Adani Group
-
గిఫ్ట్ సిటీ ఫండ్స్‌లో భారీగా ఎన్నారైల పెట్టుబడులు
ముంబై: గిఫ్ట్ సిటీలోని ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్‌లో ప్రవాస భారతీయులు దాదాపు 7 బిలియన్ డాలర్ల పెట్టుబడులు (Investments) పెట్టినట్లు ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ చైర్మన్ కె రాజారామన్ తెలిపారు. అలాగే ఇతరత్రా బ్యాంకింగ్ సాధనాల్లో దాదాపు 5,000 మంది ఎన్నారైలు (NRIs) ఒకటిన్నర బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసినట్లు ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిటర్స్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. గిఫ్ట్ సిటీలోని 30 బ్యాంకుల నిర్వహణలోని ఆస్తుల పరిమాణం (ఏయూఎం) 78 బిలియన్ డాలర్ల స్థాయిని దాటినట్లు వివరించారు. ఇందులో సుమారు 50 బిలియన్ డాలర్ల మొత్తాన్ని దేశీ కార్పొరేట్లు రుణాలుగా తీసుకున్నట్లు, ఇటీవలే ఒక బడా భారతీయ కార్పొరేట్ దిగ్గజం 3 బిలియన్ డాలర్ల రుణం కోసం దరఖాస్తు చేసుకున్నట్లు రాజారామన్ చెప్పారు. ఐపీవోకి ప్రణవ్ కన్స్ట్రక్షన్స్ దరఖాస్తు న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ సంస్థ ‘ప్రణవ్ కన్స్ట్రక్షన్స్’ ఐపీవోకు వచ్చేందుకు సెబీ వద్ద ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. రూ.392 కోట్ల విలువ చేసే తాజా ఈక్విటీ షేర్లను ఐపీవోలో భాగంగా కంపెనీ విక్రయించనుంది. అలాగే, ప్రమోటర్‌తోపాటు ఇన్వెస్టర్ షేర్‌హోల్డర్ 28.57 లక్షల షేర్లను ఓఎఫ్ఎస్ రూపంలో విక్రయించనున్నారు. ఐపీవో (IPO) ద్వారా మొత్తం రూ.78 కోట్లను సమీకరించాలన్నది కంపెనీ ప్రణాళిక. తాజా ఈక్విటీ షేర్ల జారీ రూపంలో సమకూరే రూ.224 కోట్లను ప్రభుత్వ, చట్టపరమైన అనుమతులు, అదనపు ఫ్లోర్ స్పేస్ కొనుగోలుకు తదితర అవసరాలకు వినియోగించనుంది. రూ.74 కోట్లను రుణ చెల్లింపులకు ఉపయోగించనుంది. ఈ సంస్థ ప్రధానంగా ముంబై, పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు నిర్వహిస్తుంటుంది.అదానీ విల్మర్ చేతికి ‘టాప్స్’ న్యూఢిల్లీ: టాప్స్ బ్రాండుతో పచ్చళ్లు, సాస్‌లు తయారు చేసి విక్రయిస్తున్న జీడీ ఫుడ్స్‌ను కొనుగోలు చేసినట్లు ఎఫ్ఎంసీజీ దిగ్గజం అదానీ విల్మర్ (Adani Wilmer) తాజాగా పేర్కొంది. ఇందుకు జీడీ ఫుడ్స్ మ్యాన్యుఫాక్చరింగ్ (ఇండియా) ప్రయివేట్ లిమిటెడ్‌తో తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. దీనిలో భాగంగా తొలుత 80 శాతం వాటా కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. తదుపరి మూడేళ్లలో మిగిలిన 20 శాతం వాటాను చేజిక్కించుకోనుంది.చదవండి: రియల్టీ ప్లాట్‌ఫామ్ సిలాలో ఎంఎస్ ధోని పెట్టుబడులు ఐపీఏ గూటికి క్వాలిటీ యానిమల్ ఫీడ్స్ ముంబై: ఇండియన్ పౌల్ట్రీ అలయెన్స్(ఐపీఏ) తాజాగా క్వాలిటీ యానిమల్ ఫీడ్స్‌ను కొనుగోలు చేసింది. ఇందుకు రూ. 300 కోట్లు వెచ్చించినట్లు అల్లన గ్రూప్ అనుబంధ సంస్థ ఐపీఏ వెల్లడించింది. తాజా కొనుగోలు ద్వారా దేశీ పౌల్ట్రీ పరిశ్రమలో పటిష్టపడనున్నట్లు ఐపీఏ ఒక ప్రకటనలో పేర్కొంది. కంపెనీ ఫ్రోజెన్ హలాల్ మీట్, తృణధాన్యాలతోపాటు ఫ్రూట్ పల్ప్‌లు, కాఫీ, పెట్ ఫుడ్ తదితర కన్జూమర్ ప్రొడక్టుల తయారీ, ఎగుమతులను చేపడుతోంది. -
రూ.30,000 కోట్ల పెట్టుబడులకు ప్రణాళికలు
కేరళ ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహంగా అదానీ గ్రూప్ వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో రూ.30,000 కోట్ల పెట్టుబడులు పెట్టే ప్రణాళికలను ప్రకటించింది. మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, ఆర్థిక వృద్ధిని పెంచడం, అనేక ఉద్యోగ అవకాశాలను సృష్టించడం లక్ష్యంగా ఈ పెట్టుబడులు ఉండబోతున్నట్లు తెలిపింది. ‘ఇన్వెస్ట్ కేరళ గ్లోబల్ సమ్మిట్ 2025’ సందర్భంగా అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్ (ఏపీఎస్ఈజెడ్) మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ ఈమేరకు ప్రకటన చేశారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ సదస్సును ప్రారంభించారు.కీలక పెట్టుబడి రంగాలువిజింజం పోర్టు అభివృద్ధి: రూ.20,000 కోట్ల పెట్టుబడిలో గణనీయమైన భాగాన్ని విజింజం పోర్టు అభివృద్ధికి మళ్లించనున్నారు. అదానీ గ్రూప్ ఇప్పటికే ఈ ప్రాజెక్టులో రూ.5,000 కోట్లు పెట్టుబడి పెట్టింది. విజింజం పోర్టును దేశంలోనే మొదటి ట్రాన్స్ షిప్మెంట్ హబ్‌గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది.త్రివేంద్రం అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ: తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం సామర్థ్యాన్ని 45 లక్షల ప్రయాణికుల నుంచి 1.2 కోట్లకు పెంచేందుకు అదానీ గ్రూప్ రూ.5,500 కోట్లు పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది. ఇది విమానాశ్రయం మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తుంది.కొచ్చి లాజిస్టిక్స్ అండ్ ఈ-కామర్స్ హబ్: కొచ్చిలో లాజిస్టిక్స్, ఈ-కామర్స్ హబ్‌ను ఏర్పాటు చేసి అదానీ గ్రూప్ ఈ రంగంలో కేరళ స్థానాన్ని మరింత బలోపేతం చేయనుంది. సమర్థవంతమైన సప్లై చెయిన్ మేనేజ్మెంట్ను ఈ హబ్ సులభతరం చేస్తుంది. రాష్ట్రంలో పెరుగుతున్న ఈ-కామర్స్ పరిశ్రమకు మద్దతు ఇస్తుంది.సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యం పెంపు: కొచ్చిలో తన సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని అదానీ గ్రూప్ ఏర్పాట్లు సిద్ధం చేస్తుంది. ఈ పెట్టుబడి నిర్మాణం, మౌలిక సదుపాయాల రంగాలకు తోడ్పడుతుంది. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి దోహదం చేస్తుంది.ఇదీ చదవండి: మస్క్, బెజోస్‌ను మించిన ‘బ్లాక్‌పాంథర్’ సంపదఅభివృద్ధికి కట్టుబడి ఉన్నాం..కేరళ పురోగతికి అదానీ గ్రూప్ కట్టుబడి ఉందని కరణ్ అదానీ నొక్కిచెప్పారు. కేరళ అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు. ఈ వృద్ధిలో అదానీ గ్రూప్ భాగం కావడం గౌరవంగా భావిస్తున్నామన్నారు. సంస్థ ప్రకటించిన ఈ పెట్టుబడులు వేలాది ఉద్యోగాలను సృష్టిస్తాయని చెప్పారు. స్థానిక వ్యాపారాలను పెంచుతాయని స్పష్టం చేశారు. రాష్ట్ర మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాయని పేర్కొన్నారు. -
అదానీ వివాదం దేశానికి సంబంధించింది
రాయ్‌బరేలీ: అదానీ గ్రూప్ వివాదం వ్యక్తిగతమంటూ ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తప్పుబట్టారు. ‘అదానీ వ్యవహారం నా వ్యక్తిగతం కాదు..దేశానికి సంబంధించిన వ్యవహారం’అంటూ కుండబద్దలు కొట్టారు. ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ..అధ్యక్షుడు ట్రంప్‌తో అదానీపై వన లంచాల ఆరోపణలపై చర్చించారా అని మీడియా ప్రశ్నించగా.. ‘అది ఒక వ్యక్తికి సంబంధించిన అంశం, ఇద్దరు ప్రముఖ ప్రపంచ నేతలు కలుసుకున్నప్పుడు ఇటువంటివి చర్చకు రావు’అని పేర్కొనడం తెలిసిందే. ప్రధాని మోదీతో భేటీ అనంతరం ట్రంప్ కూడా అదానీ వ్యవహారాన్ని ప్రస్తావించకపోవడం గమనార్హం. రాహుల్ శుక్రవారం సొంత నియోజకవర్గం రాయ్‌బరేలీలోని లాల్గంజ్లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ..‘నరేంద్ర మోదీ జీ, ఇది వ్యక్తిగత వ్యవహారం కాదు..దేశానికి సంబంధించినది. మీరు నిజంగా భారత ప్రధానే అయితే అదానీ వివాదం గురించి ఆరాతీసి ఉండేవారు. ఆరోపణలపై విచారణకు అవసరమైతే అదానీని అమెరికా పంపిస్తానని ట్రంప్‌కు చెప్పి ఉండేవారు. అలాంటిదేమీ లేకుండా, కేవలం వ్యక్తిగతమంటూ వదిలేశారు’అని రాహుల్ పేర్కొన్నారు. వ్యాపారవేత్త గౌతమ్ అదానీను తన మిత్రుడని పేర్కొన్న మోదీ, ఆయన గురించి ట్రంప్‌ను ఎలాంటి విషయాలు అడగలేదని కూడా చెప్పారని రాహుల్ అన్నారు. అమెరికాలో అదానీపై అవినీతి, దొంగతనం కేసు పెండింగ్‌లో ఉందని రాహుల్ తెలిపారు. సోలార్ పవర్ కాంట్రాక్టుల కోసం అమెరికా కంపెనీలు భారత్‌లోని అధికారులకు రూ.2,100 కోట్ల మేర లంచాలు ఇచ్చినట్లు గత బైడెన్ ప్రభుత్వంలోని న్యాయశాఖ ఆరోపించింది. ఇందులో అదానీ గ్రూప్‌కు కూడా సంబంధమున్నట్లు తెలిపింది. ఈ ఆరోపణలను అదానీ గ్రూపు నిరాధారాలంటూ ఖండించింది. యోగి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ కాదు..అసలు ఇంజినే లేదు యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. యూపీలో ఉన్నది డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కాదు..ఘోరంగా విఫలమైన అసలు ఇంజినే లేని ప్రభుత్వమంటూ ఎద్దేవా చేశారు. కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో మంచిగా పనిచేస్తుండగా, యూపీ ప్రభుత్వం దేశంలోనే అత్యంత విఫలమైన ప్రభుత్వమని దుయ్యబట్టారు. యూపీ ప్రభుత్వం ప్రజల సమస్యల్ని పరిష్కరించేందుకు ఎటువంటి చర్యలను తీసుకోవడం లేదన్నారు. మరో వైపు, కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణలో మునిగిపోయిందని చెప్పారు. ‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తుంది. కర్ణాటక, తెలంగాణ మాదిరిగా తయారు చేస్తుంది. నోట్ల రద్దు వల్లే అవినీతితోపాటు చదువుకున్న యువతలో నిరుద్యోగం పెరిగిపోయింది. ఉద్యోగావకాశాలను సృష్టించాలంటే మొదటగా చేయాల్సిన పని చిన్న పరిశ్రమలను బలోపేతం చేసిన రక్షణ కల్పించడమే’ అని రాహుల్ సూచించారు. వ్యక్తిగతమన్న మోదీ వ్యాఖ్యలపై -
అదానీపై ఫిర్యాదుకు ప్రభుత్వ సాయం కోరిన ఎస్ఈసీ
అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీపై ఫిర్యాదు చేసేందుకు భారత ప్రభుత్వం సాయం కోరుతూ అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (యూఎస్ ఎస్ఈసీ) సాహసోపేత నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం భారత్‌లో ఉన్న అదానీలకు తమ ఫిర్యాదును అందించేందుకు కృషి చేస్తున్నట్లు అమెరికా ఎస్ఈసీ న్యూయార్క్ జిల్లా కోర్టుకు తెలిపింది. ఈ ప్రక్రియను సులభతరం చేసేందుకు భారత న్యాయ మంత్రిత్వ శాఖ సాయాన్ని కోరినట్లు ఎస్ఈసీ పేర్కొంది. అయితే అందుకు మోదీ ప్రభుత్వం ఒప్పుకుంటుందా? అని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌భూషణ్ తన ఎక్స్‌లో అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా స్పందిస్తూ అదానీతో ఉన్న ‘పర్సనల్ మామ్లా(వ్యక్తిగత సంబంధం)’కు మోదీ కట్టుబడి ఉంటారో.. లేదో.. తెలియాలని కామెంట్ చేశారు.అసలేం జరిగిందంటే..అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (AGEL) సోలార్ ఎనర్జీ కాంట్రాక్టులు దక్కించుకునేందుకు భారత ప్రభుత్వ అధికారులకు 250 మిలియన్ డాలర్లకు పైగా లంచాలు చెల్లించిందన్న ఆరోపణలున్నాయి. దాంతో అమెరికాలోని పెట్టుబడిదారులు కూడా ఏజీఈఎల్‌లో ఇన్వెస్ట్ చేయడంతో కంపెనీపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి యూఎస్‌లోని ఎస్ఈసీ, ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ ప్రాథమిక దర్యాప్తు జరిపి సివిల్, క్రిమినల్ కేసులు పెట్టింది. వాటిని ఎదుర్కొనేందుకు అదానీ గ్రూప్ గతంలో రెండు సంస్థలను కూడా నియమించింది.కేసు నేపథ్యంసోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SECI) నుంచి కాంట్రాక్టులు పొందడానికి ఏజీఈఎల్‌కు అనైతికంగా సాయపడటానికి భారత అధికారులకు లంచం ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. దాంతో అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీ, ఆయన బంధువు సాగర్ అదానీ, ఇతర ఎగ్జిక్యూటివ్‌లపై 2024 నవంబర్ 21న అమెరికా అధికారులు అభియోగాలు మోపారు. ఈ ఆరోపణలు ఉన్నప్పటికీ గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, సీనియర్ ఎగ్జిక్యూటివ్ వినీత్ ఎస్ జైన్‌లపై యూఎస్ ఫారిన్ కరప్షన్ ప్రాక్టీసెస్ యాక్ట్ (ఏఫ్సీపీఏ) ఉల్లంఘనలకు సంబంధించి అభియోగాలు మోపలేదని ఎజీఈఎల్ నొక్కి చెప్పింది.ఇదీ చదవండి: ‘గ్రోక్ 3’ను ఆవిష్కరించిన మస్క్అదానీ గ్రూప్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. అవి ‘నిరాధారమైనవి’ అని కొట్టిపారేసింది. దాంతోపాటు ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు సాధ్యమైన అన్ని చట్టపరమైన మార్గాలను అనుసరిస్తామని చెప్పింది. ఎస్ఈసీ అభ్యర్థనపై భారత ప్రభుత్వం ఇంకా ఏ విధంగానూ స్పందించలేదు. ప్రభుత్వం అదానీలకు ఫిర్యాదును అందించడానికి అంగీకరిస్తుందో.. లేదో చూడాలి. -
దేశవ్యాప్తంగా రూ.2,000 కోట్లతో అదానీ స్కూల్స్
ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ ఇటీవల భారతదేశ విద్యా వ్యవస్థ ముఖచిత్రాన్ని మార్చే లక్ష్యంతో దాతృత్వ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. అందుకోసం దేశవ్యాప్తంగా కనీసం 20 పాఠశాలలను నిర్మించడానికి రూ.2,000 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇటీవల గౌతమ్ అదానీ చిన్న కుమారుడు జీత్ అదానీ, దివా షాల వివాహం సందర్భంగా రూ.10,000 కోట్లతో దాతృత్వ కార్యక్రమాలు ప్రారంభిస్తామని ప్రకటించిన నేపథ్యంలో ప్రాథమికంగా పాఠశాలను ఏర్పాటు చేయబోతున్నట్లు పేర్కొంది.ఈ పాఠశాలల ఏర్పాటు కోసం అదానీ గ్రూప్ ఆధ్వర్యంలోని అదానీ ఫౌండేషన్ విద్య రంగంలో గ్లోబల్ లీడర్‌గా ఉన్న జెమ్స్ ఎడ్యుకేషన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు సరసమైన ఖర్చులతో ప్రపంచ స్థాయి విద్య, అభ్యసన మౌలిక సదుపాయాలను అందించడమే లక్ష్యంగా ఈ భాగస్వామ్యం కుదిరినట్లు ఇరువర్గాలు తెలిపాయి. 2025-26 విద్యా సంవత్సరంలో లఖ్‌నవూలో తొలి ‘అదానీ జెమ్స్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్’ ప్రారంభం కానుందని అదానీ గ్రూప్ స్పష్టం చేసింది.మరిన్ని కార్యక్రమాల కోసం రూ.8 వేల కోట్లుపాఠశాలలతో పాటు ఆస్పత్రుల నిర్మాణానికి రూ.6,000 కోట్లు, నైపుణ్యాభివృద్ధికి మరో రూ.2,000 కోట్లు ఇస్తామని అదానీ గ్రూప్ గతంలో ప్రకటించింది. ఈ ప్రయత్నాలు భారతదేశంలో అత్యంత నైపుణ్యం కలిగిన మానవ వనరులను సృష్టించే విస్తృత లక్ష్యంలో భాగమని కంపెనీ పేర్కొంది. సంస్థ పాఠశాలలను ప్రారంభిస్తుండడంపై గౌతమ్ అదానీ స్పందిస్తూ.. ప్రపంచ స్థాయి విద్యను చౌకగా, విస్తృతంగా అందుబాటులో ఉంచాలనే నిబద్ధతతో ఈ ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. జెమ్స్ ఎడ్యుకేషన్‌తో భాగస్వామ్యం ద్వారా సృజనాత్మక డిజిటల్ లెర్నింగ్‌ను అందుబాటులో ఉంచేందుకు వీలవుతుందని తెలిపారు.ఇదీ చదవండి: పీఎన్బీలో రూ.271 కోట్ల ఫ్రాడ్పెళ్లి సందర్భంగా నిర్ణయంగౌతమ్ అదానీ (Gautam Adani) చిన్న కుమారుడు జీత్ అదానీ (Jeet Adani) వివాహం ఫిబ్రవరి 7న అంగరంగ వైభవంగా జరిగింది. దివా జైమిన్ షాను ఆయన పెళ్లాడారు. వివాహం సందర్భంగా ఈ నవ జంట స్ఫూర్తిదాయక ప్రతిజ్ఞ తీసుకున్నారు. ఏటా 500 మంది దివ్యాంగ వధువులకు రూ.10 లక్షలు చొప్పున సాయం అందించాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగానే అదానీ గ్రూప్ దాతృత్వ కార్యక్రమాలకు రూ.పదివేల కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించుకుంది. -
శ్రీలంక పవర్ ప్రాజెక్టుల నుంచి అదానీ బయటకు
న్యూఢిల్లీ: శ్రీలంకలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం టారిఫ్‌లను పునఃసమీక్షించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అక్కడ తలపెట్టిన రెండు పవన విద్యుత్ ప్రాజెక్టుల నుంచి అదానీ గ్రీన్ ఎనర్జీ (ఏజీఈఎల్) వైదొలిగింది. అయితే, శ్రీలంకలో పెట్టుబడులకు తమ సంస్థ కట్టుబడి ఉందని, భవిష్యత్తులో ప్రభుత్వం కోరుకుంటే తప్పకుండా కలిసి పని చేస్తామని సంస్థ తెలిపింది.వివరాల్లోకి వెళ్తే.. శ్రీలంకలోని మన్నార్, పూనెరిన్ ప్రాంతాల్లో దాదాపు 740 మిలియన్ డాలర్ల పెట్టుబడితో ఏజీఈఎల్ 484 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయాల్సి ఉంది. 2026 మధ్య నాటికి ఇవి పూర్తి కావాలి. అయితే, వీటితో పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడుతుందంటూ పర్యావరణవేత్తల ఆందోళనలు చేపట్టి, లీగల్ కేసులు వేయడంతో ఈ ప్రాజెక్టులకు ప్రారంభం నుంచే అడ్డంకులు ఎదురయ్యాయి. ఇక గత ప్రభుత్వం ప్రతిపాదిత అదానీ విండ్ పవర్ ప్లాంటు నుంచి యూనిట్‌కు 0.0826 డాలర్ల ధరకు విద్యుత్ కొనుగోలు చేసేందుకు అంగీకరించింది. కానీ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు రేటును యూనిట్‌కు 0.06 స్థాయికి తగ్గించేలా టారిఫ్‌లను పునఃసమీక్షించాలని జనవరిలో నిర్ణయించింది. ఇది ఆమోదయోగ్యమైన ధర కాకపోవడంతో ప్రాజెక్టుల నుంచి తప్పుకోవాలని ఏజీఈఎల్ నిర్ణయం తీసుకుంది. అయితే, అదానీ గ్రూప్ 700 మిలియన్ డాలర్లతో కొలంబోలో తలపెట్టిన పోర్టు అభివృద్ధి పనులు యథాప్రకారం సాగనున్నాయి. ఇదీ చదవండి: హోండా, నిస్సాన్ పొత్తు లేనట్టే!యూపీఎమ్‌కు టీసీఎస్ సేవలుఐటీ ట్రాన్స్‌ఫార్మేషన్‌లో ఏఐ మద్దతున్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) ఫిన్లాండ్ సంస్థ యూపీఎమ్తో ఐటీ ట్రాన్స్ఫార్మేషన్ సేవలందించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. రీసైక్లబుల్ ప్రొడక్టులను రూపొందించడంలో ప్రత్యేకత కలిగిన యూపీఎమ్ పునరుత్పాదక ఇంధన మెటీరియల్స్‌ను ముడిసరుకులుగా వినియోగిస్తోంది. 11 దేశాలలో కార్యకలాపాలు విస్తరించిన కంపెనీ 10.3 బిలియన్ యూరోల టర్నోవర్‌ను కలిగి ఉంది. యూపీఎమ్ వృద్ధికి డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ సహకరించనున్నట్లు ఒప్పందం సందర్భంగా టీసీఎస్ పేర్కొంది. తద్వారా ఏఐ ఫస్ట్ ఆపరేటింగ్ మోడల్‌ను అందిపుచ్చుకోనున్నట్లు తెలియజేసింది. అయితే ఒప్పందం(కాంట్రాక్ట్) విలువను వెల్లడించలేదు. యూపీఎమ్ ఎంటర్ప్రైజ్ ఐటీ వేల్యూ చైన్‌ను పటిష్టపరిచే బాటలో ఏఐ ఆధారిత అటానమస్ ఎంటర్ప్రైజ్ ప్లాట్‌ఫామ్ ఇగ్నియోను వినియోగించనున్నట్లు టీసీఎస్ వెల్లడించింది. అంతేకాకుండా యూపీఎమ్‌కు చెందిన 15,800 మంది ఉద్యోగులు, మెషీన్ల మధ్య మరింత భాగస్వామ్యానికి ఏఐ ద్వారా మద్దతివ్వనుంది. -
అదానీకి అమెరికాలో ఊరట?
వాషింగ్టన్: దాదాపు అర శతాబ్దం నాటి విదేశీ అవినీతి విధానాల చట్టం (ఎఫ్‌సీపీఏ) అమలును తాత్కాలికంగా నిలిపివేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు ఇచ్చారు. 60 రోజుల పాటు చట్టాన్ని సమీక్షించాలని, ఈలోగా దాని కింద కొత్తగా విచారణలేవీ చేపట్టరాదని ఆయన సూచించారు.వ్యాపార అవసరాల కోసం కంపెనీలు విదేశాల్లోని అధికారులకు లంచాలిచ్చి అవినీతికి పాల్పడకుండా నిరోధించేందుకు ఈ చట్టం లక్ష్యం. పారిశ్రామిక దిగ్గజం గౌతం అదానీపై లంచాల ఆరోపణలను ఇదే చట్టం కింద విచారణ చేస్తున్న నేపథ్యంలో తాజా నిర్ణయంతో ఆయనకు కొంత ఊరట లభించగలదని పరిశ్రమవర్గాలు అభిప్రాయపడ్డాయి.భారత్‌లో సౌర విద్యుత్ కాంట్రాక్టులు దక్కించుకునేందుకు అధికారులకు లంచాలిచ్చారని, అమెరికాలో నిధులను సమీకరించే క్రమంలో ఆ విషయాలను వెల్లడించలేదని అదానీ తదితరులపై గత ప్రభుత్వం అభియోగాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఎఫ్‌సీపీఏ ప్రకారం అమెరికన్ కంపెనీలైనా, ఇతర దేశాల కంపెనీలైనా వ్యాపార అవసరాల కోసం విదేశాల్లో అధికారులకు లంచాలివ్వడం చట్టవిరుద్ధం. -
రూ.6,000 కోట్లతో ‘అదానీ హెల్త్ సిటీస్’
అదానీ గ్రూప్ రూ.6,000 కోట్లతో మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌లు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ముంబయి, అహ్మదాబాద్‌ల్లో రెండు అత్యాధునిక 1,000 పడకల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సిద్ధమవుతున్నట్లు అదానీ గ్రూప్ తెలిపింది. ఇందుకోసం మాయో క్లినిక్ సహకారం తీసుకోబోతున్నట్లు చెప్పింది. అన్ని సామాజిక-ఆర్థిక నేపథ్యాలు కలిగిన ప్రజలకు సరసమైన, ప్రపంచ స్థాయి వైద్యాన్ని అందించే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ పేర్కొంది.అదానీ హెల్త్ సిటీస్‌గా పిలుస్తున్న ఈ రెండు ఇంటిగ్రేటెడ్ హెల్త్ క్యాంపస్‌ల్లో 150 మంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు, 80 మందికి పైగా రెసిడెంట్ డాక్టర్లు, 40 మందికి పైగా ఫెలోషిప్ డాక్టర్లు పనిచేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్యాంపస్‌లో మెడికల్ కాలేజీలతో సహా అధునాతన వైద్య సదుపాయాలు అందిస్తారని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బయోమెడికల్ ఇన్ఫర్మేటిక్స్, క్లినికల్ రీసెర్చ్ వంటి అత్యాధునిక రంగాలపై దృష్టి సారించే ట్రాన్సిషనల్ కేర్ యూనిట్లు, రీసెర్చ్ సెంటర్లు కూడా ఈ క్యాంపస్‌ల్లో ఉంటాయని చెప్పారు.ఇదీ చదవండి: బాలెనో ధరల పెంపుఆరోగ్య సంరక్షణ, విద్య, నైపుణ్యాభివృద్ధిని మెరుగుపరచడానికి సిద్ధంగా ఉన్నట్లు అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ నొక్కి చెప్పారు. మాయో క్లినిక్‌తో తమ భాగస్వామ్యం దేశంలో ఆరోగ్య సంరక్షణ ప్రమాణాలను పెంచడానికి సహాయపడుతుందన్నారు. అదానీ హెల్త్ సిటీస్ సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు సేవ చేయడానికి రూపొందించబడుతుందని తెలిపారు. అధిక నాణ్యత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. -
అదానీ చిన్న కొడుకు పెళ్లికి, షాదీ డాట్ కామ్ అనుపమ్ మిట్టల్ గిఫ్ట్ ఏంటో తెలుసా?
బిలియనీర్,అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ(Gautam Adani) చిన్న కుమారుడు జీత్ అదానీ (Jeet Adani), వజ్రాల వ్యాపారి జైమిన్ షా కుమార్తె దివా జైమిన్ షా (Diva Jaimin Shah) ను ఈ నెల ఏడున పెళ్లాడాడు. అహ్మదాబాద్‌లో వీరి వివాహం వైభవంగా జరిగింది. ఈ సందర్బంగా గౌతమ్ అదానీ తన కుమారుడి వివాహ సమయంలో, వివిధ సామాజిక సమస్యలకుపయోగించేలా రూ. 10వేల కోట్లు విరాళంగా ప్రకటించడం విశేషంగా నిలిచింది. ఇందులో ఎక్కువ భాగం ఆరోగ్య సంరక్షణ, విద్య మరియు నైపుణ్యాభివృద్ధిలో భారీ మౌలిక సదుపాయాల కార్యక్రమాలకు నిధులు సమకూర్చనున్నారు. అంతకుముందు, జీత్ అదానీ ,దివా షా జంట ప్రతీ ఏడాది 500 మంది వికలాంగుల మహిళల వివాహానికి ఒక్కొక్కరికీ రూ. 10 లక్షలు విరాళంగా ఇస్తామని ప్రకటించారు. 21 మంది నూతన వధూవరులు (వికలాంగ మహిళలు), వారి భర్తలను కలిశారు.ఈ వివాహంలో మరో విశేషంగా కూడా ఉంది.అదేమిటంటే..!షాదీ.కామ్ వ్యవస్థాపకుడు, షార్క్ ట్యాంక్ ఇండియా ప్యానలిస్ట్ , అనుపమ్ మిట్టల్ (Anupam Mittal) జీత్ అదానీకి ఒక ఆసక్తికరమైన వివాహ బహుమతి (Wedding Gift) ఇచ్చాడు. మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో చాలా కాలంగా ఉండిపోయిన జీత్ ప్రొఫైల్‌ను తొలగించాడు.ఈ విషయాన్ని స్వయంగా అనుపమ్మిట్టల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన వివాహానికి కొన్ని రోజుల ముందు షార్క్ ట్యాంక్ 'బియాండ్ ది ట్యాంక్' విభాగంలో మిట్టల్‌తో సంభాషించాడు జీత్. ఈ సందర్భంగా మరో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు జీత్. చిన్న వయసులో తన పాఠశాల స్నేహితులు చిలిపిగా షాదీ డాట్ కామ్‌లో ఒక ఖాతా క్రియేటర్ చేశారనీ, అది ఇప్పటికీ అది అలాగే ఉందని, దయచేసి దాన్ని ఇప్పటికైనా తొలగించాలని అభ్యర్థించాడు. As promised, here’s a small wedding gift from me to you & Diva @jeet_adani1. We have had ur profile deleted from @ShaadiDotCom now that u have confirmed ur participation in @sharktankindia 🤗💜 pic.twitter.com/1rNMtWmAhf— Anupam Mittal (@AnupamMittal) February 8, 2025దీనికి అనుపమ్ సరేనని సమాధాన మిచ్చారు. ఈ సందర్బంగా అదానీ గ్రూపు ఉద్యోగుల్లొ ఐదు శాతం వికలాంగులుగా ఉండాలని ఆదేశించినట్టు కూడా వెల్లడించారు. వాగ్దానం చేసినట్లుగామీ దంపతులకు ఇది ఒక చిన్న వివాహ బహుమతి అంటూ మిస్టర్ మిట్టల్ ఎక్స్‌లో ఒకపోస్ట్ పెట్టారు. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను కూడా ఆయన జత చేశారు.జీత్ అదానీతో షార్క్ ట్యాంక్ "దివ్యాంగ్ స్పెషల్" ఎపిసోడ్వికలాంగుల కోసం పనిచేసే వ్యవస్థాపకులకు ఏమి చేయవచ్చనే దానికి సంబంధించిన ఒక ఎపిసోడ్ ఉండాలని జీత్ అదానీ సూచన మేరకు షార్క్ ట్యాంక్ ఇండియా "దివ్యాంగ్ స్పెషల్" ఎపిసోడ్ ప్రకటించింది. ఈ ఎపిసోడ్ కోసం రిజిస్ట్రేషన్లు ఫిబ్రవరి 15 వరకు అనుమతి ఉంటుంది. -
పెళ్లి వేళ అదానీ చిన్న కొడుకు ‘పెద్ద’ మనసు..
అదానీ గ్రూప్ (Adani Group) అధినేత, దేశంలోని అత్యంత సంపన్నుల్లో ఒకరైన గౌతమ్ అదానీ (Gautam Adani) చిన్న కుమారుడు జీత్ అదానీ (Jeet Adani) వివాహం శుక్రవారం (ఫిబ్రవరి 7) అంగరంగ వైభవంగా జరుగుతోంది. దివా జైమిన్ షాను ఆయన పెళ్లాడుతున్నారు. వివాహం సందర్భంగా ఈ నవ జంట స్ఫూర్తిదాయక ప్రతిజ్ఞ తీసుకున్నారు. ఏటా 500 మంది దివ్యాంగ వధువులకు రూ.10 లక్షలు చొప్పున సాయం అందించాలని నిర్ణయించుకున్నారు.ఈ విషయాన్ని గౌతమ్ అదానీ స్వయంగా తన ‘ఎక్స్’ ఖాతా ద్వారా పంచుకున్నారు. "జీత్, దివా తమ వివాహ జీవితాన్ని ఒక గొప్ప ప్రతిజ్ఞతో ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ప్రతి సంవత్సరం 500 మంది దివ్యాంగ సోదరీమణుల వివాహానికి రూ. 10 లక్షలు విరాళంగా ఇస్తామని వారు 'మంగళ సేవ' ప్రతిజ్ఞ చేశారు. ఒక తండ్రిగా, ఈ ప్రతిజ్ఞ నాకు అపారమైన సంతృప్తిని ఇస్తుంది. ఈ చొరవ చాలా మంది దివ్యాంగ అమ్మాయిలు, వారి కుటుంబాలు ఆనందం, గౌరవంతో జీవించడానికి సహాయపడుతుందని నేను నమ్ముతున్నాను" అని గౌతమ్ అదానీ పేర్కొన్నారు. కొత్తగా పెళ్లయిన 21 మంది దివ్యాంగ వధువులను, వారి భర్తలను తాజాగా కలుసుకున్న జీత్ అదానీ ఈ కొత్త చొరవను ప్రారంభించారు.ఇరవై ఏడేళ్ల జీత్ అదానీ 2019లో అదానీ గ్రూప్‌లో చేరారు. ఎనిమిది విమానాశ్రయాల నిర్వహణ, అభివృద్ధి పోర్ట్‌ఫోలియో ఉన్న దేశంలోని అతిపెద్ద ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అయిన అదానీ ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్‌కు డైరెక్టర్‌గా ఉన్నారు. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి అయిన జీత్.. అదానీ గ్రూప్‌నకు సంబంధించిన రక్షణ, పెట్రోకెమికల్స్, కాపర్ వ్యాపారాలను పర్యవేక్షిస్తున్నారు. గ్రూప్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ బాధ్యతలను కూడా ఆయనే చూస్తున్నారు.దివ్యాంగుల సమస్య జీత్ హృదయానికి దగ్గరగా ఉన్న అంశం. ఇటీవల షార్క్ ట్యాంక్ ఇండియాలో కనిపించిన సందర్భంగా ప్రముఖ టీవీ షోలో దివ్యాంగులైన ఎంట్రాప్రెన్యూర్లు, దివ్యాంగుల కోసం పనిచేసే వారి కోసం ఒక ప్రత్యేక ఎపిసోడ్ ఉండాలని ఆయన సూచించారు. పీపుల్ గ్రూప్, షాదీ.కామ్ వ్యవస్థాపకుడు అనుపమ్ మిట్టల్ కూడా ఈ ఆలోచనకు మద్దతు ఇచ్చారు. ఆ మేరకు "దివ్యాంగ్ స్పెషల్" ఎపిసోడ్ ప్రకటించారు. అదానీ గ్రూప్ తన శ్రామిక శక్తిలో ఐదు శాతం దివ్యాంగులు ఉండేలా ఆదేశించిందని అదే సందర్భంగా జీత్ అదానీ వెల్లడించారు.అదే ప్రేరణఈ చొరవకు తనను ప్రేరేపించిన దాని గురించి మాట్లాడుతూ.. భారతదేశం అంతటా అవుట్లెట్లు ఉన్న.. వెనుకబడిన నేపథ్యాలకు చెందిన దివ్యాంగులకు ఉపాధి కల్పించే మిట్టి కేఫ్‌ను సందర్శించిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. "నేను మిట్టి కేఫ్ (ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో) ప్రారంభోత్సవానికి వెళ్ళినప్పుడు, అన్ని కష్టాలు ఎదురైనప్పటికీ అక్కడి సిబ్బంది చిరునవ్వు, ఆత్మ స్థైర్యం నన్ను కదిలించాయి" అని జీత్ అదానీ అన్నారు. గుజరాత్‌లోని ముంద్రాలో ఒక చిన్న గ్రామీణ ప్రాజెక్ట్ నుండి అదానీ ఫౌండేషన్‌ను ఒక శక్తిగా మార్చిన తన తల్లి ప్రీతి అదానీ కూడా తనకు ప్రేరణ అని ఈ యువ వ్యాపారవేత్త చెబుతారు. -
బెదిరింపులకు భయపడి మూసేయలేదు
న్యూఢిల్లీ: దిగ్గజ కార్పొరేట్ సంస్థలపై సంచలన ఆరోపణలతో ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయిన అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్(Hindenburg) మూసివేతపై ఆ సంస్థ వ్యవస్థాపకుడు నేట్ ఆండర్సన్ మరోసారి పెదవి విప్పారు. ఎవరి బెదిరింపులకో లేదంటే కేసులకో భయపడి సంస్థను మూసేయలేదని, పని భారం కారణంగానే ఆ నిర్ణయం తీసుకున్నట్లు ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన స్పష్టం చేశారు.అదానీ(Adani) గ్రూప్‌తో సహా పలు సంస్థలపై తాము ఇచ్చిన రిపోర్టులన్నింటికీ కట్టుబడి ఉన్నామని కూడా పేర్కొన్నారు. అదానీపై పలు మీడియా రిపోర్టుల్లో లేవనెత్తిన ఆరోపణల ఫలితంగానే తాము ఆ గ్రూప్‌నకు సంబంధించి ‘కార్పొరేట్ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణాన్ని’ వెలికితీశామని ఆయన చెప్పారు. కాగా, రిపోర్ట్‌లో పేర్కొన్న ఆరోపణలన్నింటినీ అదానీ గ్రూప్ తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. కొత్త బ్రాండ్ ఏర్పాటు చేస్తే సపోర్ట్ చేస్తా... భారత్ వ్యతిరేక శక్తులైన ఓసీసీఆర్పీ, జార్జ్ సోరోస్ వంటి గ్రూపులతో హిండెన్‌బర్గ్‌కు లింకులు అంటగట్టేందుకు కొంతమంది చేసిన ప్రయత్నాలపై స్పందిస్తూ.. అదో ‘పనికిమాలిక కుట్ర’గా అభివర్ణించారు. అలాంటి తెలివితక్కువ కుట్ర సిద్ధాంతాలకు మరింత ఆజ్యం పోయకూడదనే.. తమ సంస్థ వారిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఫైనాన్షియల్ ఫోరెన్సిక్ రీసెర్చ్ సేవల సంస్థగా ఎనిమిదేళ్ల క్రితం ఆవిర్భవించిన హిండెన్‌బర్గ్... ప్రపంచవ్యాప్తంగా పలు దిగ్గజ సంస్థల్లోని లొసుగులపై అధ్యయనం చేసి విడుదల చేసిన నివేదికలు రాజకీయంగా, కార్పొరేట్ ప్రపంచంలో దుమారం సృష్టించడం తెలిసిందే.కాగా, ట్రంప్ పగ్గాలు చేపట్టనున్న తరుణంలో సంస్థను మూసేస్తున్నట్లు ప్రకటించి ఆండర్సన్ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ట్రంప్ సర్కారుకు భయపడే ఆయన మూసివేత నిర్ణయం తీసుకున్నారన్న గుసగుసలు వినిపించాయి. కంపెనీ పగ్గాలు వేరెవరికైనా అప్పగించకుండా ఎందుకు మూసేయాల్సి వచి్చందన్న ప్రశ్న కు ‘ఆ బ్రాండ్ నుండి నన్ను ఎవరూ వేరు చేయలేరు. హిండెన్‌బర్గ్ అనే పేరు నాతో పెనవేసుకుపోయింది. ఎవరికైనా అమ్మేయడానికి అది సాఫ్ట్వేర్ అప్లికేషన్, సైకిళ్ల ఫ్యాక్టరీ కాదు. నా టీమ్ కొత్త బ్రాండ్‌ను ఏర్పాటు చేస్తానంటే తప్పకుండా మద్దతిస్తా. వారు ఆ పని చేస్తారనే అనుకుంటున్నా’ అని ఆండర్సన్ వ్యాఖ్యానించారు. -
అదానీ గ్రీన్ ఒప్పందంపై శ్రీలంక పునఃసమీక్ష
అదానీ గ్రీన్ ఎనర్జీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని పునఃసమీక్షించే యోచనలో ఉన్నట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. 484 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు కోసం కిలోవాట్‌కు 8.2 యూఎస్ సెంట్ల చొప్పున గతంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఈ విద్యుత్ ధరను యూనిట్‌కు 6 సెంట్ల దిగువకు తీసుకురావాలని కొత్త యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది.స్థానిక బిడ్డర్లు తక్కువ యూనిట్ ధరలకు ఆఫర్ చేయడం.. ఇరవై ఏళ్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని అధిక రేటుకు కుదుర్చుకోవాలని గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విమర్శలకు దారితీసింది. అధ్యక్షుడు అనురా కుమార దిస్సానాయకే నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం వారి ప్రస్తుత ప్రాధాన్యతలు, ఇంధన విధానాలకు అనుగుణంగా నిబంధనలను సమీక్షించాలని నిర్ణయించింది. అయితే అదానీ గ్రూప్, శ్రీలంక ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరి ప్రాజెక్ట్‌ను కొనసాగిస్తున్నట్లు ప్రకటన రావాల్సి ఉంది.ఇదీ చదవండి: పట్టణ వినియోగ పెంపునకు బ్లూప్రింట్మే 2024లో ఆమోదించిన టారిఫ్‌ను పునఃసమీక్షించాలని శ్రీలంక కేబినెట్ తీసుకున్న నిర్ణయం ప్రామాణిక సమీక్షా ప్రక్రియలో భాగమని అధికారులు తెలిపారు. ప్రభుత్వం నియమించిన కమిటీ మొత్తం ప్రాజెక్టును సమీక్షించనుంది. అదానీ గ్రూప్ శ్రీలంక గ్రీన్ ఎనర్జీ రంగంలో 1 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఈ ప్రాజెక్ట్ రద్దయినట్లు వచ్చిన వార్తలను అదానీ గ్రూప్ తోసిపుచ్చింది. నిబంధనలు ప్రస్తుత లక్ష్యాలకు అనుగుణంగా ఉండేలా చూడటానికి పునరాలోచనలో ఉన్నట్లు పేర్కొంది. శ్రీలంకలో పునరుత్పాదక ఇంధనం, ఆర్థిక వృద్ధిని పెంపొందించడానికి కంపెనీ సిద్ధంగా ఉందని తెలిపింది. -
ఆరోపణలపై పోరాడేందుకు న్యాయ సంస్థల నియామకం
అదానీ గ్రూప్ ఇటీవల అమెరికాలో తనపై వచ్చిన ఆరోపణలను న్యాయబద్ధంగా ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. ఈమేరకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC), ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ దాఖలు చేసిన సివిల్, క్రిమినల్ కేసులను నిర్వహించడానికి కిర్క్లాండ్ & ఎల్లిస్, క్విన్ ఇమ్మాన్యుయేల్ ఉర్కహర్ట్ & సుల్లివాన్ ఎల్ఎల్పీ అనే న్యాయ సంస్థలను అదానీ గ్రూప్ నియమించింది.అసలేం జరిగిందంటే..అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (AGEL) సోలార్ ఎనర్జీ కాంట్రాక్టులు దక్కించుకునేందుకు భారత ప్రభుత్వ అధికారులకు 250 మిలియన్ డాలర్లకు పైగా లంచాలు చెల్లించిందన్న ఆరోపణలున్నాయి. దాంతో అమెరికాలోని పెట్టుబడిదారులు కూడా ఏజీఈఎల్‌లో ఇన్వెస్ట్ చేయడంతో కంపెనీపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి యూఎస్‌లోని ఎస్ఈసీ, ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ ప్రాథమిక దర్యాప్తు జరిపి సివిల్, క్రిమినల్ కేసులు పెట్టింది. వాటిని ఎదుర్కొనేందుకు అదానీ గ్రూప్ తాజాగా రెండు సంస్థలను నియమించింది. ఇవి కంపెనీపై వచ్చిన ఆరోపణలపై న్యాయబద్ధంగా అక్కడి కోర్టుల్లో సమాధానం చెప్పనున్నాయి.కేసు నేపథ్యంసోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SECI) నుంచి కాంట్రాక్టులు పొందడానికి ఏజీఈఎల్‌కు అనైతికంగా సాయపడటానికి భారత అధికారులకు లంచం ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. దాంతో అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీ, ఆయన బంధువు సాగర్ అదానీ, ఇతర ఎగ్జిక్యూటివ్‌లపై 2024 నవంబర్ 21న అమెరికా అధికారులు అభియోగాలు మోపారు. ఈ ఆరోపణలు ఉన్నప్పటికీ గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, సీనియర్ ఎగ్జిక్యూటివ్ వినీత్ ఎస్ జైన్‌లపై యూఎస్ ఫారిన్ కరప్షన్ ప్రాక్టీసెస్ యాక్ట్ (ఏఫ్సీపీఏ) ఉల్లంఘనలకు సంబంధించి అభియోగాలు మోపలేదని ఎజీఈఎల్ నొక్కి చెప్పింది.ఇదీ చదవండి: ఇళ్ల నిర్మాణ వ్యయంలో భారీ కోత..?న్యాయ సంస్థల గురించిషికాగోలో ప్రధాన కార్యాలయం ఉన్న కిర్క్టాండ్ & ఎల్లిస్ అధికంగా వాణిజ్య వివాదాలు, మేధో సంపత్తి వ్యాజ్యాలు, వైట్-కాలర్ కేసుల్లో ప్రత్యేకత కలిగి ఉంది. ఇప్పటికే జాన్సన్ & జాన్సన్, వోక్స్ వ్యాగన్ వంటి ప్రధాన సంస్థలకు ఈ సంస్థ సేవలందించింది. లాస్ ఏంజిల్స్‌కు చెందిన క్విన్ ఇమ్మాన్యుయేల్ సెక్యూరిటీస్ లిటిగేషన్, ప్రొడక్ట్ లయబిలిటీ, రెగ్యులేటరీ ఇన్వెస్టిగేషన్ల్లో ప్రసిద్ది చెందింది. ఈ కంపెనీకి గూగుల్, యాపిల్, ఉబెర్ వంటి క్లయింట్లు ఉన్నారు. -
హిండెన్‌బర్గ్ మూసివేత! బెదిరింపులు ఉన్నాయా..?
అదానీ గ్రూప్, నికోలా వంటి కంపెనీలపై తీవ్ర ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచిన అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. కంపెనీ వ్యవస్థాపకుడు నాథన్ అండర్సన్ కంపెనీ వెబ్సైట్లో అప్లోడ్ చేసిన నోట్లో ఈమేరకు నిర్ణయాన్ని వెల్లడించారు. సంస్థ మూసివేతకు సంబంధించి ఏదైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా.. అనే దానిపై అండర్సన్ నోట్లో వివరాలు తెలియజేశారు.‘సంస్థ మూసివేత గురించి కొంతకాలంగా నా ఆత్మీయులు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో చర్చించాను. చాలా చర్చలు జరిగిన తర్వాతే సంస్థను మూసివేయాలని నిర్ణయించుకున్నాను. మేము తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఎలాంటి బెదిరింపులు, భయాలు, వ్యక్తిగత అంశాలు లేవు. హిండెన్‌బర్గ్ నా జీవితంలో ఒక మధురమైన అధ్యాయంగా మిగిలిపోతుంది. ఈ సంస్థ వల్ల ఎంతో సాహసం చేశాను. ఎన్నో ఇబ్బందులు, ఒత్తిళ్లు ఎదురైనా ఏ మాత్రం తొనకకుండా సంస్థను నిర్వహించాను. ఈ వ్యవహారం అంతా నాకో ప్రేమకథలా తోస్తుంది. కంపెనీ స్థాపించడానికి ముందు నన్ను నేను నిరూపించుకోవాలని ఎంతో కష్టపడేవాడిని. ప్రస్తుతం కంఫర్ట్ జోన్లో ఉన్నానని అనిపిస్తోంది. ఇకపై భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి పెడతాను. నా బృందం మంచి స్థాయికి చేరుకునేందుకు సాయపడతాను’ అని తెలిపారు.ఇదీ చదవండి: రష్యాపై యూఎస్ ఆంక్షలు.. చమురుపై ప్రభావంహిండెన్బర్గ్ గురించి..నాథన్ అండర్సన్ 2017లో దీన్ని స్థాపించారు. యూఎస్‌కు చెందిన ఈ కంపెనీ షార్ట్ సెల్లింగ్ సంస్థగా, ఇన్వెస్టిగేటివ్ రీసెర్చ్‌గా ప్రసిద్ధి చెందింది. దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌లో ఉంది. 2023లో అదానీ గ్రూప్ స్టాక్ మానిప్యులేషన్, అకౌంట్స్‌లో మోసం చేసిందని హిండెన్‌బర్గ్ నివేదిక ఆరోపించింది. ఈ నివేదికతో కంపెనీ మార్కెట్ విలువ 100 బిలియన్ డాలర్ల(సుమారు రూ.8.3 లక్షల కోట్లు)కు పైగా తుడిచిపెట్టుకుపోయింది. 2020లో నికోలా తన సాంకేతికతను ఉపయోగించి పెట్టుబడిదారులను మోసం చేసిందని ఆరోపించింది. హిండెన్‌బర్గ్ రద్దు చేయడానికి ముందు పోంజీ పథకాల నివేదికలతో సహా తన తుది దర్యాప్తులను పూర్తి చేసినట్లు తెలిపింది. అండర్సన్ తన కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని నిర్ణయించుకున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. -
వాటా అమ్మేసిన అదానీ గ్రూప్
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ (Adani) తాజాగా ఎఫ్ఎంసీజీ సంస్థ అదానీ విల్మర్‌లో (Adani Wilmar) 13.5 శాతం వాటా విక్రయించింది. ఫార్చూర్ బ్రాండ్ వంట నూనెలు, ఫుడ్ ప్రొడక్టుల కంపెనీలో 17.54 కోట్ల షేర్లను షేరుకి రూ. 275 ఫ్లోర్(కనీస) ధరలో అమ్మివేసింది. తద్వారా విల్మర్‌తో ఏర్పాటు చేసిన భాగస్వామ్య కంపెనీ(జేవీ) నుంచి వైదొలగనుంది.వెరసి కీలకంకాని బిజినెస్‌ల నుంచి తప్పుకోవడం ద్వారా గ్రూప్‌నకు ప్రధానమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్పై దృష్టి పెట్టనుంది. భాగస్వామి విల్మర్‌కు వాటా విక్రయించనున్నట్లు గత నెలలో అదానీ గ్రూప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అనుబంధ సంస్థ అదానీ కమోడిటీస్ ఎల్ఎల్పీ ద్వారా 13.5 శాతం వాటాను సంస్థాగత ఇన్వెస్టర్లకు విక్రయించింది. దీనిలో అదనంగా విక్రయించే వీలున్న 6.5 శాతం వాటా(8.44 కోట్ల షేర్లు) సైతం కలసి ఉన్నట్లు వెల్లడించింది.మార్కెట్లు క్షీణతలో ఉన్నప్పటికీ ఆఫర్ ఫర్ సేల్కు దేశ, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించినట్లు అదానీ గ్రూప్ తెలియజేసింది. దీంతో 1.96 కోట్ల షేర్లను అదనంగా ఆఫర్ చేయనున్నట్లు వెల్లడించింది. అంటే 17.54 కోట్ల షేర్లు(13.5 శాతం వాటా) ప్రస్తుతం విక్రయించగా.. మరో 1.96 కోట్ల(1.5 శాతం వాటా)ను సోమవారం(13న) రిటైల్ ఇన్వెస్టర్లకు ఆఫర్ చేయనున్నట్లు వివరించింది.అంటే మొత్తం 19.5 కోట్ల షేర్ల(15.01 శాతం వాటా)ను అమ్మివేయనున్నట్లు వెల్లడించింది. ఈ లావాదేవీ తదుపరి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25)లో 3.15 బిలియన్ డాలర్ల ఈక్విటీ పెట్టుబడులను సమకూర్చుకున్నట్లవుతుందని అదానీ గ్రూప్ తెలియజేసింది. పబ్లిక్కు కనీస వాటా తాజా వాటా విక్రయ నేపథ్యంలో పబ్లిక్కు కనీస వాటా నిబంధనలను అమలు చేసినట్లు అదానీ విల్మర్ పేర్కొంది. ప్రస్తుతం ప్రమోటర్లకు 74.37 శాతం, పబ్లిక్కు 25.63 శాతం వాటా ఉన్నట్లు తెలియజేసింది. తదుపరి దశలో ఒప్పందం ప్రకారం మిగిలిన వాటాను విల్మర్‌కు షేరుకి రూ. 305 ధర మించకుండా విక్రయించనున్నట్లు తెలియజేసింది. లావాదేవీకి ముందు కంపెనీలో అదానీ గ్రూప్‌నకు 43.94 శాతం వాటా ఉన్న విషయం విదితమే.నిజానికి విల్మర్‌కు 31 శాతం వాటా విక్రయానికి ఒప్పందం కుదిరినప్పటికీ ఆఫర్ ఫర్ సేల్కు లభించిన స్పందన ఆధారంగా మిగిలిన వాటా ను విక్రయించనుంది. మార్చి31లోగా మొత్తం వాటా విక్రయం పూర్తికానున్నట్లు అదానీ గ్రూప్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో అదానీ విల్మర్ షేరు బీఎస్ఈలో 10 శాతం పతనమై రూ. 292 దిగువన స్థిరపడింది. -
పెట్రోకెమికల్స్‌పై అదానీ దృష్టి
న్యూఢిల్లీ: విభిన్న వ్యాపారాలు కలిగిన అదానీ గ్రూప్ తాజాగా పెట్రోకెమికల్స్ విభాగంలోకి ప్రవేశించే సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం థాయ్‌లాండ్ సంస్థ ఇండోరమా రిసోర్సెస్‌తో ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించింది. ఇండోరమా రిసోర్సెస్‌తో కలిసి అదానీ పెట్రోకెమికల్స్ భాగస్వామ్య సంస్థ(జేవీ)ను ఏర్పాటు చేసినట్లు అదానీ ఎంటర్ప్రైజెస్ తాజాగా పేర్కొంది.పరస్పరం సమాన భాగస్వామ్యం(50:50 శాతం వాటా)తో వలోర్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్(వీపీఎల్) పేరుతో జేవీని ఏర్పాటు చేసినట్లు అదానీ గ్రూప్ వెల్లడించింది. జేవీ ద్వారా రిఫైనరీ, పెట్రోకెమికల్, కెమికల్ బిజినెస్‌లను ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేసింది. దశలవారీగా రిఫైనరీలు, పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌లు, స్పెషాలిటీ కెమికల్స్, హైడ్రోజన్ తదితర బిజినెస్‌ల కోసమే అదానీ పెట్రోకెమికల్స్‌ను నెలకొల్పినట్లు అదానీ ఎంటర్ప్రైజెస్ వివరించింది. 2022లోనే గుజరాత్లో పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌పై 4 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ వెల్లడించిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: చాట్‌జీపీటీకి ‘గ్రోక్’ స్ట్రోక్!అదానీ పెట్రోకెమికల్స్‌తో సంబంధం ఉన్న కొన్ని కీలక ఉత్పత్తులు కింది విధంగా ఉన్నాయి.పీవీసీ ప్లాంట్: అదానీ పెట్రోకెమికల్స్ గుజరాత్‌లోని ముంద్రాలో పాలివినైల్ క్లోరైడ్ (పీవీసీ) ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్లాంట్ సామర్థ్యం 2 మిలియన్ టన్నులు. మొదటి దశ 2026 నాటికి 1 మిలియన్ టన్నులు, రెండో దశ 2027 ప్రారంభం నాటికి మరో 1 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.ప్యూరిఫైడ్ టెరెఫ్తాలిక్ యాసిడ్ (పీటీఏ) ప్లాంట్: వలోర్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (వీపీఎల్) పేరుతో ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ మహారాష్ట్రలో 3.2 మిలియన్ టన్నుల సామర్థ్యం కలిగిన పీటీఏ ప్లాంట్‌ను అభివృద్ధి చేస్తోంది. -
విల్మర్ నుంచి అదానీ ఔట్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ(FMCG) దిగ్గజం అదానీ విల్మర్ నుంచి బిలియనీర్ గౌతమ్ అదానీ గ్రూప్ వైదొలగనుంది. ఈ భాగస్వామ్య కంపెనీ(JV)లో అదానీ గ్రూప్, సింగపూర్ సంస్థ విల్మర్ విడిగా 43.94 శాతం చొప్పున వాటా కలిగి ఉన్నాయి. అయితే దీనిలో 31.06 శాతం వాటాను విల్మర్‌కు విక్రయించనున్నట్లు అదానీ గ్రూప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ తాజాగా వెల్లడించింది.షేరుకి రూ.305 ధర మించకుండా విల్మర్(Wilmar)కు వాటాను అమ్మివేయనున్నట్లు పేర్కొంది. తద్వారా రూ.12,314 కోట్లు అందుకోనుంది. కంపెనీ ఫార్చూన్ బ్రాండ్‌తో వంట నూనెలుసహా పలు ఫుడ్ ప్రొడక్టులను విక్రయిస్తున్న విషయం విదితమే. మరో 13 శాతం వాటాను పబ్లిక్కు కనీస వాటా నిబంధనకు అనుగుణంగా ఓపెన్ మార్కెట్లో విక్రయించనున్నట్లు అదానీ(Adani) ఎంటర్ప్రైజెస్ తెలియజేసింది. వెరసి పూర్తి వాటాను 200 కోట్ల డాలర్లకు(సుమారు రూ.17,100 కోట్లు) విక్రయించనుంది. తద్వారా కంపెనీ నుంచి పూర్తిగా వైదొలగనుంది. లావాదేవీలు 2025 మార్చి31కల్లా పూర్తికావచ్చని అంచనా వేసింది. ఫలితంగా అదానీ నామినీ డైరెక్టర్లు జేవీ బోర్డు నుంచి తప్పుకోనున్నట్లు వెల్లడించింది.వృద్ధి అవకాశాలపైనే..అదానీ విల్మర్‌లో వాటా విక్రయం ద్వారా సమకూరే నిధులను వృద్ధి అవకాశాలపై వెచ్చించనున్నట్లు అదానీ ఎంటర్ప్రైజెస్(ఏఈఎల్) పేర్కొంది. ఎనర్జీ, యుటిలిటీ, ట్రాన్స్పోర్ట్, లాజిస్టిక్స్ తదితర కీలకమైన మౌలిక సదుపాయాల బిజినెస్ పురోభివృద్ధికి వినియోగించనున్నట్లు వివరించింది. తాజా లావాదేవీ ద్వారా అదానీ గ్రూప్ లిక్విడిటీ పరిస్థితి మెరుగుపడనుంది. కాగా.. ఏఈఎల్ నుంచి అదానీ విల్మర్‌లో గరిష్టంగా 31.06 శాతం వాటా కొనుగోలుకి విల్మర్ ఒప్పందం కుదుర్చుకుంది. అంతేకాకుండా పబ్లిక్కు కనీస వాటా నిబంధనమేరకు 13 శాతం వాటాను ఏఈఎల్ ఓపెన్ మార్కెట్లో విక్రయించనుంది. ఇందుకు రెండు కంపెనీలు చేతులు కలిపినట్లు ఒక ప్రకటనలో తెలియజేశాయి. ప్రస్తుతం అదానీ విల్మర్‌లో రెండు కంపెనీలకూ సంయుక్తంగా 87.87 శాతం వాటా ఉంది. అయితే క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిబంధనల ప్రకారం లిస్టింగ్ తదుపరి పబ్లిక్కు కనీసం 25 శాతం వాటాను ఆఫర్ చేయవలసి ఉంది.ఇదీ చదవండి: కొత్త ఏడాదిలో రైల్వేశాఖ కీలక నిర్ణయాలుకంపెనీ నేపథ్యం1999 జనవరిలో సమాన వాటాతో జేవీగా ఏర్పాటైన అదానీ విల్మర్.. ఫార్చూన్ బ్రాండుతో వంట నూనెలు, రైస్, ఆటాసహా వివిధ ఆహారోత్పత్తులను తయారు చేసి విక్రయిస్తోంది. 10 రాష్ట్రాలలో 23 ప్లాంట్లను నిర్వహిస్తోంది. ఐపీవో ద్వారా రూ. 3,600 కోట్లు సమీకరించింది. స్టాక్ ఎక్స్ఛేంజీల్లో 2022 ఫిబ్రవరిలో లిస్టయ్యింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన గతేడాది(2023–24) రూ.51,555 కోట్లకుపైగా ఆదాయాన్ని అందుకుంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ విలువ రూ.42,785 కోట్లుగా నమోదైంది. నవంబర్‌లో గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ గౌతమ్ అదానీ తదితరులపై యూఎస్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు అవినితి ఆరోపణలు చేశాక గ్రూప్ చేపట్టిన తొలి భారీ లావాదేవీ ఇది. గ్రూప్ ఈ ఆరోపణలను తోసిపుచ్చడంతోపాటు న్యాయపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధపడిన సంగతి తెలిసిందే. -
అదానీ గ్రూప్ చేతికి ఎయిర్ వర్క్స్
న్యూఢిల్లీ: ఏవియేషన్ మెయింటెనెన్స్, రిపేర్, ఓవరాల్ (ఎంఆర్వో) సర్విసుల దిగ్గజం ఎయిర్ వర్క్స్‌లో అదానీ గ్రూప్ 85.8 శాతం వాటాలు కొనుగోలు చేయనుంది. ఈ డీల్ కోసం సంస్థ విలువను రూ. 400 కోట్లుగా లెక్కించారు. ఇందుకు సంబంధించి అదానీ డిఫెన్స్ సిస్టమ్స్ అండ్ టెక్నాలజీస్ (ఏడీఎస్టీఎల్) షేర్ల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు అదానీ గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది. ఎయిర్ వర్క్స్ 35 నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 1,300 మంది పైగా సిబ్బంది ఉన్నారు. మెయింటెనెన్స్, ఇంటీరియర్ రీఫర్బిష్ మెంట్, పెయింటింగ్ మొదలైన సేవలు అందిస్తోంది. భారతీయ నేవీ, ఎయిర్‌ఫోర్స్‌కి కూడా సర్విసులు అందిస్తోంది. హోసూర్, ముంబై, కొచ్చిలో యూనిట్లు ఉన్నాయి. 20 పైగా దేశాల్లో సివిల్ ఏవియేషన్ నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు ఉన్నాయి. డిఫెన్స్ ఎంఆర్వో విభాగంలో అదానీ గ్రూప్ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి ఈ కొనుగోలు తోడ్పడుతుందని అదానీ ఎయిర్‌పోర్ట్స్ డైరెక్టర్ జీత్ అదానీ తెలిపారు. భారత ఏవియేషన్ పరిశ్రమ ప్రస్తుతం అంతర్జాతీయంగా మూడో స్థానంలో ఉందని, రాబోయే రోజుల్లో 1,500 ఎయిర్‌క్రాఫ్ట్‌లను సమకూర్చుకుంటోందని వివరించారు. భారత ఎంఆర్వో సామర్థ్యాలను పటిష్టం చేయాలన్న తమ లక్ష్య సాధన దిశగా ఈ కొనుగోలు కీలక మైలురాయిగా ఉండగలదని అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సీఈవో ఆశీష్ రాజవంశి తెలిపారు. -
అంబుజా సిమెంట్స్‌లో ఆ రెండు సంస్థల విలీనం
న్యూఢిల్లీ: అనుబంధ సంస్థలు సంఘీ ఇండస్ట్రీస్ (ఎస్ఐఎల్), పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్‌ను విలీనం చేసుకోనున్నట్లు అంబుజా సిమెంట్స్ వెల్లడించింది. వచ్చే 9–12 నెలల వ్యవధిలో ఈ లావాదేవీ పూర్తి కాగలదని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది.సంస్థ స్వరూపాన్ని క్రమబద్ధీకరించుకునేందుకు, గవర్నెన్స్‌ను మెరుగుపర్చుకునేందుకు ఈ కన్సాలిడేషన్ ఉపయోగపడగలదని ఒక ప్రకటనలో వివరించింది. అదానీ గ్రూప్‌లో అంబుజా సిమెంట్స్ భాగంగా ఉంది. 2023లో కొనుగోలు చేసిన సంఘీ ఇండస్ట్రీస్‌లో కంపెనీకి 58.08 శాతం వాటాలు ఉన్నాయి. అలాగే 2024 ఆగస్టులో ఆంధ్రప్రదేశ్ సంస్థ పెన్నా సిమెంట్‌ను కొనుగోలు చేసింది.విలీన స్కీము ప్రకారం ప్రతి 100 ఎస్ఐఎల్ షేర్లకు గాను అంబుజా సిమెంట్స్ 12 షేర్లను జారీ చేస్తుంది. అలాగే, పెన్నా సిమెంట్స్ ఈక్విటీ షేర్హోల్డర్లకు ఒక్కో షేరుపై రూ. 321.50 లభిస్తుంది. ఎస్ఐఎల్, పెన్నా సిమెంట్స్ షేర్ల ముఖ విలువ రూ. 10గా ఉండగా, అంబుజా సిమెంట్స్ షేరు ముఖవిలువ రూ. 2గా ఉంది. -
గ్రీన్ హైడ్రోజన్.. గేమ్ చేంజర్!
హైడ్రోజన్ కార్లు.. బస్సులు.. రైళ్లు.. నౌకలు.. పరిశ్రమలు... ఇలా ప్రపంచమంతా ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ నామ జపం చేస్తోంది! పునరుత్పాదక ఇంధన రంగంలో గేమ్ చేంజర్‌గా అభివరి్ణస్తున్న గ్రీన్ హైడ్రోజన్ కోసం భారత్ కూడా వేట మొదలుపెట్టింది. దేశీ కార్పొరేట్ దిగ్గజాలైన రిలయన్స్, అదానీ గ్రూపులతో పాటు అవాడా, హైజెన్కో గ్రీన్ ఎనర్జీస్, థెర్మాక్స్ వంటి సంస్థలు ఈ రంగంలో ఇప్పటికే భారీ ప్రణాళికలతో చకచకా ముందుకు సాగుతున్నాయి. ముఖ్యంగా ఈ నయా ఇంధనాన్ని వినియోగదారులకు చౌకగా అందించేందుకు ఉత్పాదక వ్యయాన్ని రెండింతలకు పైగా తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ప్రస్తుతం దేశంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పాదక వ్యయం ఒక్కో కేజీకి 4–5 డాలర్లు (దాదాపు రూ.340–430)గా ఉంటోంది. అదే గ్రే హైడ్రోజన్ ఉత్పత్తి ఖర్చు 1–2 డాలర్లు (రూ.85–170) మాత్రమే. గ్రే హైడ్రోజన్ ఉత్పత్తి కాలుష్యకరమైనది కావడంతో ప్రపంచవ్యాప్తంగా దీనిపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో కంపెనీలు గ్రీన్ హైడ్రోజన్ ఉత్పాదక వ్యయాన్ని గణనీయంగా తగ్గించడంపై దృష్టిపెట్టాయి. సరికొత్త టెక్నాలజీలతో పాటు వినూత్న ఉత్పత్తులు, ఇతరత్రా మార్గాలను ఎంచుకుంటున్నాయి. 2030 నాటికి భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్దేశించుకున్న 50 లక్షల వార్షిక టన్నుల ఉత్పత్తి లక్ష్యం సాకారం కావాలంటే, ఉత్పాదక వ్యయాన్ని తగ్గించడం చాలా కీలకమని నిపుణులు పేర్కొంటున్నారు. టెక్నాలజీ దన్ను... గ్రీన్ హైడ్రోజన్ ఉత్పాదనలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో పాటు అధునాతన ఎనలిటిక్స్‌ను అవాడా గ్రూప్ ఉపయోగిస్తోంది. ‘అత్యాధునిక ఎలక్ట్రోలైజర్ టెక్నాలజీ వల్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యం మెరుగుపడి, హైడ్రోజన్ ఉత్పత్తికి తక్కువ విద్యుత్ అవసరమవుతుంది. దీంతో వ్యయం భారీగా దిగొస్తోంది’ అని కంపెనీ చైర్మన్ వినీత్ మిట్టల్ పేర్కొన్నారు. హైజెన్కో సంస్థ అయితే, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), ఏఐతో పాటు మెషీన్ లెరి్నంగ్‌ను ఉపయోగించి గ్రీన్ హైడ్రోజన్, అమోనియా ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకుంటోంది. కంపెనీ ఒడిశాలోని గోపాల్‌పూర్‌లో 1.1 మిలియన్ టన్నుల సామర్థ్యంతో గ్రీన్ అమోనియా ప్రాజెక్టును నెలకొల్పే ప్రణాళికల్లో ఉంది. వెల్స్పన్ న్యూ ఎనర్జీ కూడా గ్రీన్ హైడ్రోజన్‌ను చౌకగా అందించేందుకు సౌర, పవన విద్యుత్‌తో పాటు బ్యాటరీల్లో స్టోర్ చేసిన విద్యుత్‌ను కూడా ఉపయోగిస్తోంది. అంతేకాకుండా పెద్దయెత్తున జల విద్యుత్‌ను కూడా వినియోగించే సన్నాహాల్లో ఉన్నట్లు కంపెనీ సీఈఓ కపిల్ మహేశ్వరి పేర్కొన్నారు. ఇక గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అవసరమైన మాడ్యూల్స్ తయారీ, విక్రయం, సరీ్వస్ కోసం థర్మాక్స్ బ్రిటన్‌కు చెందిన సెరెస్తో ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా దాని ఆక్సైడ్ ఎల్రక్టాలిసిస్ టెక్నాలజీని ఉపయోగించుకోనుంది. తక్కువ ఉష్ణోగ్రతతో కూడిన ఎలక్ట్రాలిసిస్ సాంకేతికతతో పోలిస్తే ఇది 25% మెరుగైనదని సంస్థ సీఈఓ ఆశిష్ భండారీ వెల్లడించారు.అంబానీ, అదానీ గిగా ఫ్యాక్టరీలుదేశంలో గ్రీన్ హైడ్రోజన్ సమగ్ర వ్యవస్థ (ఎకో సిస్టమ్) నెలకొల్పేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) 10 బిలియన్ డాలర్లను వెచి్చంచనుంది. 2030 నాటికి కేజీ గ్రీన్ హైడ్రోజన్‌ను ఒక డాలరుకే ఉత్పత్తి చేయాలనేది కంపెనీ లక్ష్యం. 2026 కల్లా తొలి ఎలక్ట్రోలైజర్ గిగా ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్ఐఎల్ చైర్మన్ ముకేశ్ అంబానీ తాజా ఏజీఎంలో ప్రకటించారు కూడా. ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరిచి, కొత్త తరం ఎలక్ట్రోలైజర్ల కోసం పెట్టుబడి వ్యయాలను తగ్గించుకోవడానికి అధునాతన ఎల్రక్టాలిసిస్ ఆధారిత టెక్నాలజీలను కూడా కంపెనీ అభివృద్ధి చేస్తోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో దిగ్గజ సంస్థల్లో ఒకటిగా అదానీ న్యూ ఇండస్ట్రీస్‌ను తీర్చిదిద్దే సన్నాహాల్లో అదానీ గ్రూప్ నిమగ్నమైంది. 2030 నాటికి 10 లక్షల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి తోడ్పడేలా సమగ్ర ఎకో సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తోంది. తదుపరి పదేళ్లలో ఈ సామర్థ్యాన్ని 30 లక్షల టన్నులకు పెంచాలనేది అదానీ లక్ష్యం. ఈ వ్యవస్థలో గ్రీన్ అమోనియా, గ్రీన్ మిథనాల్, పర్యావరణానుకూల విమాన ఇంధనం వంటి పలు ఉత్పత్తులు ఉంటాయి. గ్రీన్ హైడ్రోజన్: ప్రకృతిలో అపారంగా దొరికే నీటిని పునరుత్పాదక ఇంధనాలైన సౌర, పవన, జల విద్యుత్‌ను ఉపయోగించి హైడ్రోజన్, ఆక్సిజన్‌గా విడగొడతారు. ఎలక్ట్రోలైజర్లో జరిపే ఈ ప్రక్రియను ఎల్రక్టాలిసిస్గా పేర్కొంటారు. ఉత్పత్తిలోనూ, వినియోగంలోనూ 100 శాతం పర్యావరణానుకూలమైనది కావడంతో దీనికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. దీన్ని నిల్వ చేయడం చాలా సులభం. అంతేకాకుండా, వాహనాల నుండి పరిశ్రమల వరకు అనేక అవసరాల కోసం వాడుకోవచ్చు. గ్రే హైడ్రోజన్: హైడ్రోజన్ ఉత్పత్తిలో ఇది అత్యంత సాధారణ ప్రక్రియ. స్టీమ్ మీథేన్ రిఫారి్మంగ్ (ఎస్ఎంఆర్) అనే ప్రక్రియలో సహజవాయువును ఉపయోగిస్తారు. తయారీలో గణనీయంగా కార్బన ఉద్గారాలను విడుదల చేయడం వల్ల దీనిపై వ్యతిరేకత నెలకొంది. వినియోగంలో మాత్రం 100% పర్యావరణ హితమైనదే. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఈనాడు, ఆంధ్రజ్యోతికి ఢిల్లీ హైకోర్టు సమన్లు
ఢిల్లీ, సాక్షి: తెలుగు మీడియా సంస్థలైన ఈనాడు, ఆంధ్రజ్యోతికి ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది. అదానీ గ్రూప్ వ్యవహారంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వ్యతిరేకంగా ఈ రెండు మీడియా సంస్థలు అడ్డగోలుగా కథనాలు రాశాయి. అయితే అవి నిరాధారమైన కథనాలుగా పేర్కొంటూ.. పరువు నష్టం దావా వేశారు వైఎస్ జగన్. అదానీ గ్రూప్ కేసుకు సంబంధించి అమెరికాలో దాఖలు చేసిన అభియోగ పత్రంలో తన పేరు లేకున్నా, ఉన్నట్లుగా కట్టు కథలు రాశారని వైఎస్ జగన్ మొదటి నుంచి చెబుతున్నారు. ఈ మేరకు భేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే రూ. 100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు కూడా. అయితే జగన్ ఇచ్చిన గడువు ముగిసినా.. ఆ రెండు మీడియా సంస్థల నుంచి స్పందన లేదు. దీంతో చెప్పినట్లుగానే లీగల్ నోటీసులు పంపించారు. ఇక తనకు వ్యతిరేకంగా రాసిన కథనాలను తొలగించాలని ఢిల్లీ హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు వైఎస్ జగన్. ఈ పిటిషన్‌ను సోమవారం విచారించిన ఢిల్లీ హైకోర్టు.. ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు సమన్లు జారీ చేసింది. అయితే సమన్ల తర్వాత పిటిషనర్‌పై ప్రచురించే కథనాలపై పరిణామలు తుడి తీర్పునకు లోబడి ఉంటాయని హైకోర్టు స్పష్టం చేస్తూ.. విచారణను ఢిల్లీ హైకోర్టు ఈనెల 16వ తేదీకి వాయిదా వేసింది.కాగా, రాష్ట్ర చరిత్రలో అత్యంత చౌకగా యూనిట్ రూ.2.49 చొప్పున కేంద్రంతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంటే.. టీడీపీ తోక పత్రికల్లా ఈనాడు, ఆంధ్రజ్యోతిలు అసత్య కథనాలు ప్రచురించాయని వైఎస్ జగన్ మండిపడ్డారు. ఈ క్రమంలో ఆయన తరఫు న్యాయవాదులు ఇటీవల లీగల్ నోటీసులు జారీ చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందం అని, థర్డ్ పార్టీకి ఎలాంటి పాత్ర లేదని ఆది నుంచి తమ క్లయింట్ స్పష్టం చేస్తున్నారని పేర్కొన్నారు. సెకీ ఐఎస్టీఎస్ (అంతర్రాష్ట్ర సరఫరా) చార్జీలు మినహాయింపు ఇచ్చిందని.. ఆ మేరకు ఒప్పంద పత్రాలు, సెకీ రాసిన లేఖ ప్రతులను చూపిస్తున్నా సరే ఆ పత్రికలు పట్టించుకోకుండా నిరాధారంగా తమ క్లయింట్ గౌరవ ప్రతిష్టలను దెబ్బ తీస్తూ, ఉద్దేశ పూర్వకంగా తప్పుడు కథనాలు ప్రచురించాయని చెప్పారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంల మధ్య అత్యంత పారదర్శకంగా జరిగిన ఈ ఒప్పందంపై తప్పుడు కథనాలు ప్రచురించినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, దానిని ప్రముఖంగా మొదటి పేజీలో ప్రచురించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయినా స్పందన లేకపోవడంతో పరువు నష్టం దావాకు వెళ్లారు. -
అదానీ గ్రూప్ ఆర్థిక పరిస్థితి గుడ్
న్యూఢిల్లీ: ప్రస్తుతం అదానీ గ్రూప్ ఆర్థిక పరిస్థితి యూఎస్ షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ ఆరోపణల సమయంతో పోలిస్తే మెరుగ్గా ఉన్నట్లు బెర్న్‌స్టీన్ పేర్కొంది. ప్రమోటర్ల షేర్ల తనఖా తగ్గడంతోపాటు.. లెవరేజ్ కనిష్టస్థాయికి చేరినట్లు యూఎస్ రీసెర్చ్ సంస్థ తెలియజేసింది. గత రెండేళ్ల కాలంలో గ్రూప్ లెవరేజ్, షేర్ల తనఖా, రుణ చెల్లింపులు, బిజినెస్ విలువలు తదితరాల విశ్లేషణతో నివేదికను విడుదల చేసింది. కాగా.. 2023 జనవరిలో అదానీ ఖాతాలలో ఆర్థిక అవకతవకలు జరిగినట్లు హిండెన్‌బర్గ్ ఆరోపించిన కారణంగా గ్రూప్ కంపెనీలోని పలు షేర్లు అమ్మకాలతో దెబ్బతిన్నాయి. తదుపరి అదానీ గ్రూప్ వీటిని ఆధార రహితాలుగా కొట్టిపారేసింది. దీంతో తిరిగి గ్రూప్ కంపెనీలు బలపడటంతోపాటు నిధులను సైతం సమీకరించగలిగాయి.ఈ నేపథ్యంలో గతంతో పోలిస్తే రిసు్కలు తగ్గినట్లు బెర్న్‌స్టీన్ అభిప్రాయపడింది. కాగా.. గత నెల 21న యూఎస్ అధికారికవర్గాలు గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, సంబంధిత ఉన్నతాఅధికారులపై లంచాల ఆరోపణలు చేసింది. వీటిని సైతం అదానీ గ్రూప్ తోసిపుచి్చంది. -
రెండో రోజూ మార్కెట్ జోరు
ముంబై: ఈ ఏడాది జూలై–సెప్టెంబర్(క్యూ2)లో జీడీపీ వృద్ధి 5.4 శాతానికి మందగించినప్పటికీ దేశీ స్టాక్ మార్కెట్లు జోరు చూపాయి. గత 7 త్రైమాసికాలలోనే ఆర్థిక వ్యవస్థ కనిష్ట వృద్ధికి పరిమితమైనప్పటికీ ఇన్వెస్టర్లు పెట్టుబడులకే ప్రాధాన్యత ఇవ్వడంతో వరుసగా రెండో రోజు లాభాలతో నిలిచాయి. ఆర్థిక వృద్ధి మందగించిన కారణంగా స్వల్ప వెనకడుగుతో ప్రారంభమైన మార్కెట్లు వెనువెంటనే కోలుకున్నాయి. మిడ్‌సెషన్ నుంచీ కొనుగోళ్లు పెరగడంతో జోరందుకున్నాయి. వెరసి సెన్సెక్స్ 445 పాయింట్లు లాభపడింది. 80,248 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 145 పాయింట్లు బలపడి 24,276 వద్ద నిలిచింది. రియల్టీ జూమ్..: ఎన్ఎస్ఈలో రియల్టీ అత్యధికంగా 3 శాతం ఎగసింది. కన్జూమర్ డ్యూరబుల్స్, హెల్త్‌కేర్, ఆటో రంగాలు 2–1 శాతం మధ్య పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో అ్రల్టాటెక్, అపోలో, గ్రాసిమ్, శ్రీరామ్ ఫైనాన్స్, జేఎస్‌డబ్ల్యూ, అదానీ పోర్ట్స్, ఎంఅండ్ఎం, టెక్ఎం, టైటన్, డాక్టర్ రెడ్డీస్, ఆర్ఐఎల్, సన్, మారుతీ, హెచ్‌సీఎల్‌టెక్, కోల్ ఇండియా 4–1.3 శాతం మధ్య బలపడ్డాయి.అయితే హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎన్టీపీసీ, సిప్లా, ఎస్బీఐ లైఫ్, హెచ్‌యూఎల్, బ్రిటానియా, కొటక్ బ్యాంక్, ఇండస్ఇండ్ 2.7–0.5 శాతం మధ్య డీలాపడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1 శాతం చొప్పున పుంజుకున్నాయి. మధ్య, చిన్నతరహా షేర్లలో 463 కౌంటర్లు అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. ఈ జాబితాలో రామ్‌కో సిస్టమ్స్, గోల్డియామ్ ఇంటర్నేషనల్, అతుల్ ఆటో, కొచిన్ షిప్‌యార్డ్ తదితర కంపెనీలు ఉన్నాయి.అదానీ గ్రూప్ నేలచూపు:మార్కెట్లు లాభపడినప్పటికీ అదానీ గ్రూప్‌లోని ఆరు కౌంటర్లలో అమ్మకాలు తలెత్తాయి. అదానీ టోటల్ గ్యాస్ 5 శాతం, ఎనర్జీ సొల్యూషన్స్ 4 శాతం చొప్పున పతనమయ్యాయి. ఇతర షేర్లలో ఎన్డీటీవీ, అదానీ విల్మర్, అదానీ పవర్, అదానీ ఎంటర్ప్రైజెస్ 1–0.5 శాతం మధ్య నీరసించాయి. -
ప్రతి దాడీ బలోపేతం చేస్తుంది
జైపూర్: అదానీ గ్రూప్‌పై ఇటీవల అమెరికాలో దాఖలైన అభియోగాలపై సంస్థ చైర్మన్ గౌతమ్ అదానీ తొలిసారి బహిరంగంగా స్పందించారు. చట్టాలు, నిబంధనల అమలుకు తమ గ్రూప్ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఇలాంటి ప్రతి దాడీ తమను మరింత బలోపేతమే చేస్తుందన్నారు. ఆయన శనివారం ఇక్కడ 51వ జెమ్స్, జువెల్లరీ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘‘నిబంధనల అమలుకు సంబంధించి ఇటీవలే అమెరికా నుంచి కొన్ని ఆరోపణలు ఎదుర్కొన్నాం. ఇలాంటి సవాళ్లను ఎదుర్కోవడం మాకిది మొదటిసారేమీ కాదు. ప్రతి దాడీ మమ్మల్ని మరింత బలోపేతమే చేస్తుంది’’ అని పేర్కొన్నారు. ‘‘ఈ అంశానికి సంబంధించి మీడియాలో మాపై పుంఖానుపుంఖాలుగా వివక్ష, విద్వేషపూరిత కథనాలు వచ్చాయి. ఇంతా చేస్తే మా సంస్థకు సంబంధించిన వారెవరిపైనా అమెరికాలో ఎఫ్‌సీపీఏ చట్టాలను ఉల్లంఘించినట్టు గానీ, న్యాయ ప్రక్రియను అడ్డుకోజూసినట్టు గానీ ఒక్క అభియోగమూ నమోదు కాలేదు’’ అని అదానీ గుర్తు చేశారు. నియంత్రణ సంస్థల నియమ నిబంధనలన్నింటికీ కట్టుబడి ఉండటంలో తమ సంస్థ ప్రపంచ స్థాయి ప్రమాణాలు పాటిస్తుందన్నారు. ‘‘నేటి సమాజంలో వాస్తవాల కంటే పుకార్లే వేగంగా వ్యాపిస్తాయి. ఇన్నేళ్లలో అదానీ గ్రూప్ పెను సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎన్నో రంగాల్లో మార్గదర్శకంగా నిలిచినందుకు మేం చెల్లించిన మూల్యమది. ఆ సవాళ్లే మమ్మల్ని తీర్చిదిద్దాయి. వాటన్నింటినీ ఎప్పటికప్పుడు అధిగమిస్తూనే వస్తున్నాం. సవాళ్లను తట్టుకుని నిలుస్తూ కొత్త దారి వెదుక్కుంటూ ధైర్యంగా సాగడమే మాకు తెలుసు’’ అని అదానీ చెప్పుకొచ్చారు. హిండెన్‌బర్గ్‌పై చట్టపరంగా చర్యలు తమ గ్రూప్‌పై గతేడాది హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలను కూడా అదానీ తోసిపుచ్చారు. ఆ సంస్థపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పునరుద్ఘాటించారు. ‘‘మాపై హిండెన్‌బర్గ్ చేసింది ఆరోపణలు నిజానికి మా ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బ తీయడంతో పాటు సంస్థను రాజకీయ వివాదంలోకి కూడా లాగేందుకు చేసిన భారీ కుట్ర. ఆ ఆరోపణలను ఒక వర్గం మీడియా తమ స్వార్థ ప్రయోజనాల కోసం విపరీతంగా ప్రచారం చేసింది. అంతటి సంక్షోభంలో కూడా మేం విలువలతో ఎక్కడా రాజీ పడలేదు. అదే ఏడాది సంస్థను ఆర్థికంగా సమున్నత శిఖరాలకు చేర్చి తలెత్తుకు నిలిచాం. మేం ఎలాంటి అవకతవకలకూ పాల్పడలేదని చివరికి సుప్రీంకోర్టే తేల్చింది’’ అని చెప్పారు. -
ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు వైఎస్ జగన్ లీగల్ నోటీసులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలో అత్యంత చౌకగా యూనిట్ రూ.2.49 చొప్పున కేంద్రంతో విద్యుత్ కొనుగోలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై నిరాధార ఆరోపణలతో దుష్ప్రచారం చేస్తూ కథనాలు ప్రచురించిన ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తరఫు న్యాయవాదులు శనివారం లీగల్ నోటీసులు జారీ చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందం అని, థర్డ్ పార్టీకి ఎలాంటి పాత్ర లేదని ఆది నుంచి తమ క్లయింట్ స్పష్టం చేస్తున్నారని పేర్కొన్నారు. సెకీ ఐఎస్టీఎస్ (అంతర్రాష్ట్ర సరఫరా) చార్జీలు మినహాయింపు ఇచ్చిందని.. ఆ మేరకు ఒప్పంద పత్రాలు, సెకీ రాసిన లేఖ ప్రతులను చూపిస్తున్నా సరే ఆ పత్రికలు పట్టించుకోకుండా నిరాధారంగా తమ క్లయింట్ గౌరవ ప్రతిష్టలను దెబ్బ తీస్తూ, ఉద్దేశ పూర్వకంగా తప్పుడు కథనాలు ప్రచురించాయని చెప్పారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంల మధ్య అత్యంత పారదర్శకంగా జరిగిన ఈ ఒప్పందంపై తప్పుడు కథనాలు ప్రచురించినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, దానిని ప్రముఖంగా మొదటి పేజీలో ప్రచురించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కథనాల వల్ల తమ క్లయింటు ప్రతిష్ట దెబ్బ తింటుందని ముందే తెలిసి, అందుకు అనుగుణంగా తప్పుడు ఆరోపణలతో కథనాలు ప్రచురించారని తెలిపారు. ఈ మేరకు ఉషోదయ ఎంటర్ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ పబ్లిషర్‌తో పాటు ఈనాడు ఎడిటర్ ఎం.నాగేశ్వరరావుకు, ఆమోద పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పబ్లిషర్‌తో పాటు ఆంధ్రజ్యోతి ఎడిటర్ ఎన్.రాహుల్ కుమార్‌లకు వైఎస్ జగన్ తరఫు న్యాయవాదులు లీగల్ నోటీసు పంపారు.ఇదీ చదవండి: సెకితో ఒప్పందం.. ఏం జరిగిందో పూసగుచ్చినట్లు చెప్పిన వైఎస్ జగన్ -
టీడీపీ తీరుతో మోదీకి మకిలి!
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై టీడీపీ అధినేత, ప్రస్తుత సీఎం చంద్రబాబుతోపాటు ఎల్లోమీడియా మొత్తానికి అక్కసు ఉందన్నది జగమెరిగిన సత్యం. అయితే ఈ అక్కసు, ద్వేషాల్లో వారు ప్రధాని మోదీని భ్రష్టుపట్టించేందుకూ వెనుకాడటం లేదు. ఎలాగంటారా? అదానీపై అమెరికా కోర్టు పెట్టిన ముడుపుల కేసే ఉదాహరణ. ఒకపక్క చంద్రబాబేమో ఈ కేసులు ఆంధ్రప్రదేశ్‌కు అప్రతిష్ట తీసకొచ్చాయని వ్యాఖ్యానిస్తే.. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో మోదీని నిందిస్తోంది. ఎన్డీయే కూటమిలో భాగస్వామి అయిన టీడీపీ కూడా కాంగ్రెస్ మాటలకు వత్తాసు పలుకుతున్నట్లుగా జగన్‌పై ఆరోపణలు గుప్పించడం మోదీని భ్రష్టుపట్టించడమే అవుతుంది. అదానీపై వచ్చిన ఆరోపణలలో నిజమని నమ్మితే చంద్రబాబు కూడా మోదీని నేరుగా తప్పు పట్టాలి కదా! ఎన్డీయే నుంచి బయటకు వస్తున్నట్లు చెప్పాలి కదా! అలా కాకుండా జగన్‌పై విమర్శలు చేస్తూ మోదీకి చికాకు కలిగించారు. ఈ విషయం కేంద్రంలోని బీజేపీ పెద్దలకు అర్థమవుతోందో లేదో!ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి జగన్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి చెందిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో (సెకి) చేసుకున్న ఒప్పందానికి సంబంధించి అవినీతి జరిగిందన్నది టీడీపీ, ఎల్లో మీడియా ఆరోపణ. తన సోలార్ పవర్‌కు ఆర్డర్లు పొందడానికి అదానీ ఆయా రాష్ట్రాలలో లంచాలు ఇచ్చారని అమెరికా పోలీసులు పెట్టిన అభియోగాల ఆధారంగా వీరు ఈ ఆరోపణలు చేస్తున్నారు. అమెరికా పోలీసులు దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపినట్లు కనిపించలేదు.ప్రముఖ న్యాయ కోవిదులు ముకుల్ రోహ్తగి, మహేష్ జెఠ్మలానీలు ఇదే వ్యాఖ్య చేశారు. అదే టైమ్ లో ఐదు రాష్ట్రాలు సెకీతో ఒప్పందం కుదుర్చుకుని విద్యుత్ తీసుకోవడానికి సిద్ధపడితే, ఆ రాష్ట్రాలలో కూడా ముడుపులు ఇచ్చారని అంటూనే అమెరికా పోలీసులు ఒక్క ఏపీ పేరునే ప్రస్తావించడం అనుమానాస్పదంగా ఉంది. ఈ రాష్ట్రాలు అసలు అదానీతో ఒప్పందమే చేసుకోలేదు. ఏపీకి సంబంధించిన జగన్ ప్రత్యర్థులు ఎవరైనా అమెరికా పోలీసులను కూడా ప్రభావితం చేశారా అన్న సందేహం వస్తుంది. అదానీ ప్రధాని మోదీకి సన్నిహితుడు కావడంంతో అంతర్జాతీయ సంస్థలు ఏమైనా దేశాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి ఇలాంటి కుట్రలు చేశాయా? అన్న డౌటు కొందరు వ్యక్తం చేస్తున్నారు.జగన్‌పై విమర్శలు చేస్తే అవి మోదీకి, అదానీకి తగులుతాయన్న సంగతి చంద్రబాబు నాయుడు తెలియదా! సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఏమైనా ప్రైవేటు సంస్థా? కాదు కదా! కేంద్రానిది. వారు దానీ కంపెనీ నుంచో, మరో కంపెనీ నుంచో పవర్ కొని ఆయా రాష్ట్రాలకు సరఫరా చేస్తే వీరికి వచ్చిన కష్టం ఏమిటి? రాష్ట్రానికి విద్యుత్ యూనిట్ రూ.2.49లకే రావడం మేలా? కాదా? అన్నది చెప్పకుండా జగన్ పై బురద వేయడం వల్ల అది ఆయనపైనే పడుతుందా? ఆటోమాటిక్ గా అదానీతోపాటు, మోదీపై కూడా పడుతుంది కదా! చంద్రబాబు ఉద్దేశం అదే అయినా, లేదా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లోమీడియా భావన అదే అయినా, ధైర్యంగా నేరుగానే ఆ మాట చెప్పి ఉండవచ్చు. జగన్‌తోపాటు వారిద్దరిపై కూడా ధ్వజమెత్తి ఉండవచ్చు.అలా ఎందుకు చేయడం లేదు? ఈ నేపథ్యంలో జగన్ ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు క్షమాపణ డిమాండ్‌తో రూ.వంద కోట్ల పరువు నష్టం పరిహారం కోరుతూ నోటీసు పంపించారు. అయినా ఈ మీడియా అడ్డగోలు కథనాలు ఆపకపోవడం గమనార్హం. ప్రస్తుతం థేపీలో పెరుగుతున్న విద్యుత్ ఛార్జీల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఇవి ఈ యాగీ చేస్తున్నాయి. తన ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం వల్ల ఏడాదికి రూ.నాలుగు వేల కోట్ల చొప్పున పాతికేళ్లకు ఏపీకి రూ.లక్ష కోట్లు ఆదా అయిందని, అదంతా సంపదేనని జగన్ అన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం రూ.ఐదు నుంచి రూ.ఆరులకు సౌర, పవన విద్యుత్తును కొనుగోలు చేస్తామని ఒప్పందాలు చేసుకోవడం వల్ల ఏపీకి రూ.85 వేల కోట్ల భారం పడిందని జగన్ చెప్పారు.ఈ విషయాలకు ఈనాడు నేరుగా సమాధానం ఇవ్వకుండా చంద్రబాబు టైమ్ లో చేసిన ఒప్పందాలను ఈ ఒప్పందంతో పోల్చరాదనే పిచ్చి వాదన చేసింది. ఇందులోనే వారి డొల్లతనం బయటపడింది. అంత అధిక ధరలకు చంద్రబాబు ప్రభుత్వం పాతికేళ్లకు ఒప్పందాలు చేసుకోవాల్సిన అవసరం ఏమిటి? భవిష్యత్తులో ధరలు తగ్గుతాయని ఈనాడు రామోజీరావుకు తెలుసు కదా! అయినా అప్పట్లో ఈనాడు ఎందుకు ఆ ఒప్పందాలను వ్యతిరేకించలేదు.రూ.2.49లకే యూనిట్ విద్యుత్ కొంటేనే రూ.1750 కోట్ల లంచం ఇచ్చే అవకాశం ఉంటే అంతకు రెట్టింపు ధరకు పాతికేళ్లపాటు చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకుని ఉంటే ఇంకెంత ముడుపులకు అవకాశం ఉండి ఉండాలి? పైగా జగన్ ప్రభుత్వం ఆ పీపీఏలను రద్దు చేయాలని తలపెడితే అప్పుడు ఇదే ఎల్లో మీడియా, చంద్రబాబు రద్దు చేయరాదని, పెట్టుబడులు రావంటూ ఎందుకు వాదించారు? దీంట్లో వారి ఇంటరెస్టు ఏమిటి? వారు ప్రచారం చేసినదాని ప్రకారం సెకీతో జగన్ ప్రభుత్వం ఒప్పందం వల్ల లక్ష కోట్ల భారం పడాలి.అది నిజమే అనుకుంటే అది ఎవరు చేస్తున్నట్లు. కేంద్ర ప్రభుత్వమే కదా! అంటే మోదీ ప్రభుత్వ చర్య వల్ల ఏపీకి లక్ష కోట్ల నష్టం వస్తోందని ఎందుకు రాయలేదు! సెకీ అంతర్రాష్ట్ర విద్యుత్ పంపిణీ ఛార్జీలను రద్దు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖ గురించి ఎందుకు ఈనాడు మీడియా సమాధానం ఇవ్వలేకపోయింది. అది నిజమా? కాదా? దానివల్ల ఎన్నడూ లేని విధంగా అతి తక్కువ ధరకు కేంద్రం ఏపీకి విద్యుత్ సరఫరా చేయడానికి ముందుకు వచ్చిందన్న వాస్తవాన్ని ఎందుకు కప్పిపుచ్చారు. అలాగే గుజరాత్లో రూ.1.99లకే యూనిట్ విద్యుత్ వస్తోందని ఈనాడు ప్రచారం చేసింది.ఇక్కడ మాత్రం అతి తెలివిగా అక్కడ నుంచి ఏపీకి తరలించడానికి అయ్యే వీలింగ్ ఛార్జీల ఖర్చు మరో రెండు రూపాయల గురించి మాత్రం కప్పిపుచ్చింది. ఇది వీళ్ల దిక్కుమాలిన జర్నలిజం. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారనో, లేక తానే కనిపెట్టినట్లో ఏడు గంటలలోనే సెకీతో ఒప్పందం చేసుకున్నారని ఈనాడు పచ్చి అబద్దం ప్రచారం చేసినట్లు జగన్ డాక్యుమెంట్ల సహితంగా వివరిస్తే, దాని మీద తేలుకట్టిన దొంగ మాదిరి వ్యవహరించింది. తమిళనాడు, ఒడిషా, చత్తీస్గడ్, జమ్ము-కశ్మీర్ రాష్ట్రాలు సెకి నుంచి రూ.2.61లకు కొనుగోలు చేస్తే, దానిని ఎందుకు ఈ మీడియా చెప్పడం లేదు! పోనీ సెకితో కాకుండా అదానితో జగన్ ప్రభుత్వం నేరుగా ఒప్పందం చేసుకుందని చంద్రబాబు కాని, ఎల్లో మీడియా కాని ఆధారాలతో చూపించాయా? తాజాగా వచ్చిన ఒక సమాచారం ప్రకారం సెకీతో ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే కేంద్రం నుంచి వచ్చే రూ.2800 కోట్ల ప్రోత్సహానికి గండి పడుతుందట. ఈ విషయాన్ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి చెప్పారని ఒక ఆంగ్ల పత్రిక కథనాన్ని ఇచ్చింది. అంటే ఈ ఒప్పందం మంచిది అనే కదా!తమ చేతిలో మీడియా ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు రాసేసి బురద చల్లితే సరిపోతుందని అనుకుంటే సరిపోదు. వీరు జగన్ మీద బురద చల్లామని అనుకుంటున్నారు కాని, అది పడుతోంది మోదీపైన.ఎల్లో మీడియా కాని, టీడీపీ నేతలు పార్టీ ఆపీస్లో కూర్చుని ఎలాంటి వికృత ప్రచారం చేశారు! అమెరికా కేసులో జగన్ పేరు ఉన్నట్లు, ఆ పోలీసులు ఇండియాకు వచ్చి అరెస్టు చేసేస్తున్నట్లు, చివరికి అక్కడ జైలు కూడా రెడీ చేసినట్లు ఎంత దుర్మార్గంగా ప్రచారం చేశారు. ఇలా చేసినందుకు వారు సిగ్గు పడడం లేదు.అందులో ఏమాత్రం నిజం ఉన్నా అదానీ ముందుగా జైలుకు వెళతారని కదా? అని టీడీపీ వారు చెప్పాల్సింది.విచిత్రం ఏమిటంటే ఏపీ బీజేపీ నేతలు కొందరు చంద్రబాబుకే ప్రధాన్యత ఇస్తూ, మోదీపై బురద వేస్తున్నా కనీసం ఖండించ లేదు. గతంలో జగన్ పై సీబీఐ అక్రమ కేసులు పెట్టినట్లుగానే ఇప్పుడు అమెరికాలో కూడా పోలీసులు పిచ్చి అభియోగాలు మోపారా అన్న సందేహాన్ని న్యాయ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో సిమెంట్ కంపెనీకి నీరు ఇస్తే అది క్విడ్ ప్రోకో అని, పరిశ్రమకు భూమి ఇస్తే, అందులో నేరం ఉందని.. ఇలా జగన్ పై తప్పుడు కేసులు పెట్టారు.ఆ కేసుల వల్ల ఎపికి తీరని నష్టం జరిగింది. కొత్త పరిశ్రమలు రాకుండా పోయాయి.సోనియా గాంధీ, చంద్రబాబులతో పాటు అప్పటి సీబీఐ అధికారులు దీనికి కారణం అని భావిస్తారు. ఇప్పుడు కూడా సెకీ ఒప్పందంపై అనవసర వివాదం సృష్టించి దేశానికి, అందులోను ఏపీకి నష్టం చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఒప్పందాన్ని రద్దు చేసి, కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సెకీపై కేసు పెట్టే ధైర్యం చంద్రబాబు ప్రభుత్వం చేయవచ్చు కదా!అలా ఎందుకు చేయడం లేదు. పరోక్షంగా మోదీని గబ్బు పట్టిస్తూ, ఇంకో వైపు ఆ అగ్రిమెంట్ ను ఎందుకు కొనసాగిస్తున్నారన్న దానికి సమాధానం దొరకదు. ఈనాడు అధినేత దివంగత రామోజీకి పద్మ విభూషణ్ బిరుదు ఇప్పిస్తే, దానికి రిటర్న్ గిఫ్ట్ గా ప్రధాని మోదీకి ఆయన కుమారుడు కిరణ్ బురద రాస్తున్నట్లు అనిపిస్తుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
‘ఎవరికి చెల్లింపులు చేసినా నాకు తెలుస్తుంది’
తప్పుడు పద్ధతిలో కాంట్రాక్టులు పొందేందుకు ప్రభుత్వ అధికారులకు ఎలాంటి లంచాలు ఇవ్వలేదని అదానీ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జుగేషీందర్ సింగ్ అన్నారు. అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణల ప్రకారం అంత పెద్దమొత్తంలో ఎవరికైనా నగదు చెల్లిస్తే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ హోదాలో ఉన్న తనకు కచ్చితంగా తెలుస్తుందన్నారు. ఈమేరకు విలేకరుల సమావేశంలో ఆయన కొన్ని విషయాలు వెల్లడించారు.‘అదానీ గ్రూప్‌పై ఇటీవల వచ్చిన ఆరోపణల్లో వాస్తవాలు లేవు. గ్రూప్ అధికారులు కాంట్రాక్టులు పొందేందుకు ప్రభుత్వ అధికారులకు ఎలాంటి లంచాలు ఇవ్వలేదు. ఆరోపణల ప్రకారం అంత పెద్దమొత్తంలో నగదు చెల్లిస్తే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ హోదాలో ఉన్న నాకు కచ్చితంగా సమాచారం ఉంటుంది. యూఎస్‌లో చేసిన ఆరోపణలు న్యాయపరమైన అధికారాన్ని ఉపయోగించడమే తప్పా ఇది గ్రూప్‌పై దాడి కాదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు నిబంధనల ప్రకారం సరైన విధంగా స్పందిస్తారు. ఆయా ఆరోపణలను సమర్థంగా తిప్పికొడుతారు. ప్రస్తుతం 30 నెలల రుణ వాయిదాలు తిరిగి చెల్లించే సామర్థ్యం అదానీ గ్రూప్ కలిగి ఉంది. ఎంతటి క్లిష్ట పరిస్థితిలోనైనా 12 నెలల కంటే ఎక్కువగానే రుణా వాయిదాలు చెల్లించే నగదును ముందుగానే సిద్ధంగా ఉంటుంది’ అని తెలిపారు.ఇదీ చదవండి: పాన్ 2.0: అప్లై విధానం.. ఫీజు వివరాలుభారత్లో భారీ సౌర విద్యుత్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్‌లు పొందేందుకు దాదాపు రూ.2,200 కోట్లు (సుమారు 265 మిలియన్ డాలర్లు) లంచాలు ఇచ్చినట్లు అమెరికాలో ఇటీవల అభియోగాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో గ్రూప్ అధినేత గౌతమ్ అదానీతో పాటు మరో ఏడుగురిపై మోసం, లంచం, అవినీతి కేసులు నమోదయ్యాయి. -
పార్లమెంట్లో ఆగని రగడ
సాక్షి, న్యూఢిల్లీ: అదానీ వ్యవహారంపై ప్రతిపక్షాలు పట్టువీడడం లేదు. అదానీ అంశంతోపాటు మణిపూర్ రాష్ట్రంలో, ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ పట్టణంలో జరిగిన హింసాకాండపైనా చర్చించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కొనసాగించాయి. ప్రభుత్వం అంగీకరించలేదు. ఫలితంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఉభయ సభలు నాలుగో రోజు శుక్రవారం సైతం స్తంభించాయి. లోక్‌సభ, రాజ్యసభలో ఎలాంటి కార్యకలాపాలు సాగలేదు. రెండు సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. శుక్రవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు నినాదాలు ప్రారంభించారు. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పారీ్టల ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి బిగ్గరగా నినాదాలు చేశారు. ఇంతలో స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు చేపట్టారు. విపక్ష ఎంపీలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. నియంతృత్వం నశించాలి, అదానీని అరెస్ట్ చేయాలి అనే నినాదాలతో సభ మార్మోగిపోయింది. సభా కార్యక్రమాలు సజావుగా సాగాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని, కొందరు ఎంపీలు మాత్రం సభను పదేపదే అడ్డుకొంటూ ప్రజల ఆకాంక్షలు వినిపించకుండా చేస్తున్నారని స్పీకర్ ఓంబిర్లా మండిపడ్డారు. విపక్ష సభ్యుల తీరుపట్ల ప్రజలు చింతిస్తున్నారని చెప్పారు. సభ సజావుగా జరిగేలా సహకరించాలని కోరారు. అయినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు శాంతించలేదు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్యం 12 గంటల దాకా వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా ప్రతిపక్షాల ఆందోళన ఆగలేదు. చేసేది లేక సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు సభాపతి ప్రకటించారు. రాజ్యçసభలోనూ ఇదే రీతిలో విపక్షాలు సభా కార్యకలాపాలకు అడ్డుతగిలాయి. అదానీ గ్రూప్‌పై వచి్చన అవినీతి ఆరోపణలపై చర్చించాలని డిమాండ్ చేస్తూ విపక్ష ఎంపీలు ఇచి్చన వాయిదా తీర్మానాలను రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ తిరస్కరించారు. రూల్ నెంబర్ 267 కింద వాయిదా తీర్మానాలు ఇవ్వడాన్ని విపక్షాలు ఒక ఆయుధంగా మార్చుకుంటున్నాయని తప్పుపట్టారు. దీనిపై విపక్షాలు ఆందోళనకు దిగాయి. నినాదాలతో హోరెత్తించాయి. పరిస్థితి ఎంతకీ అదుపులోకి రాకపోవడంతో సభను సోమవారానికి వాయిదా వేశారు. -
అసలు జరిగింది ఇదే.. జాతీయ మీడియాతో వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: సెకీతో ఒప్పందం వల్ల రాష్ట్రానికి ఎంతో డబ్బు ఆదా అవుతుందని.. తక్కువ రేటు కోసమే తాము టెండర్లు పిలిచామని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఎన్డీటీవీ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ, ‘‘మా ప్రభుత్వం ఉద్దేశం తక్కువ ధరకు విద్యుత్ సేకరించడమేనని.. సాధారణంగా విద్యుత్ సేకరణ ఛార్జీ రూ.5.10గా ఉంది. సెకీతో ఒప్పందంతో రాష్ట్రానికి ఎంతో ఖర్చు తగ్గింది’’ అని వివరించారు.‘‘మేం ముందుగా 6,400 మెగావాట్ల విద్యుత్‌కు టెండర్లు పిలిచాం. కొందరి కారణంగా అది కోర్టు వివాదాల్లో చిక్కుకుంది. దాదాపు 10 నెలల తర్వాత సెకీ నుంచి మాకు లేఖ వచ్చింది. ఆ టెండర్లలో కోట్ చేసిన అమౌంట్‌కే విద్యుత్ ఇచ్చేందుకు సెకీ ఒప్పుకుంది. రూ.2.49కే యూనిట్ విద్యుత్ సఫ్లై చేసేందుకు అంగీకరించింది. అంతేకాదు స్పెషల్ ఇంటెన్సివ్ కూడా ఇచ్చేందుకు ఒప్పుకుంది. ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జీలు లేకుండా విద్యుత్ ఇచ్చేందుకు సెకీ అంగీకరించింది.’’ అని వైఎస్ జగన్ చెప్పారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో ఇంత తక్కువ రేటుకు విద్యుత్ కొనుగోలు చేయడం ఇదే ప్రథమం.. అంత మంచి మంచి అవకాశాన్ని ఏ ప్రభుత్వమైనా వదులుకుంటుందా?. కేంద్ర ఆధీనంలో సెకీ ఇచ్చిన ఆఫర్‌ను అంగీకరించాం. పెట్టుబడి పెట్టాలనుకునే ఎవరైనా సరే సీఎంను కలుస్తారు కదా.. ఇలాంటి విషయాల్లో సీఎం ముందుకు రాకపోతే పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రారు...2019 నుంచి నా పదవీ కాలం ముగిసే వరకు నేను గౌతమ్ అదానీని ఐదారు సార్లు కలిశా. కేవలం ఆగస్టులో కలిసిన విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నారు. ఆగస్టు తర్వాత అంతకుముందు కూడా చాలాసార్లు కలిశా. ఆయన్నే కాదు.. చాలామంది వ్యాపారవేత్తలతో భేటీ అయ్యాను. సీఎంగా అది నా బాధ్యత.. విధుల్లో ఒక భాగం’’ అని వైఎస్ జగన్ చెప్పారు. -
అదానీ అప్పులపై బ్యాంకులు సమీక్ష
అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీపై లంచం ఆరోపణల కేసు నమోదైనందున ఇకపై రుణదాతల ధోరని మారుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అదానీ గ్రూప్‌నకు భారీగా రుణాలు మంజూరు చేసిన బ్యాంకుల్లో ఎస్బీఐ మొదటి స్థానంలో ఉంది. అయితే ఎస్బీఐతోపాలు వివిధ బ్యాంకులు అదానీ గ్రూప్‌నకు గతంలో జారీ చేసిన రుణాలు, తాజాగా విడుదల చేసిన అప్పులకు సంబంధించి సమీక్ష ప్రారంభించించాయి. ఎస్బీఐ తర్వాత అదానీ గ్రూప్‌నకు అధిక మొత్తంలో లోన్లు ఇచ్చిన బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్‌లు అప్పుల వివరాలను సమీక్షిస్తున్నట్లు కొన్ని మీడియా సంస్థలు వెల్లడించాయి.పాత అప్పులపై మార్పులు ఉండకపోవచ్చు..ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ వివరాల ప్రకారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) అదానీ గ్రూప్‌నకు సుమారు రూ.33,500 కోట్ల అప్పు ఇచ్చింది. ఈ అప్పుతో ప్రారంభించిన పలు ప్రాజెక్ట్‌లు ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాయి. అయితే ఈ దశలో అప్పులపై రివ్యూ చేసి వాటిని నిలిపివేసే అవకాశాలు ఎస్బీఐకు లేవని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కానీ తాజాగా బ్యాంకులు అందించిన అప్పులపై మాత్రం కొంత మార్పులు చేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.కేరళ-అదానీ పోర్ట్స్ ఒప్పందంఅదానీ గ్రూప్‌పై పలు ఆరోపణలు చెలరేగుతున్న తరుణంలో కేరళ ప్రభుత్వం అదానీ పోర్స్ట్ కంపెనీతో కీలక ఒప్పందం చేసుకుంది. కేరళ ప్రభుత్వం తిరువనంతపురంలోని విజింజామ్ పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అభివృద్ధి కోసం అదానీ గ్రూప్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. 2028 వరకు దీని పనులు పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు.ఇదీ చదవండి: నకిలీ షాపింగ్ వెబ్సైట్లు.. తస్మాత్ జాగ్రత్త!అదానీకి బాసటగా..మరోవైపు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్‌నకు కొందరు ఇన్వెస్టర్లు బాసటగా నిలుస్తున్నారు. గౌతమ్ అదానీ తదితరులపై అమెరికాలో ఆరోపణలు వచ్చినప్పటికీ తమ పెట్టుబడుల విషయంలో పునరాలోచనేమీ లేదని అబు ధాబీకి చెందిన ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ (ఐహెచ్సీ) వెల్లడించింది. హరిత ఇంధనం, పర్యావరణ అనుకూల రంగాల్లో అదానీ గ్రూప్ చేస్తున్న కృషిపై తమకు పూర్తి నమ్మకం ఉందని పేర్కొంది. ఐహెచ్సీ 2022లో అదానీ గ్రీన్ ఎనర్జీ (ఏజీఈఎల్), అదానీ ట్రాన్స్‌మిషన్‌లో (ఏటీఎల్) 500 మిలియన్ డాలర్లు(రూ.4151 కోట్లు), అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో 1 బిలియన్ డాలర్లు(రూ.83,020 కోట్లు) ఇన్వెస్ట్ చేసింది. -
మేము అదానీ వెంటే...
న్యూఢిల్లీ: క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్‌నకు ఇన్వెస్టర్లు బాసటగా నిలుస్తున్నారు. గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ తదితరులపై అమెరికాలో ఆరోపణలు వచ్చినప్పటికీ తమ పెట్టుబడుల విషయంలో పునరాలోచనేమీ లేదని అబు ధాబీకి చెందిన ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ (ఐహెచ్సీ) వెల్లడించింది. హరిత ఇంధనం, పర్యావరణ అనుకూల రంగాల్లో అదానీ గ్రూప్ చేస్తున్న కృషిపై తమకు పూర్తి నమ్మకం ఉందని పేర్కొంది. ఐహెచ్సీ 2022లో అదానీ గ్రీన్ ఎనర్జీ (ఏజీఈఎల్), అదానీ ట్రాన్స్‌మిషన్‌లో (ఏటీఎల్) చెరి 500 మిలియన్ డాలర్లు, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో 1 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత ఏజీఈఎల్, ఏటీఎల్‌లో ఒక శాతం పైగా వాటాలు విక్రయించినప్పటికీ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో మాత్రం 5 శాతం పైగా వాటాలు పెంచుకుంది. మరోవైపు, అంతర్జాతీయ భాగస్వాములు కూడా అదానీ గ్రూప్‌నకు మద్దతు తెలిపారు. అదానీ గ్రూప్‌తో భాగస్వామ్యంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని శ్రీలంక పోర్ట్స్ అథారిటీ తెలిపింది. దేశంలో పోర్ట్ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో అదానీ గ్రూప్ కీలక పాత్ర పోషిస్తోందని వివరించింది. అదానీ గ్రూప్ 1 బిలియన్ డాలర్లతో కొలంబో టెరి్మనల్‌ను గ్రూప్ అభివృద్ధి చేస్తోంది. మరోవైపు, టాంజానియా ప్రభుత్వం కూడా అదానీ పోర్ట్స్‌తో ఒప్పందాలకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులపై ఎలాంటి ఆందోళన లేదని, కాంట్రాక్టులన్నీ దేశ చట్టాలకు అనుగుణంగానే ఉన్నాయని వివరించింది. దార్–ఎ–సలామ్ పోర్టులోని 2వ కంటైనర్ టెర్మినల్ నిర్వహణకు టాంజానియాతో అదానీ పోర్ట్స్ ఇటీవలే 30 ఏళ్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సౌర విద్యుత్ కాంట్రాక్టుల కోసం అధికారులకు లంచాలిచ్చారని అదానీపై అమెరికాలో ఆరోపణలు రావడంతో గ్రూప్ కంపెనీల షేర్లు కుదేలుకావడం, అభియోగాలేమీ తీవ్రమైనవి కావని సంస్థ స్పష్టతనివ్వడంతో మళ్లీ పుంజుకోవడం తెలిసిందే. -
ఈనాడు, ఆంధ్రజ్యోతిపై పరువు నష్టం దావా వేస్తున్నాం: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసులో.. తన పేరు ఉందన్న ప్రచారంపైనా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారు. ఆ ఆరోపణల్లో తన పేరు ఎక్కడా లేదని, అది ఉత్త మూర్ఖపు ప్రచారమేనని, కొంతమంది కావాలని చేస్తున్న రాద్ధాంతమని కుండబద్ధలు కొట్టారాయన. అలాగే తనపై తప్పుడు రాతలు రాస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతికి డెడ్‌లైన్ విధించారాయన.‘‘సీఎంలు పారిశ్రామిక వేత్తలను కలుస్తారు. నేను ఐదేళ్ల కాలంలో అదానీని కలిశాను. వాటికి విద్యుత్ ఒప్పందాలకు ముడిపెట్టి నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో థర్డ్ పార్టీ ఎవరూ లేరు. ఇది ఏపీ ప్రభుత్వానికి, డిస్కంలకు, కేంద్ర ప్రభుత్వానికి(సెకి) మధ్య జరిగిన ఒప్పందం. నాపై తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్లపై పరువు నష్టం దావా వేస్తా. .. ఈనాడు, ఆంధ్రజ్యోతి.. టీడీపీ కోసం పని చేసే మీడియా సంస్థలు. వాస్తవాల్ని వకక్రీకరించి పదే పదే అబద్ధాలు రాస్తున్నాయి. ఆ కేసులో నా పేరు ఎక్కడా లేదు. కానీ, ఆ రెండు మీడియా సంస్థలు నా పరువు ప్రతిష్టలు దెబ్బ తీసేలా అబద్ధాలతో ప్రచారం చేస్తున్నాయి. వాటికి లీగల్ నోటీసులు పంపిస్తా. వాటికి 48 గంటల ఇస్తున్నా. ఆ లోపు క్షమాపణలు చెప్పకపోతే.. రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తా’’ అని వైఎస్ జగన్ హెచ్చరించారు.ఇదీ చదవండి: సంపద సృష్టించిన జగన్.. ఆవిరి చేస్తున్న చంద్రబాబు! ఎలాగంటే.. -
‘విడ్డూరంగా షర్మిల మాటలు.. ముమ్మాటికీ అది తప్పుడు ప్రచారమే’
వైఎస్సార్ జిల్లా, సాక్షి: అదానీ వ్యవహారంతో గత ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని, విద్యుత్ కొనుగోళ్ల విషయంలో పత్రికల్లో వస్తున్న వార్తల్లో ఇసుమంత కూడా వాస్తవం లేదని అన్నారు వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. గురువారం ఈ అంశాలపై మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలపైనా మండిపడ్డారు.‘‘అదానీ నుంచి విద్యుత్ కొనుగోళ్లలో జగన్ కు లంచాలు ముట్టాయంటూ షర్మిల మాట్లాడటం విడ్డూరంగా ఉంది. అదానీ కంపెనీ విద్యుత్ ను కేంద్ర ప్రభుత్వానికి అమ్మితే.. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకి ద్వారా ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందులో అదానీ లంచం ఎందుకిస్తారు.? అదానీకి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధమే లేదు... షర్మిల పనిగట్టుకుని జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చేస్తుంది. రాజకీయాలను అడ్డు పెట్టుకుని వ్యక్తిగత కక్షలు తీర్చు కోవాలనుకుంటున్నారు. అధికారులకు లంచం ఇచ్చే ప్రయత్నం చేశారు అని చార్జిషీట్ లో ఉంటే.. ఏకంగా జగన్‌కు 1,750 కోట్లు లంచం ఇచ్చారని అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. జగన్ హయాంలో రాష్ట్రానికి తక్కువతో విద్యుత్ కొని ఆదా చేస్తే తప్పుడు ప్రచారాలు, అసత్య ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబుకు, షర్మిలకు దమ్ముంటే నరేంద్ర మోదీని ప్రశ్నించాలి. .. గడచిన 6 నెలల్లో కూటమి ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలు చేస్తోందన్న శివప్రసాద్‌రెడ్డి.. అబద్ధాలను అస్త్రాలుగా చేసుకుని పాలిస్తూ ఏపీ ప్రజలను గాలికి వదిలేశారన్నారు. ‘‘నాడు కేబినెట్ చర్చల అనంతరం 2.49 పైసలకే మన ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్లు చేసింది. కానీ, ఇప్పుడు రామోజీరావు కొడుకు, రాధాక్రిష్ణలు, షర్మిల, టీడీపీ నేతలు పక్కనే ఉండి చూసినట్లు మాట్లాడుతున్నారు. చంద్రబాబు గతంలో ఇదే సెకి ద్వారా రూ 5.30 పైసలతో విద్యుత్ కొనుగోలు చేసింది’’ అని శివప్రసాద్‌రెడ్డి గుర్తు చేశారు.అమెరికా కేసులో జగన్ పేరుందని దుష్ప్రచారం చేస్తున్నారు.. అక్కడ వేసిన చార్జ్ షీట్ లో ఎక్కడా జగన్ పేరూ లేదు.. ఏపీ ప్రభుత్వం పేరూ లేదు అని స్పష్టం చేశారు.ప్రతిపక్షాన్ని పూర్తిగా మట్టుపెట్టాలని ప్రశ్నించే గొంతును నొక్కేందుకు వీళ్లు చట్టాలు తెస్తున్నారు. ప్రజల సమస్యలను మేం మాట్లాడుతున్నాం అని నల్ల చట్టాలను తీసుకొస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే కూడా పీడీ యాక్ట్ పెడతారా? అని ప్రశ్నించారాయన... చెవిరెడ్డి చేసిన నేరం ఏంటి? ఓ ఆడపిల్ల కుటుంబాన్ని పరామర్శిస్తే కేసు పెడతారా?. ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే వారికి అండగా నిలవవద్దని మీరు ఇలాంటి కేసులు పెడుతున్నారా?. మీరు మాత్రం ప్రతి రోజూ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ మాట్లాడొచ్చు.. మేం పేదల పక్షాన నిలిస్తే కేసులు పెడతారా? అని శివప్రసాద్‌రెడ్డి నిలదీశారు. -
ఇవేం నేరారోపణలు?
సాక్షి, అమరావతి: సౌర విద్యుత్ ప్రాజెక్టుల సంబంధించి అదానీ గ్రూపు లంచాలు ఇచ్చేందుకు కుట్ర పన్నిందంటూ యూఎస్ ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ (ఎఫ్‌సీపీఏ) కింద అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ (డీఓజే) కేసు నమోదు చేయడాన్ని ప్రముఖ న్యాయ కోవిదుడు, మాజీ అటార్నీ జనరల్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ తప్పుబట్టారు. ‘డీఓజే’ చేసిన నేరారోపణలకు బలం చేకూర్చే విశ్వసనీయమైన ఆధారాలు ఏవీ లేవని ఆయన స్పష్టం చేశారు. ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ (ఎఫ్‌సీపీఏ)ను ఉల్లంఘించారనే విషయంలో అదానీలపై ఎలాంటి నేరారోపణలు లేవన్నారు. అలాగే న్యాయాన్ని అడ్డుకున్నారన్న నేరారోపణలో కూడా అదానీల పేర్లు గానీ వారి అధికారుల పేర్లు గానీ లేవని వెల్లడించారు. ఈ రెండు కీలకమైన నేరారోపణల్లో అదానీల పేర్లు లేవన్న సంగతిని అందరూ.. ముఖ్యంగా మీడియా గుర్తించాలని సూచించారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఏం చెప్పారంటే...యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ మోపిన నేరారోపణ పత్రాన్ని నేను చదివా. ఆయా వ్యక్తుల నిర్దిష్ట చర్యలపై అభియోగాలు మోపుతూ మన దేశంలో దాఖలు చేసే చార్జిషీట్ లాంటిది ఇది. నా లెక్క ప్రకారం మొత్తం ఐదు నేరారోపణలున్నాయి. ఇందులో మొదటి, ఐదో నేరారోపణలు మిగిలిన వాటికన్నా చాలా ముఖ్యమైనవి. అయితే ఒకటో నేరారోపణలోగానీ ఐదో నేరారోపణలోగానీ అదానీ, ఆయన మేనల్లుడు పేర్లు లేనే లేవు. ఆ నేరారోపణలు మన దేశంలో దాఖలు చేసే చార్జిషీట్ లాంటివి. అది లంచం కావచ్చు.. దొంగతనం కావచ్చు.. హత్య కావొచ్చు. మొదటి నేరారోపణలో ఇద్దరు అదానీల పేర్లు లేవు. ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ (ఎఫ్‌సీపీఏ) కింద ఈ నేరారోపణలు చేశారు. ఎఫ్‌సీపీఏ అనేది మన దేశంలో అవినీతి నిరోధక చట్టం లాంటిది. మొదటి నేరారోపణ ఏమిటంటే.. ఎఫ్సీపీఏని ఉల్లంఘించేందుకు కుట్ర పన్నారన్నది. ఇందులో ఆదానీల పేర్లు లేవు. వారి అధికారుల పేర్లు ఉన్నాయి. రెండు, మూడు, నాలుగో ఆరోపణలు సెక్యూరిటీలు, బాండ్లకు సంబంధించినవి. ఈ నేరారోపణల్లో అదానీలు, వారి అధికారుల పేర్లున్నాయి. ఐదవదైన చివరి నేరారోపణ చాలా ముఖ్యమైనది. ఈ నేరారోపణ న్యాయానికి ఆటంకం కలిగించారన్నది. ఇందులో అదానీల పేర్లు లేవు. వారి అధికారుల పేర్లు కూడా లేవు. అసలు ఎవరు ఎవరికి లంచం ఇచ్చారు..? ఎంత లంచం ఇచ్చారు..? ఎలా ఇచ్చారు... లాంటి వివరాల్లేవ్..!ఓ చార్జిషీట్లో ఫలానా వ్యక్తులు ఫలానా పనులు చేశారు.. ఫలానా వ్యక్తులు ఫలానా వారికి లంచం ఇచ్చారు లాంటి వివరాలేవీ లేకపోవడం ఆందోళన కలిగించే విషయం. అదానీలు సౌర విద్యుత్ ప్రాజెక్టుల నిమిత్తం భారతదేశ వ్యక్తులకు, సంస్థలకు లంచం ఇవ్వజూపారన్నది ప్రధాన నేరారోపణ. అయితే ఆ నేరారోపణల్లో లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారని ఉందే కానీ.. ఎవరికి లంచం ఇచ్చారు? ఎలా లంచం ఇచ్చారు? ఇందులో అదానీ గ్రూపు అధికారుల ప్రత్యక్ష ప్రమేయం ఉందా? ఎంత లంచం ఇచ్చారు? ఏ కాంట్రాక్ట్ కోసం లంచం ఇచ్చారు? అధికారులు ఏ గ్రూపునకు చెందిన వారు తదితర వివరాలేవీ కనీస స్థాయిలో కూడా ఆధారాలు లేవు. ఇందుకు సంబంధించి ఒక్కరి పేరు కూడా ఆ నేరారోపణల్లో లేదు. ఇలాంటి నేరారోపణలపై ఎవరైనా ఎలా స్పందిస్తారు? ఆ నేరారోపణల్లో ఎక్కడా కూడా ఇండియాలో లంచాలు ఇచ్చినట్లు లేదు. లంచం ఇచ్చేందుకు కుట్ర పన్నారన్నదే ప్రధాన నేరారోపణ. కానీ ఇందుకు ఎలాంటి ఆధారాలు లేవు. ఈ వ్యవహారంలో వారు (అదానీలు) అమెరికాలోని న్యాయవాదుల సలహాలు తీసుకుంటారని భావిస్తున్నా. లంచం ఇవ్వాలని చూశారన్న ఆరోపణ మినహా అందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు. అందువల్ల ఆ నేరారోపణలన్నీ కూడా ఊహాజనితమైనవే. మరోసారి చెబుతున్నా.. 1, 5వ నేరారోపణల్లో అదానీల పేర్లు లేవు. -
‘అదానీపై ఆరోపణలు... విదేశీ శక్తుల కుట్ర.. ఒక్క ఆధారం చూపలేదు’
సాక్షి, అమరావతి: ‘అదానీ గ్రూప్‌పై అమెరికా న్యాయ శాఖ (డీఓజే) చేసిన ఆరోపణలు, మోపిన అభియోగాలు కేవలం ఊహాగానాలు. పూర్తిగా నిరాధారం. పైగా వాటిని కూడా పూర్తిగా వక్రీకరించి మరీ భారత ప్రజల ముందు పెట్టారు. అదికూడా సరిగ్గా పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలయ్యే ముందే వాటిని బయట పెట్టడం వెనక భారీ దురుద్దేశాలు దాగున్నాయి. ఇది భారత్‌ను ఆర్థికంగా అస్థిరపరిచేందుకు, దేశ కార్పొరేట్ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నమే’ అని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మహేశ్ జఠ్మలానీ పేర్కొన్నారు. సౌర విద్యుత్ ప్రాజెక్టుల కోసం అదానీ గ్రూప్ భారత్‌లో అధికారులకు, నేతలకు లంచాలిచ్చినట్టు డీఓజే తన అభియోగాల్లో ఎక్కడా స్పష్టంగా పేర్కొనలేదని జఠ్మలానీ గుర్తు చేశారు. తాను కేవలం ఒక జాతీయవాదిగా వ్యక్తిగత హోదాలో మాత్రమే దీనిపై స్పందిస్తున్నట్టు చెప్పారు. అంతేగానీ అదానీలకు గానీ, వారి గ్రూప్‌నకు గానీ మద్దతుగా మాట్లాడటం లేదని స్పష్టం చేశారు. అమెరికాలో జో బైడెన్ సారథ్యంలోని డెమొక్రటిక్ ప్రభుత్వానికి చెందిన అధికార లాబీలు ఏడాదిన్నరగా మోదీ సర్కారుకు పూర్తి వ్యతిరేకంగా పని చేస్తున్నాయన్నారు. ‘అదానీ’ వివాదంపై బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.విశ్వసనీయత లేదని స్వయంగా ట్రంప్ చెప్పారు..“అది పూర్తిగా అమెరికాలో అదానీ గ్రీన్ కంపెనీ జారీ చేసిన బాండ్లకు సంబంధించిన అంశం. ఇన్వెస్టర్లకు సమాచారమే ఇవ్వకుండా బాండ్లు జారీ చేశారని, భారత్‌లో కాంట్రాక్టులు పొందేందుకు లంచాలు ఆశ చూపిన విషయాన్ని దాచి అమెరికాలో పెట్టుబడుల సేకరణకు ప్రయత్నం చేశారని అభియోగాలు మోపారు. కానీ అందుకు ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా చూపలేదు. పైగా ఈ ఉదంతానికి సంబంధించి భారత్‌లో ఏ చట్టాలను ఉల్లంఘించారో కనీసం ఒక్క అభియోగంలో కూడా పేర్కొనలేదు. కనీసం ఉల్లంఘించినట్టు కూడా చెప్పలేదు.భారత్‌లో అధికారులకు గానీ, ప్రజాప్రతినిధులకు గానీ అదానీ గ్రూప్ లంచమిచ్చినట్టు ఎక్కడా నిర్దిష్టంగా చెప్పలేదు కూడా. ‘లంచాలిచ్చారు, లేదా ఇస్తామని వాగ్దానం చేశారు’ అంటూ చాలా పదాల కూర్పులో చాలా తెలివిగా వ్యవహరించారు. కేవలం కుట్ర జరిగి ఉంటుందని అభిప్రాయపడ్డారేగానీ దానికి ఎలాంటి సాక్ష్యాధారాలూ చూపలేదు. పైగా ఆ కుట్రను అమలు చేశారని కూడా ఎక్కడా చెప్పలేదు. లోతుగా చూస్తే ఇవన్నీ కేవలం అమెరికా న్యాయ శాఖ ఊహాగానాలేనని అడుగడుగునా స్పష్టమవుతూనే ఉంది’ అని జఠ్మలానీ స్పష్టం చేశారు. అమెరికాలో న్యాయ శాఖ అనేదే ఒక పెద్ద జోక్ అని, దానికి విశ్వసనీయతే లేదని ఆ దేశానికి కాబోయే అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంపే బాహాటంగా చెప్పారని గుర్తు చేశారు.అదానీ ఎపిసోడ్ మొత్తాన్నీ భారత్‌పై బైడెన్ సర్కారు పన్నాగంలో భాగంగా జఠ్మలానీ అభివర్ణించారు. ‘అదానీలపై ఆరోపణలు తెరపైకి వచ్చినప్పుడల్లా ఆ గ్రూపు ఆర్థికంగా భారీగా నష్టపోతూ వస్తోంది. ఈసారి ఏకంగా 2.4 బిలియన్ డాలర్లు నష్టపోయింది. హిండెన్‌బర్గ్ నివేదికైనా, డీఓజే అభియోగాలైనా పార్లమెంటు సమావేశాలకు సరిగ్గా రెండు రోజుల ముందు బయటికొచ్చాయి. ఇందులోకి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఏ సాక్ష్యం లేకుండా కేవలం ఓ అభియోగ పత్రంపై ఆధారపడి నిరాధార ఆరోపణలు చేయడం కాంగ్రెస్ లాంటి పెద్ద పార్టీకి తగని పని’ అని జఠ్మలానీ పేర్కొన్నారు. విశ్వసనీయమైన సాక్ష్యాలంటూ ఉంటే కాంగ్రెస్ ముందుగా వాటిని ప్రజల ముందు పెట్టాలని జఠ్మలానీ డిమాండ్ చేశారు. -
అదానీపై లంచం ఆరోపణల్లేవు!
న్యూఢిల్లీ: గౌతమ్ అదానీ, ఆయన సోదరుడి కుమారుడు సాగర్ అదానీ, కంపెనీ బోర్డు సీనియర్ డైరెక్టర్ వినీత్జైన్పై అమెరికా న్యాయ శాఖ లంచం అభియోగాలు మోపలేదని అదానీ గ్రూప్ సంస్థ అదానీ గ్రీన్ ఎనర్జీ స్పష్టం చేసింది. ‘‘న్యూయార్క్ కోర్టులో గత వారం అమెరికా న్యాయ శాఖ (యూఎస్ డీఓజే) దాఖలు చేసిన అభియోగ పత్రంలో, యూఎస్ ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ (ఎఫ్‌సీపీఏ/అవినీతి నిరోధక) చట్టం నిబంధనలను ఉల్లంఘించే కుట్రకు పాల్పడినట్టు వ్యవస్థాపక చైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన సోదరుడి కుమారుడు సాగర్ లేదా వినీత్జైన్పై అభియోగాలు మోపలేదు’’అని స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఏజీఈఎల్) బుధవారం వివరణ ఇచ్చింది. సెక్యూరిటీస్ చట్టం కింద మోసం, కుట్ర, ఉద్దేశపూర్వక కుట్ర ఆరోపణలే మోపినట్టు తెలిపింది. ఈ అభియోగాలకు చట్టం పరిధిలో శిక్షలు లంచం కంటే చాలా తక్కువని పేర్కొంది. మరోవైపు సెక్యూరిటీల చట్టం నిబంధనలు ఉల్లంఘించారంటూ.. చట్ట ఉల్లంఘన దిశగా అదానీ గ్రీన్ ఎనర్జీకి సాయం అందించారంటూ గౌతమ్ అదానీ, సాగర్ అదానీ మరో సివిల్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నట్టు ఏజీఈఎల్ వివరణ ఇచ్చింది. సెక్యూరిటీస్ చట్టం 1933, సెక్యూరిటీస్ చట్టం 1934లోని పలు సెక్షన్లను వీరు ఉల్లంఘించారని.. ఏజీఈఎల్ సైతం ఇవే చట్ట ఉల్లంఘనలకు పాల్పడేందుకు సాయం లేదా ప్రోత్సాహం అందించినట్టు సివిల్ కేసులో అభియోగాలు మోపినట్టు వెల్లడించింది. ఏజీఈఎల్ సోలార్ విద్యుత్ సరఫరా కాంట్రాక్టులను దక్కించుకునేందుకు వీలుగా భారత అధికారులకు 265 మిలియన్ డాలర్ల లంచాలు ఇచ్చారంటూ అదానీ తదితరులపై కొన్ని రోజుల క్రితం సంచలన ఆరోపణలు రావడం తెలిసిందే. ఈ క్రమంలో ఆదానీ గ్రీన్ ఎనర్జీ ఇచ్చిన వివరణకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇవన్నీ నిరాధార ఆరోపణలు అని, ఈ విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని అదానీ గ్రూప్ ఇప్పటికే వివరణ ఇచ్చింది.అదరగొట్టిన అదానీ షేర్లు...అమెరికా లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ వివరణ ఇవ్వడంతో అదానీ కంపెనీల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అదానీ టోటల్ గ్యాస్ 20%, అదానీ పవర్ 20%, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 10%, అదానీ గ్రీన్ ఎనర్జీ 10% లాభపడ్డాయి. ఈ షేర్లన్నీ ఇంట్రాడేలో అప్పర్‌సర్క్యూట్ తాకాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ 12%, ఎన్డీటీవీ 9%, అదానీ విల్మార్ 8%, అదానీ పోర్ట్స్ 6%, సంఘీ ఇండస్ట్రీస్ 5%, అంబుజా సిమెంట్స్ 4.50%, ఏసీసీ 4% పెరిగాయి. పదకొండు కంపెనీల షేర్లూ రాణించడంతో ఒక్కరోజులో అదానీ గ్రూప్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.1.24 లక్షల కోట్లు పెరిగింది. -
‘సోలార్’ లంచాలు.. ఊహాగానాలే
సాక్షి, అమరావతి: ‘‘అదానీ’’ వ్యవహారంపై మీడియాలో వెలువడుతున్న ఊహాజనిత కథనాలు ‘అదుగో పులి అంటే.. ఇదుగో తోక!’ అన్నట్లుగా ఉన్నాయనే అభిప్రాయం న్యాయవర్గాల్లో వ్యక్తమవుతోంది. విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి అదానీ గ్రూపు లంచాలు ఇచ్చేందుకు కుట్ర పన్నిందంటూ యూఎస్ ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ (ఎఫ్‌సీపీఏ) కింద అమెరికా న్యాయశాఖ (డీఓజే) నమోదు చేసిన కేసులో నేరారోపణలకు బలం చేకూర్చే విశ్వసనీయమైన ఆధారాలేవీ లేవని ప్రముఖ న్యాయ కోవిదుడు, మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మహేశ్ జఠ్మలానీ స్పష్టం చేశారు. సౌర విద్యుత్ ప్రాజెక్టుల కోసం అదానీ గ్రూప్ భారత్‌లో అధికారులకు, నేతలకు లంచాలిచ్చినట్లు డీఓజే తన అభియోగాల్లో ఎక్కడా నిర్దిష్టంగా పేర్కొనలేదని వెల్లడించారు. కేవలం కుట్ర జరిగి ఉంటుందని అభిప్రాయపడ్డారేగానీ దానికి ఎలాంటి సాక్ష్యాధారాలూ చూపలేదని.. లోతుగా పరిశీలిస్తే ఇవన్నీ కేవలం ఊహాగానాలేనని స్పష్టమవుతోందన్నారు. ఇక ఈ కేసులో అత్యంత కీలకమైన 1, 5వ నేరారోపణల్లో అదానీ గానీ ఆయన మేనల్లుడు పేర్లు గానీ లేనే లేవని చెప్పారు. ‘ఎఫ్‌సీపీఏ’ని ఉల్లంఘించారన్న నేరారోపణల్లోగానీ.. న్యాయానికి ఆటంకం కలిగించారన్న ఆరోపణల్లోగానీ అదానీల పేర్లు లేవనే విషయాన్ని వారు తెరపైకి తెచ్చారు. కీలకమైన ఈ రెండు నేరారోపణల్లో అదానీల పేర్లు లేవనే విషయాన్ని ప్రధానంగా మీడియా సంస్థలు గుర్తించాలని సూచిస్తున్నారు. అసలు లంచం ఇవ్వటానికి ప్రయత్నించారనిగానీ.. ఇచ్చారనిగానీ నిరూపించే కనీస సమాచారం కూడా లేదని పేర్కొంటున్నారు. ఆ నేరారోపణల్లో ఎక్కడా కూడా ఇండియాలో లంచాలు ఇచ్చినట్లు లేదని.. లంచం ఇచ్చేందుకు కుట్ర పన్నారన్నదే ప్రధాన నేరారోపణ అని.. అయితే అందుకు ఎలాంటి ఆధారాలు లేవనే విషయాన్ని గుర్తించాలని సూచించారు. ఈ నేపథ్యంలో అమెరికా ‘డీఓజే’ నేరారోపణలకు బలం చేకూర్చే విశ్వసనీయమైన ఆధారాలేవీ లేవని ఈ కేసులో న్యాయపరమైన అంశాలను విశ్లేషించిన న్యాయ కోవిదులు చెబుతున్నారు. -
‘ఆధారాల్లేకుండా అదానీపై కాంగ్రెస్ ఆరోపణలు’
న్యూఢిల్లీ: అదానీ వ్యవహారంతో.. కాంగ్రెస్ కావాలనే రాజకీయం చేస్తోందని ప్రముఖ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు మహేష్ జెఠ్మలానీ అంటున్నారు.అదానీపై అమెరికాలో నమోదైంది అభియోగాలు మాత్రమే.. అవి రుజువు కాలేదని అన్నారాయన.ఛార్జ్‌షీట్‌లో ఎలాంటి ఆధారాలు లేవు. అయినా కావాలనే కాంగ్రెస్ రాజకీయం చేస్తోంది.అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ పనితీరు గురించి ట్రంప్ ఎప్పుడో చెప్పారు. యూఎస్ న్యాయశాఖ.. బైడెన్ కనుసన్నల్లో పని చేసే విభాగం. అంతర్జాతీయంగా వ్యాపారం నిర్వహిస్తున్న భారత కంపెనీల పై అమెరికాలో దాఖలైన అభియోగాలను గుడ్డిగా నమ్ముతుంది కాంగ్రెస్ పార్టీ. కానీ, అభియోగ పత్రంలో లంచాలు ఇచ్చినట్లు ఆధారాల్లేవు.సోలార్ ఎనర్జీ కాంట్రాక్టులు దక్కేందుకు భారత అధికారులకు లంచాలకు కుట్ర చేశారనే ఆరోపణలకు ఆధారాలు ఎక్కడున్నాయి?. ఆరోపణలు చేసే ముందు కాంగ్రెస్ ఆధారాలు చూపాలి. దీన్ని ఒక రాజకీయ ఆయుధంగా వాడుకోవాలనుకుంటోంది. మహారాష్ట్రలో ఓటమి తర్వాత ఈ అంశాన్ని డైవర్షన్ కోసం ఉపయోగించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి అదానీ, మణిపూర్ మినహా మిగిలిన అంశాలేవీ లేవా? అని ప్రశ్నించారాయన.The US indictment against #Adani is based on claims, not proven facts. There's no allegation of bribery in India, only a speculative charge of conspiracy to bribe. The case revolves around bond issuances by #AdaniGreenEnergy, where the DOJ infers without evidence that bondholders… pic.twitter.com/KsBAUwPbWl— Mahesh Jethmalani (@JethmalaniM) November 27, 2024 -
అదానీపై కేసు: ‘ఎవరికి లంచాలు ఇచ్చారో ఛార్జ్‌షీట్‌లో లేదు’
న్యూఢిల్లీ, సాక్షి: అదానీపై అమెరికా కేసు వ్యవహారంపై ప్రముఖ న్యాయ నిపుణుడు, భారత మాజీ అటార్నీ జనరల్ రోహత్గీ విశ్లేషణ జరిపారు. అమెరికా కోర్టులో వేసిన ఛార్జ్‌షీట్‌లో ప్రధాన ఆరోపణల్లో ఎక్కడా అదానీ పేరు ప్రస్తావించలేదని అన్నారాయన.. అదానీ వ్యవహారంలో అమెరికా కోర్టులో వేసిన ఛార్జ్‌షీట్ పూర్తిగా తప్పుల తడక. చార్జ్‌షీట్‌లో ఎవరికి ఎవరు లంచాలు ఇచ్చారనే విషయంపై ఒక్క పేరు కూడా ప్రస్తావించలేదు. భారత అధికారులకు లంచాలు ఇచ్చారని ప్రస్తావించారు కానీ.. వారి పేర్లు, హోదాపై ఎక్కడా చెప్పలేదు.నేనేం అదానీ గ్రూప్ తరఫున ప్రతినిధిగా మాట్లాడడం లేదు. నేనొక లాయర్ని. అమెరికా కోర్టు నేరారోపణను నేను పరిశీలించా. అందులో ఐదు అభియోగాల్లో.. ఒకటి, ఐదో అంశాలు కీలకంగా ఉన్నాయి. వాటిల్లోనూ అదానీగానీ, ఆయన బంధువు సాగర్‌పై గానీ అభియోగాలు లేవు. మొదటి అభియోగంలో.. అదానీల తప్ప కొందరి పేర్లు మాత్రమే ఉన్నాయి. అందులో కొందరు అధికారులు, ఒక విదేశీ వ్యక్తి పేరుంది. అలాగే.. కీలక ఆరోపణల్లోనూ అదానీ పేరు లేదు అని చెప్పారాయన.ఆరోపణలు చేసే సమయంలో అధికారులు ఏ శాఖకు చెందిన వారు, వారి పేర్లు ఏంటన్నది కచ్చితంగా ఛార్జ్‌షీట్‌లో ఉండాలి. అదానీపై మీడియాలో వస్తున్న ఆరోపణలు అవాస్తవం. పేర్లు లేకుండా ఛార్జ్‌షీట్‌లో ఆరోపణలు మాత్రమే చేయడం.. విస్మయం కలిగించింది. ఇలాంటి ఛార్జ్‌షీట్‌పై ఎలా స్పందించాలో అర్థం కావడం లేదు. అదానీ న్యాయపోరాటం చేస్తారని భావిస్తున్నా అని రోహత్గీ అన్నారు. -
అదానీ వ్యవహారంలో తెలంగాణలో పోటాపోటీ రాజకీయం!
అదానీ స్కామ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. రాజకీయ ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసేందుకు ఒకపక్క తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్.. ఇంకోపక్క బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులు వ్యూహాలు రచిస్తున్నారు. స్కిల్ యూనివర్శిటీకి అదానీ ప్రకటించిన రూ.వంద కోట్ల విరాళాన్ని తిరస్కరిస్తున్నట్లు రేవంత్ ప్రకటించి తొలి అస్త్రం సంధించగా అదే అదానీతో రేవంత్ కుమ్మక్కు అయ్యారని కేటీఆర్, హరీశ్‌లు ఆరోపణలకు దిగారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశంపై ఉలుకు, పలుకూ లేకుండా ఉండటం. బహుశా మింగలేక, కక్కలేక అన్నట్టుగా ఉన్నట్టుంది బాబు గారి పరిస్థితి!సౌర విద్యుత్తు కొనుగోళ్లకు సంబంధించి అదానీపై అమెరికా కోర్టులో కేసు నమోదైన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున విమర్శలకు దిగిన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీపై కూడా కాంగ్రెస్ తనదైన శైలిలో విరుచుకుపడింది. అయితే ఈ అంశం తెలంగాణలో రేవంత్‌కు కొంత ఇబ్బందిగా మారింది. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అదానీని విమర్శిస్తూంటే.. రేవంత్ మాత్రం కుమ్మక్కు అయ్యారని కేటీఆర్, రేవంత్‌లు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అదానీతో సంబంధాలు, పెట్టుబడులపై మీడియా అడిగిన ప్రశ్నలకు జవాబు ఇచ్చేందుకు రాహుల్ కొంత తడబడాల్సి వచ్చింది.ఆ తర్వాత ఏమైందో కాని తెలంగాణ సీఎం స్కిల్ యూనివర్శిటీకి అదానీ ఇచ్చిన వంద కోట్లను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. రాహుల్ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేయడంతోనే రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నారని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా దావోస్‌లో అదానీతో కుదుర్చుకున్న రూ.12,400 కోట్ల ఒప్పందాల మాటేమిటని, రేవంత్ స్వస్థలం కొడంగల్‌లో ఏర్పాటు చేయతలపెట్టిన అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ సంగతేమిటి? అని కూడా కేటీఆర్, హరీశ్‌కు ప్రశ్నిస్తున్నారు. అదానీకి తాము గతంలో రెడ్‌లైట్ చూపామని, రేవంత్ మాత్రం రెడ్ కార్పెట్ పరిచారని ఎద్దేవా చేస్తున్నారు.కేసీఆర్ ప్రభుత్వం అప్పట్లో తీసుకున్న కొన్ని నిర్ణయాలపై రేవంత్ ప్రభుత్వం కమిషన్లు వేయడం, ఈ-ఫార్ములా రేస్ నిర్వహణకు సంబంధించి రూ.55 కోట్ల దుర్వినియోగం ఆరోపణతోపాటు కొన్ని ఇతర అంశాల విషయంలోనూ కేటీఆర్‌పై కేసులు పెట్టే ప్రయత్నం చేయడం ద్వారా రేవంత్ బీఆర్ఎస్ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో ఎన్నికల హామీల అమలు వైఫల్యంతోపాటు హైడ్రా వ్యవహారాలు, మూసీ నదీగర్భంలో ఇళ్ల కూల్చివేత, లగచర్ల భూసేకరణ వివాదం వంటి అంశాలతో బీఆర్ఎస్ జనాల్లోకి వెళుతోంది. వీటన్నింటి మధ్యలో వచ్చిన అదానీ కేసును కూడా అందిపుచ్చుకునేందుకు ఇరు పక్షాలూ ప్రయత్నిస్తున్నాయి. నిజానికి అదాని విరాళానికి, ఆయనపై వచ్చిన కేసుకు సంబంధం ఉండకూడదు. కానీ.. రాజకీయాలలో పరిస్థితి అలా ఉండదు. అదానీ ప్రధాని మోడీకి సన్నిహితుడని, అతడిని రక్షిస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి నేతలు ఆరోపిస్తున్న విషయం కొన్ని రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాలకు, నేతలకూ ఇబ్బందిగా మారింది. ఉదాహరణకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్‌తో చత్తీస్ లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఒప్పందం చేసుకుంది. దీన్ని రాహుల్ ఎలా సమర్థించుకుంటారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తమిళనాడులోని డీఎంకే ఆధ్వర్యంలోని కూటమిలో కాంగ్రెస్ భాగస్వామి. జమ్ము-కశ్మీర్లో రాష్ట్రపతి పాలన ఉండగా ఒప్పందం కుదిరింది. అంటే బీజేపీ ఆధ్వర్యంలోని రాష్ట్రంలలో ఒప్పందం కుదురిందన్నమాట. ఇందులో అవినీతి జరిగి ఉంటే ఆ మకిలీ కాంగ్రెస్, బీజేపీలు రెండింటికీ అంటుకుంటున్నట్లు అవుతుంది కదా! బీజేపీ ఇదే వాదన చేసి కాంగ్రెస్ పై ద్వజమెత్తింది. ఈ క్రమంలో తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం ఇరుకునపడినట్లయింది.ఇదీ చదవండి: కొత్త దుష్ట సంస్కృతికి తెరలేపిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి!విద్యుత్ సరఫరా ఒప్పందం తెలంగాణతో జరగక పోయినా ఆ ప్రభావం పెట్టుబడులపై పడుతోంది. రాజకీయంగా బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య సాగుతున్న వార్ నేపథ్యంలో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. దీనిపై రేవంత్ వివరణ ఇస్తూ తానేదో అప్పనంగా వంద కోట్లు తీసుకున్నట్లు ఆరోపణలు రావడం తనకు ఇష్టం లేదని, స్కిల్ యూనివర్శిటీ వివాదాలలో చిక్కుకోరాదన్న భావనతో అదానీ విరాళాన్ని తిరస్కరించినట్లు చెప్పారు. అయితే తొలుత రేవంత్ ప్రభుత్వం సంతోషంగానే ఈ మొత్తాన్ని స్వీకరించడానికి సిద్దపడింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యూనివర్శిటీకి ఉపయోగపడుతుందని భావించింది. కానీ రాజకీయ విమర్శల కారణంగా వెనక్కి తగ్గుతున్నారు.గతంలో అదానితో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవడం కష్టమన్న భావను రేవంత్ వ్యక్తపరిచారు. వారు కోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుందని అన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా అదానీతో డేటా సెంటర్ తదితర అగ్రిమెంట్లు చేసుకుందని రేవంత్ వ్యాఖ్యానించారు. పెట్టుబడులపై బీఆర్ఎస్ విధానం ఏమిటని ప్రశ్నించారు. నిజమే! ఏ పారిశ్రామిక వేత్త అయినా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తే దానిని స్వీకరించకుండా ఉండడం కష్టమే. ఎందుకంటే రేవంత్ అన్నట్లు పరిశ్రమలు రాకపోతే తేలేదని అంటారు. తీరా ఏవైనా పరిశ్రమలు వస్తే ఆరోపణలు చేస్తుంటారని ఆయన అన్నారు.అనుభవమైంది కనుక రేవంత్ ఈ మాటలు చెబుతున్నారు. అదే తెలంగాణలో కాంగ్రెస్ విపక్షంలో ఉంటే ఆయన కూడా ఇదే తరహా రచ్చ చేసేవారు. అంతెందుకు...గతంలో వైఎస్ జగన్ పై పెట్టిన ఆక్రమ కేసులలో అనేక పరిశ్రమలకు తెలుగుదేశంతో కలిసి కాంగ్రెస్ అడ్డుపడిందన్న ఆరోపణలు ఉన్నాయి. దానివల్ల ఉమ్మడి ఏపీకి చాలా నష్టం జరిగింది. అమెరికాలో అదానీ కేసు తేలకముందే ఇక్కడ రాజకీయ దుమారాన్ని సృష్టించుకుని పెట్టుబడులపై ప్రభావం పడేలా చేస్తారా అన్న చర్చ వస్తుంది.మరో వైపు చంద్రబాబు నాయుడు ఏపీలో జగన్ టైమ్ లో ఏదో ఘోరం జరిగిపోయినట్లు ప్రచారం చేస్తూ, అదే టైమ్‌లో అదానితో మాత్రం స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. జగన్ లేనిపోని ఆరోపణలు చేసే చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో కుదిరిన ఒప్పందం గురించి మాట్లాడదు. ఈ ఒప్పందం వల్ల రూ.లక్ష కోట్ల నష్టం వస్తుందని ఎల్లో మీడియా పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తోంది. ఈనాడు రాసింది నిజమే అయితే చంద్రబాబు వెంటనే సెకీ ఒప్పందాన్ని రద్దు చేయాలి కదా! అదానితో జగన్ ప్రభుత్వం అసలు ఒప్పందమే చేసుకోకపోయినా, ఎల్లో మీడియా తప్పుడు కథనాలు వండి వార్చుతోంది. అదానీ పై తన వైఖరి ఏమిటో చంద్రబాబు చెప్పరు.జగన్ టైమ్ లో సుమారు రూ.2.5 లక్షల కోట్ల విలువైన సౌర, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను చేపట్టడానికి అదాని ముందుకు వచ్చారు. వాటిని కాదనే ధైర్యం చంద్రబాబుకు ఉందా? అదానిని ఏమైనా అంటే అది మోడీకే తగులుతుందన్న భయంతో చంద్రబాబు వ్యవహరిస్తున్నట్లు తెలియడం లేదా? పోనీ జగన్ టైమ్ లో కుదిరిన అగ్రిమెంట్లను వదలివేసి కొత్తగా అదానితో ఎలాంటి ఒప్పందాలు ఉండబోవని చంద్రబాబు ప్రభుత్వం చెప్పగలుగుతుందా? అలాంటిది ఏమీ లేదు. పైగా అదానికి స్వయంగా ఎదురేగి స్వాగతం పలికి అనేక రంగాలతో పాటు అమరావతిలో కూడా పెట్టుబడులు పెట్టడానికి ఆ గ్రూపు ముందుకు వచ్చిందని చంద్రబాబు ఆనందంగా ప్రకటించారు. అంటే అదానితో స్నేహం ఉండాలి. కాని జగన్ ను మాత్రం అప్రతిష్టపాలు చేయాలన్నమాట. చంద్రబాబు వ్యూహంలోని డొల్లతనం ఇక్కడే బహిర్గతం అయిపోతోంది. అదానీ, అంబాని వంటి పెద్ద పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి పెట్టుబడి తెస్తూంటే ఎవరూ వద్దనలేని పరిస్థితి ఉంది. కాకపోతే పారిశ్రామికవేత్తలపై వచ్చే ఆరోపణలను తమ రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడానికి మాత్రం వాడుకుంటున్నారు.ఇక్కడ ఒక సంగతి గమనంలోకి తీసుకోవాలి. అంబానీ, అదాని తదితర బడా పారిశ్రామికవేత్తలను కాదని కాంగ్రెస్, బీజేపీలు ఏమీ చేయడానికి సిద్దపడవన్నది వాస్తవం. గతంలో కేంద్రంలో కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉన్నప్పుడు అంబానీకి వ్యతిరేకంగా అప్పటి కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి తీసుకున్న ఒక నిర్ణయం నేపథ్యంలో ఆయన శాఖే మారిపోయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు.ఈనాడు మీడియా ఇన్ని నీతులు వల్లిస్తుంటుంది కదా.. అంబానీకి వ్యతిరేకంగా ఒక్క వార్త ఇవ్వగలుగుతుందా? మార్గదర్శి అక్రమ డిపాజిట్ల కేసులో రామోజీకి అంబానీ సాయపడ్డారని చెబుతారు. ఇప్పుడు కూడా అంబానీ, అదానీలు బీజేపీకి సన్నిహితులే.కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అదానీపై విమర్శలు చేస్తున్నా, అధికారంలోకి వస్తే వారూ ఏమీ చేయరన్నది బహిరంగ రహస్యమే. అంబానీ, అదానీలను కాదంటే దాని ప్రభావం దేశ ఆర్ధిక వ్యవస్థపై పడే అవకాశం ఉంది. రాజకీయ దుమారం వేరు. వాస్తవ పరిస్థితి వేరు. ఇలాంటి పారిశ్రామికవేత్తలు రాజకీయాలను పరోక్షంగా శాసిస్తున్నారన్న అభిప్రాయం కూడా ఉంది. దీనికి రేవంత్ అయినా, చంద్రబాబు అయినా, మరెవరైనా అతీతం కాదన్నది నిజం.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
‘అదానీ’పై రగడ.. పార్లమెంట్ రేపటికి వాయిదా
పార్లమెంట్ శీతాకాల సమావేశాల రెండోరోజు బుధవారం(నవంబర్ 27) ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రారంభమైన కొద్దిసేపటికే ఉభయసభలు రేపటికి వాయిదాపడ్డాయి.పార్లమెంట్ ప్రారంభమవగానే విపక్షాల ఆందోళన కారణంగా తొలుత లోక్‌సభ గంటపాటు వాయిదా పడింది. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత విపక్షాలు శాంతించకపోవడంతో స్పీకర్ లోక్‌సభను గురువారానికి వాయిదా వేశారు. రాజ్యసభలోనూ విపక్షాలు అదానీ వ్యవహారంపై ఆందోళన చేశాయి.ఎంపీల నినాదాల మధ్యలో చైర్మన్ కొద్దిసేపు ప్రశ్నోత్తరాలను నిర్వహించినప్పటికీ తర్వాత సభను గురువారానికి వాయిదా వేశారు.అదానీ వ్యవహారంపై కాంగ్రెస్ వాయిదా తీర్మానం..అదానీ లంచాల వ్యవహారంపై చర్చించాలని కాంగ్రెస్ పార్టీ లోక్‌సభలో మళ్లీ వాయిదా తీర్మానం. అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలని ఇండియా కూటమి ఎంపీలు ఆందోళకు దిగారు.విపక్షాల ఆందోళనతో స్పీకర్ లోక్‌సభను గంట పాటు వాయిదా వేశారు.ఈ సమావేశాల్లో 16 బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో అత్యంత ముఖ్యమైన వక్ఫ్ సవరణ బిల్లును జాబితాలో చేర్చారు. జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లును మాత్రం పక్కనపెట్టారు. సోషల్ మీడియాను నియంత్రించేందుకు కఠిన చట్టాలు అవసరం: లోక్‌సభలో అశ్విని వైష్ణవ్సోషల్మీడియాను నియంత్రించాలంటే ఉన్న చట్టాలనే కఠిన తరం చేయాల్సిన అవసరం ఉందిఈ అంశంపై ఏకాభిప్రాయం సాధించే అంశం పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ పరిధిలో ఉంది.సోషల్‌మీడియాలో వాక్స్వాతంత్రం పేరిట ఏదిపడితే అది పోస్టు చేస్తున్నారుదీనిని నియంత్రించాల్సిన అవసరం ఉంది.ఎంపీ అరుణ్‌గోవిల్ అడిగిన ప్రశ్నకు లోక్‌సభలో సమాధానం ఇచ్చిన కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్విపక్షాల ఆందోళన మధ్యే సమాధానం చెప్పిన ఐటీ మంత్రి -
రాహుల్ తిట్టినందుకే అదానీ విరాళం వెనక్కి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘అదానీ నుంచి రూ.100 కోట్ల విరాళం తీసుకోవడంపై రాహుల్‌గాంధీ ఫోన్ చేసి తిడితే నష్ట నివారణ కోసం సీఎం రేవంత్‌రెడ్డి వెనక్కి తగ్గాడు. అదానీ విరాళంగా రూ.100 కోట్ల చెక్‌ను ఇచ్చి 38 రోజులు పూర్తయినా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు నగదుగా ఎందుకు మార్చుకోలేదు? చెక్ చూపించి వెనుక నుంచి డబ్బులు దోచుకునే కుట్ర జరుగుతోందా?..’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ప్రశ్నించారు. ‘అదానీ ఫ్రాడ్ అని రేవంత్‌కు ఇప్పుడే తెలిసిందా? అదానీని రాహుల్‌గాంధీ ఫ్రాడ్ అంటుంటే రేవంత్ మాత్రం ఫ్రెండ్ అంటూ రూ.12,400 కోట్ల ఒప్పందాలు చేసుకున్నాడు. కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టులను బీఆర్ఎస్కు అంటగడుతూ అసత్య ప్రచారం చేస్తున్న సీఎం తన పేరును అబద్ధాల రేవంత్‌రెడ్డిగా మార్చుకోవాలి..’ అని కేటీఆర్ అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో మాజీ మంత్రులు తలసాని, పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, మాగంటి గోపీనాథ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ అసలైన శాడిస్ట్..: ‘అదానీ విషయంలో రాహుల్‌గాందీకి, రేవంత్‌కు నడుమ ఏకాభిప్రాయం కనిపించడం లేదు. రాహుల్‌తో తిట్లు తిన్న అసహనంతో నన్ను రేవంత్ ఇష్టమొచ్చినట్లు తిడుతున్నాడు. చిట్టి నాయుడికి చిప్ దొబ్బినట్లు కనిపిస్తోంది. అదానీ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించేలా తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. రాష్ట్రంలో అదానీకి రెడ్ సిగ్నల్ ఇవ్వడమే కేసీఆర్ చేసిన తప్పా? తెలంగాణ వనరులను దొంగకు దోచిపెట్టడాన్ని ప్రశ్నించిన నేను సైకోనా? తాను తప్పులు చేసి మా మీద రుద్దే ప్రయత్నం చేస్తున్న రేవంత్ అసలైన శాడిస్ట్. రేవంత్ మాదిరిగా కాళ్లు పట్టుకోవడం, లుచ్చా పనులు చేయడం, మస్కా కొట్టడం, గౌతమ్ భాయ్ అంటూ తిరిగే రకం కాదు మేము. నేను దావోస్‌లో అదానీతో కలిసి దిగిన ఫోటోను బహిరంగంగా ట్విట్టర్లో పెట్టా. కానీ రేవంత్ తరహాలో ఆయనను ఇంటికి పిలుచుకుని నాలుగు గంటలు రహస్యంగా కలవలేదు. కోహెనూర్ హోటల్లో కాళ్లు పట్టుకోలేదు. అదానీ కాళ్లు ఒత్తుకుంటూ ఉండే అలవాటు నాకు లేదు..’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదానీకి అనుమతులపై అబద్ధాలు ‘సీఎం ప్రతి అంశంపైనా అవగాహన లేకుండా ఇష్టారీతిన మాట్లాడుతూ రాష్ట్ర గౌరవం మంటగలుపుతున్నాడు. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్‌ను అదానీతో ముడి పెడుతూ సీఎం ప్రెస్మీట్లు పెడుతున్నాడు. రక్షణ శాఖ, కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఇచ్చిన అనుమతులు బీఆర్ఎస్ ప్రభుత్వానికి అంటగడుతున్నాడు. డ్రై పోర్టు, విద్యుత్ ట్రాన్స్మిషన్ అనుమతులతో మాకు సంబంధం లేదు..’ అని మాజీమంత్రి స్పష్టం చేశారు. గురుకుల మరణాలన్నీ సర్కారు హత్యలే ‘గురుకుల పాఠశాలల్లో చదివే 48 మంది పిల్లలు చనిపోయినా సీఎం సమీక్ష నిర్వహించడం లేదు. గురుకుల విద్యార్థుల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే. కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ ఆత్మహత్యకు రేవంత్‌రెడ్డే కారణం..’ అని కేటీఆర్ ఆరోపించారు. జనతా గ్యారేజ్‌లా తెలంగాణ భవన్ బంజారాహిల్స్ (హైదరాబాద్): కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ ప్రజలపై పగ పెంచుకుని వేధిస్తోందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ, హైడ్రా బాధితులు, ఆటోడ్రైవర్లు తదితర నగర ప్రజలు.. ప్రభుత్వం పెడుతున్న బాధలు చెప్పుకునేందుకు తెలంగాణ భవన్‌కు వస్తున్నారని, తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్గా మారిందని చెప్పారు. ఈ నెల 29న నిర్వహించనున్న దీక్షా దివస్ కార్యక్రమానికి సంబంధించి హైదరాబాద్ జిల్లా సన్నాహక సమావేశాన్ని మంగళవారం తెలంగాణ భవన్లో నిర్వహించారు. ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వర్గం కూడా సంతోషంగా లేదని ఆయన విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందన్నారు. రేవంత్‌రెడ్డి ఎత్తైన కుర్చీలో కూర్చొని గొప్ప మనిíÙని కావాలని భావిస్తున్నాడని, కానీ కేసీఆర్‌లా ప్రజలకు మంచి చేసినప్పుడు మాత్రమే వారి గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకోగలమని గుర్తించడం లేదని అన్నారు. హైదరాబాద్‌ను నాలుగు ముక్కలు చేసే కుట్ర ఓఆర్ఆర్ లోపల ఉన్న హైదరాబాద్‌ను మూడు లేదా నాలుగు ముక్కలు చేయాలని సీఎం కుట్ర చేస్తున్నాడని కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్ ఇమేజ్ను డ్యామేజ్ చేసే కుట్రలో బీజేపీకి కూడా భాగం ఉందని అన్నారు. కాంగ్రెస్ తప్పుడు హామీలను నమ్మి మోసపోయామని ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారని చెప్పారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ అఖండ మెజార్టీ సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా ఇవ్వని ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్‌యాదవ్, పద్మారావుగౌడ్, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, పలువురు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. -
Gudivada Amarnath: దమ్ముంటే నిరూపించండి.. దేనికైనా సిద్ధం
-
సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి,హైదరాబాద్: రాహుల్ గాంధీ మొట్టికాయలు వేయడం వల్లే సీఎం రేవంత్ అదానీ ఇచ్చిన వంద కోట్లు తిరస్కరించాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. మంగళవారం(నవంబర్ 26) కేటీఆర్ తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు.‘కొసరు మాత్రమే తిరిగిస్తే సరిపోదు. 12,400కోట్లు ఒప్పందాల సంగతేంటి?రాహుల్,రేవంత్‌రెడ్డిలలో ఎవరు పిచ్చోళ్ళో వాళ్లే తేల్చుకోవాలి.ఇకపై అనుముల రేవంత్ రెడ్డి కాదు..అబద్దాల రేవంత్ రెడ్డి. మైక్రోసాఫ్ట్ డేటా ప్రాజెక్టును అదానీ డేటా సెంటర్ అని రేవంత్ అనడం హాస్యాస్పదం.తనకంటే చిన్నవాడిని కాబట్టి తిట్టినా పడతాను. కానీ కేసీఆర్‌ను అనడానికి రేవంత్‌కు ఎంత ధైర్యం?ఈడీ కేసు కోసం రేవంత్,అతని మంత్రుల లెక్క మేం అదానీ కాళ్ళు పట్టుకోలేదు.బ్యాగులు మోసిన గజ దొంగ రేవంత్‌రెడ్డి.చిట్టినాయుడికి చిప్ దొబ్బిందని నిన్నటి రేవంత్ కామెంట్స్ చూస్తే అర్థమవుతోంది.నేను సైకో అయితే..సీఎం రేవంత్ సన్నాసినా? శాడిస్టా? ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఢిల్లీ నుంచి 8 రూపాయలు కూడా తీసుకురాలేదు.28సార్లు ఢిల్లీ వెళ్ళి..రేవంత్ 28 రూపాయలు కూడా తీసుకురాలేదు.అదానీ జాతీయ రహదారులు,రక్షణ శాఖ పనులు చేస్తే మాకేం సంబంధం?రేవంత్‌లో సబ్జెక్టు,సరుకు ఉండదు. ఎవరైనా చెప్తే వినడు. దావోస్‌లో నేను అదానీని బరాబర్ కలిసిన. మీ మాదిరి కోహినూరులో కాళ్ళు పట్టుకోలేదు. కేసీఆర్ హాయాంలో అదానీని ఎప్పుడు ప్రోత్సహించలేదు.అదానీకి రేవంత్ రెడ్ కార్పెట్ వేస్తే..మేం రెడ్ సిగ్నల్ చూపించాం.మాజీ సర్పంచ్ సాయిరెడ్డిది సీఎం రేవంత్ సోదరులు చేసిన హత్యే. ఏడాదిగా అదానీ,అల్లుడు, అన్న,బావమరిదికి అమృతం పంచటం కోసమే రేవంత్ పనిచేస్తున్నాడు.రేవంత్‌రెడ్డి అసహనం,నిరాశ, నిస్పృహలో ఉన్నారు.ముఖ్యమంత్రి అయ్యాక కూడా రేవంత్‌కు కేసీఆర్,మా మీద ఫ్రస్టేషన్ ఎందుకు?కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 48 మంది గురుకుల విద్యార్థులు చనిపోయారు.వాంకిడి గురుకుల విద్యార్థి శైలజది ప్రభుత్వం చేసిన హత్యే.తల్లిదండ్రుల మాదిరి చూసుకోవాల్సిన ప్రభుత్వమే విద్యార్థులను చంపేస్తోంది.గురుకుల విద్యార్థుల హత్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతాం’అని కేటీఆర్ హెచ్చరించారు.ఇదీ చదవండి: అదానీ నిధులు వద్దన్నాం: సీఎం రేవంత్ -
సీఎం అయ్యాక కూడా మాపై ఎందుకంత ఫ్రస్టేషన్..?
-
అంతా ఓకే.. కేవలం వ్యక్తులపైనే ఆరోపణలు..
అదానీ గ్రూప్‌పై అమెరికాలో నమోదైన లంచాల ఆరోపణల నేపథ్యంలో ఇన్వెస్ట్మెంట్ సంస్థ జీక్యూజీ పార్ట్నర్స్, ఫ్రాన్స్ ఇంధన రంగ దిగ్గజం టోటల్ ఎనర్జీస్ తాజాగా స్పందించాయి. గతేడాది యూఎస్ షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ ఆరోపణల తదుపరి అదానీ గ్రూప్‌లో జీక్యూజీ పార్ట్నర్స్ భారీగా ఇన్వెస్ట్ చేసింది. టోటల్ ఎనర్జీస్ అదానీ గ్రూప్‌తో భాగస్వామ్య కంపెనీని కలిగి ఉంది. కాగా.. అదానీ గ్రూప్‌లోని తమ పెట్టుబడులన్నీ అత్యంత లాభదాయకంగా ఉన్నట్లు జీక్యూజీ తెలియజేసింది. యూఎస్‌లో కేవలం వ్యక్తులపైనే లంచాల ఆరోపణలు నమోదైనట్లు ప్రస్తావించింది.తాము పెట్టుబడులు చేపట్టిన అదానీ గ్రూప్ పటిష్టంగానే ఉన్నట్లు జీక్యూజీ పేర్కొంది. విడిగా గ్రూప్ కంపెనీల బిజినెస్ మూలాలు పటిష్టంగా ఉన్నట్లు అభిప్రాయపడింది. అదానీ గ్రూప్‌లో జీక్యూజీ 8 బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడులను కలిగి ఉంది. అంతక్రితం వాల్‌మార్ట్, ఒరాకిల్, సీమెన్స్, ఫైజర్, హనీవెల్ తదితర పలు గ్లోబల్ కంపెనీలు, ఎగ్జిక్యూటివ్‌లపై సైతం వివిధ ఆరోపణలను ఎదుర్కొన్నట్లు పేర్కొంది.పెట్టుబడుల నిలిపివేతమరోవైపు అదానీ గ్రూప్ అత్యున్నత అధికారులపై లంచాల ఆరోపణల నేపథ్యంలో ఫ్రెంచ్ దిగ్గజం టోటల్ ఎనర్జీస్ ప్రస్తుతానికి తాజా పెట్టుబడులను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. అదానీ టోటల్ గ్యాస్‌తోపాటు అదానీ గ్రీన్ ఎనర్జీలోనూ ఫ్రెంచ్ దిగ్గజానికి పెట్టుబడులున్న సంగతి తెలిసిందే. అదానీ టోటల్ గ్యాస్‌లో 37.4 శాతం వాటాను కలిగి ఉంది. అదానీ గ్రీన్ ఎనర్జీలోనూ టోటల్‌కు 19.75 శాతం వాటా ఉంది.ఇదీ చదవండి: ఆరు నెలల్లో భారీగా ఉపాధి అవకాశాలుఆర్థికంగా పటిష్టం: అదానీ గ్రూప్తగినంత నగదు నిల్వలు, లాభార్జన నేపథ్యంలో ఆర్థికంగా పటిష్టంగా ఉన్నట్లు అదానీ గ్రూప్ తాజాగా వెల్లడించింది. దీంతో రుణ చెల్లింపులకు సమస్యలు ఎదురుకాబోవని స్పష్టం చేసింది. అంతేకాకుండా వృద్ధి అవకాశాలకు సైతం నిధులు సరిపోతాయని తెలియజేసింది. తద్వారా ఇన్వెస్టర్లకు భరోసానిచ్చింది. కంపెనీ అత్యున్నత ఎగ్జిక్యూటివ్‌లపై యూఎస్‌లో లంచాల ఆరోపణలు వెలువడిన కారణంగా ఇన్వెస్టర్లకు ఒక నోట్లో కంపెనీ ఆర్థిక పరిస్థితులను కంపెనీవద్ద రూ.55,024 కోట్ల నగదు నిల్వలున్నాయని, ఇవి రాగల 28 నెలల్లో చేపట్టవలసిన దీర్ఘకాలిక రుణ చెల్లింపులకంటే అధికమని తెలియజేసింది. గత ఆరు నెలల్లో గ్రూప్ రూ.75,227 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు పేర్కొంది. అయితే ఇదేసమయంలో మొత్తం రుణ భారం రూ.16,882 కోట్లు మాత్రమే పెరిగినట్లు వెల్లడించింది. -
అదానీ నిధులు వద్దన్నాం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్కిల్స్ యూనివర్సిటీ కోసం అదానీ సంస్థ ఇస్తామని ప్రకటించిన రూ. 100 కోట్లను తీసుకోవడం లేదని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అదానీ గ్రూపు విషయంలో వివాదాలు, జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అయితే పక్క రాష్ట్రాల్లో జరుగుతున్న వివాదాలకు, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధం లేదని పేర్కొన్నారు. సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేల్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు జంగా రాఘవరెడ్డి, రోహిణ్‌రెడ్డి, సామా రామ్మోహన్‌రెడ్డిలతో కలిసి రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. జర్నలిస్టులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. సదుద్దేశంతో ప్రారంభించిన స్కిల్ వర్సిటీ వివాదాలకు లోనుకావడం తమకు ఇష్టం లేదని.. అనవసర వివాదాల్లోకి రాష్ట్ర ప్రభుత్వాన్ని, తమను లాగొద్దని విజ్ఞప్తి చేశారు. రాజకీయ పార్టీలు ఈ వ్యవహారాన్ని రాజకీయ కోణంలో చూడటం ద్వారా నిరుద్యోగులకు నష్టం చేసే వైఖరిని అవలంబించవద్దని విజ్ఞప్తి చేశారు. ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి కార్పస్ ఫండ్ కింద నిధులు ఇచ్చేందుకు చాలా సంస్థలు ముందుకొచ్చాయని సీఎం రేవంత్ చెప్పారు. అలాగే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద రూ.100 కోట్లు ఇచ్చేందుకు అదానీ సంస్థ ముందుకొచ్చిందని తెలిపారు. కానీ అదానీ సంస్థ అదేదో తెలంగాణ రాష్ట్రానికో, ముఖ్యమంత్రికో అప్పనంగా రూ.100 కోట్లు ఇచ్చినట్టు చర్చ జరుగుతోందన్నారు. ‘‘అదానీ సహా ఇప్పటివరకు ఏ సంస్థ నుంచి తెలంగాణ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. అదానీ సంస్థ నుంచి నిధులు తీసుకున్నారంటూ వ్యక్తిగతంగా నా గురించి చర్చ జరగడం నాకు, కేబినెట్ సహచరులకు ఇష్టం లేదు. అందుకే మా అధికారి జయేశ్‌రంజన్ ద్వారా అదానీ సంస్థకు లేఖ రాశాం. ఆ సంస్థ ప్రకటించిన రూ.100 కోట్లు స్వీకరించడానికి సిద్ధంగా లేమని, ఆ నిధులు ప్రభుత్వానికి బదిలీ చేయవద్దని ఆ లేఖలో స్పష్టం చేశాం’’ అని రేవంత్ తెలిపారు. ఒప్పందాల రద్దు అంత సులువుకాదు అదానీ గ్రూపుతో గతంలో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకుంటారా? అని మీడియా ప్రశ్నించగా.. అది అంత సులువైనది కాదని, అలా రద్దు చేసుకుంటే వారు కోర్టులకు వెళ్లే అవకాశం ఉంటుందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ‘‘అయినా అదానీ ఫ్లైట్‌లో ఆడంబరంగా తిరిగింది వాళ్లు. కేసీఆర్‌లా మేం అదానీ నుంచి అప్పనంగా తీసుకోలేదు. అదానీతో ఎన్నో ఒప్పందాలు చేసుకున్నవారు మాపై ఆరోపణలు చేస్తున్నారు. అసలు పెట్టుబడుల విషయంలో వారి విధానమేంటి? పెట్టుబడులు రాకపోతే తీసుకురాలేదంటారు. తెస్తే రద్దు చేసుకోవాలంటారు. అంటే గత ప్రభుత్వం అదానీ గ్రూపుతో జాతీయ రహదారులు, డేటా సెంటర్ల ఏర్పాటు కోసం ఒప్పందాలు చేసుకున్నందుకు కేసీఆర్‌ను ప్రాసిక్యూట్ చేయాలా? వారి మీద కూడా కేసులు పెట్టాలా?’’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. వాళ్ల కాకిగోలను పట్టించుకోబోం పెట్టుబడుల విషయంలో తాము ఎవరికీ ఆయాచిత లబ్ధి చేకూర్చబోమని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ‘‘2023లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. 2024లో డిపాజిట్లు కోల్పోయింది. ఇప్పుడు మెదడు కోల్పోయింది. మీ కడుపు మంట మాకు తెలుసు. మీ దుఃఖం మాకు తెలుసు. మీ కాకిగోలను పట్టించుకోం. మీలాంటి వాళ్లు అరుస్తుంటే మాకు ఉత్సాహం వస్తుంది. మా కార్యకర్తలు సంతోషపడతారు. మీ క్షోభను చూస్తుంటే అప్పుడప్పుడు కోపం వస్తుంది. అయినా ఏకాగ్రత, కార్యదీక్షతో మేం ముందుకెళుతున్నాం’’ అంటూ బీఆర్ఎస్ నేతలను ఎద్దేవా చేశారు. ఆ ఎన్నికల్లో వచ్చింది లేదు.. పోయింది లేదు జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఉప ఎన్నికలపై రేవంత్‌రెడ్డి స్పందిస్తూ... ఆ ఎన్నికల వల్ల ఎవరికీ వచ్చింది లేదని, ఎవరికీ పోయింది లేదని పేర్కొన్నారు. ‘‘మహారాష్ట్రలో బీజేపీ కూటమికి ఎక్కువ సీట్లు వచ్చాయి. జార్ఖండ్‌లో ఇండియా కూటమికి ఎక్కువ సీట్లు వచ్చాయి. కర్ణాటక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. బెంగాల్లో బీజేపీ డిపాజిట్లు కోల్పోయింది. దేశంలోని రెండు లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ప్రజలు మోదీని ఓడించి రాహుల్, ఖర్గేల నాయకత్వాన్ని బలపర్చారు. కేరళలోని వాయనాడ్ నుంచి ప్రియాంకా గాంధీ భారీ మెజార్టీతో గెలిచారు. మహారాష్ట్రలోని నాందేడ్ లోక్‌సభ స్థానాన్ని మేమే గెలిచాం. దీన్నిబట్టి దేశ ప్రజలు మోదీ నాయకత్వాన్ని, కిషన్‌రెడ్డిని ఛీ కొట్టారని అర్థమవుతోంది. అయినా కిషన్‌రెడ్డి ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. ఆయనను కేంద్ర మంత్రిగా చేయడం తెలంగాణ దురదృష్టం..’’ అని రేవంత్ విమర్శించారు. పైరవీల కోసం కాదు.. పెళ్లి కోసం ఢిల్లీ వెళ్తున్నా.. తాను ఢిల్లీ వెళ్లినప్పుడల్లా మంత్రివర్గ విస్తరణ గురించి వార్తలు వస్తున్నాయని సీఎం రేవంత్ అన్నారు. ఇప్పుడు తాను ఢిల్లీకి వెళ్తోంది లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె వివాహం కోసమని చెప్పారు. సోమవారం రాత్రి వివాహానికి హాజరై... మంగళవారం ఉదయం తెలంగాణ ఎంపీలతో సమావేశమవుతామన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, దీర్ఘకాలం నుంచి పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల గురించి పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించే వ్యూహంపై చర్చిస్తామని చెప్పారు. అందుబాటులో కేంద్ర మంత్రులెవరైనా ఉంటే కలుస్తామన్నారు. అయితే తాము బీఆర్ఎస్ నేతల్లా పైరవీలు చేసేందుకు, కాళ్లు పట్టుకునేందుకు, కేసుల నుంచి తప్పించుకునేందుకో, మోదీ ముందు మోకరిల్లేందుకో ఢిల్లీకి వెళ్లడం లేదని పేర్కొన్నారు. కేంద్రాన్ని నిలదీసి అయినా నిధులు తెచ్చుకునేందుకు వెళుతున్నామని.. ఎన్నిసార్లయినా వెళ్తామని రేవంత్ చెప్పారు. కేంద్రం సమాఖ్య స్ఫూర్తితో ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు ఇవ్వాలని ఇవ్వాలని... అదేమీ బీజేపీ ఖజానా కాదని వ్యాఖ్యానించారు. ఏ ఎన్నికలైనా బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహించాలనేది కాంగ్రెస్ పార్టీ విధానమని, తనది కూడా అదే అభిప్రాయమని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కేటీఆర్ జైలుకెళ్లినా సీఎం అయ్యే చాన్స్ లేదు! ఎప్పుడెప్పుడు జైలుకు పోదామా అని కేటీఆర్ ఎదురుచూస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ‘‘జైలుకు వెళ్లినవారంతా ముఖ్యమంత్రులు అయ్యారని పేపర్లలో వార్తలు చూసి తాను కూడా జైలుకెళితే ముఖ్యమంత్రి అవుతానని కేటీఆర్ అనుకుంటున్నారు. కానీ కేటీఆర్ కన్నా ముందు ఆయన చెల్లెలు కవిత జైలుకు వెళ్లింది. ఇప్పుడిక సీఎం అవకాశం కూడా కేటీఆర్‌కు లేదు. సీఎం పోస్టు కోసం కేసీఆర్ కుటుంబంలో పోటీ ఎక్కువైంది. పదేళ్లు మంత్రిగా పనిచేసిన వ్యక్తి తెలివిని వాడాలి. చిల్లర ఆలోచనలు మానాలి. ఏ ఎల్లయ్యో, పుల్లయ్యో, బోడిగాడో చెప్పినట్టు ప్రభుత్వం వ్యవహరించదు. ఇక నుంచి ఆయన పేరును సైకో రామ్‌గా ఫిక్స్ చేయండి’’ అని ఎద్దేవా చేశారు. -
Adani Case: వైఎస్ జగన్‌పై వచ్చిన ఆరోపణలపై కాకాణి గోవర్ధన్‌రెడ్డి క్లారిటీ
-
‘పవన్ ప్రాపకం కోసమే బాలినేని అబద్ధాలు’
సాక్షి,నెల్లూరు:అదానీ విషయంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌జగన్‌పై బురదజల్లే ప్రయత్నం జరుగుతోందని,అయన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ప్రచారంలో ఉన్నవన్నీ అభూతకల్పనలేనని కొట్టి పారేశారు. నెల్లూరులో కాకాణి సోమవారం(నవంబర్ 25) మీడియాతో మాట్లాడారు.‘అప్పట్లో కాంగ్రెస్‌తో కుమ్మక్కై జైల్లో పెట్టించారు. లక్షల కోట్ల అవినీతి అంటూ అబద్ధాలు చెప్పారు. 2024 తర్వాత కూడా ఆవే కుట్రలు చేస్తున్నారు.సెకీకి,అదానీకి మధ్య జరిగిన దాన్ని వైఎస్ జగన్‌పై నెట్టేస్తున్నారు. గత ప్రభుత్లో ఒప్పందం కుదుర్చుకుంది సెకీతో మాత్రమే. తాము అదానీతో ఒప్పందం కుదుర్చుకున్న దాఖలాలు లేవు. 2021 సెప్టెంబర్ 15న యూనిట్ 2రూపాయల49పైసలకే విద్యుత్ ఇస్తామని ఏపీ ప్రభుత్వానికి సెకీ లేఖ రాసిందని కాకాణి గుర్తు చేశారు. ఇంకా కాకాణి ఏమన్నారంటే.. జగన్‌పై కుట్ర:గత కొద్ది రోజులుగా వైఎస్ జగన్ లక్ష్యంగా అదానీపై యూఎస్‌లో చేసిన ఆరోపణలను పట్టుకుని బురద జల్లాలని చూస్తున్నారు. జగన్ పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచే కాంగ్రెస్‌తో కుమ్మక్కైన చంద్రబాబు, ఆయనను అక్రమ కేసులతో, జైలుకు పంపిన విషయం అందరికీ తెలుసు. లక్ష కోట్లు అవినీతి అని దుష్ప్రచారం చేసిన చంద్రబాబు అండ్ కో ఒక్కో సున్నా తగ్గించుకుంటూ పోయి, చివరకు అసలు అవినీతి జరిగిందని కూడా తేల్చలేకపోయారు. ఇప్పుడు కూడా అదానీ కంపెనీ వ్యవహారంలో జగన్‌గారి పేరు లేదు. అయినా ఒక రిపోర్టు ఆధారంగా బురద జల్లడం కోసం అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నారు. యూఎస్‌కు సంబంధించిన హిండెన్‌బర్గ్‌కు, అదానీకి మధ్య జరిగిన విషయాన్ని తెచ్చి ఏం సంబంధం లేకుండా మా నాయకులకు ముడిపెట్టి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఆ నిరాధార ఆరోపణలతో ఈనాడు తప్పుడు కథనాలు రాస్తోంది.సెకీతో ప్రభుత్వ ఒప్పందంవైయస్సార్సీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ ఇండియా’ (సెకీ)తో మాత్రమే ఒప్పందం చేసుకుంది. అంతేతప్ప, అదానీ కంపెనీతో కాదు.అలాంటప్పుడు అదానీ కంపెనీలకు, జగన్‌గారికి ఏం సంబంధం?.అదానీ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి లావాదేవీలు జరపలేదు. సెప్టెంబర్ 15, 2021న కేంద్ర ప్రభుత్వం సంస్థ సెకీ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. రూ.2.49కి సోలార్ పవర్ ఇస్తామని ఆ లేఖలో పేర్కొన్నారు. దీనిపై క్యాబినెట్లో సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్న తర్వాత, అన్ని అంశాల అధ్యయనం కోసం ఎనర్జీ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారు.నెల రోజుల తర్వాత ఆ కమిటీ నివేదికపై మరోసారి చర్చించిన క్యాబినెట్, రైతులకు 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించేలా సెకీ నుంచి పవర్ కొనాలని నిర్ణయించారు.ఆ మేరకు 6400 మెగావాట్లకు సంబంధించి సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దాన్ని కూడా చంద్రబాబు కోర్టుకెళ్లి అడ్డుకున్నారు.అలా న్యాయ పరమైన చిక్కులు ఏర్పడుతున్న కారణంగా టెండర్ల సమస్య ఉన్న నేపథ్యంలో, ఆ బాధ్యత తామే తీసుకుంటామన్న సెకీ, 2024 సెప్టెంబరులో 3వేల మెగావాట్లు, 2025లో 3వేల మెగావాట్లు, 2026లో మరో 3వేల మెగావాట్లు.. మొత్తం 9వేల మెగావాట్లు ఇస్తామని హామీ ఇస్తూ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది.తక్కువ ధరకు కొంటే తప్పు చేసినట్లా!:ఒకవేళ వైయస్సార్సీపీ ప్రభుత్వం ఆరోజు సెకీతో ఒప్పందం చేసుకోకపోయి ఉంటే, కచ్చితంగా మరో విధంగా విమర్శ చేసేవాళ్లు. రూ.2.49కే యూనిట్ విద్యుత్ ఇస్తామన్నా, ప్రభుత్వం లాలూచీ పడి తీసుకోలేదని రాసే వారు.నరం లేని నాలుకను ఎటైనా తిప్పి మాట్లాడతారు. దాన్ని ఇష్టారీతిన ప్రచారం చేసే మీడియా వారికి ఎలాగూ ఉంది. 2014–19 మధ్య చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు విద్యుత్ కొనుగోలులో యూనిట్ విద్యుత్‌కు సగటున రూ.5.10 చెల్లించారు.అదే మా ప్రభుత్వ హయాంలో రూ.2.49కే కొనుగోలు చేస్తే, మంచి చేసినట్లా? లేక తప్పు చేసినట్లా?.చంద్రబాబు హయాంలో అడ్డగోలు ఒప్పందాలు:సోలార్ పవర్‌కు సంబంధించి 2014 వరకు 11 పీపీఏలు ఉండగా, చంద్రబాబు అయిదేళ్లలో 2400 మెగావాట్లకు సంబంధించి 35 పీపీఏలు చేసుకున్నారు. వాటి విలువ రూ.22,868 కోట్లు .2014లో యూనిట్ సోలార్ విద్యుత్‌ను దాదాపు రూ.7కు కొనుగోలు చేశారు. 2016లో 1500 మెగావాట్లకు రూ.3.74 నుంచి రూ.4.84 వరకు అగ్రిమెంట్లు జరిగాయి. సెకీ తక్కువకు ఇస్తామని చెప్పినా వినకుండా అంత భారీ రేట్లకు కొనుగోలు చేశారు. దాని వల్ల విద్యుత్ పంపిణీ వ్యవస్థలు (డిస్కమ్‌లు) నాశనం అవుతున్నా, కేంద్రం చెప్పినా పట్టించుకోలేదు. ఇక 2016లో యూనిట్ విద్యుత్ రూ.4.50 చొప్పున 500 మెగావాట్ల కొనుగోలు చేసేలా, సెకీతో ఒప్పందం చేసుకున్నారు. ఇంతకన్నా దౌర్భగ్యం ఎక్కడైనా ఉందా? మా ప్రభుత్వంలో కన్నా రూ.2 చొప్పున ఎక్కువ చెల్లించి కొనడం ఏమిటో?.2019–20 నాటికి విద్యుత్ కొనుగోలుకు సంబంధించి రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చిన టారిఫ్‌ల ధర రూ.4.63 నుంచి రూ.5.90 వరకు నిర్ధారించింది. చంద్రబాబు బ్రహ్మాండంగా చేయడం అంటే అధిక ధరలకు కొనుగోలు చేయడమా..?విద్యుత్ రంగంలో చంద్రబాబు నిర్వాకం:2014–19 మధ్య విద్యుత్ రంగంలో చంద్రబాబు నిర్వాకం చూస్తే.. ఉచిత విద్యుత్‌కు సంబంధించి దాదాపు రూ.8845 కోట్ల బకాయిలు పెట్టాడు. విద్యుత్ ఉత్పత్తిదారులకు సంబంధించి దాదాపు రూ.21,541 కోట్లు బకాయిలు పెట్టాడు.చంద్రబాబు రాకమునుపు రూ.29,552 కోట్లు ఉన్న విద్యుత్ రంగం బకాయిలు ఆయన దిగిపోయే నాటికి రూ.86,215 కోట్లకు చేరాయి.ఇదేనా సమర్థవంతమైన పాలన. ఆయన హయాంలో విద్యుత్ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని చెప్పడానికి ఈ లెక్కలే ఉదాహరణ.సెకీతో ఒప్పందానికి ముందు యూనిట్ కరెంట్‌కి సంబంధించి రూ.2.49 నుంచి రూ.2.58 వరకు 58 బిడ్లు దాఖలయ్యాయి. అయితే అంత తక్కువ రేటుకు ఏపీ ప్రభుత్వానికి రావడం ఇష్టం లేని చంద్రబాబు, వాటన్నింటినీ కోర్టులను ఆశ్రయించి అడ్డుకున్నారు.చివరకు సెకీతో యూనిట్ పవర్ రూ.4.50కి కొనుగోలు చేసేలా ఒప్పందం చేసుకున్నారు.అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు అబద్ధాలు:రాష్ట్ర చరిత్రలో అతి తక్కువ వ్యయానికి యూనిట్ విద్యుత్ రూ.2.49కి కొనుగోలు ఒక గొప్ప విషయం. అది కూడా ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జీలు మినహాయించి 25 ఏళ్లకు ఒప్పందం చేసుకోవడం జరిగింది.ఇది జగన్‌గారి ప్రభుత్వ గొప్పతనం. అయితే ఎక్కడ ఆయనకు మంచి పేరొస్తుందనే సాకుతో, ఆ ఒప్పందం మీద అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు.ఇవన్నీ పబ్లిక్ డాక్యుమెంట్లు. ఎవరైనా దాచేస్తే దాగేవి కావు. ఆ చరిత్రాత్మక ఒప్పందం వల్ల 25 ఏళ్ల పాటు ఏటా రూ.4వేల కోట్ల చొప్పున 25 ఏళ్లలో లక్ష కోట్లు ఆదా అవుతుంది.గతి తప్పి ఈనాడు దిగజారుడు రాతలు:ఆ అంశాలన్నింటినీ మరుగున పెడుతున్న ఈనాడు, గుజరాత్లో యూనిట్ విద్యుత్ రూ.1.99కే కొంటున్నారని రాస్తోంది. మరి ఇంటర్ ట్రాన్స్మిషన్ ఛార్జీలు ఈనాడు భరిస్తుందేమో చెప్పాలి.ఈనాడు రాతలు చూస్తుంటే, టీడీపీ ఆఫీసులో చంద్రబాబు తయారు చేసి పంపిస్తున్న స్క్రిప్ట్‌లను వారు అచ్చేస్తున్నారనిపిస్తుంది.గుజరాత్ ఊర్జ్య వికాస్ నిగమ్ లిమిటెడ్ కొన్న ధరలు చూపించి రూ. 1.99లకే కొన్నారని ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి కోవిడ్ సమయంలో కొనేవారు లేక గుజరాత్లో సోలార్ ప్యానెళ్ల ధరలు తగ్గిపోయాయి. దాన్ని ఈనాడు సాకుగా చూపించి 50 పైసలు అదనంగా కొన్నారని మరో తప్పుడు ప్రచారం చేస్తోంది.పవన్ ప్రాపకం కోసమే బాలినేని అబద్ధాలు:సెకీతో ఒప్పందంపై బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడారని దాన్ని పెద్ద భూతంలా ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ దయతో ఎమ్మెల్యే అయ్యారు. మంత్రి అయ్యారు. మా జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా పనిచేశారు. ఆయనతో మాకు చాలా చనువుంది. ఇంత దారుణంగా మాట్లాడతారని ఊహించలేదు.పవన్ కళ్యాన్ దగ్గర మెహర్బానీ కోసం ఈ ఆరోపణలు చేసి ఉంటాడనిపిస్తుంది. వైఎస్ జగన్ గురించి, ఆయన ప్రభుత్వం గురించి మాట్లాడటానికి ఆయనకి ఎలా మనసొప్పిందో ఆయన ఆలోచించుకోవాలి. మంత్రివర్గంలో నిర్ణయాలు ఎజెండాలు ఎలా ఉంటాయో ఆయనకు తెలియకపోవడం విడ్డూరం. టేబుల్ అజెండా కింద మంత్రులు అడిగిన అంశాలను వారి నియోజకవర్గ అంశాలను చేర్చడం మీకు తెలియదా?అర్థరాత్రి ఫైల్ వచ్చిందని బాలినేని పచ్చిఅబద్ధాలు చెబుతున్నారు. ఆ సమయంలో ఈ–ఫైలింగ్ విధానం ఉండగా ఇలా దారుణంగా మాట్లాడటం బాలినేనికి తగదు. ఎవరి దగ్గర నీ స్థాయి పెంచుకోవడానికి మాట్లాడుతున్నావో, ఏ ప్రయోజనాలు ఆశిస్తున్నావో మాకు అనవసరం.. కానీ వాటి కోసం మా నాయకుడి మీద బురద జల్లడం భావ్యం కాదు. తెలుగు ప్రాచీన విశిష్ట అధ్యయన కేంద్రం నా నియోజకవర్గంలోకి వచ్చింది. దానిపై కేంద్రంతో ఇబ్బందులొస్తే టేబుల్ అజెండా కింద చేర్చి భూముల కొనుగోలుకు కూడా నిధులు మంజూరు చేయించారు. ఇలాంటివి ప్రతి మంత్రికి ఎదురైన అనుభవాలే. మనం ఏదైనా అడిగితే కాదని లేదన్న సందర్భాలున్నాయా..?ఈనాడుకు ఆ అర్హత ఉందా?:సిగ్గు, బుద్ధి లేని ఈనాడు యాజమాన్యం మార్గదర్శి పేరుతో నిబంధనల విరుద్దంగా డిపాజిట్లు సేకరించి సుప్రీంకోర్టు ముందు దోషిగా నిలబడిన వీరికి వైఎస్ జగన్ మీద ఆయన ప్రభుత్వం మీద విమర్శించే అర్హత ఉందా? ఈనాడు పత్రికకు ఉన్న క్రెడిబులిటీ ఎప్పుడో పోయింది. నాకు కూడా సీబీఐ కేసులో క్లీన్ చిట్ వస్తే.. ఆ సీబీఐనే ఈనాడు విమర్శించింది. వారికి అవసరం ఉన్నప్పుడు మాత్రం సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తుంటారు. వాస్తవాలతో వీరికి అవసరం లేదు. టీడీపీకి అనుకూలంగా చంద్రబాబు రాజకీయ అజెండాతో వార్తలు రాయడమే వీరి పని. జగన్ ఎంత మంచి పని చేసినా దాన్ని తప్పుగా వెతకాలి. బురద జల్లాలి. చంద్రబాబును హీరోగా చూపించాలి.మొన్నటిదాకా జగన్ ప్రభుత్వంలో పెట్టుబడులే రాలేదని ప్రచారం చేశారు. ఇప్పుడు మాత్రం అదానీ చేత రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టించారని రాస్తున్నారు. అవసరాన్ని బట్టి ఎప్పటికప్పుడు ఈనాడులో నిజాలు మారిపోతుంటాయని కాకాణి గోవర్థన్‌రెడ్డి ఆక్షేపించారు. -
అదానీకి యూఎస్ ఎస్ఈసీ సమన్లు
అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన బంధువు సాగర్లకు యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజీ కమిషన్(యూఎస్ ఎస్ఈసీ) సమన్లు అందజేసినట్లు పీటీఐ తెలిపింది. అయితే విదేశీ పౌరులకు సమన్లు జారీ చేసి వారిని పిలిపించే అధికారం యూఎస్ ఎస్ఈసీకి లేదని కొందరు అధికారులు అభిప్రాయపడుతున్నారు.సోలార్ పవర్ ప్రాజెక్ట్‌లకు సంబంధించి అదానీ సహా మరో ఏడుగురు అధికారులు భారత ఉన్నతాధికారులకు లంచం ఇచ్చారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో సదరు అదానీ గ్రూప్ అధికారులపై అమెరికాలో కేసు నమోదైంది. అమెరికాకు చెందిన ఇన్వెస్టర్లు అదానీ గ్రీన్ వంటి కంపెనీల్లో పెట్టుబడి పెట్టడంతో యూఎస్ ఎస్ఈసీకి ఈమేరకు ఫిర్యాదు అందింది. దాంతో దర్యాప్తు జరిపి అధికారులకు లంచం ఇవ్వజూపారని ప్రాథమికంగా తేల్చారు. ఈ కేసును మరింత సమగ్రంగా విచారిస్తున్నారు.ఇదీ చదవండి: ‘ఆరోగ్య నిధి’ ప్రాధాన్యం తెలుసా?ఈ నేపథ్యంలో అహ్మదాబాద్‌లోని అదానీ శాంతివన్ ఫామ్ హౌస్, ఇదే నగరంలోని సాగర్‌కు చెందిన బోదక్దేవ్ నివాసానికి సమన్లు పంపినట్లు సమాచారం. ఈ సమన్లకు 21 రోజుల్లోగా సమాధానం ఇవ్వాల్సి ఉందని విశ్వసనీయ సమచారం. ఒకవేళ వీటికి స్పందించకపోతే వారికి వ్యతిరేకంగా తీర్పు వెలువడుతుందని అందులో అధికారులు తెలిపారు. -
ఎలాంటి తప్పులకు పాల్పడలేదు
న్యూఢిల్లీ: అదానీ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ గౌతమ్ అదానీపై యూఎస్‌లో నమోదైన లంచంఅభియోగంపై గ్రూప్ సీఎఫ్‌వో జుగేశిందర్ రాబీ సింగ్ ఎక్స్ వేదికగా స్పందించారు. 11 లిస్టెడ్ సంస్థలతో కూడిన అదానీ గ్రూప్ పోర్ట్‌ఫోలియో కంపెనీల్లో ఏ ఒక్కటీ ఎలాంటి తప్పులకు పాల్పడలేదని ఆయన స్పష్టం చేశారు. న్యాయపరమైన ఆమోదాలు పొందిన తర్వాత యూఎస్‌లో నేరారోపణపై అదానీ గ్రూప్ వివరణాత్మక వ్యాఖ్యను చేస్తుందని సింగ్ చెప్పారు. ‘సంబంధం లేని అంశాలను ఎంచుకుని, శీర్షిక సృష్టించడానికి ప్రయత్నించే వార్తలు, నివేదికలు చాలా ఉన్నాయి. లీగల్ ఫైల్లో సమర్పించిన విషయాన్ని మేము వివరంగా సమీక్షించిన తర్వాత పూర్తి సమయంలో ప్రతిస్పందిస్తాం. నేరారోపణపై ఏ న్యాయస్థానం ఇంకా తీర్పు ఇవ్వలేదు. యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ యొక్క న్యాయవాదులు వివరించినట్లుగా ఇవి ఆరోపణలు మరియు నిందితులు నిర్దోషిగా భావించబడతారు. నేరారోపణ అదానీ గ్రీన్ యొక్క ఒక ఒప్పందానికి సంబంధించినది. ఇది అదానీ గ్రీన్ యొక్క మొత్తం వ్యాపారంలో దాదాపు 10 శాతం. దీని గురించి చాలా ఖచ్చితమైన, సమగ్రమైన వివరాలు ఉన్నాయి. మేము తగిన వేదికలో విశదీకరిస్తాము’ అని జుగేశిందర్ రాబీ సింగ్ వివరించారు. అదానీ చైర్మన్‌కు సమన్లున్యూయార్క్: యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ కమీషన్ (ఎస్ఈసీ) చేసిన లంచం ఆరోపణలపై తమ వైఖరిని వివరించాల్సిందిగా అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ గౌతమ్ అదానీ మరియు అతని మేనల్లుడు, అదానీ గ్రీన్ ఎనర్జీ డైరెక్టర్ సాగర్లకు సమన్లు అందాయి. 21 రోజుల్లోగా ఎస్ఈసీకి సమాధానం ఇవ్వాలని న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి అహ్మదాబాద్‌లోని అదానీ శాంతివన్ ఫామ్ నివాసానికి, అదే నగరంలోని అతని మేనల్లుడు సాగర్ నివాసానికి సమన్లు జారీ అయ్యాయి.కెన్యాలో విమానాశ్రయ నిర్వహణ ఒప్పందం కుదుర్చుకోలేదుకెన్యా ప్రధాన విమానాశ్రయాన్ని నిర్వహించడానికి తాము ఎటువంటి ఒప్పందాన్ని కుదుర్చుకోలేదని అదానీ గ్రూప్ స్పష్టం చేసింది. యూఎస్‌లో లంచం ఆరోపణల నేపథ్యంలో 2.5 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఒప్పందాలను కెన్యా రద్దు చేసిందనే వార్తలపై బిలియనీర్ గౌతమ్ అదానీ గ్రూప్ శనివారం స్పందించింది. కెన్యా అధ్యక్షుడు విలియం రూటో ఆ దేశ ప్రధాన విమానాశ్రయ ప్రాజెక్టు రద్దుకు ఆదేశించినట్లు వచ్చిన నివేదికలను ధృవీకరించుకోవడానికి స్టాక్ ఎక్సే్ఛంజీలు పంపిన నోటీసులకు అదానీ గ్రూప్ ప్రతిస్పందించింది. విమానాశ్రయ వ్యాపారాన్ని నిర్వహిస్తున్న అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్.. ఈ ఏడాది ఆగస్టులో కెన్యాలో విమానాశ్రయాలను అప్‌గ్రేడ్ చేయడానికి, ఆధునీకరణకు, నిర్వహణకై ఒక అనుబంధ సంస్థను ఏర్పాటు చేసినట్లు ఒక ఫైలింగ్‌లో తెలిపింది. ఈ రోజు వరకు కంపెనీకి లేదా దాని అనుబంధ సంస్థలకు కెన్యాలో ఏ విమానాశ్రయ ప్రాజెక్ట్‌ను అప్పగించలేదని, ఏ విమానాశ్రయానికి సంబంధించి ఏదైనా కట్టుబడి లేదా ఖచ్చితమైన ఒప్పందాన్ని కుదుర్చుకోలేదని సంస్థ తెలిపింది.పవర్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్టుపై.. కెన్యాలో 30 ఏళ్లపాటు కీలకమైన విద్యుత్ పంపిణీ వ్యవస్థ నిర్మించి, నిర్వహించడానికి గత నెలలో సంతకం చేసిన ఒప్పందంపై మాట్లాడుతూ.. సవరించిన సెబీ లిస్టింగ్ నిబంధనల ప్రకారం సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (లిస్టింగ్ ఆబ్లిగేషన్స్ అండ్ డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్) రెగ్యులేషన్స్ 2015 యొక్క షెడ్యూల్–3, పార్ట్ ఏ, ప్యారా–బీ ఐటెం 4 పరిధిలోకి ప్రాజెక్ట్ రాదని కంపెనీ తెలిపింది. దీని ప్రకారం దక్కించుకున్న, సవరించిన లేదా రద్దు అయిన కాంట్రాక్టుల గురించి ఎలాంటి బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని గ్రూప్ పేర్కొంది. రద్దును నిర్ధారించడానికి లేదా తిరస్కరించడానికి గ్రూప్ నిరాకరించింది. పవర్ ట్రాన్స్మిషన్ లైన్లను నిర్వహించే అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ కెన్యాలో ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్‌ను దక్కించుకున్నట్టు అక్టోబర్ 9న ప్రత్యేక ఫైలింగ్‌లో తెలిపింది. దీనికి అనుగుణంగా కెన్యాలో అనుబంధ సంస్థను నెలకొల్పినట్టు వివరించింది. -
అదానీ కంపెనీల రేటింగ్ తగ్గింపు
అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్అదానీతోపాటు మరో ఏడుగురు అధికారులపై అమెరికాలో కేసు నమోదైన నేపథ్యంలో ప్రముఖ స్టాక్‌మార్కెట్ రేటింగ్ ఏజెన్సీ ఎస్ అండ్ పీ స్పందించింది. అదానీ గ్రూప్ స్టాక్లను రివ్యూచేసి రేటింగ్ ఇచ్చింది. గతంలో ఇచ్చిన రేటింగ్ తగ్గిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఇటీవల చెలరేగిన నేరాభియోగాల కారణంగా భవిష్యత్తులో అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ టోటల్ గ్యాస్ కంపెనీలపై ప్రభావం పడుతుందని భావించి ఆయా సంస్థల రేటింగ్‌ను ‘బీబీబీ-’(ప్రతికూలం)గా మార్చింది.పాలనా ధోరణులపై అనుమానంఅదానీ గ్రూప్‌పై గతంలో హిండెన్‌బర్గ్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కానీ ఈసారి ఏకంగా అమెరికా న్యాయశాఖ, యూఎస్ ఎస్ఈసీ కలిసి దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించడంతో అదానీ సంస్థల పాలనా ధోరణులపై అనుమానం వ్యక్తమవుతుంది. కంపెనీపై ఇలా వస్తున్న ఆరోపణలు అదానీ గ్రూప్ ప్రతిష్ఠను దెబ్బతీయవచ్చనీ ఎస్ అండ్ పీ అభిప్రాయపడింది. కంపెనీ వృద్ధికి సాయం చేసిన రుణదాతల్లో ఆందోళన పెరిగే అవకాశం ఉందని తెలిపింది. దాంతో కంపెనీకి నిధుల సమీకరణ సవాలుగా మారే ప్రమాదం ఉందని చెప్పింది.ఇదీ చదవండి: ఒక్క నెలలో రూ.3,617 కోట్ల ఇళ్ల అమ్మకాలుఎక్స్ఛేంజీల రియాక్షన్ఇండియన్ స్టాక్ ఎక్స్ఛేంజీలు అదానీ గ్రూప్‌పై వస్తున్న నేరారోపణలపై వివరణ కోరాయి. అదానీపై అమెరికా న్యాయశాఖతోపాటు యూఎస్ ఎస్ఈసీలో లంచం కేసు నమోదు అవ్వడంతోపాటు, ఇటీవల కెన్యా అదానీ గ్రూప్ కంపెనీలతో గతంలో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకున్నాయి. దాంతో భారత స్టాక్ ఎక్స్ఛేంజీలు వివరణ కోరాయి. సెబీ కూడా ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తుందని నిపుణులు చెబుతున్నారు. -
మార్గదర్శి పాపాల గురించి మీ పేపర్లో ఒక్కరోజైనా రాశారా ..?
-
అదానీపై కేసు ఎఫెక్ట్.. రూ.6,216 కోట్ల డీల్ రద్దు?
అదానీ గ్రూప్‌తో గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను పునఃపరిశీలిస్తామని కెన్యా ప్రకటించింది. కెన్యాలో విమానాశ్రయ అభివృద్ధితోపాటు ఎనర్జీ ప్రాజెక్ట్‌ల విస్తరణ కోసం అదానీ గ్రూప్ గతంలో ఒప్పందం చేసుకుంది. ఇటీవల అదానీ సంస్థలపై చెలరేగుతున్న నేరాభియోగాల వల్ల కెన్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఉదంతం నుంచి కోలుకుని, క్రమంగా పుంజుకున్న అదానీ గ్రూప్‌నకు మళ్లీ షాక్ తగిలింది. భారత్‌లో భారీ సౌర విద్యుత్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్‌లు పొందేందుకు దాదాపు రూ.2,200 కోట్లు (సుమారు 265 మిలియన్ డాలర్లు) లంచాలు ఇచ్చినట్లు అమెరికాలో అభియోగాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో గ్రూప్ అధినేత గౌతమ్ అదానీతో పాటు మరో ఏడుగురిపై మోసం, లంచం, అవినీతి కేసులు నమోదయ్యాయి.ఇదీ చదవండి: సోలార్ ఎనర్జీ తయారీ 20 రెట్లు వృద్ధి: ఐఎస్ఏ నివేదికఈ నేపథ్యంలో కెన్యా అధ్యక్షుడు విలియం రుటో ప్రకటన విడుదల చేశారు. కెన్యాలో విమానాశ్రయాలు, పవర్ ట్రాన్స్మిషన్లైన్ల విస్తరణకు అదానీ గ్రూప్‌తో గతంలో చేసుకున్న ఒప్పందాలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు చెప్పారు. అమెరికా దర్యాప్తు సంస్థలు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేశాక దీనిపై పునరాలోచిస్తామన్నారు. ఈ డీల్ విలువ 736 మిలియన్ డాలర్లు(రూ.6216 కోట్లు). ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంలో ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలని నిర్ణయించారు. -
‘అదానీ గ్రూప్ సంస్థలతో ఏపీ ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ.. సెకీ (సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)తో మాత్రమే ఒప్పందం చేసుకుందని, అదానీ గ్రూప్‌తో ఏపీ డిస్కమ్‌లు ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని వైఎస్సార్సీపీ స్పష్టం చేసింది. విద్యుత్ కొనుగోలుకు సంబంధించి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణల్లో వీసమెత్తు వాస్తవం లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు గురువారం ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను రైతులకు హక్కుగా కల్పించాలనే లక్ష్యంతో 7 వేల మెగావాట్ల విద్యుత్‌ను అత్యంత చౌకగా యూనిట్ రూ.2.49 చొప్పున కొనుగోలుకు సెకీతో 2021 డిసెంబర్ 1న ఏపీ డిస్కమ్‌లు ఒప్పందం చేసుకున్నాయని వెల్లడించింది. రాష్ట్రంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ రూపంలో ఏటా సుమారు 12,500 మిలియన్ యూనిట్లను డిస్కమ్‌లు సరఫరా చేస్తాయని తెలిపింది. ఈ ఛార్జీలను డిస్కమ్‌లకు రాయితీ రూపంలో ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పింది. 👉 గత చంద్రబాబు ప్రభుత్వం అనాలోచిత విధానాలతో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వల్ల విద్యుత్ సరఫరా ధర యూనిట్‌కు రూ.5.10కి చేరింది. ఇది డిస్కమ్‌లపై తీవ్ర భారం పడటానికి దారితీసింది. దీని వల్ల ప్రభుత్వంపై రాయితీ భారం కూడా పెరిగింది.👉ఈ సమస్యను పరిష్కరించేందుకు పది వేల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా సోలార్ పార్క్‌లను అభివృద్ధి చేయాలని 2020లో ప్రభుత్వం ప్రతిపాదించింది. 👉ఈ క్రమంలో 2020 నవంబర్‌లో 6,400 మెవాగాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ టెండర్లు పిలిచింది. యూనిట్ రూ.2.49–రూ.2.58 చొప్పున సరఫరా చేసేందుకు ముందుకొస్తూ 24 బిడ్లు దాఖలయ్యాయి. అయితే న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నమవడం వల్ల ఆ టెండర్ ప్రక్రియ రద్దయింది.👉అంతరాష్ట్ర విద్యుత్ సరఫరా ఛార్జీలు (ఐఎస్టీఎస్) మినహాయించి యూనిట్ రూ.2.49 చొప్పున విద్యుత్‌ను సరఫరా చేస్తామంటూ సెకీ ప్రతిపాదించింది. కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ పర్యవేక్షణలో ఏర్పాటైన ప్రభుత్వ రంగ సంస్థ.. సెకీ. 2019 జూన్ 25న నిర్వహించిన టెండర్ల ద్వారా ఏర్పాటైన సౌర విద్యుత్ కేంద్రాల నుంచి సెకీ విద్యుత్ కొనుగోలు చేస్తుంది. 👉ఈ నేపథ్యంలోనే యూనిట్ రూ.2.49 చొప్పున ఏడు వేల మెగావాట్ల విద్యుత్‌ను 25 ఏళ్లపాటు సరఫరా చేసేలా సెకీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇందులో 2024–25లో మూడు వేలు, 2025–26లో మూడు వేలు, 2026–27లో వెయ్యి మెగావాట్లను అంతర్రాష్ట్ర విద్యుత్ సరఫరా ఛార్జీలను మినహాయించుని సరఫరా చేయడానికి సెకీ అంగీకరించింది. ఈ ఒప్పందాన్ని 2021 నవంబర్ 11న ఏపీఈఆర్సీ ఆమోదించింది. ఆ తర్వాత 2021 డిసెంబర్ 1న విద్యుత్ కొనుగోలుకు సెకీతో డిస్కమ్‌లు ఒప్పందం చేసుకున్నాయి. 👉సెకీతో ఒప్పందం వల్ల రాష్ట్రానికి అత్యంత చౌకగా విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. దీని వల్ల ప్రభుత్వానికి ఏటా రూ.3,700 కోట్ల మేర ఆదా అవుతుంది. 25 ఏళ్లపాటు ఈ ఒప్పందం అమల్లో ఉండటం వల్ల రాష్ట్ర ఖజానాకు భారీగా ఆదా అవుతుంది.Andhra Pradesh distribution utilities supply close to 12,500 MU of free power per annum to agriculture sector. On this front, the Government compensates the distribution utilities to the extent of the cost of supply pertaining to that power. Owing to the policies of the previous…— YSR Congress Party (@YSRCParty) November 21, 2024 -
సెకీతోనే ఒప్పందం.. ప్రభుత్వానికి అదానీతో ఏం సంబంధం
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఎవరికైనా లంచాలు ఇస్తాయా? ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు. కానీ.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సెకీ)తో రాష్ట్రంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంటే లంచాలు చేతులు మారాయని ఆరోపణలు చేస్తుండటాన్ని ఏమనుకోవాలి? అవన్నీ ఊహాజనితమైన ఆరోపణలే అని అర్థం. ఇక అదానీ గ్రూప్‌తో విద్యుత్ కొనుగోలు చేస్తూ డిస్కమ్‌లు(విద్యుత్ పంపిణీ సంస్థలు) ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు. చేసుకోని ఒప్పందాలకు అదానీ గ్రూప్.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంతోపాటు వివిధ రాష్ట్రాలకు లంచాలు ఇచ్చిందని అమెరికా ఫెడరల్ కోర్టులో యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ కేసు దాఖలు చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎవరైనా చేసుకోని ఒప్పందాలకు లంచాలు ఇస్తారా? ఇవ్వరు కదా.. అంటే అవన్నీ ఊహాజనితమైన ఆరోపణలన్నది స్పష్టమవుతోంది. కార్పొరేట్ ప్రపంచంలో పదే పదే అదానీ గ్రూపుపై యుద్ధం ప్రకటిస్తున్న అమెరికా ఇన్వెస్టర్లు.. తాజాగా అదానీ గ్రూపు విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో వివిధ రాష్ట్రాలకు లంచాలు ఇచ్చిందంటూ ఆరోపణలు చేశారు. అదానీ గ్రూపు అమెరికా మార్కెట్ నుంచి డాలర్ల రూపంలో నిధులు సేకరిస్తున్న తరుణంలో పెట్టుబడుదారుల రక్షణ పేరిట అమెరికాబ్రూక్లిన్ ఫెడరల్ కోర్టులో అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీలతోపాటు ఏడుగురిపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ అభియోగాల్లో ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, ఒడిషా, చత్తీస్ఘడ్, జమ్ము కాశ్మీర్ రాష్ట్రాలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అదానీ గ్రూపు భారీ ఎత్తున లంచాలు ఎర చూపిదంటూ ఆరోపించారు. ఆరోపణల వెనుక భారీ కుట్ర! రానున్న 25 ఏళ్లలో అన్నదాతలకు ఎలాంటి విద్యుత్ కష్టాలు లేకుండా నిరంతరాయంగా 9 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా చేయడం కోసం సౌర విద్యుత్‌ను సమకూర్చేందుకు వంద శాతం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సెకీ) నుంచి 7 వేల మెగావాట్లు కొనుగోలు చేసేలా గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఒప్పందం కుదర్చుకుంది. ఈ ఒప్పందానికి అదానీ గ్రూపు లంచాలు ఇవ్వచూపిందంటూ ఆరోపణలు చేయడం వెనుక భారీ కుట్ర ఉందన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. అది కూడా ప్రస్తుత బహిరంగ మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే విద్యుత్‌ను కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకుంటే లంచాలకు ఆస్కారం ఎక్కడ ఉంటుంది? ఒప్పందం కుదుర్చుకున్న సమయంలో సరాసరి విద్యుత్ కొనుగోలు వ్యయం యూనిట్ రూ.5.10 ఉంటే కేవలం రూ.2.49 (రూ.2.6 తక్కువగా)కే.. అది కూడా రవాణా వ్యయం లేకుండా ఎక్కడికి కావాలంటే అక్కడికి సరఫరా చేసే విధంగా సెకీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల ధరలు యూనిట్‌కు రూ.4.63–రూ.6.76తో పోల్చినా చాలా చౌకగా విద్యుత్ లభిస్తుంది. ఏపీకి ఎన్టీపీసీ సరఫరా చేస్తున్న సౌర విద్యుత్ ధర యూనిట్ రూ.2.79 (ట్రేడింగ్ మార్జిన్ కలిపి) కన్నా ఇది తక్కువ. ఎక్కడైనా ప్రస్తుత మార్కెట్ ధర కంటే ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తే లంచాలు ఇచ్చారని ఆరోపణలు వస్తాయి. కానీ ప్రస్తుత సగటు యూనిట్ ధర కంటే రూ.2.61 తక్కువకే కొనుగోలు చేస్తే లంచాల ప్రస్తావన ఎక్కడి నుంచి వస్తుందని విద్యుత్ రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. అసలు విద్యుత్‌ను కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ నుంచి కొనుగోలు చేస్తుంటే.. అదానీ గ్రూపు లంచాలు ఎందుకు ఇవ్వజూపుతుందనే ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ ఒప్పందాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే అమెరికా ఫెడరల్ కోర్టు అభియోగ పత్రంలో ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని ఎవరైనా చెబుతారు. కాగా, అదానీ గ్రీన్ డైరెక్టర్లపై యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ చేసిన ఆరోపణలను అదానీ గ్రూపు ఖండించింది. అమెరికా ప్రాసిక్యూటర్లు ఎటువంటి ఆధారాలు లేకుండా తమ సంస్థపై తప్పుడు ఆరోపణలతో అభియోగాలు మోపారని చెప్పింది. -
అదానీ ప్రకంపనలు
న్యూయార్క్/న్యూఢిల్లీ: హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఉదంతం నుంచి కోలుకుని, క్రమంగా పుంజుకున్న అదానీ గ్రూప్‌నకు మళ్లీ షాక్ తగిలింది. భారత్‌లో భారీ సౌర విద్యుత్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్‌లు పొందేందుకు దాదాపు రూ. 2,200 కోట్లు (సుమారు 265 మిలియన్ డాలర్లు) లంచాలు ఇచ్చినట్లు అమెరికాలో అభియోగాలు నమోదయ్యాయి. గ్రూప్ అధినేత గౌతమ్ అదానీతో పాటు మరో ఏడుగురిపై మోసం, లంచం, అవినీతి కేసులు నమోదయ్యాయి. వీరిలో ఆయన సోదరుడి కుమారుడు సాగర్ కూడా ఉన్నారు. అధిక ధరకు సౌర విద్యుత్ కొనుగోలు చేసేలా రెండు రాష్ట్రాల అధికారులకు లంచాలిచ్చినట్లు, తద్వారా 20 ఏళ్ల పాటు 2 బిలియన్ డాలర్ల మేర లాభం పొందేందుకు అదానీ తదితరులు పథకం వేసినట్లు పిటిషన్లో అమెరికన్ ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు. వివరాల్లోకి వెడితే .. స్థానికంగా తయారైన సోలార్ సెల్స్, మాడ్యులర్ ప్లాంట్లను ఉపయోగించి ఉత్పత్తి చేసిన 8 గిగావాట్ల సౌర విద్యుత్‌ను రెండు రాష్ట్రాలకు సరఫరా చేసే కాంట్రాక్టులను అదానీ గ్రూప్ 2021లో దక్కించుకుంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వాల నిర్దేశిత ధర అంచనాలను అందుకోలేకపోయినా, లంచాలను ఆఫర్ చేసి కాంట్రాక్టులను పొందిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అదానీపై న్యూయార్క్ కోర్టులో అమెరికా న్యాయ శాఖ, సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజ్ కమిషన్ (ఎస్ఈసీ) రెండు కేసులు వేశాయి. మొదటి దానిలో గౌతమ్ అదానీ, సాగర్ అదానీ సహా ఏడుగురిపై న్యాయ శాఖ లంచం అభియోగాలు మోపింది. మరోవైపు, సెక్యూరిటీస్ చట్టాల్లో భాగమైన యాంటీ–ఫ్రాడ్ నిబంధనలను ఉల్లంఘించారంటూ గౌతమ్ అదానీ, సాగర్‌తో పాటు అజూర్ పవర్ మాజీ అధికార్ల మీద ఎస్ఈసీ ఆరోపణలు చేసింది. ప్రాసిక్యూటర్ల కథనం ప్రకారం కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈసీఐ) నుంచి 4 గిగావాట్ల ప్రాజెక్టును న్యూఢిల్లీ సంస్థ అజూర్ పవర్ దక్కించుకుంది. అయితే, అది లంచాల్లో తన వాటాను చెల్లించలేకపోవడంతో ఆ సంస్థ పొందిన కాంట్రాక్టులో కొంత భాగాన్ని ఎస్ఈసీఐ ద్వారా అదానీ గ్రూప్ దక్కించుకుంది. అదానీ గ్రూప్ షేర్లలో అవకతవకలు జరుగుతున్నాయంటూ 2023 జనవరిలో హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలు చేయడంలో గతేడాది గ్రూప్ సంస్థల మార్కెట్ విలువ భారీగా పతనమై, ఏకంగా 150 బిలియన్ డాలర్లు కరిగిపోయిన సంగతి తెలిసిందే. కెన్యా డీల్స్ రద్దు.. అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు అదానీ గ్రూప్‌పై ప్రభావం చూపుతున్నాయి. తమ దేశంలో విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయడంతో పాటు విద్యుత్ ట్రాన్స్మిషన్ లైన్ల ఏర్పాటు కోసం అదానీ గ్రూప్‌తో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నట్లు కెన్యా అధ్యక్షుడు విలియం రుటో తెలిపారు. గ్రూప్ కంపెనీల తదుపరి రుణ సమీకరణలకు సంబంధించి తాజా పరిణామాలు ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని మూడీస్ రేటింగ్స్ తెలిపింది.జరిగిందిక్కడ.. కేసు అక్కడ.. ఎందుకంటే.. 2020–2024 మధ్యలో అదానీ గ్రూప్ అమెరికా డాలర్ మారకంలో అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీల నుంచి 2 బిలియన్ డాలర్లు సమీకరించింది. అంతర్జాతీయ ఆర్థిక సంస్థల గ్యారంటీతో బిలియన్ డాలర్ల పైగా విలువ చేసే సెక్యూరిటీలను జారీ చేసింది. భారత్‌లో కాంట్రాక్టులను పొందేందుకు లంచాల విషయాన్ని వెల్లడించకుండా, అమెరికన్ ఇన్వెస్టర్లకు సెక్యూరిటీలను విక్రయించిందని తాజా కేసుల్లో ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. అమెరికా చట్టాల ప్రకారం తమ దేశ ఇన్వెస్టర్లు లేదా మార్కెట్లతో సంబంధాలున్న విదేశీ సంస్థలపై అవినీతి ఆరోపణలేమైనా వస్తే విచారణ చేసే అధికారాలు అక్కడి న్యాయస్థానాలకు ఉంటాయి. దానికి అనుగుణంగానే అదానీ గ్రూప్‌పై అమెరికాలో అభియోగాలు నమోదయ్యాయి. అమెరికన్ ఇన్వెస్టర్లను అడ్డం పెట్టుకుని భారీ విద్యుత్ కాంట్రాక్టులను దక్కించుకునేందుకు అదానీ, ఇతర ప్రతివాదులు పథకం రచించినట్లు అటార్నీ బ్రియాన్ పీస్ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో గౌతమ్ అదానీ సహా అదానీ ఎనర్జీ అధికారులు సాగర్ అదానీ (ఈడీ), వినీత్ ఎస్ జైన్ (సీఈవో), అలాగే అజూర్ పవర్ గ్లోబల్ మాజీ అధికారులు సిరిల్ కబానెస్.. రంజిత్ గుప్తా.. రూపేష్ అగర్వాల్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులపై( సౌరభ్ అగర్వాల్, దీపక్ మల్హోత్రా) అభియోగాలు నమోదయ్యాయి. Adani Group Spokesperson says, "The allegations made by the US Department of Justice and the US Securities and Exchange Commission against directors of Adani Green are baseless and denied. As stated by the US Department of Justice itself, "the charges in the indictment are… pic.twitter.com/rSuxuHTFUo— ANI (@ANI) November 21, 2024నిరాధార ఆరోపణలు...తమపై వచ్చిన అభియోగాలను అదానీ గ్రూప్ ఖండించింది. ఇవన్నీ నిరాధారమైనవని ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. కేసుల విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. తాజా పరిణామాల నేపథ్యంలో అదానీ గ్రీన్ ఎనర్జీ జారీ చేసిన 600 మిలియన్ డాలర్ల బాండ్ ఇష్యూని ఉపసంహరిస్తున్నట్లు తెలిపింది. అభియోగాలు వెల్లడి కావడానికి కొద్ది గంటల ముందే బాండ్ ఇష్యూ మూడు రెట్లు ఓవర్ సబ్ర్‌స్కయిబ్ కావడం గమనార్హం. అయినప్పటికీ తాజా పరిణామాలను దృష్టిలో పెట్టుకుని అమెరిన్ డాలర్ల మారకంలోని బాండ్ ఇష్యూపై ముందుకెళ్లరాదని నిర్ణయించుకున్నట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు అదానీ గ్రీన్ ఎనర్జీ తెలిపింది. మరోవైపు, ఈ వ్యవహారంలో తమ ప్రమేయమేమీ లేదని ఎస్ఈసీఐ సీఎండీ ఆర్పీ గుప్తా స్పష్టం చేశారు. అదానీ కేసుల్లో ఎక్కడా తమ సంస్థ ప్రస్తావన లేదని ఆయన పేర్కొన్నారు. -
రేవంత్.. మూసీలో అదానీ వాటా ఎంత?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీపై సంచలన ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇదే సమయంలో అదానీతో కాంగ్రెస్, బీజేపీ అనుబంధం దేశానికే అవమానం అంటూ కామెంట్స్ చేశారు. అదానీతో చేసుకున్న చీకటి ఒప్పందాలు అన్నీ బయటకు తీయాలని డిమాండ్ చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా.. అగ్రరాజ్యం అమెరికానే మోసం చేయాలని చూసిన ఘనుడు. భారత ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వజూపిన మోసగాడు. అదానీతో కాంగ్రెస్-బీజేపీ అనుబంధం.. దేశానికి అవమానం.. అరిష్టం. రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఎంత ఇవ్వజూపిండో, మూసీలో అదానీ వాటా ఎంతో!ఇలాంటి మోసగాడికి.. దగాకోరుకా.. తెలంగాణలో పెట్టుబడుల అనుమతులు!తక్షణం అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ అనుమతులను రద్దు చేయండి!మీరు అదానీతో చేసుకున్న చీకటి ఒప్పందాలు అన్నీ బయట పెట్టాలి!తెలంగాణా ఆస్తులను కొల్లగొట్టే మీ కుయుక్తులలో మీ భడే భాయ్ వాటాఎంత?మీ అదానీ భాయ్ వాటా ఎంత? మీ హైకమాండ్ వాటా ఎంత? అంటూ ప్రశ్నించారు. అగ్రరాజ్యం అమెరికానే మోసం చేయాలని చూసిన ఘనుడు..భారత ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వజూపిన మోసగాడు..అదానితో కాంగ్రెస్ - బీజేపీ అనుబంధం.. దేశానికి అవమానం..అరిష్టం రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఎంత ఇవ్వజూపిండో, మూసీ లో అదానీ వాటా ఎంతో!ఇలాంటి మోసగాడికి.. దగాకోరుకా..… https://t.co/CxL4jEGNIk— KTR (@KTRBRS) November 21, 2024 -
ఒకేరోజు అదానీ షేర్ల నష్టం రూ.2.6 లక్షల కోట్లు!
అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదైంది. దాంతో అదానీ గ్రూప్ సంస్థల షేర్లు కుప్పకూలాయి. ఈ రోజు ఉదయం మార్కెట్లు ప్రారంభం అయిన సమయం నుంచి కేవలం అదానీ గ్రూప్ లిస్ట్‌డ్ కంపెనీల నుంచే దాదాపు రూ.2.6 లక్షల కోట్లు నష్టం వాటిల్లింది. ప్రతిషేరు సుమారు 20 శాతం నష్టాల్లో కదలాడుతున్నాయి. దాంతో అదానీ గ్రూప్ సంస్థల సంపద రూ.12.3 లక్షల కోట్లకు చేరినట్లు తెలిసింది.ఏయే కంపెనీలు ఎంతే నష్టపోయాయంటే..అదానీ ఎంటర్ప్రైజెస్: 20 శాతంఅదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్: 20 శాతంఅదానీ గ్రీన్ ఎనర్జీ: 18 శాతంఅదానీ పవర్: 14 శాతంఅదానీ టోటల్ గ్యాస్: 14 శాతంఅంబుజా సిమెంట్స్: 18 శాతంఏసీసీ: 15 శాతంఅదానీ విల్మార్: 10 శాతంఎన్డీటీవీ: 14 శాతంసంఘీ ఇండస్ట్రీస్: 6 శాతంఅసలు కేసేంటి?20 ఏళ్లలో 2 బిలియన్ డాలర్ల(రూ.16,890 కోట్లు) లాభం వచ్చే సౌరశక్తి సరఫరా కాంట్రాక్ట్‌ల కోసం వీరు భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 265 మిలియన్ డాలర్లు లంచాలు ఇవ్వచూపినట్లు అమెరికా ఎఫ్‌బీఐ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి బ్యాంకులు, ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి నిధులు సేకరించేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలున్నాయి. ఈ సోలార్ ప్రాజెక్ట్‌ల్లో అమెరికా ఇన్వెస్టరల నిధులు కూడా ఉండటంతో ఆ దేశం ఎఫ్‌బీఐ ద్వారా దర్యాప్తు చేస్తోంది. అలాగే అదానీ గ్రీన్ ఎనర్జీలోనూ అక్రమ మార్గాల ద్వారా రుణాలు, బాండ్లను సేకరించినట్లు న్యాయవాదులు పేర్కొన్నారు. దాంతో గౌతమ్ అదానీ, ఆయన బంధువు సాగర్ అదానీతో సహా మరో ఏడుగురిని ఇందులో నిందితులుగా చేర్చారు.డాలర్ డినామినేటెడ్ బాండ్లపై అదానీ ప్రకటనఅమెరికా కేసు అభియోగాల నేపథ్యంలో అదానీ గ్రూప్ అమెరికా డాలర్ డినామినేటెడ్ బాండ్ ఆఫరింగ్‌లో ముందుకువెళ్లకూడదని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి గురువారం ఎక్స్ఛేంజీలకు ప్రకటన విడుదల చేసింది. ‘అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్, యూఎస్ సెక్యూరిటీ ఎక్స్చేంజీ కమిషన్(ఎస్ఈసీ)లు గౌతమ్ అదానీ, సాగర్ అదానీ సహా బోర్డు సభ్యులపై నేరాభియోగాలు చేశాయి. కాబట్టి ప్రతిపాదిత డాలర్ డినామినేషన్ బాండ్ల విషయంలో ముందుకువెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నాం’ అని తెలిపింది. ఈ ఆఫర్ విలువ సుమారు రూ.3,960 కోట్లుగా ఉంది.ఇదీ చదవండి: అదానీ ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్ సూచీలు‘అమెరికా చట్టాలు ఉల్లంఘిస్తే సహించబోం’ఈ వ్యవహారంపై అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ డిప్యూటీ అసిస్టెంట్ అటార్నీ లీసా హెచ్ మిల్లర్ స్పందించారు. అదానీ సోలార్ ప్రాజెక్ట్‌ల కాంట్రాక్ట్‌ల్లో అవకతవకలు జరిగినట్లు సమాచారం ఉందని చెప్పారు. ఈ అంశంపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచంలో ఏ ప్రాంతం వారైనా అమెరికా చట్టాలను ఉల్లంఘిస్తే సహించబోమని స్పష్టం చేశారు. ఈ కేసును ఎఫ్‌బీఐ న్యూయార్క్ కార్పొరేట్, సెక్యూరిటీస్ అండ్ కమోడిటీస్ ఫ్రాడ్ అండ్ ఇంటర్నేషనల్ కరప్షన్ యూనిట్స్ దర్యాప్తు చేస్తున్నాయి. -
అదానీ గ్రూప్ భారీ పెట్టుబడులు
పునరుత్పాదక ఇంధన వనరులపై అదానీ గ్రూప్ భారీ పెట్టుబడులు పెట్టనుంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో భారీ సామర్థ్యంతో సోలార్, పవన, హైబ్రిడ్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుపై వచ్చే ఐదేళ్లలో 35 బిలియన్ డాలర్లు (రూ.2.94 లక్షల కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్టు అదానీ గ్రీన్ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాగర్ అదానీ ప్రకటించారు. ‘2047 నాటికి వికసిత భారత్ లక్ష్య సాధనలో యువ నాయకుల పాత్ర’ అనే అంశంపై జరిగిన సీఈవో ప్యానెల్ చర్చలో భాగంగా సాగర్ అదానీ ఈ వివరాలు వెల్లడించారు.ఇదీ చదవండి: ఒకటో తరగతి ఫీజు.. రూ.4.27 లక్షలు!గుజరాత్‌లోని ఖావ్డాలో 30,000 మెగావాట్ సామర్థ్యంతో పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాలను ఈ కంపెనీ ఏర్పాటు చేస్తుండడం గమనార్హం. ఇంధన స్థిరత్వం, ఇంధన పరివర్తనం విషయంలో అదిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ పెట్టుబడుల్లో ఇది ఒకటి అవుతుందని సాగర్ అదానీ పేర్కొన్నారు. ‘‘మన దగ్గర 500 గిగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉంది. తలసరి వినియోగంలో ప్రపంచవ్యాప్తంగా చూస్తే మనం మూడింత ఒక వంతు పరిమాణంలోనే ఉన్నాం. వచ్చే 7–8 ఏళ్లలో ప్రపంచ సగటు తలసరి విద్యుత్ వినియోగానికి చేరుకోవాలంటే మరో 1,000 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం అవసరం. చైనా స్థాయికి చేరుకోవాలంటే మరో 1,500 మెగావాట్ల సామర్థ్యం అవసరం. అభివృద్ధి చెందిన దేశాలకు సమాన స్థాయికి చేరుకోవాలంటే మరో 2,500–3,000 మెగావాట్ల సామర్థ్యం అవసరం అవుతుంది’’అని వివరించారు. -
ఏక్ హై తో మోదీ, అదానీ సేఫ్ హై: రాహుల్ గాంధీ
ముంబై/రాంచీ: ‘ఏక్ హై తో సేఫ్ హై’ అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు విసిరారు. సేఫ్ అంటే సురక్షితంతోపాటు బీరువా అనే అర్థం కూడా ఉంది. మోదీ పిలుపునకు, ముంబైలో అదానీ గ్రూప్‌నకు కట్టబెట్టిన ధారావి అభివృద్ధి పథకాన్ని ముడిపెడుతూ విమర్శలు గుప్పించారు. రాహుల్ సోమవారం ముంబైలో మీడియా సమావేశంలో మాట్లాడారు. తన వెంట ఒక సేఫ్(చిన్నపాటి బీరువా) కూడా తీసుకొచ్చారు. అందులోంచి రెండు పోస్టర్లు బయటకు లాగారు.ఒక పోస్టర్‌పై నరేంద్ర మోదీ, గౌతమ్ అదానీ ఫోటో, మరో పోస్టర్‌పై ధారావి మ్యాప్ ఉంది. మోదీ, అదానీ ఫోటోపై ‘ఏక్ హై తో సేఫ్ హై’ అనే పిలుపును ముద్రించారు. కలిసి ఉంటే సురక్షితంగా ఉంటామని మోదీ చెబుతున్నారని, వాస్తవానికి సురక్షితంగా ఉన్నది ఎవరని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. మోదీ, అదానీ కలిసికట్టుగా ముందుకుసాగుతూ, ఒకరికొకరు చక్కగా సహకరించుకుంటూ సురక్షితంగా ఉంటున్నారని మండిపడ్డారు. ధారావి అభివృద్ధి ప్రాజెక్టు పేరిట రూ.లక్ష కోట్ల విలువైన భూమిని అదానీకి అప్పగించారని మండిపడ్డారు. కేవలం అదానీ ప్రయోజనాల కాపాడేలా ధారావి ప్రాజెక్టు టెండర్లు రూపొందించారని విమర్శించారు.ధారావి ప్రజల సంక్షేమాన్ని పక్కనపెట్టి బడా పారిశ్రామికవేత్తల కోసమే మోదీ ప్రభుత్వం పని చేస్తోందని ధ్వజమెత్తారు. బాధితులకు న్యాయం జరిగేదాకా పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు. ఇతర పారిశ్రామికవేత్తలకు దక్కిన ప్రాజెక్టులను నరేంద్ర మోదీకి సన్నిహితులైన బిలియనీర్లకు అప్పగించేలా కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా ఒత్తిడి తెస్తున్నారని విమర్శించారు. దేశంలో ఓడరేవులు, విమానాశ్రయాలతోపాటు దేశ సంపదను కేవలం ఒకే ఒక్క వ్యక్తికి కట్టబెడుతున్నారని ఆరోపించారు. మోదీ, అమిత్ షా, అదానీ కలిసుంటారు ‘‘ప్రధాని మోదీ ప్రవచిస్తున్న ‘ఏక్ హై తో సేఫ్ హై’కి అసలు అర్థం నేను చెబుతా. నరేంద్ర మోదీ, అమిత్ షా, గౌతమ్ అదానీ కలిసి ఉంటే సురక్షితంగా ఉంటారు. ఆ ముగ్గురూ కలిసే ఉంటున్నారు. దేశ సంపద మొత్తం అదానీ, అంబానీ లాంటి బడా బాబుల చేతుల్లోకి వెళ్లిపోతోంది. టెండర్లలో పారదర్శకతకు పాతరవేసి, ప్రాజెక్టులను వారికి కట్టబెడుతున్నారు’’ అని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. ఆయన సోమవారం జార్ఖండ్ రాజధాని రాంచీలో మీడియాతో మాట్లాడారు. మణిపూర్ గత ఏడాదిన్నర కాలంగా మండిపోతున్నా ప్రధాని మోదీ మొద్దునిద్ర వీడడం లేదని అన్నారు. హింసాకాండలో అమాయక ప్రజలు చనిపోతున్నా పట్టించుకోవడం లేదని చెప్పారు. రిజర్వేషన్లకు తాము వ్యతిరేకంగా కాదని రాహుల్ తేల్చిచెప్పారు. రిజర్వేషన్లను మరింత పెంచాలన్నదే తమ ఉద్దేశమని వివరించారు. -
అప్పుడు తప్పుబట్టి.. ఇప్పుడేమో ఆకాశానికెత్తి మరీ!
వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రముఖ పారిశ్రామిక సంస్థ అదానీ గ్రూప్ పలు పరిశ్రమలను స్థాపించడానికి ముందుకు వచ్చింది. విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటుకు ఓకే చేయడం, దానికి అప్పటి ప్రభుత్వం భూమి కేటాయించడం జరిగింది. డేటా సెంటర్ కు శంకుస్థాపన కూడా చేశారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో జగన్ ప్రభుత్వ విధానాల ప్రకారం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని ప్రతిపాదించింది. అందుకోసం ప్రభుత్వం భూముల కేటాయింపు చేసింది. గంగవరం పోర్టులో ప్రభుత్వానికి ఉన్న ఎనిమిది శాతం వాటాను అదాని గ్రూప్ కొనుగోలు చేసింది. అలాగే ప్రైవేటు రంగంలో ఉన్న కృష్ణపట్నం పోర్టు కూడా అదానీ గ్రూప్ పరిధిలోకి వచ్చింది. ఈ పరిణామాలు జరుగుతున్నప్పుడు టీడీపీ అనుకూల మీడియా ఏమని ప్రచారం చేసిందో గుర్తుందా?జగన్ ఏపీని అదానీకి రాసిచ్చేస్తున్నారని.. అదానీకి జగన్ రెడ్ కార్పెట్ వేస్తున్నారని.. ఏపీ అంతా దోపిడీ జరిగిపోతోందని వదంతులు సృష్టించారు. అదానీ పెట్టుబడులను జగన్ స్వాగతిస్తే దారుణమైన వ్యతిరేక కథనాలు ఇచ్చిన ఎల్లో మీడియా.. ఏదో రకంగా విమర్శలు చేసిన తెలుగుదేశం ఇప్పుడు మొత్తం ప్లేట్ మార్చేశాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావడంంతోనే అదానీ ఇప్పుడు మంచి పెట్టుబడిదారుడు అయిపోయారు. అదానీ పరిశ్రమలకు సంబంధించిన ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అవ్వగానే మొత్తం ఏపీ ముఖచిత్రం మారిపోయినట్లు తెలుగుదేశం మీడియా డాన్స్ చేస్తోంది.ఇక తెలుగుదేశం పరిశ్రమలు పెట్టేసినంతగా ఊదరగొడుతుంది. అదానీ అప్పుడైనా, ఎప్పుడైనా పరిశ్రమలు పెట్టి ఏపీకి ఉపయోగపడితే మంచిదే. కానీ జగన్ అధికారంలో ఉన్నప్పుడు పరిశ్రమలు రాకుండా, వచ్చిన వాటిని భయపెట్టేలా అటు తెలుగుదేశం ప్రచారం చేసింది. ఇటు ఎల్లో మీడియా అడ్డంగా దుష్ప్రచారం చేసింది.అప్పుడు పరిశ్రమల స్థాపనకు భూములిచ్చినా, నీళ్లిచ్చినా, రాయితీలిచ్చినా దోచుకోవడమన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం విధానం తయారు చేస్తేనే వరాల వర్షం కురుస్తోందని , స్వర్ణాంధ్ర సాకారం అవుతోందని బాకా వూదుతున్నారు. జగన్ టైంలో షిరిడీ సాయి సంస్థ కొత్త ప్రాజెక్టును చేపట్టడానికి వీలుగా ప్రభుత్వంనుంచి భూమిని తీసుకుంది. అలాగే నెల్లూరు జిల్లాలో పారిశ్రామికవాడ ఏర్పాటుకు భూమి తీసుకుంది. రామాయపట్నంవద్ద ఇండోసోల్ అనే సంస్థ సోలార్ ప్యానెల్స్ తయారీకి పూనుకుంటే.. ఈనాడు మీడియా ఎంత విష ప్రచారం చేసిందో చెప్పలేం.కొద్ది రోజుల క్రితం అదానీతో భేటీ సందర్భంగా వచ్చిన కథనాలను గమనిస్తే నిజంగానే ఆంధ్రప్రదేశ్ ను రాసిచ్చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం సిద్దమవుతోందా? అనే అనుమానం కలుగుతోంది. రాష్ట్రంలో పోర్టులు, మైనింగ్, ఐటీ, పర్యాటకం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలా ఒకటేమిటి !అనేక రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ప్రతిపాదనలు చేస్తోందని ఈనాడు మీడియా బాజా వాయించింది.ఇవేగాదు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డును కూడా అదానీ కంపెనీయే నిర్మిస్తుందట. వైఎస్సార్సీపీ హయాంలో ఏపీకి సంబంధించిన పారిశ్రామికవేత్తలు ప్రాజెక్టులు పెడుతుంటే.. పచ్చి అబద్ధాలను వండివార్చిన ఎల్లో మీడియా ఇప్పుడు మొత్తం ఏపీలో అన్నిరకాల పెట్టుబడులను గుజరాత్ కు చెందిన అదానీ తెస్తే బాగుందన్నట్టుగా రాస్తున్నారు. వారు అడిగినంత మేర వేల ఎకరాల భూమిని ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందట. టెండర్లు లేకుండా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం అదానీకి ఎలా అప్పగిస్తారో తెలియదు. దీన్నిబట్టి ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి నీచమైన రాజకీయం జరుగుతున్నదో ప్రజలు ఆలోచించుకోవచ్చు.తమకు నచ్చని పారిశ్రామికవేత్తలపై బురద చల్లడం, తమకు ఇష్టం లేని పార్టీ అధికారంలో ఉంటే వచ్చే పెట్టుబడులను అడ్డుకోవడం పరిశ్రమలు వెళ్లిపోతున్నాయని అసత్య ప్రచారాలను చేయడం ఇవ్వన్నీ చూస్తే ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ ఒక పెద్ద మాఫియా గుప్పిట్లో చిక్కుకున్నదనే అభిప్రాయం కలుగుతోంది.జగన్ ప్రభుత్వం రామాయపట్నం , మచిలీపట్నం, మూలపేట పోర్టులతోపాటు పది ఫిషింగ్ హార్బర్లను ప్రభుత్వపరంగా నిర్మాణం సాగించింది. ఆ పోర్టులను కూడా అదానీకే అప్పజెప్పాలన్న ఆలోచన జరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఒకప్పుడు కృష్ణపట్నం, గంగవరం పోర్టులలో అదానీ పెట్టుబడులను పెడితేనే ఏదో ఘోరం జరిగిపోయినట్టు ప్రచారం చేసిన వీళ్లు.. ప్రస్తుతం ఆ పోర్టుల విస్తరణకు అవసరమైన వందల వేల ఎకరాల భూములను కట్టబెట్టి ఆ కంపెనీపోర్టుల విస్తరణకు ప్రతిపాదించింది అని ఘనంగా ప్రచారం చేసుకుంటున్నారు.ఇక మంత్రి లోకేష్ అమెరికాలో ఆయా కంపెనీల సీఈవోలను కలవడాన్ని హైలైట్ చేస్తూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. టెస్లా కార్ల కంపెనీకి లోకేష్ ఆహ్వానం పలికారని, స్మార్ట్ సిటీ ప్రాజెక్టులలో భాగస్వాములు కావాలని కోరారని రాశారు. వీటిలో నిజంగా ఏదైనా జరిగితే మంచిదే. కానీ ఇదే లోకేష్ కొద్ది సంవత్సరాల క్రితం టెస్లా కంపెనీ ఏపీకి వచ్చేస్తున్నదన్నట్టుగా చెప్పారు. ఇప్పుడు నిజంగానే దాన్ని సాధించగలిగితే స్వాగతించవచ్చు. అలా కాకుండా ప్రచార ఆర్భాటానికి సూపర్ సిక్స్ హామీల అమలు వైఫల్యాన్ని డైవర్ట్ చేయడానికి ఇలాంటి యాత్రలు చేస్తుంటే అది ప్రజల్ని మోసం చేయడమే అవుతుంది.ఎల్లో మీడియాలో మరో మోసపూరిత కథనం ఇచ్చింది. స్కిల్ హబ్ గా ఏపీ మారుతోందని నైపుణ్య శిక్షణతో ఏడాదికి 1.24 లక్షల ఉద్యోగాలు వస్తాయని 92వేల మందికి స్వయం ఉపాధి కలుగుతుంది సిడాప్ వార్షిక ప్రణాళిక తెలిపిందంటూ ఆహా,ఓహో అంటూ భజనం చేసింది. ఒక వైపు ఉన్న ఉద్యోగాలను ఊడగొడతూ ఇంకోవైపు లక్షల ఉద్యోగాలు వస్తాయని నివేదికలు తయారు చేస్తూ ప్రజల్ని మభ్యపెట్టడానికి జరుగుతున్న ప్రయత్నాలను ప్రజలు గమనించలేరా!. ::: కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
భువనగిరి: రామన్నపేటలో టెన్షన్.. భారీగా పోలీస్ బందోబస్తు
సాక్షి, భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రామన్నపేటలో ఏర్పాటు చేయనున్న అదానీ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ నేపథ్యంలో రామన్నపేటలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు.. కంపెనీ ఏర్పాటును అఖిలపక్షం నేతలు వ్యతిరేకిస్తున్నారు.రామన్నపేటలో అంబుజా సిమెంట్స్ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. చిట్యాల వద్ద మాజీ ఎమ్మెల్యే లింగయ్య అరెస్ట్. పోలీసులతో లింగయ్య వాగ్వివాదం జరిగింది. ఈ క్రమంలో పోలీసు వాహనంలో లింగయ్యను స్టేషన్‌కు తరలించినట్టు తెలుస్తోంది. ఇక, ప్రజాభిప్రాయ సేకరణ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అభిప్రాయ సేకరణ చేస్తున్న ప్రాంతానికి భారీగా చేరుకుంటున్నారు అఖిలపక్ష నేతలు. ఈ సందర్భంగా పోలీసులు స్థానికేతరులను అడ్డుకుని వెనక్కి పంపిస్తున్నారు. అభిప్రాయసేకరణను జరగనివ్వమని అఖిలపక్ష నేతలు చెబుతున్నారు. మరోవైపు.. స్థానికులు కూడా అంబుజా గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు. రామన్నపేట పట్టణ కేంద్రంలో అదానీ అంబుజా సిమెంట్ పరిశ్రమకు అనుమతి ఇవ్వద్దని పలు గ్రామాల ప్రజలు, స్థానిక రాజకీయ నాయకులు మంగళవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ పరిశ్రమ ఏర్పాటు చేయడం వల్ల కాలుష్య సమస్య తలెత్తి ప్రజా ఆరోగ్యాలు దెబ్బ తినడంతో పాటు పచ్చటి పంట పొలాలు నాశనం అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు చేస్తామని మండల పరిధిలోని కొమ్మాయిగూడెంలో సుమారు 350 ఎకరాలను కొనుగోలు చేసి అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి ఏర్పాటుకు ఈనెల 23న ప్రజాభిప్రాయ సేకరణకు నోటిఫికేషన్ జారీ చేశారని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లో ఫ్యాక్టరీకి అనుమతులు ఇవ్వకూడదని డిమాండ్ చేశారు. -
అదానీ చేతికి ఓరియంట్ సిమెంట్
న్యూఢిల్లీ: సిమెంట్ పరిశ్రమలో స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునే దిశగా అదానీ గ్రూప్ కొనుగోళ్ల పరంపర కొనసాగిస్తోంది. తాజాగా సీకే బిర్లా గ్రూప్‌లో భాగమైన ఓరియంట్ సిమెంట్ (ఓసీఎల్) కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. డీల్ విలువ సుమారు రూ. 8,100 కోట్లుగా ఉండనుంది. కంపెనీ ప్రకటన ప్రకారం అదానీ గ్రూప్‌లో భాగమైన అంబుజా సిమెంట్స్ సంస్థ... ఓరియంట్ సిమెంట్‌లో 46.8 శాతం వాటాలను చైర్మన్ సీకే బిర్లాతో పాటు నిర్దిష్ట పబ్లిక్ షేర్‌హోల్డర్ల నుంచి రూ.3,791 కోట్లకు కొనుగోలు చేయనుంది.దీంతో మరో 26 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ఓపెన్ ఆఫర్ ఇవ్వాల్సి ఉంది. ఒక్కో ఓసీఎల్ షేరుకు రూ. 395.40 రేటు చొప్పున చెల్లించనున్నట్లు, ఈ కొనుగోలుతో తమ మార్కెట్ వాటా రెండు శాతం మేర పెరగనున్నట్లు అంబుజా సిమెంట్స్ తెలిపింది. ఇందుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. ‘ఓసీఎల్ కొనుగోలుతో అంబుజా 2025 ఆర్థిక సంవత్సరం నాటికి 100 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధిస్తుంది. కీలక మార్కెట్లలో విస్తరించడానికి, మార్కెట్ వాటాను 2% మేర పెంచుకోవడానికి ఈ డీల్ తోడ్పడుతుంది‘ అని అంబుజా సిమెంట్స్ డైరెక్టర్ కరణ్ అదానీ తెలిపారు. టెక్నాలజీ, సరీ్వస్ ఆధారిత వ్యాపారాలపై మరింత ఇన్వెస్ట్ చేసే క్రమంలో విక్రయ నిర్ణయం తీసుకున్నట్లు ఓరియంట్ సిమెంట్ చైర్మన్ సీకే బిర్లా తెలిపారు.అదనంగా మరో 8.5 మిలియన్ టన్నుల సామర్థ్యం .. ఓరియంట్ సిమెంట్‌కు పశ్చిమంలో ఒకటి, దక్షిణాదిలో ఒకటి చొప్పున మొత్తం 2 సిమెంట్ ప్లాంట్లు ఉన్నాయి. వీటి ఉత్పత్తి సామర్థ్యం 8.5 మిలియన్ టన్నులు. అలాగే, మరో 8.1 మిలియన్ టన్నుల ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయి. రాజస్తాన్‌లోని చిత్తోర్‌గఢ్‌లో అత్యంత నాణ్యమైన సున్నపు రాయి గని ఈ సంస్థ సొంతం. ఓసీఎల్ కొనుగోలుతో అంబుజా సామర్థ్యం 97.4 మిలియన్ టన్నులకు పెరుగుతుంది. -
పెట్టుబడులకు పెద్దన్నలు
దేశీయంగా వినియోగం పెరుగుతున్న కొద్దీ వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా దిగ్గజ కంపెనీలు భారీగా కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. ఇందుకోసం భారీగా ఇన్వెస్ట్ చేయబోతున్నాయి. ఇటీవలి మూడీస్ రేటింగ్స్ ప్రకారం.. కొన్నాళ్ల పాటు ఏటా 45–50 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెడతాయనే అంచనాలు నెలకొన్నాయి.ఆర్థిక వృద్ధి, ఉద్యోగాల కల్పన కోసం తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు కూడా ఈ పెట్టుబడులకు దోహదపడనున్నాయి. ఇక, స్టాండర్డ్ అండ్ పూర్ అంచనాల ప్రకారం వచ్చే దశాబ్దకాలంలో కార్పొరేట్ దిగ్గజాలు 800 బిలియన్ డాలర్లపైగా పెట్టుబడులు పెట్టబోతున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా, అదానీ, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్, వేదాంత వంటి దిగ్గజాలు ఈ మేరకు ప్రణాళికలు వేసుకుంటున్నాయి. ఇందులో దాదాపు 40 శాతం పెట్టుబడులు, అంటే సుమారు 350 బిలియన్ డాలర్లు హరిత హైడ్రోజన్, పర్యావరణహిత ఇంధనాలు, ఏవియేషన్, సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, డేటా సెంటర్లు వంటి .. కొత్త వ్యాపారాల్లోకి రానున్నాయి. అలాగే, ప్రస్తుత వ్యాపారాలను కూడా మరింత పటిష్టం చేసుకోవడంపై బిర్లా, మహీంద్రా, హిందుజా, హీరో, ఐటీసీ, బజాజ్ వంటి పలు దిగ్గజాలు దృష్టి పెడుతున్నాయి. గడిచిన రెండేళ్లుగా ఆయా సంస్థల పెట్టుబడుల సరళిని చూస్తే ఇందుకోసం వచ్చే పదేళ్లలో దాదాపు 400 బిలియన్ డాలర్ల నుంచి 500 బిలియన్ డాలర్ల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చని అంచనాలు నెలకొన్నాయి. రిస్క్‌లూ ఉన్నాయి..!దేశీ దిగ్గజాల వ్యా పార వృద్ధికి అవకాశాలు భారీగానే ఉన్నప్పటికీ.. పెట్టుబడులపరంగా కొన్ని రిసు్కలు కూడా ఉంటాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. పెట్టుబడుల కోసం ఏవో కొన్ని సంస్థలు తప్ప చాలా మ టుకు కంపెనీలు పెద్ద ఎత్తున రుణాలపైనే ఆధారపడాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. కాబట్టి లాభదాయకత ఎలా ఉంటుందో ఇంకా తెలియని కొత్త రంగాల్లో పెట్టుబడులపరంగా కావచ్చు ప్రణాళికల అమలుపరంగా కావ చ్చు ఏవైనా సమస్యలు ఎదురైతే రుణభారం గణనీ యంగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయని ఆ వర్గాలు చెబుతున్నాయి. వీటిని గుర్తించే ఆయా కంపెనీలు కొత్త టెక్నాలజీలపై ఇన్వెస్ట్ చేసే విషయంలో ప్రత్యామ్నాయ ప్రణాళికలను కూడా సిద్ధంగా ఉంచుకుంటున్నాయి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
అదానీ ప్రాజెక్ట్‌పై కొత్త ప్రభుత్వం పునఃపరిశీలన
పవన విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకోసం అదానీ గ్రూప్‌నకు గత ప్రభుత్వం మంజూరు చేసిన ఆమోదాన్ని పునఃపరిశీలిస్తామని కొత్తగా ఏర్పడిన శ్రీలంక ప్రభుత్వం తెలిపింది. ఈమేరకు అనురా కుమార దిసానాయకే నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం శ్రీలంక సుప్రీంకోర్టుకు వివరాలు తెలియజేసింది.ప్రాజెక్టును సమీక్షించాలని అక్టోబర్ 7న జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ఐదుగురు సభ్యులు కలిగిన సుప్రీంకోర్టు బెంచ్‌కి ప్రభుత్వం తెలియజేసింది. నవంబర్ 14న జరగనున్న పార్లమెంట్ ఎన్నికల తర్వాత కొత్త కేబినెట్ ఏర్పాటయ్యాక తుది నిర్ణయం తీసుకుంటామని కోర్టుకు విన్నవించింది. సెప్టెంబర్ 21 అధ్యక్ష ఎన్నికలకు ముందు ప్రెసిడెంట్ దిసానాయకే తన నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్పీపీ) కూటమి ప్రతిపాదిత ప్రాజెక్ట్‌ను రద్దు చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ శ్రీలంక ఇంధన రంగ సార్వభౌమత్వానికి ముప్పుగా పరిణమించిందని.. తాము విజయం సాధించిన తర్వాత ప్రాజెక్టును రద్దు చేస్తామని ఎన్పీపీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది.ఇదీ చదవండి: ‘పదేళ్ల అనుభవం.. ఆ ప్రశ్నతో చిరాకేసింది’అదానీ గ్రూప్ శ్రీలంకలోని ఈశాన్య ప్రాంతాలైన మన్నార్, పూనేరిన్‌లలో 484 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేసేలా గత ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. 20 సంవత్సరాల ఒప్పందంలో భాగంగా 440 మిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంది. ఈ ప్రాజెక్ట్ శ్రీలంక సుప్రీంకోర్టులో ప్రాథమిక హక్కుల వ్యాజ్యాన్ని ఎదుర్కొంది. పర్యావరణ ఆందోళనలు, అదానీ గ్రీన్ ఎనర్జీకి అనుమతినిచ్చే బిడ్డింగ్ ప్రక్రియలో పారదర్శకత లోపాన్ని పిటిషనర్లు లేవనెత్తారు. ఒక కిలోవాట్ అవర్‌కు అంగీకరించిన 0.0826 డాలర్ల టారిఫ్ శ్రీలంకకు నష్టాన్ని కలిగిస్తుందని.. ఇది 0.005 డాలర్లకు తగ్గించాలని పిటిషనర్లు వాదించారు. -
మరో సిమెంట్ కంపెనీపై అదానీ కన్ను!
న్యూఢిల్లీ: హైడెల్బర్గ్ సిమెంట్ ఇండియాపై అదానీ గ్రూప్ కన్నేసింది. జర్మన్ దిగ్గజం హైడెల్బర్గ్ మెటీరియల్స్ దేశీ అనుబంధ సంస్థ హైడెల్బర్గ్ సిమెంట్ కొనుగోలుకు అదానీ గ్రూప్ చర్చలు నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో హైడెల్బర్గ్ సిమెంట్ ఇండియా షేరు తొలుత ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో 18 శాతం దూసుకెళ్లింది. రూ.258 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. చివరికి 4 శాతం లాభంతో రూ.227 వద్ద ముగిసింది.చర్చలు సఫలమైతే హైడెల్బర్గ్ ఇండియాను బిలియనీర్ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ గ్రూప్ దిగ్గజం అంబుజా సిమెంట్స్ సొంతం చేసుకునే వీలున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 1.2 బిలియన్ డాలర్ల (సుమారు రూ.10,000 కోట్లు) విలువలో డీల్ కుదరవచ్చని అంచనా వేశాయి. అయితే అంబుజా సిమెంట్స్ షేరు ఎన్ఎస్ఈలో 3.3 శాతం క్షీణించి రూ.591 వద్ద ముగిసింది.ఇదీ చదవండి: పేరుకుపోతున్న వాహన నిల్వలు2006లోనే భారత్‌లోకి..హైడెల్బర్గ్ సిమెంట్ ఏజీ 2006లో భారత్‌లోకి ప్రవేశించింది. మైసూర్ సిమెంట్, కొచ్చిన్ సిమెంట్, ఇండోరమా సిమెంట్‌తో ఏర్పాటైన జాయింట్ వెంటర్లను కొనుగోలు చేయడం ద్వారా కార్యకలాపాలు ప్రారంభించింది. వ్యాపార పునర్వ్యవస్థీకరణ, విస్తరణల తర్వాత 5.5 మిలియన్ టన్నులకు స్థాపిత సిమెంట్ సామర్థ్యాన్ని చేర్చుకుంది. 2016లో ఐటల్ సిమెంట్ కొనుగోలుతో కార్యకలాపాలు రెట్టింపునకు పెంచుకుంది. ప్రస్తుతం నాలుగు సమీకృత సిమెంట్ తయారీ, గ్రైండింగ్ యూనిట్లను కలిగి ఉంది. దాంతో స్థాపిత సామర్థ్యం 14 మిలియన్ టన్నులకు ఎగసింది. మైసెమ్, జువారీ బ్రాండ్లతో 12 రాష్ట్రాల్లో విస్తరించింది. అదానీ గ్రూప్ అంబుజా సిమెంట్‌ను కొనుగోలు చేసిన తర్వాత చాలా కంపెనీలతో చర్చలు జరుపుతున్నారు. అందులో భాగంగానే హైడెల్బర్గ్ సిమెంట్‌ను కొనుగోలు చేస్తున్నారనేలా వార్తలు వస్తున్నాయి. -
వృద్ధి బాటలో అదానీ ఎనర్జీ
న్యూఢిల్లీ: విద్యుత్ ప్రసార కంపెనీ అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 18.5 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 1,54,660 కోట్లు) ఎంటర్ప్రైజ్ విలువను సాధించినట్లు బ్రోకరేజీ కాంటర్ ఫిట్జ్‌గెరాల్డ్ పేర్కొంది. పటిష్ట వృద్ధిలోనున్న బిజినెస్ కారణంగా కంపెనీ ఆదాయం, పన్నుకుముందు లాభాల్లో భారీ పురోగతికి వీలున్నట్లు అంచనా వేసింది. రానున్న మూడేళ్లలో ఆదాయం వార్షిక ప్రాతిపదికన 20 శాతం, పన్నుకుముందు లాభాలు 29 శాతం చొప్పున పుంజుకోగలవని అభిప్రాయపడింది. కంపెనీ విద్యుత్ ప్రసారం, పంపిణీ ఆస్తులతోపాటు.. స్మార్ట్ మీటరింగ్ బిజినెస్‌లను కలిగి ఉంది. మూడేళ్ల(2024 నుంచి 2027) కాలంలో వార్షిక ప్రాతిపదికన ఆదాయం 20 శాతం, నిర్వహణ లాభం(ఇబిటా) 29 శాతం చొప్పున పురోగమించనున్నట్లు కాంటర్ ఫిట్జ్ అంచనా వేసింది. -
పచ్చని కొలువులు తోడుంటే..!
2070 నాటికి కర్బన ఉద్గార రహిత (నెట్ జీరో) దేశంగా అవతరించాలనేది భారత్ లక్ష్యం. ఈ దిశగా ఇప్పటికే వడివడిగా అడుగులు పడుతున్నాయి. దిగ్గజ కంపెనీలు పునరుత్పాదక ఇంధన రంగంలో భారీ ప్రాజెక్టులకు తెరతీయడంతో.. గ్రీన్ జాబ్స్‌కు ఫుల్ డిమాండ్ నెలకొంది.పునరుత్పాదక ఇంధన (రెన్యూవబుల్ ఎనర్జీ) కంపెనీలు ఇప్పుడు నిపుణులకు రారామ్మంటూ రెడ్ కార్పెట్ వేస్తున్నాయి. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు తోడు మరిన్ని కొత్త ప్రాజెక్టులు జతవుతుండటంతో భారీగా సిబ్బంది కొరత నెలకొన్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ, టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ, విక్రమ్ సోలార్, జెన్సాల్ గ్రూప్ తదితర సంస్థలు నియామకాల జోరు పెంచిన వాటిలో ఉన్నాయి. ముఖ్యంగా డేటా సైన్స్, వాతావరణ విశ్లేషణ, సోలార్ సెల్–మాడ్యూల్ తయారీ, కార్యకలాపాలు, సరఫరా వ్యవస్థ నిర్వహణ, మెయింటెనెన్స్ వంటి విభాగాల్లో నిపుణులకు భారీగా అవకాశాలున్నాయనేది పరిశ్రమ ఎగ్జిక్యూటివ్‌లు, హెచ్ఆర్ ఏజెన్సీల మాట! సౌర, పవన విద్యుత్‌తో పాటు జల, అణు విద్యుత్ ఇతరత్రా హైబ్రీడ్ ప్రాజెక్టులు రెన్యూవబుల్ ఎనర్జీలోకి వస్తాయి. అదానీ.. 50 గిగావాట్లు బహుముఖ రంగాల్లో దూసుకుపోతున్న అదానీ గ్రూప్.. పునరుత్పాదక ఇంధనంపై భారీగా పెట్టుబడులు పెడుతోంది. సౌర, పవన, హైబ్రీడ్ ప్రాజెక్టుల విస్తరణకు అనుగుణంగా అదానీ గ్రీన్ ఎనర్జీ ప్రధాన కార్యకలాపాలు, మెయింటెనెన్స్‌లో నిపుణుల నియమాకాలపై దృష్టి పెట్టినట్లు కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. 2030 నాటికి 50 గిగావాట్ల (జీడబ్యూ) రెన్యూవబుల్ ఎనర్జీ సామర్థ్యాన్ని సాధించాలని అదానీ లక్ష్యంగా పెట్టుకుంది. డేటా సైంటిస్టులు, ఎలక్ట్రికల్–సివిల్ ఇంజినీర్లు, బిజినెస్ ఇంటెలిజెన్స్, డిజిటల్ టెక్నాలజీలు, సరఫరా వ్యవస్థల స్పెషలిస్టులతో పాటు పరికరాల ప్రొక్యూర్మెంట్లో అనుభవం గల వారికి కూడా కంపెనీ పెద్దపీట వేస్తోంది.హైరింగ్‌లో టాటా ‘పవర్’ ఇక టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ సోలార్ సెల్, మాడ్యూల్ తయారీ; సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల నిర్వహణ, ఆపరేషన్స్–మెయింటెనెన్స్, ఇంజినీరింగ్–టెక్నాలజీ తదితర ఉద్యోగాల భర్తీలో తలమునకమైంది. భారీ ప్రాజెక్టులకు తోడు, రూఫ్‌టాప్ సోలార్ పవర్, ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) చార్జింగ్ కేంద్రాల ఏర్పాటులో కూడా శరవేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థలో 2,500 పైగా సిబ్బంది ఉన్నారు. ‘పునరుత్పాదక విద్యుత్‌కు సంబంధించి ప్రాజెక్టులు ఫాస్ట్‌ట్రాక్‌లో నడుస్తున్నాయి. ఈ మేరకు అనేక ఎంఓయూలు కుదుర్చుకున్నాం. గుజరాత్లో 10,000 మెగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు రానున్నాయి. వీటిద్వారా అనేక ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఈ భారీ విస్తరణ, వృద్ధికి అనుగుణంగా హైరింగ్ జోరు పెంచుతున్నాం’ అని టాటా పవర్ చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ హిమల్ తివారీ పేర్కొన్నారు. ఇక జెన్సాల్ గ్రూప్ బ్యాటరీలు, డేటా ఎనలిటిక్స్, ప్రాజెక్ట్–ల్యాండ్ డెవలప్మెంట్, పర్యావరణం, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ తదితర విభాగాల్లో నిపుణుల వేటలో ఉంది. 2024–2032 మధ్య కాలంలో పునరుత్పాదక ఇంధన మార్కెట్ వార్షికంగా 8.7 శాతం వృద్ధి (సీఏజీఆర్) చెందుతుందని అంచనా. → 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని సాధించాలనేది భారత్ లక్ష్యం. → ప్రస్తుతం భారత్‌లో గ్రీన్ ఎనర్జీ (భారీ జలవిద్యుత్, అణు విద్యుత్‌తో సహా) ఉత్పత్తి సామర్థ్యం 208 గిగావాట్లు. మొత్తం విద్యుదుత్పత్తిలో ఇది దాదాపు 46%. గత 9 ఏళ్లలో 400 శాతం ఎగబాకడం విశేషం. → సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గత 9 ఏళ్లలో 30 రెట్లు ఎగసి 89.4 గిగావాట్లకు చేరింది. → పవన విద్యుత్ సామర్థ్యం 2014 నుంచి ఇప్పటిదాకా రెట్టింపునకు పైగా ఎగసి 47.19 గిగావాట్లకు చేరుకుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
అవన్నీ అబద్దాలే.. హిండెన్‌బర్గ్ ఆరోపణపై అదానీ గ్రూప్
అదానీ గ్రూప్‌పై అమెరికా షార్ట్ సెల్లర్ 'హిండెన్‌బర్గ్ రీసెర్చ్' ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. అదానీ గ్రూప్‌తో సంబంధం ఉన్న 310 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ నిధులను స్విస్ అధికారులు స్తంభింపజేసారని ఆరోపించింది. ఈ ఆరోపణలను నిరాధారమని సంస్థ తిరస్కరించింది.స్విస్ కోర్టు విచారణలో తమకు ఎలాంటి ప్రమేయం లేదని, అలాగే కంపెనీ ఖాతాలు ఏ అధికారం ద్వారా సీక్వెస్ట్రేషన్‌కు గురికాలేదని అదానీ గ్రూప్ పేర్కొంది. తమ మార్కెట్ విలువను తగ్గించడానికి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని వెల్లడించింది. మా విదేశీ హోల్డింగ్ నిర్మాణం పారదర్శకంగా, పూర్తిగా బహిర్గతం జరుగుతోంది. అంతే కాకుండా సంస్థ సంబంధిత చట్టాలకు అనుగుణంగా ఉందని వివరించింది.హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్దాలనీ.. అదానీ గ్రూప్ స్పష్టం చేసింది. ఇది మా పరువును, మార్కెట్ విలువను దెబ్బతీసేందుకు చేస్తున్న కుట్ర అని వివరించింది.ఇదీ చదవండి: దేశవ్యాప్తంగా 1.1 లక్షల ఉద్యోగాలుఅదానీ గ్రూప్పైన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది జనవరిలో కూడా 106 పేజీల నివేదికలను విడుదల చేసి.. అదానీ గ్రూప్‌లో అనేక అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించింది. ఈ సమయంలో కంపెనీ మార్కెట్ విలువ భారీగా తగ్గిపోయింది. ఈ ప్రభావంతో అదానీ సంపద ఏకంగా 60 బిలియన్ డాలర్ల వరకు తగ్గిపోయింది. ఆ తరువాత కంపెనీ షేర్స్ క్రమంగా పెరిగాయి.Swiss authorities have frozen more than $310 million in funds across multiple Swiss bank accounts as part of a money laundering and securities forgery investigation into Adani, dating back as early as 2021.Prosecutors detailed how an Adani frontman invested in opaque…— Hindenburg Research (@HindenburgRes) September 12, 2024 -
అదానీ ఎయిర్‌పోర్ట్స్ ‘ఏవియో’ యాప్
న్యూఢిల్లీ: అదానీ ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్ తాజాగా ‘ఏవియో’ డిజిటల్ ప్లాట్‌ఫాంను ఆవిష్కరించింది. విమానాశ్రయాల్లో ప్యాసింజర్ల ట్రాఫిక్, బ్యాగేజ్ ఫ్లో, గేట్ల దగ్గర పట్టే వెయిటింగ్ సమయం, కన్వేయర్ బెల్టుపై బ్యాగ్‌లు మొదలైన వివరాలను రియల్–టైమ్‌లో తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది.ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ (సీఐఎస్ఎఫ్), ఎయిర్‌లైన్స్, ఎయిర్పోర్ట్ సిబ్బంది, గ్రౌండ్ స్టాఫ్‌కి ఈ యాప్ యాక్సెస్ ఉంటుంది. ప్రయాణికుల రద్దీ, బ్యాగేజ్ ఫ్లోను పర్యవేక్షించేందుకు ఎయిర్పోర్ట్ ఆపరేటర్లు/మేనేజర్లు ఏవియోను ఉపయోగిస్తారు. విమానయాన రంగ సంస్థలు ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఈ ప్లాట్‌ఫాం సహాయకరంగా ఉండగలదని సంస్థ తెలిపింది. అదానీ గ్రూప్ సంస్థ అయిన అదానీ ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్ దేశీయంగా ఏడు విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. -
చైనాలోకి అదానీ అడుగు
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ చైనాలోకి అడుగుపెట్టింది. సప్లయ్ చైన్ సొల్యూషన్లు, ప్రాజెక్టు నిర్వహణ సేవలను ఆఫర్ చేసేందుకు వీలుగా ఓ సబ్సిడరీ కంపెనీని ఏర్పాటు చేసింది. సింగపూర్ కేంద్రంగా పనిచేసే తన సబ్సిడరీ కంపెనీ అదానీ గ్లోబల్ పీటీఈ (ఏజీపీటీఈ) షాంఘై కేంద్రంగా ‘అదానీ ఎనర్జీ రీసోర్సెస్ (షాంఘై) కో’ (ఏఈఆర్సీఎల్)ను ఏర్పాటు చేసినట్టు అదానీ ఎంటర్ప్రైజెస్ స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు సమాచారం ఇచి్చంది. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా కంపెనీల చట్టం కింద ఏఈఆర్సీఎల్ను సెపె్టంబర్ 2న ఏర్పాటు చేశామని, ఇది ఇంకా వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించాల్సి ఉందని తెలిపింది. ఎయిర్‌పోర్ట్‌లు, మైనింగ్, రోడ్లు, ప్రాజెక్టుల నిర్మాణం, నీటి ప్రాజెక్టులు, గ్రీన్ ఎనర్జీ తదితర రంగాల్లో అదానీ ఎంటర్ప్రైజెస్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కెన్యాలోని నైరోబీలో జోమో కెన్యట్టా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అభివృద్ధికి గాను ఆ దేశ ప్రభుత్వంతో చర్చలు కూడా నిర్వహిస్తోంది. ఇది సఫలమైతే ఆ సంస్థకు భారత్ వెలుపల ఇది మొదటి ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ అవుతుంది. -
సెమీకండక్టర్ మిషన్‌కు రూ.83 వేలకోట్లు..?
ఇండియన్ సెమీకండక్టర్ మిషన్(ఐఎస్ఎం) రెండో దశకు 10 బిలియన్ డాలర్లు(రూ.83 వేలకోట్లు) కేటాయించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దేశీయంగా సెమీకండక్టర్ తయారీ, ప్యాకేజింగ్, డిజైనింగ్ కోసం ఈ నిధులను ఉపయోగించబోతున్నట్లు ప్రభుత్వ సీనియర్ అధికారి తెలిపారు. టవర్ సెమీకండక్టర్, అదానీ గ్రూప్ సంయుక్తంగా చిప్ తయారీ ప్లాంట్‌ను తయారు చేయాలని ప్రతిపాదించాయి. అందుకోసం ఈ నిధుల్లో కొన్నింటిని వాడుకోనున్నట్లు తెలిసింది.దేశీయంగా ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. దానివల్ల ఎలక్ట్రానిక్ పరికరాల్లో వాడే సెమీకండక్టర్లకు గిరాకీ ఏర్పడింది. స్థానికంగా ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీలు సెమీకండక్టర్ల దిగుమతిపై ఆధారపడుతున్నాయి. అందుకు భిన్నంగా స్థానికంగా వీటిని అభివృద్ధి చేసి వినియోగించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎం)ను డిసెంబర్ 2021లో ప్రతిపాదించింది. మొదటి దశలో భాగంగా ఔట్సోర్స్డ్ అసెంబ్లీ అండ్ టెస్టింగ్(ఓఎస్ఏటీ)తోపాటు అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్(ఏపీఎంపీ) కంపెనీలకు ప్రోత్సాహకాలు అందించింది. మరికొన్ని నెలల్లో ఈ కంపెనీలు సెమీకండక్టర్ల ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.ఇదీ చదవండి: మూడు గనుల్లో 40,560 మందికి ఉపాధిఐఎస్ఎం రెండో దశలో భాగంగా రూ.83 వేలకోట్ల ప్రోత్సాకాలు అందించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇజ్రాయెల్‌కు చెందిన టవర్ సెమీకండక్టర్ సంస్థ, అదానీ గ్రూప్ సంయుక్తంగా మెగా సెమీకండక్టర్ చిప్ ఫ్యాబ్రికేషన్ యూనిట్‌ను సిద్ధం చేయాలని యోచిస్తున్నాయి. ఈమేరకు మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపినట్లు తెలిసింది. ఇప్పటికే టాటా గ్రూప్ సెమీకండక్టర్ల ఉత్పత్తి కోసం ప్రణాళికలు సిద్ధం చేసింది. -
సెబీ చైర్మన్‌ను పిలుస్తాం
న్యూఢిల్లీ: మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) చైర్మన్‌గా ఉంటూనే మాధబి పురి బుచ్ ఐసీఐసీఐ నుంచి వేతనం తీసుకుని పరస్పర విరుద్ద ప్రయోజనాలు పొందడంసహా ఆమెపై, సెబీపై పలు ఆరోపణలు వెల్లువెత్తడంతో సెబీ పనితీరును సమీక్షించాలని ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) నిర్ణయించింది. ఈ విషయంలో మాధబిని పిలిపించి ప్రశ్నించేందుకు ఆమెకు సమన్లు జారీచేయడంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్, కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ చెప్పారు. అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్ ఫండ్లలో మాధబి, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని అమెరికన్ షార్ట్‌సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ ఆరోపణలు గుప్పించిన విషయం తెల్సిందే. -
అడ్మిషన్ తిరస్కరించిన కాలేజీకే ముఖ్య అతిథిగా..
దేశంలోనే అత్యంత ధనవంతుడు గౌతమ్ అదానీ విద్యార్థిదశలో తన అడ్మిషన్ దరఖాస్తును తిరస్కరించిన కాలేజీలోనే ఇటీవల ఉపన్యాసం ఇచ్చారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ముంబయిలోని జై హింద్ కాలేజీ గౌతమ్ అదానీను ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. ఈ సందర్భంగా అదానీని పరిచయం చేసే క్రమంలో కాలేజీ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు విక్రమ్ నాంకనీ ఆసక్తికర విషయాలు తెలిపారు.‘1977-78 సంవత్సరంలో గౌతమ్ అదానీ తన పదహారో ఏటా జై హింద్ కాలేజీలో చదివేందుకు అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అప్పటికే తన సోదరుడు ఈ కాలేజీలో చదవగా తాను ఇక్కడే చేరాలని నిర్ణయించుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల కాలేజీ తన అడ్మిషన్‌ను తిరస్కరించింది. దాంతో అదే సంవత్సరం ముంబయిలో డైమండ్ సార్టర్‌గా జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత అంచెలంచెలుగా తన వ్యాపారాన్ని విస్తరించారు. దేశంలోనే అత్యంత ధనవంతుడిగా ఎదిగారు. అడ్మిషన్ తిరస్కరించిన కాలేజీలోనే ఉపన్యాసం ఇచ్చేందుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు’ అని విక్రమ్ నాంకనీ వెల్లడించారు.కాలేజీ నుంచి వెళ్లిన అదానీ వ్యాపారంలో ఎదిగి ప్రస్తుతం 220 బిలియన్ డాలర్ల (సుమారు రూ.18.26 లక్షల కోట్లు) సామ్రాజ్యానికి అధిపతి అయ్యారు. ఇటీవల హురున్ ఇండియా ప్రకటించిన దేశంలోని అత్యంత ధనవంతుల జాబితాలో ముఖేశ్ అంబానీను వెనక్కినెట్టి మొదటి స్థానంలోకి చేరుకున్నారు.అదానీ వ్యాపార సామ్రాజ్యంఎనర్జీ అండ్ యూటిలిటీస్ రంగంలో..అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్అదానీ పవర్ లిమిటెడ్అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్రవాణా అండ్ లాజిస్టిక్స్ రంగంలో..అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్అదానీ ఎయిర్పోర్ట్స్సహజ వనరుల విభాగంలో..అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ఇదీ చదవండి: పెట్రోల్, డీజిల్ ధరలపై త్వరలో కేంద్రం తీపి కబురుఇతర రంగాలుఅదానీ విల్మార్ లిమిటెడ్అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్అదానీ వాటర్అదానీ రోడ్, మెట్రో అండ్ రైల్అదానీ డేటా సెంటర్స్ -
అంబానీను దాటేసిన అదానీ.. హురున్ రిచ్ లిస్ట్ విడుదల
దేశంలో అత్యంత సంపన్నుల జాబితాను హురున్ ఇండియా విడుదల చేసింది. అందులో గౌతమ్ అదానీ(62) మొదటి స్థానంలో నిలిచారు. ఇప్పటివరకు ఈ స్థానంలో ఉన్న ముఖేశ్ అంబానీ రెండో స్థానానికి చేరారు. ఆ లిస్ట్‌లో బాలివుడ్ స్టార్ షారుఖ్‌ఖాన్‌కు తొలిసారి చోటు దక్కింది.ఈ సందర్భంగా హురున్ ఇండియా వ్యవస్థాపకులు అనస్ రెహమాన్ జునైద్ మాట్లాడుతూ..‘రూ.11.6 లక్షల కోట్ల సంపదతో గౌతమ్ అదానీ(62) తన కుటుంబం హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024లో టాప్‌లో నిలిచింది. గత ఏడాది భారత్‌లో ప్రతి ఐదు రోజులకు ఒక కొత్త బిలియనీర్ తయారయ్యాడు. చైనా బిలియనీర్ల సంఖ్య 25 శాతం పడిపోయింది. భారత్‌లో వీరి సంఖ్య 29% పెరిగింది. దాంతో దేశంలో రికార్డు స్థాయిలో బిలియనీర్ల సంఖ్య 334కు చేరింది. ఆసియా సంపద సృష్టిలో భారత వాటా అధికమవుతోంది’ అని తెలిపారు.హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 నివేదిక ప్రకారం..1. గౌతమ్ అదానీ, కుటుంబం: రూ.11.6 లక్షల కోట్లు2. ముఖేష్ అంబానీ, కుటుంబం: రూ.10.1 లక్షల కోట్లు 3. శివ్ నాడార్, కుటుంబం: రూ.3.1 లక్షల కోట్లు4. సైరస్ పునావాలా, కుటుంబం: రూ.2.89 లక్షల కోట్లు5. దిలిప్ సింఘ్వీ: రూ.2.49 లక్షల కోట్లు.6. కుమార్ మంగళం బిర్లా: రూ.2.35 లక్షల కోట్లు.7. గోపిచంద్ హిందుజా, కుటుంబం: రూ.1.92 లక్షల కోట్లు.8. రాధాకృష్ణ దమాని, కుటుంబం: రూ.1.90,900 కోట్లు.9. అజిమ్ ప్రేమ్‌జీ, కుటుంబం: రూ.1.90,700 కోట్లు.10. నిరజ్ బజాజ్, కుటుంబం: రూ.1.62 లక్షల కోట్లు2024 హురున్ ఇండియా రిచ్ లిస్ట్‌లో తక్కువ వయసు ఉన్న వారిగా జెప్టో క్విక్ కామర్స్ సంస్థ సహ వ్యవస్థాపకురాలు కైవల్య వోహ్రా(21) నిలిచారు.షారుఖ్ ఖాన్‌కు చోటుమొదటిసారిగా బాలివుడ్ నటుడు షారుఖ్ ఖాన్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్‌లో చోటు సంపాదించారు. ఐపీఎల్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్‌లో తాను వాటాలు కలిగి ఉండడంతో వాటి విలువ పెరిగింది. దాంతో మొత్తంగా రూ.7,300 కోట్లతో ఈ లిస్ట్‌లో స్థానం సంపాదించారు. -
‘అనిశ్చితులున్నా కరెంట్ ఇస్తాం’
బంగ్లాదేశ్‌కు విద్యుత్ సరఫరా చేయడానికి కట్టుబడి ఉన్నామని అదానీ పవర్ స్పష్టం చేసింది. ఆ దేశంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో భారత్ విద్యుత్ ఎగుమతుల నిబంధనల్లో మార్పులు చేసింది. అయినా గతంలో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా బంగ్లాదేశ్‌కు విద్యుత్ సరఫరా చేస్తామని అదానీ పవర్ సంస్థ ప్రతినిధులు ప్రకటన విడుదల చేశారు.ప్రకటనలోని వివరాల ప్రకారం..బంగ్లాదేశ్‌లో ఇటీవల నెలకొన్న రాజకీయ పరిణామాల వల్ల భారత్ విద్యుత్ ఎగుమతుల నిబంధనల్లో మార్పులు చేసింది. బంగ్లాదేశ్‌కు సరఫరా చేసే విద్యుత్‌ను దేశీయంగా విక్రయించాలనేది వాటి సారాంశం. కానీ గతంలో ఆ దేశంతో కుదుర్చుకున్న ఒప్పందానికి కట్టుబడి ఉన్నట్లు అదానీ గ్రూప్ తెలిపింది. బంగ్లాకు విద్యుత్ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. బంగ్లాదేశ్ పవర్ డెవలప్మెంట్ బోర్డ్ షెడ్యూల్ ప్రకారం విద్యుత్ కొనుగోలు ఒప్పందంలోని నిబంధనలను పాటిస్తామని చెప్పింది. జార్ఖండ్ రాష్ట్రంలోని అదానీ పవర్‌కు చెందిన 1,600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌లో తయారవుతున్న 100% పవర్‌ను పొరుగు దేశానికి ఎగుమతి చేసేలా ఒప్పందం జరిగింది.ఇదీ చదవండి: ప్రాణాంతక వ్యాధులున్నా.. బీమా సొమ్ము!బంగ్లాదేశ్‌లోని రాజకీయ అస్థిరతలు, అల్లర్ల వల్ల భారత్ నుంచి విద్యుత్ సరఫరా చేసే కంపెనీల మౌలిక సదుపాయాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. దాంతోపాటు గ్రిడ్ నిర్వహణ క్లిష్టంగా మారవచ్చని భావించి ప్రభుత్వం ఎగుమతి నిబంధనల్లో మార్పులు చేసింది. తాత్కాలికంగా విద్యుత్‌ను స్థానికంగా సరఫరా చేసి, అక్కడి పరిస్థితులు కుదుటపడ్డాక తిరిగి ఒప్పందాలకు అనువుగా విద్యుత్ ఎగుమతి చేసేలా వెసులుబాటు కల్పించింది. అయితే అన్ని కంపెనీలు కచ్చితంగా దీన్ని పాటించాలనే నియమం లేదు. -
22న దేశవ్యాప్త నిరసన
సాక్షి, న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్ ఫండ్లలో సెక్యూరిటీస్, ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) చైర్పర్సన్ మాధవి పురీ బుచ్, ఆమె భర్త ధవళ్‌కు వాటాలు ఉన్నాయని అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ చేసిన సంచలన ఆరోపణలపై రాజకీయ వేడి మరింత పెరిగింది. వివాదంలో కేంద్ర బిందువుగా మారిన మాధవి వెంటనే రాజీనామా చేయాలని, అదానీ అంశంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) విచారణకు డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఈనెల 22వ తేదీన దేశవ్యాప్త నిరసనకు పిలుపునిచి్చంది.ఈ మేరకు మంగళవారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌లు, పీపీసీ చీఫ్‌లతో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే భేటీ తర్వాత పార్టీ ఈ ప్రకటన చేసింది. ఈ ప్రత్యేక సమావేశంలో రాబోయే ఎన్నికల కోసం పార్టీ సన్నద్ధత, సంస్థాగత అంశాలు, ఎన్నికలపరంగా జాతీయ ప్రాముఖ్యత గల వివిధ అంశాలు, సమస్యలపై ముఖ్యనేతలు విస్తృతంగా చర్చించారు. హరియాణా, మహారాష్ట్ర, జార్ఖండ్, జమ్మూకశీ్మర్‌లలో త్వరలో ఎన్నికలు జరగనున్న విషయం విదితమే. ‘‘అదానీ– మాధవి బుచ్ ఉదంతంలో ప్రధాని మోదీ పాత్ర కూడా ఉంది. ఒక సంస్థ ప్రయోజనాల కోసం మార్కెట్ నియంత్రణ సంస్థ ఎంతగా ప్రలోభాలకు గురైందో ఈ ఉదంతం చాటుతోంది’’ అని నేతలు భేటీలో తీర్మానం చేశారు. భేటీ వివరాలను పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీడియా సమావేశంలో వెల్లడించారు. హిండెన్‌బర్గ్ ఉదంతం సహా దేశంలోని పలు సమస్యలపై దేశవ్యాప్తంగా ప్రజలను ఏకం చేసే అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని, అందుకుతగ్గ ప్రచారానికి రూపకల్పన చేసి ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ నిర్ణయించింది. కేరళ వయనాడ్ కొండల్లో ప్రకృతి విలయతాండవం ధాటికి వందల మంది ప్రాణాలు కోల్పోవడంపై సమావేశం తీవ్ర ఆవేదనను, సంతాపాన్ని వ్యక్తం చేసింది. దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించాలన్న రాహుల్ డిమాండ్‌ను నేతలు పునరుద్ఘాటించారు. బంగ్లాదేశ్‌లో దాడులకు గురవుతున్న బాధిత మైనారిటీలు గౌరవంగా బతికేలా తగు సహాయక, పునరావాస చర్యలు తీసుకునేలా మోదీ ప్రభుత్వం బంగ్లాదేశ్ సర్కార్‌పై ఒత్తిడి తేవాలని కాంగ్రెస్ డిమాండ్చేసింది. పేదలు, మధ్యతరగతిని వంచించారు: ఖర్గే ‘‘స్టాక్మార్కెట్లో చిన్న మదుపరుల పెట్టుబడుల భవితవ్యం అగమ్యగోచరం కాకూడదు. హిండెన్‌బర్గ్ బట్టబయలుచేసిన సెబీ, అదానీల ఉదంతం యావత్భారతావనికి షాక్‌కు గురిచేసింది. సెబీ, అదానీ సంబంధాలను బయటపెట్టేందుకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ నేతృత్వంలో దర్యాప్తు జరపాల్సిందే. రాజ్యాంగంపై దాడి నిరాటంకంగా కొనసాగుతోంది.కుల గణన అనేది ప్రజల డిమాండ్. ఈ అంశాలపై త్వరలో దేశవ్యాప్తంగా ప్రజాచైతన్య యాత్రలను చేపడదాం. రైతుల పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కలి్పంచాల్సిందే. అగి్నపథ్ పథకాన్ని రద్దు చేయాలి. దేశంలో హద్దులేని నిరుద్యోగం, పగ్గాల్లేని ద్రవ్యోల్బణంతో పేద, మధ్య తరగతి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పేదలు, మధ్యతరగతిని ప్రభుత్వం వంచించింది. రైళ్లు పట్టాలు తప్పడం, రైలు ప్రమాదాలు ఆనవాయితీగా మారాయి’’ అని ఖర్గే అన్నారు. -
సెబీ చీఫ్‌పై ఆరోపణలు: దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
ఢిల్లీ:అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్ ఫండ్లలో సెబీ ఛైర్పర్సన్ మాధవి పురి, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని హిండెన్‌బర్గ్ ఇటీవల విడుదల చేసిన నివేదిక వివాదాస్పదంగా మారింది. ఈ క్రమంలో ఆమెను సెబీ ఛైర్ పర్సన్‌గా తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు తాజాగా ఆమెను ఛైర్మన్ పదవి నుంచి తొలిగించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ ఆగస్టు 22 దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయాల ముందు నిరసనలు చేపట్టనున్నట్లు ప్రకటించింది.కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, ఎంపీ కేసీ వేణుగోపాల్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆగస్టు 22న దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతాం. అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఈడీ ఆఫీసుల ముందు భైఠాయించి నిరసనలు తెలుపుతాం. ఇవాళ(మంగళవారం) కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీలు, ఇన్ఛార్జ్లు, పీసీసీ ప్రెసిడెంట్లతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆదానీ గ్రూప్, సెబీకి సంబంధించిన అతిపెద్ద కుంభకోణంపై చర్చించాం. అదానీ మెగా స్కామ్‌పై జేపీసీ ఆధ్వర్యంలో విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఆందోళన చేయాలని నిర్ణయం తీసుకున్నాం’’ అని అన్నారు.చదవండి: ముగిసిన ఏఐసీసీ మీటింగ్.. సెబీ, అదానీలే టార్గెట్ -
వైద్యురాలిపై హత్యాచారాన్ని నిరసిస్తూ.. దేశమంతటికీ విస్తరించిన ఆందోళనలు..
-
అదానీపై దర్యాప్తు సీబీఐకి: కాంగ్రెస్
న్యూఢిల్లీ: అదానీ గ్రూపు షేర్ల అవకతవకలపై దర్యాప్తును సెబీ నుంచి సీబీఐకి లేదా సిట్‌కు అప్పగించాలని కాంగ్రెస్ సోమవారం సుప్రీంకోర్టును కోరింది. లేదంటే దేశవ్యాప్త ఆందోళనకు దిగుతామని హెచ్చరించింది. ‘‘హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తాజా ఆరోపణల నేపథ్యంలో సెబీ చైర్పర్సన్ మాధవి బుచ్ రాజీనామా చేయాలి. ‘మోదానీ (మోదీ + అదానీ) మెగా కుంభకోణం’పై విచారణకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలి’’ అని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ డిమాండ్ చేశారు. ‘‘అదానీపై దర్యాప్తును రెండు నెలల్లో ముగించాలని సుప్రీంకోర్టు 2023 మార్చి 3న ఆదేశాలు ఇచ్చింది. కానీ 18 నెలలు గడిచినా కొలిక్కి రాలేదు’’ అన్నారు.తోసిపుచ్చిన బీజేపీ: హిండెన్‌బర్గ్ ఆరోపణలపై జేపీసీ డిమాండ్‌ను బీజేపీ తోసిపుచి్చంది. దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనం చేసి, పెట్టుబడుల వాతావరణాన్ని చెడగొట్టడమే కాంగ్రెస్ ఉద్దేశమని మండిపడింది. -
అదానీ–సెబీ చైర్పర్సన్ ఉదంతంపై... జేపీసీతో దర్యాప్తు
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌లో సెబీ చైర్పర్సన్ మాధబీ పురీ బచ్ పెట్టుబడుల వ్యవహారంపై నిజానిజాలు నిగ్గుతేల్చడానికి సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలని ప్రతిపక్షాలు ఆదివారం డిమాండ్ చేశాయి. ‘‘అప్పుడే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. దీనిపై మోదీ ప్రభుత్వం తక్షణం స్పందించాలి’’ అన్నాయి. అదానీ గ్రూప్‌లో మాధబీ దంపతులు పెట్టుబడులు పెట్టినట్లు హిండెన్‌వర్గ్ తాజాగా ఆరోపించడం తెలిసిందే. అదానీ గ్రూప్, సెబీ చైర్పర్సన్ బంధంపై కేంద్రం నోరు విప్పాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ ఉదంతాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించాలని సుప్రీంకోర్టును కోరారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నేతృత్వంలో దర్యాప్తు జరిపించాలన్నారు. అక్రమాలకు పాల్పడుతున్న సంపన్న మిత్రులను కాపాడుకొనేందుకు మోదీ ప్రయతి్నస్తున్నారని మండిపడ్డారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మాధబీ పదవిలో కొనసాగడం అనైతికమన్నారు. ఆమె ఇంకా రాజీనామా ఎందుకు చేయలేదని రాహుల్ ప్రశ్నించారు. నియంత్రణ సంస్థ సమగ్రతను కేంద్రం కాపాడాలని డిమాండ్ చేశారు. సెబీ చైర్పర్సన్–అదానీ బంధం స్పష్టంగా కనిపిస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని సీతా రాం ఏచూరి (సీపీఎం), డి.రాజా (సీపీఐ), జైరాం రమేశ్ (కాంగ్రెస్), మహువా మొయిత్రా (టీఎంసీ), సంజయ్ సింగ్ (ఆప్), దీపాంకర్ భట్టాచార్య (సీపీఐ–ఎంఎల్) ఆరోపించారు. అదానీ గ్రూప్‌ను కాపాడడమే ప్రభుత్వ లక్ష్యమా అని ప్రశ్నించారు. విపక్షాల కుట్ర: బీజేపీ దేశంలో ఆర్థిక అస్థిరత సృష్టించడానికి ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయని బీజేపీ మండిపడింది. హిండెన్‌బర్గ్ ఆరోపణలను కొట్టిపారేసింది. విదేశీ కుతంత్రాల్లో ప్రతిపక్షాలు భాగంగా మారాయని ధ్వజమెత్తింది. -
హిండెన్‌బర్గ్ ఆరోపణలు... నిరాధారం
న్యూఢిల్లీ: అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తమపై చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని సెబీ చీఫ్ మాధవీ పురీ బచ్ కొట్టిపారేశారు. అదానీ గ్రూప్ సైతం బచ్‌తో తమకు ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవని స్పష్టంచేసింది. కాగా, అదానీ మార్కెట్ అక్రమాల్లో సెబీ చీఫ్ బచ్‌తో పాటు ఆమె భర్త ధవళ్ బచ్‌కు ప్రమేయం ఉందంటూ హిండెన్‌బర్గ్ పెద్ద బాంబ్ పేలి్చన సంగతి తెలిసిందే. బెర్ముడా, మారిషస్‌లలోని అదానీ డొల్ల కంపెనీల్లో వారిద్దరూ పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారని పేర్కొంది. ఆ డొల్ల కంపెనీల నిధులనే అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ దొడ్డిదారిన భారత్‌కు తరలించి అదానీ షేర్ల ధరలను కృత్రిమంగా పెంచేందుకు ఉపయోగించారనేది హిండెన్‌బర్గ్ ఆరోపణ. స్వయంగా మార్కెట్ నియంత్రణ సంస్థ చీఫ్‌నే ఈ వివాదంలోకి లాగడంతో దేశవ్యాప్తంగా పెను దుమారం చెలరేగింది. దీంతో బచ్ దంపతులు సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. హిండెన్‌బర్గ్ తాజా నివేదికలో చేసిన ఆరోపణలన్నీ ‘‘నిరాధారమైనవి, ఊహాగానాలు’’ అంటూ తీవ్రంగా ఖండించారు. వాటిలో ఎలాంటి వాస్తవం లేదని వారు స్పష్టం చేశారు. మా జీవితం, పెట్టుబడులు తెరిచిన పుస్తకం... హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తీవ్ర ఆరోపణలను కొట్టిపారేస్తూ... ‘‘మా జీవితం, పెట్టుబడులు తెరిచిన పుస్తకం. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ గతంలో చేసిన ఏ ఆరోపణలపైన అయితే సెబీ చట్టపరమైన చర్యలు చేపట్టి, షోకాజ్ నోటీసులు జారీ చేసిందో, అదే సంస్థ తమ వ్యక్తిత్వ హననానికి పాల్పడే విధంగా నిరాధార ఆరోపణలు చేయడం దురదృష్టకరం‘ అని బచ్ దంపతులు పేర్కొన్నారు. తమ ఆర్థికపరమైన డాక్యుమెంట్లన్నింటీనీ నిస్సంకోచంగా బయటపెట్టేందుకు సిద్ధమని, అలాగే ప్రైవేటు పౌరులుగా ఉన్నప్పటి కాలానికి సంబంధించిన ఆర్థిక వివరాలన్నింటినీ ఏ ప్రభుత్వ సంస్థ కోరినా ఇస్తామని వారు తేల్చిచెప్పారు. కాగా, అదానీల అక్రమాల్లో స్వయంగా సెబీ చీఫ్‌కు సంబంధాలుండటం వల్లే తాము బయటపెట్టిన అవకతవకలపై లోతుగా విచారణ చేపట్టేందుకు సెబీ నిరాకరించిందని హిండెన్‌బర్గ్ పేర్కొనడం గమనార్హం. మరోపక్క, అదానీ గ్రూప్‌పై ఆరోపణలన్నింటినీ తాము సక్రమంగా దర్యాప్తు చేశామని సెబీ స్పందించింది. విచారణ దాదాపు కొలిక్కి వచి్చందని తెలిపింది. పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు సంబంధించిన అన్ని అంశాలను చైర్పర్సన్ మాధవీ పురి బచ్ ఎప్పటికప్పుడు బహిర్గతం చేశారని కూడా పేర్కొంది. హిండెన్‌బర్గ్ ఏం చేస్తుంది?హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అనేది అమెరికాకు చెందిన ఇన్వెస్టర్ల తరఫున గొంతెత్తే చిన్న రీసెర్చ్ సంస్థ. కొంతమంది రీసెర్చర్ల సహకారంతో 2017లో దీన్ని నాథన్ ఆండర్సన్ నెలకొల్పారు. బాగా పేరొందిన కంపెనీల్లో అకౌంటింగ్ అవకతవకలు, ఇతరత్రా కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలను గుర్తించేందుకు ఫైనాన్షియల్ ఫోరెన్సిక్ సాధనాలను ఉపయోగించి అధ్యయనం చేస్తుంది. గతంలో కూడా నికోలా, క్లోవర్ హెల్త్, బ్లాక్ ఇంక్, కాండీ, లార్డ్స్టౌన్ మోటార్స్ వంటి కంపెనీలను ఇది టార్గెట్ చేసింది. బిజినెస్ మోడల్ ఇదీ.. అవకతవకలపై రీసెర్చ్ నివేదికలను క్లయింట్లకు ఇస్తుంది. నివేదికను పబ్లిక్‌గా బహిర్గతం చేయడానికి ముందే క్లయింట్లు, హిండెన్‌బర్గ్ కూడా ఆయా కంపెనీల షేర్లలో షార్ట్ పొజిషన్లు (ముందుగా షేర్లను అమ్మేసి, బాగా పడిన తర్వాత తిరిగి కొనుగోలు చేయడం ద్వారా సొమ్ము చేసుకోవడం) తీసుకుంటారు. రిపోర్ట్ వెలువడిన తర్వాత సదరు కంపెనీ షేర్లు భారీగా పడిపోవడంతో ఇరువురికీ భారీగా లాభాలొస్తాయి. అదానీ షేర్ల విషయంలో కూడా ఇదే జరిగింది. కాగా, అదానీ ఉదంతంలో తమకు కేవలం 4.1 మిలియన్ డాలర్లు మాత్రమే లభించాయని, రెండేళ్ల పాటు ప్రపంచవ్యాప్తంగా తమ రీసెర్చ్, విచారణ కోసం వెచి్చంచిన భారీ మొత్తంతో పోలిస్తే తమకు పెద్దగా ఒరిగిందేమీ లేదని హిండెన్‌బర్గ్ చెప్పడం విశేషం! బ్లాక్‌స్టోన్‌లో ధవళ్ పదవిపై...బ్లాక్‌స్టోన్ రియల్టీ కార్యకలాపాలతో ధవళ్ బచ్‌కు ఎలాంటి సంబంధం లేదని బచ్ దంపతుల ప్రకటన పేర్కొంది. సెబీ చైర్‌పర్సన్‌గా బచ్ నియామాకానికి ముందే 2019లో ధవళ్ బచ్ను బ్లాక్‌స్టోన్ తమ సీనియర్ అడ్వయిజర్‌గా నియమించుకుందని ప్రకటన స్ప ష్టం చేసింది. సప్లయి చైన్ మేనేజ్మెంట్లో ధవళ్ నైపుణ్యం ఆధారంగానే ఆయనకు ఆ పదవి దక్కిందని పేర్కొంది. రియల్టీ, రీట్‌లపై సెబీ తీసుకున్న నిర్ణయాలు, సంప్రదింపుల ప్రక్రియ అనంతరం బోర్డు ఆమోదం మేరకే జరిగాయని, చైర్పర్సన్ ఒక్కరే ఆ నిర్ణయాలు తీసుకోలేదని కూడా వారు వివరణ ఇచ్చారు. బచ్‌పై ఆరోపణలు ఇవీ... ‘2017లో సెబీలో హోల్‌టైమ్ మెంబర్‌గా బచ్ నియమాకానికి ముందే 2015లో బచ్ దంపతులు ఈ అదానీ డొల్ల కంపెనీల్లో (బెర్ముడాకు చెందిన గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్) ఇన్వెస్ట్ చేశారు. సింగపూర్‌లోని ఐపీఈ ప్లస్ ఫండ్ 1లో (ఇది మారిషస్ ఆఫ్‌షోర్ ఫండ్) వారు తొలుత ఖాతా తెరిచారు. దీనికి సంబంధించిన సంస్థలు అదానీ గ్రూప్ కంపెనీల షేర్లలో ట్రేడింగ్ చేస్తుండేవి. ఇండియా ఇన్ఫోలైన్ (ఐఐఎఫ్ఎల్) మేనేజ్ చేసిన ఈ వెల్త్ మేనేజ్మెంట్ ఫండ్స్‌లో వినోద్ అదానీకి కూడా పెట్టుబడులు ఉన్నాయి. అందులో ఆయన డైరెక్టర్ కూడా. 2022లో బచ్ సెబీ చైర్పర్సన్ అయ్యారు. దీంతో అదానీకి చెందిన మారిషస్, ఇతరత్రా డొల్ల కంపెనీలపై దర్యాప్తును సెబీ పెద్దగా పట్టించుకోలేదు. అదానీ గ్రూప్‌నకు పవర్ ఎక్విప్మెంట్ కొనుగోళ్లలో ఇన్వాయిస్లను పెంచి చూపడం ద్వారా విదేశీ డొల్ల కంపెనీలకు పక్కదారి పట్టించిన నిధులను గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ భారత్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఉపయోగించుకున్నారు’ అని హిండెన్‌బర్గ్ ఆరోపించింది. కాగా, తమ ఐపీఈ ప్లస్ ఫండ్ 1 అదానీ గ్రూప్ షేర్లలో ఎలాంటి పెట్టుబడులు పెట్టలేదని 360 వన్ (గతంలో ఐఐఎఫ్ఎల్ వెల్త్) స్పష్టం చేసింది. 2013 అక్టోబర్–2019 అక్టోబర్ మధ్య నిర్వహించిన తమ ఫండ్‌లో బచ్ దంపతులు చేసిన పెట్టుబడులు మొత్తం నిధుల్లో 1.5 శాతం కంటే తక్కువేనని, పెట్టుబడి నిర్ణయాల్లో ఇన్వెస్టర్ల ప్రమేయం ఏదీ లేదని కూడా పేర్కొంది.దురుద్దేశపూరితం: అదానీ హిండెన్‌బర్గ్ తాజా ఆరోపణలను అదానీ గ్రూప్ కూడా తీవ్రంగా తోసిపుచ్చింది. ‘చట్టాలు, వాస్తవాలను బేఖాతరు చేస్తూ, స్వలాభం కోసం ముందుగానే ఒక నిర్ణయానికి వచి్చ, బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారాన్ని దురుద్దేశపూరితంగా, ఊహాజనితంగా, తారుమారు చేసే విధంగా మార్చిన నివేదిక’ అని స్టాక్ ఎక్సే్ఛంజీలకు వెల్లడించిన సమాచారంలో అదానీ గ్రూప్ పేర్కొంది. మా ప్రతిష్టను దిగజార్చే ఈ ఉద్దేశపూర్వక ప్రయత్నంలో పేర్కొన్న వ్యక్తులతో గానీ, అంశాలతో గానీ అదానీ గ్రూప్‌నకు ఎలాంటి వ్యాపారపరమైన సంబంధాలు లేవని స్పష్టం చేసింది. పారదర్శకతకు తాము కట్టుబడి ఉన్నామని, చట్టపరమైన, నియంత్రణ సంస్థల నిబంధలనకు అనుగుణంగానే నడుచుకుంటున్నామని తేలి్చచెప్పింది. ‘పూర్తిగా దర్యాప్తు చేసిన, నిరాధారమని నిరూపితమైన, 2023లో సుప్రీం కొట్టేసిన అవే ఆరోపణలను హిండెన్‌బర్గ్ పదేపదే తిరగదోడుతోంది. భారతీయ చట్టాలను పూర్తిగా ఉల్లంఘిస్తూ, తప్పుదోవ పట్టించేలా ఆ సంస్థ కావాలనే ఈ ఆరోపణలు గుప్పిస్తోంది’ అని పేర్కొంది.జరిగింది ఇదీ... అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల్లో విదేశీ కంపెనీలకు భారీ వాటాలపై పెద్దయెత్తున ఆరోపణలు రావడంతో సెబీ 2020 అక్టోబర్‌లో దర్యాప్తు మొదలుపెట్టింది. అదానీ కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన విదేశీ ఇన్వెస్టర్లు నిజమైన పబ్లిక్ షేర్‌హోల్డర్లా.. లేదంటే ప్రమోటర్లకు సంబంధించి బినామీలుగా వ్యవహరిస్తున్నారా అనేది తేల్చడమే ఈ దర్యాప్తు ప్రధానోద్దేశం. కాగా, గతేడాది జనవరిలో హిండెన్‌బర్గ్ తొలిసారిగా అదానీ అక్రమాలపై విడుదల చేసిన నివేదిక సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. షేర్ల ధరలను కృత్రిమంగా పెంచుకోవడమే కాకుండా, అకౌంటింగ్ మోసాలకు కూడా పాల్పడిందని ఆరోపణలు గుప్పించింది. దీంతో అదానీ షేర్లు కుప్పకూలడం, 150 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ ఆవిరయ్యేందుకు దారితీసింది. కాగా, షేర్ల ధరల భారీ పతనం, అవకతవకలపై సుప్రీం కోర్టు సెబీతో మరో దర్యాప్తునకు ఆదేశించడంతో పాటు నియంత్రణపరమైన ఉల్లంఘనల నిగ్గు తేల్చాల్సిందిగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. అయితే, అన్నీ సక్రమంగానే ఉన్నాయంటూ కమిటీ నివేదిక ఇవ్వడం గమనార్హం. దీంతో సెబీ చేస్తున్న దర్యాప్తు సరిపోతుందని, సీబీఐ, సిట్ వంటి సంస్థలకు అప్పగించాల్సిన అవసరం లేదని సుప్రీం స్పష్టం చేసింది. హిండెన్‌బర్గ్ ఆరోపణల తర్వాత కోల్పోయిన మార్కెట్ విలువను అదానీ గ్రూప్ షేర్లు పూర్తిగా తిరిగి చేజిక్కించుకుని దూసుకుపోతుండం విశేషం. గత నెలలో కోటక్ మహీంద్రా బ్యాంక్‌ను సైతం హిండెన్‌బర్గ్ ఈ వివాదంలోకి లాగింది. అదానీ డొల్ల కంపెనీలతో ఆ బ్యాంకుకు సంబంధాలున్నాయని ఆరోపించింది. అయితే, కోటక్ బ్యాంక్ కూడా దీన్ని ఖండించింది. కాగా, వాస్తవాలను దాచిపెడుతూ, సంచలనం కోసమే హిండెన్‌బర్గ్ అదానీపై అరోపణలు చేసిందని, అదానీ షేర్ల పతనం ద్వారా లాభపడేందుకు అది న్యూయార్క్ హెడ్జ్ ఫండ్‌తో కుమ్మక్కయిందని పేర్కొంటూ గత నెల 26న సెబీ హిండెన్‌బర్గ్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేయడం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో ఏకంగా సెబీ చీఫ్‌నే ఈ వివాదంలోకి లాగడం కొత్త ట్విస్ట్. -
హిండెన్‌బర్గ్‌కు మాధబి పురి షోకాజు నోటీసులు
న్యూఢిల్లీ : అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్ ఫండ్లలో మాధబి పురికి, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని సెబీ ఛైర్పర్సన్ మాధబి పురి బచ్‌పై అమెరికా షార్ట్‌సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంచలన ఆరోపణలు చేసింది. ఆ ఆరోపణలపై మాధబిపురి బచ్, ఆమె భర్త ధవల్ బచ్‌లు సంయుక్తంగా హిండెన్ బర్గ్‌కు నోటీసులు జారీ చేశారు. భారత్ చట్టాల్ని ఉల్లంఘించి హిండెన్ బర్గ్ ఆరోపణలు చేసిందని, అందుకే ఈ షోకాజు నోటీసులు జారీచేసినట్లు ధవల్ బచ్ దంపతులు తెలిపారు. హిండెన్ బర్గ్ ఆగస్ట్ 10న సంథింగ్ బిగ్ సూన్ ఇండియా అంటూ ట్వీట్ చేసింది. ఆ మరుసటి రోజే అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన ఆఫ్‌షోర్ సంస్థల్లో మాధబి పురికి, ఆమె భర్త ధవల్ బచ్ దంపతులకు వాటాలు ఉన్నాయని హిండెన్‌బర్గ్ ఆరోపిస్తూ ట్వీట్ చేసింది. SEBI Chief Madhabi Puri Buch and her husband Dhaval Buch releases a statement in the context of allegations made by Hindenburg on 10th Aug 2024 against them."The investment in the fund referred to in the Hindenburg report was made in 2015 when they were both private citizens… pic.twitter.com/g0Ui18JVNT— ANI (@ANI) August 11, 2024 ఆ ట్వీట్‌కు మాధబి పురి స్పందించారు. హిండెన్ బర్గ్ తమ వ్యక్తిగత పరువుకు భంగం కలిగేలా వ్యహరిస్తోందని మండిపడ్డారు. హిండెన్ బర్గ్ రిపోర్ట్‌లో పేర్కొన్న ఫండ్‌లో పెట్టుబడి పెట్టడం సెబీలో చేరడానికి రెండేళ్ల ముందు అంటే 2015లో జరిగిందని గుర్తు చేశారు. ఆ ఫండ్స్‌లో తాము పెట్టుబడులు పెట్టడానికి కారణం..ఆ ఫండ్స్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్(సీఐఓ) అనిల్ అహుజా తన స్నేహితుడని ధవల్ బచ్ తెలిపారు. అనిల్ అహుజా నా చిన్న నాటి స్నేహితుడు. పైగా ఇన్వెస్ట్మెంట్ రంగంలో అపారమైన అనుభవం ఉంది. సిటీ బ్యాంక్, జేపీ మోర్గాన్, 3ఐ గ్రూప్ పీఎల్సీ వంటి సంస్థల్లో పనిచేశారు’ అని చెప్పారు. -
హిండెన్‌బర్గ్ ఆరోపణలు: అదానీ గ్రూప్ రియాక్షన్
అమెరికా ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ సంస్థ 'హిండెన్‌బర్గ్ రీసెర్చ్' ఇటీవల నాలుగు పదాల ట్వీట్ చేసింది. పారిశ్రామిక దిగ్గజం అదానీ గ్రూప్ ఆర్థిక అవకతవకలతో సెబీ చైర్పర్సన్ మాధబీ పురీ బోచ్‌కు, ఆమె భర్త ధవళ్ బోచ్‌కు సంబంధముందని తీవ్ర ఆరోపణలు చేసింది. దీనిపైన అదానీ గ్రూప్, సెబీ చైర్పర్సన్ ఇద్దరూ స్పదించారు.హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలను అదానీ గ్రూప్ తిరస్కరించింది. గతంలో కూడా హిండెన్‌బర్గ్ ఆరోపణలు నిరాధారమైనవని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. మా హోల్డింగ్ మొత్తం పారదర్శకంగా ఉందని చెబుతూ.. అనేక పబ్లిక్ డాక్యుమెంట్లలో సంబంధిత వివరాలు క్రమం తప్పకుండా బహిర్గతం చేస్తూనే ఉన్నామని సంస్థ స్పష్టం చేసింది.అదానీ గ్రూప్‌కు సంబంధించిన వ్యక్తులను లేదా మా స్థితిని కించపరచడానికి ఉద్దేశపూర్వక ప్రయత్నాలు చేస్తున్నారని సంస్థ పేర్కొంది. ప్రస్తుతం పేర్కొన్న వ్యక్తులతో ఎటువంటి వాణిజ్య సంబంధాలు లేవు. మేము పారదర్శకత మరియు అన్ని చట్టపరమైన, నియంత్రణ అవసరాలకు అనుగుణంగా కట్టుబడి ఉంటామని కంపెనీ వివరించింది. హిండెన్‌బర్గ్ ఆరోపణలు భారతీయ చట్టాలను పూర్తిగా దిక్కరిస్తున్నాయని అదానీ గ్రూప్ ప్రతినిధి అన్నారు.హిండెన్‌బర్గ్ ఆరోపణలపై సెబీ చీఫ్ కూడా స్పందించారు. 2024 ఆగష్టు 10న హిండెన్‌బర్గ్ నివేదికలో మాపై చేసిన ఆరోపణలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇందులో ఏ మాత్రం నిజం లేదు. మా జీవితం, ఆర్థిక విషయాలు తెరిచిన పుస్తకం వంటివి. అవసరమైన అన్ని విషయాలను ఇప్పటికే సెబీకి అందించాము. వారు కోరే అన్ని ఆర్థిక పత్రాలను ప్రతి అధికారానికి బహిర్గతం చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని అన్నారు. -
Hindenburg Research: అదానీ అక్రమాల్లో సెబీ చీఫ్‌కు భాగస్వామ్యం
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన షార్ట్‌సెల్లర్ కంపెనీ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ మరోసారి బాంబు పేలి్చంది. పారిశ్రామిక దిగ్గజం అదానీ గ్రూప్ ఆర్థిక అవకతవకలతో సాక్షాత్తూ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ చైర్పర్సన్ మాధబీ పురీ బోచ్‌కు, ఆమె భర్త ధవళ్ బోచ్‌కు సంబంధముందని తీవ్ర ఆరోపణలు చేసింది! అందుకే అదానీ ఆర్థిక అవకతవకలపై లోతుగా విచారణ జరిపేందుకు సెబీ పెద్దగా ఆసక్తి చూపడం లేదని అభిప్రాయపడింది. బెర్ముడా, మారిషస్‌ల్లోని అదానీ గ్రూప్ డొల్ల కంపెనీల్లో మాధబీ దంపతులకు వాటాలున్నట్టు శనివారం రాత్రి విడుదల చేసిన తాజా నివేదికలో హిండెన్‌బర్గ్ వెల్లడించింది. ‘‘ఆ కంపెనీల్లో వారిద్దరూ కోటి డాలర్ల మేరకు ‘పెట్టుబడులు’ పెట్టినట్టు చూపారు. పెట్టుబడులకు భారత్‌లో ఎన్నో మ్యూచువల్ ఫండ్లు తదితరాలుండగా ఏరి కోరి పన్ను ఎగవేతదారుల స్వర్గధామంగా పేరొందిన దేశాల్లో, అదీ అదానీలకు చెందిన డొల్ల కంపెనీల్లోనే పెట్టడం ఆశ్చర్యకరం. అదానీల ఆర్థిక అవకతవకల్లో ఏకంగా తమ చీఫే భాగస్వామి కావడంతో లోతుగా విచారణ జరిపేందుకు సెబీ వెనకడుగు వేసింది’’ అని పేర్కొంది. అదానీల విదేశీ నిధుల మూలాలపై సెబీ విచారణ తేలి్చందేమీ లేదంటూ అప్పట్లో సుప్రీంకోర్టు కూడా ఆక్షేపించిందని హిండెన్‌బర్గ్ గుర్తు చేసింది. అంతకుముందు, ‘సమ్‌థింగ్ బిగ్ సూన్ ఇండియా’ అంటూ సంస్థ శనివారం ఉదయమే ఎక్స్‌లో పోస్టు పెట్టింది. నాటినుంచీ దుమారమే అదానీ గ్రూప్ తన కంపెనీల షేర్ల ధరలను కృత్రిమంగా పెంచుకుందంటూ 2023 జనవరి 23న హిండెన్‌బర్గ్ ఇచి్చన నివేదిక దుమారం రేపడం తెలిసిందే. ధరలు పెంచిన షేర్లను తనఖా పెట్టి భారీ రుణాలు పొందిందని, అకౌంటింగ్ మోసాలకూ పాల్పడిందని నివేదిక పేర్కొంది. బెర్ముడా, మారిషస్ దేశాల్లో అదానీ కుటుంబం డొల్ల కంపెనీలు పెట్టి వాటి ద్వారా అవినీతికి, నగదు అక్రమ బదలాయింపుకు పాల్పడుతోందని ఆరోపించింది. చైర్మన్ గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ వీటిని నియంత్రిస్తున్నట్టు పేర్కొంది. ఈ నివేదిక దెబ్బకు అప్పట్లో అదానీ షేర్లు భారీగా పతనమయ్యాయి. దాని సంపద ఏకంగా 150 బిలియన్ డాలర్ల మేరకు హరించుకుపోయింది. ఈ ఉదంతం రాజకీయంగా కూడా ఇప్పటికీ జాతీయ స్థాయిలో పెను ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. అధికార బీజేపీ, విపక్ష ఇండియా కూటమి మధ్య పరస్పర ఆరోపణలకు కారణమవుతూ వస్తోంది. అయితే హిండెన్‌బర్గ్ నివేదిక వెనక కుట్ర దాగుందన్న వాదనలూ ఉన్నాయి. -
రిటైర్మెంట్ ప్రకటించిన గౌతమ్ అదానీ!
ప్రపంచవ్యాప్తంగా ఓడరేవుల నిర్మాణం, నిర్వహణ, వంటనూనెల తయారీ, గ్రీన్ ఎనర్జీ, గ్యాస్ వెలికితీత..వంటి ఎన్నో రంగాల్లో వ్యాపారం సాగిస్తున్న అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ గౌతమ్ అదానీ(62) తన 70వ ఏటా పదవీవిరమణ చేయబోతున్నట్లు ప్రకటించారు. 2030ల్లో వ్యాపార సామ్రాజ్య పట్టపు పగ్గాలను తన వారసులకు కట్టబెడుతానని చెప్పారు. ఈమేరకు బ్లూమ్‌బర్గ్ నివేదికలో వివరాలు వెలువడ్డాయి.గౌతమ్ అదానీ పదవీ విరమణ చేసిన తర్వాత తన కుమారులు కరణ్ అదానీ, జీత్ అదానీ, సోదరుడి కుమారులు ప్రణవ్ అదానీ, సాగర్ అదానీ సంస్థలో సమాన లబ్ధిదారులు అవుతారని నివేదిక ద్వారా తెలిసింది. అదానీ గ్రూప్ వెబ్సైట్ ప్రకారం గౌతమ్ అదానీ పెద్ద కుమారుడు కరణ్ అదానీ..అదానీ పోర్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. చిన్న కుమారుడు జీత్ అదానీ..అదానీ ఎయిర్‌పోర్ట్స్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రణవ్ అదానీ..అదానీ ఎంటర్ప్రైజెస్ డైరెక్టర్, సాగర్ అదానీ..అదానీ గ్రీన్ ఎనర్జీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు.ఇదీ చదవండి: నెట్‌వర్క్‌లో అంతరాయం.. బిల్లులో రాయితీ!ఈ సందర్భంగా గౌతమ్ అదానీ మాట్లాడుతూ..‘వ్యాపార స్థిరత్వానికి వారసత్వం చాలా ముఖ్యమైంది. నా తర్వాత కంపెనీలోకి వచ్చిన వారంతా చాలా నిబద్ధతతో పని చేస్తున్నారు. ఇప్పటికే కుమారులు, ఇతర బంధువులు కొన్ని కంపెనీలకు సారథ్యం వహిస్తున్నారు. క్రమానుగతంగా కంపెనీ ఎదిగేందుకు తర్వాతితరం బాధ్యతలు చేపట్టాలి. దీనిపై ఉమ్మడి నిర్ణయాధికారానికే ప్రాధాన్యం ఇస్తాం’ అని చెప్పారు. ఇదిలాఉండగా, ఇటీవల అదానీ గ్రూప్ కోర్ సంస్థగా ఉన్న అదానీ ఎంటర్ప్రైజెస్ మొదటి త్రైమాసికంలో రెట్టింపు కంటే ఎక్కువ లాభాన్ని పోస్ట్ చేసింది. -
అదానీ చేతికి గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ..?
ప్రైవేట్ ఈక్విటీ సంస్థ సీవీసీ క్యాపిటల్ పార్టనర్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్‌లో మెజారిటీ వాటాను తగ్గించుకోవాలని యోచిస్తోంది. సదరు వాటాను విక్రయించేందుకు అదానీ గ్రూప్, టొరెంట్ గ్రూప్‌లతో చర్చలు జరుపుతున్నట్లు కొన్ని మీడియా నివేదికల ద్వారా తెలిసింది.సీవీసీ క్యాపిటల్ పార్టనర్స్ 2021లో గుజరాత్ టైటాన్స్ ప్రాంచైజీని రూ.5,625 కోట్లకు దక్కించుకుంది. అయితే ప్రస్తుతం తన వాటాను తగ్గించుకోవాలని యోచిస్తోంది. దాంతో అదానీ గ్రూప్, టొరెంట్ గ్రూప్‌లకు మేజర్ వాటాను విక్రయించడానికి చర్చలు సాగుతున్నట్లు సమాచారం. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) నిబంధనల ప్రకారం ఫిబ్రవరి 2025తో ఫ్రాంచైజీ వాటాలను విక్రయించడానికి లాక్-ఇన్ పీరియడ్ ముగుస్తుంది. ఆలోపే ఈ తంతు పూర్తి చేయాలని సీవీసీ క్యాపిటల్ భావిస్తున్నట్లు తెలుస్తుంది.గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ విలువ 1-1.5 బిలియన్ డాలర్ల(రూ.8,500 కోట్లు) మధ్య ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. టొరెంట్ సంస్థ క్రికెట్ వ్యాపారంలోకి ఇంకా ప్రవేశించలేదు. కానీ, అదానీ గ్రూప్ ఇప్పటికే మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్), ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో పెట్టుబడులను కలిగి ఉంది. డబ్ల్యూపీఎల్‌లో అహ్మదాబాద్ ఫ్రాంచైజీని అదానీ గ్రూప్ 2023లో రూ.1,289 కోట్ల బిడ్‌తో సొంతం చేసుకుంది. ఈ గ్రూప్ 2021లోనే గుజరాత్ టైటాన్స్‌ను చేజిక్కించుకునేందుకు ప్రయత్నించింది. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదురలేదు.ఇదీ చదవండి: ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ ఎర్రర్ మెసేజ్..ఇదిలాఉండగా, సీవీసీకి ఇప్పటికే లాలిగా, ప్రీమియర్‌షిప్ రగ్బీ, వాలీబాల్ వరల్డ్, ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్‌లో పెట్టుబడులు ఉన్నాయి. గుజరాత్ టైటాన్స్ తన తొలి సీజన్ ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. -
మరో సిమెంట్ కంపెనీపై అదానీ కన్ను?
దేశీయంగా సిమెంట్ పరిశ్రమలో వేగంగా దివాలా చర్యలను ఎదుర్కొంటున్న జైప్రకాశ్(జేపీ) అసోసియేట్స్‌కు చెందిన జేసీ సిమెంట్స్‌ను అదానీ కొనుగోలు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.అల్ట్రాటెక్, అదానీ గ్రూప్, దాల్మియా, జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ రంగంలో ఇప్పటికే భారీ ప్రణాళికలు అమలు చేస్తున్నాయి. సిమెంట్ తయారీలో అదానీ గ్రూప్.. దిగ్గజ కంపెనీలు ఏసీసీ, అంబుజాలోని ప్రధాన వాటాను కొనుగోలు చేసి దేశంలోనే రెండో పెద్ద సంస్థగా నిలిచింది. ఈ పరిశ్రమ అభివృద్ధిపై అదానీ గ్రూప్ ఎంతో ఆసక్తిగా ఉందని నిపుణులు చెబుతున్నారు. జేపీ సిమెంట్స్‌ను కూడా ఆ గ్రూప్ కొనుగోలు చేసే వీలుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జేపీ సిమెంట్స్ 9 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఒకవేళ ఈ కంపెనీని అదానీ కొనుగోలు చేస్తే అదానీ గ్రూప్ సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యం పెరిగే అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: వేడి టీ పడి ఒళ్లంతా గాయాలు.. రూ.12.5 కోట్ల దావాజూన్ మొదటి వారంలో జేపీ గ్రూప్‌పై దివాలా చట్టం పరంగా చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్ ప్రణాళికలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఐసీఐసీఐ బ్యాంక్ దరఖాస్తు చేయడంతో అలహాబాద్‌లోని జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) కోర్టు జేపీ అసోసియేట్స్‌పై దివాలా చట్ట ప్రక్రియను ప్రారంభించింది. జేపీ గ్రూప్ ఆధ్వర్యంలోని సిమెంట్ ఉత్పత్తికి ఉపయోగపడే లైమ్‌స్టోన్ గనులు, విద్యుత్ ప్లాంటుసహా సంస్థ ఆస్తులను పొందేందుకు అదానీ గ్రూప్ సన్నాహాలు మొదలు పెట్టే వీలున్నట్లు అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పటివరకూ జేపీ ఆస్తుల విక్రయానికి ఎలాంటి ఆదేశాలు మాత్రం జారీకాలేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 2022, సెప్టెంబర్ 15 వరకు జేపీ గ్రూప్ అప్పులు రూ.6,893 కోట్లుగా ఉన్నట్లు తేలింది. -
గౌతమ్ అదానీ కొత్త ప్లాన్.. వియత్నాంలో పోర్ట్!
ఇజ్రాయెల్‌లోని హైఫా, శ్రీలంకలోని కొలంబో, టాంజానియా ఓడరేవు డార్ ఎస్ సలామ్ తర్వాత నాల్గవ అంతర్జాతీయ నౌకాశ్రయంగా కీర్తి గడిస్తున్న అదానీ పోర్ట్ కార్యకలాపాలు వియత్నాంలో కూడా ప్రారంభయ్యే అవకాశం ఉంది. దీనికోసం అదానీ గ్రూప్ వియత్నాంలో ఓడరేవును నిర్మించాలని యోచిస్తోంది.భారతదేశంలో ప్రముఖ ధనవంతులలో ఒకరైన గౌతమ్ అదానీ.. తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఎప్పటికప్పుడు విస్తరించడంతో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అదానీ గ్రూప్ అంతర్జాతీయ వాణిజ్యాన్ని మరింతగా ఉపయోగించుకునేందుకు అంతర్జాతీయ ఓడరేవు మౌలిక సదుపాయాల అభివృద్ధి చేస్తోంది. తద్వారా లాభాలను గడిస్తోంది.భారతదేశపు అతిపెద్ద పోర్ట్ ఆపరేటర్ అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ (APSEZ), వియత్నాంలోని డా నాంగ్‌లో ఓడరేవును అభివృద్ధి చేయడానికి వియత్నాం ప్రభుత్వం నుంచి కూడా ఆమోదం పొందినట్లు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ ప్రారంభ దశలో ఉందని, పెట్టుబడులకు సంబంధించిన మొత్తం ఇంకా ఖరారు కాలేదని ఆయన అన్నారు.గౌతమ్ ఆదానీ.. తన అదానీ పోర్ట్ విస్తరణను లక్ష్యంగా చేసుకుని అధిక ఉత్పత్తి లేదా అధిక జనాభా ఉన్న దేశాలలో ఓడరేవులను నిర్మించడానికి సిద్ధమవుతున్నారు. అదానీ పోర్ట్స్ ప్రస్తుతం మొత్తం వాణిజ్య పరిమాణంలో 5 శాతం అంతర్జాతీయ కార్యకలాపాల నుంచి పొందుతోంది. ఇది 2030 నాటికి 10 శాతానికి చేరుకోవడానికి తగిన సన్నాహాలు చేస్తున్నారు.ఇదీ చదవండి: బ్యాంక్ జాబ్ వదిలి 'యూ ట్యూబ్'.. ఏటా కోట్లు సంపాదిస్తూ..అదానీ గ్రూప్ కేరళలోని విజింజం ఓడరేవును ప్రారంభించనుంది. ఇప్పటికే ఇక్కడ మొదటి దశ పనులు డిసెంబర్ నాటికి పూర్తవుతాయని చెబుతున్నారు. ఈ పోర్ట్ 2028-29 నాటికి పూర్తిగా సిద్ధమవుతుందని కరణ్ అదానీ పేర్కొన్నారు. దీనికోసం ఏకంగా రూ. 20000 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. -
‘అదానీ-హిండెన్‌బర్గ్ నివేదిక వెనక చైనా హస్తం’
అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారంపై ప్రముఖ న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ కీలక వ్యాఖ్యలు చేశారు. హిండెన్‌బర్గ్ నివేదిక తయారీకి ముందే అదానీ షేర్లలో కోటక్ ఇండియా ఆపర్చునిటీ ఫండ్(కేఐఓఎఫ్) ద్వారా షార్ట్ పొజిషన్లను తీసుకున్నట్లు చెప్పారు. హిండెన్‌బర్గ్ నివేదిక వెనక చైనా వ్యక్తుల హస్తం ఉందన్నారు. అదానీ గ్రూప్‌పై నివేదికను సిద్ధం చేసేందుకే అమెరికా వ్యాపారవేత్త మార్క్ కింగ్డన్ హిండెన్‌బర్గ్‌ను ఆశ్రయించారని చెప్పారు.సెబీ ఇటీవల హిండెన్‌బర్గ్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనిపై స్పందిస్తూ ఆ నోటీసుల్లో ఎలాంటి నిజం లేదని హిండెన్‌బర్గ్ వాటిని కొట్టిపారేసింది. అదానీ షేర్ల పతనాన్ని ముందే అంచనా వేసి ట్రేడ్ చేసినట్లు సెబీ నోటీసుల్లో ఉంది. నివేదిక విడుదలకు ముందే కింగ్డన్తో హిండెన్‌బర్గ్ అనుబంధం మొదలైందని సెబీ పేర్కొంది. ఇదంతా కుట్రలో భాగంగానే జరిగిందని తెలిపింది. ఇదిలాఉండగా, అదానీ గ్రూప్ కృత్రిమంగా స్టాక్ ధరలను పెంచిందని చెప్పిన సమయంలోనే స్టాక్స్ ధరను షార్ట్ చేశామని హిండెన్‌బర్గ్ తెలిపింది. కింగ్డన్ షార్ట్ పొజిషన్ల గురించి తమకు సమాచారం లేదని సెబీ నోటీసుల తర్వాత హిండెన్‌బర్గ్ తన వివరణలో పేర్కొంది.ఈ వ్యవహారంపై తాజాగా ప్రముఖ న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ స్పందిస్తూ..‘అమెరికా వ్యాపారవేత్త కింగ్డన్ అదానీ గ్రూప్‌పై నివేదికను రూపొందించడానికే హిండెన్‌బర్గ్‌ను ఆశ్రయించారు. అదానీ షేర్లలో ట్రేడింగ్ కోసం ఆఫ్‌షోర్ ఫండ్ ఏర్పాటుకు కోటక్ మహీంద్రా ఇన్వెస్ట్మెంట్స్ (కేఎంఐఎల్)ని కింగ్డన్ సంప్రదించారు. అలా కోటక్ ఇండియా ఆపర్చునిటీ ఫండ్ (కేఐఓఎఫ్)ను సిద్ధం చేశారు. హిండెన్‌బర్గ్ నివేదిక తయారీకి ముందే మారిషస్ ద్వారా అదానీ షేర్లలో కేఐఓఎఫ్ షార్ట్ పొజిషన్లను తీసుకుంది. దీని కోసం కింగ్డన్ మాస్టర్ ఫండ్ నిధులు అందించింది. ఇందులో కింగ్డన్ భార్య అన్లాచెంగ్‌తో సహా ఆయన కుటుంబానికి భారీగా వాటాలున్నాయి’ అని చెప్పారు.ఎవరీ అన్లా చెంగ్..?అన్లా చెంగ్ ఒక చైనీస్ అమెరికన్. అమెరికాలో చైనీయుల హక్కులు, వారి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు. ఆమె ‘సుప్‌చైనా’ అనే మీడియా సంస్థకు సీఈఓగా వ్యవహరించారు. ఇది అమెరికాలో చైనా అనుకూల మీడియా సంస్థలను నిర్వహిస్తుంది. ఈ సంస్థకు అక్కడి కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధం ఉందని ఆరోపణలు రావటంతో దాన్ని మూసివేశారు.ఇదీ చదవండి: గ్యాస్ సిలిండర్లకు క్యూఆర్ కోడ్.. మంత్రి ప్రకటన‘హిండెన్‌బర్గ్ నివేదిక వెనక చైనా వర్గాల హస్తం ఉంది. అసలు కేఎంఐఎల్‌ను కింగ్డన్కు ఎవరు పరిచయం చేశారు? హిండెన్‌బర్గ్ నివేదిక రూపకల్పనలో సహకరించిన భారత ఆర్థిక సంస్థలు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులకు చైనా వర్గాల గురించి ముందే తెలుసా? షార్ట్ ట్రేడింగ్ వల్ల వారికి ఏమేరకు లాభం చేకూరింది? వీటన్నింటిపై సెబీ సమగ్ర దర్యాప్తు చేయాలి’ అని జెఠ్మలానీ డిమాండ్ చేశారు. -
హిండెన్‌బర్గ్‌కు సెబీ షోకాజ్!
న్యూఢిల్లీ: అకౌంటింగ్లో అవకతవకల ఆరోపణలతో అదానీ గ్రూప్‌ను కుదిపేసిన అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌కి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ షాకాజ్ నోటీసులు జారీ చేసింది. అదానీ సంస్థల స్టాక్స్ విషయంలో అనుచిత వ్యాపార విధానాలను అమలు చేశారనే ఆరోపణల మీద జూన్ 27న తమకు 46 పేజీల నోటీసు వచ్చినట్లు హిండెన్‌బర్గ్ తమ వెబ్సైట్లో వెల్లడించింది. ఇది అర్ధరహితమైన చర్యగా కొట్టిపారేసింది. కార్పొరేట్ అవినీతిని, మోసాలను బహిర్గతం చేసేవారిని భయపెట్టేందుకు భారత్‌లో అత్యంత శక్తిమంతులైన వారు చేస్తున్న ప్రయత్నమని వ్యాఖ్యానించింది.అదానీ గ్రూప్ స్టాక్స్‌లో తమకు షార్ట్ పొజిషన్లు ఉన్నాయనే విషయాన్ని అధ్యయన నివేదికను ప్రకటించినప్పుడే తాము వెల్లడించామని హిండెన్‌బర్గ్ పేర్కొంది. ఒక ఇన్వెస్టర్ తరఫున తీసుకున్న పొజిషన్లకు సంబంధించి 4.1 మిలియన్ డాలర్లు లభించాయని, సొంతంగా అదానీ అమెరికా బాండ్లను షార్ట్ చేయడం ద్వారా 31,000 డాలర్లు వచ్చాయని తెలిపింది. లీగల్ ఖర్చులు, అధ్యయనంపై చేసిన వ్యయాలకు అవి బొటాబొటీగా సరిపోయాయని వివరించింది. ఆర్థికంగా గానీ వ్యక్తిగత భద్రతపరంగా గానీ అదానీ గ్రూప్‌పై అధ్యయనం తమకు ఏమాత్రం ప్రయోజనకరమైనది కాకపోయినా ఇప్పటివరకు తాము చేసిన వాటిల్లో అత్యంత గర్వకారణమైనదిగా ఇది నిలిచిపోతుందని హిండెన్‌బర్గ్ తెలిపింది. కోటక్ గ్రూప్ పాత్ర .. అదానీ స్టాక్స్‌ను షార్ట్ చేసేందుకు తమ భాగస్వామ్య ఇన్వెస్టరు ఒకరు .. కోటక్ మహీంద్రా గ్రూప్‌నకు చెందిన ఆఫ్‌షోర్ ఫండ్‌ను ఉపయోగించినట్లు హిండెన్‌బర్గ్ తెలిపింది. ఆ బ్యాంకు వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్ పేరు బైటికి రాకుండా చూసేందుకే సెబీ తన నోటీసులో కోటక్‌ను ప్రస్తావించకుండా కే–ఇండియా ఆపర్చునిటీస్ ఫండ్ (కేఐవోఎఫ్) అని మాత్రమే పేర్కొందని ఆరోపించింది. సెబీ నోటీసుల ప్రకారం హిండెన్‌బర్గ్ క్లయింట్ అయిన కింగ్డన్ క్యాపిటల్.. అధ్యయన నివేదిక విడుదలకు ముందు కోటక్ మహీంద్రా ఇన్వెస్ట్మెంట్స్కి (కేఎంఐఎల్) చెందిన కేఐవోఎఫ్లో ఇన్వెస్ట్ చేసింది.అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లను షార్ట్ చేసిన కేఐవోఎఫ్ .. నివేదిక విడుదల తర్వాత పరిణామాలతో మొత్తం రూ. 183.24 కోట్ల లాభాలు ఆర్జించింది. మరోవైపు, కేఐవోఎఫ్, కేఎంఐఎల్‌కు హిండెన్‌బర్గ్ ఎన్నడూ క్లయింటుగా లేదని కోటక్ మహీంద్రా గ్రూప్ స్పష్టం చేసింది. తమ ఇతర ఇన్వెస్టర్లకు, హిండెన్‌బర్గ్‌కు మధ్య ఉన్న సంబంధాల గురించి తమకు తెలియదని పేర్కొంది. అదానీ గ్రూప్‌లో షేర్లు, అకౌంట్లలో అవకతవకలు జరుగుతున్నాయంటూ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ 2023 జనవరిలో విడుదల చేసిన నివేదికతో అదానీ గ్రూప్‌లోని 10 లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ 150 బిలియన్ డాలర్ల మేర తుడిచిపెట్టుకుపోయిన సంగతి తెలిసిందే. -
ప్రమోటర్లు వాటాలు అమ్మేస్తున్నారు!
ఇటీవల సెకండరీ మార్కెట్లు బుల్ వేవ్‌లో పరిగెడుతున్నాయి. తాజాగా సెన్సెక్స్ 79,000, నిఫ్టీ 24,000 పాయింట్ల మైలురాళ్లను అధిగమించాయి. తద్వారా ప్రామాణిక ఇండెక్సులు సరికొత్త గరిష్టాలను సాధించాయి. ఈ నేపథ్యంలో పలు లిస్టెడ్ కంపెనీల ప్రమోటర్లు కొంతమేర సొంత వాటాలను విక్రయించేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఇందుకు పలు అంశాలు ప్రభావం చూపుతున్నాయి. వివరాలు చూద్దాం..ముంబై: రోజుకో చరిత్రాత్మక గరిష్టాన్ని తాకుతూ దౌడు తీస్తున్న దేశీ స్టాక్ మార్కెట్లో పలు లిస్టెడ్ కంపెనీల షేర్లు సైతం కొత్త గరిష్టాలను తాకుతున్నాయి. దీంతో కొన్ని కంపెనీల ప్రమోటర్లు ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా తమ వాటాలో కొంతమేర విక్రయిస్తున్నారు. తద్వారా నిధులను సమకూర్చుకుంటున్నారు. వీటిని రుణ చెల్లింపులు, విస్తరణ ప్రణాళికలు, పబ్లిక్కు కనీస వాటా తదితరాలకు వినియోగిస్తున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు.కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ వివరాల ప్రకారం 2024 తొలి ఆరు నెలల్లోనే ఎన్ఎస్ఈ–500లోని కొన్ని కంపెనీల ప్రమోటర్లు 10.5 బిలియన్ డాలర్ల(రూ. 87,000 కోట్లకుపైగా) విలువైన ఈక్విటీలను విక్రయించారు. మరొక విశ్లేషణ ప్రకారం గత రెండు నెలల్లోనే సుమారు 200 లిస్టెడ్ కంపెనీల ప్రమోటర్లు రూ. 33,000 కోట్లకుపైగా విలువైన షేర్లను విక్రయించడం తాజా ట్రెండ్‌కు అద్దం పడుతోంది. వెరసి దేశీ ఈక్విటీల విలువలు అత్యంత ప్రీమియంస్థాయికి చేరాయన్న సంకేతాలు వెలువడుతున్నట్లు స్టాక్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇందువల్లనే కొన్ని లిస్టెడ్ కంపెనీల ప్రమోటర్లు తమతమ బిజినెస్‌లలో లాభాల స్వీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నారని విశ్లేíÙంచారు. కరోనా ఎఫెక్ట్...ప్రస్తుత మార్కెట్లలో పలు కంపెనీల షేర్లు గరిష్ట విలువలకు చేరడంతో బ్లాక్ డీల్స్ లేదా బల్క్ డీల్స్ ద్వారా ప్రమోటర్లు కొంతమేర వాటాలను అమ్మివేస్తున్నారు. వీరికితోడు ఇటీవల పీఈ దిగ్గజాలు, ఇతర సంస్థాగత ఇన్వెస్టర్లు సైతం తమ పెట్టుబడులను విక్రయించి సొమ్ము చేసుకుంటున్న సంగతి తెలిసిందే. కాగా.. ప్రస్తుత ట్రెండ్ కారణంగా 2023 జనవరి–డిసెంబర్లో నమోదైన 12.5 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 1,04,000 కోట్లు) విక్రయ రికార్డ్ 2024 కేలండర్ ఏడాదిలో తుడిచిపెట్టుకుపోయే వీలున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.2023లో అదానీ గ్రూప్ ప్రమోటర్లు వాటాలు విక్రయించిన విషయం విదితమే. 2024లో ఇప్పటివరకూ దేశ, విదేశీ ప్రమోటర్లు మొత్తంగా రూ. 87,000 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు. కోవిడ్–19 నేపథ్యంలో 2020 జనవరి–డిసెంబర్‌లోనూ రికార్డు నెలకొల్పుతూ రూ. 78,500 కోట్ల విలువైన షేర్లను వివిధ కంపెనీల ప్రమోటర్లు అమ్మివేశారు.జూన్‌లో పలువురు ప్రమోటర్లు బ్లాక్ డీల్స్ ద్వారా భారీగా వాటాలను విక్రయించారు. రుణ భారాన్ని తగ్గించుకునే ప్రణాళికలతో ఇండస్ టవర్స్‌లో యూకే దిగ్గజం వొడాఫోన్ గ్రూప్ 18 % వాటాను విక్రయించింది. ఇక ఎంఫసిస్‌లో 15% వాటాను పీఈ దిగ్గజం బ్లాక్‌స్టోన్ 80 కోట్ల డాలర్లకు అమ్మింది. దేశీ మైనింగ్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్‌లో ప్రమోటర్ వేదాంతా రిసోర్సెస్ 2.63% వాటా విక్రయం ద్వారా రూ. 4,184 కోట్లు సమీకరించింది. ఇక జెడ్ఎఫ్ కమర్షియల్ వెహికల్లో వాబ్కో ఏషియా 30 కోట్ల డాలర్ల విలువైన వాటాను విక్రయించింది.విక్రయ తీరు(రూ. కోట్లలో)కంపెనీ పేరు షేర్ల విలువ ఇండస్ టవర్స్ 15,300 ఎంఫసిస్ 6,680 వేదాంతా 4,184 ఇంటర్‌గ్లోబ్ 3,300 జెడ్ఎఫ్ సీవీ 2,194 గ్లాండ్ ఫార్మా 1,754 -
కోటక్ బ్యాంక్‌పై హిండెన్‌బర్గ్ ఆరోపణలు
అదానీ గ్రూప్ సంస్థలపై చేసిన ఆరోపణలకుగాను అమెరికా షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్‌కు సెబీ షోకాజ్ నోటీసులు పంపింది. ఈ వ్యవహారంపై హిండెన్‌బర్గ్ స్పందిస్తూ కొత్తగా కోటక్ మహీంద్రా బ్యాంక్‌ను వివాదంలోకి లాగింది.సెబీ నోటీసులు అందుకున్న హిండెన్‌బర్గ్ స్పందిస్తూ..‘భారత క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి షోకాజ్ నోటీసులు అందాయి. అదానీ స్టాక్స్‌పై పెట్టుబడుల్లో మేము నిబంధనల్ని పాటించలేదని అందులో ఉంది. సెబీ వ్యాఖ్యల్లో ఏమాత్రం నిజంలేదు. అదానీ గ్రూప్ కృత్రిమంగా స్టాక్ ధరలను పెంచిందని చెప్పిన సమయంలోనే ఆయా కంపెనీల స్టాక్స్ ధరను షార్ట్ చేశామని సెబీకి ఇదివరకే స్పష్టం చేశాం. కానీ నోటీసుల్లో మాత్రం షేర్ల పతనాన్ని ముందే అంచనా వేసి వాటిపై ట్రేడ్ చేసినట్లు ఉంది. ఈ నోటీసులకు అర్థం లేదు. భారత్‌లోని శక్తిమంతమైన వ్యాపారవేత్తల లోపాలను ఎత్తిచూపితే ఇలా నోటీసులు పంపడం సరికాదు’ అని చెప్పింది.‘అదానీ గ్రూప్ అవకతవకల వ్యవహారం భయటకు వచ్చే సమయంలో కోటక్ బ్యాంకు ఆఫ్‌షోర్ ఫండ్(విదేశాల్లో ఏర్పాటు చేసిన ఫండ్ కంపెనీ) ఏర్పాటు చేసింది. దాని సహాయంతో ఓ పెట్టుబడి భాగస్వామి ద్వారా అదానీ స్టాక్స్‌ను షార్ట్ చేశారు. దీనివల్ల కోటక్ బ్యాంకుకు పెద్దగా లాభాలు ఏమి రాలేదు. కానీ, సెబీ జారీ చేసిన షోకాజ్ నోటీసుల్లో ఎక్కడా కోటక్ పేరు గానీ, ఆ సంస్థ బోర్డు సభ్యుల ప్రస్తావన లేదు. సెబీ మరో శక్తిమంతమైన భారత వ్యాపారవేత్తను రక్షించే యోచనలో ఉన్నట్లు స్పష్టమవుతోంది’ అని హిండెన్‌బర్గ్ తెలిపింది.అదానీ షేర్ల షార్ట్ సెల్లింగ్‌లో నిబంధనలు పాటించామని పేర్కొంది. తన ఇన్వెస్టర్లతో ఉన్న సంబంధాలతోనే స్టాక్స్‌ను షార్ట్ చేసి 4.1 మిలియన్ డాలర్ల(రూ.34 కోట్లు) ఆదాయం పొందినట్లు తెలిపింది. అయితే సంస్థ ఖర్చులు, ఇతర వ్యయాలను లెక్కిస్తే తమకు ఏమీ మిగలలేదని స్పష్టం చేసింది.అసలేం జరిగిందంటే..అదానీ గ్రూప్ సంస్థల స్టాక్ ధరలను కృత్రిమంగా పెంచారని హిండెన్‌బర్గ్ తెలిపింది. అందుకోసం కంపెనీకు చెందిన కొన్ని విదేశీ పెట్టుబడిదారుల సహాయం తీసుకున్నారని చెప్పింది. ఈమేరకు 2023 జనవరిలో హిండెన్‌బర్గ్ నివేదిక విడుదల చేసింది. విలువ పెరిగిన షేర్లను తనఖా పెట్టి ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొందిందని ఆరోపించింది. ఆర్థికపరమైన నేరాలకు పాల్పడినట్లు తెలిపింది. యూఏఈ దేశాల్లో అదానీ కుటుంబం పలు డొల్ల కంపెనీలను నియంత్రిస్తోందని చెప్పింది. వీటిద్వారా అవినీతి, అక్రమ నగదు బదలాయింపులకు పాల్పడుతోందని ఆరోపించింది. ఆ ఆరోపణలు వచ్చిన వెంటనే కంపెనీ స్పందించి ఇన్వెస్టర్లలో నమ్మకం కలిగించేందుకు ఎస్బీఐలోని అప్పులను కొంత తీర్చింది. ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టులో విచారణ సైతం జరిగింది.ఇదీ చదవండి: హెచ్డీఎఫ్సీ యూపీఐ సేవలు నిలిపివేత.. ఎప్పుడంటే..ఇదిలాఉండగా, హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలతో కోటక్ మహీంద్రా బ్యాంక్ స్టాక్ ధర మంగళవారం 3.5 శాతం మేర నష్టపోయి రూ.1,745 వద్ద ట్రేడవుతోంది. -
భారీ పెట్టుబడులకు అదానీ రెడీ
అహ్మదాబాద్: డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ పునరుత్పాదక (రెన్యువబుల్స్‌ౖ) విద్యుదుత్పత్తిపై భారీగా ఇన్వెస్ట్ చేయనుంది. 2030కల్లా 40 గిగావాట్ల (జీడబ్ల్యూ) పునరుత్పాదక సామర్థ్యాన్ని నిర్మించే ప్రణాళికల్లో ఉంది. ఇందుకు రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులకు సిద్ధపడుతోంది. తద్వారా 2050కల్లా వివిధ బిజినెస్‌లలో నికరంగా కర్బనరహితం(నెట్ జీరో)గా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం గ్రూప్ పునరుత్పాదక(సౌర, పవన) విద్యుత్‌లో 10 గిగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది.ఇకపై ప్రతీ ఏడాది 6–7 జీడబ్ల్యూను జత చేసుకోవాలని చూస్తోంది. వెరసి 2030కల్లా 50 గిగావాట్లకు చేరుకునే లక్ష్యంతో పనిచేస్తోంది. ఒక్కో మెగావాట్‌కు రూ. 5 కోట్ల పెట్టుబడుల అంచనాతో మదింపు చేస్తే 2030కల్లా రూ. 2 లక్షల కోట్లను వెచ్చించవలసి ఉంటుందని అదానీ గ్రీన్ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాగర్ అదానీ వెల్లడించారు. వీటితోపాటు 5 జీడబ్ల్యూ పంప్ స్టోరేజీ సామర్థ్యా న్ని సైతం ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ సీఈవో అమిత్ సింగ్ తెలిపారు. విద్యుత్‌కు అధిక డిమాండ్ నెలకొనే రాత్రి వేళల్లో విద్యుదుత్పత్తికి వీలుగా స్టోరేజీ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు వివరించారు. కార్బన్ క్రెడిట్స్.. రెన్యువబుల్ సామర్థ్యాల వినియోగం ద్వారా లభించే కార్బన్ క్రెడిట్స్‌కుతోడు మరికొన్ని ఇతర చర్యల ద్వారా 2050కల్లా అదానీ గ్రూప్ నెట్ జీరోకు చేరనున్నట్లు అమిత్ పేర్కొన్నారు. గతేడాది(2023–24) అదానీ గ్రీన్ ఎనర్జీ 2.8 జీడబ్ల్యూ సామర్థ్యాలను జత చేసుకున్నట్లు తెలియజేశారు. ఈ ఆర్థిక సంవత్సరం(2024–25)లో 6 జీడబ్ల్యూ సామర్థ్యాలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. కాగా, అదానీ గ్రూప్ ఈ ఏడాది (2024–25) వివిధ విభాగాలపై భారీ పెట్టుబడుల ప్రణాళికలు ప్రకటించింది. వివిధ కంపెనీలలో రూ. 1.3 లక్షల కోట్లు వెచ్చించనుంది. -
అదానీ 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: హరిత ఇంధన ఉత్పత్తికి అవసరమయ్యే కీలక భాగాల తయారీ సామర్థ్యాలను పెంచుకోవడంపై, ఇంధన పరివర్తన ప్రాజెక్టులపై వచ్చే దశాబ్ద కాలంలో అదానీ గ్రూప్ 100 బిలియన్ డాలర్లపైగా ఇన్వెస్ట్ చేయనుంది. సోలార్ పార్కులను నిరి్మంచడం నుంచి హరిత హైడ్రోజన్, పవన విద్యుత్ టర్బైన్లు మొదలైన వాటికోసం ఎలక్ట్రోలైజర్లను తయారు చేయడం వరకు భారీ ప్లాంట్లను గ్రూప్ ఏర్పాటు చేస్తోంది. రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఈ విషయాలు తెలిపారు. ఇంధన పరివర్తన, డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనలో లక్షల కోట్ల (ట్రిలియన్ల) డాలర్లకు వ్యాపార అవకాశా లు ఉన్నాయని, ఇవి భారత్ రూపురేఖలను దేశీయంగానూ, అంతర్జాతీయంగాను మార్చేయగలవన్నారు. అంతర్జాతీయంగా ఇంధన పరివర్తన మార్కెట్ 2023లో 3 ట్రిలియన్ డాలర్లుగా ఉండగా ఇది 2030 నాటికి 6 ట్రిలియన్ డాలర్లకు చేరగలదని, అటుపైన 2050 వరకు ప్రతి పదేళ్లకు రెట్టింపు కానుందని అదానీ చెప్పారు. భారత్ నిర్దేశించుకున్నట్లుగా 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాలు సాధించాలంటే ఏటా 150 బిలియన్ డాలర్ల పైగా పెట్టుబడులు అవసరమన్నారు. -
570 మెగావాట్ల జలవిద్యుత్తు ప్లాంట్ ఏర్పాటుకు ఒప్పందం
అదానీ గ్రూప్ భూటాన్‌లో 570 మెగావాట్ల జలవిద్యుత్తు ప్లాంట్ ఏర్పాటు కోసం ఒప్పందం కుదుర్చుకుంది. ఈమేరకు తాజాగా భూటాన్ ప్రధానమంత్రి షెరింగ్ టోబ్గే, గౌతమ్ అదానీలు ఒప్పందంపై సంతకాలు చేశారు.కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. భూటాన్‌లోని చుఖా ప్రావిన్స్‌లో 570 మెగావాట్ల జలవిద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ఆ దేశంలోని డ్రక్ గ్రీన్ పవర్ కార్పొరేషన్‌తో అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్ ఆధ్వర్యంలో జరుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధిని అదానీ ప్రశంసించారు. భూటాన్‌లో హైడ్రోపవర్, ఇతర ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు.ఇదీ చదవండి: ప్రపంచాన్ని పరిచయం చేసిన నాన్నగౌతమ్అదానీ తన ఎక్స్‌ఖాతాలో ఈ పర్యటనకు సంబంధించిన విషయాలు పంచుకున్నారు. ‘భూటాన్ ప్రధానమంత్రి దాషో షెరింగ్ టోబ్గేతో సమావేశంకావడం చాలా సంతోషంగా ఉంది. చుఖా ప్రావిన్స్‌లో 570 మెగావాట్ల గ్రీన్ జలవిద్యుత్తు ప్రాజెక్ట్ ఏర్పాటుకు డ్రక్ గ్రీన్ పవర్ కార్పొరేషన్‌తో అవగాహన ఒప్పందం జరిగింది. అనంతరం భూటాన్ కింగ్ జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్‌తో సమావేశమయ్యాం. మౌలికసదుపాయాలు అభివృద్ధి చేయడానికి భూటాన్ చేస్తున్న కృషి అభినందనీయం’ అన్నారు. -
‘తెలుగురాష్ట్రాలకు చెందిన సంస్థ అప్పు మేమే తీరుస్తాం’
తెలుగురాష్ట్రాలకు చెందిన పెన్నా సిమెంట్‌కు ఉన్న రూ.3,000 కోట్ల అప్పును తామే తీరుస్తామని అదానీ గ్రూపు ఆధ్వర్యంలోని అంబుజా సిమెంట్స్ తెలిపింది. ఇటీవల పెన్నా సిమెంట్‌ను రూ.10,422 కోట్లతో కొనుగోలు చేయనున్నట్లు అంబుజా ప్రకటించింది. దాంతో కంపెనీ ఇతర సంస్థలకు బకాయిపడిన రుణాలను సైతం తీరుస్తామని అంబుజా సిమెంట్స్ హామీ ఇచ్చింది.పెన్నా సిమెంట్స్‌లోని 100 శాతం వాటాను అదానీ గ్రూప్‌లో భాగంగా ఉన్న అంబుజా సిమెంట్స్ రూ.10,422 కోట్లుకు కొనుగోలు చేస్తున్నట్లు ఇటీవల స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. మరో 3-4 నెలల్లో ఈ డీల్ పూర్తవుతుందని, ఆ తర్వాత పెన్నాకు ఉన్న రుణాన్ని చెల్లించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అంబుజా వద్ద ఇప్పటికే రూ.15,676 కోట్ల మిగులు నిల్వలున్నాయి. పెన్నా అప్పులను ఈ మిగులు నుంచి చెల్లించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పెన్నా రుణంపై వడ్డీ వ్యయాలను తగ్గించడంతో పాటు, క్రెడిట్ రేటింగ్‌ను ‘బీబీబీ’ నుంచి ‘ఏఏఏ’గా మార్చేందుకు ఇది సహాయపడుతుందని అంబుజా అంచనావేస్తుంది.సిమెంట్‌తో పాటు క్లింకర్, గ్రైండింగ్, ప్యాకేజింగ్, విద్యుత్ రంగాల్లో అదానీ గ్రూప్ విస్తరించింది. ప్రస్తుతం పెన్నా సిమెంట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్‌లో ఉన్న అయిదు సిమెంట్ యూనిట్లతో కలిపి ఏడాదికి 14 మిలియన్ టన్నుల సిమెంట్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. పెన్నా సిమెంట్ కొనుగోలుతో అదానీ గ్రూపు దేశవ్యాప్త సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యం 89 మిలియన్ టన్నుల సామర్థ్యానికి చేరింది.ఇదీ చదవండి: టీవీ, మొబైళ్లలోకి ప్రవేశిస్తున్న ‘గాలి’!ఈ ఒప్పందం ద్వారా దక్షిణ భారతదేశంలో ప్రస్తుతం రెండు శాతంగా ఉన్న మార్కెట్ వాటా 8 శాతానికి చేరుకుంటుందని, ఇదే సమయంలో శ్రీలంకలో పెన్నా సిమెంట్‌కు ఉన్న స్థానిక అనుబంధ కంపెనీ ద్వారా ఆ దేశంలో కూడా అడుగు పెట్టే అవకాశం కలుగుతుందని అదానీ గ్రూపు ఇటీవల విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. -
అంబుజా చేతికి పెన్నా సిమెంట్
సాక్షి, అమరావతి/హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు చెందిన పెన్నా సిమెంటును అంబుజా సిమెంట్ కొనుగోలు చేసింది. అదానీ గ్రూపునకు చెందిన అంబుజా సిమెంట్, పి. ప్రతాప్ రెడ్డి కుటుంబానికి చెందిన పెన్నా సిమెంట్ 100 శాతం వాటాను రూ.10,422 కోట్లకు కొనుగోలు చేసినట్లు స్టాక్ ఎక్సే్ఛంజీలకు తెలియచేసింది. ఈ మేరకు ఇరు కంపెనీల మధ్య ఒప్పందం కుదిరింది. సిమెంట్‌తో పాటు క్లింకర్, గ్రైండింగ్, ప్యాకేజింగ్, విద్యుత్ రంగాల్లో విస్తరించింది. ప్రస్తుతం పెన్నా సిమెంట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్‌లో ఉన్న అయిదు సిమెంట్ యూనిట్లతో కలిపి ఏడాదికి 14 మిలియన్ టన్నుల సిమెంట్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. పెన్నా సిమెంట్ కొనుగోలుతో అదానీ గ్రూపు దేశవ్యాప్త సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యం 89 మిలియన్ టన్నుల సామర్థ్యానికి చేరింది. ఈ ఒప్పందం ద్వారా దక్షిణ భారతదేశంలో ప్రస్తుతం రెండు శాతంగా ఉన్న మార్కెట్ వాటా 8 శాతానికి చేరుకుంటుందని, ఇదే సమయంలో శ్రీలంకలో పెన్నా సిమెంట్‌కు ఉన్న స్థానిక అనుబంధ కంపెనీ ద్వారా ఆ దేశంలో కూడా అడుగు పెట్టే అవకాశం కలుగుతుందని అదానీ గ్రూపు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వ అనుమతులు అన్నీ పూర్తి చేసుకొని మూడు నుంచి 4 నెలల్లో ఈ అక్విజిషన్ ప్రక్రియ పూర్తవుతుందని అంబుజా సిమెంట్ సీఈవో అజయ్ కపూర్ తెలిపారు. అలాగే పెన్నా సిమెంట్‌కు ఉన్న సున్నపురాయి గనులు కూడా అదానీ గ్రూపునకు కలిసి వస్తాయన్నారు.తాడిపత్రితో ప్రారంభంపి.ప్రతాప్ రెడ్డి కుటుంబం 1994లో అనంతపురం జిల్లా తాడిపత్రి వద్ద తలారి చెరువులో ఏడాదికి 0.2 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో తొలి సిమెంట్ ప్లాంటును ఏర్పాటు చేసి వేగంగా విస్తరించింది. ప్రస్తుతం తాడిపత్రి యూనిట్ సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యం 1.8 మిలియన్ టన్నులకు చేరడమే కాకుండా అక్కడ 1.3 మిలియన్ టన్నుల క్లింకర్ యూనిట్‌నుకూడా ఏర్పాటు చేశారు. అదే జిల్లా బోయరెడ్డి పల్లి వద్ద మరో రెండు మిలియన్ టన్నుల సిమెంట్, 4 మిలియన్ టన్నుల క్లింకర్, 25 మెగావాట్ల వేస్ట్ హీట్ రికవరీ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో తాండూరు వద్ద రెండు మిలియన్ టన్నుల సిమెంట్ ప్లాంటు, 1.5 మిలియన్ టన్నుల క్లింకర్, నల్గొండ జిల్లా గణే‹Ùపహడ్ వద్ద 1.2 ఎంటీ సిమెంట్, 1 ఎంటీ క్లింకర్, 7 డబ్ల్యూహెచ్ వేస్ట్ హీట్ రికవరీ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. రాజస్థాన్‌లో జోథ్‌పూర్‌లో నిర్మిస్తున్న 2 ఎంటీ, కృష్ణపట్నం వద్ద నిర్మిస్తున్న మరో 2 ఎంటీ యూనిట్లు మరో ఆరు నుంచి ఏడాదిలోగా అందుబాటులోకి రానున్నాయి. నల్గొండ జిల్లా గణేష్ పçహాడ్ వద్ద 77 మెగావాట్ల విద్యుత్ యూనిట్‌ను పెన్నా సిమెంట్ కలిగి ఉంది. ఈ ఒప్పందంతో కోల్‌కతా, గోపాల్పూర్, కరైకల్, కొచ్చి, కొలంబోలోని బల్క్ సిమెంట్ టెరి్మనల్స్ ద్వారా అదానీ సీ ట్రాన్స్‌పోర్టేషన్ లాజిస్టిక్ సామర్థ్యం పెరుగుతుందని కపూర్ చెప్పారు. -
అదానీ వారి క్రెడిట్ కార్డు.. అదిరిపోయే బెనిఫిట్స్!
అదానీ గ్రూప్‌కు చెందిన డిజిటల్ ప్లాట్‌ఫామ్ అదానీ వన్ (Adani One).. ఐసీఐసీఐ బ్యాంక్‌తో కలిసి ఎయిర్పోర్ట్ -లింక్డ్ ప్రయోజనాలతో దేశీయ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను ప్రవేశపెట్టింది. అదానీ వన్ ఐసీఐసీఐ బ్యాంక్ సిగ్నేచర్ క్రెడిట్ కార్డ్, అదానీ వన్ ఐసీఐసీఐ బ్యాంక్ ప్లాటినం క్రెడిట్ కార్డ్ అనే రెండు ఆప్షన్లలో ఈ క్రెడిట్ కార్డు అందుబాటులో ఉంది.ఫీజు వివరాలుఅదానీ వన్ ఐసీఐసీఐ బ్యాంక్ సిగ్నేచర్ క్రెడిట్ కార్డు వార్షిక ఛార్జీ రూ .5,000. దీనికి జాయినింగ్ బెనిఫిట్స్ రూ .9,000 ఉంటాయి. అలాగే అదానీ వన్ ఐసీఐసీఐ బ్యాంక్ ప్లాటినం క్రెడిట్ కార్డు వార్షిక ధర రూ .750 కాగా జాయినింగ్ బెనిఫిట్స్ రూ .5,000.ప్రయోజనాలు (అపరిమిత అదానీ రివార్డు పాయింట్లు)అదానీ వన్, విమానాశ్రయాలు, గ్యాస్, విద్యుత్, ట్రైన్‌మ్యాన్ సహా అదానీ సంస్థలలో 7 శాతం వరకు తగ్గింపు.ఇతర స్థానిక, విదేశీ ఖర్చులపై 2 శాతం వరకు తగ్గింపుఎయిర్పోర్ట్ బెనిఫిట్స్ ప్రీమియం లాంజ్ లతో సహా దేశీయ లాంజ్ లకు సంవత్సరానికి 16 వరకు యాక్సెస్లుసంవత్సరానికి రెండు వరకు ఇంటర్నేషనల్ లాంజ్ విజిట్లు8 వరకు వాలెట్, ప్రీమియం ఆటోమొబైల్ పార్కింగ్ స్థలాలకు యాక్సెస్లుఇతర ప్రయోజనాలువిమానాలు, హోటళ్లు, విహార యాత్రలకు కూపన్లతో సహా రూ.9,000 వరకు వెల్మమ్ బెనిఫిట్.సినిమా టిక్కెట్లు ఒకటి కొంటే ఒకటి ఉచితం1 శాతం ఇంధన సర్ ఛార్జీ రద్దుఅదానీ వన్ రివార్డ్స్ అల్ట్రా లాయల్టీ స్కీమ్ కు ఎక్స్‌క్లూజివ్ యాక్సెస్ -
బీహెచ్ఈఎల్కు జాక్ పాట్.. అదానీ పవర్ నుంచి భారీ ఆర్డర్
ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్ఈఎల్ రూ.3,500 కోట్ల భారీ కాంట్రాక్ట్‌ను దక్కించుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో 1,600 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ (టీపీపీ) ఏర్పాటు కోసం అదానీ పవర్ నుండి రూ. 3,500 కోట్ల ఆర్డర్‌ను అందుకున్నట్లు బీహెచ్ఈఎల్ తెలిపింది. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో 2x800 మెగావాట్ల టీపీపీని ఏర్పాటు చేసేందుకు అదానీ పవర్ లిమిటెడ్ (ఏపీఎల్) నుంచి బీహెచ్ఈఎల్ ఆర్డర్ దక్కించుకున్నట్లు బీహెచ్ఈఎల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది.ఈ సందర్భంగా బీహెచ్ఈఎల్ సంస్థ తిరుచ్చి, హరిద్వార్ ప్లాంట్లలో బాయిలర్, టర్బైన్ జనరేటర్లను తయారు చేయనున్నట్లు వెల్లడించింది. కాగా, అదానీ-బీహెచ్ఈఎల్ మధ్య కుదిరిన ఒప్పందంతో జూన్ 5న బీహెచ్ఈఎల్ షేర్లు 3 శాతం లాభంతో రూ.253.85 వద్ద ముగియగా, అదానీ పవర్ షేర్లు రూ.723 వద్ద స్థిరపడ్డాయి. -
మార్కెట్ అల్లకల్లోలం
లోక్‌సభ తాజా ఫలితాలలో ఎన్డీఏ 300 సీట్లకంటే తక్కువకు పరిమితం కానున్నట్లు స్పష్టమవడంతో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా ఆందోళన చెందారు. మార్కెట్ ఆరంభం నుంచే అమ్మకాలకు దిగారు. దీంతో సెన్సెక్స్ 6,234 పాయింట్లు, నిఫ్టీ 1,982 పాయింట్ల చొప్పున కుప్పకూలాయి. చివరికి కొంత కోలుకుని 4,390 పాయింట్ల నష్టంతో 72,079 వద్ద సెన్సెక్స్ నిలిచింది. 1,379 పాయింట్లకు నిఫ్టీ నీళ్లొదులుకుని 21,885 వద్ద ముగిసింది.ఇది రెండు నెలల కనిష్టంకాగా.. ఇంట్రాడేలో సెన్సెక్స్ 70,234కు పడిపోయింది. వెరసి ఎగ్జిట్ పోల్స్ కారణంగా సోమవారం ఇన్వెస్టర్లకు అందిన 3 శాతం లాభాలు ఒక్క రోజు తిరగకుండానే ఆవిరయ్యాయి. అంతేకాకుండా రికార్డ్ గరిష్టాలు 76,469, 23,264 పాయింట్ల స్థాయిల నుంచి సెన్సెక్స్, నిఫ్టీ గత నాలుగేళ్లలోలేని విధంగా భారీగా పతనమయ్యాయి! ఇంతక్రితం కోవిడ్–19 మహమ్మారి కట్టడికి కేంద్రం లాక్డౌన్ ప్రకటించడంతో దేశీ స్టాక్ మార్కెట్లు 2020 మార్చి 23న ఇంతకంటే అధికంగా 13 % కుప్పకూలిన సంగతి తెలిసిందే!! పీఎస్‌యూ షేర్లు ఫట్ మోడీ ప్రభుత్వానికి స్పష్టమైన మెజారిటీ లభించకపోవడంతో ప్రభుత్వ రంగ కౌంటర్లు తీవ్రంగా నష్టపోయాయి. ప్రధానంగా ఆర్ఈసీ 24 శాతం, పీఎఫ్సీ 22%, బీఈఎంఎల్, కంకార్, బీఈఎల్, బీహెచ్ఈఎల్ 19%, హెచ్ఏఎల్ 17%, ఓఎన్జీసీ, మజ్గావ్ డాక్ 16%, రైల్‌టెల్, ఎన్టీపీసీ, కోల్ ఇండియా 14%, ఆర్వీఎన్ఎల్ 13%, ఐఆర్సీటీసీ, పవర్‌గ్రిడ్, బీపీసీఎల్ 12% చొప్పున దిగజారాయి. ఇక పీఎస్‌యూ బ్యాంక్స్‌లో యూనియన్ బ్యాంక్, బీవోబీ, పీఎన్బీ, కెనరా బ్యాంక్, ఎస్బీఐ 18–13% మధ్య కుప్పకూలాయి. దీంతో పీఎస్ఈ ఇండెక్స్ 16%పైగా క్షీణించింది. ఎన్ఎస్ఈలో బ్యాంకెక్స్ 2022 ఫిబ్రవరి తదుపరి అత్యధికంగా 8% పతనమైంది. ఎదురీదిన ఎఫ్ఎంసీజీ.. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో అన్ని రంగాలూ దెబ్బతిన్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్, మెటల్, చమురు, రియలీ్ట, క్యాపిటల్ గూడ్స్, విద్యుత్ 15–6 శాతం మధ్య పతనమయ్యాయి. ఎఫ్ఎంసీజీ మాత్రం 1 శాతం బలపడింది. ప్రభుత్వేతర దిగ్గజాలలో ఎల్అండ్టీ, శ్రీరామ్ ఫైనాన్స్,టాటా స్టీల్, ఇండస్ఇండ్, హిందాల్కో, ఐసీఐసీఐ, జేఎస్‌డబ్ల్యూ, భారతీ, యాక్సిస్ 16–7 శాతం మధ్య క్షీణించాయి. అయితే హెచ్‌యూఎల్, బ్రిటానియా, నెస్లే, హీరో మోటో, టాటా కన్జూమర్ 6–2 % మధ్య జంప్ చేశాయి.అదానీ గ్రూప్ బేర్.. అదానీ గ్రూప్ కౌంటర్లు భారీగా పతనమై ముందురోజు ఆర్జించిన లాభాలను పోగొట్టుకోవడంతోపాటు మరింత నష్టపోయాయి. అదానీ పోర్ట్స్ 21 శాతం, ఎనర్జీ సొల్యూషన్స్ 20 శాతం దిగజారగా.. గ్రీన్ ఎనర్జీ, ఎంటర్ప్రైజెస్, టోటల్ గ్యాస్, ఎన్డీటీవీ 19 శాతం, అదానీ పవర్, అంబుజా సిమెంట్స్ 17 శాతం చొప్పున పతనమయ్యాయి. ఏసీసీ 15 శాతం, అదానీ విల్మర్ 10 శాతం పడ్డాయి. అత్యధిక శాతం షేర్లు కొనేవాళ్లులేక లోయర్ సర్క్యూట్లను తాకాయి. ఫలితంగా గ్రూప్‌లోని 10 లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువకు ఒక్క రోజులో రూ. 3.64 లక్షల కోట్లమేర కోతపడింది. రూ. 15.78 లక్షల కోట్లకు పరిమితమైంది. -
ఆసియా కుబేరుడిగా మళ్లీ అదానీ
న్యూఢిల్లీ: ఆసియాలోనే అత్యంత సంపన్నుల జాబితాలో అదానీ గ్రూప్ చీఫ్ గౌతమ్ అదానీ మరోసారి రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీని అధిగమించారు. 111 బిలియన్ డాలర్ల సంపదతో అగ్రస్థానం దక్కించుకున్నారు. అంతర్జాతీయంగా కుబేరుల లిస్టులో 11వ స్థానంలో నిల్చారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ రిపోర్టు ప్రకారం అంబానీ 109 బిలియన్ డాలర్ల సంపదతో అంతర్జాతీయంగా 12వ స్థానంలో ఉన్నారు. అదానీ 2022లోనే ఆసియాలో నంబర్ వన్ సంపన్నుడిగా ఎదిగారు. అంతే కాదు స్వల్ప సమయం పాటు ప్రపంచంలోనే రెండో స్థానంలో నిల్చారు. అయితే, ఆయన గ్రూప్ కంపెనీల ఖాతాల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ ఆరోపించడంతో 2023 జనవరిలో అదానీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ తర్వాత పరిణామాలతో గ్రూప్ సంస్థల షేర్లన్నీ కుదేలై ఏకంగా 150 బిలియన్ డాలర్ల విలువ కరిగిపోయింది. దీంతో ఆసియాలో అత్యంత సంపన్నుడిగా అంబానీ మళ్లీ అగ్రస్థానం దక్కించుకున్నారు. మరోవైపు, ఆరోపణలను దీటుగా ఎదుర్కొని, అదానీ క్రమంగా దిద్దుబాటు చర్యలు తీసుకుంటూ గ్రూప్‌ను మళ్లీ నిలబెట్టుకున్నారు. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి 10 గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ రూ. 17.51 లక్షల కోట్లకు చేరడంతో ఆయన సంపద కూడా పెరిగింది. మొత్తం మీద 2024లో అదానీ నికర విలువ 26.8 బిలియన్ డాలర్లు పెరగ్గా, అంబానీ సంపద 12.7 బిలియన్ డాలర్లు పెరిగింది. -
బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలోకి అదానీ స్టాక్
అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ బీఎస్ఈ సెన్సెక్స్‌లో నమోదుకానుంది. ఐటీ సంస్థ విప్రో ఈ జాబితా నుంచి బయటకువెళ్లనుంది. సెన్సెక్స్ 50 సూచీలో టాటా గ్రూప్‌కు చెందిన ట్రెంట్ లిమిటెడ్ చేరింది. ఈ సూచీలో నుంచి దివీస్ బయటకు వెళ్లింది. ఈ మేరకు ఎస్అండ్పీ డౌజోన్స్ సూచీ, బీఎస్ఈ జాయింట్ వెంచర్ ఆసియా ఇండెక్స్ ప్రకటిన విడుదల చేశాయి. ఈ మార్పులు జూన్ 24 నుంచి అమల్లోకి వస్తాయి.అదానీ గ్రూప్ కంపెనీల్లో అదానీ ఎంటర్ప్రైజెస్ సెన్సెక్స్ 30 సూచీలోకి వస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. కానీ అదానీ పోర్ట్స్ అండ్ సెజ్‌కు ఆ అవకాశం దక్కింది. ఏడాది కాలంగా ఈ కంపెనీ షేర్లు స్థిరంగా రాణిస్తుండడంతో ఈ అవకాశం దక్కినట్లు తెలిసింది. అదానీ కంపెనీల్లో సెన్సెక్స్ 30 సూచీలో చోటు దక్కించుకున్న తొలి కంపెనీ అదానీ పోర్ట్స్ కావడం విశేషం.అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్‌ను 1998లో స్థాపించారు. అహ్మదాబాద్ కేంద్రంగా దేశంలోని వివిధ పోర్ట్‌లను ఆపరేట్ చేసే లాజిస్టిక్స్ కంపెనీగా ఎదిగింది. దేశవ్యాప్తంగా 12 పోర్ట్‌లు, టెర్మినల్స్ ఈ సంస్థ పరిధిలో పనిచేస్తున్నాయి. ఇందులో దేశంలోనే మొట్టమొదటి డీప్ వాటర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ విజింజం ఇంటర్నేషనల్ సీపోర్ట్ తిరువనంతపురం, ముంద్రాలోని పోర్ట్ సెజ్ ప్రధానమైనవి. ఈ కింది పోర్ట్‌లు అదానీ పోర్ట్ అండ్ సెజ్‌లో భాగంగా ఉన్నాయి.విజింజం అంతర్జాతీయ నౌకాశ్రయం తిరువనంతపురంముంద్రా పోర్టు కృష్ణపట్నం ఓడరేవుకారైకాల్ పోర్టు హజీరా పోర్టుధమ్రా పోర్టుదహేజ్ పోర్టు గంగవరం ఓడరేవు వైజాగ్ టెర్మినల్ మోర్ముగో టెర్మినల్ కట్టుపల్లి ఓడరేవు కామరాజర్ పోర్టు ట్యూనా టెర్మినల్ అగర్దానా షిప్‌యార్డ్ & టెర్మినల్స్ డిఘి పోర్టు -
హిండెన్‌బర్గ్‌ను ఎదురొడ్డి.. నష్టాల నుంచి బయటపడ్డ అదానీ
ప్రముఖ డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ ఎంటర్ ప్రైజెస్ అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలు గతేడాది సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ కంపెనీ మార్కెట్ విలువ రూ.లక్షల కోట్ల మేరకు ఆవిరైపోయింది.ఇప్పుడు అదానీ సంస్థ ఆర్ధిక సంక్షోభం నుంచి బయటపడింది. అప్పులు తగ్గించడం, కొత్త ప్రాజెక్ట్‌లు చేపట్టడంతో ఇది సాధ్యమైందని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.హిండెన్‌బర్గ్ సృష్టించిన పెనుతుపానుకు ఎదురొడ్డి నిలిచిన అదానీ ఎంటర్ ప్రైజెస్ విభిన్నమైన వ్యూహాన్ని ఎన్నుకొంది. దానిని పక్కాగా అమలు చేసి సఫలమైంది. అదానీ స్టాక్స్ వ్యాల్యూ పెరిగింది.అదానీ ఎంటర్ప్రైజెస్ స్టాక్ ఈ రోజు (మే 24) 1.7% పెరిగి 3,445.05కి చేరుకుంది. ఫిబ్రవరి 2023లో పడిపోయినప్పటి నుండి దాదాపు మూడు రెట్లు పెరిగింది.ఈ తాజా పరిణామాలతో అదానీ గ్రూప్ తన సిమెంట్, కాపర్ వ్యాపారాలను మరింత విస్తరించే ప్రణాళికల్లో ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం అదానీ రుణాల కోసం ప్రయత్నాలు ప్రారంభించారని, అంతర్జాతీయ పెట్టుబడి సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. -
Lok Sabha Election 2024: రాయ్‌బరేలీ కోసం మేము.. అదానీ, అంబానీ కోసం మోదీ
రాయ్‌బరేలీ: రాయ్‌బరేలీ నియోజకవర్గ ప్రజల కోసం తన కుటుంబం మొత్తం పనిచేస్తే, అదానీ, అంబానీల కోసం మోదీ చాలా చెమటోడ్చారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. సోమవారం రాయ్‌బరేలీలో జరిగిన సభలో రాహుల్ ప్రసంగించారు. ‘‘ రాయ్‌బరేలీలో నామినేషన్ వేశాక రాహుల్ ఆ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ఇదే తొలిసారి. ‘‘ నానమ్మ ఇందిరా గాం«దీ, నాన్న రాజీవ్‌గాం«దీ, అమ్మ సోనియాగాంధీ అందరూ రాయ్‌బరేలీ ప్రజల జీవితాలను బాగుచేసేందుకు పాటుపడ్డారు. మా కుటుంబమంతా మీ కోసం పనిచేస్తే, మోదీ మాత్రం అదానీ, అంబానీల ప్రయోజనాలే పరమావధిగా పనిచేశారు. ఉపాధిహామీ పథకానికి 24 ఏళ్లకాలానికి ఖర్చయ్యే మొత్తానికి సరిసమానమైన బడాపారిశ్రామికవేత్తల రూ.16 లక్షల కోట్ల రుణాలను మోదీ ఒక్కదెబ్బతో మాఫీచేశారు. మోదీ హయాంలో రైతులు, నిరుద్యోగ యువత సమస్యలను జాతీయ మీడియా ఉద్దేశపూర్వకంగా చూపించలేదు. పారిశ్రామికవేత్తల కుటుంబాల ఆడంబర వివాహాలకే అగ్రతాంబూలం ఇచ్చాయి. ఆ వేడుకలనే ప్రసారంచేశాయి’’ అని ఆరోపించారు. పెళ్లి ఎప్పుడంటే? సోమవారం రాయ్‌బరేలీలో జరిగిన ప్రచారసభలో రాహుల్ మళ్లీ అదే ప్రశ్నను ఎదుర్కొన్నారు. రాహుల్ మాట్లాడేటప్పుడు సభావేదికపై సోదరి ప్రియాంకా గాంధీ కూడా ఉన్నారు. ‘నిన్ను వీళ్లేదో ప్రశ్న అడుగుతారట. సమాధానం చెప్పు’ అని ప్రియాంక చెప్పగా, ఏంటా ప్రశ్న అని రాహుల్ సభికులను అడిగారు. పెళ్లి ఎప్పుడు? అని ఒక కార్యకర్త అడిగిన ప్రశ్నకు రాహుల్ ఈసారి కొత్త సమాధానం చెప్పారు. ‘‘తొందరపడాలిక. త్వరలోనే చేసుకుంటా’’ అని అందరినీ ఆశ్చర్యపరిచారు. గతంలో పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా ‘‘ ఇన్నాళ్లు ఎందుకో పెళ్లి గురించి అంతగా పట్టించుకోలేదు’, ‘ పెళ్లి మీదకు మనసు పోలేదు’, ‘ మీరే అమ్మాయిని చూడండి’, ‘ అమ్మకు నచి్చతే ఓకే’ అంటూ వేర్వేరు సమాధానాలు చెప్పిన రాహుల్ సోమవారం ఇలా కొత్త సమాధానం చెప్పారు. తర్వాత ప్రియాంకను పొగిడారు.‘‘ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రచారం చేస్తూ ఎట్టకేలకు రాయ్‌బరేలీకి వచ్చా. కానీ ప్రియాంక మాత్రం మొదట్నుంచీ రాయ్‌బరేలీలో ప్రచార బాధ్యతలు దగ్గరుండి చూసుకుంటోంది. ఆమెకు నా కృతజ్ఞతలు’ అని ఆమెను అభినందించారు. -
Rahul Gandhi: మోదీజీ... భయపడ్డారా?
న్యూఢిల్లీ: అంబానీ– అదానీలతో కాంగ్రెస్‌కు ఒప్పందం కుదిరిందని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ తిప్పికొట్టారు. ‘నమస్కారం మోదీజీ.. మీరు భయపడ్డారా?’ అని రాహుల్ ఓ వీడియో సందేశంలో ప్రశ్నించారు. ‘సాధారణంగా మీరు అంబానీ, అదానీల గురించి అంతర్గతంగా, తెరవెనుక మాట్లాడుతారు. కానీ మొదటిసారిగా ఇవాళ మీరు అంబానీ, అదానీల పేర్లను బహిరంగంగా తీసుకున్నారు’ అని రాహుల్ అన్నారు. ఎన్ని టెంపో లోడ్ల నల్లధనం కాంగ్రెస్‌కు ముట్టింది? ఏం ఒప్పందం కుదిరింది? రాత్రికి రాత్రే అంబానీ– అదానీలపై ఆరోపణలు ఆగిపోయాయి’ అని ప్రధాని మోదీ బుధవారం వేములవాడ సభలో ప్రశ్నించారు. ప్రధాని విమర్శలకు బదులిస్తూ ‘వారు టెంపోల నిండా డబ్బులిస్తారని కూడా మీకు తెలుసు. అంటే మీకు వ్యక్తిగతంగా ఇది అనుభవమేనా?’ అని రాహుల్ నిలదీశారు. ఒక పనిచేయండి.. అంబానీ, అదానీలపైకి ఎన్ఫోర్స్మెంట్ డెరెక్టరేట్ (ఈడీ)ని పంపాలని ప్రధాని మోదీని కోరారు. కాంగ్రెస్ పారీ్టకి వారు నల్లధనమిచ్చారనే దానిపై సాధ్యమైనంత త్వరగా లోతైన దర్యాప్తు పూర్తయ్యేలా చూడాలన్నారు. వారిపైకి ఈడీని పంపడానికి భయపడొద్దన్నారను. బీజేపీ అవినీతి టెంపోకు డ్రైవర్ ఎవరో, హెల్పర్ ఎవరో మొత్తం దేశానికి తెలుసన్నారు. -
అందరూ పోలింగ్‌లో పాల్గొనాలి: అదానీ
ఆసియా కుబేరుల్లో ఒకరైన గౌతమ్ అదానీ కుటుంబ సమేతంగా అహ్మదాబాద్‌లో మంగళవారం ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఓటుహక్కు కలిగి ఉన్న పౌరులందరూ పోలింగ్‌లో తప్పక పాల్గొనాలని ఆయన తెలిపారు. ఎలక్షన్ కమిషన్ ఓటింగ్ శాతం పెంచేలా ప్రకటనలు, సెలబ్రిటీ యాడ్స్..వంటి చాలా కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే.అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్‌గా గౌతమ్ అదానీ వ్యవహరిస్తున్నారు. అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ కంపెనీ మార్కెట్ క్యాపిటల్ రూ.3.5లక్షల కోట్లుగా ఉంది. గౌతమ్ అదానీ ఎంటర్ప్రైజ్ బిజినెస్‌తోపాలు పోర్ట్ మేనేజ్మెంట్, ఎలక్ట్రిక్ పవర్, మైనింగ్, పునరుత్పాదక ఇందనం, ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇన్ఫ్రా..వంటి రంగాల్లో కంపెనీలు స్థాపించి విజయవంతంగా వాటిని కొనసాగిస్తున్నారు. -
పునరుత్పాదక విద్యుత్‌లో అదానీ గ్రీన్ ఎనర్జీ రికార్డు
న్యూఢిల్లీ: దేశీయంగా 10,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని సాధించిన తొలి కంపెనీగా తమ సంస్థ నిలి్చందని అదానీ గ్రీన్ ఎనర్జీ (ఏజీఈఎల్) తెలిపింది. గుజరాత్‌లోని ఖావ్డా సోలార్ పార్క్‌లో 2,000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంటు ఏర్పాటు ద్వారా దీన్ని సాధించినట్లు సంస్థ వివరించింది. ప్రస్తుతం కంపెనీ పోర్ట్‌ఫోలియోలో 7,393 మెగావాట్ల సౌర విద్యుత్, 1,401 మెగావాట్ల పవన విద్యుత్, 2,140 మెగావాట్ల విండ్–సోలార్ హైబ్రిడ్ ప్లాంట్లు (మొత్తం 10,934 మెగావాట్ల ) ఉన్నాయి. 2030 నాటికల్లా 45 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలని కంపెనీ నిర్దేశించుకుంది. -
మనవరాలితో అదానీ మురిపెం : బిలియనీర్ ఫోటో వైరల్
అసలు కంటే వడ్డీ ముద్దు అనేది నానుడి. అంటే బిడ్డలతో పోలిస్తే మనవలు మనవరాళ్లపైనే తల్లితండ్రులకు ఎక్కువప్రేమ అభిమానం ఉంటుంది అని. చాలా సందర్బాల్లో ఇది అక్షరాలా అనిపిస్తుంది. ఇందులో బడా పారిశ్రామికవేత్తలైనా, సెలబ్రిటీలైనా ఎవ్వరూ అతీతులు కారు. తాజాగా బిలియనీర్, అదానీ గ్రూపు అధినేత గౌతమ్ అదానీ తన ముద్దుల మనవరాలిని చూసి తెగమురిసిపోతున్నారు. నీ కళ్లలోని మెరుపుతో పోలిస్తే ఈ ప్రపంచంలోని సంపద అంతా దిగ దుడుపే అన్నట్టు రాసుకొచ్చారు. దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట వైరలవుతోంది. 14 నెలల మనవరాలు కావేరిని ఎత్తుకున్న ఫోటోలను ట్విటర్లో షేర్ చేశారు. ప్రపంచంలో ఇంతకుమించిన సంపద ఏముందంటూ ఒక కవితా పదాలను రాయడం విశేషంగా నిలిచింది. ప్రస్తుతం ఇంటర్నెట్లో హాట్‌టాపిక్‌గా నిలిచింది. "ఇన్ ఆంఖోన్ కీ చమక్ కే ఆగే దునియా కీ సారీ దౌలత్ ఫీకీ హై. (నీ కళ్ల మెరుపులో ప్రపంచంలోని సంపద అంతా మసకబారుతుంది)" అంటూ ఉద్వేగంతో రాసుకొచ్చారు. గౌతమ్ అదానీ- ప్రీతి అదానీ దంపతులకు ఇద్దరు కుమారులు కరణ్, జీత్. వీరిలో పెద్ద కుమారుడు కరణ్- పరిధి ముద్దుల తనయ కావేరి. కాగా లండన్‌లోనే సైన్స్ మ్యూజియంలో న్యూ అదానీ గ్రీన్ ఎనర్జీ గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈ చిన్నారితో ఫోటో తీసుకున్నారు. తన జీవితంలో మనవరాళ్లతో గడపడమే తనకు పని ఒత్తిడి (బిగ్గెస్ట్ స్ట్రెస్ రిలీవర్స్) పెద్ద ఉపశమనం అని గతంలో పేర్కొన్నారు. "నా మనుమరాళ్లతో సమయం గడపడం చాలా ఇష్టం, వారు నా ఒత్తిడిని తగ్గిస్తారు. నాకు రెండు ప్రపంచాలు ఒకటి ఉద్యోగం, రెండోది. కుటుంబం, కుటుంబమే నాకు గొప్ప శక్తి’’ గౌతమ్ అదానీ. इन आँखों की चमक के आगे दुनिया की सारी दौलत फीकी है। 🙏 pic.twitter.com/yd4nyAjDkR — Gautam Adani (@gautam_adani) April 2, 2024 -
మరో పోర్టును కొనుగోలు చేసిన అదానీ
-
అదానీ గ్రూప్ ప్రపంచ అతిపెద్ద కాపర్ ప్లాంట్
గుజరాత్‌లోని ముంద్రాలో అదానీ గ్రూప్ భారీ కాపర్ ప్లాంటు తొలి దశను ప్రారంభించింది. ఇది ప్రపంచంలోనే సింగిల్ లొకేషన్లో ఏర్పాటైన అతి పెద్ద కాపర్ తయారీ కర్మాగారంగా నిలవనుంది. దీనితో దిగుమతులపై ఆధారపడే పరిస్థితి కొంత తగ్గనుంది. అంబుజాలో అదానీ వాటా అప్ రూ. 6,661 కోట్ల పెట్టుబడులు డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ తాజాగా అంబుజా సిమెంట్స్‌లో వాటాను పెంచుకుంది. 21.2 కోట్ల వారంట్లను ఈక్విటీ షేర్లుగా మార్పిడి చేసుకోవడం ద్వారా 3.6 శాతం అదనపు వాటాను పొందింది. ఇందుకు రూ. 6,661 కోట్లు వెచ్చించగా.. ప్రస్తుతం అంబుజాలో అదానీ వాటా 66.7 శాతానికి చేరింది. దేశీయంగా సిమెంట్ తయారీలో రెండో పెద్ద కంపెనీగా నిలుస్తున్న అంబుజాలో ప్రమోటర్ సంస్థ హార్మోనియా ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ షేరుకి రూ. 314.15 సగటు ధరలో వారంట్లను మార్పిడి చేసుకుంది. ఇంతక్రితం 2022 అక్టోబర్‌లోనూ ప్రమోటర్ సంస్థ వారంట్లను అందుకోవడం ద్వారా రూ. 5,000 కోట్లు ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే. దీనిలో భాగంగా హార్మోనియాకు 47.74 కోట్ల మార్పిడికి వీలయ్యే వారంట్లను అంబుజా సిమెంట్స్ జారీ చేసింది. -
అదానీ చేతికి గోపాల్పూర్ పోర్టు
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం అదానీ గ్రూప్ ఖాతాలోకి మరో పోర్టు వచ్చి చేరనుంది. గ్రూప్‌లో భాగమైన అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ సంస్థ (ఏపీసెజ్) తాజాగా ఒడిశాలోని గోపాల్పూర్ పోర్టును (జీపీఎల్) దక్కించుకోనుంది. ఇందుకోసం జీపీఎల్లో షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూప్, ఒడిశా స్టీవ్డోర్స్ లిమిటెడ్ (ఓఎస్ఎల్) నుంచి 95 శాతం వాటాలను రూ. 1,349 కోట్లకు కొనుగోలు చేయనుంది. జీపీఎల్లో ఎస్పీ పోర్ట్ మెయింటెనెన్స్‌కి 56 శాతం, ఓఎస్ఎల్కి 44 శాతం వాటాలు ఉన్నాయి. ఇందులో ఎస్పీ గ్రూప్ వాటాలను పూర్తిగా, ఓఎస్ఎల్ నుంచి 39 శాతం వాటాలను ఏపీసెజ్ కొనుగోలు చేయనుంది. ఓఎస్ఎల్ 5 శాతం వాటాతో జాయింట్ వెంచర్ భాగస్వామిగా కొనసాగనుంది. రూ. 3,080 కోట్ల ఎంటర్ప్రైజ్ విలువతో 95 శాతం వాటాను రూ. 1,349 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు ఏపీసెజ్ తెలిపింది. నిర్దిష్ట మైలురాళ్లను అధిగమించాకా 5.5 ఏళ్ల తర్వాత మరో రూ. 270 కోట్లు చెల్లించే ప్రాతిపదికన ఈ డీల్ ఉంటుందని పేర్కొంది. దీంతో ఎంటర్ప్రైజ్ విలువను రూ. 3,350 కోట్లుగా లెక్కగట్టినట్లవుతుంది. గోపాల్పూర్ పోర్టు కొనుగోలుతో తమ కస్టమర్లకు మరింతగా సమగ్రమైన సేవలు అందించేందుకు వీలవుతుందని ఏపీసెజ్ ఎండీ కరణ్ అదానీ తెలిపారు. దీనితో ఒడిశాలోని మైనింగ్ హబ్‌లు, పొరుగు రాష్ట్రాలు అందుబాటులోకి రాగలవని, తద్వారా మారుమూల ప్రాంతాలకు కూడా తమ లాజిస్టిక్స్ సేవలను విస్తరించడానికి వీలవుతుందని పేర్కొన్నారు. ఏపీసెజ్‌కి ప్రస్తుతం తూర్పు, పశ్చిమ తీరాల్లో పద్నాలుగు పోర్టులు, టెర్మినల్స్ ఉన్నాయి. 20 మిలియన్ టన్నుల సామర్థ్యం.. ఒరిస్సాలోని గంజాం జిల్లాలో 20 మిలియన్ టన్నుల వార్షిక సామర్ధ్యంతో గోపాల్పూర్ పోర్టు పని చేస్తోంది. ఇనుప ఖనిజం, బొగ్గు, అల్యూమినా మొదలైన కార్గోను హ్యాండిల్ చేస్తోంది. ఇటీవలే ఇది ఎల్ఎన్జీ రీగ్యాసిఫికేషన్ టెరి్మనల్‌ను నెలకొల్పేందుకు పెట్రోనెట్ ఎల్ఎన్జీతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది. 2024 ఆర్థిక సంవత్సరంలో జీపీఎల్ 11.3 మిలియన్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ ద్వారా రూ. 520 కోట్ల ఆదాయం ఆర్జించవచ్చని అంచనాలు ఉన్నాయి. అసెట్ మానిటైజేషన్‌పై ఎస్పీ దృష్టి.. రూ. 20,000 కోట్ల రుణభారాన్ని తగ్గించుకునే దిశగా ఎస్పీ గ్రూప్ గత కొన్నాళ్లుగా అసెట్ మానిటైజేషన్ (ఆస్తులను విక్రయించడం లేదా, లీజుకివ్వడం ద్వారా నిధులు సమకూర్చుకోవడం)పై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా గతంలో మహారాష్ట్రలోని ధరమ్‌తార్ పోర్టును రూ. 710 కోట్ల విలువకు జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థకి విక్రయించింది. 2015లో దీన్ని కొనుగోలు చేసిన ఎస్పీ గ్రూప్.. ఆ తర్వాత కార్యకలాపాలను టర్న్అరౌండ్ చేయగలిగింది. వార్షిక సామర్థ్యాన్ని 1 ఎంటీపీఏ నుంచి 5 ఎంటీపీఏకి పెంచింది. ఇక గోపాల్పూర్ పోర్టు ఒప్పందం గత కొద్ది నెలల్లో రెండో డీల్. రెండు పోర్టులను గణనీయమైన విలువకు విక్రయించడమనేది అసెట్స్‌ను టర్న్అరౌండ్ చేయడంలోను, స్వల్పకాలంలోనే వాటాదారులకు మెరుగైన రాబడులు అందించడంలోనూ తమకు గల సామర్థ్యానికి నిదర్శనమని ఎస్పీ గ్రూప్ ప్రతినిధి తెలిపారు. -
రూ.3 వేలకోట్లతో మరో పోర్టును కొనుగోలు చేసిన అదానీ
భారత్‌లోని ప్రైవేట్ పోర్టులను ఒక్కొక్కటిగా అదానీ గ్రూప్ కొనుగోలు చేస్తూ వస్తోంది. కొన్నింటిలో అధిక వాటాలను కలిగి ఉంది. తాజాగా అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్(ఏపీసెజ్) ఒడిషాలోని గోపాల్పూర్ పోర్టులో మేజర్‌వాటాను కొనుగోలు చేసినట్లు షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ మంగళవారం ప్రకటించింది. ఆస్తుల నగదీకరణ ప్రణాళికలో భాగంగా రూ.3,350 కోట్ల విలువకు దీన్ని అదానీ గ్రూప్‌నకు విక్రయించినట్లు షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ తెలిపింది. ఒడిశాలో నిర్మాణ దశలో ఉన్న ఈ నౌకాశ్రయాన్ని ఎస్పీ గ్రూప్ 2017లో కొనుగోలు చేసింది. గోపాల్పూర్ పోర్టు వార్షిక సామర్థ్యం 20 మిలియన్ మెట్రిక్ టన్నులు. గ్రీన్‌ఫీల్డ్ ఎల్ఎన్జీ రీ గ్యాసిఫికేషన్ టెర్మినల్ ఏర్పాటుకు ఇటీవలే పెట్రోనెట్ ఎల్ఎన్జీతో ఈ రేవు ఒప్పందం కుదుర్చుకుంది. దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో నగదు ప్రవాహాన్ని సమకూరుస్తుందనే అంచనాలు ఉన్నాయి. గత కొన్ని నెలల్లో నౌకాశ్రయాల నుంచి ఎస్పీ గ్రూప్ పెట్టుబడులను ఉపసంహరించుకోవడం ఇది రెండోసారి. గతంలో మహారాష్ట్రలోని ధరమ్‌తర్ పోర్టును రూ.710 కోట్లకు జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రా లిమిటెడ్‌కు విక్రయించింది. దీన్ని 2015లో కొనుగోలు చేసి వార్షిక సామర్థ్యాన్ని 1 మిలియన్ టన్నుల నుంచి ఐదు మిలియన్ టన్నులకు పెంచింది. అప్పులను తగ్గించుకొని కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడంలో ఈ పెట్టుబడుల ఉపసంహరణలు కీలక పాత్ర పోషిస్తాయని ఎస్పీ గ్రూప్ అధికార ప్రతినిధి తెలిపారు. తద్వారా భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా తమ కీలక వ్యాపారాలపై దృష్టి సారించే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ గ్రూప్‌పై దాదాపు రూ.20 వేల కోట్ల రుణభారం ఉందని తెలిసింది. ఇప్పటికే ముంద్రాపోర్టు, కృష్ణపట్నం పోర్టు, కరైకల్ పోర్టు, హజిరా పోర్టు, ధామ్రా పోర్టు..వంటి ప్రధాన పోర్టుల్లో అదానీ గ్రూప్ గరిష్ఠ వాటాలు కలిగి ఉంది. ఇదీ చదవండి: మహిళలకు ప్రభుత్వ బ్యాంక్ ప్రత్యేక క్రెడిట్‌కార్డులు.. -
పెద్ద స్కెచ్ వస్తున్న అదానీ.. ఏకంగా రూ. 1.2 లక్షల కోట్ల పెట్టుబడులు
-
ప్రాజెక్టుల ఏర్పాటుకు లంచం.. స్పందించిన అదానీ గ్రూప్
భారత్‌లో ప్రాజెక్టుల ఏర్పాటుకై అదానీ గ్రూప్ ప్రతినిధులు లంచం ఇవ్వజూపారంటూ వస్తున్న ఆరోపణల విషయంలో అమెరికా ప్రభుత్వం దర్యాప్తు చేపట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్ స్పందించింది. అలా వస్తున్న కథనాలు, వార్తలు పూర్తిగా అవాస్తవమని గ్రూప్ ప్రతినిధులు వెల్లడించారు. ఆ ఆరోపణలకు సంబంధించి అమెరికా న్యాయశాఖ నుంచి ఎలాంటి నోటీసు అందలేదని సంస్థ తన ఎక్స్ఛేంజీ ఫైలింగ్‌లో తెలిపింది. ఈ దర్యాప్తు గురించి తమకు తెలియదని, భారత్‌తో సహా ఇతర దేశాల్లోని అవినీతి నిరోధక చట్టాలకు తాము కట్టుబడి ఉన్నామని గ్రూప్ పేర్కొంది. భారత్‌లో ఒక ఇంధన ప్రాజెక్టు ఏర్పాటు విషయంలో అనుకూలంగా వ్యవహరించేందుకు, భారత అధికారులకు అదానీ గ్రూప్ లేదా ఆ గ్రూప్‌లోని వ్యక్తులు ఎవరైనా లంచం ఇవ్వజూపారా లేదా అన్నది తెలుసుకోవడానికి అమెరికా దర్యాప్తు చేపట్టినట్లు బ్లూమ్‌బెర్గ్ కథనంలో పేర్కొంది. అమెరికా మార్కెట్లో అదానీ గ్రూప్ ట్రేడ్ కానప్పటికీ అమెరికన్ల పెట్టుబడులు ఆ సంస్థలో ఉన్న నేపథ్యంలో యూఎస్ ప్రభుత్వం దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ఇదీ చదవండి: ‘మళ్లీ డ్రగ్స్ తీసుకున్నాను..’ ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడి ఈ నేపథ్యంలో ఆ దేశ అటార్నీ జనరల్ ఆఫీస్, జస్టిస్ డిపార్ట్మెంట్కు చెందిన ఫ్రాడ్ యూనిట్ ఈ విచారణ జరుపుతున్నట్లు వార్తా కథనం ద్వారా తెలిసింది. దేశీయ ఎనర్జీ కంపెనీ అజ్యూర్ పవర్ గ్లోబల్‌పైనా దృష్టిపెట్టినట్లు సమాచారం. -
అదానీతో క్వాల్కామ్ సీఈవో క్రిస్టియానో భేటీ
న్యూఢిల్లీ: చిప్‌ల తయారీ దిగ్గజం క్వాల్కామ్ సీఈవో క్రిస్టియానో ఆర్ ఎమోన్, అదానీ గ్రూప్ చీఫ్ గౌతమ్ అదానీ సోమవారం సమావేశమయ్యారు. కృత్రిమ మేధ, సెమీకండక్టర్లు మొదలైన వాటి పాత్ర గురించి ఈ సందర్భంగా చర్చించినట్లు సోషల్ మీడియా సైట్ ఎక్స్‌లో అదానీ పోస్ట్ చేశారు. చెన్నైలో రూ. 177 కోట్లతో ఏర్పాటు చేసిన కొత్త డిజైన్ సెంటర్‌ను మార్చి 14న ఎమోన్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. వై–ఫై టెక్నాలజీలకు అనుబంధ ఆవిష్కరణలు లక్ష్యంగా కొత్త సెంటర్ వైర్లెస్ కనెక్టివిటీ సొల్యూషన్స్‌ను ఈ సెంటర్ రూపొందించనుంది. మరోవైపు, తమ సొంత పోర్టులు, లాజిస్టిక్స్, విద్యుదుత్పత్తి తదితర విభాగాల అవసరాల కోసం స్వల్ప మొత్తంలో తీసుకున్న 5జీ స్పెక్ట్రంనకు సంబంధించి ఉపయోగపడే సొల్యూషన్స్ కోసం అదానీ అన్వేషిస్తోంది. ఈ నేపథ్యంలో క్రిస్టియానో, అదానీ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. -
దక్షిణాసియాలోనే అతిపెద్ద డిఫెన్స్ కాంప్లెక్స్ ఏర్పాటు.. ఎక్కడంటే..
భారత రక్షణ రంగానికి తోడ్పాటునందించేలా ‘అదానీ డిఫెన్స్’ మరో ముందడుగు వేసింది. అదానీ డిఫెన్స్‌కు చెందిన దక్షిణాసియాలోనే అతిపెద్దదైన మందుగుండు సామగ్రి, క్షిపణి తయారీ కాంప్లెక్సు ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ రాజా సుబ్రమణి పాల్గొన్నారు. రక్షణ శాఖ, యూపీ ప్రభుత్వ సీనియర్ అధికారుల సమక్షంలో ఈ కార్యక్రమం ఇటీవల నిర్వహించారు. భారత ఆర్మీ 2019 ఫిబ్రవరి 26న ‘ఆపరేషన్ బందర్’ పేరుతో పాకిస్తాన్‌లోని బాలాకోట్ ప్రాంతంపై వైమానిక దాడిని నిర్వహించింది. ఈ ఆపరేషన్ ఐదో వార్షికోత్సవం సందర్భంగా మందుగుండు సామగ్రి, క్షిపణి తయారీ కాంప్లెక్సును అధికారికంగా ప్రారంభించారు. ఇదీ చదవండి: ఆండ్రాయిడ్‌లో రానున్న అద్భుతమైన అప్డేట్లు.. 500 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ సదుపాయంలో పెద్దఎత్తున మందుగుండు సామగ్రి, బుల్లెట్లు, క్షిపణులను తయారు చేయనున్నారు. కాన్పూర్‌లో ఈ క్యాంపస్ ఏర్పాటు కోసం అదానీ గ్రూప్‌కు భూమిని కేటాయించిన 18 నెలల్లోనే కార్యకలాపాలను మొదలుపెట్టడం అనేది ముఖ్యమైన అంశమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ‘రూ.3,000 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడితో మందుగుండు సామగ్రి, క్షిపణి తయారీ కాంప్లెక్సు ప్రాజెక్టును చేపట్టాం. దీనివల్ల 4,000 ఉద్యోగాలు ఏర్పడతాయి’ అని అదానీ డిఫెన్స్ సీఈవో ఆశిష్ రాజ్‌వంశీ వెల్లడించారు. -
భవిష్యత్తులో కరెంట్ కష్టాలు తీరేనా..?
అభివృద్ధి చెందుతున్న దేశంలో ప్రధానంగా కరెంట్ అవసరాలు కూడా పెరుగుతాయి. ఇండియా 2027 నాటికి దాదాపు 8 ట్రిలియన్ డాలర్ల ఎనానమీ మార్కును తాకనుందని అంచనాలు వెలువడుతున్నాయి. అందుకు పారిశ్రామిక రంగం ఎంతో చేయూతనందిస్తుంది. అయితే దానికి చాలా విద్యుత్ అవసరం అవుతుంది. దాంతోపాటు దాదాపు అన్ని రంగాల్లో విద్యుత్ ప్రధానపాత్ర పోషిస్తుంది. కానీ దాని తయారీకి ప్రభుత్వాలు, యంత్రాంగం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటుంది. సమర్థంగా కరెంట్ తయారు చేసి వినియోగించేలా పరిశోధనలు జరుగుతున్నాయి. అందులో అణు విద్యుత్‌కే పెద్దపీట వేస్తున్నారు. అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.10 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అణు విద్యుదుత్పత్తిని భారీగా పెంచడమే దీని వెనక ఉద్దేశమని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ కొన్ని మీడియా కథనాల ద్వారా తెలుస్తుంది. అణు విద్యుత్ వల్ల కర్బన ఉద్గారాలు వెలువడవు. ప్రస్తుతం చూస్తే, దేశీయంగా జరుగుతున్న మొత్తం విద్యుదుత్పత్తిలో అణు విద్యుత్ వాటా 2% కంటే తక్కువగానే ఉంది. అందుకే తొలిసారిగా ఈ రంగంలోకి ప్రైవేట్ పెట్టుబడులను ప్రభుత్వం ఆహ్వానిస్తోందని చెబుతున్నారు. దేశ విద్యుత్తు ఉత్పత్తిలో సంప్రదాయేతర ఇంధనాల ద్వారా జరుగుతోంది 42% కాగా, దీనిని 2030 కల్లా 50 శాతానికి పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రముఖ కంపెనీలతో చర్చలు అణు విద్యుత్ రంగంలో ప్రైవేట్ పెట్టుబడుల వల్లే ఈ లక్ష్యాలను చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. దాంతో రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ పవర్, వేదాంతా, టాటా పవర్లతో ప్రభుత్వం చర్చలు జరుపుతోందని తెలిసింది. ఒక్కో సంస్థ సుమారు రూ.44,000 కోట్ల (5.30 బిలియన్ డాలర్లు) వరకు పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తుంది. ఏడాదికాలంగా ఈ సంస్థలతో డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్పీసీఐఎల్)లు పలు దఫాలుగా సంప్రదింపులు జరిపినట్లు వివరించింది. 1.300 మెగావాట్ల సామర్థ్యం పెరిగే అవకాశం.. ప్రస్తుతం దేశంలో 7,500 మెగావాట్ల సామర్థ్యంతో అణు విద్యుత్ ప్లాంట్లను ఎన్పీసీఐఎల్ నిర్వహిస్తోంది. మరో 1,300 మెగావాట్ల సామర్థ్యాన్ని అభివృద్ధి చేసేందుకు పెట్టుబడులు పెట్టాలన్నది ఆ సంస్థ ప్రణాళిక. ప్రైవేట్ సంస్థలు పెట్టుబడులు పెడితే, 2040 కల్లా 11,000 మెగావాట్ల మేర అణు విద్యుదుత్పత్తి సామర్థ్యం సమకూరుతుందని అంచనా. -
రూ.10 వేలకోట్లతో అదానీ కాపర్‌ప్లాంట్..
గుజరాత్‌లోని ముంద్రాలో అదానీ గ్రూప్ 1.2 బిలియన్ డాలర్ల(సుమారు రూ.10వేలకోట్లు)తో గ్రీన్‌ఫీల్డ్ కాపర్ ఫెసిలిటీని ప్రారంభించనుంది. మొదటిదశలో ఏటా 5 లక్షల టన్నుల సామర్థ్యంతో దీన్ని రూపొందించనున్నట్లు సమాచారం. రెండు దశల్లో పూర్తయ్యే ఈ ప్రాజెక్ట్ బంగారం, వెండి, నికెల్, సెలీనియంకు సంబంధించిన ఉప ఉత్పత్తులతో పాటు కాపర్ కేథోడ్‌లు, రాడ్లను తయారుచేయనున్నారు. దీంతోపాటు ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్‌తో సల్ఫ్యూరిక్ యాసిడ్‌ను కూడా తయారుచేయనున్నారు. ఈ మిశ్రమం ఎరువులు, డిటర్జెంట్లు, ఫార్మాస్యూటికల్స్, పేపర్, షుగర్ బ్లీచింగ్, వాటర్ ట్రీట్మెంట్తోపాటు ఇతర పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. కాపర్‌ను విద్యుత్ పరికరాల ఉత్పత్తికి, పవర్ ట్రాన్స్మిషన్, పునరుత్పాదక ఇంధన రంగానికి విరివిగా వాడుతారు. దాంతో భవిష్యత్తులో కాపర్‌కు చాలా డిమాండ్ ఉంటుందని భావిస్తున్నారు. కానీ దేశంలో దాని నిలువలు పరిమితంగానే ఉన్నాయి. అదానీ ప్లాంట్ ఉత్పత్తులు తయారీ ప్రారంభిస్తే దేశ కాపర్ దిగుమతులు తగ్గుతాయని, గ్రీన్ ఎనర్జీకి షిఫ్ట్ కావడంలో సాయపడుతుందని ఎనలిస్టులు చెబుతున్నారు. 1.2 బిలియన్ డాలర్ల పెట్టుబడితో అతిపెద్ద సింగిల్ లొకేషన్ ప్లాంట్‌ను 2029 మార్చి నాటికి పూర్తి చేయాలని అదానీ గ్రూప్ చూస్తోంది. రెండు దశల్లో ప్లాంట్ పూర్తకానుండగా, మొదటి దశలో ఏడాదికి 5 లక్షల టన్నుల కెపాసిటీతో అందుబాటులోకి రానుంది. ఈ కాపర్ రిఫైనరీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి కచ్ కాపర్ లిమిటెడ్ (కేసీఎల్) పేరుతో ఓ సబ్సిడరీ కంపెనీని అదానీ గ్రూప్ ఏర్పాటు చేసింది.ఈ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి అదానీ గ్రూప్ బ్యాంక్‌ల నుంచి అప్పు పొందింది. కాగా, 2022 ఏప్రిల్ – 2023 మార్చి మధ్య 1,81,000 టన్నుల ముడి కాపర్ మెటీరియల్‌ను దిగుమతి చేసుకుంది. 2027 నాటికి దేశంలో 7,50,000 టన్నుల కాపర్ అవసరం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే దేశీయంగా హిందాల్కో వంటి కంపెనీలు కాపర్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. ఇదీ చదవండి: భారీగా తగ్గుతున్న పేటీఎం షేర్.. అసలేం జరుగుతోందంటే.. పారిశ్రామికంగా వినియోగించే లోహాల్లో స్టీల్, అల్యూమినియం తర్వాత స్థానంలో రాగి ఉంటుంది. భారతదేశంలో లోహల పరంగా తలసరి వినియోగం కేవలం 0.6 కిలోలు. అదే ప్రపంచ సగటు 3.2 కిలోలుగా ఉందని నివేదికలు చెబుతున్నాయి. అయితే దేశంలోని రాగి ఎగుమతులు ఇటీవల క్షీణించాయని కచ్ కాపర్ దీన్ని భర్తీ చేస్తుందని కంపెనీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. కాపర్ ప్లాంట్ ఉప ఉత్పత్తులను తమ గ్రూప్ సంస్థ అదానీ సిమెంట్స్ వినియోగించుకోగలదని కంపెనీ తెలిసింది. -
ఇండియా గ్రోత్‌కు అదానీ కీలకం.. అమెరికా సంస్థ వెల్లడి
అదానీ గ్రూపు ఇండియా ఎకానమీకి కీలకమని అమెరికాకు చెందిన కాంటర్ ఫిట్జ్ గెరాల్డ్ అండ్ కో తెలిపింది. అదానీ గ్రూప్‌లోని అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ షేరు 50 శాతం కంటే ఎక్కువ లాభాలను అందించగలదని బ్రెట్ నోబ్లాచ్, థామస్ షిన్స్కే అనే ఎనలిస్టులు అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. భారతదేశం 2030 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశం ఉందని ఫిట్జ్ గెరాల్డ్ తెలిపింది. అత్యధిక జనాభా కలిగిన దేశం ఆర్థిక ఆశయాలను చేరుకోవడానికి ఇంధన ఉత్పత్తిని పెంచడంతోపాటు, డిజిటల్, సాంకేతిక, మౌలిక సదుపాయాల్లో పెట్టుబడి పెట్టాలని సూచించింది. ఈ పెట్టుబడులు ఉత్పాదకత, వృద్ధిని పెంచడానికి ఉపయోగపడుతాయని తెలిపింది. చైనాతో పోటీ పడాలంటే పెట్టుబడులు కీలకమని పేర్కొంది. ఇదీ చదవండి: బడ్జెట్ 2024-25 కథనాల కోసం క్లిక్ చేయండి ఇండియా ఎకనామిక్ గ్రోత్ లక్ష్యాలు సాధించడానికి అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ కీలకపాత్ర పోషిస్తుందని ఫిట్జ్ గెరాల్డ్ చెప్పింది. కీలక వ్యాపారాల్లో ఈ సంస్థకు భాగస్వామ్యం ఉందని పేర్కొంది. భారతదేశానికి అదానీ గ్రూప్ చాలా అవసరమని వివరించింది. -
2030 నాటికి మూడో అతి పెద్ద ఎకానమీగా భారత్ - ఆకాంక్షల సాధనకు అదానీ గ్రూప్
న్యూఢిల్లీ: 2030 నాటికల్లా ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఎకానమీగా ఎదగాలన్న భారత్ ఆకాంక్షల సాధనకు అదానీ గ్రూప్ కీలకంగా ఉండనున్నట్లు అమెరికాకు చెందిన ఆర్థిక సేవల సంస్థ క్యాంటర్ ఫిట్జ్‌గెరాల్డ్ అండ్ కంపెనీ ఒక నివేదికలో తెలిపింది. వేగంగా విస్తరిస్తున్న అదానీ గ్రూప్ .. మౌలిక రంగ అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తుండటమే ఇందుకు కారణమని పేర్కొంది. గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అయిన అదానీ ఎంటర్ప్రైజెస్ (ఏఈఎల్) 50 శాతం పైగా లాభాలను అందించగలదని కంపెనీపై కవరేజీని ప్రారంభిస్తూ జనవరి 28న రాసిన నోట్లో వివరించింది. ‘ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల భారతదేశం 2030 నాటికల్లా మూడో అతి పెద్ద ఎకానమీగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. అక్కడికి చేరుకోవాలంటే భారత్ ఇటు డిజిటల్ అటు భౌతిక మౌలిక సదుపాయాలపై ఇన్వెస్ట్ చేయాలి. ఇంధన వినియోగం పెరుగుతుంది కాబట్టి ఉత్పత్తి కూడా పెరగాలి. భారత్ ఆకాంక్షిస్తున్న వాటన్నింటి సాధనకు అదానీ ఎంటర్ప్రైజెస్ కీలకమైనదిగా ఉంటుంది‘ అని క్యాంటర్ పేర్కొంది. భారీ పోర్ట్‌ఫోలియో.. ఎయిర్‌లైన్ ప్యాసింజర్ ట్రాఫిక్‌లో దాదాపు 25 శాతం వాటా, కార్గోలో 33 శాతం వాటా ఉండే ఎనిమిది ఎయిర్‌పోర్టులు అదానీ గ్రూప్ పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి. అలాగే దేశవ్యాప్తంగా అనేక డేటా సెంటర్లు నిర్మిస్తోంది. 5,000 కి.మీ. మేర రహదారుల నిర్మాణానికి కాంట్రాక్టులు ఉన్నాయి. ఏఈఎల్ రిస్కు–రివార్డుల నిష్పత్తి ప్రస్తుత స్థాయిలో ఆకర్షణీయంగా ఉన్నట్లు క్యాంటర్ వివరించింది. దేశీయంగా పబ్లిక్‌గా ట్రేడవుతున్న అతి పెద్ద నాన్–ఫైనాన్షియల్ కంపెనీల్లో 10వ స్థానంలో ఉన్నప్పటికీ ఏఈఎల్‌పై దాదాపుగా అనలిస్టు కవరేజీ లేకపోవడమనేది అదానీ గ్రూప్ సంస్థలపై ఇన్వెస్టర్లలో అంతగా అవగాహన లేకపోవడానికి కారణమని పేర్కొంది. హిండెన్‌బర్గ్ నివేదికతో తీవ్రమైన ఆందోళనలు తెరపైకి వచ్చినప్పటికీ .. గవర్నెన్స్‌ను, పారదర్శకతను మెరుగుపర్చుకునేందుకు, లిక్విడిటీ రిస్కులను తగ్గించుకునేందుకు కంపెనీ చర్యలు తీసుకుందని నోట్లో క్యాంటర్ తెలిపింది. ‘ప్రస్తుత దశలో విస్మరించ వీలు లేనంత పెద్ద గ్రూప్ అదానీది. అదానీకి దేశం అవసరం ఎంత ఉందో భారత్‌కి కూడా అదానీ అవసరం అంతే ఉందని మేము భావిస్తున్నాం‘ అని పేర్కొంది. -
రూ.300 కోట్లతో జెట్ విమానాలు కొనుగోలు చేయనున్న అదానీ.. ఎందుకంటే..
అదానీ సంస్థల ఛైర్మన్ గౌతమ్ అదానీ తన గ్రూప్‌నకు చెందిన టాప్ ఎగ్జిక్యూటివ్‌ల ప్రయాణ సౌకర్యం కోసం ఆరు జెట్ విమానాలను కొనుగోలు చేయనున్నట్లు తెలిసింది. అందుకు రూ.300 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సమాచారం. స్విట్జర్లాండ్‌కు చెందిన పిలాటస్ ఎయిర్‌క్రాఫ్ట్ కంపెనీకు చెందిన పిలాటస్ పీసీ-24 మోడల్‌కు చెందిన ఈ ఆరు జెట్ విమానాల కోసం గ్రూప్ ఇప్పటికే ఆర్డర్ చేసినట్లు తెలిసింది. అదానీ గ్రూప్‌నకు చెందిన జెట్ విమానాలను కర్ణావతి ఏవియేషన్ పర్యవేక్షిస్తుంది. ఈ ఏవియేషన్ రీసేల్ మార్కెట్ నుంచి విమానాలను కొనుగోలు చేస్తూంటుంది. తాజాగా కొనుగోలు చేసిన పిలాటస్ పీసీ-24 మోడల్ జెట్ విమానం 1,406 కిలోల కార్గో సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది భూ ఉపరితలం నుంచి 45,000 అడుగుల ఎత్తుకు వెళ్లగలదు. ఇదీ చదవండి: అమెరికాలో రెండు లక్షల టెస్లా కార్లు వెనక్కి! - కారణం ఇదే.. 10 సీటర్ సామర్థ్యం ఉన్న ఈ ఎయిర్‌క్రాఫ్ట్ 440 నాట్స్ ట్రూ ఎయిర్‌స్పీడ్ వరకు చేరుకోగలదని కంపెనీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం వస్తున్న ఈ ఆరు జెట్ విమానాలతో మొత్తం అదానీ గ్రూప్ వద్ద ఉన్న జెట్ ఫ్లైట్స్ సంఖ్య 12కు చేరుకోనుంది. -
హిండెన్ బర్గ్ వివాదం నుంచి తేరుకుని.. అదానీ మరో కీలక నిర్ణయం!
హిండెన్ బర్గ్ వివాదం నుంచి కోలుకున్న ప్రముఖ డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ ప్రస్తుతం తన టాప్ ఎగ్జిక్యూటివ్‌ల కోసం తన బిజినెస్ జెట్ ఫ్లైట్లను రెట్టింపు చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. వారి రవాణా సౌకర్యం కోసం ఆరు పిలాటస్ పీసీ-24 విమానాలకు ఆర్డర్ ఇచ్చినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 12కి చేరిన బిజినెస్ జెట్లు ఈ ఆరు పిలాటస్ పీసీ-24 జెట్లను కొనుగోలు చేసిన తర్వాత అదానీ గ్రూప్ మొత్తం బిజినెస్ జెట్ల సంఖ్య 12 అవుతుంది. అదానీతో పాటు కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్‌లు వ్యాపార కార్యకలాపాల కోసం చేసే జర్నీ సజావుగా, సమర్థంగా జరిగేలా చూడటమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రీసేల్ మార్కెట్ నుంచి కొనుగోలు చేసినందున మొత్తం ఆరు విమానాలకు రూ.300 కోట్లకు పైగా ఖర్చవుతుందని సమాచారం. సుప్రీం తీర్పుతో కోలుకున్న అదానీ 2023లో జరిగిన నష్టాల నుంచి కోలుకున్న అదానీ గ్రూప్ ప్రస్తుతం తన వ్యాపారాన్ని విస్తరిస్తూ కార్యకలాపాలను పునరుద్ధరిస్తోంది. ఈ నెల ప్రారంభంలో సుప్రీం కోర్టు తన కంపెనీకి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో గౌతమ్ అదానీ ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు. 80 బిలియన్ డాలర్ల సంపద ఆవిరి 2023 జనవరిలో అమెరికా ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ సంస్థ హిండెన్ బర్గ్ రీసెర్చ్ గౌతమ్ అదానీ, అతని సంస్థ స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ మోసానికి పాల్పడినట్లు ఆరోపించింది. ఈ ఆరోపణల కారణంగా అదానీ తన గ్రూప్ కంపెనీల షేర్లు పడిపోవడంతో సుమారు 80 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయారు. అత్యంత ధనవంతుడిగా అయితే, ఏడాది తర్వాత సుప్రీంకోర్టు హిండెన్ బర్గ్ చేసిన ఆరోపణలపై అదనపు దర్యాప్తు అవసరం లేదని, వీలైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేయాలని సెబీని ఆదేశించింది.దీంతో అదానీ కంపెనీ నష్టాల నుంచి త్వరగా కోలుకొని, తన సంపదను తిరిగి పొంది ముకేశ్ అంబానీని అధిగమించి స్వల్పకాలం పాటు భారతదేశంలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు. -
అదానీ పవర్ ఆకర్షణీయం - గణనీయంగా పెరిగిన లాభం
న్యూఢిల్లీ: అదానీ పవర్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్ నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.9 కోట్లతో పోల్చి చూసినప్పుడు ఎన్నో రెట్ల వృద్ధితో రూ.2,738 కోట్లకు దూసుకుపోయింది. మొత్తం ఆదాయం సైతం రూ.8,290 కోట్ల నుంచి రూ.13,355 కోట్లకు వృద్ధి చెందింది. మహన్ వద్ద 1,600 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణం ప్రణాళిక ప్రకారమే కొనసాగుతున్నట్టు కంపెనీ తెలిపింది. ఇనార్గానిక్ (ఇతర సంస్థల కొనుగోళ్లు) మార్గంలో తమ నాయకత్వ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోనున్నట్టు ప్రకటించింది. డిసెంబర్ త్రైమాసికంతోపాటు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని తొమ్మిది నెలల్లో ముంద్రా, ఉడుపి, రాయిపూర్, మహన్ ప్లాంట్లు అధిక విక్రయాలకు సాయపడినట్టు తెలిపింది. అదే సమయంలో గొడ్డా ప్లాంట్ నుంచి అదనపు ఉత్పత్తి తోడైనట్టు వివరించింది. బంగ్లాదేశ్ విద్యుత్ సరఫరా వ్యవస్థలో ఇది (గొడ్డా ప్లాంట్) కీలక భాగంగా మారినట్టు పేర్కొంది. మూడో త్రైమాసికంలో 21.5 బిలియన్ యూనిట్ల విద్యుత్‌ను విక్రయించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 11.8 బిలియన్ యూనిట్లుగానే ఉంది. రుణాలకు చేసే వ్యయాలు క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.946 కోట్ల నుంచి రూ.797 కోట్లకు తగ్గాయి. ప్రస్తుత ఆర్థిక సంత్సరం డిసెంబర్‌తో ముగిసిన తొమ్మిది నెలల కాలానికి నికర లాభం 230 శాతం పెరిగి రూ.18,092 కోట్లకు చేరింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇది రూ.5,484 కోట్లుగా ఉంది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో అదానీ పవర్ షేరు 4 శాతానికి పైగా లాభపడి రూ.542 వద్ద ముగిసింది. -
పెట్టుబడులకు 'ఎనర్జీ'
సీఎంతో సీఐఐ ప్రతినిధులు భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) తెలంగాణ అధ్యక్షుడు శేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రానికి చెందిన పలు పరిశ్రమల సీఈవోలు బుధవారం దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబులతో భేటీ అయ్యారు. పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వ ప్రయత్నాలను కొనియాడారు. పారిశ్రామికాభివృద్ధి కోసం తీసుకునే అన్నిరకాల నిర్ణయాలకు సీఐఐ పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు. సాక్షి, హైదరాబాద్: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరం) 54వ వార్షిక సదస్సులో భాగంగా.. రెండో రోజు బుధవారం పలు దిగ్గజ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. దావోస్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ బృందం.. పలు సంస్థల అధినేతలతో వరుస భేటీలు నిర్వహించి, ఒప్పందాలపై సంతకాలు చేసినట్టు సీఎం కార్యాలయం వెల్లడించింది. మొత్తంగా రూ.37,800 కోట్ల పెట్టుబడులకు సంబంధించి పలు ఒప్పందాలు కుదిరినట్టు, కీలక ప్రకటనలు వెలువడినట్టు తెలిపింది. సీఎంవో తెలిపిన వివరాల మేరకు.. రాష్ట్రంలో రూ.12,400 కోట్ల పెట్టుబడులకు సంబంధించి అదానీ గ్రూప్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఏరోస్పేస్–డిఫెన్స్ విభాగం సీఈఓ ఆశిశ్ రాజ్‌వంశీ ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. గ్రీన్ ఎనర్జీ.. స్కిల్స్ డెవలప్మెంట్ సెంటర్.. అదానీ గ్రూప్‌తో ఒప్పందాల్లో భాగంగా రూ.5వేల కోట్ల పెట్టుబడితో 1,350 మెగావాట్ల సామర్థ్యంతో రెండు గ్రీన్ ఎనర్జీ పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులను తెలంగాణలో ఏర్పాటు చేస్తారు. అనుబంధ సంస్థ అదానీ కొనెక్స్ మరో రూ.5వేల కోట్లతో 100 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్ క్యాంపస్‌ను చందన్‌పల్లిలో ఏర్పాటు చేస్తుంది. ఇక అంబుజా సిమెంట్స్ సంస్థ ద్వారా ఏటా 6 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యమున్న సిమెంట్ గ్రైండింగ్ యూనిట్‌ను రూ.1,400 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదిరింది. అదానీ ఏరోస్పేస్, డిఫెన్స్ పార్క్‌లో కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్, క్షిపణి అభివృద్ధి తయారీ కేంద్రాల ఏర్పాటుకు రూ.1,000 కోట్లను పెట్టుబడి పెట్టనున్నారు. తెలంగాణలో పెట్టుబడులతోపాటు యువతలో నైపుణ్యాలు (స్కిల్స్) పెంపొందించేందుకు త్వరలోనే అత్యాధునిక సౌకర్యాలతో కూడిన సమీకృత నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటుకు రేవంత్‌తో భేటీ సందర్భంగా అదానీ సంసిద్ధత వ్యక్తం చేశారు. ► తెలంగాణలో రూ.9వేల కోట్లతో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ అనుబంధ సంస్థ ‘జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ’ సంసిద్ధత వ్యక్తం చేసింది. దీనిపై ‘జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ’తో రాష్ట్ర ప్రభుత్వం పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 1,500 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటయ్యే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్‌తో సీఎం రేవంత్ చర్చించారు. ► రాష్ట్రంలో రూ.8వేల కోట్ల పెట్టుబడితో 12.5 జీడబ్ల్యూహెచ్ (గిగావాట్ ఫర్ అవర్) సామర్థ్యముండే బ్యాటరీ సెల్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు గోడి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రకటించింది. వచ్చే ఐదేళ్లలో తెలంగాణలో లిథియం, సోడియం అయాన్ సంబంధిత సాంకేతిక పరిజ్ఞానంపై పరిశోధన, అభివృద్ధి కేంద్రంతోపాటు, గిగాస్కేల్ బ్యాటరీ సెల్ తయారీ కేంద్రం ఏర్పాటవుతుంది. ప్రాజెక్ట్ మొదటి దశలో 6వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. మొదటి దశలో 2.5 గిగావాట్ల సామర్థ్యముండే సెల్ అసెంబ్లింగ్ లైన్ తయారు చేసి.. రెండో దశలో 10 గిగావాట్లకు విస్తరిస్తారు. ► డేటా సెంటర్ల నిర్వహణలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఐరన్ మౌంటేన్ అనుబంధ సంస్థ వెబ్ వెర్క్స్ తెలంగాణలో రూ.5,200 కోట్లతో డేటా సెంటర్లను నెలకొల్పేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఐరన్ మౌంటేన్ సీఈవో విలియం మీనీ, వెబ్ వెర్క్స్ సీఈవో నిఖిల్ రాఠీలతో సీఎం రేవంత్ భేటీలో రాష్ట్రంలో డేటా సెంటర్ల ఏర్పాటు, నిర్వహణపై చర్చించారు. హైదరాబాద్‌లో 10 మెగావాట్ల నెట్వర్కింగ్–హెవీ డేటా సెంటర్లో ఇప్పటికే ఈ కంపెనీ రూ.1,200 కోట్లు పెట్టుబడి పెడుతోంది. దీనికి అదనంగా రూ.4,000 కోట్లకుపైగా పెట్టుబడులతో భవిష్యత్తులో గ్రీన్‌ఫీల్డ్ హైపర్ స్కేల్ డేటా సెంటర్‌ను విస్తరించేందుకు ఈ ఒప్పందం చేసుకుంది. ► రాష్ట్రంలో ఆయిల్‌పామ్ మిషన్‌లో ఇప్పటికే భాగస్వామిగా ఉన్న గోద్రెజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఖమ్మంలో తొలిదశలో రూ.270 కోట్లతో దేశంలోనే అతిపెద్ద సమీకృత ఆయిల్‌పామ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఖమ్మంలో దేశంలోనే మొట్టమొదటి ఆయిల్‌పామ్ సీడ్ గార్డెన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ కొత్త సీడ్ గార్డెన్ ద్వారా ఏటా 70లక్షల మొక్కలను సరఫరా చేయడం ద్వారా పది లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగును చేపట్టవచ్చని పేర్కొంది. దీంతోపాటు రూ.వెయ్యి కోట్లతో కెమికల్ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేస్తామని గోద్రెజ్ సంస్థ ప్రకటించింది. నైపుణ్య శిక్షణ, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, పాడి పరిశ్రమ విస్తరణ వంటి అంశాలపైనా గోద్రెజ్ సీఎండీ నాదిర్ గోద్రెజ్‌తో సీఎం చర్చించారు. ► రాష్ట్రంలోని మల్లాపూర్‌లో ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న ‘ఆరాజెన్ లైఫ్ సైన్సెస్’ సంస్థ రూ.2వేల కోట్ల పెట్టుబడులు, 1,500 మందికి కొత్త ఉద్యోగాల కల్పన లక్ష్యంగా కార్యకలాపాలను విస్తరించనుంది. సీఎం రేవంత్‌తో ఆరాజెన్ సీఈఓ మణి కంటిపూడి భేటీ సందర్భంగా దీనిపై ఒప్పందం కుదిరింది. ఆరాజెన్ లైఫ్ సైన్సెస్ విస్తరణతో హైదరాబాద్ దేశంలోనే కాంట్రాక్ట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ హబ్‌గా మారనుందని ఆ సంస్థ పేర్కొంది. ► దావోస్ రెండోరోజు పర్యటనలో భాగంగా రేవంత్ బుధవారం హెయిన్కెన్ ఇంటర్నేషనల్ సీఈఓ డాల్ఫ్ వాన్‌డెన్ బ్రింక్, టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖర్, విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషబ్ ప్రేమ్‌జీ తదితరులతోనూ భేటీ అయ్యారు. వరంగల్‌లో ఐటీ కార్యకలాపాల విస్తరణకు సంబంధించి రిషబ్ ప్రేమ్‌జీతో చర్చించారు. ఈ భేటీల్లో ఐటీ–పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పెట్టుబడుల ప్రోత్సాహక విభాగం ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మురికివాడ రూపురేఖలు మార్చనున్న అదానీ..?
దేశంలోనే అతిపెద్ద మురికివాడ ధారావి. పేద, అట్టడుగు వర్గాల వారు నివసించే ఈ ధారావి వాసులకు ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతం అదానీ సారథ్యంలోని అదానీ గ్రూప్ తీపి కబురందించింది. అర్హులైన నివాసులకు 350 చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త ఫ్లాట్లు అందిస్తామని సోమవారం తెలిపింది. మహారాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ధారావి మురికివాడను రీ డెవలపింగ్ చేసేందుకు అదానీ గ్రూప్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టులో ఆఫర్ చేసిన ప్రతిపాదన కంటే 17 శాతం, అంతకంటే ఎక్కువ విస్తీర్ణం ఉండే ఫ్లాట్లను ధారావి వాసులకు అందజేస్తామని తెలిపింది. ఇదీ చదవండి: చైనాను బీట్ చేసే భారత్ ప్లాన్ ఇదేనా! ధారావి రీడెవలపింగ్ ప్రాంతంలో కమ్యూనిటీ హాళ్లు, రీక్రియేషనల్ ప్రాంతాలు, పబ్లిక్ గార్డెన్స్, డిస్పెన్సరీలు, పిల్లలకు డే కేర్ సెంటర్లు ఉంటాయని సంస్థ వర్గాలు తెలిపాయి. 2018 నుంచి ధారావి వాసులకు ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన’ పథకం కింద 315-322 చదరపు అడుగుల విస్తీర్ణంతో కూడిన ఇళ్లను పంపిణీ చేయడం ప్రారంభించారు. 2000 జనవరి నాటికి ఇక్కడ ఇల్లు ఉన్న వారిని ఈ పథకానికి అర్హులుగా మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
అదానీ వన్‌తో మొబిక్విక్ భాగస్వామ్యం
న్యూఢిల్లీ: విమాన టిక్కెట్లు, సుంకాల రహిత ఉత్పత్తులపై ప్రత్యేక సేవలు అందించడానికి అదానీ గ్రూప్ ట్రావెల్ బుకింగ్ యాప్– అదానీ వన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఫిన్‌టెక్ సంస్థ మొబిక్విక్ తెలిపింది. మొబిక్విక్ వాలెట్‌తో విమాన బుకింగ్‌లు, డ్యూటీ–ఫ్రీ ఉత్పత్తులపై డిస్కౌంట్లను అందిస్తామని కంపెనీ ప్రకటన పేర్కొంది. ‘‘అదానీ వన్ యాప్‌తో భాగస్వామ్యం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాము. సులభమైన చెల్లింపులు, ఇబ్బందులు లేని ప్రయాణ బుకింగ్ అనుభవాన్ని ఈ భాగస్వామ్యం ద్వారా అందిస్తాము. ప్రమాణానికి సిద్ధమవుతున్నందున కస్టమర్‌కు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా సేవలు అందించడమే ఈ భాగస్వామ్యం లక్ష్యం’’ అని మొబిక్విక్ పేర్కొంది. ఆర్థిక పరిమితుల వల్ల ఎవరి ప్రణాళికలకు ఎప్పుడూ ఆటంకం కలిగించకుండా చూసుకోవడానికి తాము అంకితభావంతో ఉన్నామని మొబిక్విక్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ బిపిన్ ప్రీత్ సింగ్ చెప్పారు. మొబిక్విక్ వాలెట్‌తో చెల్లింపు చేసినప్పుడు అదానీ వన్‌లో విమాన బుకింగ్‌లపై రూ. 500 తగ్గింపు ఉంటుందని, అలాగే అదానీ వన్ ద్వారా డ్యూటీ–ఫ్రీ ప్రొడక్టులపై రూ. 250 ఫ్లాట్ తగ్గింపు ఉంటుందని కంపెనీ తెలిపింది. ‘‘మా సూపర్ యాప్‌లో మోబిక్విక్ సులభతరమైన ఫైనాన్స్ సొల్యూషన్లను ఏకీకృతం చేస్తున్నందున మేము సంతోíÙస్తున్నాము. భారతదేశం అంతటా ట్రావెల్ బుకింగ్‌లు, గ్లోబల్ బ్రాండ్లను సరళమైన ధరలకు మరింత అందుబాటులోకి తీసుకురావడానికి సాంకేతికతను ఉపయోగించడమే మా సమిష్టి లక్ష్యం’’ అని అదానీ వన్ ప్రతినిధి మరో ప్రకటనలో తెలిపారు. -
2023 మార్కెట్ క్యాప్ ర్యాంకింగ్స్.. టాప్‌లో టాటా - మూడో స్థానంలో అదానీ
ముంబై: గత క్యాలండర్ ఏడాది(2023)లో దేశీ కార్పొరేట్ దిగ్గజాలలో టాటా గ్రూప్ భారీగా లాభపడింది. గ్రూప్‌లోని షేర్లు లాభాల దౌడు తీయడంతో గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) 35 శాతం దూసుకెళ్లింది. ఉమ్మడిగా రూ. 28.68 లక్షల కోట్లను తాకింది. దీంతో మార్కెట్ క్యాప్‌రీత్యా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక ముకేశ్ అంబానీ గ్రూప్ రిలయన్స్ ఇండస్ట్రీస్ విలువ దాదాపు 11 శాతం ఎగసింది. రూ. 19.42 లక్షల కోట్లకు చేరింది. ఫలితంగా అదానీ గ్రూప్‌ను అధిగమిస్తూ ద్వితీయ స్థానాన్ని అందుకుంది. అయితే 2022లో రిలయన్స్ గ్రూప్‌ను వెనక్కి నెట్టిన అదానీ గ్రూప్ వెనకడుగు వేసింది. మార్కెట్ విలువ దాదాపు 28 శాతం క్షీణించడంతో రూ. 14.2 లక్షల కోట్లకు పరిమితమైంది. వెరసి మూడో ర్యాంకులో నిలిచింది. 2022లో టాటా గ్రూప్ విలువ రూ. 21.2 ట్రిలియన్లుకాగా.. అదానీ గ్రూప్ రూ. 19.7 ట్రిలియన్లు, రిలయన్స్ రూ. 17.6 ట్రిలియన్లుగా నమోదయ్యాయి. రంగాలవారీగా తీరిలా దేశీ కార్పొరేట్ బిజినెస్ గ్రూప్‌లలో ప్రధానంగా ఆటోమోటివ్, ఇంజినీరింగ్, భారీయంత్ర పరికరాలు(క్యాపిటల్ గూడ్స్), విద్యుత్, మౌలిక సదుపాయాలు(ఇన్ఫ్రాస్ట్రక్చర్), రిటైల్ రంగాలు గతేడాది మెరుగైన పనితీరు చూపాయి. అయితే కమోడిటీలు, ఎనర్జీ, ఫైనాన్స్ విభాగాలు మందగించాయి. చెన్నై ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగించే మురుగప్ప గ్రూప్ మార్కెట్ విలువ దాదాపు 53 శాతం జంప్‌చేసి రూ. 3.36 లక్షల కోట్లకు చేరింది. రిటైల్ ఫైనాన్స్, ఇంజినీరింగ్, పవర్ ఎక్విప్మెంట్, సుగర్, ఆగ్రోకెమికల్స్, అబ్రాసివ్స్ తయారీలో ఉన్న మురుగప్ప గ్రూప్ మార్కెట్ విలువ రీత్యా టాప్–10 జాబితాలో చోటు(9వ ర్యాంకు) సాధించింది. 2022లో గ్రూప్ విలువ రూ. 2.2 ట్రిలియన్లు మాత్రమే. ఈ బాటలో జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ రూ. 2.39 ట్రిలియన్ల నుంచి రూ. 3.33 లక్షల కోట్లకు చేరడం ద్వారా 10వ ర్యాంకును సాధించింది. ఇందుకు జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిస్టింగ్(రూ. 44,000 కోట్ల విలువ) జత కలిసింది. రాహుల్ బజాజ్ గ్రూప్ విలువ రూ. 8.21 ట్రిలియన్ల నుంచి 23 శాతంపైగా బలపడి రూ. 10.12 లక్షల కోట్లను తాకింది. వెరసి మరోసారి నాలుగో ర్యాంకులో నిలిచింది. ఆదిత్య బిర్లా గ్రూప్ 33 శాతం ఎగసి ఐదో ర్యాంకును అందుకుంది. విలువ రూ. 4.98 లక్షల కోట్ల నుంచి రూ. 6.6 ట్రిలియన్లకు చేరింది. గ్రూప్‌లు అటూఇటుగా టెలికం రంగ దిగ్గజం భారతీ(ఎయిర్టెల్) గ్రూప్ మార్కెట్ విలువ రూ. 5.17 ట్రిలియన్ల నుంచి 27 శాతంపైగా జంప్‌చేసి రూ. 6.59 లక్షల కోట్లను తాకినప్పటికీ ర్యాంకింగ్‌లో 5 నుంచి 6కు నీరసించింది. ఐటీ సేవల హెచ్‌సీఎల్ గ్రూప్ మార్కెట్ క్యాప్ 41 శాతం దూసుకెళ్లి రూ. 3.98 ట్రిలియన్లను తాకింది. రెండు స్థానాలు మెరుగుపడి 7కు చేరింది. ఆటో రంగ దిగ్గజం ఎంఅండ్ఎం రూ. 3.95 కోట్ల మార్కెట్ విలువతో ఒక స్థానం తగ్గి 8వ ర్యాంకుకు పరిమితమైంది. నిజానికి 2022లో ఎంఅండ్ఎం మార్కెట్ విలువ రూ. 3 లక్షల కోట్లు మాత్రమే. -
ఏసీసీ చేతికి ఏషియన్ కాంక్రీట్స్
న్యూఢిల్లీ: ఏషియన్ కాంక్రీట్స్, సిమెంట్స్‌లో మిగిలిన 55 శాతం వాటాను అదానీ గ్రూప్ కంపెనీ ఏసీసీ కైవసం చేసుకుంది. ఇందుకు సుమారు రూ.426 కోట్లు వెచి్చంచింది. అంబుజా సిమెంట్స్ అనుబంధ సంస్థ అయిన ఏసీసీకి ఇప్పటికే ఏషియన్ కాంక్రీట్స్లో 45 శాతం వాటా ఉంది. ఏషియన్ కాంక్రీట్స్, సిమెంట్స్‌కు హిమాచల్ ప్రదేశ్‌లోని నలఘర్ వద్ద 1.3 మిలియన్ టన్నుల ప్లాంటు, అలాగే అనుబంధ కంపెనీ అయిన ఏషియన్ ఫైన్ సిమెంట్స్‌కు పంజాబ్‌లోని రాజ్‌పురాలో 1.5 మిలియన్ టన్నుల సిమెంట్ ప్లాంటు ఉంది. -
అంబానీ కీలక ప్రకటన.. అదానీకి టెన్షన్!
Reliance-Brookfield data centre: రిలయన్స్-బ్రూక్‌ఫీల్డ్ డేటా సెంటర్‌కు సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కీలక ప్రకటన చేశారు. రానున్న వారంలో ఈ డేటా సెంటర్‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, యూఎస్‌కు చెందిన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ డిజిటల్ రియాల్టీ ఇప్పటికే భాగస్వాములుగా ఉన్న ప్రస్తుత జాయింట్ వెంచర్లోకి ప్రవేశించడానికి రిలయన్స్ గత ఏడాది జూలైలో సుమారు రూ. 378 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఈ వెంచర్లో మూడు సంస్థలకు ఒక్కొక్క దానికి 33 శాతం వాటా ఉంది. చెన్నైలో జరిగిన తమిళనాడు గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ మాట్లాడుతూ తమ గ్రూప్ పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్‌తో పాటు ఆ రాష్ట్రంలో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయడంలో పెట్టుబడులు పెడుతుందని చెప్పారు. బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్, డిజిటల్ రియాలిటీ భాగస్వామ్యంతో రిలయన్స్ ఏర్పాటు చేస్తున్న అత్యాధునిక డేటా సెంటర్‌ను వచ్చే వారం ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. భారతీయ డేటా సెంటర్ల మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. సంవత్సరానికి 40 శాతం చొప్పున వృద్ధితో 2025 నాటికి 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్, సునీల్ మిట్టల్‌కు సంబంధించిన భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్‌లు ఇప్పటికే తమ డేటా సెంటర్లను ఏర్పాటు చేశాయి. వీటికి పోటీగా రిలయన్స్ ప్రవేశంతో డేటా సెంటర్ల మార్కెట్ వేడెక్కుతోంది. -
సుప్రీంకోర్టు తీర్పు.. కాంగ్రెస్ కీలక వ్యాఖ్యలు
ప్రముఖ కార్పొరేట్ సంస్థ అదానీ గ్రూప్ స్టాక్ ధరల్లో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ సంస్థపై కొనసాగుతున్న దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) లేదా సీబీఐకి అప్పగించేందుకు సుప్రీంకోర్టు బుధవారం నిరాకరించింది. అదానీ గ్రూప్‌పై మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా(సెబీ) కొనసాగిస్తున్న దర్యాప్తు పట్ల న్యాయస్థానం సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు తీర్పునకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసింది. అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పు పూర్తిగా సెబీకి అనుకూలంగా ఉందని తెలిపింది. అదానీ గ్రూప్ కంపెనీలపై ఆరోపణలు వచ్చిన తర్వాత కోర్టు సమగ్ర విచారణ చేయమని ఆదేశించి పది నెలలు అయిందని గుర్తుచేసింది. అయినా సెబీ తన దర్యాప్తును పూర్తి చేయడంలో విఫలమైందని పార్టీ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. అదానీ గ్రూప్ కంపెనీలపై వచ్చిన 24 పిటిషన్లకుగాను 22 పిటిషన్ల దర్యాప్తు పూర్తి చేసిన నిపుణుల కమిటీ మరో మూడు నెలల్లో సమగ్ర విచారణ పూర్తి చేయాలని సెబీని ఆదేశించిన విషయం తెలిసిందే. దానిపై కాంగ్రెస్‌పార్టీ కమ్యూనికేషన్స్ ఇన్ఛార్జీ జైరాం రమేష్ స్పందిస్తూ లోక్‌సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి రావడం తప్పా రాబోయే మూడు నెలల్లో ఏమార్పురాదన్నారు. అయితే సెబీను ప్రశ్నించేందుకు వార్తా నివేదికలు, మీడియా కథనాలు ప్రత్యామ్నాయం కాదనే విషయంపట్ల అత్యున్నత న్యాయస్థానం తీర్పుతో ఏకీభవించారు. ఇదీ చదవండి: హిండెన్‌బర్గ్ నివేదిక.. సుప్రీంకోర్టు తీర్పు.. అదానీ ఏమన్నారంటే.. ఇదిలా ఉండగా సుప్రీంకోర్టు బుధవారం వెలువరించిన తీర్పులో సెబీ సమగ్ర దర్యాప్తు జరుపుతోందని చెప్పింది. ఈ దశలో సెబీ దర్యాప్తుపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. దర్యాప్తును సెబీ నుంచి సిట్ లేదా సీబీఐకి బదిలీ చేయాలన్న వాదనలో అర్థం లేదని కొట్టిపారేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దీవాలా, మనోజ్ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం 46 పేజీల తీర్పు వెలువరించింది. -
తండ్రి స్థానంలోకి కొడుకు.. అదానీ గ్రూప్‌లో కొత్త పరిణామాలు
అదానీ గ్రూప్‌లో కొత్త పరిణామాలు చోటుచేసుకున్నాయి. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (APSEZ) కొత్త మేనేజింగ్ డైరెక్టర్‌గా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) కరణ్ అదానీని నియమించింది. ఇక ఆయన తండ్రి గౌతమ్ అదానీ కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా మళ్లీ నియమితులయ్యారు. దేశంలో అతిపెద్ద పోర్ట్స్, లాజిస్టిక్స్ కంపెనీ అయిన ఏపీఎస్ఈజెడ్ తమ సీఈవో కరణ్ అదానీని మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించినట్లు అదానీ గ్రూప్ విడుదల చేసిన ప్రకటనను ఉటంకిస్తూ పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. కాగా ఈ పదవిని ఇప్పటిదాకా అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ నిర్వహిస్తున్నారు. మరోవైపు అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నిస్సాన్ మోటార్స్‌లో మాజీ గ్లోబల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అశ్వనీ గుప్తా నియామకానికి కూడా తమ బోర్డు ఆమోదం తెలిపిందని కంపెనీ తెలిపింది. కరణ్ అదానీ 2009లో ముంద్రా పోర్ట్‌లో తన తండ్రి వ్యాపార సమ్మేళనంలో చేరారు. 2016లో దాని సీఈవోగా ఎదిగారు. మరొక పరిణామంలో ఏపీఎస్ఈజెడ్ నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లను విక్రయించడం ద్వారా 600.6 మిలియన్ డాలర్ల వరకు సమీకరించనున్నట్లు తెలిపింది. అయితే వసూళ్లను ఎలా వినియోగించుకుంటారో కంపెనీ పేర్కొనలేదు. -
Telangana: రాష్ట్రంలో పెట్టుబడులకు సిద్ధం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పెట్టుబడులకు తాము సిద్ధంగా ఉన్నామని, ఇందుకోసం ప్రభుత్వం నుంచి తగిన సహకారం కావాలని అదానీ గ్రూపు రాష్ట్ర సర్కారును కోరింది. బుధవారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబుతో అదానీ గ్రూపు పోర్ట్‌లు, సెజ్‌ల సీఈవో గౌతమ్ అదానీ పెద్ద కుమారుడు కరణ్ అదానీ, అదానీ ఏరోస్పేస్ ఈసీవో అశీష్ రాజ్వన్షి తదితరులు సమావేశమయ్యారు. ఏరో స్పేస్ పార్కు, డేటా సెంటర్‌తో పాటు కొత్త ప్రాజెక్టుల స్థాపనపై చర్చించారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన కోసం పట్టుబడులు పెడతామని అదానీ గ్రూపు ప్రతినిధులు సీఎం దృష్టికి తెచ్చారు. ఇప్పటికే తలపెట్టిన పాత ప్రాజెక్టులను కొనసాగిస్తామని, కొత్త ప్రాజెక్టుల స్థాపనకు ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం కోరుతున్నామని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్.. అదానీ గ్రూప్ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నా మన్నారు. పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి కల్పన కోసం కొత్త పరిశ్రమలకు తగిన వసతులు, రాయితీలు కల్పిస్తామని చెప్పారు. అమరరాజా గిగా ప్రాజెక్టు పురోగతిపై సమీక్ష అమరరాజా ఎనర్జీ, మొబిలిటీ సంస్థ సీఎండీ గల్లా జయదేవ్ నేతృత్వంలో కంపెనీ ప్రతినిధి బృందం బుధవారం సచివాలయంలో సీఎంను కలిసింది. రాష్ట్రంలోని దివిటిపల్లిలో ఏర్పాటు చేస్తున్న లిథియం అయాన్ బ్యాటరీల తయారీకి సంబంధించిన గిగా ప్రాజెక్టు పురోగతిపై ఈ భేటీలో చర్చించారు. అమరరాజా ప్రాజెక్టు వేగంగా అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం మద్దతు ఇస్తోందని, ప్రభుత్వ సహకారంతో తమ ప్రాజెక్టును మరింత విస్తరిస్తామని ఈ సందర్భంగా గల్లా జయదేవ్ పేర్కొన్నారు. న్యూఎనర్జీ, లిథియం అయాన్ బ్యాటరీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఇతర రంగాల్లో మరిన్ని పెట్టుబడులకు సిద్ధమని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం స్పందిస్తూ.. అమరరాజా సంస్థ రాష్ట్రంలో ఏర్పాటు చేసే పరిశ్రమలకు ప్రభుత్వపరంగా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. క్లీన్ ఎనర్జీకి తెలంగాణ కట్టుబడి ఉందని, కొత్త పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యత ఇస్తామని వివరించారు. -
Adani-Hindenburg case: ‘అదానీ’కి భారీ ఊరట
న్యూఢిల్లీ: ప్రముఖ కార్పొరేట్ సంస్థ ‘అదానీ గ్రూప్’నకు మరో విజయం లభించింది. స్టాక్ ధరల్లో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ సంస్థపై కొనసాగుతున్న దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) లేదా సీబీఐకి అప్పగించేందుకు సుప్రీంకోర్టు బుధవారం నిరాకరించింది. అదానీ గ్రూప్‌పై మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా(సెబీ) కొనసాగిస్తున్న దర్యాప్తు పట్ల న్యాయస్థానం సంతృప్తి వ్యక్తం చేసింది. సెబీ సమగ్ర దర్యాప్తు జరుపుతోందని వెల్లడించింది. ఈ దశలో సెబీ దర్యాప్తుపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. దర్యాప్తును సెబీ నుంచి సిట్ లేదా సీబీఐకి బదిలీ చేయాలన్న వాదనలో అర్థం లేదని కొట్టిపారేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దీవాలా, మనోజ్ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం 46 పేజీల తీర్పు వెలువరించింది. అదానీ గ్రూప్‌పై పెండింగ్‌లో ఉన్న రెండు దర్యాప్తులను 3 నెలల్లోగా పూర్తి చేయాలని సెబీని ఆదేశించింది. సెబీ దర్యాప్తును అనుమానించలేం అదానీ గ్రూప్ తన లిస్టెడ్ కంపెనీల షేర్ల ధరలను కృత్రిమంగా పెంచిందని, మదుపర్లను మోసగించిందని ఆరోపిస్తూ అదానీ–హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ వివాదం తర్వాత సుప్రీంకోర్టులో నాలుగు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. న్యాయవాదులు విశాల్ తివారీ, ఎంఎల్ శర్మ, కాంగ్రెస్ నేత జయ ఠాకూర్, అనామికా జైశ్వాల్ ఈ పిటిషన్లు దాఖలు చేశారు. అదానీ గ్రూప్ వ్యవహారంపై హిండెన్‌బర్గ్ నివేదిక వచి్చన తర్వాత ఆ కంపెనీ షేర్లు భారీగా పతనమయ్యాయని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. సెబీ చట్టంలో చేసిన మార్పుల కారణంగా అదానీ గ్రూప్ అవకతవకలు బయటపడడం లేదని పిటిషనర్లు ఆరోపించారు. సెబీని పటిష్టం చేయాలని కోరారు. ఈ నాలుగు పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. పత్రికల్లో వచి్చన వార్తలు లేదా ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్టు(ఓసీసీఆర్పీ) వంటి థర్డ్ పార్టీ సంస్థల నివేదికల ఆధారంగా సెబీ దర్యాప్తును అనుమానించలేమని స్పష్టం చేసింది. అలాంటి నివేదికలను కేవలం ఇన్‌పుట్స్‌గా పరిగణించవచ్చని అభిప్రాయపడింది. సెబీ దర్యాప్తును అనుమానించడానికి అలాంటివి ఆధారాలుగా ఉపయోగపడవని పేర్కొంది. చట్టబద్ధమైన సంస్థ అయిన సెబీ కొనసాగిస్తున్న దర్యాప్తును మరో సంస్థకు బదిలీ చేసే అధికారం కోర్టుకు లేదని పేర్కొన్నారు. అసాధారణ పరిస్థితుల్లోనే మాత్రమే అలా బదిలీ చేయగలమని తేలి్చచెప్పింది. నిర్ధారణ కాని సమాచారంపై ఆధారపడొద్దు అదానీపై గ్రూప్‌పై 24 ఆరోపణలు రాగా, సెబీ ఇప్పటికే 22 ఆరోపణలపై దర్యాప్తు పూర్తి చేసిందని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది. అదానీ గ్రూప్‌పై ఆరోపణలు చేయడానికి, కోర్టుకెక్కడానికి నిర్ధారణ కాని సమాచారంపై పిటిషనర్లు ఆధారపడినట్లు తెలుస్తోందని వెల్లడించింది. వారు తగిన పరిశోధన కూడా చేయకుండానే కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారని ఆక్షేపించింది. ఇకపై ఇలాంటివి పునరావృతం కాకూడదని సూచించింది. న్యాయవాదులు గానీ, పౌర సమాజం సభ్యులు గానీ అప్రమత్తంగా ఉండాలని, నిర్ధారణ కాని సమాచారం లేదా థర్డ్‌పార్టీ నివేదికల ఆధారంగా ఇష్టారాజ్యంగా పిటిషన్లు వేయడం సరైంది కాదని తేలి్చచెప్పింది. ఇదిలా ఉండగా, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సానుకూల సంకేతాలు రావడంతో బుధవారం స్టాక్ మార్కెట్లో అదానీ గ్రూప్‌లోని నమోదిత కంపెనీల షేర్ల ధరలు పైకి ఎగబాకాయి. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, ఎన్డీటీవీ, అదానీ టోటల్ గ్యాస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ విల్మార్, అదానీ పవర్, అదానీ పోర్ట్స్, అంబుజా సిమెంట్స్ వంటి సంస్థల షేర్ల ధరలు గణనీయంగా పెరిగాయి. సత్యమేవ జయతే: గౌతమ్ అదానీ సుప్రీంకోర్టు తీర్పుపై అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ స్పందించారు. సత్యమే జయిస్తుందన్న నిజాన్ని ఈ తీర్పు మరోసారి నిరూపించిందని అన్నారు. భారతదేశ ప్రగతి చరిత్రలో తమ వంతు పాత్ర పోషిస్తూనే ఉంటామని చెప్పారు. ప్రతికూల సమయంలో తమకు అండగా నిలిచినవారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ‘సత్యమేవ జయతే’ అంటూ గౌతమ్ అదానీ బుధవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. -
హిండెన్‌బర్గ్ నివేదిక.. సుప్రీంకోర్టు తీర్పు.. అదానీ ఏమన్నారంటే..
అదానీ-హిండెన్‌బర్గ్ వివాదంలో అదానీ గ్రూపునకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అదానీ గ్రూప్ కంపెనీలపై సెబీ ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను అనుమానించలేమని అత్యన్నత న్యాయ స్థానం తేల్చి చెప్పింది. ప్రముఖ బిలియనీర్ జార్జ్ సోరోస్ ఆధ్వర్యంలోని ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (ఓసీసీఆర్పీ) నివేదిక ఆధారంగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దర్యాప్తు జరిపిన విషయం తెలిసిందే. ఈ మేరకు సెబీ చేస్తోన్న దర్యాప్తులో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. ఈ కేసు విచారణను సెబీ నుంచి సిట్‌కు బదిలీ చేయడానికి తగిన ఆధారాలు లేవని పేర్కొంది. మిగిలిన దర్యాప్తును మూడు నెలల్లోగా పూర్తి చేయాలని నియంత్రణ సంస్థను ఆదేశించింది. అదానీ గ్రూప్.. షేర్ల అవకతవకలకు పాల్పడిందంటూ వచ్చిన ఆరోపణలపై నియంత్రణ సంస్థల వైఫల్యం లేదంటూ నిపుణుల కమిటీ గతంలో నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలో కమిటీ సభ్యులు పరస్పర విరుద్ధ ప్రయోజనాలు కలిగి ఉన్నారంటూ పిటిషనర్ పేర్కొనడం గమనార్హం. హిండెన్‌బర్గ్ వివాదానికి సంబంధించి 24 కేసుల్లో 22 కేసుల విచారణను సెబీ పూర్తి చేసింది. మిగతా కేసుల్లో మూడు నెలల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలని సుప్రీం ఆదేశించింది. ‘షార్ట్ సెల్లింగ్’ విషయంలో హిండెన్‌బర్గ్ మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందా..? లేదా..? అని తనిఖీ చేయాలని ప్రభుత్వాన్ని, సెబీని కోరింది. వార్తా పత్రికలు, థర్డ్ పార్టీ నివేదిక ఆధారంగా సెబీని ప్రశ్నించలేమని కోర్టు తెలిపింది. సెబీ దర్యాప్తును అనుమానించడానికి వాటిని ఆధారాలుగా చేసుకోబోమని కోర్టు చెప్పింది. అదానీ గ్రూప్ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని, ఖాతాల్లోనూ మోసాలు చేస్తోందంటూ హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదిక తీవ్ర దుమారానికి దారితీసిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించి కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని విచారించిన సుప్రీంకోర్టు కొన్ని పిటిషన్లపై తీర్పును వెలువరించింది. తాజాగా విడుదలైన తీర్పును ఉద్దేశించి ఛైర్మన్ గౌతమ్ అదానీ స్పందించారు. అత్యున్నత న్యాయస్థానం తీర్పును స్వాగతిస్తానని ఆయన తన ఎక్స్ ఖాతా ద్వారా తెలిపారు. ఎప్పటికైనా నిజం బయటకొస్తుందన్నారు. ‘సత్యమేవ జయతే, మాకు అండగా నిలిచిన వారికి కృతజ్ఞతలు. భారతదేశవృద్ధికి అదానీ గ్రూప్ సహకారం కొనసాగుతుంది’ అని అన్నారు. The Hon'ble Supreme Court's judgement shows that: Truth has prevailed. Satyameva Jayate. I am grateful to those who stood by us. Our humble contribution to India's growth story will continue. Jai Hind. — Gautam Adani (@gautam_adani) January 3, 2024 ఇదీ చదవండి: కొత్త ఏడాది మొదలవనున్న పబ్లిక్ ఇష్యూలు.. అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీలు.. అదానీ ఎంటర్ప్రైజెస్ అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ అదానీ పవర్ లిమిటెడ్ అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ అదానీ విల్మర్ లిమిటెడ్ ఎన్డీటీవీ అంబుజా సిమెంట్స్ ఏసీసీ లిమిటెడ్ -
డిజిటల్ ఎకానమీపై అదానీ గ్రూప్ దృష్టి
న్యూఢిల్లీ: దాదాపు 175 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్న దేశీ డిజిటల్ ఎకానమీలో అవకాశాలను అందిపుచ్చుకోవడంపై అదానీ గ్రూప్ దృష్టి పెట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్‌చెయిన్ తదితర ఉత్పత్తులు, సేవలను మరింతగా వినియోగంలోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా అబుధాబీకి చెందిన ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ (ఐహెచ్సీ) అనుబంధ సంస్థ సిరియస్ ఇంటర్నేషనల్ హోల్డింగ్‌తో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో (ఏఈఎల్) భాగమైన అదానీ గ్లోబల్ జట్టు కట్టింది. సిరియస్ డిజిటెక్ ఇంటర్నేషనల్ పేరుతో జాయింట్ వెంచర్ సంస్థను ఏర్పాటు చేసింది. ఇది అబుధాబీ కేంద్రంగా పని చేస్తుంది. సిరియస్ జేవీలో సిరియస్‌కు 51%, అదానీ గ్రూప్‌నకు 49% వాటాలు ఉంటాయి. అంతర్జాతీయంగా డిజిటల్ పరివర్తన విభాగంలో సిరియస్ అనుభవం, దేశీ మార్కెట్‌పై అదానీ గ్రూప్ పరిజ్ఞానంతో భారత డిజిటల్ ఎకానమీలో అవకాశాలను అందిపుచ్చుకోవడంపై సిరియస్ జేవీ దృష్టి పెట్టనుందని ఏఈఎల్ తెలిపింది. ప్రస్తుతం 175 బిలియన్ డాలర్లుగా ఉన్న డిజిటల్ ఎకానమీ 2030 నాటికి ట్రిలియన్ (లక్ష కోట్ల) డాలర్లుగా ఎదగనుందని అంచనాలు ఉన్నట్లు పేర్కొంది. ఇన్ఫ్రాతో పాటు ఫిన్‌టెక్, హెల్త్‌టెక్, గ్రీన్‌టెక్ తదితర రంగాల్లోనూ అధునాతన కృత్రిమ మేథ (ఏఐ), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), బ్లాక్‌చెయిన్ మొదలైన వాటిని మరింతగా వినియోగంలోకి తెచ్చేందుకు సిరియస్ జేవీ కృషి చేస్తుందని తెలిపింది. -
అదానీ గ్రీన్‌కు టోటల్ ‘ఎనర్జీ’
న్యూఢిల్లీ: దేశీ ప్రయివేట్ రంగ కంపెనీ అదానీ గ్రీన్ ఎనర్జీలో ఫ్రెంచ్ దిగ్గజం టోటల్ఎనర్జీస్ 30 కోట్ల డాలర్లు(సుమారు రూ. 2,500 కోట్లు) ఇన్వెస్ట్ చేసింది. తద్వారా పునరుత్పాదక ఇంధన భాగస్వామ్య సంస్థ(జేవీ)లో సమాన వాటా తీసుకుంది. అదానీ రెనెవబుల్ ఎనర్జీ నైన్ లిమిటెడ్(ఏఆర్ఈ9ఎల్) పేరుతో జేవీని ఏర్పాటు చేశాయి. 1,050 మెగావాట్ల ప్రాజెక్ట్ పోర్ట్‌ఫోలియోగల జేవీలో అదానీ గ్రీన్, టోటల్ఎనర్జీస్ 50:50 శాతం చొప్పున వాటాను తీసుకున్నాయి. అదానీ గ్రీన్‌కు ఏఆర్ఈ9ఎల్ అనుబంధ సంస్థకాగా.. 300 మెగావాట్ల నిర్వహణా సామర్థ్యంతోపాటు, 500 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. మరో 250 మెగావాట్ల ప్రాజెక్టులు అభివృద్ధి దశలో ఉన్నట్లు అదానీ గ్రీన్ వెల్లడించింది. అదానీ గ్రీన్‌లో 19.75 శాతం వాటా కలిగిన టోటల్ఎనర్జీస్ గతంలో అదానీ గ్రీన్ ఎనర్జీ ట్వంటీ త్రీ(ఏజీఈ23) లిమిటెడ్‌లో ఇన్వెస్ట్ చేసింది. ఇది అదానీ గ్రీన్‌కు మరో అనుబంధ సంస్థ. కాగా.. నిర్మాణం, అభివృద్ధి దశలో ఉన్న ప్రాజెక్టులు వాణిజ్య ప్రాతిపదికన కార్యకలాపాలు ప్రారంభిస్తే కొన్ని ప్రమాణాలకు లోబడి టోటల్ఎనర్జీస్ తిరిగి జేవీకి అదనపు పెట్టుబడులను సమకూర్చనుంది. ఇంతక్రితం ఏజీఈ23ఎల్లో టోటల్ రూ. 4,013 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. తప్పనిసరిగా మారి్పడికి లోనయ్యే డిబెంచర్ల ద్వారా నిధులు సమకూర్చింది. టోటల్ పెట్టుబడుల నేపథ్యంలో అదానీ గ్రీన్ ఎనర్జీ షేరు ఎన్ఎస్ఈలో స్వల్ప నష్టంతో రూ. 1,597 వద్ద ముగిసింది. -
గ్రీన్ ఎనర్జీపై అదానీ దృష్టి
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం అదానీ గ్రూప్ పర్యావరణహిత(గ్రీన్) ఇంధనం(ఎనర్జీ)కి మరింత ప్రాధాన్యత ఇస్తోంది. 2030కల్లా 45 గిగావాట్ల లక్ష్యాన్ని సాధించాలని ఆశిస్తోంది. ఇందుకు అనుగుణంగా అదానీ కుటుంబం రూ. 9,350 కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధపడుతోంది. గ్రూప్ కంపెనీ అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్(ఏజీఈఎల్) ప్రమోటర్ కుటుంబీకులతోపాటు ఆర్డౌర్ ఇన్వెస్ట్మెంట్, హోల్డింగ్ లిమిటెడ్, అదానీ ప్రాపర్టిస్ ప్రయివేట్ లిమిటెడ్‌కు మొత్తం 6.31 కోట్ల వారంట్లను జారీ చేయనుంది. ఒక్కో వారంట్‌ను రూ. 1,480.75 ధరలో కేటాయించేందుకు కంపెనీ బోర్డు తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నిధులను రుణ చెల్లింపులు, పెట్టుబడి వ్యయాలకు వినియోగించనున్నట్లు అదానీ గ్రీన్ పేర్కొంది. తాజా పెట్టుబడుల కారణంగా కంపెనీలో ప్రమోటర్ గ్రూప్ సంస్థలకు 3.83 శాతం వాటా లభించనుంది. వచ్చే ఏడాది 1.2 బిలియన్ డాలర్ల విలువైన బాండ్ల గడువు తీరనుంది. ఇప్పటికే వీటి చెల్లింపులు లేదా రీఫైనాన్సింగ్‌కు కంపెనీ ప్రణాళికలు వేసింది. 19.8 గిగావాట్ల విద్యుత్ కొనుగోలుకి అదానీ గ్రీన్ ఇప్పటికే ఒప్పందాన్ని పీపీఏ కుదుర్చుకుంది. ప్రమోటర్ పెట్టుబడుల వార్తలతో అదానీ గ్రీన్ షేరు బీఎస్ఈలో 4.3 శాతం ఎగసి రూ. 1,600 వద్ద ముగిసింది. -
ఈ ఏడాది ఈమే టాప్.. తర్వాతే అంబానీ, అదానీ.. కానీ..
సంపన్నుల జాబితా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు అంబానీ, అదానీ కదా.. అయితే వారి సంపాదన ఎక్కువగా ఉండడం వల్ల వారు సంపన్నుల జాబితాలో చోటుసంపాదిస్తుంటారు. ఈ ఏడాది అత్యధిక సంపద ఆర్జించిన జాబితాలో సావిత్రి జిందాల్(73) అగ్రస్థానంలో నిలిచినట్లు ‘బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్’ నివేదించింది. ఆమె మొత్తం సంపద రూ.2.1 లక్షల కోట్లు. అయితే ఈ ఒక్క ఏడాదిలోనే ఆమె సంపద రూ.80 వేలకోట్లు పెరిగిందని నివేదిక వెల్లడించింది. దాంతో అంబానీ, అదానీ, బిర్లా.. వంటి ప్రముఖుల సంపదను సావిత్రి జిందాల్ మించిపోయారు. దాంతో ఈ ఏడాది అధికంగా సంపదించిన జాబితాలో ఆమె అందరి కంటే ముందు నిలిచారని నివేదిక తెలిపింది. అయితే మొత్తంగా మాత్రం రూ.7.7 లక్షల కోట్ల సంపదతో ముఖేష్ అంబానీ అత్యధిక సంపన్నుడిగానే కొనసాగుతున్నారు. ప్రపంచ కుబేరుల్లో 13వ స్థానంలో నిలిచారు. అయితే ఈ ఏడాది ఆయన సంపద రూ.43 వేలకోట్లు పెరిగినట్లు తెలిసింది. రూ.7 లక్షల కోట్ల సంపదతో దేశంలోని సంపన్నుల జాబితాలో గౌతమ్అదానీ రెండో స్థానంలో ఉన్నారు. జిందాల్ గ్రూప్‌ను స్థాపించిన ఓం ప్రకాశ్ జిందాల్ సతీమణే సావిత్రి జిందాల్. ఆయన మరణానంతరం ఓపీ జిందాల్ గ్రూప్ ఛైర్‌పర్సన్‌గా ఆమె వ్యవహరిస్తున్నారు. ఈ గ్రూప్‌లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ అండ్ పవర్, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, జిందాల్ స్టెయిన్లెస్ వంటి కంపెనీలు ఉన్నాయి. ఇందులో చాలా వరకు కంపెనీల షేర్లు దేశీయ మార్కెట్లో లాభాల్లో దూసుకెళ్లడంతో సావిత్రి జిందాల్ సంపద భారీగా పెరిగింది. దేశీయ కుబేరుల జాబితాలో అయిదో స్థానంలో నిలిచినా.. దేశంలోని మహిళా సంపన్నుల జాబితాలో ఆమెదే అగ్రస్థానం. మొత్తం సంపద విషయంలో అజీమ్ ప్రేమ్‌జీ (రూ.2 లక్షల కోట్లు)ను సావిత్రి దాటేశారు. ఇదీ చదవండి: తగ్గిన ‘తీపి’ ఉత్పత్తి..! కారణాలు ఇవే.. ఈ ఏడాది ఎక్కువ సంపదను ఆర్జించిన వారి జాబితాలో హెచ్‌సీఎల్ టెక్ అధినేత శివ్‌నాడార్ రూ.66 వేలకోట్లతో రెండో స్థానంలో నిలిచారు. స్థిరాస్తి సంస్థ డీఎల్ఎఫ్ లిమిటెడ్ ఛైర్మన్ కేపీ సింగ్ సంపద రూ.59వేలకోట్లు పెరగడంతో మూడో స్థానంలో ఉన్నారు. ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార్ బిర్లా, షాపూర్ మిస్త్రీ రూ.52 వేలకోట్ల చొప్పున సంపదను పెంచుకున్నారు. ముకేశ్ అంబానీ సంపద ఈ ఏడాది రూ.43 వేలకోట్లు పెరిగింది. సన్‌ఫార్మా ఎండీ దిలీప్ సంఘ్వి, రవి జైపురియా, ఎంపీ లోథా, సునీల్ మిత్తల్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. -
నాలుగు సంస్థల ఏర్పాటులో అదానీ గ్రీన్ ఎనర్జీ
న్యూఢిల్లీ: అదానీ గ్రీన్ ఎనర్జీ తాజాగా నాలుగు అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసింది. అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ సిక్స్టీ, అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ సిక్స్టీ టూ, అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ సిక్స్టీ త్రీ, అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ సిక్స్టీ ఫోర్ వీటిలో ఉన్నాయి. పవన, సౌర, ఇతరత్రా పునరుత్పాదక వనరుల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడం, పంపిణీ చేయడం, విక్రయించడం తదితర లావాదేవీల కోసం ఈ అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసినట్లు సంస్థ తెలిపింది. -
ఐఏఎన్ఎస్లో అదానీకి మెజార్టీ వాటాలు
న్యూఢిల్లీ: వ్యాపార దిగ్గజం అదానీ గ్రూప్ .. మీడియా రంగంలో తన కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తోంది. తాజాగా న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్ఎస్ ఇండియాలో 50.5 శాతం మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. అనుబంధ సంస్థ ఏఎంజీ మీడియా నెట్వర్క్స్ ద్వారా ఈ లావాదేవీ నిర్వహించింది. ఐఏఎన్ఎస్, అందులో వాటాదారు (ఎండీ, ఎడిటర్–ఇన్–చీఫ్) సందీప్ బమ్జాయ్తో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు అదానీ ఎంటర్ప్రైజెస్ తెలిపింది. అయితే, కొనుగోలు కోసం ఎంత వెచి్చంచినదీ మాత్రం వెల్లడించలేదు. ‘ఐఏఎన్ఎస్ నిర్వహణ నియంత్రణ అంతా ఏఎంఎన్ఎల్ చేతిలో ఉంటాయి. సంస్థలో డైరెక్టర్లను ఎంపిక చేసే అధికారాలు కూడా ఉంటాయి‘ అని స్టాక్ ఎక్సే్చంజీలకు ఇచ్చిన సమాచారంలో అదానీ ఎంటర్ప్రైజెస్ పేర్కొంది. కొనుగోలు అనంతరం ఐఏఎన్ఎస్ ఇకపై ఏఎంఎన్ఎల్కు అనుబంధ సంస్థగా వ్యవహరిస్తుందని వివరించింది. మరోవైపు, ఈ ఏడాది ఫిబ్రవరిలో తాను అనారోగ్యం బారిన పడినప్పుడు సంస్థ ఆర్థిక పరిస్థితులు మారాయని బమ్జాయ్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే అదానీ గ్రూప్‌నకు వాటాలు విక్రయించినట్లు పేర్కొన్నారు. కోవిడ్ కష్టకాలంలోనూ వెన్నంటి ఉన్న ఉద్యోగులకు భద్రత కలి్పంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. మెజారిటీ వాటాలు విక్రయించేసినందున ఇకపై సంస్థ రోజువారీ నిర్వహణలో పాల్గొనబోనని పేర్కొన్నారు. ఈ కొనుగోలుతో అదానీ గ్రూప్ ఖాతాలో మొత్తం మూడు మీడియా సంస్థలు (ఎన్డీటీవీ, క్వింటిలియన్, ఐఏఎన్ఎస్) చేరినట్లయింది. ఐఏఎన్ఎస్ కథ ఇదీ.. ఐఏఎన్ఎస్ అనేది ఉత్తర అమెరికాలోని ప్రవాస భారతీయుల అవసరాల కోసం 1986లో ఇండో–ఏíÙయన్ న్యూస్ సర్వీస్‌గా ప్రారంభమైంది. అటు తర్వాత కొన్నాళ్లకు పూర్తిగా భారత్, దక్షిణాసియాపై ప్రధానంగా దృష్టి పెడుతూ పూర్తి స్థాయి వైర్ ఏజెన్సీగా మారింది. గత ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ. 12 కోట్లు, అంతకు ముందు రూ. 9 కోట్ల టర్నోవరు నమోదు చేసింది. సంస్థలో 200 మంది పైచిలుకు ఉద్యోగులు, ప్రపంచవ్యాప్తంగా (ఉత్తర అమెరికా, యూరప్ మొదలైన ప్రాంతాల్లో) 350కి పైగా సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు. బీక్యూ ప్రైమ్ అనే ఫైనాన్షియల్ న్యూస్ డిజిటల్ ప్లాట్‌ఫాంను నిర్వహించే క్వింటిలియన్ బిజినెస్ మీడియాను కొనుగోలు చేయడం ద్వారా అదానీ గ్రూప్ గతేడాది మీడియా వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఎన్డీటీవీలో మెజారిటీ వాటాలు దక్కించుకుంది. -
ఐదేళ్లలో రూ.9.63 లక్షలకోట్ల సంపద సృష్టి
ఇన్వెస్టర్ల సంపద సృష్టికి గత ఐదేళ్ల కాలం(2018–23)లో డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ టాప్ చెయిర్‌ను అలంకరించింది. ఈ బాటలో సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టీసీఎస్ రెండో ర్యాంకులో నిలవగా.. లాయిడ్స్ మెటల్స్, అదానీ గ్రూప్ సైతం ఇదే బాటలో నడవడం గమనార్హం! వివరాలు చూద్దాం.. న్యూఢిల్లీ: ఇన్వెస్టర్ల సంపదగా పేర్కొనే మార్కెట్ విలువ(క్యాపిటలైజేషన్)లో పలు దిగ్గజాలు గత ఐదేళ్లలో జోరు చూపాయి. పారిశ్రామిక దిగ్గజం ముకేష్ అంబానీ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) అత్యధికంగా రూ. 9,63,800 కోట్ల మార్కెట్ క్యాప్‌ను జమ చేసుకుంది. నంబర్‌వన్ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సరీ్వసెస్(టీసీఎస్) రూ. 6,77,400 కోట్ల విలువను జత చేసుకోవడం ద్వారా తదుపరి ర్యాంకును సాధించింది. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ నివేదిక ప్రకారం సంపద సృష్టిలో అదానీ ఎంటర్ప్రైజెస్ ఆల్‌రౌండ్ ప్రతిభను కనబరిచింది. స్టాక్ మార్కెట్లో వివిధ కంపెనీల పనితీరును పరిశీలించిన మోతీలాల్ ఓస్వాల్ ఆర్ఐఎల్ వరుసగా ఐదో ఏడాదిలోనూ టాప్‌లో నిలిచినట్లు పేర్కొంది. ఐసీఐసీఐ, ఎయిర్టెల్ 2018–23 కాలంలో ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ మార్కెట్ క్యాప్ రూ. 4,15,500 కోట్లమేర బలపడగా.. ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ విలువ రూ. 3,61,800 కోట్లు పుంజుకుంది. మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ రూ. 2,80,800 కోట్లను జత చేసుకుంది. అయితే లాయిడ్స్ మెటల్స్ అత్యంత వేగంగా 79 శాతం సంపదను పెంచుకున్న కంపెనీగా ఆవిర్భవించింది. ఈ బాటలో అదానీ ఎంటర్ప్రైజెస్ 78 శాతం వార్షిక వృద్ధితో ద్వితీయ ర్యాంకును సాధించింది. ఈ కాలంలో మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్‌ను మించుతూ అత్యంత నిలకడగా పురోగమించిన కంపెనీగా క్యాప్రి గ్లోబల్ నిలిచింది. ఏడాదికి 50 శాతం చొప్పున లాభపడింది. రూ. 10 లక్షలు.. ఐదేళ్లలో రూ.కోటి గత ఐదేళ్లుగా అత్యున్నత ర్యాలీ చేసిన టాప్–10 కంపెనీలలో 2018లో రూ. 10 లక్షలు ఇన్వెస్ట్ చేసి ఉంటే.. 2023కల్లా ఈ పెట్టుబడి రూ. కోటికి చేరి ఉండేదని నివేదిక పేర్కొంది. -
వేలకోట్ల అప్పు తీర్చే యోచనలో అదానీ గ్రూప్.. ఎలాగంటే..
అదానీ గ్రూప్ ఎక్కువగా రుణాలను కలిగి ఉందని.. వాస్తవ విలువ కంటే అధిక లెవరేజ్ పొందిందంటూ గతంలో అనేక వార్తలు వచ్చాయి. దాంతోపాటు హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌తో షేర్ విలువ బాగా తగ్గిపోయింది. అయితే ఆ సమయంలో చాలా రుణాలను కంపెనీ గడువు కంటే ముందే చెల్లించి తన పొటెన్షియల్‌ను నిరూపించుకుంది. వచ్చే ఏడాది రూ.15వేల కోట్లు విదేశీ కరెన్సీ బాండ్లు మెచ్యూర్ అవుతుండటంతో.. అదానీ గ్రూప్ నగదు చెల్లింపులు, కొత్త బాండ్ విక్రయాల ద్వారా డెట్ రీఫైనాన్సింగ్ పూర్తి చేయాలని చూస్తోంది. ఇందుకోసం ప్రణాళికలను రూపొందిస్తోంది. 2019లో విక్రయించిన అదానీ గ్రీన్ హోల్డింగ్ కంపెనీ బాండ్లలో రూ.6200 కోట్లు తిరిగి చెల్లించడానికి, వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో మెచ్యూర్ అయ్యే నగదు, అందుకు సమానమైన లిక్విడిటీ పూల్‌ను రూపొందించడానికి కృషి చేస్తున్నట్లు గ్రూప్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. జులై నాటికి అదానీ పోర్ట్స్‌కి చెందిన రూ.5400 కోట్ల రుణాలను నగదు రూపంలో చెల్లించటానికి సైతం అదానీ గ్రూప్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఈ ఏడాది రూ.2700 కోట్లు నగదును చెల్లించింది. మే నెలలో మెచ్యూర్ అయ్యే అదానీ గ్రీన్‌కు చెందిన రూ.4100 కోట్ల బాండ్ రీఫైనాన్స్ కోసం రూ.3400 కోట్లు సమీకరించడానికి రుణదాతలతో అదానీ గ్రూప్ చర్చలు ప్రారంభించింది. అయితే 20 ఏళ్ల కాలానికి దీర్ఘకాలిక నిధులను సమీకరించటానికి చర్యలు తీసుకుంటున్నట్లు గ్రూప్ వర్గాలు తెలిపాయి. బ్లూమ్‌బెర్గ్ డేటా ప్రకారం మొత్తం అదానీ గ్రూప్ సంస్థలు సుమారు రూ.62వేల కోట్లు రుణాలను కలిగి ఉన్నాయి. హోల్డింగ్ కంపెనీలతో పోలిస్తే, నగదు ప్రవాహాన్ని సృష్టించే ఆపరేటింగ్ కంపెనీల్లో రీఫైనాన్సింగ్ సులభం అవుతుందని సమాచారం. దాంతో అదానీ గ్రూప్ రీపేమెంట్ వ్యూహంలో భాగంగా దీన్ని ఎంచుకున్నట్లు విశ్లేషకులు తెలిపారు. నాన్-కన్వర్టబుల్ డిబెంచర్ల విక్రయం ద్వారా రూ.5,000 కోట్లు, నాన్-క్యుములేటివ్ రెడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్ల ద్వారా అదనంగా రూ.250 కోట్లు సమీకరించే ప్రణాళికలను కంపెనీ ఇటీవల ప్రకటించింది. ఇదీ చదవండి: ఇస్రో వేల కోట్లు సంపాదన.. కేంద్ర మంత్రి ఏమన్నారో తెలుసా? కంపెనీ గుజరాత్‌లోని ముంద్రా పోర్ట్‌తో సహా భారతదేశం అంతటా 13 పోర్ట్‌లు, టెర్మినల్‌లను నిర్వహిస్తోంది. అలాగే అదానీ పోర్ట్స్ శ్రీలంకలోని ఒక కంటైనర్ టెర్మినల్ కోసం ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూ.4600 కోట్ల రుణాన్ని పొందింది. -
ఐదు రోజుల్లో రూ.20 వేలకోట్ల సంపాదన..!
గడచిన వారంలో స్టాక్‌మార్కెట్ల ర్యాలీతో పాటు అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీలు భారీగా పెరిగాయి. దీంతో రిటైల్ ఇన్వెస్టర్లు లాభాలను ఆర్జించారు. హిండెన్‌బర్గ్ నివేదికతో కుప్పకూలిన స్టాక్‌లు తిరిగి మార్కెట్ జీవితకాల గరిష్ఠాలను తాకింది. దాంతో అదానీ స్టాక్ల్లో సైతం మంచి ర్యాలీ కనిపించింది. కేవలం ఐదు రోజుల్లోనే అదానీ స్టాక్స్ దాదాపు 65 శాతం పెరగడంతో అటు గ్రూప్ కంపెనీలకు, ఇటు మదుపరులకు కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. అదానీ గ్రూప్ కంపెనీల పెరుగుదల కారణంగా.. అందులో పెద్ద ఇన్వెస్టర్లుగా ఉన్న ఎల్ఐసీ, జీక్యూజీ పార్ట్నర్స్ రూ.19,500 కోట్లకు పైగా లాభాన్ని సంపాదించారు. సెప్టెంబర్ త్రైమాసికం డేటా ప్రకారం జీక్యూజీ పార్ట్నర్స్ అదానీ గ్రూప్‌లోని ఆరు కంపెనీల్లో వాటాలను కలిగి ఉన్నారు. జీక్యూజీ పెట్టుబడుల విలువ 28 శాతం అంటే రూ.7,287 కోట్లు పెరిగి రూ.32,887 కోట్లకు చేరింది. అదానీ గ్రూప్‌లోని ఏడు షేర్లలో ఎల్ఐసీ వాటాల విలువ రూ.12,234 పెరిగి రూ.58,017 కోట్లకు ఎగబాకింది. హిండెన్ బర్గ్ ఆరోపణల వల్ల ఏర్పడిన సంక్షోభం సమయంలో జీక్యూజీ అదానీకి చెందిన నాలుగు కంపెనీల్లో రూ.15,446 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. వీటిలో అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్, అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ ట్రాన్స్మిషన్ కంపెనీలు ఉన్నాయి. దీని తర్వాత అదానీ పవర్, అంబుజా సిమెంట్స్ కంపెనీల్లో కూడా వాటాల కొనుగోలు చేసింది. ఇదీ చదవండి: దిగ్గజ టెక్ కంపెనీ సీఎఫ్ఓ రాజీనామా.. ఎందుకంటే.. ఇక బీమా దిగ్గజం ఎల్ఐసీ ఏసీసీ మినహా అన్ని అదానీ కంపెనీల్లో వాటాలు కలిగి ఉంది. గతవారం అమెరికా హిండెన్ బర్గ్ ఆరోపణలను తోసిపుచ్చుతూ.. అదానీకి క్లీన్ చిట్ ఇవ్వటంతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. అదానీకి చెందిన పది లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.3.14 లక్షల కోట్లు పెరిగి మెుత్తంగా రూ.14.36 లక్షల కోట్లకు చేరుకుంది. ఇందులో అదానీ టోటల్ గ్యాస్ షేర్లు అత్యధికంగా 65 శాతం పెరుగుదలను నమోదు చేశాయి. -
Adani Group: రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు.. 10 కోట్ల మొక్కలు
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం అదానీ గ్రూప్ వచ్చే పదేళ్లలో రూ. 7 లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెట్టనుంది. తద్వారా ఇన్ఫ్రా రంగంలో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవడంపై దృష్టి పెట్టింది. గ్రూప్ సంస్థ అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ .. స్టాక్ ఎక్స్చేంజీలకు ఈ మేరకు సమాచారమిచ్చింది. మైనింగ్, విమానాశ్రయాలు, డిఫెన్స్.. ఏరోస్పేస్, సౌర విద్యుదుత్పత్తి, రహదారులు, డేటా సెంటర్లు మొదలైన వ్యాపార విభాగాల్లో అదానీ గ్రూప్ విస్తరించింది. పోర్టుల వ్యాపారంలో పర్యావరణ హిత విధానాలను ప్రవేశపెడుతోంది. అన్ని క్రేన్లను విద్యుదీకరించడం, అంతర్గతంగా డీజిల్ వాహనాలకు బదులు బ్యాటరీ ఆధారిత వాహనాలకు మళ్లడం, అదనంగా 1000 మెగావాట్ల క్యాప్టివ్ పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం వంటివి వీటిలో ఉన్నాయి. అటు అదానీ ఎలక్ట్రిసిటీ 2027 నాటికి ముంబైలో 60 శాతం మేర పునరుత్పాక విద్యుత్‌ను సరఫరా చేసే దిశగా కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఇది 38 శాతంగా ఉంది. ఇక గ్రూప్‌లో భాగమైన అంబుజా, ఏసీసీ కంపెనీలు దేశీయంగా సిమెంట్ ఉత్పత్తిలో అగ్రగామి సంస్థలుగా ఉన్నాయి. తమ సిమెంటు ఉత్పత్తిలో 90 శాతం భాగం రీసైకిల్ చేసిన ఫ్లై యాష్ వ్యర్ధాలు, స్లాగ్ ఉంటాయని అదానీ గ్రూప్ చీఫ్ గౌతమ్ అదానీ పేర్కొన్నారు. 2028 నాటికి సిమెంటు ఉత్పత్తి కోసం వినియోగించే పునరుత్పాదక శక్తి వాటాను 60 శాతానికి పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు వివరించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా 2030 నాటికి 10 కోట్ల మొక్కలను నాటాలన్న లక్ష్యం దిశగా పని చేస్తున్నామని ఆయన చెప్పారు. అదానీ గ్రూప్ ఇటీవలే సిమెంటు, టెలికం, మీడియా వ్యాపార విభాగాల్లోకి కూడా ప్రవేశించింది. -
Bimal Dayal: అదానీ కంపెనీకి కొత్త సీఈవో
అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియాకు సీఈఓగా బిమల్ దయాల్ నియమితులయ్యారు. ఈయన ప్రస్తుతం అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ ట్రాన్స్మిషన్ బిజినెస్ చీఫ్‌గా ఉన్నారు. పీటీఐ వార్తా సంస్థ నివేదికల ప్రకారం ఈ నిర్ణయాన్ని ఏఈఎస్ఎల్ డైరెక్టర్ల బోర్డు ఆమోదించింది. అదానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియాకు సంబంధించిన థర్మల్, పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్‌లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలును బిమల్ దయాల్ పర్యవేక్షిస్తారని అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ ఓ ప్రకటనలో పేర్కొంది . అదానీ పోర్ట్‌ఫోలియో కంపెనీల ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యాపారాన్ని సంవత్సరానికి 15 శాతానికిపైగా పెంచాలన్న సంకల్పాన్ని బలోపేతం చేసే దిశగా ఈ నియామకం ద్వారా మరో ముఖ్యమైన అడుగు వేసినట్లు కంపెనీ తెలిపింది.\ దేశంలో అతిపెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థగా తన అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి రాబోయే 10 సంవత్సరాల్లో రూ. 7 లక్షల కోట్లకు పైగా పెట్టుబడి పెట్టాలని పోర్ట్‌ఫోలియో ఇటీవల ప్రణాళికను ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించింది. బిమల్ పటేల్ నియామకం నేపథ్యంలో అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ ప్రస్తుత మేనేజ్మెంట్ బృందంలోని మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ సర్దానా, కంపెనీ అన్ని విభాగాలను చూసుకునే కందర్ప్ పటేల్ ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్, స్మార్ట్ మీటర్ విభాగాలను నడిపిస్తారని పీటీఐ కథనం పేర్కొంది. -
రామమందిర ప్రతిష్ఠాపనకు డేట్ ఫిక్స్.. ప్రముఖులకు ఆహ్వానం
ప్రముఖ పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీతో సహా 7,000 మందిని అయోధ్యలోని రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమానికి ఆహ్వానించినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. ఈ ఇద్దరు బిలియనీర్లతో పాటు క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా జనవరి 22, 2024న జరిగే ఈ వేడుకలకు హాజరవనున్నట్లు సమాచారం. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ శంకుస్థాపన కార్యక్రమానికి 3,000 మంది వీవీఐపీలతో కలిపి మొత్తం 7,000 మందికి ఆహ్వానాలు పంపింది. ప్రముఖ టీవీ సీరియల్ 'రామాయణం'లో రాముడి పాత్ర పోషించిన నటుడు అరుణ్ గోవిల్, సీత పాత్రలో నటించిన దీపికా చిక్లియాకు ట్రస్ట్ ఆహ్వానం పంపింది. అయోధ్యలో పోలీసుల కాల్పుల్లో మరణించిన కరసేవకుల కుటుంబాలను సైతం ఆహ్వానిస్తున్నట్లు తెలిసింది. వీవీఐపీల్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యోగా గురువు రామ్‌దేవ్, పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ, రతన్ టాటా, గౌతమ్ అదానీలు ఉన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ.. ‘రామ మందిర ప్రతిష్టాపన ఉత్సవానికి 50 దేశాల నుంచి ఒక్కొక్కరిని ఆహ్వానించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రామాలయ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన 50 మంది కరసేవకుల కుటుంబ సభ్యులను ఆహ్వానించాం. న్యాయమూర్తులు, శాస్త్రవేత్తలు, రచయితలు, కవులకు కూడా ఆహ్వానాలు పంపాం’ అని తెలిపారు. సాధువులు, పూజారులు, మత పెద్దలు, మాజీ సివిల్ సర్వెంట్లు, రిటైర్డ్ ఆర్మీ అధికారులు, సంగీత విద్వాంసులు, పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డు గ్రహీతలకు ఆహ్వానం పంపినట్లు చెప్పారు. ఇదీ చదవండి: ఇంటి నిర్మాణంలో ఇవి పాటిస్తే కరెంట్ బిల్లు ఆదా! అయోధ్యలో రామమందిర నిర్మాణ అంచనా వ్యయం రూ.1,800 కోట్లు. ఆలయ నిర్మాణం కోసం సుప్రీం కోర్టు ఆదేశాల ద్వారా శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. హిందూ దేవతల విగ్రహాల కోసం ట్రస్ట్ స్థలం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 27, 2021 వరకు శ్రీ రామ జన్మభూమి మందిర్ నిధి సమర్పణ్ అభియాన్ ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు రూ.2100 కోట్ల నిధులు సేకరించినట్లు సమాచారం. ఈ మందిర నిర్మాణాన్ని ఎల్ అండ్ టీ కంపెనీ ప్రారంభించింది. మందిరంలో వినియోగించే టెక్నాలజీని టాటా కన్సల్టెన్సీ ఇంజినీర్స్ లిమిటెడ్ కంపెనీ అందిస్తోంది. 161 అడుగుల ఎత్తు, 235 అడుగుల వెడల్పు, 360 అడుగుల పొడవుతో ఈ మందిరాన్ని నిర్మిస్తున్నారు. -
అదానీ గ్రూప్ చేతికి సంఘీ ఇండస్ట్రీస్
న్యూఢిల్లీ: సంఘీ ఇండస్ట్రీస్ (ఎస్ఐఎల్) కొనుగోలు ప్రక్రియ పూర్తయినట్లు అదానీ గ్రూప్‌లో భాగమైన అంబుజా సిమెంట్స్ (ఏసీఎల్) వెల్లడించింది. షేరు ఒక్కింటికి రూ. 121.90 చొప్పున సవరించిన ధర మేరకు కొనుగోలు చేసినట్లు వివరించింది. గతంలో ఎస్ఐఎల్లో పబ్లిక్ షేర్హోల్డర్లకు ఉన్న 26 శాతం వాటాల కోసం కంపెనీ రూ. 114.22 రేటును ఆఫర్ చేసింది. ఎస్ఐఎల్ విలువను రూ. 5,185 కోట్లుగా లెక్కగట్టి దక్కించుకున్నట్లు ఏసీఎల్ తెలిపింది. సంఘీ ఇండస్ట్రీస్‌లో తమకు నియంత్రణాధికారాలతో 54.51 శాతం వాటాలు లభించినట్లు వివరించింది. దేశీ సిమెంటు పరిశ్రమలో తమ స్థానాన్ని పటిష్టపర్చుకునేందుకు ఈ డీల్ ఉపయోగపడుతుందని అదానీ గ్రూప్ సిమెంట్ వ్యాపార విభాగం సీఈవో అజయ్ కపూర్ తెలిపారు. 74.6 ఎంటీపీఏకి ఉత్పత్తి సామర్థ్యాలు ఎస్‌ఐఎల్‌కు గుజరాత్‌లోని సంఘీపురంలో 2,700 హెక్టార్లలో క్లింకర్, సిమెంటు సమగ్ర తయారీ యూనిట్ ఉంది. ఇందులో 6.6 ఎంటీపీఏ క్లింకర్ ఉత్పత్తికి రెండు బట్టీలు, 6.1 ఎంటీపీఏ సిమెంటు గ్రైండింగ్ యూనిట్, 13 మెగావాట్ల క్యాప్టివ్ విద్యుదుత్పత్తి ప్లాంటు మొదలైనవి ఇందులో ఉన్నాయి. ఈ కొనుగోలుతో ఏసీఎల్ ఉత్పత్తి సామర్థ్యం వార్షికంగా 68.5 మిలియన్ టన్నులు (ఎంటీపీఏ) నుంచి 74.6 ఎంటీపీఏకి చేరుతుందని పేర్కొంది. కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్ తదితర పశ్చిమ తీర ప్రాంత మార్కెట్లలో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించనున్నట్లు కంపెనీ తెలిపింది. వచ్చే 30 నెలల్లో ఉత్పత్తి సామర్థ్యాలను అదనంగా పెంచుకోనున్నట్లు వివరించింది. -
జాతీయ రికార్డు సృష్టించిన అదానీ కంపెనీ
భారతదేశ ఆర్థికవ్యవస్థ రోజురోజుకూ పెరుగుతోంది. దేశంలో తయారైన వస్తువుల ఎగుమతులు రెట్టింపవుతున్నాయి. దాంతోపాటు దేశీయ అవసరాలకు విదేశాల నుంచి వస్తున్న దిగుమతులు హెచ్చవుతున్నాయి. ఈ వస్తురవాణా వివిధ మార్గాల్లో జరుగుతోంది. దేశంలో అధికంగా తీరప్రాంతం ఉంది. కాబట్టి ఎక్కువ వస్తువులు జలమార్గంలో పోర్ట్‌ల ద్వారా రవాణా చేస్తున్నారు. తాజాగా ముంద్రాలోని అదానీ ఇంటర్నేషనల్ కంటైనర్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నవంబర్ నెలకుగాను గరిష్ఠంగా 3,00,000 కంటైనర్లను సరఫరా చేశారు. అదానీ పోర్ట్ సెజ్(ఏపీ సెజ్) టెర్మినల్ నవంబర్ 2023లో 97 నౌకల్లో 3,00,431 ట్వెంటీ ఫుట్ ఈక్వాలెంట్ యునిట్(టీఈయూ)లను సరఫరా చేసి జాతీయ రికార్డును సృష్టించింది. మార్చి 2021లో ప్రతిరోజూ దాదాపు 10,000 చొప్పున 2,98,634 టీఈయూలను నెలలో సరఫరా చేసి రికార్డు నెలకొల్పింది. ప్రస్తుతం తన రికార్డును తాజాగా 3 లక్షల కంటైనర్ల సరఫరాతో తనే బద్దలుకొట్టింది. అంతేకాకుండా, ఏపీ సెజ్‌కు చెందిన ధమ్రా, ఎన్నూర్ పోర్ట్‌లు కూడా అత్యధిక నెలవారీ వాల్యూమ్లను నమోదు చేశాయి. వరుసగా 3.96 ఎంఎంటీ, 65,658 టీఈయూలను సరఫరా చేశాయి. ఏపీ సెజ్ కార్గో వాల్యూమ్లలో 36 ఎంఎంటీతో 42 శాతం పెరుగుదల నమోదు చేసింది. ఇదీ చదవండి: టెక్ కంపెనీల్లో కొత్త ఉద్యోగాలు వారికే.. ఏపీ సెజ్ ఈ ఆర్థిక ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు ఎనిమిది నెలల్లో 275 ఎంఎంటీ కార్గోను నిర్వహించాయి. అదానీ పోర్ట్స్ షేర్లు ఈరోజు ప్రారంభంలో 4.45 శాతం పెరిగి రూ.864.40 వద్ద ట్రేడవుతున్నాయి. సెప్టెంబర్ 2023 నాటికి, అదానీ గ్రూప్ సంస్థలో ప్రమోటర్లు 65.53 శాతం వాటాను కలిగి ఉన్నారు.