Andhra Pradesh
-
ఎల్లప్పుడూ ప్రజల వెంటే.. మళ్లీ అధికారంలోకి వచ్చేది మనమే: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. వైఎస్సార్సీపీ ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందని, ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటుందని పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ 15వ ఆవిర్భావ వేడుకలు(YSRCP Formation Day) బుధవారం ఏపీ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వేడుకలకు హాజరైన వైఎస్ జగన్.. మహానేత వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించి, పార్టీ జెండా ఆవిష్కరించి ప్రసంగించారు. వైఎస్సార్సీపీ ఇవాళ 15వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోంది. ప్రజల కష్టాల నుంచి వైఎస్సార్సీపీ పుట్టింది. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి పోరాడుతోంది. ప్రతిపక్షంలో కూర్చోవడం మనకు కొత్త కాదు. అధికారంలో ఉన్నవాళ్లకు ఎప్పటికప్పుడు ధీటైన సమాధానమే ఇస్తున్నాం. ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటాం.జగన్ చెప్పాడంటే.. చేస్తాడంతే అనే నమ్మకం ప్రజల్లో ఏర్పడింది. ఇవాళ ప్రజల్లోకి ధైర్యంగా కాలర్ ఎగరేసుకుని వెళ్లగలిగే స్థితిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఉన్నారు. వైఎస్సార్సీపీ ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటుంది. 3-4 ఏళ్ల తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చేది మనమే అని అన్నారాయన. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన ఆయన.. ఇవాళ వైఎస్సార్సీపీ చేపట్టిన ఫీజు పోరు గురించి ప్రస్తావించారు. ఈ వేడుకల్లో పార్టీ ముఖ్యనేతలంతా పాల్గొన్నారు.ప్రజాభ్యుదయమే పరమావధిగా ఎదుగుతున్న వైఎస్సార్సీపీ(YSRCP).. సవాళ్లనే సోపానాలుగా మార్చుకుంది. ప్రజాసమస్యల పరిష్కారంపై మడమ తిప్పకుండా పోరాటాలు చేస్తోంది. మహానేత వైఎస్సార్ ఆశయ సాధన లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే రాజకీయాల్లో నైతిక విలువలను చాటిచెప్పిన వైఎస్ జగన్(YS Jagan) ‘నేను విన్నాను.. నేను ఉన్నానంటూ’ ప్రజలకు భరోసా ఇస్తున్నారు. -
చిత్తూరు టౌన్లో టెన్షన్.. హైటెన్షన్
చిత్తూరు, సాక్షి: పట్టణంలోని గాంధీ రోడ్డులో బుధవారం ఉదయం కాల్పుల కలకలం రేగింది. ఓ బిల్డింగ్‌లోకి తుపాకులతో ప్రవేశించిన దొంగల ముఠా పోలీసులపైకి కాల్పులు జరిపింది. వాళ్లలో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. భవనంలో నక్కిన మరికొందరిని పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.అర్ధరాత్రి దాటాక ఓ దొంగల ముఠా గాంధీ రోడ్డులో ఉన్న ఓ భవనంలోకి చొరబడింది. అది గమనించిన ఆ బిల్డింగ్ యాజమాని పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులను చూసి దుండగులు రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. అయితే పోలీసులు చాకచక్యంగా ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరికొందరు ఇంకా ఆ భవనంలోనే ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ మణికంఠ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. చుట్టుపక్కల భవనాల్లో ఉన్నవారిని ఖాళీ చేయిస్తున్నారు. బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు ధరించి లోపలికి వెళ్లేందుకు సిద్ధమైనట్లు సమాచారం. నిందితుల దగ్గర తుపాకులు ఉండడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అదుపులో ఉన్నవాళ్ల దగ్గరి నుంచి 3 తుపాకులు, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పక్కనే ఉన్న ఓ బ్యాంకులో దోపిడీ కోసమే ఆ దొంగల ముఠా వచ్చి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. -
పోసాని రిలీజ్ అడ్డుకునే కుట్ర.. ఎల్లో మీడియాలో హింట్!
కర్నూలు, సాక్షి: వైఎస్సార్సీపీ న్యాయ పోరాటం ఫలితంగా.. కూటమి కక్ష సాధింపు చర్యల నుంచి నటుడు పోసాని కృష్ణమురళికి ఊరట దక్కింది. ఆయనపై నమోదైన అన్ని కేసుల్లో ఇప్పటికే బెయిల్ లభించింది. ఈ తరుణంలో ఆయన ఇవాళ ఆయన కర్నూలు జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో రిలీజ్‌కు బ్రేక్ పడింది. సోషల్ మీడియాలో అనుచిత పోస్ట్ పెట్టారంటూ పోసానిపై 5 నెలల కిందట ఏపీ సీఐడీ(AP CID) కేసు నమోదు చేసింది. తాజా కేసుల నుంచి ఊరటతో ఆయన జైలు నుంచి విడుదల కాబోతుండగా.. హఠాత్తుగా ఆ కేసును తెరపైకి తెచ్చారు. ఆఘమేఘాల మీద గుంటూరు కోర్టులో సీఐడీ పీటీ వారెంట్ దాఖలు చేయగా.. కోర్టు సీఐడీ విజ్ఞప్తికి అనుమతించింది. దీంతో.. ఈ ఉదయం సీఐడీ పోలీసులు కర్నూలు జిల్లా జైలు వద్దకు వెళ్లారు. పీటీ వారెంట్‌పై పోసానిని కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు సమాచారం. జైలు నుంచే వర్చువల్‌గా జడ్జి ఎదుట ప్రవేశపెడతారని తెలుస్తోంది. పోసానిపై సీఐడీ నమోదు చేసిన కేసు వివరాలు తెలియాల్సి ఉంది. పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali) పై మొత్తం ఏపీ వ్యాప్తంగా 30 ఫిర్యాదులకుగానూ 17 కేసులు నమోదు అయ్యాయి. ఫిబ్రవరి 26వ తేదీన అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్‌లో నమోదైన కేసుకు గానూ ఆయన అరెస్ట్ అయ్యారు. అయితే న్యాయస్థానాల్లో ఊరట దక్కవచ్చనే ఉద్దేశంతోనే.. వరుసగా ఒక్కో పీఎస్‌లో నమోదైన కేసుకుగానూనా ఆయన్ని తరలిస్తూ వచ్చారు. అలా 2 వేల కిలోమీటర్లకుపైగా తిప్పి పోసానిని హింసించారు. అయితే చివరకు.. న్యాయమే గెలిచింది. బీఎన్ఎస్ సెక్షన్ 111 ప్రకారం వ్యవస్థీకృత నేరాల కింద కేసుల నమోదుకు న్యాయస్థానాలు సమ్మతించలేదు. పోసానిపై నమోదు చేసిన కేసులకు ఆ సెక్షన్ వర్తించదని స్పష్టం చేశాయి. పోసాని కృష్ణ మురళిపై నమోదు చేసిన అన్ని కేసుల్లోనూ న్యాయస్థానాలు బెయిళ్లు మంజూరు చేశాయి.అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లెలో కేసు.. బెయిల్‌పల్నాడు జిల్లా నరసరావుపేటలో కేసు.. బెయిల్‌ఎన్టీఆర్ జిల్లా విజయవాడ భవానీపురం పీఎస్‌లో కేసు.. బెయిల్‌కర్నూలు జిల్లా ఆదోనిలో నమోదైన కేసు.. బెయిల్ హైకోర్టులో ఆయనపై పెట్టిన కొన్ని కేసులు.. క్వాష్ మరోవైపు.. పోసాని కృష్ణమురళిపై కూటమి ప్రభుత్వం తన అనుకూల మీడియా ద్వారా విషం చిమ్ముతోంది. ఆయన విడుదలపై సందిగ్ధం నెలకొందంటూ ముందుగానే కథనాలు ఇచ్చేసింది. పోసానిపై పలుచోట్ల కేసులున్న నేపథ్యంలో ఆయన విడుదలయ్యే లోపు, ఇతర జిల్లాల నుంచి ఏ స్టేషన్ పోలీసులైనా వచ్చి అరెస్టు చేసి తీసుకెళ్లొచ్చంటూ పేర్కొనగా.. ఈలోపే సీఐడీ ఆయన విడుదలను అడ్డుకునేందుకు తెర మీదకు రావడం గమనార్హం. -
ఎక్కువ మంది పిల్లల్ని కనండి
సాక్షి, అమరావతి: ఎక్కువ మంది పిల్లల్ని కనాలని సీఎం చంద్రబాబు చెప్పారు. ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ తల్లికి వందనం కింద రూ.15 వేలు చొప్పున ఇస్తానని చెప్పారు. నలుగురు పిల్లలుంటే రూ.60 వేలు ఇస్తానన్నారు. రాష్ట్ర ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో మంగళవారం అమరావతి ఎస్ఆర్ఎం వర్సిటీలో జరిగిన ‘జనాభా గతి–అభివృద్ధి’ వర్క్‌షాప్ ముగింపు సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ఆరు డెలివరీలైనా అన్నింటికీ ప్రసూతి సెలవులు ఇస్తామని చెప్పారు.దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల తగ్గిపోతోందని, దీనివల్ల నియోజకవర్గాలు తగ్గిపోతాయనే ఉద్దేశంతో ఎక్కువ మంది పిల్లల్ని కనమని చెప్పడంలేదని, దేశాన్ని దృష్టిలో ఉంచుకుని పనిచేసే యువత ఉండాలనే చెబుతున్నానని అన్నారు. ప్రస్తుతం పిల్లాడిని కనడంకన్నా స్టార్టప్ ఒకటి ఉంటే చాలనే ధోరణిలో యువత ఉన్నారన్నారు. భార్య, భర్త ఉద్యోగాలు చేస్తూ పిల్లల్లేకుండా ఎంజాయ్ చేస్తున్నారని, ఇది సామాజిక బాధ్యత కాదని అన్నారు.త్వరలోనే ప్రధానమంత్రితో అమరావతిలో రూ. లక్ష కోట్లతో ప్రాజెక్టులను పున:ప్రారంభిస్తామని, వాటిని మూడేళ్లలో పూర్తి చేస్తామని చంద్రబాబు తెలిపారు. అమరావతికి ప్రపంచంలో అత్యుత్తమ ఇన్స్టిట్యూషన్స్ను తెస్తున్నామని చెప్పారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చైర్మన్ టీ.ఆర్. పరవేందర్ మాట్లాడుతూ దేశంలో ఇంకా కోట్ల మంది తిండిలేక ఆకలితో ఉంటున్నారని, అనేక మంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని చెప్పారు. అంతకు ముందు ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో పలు భవనాల శంకుస్థాపనల్లో చంద్రబాబు పాల్గొన్నారు. -
45 ఏళ్ల చరిత్రలో నాపై హత్యా రాజకీయాల మరక లేదు
సాక్షి, అమరావతి: తన 45 ఏళ్ల రాజకీయ చరిత్రలో తనకు ఎక్కడా హత్యా రాజకీయాల మరక అంటలేదని సీఎం చంద్రబాబు చెప్పారు. హత్యా రాజకీయాలు చేసిన వారికి ప్రజాక్షేత్రంలో శాశ్వతంగా శిక్ష పడేలా చేశానని తెలిపారు. మంగళవారం శాసనసభలో శాంతిభద్రతలపై జరిగిన చర్చ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పోస్టుమార్టానికి కారణమైనవారు చివరకు పోస్టుమార్టం కావల్సిందేనంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నా.. రేపటి నుంచి ఈ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేయాలంటే చేయండి.. ఆ తర్వాత ఎలాంటి శిక్ష ఉంటుందో మీరే చూస్తారంటూ హెచ్చరించారు.శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవ్వరినీ ఉపేక్షించబోమని అన్నారు. రాజకీయ ముసుగులో నేరాలు చేసి తప్పించుకుంటానంటే ఆటలు సాగనివ్వబోనని చెప్పారు. వ్యవస్థీకృతంగా మారిన గంజాయి సాగు, మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు ఈగల్ వ్యవస్థను తెచ్చినట్లు చెప్పారు. రాష్ట్రంలో గంజాయి పండించేందుకు వీల్లేకుండా ఆధునిక టెక్నాలజీ ఉపయోగిస్తున్నామన్నారు. గంజాయి సాగు చేసే వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తామని చెప్పారు.తల్లిదండ్రులు కూడా వారి పిల్లలు ఎలా ఉంటున్నారో నిరంతరం పర్యవేక్షణ చేయాలని చెప్పారు. నియోజకవర్గాల్లో శాంతిభద్రతల పర్యవేక్షణ ఎమ్మెల్యేల బాధ్యతని, ప్రభుత్వం ఉదాసీనంగా ఉంటే పేట్రేగుతారని, కఠినంగా ఉంటే అందరూ లైన్లోకి వస్తారని అన్నారు. నేరాలు చేసి, సాక్ష్యాలు తారుమారు చేసి తప్పించుకునే వారికి కాలం చెల్లిందని చెప్పారు. రాత్రి సమయంలో డ్రోన్ పెట్రోలింగ్, సీసీ కెమెరాలు పెడుతున్నట్లు తెలిపారు.రాష్ట్రంలో సంచలనం కలిగించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఆరుగురు సాక్షులు చనిపోవడంపై ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇలాంటి కేసుల విషయంలో పోలీసులు చాలా అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉందన్నారు. భూకబ్జాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించడానికి కొత్త చట్టం తెస్తున్నామని చెప్పారు. మహిళల రక్షణకు శక్తి యాప్ మహిళల రక్షణ కోసమే శక్తి యాప్‌ని తెచ్చామని, ఆడబిడ్డలపై అత్యాచారాలకు ఒడిగడితే వారికి అదే చివరి రోజని చంద్రబాబు అన్నారు. ఆపదలో చిక్కుకున్న మహిళలు శక్తి యాప్‌లో ఫిర్యాదు చేసిన నిమిషాల వ్యవధిలో పోలీసులు వచ్చి రక్షిస్తారన్నారు. మహిళల భద్రత విషయంలో అప్రమత్తంగా లేకపోతే పోలీసులపైనా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.హత్యా రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు కాదా?మరకల్లేవని బాబు చెప్పడం హాస్యాస్పదమంటున్న విశ్లేషకులు పలు సంచలన కేసుల్లో ప్రముఖంగా వినిపించింది చంద్రబాబు పేరే ! సాక్షి, అమరావతి: నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో హత్యా రాజకీయాల మరకలు లేవని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమే అని రాజకీయవర్గాలు, విశ్లేషకులు అంటున్నారు. మల్లెల బాబ్జి హత్య మొదలు వంగవీటి రంగా హత్య వరకు అన్ని కేసుల్లో వేళ్లన్నీ చంద్రబాబు వైపే చూపించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.టీడీపీ ప్రభుత్వ అవినీతి, అక్రమాలను బట్టబయలు చేసిన సంచలన పాత్రికేయుడు పింగళి దశరథరామ్‌ను విజయవాడలో నడిరోడ్డుపై అత్యంత పాశవికంగా నరికి చంపిన ఘటన వెనుక చంద్రబాబే ప్రధాన సూత్రధారి అని అప్పట్లో అందరూ బహిరంగంగా చర్చించుకొన్నదే.ఎన్టీఆర్‌పై కత్తితో దాడి చేసిన మల్లెల బాబ్జి తర్వాత అనుమానాస్పదంగా మృతి చెందడం వెనుక కుట్రదారు చంద్రబాబే అని అప్పట్లో పెద్ద చర్చే జరిగింది. ఎనీ్టఆర్పై హత్యాయత్నం చేయించిన అసలు కుట్రదారుని పేరు బయటకు రాకుండా బాబ్జిపై ఈ దారుణానికి ఒడిగట్టడం నిజం కాదా? పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, తనకు ప్రాణ రక్షణ కల్పించాలని నిరాహార దీక్ష చేస్తున్న వంగవీటి మోహనరంగాను విజయవాడ నడిరోడ్డున హతమార్చడం వెనుక చంద్రబాబు పన్నాగం ఉందన్నది జగమెరిగిన సత్యం అని అప్పట్లో అందరూ చెప్పుకొనేవారు.ఇక చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాయలసీమ జిల్లాల్లో.. ప్రధానంగా అనంతపురం జిల్లాలో పరిటాల రవి ప్రైవేటు సైన్యం సాగించిన మారణకాండ వెనుక అసలు సూత్రధారి కూడా చంద్రబాబే అన్నది బహిరంగ రహస్యమేనని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇన్ని ఘటనల్లో బాబు పేరు మోగిపోతే.. తనకసలు ఏ మరకా లేదని చంద్రబాబు చెప్పుకోవడం విడ్డూరమని అంటున్నారు. -
బడుగు బతుకులపై పచ్చ జేసీబీలు
శాంతిపురం: టీడీపీకి ఓటు వేయలేదనే అనుమానంతో ఆ పార్టీ నేతలు పన్నిన కుట్రను అధికారులు పకడ్బందీగా అమలు చేశారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని ఇళ్లు కట్టారంటూ 9 ఇళ్లను కూల్చివేసి, ఆయా కుటుంబాలను నిర్వాసితులను చేశారు. బాధితుల కథనం ప్రకారం.. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం సంతూరు సమీపంలోని చెల్దిగాని చెరువు పక్కన మిట్టపై 9 కుటుంబాలు ఇళ్లు కట్టుకుని పాతికేళ్లుగా నివసిస్తున్నాయి. వీరిలో దళితులైన గణేష్, అశ్వత్, సోమశేఖర్, మంగమ్మ, భవానీ కుటుంబాలతో పాటు బీసీలైన నారాయణప్ప, కనకమ్మ, కావలి నారాయణప్ప, నరసింహులు కుటుంబాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో వీరి ఎక్కువ మంది వైఎస్సార్సీపీకి ఓటు వేశారనే అనుమానంతో అధికార పార్టీ నాయకులు వీరిని టార్గెట్ చేశారు. వారి ఇళ్లకు కరెంటు, నీటి సదుపాయాలను ఇప్పటికే తొలగించారు. బాధితులు కలెక్టర్, కడ పీడీ, శాంతిపురం తహసీల్దార్, ఎంపీడీవోలను కలిసి గోడును వెళ్లబోసుకున్నారు. మరోచోట ఇంటి స్థలాలు కేటాయిస్తే అక్కడికి వెళ్లిపోతామని మొరపెట్టుకున్నారు. కానీ 48 గంటల్లో ఇళ్లను ఖాళీ చేయాలని నోటీసులిచ్చిన అధికారులు గడువు తీరగానే కూల్చివేతలకు పూనుకున్నారు. పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో పోలీసుల భద్రత నడుమ రెండు జేసీబీలు తెచ్చి పేదల ఇళ్లు కూల్చేశారు. ఇళ్లలోని వస్తువులు, ధాన్యం అంతా మట్టి పాలు చేశారు. దీంతో రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలు పిల్లాపాపలు, వృద్ధులతో సహా వీధిన పడ్డాయి. సీఎం నియోజకవర్గంలో ఇంత దౌర్జన్యమా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో దళితులు, పేదలపై అధికారుల జరిపిన దౌర్జన్యకాండను వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షడు కోదండరెడ్డి, మండల కన్వినర్ బుల్లెట్ దండపాణి, రెస్కో మాజీ చైర్మన్ చక్రపాణిరెడ్డి, నాయకులు సైపుల్లా, కావలి వెంకటరమణ, గజ్జల రమేష్, చలపతి ఖండించారు. బాధితులను పరామర్శించిన అనంతరం అక్రమ నిర్మాణం పేరుతో ఇళ్లను కూల్చిన అధికారులు మండల, నియోజకవర్గ వ్యాప్తంగా ఇదే చర్యను కొనసాగించగలరా అని ప్రశ్నించారు. పిల్లలు, వృద్ధులకు నిలువ నీడ లేకుండా చేసి రాక్షసత్వం చూపారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, అప్పటివరకూ పునరావాస ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు తక్షణ సాయం అందించారు. ఎలా బతకాలి రోడ్డు ప్రమాదంలో భర్త, నాన్న చనిపోయారు. ముసలి వాళ్లైన అమ్మ మంగమ్మ, అమ్మమ్మ, వికలాంగుడైన కొడుకుతో కుటుంబాన్ని లాక్కొస్తున్నాను. రోజూ కూలికి పోతేనే ఇల్లు గడుస్తుంది. పైసా పైసా కూడబెట్టుకుని రేకుల ఇల్లు కట్టుకుంటే దిక్కులేని వాళ్లమనే కనికరం లేకుండా కూల్చేశారు. ఇప్పుడు మేం ఎలా బతకాలి?. ఎక్కడ తలదాచుకోవాలి?. – అశ్వని, బాధితురాలు అడవుల పాల్జేశారు ఓటు వేయలేదనే అనుమానంతో మా ఇంటిని కూలదోసి ఏమీ లేకుండా చేశారు. మతిస్థిమితం లేకుండా తన లోకాన తాను తిరిగే భర్త. స్కూల్‌కు వెళుతున్న ఇద్దరు బిడ్డలతో బతుకుతున్నా. కూలి పనులు చేస్తూ బతుకు వెళ్లదీస్తుంటే మా నోట్లో మట్టి కొట్టారు. మమ్మల్ని అడవుల పాలు చేశారు. – శారదమ్మ, బాధితురాలు -
సర్కారు తీరుపై కదం తొక్కిన యానిమేటర్లు
సాక్షి, అమరావతి: పొదుపు సంఘాల మహిళలకు సంఘ కార్యకలాపాల్లో సహాయకారులుగా పనిచేసే వెలుగు వీవోఏలు (గ్రామ సమాఖ్య సహాయకులు–డ్వాక్రా యానిమేటర్స్) కూటమి ప్రభుత్వ తీరుపై కదం తొక్కారు. రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా గళమెత్తారు. ‘కూటమి అధికారంలోకి వచ్చాక 4,500 మందిని తీసేశారు. అధికార పార్టీ నేతలు తమ వారిని నియమించుకునేందుకు 25 ఏళ్లుగా పనిచేస్తున్న వీవోఏలను అన్యాయంగా తొలగిస్తున్నారు. ఇదెక్కడి న్యాయం?’ అని నిలదీశారు. మంగళవారం రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిమంది వీవోఏలు విజయవాడ చేరుకుని ఆందోళనకు దిగారు. దీంతో విజయవాడ ధర్నా చౌక్ దద్దరిల్లింది. అక్రమంగా తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, కనీస వేతనాలు వర్తింపజేయాలని, 3 నెలల గౌరవ వేతన బకాయిలను వెంటనే విడుదల ఇవ్వాలని, రూ.10 లక్షలు బీమా అమలు చేయాలని డిమాండ్ చేశారు. మండల సమాఖ్యలో అధికారులు, అధికార పార్టీ నాయకులు ఏకమై కొత్త పుస్తకాలు తెచ్చుకుని, కొత్త వీవోఏల పేర్లు రాసుకుని ఆన్లైన్లో ఎక్కించుకుంటున్నారని ఆరోపించారు. ‘వీవోఏలకు మూడేళ్ల కాల పరిమితి విధిస్తూ అమల్లో ఉన్న సర్క్యులర్ రద్దు చేస్తామని టీడీపీ ఎన్నికల ముందు స్పష్టంగా హామీ ఇచి్చంది. గెలిచాక ఇప్పుడు ఆ సర్క్యులర్ మంచిదే కదా? అంటూ మాట మార్చారు’ అని ఏపీ వెలుగు వీవోఏ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి విమర్శించారు. వీవోఏలకు పని ఒత్తిడి ఎక్కువైందని, ఇవి చాలదని రాజకీయ పార్టీలు ఉద్యోగుల తొలగింపునకు దిగుతున్నాయని దుయ్యబట్టారు. పొదుపు సంఘాల మహిళల ఉత్పత్తుల ఆన్లైన్ అమ్మకాల కోసం వీవోఏలకు టార్గెట్లు పెట్టడాన్ని ఆపాలని వీవోఏలు డిమాండ్ చేశారు. తమ సమస్యలు, డిమాండ్లు పరిష్కరించకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే సమ్మెకు కూడా వెనుకాడబోమని తేల్చిచెప్పారు. ఆందోళనకు పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు మద్దతు ప్రకటించారు. వీవోఏల సంఘం అధ్యక్షురాలు సీహెచ్ రూపాదేవి, సీఐటీయూ అధ్యక్షుడు ఏవీ నాగేశ్వరరావు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు, వీవోఏ సంఘం కోశాధికారి ఎ.తిరుపతయ్య, ఉపాధ్యక్షులు ఎ.నిర్మలాదేవి, కె.లక్ష్మి ఆందోళనకు నాయకత్వం వహించారు. -
బంగారు అవకాశం.. హద్దు ఆకాశం
ఎన్నాళ్లుగానో మదిలో మెదులుతున్న రూపం కళ్ల ముందు కదలాడే క్షణాలవి.. ఎన్నో కలలు, మరెన్నో ఆశల ప్రతిరూపాలుగా వాహనాలు మెరుపులా దూసుకెళ్లే అపురూప ఘడియలవి. గోకార్టింగ్ అంటే కేవలం వాహనాల పోటీ కాదు. ఎంతో ఇష్టపడి తయారు చేసుకున్న మోడల్, కష్టపడి తయారు చేసుకున్న ఇంజిన్, వాహనంలో ప్రతి విభాగంపై సొంత ముద్ర.. ఇలా ప్రతి అంశంలోనూ విద్యార్థులు తమను తాము చూసుకుంటారు. పోటీలో బండి పరుగులు పెడుతుంటే చూసి మురిసిపోతారు. ఓ కొత్త వాహనానికి పురుడు పోసే దశను గుండెతో ఆస్వాదిస్తారు. టెక్కలి: శ్రీకాకుళం జిల్లాలో జరిగిన జాతీయ స్థాయి గోకార్టింగ్ పోటీలు ఇంజినీరింగ్ విద్యార్థుల మనసు దోచుకున్నాయి. ఆటోమొబైల్ రంగంలో ఎదగాలనుకునే విద్యార్థులకు ఈ పోటీలు ఒకరకంగా తొలి పరీక్ష లాంటివి. ఈ పోటీలు నిర్వహించడం, అందులో పాల్గొనడం, వాహనాలు తయారు చేయడం ఆషామాషీ విషయం కాదు. చాలారకాల దశలు దాటాకే బండిని ట్రాక్ మీదకు ఎక్కించాలి. గోకార్టింగ్ పోటీలు ఎందుకు నిర్వహిస్తారు..? ఆటోమొబైల్ రంగంపై ఆసక్తి కలిగిన ఇంజినీరింగ్ విద్యార్థుల్లో అంతర్లీనంగా ఉండే సృజనకు పరీక్ష పెట్టేందుకే ఈ గోకార్టింగ్ పోటీలు నిర్వహిస్తారు. ఇందులో రెండు రకాల వాహనాలు తయారు చేస్తారు. వాటిలో సీవీ(ఇంజిన్‌తో తయారుచేసినవి) ఈవీ(ఎలక్ట్రికల్ వాహనాలు) ఉంటాయి. వాహనాల తయా రీతో పాటు బిజినెస్ ఆలోచనలు సైతం పంచుకునే విధంగా ఈ గోకార్టింగ్ పోటీలు నిర్వహిస్తారు. అర్హతలు ఉండాల్సిందే.. గోకార్టింగ్ పోటీల్లో పాల్గొనాలంటే కళాశాల స్థాయి లో ‘మోటార్ స్పోర్ట్ కార్పొరేషన్’ తయారు చేసిన రూల్ బుక్ ఆధారంగా గ్రాఫికల్‌గా డిజైన్ చేస్తూ వాహనాన్ని తయారుచేయాలి. ఆ తర్వాత పోటీల్లో పాల్గొనేందుకు ఆయా కళాశాలలు నిర్వహించే ఆన్లైన్ పరీక్ష ఉత్తీర్ణత సాధించాలి. పోటీల్లో పాల్గొనే ముందు కూడా డిజైనింగ్ చెక్, ఇన్నోవేషన్ చెకింగ్‌లో భాగంగా కొత్తగా ఐఓటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్), ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారిత ఆలోచనలకు ప్రాముఖ్యతనిస్తారు. అలాగే బ్రేక్ టెస్ట్, లోడ్ టెస్ట్, స్పీడ్ టెస్ట్, స్టీరింగ్ టెస్ట్ తో పాటు ఇండ్యూరేషన్ టెస్ట్కూడా చేస్తారు. చివరగా బిజినెస్ రౌండ్లోనూ నెగ్గితేనే అర్హత సాధించినట్టు. ఒక్కో వాహనానికి 20 నుంచి 30 మంది టీమ్ సభ్యులు ఉంటారు. వారిలో కెపె్టన్, రైడర్, కో రైడర్ ఉంటారు. వాహనం తయారీ » గోకార్టింగ్ వాహనం తయారీకి సుమారు రూ. 70వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చవుతుంది. »ఇందులో సీవీ వాహనాలను పూర్తిగా ఇంజిన్‌తో తయారు చేస్తారు. ఇంజిన్, మోటారు, వీల్స్, స్టీరింగ్, ఇతర పార్టులు ఉంటాయి. »ఈవీ వాహనాలను బ్యాటరీ ఆధారంగా తయారుచేస్తారు. దీనికి బ్యాటరీ, వీల్స్, స్టీరింగ్, మోటారు ఇతర పార్టులు ఉంటాయి. ఒక్కో వాహనం సుమారు 80 నుంచి 100 కిలోల వరకు బరువు ఉంటుంది. అఫిడవిట్ కచ్చితం.. గోకార్టింగ్ పోటీల్లో రైడర్ల పాత్ర కీలకం. కానీ రైడర్‌గా మారాలంటే విద్యార్థి తల్లిదండ్రులు, కళాశాల సిబ్బంది నుంచి అఫిడవిట్‌ను సమర్పించాల్సిందే. గోకార్టింగ్ తో వచ్చే అవకాశాలు గోకార్టింగ్ పోటీల్లో పాల్గొనే అవకాశం రావడమే విద్యార్థుల విజయానికి తొలిమెట్టు లాంటిది. వాటి లో ప్రముఖ కోర్ కంపెనీల్లో ఉద్యోగవకాశాలు, ఆటోమొబైల్ రంగంలో సొంతంగా వ్యాపారం చేయాలనే ఆలోచన ఉన్న వారికి ప్రాథమిక ప్లాట్‌ఫామ్‌గా గోకార్టింగ్ ఉపయోగపడుతుంది. ప్రమాదమైనా ఇష్టమే.. గోకార్టింగ్ లో రైడింగ్ ప్రమాదకరమైనప్పటికీ ఎంతో ఆసక్తిగా ఉండడం వలన రైడర్‌గా మారాను. 60 ఓల్ట్స్ బ్యాటరీ సామర్థ్యంతో వాహనం తయారుచేశాం. మా కళాశాల ప్రిన్సిపాల్ కె.వీ.ఎన్.సునీత, ఫ్యాకల్టీ లు రూపత్, గోపీకృష్ణ సహకారంతో గోకార్టింగ్ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నాం. అందరి సహకారంతో ఈవీ వెహికల్ రైడ్‌లో మొదటి స్థానంలో నిలిచాం. – జననీ నాగరాజన్, రైడర్, బీవీఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాల, హైదరాబాద్. రెండు సార్లు రైడర్‌గా మొదటి స్థానం మా కళాశాల సీనియర్స్ ఇన్స్పిరేషన్తో గోకార్టింగ్ రైడర్ గా పోటీల్లో పాల్గొంటున్నాను. 150 సీసీ పల్సర్ ఇంజిన్‌తో వాహనం తయారుచేశాం. రైడర్‌గా రెండు సార్లు మొదటి స్థానంలో నిలిచాం. మాది మధ్య తరగతి కుటుంబం. మా నాన్న ఆటోడ్రైవర్, అమ్మ గృహిణి. భవిష్యత్‌లో మంచి కోర్ కంపెనీలో ఉద్యోగం సాధించడమే లక్ష్యం. – వి.సునీల్, రైడర్, రఘు ఇంజినీరింగ్ కళాశాల, విశాఖపట్టణం -
నిబంధనల మేరకే పత్రికలకు ప్రకటనలు
సాక్షి, అమరావతి: వార్తా పత్రికలకు ప్రకటనల జారీ విషయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై కూటమి నేతలు చేస్తున్న అసత్య ప్రచారంలో వీసమెత్తు వాస్తవం లేదని, నిబంధనల మేరకే ప్రకటనలు ఇచ్చి నట్లు అసెంబ్లీ సాక్షిగా మరోసారి తేటతెల్లమైంది. గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా సాక్షి పత్రికకు రూ.400 కోట్ల ప్రకటనలు ఇచ్చారని టీడీపీ నేతలు దు్రష్పచారం చేశారు. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ఏడాది జూలైలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ ఎమ్మెల్యేలే అడిగిన ప్రశ్నకు పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఇచ్చిన సమాధానంతో రుజువైంది. ఆ ఐదేళ్లలో సాక్షికి రూ.371 కోట్లు, ఈనాడు పత్రికకు మూడున్నరేళ్లపాటు అదే స్థాయిలో ప్రభుత్వం ప్రకటనలు జారీ చేసినట్టు వెల్లడించారు. మంగళవారం శాసన మండలిలో టీడీపీ సభ్యులే దీనిపై ప్రశి్నంచగా.. గత ప్రభుత్వంలో జీవో 431 ప్రకారం నిబంధనలకు లోబడే వార్తా పత్రికలకు ప్రకటనలను జారీ చేశారని ఒప్పుకొన్నారు. ఈ జీవో ప్రకారం ప్రకటనలు ఇచ్చే విచక్షణాధికారం సమాచార, పౌర సంబంధాల (ఐ అండ్ పీఆర్) శాఖ డైరెక్టర్‌కు ఉంటుందన్నారు. ఈ మేరకే 2019 – 24 మధ్య సాక్షికి రూ.371 కోట్ల విలువైన ప్రకటనలు జారీ చేయగా, అందులో రూ. 196 కోట్లు చెల్లించారని తెలిపారు. ఈనాడు సహా ఇతర పత్రికలన్నింటికీ రూ.488 కోట్ల మేర ప్రకటనలు ఇవ్వగా.. అందులో రూ. 360 కోట్లు ప్రభుత్వం చెల్లించిందన్నారు. మంత్రి సమాధానం వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిష్పాక్షికతను మరోసారి వెల్లడించింది. 2019కు ముందు ప్రభుత్వం జారీ చేసిన జీవో 431 ప్రకారమే 2019 – 24 మధ్య ప్రకటనలు ఇచ్చినట్లు మరోసారి స్పష్టమైంది. మూడన్నరేళ్లలోనే ఈనాడుకు రూ.243 కోట్ల విలువైన ప్రకటనలు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తొలి మూడున్నరేళ్లలోనే ఈనాడు పత్రికకు సమాచార శాఖ ద్వారా రూ.190 కోట్లు, వివిధ శాఖల ద్వారా రూ.53 కోట్లు చొప్పున మొత్తం రూ.243 కోట్లు విలువైన ప్రకటనలను ఇచ్చారు. ఆ తర్వాత ఈనాడు యాజమాన్యం ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వొద్దని, తాము ప్రచురించబోమని అధికారికంగా సమాచార శాఖకు లేఖ రాసింది. దాంతో చివరి ఏడాదిన్నర ఈనాడు పత్రికకు ప్రకటనలు ఇవ్వలేదు. ఈ లెక్కన పరిశీలిస్తే సాక్షి పత్రికతో సమానంగా ఈనాడు పత్రికకు కూడా ప్రకటనలు ఇచ్చారనేది వాస్తవం. ఇక తాజాగా ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారం సాక్షికి ఇచ్చిన ప్రకటనల మొత్తంలో రూ.175 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని స్పష్టమైంది. 2014–19 మధ్య చంద్రబాబు జమానాలో ప్రభుత్వ ప్రకటనల జారీలో ‘సాక్షి’ పత్రిక పట్ల వివక్షాపూరితంగా వ్యవహరించారు. ఆ ఐదేళ్లలో ఈనాడు పత్రికకు రూ.121.97 కోట్ల ప్రకటనలు ఇవ్వగా, సాక్షి పత్రికకు కేవలం రూ.30.97 కోట్ల మేరకే ప్రభుత్వ ప్రకటనలు జారీ చేశారు. -
పోసానిపై పైశాచికం!
సాక్షి, అమరావతి: సినిమాల్లో విలన్లు.. వృద్ధులు, మహిళలను వేధిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నట్లు చూపిస్తారు..! అక్రమ కేసులతో వేధిస్తున్న చంద్రబాబు సర్కారు అదే రీతిలో రెడ్‌బుక్ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తోంది!! తాము బనాయిస్తున్న అక్రమ కేసులు ఎలాగూ న్యాయస్థానాల్లో నిలబడవు కాబట్టి విచారణ పేరుతో వేధించాలని పోలీసులను పురిగొల్పుతోంది. సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై లెక్కకు మించి అక్రమ కేసులు బనాయించింది. రోజుకో కేసులో అరెస్ట్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లు, జైళ్ల చుట్టూ రోడ్డు మార్గంలో ఏకంగా 2,501 కి.మీ. తిప్పి రాక్షసత్వాన్ని ప్రదర్శించింది! 67 ఏళ్ల వయసున్న పోసాని కృష్ణ మురళికి కొంతకాలం క్రితమే గుండెకు శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకు ఇతరత్రా తీవ్ర ఆరోగ్య సమస్యలున్నాయి. దీంతో చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ హైదరాబాద్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం రెడ్‌బుక్ కుట్రలను ఆపలేదు. టీడీపీ, జనసేన పార్టీల నేతలు పక్కా పన్నాగంతో పోసాని కృష్ణ మురళిపై వివిధ జిల్లాల్లో అక్రమ కేసులు పెట్టారు. అనంతరం వరుస అరెస్టులతో దాష్టీకానికి తెగించారు. జనసేన కార్యకర్త ఫిర్యాదు మేరకు మొదట అరెస్ట్ చేయగా అక్కడ నుంచి రాష్ట్రమంతా తిప్పుతూ వరుసగా అరెస్ట్‌ల పర్వం కొనసాగించారు. 17 అక్రమ కేసులు బనాయించగా నాలుగు కేసుల్లో అరెస్టు చేశారు. ఫిబ్రవరి 26న హైదరాబాద్‌లోని పోసాని కృష్ణ మురళి నివాసంపై పోలీసులు దండెత్తారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన కేసులో పోసానిని అరెస్ట్ చేశారు. రాత్రంతా వాహనంలో తిప్పి ఫిబ్రవరి 27న మధ్యాహ్నం 12 గంటలకు ఓబులవారిపల్లెకు తీసుకువచ్చారు. జిల్లా ఎస్పీ విద్యా సాగర్ నాయుడు పోసానిని ఏకంగా 9 గంటల పాటు విచారించడం గమనార్హం.ఫలించిన న్యాయ పోరాటం..నేడు జైలు నుంచి పోసాని విడుదలయ్యే అవకాశంవిశాఖపట్నం, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ, అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు తదితర పోలీస్ స్టేషన్లలో నమోదు చేసిన అక్రమ కేసుల్లో పోసాని కృష్ణ మురళిని అరెస్ట్ చేసి ఆ జిల్లాలకు వరసగా తరలించాలని పోలీసులు భావించారు. అయితే పోసాని న్యాయ పోరాటం ఫలించింది. ఆయనపై బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 111 ప్రకారం వ్యవస్థీకృత నేరాల కింద కేసుల నమోదుకు న్యాయస్థానాలు సమ్మతించలేదు. పోసానిపై నమోదు చేసిన కేసులకు ఆ సెక్షన్ వర్తించదని స్పష్టం చేసింది. ఇక పోసాని కృష్ణ మురళిపై నమోదు చేసిన అన్ని కేసుల్లోనూ న్యాయస్థానాలు బెయిళ్లు మంజూరు చేశాయి. విశాఖ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన కేసులో విచారణను నిలిపివేయాలని న్యాయస్థానం ఆదేశించింది. పోసానికి బెయిల్ మంజూరు చేస్తూ కర్నూలు మొదటి అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్, ఆదోని ఇన్చార్జి అపర్ణ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కర్నూలు జిల్లా జైలులో ఉన్న పోసాని కృష్ణ మురళి బుధవారం విడుదలయ్యే అవకాశం ఉంది. -
జన హితం.. వైఎస్సార్సీపీ లక్ష్యం
సాక్షి, అమరావతి : సరిగ్గా 15 ఏళ్ల క్రితం 2011 మార్చి 12న వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద ఒక్కడితో మొదలైన వైఎస్సార్సీపీ తిరుగులేని శక్తిగా ఆవిర్భవించింది. రాజకీయంగా వైరి పక్షాలైన కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై.. చంద్రబాబు, సోనియా గాంధీ కుట్ర చేసి అక్రమ కేసులు బనాయించి.. 16 నెలలు అక్రమంగా జైల్లో నిర్బంధించినా వైఎస్ జగన్మోహన్రెడ్డి లెక్క చేయలేదు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధనే లక్ష్యంగా.. విలువలు, విశ్వసనీయతతో ప్రజలకు పార్టీని చేరువ చేశారు. 2017 నవంబర్ 6న ప్రజా సంకల్ప పాదయాత్రను ప్రారంభించారు. 14 నెలలపాటు 3,648 కి.మీల దూరం యాత్ర సాగింది. ఫలితంగా టీడీపీ దుర్మార్గపు పరిపాలనను కూకటివేళ్లతో పెకలిస్తూ.. 2019 ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్సీపీకి అఖండ విజయాన్ని అందించారు. 50 శాతానికిపైగా ఓట్లు, 151 శాసన సభ (87 శాతం), 22 లోక్‌సభ (88 శాతం) స్థానాల్లో పార్టీ ఘన విజయం సాధించింది. 2019 మే 30న ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజల గుమ్మం వద్దకే ప్రభుత్వాన్ని తీసుకెళ్లారు. ఐదేళ్లలో సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో పేదల ఖాతాల్లో ఏకంగా రూ.2.73 లక్షల కోట్లు జమ చేశారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారు. అయితే టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి కట్టడం.. సూపర్ సిక్స్‌తోపాటు 143 హామీలు ఇవ్వడంతో 2024 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధికారం కోల్పోయింది. అయినా పది నెలలుగా వైఎస్ జగన్ ప్రజలతో మమేకమవుతూ వైఎస్సార్సీపీ విధానం ప్రజా పక్షమని చాటి చెబుతున్నారు. నేడు పార్టీ జెండాను ఆవిష్కరించనున్న వైఎస్ జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయాన్ని రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. పార్టీ కార్యాలయంలోకి వెళ్లే మార్గాలను పార్టీ రంగులతో తోరణాలుగా తీర్చిదిద్దారు. బుధవారం ఉదయం 9 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ జెండా ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడలా వైఎస్సార్సీపీ జెండా ఎగర వేయాలని పార్టీ కేంద్ర కార్యాలయం పార్టీ శ్రేణులకు పిలుపునిచి్చంది. -
గుండ్రేవుల.. ఎండమావిలా ఎన్నాళ్లిలా!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: తుంగభద్ర నదిపై ఉన్న సుంకేసుల రిజర్వాయర్ నుంచి ఏటా సగటున 200 టీఎంసీలకుపైగా నీరు కృష్ణాలో కలుస్తోంది. ఆ జలాలు వృథాగా సముద్రం పాలవుతున్నాయి. గతేడాది 341.99 టీఎంసీలకుపైగా నీరు దిగువకు వదిలారు. కళ్లెదుటే ఇంత నీరు వృథాగా పోతుంటే.. కర్నూలు, వైఎస్సార్ జిల్లాలను నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. రాష్టంలో అన్ని ప్రాంతాల కంటే దుర్భిక్ష ప్రాంతం రాయలసీమ. సాగునీటి వనరులు అత్యల్పంగా ఉన్న ప్రాంతం. వర్షాధారంపై సాగు చేసే పంటలే అధికం. ప్రతి పదేళ్లలో ఎనిమిదేళ్లు ఈ ప్రాంతంలో కరువే ఉంటుంది. అరకొరగా ఉన్న సాగునీటి వనరులు కూడా మృగ్యమవుతున్నాయి. దీంతో ‘సీమ’లో వ్యవసాయం ప్రమాదంలో పడే పరిస్థితులు నెలకొన్నాయి. సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో తుంగభద్ర నదిపై గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మిస్తే కరువుతో అల్లాడిపోతున్న కర్నూలుతో పాటు వైఎస్సార్ జిల్లాకు మేలు జరుగుతుంది. వైఎస్ హయాంలో బీజం పడినా... కోడుమూరు నియోజకవర్గంలో సుంకేసుల రిజర్వాయర్‌కు 15 కిలోమీటర్ల ఎగువన సీ.బెళగల్ మండలంలో గుండ్రేవుల, రంగాపురం పరిధిలో 20.15 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించాలని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి అప్పటి ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నేతలు విన్నవించారు. దీంతో ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని వైఎస్ నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన మృతి చెందారు. కాగా.. 2011 ఏప్రిల్ 30న గుండ్రేవుల ప్రాజెక్టు డీపీఆర్‌ను అప్పటి ఈఈ సుబ్బరాయుడు ప్రభుత్వానికి నివేదించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి, ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వాలు గుండ్రేవుల నిర్మాణాన్ని విస్మరించాయి. 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రభుత్వం హడావుడిగా 2019 ఫిబ్రవరి 21న జీవో154 జారీ చేసింది. గుండ్రేవుల ప్రాజెక్టుకు రూ. 2,890 కోట్ల నిధులతో చేపట్టేలా పరిపాలన అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయితే కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని ప్రాంతాలతో పాటు పశ్చిమ ప్రాంతాల్లో పూర్తిగా సాగు, తాగునీటి సమస్య పరిష్కారమవుతుంది. కర్నూలు నగరపాలక సంస్థకు కూడా తాగునీటి కష్టాలు తీరుతాయి. అలాగే ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ నుంచి లిప్ట్ ఇరిగేషన్ ద్వారా కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశం కూడా ఉంది.ఇప్పటికే కొన్ని గ్రామాలకు పరిహారంవైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా 2007లో తుంగభద్రకు వరదలు వచ్చాయి. అప్పట్లో తుంగభద్ర పరీవాహక గ్రామాలు మునిగిపోయాయి. అప్పట్లో వైఎస్ ప్రభుత్వం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద కొన్ని గ్రామాలకు పరిహారం కూడా చెల్లించింది. గ్రామాలు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించింది. కాబట్టి ముంపు పరిహారం కూడా కొన్ని గ్రామాలకు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అంశాలను బేరీజు వేస్తే ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తిగా సానుకూల పరిస్థితులు ఉన్నట్టు స్పష్టమవుతోంది.గుండ్రేవుల నిర్మించకపోతే ‘ సీమ’కు ఇబ్బందే! తుంగభద్రలో నీటి లభ్యత ఎక్కువ. దీనిపై ఆధారపడే వైఎస్సార్, కర్నూలు జిల్లాల ఆయకట్టు ఆధారపడి ఉంది. భవిష్యత్‌లో కేసీ కెనాల్‌కు సమృద్ధిగా నీటిని అందించాలంటే గుండ్రేవుల ప్రాజెక్ట్ నిర్మించాలి. 2009లో అప్పటి ప్రభుత్వం డీపీఆర్‌కు రూ.53 లక్షలు మంజూరు చేసింది. ప్రభుత్వానికి డీపీఆర్ కూడా అందింది. రాష్ట్ర విభజన తర్వాత ఈ ప్రాజెక్టు ప్రతిపాదనను పక్కనపడేశారు. సుంకేసుల బ్యారేజీ 1.2 టీఎంసీల సామర్థ్యమే. దీంతో పెద్దగా ఉపయోగం లేదు. ఆ నీటిని కూడా తుమ్మిల ఎత్తిపోతల ద్వారా తెలంగాణ తోడేస్తోంది. విభజన తర్వాత ఆ ప్రాజెక్టు అంతరాష్ట్ర ప్రాజెక్టుగా మారింది. గుండ్రేవుల నిరి్మస్తే 20 టీఎంసీలకు పైగా నిల్వ చేసుకోవడంతో పాటు కర్నూలు పశి్చమ ప్రాంతం ఆయకట్టుతోపాటు వైఎస్సార్ జిల్లాకు మేలు జరుగుతుంది. – శ్రీనివాసరెడ్డి, రిటైర్డ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఇంజనీర్ -
హోం మంత్రి ఇలాకాలో.. అశ్లీల నృత్యాలు!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గంలో అశీల్ల నృత్యాలు అంబరాన్నంటాయి. టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతున్న పవిత్రమైన ఉపమాక వెంకన్న కల్యాణ్సోతవం కార్యక్రమంలో వెగటు పుట్టించే పాటలతో అమ్మాయిల డ్యాన్స్‌లతో అపచారానికి ఒడిగట్టారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా డీజే పేరుతో రికార్డింగ్ డ్యాన్సులను యథేచ్ఛగా నిర్వహించారు. సాక్షాత్తూ హోం మంత్రి నియోజకవర్గంలోనే ఈ కార్యక్రమం జరుగుతుండడంతో.. టీటీడీ అధికారులు గానీ, పోలీసులు గానీ ఈ రికార్డింగ్ డ్యాన్సులకు అడ్డుచెప్పే ధైర్యం చేయలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. టీడీపీ పెత్తనంతో.. నక్కపల్లి మండలం ఉపమాపకలో ఆరో శతాబ్ధానికి చెందిన వెంకన్న ఆలయానికి ఘన చరిత్ర ఉంది. 2017 సంవత్సరం వరకు దేవదాయ శాఖ ఆధీనంలో ఉండే ఈ ఆలయాన్ని తెలుగుదేశం ప్రభుత్వమే టీటీడీకి అప్పగించింది. అప్పటి నుంచి ప్రతి ఏటా నిర్వహించే బ్రహ్మోత్సవాలు, ధనుర్మాసోత్సవాలు, కల్యాణోత్సవాలు తిరుపతిలో మాదిరిగానే నిర్వహిస్తున్నారు. ఈ ప్రత్యేక పర్వదినాల్లో కేవలం ఆధ్యాత్మికమైన సాంస్కృతిక కార్యక్రమాలు మాత్రమే ఇప్పటి వరకు టీటీడీ అధికారులు నిర్వహిస్తూ వచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తరువాత జరుగుతున్న ఈ ఉపమాక వెంకన్న కల్యాణోత్సవంలో టీడీపీ నేతల పెత్తనం పెచ్చుమీరింది. హోం మంత్రిగా అనిత బాధ్యతలు చేపట్టిన తరువాత ఉపమాక దేవస్థానంలో తెలుగుదేశం నేతల జోక్యం ఎక్కువైందన్న ఆరోపణలున్నాయి. టీటీడీ సంప్రదాయానికి తూట్లు.. వెంకన్న కల్యాణోత్సవ కార్యక్రమాన్ని అపవిత్రం చేసేలా టీడీపీ నేతలు రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించడంపై భక్తులు మండిపడుతున్నారు. కల్యాణోత్సవం సందర్భంగా సోమవారం రాత్రి డీజే పేరుతో రికార్డింగ్ డ్యాన్స్‌ను ఏర్పాటు చేశారు. ఒకవైపు స్వామి వారి కల్యాణోత్సవం జరుగుతుండగా మరోవైపు ఆలయానికి ఆనుకుని వెనుక ప్రాంతంలో డీజే స్టేజ్ ఏర్పాటు చేసి అమ్మాయిలు, అబ్బాయిలతో అశ్లీల నృత్యాలు చేయించడం గమనార్హం. పైగా ఈ డ్యాన్స్ ప్రోగ్రాం కారణంగానే రాత్రి 9 గంటలకు పూర్తి కావాల్సిన ఎదురు సన్నాహక మహోత్సవంతో పాటు రథోత్సవం అర్థరాత్రి 12 వరకు ప్రారంభం కాలేదు. ఇక స్వామి వారి కల్యాణం అర్థరాత్రి 2 గంటల తర్వాత హోం మంత్రి అనిత వచ్చాక ప్రారంభించారు. ఇటువంటి రికార్డింగ్ డ్యాన్సుల కార్యక్రమానికి టీటీడీ అధికారులు ఇప్పటి వరకు అనుమతి ఇవ్వలేదు. కానీ ఈసారి మాత్రం కల్యాణోత్సవం సందర్భంగా హోం మంత్రి అనిత సోమవారం ఉదయం నుంచి అర్థరాత్రి వరకు ఉపమాకలోనే తిష్టవేశారు. కల్యాణం సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలు, కల్పించిన సదుపాయాలు, ఇలా అన్నింటినీ ఆమె స్వయంగా పర్యవేక్షించారు. హోం మంత్రిగా అనిత బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా ప్రాచీన పుణ్య క్షేత్రంలో రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించడంపై భక్తులు దుమ్మెత్తి పోస్తున్నారు. -
యువత పోరు నేడే
సాక్షి, అమరావతి: చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఐదు త్రైమాసికాలుగా ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ రూ.3,500 కోట్లు, వసతి దీవెన రూ.1,100 కోట్లు చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం అవమాన భారంతో కళాశాలలకు వెళ్లాల్సిన దుస్థితిలో ఉన్న విద్యార్థులు, పుస్తెలు అమ్మి బిడ్డల ఫీజు బకాయిలు చెల్లించిన తల్లుల పక్షాన ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ సమరభేరి మోగించింది. డీఎస్సీపై చేసిన మొదటి సంతకమే తుస్సుమనిపించిన సీఎం చంద్రబాబు.. జాబ్ క్యాలెండర్ ప్రకటించకుండా, ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా, నిరుద్యోగ భృతి చెల్లించకుండా నిరుద్యోగులను వంచిస్తున్న తీరుపై కూడా వైఎస్సార్సీపీ కదనభేరి మోగించనుంది. విద్యార్థులు, వారి తల్లితండ్రులు.. నిరుద్యోగుల పక్షాన అన్ని జిల్లాల్లో బుధవారం ‘యువత పోరు’కు సిద్ధమైంది. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రాల్లో విద్యార్థులు, వారి తల్లుతండ్రులు, నిరుద్యోగులతో కలిసి కలెక్టర్ కార్యాలయాల వరకు భారీ ర్యాలీలు నిర్వహించనుంది. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు తక్షణమే చెల్లించాలని.. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లించాలని.. కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఉపసంహరించుకుని, పేదలకు వైద్య విద్యను అందుబాటులో ఉంచాలని కోరుతూ కలెక్టర్లకు విజ్ఞాపన పత్రాలు అందజేయనుంది. అన్నదాతల సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 13న రైతు పోరు.. విద్యుత్ చార్జీల బాదుడును నిరసిస్తూ డిసెంబర్ 27న విద్యుత్ పోరును నిర్వహించిన విషయం తెలిసిందే. అప్పుడు రైతు పోరు, విద్యుత్ పోరును విఫలం చేయడానికి ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పింది. వారి బెదిరింపులు.. నిర్భందాలను రైతులు, అన్ని వర్గాల ప్రజలు లెక్క చేయలేదు. వైఎస్సార్సీపీ నిర్వహించిన రైతు పోరులో అన్నదాతలు.. విద్యుత్ పోరులో అన్ని వర్గాల ప్రజలు, ప్రధానంగా మహిళలు కదంతొక్కారు. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో పెల్లుబుకుతున్న వ్యతిరేకతకు రైతు పోరు, విద్యుత్ పోరు అద్దం పట్టాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషించారు. ఇప్పుడు యువత పోరును నియంత్రించాలని ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పింది. అయినా రైతు పోరు.. విద్యుత్ పోరు కంటే మరింతగా యువత పోరును విజయవంతం చేసేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు సన్నద్ధమయ్యాయి. నమ్మించి నయ వంచన » రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. కళాశాలల యాజమాన్యం తరగతి గది నుంచి ఎప్పుడు బయటకు గెంటేస్తుందోనన్న అవమాన భారంతోనే విద్యార్థులు కళాశాలలకు వెళ్తున్నారు. కళ్ల ముందే బిడ్డలు పడుతున్న అవస్థలు చూడలేక పేదింటి తల్లిదండ్రులు ఇళ్లు, పొలాలు, పుస్తెలు తాకట్టు పెట్టి మరీ అప్పులు తెచ్చి ఫీజులు చెల్లిస్తున్న దుర్భర పరిస్థితి కనిపిస్తోంది» నిజానికి గత విద్యా సంవత్సరంలోని చివరి రెండు త్రైమాసికాలకు కలిపి రూ.1,400 కోట్లు, వసతి దీవెన కింద రూ.1,100 కోట్లను జూన్‌లో చెల్లించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మళ్లీ జగన్ ప్రభుత్వం వచ్చి ఉంటే ఆ నిధులు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమయ్యేవి. కానీ, కూటమి అధికారంలోకి వచ్చింది. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన ఖర్చులను నిలిపివేసింది. పాత విద్యా సంవత్సరంలో చివరి రెండు త్రైమాసికాలు, ఈ విద్యా సంవత్సంలో పూర్తయిన మూడు త్రైమాసికాలకు కలిపి రూ.3,500 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి పెట్టింది. » కూటమి సర్కారు ఏర్పడిన ఈ తొమ్మిది నెలల్లో మొక్కుబడి ప్రకటనలు మినహా విద్యార్థులకు ఒరగబెట్టిందేమీ లేదు. అయితే, వైఎస్సార్సీపీ ‘యువత పోరు’ ప్రకటనతో ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి ఒక త్రైమాసికంలో రూ.700 కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. కానీ.. చాలా వరకు నిధులు ఇంకా కళాశాలల ఖాతాల్లో జమ కాకపోవడం గమనార్హం. » ప్రైవేటు కళాశాలల్లో పీజీ చదువుతున్న వారికి సైతం ఫీజు రీయింబర్స్మెంట్ అందిస్తామని ఎన్నికల్లో కూటమి పార్టీల నాయకులు ప్రగల్భాలు పలికారు. వారిని నమ్మి ప్రైవేటు కళాశాలల్లో చేరినవారి నెత్తిన పిడుగు పడినట్లయింది. పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్ ఇలా.. ఉన్నత విద్యను సొంత డబ్బు పెట్టి చదువుకోలేని వారు తీవ్ర సందిగ్ధతను ఎదుర్కొంటున్నారు.» వైఎస్ జగన్ తీసుకొచ్చిన కొత్త వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేస్తూ పేదింటి బిడ్డలకు వైద్య విద్యను దూరం చేస్తున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం 700 సీట్లు కోల్పోగా, వచ్చే ఏడాది అదనంగా వచ్చే సీట్లతో కలిపి మొత్తం 2,500 సీట్లను కోల్పోవాల్సి వస్తోంది. ఇవ్వాల్సింది రూ.7,100 కోట్లు... బడ్జెట్లో రూ.2,600 కోట్లేగత ఐదు త్రైమాసికాలకు సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు రూ.4,600 కోట్లు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చంద్రబాబు చెలగాటమాడుతున్నారు. 2024–25కి సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా దీవెన పథకాలకు రూ.3,900 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా.. ఈ ప్రభుత్వం రూ.700 కోట్లు కూడా ఇవ్వలేదు. అంటే గతేడాది పిల్లలకు రూ.3,200 కోట్లు బాకీ పెట్టారు. అంతేకాకుండా 2025–26లో మరో రూ.3,900 కోట్లు విద్యాదీవెన, వసతి దీవెనకు కావాలి. ఈ రెండూ కలిపితే పిల్లలకు రూ.7,100 కోట్లు ఇవ్వాల్సి ఉండగా బడ్జెట్లో కేవలం రూ.2,600 కోట్లే కేటాయించారు. దీన్ని బట్టి చూస్తే పిల్లలను చదువులకు దూరం చేసే కుట్ర తేటతెల్లమవుతోంది. ప్రైవేటు కాలేజీల్లో పీజీ చదివే విద్యార్థులకు సైతం ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామని ఎన్నికల్లో నమ్మబలికిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చాక విద్యార్థులను నట్టేట ముంచారు. ఇప్పటికే ఆన్లైన్ వర్టికల్స్ ఎడెక్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందం గాలికి ఎగిరిపోయింది. మరోవైపు విద్యా దీవెన ఇవ్వకపోవడంతో ఇంజనీరింగ్ కాలేజీలను మూసివేసే పరిస్థితి వచ్చింది. వసతి దీవెనను పూర్తిగా గాలికి వదిలేశారు. విద్యార్థుల భవిష్యత్తుపై చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే వారికి ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు చెల్లించడంతోపాటు 2025–26 బడ్జెట్లో ఈమేరకు తగినన్ని నిధులు కేటాయిస్తూ సవరణ చేయాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు.రూ.18,663.44 కోట్లు ఇచ్చిన వైఎస్ జగన్‌వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు త్రైమాసికం ముగిసిన వెంటనే ఆ త్రైమాసికానికి సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేసింది. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన కింద ఏడాదికి రూ.3,900 కోట్లు చొప్పున అందచేసింది. ఐదేళ్లలో జగనన్న విద్యా దీవెన కింద రూ.12,609.68 కోట్లు, వసతి దీవెన కింద రూ.4275.76 కోట్లు విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేశారు. గతంలో టీడీపీ సర్కారు ఇవ్వకుండా ఎగ్గొట్టిన రూ.1,778 కోట్ల ఫీజు బకాయిలను సైతం వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే చెల్లించి విద్యార్థుల చదువులకు అండగా నిలిచారు. మొత్తం రూ.18,663.44 కోట్ల మేర ప్రయోజనం చేకూర్చారు.» కూటమి అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలు ఇవ్వడం దేవుడెరుగు.. ఉన్న ఉద్యోగాలు ఊడబెరికి వలంటీర్లను నడిరోడ్డుపైకి లాగేశారు. రూ.10,000 వేతనం ఇస్తామని ఎన్నికల్లో హామీలు గుప్పించి, పీఠం ఎక్కాక 2.60 లక్షల మంది వలంటీర్ల జీవితాలను గాలికి వదిలేశారు. » తొలి సంతకం అంటూ సీఎం చంద్రబాబు ఊదరగొట్టిన డీఎస్సీకి 9 నెలలైనా నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగులను నిలువునా ముంచారు. 16,347 పోస్టులను ప్రకటించి.. డిసెంబరు నాటికి భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పి, వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను సైతం రద్దు చేశారు.»‘ప్రతి సంవత్సరం జాబ్ కేలండర్ విడుదల చేస్తాం. రికార్డు చేసుకో.. డేటు, టైము రాసుకో.. జగన్‌లా పారిపోయే బ్యాచ్ కాదు నేను..’ అంటూ 2024 ఫిబ్రవరి 13న యువగళం సభలో ప్రగల్భాలు పలికిన లోకేశ్.. ఇప్పుడు జాబ్ కేలండర్ ఊసే మర్చిపోయారు. చంద్రబాబు సైతం ఇదే హామీ పదేపదే ఇచ్చారు. జనవరి 1 వెళ్లిపోయింది, ఫిబ్రవరి దాటేసింది, మార్చి కూడా అయిపోతోంది.. కానీ జాబ్ కేలండర్ ప్రకటన లేదు. ఏపీపీఎస్సీ నుంచి ఒక్క ప్రకటనా వెలువడలేదు. గత ప్రభుత్వంలో ఇచ్చిన గ్రూప్–1, 2 మెయిన్స్ పరీక్షలను పలుసార్లు వాయిదా వేశారు. గత నెలలో గ్రూప్–2 మెయిన్స్ నిర్వహించారు. ఈ పరిణామాలను గమనిస్తున్న అభ్యర్థులు గతంలో ప్రకటించిన 21 నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షలపై ఆందోళన చెందుతున్నారు. ఈ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకుని 10 లక్షల మందికి పైగా పరీక్షలకు సిద్ధం అవుతున్నారు. దీంతో పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో.. శిక్షణ కొనసాగించాలా.. లేక విరమించాలా? అని మథనపడుతున్నారు. » చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి నిరుద్యోగులను మోసం చేస్తూనే ఉన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన రెండు బడ్జెట్లలో నిరుద్యోగుల సంక్షేమానికి పైసా కూడా విదల్చలేదు. ఏపీలో గత ఏడాది 1.60 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. ఇంటికి ఒకరిని గుర్తించినా నెలకు రూ.3 వేల చొప్పున రూ.4,800 కోట్లు, ఏడాదికి రూ.57,600 కోట్లు కేటాయించాల్సి ఉండగా ప్రభుత్వం మొండి చెయ్యి చూపింది. 2025–26 బడ్జెట్‌కు వచ్చేసరికి కుటుంబాల సంఖ్య 1.70 కోట్లకు చేరింది. ఈ లెక్కన నెలకు రూ.5,100 కోట్లు, ఏడాదికి రూ.61,200 కోట్లు కేటాయించాల్సి ఉండగా రూపాయి కూడా కేటాయించలేదు. -
‘అప్పు’డే.. మరో రూ.9,000 కోట్లు!
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం ప్రతి మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చేసింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ) ద్వారా మరో రూ.9,000 కోట్ల అప్పు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిoది. ప్రైవేట్ ప్లేస్మెంట్ ప్రాతిపదికన డిబెంచర్లు లేదా బాండ్ల జారీతో రూ.9,000 కోట్ల వరకు సమీకరించేందుకు ఏపీఎండీసీకి అనుమతి ఇస్తూ గనుల శాఖ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.ఇప్పటికే ఏపీఎండీసీ ద్వారా రూ.5,000 కోట్ల అప్పు చేసేందుకు గతేడాది డిసెంబర్లో ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా నిధులను వేగంగా సమీకరించేందుకు అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు.. సలహాదారు అండ్ మర్చంట్ బ్యాంకర్‌ను కూడా ఏపీఎండీసీ నియమించింది. అప్పు చేసిన నిధులను కొత్త మైనింగ్ ప్రాజెక్టులను కొనుగోలు చేయడానికి, అభివృద్ధి చేయడానికి, ఏదైనా ఇతర లాభదాయక వెంచర్లలో పెట్టుబడి పెట్టడానికి వినియోగించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పుడు చేసే ఈ రూ.9,000 కోట్ల అప్పుతో కూటమి ప్రభుత్వంలో ఏపీఎండీసీ ద్వారా చేసిన అప్పులు రూ.14,000 కోట్లకు చేరుతాయి. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటి వరకు వివిధ కార్పొరేషన్ల ద్వారా మొత్తం రూ.23,700 కోట్ల అప్పు చేసింది. ఈ అప్పులన్నీ బడ్జెట్ బయట చేస్తున్నవే. -
పౌరుల స్వేచ్ఛను హరిస్తుంటే.. చూస్తూ ఊరుకోం
ప్రభుత్వ నిర్ణయాలు, చర్యలను విమర్శించడం.. నిరసించడాన్ని నేరం అంటే ప్రజాస్వామ్య మనుగడే సాధ్యం కాదు.స్వేచ్ఛగా మాట్లాడటం, భావ వ్యక్తీకరణ లాంటి వాటి గురించి మన పోలీసు యంత్రాంగానికి బోధించాల్సిన సమయం ఆసన్నమైంది. అలాగే ఈ విషయంలో వారికి జ్ఞానోదయం కూడా కలిగించాలి. స్వేచ్ఛగా మాట్లాడటం, భావవ్యక్తీకరణపై ఎంత వరకు సహేతుక నియంత్రణ విధించాలన్న దానిపై అవగాహన కల్పించాలి. రాజ్యాంగం మనకందించిన ప్రజాస్వామ్య విలువల గురించి కూడా వారికి అవగాహన కల్పించాల్సిన సమయం వచ్చింది.– ప్రొఫెసర్ జావీద్ అహ్మద్ హజమ్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలురెడ్ బుక్ రాజ్యాంగంలో.. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో.. చట్టాలను కాలరాస్తూ.. ప్రజాస్వామ్య విలువలకు పాతరేస్తూ.. పౌరుల స్వేచ్ఛను హరిస్తూ ఎడాపెడా అక్రమ అరెస్టులకు బరి తెగిస్తున్న ఖాకీలపై హైకోర్టు కన్నెర్ర చేసింది..! ప్రభుత్వాన్ని, రాజకీయ పార్టీల అధినేతలను విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు అడ్డగోలుగా కేసులు బనాయించడంపై నిప్పులు చెరిగింది. సోషల్ మీడియా యాక్టివిస్టులకు బెయిల్ రాకుండా చేసేందుకు ఉద్దేశపూర్వకంగా బీఎన్ఎస్ సెక్షన్ 111 కింద కేసులు బనాయించటాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం బలవంతపు వసూళ్ల కిందకు వస్తుందా? అని పోలీసులను నిలదీసింది. పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్‌లు చేస్తున్నా... మేజిస్ట్రేట్లు యాంత్రికంగా రిమాండ్ విధిస్తుండటాన్ని కూడా తప్పుబట్టింది. పోలీసులు చట్టం కంటే ఎక్కువ అనుకుంటున్నారని, ప్రతీ ఒక్కరూ చట్టానికి లోబడే నడుచుకోవాలని మందలించింది. ఊహల ఆధారంగా ఇష్టానుసారంగా అరెస్టులు చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది. చిన్న తప్పులే కదా అని వదిలేస్తే.. రేపు కోర్టులోకి వచ్చి అరెస్టులు చేయడానికి కూడా వెనుకాడరని ఘాటుగా వ్యాఖ్యానించింది.భిన్నాభిప్రాయం, అసమ్మతి తెలియచేయడం అన్నది రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో అంతర్భాగం. ప్రతి పౌరుడు కూడా ఇతరులు వ్యక్తం చేసే భిన్నాభిప్రాయాన్ని గౌరవించాలి.ప్రభుత్వ నిర్ణయాలపై శాంతియుతంగా నిరసన తెలియచేసే అవకాశం ఇవ్వడం ప్రజాస్వామ్యంలో తప్పనిసరి. – ప్రొఫెసర్ జావీద్ అహ్మద్ హజమ్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుసాక్షి, అమరావతి: టీడీపీ, ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు సోషల్ మీడియా యాక్టివిస్ట్ అవుతు శ్రీధర్‌రెడ్డికి కింది కోర్టు రిమాండ్ విధించడం చట్ట విరుద్ధమని హైకోర్టు ప్రకటించింది. ఈమేరకు రిమాండ్ ఉత్తర్వులను రద్దు చేస్తూ న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, డాక్టర్ జస్టిస్ కుంభజడల మన్మథరావుల ధర్మాసనం తీర్పు వెలువరించింది. తీర్పు కాపీ అందిన వెంటనే శ్రీధర్‌రెడ్డిని విడుదల చేయాలని నెల్లూరు జిల్లా జైలు సూపరింటెండెంట్‌ను ధర్మాసనం ఆదేశించింది. న్యాయమా?.. అన్యాయమా? అన్నదే ముఖ్యం...ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం పలు ఘాటు వ్యాఖ్యలు చేసింది. అవుతు శ్రీధర్‌రెడ్డి అరెస్ట్ విషయంలో పోలీసులు అడుగడుగునా ఉల్లంఘనలకు పాల్పడ్డారని స్పష్టం చేసింది. ఎలాంటి రుజువులు లేకుండా పోలీసులు తమ ఊహ ఆధారంగా అరెస్ట్‌లు చేస్తామంటే కుదరదని పేర్కొంది. ఇలా నిబంధనలకు విరుద్ధంగా ఆరెస్టులు చేస్తూ పౌరుల స్వేచ్ఛను హరిస్తామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది. మేజిస్ట్రేట్లు సైతం ఏమీ చూడకుండా యాంత్రికంగా వ్యవహరిస్తున్నారని ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. వ్యక్తులు ఎవరన్నది తమకు ముఖ్యం కాదని, పోలీసులు చర్యలు న్యాయమా? అన్యాయమా? అన్నదే ముఖ్యమని తేల్చి చెప్పింది. పోలీసులు చట్టం కంటే ఎక్కువ అనుకుంటున్నారని, ప్రతీ ఒక్కరూ చట్టానికి లోబడే పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. పౌరుల హక్కులను, స్వేచ్ఛను పరిరక్షించాల్సిన బాధ్యత తమపై ఉందంది. పౌరుల స్వేచ్ఛను తేలిగ్గా తీసుకునే చర్యలను తాము ఎంత మాత్రం అనుమతించబోమంది. చట్టాన్ని ఉల్లంఘిస్తామంటే కుదరదని పోలీసులకు తేల్చి చెప్పింది. ఎలా పడితే అలా అరెస్టులు చేసి మేజిస్ట్రేట్ల ముందు హాజరుపరుస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదంది. ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. చిన్న తప్పులే కదా అని వదిలేస్తే, రేపు కోర్టులోకి వచ్చి అరెస్టులు చేయడానికి కూడా వెనుకాడరని వ్యాఖ్యానించింది. అంతా బాగుందని చెప్పేస్తే, తాము మౌనంగా ఉండిపోతామని అనుకోవద్దని పోలీసులకు తేల్చి చెప్పింది. శ్రీధర్‌రెడ్డిని అరెస్ట్ చేసి హాజరుపరిచినప్పుడు మొదట మేజిస్ట్రేట్ రిమాండ్ తిరస్కరించారని, దీంతో ఆయన్ను స్వేచ్ఛగా వదిలేయాల్సిన పోలీసులు మళ్లీ అరెస్ట్ చూపారని పేర్కొంది. మేజిస్ట్రేట్ సైతం రిమాండ్ రిపోర్ట్‌లోని అంశాలను లోతుగా పరిశీలించకుండా శ్రీధర్‌రెడ్డికి రిమాండ్ విధించారని ధర్మాసనం ఆక్షేపించింది. ప్రతీ దశలోనూ పోలీసులు చట్ట ఉల్లంఘనలకు పాల్పడ్డారంది. శ్రీధర్‌రెడ్డి అరెస్ట్ విషయాన్ని సైతం సరైన పద్ధతిలో సంబంధీకులకు తెలియచేయలేదని ప్రస్తావించింది. రిమాండ్ రిపోర్టును పరిశీలిస్తే బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 47(1) కింద అరెస్ట్ విషయాన్ని తెలియచేయలేదని తెలిపింది. అందువల్ల శ్రీధర్‌రెడ్డి నిర్భంధం అక్రమమని ధర్మాసనం తేల్చి చెప్పింది. సెక్షన్ 47(1) ప్రకారం అరెస్ట్ విషయాన్ని నిర్భంధంలో ఉన్న వ్యక్తికి వెంటనే తెలియచేసి తీరాల్సి ఉంటుందని పేర్కొంది. శ్రీధర్‌రెడ్డిని హాజరుపరిచినప్పుడు సెక్షన్ 47(1) ప్రకారం అరెస్ట్‌కు గల కారణాలను నిందితునికి తెలియచేయలేదన్న కారణంతో మేజిస్ట్రేట్ రిమాండ్‌ను తోసిపుచ్చారు. సెక్షన్ 47(1) పోలీసులు చట్టం నిర్ధేశించిన విధి విధానాలను పాటించని పక్షంలో నిందితుడిని స్వేచ్ఛగా వదిలేయాలని చట్టం చెబుతోంది. ఈ కేసు విషయానికి వస్తే పోలీసులు చట్టపరమైన విధి విధానాలను పాటించకపోయినా కూడా నిందితుడికి మేజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. తద్వారా మేజిస్ట్రేట్ యాంత్రికంగా వ్యవహరించారు. అందువల్ల శ్రీధర్‌రెడ్డి రిమాండ్ చట్ట విరుద్ధమని హైకోర్టు స్పష్టం చేసింది. కింది కోర్టు రిమాండ్ ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అయితే శ్రీధర్‌రెడ్డిపై నమోదు చేసిన కేసులో దర్యాప్తు కొనసాగించుకోవచ్చునని పోలీసులకు సూచించింది.రిమాండ్‌పై భార్య న్యాయ పోరాటంతన భర్త అవుతు శ్రీధర్‌రెడ్డికి రిమాండ్ విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు చట్ట విరుద్ధమంటూ ఎం.ఝాన్సీ వాణిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ రఘునందన్‌రావు ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున పాపిడిప్పు శశిధర్‌రెడ్డి వాదనలు వినిపించగా ప్రభుత్వం తరఫున యతీంద్ర దేవ్ వాదనలు వినిపించారు.రీల్ పోస్టు చేయడం.. బలవంతపు వసూలా?సాక్షి, అమరావతి: సోషల్ మీడియా యాక్టివిస్టులకు బెయిల్ రాకుండా చేసేందుకు పోలీసులు ఉద్దేశపూర్వకంగా బీఎన్ఎస్ సెక్షన్ 111 కింద కేసులు బనాయించటాన్ని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ప్రభుత్వ తీరును వ్యంగ్యంగా చిత్రీకరించి ఫేస్బుక్లో సదరు రీల్‌ను పోస్ట్ చేసిన మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు కొరిటిపాటి ప్రేమ్‌కుమార్‌పై బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారంటూ కేసు పెట్టడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం బలవంతపు వసూళ్ల కిందకు వస్తుందా? అని పోలీసులను నిలదీసింది. ప్రేమ్ కుమార్ పోస్ట్ చేసిన రీల్‌కు, బలవంతపు వసూళ్లకు ఏం సంబంధం ఉందని ప్రశ్నించింది. ఆయన బలవంతపు వసూళ్లకు పాల్పడటంతో పాటు తరచూ నేరాలు చేసే వ్యక్తి అని రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొనడంపై మండిపడింది. దేని ఆధారంగా ఇలా రాశారంటూ నిలదీసింది. అరెస్ట్ సమయంలో ఆయన వద్ద రూ.300 దొరికాయి కాబట్టి వాటిని బలవంతపు వసూళ్లుగా చెబుతున్నారా? అంటూ మండిపడింది. మేజిస్ట్రేట్లు కూడా యాంత్రికంగా రిమాండ్ విధించేస్తున్నారంది. రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు ఏం పేర్కొన్నారు? అందులో పేర్కొన్న సెక్షన్లు నిందితునికి వర్తిస్తాయా? లాంటి విషయాలను లోతుగా పరిశీలించకుండానే రిమాండ్ విధించేస్తున్నారని పేర్కొంది. రొటీన్‌గా రిమాండ్ ఉత్తర్వులు..తమ ముందుకు వస్తున్న కేసులను పరిశీలిస్తే మేజిస్ట్రేట్లు యాంత్రికంగా వ్యవహరిస్తున్నారనే విషయం స్పష్టంగా కనిపిస్తోందని హైకోర్టు పేర్కొంది. మేజిస్ట్రేట్లు రొటీన్‌గా రిమాండ్ ఉత్తర్వులిచ్చేస్తున్నారంది. మేజిస్ట్రేట్లు యాంత్రికంగా వ్యవహరిస్తున్నా, తాము మాత్రం బుర్రలు ఉపయోగించే విచారణ జరుపుతున్నామని వ్యాఖ్యానించింది. నిందితుడిని అరెస్ట్ చేసే సమయంలో అతడు ఎక్కడ ఉంటే అక్కడి పంచాయితీదారుల సమక్షంలోనే జరగాల్సి ఉంటుందని తెలిపింది. అయితే ప్రేమ్‌కుమార్ అరెస్ట్ విషయంలో కర్నూలు పోలీసులు అక్కడ పంచాయతీదారులను గుంటూరుకి తీసుకురావడంపై హైకోర్టు ఒకింత విస్మయం వ్యక్తం చేసింది. ఇలా చేయడానికి చట్టం అనుమతిస్తోందా? అని నిలదీసింది. ప్రేమ్‌కుమార్ వ్యంగ్యంగా నాటక రూపంలో ఓ రీల్ చేసి పోస్టు చేశారని, ఇందులో బలవంతపు వసూళ్ల అంశం ఎక్కడ ఉందని ప్రశ్నించింది. ఇలాంటి తీరును ఎంత మాత్రం సహించేది లేదని, ప్రేమ్‌కుమార్ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారంటూ కేసు పెట్టడాన్ని ఎలా సమర్థించుకుంటారో పోలీసులు చెప్పి తీరాలని హైకోర్టు స్పష్టం చేసింది. దీనికి సంబంధించి కర్నూలు త్రీ టౌన్ ఎస్‌హెచ్‌వో అఫిడవిట్ దాఖలు చేయడంతో పాటు తమ ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. ఈ సమయంలో పిటిషనర్ తరఫు న్యాయవాది వేలూరి మహేశ్వరరెడ్డి జోక్యం చేసుకుంటూ, జిల్లా ఎస్పీని సైతం అఫిడవిట్ దాఖలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ, మిగిలిన ప్రతివాదులు కూడా కౌంటర్లు దాఖలు చేయాలనుకుంటే చేయవచ్చని పేర్కొంటూ విచారణను ఈ నెల 25కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, డాక్టర్ జస్టిస్ కుంభజడల మన్మథరావు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తన తండ్రి ప్రేమ్‌కుమార్‌ను కర్నూలు పోలీసులు అక్రమంగా నిర్భంధించారని, ఆయనను కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థిస్తూ కొరిటిపాటి అభియన్ గత ఏడాది హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన జస్టిస్ రఘునందన్‌రావు ధర్మాసనం తాజాగా మరోసారి విచారించింది.సెక్షన్ 111 ఏ సందర్భంలో పెట్టొచ్చంటే...కిడ్నాపింగ్, దొంగతనం, వాహన దొంగతనం, బలవంతపు వసూళ్లకు పాల్పడం, కాంట్రాక్ట్ కిల్లింగ్, ఆర్థిక నేరాలు, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా, మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, ఇతర అక్రమ వస్తువులను కొనుగోలు చేయడం, అమ్మడం వంటి వాటికి పాల్పడిన వారికి మాత్రమే సెక్షన్ 111 వర్తిస్తుంది. ఈ నేరాలు రుజువైతే మరణశిక్ష, జీవితఖైధు, రూ.10 లక్షలకు తగ్గకుండా జరిమానా విధించవచ్చు. సోషల్ మీడియా పోస్టులు ఈ నేరాల కిందకు రాకపోయినప్పటికీ పోలీసులు ఉద్దేశపూర్వకంగా ఆ పోస్టులను వ్యవస్థీకృత నేరంగా చూపుతూ సోషల్ మీడియా యాక్టివిస్టులపై సెక్షన్ 111 కింద కేసులు బనాయిస్తున్నారు. బెయిల్ రాకుండా చేసేందుకే ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తున్నారు. ప్రస్తుత కేసులో కూడా పోలీసులు ప్రేమ్‌కుమార్‌పై బలవంతపు వసూళ్ల కింద కేసు పెట్టారు. -
నిలువ నీడ లేకుండా.. కుప్పంలో పేదల ఇళ్లపై దౌర్జన్యం!
కుప్పం(చిత్తూరు జిల్లా) : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో పేదల ఇళ్లను దౌర్జన్యంగా కూల్చివేసింది కూటమి ప్రభుత్వం. శాంతిపురం మండలం మఠం పంచాయితీ సంతూరు గ్రామంలోని నిరుపేదల ఇళ్లను బలవంంతగా ఖాళీ చేయించి కూల్చివేసే పనులను ఆరంభించింది. కీనీసం ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా బలవంతంగా ఇళ్లు ఖాళీ చేయించిన అధికారులు, టీడీపీ నేతలు.. ఆపై కూల్చివేసే కార్యక్రమం చేపట్టారు. అది చెరువు స్థలమని అందుచేత కూల్చివేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.30 ఏళ్లుగా ఉంటున్న తమను బలవంతంగా ఖాళీ చేయించడం అన్యాయం అంటున్నారు బాధితులు. 10 కుటుంబాలకు చెందిన ఇళ్లను జేసీబీల సాయంతో కూల్చివేశారు అధికారులు. దీనిపై వైఎస్సార్ సీపీ ఆందోళన చేపట్టింది. బాధిత కుటుంబాలకు అండగా నిలిచింది. బాధిత కుటుంబాలు ఉండటానికి మరొకచేట స్థలం కేటాయించక ముందే ఇళ్లను కూల్చివేయడం దారుణమని వైఎస్సార్ సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబు చొరవ తీసుకుని పేద ప్రజలకు మరొకచోట స్థలం కేటాయించాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేస్తోంది. -
‘అమరావతి అప్పులపై చంద్రబాబు పచ్చి అబద్దాలు’
తాడేపల్లి: అమరావతి రాజధాని నిర్మాణం కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పులపై ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నవి పచ్చి అబద్దాలేననే విషయం బట్టబయలు అయ్యిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కారుమూరి వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి కోసం కేంద్రం రూ.15వేల కోట్లు ప్రపంచబ్యాంక్ ద్వారా ఇప్పిస్తోందని, ఇది పూర్తి గ్రాంట్ అంటూ ఇప్పటి వరకు చేసిన వాదనలు పూర్తి అవాస్తవాలేనని తేలిపోయింది. పార్లమెంట్ సాక్షిగా అమరావతి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులపై కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించిన అంశాలతో ఇప్పటి వరకు సీఎం చంద్రబాబు చేస్తున్న బుకాయింపులన్నీ అసత్యాలేనని బయటపడిందన్నారు కారుమూరి వెంకటరెడ్డి. ఇంకా ఆయన ఏమన్నారంటే...అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇప్పించేది గ్రాంట్ మాత్రమేనని, దీనిని అప్పుగా తిరిగే కట్టాల్సిన అవసరం లేదంటూ ఇప్పటి వరకు రాష్ట్రప్రభుత్వం బుకాయిస్తూ వచ్చింది. తాజాగా పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి దీనిపై ఇచ్చిన స్పష్టతతో ఇదంతా అబద్ధమేనని తేలిపోయింది. వైయస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి ఈనెల 10వ తేదీన పార్లమెంట్లో అడిగిన క్వశ్చన్ నెంబర్ 1703కు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంట్లో లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. ప్రపంచబ్యాంకు, ఏడీబీ సహా ఇతర రుణాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేసే అప్పుల పరిధిలోకి రాని రుణాలే అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వమే వాటిని చెల్లించాలని కేంద్ర మంత్రి తన సమాధానంలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. కేంద్రం కేవలం పది శాతం మాత్రమే అంటే రూ. 1500 కోట్లు వరకే గ్రాంట్‌గా ఇస్తుందని వెల్లడించారు. అమరావతికి కేంద్ర సాయం ఒట్టిదేనని, చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఇన్నాళ్లు వైయస్సార్సీపీ చెబుతూ వస్తున్నదే ఇప్పుడు నిజమైంది. కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానం ద్వారా చంద్రబాబు చేసిన ప్రచారం అబద్ధమేనని తేలిపోయింది.రూ.5 వేల కోట్లు అప్పుకి రూ.15 వేల కోట్లు చెల్లింపు2014-19 మధ్య కూడా అమరావతి నిర్మాణం కోసం అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రూ.5,335 కోట్లు రుణాలు తీసుకుంది. ఇందులో హడ్కో నుంచి రూ. 1,098 కోట్లు, బ్యాంకుల కన్సార్టియం నుంచి రూ. 1862 కోట్లు, అమరావతి బాండ్ల ద్వారా రూ. 2 వేల కోట్లు తీసుకుంది. ఈ అప్పులకు సంబంధించిన వడ్డీలను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం, అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏటా రూ. 1,573 కోట్లు వడ్డీలుగానే కడుతోంది. అంటే రూ.5,335 కోట్ల రుణాలకు పదేళ్లలో రూ. 15,773 కోట్లు తిరిగి చెల్లించాల్సిన పరిస్థితిని తీసుకువచ్చారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు అని చెప్పుకుంటూ ప్రజాధనంను వడ్డీల రూపంలో అమరావతి కోసం దోచిపెడుతున్నారు. మళ్లీ ఇదే అమరావతి కోసం బడ్జెట్లో రూ. 6 వేల కోట్లు కేటాయించారు.అమరావతి కోసం మొత్తం రూ.37 వేల కోట్ల రుణాలుప్రస్తుతం ప్రపంచ బ్యాంకు నుంచి రూ. 15 వేల కోట్లు, హడ్కో నుంచి రూ. 11 వేల కోట్లు, జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ నుంచి రూ.5 వేల కోట్లు .. మొత్తం రూ. 31 వేల కోట్లు మళ్లీ అప్పులు చేస్తున్నారు. వీటితోపాటు సీఆర్డీఏ ద్వారా నిధులు సమీకరించాలని చూస్తోంది. గతంలో చేసిన అప్పులు కూడా కలిపి ఇప్పటికే రూ. 37 వేల కోట్లు అప్పులు చేశారు. ఇవన్నీ ఎప్పుడు చెల్లిస్తారు.. ఎలా చెల్లిస్తారు? అమరావతి అంటేనే ఒక దోపిడీ. రాజధాని నిర్మాణం ముసుగులో భారీ అవినీతి జరుగుతోంది. జాతీయ రహదారుల నిర్మాణానికే కిలోమీటర్‌కి రూ. 20 నుంచి రూ. 22 కోట్లు ఖర్చవుతుంటే, అమరావతి ప్రాంతంలో ఒక కిలోమీటర్ రోడ్డు వేయడానికి రూ. 53.88 కోట్లు అవుతుందట. గతంలో తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీల నిర్మాణం కోసం ఒక చదరపు అడుగు నిర్మాణానికి రూ.9400 లు ఖర్చు చేశారు. ఏ గేటెడ్ కమ్యూనిటీ నిర్మానానికి కూడా ఇంత భారీగా ఖర్చు కాదు. అమరావతి పేరుతో బినామీలకు దోచిపెట్టడమే లక్ష్యంగా చంద్రబాబు ముందుకు సాగుతున్నారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్గతంలో 2014-19 మధ్య రూ. 40 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచి రూ. 5వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అందులోనూ దిగిపోయేనాటికి రూ. వెయ్యి కోట్లు బిల్లులు పెండింగ్ పెట్టి దిగిపోయారు. ఇదే వ్యవహారం ఇప్పుడూ జరుగుతోంది. ఇదంతా ప్రజలకు తెలియకుండా అసెంబ్లీ సాక్షిగా డైవర్షన్ పాలిటిక్స్ కి తెరలేపారు. బడ్జెట్ లో ఉన్న లొసుగులపై ప్రభుత్వాన్ని వైయస్ఆర్సీపీ ప్రశ్నిస్తే వాటికి సమాధానం చెప్పే ధైర్యం లేక కేబినెట్ మీటింగులో రంగయ్య మరణంపై చర్చ పెట్టారు. కేబినెట్ సమావేశంలో ప్రజా సమస్యలను గాలికొదిలేసి సహజ మరణాన్ని అనుమానాస్పద మరణంగా చిత్రీకరించే కుట్రకు తెరలేపారు. సుప్రీంకోర్టు డైరెక్షన్లో సీబీఐ దర్యాప్తు చేస్తున్న వివేకా కేసుపై కేబినెట్లో ముఖ్యమంత్రికి చర్చించాల్సిన అవసరం ఏంటి? అసెంబ్లీలో ఎందుకు చర్చిస్తున్నారు? ఇంత చెబుతున్న చంద్రబాబు.. వివేకాను దారుణంగా నరికి చంపానని ఒప్పుకున్న దస్తగిరి గురించి ఎందుకు మాట్లాడటం లేదు? ఇదంతా చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్.బాబు హయాంలోనే హత్యారాజకీయాలుతన జీవితంలో పాలనలో హత్యారాజకీయాలు చేయలేదని, చూడలేదని చంద్రబాబు చెప్పడం విడ్డూరం. ఆయన బావమరిది బాలకృష్ణ ఇంట్లో జరిగిన కాల్పులు, చనిపోయిన వాచ్మెన్ మరణంపై విచారణ కోరండి. దీంతోపాటు మల్లెల బాబ్జి, వంగవీటి మోహనరంగ హత్య, పింగళి దశరథరామ్ హత్యలపై కూడా సిట్ విచారణ జరిపించవచ్చు కదా! ఇవన్నీ ప్రజలకు తెలియాలి. ఎన్టీఆర్ మానసిక క్షోభకు ఎవరు కారణం? ఆయన ఎలా చనిపోయారో ఈనాటి తరానికి తెలియాలి. పార్టీ ఆఫీసు మీద జరిగిన దాడిపై కూడా చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడాడు. తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చుని పట్టాభి అనే వ్యక్తి నాటి సీఎం వైయస్ జగన్ గురించి అసభ్య పదజాలంతో రెచ్చిపోయినందుకు కాదా? దాడి వెనుక కారకులు తండ్రీకొడుకులు చంద్రబాబు, నారా లోకేష్ కాదా? తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్కసారైనా చంద్రబాబు నీతివంతమైన రాజకీయం చేశాడా? అడుగడుగునా అవినీతి, బంధుప్రీతి, దోపిడీ, వెన్నుపోటు రాజకీయాలు చేసిన వ్యక్తి తన మీద మరకలు లేవని చెబుతున్నాడు’అని మండిపడ్డారు. -
మక్కీకి మక్కీ దిశ యాప్‌ను కాపీ చేసిన చంద్రబాబు ప్రభుత్వం
సాక్షి, విజయవాడ : వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా తన హయాంలో దిశ యాప్‌కు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం అందుబాటులోకి తెచ్చిన యాప్ దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. అయితే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ యాప్‌ను నిర్విర్యం చేసింది. తాజాగా అదే యాప్‌ను కూటమి ప్రభుత్వం కాపీ కొట్టింది. మక్కీకి మక్కీ దిశ యాప్ ఫీచర్ల తోనే శక్తి యాప్ రూపొందించింది. ఆ యాప్ వివరాల్ని అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు ప్రకటించారు. గతంలో దిశ యాప్‌ని చంద్రబాబు, హోంమంత్రి అనిత ఎగతాళి చేశారు. అదే దిశ యాప్‌ని కాపీ కొట్టి నేడు అమలు చేయడం గమనార్హం -
పోసానికి బిగ్ రిలీఫ్.. రేపు విడుదలయ్యే అవకాశం!
తాడేపల్లి : కూటమి ప్రభుత్వం అక్రమంగా పెట్టిన కేసుల్లో ప్రముఖ నటుడు, ప్రముఖ రచయిత పోసాని కృష్ణమురళి రేపు(బుధవారం) విడుదలయ్యే అవకాశం ఉంది. పోసానిపై పెట్టిన అన్ని కేసుల్లోనూ బెయిల్ లభించడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యేందుకు మార్గం సుగమం అయ్యింది. ఈరోజు(మంగళవారం), ఆదోని, విజయవాడ కోర్టుల్లో పోసానికి బెయిల్ లభించగా, నిన్న(సోమవారం) నర్సారావుపేట కోర్టు బెయిల్ ఇచ్చింది. అంతకుముందు రాజంపేట కోర్టు బెయిల్ మంజూరు చేసింది.అయితే పోసానిపై పెట్టిన మొత్తం 17 కేసుల్లో మిగత వాటిల్లో బీఎన్ఎస్ చట్టం 35(3) కింద నోటీసులు ఇవ్వాలని ఇప్పటికే హైకోర్టు ఆదేశించింది. దాంతో పోసానికి బిగ్ రిలీఫ్ లభించింది. కాగా, మహాశివరాత్రి రోజు, ఫిబ్రవరి 26న హైదరాబాద్‌లో పోసానిని అరెస్టు చేశారు అన్నమయ్య జిల్లా సంబేపల్లి పోలీసులు. ఏపీ ప్రభుత్వం కుట్రలు..ఏళ్ల కిందట ప్రెస్ మీట్ లో మాట్లాడిన అంశాలకు ఇప్పడు కేసులు పెట్టారు. పోసానికి న్యాయపరమైన ఊరట లభించకుండా ప్రభుత్వం పన్నాగం పన్నింది. అన్నమయ్య పోలీసుల అరెస్టు తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పోసానిపై కేసులు నమోదు చేశారు. ఎక్కడెక్కడ కేసులు పెట్టింది కూడా బయటకు రానీయకుండా పోలీసులతో సర్కారు కుట్రలు చేసింది. తద్వారా బెయిల్స్ పిటిషన్లు వేయకుండా ప్రయత్నాలు చేసింది. వందల కిలోమీటర్లు తిప్పారు..ఒక్కో కేసులో పీటీ వారెంట్ కోరుతూ పోసానిని వందలకొద్దీ కిలోమీటర్లు తిప్పారు పోలీసులు.హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా రాజంపేటకు..తర్వాత అక్కడ నుంచి నర్సరావుపేటకు, తర్వత గుంటూరుకు, అక్కడ నుంచి కర్నూలు జిల్లా ఆదోనికి, అదోని నుంచి మళ్లీ విజయవాడలోని సూర్యారావుపేటకు తిప్పారు. అపై అక్కడ నుంచి మళ్లీ కర్నూలు జైలుకు తరలించారు. అయితే 67 ఏళ్ల వయసులో, హృద్రోగ సమస్యలతో బాధ పడుతున్న పోసానిని అనారోగ్య సమస్యలున్నా వేధించింది ప్రభుత్వం. ఈ కుట్రను వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ హైకోర్టుకు నివేదించి సమర్థవంతంగా వాదనలు వినిపించింది. పోసానిపై నమోదైన కేసులో 35(3)నోటీసు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. విశాఖపట్నం ఒన్టౌన్లో నమోదైన కేసులో పూర్తిగా విచారణను నిలిపేయాలని ఆదేశాలిచ్చింది.పోసానికి అండగా వైఎస్సార్సీపీహైకోర్టు ఆదేశాల తర్వాత చురుగ్గా దిగువ కోర్టుల్లో న్యాయ స్థానాలను వైఎస్సార్సీపీ లీగల్ సెల్ ఆశ్రయించింది. పోసానికి పూర్తిగా అండగా ఉంది వైఎస్సార్ సీపీ. దాంతో అన్ని కేసుల్లోనూ పోసాని బెయిల్ పొందడంతో రేపు విడుదలయ్యే అవకాశం కనబడుతోంది. -
‘అమరావతిలో వేల ఎకరాల్ని అమ్ముతాం.. అప్పులు తీరుస్తాం’: నారాయణ
సాక్షి,విజయవాడ : అమరావతి భూములపై ఏపీ పురపాలకశాఖ మంత్రి పొంగూరు నారాయణ (Ponguru Narayana) కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు ప్రభుత్వం రైతుల నుంచి వేల ఎకరాల భూముల్ని సేకరించింది. వాటిలో నాలుగువేల ఎకరాలు అమ్మేయనున్నట్లు తెలిపారు.భూములు ధర పెరిగాక రైతుల నుండి సేకరించిన భూముల్లో 4 వేల ఎకరాలు అమ్ముతాం. రైతులకు అభివృద్ధి చేసిన తర్వాత ప్లాట్ లను తిరిగి ఇస్తాం. రైతులు భూములు అమ్మిన డబ్బులతో అప్పులు తీరుస్తాం’ అని వ్యాఖ్యానించారు. -
‘పెరిగిన పోలవరం ఖర్చును ఎవరు భరిస్తారు?’
ఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు, బడ్జెట్ లో పోలవరంకు కేటాయించిన నిధులు, పెరిగిన పోలవరం ప్రాజెక్టు ఖర్చు, విద్యారంగం తదితర అంశాలపై వైఎస్సార్సీపీ తన గళం వినిపించింది. ఉభయ సభల్లోనూ వైఎస్సార్సీపీ ఎంపీలు కొన్ని కీలకాంశాలు లేవనెత్తారు.ఈరోజు(మంగళవారం) పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఎంపీ గురుమూర్తి.. లోక్‌సభలో మాట్లాడుతూ.. ‘పోలవరం ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గించారు. పోలవరం ఎత్తు తగ్గించడం వల్ల స్టోరేజ్ కెపాసిటీ 194 నుంచి కేవలం 115 టీఎంసీలకే పరిమితమవుతుంది. దీనివల్ల సాగునీరు, తాగు నీటికి , విద్యుత్తు ఉత్పత్తి పైన తీవ్ర ప్రభావం పడుతుంది. ఒరిజినల్ పోలవరం డ్యాం ఎత్తు ప్రకారమే నిర్మించాలి.ఇటీవల బడ్జెట్లో పోలవరంకు అరకొరగా రూ. 5936 కోట్లు మాత్రమే కేటాయించారు. పెరిగిన పోలవరం ఖర్చును ఎవరు భరిస్తారు?, పోలవరం సిఈఓ ఆఫీస్ ను ఏపీకి తరలించాలి. ఏపీలో 17 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనుమతులు తీసుకుంది. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం లేఖతో కడప మెడికల్ కాలేజీ పర్మిషన్ ను ఉపసంహరించారు.మౌలిక వసతులు లేవనే రాష్ట్ర ప్రభుత్వం లేఖతో ..మెడికల్ కాలేజీలకు పర్మిషన్ వెనక్కి తీసుకోవడం చరిత్రలో ఇదే తొలిసారి. 17 మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయకూడదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తారా లేదన్న అంశంపై కేంద్రం స్పష్టత ఇవ్వాలి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు ఇస్తారా లేదో చెప్పాలి. దుగ్గరాజపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి. విభజన చట్టం ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఇప్పటివరకు ఈ హామీని నిలుపుకోకపోవడం ప్రజలను మోసం చేయడమే. అమరావతికి ఇచ్చే 15000 కోట్ల రూపాయలను ఎవరు చెల్లిస్తారు?, అమరావతి అప్పులను ఎవరు చెల్లిస్తారనేది స్పష్టం చేయాలి’ అని ఎంపీ గురుమూర్తి డిమాండ్ చేశారు.వైఎస్ జగన్ విద్యారంగం అభివృద్ధి కృషి చేశారురాజ్యసభలో విద్యాశాఖ పద్దులపై వైఎస్సార్సీపీ ఎంపీ గొల్ల బాబురావు మాట్లాడుతూ.. ‘ వైఎస్ జగన్ హయాంలో ఏపీలో విద్యారంగం అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. విద్యా దీవెన, విద్యా వసతి దీవెన కింద రూ. 73 వేల కోట్లు రూపాయిలు విద్యార్థుల కోసం ఖర్చు చేశారు. 45 వేల ప్రభుత్వ పాఠశాలలను నందనవనంగా తీర్చిదిద్దారు. దీన్ని చూసి ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేశాయి. కాలేజీ విద్యను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది కాలేజీలో కేవలం డిగ్రీలు ఇచ్చే సంస్థలుగా మారిపోయాయి. ఎలాంటి నైపుణ్యాలు లేకుండా విద్యార్థులు బయటకు వస్తున్నారు’ అని ఎంపీ గొల్ల బాబురావు స్పష్టం చేశారు. -
పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు
కర్నూల్: ఆదోని కేసులో ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరైంది. నిన్న(సోమవారం) పోసానిని కస్టడీకి ఇవ్వాలనే పిటిషన్ కొట్టివేసిన జేఎఫ్‌సీఎం కోర్టు.. ఈ రోజు(మంగళవారం) బెయిల్ మంజూరు చేసింది. ఆదోని త్రీటౌన్ పీఎస్ లో జనసేన నేత రేణువర్మ ఫిర్యాదుతో 2024 నవంబర్ 14న కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ 353(1) , 353(2), 353(సి) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, విజయవాడ నుంచి పిటి వారెంట్ పై అరెస్టు చేశారు. ఈనెల 5వ తేదీ నుంచి కర్నూలు జైలులో ఉన్నారు పోసాని. బెయిల్ పిటిషన్‌పై సుదీర్ఘ వాదనల తరువాత నిన్న తీర్పు రిజర్వు చేశారు మేజిస్ట్రేట్. అయితే పోసానికి బెయిల్ పిటిషన్‌ను ప్రభుత్వ న్యాయవాదులు తీవ్రంగా వ్యతిరేకించారు. పోసానిని మరింత విచారించాల్సి ఉందని, దూషణల వెనుక ఎవరు ఉన్నారో తేలాల్సి ఉందని, కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం నిన్ననే కస్టడీ పిటిషన్ డిస్మిస్ చేసిన మేజిస్ట్రేట్.. ఈ రోజు బెయిల్ మంజూరు చేశారు.దాంతో పోసాని కృష్ణమురళికి ఇప్పటివరకూ మూడు కేసుల్లో బెయిల్ లభించింది. నరసరావుపేటలో నమోదైన కేసులో పోసానికి నిన్న బెయిల్ మంజూరైంది. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన కేసులో నరసరావుపేట కోర్టు బెయిల్ మంజూరు చేసింది.అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పోసానికి బెయిల్ మంజూరు చేస్తూ కడప మొబైల్ కోర్టు గత శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కేసులోనే పోసాని ఫిబ్రవరి 26వ తేదీన అరెస్టయ్యారు. పోసానిని హైదరాబాద్‌లోని నివాసంలో అరెస్ట్ చేసి.. ఆ మరుసటి రోజు ఓబులవారిపల్లెకు తీసుకెళ్లారు. అటుపై పల్నాడు జిల్లా నరసరావుపేటలో, కర్నూల్ జిల్లా ఆదోనీ పీఎస్‌లలో నమోదైన కేసుల్లో పీటీ వారెంట్ కింద ఆయన్ని తరలించారు. ఈ కేసుల్లో ఉపశమనం కోరుతూ ఆయన పిటిషన్లు వేశారు. మరోవైపు హైకోర్టులోనూ ఆయన వేసిన క్వాష్ పిటిషన్ విచారణ దశలో ఉంది. -
‘కరువు సాయం లేదు...క్రాప్ ఇన్స్యూరెన్స్ లేదు.. ఇప్పుడేమో ఇలా’
అమరావతి: అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూటమి ప్రభుత్వం రైతులకు ఇస్తానన్న రూ. 20 వేలు ఇవ్వకుండా ఇప్పుడు మాట మార్చడంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి తీవ్రంగా తప్పుబట్టారు. రైతులకు పెట్టుబడి సాయం రూ. 20 వేలు ఇస్తామని చెప్పి.. ఇప్పుడు కేంద్రం ఇచ్చే నిధులతో కలిపే అనడం కచ్చితంగా రైతును మోసం చేయడమేని వరుదు కళ్యాణి ఆక్షేపించారు.ఈ రోజు(మంగళవారం) శాసనమండలిలో వరుదు కళ్యాణి మాట్లాడుతూ..‘ మంత్రి అచ్చెన్నాయుడి వ్యాఖ్యలు తీవ్ర నిరాశను కల్గించాయి. పెట్టుబడి సాయం రూ. 20 వేలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. ఇప్పుడు కేంద్ర సాయంతో కలిపి రూ. 20 వేలు అంటున్నారు. మండలి సాక్షిగా రైతుకు వెన్నుపోటు పొడిచారు. ఈ ప్రభుత్వం రైతులను మోసం చేసింది. అన్నమో రామచంద్రా అనే పరిస్థితిని రైతుకు తీసుకొచ్చారు. జగన్ మోహన్ రెడ్డి పాలనలో వ్యవసాయం పండుగలా సాగింది.కూటమి పాలనలో సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. గత ప్రభుత్వం పాలనలో నాణ్యమైన విత్తనాలు అందించారు. కూటమి పాలనలో నాణ్యమైన విత్తనాలే దొరకలేదు. పంటలకు గిట్టుబాటు ధర లేదు. కరువు సాయం లేదు.. క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. మిర్చికి గతంలో రూ. 21 వేలకు పైగా మద్దతు ధర ఉంది. వైఎస్ జగన్ మిర్చి యార్డ్ ను సందర్శించే వరకూ ఈ ప్రభుత్వంలో కదిలిక రాలేదు. కూటమి ప్రభుత్వం చేసే సమీక్షలు రైతుకి మేలు చేయడానికా?.. కాలక్షేపానికా?’ అని ప్రశ్నించారు వరుదు కళ్యాణి. రూ. 8కి టమోటా కొంటామని చెప్పారు.. ఇప్పటివరకూ ఒక్క కిలో టమోటా అయినా ప్రభుత్వం కొనుగోలు చేసిందా? అని నిలదీశారు. -
రైతన్న దగా.. అన్నదాత సుఖీభవపై చంద్రబాబు సర్కార్ యూటర్న్
సాక్షి,విజయవాడ : రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ రైతన్నను దగా చేసింది. అన్నదాత సుఖీభవపై యూటర్న్ తీసుకుంది. ఎన్నికల మేనిఫెస్టోలో రూ.20 వేలు ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించింది. ఇప్పుడు రైతులకు ఇచ్చేది రూ.14వేలేనని తేల్చి చెప్పింది. అన్నదాత సుఖీభవపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటన ఇచ్చారు. కేంద్రం ఇచ్చే రూ.6 వేలుతో కలిపి రూ.20 వేలు ఇస్తామని, మేనిఫెస్టోలో కూడా అదే చెప్పాము అంటూ అబద్ధాలు చెప్పారు. అయితే, మేనిఫెస్టోలో రూ.20 వేలు ఆర్థిక సహాయం అందిస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఎక్కడ కేంద్రం సహాయం ఇస్తేనే అన్నదాత సుఖీభవ ఇస్తామని ప్రస్తావించలేదు. ఇప్పుడు అధికారంలోకి రాగానే రైతులకు ఎగనామం పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం నుండి రూ.14 వేలే ఇస్తామంటూ కూటమి ప్రభుత్వం యూ టర్న్ తీసుకుంది. కూటమి ప్రభుత్వ నిర్ణయంపై రైతన్నులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
రాజధానికి కేంద్రం నిధులపై స్పష్టత లేదు: వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి
ఢిల్లీ: ఏపీ రాజధాని నిర్మాణం కోసం కేంద్రం అందించే నిధులపై స్పష్టత లేదన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఢిల్లీలో ఉన్న ఎంపీ గురుమూర్తి.. సాక్షి టీవీతో మాట్లాడుతూ.. రాజధానికి కేంద్రం అందిస్తున్న నిధులపై స్పష్టత లేదన్నారు.15 వేల కోట్ల రూపాయల సహాయం అందిస్తామన్న కేంద్రం 1500 కోట్లకే పరిమితం కావడం ఏమిటి ? , మిగిలిన సొమ్ముకు తాము కేవలం ఫెసిలిటేటర్ గానే వ్యవహరిస్తామని చెబుతోంది. రాజధాని అప్పుల చెల్లింపు బాధ్యత తమదేనని కేంద్ర ప్రభుత్వం ప్రకటించలేదు. ఇప్పటికే ఏపీ అప్పుల కుప్పగా మారింది. ఏపీ శ్రీలంక, జింబాబ్వే గా మారిందని గతంలో గగ్గోలు పెట్టిన కూటమి నేతలు రాజధాని అప్పులపై ఏం మాట్లాడుతారు. అలాగే రాజధానికి ఇస్తున్న అప్పుల కు విధిస్తున్న షరతులు , నిబంధనలేమిటో బయట పెట్టలేదు. ప్రపంచ బ్యాంకు లాంటి సంస్థలు పన్నులు పెంచాలని, సంస్థలను తాకట్టు పెట్టమని షరతులు పెడుతుంటాయి. అలాంటి షరతులు రాజధాని అప్పులకు ఏమైనా విధించారా? ఉంటే వాటిని బహిరంగపరచాలి’ అని ఆయన డిమాండ్ చేశారు. -
పిఠాపురం పీఠాధిపతి ఎక్కడ?
సాక్షి,తాడేపల్లి : పిఠాపురం పీఠాధిపతి ఎక్కడ? అని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల ప్రశ్నించారు. జ్యోతి కాశినాయున క్షేత్రంలో కూల్చివేతలను పరిశీలించారు. ఈ ప్రభుత్వం ఆధ్యాత్మిక స్థలాలను కూల్చివేయడం దారుణం. విధ్వంస పాలన అంటే ఇది. సనాతన ధర్మాన్ని కాపాడతానన్న పిఠాపురం పీఠాధిపతి ఎక్కడికి వెళ్ళాడు..? ఆయన సొంత శాఖ అధికారులు కూల్చివేతకు దిగితే ఎందుకు నోరుమెదపడం లేదు..? అటవీ అనుమతులు తీసుకురావాల్సిన ఆయన ఎందుకు మిన్నకున్నారు..? ఈ కూల్చివేతకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి’ అని డిమాండ్ చేశారు. -
ఏపీ హైకోర్టులో కూటమి సర్కార్‌కు ఎదురుదెబ్బ
అమరావతి, సాక్షి: కూటమి సర్కార్‌కు ఏపీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. సోషల్ మీడియా యాక్టివిస్ట్ అవుతు శ్రీధర్ రెడ్డి రిమాండ్ పోలీసులు వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. తక్షణమే ఆయన్ని విడుదల చేయాలని ఆదేశిస్తూ.. పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.శ్రీధర్ రెడ్డి అరెస్టులో పోలీసులు అత్యుత్సాహం చూపించారన్న న్యాయస్థానం.. రిమాండ్ విధించిన కింది కోర్టు తీరును కూడా తప్పుబట్టింది. ఇదిలా ఉంటే.. అక్రమ కేసులో అవుతు శ్రీధర్ రెడ్డిని ఫిబ్రవరి 24వ తేదీన విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ఆయనకు మార్చి 10వ తేదీ వరకు రిమాండ్ విధించింది. -
వైఎస్సార్సీపీ ‘యువత పోరు’కు అంతా సిద్ధం
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో పేద విద్యార్థులు, నిరుద్యోగులు తరఫున కూటమి ప్రభుత్వంపై పోరుకి వైఎస్సార్సీపీ సిద్ధమైంది. రేపు(బుధవారం) ‘‘యువత పోరు’’ పేరుతో ధర్నా కార్యక్రమం నిర్వహించాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ శ్రేణులను ఆదేశించారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జెండావిష్కరణలు చేయనున్నారు. అనంతరం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చంద్రబాబు ప్రభుత్వ మోసాలపై విద్యార్థులు, నిరుద్యోగులు నినదించనున్నారు. ధర్నాలు నిర్వహించనున్నారు.16,347 పోస్టులతో డీఎస్సీ పేరుతో చంద్రబాబు చేసిన తొలి సంతకం అభాసుపాలైంది. 9 నెలలు కావొస్తున్నా డీఎస్సీ నోటిఫికేషన్ అతీగతీలేదు. వైఎస్ జగన్ తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను కూటమి సర్కార్ ప్రైవేటుపరం చేసింది. పేద, మధ్య తరగతి విద్యార్థులకు వైద్య విద్యను కూడా కూటమి ప్రభుత్వం దూరం చేసింది. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలంటూ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.రాష్ట్రంలో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. మూడు త్రైమాసికాల నుండి ఫీజులు ఇవ్వకుండా విద్యార్థులను చంద్రబాబు వేధిస్తున్నారు. నిరుద్యోగ భృతి విషయంలో కూటమి ప్రభుత్వం మాట తప్పింది. నిరుద్యోగ భృతి పేరుతో నెలకు రూ.3 వేలు ఇస్తామంటూ యువతను మోసం చేశారు. ఉద్యోగాల్లేక యువత అల్లలాడిపోతోంది.విద్యార్థుల జీవితాలతో కూటమి సర్కార్ ఆటలు: కన్నబాబుకాకినాడ జిల్లా: పేద విద్యార్ధుల భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం ఆటలాడుకుంటోందని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో-ఆర్డినేటర్ కురసాల కన్నబాబు మండిపడ్డారు. మంగళవారం ఆయన యువత పోరు పోస్టర్‌ను ఆవిష్కరించారు. రూ.4,800 కోట్లు ఫిజు రీయింబర్స్మెంట్ బకాయిలను కూటమి ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిందని ధ్వజమెత్తారు.‘‘ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ప్రవేశపెట్టిన ఘనత దివంగత మహానేత వైఎస్సార్‌దే. ఆయన తనయుడిగా నాలుగు అడుగులు ముందుకు వేసి ఈ పథకాన్ని వైఎస్ జగన్ విస్తృతంగా అమలు చేశారు. ప్రతి వర్గాన్ని మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదే. మోసపోయిన ప్రజలకు అండగా వైఎస్సార్సీపీ ఉంటుంది. చంద్రబాబు సర్కార్‌ను నిలదీయడానికి వైఎస్సార్సీపీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది’’ అని కన్నబాబు పేర్కొన్నారు. -
కర్ణాటక బస్సు బీభత్సం.. నలుగురి మృతి
సాక్షి, కర్నూలు జిల్లా: కర్ణాటక గంగావతి డిపోకు చెందిన కేఎస్ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. గంగావతి నుంచి రాయచూర్‌కు వెళ్తున్న బస్సు ఆదోని మండలం పాండవగళ్లు గ్రామ సమీపంలో ముందు వెళ్తున్న రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు అక్కడికక్కడ డే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.మృతి చెందిన వారిలో ఆదోని మండలం కుప్పగళ్లు గ్రామానికి చెందిన భార్యా భర్తలు, కర్ణాటకలోని మాన్వికి చెందిన అక్కా తమ్ముళ్లు ఉన్నారు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
వెంకయ్య నాయుడు గారూ.. అవేం మాటలు?
మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును పొగడ్తలతో ముంచెత్తారు. మనకెవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. అయితే.. ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలపై మాత్రం చర్చ జరగాల్సిందే. ఎన్నికల్లో గెలిచేందుకు మూడు పార్టీలు కలిసికట్టుగా వచ్చి అబద్ధాలు ప్రచారం చేయడం, ఆచరణ సాధ్యం కానీ అనేక హామీలివ్వడం.. ఆపై వాటిని విస్మరించడం వంటి అంశాలపై వెంకయ్య నాయుడు తన అభిప్రాయం చెప్పకుండా.. చేయగలిగిన పనులపైనే ఎక్కువ దృష్టి పెడితే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఇంతకీ ఈ వ్యాఖ్యకు అర్థమేమిటి?. ఎన్నికల హామీలు పట్టించుకోవద్దని చెప్పడమే అవుతుంది కదా?. ఉపరాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన తరువాత వెంకయ్య నాయుడు(M Venkaiah Naidu).. రాజకీయాలకు దాదాపుగా దూరంగా ఉంటున్నారు. బీజేపీ కార్యక్రమాల్లోనూ అప్పుడప్పుడూ మాత్రమే పాల్గొంటున్నారు. స్వర్ణభారతి ట్రస్టు కార్యకలాపాల్లో భాగస్వామి అవుతుంటారు. ఆయన ఉచిత పథకాలకు వ్యతిరేకమని ప్రతీతి. ఈ విషయాన్ని ఆయన చాలాసార్లు బహిరంగంగానే చెప్పుకున్నారు కూడా. అయితే.. కొన్ని దశాబ్దాలుగా మిత్రుడిగా ఉన్న చంద్రబాబు నాయుడికి ఈ విషయాలేవీ ఆయన చెప్పినట్లు కనిపించదు. 👉ఇటీవల వెంకయ్య నాయుడు విశాఖపట్నంలో మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన పుస్తక ఆవిష్కరణ సభలో చంద్రబాబు(Chandrababu)ను అభివృద్ది కాముకుడిగగా ప్రశంసించారు. అయితే సూపర్సిక్స్తోపాటు 150 ఇతర హామీలు ఇవ్వడంలో ఆయనకు ఏ అభివృద్ధి కాముకత కనిపించిందో తెలియదు. ఏదో రకంగా మిత్రుడు గెలిచారన్న ఆనందం ఉంటే ఉండవచ్చు??. చంద్రబాబు ప్రభుత్వం చేసిన హామీలను అమలు చేస్తోందా? లేదా? అనేది ఆయనకు తెలియకుండా ఉంటుందా!. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని హామీలు అమలు చేయాలని సూచించాల్సిన వెంకయ్య.. చేయగలిగిన పనులపైనే దృష్టి పెట్టాలని చెప్పడం ప్రజలను మోసం చేయడమే అవుతుంది కదా. 👉చంద్రబాబు ఆలోచనలు మంచివని వెంకయ్య సర్టిఫికెట్ ఇస్తూ.. అవి చాలా ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. అవి ఏరకంగా ఉంటాయి? సూపర్‌సిక్స్‌తో సహా అనేక వాగ్దానాలు చేయడంలో ఉన్న మంచి ఆలోచనలు ఏమిటో కాస్త వివరంగా చెప్పి ఉంటే జనానికి కూడా బాగా అర్థమయ్యేది కదా?. ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఇస్తామని టీడీపీ, జనసేనలు ఎన్నికల హామీ ఇచ్చాయి. కాని తాజాగా ప్రవేశపెట్టన బడ్జెట్లో ఆ ఊసే ఎత్త లేదు. ఇది మంచి ఆలోచనా కాదా? అదే కాదు..నిరుద్యోగులకు రూ.3,000 భృతి ఇస్తామని,.. వలంటీర్లకు జీతం రూ.10,000 చేస్తామని రాష్ట్రంలో ఎక్కడైనా తిరిగే విధంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని, బలహీన వర్గాల వారికి 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని, తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్ధికి రూ.15 వేలు పంపిణీ చేస్తామని.. పలు వాగ్దానాలు చేశారు. ఇవన్నీ చంద్రబాబులో వచ్చిన మంచి ఆలోచనలే అని వెంకయ్య చెప్పదలిచారా?.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు కలిసి చేసిన వాగ్దానాల విలువ ఏడాదికి సుమారు లక్షన్నర కోట్ల వరకు ఉండొచ్చు. కేవలం సూపర్ సిక్స్ హామీలకే రూ.79,179 కోట్లు అవసరమవుతాయి. కాని చంద్రబాబు ప్రభుత్వం కేవలం రూ.17,179 కోట్లే కేటాయించడం మంచి ఆలోచనేనని వెంకయ్య చెబుతారా?. 👉విద్య సంగతి ఎలా ఉన్నా మద్యం బాగా సరఫరా చేస్తున్నామని చెబుతున్న ఏపీ ప్రభుత్వం తీరు చూసి వెంకయ్య నాయుడు పరవశిస్తున్నారా?. చంద్రబాబు మాతృబాషలోనే విద్యా బోధన జరగాలని అన్నందుకు వెంకయ్య సంతోషించారు. విద్యాబోధన పదో తరగతి వరకు మాతృభాషలోనే ఉండాలని కూడా ఆయన సలహా ఇచ్చారు. ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తెలుగులో జరగాలని అన్నారు. మరి ప్రభుత్వంలో ఆ పరిస్థితి ఉందో, లేదో వెంకయ్య అడిగి తెలుసుకుని ఉండాలి. అలాగే చంద్రబాబు మనుమడు కాని, ఆయన బంధుమిత్రులలో ఎందరు తెలుగు మీడియంలో విద్యను అభ్యసిస్తున్నారో ఆరా తీసుకుని మెచ్చుకుని ఉంటే బాగుండేది కదా!. 👉ఇక్కడే సమస్య వస్తోంది. తెలుగు మీడియం అంటూ ప్రచారం చేసే చంద్రబాబు, వెంకయ్య నాయుడు తదితర ప్రముఖుల కుటుంబాలలో ఎంతమంది దానిని పాటిస్తున్నారో ఇంతవరకు ఎవరూ చెప్పడం లేదు. కేవలం పేదలు, బలహీన వర్గాల వారు చదువుకునే ప్రభుత్వ స్కూళ్లలో మాత్రమే తెలుగు మీడియం ఉండాలని అనడంలో ఆంతర్యం ఏమిటో తెలియదు. సోషల్ మీడియాను అదుపులో పెట్టకపోతే పరిణామాలేమిటో ఏపీలో చూశామని, దాని పరిణామాలు అనుభవిస్తున్నారని ఆయన అన్నారు. వెంకయ్య నాయుడు కూడా ఏదో తెలుగుదేశం నాయకుడు మాట్లాడినట్లే స్పీచ్ ఇవ్వడం దురదృష్టకరం. వైఎస్సార్సీపీ హయాంలో టీడీపీ సోషల్ మీడియా ఎంత అరాచకంగా పోస్టులు పెట్టినా ఈయన ఎన్నడైనా నోరు తెరిచారా? అప్పుడేమో భావ వ్యక్తికరణ స్వేచ్చ అని చంద్రబాబు.. ఎల్లో మీడియా ప్రచారం చేశారే. సీఎంగా ఉన్న జగన్‌ను పట్టుకుని బూతులు తిట్టినా కేసులు పెట్టడానికి వీలులేదని వాదించారే. ఆ విషయాలు వెంకయ్య నాయుడుకు తెలియకుండా ఉంటాయా? 👉అధికారంలోకి వచ్చాక సైతం వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ వారు ఎంత అరాచకంగా వ్యవహరిస్తునేది ఆయన తెలుసుకోలేక పోతున్నారు. కావాలంటే టీడీపీ వారు పెట్టిన బండబూతుల పోస్టింగులు చూడాలని ఆయన భావిస్తే.. మాజీ మంత్రులు రోజా, అంబటి రాంబాబు వంటివారు పంపిండానికి సిద్దంగా ఉంటారు. అచ్చంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి చదివి అవి రాసే పచ్చి అబద్దాలనే ఆయన ప్రచారం చేస్తున్నట్లుగా ఉంది. ఉప రాష్ట్రపతి పదవి చేసిన పెద్దాయన ఎవరూ అభ్యంతరకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టరాదని అన్ని పార్టీల వారికి చెప్పాలి కాని, ఒకవైపే మాట్లాడడం సమంజసం అనిపించదు.👉అంతెందుకు జగన్ ప్రభుత్వం(Jagan Government)పై ఎన్ని అసత్య ఆరోపణలు చంద్రబాబు, పవన్, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా ప్రచారం చేసింది తెలియదా?. వెంకయ్య నాయుడుకు అవి సూక్తి ముక్తావళిలా నిపించేవేమో తెలియదు. అప్పులపై చంద్రబాబు, పవన్, పురందేశ్వరి తదితరులు చేసిన పచ్చి అబద్దాలు ఇప్పుడు ఆధార సహితంగా కనిపిస్తున్నాయే. అసెంబ్లీ సాక్షిగానే స్వయంగా ఆర్థిక మంత్రి కేశవ్ అవి అబద్దాలని అంగీకరించారే. అలా ఆర్గనైజ్డ్గా మూడు పార్టీల నేతలు అబద్దాలు ప్రచారం చేయడం నేరమో, కాదో వెంకయ్య నాయుడు చెప్పగలిగి ఉంటే బాగుండేది. వైఎస్సార్సీపీ వారికి పనులు చేయవద్దని ఆదేశిస్తున్న చంద్రబాబు నాయుడును అభివృద్ధి కాముకుడని, మంచి ఆలోచనలు కలిగిన వ్యక్తి అని ప్రశంసిస్తుంటే ప్రజలు ఏమనుకోవాలి?. కనీసం అలాంటి వివక్ష వద్దని చంద్రబాబుకు సలహా ఇవ్వలేక పోయారే! ఏది ఏమైనా ఎమర్జెన్సీలో జైలుకు వెళ్లిన వెంకయ్య నాయుడు.. ఏపీలో ఇప్పుడు ఉన్న ఎమర్జెన్సీని సమర్థిస్తున్నట్లు మాట్లాడడం, కనిపిస్తున్న కక్షపూరిత రాజకీయాలు, అరాచక పరిస్థితులపై స్పందించ లేకపోవడం బాధాకరం.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాలా వ్యాఖ్యాత. -
ఏ ఇంటి తలుపు తట్టినా... గుండెల్ని పిండేసే ఉద్దానం కథలు
నిత్యం పంటలతో తొణికిసలాడే ఉద్దానం విషాదాలకు నిలయంగా మారింది. ఏ ఇంటి తలుపుతట్టినా కన్నీటిచారలే కనిపిస్తున్నాయి. గుండెలను పిండేసే కిడ్నీ బాధలు అడుగడుగునా తారసపడుతున్నాయి. ఇంటికి పెద్ద దిక్కు కిడ్నీ వ్యాధితో మంచాన పడితే.. ఆ పెద్ద దిక్కును దక్కించుకోవడానికి ఉన్నదంతా అమ్మేసి రోడ్డున పడ్డ కుటుంబాల దర్శనమిస్తున్నాయి. ఎదిగొచ్చిన కన్న కొడుకు కిడ్నీ వ్యాధితో కళ్లేదుటే కూలిపోతుంటే భరించలేని ఆ తల్లిదండ్రులు, భారీగా అప్పులు చేసి ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు. ఆ కుటుంబాలను ఒకసారి పలకరిస్తే... – ఇచ్ఛాపురం రూరల్ ఇల్లు అమ్మేశాం భర్తే సర్వస్వంగా భావించి తన ఐదో తనాన్ని కాపాడుకునేందుకు నీడనిచ్చే ఇంటిని అమ్మేసి అతడిని రక్షించుకునే పనిలో పడింది ఈ ఇల్లాలు. ఇచ్ఛాపురం మండలం నీలాపపుట్టుగ గ్రామానికి చెందిన కోనేటి తులసీరావు, దమయంతి దంపతులకు పిల్లలు లేకపోవడంతో ఒకరి కొకరు కంటి పాపల్లా బతుకుతున్నారు. విసనకర్రలు తయారు చేస్తూ ఊరూరా తిరిగి అమ్ముతూ, వచ్చే ఆదాయంతో కడుపునింపుకునేవారు. అయితే ఈ దంపతులపై కిడ్నీ భూతం పంజా విసిరింది. ఐదేళ్ల క్రితం కిడ్నీ వ్యాధికి గురైన తులసీరావును రక్షించుకునేందుకు శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో భర్తను చేరి్పంచింది. ఖరీదైన వైద్యం కోసం భార్య దమయంతి రెండు ఇళ్లను అమ్మేసింది. 8 నెలలు నుంచి వ్యాధి మరింత తీవ్రరూపం దాల్చడంతో ప్రస్తుతం కవిటిలో డయాలసిస్ చేయిస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న అరకొర మందులతో ఇబ్బంది పడుతున్న భర్త బాధను చూడలేక ప్రస్తుతం తాము నివసిస్తున్న ఇంటిని సైతం తాకట్టుపెట్టింది. రోజుకు పది విసనకర్రలు తయారు చేసి అమ్మితే రూ.100లు వస్తుందని, అయితే ఆ డబ్బులు మందులకే సరిపోవడం లేదని వాపోతోంది.ఉన్నదంతా వైద్యానికే ఇచ్ఛాపురం మండలం సన్యాసిపుట్టుగ గ్రామానికి చెందిన ఆయన పేరు నందూరి విజయ భూషణ్. ఛండీగడ్‌లో కూలి పనులు చేసుకొని కుటుంబాన్ని పెంచుకుంటూ వస్తున్న దశలో కిడ్నీ మహమ్మారికి గురయ్యాడు. శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ఖరీదైన చికిత్స తీసుకున్నప్పటికీ ఫలితం కనిపించలేదు. రూ.లక్షలు అప్పులు చేసి నెలకు రూ.20 వేలు చొప్పున చెల్లించి ఏడాది పాటు డయాలసిస్ చేయించుకున్నాడు. ప్రస్తుతం కవిటిలో డయాలసిస్ చేయించుకుంటున్నారు. డయాలసిస్‌కు వెళ్లిన ప్రతిసారి కేవలం ఆటో ఖర్చులే రూ.600 వరకు అవుతున్నాయని, ప్రభుత్వం ఇచ్చే పింఛన్ ఆటో ఖర్చులకే అయిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కళ్లముందు అప్పులు కనిపిస్తుంటే తమ కుటుంబ భవిష్యత్తు ఎలా ఉంటుందోననే భయమేస్తోందని విచారం వ్యక్తం చేస్తున్నాడు. మునుపటిలా 108 వాహనం ద్వారా తమను ఆస్పత్రికి తీసుకెళ్లడం, రావడం వంటి సదుపాయాలు కల్పించాలని కోరుతున్నాడు.ఇదీ చదవండి: అప్పుడు వెడ్డింగ్ గౌను, ఇపుడు ఎంగేజ్మెంట్ రింగ్ : సమంత అంత పనిచేసిందా?నాడు భర్త, కొడుకు – నేడు తల్లి కవిటి మండలం బొరివంక గ్రామంలోని హరిజనవాడకు చెందిన ఈమె పేరు బలగ కామాక్షి. భర్త తలయారీగా పనిచేస్తూ పన్నెండేళ్ల కిత్రం మూత్రపిండాల వ్యాధితో మృతి చెందగా, తండ్రి ఉద్యోగాన్ని సంపాదించిన కొడుకు బాలరాజు తల్లితో పాటు భార్య, పిల్లలను సాకుతూ వచ్చాడు. విధి ఆడిన వింత నాటకంలో కొడుకు బాలరాజు సైతం కిడ్నీవ్యాధి బారినపడ్డాడు. కొడుకు వైద్యం కోసం తల్లి అప్పులు చేసినా ఎంతో కాలం బతకలేదు. ఈ పిరిస్థితుల్లో కోడలు పిల్లలను వదిలేసి వెళ్లిపోయింది. దీంతో ఎదిగొచ్చిన పిల్లలను పెంచి పోషించే బాధ్యత కామాక్షిపై పడింది. అప్పులు చేసి పిల్లలకు పెళ్లి చేసిన కామాక్షి, ఇప్పుడు తాను సైతం కిడ్నీ భూతం కబంధ హస్తాల్లో చిక్కుకుంది. నెలకు సుమారు రూ.10 వేలు వరకు వైద్యానికే ఖర్చవుతోందని, ప్రభుత్వం వితంతు పింఛన్ మాత్రమే ఇస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తోంది -
TDP: చెరువు దగ్గరకొస్తే.. తేల్చుకుందాం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: విజయనగరం జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి సంధ్యా గజపతిని తోటి టీడీపీ నాయకుడు, నీటి సంఘం అధ్యక్షుడు, చౌదరి బాబ్జీ అనుచరుడు సంపతిరావు గణపతి ఫోన్ చేసి బెదిరించారు. పల్లవాని చెరువు భూమిని ఆనుకుని ఆక్రమించారని చెరువుల పరిరక్షణ పేరుతో ఫిర్యాదు చేయడమేంటని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ‘సత్తా ఉంటే.. చెరువు దగ్గరకొస్తే తేల్చుకుందాం. అది చెరువు అని ఉందా. నీకు జ్ఞానం ఉందా?’ అని రాత్రి 9.20గంటల సమయంలో ఫోన్ చేసి ఇష్టారీతిన మాట్లాడారు. దీంతో ఆమె పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. జిల్లాలోని పలుచోట్ల చెరువులు ఆక్రమణకు గురయ్యాయని, ఆక్రమణలు తొలగించాలని కోరుతూ ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్‌లో ఆ సంఘం ప్రతినిధులు కృష్ణమూర్తినాయుడు, సంధ్యా గజపతి తదితరులు ఫిర్యాదు చేశారు.ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నాయకుడు, నీటి సంఘం అధ్యక్షుడు సంపతిరావు గణపతి నేరుగా సంధ్యా గజపతికి రాత్రి 9.20గంటల సమయంలో ఫోన్ చేసి బెదిరిస్తూ మాట్లాడారు. డీ పట్టాయే కొన్నానని ఒప్పుకుంటూనే.. ‘ఇంకా ఏమీ చెరువులు కనిపించలేదా? బాబ్జీ చెరువును జన్మలో తీయించగలవా? ఊర్లో పెద్ద చెరువు 165ఎకరాలు ఉంటే 60ఎకరాలకు వస్తే అప్పుడెక్కడికి వెళ్లిపోయావు? చెరువులన్నీ తీయడానికి పోటుగెత్తివా...మండలంలో అన్నీ తీయ్...రాష్ట్రంలో ఉన్న చెరువులన్నింటిని తీయ్. అప్పుడు ఇక్కడికి రా...సత్తా ఉంటే చెరువు దగ్గరికి రా..’ అని బెదిరించారు. ‘రికార్డు చేసుకో...ఎవరికిచ్చినా నష్టం లేదు’ అని వార్నింగ్ ఇచ్చారు.ఫిర్యాదులో పేర్కొన్న చెరువు వివరాలివి ఎచ్చెర్ల రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 1బీలోని ఎకరా 58సెంట్లు మేర భూమిని 1971లో మొహమ్మద్ ఫజుల్లాత్ అనే వ్యక్తికి డీ పట్టా కింద ఇచ్చారు. అయితే, ఈ భూమిని తర్వాత సంపతిరావు గణపతితో పాటు మరో నలుగురు కొనుగోలు చేశారు. రికార్డుల్లో కూడా అనుభవ స్వభావం కొనుగోలు అని నమోదు చేశారు. దీనిపై ఫిర్యాదులు వెళ్లాయి. సుధాసాగర్ అనే తహసీఉన్నప్పుడు డీ పట్టా భూమిని కొనుగోలు చేయడం కుదరదని, నిబంధనల ప్రాప్తికి అమ్మకం, కొనుగోలు చేయకూడదని, దీన్ని స్వాధీన పర్చుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని విచారణలో నిగ్గు తేల్చడమే కాకుండా దాన్ని ప్రభుత్వ భూమిగా మార్చేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పల్లవాని చెరువుకు ఆనుకుని ఉన్న ఈ భూమిలో ఉన్న వాటిని తొలగించాలని ఆదేశాలిచ్చారు. అప్పట్లో సదరు ఉత్తర్వుల మేరకు తొలగింపులు జరిగాయి. కానీ మళ్లీ అక్కడే కట్టడాలు జరిగాయి. వాటిని తొలగించాలని కోరుతూ మళ్లీ సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్‌లో ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి «ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు చేసిన వారిలో సంధ్యా గజపతి కూడా ఉండటంతో ఆమెకు సంపతిరావు గణపతి అనే వ్యక్తి ఫోన్ చేసి బెదిరింపులకు దిగారు. ఈ ఫోన్ సంభాషణను సంధ్యా గజపతి రికార్డు చేశారు. దీన్ని పట్టుకుని పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని సోమవారం రాత్రి మీడియాను ఆశ్రయించి జరిగిందంతా వివరించారు. దీనిపై గణపతిని ‘సాక్షి’ వివరణ కోరగా.. తాను మాట్లాడానని, తన భూమి విషయంలో ఫిర్యాదులు చేస్తున్నారని, ఆమె రికార్డు చేస్తుందని తెలిసినా కూడా మాట్లాడానని, తానేమీ బెదిరించలేదని, ఆమే తిరిగి బెదిరించిందని తెలిపారు. -
బుడమేరు వరద సాయంలో చంద్రబాబు సర్కార్ విఫలం: బొత్స
సాక్షి, అమరావతి: వరద సహాయంలో కూటమి సర్కార్ విఫలమైందని విపక్షనేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. బుడమేరు వరద సాయంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, వైఎస్ జగన్ ప్రకటించిన కోటి రూపాయలను మేమే బాధితులకు అందించామని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని.. అందుకే మేమే స్వయంగా మా పార్టీ తరపున బాధితులకు సాయం అందించామని బొత్స తెలిపారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడుతూ, వరద బాధితుల్లో అనేక మందికి ఇంకా పరిహారం అందలేదని మండిపడ్డారు. వరద సహాయం విషయంలో ప్రభుత్వం విఫలమైంది. ఆపరేషన్ బుడమేరు అన్నారు.. ఇప్పటివరకు ఏం చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రుహుల్లా మాట్లాడుతూ.. బుడమేరు గేట్లను ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి చేయలేదని.. వరదల తర్వాత బుడమేరును ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ఇప్పటికీ అనేకమంది బాధితులు కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు. ఒక ఇంటికి పరిహారం ఇచ్చి 10 ఇళ్లకు ఇచ్చినట్లు రాసుకున్నారు. అందరికీ సాయం అందిందని చెప్పడం పచ్చి అబద్ధమని రుహుల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విధి రాత: ప్రసవం కోసం వెళ్తూ..!
మరో రెండు రోజుల్లో ఆమెకు ప్రసవం. ఆ దంపతుల ఆలోచనలన్నీ పుట్టబోయే బిడ్డపైనే ఉన్నాయి. అంతా సవ్యంగా జరగాలని దేవుళ్లందరికీ మొక్కారు. డాక్టర్లు సోమవారం నుంచే ఆస్పత్రిలో ఉండిపొమ్మన్నారు. కానీ వారి విధిరాత మరోలా ఉంది. వస్తువులన్నీ సర్దుకుని వస్తామని చెప్పి వచ్చేశారు. అదే వారి తప్పైపోయింది. ఇంటికి వెళ్తుంటే బస్సు రూపంలో మృత్యువు ఎదురొచ్చింది. తల్లిని, కడుపులోని బిడ్డను తనతో తీసుకెళ్లిపోయి.. కుటుంబానికి శోకం మిగిల్చింది. శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా కేంద్రంలోని డేఅండ్‌నైట్ కూడలి సమీపంలో సోమవారం జరిగిన ప్రమాదంలో యంపాడ రాజేశ్వరి(20)(Rajeshwari) అనే నిండు గర్భిణి దుర్మరణం పాలయ్యారు. మరో 48 గంటల్లో ఆమె ప్రసవానికి సిద్ధమవుతుండగా.. ఈ దుర్ఘటన జరగడంతో కుటుంబం తల్లడిల్లిపోతోంది. స్కూటీని(Scooty) ఆర్టీసీ బస్సు (rtcbus)ఢీకొట్టడంతో ఆమె బస్సు చక్రాల కింద నలిగిపోయి ప్రాణాలు విడిచారు. ఘటనలో ఆమె భర్త దుర్గారావు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ట్రాఫిక్ సీఐ నాగరాజు, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. ఎచ్చెర్ల మండలం కుంచాల కూర్మయ్యపేటకు చెందిన యంపాడ దుర్గారావు అర్బన్ కాలనీలో తన ఇంటికి సమీపంలోనే టిఫిన్‌షాపు నడుపుతున్నారు. ఆయనకు అదే గ్రామానికి చెందిన రాజేశ్వరితో నాలుగేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఏడాదిన్నర వయసు గల పాప ఉంది. రాజేశ్వరి మళ్లీ గర్భం(pregnant woman) దాల్చడంతో శ్రీకాకుళం రిమ్స్‌లో తరచూ చూపిస్తున్నారు. ఆ క్రమంలోనే సోమవారం ఉదయం 9:30 గంటలకు దంపతులిద్దరూ స్కూటీపై బయల్దేరారు. రిమ్స్‌లో వైద్యులకు చూపించాక బుధవారం ప్రస వం జరిగే అవకాశం ఉందని, ఇప్పుడు వెళ్తే రావడం కష్టమవుతుంది కాబట్టి సోమవారమే ఇక్కడ ఉండిపోవాలని వైద్యులు సూచించారు. కానీ వస్తువులన్నీ సర్దుకుని వచ్చేస్తామని భార్యాభర్తలు తిరుగు ప్రయాణమయ్యారు. డేఅండ్‌నైట్ కూడలి సమీపానికి ఉదయం 11.48గంటలకు వారు బండిపై చేరుకున్నారు. కూడలి దాటుకుని బ్రి డ్జి వైపు వెళ్లిన కొద్ది సేపటికే విశాఖ వెళ్తున్న ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు వీరిని దాటుకుంటూ వెళ్లింది. అయితే బస్సు స్కూటీ అద్దాన్ని తాకడంతో.. బండి అదుపు తప్పి దుర్గారావు డివైడర్ వైపు పడిపోయా రు. రాజేశ్వరి మాత్రం బస్సు వెనుక చక్రాల కింద పడిపోవడంతో తీవ్ర రక్తస్రావమైంది. ప్రమాదం జ రిగినా బస్సు డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోవడం అక్కడి వారిని నిశ్చేషు్టలను చేసింది.వెంటనే అక్కడున్న వా రి సాయంతో భర్త దుర్గారావు రాజేశ్వరిని ఆటోలో మెడికవర్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. కానీ తీవ్రంగా గాయపడిన ఆమె సాయంత్రం నాలుగు గంటలకు మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రమాద దృశ్యాలన్నీ మెడిల్యాబ్ సీసీ కెమెరా ఫుటేజీలో నిక్షిప్తమయ్యాయి. దాని ప్రకారం పోలీసులు బస్సును గుర్తించి డ్రైవర్‌కు ఫోన్ చేసి రమ్మని పిలిచారు. అయితే తనకు ఏం జరిగిందో తెలియ దని డ్రైవర్ చెప్పడం గమనార్హం. దీనిపై కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మెట్ట సుధాకర్ తెలిపారు. 20 ఏళ్లకే .. చనిపోయిన రాజేశ్వరి వయసు కేవలం 20 ఏళ్లు. పదహారేళ్లు దాటాక పెళ్లి చేసుకుని 18 ఏళ్లకు తల్లిగా మారిన రాజేశ్వరికి 20 ఏళ్లకే ఆయుష్షు రేఖ ఆగిపోయింది. ఇంత చిన్న వయసులో అది కూడా గర్భిణిగా చనిపోవడంతో ఊరంతా శోకసంద్రమైంది. -
మండలి: మేం అనుసరించిన విధానాలను నీతి ఆయోగ్ ప్రశంసించింది: బొత్స
మంత్రి అచ్చెన్నాయుడి వ్యాఖ్యలు తీవ్ర నిరాశను కలిగించాయి : వరుదు కళ్యాణి👉పెట్టుబడి సాయం 20 వేలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు👉ఇప్పుడు కేంద్రం సాయంతో కలిపి 20 వేలు ఇస్తామంటున్నారు👉మండలి సాక్షిగా రైతుకి వెన్నుపోటు పొడిచారు👉ఈ ప్రభుత్వం రైతులను మోసం చేసింది👉అన్నమో రామచంద్రా అనే పరిస్థితికి రైతును తీసుకొచ్చారు👉జగన్ మోహన్ రెడ్డి పాలనలో వ్యవసాయం పండుగలా సాగింది👉కూటమి పాలనలో సాగు విస్తీర్ణం తగ్గిపోయిందిఅచ్చెన్నాయుడు మాటలు వింటుంటే నవ్వాలో ఏడవాలో తెలియటం లేదు : బొత్స👉2016లో రుణమాఫీకి బాండ్ ఇచ్చారు👉రుణమాఫీ చేయకుండా 2019 వరకూ ఏం చేశారు👉మిర్చి ఒక్క టన్నైనా 11,700 రూపాయలకి కొన్నారా👉గోవాడ షుగర్ ఫ్యాక్టరీని ఆదుకోవాలని కోరుతున్నాం60% శాతానికి పైగా ప్రజలు వ్యవసాయం పై ఆధారపడి జీవిస్తున్నారు: బొత్స👉గత ప్రభుత్వంలో రైతులను సకాలంలో ఆదుకున్నాం👉విపత్తు వస్తే సీజన్ ముగిసేలోపు పరిహారం అందించాం👉విత్తనాలు...ఎరువులు రైతుల వద్దకే తీసుకెళ్లి అందించాం👉మా ప్రభుత్వంలో అనుసరించిన వ్యవసాయ విధానాలను నీతిఆయోగ్ కూడా ప్రశంసించింది👉మేం రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు మేలు చేశాం👉వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చేనాటికి సివిల్ సప్లై డిపార్ట్ మెంట్ చెల్లించాల్సిన బకాయిలు 5286 కోట్లు👉వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆత్మహత్య చేసుకుంటే రైతుల పేరుతో డబ్బులు తీసుకున్నారనడం కరెక్ట్ కాదు👉ఇలా మాట్లాడటం రైతులను అవమానపరచడమేమంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యలపై బొత్స సత్యనారాయణ అభ్యంతరం👉తప్పు జరిగితే విచారణ జరిపించుకోవడం ఆయా ప్రభుత్వాల విధానం👉తాడేపల్లి ప్యాలెస్‌లో రికార్డులు తగలబెట్టేశారనడం సరికాదు👉రికార్డుల నుంచి మంత్రి వ్యాఖ్యలు తొలగించాలి👉ఆధారాలుంటే రుజువుచేయండి👉బాధ్యత కలిగిన మంత్రి పదవిలో ఉండి ఇలా మాట్లాడటం సరికాదు👉తగలబెట్టినట్లు ఆధారాలుంటే కేసు ఫైల్స్‌లో ఎంక్వైరీ బైండింగ్స్‌లో చేర్చుకోండిబుడమేరు వరద సాయంపై మండలిలో చర్చ👉వరద బాధితుల్లో అనేకమందికి ఇంకా పరిహారం అందలేదు: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్👉వరద సహాయం విషయంలో ప్రభుత్వం విఫలమైంది👉ఆపరేషన్ బుడమేరు అన్నారు.. ఇప్పటివరకు ఏం చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి👉బుడమేరు గేట్లను ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి చేయలేదు: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రుహుల్లా👉వరదల తర్వాత బుడమేరును ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు👉ఇప్పటికీ అనేకమంది బాధితులు కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు👉ఒక ఇంటికి పరిహారం ఇచ్చి 10 ఇళ్లకు ఇచ్చినట్లు రాసుకున్నారు👉అందరికీ సాయం అందిందని చెప్పడం పచ్చి అబద్ధం👉కూటమి ప్రభుత్వంపై మాకు నమ్మకం లేదు: బొత్స సత్యనారాయణ👉వైఎస్ జగన్ ప్రకటించిన కోటి రూపాయలను మేమే బాధితులకు అందించాం👉నేనే అందుకు బాధ్యత తీసుకున్నా👉కూటమి సర్కార్ సాయం అందించడంలో విఫలమైంది👉ప్రభుత్వంపై మాకు నమ్మకం లేదు👉అందుకే మేమే స్వయంగా మా పార్టీ తరపున బాధితులకు సాయం అందించాంఏపీ శాసనమండలిలో ఉచిత ఇసుకపై వాడివేడిగా చర్చ 👉కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక ధర పెరిగింది: బొత్స సత్యనారాయణ👉విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఇసుక ధర తగ్గలేదు👉ప్రభుత్వం చెప్పినట్లు ఇసుక ఇవ్వడం లేదు👉గత ప్రభుత్వం కంటే ఇప్పుడు ఎంతకిస్తున్నారో వెరిఫై చేయాలి👉కూటమి నేతలు చెప్పే లెక్కలు తప్పుగా ఉన్నాయి.👉కూటమి నేతలు వాస్తవానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు👉ఉచిత ఇసుక, ఇసుక అక్రమ అమ్మకాలపై శాసనమండలిలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 80 లక్షల టన్నుల స్టాక్‌ను కొత్త ప్రభుత్వానికి అప్పగించిందని.. దానిలో ఎంత స్టాక్ రికార్డెడ్‌గా జమ చేశారు?. ఎంత ఆదాయం వచ్చిందని ప్రశ్నించారు. రీచ్‌లలో ట్రాక్టర్ల నుంచి లారీల్లోకి ఇసుక వేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం మొత్తం మెషినరీల ద్వారానే ఇసుకను తీసి లారీలకు లోడు చేస్తున్నారు. రాత్రి, పగలూ తేడా లేకుండా ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది’’ అని తోట త్రిమూర్తులు మండిపడ్డారు.👉‘‘ఒక్కొక్క లారీకి సుమారు 11 నుంచి 12 వేల వరకు వసూలు చేస్తున్నారు. గత ప్రభుత్వం అప్పగించిన ఇసుకకు, చెబుతున్న లెక్కలకు తేడాలు ఉన్నాయి. మెషినరీల ద్వారా ఇసుకను మొత్తం తోడేస్తున్నారు. గత 2016లో తెచ్చిన పాలసీనే ఇప్పుడు కూడా ఉంది. పేద ప్రజలకు ఇసుక అందే పరిస్థితి లేదని తోట త్రిమూర్తులు ధ్వజమెత్తారు.👉శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో లారీ ఇసుక ఎంతకు దొరికేది?.. ఈ రోజు ఎంతకు దొరుకుతుందంటూ కూటమి సర్కార్‌ని నిలదీశారు. ఉచిత ఇసుక అంటే టన్నుకు కనీసం 400 రూపాయలు తగ్గాలి. సామాన్యులకు ఉచిత ఇసుక అందే పరిస్థితి లేదని మండిపడ్డారు. -
AP: జీబీఎస్ వైరస్‌తో మరో మహిళ మృతి
సాక్షి, గుంటూరు: గుంటూరు ఆసుపత్రిలో జీబీఎస్ వైరస్‌తో మరో మహిళ మృతి చెందింది. వారం క్రితం వైరస్ లక్షణాలతో ఆసుపత్రిలోకి చేరిన మహిళ.. చికిత్స పొందుతూ మరణించింది. కాగా, గుంటూరు జీజీహెచ్‌లో గత నెల.. షేక్ గౌహర్ జాన్ అనే మహిళ మృతి చెందింది. గులియన్ బార్ సిండ్రోమ్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన గౌహర్.. వ్యాధి తీవ్రత మరణించింది.కాగా, ఇటీవల ఇదే ఆసుపత్రిలో కమలమ్మ అనే మహిళ జీబీఎస్‌తో చనిపోగా.. ఇపుడు మరో మహిళ కూడా మరణించడంతో జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న జీబీఎస్ బాధితులు ఆందోళన చెందుతున్నారు.భయపెడుతున్న జీబీ సిండ్రోమ్గులియన్ బ్యారి సిండ్రోమ్ (జీబీఎస్) వ్యాధి వేగంగా విస్తరిస్తుండటంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ వ్యాధి లక్షణాలేమిటి? దీని బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాలను ప్రజలు శోధిస్తున్నారు. కలుషిత నీరు, ఆహారం తీసుకునేవారిలోనే జీబీఎస్ అధికంగా వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెప్తున్నారు. -
జగనన్న కాలనీ కబ్జా.. పల్నాడులో బరితెగించిన టీడీపీ గూండాలు
సాక్షి, పల్నాడు జిల్లా: గురజాల నియోజకవర్గంలో టీడీపీ నేతలు బరితెగించారు. పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను సైతం వదలడం లేదు. టీడీపీ నాయకులు యథేచ్ఛగా సాగిస్తున్న భూ దందా సాగిస్తున్నారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు కూడా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో టీడీపీ నాయకులు మరింత రెచ్చిపోతున్నారు.గురజాల మండలంలోని పులిపాడు గ్రామంలో జగనన్న కాలనీని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అనుచరులు కబ్జా చేసేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో పులిపాడులో 70 సెంట్ల లో 40 మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమ భూములంటూ యరపతినేని అనుచరులు నకిలీ సర్టిఫికెట్ సృష్టించారు. పొజిషన్ సర్టిఫికెట్ జారీ చేయడంలో వీఆర్వో జ్యోతి కీలక పాత్ర పోషించారు.పొజిషన్ సర్టిఫికెట్ ఆధారంగా 70 సెంట్లు జగనన్న కాలనీని తొమ్మిది మంది టీడీపీ నేతలు తమ పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఎవరైనా గొడవ చేస్తే చంపేస్తామంటూ టీడీపీ గూండాలు బెదిరింపులకు దిగుతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు వేడుకుంటున్నారు. -
విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మికుల ఆందోళన
సాక్షి, విశాఖపట్నం: కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపును నిరసిస్తూ విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఇప్పటికే వెయ్యి మంది కాంట్రాక్ట్ కార్మికులను యాజమాన్యం తొలగించగా.. మరికొందరిని తొలగించే యోచనలో ఉంది. నేటితో యాజమాన్యం కోరిన గడువు ముగియనుంది. నేడు రిజనల్ లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో మరోసారి చర్చలు జరపనున్నారు. స్పష్టత ఇవ్వకపోతే రేపటి నుంచి సమ్మెలోకి వెళ్లే అవకాశం ఉంది.కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపుపై సమావేశం కొనసాగుతోంది. యూనియన్ నేతలతో స్టీల్ ప్లాంట్ యాజమాన్యం సమావేశమైంది. కాంట్రాక్టు కార్మికుల తొలగింపుపై చర్చలు కొలిక్కి రాలేదు. యాజమాన్యం తీరుపై కార్మిక సంఘాల నేతలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఇప్పటివరకు వెయ్యి మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారని... తొలగించిన వాటిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని.. లేదంటే నిరవధిక సమ్మెకు దిగుతామని యూనియన్ నేతలు హెచ్చరించారు. కాంట్రాక్ట్ కార్మికులను తొలగించమనే హామీ ఇప్పటివరకు యాజమాన్యం నుంచి రాలేదని.. యాజమాన్యం చెబుతోంది ఒకటి, చేస్తోంది ఒకటని కార్మికులు మండిపడుతున్నారు.స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్టు కార్మికులను అక్రమంగా తొలగిస్తున్నారని అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు ధ్వజమెత్తారు. అక్రమ తొలగింపులను ఆపకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్టు కార్మికులను తొలగింపును నిరసిస్తూ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పాతగాజువాకలో ఆదివారం మహాధర్నా నిర్వహించిన సంగతి తెలిసిందే.స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు మోదీ ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నాలను ముమ్మరం చేసిందని అందులో భాగంగా ప్రైవేట్ పెట్టుబడిదారులు కోరినట్టుగా ఇక్కడి కార్మికుల సంఖ్యను తగ్గిస్తోందన్నారు. దీన్ని ప్రశ్నిస్తున్న నాయకులకు యాజమాన్యం షోకాజ్ నోటీసులను జారీ చేయడం దుర్మార్గమని సీపీఎం నేతలు ధ్వజమెత్తారు. -
అప్పుడే ముదిరిన ఎండలు..బయటకు వచ్చేందుకు భయపడుతున్న జనం (ఫొటోలు)
-
తిరుపతి: హోటల్లో కుప్పకూలిన పైకప్పు
సాక్షి, తిరుపతి: నగరంలోని బస్టాండ్ సమీపంలోని మినర్వా గ్రాండ్ హోటల్లో పైకప్పు కూలింది. రూమ్ నంబర్ 314లో ఒక్కసారిగా సీలింగ్ కుప్పకూలింది. దీంతో ఆ హోటల్లో ఉన్న భక్తులు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఇద్దరు భక్తులు గాయపడ్డారు. సంఘటన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హోటల్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రోజా కేసులో రోజుకో ట్విస్ట్
సాక్షి, విశాఖపట్నం: ఎన్ఆర్ఐ మహిళ రోజా అనుమానాస్పద మృతి క్రైం థ్రిల్లర్‌ను తలపిస్తోంది. కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. నగర పోలీసు కమిషనర్ ఆదేశాలతో ఎట్టకేలకు మృతురాలి స్నేహితుడు, నిందితుడిగా భావిస్తున్న డాక్టర్ శ్రీధర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎన్ఆర్ఐ మహిళ రోజాకు.. డాక్టర్ శ్రీధర్‌కు మధ్య ఉన్న సంబంధం ఏంటి?.. రోజా హోటల్‌కు వచ్చిన రెండు గంటల్లో అనుమానాస్పదంగా మృతి చెందడం వెనుక ఏం జరిగిందో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ నెల 6వ తేదీ మధ్యాహ్నం 1.40 గంటలకు శ్రీధర్‌ను కలిసేందుకు మేఘాలయ హోటల్లోని రూం నంబర్ 229కి రోజా వెళ్లింది. 3.35 గంటల తరువాత ఆమె బాత్రూమ్లో అపస్మారక స్థితిలో ఉందని శ్రీధర్ హోటల్ సిబ్బందికి చెప్పాడు. హత్యా? ఆత్మహత్యా? రెండు గంటల వ్యవధిలో రోజా అనుమానాస్పదంగా మృతి చెందడంపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. రెండు గంటలు ఇద్దరూ ఒకే గదిలో ఉన్నారు. ఈ సమయంలో రోజా–శ్రీధర్‌కు మధ్య గొడవ జరిగిందా?.. ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాడా? అందుకే ఆమె ఆత్మహత్య చేసుకున్నా ఆపకుండా చూస్తూ ఉండిపోయాడా?.. మృతి చెందిందని నిర్ధారించుకున్న తరువాతే హోటల్ సిబ్బందికి సమాచారం ఇచ్చాడని ప్రచారం జరుగుతోంది. నిజానికి రోజాను ఆత్మహత్య చేసుకునేలా అమెరికాలో ఉన్నప్పటి నుంచే శ్రీధర్ ప్రేరేపిస్తున్నాడని పోలీసులు విచారణలో తెలినట్లు తెలిసింది. ఒకవేళ రోజాది ఆత్మహత్య కాకపోతే అదే రూమ్‌లో ఉన్న శ్రీధర్ ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రోజా పోస్టుమార్టం నివేదిక వస్తే తప్ప నిజనిజాలు బయట పడే అవకాశం లేదు. ఎఫ్ఐఆర్లో శ్రీధర్ పేరు చేర్చలేదెందుకు? ఈ కేసులో మొదటి నుంచి పోలీసులు నిర్లక్ష్యం కనిపిస్తూనే ఉంది. డాక్టర్ శ్రీధర్‌ను కేసు నుంచి తప్పించేయత్నం జరుగుతోందని విస్తృతంగా ప్రచారం జరిగింది. కేసు తేలిపోయేవిధంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఒకే గదిలో రోజా–శ్రీధర్ ఉన్న సమయంలో.. రోజా అనుమానాస్పదంగా మృతి చెందితే ఎఫ్ఐఆర్లో శ్రీధర్ పేరు చేర్చకపోవడం చర్చనీయాంశమైంది. కేసును నీరుగార్చేందుకు పోలీసులు ఎందుకు ప్రయత్నించారు? డాక్టర్ శ్రీధర్ వెనుక ఎవరున్నారు? పోలీసులపై ఎవరి ఒత్తిడైనా ఉందా? అన్న ప్రశ్నలకు వారే సమాధానం చెప్పాలి. ఈ కేసు విషయంలో విమర్శలు రావడంతో ఎట్టకేలకు మూడో పట్టణ పోలీసులు శ్రీధర్‌ను అరెస్టు చేసినట్లు ఆదివారం ఆర్ధరాత్రి ప్రకటించారు. అన్ని వేళ్లూ పోలీసులవైపే.. ఎన్ఆర్ఐ మహిళా అనుమానాస్పద మృతిపై పోలీసులు చర్యలు విమర్శలకు తావిచ్చింది. సంఘటన జరిగిన వెంటనే శ్రీధర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తే నిజనిజాలు బయటపడేవి. అయితే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు నుంచి విచారణ వరకు అన్ని వేళ్లు వారివైపే చూపించేలా వ్యవహరించారు. 6వ తేదీన రోజా మృతి చెందినప్పటికీ 8వ తేదీ వరకు అటువంటి ఘటన జరగలేదు అన్నట్లు వ్యవహరించారు. పలుకుబడి ఉన్న కుటుంబాలకు చెందిన వ్యక్తులు తప్పు చేస్తే వెనకేసుకువచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు. పేద, మధ్యతరగతికి చెందిన ఎవరైనా తప్పు చేస్తే మీడియా సమావేశాలు పెట్టి మరీ ప్రచారం చేసుకునే పోలీసులు ఈ కేసు విషయంలో పాటిస్తున్న గోప్యత అనుమానాలకు తావిస్తోంది. -
యనమలకు బాబు ‘షాక్’ హ్యాండ్
సాక్షి, అమరావతి: తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ముఖ్య నేతగా ఉన్న యనమల రామకృష్ణుడు రాజకీయాల నుంచి అవమానకరంగా పక్కకు తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తన సమకాలీకుడు, ఎన్టీఆర్ నుంచి టీడీపీని లాక్కునేందుకు స్పీకర్‌గా అన్ని విధాలా సహకరించిన సహచరుడు.. యనమలను పట్టించుకోకుండా చంద్రబాబు చివరి దశలో వదిలేశారనే చర్చ నడుస్తోంది. ఈ నెలాఖరుతో యనమల ఎమ్మెల్సీ పదవికి గడువు ముగియనుండగా, ఆయన సభ్యత్వాన్ని రెన్యువల్ చేయలేదు. ప్రస్తుతం నడుస్తున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలే ఆయన పాల్గొంటున్న చివరి సమావేశాలుగా చెబుతున్నారు. చంద్రబాబు తనయుడు లోకేశ్‌తో పొసగకపోవడం, ఆయన కోటరీని వ్యతిరేకించడం వల్లే యనమలను పూర్తిగా పక్కనపెట్టేసినట్లు తెలుస్తోంది. మున్ముందు రాజకీయంగా ఆయనకు ఎటువంటి పదవులు ఇచ్చే అవకాశం లేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఆయన రిటైర్ అయినట్లేనని స్పష్టం చేస్తున్నాయి. పార్టీ కోసం సుదీర్ఘకాలం పని చేసిన వ్యక్తికి ఇంత అవమానకరంగా రాజకీయ ముగింపు ఉంటుందని ఎవరూ ఊహించలేదంటున్నారు. తనకు ఎమ్మెల్సీ పదవి రెన్యువల్ చేయకపోవడంపై యనమల స్పందించకపోయినా తనను కావాలని అవమానించినట్లు సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలిసింది. కూతురు, అల్లుడికి పదవులు ఉన్నాయనే కారణంతో పక్కకు.. టీడీపీలో ప్రస్తుతం లోకేశ్ మాటే శాసనంగా నడుస్తుండడంతో ఎమ్మెల్సీ స్థానాల్లో యనమల పేరును కనీసం పరిగణనలోకి తీసుకోలేదు. ఆయన కుమార్తె తుని ఎమ్మెల్యేగా, అల్లుడు ఏలూరు ఎంపీగా ఉండడంతో ఇక ఆయనకు ఎలాంటి పదవులు ఇవ్వాల్సిన అవసరం లేదని చంద్రబాబు సైతం భావించినట్లు ప్రచారం జరుగుతోంది. 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచినప్పుడు ఎమ్మెల్యేగా లేకపోయినా చంద్రబాబు ఆయన్ను ఎమ్మెల్సీగా చేసి ఆర్థిక మంత్రి పదవి ఇచ్చారు. అప్పట్లో తనకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇవ్వాలని కోరినా ఆయన అనుభవాన్ని ఉపయోగించుకుంటానని మంత్రి పదవి ఇచ్చారు. 2019లో టీడీపీ ఓడిపోవడంతో శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా కొనసాగారు. అయితే అంతకుముందు నుంచే పార్టీలో లోకేశ్ పెత్తనం పెరిగిపోవడం, దాన్ని యనమల వంటి పలువురు సీనియర్లు వ్యతిరేకించడంతో చినబాబు ఆగ్రహానికి గురై, వారి ప్రాధాన్యత తగ్గిపోయింది. ఇప్పుడు అధికారంలో ఉండడంతో యనమలకు పూర్తిగా చెక్ పెట్టి రాజకీయాల నుంచే అనివార్యంగా రిటైర్మెంట్ ఇప్పించారనే చర్చ జరుగుతోంది.పార్టీలో తనకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతోనే ఇటీవల ఆయన కాకినాడ పోర్టు, సెజ్ వ్యవహారంలో ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ ఏకంగా చంద్రబాబుకు లేఖ రాశారు. కాకినాడ పోర్టు యజమానిగా ఉన్న కేవీ రావు పేదల భూములు తీసుకుని అక్రమంగా సంపాదించారని, అలాంటి వారిని వెనకేసుకురావడం ఏమిటని ప్రశ్నిoచారు. యనమల స్థాయి నాయకుడు ఏకంగా సీఎంని ప్రశ్నిస్తూ లేఖ రాయడం కలకలం రేపింది. అయితే చంద్రబాబు తన మార్కు రాజకీయంతో పార్టీలోనే యనమల వ్యతిరేకుల్ని, సోషల్ మీడియాను ప్రోత్సహించి ఆయనపై ఎదురుదాడి చేయించడంతోపాటు అసభ్యంగా తిట్లు కూడా తిట్టించారు. అప్పటి నుంచి టీడీపీకి, యనమలకు మధ్య దూరం ఇంకా పెరిగిపోయింది. వాడుకుని వదిలేయడం బాబుకు అలవాటే ప్రస్తుతం జరుగుతున్న శాసనమండలి సమావేశాల్లోనూ యనమలకు కనీస ప్రాధాన్యం లభించడంలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మండలిలో లోకేశ్ ఉన్నప్పుడు ఆయన చూస్తుండగా యనమల దగ్గరికి వెళ్లి మాట్లాడేందుకు సైతం టీడీపీ సభ్యులు జంకుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాజకీయంగా అవసరానికి వాడుకుని ఆ తర్వాత పూచికపుల్లలా తీసిపడేయడం చంద్రబాబుకు మొదటి నుంచి అలవాటైన విద్యే. కాబట్టి యనమలకు అదే తరహా ట్రీట్మెంట్ లభించిందని విశ్లేషకులు చెబుతున్నారు. -
ఆశపెట్టి హ్యాండిచ్చారు
సాక్షి, అమరావతి: అవసరానికి వాడుకుని, ఆ తర్వాత వదిలేయడం చంద్రబాబు నైజం. ఇది అందరికీ తెలిసిన నిజం. ఎన్నోసార్లు ఎంతోమంది నేతలు కూడా ఈ విషయం విస్పష్టంగా చెప్పారు. ఆయన సొంత బావమరిది నందమూరి హరికృష్ణ కూడా చంద్రబాబుది ‘యూజ్ అండ్ త్రో పాలసీ’ అని ఓ సందర్భంగా గట్టిగానే చెప్పారు. తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల విషయంలోనూ చాలామందికి చంద్రబాబు ఏమిటో తెలిసొచ్చింది. ఎన్నికల సమయంలో పని చేసేందుకు అనేక మందికి చంద్రబాబు ఎమ్మెల్సీ పదవులను ఎరగా వేశారు. సీట్లు సర్దుబాటు చేయలేని వారికి, నియోజకవర్గాల్లో పని చేయించుకోవాల్సిన వారికి, ఆరి్థకంగా ఆసరాగా ఉన్న వారికి ఆయన ఎడాపెడా హామీ ఇచ్చేశారు. అధికారంలోకి వచ్చాక మొదటి విడతలోనే ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి ఎన్నికల్లో పని చేయించుకున్నారు. కొందరికైతే ఆ నియోజకవర్గాల్లో జరిగిన బహిరంగ సభల్లోనే ప్రకటన కూడా చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక.. వారితో చంద్రబాబుకి పని లేకపోయింది. పదవులు, ఎమ్మెల్సీల ఎంపికలో పక్కన పెట్టేశారు. మారిన మనిషినంటూ చంద్రబాబు చేసిన ప్రకటనలతో కచ్చితంగా ఎమ్మెల్సీ వస్తుందని ఎదురుచూసిన నేతలంతా ఇప్పుడు హతాశులయ్యారు. చంద్రబాబు మాట ఇచ్చారంటే అది తప్పకుండా నెరవేర్చే అవకాశం ఉండదని తెలిసి వచ్చిందని వాపోతున్నారు.ఎమ్మెల్సీ స్థానం కోసం ఆశగా ఎదురుచూసి, బాబు కొట్టిన దెబ్బకు తెల్లమొహాలు వేసిన టీడీపీ ఆశావహుల జాబితాశ్రీకాకుళం జిల్లా 1. పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణ 2. టీడీపీ జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు చౌదరి బాబ్జి అల్లూరి సీతారామరాజు జిల్లా 1. మత్స్యరాస మణికుమారి కాకినాడ జిల్లా 1. మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పశ్చిమ గోదావరి జిల్లా 1. ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు 2. తాడేపల్లిగూడెం నియోజకవర్గ్గ ఇన్చార్జి వలవల బాబ్జి 3. మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి 4. నర్సాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు 5. మాజీ మంత్రి పీతల సుజాత 6. ఉండి మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజు ఏలూరు జిల్లా 1. పోలవరం మాజీ ఎమ్మెల్యే బొరగం శ్రీనివాస్ ఎన్టీఆర్ జిల్లా 1. దేవినేని ఉమామహేశ్వరరావు 2. నెట్టెం రఘురాం 3. వంగవీటి రాధాకృష్ణ 4. బుద్ధా వెంకన్న 5. నాగుల్ మీరా పల్నాడు జిల్లా 1. పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ చిత్తూరు జిల్లా 1. తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ 2. శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు 3. చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు అనంతపురం జిల్లా 1. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి 2. మాజీ ఎమ్మెల్యే జితేందర్ గౌడ్ 3. మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప 4. గుండుమల తిప్పేస్వామి కర్నూలు జిల్లా 1. డోన్‌కు చెందిన ధర్మవరపు సుబ్బారావు 2. నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మనందరెడ్డి -
కూటమి ప్రభుత్వ కుట్రతో .. యువ శక్తి నిర్వీర్యం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులపై మీనమేషాలు లెక్కిస్తూ వారి భవిష్యత్తును అంధకారంలోకి నెడుతోంది. యాజమాన్యం తరగతి గది నుంచి ఎప్పుడు బయటకు గెంటేస్తుందోనన్న అవమాన భారంతోనే విద్యార్థులు కళాశాలలకు వెళ్తున్నారు. కళ్ల ముందే బిడ్డలు పడుతున్న అవస్థలు చూడలేక పేదింటి తల్లిదండ్రులు ఇళ్లు, పొలాలు, పుస్తెలు తాకట్టు పెట్టిమరీ అప్పులు తెచ్చి ఫీజులు చెల్లిస్తున్న దుర్భర పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి గడిచిన విద్యా సంవత్సరంలోని చివరి రెండు త్రైమాసికాలకు కలిపి రూ.1,400 కోట్లు, వసతి దీవెన కింద రూ.1,100 కోట్లను జూన్‌లో చెల్లించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మళ్లీ వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చి ఉంటే ఆ నిధులు విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో జమయ్యేవి. కానీ, కూటమి అధికారంలోకి వచ్చింది. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన ఖర్చులను నిలిపివేసింది. పాత విద్యా సంవత్సరంలో చివరి రెండు త్రైమాసికాలు, ఈ విద్యా సంవత్సంలో పూర్తయిన మూడు త్రైమాసికాలకు కలిపి రూ.3,500 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి పెట్టింది. కూటమి సర్కారు ఏర్పడిన ఈ 9 నెలల్లో మొక్కుబడి ప్రకటనలు మినహా విద్యార్థులకు ఒరగబెట్టిందేమీ లేదు. దీనికితోడు గత విద్యా సంవత్సరంలోని వసతి దీవెన చెల్లింపులు రూ.1,100 కోట్లకు మంగళం పాడింది. విద్యార్థులకు మొత్తం రూ.4600 కోట్లు బకాయిపడింది. అయితే, వైఎస్సార్సీపీ ‘యువత పోరుబాట’ ప్రకటనతో ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి ఒక త్రైమాసికంలో రూ.700 కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటివరకు పాక్షిక చెల్లింపులు మాత్రమే జరిగాయి. చాలావరకు నిధులు ఇంకా కళాశాలల ఖాతాల్లో జమకాకపోవడం గమనార్హం. ప్రైవేటు కళాశాలల్లో పీజీ చదువుతున్నవారికి సైతం ఫీజు రీయింబర్స్మెంట్ అందిస్తామని ఎన్నికల్లో కూటమి పార్టీల నాయకులు ప్రగల్భాలు పలికారు. వారిని నమ్మి ప్రైవేటు కళాశాలల్లో చేరినవారి నెత్తిన పిడుగుపడినట్లయింది. పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్ ఇలా.. ఉన్నత విద్యను సొంత డబ్బు పెట్టి చదువుకోలేనివారు తీవ్ర సందిగ్ధతను ఎదుర్కొంటున్నారు.ఇవ్వాల్సింది.. ఇచ్చేది.. అంతా మాయే!ఉన్నత విద్యలో భాగంగా ఫీజు రీయింబర్స్మెంట్ కింద ప్రతి త్రైమాసికానికి రూ.700 కోట్ల చొప్పున ఏడాదికి రూ.2,800 కోట్లు చెల్లించాలి. వసతి దీవెనగా ఏప్రిల్‌లో మరో రూ.1,100 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఒక విద్యా సంవత్సరంలో రూ.3,900 కోట్లు అందించాలి. కానీ, చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేసింది మాత్రం రూ.700 కోట్లే. అందులోనూ పూర్తి సొమ్ములు కళాశాలలకు చేరలేదు. కేవలం కేంద్ర ప్రభుత్వం నుంచి సామాజికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు వచ్చే స్కాలర్షిప్లు మాత్రమే జమయ్యాయి. ఇక 2024–25 విద్యా సంవత్సరంలో ప్రభుత్వం రూ.3,200 కోట్లు బకాయిలు పెట్టింది. వచ్చే విద్యా సంవత్సరానికి మరో రూ.3,900 కోట్లను కలుపుకొని మొత్తం రూ.7,100 కోట్లు చెల్లించాలి. తాజా బడ్జెట్లో మాత్రం రూ.2,600 కోట్లు మాత్రమే కేటాయించడం గమనార్హం. దీన్నిబట్టి చూస్తే కూటమి చెప్పిన పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్ హామీ బూటకంగా తేలిపోయింది. పాత బకాయిలూ ఇచ్చిన వైఎస్ జగన్2019 మే నెలలో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ సర్కార్ విద్యార్థులను రాజకీయాలకు అతీతంగా చదివించింది. 2017–19 మధ్య టీడీపీ ప్రభుత్వం 16.73 లక్షల మంది విద్యార్థులకు రూ.1,778 కోట్లు బకాయిలు పెడితే వైఎస్సార్సీపీ ప్రభుత్వమే చెల్లించింది. ఐదేళ్ల పాలనలో జగనన్న విద్యా దీవెన కింద రూ.12,609.68 కోట్లు, వసతి దీవెన కింద రూ.4275.76 కోట్లు విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో వేశారు. మొత్తం రూ.18,663.44 కోట్లను అందజేశారు.తొలి సంతకానికి విలువేది?కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు దేవుడెరుగు.. ఉన్న కొలువులు ఊడబీకి వలంటీర్లను నడిరోడ్డుపైకి లాగేశారు. రూ.10 వేలు వేతనం ఇస్తామని ఎన్నికల్లో హామీలు గుప్పించి పీఠం ఎక్కిన తర్వాత 2.60 లక్షల మంది వలంటీర్ల జీవితాలను గాలికి వదిలేశారు. మరోవైపు తొలి సంతకం అంటూ సీఎం చంద్రబాబు ఊదరగొట్టిన డీఎస్సీకి 9 నెలలైనా నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగులను నిలువునా ముంచారు. సుమారు 16,347 పోస్టులను ప్రకటించి.. డిసెంబరు నాటికి భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పి, వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను సైతం రద్దు చేశారు. జనవరి వెళ్లిపోయే.. జాబ్ కేలండర్ పోయే!‘ప్రతి సంవత్సరం జాబ్ కేలండర్ విడుదల చేస్తాం. రికార్డు చేసుకో.. డేటు టైము రాసుకో.. జగన్లాగా పారిపోయే బ్యాచ్ కాదు నేను’..2024 ఫిబ్రవరి 13న యువగళం సభలో మంత్రి నారా లోకేష్ చెప్పిన మాటలు ఇవి. కానీ, ఎన్నికలై, ప్రభుత్వం ఏర్పడ్డాక జాబ్ కేలండర్ ఊసే మర్చిపోయారు. లోకేష్ మాత్రమే కాదు.. చంద్రబాబు సైతం ఇదే హామీని పదేపదే ఇచ్చారు. జనవరి 1 వెళ్లిపోయింది, ఫిబ్రవరి దాటేసింది, మార్చి కూడా అయిపోతోంది..! కానీ జాబ్ కేలండర్ ప్రకటన లేదు. ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు పూర్తవుతున్నా ఏపీపీఎస్సీ నుంచి ఒక్క ప్రకటనా వెలువడలేదు. వైద్య కళాశాలలపై ప్రైవేటు కత్తివైఎస్ జగన్ తీసుకొచ్చిన కొత్త వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేస్తూ పేదింటి బిడ్డలకు వైద్య విద్యను దూరం చేస్తున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం 700 సీట్లు కోల్పోగా, వచ్చే ఏడాది అదనంగా వచ్చే సీట్లతో కలిపి మొత్తం 2500 సీట్లను కోల్పోవాల్సి వస్తోంది. అత్యంత పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ! వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏపీపీఎస్సీ ద్వారా 78 నోటిఫి కేషన్లు ఇచ్చి పరీక్షలు అత్యంత పారదర్శకంగా నిర్వహించింది. ప్రతి నోటిఫికేషన్‌కు షెడ్యూల్లో ప్రకటించిన తేదీల్లోనే పరీక్షలు జరిపింది. రెండుసార్లు గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల పోస్టుల భర్తీ చేపట్టి 1.34 లక్షల మందికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది. 2019కి ముందు టీడీపీ ప్రభుత్వం వివాదాస్పదంగా మార్చిన పరీక్షలను సైతం కోర్టు కేసులతో పాటు అన్ని వివాదాలను పరిష్కరించి పోస్టులు భర్తీ చేసింది. ప్రస్తుతం పరీక్షలకు శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులు చేస్తున్న ఉద్యోగాలకు సెలవు పెట్టి ప్రతి నెల సగటున రూ.15 వేల చొప్పున ఖర్చు చేస్తూ ఆర్థికంగా నలిగిపోతున్నారు. ఉద్యోగం రాలేదు.. భృతి ఇవ్వలేదు!చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి నిరుద్యోగులను మోసం చేస్తూనే ఉన్నారు. తాజాగా ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ఉద్యోగం వచ్చేవరకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్న చంద్రబాబు.. ఇప్పటివరకు ప్రవేశపెట్టిన రెండు బడ్జెట్ లలో నిరుద్యోగుల సంక్షేమానికి పైసా కూడా విదల్చలేదు. ఏపీలో గత ఏడాది 1.60 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. ఇంటికి ఒకరిని గుర్తించినా నెలకు రూ.3 వేల చొప్పున రూ.4,800 కోట్లు, ఏడాదికి రూ.57,600 కోట్లు కేటాయించాల్సి ఉండగా మొండిచెయ్యి చూపింది. 2025–26 బడ్జెట్‌కు వచ్చేసరికి కుటుంబాల సంఖ్య 1.70 కోట్లకు చేరింది. ఈ లెక్కన నెలకు రూ.5,100 కోట్లు ఏడాదికి రూ.61,200 కోట్లు అవుతోంది. -
‘పోసాని’పై ఎలాంటి కఠిన చర్యలొద్దు
సాక్షి, అమరావతి/నరసరావుపేట టౌన్/కర్నూలు (టౌన్) : సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో సినీనటుడు పోసాని కృష్ణమురళికి హైకోర్టు ఊరటనిచ్చింది. ఆయనపై ఎలాంటి కఠిన చర్యలేవీ తీసుకోవద్దని విశాఖపట్నం వన్‌టౌన్ పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. అలాగే, గుంటూరు పట్టాభిపురం, అల్లూరి జిల్లా పాడేరు, మన్యం జిల్లా పాలకొండ పోలీ స్స్టేషన్లలో నమోదైన కేసుల్లో పోసానికి బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 35 (3) కింద నోటీసులిచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. ఇదే సమయంలో భవానీపురం పోలీసులు పీటీ వారెంట్ అమలుచేసిన నేపథ్యంలో, తనపై కేసు కొట్టేయాలంటూ పోసాని దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఏమాత్రం వర్తించని సెక్షన్ల కింద కేసులు..సీఎం చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ తదితరులను కించపరుస్తూ సోషల్ మీడియాలో మాట్లాడారంటూ అందిన ఫిర్యాదు మేరకు పోసాని కృష్ణమురళిపై పట్టాభిపురం, భవానీపురం, పాడేరు, పాలకొండ, విశాఖపట్నం వన్‌టౌన్ పోలీసులు వేర్వేరుగా కేసులు నమోదుచేసిన విషయం తెలిసిందే. ఈ కేసులను కొట్టేయాలని కోరుతూ పోసాని హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై సోమవారం జస్టిస్ హరినాథ్ విచారణ జరిపారు. పోసాని తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. పోలీసుల తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) ఇవన సాంబశివ ప్రతాప్, రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ.. భవానీపురం పోలీసులు ఇప్పటికే పీటీ వారెంట్‌ను అమలుచేసినందున పోసాని పిటిషన్‌ను కొట్టేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యా యమూర్తి జస్టిస్ హరినాథ్.. అదనపు ఏజీ, పీపీ వాదనలను పరిగణనలోకి తీసుకుంటూ పోసాని క్వాష్ పిటిషన్‌ను కొట్టేశారు. విశాఖ వన్‌టౌన్ పోలీసులు నమోదుచేసిన కేసులో మాత్రం పోసానిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని ఆదేశిస్తూ విచారణను ఈనెల 19కి వాయిదా వేశారు.పోసానికి బెయిల్ మంజూరు..పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు చేస్తూ నరసరావుపేట ప్రధాన జూనియర్ సివిల్ జడ్జ్ ఆర్. ఆశీర్వాదం పాల్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇద్దరు జామీన్‌దారులు ఒక్కొక్కరు రూ.10 వేలు పూచీకత్తు చొప్పున సమర్పించేలా ఉత్తర్వులు జారీచేశారు. రాజంపేట సబ్జైల్లో ఉన్న పోసానిని ఈనెల 3న పీటి వారెంట్‌పై నరసరావుపేట టూటౌన్ పోలీసులు స్థానిక కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ అనంతరం గుంటూరు సబ్‌జైలులో ఉన్న ఆయనను పీటి వారెంట్‌పై కర్నూలు పోలీసులు అక్కడ నమోదైన కేసులో తీసుకెళ్లి కోర్టులో హాజరుపర్చారు. ప్రస్తుతం ఆదోని సబ్జైల్లో పోసాని ఉన్నారు. ఇక పోసానిపై ఆదోని పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్‌ను సోమవారం కర్నూలు మొదటి అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ (జేఎఫ్‌సీఎం) అపర్ణ డిస్మిస్ చేశారు. అలాగే, బెయిల్ పిటిషన్‌పై వాదనలు కూడా ముగియడంతో న్యాయమూర్తి తీర్పును రిజర్వు చేశారు. మంగళవారం తీర్పు వెలువడనుంది. -
కొనుగోలు కేంద్రాలు క్లోజ్!
సాక్షి, అమరావతి: ఇటు మద్దతు ధరలు లేవు.. అటు కొనుగోలు చేసే నాథుడు లేడు! ధాన్యం రైతులను టీడీపీ కూటమి సర్కారు ముప్పుతిప్పలు పెడుతోంది. రైతు సేవా కేంద్రాల్లో కేవలం పేరుకు మాత్రమే సేకరణ చేస్తూ అన్నదాతల కష్టాన్ని దళారులు, మిల్లర్లకు దోచిపెడుతోంది. సంక్రాంతి తర్వాత నూర్పిడులు చేసిన ధాన్యం రాసులు ఇప్పటికీ శ్రీకాకుళం, కృష్ణా, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కుప్పలుగా పంట పొలాల్లోనే కనిపిస్తున్నాయి. వ్యవసాయ శాఖ ముందస్తు దిగుబడి అంచనాలతో పోలిస్తే ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం పరిమాణం దారిదాపుల్లో కూడా లేదు. రబీ సాగు ఊపందుకున్నా.. పౌరసరఫరాల శాఖ మంత్రి జిల్లాల పర్యటనకు వెళ్లే సమయాల్లో లక్ష్యం తగ్గిపోతూ వచ్చింది. అతి కష్టంమీద 33. లక్షల టన్నులను సేకరించారు. గోదావరి జిల్లాల్లో జనవరి నెలాఖరు నుంచి కొనుగోళ్లు క్రమంగా నిలిపివేశారు. రబీ సాగు ఊపందుకున్న తరుణంలో ఇప్పటికీ ఖరీఫ్ రెండో ముందస్తు అంచనాలతోనే కొట్టుమిట్టాడుతోంది. ఖరీఫ్‌లో సుమారు 35 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. వ్యవసాయ శాఖ అక్టోబర్ ముందస్తు అంచనాల ప్రకారం 84 లక్షల టన్నుల దిగుబడి, జనవరి రెండో ముందస్తు అంచనా ప్రకారం 79 లక్షల టన్నుల దిగుబడి వస్తుంది. విపత్తులతో దాదాపు 10 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతింది. ఇందులో ఎంత కాదనుకున్నా సుమారు 70 లక్షల టన్నులకు పైగా దిగుబడి వచ్చే అవకాశం ఉంది. అంచనాలకు ఆమడ దూరంలో కొనుగోళ్లు వైఎస్సార్ జిల్లాలో 1.71 లక్షల టన్నుల దిగుబడి అంచనా కాగా ప్రభుత్వం కొనుగోలు చేసింది 18 వేల టన్నుల ధాన్యం మాత్రమే. పల్నాడులో 2.25 లక్షల టన్నులు దిగుబడి అంచనా అయితే కొన్నది 12 వేల టన్నులే. బాపట్లలో దిగుబడి అంచనా 5.54 లక్షల టన్నులు అయితే 87 వేల టన్నులే కొనుగోలు చేశారు. గుంటూరులో 3.69 లక్షల టన్నులకు గాను 36 వేల టన్నులు కొన్నారు. అనకాపల్లిలో 2.70 లక్షల టన్నుల దిగుబడి రానుందని అంచనా వేస్తే 30 వేల టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. ఫైన్ వెరైటీలకు మార్కెట్లో పెద్దగా రేటు రాకపోవడంతో అన్నదాతలు కుదేలయ్యారు. రైతు సేవా కేంద్రాల వారీగా టార్గెట్లు ధాన్యం కొనుగోళ్లకు రైతు సేవా కేంద్రాల వారీగా ప్రభుత్వం టార్గెట్లు విధించింది. టార్గెట్ పూర్తయిన చోట ధాన్యం విక్రయించలేని పరిస్థితి నెలకొంది. గత నెలలో కృష్ణా జిల్లాలో, తాజాగా శ్రీకాకుళం జిల్లాలో సిండికేట్‌గా మారిన మిల్లర్లు బ్యాంకు గ్యారంటీలు ఇవ్వకపోవడంతో రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం సేకరించడం లేదు. కనీసం ఆన్లైన్లో కూడా నమోదు చేయడం లేదు. ధాన్యం కొనుగోలు షెడ్యూల్ ఇస్తే గోతాలు వస్తాయి. వాటిల్లో పంటను భద్రపరిచి జాగ్రత్త చేసుకునే వెసులుబాటు ఉంటుంది. దళారులు, మిల్లర్ల కనుసన్నల్లో సేకరణ జరుగుతుండటంతో అన్నదాతలు దిక్కుతోచని పరిస్థితుల్లో కూరుకుపోయారు. మధ్యవర్తులు, దళారులు, కమీషన్ ఏజెంట్లు నిర్దేశించిన రేటుకే తెగనమ్ముకోవాల్సి వస్తోంది.బస్తాకు రూ.400–500 నష్టం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ధాన్యం సేకరణలో మిల్లర్లు, దళారుల దోపిడీని ప్రోత్సహించింది. 75 కేజీల బస్తా సాధారణ రకానికి రూ.1725, ఏ–గ్రేడ్‌కు రూ.1740గా మద్దతు ధర ప్రకటించింది. కానీ తేమ శాతం పేరుతో రైతుల నడ్డి విరిచేశారు. దీంతో రైతులు ఒక్కో బస్తా రూ.400 – 500 నష్టానికి విక్రయించిన దుస్థితి. దీంతో టన్నుకు సుమారు రూ.6 వేలకుపైగా నష్టం వాటిల్లింది. ఈ లెక్కన ప్రభుత్వం కొనుగోలు చేసిన రూ.7,790 కోట్ల విలువైన 33.80 లక్షల టన్నుల్లో రైతులకు దక్కాల్సిన సుమారు రూ.2 వేల కోట్లకు పైగా మద్దతు ధరను మధ్యవర్తులు, మిల్లర్లు మాటున దోచేశారు. మిల్లరు కనుసైగ చేస్తే తప్ప కల్లాల్లో నుంచి ధాన్యం కదలని పరిస్థితి. పోనీ జీఎల్టీ వస్తుంది కదా అని రైతు సొంతంగా వాహనం సమకూర్చుకుని ధాన్యం తరలిద్దామనుకుంటే దించేందుకు ఎన్ని రోజులు పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. కుప్పల్లో.. కల్లాల్లోనే ధాన్యం శ్రీకాకుళం జిల్లాలో సంక్రాంతి తర్వాతే పంట విక్రయానికి వస్తుంది. ఖరీఫ్‌లో 4.90 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు తాత్కాలిక టార్గెట్ ఇచ్చారు. ఇక్కడ 7.50 లక్షల టన్నులకు పైగా దిగుబడి వస్తుందని అంచనా. ప్రభుత్వం కావాలనే తక్కువగా ధాన్యం కొనుగోలు చేస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో కుప్పల్లో, కల్లాల్లో సుమారు 1.50 లక్షల టన్నుల వరకు ధాన్యం నిల్వలు కనిపిస్తున్నాయి. మరోవైపు ధాన్యం ఉన్న చోట్ల కొనుగోలు కేంద్రాలను మూసివేస్తున్నారు. ఇచ్చాపురం, కవిటి, కంచలి, పలాస, రణస్థలం, లావేరు, ఎచెర్ల, తదితర మండలాల్లో 118 వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎత్తివేశారు. 20 – 30 రోజులు గడిచినా సొమ్ము ఖాతాల్లోకి జమ కావడం లేదని రైతులను వాపోతున్నారు. ఇదే అదనుగా దళారీలు 75 కిలోల బస్తాకు మద్దతు ధర కంటే సుమారు రూ.400–300 వరకు తగ్గించి కొంటున్నారు. నెల్లూరులో ఇప్పుడిప్పుడే పంట కోతకు రావడంతో తాత్కాలికంగా 20 వేల టన్నుల కొనుగోలుకు టార్గెట్ ఇచ్చారు. నాడు కట్టడి.. నేడు ఇష్టారాజ్యం.. వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా ధాన్యం సేకరణలో దళారులు, మిల్లర్లు దందాను కట్టడి చేసింది. ప్రభుత్వమే సంపూర్ణ మద్దతు ధర ఇచ్చి ధాన్యం కొనుగోలు చేయడంతో రైతులకు ఎంతో మేలు జరిగింది. బహిరంగ మార్కెట్లో సైతం ధాన్యం రేట్లు పెరిగాయి. తొలిసారిగా దొడ్డు బియ్యానికి మంచి గిరాకీ లభించింది. తాము తక్కువ రేటు ఇస్తే రైతులు ప్రభుత్వానికే పంటను విక్రయిస్తారని గ్రహించిన దళారులు సైతం మద్దతు ధరకు మించి పంటను కొనుగోలు చేసిన సందర్భాలు తొలిసారిగా కనిపించాయి. కూటమి ప్రభుత్వం రాగానే మొత్తం పరిస్థితి తలకిందులైంది. సాధారణ రకాలకు మద్దతు ధర లేకపోగా బహిరంగ మార్కెట్లో డిమాండ్ ఉన్న సన్నాలకు (ఫైన్ వెరైటీలు) ధర పడిపోయింది. గోదావరి డెల్టాలో బీపీటీ సాంబ మసూరి రకాన్ని పండించిన రైతులకు దళారులు చుక్కలు చూపించారు. 75 కిలోల బస్తా రూ.2,500 పలుకుతుందని రైతులు ఆశించగా రూ.1,400 – రూ.1,500కి మించి కొనలేదు. కడప ప్రాంతంలోనూ సన్నాలకు ధర లేక రైతులు అవస్థలు పడ్డారు. కృష్ణా డెల్టాలో అధికంగా పండించే ఎంటీయూ–1262, ఎంటీయూ–1318 సూపర్ ఫైన్ వెరైటీ రకాలను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో తీవ్రంగా నష్టపోయారు. -
అంగన్వాడీ టీచర్ ఆత్మహత్య
నకరికల్లు: టీడీపీ, జనసేన నాయకుల బెదిరింపులు భరించలేక ఒక అంగన్వాడీ టీచర్ ఆత్మహత్య చేసుకున్నారు. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం పాపిశెట్టిపాలేనికి చెందిన షేక్ ఫాతిమాబేగం (35) అదే గ్రామంలో 11 ఏళ్లుగా అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆమెను అంగన్వాడీ టీచర్ పోస్టు నుంచి తొలగించి, తమవారిని నియమించుకుంటామని గ్రామానికి చెందిన టీడీపీ, జనసేన నాయకులు బెదిరిస్తున్నారని ఫాతిమాబేగం కుటుంబ సభ్యులు తెలిపారు. దాదాపు 9 నెలలుగా ఆమెను బెదిరిస్తూనే ఉండటంతో తీవ్ర ఒత్తిడికి గురవుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఫాతిమాబేగాన్ని అంగన్వాడీ టీచర్ ఉద్యోగం నుంచి తొలగిస్తారని టీడీపీ, జనసేన నాయకులు ప్రచారం చేస్తుండటంతో తీవ్ర ఆందోళనకు గురైన ఆమె ఆదివారం తమ ఇంట్లోనే గడ్డిమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. వెంటనే బంధువులు నరసరావుపేటలోని ఒక ప్రైవేటు వైద్యశాలకు తీసుకువెళ్లారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందారు. ఫాతిమాబేగం భర్త సైదావలి గుంటూరులో మెకానిక్‌గా పని చేస్తున్నారు. వారికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. తన భార్య మృతిపై సైదావలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
బీఈడీ ప్రశ్నాపత్రం లీకేజీలో 10 మంది అరెస్టు
నగరంపాలెం: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎన్‌యూ) బీఈడీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో పది మందిని అరెస్టుచేసినట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. లీకేజీకి వినియోగించిన 13 మొబైల్ఫోన్లను సీజ్ చేశామని చెప్పారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఉత్తర డీఎస్పీ మురళీకృష్ణ, పెదకాకాని సీఐ టీపీ నారాయణస్వామితో కలిసి ఆయన కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. వినుకొండ కాలేజీలో లీక్.. ఏఎన్‌యూ పరిధిలో గత శుక్రవారం (ఈనెల 7న) మ.2 గంటలకు బీఈడీ పరీక్ష ప్రారంభం కావల్సి ఉండగా మ.1.22కు ప్రశ్నపత్రం లీకైంది. దీన్ని ఏఎన్‌యూ ఉప కులపతి (వీసీ), పరీక్ష కేంద్రం సమన్వయకర్త గుర్తించారు. లీకేజీ వ్యవహారంపై ఏఎన్‌యూ పీజీ, వృత్తి విద్య కోర్సుల పరీక్ష కేంద్రం సమన్వయకర్త మన్నవ సుబ్బారావు పెదకాకాని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం సాయంతో పల్నాడు జిల్లా వినుకొండ టౌన్‌లోని శ్రీ వివేకానంద కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ సంస్థలోని కంప్యూటర్ గది నుంచి లీకైనట్లు తేల్చారు. దీంతో కళాశాల కరస్పాండెంట్ సయ్యద్ రఫిక్ అహ్మద్, ప్రిన్సిపాల్ దుపాటి సురేష్ కుమార్, కంప్యూటర్ ఆపరేటర్ ధార స్వర్ణరాజ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు.కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ నిర్వాకం ఇక పరీక్ష ప్రారంభమయ్యే నలభై నిమిషాల ముందు ఆయా పరీక్ష కేంద్రాలకు పాస్వర్డ్ పంపిస్తారు. తద్వారా పాస్వర్డ్ కొట్టి, ప్రశ్నాపత్రాన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంది. కానీ, ఈ పాస్‌వర్డ్‌ను కరస్పాండెంట్, ప్రిన్సిపాల్, కంప్యూటర్ ఆపరేటర్లు దుర్వినియోగం చేసి, వాట్సాప్ గ్రూప్ ద్వారా ప్రశ్నాపత్రాన్ని లీక్ చేశారు. తద్వారా ఒడిశాకు చెందిన సంతోష్‌కుమార్ సాహు, బిష్ణుప్రసాద్ పాత్రో, సుకాంత్, విద్యార్థులు పురుషోత్తం ప్రధాన్, ధీరేన్కుమార్ సాహులకు చేరింది. వీరు ప్రియబత్రో గోడయ్, మిలాన్ తృష్టిలకు పంపించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఈ పదిమందినీ అరెస్టుచేసి వీరి నుంచి 13 మొబైల్ఫోన్లను స్వా«దీనం చేసుకుని సీజ్ చేశామని ఎస్పీ తెలిపారు. ఒడిశా నిందితులు తమ రాష్ట్రంలో విద్యార్థులతో బీఈడీ పరీక్షలు రాయించి వారు ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణతయ్యేందుకు ఈ లీకేజీకి శ్రీకారం చుట్టారు. అలాగే, శ్రీ వివేకానంద కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ సంస్థ నిర్వాహకులు కూడా ఇదే పద్ధతి అవలంబించినట్లు దర్యాప్తులో తేలింది. ఇక కేసుని త్వరితగతిన ఛేదించిన ఉత్తర డీఎస్పీ సీహెచ్ మురళీకృష్ణ, పెదకాకాని సీఐ టీపీ నారాయణస్వామిలను ఎస్పీ అభినందించారు. -
నాడు మా వర్మ... నేడు నీ ఖర్మ!
సాక్షి, అమరావతి: అసెంబ్లీలో అడుగు పెట్టడమే కలగా మారిన పవన్ కళ్యాణ్‌కు సహకరించి.. ఆ కల నెరవేరేలా చేసిన పిఠాపురం టీడీపీ ఇన్‌ఛార్జి ఎస్వీఎస్ఎన్ వర్మను ఆయనే రాజకీయంగా దెబ్బకొట్టారనే చర్చ జోరుగా జరుగుతోంది. ఆయనకు ఎమ్మెల్సీ సీటు రాకుండా పవన్ అడ్డుపడ్డారని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే పిఠాపురంలో తనకు ఇబ్బందులు వస్తాయని ఆయన చంద్రబాబుకు చెప్పడం వల్లే పక్కన పెట్టారని టీడీపీ నేతలు చెబుతున్నారు. తనకు ప్రొటోకాల్ సమస్యలు వస్తాయని, వర్మకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వవద్దని స్వయంగా పవనే .. చంద్రబాబుకు చెప్పారని రెండు పార్టీల్లోనూ చర్చించుకుంటున్నారు. అలాగే వర్మకు పదవి లభిస్తే పిఠాపురంలో ఆయన ప్రాధాన్యత పెరిగి రెండు అధికార కేంద్రాలు ఏర్పాటవుతాయనే ఆందోళనలోనూ పవన్ కళ్యాణ్ ఉన్నట్లు చెబుతున్నారు. అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో మళ్లీ తాను అక్కడి నుంచి పోటీ చేయడం కష్టమవుతుందనే భావనలో ఆయన ఉన్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. వర్మ ఎమ్మెల్సీ అయితే నియోజక వర్గానికి చెందిన కూటమి నేతలు ఆయన వద్దకే వెళతారని, ఇది రాజకీయంగా తమకు నష్టమని పవన్ అంచనా వేస్తున్నట్లు సమాచారం. సీటు త్యాగం చేసిన వ్యక్తికి వెన్నుపోటా!ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కోసం ఎమ్మెల్యే సీటు త్యాగం చేసిన వర్మకు ఇది తీరని అన్యాయమని టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాకలో పోటీ చేసి ఒక్క చోట కూడా పవన్ కళ్యాణ్ గెలవలేకపోయిన విషయం తెలిసిందే. పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో అధినేత ఓడిపోవడం అప్పట్లో జనసేన వర్గాలు జీర్ణించుకోలేకపోయాయి. పవన్ కళ్యాణ్ కూడా ఇదే విషయాన్ని పలు సభల్లో చెప్పి బాధపడేవారు. దీంతో 2024 ఎన్నికల్లోనూ ఆయనను ఓటమి భయం వెంటాడింది. అందుకే చివరి వరకూ ఎక్కడ పోటీ చేయాలో తేల్చుకోలేకపోయారు. రకరకాల సమీకరణాల తర్వాత పిఠాపురం అయితే బాగుంటుందని పొత్తులో ఆ సీటును తీసుకున్నారు. కానీ టీడీపీ శ్రేణులు మొదట దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. టీడీపీ సీటును జనసేనకు ఎలా ఇస్తారని భారీ ఎత్తున ఆందోళనకు దిగాయి. టీడీపీ తరఫున ఆ సీటు దాదాపు ఖరారైన ఎస్వీఎస్ఎన్ వర్మ అయితే రాజీనామాకు సైతం సిద్ధపడ్డారు. కానీ, చంద్రబాబు పలుమార్లు బుజ్జగించడంతో శాంతించి పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పని చేశారు. అధికారంలోకి వచ్చాక ఆయనను ఎమ్మెల్సీ చేస్తామని చంద్రబాబు గట్టిగా హామీ ఇవ్వడంతోనే ఆయన పవన్ కోసం తన సీటు త్యాగం చేశారు. పిఠాపురం టీడీపీ శ్రేణుల్ని బ్రతిమిలాడి ఆయన పవన్ కోసం పని చేయించారు. పవన్ అసెంబ్లీకి వెళ్లడంలో వర్మది కీలక పాత్ర పవన్ కూడా వర్మ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది లేకుండా చూస్తానని అంతర్గతంగా చెప్పినట్లు ప్రచారం జరిగింది. దీంతో పవన్‌ను గెలిపించేందుకు వర్మ అహర్నిశలు పనిచేశారు. టీడీపీ శ్రేణులు పలుచోట్ల ఆయనను తిట్టినా లెక్క చేయకుండా తిరిగి పవన్‌ను గెలిపించారు. రెండుచోట్ల ఓడిపోయిన వ్యక్తికి తన సీటును త్యాగం చేసి గెలిపించి అసెంబ్లీకి పంపడంలో కీలకపాత్ర పోషించారు. ఇప్పుడు ఆయనకే పవన్ అడ్డుపడడం ఏమిటని టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన వర్మను పవన్ దెబ్బకొట్టడం దారుణమని వాపోతున్నాయి. ఎమ్మెల్సీ స్థానాల కేటాయింపులో ఆయనకు అన్యాయం జరిగిందని ఆవేదన చెందుతున్నాయి. -
వర్క్ ఫ్రం హోంపై కొత్త పాలసీ
సాక్షి, అమరావతి: వర్క్ ఫ్రం హోంపై సర్వే నివేదిక ఆధారంగా నూతన పాలసీ తీసుకురానున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. విద్యార్హతలు ఉండి, పనిచేసే సామర్థ్యం ఉన్నవారికి శిక్షణ ఇవ్వడం ద్వారా ఇంటి నుంచి పనిచేసే అవకాశాలు కల్పించేందుకు ఆయా సంస్థలతో మాట్లాడాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు, కార్యక్రమాల నిర్వహణపై సోమవారం సీఎం సమీక్ష చేశారు. వివిధ కార్యక్రమాల అమల్లో లబ్ధిదారుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా అధికారులతో అసెంబ్లీలోని తన ఛాంబర్లో సమీక్షించారు.ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సేవల్లో 100 శాతం నాణ్యత కనిపించాలని, లబ్ధిదారుల నుంచి పూర్తిస్థాయిలో సంతృప్తి వ్యక్తంకావాలని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ సేవల్లో నాణ్యత పెంచడం, ప్రజలు సంతృప్తి చెందేలా కార్యక్రమాలు అమలుచేయడంపై అన్ని స్థాయిల్లో దృష్టిపెట్టాలని సూచించారు. పదేపదే ఫిర్యాదులు వస్తున్న విభాగాల్లో బాధ్యులను గుర్తించి మార్పు వచ్చేలా చూడాలని ఆదేశించారు. కిందిస్థాయి ఉద్యోగులు, అధికారులకు కౌన్సెలింగ్ నిర్వహించడం ద్వారా ఉన్నతాధికారులు సేవలు మెరుగుపరచాలని సూచించారు. ప్రభుత్వ శాఖల్లో అవినీతి విషయంలో ఏమాత్రం సహించొద్దన్నారు. ‘ఆస్పత్రుల్లో అందించే సేవలపై రోగుల నుంచి ప్రభుత్వం అభిప్రాయం సేకరించగా.. 68.6శాతం మంది డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారు. డాక్టర్ల ప్రవర్తనపై 71.7 శాతం, సిబ్బంది ప్రవర్తనపై 65.6 శాతం మంది సంతృప్తి వ్యక్తంచేశారు. మందులు ఆస్పత్రుల్లో ఇస్తున్నారా, ప్రభుత్వాస్పత్రిలో పరిశుభ్రత ఎలా ఉందన్న ప్రశ్నలకు 65 శాతం సంతృప్తి వ్యక్తంకాగా.. దీన్ని మరింత మెరుగుపరుచుకోవాలి’ అని సీఎం సూచించారు. ‘ఎప్పటికప్పుడు చెత్త సేకరిస్తున్నారా... అన్న ప్రశ్నకు 67 శాతం మంది అవునన్నారు. రెవెన్యూ సేవలకు సంబంధించి పాసు పుస్తకానికి అదనపు చార్జీలు తీసుకుంటున్నారని.. సర్వే దరఖాస్తుపై దరఖాస్తు రుసుము కాకుండా అదనపు చార్జీలు తీసుకుంటున్నారని ప్రజలు బదులిచ్చారు. రెవెన్యూ సేవల్లో మార్పు కనిపించాలి’ అని సీఎం చెప్పారు. కాగా, ‘పాపులేషన్ డైనమిక్స్ అండ్ డెవలప్మెంట్’పై మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో జరిగే సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొంటారు.అమరావతికి డీప్ టెక్నాలజీప్రభుత్వ క్యాన్సర్ సలహాదారునిగా డాక్టర్ నోరిడీప్ టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్ అమరావతికి తేవడానికి కృషిచేస్తానని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై ప్రముఖ సంస్థలతో చర్చలు జరుపుతున్నామని వెల్లడించారు. ప్రముఖ క్యాన్సర్ వైద్యులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు జీవిత ప్రయాణానికి సంబంధించిన ‘మంటాడ టూ మ్యాన్‌హ్యాటన్’ పుస్తకాన్ని సీఎం చంద్రబాబు సోమవారం విజయవాడలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నోరి దత్తాత్రేయుడు పేద కుటుంబంలో పుట్టి, అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ ప్రపంచస్థాయి వైద్యులుగా ఎదిగారని కొనియాడారు. 50 ఏళ్ల పాటు క్యాన్సర్ వైద్యసేవల్లో నిమగ్నమయ్యారన్నారు. నోరి ఫౌండేషన్ పెట్టి ప్రజాసేవ చేస్తున్నారన్నారు. ‘నోరి’ని ఏపీ ప్రభుత్వ క్యాన్సర్ సలహదారుగా నియమిస్తున్నామని ప్రకటించారు. హైదరాబాద్‌లోని బసవతారకం తరహాలోనే అమరావతిలోనూ ఓ క్యాన్సర్ ఆస్పత్రి నిర్మించడానికి చర్యలు తీసుకుంటున్నామని చంద్రబాబు చెప్పారు. వచ్చే నాలుగైదేళ్లలో రాష్ట్రంలో ప్రకృతి సాగును 50 లక్షల ఎకరాలకు విస్తరిస్తామన్నారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా మాట్లాడారు. -
నామినేషన్లు వేసిన కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థులు
సాక్షి, అమరావతి: ఎమ్మెల్యేల కోటాలోని నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు కూటమి అభ్యర్థులు సోమవారం నామినేషన్లు వేశారు. ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక దానికి ఇంతకుముందే జనసేన అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. నామినేషన్ల దాఖలుకు సోమవారం ఆఖరి రోజు కావడంతో మిగిలిన నాలుగు స్థానాలకు టీడీపీ తరఫున ముగ్గురు, బీజేపీ తరఫున ఒకరు నామినేషన్లు వేశారు. తొలుత టీడీపీకి చెందిన బీద రవిచంద్ర, బీటీ నాయుడు, కావలి గ్రీష్మ నామినేషన్లు దాఖలు చేయగా, ఆ తర్వాత బీజేపీకి చెందిన సోము వీర్రాజు నామినేషన్ వేశారు. టీడీపీ అభ్యర్థుల వెంట మంత్రులు లోకేశ్, అచ్చెన్నాయుడు, కందుల దుర్గేష్, ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు తదితరులు వచ్చారు. బీజెపీ అభ్యర్థి వీర్రాజు వెంట మంత్రులు సత్యకుమార్, టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. వీరంతా నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి, శాసన మండలి ఉప కార్యదర్శి వనితారాణికి సమర్పించారు. సహాయ రిటర్నింగ్ అధికారులుగా ఉన్న అసెంబ్లీ సహాయ కార్యదర్శులు ఆర్.శ్రీనివాసరావు, ఈశ్వరరావు ఆ పత్రాలను పరిశీలించారు. నామినేషన్ అనంతరం బీజేపీ అభ్యర్థి సోము వీర్రాజు పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి, మంత్రి సత్యకుమార్ తదితరులతో కలిసి సీఎం చంద్రబాబును సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు పేరును ఆ పార్టీ జాతీయ నాయకత్వం సోమవారం ఉదయం ప్రకటించింది. సోము వీర్రాజు 2015–21 మధ్య బీజేపీ తరఫున ఎమ్మెల్సీగా కొనసాగారు. 2020–23 మధ్య బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఎమ్మెల్సీగా తనను ఎంపిక చేసినందుకు జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాకు సోము వీర్రాజు ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు ఆధ్వర్యంలో కలిసి పనిచేస్తామని చెప్పారు. ఏకగ్రీవమే.. ఎమ్మెల్యే కోటాలో ఐదు స్థానాలకు ఐదుగురు అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉండటంతో ఏకగ్రీవ ఎన్నిక లాంఛనమే కానుంది. టీడీపీ నుంచి ముగ్గురు అభ్యర్థులు జనసేన నుంచి ఒకరు, బీజేపీ నుంచి ఒకరు నామినేషన్ దాఖలు చేసినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. 11న నామినేషన్ల పరిశీలన తర్వాత 13 వరకు నామినేషన్ ఉపసంహరణకు గడువు ఉంది. నామినేషన్ ఉపసంహరణ తేదీ తర్వాత ఐదుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలిచినట్టు అధికారికంగా ప్రకటిస్తారు. -
అంగన్వాడీ ఆగ్రహ వేడి..
వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల, కొండాపురం రైల్వేస్టేషన్ల వద్ద మహాధర్నాకు వెళ్లనివ్వకుండా అంగన్వాడీలను పోలీసులు అడ్డుకున్నారు. కైకలూరు, ఏలూరు రైల్వే స్టేషన్లు, చేబ్రోలు పోలీస్ స్టేషన్ వద్ద అంగన్వాడీలను నిర్బంధించగా, జీలుగుమిల్లి, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు చెందిన అంగన్వాడీలను అశ్వారావుపేట బోర్డర్లో పోలీసులు అడ్డగించారు. కలపర్రు టోల్ గేట్ వద్ద ప్రైవేట్ వాహనాల్లో పెద్ద సంఖ్యలో తరలివెళుతున్న వారిని అడ్డుకుని కిందకు దించేశారు. సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: మాట తప్పి మోసం చేసిన కూటమి ప్రభుత్వంపై అంగన్వాడీలు కన్నెర్ర చేశారు. చంద్రబాబూ.. డౌన్‌డౌన్! కూటమి సర్కారుకు మా సత్తా చూపిస్తాం..! అంటూ కదం తొక్కారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, టోల్ గేట్ల వద్ద పోలీసు నిర్బంధాలు.. గృహ నిర్బంధాలు.. నోటీసులు.. రెడ్‌బుక్ రాజ్యాంగంలో సర్కారు అణచివేతలకు వెరవకుండా తరలివచ్చి ఉప్పెనలా విరుచుకుపడ్డారు. విజయవాడ ధర్నా చౌక్‌లో అంగన్వాడీల ఆగ్రహ జ్వాలలు ఎగసిపడ్డాయి. ఆంక్షలు, అడ్డంకులను దాటుకుని రాష్ట్రవ్యాప్తంగా భారీగా తరలివచ్చిన అంగన్వాడీలతో సోమవారం విజయవాడలో నిర్వహించిన ‘మహాధర్నా’ దద్ధరిల్లింది. కాగా, పల్నాడు జిల్లా నకరికల్లు మండలంలో 11 ఏళ్లుగా అంగన్వాడీ టీచర్‌గా పని చేస్తున్న ఓ మహిళను ఉద్యోగం నుంచి తొలగిస్తామని టీడీపీ –జనసేన కూటమి నేతలు బెదిరించడంతో తీవ్ర మానసిక ఆందోళనకు గురైన ఆమె పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. సర్కారు నిర్బంధకాండ.. అంగన్వాడీల మహాధర్నా నేపథ్యంలో కూటమి సర్కారు ఆదేశాలతో ఆదివారం రాత్రి నుంచి వారిపై రాష్ట్రవ్యాప్తంగా పోలీసు నిర్బంధకాండ కొనసాగింది. అంగన్వాడీలను ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు సోమవారం రోజు శిక్షణ, రికార్డుల పరిశీలనకు హాజరు కావాలంటూ ప్రభుత్వ యంత్రాంగం హుకుం జారీ చేసింది. అయినప్పటికీ అంగన్వాడీలు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులను రంగంలోకి దించింది. వైఎస్సార్, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి, నంద్యాల, తిరుపతి, చిత్తూరు, విజయనగరం తదితర జిల్లాల్లో అంగన్వాడీలను పోలీసులు హౌస్ అరెస్టులు చేశారు. విజయవాడ మహాధర్నాకు వెళ్లడానికి వీల్లేదంటూ నోటీసులు ఇచ్చారు. కైకలూరు, ఏలూరు రైల్వే స్టేషన్లు, చేబ్రోలు పోలీస్ స్టేషన్ వద్ద అంగన్వాడీలను నిర్బంధించారు. జీలుగుమిల్లి, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు చెందిన అంగన్వాడీలను అశ్వారావుపేట బోర్డర్లో పోలీసులు అడ్డగించారు. కలపర్రు టోల్ గేట్ వద్ద ప్రైవేట్ వాహనాల్లో వెళుతున్న వారిని అడ్డగించి కిందకు దించేశారు. నాడు న్యాయబద్ధమేనన్న లోకేశ్ గతంలో ఆందోళన నిర్వహించిన సమయంలో అంగన్వాడీలను కలసిన నారా లోకేశ్ వారు అడుగుతున్నవి న్యాయబద్ధమైనవని, కూటమి ప్రభుత్వం రాగానే అమలు చేస్తామని హామీ ఇచ్చారని ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ గుర్తు చేశారు. సమస్యల పరిష్కారం కోసం గతంలో 42 రోజులపాటు సమ్మె చేయడంతో వైఎస్సార్సీపీ హయాంలో ఆరు జీవోలు ఇచ్చిందన్నారు. ఒప్పందం ప్రకారం గతేడాది జూన్‌లోనే వేతనాలు పెంచాల్సి ఉన్నా కూటమి ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు గడుస్తున్నా అమలు చేయడం లేదన్నారు. ఇప్పటికైనా అంగన్వాడీల డిమాండ్లను అమలు చేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అధికారంలోకి రాగానే అన్యాయమైపోతాయా? గత ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచి్చన అనేక హామీలను అమలు చేసిందని ఈ సందర్భంగా నిర్వహించిన సభలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు తెలిపారు. అయితే మిగిలిన ఒప్పందాలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం దగా చేస్తోందని ధ్వజమెత్తారు. గ్రాట్యుటీ, మట్టి ఖర్చులు వంటి అనేక హామీలకు కోతలు పెట్టి మభ్య పెడుతోందన్నారు. ప్రతిపక్షంలో ఉండగా అంగన్వాడీల డిమాండ్లు న్యాయమేనని అనిపించిన కూటమి నేతలకు అధికారంలోకి రాగానే అన్యాయమైపోతాయా? అని నిలదీశారు. నాడొక మాట.. నేడొక మాట కాకుండా హామీలను అమలు చేసి మాట నిలబెట్టుకోవాలని లక్ష్మణరావు డిమాండ్ చేశారు. నెలాఖరులో జరిగే రివ్యూలు ఆగమేఘాలపై..అంగన్వాడీలు విజయవాడలో మహాధర్నాకు హాజరుకాకుండా కుట్రలకు తెరతీసిన కూటమి ప్రభుత్వం నెలాఖరులో జరిగే సమీక్ష కార్యక్రమాలను అప్పటికప్పుడు తెరపైకి తెచ్చింది. అయినా కడప, బద్వేలులోని ఆర్డీవో కార్యాలయాల ఎదుట ఏఐటీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీలు కదం తొక్కారు. 2022లో సుప్రీం కోర్టు గ్రాట్యుటీ విషయంలో అంగన్వాడీలకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా అమలు చేయకపోవడం దారుణమని మండిపడ్డారు. మైదుకూరులోని తహసీల్దార్ కార్యాలయం, ప్రొద్దుటూరులోని అర్బన్ సీడీపీవో కార్యాలయం, జమ్మలమడుగు ఐసీడీఎస్ కార్యాలయం, ఎర్రగుంట్ల, కమలాపురం తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. అంగన్వాడీలు విజయవాడలో మహాధర్నాకు హాజరు కాకుండా ఉయ్యూరు రూరల్ మండలంలో ఐసీడీఎస్ అధికారులు విశ్వ ప్రయత్నాలు చేశారు. అంగన్వాడీలకు శిక్షణ, రివ్యూ పేరుతో సోమవారం పెదవోగిరాల ఎంపీపీ పాఠశాలలో సమావేశం నిర్వహించి మమ అనిపించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆకునూరు సెక్టర్ రివ్యూ నిర్వహించినట్టు కంకిపాడు ప్రాజెక్టు సీడీపీవో బేబీ సుకన్య తెలిపారు. అంగన్వాడీలను అడ్డుకోవడమే లక్ష్యంగా రివ్యూ నిర్వహించారని ట్రేడ్ యూనియన్ నాయకులు విమర్శించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పోలీసుల నిర్బంధకాండను ప్రజా సంఘాలు ఖండించాయి. అక్రమ అరెస్టులపై అంగన్వాడీలు విజయనగరం కలెక్టరేట్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.ఇవీ ప్రధాన డిమాండ్లు...» అంగన్వాడీలకు నెల వేతనం రూ.26 వేలకు పెంచాలి. » గ్రాట్యుటీ చెల్లింపు హామీని అమలు చేయాలి. » మినీ అంగన్వాడీలను మెయిన్ సెంటర్లుగా మారుస్తూ వెంటనే జీవో ఇవ్వాలి. » రాజకీయ జోక్యాన్ని అరికట్టి హెల్పర్ల పదోన్నతులపై నిర్దిష్ట మార్గదర్శకాలు రూపొందించి అమలు చేయాలి. » సాధికారత సర్వేలో ప్రభుత్వ ఉద్యోగులు అనే పదం తొలగించి సంక్షేమ పథకాలను అంగన్వాడీలకు వర్తింపచేయాలి. » సర్వీసులో ఉంటూ చనిపోయిన వారికి మట్టి ఖర్చులకు రూ.20 వేలు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. సమ్మెకాలంలో మృతి చెందిన వారికి కూడా ఇవి వర్తింపజేయాలి. » పెండింగ్‌లో ఉన్న అంగన్వాడీల అద్దెలు, టీఏ బిల్లులు వెంటనే ఇవ్వాలి. అన్ని యాప్‌లను కలిపి ఒకే యాప్‌గా మార్పు చేయాలి. » పెండింగ్‌లో ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. » మెనూ చార్జీలను పెంచాలి. » ఉచితంగా గ్యాస్ సరఫరా చేయాలి. » వేతనంతో కూడిన మెడికల్ లీవ్ కనీసం మూడు నెలలు ఇవ్వాలి. » ప్రీ స్కూల్ పిల్లలకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలి. ఐదు సంవత్సరాల పిల్లలందరూ అంగన్వాడీ కేంద్రాలలో ఉండేలా జీవో ఇవ్వాలి. ప్రీ స్కూల్ పిల్లలకు సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలనే డిమాండ్‌ను తక్షణం అమోదించి అమలు చేయాలి. రెడ్ బుక్ పాలనపై కళ్లకు గంతలతో నిరసన» రెడ్‌బుక్ పాలన నశించాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం అంబేడ్కర్ సెంటర్లో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన ప్రదర్శన నిర్వహించారు. హామీలను వెంటనే అమలు చేయాలని నినదించారు. » అంగన్వాడీల అక్రమ అరెస్టులను నిరసిస్తూ.. కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరులో తహశీల్దారు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. » తొమ్మిది నెలలుగా హామీలను అమలు చేయకపోవడం, పోలీస్ నిర్బంధాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏలూరు జిల్లా చింతలపూడిలో అంగన్వాడీలు ప్రదర్శన చేపట్టారు. బోసు బొమ్మ సెంటర్లో రాస్తా రోకో చేశారు. -
పోలీసులే ఫిర్యాదు చేసి.. పోలీసులే కేసు నమోదు!
ఏలూరు: టీడీపీ ఆదేశాలతో అక్రమ కేసుల పర్వం కొనసాగుతోంది. వైఎస్సార్ సీపీ శ్రేణులే లక్ష్యంగా టీడీపీ చెలరేగిపోతోంది. తాజాగా దెందులూరు నియోజకవర్గంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసింది కూటమి ప్రభుత్వం. ఏలూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కామిరెడ్డి నానిపై అక్రమ కేసులు బనాయించారు దెందులూరు పోలీసులు. తన నివాసం వద్ద ఉన్న కామిరెడ్డి నాని.. తమ విధులకు ఆటంకం కల్గించారంటూ రివర్స్ కేసులు పెట్టారు ఏపీ పోలీసులు. ఈ కేసులో పోలీసులే ఫిర్యాదు చేసి.. వాళ్లే కేసు నమోదు చేయడం గమనార్హం. కామిరెడ్డి నానిపై హెడ్ కానిస్టేబుల్ హమిద్ ఫిర్యాదు చేయగా, ఎస్పై శివాజీ కేసు నమోదు చేశారు. 132R/w 3(5)bns సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.ఏపీలో పూర్తిగా విఫలమైన కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తువారిపై, కూటమిలో ఉన్న పార్టీలపై గతంలో విమర్శలు చేసిన వారిపై టీడీపీ ప్రభుత్వం ప్రతీకార చర్యలకు పాల్పడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారసుడు నారా లోకేష్ ‘రెడ్ బుక్’ రాజ్యాంగం రాసుకుంటున్నానని గతంలో ఏదైతే చెప్పారో అదే అమలు చేస్తోంది. అందుకు తగ్గట్టుగానే కూటమి ప్రభుత్వం అక్రమ కేసులను బనాయిస్తూ.. వైఎస్సార్సీపీ శ్రేణులను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఏదొక అక్రమ కేసును వారిపై మోపి.. బెదిరింపు చర్యలకు పాల్పడుతోంది. ఇందుకు రాష్ట్ర పోలీసులు కూడా సహకరిస్తూ ఉండటంతో అక్రమ కేసుల పరంపరంకు అడ్డుకట్టలేకుండా పోతోంది. కూటమి ప్రభుత్వం అరాచకపాలను ప్రశ్నిస్తే చాలు ఏదొక అక్రమ కేసును చవిచూడాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ప్రశ్నిస్తేనే తప్పు అన్నట్లుగా ఏపీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది కూటమి ప్రభుత్వం. -
ఒక విద్యార్థిని కోసం.. బీభత్సం చేసిన రెండు కాలేజీల ఇంటర్ విద్యార్థులు
సాక్షి,విజయవాడ: కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఇంటర్ విద్యార్థులు ఘర్షణకు దిగారు. రెండు ప్రైవేట్ కాలేజీలకు చెందిన విద్యార్థులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. బస్సు అద్దాలను ధ్వంసం చేసి ఘర్షణ వాతావరణం సృష్టించారు. దీంతో బస్సులో ఉన్న విద్యార్ధులు భయబ్రాంతులకు గురయ్యారు.ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాసేందుకు వచ్చిన విద్యార్థులు ఓ విద్యార్థిని విషయంలో ఘర్షణ పడినట్లు తెలుస్తోంది. పరీక్షకు ముందు ఎగ్జామ్ సెంటర్ సమీపంలోని జిరాక్స్ సెంటర్ వద్ద ఓ కాలేజీ విద్యార్థినితో చిన్న వాగ్వాదం జరిగింది. అది చిలికి చిలికి.. కూల్ డ్రింక్ బాటిళ్లతో తలల పగలగొట్టేంత ఘర్షణకు దారి తీసింది.స్థానికులు వద్దని వారిస్తున్నా వినని విద్యార్థులు షాపుల్లో ఉన్న కూల్‌డ్రింక్ బాటిళ్లతో దాడులకు దిగడంతో భీతావాహ పరిస్థితి నెలకొంది. -
Posani Krishna Murali: పోసాని కృష్ణమురళికి బెయిల్
పల్నాడు జిల్లా: ప్రముఖ రచయిత,నటుడు పోసాని కృష్ణమురళిపై నరసరావుపేటలో నమోదైన కేసులో బెయిల్ మంజూరైంది. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నరసారావుపేటలో కేసు నమోదు చేశారు పోలీసులు. మార్చి మొదటి వారంలో పోసానిపై కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసులు పిటి వారెంట్‌పై నరసరావుపేట కోర్టులో పోసాని హాజరు పరిచారు. విచారణ చేపట్టిన కోర్టు పోసానికి 10 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను నరసరావుపేట టూటౌన్ పోలీసులు గుంటూరు జైలుకు తరలించారు. తాజాగా, నరసరావుపేట కోర్టులో పోసాని బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇదిలా ఉంటే, అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పోసానికి బెయిల్ మంజూరు చేస్తూ కడప మొబైల్ కోర్టు గత శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. పోసానికి బెయిలు ఇవ్వకూడదని పోలీసుల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించినప్పటికీ.. కోర్టు పోసాని తరఫు న్యాయవాదుల వాదనలతో ఏకీభవిస్తూ... బెయిల్ మంజూరు చేసింది. పోసాని కస్టడీ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ఈ కేసులోనే పోసాని ఫిబ్రవరి 26వ తేదీన అరెస్టయ్యారు.పోసానిని హైదరాబాద్‌లోని నివాసంలో అరెస్ట్ చేసి.. ఆ మరుసటి రోజు ఓబులవారిపల్లెకు తీసుకెళ్లారు. అటుపై పల్నాడు జిల్లా నరసరావుపేటలో, కర్నూల్ జిల్లా ఆదోనీ పీఎస్‌లలో నమోదైన కేసుల్లో పీటీ వారెంట్ కింద ఆయన్ని తరలించారు. ఈ కేసుల్లో ఉపశమనం కోరుతూ ఆయన వేశారు. ఆదోని కేసులో భాగంగా పోలీసులు కస్టడీ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను కర్నూల్ జేఎఫ్‌సీఎం కోర్టు కొట్టివేయగా, నరసారావుపేట కేసులో బెయిల్ మంజూరైంది. మరోవైపు హైకోర్టులోనూ ఆయన వేసిన క్వాష్ పిటిషన్ విచారణ దశలో ఉంది. -
‘ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటే సరిపోదు’
చోడవరం: రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటే సరిపోదని, రాష్ట్రంలోని రైతుల సమస్యలు కూడా పట్టించుకోవాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. రైతులు మన రాష్ట్రానికి సంబంధించిన వారు కాదా? అని బొత్స నిలదీశారు. ఈ రోజు(సోమవారం) చోడవరంలోని గోవాడ షుగర్ ఫ్యాక్టరీని బొత్స సందర్శించారు. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ‘గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతుల కోసం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేస్తాం. శాసనమండలలో రైతుల సమస్యలను లేవనెత్తుతాం. రైతుల బకాయిలను ఆణా పైసాతో సహా చెల్లించాలి. గోవాడ సుగర్ ఫ్యాక్టరీ పరిధిలో లక్ష 70 వేల టన్నుల చెరకు పండింది. ఇప్పటి వరకు కనీసం 70 టన్నుల చెరకు కూడా క్రస్సింగ్ చేయలేదు. షుగర్ ఫ్యాక్టరీ వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు రైతులకు బకాయిలు చెల్లించలేదు. ప్రతి ఏడాది నవంబర్ డిసెంబర్ నెలలో క్రసింగ్ జరిగేది. కానీ ఇప్పుడు సంక్రాంతి దాటిన క్రసింగ్ జరగ లేదు. జనవరిలో క్రాసింగ్ జరగడం వలన చెరుకు ఎండిపోతుంది. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతులను వైఎస్ జగన్ రూ. 90 కోట్లతో ఆదుకున్నారు.షుగర్ ఫ్యాక్టరీ కష్టాల నుంచి తక్షణం గట్టెక్కాలంటే 35 కోట్లు అవసరం. ప్రభుత్వం వెంటనే రూ. 35 కోట్లు విడుదల చేయాలి. ఉద్యోగులకు జీతాలు వెంటనే చెల్లించాలి. టన్ను చెరుకుకు రూ. 2500 ఇస్తే ఏమి సరిపోతుంది?, రైతులు మన రాష్ట్ర ప్రజలు కాదా?, దివంగత నేత వైఎస్ హయాంలో షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నతమైన దశలో ఉన్నాయి. ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం కాదు రైతులను ఆదుకోవాలి. రాజకీయాలు కోసం నేను రాలేదు.. రైతుల బాధలు చూసి మాట్లాడుతున్నాను.’ అని బొత్స స్పష్టం చేశారు. -
బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలి.. రాజ్యసభలో వైఎస్సార్సీపీ డిమాండ్
ఢిల్లీ: తిరుపతిలో కొత్తగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీ మేడ రఘునాథ్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. రాజ్యసభలో రైల్వే సవరణ బిల్లుపై చర్చ జరిగింది. వైఎస్సార్సీపీ తరఫున ఎంపీ మేడ రఘునాథ్ రెడ్డి చర్చలో పాల్గొన్నారు.రాజ్యసభలో చర్చ సందర్భంగా ఎంపీ మేడ రఘునాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. తిరుపతిలో కొత్తగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలి. చెన్నై, బెంగళూరుకు సమాన దూరంలో ఉన్న తిరుపతికి భారీ సంఖ్యలో ప్రయాణికులు వస్తుంటారు.భారీ సంఖ్యలో ప్రయాణికులను నేపథ్యంలో ఈ డివిజన్ ఫీజిబిలిటీ ఉంది. తిరుపతి రైల్వే స్టేషన్‌ను వరల్డ్ క్లాసు రైల్వే స్టేషన్‌గా తీర్చిదిద్దాలి. అన్నమయ్య జిల్లాలో నందలూరు రైల్వే స్టేషన్ వద్ద ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ స్థాపించాలి. అక్కడ 400 ఎకరాల భూమి, అవసరమైన నీరు అందుబాటులో ఉంది.వైజాగ్ రైల్వే జోన్లో వాల్తేరు జోనును సంపూర్ణంగా విలీనం చేయాలి.రైల్వే బోర్డులో ఏపీకి తగిన ప్రాతినిధ్యం కల్పించాలి. ప్రీమియం ట్రైన్లలో సామాన్య ప్రయాణికుల కోసం ఐదు కోచ్ లు అదనంగా ఏర్పాటు చేయాలి. రైల్వే ప్రమాదాల నేపథ్యంలో ఇండిపెండెంట్ సేఫ్టీ ఆడిట్ జరగాలి.అపరిశుభ్రమైన రైలు నాణ్యతలేని ఆహారం తదితరు అంశాలపై ప్రయాణికుల ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోవాలి.’అని కోరారు. -
పోసాని కస్టడీ పిటిషన్ కొట్టివేత
సాక్షి,కర్నూలు.: కూటమి సర్కారు అక్రమంగా బనాయించిన కేసులో అరెస్టైన ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్టమురళీని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్‌ను కర్నూల్ జేఎఫ్‌సీఎం కోర్టు కొట్టివేసింది. పోసాని కస్టడీ పిటిషన్‌ను డిస్మిస్ చేశారు కోర్టు మేజిస్ట్రేట్. ఈ నెల ఆరో తేదీన జేఎఫ్‌సీఎం కోర్టులో ఆదోని పోలీసులు కస్టడీ పిటిషన్ వేశారు. పోసానిని విచారించే క్రమంలో కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఏడో తేదీన తీర్పును రిజర్వ్ చేసిన మేజిస్ట్రేట్.. ఇవాళ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ తీర్చు ఇచ్చారు. ఇక బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేశారు మేజిస్ట్రేట్.ఇదిలా ఉంటే, అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పోసానికి బెయిల్ మంజూరు చేస్తూ కడప మొబైల్ కోర్టు గత శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. పోసానికి బెయిలు ఇవ్వకూడదని పోలీసుల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించినప్పటికీ.. కోర్టు పోసాని తరఫు న్యాయవాదుల వాదనలతో ఏకీభవిస్తూ... బెయిల్ మంజూరు చేసింది. పోసాని కస్టడీ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ఈ కేసులోనే పోసాని ఫిబ్రవరి 26వ తేదీన అరెస్టయ్యారు.పోసానిని హైదరాబాద్‌లోని నివాసంలో అరెస్ట్ చేసి.. ఆ మరుసటి రోజు ఓబులవారిపల్లెకు తీసుకెళ్లారు. అటుపై పల్నాడు జిల్లా నరసరావుపేటలో, కర్నూల్ జిల్లా ఆదోనీ పీఎస్‌లలో నమోదైన కేసుల్లో పీటీ వారెంట్ కింద ఆయన్ని తరలించారు. ఈ కేసుల్లో ఉపశమనం కోరుతూ ఆయన వేశారు. మరోవైపు హైకోర్టులోనూ ఆయన వేసిన క్వాష్ పిటిషన్ విచారణ దశలో ఉంది.పోసాని క్వాష్ పిటిషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు -
ఎన్ఆర్ఐ మహిళ మృతి కేసులో బిగ్ ట్విస్ట్
విశాఖ: ఇటీవల నగరంలో ఓ స్టార్ హోటల్ లో ఓ ఎన్ఆర్ఐ మహిళ మృతికి సంబంధించిన కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులు, అనుమానితులు ఎవరూ లేరని తొలుత ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న పోలీసులు.. చివరకు ఆమె వెంటే ఉన్న డాక్టర్ శ్రీధర్ ను అదుపులోకి తీసుకున్నారు.ఈ కేసుకు సంబంధించి అనుమానాలు ఎక్కువ కావడంతో పాటు ‘సాక్షి’ వరుస కథనాలతో పోలీసు యంత్రాంగం కదిలింది. ఆ ఎన్ఆర్ఐ మహిళ ఆత్మహత్య చేసుకునేలా డాక్టర్ పిల్లా శ్రీధర్ ప్రేరేపించాడని అభియోగాలు నమోదు చేసిన పోలీసులు.. డాక్టర్ శ్రీధర్ ను అరెస్ట్ చేశారుఈ నెల 8వ తేదీన ఓ స్టార్ హెటల్ లో ఎన్నారై మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆ హోటల్ వాష్ రూమ్ లో ఎన్నారై మహిళ ఉరివేసుకుని ఉంది. అయితే ఆ సమయంలోనే కూడా ఉన్న డాక్టర్ పై అనుమానాలు రేకెత్తాయి. చివరకు డాక్టర్ శ్రీధర్ ను అరెస్ట్ చేయడంతో ఈ కేసు మరో అడుగు ముందుకు కదిలింది. బీఎన్ఎస్ 108 ప్రకారం కేసు నమోదు చేసి.. నిందితుడిని రిమాండ్ కు తరలించారు. అయితే ఎన్నారై మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆత్మహత్య చేసుకునేలా చేశాడా?, లేక హత్య చేశాడా అనేది విచారణలో తెలియాల్సి ఉంది. ఇక డాక్టర్ పిల్లా శ్రీధర్ ను పోలీసులు కస్టడీకి కోరతారా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. -
‘చంద్రబాబు నిరుద్యోగ భృతి ఎక్కడ’
సాక్షి, అనంతపురం: చంద్రబాబు నిరుద్యోగ భృతి ఎక్కడ? అని వైఎస్సార్ సీపీ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ ప్రశ్నించారు. విద్యార్థులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల, నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ మార్చి 12న రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఈ సందర్భంగా శైలజానాథ్ మాట్లాడుతూ..ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం నమ్మక ద్రోహమే అవుతుంది. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని వైఎస్సార్,వైఎస్ జగన్ పకడ్బందీగా అమలు చేశారువైఎస్ జగన్ లక్షలాది మంది పేద విద్యార్థులను ఉన్నత చదువులు చదివించారు. రూ. 3900 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించకపోవడం చంద్రబాబు అసమర్థతే. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి పది నెలలైనా మెగా డీఎస్సీ ఎందుకు ఇవ్వలేదు?.నిరుద్యోగ భృతి ఎక్కడ చంద్రబాబు’అని ప్రశ్నించారు. -
కూటమి ప్రభుత్వంలో కూలీలుగా విద్యార్థులు.. పవన్ ఏం చేస్తున్నట్లు..
సాక్షి,తాడేపల్లి: ప్రజా సమస్యలను గాలికి వదిలేసి చంద్రబాబు కక్షసాధింపులకు దిగారు. ఫీజు రియింబర్స్‌మెంట్ లేక కూలి పనులకు వెళ్తున్నారు. ప్రశ్నిస్తామన్న పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు? బకాయి పడిన మొత్తం ఫీజు రియింబర్స్మెంట్ని వెంటనే చెల్లించాలని వైఎస్సార్సీపీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి చంద్రబాబు కక్షసాధింపులకు దిగారు. ఫీజులు కట్టలేదని కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. ఫీజు కట్టలేక విద్యార్థులు కూలీలుగా మారుతున్నారు.అనంతపురంలో చరణ్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.అయినాసరే కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. అందుకే 12న పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. ఇంతవరకు నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదు. గ్రూప్-2 విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే మంత్రి లోకేష్ దుబాయ్ వెళ్లి క్రికెట్ చూశాడు. వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలు తెస్తే వాటిని చంద్రబాబు ప్రయివేటీకరణ చేస్తున్నారు.మెడికల్ సీట్లు వద్దని చంద్రబాబు లేఖ రాయడం దుర్మార్గం.ప్రశ్నిస్తామన్న పవన్ ఏం చేస్తున్నట్లు : చంద్రబాబు యువత జీవితాలతో చెలగాటమాడుతున్నారు. రూ.3900 కోట్లు ప్రతి ఏటా ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఇవ్వాలి. నిధులు ఇవ్వకపోవడంతో కాలేజీ యాజమాన్యం విద్యార్థులను బయటకు నెడుతున్నాయి. బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారో కూడా ప్రభుత్వం చెప్పటం లేదు. ప్రశ్నిస్తామన్న పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు?.2050 మెడికల్ సీట్లు వద్దని లేఖ రాసిన నీచ చరిత్ర చంద్రబాబుది.బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ అని నిరూపించారు. జాబ్ కేలండర్ జాడే లేదు.నిరుద్యోగులను చంద్రబాబు మోసం చేశారు.మెగా డిఎస్సీ పేరుతో దగా చేశారు. వైఎస్ జగన్ తెచ్చిన విద్యా సంస్కరణలకు చంద్రబాబు పాతర వేశారు.ఈ సమస్యల పరిష్కారం కోరుతూ 12న కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేస్తాం’అని హెచ్చరించారు. రవిచంద్ర, విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ -
వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్ డిస్మిస్
విజయవాడ: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని మరోసారి విచారించేందుకు తమ కస్టడీకి ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్ ను విజయవాడ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు తోసిపుచ్చింది. పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ ను డిస్మిస్ చేసింది కోర్టు. అదే సమయంలో వంశీ బెయిల్ పిటిషన్ పై విచారణను ఈ నెల 12 వ తేదీకి వాయిదా వేసింది కోర్టు.ఈ కేసు విచారణలో భాగంగా కౌంటర్ దాఖలు చేసేందుకు సత్యవర్థన్ తరపు న్యాయవాది రెండు రోజులు సమయం కోరారు. దాంతో బెయిల్ పిటిషన్ పై విచారణను 12కు వాయిదా వేసింది కోర్టు. అదే సమయంలో వల్లభనేని వంశీ ఉంటున్న బ్యారక్ మార్చాలని దాఖలు చేసిన పిటిషన్ పై కూడా విచారణ జరిగింది.అయితే ఇతర ఖైదీలు ఉంటున్న బ్యారక్ లోకి వంశీని మార్చడం కుదరదని జైలు అధికారులు కోర్టుకు తెలిపారు. భద్రతా కారణాల రీత్యా బ్యారక్ మార్చలేమని జైలు అధికారులు స్పష్టం చేశారు. కాగా, మెత్తటి దిండు, దుప్పటి కావాలని వంశీ కోరగా, అందుకు జైలు అధికారులు అంగీకరించారు. కాగా, జైలు బ్యారక్‌లో తనను ఒంటరిగా ఉంచారని గత నెల చివర్లో పిటిషన్ దాఖలు చేశారు వంశీ. భద్రతాపరంగా తనకు ఇబ్బంది లేనప్పటికీ అందరూ ఉన్న సెల్‌లోకి తనను మార్చాలని కోరారు.సీసీ ఫుటేజ్‌ను భద్రపరచండితన భర్త అరెస్టు అక్రమమని తేల్చేందుకు అవసరమైన సీసీ ఫుటేజ్ ను భద్రపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ వల్లభనేని వంశీ భార్య.. హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. సీసీ ఫుటేజ్‌ను భద్రపరచాలంటూ పోలీసుల్ని ఆదేశించింది హైకోర్టు. -
12న జరిగే 'యువత పోరు'తో ప్రభుత్వాన్ని నిలదీద్దాం: సజ్జల
తాడేపల్లి : ఈ నెల 12వ తేదీన వైఎస్సార్సీపీ తలపెట్టిన ‘యువత పోరు’ ద్వారా ప్రభుత్వాన్ని నిలదీద్దామని పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.. ఈ మేరకు ఆయన టెలికన్ఫరెన్స్ లో మాట్లాడారు. దీనికి వైఎస్సార్సీపీ ముఖ్యనేతలు, విద్యార్థి, యువజన విభాగం నేతలు, 13 యూనివర్శిటీల విద్యార్థి నాయకులు, మేధావులు, విద్యారంగం ప్రముఖులు హాజరయ్యారు.‘12న జరిగే 'యువత పోరు'తో ప్రభుత్వాన్ని నిలదీద్దాం. ఫీజు రీయంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రభుత్వం దిగివచ్చేవరకూ పోరాడదాం. రేపు యూనివర్శిటీల లోపల లేదా బయట "యువత పోరు" పోస్టర్ ఆవిష్కరణ చేయాలి. యూనివర్శిటీల నుంచి విద్యార్థులు ర్యాలీలో పాల్గొనేలా చూడాలి. అప్పుడే ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగి వారి సమస్యలు పరిష్కారమవుతాయి వైఎస్సార్సీపీ విద్యార్ధి, యువజన విభాగాలు సమన్వయంతో కార్యక్రమాన్ని నిర్వహించాలి’ సూచించారు సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రతీ పల్లెలో ఘనంగా వైఎస్సార్సీపీ ఆవిర్భావ వేడుకలు -
పోలీసుల కట్టుకథకు ఇవిగో ఆధారాలు : విడదల రజని
సాక్షి, నరసరావుపేట: కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నిత్యం దళితులు, వెనుకబడిన వర్గాలను వేధించడమే లక్ష్యంగా పెట్టుకుని పాలన సాగిస్తోందని మాజీ మంత్రి విడదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల్లో నరసరావుపేట జైలులో రిమాండ్‌లో ఉన్న చిలకలూరిపేటకు చెందిన దళిత యువకుడు, సోషల్ మీడియా యాక్టివిస్ట్ దొడ్డా రాకేష్ గాంధీని సోమవారం ఆమె పరామర్శించి, ధైర్యం చెప్పారు. అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో బడుగు, బలహీనవర్గాలకు గొంతెత్తే స్వాతంత్రం కూడా లేకుండా చేశారంటూ మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే సోషల్ మీడియా యాక్టివీస్ట్ లపై ఉక్కుపాదంతో అణిచివేస్తున్న దుర్మార్గమైన పాలనను చంద్రబాబు కొనసాగిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఇంకా ఆమె ఏమన్నారంటే...పత్తిపాటి పుల్లారావు ఒత్తిడితోనే తప్పుడు కేసులుతెలుగుదేశం ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఒత్తిడితోనే పోలీసులు తప్పుడు బనాయిస్తున్నారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరుడుగా, సోషల్ మీడియా యాక్టివిస్ట్‌గా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్న రాకేష్ గాంధీపై కావాలనే తప్పుడు కేసులు బనాయించి, జైలుకు పంపారు. భాషా అనే వ్యక్తితో టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఈనెల 6వ తేదీన ఒక కేసు నమోదు చేయించారు. రాకేష్ గాంధీ తన ఇద్దరు మిత్రులు ఫణీంద్ర నాగిశెట్టి, దామిశెట్టి కోటేశ్వర్ లతో కలిసి తనపై దాడి చేసి, హతమార్చేందుకు ప్రయత్నించారని, అసభ్య పదజాలంతో దూషించారంటూ భాష ఫిర్యాదు చేశాడు. చుట్టుపక్కల వారు గమనించడంతో తన ఫోన్ లాక్కుని వారు పరారయ్యారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు ఏకంగా సెక్షన్ 308 కింద కేసు నమోదు చేశారు. సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద బీఎన్ఎస్ 111 సెక్షన్ కింద కేసులు పెడితే కోర్టులు చీవాట్లు పెడుతుండటంతో, రాకేష్ గాంధీపై ఈ సెక్షన్ నమోదు చేయకుండా తెలివిగా ఒక తప్పుడు ఫిర్యాదును రాయించి, దాని ప్రకారం హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. పోలీసుల కట్టుకథకు ఇవిగో ఆధారాలురాకేష్ గాంధీ అరెస్ట్ విషయంలో పోలీసులు అల్లిన కట్టుకథ ఇలా ఉంటే.. వాస్తవాలు ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. రాకేష్ బెదిరించినట్టుగా చెబుతున్న ఆరో తేదీ రాత్రి 9 గంటల సమయంలో అతడు గుంటూరులో ఇంట్లో ఉన్నాడు. దీనికి సీసీ ఫుటేజీ ఆధారాలున్నాయి. అదే వ్యక్తి అదే సమయంలో చిలుకలూరిపేట కళామందిర్ సెంటర్లో ఎలా ఉంటాడో పోలీసులే చెప్పాలి. చిలకలూరిపేటలో ఉంటే వేధిస్తున్నారనే కారణంతో గత 9 నెలలుగా రాకేష్ గుంటూరులోనే ఉంటున్నాడు. ఘటన జరిగినట్టుగా చెబుతున్న 6వ తేదీతో పాటు అంతకు ముందు రోజు కూడా అతడు గుంటూరులోనే ఉన్నాడు. గుంటూరులో నాతో పాటు పలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఇదే కేసులో ఉన్న మరో వ్యక్తి ఫణీంద్ర నాగిశెట్టి కూడా ఘటన జరిగిన రోజు, అదే సమయంలో సెలూన్లో హెయిర్ కటింగ్ కోసం వెళ్లాడు. ఇందుకు సీసీ ఫుటేజీ ఆధారాలు కూడా ఉన్నాయి. మరో వ్యక్తి దామిశెట్టి కోటేశ్వర్ కూడా ఉద్యోగం చేసుకుంటూ హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. ఈ ఆధారాలన్నీ చూస్తే కట్టుకథలు అల్లి వైస్సార్సీపీ శ్రేణులను వేధింపులకు గురిచేస్తున్నట్టు చాలా స్పష్టంగా అర్ధమవుతుంది. కేవలం ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రోద్భలంతో సీఐ ఇలా తప్పుడు కేసులు నమోదు చేసి వేధింపులకు పాల్పడుతున్నాడు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అబద్ధాలను నిజం చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే ఈ ఆధారాలను కోర్టు ముందుంచడం జరిగింది. అధికార పార్టీ ఎమ్మెల్యేల మెప్పకోసం పోలీసులు నిబంధనలు ఉల్లంఘించి వ్యవహరిస్తే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఇలాంటి పనులు ద్వారా పోలీసు వ్యవస్థ మీద ప్రజల్లో ఉన్న నమ్మకం రోజురోజుకీ తగ్గిపోతోంది. -
‘వర్మ చాలా సీనియర్ పొలిటీషియన్.. కానీ’: నాదెండ్ల మనోహర్
కాకినాడ: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే SVSN వర్మకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు షాకిచ్చిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వర్మకి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తానని హామీ ఇచ్చిన బాబు..ఇప్పుడు ఆ హామీని గాలికొదిలేశారు. దాంతో చంద్రబాబు మాట నమ్మి ఇప్పటికే రెండు సార్లు మోసపోయిన వర్మ.. మరోసారి దానికి గురి కాకతప్పలేదు. తాజాగా టీడీపీ ప్రకటించిన ఎమ్మెల్సీ టికెట్ల జాబితాలో వర్మ పేరు ఎక్కడా కనిపించలేదు.పవన్ కళ్యాణ్ కు పిఠాపురం ఎమ్మెల్యే సీటును వర్మ వదులుకున్న క్రమంలో ఎమ్మెల్సీ టికెట్ హామీ ఇచ్చారు చంద్రబాబు. ఇప్పుడు తీరా చూస్తే వర్మ కి ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదుజఈ అంశంపై పీఏసీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ ఆసక్తికర కామెంట్లు చేశారు. ఎస్పీఎస్ఎన్ వర్మ ఒక సీనియర్ పొలిటిషియన్ అంటూనే, ఆయన ఎమ్మెల్సీ టికెట్ అంశమనేది వారి పార్టీనే నిర్ణయిస్తుందన్నారు మనోహర్. ఇక్కడ తాము వర్మకి చెక్ పెట్టాల్సిన అవసరం ఏముంటందన్నారు మనోహర్.‘పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా. వర్మ చాలా సీనియర్ పొలిటీషియన్. వాళ్ళ పార్టీ ఆయన విషయం లో నిర్ణయం తీసుకుంటుంది, అది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం. వర్మ ని గౌరవించడం లో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. వర్మకి చెక్ పెట్టాల్సిన అవసరం ఏమి ఉంటుంది’ అని అన్నారు.ఇక ఈ నెల 14వ తేదీన పిఠాపురంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ సభను నిర్వహిస్తున్నట్లు మనోహర్ పేర్కొన్నారు. పవన్ సెక్యూరిటీ విషయంలో డిపార్ట్మెంట్ తో పాటు పార్టీ పరంగా మేము కూడా చూసుకుంటాం. సభా ప్రాంగణం లో 75 సి సి కెమెరా లు ఏర్పాటు చేస్తాం. పిఠాపురం ప్రజలకి కృతజ్ఞతలు చెప్పడానికి ఈ సభ ఏర్పాటు చేశాం. ఈ నెల 14 న సాయంత్రం 4 గంటలకు జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ ప్రారంభమవుతుంది’ అని పేర్కొన్నారు మంత్రి మనోహర్. -
పోసాని క్వాష్ పిటిషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: సినీ నటుడు పోసాని కృష్ణమురళి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ల మీద ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విజయనగరం, గుంటూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల పోలీసులు నమోదు చేసిన కేసుల్లో 35(3) నోటీసులిచ్చి వివరణ తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. విశాఖలో నమోదైన కేసు క్వాష్ చేయాలన్న పిటిషన్‌పై విచారణను వచ్చే వారానికి కోర్టు వాయిదా వేసింది. ఇదిలా ఉండగా.. పోసాని కృష్ణమురళిపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపును కొనసాగిస్తూనే ఉంది. వరుస కేసుల్లో అరెస్ట్ చేస్తూ స్టేషన్ల చుట్టూ పోలీసులు తిప్పుతున్నారు. మొన్న విజయవాడ చీఫ్ మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ కోర్టులో పోసానిని పోలీసులు హాజరుపరిచారు. ఈ నెల 20 వరకు కోర్టు రిమాండ్ విధించింది. తనకు ఆనారోగ్య సమస్యలున్నాయని న్యాయమూర్తికి పోసాని చెప్పారు. గుండె ఆపరేషన్ అయ్యిందని.. పక్షవాతం కూడా వచ్చిందని ఆయన తెలిపారు. ‘‘నాపై అక్రమ కేసులు పెట్టారు. నన్ను ఎక్కడికి తీసుకెళుతున్నారో కూడా తెలియడం లేదు’’ అంటూ పోసాని ఆవేదన వ్యక్తం చేశారు.పోలీసు వాహనంలో గంటల తరబడి కూర్చోలేకపోతున్నానని.. తనను ఒకే జైలులో ఉంచేలా ఆదేశాలివ్వాలని పోసాని కోరగా, పిటి వారెంట్‌పై వచ్చినందున తాను ఎలాంటి ఆదేశాలివ్వలేనని న్యాయమూర్తి తెలిపారు. పోసాని కృష్ణమురళికి ఈనెల 20 వరకూ న్యాయమూర్తి రిమాండ్ విధించారు. అనంతరం, పోసానిని కర్నూలు జైలుకి తరలించారు.కాగా, అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పోసానికి బెయిల్ మంజూరు చేస్తూ కడప మొబైల్ కోర్టు శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. పోసానికి బెయిలు ఇవ్వకూడదని పోలీసుల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించినప్పటికీ.. కోర్టు పోసాని తరఫు న్యాయవాదుల వాదనలతో ఏకీభవిస్తూ... బెయిల్ మంజూరు చేసింది. పోసాని కస్టడీ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. -
ఎవరికి చెక్ పెట్టేందుకు.. గ్రీష్మకు ఎమ్మెల్సీ పదవి..
రాజాం : టీడీపీని నమ్ముకుని 2019 సార్వత్రిక ఎన్నికల్లో తల్లి భంగపడింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూతురుకు నిరాశే మిగిలింది. తల్లీకూతుల్లిద్దరు ఇంటిముఖం పట్టేశారని అందరూ అనుకున్నారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలో ఇంతలోనే కుమార్తెకు నామినేటెడ్ పదవి ఇచ్చి కొంతమేర ఉపశమనం. ఆ పదవి కూడా రాకుండా అడ్డుకున్న మరో వర్గానికి మరో షాక్ తగిలేలా ఎమ్మెల్సీ పదవి ఆమెకు లభించింది. ఆమె రాజాం నియోజకవర్గంలో సంతకవిటి మండలం కావలి గ్రామానికి చెందిన కావలి గ్రీష్మ. ఈమె తల్లి కావలి ప్రతిభా భారతి సీనియర్ టీడీపీ నాయకురాలు. ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి 1983, 1985, 1989, 1994, 1999లో ఐదు దఫాలు ఎమ్మెల్యేగా గెలుపొంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా స్పీకర్‌గా పని చేశారు. 27 ఏళ్లకే ఎన్టీఆర్ మంత్రివర్గంలో క్యాబినెట్ ర్యాంకు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నియోజకవర్గాల విభజన తరువాత వరుసగా రాజాం నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలు పోటీ చేసి ఓటమి చెందారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి కోండ్రు మురళీమోహన్ టీడీపీలోకి వచ్చి ప్రతిభా భారతికి 2019లో టిక్కెట్ దక్కకుండా చేశారు. 2024లో ప్రతిభాభారతి కుమార్తె గ్రీష్మ టిక్కెట్ కోసం ప్రయత్నించగా, ఆమెకు కూడా టిక్కెట్ రాకుండా అడ్డుకట్టు వేసి టిక్కెట్ తాను దక్కించుకోవడమే కాకుండా ఎమ్మెల్యేగా గెలిచిన కోండ్రు సిట్టింగ్ అభ్యర్థి, సీనియర్ నాయకురాలైన కావలి ప్రతిభాభారతి కుటుంబానికి ప్రాధాన్యత లేకుండా చేశారు. దీంతో అటు ప్రతిభాభారతితో పాటు ఆమె కుమార్తె గ్రీష్మ విశాఖపట్నంకు పరిమితమయ్యారు. టీడీపీ అధికారంలో లేని సమయంలో పార్టీ తరఫున కార్యక్రమాలకు సొంత ఆస్తులు తగలబెట్టడమే కాకుండా అధికార పార్టీపై ఇష్టానుసారం మాటలిసిరిన కావలి గ్రీష్మకు నిరాశే మిగిలింది. అనంతరం జరిగిన పరిణామాల్లో గ్రీష్మకు టీడీపీ ఉమెన్ ఎన్ఫోర్స్మెంట్ చైర్పర్సన్ పదవిని కట్టబెట్టింది. దీంతో మళ్లీ తెరమీదకు వచ్చిన గ్రీష్మకు ఇంతలోనే ఎమ్మెల్సీగా టిక్కెట్ లభించింది. ఆశావహులకు చెక్ రాష్ట్ర వ్యాప్తంగా ఆశావహులు, సీనియర్ నేతలు పదుల సంఖ్యలో నామినేటెడ్ పదవుల నిమిత్తం ఎదురు చూస్తున్నారు. ఇందులో విజయనగరం జిల్లా నుంచి కిమిడి నాగార్జున, కర్రోతు బంగార్రాజు, గొంప కృష్ణ, బొబ్బిలి చిరంజీవులు, కేఏ నాయుడు, కొల్ల అప్పలనాయుడు, తెంటు లక్షున్నాయుడు తదితరులు ఉన్నారు. కావలి గ్రీష్మకు మూడు నెలలు క్రితమే ఉమెన్ ఎన్ఫోర్స్మెంట్ చైర్పర్సన్ పదవి ఇవ్వడంతో ఆమె పేరు ఎవరూ ఊహించలేదు. కిమిడి నాగార్జున, గొంప కృష్ణ, కొల్ల అప్పలనాయుడు, కేఏ నాయుడులాంటి నేతల పేర్లు తప్పించి, గ్రీష్మకు ఎమ్మెల్సీ పదవి రావడం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ పదవి వెనుక రాజాం నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నేత హస్తం ఉందనేది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఎవరికి చెక్ పెట్టేందుకు.. రాజాం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యేగా కోండ్రు గెలిచిన తరువాత మంత్రి పదవి ఆశించారు. కనీసం విప్‌గా అవకాశం వస్తుందని చూశారు. ఈ రెండు లేకపోయేసరికి ఆయన వర్గంలో అలజడి ప్రారంభం అయ్యింది. కోండ్రు కూడా పెద్దగా నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ సమస్యలపై దృష్టి పెట్టడం లేదని, ఇక్కడ ఉండడం లేదనే గుసగుసలు ఉన్నాయి. అతని సోదరుడు జగదీష్ కనుసన్నల్లోనే మొత్తం తంతు జరుగుతోంది. దీంతో కావలి ప్రతిభాభారతి వర్గీయులతో పాటు కిమిడి కళావెంకటరావు వర్గీయులు, ఆది నుంచి టీడీపీని నమ్ముకున్న టీడీపీ కార్యకర్తలు ఈ విషయాన్ని అధిష్టానానికి చేరవేశారని తెలుస్తుంది. ఫలితంగా కావలి గ్రీష్మకు ఎన్ఫోర్స్మెంట్ చైర్మన్ పదవి ఇచ్చి తెరమీదకు తెచ్చినా ఆమెకు ఎమ్మెల్యే వర్గం ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి నియోజకవర్గంలో టీడీపీ పాత వర్గానికి లోకేష్ టీం జీవం పోసిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు రాజాం నియోజకవర్గంలో కోండ్రు మురళీమోహన్‌తో సమానంగా కావలి గ్రీష్మకు ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలో, కార్యక్రమంలో కుర్చీ వేయాల్సి ఉంటుందని, కోండ్రుకు చెక్‌పెట్టే ప్రయత్నంలో భాగంగానే ఈ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారనే వార్తలు ఊపందుకున్నాయి. ఇంకో వైపు సంతకవిటి మండలానికి చెందిన టీడీపీ సీనియర్ నేత కొల్ల అప్పలనాయుడు కూడా ఈ ఎమ్మెల్సీ పదవిపై ఆశలు పెట్టుకున్నప్పటికీ ఆయనకు ఈ పదవి ఇవ్వకపోవడంతో సంతకవిటి మండలంలో కొల్ల వర్గీయులు టీడీపీ తీరును తప్పుపడుతున్నారు. అడ్రస్ లేని ఆ నేతలు టీడీపీ కష్టకాలంలో ఉన్న సమయంలో పార్టీ పార్లమెంట్ అధ్యక్షులుగా, జిల్లాకు పెద్ద దిక్కు గా కిమిడి నాగార్జున వ్యవహరించారు. 2024లో చీపురుపల్లి నియోజకవర్గం నుంచి టిక్కెట్ ఆయనకు దక్కకుండా పార్టీ వ్యవహరించింది. కనీసం ఎమ్మెల్సీ పదవి వస్తుందని ఆశపడ్డ ఆయనకు నిరాశే మిగిలింది. ఆయన పేరు ఈ నామినేటెడ్ పదవుల్లో అడ్రస్ లేకుండా పోయింది. గొంప కృష్ణ, కేఏ నాయుడు, కొల్ల అప్పలనాయుడు తదితర నేతల పరిస్థితి కూడా ఇదే మా దిరిగా మారింది. వీరిప్పుడు అధిష్టానం నిర్ణయాన్ని కక్కలేని, మింగలేని పరిస్థితిలో ఉన్నారు. -
బాబు, పవన్ రాజకీయం.. వర్మకు వెన్నుపోటు!
ఎప్పటిలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి మాట తప్పారు. చంద్రబాబు మాట మీద నిలబడితే వింతకానీ మాట తప్పితే వింతేముంది. తనది నలభై ఏళ్ల రాజకీయ అనుభవం అంటారు కానీ.. ఈ అనుభవం వెన్నుపోట్లలోనే ఎక్కువగా ఉంటుందన్నది చరిత్ర తెరిచి చూస్తే ఇట్టే తెలిసిపోతుంది.దీనికి తాజా ఉదాహరణ కావాలా?. పిఠాపురం ఎమ్మెల్యే కావాల్సిన వ్యక్తి.. జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన వర్మనే తీసుకుందాం. ‘నీకెందుకు వర్మా నీ రాజకీయ భవిష్యత్ నా చేతిలో ఉంది.. మొదటి ఛాన్స్ లోనే నీకు ఎమ్మెల్సీ ఖాయం.. ముందు నువ్వు పవన్‌ను గెలిపించి చూడు.. నీ ఫ్యూచర్ ఎక్కడో ఉంటుంది’ అని ఎన్నికల సమయంలో చంద్రబాబు వేలాది మంది జనం సమక్షంలో చెప్పారు.. అదే తరుణంలో పవన్ సైతం తనకు వర్మ రాజకీయ భవిష్యత్ కన్నా పెద్ద పనేం లేదని.. ఆయన్ను ఒక స్థాయిలో పెట్టడమే తన ముందున్న కర్తవ్యం అన్నారు. ఇలా ఇద్దరు పెద్ద మనుషులు మాటిచ్చారు.దీంతో, ఇక తనకు తిరుగులేదని వర్మ కూడా నిన్న మొన్నటివరకూ దిలాసాగా ఉన్నారు. తీరా చూస్తే ఎమ్మెల్యేల కోటాలో వచ్చిన మూడుకు మూడు ఎమ్మెల్సీలను కావలి గ్రీష్మ.. బీద రవిచంద్ర.. బీటీ నాయుడులకు ఇచ్చిన చంద్రబాబు.. వర్మకు మాత్రం దెబ్బేశారు. అదేంటి తన ఫ్యూచర్ కోసం ఇద్దరు హామీలు ఇచ్చారు కానీ ఒక్కరు కూడా తన గురించి ఆలోచించలేదా అని వర్మ.. ఆయన వర్గీయులు లోలోన మదనపడుతున్నారు. కానీ, ఈ విషయం ఎక్కడా బయటకు అనలేని పరిస్థితి.ఇదిలా ఉండగా తన గెలుపు వెనుక వెన్నుదన్నుగా నిలిచిన వర్మను పవన్ కళ్యాణ్ కూడా కావాలనే పట్టించుకోవడం మానేశారా.. అది తెలుగుదేశం పార్టీ వ్యవహారం కదా మధ్యలో నేనెందుకు దూరడం అని దూరంగా ఉన్నారా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అందుకే తన పార్టీకి దక్కిన ఎమ్మెల్సీని అన్నయ్య నాగబాబుకు ఇచ్చి.. అక్కడితో పవన్ సైలెంట్ అయ్యారు తప్ప తన కోసం పని చేసిన వర్మను పట్టించుకోలేదు. వాస్తవానికి పవన్‌లో ఈ ఆలోచన ఉండుంటే అయన చంద్రబాబుకు గట్టిగా చెప్పి వర్మకు అవకాశం ఇప్పించవచ్చు. కానీ, పవన్ ఆపని చేయలేదు.అప్పట్లో మాటైతే ఇచ్చేసారు కానీ మాటను నిజం చేసే విషయంలో పెద్దగా సీరియస్‌గా లేరు. అందుకే వర్మను ఆయన మానాన ఆయన్ను వదిలేశారు. మరోవైపు చంద్రబాబు కూడా పిఠాపురంలో పవన్ ఫిక్స్ అయిపోతున్న తరుణంలో వర్మను ఎందుకు ఇంకా మోయడం అని పక్కన పెట్టారా అనే సందేహాలు కూడా ఉన్నాయ్.. ఏదైతేనేం పవన్‌ను గెలుపు తీరానికి చేర్చిన వర్మ రేవులో తాడిచెట్టు మాదిరిగా ఒంటరిగా మిగిలిపోయారు.. చంద్రబాబు బాగా వాడుకుని వదిలేసిన వారి జాబితాలో తాజాగా చేరిపోయారు.-సిమ్మాదిరప్పన్న. -
ఏంటి సీనియర్ మరీ ఇలా చేశారు?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసే ప్రకటనలు అవసరాన్ని బట్టి మారిపోతుంటాయి. ప్రజలకోసం ఇలా మాటమారిస్తే ఓకే కానీ.. ఆయనెప్పుడు రాజకీయాల కోసమే ఇలా చేస్తూంటారు. కొన్ని రోజులుగా ఆయన చేస్తున్న ఉపన్యాసాలను పరిశీలిస్తే.. పొంతన లేకుండా కనిపిస్తాయి. ఒకపక్క దేశం మొత్తమ్మీద నియోజకవర్గాల పునర్విభజన కోసం రంగం సిద్ధమవుతూంటే.. దానిపై ఆయన తన స్పష్టమైన నిర్ణయం చెప్పకుండా కప్పదాటు వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఇదెలా ఉందంటే.. కడుపు నొప్పి అంటే తలనొప్పికి మందు ఇచ్చినట్లుగా ఉంది!. జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) జరుగుతున్న నేపథ్యంలో ఉత్తరాదిలో సీట్లు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. యూపీ, బీహార్ వంటి రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ సక్రమంగా చేపట్టని కారణంగా పెరుగుదల ఎక్కువ ఉందని.. ఫలితంగా వారికి అక్కడ ఎక్కువ పార్లమెంటరీ స్థానాలు అందుబాటులోకి వస్తున్నాయన్న భావన చాలామందిలో ఉంది. దక్షిణాది రాష్ట్రాలు అధిక జనాభాతో వచ్చే ముప్పును ముందుగానే గుర్తించి నియంత్రణ సమర్థంగా నిర్వహించినందుకు ఇక్కడి సీట్లలో పెద్దగా మార్పుల్లేకుండా పోనున్నాయి. 👉ఈ అంశంపై తమిళనాడు, కర్ణాటక, తలంగాణ ముఖ్యమంత్రులు ఇప్పటికే తమ అభ్యంతరాలను వ్యక్తం చేయగా.. చంద్రబాబు మాత్రం దాటవేసే ధోరణి అవలంబిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఒకడుగు ముందుకేసి నియోజకవర్గాల పునర్విభజన ఇదే పంథాలో సాగితే దక్షిణాది తిరగబడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఉత్తరాది రాష్ట్రాల ప్రభావం ఇప్పటికే ఎక్కువగా ఉందని.. సీట్లు పెరిగితే వారి ఆధిపత్యం మరింత పెరిగిపోతుంది. పార్లమెంటులోని ప్రస్తుత 543 లోక్‌సభ సీట్లను 753కు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. దక్షిణాదిలో ప్రస్తుతం 129 సీట్లు ఉండగా.. డీలిమిటేషన్ తరువాత అత్యధికంగా 144 స్థాయికి చేరవచ్చు. ఏపీ, తెలంగాణల్లో చెరో మూడు సీట్లే పెరిగే అవకాశం ఉంటుంది. కేరళలో ఒక సీటు తగ్గుతుందట!. తమిళనాడులో రెండు సీట్లే పెరుగుతాయి. కర్ణాటకలో మాత్రం ఎనిమిది సీట్లు ఎక్కువ కావచ్చు. ఫలితంగా కొత్తగా ఏర్పాటయ్యే సీట్లను కలుపుకుని చూసినప్పుడు దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిథ్యం ప్రస్తుతమున్న 24 శాతం నుంచి నుంచి 19 శాతానికి పడిపోనుంది. 👉డీలిమిటేషన్ పూర్తి అయితే ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే 48 స్థానాలు పెరిగి మొత్తం సంఖ్య 128 స్థానాలకు చేరనుంది. బీహార్ పార్లమెంటరీ స్థానాలు కూడా 40 నుంచి 70కి చేరతాయి. మధ్యప్రదేశ్‌లో 29 నుంచి 47 అవుతాయి. ఈ రకమైన పరిస్థితి వల్ల ఉత్తరాది గుత్తాధిపత్యం అధికం అవుతుందన్న ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గాల పునర్విభజన జనాభా ప్రాతిపదిక కాకుండా 1971 నాటి లెక్కలు తీసుకోవాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. కొందరు మేధావులు విస్తీర్ణం ప్రాతిపదికగా డీలిమిటేషన్ చేస్తే ఈ సమస్య కొంత తగ్గవచ్చని అభిప్రాయపడుతున్నారు. నిజానికి దక్షిణాది రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రులలో సీనియర్ చంద్రబాబు నాయుడు. ఆయన మాత్రం దీనిపై విభిన్నంగా స్పందించారు. ఉత్తరప్రదేశ్, బీహారు రాష్ట్రాలు ఎక్కువమంది జనాభాతో దేశాన్ని కాపాడుతున్నాయని, ఈ విధానాన్ని అన్ని రాష్ట్రాలు అనుసరించాలని చంద్రబాబు సూచిస్తున్నారు. 2026 డీలిమిటేషన్ వల్ల లోక్‌సభ సీట్లలో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని ఈ ప్రాంత నాయకులు అంతా బాధ పడుతుంటే చంద్రబాబు జనాభాను పెంచండని చెప్పి అసలు సమస్య జోలికి వెళ్లకుండా జాగ్రత్తపడ్డారు. 👉గతంలో.. ఇదే చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఉత్తరాది రాష్ట్రాలు సరిగా పనిచేయడం లేదని, అందువల్ల వాటికి అధిక నిధులు ఇవ్వరాదని చెప్పేవారు. బాగా పనిచేస్తున్న ఏపీ తదితర రాష్ట్రాలకు తక్కువ నిధులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసేవారు. ఆ రాష్ట్రాలలో జనాభా నియంత్రణ లేకపోవడాన్ని ఆక్షేపించేవారు. కాని అన్ని అంశాలలో మాదిరే చంద్రబాబు ఇక్కడ కూడా యు టర్న్ తీసుకున్నట్లు కనిపిస్తుంది. 👉కేంద్రంలోని బీజేపీని గట్టిగా నిలదీసే పరిస్థితిలో లేరు. ఎన్డీయే ప్రభుత్వం తెలుగుదేశం సీట్లపై ఆధారపడి ఉన్నా, చంద్రబాబు ఎందువల్లో ఎక్కువగా భయపడుతున్నారేమో అనే వ్యాఖ్యలు వస్తున్నాయి. అందుకే ధైర్యంగా డీలిమిటేషన్లో ఏపీతో సహా దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న నష్టంపై గొంతెత్తలేకపోతున్నారని అంటున్నారు. పైగా ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాలు జనాభాను పెంచి దేశాన్ని కాపాడుతున్నాయని చెబుతున్నారు. ఇది ఒక రకంగా ఆంధ్రతో సహా దక్షిణాదిని అవమానించడమే కదా అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. 👉జనాభా పెంచే విధానాన్ని అన్ని రాష్ట్రాలు అనుసరించాలట. కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీయే ఉంది కనుక, వారికి ఎక్కడ అసంతృప్తి వస్తుందో అని ఆయన మాట్లాడకపోగా అర్జంట్‌గా పిల్లలను కనండని చెబితే ఏమి చేయాలి? నిజంగానే ప్రజలు తమ ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా జనాభాను పెంచితే ఎవరు పోషించాలి? చంద్రబాబు ఎన్నికల సమయంలో చేసే హామీలను నమ్మి ప్రజలు ఎలా మోసపోతున్నారో అంతా గమనిస్తున్నారు. ఇంకో సంగతి చెప్పాలి. ఓ పాతికేళ్లకు దక్షిణాదిలో జనాభాను పెంచినా, అప్పటికి ఉత్తరాదిలో ఇంకా జనాభా పెరిగిపోతుంది కదా!. అందువల్ల ఆయన చెబుతున్న తర్కంలో హేతుబద్దత కనిపించదు. ఉత్తరాది, దక్షిణాది మధ్య ఒక సమతుల్యత రావడం అవసరం కాదా? దానిని వదలి ఉత్తరాది రాష్ట్రాల వారు దేశాన్ని కాపాడుతున్నారట.. అంటే దక్షిణాది వారు కాపాడడం లేదని చెప్పడమా?. తమిళనాడు సీఎం డిమాండ్‌పై చంద్రబాబు మాత్రం స్పందించడం లేదు. వచ్చే ఏడాది పునర్విభజన వల్ల నష్టం జరుగుతుందని అంతా చెబుతుంటే, ఇప్పుడు పిల్లలను కని జనాభాను పెంచండి అని అనడంవల్ల ఏమి ప్రయోజనం ఉంటుందో చంద్రబాబే చెప్పాలి. ఏది ఏమైనా.. కేవలం తక్షణ రాజకీయ ప్రయోజనాలకన్నా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూడడంలో చంద్రబాబు పాత్ర తీసుకోకపోతే చరిత్ర ఆయనను క్షమిస్తుందా?. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరు ప్రకటన
విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్ ఎన్డీయే కూటమి ఎమ్మెల్సీ చివరి అభ్యర్థి పేరును ప్రకటించారు. బీజేపీ తరఫున పార్టీ సీనియర్ నేత సోము వీర్రాజు పేరును ఖరారు చేశారు. తద్వారా గత ఎన్నికల టైం నుంచి పార్టీలో కొనసాగుతున్న లుకలుకలకు అధిష్టానం చెక్ పెట్టే ప్రయత్నం చేసింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల టైంలో.. చంద్రబాబు తన మార్క్ రాజకీయం నడిపించారు. ఒరిజినల్ బీజేపీ నేతలకు సీట్లు దక్కకపోవడంతో సంఘ్‌పరివార్ నేతలు బహిరంగంగానే అసంతృప్తి వెల్లగక్కారు. ఎమ్మెల్యే, ఎంపీ సీటు దక్కుతుందని ఆయన ఆశించినా.. అది నెరవేరలేదు. సామాజిక సమీకరణాలను కూడా పట్టించుకోకపోవడంతో బీజేపీ అధిష్టానం తప్పు చేసిందనే చర్చ విపరీతంగా నడిచింది. అయితే ఆ తప్పును వీర్రాజు ఎంపిక ద్వారా అధిష్టానం ఇప్పుడు సరిద్దుకున్నట్లు కనిపిస్తోంది. తొలుత ప్రచారంలో చాలామంది పేర్లు వినిపించినప్పటికీ.. సోము వీర్రాజు వైపే అధిష్టానం మొగ్గు చూపింది. సినియారిటీకి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు పవర్ బ్యాలెన్స్ చేసేందుకు ఆయన సామాజిక వర్గాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. ఇవాళ ఆయన నామినేషన్ దాఖలు చేస్తారని సమాచారం. ఏపీలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఉండగా.. మూడు టీడీపీ తీసుకుంది. ఒకటి జనసేన(కొణిదెల నాగబాబు), మరొకటి బీజేపీకి కేటాయించింది. -
‘డౌన్ డౌన్ చంద్రబాబు.. మా సత్తా ఏంటో చూపిస్తాం’
ఎన్టీఆర్ జిల్లా, సాక్షి: వేతనాల పెంపు డిమాండ్‌తో అంగన్వాడీలు చేపట్టిన విజయవాడ మహా ధర్నా.. కూటమి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో మారుమోగుతోంది. చంద్రబాబూ.. డౌన్ డౌన్.. కూటమి సర్కార్‌కు మా సత్తా ఏంటో చూపిస్తామంటూ నినాదాలతో విజయవాడ మారుమోగుతోంది. అంతకు ముందు.. ఛలో విజయవాడ ధర్నాను అడ్డుకునేందుకు శతవిధాల ప్రయత్నించారు. ఎక్కడికక్కడే అడ్డుకునేందుకు తనిఖీలు నిర్వహించారు. అయినప్పటికీ రాష్ట్రం నలుమూలలా నుంచి అంగన్వాడీలు తరలి వచ్చారు. వేతనాల పెంపు సహా పలు సమస్యల పరిష్కార డిమాండ్లతో అంగన్వాడీలు సోమవారం (మార్చి 10న) ఛలో విజయవాడ ధర్నా నిర్వహించ తలపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విజయవాడ వెళ్లే అన్ని మార్గాలను పోలీసులు తమ గుప్పిట పెట్టుకున్నారు. అంగన్వాడీలను ఎక్కడికక్కడే అడ్డుకుంటూ నిరంకుశంగా వ్యవహరించారు. కానీ.. 👉టియర్ గ్యాస్ వాహనంతో..పోలీసుల వలయం దాటి.. విజయవాడకు ఇప్పటికే భారీగా చేరుకున్న అంగన్వాడీలు మహా ధర్నాకు సిద్ధమయ్యారు. అలంకార్ సెంటర్‌కు అంగన్వాడీలు చేరుకోవడంతో.. పోలీసులు అలర్ట్ అయ్యారు. భారీ సంఖ్యలో మహిళా పోలీసులు, సిబ్బంది మోహరించారు. రోడ్డు బ్లాక్ చేసి ఎవరిని ముందుకు కదలనివ్వడం లేదు. ఈ క్రమంలో.. టియర్ గ్యాస్ వాహనం సైతం అక్కడ కనిపించడం గమనార్హం. అయితే ధర్నాను అడ్డుకుంటే తమ సత్తా చూపిస్తామంటూ అంగన్వాడీలు చెబుతున్నారు.👉రైళ్లోంచి బలవంతంగా.. అనంతపురం నుంచి అంగన్వాడీలు రైలులో విజయవాడకు బయల్దేరారు. అయితే..వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల స్టేషన్లో కార్యకర్తలతో పోలీసులు అమానుషంగా వ్యవహరించారు. బలవంతంగా వాళ్లను బయటకు దించేశారు. ఈ క్రమంలో చంద్రబాబు డౌన్.. డౌన్ నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది.👉మచిలీపట్నం మూడు స్తంభాల సెంటర్ లో పోలీస్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ప్రతి వాహనాన్ని.. ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. -
పాపాహోం నుంచి శాటిలైట్ సెంటర్‌కు..
సీతమ్మధార: తల్లిదండ్రులు విడిపోయారు. దీంతో ఆ బాలిక భవిష్యత్ అంధకారంలో పడిపోతుందనుకున్నారు. అమ్మమ్మ అన్నీ అయి చదివించారు. సీతమ్మధార పాపాహోంలో(Seethammadhara) ఉంటూ చదువుకున్న ఆమె ప్రస్తుతం ఉన్నతోద్యోగం చేయడం విశేషం. దీంతో త్వరలోనే పాపాహోం ఆవరణలో ఆమెకి ఘనంగా సత్కారం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ యువతి విజయగాథ మనమూ తెలుసుకుందాం. గూడూరుకు చెందిన భట్టిపాటి ప్రియాంక (21)(Bhattipati Priyanka) విశాఖ జిల్లా తగరపువలసలో మేనమామ వద్ద ఉంటూ చదువుకునేది. 9వ తరగతి చదివే సమయంలో 2017లో పాపాహోంలో చేరింది. సీతమ్మధారలోని డాల్ఫిన్ స్కూల్లో 9, పది చదివింది. ఈమెకి తల్లి లేరు. తండ్రి రెండో వివాహం చేసుకున్నారు. ప్రియాంక డిప్లమో ఇన్ కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ (డీసీసీ) పూర్తి చేసింది. తర్వాత నెల్లూరు జిల్లాలో డీకేడబ్ల్యూ కళాశాలలో బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ బ్రాంచ్‌లో (సీఏ)లో చేరింది. భీమునిపట్నం పాలిటెక్నిక్ కళాశాలలో పాపాహోం ఆర్థిక సాయంతోనే డిప్లమో చదివింది. ఈ కళాశాల నుంచి విద్యార్థుల వివరాలు పంపడంతో శ్రీహరికోటలోని స్పేస్ సెంటర్లో ఏడాది పాటు అప్రెంటిస్ శిక్షణకు ఎంపికై శిక్షణ తీసుకుంది. గత ఏడాది అక్టోబర్‌లో ఈ శిక్షణ పూర్తి అయింది. ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా బెంగళూరులోని కేంద్ర ప్రభుత్వానికి చెందిన యూఆర్ రావు శాటిలైట్ సెంటర్లో అకౌంట్స్‌లో సీహెచ్ఎస్ఎస్ పోస్టులో కాంట్రాక్ట్ విధానంలో పని చేస్తోంది. ప్రస్తుతం ఆమెకి రూ.22 వేల వేతనం అందుతోంది. రాకెట్ లాంచింగ్ ఉద్యోగమే లక్ష్యం.. నేను 2003లో గూడూరులో పుట్టాను. 2008లో నా తల్లిదండ్రులు విడిపోయారు. గూడూరులోని అమ్మమ్మ వద్దే పెరిగాను. విశాఖలోని పాపాహోంలో ఉంటూ డాల్ఫిన్ స్కూల్లో 9వ తరగతిలో చేరాను. అక్కడే పదో తరగతి పూర్తి చేశాను. భీమిలిలో డిప్లమో చేశాను. 2018లో తల్లి ఇంట్లోంచి వెళ్లిపోయారు. ఎక్కడున్నారో తెలియదు. రాకెట్ లాంచింగ్ సెంటర్లో ఉద్యోగమే ధ్యేయంగా పని చేస్తున్నాను. గూడురులో అమ్మమ్మ బాగోగులు నేనే చూస్తున్నాను. – ప్రియాంక, బెంగళూరు. -
భారత జట్టు అపూర్వ విజయంపై వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో భారత జట్టుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. జట్టు విజయం మన దేశానికి గర్వకారణమైన క్షణం అని చెప్పుకొచ్చారు.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో అసాధారణ విజయం సాధించిన అనంతరం భారత జట్టుకు వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. ‘ఇది ఎంతో అర్హమైన అజేయ విజయం. మన దేశానికి గర్వకారణమైన క్షణం! టీమిండియాకు అభినందనలు’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.Congratulations to Team India on their exceptional victory! in ICC Champions Trophy 2025. This is a highly deserving unbeaten victory. A proud moment for our nation! Kudos to Team India.#ChampionsTrophy2025 #INDvsNZ— YS Jagan Mohan Reddy (@ysjagan) March 9, 2025 -
ఇస్రోకు మరో రెండు లాంచ్ ప్యాడ్లు
న్యూఢిల్లీ: వినూత్నమైన అంతరిక్ష ప్రయోగాల్లో దూసుకెళ్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తన శక్తి సామర్థ్యాలను మరింత పెంచుకునే ప్రయత్నాల్లో భాగంగా మరో రెండు నూతన లాంచ్ప్యాడ్లను సమకూర్చుకుంటోంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో, తమిళనాడులోని కులశేఖరపట్నంలో వీటిని నిర్మిస్తున్నట్టు ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ ధ్రువీకరించారు. వీటిని రెండేళ్లలో అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. వాటిద్వారా అత్యాధునిక రాకెట్లను నింగిలోకి పంపనున్నారు. కొత్త లాంచ్పాడ్లతో ఇస్రో రాకెట్ ప్రయోగ సామర్థ్యం మరింత ఇనుమడించనుందని చైర్మన్ అన్నారు. చంద్రయాన్–4కు సంబంధించి ఆయన కీలక ప్రకటన చేశారు. 2028లో ప్రయోగం చేపట్టనున్నట్లు తెలిపారు. చంద్రయాన్–3 ఉపగ్రహం మొత్తం బరువు 4,000 కిలోలు కాగా చంద్రయాన్–4 9,200 కిలోలుంటుందని వెల్లడించారు. చందమామపైకి చేరుకొని, అక్కడి నమూనాలను సేకరించి విజయవంతంగా రావడం చంద్రయాన్–4 మిషన్ లక్ష్యం. చంద్రుడిపై మన ప్రయోగాల్లో ఇది కీలక మలుపు కానుందని చెబుతున్నారు. మహిళా సైంటిస్టులకు ప్రాధాన్యం అంతరిక్ష ప్రయోగాల్లో పురుషులతో సమానంగా మహిళా సైంటిస్టులకు ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు నారాయణన్ పేర్కొన్నారు. చంద్రయాన్, మార్స్ ఆర్బిటార్ మిషన్ ప్రయోగాల్లో మహిళలది కీలక పాత్ర అని ప్రశంసించారు. అమెరికా, భారత్ ఉమ్మడిగా ‘నిసార్’ శాటిలైట్‌ను అభివృద్ధి చేస్తున్నాయన్నారు. దాన్ని జీఎస్ఎల్వీ మార్క్–2 రాకెట్ ద్వారా ప్రయోగించనున్నట్లు తెలియజేశారు. పర్యావరణ మార్పులపై అధ్యయనానికి ఈ ఉపగ్రహం తోడ్పడుతుందన్నారు. వాతావరణ పరిస్థితులపై అధ్యయనానికి జి–20 శాటిలైట్ రూపకల్పనలో ఇస్రో నిమగ్నమైంది. ఇందులో 40 శాతం పేలోడ్లు దేశీయంగా అభివృద్ధి చేసినవే కావడం విశేషం. భారత తయారీ రాకెట్లతో ఇప్పటిదాకా 34 దేశాలకు చెందిన 433 ఉపగ్రహాలను ప్రయోగించినట్టు వి.నారాయణన్ వెల్లడించారు. ఇందులో 90 శాతం ప్రయోగాలు గత పదేళ్లలోనే జరిగాయన్నారు. -
గట్టెక్కుతామా.. నష్టపోతామా..
మరికొద్దిరోజుల్లో పొగాకు వేలం ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానుంది. రెండేళ్లుగా ధరలు ఆశాజనకంగా ఉండి రైతులకు లాభాలొచ్చాయి. ఈ ఏడాది మార్కెట్ ఎలా ఉంటుందోనని ఎదురు చూస్తున్నారు. సాగు ఖర్చులు భారీగా పెరిగిన నేపథ్యంలో వేలంలో దక్కే ధరలపై ఆశలు పెట్టుకున్నారు. గతేడాది కంటే ధరలు పెంచితేనే లాభాలు వస్తాయని లేకుంటే నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అటు బోర్డు అధికారులతోపాటు, ఇటు రైతులు అభిప్రాయపడుతున్నారు.కందుకూరు: పొగాకు బోర్డు ఒంగోలు రీజియన్ పరిధిలో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మొత్తం 11 వేలం కేంద్రాలున్నాయి. ఈనెల 10వ తేదీ నుంచి కందుకూరు – 1వ కేంద్రంతోపాటు ఒంగోలు –1, కొండపి, పొదిలి కేంద్రాల్లో వేలం ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానుంది. మిగిలిన కందుకూరు – 2, కలిగిరి, డీసీపల్లితోపాటు ఒంగోలు – 2, టంగుటూరు, వెల్లంపల్లి, కనిగిరి వేలం కేంద్రాల్లో 19వ తేదీ నుంచి మొదలవుతుంది. 2025 – 26 సీజన్‌కు సంబంధించి 11 కేంద్రాల పరిధిలో 105.27 మిలియన్ కేజీల పొగాకును అధికారికంగా అమ్ముకునేందుకు బోర్డు అనుమతి ఉంది. అయితే ప్రస్తుతం సాగు విస్తీర్ణం, వస్తున్న ఉత్పత్తిని దృష్టిలో ఉంచుకుని 162 మిలియన్ కేజీల వరకు ఈ సీజన్లో అమ్మకాలు ఉండొచ్చని బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు. ధరలు పెంచాలంటూ..రెండు సంవత్సరాలుగా పొగాకు మార్కెట్ రైతులకు లాభాల పంట పండించింది. దీంతో ఈ ఏడాది అనేకమంది సాగుపై అధికంగా మొగ్గు చూపారు. బోర్డు పరిమితికి మించి భారీగా పంట వేశారు. రైతులు సాగులో పోటీ పడటంతో పొలాలు, బ్యారెన్ల కౌలు ధరలు అమాంతం పెరిగిపోయాయి. గతేడాది రూ.లక్ష ఉన్న బ్యారెన్ కౌలు ఈసారి రూ.2.50 లక్షల వరకు పెరిగింది. పొలం కౌలు, కూలీల రేట్లన్నీ రెట్టింపయ్యాయి. ఈ పరిస్థితుల్లో గతేడాది కంటే బ్యారెన్‌కు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు అదనంగా ఖర్చయ్యిందని స్వయంగా బోర్డు అధికారులే లెక్కలు వేస్తున్నారు. పెరిగిన ఖర్చులకు అనుగుణంగా వేలంలో ధరలు కూడా పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కేజీ పొగాకుకు సరాసరి ధరను రూ.300కు తగ్గకుండా ఇవ్వాలని కోరుతున్నారు. అయితే గతేడాది వేలం ముగిసే సమయానికి కేజీ సరాసరి ధర రూ.254 మాత్రమే ఉంది. కానీ రైతులు ఆశించిన స్థాయిలో ఈ సంవత్సరం మార్కెట్ ఉంటుందా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.కర్ణాటక మార్కెట్లో ఇలా..ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతున్న పొగాకు వేలం అక్కడి రైతులకు కొంత ఆశాజనకంగానే ఉందని అధికారులు చెబుతున్నారు. బ్రైట్ గ్రేడ్ కేజీ పొగాకు ధర రూ.337 వరకు పలుకుతోంది. మొత్తంగా కేజీ సరాసరి ధర చూస్తే రూ.268.25 వరకు ఉంది. అయితే ఆంధ్రాలో పెరిగిన సాగు ఖర్చులను దృష్టిలో పెట్టుకుని ధరలు పెంచాల్సిన అవసరం ఉందని రైతులు కోరుతున్నారు. 50 శాతం పైనే.. ఈ ఏడాది పొగాకు నాణ్యత ఆశాజనకంగా ఉండటం రైతులకు ఊరటనిచ్చే అంశంగా మారింది. మొత్తం ఉత్పత్తుల్లో 50 శాతానికి పైగా మొదటి రకం అంటే బ్రైట్ గ్రేడ్ వచ్చాయని బోర్డు అధికారులు చెబుతున్నారు. మిగిలిన గ్రేడ్లు కూడా ఆశించిన స్థాయిలో నాణ్యతగా ఉన్నాయంటన్నారు. ఇది వేలంలో రైతులకు సానుకూలాంశంగా మారనుంది. అయితే గ్రేడింగ్ విధానంలో వారు సరైన జాగ్రత్తలు పాటించి బేళ్లు కట్టాలని అధికారులు సూచిస్తున్నారు.ఉత్పత్తి బాగా పెరిగిందిఈనెల 10వ తేదీ నుంచి ఈ సీజన్‌కు సంబంధించి అధికారికంగా పొగాకు వేలం ప్రక్రియను ప్రారంభించనున్నాం. మొదటి దశలో నాలుగుచోట్ల, 19వ తేదీన మిగిలిన కేంద్రాల్లో మొదలుపెడతాం. ఈ ఏడాది ఉత్పత్తి బాగా పెరిగింది. రైతులు ఖర్చులకు అనుగుణంగా ధరలివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వేలం ప్రారంభమైన తర్వాత ధరలపై ఒక అంచనాకు రాగలం. – లక్ష్మణరావు, ఆర్ఎం -
మెడికల్ అకాడమీకి మంగళం!
కంకిపాడు: విద్యారంగాన్ని రాష్ట్రంలోని కూటమి సర్కారు నిర్లక్ష్యం చేస్తోంది. విద్యార్థుల జీవితాలను నడిరోడ్డుకు లాగుతోంది. ఫలితంగా కోటి ఆశలతో ప్రతిభా పరీక్ష రాసి ఐఐటీ–మెడికల్ అకాడమీలో ప్రవేశం పొందిన విద్యార్థుల భవిష్యత్‌పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఈ ఏడాది ఐఐటీ–మెడికల్ అకాడమీలో ప్రవేశాల జాబితాలో కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలోని ఈడుపుగల్లులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల సంస్థ ఐఐటీ–మెడికల్ అకాడమీ పేరు లేకపోవటం అకాడమీకి మంగళం పాడేందుకు రంగం సిద్ధమైందన్న వాదనకు బలం చేకూరుస్తోంది. దీంతో ప్రస్తుతం మొదటి సంవత్సరం విద్య పూర్తిచేస్తున్న విద్యార్థులు రెండో సంవత్సరం తమ విద్యాభ్యాసం ఎక్కడ? ఎలా? సాగుతుందోనన్న ఆందోళనతోనే వార్షిక పరీక్షలు రాస్తున్న దుస్థితి నెలకొంది. మూడింటిలో ఒకటిరాష్ట్రవ్యాప్తంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల సంస్థ ఐఐటీ–మెడికల్ అకాడమీలు మూడు మాత్రమే ఉన్నాయి. కృష్ణా జిల్లా ఈడుపుగల్లు, కర్నూలు జిల్లా చిన్నటేకూరు, గుంటూరు జిల్లా అడవి తక్కెళ్లపాడు ప్రాంతాల్లో ఇవి నడుస్తున్నాయి. చిన్నటేకూరు, అడవి తక్కెళ్లపాడు రెండు అకాడమీలు బాలురకు, ఈడుపుగల్లు అకాడమీ ప్రత్యేకించి బాలికలకు ఏర్పాటు చేశారు. 2017లో ఏర్పాటైన ఈ కేంద్రంలో ప్రస్తుతం 500 మందికి పైగా విద్యనభ్యసిస్తున్నారు. గురుకులం మూసివేతకు రెడీరాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పూర్తిచేసిన ప్రతిభావంతులైన విద్యార్థులకు రెండు దశల్లో పరీక్ష రాసి అర్హత పొందిన వారికే ఈ అకాడమీలో ప్రవేశం కల్పిస్తారు. ఐఐటీ, నీట్‌తో పాటు ఐక్యరాజ్యసమితి సందర్శనకు వెళ్లిన విద్యార్థులు కూడా ఈ అకాడమీలో విద్యనభ్యసించారు.పటిష్టమైన భద్రత ఉన్న అకాడమీని మూసివేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు ఈ ఏడాది ఏపీ ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఏపీ ఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ ద్వారా నిర్వహిస్తున్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాల ప్రవేశ నోటిఫికేషన్లో ఈడుపుగల్లు ఐఐటీ–మెడికల్ అకాడమీ ప్రస్తావన లేకపోవటం నిదర్శనం. విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంనోటిఫికేషన్ నిలిపివేతతో ఐఐటీ–మెడికల్ అకాడమీ ఎత్తివేతకు రంగం సిద్ధమైంది. దీంతో ఈ ఏడాది మొదటి సంవత్సరం ఇంటర్మీడియెట్ పూర్తి చేసుకున్న విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ఇక్కడ విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు ద్వితీయ సంవత్సరం చదువులు ఎలా, ఎక్కడన్న ఆందోళనలో మునిగిపోయారు. చదువుల దిగులుతోనే మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలను విద్యార్థులు రాస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో కూటమి సర్కారు, సాంఘిక సంక్షేమ శాఖ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈడుపుగల్లు అకాడమీ నిర్వహిస్తున్న భవనం ప్రైవేటు వ్యక్తులది కావటంతో అక్కడి నుంచి అకాడమీ తీసివేయాలనే ఆలోచనతో అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల చేయలేదని చెబుతున్నారు. మొదటి సంవత్సరం పరీక్ష రాసిన విద్యార్థులను ఎన్టీఆర్ జిల్లా కుంటముక్కల గురుకులం, అలాగే విద్యార్థుల సొంత జిల్లాల్లో గురుకులాలకు తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చర్యతో ఐఐటీ–మెడికల్ అకాడమీతో మెరుగైన విద్య అందుతుందని ఆశించి ప్రతిభా పరీక్షల్లో సత్తా చాటి అకాడమీలో ప్రవేశం పొందిన విద్యార్థులు సాధారణ ఇంటర్ విద్యను అభ్యసించటం ద్వారా తమ భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతుందన్న ఆందోళన సర్వత్రా నెలకొంది. దీనికితోడు విద్యార్థుల సామర్థ్యాలు కూడా తక్కువగా ఉన్నాయని, విద్యాప్రమాణాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతుండటం గమనార్హం. న్యాయ పోరాటానికి సిద్ధంఈ పరిస్థితుల్లో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అకాడమీని కొనసాగిస్తేనే విద్యార్థులకు మెరుగైన విద్య, భవిష్యత్ భద్రంగా ఉంటుందని పేర్కొంటున్నారు. అధికారులు తమ ఆవేదన అర్థం చేసుకోవాలని కోరుతున్నారు. అకాడమీని కొనసాగించేలా విద్యార్థుల తల్లిదండ్రులు న్యాయపోరాటానికి సన్నద్ధంఅవుతున్నారు. విద్యార్థులకు నష్టం జరగనివ్వంవిద్యార్థులకు ఎలాంటి నష్టం జరగనివ్వం. ప్రస్తుతం అకాడమీ ఉన్న భవనం ప్రైవేటుది. 500 మార్కులు పైన వచ్చిన విద్యార్థులను అకాడమీలో చేర్చుకున్నాం. ఇక్కడ ఉన్న పిల్లలను కుంటముక్కలకు తరలిస్తాం. వచ్చే ఏడాది 10 వరకూ ఐఐటీ–మెడికల్ అకాడమీలు రాబోతున్నాయి. ఆందోళన చెందాల్సిన పనిలేదు. మెరుగైన విద్య అందుతుంది. – ఎ.మురళీకృష్ణ, జిల్లా కోఆర్డినేటర్, ఉమ్మడి కృష్ణాజిల్లా -
‘ప్రైవేట్’ నోట.. ‘డీమ్డ్’ పాట!
సాక్షి, అమరావతి: ప్రతిభ ఆధారంగా నిరుపేద, మధ్యతరగతి విద్యార్థులకు దక్కే ఎంబీబీఎస్, బీడీఎస్, మెడికల్ పీజీ, ఎండీఎస్ సీట్లకు గండికొడుతూ ప్రైవేట్ వైద్య కళాశాలల యాజమాన్యాలు డీమ్డ్ (స్వయం ప్రతిపత్తి) బాట పట్టడానికి పోటీపడుతున్నాయి. ప్రైవేట్ యాజమాన్యాలకు అనుకూలమైన పార్టీ టీడీపీ అధికారంలో ఉండటంతో ఇదే అనువైన సమయంగా భావించిన యాజమాన్యాలు స్వయం ప్రతిపత్తి సాధించుకోవడానికి తెగ ఆరాటపడుతున్నాయి. గడిచిన ఐదేళ్లలో ఎప్పుడూ లేనివిధంగా చంద్రబాబు సీఎం అయ్యాక యూజీసీ నుంచి డీమ్డ్ వర్సిటీ హోదా పొందడానికి ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్’ (ఎన్ఓసీ) మంజూరు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తుల తాకిడి పెరిగింది. అపోలో, కిమ్స్, జీఎస్ఎల్, జెమ్స్, మరికొన్ని వైద్య కళాశాలల యజమానులు ఎన్ఓసీ కోరినట్లు తెలుస్తోంది. విశాఖలోని హోమి బాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో మెడికల్ పీజీ సీట్లున్నాయి. ఈ సంస్థ సైతం ఆరోగ్య విశ్వవిద్యాలయం అఫిలియేషన్ నుంచి బయటపడి, వేరే రాష్ట్రంలోని మాతృ సంస్థ అఫిలియేషన్ కింద పనిచేయడానికి ఎన్ఓసీ కోరింది.ఎంబీబీఎస్, పీజీ కోర్సుల ఫీజుల్లో వ్యత్యాసం ఇలా..ప్రస్తుతం ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ ఫీజులు కన్వీనర్ 16,500బీ కేటగిరి 13,20,000ప్రస్తుతం ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మెడికల్ పీజీ ఫీజులుకన్వీనర్4,96,800బీ కేటగిరి 9,93,600ఎన్ఓసీ ఇవ్వాలంటే చట్ట సవరణ చేయాల్సిందేడీమ్డ్ బాట పట్టేందుకు కళాశాలలు పెట్టుకున్న ఎన్ఓసీ దరఖాస్తులపై సీఎం చంద్రబాబు స్థాయిలో కొద్ది రోజుల క్రితం చర్చలు నడిచినట్టు తెలిసింది. ఎన్ఓసీ ఇవ్వడానికి సా«ధ్యాసాధ్యాలపై చర్చించినట్టు సమాచారం. అయితే, ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం చట్టం 1986లోని సెక్షన్6 ప్రకారం రాష్ట్రంలోని వైద్య కళాశాలలు ఇతర యూనివర్సిటీల కింద పనిచేయడానికి వీల్లేదు. రాష్ట్రంలోని వైద్య విద్య కళాశాలలన్నీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోనే కార్యకలాపాలు నిర్వహించాలని చట్టం చెబుతోంది. ఎన్ఓసీ మంజూరు అంశంపై ప్రభుత్వం న్యాయ శాఖ అభిప్రాయాన్ని కోరగా.. ఏ ఒక్కరికి ఎన్ఓసీ ఇవ్వాలన్నా వర్సిటీ చట్టానికి సవరణ తప్పనిసరని సూచించినట్టు తెలిసింది. కాగా, 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో ఎమ్మెల్యే బాలకృష్ణ చిన్నల్లుడు, మంత్రి లోకేశ్ తోడల్లుడైన విశాఖ ఎంపీ భరత్ కుటుంబానికి చెందిన ‘గీతం’ సంస్థ డీమ్డ్ హోదా దక్కించుకుంది. అధికారం అండతో అడ్డదారుల్లో వైద్య కళాశాలలకు డీమ్డ్ హోదా సాధించుకున్నారన్న ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి. అదే తరహాలోనే ఇప్పుడు కూడా సొంత సామ్రాజ్యాన్ని స్థాపించుకోవడం కోసం ప్రభుత్వ పెద్దల అస్మదీయ ప్రైవేట్ మెడికల్ కాలేజీ యాజమాన్యాలు ప్రయత్నిస్తున్నాయి.చెప్పిందే ఫీజు.. పెట్టిందే నిబంధనరాష్ట్రంలోని గీతం మినహా మిగిలిన ప్రైవేట్ వైద్య కళాశాలలన్నీ హెల్త్ వర్సిటీ చట్టం ప్రకారం కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 18 ప్రైవేట్ వైద్య కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో 50 శాతం ఎంబీబీఎస్ సీట్లు కన్వీనర్, 35 శాతం బీ కేటగిరీ, 15 శాతం ఎన్ఆర్ఐ కోటా కింద భర్తీ చేస్తున్నారు. సీట్లన్నింటినీ ఆరోగ్య విశ్వవిద్యాలయమే భర్తీ చేస్తోంది. మొత్తం సీట్లలో 50 శాతానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వంటి రూల్ ఆఫ్ రిజర్వేషన్ వర్తింపజేస్తున్నారు. అదేవిధంగా కన్వీనర్ కోటా సీట్లలో 85 శాతం సీట్లను స్థానిక విద్యార్థులకే అవకాశం ఉంటోంది. ప్రభుత్వం నిర్ణయించిన మేరకే ఈ కళాశాలల్లో ఫీజులు ఉంటున్నాయి. అడ్మిషన్లతో పాటు, పరీక్షలను వర్సిటీయే నిర్వహిస్తోంది. అదే డీమ్డ్ హోదా వస్తే ఆయా కళాశాలలపై హెల్త్ వర్సిటీ అజమాయిషీ ఉండదు. వారు చెప్పిందే ఫీజు, పెట్టిందే నిబంధనగా మారిపోతుంది. ఎంబీబీఎస్, పీజీ సీట్లన్నీ యాజమాన్య కోటాగా మారిపోతాయి. ఎంబీబీఎస్, బీడీఎస్, ఎండీఎస్, మెడికల్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలన్నింటినీ జాతీయ ర్యాంకుల ఆధారంగా మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ, డీజీహెచ్ఎస్, కేంద్ర ప్రభుత్వం భర్తీ చేస్తాయి. స్థానిక, ఎస్సీ, ఎస్టీ, బీసీ వంటి రిజర్వేషన్లు ఉండవు. దీంతో మన విద్యార్థులు పెద్దఎత్తున సీట్లను నష్టపోతారు. మన విద్యార్థులకు తీరని నష్టం..నిజానికి.. కొత్త వైద్య కళాశాలలు ప్రైవేటీకరణ చేయాలన్న నిర్ణయంతో డాక్టర్ కావాలన్న మన విద్యార్థుల కలలను చంద్రబాబు ప్రభుత్వం చిదిమేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నిర్మించ తలపెట్టిన కొత్త వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. 17 కళాశాలల్లో ఐదింటిని 2023–24 విద్యా సంవత్సరంలోనే ప్రారంభించి 750 ఎంబీబీఎస్ సీట్లను వైఎస్ జగన్ ప్రభుత్వం సమకూర్చింది. మిగిలిన కళాశాలలను పీపీపీలో ప్రైవేట్‌కు కట్టబెట్టాలన్న పక్కా వ్యూహంతో రెండు, మూడు దశల్లోని పులివెందుల, మదనపల్లె, మార్కాపురం, ఆదోని, పిడుగురాళ్ల, బాపట్ల, పార్వతీపురం, నర్సీపట్నం, పెనుకొండ, పాలకొల్లు, అమలాపురం మెడికల్ కళాశాలల నిర్మాణ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. వాస్తవానికి.. పులివెందుల వైద్య కళాశాలకు 50 ఎంబీబీఎస్ సీట్లతో తరగతుల ప్రారంభానికి ఎన్ఎంసీ అనుమతులిచ్చినా ప్రభుత్వం వద్దని లేఖ రాసి విద్యార్థులకు తీరని ద్రోహం తలపెట్టింది. ఇలా కూటమి ప్రభుత్వ దుర్మార్గపు నిర్ణయాలతో రెండేళ్లలో 2,450 సీట్లను మన విద్యార్థులు నష్టపోతున్నారు. దీనికితోడు.. ప్రస్తుతమున్న ప్రైవేట్ వైద్య కళాశాలలు డీమ్డ్ హోదా సాధించుకునే ప్రయత్నాలు చేస్తుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. -
విలీనంపై ‘ఎస్’ అనాల్సిందే!
సాక్షి, అమరావతి: గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల మూసివేత వైపే ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఎంతో శ్రమకోర్చి తెచ్చుకున్న బడులను సర్కారు విలీనం వైపు నడిపిస్తోంది. ఇందుకు గ్రామస్తులు అంగీకరించకపోయినా.. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు ‘నో’ అని చెప్పినా ‘ఎస్’ అనిపించాల్సిన బాధ్యత ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులదేనని ఉన్నతాధికారులు ఆదేశించినట్టు సమాచారం. ప్రతి గ్రామ పంచాయతీకి ఒకమోడల్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటులో భాగంగా తక్కువ ఎన్రోల్ ఉన్న బడుల్లోని విద్యార్థులను ఒక్కచోటకు చేర్చే ప్రక్రియ చేపట్టారు. ఈ క్రమంలో దూరం వెళుతున్న విద్యార్థులకు రవాణా చార్జీలను ఇస్తామని ప్రభుత్వం మభ్యపెడుతోంది. గత ప్రభుత్వం జీవో నం.117 తీసుకొచ్చి పాఠశాలలను విచ్ఛిన్నం చేసిందని ఓపక్క విషం చిమ్ముతూనే.. మరోపక్క ఉన్న బడులను మూసివేసే ప్రక్రియ ప్రారంభించింది. మండల స్థాయిలో ఎంఈవోలు ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలకు విలీన ప్రక్రియను వివరించి ఒప్పించాలని, మండలంలోని ఏ క్లస్టర్లో ఏ పాఠశాలను ఎలా మార్పు చేశారో చెప్పాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఎంఈవోలు కాంప్లెక్స్ చైర్మన్లతో సమన్వయం చేసుకుంటూ క్లస్టర్లో ఉన్న ప్రధానోపాధ్యాయులతో కలిసి ఆ గ్రామంలోని పాఠశాలలను ఎలా మార్పు చేస్తున్నారో సంబంధిత గ్రామ పెద్దలు, స్కూల్ మెనేజ్మెంట్ కమిటీలకు తెలియజేయాలని ఆదేశించారు. ఆయా పాఠశాలలను ఫౌండేషన్ స్కూల్‌గా మార్చారా? బేసిక్ ప్రైమరీ స్కూల్‌గా మార్చారా? లేదా మోడల్ ప్రైమరీ స్కూల్‌గా మార్చారా? అనేది వారికి వివరించి వారి నుంచి అనుమతి తీసుకోవాలి. అయితే, ఈ క్రమంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ‘నో’ అని చెప్పకుండా చూడాలని ఉపాధ్యాయులపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. గ్రామాల సెంటిమెంట్‌పై కన్నెర్ర గ్రామ స్థాయిలో ప్రభుత్వ పాఠశాల, గుడి అనేవి స్థానికుల సెంటిమెంట్‌తో ముడిపడిన అంశాలు. వీటిని మూసివేసేందుకు, తరలించేందుకు స్థానికులు అంగీకరించరు. అయినప్పటికీ స్థానికుల అంగీకారంతో పనిలేకుండా ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం కృష్ణాపురంలో ఉన్న బాబు జగ్జీవన్‌రామ్ ఎంపీపీ స్కూల్‌ను విద్యార్థులు తక్కువగా ఉన్నారన్న సాకుతో 2016లో నాటి టీడీపీ ప్రభుత్వం మూసివేసింది.స్థానికులు ఎంతగా ప్రాథేయపడినా పట్టించుకోలేదు. పిల్లలు చదువుకు దూరం అవుతున్నారని గత వైఎస్సాÆŠసీపీ ప్రభుత్వంలో గ్రామస్తులు విజ్ఞప్తి చేయగా తిరిగి తెరిపించారు. ఇప్పుడు ఈ పాఠశాలలోని విద్యార్థులను మరో బడిలో విలీనం చేసేందుకు చర్యలు ప్రారంభించారు. ఇలాంటి పాఠశాలలు రాష్ట్రవ్యాప్తంగా 12 వేల వరకు ఉన్నట్టు అంచనా. గత ప్రభుత్వంలో జీవో నం.117 ద్వారా హైసూ్కళ్లకు కిలోమీటరు లోపు దూరం ఉన్న ప్రాథమిక పాఠశాలల్లోని 3–5 తరగతుల విద్యార్థులు సబ్జెక్టు టీచర్ బోధన కోసం హైస్కూళ్లలో విలీనం చేశారు. మిగిలిన తరగతులను అదే ప్రాథమిక పాఠశాలలో కొనసాగించారు. ప్రస్తుతం 65 మంది ఎన్రోల్ ఉన్న పాఠశాలలను మోడల్ ప్రైమరీ స్కూళ్లుగా మారుస్తామని, అంతమంది విద్యార్థులు లేకుంటే సమీపంలోని ఇతర ప్రభుత్వ స్కూళ్లలోని విద్యార్థులను తరలించాలని ఎంఈవోలకు మౌఖిక ఆదేశాలు ఇవ్వడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రాథమిక పాఠశాల విద్యార్థులు 3–5 కి.మీ. పైగా దూరం వెళ్లాల్సి వస్తుందని గ్రామస్తులు మండిపడుతున్నారు. విలీన ఒత్తిడి భరించలేమంటున్న ఉపాధ్యాయులు ఆదర్శ పాఠశాలల ఏర్పాటు క్రమంలో ఓ పాఠశాలను కేంద్రంగా చేసి చుట్టూ ఉన్న పాఠశాలలను విలీనం చేయడం, లేదా 3–5 తరగతులను తీసుకొచ్చి ఎంపిక చేసిన పాఠశాలలో కలపడాన్ని ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నారు. పైగా ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సిన బాధ్యతను అదే ఉపాధ్యాయులకు అప్పగించడం, కాదన్న వారిని ఉన్నతాధికారులు బెదిరించడం తట్టుకోలేక పోతున్నామని వాపోతున్నారు. గత ప్రభుత్వంలో ప్రతి పాఠశాలలో మన బడి నాడు–నేడు పథకం కింద రూ.లక్షలు ఖర్చు చేసి సదుపాయాలు కల్పిస్తే వాటిని వినియోగించుకోకుండా విలీనం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వం పెట్టిన ఖర్చు వృథా అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే రెండేళ్లలోనే ప్రాథమిక పాఠశాలలు శాశ్వతంగా కనుమరుగవుతాయని.. ఇదంతా ప్రైవేటు స్కూళ్లను ప్రోత్సహించేందుకే అన్నట్లు ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి బదులు 40 లేదా 45 మంది పైగా ఎన్రోల్ ఉన్న స్కూళ్లను మోడల్ స్కూళ్లుగా మార్చి, మిగిలిన పాఠశాలలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. -
నువ్వు డాక్టర్‌వా.. గేదెలు కాస్తున్నావా?
ప్రత్తిపాడు: రాష్ట్రంలో కూటమి నేతల దాడులు, దౌర్జన్యాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. తాజాగా.. జనసేన పార్టీకి చెందిన నియోజకవర్గ ఇన్చార్జి వరుపుల తమ్మయ్యబాబు ఏకంగా మహిళా డాక్టర్‌పై విరుచుకుపడి నానా రాద్ధాంతం సృష్టించారు. ఎప్పటిలాగే పోలీసులు ప్రేక్షకపాత్రకు పరిమితమయ్యారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చోటుచేసుకున్న ఈ ఘటన పూర్వాపరాలు ఏమిటంటే.. ఏలేశ్వరం మండలం లింగంపర్తికి చెందిన కాపవరపు చంద్రకళ పదేళ్ల కుమారుడు చంద్ర శేఖర్‌తో కలిసి ఆటోలో లింగంపర్తి వస్తోంది.ఆమె ప్రయాణిస్తున్న ఆటోను తునివైపు వెళ్తున్న కారు రామవరం వద్ద ఢీకొట్టి బోల్తా పడింది. చికిత్స నిమిత్తం తల్లీకొడుకును హైవే అంబు లెన్సులో స్థానిక సీహెచ్‌సీకి తీసుకొచ్చారు. డ్యూటీ డాక్టర్ శ్వేత వెంటనే స్పందించి, సిబ్బంది సహాయంతో వైద్యసేవలు అందించారు. అదే సమయంలో తమ గ్రామానికి చెందిన క్షత గాత్రులను పరామర్శించేందుకు లింగంపర్తి నుంచి వచ్చిన కొందరు వ్యక్తులు ఆస్పత్రిలోకి దూసు కొచ్చి, బాధితులను తీసుకొచ్చిందెవరంటూ నానా యాగీ చేశారు. గాయపడిన వారిని ఎవరైనా తీసుకొస్తే వివరాలు లేకుండానే చికిత్స చేస్తారా అంటూ వారు వైద్యురాలితో ఘర్షణకు దిగారు. సిబ్బంది వారిస్తున్నా వినకుండా వారిపై ఎదురుదాడికి దిగారు. హైవే అంబులెన్సులో తీసుకొచ్చారని, పోలీసులకు సమాచారం అందించామని ఎంత చెబుతున్నా వినకుండా ఆçస్పత్రికి తీసుకొచ్చిన వారి వివరాలు చెప్పాలని రాద్ధాంతం చేశారు. అలాగే, తమ నాయకుడు వరుపుల తమ్మయ్యబాబుతో మాట్లాడాలంటూ డాక్టర్ శ్వేతకు సెల్‌ఫోన్ ఇచ్చారు. దీంతో అవతలి వ్యక్తి ఎవరో తెలియని డాక్టర్ బాధితులకు వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. అంతే.. ఆగ్రహావేశాలతో ఊగిపోతూ వరుపుల తమ్మయ్యబాబు ఆస్పత్రికి చేరుకున్నారు. ‘తమ్మయ్యబాబు అంటే తెలీదా.. జీతాలు తీసుకోవడంలేదా.. నువ్వు డాక్టర్‌వా.. గేదెలు కాస్తున్నావా’.. అని నోటికొచ్చినట్లు అరుస్తూ ఆస్పత్రిలో హడావుడి చేశారు. దీంతో రోగులు, సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. సెల్‌ఫోన్ లాక్కుని.. నగదు దోచుకుని..ఈ తతంగమంతా ఓ పారిశుధ్య కార్మికురాలు తన సెల్లో వీడియో తీస్తుండగా జనసేన కార్య కర్తలు ఆమె సెల్‌ఫోన్‌ను లాక్కుని వెళ్లిపోయారు. ఆ తర్వాత దాన్నుంచి రూ.2,700 నగదును ట్రాన్సఫర్ చేసుకుని, వీడియోలన్నీ తొలగించి రాత్రి 11 గంటలకు తిరిగిచ్చారు. ఇంత జరుగుతున్నా అక్కడే ఉన్న పోలీసులు మాత్రం ప్రేక్షకపాత్ర పోషించారు. మరోవైపు.. తమకు స్వేచ్ఛ, రక్షణ కల్పించాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా స్పష్టమైన హామీ కావాలనివైద్యులు డిమాండ్ చేశారు. కాగా, డాక్టర్ శ్వేత పట్ల అనుచితంగా ప్రవర్తించిన తమ్మయ్యబాబు ను సస్పెండ్ చేస్తున్నట్లు జనసేన తెలిపింది. -
అటవీ ప్రాంతం పేరుతో ఆధ్యాత్మికతపై దాడి!
తెలుగు రాష్ట్రాల్లో అవధూత కాశినాయన జ్యోతి క్షేత్రం – ఆధ్యాత్మికవేత్తలకు దివ్యానుభూతిని కలిగిస్తోంది. ఏ సమయంలో వెళ్లినా అన్నదానం జరుగుతుండడం ఇక్కడ ప్రత్యేకత. అందుకే అనాథలకు ఇది ఆకలి తీర్చే ఒక దేవాలయం. వైఎస్సార్ జిల్లా బద్వేలు నియోజకవర్గం, కాశినాయన మండలం నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న ఈ క్షేత్రంలో దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా ధార్మిక సేవలు కొనసాగుతున్నాయి. అయితే అటవీ ప్రాంతం పేరుతో ఈ ఆశ్రమాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు షురూ అయ్యాయి. ఇప్పటికే సత్రాలు, వాష్ రూమ్‌లను కూల్చివేశారు. – కడప/పులివెందుల/కాశినాయన/బద్వేలు అర్బన్ నాటి పాలకుల అండ.. నేటి పాలకుల కూల్చివేతలుగతంలో అటవీ శాఖ అధికారులు అక్కడి నిర్మాణాలపై అభ్యంతరాలు తెలిపినా కూల్చివేత వరకూ వెళ్లలేదు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు అక్కడ ఉన్న 13 హెక్టార్ల భూమిని అటవీ చట్టం నుంచి మినహాయించాలని అప్పటి కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌కు లేఖ కూడా రాశారు. అటవీ సంరక్షణ చట్టం రాకముందు నుంచే ఇక్కడ దేవాలయాలు ఉన్నాయని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సైతం పలుమార్లు కేంద్ర ప్రభుత్వ పెద్ద ల దృష్టికి ఇదే సమస్యను తీసుకెళ్లారు. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం వెనుకా ముందు చూడకుండా కూల్చివేతలు చేపట్టింది. నెల్లూరు జిలాకు చెందిన కాశినాయన అనే సిద్ధుడు బాల్యం నుంచి ఆధ్యాత్మిక చింతనతో దేశాటన చేస్తూ పుణ్యక్షేత్రాల్లో గడిపారు. పాడుబడ్డ దేవాలయాలను జీర్ణోద్ధరణ చేయమన్న గురువు ఆదేశాల ప్రకారం జ్యోతి క్షేత్రంలో నరసింహస్వామి దేవాలయాన్ని 1980వ దశకంలో పూర్తి చేశారు. కాశినాయన పరమపదించాక 1995 నుంచి జ్యోతిక్షేత్రం... కాశినాయన క్షేత్రం అయ్యింది. ఇక్కడి నుంచి అహోబిలం లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి కాలిబాట కూడా ఉంది. జ్యోతిక్షేత్రంలో నిర్మాణాలకు గతంలో మాజీ సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి, మాజీ మంత్రి బిజివేముల వీరారెడ్డి సైతం సహకారం అందించడం గమనార్హం. కూల్చివేతలను తక్షణం నిలుపుదల చేయాలి... క్షేత్రంలో కూల్చివేతలను తక్షణం నిలుపుదల చేయాలని రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ (ఆర్సీడీఎస్) అధ్యక్షుడు సురేంద్రారెడ్డి, ఉపాధ్యక్షుడు వెంకట సర్వోత్తమరెడ్డి శనివారం ఇక్కడ పేర్కొన్నారు. అడవి మధ్యలో ఉన్న ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలకు లేని నిబంధనలు, కఠిన చర్యలు కాశినాయన ఆశ్రమంపై ఎందుకని ప్రశ్నిoచారు. ఆశ్రమానికి చేరుకోకుండా ఫారెస్ట్ అధికారులు ఇప్పటికే పలు అడ్డంకులు సృష్టిస్తున్నారని సొసైటీ ప్రతినిధులు పేర్కొన్నారు. పోరుమామిళ్ల నుంచి జ్యోతి (కాశినాయన ఆశ్రమం) వెళ్లే ఆర్టీసీ బస్సులను అడవిలోకి ప్రవేశించకుండా చివరి పల్లె అయిన వరికుంట్ల గ్రామం దగ్గరే ఆపి అటునుంచి అటే వెనక్కి పంపిస్తున్నారని వారు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని సమస్యలను పరిష్కరించాలని, లేదంటే తీవ్ర ప్రజా ప్రతిఘటనను ఎదుర్కొనాల్సి వస్తుందని హెచ్చరించారు. భక్తుల మనోభావాలు కాపాడాలి: ఎమ్మెల్యే సుధ కూటమి నేతలు ఆలయాలపై రాజకీయాలు చేయడం మానుకుని భక్తుల మనోభావాలు కాపాడేందుకు కృషి చేయాలని వైఎస్సార్ జిల్లా బద్వేలు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ అన్నారు. ఆదివారం పట్టణంలోని ఎన్జీవో కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆమె మాట్లాడారు. సనాతన ధర్మం పరిరక్షణకు ప్రాణాలైనా అర్పిస్తానని ఉపన్యాసా లిచ్చే డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ నిత్యం వందలాది మంది భక్తుల ఆకలిని తీర్చే దివ్య క్షేత్రంగా విరాజిల్లుతున్న కాశినాయన ఆలయాన్ని అటవీ అధికారులు కూల్చి వేస్తుంటే ఏం చేస్తున్నారని నిలదీశారు. ఎంతో సుదీర్ఘ చరిత్ర కలిగిన కాశినాయన ఆలయ పరిరక్షణ కోసం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వంతో పొత్తులో ఉన్నందున తక్షణమే మాట్లాడి సమస్య పరిష్కరించాలన్నారు. దుశ్చర్యలను ఆపేయాలి సనాతన ధర్మాన్ని, ధార్మికతను కాపాడతానని డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ చెప్పారు. ఇప్పుడు కాశినాయన క్షేత్రంలో కూల్చివేతలను ఆయన నేతృత్వంలోని అటవీశాఖ అధికారులే చేపట్టారు. వెంటనే ఈ దుశ్చర్యలను ఆపేయాలి. హిందువుల మనోభావాలను సంరక్షించాలి. – స్వామి విరజానందా, అచలాశ్రమ పీఠాధిపతి. బ్రహ్మంగారిమఠం ధర్మ ప్రచారానికి అండగా నిలవండి ధర్మం కోసం పనిచేస్తున్న ధార్మిక ఆశ్రమాలను సాకులు చెబుతూ కూల్చివేస్తుండడం శోచనీయం. ఇలాంటి వందలాది ఆశ్రమాలను అందులోని ధార్మిక వేత్తలను కాపాడాలని, కూల్చివేతలను తక్షణం ఆపేయించాలని డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ను కోరుతున్నాం. – శ్రీనివాసానందస్వామి, ఆశ్రమ నిర్వాహకులు -
పాడి రైతుకు దగా
సాక్షి, అమరావతి/నెట్వర్క్ పాడి రైతు చితికిపోతున్నాడు. ఓ వైపు దాణా ధరలు చుక్కలనంటుతుంటే మరోవైపు పశుగ్రాసం దొరకని దుస్థితి. పశు పోషణ భారంగా తయారైన ప్రస్తుత తరుణంలో పాల సేకరణ ధరలు పెంచాల్సింది పోయి ప్రైవేటు డెయిరీలు తగ్గించేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. కూటమి ప్రభుత్వ పర్యవేక్షణ కొరవడటంతో తమకు నచ్చిన ధర చెల్లిస్తూ పాడి రైతులను ప్రైవేటు డెయిరీలు నిలువు దోపిడీ చేస్తున్నాయి. వారు చెప్పిందే ధర.. చెల్లించిందే రొక్కం.. అన్నట్టుగా తయారైంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో గేదె పాల సేకరణపై ప్రైవేటు డెయిరీలు విధిస్తోన్న ఆంక్షలు పాడి రైతులకు శాపంగా మారాయి. అరకొరగా సేకరించడంతోపాటు ఆవు పాల ధరలే ఇస్తున్నారు. వెన్న శాతం ఎంత ఉన్నా సరే తాము చెప్పిన ధరకు ఇస్తామంటేనే తీసుకుంటామని తెగేసి చెబుతున్నారు. దీంతో చేసేది లేక అయినకాడికి అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వ పాలనలో గిట్టుబాటు ధర లేక పాడి రైతులు జీవనాధారమైన పశు సంపదను తెగనమ్ముకోవాల్సి వస్తోంది. నాడు అమూల్‌తో పాల విప్లవం.. వైఎస్ జగన్ ప్రభుత్వం పాడి రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలన్న సంకల్పంతో 2020 అక్టోబర్‌లో జగనన్న పాల వెల్లువ (అమూల్) కేంద్రాలను ప్రారంభించింది. 19 జిల్లాలో 4,798 గ్రామాల నుంచి పాలసేకరణ జరిగేది. 4.75 లక్షల మంది నుంచి రోజుకు సగటున గరిష్టంగా 3.95 లక్షల లీటర్ల పాల సేకరణ చేసేది. ప్రారంభంలో 10 శాతం వెన్నతో లీటర్ ఆవు పాలకు రూ.25–28, గేదె పాలకు రూ.56–60 చొప్పున ప్రైవేట్ డెయిరీలు చెల్లించగా, అమూల్ ప్రారంభంలోనే గేదె పాలకు (11 శాతం వెన్న, 9 శాతం ఎస్ఎన్ఎఫ్) లీటర్‌కు రూ.71.47, ఆవు పాలకు (5.4 శాతం వెన్న, 8.7 శాతం ఎస్ఎన్ఎఫ్) రూ.34.20 చొప్పున చెల్లించింది. ఆ తర్వాత వరుసగా ఏడు సార్లు ధర పెంచడంతో గతేడాది మే నాటికి గేదె పాలకు రూ.89.76, ఆవు పాలకు రూ.43.69 చొప్పున చెల్లించేది. 40 నెలల్లో ఏడుసార్లు పాల సేకరణ ధరలు పెంచడంతో లీటర్ గేదె పాలపై రూ.18.29, ఆవు పాలపై రూ.9.49 చొప్పున పెరిగింది. ఫలితంగా జేపీవీ (జగనన్న పాల వెల్లువ) ప్రాజెక్టు కింద అమూల్‌కు పాలుపోసే రైతులకు రూ.97.86 కోట్ల మేర అదనపు లబ్ధి చేకూరింది. అమూల్‌తో పోటీని తట్టుకోలేక పాల సేకరణ ధరలు పెంచడం వల్ల ప్రెవేటు డెయిరీలకు పాలుపోసే రైతులకు రూ.4,911 కోట్ల మేర అదనంగా లబ్ధి కలిగింది. మరో వైపు వెన్న, ఎస్ఎన్ఎఫ్ శాతాన్ని బట్టి అణాపైసలతో సహా లెక్కగట్టి పది రోజులకోసారి నేరుగా వారి ఖాతాలకు డబ్బు జమ చేసేవారు. ఫలితంగా గేదె పాలకు లీటర్‌కు రూ.112, ఆవు పాలకు లీటర్‌కు రూ.53.86 చొప్పున గరిష్టంగా ధర లభించింది. లీటర్‌కు ఏటా రూ.2–5 పెంచడమే గగనమనే ప్రైవేట్ డెయిరీలు అమూల్ పోటీని తట్టుకోలేక గేదె పాలకు లీటర్‌పై రూ.14, ఆవు పాలపై రూ.7 వరకు సేకరణ ధర పెంచక తప్పలేదు. అయినప్పటికీ ప్రైవేట్ డెయిరీలతో పోలిస్తే అమూల్ పాల సేకరణ ధరలు 10–20 శాతం అధికంగానే ఉండేవి. సీజన్‌తో సంబంధం లేకుండా వెన్న, ఘన పదార్థాల శాతాన్ని బట్టి అమూల్ ఒకే రీతిలో చెల్లించి పాడి రైతులకు మేలు చేసింది. నేడు పాడి రైతుల నిలువు దోపిడీ ప్రభుత్వ ఒత్తిళ్లు తట్టుకోలేక అమూల్ పాలసేకరణ నుంచి తప్పుకుంటోంది. ఇప్పటికే 14 జిల్లాల్లో పాలసేకరణ పూర్తిగా నిలిపివేసింది. ప్రస్తుతం అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, అన్నమయ్య జిల్లాల్లో కేవలం ఐదారు వందల గ్రామాల్లో నామమాత్రంగా పాలసేకరణ చేస్తోంది. గతేడాది ఇదే సమయంలో రోజుకు 3.95 లక్షల లీటర్ల పాల సేకరణ చేయగా, ఈ ఏడాది కేవలం 50–60 వేల లీటర్లకు మించి సేకరించలేని దుస్థితి ఏర్పడింది. గతంలో మంచి ధర లభించడంతో అమూల్‌కు పాలు పోసే ప్రతి ముగ్గురిలో ఒక పాడి రైతు 2–3 ఆవులను కొనుగోలు చేశారు. ఇప్పుడు పాల సేకరణ ధరలు పడిపోవడంతో రైతులు ఆవులను అమ్ముకుంటున్నారు. ఇదేసాకుగా ప్రైవేట్ డెయిరీలు పాల సేకరణ ధరలు లీటర్‌కు రూ.15–40 మేర తగ్గించేయడంతో పాడి రైతుల జీవనోపాధికి గండి పడింది. వెన్న, ఎస్ఎన్ఎఫ్ శాతాలతో సంబంధం లేకుండా 15 రోజులకోసారి సగటు ధర నిర్ణయిస్తుండడంతో ఒక్కో పాడి రైతు సగటున రోజుకు రూ.100–300 వరకు నష్టపోతున్నాడు. రాయలసీమ, ఇటీవల ఉత్తరాంధ్రలో విశాఖ డెయిరీ వారు రోజు10 లీటర్లు పాలు పొసే రైతు నుంచి ఒక లీటర్, ఐదు లీటర్లు పాలు పొసే రైతుకు అరలీటర్ వెనక్కి ఇచ్చేస్తున్నారు. రైతులు ధర్నాలు చేసినా పట్టించుకోలేదు. పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలన్న ఆలోచన కూటమి ప్రభుత్వం చేయడం లేదు. గోశాలల పేరిట హంగామా చేస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం గత తొమ్మిది నెలల్లో పాడి రైతులకు ఒక్కటంటే ఒక్క పాడి గేదె ఇచ్చిన పాపాన పోలేదు. రైతుల వద్ద ఉన్న పాడిలో 25 శాతం తగ్గిపోయిందని లైవ్ స్టాక్ సెన్సెస్ స్పష్టం చేస్తోంది. జీడీపీ, జీఎస్డీపీ అంటూ కాకి లెక్కలేస్తూ కాలం గడుపుతున్న రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలో తగ్గిపోతున్న పాడి, పాల ఉత్పత్తిపై దృష్టి పెట్టడం లేదు. మరొక వైపు రిటైల్ మార్కెట్లో పాల విక్రయ ధరలు ప్రైవేటు డెయిరీలు ఇష్టమొచ్చినట్టుగా పెంచేస్తూ వినియోగదారులపై భారం మోపుతున్నాయి. అర లీటర్ ప్యాకెట్ ఫుల్ క్రీమ్‌తో రూ.32–37, రిచ్ గోల్డ్ పాలు రూ.30–32, గోల్డ్ పాలు రూ.28–30 చొప్పున విక్రయిస్తూ దోపిడీకి గురిచేస్తున్నాయి. అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి అన్నట్లు తయారైంది పాల ధర. దీనివల్ల అటు పాడి రైతూ లాభ పడటం లేదు. ఇటు ప్రజలకూ మేలు జరగడం లేదు. మధ్యలో ప్రైవేట్ డెయిరీలు మాత్రం ఇష్టానుసారం దండుకుంటున్నాయి. ఇష్టానుసారం ధర నిర్ణయిస్తూ రైతుల జీవితాలతో ఆడుకుంటున్నాయి. ఆదుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తోంది. పైగా రైతులకు అండగా నిలిచిన అమూల్ డెయిరీని తరిమేస్తూ ప్రైవేట్ డెయిరీ దందాను ప్రోత్సహిస్తోంది. పాలకు ధర లేదు అమూల్ డెయిరీ పాల సేకరణను ఆపేయించడంతో ధరలు లేకుండా పోయాయి. దీంతో మాకున్న ఆవుల్లో సగానికిపైగా అమ్ముకోవాల్సి వచ్చింది. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం పాల ధర లీటర్‌పై రూ.15 నుంచి 20 వరకు తగ్గించారు. ఇదేమని ప్రశ్నిస్తే ఇష్టం ఉంటే పోయండి.. లేదంటే మానుకోండి.. అంటున్నారు. చేసేదీ ఏమీ లేకు ఆవులను అమ్ముకుంటున్నాం. – విమల, కురవపల్లి, చిత్తూరు జిల్లారైతుల పొట్ట కొడుతున్నారు అమూల్ డెయిరీ ఉన్నప్పుడు ప్రైవేటు డెయిరీలన్నీ గిట్టుబాటు ధర చెల్లించేవి. కూటమి ప్రభుత్వం రావడంతో కక్ష కట్టి అమూల్ కేంద్రాలను సాగనంపుతోంది. సహాయ నిరాకరణ చేస్తోంది. పాడి రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదు. పోటీ లేకపోవడంతో ప్రైవేటు డెయిరీలు ఇష్టారాజ్యంగా దోచేస్తున్నాయి. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అమూల్ డెయిరీకి పాలు పోసేటప్పుడు లీటర్ ఆవు పాలకు రూ.40–45 వచ్చింది. కానీ విధి లేని పరిస్థితిలో ప్రైవేటు డెయిరీలకు తక్కువ ధరకు పాలు పోయాల్సి వస్తోంది. – అచ్చమ్మ, అంగళ్లు,, అన్నమయ్య జిల్లా ఇష్టానుసారం కొనుగోలుప్రైవేటు డెయిరీలు ఇష్టానుసారం ధరలు నిర్ణయిస్తూ పాలు కొనుగోలు చేస్తున్నాయి. 2024 ఏప్రిల్ వరకు లీటరు ధర రూ.80 ఉండగా, ప్రస్తుతం రూ.70–75తో కొనుగోలు చేస్తున్నారు. హెరిటేజ్, శ్రీనివాస డెయిరీలు వారి ఇష్టం కొద్దీ ధరలు నిర్ణయిస్తూ కొనుగోలు చేస్తున్నారు. రైతు ధర నిర్ణయించి అమ్మే పరిస్థితి ఎక్కడా లేదు. – శ్రీనివాసులు, రైతు నగరం, నంద్యాల బయటి వాళ్లకు విక్రయిస్తున్నా నాకు మూడు పాడి గేదెలున్నాయి. రెండు పూటలా 16 లీటర్ల పాలిస్తాయి. పాలలో వెన్నశాతం తక్కువగా వస్తోందనే సాకుతో ప్రైవేటు డెయిరీలు ఇష్టానుసారం ధర తగ్గించేస్తున్నారు. ప్రైవేటు డెయిరీలకు 5 లీటర్లు, బయటి వారికి 10 లీటర్ల పాలను విక్రయిస్తున్నాను. బయటి వారు లీటర్‌కు రూ.50 ఇస్తుంటే ప్రైవేటు డెయిరీలు మాత్రం రూ.32–34 ఇస్తున్నారు. – వావిలపల్లి హరిబాబు, ధవుమంతపురం, మన్యం జిల్లా గతంలో లీటర్‌కు రూ.69..ఆవు పాల ధర తగ్గించారు. గతంలో లీటర్‌కు రూ.69 వరకు ఇచ్చేవారు. విశాఖ డెయిరీ లీటర్‌కు రూ.3–5 తగ్గించేసింది. పాడి రైతులకు పెద్దగా గిట్టుబాటు రాక బయటి వాళ్లకు అమ్ముకుంటున్నాం. – పి.వెంకటరావు, యలమంచలి, అనకాపల్లి జిల్లా -
‘ఉన్నత’ సంస్కరణలు తప్పనిసరి..
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో (స్టేట్ యూనివర్సిటీలు) సంస్కరణలు అమలు చేయాలని నీతి ఆయోగ్ సూచించింది. జాతీయ విద్యావిధానం 2020కి అనుగుణంగా కరిక్యులమ్, పరీక్షల విధానంతో పాటు వర్సిటీల అక్రిడిటేషన్ ప్రక్రియ వరకు అన్నింటిలోనూ మార్పులు తేవాలని పేర్కొంది. జాతీయ పరిశోధన విధానాన్ని ప్రవేశపెట్టి మానవీయ శాస్త్రాలలో పరిశోధనలను ప్రోత్సహించాలని సిఫారసు చేసింది.సెమిస్టర్ ప్రాతిపదికన బోధన నాణ్యతను లెక్కించడం నుంచి ఉన్నత విద్య రోడ్ మ్యాప్ రూపకల్పన వరకు నీతి ఆయోగ్ పలు సూచనలు చేసింది. ఈ మేరకు 20 రాష్ట్రాలకు చెందిన వర్సిటీల వైస్ చాన్సలర్ల ఆమోదంతో రూపొందించిన నివేదికను ఇటీవల విడుదల చేసింది. ఆయా రాష్ట్రాలు తమ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో మెరుగైన సంస్కరణలకు లిఖిత పూర్వకంగా అంగీకారం తెలిపాయి. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా రాష్ట్ర విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయడం, 2047 నాటికి కేంద్రం నిర్దేశించిన వికసిత్ భారత్ దార్శనికతలో భాగంగా నివేదికను తయారు చేసినట్లు నీతి ఆయోగ్ తెలిపింది43 స్టేట్ వర్సిటీలతో కర్ణాటక టాప్.. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం ఉన్నత విద్యలో 81% విద్యార్థుల నమోదు రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లోనే ఉంది. 2025 జనవరి నాటికి దేశంలో 495 స్టేట్ యూనివర్సిటీలు ఉన్నాయి. వీటిలో 43 వర్సిటీలతో కర్ణాటక అగ్రస్థానంలో ఉండగా పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ 38 వర్సిటీలతో రెండో స్థానాల్లో నిలిచాయి. గత 14 ఏళ్లలో స్టేట్ వర్సిటీల వృద్ధి 50 శాతానికి పైగా ఉంది. వీటిలో విద్యార్థుల నమోదు 2011–12నుంచి 2021–22 మధ్య 38% పెరిగి దాదాపు 3.24 కోట్లకు చేరుకుంది.పరిశోధనలు.. స్టార్టప్స్విద్యలో నాణ్యతా ప్రమాణాలు, పాలన, నిధులు, ఉపాధి సామర్థ్యం అనే నాలుగు విభాగాలలో 80 సిఫార్సులతోపాటు పరిశోధన, బోధన, డిజిటలైజేషన్, అంతర్జాతీకరణ అనే కీలకమైన నాలుగు అంశాలలో తీసుకోవాల్సిన చర్యలపై నీతి ఆయోగ్ నివేదికలో సూచనలు చేసింది. మానవీయ శాస్త్రాలు, ప్రాథమిక పరిశోధనలను ప్రోత్సహించడంతో పాటు పరిశోధనలను వాణిజ్యీకరణ చేయాలని, వర్సిటీల్లో స్టార్టప్‌లకు అవకాశం కల్పించాలని, ప్రముఖ పరిశోధన సంస్థలను ఇందులో భాగస్వాములుగా చేయాలని నివేదిక సూచించింది.ఐఐటీలకు దీటుగా ఎదగాలి..నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం దశాబ్ద కాలంలో (2011–12 నుంచి 2021–22 వరకు) విద్యార్థుల స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్) వృద్ధి పరంగా కేరళ, హిమాచల్‌ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, గోవా, ఉత్తరాఖండ్, సిక్కిం, రాజస్థాన్ టాప్ 10 రాష్ట్రాలుగా నిలిచాయి. అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాలు విద్యార్థి–టీచర్ నిష్పత్తి (పీటీఆర్)లో మొదటి ఐదు స్థానాల్లో ఉన్నట్లు నివేదిక పేర్కొంది. లింగ సమానత్వ సూచిక (జీపీఐ)లో నాగాలాండ్, హిమాచల్‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, సిక్కిం, హరియాణా, రాజస్థాన్, త్రిపుర, తమిళనాడు టాప్ 10 రాష్ట్రాలుగా ఉన్నాయి. అమెరికా, బ్రెజిల్ దేశాల్లో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు అత్యుత్తమ ప్రమాణాలను అనుసరిస్తున్నాయని, ఆ స్థాయిలో మన స్టేట్ వర్సిటీలు కూడా ఉండాలని సూచించింది. దేశంలో ఐఐటీలు వంటి విద్యాసంస్థలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు కూడా ఉన్నత ప్రమాణాల కోసం కృషి చేయాలని పేర్కొంది. గత సర్కారు హయాంలో పలు సంస్కరణలు అమలు..నీతి ఆయోగ్ తాజాగా సిఫారసు చేసిన పలు సంస్కరణలను వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా ఏపీలోని వర్సిటీలు, కళాశాల విద్యలో గతంలోనే అమలు చేయడం గమనార్హం. కళాశాలలను కంపెనీల స్టార్టప్స్‌తో అనుసంధానించి విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లను అకడమిక్‌లో భాగం చేసింది. మానవీయ శాస్త్రాలు అభ్యసిస్తున్న విద్యార్థులకు సైతం ఇంటర్న్‌షిప్ తప్పనిసరి చేసింది. అంతేకాకుండా మైక్రోసాఫ్ట్ లాంటి అంతర్జాతీయ సంస్థ ద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఫ్యూచర్ స్కిల్స్‌పై శిక్షణను ప్రవేశపెట్టింది. అంతర్జాతీయ యూనివర్సిటీలు అందిస్తున్న నైపుణ్య కోర్సులను మన విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి తెచ్చింది. ఆన్లైన్ ఎడ్టెక్ సంస్థ ఎడెక్స్‌తో కలిసి 2 వేల అంతర్జాతీయ యూనివర్సిటీల నుంచి సర్టిఫికెట్ కోర్సులను ఉచితంగా అందించింది.ఏఐసీటీఈ ద్వారా ఏఐ, పైథాన్, క్లౌడ్ కంప్యూటింగ్ లాంటి అంశాల్లో శిక్షణను అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఒక్క 2023–24 విద్యా సంవత్సరంలోనే డిగ్రీ పూర్తయిన వెంటనే దాదాపు 2 లక్షల మందికిపైగా క్యాంపస్ ఎంపికల్లో ఉద్యోగాలు సాధించారు. ఇతర సిఫారసులివీ..» విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు సెమిస్టర్ ప్రాతిపదికన బోధన నాణ్యతను లెక్కించాలి.» డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌లను బోధనతో అనుసంధానించాలి. » ప్రొఫెసర్లు, విద్యార్థులకు ప్రపంచ దృక్పథాన్ని అలవరచేందుకు విదేశీ విశ్వవిద్యాలయాలతో కలిసి పనిచేయాలి. » ఉన్నత విద్య ఆర్థిక సంస్థ (హెచ్ఈఎఫ్ఏ) తరహాలో రాష్ట్ర విశ్వవిద్యాలయాల కోసం మౌలిక సదుపాయాల ఆర్థిక సంస్థను నెలకొల్పాలి. » ఆర్థిక సహాయం కోసం బలమైన పూర్వ విద్యార్థుల సంఘాలు, కార్పొరేట్ కార్యక్రమాలపై రాష్ట్ర విశ్వవిద్యాలయాలు దృష్టి పెట్టాలి. » 2047 రాష్ట్ర స్థాయి ఉన్నత విద్యా రోడ్‌మ్యాప్‌ను రూపొందించుకోవాలి. ఉన్నత విద్యా మండళ్లకు అధికారాలు కల్పించి ప్రొఫెసర్ల నియామక ప్రక్రియను సంస్కరించాలి. » పాలక మండళ్లల్లో బోధనా బృందాలకు చోటు కల్పించాలి. » రాష్ట్ర ఉన్నత, సాంకేతిక విద్యా విభాగాల మధ్య సహకారాన్ని పెంచుతూ అక్రిడిటేషన్ ప్రక్రియను మార్చాలి. » విద్యార్థుల ఉపాధి సామర్థ్యాన్ని పెంచేందుకు ఇంటర్న్‌షిప్‌లు, అప్రెంటిస్‌షిప్‌లపై దృష్టి పెట్టాలి. వారు ఉద్యోగాల సృష్టికర్తలుగా ఎదిగేలా ప్రోత్సహించాలి. -
సీనియర్లకు బాబు ఝలక్!
సాక్షి, అమరావతి: ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో టీడీపీ సీనియర్ నేతలు, గత ఎన్నికల్లో సీటు దక్కని ముఖ్య నేతలు, సిట్టింగ్‌లకు మొండిచేయే మిగిలింది. చివరి వరకు నమ్మించి, మరోమారు దగాకు గురిచేశారనే చర్చ ఆ పార్టీలో మొదలైంది. యనమల రామకృష్ణుడి స్థానాన్ని ఆయనకివ్వకుండా పూర్తిగా పక్కన పెట్టేశారు. పార్టీ కార్యాలయంలోనే ఉండి చంద్రబాబు చెప్పిన పనులన్నీ చేసిన మరో సిట్టింగ్ ఎమ్మెల్సీ అశోక్‌బాబుకు సైతం అవకాశం ఇవ్వలేదు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు క్రియాశీలకంగా పని చేసిన మరో సిట్టింగ్ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావుదీ అదే పరిస్థితి. మరోసారి ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామంటూ ఆశ చూపించి, రాజీనామా చేయించి టీడీపీలో చేర్చుకున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి చంద్రబాబు దెబ్బ కొట్టారు. మరో వైపు ఈసారి శాసన మండలిలో అడుగు పెట్టడం ఖాయమనుకున్న ఎస్వీఎస్ఎన్ వర్మ, దేవినేని ఉమామహేశ్వరరావుకు అవకాశం దక్కలేదు. దళిత నేత కేఎస్ జవహర్, బీసీ నేత బుద్ధా వెంకన్నతో పాటు ఈ సీట్లపై ఆశలు పెట్టుకున్న చాలా మంది నేతలను చంద్రబాబు పక్కన పెట్టారు. ఎమ్మెల్సీ స్థానాలపై ఆశలు పెట్టుకున్న నేతలకు ఆదివారం సాయంత్రం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో ఫోన్ చేయించి ఈసారి అవకాశం ఇవ్వలేకపోతున్నామని చెప్పించారు. ఎంపిక చేసిన అభ్యర్థులకు చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి చెప్పినట్లు తెలిసింది. వారు సోమవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. పవన్ అడ్డుకోవడం వల్లే...పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు ఎమ్మెల్సీ స్థానం దక్కకపోవడంపై టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. చంద్రబాబు ఆయనకు అవకాశం ఇవ్వకుండా ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ అడ్డుకున్నారనే ప్రచారం జరుగుతోంది. వర్మను ఎమ్మెల్సీ చేస్తే పిఠాపురం నియోజకవర్గంలో రెండో అధికార కేంద్రం తయారు చేసినట్లవుతుందని పవన్ భావించారని, అందుకే వర్మకు సీటు ససేమిరా అన్నారని చెబుతున్నారు. పవన్ అడ్డు చెప్పడం వల్లే వర్మకు చంద్రబాబు సీటు ఇవ్వలేదని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పిఠాపురం పూర్తిగా తన చేతిలో ఉండాలంటే.. అక్కడ తాను తప్ప మరో నాయకుడు ఉండకూడదని పవన్ భావించడం వల్లే వర్మను పక్కన పెట్టారని నియోజకవర్గంలో చర్చ మొదలైంది. ఇదివరకు రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ కోసం ఎమ్మెల్యే సీటు త్యాగం చేసిన వర్మకు ఇది తీరని అన్యాయమని టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హామీ ఇచ్చి.. చివరకు మోసంగత ఎన్నికల్లో పొత్తులో భాగంగా తన సీటును పవన్ కళ్యాణ్‌కు కేటాయించినప్పుడు వర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక దశలో టీడీపీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో చంద్రబాబు తన వద్దకు పిలిపించుకుని బుజ్జగించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి దఫాలోనే ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని, మంచి రాజకీయ భవిష్యత్ ఉంటుందని హామీ ఇచ్చారు. వర్మ రాజకీయ భవితవ్యానికి ఢోకా లేకుండా చేస్తానని నియోజకవర్గ నేతలకు సైతం మధ్యవర్తుల ద్వారా చెప్పించారు. పవన్ గెలుపు కోసం పని చేయాలని ఒత్తిడి చేశారు. దీంతో పార్టీ కోసం వర్మ తన సీటును త్యాగం చేయడంతోపాటు పవన్ పక్కనే నిలబడి ఆయన్ను గెలిపించేందుకు నియోజకవర్గం అంతా తిరిగారు. టీడీపీ శ్రేణులు పలుచోట్ల ఆందోళనలు చేసినా, ఎవరి కోసమో పని చేయడం ఏమిటని తిట్టినా పట్టించుకోకుండా పవన్ కోసం పని చేశారు. ఆయన ఎటువంటి ఇబ్బందులు సృష్టించకుండా పని చేయడం వల్లే శాసనసభలో అడుగుపెట్టాలనే పవన్ కల నెరవేరింది. తన కలను నెరవేర్చడానికి పని చేసిన వర్మను పవన్ రాజకీయంగా పూర్తిగా తొక్కేయాలనుకోవడం, ఇందుకు చంద్రబాబు సహకరించడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. పార్టీ కోసం పని చేసిన వారిని పట్టించుకోకుండా పక్క పార్టీ కోసం పని చేయడం తమ వల్ల కాదని టీడీపీ నేతలు ఆవేదన చెందుతున్నారు. పవన్‌కళ్యాణ్ తన రాజకీయ భవితవ్యం కోసం వర్మ అవకాశాలను దెబ్బ తీయడం, ఇదే సమయంలో తన సోదరుడు నాగబాబుకు మాత్రం పదవి ఇప్పించుకోవడం దారుణమని వాపోతున్నారు.టీడీపీ అభ్యర్థులు వీళ్లే..టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో ఒకరైన బీద రవిచంద్ర మంత్రి లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడు కావడంతో ఆయన పేరు ఖరారు చేశారు. లోకేశ్ పాదయాత్రతో పాటు గత ఎన్నికల్లో ఆయన వ్యవహారాల్లో రవిచంద్ర కీలకంగా వ్యవహరించారు. రాయలసీమ ప్రాంతం నుంచి ఒక్కరికైనా అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో సిట్టింగ్ ఎమ్మెల్సీ బీటీ నాయుడుకు అవకాశం ఇచ్చారు. మూడో స్థానాన్ని టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మను ఎంపిక చేశారు. ఇద్దరు బీసీలు, ఒక ఎస్సీకి అవకాశం ఇచ్చినట్లు టీడీపీ నేతలు తెలిపారు. జనసేన తరఫున నాగబాబుకు ఒక స్థానం, బీజేపీకి ఇంకో స్థానం కేటాయించారు. కాగా, బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, పార్టీ నేతలు పాకా వెంకటసత్యనారాయణ, గారపాటి సీతారామాంజనేయచౌదరి, మాలతీరాణి పేర్లు అధిష్టానం పరిశీలనలో ఉన్నాయి. -
గ్రామ సర్వేయర్లకు అగచాట్లు
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వంలో భూముల రీ సర్వేలో కీలకపాత్ర పోషించిన గ్రామ సర్వేయర్లు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో తీవ్ర అగచాట్లు పడుతున్నారు. వారు చేయాల్సినవే కాకుండా అదనపు పనులు అప్పగిస్తూ ఇబ్బందులు పెడుతుండడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మల్టిపుల్ పనులు చేసే జాబితాలో పెట్టడంతో గ్రామ సర్వేయర్లపై గ్రామ, వార్డు సచివాలయాల శాఖ, రెవెన్యూ, పంచాయతీరాజ్, సర్వే సెటిల్మెంట్ ల్యాండ్ రికార్డుల శాఖలు పెత్తనం చేస్తున్నాయి. సర్వేయర్లపై సచివాలయ కార్యదర్శి, తహశీల్దార్, ఎంపీడీవో, మండల సర్వేయర్.. బాస్‌లుగా ఉన్నారు. ఈ నాలుగు శాఖల బాస్‌లు ఒకే సమయంలో వివిధ రకాల పనులను అప్పగిస్తున్నారు. ఏ పని చేయకపోయినా షోకాజ్ నోటీసులు, మెమోలతో హడలెత్తిస్తున్నారు. వాస్తవానికి సర్వేయర్లకు మాతృ శాఖ సర్వే సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డుల శాఖ. వారి ప్రధాన పని భూముల రీ సర్వే చేయడమే. కానీ ఇప్పుడు ఆ పనితో పాటు పీ–4, హౌస్ హోల్డ్ తదితర సర్వేలు కూడా చేయిస్తున్నారు. ఒకే సమయంలో అన్ని పనులూ చేయాలని ఒత్తిడి చేస్తుండడంతో ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు సర్వేయర్లు పనిచేయక తప్పడం లేదు. వారికి సంబంధించిన రీ సర్వే పని చేసినా.. ఆ తర్వాత రెవెన్యూ శాఖ చేయాల్సిన యాజమాన్య హక్కుల నిర్ధారణ (టైటిల్ కన్ఫర్మేషన్) పని కూడా వీరిపైనే పడుతోంది. రెవెన్యూ సిబ్బంది సహకరించకపోవడంతో పాత రికార్డుల్లో ఉన్న వివరాలతోనే 1బీ, అడంగల్ రికార్డులు సిద్ధమవుతున్నాయి. దీంతో ఆ తప్పులన్నింటికీ సర్వేయర్లనే బాధ్యులుగా చేసి షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నారు. అలాగే అనేక ఏళ్ల నుంచి రెవెన్యూ రికార్డుల్లో ఉన్న తప్పులకు కూడా గ్రామ సర్వేయర్లనే బాధ్యులుగా చేస్తుండడంతో వారు లబోదిబోమంటున్నారు. ల్యాప్‌టాప్, ఇతరత్రా పరికరాలు ఇవ్వకుండానే పనులు చేయాలంటూ ఒత్తిడి చేస్తుండడంతో ఆందోళనకు గురవుతున్నారు. అంతేకాకుండా.. ఉదయం సంబంధిత సచివాలయానికి వచ్చి బయోమెట్రిక్ హాజరు కచ్చితంగా వేయాలంటూనే.. మరోవైపు ఇతర ప్రాంతాల్లో పనులు అప్పగిస్తున్నారు. దీంతో వారి పరిస్థితి దయనీయంగా మారిపోయింది. ఇన్ని పనులు చేసినా పదోన్నతుల చానల్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని పలువురు గ్రామ సర్వేయర్లు వాపోతున్నారు. మరోవైపు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హేతుబద్దికరణలో 4,700 మందికి పైగా గ్రామ సర్వేయర్లను మిగులు సిబ్బందిగా చూపించారు. వారికి ఇతర శాఖల్లో బదిలీలకు ఆప్షన్ ఉన్నా.. అది కూడా అమలు చేయడం లేదు. -
మహానాడులో తొడకొట్టిన గ్రీష్మకు జాక్‌పాట్
సాక్షి, అమరావతి: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ప్రకటించిన ముగ్గురు అభ్యర్థుల్లో కావలి గ్రీష్మ (kavali greeshma) బూతులకు పెట్టింది పేరు. 2022లో టీడీపీ నిర్వహించిన మహానాడులో ప్రసంగించిన ఆమె పార్టీ అధినేత చంద్రబాబు, వందల మంది పార్టీ సీనియర్ నేతలు, వేలాది మంది కార్యకర్తల సమక్షంలోనే తొడ కొడుతూ రాయలేని భాషలో బూతులు లంకించుకున్నారు. ‘ఎవడైనా సరే జగన్మోహన్రెడ్డి అంటూ ఇంటికొచ్చినా.. బస్సు యాత్రలో వచ్చినా.. బస్సులోంచి ఈడ్చి ఈడ్చి తంతాం.. నా కొ... ల్లారా.. రాష్ట్రాన్ని రావణకాష్టం చేశారు. సిగ్గూ, శరం లేకుండా బస్సులో వెళతారా? బస్సులోంచి ఈడ్చి తన్నకపోతే (తొడ కొడుతూ).. తెలుగుదేశం గడ్డలో పుట్టినవాళ్లమే కాదు’ అంటూ చంద్రబాబు (Chandrababu) సమక్షంలోనే వైఎస్సార్సీపీ నేతలపై బూతుల దండకం ఎత్తుకున్నారు. అంతేకాకుండా.. ‘మీరే మాకు అండ.. మీరే మాకు ధైర్యం.. మీరే మాకు స్ఫూర్తి (చంద్రబాబును చూస్తూ).. లోకేశ్ అన్న కోసం అందరం ఉంటామని గట్టిగా చెప్పండి తమ్ముళ్లూ.. జై తెలుగుదేశం’ అంటూ కావలి గ్రీష్మ టీడీపీ మహానాడులో వ్యాఖ్యలు చేశారు. సాక్షాత్తూ టీడీపీ అధినేత చంద్రబాబు, వందల మంది సీనియర్ పార్టీ నేతల సమక్షంలోనే గ్రీష్మ అసభ్య వ్యాఖ్యలు చేస్తూ.. తొడ కొడుతూ బూతులతో విరుచుకుపడ్డా చంద్రబాబు కనీసం ఇదేంటని ఆమెను వారించలేదు. వైఎస్సార్సీపీ నేతలు... ఆయన భార్యను ఏమీ అనకపోయినా.. అన్నారంటూ నానా యాగీ చేసిన చంద్రబాబు తాజాగా ఎమ్మెల్సీ స్థానానికి కావలి గ్రీష్మను ఎంపిక చేసి తన మనస్తత్వం ఎలాంటిదో చాటుకున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: పోలీసుల కట్టుకథకు ఇవిగో ఆధారాలు.. విడదల రజనిఆమె బూతులకు మెచ్చే టీడీపీ అధికారంలోకి రాగానే రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్‌పర్సన్‌గా గ్రీష్మను నియమించారని రాజకీయ పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఆమెకు ఎమ్మెల్సీగానూ అవకాశం ఇవ్వడం ద్వారా ఎదుటివారికి నీతులు చెప్పడమే కానీ తాను పాటించనని సీఎం చంద్రబాబు నిరూపించారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
కాటమరాయుడా.. కదిరి నరసింహుడా!
ఆ దేవుడు లక్ష్మీనారసింహుడు. భక్తులచేత వసంతవల్లభుడిగా, కాటమ రాయుడిగా, ప్రహ్లాదవరదుడిగా పూజలందుకుంటున్న శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి దివ్యక్షేత్రం శ్రీసత్యసాయిజిల్లా కదిరిలో వెలసింది. ఖాద్రీశుడి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం అంకురార్పణంతో అత్యంత వైభవంగా ప్రారంభం అయ్యాయి. ఈ ఉత్సవాలు పక్షం రోజులపాటు జరుగుతాయి. భక్తప్రహ్లాద సమేత నారసింహుని దర్శనం ఇక్కడ మాత్రమే చూడవచ్చు.స్థల పురాణంహిరణ్యకశిపుని సంహరించిన అనంతరం శ్రీవారు ఆ ఉగ్రరూపంలోనే సమీపంలోని కదిరి కొండ వద్ద సంచరించసాగారు. మహర్షులు ఆయనను శాంతింపజేసేందుకు ఆ కొండపై ఆలయాన్ని నిర్మించి స్వామివారిని అందులో వసించమని వేడుకున్నారు. అదే కొండపై శ్రీవారి పాదముద్రికలు కూడా ఉన్నాయి. అందుకే ఈప్రాంతాన్ని ‘ఖాద్రి’ అని పిలిచారు. ‘ఖా’ అంటే విష్ణుపాదమని, ‘అద్రి’ అంటే కొండ అని అర్థం. ఖాద్రి కాస్తా కదిరిగా పిలుస్తున్నారు.మహిమాన్వితుడు.. ఖాద్రీశుడుకదిరిప్రాంతంలో ఒకప్పుడు ఖాదిరి వృక్షాలు(చండ్ర వృక్షాలు) ఎక్కువగా ఉండేవి. వీటికింద ఒక పుట్టలో నారసింహుడు స్వయంభువుగా వెలిశాడని అందుకే ఖాద్రీ నారసింహుడని పిలు స్తున్నారని మరో కథనం. ప్రతి నెలా స్వాతినక్షత్రం రోజు మాత్రమే ఇక్కడ మూల విరాట్‌కు అభిషేకం చేస్తారు. వసంత వల్లభుడని పేరుశ్రీ మహావిష్ణువు అనుగ్రహం కోసం భృగు మహర్షి ఈప్రాంతంలో తపస్సు చేశాడని, అందుకు మెచ్చిన విష్ణువు తాను కోనేటిలో వెలిశానని, తన విగ్రహాలను వెలికితీసి పూజాది కార్యక్రమాలు చేయాలని కోరినట్లు ఓ కథనం. ఉత్సవ విగ్రహాల వెలికితీత జరిగింది వసంత మాసంలో కనుక స్వామివారికి వసంత వల్లభుడని పేరు కూడా ఉంది. అందుకే కోనేరును భృగుతీర్థమని పిలుస్తారు. ఆ ఉత్సవవిగ్రహాలనే ఇప్పటికీ బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ తిరువీధుల్లో ఊరేగిస్తారు. ఇంతటి తేజస్సు కల్గిన ఉత్సవ విగ్రహాలు ఎక్కడా లేవని భక్తులు చెబుతారు.దేశంలోనే 3వ అతి పెద్ద బ్రహ్మరథంస్వామివారి బ్రహ్మ రథం సుమారు 540 టన్నుల బరువు, 37.5 అడుగుల ఎత్తు ఉంది. రథంలోని పీఠం వెడల్పు 16 అడుగులు ఉంది. 130 ఏళ్ల క్రితం ఈ బ్రహ్మరథం తయారు చేశారు. రథంపై 256 శిల్పకళాకృతులను టేకుతో అందంగా తీర్చిదిద్దారు. తమిళనాడులోని అండాల్ అమ్మవారి శ్రీవల్లి పుత్తూరు రథం, తంజావూరు జిల్లాలోని తిరువార్ రథం తర్వాత 3వ అతి పెద్దది ఈ ఖాద్రీశుడి బ్రహ్మరథం. ఆదివారం (9న) అంకురార్పణతో మొదలయిన ఈ బ్రహ్మోత్సవాలలో రోజుకో వాహనం మీద స్వామివారి ఊరేగింపు జరుగుతుంది. 22వ తేదీ తీర్థవాది ఉత్సవం, 23న పుష్పయాగోత్సవంతో ముగుస్తాయి. మా వంశమంతా స్వామి సేవలోనే..తర తరాలుగా మా వంశాలు స్వామివారి సేవలోనే తరిస్తున్నాయి. అది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాం. ప్రహ్లాద సమేత లక్ష్మీనారసింహుడి దర్శనం ఇంకెక్కడా ఉండదు. బ్రహ్మోత్సవాలు 15 రోజుల పాటు జరిగేది కూడా ఇక్కడే. ప్రతి నెలా స్వాతి నక్షత్రం రోజు మూలవిరాట్‌కు అభిషేకం చేస్తాం. – నరసింహాచార్యులు, ఆలయ ప్రధాన అర్చకులుబ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లుబ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో రోజంతా నిత్యాన్నదానం ఉంటుంది. కల్యాణోత్సవంతో పాటు రథోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. ఇందుకు అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. అన్ని ప్రభుత్వ శాఖల అధికారుల సహకారంతో బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా జరిగేలా చూస్తున్నాం.– శ్రీనివాసరెడ్డి, ఆలయ ఈఓ– చెరువు శ్రీనివాసరెడ్డి, సాక్షి, కదిరి, శ్రీసత్యసాయి జిల్లా -
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకి చంద్రబాబు షాక్
అమరావతి: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే SVSN వర్మకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు షాకిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వర్మకి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తానని హామీ ఇచ్చిన బాబు..ఇప్పుడు ఆ హామీని గాలికొదిలేశారు. దాంతో చంద్రబాబు మాట నమ్మి ఇప్పటికే రెండు సార్లు మోసపోయిన వర్మ.. మరోసారి దానికి గురి కాకతప్పలేదు. తాజాగా టీడీపీ ప్రకటించిన ఎమ్మెల్సీ టికెట్ల జాబితాలో వర్మ పేరు ఎక్కడా కనిపించలేదు.పవన్ కళ్యాణ్ కు పిఠాపురం ఎమ్మెల్యే సీటును వర్మ వదులుకున్న క్రమంలో ఎమ్మెల్సీ టికెట్ హామీ ఇచ్చారు చంద్రబాబు. ఇప్పుడు తీరా చూస్తే వర్మ కి ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదు చంద్రబాబు. దాంతో చంద్రబాబు తీరుపై వర్మ వర్గంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. మరొకవైపు వర్మ రాజకీయ భవిష్యత్ ముగిసిందనే ప్రచారం కూడా సాగుతోంది. చంద్రబాబు ఇచ్చిన షాక్ తో వర్మ వర్గం అయోమయంలో పడింది. తమనేత రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిన సమయంలో ఏం చేయాలనే దానిపై వారు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. -
గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ మృతిపై వైఎస్ జగన్ సంతాపం
సాక్షి,తాడేపల్లి : ప్రముఖ సంగీత విద్వాంసులు, శాస్త్రీయ సంగీత గాయకుడు, స్వరకర్త గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ మృతిపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. గరిమెళ్లకు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్ధానం ఆస్ధాన విద్వాంసుడిగా బాలకృష్ణ ప్రసాదు అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు వైఎస్ జగన్. సంగీత విద్వాంసుడిగానే కాకుండా ప్రముఖ సంకీర్తనాచార్యులు తాళ్లపాక అన్నమాచార్యుల వారి సంకీర్తలనకు స్వరకల్పన చేసి.. అన్నమాచార్యుల వారి సంగీత, సాహిత్యాలను ప్రజలకు చేరవేయడంలో ఆయన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు వైఎస్ జగన్. -
టీటీడీ ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూత
సాక్షి,తిరుపతి: టీటీడీ ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూశారు. 1978 నుండి 2006 వరకు టీటీడీలో ఆస్థాన గాయకుడిగా పనిచేసిన గరిమెళ్ళ 600లకు పైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేశారు. గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ భౌతిక దేహానికి టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి నివాళులర్పించారు. అంనతరం భూమన మాట్లాడుతూ.. ఆయనకు మరణం వేంకటేశ్వర స్వామి భక్తులకు తీరని లోటు. అన్నమయ్య కీర్తనలను గానం చేసి నేటి తరం భక్తులకు అందించిన మహనీయుడు గరిమెళ్ళ బాలకృష్ణ మరణించడం దురదృష్టకరమని అన్నారు. వినరో భాగ్యము విష్ణుకథ, జగడపు చనువుల జాజర,పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు వంటి సుప్రసిద్ధ కీర్తనలకు స్వరాలు సమకూర్చిన గరిమెళ్ళ సంప్రదాయ కర్ణాటక సంగీతంలో, లలిత సంగీతంలో, జానపద సంగీతంలోనూ పాటలు పాడారు. -
‘యువత పోరుకు అందరూ మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం’
గుంటూరు: వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్న యువత పోరు కార్యక్రమానికి అందరూ మద్దతు ఇవ్వాలని పార్టీ నాయకులు, మాజీ మంత్రి అంబటి రాంబాబు విజ్ఞప్తి చేశారు. ఈరోజు(ఆదివారం) గుంటూరులోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో యువత పోరు పోస్టర్ ను ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డితో కలిసి అంబటి రాంబాబు ఆవిష్కరించారు. దీనిలో భాగంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ‘ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 12వ తేదీన యువత పోరు కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో వసతి దీవెన బకాయిలు పెద్ద ఎత్తున పేరుకుపోయాయి. విద్యార్థులు చదువుకునేందుకు ఇబ్బందలు పడుతున్నారు. పేద విద్యార్థులు వ్యవసాయ బాట పట్టే విషమ పరిస్థితిని కల్పించారు. బకాయిలు తీర్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ వరకూ ర్యాలీ చేస్తాం. ఈ ప్రభుత్వంలో సూపర్ సిక్స్ లేదు.. సూపర్ సెవెన్ లేదు. నిరుద్యోగ భృతి అంశాన్ని పక్కన పెట్టేశారు. ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. మెడికల్ కాలేజ్ లను ప్రభుత్వం రంగం నుండి ప్రవేటు రంగానికి మార్చేసి పప్పు బెల్లాల్లా అమ్ముకునేందుకు సిద్దం మయ్యారు. పెట్టుబడి దారులకు అమ్ముకుంటున్నారు. యువత పోరుకు అందరూ మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం’ అని అంబటి స్పష్టం చేశారు. -
నంద్యాల జిల్లాలో టీడీపీ నేతల అరాచక పర్వం.. వంతపాడుతున్న పోలీసులు
సాక్షి,నంద్యాల జిల్లా : నంద్యాల జిల్లాలో టీడీపీ నేతల అరాచకాలు తారస్థాయికి చేరుకున్నాయి. కొలిమిగుండ్ల మండలం చింత లాయపల్లె గ్రామంలో టీడీపీ నాయకులు కక్ష సాధింపు చర్యలకు దిగారు. చీనితోటను జేసీబీతో నాశనం చేశారు. అయితే, చీనితోటను నాశనం చేయొద్దంటూ అడ్డుపడిన మహిళలపై కట్టెలు, రాళ్లతో దాడులకు దిగారు. ఈ దాడుల్లో ముగ్గురు మహిళలు,ఓ బాలిక తీవ్రంగా గాయపడ్డారు.అయితే, ఈ చీనితోట పంటవేసిన మూడు ఎకరాల పొలంపై కోర్టులో కేసు నడుస్తోంది. కేసు విచారణ కొనసాగుతుండగా సివిల్ కేసులో కొలిమిగుండ్ల సీఐ రమేష్ జోక్యం చేసుకున్నారు. ఆ పొలాన్ని టీడీపీ వర్గీయులకు అప్పగించాలంటూ సదరు పొలం యజమానిపై ఒత్తిడి తెచ్చారు. అయినా బాధితులు తలొగ్గక పోవడంతో కొలిమిగుండ్ల పోలీసులు దాడికి ఉసిగొల్పాడు.ఇక టీడీపీ నేతల దాడిలో బనగానపల్లె ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భాదితుల్ని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పరామర్శించారు. బాధితులకు వైఎస్సార్సీపీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. -
ప్రతీ పల్లెలో ఘనంగా వైఎస్సార్సీపీ ఆవిర్భావ వేడుకలు: సజ్జల
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ ఈనెల 12న చేపట్టిన ‘యువత పోరు’ ద్వారా రాష్ట్రంలో యువతను, నిరుద్యోగులను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వ వైఖరిని నిలదీయాలని పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. అలాగే, 12వ తేదీన వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని వాడవాడలా పార్టీ ఆవిర్భావ వేడుకలను ఉత్సాహంగా జరుపుకోవాలన్నారు. ప్రతి పల్లెలోనూ పార్టీ జెండాలను ఎగురవేయాలని సూచించారు.యువత పోరు, పార్టీ ఆవిర్భావ దినోత్సవాలపై ఆదివారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో సజ్జల రామకృష్ణారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘రాష్ట్ర వ్యాప్తంగా యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వం సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో లక్షలాది మంది విద్యార్ధులు ఆందోళన చెందుతున్నారు. మొత్తం రూ.3900 కోట్ల మేరకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉంటే ఈ బడ్జెట్లో కేవలం రూ.2600 కోట్లు కేటాయించడం దుర్మార్గం. అంటే విద్యార్ధుల సంఖ్యను కూడా కుదించేందుకు ఈ ప్రభుత్వం కుట్ర చేస్తోంది.బకాయిలు పెండింగ్..పేద, మధ్యతరగతి విద్యార్ధులను చదువులకు దూరం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అయిదు త్రైమాసికాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ పెట్టడం రాక్షసత్వం. ఫీజులు చెల్లించకపోవడంతో కాలేజీల నుంచి విద్యార్ధులను వెళ్లగొడుతున్నారు. దిక్కుతోచని స్థితిలో చదువులు మధ్యలో ఆగిపోతున్నా సర్కారు చోద్యం చూస్తోంది. పేద పిల్లలకు పెద్ద చదువులు సాకారం చేస్తూ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఆనాడు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకువచ్చారు. నిరుపేద ఇళ్ల నుంచి డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు తయారు కావాలన్న సమున్నత లక్ష్యంతో నాడు ఫీజు రీయింబర్స్మెంట్ కు శ్రీకారం చుట్టారు.చంద్రబాబు సర్కార్ 2014-19 మధ్యలో ఈ పథకానికి తిలోదకాలు ఇచ్చింది. ఉద్దేశపూర్వకంగా బకాయిలు పెట్టి, కాలేజీ యాజమాన్యాలను, విద్యార్ధులను ఇబ్బందుల పాలు చేసింది. వైఎస్సార్ బాటలో మరో రెండు అడుగులు ముందుకు వేసిన వైఎస్ జగన్ 93 శాతం మంది విద్యార్ధులకు మేలు చేసేలా ఈ పథకాన్ని విస్తరింపచేశారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు కూటమి సర్కార్ ఈ పథకాన్ని నీరు గార్చేందుకు ప్రయత్నిస్తోంది.నిరుద్యోగులను వంచిస్తున్న కూటమి..కూటమి ప్రభుత్వంపై యువతలోనూ ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. నిరుద్యోగ యువతకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని విస్మరించారు. ఇరవై లక్షల ఉద్యోగాలు లేదా ప్రతినెలా మూడు వేల రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తామంటూ ఇచ్చిన హామీ ఏమైంది?. ఈ హామీని అమలు చేయాలంటే ఏడాదికి రూ.7200 కోట్లు అవసరం. కానీ గత బడ్జెట్ లో దీనికి కేటాయింపులు లేవు. ఈ ఏడాది బడ్జెట్ లోనూ పైసా కూడా కేటాయించలేదు.మెడికల్ కాలేజీలు ప్రైవేటుపరం..ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేసేందుకు వైఎస్సార్సీపీ హయాంలో పదిహేడు కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టారు. ఇందులో అయిదు కాలేజీల నిర్మాణం పూర్తై, తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. మిగిలిన వాటిల్లో నిర్మాణపనులు పూర్తిచేసి, తరగతులను ప్రారంభించాల్సి ఉంది. కానీ వాటిని కూడా ప్రైవేటీకరించేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోంది. ఇచ్చిన మెడికల్ సీట్లను కూడా వద్దంటూ రాష్ట్రప్రభుత్వమే లేఖ రాయడం దుర్మార్గం. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎనిమిది వేల కోట్ల రూపాయలకు పైగా నిధులతో ఒకేసారి పదిహేడు ప్రభుత్వ వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టింది.వీటిల్లో విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల కాలేజీలు 2023లో ప్రారంభమయ్యాయి. వీటి ద్వారా అదనంగా 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. 2019 వరకు రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో కేవలం 11 వైద్య కాలేజీలే ఉండేవి. వందేళ్ళ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టిన ఘనత వైఎస్ జగన్‌కు దక్కుతుంది. అయితే కొత్త మెడికల్ కాలేజీలను, వాటిద్వారా వచ్చే సీట్లను కూటమి ప్రభుత్వం అడ్డుకుంటోంది. వాటిని ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నిస్తోంది.విద్యార్థి సంఘాలు కలిసి రావాలి..ఈ తరుణంలో ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీ.. యువతకు, విద్యార్ధులకు అండగా నిలిచి ప్రభుత్వం విధానాలపై పోరాడాలి. అందుకోసం తలపెట్టిన యువత పోరులో కలిసి వచ్చే అన్ని విద్యార్థిసంఘాలు, యువజన సంఘాలతో వైఎస్సార్సీపీ నేతృత్వంలో శాంతియుతంగా నిరసన కార్యక్రమాలను నిర్వహించాలి. అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట విద్యార్థులు, నిరుద్యోగులు, యవతతో కలిసి వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రదర్శన, ధర్నా కార్యక్రమం చేపట్టాలి. అనంతరం కలెక్టర్లకు సమస్యలపై విజ్ఞాపన పత్రాలు అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని జిల్లా పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, మండల స్థాయి నేతలు సమన్వయంతో విజయవంతం చేయాలి.వాడవాడలా పార్టీ ఆవిర్భావ వేడుకలు..ఈనెల 12వ తేదీ వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం. రాష్ట్రంలోని వాడవాడలా పార్టీ ఆవిర్భావ వేడుకలను ఉత్సాహంగా జరుపుకోవాలి. ప్రతి పల్లెలోనూ పార్టీ జెండాలను ఎగురవేయాలి. ప్రజల్లో వైఎస్సార్సీపీకి ఉన్న బలాన్ని చాటుకోవాలి. పార్టీ పట్ల సానుభూతితో ఉన్న శ్రేణులను ఆవిర్భావ వేడుకల్లో భాగస్వాములను చేయాలి. ప్రజల్లో పార్టీకి ఉన్న ఆదరణను నిలబెట్టుకుంటూ, రానున్న రోజుల్లో వారికి అండగా ఉంటామనే భరోసాను కల్పించాలి. మండలస్థాయి కమిటీల ఏర్పాటుకు కూడా నియోజకవర్గ ఇన్చార్జీలు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. -
‘యువతను నమ్మించి దగా చేసిన చంద్రబాబు సర్కార్’
సాక్షి, విజయవాడ: ఈ నెల 12న వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పార్టీ అధినేత జగన్ పిలుపు మేరకు ఫీజు పోరు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ తెలిపారు. విద్యార్థులకు అండగా ఉండాలని ఫీజు పోరు, యువత పోరు కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. విద్యార్థులను నమ్మించి కూటమి ప్రభుత్వం మోసం చేసిందని.. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తుందని అవినాష్ మండిపడ్డారు.‘‘జగన్ హయాంలో ఉన్నత విద్యను అందించి పథకాలు అమలు చేసింది. కూటమి ప్రభుత్వం విద్యార్ధుల జీవితాలను నాశనం చేసింది. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజల జీవితాలను నాశనం చేసారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి మోసం చేశారు. జగన్ తెచ్చిన పథకాలు అమలు చేసి ప్రజలకు మంచి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. 12వ తేదీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆన్ని గ్రామాల్లో, పట్టణాల్లో కార్యక్రమాలు చేపడతాం’’ అని అవినాష్ తెలిపారు.కూటమి ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం: స్వామిదాస్మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్ మాట్లాడుతూ, విద్యా వ్యవస్థను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. పేదలకు విద్యను దూరం చేయాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. ‘‘విద్యతోనే సముల మార్పు సాధ్యం.. దీనికి వ్యతిరేకంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. జగన్ పిలుపు మేరకు 12వ తేదీన ఫీజు పోరు చేస్తున్నాం. మెడికల్ కాలేజీలను అమ్ముకొని కార్పొరేట్లకు ఊడిగం చేయాలని ప్రయత్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా తప్పులు సరిచేసుకోవాలి. సూపర్ సిక్స్ పథకాలకు దిక్కులేదు. విద్యా దీవెన, వసతి దీవెన, తల్లికి వందనం పథకాలు మాయం చేశారు. కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారాలు మానుకొని వాస్తవాలు ఒప్పుకోవాలి’’ అని ఆయన హితవు పలికారు.మెడికల్ కాలేజీలను అమ్ముకుంటున్నారు: మొండితోక జగన్మోహన్రావుమాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు మాట్లాడుతూ.. వైఎస్సార్, జగన్ హయంలో పేద ప్రజలు ధీమాగా ఉండేవారు. చదువు విషయంలో బెంగ పడేవారు కాదు. జగన్ మంచి చేస్తారనే నమ్మకం వారిలో ఉండేది. మెడికల్ కాలేజీలను అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. తప్పులు బయటపడతాయని వైఎస్సార్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వటం లేదు. చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు’’ అని జగన్మోహన్రావు హెచ్చరించారు. -
నిరుద్యోగులకు చంద్రబాబు సర్కార్ ద్రోహం: భూమన
సాక్షి, తిరుపతి జిల్లా: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు తీరును ఎండగట్టారు. కూటమి ప్రభుత్వ మోసాలపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసనలకు పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ‘యువత పోరు’ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధు సూదన్‌రెడ్డి, చంద్రగిరి సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, హర్షిత్ రెడ్డి, నగర పాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష పాల్గొన్నారు.ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ, నిరుద్యోగ భృతి ఇస్తామంటూ నిరుద్యోగులను చంద్రబాబు సర్కార్ ద్రోహం చేసిందని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్నికలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా యువతను, ప్రజలను అడ్డగోలుగా మోసగించారని ధ్వజమెత్తారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్ యువతకు, ప్రజలకు ప్రాధాన్యతనిచ్చి ఇచ్చిన ప్రతి హామిని నేరవేర్చారని భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. -
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 02-09) (3)
-
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 02-09) (2)
-
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 02-09) (1)
-
విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మికుల ఆందోళన
సాక్షి, విశాఖపట్నం: గాజువాకలో స్టీల్ ప్లాంట్ కార్మికులు ధర్నాకు దిగారు. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపునకు నిరసనగా అఖిలపక్ష కార్మిక సంఘాలు ఉద్యమానికి నడుం బిగించాయి. నేడు గాజువాకలో భారీ ఆందోళనకు పిలుపునిచ్చింది. నిన్న 900 మంది కాంట్రాక్ట్ కార్మికులను యాజమాన్యం తొలగించింది. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. భారీగా కార్మికులు హాజరయ్యారు. -
తిరుపతి: విరిగిన రైలు పట్టాలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
తిరుపతి జిల్లా: గూడూరు సమీపంలో రైలు పట్టాలు విరిగాయి. గొర్రెల కాపరి గమనించి ఎర్ర టవలు కట్టడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో విజయవాడ తిరుపతికి వెళ్లే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పట్టాలు ప్రమాదవశాత్తు విరిగిందా? లేక కుట్ర ఏమైనా దాగి ఉందా? అనే కోణంలో రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు. -
ఆగని ‘కూటమి’ వేధింపులు.. సోషల్ మీడియా యాక్టివిస్ట్ రాకేష్ అరెస్ట్
చిలకలూరిపేట: రాష్ట్రంలో సోషల్ మీడియా యాక్టివిస్ట్‌ల అరెస్టుల పరంపర కొనసాగుతోంది. పల్నాడు జిల్లా చిలకలూ రిపేటలోని తూర్పు మాలపల్లెకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ దొడ్డా రాకేష్‌గాంధీని అర్బన్ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం అర్ధరాత్రి గుంటూరులో అదుపులోకి తీసుకుని చిలకలూరిపేట అర్బన్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు.కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అరెస్టు చేస్తారన్న భయంతో రాకేష్‌గాంధీ చిలకలూరిపేటలో నివాసం ఉండటం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రాకేష్‌గాంధీ ఆచూకీ తెలియజేయాలని అతని తండ్రి దొడ్డా దాసును పోలీసులు 4 రోజులపాటు అక్రమంగా నిర్బంధించి వేధించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.అయినప్పటికీ అతని ఆచూకీ తెలియకపోవడంతో అప్పటి నుంచి నిఘా పెట్టిన పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. టీడీపీకి చెందిన బాషా అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాకేష్గాంధీపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. రాకేష్గాంధీపై రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల కూడా కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ఈ విషయమై చిలకలూరిపేట అర్బన్ సీఐ పి.రమేష్‌ను వివరణ కోరగా, దొడ్డా రాకేష్‌గాంధీని అరెస్టు చేశామన్నారు. రాకేష్‌గాంధీని న్యాయస్థానంలో హాజరుపరిచారు. చిలకలూరిపేట కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. -
విశాఖకు ఎన్నారై మహిళ ఎందుకొచ్చింది?.. ఆ రూమ్‌లో ఏం జరిగింది?
విశాఖ సిటీ: విశాఖలో ఖాకీ క్రైమ్ కథా చిత్రం.. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. ఒక ఎన్ఆర్ఐ మహిళ, ఒక వైద్యుడు మధ్య ఏం జరిగిందన్న అంశం హాట్ టాపిక్‌గా మారింది. విశాఖకు చెందిన ఒక వైద్యుడు రెండు వారాలకు పైగా హోటల్లోనే ఎందుకు బస చేశాడు? అమెరికా పౌరసత్వం కలిగిన మహిళ విశాఖకు ఎందుకు వచ్చింది? ఆమె ఆ వైద్యుడు ఉన్న రూమ్ నెంబర్ 229లో ఎందుకు ఉంది? వారి మధ్య గొడవ జరగడానికి గల కారణమేంటి? కొద్ది నిమిషాల్లోనే ఆమె బాత్రూమ్లో నగ్నంగా విగతజీవిగా ఎలా మారింది?పోలీసులకు ఎవరు సమాచారమిచ్చారు? కిటికీ గానీ, హుక్గానీ లేని బాత్రూమ్లో ఆమె ఎలా ఉరి వేసుకుంది? ఆ సమయంలో వైద్యుడు అక్కడే ఉన్నాడా? రెండు రోజుల పాటు ఈ ఘటన బయటకు రాకుండా పోలీసులు ఎందుకు గోప్యంగా ఉంచారు? ఎఫ్ఐఆర్లో వైద్యుడి పేరును చేర్చారా? లేదా? అతడి సెల్ఫోన్లో ఎవరి ప్రైవేట్ వీడియోలు ఉన్నాయి? హోటల్ గదిలో పోలీసులు ఎటువంటి సామగ్రి గుర్తించారు? ఇంటెలిజెన్స్ అధికారులకు కూడా ఈ కేసు సమాచారం ఇవ్వకపోవడం వెనుక మర్మమేంటి? ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. అనేక ఊహకందని ప్రశ్నలు థ్రిల్లర్ సినిమాకు మించి సస్పెన్స్‌ను క్రియేట్ చేస్తున్నాయి. అయితే విశాఖ పోలీసులు మాత్రం ఆ ప్రశ్నలన్నింటినీ పక్కనపెట్టి.. సింపుల్‌గా అనుమానాస్పద మృతి అని తేల్చేశారు. ఈ కేసు విషయంలో పోలీసుల వ్యవహార శైలి తీవ్ర వివాదాస్పదమవుతోంది. గురువారం మధ్యాహ్నం ఘటన జరిగితే.. అదే రోజు సాయంత్రం ఎఫ్ఐఆర్ నమోదు చేసి కూడా శనివారం వరకు బయటకు రాకుండా ఉంచడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇందుకోసం రూ.కోటి వరకు ఒప్పందం జరిగిందన్న ఊహాగానాలు చెలరేగుతున్నాయి. పోలీసుల తీరే ఈ ఆరోపణలు చెలరేగడానికి తావిస్తోంది. వైద్యుడు ఫ్యామిలీ ఫ్రెండ్? విశాఖకు చెందిన వైద్యుడు పిల్లా శ్రీధర్ రెండు వారాలకు పైగా హోటల్ మేఘాలయలో బస చేస్తున్నారు. సీతమ్మధార ప్రాంతానికి చెందిన కాకర్లపూడి రోజా ప్రస్తుతం వివాహం చేసుకొని యూఎస్‌లో స్థిరపడ్డారు. రోజా కుటుంబానికి శ్రీధర్ ఫ్యామిలీ ఫ్రెండ్‌గా తెలుస్తోంది. నాలుగు రోజుల క్రితం రోజా విశాఖకు వచ్చి శ్రీధర్ ఉన్న గదిలోనే ఉంటోంది. అయితే గత గురువారం వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు సమాచారం. కొద్ది నిమిషాల్లోనే ఆమె బూత్రూమ్లో అనుమానాస్పదంగా మృతి చెందింది. పోలీసులకు సమాచారం ఇచ్చింది ఎవరు? ఆమె మృతి చెందిన విషయాన్ని పోలీసులకు ఎవరు సమాచారం ఇచ్చారన్న విషయం సస్పెన్స్‌గా మారింది. అయితే మహిళ బాత్రూమ్లో ఉరి వేసుకొని చనిపోయిందని హోటల్ మేనేజర్ ఫిర్యాదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. రూమ్‌లో శ్రీధర్ మాత్రమే ఉంటే.. హోటల్ మేనేజర్‌కు ఆమె చనిపోయిందన్న విషయం ఎలా తెలిసింది? ఆత్మహత్య చేసుకోవాలనుకునే రోజా ఎందుకు నగ్నంగా ఉంది. ఫ్యాన్ హుక్, కిటీకీ గానీ లేని బాత్రూమ్లో ఆమె ఎలా ఉరి వేసుకుంది? ఇలా అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది. పోలీసులు వచ్చిన సమయంలో శ్రీధర్ రూమ్‌లోనే ఉన్నారా? పోలీసులు అతడి పేరును ఎఫ్ఐఆర్లో నమోదు చేశారా? లేదా అన్న విషయం తేలాల్సి ఉంది. ఎందుకంత గోప్యం.. గురువారం మధ్యాహ్నం ఘటన జరిగితే అదే రోజు సాయంత్రం 5.30కి ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం రాత్రి విషయం బయటకు పొక్కడంతో మీడియా త్రీటౌన్ సీఐ రమణయ్యను సంప్రదించారు. అసలు అటువంటి ఘటనే జరగలేదని, తప్పుడు సమాచారమని చెప్పి తప్పించుకున్నారు. శనివారం ఉదయం ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళితే.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికీ కూడా ఈ కేసు పూర్తి వివరాలను పోలీసులు బయటకు వెల్లడించకపోవడం గమనార్హం.చదవండి: భర్త మటన్ కట్టింగ్.. ప్రియుడు కిరాణం షాపు.. చివరికి..కేసు మాఫీకి ప్రయత్నాలు? ఈ కేసును మాఫీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఎన్ఆర్ఐ మహిళది హత్యా? ఆత్మహత్య? అన్నది తేలాల్సి ఉంది. ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆ వార్తలకు పోలీసుల వ్యవహార శైలే బలాన్ని చేకూరిస్తున్నాయి. ఈ ఘటన బయటకు రాకుండా ఉండేందుకు భారీ స్థాయిలో ఒప్పందాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో ఒక ఉన్నతాధికారి పాత్ర కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే శనివారం మహిళ మృతదేహానికి కేజీహెచ్‌లో పోస్టుమార్టం నిర్వహించారు. ఆ నివేదిక ఆధారంగా కేసులో చర్యలు తీసుకుంటామని నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి చెబుతున్నారు. -
కేసినో వేట.. జీవితాలతో ఆట..!
గోవా అనగానే బీచ్‌లతోపాటు కేసినోలు గుర్తుకొస్తాయి. ఆ కేసినోలపై తెలుగు రాష్ట్రాల్లోని కొందరికి ఉన్న ఆకర్షణను అవకాశంగా చేసుకుని కొన్ని ముఠాలు చెలరేగిపోతున్నాయి. ఈవెంట్ల పేరుతో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఏజెంట్లను నియమించుకుని మరీ అమాయకులకు ఎర వేస్తున్నారు. గోవాతోపాటు శ్రీలంక, నేపాల్‌లలో కూడా దందా సాగుతోంది. రూ.లక్షన్నర నుంచి రూ.2 లక్షల వరకు చెల్లించి వెళ్లేవారు.. ఆటలు ముగిశాక ఒట్టి చేతులతోనో, అప్పుల భారంతోనో, ఆస్తులు రాసేసో.. వెనక్కి రాక తప్పడం లేదు.ఇలా వెళ్లిన వందల మంది సర్వం పోగొట్టుకుని వస్తున్నారు. సాక్షి ప్రతినిధి, గుంటూరు : మధ్య తరగతి, సంపన్నవర్గాలకు కేసినో ఈవెంట్లు నిర్వహించే ముఠాలు గాలం వేస్తున్నాయి. గోవాలోని కేసినోలతో చీకోటి ప్రవీణ్ తెరపైకి రాగా.. ఆయనను ఆదర్శంగా తీసుకుని మరికొందరు ఈ దందాలో అడుగుపెట్టారు. గోవాలో 13 ముక్కలాటపై నిషేధం ఉన్నా, అద్దెకు తీసుకున్న కేసినోలలో వీటిని నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో ఎనిమిది మంది సిండికేట్‌గా ఏర్పడ్డారు. శ్రీనివాసరెడ్డి, ధన, రఫీ, వీరన్నగౌడ్, ప్రశాంత్‌రెడ్డి, నాగరాజు, పరమేష్, తిరుపతిరెడ్డిలు తమ వాట్సప్ గ్రూపుల ద్వారా దందా నడుపుతున్నారు. ఏరియాలవారీగా సభ్యులను ఏర్పాటు చేసుకుని ఎరినైనా గోవా పంపితే కమీషన్ ఇస్తున్నారు. ప్రతి నెలలో ఇరవైకిపైగా ఇలాంటి ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. గోవాలోని బిగ్ బీ, క్యాడీలాక్ డైమండ్ తదితర కేసినోలను అద్దెకు తీసుకుంటున్నారు. నాలుగు రోజుల ఈవెంట్‌కు రూ.కోటి వరకు అద్దె చెల్లిస్తున్నారంటే వారి రాబడి స్థాయి ఎంతో తెలుసుకోవచ్చు. డిపాజిట్ మొత్తాన్ని బట్టి ఆఫర్లు వెళ్లేవారు రూ.రెండు లక్షల వరకు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఆ మేరకు వారికి కాయిన్లు అందిస్తారు. ఈ కాయిన్లతో కేసినోలో ఆడాల్సి ఉంటుంది. వీరికి రానుపోనూ ఉచితంగా విమాన టిక్కెట్లు, గోవాలో బస సదుపాయం, కట్టిన మొత్తాన్ని బట్టి ఫ్రీ మద్యం, వినోద కార్యక్రమాలు వంటి ఆఫర్లు ఉంటాయి. గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, విశాఖ, హైదరాబాద్‌ల నుంచి విమానాల్లో గోవా తీసుకెళ్తున్నారు. ఈవెంట్లు ఉన్న రోజుల్లో గోవా వెళ్లే విమానాలన్నీ రద్దీగా ఉంటున్నాయి. ఒక్కో ఈవెంట్‌కు ఒక్కో ఆర్గనైజర్, అతడికి ఫోన్ నెంబర్ కేటాయిస్తున్నారు. అందర్–బాహర్, బక్కారత్, రౌలెట్టే, బ్లాక్‌జాక్, జండూ, తీన్‌పత్తీ, రమ్మీ/సిండికేట్‌తో పాటు 13 ముక్కల ఆట ఆడిస్తున్నారు. అప్పులిచ్చి.. ఆస్తులు కొట్టేసి.. గెలిచినా ఏదో విధంగా డబ్బులు గుంజి పంపుతున్నారు. డబ్బులు పోతే అక్కడే వీరికి అప్పులు ఇచ్చి మరీ లాగేస్తున్నారు. తర్వాత పొలాలు, స్థలాలు వంటి స్థిరాస్తులు కూడా రాయించుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఇలా ఈవెంట్లకు వెళ్తున్న వారి సంఖ్య వందల్లో ఉంటోంది. గోవా కేసినోలో ఆడితే జీఎస్టీతో కలిపి అక్కడి నిర్వాహకులకు చెల్లించాలి. తెలుగు రాష్ట్రాల నుంచి ఈవెంట్లు చేస్తున్న వారు అక్కడ తమ సొంత స్వైపింగ్ మిషన్లు పెడుతున్నారు. జీఎస్టీ కూడా చెల్లించకుండానే ఈవెంట్లు చేస్తున్నా ప్రభుత్వాలు, నిఘా వర్గాలు పట్టించుకోవడం లేదు. దీంతో దందా యథేచ్ఛగా సాగిపోతోంది. ఈ ముఠాల చేతిలో చిక్కిన వారి కుటుంబాలు రోడ్డునపడుతున్నాయి. -
సీనియారిటీ తెలియక.. పదోన్నతుల తికమక
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయుల పదోన్నతులకు రాష్ట్ర విద్యాశాఖ రంగం సిద్ధం చేసింది. జిల్లాలు, క్యాడర్ వారీగా సీనియార్టీ జాబితాలను సిద్ధం చేసి పాత జిల్లా విద్యాశాఖ అధికారుల (డీఈవో) అధికారిక వెబ్సైట్లో ప్రచురించాలని ఆదేశించింది. వాటిపై ఉపాధ్యాయులు అభ్యంతరాలను సైతం చెప్పాలని, ఈ ప్రక్రియ మొత్తం ఈ నెల 10వ తేదీలోగా పూర్తి చేయాలని సూచించింది. అయితే, సీనియారిటీ జాబితాలో తాము ఎక్కడున్నామో తెలియక ఉపాధ్యాయలు గందరగోళానికి గురవుతున్నారు. ఆన్లైన్లో చూస్తే జిల్లాల్లోని ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాకు బదులు ఒక్క ఉపాధ్యాయుడి వివరాలు మాత్రమే కనిపిస్తున్నాయని వాపోతున్నారు. ఇప్పటికే 13 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి విద్యాశాఖ అధికారులు సీనియారిటీ జాబితాలను ప్రకటించారు. ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్, స్కూల్ అసిస్టెంట్ నుంచి ప్రధానోపాధ్యాయ పోస్టుకు సబ్జెక్టు వారి సీనియార్టీ జాబితాలను టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టం (టీఐఎస్) ఆధారంగా వెబ్సైట్లో ఉంచారు.అయితే, ఇప్పటికే ప్రకటించిన పదోన్నతుల సీనియార్టీ జాబితాల్లో పలు రకాల సమస్యలు ఉత్పన్నమైనట్టు సమాచారం. పలు జిల్లాల్లో కులాల కేటగిరీ నమోదులో అనేక తప్పిదాలు జరిగినట్టు తెలుస్తోంది. కొన్నిచోట్ల డీఎస్సీ ర్యాంకులు కూడా అందుబాటులో లేకుండానే ర్యాంకులు ప్రకటించినట్టు చెబుతున్నారు. ఇలా అయితే చాలామంది ఉపాధ్యాయులకు అన్యాయం జరిగే అవకాశం ఉన్నట్టు ఆందోళన వ్యక్తమవుతోంది. డీఎస్సీ ర్యాంకులు లేకుండానే.. పదోన్నతుల కోసం ఉపాధ్యాయులు సీనియార్టీని నిర్ణయించాలంటే వారి డీఎస్సీ ర్యాంకు కీలకం. అయితే, పలు జిల్లాల్లో కొన్ని బ్యాచ్‌ల టీచర్లకు చెందిన ర్యాంకుల వివరాలు లేవని తెలుస్తోంది. గతంలో ప్రభుత్వాలు నిర్వహించిన డీఎస్సీ ర్యాంకులను నమోదు చేయడంలోను, డీఎస్సీ ర్యాంకులు భద్రపరచడంలోను అలసత్వం చూపడంతో ఇప్పుడు ఆ ప్రభావం కనిపిస్తోంది. ఒక్క ర్యాంకు తేడా ఉన్నా ఉపాధ్యాయులు తమ సీనియారిటీని కోల్పోయే అవకాశం ఉంది. తద్వారా పదోన్నతి కూడా కోల్పోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తమవుతోంది. కనీసం సబ్జెక్టు వారీగా పదోన్నతులు ఇచ్చే పోస్టుల సంఖ్య కూడా తెలియజేయకుండా సీనియార్టీ జాబితాను ప్రకటించాలని జిల్లా స్థాయి అధికారులపై ఒత్తిడి తేవడంతో ఉపాధ్యాయ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా పదోన్నతులు కల్పించే పోస్టుల సంఖ్యకు మూడు రెట్లు ఉపాధ్యాయుల జాబితాను ప్రకటించి, అనంతరం అభ్యంతరాలు స్వీకరిస్తారు. కానీ.. ప్రస్తుతం అందుకు విరుద్ధంగా జరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరి వివరాలను సీనియార్టీ జాబితాలో పొందుపరచడం గమనార్హం. ప్రధానోపాధ్యాయుల పదోన్నతులకు అన్ని సబ్జెక్టుల ఉపాధ్యాయుల కలబోతగా సీనియార్టీ ప్రకటించాల్సి ఉండగా.. సబ్జెక్టుల వారీగా ప్రకటించారు. స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులకు సబ్జెక్టుల వారీగా పదోన్నతులకు అర్హులైన ఎస్జీటీల జాబితా ప్రకటించాల్సి ఉండగా.. అన్ని సబ్జెక్టులకు అర్హులైన ఉపాధ్యాయులతో జాబితాను ప్రకటించారు. దీనివల్ల పదోన్నతి పొందాల్సిన ఉపాధ్యాయుడు సబ్జెక్టు సీనియారీ్టలో ఎక్కడున్నారో.. తనకంటే ముందున్న వారు అసలైన సీనియర్లు అవునో కాదో తెలుసుకునే అవకాశం లేదు. సీనియారిటీ ర్యాంకుల్లో గందరగోళం ప్రస్తుతం పాఠశాల విద్యాశాఖ 1984 నుంచి జరిగిన డీఎస్సీల ద్వారా నియమితులైన ఉపాధ్యాయులు రాష్ట్రంలో పనిచేస్తున్నారు. నాటి డీఎస్సీల్లో వారు సాధించిన ర్యాంకు ఆధారంగా సీనియారిటీని నిర్ణయించాలి. కానీ ప్రస్తుతం అందుకు విరుద్ధంగా జరుగుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చాలా జిల్లాల్లో ర్యాంకులు లేకుండానే జిల్లా స్థాయిలో నచి్చన నంబర్లను కేటాయించి, అదే సీనియర్ నంబర్‌గా చెబుతున్నట్టు తెలుస్తోంది. దీంతో ఉపాధ్యాయులకు తీవ్రమైన అన్యాయం జరిగే ప్రమాదముంది. ఉదాహరణకు 2002లో జరిగిన డీఎస్సీలో అనంతపురం జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయుడు 128 ర్యాంకు సాధించి ఎస్జీటీగా సరీ్వసులో చేరగా, ఇప్పుడు అతనికి సీనియారిటీ జాబితాలో 1,356 ర్యాంకు కేటాయించారు. అదే డీఎస్సీలో మొదటి ర్యాంకు ఉపాధ్యాయునికి 1,384 సీనియార్టీ నంబర్ చూపించారు. డీఎస్సీ మొదటి ర్యాంకు ఉపాధ్యాయునికి ఏమైనా రిమార్కు ఉంటే చూపించాలి. కానీ అదీ చేయలేదు. దీంతో ఆందోళన చెందుతున్న ఉపాధ్యాయులు సీనియార్టీ జాబితాలను డీఎస్సీ ర్యాంకులు ఆధారంగా పూర్తిగా పరిశీలించాలని విద్యాశాఖకు విజ్ఞప్తి చేస్తున్నారు. అభ్యంతరాలను ఈనెల 10వ తేదీ లోగా చెప్పాలని ఆదేశించడం తగదని, పారదర్శకంగా ర్యాంకులు ప్రకటించి, అప్పుడు అభ్యంతరాలు కోరాలని పేర్కొంటున్నారు. సీనియారిటీ జాబితాలో తప్పులు సీనియారిటీ జాబితాలో అనేక తప్పులున్నాయి. 1984 డీఎస్సీ నుంచి అన్ని డీఎస్సీల రోస్టర్ కమ్ మెరిట్ ఎంపిక జాబితాలు జిల్లాల వారీగా వెబ్సైట్లో ఉంచాలి. కొన్ని జిల్లాల్లో విద్యాశాఖ సిబ్బంది ఇష్టారాజ్యంగా ర్యాంకులు కేటాయించారు. లిస్టు బహిర్గతం చేస్తేనే జాబితాలో తప్పుల సవరణకు అవకాశం ఉంటుంది. – వి.రెడ్డి శేఖర్‌రెడ్డి, కోశాధికారి, వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ ఇచ్చిన ర్యాంకుల్లో పొంతన లేదు టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో ఉంచిన ప్రమోషన్ సీనియారిటీ జాబితా సరిగా లేదు. డైరెక్టర్ రిక్రూట్మెంట్ వారికి, ప్రమోషన్లు తీసుకున్న వారికి ర్యాంకులు చూస్తే చాలా తేడా కనిపిస్తోంది. అలాగే, ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:40గా ఉండాలి. అప్పుడే ఎక్కువ మందికి పదోన్నతులు వస్తాయి. – లెక్కల జమాల్‌రెడ్డి, అధ్యక్షుడు, ప్రగతిశీల రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం డీఎస్సీ ర్యాంకుల జాబితా ప్రకటించాలి సీనియార్టీ జాబితాలో ఉపాధ్యాయులకు ర్యాంకుల వివరాలు ఇచ్చినప్పటికీ స్పష్టత లేదు. అన్ని డీఎస్సీల బ్యాచ్‌లకు సంబంధించి ఉపాధ్యాయుల మెరిట్ ర్యాంకుల జాబితా ప్రకటించాలి. డీఎస్సీ మెరిట్ ర్యాంకుతో పాటు మార్కుల వివరాలు తెలపాలి. రోస్టర్ ర్యాంకు, మెరిట్ ర్యాంకు వివరాలపై స్పష్టత ఇవ్వాలి. – సీవీ ప్రసాద్, అధ్యక్షుడు, ఏపీటీఎఫ్ అమరావతి -
ఐపీఎల్ 2025... డిజిటల్ మార్కెటింగ్ బొనాంజా...!
వేసవి వచ్చిందంటే.. విద్యార్థులకు సెలవుల సరదా.. మామిడి పండ్ల మజా.. అంతేనా..? క్రేజీ క్రేజీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సందడి కూడా..! ప్రస్తుతం కొనసాగుతున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ముగింపు దశకు వచ్చింది. ఈ నెల 22 నుంచి ఐపీఎల్ హంగామాకు తెరలేవనుంది. ఈ క్రికెట్ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయనున్న ‘జియో హాట్‌స్టార్’ చానల్ కూడా ఇందుకుతగ్గట్లే మార్కెటింగ్ వ్యూహాలతో సన్నద్ధమవుతోంది.రిలయన్స్‌కు చెందిన జియో సినిమా, డిస్నీ హాట్‌స్టార్ విలీనమై ‘జియో హాట్‌స్టార్’గా ఏర్పడిన తర్వాత ఇదే తొలి ఐపీఎల్ సీజన్. దీంతో ప్రకటనల ద్వారా భారీ ఆదాయానికి గురిపెట్టింది. అందుకోసం డిజిటల్ బ్రెయిన్ మ్యాపింగ్ వ్యూహాలను అమలు చేస్తుండడం తాజా పరిణామం. ఇప్పటికే గూగుల్, మెటా సంస్థలు ఈ పద్ధతి ద్వారా భారీగా ప్రకటనలు రాబడుతున్నాయి. ఇదే పద్ధతిలో.. జియో హాట్‌స్టార్ సైతం భారత్‌తో పాటు యావత్ ప్రపంచంలో క్రికెట్ అభిమానులను విశేషంగా అలరించే ఐపీఎల్ ద్వారా భారీ ఆదాయంపై కన్నేసింది. – సాక్షి, అమరావతిమార్చి 22 నుంచి మే 25 వరకు దేశంలోని 13 నగరాల్లో నిర్వహించే 74 మ్యాచ్‌లకు భారీగా వీక్షకులను ఆకర్షించడం ద్వారా జియో హాట్‌స్టార్ రికార్డు స్థాయిలో ప్రకటనల ఆదాయంపై గురిపెట్టింది. ఐపీఎల్–2025 భారీ మార్కెటింగ్ ఆదాయ వనరుగా మారనుంది. టీవీలు, డిజిటల్ మీడియా ప్రసారాలు, టీమ్ స్పాన్సర్‌షిప్‌లు, స్టేడియంలలో ప్రకటనలు, ఇతరత్రా మాధ్యమాల ద్వారా దాదాపు రూ.7 వేల కోట్లు వస్తాయని మార్కెటింగ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రత్యక్ష ప్రసార హక్కులు పొందిన జియో హాట్‌స్టార్ అందులో రూ.4,500 కోట్ల ఆదాయం రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. రికార్డుస్థాయిలో వ్యూయర్షిప్ సాధించడం ద్వారా తమ చానల్లో ప్రకటనలు ఇస్తే వినియోగదారులకు మరింత చేరువ కాగలమని పారిశ్రామిక, వ్యాపార సంస్థలకు నమ్మకం కలిగించాలన్నది ఉద్దేశం. అందుకోసం జియో హాట్‌స్టార్ అడ్వర్టైజ్మెంట్ విభాగం ఇటీవల బెంగళూరులో పారిశ్రామిక, వ్యాపార సంస్థల ప్రతినిధులతో ప్రత్యేక సెమినార్ నిర్వహించింది. కార్పొరేట్ పరిశ్రమలు, భారీ వ్యాపార సంస్థల నుంచే కాదు.. రాష్ట్రం/నగరాలకు పరిమితమైన వ్యాపార సంస్థల నుంచి ప్రకటనలు రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. కనీసం 17 వేల అమెరికన్ డాలర్లు (రూ.14.80లక్షలు)తో ప్రకటనల ప్యాకేజీలు అందుబాటులోకి తెచ్చింది. డిజిటల్ బ్రెయిన్ మ్యాపింగ్ ద్వారా ఏ వీక్షకుడి మొబైల్ ఫోన్లలో ఎటువంటి ప్రకటనలు ఇవ్వాలన్నది ముందుగానే గుర్తిస్తామని వారికి వివరించింది.భారీ వ్యూయర్‌షిప్పే లక్ష్యం!ప్రపంచంలో ఎన్నో క్రికెట్ లీగ్‌లు ఉన్నప్పటికీ ఐపీఎల్ లెవలే వేరు. బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా (బీసీసీఐ) 2008లో ప్రారంభించిన ఐపీఎల్‌కు ఏటా ఆదరణ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. అటు స్టేడియాలు, ఇటు టీవీలు, స్మార్ట్ఫోన్లలో భారీ వ్యూయర్షిప్ ఐపీఎల్ సొంతం. ఈసారి దీనిని మరింతగా పెంచుకోవాలని జియోహాట్‌స్టార్ భావిస్తోంది. ఒక్కో మ్యాచ్‌ను కనీసం 4 కోట్ల టీవీలు, 42 కోట్ల మొబైల్ ఫోన్లలో వీక్షించేలా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వివిధ ప్యాకేజీల కింద చానల్ ప్రసారాలను అందుబాటులోకి తెచ్చింది.డిజిటల్ మ్యాపింగ్ అంటే..వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు తమ పిల్లలను ఇంటర్మీడియట్ తరువాత ఏ ఇంజనీరింగ్ కాలేజీలో చేర్చించాలనే విషయంపై వాట్సాప్‌లో చాటింగ్ చేశారు. అంతే..! కాసేపటికే వారి ఫేస్బుక్ వాల్‌పై దేశంలోని పలు ఇంజనీరింగ్ కాలేజీల ప్రకటనలు వరదలా పారాయి. స్మార్ట్ ఫోన్‌పై ఫేస్బుక్ ఖాతాను స్క్రోల్ చేసినా ఇంజినీరింగ్ కాలేజీల ప్రకటనలే. ఇది ఎలా సాధ్యం?ఆ వ్యక్తులు ఇంజనీరింగ్ కాలేజీలపై వాకబు చేయనున్నారని ఫేస్బుక్ యాజమాన్య సంస్థ ‘మెటా’కు ఎలా తెలిసింది!? ఈ ప్రశ్నకు సమాధానం.. ‘డిజిటల్ బ్రెయిన్ మ్యాపింగ్’. దీనిని సర్వైలెన్స్ క్యాపిటలిజం (నిఘా పెట్టుబడిదారీ విధానం)గా చెబుతారు. డిజిటల్ టెక్నాలజీ యుగంలో పారిశ్రామిక, వ్యాపార సంస్థల మార్కెటింగ్ ప్రణాళికల్లో సర్వైలెన్స్ క్యాపిటలిజం అత్యంత కీలకంగా మారింది.డిజిటల్ బ్రెయిన్ మ్యాపింగ్‌ను సొమ్ము చేసుకుంటున్న సంస్థలుగూగుల్, మెటా, అమెజాన్ వంటివి తమ ఖాతాదారుల వ్యక్తిగత వివరాలు, వారి అభిరుచులు, వారి వ్యవహార శైలి మొదలైన డేటాను ఎప్పటికప్పుడు సేకరించి విశ్లేషిస్తాయి. ఇదే ‘డిజిటల్ బ్రెయిన్ మ్యాపింగ్’. ఈ డేటాను కొనుగోలు చేసేందుకు గూగుల్, మెటాలతో పారిశ్రామిక, వ్యాపార సంస్థలు ఒప్పందాలు చేసుకుంటాయి. ఈ సంస్థలకు అందిన డేటా ఆధారంగా.. ఖాతాదారుల అభిరుచి, అవసరాలకు తగినట్లుగా వ్యాపార ప్రకటనలు వారి సోషల్ మీడియా ఖాతాల్లో ప్రసారమవుతాయి. ఇవన్నీ వెంటవెంటనే జరిగిపోతాయి. అంటే సోషల్ మీడియా ఖాతాదారులు తమ ఫోన్లలో చేసే ప్రతి సెర్చ్, ప్రతి క్లిక్ కూడా డిజిటల్ బ్రెయిన్ మ్యాపింగ్‌కు దోహదపడుతోంది. తద్వారా సర్వైలెన్స్ క్యాపిటలిజం మార్కెటింగ్ ప్రణాళికలు రూపొందించేందుకు ఉపకరిస్తోంది. ఇప్పటివరకు గూగుల్, మెటా, అమెజాన్ వంటి సంస్థలే డిజిటల్ బ్రెయిన్ మ్యాపింగ్‌ను సొమ్ము చేసుకుంటున్నాయి. మరింత క్షేత్రస్థాయిలోకి వెళ్లి భారీగా ప్రకటనల ఆదాయాన్ని రాబట్టడమే లక్ష్యంగా ఇకపై జియో హాట్‌స్టార్ కూడా ఈ పద్దతిని అనుసరించనుంది. దీనికోసం ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్ మ్యాచ్‌లను వీక్షించే అభిమానుల అభిరుచులను దేశాలు, రాష్ట్రాలు, ప్రాంతాలు, నగరాల వారీగా విభజించి విశ్లేషించి అందుబాటులోకి తేనుంది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా, భారత దేశం అంతటా, రాష్ట్రాలు, నగరాల వారీగా ఎక్కడికక్కడ వివిధ ప్యాకేజీల కింద ప్రకటనలను రాబట్టేందుకు ప్రణాళిక రూపొందించింది. -
వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవం
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. పార్టీ మహిళా నేతలు ముందుగా మహానేత వైఎస్సార్ విగ్రహానికి నివాళులరి్పంచి, ఆయనను స్మరించుకున్నారు. కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో మహిళల సాధికారత అంటే వైఎస్సార్, ఆ తర్వాత వైఎస్ జగన్ మాత్రమే గుర్తుకొస్తారని చెప్పారు. మహిళలకు చేసిన వాగ్దానాలు అమలు చేయకుండా వారిని గాలికి వదిలేయడం చంద్రబాబుకు అలవాటుగా మారిందన్నారు. తనను గెలిపించిన కుప్పంలోనే ఎకరాలకు ఎకరాలు గంజాయి సాగు చేస్తుంటే చంద్రబాబుకు కనిపించడం లేదా.. అని ప్రశ్నించారు. హోం మంత్రి సొంత జిల్లా ఉమ్మడి విశాఖలో ఎకరాలుకు ఎకరాలు గంజాయి పండిస్తున్నా, ముఖ్యమంత్రి ఉన్న గుంటూరు డ్రగ్స్‌కు అడ్డాగా మారినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి మాట్లాడుతూ టీడీపీ కూటమి పాలనలో మహిళల పరిస్థితి దారుణంగా మారిందని చెప్పారు. మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు నిత్యకృత్యంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమికి ఎందుకు ఓటేశామా.. అని మహిళలు బాధపడుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త షేక్ నూర్ ఫాతిమా, గంగాధర నెల్లూరు సమన్వయకర్త కృపాలక్ష్మి, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొత్తపల్లి రజనితో పాటు పార్టీ మహిళా నేతలు ఎం శ్రీదేవి, కేవీవీ స్వప్న, టి.స్వప్నలత, బొజ్జా సుజాత, పి. చైతన్య రెడ్డి, దాసరి దర్యాబీ పలువులు మహిళా నేతలు పాల్గొన్నారు.మహిళలను నట్టేట ముంచడం బాబుకు అలవాటే..: ఆర్కే రోజానవ మాసాల్లో మహిళలను నవ విధాలుగా మోసం చేసిన కూటమి ప్రభుత్వానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిపే అర్హత లేదని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. ఆమె శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా తో మాట్లాడారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు ఆకర్షణీయమైన హామీలతో మహిళలను నమ్మించి, అధికారంలోకి రాగానే మొండిచేయి చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో మహిళలు సా మాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా నిలదొక్కుకునేలా అన్ని విధాలా అండగా నిలిచిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రతి పథకాన్ని మహిళ పేరు మీద ఇచ్చి, ఆ ఇంట్లో మహిళ గౌరవాన్ని పెంచడమే కాకుండా మగవారితో సమానమైన స్థానం కల్పించి, మహరాణుల్లా చూసుకున్నా రని గుర్తుచేశారు. వారి భద్రత కోసం దిశ యాప్, దిశా పోలీస్ స్టేషన్లను తీసుకొచ్చి వారికి అండగా నిలిచారని చెప్పారు. కానీ కూటమి ప్రభుత్వం వాటన్నింటినీ నిర్వీర్యం చేసిందన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనితకు మహిళలు అంటే గౌరవమే లేదన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో 30 వేల మంది మహిళలు అక్రమ రవాణా అయ్యారంటూ ఊగిపోయిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు అధికారంలో ఉండి కూడా వారిని ఇళ్లకు ఎందుకు తేవట్లేదని నిలదీశారు. సుగాలి ప్రీతి కేసు విషయంలో ఆయన శైలి చూస్తే ఆయనేమిటో అర్థమవుతుందన్నారు. హామీల అమలేది? వరుదు కళ్యాణి ఓట్ల కోసం కూటమి పార్టీలు మహిళలకు ఇచ్చిన హామీల అమలు ఏమైందని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరు దు కళ్యాణి ప్రశ్నించారు. మహిళా భద్రతను కూ టమి గాలికొదిలేసిందని దుయ్యబట్టారు. జగన్ కంటే ఎక్కువ మేలు చేస్తామంటూ సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించి, ఇప్పుడు వాటిని ఎగ్గొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. మహాశక్తి పేరుతో పెద్ద ఎత్తున ప్రచారం చేశారని, ఇప్పటి వరకు ఒక్క మహిళకు కూడా ఈ పథకం కింద మేలు జరగలేదన్నారు.మహిళా దినోత్సవం ఒక మహత్తర కార్యక్రమంవైఎస్సార్సీపీ ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజారాణిసాక్షి, న్యూఢిల్లీ: మహిళా దినోత్సవం అనేది ఒక వేడుక కంటే ఎక్కువని వైఎస్సార్సీపీ అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజారాణి చెప్పారు. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని శనివారం ఢిల్లీలోని ఆంధ్రా అసోసియేషన్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఎంపీ తనూజారాణి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సతీమణి గంగాపురం కావ్య, కేంద్ర సహాయ మంత్రి భూపతి శ్రీనివాస వర్మ సతీమణి భూపతి వెంకటేశ్వరీదేవి, వ్యవసాయ శాఖ జాయిండ్ సెక్రటరీ పెరిన్ దేవి, ఢిల్లీ విద్యాశాఖ డైరెక్టర్ వేదిత రెడ్డి, గైనకాలజిస్ట్ డాక్టర్ కమలారావు, సఫ్దర్‌గంజ్ హాస్పిటల్ నర్సింగ్ ఆఫీసర్ కరుణ కుమారికి ప్రపంచ మహిళా దినోత్సవ పురస్కారాలను ప్రదానం చేశారు. ఆంధ్ర అసోసియేషన్ నార్త్ ఢిల్లీ సెక్రటరీ సౌజన్య, సెంట్రల్ ఢిల్లీ సెక్రటరీ శారద, ప్రమీళ, కళ్యాణి, వసంత, సుశీలలు అవార్డులను అందజేశారు. -
16 జిల్లాల్లో రెండో విడత పీ–4 సర్వే
సాక్షి, అమరావతి: పీ–4 రెండో విడత సర్వే 16 జిల్లాల్లో శనివారం మొదలైంది. రాష్ట్రంలోని మొత్తం పేదల్లో అట్టడుగున ఉండే 20 శాతం నిరుపేదలను గుర్తించేందుకు కూటమి ప్రభుత్వం తొలి విడతగా ఫిబ్రవరి 20 నుంచి మార్చి 2 మధ్య పది జిల్లాల్లో ఈ సర్వేను పూర్తి చేసింది. మిగిలిన 16 జిల్లాల్లో ఈ నెల 18 వరకు ప్రక్రియ కొనసాగనుంది. రెండు విడతల్లో మొత్తం 1,28,14,471 కుటుంబాల నుంచి సామాజిక, ఆర్థిక స్థితిగతులపై 27 ప్రశ్నల ద్వారా ప్రభుత్వం సమాచారం సేకరిస్తోంది. గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ఇంటింటి నుంచి సమాచార సేకరణ చేపడుతున్నారు. కుటుంబాల జాబితాను ప్రభుత్వం సర్వే నిర్వహణకు ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్‌తో అనుసంధానం చేసింది. సర్వేపై సవాలక్ష అనుమానాలు సర్వే సందర్భంగా కుటుంబ యజమాని ఆధార్, ఫోన్ నంబర్లతో పాటు, ఇంట్లో టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, ఏసీ, ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్ వంటివి ఉన్నాయా? ఎంతమంది సంపాదించే వ్యక్తులు ఉన్నారు..? మున్సిపల్, పట్టణ పరిధిలో ఏ ఆస్తులు ఉన్నాయి..? నెలకు ఎంత కరెంటు బిల్లు వస్తుంది? వంటి ప్రశ్నలు అడుగుతుండడంతో ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలేవీ అమలు చేయడం లేదని ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా.. సర్కారు మాత్రం పేదల్లో పెద్ద పేదలు, చిన్న పేదలు ఎవరు అన్నది తేల్చడానికి సర్వే చేయడం భవిష్యత్తులో పథకాలను కొద్దిమందికే పరిమితం చేసే ఎత్తుగడ అని భయాందోళన చెందుతున్నారు. ప్రభుత్వం మాత్రం వివిధ ప్రాజెక్టుల ద్వారా అవసరమైన కుటుంబాలకు ప్రైవేట్ రంగ సాయం అందించడం కోసమే సర్వే నిర్వహిస్తున్నట్టు పేర్కొంటున్నది.పథకాల్లో కోతకేనా? అనే భయం పథకాల్లో కోతలు పెట్టేందుకే సర్వే నిర్వహిస్తున్నారన్న సందేహంతో పాటు బ్యాంకు ఖాతా, కుటుంబ ఆదాయం వంటి సున్నిత వివరాలు సైతం అడుగుతుండడంతో పలు కుటుంబాలు ఆసక్తి చూపడం లేదని తెలిసింది. ఇలాంటి కుటుంబాలను జాబితాలో ప్రత్యేకంగా నమోదు చేస్తున్నారు. తొలి విడత పది జిల్లాలతో పాటు శనివారం నుంచి రెండో దఫా మొదలైన 16 జిల్లాల్లో సర్వే సిబ్బంది 54,70,565 కుటుంబాల సందర్శన పూర్తి చేశారు. ఇందులో 46,46,773 కుటుంబాలు వివరాలను తెలపగా, 8,23,792 కుటుంబాలు నిరాకరించాయి. సర్వే పూర్తయ్యాక ఈ నెల 21న వివరాలతో జాబితాను గ్రామ సభల్లో ప్రదర్శించనున్నట్టు అధికారులు తెలిపారు. -
కోలుకోని కోడి
బర్డ్ ఫ్లూ దెబ్బకు కోళ్ల పరిశ్రమ కుదేలవుతోంది. ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో వైరస్ల ఉధృతి దాదాపు తగ్గుముఖం పట్టింది. బర్డ్ ఫ్లూ వైరస్ గుర్తించిన ప్రాంతాల్లో రెడ్ జోన్ సహా ప్రభుత్వ హెచ్చరికలన్నీ ఉపసంహరించారు. పూర్తిస్థాయిలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. అయినా అమ్మకాలు ఏమాత్రం ఊపందుకోకపోవడంతో పౌల్ట్రీ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చెందుతున్నారు. – సాక్షి, అమరావతిపరిశ్రమకు దెబ్బ మీద దెబ్బరాష్ట్రంలో 1200కు పైగా కోళ్లఫామ్‌లు ఉండగా.. వాటిలో 5.60 కోట్లకు పైగా కోళ్లు ఉన్నాయి. వెయ్యికి పైగా ఫామ్‌లు ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల పరిధిలోనే ఉన్నాయి. రోజుకు 6 కోట్ల గుడ్లు ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ ప్రస్తుతం రోజుకు 4.50 కోట్ల గుడ్లకు మించి ఉత్పత్తి జరగడం లేదు. రాష్ట్ర పరిధిలో సుమారు 3 కోట్ల గుడ్లు వినియోగమవుతుండగా, మిగిలినవి పశ్చిమ బెంగాల్, ఒడిశా, బిహార్, అస్సాం, మణిపూర్ తదితర రాష్ట్రాలతో పాటు గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. గతేడాది కురిసిన వర్షాలు, వరదలతో దాదాపు 2 లక్షల కోళ్లు మృత్యువాతపడగా, కేవలం 3,489 కోళ్లకు మాత్రమే రూ.100 చొప్పున పరిహారం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకుంది. మరోవైపు భారీగా పెరిగిన మేత ఖర్చులతో పెద్దఎత్తున కోళ్లపామ్లు మూతపడ్డాయి. దీంతో గుడ్ల ఉత్పత్తి 40–50 శాతం మేర తగ్గిపోయింది.బర్డ్ ప్లూతో అదనపు భారంఈ తరుణంలో బర్డ్ ఫ్లూ మహమ్మారి పౌల్ట్రీ పరిశ్రమను కోలుకోలేని దెబ్బతీసింది. ఒక్కసారిగా లక్షలాది కోళ్లు కళ్లెదుటే మృత్యు వాతపడటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దాదాపు 30 లక్షలకు పైగా కోళ్లు మృత్యువాత పడినట్టు పౌల్ట్రీ నిర్వాహకులు చెబుతుండగా, అధికార యంత్రాంగం మాత్రం 5.50 లక్షల కోళ్లు మాత్రమే మృత్యువాత పడ్డాయని తేల్చింది. మరోపక్క రెడ్ జోన్ పరిధిలో 30కుపైగా ఫామ్స్ మూసివేసి వాటిలో ఉండే సుమారు 6.60 లక్షలకు పైగా కోళ్లను చంపి పాతిపెట్టారు. లక్షల సంఖ్యలో కోడిగుడ్లను ధ్వంసం చేశారు. రెడ్ జోన్ల పరి«ధిలో వైరస్ ప్రభావం లేనప్పటికీ వ్యాక్సినేషన్, శానిటేషన్ కోసం ప్రతీ రైతుకు రూ.5–10 లక్షల వరకు భారం పడింది. వైరస్ ప్రభావంతో చనిపోయిన, చంపిన కోళ్లకు పరిహారం చెల్లించి ఆదుకోవాలన్న రైతుల అభ్యర్థనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.కొత్త బ్యాచ్‌లు పెట్టేందుకు సాహసించని రైతులుప్రస్తుత పరిస్థితుల కారణంగా పౌల్ట్రీ ఫామ్స్‌లో కొత్త బ్యాచ్‌లు పెట్టేందుకు రైతులు ఏమాత్రం సాహసించడం లేదు. సాధారణంగా 40–45 రోజుల వయసులో బ్రాయిలర్ కోళ్లను కంపెనీలతోపాటు రిటైలర్స్ కొంటారు. ప్రస్తుతం ఫామ్‌లలో ఏకంగా 60–75 రోజుల వయసున్న కోళ్లు పేరుకుపోయాయి. సాధారణంగా ఫామ్ వద్ద కేజీన్నర నుంచి రెండు కేజీల మధ్య ఉండే కోళ్లు ప్రస్తుతం 3–4 కేజీల వరకు పెరిగిపోతున్నాయి. దాదాపు ప్రతి జిల్లాల్లోనూ 30 లక్షలకు పైగా కోళ్లు ఉన్నట్టు చెబుతున్నారు. ఫామ్ వద్ద లైవ్ బర్డ్ రూ.75–రూ.80 ధర ప్రకటిస్తున్నప్పటికీ కొనే వారులేక ప్రకటిత ధరపై కనీసం రూ.20–రూ.25 తగ్గించి ఇచ్చేస్తున్నారు.ఆంక్షలు సడలించినా ఊపందుకోని అమ్మకాలుఫిబ్రవరి రెండో వారం నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో వైరస్ల ప్రభావం పూర్తిగా తగ్గుముఖం పట్టింది. ప్రభుత్వ హెచ్చరికలన్నీ తొలగించారు. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో మధ్యాహ్న భోజనం, అంగన్వాడీ కేంద్రాల్లో కోడిగుడ్ల పంపిణీపై విధించిన ఆంక్షలను ఎత్తివేశారు. తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాలకు ఎగుమతులపై ఆంక్షలు పూర్తిగా సడలించారు. వైరస్ ప్రభావం ఏమాత్రం లేదని అధికారులు ప్రకటించినప్పటికీ ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు తొలగడం లేదు. నెక్, పౌల్ట్రీ యజమానుల సంఘం సంయుక్తంగా రాష్ట్రవ్యాప్తంగా చికెన్ మేళాలు పెడుతున్నప్పటికీ అమ్మకాలు మాత్రం ఊపందుకోవడం లేదు. ముఖ్యంగా ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో అమ్మకాలు ఘోరంగా పడిపోయాయని చెబుతున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లలో చికెన్ వంటకాల పట్ల ఆసక్తి చూపడం లేదు. ఫంక్షన్లలో సైతం చికెన్ వంటకాలు వడ్డించడం లేదు. మంగళ, ఆదివారాలలో సైతం 30–40 శాతానికి మించి కోళ్లు అమ్ముడుపోవడం లేదు. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో కిలో బ్రాయిలర్ మాంసం రూ.170–రూ.200 మ«ధ్య ధర పలుకుతోంది. 20 శాతం నుంచి 30 శాతం వరకు డిస్కౌంట్ బోర్డులు పెట్టినా కొనడం లేదని చికెన్ షాపు నిర్వాహకులు చెబుతున్నారు.ఇది కోలుకోలేని దెబ్బబర్డ్ ఫ్లూ దెబ్బకు పౌల్ట్రీ పరిశ్రమ ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కనిపించడంలేదు. వైరస్ ప్రభావం పూర్తిగా తగ్గిననప్పటికీ ప్రజల్లో భయాందోళనలు మాత్రం పోవడం లేదు. చికెన్ మేళాలు నిర్వహిస్తున్నా అమ్మకాలు పుంజుకోవడం లేదు. గత సీజన్లో ఇదే నెలలో అమ్ముడైన కోళ్లలో సగం అమ్మకాలు కూడా ఈ ఏడాది జరగలేదు. ఫామ్స్‌లో లక్షలాది కోళ్లు అమ్ముడుపోక పేరుకుపోతున్నాయి. ఎండల తీవ్రత పెరిగితే కోళ్ల ఉత్పత్తి తగ్గి పోతుంది. ఆగస్టు వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అంచనా వేస్తున్నాం. – గడ్డం బుచ్చారావు, అధ్యక్షుడు, కృష్ణా జిల్లా బ్రాయిలర్ ఫార్మర్స్ అసోసియేషన్పుంజుకోవడానికి టైం పడుతుందిబర్డ్ ఫ్లూ ప్రభావం పరిశ్రమపై తీవ్రంగా పడింది. ఎగుమతులకు ఇబ్బంది లేకపోయినా స్థానిక వినియోగం తగ్గింది. ఫామ్ గేటు వద్ద గతేడాది ఇదే సమయానికి కోడిగుడ్ల ధర రూ.5కుపైగా ఉంది. ఈ ఏడాది ఫామ్ గేటువద్దే రూ.3.80–రూ.3.90కు మించి కొనడం లేదు. ఆర్థిక భారమైనా చికెన్ మేళాలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రజల్లో భయాందోళనలు పోవడం లేదు. ఈ విషయంలో ప్రభుత్వం కూడా చేయూతనివ్వాలి. – తుమ్మల కుటుంబరావు, నెక్ మాజీ చైర్మన్ -
అసైన్డ్ భూమిపై ఆ ‘షరతు’ను అధికారులే నిరూపించాలి
సాక్షి, అమరావతి: అసైన్డ్ భూమి రిజిస్ట్రేషన్ విషయంలో అధికారుల తీరును రాష్ట్ర హైకోర్టు తప్పుబట్టింది. 18.6.1954కి ముందు నిరుపేదలకు.. ‘‘ఎవరికీ బదలాయింపు (అన్యాక్రాంతం) చేయరాదన్న’’ షరతుతోనే భూములను అసైన్డ్ చేసినట్లు నిరూపించాల్సిన బాధ్యత అధికారులదేనని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఆధారాలను సమర్పించలేకపోతే, అసైన్డ్ భూమి విషయంలో అలాంటి షరతు ఏదీ లేదనే భావించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో అసైన్డ్ భూముల అన్యాక్రాంతంపై ఉన్న నిషేధం ఆ భూములకు వర్తించదని పునరుద్ఘాటించింది. 18.6.1954కి ముందు అసైన్డ్ చేసిన భూముల విక్రయానికి సమర్పించే డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ అధికారులు స్వీకరించి తీరాల్సిందేనని, ఇందుకు సంబంధించి రావి సతీష్ కేసులో హైకోర్టు ధర్మాసనం గతంలో ఇచ్చిన తీర్పును రెవెన్యూ అధికారులందరూ పాటించాలని తేల్చి చెప్పింది. భూముల రిజిస్ట్రేషన్‌కు నిరభ్యంతర పత్రంను (ఎన్వోసీ) తప్పనిసరి చేయడానికి వీల్లేదని కూడా ధర్మాసనం అప్పట్లోనే స్పష్టం చేసిందని గుర్తు చేసింది. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరు గ్రామం సర్వే నంబరు 177/ఏలోని 0.66 సెంట్ల భూమిని ప్రభుత్వానిదిగా పేర్కొంటూ 2008లో పెనమలూరు తహసీల్దార్ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను రద్దు చేసింది. ఇందులోని 0.66 సెంట్ల భూమి రిజిస్ట్రేషన్‌ను నిరాకరించడాన్ని తప్పుబట్టింది. ఈ భూమి విక్రయానికి సంబంధించిన డాక్యుమెంట్లను రిజిష్టర్ చేయాలని పటమట సబ్ రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ తీర్పు వెలువరించారు.రిజిస్ట్రేషన్‌కు ఎన్వోసీ తేవాలన్న అధికారులుకానూరులోని సర్వే నం.177/ఏలోని 1.64 ఎకరాల భూమిని 1942లో నల్లూరు వెంకటస్వామి అనే వ్యక్తికి అసైన్డ్ కింద కేటాయించారు. ఇందులో 0.66 సెంట్లను ఆయన వారసులైన సత్యానందం, రత్నమ్మ నుంచి 1966లో ఉప్పలపాటి రాజారత్నం అనే మహిళ కొన్నారు. తర్వాత ఆమె కుమారుడు బలరాంకు వారసత్వంగా వచ్చింది. అతడు భూమిని అమ్మేందుకు సబ్ రిజిస్ట్రార్‌ను సంప్రదించగా నిరభ్యంతర పత్రం తేవాలని కోరారు. బలరాం పెనమలూరు తహసీల్దార్ వద్దకు వెళ్లగా ఆ భూమి ప్రభుత్వానిది అని, ఎవరికీ అమ్మడానికి వీల్లేదని 2008లో ప్రొసీడింగ్స్ జారీ చేశారు. వీటిని సవాల్ చేస్తూ బలరాం 2009లో హైకోర్టులో పిటిషన్ వేశారు.ఈ వ్యాజ్యంపై జస్టిస్ చల్లా గుణరంజన్ ఇటీవల తుది విచారణ చేపట్టారు. బలరాం తరఫు న్యాయవాది పి.రాయ్‌రెడ్డి వాదిస్తూ.. వెంకటస్వామికి ఇచ్చిన భూమిలో 0.66 సెంట్లను అసైన్డ్ భూముల బదలాయింపు నిషేధ చట్టం రాక ముందే రాజారత్నం కొన్నారని పేర్కొన్నారు. అసైన్మెంట్ ఉత్తర్వుల్లోనూ.. అన్యాక్రాంతం చేయరాదన్న షరతు లేదన్నారు. అధికారులు ఏకపక్షంగా ప్రభుత్వ భూమి అంటున్నారని వివరించారు. ప్రభుత్వ సహాయ న్యాయవాది శ్రావణి వాదనలు వినిపిస్తూ, వెంకటస్వామికి 1942లో భూమిని అసైన్ చేసినట్లు పిటిషనర్ ఆధారాలు చూపడం లేదన్నారు. కాబట్టి 18.6.1954కి ముందు అసైన్ చేసినట్లు భావించడానికి వీల్లేదని తెలిపారు. భూమిని అన్యాక్రాంతం చేయవచ్చన్న షరతు లేదని చెప్పలేమన్నారు. 1966లో వెంకటస్వామి వారసుల నుంచి కొన్నప్పటికీ, 1977లో తీసుకొచ్చిన అసైన్డ్ భూముల అన్యాక్రాంత నిషేధ చట్టం వర్తిస్తుందని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ గుణరంజన్ తీర్పునిస్తూ.. అసైన్మెంట్ కింద 18.6.1954కి ముందు ఇచ్చిన భూములను నిషేధిత జాబితాలో చేర్చడానికి వీల్లేదని హైకోర్టు ధర్మాసనం గతంలోనే తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు. ప్రస్తుత కేసులో వెంకటస్వామికి అసైన్మెంట్ కింద భూమి ఇవ్వడాన్ని, దానిని రాజారత్నం కొనడాన్ని అధికారులు తోసిపుచ్చడం లేదన్నారు. అయితే, 1966కి ముందు మాత్రమే భూమిని అసైన్ చేసినట్లు చెబుతున్నారని తెలిపారు. అన్యాక్రాంతం చేయరాదన్న షరతుతోనే అసైన్ చేశారనేందుకు ఎలాంటి ఆధారాలు చూపడం లేదన్నారు. పిటిషనర్ మాత్రం వెంకటస్వామికి 1942లో అసైన్ చేసినట్లు ఆధారాలు చూపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పిటిషనర్ భూమి.. అసైన్ భూమి అన్యాక్రాంత నిషేధ చట్టం పరిధిలోకి రాదని స్పష్టం చేశారు. తహసీల్దార్ ప్రొసీడింగ్స్‌ను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. బలరాం సమర్పించిన డాక్యుమెంట్‌ను రిజిష్టర్ చేయాలని సబ్ రిజిస్ట్రార్‌ను ఆదేశించారు. -
ఎమ్మెల్యేలూ.. కాసేపు బజ్జోండి!
సాక్షి, ఏపీ సెంట్రల్ డెస్క్: ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలు తమ ఉద్యోగుల కోసం విలాసవంతమైన సౌకర్యాలు కల్పిస్తుంటాయి. ఆఫీస్‌కు రాగానే బ్రేక్‌ఫాస్ట్.. కాస్త బోర్ కొడితే సేదతీరడానికి పలు రకాల ఆటలు.. మధ్యాహ్న భోజనం.. ఆ తర్వాత కునుకు వస్తే నిద్ర పోవడానికి బెడ్లు.. మధ్యమధ్యలో టీ, కాఫీ, జ్యూస్‌లు.. ఇలా ఎన్నో రకాల సదుపాయాలు ఏర్పాటు చేస్తుంటాయి. కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ యూటీ ఖదీర్ కూడా ఇటువంటి ఆలోచనే చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా కర్ణాటక అసెంబ్లీలో శాసనసభ్యులకు పలు సదుపాయాలను అందుబాటులోకి తెచ్చారు. ఉదయం సభకు రాగానే బ్రేక్‌ఫాస్ట్.. మధ్యాహ్నం భోజనం.. ఆ తర్వాత కునుకు తీసేందుకు రిక్లైనర్ కుర్చీలు.. రిలాక్సేషన్ కోసం మసాజ్ కుర్చీలు ఏర్పాటు చేయించారు. ఈనెల 3 నుంచి మొదలైన కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు 21వ తేదీ వరకు జరగనున్నాయి. అయితే సమావేశాల సమయంలో చాలా మంది సభ్యులు మధ్యాహ్న భోజనం తర్వాత సభా కార్యక్రమాలకు గైర్హాజరవుతున్నారని స్పీకర్ ఖదీర్ గుర్తించారు. ఆ పరిస్థితిని నివారించేందుకు, హాజరుశాతాన్ని పెంచేందుకు గాను.. సభ్యులు మధ్యలో కాసేపు నిద్రపోవడానికి 15 రిక్లైనర్లను, రెండు మసాజ్ కుర్చీలను అద్దెకు తీసుకున్నారు. ఒక్క సమావేశాలప్పుడు తప్ప మిగతా సమయాల్లో వీటి ఉపయోగం ఉండనందున.. ప్రస్తుతం వాటిని కొనుగోలు చేయకుండా అద్దెకు మాత్రమే తీసుకున్నామని స్పీకర్ చెప్పారు. 15 రిక్లైనర్లను, రెండు మసాజ్ కుర్చీలను అధికార, విపక్ష లాంజ్లలో ఏర్పాటు చేశామన్నారు. మరిన్ని మసాజ్ కుర్చీలకు ప్రతిపాదన..స్పీకర్ ఖదీర్ మరో అడుగు ముందుకేసి శాసనసభ్యుల కోసం మరిన్ని మసాజ్ కుర్చీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మసాజ్ కుర్చీలతో పాటు సభ్యుల గదులకు స్మార్ట్ లాక్స్ ఏర్పాటు చేయడానికి రూ.3 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఖదీర్ తెలిపారు. స్మార్ట్ లాక్స్ ఏర్పాటు వల్ల సభ్యులకు భద్రత పెరగడంతో పాటు వారి గదుల్లోకి ఇతరులెవ్వరూ ప్రవేశించే అవకాశం ఉండదని చెప్పారు. ఎక్కువ గంటలు పని చేయడం వల్ల ఎమ్మెల్యేలు ఒత్తిడి ఎదుర్కొంటున్నారని వివరించారు. వారు చేస్తున్న పనికి ఇవి విలాసాలు కావని.. అవసరాలు మాత్రమేనని చెప్పారు. ఈ సౌకర్యాలకు ఎమ్మెల్యేలు పూర్తిగా అర్హులంటూ తన చర్యలను సమర్థించుకున్నారు. ఈ సదుపాయాల వల్ల సభ్యులు ఇక ఏ కారణంతోనూ బయటకు వెళ్లబోరని అన్నారు. కాగా, స్పీకర్ నిర్ణయాన్ని పలువురు మంత్రులు, అధికార కాంగ్రెస్ పార్టీ సభ్యులు సమర్థించగా.. బీజేపీ నేతలు విమర్శించారు. ఎమ్మెల్యేలు ఒత్తిడితో పని చేస్తారని, పైగా చాలా మంది సీనియర్ సిటిజన్లు ఉన్నందున ఇలాంటి ఏర్పాట్లు మంచివేనని అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే చెప్పారు. పాలనా సమస్యలపై దృష్టి పెట్టకుండా.. ఇలాంటి అనవసరమైన ఖర్చులు చేయడం ఏమిటంటూ బీజేపీ నేత సీటీ రవి విమర్శించారు. -
చంద్రబాబు క్షుద్ర రాజకీయం
సాక్షి, అమరావతి: మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును పక్కదారి పట్టించి, తమ రాజకీయ ప్రయోజనాల కోసం దుష్ప్రచార కుట్రకు టీడీపీ కూటమి ప్రభుత్వం మరోమారు తెరతీసింది. ఈ కేసులో సాక్షిగా ఉన్న వాచ్‌మేన్ రంగన్న అనారోగ్యంతో మరణిస్తే, ఆ ఉదంతాన్ని వక్రీకరిస్తూ కుతంత్రం పన్నుతోంది. సీబీఐ దర్యాప్తు చేస్తున్న కేసు పరిధిలోకి రాష్ట్ర పోలీసులను జొప్పించడం ద్వారా చంద్రబాబు తన కుయుక్తులను చాటుకున్నారు. ఇందుకోసం ఏకంగా రాష్ట్ర మంత్రి మండలి సమావేశాన్ని వేదికగా చేసుకోవడం కూటమి ప్రభుత్వ పన్నాగానికి నిదర్శనం. నాడు చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే 2019 మార్చి 14న వైఎస్ వివేకా హత్యకు గురవ్వగా, ప్రస్తుతం అదే చంద్రబాబు ప్రభుత్వంలో రంగన్న మరణించారన్న వాస్తవాలను కప్పిపుచ్చుతూ తిమ్మిని బమ్మి చేసేందుకు బరి తెగిస్తున్నారు. వాస్తవంగా ఇందుకు బాధ్యత వహించాల్సింది టీడీపీ ప్రభుత్వం. కానీ అందుకు విరుద్ధంగా వివేకా హత్య వెనుక ఉన్న కుట్రను కప్పి పుచ్చేందుకే ఇలా చేస్తున్నారని తెలుస్తోంది. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న రంగన్నను తొలుత పులివెందుల ఆసుపత్రికి, అనంతరం కడపలోని రిమ్స్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లి చికిత్స చేయించినా ఫలితం లేకపోయింది. ఈ సహజ మరణానికి రాజకీయ రంగు పులమాలన్న ఆలోచన రావడం ఒక్క చంద్రబాబు ముఠాకే సాధ్యమైంది. ఎవరికైనా, ఏమైనా సందేహాలు ఉంటే ఈ కేసును విచారిస్తున్న సీబీఐకి నివేదించాలి. ఇంకోవైపు న్యాయస్థానంలో విచారణ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రంగన్నతోపాటు గత ఐదేళ్లలో సంభవించిన మరికొన్ని సహజ మరణాలపై దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించారు. తద్వారా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును పరోక్షంగానైనా సరే రాష్ట్ర పోలీసులకు అప్పగించాలన్నది చంద్రబాబు కుతంత్రమని స్పష్టమవుతోంది. తద్వారా తన రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వైఎస్సార్సీపీపై దు్రష్పచారం చేసే కుట్రను అమలు చేయాలన్నది అసలు ఉద్దేశం. అందుకే కుట్ర పూరితంగా గురువారం బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డితో అసెంబ్లీలో మాట్లాడించి, ఆ రాత్రికే సిట్‌ను నియమిస్తున్నట్టు ప్రకటించారు. రెడ్‌బుక్ కుట్రలను అమలు చేసేందుకే ప్రత్యేకంగా వైఎస్సార్ జిల్లా ఎస్పీగా నియమించిన ఇ.జి.అశోక్కుమార్తోనూ అదే రాత్రి హడావుడిగా మాట్లాడించారు. మంత్రివర్గ సమావేశం వేదికగా కుట్ర సచివాలయంలో శుక్రవారం మంత్రి మండలి సమావేశంలో అజెండా అంశాలపై చర్చ అనంతరం.. ముందస్తు పన్నాగం ప్రకారం రంగన్న మృతిపై చర్చకు తెరతీశారు. ఏకంగా డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తాను మంత్రి మండలి సమావేశ మందిరంలోకి పిలిపించి రంగన్న మృతిపై ఆరా తీసినట్టు హైడ్రామా నడిపారు. ముందు ఇచి్చన స్క్రిప్టు ప్రకారమే డీజీపీ తన పాత్రలో నటించారు. రంగన్నది అనుమానాస్పద మృతేనని ప్రాథమిక దర్యాప్తు పూర్తి కాకుండానే, పోస్టుమార్టం నివేదిక రాకుండానే ఆయన ఏకపక్షంగా ప్రకటించడం విడ్డూరం. బాబు గూటిలో చిలుకే దస్తగిరి స్వయంగా వివేకానందరెడ్డిని దారుణంగా హత్య చేశానని అంగీకరించిన దస్తగిరిని అప్రూవర్‌గా మార్చడం న్యాయ నిపుణులను విభ్రాంతికి గురి చేసింది. తద్వారా తాము లక్ష్యంగా చేసుకున్న వారి పేర్లను అతనితో వాంగ్మూలం ద్వారా చెప్పించడం అన్నది టీడీపీ పకడ్బందీ కుట్రకు తార్కాణం. అప్రూవర్‌గా మారక ముందు అతను ఇచ్చిన వాంగ్మూలం, అప్రూవర్‌గా మారిన తర్వాత ఇచ్చిన వాంగ్మూలం పూర్తి పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. అత్యంత నేర చరిత్ర కలిగిన దస్తగిరి వైఎస్ వివేకా హత్యకు కొన్ని రోజుల ముందు వరకు రూ.500 కోసం కూడా అప్పులు చేసే దయనీయ స్థితిలో ఉండేవాడు. స్నేహితుడు సునీల్ యాదవ్‌తో అతని వాట్సాప్ చాటింగులే ఆ విషయాన్ని నిర్ధారించాయి. అటువంటి దస్తగిరి అప్రూవర్‌గా మారిపోగానే... అతని వద్దకు కోట్లాది రూపాయలు ఎలా వచ్చాయన్నది ఈ కేసులో అత్యంత కీలకం. ఇతను బహిరంగంగా సాగిస్తున్న దందాగిరీ అంతా ఇంతా కాదు. ఇలాంటి కిరాయి రౌడీకి సిద్ధార్థ లూథ్రా వంటి ఢిల్లీ స్థాయి లాయర్లు కేసు వాదిస్తుండటం గమనార్హం. గురువారం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు లూథ్రాతో రహస్యంగా భేటీ కావడం గమనార్హం. అనంతరమే రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను నియమించింది.వివేకా రెండో భార్య వాంగ్మూలాన్ని పట్టించుకోరా? వైఎస్ వివేకానందరెడ్డి రెండో భార్య షమీమ్ ఆవేదనతో ఇచి్చన వాంగ్మూలాన్ని అటు సీబీఐ, ఇటు చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా విస్మరిస్తున్నాయి. ఆమెతో రెండో వివాహంతోనే వివేకా కుటుంబంలో విభేదాలు ఏర్పడ్డాయి. షమీమ్‌కు ఆస్తిలో వాటా ఇస్తానని చెప్పడంతోపాటు ఆమె కుమారుడిని తన రాజకీయ వారసుడిగా ప్రకటిస్తానని వివేకా చెప్పడాన్ని ఆయన మొదటి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. షమీమ్‌ను సునీత తీవ్రంగా దూషిస్తూ అవమానించారు. వారిద్దరి మధ్య వాట్సాప్ చాటింగ్‌లు ఆ విషయాన్ని బయట పెట్టాయి. వివేకా హత్య వెనుక ఆయన సొంత కుటుంబ సభ్యులు.. అంటే కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివ ప్రకాశ్ రెడ్డి పాత్ర ఉందని షమీమ్ వాంగ్మూలం ఇచ్చారు. మరి ఆ అంశానికి చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నది ప్రశ్నార్థకంగా మారింది. తద్వారా వైఎస్ వివేకా హత్య వెనుక కారణాలను కప్పిపుచ్చి, తమ రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకెళ్లాలని టీడీపీ కూటమి ప్రభుత్వం భావిస్తోందనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రంగన్న మృతదేహానికి రీ పోస్టుమార్టంసిట్ పర్యవేక్షణలో 4 గంటలపాటు నిర్వహణపులివెందుల: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ఇంటి వాచ్‌మేన్ రంగన్న మృతదేహానికి శనివారం రీ పోస్టుమార్టం నిర్వహించారు. ఉబ్బసం, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో తీవ్ర అనారోగ్యానికి గురైన రంగన్న కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన మృతదేహానికి గురువారం కడప రిమ్స్‌లో వైద్యులు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహాన్ని పులివెందులలోని భాకరాపురం శ్మశానవాటికలో ఖననం చేశారు. అయితే, రంగన్న మృతి పట్ల సీఎం చంద్రబాబు శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో అనుమానం వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో సిట్, వైద్య బృందం సభ్యులు కలిసి భాకరాపురం శ్మశానంలో పూడ్చిపెట్టిన రంగన్న మృతదేహాన్ని వెలికితీయించారు. శ్రీకాకుళం జిల్లా ఏఎస్పీ శ్రీనివాసులు పర్యవేక్షణలో కడపకు చెందిన వైద్య బృందం, తిరుపతి నుంచి వచ్చిన ఫోరెన్సిక్ బృందం సభ్యులు.. రెవెన్యూ అధికారుల సమక్షంలో 4గంటలపాటు రంగన్న మృతదేహానికి రీ పోస్టుమార్టం నిర్వహించారు. ముఖ్యమైన శరీర భాగాలను సేకరించి తిరుపతి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. -
ఐదుగురు సిట్టింగ్‌లూ కరివేపాకులు!
సాక్షి, అమరావతి: ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ స్థానాల కేటాయింపులో సిట్టింగ్‌లకు అవకాశం లేనట్లేనని టీడీపీలో ప్రచారం జరుగుతోంది. ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్సీలు ఉంటే వారిలో ఒక్కరికి కూడా సభ్యత్వాన్ని తిరిగి రెన్యువల్ చేసే పరిస్థితి లేదని నేతలు చర్చించుకుంటున్నారు. యనమల రామకృష్ణుడు, అశోక్‌బాబు, బీటీ నాయుడు, దువ్వారపు రామారావుల పదవీ కాలం ఈ నెలాఖరులో పూర్తి కానుండగా, వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన జంగా కృష్ణమూర్తి గతంలోనే రాజీనామా చేశారు. ఈ ఐదు స్థానాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈ ఐదింటిలో ఒకటి జనసేనకు కేటాయించగా, మిగిలిన నాలుగింటిలో ఒకటి బీజేపీకి ఇచ్చే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది. అయితే బీజేపీ అగ్ర నాయకత్వం రాజ్యసభ స్థానాలపైనే ఆసక్తి చూపుతూ, ఎమ్మెల్సీ స్థానాల గురించి పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఒక స్థానం తమకివ్వాలని కోరుతున్నా, జాతీయ నాయకత్వం ఆ దిశగా టీడీపీకి ఎటువంటి సూచనలు చేయలేదని చెబుతున్నారు. దీంతో ప్రస్తుతం బీజేపీ నుంచి ఎవరికీ అవకాశం దక్కే సూచనలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో నాలుగు స్థానాలు టీడీపీ ఖాతాలోకే వెళతాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ ఇందులో ప్రస్తుతం ఆ స్థానాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న వారిలో ఒక్కరిని కూడా పరిగణనలోకి తీసుకోకపోవడం గమనార్హం. యనమలకు అవమానం!పార్టీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడిని అవమానకరమైన రీతిలో పక్కన పెడుతున్నట్లు టీడీపీలో చర్చ నడుస్తోంది. ఆయనకు ఎమ్మెల్సీ స్థానాన్ని రెన్యువల్ చేయకపోగా, పార్టీలోనూ ప్రాధాన్యాన్ని తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా ఉండడంతోపాటు పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతూ, చంద్రబాబుతో అత్యంత సాన్నిహిత్యం ఉన్నా ఆయన్ను పట్టించుకోక పోవడం వెనుక లోకేశ్ ఉన్నట్లు టీడీపీలో ప్రచారం జరుగుతోంది. సీనియర్లను పూర్తిగా పక్కనపెట్టి, సొంత మనుషులతో కోటరీ నిర్మించుకుంటున్నారని పార్టీలో గుప్పుమంటోంది. ఈ క్రమంలోనే చాలా కాలంగా యనమల సహా చాలా మంది సీనియర్లకు అవమానాలు ఎదురవుతున్నాయి. ఈ కోపంతోనే కొద్ది రోజుల క్రితం కాకినాడ పోర్టు, సెజ్ వ్యవహారంలో చంద్రబాబు తీరును తప్పు పడుతూ యనమల లేఖ రాయడం ద్వారా కలకలం సృష్టించారు. అప్పటి నుంచి పార్టీలో ఆయన ప్రాధాన్యం తగ్గిపోయింది. ఇప్పుడు ఎమ్మెల్సీతో సహా మరే పదవులు ఆయనకు ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. మిగిలిన నలుగురికీ నిరాశేఉద్యోగ సంఘాల నేతగా ఉండి టీడీపీలో చేరి, పార్టీ కార్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న అశోక్‌బాబు, ఉత్తరాంధ్ర నుంచి గతంలో శాసన మండలికి వెళ్లిన దువ్వారపు రామారావు, రాయలసీమ కోటాలో మండలిలో ఉన్న బీటీ నాయుడి పేర్లను ప్రస్తుతం పరిగణనలోకి తీసుకోవడం లేదనే చర్చ జరుగుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ ముగ్గురు మండలిలో చురుగ్గా ఉండి లోకేశ్‌తో కలిసి పని చేసినా, మారిన పరిస్థితుల్లో వారి అవసరం లేదని భావిస్తున్నట్లు సమాచారం. వారివల్ల అంత ఉపయోగం లేదనే కారణంతో ఎమ్మెల్సీ సభ్యత్వం రెన్యువల్ కోసం పరిగణనలోకి తీసుకోలేదని చెబుతున్నారు. ఎన్నికలకు ముందు జంగా కృష్ణమూర్తి వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించినప్పుడు మళ్లీ ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆయనొకరు ఉన్నారనే విషయమే టీడీపీ అధిష్టానం గుర్తించడం లేదంటున్నారు. -
కందిపప్పు హుష్‌కాకి!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ గాడి తప్పింది. పేదలకు సబ్సిడీపై అందించాల్సిన నిత్యావసరాలపై నిర్లక్ష్య ధోరణి పెరుగుతోంది. ప్రభుత్వం రేషన్ ఇస్తే తప్ప పూట గడవని కుటుంబాల్లో ఆందోళన మొదలైంది. గడిచిన ఎనిమిది నెలలుగా ఇదే పరిస్థితి. ఒక నెలలో వచ్చిన రేషన్ సరుకులు మరుసటి నెలలో ఇస్తారో లేదో తెలియని దుస్థితి. ఎన్నికల్లో పేదల ఓట్లను దండుకోవడమే పరమావధిగా తాము అధికారంలోకి వస్తే రేషన్‌లో 18 రకాల సరుకులు ఇస్తామని ప్రగల్భాలు పలికిన కూటమి నాయకులు.. పీఠం ఎక్కిన తర్వాత పత్తా లేకుండా పోయారు. పేదల నోటికి అందాల్సిన తిండిని లాగేస్తున్నారు. కార్డుదారులకు కిలో కంది పప్పు కూడా ఇవ్వలేక ముఖం చాటేస్తున్నారు. కార్డు తీసుకుని ఎండీయూ వాహనందగ్గరకు వెళ్లిన ప్రతిసారీ లబ్దిదారులకు కందిపప్పు లేదనో, రాలేదనో, వచ్చింది సరిపోలేదనో సమాధానమే ఎదురవుతోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత జూలై, ఆగస్టులో కేవలం 249 టన్నుల కందిపప్పును మాత్రమే రేషన్ కార్డుదారులకు పంపిణీ చేసింది. సెప్టెంబర్ లో అసలు పంపిణీ ఊసే లేదు. అంటే తొలి మూడు నెలల్లో 1.48 కోట్లకుపై రేషన్ కార్డులు ఉండగా కేవలం 2 శాతం (2.50 లక్షల) కార్డుదారులకు మాత్రమే కందిపప్పు అందించారు. అక్టోబర్‌లో 2,981 టన్నులు, నవంబర్, డిసెంబర్లో 10,800 టన్నుల చొప్పన, జనవరిలో 8,700 టన్నులు, ఫిబ్రవరిలో 3,100 టన్నుల సరఫరాతో సరిపెట్టేశారు. వాస్తవానికి నెలకు కార్డుదారులు అందరికీ కిలో కందిపప్పు చొప్పున పంపిణీ చేయాలంటే 15 వేల టన్నులు అవసరం. సగటున 7 వేల టన్నులకుపైగా కార్డుదారుల నుంచి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. కానీ, గత ఎనిమిది నెలల్లో ప్రభుత్వం పంపిణీ చేసింది కేవలం 36 వేల టన్నులు మాత్రమే. పండుగ పూట కూడా పప్పన్నం లేదు.. పండుగల సమయంలో కందిపప్పు అసలే పంపిణీ చేయలేదు. బహిరంగ మార్కెట్లో కిలో రూ.180–220 వరకు ధర పలుకుతున్న సమయంలో పేదలు కందిపప్పు కొనుగోలు చేయలేని నిస్సహాయ స్థితిలో ప్రభుత్వం ఇస్తుందని ఎదురు చూశారు. ప్రభుత్వ పెద్దలు మాత్రం నిరాశే మిగిల్చారు. కేంద్ర ప్రభుత్వం ఎనిమిది నెలల్లో 14 వేల టన్నుల కందులను మద్దతు ధరపై ఏపీకి కేటాయిస్తే వాటిని మరాడించగా వచ్చిన కంది పప్పును మాత్రమే పంపిణీ చేశారు. టెండర్ల ప్రక్రియలో కాంట్రాక్టర్లు ఎక్కువ కోట్ చేస్తున్నారన్న కారణంతో కొనుగోలుకు ముందుకు వెళ్లడం లేదు. దీంతో నిల్వలు ఖాళీ అయిపోవడంతో మార్చి నుంచి కందిపప్పు పంపిణీ నిలిచి పోయింది. రాజధాని ప్రాంత జిల్లాల్లోనే ఒక్క ఎంఎల్ఎస్ పాయింట్‌కు కూడా కిలో కంది పప్పు చేరని దుస్థితి. సబ్సిడీ భారం తగ్గించుకునే కుట్ర కూటమి ప్రభుత్వం పేదలకు ఇచ్చే సబ్సిడీ రేషన్‌లో కోత పెట్టేందుకే కుట్రలు చేస్తోంది. ఇందులో భాగంగానే కందిపప్పు పంపిణీని కావాలనే నిలిపి వేస్తోంది. వాస్తవానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకాయి. ముఖ్యంగా కందిపప్పు ధర కిలో రూ.180–220కి పైగా పలికింది. ఆ సమయంలో ప్రభుత్వం పేదల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. గత ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో ఎంత రేటు పెరిగినప్పటికీ (రూ.170కిలో) కిలో కందిపప్పును రాయితీపై రూ.67కే అందించింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ సబ్సిడీని భారంగా భావిస్తోంది. రేటు పెంచితే లబ్ధిదారుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుందని, దీనికి బదులు ఎక్కువ రేటు పెట్టి కొని కందిపప్పును ఇవ్వడం కంటే పంపిణీని ఎత్తేస్తే మంచిదనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అయితే.. దేశీయంగా కందిపప్పు ధరలు కొంతమేర దిగి వచ్చాయి. హోల్ సేల్‌లో కిలో రూ.100 (సాధారణం), క్వాలిటీ రకం రూ.110–118 పలుకుతోంది. అయినప్పటికీ ప్రభుత్వ పెద్దలు సబ్సిడీపై కందిపప్పును అందించక పోవడం శోచనీయం. మరో వైపు కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్ పెట్టడంతో పౌర సరఫరాల సంస్థపై ఆర్థిక భారం పెరిగిపోతున్నట్టు తెలుస్తోంది. అసలు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్‌లో కోతలు పెట్టడం.. నెలలు తరబడి నిత్యావసరాల పంపిణీని నిలిపి వేయడం కొత్తేమీ కాదు. 2014 సెప్టెంబర్ నుంచి 2015 జూలై వరకు కందిపప్పు పంపిణీని ఆపేశారు. 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో రూ.1,605 కోట్ల విలువైన 0.93 లక్షల టన్నుల కందిపప్పును మాత్రమే పంపిణీ చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.3,140 కోట్ల విలువైన 3.28 లక్షల టన్నుల కందిపప్పును పేదలకు సబ్సిడీపై అందించడం విశేషం. కార్డుదారులు తిరగబడే రోజులు వస్తాయి కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్న ఉచిత రేషన్ బియ్యాన్ని కార్డుదారులకు అందిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్ని రకాల వస్తువులు ఇస్తామన్న ప్రభుత్వం ఒకటి రెండు సరుకులతోనే సరిపెడుతోంది. బియ్యం, చక్కెర తప్ప మిగిలినవి ఏవీ పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదు. కందిపప్పు చూద్దామంటే కనిపించకుండా పోతోంది. ప్రభుత్వం ఇలాగే వినియోగదారులను ఇబ్బందులకు గురి చేస్తే కార్డుదారులు తిరగబడే రోజులు వస్తాయి. – హుసేనమ్మ, కానాల గ్రామం, నంద్యాల జిల్లా స్టాక్ రాలేదని చెప్పారు తిరుపతి జిల్లాలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రేషన్ కార్డుదారులకు కందిపప్పును సక్రమంగా ఇవ్వడం లేదు. మొదటి మూడు నెలలు స్టాక్ రాలేదని చెప్పారు. ఆ తర్వాత కొంత మేరకు మాత్రమే వచ్చిందని తెలిపారు. తాజాగా మళ్లీ రాలేదని చెబుతున్నారు. అధికారులు మాత్రం ప్రస్తుతం కందిపప్పు వస్తుందని.. అయితే కొందరు డీలర్లు డీడీ కట్టడం లేదని చెబుతున్నారు. మొత్తంగా అయితే కందిపప్పు 50 శాతం మంది కార్డుదారులకు సక్రమంగా ఇవ్వడం లేదు. చౌకదుకాణాల్లో కేజీ కందిపప్పు రూ.67కే లభిస్తుంది. మార్కెట్లో రూ.120 నుంచి రూ.130 వరకు చెల్లించాల్సి ఉంటుంది. – గురవయ్య, వాకాడు, తిరుపతి జిల్లా జనవరి నెలలో సగం మందికే పంపిణీ ప్రతినెలా రేషన్ డిపోల నుంచి బియ్యంతో పాటు కందిపప్పు, పంచదార, గోధుమ పిండి తదితర వస్తువులను సరఫరా చేయాల్సి ఉన్నా ప్రభుత్వం కేవలం బియ్యం మాత్రమే పంపిణీ చేస్తుంది. జనవరి నెలలో కందిపప్పు కొంత మందికి మాత్రమే మా ప్రాంతంలో అందజేశారు. మిగిలిన వారు రేషన్ దుకాణదారుడిని అడిగితే నిల్వలు అయిపోయాయని సమాధానం ఇచ్చారు. – ఉరిటి అప్పలనాయుడు, ఎమ్మార్ నగరం, పార్వతీపురం మండలం సరిగా ఇవ్వడం లేదు నేను ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నా. మా కుటుంబంలో నలుగురం ఉన్నాం. గత ప్రభుత్వ హయాంలో రేషన్ షాపు నుంచి బియ్యం, బ్యాళ్లు (కంది పప్పు), చక్కెర తదితరాలు వచ్చేవి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బియ్యం మాత్రమే ఇస్తున్నారు. రెండు నెలల నుంచి బ్యాళ్లు ఇవ్వడం లేదు. దీంతో బయటి మార్కెట్లో కేజీ రూ.150 పెట్టి కొనుగోలు చేస్తున్నాం. – రాజశేఖర్, గణేష్‌నగర్, కర్నూలు ఒకటి, రెండు నెలలే.. కూటమి ప్రభుత్వం రేషన్ సరుకులు పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదు. గత ప్రభుత్వ హయాంలో వాహనాల ద్వారా బియ్యంతోపాటు కందిపప్పు, పంచదార, జొన్నలు, గోధుమ పిండి, రాగిపిండి, రాగులు తదితర సరుకులు అందజేసేవారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తొమ్మిది నెలల్లో ఒకటి రెండు నెలల్లో మాత్రమే అదీ కొద్ది మందికే సరఫరా చేశారు. – హయగ్రీవాచారి, రాయపాడు గ్రామం, గోస్పాడు మండలం, నంద్యాల జిల్లా నమ్మించి మోసం చేయడమేకూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ప్రతి నెల పేదలకు అందించాల్సిన కంది పప్పును సక్రమంగా అందించడం లేదు. ప్రస్తుతం ప్రతి నెల బియ్యం, పంచదారతో సరిపెడుతున్నారు. పేద ప్రజలకు కంది పప్పు ఇవ్వడమే మానేశారు. ఇది ప్రజలను నమ్మించి మోసం చేయడమే. – డి.రాజ్యలక్ష్మి, రంకిణి గ్రామం, పాతపట్నం మండలం, శ్రీకాకుళం జిల్లా -
ఎన్ని కాన్పులైనా ప్రసూతి సెలవులిస్తాం
మార్కాపురం/తర్లుపాడు: ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు ఇకపై ఎన్ని కాన్పులైనా ప్రసూతి సెలవులు ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. గతంలో తానే జనాభా నియంత్రణ పాటించాలని చెప్పానని, అయితే భవిష్యత్తు ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రంలో జనాభా పెరగాల్సిన అవసరం ఉందని.. ఈ నేపథ్యంలో ఎంతమంది పిల్లలను కన్నా మహిళా ఉద్యోగుల ప్రయోజనాలకు ఇబ్బంది కలగకుండా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు బదులిచ్చారు. ఆయన ఏమన్నారంటే.. మహిళలను లక్షాధికారులుగా మారుస్తా. ఈ ఏడాదిలో లక్ష మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారుచేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నాను.రాష్ట్రంలో వంద మంది మహిళా పారిశ్రామికవేత్తలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలి. పాతికేళ్ల క్రితం నేను డ్వాక్రా గ్రూపులను తయారుచేస్తే అందరూ విమర్శించారు. కానీ, ఇప్పుడు వారు రాజకీయ, ఆర్థిక శక్తిగా మారడం ఎంతో సంతోషంగా ఉంది. మహిళా దినోత్సవం రోజున రాష్ట్ర ప్రభుత్వం 21 కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. డ్వాక్రా మహిళలు తయారుచేసిన ఉత్పత్తులకు ప్రపంచస్థాయి గుర్తింపు, మార్కెటింగ్ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. పరిశ్రమలు స్థాపించే మహిళలకు 45 శాతం రాయితీ కల్పించి ప్రోత్సహిస్తాం.ఈరోజున రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలు రూ.లక్ష కోట్ల అప్పు తీసుకునే స్థాయికి వచ్చాయి. మహిళల కోసమే ర్యాపిడో, అరకు కాఫీ, ఫ్లిప్‌కార్ట్ వంటిసంస్థలతో ఒప్పందం చేసుకున్నారు. ప్రతి మేజర్ పంచాయతీలో అరకు కాఫీ కేంద్రాన్ని మహిళలు ఏర్పాటుచేయాలి. టెక్నాలజీని ఉపయోగించుకుని వర్క్ ఫ్రం హోం ద్వారా మహిళలు రాణించాలి. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఈ ఏడాది నుంచి ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పథకం వర్తింపజేస్తాం. మే నుంచి అన్నదాత సుఖీభవ పథకాలను అమలుచేస్తాం. ప్రపంచంలో ఉండే ప్రముఖ కంపెనీలు, వ్యక్తులను మన రాష్ట్రానికి తీసుకొస్తా. ఈ రోజున డ్వాక్రా మహిళలకు రూ.1,826.43 కోట్ల రుణాలు అందిస్తున్నాం. డ్వాక్రా మహిళలు సొంత ఊరిలోనే ఉండి వ్యాపారాలు చేయాలి. టీవీల్లో, బయట, సోషల్ మీడియాల్లో మహిళల గురించి ఎవరైనా అసభ్యంగా మాట్లాడితే క్షమించేది లేదు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నిరోధానికి ఈగల్ వ్యవస్థను ఏర్పాటుచేశాం. దీపం పథకం కింద ఏడాదికి మూడు సిలిండర్లు అందిస్తున్నాం. వెలిగొండకు గోదావరి, కృష్ణా నీళ్లు పారిస్తా.. ఈ సమావేశంలో ఒక మహిళ, విద్యారి్థని అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు బదులిస్తూ.. తానే వెలిగొండకు శంకుస్థాపన చేశానని, తానే పూర్తిచేసి గోదావరి, కృష్ణా జలాలను వెలుగొండ ద్వారా ఈ ప్రాంతానికి పారిస్తానని చెప్పారు. అలాగే, బనకచర్ల–గోదావరి ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని తరలిస్తామన్నారు. త్వరలో మార్కాపురం జిల్లాను ఏర్పాటుచేస్తానని, అప్పుడు ఈ ప్రాంత సమస్యలు తీరతాయని ఆయన చెప్పారు. మహిళా లబ్ధిదారులకు చంద్రబాబు ఈ–ఆటోలు, బైక్‌లు అందించారు. మహిళలు, పిల్లల రక్షణకు సంబంధించిన శక్తియాప్‌ను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఐజీపీ రాజకుమారి, ఎస్పీ దామోదర్ల సమక్షంలో సీఎం ప్రారంభించారు. ఎమ్మెల్యే పనితీరు ఆశాజనకంగా లేదు.. అనంతరం టీడీపీ కార్యకర్తలతో జరిగిన ముఖాముఖిలో చంద్రబాబు మాట్లాడుతూ ఇక్కడి ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పనితీరు ఆశాజనకంగాలేదన్నారు. పార్టీ కోసం పనిచేసే వారికి అండగా ఉంటానన్నారు. ఇక మహిళా దినోత్సవం రోజున జరుగుతున్న ఈ సమావేశంలో 50 శాతం మహిళలు ఉండాల్సి ఉండగా, కేవలం ఒక్క శాతమే ఉన్నారంటే పరిస్థితిని ఏవిధంగా సమర్థించుకుంటారని ప్రశ్నించారు. సామాజికంగా, రాజకీయంగా ఓటు బ్యాంకు పెంచే బాధ్యత తనదని తెలిపారు. ఇదిలా ఉంటే.. సీఎం బందోబస్తుకు వచ్చిన పోలీసులు ఎండ వేడికి తట్టుకోలేకపోయారు. ఒంగోలు ఏఆర్ కానిస్టేబుల్ రమణయ్య స్పృహతప్పి పడిపోయారు. -
బ్యాంకింగ్ సంస్థల పేరిట బురిడీ!
సాక్షి, అమరావతి: బ్రాండింగ్ ముసుగులో సైబర్ నేరగాళ్లు పేట్రేగిపోతున్నారు. బ్యాంకింగ్, ఆర్థిక సంస్థల పేర్లతోనే అత్యధికంగా నిధులు కొల్లగొడుతున్నారు. రిటైల్, టెక్నాలజీ రంగాల పేరిట మోసాలు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇక సైబర్ నేరస్తులు నిధులు కొల్లగొట్టేందుకు ఫిషింగ్ యాప్‌లు, లింక్‌లనే ప్రధాన సాధనంగా చేసుకుంటున్నారు. ప్రముఖ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ ‘క్లౌడ్ సేక్’ దేశంలో సైబర్ నేరాల తీవ్రతపై తాజా నివేదికలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. 2025లో దేశంలో సైబర్ నేరగాళ్లు మరింతగా రెచ్చిపోయే అవకాశాలున్నాయని కూడా అంచనా వేసింది. నివేదికలోని ప్రధాన అంశాలివి..» బ్యాంకులు, ఆర్థిక సంస్థల పేరిట మోసాలే మొదటి స్థానంలో ఉన్నాయి. దేశంలో 39.5 శాతం సైబర్ నేరాలు బ్యాంకులు, ఆర్థిక సంస్థల పేరిటæ బురిడీ కొట్టించి నిధులు కొల్లగొడుతున్నారు. » రెండు, మూడు స్థానాల్లో రిటైల్/ఈ–కామర్స్, టెక్నాలజీ సంస్థలున్నాయి. రిటైల్ సంస్థల పేరుతో 21.4 శాతం, టెక్నాలజీ సంస్థల పేరిట 12.5శాతం సైబర్ నేరస్తులు బురిడీ కొట్టిస్తున్నారు. ఇక టెలీ కమ్యూనికేషన్ల సంస్థలు(9.1శాతం), ట్రావెల్ సంస్థలు(8.6శాతం), రియల్ ఎస్టేట్ సంస్థలు(2.5శాతం), బీమా కంపెనీలు(1.9%) పేరిట కూడా సైబర్ నేరస్తులు మోసాలకు పాల్పడుతున్నారు.» సైబర్ ముఠాలు అత్యధికంగా ఫిషింగ్ యాప్‌లు/లింకులనే తమ మోసాలకు సాధనంగా చేసుకుంటున్నాయి. ఫిషింగ్ యాప్‌లు/ లింకులు పంపి వాటిని క్లిక్ చేయగానే బ్యాంకు ఖాతాల్లో నిధులు కొల్లగొడుతున్నాయి. మొత్తం సైబర్ నేరాల్లో ఈ తరహా మోసాలు ఏకంగా 58% ఉండటం గమనార్హం. » తర్వాత స్థానాల్లో సోషల్ మీడియా మాధ్యమాలున్నాయి. ఫేక్ ఫేస్బుక్ ఐడీల పేరిట 25.7శాతం, యూట్యూబ్ ద్వారా 5.8శాతం, ఎక్స్( ట్విట్టర్) ఖాతాల ద్వారా 3.2శాతం, ఇన్స్టాగామ్ ద్వారా 2.5శాతం సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. » సైబర్ నేరస్తులు 2025లో దేశంలో ఏకంగా రూ.20 వేల కోట్లు కొల్లగొట్టే అవకాశం ఉందని అంచనా. దేశంలో సైబర్ మోసాలపై ఏకంగా 25 లక్షలకు పైగా ఫిర్యాదులు నమోదయ్యే అవకాశం ఉంది. వాటిలో 41 శాతం వరకు బ్యాంకింగ్, ఆర్థిక సంస్థల పేరిట మోసాలే ఉంటాయని భావిస్తున్నారు. ఇక దేశంలో మోసపూరితమైన యాప్‌లు 83 శాతం, ఫేక్ సోషల్ మీడియా ఖాతాలు 65 శాతం పెరగొచ్చని అంచనా. -
అలలపై కలల విహారం
అలలపై తేలియాడుతూ ప్రయాణం.. గమ్యం చేరే వరకు ఎక్కడా బోర్ కొట్టకుండా ఆటలు, పాటలు, విందులు, వినోదాల్లాంటి బోలెడన్ని సరదాలు.. కళ్లు చెదిరే ఇంటీరియర్లతో అందమైన గదులు.. ప్రయాణ బడలిక తెలియనివ్వని పాన్పులు.. ఒకవేళ అలసటకు గురైతే స్పా, మసాజ్ లాంటి సర్వీసులు.. ఉన్న చోటే బోలెడంత షాపింగ్ చేసుకొనే అవకాశం.. ఇంకా ఈత కొలనులు.. జిమ్‌లు.. ఇలా ఒకటేమిటి ఇంద్రభవనం లాంటి సకల విలాసాలతో కూడిన నౌకల్లో విహారయాత్రలంటే ఎవరికి ఇష్టం ఉండదు.అందుకే దేశంలో లగ్జరీ క్రూజ్ టూరిజం సరికొత్త ట్రెండ్‌గా మారింది. పర్యాటకులను ఆనంద‘సాగరం’లో ముంచెత్తే అనుభూతులు పంచుతోంది. ఇంకేం.. జీవితాంతం గుర్తుండిపోయే సముద్రమంత లోతైన జ్ఞాపకాలు కావాలనుకుంటే ‘సీ’కేషన్కు సిద్ధమైపోండి. గెట్ సెట్ క్రూజ్!! దేశంలో క్రూజ్ పర్యాటకం క్రమంగా పుంజుకుంటోంది. డెస్టినేషన్ వెడ్డింగ్స్, ప్రైవేటు పార్టీలు, కంపెనీల గెట్ టు గెదర్ వంటి కార్యక్రమాలకు కూడా క్రూజ్‌లు వేదికలుగా మారుతున్నాయి. ప్రస్తుతం దేశంలో క్రూజ్ ప్రయాణికుల సంఖ్య 4.5 లక్షలు దాటింది. కార్డీలియా క్రూజెస్ అనే స్వదేశీ సంస్థ 2021 సెపె్టంబర్లో సుమారు 2 వేల మంది ప్రయాణికుల సామర్థ్యంగల ‘ఎంప్రెస్’నౌక ద్వారా భారత్‌లో తొలిసారిగా లగ్జరీ క్రూజ్ పర్యాటకానికి తెరతీసింది.బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రాల్లో క్రూజ్ యాత్రలు నిర్వహిస్తోంది. పశ్చిమ తీరంలో ముంబై హోమ్ పోర్టుగా సెపె్టంబర్–జూన్ మధ్య గోవా, కొచ్చి, లక్షదీవులకు... జూన్–సెప్టెంబర్ మధ్య తూర్పు తీరంలో చెన్నై హోమ్ పోర్ట్‌గా క్రూజ్ ట్రిప్పులు తిప్పుతోంది. 2023 జూన్‌లో భారత్ నుంచి శ్రీలంకకు జర్నీతో విదేశీ క్రూజ్ సర్విసులను ప్రారంభించిన ఘనతను కూడా కార్డీలియా సొంతం చేసుకుంది.ఇప్పుడు ఏటా చెన్నై–శ్రీలంక మధ్య జూన్–సెపె్టంబర్ నెలల్లో కార్డీలియా ’ఎంప్రెస్‘విహారయాత్రలను నిర్వహిస్తోంది. గమ్యస్థానాల్లో వాటర్ అడ్వెంచర్లు, జంగిల్ సఫారీలు, ఆన్‌షోర్ సిటీ టూర్, అవుట్డోర్ పర్యటనలను కూడా అందిస్తోంది. దేశీయ గమ్యస్థానాలకు పర్యాటకుల ఆక్యుపెన్సీ 85 శాతం మేర ఉంటోందని.. వేసవి సెలవుల్లో టికెట్లు పూర్తిగా బుక్ అయిపోతున్నాయని కంపెనీ సీఈఓ జుర్గెన్ బైలోమ్ చెబుతున్నారు. కొత్త రూట్లు, గమ్యస్థానాలకు విస్తరణ నేపథ్యంలో భారతీయ క్రూజ్ ట్రాఫిక్ 25–30 శాతం పెరిగే అవకాశం ఉందన్నారు. కేంద్రం దన్ను.. దేశంలో సముద్ర క్రూజ్ పర్యాటకులను 2029 నాటికి ఏటా 10 లక్షల మంది స్థాయికి చేర్చడంతోపాటు ఈ రంగంలో 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేలా ఐదేళ్ల భారత్ క్రూజ్ మిషన్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా 10 సముద్ర క్రూజ్ టెర్మినల్స్, 100 రివర్ క్రూజ్ టెర్మినల్స్ నిర్మించాలనేది ప్రభుత్వ లక్ష్యం.ప్రపంచస్థాయి మౌలిక వసతులతోపాటు పర్యాటక ప్రదేశాలను మరింతగా అభివృద్ధి చేయనున్నారు. బడ్జెట్లో కూడా క్రూజ్ పరిశ్రమ వృద్ధికి ప్రోత్సాహకాలు ఇవ్వడం విశేషం. గంగ, బ్రహ్మపుత్ర నదుల్లో ఇప్పటికే రివర్ క్రూజ్ సర్విసులు ప్రారంభమయ్యాయి. కృష్ణా, గోదావరి, నర్మద, కావేరి నదుల్లోనూ ఈ సర్విసులను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రివర్ క్రూజ్ పర్యాటకులను 2029 నాటికి ఏటా 15 లక్షలకు పెంచాలనేది మిషన్ లక్ష్యం.వైజాగ్ హాట్ డెస్టినేషన్... జూలైలో మళ్లీ క్రూజ్ రెడీ2022లో తొలిసారి కార్డీలియా క్రూజెస్ ‘ఎంప్రెస్’నౌక విశాఖ–చెన్నై మధ్య సముద్ర విహారంతో పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచింది. గతేడాది ‘ద వరల్డ్’అనే విదేశీ లగ్జరీ క్రూజ్ షిప్ గ్లోబల్ టూరిస్టులను విశాఖకు తీసుకొచ్చింది. ఇక్కడ సకల సౌకర్యాలతో నిర్మించిన అంతర్జాతీయ క్రూజ్ టెర్మినల్‌లో లంగరేసింది. ఈ ఏడాది మళ్లీ జూలైలో కార్డీలియా ఎంప్రెస్ నౌక వైజాగ్–పుదుచ్చేరి–చెన్నై మధ్య ట్రిప్పులకు రెడీ అవుతోంది.సుమారు రూ. 100 కోట్ల వ్యయంతో విశాఖ పోర్టులో నిర్మించిన ఇంటర్నేషనల్ క్రూజ్ టెర్మినల్ నుంచి నౌకల రాకపోకలు మొదలవడంతో క్రూజ్ పర్యటకానికి కూడా వైజాగ్ హాట్ డెస్టినేషన్‌గా నిలుస్తోంది. షిప్ ఆకారంలో నిర్మించిన ఈ టెర్మినల్‌లోని బెర్త్‌లో 2,500 మంది సామర్థ్యంతో కూడిన భారీ క్రూయిజ్లను లంగరేయొచ్చు. త్వరలో ఇక్కడి నుంచి సింగపూర్, మలేసియా, థాయ్‌లాండ్, శ్రీలంక తదితర దేశాలకు క్రూజ్ సర్వీసులు ప్రారంభించేందుకు పలు క్రూజ్ కంపెనీలతో సంప్రదింపులు జరుగుతున్నాయి.విదేశీ క్రూజ్‌ల క్యూఇటలీకి చెందిన కోస్టా క్రూజెస్ తొలిసారిగా 2023లో భారత్ పర్యాటకులకు అంతర్జాతీయ స్థాయి క్రూజ్ అనుభూతితోపాటు ఇటాలియన్ ఆతిథ్యాన్ని రుచి చూపించింది. ముంబై, కొచ్చి, గోవాతోపాటు లక్షదీవుల మధ్య మొత్తం 23 ట్రిప్పులు నిర్వహించింది. మొత్తం 14 అంతస్తులు (డెక్‌లు), 3,780 మంది ప్రయాణికుల సామర్థ్యంతో కోస్టా సెరీనా క్రూజ్ భారత సముద్ర జలాల్లో విహరించిన అతిపెద్ద నౌకగా రికార్డుకెక్కింది.ఆసియా పసిఫిక్ కార్యకలాపాల కోసం భారత్‌ను ప్రధాన కేంద్రంగా చేసుకోవడంపై దృష్టి పెడుతున్నామని కోస్టా క్రూజెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాబర్టో అల్బెర్టీ వెల్లడించారు. క్రూజ్ టూరిజానికి ప్రభుత్వ ప్రోత్సాహంతో మరిన్ని క్రూజ్ కంపెనీలు భారత్‌కు క్యూ కట్టనున్నాయి. వచ్చే ఏడాది నుంచి ‘రిసార్ట్ వరల్డ్ వన్’క్రూజ్ లైనర్ మన దేశంలో సెయిలింగ్‌కు సై అంటోంది. రాయల్ కరీబియన్, డిస్నీ తదితర దిగ్గజ క్రూజ్ లైనర్లు కూడా భారత మార్కెట్లోకి అడుగుపెట్టే ప్రణాళికల్లో ఉన్నాయి.ఇక అలలపై ఆగ్నేయాసియా చుట్టేయొచ్చు! భారత క్రూజ్ పరిశ్రమ ఇక అంతర్జాతీయంగానూ సత్తా చాటనుంది. కార్డీలియా తొలిసారిగా భారత్ నుంచి ఆగ్నేయాసియాలోని ప్రముఖ పర్యాటక దేశాలకు జూలైలో క్రూజ్ జర్నీ ప్రారంభిస్తోంది. ఇందుకోసం 2,500 మంది సామర్థ్యంగల రెండు కొత్త క్రూజ్లను కొననుంది. చెన్నై నుంచి మొదలయ్యే ఈ 10 రోజుల ట్రిప్‌లో థాయ్‌లాండ్ (ఫుకేట్), మలేసియా (కౌలాలంపూర్, లంకావీ)ల మీదుగా సింగపూర్ చేరుకోవచ్చు.అలాగే సింగపూర్ నుంచి మొదలై అవే డెస్టినేషన్లను కవర్ చేస్తూ చెన్నై చేరేలా టూర్లను ప్లాన్ చేశారు. ఇప్పటికే కార్డీలియా వెబ్సైట్ (www.cordeliacruises) తోపాటు ప్రముఖ ట్రావెల్ పోర్టల్స్‌లో బుకింగ్స్ మొదలయ్యాయి. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రాలను చుట్టేయడంతోపాటు గమ్యస్థానాల్లో సిటీ టూర్స్, ఆన్‌షోర్ పర్యటనలతో ఒకే ట్రిప్‌లో మూడు దేశాలను కవర్ చేసే అవకాశం ఉంటుంది.ప్యాకేజీలు ఇలా... కార్డీలియా ‘ఎంప్రెస్షిప్లో మధ్యతరగతి కుటుంబం సైతం లగ్జరీ క్రూజ్ జర్నీ చేసేవిధంగా రకరకాల రూమ్‌లు, ఆఫర్లు, గ్రూప్ ప్యాకేజీలు ఉన్నాయి. ఉదాహరణకు చెన్నై–విశాఖ మధ్య ఇద్దరు పెద్దవాళ్లకు రెండు రాత్రులు, 3 పగళ్ల ప్యాకేజీ ధరలు (పన్నులన్నీ కలిపి) చూస్తే...అన్లిమిటెడ్ ఫుడ్, ఎంటర్టైన్మెంట్తో మూడు రోజులపాటు ఫైవ్ స్టార్ లగ్జరీ సముద్ర ప్రయాణ అనుభూతిని సొంతం చేసుకోవచ్చు. జర్నీ రూట్, ఎంత మంది, ఎన్ని రోజులు (3, 5 నైట్స్ ప్యాకేజీలు) అనేదాన్ని బట్టి రేట్లు మారతాయి. 12 ఏళ్ల లోపు పిల్లలకు షరతులకు లోబడి ఉచిత ప్రయాణ (పన్నులు కాకుండా) ఆఫర్ ఉంది. ధర ఎక్కువైనా మరింత లగ్జరీ, సౌకర్యాలు కోరుకునేవారికి సూట్, చైర్మన్ సూట్ కూడా ఉన్నాయి.విదేశీ టూర్ల విషయానికొస్తే... చెన్నై నుంచి శ్రీలంకకు (హంబన్‌టోట, ట్రింకోమలీ, జాఫ్నా), తిరిగి చెన్నై (5 నైట్స్, 6 డేస్ రౌండ్ ట్రిప్) జర్నికి ఇద్దరు పెద్దవాళ్లకు చార్జీ దాదాపు రూ. లక్ష పడుతుంది. అలాగే చెన్నై నుంచి సింగపూర్ (ఫుకెట్, లంకావీ, కౌలాలంపూర్ మీదుగా వన్‌వే ట్రిప్ – 10 నైట్స్, 11 డేస్) ట్రిప్‌కి చార్జీ రూ.2,21,745 అవుతుంది. పన్నులతో కలిపి, ఇంటీరియర్ స్టేట్‌రూమ్ ప్యాకేజీలు ఇవి.క్రూజ్ లెక్కలు ఇలా.. 3 కోట్లు: ప్రపంచవ్యాప్తంగా ఏటా క్రూజ్ జర్నీ చేస్తున్న పర్యాటకుల సంఖ్య (సుమారుగా) 30 బిలియన్ డాలర్లు: క్రూజ్ జర్నీ మార్కెట్ విలువ45 బిలియన్ డాలర్లు: 2029 నాటికి క్రూజ్ జర్నీ మార్కెట్ విలువ అంచనా4.5 లక్షలు: దేశంలో ప్రస్తుతం క్రూజ్ ప్రయాణికుల సంఖ్య5.3 లక్షలు: ఇప్పటిదాకా కార్డీలియా ఎంప్రెస్‌లో విహరించిన పర్యాటకులు -
దయ్యాల వేద పఠనం!
తెర వెనుక కత్తుల కోలాటమాడుతున్నవారు తెరముందుకొచ్చి శాంతి కపోతాలను వదులుతున్నారు. రోత చేష్టల రంగమార్తాండులు శ్రీరంగనీతులు బోధిస్తున్నారు. అదిగో దొంగ ఇదిగోదొంగ అంటూ గజదొంగలే అరుస్తున్నారు. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌లో కంచె చేను మేస్తున్నది. పోలీసు వ్యవస్థను ప్రతిపక్షంపైకి పాలకులు ఉసిగొల్పుతున్నారు. ఇదే కదా, అసలు సిసలైన వ్యవస్థీకృత నేరం. అత్యున్నత స్థాయి పోలీసు అధికారి మంత్రి వర్గం ముందు హాజరై ఓ గొప్ప వాగ్దానం చేశాడని వార్తలు వెలువడ్డాయి. ప్రతిపక్షాన్నీ, దాని అభిమానులనూ వేటాడే పనిలో మరింత వేగం పెంచుతారట. దీన్నేమంటాము? నేరమే అధికారమై కొలువు దీరడం కాదా? నేరమే అధికారమై కొరడా ఝుళిపించడం కాదా?నేరమే అధికారమై ప్రజల్నే నేరస్థుల్ని చేస్తుంటే నోరుండీ ఊరక కూర్చున్న ప్రతి ఒక్కడూ నేరస్థుడేనంటారు విప్లవకవి వరవరరావు. ఈరోజు వేటాడుతున్నది ప్రతిపక్షాన్నే కావచ్చు. రక్తం రుచి మరిగిన పులికి పరిమితులూ, షరతులూ వర్తి స్తాయా? ఉపవాస దీక్షలేమైనా అడ్డొస్తాయా? పౌరహక్కులను పాదాల కింద తొక్కేయడానికి అలవాటుపడ్డ పోలీస్ రాజ్యం కూడా అంతే! ఈ రోజున వాడు తడుతున్నది నీ ఇంటి తలుపును కాకపోవచ్చు. నేడు కాకపోతే రేపు లేదా మరునాడు... నువ్వు నీ హక్కుల్ని గురించి ప్రశ్నించిన రోజున నీ ఇంటి ముంగిట కూడా ఆ బూట్ల చప్పుడు వినిపిస్తుంది.నేరమే అధికారమై ప్రశ్నిస్తున్న ప్రతివాడి మీద నేరస్థుడనే ముద్ర వేసే ధోరణిని ఆదిలోనే ప్రతిఘటించకపోతే ప్రజా స్వామ్య మనుగడకే ప్రమాదమేర్పడుతుంది. అధికారంలోకి రావడానికి అసత్యాలకూ, అభూత కల్పనలకూ ఒడిగట్టారు గనుక ప్రభుత్వపక్ష స్వభావాన్ని నేరపూరితమైనదిగా భావించ వలసి వస్తున్నది. అసత్యాలూ, అభూత కల్పనలన్నీ ఒక్కొ క్కటిగా రుజువౌతూ వస్తున్నాయి గనుక నేరమే అధికారం రూపు దాల్చిందని అనుకోవలసి వస్తున్నది. గతకాలపు జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిందనీ, 14 లక్షల కోట్ల అప్పు చేశారనీ కూటమి పక్షం ఊరూవాడా ఏకంచేసి ప్రచారం చేసింది. మొన్ననే రాష్ట్ర శాసనసభలో సాక్షాత్తూ ఆర్థికమంత్రి పాత ప్రచారానికి విరుద్ధమైన ప్రకటన చేశారు. జగన్ ప్రభుత్వం చేసిన మొత్తం అప్పు 3 లక్షల 39 వేల కోట్లేనని తేల్చారు. ఎంత గుండెలు తీసిన బంట్లు వీరు? ఈ ఒక్క ఉదాహరణ చాలదా, ప్రభుత్వ నేరపూరిత స్వభావాన్ని నిర్ధారణ చేయడానికి?అప్పుల ప్రస్తావన మచ్చుకు మాత్రమే. ఇటువంటి బేషరమ్ ప్రచారాలు చాలా చేసింది కూటమి. సామాన్య ప్రజల ఆశల మీద, ఆకాంక్షల మీద కూటమి జూదమాడింది. వారి కలల అలల మీద ఆటలాడింది. ఏమార్చడానికి ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోను డస్ట్‌బిన్‌లోకి గిరాటేసింది. కుర్చీ మీద కూర్చొని నవమాసాలు గడిచిపోయాయి. హామీల డెలివరీ ఆనవాళ్లే లేవు. ఉండకపోవచ్చు కూడా. బడ్జెట్లో కొన్ని హామీలకు మాత్రమే అరకొర కేటాయింపులు చూపారు. మిగతా వాటి ఊసే లేదు. నిరుద్యోగులకు నెలకు 3 వేల భృతి ఇస్తామన్నారు. మోసం చేశారు. ఆడబిడ్డలకు నెలకు పదిహేను వేలిస్తామన్నారు. మోసం చేశారు. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికీ ఏటా 15 వేలిస్తా మన్నారు. దానికి ఒక ఏడాది ఎగనామం పెట్టి, ఈసారి బడ్జెట్లో అవసరమైన సొమ్ములో సగం మాత్రమే కేటాయించారు.ఇంతవరకూ ఒక్క పైసా కూడా లబ్ధిదారులకు చేరలేదు.రైతుకు ఏటా 20 వేల ఆర్థిక సాయమన్నారు. రైతన్న ఎదురు చూస్తూనే ఉన్నాడు.సాయం సంగతి దేవుడెరుగు. పండించిన పంటకు గిట్టు బాటు ధర లేక రైతులు అల్లాడుతున్నారు. జగన్ హయాంలో ఇరవై నుంచి ఇరవై ఏడు వేల దాకా పలికిన క్వింటాల్ మిర్చి ధర ఇప్పుడు ఆరేడు నుంచి పదివేల దాకా పడిపోయింది. పెట్టుబడి ఖర్చులు కూడా రైతులకు రాలేదు. అన్ని పంటల కథలూ దాదాపు ఇంతే! కాల్వల కింద వేసుకున్న వరి పైర్లు కూడా నీటి తడులు లేక ఎండిపోతున్న వైనాన్ని ఐదేళ్ల తర్వాత ఇప్పుడే చూస్తున్నాము. మహిళలకు ఉచిత బస్సు ఇంకా డిపో దాటి రోడ్డెక్కలేదు. అప్పుడే దానిమీద మాట మార్చడం మొదలైంది. ఉచిత బస్సును ఒక్క జిల్లాకే పరిమితం చేస్తామని ఇప్పుడు చెబుతున్నారు.ఈ రకంగా హామీల ఎగవేతతోపాటు పాలనా వైఫల్యాలతో ఆదిలోనే అప్రతిష్ఠ మూటగట్టుకున్న కూటమి సర్కార్ విమర్శ కుల నోళ్లు మూయించి, అసత్యాలను ప్రచారంలో పెట్టి పబ్బం గడుపుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీపై దాడిని కేంద్రీకరించి, భారత న్యాయసంహితలోని 111వ సెక్షన్‌ను ఈ దాడికి ఆయుధంగా వాడటం మొదలుపెట్టారు. సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసే వారిపై ఈ సెక్షన్ వాడకూడదని ఏపీ హైకోర్టు చెప్పినా కూడా కూటమి సర్కార్ చెవికెక్కించుకోలేదు. కిడ్నాపులు, దోపిడీలు, భూకబ్జాలు, ఉగ్రవాద కార్యకలాపాలు, ఆర్థిక నేరాలు వగైరా ముఠాలుగా ఏర్పడి చేసే నేరాలు (వ్యవస్థీకృత నేరాలు) ఈ సెక్షన్ పరిధిలోకి వస్తాయి.సోషల్ మీడియాలో చేసే విమర్శలను ఈ పరిధిలోకి తెచ్చి రాష్ట్ర సర్కార్ చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నది. ప్రత్యర్థుల పట్ల కక్షపూరిత వైఖరి కారణంగానే సర్కార్ ఈ కుట్రకు తెరతీసిందనుకోవాలి. సోషల్ మీడియాలో చేసే విమర్శల వెనుక ఎవరిదో ప్రోద్బలం ఉన్నదనీ, ఇదంతా వ్యవస్థీకృతంగా జరుతున్నదనీ ఓ స్క్రీన్‌ప్లేను తయారుచేసి, దానికి అనుగుణంగా కీలక వ్యక్తులను అరెస్ట్ చేయాలనీ, తద్వారా ఆ పార్టీని బలహీన పరచాలనే పన్నాగం స్పష్టంగానే కనిపిస్తున్నది. ఇందు కోసం వేలాదిమంది కార్యకర్తలు, అభిమానుల మీద కేసులు పెట్టాలనీ, వేధించాలనీ జిలాల్ల వారీగా టార్గెట్లు పెట్టుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.ఇటీవల పోలీసు ఉన్నతాధికారి నిర్వహించిన ఒక సమీక్షా సమావేశంలో కూడా ఈ టార్గెట్లను చేరుకునేలా సహకరించాలనే ఆదేశాలిచ్చినట్టు వచ్చిన వార్తలు నిజమైతే అంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదు. గత ప్రభుత్వ హయాంలో కూటమి అగ్రనాయకులంతా బరితెగించి మాట్లాడిన బూతుల ఆడియోలు, చెప్పులు చూపెట్టిన వీడియోలు కోకొల్లలు. వీరికి భిన్నంగా వైసీపీ అధినేత ఏనాడూ ఏ ఒక్క అసభ్యకర వ్యాఖ్యానం చేయలేదు. అయినా సరే, వీరి బూతులకు బదు లిచ్చిన నేతలపై అక్రమ కేసులకు తెగబడుతున్నారు.మొన్నటి మంత్రివర్గ సమావేశం ఎజెండా ముగిసిన తర్వాత ఒక పోలీస్ ఉన్నతాధికారి హాజరై ఒక వింత సందేశాన్ని వినిపించినట్టు యెల్లో మీడియా టాప్ న్యూస్‌గా ప్రచారంచేసింది. బహుశా కూటమి పెద్దల తాజా కుట్రలో భాగంగానే ఈ వింత కథను ప్రచారంలోకి తెచ్చి ఉంటారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఇటీవల చనిపోయిన రంగన్న అనే వివేకానందరెడ్డి ఇంటి వాచ్‌మన్ మరణం అనుమానాస్పదమేనని ఆ ఉన్నతాధికారి మంత్రులకు ఉపదేశించారట! అనారోగ్యంతో ఉన్న తన భర్తను పోలీసులు వేధించారనీ, అందువల్లనే అయన చనిపోయాడనీ రంగన్న భార్య మీడియాతో మాట్లాడిన మాట లను వారెందుకు పరిశీలనలోకి తీసుకోలేదో తెలియదు మరి!అంతటితో ఆగలేదు. ఈమధ్యకాలంలో చనిపోయిన వ్యక్తులను వివేకానంద హత్య కేసుకు లింకు చేస్తూ అవన్నీ అనుమానాస్పద మరణాలేనని చెప్పడానికి పూనుకోవడం, మోకాలుకు, బోడిగుండుకు ముడిపెట్టినట్టు కథలు అల్లడం దిగ్భ్రాంతి కలిగిస్తున్నది. అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన అభిషేక్ రెడ్డి మరణంపై కూడా అనుమానాలున్నాయట! జగన్ కుటుంబ సభ్యుల ప్రేమాభిమా నాలు చూరగొన్న డ్రైవర్ నారాయణ కేన్సర్ వ్యాధికి చికిత్స తీసుకుంటూ కొంతకాలం క్రితం చనిపోయాడు. అందులో కూడా అనుమానం ఉన్నదట! నీచమైన కుట్రలకు పరాకాష్ట డాక్టర్ గంగిరెడ్డి పేరును కూడా ఇందులోకి లాగడం. డాక్టర్గంగిరెడ్డి భారతమ్మ తండ్రి. కరోనా సోకడంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ చనిపోయారు. ఆయన మరణం కూడా అనుమానమేనట! పోలీస్ అధికారి ఏం చెప్పాడో తెలియదుగానీ ‘ఈనాడు’ మాత్రం అరపేజీ ఫిక్షన్ రాసి పారేసింది.తాము చెప్పదలుచుకున్న కథలో ఆవగింజంత నిజమైనా ఉండాలన్న నియమం వారికేమాత్రం లేదు. చెప్పింది ప్రచారం చేసిపెట్టడానికి మోచేతి కింద వందిమాగధ మీడియా సిద్ధంగా ఉన్నది. చేతిలో అధికారం ఉన్నది. వ్యవస్థల మెడలకు బిగించిన ఇనుప గొలుసులు తమ చేతిలోనే ఉన్నాయి. ఉసిగొలిపితే చాలు. కేసులు పెట్టడం ఎంత పని? ఇప్పుడిదే కూటమి సర్కార్ సింగిల్ పాయింట్ ఎజెండా! దయ్యాలు వేదాలు వల్లించినట్టు,తోడేళ్లు – గుంటనక్కలూ శాకాహార ప్రతిజ్ఞలు చేసినట్టు ఈ పెద్దలంతా సభలు పెట్టుకొని ఒకరినొకరు పొగుడుకుంటూ, ప్రజా సంక్షేమం గురించి, ప్రజాస్వామ్యం గురించి, అభివృద్ధి గురించి మాట్లాడటం కంటే ఎబ్బెట్టు దృశ్యాలు ఇంకేముంటాయి? అటువంటి ఎబ్బెట్టు దృశ్యాన్ని ఈమధ్యనే విశాఖతీరంలో చూడవలసి వచ్చింది.తెలంగాణ పునరాలోచన?తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటై సరిగ్గా పదిహేను మాసాలైంది. అరవై మాసాల (ఐదేళ్ల) పాలన కోసం ప్రజలు ఎన్నుకున్నారనుకుంటే అందులో పావు భాగం ప్రయాణం పూర్తయిందన్నమాట. నిజానికి ఈపాటికే ప్రభుత్వం పూర్తిగా కుదురుకొని దాని ఎజెండాను పరుగెత్తించే క్రమంలో ఉండాలి. కానీ, ఎందుకనో ఇప్పటికీ పార్టీకి, ప్రభుత్వానికి మధ్య, ప్రభు త్వంలోని మంత్రుల మధ్య, మంత్రులకు అధికారులకు మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తున్నది. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ గనుక ఇటువంటివన్నీ షరా మామూలేనని ఆ పార్టీ నేతలు సమర్థించుకోవచ్చు గాక. కానీ, ఈ వాదనను అంగీకరించడానికి జనం సిద్ధంగా లేరు.శాసన మండలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆర్భాటంగా పోటీ చేసి, ముఖ్యమంత్రితో సహా యంత్రాంగమంతా రంగంలోకి దిగి కూడా ఓటమి పాలైంది. అది కూడా బీజేపీ చేతిలో! రాష్ట్ర వ్యాప్తంగా బలమైన పునాది, కార్యకర్తల బలం, నాయకత్వ ఇమేజ్ ఉన్న బీఆర్ఎస్ చేతిలో ఓడిపోయి ఉంటే కనీసం గుడ్డిలో మెల్ల అనుకోవచ్చు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రధాన శత్రువు, ఉత్తరాది పార్టీగా తాము విమర్శించే బీజేపీ చేతిలోభంగపడటం కచ్చితంగా కాంగ్రెస్ సర్కార్‌కు ఇబ్బందికరమైన విషయమే. బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. పోటీ చేయకుండా బీజేపీకి సహకరించిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నది.అయితే ఈ ఆరోపణకు సరైన ఆధారం కనిపించడం లేదు. బీఆర్ఎస్ గనుక లోపాయకారిగానైనా బీజేపీకి పూర్తిగా సహకరించి ఉంటే బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు అంత భారీస్థాయిలో ఓట్లు పడేవి కావు. బీసీ నినాదం వల్లనే హరికృష్ణ పెద్దసంఖ్యలో ఓట్లు సంపాదించారనే వాదన కూడా ఉన్నది. కానీ తెలంగాణ బీసీ సమూహాల్లో సామాజిక విధేయత కన్నా రాజకీయ విధేయతే ఎక్కువ. బీఆర్ఎస్కు విధేయంగా ఉండే ఓటర్లలో బీసీలే ఎక్కువ సంఖ్యలో ఉంటారు. కనుక బీఆర్ఎస్ ఓట్లు పెద్దసంఖ్యలో హరికృష్ణకు బదిలీ అయుండవచ్చనే అభిప్రాయం ఉన్నది.కేవలం వ్యక్తిగత సంబంధాల మీద ఆధారపడి పెద్దగా ఆర్థిక దన్ను లేకుండానే బీజేపీ, కాంగ్రెస్‌లకు హరికృష్ణ గట్టి పోటీ ఇవ్వగలిగినప్పుడు, బీఆర్ఎస్ రంగంలో ఉన్నట్లయితే గెలిచేది కాదా అనే చర్చ కూడా మొదలైంది. పోటీ చేయకపోవడానికి బీఆర్ఎస్కు ఉన్న కారణాలేమిటో అధికారికంగా తెలియదు. పార్టీ గుర్తుపై ఎన్నికై అధికార పార్టీలో చేరిన పదిమంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడి ఆ స్థానాల్లో ఉపఎన్నికలు రావాలని బీఆర్ఎస్ బలంగా కోరుకుంటున్నది. అందుకు కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ సహకారం అవసరమని కూడా ఆ పార్టీ భావిస్తుండవచ్చు. అందుకోసమే కౌన్సిల్ బరికి బీఆర్ఎస్ దూరం జరిగిందనే అభిప్రాయం కూడా ఉన్నది.తెలంగాణలో తమ పార్టీ బాగా బలపడిందని బీజేపీ శ్రేణులు బలంగా నమ్ముతున్నాయి. నిజంగానే అర్బన్, సెమీ ఆర్బన్ ప్రాంతాల్లో కొంత హిందూత్వ ప్రభావం ఆ పార్టీకి ఉపకరిస్తున్న సూచనలు కన్పిస్తున్నాయి. ముఖ్యంగా బీసీ యువతలో వీరహిందూత్వ ప్రచారం బాగానే పనిచేస్తున్నది. బంజారా, ఇతర గిరిజన తెగల్లో ప్రాబల్యం సంపాదించడానికి కాషాయ పార్టీ వ్యూహాత్మకంగా పనిచేస్తున్నది. ఈ పరిణామాలు సహజంగానే బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు కలవరం కలిగిస్తాయి.రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఒక చిన్న లిట్మస్ టెస్ట్ అందుబాటులో ఉన్నది. పదిమంది ఫిరాయింపు ఎమ్మెల్యేల గుండెచప్పుడు వింటే చాలు. అనర్హత విషయంలో సుప్రీంకోర్టు పట్టుదలగా ఉండటంతో వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారట. కాంగ్రెస్ టిక్కెట్‌పై ఉపఎన్నికల్లో గెలిచే ప్రసక్తే లేదని ఫిరాయింపుదారులు బలంగా నమ్ము తున్నారు. కొందరు బహిరంగంగా తాము పార్టీ మారలేదని చెబుతున్నారు. గోడ దూకినవారు మళ్లీ గోడెక్కి కూర్చుంటు న్నారు. మరికొందరు అంతర్గతంగా మథనపడుతున్నారు.అంతే తేడా!ప్రయాణంలో పాతిక శాతం కూడా పూర్తికాక ముందే కాంగ్రెస్ పార్టీ ఆత్మవిశ్వాసం కోల్పోయినట్టు కనిపిస్తున్నది. ధిక్కార స్వరాలు వినిపించడం మొదలైంది. ఈ పరిస్థితి రావడా నికి ప్రభుత్వంలో సమన్వయ లోపం, అనుభవ రాహిత్యం కూడా ప్రధాన కారణాలే! రైతులకు రెండు లక్షల రుణమాఫీకింద 20 వేల కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం రైతాంగపు సానుభూతిని మాత్రం సంపాదించలేకపోయింది. రెండు లక్షల మీద ఐదువేలో పదివేలో వడ్డీ మిగిలిపోయిన వారికెవరికీ రుణమాఫీ జరగలేదు. సాంకేతిక కారణాల వల్ల 30 శాతంమందికి మాఫీ జరగలేదు. దానికితోడు రైతుబంధు నిలిచి పోవడం, గతంతో పోలిస్తే గిట్టుబాటు ధరలు దక్కకపోవడం, వేసంగి పంటకు నీళ్లివ్వలేకపోవడం, ఎప్పుడో మరిచిపోయిన కరెంటు కోతలు, మోటార్లు కాలిపోవడాలు మళ్లీ ప్రత్యక్షం కావ డంతో రైతాంగంలో వ్యతిరేకత పెరుగుతున్నది.ఆర్థిక మందగమనం అనే పరిణామం దేశవ్యాప్తంగా ఉన్నదే కావచ్చు. కానీ తెలంగాణలో స్వయంగా ప్రభుత్వమే పూనుకొని హైడ్రా అనే అసందర్భ శరభ నాట్యం చేయడం రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు చేసింది. ఇది రాష్ట్రమంతటా డబ్బు చలా మణిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. దానికితోడు కేసీఆర్ హయాంలో రైతుబంధు, దళిత బంధు వగైరా స్కీముల ద్వారా ఏటా జనం చేతుల్లోకి చేరిన వేలకోట్ల రూపాయలు ఆగి పోయాయి.అవసరాలకు భూమిని అమ్ముకోవాలన్నా, కొనే నా«థుడు దొరక్క రైతులు అవస్థలు పడ్డారు. ఆరోగ్యశ్రీ నిధులు సకాలానికి అందక, ఫీజు రియింబర్స్‌మెంట్ అమలు జరగక, రిటైర్మెంట్ బెనిఫిట్లు అందక వివిధ వర్గాల ప్రజలు సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో ఆర్భాటంగా ప్రారంభించిన ప్రజా దర్బార్ మూణ్ణాళ్ల ముచ్చటగా మిగిలి పోయింది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడానికి ఇటువంటి కారణాలేమీ లేవు. కేవలం నాయకత్వ అహంకారపూరిత ధోరణి ప్రజలకు దూరం చేసింది. నిరుద్యోగ యువత సమస్య లను విని వారిని సాంత్వన పరచడంలో చూపిన నిర్లక్ష్యం వల్ల భారీ మూల్యాన్ని చెల్లించవలసి వచ్చింది. దసరా సెలవుల్లో ఇళ్లకు చేరుకున్న ఈ యువత తల్లిదండ్రులను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్చడంలో కృతకృత్యులయ్యారు. ప్రతిష్ఠాత్మకంగా భావించిన పథకాలు కొన్ని గురితప్పాయి. కొందరు ఎమ్మెల్యేల అహంకారం, అవినీతి కూడా జనంలో ఏహ్యభావం ఏర్పడ్డానికి కారణమై ఆ పార్టీకి నష్టం చేకూర్చాయి. అంతే తప్ప విస్తార జనబాహుళ్యం బీఆర్ఎస్ హయాంలో ఇక్కట్లపాలైన దాఖలాలు లేవు.చేసిన ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చలేకపోగా కొన్ని సంక్షోభాలను పిలిచి మరీ అక్కున చేర్చుకుంటున్న కాంగ్రెస్ సర్కార్ పనితీరు మారకుంటే చేదు అనుభవాలను చవిచూడక తప్పక పోవచ్చు. ఈ వేసవి కష్టాలను, మంచినీటి కటకటను ప్రభుత్వం ఏ రకంగా ఎదుర్కోబోతున్నదో చూడవలసి ఉన్నది. మరో పక్కన గత కేసీఆర్ పాలనే ఈ పాలనకంటే బాగున్నదని బలపడుతున్న ప్రజాభిప్రాయాన్ని ఎలా మార్చగలరో కూడా చూడాలి. ఈ వేసవి పరీక్షలో గనుక కాగ్రెస్ ఫెయిలయితే వచ్చే రజతోత్సవ సభలో కేసీఆర్ పాంచజన్యం పూరించడం ఖాయం!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వంగవీటి నరేంద్ర, బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కర్నాటి వెంకట ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా, రాష్ట్ర కార్యదర్శులుగా పూల శ్రీనివాసరెడ్డి (సత్యసాయి జిల్లా), కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి (తిరుపతి జిల్లా) నియమించిన సంగతి తెలిసిందే. -
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీగా కార్మికుల తొలగింపు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కార్మికులను భారీగా తొలగించారు. 900 మంది కాంట్రాక్ట్ కార్మికులను యాజమాన్యం తొలగించింది. ఏ క్షణమైనా సమ్మెకు కాంట్రాక్ట్ కార్మికులు దిగనున్నారు. రేపు భారీ ఆందోళనకు అఖిలపక్ష కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఇప్పటికే సమ్మె నోటీసు గడువు ముగిసింది. స్థానిక ప్రజా ప్రతినిధులపై కార్మికులు మండిపడుతున్నారు.కాగా, స్టీల్ సీఐటీయూ గౌరవాధ్యక్షుడు జె.అయోధ్యరామ్‌కు ఇచ్చిన షోకాజ్ నోటీసును తక్షణం ఉపసంహరించుకోవాలని జిల్లా అధ్యక్షుడు ఎన్.రామారావు యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. అయోధ్యరామ్‌కు షోకాజ్ నోటీసు జారీ చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉక్కు పరిపాలన భవనం వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉక్కు పరిరక్షణ ఉద్యమాన్ని ప్రభావితం చేసే విధంగా కార్మిక సంఘాల ప్రతినిధులపై ఉక్కు యాజమాన్యం కుట్రలు చేస్తోందన్నారు. కర్మాగారంలో నేటి వరకు ఉన్న ప్రతి ప్రయోజనం పోరాటాల ద్వారానే సాధించుకున్నట్లు ఆయన గుర్తు చేశారు. పోరాటంలో అనైక్యతను సృష్టించడం కోసం ప్రభుత్వం, యాజమాన్యాలు ఎంత ప్రయత్నించినా.. స్టీల్ కార్మికులు మరింత ఐక్యంగా ముందుకు సాగుతారన్నారు. గుర్తింపు యూనియన్ ప్రధాన కార్యదర్శి డి.ఆదినారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీ ద్వారా స్టీల్ పరిశ్రమలో సమస్యలు పరిష్కారం కావని ఆయన వివరించారు. సస్పెన్షన్లు, షోకాజ్ నోటీసులతో కార్మి ఉద్యమాన్ని అణచలేరన్నారు. వెంటనే యాజమాన్యం నోటీసును ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
సహజ మరణాలపై సిట్ కుట్ర: వైఎస్ మదన్‌మోహన్‌రెడ్డి
పులివెందుల: వైఎస్సార్సీపీ డాక్టర్స్ విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వైఎస్ అభిషేక్‌రెడ్డి అనారోగ్యంతో మృతి చెందితే, దానిపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని, దానికి ప్రభుత్వ పెద్దలు కూడా వంతపాడుతున్నారని అభిషేక్ రెడ్డి తండ్రి, వైఎస్సార్సీపీ నేత వైఎస్ మదన్మోహన్ రెడ్డి అన్నారు. ఆయన శనివారం వైఎస్సార్ జిల్లా పులివెందులలో మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షులంతా ఒక్కొక్కరుగా చనిపోతున్నారంటూ ఎల్లో మీడియా విషపూరిత కథనాలు ప్రచురించడాన్ని ఖండించారు.తమ కుమారుడు అభిషేక్ రెడ్డి అనారోగ్యంతో చనిపోయారని చెప్పారు. తమ కుమారుడి ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు శక్తివంచన లేకుండా ప్రయత్నించారని, కోమా నుంచి బయటపడతాడని ఆశించామని, దేవుడు చిన్న చూపు చూడటంతో మృతి చెందాడని తెలిపారు. ఎంతో భవిష్యత్ ఉన్న అభిషేక్‌రెడ్డి చిన్న వయస్సులో చనిపోవడం ఈ ప్రాంతంలో అందరినీ కలచివేసిందని చెప్పారు. అభిషేక్‌రెడ్డి పిల్లలను చూస్తే కడపు తరుక్కుపోతోందని ఆవేదన వ్యక్తంచేశారు.అభిషేక్ మృతి తమకు తీరని లోటని, ఆ బాధ నుంచి కోలుకోలేకపోతున్నామని తెలిపారు. ఇలాంటి తీవ్ర విషాద పరిస్థితుల్లో తాముంటే.. చిన్నాన్న వైఎస్ వివేకా నందరెడ్డి హత్య కేసులో సాక్షులు ఒక్కొక్కరుగా చనిపోతున్నారని, అందులో కుట్ర ఉందంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి పెడర్థాలు తీయడం, ప్రభుత్వ పెద్దలూ ఇదే విధంగా మాట్లాడటం దారుణమని అన్నారు. మామ డాక్టర్ ఈసీ గంగిరెడ్డి కరోనా వైరస్, అనారోగ్యంతో దీర్ఘ కాలం చికిత్స పొందుతూ చనిపోయారని తెలిపారు.మొన్న వాచ్‌మేన్ రంగన్న కూడా అనారోగ్యంతో చనిపోయాడని చెప్పారు. రంగన్నకు ఆయాసం ఉందని ఆయన కుటుంబ సభ్యులు కూడా చెబుతున్నారని, అతని అనారోగ్యం ఇక్కడి అందరికీ తెలుసునని చెప్పారు. వీరందరి సహజ మరణాలను అసహజ మరణాలుగా చిత్రీకరించేందుకు ఒక పథకం ప్రకారం ఎల్లో మీడియా పనిచేస్తోందని అన్నారు. బయటి ప్రపంచానికి పులివెందులలో దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని తెలియజెప్పేందుకు ఎల్లో మీడియా విశ్వప్రయత్నం చేస్తోందని, ప్రభుత్వ పెద్దల చర్యలూ ఇదే విధంగా ఉన్నాయని ధ్వజమెత్తారు.సిట్ కాదు.. జ్యుడీషియల్ విచారణ జరిపించండిచిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షులుగా ఉన్న వారు మృతి చెందిన వ్యవహారంపై ప్రభుత్వ సిట్ దర్యాప్తు అంటేనే ఏదో కుట్ర దాగి ఉందన్న అనుమానం వస్తోందని వైఎస్ మదన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సిట్ కాకుండా జ్యుడిషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అనేక మందిపై పెడుతున్న అడ్డగోలు కేసులు, చేపడుతున్న ఏకపక్ష విచారణ అందరమూ కళ్లారా చూస్తున్నామని, అందువల్లే సిట్‌పై నమ్మకం లేదని చెప్పారు. -
నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియడం లేదు: పోసాని
సాక్షి, విజయవాడ: పోసాని కృష్ణమురళీపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపును కొనసాగిస్తూనే ఉంది. వరుస కేసుల్లో అరెస్ట్ చేస్తూ స్టేషన్ల చుట్టూ పోలీసులు తిప్పుతున్నారు. ఇవాళ విజయవాడ చీఫ్ మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ కోర్టులో పోసానిని పోలీసులు హాజరుపరిచారు. ఈ నెల 20 వరకు కోర్టు రిమాండ్ విధించింది. తనకు ఆనారోగ్య సమస్యలున్నాయని న్యాయమూర్తికి పోసాని చెప్పారు. గుండె ఆపరేషన్ అయ్యిందని.. పక్షవాతం కూడా వచ్చిందని ఆయన తెలిపారు. ‘‘నాపై అక్రమ కేసులు పెట్టారు. నన్ను ఎక్కడికి తీసుకెళుతున్నారో కూడా తెలియడం లేదు’’ అంటూ పోసాని ఆవేదన వ్యక్తం చేశారు.పోలీసు వాహనంలో గంటల తరబడి కూర్చోలేకపోతున్నానని.. తనను ఒకే జైలులో ఉంచేలా ఆదేశాలివ్వాలని పోసాని కోరగా, పిటి వారెంట్‌పై వచ్చినందున తాను ఎలాంటి ఆదేశాలివ్వలేనని న్యాయమూర్తి తెలిపారు. పోసాని కృష్ణమురళికి ఈనెల 20 వరకూ న్యాయమూర్తి రిమాండ్ విధించారు. పోసానిని కర్నూలు జైలుకి తరలించారు.కాగా, అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పోసానికి బెయిల్ మంజూరు చేస్తూ కడప మొబైల్ కోర్టు శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. పోసానికి బెయిలు ఇవ్వకూడదని పోలీసుల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించినప్పటికీ.. కోర్టు పోసాని తరఫు న్యాయవాదుల వాదనలతో ఏకీభవిస్తూ... బెయిల్ మంజూరు చేసింది. పోసాని కస్టడీ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ఈ కేసులోనే పోసాని ఫిబ్రవరి 26వ తేదీన అరెస్టయ్యారు. -
విశాఖలో ఎన్నారై మహిళ అనుమానాస్పద మృతి!
విశాఖ: నగరంలోని ఓ స్టార్ హెటల్ లో ఎన్నారై మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆ హోటల్ వాష్ రూమ్ లో ఎన్నారై మహిళ ఉరివేసున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. అయితే ఈ కేసును అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకున్నట్లు సీపీ తెలిపారు. దీనికి సంబంధించి ఆమె వెంట ఉన్న ఎన్ఆర్ఐ డాక్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళ మృతదేహానికి పోస్టు మార్టం పూర్తయ్యిందని, అనుమానాస్పద మృతి కేసుగా దర్యాప్తు చేస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు. ఆమె ఆత్మహత్య చేసుకుందా? లేక ఎవరైనా చంపేసి ఆమె మెడకు ఉరితాడు బిగించి వాష్ రూమ్ లో పెట్టారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆ మహిళ ఎవరు.. ఎక్కడ నుంచి వచ్చారు.. ఆమె కూడా ఉన్న డా క్టర్ ఎవరు అనే విషయాలు తెలియాల్సి ఉంది. -
చంద్రబాబు తప్పుడు మాటలు.. ఈనాడు రోత రాతలు: పేర్ని నాని
సాక్షి, తాడేపల్లి: ఈనాడు రోత రాతలపై వైఎస్సార్సీపీ మండిపడింది. వైఎస్ జగన్ లక్ష్యంగా ఈనాడు విషపు రాతలు రాస్తోందని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకా హత్య కేసులో నారాయణ సాక్షిగా ఉన్నారని ఈనాడు రోత రాతలు రాసింది. కేబినెట్లో చంద్రబాబు ఏదో మాట్లాడితే.. ఈనాడు తప్పుడు వార్తలు వండి వార్చింది. వివేకా వాచ్మెన్ రంగయ్య మృతిని కూడా వైఎస్ జగన్‌కు ఆపాదించే యత్నం చేసింది. హామీలు అమలు గురించి తప్పించుకునేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్’’ అంటూ పేర్ని నాని నిప్పులు చెరిగారు.‘‘డైవర్షన్ పాలిటిక్స్ చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు.. ఎన్నికలయ్యాక చేతులెత్తేశారు. రాజకీయ ప్రత్యర్థులపై తప్పుడు వార్తలు రాయించడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఎన్టీఆర్ పరపతిని కూడా ఈనాడును అడ్డంపెట్టకుని బాబు దెబ్బతీశాడు. గతంలో లక్ష్మీపార్వతిపై కూడా ఈనాడులో ఇలాగే తప్పుడు రాతలు రాయించారు. వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి ఈనాడును చంద్రబాబు వాడుతున్నారు. వైఎస్ వివేకా హత్యతో వైఎస్ జగన్‌కు ఏం సంబంధం?. వ్యవస్థలను ప్రభావితం చేసి వైఎస్సార్సీపీ నేతలను బాబు ఇబ్బంది పెట్టాలని చూశారు’’ అని పేర్ని నాని ధ్వజమెత్తారు.‘‘వైఎస్ జగన్, వైఎస్ అవినాష్‌రెడ్డిలపై విషం చిమ్మడమే చంద్రబాబు లక్ష్యం. న్యాయ వ్యవస్థలను కూడా ప్రభావితం చేసేలా ఈనాడులో వార్తలురాస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా రంగన్న మృతిని కేబినెట్లో చర్చించారు. నారాయణ యాదవ్ అనారోగ్యంతో మృతి చెందారు. గంగాధర్‌రెడ్డిది సహజ మరణమని పోస్టుమార్టం రిపోర్ట్ చెప్తుంది. గంగాధర్‌రెడ్డి మరణం అనుమానం అంటూ బాబు డైరెక్షన్లో ఈనాడు తప్పుడు రాతలు రాసింది. గన్మెన్లు ఉండగా రంగన్న మృతిపై చంద్రబాబుకు సందేహం ఏంటో అర్థం కావడం లేదు. చంద్రబాబు ఇచ్చిన గన్మెన్లు ఉండగా.. రంగన్న మృతి ఎలా అనుమానాస్పదం?’’ అంటూ పేర్ని నాని ప్రశ్నించారు.‘‘పరిటాల మృతి తర్వాత చంద్రబాబు సీఎం అయ్యారు. 2014- 2019 మధ్య పరిటాల సునీత కూడా మంత్రిగా ఉన్నారు. పరిటాల రవి హత్యపై ఎందుకు విచారణ చేయలేదు. వివేకా హత్య కేసులో నారాయణ సాక్షి కాదని రికార్డులు చెప్తూ ఉంటే.. నారాయణ సాక్షి అని ఈనాడు ఎలా రాస్తోంది?’’ పేర్ని నాని నిలదీశారు.‘‘వివేకా హత్య కేసులో ఈనాడు తప్పుడు వార్తలు రాసింది. సుగాలి ప్రీతి హత్య కేసు గురించి తీవ్రంగా పరిగణించరుగానీ రంగయ్య మృతిపై మాత్రం తీవ్రంగా స్పందిస్తారంట. జగన్ డ్రైవర్ నారాయణ యాదవ్ ఆ కేసులో సాక్షి అంటూ తప్పుడు కథనాలు రాశారు. జగన్ లక్ష్యంగా విషపు రాతలు రాసింది. చంద్రబాబువి.. తప్పుడు మాటలు, ఈనాడువి తప్పుడు రాతలు. కేబినెట్లో ప్రజలకు చేయాల్సిన మేలు గురించి చర్చించలేదు. ఎన్నికలలో ఓట్ల కోసం ప్రజలను మోసం చేస్తారు. అధికారంలోకి వచ్చాక తన తప్పుడు హామీల నుండి బయట పడటానికి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. హామీలకు పంగనామాలు పెట్టారు...రాజకీయ ప్రత్యర్థులపై ఈనాడులో విషం కక్కించటం చంద్రబాబుకు అలవాటే. ఎన్టీఆర్ కు వెన్నుపోటు నుండి అనేక అంశాలలో ఇదే జరిగింది. లక్ష్మీ పార్వతి విషయంలో కూడా అప్పట్లో ఇలాగే రాయించారు. అవినాష్ కు సంబంధం లేకపోయినా కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. న్యాయవ్యవస్థను కూడా ప్రభావితం చేసేలాగ పెద్దపెద్ద అక్షరాలతో వార్తలు రాయిస్తున్నారు. నారాయణకు వివేకా కేసుకు ఎలాంటి సంబంధం లేదు. బ్రెయిన్ ట్యూమర్ తో నారాయణ చనిపోయారు. కల్లూరి గంగాధరరెడ్డిని 243వ సాక్షిగా ఉన్నాడు. దీర్ఘకాలంగా షుగర్ వ్యాధితో మృతి చెందారు. ఆయనది సహజ మరణం అని పోస్టుమార్టం రిపోర్టు కూడా ఉంది. శ్రీనివాసరెడ్డి 2018 సెప్టెంబరు లో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వేధింపుల కారణంగానే సూసైడ్ చేసుకున్నట్టు సూసైడ్ నోట్ రాశారు..వైఎస్ అభిషేక్‌రెడ్డి తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారు. జగన్, సునీతమ్మ ఇద్దరికీ అభిషేక్ బంధువే. మల్టీ ఆర్గన్స్ డేమేజ్ వలన అభిషేక్ మృతి చెందిన సంగతి అందరికీ తెలిసినా ఈనాడు విషపు రాతలు రాసింది. వాచ్మెన్ రంగన్నకు పోస్టుమార్టం అయ్యాక ఖననం చేశారు. రంగన్న గురించి కేబినెట్లో చర్చించారు. డీజీపీతో పాటు కడప నుండి పోలీసు అధికారులు వచ్చి ప్రభుత్వ పెద్దల సందేశం తీసుకుని వెళ్లారు. రంగన్నకు 2+2 గన్ మెన్లతో జగన్ ప్రభుత్వం భద్రత కల్పించారు. చంద్రబాబు వచ్చాక 1+1 భద్రతకు తగ్గించారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన గన్‌మెన్ ఉండగా ఎలా అనుమానాస్పదంగా రంగన్న మృతి చెందారు?. ఖననం చేసిన రంగన్న మృతదేహాన్ని మళ్ళీ బయటకు తీసి రీపోస్టుమార్టం చేస్తున్నారు. ఆ నివేదికలు రాకముందే ఈనాడులో తప్పుడు కథనాలు ఎలా రాశారు?..పరిటాల రవి హత్యలో సాక్షుల మృతిపై చంద్రబాబు ఎందుకు విచారణ జరపలేదు?. ఎప్పుడో చనిపోయిన నారాయణ యాదవ్ మృతితో సహా అందరిపై విచారణ చేస్తారట, ఎవరిని ఇరికించటానికి విచారణల పేరుతో వ్యవస్థలను నాశనం చేస్తారు?. ఎన్నికల హామీలను డైవర్షన్ చేయటానికి ఇలాంటి తప్పుడు వార్తలు, తప్పుడు విచారణలు చేయిస్తున్నారు. రంగన్న ఇచ్చిన 164 స్టేట్మెంటులో అవినాష్ రెడ్డి పేరు లేదు. అసలు ఏ సాక్షి కూడా అవినాష్ పేరు చెప్పలేదు. ఇలాంటి తప్పుడు కథనాలు రాసే విష సంస్కృతి మానుకోవాలి’’ అని పేర్ని నాని హితవు పలికారు. -
నవ మాసాల్లో కూటమి నవ మోసాలను తెచ్చింది
గుంటూరు, సాక్షి: మహిళ అంటే కూటమి ప్రభుత్వానికి గౌరవమే లేదని.. అందుకే ఈ పాలనలో రక్షణ కరువైందని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం(మార్చి 8న) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న రోజా.. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘వైఎస్సార్సీపీ హయాంలో మహిళల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చాం. కానీ, కూటమి ప్రభుత్వం ఈ నవ మాసాల్లో నవ మోసాలు తీసుకొచ్చింది’’ అని అన్నారామె.‘‘ఏపీలో మహిళలు.. చంద్రబాబు మోసాలపై ఆగ్రహంతో ఉన్నారు. సూపర్ సిక్స్ హామీలను గాలికి వదిలేశారు. ఏపీలో చంద్రన్న దగ, చంద్రన్న పగ, చంద్రన్న పంగనామం, చంద్రన్న వెన్నుపోటు మాత్రమే అమలవుతున్నాయి. సూపర్ సిక్స్ పేరుతో మహిళలను మోసం చేసి నట్టేట ముంచారు. మహిళా దినోత్సవాన్ని జరుపుకునే హక్కు ఈ ప్రభుత్వానికి లేదు. రోజుకు 70 మంది మహిళలు, వృద్దుల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. జగన్ హయాంలో దిశా పీఎస్‌లు, యాప్ తెచ్చి రక్షణ కల్పించారు. చంద్రబాబు మళ్లీ యాభై వేలకు పైగా బెల్టుషాపులు పెట్టారు’’ అని ఆర్కే రోజా మండిపడ్డారు.‘‘తల్లికివందనం పేరుతో మహిళలకు పంగనామం పెట్టారు. ఇదేనా మహిళలకు మీరిచ్చే గౌరవం?. నిరుద్యోగ మహిళలు, యువతులను చంద్రబాబు మోసం చేశారు. మహిళలు తిరగబడతారని చంద్రబాబుకు అర్థమయ్యింది. అందుకే శక్తియాప్ పేరుతో యాప్‌ని తెస్తున్నారు. జగన్ తెచ్చిన దిశా యాప్‌ని చంద్రబాబు కాపీ కొట్టారు. మహిళా భద్రత గురించి కేబినెట్లో ఏనాడూ చర్చించలేదు. కానీ గంజాయి, మద్యం వ్యాపారుల ప్రయోజనాల గురించి చర్చించారు. చంద్రబాబు, అనిత సొంత నియోజకవర్గాల్లో గంజాయి విపరీతంగా అమ్ముతున్నారు. 30 వేలమంది మహిళలు అక్రమ రవాణా అయ్యారని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం చేస్తున్నారు?. మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయటం పవన్ కే చెల్లింది..సుగాలి ప్రీతి కుటుంబానికి ఎందుకు న్యాయం చేయలేక పోతున్నారు?. కేంద్రంలో కూడా మీ కూటమి ప్రభుత్వమే ఉన్నప్పుడు ఎందుకు సీబీఐ విచారణ చేయించలేకపోయారు?. కనీసం సుగాలి ప్రీతి తల్లికి ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు?. జనసేన నేతల చేతిలో మోసపోయిన మహిళలకి ఏం న్యాయం చేశారు?. మహిళా దినోత్సవం జరుపుకునే హక్కు పవన్ కళ్యాణ్‌కి లేదు. మహిళల కన్నీటి శాపనార్థాలకు కూటమి ప్రభుత్వం పతనం అవుతుంది. ఉచిత బస్సు పేరుతో అన్యాయం చేశారు. తగిన సమయంలో మహిళలే చంద్రబాబుకు బుద్ధి చెప్తారు’’ అని రోజా చెప్పారు. -
TDP: అదృష్టంతో ఎమ్మెల్యే అయ్యావ్!
శ్రీకాళహస్తి: ‘అదృష్టం వల్లో.. పూర్వజన్మ సుకృతం వల్లో ఎమ్మెల్యే అయ్యావు. నిజాలు తెలుసుకుని మాట్లాడాలి. హేయమైన నీ మాట తీరు మార్చుకో’ అంటూ టీడీపీ నాయకుడు, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు ప్రస్తుత ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డిపై ధ్వజమెత్తారు. అసెంబ్లీలో ఓటేరు కాలువపై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు శుక్రవారం తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాటల్లోనే.. ‘ఓటేరు కాలువ భూముల గురించి క్షుణంగా విలేకరుల సమావేశంలో తెలిపాను.అయినా సుధీర్‌రెడ్డి రైతులు కడుపుకొట్టే విధంగా అసెంబ్లీలో ప్రసంగించడం బాధ కలిగించింది. మాపై సీఎం చంద్రబాబుకు, మంత్రి లోకేష్‌కు ఏదో ఒకటి చెప్పి కలరింగ్ ఇచ్చుకుంటున్నావని తెలిసింది. మొత్తం వివరాలతో వెళ్లి నువ్వు చేస్తున్న ఆగడాలను బయటపెడుతా. నీ కుటుంబానికి మూడు తరాలుగా అండగా నిలిచాను. నీకు అదృష్టం కలిసి వచ్చి ఎమ్మెల్యే అయ్యావు. అహంకార ధోరణితో తొమ్మిది నెలల్లో నువ్వు చేసిన అరాచకాలపై వంద పేజీల నివేదిక సీఎంకు అందజేస్తా. ఓటేరు భూముల విషయంలో రైతుల కడుపు కొట్టేవిధంగా నువ్వు చేస్తున్న దుష్పష్ప్రాన్ని మేము పక్కా ఆధారాలతో నిరూపిస్తాం.డొనేషన్లు తీసుకుని గెలిచి ఎవరినీ పట్టించుకోవడం లేదు. నీ కుటుంబం పరువు, పేరు చెడగొడుతున్నావు. ఒకసారికే నీకు తోక వచ్చేస్తే నీ కుటుంబం కంటే ముందు 1982లో నేను పార్టీలో చేరాను. 9 నెలల నీ పాలన చూసిన తర్వాత బియ్యపు మధుసూదన్‌రెడ్డి వెయ్యి రెట్లు మేలు అని ప్రజలు అనుకుంటున్నారు. ఈ విధంగా పార్టీని భ్రష్టు పట్టిస్తున్నావు. ఇక ప్రతి వారం పార్టీని, నియోజకవర్గాన్ని కాపాడుకోవడానికి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నీ బాగోతాలు కడిగేస్తా’. అంటూ విరుచుకుపడ్డారు. మాజీ ఎమ్మెల్యే సత్రవాడ మునిరామయ్య, గురుదశరథన్, ప్రసాద్‌నాయుడు పాల్గొన్నారు. -
‘మల్లెల బాబ్జీ నుంచి తారకరత్న దాకా చర్చిద్దామా.. బాబు?’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ప్రభుత్వం అంటేనే హత్యా రాజకీయాలు అని మరోసారి నిరూపించుకున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. అసలు వివేకా హత్య జరిగింది కూడా చంద్రబాబు హయాంలోనే కదా. ఆ సమయంలో కేసును నీరుగార్చేలా చేసిందీ చంద్రబాబే. వివేక కేసులో దోషులందరికీ కఠినంగా శిక్షించాల్సిందే అంటూ వ్యాఖ్యలు చేశారు.మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘కేబినెట్ సమావేశాలు కామెడీ సమావేశాలుగా మారిపోయాయి. కేబినెట్ సమావేశాలు అనగానే అన్ని వర్గాల ప్రజలు ఆశగా ఎదురు చూస్తారు. తమకు మేలు చేకూరే అంశాలపై ఏమైనా నిర్ణయం తీసుకుంటారేమోనని అనుకుంటారు. కానీ, చంద్రబాబు కేబినెట్‌కి వైఎస్ జగన్ అంటే భయం పట్టుకుంది. పదే పదే జగన్ చుట్టూ చర్చిస్తున్నారు. చివరికి సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న కేసు గురించి కూడా చర్చించే స్థాయికి దిగజారారు.చంద్రబాబు ప్రభుత్వం అంటేనే హత్యా రాజకీయాలు అని మరోసారి నిరూపించుకున్నారు. చంద్రబాబు హయాంలో జరిగిన హత్యల గురించి కూడా సమీక్షలు నిర్వహించాలి. అసలు వివేకా హత్య జరిగింది కూడా చంద్రబాబు హయాంలోనే. ఆ సమయంలో కేసును నీరుగార్చేలా చేసిందీ చంద్రబాబే. సాక్షులు అనారోగ్యంతో చనిపోతే జగన్ కుటుంబానికి ఏం సంబంధం?. వైఎస్ జగన్‌ని అవమానపరిచే కుట్ర కాదా ఇది?. ఆయన చెల్లెళ్లను కూడా తన రాజకీయాల కోసం చంద్రబాబు వాడుకున్నారు. వైఎస్ జగన్ కుటుంబాన్ని చీల్చటానికి చంద్రబాబు చేసిన కుట్ర ఇది.వివేకానంద రెడ్డిని నేనే చంపానని దస్తగిరి పదేపదే చెప్పాడు. మరి అతనికి బెయిల్ ఇచ్చి బయట తిప్పుతున్నదెవరో చంద్రబాబు సమీక్ష చేయాలి. మల్లెల బాబ్జీ హత్య నుండి వినుకొండ రషీద్ హత్య వరకు అన్నింటిపై చర్చిద్దాం. వీటిపై ఏ వేదిక మీద చర్చించటానికైనా మేము సిద్ధమే. బాలకృష్ణ కుటుంబంలో జరిగిన కాల్పుల గురించి కూడా చర్చిద్దాం. ఆయన వాచ్మెన్ ఎలా చనిపోయాడో కూడా చర్చిద్దామా?. హరికృష్ణ రోడ్డు ప్రమాదం, నారా రామ్మూర్తి నాయుడు పిచ్చివాడు కావటం, తారకరత్న హఠాన్మరణం గురించి కూడా చర్చించాలి. వీటన్నిటిపై చంద్రబాబు సమీక్ష చేయాలి. వివేకా కేసులో దోషులందరికీ కఠినంగా శిక్షించాల్సిందే. వివేకా అధికారికంగా పెళ్లి చేసుకున్న షమీమ్ ఫోన్ ఎక్కడ ఉంది?. అందులోని వాట్సప్ చాటింగ్‌ని ఎందుకు డిలిట్ చేశారో కూడా తేల్చాలి. ఈసీ గంగిరెడ్డి, డ్రైవర్ నారాయణ, అభిషేక్‌రెడ్డి అనారోగ్యంతో చనిపోతే దాన్ని కూడా రాజకీయం చేస్తారా?. అధికారంలో ఉన్నాం కాబట్టి ఏదైనా చేయవచ్చు అనుకుంటున్నారా?. హత్యా రాజకీయాలు మాపై రుద్దాలనుకుంటే కుదరదు. ఆ పాపాలే మీకు శాపాలై ఉరితాళ్లుగా మారతాయి’ అంటూ హెచ్చరించారు. -
‘యువత పోరు’తో చంద్రబాబు వైఖరిని ఎండగడదాం: వైవీ సుబ్బారెడ్డి
గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో పేద విద్యార్థులు, నిరుద్యోగులు తరఫున కూటమి ప్రభుత్వంపై పోరుకి వైఎస్సార్సీపీ సిద్ధమైంది. ఈ నెల 12వ తేదీన ‘‘యువత పోరు’’(Yuvatha Poru) పేరుతో ధర్నా కార్యక్రమం నిర్వహించాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇవాళ తాడేపల్లిలోని YSRCP కేంద్ర కార్యాలయంలో పోస్టర్‌ను ఆవిష్కరించారు. యువత పోరు పోస్టర్‌ను లాంఛ్ చేసిన రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) మీడియాతో మాట్లాడారు. యువతపై చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోంది. వారికి ఇచ్చిన ఏ హామీనీ అమలు చేయటం లేదు. అందుకే 12న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేయాలని నిర్ణయించాం. ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేస్తాం. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. 👉రాష్ట్రంలో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. మూడు త్రైమాసికాల నుండి ఫీజులు ఇవ్వకుండా విద్యార్థులను చంద్రబాబు వేధిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి నిధులు ఇచ్చేంత వరకు పోరాటం చేస్తాం. ఫీజు బకాయిలు తక్షణమే చెల్లించాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపట్టబోతున్నాం. విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి కలెక్టరేట్ల ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించనున్నాం. ఎక్కడికక్కడే మెమోరాండం సమర్పించబోతున్నాం. ఫీజు బకాయిలతో పాటు నిరుద్యోగ సమస్య, మెడికల్ కాలేజీలకు సంబంధించిన అంశాలపైనా యువత పోరు ఉండనుంది.👉నిరుద్యోగ భృతి విషయంలో కూటమి ప్రభుత్వం(Kutami Prabhutvam) మాట తప్పింది. నిరుద్యోగ భృతి పేరుతో నెలకు రూ.3 వేలు ఇస్తామంటూ యువతను మోసం చేశారు. ఉద్యోగాల్లేక యువత అల్లలాడిపోతోంది. కూటమి స్వార్థ ప్రయోజనాల కోసం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. పేద, మధ్యతరగతి విద్యార్థుల కోసం నాణ్యమైన వైద్యం అందించాలని జగన్ 17 మెడికల్ కాలేజీలను తెచ్చారు. ఐదు కాలేజీలను ఆల్రెడీ ప్రారంభించారు. కానీ, చంద్రబాబు ప్రయివేటు పరం చేయాలని చూస్తున్నారు. ఈ ప్రయత్నాలను అడ్డుకుందాం.విద్యార్థులు, నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం చేసిన మోసాన్ని ఎండగడుతూ ర్యాలీలు నిర్వహిద్దాం. యువత పోరును పెద్ద ఎత్తున విజయవంతం చేద్దాం’’ అని వైఎస్సార్సీశ్రేణులను ఉద్దేశించి వైవీ సుబ్బారెడ్డి పిలుపు ఇచ్చారు. -
బీటెక్ విద్యార్థుల ప్రేమ ‘పంచాయితీ’
తెలిసీ తెలియని వయస్సులో ప్రేమలో పడటం.. జీవితంలో స్థిరపడకుండానే పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకోవడం తమ విజయంగా భావించడం యువతకు పరిపాటిగా మా రింది. ఏ తల్లిదండ్రులైనా తమ కుమార్తె సంతోషాన్నే కోరుకుంటారు. ఆడ..పిల్ల అయినప్పటికీ ఆ గజ్జెల సవ్వడితో మురిసిపోతారు. ఇలాంటి అమ్మానాన్నలు.. ప్రేమ వాకిట్లో కానివాళ్లుగా మారిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది.మూడు రోజులుగా ఆ తండ్రి వేదన వర్ణనాతీతం. కంటికి రెప్పలా చూసుకున్న కుమార్తె నిన్న మొన్న పరిచయమైన ప్రేమకునితోనే ఉంటానని చెప్పడం ఆ హృదయాన్ని కలచివేసింది. కాళ్లావేళ్లా పడినా.. వాళ్లతో వీళ్లతో చెప్పించినా.. కుమార్తె మనసు కరగకపోవడంతో ఆ తల్లిదండ్రుల మనసు గాయపడింది.ప్రేమించడం తప్పుకాదు.. పెళ్లి చేసుకోవడం నేరం అంతకన్నా కాదు. కానీ పెద్దలను ఒప్పించి చేసుకున్నప్పుడే ఆ ప్రేమకు పరిపూర్ణత చేకూరుతుంది. ఇటీవల కాలంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఎన్నో జంటలు చిన్న చిన్న వివాదాలతో ప్రాణాలు తీసుకునే వరకు వెళ్లడం చూస్తే.. ఏ తల్లిదండ్రులకై నా ప్రేమ పెళ్లి గుండెను బరువెక్కించక మానదు.కర్నూలు: బేతంచర్ల మండలం బుగ్గానిపల్లె తండాకు చెందిన రాజేష్‌నాయుడు, మాధురిబాయి ఎదురెదురు ఇళ్లలో నివాసం ఉంటున్నారు. ఇద్దరూ ఒకే ప్రైవేటు కళాశాలలో బీటెక్ చదువుతున్నారు. వీరిద్దరూ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. మూడు రోజుల క్రితం ఇద్దరూ కనిపించకుండా పోయారు. దీంతో ఇరువురి కుటుంబ సభ్యులు ఆరా తీస్తే విషయం బయటపడింది. మాధురిబాయి తండ్రి ఓ ప్రభుత్వ ఉద్యోగి. ఆయన విన్నపం మేరకు త్రీటౌన్ పోలీసులు బుధవారం రాత్రి ప్రేమ జంటను స్టేషన్‌కు రప్పించారు. అయితే ఇరువురూ ఇష్టపూర్వకంగా వెళ్లినట్లు రాత పూర్వకంగా అంగీకరించారు. గురువారం ఉదయం తిరిగి ఇరువురి తరపు బంధువులు స్టేషన్లో పంచాయితీ పెట్టినా ఫలితం లేకపోయింది. ఈ విషయమై శుక్రవారం ఉదయం గ్రామంలో యువకుడి ఇంటి ముందు తమ కుమార్తెను మోసం చేసి పెళ్లిచేసుకున్నాడని యువతి కుటుంబ సభ్యులు గగ్గోలు పెట్టారు. సమాచారం తెలుసుకున్న సీఐ వెంకటేశ్వరరావు సిబ్బందితో అక్కడికి చేరుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పారు.టూటౌన్ పోలీస్టేషన్లో మూడో రోజు..ఇదిలా ఉండగా గ్రామం నుంచి పంచాయితీ కోసం వచ్చిన ఇరువురి కుటుంబాలను పోలీసులు టూటౌన్‌కు రప్పించారు. అక్కడ సీఐ ఇస్మాయిల్, త్రీటౌన్ సీఐ కంబగిరిరాముడు కలిసి ప్రేమ జంటను పెద్దల ఎదుట నిలబెట్టారు. యువతి తను ప్రేమించిన యువకుడితోనే వెళ్లిపోతానని తెగేసి చెప్పడంతో యువతి తండ్రి కన్నీళ్లు పెట్టుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
తల్లి మృతి.. కన్నీటితో ఇంటర్ పరీక్ష రాసిన విద్యార్థి
అనకాపల్లి: తల్లిని కోల్పోయిన పుట్టెడు దుఃఖంలోనూ ఇంటర్మీడియట్ విద్యార్థి పరీక్షకు హాజరైన విషాదకర ఘటన తారువలో శుక్రవారం చోటు చేసుకుంది. దేవరాపల్లి మండలం తారువ గ్రామానికి చెందిన ముత్యాల పరమేశ్వరి గురువారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో ఆమె కుమారుడు ఆకాష్ సహా కుటుంబ సభ్యులంతా రాత్రంతా తల్లి పార్థివదేహం వద్ద కన్నీరుమున్నీరుగా విలపించారు. చోడవరంలో చదువుతున్న ఆకాష్ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సవరం పరీక్షలకు శుక్రవారం హాజరు కావాల్సి ఉంది. అతని భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని కుటుంబ సభ్యులు ఆకాష్‌కు ధైర్యం చెప్పి పరీక్షకు సిద్ధం చేశారు. గుండెల్లో నుంచి ఉబికివస్తున్న బాధను పంటి బిగువున భరిస్తూ పరీక్షకు హాజరయ్యాడు. పరీక్షకు పయనమయ్యే ముందు ఆకాష్ తన తల్లి పార్థివదేహం వద్ద గుండెలవిలేలా రోదించడం పలువుర్ని కంటతడి పెట్టించింది. తల్లికి నమస్కరించి బాధను దిగమింగుతూ పరీక్ష రాసేందుకు చోడవరం పయనమయ్యాడు. ఆకాష్ పరీక్ష రాసి తిరిగి వచ్చాక ఆశ్రునయనాల మధ్య కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు. -
కోడిగుడ్డుపై ఈకల కోసం.. షాడో సీఎం పాకులాట
తమకు గిట్టనివారిపై కక్ష ఎలా తీర్చుకోవాలో, తమకు కావల్సిన వారిని ఎలా అందలం ఎక్కించాలో తెలుసుకోవాలంటే ఏపీకి వెళ్లాలి. అక్కడ జరుగుతున్న పరిణామాలు కచ్చితంగా కేస్ స్టడీ అవుతాయి. సాధారణంగా ప్రజాస్వామ్య వ్యవస్థను వ్యతిరేకించే తీవ్రవాద పార్టీలు రాజ్యంపై దాడులు చేస్తుంటాయి. కానీ, చిత్రంగా ఏపీలో అధికారంలో ఉన్న రాజకీయ కూటమి ప్రజలపై, ప్రతిపక్షంపైన ఇలాంటి దాడులకు పాల్పడుతోంది. ఈ క్రమంలో వారు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను, సినిమా కళాకారులను సైతం వదలడం లేదు. కూటమి ప్రభుత్వం ఏదో ఒక అక్రమ కేసు పెట్టి వేధింపులకు దిగుతోంది.షాడో సీఎంగా భావిస్తున్న నారా లోకేష్ తీసుకు వచ్చిన రెడ్‌బుక్ రాజ్యాంగం ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. కొద్దిరోజుల క్రితం సీనియర్ ఐపీఎస్ అధికారి, గతంలో సీఐడీ అధిపతిగా పనిచేసిన దళిత అధికారి పీవీ సునీల్ కుమార్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేయడం శోచనీయం. దానికి ప్రభుత్వం చెప్పిన కారణం వింటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన గత ప్రభుత్వ సమయంలో అనధికారికంగా విదేశాలకు వెళ్లి వచ్చారట. ఆయన అలా టూర్ చేసినప్పుడు సున్నితమైన సమాచారం లీక్ అయ్యే అవకాశం ఉందట. బహుశా ఇలాంటి పిచ్చి కారణంతో ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ.. ఏ అధికారిపైనా ఇలాంటి చర్య తీసుకుని ఉండకపోవచ్చు. ఎందుకంటే సునీల్ కుమార్ విదేశాలకు వెళ్లడం, రావడం కూడా జరిగి కొన్నేళ్లు అయింది. ఎప్పుడూ ఆయనపై ఎలాంటి ఆరోపణలు రాలేదు. ఆయన వల్ల దేశానికి, లేదా రాష్ట్రానికి సంబంధించిన కీలక సమాచారం ఏదీ బయటకు వెళ్లినట్లు ఆరోపణలు రాలేదు.కేంద్ర ప్రభుత్వం ఇలాంటి విషయాలలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటుంది. నిజంగా మన దేశ ప్రముఖులు ఎవరైనా కీలక సమాచారం లీక్ చేసే అవకాశం ఉందనుకున్నా, అభ్యంతరకరంగా వ్యవహరిస్తున్నారన్న అనుమానం ఉంటే వెంటనే చర్య తీసుకుంటుంది. అలాంటిది ఏమీ జరగలేదు. పైగా రాష్ట్రాలలో అంత ప్రమాదకరమైన సున్నిత సమాచారం ఏదీ ఉండదు. బాధ్యతాయుతమైన పోస్టులో ఉన్న సునీల్ కుమార్‌కు ఆ మాత్రం తెలియకుండా ఉండదు. అసలు కారణం ఏమిటంటే 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన పలు స్కాంలను పరిశోధించి, సాక్ష్యాధారాలతో సహా పలు కేసులు పెట్టడంలో సునీల్ కుమార్ ముఖ్య భూమిక పోషించారన్నది టీడీపీ పెద్దలకు ఉన్న కోపం. ఆ కేసులలో పనిచేసిన అప్పటి అధికారులు పలువురిపై ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. కొందరికి పోస్టింగ్‌లు కూడా ఇవ్వలేదు. అంతేకాక డీజీపీ ఆఫీసుకు వచ్చి రిపోర్టు చేసి కూర్చోవాలని ఆదేశించింది. దీనిని రిటైర్డ్ ఐపీఎస్‌లు ఖండించారు కూడా. అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు.ఇక సునీల్ కుమార్‌పై ఏవైనా ఆరోపణలు చేసి కేసులు పెట్టాలని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం గట్టి ప్రయత్నమే చేసి ఉంటుంది. ఇందుకోసం ఇద్దరు, ముగ్గురు రిటైర్డ్ పోలీసు అధికారులకు బాధ్యత అప్పగించిందని కూడా వార్తలు వచ్చాయి. అయినా సునీల్ కుమార్‌పై స్కాంల ఆరోపణలు చేయడానికి అవకాశం వచ్చినట్లు లేదు. దాంతో రెడ్ బుక్ సృష్టికర్తలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఒత్తిడి తెచ్చి దళిత ఐపీఎస్ అధికారిని ఈ రకంగా సస్పెండ్ చేయించి ఉండవచ్చన్న అభిప్రాయం వస్తోంది. తీరా చూస్తే సునీల్ కుమార్ అనధికారంగా విదేశీ యాత్రలు చేయలేదని వెల్లడవుతోంది. ఆయన ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు తీసుకునే విదేశీ టూర్‌కు వెళ్లారు. ఆయన వ్యక్తిగత హోదాలోనే వెళ్లారు. అందుకు సొంతంగానే ఖర్చు పెట్టుకున్నారు. ప్రభుత్వం వద్ద ఏదైనా నిర్దిష్ట సమాచారం ఉంటే దానికి సంబంధించి ముందుగా సునీల్ కుమార్‌కు నోటీసు ఇవ్వాలి. కానీ, ఆ పని చేయకుండా సస్పెండ్ చేశారంటేనే అందులోని దురుద్దేశం అవగతమవుతుందని అనుభవజ్ఞులు చెబుతున్నారు.సీనియారిటీ, ట్రాక్ రికార్డు రీత్యా ఏపీకి డీజీపీ అయ్యే అవకాశం ఉన్నందున, కేంద్రానికి తప్పుడు నివేదిక పంపేందుకు ఇలా సస్పెండ్ చేసి ఉండవచ్చని కొందరు రిటైర్డ్ ఐపీఎస్‌లు అభిప్రాయపడుతున్నారు. డీజీపీ స్థాయిలో ఉన్న అధికారి పట్ల ఇంత ఘోరంగా వ్యవహరించిన ప్రభుత్వం, ఒక చిన్నస్థాయి అధికారి పట్ల ఎంత ఉదారంగా వ్యవహరించిందో చూడండి. గతంలో చంద్రబాబు వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తిపై స్కిల్ స్కాం కేసులో అభియోగాలు వచ్చాయి. ఆయనను విచారించాలని అప్పట్లో సీఐడీ తలపెట్టింది. దానిని గమనించిన తెలుగుదేశం పెద్దలు అతనిని ఢిల్లీ నుంచి చెప్పా పెట్టకుండా అమెరికాకు పంపించేశారని అంటారు. దాంతో విచారణకు ఆయన అందుబాటులోకి రాకపోవడంతో ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కానీ, కూటమి అధికారంలోకి రావడంతోనే ఆ సస్పెన్షన్ ఎత్తివేయడమే కాకుండా మొత్తం జీతభత్యాలను చెల్లించేశారని మీడియాలో కథనాలు వచ్చాయి.అంతేకాదు, ఈయన ఇంటిపై కేంద్ర ప్రభుత్వ ఆదాయపన్ను శాఖ దాడులు చేసి సుమారు రెండువేల కోట్ల అక్రమాలకు సంబంధించిన ఆధారాలు కనుగొన్నట్లు అప్పట్లో సీబీడీటీ ప్రకటించింది. ఆ తర్వాత కేసును విజయవంతంగా మేనేజ్ చేసుకున్నారు. అది వేరే సంగతి. అలాంటి వ్యక్తిపై ప్రభుత్వం సస్పెన్షన్ ఎలా ఎత్తివేస్తుందంటే ఏమి చెబుతాం. అదంతే.. మరో సీనియర్ ఐఏఎస్ అధికారి భాస్కర భూషణ్ అనే అధికారి టీడీపీ హయాంలో 2018లో అనుమతులు లేకుండానే విదేశాలకు వెళ్లి వచ్చారట. తదుపరి ఏడాదికి ఆయన తిరిగి వస్తే, అప్పటి ప్రభుత్వం విదేశీ యాత్రలకు ఆమోదం తెలిపిందంట. దీనిపై ఎవరు వివరణ ఇవ్వాలి?. గతంలో ఒక డాక్టర్ రోడ్డుపై నానా రచ్చగా వ్యవహరించి, పోలీసుల మాట వినకుండా ప్రవర్తిస్తే ఒక పోలీస్ కానిస్టేబుల్ అతని చేతులు కట్టి పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. ఆ ఉదంతాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వానికి ఆపాదిస్తూ, దళితులకు ఇంత అవమానం చేస్తారా అంటూ దుష్ప్రచారం చేశారు. దానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా మరీ నీచంగా ఆనాటి ప్రభుత్వంపై విష ప్రచారం సాగించింది.ఇప్పుడేమో ఒక దళిత సీనియర్ ఐపీఎస్ అధికారిపై మాత్రం ఇంత దారుణంగా కక్ష కట్టారు. దీనిపై రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. మంచి పేరున్న ఒక దళిత అధికారిని విద్వేషపూరితంగా సస్పెండ్ చేయడం ఏ మాత్రం సమంజసం కాదని ఆయన అన్నారు. ఇది కేవలం కోడిగుడ్డుపై ఈకలు పీకడమేనని అన్నారు. సునీల్ కుమార్ ఏమైనా గూఢచారి విభాగంలో ఉన్నారా, ఆయన ప్రతీ మూమెంట్ చెప్పడానికి అని ప్రశ్నించారు. ఆయనకు అనుమతులు ఇచ్చింది ప్రభుత్వమే కదా అని వ్యాఖ్యానించారు. సునీల్ ప్రజల ధనంతో టూర్ కు వెళ్లలేదని స్పష్టం చేశారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ప్రజల సొమ్ముతో ఎలా విదేశాలు తిరిగి వస్తున్నారని, వారిద్దరి టూర్ షెడ్యూల్ వెల్లడించాలని, ఎన్ని ఉల్లంఘనలు జరిగాయో తెలుస్తుందని కూడా ప్రవీణ్ సవాల్ చేశారు.దళిత వర్గాల వారి పిల్లలు విదేశాలలో చదువుకోవద్దా?. ఆ పిల్లలను చూడడానికి దళితులు వెళ్లవద్దా?. ఆధిపత్య వర్గాలే విదేశాలకు వెళ్లాలా అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రవీణ్ కుమార్ అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద జవాబు ఉండదు. గూఢచర్య పరికరాల కొనుగోలు కేసులో ఆరోపణలు ఉన్న ఒక అధికారిని గత ప్రభుత్వం సస్పెండ్ చేస్తే, కూటమి ప్రభుత్వం దానిని ఎత్తివేయడమే కాకుండా, మొత్తం జీతం కూడా చెల్లించింది. అంత పెద్ద ఆరోపణ ఉన్నా తమకు మద్దతు ఇస్తున్నందున ఆ అధికారిపై కేసు ఎత్తివేయడం ఒకవైపు చేస్తూ, తమకు గిట్టని మరో అధికారిపై ఏదో ఒక పిచ్చి కారణం చూపి కేసులు పెట్టడం ద్వారా కూటమి ప్రభుత్వం అప్రతిష్ట పాలవుతోంది. దళిత సంఘాలు ఈ పరిణామాలపై మండిపడుతున్నాయి. తెలుగుదేశం నేతలకు గత హయాంలో తప్పుడు కేసులు పెట్టారన్న సందేహం వస్తే దానిపై విచారణ చేయవచ్చు. ఆ స్కాంల ఆరోపణలకు సమాధానం చెప్పలేక ఇలా రెడ్ బుక్ ప్రయోగిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వంలో ఉన్నవారి కుంభకోణాలను సమర్ధంగా వెలుగులోకి తీసుకువస్తే ఇలాంటి కక్షలు ఎదుర్కోవలసి వస్తుందన్న భయం అధికారవర్గంలో ఏర్పడితే అది ప్రజాస్వామ్యానికి, సమాజానికి, అధికార వ్యవస్థకు ఎంత ప్రమాదమో ఆలోచించవలసిన పరిస్థితి ఏర్పడింది.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
TTD: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 9 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 67,127 మంది స్వామివారిని దర్శించుకోగా 22,910 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.47 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కె ట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 10 గంట ల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
పోసానిపై ఆగని వేధింపులు.. మరో పీఎస్‌కు తరలింపు
కర్నూలు/ఎన్టీఆర్, సాక్షి: పోసాని కృష్ణ మురళి(Posani Krishna Murali)పై కూటమి సర్కార్ వేధింపులు ఆగడం లేదు. కూటమి పార్టీల నేతలు పెట్టిన కేసుల్లో ఆయనకు వరుసగా ఊరటలు దక్కుతుండడం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన్ని ఇంకో కేసులో ఇప్పుడు మరో పీఎస్‌కు తరలిస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి నరసరావుపేట పోలీసుల కస్టడీ పిటిషన్‌ను కోర్టు రద్దు చేసింది. దీంతో ఆగమేఘాల మీద విజయవాడ భవానీపురం పోలీసులు కర్నూల్ జైలుకు చేరుకున్నారు. ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్(PT Warrant) కింది పోసానిని హైదరాబాద్ మీదుగా విజయవాడకు తరలిస్తున్నారు. సాయంత్రంలోగా ఆయన్ని విజయవాడకు తీసుకొచ్చే అవకాశం ఉంది. కోర్టులో లేదంటే మెజిస్ట్రేట్ ఎదుట పోసానిని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రిమాండ్ విధిస్తే గనుక విజయవాడ జైలుకు పోసానిని తరలిస్తారు. లేదంటే మళ్లీ కర్నూలు జైలుకే తరలిస్తారు. ఈ కేసు చాలా ముఖ్యమైందని చెబుతూ కోర్టు నుంచి భవానీపురం పోలీసులు పీటీ వారెంట్ పొందారు.ఇదిలా ఉంటే.. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పోసానికి బెయిల్ మంజూరు చేస్తూ కడప మొబైల్ కోర్టు శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. పోసానికి బెయిలు ఇవ్వకూడదని పోలీసుల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించినప్పటికీ.. కోర్టు పోసాని తరఫు న్యాయవాదుల వాదనలతో ఏకీభవిస్తూ... బెయిల్ మంజూరు చేసింది. పోసాని కస్టడీ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ఈ కేసులోనే పోసాని ఫిబ్రవరి 26వ తేదీన అరెస్టయ్యారు. పోసానిని హైదరాబాద్‌లోని నివాసంలో అరెస్ట్ చేసి.. ఆ మరుసటి రోజు ఓబులవారిపల్లెకు తీసుకెళ్లారు. అటుపై పల్నాడు జిల్లా నరసరావుపేటలో, కర్నూల్ జిల్లా ఆదోనీ పీఎస్‌లలో నమోదైన కేసుల్లో పీటీ వారెంట్ కింద ఆయన్ని తరలించారు. ఈ కేసుల్లో ఉపశమనం కోరుతూ ఆయన వేసిన పిటిషన్లపై తీర్పు వెల్లడి కావాల్సి ఉంది. మరోవైపు హైకోర్టులోనూ ఆయన వేసిన క్వాష్ పిటిషన్ విచారణ దశలో ఉంది. -
‘నా చావుకు ధనలక్ష్మియే కారణం..’
విశాఖపట్నం: అచ్చియ్యమ్మపేటలో ఒక మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అప్పు తీసుకున్న ఇంట్లోనే ఆమె శవమై కనిపించడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారా లేదా హత్యకు గురయ్యారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇది ఆత్మహత్య కాదని హత్యేనని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ టూటౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు.టూటౌన్ సీఐ బి.తిరుమలరావు తెలిపిన వివరాలివి.. అంగడిదిబ్బ ప్రాంతానికి చెందిన బొడ్డు సుగుణ(34), తన భర్త అప్పన్న, ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్నారు. సుగుణ అచ్చియ్యమ్మపేటకు చెందిన ధనలక్ష్మి వద్ద లక్ష రూపాయలు అప్పుగా తీసుకున్నారు. ఆ సమయంలో ధనలక్ష్మి డబ్బులు ఇచ్చినందుకు వీడియో కూడా తీసింది. రూ.లక్షకు వారానికి రూ.20 వేలు అసలు, వడ్డీ చెల్లించేలా ఒప్పందం కుదిరింది. అయితే, సుగుణ సకాలంలో వడ్డీ చెల్లించలేకపోవడంతో, ధనలక్ష్మి, ఆమె కుమారుడు భరత్ గురువారం సుగుణ ఇంటికి వెళ్లి గొడవపడ్డారు. వెంటనే డబ్బులు చెల్లించాలని, లేకపోతే వీడియోను అప్పన్నకు పంపిస్తానని బెదిరించారు. దీంతో మనస్తాపం చెందిన సుగుణ గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో రూ.40 వేలు పట్టుకుని ధనలక్ష్మి ఇంటికి బయలుదేరింది. డబ్బులు ఇచ్చేందుకు ఆమె ఇంట్లోకి వెళ్లగా.. ధనలక్ష్మి లేరు. ఇంట్లో ఆమె చిన్న కుమారుడు ఒక్కడే ఉన్నాడు. కాగా.. రాత్రి 7 గంటలకు ఇంటికి తిరిగి వచ్చిన ధనలక్ష్మి.. గదిలో ఫ్యానుకు వేలాడుతున్న సుగుణ మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించింది. వారు ఘటనా స్థలానికి చేరుకుని తలుపులు బద్దల గొట్టి మృతదేహాన్ని కిందకు దించారు. విషయం తెలుసుకున్న సుగుణ భర్త అప్పన్న, తన భార్యను ధనలక్ష్మి కుటుంబ సభ్యులే హత్య చేశారని, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు.పోలీసులు కూడా వారితో కుమ్మక్కయ్యారని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం అప్పన్న, అతని ఇద్దరు కుమారులు, మృతురాలి బంధువులు టూటౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని, ధనలక్ష్మి, ఆమె కుటుంబ సభ్యులపై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు ధనలక్ష్మిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అప్పన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. సుగుణ చనిపోయే ముందు బయట నుంచి స్టూలు పట్టుకుని ధనలక్ష్మి ఇంట్లోకి వెళ్లినట్లు సీసీ ఫుటేజ్‌లో రికార్డ్ అయి ఉందని పోలీసులు వెల్లడించారు.‘నా చావుకు ధనలక్ష్మియే కారణం..’మరణించే ముందు సుగుణ తన భర్త అప్పన్నకు వాయిస్ మెసేజ్ పంపింది. ‘నా చావుకు ధనలక్ష్మి, ఆమె కుమారుడు భరత్ కారణం. నా కోసం బాధపడవద్దు. నేను అప్పులు మాత్రమే చేశాను. నా వల్ల నువ్వు, పిల్లలు సుఖపడలేరు. ధనలక్ష్మి నన్ను టార్చర్ పెడుతోంది. ఈ టార్చర్ నాతోనే పోవాలి. నా వల్ల మీరు బాధపడకూడదు. పిల్లలను హాస్టల్లో చేర్పించి బాగా చదివించు. నువ్వు నా కోసం బాధపడవద్దు’అని సుగుణ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వాయిస్ మెసేజ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా మహిళలు బాగుంటేనే ఆ కుటుంబం, రాష్ట్రం, దేశం బాగుంటుందని తెలిపారు. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని అన్నారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు. “మహిళలు బాగుంటేనే ఆ కుటుంబం బాగుంటుంది. కుటుంబాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రం బాగుంటే దేశం కూడా బాగుంటుంది’’ అని గట్టిగా నమ్మే వ్యక్తిని. ఆ దిశలోనే మన ప్రభుత్వ కాలంలో మహిళల అభ్యున్నతి, సాధికారతకు పెద్దపీట వేస్తూ పాలన చేశాం. అన్నిరంగాల్లో మహిళలను ప్రోత్సహించి, దాదాపు 32కు పైగా పథకాల ద్వారా వారికి భరోసా కల్పించాం.నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం కేటాయిస్తూ తొలిసారిగా చట్టం చేశాం. గిరిజన, దళిత మహిళలను డిప్యూటీ సీఎం, హోంమంత్రి లాంటి పెద్ద పదవులతో గౌరవించాం. మహిళల భద్రత, రక్షణ కోసం “దిశ’’ వ్యవస్థను ప్రవేశపెట్టాం. “ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు’’ అన్న నానుడిని నమ్ముతూ ఆ దిశగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టాం. నా భవిష్యత్ రాజకీయ ప్రస్థానం కూడా మహిళాభ్యున్నతే ప్రధాన లక్ష్యంగా సాగుతుంది’ అని తెలిపారు. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు. “మహిళలు బాగుంటేనే ఆ కుటుంబం బాగుంటుంది. కుటుంబాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రం బాగుంటే దేశం కూడా బాగుంటుంది’’ అని గట్టిగా నమ్మే వ్యక్తిని. ఆ దిశలోనే మన ప్రభుత్వ కాలంలో మహిళల అభ్యున్నతి, సాధికార…— YS Jagan Mohan Reddy (@ysjagan) March 8, 2025 -
పుణ్యమూర్తివి నీవమ్మా.. మా ఇంటి కావలి తల్లివి నీవమ్మా
ఆధునిక సమాజంలో మహిళలకు గౌరవం దక్కడం ఇప్పిడిప్పుడే మొదలైంది. స్త్రీ విద్య.. స్త్రీలకు ఉద్యోగాలు.. రాజకీయ పదవులు.. సామాజిక హోదా ఈమధ్యనే పెరుగుతూ వస్తోంది. కానీ, ఈ మారుమూల పల్లెల్లో స్త్రీమూర్తులను సాక్షాత్తుగా దేవతలుగా కొలుస్తారు. తమ ఇంటి ఇలవేల్పులుగా ఆరాధిస్తారు. తమ కుటుంబాలను కాపాడే శక్తిగా.. అమ్మవారిగా పూజిస్తారు.. తమ ఇంట పండిన పంటలో తోలి గంపను ఆమెకు సమర్పిస్తారు.. తమ ఇంట వండిన వంటలు తొలిముద్దను ఆమెకు సమర్పిస్తారు. ఇంట్లో ఏదైనా పండగొచ్చినా పబ్బమొచ్చినా ఇళ్లలో వండుకునే పిండివంటల్లో తొలివాయి ఆమెకే ఇచ్చి.. అమ్మా నీ చలవతోనే మేమంతా చల్లగా ఉన్నాం.. నువ్విచ్చిన ఆస్తిపాస్తులు.. ఆశీస్సులతో ఇలా సాగుతున్నాం.. నువ్వు లేకున్నా నీ జ్ఞాపకాలు చాలు.. ఇదిగో నిన్ను చూస్తూ బతికేస్తాం అంటూ భక్తి.. ప్రేమ నిండిన కళ్ళతో ఆ స్మారకాలవద్ద పవిత్రంగా ప్రమిదలు వెలిగిస్తారు.. ఏదైనా ఇంట్లో ఒక మహిళా పుణ్యస్త్రీగా కన్నుమూస్తే ఆమెను పేరంటాలుగా గౌరవిస్తారు. ఆమె పేరిట ఒక స్మారక చిహ్నాన్ని నిర్మిస్తారు.. వీటిని గుండాం అంటారు. భర్తకన్నా ముందే తనువు చలించడం ఒక మహిళకు దైవత్వాన్ని తెచ్చిపెడుతోంది. అంటే ఆమె పుణ్యస్త్రీగా ముత్తైదువుగా కన్నుమూసి ఆ ఇంటి వారి పాలిట ఇలవేల్పుగా కొలువైపోతుంది. భారతీయ సమాజంలో విధవగా జీవించడం మహిళ ఒక శాపంలా భావిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో భర్తకన్నా ముందుగానే ప్రాణం విడిచివెళ్లిన స్త్రీ ఏకంగా దైవత్వాన్ని సంతరించుకుని ఆయా కుటుంబాల్లో దేవతలుగా కొలువుదీరుతారు. విజయనగరం జిల్లాలోని రాజాం, రేగిడి, వంగర, సంతకవిటి మండలాల్లో వందలాది పల్లెల్లో ఈ ఆచారం ఉంది.పంటపొలాలకు.. పాడిపశువుల నువ్వే అండాదండాఇక్కడ పొలాల్లో, రోడ్లకు ఇరువైపులా కనిపిస్తున్న ఈ చిన్న చిన్న నిర్మాణాలను ఇక్కడి స్థానికులు గుండాలు అని పిలుస్తారు. ఇటువంటి గుండాలు ప్రతీ గ్రామంలో వందల సంఖ్యలో ఉంటాయి. బొమ్మనాయుడువలస, బొద్దూరు, గుళ్ళ సీతారాంపురం, గడ్డి ముడిదాం, ఉణుకూరు, అరసాడ, కాగితాపల్ల వంటి పల్లెల్లో ప్రతి ఇంటికీ ఇలాంటి గుండాలు ఒంటరి.. వారువారు స్థోమతను బట్టి తమ పొలాల్లోను.. కల్లంలోనూ వీటిని నిర్మించి అందులో ఆ మహిళా ఆత్మను ప్రతిష్టించి ఆ గుండంలో ఆమె జీవించి ఉన్నట్లుగా భావిస్తారు. ఆ ఇంట జరిగే శుభ కార్యాల్లో తోలి కబురు ఆమెకే చెబుతారు. గర్భిణీలు.. పెళ్లికూతుళ్ళు కూడా అక్కడకు వెళ్లి దీపం పెట్టి.. నీలాగే గొప్ప ముత్తైదువులా జీవించేలా ఆశీర్వదించాలమ్మా అని ప్రార్థిస్తారు. అంతేకాకుండా పంటపొలాలు.. పాడిపశువులను సైతం ఆ పేరంటాలు కాపాడుతుందని.. వ్యవసాయపనుల సందర్భాల్లో ఎలాంటి ఇబ్బందులు.. ప్రమాదాలు కూడా రాకుండా ఆమె కావలి ఉంటుందని .. ఇంటికి చీడపీడలు.. అనారోగ్యాలు రానివ్వకుండా ఆ పేరంటాలు అడ్డంగా నిలబడుతుందని విశ్వాసంతో ఉంటారు. అందుకే ప్రతి గుండానికి లలితమ్మ పేరంటాలు.. లక్షమ్మ పేరంటాలు.. రాధమ్మ పేరంటాలు అని పేర్లు పెడుతూ మరణించిన తరువాత కూడా తమ భక్తిప్రపత్తులు చాటుకుంటారు. ఈ గ్రామాల్లో వందలాది ఇలాంటి స్మారకాలు ( గుండాలు) కనిపిస్తాయి. వాటికి ఏటా రంగులు వేసి.. చక్కగా ముస్తాబు చేసి అందులో తమ ఇంటి ముత్తైదువను చూసుకుంటారు. ఈరోజుల్లో మహిళలను గౌరవించడం మాట అటుంచి వారికి రక్షణ కూడా లేకుండా పోతున్న పరిస్థితుల్లో ఉండగా వందల ఏళ్ళనుంచీ ఆ పల్లెవాసులు మహిళలకు ఏకంగా దేవతా స్థానం కల్పించి మరణించాక కూడా ఆమెను తమ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చూస్తూ.. ఏటా కొత్తబట్టలు.. పిండి వంటలు.. పళ్ళు ఫలాలు.. సమర్పిస్తారు.. ఇది కదా అసలైన మహిళా సాధికారత.. ఇది కదా మహిళలకు అసలైన గౌరవం..-సిమ్మాదిరప్పన్న. -
మాయమయ్యాడు.. మామూలు మనిషి
ఒకప్పడు ఎటు చూసినా బంధాలు..అను బంధాలు..ఆత్మీయతలు.. అనురాగాలు.. విలసిల్లేవి.. ప్రపంచీకరణ పుణ్యమాని.. మనిషిలో స్వార్థం పెరిగి మాన సంబంధాలు కనుమరుగవుతున్నాయి. తన జీవితం తనదే, పొరుగువారితో పనేముందన్న రీతి లో మానవుడు సాగుతున్నాడు. యాంత్రిక జీవనం గడుపుతున్నాడు.. మచ్చుకైనా మానవత్వం కనిపించకపోవడంతో మామూలు మనిషి మాయమైపోయాడనక తప్పదు. నేటి మానవ సంబంధాలపై ప్రత్యేక కథనం. పలమనేరు: మానవ సంబంధాలను మంటగలిపి కేవలం తమ స్వార్థం చూసుకుంటున్న మనుషులు సమాజంలో ఎక్కువైపోయారు. గమ్యం తెలియని జీవన పయనమెటో తెలియని గందరగోళం నెలకొంది. సమాజంలో మంట కలుస్తున్న మానవత్వాన్ని మేలు కొల్పాల్సిన అవరసం ఎంతైనా ఉంది. గత ఏడాదిలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అందరూ ఉండి అనాథల్లా మారి కనీసం అంత్యక్రియలకు నోచుకోని పదిమందికి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు దహనసంస్కారాలు చేశారంటే సమాజంలో ఎలాంటి మావనీయ సంబంధాలున్నాయే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మానవ సంబంధాలెలా ఉన్నాయంటే? పలమనేరు మండలంలోని మొరం పంచాయతీకి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి తన కుటుంబంతో బెంగళూరులో కాపురముంటున్నారు. అనారోగ్యంతో అతని తల్లి మృతి చెందింది. దీంతో ఆ ఇంటి యజమాని మానవత్వం లేకుండా తన ఇంట్లో శవాన్ని పెట్టకుండా అడ్డుకున్నాడు. దీంతో విధిలేక వారు స్వగ్రామానికి తీసుకొచ్చారు. బయట చనిపోయినవారు గ్రామంలోకి రాకూదనే సంప్రదాయంతో శవాన్ని ఊరిబయటే పెట్టి ఆపై అంత్యక్రియలను నిర్వహించారు. పలమనేరు సమీపంలోని సాయినగర్‌లో ఓ ఉద్యోగి సొంత ఇంటిని నిర్మించుకుని పదేళ్లుగా కాపురముంటున్నాడు. ఆయన ఇప్పటివరకు ఇరుగుపొరుగు వారితో మాట్లాడలేదు. ఎరింటికీ వెళ్లలేదు. ఆ వీధిలో ఎవరికైనా కష్టమొచ్చినా సాయం చేయలేదు. పొద్దున ఆఫీసుకెళ్లడం పొద్దుపోయాక ఇంటికి రావడం తప్ప అతనికి ఎవరితోనూ సంబంధం లేని జీవితం గడుపుతున్నారు. మారిన బతుకులు ఒకటో తరగతి నుంచి కార్పొరేట్ స్కూల్ ఆపై కాలేజీ, మళ్లీ కుటుంబానికి దూరంగా పిల్లల చదువులు. ఆపై ఉద్యోగం రాగానే వారి జీవితం వారిది. ఇక ఇళ్లల్లోని పెద్దలను పిల్లలే వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్నారు. దీంతో కుటుంబ విలువలు తెలియని పిల్లలు ఎవరికివారేఅన్న భావనతో తమ బతుకులకు అంకితమైపోతున్నారు. స్మార్ట్ఫోన్ల పుణ్యమాని మానవ సంబంధాల పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. గతంలో ఓ గ్రామంలో వంద కుటుంబాలుంటే కనీసం 20 కుటుంబాలన్నా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు ఊరికి రెండు, మూడు కుటుంబాలు సైతం కలిసి ఉండడం లేదు. సచ్చినా బాధపడే వారెవరు? సొంత కుటుంబసభ్యులు ఎవరైనా మృతి చెందితే కనీసం కొన్నేళ్లపాటు బాధపడే రోజులు గతంలో కనిపించేవి. కానీ ఇప్పుడు సొంత కుటుంబసభ్యులు చనిపోయినా కేవలం రెండు మూడు రోజులే బాధ, ఆపై అసలు పట్టించుకోరు. మాయమవుతున్న మానవసంబంధాలు ఎవరు ఏమైతే నాకేంటి నా కుటుంబం బాగుంటే చాలనే స్వార్థం ఎక్కువైంది. ఆఖరికి తన సొంత అమ్మా నాన్న, అక్కా చెల్లి, అన్నదమ్ములను సైతం పట్టించుకోవడం లేదు. గతంలో గ్రామంలో ఎవరి ఇంట్లోనైనా శుభ, అశుభకార్యాలు జరిగితే పనులు చేసేందుకు ఇంటికోమనిషి వెళ్లేవారు. ఇప్పుడు పెళ్లికి సైతం రావడంలేదు. దీంతో శుభ, అశుభ కార్యక్రమాలకు ఈవెంట్ మేనేజర్లే దిక్కుగా మారారు. నాటి పలకరింపులు కరువు గతంలో ఇంటికి ఎవరైనా బంధువులొస్తే గంటల తరబడి పలకరింలుండేవి. ఆపై బంధువులకు విందుభోజనం చేసిపెట్టేవాళ్లం. ఇప్పుడు ఎవరైనా బంధువులు ఇంటికోస్తే నిమిషం పలకరింపు, బిజీగా ఉన్నాం ఇంకోసారి వస్తాంలేనంటూ పదినిమిషాల్లో వెళ్లడం కనిపిస్తోంది. మన ఇంట్లోని వారు సైతం బంధువులతో మాట్లాడకుండా స్మార్ట్ఫోన్లకు అతక్కుపోయి ఉంటున్నారు . – లక్ష్మీపతినాయుడు, బురిశెట్టిపల్లి, బైరెడ్డిపల్లి మండలం కష్టమొస్తే పలకరించేవాళ్లుండాలయ్యా! గతంలో ఎవరికైనా కష్టం వస్తే ఇంటిపక్కనున్నవారో స్నేహితులో మంచి సలహా చెప్పి సమస్యకు పరిష్కారం చూపేవారు. ఇప్పుడు ఆత్మీయ పలకరింపులు లేవు. ఎవరు చూసినా వారి పనుల్లో బిజీబీజీ. రోడ్డుపై ప్రమాదం జరిగినా మనకెందుకులే, కేసవుతుందని వెళ్లిపోయే సమాజమిది. అమ్మా,నాన్న, బిడ్డలకంటే ఎక్కువగా సోషల్‌మీడియాతో గడుపుతున్నారు. – పుష్పరాజ్, రిటైర్డ్ టీచర్, పలమనేరు -
నేడు సాక్షి అవార్డ్స్ స్పెషల్ ఎపిసోడ్
గత పది సంవత్సరాలుగా సాక్షి మీడియా గ్రూప్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ టెన్త్ ఎడిషన్’ వేడుక స్పెషల్ ఎపిసోడ్ సాక్షి టీవీలో శనివారం ప్రసారం కానుంది. ఫిబ్రవరి 28 శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకలో హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ వేడుకలో వై.ఎస్.భారతి రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేశారు. సామాజిక రంగంలో గొప్ప సేవ చేస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన వారికీ, కళారంగంలో గొప్ప ప్రతిభ చూపిన వారికి 2023–24 సంవత్సరాలకు గాను ఈ ఎక్సెలెన్సీ అవార్డులు బహూకరించారు. జ్యూరీ చైర్‌పర్సన్‌గా శాంతా సిన్హా వ్యవహరించారు. అవార్డులు అందుకున్న వారిలో పర్యావరణ సేవకు గాను దూసర్ల సత్యనారాయణ, సేంద్రియ వ్యవసాయానికి మల్లికార్జున రెడ్డి, అమర సైనికుడు డొక్కరి రాజేష్ (మరణానంతరం అతని తల్లిదండ్రులకు), క్రికెటర్ గొంగడి త్రిష, అథ్లెట్ జీవాంజి దీప్తి తదితరులు ఉన్నారు. సినిమా రంగంలో లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ సీనియర్ నటి రమాప్రభ అందుకున్నారు. ఎక్సెలెన్సీ అవార్డులు అందుకున్న వారిలో దర్శకుడు సాయి రాజేష్, మీనాక్షి చౌదరి, కిరణ్ అబ్బవరం తదితరులు ఉన్నారు. డైరెక్టర్ సుకుమార్ ‘తెలుగు పర్సన్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారం, ఉత్తమ దర్శకుడి పురస్కారం అందుకున్నారు. -
బట్రెస్ డ్యామ్ నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్ డ్యామ్ సీపేజీ నియంత్రణకు దాని దిగువన బట్రెస్ డ్యామ్ నిర్మించేందుకు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) శుక్రవారం అనుమతి ఇచ్చింది. ఎగువ కాఫర్ డ్యామ్‌కు దిగువన టోయ్(అడుగు భాగం)లో దీనిని నిర్మించేలా అంతర్జాతీయ నిపుణుల కమిటీ (పీవోఈ) ఖరారు చేసిన డిజైన్‌ను సీడబ్ల్యూసీ ఆమోదించింది. ఎగువ కాఫర్ డ్యామ్ దిగువన దానికి సమాంతరంగా 2,454 మీటర్ల పొడవున 8 మీటర్ల ఎత్తుతో రీయిన్‌ఫోర్స్‌డ్ సిమెంట్ కాంక్రీట్‌తో బట్రెస్ డ్యామ్ నిర్మాణ పనులు చేపట్టాలని పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) ప్రాజెక్ట్ అధికారులను ఆదేశించింది. జూలైలోగా బట్రెస్ డ్యామ్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని నిర్దేశించింది. 2016–18 మధ్య ఎగువ కాఫర్ డ్యామ్ పునాది (జెట్ గ్రౌటింగ్ వాల్) నిర్మాణంలో నాటి టీడీపీ సర్కార్ తప్పిదం వల్ల సీపేజీ అధికంగా ఉందని పీవోఈ తేల్చింది. గోదావరి వరదల్లోనూ ప్రధాన డ్యామ్ గ్యాప్–2లో డయాఫ్రం వాల్ పనులు కొనసాగించాలంటే ఎగువ కాఫర్ డ్యామ్ సీపేజీని నియంత్రించాలని.. అందుకు ఎగువ కాఫర్ డ్యామ్ దిగువన బట్రెస్ డ్యామ్‌ను నిర్మించాలని సూచించింది. దాంతో బట్రెస్ డ్యామ్ డిజైన్‌ను రూపొందించాలని కాంట్రాక్టు సంస్థను సీడబ్ల్యూసీ ఆదేశించింది. కాంట్రాక్టు సంస్థ రూపొందించిన డిజైన్‌పై ఈనెల 4న పీవోఈతో సీడబ్ల్యూసీ సీఈ విజయ్ శరణ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ సమావేశంలో పీవోఈ చేసిన సూచనల మేరకు డిజైన్‌లో మార్పులు చేర్పులు చేసి పంపాలని కాంట్రాక్టు సంస్థను సీడబ్ల్యూసీ ఆదేశించింది. ఆ మేరకు రూపొందించిన బట్రెస్ డ్యామ్ డిజైన్‌ను సీడబ్ల్యూసీ ఆమోదించింది.ఏమిటీ బట్రెస్ డ్యామ్కాంక్రీట్ ఆనకట్ట, కాఫర్ డ్యామ్ సీపేజీ (లీకేజీ) నీటిని నియంత్రించడానికి దాని దిగువన రీయిన్‌ఫోర్స్‌మెంట్ కాంక్రీట్‌తో నిర్మించేదే బట్రెస్ డ్యామ్. ఎగువ కాఫర్ డ్యామ్ పునాదిలో లోపాల వల్ల సీపేజీ అధికంగా ఉంది. దాన్ని నియంత్రించాలంటే దానికి పొడవునా దిగువ భాగంలో మరో చిన్న సైజు (బట్రెస్) డ్యామ్ నిర్మించాలని పీవోఈ సూచించింది. పునాది స్థాయి నుంచి ఇనుప కడ్డీలు, సిమెంట్ కాంక్రీట్‌తో భూఉపరితలానికి 8 మీటర్ల ఎత్తు వరకూ బట్రెస్ డ్యామ్‌ను నిర్మిస్తారు. బంకమట్టి ప్రాంతంలోనూ డీ–వాల్‌కు లైన్ క్లియర్ప్రధాన డ్యామ్ గ్యాప్–2లో బంకమట్టి నేల ఉన్న ప్రాంతంలోనూ డయాఫ్రం వాల్ (డీ–వాల్) నిర్మాణానికి సీడబ్ల్యూసీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. బంకమట్టి నేల ఉన్న ప్రాంతంలో నిర్మిస్తున్న డీ వాల్‌కు ఇరువైపులా 25 మీటర్ల పొడవున వైబ్రో కాంపాక్షన్ చేసి.. ఇసుక సాంద్రతను పెంచి.. నేలను పటిష్టం చేయాలని పీవోఈ సూచించింది. ఆ తర్వాత డీ–వాల్ పనులు చేపట్టాలని సీడబ్ల్యూసీ ఆదేశించింది. దాంతో బంకమట్టి నేల ఉన్న ప్రాంతంలో నిర్మించనున్న డీ–వాల్‌కు ఇరువైపులా 25 మీటర్ల పొడవున వైబ్రో కాంపాక్షన్ పనులను కాంట్రాక్టు సంస్థ శుక్రవారం ప్రారంభించింది. -
రూ.9 వేల కోట్ల అప్పునకు గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ) పలు రకాల బాండ్ల విడుదల ద్వారా రూ.9 వేల కోట్ల అప్పు సమీకరించుకునేందుకు రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విజయనగరం జిల్లాలోని గాజులరేగ గ్రామంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మాణానికి రెండెకరాల స్థలాన్ని కేటాయిస్తూ రాష్ట్ర మంత్రి మండలి సమావేశం నిర్ణయం తీసుకుంది. టీడీపీ కార్యాలయ నిర్మాణం కోసం ఎకరానికి సంవత్సరానికి రూ.వెయ్యి అద్దె ప్రాతిపదికన 33 ఏళ్లపాటు రెండు ఎకరాల భూమిని కేటాయించే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో పర్యాటకానికి భూముల కేటాయింపు పాలసీ–2024–29కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో ఎంఎస్ఎంఈ పార్కు నిర్మాణం కోసం 27 ఎకరాల భూమి ఏపీఐఐసీకి బదలాయించేందుకు ఆమోదం తెలిపింది.తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద వ్యవసాయ, సహకార శాఖకు 10.72 ఎకరాలు కేటాయించేందుకు, రాజమండ్రిలోని గోదావరి నదిపైన ఉన్న హేవ్ లాక్ వంతెనను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి వీలుగా 116.974 ఎకరాల భూమిని, కాకినాడ జిల్లా తమ్మవరం గ్రామంలో 66.12 ఎకరాల భూమిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి వీలుగా ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థకు కేటాయించే ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఏలూరు జిల్లా వేలయిర్పాడులోని ఆర్‌ఎస్‌నెంబర్ 74లో 5.75 ఎకరాలను ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు కేటాయించేందుకు నిర్ణయించారు. చిత్తూరు జిల్లా జంగాలపల్లి గ్రామంలోని సెయింట్ గ్యాబ్రియేల్ ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యా సంస్థకు కేటాయించిన 4.64 ఎకరాల్లో నిర్మాణానికి మరో 18 నెలలు గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నంలో సెంచూరియన్ స్కూల్ ఆఫ్ రూరల్ ఎంటర్ర్పైజ్ మేనేజ్మెంట్ ట్రస్ట్–భువనేశ్వర్‌ను సెంచూరియన్ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ ట్రస్టు–విశాఖపట్నంగా మార్చుతూ తదనుగుణంగా ఏపీ ప్రైవేటు యూనివర్సిటీస్ (ఎస్టాబ్లిష్మెంట్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్–2016 (యాక్ట్ 18 ఆఫ్ 2018) సవరణ బిల్లు 2025ని శాసనసభ ఆమోదం కోసం పెట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. సెంట్రల్ పూల్‌కు కొత్తగా 372 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు, ఇన్ సర్వీసులో ఉన్న పీజీ డాక్టర్లు దానికనుగుణంగా వేతనాలు పొందడానికి వీలుగా పీజీ లీన్ ఉత్తర్వులు ఇవ్వడానికి ఆమోదించింది. కుప్పం నియోజకవర్గంలో రూ.5 కోట్లతో డిజిటల్ హెల్త్ నెర్వ్ సెంటర్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. గీత కులాలకు కేటాయించిన 335 మద్యం దుకాణాల్లో నాలుగు దుకాణాలను సొండి కులాల వారికి కేటాయిస్తూ చేసిన సవరణను ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ (ఏపీఈడీబీ)లో 22 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి అనుమతిచ్చింది. ఎంపీడీవోల డైరెక్ట్ రిక్రూట్మెంట్ రద్దు ఏపీపీఎస్సీ ద్వారా ఎంపీడీవోల నియామక ప్రక్రియకు ప్రభుత్వం స్వస్తి పలకనుంది. ఎంపీడీవో ఖాళీలను ఇకపై పదోన్నతుల ద్వారానే భర్తీ చేస్తారు. ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగుల సర్వీసు రూల్స్‌లో సవరణ తీసుకొచ్చే పలు ప్రతిపాదనలపై శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఎంపీడీవో, డివిజనల్ పంచాయతీ అధికారి (డీఎల్పీవో) ఇక ఒకే క్యాడర్‌గా కొనసాగుతారు. జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) స్థాయిని డిప్యూటీ డైరెక్టర్ స్థాయికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. డీపీవో, డిప్యూటీ జడ్పీ సీఈవో పోస్టులతో పాటు డీడీవో పోస్టుల్లో మూడో వంతు నేరుగా నియామకం చేపట్టే విధానం తీసుకురానున్నారు. మండల స్థాయిలో పనిచేసే ఈవోపీఆర్డీలకు ఇక డిప్యూటీ ఎంపీడీవో హోదా కల్పిస్తారు. జడ్పీ సీఈవో పోస్టుల్లో సగం ఐఏఎస్ అధికారులను నియమించే నిబంధనను మంత్రివర్గం ఆమోదించింది. ఐఏఎస్ అధికారులను నియమించని పక్షంలో జడ్పీ సీఈవో ఫీడర్ క్యాటరీ సిబ్బంది లేదా ఇతర శాఖ నుంచి డిప్యూటేషన్ విధానంలో నియమిస్తారు. వేరే శాఖ సిబ్బందికి పంచాయతీరాజ్ శాఖ నియామకాల్లో బాధ్యతలు అప్పగించే పక్షంలో అలాంటి వారికి ఇక ముందస్తు శిక్షణను తప్పనిసరి చేశారు. సీబీఐ పరిధిలో ఉన్నా జోక్యం చేసుకోవాలి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు సీబీఐ పరిధిలో ఉన్నప్పటికీ జోక్యం చేసుకోవాలని సీఎం చంద్రబాబు పోలీస్ అధికారులను ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో శుక్రవారం మంత్రివర్గం సమావేశం ముగిసిన అనంతరం రాజకీయ అంశాలపై ఆయన మంత్రులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వివేకా హత్య కేసులో సాక్షులకు రక్షణ కల్పించాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను ఆదేశించారు. ఈ కేసులో సాక్షులు అనుమానాస్పదంగా మృతి చెందుతున్నారని, ఇప్పుడు వాచ్మెన్ రంగన్న అలానే మృతి చెందడం సందేహాస్పదంగా ఉందని చెప్పారు.రంగన్న మృతికి సంబంధించిన వివరాలను సీఎం, మంత్రులకు డీజీపీ వివరించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. వైఎస్ వివేకా హత్యను తొలుత గుండెపోటుగా చెప్పారని, ఇప్పుడు వాచ్మెన్ రంగన్నను పోలీసులే చంపారని వైఎస్సార్సీపీ అనుకూల మీడియాలో వార్తలు వచ్చాయని చెప్పినట్లు తెలిసింది. అందుకే ఆ పార్టీ కుట్రల గురించి అప్రమత్తంగా ఉండాలని తాను ముందు నుంచీ చెబుతున్నానని చంద్రబాబు అన్నట్లు సమాచారం. పరిటాల రవి హత్య కేసులో సాక్షులు కూడా ఇలానే చనిపోతూ వచ్చారని తెలిపారు. ఇప్పటి వరకు ఈ కేసులో ఆరుగురు సాక్షులు చనిపోయారన్నారు. రంగన్నను హత్య చేసి, దానిని ప్రభుత్వానికి ఆపాదించాలనే కుట్ర ఇందులో దాగి ఉందని పలువురు మంత్రులు అన్నట్లు తెలిసింది. -
అప్పులపై కట్టుకథలు.. అసెంబ్లీలో బట్టబయలు
సాక్షి, అమరావతి : వైఎస్సార్సీపీ హయాంలో అప్పులపై ఎన్నికల ముందు పచ్చి అబద్ధాలే చెప్పామని అసెంబ్లీ సాక్షిగా కూటమి ప్రభుత్వం శుక్రవారం అంగీకరించింది. ఒకసారి రూ.14 లక్షల కోట్లు అప్పులు చేశారని, మరోసారి రూ.10 లక్షల కోట్లంటూ ఎన్నికల ముందు కూటమి నేతలు పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు అప్పులు చేసిందంటూ అసెంబ్లీలో, బయట నిస్సిగ్గుగా అవాస్తవాలు చెబుతున్నారు. అయితే శుక్రవారం అసెంబ్లీలో వైఎస్సార్సీపీ సభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, మత్స్యరాస విశ్వేశ్వర రాజు రాష్ట్ర అప్పులపై అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ లిఖిత పూర్వకంగా సమాధానం చెబుతూ 2023–24 మార్చి నాటికి బడ్జెట్ అప్పులు, గ్యారెంటీ అప్పులు కలిపి మొత్తం రూ.6.46 లక్షల కోట్లు మాత్రమేనని వెల్లడించారు. ఇదే అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానం చెబుతూ సీఎం చంద్రబాబు రూ.10 లక్షల కోట్లు అప్పు చేశారంటూ అబద్ధాలు చెప్పారు. ఇప్పుడు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. రాష్ట్ర అప్పులు 2023–24 మార్చి నాటికి బడ్జెట్లో రూ.4.91 లక్షల కోట్లు, గ్యారెంటీ అప్పులు రూ.1.54 లక్షల కోట్లు.. మొత్తంగా రూ.6.46 లక్షల కోట్లేనని స్పష్టం చేశారు. తద్వారా సీఎం చంద్రబాబు ఇంకా రూ.10 లక్షల కోట్లు అప్పు చేశారంటూ చెబుతున్న మాటలన్నీ అవాస్తవాలేనని అర్థమైందని ఆర్థిక శాఖ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. దుష్ప్రచారమే లక్ష్యం కూటమి ప్రభుత్వం ఈ ఆర్థిక ఏడాది బడ్జెట్లో 2024 డిసెంబర్ నాటికే ఏకంగా రూ.71 వేల కోట్లకు పైగా అప్పు చేసినట్లు ఆర్థిక మంత్రి కేశవ్ వెల్లడించారు. 2023–24 మార్చి నాటికి బడ్జెట్ అప్పులు రూ.4,91,734.11 కోట్లు ఉండగా, ఈ ఆర్థిక ఏడాది డిసెంబర్ నాటికి బడ్జెట్ అప్పులు రూ.5,63,376.96 కోట్లకు పెరిగినట్లు తెలిపారు. రాష్ట్రం విడిపోయిన నాటి నుంచి 2024 డిసెంబర్ 31 నాటికి ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వని ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన అప్పులు రూ.91,252.58 కోట్లు ఉన్నాయన్నారు. అన్నీ కలుపుకుంటే కూడా మొత్తం అప్పులు రూ.10 లక్షల కోట్లు లేవని తేలింది. అయినా సరే సీఎం చంద్రబాబు పదే పదే రూ.10 లక్షల కోట్ల అప్పులు చేశారని చెబుతుండటం వెనుక గత దుష్ప్రచారమే కారణం. అప్పుడు అలా చెప్పినందున, ఇప్పుడు మరో రకంగా చెబితే బాగోదనే ఇలా మాట్లాడుతున్నారని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. రాష్ట్ర అప్పులు రూ.6.46 కోట్లేనని అప్పటి సీఎం వైఎస్ జగన్‌తోపాటు, కాగ్, ఆర్బీఐ నివేదికలు వెల్లడించాయి. ఇప్పుడు మంత్రి కేశవ్ కూడా ఇదే చెప్పారు. ఇదంతా ప్రజలను నమ్మించాలనే మోసపూరిత వ్యవహారం తప్ప మరొకటి కాదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
‘కుట్టు’ స్కీమ్.. గుట్టుగా స్కామ్!
సాక్షి, అమరావతి: స్కీముల పేరుతో స్కామ్‌లకు కూటమి ప్రభుత్వం తెర తీసింది. అసలు ఇంతవరకు లబ్దిదారుల ఎంపికే జరగలేదు. కానీ శిక్షణ పూర్తైనట్లు రూ.60 లక్షలు నిధులు మాత్రం విడుదల చేసేశారు. కుట్టు పనుల్లో శిక్షణ (టైలరింగ్), మిషన్ల పంపిణీ పేరుతో రూ.255 కోట్లతో చేపట్టిన స్కీమ్‌లో రూ.వంద కోట్లకుపైగా కొట్టేసేందుకు స్కెచ్ వేశారు. వాటాలు కుదరడంతో నిబంధనలకు విరుద్ధంగా టెండర్ ఖరారు చేశారు. అసలు శిక్షణ ప్రక్రియే చేపట్టకుండా 1.02 లక్షల మంది మహిళలకు సీఎం చంద్రబాబు నేడు కుట్టు మిషన్లు పంపిణీకి సిద్ధమయ్యారు. బీసీ సంక్షేమ శాఖలో అవినీతి బాగోతం ఇదీ! మూడేళ్లలో రూ.300 కోట్లు! మార్కెట్లో కుట్టు మిషన్లు రూ.5 వేల నుంచి రూ.13 వేల లోపే దొరుకుతున్నాయి. నాణ్యమైన మిషన్ అందచేసినా రూ.13 వేలు లెక్కన రాష్ట్రంలో 1,02,832 మంది మహిళా లబ్దిదారులకు అందించాలంటే రూ.1,33,68,16,000 వ్యయం అవుతుంది. కానీ ప్రభుత్వం ఖరారు చేసిన టెండర్ లెక్కలో మాత్రం మిషన్ల కొనుగోలుకు రూ.224,05,03,616 ఖర్చు చూపించారు. అంటే రూ.133.68 కోట్లు వ్యయం అయ్యే వాటిని ప్రభుత్వం రూ.224.05 కోట్లకు కట్టబెట్టింది. ఈ స్కామ్‌లో ఈ ఏడాది దాదాపు రూ.వంద కోట్లు స్వాహా చేసేలా పథకం రూపొందించారు. మూడేళ్లలో రూ.300 కోట్లకుపైగా ప్రజా ధనాన్ని కాజేసేందుకు ప్లాన్ వేశారు. వ్యయం పెంచేసి.. నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (సీడాప్) అనే విభాగం ఉంది. దాన్ని కాదని ఆంధ్రప్రదేశ్ బీసీ సహకార ఆర్థిక సంస్థ (ఏపీబీసీసీఎఫ్సీఎల్) ద్వారా కుట్టు మిషన్ల స్కామ్‌కు శ్రీకారం చుట్టారు. మొదట రూ.వంద కోట్లతో చేసిన ప్రతిపాదనలను కొనుగోలు, శిక్షణ, పంపిణీ పేరుతో రూ.255 కోట్లకు పెంచారు. మొత్తం 46,044 మంది బీసీ మహిళలు, 45,772 మంది ఈడబ్ల్యూఎస్, 11,016 మంది కాపు మహిళా లబ్దిదారులను ఎంపిక చేయాల్సి ఉంది. 90 రోజుల పాటు శిక్షణ ఇచ్చాక ఉచితంగా కుట్టు మిషన్ అందించాల్సి ఉంటుంది. ముందస్తు ఒప్పందంతోనే టెండర్ ఖరారు.. ఏ టెండర్ పిలిచినా తక్కువ మొత్తానికి కోట్ చేసిన సంస్థకు ఖరారు చేయాలి. బీసీ కార్పొరేషన్ ద్వారా ఉచిత శిక్షణ, కుట్టు మిషన్ల పంపిణీకి గతేడాది డిసెంబర్ 18న ఆన్లైన్ బిడ్లను పిలిచారు. అదే నెల 31న టెక్నికల్ బిడ్లను తెరిచి మూడు సంస్థలకు అర్హత ఉన్నట్లు ఖరారు చేశారు. తాజాగా ఆ మూడు సంస్థలకు ఫెనాన్షియల్ బిడ్లలో టెండర్ కట్టబెడుతూ ఆమోద ముద్ర వేశారు. యూనిట్ (ఒక్కో కుట్టు మిషన్) రూ.21,788 చొప్పున సరఫరాకు శ్రీటెక్నాలజీ ఇండియా (ఎల్ఎల్పి, హైదరాబాద్) ముందుకు రాగా సోషల్ ఏజెన్సీ ఫర్ పీపుల్ ఎంపవర్మెంట్ రూ.23,400 చొప్పున సమకూర్చనున్నట్లు తెలిపింది. సెంటర్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ రూ.23,500 చొప్పున సరఫరా చేస్తామని బిడ్లు దాఖలు చేసింది. ఈ మూడు సంస్థలకు ఎంపానల్మెంట్ చేస్తూ ప్రభుత్వం టెండర్ ఖరారు చేయడం గమనార్హం.తక్కువ ధరకే కుట్టు మిషన్ సరఫరా చేస్తామని బిడ్ వేసిన సంస్థకు టెండర్ ఇవ్వాల్సి ఉండగా, ఎక్కువ ధర కోట్ చేసిన మరో రెండు సంస్థలకు కూడా అవకాశం ఇవ్వడం వెనుక ఏం జరిగిందనేది బహిరంగ రహస్యమే! మరో చిత్రం ఏమిటంటే ఎక్కువ మొత్తానికి బిడ్స్ వేసిన రెండు సంస్థలు ఒకే సిండికేట్ కావడం గమనార్హం. శిక్షణ ఇవ్వలేదుగానీ నిధులిచ్చేశారు.. ప్రభుత్వం టెండర్లో పొందుపరిచిన ప్రమాణాలను పరిగణలోకి తీసుకుంటే ఒక్కో కుట్టుమిషన్ కేవలం రూ.5 వేల నుంచి రూ.13వేల లోపు మాత్రమే పలుకుతోంది. కుట్టు మిషన్‌తోపాటు శిక్షణ కూడా అందించేలా ఒక్కో యూనిట్‌కు రూ.25 వేలు చొప్పున ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఎక్కడైనా సరే టెండర్ దక్కించుకున్నవారు పనులు మొదలుపెట్టి తరువాత బిల్లులు సమర్పిస్తారు. కానీ ఇక్కడ మాత్రం టెండర్ ఖరారు కాగానే ఆర్డర్ ఇవ్వకముందే మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరుతో రూ.60 కోట్లు (టెండర్ మొత్తంలో 25 శాతం) ఇచ్చేలా ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లోనే ఆగమేఘాలపై ఫైల్ కదిలింది. లబ్దిదారుల ఎంపిక, శిక్షణ కార్యక్రమాలను చేపట్టకుండానే ఎంటర్‌ప్రైజర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఈడీపీ) పేరుతో ఏకంగా రూ.60 లక్షలను సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) సంస్థకు ఇచ్చేయడం అనుమానాలకు తావిస్తోంది. టెండర్ ఖరారయ్యాక జిల్లాల వారీగా లబ్దిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించి శిక్షణ పూర్తయ్యాక ఇవ్వాల్సిన నిధులను ముందుగానే విడుదల చేయడంతో అవి ఎవరి జేబులోకి చేరాయనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. -
మార్గదర్శి, రామోజీది 45 ఏళ్ల నయవంచన
సాక్షి, అమరావతి: మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్) కర్త రామోజీరావుల అక్రమ డిపాజిట్ల వసూళ్ల వ్యవహారం 45 ఏళ్ల నయవంచన అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ శుక్రవారం తెలంగాణ హైకోర్టుకు నివేదించారు. ఏపీలోని గత ప్రభుత్వం మార్గదర్శి అక్రమాలపై విచారణ కోసం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేయగా, ప్రస్తుత ప్రభుత్వం మాత్రం మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను కాపాడేందుకు ప్రయత్నిస్తోందన్నారు. తెలంగాణ సర్కారు కూడా దీనికి తానతందాన అంటోందని తెలి పారు.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను (ఆర్బీఐ) ప్రతివాదిగా చేర్చాలని, డిపాజిట్ల వసూళ్లు అక్రమమా? సక్రమమా? తేల్చాల్సింది చట్టబద్ధ సంస్థేనని సుప్రీంకోర్టే నేరుగా చెప్పిందని ధర్మా సనం దృష్టికి తీసుకొచ్చారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ డిపాజిట్ల వసూళ్లు అక్రమమేనని ఆర్బీఐ చాలా స్పష్టంగా ఈ కోర్టుకు చెప్పిందన్నారు. ఇప్పుడు కూడా మార్గదర్శిపై కఠిన చర్యలు చేపట్టకుంటే భవిష్యత్‌కు తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లు అవుతుందన్నారు.రామోజీ అక్రమాలకు హెచ్‌యూఎఫ్ సభ్యులు కూడా బాధ్యులేనని చెప్పారు. హెచ్‌యూఎఫ్ కింద మార్గదర్శి ఫైనాన్షియర్స్ కార్యకలాపాలు చేపట్టినందున కర్త రామోజీరావు మాత్రమే బాధ్యడవుతారని, ఇతర కుటుంబసభ్యులకు ఎలాంటి సంబంధం ఉండదంటూ ఆ సంస్థ జనవరి 29న దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై అన్ని పక్షాల వాదనలు విన్న జస్టిస్ పి.శ్యాం కోషి, జస్టిస్ కలాసికం సుజనలతో కూడిన హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈ అంశంపై తీర్పును రిజర్వ్ చేసింది. అంతకుముందు ఉండవల్లి తన వాదనలను కొనసాగించారు.ఇష్టారాజ్యంగా వసూళ్లు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు.. ఇలా వేటి అనుమతి లేకుండా ఇష్టారాజ్యంగా మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను నడిపించారని, ఇదేమని అడిగేవారు లేకుండా తీవ్ర భయభ్రాంతులకు గురిచేశారని ఉండవల్లి పేర్కొన్నారు. ‘‘రాష్ట్రంలోనే అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి రామోజీ కావడం, వెంట ఆయన మీడియా మాఫియా ఉండడంతో బాధితులు ఫిర్యాదు చేయడానికి వెనుకాడారు. ఫిర్యాదు చేసినా రామోజీపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. 2004 తర్వాత బోగస్ బ్యాంక్‌ల బండారం బయటపడుతుండడంతో మార్గదర్శి అక్రమాలపై కూడా విచారణ జరపాలని నాటి సీఎం, దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నిర్ణయించారు. ఎప్పుడైతే మార్గదర్శిపై విచారణ ప్రారంభమైందో నాటి నుంచి వైఎస్సార్‌పై రామోజీరావు తన మీడియాలో అనుచిత వార్తలు ప్రచురించడం, ప్రసారం చేయడం మొదలుపెట్టారు. కథనాలు అల్లి రాసేవారు. ఈ క్రమంలోనే నా తల్లికి మార్గదర్శి నుంచి వచ్చిన చెక్, దానిపై ఉన్న సంతకాలను పరిశీలించగా అవకతవకలన్నీ బయటపడ్డాయి. దీంతో నేను ఫిర్యాదు చేసి, నిజం తేల్చేందుకు 18 ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నా’’అని ఉండవల్లి కోర్టుకు నివేదించారు. ఐటీ శాఖ కనీసం పట్టించుకోలేదు.. ‘‘కర్త మరణించి, వ్యాపారం ఆగిపోతే ఎలా చర్యలు చేపట్టాలనేది ఆలోచించవచ్చు. రామోజీ చనిపోయినా హెచ్‌యూఎఫ్ వ్యాపారాన్ని వారసులు కొనసాగిస్తూ లబ్ధి పొందుతున్నారు. ఇదో హత్య కేసు లాంటిది. నిందితుడు చనిపోతే ఇక కేసు ఉండదని మార్గదర్శి న్యాయవాదులు చెప్పడం విడ్డూరం. దేశంలోని అన్ని హెచ్‌యూఎఫ్‌ల నుంచి ఆదాయపు పన్ను శాఖ పన్ను వసూలు చేస్తోంది. వాటి సిబిల్ స్కోరు, ఆదాయ వ్యయాలపై పరిశీలన చేస్తుంది. ఈనాడు, ఈటీవీ, ఫిలిం సిటీ.. ఇలా అన్నీ కలిపి దాదాపు రూ.1,359 నష్టాల్లో ఉన్నాయి. ఇవన్నీ సాంకేతిక నష్టాలని మార్గదర్శి చెబుతోంది. ఇంత జరిగినా ఆదాయ పన్ను శాఖ కనీసం హెచ్‌యూఎఫ్ వ్యాపారంపై స్టే కూడా కోరడం లేదు. టీడీఎస్ ప్రస్తావనే లేదు. ప్రస్తుతం తెలంగాణ, ఏపీలో ఉన్న ప్రభుత్వాలకు మీడియా మాటున అక్రమాలు చెలాయిస్తున్న మార్గదర్శిపై ప్రత్యేక అభిమానం ఉంది’’అని ఉండవల్లి వాదించారు. ఈ కేసులో ఆర్బీఐని తాను ప్రతివాదిగా తొలుత చేర్చలేదని.. సుప్రీంకోర్టు ఎస్ఎల్పీ విచారణ చేస్తూ.. ఇది ఓ కుంభకోణంలా కనిపిస్తోందని, ఆర్బీఐని ప్రతివాదిగా చేర్చాలని స్పష్టం చేసిందని వివరించారు.‘‘అక్రమాలు, అవకతవకలు జరిగాయా? లేదా? చట్టప్రకారమే జరిగిందా? తేల్చాల్సింది ఆర్బీఐ కదా అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో మార్గదర్శి డిపాజిట్ల వసూలు అక్రమమేనని ఆర్బీఐ తేల్చింది’’అని ఉండవల్లి పేర్కొన్నారు. లూథ్రాను మందలించిన ధర్మాసనం ఉండవల్లి వాదనలు వినిపిస్తుండగా, మార్గదర్శి తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా పదేపదే అడ్డుపడ్డారు. సీనియర్ న్యాయవాది అయి ఉండి ఇలా కలుగజేసుకోవడం సరికాదని ఆయనను ధర్మాసనం మందలించింది. ఉండవల్లి వాదనలు ముగిసేవరకు ఆగాలని ఆదేశించింది. తర్వాత ఏపీ ప్రభుత్వం తరఫున ఆ రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది రాజేశ్వర్‌రెడ్డి వాదిస్తూ ఉండవల్లి వాదనలను తోసిపుచ్చారు. విచారణ చేశామని, ఫిర్యాదు చేసేందుకు ఎవరూ రాలేదని చెప్పారు. హెచ్‌యూఎఫ్ వ్యక్తి కాదని, విచారణ సాధ్యం కాదని మార్గదర్శి తరఫు సీనియర్ న్యాయవాది నాగముత్తు చెప్పారు. కర్త అక్రమాలకు హెచ్‌యూఎఫ్ సభ్యులు బాధ్యత వహించరని పేర్కొన్నారు. రామోజీ మరణం నేపథ్యంలో కేసు విచారణను ముగించాలని కోరుతూ తాము దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను అనుమతించాలని కోరారు. నాకు డబ్బులు చెల్లించలేదు... అందరి వాదనలు పూర్తయిన తరువాత లక్ష్మీనరసింహారావు అనే న్యాయవాది జోక్యం చేసుకున్నారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ తన డబ్బు తిరిగివ్వలేదని ఆర్బీఐకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తనను కూడా ఈ పిటిషన్లలో ప్రతివాదిగా చేర్చుకుని, వాదనలు వినాలని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ, అప్పటికే తీర్పు రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించామని, వాదనలను లిఖితపూర్వకంగా అందజేయాలని ఆదేశించింది.బాధ్యత నుంచి పారిపోలేరు రామోజీరావు మరణించినా.. అక్రమాల కారణంగా లబ్ధి పొందినవారు ఉన్నారు. ఆ లబ్ధిని అనుభవిస్తూ మాకేం సంబంధం లేదని వారు తప్పించుకోలేరు. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45ఎస్‌ను ఉల్లంఘించారని ఆర్బీఐ స్పష్టంగా చెబుతోంది. తన కుటుంబ సభ్యుల కోసమే సేకరిస్తున్నా అన్నట్లు రామోజీరావు 22 మంది కుటుంబసభ్యుల పేర్లను కూడా హెచ్‌యూఎఫ్‌లో చేర్చారు. అలాంటప్పుడు వారు బాధ్యత నుంచి పారిపోలేరు.తండ్రి లోన్ తీసుకుని చనిపోతే కుటుంబం బాధ్యులు కారా? తండ్రి బ్యాంక్ లోన్ తీసుకుని మరణిస్తే.. కుటుంబసభ్యులను బాధ్యులను చేయరా? రామోజీ అక్రమాలకు కుటుంబసభ్యులు కచ్చితంగా బాధ్యులే. వారు శిక్ష అనుభవించాల్సిందే. కాదని.. ఇలానే ప్రోత్సహిస్తే.. దీన్ని అసరాగా తీసుకుని ఇలాంటి ఫైనాన్షియర్లు ఎన్నో పుట్టుకొస్తాయి. అప్పుడు ఈ దేశమే తీవ్ర ప్రమాదంలో పడిపోతుంది. భవిష్యత్‌లో ప్రజల డిపాజిట్లకు గ్యారెంటీ లేకుండా పోతుంది. – మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ -
నేడు డ్వాక్రా మహిళలకు రుణాలు మంజూరు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్తలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని, బ్యాంకుల నుంచి రుణాలను ఇప్పించడంతో పాటు యూనిట్ల ఏర్పాటులో 45శాతం వరకు రాయితీలు అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. శనివారం అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా రూ.14,000 కోట్ల రుణాలను డ్వాక్రా మహిళలకు అందిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అదే విధంగా ఇంటి వద్ద ఖాళీ సమయంలో పనిచేసే విధంగా వర్క్ ఫ్రం హోమ్ విధానం ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. శుక్రవారం విజయవాడలో ఎలీప్ నిర్వహిస్తున్న ఎంఎస్ఎంఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన చంద్రబాబు మాట్లాడుతూ 50 శాతం మంది మహిళలు పనిచేస్తేనే 2047 స్వర్ణాంధ్ర లక్ష్యం సాధ్యమవుతుందన్నారు. ఇందుకోసమే ప్రతీ ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త నినాదం తీసుకున్నామని తెలిపారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీనికి అనుసంధానంగా ఐదు రీజనల్ హబ్‌లు ఉంటాయని, ఒక ఆలోచనతో వస్తే దాన్ని ఏ విధంగా పారిశ్రామీకరణ చేయాలో ప్రభుత్వం దగ్గరుండి చేయిపట్టి అడుగులు వేయిస్తుందన్నారు. అనకాపల్లి జిల్లా, కోడూరు వద్ద 31 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఎలీప్ మహిళా పారిశ్రామిక పార్కు ద్వారా 200 యూనిట్లు ఏర్పాటు కావడమే కాకుండా 10,000 మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. టెక్నాలజీని వినియోగించుకొని అడుగుముందుకేసే వారికి ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని తెలిపారు. -
12న ‘యువత పోరు’ బాట
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు, యువతను నిలువునా మోసగించిన కూటమి ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఆయా వర్గాల తరఫున ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 12న అన్ని జిల్లా కేంద్రాల్లో తలపెట్టిన యువత పోరు ర్యాలీలను, జిల్లా కలెక్టర్లకు మెమోరాండం సమర్పించే కార్యక్రమాలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు వైఎస్సార్సీపీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. అదే రోజున వైఎస్సార్సీపీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కోరారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ జిల్లాల అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు, రీజనల్ కో–ఆర్డినేటర్లు, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శులు, ముఖ్య నేతలతో శుక్రవారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సజ్జల ఇంకా ఏమన్నారంటే.. » నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించి మోసగించిన వైనం, వైద్య విద్యను ప్రైవేటీకరణ చేయడం ఇలా విద్యార్థులు, యువతను నిలువునా మోసగించిన ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆయా వర్గాల పక్షాన పోరుబాటకు సిద్ధమయ్యాం. ఇది అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలబడాల్సిన సమయం. యువతకు న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేసేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. విద్యార్థులు, యువకులు, వారి తల్లిదండ్రులు భాగస్వాములయ్యేలా విస్తృతంగా ప్రచారం చేయాలి. » కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ.. రైతులకు అండగా నిలుస్తూ వైఎస్సార్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చేపట్టిన కార్యక్రమం ఇప్పటికే విజయవంతమైంది. ఆ తర్వాత విద్యుత్ చార్జీలపై చేసిన కార్యక్రమం కూడా అదే స్థాయిలో విజయవంతమైంది. జిల్లాల పార్టీ అధ్యక్షులు కీలకంగా అందరినీ సమన్వయం చేసుకుంటూ ఈ మూడో కార్యక్రమాన్నీ(యువత పోరు) విజయవంతం చేయాలి. » యువత పోరుకు సంబంధించి వైఎస్సార్సీపీ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని కూడా నిర్వహిద్దాం. పార్టీ శ్రేణులు సైతం భారీగా ఈ కార్యక్రమంలో పాల్గొని, ప్రజల గొంతుకగా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేయాలి. జిల్లా స్థాయిలో జరుగుతున్న కార్యక్రమమైనందున ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు ముందస్తు ఏర్పాట్లు చేసుకుని విజయవంతం చేయాలి. » 12న వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి చోటా ఘనంగా ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలి, మన పార్టీపై ఉన్న ప్రజాభిమానం ఈ సందర్భంగా వెల్లడవ్వాలి. ఈ కార్యక్రమాన్ని ఉదయాన్నే పూర్తి చేసుకుని అనంతరం యువత పోరు కార్యక్రమం నిర్వహించాలి. యువత పోరు కార్యక్రమం ప్రజలకు సంబంధించిన అంశం కాబట్టి ఆ రోజు యధావిధిగా కొనసాగించాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సూచించారు. అంతేకాక పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని గ్రామాల నుంచి రాష్ట్రస్థాయి వరకూ వైఎస్సార్సీపీ జెండా ఎగురవేయాలి. » సోషల్ మీడియాకు సంబంధించి కొత్తగా మరికొంతమంది కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేస్తూ వేధిస్తున్నారు. వారికి న్యాయ సహాయం అందించేందుకు లీగల్ సెల్ సిద్ధంగా ఉంది. ఏ సమయంలో ఎవరి దృష్టికి వచ్చినా వెంటనే లీగల్ సెల్‌ను అప్రమత్తం చేసి వారికి అండగా నిలబడాలి. » వైఎస్సార్సీపీ మండల స్థాయి వరకూ కమిటీల నియామకం కూడా ఈ నెల 16 నాటికి పూర్తి చేయాలని వైఎస్ జగన్ ఆదేశించారు. అవసరమైతే రాష్ట్ర స్థాయి నాయకుల సహకారం తీసుకుని కమిటీల నియామకాలు పూర్తిచేయాలి. -
విక్రాంత్‌రెడ్డికి ముందస్తు బెయిల్
సాక్షి, అమరావతి: కాకినాడ సీ పోర్టు వాటాల బదిలీ వ్యవహారంలో యర్రంరెడ్డి విక్రాంత్‌రెడ్డికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని, కేసుతో సంబంధం ఉన్న ఏ వ్యక్తినీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రలోభపెట్టడం, భయపెట్టడం చేయరాదని ఆదేశించింది. దర్యాప్తునకు సహకరించాలని చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం తీర్పు వెలువరించారు.తనను బెదిరించి పోర్టులో వాటాలను అరబిందో సంస్థ కొనుగోలు చేసిందంటూ సీఎం చంద్రబాబు సన్నిహితుడు, పోర్టు ప్రమోటర్ కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ నమోదు చేసిన ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ విక్రాంత్‌రెడ్డి డిసెంబర్లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విక్రాంత్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి, సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, కేవీ రావు తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు సుదీర్ఘ వాదనలు వినిపించారు. అనంతరం తీర్పు రిజర్వ్ చేసిన న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి శుక్రవారం తన నిర్ణయాన్ని వెలువరించారు. నాలుగున్నరేళ్ల తర్వాత ఫిర్యాదా? ‘నాలుగున్నరేళ్ల క్రితం ఘటన జరిగితే ఇప్పుడు ఫిర్యాదు చేశారు. ఈ ఆలస్యంపై ఫిర్యాదుదారు కేవీ రావు నుంచి సంతృప్తికర సమాధానం రాలేదు. జాప్యానికి బెదిరింపులే కారణమని, ప్రభుత్వం మారడంతో ఫిర్యాదు చేశానంటూ ఆయన చేసిన వాదన ఆమోదయోగ్యం కాదు. అయన్ని బెదిరించి ఉంటే, కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు ఎందుకు దాఖలు చేయలేదో వివరణ లేదు. కేవీ రావును బెదిరించడం వల్లే ఆయన వాటాలను నామమాత్రపు ధరకు అరబిందో రియాలిటీకి బదిలీ చేశారన్నదే పిటిషనర్ విక్రాంత్‌రెడ్డిపై ఉన్న ప్రధాన నేరారోపణ. పీకేఎఫ్ శ్రీధర్ సంతానం ఆడిట్ సంస్థతో విక్రాంత్ కుమ్మక్కయి ఆడిట్ రిపోర్ట్‌లో సంఖ్యలను పెంచి చూపారని, దీన్ని అడ్డంపెట్టుకునే కేవీ రావును బెదిరించారని ఆరోపిస్తున్నారు. ఆడిట్ సంస్థతో కలిసి విక్రాంత్‌రెడ్డి సంఖ్యలను పెంచి చూపారనేందుకు ప్రాథమిక ఆధారాలు లేవు. దీనిద్వారా విక్రాంత్ లబ్ధి పొందారని సీఐడీ కూడా చెప్పడంలేదు. ఎఫ్ఐఆర్లోనూ ఆడిట్ కంపెనీని విక్రాంత్ కలిసినట్లు లేదు. అంతేకాక అరబిందో కొన్న వాటాల ద్వారా విక్రాంత్‌రెడ్డి ఆర్థికంగా లబ్ధి పొందినట్లు ఎలాంటి ఆరోపణలు లేవు. రిపోర్ట్‌ను ఆడిట్ సంస్థే తయారు చేసిందని కేవీ రావే అంగీకరిస్తున్నారు. అలాంటప్పుడు ఈ నివేదిక విషయంలో విక్రాంత్‌పై నేరారోపణలు చేయడానికి వీల్లేదు. దానిని విక్రాంత్‌రెడ్డి ఫోర్జరీ చేశారన్న ప్రశ్నే తలెత్తదు. ఫోర్జరీ చేశారని సీఐడీ, ఫిర్యాదుదారు కూడా చెప్పడం లేదు. విక్రాంత్‌రెడ్డి ఆ నివేదికను తారుమారు చేయడం, మార్చడం, మోసపూరితంగా సంపాదించడం చేయలేదు. అందువల్ల ఆయనకు సెక్షన్ 464 వర్తించదు’ అని జస్టిస్ శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఫిర్యాదు లేకుండానే ప్రాథమిక విచారణ జరపడమా! ‘2024 సెపె్టంబర్లో తామిచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ప్రాథమిక విచారణ జరిపారని కేవీ రావు చెబుతున్నారు. ఎఫ్ఐఆర్ను పరిశీలిస్తే.. 2024 డిసెంబరు 2న కేవీ రావు ఫిర్యాదు చేశారు. అంటే అంతకు ముందు ఎలాంటి ఫిర్యాదు లేదు. ఫిర్యాదు లేకుండానే పోలీసులు ఎలా ప్రాథమిక విచారణ జరిపారో తెలియడంలేదు. నాలుగున్నరేళ్ల జాప్యంతో ఫిర్యాదు చేసినప్పుడు, పోలీసులు ప్రాథమిక విచారణ జరిపి తీరాలి. కానీ, ఇక్కడ ఫిర్యాదు ఇవ్వకపోయినా పోలీసులు ప్రాథమిక విచారణ జరిపారు. దీనినిబట్టి పోలీసులు దర్యాప్తును ఏ తీరున సాగించారన్న దానిపై ఎలాంటి సందేహం అక్కర్లేదు’ అని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. -
చెప్పండి.. చేసేస్తాం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పెద్దల రెడ్‌బుక్ కుట్రలకు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా సెల్యూట్ చేస్తుండటం యావత్ పోలీసు శాఖను విభ్రాంతికి గురిచేస్తోంది. వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులతో మరింతగా విరుచుకు పడాలని ఆయన జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లకు టార్గెట్ పెట్టి మరీ ఒత్తిడి చేస్తుండటం సర్వత్రా చర్చనీయాంశమైంది. మరోవైపు సీబీఐ దర్యాప్తు చేస్తున్న మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రాష్ట్ర పోలీసు శాఖ అత్యుత్సాహం ప్రదర్శిస్తుండటం విస్మయ పరుస్తోంది. వివేకా హత్య కేసులో సాక్షిగా ఉన్న రంగన్న సుదీర్ఘకాలం అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇటీవల ఆయన ఆరోగ్యం విషమించడంతో కుటుంబ సభ్యులు తొలుత పులివెందుల, ఆ తర్వాత కడప రిమ్స్‌కు తరలించారు. ఈ క్రమంలో గురువారం మృతి చెందాడు. కాగా, ఈ అంశాన్ని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలని కూటమి ప్రభుత్వ పెద్దలు పన్నాగం పన్నారు. రంగన్న మృతితోపాటు మరికొన్ని సహజ మరణాలపై దర్యాప్తు కోసం సిట్‌ను నియమించారు. వివేకా హత్య కేసును ఐదేళ్లుగా సీబీఐ దర్యాప్తు చేస్తోంది. మరి రంగన్న తదితరుల సహజ మరణాలపై ఏపీ పోలీసులు సిట్ పేరుతో దర్యాప్తు చేయడం ఏమిటని న్యాయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. కానీ, డీజీపీ గుప్తా మాత్రం ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం అత్యుత్సాహం ప్రదర్శిస్తుండటం విస్మయ పరుస్తోంది. వెలగపూడిలోని సచివాలయంలో శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత డీజీపీ గుప్తా.. తాజా సిట్ గురించి మంత్రులకు వివరించారు. పైగా ‘రంగయ్య మృతి అనుమానస్పదమే’ అని చెప్పారు. ఇంకా సిట్ దర్యాప్తే మొదలు పెట్టకుండా రంగన్న మృతి అనుమానాస్పదమని డీజీపీ ఏకపక్షంగా మంత్రులకు వివరించడం పోలీసు శాఖ ప్రతిష్టను రాజకీయ ప్రయోజనాల కోసం పణంగా పెట్టిననట్టేనని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. తద్వారా సిట్ నివేదిక ఎలా ఉండబోతోందన్నది స్పష్టమవుతోందని చెబుతున్నారు. వేధించకపోతే వేటేస్తాం..‘వైఎస్సార్సీపీ నేతలే లక్ష్యంగా అక్రమ కేసుల జోరు పెంచండి’ అని డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లకు తేల్చిచెప్పారు. ఇదే ప్రధానాంశంగా ఆయన ఇటీవల టెలీ కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారని పోలీసు వర్గాలే చెబుతున్నాయి. వైఎస్సార్సీపీ నేతలకు వ్యతిరేకంగా కూటమి నేతలు చేస్తున్న ఫిర్యాదులపై తక్షణం స్పందించాలని.. ప్రాథమిక ఆధారాలు లేకుండానే అక్రమ కేసులు నమోదు చేసేయాలని ఆయన విస్పష్టంగా ఆదేశించారు. వైఎస్సార్సీపీకి చెందిన ఏయే నేతలపై ఫిర్యాదు చేయాలన్నది టీడీపీ ప్రధాన కార్యాలయం నిర్ణయిస్తుందని, ఆ ఫిర్యాదులు అందిన వెంటనే అరెస్టులకు తెగబడాలని డీజీపీ నిర్దేశించారని సమాచారం. ఈ సందర్భంగా న్యాయ, సాంకేతిక అంశాలను కొందరు ఎస్పీలు ప్రస్తావించగా, డీజీపీ గుప్తా వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. చెప్పినట్టు వేధించాల్సిందేనని, లేకుంటే బదిలీ వేటేస్తామని ఆయన తేల్చి చెప్పినట్లు సమాచారం. మరోవైపు సీఐడీ, ఏసీబీ, విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్ విభాగాల ద్వారా కూడా వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసుల జోరు పెంచామని కూడా ఆయన వారితో చెప్పడం గమనార్హం. ఎవరు ఎంతగా అక్రమ కేసులతో వేధిస్తున్నారన్నదాన్ని బట్టి ఎస్పీలు, కమిషనర్ల పనితీరు నివేదికలు ఆధారపడి ఉంటాయని కూడా వ్యాఖ్యానించినట్టు సమాచారం.తీసుకోండి ఫిర్యాదులు.. పెట్టండి కేసులు» పోసాని కృష్ణ మురళిపై ఒక్కసారిగా అబద్ధపు ఫిర్యాదులు జోరందుకున్నాయి. ఆయనపై రాష్ట్రంలో వేర్వేరు జిల్లాల్లో పోలీసులు చకచకా అక్రమ కేసులు నమోదు చేశారు. హైదరాబాద్‌లో ఉన్న ఆయన్ను అరెస్ట్ చేసి.. అన్నమయ్య, పల్నాడు, కర్నూలు జిల్లాలు తిప్పుతూ వేధింపులకు తెగబడ్డారు. » మాజీ మంత్రి విడదల రజినీని తాజాగా లక్ష్యంగా చేసుకున్నారు. ఆమెపై ఓ క్వారీ యజమాని ద్వారా అవాస్తవ ఆరోపణలతో ఏసీబీకి ఫిర్యాదు ఇప్పించారు. ఆ ఫిర్యాదు ప్రతి దుమ్ము దులిపిన ఏసీబీ అధికారులు ఆమెను అక్రమ కేసుతో వేధించేందుకు సన్నద్ధమవుతున్నారు. » పర్చూరు నియోజకవర్గంలో గతంలో ఓట్లను తొలగించారనే ఆరోపణలతో ప్రభుత్వం మరో కుట్రకు తెరతీసింది. అందుకోసం కుట్ర పూరితంగా టీడీపీ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావుతో ఫిర్యాదు చేయించింది. ఆ వెంటనే ఓట్ల తొలగింపుపై దర్యాప్తునకు సిట్‌ను నియమించింది. టీడీపీ అస్మదీయ అధికారి, ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్‌ను సిట్ ఇన్చార్జ్గా డీజీపీ సూచించడం గమనార్హం. ఆయన ఇప్పటికే రఘురామకృష్ణంరాజు ఫిర్యాదుతో ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్, విజయ్‌పాల్ తదితరులపై చెలరేగిపోతున్న విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు కొట్టివేసిన అభియోగాలపై తాజాగా కేసు నమోదు చేసి మరీ వేధింపులకు పాల్పడుతూ దామోదర్ హల్చల్ సృష్టిస్తున్నారు. ఈ కేసులో అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వాలంటూ గుంటూరు జీజీహెచ్ అధికారులను వేధిస్తున్నారు. అటువంటి ట్రాక్ రికార్డు ఉన్న ఈయనకు సిట్ బాధ్యతలు అప్పగించడం పక్కా ప్రభుత్వ పన్నాగమే. » ఇక వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై సీఐడీ నమోదు చేసిన అక్రమ కేసులోనూ డీజీపీ గుప్తా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఉద్యోగి సత్య ప్రసాద్‌ను వేధించి అబద్ధపు వాంగ్మూలం ఇప్పించారు. తాజాగా ప్రభుత్వ మాజీ సలహాదారుడు రాజ్ కసిరెడ్డితో అబద్ధపు వాంగ్మూలం ఇప్పించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకోసం ఆయన సమీప బంధువులను వేధిస్తూ ఒత్తిడి పెంచుతున్నారు. తాము చెప్పినట్టు అబద్ధపు వాంగ్మూలం ఇవ్వకపోతే అక్రమ కేసులు నమోదు చేస్తామని రాజ్ కసిరెడ్డి సమీప బంధువుల ఇళ్లకు పోలీసులు వెళ్లి బెదిరింపులకు పాల్పడుతున్నారు. -
జగన్ రాసింది చరిత్ర.. బాబు చేస్తోంది దగా
చదువుకునే బిడ్డలకు గట్టి చేయూతనిచ్చారు.. ఆడబిడ్డలకు గూడు కట్టించారు.. రాజకీయాల్లో నాయకురాళ్లుగా నలుగురినీ నడిపించేందుకు పదవులిచ్చి పెద్దపీట వేశారు.. సమాజంలో మహిళల భద్రతకు రక్షణ కవచంగా నిలిచారు వైఎస్ జగన్మోహన్రెడ్డి. మరే రాష్ట్రంలోనూ లేనివిధంగా అమ్మ కడుపులోని బిడ్డ నుంచి ఆప్యాయంగా ఆశీర్వదించే అవ్వ వరకు మహిళలే కేంద్రంగా సంక్షేమ పథకాలు అందించారు. నవరత్న కాంతుల్లో మహిళా లోకం నవశకం నాంది పలికింది. ఆయన పాలనలో చేపట్టిన విప్లవాత్మక కార్యక్రమాలతో మహిళలు ఆర్థిక, సామాజిక, రాజకీయంగా ముందుకుసాగారు. మహిళాభివృద్ధి ద్వారానే కుటుంబ అభివృద్ధి జరుగుతుందనే గట్టి విశ్వాసంతో వైఎస్ జగన్ కొత్త చరిత్ర సృష్టించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణ పేదలైన అక్కచెల్లెమ్మలకు అండగా నిలిచారు. – సాక్షి, అమరావతిసాక్షి, అమరావతి: ఎన్నికల్లో సూపర్‌సిక్స్ హామీలను కురిపించి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా సీఎం చంద్రబాబు మహిళలను దగా చేస్తున్నారు. గతంలో వైఎస్ జగన్ అమలుచేసిన మహిళా సంక్షేమ పథకాలన్నింటినీ అటకెక్కించిన చంద్రబాబు కనీసం తాను ఇచ్చిన హామీలనూ పట్టించుకోవడం లేదు. సూపర్ సిక్స్ అమలుకే ఏడాదికి రూ.79,867 కోట్లు అవసరమైతే గత నవంబరులో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్లో రూ.7,282 కోట్లే ఇచ్చి రూ.865 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఈ ఏడాది (2025–26) బడ్జెట్లో సూపర్ సిక్స్ హామీలకు రూ.17,179 కోట్లు మాత్రమే కేటాయించగా ఎంత ఖర్చు చేస్తారనేది అనుమానమే. ప్రధానంగా తల్లికి వందనం, ఉచిత బస్సు, ఆడబిడ్డ సంక్షేమ నిధి వంటి అనేక పథకాల అమలులో కూటమి ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ప్రధాన హామీల అమలులో వైఫల్యం ఇలా..ఆడబిడ్డ నిధి దగా: 18 ఏళ్ల నుంచి 59 ఏళ్లలోపు ఉన్న ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున (ఏడాదికి రూ.18వేలు) ఇస్తామన్నారు. ఈ లెక్కన రాష్ట్రంలోని 1.80 కోట్ల మందికి రూ.32,400 కోట్లు కేటాయించాలి. రెండేళ్లకు రూ.64,800 కోట్లు కావాలి. కానీ, గత ఏడాది, ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపులు చేయకుండా ఆడబిడ్డలను దగా చేశారు.ఉచిత బస్సు.. తుస్సు: మహిళలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇందుకోసం నెలకు రూ.275 కోట్ల చొప్పున ఏడాదికి రూ.3,500 కోట్లవుతుంది. నిరుడు, ఈ ఏడాది కలిపి బడ్జెట్లో రూ.7 వేల కోట్లు ఎగరగొట్టడంతో ఉచిత బస్సు తుస్సు అనిపించారు.తల్లికి వందనంలోనూ వంచనే: పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తామన్నారు. గత బడ్జెట్లో తల్లికి వందనం పథకానికి రూ.5,386 కోట్లు కేటాయింపులు చేసినా రూపాయి కూడా ఎవరికీ ఇవ్వలేదు. ఈ ఏడాది బడ్జెట్లో బడ్జెట్ ఇన్ బ్రీఫ్‌లో ఆ పథకానికి రూ.9,407 కోట్లు కేటాయించినట్లు చూపారు. బడ్జెట్ డాక్యుమెంట్లో డిమాండ్ ఫర్ గ్రాంట్స్‌లో మాత్రం రూ.8278 కోట్లు కేటాయించినట్లు మాత్రమే ఉంది. 1 నుంచి 12వ తరగతి రాష్ట్రంలో 87,41,885 మంది పిల్లలు చదువుతున్నారు. వారికి రూ.15 వేల చొప్పున ఆ పథకానికి రూ.13,112 కోట్లు కేటాయించాలి. విద్యా దీవెనను భ్రష్టు పట్టించేలా: విద్యా దీవెన పథకానికి రూ.3,900 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా, చంద్రబాబు గత ఏడాది రూ.700 కోట్లే కేటాయించారు. విద్యా దీవెన, వసతి దీవెనకు ఈ ఏడాది మరో రూ.3,900 కోట్లు కావాలి. ఇచ్చింది రూ.2,600 కోట్లు మాత్రమే.దీపం సాయం..అంతా గ్యాస్: రాష్ట్రంలోని 1.59 కోట్ల గ్యాస్ కనెక్షన్లకు ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు కోసం రూ.4 వేల కోట్లు అవుతుంది. నిరుడు కేవలం రూ.865 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం ఈ ఏడాది రూ.2,439 కోట్లే కేటాయించింది.సున్నా వడ్డీ రుణాలు సున్నానేనా: డ్వాక్రా సంఘాలకు రూ.పది లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అన్నారు. దీనికోసం గత బడ్జెట్లో రూ.950 కోట్లు కేటాయించినా రూపాయి కూడా ఇవ్వలేదు. ఈ ఏడాది రూ.వంద కోట్లే కేటాయించారు.50ఏళ్లకే పెన్షన్.. ఒట్టిదే: బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ అని హామీ ఇచ్చారు. మరో 20 లక్షల మందికి నెలకు రూ.4 వేల చొప్పున అందించాలంటే ఏడాదికి రూ.9,600 కోట్లు అవుతుంది. రెండు బడ్జెట్లలోనూ కేటాయింపులు చేయకపోవడంతో 50 ఏళ్లకే పెన్షన్ ఒట్టిదేనా? అని మహిళలు మండిపడుతున్నారు. ఇవే కాకుండా నిరుద్యోగ భృతి, అన్నదాత సుఖీభవ పథకాలకు మొండిచేయే. ఇక పింఛన్ల కోత సరేసరి. -
కోటి మంది డ్వాక్రా మహిళలకు ధోకా
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. యావత్ ప్రపంచం మహిళల హక్కులు, ఆర్థిక స్వావలంబన, ఉన్నతి కోసం మాట్లాడుకుంటున్న తరుణంలో చంద్రబాబు సర్కారు ఏకంగా మహిళా దినోత్సవం రోజే వారి సాధికారతకు తూట్లు పొడిచింది! అక్కచెల్లెమ్మల అభ్యున్నతి కోసం ఏర్పాటైన స్త్రీ నిధి బ్యాంకును పూర్తిగా నిర్వీర్యం చేస్తూ అడుగులు వేస్తోంది. కూటమి సర్కారు కొత్త పథకాలు విద్యాలక్ష్మి, కల్యాణలక్ష్మి కోసం ఇచ్చే రుణాలను స్త్రీ నిధి బ్యాంకు నుంచి ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతో బ్యాంకు మనుగడే ప్రశ్నార్థకంగా మారుతోంది.అదే అంతకు ముందు గత ఐదేళ్లూ మహిళా సాధికారతే ధ్యేయంగా వైఎస్ జగన్ ప్రతి అడుగూ వేశారు. అన్ని పథకాలను మహిళల పేరిటే అమలు చేసి ఆర్థిక ఆసరా కల్పించారు. ప్రతి పథకానికి బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించి చిత్తశుద్ధిని చాటుకున్నారు. వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫా కార్యక్రమాల ద్వారా ఏకంగా రూ.427.27 కోట్ల మొత్తాన్ని అర్హులకు పారదర్శకంగా అందించారు.సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పొదుపు సంఘాల మహిళలకు స్త్రీ నిధి బ్యాంకు ఇచ్చే రూ.4 వేల కోట్ల రుణాల్లో రూ.1,000 కోట్ల చొప్పున కళ్యాణలక్ష్మీ, విద్యాలక్ష్మీ పథకాలకు నాలుగు శాతం వడ్డీకి రుణాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. మొత్తం రుణాల్లో నాలుగో వంతు రుణాలను తక్కువ వడ్డీకి ఇవ్వడం వల్ల స్త్రీ నిధి సంస్థ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోనుంది. గత ఐదేళ్లలో స్త్రీ నిధికి సంబంధించి దాదాపు రూ.4 వేల కోట్లు నిరంతరం పొదుపు సంఘాల మహిళల వద్ద రుణాలు రూపంలో ఉన్నాయి. పథకాల అమలుకు చిత్తశుద్ధితో బడ్జెట్లో నిధులు కేటాయించకుండా ఇలా అడ్డదారిలో మళ్లించడం వల్ల పొదుపు సంఘాల వ్యవస్థ దెబ్బతింటుందనే ఆందోళన మహిళల్లో వ్యక్తమవుతోంది. కళ్యాణలక్ష్మి, విద్యాలక్ష్మి పథకాలకు బడ్జెట్లో నిధులు కేటాయించకుండా మహిళలను మోసం చేసిన టీడీపీ కూటమి ప్రభుత్వం ‘స్త్రీ నిధి’ నిధులను వాడుకోవాలని నిర్ణయించింది. కోటి మందికి పైగా ఉన్న పొదుపు మహిళలకు తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే సంస్థ నిధులను వాడుకోవడం అంటే.. ఆ మేరకు డ్వాక్రా మహిళల రుణాల లభ్యత తగ్గించడమేననే ఆందోళన వ్యక్తమవుతోంది. అత్యవసర సమయాల్లో ఆర్థిక తోడ్పాటు అందించే స్త్రీ నిధి బ్యాంకును నష్టాల ఊబిలోకి గెంటేస్తోందని, సర్కారు నిర్వాకాలతో సంస్థ మూతపడితే పేద మహిళల ఆర్థిక అవసరాలకు తోడ్పాటు కరువై దిక్కుతోచని పరిస్థితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పథకాల అమలుకు బడ్జెట్లో నిధుల కేటాయింపులు లేకుండా.. స్త్రీ నిధి ద్వారా రుణాలు ఇప్పించాలన్న కూటమి సర్కారు యోచనపై అధికారులు విస్తుపోతున్నారు. 7 శాతం వడ్డీకి అప్పులు తెచ్చి... 4 శాతం వడ్డీకి రుణాలివ్వాలట! సొంత నిధులు తక్కువగా ఉండే స్త్రీ నిధి బ్యాంకు ఇతర బ్యాంకుల నుంచి ఏడు శాతం వడ్డీకి తీసుకొచ్చిన డబ్బులనే 11 శాతం వడ్డీకి పొదుపు మహిళలకు రుణంగా ఇస్తూ ఉంటుంది. ఏడు శాతానికి పైన తీసుకొనే నాలుగు శాతం వడ్డీలో రెండు శాతం వడ్డీ డబ్బులను తిరిగి గ్రామ, మండల సమాఖ్యలకు, మిగిలిన 2 శాతం వడ్డీ డబ్బులను స్త్రీ నిధి సిబ్బంది జీతాలు, సంస్థ నిర్వహణకు వినియోగిస్తుంటారు. స్త్రీ నిధి సంస్థ ఏడు శాతం వడ్డీకి తెచ్చుకుంటున్న నిధులను ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా ఆలోచన చేస్తున్న కళ్యాణలక్ష్మీ, విద్యాలక్ష్మీ పథకాల లబ్దిదారులకు నాలుగు శాతం వడ్డీకే రుణాలు ఇప్పించేలా కసరత్తు చేశారు. ఈ ప్రక్రియకు సంబంధించి ప్రణాళిక ఇప్పటికే దాదాపు కొలిక్కి వచ్చింది. అంటే మూడు శాతం చొప్పున వడ్డీ డబ్బులను స్త్రీ నిధి బ్యాంకు నష్టపోవాల్సి ఉంటుంది. ఈ పథకాలు అమలు చేయడం వల్ల స్త్రీ నిధి సంస్థకు ఆర్థికంగా వాటిల్లే నష్టానికి సంబంధించి తిరిగి చెల్లింపులు, అదనపు సాయం అందించడం గురించి ఇప్పటిదాకా ప్రభుత్వ స్థాయిలో జరిగిన కసరత్తులో ఎక్కడా కనీసం చర్చ జరగలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. పూర్తిగా స్త్రీ నిధి సంస్థ నిధులతోనే ఈ పథకాలను అమలు చేసేలా అడుగులు పడుతున్నాయి. ఒకవైపు వడ్డీకి తెచ్చుకునే డబ్బులను మరోవైపు అంతకంటే తక్కువ వడ్డీకి రుణాలుగా ఇవ్వడం ద్వారా స్త్రీ నిధి సంస్థ నష్టాల ఊబిలోకి వెళ్లి మూతపడే అవకాశం ఉంటుందని మహిళా సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. స్త్రీ నిధి బ్యాంకు నిబంధనలివీ..స్త్రీ నిధి బ్యాంకు అందించే రుణాలను పేద మహిళల కుటుంబాల జీవనోపాధుల పెంపు లేదా ఆదాయ అభివృద్ధి కార్యక్రమాల కోసమే వెచ్చించాలి. రుణాలను సద్వినియోగం చేసుకుని మహిళల ఆదాయం పెరిగేలా తోడ్పాటునివ్వాలి. స్త్రీ నిధి నిబంధనలు గాలికి.. సాధారణంగా పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉండే మహిళలు బ్యాంకు లింకేజీ కార్యక్రమంలో కమర్షియల్ బ్యాంకు ద్వారా రుణాలు పొందుతుంటారు. బ్యాంకు లింకేజీ ద్వారా మహిళలు పొందే రుణాలను మూడు నాలుగేళ్ల కాల పరిమితితో నెలవారీ కిస్తీ రూపంలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం క్యాష్ అండ్ క్రెడిట్ విధానం అమలులో ఉన్నా.. ఒక్కో సంఘం మూడు నాలుగేళ్లకు ఒకసారే బ్యాంకు లింకేజీ లోన్లు తీసుకుంటాయి. పొదుపు సంఘం ద్వారా మహిళలు ఒకసారి బ్యాంకు లింకేజీ రుణం పొందిన తర్వాత అత్యవసర సమయాల్లో స్త్రీ నిధి ద్వారా అదనపు ఆర్థిక రుణాన్ని పొందుతుంటారు. పొదుపు మహిళలకు బ్యాంకు లింకేజీ కార్యక్రమంలో రుణాలిచ్చినా, స్త్రీ నిధి ద్వారా రుణాలిచ్చినా నిబంధనల ప్రకారం ఆయా కుటుంబాల జీవనోపాధుల పెంపు లేదా ఆదాయ అభివృద్ధి కార్యక్రమాల కోసమే వెచ్చించాలి. ఆ రుణాలను ఉపయోగించుకొని తమ ఆదాయం పెంచుకోవాలి. అయితే కూటమి సర్కారు ఆలోచన దీనికి భిన్నంగా ఉంది. స్త్రీ నిధి బ్యాంకు నిబంధనలను తుంగలో తొక్కి కొత్త పథకాలకు మళ్లిస్తోంది. జగన్ హయాంలో ప్రభుత్వమే నేరుగా సాయం.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఐదేళ్ల పాటు పేద కుటుంబాల పిల్లల చదువులకు అండగా నిలుస్తూ అమ్మ ఒడి, వసతి దీవెన, విద్యాదీవెన పథకాల ద్వారా తిరిగి చెల్లించే అవసరం లేకుండా నేరుగా పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసింది. కళ్యాణమస్తు, షాదీ తోఫా కార్యక్రమాల ద్వారా రూ.427.27 కోట్ల మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేని విధానంలో అర్హులకు అందించింది. ఎన్నికల ముందు ఎడాపెడా హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు లబ్ధిదారులంతా తప్పనిసరిగా తిరిగి చెల్లించాల్సిన రుణాల రూపంలో విద్యాలక్ష్మీ, కళ్యాణలక్ష్మీ పథకాల అమలుకు సిద్ధమైంది. ఇందుకోసం 12 ఏళ్లుగా కోటి మందికి పైగా పొదుపు మహిళల ఆర్థిక అవసరాలు తీర్చిన స్త్రీ నిధి సంస్థను బలి పెడుతోంది. స్త్రీ నిధిని నష్టాల్లోకి నెట్టి నిర్వీర్యం చేసేలా అడుగులు వేయటాన్ని మహిళా సంఘాలు, రాజకీయ వర్గాలు తప్పుబడుతున్నాయి. నిధులు మళ్లిస్తే ఊరుకోం స్వయం సహాయక సంఘాల మహిళల జీవనోపాదులను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన స్త్రీ నిధి నిధులను ఇతర అవసరాలకు మళ్లిస్తే ఊరుకునేది లేదు. ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు ప్రకటించిన కళ్యాణలక్ష్మి, విద్యాలక్ష్మి పథకాలకు ప్రభుత్వం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించాలి. ఆ పథకాల అమలుకు బడ్జెట్లో కేటాయింపులు లేకపోవడం అన్యాయం. పొదుపు మహిళల అభ్యున్నతికి ఉద్దేశించిన స్త్రీ నిధిని మళ్లించేందుకు యత్నిస్తుండటం దారుణం. దీనివల్ల పొదుపు మహిళల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలి. – పి.నిర్మలమ్మ, ఐద్వా సీనియర్ నాయకురాలు, కర్నూలుస్త్రీ నిధిని మళ్లించడం దారుణం టీడీపీ కూటమి ప్రభుత్వం మహిళా సంక్షేమ పథకాలకు గండికొడుతోంది. మహిళా సాధికారిత గురించి గొప్పలు చెబుతూ కల్యాణలక్ష్మి, విద్యాలక్ష్మి పథకాలకు బడ్జెట్లో నిధులు కేటాయించకపోవటాన్ని బట్టి పాలకులకు చిత్తశుద్ధి లేదని రుజువవుతోంది. స్త్రీ నిధి బ్యాంకు రుణాలను ఇతర పథకాలకు మళ్లించే యత్నాలు సిగ్గుచేటు. ప్రభుత్వ మోసపూరిత విధానాలను మహిళలు గమనిస్తున్నారు. – ఎం.విజయ, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ప్రకాశం జిల్లా అధ్యక్షురాలు ఊరుకునేది లేదు.. కూటమి ప్రభుత్వం స్త్రీ నిధిని ఇతర పథకాలకు మళ్లిస్తే ఊరుకునేది లేదు. ఇలాంటి అనాలోచిత నిర్ణయాలతో డ్వాక్రా మహిళలకు రుణాలు తగ్గే ప్రమాదం ఉంది. బ్యాంకు నిబంధనలను తుంగలో తొక్కి అసంబద్ధ నిర్ణయాలు తీసుకోవడం సరికాదు. – చిట్టెమ్మ, డ్వాక్రా సంఘం సభ్యురాలు, చిత్తూరు జిల్లా.నిధులు కేటాయించకపోవడం దారుణం కళ్యాణలక్ష్మీ, విద్యాలక్ష్మి పథకాలకు బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం దారుణం. డ్వాక్రా మహిళల సాధికారతకు రుణాలు సమకూరుస్తున్న స్త్రీ నిధి బ్యాంకు నిధులను ఈ పథకాలకు మళ్లిస్తే డ్వాక్రా మహిళలకు సమస్యలు తప్పవు. డ్వాక్రా నిధులతో కుటుంబాలను నెట్టుకొస్తున్న పేద వర్గాల మహిళలు మళ్లీ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితిని ఈ ప్రభుత్వం కల్పిస్తోంది. డ్వాక్రా మహిళలకు స్త్రీ నిధి రుణాలు అందని పరిస్థితి ఉత్పన్నం కానుంది. డ్వాక్రా మహిళలకు ద్రోహం తలపెట్టే యత్నాలను విరమించుకోవాలి. కళ్యాణలక్ష్మి, విద్యాలక్ష్మి పథకాలకు పూర్తి స్థాయిలో నిధులు కేటాయించాలి. డ్వాక్రా మహిళలకు ఇబ్బంది లేకుండా బ్యాంకు రుణాలను సక్రమంగా అందించి ఆర్థికంగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. – ఇ.చంద్రావతి, శ్రామిక మహిళా సంఘాల ప్రతినిధి, కాకినాడ జిల్లా -
అబద్ధాల్లో చంద్రబాబు డబుల్ పీహెచ్డీ: సాకే శైలజానాథ్
సాక్షి, తాడేపల్లి: అబద్దాలు చెప్పటంలో చంద్రబాబు డబుల్ పీహెచ్డీ చేశారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ దుయ్యబట్టారు. అధికారంలోకి రావటానికీ, వచ్చాక కూడా అబద్ధాలు ఆడటం చంద్రబాబుకు అలవాటు అంటూ మండిపడ్డారు. రాష్ట్రం శ్రీలంకలాగ మారుతోందంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి పదేపదే విష ప్రచారం చేశారు. రూ.14 లక్షల కోట్ల అప్పు రాష్ట్రానికి ఉన్నట్టు ప్రచారం చేశారు.. వాస్తవానికి చంద్రబాబు ఇప్పుడు చేస్తున్న అప్పులతో అల్లాడిస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న అప్పుల కేకలు పవన్ కళ్యాణ్‌కి వినపడటం లేదా?’’ అంటూ శైలజానాథ్ ప్రశ్నించారు.‘‘గవర్నర్ స్పీచ్‌లో కూడా అబద్దాలు చెప్పారు. వైఎస్సార్సీపీ సభ్యులు అసెంబ్లీలో అప్పుల గురించి అడిగితే వాస్తవాలు బయట పడ్డాయి. ఇప్పటి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఏకంగా శ్రీలంకని మించి అప్పులు చేశారన్నారు. బీజేపీ నేత పురంధేశ్వరి కూడా రూ.12 లక్షల అప్పు ఉందన్నారు. ప్రజలను మోసం చేయటానికి వీరంతా కలిసి వ్యవస్థీకృత నేరం చేశారు. అప్పటి జగన్ ప్రభుత్వంపై ఒక ప్రణాళికాబద్ధంగా దుష్ప్రచారం చేశారు. చంద్రబాబు ఈ 9 నెలలకే లక్షా 47 వేల కోట్ల అప్పు చేశారు. ఈ తెచ్చిన అప్పంతా ఎవరికి ఇచ్చారు?’’ అంటూ శైలజానాథ్ నిలదీశారు.‘‘ప్రజలకు ఇచ్చారా? పెద్దవాళ్లే పంచుకున్నారా?. సంపద సృష్టిస్తామని చెప్పి అప్పులు చేస్తున్నారు. సూపర్ సిక్స్ పథకాలన్నిటినీ వెంటనే అమలు చేయాలి. అప్పులు తెచ్చి రాజధానిని కడుతున్నారు. అన్ని ప్రాంతాల ప్రజల సొమ్మును రాజధానిలో పెడుతున్నారు. కేంద్రం ఇస్తానన్న రూ.20 వేల కోట్లు తెచ్చి రాజధాని నిర్మాణం చేయాలి’’ అని సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు. -
కూటమి నేతల్లో క్రెడిబులిటీ లేదు : శ్యామల
సాక్షి,తాడేపల్లి : రాష్ట్రంలో మహిళలకు భయం తప్ప భరోసా లేదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి శ్యామల అన్నారు. శుక్రవారం (మార్చి7) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు.‘వైఎస్సార్సీపీ తరుఫున మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. ఏపీలో కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. కూటమి నేతలకు క్రెడిబులిటీ లేదు. వైఎస్సార్సీపీ హయాంలో మహిళలకు అగ్రతాంబూలం కల్పించారు. నవరత్నాల్లో కూడా 90 శాతం మహిళలకే నిధులు కేటాయించింది. దిశ యాప్‌తో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి రక్షణ కల్పించారు. జాతీయ స్థాయిలో 19 అవార్డులు వచ్చిన దిశ యాప్‌ను కూటమి ప్రభుత్వం నిర్విర్యం చేసింది. దిశ ప్రతులను ఇప్పటి హోమంత్రి అనిత తగల బెట్టారు.కూటమి ప్రభుత్వంలో మహిళలపై 16,809 కేసులు నమోదయ్యాయని హోంమంత్రి ప్రకటించారు. వాటిల్లో ఎన్ని కేసుల్లో బాధితులకు న్యాయం చేశారు?. మచ్చుమర్రి, గుడ్లవల్లేరు ఘటనలు ప్రభుత్వ ఉదాసీనకు అద్దం పట్టాయి.పుంగనూరులో చిన్నారి హత్య జరిగితే హోంమంత్రి రాజకీయాలు మాట్లాడటం సిగ్గుచేటు.ఆడపిల్లలు, మహిళలకు రక్షణ కలిగింది కేవలం వైఎస్ జగన్ పాలనలోనే. ఒక సోదరుడిగా, బిడ్డగా ముందుండి వైఎస్ జగన్ నడిపించారు. నవరత్నాల పథకంతో మహిళలకు గౌరవం పెరిగింది. ఎవరూ అడగకుండానే జగన్ మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పించారు.జడ్పీ ఛైర్మన్లు, డిప్యూటీ ఛైర్మన్లు, మేయర్లు ఇలా సగానికిపైగా మహిళలకే కేటాయించారు. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతుంటే పవన్ కళ్యాణ్ చోద్యం చూస్తున్నారా?.సూపర్ సిక్స్ హామీలన్నీ మోసం మోసం. ఉచిత బస్సు పథకంపై నిలువునా మోసం చేశారు. రాష్ట్రం అంతా ఉచిత బస్సు ద్వారా తిరగవచ్చని చంద్రబాబు చెబితే జిల్లాలకే పరిమితం చేస్తున్నట్టు మంత్రి సంధ్యారాణి ప్రకటించారు’అని అన్నారు.