allu aravind
-
కేరళకు అల్లు అరవింద్.. నిర్మాత బన్నీవాసు క్లారిటీ
టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు ఆసక్తికర కామెంట్స్ చేశారు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ఛావా తెలుగు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఛావాను గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ విషయంపై అరవింద్ ఎలా రియాక్ట్ అయ్యారని మీడియా ప్రతినిధులు బన్నీవాసును ప్రశ్నించారు. దీనిపై ఆయన స్పందిస్తూ అల్లు అరవింద్ ప్రస్తుతం కేరళలో ఉన్నారని తెలిపారు. ట్రీట్మెంట్ కోసం ఆయన కేరళ వెళ్లారని వెల్లడించారు.అయితే ఆయన కేవలం వెల్నెస్ సెంటర్లో చికిత్స కోసం వెళ్లారని బన్నీ వాసు అన్నారు. బరువు తగ్గేందుకు ప్రకృతి వైద్య చికిత్స తీసుకుంటున్నారని వెల్లడించారు. ఛావా నిర్మాతలతో మాట్లాడి తెలుగు రిలీజ్ చేసేందుకు ప్రయత్నించాలని అరవింద్ చెప్పారని తెలిపారు. ఆయన డైరెక్షన్లోనే ఛావాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు.కాగా.. బాలీవుడ్ మూవీ ఛావాలో విక్కీ కౌశల్, రష్మిక మందన్నా జంటగా నటించారు. ఈ చిత్రాన్ని శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇందులో శంభాజీ మహారాజ్ విక్కీ కౌశల్, యేసుబాయిగా రష్మిక మందన్నా నటించారు. గతనెల థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలవడంతో తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. -
ఆయన జీవితాన్ని వెబ్ సిరీస్‌గా తీయాలనుకున్నా: అల్లు అరవింద్
ఈ ఏడాది అక్కినేని హీరో నాగచైతన్య తండేల్ మూవీతో మరో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ మూవీకి తొలి రోజే పాజిటివ్ టాక్ రావడంతో ఏకంగా రూ. 21.27 కోట్లు రాబట్టింది. విడుదలైన వారం రోజులైనా బాక్సాఫీస్ వద్ద అభిమానులను అలరిస్తోంది. వందకోట్ల మార్కు దిశగా పరుగులు పెడుతోంది. ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్గా మెప్పించింది. ఈ మూవీ సక్సెస్ కావడంతో శ్రీకాకుళంలో గ్రాండ్‌గా ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు హాజరైన నిర్మాత అల్లు అరవింద్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయన జీవితాన్ని సినిమా రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని వెల్లడించారు.అల్లు అరవింద్ మాట్లాడుతూ.. 'మల్లయోధుడు కోడి రామ్మూర్తి గారి స్డేడియంలో మనం ఈ ఫంక్షన్ చేసుకుంటున్నాం. ఆయన గొప్పతనం మొత్తం ఇండియా అంతా తెలుసు. కానీ వారిని స్మరించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఈ ప్రాంతంలో చాలా ఏళ్ల క్రిత పుట్టి ప్రపంచప్రఖ్యాతి గాంచారు. ఈ జిల్లాకు ఎన్నో పేరు ప్రతిష్టలు తీసుకొచ్చారు. నేను ఆయన చరిత్ర చదివినప్పుడు వెబ్ సిరీస్‌గా తీయాలని అనుకున్నాం. నాకు ఆశ్చర్యం కలిగిన విషయం ఏంటంటే రెండు కార్లను చేతులతో ఆపిన ఆయన కేవలం శాఖాహారి' అని తన మనసులో మాటను పంచుకున్నారు. శాకాహారి అయిన ఆయన శారీరక ధారుఢ్యంలో ఎందరికో స్ఫూర్తి అని కొనియాడారు. -
తండేల్ మూవీ.. మరోసారి డ్యాన్స్‌తో అదరగొట్టిన అల్లు అరవింద్
ఈ ఏడాది అక్కినేని హీరో నాగచైతన్య తండేల్ మూవీతో ప్రేక్షకులను పలకరించారు. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. తొలి రోజే పాజిటివ్ టాక్ రావడంతో రూ. 21.27 కోట్లు రాబట్టింది. విడుదలైన వారం రోజులైనా బాక్సాఫీస్ వద్ద అభిమానులను అలరిస్తోంది. వందకోట్ల మార్కు దిశగా పరుగులు పెడుతోంది. దీంతో ఇటీవలే ఈ మూవీ సక్సెస్ కావడంతో హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ఈవెంట్ కూడా నిర్వహించారు. ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్గా మెప్పించింది.తాజాగా తండేల్ టీమ్ శ్రీకాకుళంలో సందడి చేసింది. ఈ సినిమా సక్సెస్ మీట్లో భాగంగా ఏర్పాటు చేసిన ఈవెంట్లో చిత్రబృంద సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మరోసారి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఈ చిత్రంలోనే హైలెస్సా.. హైలెస్సా అంటూ సాగే పాటకు స్టెప్పులు వేశారు. హీరోయిన్ సాయిపల్లవితో కలిసి వేదికపై డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను నిర్మాత బన్నీవాసు తన ట్విటర్ ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. కాగా.. ఈ సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్లో బన్నీ వాసు, అల్లు అరవింద్ నిర్మించారు. సినిమా విడుదలకు ముందే తండేల్ పాటలు, డైలాగులతో భారీ అంచనాలను క్రియేట్ చేసింది.కాగా.. ఈ చిత్రాన్ని మత్స్యకారుల బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించారు. శ్రీకాకుళంకు చెందిన కొందరు మత్స్యకారులు పాకిస్తాన్ జలాల్లోకి పొరపాటున ప్రవేశించారు. దీంతో వారిని పాక్ కోస్ట్‌గార్డు బంధించి జైల్లో వేశారు. నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కించడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. Sweetest moments of Success 💗💗#Thandel @chay_akkineni @Sai_Pallavi92 #AlluAravind pic.twitter.com/HGnQ4tDlS0— Bunny Vas (@TheBunnyVas) February 13, 2025 -
శ్రీకాకుళంలో ‘తండేల్’ మూవీ విజయోత్సవ వేడుక (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న ‘తండేల్’ మూవీ యూనిట్ (ఫొటోలు)
-
మెగా వర్సెస్ అల్లు.. అసలేం జరుగుతుంది?
టాలీవుడ్లో మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీకి మంచి గుర్తింపు ఉంది. ఇరు కుటుంబాల నుంచి స్టార్స్ ఉన్నారు. అయితే మొన్నటి వరకు మెగా ఫ్యామిలీ అయినా అల్లు ఫ్యామిలీ అయినా ఒకటే అనే భావన అందరిలో ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో ఇరు కుటుంబాల మధ్య మాత్రం కోల్డ్ వార్ నడుస్తోంది. ఆ విషయం ఇండస్ట్రీ వరకే పరిమితం కాకుండా అభిమానుల వరకు చేరింది. దానికి కారణం సోషల్ మీడియా అనే చెప్పాలి. మొన్నటి వరకు ట్విటర్, ఇన్‌స్టా గ్రామ్‌లో అల్లు అర్జున్(Allu Arjun)ని ఫాలో అయినా మెగా హీరోలు.. ఇప్పుడు వరుసగా అన్ ఫాలో అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో మెగా మేనల్లుడు సాయి దుర్గాతేజ్ బన్నీని అన్‌ఫాలో చేయడంతో ఇరు కుటుంబాల మధ్య విభేదాలు వచ్చినట్లు ప్రచారం మొదలైంది. ఎన్నికల ఫలితాల తర్వాత మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా యుద్ధమే ప్రారంభించారు. ఒకరినొకరు ట్రోల్ చేస్తూనే ఉన్నారు.(చదవండి: మా తాతయ్యను ఆదర్శంగా తీసుకోవద్దని చెప్పారు: చిరంజీవి ఆసక్తికర కామెంట్స్)ఇక పుష్ప 2 రిలీజ్ సమయంలో మెగా హీరోలెవరూ ఆ సినిమా గురించి మాట్లాడలేదు. ఏ చిన్న సినిమా విజయం సాధించినా మాట్లాడే చిరంజీవి.. పుష్ప 2 బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు ఇప్పటి వరకు ఉన్న చాలా రికార్డులను బద్దలు కొట్టినా.. స్పందించలేదు. అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు చిరంజీవితో సహా సినీ ప్రముఖులంతా పరామర్శిస్తే.. పవన్ కల్యాణ్, రామ్ చరణ్ మాత్రం తమకు తెలియదన్నట్లుగానే ఉన్నారు. పవన్ కల్యాణ్ అయితే ‘సంధ్య థియేటర్’ ఘటనలో అల్లు అర్జున్‌దే తప్పు అన్నట్లుగా మాట్లాడాడు. అయితే అరెస్ట్ తర్వాత బన్నీ వెళ్లి చిరంజీవిని కలవడంతో ఇరు కుటుంబాల మధ్య వివాదాలు సమిసిపోయాయని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా రామ్ చరణ్(Ram Charan) ఇన్‌స్టాలో బన్నీని అన్ ఫాలో చేయడంతో అలు మెగా-అల్లు ఫ్యామిలీ మధ్య ఏం జరుగుతుందనే చర్చలు మొదలయ్యాయి.బన్నీ మాత్రమే..రామ్ చరణ్- బన్నీల మధ్య మంచి స్నేహ బంధం ఉంది. వరుసకు బావ బామ్మర్దులు అయినా..అన్నదమ్ముల్లా కలిసి ఉండేవాళ్లు. చరణ్ కంటే ముందే బన్నీ సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. అతనికి ఇన్‌స్టాలో 28.5 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. అయితే బన్నీ మాత్రం తన సతీమణి స్నేహరెడ్డిని మాత్రమే ఫాలో అవుతున్నాడు. రామ్ చరణ్ కాస్త ఆలస్యంగా ఇన్‌స్టాలోకి వచ్చినా..26 మిలియన్ల ఫాలోవర్స్‌ని సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఆయన 38 మందిని ఫాలో అవుతున్నాడు. (చదవండి: 'ఈ రోజుల్లో కూడా ఇలాంటి ఆలోచనలా?'.. చిరంజీవి వ్యాఖ్యలపై స్పందించిన శ్యామల)మొన్నటి వరకు ఆ లిస్ట్‌లో అల్లు అర్జున్ కూడా ఉన్నాడు. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ సడెన్‌గా అన్ ఫాలో చేశాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. అయితే అల్లు అర్జున్ ను చరణ్ అన్‌ఫాలో చేసినప్పటికీ, ఆయన తమ్ముడు అల్లు శిరీష్ ని మాత్రం ఫాలో అవుతుండటం గమనార్హం. మరోవైపు మెగా కోడలు ఉపాసన కొణిదెల మాత్రం బన్నీని ఫాలో అవుతోంది. దీంతో చరణ్ - బన్నీ మధ్యే ఏదో సమస్య ఉండి ఉండొచ్చని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.చరణ్ స్పందించేనా?ఈ మధ్య సోషల్ మీడియాలో మెగా, అల్లు ఫ్యాన్స్ మధ్య పెద్ద యుద్దం నడుస్తోంది. మెగా హీరోలు ఏం మాట్లాడినా.. దానికి అల్లు ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. అలాగే అల్లు ఫ్యామిలీ సరదాగా మాట్లాడినా సరే.. కావాలనే హేళన చేస్తున్నాడంటూ మెగా ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఇటీవల ఓ ఈవెంట్ గేమ్ ఛేంజర్ నిర్మాత దిల్ రాజుపై అల్లు అరవింద్ సరదాగా పంచులేస్తే.. దాన్ని రామ్ చరణ్‌కి ఆపాదించి..అరవింద్‌ని ట్రోల్ చేశారు. అది భరించలేక చివరకు అరవింద్ వివరణ ఇచ్చాడు. తన మేనల్లుడు చరణ్‌తో మంచి రిలేషన్ ఉందని చెప్పాడు. ఇది చెప్పి వారం రోజులు కూడా దాటకముందే బన్నీని చరణ్ అన్‌ఫాలో చేయడం గమనార్హం. మరి ఇది పొరపాటున జరిగిందా లేదా కావాలనే అన్ ఫాలో చేశాడా అనేది తెలియాలి. ఒకవేళ దీనిపై చరణ్ స్పందించపోతే..ఇద్దరి ఫ్యాన్స్ మధ్య మళ్లీ సోషల్ మీడియా వార్ జరుగడం ఖాయం. ఈ ‘అన్ ఫాలో’ గొడవకి ఫుల్ స్టాప్ ఎవరు పెడతారో చూడాలి. -
మరోసారి ఆర్టీసీ బస్సులో 'తండేల్'.. వివరాలు షేర్ చేసిన నిర్మాత
నాగచైతన్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన తండేల్ సినిమాను పైరసీ వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే నిర్మాతలు బన్నీ వాసు, అల్లు అరవింద్ చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేశారు. కొద్దిరోజుల క్రితమే పలాస నుంచి విజయవాడ వెళ్లిన ఆర్టీసీ బస్సులో ఈ సినిమాను ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో చిత్ర యూనిట్ ఫైర్ అయింది. అయితే, తాజాగా మరోసారి ఏపీఎస్ ఆర్టీసీ బస్సులోనే ఈ సినిమాను ప్రదర్శించడంతో ఆ వార్త నెట్టింట వైరల్ అయింది. దీనిపై నిర్మాత బన్ని వాసు తన సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు.ఫిబ్రవరి 11న విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్లే బస్సులో తండేల్ సినిమాను ప్రదర్శించినట్లు బన్నీ వాసు తెలిపారు. ఆ బస్సుకు సంబంధించిన వివరాలు (AP 39 WB. 5566) షేర్ చేశారు. రెండోసారి ఏపీఎస్ ఆర్టీసీలోనే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో అక్కినేని ఫ్యాన్స్ కూడా ఫైర్ అవుతున్నారు. ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని బన్నీ వాసు కోరారు. 'మా సినిమా పైరసీని రెండోసారి ప్రదర్శించారు. ఎంతో కష్టపడి సినిమా తీశాం. ఇలాంటి పనుల వల్ల చిత్ర పరిశ్రమకు నష్టం జరుగుతుంది. ఎంతోమంది క్రియేటర్స్ శ్రమను అగౌరవపరచడమే అవుతుంది.' అని వాసు పేర్కొన్నారు.నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తండేల్’(Thandel). అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 7న రిలీజ్ అయింది. బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ రావడంతో సినిమా చూసేందుకు ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగింది. ఇలాంటి సమయంలో ఇలా పైరసీని ప్రొత్సాహిస్తే చిత్ర పరిశ్రమకు తీరని నష్టాన్ని తెచ్చినట్లు అవుతుందని చాలామందిలో అభిప్రాయం వ్యక్తమౌతుంది. సినిమా రిలీజైన రెండు రోజుల్లోనే పైరసీ ప్రింట్ బయటకు వస్తే సినిమా మనగుడ ఉండదని కూడా కొందరు హెచ్చరిస్తున్నారు.Once again the pirated version of our #Thandel played on the @apsrtc bus (Vehicle No: AP 39 WB. 5566). Piracy harms the film industry and disrespects creators' hard work. APSRTC Chairman #KonakallaNarayanaRao Garu, kindly ensure a strict circular is issued, prohibiting the… pic.twitter.com/xIrhziUkNP— Bunny Vas (@TheBunnyVas) February 11, 2025 -
అరెస్ట్ చేయిస్తాం... జాగ్రత్త : అల్లు అరవింద్ వార్నింగ్
‘‘పైరసీ చేయడం పెద్ద క్రైమ్. ప్రస్తుతం సైబర్ సెల్స్ బాగా పని చేస్తున్నాయి. మిమ్మల్ని (పైరసీదారులను) పట్టుకోవడం తేలిక. వాట్సప్, టెలిగ్రామ్ గ్రూప్ అడ్మిన్లకు ఇదే నా హెచ్చరిక... జాగ్రత్తగా ఉండండి. మీరు జైలుకు వెళ్లే అవకాశం ఉంది’’ అని నిర్మాత అల్లు అరవింద్(Allu Aravind) హెచ్చరించారు. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తండేల్’(Thandel). అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న రిలీజ్ అయింది. కాగా, ‘తండేల్’ సినిమాను పైరసీ చేసి, ఆన్లైన్లో పెట్టారు. ఈ విషయంపై సోమవారం ప్రెస్మీట్లో అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘నిర్మాతలు, ఫిల్మ్ ఛాంబర్, ఓటీటీ చర్యల వల్ల కొన్నేళ్లుగా సినిమా పైరసీ ఆగింది. కానీ రెండు నెలల నుంచి మళ్లీ పెరిగింది. మొన్న ‘దిల్’ రాజుగారి సినిమాను ఇలానే ఆన్లైన్లో విడుదల చేశారు. పైరసీ నియంత్రణకు ఫిల్మ్ ఛాంబర్లోని సెల్ రాత్రీ పగలూ పని చేస్తోంది. కానీ కొందరు వాట్సప్ గ్రూపుల్లో లింకులను ఫార్వార్డ్ చేస్తున్నారు. ఇలా చేస్తున్న వాట్సప్, టెలిగ్రామ్ గ్రూప్‌ల అడ్మిన్లను గుర్తించి, సైబర్ క్రైమ్ దృష్టికి తీసుకెళ్లాం. వారిని అరెస్ట్ చేయిస్తాం. ఏపీఎస్ఆర్టీసీ బస్సులో సినిమా పైరసీ ప్రింట్‌ను ప్రదర్శించడం డ్రైవర్ అమాయకత్వం. సినిమా సక్సెస్‌ను మేం ఆస్వాదించే క్రమంలో ఈ పైరసీ సమస్య మాకు ప్రతిబంధకం’’ అన్నారు. ‘‘క్రిమినల్ కేసులు నమోదు అయితే వెనక్కి తీసుకోలేము. పైరసీ చేసినవాళ్లకి, దాన్ని డౌన్లోడ్ చేసుకున్న వాళ్లకీ కేసులు వర్తిస్తాయి. ‘తండేల్’ సినిమా పైరసీ కాపీ ఓవర్సీస్ నుంచే వచ్చింది. ఇది తమిళ ప్రింట్ నుంచి వచ్చింది. దానికి తెలుగు ఆడియో కలిపారు. పైరసీ కాపీని ప్రదర్శించవద్దని కేబుల్ ఆపరేటర్స్‌ని కూడా హెచ్చరిస్తున్నాం’’ అని బన్నీ వాసు అన్నారు. ఇదిలా ఉంటే... ఈ సమావేశం నిర్వహించిన కొంత సమయానికి బన్నీ వాసు ‘ఎక్స్’ వేదికగా ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కె. నారాయణరావుని ఉద్దేశించి, ‘‘పైరసీని అడ్డుకునేందుకు కఠినమైన చర్యలు తీసుకోవడానికి నిజాయితీగా మీరు చేసిన ప్రయత్నాన్ని, ఈ విషయంపై త్వరితగతిన స్పందించినందుకు, ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు.ప్లీజ్... లీవ్ అజ్ బిహైండ్‘తండేల్’ ప్రీ రిలీజ్ వేడుకలో అల్లు అరవింద్ మాట్లాడినప్పుడు... ‘గేమ్ ఛేంజర్’ని తక్కువ చేసినట్లుగా ఉందని సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. ‘‘ఆ రోజు ‘దిల్’ రాజుగారిని ఉద్దేశించి, నేను మాట్లాడిన మాటలకు అర్థం... ఆయన ఒక్క వారం రోజుల్లోనే కష్టాలు–నష్టాలు–ఇన్కమ్ట్యాక్స్లు.. ఇవన్నీ అనుభవించారని. ఉద్దేశపూర్వకంగా నేను మాట్లాడిన మాటలు కాదు. మెగా అభిమానులు ఫీలై, నన్ను ట్రోల్ చేశారు. ఫీలైన ఆ అభిమానులకు చెబుతున్నాను... నాకు చరణ్ (రామ్‌చరణ్) కొడుకులాంటి వాడు. నాకున్న ఏకైక మేనల్లుడు. అందుకని ఎమోషనల్‌గా చెబుతున్నాను. ప్లీజ్... లీవ్ అజ్ బిహైండ్’’ అన్నారు. -
మెగా అభిమానులకు అల్లు అరవింద్ క్షమాపణలు
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) మెగా అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. రామ్‌చరణ్ (Ram Charan)ను చులకన చేసి మాట్లాడలేదని, తన మాటల్ని తప్పుగా అర్థం చేసుకుని ట్రోల్ చేస్తున్నారని వాపోయాడు. సోమవారం జరిగిన తండేల్ ఈవెంట్లో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ఈ మధ్య తండేల్ సినిమా ప్రమోషన్స్‌లో నేను రామ్‌చరణ్ స్థాయి తగ్గించానని ట్రోల్ చేశారు. కానీ నేను దిల్ రాజుగారి పరిస్థితి గురించి మాత్రమే మాట్లాడాను. ఏకైక మేనల్లుడుదిల్ రాజు ఒక్క వారం రోజుల్లోనే కష్టాలు, నష్టాలు, ఇన్కమ్ ట్యాక్సులు అన్నీ అనుభవించారన్నాను. ఇది ఉద్దేశపూర్వకంగా అనలేదు. అయినా దానికి కొందరు మెగా అభిమానులు ఫీలైపోయి నన్ను ట్రోల్ చేశారు. చరణ్ నాకున్న ఏకైక మేనల్లుడు. తను నాకు కొడుకులాంటోడు. నేను చరణ్‌కు ఏకైక మేనమామను. మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. ఉద్దేశపూర్వకంగా నేను ఏదీ అనలేదు. మీ మనోభావాలు దెబ్బతినుంటే క్షమించండి. ఇక్కడితో ఆ విషయాన్ని వదిలేయండి అని అల్లు అరవింద్ కోరాడు.(చదవండి: వాలంటైన్స్ వీక్.. ఓటీటీలో ఏకంగా 16 సినిమాలు రిలీజ్)ఇంతకీ ఏం జరిగిందంటే?అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించిన లేటెస్ట్ మూవీ తండేల్ (Thandel Movie). ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఆయన చురుకుగా పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో ఓ ఈవెంట్లో తన మేనల్లుడు రామ్‌చరణ్ తొలి సినిమా చిరుత సరిగ్గా ఆడలేదని, బిలో యావరేజ్ అని పేర్కొన్నాడు. అందుకే రెండో సినిమాతో హిట్ ఇవ్వాలని మగధీర తీశానన్నాడు. ఈ మూవీతో నష్టపోతానేమోనని భయపడ్డానని, కానీ అది బ్లాక్‌బస్టర్ సక్సెస్ అయిందన్నాడు. అలాగే దిల్ రాజును స్టేజీపైకి ఆహ్వానిస్తూ.. ఆయన వారం రోజుల్లోనే కష్టనష్టాలన్నీ చూశారన్నాడు. గేమ్ ఛేంజర్ వైఫల్యాన్ని అల్లు అరవింద్ తన మాటల్లో ఎత్తిచూపుతున్నాడని, చరణ్‌ను కించపరుస్తున్నాడని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.అల్లు అరవింద్‌పై ట్రోలింగ్అలాగే చిరుత యావరేజ్ కంటే కూడా తక్కువే ఆడిందన్న మాటను మెగా ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. ఈ సినిమా సక్సెస్ అయితే ఫ్లాప్ అంటాడేంటని మండిపడ్డారు. దీంతో అరవింద్‌పై విరుచుకుపడుతూ ట్రోల్ చేశారు. ఈ ట్రోలింగ్ గురించి తండేల్ ప్రెస్మీట్లో అల్లు అరవింద్‌కు ప్రశ్న ఎదురైంది. అందుకాయన స్పందిస్తూ.. ట్రోలింగ్ తన దృష్టికి వచ్చిందని, గమనిస్తున్నానన్నాడు. కానీ దీనిపై కామెంట్ చేయనంటూ తెలివిగా సమాధానం దాటవేశాడు. దీంతో అల్లు అరవింద్ ఉద్దేశపూర్వకంగా రామ్‌చరణ్‌ను, చిరుత సినిమాను చులకన చేస్తూ మాట్లాడారని వివాదం ఊపందుకుంది. తాజాగా అరవింద్.. చరణ్ తన కొడుకులాంటివాడంటూ వివరణ ఇవ్వడంతో ఈ వివాదం సద్దుమణిగినట్లయింది.చదవండి: పెళ్లయి 21 ఏళ్లు.. తల్లి కావాలనుంది.. పద్మప్రియ -
గజినీ 2 తో 1000 కోట్లు కొట్టాలి
-
తండేల్ చిత్ర టికెట్ ధరలపై అల్లు అరవింద్ కీలక వ్యాఖ్యలు
-
తెలుగు నిర్మాత అంటే తలెత్తి చూస్తున్నారు: అల్లు అరవింద్
‘‘నేను నిర్మించిన ‘మగధీర’ సమయంలో రూ.40 కోట్లు బడ్జెట్ అంటే... ఈ రోజు ద్రవ్యోల్బణం తీసుకుంటే సుమారు రూ. 350 కోట్లు అవుతుంది. ప్రస్తుతం దాదాపు అందరూ ఇంత బడ్జెట్‌తో సినిమాలు తీస్తున్నారు. ఈ రోజు తెలుగు సినిమా నిర్మాత అంటే తలెత్తి చూస్తున్నారు. దీనికి కారణం అలాంటి సినిమాలు చేయగల హీరోలు, దర్శకులు తెలుగులో ఉన్నారు. ఇది తెలుగు వారి విజయం’’ అని అల్లు అరవింద్(Allu Aravind) తెలిపారు. అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’(Thandel). చందు మొండేటి దర్శకత్వం వహించారు.అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం నేడు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘మా కంట్రోల్లో లేని ఏరియాల్లో మా చిత్రాల విడుదలని బయటి వారికి ఇస్తాం తప్పితే మిగతా అంతా మేమే రిలీజ్ చేస్తున్నాం. మేం అనుకున్న దానికంటే ‘తండేల్’కి బడ్జెట్ ఎక్కువ అయ్యింది. నా వద్దకు బన్నీ వాసు వచ్చి ‘మన సినిమా బయటకి అమ్మేద్దామా?’ అన్నాడు. ఏం ఫర్వాలేదు.. మనమే రిలీజ్ చేస్తున్నామని చెప్పాను’’ అని పేర్కొన్నారు. నాగచైతన్య మాట్లాడుతూ–‘‘నాన్న(నాగార్జున) గారికి మా సినిమా చాలా నచ్చింది. ఆయన్ని సక్సెస్ మీట్‌కి తీసుకొస్తాం’’ అని చెప్పారు.చందు మొండేటి మాట్లాడుతూ– ‘‘తొమ్మిది నెలలు ఓ మనిషి కోసం ఎదురుచూడటం, ఆ మనిషి తనకోసం వస్తాడనే నమ్మకం.. ఇలా చాలా అందమైన భావోద్వేగాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఈ మూవీ చూశాక చైతన్య, సాయి పల్లవిలో ఎవరి నటన బాగుందనే చర్చ పెడతారు. నన్ను అడిగే చైతన్య చేసిన రాజుపాత్ర అని చెబుతాను’’ అన్నారు. బన్నీ వాసు మాట్లాడుతూ–‘‘ఈ సినిమాలోపాకిస్తాన్ సీక్వెన్ ్స కోసం చందూగారు చాలా పరిశోధన చేశారు. నాగేంద్రగారు అద్భుతమైన సెట్ వేశారు’’ అని చెప్పారు. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర,పాటల రచయిత శ్రీమణి మాట్లాడారు. -
తెలంగాణలో తండేల్ షోలు.. అంత బెనిఫిట్ మాకొద్దు: అల్లు అరవింద్ ఆసక్తికర కామెంట్స్
నాగచైతన్య హీరోగా వస్తోన్న తండేల్ చిత్ర టికెట్ ధరలపై టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టికెట్ ధరల పెంపు కోసం ప్రభుత్వాన్ని సంప్రదించలేదని అన్నారు. ఏపీలో మాత్రమే తండేల్ టికెట్ ధరల పెంపు కోసం అడిగామని తెలిపారు. తెలంగాణలో తండేల్ బెనిఫిట్ షోలు లేవని.. అంత బెనిఫిట్ కూడా వద్దని ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలంగాణ మల్టీప్లెక్స్‌ల్లో రూ.295, రూ. 395 టికెట్ ధరలు ఇప్పటికే పెరిగి ఉన్నాయని అల్లు అరవింద్ తెలిపారు.అల్లు అరవింద్ మాట్లాడుతూ.. 'ఆంధ్రప్రదేశ్‌లోనే సినిమా టికెట్ ధరలు తక్కువగా ఉన్నాయి. అందుకే అక్కడ టికెట్ ధరలు రూ.50 పెంచమనే ఏపీ ప్రభుత్వాన్ని అడిగాం. తెలంగాణలో టికెట్ ధరల పెంపు కోసం ప్రభుత్వాన్ని అడగలేదు. ఎందుకంటే ఇక్కడ ఇప్పటికే టికెట్ ధరలు రూ.295, రూ. 395 పెరిగి ఉన్నాయి. తండేల్ సినిమాకు తెలంగాణలో ఎలాంటి బెనిఫిట్ షోలు లేవు. అంత బెనిఫిట్ కూడా మాకొద్దు. ఈ సినిమాకు అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చయింది. మా వాసు, కొంతమంది నా దగ్గరకు వచ్చి ఈ సినిమాను ఏరియాల వారీగా అమ్మేద్దామని అడిగారు. కానీ నేను సినిమా చూశాక మనమే విడుదల చేద్దామని చెప్పా' అని అన్నారు.కాగా.. అక్కినేని హీరో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం తండేల్. చందు మొండేటి డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన తండేల్ మూవీ ట్రైలర్, సాంగ్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మత్స్యకార బ్యాక్ డ్రాప్లో తెరకెక్కించిన ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. -
'సాయి పల్లవి'పై నమ్మకం, 'రామ్ చరణ్'పై ప్రేమ.. అల్లు అరవింద్ వ్యాఖ్యలు
నాగచైతన్య- సాయి పల్లవి కాంబినేషన్లో తెరకెక్కిన ‘తండేల్’ సినిమా ప్రమోషన్స్ చాలా స్సీడ్గానే జరుగుతున్నాయి. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ‘లవ్ స్టోరీ’ (2021) వంటి హిట్ ఫిల్మ్ తర్వాత నాగచైతన్య, సాయిపల్లవి జోడీగా నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. చందు మొండేటి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే, తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యలో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. తండేల్ కోసం సాయి పల్లవిని ఎందుకు తీసుకున్నారో చెప్పారు.అమ్మాయిలకు వైట్ స్కిన్ ఉంటే సరిపోదు..వాస్తవ ఘటనల స్ఫూర్తితో రూపొందిన చిత్రం ‘తండేల్’ అని అల్లు అరవింద్ అన్నారు. లవ్ ఎలిమెంట్స్‌తో పాటు మంచి యాక్షన్ కూడా ఇందులో ఉంటుంది. తండేల్ రాజు పాత్రలో నాగచైతన్య అద్భుతమైన నటన చూస్తారని ఆయన అన్నారు. ఇదే సమయంలో సాయి పల్లవి గురించి ఆయన ఇలా అన్నారు. 'తండేల్‌లో సాయి పల్లవి ఎంపిక నాదే.. కమర్షియల్‌గా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. బుజ్జితల్లి పాత్ర కోసం ముంబైకి వెళ్లి హీరోయిన్ను తీసుకురాలేదు. అక్కడి నుంచి వచ్చిన అమ్మాయిల స్కిన్ వైట్‌గా ఉండొచ్చు కానీ, ఈ పాత్రకు జీవం తీసుకురాలేరనేది నా అభిప్రాయం. కథలో ఈ పాత్ర చుట్టూ చాలా భావోద్వేగాలు ఉంటాయి. సినిమా చూశాక సాయి పల్లవి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ పాత్ర సాయి పల్లవి అయితే చాలా నిజాయతీగా నటించగలదని అనుకున్నాను. అందరి అంచనాలకు మించి ఆమె వంద శాతం సినిమాకు న్యాయం చేసింది. ఆమెలోని టాలెంట్ అనంతం.' అని చెప్పవచ్చన్నారు.అదీ.. నా అల్లుడిపై ప్రేమరామ్ చరణ్‌తో పాటు గీతా ఆర్ట్స్‌కు మగధీర సినిమా చాలా ప్రత్యేకం. ఈ సినిమాను చరణ్‌తో చేయాలని రాజమౌళినే ఎందుకు కలిశారని అల్లు అరవింద్‌ను బాలీవుడ్ మీడియా ప్రశ్నించింది. నా అల్లుడు (రామ్ చరణ్) మొదటి సినిమా చిరుత యావరేజ్‌గా రన్ అయింది. అలాంటి సమయంలో అతని తర్వాతి సినిమా చేసే ఛాన్స్ నాదే. చరణ్‌కు మంచి హిట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఈ క్రమంలోనే మంచి దర్శకుడిని సంప్రదించాలని ముందే అనుకున్నాను. చరణ్ సినిమా కోసం ఎంత ఖర్చు అయినా పెట్టేందుకు రెడీగా ఉన్నాను. అలాంటి సమయంలో రాజమౌళిని సంప్రదించాను. అలా మగధీర రావడానికి కారణం అయింది. అలా నా అల్లుడికి పెద్ద హిట్ ఇచ్చాను. అది తనపై నాకున్న ప్రేమ' అంటూ అరవింద్ పేర్కొన్నారు.గతంలో కూడా మగధీర గురించి అల్లు అరవింద్ పలు వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా కోసం అనుకున్నదానికంటే 80 శాతం ఖర్చు అధికమైందని ఆయన అన్నారు. మగధీర కోసం తన దగ్గర ఉన్న మొత్తం డబ్బులను పెట్టానని ఆయన అన్నారు. అయితే, ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్స్‌తో సంబంధం లేకుండా ఆయనే సొంతంగా విడుదల చేశారు. మూవీ విడుదలయ్యాక దానికి మూడింతలు వచ్చిందని ఆయనే అన్నారు. ఒక్కోసారి రిస్క్ చేసి పొగొట్టుకున్న సందర్భాలూ కూడా ఉన్నాయని తెలిపారు. -
‘తండేల్’ మూవీ విశేషాలు చెప్పిన నాగచైతన్య (ఫొటోలు)
-
అల్లు అర్జున్‌కు అనారోగ్యం.. అందుకే ఇక్కడకు రాలేదు: అల్లు అరవింద్
అల్లు అరవింద్(Allu Aravind) సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం 'తండేల్'. చందూ మొండేటి తెరకెక్కించిన ఈ చిత్రంలో నాగచైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించారు. పాన్ ఇండియా రేంజ్లో ఫిబ్రవరి 7న ఈ చిత్రం విడుదల కానుంది. తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ వస్తున్నారని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కానీ, బన్నీ ఈ కార్యక్రమంలో పాల్గొనడం లేదని చివరిక్షణంలో తెలిపారు. అందుకు కారణాలను అల్లు అరవింద్ వివరించారు.విదేశాల నుంచి అల్లు అర్జున్తండేల్ ఈవెంట్ కోసం అల్లు అర్జున్ వస్తున్నారని తెలపడంతో ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే, ఆయన స్థానంలో ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా హాజరయ్యారు. అందుకు కారణాలను అల్లు అరవింద్ ఇలా చెప్పారు. 'ఈ ఈవెంట్‌కు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వస్తున్నట్లు ముందుగా చెప్పాం. కానీ, బన్నీ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. అనారోగ్యం కారణంగా అల్లు అర్జున్ రాలేదు. ఈ కార్యక్రమం కోసమే వేరే దేశం నుంచి అదే పనిగా హైదరాబాద్ వచ్చాడు. అయితే, తీవ్రమైన గ్యాస్ సంబంధిత సమస్య కారణంగా బన్నీ ఈ కార్యక్రమానికి రాలేదు' అని అల్లు అరవింద్ తెలిపారు.నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. 2018లో శ్రీకాకుళం నుంచి గుజరాత్‌కు వలస వెళ్లిన మత్స్యకారులు పొరపాటున పాకిస్తాన్ బోర్డర్ క్రాస్ చేసి, అక్కడి కోస్టుగార్డులకు బందీలుగా చిక్కారు. ఇదే కథను ఆధారంగా చేసుకుని ‘తండేల్’ తీశారు. ఈ ఘటనలో నిజంగా భాగమైన వారిలో తండేల్ రామారావు, రాజు, కిశోర్ తదితరులు ఈ వేడుకలో పాల్గొని, వారి అనుభవాలను పంచుకున్నారు. శ్రీకాకుళం నుంచి వచ్చిన ఆ మత్సకారులను నాగచైతన్య వేదిక పైకి పిలిచారు. వారిపై ప్రశంసలు కురింపించారు. -
‘తండేల్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
నాగచైతన్య తండేల్ ఈవెంట్.. డ్యాన్స్‌తో అదరగొట్టిన అల్లు అరవింద్
అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), సాయి పల్లవి(Sai Pallavi) జంటగా నటించిన చిత్రం 'తండేల్'(Thandel Movie). కార్తికేయ 2 ఫేమ్ చందు మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న థియేటర్లలో సందడి చేయనుంది. ఇటీవల రిలీజైన ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ నేపథ్యంలో తండేల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. తండేల్ జాతర పేరుతో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.(ఇది చదవండి: బన్నీ ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ‘తండేల్’ టీమ్.. నో ఎంట్రీ!)డ్యాన్స్‌తో ఆకట్టుకున్న అల్లు అరవింద్..అయితే ఈ ఈవెంట్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ తన డ్యాన్స్‌తో అలరించారు. యాంకర్ సుమ కనకాలతో కలిసి స్టెప్పులు వేశారు. హైలెస్సా హైలెస్సా అంటూ సాగే పాటకు ఆయన డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను గీతా ఆర్ట్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. కాగా.. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీవాస్ నిర్మించారు. The legendary producer does it again 💥💥💥The super energetic #AlluAravind Garu shakes his leg for #HailessoHailessa at the #ThandelJaathara ❤️🔥Watch the #ThandelJaathara live now 💥💥▶️ https://t.co/DPO8zzLUOv#Thandel GRAND RELEASE WORLDWIDE ON FEBRUARY 7th.… pic.twitter.com/qo8OvOwNeB— Geetha Arts (@GeethaArts) February 2, 2025 -
‘తండేల్’కి దేవిశ్రీని తీసుకోవద్దనుకున్నా.. కానీ.. : అల్లు అరవింద్
సినిమా ఆడాలంటే..దమ్మున్న కథ కావాలి. మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకుడు కచ్చితంగా థియేటర్‌కు వస్తాడు. అందులో డౌటే లేదు. కానీ అది ఎంత మంచి కంటెంట్ అయినా సరే.. ప్రేక్షకులకు రీచ్ కాకపోతే అంతే సంగతి. అందుకే రిలీజ్‌కు ముందే పాటలు, ట్రైలర్, టీజర్లను విడుదల చేస్తూ సినిమాని ప్రమోట్ చేసుకుంటారు మేకర్స్. రిలీజ్‌కు ముందు..రిలీజ్ తర్వాత కూడా సినిమా విజయంలో కీలక పాత్ర పోషించేంది సంగీతం అనే చెప్పాలి. పాటలు, నేపథ్య సంగీతం బాగుంటే చాలు సినిమా సగం హిట్టయినట్టే. అందుకే సంగీత దర్శకుల విషయంలోనూ నిర్మాతలు ఆచి తూచి అడుగేస్తారు. జానర్‌ని బట్టి మ్యూజిక్ డైరెక్టర్లను ఎంచుకుంటారు. ఇక ప్రేమ కథలకు పెట్టింది పేరు దేవిశ్రీ ప్రసాద్(Devi Sri Prasad). లవ్‌స్టోరీ చిత్రాలకు ఆయన అందించే పాటలు ఎలా ఉంటాయో తెలుగు ప్రేక్షకులందరికి తెలిసిందే. మెలోడీ అయినా మాస్ సాంగ్ అయినా.. హృదయాలను హత్తుకుంటాయి. తాజాగా తండేల్(Thandel) చిత్రానికి కూడా దేవి అలాంటి పాటలే అందించాడు. ఈ చిత్రం నుంచి విడుదలైన అన్ని పాటలు ఇప్పటికే సూపర్ హిట్‌గా నిలిచాయి. హైలేస్సో హైలెస్సా.. సాంగ్ అయితే అంతటా మార్మోగుతుంది. అలాంటి చాట్ బస్టర్స్ అందించిన దేవిశ్రీ.. ఈ సినిమాకు ఫస్ట్ చాయిస్ కాదట. అసలు ఈ చిత్రానికి అతన్ని తీసుకోవద్దని నిర్మాత అల్లు అరవింద్ అనుకున్నారట. బన్నీ చెప్పడంతోనే తండేల్ చాన్స్ డీఎస్పీకి వచ్చిందట. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రబృందం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అరవింద్ ఈ విషయాన్ని చెప్పారు.దేవి సంగీతం వద్దని చెప్పానుతండేల్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా దేవిప్రసాద్‌ని పెట్టుకుందామని మా టీమ్ చెబితే నేను వద్దని చెప్పాను. ఎందుకంటే..పుష్ప2 సినిమా, మా సినిమా పనులు ఒకేసారి ప్రారంభం అయ్యాయి. దేవి పుష్ప 2కి సంగీతం అందించడంలో బిజీగా ఉన్నాడు. అలాంటి వాడిని తీసుకుంటే మన సినిమాకు న్యాయం చేయలేడని టీమ్‌కి చెప్పాను. వేరే మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకోవాలనుకున్నాం.బన్నీ చెప్పడంతో..దేవి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. వాళ్ల నాన్న(సత్య మూర్తి) నా స్నేహితుడు. మేమిద్దరం కలిసి ఎన్నో సినిమాలు చేశాం. కానీ పుష్ప 2 లాంటి సినిమాకు పని చేస్తున్నప్పడు.. ఇంకో సినిమాకు న్యాయం చేయలేడేమో అనిపించింది. దేవిని వాళ్లే(పుష్ప టీమ్) లాగేసుకుంటారు. మాకు సమయం కేటాయించడు అనుకున్నాం. అయితే తండేల్‌కి మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎవరి తీసుకోవాలనేది అర్థం కాలేదు. ఓ రోజు ఇంట్లో భోజనం చేస్తున్న సమయంలో అల్లు అర్జున్‌కి ఈ విషయం చెప్పాను. ‘ఎవరి తీసుకోవాలో తెలియడం లేదు. దేవిని తీసుకుంటే.. మీరు(పుష్ప 2) ఇబ్బంది పెడతారు. అతన్ని తీసుకోవాలంటే నిన్ను(బన్నీ), దర్శకుడు(సుకుమార్) ఇలా అందరిని అడగాల్సి ఉంటుంది. అందుకే వేరే వ్యక్తిని చూద్దాం అనుకుంటున్నాను’అని చెప్పా. వెంటనే బన్నీ.. ‘దేవినే బెస్ట్ చాయిస్. లవ్‌స్టోరీలకు దేవిని మించినోడు లేడు..అతన్నే తీసుకోండి’ అని చెప్పాడు. దీంతో మేం దేవిని సంప్రదించాం’ అని అరవింద్ చెప్పుకొచ్చాడు. కాగా, చందు మొండేటి దర్వకత్వంలో నాగచైనత్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. -
'అమిర్ ఖాన్‌తో వెయ్యి కోట్ల సినిమా'.. తండేల్ ఈవెంట్లో అల్లు అరవింద్ కామెంట్స్
అక్కినేని నాగచైతన్య తండేల్(Thandel Movie) మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్(Allu Aravind) ఆసక్తికర కామెంట్స్ చేశారు. అమిర్ ఖాన్(Amir Khan) గజిని (Ghajini)సినిమాను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అప్పట్లో గజిని రూ.100 కోట్ల క్లబ్లో చేరిన తొలి భారతీయ చిత్రంగా నిలిచిందన్నారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే అమిర్ ఖాన్ మాతో ఛాలెంజ్ చేశారని గుర్తు చేసుకున్నారు. కచ్చితంగా వందకోట్లు రాబడుతుందని అన్నారని.. అందుకే మేం ప్రమోట్ చేసినట్లు అల్లు అరవింద్ వెల్లడించారు. ఇవాళ ముంబయిలో జరిగిన తండేల్ హిందీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు బాలీవుడ్ హీరో అమిర్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.అయితే ఈవెంట్లో అల్లు అరవింద్ తన మనసులోని మాటను బయటపెట్టారు. అప్పుడు రూ.100 కోట్లు ఎక్కువని.. ఇప్పుడైతే రూ.1000 కోట్లు రాబట్టే సినిమా తీయాలనుందని ఆయన అన్నారు. అది గజిని-2 కూడా కావొచ్చని అరవింద్ నవ్వుతూ మాట్లాడారు. అయితే కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన గజిని చిత్రాన్ని హీందీలో రీమేక్ చేశారు. తమిళంలో సూపర్‌హిట్‌గా నిలిచిన గజిని.. బాలీవుడ్‌లోనూ సత్తా చాటింది. మరోవైపు గజిని-2 కూడా ఉంటుందని గతంలో సూర్య హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.కాగా.. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన పాన్ ఇండియా చిత్రం తండేల్. ఈ మూవీ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. చందు మొండేటి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మత్స్యకార బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీని తెరకెక్కించారు. ఇటీవల తెలుగులో ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా హిందీలోనూ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని గీతా ఆర్స్ట్ బ్యానర్లో బన్నీవాసు నిర్మించారు. -
300 కోట్ల బడ్జెట్.. హీరోగాసూర్య లేదా చరణ్, నో చెప్పిన దర్శకుడు!
చిత్ర పరిశ్రమలో విజయానికే విలువెక్కువ. ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ అయినా సరే..ఫ్లాప్ ఇస్తే మరో చాన్స్ రావడానికి చాలా సమయం పడుతుంది. గతంలో ఎన్ని రికార్డులు క్రియేట్ చేసినా సరే.. ప్లాప్ డైరెక్టర్‌తో సినిమా తీసేందుకు నిర్మాతలు కాస్త ఆలోచిస్తారు. అదే ఒక్క హిట్ పడితే చాలు కోట్ల అడ్వాన్స్ ఇచ్చి మరీ బుక్ చేసుకుంటారు. బడ్జెట్‌తో సంబంధం లేకుండా మాక్కూడా బ్లాక్ బస్టర్ అందించని ఎంత డబ్బులైనా ఇచ్చేస్తారు. కార్తికేయ 2 తర్వాత దర్శకుడు చందూ మొండేటి(Chandoo Mondeti )కి కూడా ఇలాంటి ఆఫరే వచ్చిందట. 300 కోట్ల బడ్జెట్ ఇస్తా.. రామ్ చరణ్, సూర్య లాంటి హీరోలను సెట్ చేస్తా భారీ సినిమా చెయ్ అని నిర్మాత అల్లు అరవింద్(Allu Aravind) అన్నారట.కానీ ఆయన మాత్రం తండేల్(Thandel) కథనే చేస్తానని, అది కూడా నాగచైతన్యతోనే చేస్తానని చెప్పడంతో వారి ఆలోచనను విరమించుకున్నారట. ఈ విషయాన్ని తాజాగా చందు మొండేటి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.‘కార్తికేయ-2 తర్వాత గీతా ఆర్ట్స్‌లో సినిమా చేయాల్సి వచ్చినపుడు.. తండేల్ కథ నా ముందుకు వచ్చింది. అయితే అల్లు అరవింద్, బన్నీవాసు ఆ కథ సినిమాకు సెట్ కాదని అనుకున్నారు. కార్తికేయ-2ను నేను హ్యాండిల్ చేసిన తీరు గురించి చెబుతూ పెద్ద సినిమా చేద్దామన్నారు. ‘మన దగ్గర సూర్య ఉన్నాడు, అలాగే రామ్ చరణ్ సైతం అందుబాటులో ఉన్నాడు. 300 కోట్ల దాక బడ్జెట్ ఇస్తాం. భారీ సినిమా ప్లాన్ చెయ్’ అని చెప్పారు. నీ నేను మాత్రం ‘తండేల్’ కథే ఎందకు చేయకూడదు అన్నాను. ఆ కథే నాకు ఎక్కువ నచ్చి దాన్నే చేయడానికి రెడీ అయ్యాను’ అని చందూ మొండేటి అన్నారు.ఇక తండేల్ విషయానికొస్తే.. కార్తికేయ 2 తర్వాత చందు దర్శకత్వం వహించిన చిత్రమిది. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఇటీవల రిలీజైన ట్రైలర్ కూడా సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
నా ఇంట్లో రూలింగ్ పార్టీ వైజాగే: నాగచైతన్య
నాగచైతన్య(Naga Chaitanya), సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’. చందు మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘తండేల్’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను వైజాగ్‌లోని రామా టాకీస్ రోడ్డులోని శ్రీరామ పిక్చర్ ప్యాలెస్‌లో నిర్వహించింది చిత్రం యూనిట్. ఈ వేడుకలో నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘మన పుష్పకా బాప్ అల్లు అరవింద్‌గారు. ఏడాదిన్నర నుంచి నా లైఫ్‌లో నిజమైన తండేల్ ఆయనే. ఈ సినిమాకి ఆయన ఇచ్చిన గైడెన్స్ చాలా విలువైనది. ఏ సినిమా రిలీజ్ తర్వాత అయినా వైజాగ్ టాక్ ఏంటి? అని కనుక్కుంటాను. ఎందుకంటే... వైజాగ్‌లో సినిమా ఆడిందంటే ప్రపంచంలో ఎక్కడైనా ఆడాల్సిందే. వైజాగ్ నాకు ఎంత క్లోజ్ అంటే నేను వైజాగ్ అమ్మాయి (శోభిత)ని ప్రేమించి, పెళ్లి చేసుకుని, ఇప్పుడు... నా ఇంట్లో కూడా వైజాగ్ ఉంది. నా ఇంట్లో రూలింగ్ పార్టీ వైజాగే. ‘తండేల్’(Thandel) సినిమాకు వైజాగ్‌లో కలెక్షన్స్ షేక్ అవ్వాలి. లేకపోతే ఇంట్లో నా పరువు పోతుంది (సరదాగా). దద్దా... గుర్తెట్టుకో... ఈ పాలి యాట గురి తప్పేదేలేదేస్. ఫిబ్రవరి 7న రాజులమ్మ జాతరే’’ అని అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘శ్రీకాకుళంలో ఒక చిన్న ఊర్లో జరిగిన కథను సినిమాగా తీశాం. నాగచైతన్య ఏ సినిమాలోనూ ఇంతవరకు నటించని స్థాయిలో ఈ సినిమాలో నటించారు. కొన్ని సీన్స్ చూస్తే మన గుండె కరిగిపోయేలా నటించారు. ఈ కథను చందు మొండేటి అత్యద్భుతంగా మలిచి, చాలా బాగా తీశారు. సాయిపల్లవిగారు అద్భుతంగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ చించిపడేశాడు’’ అని తెలిపారు. తండేల్ ట్రైలర్ విషయానికొస్తే.. నాతన్య, సాయి పల్లవి మధ్య అదిరిపోయిన కెమెస్ట్రీకి తోడు కాస్త దేశభక్తిని కూడా జోడించి డైరెక్టర్ చందూ మొండేటి ఈ సినిమాను భారీగా ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ ఇద్దరి నోటా ఉత్తరాంధ్ర యాస బాగా పలికింది. తండేల్ అంటే లీడర్ అనే విషయాన్ని ఈ ట్రైలర్ ద్వారా తెలియజేశారు. ‘రాజూ.. ఊళ్లో అందరూ మన గురించి ఏటేటో మాటాడుకుంటున్నారు రా’ అనే సాయి పల్లవి డైలాగుతో ట్రైలర్ మొదలవుతుంది. వాళ్లు అనుకుంటున్నదే నిజం చేసేద్దామని ఆమె అనగానే ఇద్దరి లవ్ స్టోరీ మొదలవుతుంది. అయితే తరచూ చేపల వేటకు వెళ్లే అతడు.. ఆమెకు దూరమవుతూ ఉంటాడు. కానీ ఓసారి పాకిస్తాన్ సరిహద్దుకు వెళ్లి అక్కడే చిక్కుకుపోతాడు. అక్కడితో ట్రైలర్ కాస్తా లవ్ ట్రాక్ నుంచి దేశభక్తి వైపు వెళ్తుంది. మా దేశంలోని ఊరకుక్కలన్నీ ఉత్తరం వైపు తిరిగి పోస్తే.. ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా పోతుంది.. మా యాసను మాత్రం ఎటకారం చేస్తే రాజులమ్మ జాతరే అని రెండు పవర్ ఫుల్ డైలాగులు చైతూ నోటి వెంట వినిపిస్తాయి. మొత్తం ట్రైలర్ ఒక పవర్ ప్యాక్డ్గా ప్రేక్షకులను తొలిరోజే థియేటర్లకు రప్పించేలా ఉంది. -
నాగచైతన్య ‘తండేల్’ HD మూవీ స్టిల్స్
-
పుష్ప స్టైల్లో తండ్రికి బర్త్ డే విషెస్ చెప్పిన ఐకాన్ స్టార్..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తండ్రి బర్త్ డేను సెలబ్రేట్ చేసుకున్నారు. నాన్న అల్లు అరవింద్‌తో బన్నీ స్వయంగా కేక్ కట్ చేయించారు. ఈ వేడుకలో బన్నీ భార్య స్నేహరెడ్డి, పిల్లలు అయాన్, అర్హ కూడా పాల్గొన్నారు. అల్లు అరవింద్ కేక్ కట్ చేసిన ఫోటోను ట్విటర్ ద్వారా పంచుకున్నారు బన్నీ. తాజాగా అలలు అర్జున్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.పుష్ప కా బాప్ అంటూ..ఈ పోస్ట్‌లో పుష్ప కా బాప్ అని రాసిన ఉన్న కేక్ ఫోటోను కూడా షేర్ చేశారు. ఈ కేక్ ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ విషయం తెలుసుకున్న బన్నీ ఫ్యాన్స్ అల్లు అరవింద్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. బాక్సాఫీస్ వద్ద పుష్ప-2 జోరు..గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన పుష్ప-2 ది రూల్ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ఈ సినిమా భారతీయ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇప్పటికే బాహుబలి, కేజీఎఫ్, బాహుబలి-2 రికార్డులను తిరగరాసింది. ప్రస్తుతం రూ.1800 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది.ఈ నేపథ్యంలోనే అమిర్ ఖాన్ చిత్రం దంగల్ వసూళ్ల రికార్డ్‌పై పుష్పరాజ్ కన్నుపడింది. రూ.2 వేల కోట్లకు పైగా వసూళ్లతో తొలిస్థానంలో దంగల్ కొనసాగుతోంది. ఆ రికార్డ్‌ను బద్దలు కొట్టేందుకు పుష్ప మేకర్స్ సరికొత్త ప్లాన్‌తో ఆడియన్స్ ముందుకొచ్చారు. ఈనెల 17 నుంచి దాదాపు 20 నిమిషాల పాటు అదనంగా సీన్స్ జోడించనున్నట్లు ప్రకటించారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.బన్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..అయితే తాజాగా ఈ విషయంలో బన్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. పుష్ప-2 ది రూల్ రీ లోడింగ్ వర్షన్ తేదీని మార్చారు. ముందుగా ఈనెల 11 నుంచే వస్తుందని ప్రకటించారు. కానీ ఆ డేట్ కాకుండా జనవరి 17న తీసుకు రానున్నట్లు తెలిపారు. దీంతో ఈ నెల 11న పుష్ప-2 ఎక్స్ట్రా ఫైర్ చూడాలనుకున్న ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌కు నిరాశ ఎదురైంది. దంగల్ రికార్డ్‌పై గురి..అల్లు అర్జున్ పుష్ప-2 ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించింది. కేవలం 32 రోజుల్లోనే భారతీయసినీ చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పటికే 'బాహుబలి-2', కేజీఎఫ్ లాంటి పెద్ద సినిమాల ఆల్ టైమ్ వసూళ్లను పుష్ప-2 అధిగమించింది. ఈ లెక్కన చూస్కతే అమిర్ ఖాన్ దంగల్ మూవీ మాత్రమే పుష్ప-2 కంటే ముందుంది. ఈ మూవీ అదనపు సీన్స్ యాడ్ చేయడం చూస్తే దంగల్ రికార్డ్‌పైనే గురి పెట్టినట్లు తెలుస్తోంది.ప్రీ రిలీజ్ బిజినెస్‌లోనూ రికార్డ్..పుష్ప-2 విడుదలకు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం సినిమా విడుదల రోజు నుంచే వసూళ్ల సునామీ సృష్టించింది. పుష్పరాజ్ కలెక్షన్స్ చూసి ప్రపంచ సినీ ప్రేమికులు ఫిదా అయిపోయారు. తొలి రోజు నుంచే ఇండియాలో ఆల్‌టైమ్ రికార్డులు సృష్టించింది. కేవలం 32 రోజుల్లో రూ.1831 కోట్లు వసూలు చేసి ఇండియా చరిత్రలో ఆల్‌టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో రష్మిక మందన్నా కథానాయికగా నటించంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతమందించారు. Happy Birthday Dad . Thank you for making our lives soo special with your gracious presence . pic.twitter.com/CgWYsbk2eF— Allu Arjun (@alluarjun) January 10, 2025 -
సీఎం రేవంత్‌తో సీనీ ప్రముఖుల భేటీ (ఫోటోలు)
-
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖుల భేటి.. ముహుర్తం ఫిక్స్!
సంధ్య థియేటర్ ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు టాలీవుడ్ సినీ ప్రముఖులు సిద్ధమయ్యారు. ఇప్పటికే అపాయింట్మెంట్ తీసుకున్న సినీ పెద్దలు గురువారం ఉదయం 10 గంటలకు సమావేశం కానున్నారు. ఈ భేటీకి టాలీవుడ్ తరఫున ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు, మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, హీరో వెంకటేశ్ కుడా హాజరు కానున్నారు.గురువారం ఉదయం 10 గంటలకు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సంధ్య థియేటర్ ఘటన తర్వాత జరిగిన పరిణామాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. దిల్‌రాజుతో పాటు పలువురు నిర్మాతలు, దర్శకులు కూడా హాజరవుతారని సమాచారం. సంధ్య థియేటర్ ఘటనతో పాటు సినిమా పరిశ్రమ సమస్యలపై కూడా చర్చిస్తారని టాక్ వినిపిస్తోంది. ఈ భేటీలో ప్రభుత్వం తరఫున మంత్రులు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి, ఉత్తమ్, దామోదర రాజనర్సింహ హాజరు కానున్నారు. -
శ్రీ తేజ కుటుంబానికి రూ.2 కోట..
-
కిమ్స్ ఆస్పత్రికి దిల్ రాజు, అల్లు అరవింద్
-
రేవతి కుటుంబానికి రూ. 2 కోట్ల ఆర్థిక సాయం
హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజను చూసేందుకు అల్లు అరవింద్, దిల్ రాజు, సుకుమార్ వెళ్లారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి వారు తెలుసుకున్నారు. ఈ నెల 4న హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్లో పుష్ప–2 ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ రావడం, ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించడం, ఆమె కుమారు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడటం తెలిసిందే. ఆ కుటుంబానికి అండగా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మైత్రీ మూవీ మేకర్స్, అల్లు అర్జున్ సాయం చేసేందుకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ పేరుతో అల్లు అరవింద్ భారీ సాయం ప్రకటించారు. శ్రీతేజ ఆరోగ్య పరంగా త్వరగా కోలుకోవాలని రూ. 1 కోటి అరవింద్ ప్రకటించారు. డైరెక్టర్ సుకుమార్ రూ. 50 లక్షలు అందించారు. అయితే, మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పటికే రూ. 50 లక్షలు ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తం రూ. 2 కోట్ల రూపాయలు చెక్కులను తెలంగాణ ఎఫ్డీసీ ఛైర్మన్‌గా దిల్ రాజుకు అందించారు. రేవతి భర్త భాస్కర్‌తో అల్లు అరవింద్ మాట్లాడారు. శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన తెలుసుకున్నారు. కిమ్స్ ఆస్పత్రిలో శ్రీతేజను పరామర్శించిన అనంతరం అల్లు అరవింద్ ఇలా అన్నారు. ' ఈ విపత్తు అనంతరం అబ్బాయి కోలుకుంటున్నాడు. త్వరగా కోలుకుని మన అందరితో తిరుగుతాడని ఆశిస్తున్నాను. శ్రీతేజ కుటుంబానికి మైత్రీ మూవీస్ నిర్మాతలు నవీన్, రవిశంకర్‌తో పాటు దర్శకుడు సుకుమార్, అల్లు అర్జున్ తరపున మొత్తం రూ.2 కోట్లు ఇస్తున్నాం. ఈ చెక్‌లను ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న దిల్ రాజుకి ఇస్తున్నాం.' అని అల్లు అరవింద్ పేర్కొన్నారు. -
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. అసలేం జరిగిందంటే.. (చిత్రాలు)
-
అల్లు అర్జున్ ఎదుగుదలను ఓర్వలేకనే..!?
హైదరాబాద్: ‘పుష్ప’ సిరీస్ సినిమాలతో అల్లు అర్జున్ జాతీయ స్థాయిలో రికార్డులు బద్దలుకొట్టడం కొందరికి కంటగింపుగా మారిందని కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. పుష్ప–2 బ్లాక్ బస్టర్‌గా నిలిచి కొత్త రికార్డుల దిశగా దూసుకుపోతున్న తరుణంలో అల్లు అర్జున్ ఎదుగుదలను ఓర్వలేకనే.. ఆయనపై దుష్ప్రచారాలు సాగుతున్నట్టుగా సినీ పరిశ్రమ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సినీ పరిశ్రమతో సంబంధం ఉన్న వాళ్లే దీని వెనుక సూత్రధారులుగా ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ అరెస్టు జరిగినప్పుడు జాతీయ స్థాయిలో నేతలు, బాలీవుడ్ నటుల నుంచి సత్వరమే స్పందన వ్యక్తమైంది. ఒక రాత్రి జైలులో ఉండి మరునాడు విడుదల అయిన అల్లు అర్జున్ను పరామర్శించేందుకు పెద్ద సంఖ్యలో సినీ ప్రముఖులు ఆయన ఇంటికి క్యూ కట్టారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఆలస్యంగా తూతూ మంత్రంగా స్పందించడం.. అల్లు అర్జున్‌కు దగ్గరి బంధువైన ఏపీ డిప్యూటీ సీఎం, సినీ హీరో పవన్ కల్యాణ్ స్పందించకపోవడం.. అల్లు అర్జున్ అరెస్టైన రోజు, విడుదలైన రోజు కూడా హైదరాబాద్‌లోనే ఉన్న పవన్ కనీసం పరామర్శించకుండానే ఏపీకి వెళ్లిపోవడం వంటివి చూస్తుంటే.. ఈ వ్యవహారం వెనుక వీరి ఒత్తిడి ఉందనే అనుమానాలు వస్తున్నాయని సినీ పరిశ్రమ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.ఎన్నో అనుమానాలు..వాస్తవానికి ఒక తెలుగు సినిమా అయిన పుష్ప–2 జాతీయ స్థాయిలో బ్లాక్ బస్టర్‌గా నిలిచి, వేడుకగా జరుపుకోవాల్సిన సమయంలో... ఆ రికార్డులకు కారణమైన హీరో అల్లు అర్జున్ విషయంలో ఇంత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి ఏముంటుందని సినీ పరిశ్రమ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన జరిగిన వారం రోజుల తర్వాత అకస్మాత్తుగా చర్యలు చేపట్టడం.. అదీ కోర్టుల్లో బెయిల్ వచ్చే అవకాశం లేకుండా.. రెండు, మూడు రోజులు జైలులో ఉండాల్సి వచ్చేలా శుక్రవారం అరెస్టు చేయడం.. హైకోర్టు సాయంత్రమే బెయిల్ మంజూరు చేసినా అర్ధరాత్రి వరకు పత్రాలు జైలుకు చేరకపోవడం.. రాత్రి జైలులోనే ఉండాల్సి రావడం వంటి ఘటనల వెనుక ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉన్నారనే చర్చ సినీ పరిశ్రమ వర్గాల్లో జరుగుతోంది. వాస్తవానికి పుష్ప–2 సినిమా విడుదలకు ముందే ఏపీలో కొందరు అల్లు అర్జున్‌పై తీవ్ర విమర్శలు చేశారు. అల్లు అర్జున్.. పవన్‌కు దగ్గరి బంధువని తెలిసీ కూడా జనసేన, టీడీపీ నేతలు వివాదాస్పద ప్రకటనలు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. పుష్ప–2 సినిమాను నడవనీయబోమని కూడా జనసేన, టీడీపీ నేతలు ప్రకటనలు చేశారని అభిమానులు గుర్తు చేస్తున్నారు. ముందు నుంచే దుష్ప్రచారం ‘అల్లు అర్జున్‌కు అసలు ఫ్యాన్స్ ఉన్నారా? ఉన్నది మెగా ఫ్యాన్సే’ అని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేయడం వెనుక ఏం జరిగి ఉంటుందనే చర్చ అభిమానుల మధ్య మరోమారు మొదలైంది. అల్లు అర్జున్‌కు ఫ్యాన్స్ ఉన్నట్టు తనకు తెలియదన్నారు. మెగా కుటుంబం నుంచి విడిపోయి ఎవరైనా ఫ్యాన్స్ బ్రాంచిలు, షామియానా కంపెనీలు పెట్టుకుంటే మేం చెప్పలేం అని వ్యాఖ్యానించారు. ‘అల్లు అర్జున్‌లో చిరంజీవి, పవన్ కళ్యాణ్, రాంచరణ్ అభిమానులు వారి హీరోలను చూసుకుంటున్నారన్నారు. వారిని కాదని.. నేను పెద్ద పుడింగిని, నా కిష్టమైతే వస్తా అంటే, మానేయ్ వెళ్లిపో.. ఎవడికి కావాలి?’ ఆయన వస్తే ఏంటి, రాకపోతే ఏంటి?’ అని బొలిశెట్టి వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్ను ఉద్దేశించి నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి (టీడీపీ) ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. అందులో అల్లు అర్జున్ గారూ.. మీరు నంద్యాలలో చేసిన ఎన్నికల ప్రచారం ఇక్కడి ప్రజలకు ఇప్పటికీ మరువలేనిది. మీరు నంద్యాలలో ముందస్తు ఎన్నికల ఈవెంట్‌ని కలిగి ఉన్నట్లుగా మీకు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందని మేము ఆశిస్తున్నాం. మీ సెంట్మెంట్ మాకు చాలా బాగా పని చేసింది. ఆ సెంట్మెంట్ మాదిరిగానే మీ పుష్ప–2 చిత్రం కూడా పాన్ ఇండియా స్థాయిలో విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాం’ అని పేర్కొన్నారు. ‘అల్లు అర్జున్ నువ్వు హీరో అనుకుంటున్నావా.. నువ్వు ఒక కమెడియన్. చిరంజీవి, పవన్, నాగబాబు కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకుంటే కానీ నువ్వు చేసిన తప్పు సరికాదు. పుష్ప సినిమా మా నియోజకవర్గం గన్నవరంలో ఎలా ఆడుతుందో చూస్తా’ అని గన్నవరం నియోజకవర్గం జనసేన నేత రమేష్ బాబు వ్యాఖ్యానించారు. -
ఇంటిపై రాళ్ల దాడి.. రియాక్ట్ అయిన అల్లు అరవింద్
జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ విద్యార్థులు దాడి చేశారు. ఆ ఘటనపై తాజాగా అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ రియాక్ట్ అయ్యారు. ఈ ఘటనపై ఆయన ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఇలాంటి సమయంలో అందరూ చాలా సంయమనం పాటించాలని ఆయన కోరారు.' మీరందరూ మా ఇంటి వద్ద జరిగింది అంతా చూశారు. కానీ, ప్రస్తుతం మేము సంయమనం పాటించాల్సిన సమయం.. దేనికీ రియాక్ట్ కాకూడదు. పోలీసులు వచ్చారు. ఆందోళన చేసిన వారిపై కేసు పెట్టారు. ఇక్కడికి ఎవరైనా గొడవ చేసేందుకు మళ్లీ వస్తే అలాంటి వారిని తీసుకెళ్లేందుకు పోలీసులు ఇక్కడే ఉన్నారు. ఇలాంటి వాటిని ఎవరూ ప్రోత్సహించకూడదు. మీడియా వారు వచ్చారని మేము మాట్లాడే పరిస్థితి లేదు. ఈ సంఘటన గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేం. మేము సంయమనంగానే ఉన్నాం. ఎవరూ తొందరపడి ఎలాంటి చర్యలకు పాల్పడొద్దు' అని అల్లు అరవింద్ అన్నారు. -
నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారు: అల్లు అర్జున్
బంజారాహిల్స్: పుష్ప–2 బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో తాను నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు వస్తున్న ఆరోపణలను హీరో అల్లు అర్జున్ తీవ్రంగా ఖండించారు. అవన్నీ నూటికి నూరు శాతం అబద్ధాలేనని స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా సాగుతున్న దుష్ప్రచారంగా అభివర్ణించారు. పోలీసుల అనుమతి లేకుండానే తాను థియేటర్‌కు వెళ్లినట్లు, తొక్కిసలాట అనంతరం పోలీసుల సూచనలు పెడచెవిన పెట్టినట్లు కొంత మంది చేసిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. తనను మానవత్వంలేని మనిషిగా చిత్రీకరించడం బాధించిందన్నారు. సమాచార లోపం వల్లే ఈ పరిస్థితి నెలకొందన్నారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనపై చేసిన విమర్శల నేపథ్యంలో శనివారం రాత్రి జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అల్లు అర్జున్ మాట్లాడారు. తాజా పరిణామాలపై వివరణ ఇచ్చారు. థియేటర్ నాకు గుడిలాంటిది.. ‘సినిమా థియేటర్ నాకు గుడి లాంటిది. అక్కడ ప్రమాదం జరగడం నాకు చాలా బాధగా ఉంది. బాధిత కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. ఆ ఘటన తర్వాత నిర్మాత బన్నీ వాసు వెళ్లి బాధిత కుటుంబంతో మాట్లాడారు. నేను కూడా వస్తానంటే ఉద్రిక్త పరిస్థితులు ఉన్నందున మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని చెప్పి వారించారు. నాపై పోలీసులు కేసు నమోదు చేసినందున బాధిత కుటుంబాన్ని కలిస్తే చట్టపరంగా తప్పుడు సంకేతాలు వస్తాయని లీగల్ టీం సైతం గట్టిగా చెప్పడం వల్లే అక్కడికి వెళ్లలేకపోయా’అని అల్లు అర్జున్ తెలిపారు. నా అభిమాని చనిపోతే వెళ్లాలని నాకు ఉండదా? తొక్కిసలాట ఘటనలో ఒకరి మృతితో 15 రోజులుగా బాధలో ఉన్నానని అల్లు అర్జున్ చెప్పారు. ఈ నేపథ్యంలో సినిమా విజయోత్సవాలను నిర్వహించరాదని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ‘గతంలో మెగాస్టార్ చిరంజీవితోపాటు పలువురు హీరోల అభిమానులు చనిపోతే విజయవాడ, వైజాగ్ లాంటి ప్రాంతాలకు వెళ్లి పరామర్శించా. అలాంటిది నా అభిమాని చనిపోతే వెళ్లనా? పరామర్శించాలని నాకు ఉండదా?’అని అల్లు అర్జున్ ప్రశ్నించారు. ఘటన జరిగిన మర్నాడే బాధిత కుటుంబాన్ని కలవాలనుకున్నప్పటికీ తన లీగల్ టీం సూచనల వల్ల వెళ్లలేకపోయానన్నారు. అనుమతి లేకపోతే పోలీసులు వెనక్కి పంపేవారు కదా.. థియేటర్లో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనను అత్యంత దురదృష్టకరమైన ప్రమాదంగా హీరో అల్లు అర్జున్ అభివర్ణించారు. సినిమా చూసేందుకు వెళ్లినప్పుడు పోలిసులు అక్కడ ఉన్నారని... దాంతో తన రాకకు అనుమతి ఉందనే భావించినట్లు ఆయన చెప్పారు. తాను లోపలికి వెళ్లేందుకు వీలుగా తన వాహనాలకు దారి చూపింది పోలిసులేనని.. ఒకవేళ తన రాకకు పోలీసుల అనుమతి లేకుంటే వారు అప్పుడే వెనక్కి పంపేవారు కదా? అని అల్లు అర్జున్ ప్రశ్నించారు. రోడ్ షో అనడం దారుణం థియేటర్‌కు రోడ్ షో, ర్యాలీ చేసుకుంటూ వెళ్లాననే మాట పూర్తిగా అవాస్తవం, దారుణమని అల్లు అర్జున్ వ్యాఖ్యానించారు. థియేటర్‌కు కేవలం కొన్ని మీటర్ల దూరంలో ఉండగా భారీ సంఖ్యలో అభిమానులు తన వాహనాన్ని చుట్టుముట్టారని చెప్పారు. తాను కారులో నుంచి పైకి వచ్చి అభివాదం చేస్తే అభిమానులు పక్కకు జరుగుతారని అక్కడి వారు చెబితే తాను బయటకు వచ్చానని వివరించారు. తనను ఒక్కసారైనా చూసేందుకు అంత మంది అభిమానులు వచ్చినప్పుడు తాను కారులోనే కూర్చుంటే తనకు తల పొగరు అనుకుంటారని భావించే వారికి నమస్కరిస్తూ దారివ్వాలని కోరానన్నారు. మహిళ మృతి గురించి పోలీసులు చెప్పలేదు.. తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిందని పోలిసులు తనకు చెప్పలేదని అల్లు అర్జున్ చెప్పారు. కేవలం థియేటర్ యాజమాన్యం తన వద్దకు వచ్చి బయట గొడవగా ఉన్నందున వెళ్లిపోవాలని సూచించారన్నారు. దీంతో వెంటనే తాను భార్యతో కలిసి బయటకు వెళ్లిపోయానని వివరించారు. తన పిల్లల్ని లోపలే వదిలి వెళ్లానని.. ఒకవేళ జరిగిన దుర్ఘటన గురించి తెలిస్తే వారిని వదిలిపెట్టి ఎందుకు వెళ్తానని ప్రశ్నించారు. ఈ విషయం మరుసటి రోజు ఉదయం తెలిసి షాక్‌కు గురయ్యానన్నారు. ఆ తర్వాత బాధిత కుటుంబానికి అండగా ఉన్నాననే విషయాన్ని తెలియజేసేందుకే వీడియో విడుదల చేశానన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ్ కోలుకుంటున్నాడని తెలియడం ఒక్కటే ప్రస్తుతం తనకు ఊరట కలిగించే అంశమన్నారు. తాను వెళ్లడం సమస్యగా మారుతుందనే ఉద్దేశంతోనే తన తండ్రి అల్లు అరవింద్‌ను ప్రత్యేక అనుమతి ద్వారా ఆస్పత్రికి పంపి బాలుడి చికిత్స వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నానని అల్లు అర్జున్ వివరించారు. తాను, దర్శకుడు సుకుమార్ కలిసి పిల్లల భవిష్యత్తు కోసం కచ్చితంగా ఏదైనా మంచి పని చేయాలని అవసరమైతే వారి పేరిట ఫిక్స్ డిపాజిట్ చేయాలని చర్చించుకున్నట్లు చెప్పారు. ఎవరినీ నిందించట్లేదు.. తాను ఎవరినీ నిందించాలని మాట్లాడటం లేదని.. తనకు ఎవరిపైనా వ్యక్తిగత కోపం లేదని అల్లు అర్జున్ చెప్పారు. ప్రభుత్వం తమ సినిమాకు అన్ని రకాలుగా ప్రోత్సాహం అందించిందని.. అందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. అదే సమయంలో తనను మానవత్వం లేని వ్యక్తిగా చిత్రీకరించే పరిస్థితి ఎదురవడం అత్యంత బాధాకరంగా ఉందన్నారు. కేసు విచారణ దశలో ఉన్నందున మీడియా ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేనని అల్లు అర్జున్ పేర్కొన్నారు. మా కుటుంబం గురించి అందరికీ తెలుసు: అల్లు అరవింద్ పాన్ ఇండియా మూవీగా వచ్చిన సినిమాను ప్రేక్షకులతో కలిసి థియేటర్లో చూసుకుందామనే ఉద్దేశంతోనే అల్లు అర్జున్ సంధ్య థియేటర్‌కు వెళ్లాడని నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. థియేటర్ వద్ద ఘటన తర్వాత మనస్తాపానికి గురై అదే ఆలోచనలతో ఉండిపోయాడన్నారు. మూడు తరాల చరిత్రగల తమ కుటుంబం గురించి అందరికీ తెలుసన్నారు. అసత్య ప్రచారాల వల్ల బాధలో ఉన్నందున మనసులోని ఆవేదనను చెప్పుకుంటున్నామన్నారు. ప్రజలు ఆదరిస్తేనే ఈ స్థాయికి వచ్చామని.. అభిమానాన్ని ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నామన్నారు. -
బన్నీ 22 ఏళ్లుగా కష్టపడుతున్నాడు.. ఎక్కడైనా తప్పు చేశాడా..?: అల్లు అరవింద్
సంధ్య థియేటర్ ఘటన గురించి తన కుమారుడు అల్లు అర్జున్‌పై వస్తున్న విమర్శల పట్ల అల్లు అరవింద్ కూడా రెస్పాండ్ అయ్యారు. తన కుమారుడి వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి మాట్లాడటం తట్టుకోలేకపోతున్నామని ఆయన అన్నారు. రేవతి కుటుంబం విషయంలో న్యాయవాదుల సూచన మేరకే బన్నీ మాట్లాడుతున్నాడని ఆయన గుర్తు చేశారు.'దయచేసి అందరూ ఈ విషయం అర్థం చేసుకోండి. ప్రస్తుతం కేసు విచారణలో ఉండగా న్యాయపరమైన చిక్కులు వస్తాయనే ఉద్దేశంతో మీరు అడిగే ప్రశ్నలకు బన్నీ సమాధానం చెప్పలేకపోతున్నాడు. సుమారు మూడేళ్లు కష్టపడి పాన్ ఇండియా రేంజ్లో తీసిని సినిమాను అభిమానులతో చూద్దామని థియేటర్‌కు వెళ్లాడు. అయితే, థియేటర్ వద్ద జరిగిన ఆ సంఘటనతో బన్నీ మా ఇంట్లో పార్కులో ఓ మూలన కూర్చొని ఉంటున్నాడు. సినిమా సెలబ్రేషన్స్ వద్దని చెప్పాడు.సినిమా ఇంతటి విజయం సాధించినప్పటికీ ఎలాంటి సంతోషం లేకుండానే తన అభిమాని కుటుంబం ఇలా అయిపోయిందని బాధపడుతున్నాడు. బన్నీ ఇంతటి స్థాయిలోకి రావడానికి 22 ఏళ్లుగా కష్టపడుతున్నాడు. అతనికి వచ్చిన పేరు అంతా కూడా ఒక రాత్రి, ఒక సినిమాతో రాలేదు. మూడు తరాలుగా ఇండస్ట్రీలోనే ఉంటున్నాం. ఎక్కడా కూడా చెడుగా వ్యవహరించలేదు. ఇప్పడు మాపై ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తేంటే బాధగా ఉండటం వల్లే మీడియా ముందుకు వచ్చాం.' అని అల్లు అరవింద్ అన్నారు. -
'అల్లు అర్జున్ రాకపోవడానికి కారణమదే'.. శ్రీతేజ్‌కు అల్లు అరవింద్ పరామర్శ
అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత కీలక పరిణామం చోటు చేసుకుంది. సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ పరామర్శించారు. శ్రీతేజ్ కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఆయన ఆరోగ్య పరిస్థితిపై కిమ్స్ వైద్యులతో చర్చించారు.( ఇది చదవండి: శ్రీతేజ్ బ్రెయిన్ డ్యామేజ్ అయ్యింది: సీపీ సీవీ ఆనంద్)సంధ్య థియేటర్ ఘటన దురదృష్టకరమని.. రేవతి కుటుంబాన్ని పూర్తిగా తాము ఆదుకుంటామని అల్లు అరవింద్ హామీ ఇచ్చారు. ఈ ప్రభుత్వం మాకు పూర్తిస్థాయిలో సహకారం అందించిందని అన్నారు. కేసు కోర్టులో ఉన్నందున అల్లు అర్జున్ రాలేకపోయారని వివరించారు. అందుకే అర్జున్ తరపున నేను ఆస్పత్రికి వచ్చానని అల్లు అరవింద్ స్పష్టం చేశారు. ప్రభుత్వ అనుమతి తీసుకుని వచ్చా..అల్లు అరవింద్ మాట్లాడుతూ..'ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుమతితో ఆస్పత్రిలో శ్రీతేజ్‌ను చూసేందుకు వచ్చా. ప్రస్తుతం బాలుడు క్రమంగా కోలుకుంటున్నాడని వైద్యులు చెప్పారు. పూర్తిగా కోలుకోడానికి సమయం పడుతుంది. శ్రీతేజ్ కోలుకోడానికి మేం ఎంతైనా సహాయం చేస్తాం. తను సంపూర్ణంగా ఆరోగ్యంతో తిరిగిరావడానికి ప్రభుత్వం సహకరిస్తామనడం అభినందనీయం. చాలా మంది అభిమానులు, బంధువులు, స్నేహితులు అల్లు అర్జున్ ఎందుకు హాస్పిటల్ కు వెళ్లి పరామర్శించలేదని అడుగుతున్నారు. అల్లు అర్జున్ హాస్పిటల్‌కు రాకపోడానికి కారణం ఉంది. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన మరుసటి రోజే ఆస్పత్రికి అల్లు అర్జున్ వస్తానని అనుకున్నాడు. కానీ కిమ్స్ హాస్పిటల్ వైద్యులు వద్దని వారించడంతో రాలేదు. అదే రోజు అల్లు అర్జున్‌పై కేసు నమోదైంది. ఎవరితో మాట్లాడవద్దని మా న్యాయవాది నిరంజన్ రెడ్డి గట్టిగా చెప్పారు. ఆ తర్వాత మేం రావడానికి అనేక నిబంధనలు అడ్డొచ్చాయి. బన్నీ బాధపడుతూ నన్ను వెళ్లి చూసి రమ్మన్నారు. అందుకే ప్రభుత్వ అనుమతితో బాలుడు శ్రీతేజ్ పరిస్థితిని అడిగితెలుసుకున్నా' అని తెలిపారు.అసలేం జరిగిందంటే..ఈనెల 5న అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 మూవీ థియేటర్లలో విడుదలైంది. అయితే ఒక రోజు ముందే ఈ మూవీ ప్రీమియర్స్ షోలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా బన్నీ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్లో సినిమా వీక్షించారు. అదే సమయంలో ఫ్యాన్స్ దూసుకురావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిగా.. ఆమె కుమారుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు. అయితే ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో విడుదలయ్యారు. -
వివాహ వేడుకలో చిరంజీవి, అల్లు అర్జున్ దంపతులు.. ఫోటోలు వైరల్
-
వివాహ వేడుకలో చిరంజీవి, అల్లు అర్జున్ దంపతులు
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, మెగాస్టార్ చిరంజీవి ఒక పెళ్లి వేడుకలో సందడిగా కనిపించారు. తమ ఇంట్లో పెళ్లిలా వారందరూ పాల్గొనడంతో ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నూతన దంపతులను చిరంజీవితో పాటుగా అల్లు అర్జున్ ఆశీర్వదంచారు. దీంతో ఈ వివాహ వేడుక ఎవరిదై ఉంటుందని సోషల్‌మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది.అల్లు అరవింద్ సొంత నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌లో చాలా ఏళ్లుగా డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు చూస్తున్న బాబీ కుమారుడిదే ఈ వివాహ సందడి. తమ వద్ద ఎన్నో ఏళ్లుగా ఉంటూ కుటుంబ సభ్యుడిగా బాబీ ఉండటం వల్లే తన కుమారుడి పెళ్లి వేడుకలో వారందరూ పాల్గొన్నట్లు తెలుస్తుంది. బాబీ కుమారుడు రామకృష్ణ తేజ- సుజాతల పెళ్లి హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో అరవింద్‌తో పాటు మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ దంపతులు, అల్లు శీరిష్ పాల్గొన్నారు. నూతన దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. (ఇదీ చదవండి: Kanguva Review: 'కంగువా' మూవీ రివ్యూ)త్వరలో 'పుష్ప 2' మూవీతో అల్లు అర్జున్ ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు. డిసెంబరు 5న థియేటర్లలోకి రానుంది. 17వ తేదీన సాయంత్రం 6:03 గంటలకు ట్రైలర్ లాంచ్ చేయనున్నారు. ఇప్పటికే హైప్ బోలెడంత ఉంది. ట్రైలర్ రిలీజైన తర్వాత అది ఇంకాస్త పెరగడం గ్యారంటీ.(ఇదీ చదవండి: ‘మట్కా’ మూవీ రివ్యూ) -
‘ఆస్ట్రిడ్ ’కు అల్లు అరవింద్ అభినందనలు (ఫొటోలు)
-
నాగ చైతన్య తండేల్.. రిలీజ్ డేట్ కోసం ఇంతలా పోటీపడ్డారా?
అక్కినేని హీరో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తోన్న తాజా చిత్రం తండేల్. ఈ మూవీకి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా అప్డేట్స్ ఫ్యాన్స్ ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఉంటుందా? లేదా అభిమానులు కన్ఫ్యూజన్లో ఉన్నారు. దీంతో తండేల్ మేకర్స్ రిలీజ్ డేట్‌పై అధికారికంగా ప్రకటించారు. హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిం తండేల్ విడుదల తేదీని ప్రకటించారు.వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్వయంగా వెల్లడించారు. ఈ ప్రకటనతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. మొదట క్రిస్మస్, సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుందని అందరూ అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల రిలీజ్ డేట్ మార్చాల్సి వచ్చిందని తెలిపారు.అయితే ఈ రిలీజ్ డేట్‌పై చేసిన వీడియో మాత్రం ఫన్నీగా తెగ ఆకట్టుకుంటోంది. కేవలం సినిమా విడుదల తేదీని నిర్ణయించేందుకు ఓ గేమ్ ఆడారు. అదే టగ్ ఆఫ్ వార్ పేరుతో చిన్న పోటీ నిర్వహించారు. సంక్రాంతి, సమ్మర్ పేరుతో రెండు టీమ్స్‌గా విభజించి 'టగ్స్ ఆఫ్ తండేల్' అంటూ పోటీ పెట్టారు. ఈ గేమ్‌లో రెండు టీములు గెలవకపోవడంతో మధ్యలో ఫిబ్రవరిని ఎంచుకున్నారు. అలా తండేల్ మూవీ రిలీజ్ డేట్ మేకర్స్ నిర్ణయించారు. ఈ వీడియో ఇదేందయ్యా ఇదీ.. ఇదీ నేను చూడలే అంటూ అల్లు అరవింద్ చెప్పిన డైలాగ్స్ ఫ్యాన్స్‌కు నవ్వులు తెప్పిస్తున్నాయి. కాగా.. శ్రీకాకుళం మత్స్యకార కుటుంబంలో జరిగిన కథ అధారంగా ఈ సినిమా తీస్తున్నారు. 2018లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రానుంది. శ్రీకాకుళం సాంసృతిక, సామాజిక అంశాలతో పాటు మత్స్యకారుల జీవితాలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో చూపించనున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజు అనే జాలరి పొరపాటుగా పాకిస్థాన్ సముద్రజలాల్లోకి ప్రవేశించాడు. దీంతో పాక్ నేవి అధికారులు అరెస్ట్ చేస్తుంది. ఈ ఘటనను ఆధారం చేసుకుని తండేల్ చిత్రాన్ని నిర్మించారు. ఆ జాలరిని తిరిగి భారత్‌కు రప్పించేందుకు తన ప్రియురాలు చేసిన పోరాటం ఏంటో ఈ సినిమాలో చూడొచ్చు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. How did team #Thandel decide on the release date? With a super fun game...❤🔥'Tugs of Thandel' out now 💥▶️ https://t.co/H0x2uNz02r#Thandel GRAND RELEASE WORLDWIDE ON FEBRUARY 7TH, 2025 ❤️🔥In Telugu, Tamil & Hindi.#ThandelonFeb7th#DhullakotteyalaYuvasamrat… pic.twitter.com/HYZQPsSegw— Geetha Arts (@GeethaArts) November 7, 2024 -
అల్లు అరవింద్ ‘గేమ్ ఛేంజర్’ అయ్యేనా?
సంక్రాంతి.. టాలీవుడ్‌కి పెద్ద పండగ. కరోనా సమయంలో కూడా సంక్రాంతికి రిలీజైన సినిమాలు మంచి వసూళ్లను రాబట్టాయి. అందుకే మన దర్శక-నిర్మాతలు ‘సంక్రాంతికి సై’ అంటూ తమ సినిమాలను విడుదల చేస్తుంటారు. ఈ సారి కూడా నాలుగైదు పెద్ద సినిమాలు సంక్రాంతి బరిలోకి దిగబోతున్నాయి. ఇప్పటికే కొందరు సంక్రాంతికి వస్తున్నాం అని ప్రకటించారు. మరికొన్ని సినిమాలు సడన్ సర్ప్రైజ్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాయి. అయితే ఈ ‘బాక్సాఫీస్’ ఆటలో ఈ సారి అల్లు అరవింద్ ‘గేమ్ ఛేంజర్’ అయ్యేలా కనిపిస్తున్నాడు. అల్లుడు రామ్ చరణ్‌కి పోటీగా తన సినిమాను బరిలోకి దించి ‘బాక్సాఫీస్’ ఆటను మరింత రసవత్తరంగా మార్చడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ మూవీ సంక్రాంతి బరిలో నిలిచింది. శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ షూటింగ్ జాప్యం, ఇతర కారణాలతో విడుదల వాయిదా పడుతూ వచ్చింది. చివరకు సంక్రాంతికి వస్తున్నాం అటూ దసరా రోజు ప్రకటన చేశారు. ఈ చిత్రం కంటే ముందే మరో మూడు పెద్ద సినిమాలు కూడా సంక్రాంతికి వస్తున్నాం అని ప్రకటించాయి. అందులో ఒకటి చిరంజీవి ‘విశ్వంభర’. రెండోది అనిల్ రావిపూడి-వెంకటేశ్ మూవీ. మూడోది నందమూరి బాలకృష్ణ-బాబీ సినిమా. (చదవండి: అఖండగా బాలయ్య మరోసారి.. అధికారిక ప్రకటన)అయితే అనూహ్యంగా చిరంజీవి వెనక్కి తగ్గి.. కొడుకు సినిమాను బరిలోకి నిలిపాడు. ఈ మూడు సినిమాల మధ్యే గట్టిపోటీ ఉంటుందని అంతా అనుకున్నారు. తాజాగా మరో సినిమా కూడా సంక్రాంతి బరిలోకి రాబోతుంది. అదే అక్కినేని నాగచైతన్య ‘తండేల్’. ‘లవ్‌స్టోరీ’ సినిమా తర్వాత నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రమిది. చందు మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.(చదవండి: బరిలోకి మహేశ్, చరణ్, సమంత.. అయినా ఫ్లాప్ తప్పలేదు!)వాస్తవానికి ఈ సినిమా డిసెంబర్ మూడోవారంలో రిలీజ్ చేయాలని భావించారట. అప్పటిలోపు పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి ఫస్ట్ కాపీ సిద్ధం చేసే పరిస్థితి లేదని చందు చెప్పేశాడట. వీలైనంతవరకు ట్రై చేద్దామని..కుదరకపోతే రిలీజ్‌ను వాయిదా వేయక తప్పదని ముందే చెప్పారట. ఒకవేళ డిసెంబర్ మూడో వారంలోపు విడుదల చేసే అవకాశం లేనట్లేయితే.. ఎక్కువ రోజులో హోల్డ్ చేయకుండా సంక్రాంతి పండక్కే రావాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి అయితే డిసెంబర్ మూడో వారంలో రిలీజ్ అన్నదానికి అనుగుణంగానే పనులు జరుగుతున్నాయి. త్వరలోనే నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు ఈ విషయంపై ఓ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. -
అట్టహాసంగా ‘సైమా 2024 అవార్డుల’ వేడుక (ఫొటోలు)
-
నితిన్ కోసం ఎన్టీఆర్ కు కాల్ చేస్తే.. తను చెప్పిన మాటేంటంటే...
-
మా నాన్న నాతో సినిమా తీయలేదని ఎందుకు అన్నానంటే..
-
పవన్ కళ్యాణ్‌తో సినీ నిర్మాతల భేటీ
సాక్షి, అమరావతి: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో తెలుగు సినిమా నిర్మాతలు సోమవారం సమావేశమయ్యారు. విజయవాడలోని పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో సినిమా రంగానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి దుర్గేశ్, నిర్మాతలు సి.అశ్వనీదత్, అల్లు అరవింద్, ఏఎం రత్నం, ఎస్.రాధాకృష్ణ, దిల్ రాజు, బోగవల్లి ప్రసాద్, డీవీవీ దానయ్య, సుప్రియ, ఎన్వీ ప్రసాద్, బన్ని వాసు, నవీన్ ఎర్నేని, నాగవంశీ, టీజీ విశ్వ ప్రసాద్, వంశీకృష్ణ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను పవన్ కళ్యాణ్‌కు వివరించామని చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమ తరఫున ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని అభినందించడానికి అపాయింట్మెంట్ కోరామన్నారు. సినీ రంగ సమస్యలపై పూర్తి స్థాయిలో చర్చించేందుకు మరోసారి సమావేశమవుతామని చెప్పారు. -
ఆ ధైర్యం దిల్ రాజుకే సాధ్యం: అల్లు అరవింద్
ఆశిష్, బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం లవ్ మీ. ఇఫ్ యు డేర్ అన్నది ఉపశీర్షిక. ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించారు. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దిల్ రాజు గురించి ఆసక్తరమైన విషయాలను పంచుకున్నారు.లవ్ మీ చిత్రాన్ని డైరెక్ట్ చేసే అవకాశాన్ని అరుణ్‌కు దక్కడం చాలా సంతోషం అని అల్లు అరవింద్ అన్నారు. కొత్తవారికి దర్శకత్వం వహించే ఛాన్సులు ఎక్కువగా దిల్ రాజు ఇస్తుంటారని ఆయన గుర్తు చేశారు. డైరెక్షన్లో గత అనుభవం లేని వారికీ అవకాశాలు ఇవ్వడం దిల్ రాజుకే సాధ్యమని అల్లు అరవింద్ తెలిపారు. అలాంటి సాహసం తాను ఏమాత్రం చేయలేనని ఆయన అన్నారు. లవ్ మీ సినిమాతో కీరవాణి, పీసీ శ్రీరామ్‌లాంటి స్టార్ టెక్నిషియన్లతో మొదటి ప్రాజెక్ట్‌కే పని చేయడం అరుణ్ అదృష్టమని తెలిపారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందని ఆరవింద్ ఆశించారు.దిల్ రాజు మాట్లాడుతూ..'హర్షిత్ రెడ్డి సినిమాపై ఉన్న ఆసక్తితో నిర్మాతగా మారాడు. హన్షిత చిన్నప్పటినుంచి షూటింగ్స్‌కు వెళ్లేది. కానీ సినిమా రంగంలోకి వస్తుందని ఊహించలేదు. వీరిద్దరు కలిసి దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై చిత్రాలు నిర్మిస్తున్నారు. తొలి సినిమా బలగంతో వేణు యెల్దండిని దర్శకుడిగా పరిచయం చేశారు. లవ్ మీతో అరుణ్‌కు ఛాన్స్ ఇచ్చారు. మరికొన్ని సినిమాల వివరాలు త్వరలోనే ప్రకటిస్తాం. కొత్తవారిని ప్రోత్సహించాలనేదే మా లక్ష్యం' అని అన్నారు. -
కొత్త ఎలక్ట్రిక్ కారు కొన్న అల్లు అరవింద్.. ధరెంతంటే?
తెలుగు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కొత్త కారు కొన్నాడు. ఈసారి బీఎమ్‌డబ్ల్యూ ఐ7 బ్రాండ్‌ను తన గ్యారేజీకి తీసుకొచ్చాడు. చూడటానికి ఎంతో స్టైలిష్‌గా ఉన్న ఈ కారులో అత్యాధునిక టెక్నాలజీని వాడినట్లు తెలుస్తోంది. ఈ ఎలక్ట్రిక్ కారు ధర రెండున్నర కోట్ల పైనే ఉన్నట్లు సమాచారం. ఇకపోతే అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ ద్వారా ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలను అందించాడు. పసివాడి ప్రాణం, మెకానిక్ అల్లుడు, జల్సా, మగధీర, సరైనోడు, అల వైకుంఠపురములో.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చిత్రాలున్నాయి.తండ్రి నిర్మాతగా, తనయుడు హీరోగా బిజీఅల్లు అర్జున్ 22వ సినిమాతో పాటు బోయపాటి శ్రీనివాస్ తెరకెక్కించే సినిమా సైతం గీతా ఆర్ట్స్ బ్యానర్లోనే నిర్మితం కానుంది. కొన్ని ఇతర భాషా చిత్రాలను అరవింద్ ఇక్కడ డబ్ చేయిస్తూ సక్సెస్ఫుల్ డిస్ట్రిబ్యూటర్‌గా పేరు తెచ్చుకున్నాడు. మరోవైపు అల్లు అరవింద్ తనయుడు, అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ ఆగస్టు 15న విడుదల కానుంది. View this post on Instagram A post shared by BMW KUN Exclusive (@bmwkunexclusive_ts_ap) -
Allu Arjun: అల్లు అర్జున్ గురించి ఈ విషయాలు తెలిస్తే.. ఎత్తిన ప్రతి వేలూ ముడుచుకోవాల్సిందే
'గంగోత్రి'తో ఒక నదిలా ఇండస్ట్రీలో 'పరుగు'లు పెడదామని ఎంట్రీ ఇస్తే.. 'ఎవడు' రా వీడు అంటూ వచ్చిన విపరీతమైన ట్రోల్స్‌ను 'హ్యాపీ'గా భరించి.. 'జులాయి' అనుకున్న వాడే 'దేశముదురు'లా మారి బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల 'రేసుగుర్రం' అయ్యాడు. 'రుద్రమదేవి'కి తోడుగా గోన గన్నా రెడ్డిగా అవతారమెత్తి ఇండస్ట్రీకి 'సరైనోడు' వచ్చాడు రా అని చాటిచెప్పాడు. నేడు పాన్ ఇండియా రేంజ్లో ఉన్న టాప్ హీరోలతో పోటీ పడుతూ నీ యవ్వ తగ్గేదేల్యా అని 'పుష్ప' గాడి రూలింగ్ ప్రారంభించాడు. వారు మరెవరో కాదు అల్లు అర్జున్.. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ కథనం. అల్లు అర్జున్ ఈ పేరు వింటే రెండు తెలుగు రాష్ట్రాల్లో స్టైలిష్ స్టార్ గుర్తుకొస్తాడు.. మల్లు అర్జున్ ఈ పేరు వింటే కేరళలో అభిమానులు ఊగిపోతారు. వీడు హీరో ఎంటి రా..? అనే స్థాయి నుంచి హీరో అంటే వీడు రా అనే రేంజ్‌కు చేరుకున్నారు బన్నీ. అగ్ర నిర్మాత తనయుడిగా.. అగ్ర కథానాయకుడికి మేనల్లుడిగా ఒక బరువు బాధ్యతలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. అహర్నిశలు శ్రమించి సినీ మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న నటుడు అల్లు అర్జున్. 'ఆడా ఉంటా.. ఈడా ఉంటా' అంటూ.. అటు క్లాస్ ఆడియన్స్‌ను, ఇటు మాస్ ప్రేక్షకులను మెప్పించే సత్తా ఉన్న హీరోగా బన్నీ గుర్తింపు పొందారు. ట్రోల్స్‌కు భయపడకుండా గట్టి సమాధానం ఇచ్చాడు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్- నిర్మల దంపతులకు 1982 ఏప్రిల్ 8న చెన్నైలో పుట్టిన అల్లు అర్జున్ 18 ఏళ్ల వరకు అక్కడే పెరిగాడు. ప్రాథమిక విద్య కూడా అక్కడే ముగిసింది. తాత స్టార్ కమెడియన్ (రామలింగయ్య), మామయ్య స్టార్ హీరో (చిరంజీవి), నాన్న స్టార్ ప్రొడ్యూసర్.. ఈ నేపథ్యంలో బన్నీ తెరంగేట్రం సులువుగా జరిగింది. 2003లో 'గంగోత్రి' సినిమాతో దర్శకుడు రాఘవేంద్రరావు బన్నీని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. మెగా కాంపౌండ్ నుంచి వస్తున్న హీరో కావడం అప్పటికే విజేత, స్వాతిముత్యంలో బాల నటుడిగా కనిపించడమే కాకుండా చిరంజీవి సినిమా 'డాడీ'లో డ్యాన్స్ చేసి మెప్పించడం వంటి అంశాలు బన్నీకి బాగా కలిసి వచ్చాయి. దీంతో గంగోత్రి విడుదల సమయంలో థియేటర్స్ అన్నీ హౌస్‌ఫుల్ బోర్డులు పడ్డాయి. ఇందులో ఆయన నటనకు ఎవరూ పేరు పెట్టలేదు కానీ లుక్ పరంగా బారీగా ట్రోల్స్ ఎదుర్కొన్నాడు. వాటిని సంతోషంగా స్వీకరించడమే కాకుండా తనను తాను మార్చుకున్నాడు. అలా 'ఆర్య'తో గట్టి సమాధానమిచ్చాడు. తొలి చిత్రంలో సింహాద్రిగా కనిపించిన ఆ కుర్రాడేనా..? ఈ 'ఆర్య' అంటూ తెలుగు సినీ ప్రేక్షకులంతా ఆశ్చర్యపోయేలా చేశాడు. మరో హీరో అయితే ఈ సినిమా చేసేవాడు కాదేమో టాలీవుడ్ బెస్ట్ డాన్సర్ గా అప్పట్లోనే చిరంజీవితో ప్రశంసలు అందుకున్నాడు బన్నీ. గంగోత్రి,ఆర్య,బన్నీ సినిమాలతో హ్యాట్రిక్ పూర్తి చేశాడు. తొలి మూడు సినిమాలతో వరస హిట్లు అందుకున్న అతికొద్ది మంది హీరోల్లో అల్లు అర్జున్ కూడా ఒకరు. ఆపై వెంటనే హ్యాపీ నిరాశ పరిచినా.. దేశముదురుతో సూపర్ హిట్ కొట్టాడు. ఈ సినిమాతో తెలుగులో తొలి సిక్స్ ప్యాక్ హీరోగా చరిత్ర సృష్టించాడు బన్నీ. ఆ మరుసటి ఏడాది పరుగుతో తన నటనను చూపించాడు. వరుడు, వేదం, బద్రీనాథ్,జులాయి,దువ్వాడ జగన్నాథం,రుద్రమదేవి లాంటి సినిమాలతో తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించడం ఆయనకే చెల్లింది. ఫలానా సినిమాలో క్లైమాక్స్‌లో మీ పాత్ర చనిపోతుంది నటిస్తారా?’ అని ఏ స్టార్ హీరోనైనా అడిగితే వెనకడుగేస్తుంటారు. కానీ, ఆ విషయంలో 'వేదం' కోసం బన్నీ ముందడుగేశాడు. 'రుద్రమదేవి' సినిమా చిక్కుల్లో ఉందని తెలుసుకున్న అర్జున్ పారితోషికం తీసుకోకుండానే గోనగన్నారెడ్డి పాత్ర పోషించి. ఆ సినిమాకు మరింత హైప్ క్రియేట్ చేశాడు. దీంతో తనలోని మరో కోణాన్ని చూపించాడు. అల్లు అర్జున్ రూమ్‌లో వారిద్దరి ఫోటోలు అల్లు అర్జున్‌కు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ప్రాణం. ఆయన రూమ్‌లో కేవలం ఇద్దరు ఫోటోలు మాత్రమే ఉంటాయని, ఒకటి మైకేల్ జాక్సన్ది, మరొకటి చిరంజీవిదని, వాళ్లిద్దరినీ చూస్తూ తాను డ్యాన్స్ నేర్చుకున్నానని ఆయన గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మైకేల్ జాక్సన్ అంటే ఆయనకు ప్రాణం. మైకేల్ జాక్సన్ చనిపోయిన తర్వాత ఆయనకు ఘన నివాళి అర్పిస్తూ ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చారు. పుష్ప సినిమాలో శ్రీవల్లి పాటలో చెప్పు జారిపోయే స్టెప్ చూడ్డానికి సింపుల్‌గా ఉంటుంది. కానీ అది ఎంత వైరల్ అయ్యిందో అందరికి తెలిసిందే. బాలీవుడ్ స్టార్స్, క్రికెటర్ల దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు ఆ స్టెప్‌ను అనుకరిస్తూ లెక్కలేనన్ని వీడియోలు చేశారు. అలా దాదాపు ప్రతి సినిమాలో సిగ్నేచర్ స్టెప్స్ ఉంటాయి. ప్రయోగాలతో పాటు కష్టపడేతత్వం ప్రతి సినిమాలో ప్రయోగాలకు అల్లు అర్జున్ ఎప్పుడూ ముందుంటారు. కథ, కథనం నచ్చితే పాత్ర పరిధి, నిడివి తక్కువైనా చేసేందుకు వెనుకాడరు. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి పాత్ర కథకు చాలా ముఖ్యం. కానీ అతిథి పాత్ర. అయినా అల్లు అర్జున్ చేశారు. క్రిష్ (రాధాకృష్ణ జాగర్లమూడి) దర్శకత్వంలో వచ్చిన 'వేదం' సినిమాలో కేబుల్ రాజు పాత్ర పోషించి.. విభిన్నమైన కథ ఉంటే చేయడానికి తాను సిద్ధమని సంకేతాలిచ్చారు. ప్రయోగం ఫలించని సందర్భమూ లేకపోలేదు. 'నా పేరు సూర్య' వైఫల్యమే దీనికి ఉదాహరణ. సినిమా కోసం బన్నీలా కష్టపడేంత నటులు ఈ రోజుల్లో అరుదని ప్రముఖ దర్శకులు సుకుమార్, త్రివిక్రమ్, పూరీ జగన్నాథ్ పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. అందుకు ఉదాహరణలు కూడా ఉన్నాయి. పుష్ప సినిమా కోసం దాదాపు ఏడాది పాటు చిత్తూరు యాసను అల్లు అర్జున్ సాధన చేశారు. 'బద్రినాథ్' సినిమా కోసం మలేషియా వెళ్లి కత్తియుద్ధం నేర్చుకున్నారు. రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి పాత్ర కోసం తెలంగాణ శైలిలో ఎలా మాట్లాడాలో నేర్చుకున్నారు. అల్లు లెగసీ మెగా కాంపౌండ్ హీరో నుంచి తన సొంత కష్టంతో అల్లు హీరోగా ప్రత్యేకమైన గుర్తింపును క్రియేట్ చేసుకున్నాడు. అలాగనే ఎన్నడూ మెగా అభిమానులను ఆయన తక్కువ చేయలేదు. అర్జున్‌కి అభిమానులు మలయాళం ఇండస్ట్రీలో కూడా ఉన్నారు. గతంలో కానీ, ప్రస్తుతం కానీ.. ఏ హీరోకి లేని క్రేజ్ మలయాళంలో బన్నీ సొంతం. అక్కడ అంతా ఆయనని మల్లు అర్జున్ అని పిలుస్తారు. 'పుష్ప'తో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో అభిమానులను సంపాధించుకున్నాడు. ఆ సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ ఒక్కసారిగా ఖండంతరాలను దాటింది. సినిమా రంగంతో పాటు క్రికెట్, పాలిటిక్స్‌లో ఉండే సెలబ్రిటీల సైతం ఏదో ఒక సందర్భంలో.. 'నీయవ్వ తగ్గేదే లే' అని అల్లు అర్జున్ డైలాగ్ ఉపయోగించే ఉంటారు. అలా ఆయన పేరు మరింత వేగంగా జనాల్లోకి చొచ్చుకుని పోయింది. ఇంత రేంజ్‌కు ఆయన చేరుకోవడానికి ఆయన ప్రధాన బలం టాలెంట్. కంటెంట్‌తో పాటు టాలెంట్ ఉన్నోడికి ఎక్కడైన తిరుగులేదని అల్లు అర్జున్ జీవితం తెలుపుతుంది. ఫ్యామిలీ మ్యాన్ సినిమాలు, షూటింగ్‌లతో పాటు వ్యక్తిగత జీవితానికి కూడా అధిక ప్రాధాన్యత ఇస్తారు అల్లు అర్జున్. ఎంత బిజీగా ఉన్నా సరే వీలు కల్పించుకొని మరీ భార్యాపిల్లలతో గడిపేందుకు ఆయన సమయం కేటాయిస్తారు. ఇలా మంచి భర్త, మంచి తండ్రి, మంచి కొడుకు అని అనిపించుకునే బన్నీ సమయం వచ్చినప్పుడు తన కుటుంబానికి ఎంతటి ప్రాముఖ్యత ఇస్తాడో కూడా చూపిస్తాడు. తల్లిదండ్రుల ప్రేమ ఎలాంటిదో అభిమానుల ప్రేమ కూడా అలాంటిదే అని చెప్పిన బన్నీ.. ఎవరికైనా ఫ్యాన్స్ ఉంటారు. నాకు మాత్రం ఆర్మీ ఉంటుంది. నా జీవితంలో నేను సాధించిన అతిపెద్ద ఆస్తి అభిమానులే అని ఓ ఇంటర్య్వూలో ఆయన చెబుతూ ఉప్పొంగిపోయాడు. అల్లు అర్జున్ గురించి ఈ విషయాలు తెలుసా ► దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2022’ పురస్కారాన్ని గెలుచుకున్నాడు. ఈ అవార్డు అందుకున్న తొలి దక్షిణాది నటుడిగా రికార్డ్ ► రెండు సైమా అవార్డులతో పాటు ఒక ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్న అల్లు అర్జున్ ► ఇన్‌స్టాలో అల్లు అర్జున్ ఫాలోవర్స్ ఏకంగా 25 మిలియన్లు ఉన్నారు. ఇంతమంది ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న తొలి దక్షిణాది నటుడిగా అల్లు అర్జున్ కావడం విశేషం ► 'పుష్ప' సినిమాతో తన నటనకు గానూ జాతీయ ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్న అల్లు అర్జున్. ఈ అవార్డు పొందిన తొలి తెలుగు హీరోగా ఆయన సరికొత్త రికార్డు సృష్టించారు. ► టాలీవుడ్లో 'దేశ ముదురు' సినిమాతో సిక్స్‌ప్యాక్ పరిచయం చేసింది అల్లు అర్జున్నే ► బన్నీకి నటి ఐశ్వర్యరాయ్ అంటే అభిమానం. ఆవిడకు పెళ్లయినప్పుడు చాలా బాధపడ్డాడట ► అల్లు అర్జున్‌కు బాగా నచ్చే సినిమాలు టైటానిక్, ఇంద్ర.. ఇప్పటికే చాలాసార్లు ఆ సినిమాలు చూశారట ► 2021లో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చలనచిత్రంగా పుష్ప: ది రైజ్ రికార్డ్ క్రియేట్ చేసింది ► 'బద్రినాథ్' సినిమా కోసం మలేషియా వెళ్లి కత్తియుద్ధం నేర్చుకున్న బన్నీ ► 'రుద్రమదేవి' సినిమా సమస్యల్లో ఉందని తెలుసుకున్న అర్జున్.. ఆ ప్రాజెక్ట్‌కు తనలాంటి స్టార్ అవసరమనుకున్నాడు. అందుకే పారితోషికం తీసుకోకుండా గోనగన్నారెడ్డి పాత్ర పోషించాడు. 👉: ప్రతి పాత్రా ప్రత్యేకం.. వెండితెర ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు ప్రత్యేకం (ఫొటోలు) -
సౌత్ ఇండియా ఫిలిం ఫెస్టివల్ వేదికపై 'చిరు' సత్కారం
సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ తొలి వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వెళ్లారు. హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మణిశర్మ, తనికెళ్ల భరణి, టీజీ విశ్వప్రసాద్, మురళీమోహన్, అల్లు అరవింద్, కె.ఎస్.రామారావు,మంచు లక్ష్మీతో పాటు పలు భాషలకి చెందిన సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఎంతో ఘనంగా జరిగిన ఈ వేడుకకి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. పద్మవిభూషణ్ గౌరవం పొందిన సందర్భంగా చిరంజీవిని ఈ వేదికపై సత్కరించారు. వేదకపై ఉన్న మెగాస్టార్‌కు ఆంజనేయుడి ప్రతిమను అల్లు అరవింద్, మురళీమోహన్, టీజీ విశ్వప్రసాద్‌లు అందించారు. ఇప్పటికే పలు వేదికలపైన చిరంజీవిని పలువురు సత్కరించారు. గత నెలలో లాస్ ఏంజిల్స్‌లో తెలుగు అభిమానులు కూడా చిరును ఘనంగా సన్మానించారు. అమెరికాలోని మెగా ఫ్యాన్స్ ‘మెగా ఫెలిసిటేషన్ ఈవెంట్’ పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించి మెగాస్టార్‌ను గౌరవించారు. చిరంజీవికి అవార్డు వచ్చిన సమయంలో ఆయనకు పెద్ద సత్కారం చేయబోతున్నామని గతంలో ఇండస్ట్రీ పెద్దలు ప్రకటించారు కానీ అది ఇంకా కార్యరూపం దాల్చలేదు. -
సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2024..తారల సందడి (ఫొటోలు)
-
మళ్లీ మాస్ కాంబో
ఎనిమిదేళ్ల క్రితం విడుదలైన ‘సరైనోడు’ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ పతాకంపై ఈ పక్కా మాస్ మూవీని అల్లు అరవింద్ నిర్మించారు. కాగా ‘సరైనోడు’ తర్వాత నిర్మాత అల్లు అరవింద్– దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనుంది. ఈ మాస్ కాంబో గురించిన అధికారిక ప్రకటన శుక్రవారం వెల్లడైంది. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తారా? లేక మరో హీరో ఎవరైనా నటిస్తారా? అనే విషయంపై సరైన స్పష్టత రావాల్సి ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన మిగతా వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లుగా మేకర్స్ తెలిపారు. -
మెగా సంక్రాంతి వేడుకలు.. చిరు ఫామ్‌హౌజ్ ధర ఎంతో తెలుసా?
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి ముగిసింది. కానీ పండుగ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి షేర్ చేసిన ఒక ఫోటో ఇప్పటికీ నెట్టింట వైరల్ అవుతుంది. మెగా కుటుంబ సభ్యులు అందరూ ఒక్కచోటకు చేరి గ్రాండ్‌గా ఈ పండగని సెలబ్రేట్ చేసుకున్నారు. దీంతో వారందరూ సంక్రాంతిని ఎక్కడ సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ ప్రేదేశం ప్రత్యేకత ఏంటని చాలామంది ఆరాదీస్తున్నారు. మెగాస్టార్ ఫ్యామిలీ 2024 సంక్రాంతి సంబరాలను బెంగళూరులోని చిరంజీవికి ఎంతో ఇష్టమైన తన సొంత ఫామ్‌హౌజ్‌లో జరుపుకున్నారు. ఈ సంబరాల్లో చిరంజీవి, అల్లు అరవింద్, రామ్ చరణ్, అల్లు అర్జున్‌తో సహా వారి కుటుంబ సభ్యులు అందరూ పాల్గొన్నారు. దీంతో వారందరూ ఉన్న ఫోటోపై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. మెగాఫ్యామిలీ సంక్రాంతి సంబరాలు చేసుకున్న ఆ ఫామ్‌హౌజ్ గురించి నెటిజన్లు తెగ ఆరాతీస్తున్నారు. ఇంతకు ఆ ఫామ్‌హౌజ్ ఎక్కడ ఉంది..? ఎవరిది..? దాని ఖరీదు ఎంత..? అనే విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే ఆ ఫామ్‌హజ్ మెగాస్టార్ చిరంజీవికి సంబంధించినదే... అది బెంగళూరుకు దాదాపు 30 కీమీ దూరంలో ఉన్న దేవనహళ్లిలో ఉంది. వారి ఫామ్‌హౌజ్‌కు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కూడా దగ్గర్లోనే ఉంటుంది. అయితే ఈ ఫామ్‌హౌజ్ ధర దాదాపు రూ.30 కోట్లకు పైమాటే ఉండవచ్చని తెలుస్తోంది. అక్కడ ఆచార్య సినిమా షూట్ కూడా జరిగింది. మెగా కుటుంబానికి సంబంధించి చాలా వేడుకలు ఇక్కడే జరిగాయి. ఇందులో భాగంగానే ఈ సంక్రాంతి వేడుకలు కూడా అక్కడ వారందరూ ఘనంగా జరుపుకున్నారు. ఆ సమయంలో వారు గ్రూప్‌గా తీసుకున్న ఫోటోను చిరంజీవి తన అభిమానుల కోసం షేర్ చేసి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. ఇదే సమయంలో చిరంజీవి కొత్త సినిమా టైటిల్ 'విశ్వంభర' అని ప్రకటించారు. ఈ సినిమా టైటిల్ విజువల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టకుంటుంది. అల్లు అర్జున్ పుష్ప-2, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. -
Allu Aravind Birthday: నిర్మాత అల్లు అరవింద్ బర్త్‌డే స్పెషల్ ఫోటోలు (ఫొటోలు)
-
తండ్రికి ఐకాన్ స్టార్ స్పెషల్ విషెస్.. ట్వీట్ వైరల్!
అల్లు అరవింద్ పేరు చెప్పగానే గీతా ఆర్ట్స్ పేరు అందరికీ గుర్తుకొస్తుంది. అంతలా టాలీవుడ్ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరిగా నిలిచారు. తాజాగా ఇవాళ ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయన తనయుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. హ్యాపీ బర్త్‌డే డాడ్ అంటూ విషెస్ తెలిపారు. (ఇది చదవండి: అల్లు అరవింద్ అనుకుంటే బ్రహ్మానందం చేశాడు!) కాగా.. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 సినిమాతో బిజీగా ఉన్నారు. సుకుమార్- బన్నీ కాంబినేషన్లో పుష్ప పార్ట్-1 సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రం రిలీజ్ డేట్‌ను కూడా ఇప్పటికే ప్రకటించారు. ఈ ఏడాది ఆగస్టు 15న పుష్ప-2 థియేటర్లలో సందడి చేయనుందని మేకర్స్ వెల్లడించారు. Happy Birthday Dad 🖤 pic.twitter.com/nrlLF4yRHM — Allu Arjun (@alluarjun) January 10, 2024 -
ఆ డబ్బులు ఎగ్గొట్టిన తండ్రి.. అసలు విషయం చెప్పిన అల్లు అర్జున్
స్టార్ హీరో అల్లు అర్జున్.. ప్రస్తుతం 'పుష్ప 2' మూవీతో బిజీగా ఉన్నాడు. షూటింగ్ జరుగుతోంది. ఈ మధ్య కాలంలో బన్నీ నుంచి మూవీకి సంబంధించిన అప్డేట్స్ లాంటివి ఏం లేవు. బహుశా ఇప్పట్లో రాకపోవచ్చు. అయితే సడన్‌గా ఇన్ స్టాలో ఓ పోస్ట్ పెట్టాడు. ఎవరికీ తెలియని ఓ విషయాన్ని బయటపెట్టాడు. ఇప్పుడిది సోషల్ మీడియాలో డిస్కషన్‌కి కారణమైంది. ఇంతకీ ఏం జరిగింది? తండ్రి అల్లు అరవింద్ స్వతహాగా నిర్మాత కావడంతో చిన్నప్పటి నుంచి అల్లు అర్జున్.. సినిమా వాతావరణంలోనే పెరిగాడు. అయితే బన్నీ రెండేళ్ల వయసులో ఉన్నప్పుడే మెగాస్టార్ చిరంజీవి 'విజేత' మూవీలో నటించాడు. దీని గురించి ఫ్యాన్స్‌కి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. తాజాగా ఈ సినిమా షీల్ట్తో అల్లు అరవింద్ ఉన్న ఫొటోని బన్నీ పోస్ట్ చేశాడు. ఓ ఫన్నీ విషయాన్ని రివీల్ చేశాడు. (ఇదీ చదవండి: ఊరమాస్‌కి కేరాఫ్.. ఆ విషయంలో ఎక్స్పర్ట్.. ప్రశాంత్ నీల్ సక్సెస్ సీక్రెట్ ఇదే!) డబ్బులు ఇవ్వలేదు 'నా తొలి సినిమా విజేత.. మై ప్రొడ్యూసర్(నాన్న).. ఓ మైగాడ్. ఇందులో యాక్ట్ చేసినందుకు డబ్బులు ఇవ్వలేదని ఇప్పుడు మళ్లీ గుర్తొచ్చింది' అని అల్లు అర్జున్.. ఇన్ స్టాలో స్టోరీ పెట్టాడు. అయితే ఇదంతా ఫన్నీగా ఉండటంతో నెటిజన్స్ కూడా నవ్వుకుంటున్నారు. పాన్ ఇండియా స్టార్ అయినప్పటికీ.. తండ్రి డబ్బులు ఎగ్గొట్టేశాడని బన్నీ పెట్టిన స్టోరీ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇకపోతే అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న 'పుష్ప 2'.. వచ్చే ఏడాది ఆగస్టు 11న థియేటర్లలోకి రాబోతుంది. దీని తర్వాత త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగా లాంటి డైరెక్టర్స్‌తో బన్నీ సినిమాలు చేయబోతున్నాడు. వీళ్లిద్దరూ కాకుండా మరికొందరు డైరెక్టర్స్ కూడా లైన్లో ఉన్నారు. (ఇదీ చదవండి: 'సలార్' కలెక్షన్స్ రచ్చ.. రెండు రోజుల్లో ఏకంగా అన్ని కోట్లు) -
గోవాలో ఘనంగా సంతోషం అవార్డ్స్ వేడుక (ఫొటోలు)
-
మా నాన్న మమ్మల్ని వదిలేసి వెళ్లడం వల్లే..!
-
అతడు ఫెయిలయ్యాడు, మాకు పీఆర్వో కాదు.. అల్లు అరవింద్ సీరియస్
ఈ మధ్య సినిమా ప్రమోషన్స్‌లో విలేఖరి సురేశ్ కొండేటి పేరు మారుమోగుతోంది. సెలబ్రిటీలను చిత్రవిచిత్ర ప్రశ్నలడుగుతూ సోషల్ మీడియాలో సెలబ్రిటీ అయిపోయాడు. ఈయన చాలాకాలం నుంచి సంతోషం అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాడు. అయితే ఈసారి ఏకంగా గోవాలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. దక్షిణాది నుంచి పలువురు సెలబ్రిటీలను ఈవెంట్‌కు తీసుకెళ్లాడు. కానీ ఈ ఫంక్షన్ రసాభాసగా జరగడంతో టాలీవుడ్ పరువుపోయే పరిస్థితికి వచ్చింది. కన్నడ సెలబ్రిటీలకు ఇబ్బందులు ఈవెంట్ నిర్వహణలో కన్నడ సెలబ్రిటీలకు చేదు అనుభవం ఎదురైందట. స్టేజీపై కన్నడ నటులకు అవార్డులు ఇస్తున్న సమయంలో సడన్‌గా లైట్స్ ఆర్పేసి వారిని అవమానించారని, హోటల్ సిబ్బందితోనూ ఇబ్బందులు ఎదురయ్యాయంటూ.. కన్నడ ప్రతినిధులు సంతోషం అవార్డు వేడుకల మీద విమర్శలు చేస్తూ టాలీవుడ్‌ను తప్పుపడుతున్నారు. వేడుక మధ్యలో నుంచే యాంకర్ వెళ్లిపోయిందని, తమకు సరైన ఏర్పాట్లు చేయకుండా దారుణంగా అవమానించారంటూ కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై నిర్మాత అల్లు అరవింద్ స్పందించాడు. ఒక వ్యక్తి చేసిన పొరపాటు 'ఒక జర్నలిస్టు అనేక సంవత్సరాలుగా అవార్డు ఫంక్షన్స్ నిర్వహిస్తున్నాడు. ఈసారి గోవాలో చేద్దామనుకున్నాడు, కానీ ఏదో కొన్ని కారణాల వల్ల ఫెయిలయ్యాడు, చేయలేకపోయాడు. ఆ ఫంక్షన్‌కు వెళ్లినవారు ఇబ్బందులు పడ్డారు. అందులో ఇతర భాషల వారు కూడా ఉన్నారు. వాళ్లు తెలుగు సినీ ఇండస్ట్రీని నిందిస్తున్నారు. అది సరైనది కాదు. ఒక వ్యక్తి చేసిన పొరపాటును ఇండస్ట్రీ మొత్తానికి ఆపాదించడం కరెక్ట్ కాదు. అలాగే మీడియా.. అతడిని మా కుటుంబానికి చెందిన వ్యక్తికి పీఆర్వో అని రాస్తున్నారు. ఆయన ఎవరికీ పీఆర్వో కాదు. మా ఫ్యామిలీకి చెందిన పీఆర్వో అసలే కాదు. తను సొంతంగా ఏదో కార్యక్రమం చేయాలనుకుని ఫెయిలయ్యాడు.. అంతే!' అని పేర్కొన్నాడు. .#Kannada celebrities face humilation at #SanthoshamSouthIndian Film awards #Goa It is with deep concern and disappointment that we need to address the distressing events that transpired at the #Santhosham #South #Indian Film Awards 2023 The award function that is organised by… pic.twitter.com/s0kXAKPmh1 — A Sharadhaa (@sharadasrinidhi) December 3, 2023 చదవండి: జపాన్ అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. అప్పుడే స్ట్రీమింగ్ -
కాంగ్రెస్ విజయం.. అల్లు అరవింద్ శుభాకాంక్షలు..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. రెండుసార్లు వరుస విజయాలు సాధించిన బీఆర్ఎస్ను ప్రజలు పక్కనపెట్టేశారు. కాంగ్రెస్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకున్నారు. మొత్తంగా 64 స్థానాలు కైవసం చేసుకున్న కాంగ్రెస్ అధికారం చేపట్టబోతోంది. ఈ క్రమంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ హస్తం పార్టీకి శుభాకాంక్షలు చెప్పారు. సోమవారం నాడు ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం సంతోషంగా ఉందన్నారు. సినీ పరిశ్రమను ఆదుకోవడం హస్తం పార్టీకి కొత్తేమీ కాదన్నారు. ఇంతకుముందున్న ప్రభుత్వాలు కూడా సినీపరిశ్రమను ఎంతగానో ప్రోత్సహించాయని తెలిపారు. ఈ ప్రభుత్వం కూడా చిత్రపరిశ్రమను ప్రోత్సహిస్తుందని భావిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నామని, త్వరలోనే ఇండస్ట్రీ తరపున కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలను కలుస్తామని చెప్పారు. చదవండి: సిల్క్ స్మితపై కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. మళ్లీ వైరల్.. -
రష్మిక మందాన్నా ‘‘ది గర్ల్ ఫ్రెండ్’ మొదలైంది!
రష్మికా మందన్నా ప్రధాన ప్రాత్రలో నటించనున్న సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్’. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో విద్య కొప్పినేని, ధీరజ్ మొగిలినేని నిర్మించనున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి దర్శక–నిర్మాత మారుతి కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ ఇచ్చారు. దర్శక–నిర్మాత సాయి రాజేశ్ గౌరవ దర్శకత్వం వహించారు. వైవిధ్యమైన ప్రేమకథతో తెరకెక్కనున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సినిమాకు సంగీతం: హేషమ్ అబ్దుల్ వాహబ్, కెమెరా: కృష్ణన్ వసంత్. -
‘కోట బొమ్మాళి పీఎస్’లో హీరోలు లేరు: అల్లు అరవింద్
‘పోలీసులనే పోలీసులు వెంటాడే విచిత్రమైన కథ ‘కోట బొమ్మాళి పీఎస్’. ఈ సినిమాలో హీరోలు లేరు.. కథే హీరోగా వెళుతుంటుంది. ఈ చిత్రం ఏ రాజకీయ నాయకుడిని, పోలీస్ ఆఫీసర్ని ఉద్దేశించి తీయలేదు. ఈ వైవిధ్యమైన చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్. రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ జంటగా శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. తేజా మార్ని దర్శకత్వంలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘లింగిడి లింగిడి..’ పాట తర్వాత ఈ సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి. ఈ చిత్రం మంచి హిట్టవ్వాలి’’ అన్నారు. ‘‘ఈ సినిమా ట్రైలర్ చూశాను. ఇప్పుడున్న పరిస్థితులకి చెప్పాలనుకున్న విషయాన్ని క్లియర్‌గా చెప్పారు’’ అని దర్శకుడు బోయపాటి శ్రీను అన్నారు. ‘‘ప్రేక్షకులను ఆలోచింపజేసే చిత్రమిది’’ అని ‘బన్నీ’ వాసు అన్నారు. -
కొత్తవాళ్లతో సినిమా పెద్ద బాధ్యత
‘‘మా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌లో ఇప్పటివరకు వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిలింస్ చేశాం. తొలిసారి ఫీచర్ ఫిల్మ్ప్రారంభించాం. ఇంతమంది కొత్తవాళ్లతో సినిమా చేయటం పెద్ద బాధ్యతగా భావిస్తున్నాను’’ అన్నారు నిహారిక కొణిదెల. యదు వంశీ దర్శకత్వంలో నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్ఎల్పీ, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్‌పై పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మిస్తున్న చిత్రం శుక్రవారంప్రారంభమైంది. తొలి సన్నివేశానికి నటుడు నాగబాబు కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో వరుణ్ తేజ్ క్లాప్ కొట్టారు. డైరెక్టర్ వెంకీ కుడుముల గౌరవ దర్శకత్వం వహించగా, నిర్మాత అల్లు అరవింద్ స్క్రిప్ట్‌ని యూనిట్‌కి అందించారు. యదు వంశీ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ద్వారా 11 మందిని హీరోలుగా, నలుగురిని హీరోయిన్లుగా పరిచయం చేస్తున్నాం’’ అన్నారు. ‘‘ఈ చిత్రంతో నేను, నా సతీమణి జయలక్ష్మి నిర్మాతలుగా పరిచయమవుతున్నాం’’ అన్నారు శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ అధినేత ఫణి. ఈ చిత్రానికి కెమెరా: రాజు ఎడురోలు, సంగీతం: అనుదీప్ దేవ్, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: మన్యం రమేశ్. -
'సీతారామం' బ్యూటీ తెలుగింటి కోడలు కానుందా?
తెలుగులో ప్రతి ఏడాది పదుల సంఖ్యలో హీరోయిన్లు వస్తూనే ఉంటారు. కానీ వాళ్లలో హిట్ కొట్టి, స్టార్స్ అయ్యేది మాత్రం ఒకరో ఇద్దరు మాత్రమే ఉంటారు. అలా గతేడాది రిలీజైన 'సీతారామం' సినిమాతో ఓవర్‌నైట్ స్టార్డమ్ సంపాదించిన బ్యూటీ మృణాల్ ఠాకుర్. ప్రస్తుతం పలు సినిమాలు చేస్తున్న ఈమె పెళ్లి చేసేసుకోవాలని టాలీవుడ్ బడా నిర్మాత ఆశీర్వాదించాడు. ఇప్పుడీ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిపోయింది. తెలుగులో స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థ తరఫున ఎన్నో అద్భుతమైన సినిమాలు తీసి ప్రేక్షకుల్ని అలరించారు. గతంలో ఓ సందర్భంగా ఆయన హీరోయిన్ లావణ్య త్రిపాఠిని.. హైదరాబాద్ వచ్చేయ్ అమ్మా అని ఆశీర్వదించారు. ఆ తర్వాత కొన్నాళ్లకు లావణ్.. మెగాఫ్యామిలీకి చెందిన హీరో వరుణ్ తేజ్‌తో నిశ్చితార్థం చేసుకుంది. నవంబరు 1న వరుణ్-లావణ్య పెళ్లి కూడా జరగనుంది. (ఇదీ చదవండి: 'కేసీఆర్' సినిమా కోసం ఇల్లు తాకట్టు పెట్టిన 'జబర్దస్త్' కమెడియన్) సరే లావణ్య పెళ్లి సెట్ అయినప్పుడు చాలామంది అల్లు అరవింద్ ఆశీర్వాదం గురించి మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఆయనే.. 'సీతారామం' హీరోయిన్ మృణాల్ ఠాకుర్‌ని కూడా ఆశీర్వదించారు. సైమా అవార్డ్స్‌లో 'సీతారామం' సినిమాకుగానూ ఉత్తమ నటిగా మృణాల్ నిలిచింది. ఈ అవార్డుని అల్లు అరవింద్.. ఈమెకు ప్రెజెంట్ చేశారు. ఆ తర్వాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 'గతంలో ఓ వేదికపై హీరోయిన్‌తో ఓ మాట అన్నాను. తెలుగబ్బాయిని పెళ్లి చేసుకుని టాలీవుడ్‌కి కోడలిగా వచ్చేయమన్నాను. ఆ మాటని ఆమె నిజం చేసింది. ఇప్పుడు నీతో కూడా అదే మాట అంటున్నా. టాలీవుడ్ కోడలిగా హైదరాబాద్ వచ్చేయ్' అని అల్లు అరవింద్, మృణాల్ ఠాకుర్ తో అన్నారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోంది. (ఇదీ చదవండి: ఆ సినిమా షూటింగ్లో దౌర్జన్యం.. కత్తులు తెచ్చి నటితో అలా!) #alluaravind mawa very naughty aa... #MrunalThakur tfi lo young heroni chesesko... pic.twitter.com/kjeCzguXQM — celluloidpanda (@celluloidpanda) October 28, 2023 -
అల్లు అరవింద్ అనుకుంటే బ్రహ్మానందం చేశాడు!
అల్లు అరవింద్ పేరు చెప్పగానే గీతా ఆర్ట్స్ నిర్మాత, ఐకాన్ అల్లు అర్జున్ తండ్రి అని చాలామంది అంటారు. కానీ అప్పట్లో చిరంజీవితో కలిసి కొన్ని సినిమాల్లో నటించారని ఇప్పటి జనరేషన్ కుర్రాళ్లకు చాలామందికి తెలియదు. ప్రస్తుతం నిర్మాతగా బిజీగా ఉన్న ఆయనతో ప్రయోగం చేద్దామని టాలీవుడ్ యువ దర్శకుడు ఒకరు అనుకున్నారు. కానీ ఆ పాత్ర బ్రహ్మానందంతో చేయించాడు. ఇంతకీ ఏంటా సినిమా? (ఇదీ చదవండి: గాలి తీసేసిన తమన్.. ఈ కౌంటర్ బోయపాటికేనా?) టతరుణ్ భాస్కర్ పేరు చెప్పగానే 'పెళ్లి చూపులు', 'ఈ నగరానికి ఏమైంది?' లాంటి క్రేజీ మూవీస్ గుర్తొస్తాయి. ఇప్పుడా డైరెక్టర్ చాలా ఏళ్ల తర్వాత తీస్తున్న సినిమా 'కీడా కోలా'. థ్రిల్లర్ ఎంటర్టైనింగ్ కాన్సెప్ట్‌తో తీస్తున్న ఈ సినిమాలో సాధారణ ఆర్టిస్టులే ఎక్కువగా నటించారు. సినిమా ఆసాంతం వీల్ ఛైర్లో కూర్చుని ఉండే వరదరాజులు అనే పాత్రలో మాత్రం బ్రహ్మానందం యాక్ట్ చేశాడు. అయితే స్టోరీ అంతా రెడీ కాగానే వరదరాజులు పాత్ర అల్లు అరవింద్ చేస్తే బాగుంటుందని తరుణ్ భాస్కర్ అనుకున్నాడు. తాజాగా 'కీడా కోలా' ప్రమోషనల్ ఇంటర్వ్యూలో అదే విషయాన్ని రానాతో చెప్పాడు. అల్లు అరవింద్ దగ్గరకెళ్లి.. మీరు యాక్ట్ చేస్తారా అని తరుణ్ భాస్కర్ అడిగితే.. ఆయన సింపుల్‌గా నవ్వి ఊరుకున్నారట. దీంతో ఆ పాత్ర కోసం బ్రహ్మీ లైనులోకి వచ్చాడు. నవంబరు 3న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. (ఇదీ చదవండి: 'జైలర్' విలన్ని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం అదే?) -
Allu Business Park Launch Pics: అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహం ఆవిష్కరణ (ఫొటోలు)
-
అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహం ఆవిష్కరణ
తెలుగు సినిమా గర్వించే లెజెండరీ సీనియర్ నటులు, దివంగత పద్మశ్రీ డా.అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆదివారం ఆయన 101వ జయంతి. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని అల్లు బిజినెస్ పార్క్‌లో అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని హీరో అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అల్లు రామలింగయ్య కుమారుడు, నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ–‘‘వెయ్యి సినిమాలకుపైగా నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన గొప్ప నటులు నాన్నగారు. తనదైన నటనతో యాభై ఏళ్లపాటు ప్రేక్షకుల్ని అలరించిన ఆయన తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖ, హీరో అల్లు శిరీష్‌తో పాటు అల్లు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
డీజే టిల్లు కొత్త సినిమా.. క్లాప్ కొట్టిన అల్లు అరవింద్
‘డీజే టిల్లు’ ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా ‘బొమ్మరిల్లు’ ఫేమ్ భాస్కర్ దర్శకత్వంలో కొత్త సినిమా షురూ అయింది. బాపినీడు.బి సమర్పణలో ఎస్వీసీసీ బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న 37వ సినిమా గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రాడ్యూసర్ ‘దిల్’ రాజు కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా బీవీఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘భాస్కర్ దర్శకత్వంలో సిద్ధుతో మా బ్యానర్లో సినిమా చేయటం ఎంతో సంతోషంగా ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా మూవీ ఉంటుంది. హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తాం’’ అన్నారు. ఈప్రారంభోత్సవంలో నిర్మాతలు వై.రవిశంకర్, వంశీ, దామోదర్ ప్రసాద్, రాధా మోహన్ , మిర్యాల రవీందర్ రెడ్డి, రచయిత కోన వెంకట్, డైరెక్టర్ నందినీ రెడ్డి, కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సాయి ప్రకాష్. -
'బేబీ' ఫేమ్ వైష్ణవి కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్.. హీరో ఎవరంటే
బేబీ హీరోయిన్ 'వైష్ణవి చైతన్య' పేరు ఇప్పుడు ఎక్కడ చూసినా ట్రెండింగ్‌లో ఉంది. టాలీవుడ్లో హీరోయిన్ కావాలనే లక్ష్యంతో పరిశ్రమకొచ్చి. ఎనిమిదేళ్లైనా అది నెరవేరకపోవడంతో యూట్యూబర్‌గా అయినా కొనసాగాలని పలు షార్ట్ ఫిలిమ్స్ తీసుకుంటూ.. ఇన్‌స్టాలో రీల్స్ చేసుకుంటూ ఉంటున్న తనకు డైరెక్టర్ సాయిరాజేశ్ వల్ల బేబీతో సిల్వర్ స్క్రీన్‌పై మొదటిసారి మెరిసింది. వచ్చిన అవకాశం నిలబెట్టుకునేందకు తను కూడా ఎంతగానో కష్టపడింది కూడా. (ఇదీ చదవండి: నో డౌట్.. ఈ కామన్ మహిళ బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఖాయం) మొదట కథ విన్నప్పుడు ఒక బస్తీలో పుట్టి పెరిగిన అమ్మాయి పాత్రలో కనిపిస్తావని డైరెక్టర్ చెప్పినప్పుడు ఎగిరి గంతేశానని గతంలో ఓ ఇంటర్వ్యూలో వైష్ణవి చెప్పింది. ఎందుకంటే తాను కూడా చాంద్రాయణగుట్టలోని ఒక బస్తీ అమ్మాయినే కాబట్టి అంటూ తన ఐడెంటీని దాచుకోకుండా చెప్పుకొచ్చింది. దీంతో ఒక తెలుగమ్మాయి టాలెంట్‌కు దక్కాల్సిన ఫేమ్ తనకు వచ్చింది. (ఇదీ చదవండి: నీకు కృతజ్ఞతే లేదు.. బన్నీని ముందు పెట్టి మారుతిపై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్) తాజాగా వైష్ణవి టాలీవుడ్లో ప్రముఖ సంస్థ అయినటువంటి గీతా ఆర్ట్స్‌లో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి తనను అల్లు అరవింద్ సంప్రదించినట్లు సమాచారం. ఇప్పటికే అందుకు సంబంధంచి స్టోరీ కూడా తన వద్ద ఉందని, అది కూడా ఫీమేల్ ఓరియేంటేడ్ అని బేబీ సక్సెస్ మీట్లోనే అల్లు అరవింద్ కొంతమేరకు లీకులు ఇచ్చారు. మరోవైపు అల్లు శిరీష్- వైష్ణవి జంటగా మరో స్టోరీతో కూడా మూవీని ప్లాన్ చేస్తున్నారని టాక్. అల్లు అర్జున్ కూడా బేబీలో వైష్ణవి నటనకు ఫిదా అయ్యానని ఓపెన్‌గానే చెప్పాడు. అల్లు కుటుంబం నుంచి తనకు మంచి గుర్తింపు ఉంది కాబట్టి. ఎదో ఒక ప్రాజెక్ట్‌లో గీతా ఆర్ట్స్ ద్వారా తన జర్నీలో మరో అడుగు పడటం ఖాయమని తెలుస్తోంది. -
రాముడిగా రణ్‌బీర్.. రావణుడిగా యశ్?
భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా ఇప్పటికే పలు చిత్రాలు వచ్చాయి.. ఇంకొన్ని వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రామాయణం ఆధారంగా అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రా ఓ సినిమాను నిర్మించనున్నట్లుగా ప్రకటన వచ్చి దాదాపు మూడేళ్లు ముగిసింది. కానీ ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. దాంతో ఈ చిత్రం నిలిచి΄ోయిందా? అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే అలాంటిదేమీ లేదని, ప్రీప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని నిర్మాతలు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఈ ఏడాది చివర్లో రెగ్యులర్ షూటింగ్‌ను ఆరంభించాలని నిర్మాతలు అనుకుంటున్నారన్నది తాజా సమాచారం. ఈ చిత్ర దర్శకుడు నితీష్ తివారి ఈ సినిమా పనులను మరింత వేగవంతం చేశారని బాలీవుడ్లో వినిపిస్తోంది. ప్రస్తుతం నటీనటుల ఎంపికపై దృష్టి పెట్టారట. రాముడు, సీత, లక్ష్మణుడు, రావణుడు, హనుమంతుడు వంటి ప్రధాన పాత్రలకు ఆర్టిస్టులను ఎంపిక చేసి, లుక్ టెస్ట్‌ను నిర్వహించేందుకు నితీష్ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా ఆలియా భట్, రావణుడి పాత్రలో యశ్‌లు నటించనున్నారని, ముందు వీరి లుక్ టెస్ట్ జరుగుతుందని టాక్. మరి.. ఈ ‘రామాయణం’లో రియల్ లైఫ్ జంట ఆలియా, రణ్‌బీర్ సీతారాములుగా కనిపిస్తారా? ‘కేజీఎఫ్’లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో విజృంభించిన యశ్ ఈ చిత్రంలో రావణుడిగా బీభత్సం సృష్టిస్తారా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. -
వైష్ణవిని గట్టిగ హగ్ చేసుకొని ముద్దు పెట్టుకున్నాను..
-
సరదాగా చెప్తే.. లావణ్య సీరియస్‌గా తీసుకుంది: అల్లు అరవింద్
మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. ఇటీవల వీళ్ల నిశ్చితార్థం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. కొన్నేళ్లు ఈ జంట ప్రేమలో ఉన్నా.. ఎక్కడా బయటపడలేదు. మీడియాలో వార్తలు వచ్చినా స్పందించలేదు. దీంతో ఇది పుకారు మాత్రమేనని అంతా అనుకున్నారు. కానీ సడెన్‌గా ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికీ షాకిచ్చారు. వీరి ఎంగేజ్మెంట్ తర్వాత అల్లు అరవింద్ గతంలో ఓ మూవీ ఈవెంట్లో చేసిన కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి. ‘చావు కబురు చల్లగా' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లావణ్య మాట్లాడుతుండగా మధ్యలో మైక్ అందుకున్న అల్లు అరవింద్.. 'ఎక్కడో నార్త్ ఇండియా నుంచి వచ్చి తెలుగు చక్కగా మాట్లాడుతోంది. ఇక్కడే ఒక కుర్రోడిని చూసి పెళ్లి చేసుకుని సెటిల్ అయితే బాగుంటుంది’ అని అన్నారు. అది ఇప్పుడు నిజమైంది. అల్లు అర్జున్ కూడూ ఈ వీడియోని షేర్ చేసి మరీ ‘మా నాన్న విజనరీ, ఆయన చెప్పిందే జరిగింది’ అని ట్వీట్ చేశాడు. ఇదంతా అనుకోకుండా జరిగిందని, తాజాగా అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు. ‘బేబీ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అల్లు అరవింద్ గెస్ట్ వచ్చారు. ఈ సందర్భంగా లావణ్య త్రిపాఠి పెళ్లి గురించి యాంకర్ ఆయనకు గుర్తు చేసింది. దీనిపై అరవింద్ స్పందిస్తూ.. ‘ఏదో సరదాగా చెప్తే.. లావణ్య సీరియస్‌గా తీసుకొని మా వాడినే పెళ్లి చేసుకోబోతుంది’ అని ఫన్నీగా అన్నారు. అంతేకాదు బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్యని ఇప్పుడే పెళ్లి చేసుకోవద్దని సలహా ఇచ్చారు. ఇంకా మంచి భవిష్యత్ ఉందని, కెరీర్ లో సెటిల్ అయ్యాక పెళ్లి ఆలోచన చేసుకోవాలని అన్నారు. ఇక బేబి విషయానికొస్తే.. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన చిత్రమిది. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని ఎస్కేఎన్ నిర్మించారు. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జులై 14న విడుదల కాబోతుంది. -
త్వరలోనే మరో రామాయణం.. రాముడు, సీతగా వారిద్దరే!
రామాయణ ఇతిహాసం ఆధారంగా ప్రభాస్ ఆదిపురుష్ తెరకెక్కిన సంగతి తెలిసిందే. కృతిసనన్ జంటగా నటించిన ఈ చిత్రం ఈనెల 16న థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే త్వరలోనే మరో క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ రామాయణాన్ని తెరకెక్కిస్తున్నట్లు టీ టౌన్లో టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ ఫిలిం మేకర్ నితేశ్ తివారీ, నిర్మాత మధు మంతెనతో కలిసి ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: ఫోటోలు షేర్ చేసి ట్రోలర్స్‌కు గట్టిగానే రిప్లై ఇచ్చిన నటి) అయితే ఈ సినిమాలో రాముడి పాత్రలో రణ్‌బీర్‌కపూర్‌ను ఎంపిక చేశారని టాక్ వినిపిస్తోంది. సీత పాత్రకు బాలీవుడ్ భామ ఆలియా భట్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. తాజాగా దర్శకుడు నితేశ్ తివారీతో అలియా భట్ కనిపించడంతో ఓకే చెప్పారని సమాచారం. కానీ గతంలో సీతగా సాయిపల్లవి కనిపించనుందని వార్తలొచ్చాయి. ఇక ఈ సినిమాలో రావణుడి పాత్రకు కేజీయఫ్ హీరో యశ్‌ను ఓకే చేశారని తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. గతంలో ఈ ప్రాజెక్ట్ గురించి అల్లు అరవింద్ మాట్లాడుతూ..'నేను కొందరు నిర్మాతలతో కలిసి రామాయణాన్ని నిర్మిస్తున్నా. దాని కోసం నాలుగేళ్లుగా వర్క్ జరుగుతోంది. ప్రీ ప్రొడక్షన్ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ఆ తర్వాత ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఉంటాయి. ఇది చాలా పెద్ద ప్రయత్నం. పూర్తవ్వడానికి చాలా ఏళ్లు పడుతుంది. ఇండియాలోనే అతి భారీ బడ్జెట్ సినిమాగా నిలుస్తుందని'. చెప్పారు. మరోవైపు ఈ ప్రాజెక్ట్ వాయిదా పడనుందనే వార్తలపై తాజాగా నిర్మాత మధు మంతెన స్పందించారు. ఈ ఏడాది చివర్లో సినిమాను ప్రారంభించనున్నాం. దయచేసి ఇలాంటివి ప్రచారాన్ని నమ్మకండి అని అన్నారు. దీంతో మరో ఆదిపురుష్ రాబోతోందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: అతనిపై విపరీతమైన క్రష్.. కానీ నన్ను మోసం చేశాడు: హీరోయిన్) -
బన్నీ విషయంలో లెక్క తప్పిన అల్లు రామలింగయ్య
ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ప్రసారం అయిన తెలుగు ఇండియన్ ఐడల్- 2 గ్రాండ్ ఫినాలే కోసం ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరు అయ్యారు. సంగీత ప్రియుల మనుసు దోచుకుంది ఈ షో. ముఖ్య అతిథిగా వచ్చిన బన్నీ.. తన చిన్ననాటి సంగతులను పంచుకున్నారు. (ఇదీ చదవండి: త్రిషకు అతనితో పెళ్లి చేయడమే పెద్ద మైనస్.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్) ''తాత (అల్లు రామలింగయ్య) గ్రాండ్ చిల్డ్రన్లలో నేను చాలా క్వయిట్గా ఉండేవాడిని... మిగిలిన వారితో పోలిస్తే వీడు మొద్దు, భవిష్యత్త్ ఎలా ఉంటుందో ఏమిటో అనుకున్నాడేమో..! ఆ రోజుల్లోనే నా పేరుతో ఒక ఇన్స్యూరెన్స్ చేయించాడు. నేను నామినీగా ఉంటడంతో రూ.10 లక్షలు నాచేతికి వచ్చాయి. పిల్లలు క్వయిట్గా ఉంటే వారి భవిష్యత్‌పై తల్లిదండ్రులకు కూడా సందేహాలు ఉంటాయి. కానీ వారిలో దాగి ఉన్న హిడెన్ టాలెంట్‌ను గుర్తించి బయటకు తీస్తే వారి భవిష్యత్‌కు ఎదురే ఉండదు. అల్లు రామలింగయ్య గారికి 8 మంది మనమలు, మనమరాళ్లు.. వారందరిలో మొదట సంపాదించింది నేనే'' అని అల్లు అర్జున్ తెలిపారు. (ఇదీ చదవండి: రాహుల్ సిప్లిగంజ్ ఇంట్లో పెళ్లిసందడి.. ఫోటోలు వైరల్!) తాత బీమా గురించి చెబుతూనే.. తండ్రి (అల్లు అరవింద్) గురించి కూడా మరో ఆసక్తికరమైన విషయాన్ని తెలిపాడు బన్నీ. ''మేం చెన్నై నుంచి హైదరాబాద్‌కు షిఫ్ట్ అయిన రోజుల్లో ఒకేసారి మా లైఫ్ టర్న్ తీసుకుంది. హైదరాబాద్‌కు మాకన్నా ముందే నాన్న షిఫ్టయిపోయారు… తర్వాత మేం ఇక్కడికి చేరుకున్నాం. ఓ రోజు మేం ఇద్దరమే ఉన్నప్పుడు హఠాత్తుగా నన్ను హగ్ చేసుకుని, నువ్వు రాబోయే రోజుల్లో హీరోగా మంచి పేరు తెచ్చుకుంటావు అన్నాడు ప్రేమగా… తన గురించి చెబుతూ పోతే ఒక రాత్రి సరిపోదు… నాకు దేవుడు అంటే మా నాన్నే.. నేను ఏమీ అడగకుండానే అన్నీ నాన్నే ఇచ్చాడు'' అంటూ ఎమోషనల్‌గా చెబుతూ పోయాడు బన్నీ. తన మాటల్లో హిపోక్రసీ ఏమీ కనిపించలేదు, వినిపించలేదని… చాలా నేచురల్ ఫ్లోతో చెప్పారని బన్నీ ఫ్యాన్స్ అంటున్నారు. -
బయోపిక్ లో నాగచైతన్య...!
-
నా వల్ల పైకొచ్చినవాళ్లు గీత దాటారు, అతడి పేరు చెప్పను!
నా ద్వారా పైకి వచ్చిన దర్శకులు చాలామంది గీత దాటారన్నాడు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్. కెరీర్లో కొంత సక్సెస్ కాగానే ఆ విషయం మర్చిపోయి గీత దాటి వేరే సినిమాలు చేశారని పేర్కొన్నాడు. మే 5న మలయాళంలో రిలీజైన 2018 మూవీ అక్కడ రూ.150 కోట్ల మార్క్ టచ్ చేసి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. గతవారం తెలుగులో విడుదలై ఇక్కడ కూడా భారీ కలెక్షన్స్ సాధిస్తోంది. ఈ సందర్భంగా నిర్మాతలు గురువారం థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేశారు. జూనియర్స్‌కు స్పేస్ ఇవ్వాలి ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. నేను అమెరికాలో ఉండగా బన్నీ వాసు ఫోన్ చేశాడు. 2018 మూవీ చూశా, ఇది మనం తెలుగులో రిలీజ్ చేయాలి అని చెప్పాడు. ఇతర భాషల్లో వస్తున్న మంచి సినిమాలన్నీ మనమే చేస్తున్నం కదా.. ఇది కూడా మనమే చేద్దాం అంటే సరేనన్నాను. అయితే ఇక్కడ నేను గానీ, దిల్ రాజుగానీ.. సీనియర్స్ అందరం జూనియర్స్‌కు స్పేస్ ఇవ్వాలి. అందులో వాళ్లను ఎదగనివ్వాలి. మొత్తం మనమే ఆక్రమించేసి మనమే పైకొచ్చేయాలనేది సరి కాదు. పక్కవాళ్లకు స్పేస్ ఇవ్వడమే నా ఆటిట్యూడ్. ఇప్పటికీ నాకోసం నిలబడ్డాడు చందూ మొండేటి కార్తికేయ 2 తీసి ఏడాది దాటిపోయింది. అయితే ఆ సినిమా రిలీజవకముందే నాతో రెండు సినిమాలు చేయాలన్న కమిట్మెంట్ ఉంది. కార్తికేయ 2 రిలీజ్ కాకముందే అతడో గొప్ప డైరెక్టర్ అని గ్రహించి బుక్ చేసుకున్నాను. నాద్వారా పైకొచ్చినవాళ్లలో చాలామంది గీత దాటారు. వాళ్ల పేరు ఇప్పుడు చెప్పాలనుకోవడం లేదు. కానీ చందూ మొండేటి మాత్రం నాతో సినిమా చేయడానికే నిలబడ్డారు' అని వ్యాఖ్యానించాడు అరవింద్. అయితే అల్లు అరవింద్ ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారనేది ఆసక్తికరంగా మారింది. చదవండి: అమ్మాయిలపై అత్యాచారం... నటుడికి 30 ఏళ్ల జైలు శిక్ష -
అన్నీ మంచి శకునములే హాయినిస్తుంది
‘‘రాఘవేంద్రరావు, అశ్వినీదత్గార్లతో నాది 30 ఏళ్లు పైబడిన స్నేహం. స్వప్న, ప్రియాంక నా కూతుళ్లులాంటివారు. నేను, దత్‌గారు యాభై ఏళ్లుగా పరిశ్రమలో ఉన్నప్పటికీ ఇవాళ మా పిల్లల వల్ల ఇంకా ఎక్కువ షైన్ అవుతున్నాం. ‘అన్నీ మంచి శకునములే’ మనందరికీ హాయి ఇస్తుందనే నమ్మకం ఉంది’’ అని నిర్మాత అల్లు అరవింద్. అన్నారు. సంతోష్ శోభన్, మాళవికా నాయర్ జంటగా నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. ప్రియాంకా దత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘చెయ్యి చెయ్యి కలిపేద్దాం..’ అంటూ సాగే నాలుగో పాటను డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు, నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వినీదత్ రిలీజ్ చేశారు. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటను శ్రీ కృష్ణ, వేణు శ్రీరంగం, సందీప్, చైత్ర అంబడిపూడి పాడగా, బృందా మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. రాఘవేంద్రరావు మాట్లాడుతూ–‘‘అన్నీ మంచి శకునములే’ మూవీ ‘పెళ్లి సందడి’ అంత పెద్ద విజయం సాధిస్తుంది’’ అన్నారు ‘‘రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, అశ్వినీదత్గార్లు నాకు మంచి శకునం’’ అన్నారు నందినీ రెడ్డి. ‘‘చిన్నప్పటినుంచి ఈ ముగ్గుర్ని (రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, అశ్వినీదత్) చూస్తూ పెరిగాం.. వీరిని ఒకే వేదికపై చూడటం ఆనందంగా ఉంది’’ అన్నారు నిర్మాతలు ప్రియాంకా దత్, స్వ΄్నా దత్. -
CII Dakshin 2023: యువత సినీపరిశ్రమకు రావాలి
‘‘దక్షిణాది సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటడం గొప్ప విషయం. యువత సినిమా పరిశ్రమకు రావాలి. ‘ఆర్ఆర్ఆర్, ‘ది ఎలిఫెంట్ ఆఫ్ విస్పరర్స్’ ఆస్కార్ అవార్డులు సాధించడం గర్వకారణం’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్. బుధవారం చెన్నైలో జరిగిన సీఐఐ (కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) దక్షిణ్ సమ్మిట్‌లో ఆయన పాల్గొని ప్రసంగించారు. సీఐఐ దక్షిణ్ చైర్మన్, మేనేజింగ్ పార్ట్నర్ టీజీ త్యాగరాజన్ నేతృత్వంలో రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సు ప్రారంభోత్సవంలో తమిళనాడు మంత్రులు ఉదయనిధి స్టాలిన్, స్వామినాథన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సీఐఐ దక్షిణ్ కమిటీ సభ్యురాలు సుహాసిని, నిర్మాత అల్లు అరవింద్, ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి, నటులు కార్తీ, రిషబ్ శెట్టి, నటి మంజు వారియర్, దర్శకుడు వెట్రిమారన్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సెల్వమణి మాట్లాడుతూ– ‘‘తమిళ చిత్రాల షూటింగ్‌లు తమిళనాడులో అధికంగా జరిగేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. ఇప్పటివరకూ దక్షిణాదిలో 50 వేల చిత్రాలు రూపొందాయి. అయితే సినిమాలనే నమ్ముకున్న కార్మికులకు ప్రోత్సాహం లేదు. వారి కోసం తమిళనాడు సినీ కార్మికుల డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలి’’ అన్నారు. మంత్రి ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ – ‘‘తమిళనాడు ప్రభుత్వం, ముఖ్యమంత్రి స్టాలిన్ సినీ పరిశ్రమకు అండగా ఉంటారు. సెల్వమణి తదితరులు పేర్కొన్న అంశాల గురించి చర్చించి, చర్యలు తీసుకుంటాం’’ అన్నారు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు...’ పాట నృత్యదర్శకుడు ప్రేమ్ రక్షిత్, ‘ది ఎలిఫెంట్ ఆఫ్ విస్పరర్స్’ షార్ట్ ఫిలిం దర్శకురాలు కార్తీకీలను సత్కరించారు. -
‘విడుదల పార్ట్ 1’ సినిమా ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
Vidudhala Part1: ఈ సినిమాను మీడియానే ప్రజల వద్దకు తీసుకెళ్లాలి
‘విడుతలై పార్ట్ 1’ సినిమా చూసిన తర్వాత క్లైమాక్స్ లో ఎమోషన్ కి కనెక్ట్ అయి లేచి చప్పట్లు కొట్టేసాను. ఇది చాలా గొప్ప సినిమా. ఇటువంటి సినిమాను మీడియా ప్రజల వద్దకు తీసుకెళ్లాలి’అని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కోరారు. ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘విడుతలై పార్ట్ 1’ . విజయ్ సేతుపతి, సూరి కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం మార్చి 31న తమిళ్లో విడుదలై హిట్ టాక్ని సంపాదించుకుంది. ఈ చిత్రాన్ని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ‘గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్’ ద్వారా తెలుగులో ‘విడుదల పార్ట్ 1’గా ఏప్రిల్ 15న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందంతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘వెట్రిమారన్ అంటే చాలా రోజులు నుంచి నాకు ఇష్టం. ఆయన సినిమాలు అన్ని చూస్తాను. ఈ విడుదల సినిమాను రెండు పార్టులుగా చేశారు. ఒక వరల్డ్ క్రియేట్ చేసి ఆడియన్స్ ను ఆ వరల్డ్ లోకి తీసుకెళ్తే ఆ సినిమాలు సక్సెస్ అవుతాయి. ఈ సినిమాలో కూడా వెట్రిమారన్ అలాంటి వరల్డ్ ను క్రియేట్ చేసి ఆసక్తిని పెంచాడు’ అన్నారు. ‘నేను తీసే సినిమాలు ఎప్పుడు రూటెడ్ గానే ఉంటాయి. ఈ సినిమా తెలుగులో రిలీజ్ అవుతుంది అనుకోలేదు. ఈ సినిమాను తెలుగులో అల్లు అరవింద్ గారు రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నందుకు థాంక్యూ’ అని వెట్రిమారన్ అన్నారు. ఇంత అద్భుతమైన సినిమాని వెట్రిమారన్ నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు’అని నిర్మాత ఎల్రెడ్ కుమార్ అన్నారు. ఈ సమావేశంలో హీరో సూరి, హీరోయిన్ భవాని శ్రీ తదితరులు పాల్గొన్నారు. -
రక్తం చుక్క కూడా రాలేదు.. చాలా భయపడ్డా: అల్లు అరవింద్
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గతంలో బైక్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఆ ప్రమాదం నుంచి పూర్తిగా కోలుకున్న తేజ్..ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నాడు. తాజాగా తేజ్ నటించిన చిత్రం ‘విరూపాక్ష’ విడుదలకు సిద్ధంగా ఉంది. నేడు ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా వచ్చిన అల్లు అరవింద్ .. తేజ్ ప్రమాదం గురించి మాట్లాడారు. ‘తేజ్‌కు యాక్సిడెంట్ అయిందనే విషయం తెలియగానే.. మొదట నేనే ప్రమాదం జరిగిన స్థలానికి వెళ్లాను. సాయి ధరమ్ తేజ్ పరిస్థితి చూసి చాలా భయమేసింది. రక్తం చుక్క కూడా రాలేదు. ఏం జరిగిందో తెలియడానికి పావు గంట పట్టింది. అంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడినందుకు చాలా ఆనందంగా ఉంది. బ్రతుకుతాడో లేదో అనుకున్న వ్యక్తి.. ఇప్పుడు ‘విరూపాక్ష’లో అద్భుతంగా నటించాడని కొంతమంది చెబుతుంటే సంతోషంగా ఉంది’అని అల్లు అరవింద్ అన్నారు. కార్తీక్‌దండు దర్శకత్వంలో తెరకెక్కిన ‘విరూపాక్ష’లో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించింది. ఈ నెల 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
నా మేనల్లుడు రామ్ చరణ్ ,ఎన్టీఆర్ ఆస్కార్ పట్టుకున్నప్పుడు నాకు ఎలా అనిపించింది అంటే
-
హైదరాబాద్‌లో ‘నాట్స్’ ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
నాట్స్ ఆలోచన సంతోషాన్నిచ్చింది: అల్లు అరవింద్
‘‘మా నాన్న అల్లు రామలింగయ్య, ఎన్టీఆర్, ఘంటసాలగార్ల శతజయంతి ఉత్సవాలను అమెరికాలో నిర్వహించనుండటం సంతోషం. ఈ ఆలోచన చేసిన ‘నాట్స్’వారికి థ్యాంక్స్’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. ప్రముఖ నటులు ఎన్టీఆర్, అల్లు రామలింగయ్య, సంగీత దర్శకుడు ఘంటసాల శతజయంతి ఉత్సవాలను మే 26, 27, 28 తేదీల్లో ‘నాట్స్’ (ఉత్తర అమెరికా తెలుగు సమితి) ఆధ్వర్యంలో న్యూజెర్సీలో నిర్వహించ నున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో ‘నాట్స్’ అధ్యక్షుడు బాపు నూతి మాట్లాడుతూ.. ‘‘అమెరికాలోని తెలుగువారికి కష్టం వస్తే సామాజికంగా, ఆర్థికంగా భరోసా ఇచ్చే సంస్థే ‘నాట్స్’’ అన్నారు. ‘‘నటులుగా 50 సంవత్సరాలు(గోల్డెన్ జూబ్లీ) పూర్తి చేసుకుంటున్న జయసుధ, సాయికుమార్గార్లను, ‘ఆస్కార్’ అవార్డు గ్రహీత చంద్రబోస్‌లను న్యూజెర్సీలో సత్కరిస్తాం’’ అన్నారు ‘నాట్స్’ కన్వీనర్ శ్రీధర్ అప్పసాని. ఈ వేడుకలో ‘నాట్స్’ డిప్యూటీ కన్వీనర్ రాజ్ అల్లాడ, నటులు సాయికుమార్, ఆది, డైరెక్టర్లు ఎ.కోదండరామి రెడ్డి, బి.గో΄ాల్, అవసరాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
Sakshi 15th Anniversary: సినీ ప్రముఖుల శుభాకాంక్షలు
‘సాక్షి’ ప్రారంభమై పదిహేనేళ్లు అయిందంటే నమ్మలేకపోతున్నాను. ప్రారంభ వేడుకకి మొన్న మొన్నే వెళ్లినట్లుగా అనిపిస్తోంది. ఆ వేడుక ఇంకా గుర్తుంది. ‘సాక్షి’కి నా ప్రత్యేక అభినందనలు’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్. ‘సాక్షి’ దినపత్రిక ఆరంభమై నేటితో 15 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా అల్లు అరవింద్ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘సాక్షి’ పదిహేనేళ్లు పూర్తి చేసుకుంది. ఇంకా బ్రహ్మండంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను’’ అన్నారు నిర్మాత అచ్చిడ్డి. ‘‘సాక్షి’ ఇలాంటి విజయవంతమైన వసంతాలను ఎన్నో చూడాలి’’ అన్నారు కన్నడ హీరో శివరాజ్‌కుమార్. ‘సాక్షి’ పదిహేనేళ్లు పూర్తి చేసుకుని, పదహారో ఏడాదిలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా శుభాకాంక్షలు’’ అన్నారు దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. ‘‘తెలుగు ప్రేక్షకులకు అద్భుతమైన వాస్తవాలను అందించాలని, స్ఫూర్తినిచ్చే వార్తలు ఇవ్వాలనే ప్రజాసంకల్పాన్ని ధ్యేయంగా చేసుకుని అందులో విజయం సాధిస్తూ, ప్రతి ఏడాది ప్రజలకు మరింత చేరువవుతున్నందుకు అభినందనలు’’ అన్నారు నిర్మాత కె.అచ్చిరెడ్డి. ఇంకా హీరోలు ‘అల్లరి’ నరేశ్, అది సాయికుమార్, కార్తికేయ, విశ్వక్ సేన్, కిరణ్ అబ్బవరం, నటులు తనికెళ్ల భరణి, సుమన్, సాయికుమార్, ‘సీనియర్’ నరేశ్, అలీ, దర్శకులు కృష్ణవంశీ, బి.గోపాల్, నందినీ రెడ్డి, నిర్మాతలు సి.కల్యాణ్, ‘దిల్’ రాజు, రచయిత పరుచూరి గోపాలకృష్ణ, రచయిత, నిర్మాత కోన వెంకట్ తదితరులు ‘సాక్షి’కి శుభాకాంక్షలు తెలిపి, మరిన్ని విజయవంతమైన వసంతాలను చూడాలని ఆకాంక్షించారు. -
టాలీవుడ్ సినీ ప్రముఖులతో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ భేటీ, చిరు ట్వీట్
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో మెగాస్టార్ చిరంజీవి, టాలీవుడ్ ప్రముఖులు సమావేశమయ్యారు. మంత్రి హైదరాబాద్ పర్యటనలో భాగంగా టాలీవుడ్ సినీ ప్రముఖులు ఆయనతో భేటీ అయినట్లు తెలుస్తోంది. చిరు ఇంట్లో జరిగిన ఈ సమావేశానికి నాగార్జున అక్కినేని, అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌తో పాటు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ విషయాన్ని స్వయంగా చిరు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ సందర్భంగా అనురాగ్ ఠాకూర్‌తో కలిసి దిగిన ఫొటోలను చిరు షేర్ చేశారు. చదవండి: మీకు ఉర్ఫీ ఫివర్ అట్టుకుందా!: శిల్పా శెట్టిపై దారుణమైన ట్రోల్స్ ఈ మేరకు చిత్ర పరిశ్రమ అభివృద్ధి, వ్యక్తిగత, ఇతరత్రా అంశాలపై వారు చర్చించినట్లు సమాచారం. ఈ మేరకు చిరు ట్వీట్ చేస్తూ.. ‘హైదరాబాద్ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మా ఇంటికి వచ్చారు. మాతో గడిపిన ఈ వీలువైన సమయానికి ఆయనకు ధన్యవాదాలు. ఈ సందరర్భంగా నా సోదరుడు నాగార్జునతో కలిసి భారతీయ చలనచిత్ర పరిశ్రమ, వేగవంతమైన పురోగతి గురించి ఆయన చర్చించడం జరిగింది. ఈ ఆహ్లాదకరమైన సమావేశం నాకేంతో నచ్చింది’ అంటూ చిరు రాసుకొచ్చారు. Thank you dear Sri @ianuragthakur for making time to drop by at my place on your visit to Hyderabad yesterday. Loved the delightful discussion we had along with my brother @iamnagarjuna about the Indian Film Industry and the rapid strides it is making! pic.twitter.com/Bm6bjvHT39 — Chiranjeevi Konidela (@KChiruTweets) February 27, 2023 -
చరణ్ బర్త్‌డే: మెగా ఫ్యాన్స్‌కి సర్ప్రైజ్ ఇవ్వబోతున్న అల్లు అరవింద్
మెగా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ మెగా ఫ్యాన్స్‌కి సర్ప్రైజ్ అందించనున్నారు. చరణ్ కెరీర్లో మైలురాయిగా నిలిచిన చిత్రం ‘మగధీర’. 2009లో విడుదలైన ఈ చిత్రం ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ అనిపించుకుంది. 13 ఏళ్ల తర్వాత మరోసారి ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ప్రకంపనలు సృష్టించడానికి సిద్దమవుతుంది. ఈ సినిమాను రిరిలీజ్ చేసేందుకు గీతా ఆర్ట్స్ ప్లాన్ చేస్తోంది. మార్చి 27న రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా మగధీర చిత్రాన్ని రిరిలీజ్ చేయబోతున్నట్లు తాజాగా గీతా ఆర్ట్స్ అధికారిక ప్రకటన ఇచ్చింది. చదవండి: కేరళ హైకోర్టులో మోహన్ లాల్‌కు చుక్కెదురు! కాగా మెగా తనయుడిగా చిరుత సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన చరణ్ తన రెండవ సినిమా మగధీరతోనే ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రాని దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన సంగతి తెలిసిందే. నిర్మాతలకు మూడింతల లాభాలు తెచ్చిపెట్టిన ఈ సినిమాను చరణ్ బర్త్‌డే సందర్భంగా అల్లు అరవింద్ రిరిలీజ్ చేసి మెగా ఫ్యాన్స్‌కి ట్రీట్ ఇవ్వబోతున్నారు. ఇందులో చరణ్ పోషించిన కాలభైరవ పాత్రకు విపరీతమైన ప్రేక్షక ఆదరణ దక్కింది. ఈ సినిమాలో రామ్ చరణ్‌కు జోడిగా కాజల్ అగర్వాల్ నటించింది. చదవండి: విశ్వనాథ్‌గారు నాపై అలిగారు, చాలా రోజులు మాట్లాడలేదు: జయసుధ On the occasion of 𝐌𝐄𝐆𝐀 𝐏𝐎𝐖𝐄𝐑𝐒𝐓𝐀𝐑 @AlwaysRamCharan Birthday! 😎 Re-Releasing the Sensational 𝐈𝐍𝐃𝐔𝐒𝐓𝐑𝐘 𝐇𝐈𝐓 #Magadheera in theaters 🔥#MagadheeraReRelease 💥@ssrajamouli @MsKajalAggarwal @mmkeeravaani #AlluAravind @BvsnP @DOPSenthilKumar @GeethaArts pic.twitter.com/aENWnSn23a — Geetha Arts (@GeethaArts) February 23, 2023 -
అల్లు అర్జున్ను చూసి తండ్రిగా గర్వపడుతున్నా : అల్లు అరవింద్
పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ను చూసి గర్వపడుతున్నానని అల్లు అరవింద్ అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన కొడుకు బన్నీపై ప్రశంసలు కురిపించారు. 'గతంలో నన్ను స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ అని పిలిచేవారు. నా సినిమాల గురించి మాట్లాడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కొంతమంది అయితే వాళ్ల పిల్లలకు నన్ను అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ అని పరిచయం చేస్తున్నారు. ఒక తండ్రికి ఇంతకన్నా గుర్తింపు ఏం ఉంటుంది? ఒక తండ్రిగా నాకు అది గర్వకారణం.బన్నీని ఇండస్ట్రీకి పరిచయం చేసినందుకు మరోసారి గర్వపడుతున్నా. ఇక నా మనవరాలు అల్లు అర్హ కూడా సినిమాల్లోకి వచ్చేసింది. సమంత ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న శాకుంతలం చిత్రంలో అర్హ కీలక పాత్రలో నటించింది. తనను స్క్రీన్‌పై చేసేందుకు మేమంతా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం' అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అల్లు అరవింద్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. -
కిరణ్‌లాంటి వ్యక్తులు తక్కువ.. రెండు సీన్లకే థ్రిల్లయ్యా: అఖిల్
‘‘గీతా ఆర్ట్స్ ఈవెంట్‌కు నేను ఓ కుటుంబసభ్యుడిలా వచ్చాను. కొత్తదనం కోసం అరవింద్‌గారు ఎప్పుడూ తాపత్రయపడుతుంటారు. కష్టం ఎప్పుడూ వృథా కాదు. కిరణ్ ఎంతో కష్టపడుతున్నాడు. తనకు ఆల్ ది బెస్ట్’’ అని అన్నారు అక్కినేని అఖిల్. కిరణ్ అబ్బవరం, కశ్మీరా పరదేశి జంటగా మురళీ కిషోర్ (నందు) దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన అఖిల్ మాట్లాడుతూ– ‘‘వినరో..’లోని రెండు సీన్లు చూసి, థ్రిల్ అయ్యాను. ట్విస్ట్స్ అండ్ టర్న్స్‌తో ఈ సినిమా వస్తోంది ’’ అని అన్నారు. ‘‘జెన్యూన్‌గా ఉండే కిరణ్‌లాంటి వ్యక్తులు తక్కువ. బన్నీ వాసుతో పాటు కిరణ్ అబ్బవరంనూ ఓ నిర్మాతగా ఫీలవుతున్నాను. ఈ సినిమాకు అతను అలా వర్క్ చేశాడు’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్. ‘‘అఖిల్గారి సినిమాలో నేను ఓ కీ రోల్ చేయాల్సింది. కుదర్లేదు. ఏయన్నార్‌గారు చేసిన ‘మనం’ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఓ ఎమోషన్. స్క్రీన్‌పై గీతా ఆర్ట్స్ అని చూసిన మాలాంటి వారు కూడా అదే బ్యానర్లో సినిమాలు చేయొచ్చు అంటూ చాన్స్ ఇచ్చిన అల్లు అరవింద్‌గారికి ధన్యవాదాలు. నాలా సినిమాపై ప్యాషన్‌తో వచ్చేవారి తరపున అల్లు అరవింద్‌గారికి ధన్యవాదాలు చెబుతున్నాను. ‘వినరో. ..’ సినిమా బాగా రావడానికి ఎంతో కారణమైన బన్నీ వాసుగారి దగ్గర్నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ మూవీతో నందు అన్నకు మంచి పేరు వస్తుంది. యూట్యూబ్‌లో షార్ట్‌ఫిల్మ్ ‘గచ్చిబౌలి’ నుంచి నేను ఇక్కడి వచ్చేంతవరకు నన్ను ప్రోత్సహించిన, ఇంకా సపోర్ట్ చేస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్. ‘వినరో..’ పెద్ద హిట్టవుతుందని నమ్ముతున్నాను’’ అన్నారు కిరణ్ అబ్బవరం. ‘‘నేను దర్శకుడిని అయ్యానని మా నాన్నకు నేను హ్యాపీగా చెప్పుకునేలా చేసిన కిరణ్ అబ్బవరంకు, నిర్మాతలు అరవింద్, బన్నీ వాసుగార్లకు ధన్యవాదాలు’’ అన్నారు మురళీ కిషోర్. ‘‘గీతా ఆర్ట్స్ తర్వాత నాగచైతన్య, అఖిల్ నాకు ఆప్తులు. నా మనసుకు కనెక్ట్ అయిన సినిమా ఇది. ఈ సినిమా చూశాక ఆడియన్స్ కొన్ని అంశాలను వెంట తీసుకెళ్తారు. కిరణ్, కిశోర్, మ్యూజిక్ డైరెక్టర్ చేతన్‌లకు మంచి భవిష్యత్తు ఉంటుంది’’ అన్నారు బన్నీ వాసు. -
కొత్త తరం ప్రేమకథ
‘అతడు, ఆర్య, ΄పౌర్ణమి, భద్ర’ వంటి చిత్రాల్లో బాలనటుడిగా నటించిన దీపక్ సరోజ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సిద్ధార్థ్ రాయ్’. వి. యశస్వి దర్శకత్వంలో జయ ఆడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన నిర్మించారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా కాన్సెప్ట్ పో స్టర్‌ను డైరెక్టర్ హరీష్ శంకర్ ఆవిష్కరించగా, నిర్మాత అల్లు అరవింద్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ‘‘కొత్త తరం ప్రేమకథగా రూపొందిన చిత్రం ఇది. ఈ వేసవిలో రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. తన్వి నేగి, నాదిని, ఆనంద్, కల్యాణీ నటరాజన్, మాథ్యూ వర్గీస్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: రథన్, కెమెరా: శ్యామ్ కె. నాయుడు, లైన్ప్రొ డ్యూసర్: బి. శ్యామ్‌కుమార్. -
అందుకే తెలుగు సినిమాలంటే ఇష్టం
‘‘మంచి కంటెంట్‌కు కమర్షియల్ అంశాలు జోడించి, తెలుగు సినిమాలు తీస్తుంటారు. అందుకే తెలుగు సినిమాలంటే నాకు ఇష్టం. ఇలాంటి తరహా సినిమాలు తీయడం రిస్క్ అయినప్పటికీ చాలెంజింగ్‌గా తీసుకుని ఇక్కడ తెరకెక్కిస్తారు. అయితే మా (మరాఠీ) సినిమాలు కమర్షియల్‌గా కాకుండా ఎక్కువగా రియలిస్టిక్‌గా ఉంటాయి’’ అని అన్నారు కశ్మీరా పరదేశి. కిరణ్ అబ్బవరం, కశ్మీరా పరదేశి జంటగా మురళీ కిషోర్ దర్శకత్వంలో రూపొం దిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో కశ్మీరా మాట్లాడుతూ– ‘‘తిరుపతి నేపథ్యంలో వస్తున్న సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. తిరుపతిలో షూటింగ్ చేయడం వల్ల పాజిటివ్ వైబ్రేషన్స్ కలిగాయి. ఈ చిత్రంలో నటనకు స్కోప్ ఉన్న దర్శన పాత్ర చేశాను. గీతా ఆర్ట్స్ వంటి బ్యానర్లో సినిమా చేయడం కంఫర్ట్‌గా అనిపించింది. ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా, హిందీలో ఓ సినిమా చేస్తున్నాను. తెలుగులో చర్చలు జరుగుతున్నాయి’’ అన్నారు. -
బన్నీ భార్యకు ఆ అవసరం లేదు.. అయినా పనిచేస్తుంది : అల్లు అరవింద్
ప్రతి ఆడపిల్ల తన కుటుంబంతో కలిసి రైటర్ పద్మభూషణ్ సినిమా చూడాలని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. సుహాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఇటీవలె విడుదలై థియేటర్స్‌లో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతుంది. తాజాగా రైటర్ ప్మభూషణ్ సక్సెస్ మీట్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అల్లు అరవింద్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ''ప్రతి ఆడపిల్లలు పెరెంట్స్‌ని తీసుకొని ఈ సినిమాకు వెళ్లాలి. ఎందుకంటే సాధారణంగా ఆడపిల్లలనగానే చక్కగా చదువుకోవాలి. పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాలి.వాళ్లని పెంచి పెద్ద చేయాలనే ఉంటుంది. కానీ వాళ్లకంటూ కొన్ని అభిప్రాయాలు, ఇష్టాలు ఉంటాయని తల్లిదండ్రులు గుర్తించరు. అందుకే ఆ సినిమా వాళ్లందరికి చూపించాలి. ఇక నేను పర్సనల్‌గా ఆడపిల్లలు ఇంట్లోనే కూర్చోవాలి అనే సిద్ధాంతాలను ఇష్టపడను. వాళ్ల కాళ్లమీద వాళ్ల నిలబడాలనుకుంటాను. ఈ సినిమా చూశాక ఇంటికి వెళ్లి మా భార్యను అడిగాను. నువ్వు ఏం అవ్వాలనుకున్నావ్ అని. ఇక మా కోడలు స్నేహా రెడ్డి(అల్లు అర్జున్ భార్య)కి నిజానికి పని చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమె ధనవంతుల ఇంట్లో పుట్టి పెద్ద స్టార్ హీరోను పెళ్లి చేసుకుంది. కానీ ఇప్పటికీ తన పని తాను చేసుకుంటుంది'' అంటూ కోడలిపై ప్రశంసలు కురిపించారు. కాగా స్నేహారెడ్డి ప్రస్తుతం ఓ ఆన్లైన్ ఫోటో స్టూడియోకు సీఈవోగా వ్యవహరిస్తున్నారు. -
K Viswanath : కళాతపస్వి పార్థివదేహానికి ప్రముఖుల నివాళులు (ఫొటోలు)
-
మెగా ఛాయ నుంచి బన్నీ బయటకు రావాలనుకుంటున్నాడా? చిరంజీవి రియాక్షన్ ఇదే!
టాలీవుడ్ సినీ పరిశ్రమలో అల్లు, మెగా ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. సినిమా విషయంలో ఈ రెండు కుటుంబాలు ఒక్క ఫ్యామిలీగా ఒకే తాటిపై ఉన్నారు. అయితే కొంతకాలంగా అల్లు, మెగా కుటుంబాల్లో విభేదాలు వచ్చాయంటూ తరచూ వార్తలు వినిపిస్తున్నా సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ రూమర్స్‌పై అల్లు అరవింద్, చిరంజీవిలు గతంలో క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ ఈ రూమర్లకు ఎండ్ పడటం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ తెలుగు చానల్‌తో ముచ్చటించిన చిరుకు దీనిపై ప్రశ్న ఎదురైంది. వాల్తేరు వీరయ్య బ్లాక్‌బస్టర్ హిట్ అయిన నేపథ్యంలో చిరంజీవి తాజాగా ఓ టాక్ షోకు ఇంటర్య్వూ ఇచ్చారు. చదవండి: రెండు రోజుల్లో మనోజ్ నుంచి స్పెషల్ న్యూస్, ఆసక్తి పెంచుతున్న ట్వీట్! ఈ సందర్భంగా అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ అని ఎందుకు వార్తలు వస్తున్నాయి? మెగా చాయ నుంచి బన్నీ బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారా? అని వార్తలు వినిపిస్తున్నాయి..అసలు ఏంటి? అని హోస్ట్ చిరంజీవిని ప్రశ్నించారు. దీనికి మెగాస్టార్ స్పందిస్తూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ‘ఈ వార్తలకు నా సమాధానం ఒకటే.. ఈ ఇంటర్య్వూ తర్వాత నేను, నా భార్య సురేఖతో కలిసి అల్లు అరవింద్‌ను కలిసి బర్త్‌డే విషెస్ చెప్పబోతున్నా. మీ మొత్తం ప్రశ్నలకు ఈ సమాధానం చాలు అనుకుంటా! కానీ.. ఇటీవల మా ఇంట్లో జరిగిన క్రిస్మస్ వేడుకలకు బన్నీ వచ్చాడు. బన్నీ, చరణ్, తేజ్ వరుణ్, వైష్ణవ్ ఇలా కజిన్స్ అంతా శుభ్రంగా క్రిస్మస్ను సెలబ్రెట్ చేసుకున్నారు. ఆ రోజు మా ఇంట్లో సరదాగా గడిపారు, ఫొటోలు తీసుకున్నారు’ అని చెప్పారు. ‘ఇక ప్రొఫెషన్‌కు వచ్చేసరికి ఎవరి ప్రయత్నం వారు, ఎవరి ఎదుగుదల వారు, ఎవరి ప్రాచుర్యం కోసం వారు ప్రయత్నించడంలో ఎలాంటి తప్పు లేదు. నేను అదే చేస్తాను. కల్యాణ్ కంటే నేను ఎక్కువ అని.. అర్టిస్ట్‌గా వాడు ఎక్కువ అవ్వాలని, అందరి కంటే చరణ్, బన్నీ, వరుణ్, తేజు, వైష్ణవ్‌లు ముందుంజలో ఉండాలని వాళ్లంతా ప్రయత్నిస్తుంటే మేం వారిని స్వాగతిస్తాం. అలా వెళ్లే దారిలో నా పేరు ప్రస్తావించారా? లేదా? అంటే ప్రస్తావిస్తారు. కానీ ఎన్నిసార్లు. మా నాన్న.. మా నాన్న అని పదిసార్లు అంటుంటే అందరు చరణ్ బాబును తిడతారు. అలా అని నాన్న అని ప్రస్తావించకపోతే మా మధ్య విభేదాలు ఉన్నట్లు కాదు. ఇంట్లో మేం కలిసి తింటాం. గోరు ముద్దలు తినిపించుకుంటాం. అది అందరికి తెలియాల్సిన అవసరం లేదు’ అని చెప్పుకొచ్చారు. చదవండి: ఆ స్టార్ హీరోతో ప్రేమలో పడ్డాను: సీనియర్ నటి జయమాలిని ప్రొఫెషన్ రిత్యా, బిజినెస్ రిత్యా అల్లు అరవింద్ గారు బాలకృష్ణను కలవడం వల్ల ఇలాంటి వార్తలు వస్తున్నాయంటారా? అని అడగ్గా.. నిజం చెబుతున్నా ఆహా పెట్టుకోవడంలో అసలు తప్పులేదు. ఆహా అందరిది. నాకున్న బిజీ షెడ్యూల్ కారణంగా హోస్ట్‌గా వారు వెరే ఆరిస్టుని పెట్టుకోవచ్చు. అలాగే నాకున్న బిజీ వల్ల నన్ను పిలిచి ఉండకపోవచ్చు. అంతేకాని బాలకృష్ణను పెట్టుకున్నారు కదా అని మా మధ్య మనస్పర్థలు ఉన్నాయనడం కరెక్ట్ కాదు. కానీ నటులుగా ఎవరికి వారు స్వతంత్ర్యంగా ఓ బ్రాండ్ నేమ్ ఏర్పరుచుకోవాలి, ఎవరికి వాళ్లు ఎదగాలి అనుకున్నప్పుడు వాళ్లందరి నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తాను. వాళ్లంత నా పిల్లలే’ అంటూ తనదైన శైలిలో రూమర్లకు చెక్ పెట్టారు చిరంజీవి. -
ఆ సినిమాతో పోల్చడం సంతోషం
‘‘ఫీల్ గుడ్ సినిమా ఆడదు.. ప్రేమ కథలు ఇంటికి (ఓటీటీ) వచ్చినప్పుడు చూద్దాంలే’ అని ప్రేక్షకులు అను కుంటున్న తరుణంలో ‘సీతారామం’ వచ్చి అదరగొట్టేసింది. ఆ సినిమా క్లయిమాక్స్‌కి ఉన్న ఫీలింగ్ మా ‘18 పేజెస్’కి వచ్చిందని చాలామందిపోల్చి చెబుతుంటే సంతోషంగా ఉంది. మా సినిమా చూస్తే ఒక నవలను చదివిన అనుభూతి కలిగేలా దర్శకుడు మలిచాడు’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. నిఖిల్ సిద్ధార్థ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘18 పేజెస్’. డైరెక్టర్ సుకుమార్ కథ అందించారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదలైంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా సక్సెస్ మీట్లో బన్నీ వాసు మాట్లాడుతూ – ‘‘మా సినిమా మొదటిరోజు వసూళ్ల కంటే మూడో రోజు ఎక్కువ ఉన్నాయి. ఈ చిత్రం విషయంలో మేం లాభాల్లో ఉన్నాం’’ అన్నారు. ‘‘మా సినిమా చూసినవారు ‘మాకు మేమే ప్రేమలో పడిన అనుభూతి వస్తోంది’ అంటున్నారు. అది మాకు పెద్ద ప్రశంస’’ అన్నారు సూర్యప్రతాప్. ‘‘2022లో టాప్ ఫైవ్ లవ్ స్టోరీస్‌లో మా ‘18 పేజెస్’ ఉంటుంది. కెరీర్ వైజ్‌గా నా జీవితంలో ఇది బెస్ట్ ఇయర్’’ అన్నారు నిఖిల్. ‘‘శతమానం భవతి’లో నేను చేసిన నిత్య ΄ాత్రకి ఎంత మంచి పేరొచ్చిందో ‘18 పేజెస్’లో నందిని ΄ాత్రకి కూడా అంతే పేరొచ్చింది’’ అన్నారు అనుపమ. ∙ నిఖిల్, అనుపమ, అల్లు అరవింద్, బన్నీ వాసు, సూర్యప్రతాప్ -
అనుపమతో స్టెప్పులేసిన అల్లు అరవింద్.. వీడియో వైరల్
యంగ్ హీరో నిఖిల్, అనుపమ మరో సూపర్‌హిట్ మూవీని తమ ఖాతాలో వేసుకున్నారు. ఇదివరకే కార్తికేయతో సక్సెస్ అందుకున్న ఈ జోడీ తాజాగా 18 పేజెస్తో మరో విజయాన్ని సొంతం చేసుకున్నారు.ముఖ్యంగా అనుపమ, నిఖిల్ల నటన, డైలాగ్స్ యూత్‌ను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథ అందించగా, ఆయన శిష్యుడు సూర్యప్రతాప్ పల్నాటి దర్శకత్వం వహించాడు. డిసెంబర్ 23న విడుదలైన 18 పేజెస్ సినిమా తొలిరోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తూ క్లాసిక్ హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌ను మూవీ టీం గ్రాండ్‌గా నిర్వహించింది. ఇందులో పాల్గొన్న నిర్మాత అల్లు అరవింద్ మూవీలోని 'టైం ఇవ్వు పిల్ల.. కొంచెం టైం ఇవ్వు' అంటూ సాగే పాటకు అనుపమతో కలిసి సరదాగా స్టెప్పులేశారు. అనుపమ, అల్లు అరవింద్‌తో పాటుగా, సుకుమార్ కూడా స్టెప్పులు వేశారు. ఈ వీడియోను నిఖిల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్చేయగా ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. View this post on Instagram A post shared by Nikhil Siddhartha (@actor_nikhil) -
ఆ చాన్స్ మిస్సయినప్పుడు చాలా బాధపడ్డాను: అనుపమా పరమేశ్వరన్
‘‘ప్రేమ లేకుండా ఈ ప్రపంచమే లేదు. భావోద్వేగాలు లేని జీవితమూ ఉండదు. ‘18 పేజెస్’ వంద శాతం స్వచ్ఛమైన ప్రేమకథ. అన్ని వర్గాల వారికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అని హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ అన్నారు. నిఖిల్ సిద్ధార్థ హీరోగా సూర్యప్రతాప్ పల్నాటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘18 పేజెస్’. డైరెక్టర్ సుకుమార్ కథ అందించారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్– సుకుమార్ రైటింగ్స్‌పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) రిలీజవుతోంది. ఈ సందర్భంగా చిత్రకథానాయిక అనుపమా పరమేశ్వరన్ చెప్పిన విశేషాలు.. ► సూర్యప్రతాప్‌గారు చెప్పిన ‘18 పేజెస్’ కథ ఎగ్జయిటింగ్‌గా అనిపించడంతో వెంటనే ఓకే చెప్పాను. ‘కార్తికేయ 2’కి ముందే ‘18 పేజెస్’కి సైన్ చేశాను. ‘కార్తికేయ 2’ అడ్వెంచరస్ మూవీ అయితే ‘18 పేజెస్’ ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ. ‘కార్తికేయ 2’ ఇక్కడ సూపర్ హిట్ కావడంతో పాటు హిందీలోనూ ఘనవిజయం సాధించింది. ‘కార్తికేయ 2’ బ్లాక్ బస్టర్ కావడంతో మా జంట (నిఖిల్, అనుపమ)కి మంచి పేరొచ్చింది. ‘18 పేజెస్’ చాలా మంచి సినిమా.. ‘కార్తికేయ 2’లాగే ఈ మూవీ సూపర్ హిట్టవుతుందనే నమ్మకంతో ఉన్నాం. ► సుకుమార్‌గారి ‘రంగస్థలం’ చాన్స్ మిస్సయినప్పుడు చాలా బాధపడ్డాను. అయితే ఏ సినిమా కథ అయినా మనం ఎంచుకోం.. ఆ కథే మనల్ని ఎంచుకుంటుంది. ‘రంగస్థలం’ మిస్ అయినా ఇప్పుడు సుకుమార్‌గారు రాసిన పాత్రలో నటించడం సంతోషంగా ఉంది. ఈ సినిమాలో నేను చేసిన నందిని పాత్ర గుర్తుండిపోతుంది. సుకుమార్‌గారి కథకి సూర్యప్రతాప్‌గారు వందశాతం న్యాయం చేశారు కాబట్టే సినిమా బాగా వచ్చింది. ► ‘18 పేజెస్’లోని లవ్ స్టోరీ నా ఫేవరెట్. వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తున్న ఈ టైమ్‌లో మొబైల్ లేకుండా ఒక్క రోజు కూడా చాలామంది ఉండలేరు. అలాంటిది మొబైల్, సోషల్ మీడియా లేకుండా ఉండే ఒక అమాయకమైన నందిని పాత్ర నా మనసుకు బాగా దగ్గరగా అనిపించింది. ► ‘నాకు అనుపమలాంటి కూతురు ఉంటే బాగుండు’ అని అల్లు అరవింద్‌గారు అనడం పెద్ద ఆశీర్వాదంగా భావిస్తున్నాను. ఆయన నన్ను కూతురిలా బాగా చూసుకుంటారు. అందుకే మా కజిన్స్ చాలామంది ఆయన్ని మావయ్యా అని పిలుస్తుంటారు (నవ్వుతూ). బన్నీ వాసుగారు మంచి అభిరుచి ఉన్న నిర్మాత. ► నేను ఒప్పుకున్న సినిమాలన్నీ అయిపోయాక.. నటనకు కొద్ది రోజులు గ్యాప్ తీసుకుని, దర్శకుల వద్ద సాంకేతిక అంశాలపై అవగాహన పెంచుకుని, ఆ తర్వాత డైరెక్షన్ చేస్తాను. వీలు కుదిరినప్పుడల్లా కథ రాస్తున్నాను.. అయితే నా డైరెక్షన్లో నేను నటించను. -
ఆయన లేకుంటే నా జీవితం ఇలా ఉండేది కాదు: అల్లు అర్జున్
‘‘ఇది వరకు మనం సౌత్ సినిమాలు చేస్తే సౌత్ వరకే రీచ్ ఉండేది. కానీ దక్షిణాది సినిమాలు ఉత్తరాదికి వెళ్లేందుకు ‘బాహుబలి’తో బాటలు వేసిన రాజమౌళిగారికి థ్యాంక్స్. ‘పుష్ప, కేజీఎఫ్, కార్తికేయ 2, కాంతార’ సినిమాలు పాన్ ఇండియా వెళ్లడం హ్యాపీ. మన చిత్రాలు దేశమంతా చూస్తుండటం మనకు గర్వకారణం’’ అని హీరో అల్లు అర్జున్ అన్నారు. నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘18 పేజెస్’. డైరెక్టర్ సుకుమార్ కథ అందించగా, సూర్యప్రతాప్ పల్నాటి దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్ని వాసు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23 విడుదలకానుంది. గోపీసుందర్, సూర్యప్రతాప్, వివేక్ కూచిభొట్ల, బన్ని వాసు, సుకుమార్, అనుపమ, అల్లు అర్జున్, నిఖిల్ ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో అల్లు అర్జున్ మాట్లాడుతూ– ‘‘సుకుమార్‌గారు లేకుంటే నా ఈ జీవితం, ఈ ప్రయాణం ఇలా ఉండేది కాదని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. అందుకే ఆయనంటే అభిమానం, గౌరవం, ప్రేమ ఉన్నాయి. మా నాన్నకి(అల్లు అరవింద్) సొంత ఓటీటీ ఉంది. ‘18 పేజెస్’ విడుదల ఆలస్యం అవుతుండటంతో ఓటీటీలో రిలీజ్ చేయమని చాలా మంది చెప్పినా థియేటర్లోనే విడుదల చేస్తున్న ఆయనకి థ్యాంక్స్. ‘18 పేజెస్’ కి గోపీ సుందర్ మంచి సంగీతం ఇచ్చారు. ఇలాంటి వంటి మంచి సినిమా తీసినందుకు సూర్యప్రతాప్‌కి థ్యాంక్స్. ‘హ్యాపీడేస్’ నుంచి నిఖిల్ గ్రాఫ్ చూస్తున్నాను.. చాలా మంచి కథలు ఎంచుకుంటున్నాడు. ఎలా అని ఓ సారి అడిగితే బుక్స్ బాగా చదువుతాడట. నా వ్యక్తిగత అభిప్రాయంలో ఒక యాక్టర్‌కి కావాల్సిన అర్హత ఏంటంటే పుస్తకాలు చదవడం.. అది తనలో చాలా ఉంది. ‘18 పేజెస్’ కి యూనిట్ పెట్టిన కష్టం మీ మనసులను టచ్ చేస్తుంది. ‘పుష్ప 2’ అస్సలు తగ్గేదే లే’’ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ–‘‘18 పేజెస్’ వంటి అద్భుతమైన కథని సుకుమార్ రాశాడు. ఇది గీతా ఆర్ట్స్‌లో తీస్తే బాగుంటుందని బన్ని వాసుకి కథ ఇచ్చి, మా గీతా ఆర్ట్స్‌లో సినిమా తీయించినందుకు తనకి థ్యాంక్స్’’ అన్నారు. డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ– ‘‘నేను నిర్మాత అవుదామని ‘జగడం’ టైమ్‌లో అనుకున్నా. ‘ఆర్య 2’ తీస్తున్నప్పుడు నిఖిల్‌కి లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాను. ‘హ్యాపీడేస్’ సినిమా చూసినప్పుడే తను సక్సెస్ అవుతాడనిపించి, ఆ అడ్వాన్స్ ఇచ్చాను. ‘18 పేజెస్’ సక్సెస్ క్రెడిట్ సూర్యప్రతాప్దే. ‘పుష్ప 2’ ఐదు రోజులు షూటింగ్ చేశాం’’ అన్నారు. ‘‘అల్లు అర్జున్, సుకుమార్‌లు లేకపోతే బన్ని వాసు అనే వాడు ఈరోజు ఇక్కడ ఉండేవాడు కాదు’’ అన్నారు బన్నీ వాసు. ‘‘పాన్ ఇండియా స్థాయికి మన తెలుగు సినిమాలు తీసుకెళ్లేలా బాటలు వేసిన దర్శకులు రాజమౌళి సర్, సుకుమార్ సర్కి థ్యాంక్స్. ‘18 పేజెస్’ అందర్నీ సర్ప్రైజ్ చేస్తుంది’’ అన్నారు నిఖిల్. ఈ వేడుకలో నిర్మాతలు వై.రవిశంకర్, ‘జెమిని’ కిరణ్, ఎస్కేఎన్, వివేక్ కూచిభొట్ల, సంగీత దర్శకుడు గోపీ సుందర్ పాల్గొన్నారు. -
నిఖిల్ సిద్ధార్థ్ '18 పేజిస్' మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
అనుపమ పరమేశ్వరన్‌పై నిర్మాత అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు
నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం '18 పేజిస్'. ఈ సినిమాను జీఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తుండగా.. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథను అందించారు. సూర్యప్రతాప్ పల్నాటి దర్శకత్వం వహించిన ఈ డిసెంబర్ 23న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యమలో ఈ సినిమాలోని ‘ఏడురంగుల వాన..’ పాటను చిత్రం బృందం ఆదివారం విడుదల చేసింది. శ్రీమణి రాసిన సాహిత్యం అందించగా సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాటను అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ఈ పాటను రిలీజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘అనుపమ గురించి మాట్లాడకుండ ఉండలేను. ఆమెను చూస్తే నాకు ఇలాంటి కూతురు ఉంటే బాగుండు అనిపిస్తుంది. అంత మంచి అమ్మాయి తను. తనలో ఎలాంటి నటన ఉండదు. చాలా ట్రాన్స్‌పరేంట్‌గా ఉంటుంది. మనసులో ఏది ఉంటే అది మొహంలో కనిపిస్తుంది. ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. అందుకే అనుమప అంటే చాలా ఇష్టం’ అని చెప్పుకొచ్చారు. హీరో నిఖిల్ గురించి మాట్లాడుతూ.. నిఖిల్ చాలా అంకిత భావంతో పనిచేస్తాడంటూ ప్రశంసించారు. చదవండి: అషు కాలును ముద్దాడటంపై ఆర్జీవీ క్లారిటీ, ట్రోలర్స్‌కు వర్మ గట్టి కౌంటర్ సరికొత్త హంగులతో ఏషియన్ తారకరామ థియేటర్, త్వరలో పున:ప్రారంభం -
అందుకే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు: అల్లు అరవింద్
అలా చేయడం వల్లే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. ఆధునికీకరణ వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లకు ప్రేక్షకులు అధిక సంఖ్యలో వస్తున్నారని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్ 2’ కార్యక్రమానికి అతిథిగా హాజరైన ఆయన థియేటర్ల వ్యవస్థ గురించి మాట్లాడారు. ఇదే షోలో ఆయనతోపాటు మరో నిర్మాత దగ్గుబాటి సురేశ్, దర్శకులు రాఘవేంద్రరావు, కోదండ రామిరెడ్డి పాల్గొన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ.. 'థియేటర్లు పడిపోతున్న సమయంలో ఆయా థియేటర్ల యజమానులు వాటిని పైకి రావాలనుకుంటారు. వాటిని మామూలు స్థితికి తీసుకురావడం, సినిమాలు కొనుక్కోవడం వారికి పెద్ద సవాలుగా మారింది. దాన్ని భరించలేక ‘థియేటర్లను మీరే రన్ చేయండి.. మాకు సంవత్సరానికి ఇంత ఇవ్వండి’ అని థియేటర్ల ఓనర్లు నిర్మాతలను కోరారు. అలా మేం వాటిని తీసుకొని కొన్ని కోట్ల రూకపాయలతో మంచిగా తీర్చిదిద్దాం. అన్ని వసతులు ల్పించాం. అలా థియేటర్లను ఆధునికీకరించడం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతోంది. వసూళ్లు ఎక్కువగా వస్తున్నాయి. మీలాంటి పెద్ద హీరోలకు అవకాశాలు ఇవ్వగలుగుతున్నాం.' అని తెలిపారు. దీనిపై సురేశ్ స్పందిస్తూ.. దీని వల్ల కొందరికి థియేటర్లు దొరక్కపోవడంతో పలు సందర్భాల్లో విమర్శించారన్నారు. అందరూ కలిసి సినిమాను బతికించారని అరవింద్ ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం, చిరంజీవి, బాలకృష్ణ కాంబినేషన్లో ఓ చిత్రం నిర్మించాలనుందనే తన కోరికను బయటపెట్టారు. -
నెక్ట్స్ మహానటి ఎవరు? ఆ స్టార్ హీరోయిన్ పేరు చెప్పిన అగ్ర నిర్మాతలు
నందమూరి నట సింహం బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్ స్టాపబుల్-2’. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షో 5 ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. ఇటీవల ఈ జరిగిన ఈ టాక్ షోకు లేటెస్ట్ ఎపిసోడ్‌కు ఇద్దరు అగ్ర నిర్మాతలు అతిథులు వచ్చి సందడి చేశారు. దివంగత నటులు, మాజీ సీఎం నందమూరి తారకరామారావు(సీనియర్ ఎన్టీఆర్) శత జయంతి సందర్భంగా అన్‌స్టాబుల్ స్పెషల్ ఎపిసోడ్‌ను నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఈ షో స్పెషల్ గెస్ట్లుగా టాలీవుడ్ బడా నిర్మాతలు అల్లు అరవింద్, దగ్గుబాటి సురేశ్ బాబు.. దర్శకుడు రాఘవేంద్రరావు అతిథులుగా విచ్చేశారు.ఈ సందర్భంగా షోలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ప్రస్తుత జనరేషన్లో హీరోయిన్లలో మహానటి ఎవరంటూ బాలయ్య.. అల్లు అరవింద్, సురేశ్ బాబులను ప్రశ్నించాడు. దీనికి వీరద్దరు ఇచ్చిన సమాధానం ఆసక్తిని సంతరించుకుంది. అనుకొకుండానే ఇద్దరు నిర్మాతల ఒకే హీరోయిన్ పేరు చెప్పడం విశేషం. నెక్ట్స్ మహానటి ఎవరని అడగ్గానే వీరిద్దరు పలకపై సమంత పేరు రాశారు. సురేశ్ బాబు సమంత అనే సమాధానం చెప్పగానే అల్లు అరవింద్ కూడా తాను అదే పేరు రాశానని చెప్పారు. ఇప్పుడు ఉన్న వాళ్లలో మహానటి అవగలిగితే సమంత అనే సురేశ్ బాబు తన అభిప్రాయం చెప్పారు. దీంతో ఈ వీడియోను సమంత ఫ్యాన్స్ పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో వైరల్ చేస్తున్నారు. సమంత ఫ్యాన్‌క్లబ్ ట్విటర్ పేజీలో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా మహానటి సావిత్రి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. భారతీయ సినీ పరిశ్రమలో మహానటి సావిత్రి చెరగని ముద్ర వేసుకున్నారు. తన సినీ కెరీర్, వ్యక్తిగత జీవితం ఓ చరిత్రగా నిలిచింది. ఆమె తర్వాత మళ్ళీ అలాంటి మహానటి రారు, రాలేరు అని అంటారు. అంతలా తన నటనతో కట్టిపడేశారు ఆమె. ఆమె తరువాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్న నటి సౌందర్య అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. నటన పరంగా, వ్యక్తిత్వం పరంగా సౌందర్య ఇండస్ట్రీలో, అభిమానుల్లో మంచి ఆదరణ పొందారు. సావిత్రి తర్వాత సావిత్రి అనేలా సౌందర్య అద్భుతమైన నటనతో తెలుగు వారి హృదయాలను గెలుచుకున్నారు. ఇప్పుడు ఈ జనరేషన్లో సమంతను మహానటిగా ఇద్దరు అగ్ర నిర్మాతలు పేర్కొనడంతో ఆమె ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. Coming from both legendary producers of the industry at the same time ❤️ #Mahanati #Samantha 😍🤩 its all your dedication and hardwork angel 🙇 @Samanthaprabhu2 You earned it 💪 and you deserve it 🫶 #SamanthaRuthPrabhu pic.twitter.com/J6otq5o9pf — Samantha Fans (@SamanthaPrabuFC) December 3, 2022 -
తండ్రి మాట వినకపోతే అల్లుఅర్జున్ లా అవుతారు : బండ్ల గణేష్
-
చిరంజీవితో బాలకృష్ణ మల్టీస్టారర్.. గూస్ బంప్స్ గ్యారంటీ!
దశాబ్దాల నుండి..మాస్‌ను మంత్రముగ్డులను చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి,నటసింహం నందమూరి బాలకృష్ణ. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే,ఉహిస్తేనే, గూస్ బంప్స్ గ్యారంటీ. ఇప్పుడు ఈ కల సాకారం కాబోతుందా.? ఆ తరంలో ఎన్టీఆర్, ఏన్నార్, కృష్ణ లాంటి స్టార్లు ఒకే స్క్రీన్ లో కనిపించి..అభిమానులను ఖుషీ చేశారు. ఇప్పుడు ఈ తరం హీరోలు నందమూరి నటసింహం, కొణెదెల హీరో కలిసి నటించబోతున్నారా ?ఈ బిగ్ ప్రాజెక్టుకు..అల్లు అరవింద్ స్కేచ్ వేస్తున్నాడా ?ఇంతకీ ఈ ప్రాజెక్ట్ నిజంగా ఉంటుందా ,ఇప్పుడు ఎందుకు ఈ చర్చ వచ్చింది అంటారా ? ఎన్టీఆర్ ,ఏన్నార్ ఓ తరం నటులు.ఫిల్మ్ ఇండిస్ట్రీకి రెండు కళ్లలాంటి వారు.దశాబ్దాల పాటు నువ్వా నేనా అంటూ పోటీ పడ్డారు.అలాంటి స్టార్లు స్క్రీన్ షేర్ చేసుకున్నారు.తర్వాత వచ్చిన కృష్ణ,కృష్ణం రాజు,శోభన్ భాబు లాంటి హీరోలు కూడా ఒకే స్క్రీన్ మీద కనిపించి అలరించిన వారే.ఇలాంటి సాలిడ్ మల్టీ స్టారర్లు చేసి వెండితెరను కళకళలాడేలా చేసారు ఆ తరం తర్వాత..చిరంజీవి,బాలకృష్ణ,నాగార్జున,వెంకటేష్ తెలుగు వెండితెరకు నాలుగు స్థాంబాలుగా నిలిచారు.అయితే ఈ స్టార్లు..ఒకే స్క్రీన్ల మీద కనిపించింది మాత్రం లేదు.ఫ్యాన్స్ మధ్య పోటీ,వీళ్లను తెర మీద చూపించే కథ రాకపోవటం అలాగే..స్టార్ల మధ్య ఇగో ఫ్యాక్టర్లు లాంటివి కూడా..వీళ్లు కలిసి నటించకపోవటానికి కారణంగా నిలిచాయి.ఏమైతేనేం .వెండితెర మీద ఈ స్టార్ల మల్టీ స్టారర్ సినిమాలు చూసే భాగ్యం అభిమానులకు లేకుండా పోయింది.అయితే..ఇప్పుడు మాస్ గా బాప్ ..మెగాస్టర్ చిరంజీవి,నందమూరి నటసింహంల మల్టీ స్టారర్ తెర మీదికి వచ్చింది.ఈ బిగ్ ప్రాజెక్ట్‌కు వేదికగా ఆహా ప్లాట్ ఫామ్ నిలిచింది నందమూరి నటసింహం ఆహా ప్లాట్ ఫామ్ లో ఆన్ స్టాపబుల్ సీజన్ 2 చేస్తున్న మ్యాటర్ తెలిసిందే.మొదటి సీజన్ హిట్ కొట్టింది.ఈ సెకండ్ సీజన్ కూడా బాగా అలరిస్తుంది. 90 సంవత్సరాల తెలుగు సినిమా సెలబ్రిషన్స్ సందర్బంగా..నిర్మాతలు..అల్లు అరవింద్,దగ్గుబాటి సురేష్ బాబు,దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావును కలిపి బాలయ్య ఇంటర్వూ చేశాడు. ఇంటర్వూలో భాగంగా..అల్లు అరవింద్ తో ..మనిద్దరి కాంబినేషనే బ్యాలన్స్ అని బాలయ్య అడగగా,మీతో చిరంజీవి గారుతో కలిపి కాంబినేషన్ తీద్దామని వెయిట్ చేస్తున్నాను అని అన్నాడు అల్లు అరవింద్. వెంటనే బాలకృష్ణ స్క్రిప్ట్ ఎలా ఉండాలో కూడా చెప్పేశాడు. మా మల్టీస్టారర్ లో చిరంజీవికి పాటలు ఉండాలి. నాకు ఫైట్స్ ఉండాలి. ఇంట్రో సాంగ్ చిరంజీవిది, క్లైమాక్స్ ఫైట్ నాది అని బాలయ్య చెప్పుకొచ్చాడు. మరి అల్లు అరవింద్ ఆ మాటలు సీరియస్ గా అన్నాడా ? మరి ఏ ఉద్దేశంతో అన్నాడో తెలియదు కాని..చిరు,బాలయ్య కలిసి మల్టీ స్టారర్ చేయటం అనే అలోచనే ..ఓ సెలబ్రిషన్‌ల ఉంది.మరి వీరిద్దరు కలిసి నటించి..వెండితెర సెలబ్రేషన్స్ చేయాలని అశిద్దాం. -
చిరు, బాలయ్య మల్టీస్టారర్..?
-
వారసుడు సినిమా వివాదంపై స్పందించిన అల్లు అరవింద్
-
డబ్బింగ్ సినిమాల విడుదల ఆపడం జరిగే పని కాదు: అల్లు అరవింద్
-
తెలుగు నిర్మాతల మండలి నిర్ణయంపై స్పందించిన అల్లు అరవింద్
తెలుగులో దిల్ రాజు నిర్మిస్తున్న వారసుడు మూవీ విడుదల ప్రస్తుతం తెలుగు, తమిళ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. సంక్రాంతి విడుదలకు డైరెక్ట్ తెలుగు సినిమాలకే ముందుగా ప్రాధాన్యత ఇవ్వాలని ఇటీవల తెలుగు నిర్మాతల మండలి లేఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే అప్పటికే వారసుడు మూవీని సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్టు చిత్ర బృందం ప్రకటిచింది. తమిళ్ స్టార్ విజయ్ హీరోగా నటించిన వారసుడు మూవీ డబ్బింగ్ చిత్రం కావడంతో ఈ సినిమా సంక్రాంతి విడుదలపై సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలో తెలుగు నిర్మాతల మండలి నిర్ణయంపై తాజాగా తమిళ నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: ముదురుతున్న వారసుడు మూవీ వివాదం, మండిపడుతున్న తమిళ్ దర్శక-నిర్మాతలు తెలుగు చిత్రాలు తమిళ్లో ఏ ఆటంకం లేకుండా విడుదల అవుతున్నాయని, కానీ తెలుగులో తమిళ చిత్రాలను ఆపడం ఏంటని తమిళ దర్శక-నిర్మాతలు ప్రశ్నిస్తున్నారు. అలా అయితే తాము కూడా తెలుగు చిత్రాలను ఇక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. అంతేకాదు ఈ విషయమై ఈ నెల 22 తమిళ నిర్మాతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. తమిళ నిర్మాతల అభ్యంతరంపై తాజాగా ప్రముఖ తెలుగు నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. డబ్బింగ్ సినిమాల విడుదల ఆపడం జరిగే పని కాదని అన్నారు. సినిమాకు ఎల్లలు లేవని, ఎల్లలు తీసేశామన్నారు. సౌత్ నార్త్ అనే భేదాలు లేవని, బాగున్న సినిమా ఎక్కడైన ఆడుతుందని అల్లు అరవింద్ వ్యాఖ్యానించారు. -
తమిళనాడులో వారసుడు సినిమాపై వివాదం
-
డబ్బులిచ్చి మరీ సినిమాలు రిలీజ్ చేశాడు..కృష్ణని కోల్పోవడం దురదృష్టకరం: అల్లు అరవింద్
సూపర్‌స్టార్ కృష్ణ పార్థివదేహానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నివాళులర్పించారు. పద్మాలయ స్టూడియోస్కి చేరుకున్న ఆయన .. కృష్ణకు పుష్పాంజలి ఘటించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణ నిర్మాత హీరో అని కొనియాడాడు. ‘నేను సినిమాలు తీయడానికి వచ్చినప్పటి నుంచి ఆయనను(కృష్ణ) గమనిస్తున్నాను. ఆయన చనిపోయాడనే వార్త వినగానే.. ఆయన చేసిన గొప్ప విషయం గుర్తుకు వచ్చింది. ఇద్దరు ముగ్గురు నిర్మాతలు ఆయనకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ ఇవ్వకముందే సినిమాలు విడుదల చేసేందుకు రెడీ అయ్యారు. అప్పుడు కృష్ణ వాళ్లని పిలిచి ‘మీరేదో కష్టాల్లో ఉన్నారట కదా.. నన్ను ఏమైనా సాయం చెయ్యమంటారా?’అని అడిగి డబ్బులు ఇచ్చి మరీ సినిమాలు విడుదల చేశారు. ఆ నిర్మాతలు ఎవరో నాకు తెలుసు. ఇప్పుడు వారి పేర్లు ప్రస్తావించదలచుకోలేదు. నిర్మాతల బాగోగులు కోరుకునే గొప్ప వ్యక్తి ఇప్పుడు మనకు లేడు. అది మన దురదృష్టం. ఆయన నివాళికి కుటుంబు సభ్యులు, సినీ ప్రముఖులతో పాటు లక్షల మంది అభిమానులు రావడం నిజంగా విచిత్రం. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నా’అని అల్లు అరవింద్ అన్నారు. -
అల్లు అరవింద్‌కు నలుగురు కుమారులని తెలుసా?
స్టార్ కమెడియన్ అల్లు రామలింగయ్య తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు అల్లు అరవింద్. నటుడిగా కాకుండా నిర్మాతగా కెరీర్ ఎంచుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్లో బడా నిర్మాతగా వెలుగొందుతున్నాడు. గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ కింద ఎన్నో సినిమాలను ప్రేక్షకులకు అందిస్తున్నాడు. ఆయన వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. ఆయనకు ముగ్గురు కుమారులు అని అందరూ అనుకుంటారు. వారే అల్లు అర్జున్, అల్లు శిరీష్, అల్లు వెంకటేశ్ (బాబీ). కానీ అల్లు అరవింద్‌కు మరో కుమారుడు కూడా ఉండేవాడన్న విషయాన్ని శిరీష్ బయటపెట్టాడు. 'మా నాన్నకు మేం నలుగురం. పెద్దన్నయ్య అల్లు వెంకటేశ్ తర్వాత రాజేష్ జన్మించాడు. వీళ్లిద్దరి తర్వాత అర్జున్ పుట్టాడు. ఐదారేళ్ల వయసులో రాజేశ్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. నేను పుట్టడాని కంటే ముందే ఇది జరిగింది' అని చెప్పుకొచ్చాడు అల్లు శిరీష్. చదవండి: మనసుకు గాయమంటూ రేవంత్ ఏడుపు చాలా నెర్వస్‌గా ఉంది, అంతా మీ చేతుల్లోనే: సమంత -
అల్లు అరవింద్ అలా అడిగేసరికి షాక్ అయ్యాను : అను ఇమ్మానుయేల్
మజ్ను సినిమాతో టాలీవుడ్‌కు పరిచయైన బ్యూటీ అను ఇమ్మానుయేల్. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ అల్లు శిరీష్‌తో డేటింగ్లో ఉందంటూ కొద్ది రోజులుగా గుసగుసలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ లేకపోయినా వీరిద్దరూ చట్టాపట్టాలేసుకొని తిరగుతున్నట్లు ఫిల్మీ దునియాలో టాక్ వినిపిస్తుంది. ఇదే విషయం గురించి అను ఇమ్మానుయేల్‌ని పిలిచి మరి అల్లు అరవింద్ డైరెక్ట్‌గా అడిగేశాడట. ఊర్వశివో రాక్షసివో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా అను ఇమ్మానుయేల్ మాట్లాడుతూ ఈ విషయాన్ని బయటపెట్టేసింది. శిరీష్‌తో ప్రేమలో ఉన్నానంటూ వార్తలు వస్తున్నాయి. నిజానికి ఈ మూవీ ఓపెనింగ్ రోజు పూజలోని శిరీష్‌ని నేను కలిశాను. ఆ తర్వాత మూవీ కోసం ఓసారి కాఫీ షాప్‌లో మాట్లాడకున్నాం. ఆ మాత్రానికే డేటింగ్ అంటూ వార్తలు రాసేశారు. అల్లు అర్జున్‌తో నా పేరు సూర్య మూవీలో నటించాను. అప్పటి నుంచి ఆ కుటుంబంతో నాకు మంచి అనుబంధం ఉంది అంతే. అల్లు అరవింద్ కూడా ఓసారి నన్ను నా కొడుకుతో డేటింగ్లో ఉన్నావా అని అడిగారు. ఆ తర్వాత చాలా సేపు దీని గురించి మాట్లాడి నవ్వుకున్నాం అంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. -
లవ్.. హారర్.. కామెడీ
ఇటీవల హిట్ చిత్రం కన్నడ ‘కాంతార’ని తెలుగులో విడుదల చేసిన అల్లు అరవింద్ గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ త్వరలో హిందీ చిత్రం ‘భేదియా’ని విడుదల చేయనుంది. ఈ లవ్–హారర్–కామెడీ మూవీ తెలుగు విడుదల హక్కులను దక్కించుకున్న విషయాన్ని బుధవారం ప్రకటించింది. అమర్ కౌశిక్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం హిందీ, తమిళ, తెలుగులో ఈ నెల 25న విడుదల కానుంది. వరుణ్ ధావన్, కృతీ సనన్ జంటగా నటించారు. కాగా ఈ చిత్రంలో తోడేలు కాటుకు గురైన యువకుడు భాస్కర్ పాత్రలో వరుణ్, డాక్టర్ అనిక పాత్రలో కృతి కనిపిస్తారు. ‘‘మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను విడుదల చేయాలనే ఆలోచనతో తెలుగు రాష్ట్రాల్లో ‘కాంతార’ తెలుగు వెర్ష¯Œ ను విడుదల చేశాం. ‘భేదియా’ కంటెంట్ కూడా బాగుంటుంది’’ అని నిర్మాత బన్నీ వాసు పేర్కొన్నారు. -
ఇది అసలు ఊహించలేదు.. కాంతార హీరో రిషబ్ శెట్టి
ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ , రిషబ్ శెట్టి కాంబినేషన్లో వచ్చిన కన్నడ చిత్రం ‘కాంతార’. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. సెప్టెంబర్ 30న కన్నడలో రిలీజైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాను తెలుగులో అక్టోబర్ 15న విడుదల చేశారు. టాలీవుడ్లో మెగా నిర్మాత అల్లు అరవింద్ గీతా ఫిల్మ్స్ ద్వారా రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ టూర్ ప్రారంభించింది. నేడు తిరుపతి, విశాఖపట్నంలో ఉన్న థియేటర్లను కాంతారా చిత్రబృందం సందర్శించింది. ఈ సందర్భంగా సినిమా విశేషాలను దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి అభిమానులతో పంచుకున్నారు. (చదవండి: ‘కాంతార’కి బిగ్ షాకిచ్చిన కోర్టు.. ఇకపై దాన్ని ప్రదర్శించకూడదు!) హీరో రిషబ్ శెట్టి మాట్లాడుతూ... 'ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఇంతగా ఆదరిస్తారని ఊహించలేదు. కేవలం రెండు వారాల్లో ఈ సినిమా రూ.50 కోట్ల వసూళ్లు సాధించడం ఆనందంగా ఉంది. ఇంతలా ఆదరించినందుకు టాలీవుడ్ ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మీ ఆదరాభిమానాలు ఎప్పటికి ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.' అని అన్నారు. మెగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ...' సినిమాకు భాష ముఖ్యం కాదు.. కేవలం ఎమోషన్ ఒకటే ఉంటుంది అని కాంతార నిరూపించింది. ఈ సినిమాను కన్నడలో చూసి బన్ని వాసు నాతో చెప్పాడు. ఆ తర్వాత సినిమా చూసినప్పుడు నాకు ఎమోషన్ అర్ధమైంది. ఈ ఎమోషన్‌కు కనెక్ట్ అయి తెలుగులో డిస్ట్రిబ్యూషన్ చేస్తే బాగుంటుందనిపించింది. అందుకే టాలీవుడ్‌లోనూ రిలీజ్ చేశాం'. అని చెప్పారు. -
తెలుగు రాష్ట్రాల్లో ‘కాంతార’ సక్సెస్ టూర్, ప్రేక్షకులను కలవనున్న రిషబ్ శెట్టి
కన్నడ మూవీ కాంతార బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులను కొల్లగొడుతోంది. దేశవ్యాప్తంగా కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలు పొందిన ఈ చిత్రం మరో సరికొత్త రికార్డు నెలకొల్పింది. కన్నడలో సెప్టెంబర్ 30న రిలీజ్ అయిన ఈ చిత్రం తెలుగులో అక్టోబర్ 15న రిలీజ్ అయ్యి ఇక్కడ కూడా బ్లాక్‌బస్టర్ అందుకుంది. మెగా నిర్మాత అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఈ సినిమాను తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేశారు. తెలుగులో మూవీ విజయవంతంగా ఆడుతున్న నేపథ్యంలో ప్రేక్షకులను నేరుగా కలిసేందుకు కాంతార మూవీ టీం సక్సెస్ టూర్‌ను నిర్వహించనుంది. అక్టోబర్ 29న(శనివారం) తిరుపతి, వైజాగ్‌లో ప్రదర్శించబుడుతున్న థియేటర్స్‌ను సందర్శించనున్నారు. ఈ సక్సెస్ టూర్లో చిత్ర దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి పాల్గొననున్నారు. -
అల్లు అరవింద్ భారీ స్కెచ్.. ‘కాంతార’ దర్శకుడితో రామ్ చరణ్ మూవీ!
టాలీవుడ్లో కాంతర హవా ఇంకా కొనసాగుతుంది. ఈ కన్నడ చిత్రాన్ని తెలుగులో గీత ఆర్ట్ సంస్థ బ్యానర్ మీద అల్లు అరవింద్ అక్టోబర్ 15న విడుదల చేశాడు. తెలుగు ఆడియన్స్ ఈ సినిమాను రీసీవ్ చేసుకుంటారో లేదో అనే అనుమానంతో పెద్దగా ప్రమోషన్స్ లేకుండా సినిమాను విడుదల చేశారు. కానీ మౌత్ టాక్‌తో ఈ సినిమా భారీ విజయం సాధించింది. రిషబ్ శెట్టి టేకింగ్, యాక్టింగ్‌కి టాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమా సక్సెస్ మీట్ లో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. రిషబ్ శెట్టితో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నానని ప్రకటించారు. అయితే అందరూ ఆయనను హీరోగా పెట్టి సినిమా తీస్తున్నారేమో అనుకున్నారు. కానీ తాజాగా ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. రిషబ్ శెట్టి తో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ సినిమా చేయనున్నాడని తెలుస్తుంది. రిషబ్ శెట్టి వద్ద ఒక ఆసక్తికరమైన లైన్ ఉందట. దానిని తెరకెక్కించాలంటే అల్లు అరవింద్ లాంటి బడా ప్రొడ్యూసర్లకే సాధ్యమవుతుందని, ఆయనను సంప్రదించాడట. ఈ స్టోరీకి రామ్ చరణ్ అయితే బాగుంటుందని రిషబ్ భావిస్తున్నాడట. చరణ్‌కి స్టోరీ నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. ఈ క్రేజీయెస్ట్ కాంబో రావడం గ్యారెంటీ. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌కి కొంచెం గ్యాప్ రావడంతో జపాన్ పర్యటనకు వెళ్లాడు. అక్కడ ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటూ బిజీగా ఉన్నాడు. -
మొదట ఆందోళన పడ్డా.. ఆ తర్వాత హ్యాపీ: అల్లు అరవింద్
‘‘ఊర్వశివో రాక్షసివో’ చిత్ర కథని తమ్మారెడ్డి భరద్వాజగారు అందించారు. ఈ సినిమా ప్రివ్యూ చూసిన తర్వాత ఆయన నుంచి నాకు వరుసగా కాల్స్ వచ్చాయి. తన కథను మేము సరిగ్గా తీయలేకపోయారని అంటారేమో అనుకుని మొదట టెన్షన్ పడ్డా.. కానీ, సినిమా చాలా బాగా తీశారని ఆయన చెప్పడంతో సంతోషపడ్డాం’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. చదవండి: స్టార్ హీరో సల్మాన్‌కు అనారోగ్యం.. షూటింగులు వాయిదా అల్లు శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్‌పై ధీరజ్ మొగిలినేని నిర్మించిన ఈ సినిమా నవంబర్ 4న విడుదలకానుంది. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రంలో మధ్య తరగతి అబ్బాయిగా శిరీష్ బాగా నటించాడు. మా సినిమా చూసి ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన ‘కపట నాటక సూత్రధారి’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే.. ‘‘దాసరి నారాయణరావు, బాలచందర్‌గార్లు మధ్య తరగతి సమస్యలను అందంగా, సరదాగా చెప్పేవారు. మళ్లీ ఇన్నాళ్లకు ‘ఊర్వశివో రాక్షసివో’లో చూపిస్తుండటం హ్యాపీ’’ అన్నారు తమ్మారెడ్డి భరద్వాజ. ‘‘యువత ఆలోచనలు ఎలా ఉంటున్నాయి? అనే నేపథ్యంలో ఈ సినిమా తీశాం’’ అన్నారు రాకేష్ శశి. ‘‘ఇంటికెళ్లిన తర్వాత కూడా ప్రేక్షకులు మా మూవీ గురించి ఆలోచిస్తారు’’అన్నారు అల్లు శిరీష్. -
త్వరలో 'కాంతార' హీరో రిషబ్ శెట్టితో సినిమా: అల్లు అరవింద్
ఓటీటీల వల్ల జనాలు థియేటర్లకు రావడం లేదు అనేదాంట్లో ఏమాత్రం నిజం లేదని నిరూపించాయి పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2, కార్తికేయ 2 సినిమాలు. కంటెంట్ ఉంటే చాలు కేవలం మౌత్ టాక్‌తోనే జనాలను థియేటర్స్‌కు రప్పించవచ్చని నిరూపించింది కాంతార. సెప్టెంబర్ 30న కన్నడలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తెలుగులో అక్టోబర్ 15 న రిలీజై ఇక్కడ కూడా సూపర్ హిట్ అయింది. మెగా నిర్మాత అల్లు అరవింద్ "గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్" ద్వారా తెలుగులో దీన్ని రిలీజ్ చేసారు. ఈ చిత్రం విజయవంతంగా ఆడుతున్న తరుణంలో బుధవారం ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్లో అల్లు అరవింద్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 'సినిమాకు భాషా సరిహద్దులు లేవు, ఎమోషన్ బారియర్ ఒకటే ఉంటుంది అని కాంతార చిత్రం రుజువు చేసింది. ఇది మట్టిలోంచి పుట్టిన కథ. ఇది ఎక్కడో కొరియన్, హాలీవుడ్ సినిమాలను నుంచి కాపీ కొట్టింది కాదు. ఈ సినిమాలో విష్ణు తత్వం, రౌద్ర రూపం చూశాక ఇది సింహాచలంకి దగ్గరగా ఉన్న కథ అనిపించింది. ఇందులో హీరో ఎంత గొప్పగా చేశాడో మీరు చూశారు. అతను ఫీల్ అయ్యి చేయడం వల్ల ఈ సినిమా అంతలా కనెక్ట్ అయింది. ఈ చిత్రానికి అజనీష్ లోకనాధ్ అద్భుతమైన బాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. జాతరలో జరిగే అరుపులను, కొన్ని సౌండ్స్‌ను రికార్డ్ చేసి మ్యూజిక్‌తో పాటు వదిలారు. ఈ సినిమాను కన్నడలో చూసిన బన్నీ వాసు నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి అర్జెంటుగా మీరొక సినిమా చూడండి అన్నాడు. ఏంటి, బన్నీ వాసు ఇంత ఎగ్జైట్మెంట్గా చెబుతున్నాడు అనుకున్నాను. సినిమా చూసినప్పుడు నాకు ఎమోషన్ అర్ధమైంది. ఈ ఎమోషన్‌కు కనెక్ట్ అయ్యి దీన్ని తెలుగులో డిస్ట్రిబ్యూషన్ చేస్తే బాగుంటుందనిపించి తెలుగులో రిలీజ్ చేశాం. ఇక్కడ చెప్పాల్సిన ఇంకో విషయం ఏమిటంటే గీత ఆర్ట్స్ లో సినిమా చేయమని రిషబ్ శెట్టిని అడిగాను, ఆయన కూడా ఒప్పుకున్నాడు' అని చెప్పాడు అల్లు అరవింద్. చదవండి: సర్దార్లో అన్ని గెటప్సా? సూర్యను దాటేస్తాడా? బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న కాంతా.. ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే? -
‘గీత ఆర్ట్స్’ బ్యానర్లో గీత ఎవరో చెప్పేసిన అల్లు అరవింద్
తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థలో గీత ఆర్ట్స్ బ్యానర్ ఒకటి. ఈ బ్యానర్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. చెప్పాలంటే ఈ నిర్మాణ సంస్థకు పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ బ్యానర్లో సినిమా అంటే ప్రేక్షకుల అంచనాలు మరింత పెరిగిపోతాయి. కొత్త నటినటులు ఉన్నప్పటికి ఈ బ్యానర్లో వచ్చే సినిమా చూసే ప్రేక్షకుల సంఖ్య ఎక్కువనే చెప్పాలి. అయితే ఏ నిర్మాణ సంస్థకు అయిన వారివారి కూతుళ్ల పేర్లులేదా భార్య పేరు, ఇంటి పేరు ఉంటుంది. కానీ, అల్లు అరవింద్ నిర్మాణ సంస్థ ‘గీత ఆర్ట్స్’లో గీత అనేది ఎవరు పేరు అనేది ఆసక్తి కలిగించే విషయం. ఎందుకంటే ఈ పేరుతో అల్లు కుటుంబంలో ఎవరు లేకపోవడమే! చదవండి: బిగ్‌బాస్ 6: గీతూ రాయల్ భర్త ఎవరు, ఏం చేస్తుంటాడో తెలుసా? తాజాగా గీత ఆర్ట్స్‌లో గీత అంటే ఎవరో రివీల్ చేశారు సంస్థ అధినేత అల్లు అరవింద్. ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొన్న ఆయనకు గీత ఆర్ట్స్‌లో.. గీత అంటే ఎవరనే ప్రశ్న ఎదురైంది. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘‘గీత’ అనేది నా గర్ల్ ఫ్రెండ్ అనే డౌటు చాలామందిలో ఉంది. అది నిజమే. నాకు గీత అనే గర్ల్‌ఫ్రెండ్ ఉండేది. ఆమె పేరునే మా నిర్మాణ సంస్థకు పెట్టానని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కానీ అందులో నిజం లేదు. నా గర్ల్‌ఫ్రెండ్ పేరు గీత అనేది నిజం, మా బ్యానర్ పేరు గీత ఆర్ట్స్ అని పెట్టడం నిజం. కానీ ఈ రెండూ వేరు వేరు సందర్భాలు. అయితే నా స్నేహితులు ఈ రెండింటిని కలిపేసి నన్ను ఆటపట్టిస్తుంటారు‘’ అని ఆయన చెప్పుకొచ్చారు. అనంతరం తమ బ్యానర్‌కు గీత ఆర్ట్స్ పెట్టడం వెనక అసలు కారణమేంటో ఆయన వివరించారు. చదవండి: పూరీకి ఆ విషయం తెలియకుండా మేనేజ్ చేశా: సత్యదేవ్ ‘‘నిజానికి ‘గీత ఆర్ట్స్’ అనే పేరుతో సొంత నిర్మాణ సంస్థను పెడదామనే ఒక ప్రపోజల్‌ను పెట్టింది మా నాన్నగారు (అల్లు రామలింగయ్య). భగవద్గీత బోధన ప్రకారం.. ప్రయత్నం మాత్రమే మనది .. ఫలితం మన చేతిలో లేదు అనేది సారాంశం. అది సినిమాలకు కరెక్టుగా సరిపోతుంది. నిర్మాతగా నీ ప్రయత్నం నువ్వు చేయడమే.. ఫలితం ప్రేక్షక దేవుళ్ల చేతిలో ఉంటుంది. ‘గీత’లో చెప్పినట్లుగా సినిమా నిర్మాణ వ్యవహారాలు ఉండటంతో ‘గీత ఆర్ట్స్’ అని పెడదామని నాన్నగారు అనడం.. అదే ఫైనల్ కావడం జరిగిపోయింది’’ అని అల్లు అరవింద్ తెలిపారు. మరి పెళ్లి తర్వాత అయినా ఈ పేరు నిర్మల ఆర్ట్స్ అని మార్చొచ్చు కదా అని హోస్ట్ అడగడంతో అప్పటికే ఈ బ్యానర్ నుంచి ఎన్నో సూపర్ హిట్లు వచ్చాయని, అందుకే మార్చడం ఎందుకని వదిలేశామని నవ్వుతూ సమాధానం ఇచ్చారు అల్లు అరవింద్. -
మెగా- అల్లు ఫ్యాన్స్‌కి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన అల్లు అరవింద్
టాలీవుడ్ బడా నిర్మాతల్లో అల్లు అరవింద్ ముందు వరసలో ఉంటారు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఆయన ఎన్నో బ్లాక్‌బస్టర్, హిట్ చిత్రాలను నిర్మించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో సినిమా రిలీజ్ అంటే ఆ హీరోల పంట పండినట్టే. అలా నిర్మాతగా అల్లు అరవింద్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. సక్సెస్ ఫుల్ నిర్మాతగా రాణిస్తున్న ఆయన తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మెగా- అల్లు ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. పుష్ప మూవీ తనకు, తన కుమారుడు అల్లు అర్జున్ మైల్ స్టోన్ అన్నారు. చదవండి: పూరీకి ఆ విషయం తెలియకుండా మేనేజ్ చేశా: సత్యదేవ్ పుష్ప మూవీతో బన్నీ జాతీయ స్థాయిగా గుర్తింపు తెచ్చుకోవడం చాలా తృప్తిగా ఉందన్నారు. ‘మా గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఎక్కువగా సినిమాలు తీసిందని మెగాస్టార్ చిరంజీవి గారే. మా బ్యానర్లో ఆయన తీసిన సినిమాలన్ని దాదాపుగా హిట్ అయ్యాయి. ఇక నిర్మాతగా నా జీవితంలో అద్భుతమైన సినిమా తీశాను అనే సంతృప్తి మగధీరతో వచ్చింది. ఈ సినిమాకు మేం పెట్టిన బడ్జెట్ కంటే మూడింతలు లాభం వచ్చింది. మొదట ఈ సినిమాకు అనుకున్న బడ్జెట్ కంటే 80 శాతం ఎక్కువ బడ్జెట్ పెట్టాల్సి వచ్చింది. దీంతో చాలా భయపడ్డాను. ఇక ఎడిటింగ్, గ్రాఫిక్స్ వర్క్ పూర్తయ్యాక సినిమా చూస్తే ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. చదవండి: విడాకులు రద్దు? కొత్త ఇంటికి మారనున్న ధనుశ్-ఐశ్వర్యలు! వెంటనే డిస్ట్రిబ్యూటర్స్‌కు ఫోన్ చేసి సినిమా మొత్తం మనమే విడుదల చేస్తున్నాం అని చెప్పా. దీంతో వాళ్లంత షాక్ అయ్యారు’ అని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మాట్లాడుతూ.. చరణ్- బన్ని కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ చేయాలనేదని తన కోరిక అని వారిద్దరి కాంబోలో వచ్చే చిత్రం కోసం చరణ్- అర్జున్ అనే టైటిల్‌ను పదేళ్ల క్రితమే అనుకున్నానని తెలిపారు. అయితే ఈ మల్టిస్టారర్ కోసం కథలు వింటున్నారా అని అడగ్గా.. ఇంకా లేదని సమాధానం ఇచ్చారు. ఎప్పటికైనా తన కల నెరవేర్చుకుంటానని, వీరిద్దరితో కలిసి ఓ సినిమా చేస్తానని అల్లు అరవింద్ వ్యాఖ్యానించారు. కాగా ప్రస్తుతం బన్నీ పుష్ప 2తో బిజీగా ఉండగా, చరణ్ శంకర్ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు. -
కాసుల వర్షం కురిపిస్తున్న 'కాంతార'.. మౌత్‌టాక్‌తోనే సూపర్ హిట్
రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం 'కాంతార'. కన్నడలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ చిత్రం తెలుగులోనూ అదిరిపోయే కలెక్షన్లతో దుమ్మురేపుతుంది. రిలీజైన తొలిరోజు నుంచే హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. కాంతార రైట్స్ కేవలం రూ. 2 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. మొదటిరోజు 1.95 కోట్ల గ్రాస్ ను సాధించిన ఈ చిత్రం రెండవ రోజు ఏకంగా రూ. 11.5 కోట్ల గ్రాస్‌ను సొంతం చేసుకుంది. కేవలం మౌత్‌టాక్‌తోనే ఇంత పెద్ద విజయం సాధించడం అరుదైన విషయం. కన్నడలో భారీ విజయం సాధించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తెలుగులో రిలీజ్ చేశారు. రిషబ్ శెట్టి అద్భుతమైన నటన, విజువల్స్‌కి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ తోడై కాంతార థియేటర్స్‌లో మాస్ జాతర చేస్తోంది. కన్నడలో 17 రోజుల కలెక్షన్స్ ను తెలుగులో కేవలం రెండు రోజుల్లోనే కొల్లగొట్టిందీ చిత్రం. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది కాంతార. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్‌తో దూసుకుపోతుంది. ముఖ్యంగా ఈ ‘కాంతార’ క్లైమాక్స్ సినిమా విజయంలో ప్రధాన పాత్ర పోషించింది. చివరి 20 నిమిషాలు అరాచకానికి అర్థం చూపించాడు రిషబ్ శెట్టి. అప్పటివరకు మాములుగా సాగుతున్న సినిమాను క్లైమాక్స్ లో వేరే లెవెల్ కి తీసుకెళ్లాడు. ఇప్పటికే కన్నడలో సంచలనం సృష్టించిన ఈ చిత్రం, తెలుగులో కూడా అంతకు మించిన విజయఢంకా మోగిస్తోంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Tremendous response from the audience for #KantaraTelugu 🔥 95% rating on @bookmyshow 💥 Watch #Kantara in theaters near you now! 💥 🎟️: https://t.co/WNkTI6j3BF #Kantara @shetty_rishab @VKiragandur @hombalefilms @GeethaArts @gowda_sapthami @AJANEESHB @actorkishore pic.twitter.com/p5YnWJiCe9 — Geetha Arts (@GeethaArts) October 16, 2022 -
దేశం మొత్తం మాట్లాడుకుంటున్న సినిమా " కాంతారా "
-
‘కాంతారా’ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది: రిషబ్ శెట్టి
‘‘హోంబలే ఫిల్మ్స్ సంస్థ మంచి కథలను ఎంచుకుంటూ సినిమాలు తీస్తోంది. ‘కాంతారా’ సినిమా చూసిన తర్వాత ఇన్ని సినిమాలు తీసిన నేను కూడా వారి దగ్గర నుంచి కొంత నేర్చుకోవాలని అనిపించింది. విభిన్నమైన సినిమాలు కావాలనుకునేవారికి ‘కాంతారా’ కచ్చితంగా నచ్చుతుంది’’ అని అన్నారు నిర్మాత అల్లు అరవింద్. కన్నడ నటుడు, రచయిత, దర్శకుడు రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘కాంతారా’. ఈ చిత్రంలో సప్తమి గౌడ, కిశోర్ కుమార్, అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి, ప్రకాష్ తుమినాడు కీలక పాత్రలు పోషించారు. ‘కేజీఎఫ్’ ఫేమ్ విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 30న విడుదలైంది. ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ గీతా ఫిలింస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ నెల 15న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ – ‘‘అడవి నేపథ్యంలో వచ్చిన ‘పుష్ప’ చూసి ప్రేక్షకులు ఎంతగా ఇష్టపడ్డారో.. అదే నేపథ్యంలో వస్తున్న ‘కాంతారా’ను కూడా అంతే ఇష్టపడతారు. ‘కాంతారా’లో ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ మాత్రమే కాదు.. విష్ణు తత్వాన్ని కూడా చెప్పడం జరిగింది. రీసెంట్గా వచ్చిన ఈ తరహా సినిమాలు సూపర్ హిట్టయ్యాయి. ‘కాంతారా’ను రిషబ్ శెట్టి ఎంత అద్భుతంగా డైరెక్ట్ చేశారో అంతే బాగా యాక్ట్ చేశారు. సుమారు 40 నిమిషాల వరకు చూపు తిప్పుకోకుండా ఈ సినిమాను చూశాను. హీరోయిన్ సప్తమి డీ గ్లామరస్ రోల్‌ను బాగా చేసింది’’ అని అన్నారు. రిషబ్ శెట్టి మాట్లాడుతూ– ‘‘భారతీయ చిత్ర పరిశ్రమలోనే తెలుగు చలన చిత్ర పరిశ్రమ అగ్రస్థానంలో ఉంది. ఫారెస్ట్ మిస్టరీతో పాటు అగ్రికల్చర్ ల్యాండ్, ఎమోషన్స్ చుట్టూ ఈ సినిమా కథ సాగుతుంది. యూనివర్సల్ కథతో వస్తున్న ‘కాంతారా’ ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందని చెప్పగలను. అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌గారి గీతా ఫిలింస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ‘కాంతారా’ రిలీజ్ అవుతున్నందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘రిషబ్ శెట్టితో నేను చేసిన మూడో సినిమా ఇది. ‘కాంతారా’లో ఆరు పాటలు రాసే అవకాశాన్ని ఇచ్చిన హనుమాన్‌గారికి ధన్యవాదాలు’’ అన్నారు రచయిత రాంబాబు గోశాల. -
కన్నడ సెన్సేషన్ ‘కాంతారా’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది
ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ , రిషబ్ శెట్టి కాంబినేషన్లో వచ్చిన కన్నడ చిత్రం ‘కాంతారా’. సెప్టెంబర్ 30న విడుదలైన ఈ చిత్రానికి అక్కడ భారీ విజయం సాధించింది.. ప్రస్తుతం ఈ చిత్రాన్ని ఇతర భాషల్లో డబ్ చేసి విడుదల చేయబోతున్నారు మేకర్స్. తెలుగు థియేట్రికల్ రైట్స్‌ని అల్లు అరవింద్ సొంతం చేసుకున్నారు. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ‘కాంతారా’ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. (చదవండి: ఆదిపురుష్ టీజర్‌పై తమ్మారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు) కాంతారా అనేది సంస్కృత పదం. తెలుగులో దీనికి అడవి అని అర్థం వస్తుంది. ప్రేమ చూపిస్తే అంతకు మించిన ప్రేమను.. విధ్వంసం సృష్టిస్తే.. అంతకంటే ఎక్కువ విధ్వంసాన్ని రిటర్న్ గిఫ్టుగా ఇవ్వడం అడవి తల్లి నైజం. ప్రేమ భావోద్వేగాలు, గ్రామీణ వాతావారాన్ని ఆహ్లదకరంగా చూపించిన ఈ చిత్ర తెలుగు ట్రైలర్ ను అధికారికంగా రిలీజ్ చేశారు . అక్టోబర్ 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రిషబ్ శెట్టి ఈ చిత్రానికి నటనే కాకుండా స్వయంగా దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి కీలక పాత్రల్లో కనిపించారు.హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించారు. -
చిరంజీవి ఫ్యామిలీతో గొడవ? మరోసారి అల్లు అరవింద్ క్లారిటీ!
మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీకి మధ్య సత్సంబంధాలు లేవంటూ సోషల్ మీడియాలో తరచూ పుకార్లు షికార్లు చేస్తుంటాయి. మా మధ్య ఎటువంటి గొడవలు లేవు అని అటు చిరంజీవి, ఇటు అల్లు అరవింద్ ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా ఈ రూమర్లకు చెక్ పడటం లేదు. తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అరవింద్‌కు ఇదే ప్రశ్న ఎదురైంది. ఎందుకిలా కాంట్రవర్సీలోకి లాగుతారు? మా కుటుంబాల మధ్య ఎలాంటి గొడవలు లేవని క్లారిటీ ఇచ్చారు. ఇక తన మనవరాలు గురించి మాట్లాడుతూ.. 'అర్హ ఎంతో తెలివైనది. ఇంత చిన్న వయసులో అంత తెలివైనవాళ్లను చూడటం చాలా అరుదు. నా మనవరాలు కాబట్టి ఎక్కువ చెప్పుకోకూడదులే' అంటూనే అర్హపై ప్రశంసల వర్షం కురిపించారు అల్లు అరవింద్. చదవండి: గరికపాటికి సారీ చెప్పిన చిరంజీవి అమ్ము ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది, స్ట్రీమింగ్ ఎక్కడంటే? -
Allu Studios Launch Photos: అల్లు స్టూడియోని ప్రారంభించిన చిరంజీవి (ఫొటోలు)
-
అల్లు స్టూడియోను ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి
-
అల్లు స్టూడియోని ప్రారంభించిన చిరంజీవి
అల్లు రామలింగయ్య శత జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి అల్లు స్టూడియోని ప్రారంభించారు. గండిపేటలో దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక సాంకేతిక సదుపాయాలతో ఈ స్టూడియోని నిర్మించారు. అల్లు స్టూడియో ప్రారంభోత్సవంలో మెగాస్టార్ చిరంజీవితో పాటు అల్లు ఫ్యామిలీ పాల్గొంది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ‘అల్లు రామలింగయ్య గారి శత జయంతి సందర్భంగా వారికి నా నివాళి.. ఎంతో మంది నటులున్నా కొద్దిమందికి మాత్రమే ఘనత, అప్యాయత లభిస్తుంది. రామలింగయ్య గారి బాటలో అరవింద్, బన్నీ శిరీష్ ,బాబి విజయవంతంగా కొనసాగుతున్నారు. నాడు నటుడిగా ఎదగాలని రామలింగయ్య గారి ఆలోచనే నేడు ఓ వ్యవస్ద గా అల్లు కుటుంబం ఎదిగింది. అరవింద్ అగ్ర నిర్మాతగా , మనవలకు స్టార్డమ్ దక్కింది. అల్లు స్టూడియో లాభాలను తీసుకురావాలి. ఇది అల్లు వారికి కృతజ్ఞత , గుర్తింపు గా ఉండాలని నిర్మించినట్లుంది. అల్లు ఫ్యామిలీ లో భాగం అవ్వటం నాకు ఆనందంగా ఉంది’ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ..‘ మా నాన్నగారు చనిపోయి 18 ఏళ్లయింది. అనేక మధ్యమల్లో ఇప్పటికీ ఆయన కన్పిస్తున్నారు.స్టూడియో అనేది ఓ జ్ఞాపిక.. లాభాపేక్ష కోసం కట్టింది కాదు. గీతా ఆర్ట్స్ , అల్లు స్టూడియో , ఆహా ఓటిటి అన్నింటిని నా కుమారులకు అప్పగిస్తున్నాను’ అన్నారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ‘అల్లు స్టూడియోస్ ను ఆవిష్కరించిన చిరంజీవి గారికి ధన్యవాదాలు. మా తాతగారి శత జయంతి ఓ ప్రత్యేక మైన రోజు. స్టూడియో అనేది లాభాపేక్ష కోసం పెట్టలేదు. తాతగారి కోరిక, వారి జ్ఞాపకంగా స్టూడియో పెట్టాం. ఇక్కడ చిత్రీకరణలు జరిగితే తాతాగారికి ఆనందంగా ఉంటుంది. తాతగారు చనిపోయి18 ఏళ్లయినా, మా నాన్న గారికి వారిపై ప్రేమ పెరుగుతోంది. నాపై అభిమానాన్ని చూపిస్తున్న మెగాభిమానులకు, నా ఆర్మీ కి ధన్యవాదాలు’ అన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Allu Ramalingaiah: హాస్య దళానికి కులపతి అల్లు రామలింగయ్య
తెలుగు సినిమా చరిత్రలో భావి తరాల వారిని ప్రభావితం చేయగలిగిన నటీనటులు వేళ్ళమీద లెక్క పెడితే అందులో తప్పనిసరిగా నిలిచే పేరు అల్లు రామలింగయ్య. హాస్యంలోంచి విలనీ, విలనీ లోంచి హాస్యం సాధించిన విశిష్ట నటుడు. 1953లో తొలిచిత్రం పుట్టిల్లులో పోషించిన శాస్త్రులు, వద్దంటే డబ్బులో టీచరు, దొంగరాముడులో హాస్టలు వార్డెను పాత్రల్ని పునాదులుగా చేసుకుని భాగ్యరేఖ, మాయాబజార్ చిత్రాలతో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. 2004 నాటికి 1,000కి పైగా చిత్రాల్లో విలక్షణ భూమికల్ని పోషించారు. ‘పుట్టిల్లు’, ‘మాయాబజార్’లలోని శాస్త్రులు పాత్ర ఆకట్టు కుంది. అందుకే ఆ తర్వాత అనేక చిత్రాల్లో శాస్త్రి పాత్ర ఆయన్నే వరిచింది. ఒక్కో చిత్రంలో ‘శాస్త్రి’ పాత్ర ఒక్కోలా ఉండడమే అల్లు సాధించిన పరిపూర్ణత. ఆ పాత్రకు తాను నిజ జీవితంలో చూసిన సూరి భొట్ల నారాయణమూర్తి స్ఫూర్తి అనీ, అయితే ఆయా చిత్రాల్లో పాత్రౌచిత్యాన్ని బట్టి రసాల కూర్పు చేసుకునే వాడిననీ ఆయనే స్వయంగా చెప్పుకున్నారు. అలాగే హాస్య పాత్రలు పోషించాల్సి వచ్చినప్పుడల్లా మునిమాణిక్యం నర సింహరావు, భమిడిపాటి కామేశ్వరరావు వంటి వారి రచనలు చదివి స్ఫూర్తి చెందేవాడిననీ, ఆ ఇద్దరూ తన అభిమాన రచయితలనీ అల్లు పేర్కొన్నారు. ఎప్పుడో దొంగ రాముడు షూటింగ్ సమయంలో అల్లు అప్రయత్నంగా డైలాగ్ మరిచి పోవడం వలన వెలువడిన ’ఆమ్యామ్యా’ని, బుద్ధిమంతుడు, బాలరాజు కథ, అందాల రాముడు చిత్రాల్లో చెప్పగా చెప్పగా ‘ఆమ్యామ్యా’ కాస్తా తెలుగు నాట లంచానికి పర్యాయపదంగా స్థిరపడిపోయి, దినపత్రికల్లో పతాక శీర్షిక అయ్యింది. ముళ్ళపూడి వెంకట రమణని ఓ జర్నలిస్ట్ ‘ఆమ్యామ్యా’ సృష్టికర్త మీరే కదా?! అని ప్రశ్నస్తే ‘ఆమ్యామ్యా సృష్టికర్త అల్లు రామలింగయ్య గారు, ఆమ్యామ్యా మీద పేటెంట్ హక్కులన్నీ వారివే’ అని ధృవీకరించారు. మూగమనసులు సినిమా చేసేనాటికి వెయ్యి రూపాయలు పారితోషికం కాస్తా రెండువేల ఐదొందలు అయ్యింది. అల్లు 2003 నాటికి గానీ అత్యధిక పారితోషికం లక్ష రూపాయలు అందుకోలేదు. పాలకొల్లులో నాటకాలాడటం, స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొని జైలు శిక్షలను అభవించడం, ప్రజా నాట్యమండలితో అనుబంధం వంటి అనేక దశలు రామలింగయ్య జీవితంలో ఉన్నాయనే విషయం చాలామందికి తెలియదు. అల్లు జననీ జనకులు అల్లు వెంకయ్య, సత్తెమ్మ. మొత్తం ఏడుగురు సంతానం. క్షీరా రామలింగేశ్వరుడి పేరు ఆయనకు పెట్టారు. ఆ రోజుల్లో అధికారులు 40 ఏళ్ళని బర్త్ సర్టిఫికెట్ తీసుకువస్తే ప్రవేశ పరీక్ష రాయక్కర్లేదని ఆర్ఎంపీ సర్టిఫికెట్ ఇస్తామని చెబితే... ‘లేదు నాకు 39 ఏళ్ళే, నేను పరీక్ష రాస్తా’నని చెప్పి పరీక్ష రాసి ఉత్తీర్ణుడై హోమియోపతి డాక్టరుగా అల్లు సాధించిన కీర్తి ఇంతా అంతా కాదు. అల్లు నుండి వైద్యసేవలు అందుకున్నవారిలో నందమూరి బసవతారకంతో పాటు నూతన నటీనటుల వరకూ ఉండేవారంటే అతిశయోక్తి కాదు. రాజ మండ్రిలో బోడా వెంకటరత్నం, చింతవారి జానకి రామయ్య తదితర ప్రముఖులతో స్థాపించబడిన హోమియో కళాశాల ఆర్థిక అస్థిర పరిస్థితుల్లో ఉంటే అల్లు రామలింగయ్య కృషితో ఆంధ్ర దేశంలో పేరెన్నిక గన్న కళాశాలగా ఎదిగింది. ప్రతి కార్యక్రమానికీ అర్ధాంగి అల్లు కనక రత్నం, పెద్ద కుమార్తె అల్లు నవ భారతీదేవి తప్పని సరిగా వచ్చేవారు, జాతీ యోద్యమంలో నూలు వడకడంలో జిల్లాలోనే మొదటి బహు మతి పొందిన కారణంగా కనకరత్నంని కోరి మరీ పెళ్ళా డారు రామలింగయ్య. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాక కలిగిన సంతానం కావడంతో తమ కుమార్తెకు నవభారతి అని పేరు పెట్టుకున్నారంటే ఆయన దేశభక్తి ఏమిటో అర్థమవుతుంది. అల్లు అరవింద్ అగ్ర నిర్మాతగా అవతరించాక ‘నాన్నగారూ కొంచెం మీరు విశ్రాంతి తీసుకోవచ్చు కదా! ఇంకా నటించడం ఎందుకండి, సంవత్సరంలో మీరెంత సంపాదిస్తారో అంతా మీకు ఒక్కసారిగా నేనిచ్చేస్తాను’ అంటే... ‘నటించడంలోనే నా తృప్తి, సరదా, సంతోషం అన్నీ ఉన్నాయి, కాబట్టి ఓపిక నశించే వరకూ నటిస్తా. ఊపిరి ఉండే వరకూ నటిస్తా. మరణించాక కూడా నటిస్తా అన్నారు అల్లు రామలింగయ్య. ‘మరణించాక నటిస్తారా? అదెలాగ నాన్నగారూ?’ అన్నారు అరవింద్. ‘నేను పోయాక నన్ను పాడెమీద పడుకో బెట్టాక నువ్వా దృశ్యాలన్నిటినీ కెమెరాతో షూట్ చేయిస్తావని నాకు తెలుసు, అంటే నేను పోయాక కూడా నటిస్తున్నాననే కదా!’ అన్నారు రామలింగయ్య. ఇంత చెప్పీ అల్లు రామలింగయ్య బాల్యం నుండే అస్పృశ్యత, అంటరానితనంపై పోరాడారని చెప్పకపోతే తప్పే అవుతుంది. ‘కుక్కను జూచి గురుతర భక్తితో భైరవుండని ప్రేమ బరగుచుండి/ పాముని జూచి సుబ్బారాయుడని మ్రొక్కి పాలు పోసి పెంతురు భక్తి గల్గి/గద్దను జూచి విష్ణు వాహనం బనుచు కడు ముదముతో వినుతి జేసి/కోతి హనుమంతుడనుచు కూర్మి మీర తాకెదరు గాదె మమ్మేల తాకరయ్యా?! జంతువుల కన్నా అధముడా సాటి నరుడు’ అనే పద్యంతో ధ్వజమెత్తిన అల్లు రామలింగయ్య జీవిత పర్యంతమూ ఈ సిద్ధాంతానికే కట్టుబడిన మహర్షి! – చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్, రచయిత -
'నేనే వస్తున్నా' రిలీజ్ డేట్ ఫిక్స్.. సినిమాపై భారీ అంచనాలు
తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ 'నానే వరువెన్'. తెలుగులో ఈ సినిమాను 'నేనే వస్తున్నా' అంటూ ప్రేక్షకులను పలకరించనుంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, గీతా ఆర్ట్స్ సమర్పణలో ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈనెల 29న థియేటర్లలో భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ మూవీకి సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతమందించారు. (చదవండి: గీతా ఆర్ట్స్ బ్యానర్లో నేనే వస్తున్నా చిత్రం) ఇప్పటికే 'నానే వరువెన్' నుంచి రిలీజైన పోస్టర్లు, పాటలు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. తెలుగులో చిత్రంలోని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించింది. ధనుష్‌కు తెలుగులో కూడా అభిమానుల ఫాలోయింగ్ ఉండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 'కాదల్ కొండేన్', 'పుదుపేట్టై', 'మయక్కం ఎన్న' సినిమాల తర్వాత ధనుష్, సెల్వ రాఘవన్ కాంబినేషన్లో వస్తున్న నాల్గవ చిత్రం కావడంతో ఫ్యాన్స్ ఆసక్తి మరింత పెరిగింది. తమిళంలో వి క్రియేషన్స్ బ్యానర్‌పై కలైపులి ఎస్ థాను నిర్మించిన ఈ చిత్రాన్ నిర్మించగా.. తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ విడుదల చేస్తున్నారు. -
గీతా ఆర్ట్స్ బ్యానర్లో ధనుశ్ ‘నేనే వస్తున్నా’ చిత్రం
తమిళ స్టార్ హీరో ధనుశ్ తాజా చిత్రం ‘నానే వరువేన్’. ధనుశ్ సోదరుడు, డైరెక్టర్ సెల్వరాఘవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ‘కాదల్ కొండేన్’, ‘పుదుపేట్టై’, ‘మయక్కం ఎన్న’ తర్వాత ధనుశ్-సెల్వరాఘవన్ కలయికలో వస్తున్న నాలుగవ చిత్రమిది. ఇటీవల షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని తెలుగులో నేనే వస్తున్నా పేరుతో విడుదల చేస్తున్నారు. చదవండి: రణ్వీర్ చెంప చెల్లుమనిపించిన బాడిగార్డ్! అసలేం జరిగిందంటే.. అయితే ఈ సినిమాను తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్‌తో కలిసి కలై పులి ఎస్ తను ఈ సినిమాను సమర్నిస్తున్నట్లు తాజాగా అధికారిక ప్రకటన ఇచ్చారు. తాజాగా నిర్మాత కలై పులి గీతా అర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌ను కలిశారు. ఈ సందర్భంగా నేను వస్తున్నా పోస్టర్ రిలీజ్ చేశారు. అనంతరం నిర్మాత మీడియాతో మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని ఈ నెలలో(సెప్టెంబర్) విడుదల చేస్తామని, త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని తెలిపారు. కాగా యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో కమెడియన్ మోగి బాబు, ఇందుజా రవిచంద్రన్, ఎల్లి అవ్రాయ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. -
ఓటీటీ చరిత్రలో అతిపెద్ద ప్రాజెక్ట్‌గా ‘మహాభారత్’
మహాభారతం నిజంగా ఒక మహాగ్రంథం. అది చదవడం మొదలు ఎన్నటికీ పూర్తికానంతగా రచన జరిగింది. లెక్కలేనన్ని పాత్రలు, పాత్రధారులు మనకు కనిపిస్తారు. ప్రతి ఒక్క పాత్రకు దానికంటూ ఒక విశిష్టత ఉంటుంది. వేదవ్యాస మహర్షి రచించిన ఈ గ్రంధాన్ని తెరకెక్కించాలని ఎన్నో నిర్మాణ సంస్థలు, దర్శకులు సన్నాహాలు చేశారు. దర్శక ధీరుడు రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా ఇదే. అయితే ఇది సినిమా కంటే ముందు వెబ్ సిరీస్ రూపంలో ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. డిస్నీ+ హాట్‌స్టార్ ఇండియన్ ఓటీటీ స్పేస్‌లో అతిపెద్ద ప్రాజెక్ట్‌గా ‘మహాభారత్’ రాబోతుంది. అల్లు ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మాణంలో భాగస్వామ్యం కానుంది. ‘గ్రేటెస్ట్ ఇతిహాసం- మునుపెన్నడూ చూడని స్థాయిలో తిరిగి చెప్పబడుతుంది. ఒక అద్భుతమైన దృశ్యం కోసం చూస్తూ ఉండండి. త్వరలోనే డిస్నీ+ హాట్‌స్టార్‌లో 'మహాభారత్' రాబోతుంది’ అని అడిస్నీ+ హాట్‌స్టార్ సంస్థ ట్వీట్ చేసింది. అల్లు ఫ్యామిలీ ఇటీవలే అల్లు ఎంటర్టైన్మెంట్స్ను ప్రారంభించింది. ఇప్పటికే వారు మెగా బడ్జెట్ ప్రాజెక్ట్‌లో భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఈ సిరీస్‌కు సహ నిర్మాతలుగా కనిపిస్తున్నారు. ఈ మెగా ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది. The greatest epic ever written- retold at a scale never seen before! Stay tuned for an ethereal spectacle- #Mahabharat, is coming soon only on @DisneyPlusHS #HotstarSpecials #Mahabharat #MahabharatOnHotstar @alluents & @MythoStudios pic.twitter.com/5yhs7HvuCC — Disney Star (@starindia) September 10, 2022 -
పవన్ కల్యాణ్‌కి విషెస్ చెప్పని బన్నీ, కారణమిదేనా?
తెలుగు సినీ పరిశ్రమలో మెగా-అల్లు ఫ్యామిలీలకు ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఈ రెండు కుటుంబాలు ఒక్కచోట కనిపిస్తే ఫ్యాన్స్‌కు కన్నుల పండగే. అయితే ఇటీవల కాలంలో ఈ రెండు కుటుంబాల మధ్య విభేదాలు వచ్చాయంటూ వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఎందుకంటే మెగా ఇంట్లో ఎలాంటి సెలబ్రెషన్స్ అయిన అల్లు ఫ్యామిలీ మొత్తం అక్కడ వాలిపోతుంది. అయితే ఈ మధ్య వారు కలిసి ఎక్కడ కనిపించడం లేదు. చిరంజీవి బర్త్‌డే వేడుకలో బన్నీ కొడుకు తప్పా అల్లు ఫ్యామిలీకి సంబంధించిన వారు ఎవరూ కనిపించకపోవడంతో మరోసారి ఈ రూమర్స్ తెరపైకి వచ్చాయి. చదవండి: సమంతతో నా ప్రయాణం ముగిసిందనుకుంటున్నా: చిన్మయి ఈ నేపథ్యంలో రీసెంట్గా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న నిర్మాత అల్లు అరవింద్ ఈ వార్తలపు ఖండించారు. మొదట్నుంచి ఉన్న బంధుత్వమే ఇప్పటికీ ఉందని, తమ కుటుంబాల మధ్య విబేధాలు వచ్చాయన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. ఎవరి స్టార్డమ్ వాళ్లకు వచ్చిన తర్వాత ఇలాంటి వార్తలు రావడం సహజమే అని ఆ వార్తలను ఆయన కొట్టిపారేశారు. అయితే తాజాగా బన్నీ తీరు చూసి కొందరు మరోసారి వీరి బంధుత్వం చెడిందా? అనే సందేహాలను లేవనేత్తున్నారు. దీనికి కారణం శుక్రవారం(సెప్టెంబర్ 2) పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్‌డేకు అల్లు అర్జున్ విష్ చేయకపోవడమే. చదవండి: ‘బ్రహ్మాస్త్రం’ రిలీజ్‌కు ఇంకా 6 రోజులే.. అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన రాజమౌళి చిరంజీవి బర్త్‌డేకు విష్ చేసిన అల్లు అర్జున్ మరి పవన్‌కు ఎందుకు విషెస్ చెప్పకపోవడం ఈ వార్తలకు మరోసారి ఆజ్యం పడింది. ఒక్క బన్నీ మాత్రమే కాదు అల్లు శీరిష్ కానీ, బన్నీ భార్య స్నేహా రెడ్డి సైతం పవన్ కల్యాణ్‌ని విష్ చేస్తూ ఎలాంటి పోస్ట్ పెట్టలేదు. దీంతో మెగా ఫ్యామిలీ-అల్లు ఫ్యామిలీకి విభేదాలు ఉన్నా మాటే నిజమేనా? అంటూ నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. రెండు రోజుల క్రితమే ఈ వార్తలపై అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చిన బన్నీ విష్ చేయకపోవడంతో ఈ అంశం మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. మరి ఇక దీనిపై అల్లు అర్జున్ ఎలా స్పందిస్తాడో చూడాలి. -
అల్లు-మెగా ఫ్యామిలీల మధ్య గొడవలా? అందుకే కలుసుకోవట్లేదా?
తెలుగు సినీ పరిశ్రమలో మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగిన చిరంజీవి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్నారు.అల్లు రామలింగయ్య కూతురు సురేఖను చిరంజీవి వివాహం చేసుకున్న తర్వాత బావమరిదిగా, నిర్మాతగానూ అల్లు అరవింద్ చిరంజీవికి అండగా నిలుస్తూ కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. అయితే కొంతకాలంగా అల్లు, మెగా ఫ్యామిలీ మధ్య విబేధాలు తలెత్తాయని, అందుకే రెండు కుటుంబాలకు చెందినవారు పెద్దగా కలుసుకోవడం లేదంటూ నెట్టింట వార్తలు గుప్పుమంటున్నాయి. తాజాగా ఈ వార్తలపై అల్లు అరవింద్ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన మెగా ఫ్యామిలీతో గొడవలపై క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'మొదట్నుంచి ఉన్న బంధుత్వమే ఇప్పటికీ ఉంది. మా కుటుంబాల మధ్య విబేధాలు వచ్చాయన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఎవరి స్టార్డమ్ వాళ్లకు వచ్చిన తర్వాత ఇలాంటి వార్తలు రావడం సహజమే. పిల్లలు పెద్దవారు అవుతున్నారు. ఎవరి షూటింగ్స్‌లో వారు బిజీగా ఉంటున్నారు. అన్నిసార్లు కలుసుకోకపోవచ్చు. కానీ ఏదైనా పండగ వచ్చినా, ఫంక్షన్స్ జరిగినా అందరూ ఒకచోట చేరిపోతారు. ఫ్యామిలీ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇండస్ట్రీలో పెద్దవాళ్లపై రాళ్లు విసరడానికి చాలామంది ఎదురుచూస్తుంటారు. అలా పనిగట్టుకొని కొందరు చేస్తున్న ప్రచారమే తప్పా మా మధ్య ఎలాంటి విబేధాలు లేవు' అంటూ చెప్పుకొచ్చారు. -
50 థియేటర్లని సరదాగా అనుకుంటే, ఇప్పుడేమో..: అల్లు అరవింద్
Allu Aravind Speech In Karthikeya 2 Success Meet: క్రేజీ నిర్మాణ సంస్థలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై ఎనర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం "కార్తికేయ 2". ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహించారు. మంచి విజయం సాధించిన 'కార్తికేయక'కు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రాన్ని టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించారు. ఈ నెల 13న థియేటర్స్‌లలో విడుదలై సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శితమవుతున్న సందర్బంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, డైరెక్టర్ శ్రీ వాసు, మైత్రి అధినేత నవీన్ ఏర్నేని తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా వచ్చిన నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ''ఈ సినిమాను హిందీలో సరదాగా రిలీజ్ చేద్దామని 50 థియేటర్స్‌లలో విడుదల చేస్తే అది రెండో రోజుకు 200 థియేటర్స్ అయింది. ప్రస్తుతం 700 థియేటర్స్‌లలో ఆడుతుంది. అంటే ఇవాళ భాష అనే బారికేడ్లను దాటుకొని ప్రజల గుండెల్లోకి వెళ్లింది అంటే సినిమాలో సత్తా లేకుంటే అలా జరగదు కదా. ఇలా అన్ని థియేటర్స్‌లలో ఆడదు కదా. కాబట్టి ఈ సినిమా ఇంకా పెద్ద విజయం సాదించాలి'' అని తెలిపారు. మా సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. చందు మొండేటి చాలా హార్డ్ వర్క్ చేశాడు. నిఖిల్, అనుపమ, టెక్నీకల్ టీం అందరూ బాగా సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చింది అని చిత్ర నిర్మాత విశ్వ ప్రసాద్ పేర్కొన్నారు. చదవండి: ప్రభాస్ విషయంలో ఆ నిర్మాత వెనుకడుగు.. కారణం అదేనా? మహేశ్ బాబు థియేటర్లో దళపతి విజయ్.. వీడియో వైరల్ ''ఈ సినిమా ఒక్క తెలుగులోనే కాకుండా హిందీలో కూడా బాగా ఆడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా సినిమాను ఇంత పెద్ద హిట్ చేసినందుకు ఆడియెన్స్‌కు కృతజ్ఞతలు'' అని హీరో నిఖిల్ తెలిపాడు. ''సినిమా చూస్తుంటే చాలా కొత్తగా ఉంది. అందరూ కొత్త యాక్టర్స్ లా చాలా బాగా నటించారు. వీరందరికీ ఇది 2.0 అనుకోవచ్చు. ఈ సినిమా ఇన్స్పిరేషన్ గా తీసుకొని ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను'' అని దర్శకుడు శ్రీ వాస్ పేర్కొన్నాడు. ''మా చిత్ర నిర్మాతల సహకారం మరువలేనిది. నాకింత మంచి అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు'' అని డైరెక్టర్ చందు మొండేటి తెలిపాడు. చదవండి: నేను పెళ్లి చేసుకునే సమయానికే ఆమెకు ఒక బాబు: బ్రహ్మాజీ సిల్క్ స్మిత బయోపిక్కు రానున్న సీక్వెల్.. ఈసారి ఏ హీరోయిన్? బిగ్‌బాస్ బ్యూటీకి లైంగిక వేధింపులు.. ఆవేదనతో పోస్ట్ -
ఇండస్ట్రీలో అవకాశాలు లేవు అంటున్నారు: మంత్రి తలసాని
Minister Talasani Srinivas Speech At Sammathame Pre Release Event: ‘తెలుగు చిత్ర పరిశ్రమ సత్తా ఈరోజు విశ్వవ్యాప్తం అయింది. ఇండస్ట్రీలో చాలామంది అవకాశాలు లేవు అంటున్నారు.. కానీ, ప్రతిభ ఉంటే ఇంటి వద్ద ఉన్నా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ‘సమ్మతమే’ సినిమా హిట్ కావాలి.. సక్సెస్ మీట్లో కలుద్దాం’’ అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి జంటగా గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సమ్మతమే’. కంకణాల ప్రవీణ నిర్మించిన ఈ చిత్రం గీతా ఆర్ట్స్ బ్యానర్లో శుక్రవారం (జూన్ 24) విడుదలవుతోంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ వేడుకలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి. జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘సమ్మతమే’ ట్రైలర్ చూసినప్పుడు సినిమాలో విషయం ఉందనిపించింది. యంగ్ టీమ్ కలిసి ధైర్యంగా తీసిన ఈ సినిమా ఘనవిజయం సాధించాలి’’ అన్నారు. ‘‘సమ్మతమే’ని గీతా ఆర్ట్స్‌లో రిలీజ్ చేయడానికి ముఖ్య కారణం కిరణ్. ఈ చిత్రం ఘనవిజయం సాధించాలి’’ అన్నారు అల్లు అరవింద్. ‘‘సమ్మతమే’ సినిమా నా ఒక్కరిదే కాదు.. ఇక్కడికొచ్చిన మీ అందరిదీ. ఈ చిత్రాన్ని హిట్ చేయాలి’’ అన్నారు కంకణాల ప్రవీణ. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్, గాదరి కిషోర్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, నిర్మాత ‘బన్నీ’ వాసు తదితరులు పాల్గొన్నారు. చదవండి: 'పుష్ప 2'లో శ్రీవల్లి చనిపోతుందా ? నిర్మాత క్లారిటీ ! నేను జీరో.. ఏదో ఒకరోజు ఆ స్థాయికి వెళ్తా: ఆకాష్ పూరి ఓటీటీలోనూ రికార్డులు క్రియేట్ చేస్తున్న 'ఆర్ఆర్ఆర్'.. -
అలా చేస్తే చేటు తప్పదు
‘‘ఈ మధ్య నిర్మాతలు త్వరగానే సినిమాలను ఓటీటీలోకి తెచ్చేస్తున్నారు. ఇలా చేస్తే చేటు తప్పదేమో. మా ‘పక్కా కమర్షియల్’ చిత్రం మాత్రం ఆలస్యంగానే ఓటీటీకి వస్తుంది’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్. గోపీచంద్, రాశీఖన్నా హీరో హీరోయిన్లుగా మారుతి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పక్కా కమర్షియల్’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం జూలై 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘టి. కృష్ణ (హీరో గోపీచంద్ తండ్రి) గొప్ప దర్శకులు. ఆయనతో మా బ్యానర్లో ఓ సినిమా తీయాలనుకున్నాను. కుదర్లేదు. ఇప్పుడు వారి అబ్బాయి గోపీచంద్‌తో ‘పక్కా కమర్షియల్’ సినిమా తీసినందుకు సంతోషంగా ఉంది. గోపీచంద్‌లో ఉన్న కామెడీని దర్శకుడు మారుతి బాగా బయటకు తీశారు. ఈ సినిమాను బాగా ఖర్చు పెట్టి తీశాం’’ అన్నారు. ‘‘రణం’, ‘లౌక్యం’ తర్వాత మళ్లీ అంత ఫన్ ఉన్న సినిమా చేశాను. ‘పక్కా కమర్షియల్’ కథలో హ్యూమర్‌కు మంచి స్కోప్ ఉంది. మారుతి రాసిన కథకు న్యాయం చేశాననే అనుకుంటున్నాను’’ అన్నారు గోపీచంద్. ‘‘నా నుంచి ప్రేక్షకులు ఆశించే కామెడీకి ఇతర అంశాలు జోడించి తీసిన చిత్రం ‘పక్కా కమర్షియల్’’ అన్నారు మారుతి. ‘‘ఎంటర్ టైన్మెంట్కు మంచి యాక్షన్ కుదిరిన చిత్రం ఇది’’ అన్నారు బన్నీ వాసు. ‘‘ఈ సినిమా నాకు ఎంతో ప్రత్యేకం. ‘ప్రతిరోజూ పండగ’ చిత్రంలో నేను చేసిన ఏంజెల్ ఆర్నా పాత్రకు రెండు రెట్ల వినోదం ఈ సినిమాలో ఉంటుంది’’ అన్నారు రాశీ ఖన్నా. సహనిర్మాత ఎస్కేఎన్ పాల్గొన్నారు. -
స్టేజ్‌పై మహేశ్‌బాబు డ్యాన్స్.. అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు
దేశంలో చిత్రపరిశ్రమ పరిస్థితి దారుణంగా ఉంది. ఒకటి రెండు పెద్ద సినిమాలు మినహా.. ఇతర చిత్రాలేవి పెట్టిన బడ్జెట్‌ని తిరిగి రాబట్టుకోలేకపోతున్నాయి. బాలీవుడ్ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. ఒకప్పుడు 100 కోట్ల వసూళ్లను ఈజీగా రాబట్టిన బాలీవుడ్ హీరోలు.. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడుతున్నారు. ఇక టాలీవుడ్లో సినిమాలను ఆదరించడానికి ప్రేక్షకులు సిద్దంగా ఉన్నప్పటికీ.. టికెట్ల రేట్లు థియేటర్లకి దూరం చేస్తున్నాయి. అలాగే కరోనా ఎఫెక్ట్‌తో ఓటీటీల ప్రాధాన్యత పెరగడం కూడా థియేటర్స్‌కి ప్రేక్షకులు దూరం కావడానికి ఒక్క కారణమని చెప్పొచ్చు. (చదవండి: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా టైటిల్ ఇదేనా ?) సూపర్ హిట్ చిత్రాలను సైతం నాలుగు వారాల్లోనే ఓటీటీలో విడుదల చేస్తుండడంతో.. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు థియేర్స్‌కి వెళ్లడమే మానేశారు. కొద్ది రోజులు ఆగితే ఓటీటీలో సినిమా చూడొచ్చులే అనే భావన వారిలో ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేక్షకులకు థియేటర్స్ రప్పించడం కోసం నిర్మాతలు నానా కష్టాలు పడుతున్నారు. ఈ మధ్యే ఎఫ్3 చిత్రానికి టికెట్లను రేట్లను పెంచకుండా.. ప్రేక్షకులను థియేటర్స్‌కి రప్పించే ప్రయత్నం చేశాడు దిల్ రాజు. ఆయన బాటలోనే పలువురు నిర్మాతలు నడిచేందుకు సిద్దమవుతున్నారు. ఇదిలా ఉంటే... తాజా పరిస్థితులపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రేక్షకులను థియేటర్స్‌కు రప్పించడం కోసం సినిమా హీరోలు ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. గోపిచంద్ హీరోగా మారుతి దర్శకత్వం వహించిన చిత్రం పక్కా కమర్షియల్. తాజాగా ఈచిత్ర బృందం ఏర్పాటు చేసిన మీడియాలో సమావేశంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ..‘సినిమా ఫంక్షన్స్‌కు వెళ్లడం గోపిచంద్‌కు పెద్దగా ఇష్టం ఉండదు. కాస్త సిగ్గు కూడా ఎక్కువే. ఈ మీడియా సమావేశానికి గోపిచంద్‌ని కచ్చింతంగా రప్పించండి అని నేను చెప్పాను. ఇప్పుడు చిత్ర పరిశ్రమ పరిస్థితి బాగాలేదు. సినిమా ప్రమోషన్స్ కోసం హీరోలు కూడా రావాలి. ఈ మధ్య కాలంలో ఓ పెద్ద హీరో స్టేజ్ మీద డ్యాన్స్ చేసి తన సినిమాను ప్రమోట్ చేసుకున్నాడు. అలా చేసువాల్సిన పరిస్థతి ఏర్పడింది. సినిమాను జనాల్లోకి తీసుకెళ్లే బాధ్యత హీరోలపైన కూడా ఉంది. ఈ మధ్య ఓటీటీలో చాలా కంటెంట్ దొరుకుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేక్షకులను ధియేటర్స్‌కు రావాలంటే.. హీరో, హీరోయిన్లు ప్రచారంలో పాల్గొనాలి. ఎన్ని ఫంక్షన్స్ ఉన్నా హీరో, హీరోయిన్లు వచ్చి తమ సినిమాను ప్రచారం చేసుకోవాలి. మమల్ని(నిర్మాతలను) చూసి ప్రేక్షకులను థియేటర్స్‌కు రారు. హీరో హీరోయిన్లను చూసే వస్తారు’అంటూ అల్లు అరవింద్ చెప్పుకొచ్చాడు. కాగా, ఇటీవల ‘సర్కారు వారి పాట’ సినిమా సక్సెస్ మీట్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు డాన్స్ చేసిన సంగతి తెలిసిందే. కర్నూలులో జరిగిన ఈ కార్యక్రమంలో మహేశ్ తొలిసారిగా స్టేజ్‌పై స్టెప్పులేసి ఫ్యాన్స్ అలరించాడు. అల్లు అరవింద్ పరోక్షంగానే మహేశ్‌బాబును ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. -
ఆ పాట చాలా బాగుంది: అల్లు అరవింద్
Darja Movie Second Song Released By Allu Aravind In Hyderabad: సునీల్, అనసూయ ప్రధాన తారాగణంగా సలీమ్ మాలిక్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘దర్జా’. కామినేని శ్రీనివాస్ సమర్పణలో పైడిపాటి శివశంకర్ నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ‘దర్జా’లోని రెండో పాటను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘పాట చాలా బాగుంది. పాటను చూస్తుంటే సినిమా విజువల్‌గా గ్రాండ్ ఉంటుందనిపిస్తోంది. ఈ చిత్రం సక్సెస్ సాధించాలి’’ అన్నారు. చదవండి: అనసూయను టచ్ చేయాలని చూశారా.. బందరు కోట బద్దలైపోద్ది ‘భీమవరం చిన్నదాన్ని రామలింగో..’ అని మొదలై ‘లింగో లింగో’ అంటూ సాగే స్పెషల్ సాంగ్ ఇది. వై. విష్ణు లిరిక్స్ అందించిన ఈ పాటను నేహా పాడారు. ఇటీవల విడుదలైన దర్జా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ర్యాప్ రాక్ షకీల్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్. ఈ చిత్రానికి కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా రవి పైడిపాటి పని చేస్తున్నారు. -
సుడిగాలి సుధీర్ క్రైం థ్రిల్లర్ 'కాలింగ్ సహస్ర'.. టీజర్ విడుదల
Sudheer Calling Sahasra Movie Teaser Released By Allu Aravind: సుడిగాలి సుధీర్.. బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరియయం అక్కర్లేని పేరు. మెజీషియన్‌గా అందరి దృష్టిన ఆకర్షించిన సుధీర్ ఓ కామెడీ షోతో బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చాడు. తనదైన యాంకరింగ్, కామెడీ, డ్యాన్స్‌తో ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యాడు. పరిశ్రమలో అడుగు పెట్టిన అనతి కాలంలోనే ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు సుధీర్. అలా వచ్చిన క్రేజ్‌తో వెండితెరపై హీరోగా మారాడు. విభిన్నమైన కథలను సెలెక్ట్ చేసుకుంటూ హీరోగా ముందుకు సాగుతున్నాడు. ఈ క్రమంలోనే సాఫ్ట్వేర్ సుధీర్, 3 మంకీస్ సినిమాలతో అలరించిన సుధీర్ తాజాగా 'కాలింగ్ సహస్ర' అనే డిఫరెంట్ క్రైం స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు సుడిగాలి సుధీర్. ఈ సినిమా టీజర్‌ను శుక్రవారం (ఏప్రిల్ 1) ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మూవీ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఒక నిమిషం 18 సెకన్ల నిడివితో ఉన్న ఈ టీజర్లో ప్రతి సన్నివేశం ఆసక్తి పెంచేలా ఉంది. 'బతకడం కోసం చంపడం సృష్టి ధర్మం. మరి చంపడం తప్పు కానప్పుడు దాన్ని చూపించడం తప్పెలా అవుతుంది', 'చివరగా చావంటే కేవలం ప్రాణం పోవడం కాదురా.. మన కళ్ల ముందు మనం ప్రేమించిన వాళ్లు పోవడం' అనే డైలాగ్‌లతో టీజర్ ఆకట్టుకునేలా ఉంది. చూస్తుంటే ఈ మూవీలో క్రైంతోపాటు మంచి లవ్ యాంగిల్ ఉన్నట్లు తెలుస్తోంది. రాధా ఆర్ట్స్, షాడో మీడియా ప్రొడక్షన్ సంయుక్త సమర్పణలో విజేష్ కుమార్ తయల్, చిరంజీవి పామిడి, వెంకటేశ్వర్లు కాటూరి నిర్మాతలుగా వ్యవహరించారు. అరుణ్ విక్కీరాల దర్శకత్వం వహించగా మోహిత్ రహ్మణియక్ సంగీతం అందించారు. -
అల్లు అర్జున్‌కి స్నేహ తండ్రి సన్మానం.. అతిథిగా చిరంజీవి
Sneha Reddy’s father felicitates Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో బన్ని సతీమణి స్నేహారెడ్డి తండ్రి చంద్రశేఖర్ రెడ్డి తన అల్లుడు అల్లు అర్జున్ కోసం గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేశారు. ఓ ప్రముఖ స్టార్ హోటల్లో పుష్ప సక్సెస్ పార్టీ జరిగినట్టు సమాచారం. చంద్రశేఖర్ రెడ్డి బన్నికి పిల్లనిచ్చిన స్వంత మామగారు. ఇక ఆయన ఇప్పటి వరకు సినిమా జనాలకు, సినిమా ఫంక్షన్లకు పరిచయం తక్కువనే చెప్పాలి. అయితే తొలిసారి అల్లు అర్జున్ కోసం ఇలాంటి పార్టీ ఇచ్చారు. అంతేకాక ఆయనే స్వయంగా సినిమా జనాలను ఆహ్వానించడం విశేషం. పుష్పరాజ్‌గా అద్బుతంగా నటించిన అల్లు అర్జున్ను చంద్రశేఖర్ రెడ్డి సత్కరించారు. ఇక ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి-సురేఖా దంపతులతో పాటు అల్లు అరవింద్, అల్లు స్నేహారెడ్డి, త్రివిక్రమ్ శ్రీనివాస్, క్రిష్ జాగర్లమూడి, హరీష్ శంకర్, గుణశేఖర్‌తో పాటు పలువురు ఈవెంట్‌కు హాజరయినట్టు తెలుస్తోంది. ఇక ఈ పార్టీలో మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఇక బన్ని సినిమాల విషయానికొస్తే..‘పుష్ప’ రెండో భాగం ‘పుష్ప: ది రూల్’ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ తర్వాత చిత్రం సంజయ్‌లీలా భన్సాలీతో చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే రాజమౌళి దర్శకత్వంలోనూ బన్నీ నటించబోతున్నట్లు సమాచారం. -
తమిళంలో 'ఆహా' ఓటీటీ లాంచ్ (ఫోటోలు)
-
తమిళంలో 'ఆహా'ను లాంచ్ చేసిన అల్లు అరవింద్
Allu Aravind Launches Aha Ott Tamil: ఇప్పుడంతా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల హవా కొనసాగుతుందని చెప్పొచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇవి చిన్న చిత్రాలకు ఆశాజనకంగా మారుతున్నాయి. ఆ విధంగా తెలుగులో ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్ సూపర్ రేటింగ్‌తో దూసుకుపోతోంది. దీని అధినేత అల్లు అరవింద్ ఆహాను తమిళంలోనూ ప్రారంభించారు. దీని ఆవిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం చెన్నైలోని ఓ హోటల్లో నిర్వహించారు. ఆడంబరంగా జరిగిన ఈ వేడుకకు నిర్మాత ఆర్.బి.చౌదరి, కలైపులి ఎస్.థాను, దర్శకుడు కె ఎస్ రవికుమార్, శరత్‌కుమార్, రాధిక శరత్‌కుమార్ దంపతులు, నటుడు ఎస్.జె.సూర్య, ఖుష్భు, కె.భాగ్యరాజ్, పా.రంజిత్, నటుడు జయం రవి, సంగీత దర్శకుడు అనిరుధ్, దర్శకుడు శివ పాల్గొన్నారు. అల్లు అరవింద్‌ను నిర్మాత కలైపులి ఎస్.థాను సత్కరించారు. నటుడు జయం రవి, సంగీత దర్శకుడు అనిరుధ్ ఆహా లోగోను ఆవిష్కరించారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ తాను చెన్నైలో పుట్టి పెరిగి విద్యాభ్యాసం చేసిన రోజులను గుర్తు చేసుకున్నారు. 20 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు వెళ్లి మళ్లీ ఇప్పుడు తిరిగి రావడం.. పుట్టింటికి వచ్చినంత ఆనందం కలుగుతోందని పేర్కొన్నారు. ఈ ఆహా ఓటీటీ ద్వారా తమిళంలో నూరుశాతం ఎంటర్టైన్మెంట్ అందించడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. -
'చిరంజీవి వెళ్లారు.. ఒకే ఇంటి నుంటి నుంచి ఇద్దరు ఎందుకు'?
Allu Aravind Comments On Tollywood Celebrities Meeting With AP CM Jagan: సీఎం జగన్‌తో టాలీవుడ్ సినీ ప్రముఖల భేటీపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. 'ఈ భేటీతో టికెట్ల ధరల అంశంపై ఎండ్ కార్డ్ పడుతుందని ఆశిస్తున్నాం. ఇరు పక్షాలకు మంచి జరగుతుందని భావిస్తున్నా. మా కుటుంబం నుంచి చిరంజీవి వెళ్లారు. కాబట్టి నేను వెళ్లాల్సిన అవసరం లేదు. ఒకే ఇంటి నుంచి ఇద్దరు ఎందుకు? ఇండస్ట్రీకి మేలు జరిగేలా ప్రకటన వస్తుందని ఆశిస్తున్నా' అని పేర్కొన్నారు. కాగా ఉదయం 11 గంటలకు ఏపీ సీఎం జగన్‌తో చిరంజీవి, మహేశ్‌బాబు, కొరటాల శివ, రాజమౌళి వంటి సినీ ప్రముఖులు భేటీ కానున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇండస్ట్రీ చూపు మొత్తం ఈ భేటీపైనే ఉంది. -
అల్లు అరవింద్‌కు రూ. 40 కోట్లు నష్టం !.. బన్నీ సినిమా హిందీ వెర్షన్ లేనట్లేనా ?
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అల వైకుంఠపురములో' సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ కొట్టింది. బన్నీ స్టైలిష్ యాక్షన్, త్రివిక్రమ్ మ్యాజికల్ డైలాగ్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఇటీవల విడుదలైన అల్లు అర్జున్ మాస్ పెర్ఫామెన్స్ చిత్రం 'పుష్ప' హిట్‌తో 'అల వైకుంఠపురములో' మూవీని కూడా హిందీలో విడుదల చేయాలనుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు హిందీలో డబ్బింగ్ కూడా చేశారు. అయితే ప్రస్తుతం ఈ డబ్బింగ్ వెర్షన్‌ను థియేటర్లలో రిలీజ్ చేయడాన్ని ఆపేశారు. ఈ సినిమాను హిందీలో 'షెహజాదే' పేరుతో రీమేక్ చేస్తున్నారు. దీంతో రీమేక్ నిర్మాతలకు, డబ్బింగ్ నిర్మాతలకు మధ్య అభిప్రాయ బేధాలు కుదరకపోవడంతో సినిమా విడుదలను మానుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు కారణం 'అల వైకుంఠపురములో' సినిమా హిందీ రీమేక్‌లో హీరోగా నటిస్తున్న కార్తీక్ ఆర్యన్ అని డబ్బింగ్ రైట్స్ దక్కించుకున్న గోల్డ్‌మైన్స్ మనీష్ షా ఆరోపిస్తున్నారు. ఈ హిందీ డబ్బింగ్ వెర్షన్‌ను థియేటర్లలో రిలీజ్ చేస్తే తాను నటిస్తున్న 'షెహజాదే' చిత్రాన్ని చేయకుండా మధ్యలోనే మానేస్తానని హీరో కార్తీక్ ఆర్యన్ నిర్మాతలకు చెప్పాడట. అయితే 'షెహజాదే' నిర్మాతల్లో అల్లు అరవింద్ కూడా ఒకరు. ఇప్పటివరకూ 'షెహజాదే' చిత్రీకరణకు అయిన ఖర్చు రూ. 40 కోట్లు అని తెలుస్తోంది. 'అల వైకుంఠపురములో' హిందీ డబ్బింగ్ కోసం రూ. 2 కోట్లు ఖర్చు పెట్టారని సమాచారం. ఈ సినిమాను విడుదల చేస్తే తనకు రూ. 20 కోట్లు ప్రాఫిట్ వచ్చేదని, కానీ తనకు తెలిసిన నిర్మాతలకు నష్టం రాకూడదనే ఈ రిలీజ్ ప్రయత్నాన్ని విరమించుకున్నాని మనీష్ షా పేర్కొన్నారు. అలాగే ఇది కార్తీక్ ఆర్యన్ కోసం కాదు, అల్లు అరవింద్ కోసం చేస్తున్నాని, షెహజాదే నిర్మాతలు రూ. 40 కోట్లు నష్టపోవడం తనకు ఇష్టం లేదని తెలిపారు. 'అల వైకుంఠపురములో' హిందీ డబ్బింగ్ వెర్షన్‌ను కేవలం 'దించాక్' టీవీ ఛానెల్లో మాత్రమే రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. -
‘తగ్గేదే లే’ డైలాగ్‌తో తండ్రి మ్యానరిజం చూపించిన అయాన్, ఆర్హ
Allu Arha And Allu Ayaan: అల్లు అర్జున్ తాజా చిత్రం పుష్ప మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి డైరెక్టర్లు ఎస్ఎస్ రాజమౌళి, కొరటాల శివ, మారుతి, వెంకీ కుడుముల, బుచ్చిబాబు సనతో పాటు నిర్మాత అల్లు అరవింద్ ముఖ్య అతిథులుగా వచ్చారు. ఈ సందర్భంగా బన్నీ ఇండస్ట్రీకి దొరికిన బహుమతి అంటూ అల్లు అర్జున్‌పై రాజమౌళి ప్రశంసలు కురిపంచాడు. ఈ వెంట్లో అల్లు అర్జున్‌తో పాటు హీరోయిన్ రష్మిక మందన్నా, అనసూయ, సునీల్‌తో పాటు మిగతా తారగణం పాల్గొంది. కానీ దర్శకుడు సుకుమార్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మాత్రం రాలేకపోయారు. చదవండి: సమంతకు థ్యాంక్స్ చెప్పిన బన్నీ ఈ ఈ ప్రీ రిలీజ్ కార్యక్రమంలో రష్మిక తన క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్, డ్యాన్స్, మాటలతో సందడి చేసింది. ఇదిలా ఉంటే ఈ వేడుకలో ఇద్దరు బుల్లి సెలబ్రెటీలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. వారెవరో కాదు ఐకాన్ స్టార్ తనయుడు అయాన్, తనయ ఆర్హ. తండ్రితో పాటు ఈవెంట్‌కు వచ్చిన అయాన్, అర్హలు ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. అల్లు అర్హ, అల్లు అయాన్లు పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై చేసిన హడావిడి అందరినీ ఆకట్టుకుంది. ఇక వీరిద్దరూ చెప్పిన డైలాగ్స్ అయితే స్పెషల్‌గా నిలిచాయి. చదవండి: అప్పుడే ఓటీటీకీ ‘ఆర్ఆర్ఆర్’.. ఫ్యాన్సీ రేటుకు నెట్‌ఫ్లిక్స్ డీల్! స్టేజ్‌పై వచ్చిన వారిని హోస్ట్ సుమ ఎవరూ మాట్లాడతారని అడగంతో అయాన్ నేను అంటూ చేతులు ఎత్తాడు. దీంతో సుమ మైక్ ఇచ్చింది. వెంటనే ‘ హాలో.. తగ్గేదే లే’ అంటూ తండ్రి మ్యానరిజాన్ని చూపించాడు అయాన్. ఆ తర్వాత ఆర్హ సైతం మైక్ తీసుకుని నమస్తే అంటూ తండ్రి స్టైల్లో ‘తగ్గేదే లే’ డైలాగ్ చెప్పి విజిల్స్ వేయించింది. ఇలా అయాన్, ఆర్హలు వచ్చి క్యూట్ క్యూట్ తండ్రి డైలాగ్ చెప్పడంతో అక్కడ ఒక్కసారిగా సందడి వాతావరణం నెలకొంది. అయాన్, ఆర్హల అల్లరిని చూసి తండ్రి అల్లు అర్జున్, తాత అల్లు అరవింద్‌లు మురిపిపోయిన తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. -
ట్రెండింగ్‌లో 'జెర్సీ' ట్రైలర్.. మరో హిట్టు గ్యారెంటీ!
Jersey Trailer Is Out: ‘అర్జున్‌రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్‌సింగ్’ అనంతరం షాహిద్ కపూర్ చేస్తున్న మరో తెలుగు రీమేక్ జెర్సీ. నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ మూవీని అదే పేరుతో బాలీవుడ్‌లోనూ రీమేక్ చేస్తున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరినే ఈ సినిమాను కూడా రూపొందించారు. ఈ సినిమా డిసెంబర్ 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా తాజాగా జెర్సీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో షాహిద్ కపూర్‌కి జోడీగా మృణాల్ ఠాకూర్ నటించింది. పంకజ్ కపూర్, శిశిర్ శర్మ,శరద్ కేల్కర్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే పలుమార్లు రిలీజ్ డేట్ వాయిదా వేస్తే వస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు డిసెంబర్31న థియేటర్స్‌లో సందడి చేయనుంది. -
అంగరంగ వైభవంగా హీరో కార్తికేయ పెళ్లి ఫోటోలు
-
అల్లు అర్హకు తల్లి స్నేహా బర్త్‌డే స్పెషల్ గిఫ్ట్.. వీడియో వైరల్
Allu Arha Birthday Special Gift From Parents And Video Viral: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కుటుంబానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో తెలిసేంది. ఖాళీ సమయం దొరికితే భార్య ఇద్దరు పిల్లలతో ఆయన సరదాగా గడుపుతుంటారు. ఇక అల్లు అర్జున్ భార్య స్నేహ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. బన్నీతో పాటు తన పిల్లలు అయాన్, అర్హలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. అలాగే అల్లు అర్జున్ న్ కొత్త సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ను కూడా షేర్ చేస్తూ ఉంటుంది. ఇవాళ (నవంబర్ 21) అల్లు అర్జున్-స్నేహ దంపతుల ముద్దుల కూతురు అర్హ పుట్టినరోజు. నవంబర్ 21, 2016న పుట్టిన అర్హ నేడు ఐదేళ్లు పూర్తి చేసుకుని ఆరో వసంతంలోకి అడుగుపెడుతోంది. దీనికి సంబంధించిన ఓ వీడియోను స్నేహ తన ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్ చేశారు. అందులో అర్హ చెస్ గేమ్ ఆడుతూ సందడి చేస్తుంది. ఒక్కొక్క చేస్ గేమ్ బోర్డులో పావులు కదుపుతూ, కేరింతలు కొడుతూ, నవ్వుతూ చిందులేస్తు కనిపిస్తుంది. తన గేమ్‌ను అల్లు అర్జున్ కుటుంబం చప్పట్లు ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. అనంతరం తాను గెలుచుకున్న బహుమతులను చూపిస్తూ ఉంటుంది అర్హ. అర్హను, తాను ఆడే ఆట తీరును అల్లు అర్జున్, స్నేహ ప్రేమగా చూస్తూ ఆనందిస్తుంటారు. అల్లు అరవింద్ తన మనవరాలిని ముద్దు చేస్తూ కనిపిస్తారు. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) చదవండి: ‘ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా..’ సాంగ్ రిలీజ్ -
సంతోషం అవార్డ్స్‌లో తళుక్కుమన్న తారలు
-
Aha 2.0: ఇక నెక్ట్స్ లెవల్లో ఉంటుంది
Allu Arjun Launched AHA 2.0: ‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకుల ఆదరణ వల్లే ‘ఆహా’ మంచి స్థాయికి చేరుకుంది. నంబర్ వన్ సక్సెస్ ఫుల్ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌గా ఆహా కొనసాగుతున్నందుకు గర్వంగా ఉంది’’ అని హీరో అల్లు అర్జున్ అన్నారు. హైదరాబాద్‌లో ‘ఆహా 2.0’ ఓటీటీ వెర్షన్‌ను అల్లు అర్జున్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఆహా’ సక్సెస్‌కు ముఖ్య కారకులైన నాన్నగారు (అల్లు అరవింద్), జూపల్లి రామేశ్వర్రావు, రామ్ జూపల్లిగార్లకు శుభాకాంక్షలు. మాకు తోడుగా ఉంటున్న నిర్మాత ‘దిల్’రాజు, సపోర్ట్ చేస్తున్న వంశీ పైడిపల్లికి, ఎంతో కష్టపడుతున్న అజిత్‌కు థ్యాంక్స్. ముఖ్యంగా ‘ఆహా’ టీమ్‌కు కంగ్రాట్స్.. ఈ సక్సెస్‌లో వారి పాత్ర చాలా ముఖ్యం. ‘ఆహా 2.0’ నెక్ట్స్ లెవల్లో ఉంటుంది. ప్రతి శుక్రవారం ‘ఆహా’లో కొత్త రిలీజ్ ఉంటుంది.. ‘ఆహా’ లోని ‘సినిమాపురం’ సర్ప్రైజ్ గురించి త్వరలో చెబుతాం’’ అన్నారు. ఆహా ప్రమోటర్స్‌లో ఒకరైన అల్లు అరవింద్ మాట్లాడుతూ–‘‘2020 ఫిబ్రవరిలో ‘ఆహా’ని లాంచ్ చేశాం. నా విజన్‌ని సపోర్ట్ చేసి నాకు ధైర్యాన్నిచ్చిన జూపల్లి కుటుంబానికి థ్యాంక్స్. ఇప్పటి వరకూ ‘ఆహా’లో మీరు చూసిన కంటెంట్ వేరు.. ‘ఆహా 2.0’ లో ఇకపై రాబోతున్న కంటెంట్ వేరు’’ అన్నారు. దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ – ‘‘పాట అనేది మనందరి జీవితంలో ఒక భాగం. మనం ఉన్నంత వరకూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారి పాటలు వింటూనే ఉంటాం. ‘అమెరికన్ ఐడల్’ అనేది పెద్ద టాలెంట్ షో. 2004లో ‘ఇండియన్ ఐడల్’గా మనదేశానికొచ్చింది. తొలిసారి దక్షిణాదిలో ‘తెలుగు ఐడల్’ని ‘ఆహా’లో లాంచ్ చేయబోతున్నాం. తెలుగువారందరూ ‘తెలుగు ఐడల్’ ఆడిషన్స్ పాల్గొనొచ్చు’’ అన్నారు. ఈ వేడుకలో వివిధ విభాగాల్లో ‘ఆహా’ అవార్డులను అందించారు. ఆహా ప్రమోటర్స్ రామ్ రావ్ జూపల్లి, అజిత్, నిర్మాతలు నాగవంశీ, శరత్ మరార్, ఎస్కేఎన్ తదితరులు పాల్గొన్నారు. -
ఆహా సబ్‌స్క్రైబర్స్‌కి గుడ్‌న్యూస్, సరికొత్త ఫిచర్స్‌తో ఆహా 2.0
ఒరిజినల్ తెలుగు కంటెంట్‌తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఓటీటీ సంస్థ ‘ఆహా’. ఎప్పటికప్పుడు సరికొత్త షోలు.. కొత్త కొత్త సినిమాలతో పాటు ఒరిజినల్ వెబ్ సిరీస్‌లతో దూసుకుపోతుంది. సందర్భాన్ని బట్టి ప్రేక్షకులను ఆకట్టుకొనే పనిలో ప్రణాళికలు వేస్తూ తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు బ్లాక్ బస్టర్ చిత్రాలను.. సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. అదిరిపోయే టాక్ షో… ఇంట్రెస్టింగ్ గేమ్ షోలతో సాగిపోతోంది. ప్రారంభించిన అతి తక్కున సమయంలోనే ఇతర ఓటీటీ సంస్థలకు గట్టి పోటీనిస్తూ.. డిజిటల్ రంగంలో నెంబర్ వన్ దిశగా దూసుకుపోతుంది ఈ తెలుగు ఓటీటీ సంస్థ. చదవండి: హీరో బాలకృష్ణకు సర్జరీ తరచూ సరికొత్త ఫిచర్స్ అందిస్తూ రోజు రోజుకీ తమ సబ్ స్కైబర్స్ సంఖ్యను పెంచుకుంటూ పొతోంది ఆహా. ఇదిలా ఉంటే.. అతి తక్కువ సమయంలో ఇంతటీ క్రేజ్ సంపాదించుకున్న ఆహా… ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సమర్పణలో ఆహా 2.0 అవతరించనుంది. దీపావళి పండుగ సందర్భంగా ఆహా యాప్‌ను 2.0గా అప్ గ్రేడ్ చేసి సరికొత్త ఫీచర్స్ అందించారు. ఈ రోజ ఉ (నవంబర్ 2) హైదరాబాద్‌లో ఐకాన్ స్టార్ ప్రెజెంట్స్ పేరుతో ఆహా 2.0 అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హజరయ్యాడు. చదవండి: పునీత్ కుటుంబాన్ని పరామర్శించిన హీరో నాగార్జున An event full of celebrations & surprises 💥💥 Watch 'Icon Staar Presents aha 2.0' Live Now! ▶️ https://t.co/k5gydx6UbO@alluarjun #aha2point0 pic.twitter.com/C64GOTyTpf — ahavideoIN (@ahavideoIN) November 2, 2021 ఈ నేపథ్యంలో ఆహా ప్రమోటర్స్ అల్లు అరవింద్, దిల్‌రాజు, రామ్ రావ్ జూపల్లి ఆహాలో ప్రసారం కాబోయే సూపర్ హిట్ చిత్రాలు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, లక్ష్య, మంచిరోజులొచ్చాయి, డీజే టిల్లు, రొమాంటిక్, అనుభవించు రాజా, పుష్పక విమానం, గని వంటి ఫిక్షనల్, నాన్ ఫిక్షనల్ చిత్రాలతో పాటు ఆహా ఒరిజినల్స్ అన్‌స్టాపబుల్, సేనాపతి, భామా కలాపం, త్రీరోజెస్ వంటి చిత్రాలకు సంబంధించి కూడా వివరాలను తెలియజేస్తారు. ఇప్పుడు ఆహాను సబ్‌స్క్రైబ్ చేసుకుని ఎవరైతే ఎంజాయ్ చేస్తున్నారో ఆ వీక్షకులకు ఆహా 2.0 ద్వారా ఆడియో పరంగా, పిక్చర్ క్వాలిటీ పరంగా వరల్డ్ క్లాస్ ఫీచర్స్‌తో పాటు ఎలాంటి కంటెంట్ ప్రేక్షకుడికి కావాలనే దానిపై కూడా ఈ యాప్ ద్వారా అందిస్తారు.