగా ఇప్పటి వరకు రూ.38లక్షల నగదు, 60 తులాల బంగారం సీజ్. కాగా, కాసేపట్లో ఉమా మహేశ్వర్‌ను అధికారులు ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నారు. -
సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో (సీసీఎస్) ఏసీపీగా పని చేస్తున్న టీఎస్ ఉమామహేశ్వరరావును ఏసీబీ అరెస్ట్ చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆయన, ఆయన బంధువుల నివాసాలపై మంగళవారం దాడులు చేశారు. తెలంగాణ, ఏపీలోని ఉమామహేశ్వరావు ఇళ్లు, ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లతో సహా మొత్తం 11 చోట్ల సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో నగదు, బంగారం, ఆస్తి పత్రాలతో పాటు రెండు బ్యాంకు లాకర్లను గుర్తించినట్లు తెలిసింది. మంగళవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ప్రారంభమైన సోదాలు రాత్రి వరకు కొనసాగాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీపీ ఉమామహేశ్వరరావును అరెస్టు చేసినట్లు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్రబాబు తెలిపారు. ‘ప్రీలాంచ్’ నిందితులకు వత్తాసుపై ఫిర్యాదులు ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో వేలాది మంది నుంచి డబ్బు వసూలు చేసి నిండా ముంచిన సాహితీ ఇన్ఫ్రా సంస్థ, దాని అనుబంధ సంస్థలపై అనేక కేసులు నమోదయ్యాయి. రూ.వేల కోట్లతో ముడిపడి ఉన్న ఈ స్కామ్‌కు సంబంధించిన కేసులు అన్నీ సీసీఎస్‌కు బదిలీ అయ్యాయి. దాదాపు 50 కేసుల దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసిన ఉన్నతాధికారులు దాని బాధ్యతలు ఉమామహేశ్వరరావుకు అప్పగించారు. దీన్ని తనకు అనువుగా మార్చుకున్న ఉమా మహేశ్వరరావు నిందితుల నుంచి భారీ మొత్తం డిమాండ్ చేసి వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిందితులకు వత్తాసు పలుకుతూ బాధితులకు తీవ్ర అన్యాయం చేశారనే ఫిర్యాదులు ఏసీబీకి అందాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఫిర్యాదులూ వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న ఏసీబీ దర్యాప్తు చేపట్టింది. ఏపీలోని బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు మంగళవారం ఉదయం అశోక్‌నగర్‌లోని ఓ అపార్ట్మెంట్లో ఉన్న ఉమామహేశ్వరరావు ఇల్లు, నేరేడ్మెట్, ఎల్బీనగర్‌ల్లోని స్నేహితుల ఇళ్లు, ఆయన సోదరుడు, మామ ఇళ్ళతో సహా ఏపీలోని భీమవరం, విశాఖపట్నం, నర్సీపట్నంల్లోని బంధువుల ఇళ్లల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. అనకాపల్లి జిల్లా రోలుగుంటలో ఉమామహేశ్వరరావు దూరపు బంధువు దివంగత మడ్డు తమ్మునాయుడు ఇంట్లో ఐదుగురు సభ్యులతో కూడిన తెలంగాణ ఏసీబీ అధికారుల బృందం తనిఖీలు చేసింది. తమ్మునాయుడు భార్య నుంచి వారి ఇల్లు, భూములు తదితర ఆదాయ వనరుల వివరాలు సేకరించారు. పత్రాలు, డైరీల్లో సందీప్ అనే పేరు దాడుల్లో పలు కీలక డాక్యుమెంట్లతో పాటు రూ.38 లక్షల నగదు, 60 తులాల బంగారం, 17 ఆస్తులకు సంబంధించిన పత్రాలు, 5 ప్లాట్ల వివరాలు లభించినట్లు తెలిసింది. ఉమామహేశ్వరరావు బినామీల పేరిట భారీగా ఆస్తులు కూడగట్టారని ఏసీబీ అధికారులు గుర్తించారు. బ్యాంకు లాకర్ల విషయంలో ఉమామహేశ్వరరావు సహకరించట్లేదని, వాటిని తెరవడానికి కొంత సమయం పడుతుందని అధికారులు చెప్తున్నారు. ఉమామహేశ్వరరావు నుంచి స్వా«దీనం చేసుకున్న పత్రాలు, డైరీల్లో సందీప్ అనే పేరును అధికారులు గుర్తించారు. తన వెంట నిత్యం ల్యాప్‌టాప్ ఉంచుకునే ఉమామహేశ్వరరావు అందులో తాను ఎవరి నుంచి ఎంత తీసుకున్నరీ రాసుకున్నట్లు తెలిసింది. దీన్ని స్వాదీనం చేసుకున్న ఏసీబీ అధికారులు అందులోని వివరాలు విశ్లేషిస్తున్నారు. సోదాలు పర్యవేక్షించిన జేడీ సు«దీంద్రబాబు ఉమామహేశ్వరరావు, సందీప్ కలిసి అనేక చోట్ల పెట్టుబడులు పెట్టారని ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ సందీప్ ఎవరు? అతడి పాత్ర ఏంటి? అనేది లోతుగా ఆరా తీస్తున్నారు. సీసీఎస్‌లోని ఉమామహేశ్వరరావు చాంబర్లో తనిఖీలు చేపట్టి ,ఆయన దర్యాప్తు చేసిన కేసుల వివరాలు ఆరా తీస్తున్నారు. జేడీ సుదీంద్రబాబు మంగళవారం రాత్రి అశోక్‌నగర్‌లోని ఉమామహేశ్వరరావు ఇంటికి వెళ్లి సోదాలను పర్యవేక్షించారు. ఉమామహేశ్వరరావును అరెస్టు చేశామని, బుధవారం కోర్టులో ప్రవేశపెడతామని తెలిపారు. గతంలో అబిడ్స్ ఇన్స్పెక్టర్గా పని చేసిన ఉమామహేశ్వరరావు అక్కడ ఓ మహిళా కానిస్టేబుల్‌తో దురుసుగా ప్రవర్తించి సస్పెండ్ అయ్యారు. విధుల్లోకి తిరిగి వచి్చన ఆయన్ను రేంజ్ అధికారులు సైబరాబాద్ కమిషనరేట్‌కు అలాట్ చేశారు. జవహర్‌నగర్ పోలీసుస్టేషన్ ఇన్స్పెక్టర్గా పని చేస్తుండగా ఓ నేర స్థలికి వెళ్లిన ఆయన అక్కడ ఓ మహిళ ముందు అభ్యంతరకంగా ప్రవర్తిస్తూ వివాదాస్పదుడు కావడంతో మరోసారి సస్పెండ్ అయ్యారు. ఇబ్రహీంపట్నం ఏసీపీగా పని ఉమామహేశ్వరరావు ఎన్నికల ముందు జరిగిన బదిలీల్లో సీసీఎస్‌కు వచ్చారు. -
ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి వెంకటేష్ అలియాస్ వెంకట్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం చోటుచేసుకున్న ఈఘటన వివరాలను వరంగల్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య వెల్లడించారు. జిల్లాలోని దంతాలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన గుండగాని హరీష్.. దంతాలపల్లి మండల కేంద్రంలో 128 గజాల భూమి కొనుగోలు చేశాడు. రిజిస్ట్రేషన్ చేసేందుకు సబ్ రిజిస్ట్రార్ తస్లీమా గజానికి రూ.200 చొప్పున డిమాండ్ చేయగా.. రూ.150 చొప్పున ఇస్తానని బేరం కుదుర్చుకుని వరంగల్ జిల్లా కేంద్రంలోని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. శుక్రవారం సాయంత్రం మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ పూర్తికాగానే రూ.19,200 నగదును అవుట్ సోర్సింగ్ ఉద్యోగి వెంకటేష్‌కు ఇవ్వమని సబ్ రిజిస్ట్రార్ చెప్పగా.. హరీష్ ఆ డబ్బులను అందజేస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వెంకట్ వద్ద లెక్క చూపని మరో రూ.1.72లక్షలు నగదు ఉండగా స్వాధీనం చేసుకున్నారు. సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఆలేటి వెంకట్‌ను అదుపులోకి తీసుకుని వరంగల్‌లోని ఏసీబీ కోర్టుకు తరలించారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని విజ్ఞప్తి చేశారు. దాడుల్లో ఏసీబీ సీఐలు శ్యాంసుందర్, రాజు, సునీల్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
ACB raids: తహసీల్దార్ రజని ఇంట్లో ఏసీబీ తనిఖీలు..
జమ్మికుంట/వరంగల్‌క్రైం: రెండు అంతస్తుల ఇల్లు.. 21 ఇంటి స్థలాలు.. ఏడు ఎకరాల భూమి.. కిలోన్నర బంగారం.. ఇతరత్రా కలిపి మార్కెట్ వి లువ ప్రకారం రూ.12 కోట్ల ఆస్తులు. ఇవన్నీ జమ్మికుంట తహసీల్దార్ మర్కల రజనికి చెందిన హనుమకొండలోని ఇంటితోపాటు మరో ఐదు చోట్ల ఏకకాలంలో అవినీతి నిరోధకశాఖ అధికారులు బుధవారం నిర్వహించిన దాడుల్లో వెలుగుచూశాయి. ఉదయం నుంచి హనుమకొండలోని కేఎల్ఎన్రెడ్డి కాలనీ, ధర్మసాగర్, మరో నాలుగు చోట్ల ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. తహసీల్దార్ రజని ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళిక ప్రకారం అమె బంధువులు, సన్నిహితుల ఇళ్లను టార్గెట్ చేసుకుని తనిఖీలు చేశారు. కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ రమణామూర్తి ఆధ్వర్యంలో జరిగిన దాడుల్లో ఒక్కో చోట ఇన్స్పెక్టర్ స్థాయి ఆధ్వర్యంలో దాడులు కొనసాగాయి. ఆమె గతంలో తహసీల్దార్‌గా పనిచేసిన ప్రాంతాల్లో ఆమెకు సన్నిహితంగా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహించారు. రూ.12కోట్ల అక్రమాస్తులు.. తహసీల్దార్ మర్కల రజనిపై ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయని డీఎస్పీ రమణామూర్తి తెలిపారు. ఏసీబీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లాలో ఆరు చోట్ల దాడులు నిర్వహించామన్నారు. రజనికి హనుమకొండలో కేఎల్ఎన్రెడ్డి కాలనీలో రెండు అంతస్తుల ఇల్లు, 21 ఇంటి స్థలాలు, 7 ఎకరాల భూమి, 2 కార్లు, 3 ద్విచక్ర వాహనాలు, బ్యాంకులో రూ.25లక్షలు, లాకర్లు, ఇంట్లో కిలోన్నర బంగారం, ఇంట్లో రూ.1.50 లక్షల నగదు లభించినట్లు తెలిపారు. దీని విలువ (ప్రభుత్వ విలువ ప్రకారం) రూ.3.25 కోట్లు. ఇందులో సుమారు రూ.3కోట్ల అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించినట్లు ఆయన తెలిపారు. వీటి విలువ మార్కెట్ ప్రకారం సుమారు రూ.12 కోట్ల వరకు ఉంటుందని డీఎస్పీ రమణామూర్తి పేర్కొన్నారు. తహసీల్దార్ రజనిని అదుపులోకి తీసుకుని కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ రమణామూర్తి తెలిపారు. -
ఏసీబీ దర్యాప్తు.. సీడీపీవో ఆఫీసర్ శ్రీదేవి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: నిధుల దుర్వినియోగం వ్యవహారంలో.. సిటీ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు అధికారిణి అనిశెట్టి శ్రీదేవిని ఏసీబీ అరెస్టు చేసింది. కరీంనగర్ కోర్టులో ఆమెను హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా జైనూర్‌లో గతంలో సీడీపీవోగా పనిచేసిన సమయంలో శ్రీదేవి నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు గుర్తించామన్నారు. 322 అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి దాదాపు రూ.65.78 లక్షల నగదును దారి మళ్లించినట్లు గుర్తించారు. ఆరోగ్యలక్ష్మి పాల సరఫరా ఖర్చులపై నకిలీ ఇండెంట్లను సృష్టించి నగదు కాజేసినట్లు దర్యాప్తులో తేల్చారు. -
మూడు లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన అవినీతి చేప
సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో రూ.3 లంచం తీసుకుంటూ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ లచ్చునాయక్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. బాధితుల వద్ద నుంచి లంచం తీసుకుంటుండగా అధికారులు అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాల ప్రకారం.. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ లచ్చునాయక్ ఏసీబీకి చిక్కారు. రూ.3 లక్షలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఔషధాల టెండర్ కోసం వెంకన్న అనే వ్యాపారి నుంచి ఈ మొత్తాన్ని డిమాండ్ చేశారు. దీంతో, సదరు బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. ఈ క్రమంలో శుక్రవారం ఆయన నివాసంలో వెంకన్న నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేశారు. రెడ్‌హ్యాండెడ్‌గా అధికారిని పట్టుకున్నారు. అయితే, ప్రభుత్వ ఆసుపత్రికి రెండేళ్లుగా ఔషధాలు సరఫరా చేస్తున్నట్లు వెంకన్న తెలిపారు. కొన్నాళ్లుగా సూపరింటెండెంట్ 10 శాతం కమీషన్ తీసుకుంటున్నారని, ఇటీవల అధికశాతం కావాలని డిమాండ్ చేసినట్లు వెల్లడించారు. నెలరోజుల క్రితం రూ.లక్ష లంచంగా ఇవ్వగా.. నాలుగు రోజుల క్రితం మరో రూ. 3 లక్షలు డిమాండ్ చేయడంతో ఏసీబీని ఆశ్రయించినట్లు తెలిపారు. -
HMDA శివబాలకృష్ణ కేసులో మరో ట్విస్ట్.. ఐఏఎస్ అరవింద్..
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అవినీతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈకేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ.. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ అంశాన్ని బయటకు తీసింది. దీంతో, విచారణ చేపట్టేందుకు సిద్ధమైంది. వివరాల ప్రకారం.. హెచ్ఎండీఏ అధికారి శివబాలకృష్ణ అవినీతి కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. శివ బాలకృష్ణ కేసులో తాజాగా ఏసీబీ నివేదిక రెడీ చేసింది. ఈ నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఇక, ఈ కేసులో మరో కొత్త అంశాన్ని బయటకు తీసుకువచ్చింది. ఏసీబీ నివేదికలో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ వ్యవహారాన్ని ప్రస్తావించింది. బాలకృష్ణ దగ్గర నుంచి అరవింద్ కుమార్ పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నట్టు నివేదికలో పేర్కొంది. ఇక, ఈ వ్యవహారంలో ఐఏఎస్ అధికారి అయిన అరవింద్ కుమార్‌ను విచారించేందుకు ఏసీబీ.. ప్రభుత్వ అనుమతిని కోరింది. మరోవైపు.. బాలకృష్ణ నుంచి రికవరీ చేసిన ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. కాగా, గత పదేళ్ల కాలంలో దాదాపు 15 సెల్‌ఫోన్స్ మార్చినట్టు ఏసీబీ నివేదికలో వెల్లడించారు. ఈ ఫోన్లు, కాంటాక్ట్‌లకు సంబంధించి మరిన్ని కీలక విషయాలను ఏసీబీ వెల్లడించే అవకాశం ఉంది. -
HMDA: శివ బాలకృష్ణపై సస్పెన్షన్ వేటు
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ, రేరా, మెట్రోలో జరిగిన అక్రమాలకు సంబంధిచిన కేసులో అవినితి నిరోధక శాఖ(ఏసీబీ) విచారణ ఎదుర్కొంటున్న శివబాల కృష్ణపై హైదరాబాద్ మెట్రో పాలిటన్ అథారిటీ(HMDA) వేటు వేసింది. శివ బాలకృష్ణను సస్పెండ్ చేస్తూ మంగళవారం హెచ్ఎండీఏ కమిషనర్ దాన కిషోర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఆదాయనికి మించి ఆస్తుల కేసులో శివబాలకృష్ణ అరెస్ట్ అయ్యారు. ఇక.. ఆయన తన పదవిని అడ్డుపెట్టుకొని రూ. వందల కోట్లు సంపాధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఏసీబీ కేసులో విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో శివ బాలకృష్ణపై సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలుస్తోంది. చదవండి: ఏసీబీ కస్టడీకి హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ -
బాలకృష్ణను అదుపులో తీసుకున్నాం: ఏసీబీ
హైదరాబాద్, సాక్షి: ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అరెస్టు అయ్యారు. బుధవారం ఆయన ఇంట్లో చేసిన తనిఖీల్లో భారీగా ఆస్తులు బయటపడ్డాయి. సోదాలు పూర్తి కావడంతో ఆయన్ని అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రేపు ఆయన్ని కోర్టులో హాజరు పరిచే అవకాశాలు ఉన్నాయి. ‘‘బాలకృష్ణను అదుపులోకి తీసుకున్నాం. రేపు ఆయన్ని కోర్టులో హాజరుపరుస్తాం. ఆ తర్వాత కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుంటాం. తనిఖీల సమయంలో కుటుంబ సభ్యులెవరూ మాకు సహకరించలేదు’’ అని ఏసీబీ ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు శివబాలకృష్ణ ఇంట్లో సోదాలు ముగియగా.. మరో నాలుగు చోట్ల మాత్రం ఇంకా సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఇంకోవైపు ఆయన బ్యాంకు లాకర్స్‌ను ఏసీబీ అధికారులు తెరవనున్నారు. మొత్తం 20 చోట్ల తనిఖీలు చేపట్టిన ఏసీబీ.. భారీగా స్థిర, చరాస్తులకు సంబంధించిన పత్రాలకు స్వాధీనం చేసుకుంది. తన పదవిని, ఓ సీనియర్ ఐఏఎస్ అధికారితో సన్నిహిత పరిచయాన్ని అడ్డుపెట్టుకుని ఏకంగా రూ.500 కోట్ల వరకు అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టుగా ఏసీబీ అంచనా వేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే శివబాలకృష్ణపై ఆదాయానికి మించిన ఆస్థుల కేసు నమోదు అయ్యింది. గుర్తించిన ఆస్తులు ఇవే.. రూ. 40 లక్షల నగదు, ఐదుకోట్ల విలువైన బంగారం భారీగా స్థిర, చరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం 70 ఎకరాల భూమి, ఇండ్లు 60 ఖరీదైన చేతి గడియారాలు.. 100 మొబైల్ ఫోన్లు(భారీగా ఐఫోన్లు), నాలుగు కార్లు భారీగా ల్యాప్ టాప్స్ వీటితో పాటు ఇంట్లోనే ఆయన క్యాష్ కౌంటింగ్ యంత్రాలు ఉంచుకోవడం గమనార్హం. అలాగే.. ఆయన బ్యాంకు లాకర్లు తెరవడంతో పాటు బంధువుల ఇళ్లలో సోదాలు ముగిస్తే మరికొన్ని ఆస్తులు బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. శివ బాలకృష్ణతో సంబంధం ఉన్న అధికారులను వదలకుండా ప్రశ్నిస్తామని ఏసీబీ తాజాగా ప్రకటించింది. ఇక బుధవారం సాయంత్రం వరకు స్వాదీనం చేసుకున్న ఆస్తుల విలువే బహిరంగ మార్కెట్లో రూ.వంద కోట్లకుపైగానే ఉందని తేలింది. ఏసీబీ దాడుల్లో ఇటీవల కాలంలో ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు బయటపడటం ఇదే తొలి సారి అని అధికారులు పేర్కొంటున్నారు. ‘‘బాలకృష్ణ 2018–2023 మధ్య హెచ్ఎండీఏ డైరెక్టర్‌గా కొనసాగారు. హెచ్ఎండీఏ డైరెక్టర్‌గా పనిచేసిన సమయంలో శివబాలకృష్ణ భారీగా అవినీతికి పాల్పడి, అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టుగా ఫిర్యాదులు ఉన్నాయి. భారీ ఎత్తున అతి విలువైన భూముల పత్రాలు దొరికాయి. అవన్నీ బినామీల పేరిట కొనుగోలు చేశారు. వాటిని పరిశీలిస్తున్నాం. బాలకృష్ణ ఇంట్లో రూ.40 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నాం. ఇంకా బ్యాంకు లాకర్లను పరిశీలించాల్సి ఉంది..’’అని ఏసీబీ డీజీ తెలిపారు. -
SCCL: సింగరేణి నియామకాల్లో అవకతవకలు.. రంగంలోకి ఏసీబీ..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం స్పీడ్ పెంచింది. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, పలు అక్రమాలపై ప్రభుత్వం సీరియస్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే సింగరేణిలో జరిగిన పలు నియామకాల్లో అక్రమాలపై దృష్టి సారించింది. దీంతో, పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వివరాల ప్రకారం.. సింగరేణిలో మెడికల్ ఇన్వాలిడేషన్ నియామకాల్లో అవకతవకలు జరిగినట్టు ఎండీ బలరాం తెలిపారు. ఈ క్రమంలో నియామకాల పేరుతో పలువురు ఉద్యోగులు డబ్బు వసూలు చేసినట్టు స్పష్టం చేశారు. దీంతో, ఇప్పటికే పలువురిని సింగరేణి యాజమాన్యం సస్పెండ్ చేసిందని చెప్పారు. ఇక తాజాగా, ఎండీ బలరాం సింగరేణి అంశంపై ఏసీబీకి లేఖ రాశారు. దీంతో, ఏసీబీ డీఎస్పీ రమేష్ నేతృత్వంలో విచారణ చేపట్టింది. సింగరేణిలో నియామకాలపై దర్యాప్తు చేస్తోంది. -
రానున్న పూర్వవైభవం.. ఏసీబీ మళ్లీ దాడులకు సిద్ధం!
సాక్షి, ఆసిఫాబాద్: ఎన్నికల నియమావళి అమల్లో ఉండటం.. సిబ్బంది ఎన్నికల విధుల్లో నిమగ్నం కావడం.. తదితర కారణాలతో ప్రభుత్వ శాఖల్లో పనులు నత్తనడకన జరగడంతో ఇటీవల అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ) జోరు తగ్గింది. ప్రజల నుంచి పెద్దగా ఫిర్యాదులు కూడా లేకపోవడంతో కేసుల కోసం తడుముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఎన్నికలు ముగిశాయి.. కొత్త సర్కారు కొలువుదీరింది. పరిపాలన మళ్లీ గాడిన పడింది. ఏసీబీ బాస్‌గా సీవీ ఆనంద్ బాధ్యతలు చేపట్టాక.. ఏసీబీకి మళ్లీ పూర్వవైభవం తీసుకురావాలన్న లక్ష్యాన్ని నిర్దేశించారు. దీంతో ఏసీబీ అధికారులు మళ్లీ దాడులకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఫిర్యాదులతోపాటు సొంతంగా దాడులు చేసేందుకు అవకాశమున్న ‘ఆదాయానికి మించి ఆస్తులు’ కేసులపై ఈ విభాగం దృష్టి సారిస్తోంది. ఎన్నికలతో విరామం.. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇప్పటివరకు రెండు ఏసీబీ దాడులు జరిగాయి. రెబ్బెన మండల సర్వేయర్, చైన్‌మెన్ రూ.10 వేలు, రూ.20 వేల లంచం తీసుకొంటూ చింతలమానెపల్లి ఎస్సై ఏసీబీకి దొరికిపోయారు. ఆ తర్వాత మళ్లీ ఏసీబీ దాడులు నమోదు కాలేదు. అసెంబ్లీ ఎన్నికల పర్వంతో రెవెన్యూ, పోలీసు, రవాణా, రిజిస్ట్రేషన్లు, పౌరసరఫరాలు తదితర కీలక శాఖల సిబ్బంది ఆ విధుల్లో మునిగిపోయారు. పింఛన్లు, భూముల పట్టాల మంజూరు, వివిధ రకాల అనుమతుల ప్రక్రియలు మందగించాయి. ప్రజలకు సంబంధించిన ప్రభు త్వ కార్యాలయాల్లో పనులన్నీ దాదాపు స్తంభించాయి. దీని వల్ల ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు కూడా చాలా తగ్గాయని ఏసీబీ సిబ్బంది చెబుతున్నారు. ఫిర్యాదుల ఆధారంగానే ఉద్యోగులపై నిఘా పెట్టి వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి వీలవుతుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, లంచాల కోసం ఎవరైనా డిమాండ్ చేసినా తమకు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు కోరుతున్నారు. ‘వారి’పై ప్రత్యేక దృష్టి.. ప్రస్తుతం ఫిర్యాదులు(ట్రాప్)లతో పాటు ఆదాయానికి మించి ఆస్తులు(డీఏ) కలిగి ఉన్న వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఏసీబీ భావిస్తోంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో లెక్కకు మిక్కిలిగా సంపాదించుకుంటున్న సిబ్బంది, బినామీ పేర్లతో ఆస్తులు వెనకేసుకున్న ఉద్యోగులు, ఇక్కడే ఏళ్ల తరబడి తిష్టవేసి, పాడి ఆవుల్లాంటి విభాగాల్లో పాతుకుపోయిన అధికారులు, ఉద్యోగులపై ఈ విభాగం దృష్టి సారిస్తోంది. అవినీతికి బానిసలైన అధికారుల అక్రమ ఆస్తులపై, బినామీలపై ఏసీబీ రహస్యంగా నిఘా వేయనున్నట్లు సమాచారం. ఇవి చదవండి: ట్రాఫిక్ చలాన్ల చెల్లింపులో నిర్లక్ష్యం -
ఏసీబీకి చిక్కిన గచ్చిబౌలి ఏడీఈ
గచ్చిబౌలి: లంచం తీసుకుంటూ గచ్చిబౌలి సబ్ ఇంజనీర్, ఏడీఈ ఏసీబీకి చిక్కారు. ఏడీఈ అందె రాముతో పాటు సబ్ ఇంజనీర్ వీరమల్ల సోమనాథ్‌ను ఈ మేరకు అరెస్ట్ చేసినట్లు ఏసీబీ డీఎస్పీ భద్రయ్య తెలిపారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ నానక్‌రాంగూడకు చెందిన రాకేష్ సింగ్ రెండు విద్యుత్ మీటర్లు బిగించేందుకు రూ.70 వేలకు ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ బి.సందీప్ కుమార్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడని చెప్పారు. సందీప్ కుమార్ రెండు మీటర్ల కోసం ఆన్లైన్ దరఖాస్తు చేశారన్నారు. ధరఖాస్తును గచ్చిబౌలి ఏఈకి పంపగా ఎస్టిమేట్ వేసి తిరిగి ఏడీఈకి పంపారని పేర్కొన్నారు. ఏఈకి ఫైల్ పంపాలని కాంట్రాక్టర్ సందీప్ ఏడీఈని కలువగా రూ.30 వేలు లంచం డిమాండ్ చేశాడు. చివరకు రూ.20 వేలు ఇస్తాననడంతో ఒప్పుకున్నాడు. కాంట్రాక్టర్ మంగళవారం సాయంత్రం ఏడీఈ ఆఫీస్‌లో సబ్ ఇంజనీర్ సోమనాథ్‌కు రూ.20 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏడీఈ రాము వద్ద రూ.1,51,380 లెక్కలేని నగదు లభించిందన్నారు. కార్యాలయంతో పాటు హబ్సిగూడలోని ఆయన ఇంటిపై ఏసీబీ దాడులు జరుగుతున్నాయని తెలిపారు. ఇద్దరిని అరెస్ట్‌చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఆయన పేర్కొన్నారు. -
రూ.2 లక్షలు లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, ఆర్ఐ
సాక్షి, ఆదిలాబాద్ : అదిలాబాద్ జిల్లాలో రెవెన్యూ అదికారులు అడ్డగోలుగా వసూళ్ల దందాకు పాల్పడుతున్నారు. అదివారం సెలవు దినం కూడా వదిలిపెట్టడం లేదు. పట్టాపాసు పుస్తకంలో సవరణల కోసం రెండు లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేస్తూ తహసీల్దార్, ఆర్ఐ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఈ సంఘటన జిల్లాలోని మావల మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అదిలాబాద్‌కు చెందిన యతీంద్రనాథ్ అనే రైతు మావల సమీపంలోని 14 ఎకరాల భూమికి సంబంధించి నాలుగు పాసు పుస్తకాల్లో మార్పుల కోసం మావల తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించాడు. ఇందుకు ఎమ్మార్వో అరీఫా సుల్తానా, ఆర్ఐ హన్మంతరావు రెండు లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. చేసేది లేక బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్లాప్లాన్‌తో తహసిల్దార్ ఆరిఫాసుల్తానా, ఆర్ఐ హనుమంతరావుకు మావల తాహసీల్దార్ కార్యాలయంలో రెండు లక్షలు అందజేస్తుండగా ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ‘వారంలో బీజేపీ తొలి విడత అభ్యర్థుల జాబితా’ -
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీఐ జానకి
సాక్షి, హైదరాబాద్: ఓ మహిళా ఇన్స్పెక్టర్(సీఐ) లంచం తీసుకుంటుడగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఇన్స్పెక్టర్ జానకి ఏసీబీకి చిక్కారు. ఈ ఘటన పీర్జాదిగూడలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో శానిటేషన్ సెక్షన్లో జానకి ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా, శానిటేషన్ వస్తువులు సరఫరా చేసే వ్యక్తి నుంచి సీఐ జానకి లంచం డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రూ.20 వేలు లంచం తీసుకుంటూ శానిటేషన్ ఇన్స్పెక్టర్ జానకీ. దీంతో, సదరు బాధితుడు ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు చెప్పాడు. ఈ క్రమంలో 20వేలు ఇస్తుండగా జానకిని అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కాగా, ఆఫీసులో ఇంకా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇది కూడా చదవండి: పోలీసుల కళ్లలో కారం కొట్టి.. 15 రౌండ్ల కాల్పులు.. కస్టడీలోనే ఖతం చేశారు -
2019లో ‘ఉత్తమ’ అధికారి అవార్డు.. ఏసీబీ వలలో సంగెం తహసీల్దార్
ఆయన ప్రభుత్వం గుర్తించిన ఉత్తమ అధికారి. పైసా లేనిదే పనిచేయడనే విమర్శలున్నాయి. పనిచేసిన చోటల్లా పైత్యం చూపినట్లు సçహోద్యోగులు చెబుతున్నారు. ఎట్టకేలకూ పాపం పండింది. ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. సాక్షి, వరంగల్: రెవెన్యూ శాఖలో అవినీతి తిమింగళాన్ని ఏసీబీ అధికారులు పక్కాగా వల పన్ని పట్టుకున్నారు. సంగెం తహసీల్దార్ నరిమేటి రాజేంద్రనాథ్‌ను శుక్రవారం ఉదయం 10 గంటలకు హంటర్‌రోడ్డు నందిహిల్స్‌లోని ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. సంగెం మండల పరిధి కాపులకనిపర్తిలోని వ్యవసాయ భూమికి సంబంధించి రిజిస్ట్రేషన్ వ్యవహారంలో సంబంధిత రైతును నాలుగు నెలలుగా తహసీల్దార్ ఇబ్బందికి గురిచేస్తున్నాడు. ఈక్రమంలో బాధిత రైతు అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులను అశ్రయించాడు. పక్కా పథకం ప్రకారం.. ఏసీబీ అధికారులు తహసీల్దార్ రాజేంద్రనా«థ్‌ను పట్టుకున్నారు. వరంగల్ ఏసీబీ డీఎస్పీ వై.హరీశ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కాపులకనిపర్తిలో చింతనెక్కొండకు చెందిన నల్లెపు కుమార్‌కు మూడెకరాల భూమి ఉంది. అందులో నుంచి తన చెల్లెలికి ఎకరం భూమిని గిఫ్ట్‌గా ఇవ్వడానికి ఆన్లైన్ ద్వారా స్లాట్ బుక్ చేసుకున్నాడు. కానీ తహసీల్దార్ రాజేంద్రనాథ్ రిజిస్ట్రేషన్ చేయకుండా.. నాలుగు నెలలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. హనుమకొండలోని రాజేంద్రనాథ్ నివాసం ఈక్రమంలో రైతు ఈనెల 2న తహసీల్దార్ అడిగిన రూ.50 వేలు ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. అందులో భాగంగానే శుక్రవారం తహసీల్దార్ రాజేంద్రనాథ్ రైతు కుమార్‌కు ఫోన్ చేసి డబ్బులు తీసుకుని ఇంటికి రావాలన్నాడు. రైతు నుంచి డబ్బులు తీసుకున్న వెంటనే అతడిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం రాజేంద్రనాథ్ నివాసంలో కంప్యూటర్, ఇతర ఫైల్స్ పరిశీలించారు. విలువైన భూముల పత్రాలు, వాహనాలు, ప్లాట్లు ఇతర విలువైన పత్రాలు లభించినట్లు సమాచారం. అనంతరం సంగెం తహసీల్దార్ కార్యాలయానికి రాజేంద్రనాథ్‌ను తీసుకొచ్చి ఆర్డీఓ మహెందర్‌జీ సమక్షంలో రికార్డులు తనిఖీ చేసి, సోదాలు నిర్వహించారు. కాగా.. తహసీల్దార్ కార్యాలయంలో పలు డాక్యుమెంట్లను, రికార్డులను, కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లను, సీసీ పుటేజీలను సీజ్ చేసినట్లు సమాచారం. దాడుల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్లు శ్యాంసుందర్, శ్రీను, సిబ్బంది పాల్గొన్నట్లు ఏసీబీ డీఎస్పీ వై.హరీశ్‌కుమార్ తెలిపారు. ఆది నుంచి అదేతీరు! సంగెం తహసీల్దార్ రాజేంద్రనాథ్ ఉద్యోగ ప్రస్థానం ఆది నుంచి వివాదాస్పదమే! గతంలో డీటీ స్థాయిలో ఓప్రజాప్రతినిధి వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పని చేశారు. అక్కడ్నుంచి బదిలీ అయిన తర్వాత సుదీర్ఘకాలం ఉమ్మడి వరంగల్ జిల్లాలో జేసీల వద్ద సీసీగా పని చేశారు. తర్వాత ధర్మసాగర్లో పని చేశారు. జిల్లాల విభజన అనంతరం వరంగల్ జిల్లాకు వెళ్లిన ఆయన మొదట్లో నల్లబెల్లి తహసీల్దార్‌గా వెళ్లారు. అక్కడ కూడా వివాదాస్పద పనులతో ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. దీంతో ఉన్నతాధికారులు అతడిని కలెక్టరేట్‌కు బదిలీ చేశారు. కలెక్టరేట్‌కు వచ్చిన తర్వాత ఆయన తీరు మరింత ఆందోళనకరంగా మారిందని ఆరోపణలున్నాయి. కలెక్టరేట్ ఏఓగా పని చేస్తూ ఉద్యోగులు, ఉన్నతాధికారులకు మధ్య సమన్వయం చేయాల్సిన సమయంలో ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించేలా పనులు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా సదరు అధికారి ఇబ్బందులు భరించలేక జిల్లాలోని సçహోద్యోగులు, రెవెన్యూ శాఖలోని ఇతర స్థాయి ఉద్యోగులు ఇతడి వేధింపులపై ఓ జిల్లాస్థాయి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకొని ఒక్కొక్కరుగా తమ బాధలు చెప్పుకున్నట్లు సమాచారం. పదే పదే ఆరోపణలు వస్తున్నా.. కొందరు అధికారులు సదరు తహసీల్దార్‌కు అన్ని విధాలా అండగా నిలవడం తీవ్రస్థాయిలో విమర్శలకు దారితీసింది. అండగా నిలిచిన ఆజిల్లా ఉన్నతాధికారి బదిలీ కావడంతో కలెక్టరేట్ నుంచి రాజేంద్రనాథ్ బదిలీ అనివార్యమైంది. దీంతో తోటి ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నట్లు చెబుతుంటారు. తీవ్రస్థాయిలో ఆరోపణలున్న రాజేంద్రనాథ్‌ను 2019లో ఉత్తమ అధికారి అవార్డు అందించడం విశేషం. -
‘గుట్ట’ సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో ముగిసిన సోదాలు
యాదగిరిగుట్ట: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్ట సబ్ రిజిస్ట్రార్ దేవానంద్ నివాసంలో ఏసీబీ అధికారుల సోదాలు శుక్రవారం ముగిశాయి. మూడు ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి రూ.20 వేలు డిమాండ్ చేసిన సబ్ రిజిస్ట్రార్ దేవానంద్.. స్థానిక డాక్యుమెంట్ రైటర్ ప్రభాకర్‌ను మధ్యవర్తిగా పెట్టి లంచం తీసుకున్న నేపథ్యంలో ఏసీబీ అధికారులు గురువారం పట్టుకున్న విషయం విదితమే. కాగా, దేవానంద్ ఇంట్లో రూ.76 లక్షలకుపైగా నగదు, 27 తులాల బంగారు ఆభరణాలు, 7.9 ఎకరాల పొలం, 200 గజాల ప్లాట్‌కు సంబంధించిన డాక్యుమెంట్లు, తొమ్మిది విదేశీమద్యం బాటిళ్లు, పలు ఇతర కీలక డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దేవానంద్, ప్రభాకర్‌లను ఏసీబీ జిల్లా ఇన్చార్జి డీఎస్పీ శ్రీకృష్ణగౌడ్, మెదక్ డీఎస్పీ ఆనంద్ ఆధ్వర్యంలో విచారించారు. వారిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచినట్లు అధికారులు తెలిపారు. -
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ పాల్వంచ ఎంపీడీఓ
సాక్షి, పాల్వంచ : ఓ కాంట్రాక్టర్‌కు బిల్లు మంజూరు చేసేందుకు లంచం తీసుకుంటూ శుక్రవారం పాల్వంచ ఎంపీడీఓ పి.ఆల్బర్ట్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కాడు. ఏసీబీ వరంగల్, ఖమ్మం డీఎస్పీ మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం..పాండురంగాపురం గ్రామ పంచాయతీలో శ్మశానవాటిక, డంపింగ్ యార్డు నిర్మించిన కాంట్రాక్టర్ ఆడెపు రామలింగయ్యకు బిల్లు మంజూరు కావాల్సి ఉండగా..ఎంపీడీఓ ఆల్బర్ట్ రూ.20వేలు లంచం డిమాండ్ చేశాడు. గతంలోనే కొంత డబ్బు ఇచ్చానని, అయినా ఇంకా అడుగుతున్నాడని విసిగిన సదరు కాంట్రాక్టర్ ఈనెల 9వ తేదీన ఖమ్మం ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వారి సూచన మేరకు శుక్రవారం మధ్యాహ్నం ఎంపీడీఓకు డబ్బులు ముట్టజెప్పాడు. అప్పటికే నిఘావేసి ఉన్న ఏసీబీ అధికారులు ఆయన గదిలోకి వెళ్లి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డబ్బులను స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించి, ఎంపీడీఓపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ దాడుల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్లు రమణమూర్తి, క్రాంతికుమార్‌లు పాల్గొన్నారు. గతంలో ఇద్దరు.. రెండు సంవత్సరాల క్రితం తహసీల్దార్ కార్యాలయంలో ఓ వీఆర్వో రూ.7,000లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. గత మార్చి 20వ తేదీన పాల్వంచ తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఆనంద్ మోహన్ చక్రవర్తి పాండురంగాపురం గ్రామానికి చెందిన అరుణ్‌సాయికి ఓ ధ్రువీకరణ పత్రం ఇవ్వడానికి రూ.3,500 లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఇప్పుడు ఏకంగా ఎంపీడీఓనే రూ.20వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కాడు. పాల్వంచలోని ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి పెచ్చుమీరుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ఏసీబీకి పట్టుబడిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ -
8 నుంచి ‘ఓటుకు కోట్లు’ తుది విచారణ
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసు తుది విచారణ ఈ నెల 8 నుంచి ప్రారంభం కానుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటేయాలంటూ 2015లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించినటువంటి ఆధారాలను ఏసీబీ సోమవారం ప్రత్యేక కోర్టుకు సమర్పించింది. ఇందులో రికార్డయిన వీడియోతోపాటు నిందితులకు సంబంధించిన ఫోన్ రికార్డింగ్స్ తో కూడిన 1 టీబీ హార్డ్‌డిస్క్‌లు రెండు, ఒక డీవీడీఆర్ ఉన్నాయి. ఈ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న స్టీఫెన్సన్ను ఈనెల 8న హాజరై వాంగ్మూలం ఇవ్వాలని -
75 వేలు లంచం: సుధాకర్‌రెడ్డి, భాస్కరాచారి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్/గన్‌ఫౌండ్రీ: లంచం తీసుకున్న కేసులో తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ భాస్కరాచారి, జనరల్ మేనేజర్ సుధాకర్‌రెడ్డిలను ఏసీబీ అరెస్టు చేసింది. గిడ్డంగుల సంస్థలో గ్రేడ్–1 మేనేజర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందిన బానోత్ సుందర్‌లాల్‌కు తన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలంటే రూ.75 వేలు లంచంగా ఇవ్వాలని భాస్కరాచారి, సుధాకర్‌రెడ్డిలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు బుధవారం సుందర్‌లాల్ రూ.75 వేల నగదును సుధాకర్‌రెడ్డికి ఇచ్చాడు. అక్కడే మాటేసిన అధికారులు తొలుత సుధాకర్‌రెడ్డి.. ఆ తర్వాత భాస్కరాచారిని అరెస్టు చేసి డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఏసీబీ జడ్జి ముందు నిందితులను ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలించారు. అంతకుముందు ఏసీబీ అధికారులు ఇద్దరు నిందితుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఘటనపై ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ మాట్లాడుతూ.. ‘బాధితుడు సుందర్‌లాల్‌కు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా 6 నెలలుగా తిప్పించుకుంటున్నారు. రూ.లక్ష లంచం డిమాండ్ చేశారు. సుందర్‌లాల్ గతంలో కరీంనగర్లో ఏసీబీ కేసులో ఉండటంతో దానిని కారణంగా చూపి, అతని ఫైల్ ముందుకు సాగనివ్వలేదు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం అడిగితే 1064 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వండి..’అని ఆయన సూచించారు. -
ఎమ్మెల్సీ ఎన్నికపై కాంగ్రెస్ కీలక నిర్ణయం!
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఎన్నికల్లో ఎవరికీ మద్దతు ఇవ్వొద్దని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. తమకు మద్దతు ఇవ్వాలని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌లు విడివిడిగా కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వానికి ఇదివరకు విన్నవించారు. దీనిపై నిర్ణయం తీసుకునేందుకుగాను ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి నేతృత్వంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కమిటీ వేశారు. ఇతరులకు మద్దతు ఇచ్చే దాని కన్నా తామే బరిలో ఉందామని, పార్టీ అభ్యర్థికి గెలుపు అవకాశాలు న్నాయని ఆయా జిల్లాల మెజారిటీ నేతలు కమిటీకి సూచించినట్టు గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ విషయంపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్‌తో జరిగిన టీపీసీసీ ముఖ్యుల జూమ్ కాన్ఫరెన్స్‌లో కూడా అదే అభిప్రాయం వెల్లడైంది. కాగా, ఈ స్థానానికి మొత్తం 26 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ అభ్యర్థిత్వం వైపు పార్టీ నాయకత్వం మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్, మరో గిరిజన నేత బెల్లయ్యనాయక్‌ల పేర్లను కూడా తీవ్రంగానే పరిశీలిస్తున్నారు. మానవతారాయ్, బెల్లయ్య నాయక్‌లు సోమవారం పార్టీ పెద్దలను కలసి టికెట్ విషయమై తమ వాదనలను వినిపించారు. అయితే, టీపీసీసీ ముఖ్యనేతలు కసరత్తు పూర్తి చేసిన తర్వాత ముగ్గురు నేతల పేర్లను ఏఐసీసీకి పంపనున్నారు. రంగారెడ్డి ఆశావహులతో చర్చలు కాగా, రంగారెడ్డి–హైదరాబాద్– మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక పై సోమవారం గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజులు సమావేశమై పార్టీ నేతల అభిప్రాయాలను సేకరించారు. ఈ స్థానానికి టికెట్ ఆశిస్తున్న ఏఐసీసీ కార్యదర్శులు వంశీచంద్‌రెడ్డి, జి.చిన్నారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎం.ఆర్.జి.వినోద్‌రెడ్డిలతో కూడా సంప్రదింపులు జరిపారు. టీపీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్, ఓబీసీ సెల్ చైర్మన్ కత్తి వెంకటస్వామి, ఉపాధ్యాయ నేత హర్షవర్ధన్‌రెడ్డిలతోసహా 24 మంది టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలోంచి మూడు పేర్లను ప్రతిపాదించి మంగళవారం ఏఐసీసీకి పంపనున్నట్టు సమాచారం. పిటిషన్ పునర్విచారించాలని రేవంత్ అభ్యర్థన ఏసీబీ అభిప్రాయం కోరుతూ 18కి విచారణ వాయిదా సాక్షి, హైదరాబాద్: తమపై ఏసీబీ నమోదు చేసిన అభియోగాలను విచారించే పరిధి ఈ కోర్టుకు లేదంటూ మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఉత్తర్వులు ఇచ్చేందుకు న్యాయస్థానం సిద్ధమవుతుండగా, పిటిషన్‌ను తిరిగి విచారించాలంటూ రేవంత్ ఏసీబీ ప్రత్యేక కోర్టును అభ్యర్థించారు. ఈ మేరకు ఆయన తరఫు న్యాయవాది సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. తన తరఫు న్యాయవాది వీడియో కాన్ఫరెన్స్‌లో కొన్ని కీలక అంశాలపై వాదనలు వినిపించలేకపోయారని అందులో పేర్కొన్నారు. మరోసారి విచారణ జరిపితే తమ వాదనలు పూర్తిగా వినిపిస్తామని విన్నవించారు. ఈ మేరకు అనుమతి మంజూరు చేసిన న్యాయమూర్తి సాంబశివరావు నాయుడు... ఈ పిటిషన్‌పై అభ్యంతరం ఉంటే తెలియజేయాలని ఏసీబీని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేశారు. తమపై నమోదు చేసిన అభియోగాలను ఎలక్షన్ ట్రిబ్యునల్ మాత్రమే విచారించాలని, ఏసీబీ ప్రత్యేక కోర్టుకు విచారించే పరిధి లేదని రేవంత్‌రెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపించిన విషయం తెలిసిందే. కాగా, చంద్రబాబు అక్రమ ఆస్తులపై ఏసీబీ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ నందమూరి లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును న్యాయస్థానం ఈ నెల 18న వెలువరించనుంది. -
కామారెడ్డి: డీఎస్పీ లక్ష్మీ నారాయణ అరెస్ట్
-
కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీ నారాయణ అరెస్ట్
సాక్షి, కామారెడ్డి: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణను ఏసీబీ అధికారులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇటీవల డీఎస్పీ ఇంట్లో నిర్వహించిన తనిఖీల్లో ఆదాయానికి మించి రూ. 2.11 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. బెట్టింగ్ కేసులో నిందితుల నుంచి కామారెడ్డి సీఐ జగదీశ్, ఎస్సై గోవింద్ డబ్బులు వసూలు చేసిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో అప్పట్లో డీఎస్పీని కూడా విచారించారు. అయితే బెట్టింగ్ కేసులో లక్ష్మీ నారాయణ ప్రమేయం లేదని తేలినప్పటికీ, ఆయన ఆస్తుల వ్యవహారంలో ఏసీబీ విచారణ చేపట్టింది. దీంతో ఆయనను ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిచించారు. చదవండి: ఎస్ఐ గోవింద్‌పై సస్పెన్షన్ వేటు చదవండి: కామారెడ్డి పోలీసుల్లో ఐపీఎల్ బెట్టింగ్ గుబులు! -
సీఐ జగదీశ్ కేసు: రోజుకో విషయం వెలుగులోకి
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి సీఐ జగదీశ్ అక్రమాల వ్యవహారంలో రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. జగదీశ్ అక్రమాస్తులకు సంబంధించి వారం రోజులుగా ఏసీబీ అధికారుల విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే నిజామాబాద్ కంఠేశ్వర్‌లోని యాక్సిస్ బ్యాంక్ లాకర్లో ఉన్న రూ.34 లక్షల నగదు, 9 లక్షల విలువ చేసే బంగారంతో పాటు ఇతర విలువైన ఆస్తులకు సంబంధించిన విలువైన డాక్యుమెంట్స్‌ను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. ఐపీఎల్ క్రికెట్ ప్రారంభం నుంచే బెట్టింగ్ నిర్వాహకులతో సీఐ జగదీశ్ టచ్‌లో ఉన్నట్లు ఏసీబీ అనుమానం వ్యక్తం చేస్తోంది. కాగా, జగదీశ్‌కు బెట్టింగ్ వ్యవహారంలోనే కాకుండా ఓ వివాహిత హత్య కేసుతో, ఓ పెళ్లి సంబంధం విషయంలో పెద్ద ఎత్తున డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జగదీశ్‌కు సంబంధించిన బాధితుల నుంచి ఏసీబీ అధికారులు వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఐపీఎల్ క్రికెట్‌కు సంబందించి బెట్టింగ్ నిర్వాహకుల నుంచి సీఐతో పాటు జిల్లాకు చెందిన పలువురు సీఐలు, ఏఎస్సైలు పెద్ద ఏత్తున మాముళ్లు తీసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఏసీబీ అధికారులు క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో ఇతర పోలీస్ అధికారుల ప్రమేయంపై కూడా ఆరా తీస్తున్నారు. చదవండి: (బెయిల్ కోసం కామారెడ్డి సీఐ చేతివాటం) -
కట్టలు కట్టలుగా డబ్బు..
సాక్షి, నిజామాబాద్ : క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో అరెస్ట్ అయి సస్పెండ్ అయిన కామారెడ్డి సీఐ జగదీశ్‌కు సంబంధించి ఏసీబీ అధికారులు భారీగా అక్రమ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ కంటేశ్వర్ యాక్సిస్ బ్యాంకులో జగదీశ్‌కి సంబంధించిన లాకర్ ఓపెన్ చేసి.. 34,40,000 రూపాయల నగదుతో పాటు 9 లక్షల రూపాయల విలువచేసే బంగారు నగలను సీజ్ చేసినట్లు ఏసీబీ డైరెక్టర్ జనరల్ పూర్ణచందర్ రావుతెలిపారు. సస్పెండైన సీఐ జగదీశ్‌కు సంబంధించి అక్రమాస్తులను గుర్తించే పనిలో లోతుగా వివరాలు సేకరిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. బినామీ పేర్లతో పలు చోట్ల పెద్ద ఎత్తున జగదీష్ భూములు కొన్నట్లు ఏసీబీ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: కామారెడ్డి సీఐ జగదీశ్ అరెస్టు) -
అడిగినంత ఇస్తే సరి.. లేదంటే..!
సాక్షి, సిటీబ్యూరో: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అవినీతికి నిలయంగా మారింది. పైసా విదల్చనిదే ఫైలు కదలని పరిస్థితి నెలకొంది. ట్రాన్స్ఫార్మర్, కొత్త వెంచర్లో లైన్ల ఏర్పాటు, లైన్ల మార్పిడి, ప్యానల్ బోర్డు, కరెంట్ మీటర్....ఇలా ప్రతి పనికీ ఓ రేట్ ఫిక్స్ చేశారు. అడిగినంత ఇస్తే సరి..లేదంటే వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నారు. ఇంజనీర్ల తీరుతో విసిగిపోయిన వినియోగదారులు, విద్యుత్ కాంట్రాక్టర్లు చివరకు ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తుండటంతో అవినీతి తిమింగళాలను వలపన్ని పట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఒక సారి ఏసీబీ కేసులో అరెస్టై కేసు విచారణలో ఉన్న అధికారులు ఏడాది తిరగక ముందే అంత కంటే మంచి పోస్టులో చేరిపోతుండటంపై విశేషం. నిజానికి ఏసీబీ కేసులున్న అధికారులను పెద్దగా ప్రాధాన్యం లేని పోస్టుల్లో వేయాలి. కానీ దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో ఇందుకు విరుద్ధంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి పెద్దపీట వేస్తుండటం కొసమెరుపు. చదవండి: ప్రైవేటీకరణ మాటే లేదు వారి రూటే సపరేటు..ప్రతి పనికీ ఓ రేటు గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కొత్తగా అనేక వెంచర్లు వెలుస్తున్నాయి. బహుళ అంతస్తుల భవనాలు, వ్యక్తిగత గృహాలు అనేకం నిర్మాణం అవుతున్నాయి. కొత్తలైన్లు, మీటర్లు కరెంటోళ్లకు కామధేనువులా మారాయి. నిజానికి నాలుగు మీటర్లకు మించితే ప్యానల్ బోర్డు ఏర్పాటు చేసుకోవాలి. చాలా మంది వినియోగదారులు జీహెచ్ఎంసీ నుంచి అనుమతి తీసుకోకుండా నిర్మాణాలు చేపడుతుంటారు. ఒక వేళ అనుమతి తీసుకున్నా..సెట్‌బ్యాక్, పార్కింగ్, ఫైర్‌సేఫ్టీ వంటి నిబంధనలు పాటించరు. దీంతో వీటికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇవ్వరు. ప్రభుత్వ, నోటరీ స్థలాల్లో నిర్మాణాలకు ఎలాంటి ధృవపత్రాలు ఉండవు. నిర్మాణంలో ఉన్న ఈ లోపాలను ఇంజనీర్లు అవకాశంగా తీసుకుంటున్నారు. నిజానికి ఏదైనా వెంచర్‌కు కరెంట్‌లైన్ మంజూరు చేయాలంటే హెచ్ఎండీఏ అనుమతి ఉండాలి. కానీ ప్రస్తుతం శివారు ప్రాంతాల్లోని వెంచర్లలో చాలా వాటికి అనుమతి లేదు. అప్పట్లో గ్రామ పంచాయితీ అనుమతితో ఆయా వెంచర్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వీటికి లైన్లు మంజూరు కోసం రూ.2 లక్షలకుపైగా వసూలు చేస్తున్నారు. అన్ని అనుమతులు ఉన్నా హెచ్ఎండీఏ వెంచర్ నిర్వాహకులు కూడా రూ.లక్షకు పైగా ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఇక శివార్లలో కొత్తగా నిర్మించే అపార్ట్‌మెంట్‌కు ప్యానల్‌బోర్డు, ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయాలంటే సదరు యజమాని కనీసం రూ.లక్షన్నరపైగా కప్పం కట్టాల్సిందే. చదవండి: కరెంట్ బిల్లు తగ్గాలా.. ఇలా చేయండి! ఏసీబీని ఆశ్రయిస్తుండటంతో.. శివారు ప్రాంతాల్లోని కీసర, మేడ్చల్, హబ్సీగూడ, సైనిక్‌పురి, సరూర్‌నగర్, రాజేంద్రనగర్, చంపాపేట్, హబ్సీగూడ, డివిజన్లు అవినీతికి నిలయంగా మారాయి. ఇక్కడ పని చేస్తున్న కొంత మంది ఉన్నతాధికారులు కిందిస్థాయిలో పని చేస్తున్న సిబ్బందిని ఏజెంట్లుగా పెట్టుకుని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అధికారికంగా ఎలాంటి ఎస్టిమేషన్లు లేకుండానే కొత్తలైన్లు, ప్యానల్‌బోర్డులు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేన్నారు. నిజానికి భవనం, వెంచర్ యజమానులు కొత్త లైన్లు, కనెక్షన్ల కోసం ఆయా డివిజన్ల పరిధిలోని వినియోగదారుల సేవాకేంద్రంలో దరఖాస్తు చేసుకుంటారు. ఈ కేంద్రం నుంచి దరఖాస్తు సంబంధిత సెక్షన్ ఏఈ, ఏడీఈ, డీఈ,ఎస్ఈకి వెళ్లుంది. వర్క్ఎస్టిమేషన్ దగ్గరి నుంచి మెటీరియల్ సరఫరా, వర్క్ పూర్తైన తర్వాత తనిఖీ చేసే వరకు సెక్షన్‌కు ఇంత అంటూ ప్రతి ఒక్కరికీ ఎంతో కొంత సమర్పించుకోవాల్సిందే. లేదంటే రోజుల తరబడి తిరిగినా ఫైలు ముందుకు కదలదు. -
ధర్మారెడ్డి ఆత్మహత్య.. అనుమానాలెన్నో..
సాక్షి, హైదరాబాద్/కుషాయిగూడ: కీసర భూవివాదం కేసులో మాజీ తహసీల్దారు నాగరాజుతో పాటు అరెస్టయిన ధర్మారెడ్డి (77) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇప్పటికే నాగరాజు జైల్లోనే ఆత్మహత్య చేసుకోగా.. ధర్మారెడ్డి జైలు నుంచి బెయిల్‌పై బయటకొచ్చిన పది రోజు లకే స్థానిక ఆలయం సమీపంలో వేపచెట్టుకు ఉరివేసుకున్న స్థితిలో కనిపించడం అనుమానాలకు తావి స్తోంది. పోస్టుమార్టం అనంతరం ఆయన మృతదేహాన్ని కుషాయిగూడ నాగార్జుననగర్ కాలనీకి తరలించారు. ఇదే కేసులో చంచల్‌గూడ జైల్లో ఉన్న కుమారుడు శ్రీకాంత్‌రెడ్డి రాగానే రాంపల్లి దయారాలో ధర్మారెడ్డి అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. శనివారం ఇంట్లోంచి వెళ్లి.. ఆదివారం శవమై.. శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ధర్మారెడ్డి ఇంటి నుంచి బయటికెళ్లారు. రాత్రయినా తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల వెతికారు. ఆదివారం తెల్లవారుజామున ఆరున్నర గంటల ప్రాంతంలో వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం సమీపంలోని వేపచెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడన్న సమాచారం తెలి సింది. ఏడేళ్లుగా అప్పుడప్పుడు ధర్మారెడ్డి ఆ ఆలయంలో రాత్రిళ్లు నిద్రించేవారని, చివరకు అక్కడే శాశ్వత నిద్రలోకి వెళ్లారంటూ బంధువులు రోదిం చారు. కాగా, బెయిల్‌పై ఇంటికి వచ్చినా ధర్మారెడ్డికి పోలీసుల వేధింపులు ఆగలేదని వారు అంటున్నారు. నాంపల్లి ఏసీబీ కోర్టుకొచ్చి సంతకం చేసి వెళ్లాలని చెప్పారని, ఆరోగ్యం సహకరించట్లేదని బతిమాలినా పోలీసులు వినిపించుకోలేదని వారు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో రావాల్సిందేనని బెదిరింపు ధోరణిలో మాట్లాడారని, కోర్టుకు వెళ్లలేక, మరోపక్క కొడుకుకు ఇంకా బెయిల్ రాకపోవడంతో మానసికంగా కుంగిపోయారన్నారు. అనుమానాలెన్నో.. 77 ఏళ్ల ధర్మారెడ్డి సరిగా నడవలేరు. చీకటిపడితే కళ్లు సరిగా కనిపించవు. అటువంటి వ్యక్తి గుడి సమీపంలో 12 అడుగుల ఎత్తున్న వేపచెట్టు కొమ్మకు తాడు ఎలా కట్టారన్నది అంతుచిక్కట్లేదు. గుడిలోకి చెందిన అడుగున్నర ఎత్తుండే ఓ కుర్చీ ఘటనాస్థలిలో కనిపించింది. ఒకవేళ కుర్చీ ఎక్కి కొమ్మకు దుస్సు ముడివేశారా అంటే.. ఘటనాస్థలాన్ని చూస్తే అలా లేదు. తాడును కొమ్మకు గట్టిగా బిగించి కట్టినట్టుంది. చెట్టెక్కితేనే అది సాధ్యం. వయసు దృష్ట్యా ధర్మారెడ్డి చెట్టెక్కి కొమ్మకు తాడు కట్టడం సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే, ఘటన స్థలంలో కనిపించిన కుర్చీని వేపచెట్టువైపు తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీకి చిక్కలేదు. ఈ దిశగా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇదీ వివాదం.. నవాబుల నుంచి వారసత్వంగా సంక్రమించిన 96 ఎకరాలకు ధర్మారెడ్డి తండ్రి నారాయణరెడ్డి 1950 నుంచి 58 మధ్యకాలంలో టెనెంట్‌గా ఉన్నారని ధర్మారెడ్డి కుటుంబసభ్యులు చెబుతున్నారు. ‘రెండేళ్ల పాటు పన్నులు చెల్లించడంతో 38ఈ సర్టిఫికెట్ కూడా వచ్చింది. కిషన్‌సింగ్ అనే వ్యక్తి రికార్డులను తారుమారుచేసి కొందరికి ఆ భూమి విక్రయించాడు. దీనిపై విచారణ జరిపిన అప్పటి తహసీల్దార్ అందులో 24 ఎకరాలకు ధర్మారెడ్డితో పాటు అతని ముగ్గురి సోదరుల పేరుపై పట్టా పాస్‌బుక్ ఇవ్వాలని ఆదేశాలిచ్చారు. అయితే, ఆ భూమి తమదంటూ కొందరు ఫిర్యాదు చేయడంతో సెప్టెంబర్ 25న ధర్మారెడ్డిని, 29న అతని కుమారుడు శ్రీకాంత్‌రెడ్డి తదితరులను అన్యాయంగా అరెస్టు చేశార’ని వారు అంటున్నారు. కాగా, ఈ వివాదానికి సంబంధించి అప్పటికే లంచం కేసులో అరెస్టయి ఉన్న మాజీ తహసీల్దార్ నాగరాజుపై.. ధర్మారెడ్డి పేరిట అక్రమంగా పట్టా పాస్ పుస్తకాలను సృష్టించారనే ఆరోపణలతో ఏసీబీ మరో కేసు నమోదు చేసింది. ఏ సమయంలో ఏం చేశాడంటే.. – శనివారం సాయంత్రం 4.48 ని.: ధర్మారెడ్డి వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయానికి వచ్చారు. 5.08: వరకు ఉండి వెళ్లిపోయారు. 5.24కి మళ్లీ వచ్చి.. రాత్రి 7.43కి బయటకు వెళ్లారు. 8.06కు మళ్లీ వచ్చి వెంటనే వెళ్లిపోయారు. – రాత్రి 8.54: ధర్మారెడ్డి ఫోన్ మాట్లాడుతూ మళ్లీ ఆలచానికి వచ్చారు. 9.30: టవల్ వేసుకొని పడుకున్నారు. 10.11: ఓ బాబుతో ముగ్గురు మహిళలు వచ్చి చాప పర్చుకొని పడుకున్నారు. ఈ అలికిడికి ధర్మారెడ్డి నిద్రలేచి 10.14 సమయంలో గుడిలోనే అటుఇటు తిరిగారు. – 11.24: ఓ మహిళ నిద్రలేచింది. అటూఇటూ చూసి మళ్లీ పడుకుంది. – 11.33: మళ్లీ లేచిన ఆమె అక్కడే ఉన్న కుళాయి నుంచి బాటిల్లో నీళ్లు నింపుకుంది. ఆపై తనతో ఉన్న ఇద్దరినీ నిద్రలేపింది. వారంతా ధర్మారెడ్డి కదలికలను గమనించారు. – 12.10: ముగ్గురు మహిళలు వెళ్లిపోయారు. – 12.13: ధర్మారెడ్డి చేతిలో టవల్‌తో వెళ్లారు. సివిల్ కేసులో పోలీసుల ప్రమేయమేంటి? మాకు ఎలాంటి సంబంధం లేని తహసీల్దార్ నాగరాజు కేసులో మా నాన్న, అన్నయ్యను పోలీసులు కొందరు పెద్దల ఒత్తిడితో ఇరికించారు. కావాలని సివిల్ కేసును క్రిమినల్ కేసుగా మార్చారు. ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి. – ఉమాదేవి, మృతుడి చిన్న కుమార్తె అంత్యక్రియలకు నా కొడుకును పంపించండి కొందరి ఫిర్యాదుతో నా భర్తను, కొడుకును అన్యాయంగా అరెస్ట్ చేశారు. సదరు భూమి పత్రాలు ఎక్కడంటూ నా భర్త ధర్మారెడ్డిని ఏసీబీ అధికారులు బెదిరించారు. నా భర్త అంత్యక్రియల కోసం కుమారుడు శ్రీకాంత్‌రెడ్డిని పంపించాలి. అప్పటివరకు మృతదేహాన్ని ఇక్కడే ఉంచుతాం. – వెంకటమ్మ, మృతుడి భార్య -
కీసర మాజీ తాహసీల్దార్ ఆత్మహత్య
-
కీసర మాజీ తాహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్ : కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య చేసుకున్నారు. ఇటీవలే అవినీతి నిరోధక శాఖ ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చంచలగూడ జైలులో ఉన్న నాగరాజు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. రూ.కోటి 10 లక్షల లంచం కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. నెలరోజులుగా ఏసీబీ విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. (1.10 కోట్ల లంచం : ఏసీబీ వలలో తహసీల్దార్) నాగరాజుపై ఏసీబీ ప్రశ్నల వర్షం నకిలీ పాసు పుస్తకాల జారీ విషయంలో కీసర మాజీ తహసీల్దార్ నాగరాజుపై ఏసీబీ మంగళవారం ప్రశ్నల వర్షం కురిపించింది. రెండోసారి అతడిని కస్టడీలోకి తీసుకున్న అధికారులు.. కందాడి ధర్మారెడ్డి, అతడి కుటుంబ సభ్యులకు, ఇతరులకు కలిపి దాదాపు 24 ఎకరాల భూమికి అక్రమ పద్ధతిలో పాసు పుస్తకాలు ఎలా జారీ చేశారని ప్రశ్నించారు. అసలు హక్కుదారులు, వారసులు ఉండగా నకిలీ పత్రాలు ఎలా సృష్టించారు? ఇందుకు ఎవరు సహకరించారు? దీని వెనక ఎంత డబ్బులు చేతులు మారిందని అడిగారు. దీనికితోడు అదే ధర్మారెడ్డి స్థానికంగా ఉన్న 140 ఎకరాలు స్వాహా చేద్దామని చేసిన ప్రయత్నానికి ఎలాంటి సహకారం అందించారని కూడా ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. చదవండి: కీసర ఎమ్మార్వో నాగరాజు రిమాండ్ రిపోర్టు కాగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కీసర మండలం రాంపల్లిదాయర రెవెన్యూ గ్రామ పరిధిలో సర్వేనంబర్ 604 నుంచి 614 వరకు గల కోర్ట్ ఆఫ్ వార్డ్స్ (గవర్నమెంట్ కస్టోడియన్ ల్యాండ్) 53 ఎకరాల భూముల్లోని 28 ఎకరాలకు సంబంధించి ఓ వర్గానికి అనుకూలంగా రెవెన్యూ రికార్డులో పేర్ల నమోదుతోపాటు, పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చేందుకు నాగరాజు రియల్ బ్రోకర్ కందాడి అంజిరెడ్డి ఇంట్లో రూ.1.10 కోట్ల నగదు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన విషయం తేల్సిందే. ఇక అక్రమాలతో కోట్లకు పడగలెత్తిన తహసీల్దార్ నాగరాజుది ఆది నుంచీ అవినీతి చరిత్రేనని తెలుస్తోంది. రెవెన్యూ శాఖలో 15 ఏళ్లుగా టైపిస్టు నుంచి ఆర్ఐ, డీటీ, తహసీల్దార్ వరకు పనిచేసిన ప్రతి స్థాయిలో ఆయన ‘చేతివాటం’ చూపించాడని రెవెన్యూ వర్గాల సమాచారం. (గిన్నిస్ బుక్ రికార్డులోకి కీసర తహసీల్దార్) -
నరసింహ రెడ్డి కేసులో మరో 8 మంది అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో మల్కాజ్ గిరి ఏసీపీ నరసింహ రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం అధికారులు ఈ కేసుకు సంబంధించి మరో ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. వీరంతా పలు సందార్భాల్లో నరసింహ రెడ్డికి సాయం చేసినట్లు అధికారులు గుర్తించారు. మాదాపూర్‌లోని రెండు వేల గజాల స్థలం వివాదంలో నరసింహ రెడ్డి జోక్యం చేసుకోవడమే కాక బినామీల పేర్లతో మాదాపూర్ భూమిని దక్కించుకున్నాడు. మార్కెట్ విలువ ప్రకారం ఆ ల్యాండ్ దాదాపుగా 50 కోట్ల విలువ చేస్తుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఎనిమిది మంది కలిసి తప్పుడు పత్రాలతో భూమిని స్వాధీనం చేసుకున్నట్లుగా నిర్ధారణయ్యింది. దాంతో అధికారులు నరసింహ రెడ్డికి సాయం చేసిన ఎనిమిది మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. (చదవండి: ఏసీపీ నరసింహారెడ్డి రెండో లాకర్ ఖాళీ) -
మేరే పీచే బాస్ హై!
సాక్షి, హైదరాబాద్: భూ దందాలకు పాల్పడుతున్న అవినీతి అనకొండలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు, మెదక్ మాజీ అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేశ్ తరువాత ఏసీబీ చేతికి మరో అవినీతి తిమింగలం దొరికింది. విధినిర్వహణలో అనేక అక్రమాలకు పాల్పడ్డారని, అలా సంపాదించిన డబ్బుతో రెండు తెలుగు రాష్ట్రా ల్లో భారీగా ఆస్తులు కూడబెట్టారన్న ఫిర్యాదులతో కేసు నమోదు చేసిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మల్కాజిగిరి ఏసీ పీ నరసింహారెడ్డిపై బుధవారం దాడులు చేశా రు. తెలంగాణ, ఏపీల్లోని 25 ప్రాంతాల్లో ఏసీ బీ ప్రత్యేక బృందాలు ఏకకాలంలో దాడులు చేసి నరసింహారెడ్డి భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించాయి. వీటి విలువ బహిరంగ మార్కెట్లో రూ.100 కోట్లకు పైగా ఉంటుంద ని సమాచారం. రెండు రాష్ట్రాల్లో 25 ప్రాంతాల్లో... 25కు పైగా ప్రత్యేక బృందాలు ఏకకాలంలో నరసింహారెడ్డి, ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో దాడులు చేయడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. బుధవారం ఉదయం సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్‌లోని ఏసీపీ సరసింహరెడ్డి నివాసంలో హైదరాబాద్ రేంజ్ డీఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలో సోదాలు జరిగాయి. భారీగా బంగారు, వెండి ఆభరణాలు, కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఉప్పల్‌లో ఉన్న ఏసీపీ కార్యాలయంలో జరిగిన సోదాల్లో కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. బుధవారం రాత్రి ఏసీపీ నరసింహారెడ్డిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడెక్కడ సోదాలు జరిగాయంటే..! ఏసీపీ స్థాయి అధికారి కోసం 25 కంటే ఎక్కువ బృందాలు రంగంలో దిగడం ఈ కేసుపై ఏసీబీ ఏస్థాయిలో దృష్టి పెట్టిందో తెలుపు తోంది. నరసింహారెడ్డి అవినీతి విస్తరణకు అద్దం పడుతోంది. బుధవారం ఉదయం హైదరాబాద్, సికింద్రాబాద్‌లతోపాటు జన గామ జిల్లాలోని లింగాలఘణపురం మండ లం వడిచర్లలో, బచ్చన్నపేట, రఘునాధపల్లి మండలాలతో పాటు, జగిత్యాల జిల్లా గంగాధర, నల్లగొండ జిల్లా, ఏపీలోని అనంతపురం జిల్లాలో కలిపి మొత్తం 25 ప్రాంతాల్లో దాడు లు జరిగాయి. నర్సింహారెడ్డి అత్తగారి ఊరైన జనగామ జిల్లా లింగాలఘణపురం మండలంలోని వడిచర్లలో బుధవారం ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఆ సమయంలో ఏసీపీ మామ మోతె నర్సింహారెడ్డి అక్కడే ఉన్నారు. కుర్చపల్లి గ్రామంలోని పోరెడ్డి తిరుపతిరెడ్డి అనే బంధువు ఇంట్లోనూ ఏసీబీ అధికారులు సోదా చేశారు. అలాగే కొన్నె గ్రామం వద్ద సాగు భూమిని పరిశీలించారు. ఈ భూమిని బినామీ పేరిట ఏసీపీ కొన్నారని సమాచారం. మియాపూర్, బేగంపేట్, ఉప్పల్‌లో సర్కిల్ ఇన్స్పెక్టర్గా.. చిక్కడపల్లి, మల్కాజిగిరి ఏసీపీగా పనిచేసిన నర్సింహారెడ్డి నగర శివారు ప్రాంతాలైన మియాపూర్, ఉప్పల్, మల్కాజిగిరిల్లో భూవివాదాల్లో తలదూర్చినట్లు ఆరోపణలు వచ్చాయి. అసైన్డ్ భూముల వివాదాలే కారణమా? పలు భూవివాదాల్లో తలదూర్చేవాడన్న ఆరోపణలున్న ఏసీపీని చివరికి అవే వివాదాలు ఏసీబీకి పట్టించాయని సమాచారం. హైదరాబాద్‌లో బాగా పేరు ప్రఖ్యాతలు ఉన్న ఓ ప్ర జాప్రతినిధి బినామీలతో ఏసీపీకి సంబంధా లు ఉన్నాయన్న ప్రచారం కలకలం రేపుతోంది. కొండాపూర్‌లోని అసైన్డ్ భూమిని నరసింహారెడ్డి కొనుగోలు చేశాడని, ఈ విషయాన్ని ఏసీబీ అధికారులు ఎదుట ఆయనే అంగీకరిం చారని సమాచారం. ఈ భూమిని మధుకర్ అనే వ్యక్తి ద్వారా కొనుగోలు చేసినట్లు ఏసీబీ అధికారులకు ఏసీపీ నరసింహారెడ్డి వెల్లడించారని తెలిసింది. జగిత్యాల జిల్లా గంగాధరకు చెందిన ఎంపీపీ మధుకర్ ఇంట్లోనూ ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఏసీబీ అధికారులను చూసి మధుకర్ పారిపోయినట్లు తెలిసింది. అసలు ఈ వివాదమే.. వ్యవహారాన్ని ఏసీబీ వరకు తీసుకెళ్లినట్లు సమాచారం. వీటితోపాటు ఘటకేసర్ సమీ పంలోని యమ్నంపేట్లో 30 ఎకరాల వివాదాస్పద భూమిని కొనుగోలు చేసినట్లు ఆరోపణలూ ఉన్నాయి. నిజాం కాలం నాటి ఈ భూమిని రాజకీయ నేతలతో కలిసి కొన్నార ని ఏసీబీ వద్ద సమాచారం ఉంది. మధుకర్ కోసం ఏసీబీ అధికారులు గాలిస్తున్నారు. మధుకర్ ఆచూకీ దొరికితే.. అతని వెనక ఉన్న ఆ బడా రాజకీయ నేత లెవరు? ఇంతవరకూ వీరు కొనుగోలు చేసిన అసైన్డ్ భూవ్యవహారాలపై స్పష్టత వస్తుందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఏసీబీ గుర్తించిన ఆస్తులివే..! అనంతపురంలో 55 ఎకరాల వ్యవసాయభూమి, మాదాపూర్‌లోని సైబర్‌టవర్ ఎదుట 1,960 చదరపు గజాల నాలుగు ప్లాట్లు, హఫీజ్‌పేటలో మూడం తస్తుల భవనం, రెండు ఓపెన్ ప్లాట్లు, మరో రెండు ఇళ్లను గుర్తించారు. బ్యాంకు ఖాతాల్లో రూ.15 లక్షల నగదు, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో పెట్టబడులు పెట్టినట్లు సోదాల్లో అధికారులకు ఆధారాలు లభించాయి. రెండు బ్యాంకు లాకర్లను కూడా గుర్తించారు. ఈ ఆస్తుల విలువ రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం.. రూ.7.5 కోట్లు ఉంటుందని, అయితే బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. ఆయా ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు సోదాలు జరుగుతూనే ఉండటం గమనార్హం. మేరే పీచే బాస్ హై! సాక్షి, హైదరాదాబాద్: ‘నా మీద ఎన్ని ఆరోణలు వచ్చినా.. నాకేం కాదు. నా వెనక డీజీపీ ఉన్నారు.. ఆయనే నాకు గాడ్‌ఫాదర్’ అంటూ ఏసీపీ వై.నరసింహారెడ్డి పలువురి వద్ద గొప్పలకు పోయినట్లు తెలిసింది. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ విషయం తెలుసుకున్న పోలీస్ బాస్ దీన్ని తీవ్రంగా పరిగణించారు. వెంటనే రహస్యంగా అంతర్గత విచారణ జరిపించారు. వరుసగా వచ్చిన ఫిర్యాదులతో నెలరోజుల ముందే నరసింహారెడ్డి ఏసీపీ ఉన్నతాధికారుల నిఘాలోకి వెళ్లాడని సమాచారం. వాస్తవానికి వనస్థలిపురం ఏసీపీ జయరాం సస్పెండ్ అయినప్పటి నుంచే ఏసీపీ నరసింహారెడ్డి వ్యవహారాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించినట్లు తెలిసింది. అప్పటి నుంచే పక్కాగా విచారణ చేసిన ఏసీబీ అదును చూసి దాడులు చేసింది. ఉప్పల్ ఠాణాలో పనిచేసిన సమయంలో ఎస్సై లింగంపై ఎన్ని ఆరోపణలు వచ్చినా నరసింహారెడ్డి అతన్ని రక్షించే ప్రయత్నం చేశాడన్న విమర్శలున్నాయి. ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలో ఉన్న సదరు ఎస్సై లింగం భూవివాదంలో తలదూర్చడంతో హెచ్చార్సీలో కేసు నమోదవడం గమనార్హం. బినామీగా బార్ ఓనర్! ఏసీపీ నరసింహారెడ్డికి నగరంలోని అశోక్‌పాటిల్ అనే ఓ బార్ యజమానితో సాన్నిహిత్యం ఉందని, అతనే బినామీగా వ్యవహరిస్తున్నాడని సమాచారం. ఏసీపీ అక్రమ సంపాదనను అతడే మేనేజ్ చేసేవాడని సమాచారం. పోలీసుశాఖలో పని చేసే ఓ ఉన్నతాధికారికి నగరంలో కోట్ల రూపాయల విలువైన బంగళాను ఏసీపీ కానుకగా ఇచ్చాడని ప్రచారం జరుగుతోంది. ఈ బంగళాను బినామీ అశోక్‌పాటిల్ ద్వారా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఘట్కేసర్ తహసీల్దార్ ఓ కేసు విషయంలో చేసిన ఫిర్యాదు ఆధారంగా ఏసీపీని ఉన్నతాధికారులు మందలించారని సమాచారం. -
రెండు రాష్ట్రాల్లో 12 చోట్ల సోదాలు
సాక్షి, హైదరాబాద్: మల్కాజ్గిరి ఏసీపీ నరసింహారెడ్డి నివాసంలో తెలంగాణ రాష్ర్ట అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీపీ నివాసంతో పాటు ఏపీ, తెలంగాణలోని ఆయన బంధువుల నివాసాల్లో ఏకకాలంలో 12 చోట్ల అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్ రేంజ్ డీఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సోదాలు ఈ రోజు సాయంత్రం వరకు జరగనున్నట్లు తెలిసింది. గతంలో ఉప్పల్ సీఐగా, చిక్కడపల్లి, మల్కాజిగిరి ఏసీపీగా నరసింహారెడ్డి పని చేశారు. ఆ సమయంలో ఆయన అనేక భూతగాదాల్లో తలదూర్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. (చదవండి: దేవికారాణి ‘రియల్’ దందా!) హైదరాబాద్‌లోని సికింద్రాబాద్, మహేంద్రహిల్స్, డీడీ కాలనీ, అంబర్‌పేట, ఉప్పల్, వరంగల్‌లో 3 చోట్ల, కరీంనగర్లో 2 చోట్, నల్లగొండలో 2 చోట్ల, అనంతపూర్‌లో సోదాలు కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్ నివాసంలో భారీగా బంగారు, వెండి ఆభరణాలను అధికారులు గుర్తించారు. వాటితో పాటు భారీగా ఆస్తులు, ప్లాట్స్, వ్యవసాయ భూములు గుర్తించారు. ఈ ఆరోపణలు నిజమైతే అరెస్ట్ చేసి అవకాశం ఉందంటున్నారు అధికారులు. అంతేకాక నరసింహారెడ్డి నగర శివారు ప్రాంతాలైన మియాపూర్, ఉప్పల్, మల్కాజిగిరి, భూ వివాదాల్లో తలదూర్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మాజీ ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి అల్లుడు అయిన ఏసీపీ నరసింహారెడ్డి రూ.50 కోట్ల అక్రమాస్తులు సంపాదించినట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. -
ఏసీపీ ఇంటిపై ఏసీబీ దాడులు
-
మల్కాజ్గిరి ఏసీపీ ఇంటిపై ఏసీబీ దాడులు
సాక్షి, హైదరాబాద్: మల్కాస్‌గిరి ఏసీబీ నరసింహారెడ్డి నివాసంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలతో ఏసీబీ సోదాలు చేపట్టింది. నరసింహారెడ్డి గతంలో ఉప్పల్ సీఐగా పని చేశారు. పలు భూ వివాదాలతో పాటు సెటిల్మెంట్లలో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో 20చోట్ల ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇక ఒకే సమయంలో ఏసీబీ అధికారులు 34 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. వరంగల్ జిల్లాలో మూడు చోట్ల, కరీంనగర్, నల్గొండ జిల్లాల్లో రెండు చోట్ల, ఏపీలోని అనంతపురంలో ఒక చోట అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. మాజీ ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి అల్లుడు అయిన ఏసీపీ నరసింహారెడ్డి రూ.50 కోట్ల అక్రమాస్తులు సంపాదించినట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. -
ఆ ముగ్గురు ఎక్కడ?..
సాక్షి, మెదక్: మెదక్ అడిషనల్ కలెక్టర్ (ఏసీ) నగేశ్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే ముగ్గురు ఉద్యోగులు పత్తా లేకుండా పోయారు. దీంతో కలెక్టరేట్ ఉద్యోగుల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నర్సాపూర్ మండలం చిప్పల్‌తుర్తిలో 112 ఎకరాల నిషేధిత భూమికి ఎన్ఓసీ కోసం రూ.1.12 కోట్ల లంచం కేసులో అడిషనల్ కలెక్టర్ సహా ఐదుగురు అరెస్టు అయిన విషయం విదితమే. ఎప్పుడైతే నగేశ్ ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు మొదలు పెట్టారో.. అప్పటి నుంచి వీరంతా అదృశ్యమయ్యారు. మరోవైపు ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. ఎన్ఓసీకి అనుమతి ఇవ్వాలని మెదక్ మాజీ కలెక్టర్ ధర్మారెడ్డి సంతకం చేసి పంపించినట్లు రిజిస్ట్రేషన్ శాఖ నుంచి లేఖ వెలుగులోకి రావడం సంచలనం సృష్టించింది. సన్నిహితంగా ఆ ముగ్గురు అడిషనల్ కలెక్టర్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే ముగ్గురు ఉద్యోగులు అదృశ్యమవడంపై ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. నగేశ్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించినప్పటి నుంచి ఇంత వరకు వారి ఆచూకీ కనిపించడం లేదు. ఈ ముగ్గురిలో ఒకరు కలెక్టరేట్ పరిపాలనా విభాగంలో పనిచేస్తారు.. మరొకరు అడిషనల్ కలెక్టర్ కార్యాలయంలో నిత్యం అన్నీ తానై వ్యవహరిస్తారు.. ఇంకొకరు అన్నింటా సహకరించే వ్యక్తి. వీరు సడన్‌గా మాయమవడంతో ఏసీబీ అధికారులు దృష్టి పెట్టారన్న ప్రచారం సాగుతోంది. వివిధ పనులకు రూరల్ ప్రాంతాల నుంచి కార్యాలయానికి వచ్చినవారు గతంలో పరిచయమున్న సిబ్బంది లేకపోవడంతో గుసగుసలాడుకున్నారు. ధర్మారెడ్డిని విచారించే అవకాశం ఈ భూ వ్యవహారంలో మాజీ కలెక్టర్ ధర్మారెడ్డి పేరు వినిపించడం కలకలం సృష్టించింది. 112 ఎకరాలకు ఎన్ఓసీ కోసం అదనపు కలెక్టర్ నగేశ్.. భూమి కొనుగోలు చేసిన లింగమూర్తితో రూ.1.12 కోట్లకు జూలై 31న బేరం కుదుర్చుకున్నారు. భూ ఎన్ఓసీకి సంబంధించిన ఫైలు ఆగస్టు 21న తహసీల్దార్, 23న ఆర్డీవో, 25న కలెక్టర్‌కు చేరింది. ఆ తర్వాత జూలై 31న మూర్తితో రూ.1.12 కోట్లకు బేరం కుదుర్చుకున్నారు. ఇదే రోజు కలెక్టర్ ఉద్యోగ విరమణ పొందారు. అయితే రిజిస్ట్రేషన్ శాఖ నుంచి వెలుగులోకి వచ్చిన లేఖలో 112 ఎకరాలకు ఎన్ఓసీకి అనుమతి ఇవ్వాలని కలెక్టర్ నుంచి ఫైలు అందిందని ఉంది. ఈ నేపథ్యంలో ఆయన పాత్రపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. పదవీ విరమణ రోజు ఆ లేఖ ఎందుకు రాయాల్సి వచ్చిందనే కోణంలోనూ వారు ఆరా తీస్తున్నట్లుగా సమాచారం. అంతేకాదు .. ధర్మారెడ్డి పదవీ విరమణ తర్వాత హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఆయన ఇంకా మెదక్‌లోని ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయలేదని సమాచారం. ఆ బంగ్లాలో పనిచేసే సిబ్బందికి రోజు ఫోన్ చేసి ఆరా తీసే ధర్మారెడ్డి.. అడిషనల్ కలెక్టర్ వివాదం తర్వాత అసలు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదని సిబ్బంది చెబుతున్నారు. ఏదేమైనా త్వరలో ఆయనను విచారించడం ఖాయమని అవినీతి నిరోధక శాఖకు చెందిన ఒకరు స్పష్టం చేశారు. మొత్తానికి రోజుకో మలుపు తిరుగుతున్న ఈ కేసులో ఇంకెందరి పాత్రలు ఉన్నాయోనని ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. తహసీల్దార్ మాలతికి ప్రశ్నల వర్షం చిప్పల్తుర్తి గ్రామంలోని 58, 59 సర్వే నంబర్లలోని భూమి ఎన్ఓసీకి దరఖాస్తు సమయంలో నర్సాపూర్ తహసీల్దార్ మాలతి సెలవులో ఉన్నారు. అప్పుడు ఆర్డీవో అరుణారెడ్డి, ఇన్చార్జి తహసీల్దార్‌గా ఉన్న సత్తార్‌కు ఈ వ్యవహారంలో రూ.లక్ష చొప్పున ముట్టినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే గురువారం ఆర్డీవోను హైదరాబాద్‌కు తీసుకెళ్లేటప్పుడు మాలతిని సైతం తీసుకెళ్లడం స్థానికంగా చర్చనీయాంశం అయింది. ఆర్డీవో మహిళ కావడంతో మాలతిని ఆమెకు తోడుగా తీసుకెళ్లినట్లు ఏసీబీ అధికారులు చెప్పారు. అయితే.. అక్కడికి వెళ్లిన తర్వాత మాలతిని కూడా విచారించినట్లు సమాచారం. ఆ సమయంలో ఎందుకు సెలవు పెట్టారు?.. ఎవరైనా ఒత్తిడి చేశారా?.. ఇబ్బందులు పెట్టారా అని ప్రశ్నించినట్లు తెలిసింది. వ్యక్తిగత సమస్యలతో సెలవు పెట్టినట్లు ఆమె సమాధానం ఇచ్చారని సమాచారం. -
ఈఎస్ఐ స్కామ్: ఏసీబీ దర్యాప్తు వేగవంతం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన ఈఎస్ఐ స్కాం కేసులో ఏసీబీ దర్యాప్తు మళ్లీ ఊపందుకుంది. ఈ స్కామ్‌లో ప్రధాన నిందితురాలుగా ఉన్న మాజీ డైరెక్టర్ దేవికారాణి ఆస్తుల చిట్టా ఒక్కొక్కటిగా బయట పడుతోంది. సైబరాబాద్‌లో కమర్షియల్ రెసిడెన్షియల్ స్థలం కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఇచ్చిన రూ. 4 కోట్ల 47 లక్షల రూపాయలను ఏసీబీ సీజ్ చేసింది. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఇంట్లో దొరికిన డాక్యుమెంట్ల ప్రకారం బంగారపు ఆభరణాలు ఎక్కడికి తరలించారు అన్న అంశాలపై ఏసీబీ విచారణ చేస్తోంది.ఇంట్లో దొరికిన పత్రాల ఆధారంగా 10 కోట్ల బంగారు ఆభరణాలు రహస్య ప్రాంతంలో దాచిపెట్టినట్లు ఏసీబీ అనుమానిస్తుంది. స్కామ్ లో అరెస్ట్ చేసిన తర్వాత ఆమె కు సంబంధించిన 35 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించి ఏసీబీ సీజ్ చేసింది. అయితే బహిరంగ మార్కెట్ లో వీటి విలువ 200 కోట్ల ఉందంటున్న ఏసీబీ భావిస్తోంది. దేవికారాణిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు కూడా ఏసీబీ నమోదు చేసింది. ఒక పక్క విచారణ కోనసాగుతుండగానే నిందితులు తమ ఆస్తులను, బంగారపు ఆభరణాలను పక్క ప్లాన్ తో దారి మళ్లించినట్లు ఏసీబీ భావిస్తోంది. ఇప్పటి వరకు అరెస్ట్ అయిన 25 మంది నిందితులకు సంబంధించిన వందల కోట్ల ఆస్తులను ఏసీబీ సీజ్ చేసింది. ఇప్పుడు మళ్ళీ నిందితులకు సంబంధించి కోట్ల రూపాయలు బయట పడడంతో ఏసీబీ షాక్ గురైంది. దేవికారానికి నోటీసులు ఇచ్చి మరోసారి విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఏసీబీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవిక రాణి, ఫార్మా సిస్ట్ నాగలక్ష్మి భారీ స్కామ్‌కు పాల్పడిన విషయం తెలిసిందే. గతేడాది ఈ కేసు మెడికల్ డిపార్ట్మెంట్లో పెను సంచలనాన్ని రేపింది. చదవండి: దేవికారాణి ‘రియల్’ దందా! -
దేవికారాణి ‘రియల్’ దందా!
సాక్షి, హైదరాబాద్ : ఈఎస్ఐకి చెందిన ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్)లో మందుల కొనుగోళ్లలో జరిగిన అవినీతి జాడలు తవ్వినకొద్దీ బయటపడుతూనే ఉన్నాయి. ఐఎంఎస్ మాజీ డైరెక్టర్ దేవికారాణిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ).. ఆమె రియల్ ఎస్టేట్ లావాదేవీ లను సైతం మంగళవారం వెలుగులోకి తెచ్చింది. దేవికారాణి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఓ రెసిడెన్షియల్ వెంచర్లో చదరపు అడుగుకు రూ.15 వేల విలువ కలిగిన 6 ఫ్లాట్లను కుటుంబ సభ్యుల పేరిట కొనేందుకు ఫార్మాసిస్ట్ నాగలక్ష్మితో కలిసి రూ.4.47 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించింది. ఇందులో దేవికారాణి వాటా రూ.3.75 కోట్లు కాగా, ఫార్మాసిస్ట్ నాగలక్ష్మి వాటా రూ.72 లక్షలని ఏసీబీ తేల్చింది. ఈ మొత్తం.. లెక్కల్లోలేని నగదుగా గుర్తించింది. ఈ పెట్టుబడుల్లో రూ.22 లక్షలు బినామీదార్ల పేరిట దేవికారాణి ఇన్వెస్ట్ చేసినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ ఫ్లాట్ల కొనుగోలుకు రూ.2,29,30,000 మొత్తాన్ని చెక్కులు, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా ఆమె చెల్లించినట్టు చెప్పారు. బయటపడిన నోట్ల కట్టలు ఈ వ్యవహారంపై ఏసీబీ అధికారులు సంబంధిత వెంచర్ డెవలపర్‌కు నోటీసులు అందజేశారు. ఆస్తులు అటాచ్ చేస్తామంటూ నోటీసుల్లో హెచ్చరించారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో తన ఖాతాకు దేవికారాణి, నాగలక్ష్మి పంపిన మొత్తం డబ్బును సదరు డెవలపర్ డ్రా చేసి ఏసీబీకి తిరిగి అప్పగించాడు. భారీ మొత్తం కావడంతో రూ.500, రూ.2,000 నోట్లకట్టలు నాలుగు టేబుళ్లను ఆక్రమించాయి. తాజా ఉదంతంలో రూ.4.47 కోట్లు దొరకడంతో కీసర తహసీల్దార్ వద్ద లభించిన రూ.కోటీ పది లక్షల రికార్డును తిరగరాసినట్లైంది. -
కీసర ఎమ్మార్వో నాగరాజు రిమాండ్ రిపోర్టు
సాక్షి, మేడ్చల్: కోటి 10 లక్షల రూపాయల లంచం కేసులో అడ్డంగా దొరికిపోయిన కీసర ఎమ్మార్వో నాగరాజు కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్‌ను ఏసీబీ శుక్రవారం విడుదల చేసింది. ఈ రిపోర్టులో పలు ఆసక్తికర విషయాలు బయటికొచ్చాయి. రాంపల్లి దాయర వద్ద ఉన్న 19 ఎకరాల 39 గుంటల భూమిని ఒరిజినల్ పట్టదారులకు ఇప్పించేందుకు అంజిరెడ్డి అనే వ్యక్తి మధ్యవర్తిత్వం చేసినట్లు రిపోర్టులో తేలింది. ఇందులో భాగంగానే తహశీల్దార్ నాగరాజుకు 1.10 కోటి రూపాయలు డీల్‌ను అంజిరెడ్డి కుదిర్చినట్లు తేలింది. నాగరాజుకు అందజేసిన డబ్బు శ్రీనాథ్ యాదవ్ అనే వ్యక్తి సమకూర్చినట్లు బయటపడింది. దీంతోపక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన ఏసీబీ.. అంజిరెడ్డికి చెందిన ఫార్చ్యూనర్, శ్రీనాథ్ వోక్స్ వాగన్ కార్‌ను సీజ్ చేసింది. అయితే నాగరాజుతో డీల్‌కు సంబంధించి అంజిరెడ్డి స్నేహితుడి ఇంట్లో సమావేశమైనట్లు తెలిసింది. ఏసీబీ దాడి సమయంలో అంజిరెడ్డి స్నేహితుడి ఇంట్లోనే నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇంటిని మొత్తం సెర్చ్ చేసిన ఏసీబీ.. ఎంపీ రేవంత్ రెడ్డికి సంబంధించిన 65 పేజీల రెప్రజెంటేటివ్ లెటర్స్‌ను కూడా స్వాధీనం చేసుకుంది.గుండ్ల పోచంపల్లి గ్రామ పంచాయతీ కి సంబంధించి ఇళ్ళ అనుమతికి 204 పేజీల పత్రాలతో పాటు, రాంపల్లి దాయర భూ పంచాయతీకి సంబంధించి ఆర్టీఐ నుండి సేకరించిన 105 పేజీల పత్రాలు, పలు కేసుల ఎఫ్ఐఆర్ కాపీలు, కోర్ట్ ఆర్డర్ కాపీలతో పాటు 65 పత్రాలు స్వాధీనం చేసుకుంది. (చదవండి : కోటి లంచం కేసు : రేవంత్‌పై విచారణ..!) ఈ అంశాలపైనే మూడు రోజుల పాటు విచారించినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. అయితే విచారణ సమయంలో నిందితులెవరు సహకరించలేదని ఏసీబీ తెలిపింది. దీంతో నిందితులను మరోమారు కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు ఏసీబీ స్పష్టం చేసింది. కాగా ఈ కేసులో నాగరాజుతో పాటు మిగతా నిందితులు ఏసీబీ కోర్టులో శుక్రవారం బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. (చదవండి : గిన్నిస్ బుక్ రికార్డులోకి కీసర తహసీల్దార్) -
రూ.కోటి 10 లక్షలు ఎవరివని ఏసీబీ ఆరా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కీసర తహశీల్దార్ నాగరాజు అవినీతి కేసులో రెండో రోజు ఏసీబీ అధికారుల విచారణ ముగిసింది. ఈ కేసులో ఎమ్మార్వో నాగరాజు, వీఆర్వో సాయిరాజ్‌తో పాటు నిందితులుగా ఉన్న అంజిరెడ్డి, శ్రీనాథ్‌లకు సంబంధించి అనేక విషయాలను ఏసీబీ అధికారులు సేకరించారు. ఈ సందర్భంగా అంజిరెడ్డి ఇంట్లో దొరికిన భూ లావాదేవీల డాక్యుమెంట్ల గురించి ఆరా తీశారు. ఈ క్రమంలో కోటి 10 లక్షల రూపాయల డబ్బు ఎవరివి అన్నదానిపై పూర్తి వివరాలు రాబట్టిననట్లు సమాచారం. ఎమ్మార్వో నాగరాజు మాత్రం ఏసీబీ అధికారులకు సహకరించనట్లు తెలుస్తోంది. తాజా విచారణలో సైతం ఆయన బ్యాంకు లాకర్లపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. విచారణ అనంతరం ఈ కేసులో నలుగురు నిందితులను ఏసీబీ కార్యాలయం నుంచి చంచల్ గూడ జైలుకు తరలించారు. వారిని రేపు మరోసారి కస్టడీలోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారించనున్నారు. (చదవండి: 1.10 కోట్ల లంచం : ఏసీబీ వలలో తహసీల్దార్) -
మొన్న నాగరాజు.. నేడు వెంకటేశ్వర్‌రెడ్డి
సాక్షి, రంగారెడ్డి/మేడ్చల్ : కోటి 10 లక్షల లంచం తీసుకొని దొరికిపోయిన కీసర తహసీల్దార్ నాగరాజు ఘటన మరువకముందే మరో రెవెన్యూ అవినీతి అధికారి పట్టుబడ్డాడు. అయితే ఈసారి నాగరాజు తరహాలో కోటి రూపాయలు కాకుండా 5వేల రూపాయలు లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీకి దొరికిపోయాడు. ఈ ఘటనతో తెలంగాణలో రెవెన్యూ అధికారుల తీరు ఏ మాత్రం మారలేదన్న విషయం బయటపడింది.(బయటపడుతున్న కీసర ఎమ్మార్వో అక్రమాలు) వివరాలు.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వెంకటేశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి సర్వేయర్ సూపరిండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. శంషాబాద్ తొండుపల్లిలోని 20 ఎకరాల స్థల వివాదంపై ఒక వ్యక్తిని 15వేల రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. కాగా బుధవారమే 10వేల రూపాయల లంచం అందుకున్న వెంకటేశ్వర్‌రెడ్డి గురువారం మరో 5వేల రూపాయలు తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు. వెంకటేశ్వర్‌రెడ్డి పనిచేస్తున్న కార్యాలయంతో పాటు అతని నివాసంలోనూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఐటీశాఖకు లేఖ రాసిన ఏసీబీ మరోవైపు తహసీల్దార్ నాగరాజు లంచం తీసుకున్న కోటి 10 లక్షల రూపాయల పై ఏసీబీ విచారణను వేగవంతం చేసింది. ఈ డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు.. వీరి వెనుక ఉన్న అసలు సూత్ర దారులు ఎవరు అన్న కోణంలో ఏసీబీ కేసును విచారిస్తుంది. ఈ ఘటనపై గురువారం ఏసీబీ ఐటి శాఖకు లేఖ రాసింది. మనీ ట్రాన్స్ సెక్షన్ ఎక్కడి నుంచి జరిగిందో తెలపాలంటూ ఐటిశాఖను లేఖలో కోరింది. నాగరాజుకు సంబంధించిన ఆస్తుల వివరాలపై కూపీ లాగుతున్న ఏసీబీ .. విదేశాల్లో సైతం పెట్టుబడులు పెట్టినట్టు తెలిపింది. (కీసర భూదందాలో రాజకీయ హస్తం!) ఇదే విషయమై ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖ లో సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లనే ప్రభుత్వ ఉద్యోగులు లంచాలకు మరిగారు. అధికారులు లంచాలు డిమాండ్ చేస్తే ఏసీబీ కి ఫిర్యాదు చేయాలి. గతంలో నాగరాజు పనిచేసిన చోట రికార్డులను ఏసీబీ పరిశీలిస్తోంది. నాగరాజు కు మధ్యవర్తిత్వం వహించిన ఆంజిరెడ్డి ,శ్రీనాథ్ ఇంట్లో దొరికిన డాక్యుమెంట్లను పరీశీలిస్తున్నాం. నిందితులను కస్టడీలోకి తీసుకుంటే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నాం. అంటూ తెలిపారు. -
పాసు పుస్తకాలకెళ్తే.. ఆర్ఐకి రూ. 35 లక్షల అప్పు
సాక్షి, మేడ్చల్: కొత్త పాసు పుస్తకాల కోసం అప్పటి కీసర తహసీల్దార్ నాగరాజు ఆశ్రయించగా, ఆర్ఐ కిరణ్ ఇళ్లు నిర్మించుకుంటున్నాడని రూ.35 లక్షలు అప్పు ఆయనకు ఇప్పించి, ఇప్పటి వరకు ఇవ్వలేదని కీసర దాయారకు చెందిన రైతు కుంటోళ్ల దశరథ తెలిపారు. మా రాంపల్లి దాయార గ్రామానికి సంబంధించిన భూముల వ్యవహారంలో పాసు పుస్తకాల జారీ విషయంపై రియల్టర్ బ్రోకర్ల నుంచి రూ. 1.10 కోట్లు లంచం తీసుకుంటూ... ఏసీబీకి చిక్కటంతో ఆయన లంచావతారం బయటపడిందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లుకు న్యాయం చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. గతంలోనే డబ్బులివ్వాలని తహసీల్దార్ నాగరాజుకు వద్దకు వెళ్లితే... తనపై అక్రమంగా 353 ఐపీసీ కింద కేసు నమోదు చేయించి తీవ్రంగా వేధించారని దశరథ తెలిపారు. కీసర దాయార గ్రామంలో 173, 174, 175, 176, 179, 213 సర్వే నంబర్లలో తొమ్మిది ఎకరాల భూమికి సంబంధించిన కొత్త పాసు పుస్తకాల కోసం నాగరాజును తరచు కలిసినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు పాసు పుస్తకాలు ఇవ్వకపోగా ఆర్ఐ కిరణ్‌కు ఇప్పించిన రూ. 35 లక్షలు ఇవ్వలేదన్నారు. ఈ విషయమై జిల్లా రెవెన్యూ అధికారులు, కలెక్టర్ సకాలంలో స్పందించి న్యాయం చేయాలని ఆయన కోరారు. కొత్త పాసు పుస్తకాలు కూడా ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఏసీబీకి పట్టుబడ్డ వెంకటేశ్వరరెడ్డి: రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు కోనసాగుతున్నాయి. సర్వేయర్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరెడ్డిపై అధికారలు తనిఖీలు నిర్వహించారు. రూ. 5వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి వెంకటేశ్వరరెడ్డి రెడ్ హ్యండెడ్‌గా పట్టుబడ్డారు. ఆయన సర్వే రిపోర్టు ఇవ్వడం కోసం లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. -
రెవెన్యూ అనకొండలు
సాక్షి, హైదరాబాద్ : గతేడాది జూలైలో కేశంపేట తహసీల్దార్ లావణ్యపై ఏసీబీ అధికారులు దాడులు చేసిన సమయంలో రూ.93 లక్షల నగదు దొరికితే అక్కడికి వెళ్లిన వారి కళ్లు తిరిగాయి. తాజాగా లావణ్య రికార్డును బద్దలు కొట్టేలా కీసర తహసీల్దార్ నాగరాజు ఏకంగా రూ.1.10 లక్షల నోట్ల కట్టలతో పట్టుబడడంతో అంతా నోరెళ్లబెట్టారు. రెవెన్యూశాఖలో వేళ్లూనుకున్న అవినీతికి ఈ రెండు ఘటనలూ నిదర్శనం. అవినీతికి చిరునామాగా మారిన రెవెన్యూ వ్యవస్థను సంస్కరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఒకవైపు ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు లంచావ తారాల లీలలకు మాత్రం బ్రేకులు పడడంలేదు. భూ ముల విలువలకు రెక్కలు రావడం.. భూ వివాదాలు పెరిగిపోవడాన్ని ఆసరా చేసుకుంటున్న కొందరు అధికారులు డబ్బు మూటలకు ఆశపడుతున్నారు. దాయాదులు వివాదమైనా, సరిహద్దు తగాదైనా, న్యాయపరమైన చిక్కులైనా, సాంకేతిక సమస్యలైనా జాన్తానై అంటూ అందినకాడికి దండుకుంటున్నారు. తాజాగా ‘షాక్’పేట రెవెన్యూశాఖను ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో హైదరాబాద్‌లోని షేక్‌పేట మండల తహసీల్దార్ వివాదాస్పద భూ వ్యవహారంలో తలదూర్చి ఏసీబీకి చిక్కారు. తహసీల్దార్ సుజాత ఇంటిపై దాడి చేసిన అధికారులు.. సుమారు రూ.30 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఇదే భూ వివాదంలో ప్రైవేటు వ్యక్తులకు అండగా నిలిచిన ఆర్ఐ కూడా భారీ నగదుతో ఏసీబీకి పట్టుబట్టారు. ఆ కేసులో సుజాత భర్త ఆత్మహత్య చేసుకోవడం, ఫిర్యాదుదారుడిపై కూడా ఆరోపణలు రావడంతో ఆ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. రెవెన్యూశాఖలో లంచాల ఆరోపణల నేపథ్యంలో అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్య అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ హత్య అనంతరం కూడా రెవెన్యూశాఖపై ఆరోపణలు, ఏసీబీ కేసుల విషయంలో ఎలాంటి మార్పులు రాకపోగా.. అందరూ తిరిగి పాతబాటే పట్టడం గమనార్హం. క్షేత్రస్థాయిలో పనిచేసే వీఆర్వో నుంచి జాయింట్ కలెక్టర్ల వరకు అవినీతిపర్వాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఆ మూడు జిల్లాల్లోనే తిష్ట.. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో పనిచేస్తున్న అధికారులు అక్కడి నుంచి కదలడానికి ఇష్టపడరు. అలాగే వారిని కదలించడానికి ఎవరూ సాహసించరు. దశాబ్దాల కాలంగా నయాబ్ తహసీల్దార్ నుంచి అదనపు కలెక్టర్ల వరకు అదే జిల్లాలో కొలువులు చేస్తున్నారు. రంగారెడ్డి నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి మేడ్చల్, మేడ్చల్ నుంచి రంగారెడ్డి ఇలా ఈ మూడు జిల్లాల్లోనే సర్వీసు పూర్తి చేసుకుం టున్నా.. ప్రభుత్వం చూసీ చూడనట్లు వ్యవహరిస్తోంది. విలువైన భూములను డీల్ చేసే క్రమం లో బడాబాబులు, ప్రజాప్రతినిధులతో ఏర్పడిన పరిచయాన్ని పలుకుబడిగా మార్చుకొని ప్రభుత్వ స్థాయిలో చక్రం తిప్పుతున్న అధికారులు తమ కుర్చీలకు ఎసరు రాకుండా చూసుకుంటున్నారు. ఒకవేళ కాదూ కూడదని ప్రభుత్వం ఇతర జిల్లాలకు బదిలీ చేసినా.. సెలవుపై వెలుతున్నారే తప్ప బాధ్యతలు తీసుకోవడంలేదు. -
1.10 కోట్ల లంచం : ఏసీబీ వలలో తహసీల్దార్
సాక్షి, హైదరాబాద్ : కీసర రెవెన్యూశాఖలో ఓ భారీ అవినీతి చేప ఏసీబీ వలకు చిక్కింది. ఏకంగా రూ. కోటీ 10 లక్షల లంచం తీసుకుంటూ కీసర తహసీల్దార్ నాగరాజు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. భూరికార్డుల్లో పేర్లు మార్చడం, పట్టాదారు పాస్‌బుక్ ఇవ్వడం కోసం ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశాడు. కీసర మండలం రాంపల్లి దాయర గ్రామానికి చెందిన సర్వే నంబర్ 604 నుంచి 614 వరకు గల 53 ఎకరాల స్థలానికి సంబంధించి రెండు వర్గాల మధ్య కోర్టులో కేసు నడుస్తున్నట్టు సమా చారం. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంలో ఓ వర్గానికి అనుకూలంగా రికార్డులు తయారుచేయడానికి తహసీల్దార్ రూ.2 కోట్ల లంచం డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఏఎస్రావు నగర్‌లోని తన ఇంటివద్ద మొదటి విడతగా రూ.కోటీ 10 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడిచేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రాంపల్లి దాయర గ్రామానికి చెందిన కందాడి అంజిరెడ్డి, వరంగల్‌కు చెం దిన శ్రీనాథ్ యాదవ్‌తోపాటు రాంపల్లి వీఆర్ఏ సాయిరాజ్ తహసీల్దార్‌కు సహకరించినట్లు సమాచారం. ఈ ముగ్గురినీ కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నాగరాజుతోపాటు ఆయన బంధు వుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తొలినుంచీ అవినీతి ఆరోపణలే.. తహసీల్దార్ నాగరాజుపై తొలి నుంచీ అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండేళ్ల క్రితం కూకట్పల్లి నుంచి కీసరకు బదిలీపై వచ్చిన ఆయన పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. గతంలో చీర్యాల గ్రామానికి చెందిన ఓ రైతు వద్ద రూ.లక్ష డిమాండ్ చేయడంతో ఆ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో అతడి కుటుంబ సభ్యులు తహశీల్దార్ కార్యాలయానికి వచ్చిన నాగరాజును నిలదీశారు. కాగా, ఇటీవల కీసర మండలంలో రియల్ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ భూముల ధరలకు రెక్కలు రావడంతో రెవెన్యూ విభాగంలో ఉన్న లోసుగులను అడ్డుపెట్టుకొని తమ కార్యాలయాలకు వచ్చే వ్యక్తుల నుంచి పెద్ద ఎత్తున లంచాలు డిమాండ్ చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కీలక అధికారి విల్లా బహుమతి.. రెవెన్యూశాఖలో టైపిస్ట్‌గా చేరిన నాగరాజు పదోన్నతిపై తహశీల్దార్‌గా ఎదిగాడు. మధ్యలో డిప్యూటీ తహసీల్దార్‌గా ఉన్న సమయంలో ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీబీకి పట్టుబడ్డాడు. అయినా.. రాజకీయ పలుకుబడి ఉపయోగించి తనపై ఉన్న కేసులను తొలగించుకున్నాడు. ఇప్పుడు తన లంచాల స్థాయిని ఏకంగా రూ.కోట్లకు పెంచుకున్నాడు. ఇటీవల మేడ్చల్ జిల్లాలోని ముగ్గురు తహశీల్దార్లు తమ అక్రమాల జోలికి రాకుండా.. ఓ కీలకాధికారికి రూ.కోట్లు విలువ జేసే విల్లాను కొనిచ్చారంటే వీరి అవినీతి ఏ స్థాయిలో ఉందో, వీరు ఎంత పెద్ద అధికారినైనా ఎలా మేనేజ్ చేయగలరో అర్థం చేసుకోవచ్చు. సీఎం కార్యాలయం కన్నెర్ర.. కీసరలో ఏసీబీ దాడులపై సీఎం కార్యాలయం కూడా ఆరా తీసినట్లు సమాచారం. రెవెన్యూ అధికారుల విషయంలో తీవ్ర ఆగ్రహంతో ఉన్న సీఎం కేసీఆర్.. రెవెన్యూశాఖ విషయంలో కీలకమైన నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. -
నటి శ్రీసుధ అవినీతి ఆరోపణల కేసులో పురోగతి
హైదరాబాద్: సినీ నటి సాయి సుధ, ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్పై చేసిన అవినీతి ఆరోపణల కేసులో పురోగతి కనిపిస్తోంది. దర్యాప్తులో భాగంగా ఏసీబీ అధికారులు మధ్యవర్తులను విచారిస్తున్నారు. బాపూనగర్‌లో ఉండే రాజేష్ నుంచి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకొని, అవినీతి నిరోధక శాఖ అధికారులు విచారించారు. ఇదే కేసులో మరో ప్రముఖ మధ్యవర్తిని కూడా విచారించనున్నారు. అయితే ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్లో నటి సాయి సుధ ఫిర్యాదు చేసింది. ఇదే కేసుకు సంబంధించి దర్యాప్తు కోసం ఎస్ఆర్ నగర్ పోలీస్ ఇన్స్పెక్టర్ మురళీ కృష్ణ తనవద్ద నుంచి లంచం తీసుకున్నట్లు నటి సాయి సుధ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. (సీఐ మురళీకృష్ణపై ఏసీబీకి నటి శ్రీసుధ ఫిర్యాదు) (పెళ్లి పేరుతో మోసం చేశాడు) -
సీఐ మురళీకృష్ణపై నటి శ్రీసుధ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: ఎస్ఆర్ నగర్ సీఐ మురళీకృష్ణ తన దగ్గర లంచం తీసుకున్నారంటూ నటి శ్రీసుధ ఏసీబీ(అవినీతి నిరోధక శాఖ)కు ఫిర్యాదు చేశారు. కాగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు తమ్ముడు శ్యామ్ కే.నాయుడు తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో నటి సాయి సుధ గతంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు దర్యాప్తు కోసం సీఐ మురళీకృష్ణ తన దగ్గర డబ్బులు వసూలు చేశారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాక ఈ కేసులో శ్యామ్ కే నాయుడు తనతో రాజీ కుదుర్చుకున్నట్లు నకిలీ పత్రాలు సృష్టించారని ఆరోపించారు. ఈ మేరకు నాంపల్లిలోని ఏసీబీ అధికారులకు ఆధారాలు సమర్పించారు. (పెళ్లి పేరుతో మోసం చేశాడు) చదవండి: (సుశాంత్ తండ్రి ఫిర్యాదు.. రియాపై కేసు) -
బంజారాహిల్స్ ల్యాండ్ కేసులో మరో కోణం
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లో 50 కోట్ల రూపాయల విలువైన ల్యాండ్ కేసులో మంగళవారం కొత్త కోణం బయటపడింది. ఎకరా 20 గుంటలకు చెందిన ల్యాండ్ పత్రాలన్నీ ఏసీబీ అధికారులు నకిలీవిగా తేల్చారు. ఈ కేసులో కోర్టుకు అందజేసిన పత్రాలు సైతం అన్ని ఫోర్జరీవేనని విచారణలో విల్లడైంది. ఈ కేసులో అరకోటి లంచం తీసుకుంటూ ఆర్ఐ నాగార్జున రెడ్డి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. షేక్‌పేట తహసీల్దారు సుజాతను సైతం అరెస్ట్ చేశారు. ఈ కేసును ఆలస్యం చేసేందుకు ఎస్సై రవీంద్ర నాయక్ రూ. 3 లక్షలు డిమాండ్ చేస్తూ ఏసీబీకి పట్టుబట్టాడు. ఇప్పటికే ఈ కేసులో భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన పాతబస్తీకి చెందిన సయ్యద్ ఖాలీద్‌పై చర్యలు తీసుకోవాలని గతంలో రెవెన్యూ అధికారులు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దీనిపై సీపీ అంజనీకుమార్‌కు ఏసీబీ అధికారులు లేఖ రాశారు.(కబ్జాదారుడికి సహకరించిన రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఎస్ఐ అరెస్ట్ ) ఏం జరిగిందంటే.. బంజారాహిల్స్ రోడ్ నెం.14లో ఉన్న 4865 గజాల(సుమారు రెండెకరాలు) ప్రభుత్వ స్థలాన్ని సయ్యద్ అబ్దుల్ ఖాలిద్ అనే వ్యక్తి ఆక్రమించి హెచ్చరిక బోర్డును తొలగించి తన పేరుతో బోర్డు ఏర్పాటు చేశాడు. అయితే అది ప్రభుత్వ స్థలం కావడంతో తహసిల్దార్ సుజాత పలుమార్లు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే సదరు స్థలాన్ని ప్రైవేట్ పరం చేస్తూ హద్దులు చూపిస్తానంటూ అదే కార్యాలయంలో పని చేస్తున్న ఆర్ఐ నాగార్జున రెడ్డి ఖాలిద్ నుంచి రూ.30 లక్షలు డిమాండ్ చేశాడు. ఇందులో భాగంగా శనివారం ఖాలిద్ రూ.15 లక్షల నగదును నాగార్జున రెడ్డికి ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మరోవైపు పోలీసులు అతడిని అరెస్ట్ చేయకుండా ఉండేందుకు లంచం అడిగిన ఎస్సై రవీందర్‌ను సైతం ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. (శివారుపై ఏసీబీ కన్ను) -
శంకరయ్య బాగోతాలు బట్టబయలు
-
శంకరయ్య బాగోతాలు బట్టబయలు
సాక్షి, హైదరాబాద్: షాబాద్ సీఐ శంకరయ్య ఇంట్లో కొనసాగుతున్న ఏసీబీ సోదాల్లో కీలక సమాచారం వెల్లడవుతోంది. ఇప్పటికే సోదాల్లో భారీ స్థాయిలో కూడబెట్టిన ఆస్తులను అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. ఇక తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్యకేసులో నిందితుడు రాకేష్‌రెడ్డితోనూ శంకరయ్యకు సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గతంలో దుండిగల్ సీఐగా పనిచేస్తున్న సమయంలో శంకరయ్యకు రాకేశ్‌రెడ్డితో పరిచయం ఏర్పడిందని, అప్పటి నుంచి వారి మధ్య లావాదేవీలు కొనసాగుతున్నట్టు తెలిసింది. ఇక జయరాం, శిఖ చౌదరీల కాల్ డేటాను సీఐ శంకరయ్య ద్వారా రాకేష్‌రెడ్డి రాబట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. శంకరయ్య ఇలా దొరికిపోయారు షాబాద్ సీఐగా పని చేస్టున్న శంకరయ్య జయరాంరెడ్డి అనే వ్యక్తి వద్ద రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుపడ్డాడు. ఏసీబీ అధికారులు అతని నివాసాల్లో సోదాలు చేపట్టడంతో విస్మయకర విషయాలు తెలుస్తున్నాయి. ఇక శంకరయ్య, ఏఎస్ఐ రాజేందర్ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. శంకరయ్య అతని బందువుల ఇళ్లలో కొనసాగిన ఏసీబీ సోదాల్లో ఈ ఆస్తులను గుర్తించారు. ఒక కోటి 5 లక్షల విలువ చేసే రెండు ఇళ్లు రెండు కోట్ల 28 లక్షల విలువచేసే 11 ఇంటి ప్లాట్స్. 77 లక్షల విలువచేసే 41 ఎకరాల 3 గుంటల వ్యవసాయ భూమి నిజామాద్, చేవెళ్ల, మిర్యాల గూడలో ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. 7 లక్షల విలువ చేసే మారుతి స్విప్ట్ కారు. 21 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు 17 లక్షల 88 వేల నగదు 6 లక్షల విలువ చేసే ఇతర వస్తువులు 81 వేల వెండి వస్తువులను ఏసీబీ అధికారులు గుర్తించారు. -
సీఐ శంకరయ్య ఇంట్లో విస్తుపోయే ఆస్తులు
సాక్షి, హైదరాబాద్: షాబాద్ సీఐ బి. శంకరయ్య ఇంట్లో సోదాలు చేసిన ఏసీపీ అధికారాలు విస్తుపోయే విషయాలను బయటపెట్టారు. శంకరయ్య బినామీల పేరుతో భారీగా ఆస్తుల కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. భూ తగాదా కేసులో రూ.లక్షా 20వేలు లంచం తీసుకుంటూ సీఐ శంకరయ్య పట్టుబడిన విషయం తెలిసిందే. రెవెన్యూ విలువ లెక్కల ప్రకారం రూ.4.58 కోట్ల ఆస్తులుగా గుర్తించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఇక బహిరంగ మార్కెట్లో రూ.10కోట్లకు పైనే ఆస్తుల విలువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్‌లో రూ.కోటి ఐదు లక్షలు విలువ చేసే రెండు నివాసాలు ఉన్నట్లు తెలిపారు. రూ.2 కోట్ల 25 లక్షల విలువ చేసే 11 ప్లాట్ల పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. దాంతో పాటు నిజామాబాద్, చేవెళ్ల, మిర్యాలగూడలో 41 ఎకరాల వ్యవసాయ భూమి, కారు ఉన్నాయని తెలిపారు. రూ. 22 లక్షలు విలువ చేసే బంగారం, నగలు, రూ.17 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు అధికారలు పేర్కొన్నారు. అనంతరం శంకరయ్యకు ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టినట్లు అధికారులు చెప్పారు. శంకరయ్య, ఏఎస్ఐ రాజేందర్‌లకు రిమాండ్ విధిస్తూ, చంచల్‌గూడ జైలుకు తరలించినట్లు అధికారులు తెలిపారు. -
శంకరయ్య ఇంట్లో సోదాలు.. భారీగా ఆస్తులు
సాక్షి, హైదరాబాద్: భూతగాదా కేసులో లక్షా 20వేల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన షాబాద్ సీఐ శంకరయ్య ఇంట్లో ఏసీబీ సోదాలు ముగిశాయి. గురువారం మధ్యాహ్నం నుంచి జరిపిన సోదాల్లో భారీగా ఆస్తులను గుర్తించినట్లు శుక్రవారం రోజున ఏసీబీ అధికారులు వెల్లడించారు. రూ. 4కోట్ల విలువైన ఆస్తులను గుర్తించడంతో పాటు, విలువైన ఆస్తులకు సంబంధించిన పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కాగా.. ఇప్పటికే సీఐ శంకరయ్య, ఏఎస్ఐ రాజేందర్‌లకు ఏసీబీ కరోనా పరీక్షలు నిర్వహించింది. అనంతరం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి వైద్యపరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం సీఐ, ఏఎస్ఐలను ఏసీబీ న్యాయమూర్తి ఎదుట ఏసీబీ అధికారులు ప్రవేశపెట్టారు. ఏసీబీ న్యాయమూర్తి షాబాద్ సీఐ శంకరయ్య, ఏఎస్ఐ రాజేందర్‌లకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. దీంతో వీరిద్దరిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. చదవండి: ఏసీబీ వలలో సీఐ, ఏఎస్ఐ -
శివారుపై ఏసీబీ కన్ను
సాక్షి, హైదరాబాద్: శివారు మండలాలపై ప్రభుత్వం డేగకన్ను వేసింది. అవినీతి రెవెన్యూ అధికారుల భరతం పట్టేందుకు సమాచారం సేకరిస్తోంది. ఈ మేరకు రంగంలోకి దిగిన అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ).. రాజధాని చుట్టూరా ఉన్న జిల్లాల్లోని తహసీల్దార్ల వ్యవహారశైలిపై నిఘా పెట్టింది. ప్రజల్లో అవినీతి అప్రతిష్టను మూటగట్టుకున్న రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేసే దిశగా ఒకవైపు ప్రయత్నిస్తుంటే.. మరోవైపు ఇటీవల షేక్‌పేట మండల తహసీల్దార్, ఆర్ఐ ఏసీబీ వలలో చిక్కడం సంచలనం కలిగింది. ఒక భూ వివాదంలో తలదూర్చిన ఈ రెవెన్యూ ద్వయం ఏకంగా రూ.50 లక్షల డీల్ కుదుర్చుకున్నట్లు విచారణలో తేలడం ప్రభుత్వాన్ని నివ్వెర పరిచింది. గతేడాది రంగారెడ్డి జిల్లా తహసీల్దార్ కూడా రూ.93 లక్షల నగదుతో పట్టుబడ్డారు. ఈ నేపథ్యంలోనే అక్రమార్కుల చిట్టాను తయారు చేసిన ఏసీబీ.. ఆ జాబితాను ప్రభుత్వానికి అందజేసినట్లు తెలిసింది. హైదరాబాద్ పరిసరాల్లో భూముల రేట్లు నింగినంటడం, రెవెన్యూ తగాదాలు కూడా గణనీయంగా పెరిగిపోవడంతో ఇదే అదనుగా అధికారుల అవినీతికి అడ్డూ అదుపులేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే శివారు మండలాల పోస్టింగ్‌లకు పోటీ తీవ్రంగా ఉంటోంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ఏసీబీ క్షేత్రస్థాయిలో అవినీతి తిమింగలాల సమాచారాన్ని రాబడుతోంది. విలువైన భూములు, వివాదాస్పద భూములపై తహసీల్దార్లు తీసుకున్న నిర్ణయాలను విశ్లేషిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఈ వివరాలను కూడా నివేదికలో పొందుపరచాలని నిర్ణయించినట్లు తెలిసింది. అంతేగాకుండా రెవెన్యూ వ్యవహారాల్లో అధికారుల కుటుంబసభ్యులు, పైరవీకారుల పాత్రను కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం. గాడ్ఫాదర్ల అండతో... కొలువులో చేరింది మొదలు పదవీ విరమణ వరకు అక్కడే నెలవు. పదో న్నతులు లభించినా.. బది లీ ఉత్తర్వులు అందినా.. గాడ్ఫాదర్ల అండ తో పక్క మండలాలకు వెళతారే తప్ప పొరపాటున జిల్లా సరిహద్దు దాటరు. ఒకవేళ కాదు కూడదని ప్రభుత్వం బదిలీ చేసినా.. పోస్టింగ్‌లో చేరకుండా కాలయాపన చేస్తా రు. రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, వికారాబాద్ జిల్లాల్లో పనిచేస్తున్న అధికారులను కదలించడం అంత ఆషామాషీ కాదు. వీరి పలుకుబడి ముందు ఐఏఎస్ అధికారులు బలాదూరే. నయాబ్ తహసీల్దార్‌గా ఉద్యోగంలో చేరి అదనపు కలెక్టర్‌గా అవే జిల్లాల్లో రిటైర్ అవుతున్నారంటే ప్రభుత్వంలో వీరికున్న పలుకుబడి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. పెరిగిన భూ వివాదాలను అనువుగా మలుచుకుంటున్న రెవెన్యూ అధికారులు వివాదాస్పద భూ వ్యవహారాల్లో తలదూర్చుతున్నారు. భూ విలువలు కోట్లలో పలుకుతుండటం.. భూ మాఫియా, రియల్టర్లు ఎంతైనా ఇచ్చుకునేందుకు ఆఫర్లు ఇస్తుండటంతో ఎందాకైనా వెళ్లేందుకు రెవెన్యూ గణం సాహసిస్తోంది. దీంతో శివారు మండలాల్లో పోస్టింగ్‌లు హాట్‌కేకులా మారిపోయాయి. తమకు అనువుగా ఉండే అధికారిని ఈ కుర్చీలో కూర్చోబెట్టేందుకు ప్రజాప్రతినిధులు మొదలు బడాబాబుల వరకు తెరవెనుక ప్రయత్నాలు సాగిస్తున్నారు. -
పనేదైనా...పైసలివ్వాల్సిందే..!
సాక్షి, హైదరాబాద్: అవినీతికి చిరునామా గా మారిన రెవెన్యూ వ్యవస్థను సంస్కరించాలని సీఎం కేసీఆర్ ఒకవైపు ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు లంచావతారాల లీలలు బట్టబయలవుతున్నాయి. రియల్ ఎస్టేట్ బూమ్ ఉన్నచోట ఏరికోరి పెద్దతలలకు రూ.లక్షలు ఎదురిచ్చి మరీ.. పోస్టింగులు తెచ్చుకుంటున్నారు. ఏడాది క్రితం రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల తహసీల్దార్ లావణ్యపై ఏసీబీ దాడులు జరిగాయి. వీటి లో ఆమె ఇంట్లో ఏకంగా రూ.93 లక్షల నగదు కట్టలు లభించాయి. ఈ తహసీల్దార్ అవినీతి పర్వంలో ఆఖరికి ఆమె భర్త హస్తం కూడా ఉన్నట్లు తేలడం.. ఇద్దరిపై నా సస్పెన్షన్ వేటు విదితమే. తాజాగా ‘షాక్’పేట తాజాగా మరో ఇద్దరు రెవెన్యూ అధికారులు ఏసీబీ వలలో పడ్డారు. హైదరాబాద్ సంపన్నవర్గాలు నివసించే షేక్‌పేట మండ ల తహసీల్దార్ వివాదాస్పద భూ వ్యవహారంలో తలదూర్చి ఏసీబీకి చిక్కా రు. శనివారం తహసీల్దార్ సుజాత ఇంటి పై దాడి చేసిన అధికారులు.. రూ.30 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఇదే భూ వివాదంలో ప్రైవేటు వ్యక్తులకు అండగా నిలిచిన ఆర్ఐ కూడా పట్టుబడ్డారు. జేసీలు మొదలు.. వీఆర్వో వరకు..! గతంలో శివారు జిల్లా జాయింట్ కలెక్టర్‌పై ఏసీబీ దాడులు చేసి ఆదాయానికి మించి ఆస్తులున్నాయని కటకటాల వెనక్కి నెట్టిం ది. ఇదే జిల్లాలో పనిచేసిన ఓ ఆర్డీవో కూడా ఏసీబీ వలలో చిక్కారు. ఆ తర్వాత శేరిలిం గంపల్లి తహసీల్దార్‌గా పనిచేసిన మహిళాధికారి కూడా పట్టుబడ్డారు. ఇక అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ సజీవదహనం కేసులోను అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆ జిల్లాల్లోనే తిష్ట.. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో పనిచేస్తున్న అధికారులు అక్కడి నుంచి కదలడానికి ఇష్టపడరు. దశాబ్ధాల కాలంగా నయాబ్ తహసీల్దార్ నుంచి అదనపు కలెక్టర్ల వరకు అదే జిల్లాలో కొలువులు వెలగబెడుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం ఇతర జి ల్లాలకు బదిలీ చేసినా.. సెలవుపై వెలుతున్నారే తప్ప బాధ్యతలు తీసుకోవడంలేదు. -
ఐఎంఎస్ కుంభకోణంలో ఓమ్నీ నాగరాజు అరెస్టు
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐకి చెందిన ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) మందుల కుంభకోణంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దూకుడు కొనసాగుతోంది. మొదటి నుంచి అధికారులతో కుమ్మక్కయి అధిక ధరలకు మందులు కొనుగోలు చేయడంలో కీలకంగా వ్యవహరించిన ఓమ్నీ మార్కెటింగ్ మేనేజర్ చెరుకూరి నాగరాజును ఏసీబీ అధికారులు గురు వారం అరెస్టు చేశారు. ఈ కేసులో నాగరాజు ఏ–9గా ఉన్నాడు. ఓమ్నీ ఫార్మా ఎండీ శ్రీహరిబాబు అలియాస్ బాబ్జిని ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. శ్రీహరిబాబే లెజెండ్ కంపెనీని సృష్టించి దానికి కృపాసాగర్‌రెడ్డి అనే వ్యక్తిని బినామీగా పెట్టాడని దర్యాప్తు లో అధికారులు గుర్తించారు. శ్రీహరిబాబుకు చెందిన ఓమ్నీ ఫార్మాలో నాగరాజు మార్కెటింగ్ మేనేజర్‌గా పనిచేసేవాడు. లెజెండ్ కంపెనీ ద్వారా అప్పటి డైరెక్టర్ దేవికారాణి, జాయింట్ డైరెక్టర్ పద్మ ద్వారా అధిక ధరలకు బిల్లులు చెల్లించేలా చేయడంలో నాగరాజు కీలకపాత్ర పోషించినట్లు శ్రీహరిబాబు ఏసీబీ దర్యాప్తులో వెల్లడిం చాడు. దీంతో ఏసీబీ నాగరాజును అరెస్టు చేసింది. -
కమీషన్.. డిస్కం
సాక్షి, సిటీబ్యూరో: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అవినీతికి నిలయంగా మారింది. పైసా విదల్చనిదే ఫైలు కదలని పరిస్థితి నెలకొంది. ట్రాన్స్ఫార్మర్, కొత్త వెంచర్లో లైన్ల ఏర్పాటు, లైన్ల మార్పిడి, ప్యానల్ బోర్డు, కరెంట్ మీటర్....ఇలా ప్రతి పనికీ ఓ రేట్ ఫిక్స్ చేశారు. అడిగినంత ఇస్తే సరి..లేదంటే వినియోగదారులకు చుక్కలు చూపుతున్నారు. ఇంజినీర్ల తీరుతో విసిగిపోయిన వినియోగదారులు, విద్యుత్ కాంట్రాక్టర్లు చివరకు ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తుండటంతో వారు వలపన్ని అవినీతి తిమింగలాలను పట్టుకుంటున్నారు. అయితే ఇప్పటికే ఒక సారి ఏసీబీ కేసులో అరెస్టై కేసు విచారణలో ఉన్న అధికారులు కూడా ఏడాది తిరక్క ముందే అంత కంటే మంచి పోస్టులో చేరిపోతుండటంపై విశేషం. ఏసీబీ కేసులున్న అధికారులను నాన్ ఫోకల్ పోస్టుల్లో నియమించాల్సి ఉండగా, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో ఇందుకు విరుద్ధంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి పెద్దపీట వేస్తుండటం గమనార్హం. ఆ డివిజన్లు అవినీతికి నిలయాలు: నగర శివార్లలో కొత్తగా అనేక వెంచర్లు వెలుస్తున్నాయి. కొత్తలైన్లు, మీటర్లు కరెంటోళ్లకు కామధేనువులా మారాయి. నిజానికి నాలుగు మీటర్లకు మించితే ప్యానల్ బోర్డు ఏర్పాటు చేసుకోవాలి. అయితే పలవురు వినియోగదారులు జీహెచ్ఎంసీ అనుమతి తీసుకోకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. ఒక వేళ అనుమతి తీసుకున్నా..సెట్‌బ్యాక్, పార్కింగ్, ఫైర్‌సేఫ్టీ తదితర నిబంధనలు పాటించకపోవడంతో వాటికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇవ్వరు. ఈ నేపథ్యంలో రాజేంద్రనగర్, గచ్చిబౌలి, కూకట్పల్లి, చంపాపేట్, హబ్సిగూడ, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, మియాపూర్, కూకట్పల్లి, కొండాపూర్, మాదాపూర్ డివిజన్లలో పని చేస్తున్న కొందరు అధికారులు వినియోగదారుల బలహీనతను ఆసరాగా చేసుకుని అందినకాడికి దండుకుంటున్నారు. అధికారికంగా ఎలాంటి ఎస్టిమేషన్లు లేకుండానే కొత్తలైన్లు, ప్యానల్‌బోర్డులు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జీడిమెట్ల సుభాష్‌నగర్, ప్రగతినగర్, షాపూర్‌నగర్, డీపీపల్లి, ప్రగతినగర్‌లోని క్షేత్రస్థాయి సిబ్బందిపై ఇటీవల పెద్దత్తున ఆరోపణలు వెల్లువెత్తడంతో ఇద్దరు క్షేత్రస్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకుని చేతులు దులుపుకున్న విషయం తెలిసిందే. వాస్తవానికి భవనం, వెంచర్ యజమానులు కొత్త లైన్లు, కనెక్షన్ల కోసం ఆయా డివిజన్ల పరిధిలోని వినియోగదారుల సేవాకేంద్రంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కేంద్రం నుంచి దరఖాస్తు సంబంధిత సెక్షన్ ఏఈ, ఏడీఈ, డీఈ,ఎస్ఈకి వెళుతుంది. వర్క్ ఎస్టిమేషన్ దగ్గరి నుంచి మెటీరియల్ సరఫరా, వర్క్ పూర్తయిన తర్వాత తనిఖీ చేసే వరకు ఆయా విభాగాల అధికారులకు అడిగినంత ఇచ్చుకోవాల్సిందే. లేనిపక్షంలో రోజుల తరబడి తిరిగినా పనులు కావడం లేదు. క్షేత్రస్థాయి ఇంజినీర్లపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో విసుగెత్తిన వినియోగదారులు, విద్యుత్ కాంట్రాక్టర్లు గత్యంతరం లేర ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. ఏసీబీకి చిక్కిన ఇద్దరు డీఈలు కీసర విలేజ్, నాగారం పరిధిలో ఇటీవల కొత్తగా ఓ వెంచర్ వెలసింది. కొత్తలైన్కోసం యజమానులు డిస్కంకు దరఖాస్తు చేశారు. వర్క్ ఎస్టిమేషన్, అనుమతులు మంజూరు చేసేందుకు మేడ్చల్ డీఈ ప్రసాదరావు సంబంధిత కాంట్రాక్టర్ బొల్లారం బాలనరసింహను రూ.50 వేలు డిమాండ్ చేశారు. రెండు రోజుల క్రితం ఆయనకు రూ.25 వేలు చెల్లించారు. అయినా వర్క్ ఆర్డర్ ఇవ్వకుండా ఆఫీసు చుట్టూ తిప్పుకుంటుండటంతో విసుగుచెందిన కాంట్రాక్టర్ నరసింహ ఏసీబీని ఆశ్రయించారు. గురువారం మధ్యాహ్నం తన కార్యాలయంలోనే డీఈ ప్రసాదరావు కాంట్రాక్టర్ నుంచి రూ. 5000 లంచంగా తీసుకుంటుండగా, ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని, ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. సదరు అధికారి ఇటీవలే కార్పొరేట్ ఆఫీసు(నాన్‌ఫోకల్ ఫోస్టు) నుంచి మేడ్చల్ డీఈ (ఫోకల్ పోస్టు)కు బదిలీ కావడం విశేషం. ♦ మణికొండలోని ఓ బహుళ అంతస్తుల భవనానికి విద్యుత్ కనెక్షన్ కోసం వర్క్స్ ఎస్టిమేషన్కు భవన యజమాని రవీందర్‌రెడ్డి దరఖాస్తు చేసుకున్నాడు. ఇందుకుగాను సైబర్‌సిటీ డీఈ టెక్నికల్ ముత్యం వెంకటరమణ రూ.25 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఆ భవనం పనులు దక్కించుకున్న విద్యుత్ కాంట్రాక్టర్ శివకుమార్‌రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. గురువారం సాయంత్రం డీఈ వెంకటరమణ కాంట్రాక్టర్ నుంచి రూ.25 వేలు లంచం తీసుకుంటుండగా, రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మచ్చుకు కొన్ని కేసులు: ♦ సెప్టెంబర్‌లో లైన్మెన్ రాజేందర్ గచ్చిబౌలిలోని నిర్మాణంలో ఉన్న భవనానికి మీటర్ బిగించేందుకు రూ.60వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు. ♦ నవంబర్‌లో కొండాపూర్ ఏడీఈ డి.శ్యాంమనోహర్ రూ.లక్ష లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ట్రాన్స్ఫార్మర్, ఆరు మీటర్లు మంజూరు చేసేందుకు లంచం డిమాండ్ చేశారు. ♦ మియాపూర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌కు మీటర్ అమర్చేందుకు ఓ సోలార్ విద్యుత్ సంస్థ ప్రతినిధి నుంచి లంచం తీసుకుంటున్న మియాపూర్ ఏడీఈ రమేష్, సబ్ ఇంజినీర్ పాండులను ఏసీబీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఏడీఈ రమేష్‌పై 2008లోనే ఏసీబీ కేసు నమోదైంది. కేసు విచారణలో ఉన్న సమయంలోనే ఆయన మరోసారి పట్టుబడటం విశేషం. ♦ షాపూర్‌నగర్ ఏఈ చిత్తరంజన్ సహా యూసఫ్‌గూడ ఏఈ సుధాకర్ కూడా ఇటీవల ఏసీబీకి పట్టుబడ్డవారిలో ఉన్నారు. ♦ 2017 జూన్‌లో అసెస్మెంట్స్ ఎస్ఈ శివాజీ రాఠోడ్ ఐమ్యాక్స్ థియేటర్లో వినియోగదారుల నుంచి రూ.80వేలు లంచం తీసుకుంటూ దొరికాడు. ♦ గత ఏడాది ఏప్రిల్‌లో షేక్‌పేట ఏఏఈ షేక్‌బాబా మెహిదీపట్నంలోని అపార్ట్‌మెంట్‌కు ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేసేందుకు రూ.30వేలు తీసుకుంటుండగా ఏసీబీ పట్టుకుంది. -
పోలీస్‌శాఖపై నజర్; పెరుగుతున్న ఏసీబీ దాడులు
ప్రభుత్వం ఇచ్చే జీతం సరిపోదన్నట్లుగా కొంతమంది అధికారులు, ఉద్యోగులు అవినీతికి తెగబడుతున్నారు. పని ఏదైనా పైసలిస్తేనే చేస్తామని తెగేసి చెబుతున్నారు. ప్రజలతో సత్సంబంధాలు అధికంగా ఉండే రెవెన్యూ, పోలీసుశాఖలోనే అవినీతి తిమింగలాలు ఎక్కువగా ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదులు కూడా ఈ శాఖలపైనే ఎక్కువగా వస్తుండటంతో ఏసీబీ అధికారులు దృష్టిసారించి పట్టుకుంటున్నారు. సాక్షి, నాగర్‌కర్నూల్: సమాజంలో జరిగే అన్యాయాలను, అక్రమాలను, అవినీతి దందాలను అరికట్టాల్సిన పోలీసుశాఖకు కొంతమంది చెడ్డపేరు తెస్తున్నారు. వారి వ్యవహారశైలి కారణంగా మొత్తం పోలీసుశాఖకు మచ్చ తెచ్చిపెడుతోంది. ప్రభుత్వ శాఖల్లో ఉచితంగా ప్రజలకు సేవలు అందాల్సి ఉండగా కొంతమంది అధికారులు, ఉద్యోగులు అక్రమ సంపాదనకు అలవాటుపడి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో ఎంతోకొంత ముట్టజెప్పినా అది సరిపోదన్నట్టుగా అత్యాశకు పోయి ఇంకా ఇవ్వాలని వేధింపులకు గురి చేస్తుండటంతో విసిగిపోతున్న బాధితులు ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఏసీబీ దాడుల్లో 8 మంది అధికారులు పట్టుబడ్డారు. వారిలో పోలీసు, రెవెన్యూశాఖల అధికారులే ఎక్కువగా ఉన్నారు. ఏడు నెలల్లో 8 ఏసీబీ కేసులు.. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఏడు నెలల్లో 8మంది ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డారు. ఫిబ్రవరి 19వ తేదీన అయిజ మండలం చిన్నతాండ్రపాడుకు చెందిన వీఆర్ఓ రైతు నుంచి రూ.10వేలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. మార్చి 5వ తేదీన దామరగిద్దలో రూ.20వేలు లంచం డిమాండ్ చేసిన హెచ్ఎం ఏసీబీకి పట్టుబడ్డారు. మార్చి 12న మల్దకల్ మండలం ఎల్కూరు గ్రామానికి చెందిన వీఆర్ఏ రూ.15వేలు లంచం రైతు నుంచి తీసుకుంటుండగా ఏసీబీ వలలో పడ్డాడు. ఇసుక ట్రాక్టర్ యజమానులతో రూ.20వేలు పుచ్చుకుంటూ బల్మూర్ ఎస్ఐ, కానిస్టేబుల్ రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడ్డారు. ఆగష్టు 8వ తేదీన రూ.12వేలు లంచం తీసుకుంటూ మిడ్జిల్ ఎలక్ట్రిసిటీ ఏఈ ఏసీబీకి దాడిలో పట్టుబడ్డాడు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ఉత్తమ ఉద్యోగిగా అవార్డు అందుకున్న మరుసటి రోజే మహబూబ్‌నగర్ వన్ టౌన్ పోలీసుస్టేషన్లో ఇసుక వ్యాపారి నుంచి రూ.17వేలు లంచం తీసుకుంటూ తిరుపతిరెడ్డి అనే కానిస్టేబుల్ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఈనెల 4వ తేదీన వనపర్తి జిల్లా కేం ద్రం లో ఓ క్వారీ పేరు మార్చేందుకు రూ. 20 వేలు డిమాండ్ చేసిన మైనింగ్ ఏడీ సా మ్యూల్ జాకబ్, ఆర్ఐ సాయిరాంలు ఏసీబీ కి చిక్కారు. గతంలోనే రూ.లక్ష లంచంగా తీసుకున్నప్పటికి, మళ్లీ రూ. 20 వేలు డిమాండ్ చేయడంతో చేసేది లేక బా ధితులు దిలిపాచారీ ఏసీబీని ఆశ్రయించాడు. తాజాగా తెల్కపల్లి మండల కేంద్రానికి చెందిన పశువుల సంత కాంట్రాక్టర్‌ను ప్రతినెలా డబ్బులు ఇవ్వాలంటూ ఎస్ఐ వెంకటేష్ వేధిస్తుండటంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. నేరుగా డబ్బులను తన ఇంటికి వచ్చి ఇవ్వాలని చెప్పగా బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. రూ.15వేలు తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుబడ్డాడు. పోలీసుశాఖపై దృష్టి సమాజానికి ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసుశాఖలో అవినీతి పెచ్చుమీరుతుం దన్న విమర్శలు లేకపోలేదు. ప్రతినెలా ఇసుక, మద్యం, ఇతర వ్యాపారుల నుంచి మామూళ్ల రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నారని, అదేవిధంగా పోలీసుస్టేషన్లలో పంచాయతీలు నిర్వహిస్తూ డబ్బులు వసూ లు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నా యి. స్టేషన్ పరిధిలో ఏ వ్యాపారం జరిగినా తన వాటా ముట్టజెప్పాల్సిందేనన్న తీరుగా కొంతమంది ఎస్ఐలు వ్యవహరిస్తున్నారని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. సివిల్ కేసు ల్లోనూ తలదూర్చుతూ తమకు అనుకూలమైన వారికి సెటిల్మెంట్లు చేస్తున్నారని ప్రజలనుంచి బహిరంగంగా విమర్శిలున్నా యి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని అటాచ్ చేయడమో, బదిలీ చేయడం, సస్పెండ్ చేయడం వంటి సంఘటన లు నిత్యం జరుగుతూనే ఉన్నా వారిలో మా ర్పు రావడంలేదు. ఈ మధ్య ఫిర్యాదుల సంఖ్య పెరిగిపోవడంతో ఏసీబీ అధికారు లు పోలీసుశాఖపై వరుస దాడులకు పాల్పడుతున్నారు. ఏడు నెలల్లో ఏసీబీకి పట్టుబడి న 8 కేసుల్లో ఉమ్మడి జిల్లాలో మూడు కేసు లు పోలీసుశాఖకు చెందిన వారిపైనే ఉన్నాయి. -
ఏసీబీ వలలో అవినీతి చేప
సాక్షి, పాల్వంచ: పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్(కేటీపీఎస్) 5,6 దశల చీఫ్ ఇంజ నీర్ కె.ఆనందం ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ(ఎసీబీ) అధికారులకు పట్టుబడ్డాడు. గురువారం మధ్యా హ్నం 12.45 నిమిషాలకు ఏసీబీ డీఎస్పీ ప్రతా ప్ ఆధ్వర్యంలో సిబ్బంది చేపట్టిన ఆపరేషన్‌లో రూ.3లక్షల నగదు తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు ఏకకాలంలో సీఈ కార్యాలయంతో పాటు ఆయన నివాసం ఉండే జెన్కో గెస్ట్‌హౌస్‌లోనూ సోదాలు చేశారు. డీఎ స్పీ ప్రతాప్ కథనం ప్రకారం.. కేటీపీఎస్ 5, 6 దశల కర్మాగారంలో మెటీరియల్æ(మిషనరీ స్పేర్ పార్ట్స్) సప్లయ్ కాంట్రాక్ట్‌ను పాల్వంచకు చెందిన వాహిని ఇంజనీరింగ్ సర్వీసెస్ కాంట్రాక్టర్ లలిత్ మోహన్ నిర్వహిస్తున్నాడు. గత జూ లైలో టెండర్లకు నోటిఫికేషన్ ఇవ్వగా, అదే నెల చివరి వారంలో 21 రకాల పనులను రూ.71లక్షలకు దక్కించుకున్నాడు. మెటీరియల్ సప్లయ్ చేసినందుకు 7 పనులకు రూ.28లక్షల బిల్లులు ఇచ్చారు. మిగిలిన రూ.43లక్షల బిల్లులు చేయా ల్సిఉంది. ఈక్రమంలో ఈనెల 1న సీఈ ఆనం దం కాంట్రాక్టర్ లలిత్ మోహన్‌ను పిలిపించి టెండర్ల బిల్లులు చేసినందుకు తనకు రూ.10 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేకుంటే వర్క్ ఆర్డర్‌ను రద్దు చేసేలా చూస్తానని బెదిరించాడు. దీంతో లలిత్ మోహన్ రూ.2లక్షల లంచం ఇచ్చాడు. మరో రూ.3లక్షలు 10వ తేదీన ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఏసీబీని ఆశ్రయించిన కాంట్రాక్టర్.. మెటీరియల్ సప్లయ్ పనుల్లో తనకు వచ్చే లాభం డబ్బును సీఈ అడగడంతో లలిత్ మోహన్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఖమ్మం డీఎస్పీ ప్రతాప్ సూచనల మేరకు రూ.3లక్షలు తీసుకుని సీఈ కె.ఆనందంకు గురువారం అందించాడు. కాగా, ముందస్తు పధకం ప్రకారం అక్కడికి వచ్చిన డీఎస్పీ ప్రతాప్, సీఐలు రవి, రమణమూర్తి, పీఆర్ ఏఈ ఇర్ఫాన్, సీనియర్ అసిస్టెంట్ కె.వి.రాఘవేందర్, మరో పది మంది సిబ్బంది కలిసి ఆనందం లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. సీఈని అదుపులోకి తీసుకుని, శుక్రవారం హైదరాబాద్ కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. ఏకకాలంలో సోదాలు.. సీఈ కార్యాలయంలో అతడిని పట్టుకోవడంతో పాటు జెన్కో కాలనీలో సీఈ నివాసం ఉంటున్న గెస్ట్ హౌస్‌లోనూ ఏకకాలంలో సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆయన కంప్యూటర్లో ఉన్న వివరాలను సైతం పరిశీలించారు. ఏసీబీ అధికారుల సోదాలతో ఒక్కసారిగా కేటీపీఎస్ కాంప్లెక్స్‌లోని ఉద్యోగుల్లో కలకలం రేపింది. ప్రజాహిత బ్రహ్మకుమారీస్ సంస్థ కీలక బాధ్యుడిగా, కర్మాగారంలో నిత్యం అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్న సీఈ లంచావతారంలో దొరకడంతో పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కర్మాగారంలో కార్మికులకు సైతం ఆధ్యాత్మిక పుస్తకాలు, కరపత్రాలు, జ్ఞాపికలు పంపిణీ చేయడం, వారికి దైవ సూక్తులు బోధించడం వంటి పనులు చేసే వ్యక్తి ఇలా చేయడం ఏంటని చర్చించుకుంటున్నారు. ఇబ్బంది వల్లే ఏసీబీని ఆశ్రయించా కేటీపీఎస్ 5, 6 దశల కర్మాగారంలో మెటీరియల్ సప్లయ్ చేసేందుకు రూ.71లక్షల పనులను టెండర్ల ద్వారా దక్కించుకున్నాం. 7 పనులకు రూ.28లక్షల బిల్లులు చేశారు. మిగిలిన రూ.43లక్షల బిల్లులకు సీఈ రూ.10లక్షలు లంచం అడిగాడు. లేదంటే మిగితా బిల్లులు ఆపేస్తానని, భూపాలపల్లిలో కూడా బిల్లులు రాకుండా చేస్తానని బెదిరించాడు. ఈ పనులన్నీ గత సీఈ టీఎస్ఎన్ మూర్తి హయాంలోనే నాకు దక్కాయి. 15 సంవత్సరాలుగా నేను పనులు చేస్తున్నా.. ఏనాడూ ఏ అధికారీ డబ్బులు అడగలేదు. ఇప్పుడు సీఈ ఆనందం పెద్ద మొత్తంలో అడగడం ఇబ్బంది కలిగించింది. అందుకే ఏసీబీ వారిని ఆశ్రయించా. – లలిత్ మోహన్, కాంట్రాక్టర్ లంచం అడిగితే 1064కు కాల్ చేయండి ఎవరైనా ప్రభుత్వ అధికారులు లేదా సిబ్బంది లంచం అడిగితే టోల్ ఫ్రీ నంబర్ 1064కు కాల్ చేయండి. ఈ నంబర్ 24 గంటలూ అందుబాటులో ఉంటుంది. ఫోన్ చేసిన బాధితులకు తప్పక సహకరిస్తాం. అవసరమైతే వారి పేర్లను గోప్యంగా ఉంచుతాం. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అవినీతికి పాల్పడితే ఎవరినైనా వదిలే ప్రసక్తి లేదు. – ప్రతాప్, ఏసీబీ డీఎస్పీ -
అత్యాశే కొంపముంచింది
సాక్షి, వనపర్తి: అత్యాశ పతనానికి దారితీస్తుందన్న విషయం మరోసారి నిరూపితమైంది. రూ.వేలల్లో జీతాలు తీసుకునే ప్రభుత్వ అధికారులు అక్రమార్జనకు అలవాటుపడిన కొందరు అధికారులు పేద, ధనిక అనే తేడా లేకుండా లంచం కోసం వేధించటం ఈ రోజుల్లో పరిపాటిగా మారింది. ఓ చిన్న పనికోసం ఇదివరకే రూ.ఒక లక్ష లంచం తీసుకున్న వనపర్తి మైన్స్‌శాఖ ఏడీ జాకబ్ మరో రూ.20 వేల కోసం అత్యాశపడి చివరికి ఏసీబీ వలకు శుక్రవారం చిక్కిన సంఘటన వనపర్తిలో సంచలనం రేకెత్తిస్తోంది. ఏసీబీ డీఎస్పీలు ఫయాజ్, శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన దిలీపాచారికి వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం బుద్దారంలో మినరల్స్ క్వారీ ఉంది. దానిని మరో కంపెనీకి విక్రయించిన దిలీపాచారి మైన్స్‌క్వారీని శ్రీ సాయి మినరల్స్ అండ్ మైన్స్ నుంచి మరో సంస్థ పేరున మార్చాలని కోరుతూ దరఖాస్తు చేశాడు. తనిఖీ.. ఐదురెట్లు అదనంగా ఫైన్ ఇదిలాఉండగా, క్వారీని తనిఖీ చేసిన మైన్స్ ఏడీ జాకబ్ చెల్లించాల్సిన రాయల్టీకి ఐదురెట్లు అదనంగా ఫైన్ వేస్తూ షోకాజ్ నోటీసు ఇచ్చారు. ఫై న్ వేసేందుకు కారణమేంటి నేను ప్రభుత్వ నిబంధనల మేరకే క్వారీ నిర్వహణ చేస్తున్నానని బాధితుడు అధికారిని అభ్యర్థించగా రూ.ఒక లక్ష లంచం ఇవ్వమని ఏడీ కోరాడు. దీంతో సె ప్టెంబర్ 27వ తేదీన స్థానికంగా ఉన్న మైన్స్ ఏడీ జాకబ్ దిలీపాచారిని తన ఇంటికి పిలిపించుకుని రూ.ఒక లక్ష లంచం తీసుకున్నాడు. అయినా కూడా పనిచేయకుండా ఇబ్బందులకు గురిచేస్తూ వచ్చాడు. శుక్రవారం ఆర్ఐకి ఇవ్వాలంటూ మరో రూ.20వేలు తీసుకురమ్మని ఏడీ కోరాడు. దీంతో బాధితుడు దిలీపాచారి తమను ఆశ్రయించాడని ఏసీబీ అధికారులు తెలిపారు. పథకం ప్రకారం పట్టుకున్నారు.. ఇదివరకే రూ.ఒక లక్ష లంచం తీసుకుని పనిచేయకుండా రోజూ ప్రదక్షణలు చేయిస్తూ ఇంకా లంచం కావాలని వేధించటంతో బాధితుడు దిలాపాచారి ఏబీసీ అధికారులను ఆశ్రయించారు. వారు పౌడర్ చల్లిన నోట్లను బాధితుడికి ఇచ్చారు. మైన్స్‌ఏడీ జాకబ్ ఆ నోట్లని తెలియక లంచంగా తీసుకుని రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. బాధితుడితో లంచం తీసుకున్న వెంటనే వనపర్తిలోని కార్యాలయం సమీపంలో కాచుకుని ఉన్న సుమారు 20 మంది ఏసీబీ అధికారులు సిబ్బంది ఒక్కసారిగా.. దాడి చేసి జాకబ్‌ను పట్టుకున్నారు. జాకబ్‌తో పాటు లంచంలో భాగస్వామ్యం ఉన్న సాయిరాంను అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న సెల్ఫోన్లను లాక్కున్నారు. ఇల్లు, కార్యాలయంలో సోదాలు మైన్స్ ఏడీ లంచావతారంపై ఫిర్యాదు రాగానే ఏసీబీ అధికారులు ఆఫీస్‌తో పాటు అతని ఇంట్లోను సోదాలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక్కడ లంచం తీసుకుంటూ పట్టుబడగానే హైదరాబాద్‌లోని తన నివాసంలోనూ సోదాలు ప్రా రంభించినట్లు ఏబీసీ అధికారులు తెలిపారు. -
11వేల ఎకరాలకు అక్రమ పట్టాలు: పరారీలో అధికారులు
సాక్షి, చందంపేట: చందంపేట మండలంలో గతంలో అక్రమంగా పట్టాలు చేసిన అధికారుల వ్యవహారంపై ఏసీబీ విచారణకు పూనుకుంది. ఈ నేపథ్యంలో చందంపేట రెవెన్యూ కార్యాలయంపై ఏసీబీ నిఘా పెట్టింది. దీంతో రైతు బంధు, రైతు బీమా.. వచ్చేస్తోంది.. కేవలం రూ.20వేలే..రండి బాబు రండి అంటూ అక్రమ పట్టాలు ఇచ్చిన రెవెన్యూ అధికారుల్లో గుబులు మొదలైంది. ఒకటి కాదు..రెండు కాదు సుమారు 11వేల ఎకరాలకు అక్రమ పట్టాలు ఇచ్చిన అధికారులపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. గతంలో కేవలం సస్పెండ్ అయిన అధికారులపై ఇప్పుడు క్రిమినల్ కేసులు పెడుతున్నారు. అయితే వారంతా ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో ఆయా సెక్షన్ల కింద బెయిల్ రాకపోవడంతో భయాందోళన చెందుతున్నారు. చందంపేట మండలంలో 2018–19 సంవత్సరంలో విధులు నిర్వహించిన తహసీల్దార్ చాంద్‌పాషా, శ్రీనివాస్‌శంకర్, యూసుఫ్, ఇన్చార్జ్ తహసీల్దార్ రవీందర్‌రాజు, వీఆర్వోలు నాగలక్ష్మి, అంజయ్య, యాదయ్య, జూనియర్ అసిస్టెంట్ శ్రీనులపై ఇప్పటికే సెక్షన్ 409, 419, 420, 464, 465, 468, 34ఐపీసీ సెక్షన్ల కింద చందంపేట పోలీసులు కేసులు నమోదు చేశారు. ఏసీబీ విచారణ.. చందంపేట మండలంలో కొంతమంది రాజకీయ నాయకులు పేరున్న నేతలతో కలిసి రెవెన్యూ అధికారులు చేతులు కలిపారని, సుమారు 11వేల ఎకరాలు భూములు లేకున్నా నూతన పట్టాదారు పాస్‌పుస్తకాలు అందజేశారని విచారణలో తేలడంతో వారిపై సస్పెన్షన్ వేటు పడగా క్రిమినల్ కేసులు కూడా నమోదు చేశారు. ఇప్పటికే కలెక్టరేట్ నుంచి అధికారులు పలు రికార్డులను పరిశీలించారు. ఏసీబీ అధికారులు కూడా రెవెన్యూ అధికారుల నుంచి నూతనంగా పంపిణీ చేయబోయే పట్టాదారు పాస్‌పుస్తకాలను స్వాధీనం చేసుకోగా, అక్రమ పట్టాలను ఆన్లైన్ నుంచి తొలగిస్తున్నారు. ఏసీబీ అధికారులు ఇప్పటికే రెవెన్యూ అధికారులను పూర్తి నివేదికలను అందించాలని మూడు రోజుల క్రితం విచారించినట్లు తెలుస్తోంది. మంగళవారం హైదరాబాద్ ఏసీబీ కార్యాలయానికి హాజరు కావాలని వ్యవసాయ అధికారులకు కూడా నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. -
ఏసీబీకి చిక్కిన లైన్మెన్
సాక్షి, రంగారెడ్డి : గృహ వినియోగ విద్యుత్ మీటర్ కోసం లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీ అధికారులకు లైన్మెన్ చిక్కాడు. పెద్దషాపూర్ సబ్‌స్టేషన్ పరిధిలోని తొండుపల్లి, ఊట్పల్లి, చౌదరిగూడ లైన్మెన్గా కాశీరాం పనిచేస్తున్నాడు. ఊట్పల్లి పరిధిలోని సదరన్ వెంచర్లో ఇంటిని నిర్మించుకుంటున్న తిరుపతిరెడ్డికి గృహ వినియోగ విద్యుత్ మీటర్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఈ పనికోసం లైన్మెన్ రూ.40 వేలు లంచం డిమాండ్ చేశాడు. తాను డబ్బులు ఇవ్వలేనని తిరుపతిరెడ్డి చెప్పడంతో లైన్మెన్ మీటర్ బిగించకుండా ఇబ్బందులకు గురిచేశాడు. దీంతో తిరుపతిరెడ్డి ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఒప్పందం మేరకు ఇటీవల రూ.20 వేలు ఇవ్వడానికి అంగీకరించాడు. ఈ సమాచారాన్ని ఏసీబీకి తెలపడంతో సోమవారం ఆ నగదు కాశీరాంకు ఇస్తుండగా అధికారులు రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. ఏసీపీబీ డీఎస్పీ సూర్యనారాయణ, సీఐలు మాజీద్ అలీ, నాగేందర్‌గౌడ్ కేసు దర్యాప్తు చేపడుతున్నారు. కాశీరాం గతంలో పనిచేసిన శంషాబాద్, పాలమాకుల పరిధిలో కూడా అనేకమంది గృహ, పారిశ్రామిక యజమానులకు లంచాల కోసం ఇబ్బందులు పెట్టేవాడని ఆరోపణలు ఉన్నాయి. -
ఏసీబీకి పట్టుబడ్డ లైన్‌మన్
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్‌లోని పెద్ద షాపూర్ ఏఈ కార్యాలయంలో లైన్‌మన్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు సోమవారం రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. పెద్ద షాపూర్ ఏఈ కార్యాలయంలో లైన్‌మన్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఎస్. కాశీరాములు.. తిరుపతి రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో మీటర్ ఫిట్ చేసినందుకు 50 వేలు లంచం కావాలని డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో లంచం తీసుకుంటుండగా లైన్‌మన్‌ను పట్టుకున్నారు. సోమవారం రూ.28 వేలు లంచం తీసుకుంటూ కాశీరాములు ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. -
ఏసీబీ దాడుల కలకలం
సాక్షి, జగిత్యాల: జిల్లాలో ఏసీబీ దాడులు కలకలం రేపాయి. ఆరు నెలల్లో ముగ్గురు అధికారులు ఏసీబీకి పట్టుబడడం చర్చనీయాంశమైంది. వరుస ఘటనలతో జిల్లా అధికారుల్లో కలవరం మొదలైంది. కార్యాలయాల్లోకి వచ్చే కొత్తగా వారిని నమ్మేందుకు జంకుతున్నారు. జూన్ 10న మెట్పల్లి తహసీల్దార్ కార్యాలయంలో మేడిపల్లి వీఆర్వో గోపు బాపయ్య రైతు నుంచి రూ.3 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఆ ఘటన మరువక ముందే జిల్లా మత్స్యశాఖ అధికారి రాణాప్రతాప్, సీనియర్ అసిస్టెంట్ న్యూరొద్దీన్ రూ.60 వేల లంచం తీసుకుంటూ పట్టుబడడం చర్చనీయాంశంగా మారింది. 50 సభ్యత్వాలు.. రూ.60 వేలు డిమాండ్ మత్స్య సహకారసంఘంలో అదనపు సభ్యత్వ నమోదు కోసం మెట్పల్లి మండలం జగ్గసాగర్‌కు చెందిన మత్స్యకార సంఘం సభ్యులు జిల్లా కేంద్రంలోని మత్స్యశాఖ కార్యాలయంలో సంప్రదించారు. కొత్తగా సభ్యులను చేర్చే విషయమై ఆ శాఖ అధికారులు 8 నెలలుగా వేధిస్తున్నారు. డబ్బులిస్తేనే సభ్యత్వ నమోదు చేస్తామని జిల్లా అధికారి రాణాప్రతాప్, సీనియర్ అసిస్టెంట్ న్యూరొద్దీన్ తేల్చి చెప్పారు. గ్రామశాఖ అధ్యక్షుడు ఏళ్ల రాజన్న పదిహేను రోజుల క్రితం ఇద్దరు అధికారులను కలిశాడు. జిల్లా అధికారికి రూ.40 వేలు, సీనియర్ అసిస్టెంట్‌కు రూ.20 వేల లంచం ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. ఇదే విషయాన్ని ఏసీబీ అధికారులకు తెలిపారు. గురువారం డబ్బులు తీసుకుంటుండగా సీనియర్ అసిస్టెంట్ న్యూరొద్దీన్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇద్దరు అధికారుల నుంచి వివరాలు సేకరించి, కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ భద్రయ్య కేసు నమోదు చేశారు. ఏసీబీ దాడులతో అధికారుల్లో ఆందోళన జగిత్యాల జిల్లా వ్యాప్తంగా మత్స్యశాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు జరుగుతున్నట్లు ప్రచారం జరగడంతో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. ఏసీబీ అధికారుల దాడులతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. జిల్లా మత్స్య శాఖ అధికారి ఏసీబీకి పట్టుబడిన సంఘటన సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. మిగతా శాఖల ఉద్యోగులు అప్రమత్తమయ్యారు. -
అడ్డంగా దొరికిపోయిన భగీరథ అధికారులు
సాక్షి, వికారాబాద్: మిషన్ భగీరథ పథకంలో అందినకాడికి దోచుకుంటున్నారు కొందరు అధికారులు. తాజాగా బిల్లులు చెల్లించేందుకు డబ్బులు డిమాండ్ చేసిన మిషన్ భగీరథ అధికారులు అడ్డంగా దొరికిపోయారు. జిల్లాలోని తాండూరులో మంగళవారం ఏసీబీ అధికారులు వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం గురువయ్య మిషన్ భగీరథ కాంట్రాక్టర్. అతనికి రూ.20 లక్షలు బిల్లులు రావాల్సి ఉంది. అందుకోసం నెలరోజులుగా డబ్ల్యూఎస్‌డీఈ శ్రీనివాస్ చుట్టూ తిరుగుతున్నాడు. బిల్లులు చెల్లించడానికి ముందు తమ జేబులు తడపాలని శ్రీనివాస్ కోరాడు. రూ.30 వేలు ముట్టచెపితేనే బిల్లులు చేస్తానని చెప్పడంతో కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. వారి సూచన మేరకు కాంట్రాక్టర్ డీఈ శ్రీనివాస్‌కు రూ.30 వేలు డబ్బులు ఇవ్వబోయాడు. అతను వారించి వర్కింగ్ ఇన్స్పెక్టర్ మహేందర్‌కు ఇవ్వాలని సూచించడంతో అతనికి డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ ఇద్దరి అధికారులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. శ్రీనివాస్ ఇంటిపై కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. -
ఏసీబీకి చిక్కిన ‘ఉత్తమ’ పోలీస్
సాక్షి, మహబూబ్‌నగర్ : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పరేడ్ మైదానంలో జరిగిన కార్యక్రమంలో ఉత్తమ ఉద్యోగిగా అవార్డు తీసుకున్న గంటల వ్యవధిలోనే లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు ఓ కానిస్టేబుల్. దీంతో అవినీతి పరులకు ఉత్తమ ఉద్యోగులుగా అవార్డులు ఇస్తున్నారని ఆ శాఖపై విమర్శలు వినిపిస్తున్నాయి. మహబూబ్‌నగర్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన మడవత్ రమేష్ ప్రభుత్వం నుంచి ఆన్లైన్లో అనుమతులు తీసుకొని నిబంధనల ప్రకారం ఇసుక తరలిస్తున్నాడు. ఈ క్రమంలో వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పల్లె తిరుపతిరెడ్డి గత ఏడాది నుంచి నాకు డబ్బులు ఇవ్వడం లేదు, డబ్బులు కావాలని రమేష్‌ను పలు మార్లు ఇబ్బంది పెడుతూ వచ్చాడు. అయితే రూ.17వేలు కావాలని తిరుపతిరెడ్డిని డిమాండ్ చేశాడు. దీనికి రమేష్ ఒప్పుకోకపోవడంతో కొన్ని రోజుల సమయం ఇచ్చాడు. ఆ తర్వాత రమేష్‌తో రూ.15వేలకు బేరం కుదుర్చుకున్నాడు. పక్కా ప్రణాళికతో పట్టుకున్నారు.. ఈమేరకు రమేష్ జిల్లా కేంద్రంలోని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణ చేసి ఇసుక తరలించడానికి రూ.17వేలు లంచం అడిగినట్లు రుజువు కావడంతో శుక్రవారం ఉదయం నుంచి ప్రణాళిక ప్రకారం విచారణ సాగించారు. మహబూబ్‌నగర్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పల్లె తిరుపతిరెడిక్డి రూ.17వేలు లంచం ఇస్తుంటే ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణగౌడ్ ఆధ్వర్యంలో దాడులు చేసి రెడ్‌హ్యాండ్‌గా పట్టుకున్నారు. కానిస్టేబుల్ తిరుపతిరెడ్డి అడిగిన డబ్బును రమేష్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఉన్న పోలీస్ వాహనం వెనుక భాగంలో ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత బాధితుడు మాకు తెలపడంతో మా టీంతో లోపలికి వెళ్లి తనిఖీ చేయగా తిరుపతిరెడ్డి ఫ్యాంట్ జేబులో రూ.17వేలు పట్టుబడ్డాయి. ఆ తర్వాత ఏసీబీ అధికారులు కానిస్టేబుల్ తిరుపతిరెడ్డిని పూర్తిగా తనిఖీలు చేసి ఏమైన ఆస్తుల పత్రాలు ఉన్నాయా.. ఏమైన ఆస్తులు ఉన్నాయా? బంధువుల పేర్లమీద ఎలాంటి ఆస్తులు ఉన్నాయి అనే అంశాలపై వివరాలు సేకరించారు. ఈ కేసులో పూర్తిగా విచారణ చేసి కానిస్టేబుల్ తిరుపతిరెడ్డిని హైదరాబాద్ ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ వెల్లడించారు. అవినీతిపరుడికి ఉత్తమ సేవా పతకం టూటౌన్ పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న సమయంలోనే తిరుపతిరెడ్డి అనేక వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడ కూడా పాత పద్దతిలోనే వసూళ్లకు పాల్పడుతూ వచ్చాడు. అలాంటి వ్యక్తికి ఉత్తమ ఉద్యోగిగా పోలీస్ ఉన్నత అధికారులు ఎలా గుర్తించారో అంతు చిక్కని ప్రశ్నగా మారింది. ఇబ్బంది పెడుతూ వచ్చాడు నేను 2017 డిసెంబర్ నుంచి ప్రభుత్వ అనుమతులతో ఇసుక తరలిస్తున్నాను. వన్‌టౌన్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ తిరుపతిరెడ్డి గత కొన్ని రోజుల నుంచి డబ్బులు కావాలని డిమాండ్ చేస్తూ వస్తున్నాడు. రూ.17వేలు అడగగా నా దగ్గర డబ్బులు లేవు మూడు రోజుల సమయం ఇవ్వండి రూ.15వేలు ఇస్తానని చెప్పాను. అనంతరం ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశా. సదరు కానిస్టేబుల్‌కు టూటౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేసిన సమయంలో కూడా రెండుసార్లు ఇచ్చాను. ఇతను పల్సర్ వాహనంపై సివిల్ డ్రస్‌లో కోయిలకొండ ఎక్స్‌రోడ్, ఫైర్ స్టేషన్ దగ్గరకు వచ్చి ఇసుక ట్రాక్టర్లతో కలెక్షన్ చేస్తుంటాడు. – మడావత్ రమేష్, ఫిర్యాదుదారుడు -
ఏసీబీ వలలో ట్రాన్స్‌కో ఏఈ
సాక్షి, జడ్చర్ల: మరో అవినీతి అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ సంఘటన మిడ్జిల్‌లో చోటుచేసుకుంది. ఏసీబీ డీఎస్పీ కథనం ప్రకారం.. మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన రైతు బోంపెల్లి రాజేందర్‌రెడ్డి తన వ్యవసాయ పొలం దగ్గర విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కోసం ముగ్గురు రైతుల పేరిట గత రెండు నెలల క్రితం డీడీ తీసి జడ్చర్ల విద్యుత్ కార్యాలయంలో అందజేశాడు. ఆ తర్వాత మిడ్జిల్ ఏఈ పర్వతాలును సంప్రదించగా.. రూ.15 వేలు ఇస్తేనే ట్రాన్స్ఫార్మర్ ఇస్తానని చెప్పడంతో రైతు రూ.12 వేలు ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు. ఈ విషయమై గత నెల 30న ఏసీబీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై విచారణ జరిపిన ఏసీబీ అధికారులు ఏఈ డబ్బులు డిమాండ్ చేసినట్లు తేలింది. దీంతో వారి సూచన మేరకు గురువారం మధ్యాహ్నం రైతు నుంచి రూ.12 వేలు ఏఈ పర్వతాలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ మేరకు ఏఈపై కేసు నమోదు చేశామని, శుక్రవారం హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ పేర్కొన్నారు. దాడుల్లో ఇన్స్పెక్టర్లు లింగస్వామి, ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. వివరాలు వెల్లడిస్తున్న ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణగౌడ్ రెండు నెలలు తిరిగా.. గ్రామ శివారులోని సర్వే నంబర్లు 116, 117లో తొమ్మిది ఎకరాల భూమి ఉండగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కోసం గత రెండు నెలల క్రితం తన తల్లి అలివేలు, తమ్ముడు రవీందర్‌రెడ్డి, పక్క పొలం రైతు గజేందర్‌రెడ్డి పేరిట డీడీ తీసి తీసి జడ్చర్ల సబ్‌డివిజన్ కార్యాలయంలో ఇచ్చానని రైతు రాజేందర్‌రెడ్డి తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ కోసం గత రెండు నెలల నుంచి ఏఈ దగ్గరకు వస్తే డబ్బులు ఇస్తేనే ట్రాన్స్ఫార్మర్ ఇస్తామని, రూ.15 వేలు డిమాండ్ చేయగా అంత ఇవ్వలేనని రూ.12 వేలకు ఒప్పందం చేసుకొని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశానన్నారు. వారి సూచనల మేరకు గురువారం మధ్యాహ్నం ఏఈ కార్యాలయంలో ఏఈ పర్వతాలుకు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారన్నారు. మండలంలో నలుగురు ఉద్యోగులు రైతులకు పనులు చేసిపెట్టడానికి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు విద్యుత్ శాఖలో ఇద్దరు అధికారులు పట్టుబడ్డారు. మొదట 1995లో బో యిన్‌పల్లికి చెందిన ఓ రైతు పేరిట పొలం మార్చడానికి రెవెన్యూ శాఖలో పనిచేసే ఆర్ఐ పెంటయ్య లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఆ తర్వాత 1997లో ముచ్చర్లపల్లికి చెందిన రైతు శ్యాంసుందర్‌రెడ్డికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వడాని కి రూ.3 వేలు లంచం తీసుకుంటూ విద్యుత్ సబ్ ఇంజనీర్ అబ్దుల్‌రబ్ పట్టుబడ్డాడు. అలాగే 2013 ఏప్రిల్ 1న జకినాలపల్లికి చెందిన పోలే శంకర్‌ను ఓ కేసు విషయంలో రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఎస్ఐ సాయిచంద్రప్రసాద్ ఏసీబీ అధికారులకు పట్టుబడగా.. తాజాగా విద్యుత్ ఏఈ పర్వతాలు రైతు నుంచి రూ.12 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఏడాది క్రితమే ఇక్కడికి.. విద్యుత్ ఏఈ పర్వతాలు కేఎల్ఐ కాల్వ సమీపంలో రైతుల పొలాలు లేకపోవడంతో, అదే అదునుగా చూపించి ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయడానికి రైతుల నుంచి భారీగా లంచాలు వసూలు చేసినట్లు తెలిసింది. గతేడాది జూలై మొదటి వారంలో బాలానగర్ నుంచి బదిలీపై ఏఈ పర్వతాలు ఇక్కడికి వచ్చారు. ఆయన వచ్చి న తర్వాత కేఎల్ఐ కాల్వ పరిసర ప్రాంతాల్లో దాదాపు 30 ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చినట్లు తెలిసింది. అయితే ప్రతి రైతు నుంచి డబ్బులు వసూలు చేసినా ఎవరూ ముందుకు రాలేదు. తాజాగా రైతు రాజేందర్‌రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో ఈయన బాగోతం బయటపడింది. -
ఇక్కడ పని జరగాలంటే ముందు పైసలివ్వాలి
సాక్షి, హైదరాబాద్: ఏసీబీ అధికారుల వలలో మరో అవినీతి చేప చిక్కింది. మల్కాజ్‌గిరిలో ఓ మహిళ నుంచి రూ.7వేలు లంచం తీసుకుంటూ అసిస్టెంట్ పెన్షన్ పేమెంట్ అధికారి ఫులూ నాయక్ ఏసీబీ అధికారులకు దొరికాడు. వివరాల్లోకి వెళితే.. మల్కాజ్గిరి పెన్షన్ కార్యాలయంలో ఫులూ నాయక్ అసిస్టెంట్ పెన్షన్ పేమెంట్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఓమహిళ తన పెన్షన్ డబ్బులు తీసుకోడానికి కార్యాలయానికి వెళ్లింది. పెన్షన్ డబ్బులు కావాలంటే తనకు కొంత ముట్ట చెప్పాలని ఫులూ నాయక్ ఆమహిళను డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో బాధితురాలు ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు ఫులూ నాయక్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. -
ఏసీబీ వలలో ‘ఎక్సైజ్’ చేపలు!
నిజామాబాద్‌అర్బన్: లంచం డిమాండ్ చేసిన ఎక్సైజ్ శాఖ అధికారులు అవినీతి నిరోధక శాఖ వలకు చిక్కారు. కల్లు బట్టి నుంచి శాంపిల్స్ సేకరించి, డబ్బులు డిమాండ్ చేసిన ఎక్సైజ్ టాస్క్‌పోర్స్ ఇన్స్పెక్టర్ జె.వెంకట్‌రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ స్రవంతిలను ఏసీబీ అధికారులు బుధవారం అరెస్టు చేశారు. ఏసీబీ డీఎస్పీ ప్రసన్నరాణి తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ రూరల్ మండలంలోని గూపన్పల్లిలో పులి రాజాగౌడ్ కల్లుబట్టి నిర్వహిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ జె.వెంకట్‌రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ స్రవంతి కల్లు బట్టిపై దాడి చేసి, శాంపిల్స్ సేకరించారు. తదుపరి చర్యలు చేపట్టకుండా ఉండేందుకు గాను అధికారులు రాజాగౌడ్ నుంచి రూ.40 వేలు డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకుంటే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. దీంతో రాజాగౌడ్ రూ.30 వేలు ఇస్తానని అంగీకరించాడు. ఆ తర్వాత అతడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఫిర్యాదు తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. బుధవారం ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం, సీఐ కార్యాలయాలను తనిఖీ చేశారు. మధ్యాహ్యం 2 నుంచి రాత్రి 9.30 గంటల వరకు విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా కల్లు బట్టీ నిర్వాహకులను, ఎక్సైజ్ శాఖ అధికారులను విచారించారు. శాంపిల్స్ సేకరించిన తర్వాత పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారా.. లేదా అన్న దానిపై విచారణ జరిపారు. శాంపిల్స్ సేకరించి తమ వద్దే ఉంచుకున్నట్లు వెల్లడైందని ఏసీబీ అధికారులు వెల్లడించారు. టాస్క్‌ఫోర్స్ సంబంధించి గతంలో జరిగిన తనిఖీలు, వివిధ విషయాలపై విచారణ అనంతరం లంచం డిమాండ్ నేరం కింద టాస్క్ఫోర్సు ఇన్స్పెక్టర్ జె.వెంకట్‌రెడ్డి, సబ్ఇన్స్పెక్టర్ స్రవంతిలను అరెస్టు చేశారు. -
ఏసీబీకి చిక్కిన మెప్మా డీఎంసీ
ఖమ్మంటౌన్: ఖమ్మం జిల్లా మెప్మా డీఎంసీ(డిస్ట్రిక్ట్ మెషిన్ కోఆర్డినేటర్) మన్నేపల్లి కమలశ్రీ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కింది. మెప్మా రిసోర్స్ పర్సన్ (ఆర్పీ) నుంచి రూ.40 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు గురువారం నగరంలోని మెప్మా కార్యాలయంలో తన సీటు వద్దనే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది. గత కొన్ని సంవత్సరాలుగా డీఎంసీపై అవినీతి, అక్రమాల ఆరోపణలు వస్తున్నాయి. ఆమె ఆగడాలు హెచ్చుమీరడంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. నగరంలోని గొల్లగూడెం శాంతి సమాఖ్య సంఘానికి చెందిన ధనలక్ష్మి రిసోర్స్ పర్సన్‌గా గత కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తుండగా..ఆమె విద్యార్హత విషయంలో సదరు అధికారి లంచం డిమాండ్ చేయడంతో..విసిగి వేసారి ఏసీబీకి పట్టించింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆర్పీలకు నెలకు రూ.4 వేలు గౌరవ వేతనం ఇస్తామని ప్రకటించగా..కనీస విద్యార్హత పదో తరగతి చేసింది. ఈ క్రమంలో కొందరు ఆ మేరకు సర్టిఫికెట్లు లేనివారుండగా..ధనలక్ష్మి పదో తరగతి పాస్ కాకపోవడంతో గత కొంత కాలంగా ఆర్పీగా విధుల నుంచి తొలగిస్తానంటూ డీఎంసీ బెదిరింపులకు పాల్పడుతోంది. అయితే ప్రస్తుతం పనిచేసే వారికి టెన్త్ పూర్తి చేయాడానికి కొంత వెసులుబాటు ఉన్నప్పటికీ రూ.60 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఆర్పీ ధనలక్ష్మి మరోమారు వెళ్లి డీఎంసీ కమలశ్రీని కలిసి బతిమాలడంతో రూ.50వేలు ఇవ్వాలని ఒప్పదం చేసుకున్నారు. అంత డబ్బు చెల్లించలేనని నిర్ణయించుకున్న ధనలక్ష్మి ఏసీబీ ఆధికారులను ఆశ్రయించింది. దీంతో వారి సూచనలతో గురువారం రూ.40 వేలను ముందస్తుగా తీసుకెళ్లిన ధనలక్ష్మి మరో ఆర్పీ ఉషతో కలసి వెళ్లి మెప్మా కార్యాలయంలో తన సీట్లో కూర్చొని ఉన్న డీఎంసీ కమలశ్రీకి డబ్బు అందజేశారు. అదే సమయంలో ఏసీబీ నల్లగొండ రేంజ్ ఇన్చార్జ్ డీఎస్పీ ఆనంద్‌కుమార్ ఆధ్వర్యంలోని బృందం ఆకస్మిక దాడి నిర్వహించి..కమలశ్రీ టేబుల్ సొరుగులో ఉన్న రూ.40 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆమె చేతివేళ్ల అచ్చులను సేకరించారు. మెప్మాలోని పలు అంశాలపై ఏసీబీ ఆధికారులు కమలశ్రీని ప్రశ్నించారు. అనంతరం ఆమెను వీడీవోస్ కాలనీలో ఉన్న ఏసీబీ కార్యాలయానికి తరలించారు. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాం.. మెప్మా డీఎంసీ కమలశ్రీపై ఆర్పీ ధనలక్ష్మి మాకు ఈ నెల 6న ఫిర్యాదు చేసింది. ఆర్పీ ఉద్యోగంలో కొన సాగలంటే రూ.50 వేలు చెల్లించాల్సిందేనని వేధిస్తోం దని బాధితురాలు మా వద్దకు వచ్చి సంప్రదించింది. జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు ఏవరైనా లంచం అడిగితే సమాచారం అందించండి. కమలశ్రీ 2007 నుంచి మెప్మాలో ఉద్యోగం చేస్తోంది. 12 సంవత్సరాలుగా ఆమె పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బినామీల పేరుతో ఆస్తులు కూడపెట్టినట్లు కూడా ఏసీబీ ఆధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఇటీవల రూ.15లక్షలతో కొత్త కారును కూడా కొనుగోలు చేసిన దానిపై కూడా విచారణ జరుపుతాం. – ఆనంద్‌కుమార్, ఏసీబీ డీఎస్పీ, నల్లగొండ రేంజ్ -
ఏసీబీ వలలో జేసీ సీసీ
భూపాలపల్లి: వివిధ శాఖల్లో నిత్యం దాడులు జరిపే అవినీతి నిరోధక శాఖ ఈసారి ఏకంగా జిల్లా కలెక్టరేట్లోనే పంజా విసిరింది. లంచం కోసం కక్కుర్తి పడిన ఓ అధికారిని బుధవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఈ సంఘటన కలెక్టరేట్‌తో పాటు జిల్లాలో చర్చనీయాంశంగా మారిం ది. ఏసీబీ డీఎస్పీ కె భద్రయ్య, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ పట్టణానికి చెందిన బియ్యం వ్యాపారి జన్ను అనిల్ గత ఏడాది సెప్టెంబర్ నెలలో ఓ లారీలో 162 క్వింటాళ్ల బియ్యాన్ని ములుగు మీదుగా తరలిస్తున్నాడు. ఈ క్రమంలో ములుగు పోలీసులు లారీని పట్టుకొని సీజ్ చేశారు. దీంతో అనిల్ హైకోర్టును ఆశ్రయించగా సీజ్ చేసిన బియ్యాన్ని రిలీజ్ చేయాలని అక్టోబర్ 23న ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల ప్రతులను అక్టోబర్ 30న జేసీ స్వర్ణలత సీసీ ఎండీ తాజొద్దీన్‌కు అప్పగించారు. తన బియ్యాన్ని రిలీజ్ చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నాడు. బియ్యం రిలీజ్ ఆర్డర్ కాపీ తీసుకునేందుకని ఈ నెల 5న సీసీ తాజొద్దీన్ వద్దకు అనిల్ వచ్చాడు. అయితే లంచం ఇవ్వనిదే రిలీజింగ్ ఆర్డర్ ఇవ్వనని సదరు అధికారి చెప్పాడు. సుమా రు పది రోజుల పాటు సీసీని బాధితుడు అనిల్ బతిమిలాడాడు. అయినప్పటికీ అతడు కనికరించలేదు. రిలీజింగ్ ఆర్డర్ కాపీ కోసం రూ. లక్ష ఇవ్వాలని డిమాండ్ చేయసాగాడు. దీంతో చేసేది లేక బాధితుడు అనిల్ రూ. 50 వేలు ఇచ్చేందుకు అంగీకరించాడు. అయితే లంచం ఇవ్వడం ఇష్టం లేని అనిల్ ఇటీవల వరంగల్ అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు బుధవారం మధ్యాహ్నం కలెక్టరేట్లోని జేసీ సీసీ గదిలో అనిల్ రూ. 45 వేలు సీసీ తాజొద్దీన్‌కు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ కె భధ్రయ్య, అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పట్టుకున్న నగదును స్వాధీనం చేసుకొని తాజొద్దీన్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం కలెక్టరేట్లోని సీసీ కెమెరాల పుటేజీలను ఏసీబీ అధికారులు పరిశీలించారు. లంచం తీసుకున్న తాజొద్దీన్ బుధవారం ఎవరెవరిని కలిశారనే విషయమై సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. మధ్యా హ్నం నుంచి రాత్రి వరకు తాజొద్దీన్‌ను విచారణ చేపట్టిన ఏసీబీ అధికారులు రాత్రి అతడిని అరెస్ట్ చేసి హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టుకు తరలించారు. అయితే కలెక్టరేట్లో చోటు చేసుకున్న ఈ సంఘటన కలెక్టరేట్‌తో పాటు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. లంచం ఇవ్వడం ఇష్టం లేకనే.. బియ్యం వ్యాపారం చేస్తాను. నా బియ్యాన్ని ములుగు పోలీసులు పట్టుకున్నారు. హైకోర్టును ఆశ్రయించగా బియ్యాన్ని రిలీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆర్డర్ కాపీలు ఇచ్చినప్పటికీ రిలీజింగ్ ఆర్డర్ కాపీని సీసీ తాజొద్దీన్ ఇవ్వడం లేదు. రూ. లక్ష లంచం కావాలని డిమాండ్ చేశాడు. దీంతో ఏసీబీని ఆశ్రయించా. రూ. 45 ఇచ్చి తాజొద్దీన్‌ను ఏసీబీకి పట్టించా. – జన్ను అనిల్, బాధితుడు విచారణ కొనసాగుతోంది.. జిల్లా జాయింట్ కలెక్టర్ స్వర్ణలత సీసీ తాజొద్దీన లంచం తీసుకుంటుండగా పట్టుకున్నాం. అయితే ఈ సంఘటనకు సంబంధించి ఎవరెవరి పాత్ర ఉందనే విషయమై విచారణ జరుపుతున్నాం. సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరిపై కేసులు నమోదు చేసేందుకు వెనుకాడం. – కె భద్రయ్య, ఏసీబీ డీఎస్పీ -
ఈ పోలీసుకి ఏమైంది?
సాక్షి,సిటీబ్యూరో: గతేడాది వరుస ఏసీబీ ట్రాప్స్.. ఈ ఏడాది వరుసపెట్టి వివాదాలు.. వెరసి పోలీసు విభాగానికి ఏమైందనే సందేహం కలుగుతోంది. అనుచిత ప్రవర్తన, ఆరోపణల నేపథ్యంలో రెండు రోజుల క్రితం బేగంపేట ఇన్స్పెక్టర్ బుచ్చియ్యపై వేటు పడింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన జయరామ్ హత్య కేసులో మృతదేహం తరలింపునకు సలహా ఇచ్చానే ఆరోపణ ఎదుర్కొంటున్న నల్లకుంట ఇన్స్పెక్టర్ శ్రీనివాసులును సోమవారం లూప్లైన్లోకి బదిలీ చేశారు. ఉల్లంఘనుల నుంచి స్వాధీనం చేసుకున్న వాహనాలను తిరిగి ఇచ్చే విషయంలో గోల్‌మాల్‌కు పాల్పడ్డారనే ఆరోపణపై సైఫాబాద్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గంగారామ్‌తో పాటు ఓ ఎస్సైను సీఏఆర్ హెడ్–క్వార్టర్స్‌కు ఎటాచ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. జాతీయస్థాయిలో గుర్తింపు పొందుతున్న హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో ఇలాంటి సంఘటనలకు ప్రధాన కారణం ‘ఎలక్షన్ ఎఫెక్ట్’ అని వినిపిస్తోంది. కమిషనరేట్‌కు జాతీయ గుర్తింపు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం శాంతి భద్రతల పరిరక్షణకు పెద్దపీట వేసింది. అందులో భాగంగా హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌ను రోల్‌మోడల్‌గా తయారు చేయాలని నిర్ణయించుకుంది. ఈ బాధ్యతలు చేపట్టిన ఉన్నతాధికారులు విప్లవాత్మకమైన సంస్కరణలు చేశారు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తేవడంతో పాటు సిబ్బంది, అధికారుల్లో మార్పునకు శ్రీకారం చుట్టారు. ఫలితంగా అవినీతికి గణనీయంగా అడ్డుకట్ట పడడి, వారి ప్రవర్తన ప్రజల మన్నన పొందేలా మార్చారు. ఈ చర్యలన్నీ వెరసి నగర పోలీసు కమిషనరేట్‌కు జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చాయి. ఇక్కడ అమలవుతున్న విధానాలకు తగ్గట్టు పనిచేస్తున్న అధికారులను మార్చడంలో ఉన్నతాధికారులు సఫలీకృతులయ్యారు. వెరసి దాదాపు నాలుగున్నరేళ్ల పాటు సిటీలో పోలీసింగ్ సజావుగా సాగిపోయింది. చెదురుమదురు ఘటనల మినహా పోలీసింగ్‌కు మచ్చ తెచ్చే సంచలనాత్మక ఘటనలు ఏమీ లేవు. ఎన్నికల సందర్భంలో నిబంధనలతో.. గత ఏడాది ఎన్నికల నేపథ్యంలో ఈసీ తీసుకు వచ్చిన నిబంధనలు సిటీలో భారీ బదిలీలకు కారణమయ్యాయి. ఇన్స్పెక్టర్లు రెవెన్యూ జిల్లాలో గరిష్టంగా మూడేళ్లు, ఎస్సైలు ఓ నియోజకవర్గంలో గరిష్టంగా ఐదేళ్లకు మించి పనిచేస్తే బదిలీ తప్పలేదు. రాజధానిలో మొత్తం మూడు కమిషనరేట్లు ఉన్నాయి. వీటిలో ఎన్నికల బదిలీల ఎఫెక్ట్ సిటీపైనే భారీగా పడింది. హైదరాబాద్ కమిషనరేట్ హైదరాబాద్ రెవెన్యూ జిల్లా పరిధిలోనే విస్తరించి ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ మూడేళ్లకు మించి పనిచేస్తున్న ఇన్స్పెక్టర్లు వేరే కమిషనరేట్/జిల్లాకు బదిలీ కావడం అనివార్యమైంది. దీనికితోడు అదే సమయంలో సిటీ నుంచి డీఎస్పీలుగా (ఏసీపీ) పదోన్నతి పొందిన వారూ పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఇలా ప్రమోషన్ వచ్చిన వారికి కాలపరిమితి నుంచి మినహాయింపు ఉంటుందని భావించినా అది సాధ్యం కాలేదు. సిటీ పైనే భారీ ప్రభావం.. నగరం చుట్టూ విస్తరించి ఉన్న సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లు ఎన్నికల బదిలీల విషయంలో సేఫ్ జోన్లోకి చేరిపోయాయి. అక్కడా బదిలీలు అనివార్యమే అయినప్పటికీ కమిషనరేట్స్ పరిధిలో అంతర్గతంగా చేసుకుంటే సరిపోయింది. సైబరాబాద్‌లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు, రాచకొండలో రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి జిల్లాల్లోని ప్రాంతాలు ఉన్నాయి. దీంతో ఒక కమిషనరేట్‌లో రెండు, మరో దాంట్లో మూడు రెవెన్యూ జిల్లాలు ఉన్నట్లే లెక్క. వీటి ప్రకారం ఓ జిల్లాలో ఉన్న ఠాణాల్లో పనిచేస్తూ మూడేళ్లు పూర్తయిన వారిలో కొందరిని అదే కమిషనరేట్‌లోని మరో రెవెన్యూ జిల్లాకు పంపే అవకాశం ఉంది. ఈ రకంగా ఈ రెండు కమిషనరేట్లపై ఎన్నికల బదిలీల భారం భారీగా లేదు. అయితే, హైదరాబాద్ కమిషనరేట్ మొత్తం ఒకే రెవెన్యూ జిల్లాలో ఉండడంతో ఇక్కడ పనిచేస్తున్న వారిని అనివార్యంగా బయటకు బదిలీ చేసి జిల్లాల్లోని వారిని తీసుకురావాల్సి వచ్చింది. ఎస్సై స్థాయి అధికారుల్లో సిటీ నుంచి బయటకు–అక్కడ నుంచి సిటీకి వంటి మార్పులు లేవు. అయితే నగరంలో స్టేషన్‌హౌస్ ఆఫీసర్లుగా(ఎస్హెచ్ఓ) వ్యవహరించే ఇన్స్పెక్టర్లే అత్యంత కీలకం. ఇక్కడి ‘పద్ధతులు’ వారికి పట్టక.. గడిచిన నాలుగున్నరేళ్లు పరిణామాలను పరిశీలిస్తే నగర పోలీసు విభాగంలో పోలీసింగ్‌కు ప్రత్యేక పద్ధతులు, జవాబుదారీతనం ఏర్పడ్డాయి. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో ఈ తరహా వ్యవస్థలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో అక్కడి ‘విధానాలు’ యథావిధిగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి ‘అంశాలకు’ అలవాటుపడిన అధికారులు ఎన్నికల నిబంధనల నేపథ్యంలో అనివార్య పరిస్థితులతో సిటీలోకి వచ్చారు. ఇక్కడ పోస్టింగ్ తీసుకున్నప్పటికీ విధానాలకు ఆకళింపు చేసుకోలేక, అక్కడ ఉన్న ‘సౌకర్యాలు’ వదులుకోలేక తీవ్రస్థాయిలో ‘నలిగిపోతున్నారు’. ఈ కారణంగానే అవకాశం దొరికినప్పుడల్లా ‘స్వలాభాల’ కోసం అర్రులు చాస్తున్నారు. వెరసి వరుసపెట్టి ఏసీబీకి పట్టుబడడం, తీవ్రస్థాయిలో వివాదాస్పదులుగా మారడం పరిపాటిగా మారింది. సిటీలో కనీసం ఏసీపీ స్థాయి అధికారులైనా పాతవారు ఉంటే పరిస్థితులు అదుపులో ఉండేవి. వారూ కొత్త వారే కావడంతో హద్దూ అదుపు లేకుండా పోతోంది. వారినివెనక్కి తెస్తేనే పరిస్థితుల్లో మార్పు పోలీసు విభాగంలో వెలుగులోకి వస్తున్న వివాదాలకు పుల్‌స్టాప్ పెట్టాలంటే భారీ స్థాయిలో బదిలీలు అనివార్యమని తెలుస్తోంది. ప్రస్తుతం సిటీలో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ స్థాయి అధికారుల్లో అనేకమంది ఎప్పుడు ‘పారిపోదామా’ అనే ఉద్దేశంతోనే తప్పనిసరై తమ సీట్లలో కూర్చుంటున్నారు. ఉన్నతాధికారులు ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా.. నిపుణులతో క్లాసులు తీసుకుని, జవాబుదారీతనం పెంచడానికి కృషి చేస్తున్నా సత్ఫలితాలు రావడం లేదు. ఈ నేపథ్యంలో నానాటికీ వివాదాస్పదం అవుతున్న పోలీసింగ్‌లో మార్పు రావాలంటే సిటీకి చెందిన పాత అధికారులను మళ్లీ వెనుక్కు తీసుకురావడం ఉత్తమం అనే భావన ఉంది. అయితే, పార్లమెంట్ ఎన్నికల పూర్తయ్యే వరకు ఇది సాధ్యం కాదని తెలుస్తోంది. ఈలోగా సిటీ కమిషనరేట్‌లో ‘నిర్ణీత గడువు’ పూర్తి చేసుకున్న మరికొందరూ బయటకు బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ఉన్నతాధికారులు ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు. ఒకప్పుడు ‘ఫేవరేట్ సీట్’గా ఉన్న సిటీలో పోస్టింగ్ ప్రస్తుతం ‘హాట్ సీట్’గా మారిందని వినిపిస్తోంది.