Andhra Pradesh High Court
-
ఏపీ హైకోర్టులో పోసాని కృష్ణమురళికి ఊరట
సాక్షి, అమరావతి: ఏపీ హైకోర్టులో పోసాని కృష్ణమురళికి ఊరట లభించింది. తనపై బాపట్ల పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును క్వాష్ చేయాలంటూ హైకోర్టులో పోసాని పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. BNS 35(3) సెక్షన్‌ను ఫాలో కావాలని పోలీసులను కోర్టు ఆదేశించింది.కాగా, పోసానిని సీఐడీ పోలీసులు నిన్న (బుధవారం) రాత్రి( గుంటూరులో ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి ఇంటి వద్ద హాజరు పరిచారు. ఈ సందర్భంగా పోసాని అనారోగ్య సమస్యల గురించి విన్నవించుకున్నారు. బెయిల్ రాకపోతే తనకు ఆత్మహత్యే శరణ్యమని పోసాని కృష్ణమురళి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులకు సంబంధించి తనకు ఎటువంటి పాపం తెలియదని, తానేం చేయలేదని న్యాయమూర్తి ఎదుట బోరున విలపించారు.నిజం మాట్లాడినందుకు తన మీద కక్ష కట్టి ఇలాంటి అన్యాయమైన కేసులు పెట్టారని విన్నవించారు. తల్లి మీద, పిల్లల మీద ఒట్టేసి చెబుతున్నానని తనకే పాపమూ తెలియదని న్యాయమూర్తిని వేడుకొన్నారు. బెయిల్ ఇవ్వాలని కోరారు. వయసు మీదపడడంతో కూర్చోలేక పోతున్నానని చెప్పుకొచ్చారు. పోలీసులు ఎక్కడినుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియడం లేదని, ఇప్పటికే కొన్ని వందల మైళ్లు ప్రయాణం చేయించారని, ఎందుకు నన్ను తిప్పుతున్నారో అర్థం కావడం లేదని, ఇలా చేస్తే తాను ఎక్కువ రోజులు బతకనని మొరపెట్టుకున్నారు.టీడీపీలోకి రమ్మంటే రానందుకు లోకేశ్ తనను వేధిస్తున్నారని, నంది అవార్డుల ప్రకటనలో పక్షపాతాన్ని ఎత్తిచూపడంతో కక్ష కట్టారని తెలిపారు. అన్నీ నిజాలే చెబుతున్నానని నార్కో ఎనాలసిస్ టెస్టుకూ సిద్ధమన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఇన్ని కేసులు కడతారా అని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఆ విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం.. టీటీడీకి హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: తిరుమలలో నిర్మాణాలపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా పలు మఠాలు నిర్మాణాలు చేపట్టాయని.. వాటిపై చర్యలు తీసుకునేలా అధికారులు ఆదేశించాలంటూ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై బుధవారం.. హైకోర్టు విచారణ జరిపింది. తిరుమలలో నిర్మాణాల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని టీటీడీని హైకోర్టు హెచ్చరించింది.ఎంతో సుందరమైన తిరుమలను కాంక్రీట్ జంగిల్ కాకుండా చర్యలు తీసుకోవాలని టీటీడీకి హైకోర్టు తేల్చి చెప్పింది. తిరుమలలో నిర్మాణాలను ఇలానే కొనసాగిస్తే కొంతకాలం తర్వాత తిరుమల అటవీ ప్రాంతం కనుమరుగవుతుందని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. తిరుమల వ్యవహారంలో చాలా కఠినంగా వ్యవహరిస్తామని హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది. తిరుమలలో ధార్మిక సంస్థలు, మతం పేరుతో ఎలా పడితే అలా నిర్మాణాలు చేస్తామంటే కుదరదని న్యాయస్థానం తేల్చి చెప్పింది.ఇప్పటికే ఒక మఠం చేపట్టిన నిర్మాణాలపై చర్యలకు ఆదేశించామని పేర్కొన్న హైకోర్టు.. తిరుమలలో నిర్మాణాలు చేసిన పలు మఠాలకు నోటీసులు జారీ చేసింది. దేవాదాయ శాఖ కార్యదర్శి, టీటీడీ ఈవో, టీటీడీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్‌కు నోటీసులిచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని టీటీడీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ మే 7 తేదీకి కోర్టు వాయిదా వేసింది. -
కొడాలి నానికి ఏపీ హైకోర్టులో ఊరట
అమరావతి, సాక్షి: ఏపీ మాజీ మంత్రి కొడాలి నానికి హైకోర్టులో ఊరట లభించింది. విశాఖలో తనపై నమోదు అయిన కేసును క్వాష్ చేయాలని ఆయన పిటిషన్ వేయగా.. 35(3) కింద నోటీసులు ఇచ్చి వివరాలు తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.అధికారంలో ఉన్నప్పుడు కొడాలి నాని మూడేళ్లపాటు చంద్రబాబు, లోకేశ్‌లపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారని కిందటి ఏడాది నవంబర్‌లో విశాఖ మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు వచ్చింది. దీంతో ఆయనపై కేసు నమోదు అయ్యింది. -
పోసాని లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారణ
అమరావతి, సాక్షి: నటుడు పోసాని కృష్ణమురళి తరఫున వైఎస్సార్సీపీ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై మరికాసేపట్లో ఏపీ హైకోర్టులో వాదనలు జరగనున్నాయి. పోసానిపై ఏపీ సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్‌ను సవాల్ చేస్తూ ఈ పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి (లీగల్ వ్యవహారాలు), మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి స్వయంగా వాదనలు వినిపించనున్నారు. ఈ పిటిషన్ విచారణ కంటే ముందే.. కర్నూలు జైలు నుంచి సీఐడీ పోలీసులు పోసానిని గుంటూరుకు తరలిస్తుండడం గమనార్హం. పోసానిపై దాఖలైన అన్ని కేసుల్లోనూ కస్టడీ పిటిషన్లను తిరస్కరించిన న్యాయస్థానాలు.. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఊరట ఇచ్చాయి. అంతేకాదు.. పలు జిల్లాలో దాఖలైన కేసులనూ హైకోర్టు క్వాష్ చేసింది. ఈ తరుణంలో ఈ ఉదయం ఆయన కర్నూలు జైలు నుంచి విడుదల అవుతారని అంతా భావించారు. అయితే అనూహ్యంగా.. ఏపీ సీఐడీ తెర మీదకు వచ్చింది. ఐదు నెలల కిందట దాఖలైన కేసును పట్టుకుని గుంటూరు కోర్టు నుంచి పీటీ వారెంట్ పొందింది. ఈ ఉదయం కర్నూల్ జిల్లా జైలుకు పీటీ వారెంట్‌తో చేరుకుంది. ఇది పోసానిని బయటకు రాకుండా చేసే కుట్రేనని పేర్కొన్న వైఎస్సార్సీపీ.. హైకోర్టులో సదరు పీటీ వారెంట్‌ను సవాల్ చేసింది. -
తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక వ్యాజ్యం.. కూటమి ప్రభుత్వానికి తొలి దెబ్బ
అమరావతి, సాక్షి: తిరుపతి డిప్యూటీ మేయర్ అక్రమ ఎన్నికపై కూటమి ప్రభుత్వానికి తొలి దెబ్బ పడింది. ఈ ఎన్నికకు సంబంధించి దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంను బుధవారం విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా జరిగిన హింసపై బీజేపీ ఫైర్‌బ్రాండ్, ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్య స్వామి (Subramanian Swamy) ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ పిల్‌ను విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ థాకూర్ బెంచ్.. ఎన్నికపై స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలంటూ ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది.Dr Subramaniam @Swamy39 today appeared before the Andhra High Court at Amravati in a PIL challenging the irregularities in the Dy Mayor elections in Tirupati Municipal Corporation, the division bench of the Honble High Court led by Honble Chief Justice Thakur issued notice to the… pic.twitter.com/eiqg91GFpV— Jagdish Shetty (@jagdishshetty) March 12, 2025Today, AP HC issued notice on my PIL seeking investigation in the Tirupati Dy Mayor Elections. Status report by the police department was also directed. Shri Yugandhar Reddy & Ms Palak Bishnoi, Advocates assisted me in the Court.— Subramanian Swamy (@Swamy39) March 12, 2025అలాగే పోలీస్ శాఖకు కూడా ఆదేశాలు జారీ అయినట్లు సుబ్రహ్మణ్య స్వామి వెల్లడించారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక(Tirupati Deputy Mayor Election) సందర్భంగా జరిగిన ఘటనలను దురదృష్టకరమైన సంఘటనలుగా ఆయన ఇంతకు ముందు అభివర్ణించిన సంగతి తెలిసిందే. ‘‘చాలామందిని భయపెట్టి దాడులు చేశారు. ఎన్నికల సమయంలో హింసను నివారించేందుకు తీవ్రమైన చర్యలు తీసుకోవాలి అని పిల్ వేశా’’ అని ఆయన అన్నారు. తిరుపతి ఘటనలో కేవలం ఎఫ్ఐఆర్ మాత్రమే వేశారని, ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. ఈ విషయంపై కోర్టు చర్యలు తీసుకుంటే గనుక దేశవ్యాప్తంగా ఇదొక చట్టంగా మారుతుంది అని ఆయన అభిప్రాయడ్డారు. -
ఏపీ పోలీసులకు హైకోర్టు వార్నింగ్
-
పౌరుల స్వేచ్ఛను హరిస్తుంటే.. చూస్తూ ఊరుకోం
ప్రభుత్వ నిర్ణయాలు, చర్యలను విమర్శించడం.. నిరసించడాన్ని నేరం అంటే ప్రజాస్వామ్య మనుగడే సాధ్యం కాదు.స్వేచ్ఛగా మాట్లాడటం, భావ వ్యక్తీకరణ లాంటి వాటి గురించి మన పోలీసు యంత్రాంగానికి బోధించాల్సిన సమయం ఆసన్నమైంది. అలాగే ఈ విషయంలో వారికి జ్ఞానోదయం కూడా కలిగించాలి. స్వేచ్ఛగా మాట్లాడటం, భావవ్యక్తీకరణపై ఎంత వరకు సహేతుక నియంత్రణ విధించాలన్న దానిపై అవగాహన కల్పించాలి. రాజ్యాంగం మనకందించిన ప్రజాస్వామ్య విలువల గురించి కూడా వారికి అవగాహన కల్పించాల్సిన సమయం వచ్చింది.– ప్రొఫెసర్ జావీద్ అహ్మద్ హజమ్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలురెడ్ బుక్ రాజ్యాంగంలో.. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో.. చట్టాలను కాలరాస్తూ.. ప్రజాస్వామ్య విలువలకు పాతరేస్తూ.. పౌరుల స్వేచ్ఛను హరిస్తూ ఎడాపెడా అక్రమ అరెస్టులకు బరి తెగిస్తున్న ఖాకీలపై హైకోర్టు కన్నెర్ర చేసింది..! ప్రభుత్వాన్ని, రాజకీయ పార్టీల అధినేతలను విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు అడ్డగోలుగా కేసులు బనాయించడంపై నిప్పులు చెరిగింది. సోషల్ మీడియా యాక్టివిస్టులకు బెయిల్ రాకుండా చేసేందుకు ఉద్దేశపూర్వకంగా బీఎన్ఎస్ సెక్షన్ 111 కింద కేసులు బనాయించటాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం బలవంతపు వసూళ్ల కిందకు వస్తుందా? అని పోలీసులను నిలదీసింది. పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్‌లు చేస్తున్నా... మేజిస్ట్రేట్లు యాంత్రికంగా రిమాండ్ విధిస్తుండటాన్ని కూడా తప్పుబట్టింది. పోలీసులు చట్టం కంటే ఎక్కువ అనుకుంటున్నారని, ప్రతీ ఒక్కరూ చట్టానికి లోబడే నడుచుకోవాలని మందలించింది. ఊహల ఆధారంగా ఇష్టానుసారంగా అరెస్టులు చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది. చిన్న తప్పులే కదా అని వదిలేస్తే.. రేపు కోర్టులోకి వచ్చి అరెస్టులు చేయడానికి కూడా వెనుకాడరని ఘాటుగా వ్యాఖ్యానించింది.భిన్నాభిప్రాయం, అసమ్మతి తెలియచేయడం అన్నది రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో అంతర్భాగం. ప్రతి పౌరుడు కూడా ఇతరులు వ్యక్తం చేసే భిన్నాభిప్రాయాన్ని గౌరవించాలి.ప్రభుత్వ నిర్ణయాలపై శాంతియుతంగా నిరసన తెలియచేసే అవకాశం ఇవ్వడం ప్రజాస్వామ్యంలో తప్పనిసరి. – ప్రొఫెసర్ జావీద్ అహ్మద్ హజమ్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుసాక్షి, అమరావతి: టీడీపీ, ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు సోషల్ మీడియా యాక్టివిస్ట్ అవుతు శ్రీధర్‌రెడ్డికి కింది కోర్టు రిమాండ్ విధించడం చట్ట విరుద్ధమని హైకోర్టు ప్రకటించింది. ఈమేరకు రిమాండ్ ఉత్తర్వులను రద్దు చేస్తూ న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, డాక్టర్ జస్టిస్ కుంభజడల మన్మథరావుల ధర్మాసనం తీర్పు వెలువరించింది. తీర్పు కాపీ అందిన వెంటనే శ్రీధర్‌రెడ్డిని విడుదల చేయాలని నెల్లూరు జిల్లా జైలు సూపరింటెండెంట్‌ను ధర్మాసనం ఆదేశించింది. న్యాయమా?.. అన్యాయమా? అన్నదే ముఖ్యం...ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం పలు ఘాటు వ్యాఖ్యలు చేసింది. అవుతు శ్రీధర్‌రెడ్డి అరెస్ట్ విషయంలో పోలీసులు అడుగడుగునా ఉల్లంఘనలకు పాల్పడ్డారని స్పష్టం చేసింది. ఎలాంటి రుజువులు లేకుండా పోలీసులు తమ ఊహ ఆధారంగా అరెస్ట్‌లు చేస్తామంటే కుదరదని పేర్కొంది. ఇలా నిబంధనలకు విరుద్ధంగా ఆరెస్టులు చేస్తూ పౌరుల స్వేచ్ఛను హరిస్తామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది. మేజిస్ట్రేట్లు సైతం ఏమీ చూడకుండా యాంత్రికంగా వ్యవహరిస్తున్నారని ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. వ్యక్తులు ఎవరన్నది తమకు ముఖ్యం కాదని, పోలీసులు చర్యలు న్యాయమా? అన్యాయమా? అన్నదే ముఖ్యమని తేల్చి చెప్పింది. పోలీసులు చట్టం కంటే ఎక్కువ అనుకుంటున్నారని, ప్రతీ ఒక్కరూ చట్టానికి లోబడే పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. పౌరుల హక్కులను, స్వేచ్ఛను పరిరక్షించాల్సిన బాధ్యత తమపై ఉందంది. పౌరుల స్వేచ్ఛను తేలిగ్గా తీసుకునే చర్యలను తాము ఎంత మాత్రం అనుమతించబోమంది. చట్టాన్ని ఉల్లంఘిస్తామంటే కుదరదని పోలీసులకు తేల్చి చెప్పింది. ఎలా పడితే అలా అరెస్టులు చేసి మేజిస్ట్రేట్ల ముందు హాజరుపరుస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదంది. ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. చిన్న తప్పులే కదా అని వదిలేస్తే, రేపు కోర్టులోకి వచ్చి అరెస్టులు చేయడానికి కూడా వెనుకాడరని వ్యాఖ్యానించింది. అంతా బాగుందని చెప్పేస్తే, తాము మౌనంగా ఉండిపోతామని అనుకోవద్దని పోలీసులకు తేల్చి చెప్పింది. శ్రీధర్‌రెడ్డిని అరెస్ట్ చేసి హాజరుపరిచినప్పుడు మొదట మేజిస్ట్రేట్ రిమాండ్ తిరస్కరించారని, దీంతో ఆయన్ను స్వేచ్ఛగా వదిలేయాల్సిన పోలీసులు మళ్లీ అరెస్ట్ చూపారని పేర్కొంది. మేజిస్ట్రేట్ సైతం రిమాండ్ రిపోర్ట్‌లోని అంశాలను లోతుగా పరిశీలించకుండా శ్రీధర్‌రెడ్డికి రిమాండ్ విధించారని ధర్మాసనం ఆక్షేపించింది. ప్రతీ దశలోనూ పోలీసులు చట్ట ఉల్లంఘనలకు పాల్పడ్డారంది. శ్రీధర్‌రెడ్డి అరెస్ట్ విషయాన్ని సైతం సరైన పద్ధతిలో సంబంధీకులకు తెలియచేయలేదని ప్రస్తావించింది. రిమాండ్ రిపోర్టును పరిశీలిస్తే బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 47(1) కింద అరెస్ట్ విషయాన్ని తెలియచేయలేదని తెలిపింది. అందువల్ల శ్రీధర్‌రెడ్డి నిర్భంధం అక్రమమని ధర్మాసనం తేల్చి చెప్పింది. సెక్షన్ 47(1) ప్రకారం అరెస్ట్ విషయాన్ని నిర్భంధంలో ఉన్న వ్యక్తికి వెంటనే తెలియచేసి తీరాల్సి ఉంటుందని పేర్కొంది. శ్రీధర్‌రెడ్డిని హాజరుపరిచినప్పుడు సెక్షన్ 47(1) ప్రకారం అరెస్ట్‌కు గల కారణాలను నిందితునికి తెలియచేయలేదన్న కారణంతో మేజిస్ట్రేట్ రిమాండ్‌ను తోసిపుచ్చారు. సెక్షన్ 47(1) పోలీసులు చట్టం నిర్ధేశించిన విధి విధానాలను పాటించని పక్షంలో నిందితుడిని స్వేచ్ఛగా వదిలేయాలని చట్టం చెబుతోంది. ఈ కేసు విషయానికి వస్తే పోలీసులు చట్టపరమైన విధి విధానాలను పాటించకపోయినా కూడా నిందితుడికి మేజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. తద్వారా మేజిస్ట్రేట్ యాంత్రికంగా వ్యవహరించారు. అందువల్ల శ్రీధర్‌రెడ్డి రిమాండ్ చట్ట విరుద్ధమని హైకోర్టు స్పష్టం చేసింది. కింది కోర్టు రిమాండ్ ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అయితే శ్రీధర్‌రెడ్డిపై నమోదు చేసిన కేసులో దర్యాప్తు కొనసాగించుకోవచ్చునని పోలీసులకు సూచించింది.రిమాండ్‌పై భార్య న్యాయ పోరాటంతన భర్త అవుతు శ్రీధర్‌రెడ్డికి రిమాండ్ విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు చట్ట విరుద్ధమంటూ ఎం.ఝాన్సీ వాణిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ రఘునందన్‌రావు ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున పాపిడిప్పు శశిధర్‌రెడ్డి వాదనలు వినిపించగా ప్రభుత్వం తరఫున యతీంద్ర దేవ్ వాదనలు వినిపించారు.రీల్ పోస్టు చేయడం.. బలవంతపు వసూలా?సాక్షి, అమరావతి: సోషల్ మీడియా యాక్టివిస్టులకు బెయిల్ రాకుండా చేసేందుకు పోలీసులు ఉద్దేశపూర్వకంగా బీఎన్ఎస్ సెక్షన్ 111 కింద కేసులు బనాయించటాన్ని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ప్రభుత్వ తీరును వ్యంగ్యంగా చిత్రీకరించి ఫేస్బుక్లో సదరు రీల్‌ను పోస్ట్ చేసిన మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు కొరిటిపాటి ప్రేమ్‌కుమార్‌పై బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారంటూ కేసు పెట్టడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం బలవంతపు వసూళ్ల కిందకు వస్తుందా? అని పోలీసులను నిలదీసింది. ప్రేమ్ కుమార్ పోస్ట్ చేసిన రీల్‌కు, బలవంతపు వసూళ్లకు ఏం సంబంధం ఉందని ప్రశ్నించింది. ఆయన బలవంతపు వసూళ్లకు పాల్పడటంతో పాటు తరచూ నేరాలు చేసే వ్యక్తి అని రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొనడంపై మండిపడింది. దేని ఆధారంగా ఇలా రాశారంటూ నిలదీసింది. అరెస్ట్ సమయంలో ఆయన వద్ద రూ.300 దొరికాయి కాబట్టి వాటిని బలవంతపు వసూళ్లుగా చెబుతున్నారా? అంటూ మండిపడింది. మేజిస్ట్రేట్లు కూడా యాంత్రికంగా రిమాండ్ విధించేస్తున్నారంది. రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు ఏం పేర్కొన్నారు? అందులో పేర్కొన్న సెక్షన్లు నిందితునికి వర్తిస్తాయా? లాంటి విషయాలను లోతుగా పరిశీలించకుండానే రిమాండ్ విధించేస్తున్నారని పేర్కొంది. రొటీన్‌గా రిమాండ్ ఉత్తర్వులు..తమ ముందుకు వస్తున్న కేసులను పరిశీలిస్తే మేజిస్ట్రేట్లు యాంత్రికంగా వ్యవహరిస్తున్నారనే విషయం స్పష్టంగా కనిపిస్తోందని హైకోర్టు పేర్కొంది. మేజిస్ట్రేట్లు రొటీన్‌గా రిమాండ్ ఉత్తర్వులిచ్చేస్తున్నారంది. మేజిస్ట్రేట్లు యాంత్రికంగా వ్యవహరిస్తున్నా, తాము మాత్రం బుర్రలు ఉపయోగించే విచారణ జరుపుతున్నామని వ్యాఖ్యానించింది. నిందితుడిని అరెస్ట్ చేసే సమయంలో అతడు ఎక్కడ ఉంటే అక్కడి పంచాయితీదారుల సమక్షంలోనే జరగాల్సి ఉంటుందని తెలిపింది. అయితే ప్రేమ్‌కుమార్ అరెస్ట్ విషయంలో కర్నూలు పోలీసులు అక్కడ పంచాయతీదారులను గుంటూరుకి తీసుకురావడంపై హైకోర్టు ఒకింత విస్మయం వ్యక్తం చేసింది. ఇలా చేయడానికి చట్టం అనుమతిస్తోందా? అని నిలదీసింది. ప్రేమ్‌కుమార్ వ్యంగ్యంగా నాటక రూపంలో ఓ రీల్ చేసి పోస్టు చేశారని, ఇందులో బలవంతపు వసూళ్ల అంశం ఎక్కడ ఉందని ప్రశ్నించింది. ఇలాంటి తీరును ఎంత మాత్రం సహించేది లేదని, ప్రేమ్‌కుమార్ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారంటూ కేసు పెట్టడాన్ని ఎలా సమర్థించుకుంటారో పోలీసులు చెప్పి తీరాలని హైకోర్టు స్పష్టం చేసింది. దీనికి సంబంధించి కర్నూలు త్రీ టౌన్ ఎస్‌హెచ్‌వో అఫిడవిట్ దాఖలు చేయడంతో పాటు తమ ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. ఈ సమయంలో పిటిషనర్ తరఫు న్యాయవాది వేలూరి మహేశ్వరరెడ్డి జోక్యం చేసుకుంటూ, జిల్లా ఎస్పీని సైతం అఫిడవిట్ దాఖలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ, మిగిలిన ప్రతివాదులు కూడా కౌంటర్లు దాఖలు చేయాలనుకుంటే చేయవచ్చని పేర్కొంటూ విచారణను ఈ నెల 25కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, డాక్టర్ జస్టిస్ కుంభజడల మన్మథరావు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తన తండ్రి ప్రేమ్‌కుమార్‌ను కర్నూలు పోలీసులు అక్రమంగా నిర్భంధించారని, ఆయనను కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థిస్తూ కొరిటిపాటి అభియన్ గత ఏడాది హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన జస్టిస్ రఘునందన్‌రావు ధర్మాసనం తాజాగా మరోసారి విచారించింది.సెక్షన్ 111 ఏ సందర్భంలో పెట్టొచ్చంటే...కిడ్నాపింగ్, దొంగతనం, వాహన దొంగతనం, బలవంతపు వసూళ్లకు పాల్పడం, కాంట్రాక్ట్ కిల్లింగ్, ఆర్థిక నేరాలు, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా, మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, ఇతర అక్రమ వస్తువులను కొనుగోలు చేయడం, అమ్మడం వంటి వాటికి పాల్పడిన వారికి మాత్రమే సెక్షన్ 111 వర్తిస్తుంది. ఈ నేరాలు రుజువైతే మరణశిక్ష, జీవితఖైధు, రూ.10 లక్షలకు తగ్గకుండా జరిమానా విధించవచ్చు. సోషల్ మీడియా పోస్టులు ఈ నేరాల కిందకు రాకపోయినప్పటికీ పోలీసులు ఉద్దేశపూర్వకంగా ఆ పోస్టులను వ్యవస్థీకృత నేరంగా చూపుతూ సోషల్ మీడియా యాక్టివిస్టులపై సెక్షన్ 111 కింద కేసులు బనాయిస్తున్నారు. బెయిల్ రాకుండా చేసేందుకే ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తున్నారు. ప్రస్తుత కేసులో కూడా పోలీసులు ప్రేమ్‌కుమార్‌పై బలవంతపు వసూళ్ల కింద కేసు పెట్టారు. -
ఏపీ హైకోర్టులో కూటమి సర్కార్‌కు ఎదురుదెబ్బ
అమరావతి, సాక్షి: కూటమి సర్కార్‌కు ఏపీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. సోషల్ మీడియా యాక్టివిస్ట్ అవుతు శ్రీధర్ రెడ్డి రిమాండ్ పోలీసులు వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. తక్షణమే ఆయన్ని విడుదల చేయాలని ఆదేశిస్తూ.. పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.శ్రీధర్ రెడ్డి అరెస్టులో పోలీసులు అత్యుత్సాహం చూపించారన్న న్యాయస్థానం.. రిమాండ్ విధించిన కింది కోర్టు తీరును కూడా తప్పుబట్టింది. ఇదిలా ఉంటే.. అక్రమ కేసులో అవుతు శ్రీధర్ రెడ్డిని ఫిబ్రవరి 24వ తేదీన విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ఆయనకు మార్చి 10వ తేదీ వరకు రిమాండ్ విధించింది. -
‘పోసాని’పై ఎలాంటి కఠిన చర్యలొద్దు
సాక్షి, అమరావతి/నరసరావుపేట టౌన్/కర్నూలు (టౌన్) : సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో సినీనటుడు పోసాని కృష్ణమురళికి హైకోర్టు ఊరటనిచ్చింది. ఆయనపై ఎలాంటి కఠిన చర్యలేవీ తీసుకోవద్దని విశాఖపట్నం వన్‌టౌన్ పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. అలాగే, గుంటూరు పట్టాభిపురం, అల్లూరి జిల్లా పాడేరు, మన్యం జిల్లా పాలకొండ పోలీ స్స్టేషన్లలో నమోదైన కేసుల్లో పోసానికి బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 35 (3) కింద నోటీసులిచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. ఇదే సమయంలో భవానీపురం పోలీసులు పీటీ వారెంట్ అమలుచేసిన నేపథ్యంలో, తనపై కేసు కొట్టేయాలంటూ పోసాని దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఏమాత్రం వర్తించని సెక్షన్ల కింద కేసులు..సీఎం చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ తదితరులను కించపరుస్తూ సోషల్ మీడియాలో మాట్లాడారంటూ అందిన ఫిర్యాదు మేరకు పోసాని కృష్ణమురళిపై పట్టాభిపురం, భవానీపురం, పాడేరు, పాలకొండ, విశాఖపట్నం వన్‌టౌన్ పోలీసులు వేర్వేరుగా కేసులు నమోదుచేసిన విషయం తెలిసిందే. ఈ కేసులను కొట్టేయాలని కోరుతూ పోసాని హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై సోమవారం జస్టిస్ హరినాథ్ విచారణ జరిపారు. పోసాని తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. పోలీసుల తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) ఇవన సాంబశివ ప్రతాప్, రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ.. భవానీపురం పోలీసులు ఇప్పటికే పీటీ వారెంట్‌ను అమలుచేసినందున పోసాని పిటిషన్‌ను కొట్టేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యా యమూర్తి జస్టిస్ హరినాథ్.. అదనపు ఏజీ, పీపీ వాదనలను పరిగణనలోకి తీసుకుంటూ పోసాని క్వాష్ పిటిషన్‌ను కొట్టేశారు. విశాఖ వన్‌టౌన్ పోలీసులు నమోదుచేసిన కేసులో మాత్రం పోసానిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని ఆదేశిస్తూ విచారణను ఈనెల 19కి వాయిదా వేశారు.పోసానికి బెయిల్ మంజూరు..పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు చేస్తూ నరసరావుపేట ప్రధాన జూనియర్ సివిల్ జడ్జ్ ఆర్. ఆశీర్వాదం పాల్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇద్దరు జామీన్‌దారులు ఒక్కొక్కరు రూ.10 వేలు పూచీకత్తు చొప్పున సమర్పించేలా ఉత్తర్వులు జారీచేశారు. రాజంపేట సబ్జైల్లో ఉన్న పోసానిని ఈనెల 3న పీటి వారెంట్‌పై నరసరావుపేట టూటౌన్ పోలీసులు స్థానిక కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ అనంతరం గుంటూరు సబ్‌జైలులో ఉన్న ఆయనను పీటి వారెంట్‌పై కర్నూలు పోలీసులు అక్కడ నమోదైన కేసులో తీసుకెళ్లి కోర్టులో హాజరుపర్చారు. ప్రస్తుతం ఆదోని సబ్జైల్లో పోసాని ఉన్నారు. ఇక పోసానిపై ఆదోని పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్‌ను సోమవారం కర్నూలు మొదటి అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ (జేఎఫ్‌సీఎం) అపర్ణ డిస్మిస్ చేశారు. అలాగే, బెయిల్ పిటిషన్‌పై వాదనలు కూడా ముగియడంతో న్యాయమూర్తి తీర్పును రిజర్వు చేశారు. మంగళవారం తీర్పు వెలువడనుంది. -
అసైన్డ్ భూమిపై ఆ ‘షరతు’ను అధికారులే నిరూపించాలి
సాక్షి, అమరావతి: అసైన్డ్ భూమి రిజిస్ట్రేషన్ విషయంలో అధికారుల తీరును రాష్ట్ర హైకోర్టు తప్పుబట్టింది. 18.6.1954కి ముందు నిరుపేదలకు.. ‘‘ఎవరికీ బదలాయింపు (అన్యాక్రాంతం) చేయరాదన్న’’ షరతుతోనే భూములను అసైన్డ్ చేసినట్లు నిరూపించాల్సిన బాధ్యత అధికారులదేనని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఆధారాలను సమర్పించలేకపోతే, అసైన్డ్ భూమి విషయంలో అలాంటి షరతు ఏదీ లేదనే భావించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో అసైన్డ్ భూముల అన్యాక్రాంతంపై ఉన్న నిషేధం ఆ భూములకు వర్తించదని పునరుద్ఘాటించింది. 18.6.1954కి ముందు అసైన్డ్ చేసిన భూముల విక్రయానికి సమర్పించే డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ అధికారులు స్వీకరించి తీరాల్సిందేనని, ఇందుకు సంబంధించి రావి సతీష్ కేసులో హైకోర్టు ధర్మాసనం గతంలో ఇచ్చిన తీర్పును రెవెన్యూ అధికారులందరూ పాటించాలని తేల్చి చెప్పింది. భూముల రిజిస్ట్రేషన్‌కు నిరభ్యంతర పత్రంను (ఎన్వోసీ) తప్పనిసరి చేయడానికి వీల్లేదని కూడా ధర్మాసనం అప్పట్లోనే స్పష్టం చేసిందని గుర్తు చేసింది. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరు గ్రామం సర్వే నంబరు 177/ఏలోని 0.66 సెంట్ల భూమిని ప్రభుత్వానిదిగా పేర్కొంటూ 2008లో పెనమలూరు తహసీల్దార్ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను రద్దు చేసింది. ఇందులోని 0.66 సెంట్ల భూమి రిజిస్ట్రేషన్‌ను నిరాకరించడాన్ని తప్పుబట్టింది. ఈ భూమి విక్రయానికి సంబంధించిన డాక్యుమెంట్లను రిజిష్టర్ చేయాలని పటమట సబ్ రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ తీర్పు వెలువరించారు.రిజిస్ట్రేషన్‌కు ఎన్వోసీ తేవాలన్న అధికారులుకానూరులోని సర్వే నం.177/ఏలోని 1.64 ఎకరాల భూమిని 1942లో నల్లూరు వెంకటస్వామి అనే వ్యక్తికి అసైన్డ్ కింద కేటాయించారు. ఇందులో 0.66 సెంట్లను ఆయన వారసులైన సత్యానందం, రత్నమ్మ నుంచి 1966లో ఉప్పలపాటి రాజారత్నం అనే మహిళ కొన్నారు. తర్వాత ఆమె కుమారుడు బలరాంకు వారసత్వంగా వచ్చింది. అతడు భూమిని అమ్మేందుకు సబ్ రిజిస్ట్రార్‌ను సంప్రదించగా నిరభ్యంతర పత్రం తేవాలని కోరారు. బలరాం పెనమలూరు తహసీల్దార్ వద్దకు వెళ్లగా ఆ భూమి ప్రభుత్వానిది అని, ఎవరికీ అమ్మడానికి వీల్లేదని 2008లో ప్రొసీడింగ్స్ జారీ చేశారు. వీటిని సవాల్ చేస్తూ బలరాం 2009లో హైకోర్టులో పిటిషన్ వేశారు.ఈ వ్యాజ్యంపై జస్టిస్ చల్లా గుణరంజన్ ఇటీవల తుది విచారణ చేపట్టారు. బలరాం తరఫు న్యాయవాది పి.రాయ్‌రెడ్డి వాదిస్తూ.. వెంకటస్వామికి ఇచ్చిన భూమిలో 0.66 సెంట్లను అసైన్డ్ భూముల బదలాయింపు నిషేధ చట్టం రాక ముందే రాజారత్నం కొన్నారని పేర్కొన్నారు. అసైన్మెంట్ ఉత్తర్వుల్లోనూ.. అన్యాక్రాంతం చేయరాదన్న షరతు లేదన్నారు. అధికారులు ఏకపక్షంగా ప్రభుత్వ భూమి అంటున్నారని వివరించారు. ప్రభుత్వ సహాయ న్యాయవాది శ్రావణి వాదనలు వినిపిస్తూ, వెంకటస్వామికి 1942లో భూమిని అసైన్ చేసినట్లు పిటిషనర్ ఆధారాలు చూపడం లేదన్నారు. కాబట్టి 18.6.1954కి ముందు అసైన్ చేసినట్లు భావించడానికి వీల్లేదని తెలిపారు. భూమిని అన్యాక్రాంతం చేయవచ్చన్న షరతు లేదని చెప్పలేమన్నారు. 1966లో వెంకటస్వామి వారసుల నుంచి కొన్నప్పటికీ, 1977లో తీసుకొచ్చిన అసైన్డ్ భూముల అన్యాక్రాంత నిషేధ చట్టం వర్తిస్తుందని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ గుణరంజన్ తీర్పునిస్తూ.. అసైన్మెంట్ కింద 18.6.1954కి ముందు ఇచ్చిన భూములను నిషేధిత జాబితాలో చేర్చడానికి వీల్లేదని హైకోర్టు ధర్మాసనం గతంలోనే తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు. ప్రస్తుత కేసులో వెంకటస్వామికి అసైన్మెంట్ కింద భూమి ఇవ్వడాన్ని, దానిని రాజారత్నం కొనడాన్ని అధికారులు తోసిపుచ్చడం లేదన్నారు. అయితే, 1966కి ముందు మాత్రమే భూమిని అసైన్ చేసినట్లు చెబుతున్నారని తెలిపారు. అన్యాక్రాంతం చేయరాదన్న షరతుతోనే అసైన్ చేశారనేందుకు ఎలాంటి ఆధారాలు చూపడం లేదన్నారు. పిటిషనర్ మాత్రం వెంకటస్వామికి 1942లో అసైన్ చేసినట్లు ఆధారాలు చూపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పిటిషనర్ భూమి.. అసైన్ భూమి అన్యాక్రాంత నిషేధ చట్టం పరిధిలోకి రాదని స్పష్టం చేశారు. తహసీల్దార్ ప్రొసీడింగ్స్‌ను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. బలరాం సమర్పించిన డాక్యుమెంట్‌ను రిజిష్టర్ చేయాలని సబ్ రిజిస్ట్రార్‌ను ఆదేశించారు. -
విక్రాంత్‌రెడ్డికి ముందస్తు బెయిల్
సాక్షి, అమరావతి: కాకినాడ సీ పోర్టు వాటాల బదిలీ వ్యవహారంలో యర్రంరెడ్డి విక్రాంత్‌రెడ్డికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని, కేసుతో సంబంధం ఉన్న ఏ వ్యక్తినీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రలోభపెట్టడం, భయపెట్టడం చేయరాదని ఆదేశించింది. దర్యాప్తునకు సహకరించాలని చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం తీర్పు వెలువరించారు.తనను బెదిరించి పోర్టులో వాటాలను అరబిందో సంస్థ కొనుగోలు చేసిందంటూ సీఎం చంద్రబాబు సన్నిహితుడు, పోర్టు ప్రమోటర్ కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ నమోదు చేసిన ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ విక్రాంత్‌రెడ్డి డిసెంబర్లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విక్రాంత్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి, సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, కేవీ రావు తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు సుదీర్ఘ వాదనలు వినిపించారు. అనంతరం తీర్పు రిజర్వ్ చేసిన న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి శుక్రవారం తన నిర్ణయాన్ని వెలువరించారు. నాలుగున్నరేళ్ల తర్వాత ఫిర్యాదా? ‘నాలుగున్నరేళ్ల క్రితం ఘటన జరిగితే ఇప్పుడు ఫిర్యాదు చేశారు. ఈ ఆలస్యంపై ఫిర్యాదుదారు కేవీ రావు నుంచి సంతృప్తికర సమాధానం రాలేదు. జాప్యానికి బెదిరింపులే కారణమని, ప్రభుత్వం మారడంతో ఫిర్యాదు చేశానంటూ ఆయన చేసిన వాదన ఆమోదయోగ్యం కాదు. అయన్ని బెదిరించి ఉంటే, కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు ఎందుకు దాఖలు చేయలేదో వివరణ లేదు. కేవీ రావును బెదిరించడం వల్లే ఆయన వాటాలను నామమాత్రపు ధరకు అరబిందో రియాలిటీకి బదిలీ చేశారన్నదే పిటిషనర్ విక్రాంత్‌రెడ్డిపై ఉన్న ప్రధాన నేరారోపణ. పీకేఎఫ్ శ్రీధర్ సంతానం ఆడిట్ సంస్థతో విక్రాంత్ కుమ్మక్కయి ఆడిట్ రిపోర్ట్‌లో సంఖ్యలను పెంచి చూపారని, దీన్ని అడ్డంపెట్టుకునే కేవీ రావును బెదిరించారని ఆరోపిస్తున్నారు. ఆడిట్ సంస్థతో కలిసి విక్రాంత్‌రెడ్డి సంఖ్యలను పెంచి చూపారనేందుకు ప్రాథమిక ఆధారాలు లేవు. దీనిద్వారా విక్రాంత్ లబ్ధి పొందారని సీఐడీ కూడా చెప్పడంలేదు. ఎఫ్ఐఆర్లోనూ ఆడిట్ కంపెనీని విక్రాంత్ కలిసినట్లు లేదు. అంతేకాక అరబిందో కొన్న వాటాల ద్వారా విక్రాంత్‌రెడ్డి ఆర్థికంగా లబ్ధి పొందినట్లు ఎలాంటి ఆరోపణలు లేవు. రిపోర్ట్‌ను ఆడిట్ సంస్థే తయారు చేసిందని కేవీ రావే అంగీకరిస్తున్నారు. అలాంటప్పుడు ఈ నివేదిక విషయంలో విక్రాంత్‌పై నేరారోపణలు చేయడానికి వీల్లేదు. దానిని విక్రాంత్‌రెడ్డి ఫోర్జరీ చేశారన్న ప్రశ్నే తలెత్తదు. ఫోర్జరీ చేశారని సీఐడీ, ఫిర్యాదుదారు కూడా చెప్పడం లేదు. విక్రాంత్‌రెడ్డి ఆ నివేదికను తారుమారు చేయడం, మార్చడం, మోసపూరితంగా సంపాదించడం చేయలేదు. అందువల్ల ఆయనకు సెక్షన్ 464 వర్తించదు’ అని జస్టిస్ శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఫిర్యాదు లేకుండానే ప్రాథమిక విచారణ జరపడమా! ‘2024 సెపె్టంబర్లో తామిచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ప్రాథమిక విచారణ జరిపారని కేవీ రావు చెబుతున్నారు. ఎఫ్ఐఆర్ను పరిశీలిస్తే.. 2024 డిసెంబరు 2న కేవీ రావు ఫిర్యాదు చేశారు. అంటే అంతకు ముందు ఎలాంటి ఫిర్యాదు లేదు. ఫిర్యాదు లేకుండానే పోలీసులు ఎలా ప్రాథమిక విచారణ జరిపారో తెలియడంలేదు. నాలుగున్నరేళ్ల జాప్యంతో ఫిర్యాదు చేసినప్పుడు, పోలీసులు ప్రాథమిక విచారణ జరిపి తీరాలి. కానీ, ఇక్కడ ఫిర్యాదు ఇవ్వకపోయినా పోలీసులు ప్రాథమిక విచారణ జరిపారు. దీనినిబట్టి పోలీసులు దర్యాప్తును ఏ తీరున సాగించారన్న దానిపై ఎలాంటి సందేహం అక్కర్లేదు’ అని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. -
పేర్ని నానికి హైకోర్టులో ఊరట
-
పోసాని కృష్ణమురళికి మరో ఊరట
అమరావతి, సాక్షి: ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali)కి ఏపీ హైకోర్టులో మరో ఊరట దక్కింది. కూటమి నేతలపై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే. అయితే విజయవాడ సూర్యారావుపేట పీఎస్‌లో నమోదైన కేసులో ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు శుక్రవారం ఆదేశించింది.తనపై నమోదు అయిన కేసులను కొట్టివేయాలంటూ ఏపీ హైకోర్టు(AP high Court)లో పోసాని క్వాష్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే గురువారం వాదనలు విన్న హైకోర్టు.. విశాఖ, చిత్తూరు జిల్లాల్లో నమోదు అయిన కేసుల్లో తొందరపాటు చర్యలు వద్దని ఆదేశించింది. సోమవారానికి తదుపరి విచారణను వాయిదా వేసింది. తాజాగా.. ఇవాళ పోసానిని అరెస్ట్ చేయొద్దంటూ విజయవాడ సూర్యారావు పేట పోలీసులను ఆదేశించింది. పోసాని తరఫున ఇవాళ వైఎస్సార్సీపీ లీగల్ కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ వాదనలు వినిపించారు.హైదరాబాద్ టు కర్నూల్ జైలు.. ఎప్పుడు.. ఏం జరిగిందంటే..ఫిబ్రవరి 24న.. పవన్ కల్యాణ్‌తో పాటు కూటమి నేతలను పోసాని గతంలో దూషించారంటూ జనసేన నేత జోగినేని మణి ఫిర్యాదుతో అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పీఎస్‌లో కేసు నమోదుఫిబ్రవరి 27న.. హైదరాబాద్‌లోని తన నివాసంలో పోసానిని అరెస్ట్ చేసిన అన్నమయ్య జిల్లా పోలీసులు.. ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పినా వినని పోలీసులు.. అదే రాత్రి తరలింపుఫిబ్రవరి 28న.. ఒబులవారిపల్లి పీఎస్‌కు తరలింపు.. సుదీర్ఘ విచారణ.. ఆరోగ్య సమస్యలు ఉన్నాయని మరోసారి పోలీసుల దృష్టికి తీసుకెళ్లిన పోసానిఫిబ్రవరి 28న.. రైల్వే కోడూరులో పోసానిని ప్రవేశపెట్టిన పోలీసులు.. 14 రోజుల రిమాండ్ విధింపుమార్చి1న.. ప్రిజనర్ ట్రాన్సిట్(PT) వారెంట్ కింద అదుపులోకి తీసుకున్న పల్నాడు నరసరావుపేట టూటౌన్ పోలీసులుమార్చి3న.. నరసరావుపేట కోర్టులో పోసానిని ప్రవేశపెట్టిన పోలీసులు. పోసానికి జ్యూడీషియల్ రిమాండ్ విధించిన జడ్జిమార్చి3న.. పీటీ వారెంట్ జారీ చేసిన కర్నూల్ జిల్లా ఆదోని త్రీటౌన్ పోలీసులు. మార్చి4న.. నరసరావుపేట నుంచి ఆదోని పీఎస్‌కు పోసాని తరలింపు మార్చి 5న.. మెజిస్ట్రేట్ నివాసంలో పోసానిని ప్రవేశపెట్టిన ఆదోని త్రీటౌన్ పోలీసులు.. రిమాండ్ మీద కర్నూల్ జైలుకు తరలించారుమార్చి6న.. ఆదోని కోర్టులో పోసాని బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్ విచారణ.. కస్టడీ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్మార్చి7న.. కర్నూలు జస్టిస్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో పోసాని బెయిల్ పిటిషన్ విచారణకౌంటర్ వేయనున్న ఆదోని పోలీసులుఇవాళ సాయంత్రం కస్టడీ పిటిషన్, బెయిల్ పిటిషన్ పై కర్నూలు కోర్టులో తీర్పు వెలువడే అవకాశం -
ఏపీ హైకోర్టులో పేర్ని నానికి ఊరట
అమరావతి, సాక్షి: ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య(నాని)కి ఊరట లభించింది. రేషన్ బియ్యం వ్యవహారానికి సంబంధించిన కేసులో కోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఆయన ఏ6గా ఉన్న సంగతి తెలిసిందే. పేర్ని నాని(Perni Nani) సతీమణి పేర్ని జయసుధ పేరిట ఉన్న గోడౌన్లో రేషన్ బియ్యం మాయమైందన్న అభియోగాలతో కూటమి ప్రభుత్వం కిందటి ఏడాది డిసెంబర్లో కేసు పెట్టింది. ఈ కేసులో జయసుధ పేరును ఏ1గా, ఏ2గా గోదాం మేనేజర్ మానస్ తేజ్, మిల్లు యాజమాని బాల ఆంజనేయులు, లారీ డ్రైవర్ మంగారావులను మిగతా నిందితులుగా చేర్చారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే మచిలీపట్నం పీఎస్ లో పేర్ని జయసుధ విచారణకు హాజరు కాగా.. కోర్టు నుంచి ముందస్తు బెయిల్ కూడా పొందారు. అయితే ఈ అభియోగాలను ఖండించిన పేర్ని నాని.. రాజకీయ ఉద్దేశంతో పెట్టిన కేసేనని, తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడంతో పాటు తనను అరెస్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ముందస్తు బెయిల్(Anticipatory Bail) కోసం ఆయన హైకోర్టు(High Court)ను ఆశ్రయించగా.. చివరకు ఊరట దక్కింది.వైవీ విక్రాంత్ రెడ్డికి ఊరటమరోవైపు కాకినాడ సీ పోర్టు వ్యవహారంలో వైవీ విక్రాంత్ రెడ్డి(YV Vikrant Reddy)కి కూడా ఇవాళ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కాకినాడ పోర్టు, సెజ్ కు సంబంధించి 41 శాతం వాటాలు బలవంతంగా లాగేసుకున్నారని ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసులో విక్రాంత్ రెడ్డి ఏ1గా ఉన్నారు. అయితే కాకినాడ పోర్టు, సెజ్ విషయంలో తనకు సంబంధం లేదని విక్రాంత్ రెడ్డి చెబుతున్నారు. ఈ క్రమంలో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా.. ఇవాళ మంజూరు అయ్యింది. -
ఏపీ హైకోర్టులో పోసాని కృష్ణమురళికి ఊరట
-
ఏపీ హైకోర్టులో RGVకి బిగ్ రిలీఫ్
-
AP High Court: పోసాని కృష్ణమురళికి ఊరట
సాక్షి, అమరావతి: ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali)కి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై చిత్తూరు, విశాఖ జిల్లాల్లో నమోదైన కేసుల్లో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఉన్నత న్యాయస్థానం పోలీసులను గురువారం ఆదేశించింది.పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా 30 ఫిర్యాదుల ఆధారంగా.. 16 కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే. చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కల్యాణ్‌లను దూషించారంటూ ఇటు టీడీపీ, అటు జనసేన శ్రేణులు ఫిర్యాదులు చేయడంతో ఈ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో.. ఫిబ్రవరి 28వ తేదీన రాత్రి హైదరాబాద్‌లోని నివాసంలో పోసానిని అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. రిమాండ్ మీద ఆయన్ని రాజంపేట సబ్ జైలుకు తరలించారు. ఆపై పీటీ వారెంట్ల మీద పల్నాడు జిల్లా నరసరావుపేట, అటు నుంచి కర్నూల్ సెంట్రల్ జైలుకు రిమాండ్ మీద తరలించారు. అయితే ఉద్దేశపూర్వకంగా ఒక్కో జిల్లా తిప్పుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగానే.. తన పైన నమోదైన కేసులను కొట్టివేయాలంటూ పోసాని కృష్ణ మురళి క్వాష్ పిటిషన్(Posani Quash Petition) వేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. రెండు జిల్లాల్లో నమోదైన కేసుల నుంచి కాస్త ఊరట ఇచ్చింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. -
హైకోర్టులో ఆర్జీవీకి భారీ ఊరట!
సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ(Ram Gopal Varma)కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు(AP High Court)లో భారీ ఊరట లభించింది. ఆయన దర్శకత్వం వహించిన ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాపై నమోదైన కేసు విచారణపై హైకోర్టు స్టే విధించింది. సీఐడీ పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ ఆర్జీవీ బుధవారం హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశాడు. నేడు విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఐదేళ్ల క్రితం(2019)లో రిలీజైన సినిమాపై ఇప్పుడు కేసు నమోదు చేయడం ఏంటని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించి, తదుపరి విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది. ఏం జరిగింది?2019లో 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'(kamma rajyam lo kadapa reddlu) పేరుతో ఆర్జీవీ ఒక సినిమాను రూపొందించారు. 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' పేరుతో సినిమాను రిలీజ్ చేశారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా సినిమాను చిత్రీకరించారని వర్మపై మంగళగిరి సమీపంలోని ఆత్మకూరుకు చెందిన బండారు వంశీకృష్ణ సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలను కూడా తొలగించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆర్జీవీకి సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. సీఐడీ నోటీసులను సవాల్ చేస్తూ ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించారు. -
ఏపీ హైకోర్టులో పోసాని కృష్ణ మురళి క్వాష్ పిటిషన్
-
కూటమి ప్రభుత్వంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం
సాక్షి,విజయవాడ: కూటమి ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పీపీలు, ఏపీపీల నియామకంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నిస్తూ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది. ఏపీపీఎస్సీ చైర్మన్ ,సభ్యుల నియామకం నిబంధనల ప్రకారం జరగలేదని, కాబట్టి వాటిని వెంటనే రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో పాటు కింది కోర్టులో పీపీలు ,ఏపీపీలు తోపాటు మరికొన్ని పోస్టుల నియామకానికి చర్యలు తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది.విచారణలో భాగంగా ఏపీపీఎస్సీ ఛైర్మన్, సభ్యుల నియామక నోట్ ఫైళ్లను తమ ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు, పీపీలు,ఏపీపీల నియామకంలో జాప్యంపై ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎస్ స్వయంగా తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. -
యాంత్రికంగా రిమాండ్లు సరికాదు
సాక్షి, అమరావతి: సోషల్ మీడియా పోస్టుల కేసుల్లో మేజిస్ట్రేట్లు యాంత్రికంగా వ్యవహరిస్తుండటాన్ని హైకోర్టు ఆక్షేపించింది. ఫిర్యాదులో లేని అంశాల ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేసి, నిందితులను రిమాండ్ కోసం హాజరు పరుస్తున్న సమయంలో మేజిస్ట్రేట్లు పూర్తి స్థాయిలో పరిశీలన చేయకుండానే రిమాండ్ విధించడం సరికాదని అభిప్రాయపడింది. సోషల్ మీడియా యాక్టివిస్ట్, మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు కొరిటిపాటి ప్రేమ్‌కుమార్ అరెస్ట్ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ కేసులో అన్ని అంశాలను లోతుగా పరిశీలిస్తామంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, డాక్టర్ జస్టిస్ కుంభజడల మన్మథరావు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసులు తన తండ్రి ప్రేమ్‌కుమార్‌ను అక్రమంగా నిర్భంధించారని, ఆయన్ను కోర్టు ముందు హాజరు పరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ కొరిటిపాటి అభియన్ గత ఏడాది హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన జస్టిస్ రఘునందన్‌రావు ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. అభినయ్ తరఫు న్యాయవాది వేలూరి మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ.. సోషల్ మీడియా యాక్టివిస్టులపై పోలీసులు ఏకపక్షంగా, చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను సైతం కాలరాస్తున్నారన్నారు. ఈ వ్యాజ్యం పరిధిని విస్తృతం చేసి పోలీసులను జాగృతం చేయాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. వ్యంగ్యం కూడా నేరమైంది.. ప్రేమ్‌కుమార్ అరెస్ట్ విషయంలో పోలీసులు చట్ట విరుద్ధంగా వ్యవహరించారని, తెల్లవారుజామున అదుపులోకి తీసుకుని, ఆ తర్వాత ఉదయం 8 గంటలకు ఆయన్ను అరెస్ట్ చేసినట్లు చూపారని మహేశ్వరరెడ్డి తెలిపారు. ఎప్పుడు అదుపులోకి తీసుకుంటారో అప్పుడే అరెస్ట్ చేసినట్లు అవుతుందన్నారు. ప్రభుత్వ పెద్దలపై వ్యంగ్యంగా విమర్శలు చేసినందుకే కేసులు పెట్టారని, వ్యంగ్యం కూడా నేరం కావడం ఇప్పుడే చూస్తున్నామన్నారు.ప్రేమ్‌కుమార్ బెదిరింపులు, బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడ్డారంటూ పోలీసులు కేసు పెట్టారని, వాస్తవానికి ఫిర్యాదులో అందుకు సంబంధించి ఎలాంటి ఆరోపణ లేదన్నారు. మేజి్రస్టేట్ ఈ విషయాన్ని పట్టించుకోకుండా రిమాండ్ విధించారన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, మేజిస్ట్రేట్ యాంత్రికంగా వ్యవహరించినట్లు అర్థమవుతోందని వ్యాఖ్యానించింది. సమగ్ర పరిశీలన చేయకుండా యాంత్రికంగా రిమాండ్ ఉత్తర్వులు జారీ చేయడం సబబు కాదని తెలిపింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది. -
ఏపీ హైకోర్టులో పోసాని క్వాష్ పిటిషన్
సాక్షి,విజయవాడ : సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో తనపైన నమోదైన అన్నీ కేసులను కొట్టివేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. పోలీసులు నమోదు చేసిన కేసుల్లో తదుపరి చర్యలు అన్నీ నిలిపిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషన్లో కోరారు. -
పోలీసులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు
డీజీపీ పోస్టుపై మాకు ఉన్న గౌరవంతో ఆయన వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు ఇవ్వకుండానియంత్రించుకుంటున్నాం. సోషల్ మీడియా యాక్టివిస్ట్ బొసా రమణ అరెస్ట్ విషయంలో పోలీసులు వాస్తవాలను దాచిపెట్టి తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. రమణ అరెస్ట్ వ్యవహారంలో నివేదిక ఇవ్వాలని ఆదేశించినా ఇంతవరకు డీజీపీ నుంచి అందలేదు. కేసు సున్నితత్వాన్ని దృష్టిలో పెట్టుకునే డీజీపీ నుంచి నివేదిక కోరాం. రాతపూర్వకంగా ఆదేశాలు ఇస్తేనే నివేదిక సమర్పించాలని డీజీపీ భావిస్తే ఆ మేరకు ఆదేశాలు జారీ చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. రమణ అరెస్ట్ విషయంలో విశాఖ పోలీస్ కమిషనర్, ప్రకాశం ఎస్పీ దాఖలు చేసిన నివేదికలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. – హైకోర్టు ధర్మాసనం సాక్షి, అమరావతి: డీజీపీ పోస్టుపై తమకు ఉన్న గౌరవంతో ఆయన వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు ఇవ్వకుండా నియంత్రించుకుంటున్నామని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. సోషల్ మీడియా యాక్టివిస్ట్ బొసా రమణ అరెస్ట్ విషయంలో పోలీసులు వాస్తవాలను దాచిపెట్టి తప్పుల మీద తప్పులు చేస్తున్నారని ఆక్షేపించింది. రమణ అరెస్ట్ వ్యవహారంలో నివేదిక ఇవ్వాలని ఆదేశించినా ఇంతవరకు డీజీపీ నుంచి అందలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసు సున్నితత్వాన్ని దృష్టిలో పెట్టుకునే డీజీపీ నుంచి నివేదిక కోరామని పేర్కొంది. రాతపూర్వకంగా ఆదేశాలు ఇస్తేనే నివేదిక సమర్పించాలని డీజీపీ భావిస్తే ఆ మేరకు ఆదేశాలు జారీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పింది. రమణ అరెస్ట్ విషయంలో విశాఖ పోలీస్ కమిషనర్, ప్రకాశం ఎస్పీ దాఖలు చేసిన నివేదికలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని తప్పుబట్టింది. ఈ కేసులో పూర్తి వివరాలు సమర్పించేందుకు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) అందుబాటులో లేనందున సహాయ న్యాయవాది అభ్యర్థన మేరకు విచారణను మార్చి 11వతేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ కుంచం మహేశ్వరరావు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రమణ అక్రమ నిర్బంధంపై పిటిషన్... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులను విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారంటూ విశాఖ జిల్లా మద్దిపాలెం, చైతన్యనగర్‌కి చెందిన బొసా రమణను పోలీసులు అరెస్ట్ చేశారు. తన భర్తను అక్రమంగా నిర్బంధించారని, ఆయన్ను కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ రమణ భార్య బొసా లక్ష్మీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరుపుతున్న జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతూ పలు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది. పరస్పర విరుద్ధంగా రెండు నివేదికలు... ధర్మాసనం ఆదేశాల మేరకు బొసా రమణ అరెస్ట్ విషయంలో విశాఖ పోలీస్ కమిషనర్, ప్రకాశం ఎస్పీ తమ నివేదికలను అందచేశారు. వాటిని పరిశీలించిన ధర్మాసనం, ఈ రెండు నివేదికల్లో అంశాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది. రమణను పొదిలి పోలీసులు విశాఖలోని ఆయన ఇంటి వద్ద అరెస్ట్ చేశారని కమిషనర్ చెబుతుండగా.. ప్రకాశం ఎస్పీ మాత్రం విశాఖ ఎంవీవీ పోలీస్‌స్టేషన్‌లో అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారని తెలిపింది. అరెస్ట్ విషయంలో వాస్తవాలను కోర్టు ముందుంచడం లేదని, అందువల్లే డీజీపీ నుంచి నివేదిక కోరామని స్పష్టం చేసింది. వర్రా అక్రమ నిర్బంధం కేసులో విద్యాసాగర్ నాయుడుకు నోటీసులుసోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రరెడ్డి అక్రమ నిర్బంధం వ్యవహారంలో వైఎస్సార్ కడప జిల్లా అప్పటి ఇన్చార్జ్ ఎస్పీ విద్యాసాగర్ నాయుడిని హైకోర్టు సుమోటోగా వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చింది. వర్రా రవీంద్రరెడ్డి నిర్బంధం విషయంలో వివరణ ఇవ్వాలని ఆయన్ను ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి 10కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ కుంచం మహేశ్వరరావు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాసాగర్‌పై నిర్దిష్ట ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆయన్ను ఈ వ్యాజ్యంలో వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేరుస్తున్నట్లు తెలిపింది. వాటికి బదులివ్వాల్సిన బాధ్యత ఆయనపై ఉందని స్పష్టం చేసింది. తన భర్త రవీంద్రరెడ్డిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, ఆయన్ను కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలంటూ వర్రా కళ్యాణి గత ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
ఎస్పీ విద్యాసాగర్ నాయుడుకి హైకోర్టు నోటీసులు
అమరావతి: సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద రెడ్డి హెబియస్ కార్పస్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ. వర్రారవీంద్ర రెడ్డి అక్రమ నిర్బంధం వ్యవహారంలో అప్పటి వైఎస్ఆర్ కడప జిల్లా ఇన్చార్జి ఎస్పి విద్యాసాగర్ నాయుడుని వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చిన హైకోర్టు.వర్రా రవీంద్ర రెడ్డి నిర్బంధం విషయంలో వివరణకు అప్పటి ఇంచార్జ్ ఎస్పి విద్య సాగర్ నాయుడుని ఆదేశించిన కోర్టు. తదుపరి విచారణ మార్చి 10వ తేదీకి వాయిదా -
ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్సీపీనే: సుబ్రహ్మణ్య స్వామి
అమరావతి, సాక్షి: ఏపీలో ప్రధాన ప్రతిపక్ష హోదా వైఎస్సార్సీపీకే దక్కాలని బీజేపీ ఫైర్‌బ్రాండ్, ప్రముఖ లాయర్ సుబ్రహ్మణ్య స్వామి (Subramanian Swamy) అంటున్నారు. ఇటీవల తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా జరిగిన హింసపై ఆయన కోర్టుకెక్కారు. ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే మీడియాకు వెల్లడించారు.‘‘తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక(Tirupati Deputy Mayor Election) సందర్భంగా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. చాలామందిని భయపెట్టి దాడులు చేశారు. ఎన్నికల సమయంలో హింసను నివారించేందుకు తీవ్రమైన చర్యలు తీసుకోవాలి అని పిల్ వేశా. నేను వేసిన పిల్ మార్చి 12వ తేదీన విచారణకు వస్తుంది’’ అని మీడియాకు తెలిపారాయన. తిరుపతి ఘటనలో కేవలం ఎఫ్ఐఆర్ మాత్రమే వేశారని, ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారాయన. ఈ విషయంపై కోర్టు చర్యలు తీసుకుంటే.. దేశవ్యాప్తంగా ఇదొక చట్టంగా మారుతుంది అని సుబ్రహ్మణ్య స్వామి అభిప్రాయడ్డారు.ప్రధాన ప్రతిపక్ష హోదా వైఎస్సార్‌సీపీదేఏపీలో ప్రతిపక్షంలో ఒక్క వైఎస్సార్సీపీ(YSRCP)నే ఉంది. కాబట్టి ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష(Principal Opposition) హోదా ఇవ్వడంలో ఎలాంటి తప్పులేదు. అసెంబ్లీలో తక్కువ మంది ఎమ్యెల్యేలు ఉన్నా వైఎస్సార్సీపీకి ఆ హోదా దక్కాల్సిందే అని స్పష్టం చేశారాయన. ఈ క్రమంలో ఆయన మరికొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 👉తిరుపతి లడ్డూ అంశం(Tirupati Laddu Controversy) ముగిసిపోయింది. కల్తీలాంటి అంశాలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. తిరుపతి లడ్డూను కల్తీ చేయాలని నిజమైన భక్తులు ఎవరూ అనుకోరు. 👉మంచి విషయం ఎవరు చెప్పినా పార్టీలకతీతంగా అంగీకరించాలి. నా నిర్ణయాలను పార్టీ ఎన్నడూ వ్యతిరేకించలేదు అని అన్నారాయన. ఇదిలా ఉంటే.. ఏపీ కూటమి ప్రభుత్వం (AP Kutami Prabhutvam)లో బీజేపీ భాగమై ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు దారి తీసే అవకాశం లేకపోలేదు. -
విశాఖలో హైకోర్టు బెంచ్ కోరుతూ సదస్సు
విశాఖ : విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలంటూ ఉత్తరాంధ్ర న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు(ఆదివారం) సదస్సు ఏర్పాటు చేశారు. ఏజెన్సీ ప్రజలకి సైతం విశాఖ అందుబాటులో ఉంటుందని ఉత్తరాంధ్రకు చెందిన ఆరు జిల్లాల న్యాయవాదులు కోరుతున్నారు. హైకోర్టు బెంచ్ విశాఖకు ఇచ్చేంత వరకూ తమ పోరాటం కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల న్యాయవాదులతో సదస్సు నిర్వహించారు. విఖాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ గత 20 ఏళ్ల నుంచి కొనసాగుతూ వస్తుందని న్యాయవాదులు అంటున్నారు. విజయవాడలో ఉన్న హైకోర్టుకు వెళ్లాలంటే సుమారు 700 కి.మీ ప్రయాణించాల్సిన కారణంగా ఇక్కడ హైకోర్టు బెంచ్ అనేది అనివార్యమని వారు డిమాండ్ చేస్తున్నారు. -
నష్టపరిహారం చెల్లించాల్సిందే!
-
‘మార్గదర్శి’ మోసాల కేసు మూత
ఆర్బీఐ సెక్షన్ 45 (ఎస్)కి విరుద్ధంగా మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమ డిపాజిట్లను సేకరించిన వ్యవహారంలో రామోజీ, ఆయన కుటుంబ సభ్యులను రక్షించేందుకు ఎంత చేయాలో అంత చేస్తూ వస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. ఇప్పుడు రామోజీ కుటుంబానికి ఆర్థికంగా అత్యంత కీలకమైన మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ విషయంలోనూ అదే రీతిలో వ్యవహరించింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలపై దాఖలు చేసిన అప్పీళ్లను సీఐడీ ద్వారా ఇప్పటికే ఉపసంహరింప చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు మరింత బరి తెగించి మార్గదర్శి చిట్‌ఫండ్‌పై అసలు కేసు నమోదు చేయడమే ‘పొరపాటు..’ అంటూ దర్యాప్తు సంస్థతో చెప్పించింది.సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్ అక్రమాలు, ఆర్థిక అవకతవకలకు కీలక ఆధారాలున్నాయని గతంలో బల్లగుద్ది గట్టిగా వాదించిన సీఐడీ.. చంద్రబాబు ప్రభుత్వం ఒత్తిడితో ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించింది. తాము సేకరించిన మౌఖిక, రాతపూర్వక ఆధారాలేవీ మార్గదర్శి చిట్‌ఫండ్ అక్రమాలను రుజువు చేసేవి కావంటూ నిస్సహాయంగా చేతులెత్తేసింది. ఈమేరకు మార్గదర్శి చిట్‌ఫండ్ విషయంలో కేసు నమోదు చేయడం పొరపాటు అంటూ సంబంధిత కోర్టులో ఫైనల్ రిపోర్ట్ దాఖలు చేయనున్నట్లు దర్యాప్తు సంస్థ హైకోర్టుకు నివేదించింది. మార్గదర్శి అక్రమాలను నిరూపించేందుకు అన్ని ఆధారాలున్నాయని గతంలో తేల్చి చెప్పిన సీఐడీ హఠాత్తుగా స్వరం మార్చడం వెనుక సీఎం చంద్రబాబు ఒత్తిళ్లు తీవ్ర స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. బాబు డైరెక్షన్లో.. ఆయన ఆదేశాల మేరకు దర్యాప్తు సంస్థ నడుచుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. రాజగురువు రామోజీ లేనప్పటికీ ఆయన కుటుంబం పట్ల చంద్రబాబు సర్కారు రాజభక్తిని చాటుకుంటూనే ఉంది! రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నిబంధనలకు విరుద్ధంగా... ఆర్బీఐ సెక్షన్ 45 (ఎస్) తమకు వర్తించదంటూ మార్గదర్శి ఫైనాన్షియర్స్ చట్ట విరుద్ధంగా అక్రమ డిపాజిట్లను సేకరించిన వ్యవహారంలో రామోజీరావు, ఆయన కుటుంబ సభ్యులను రక్షించేందుకు ఎంత చేయాలో అంత చేస్తూ వస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. ఇప్పుడు రామోజీ కుటుంబానికి ఆర్థికంగా అత్యంత కీలకమైన మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ విషయంలోనూ అదే రీతిలో వ్యవహరించింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాల విషయంలో దాఖలు చేసిన అప్పీళ్లను సీఐడీ ద్వారా ఇప్పటికే ఉపసంహరింప చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు మరింత బరి తెగించింది. ఏకంగా మార్గదర్శి చిట్‌ఫండ్‌పై కేసు నమోదే ‘పొరపాటు..’ అంటూ సీఐడీ చేత చెప్పించింది. అంతేకాక ఇప్పటి వరకు సాగించిన దర్యాప్తులో సేకరించిన మౌఖిక, రాతపూర్వక ఆధారాలు ఏవీ కూడా మార్గదర్శి చిట్‌ఫండ్‌పై పెట్టిన కేసును నిరూపించేవిగా లేవంటూ సీఐడీతో ఏకంగా హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయించింది. మార్గదర్శి చిట్‌పై కేసు నమోదు ‘పొరపాటు..’ (మిస్టేట్ ఆఫ్ ఫ్యాక్ట్) అంటూ సంబంధిత కోర్టులో ఫైనల్ రిపోర్ట్ దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేయించింది. ఇక ఫైనల్ రిపోర్ట్ దాఖలు చేసేందుకు సీఐడీ అదనపు డీజీ డాక్టర్ రవిశంకర్ అయ్యన్నార్ అనుమతి మంజూరు చేయడమే తరువాయి. తద్వారా మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలు ఎప్పటికీ బహిర్గతం కాకుండా శాశ్వతంగా సమాధి కట్టాలని బాబు సర్కారు నిర్ణయించింది. ఒకవైపు తెలంగాణ హైకోర్టులో మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమ డిపాజిట్ల కేసులో రామోజీరావు చట్టవిరుద్ధంగా వ్యవహరించారని ఆర్బీఐ బహిర్గతం చేయగా.. మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలకు ఆధారాల్లేవని ఏపీ హైకోర్టులో సీఐడీ చేత చెప్పించడం గమనార్హం. మరో కీలక విషయం ఏమిటంటే.. తెలంగాణ హైకోర్టులో మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమాల కేసు విచారణకు వచ్చిన రోజే.. ఏపీ హైకోర్టులో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు అనుకూలంగా సీఐడీ కౌంటర్ దాఖలు చేయడం. చట్ట ఉల్లంఘనలకు పాల్పడినందుకు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కి చెందిన రూ.1,050 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు సంబంధించి హైకోర్టులో సీఐడీ దాఖలు చేసిన అప్పీళ్లను ఆ సంస్థ చేత చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉపసంహరింప చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా మార్గదర్శిపై కేసు నమోదు చేయడం ‘పొరపాటు’ అంటూ సీఐడీ దాఖలు చేసే తుది నివేదికను సంబంధిత కోర్టు ఆమోదిస్తే చంద్రబాబు ప్రభుత్వం విజయం సాధించినట్లే! మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై కేసు క్లోజ్ అయినట్లే!!చిట్స్ రిజిస్ట్రార్ ఫిర్యాదుతో రంగంలోకి సీఐడీ...మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఆర్థిక అవకతవకలు, తప్పుడు రికార్డుల నిర్వహణ, నిధుల మళ్లింపు, ఇతర చట్ట ఉల్లంఘనలపై చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ 2023 మార్చి 10న సీఐడీకి ఫిర్యాదు చేయడం తెలిసిందే. ఈ ఫిర్యాదు ఆధారంగా అదే రోజు రామోజీరావు, శైలజా కిరణ్, మార్గదర్శి చిట్స్ ఆడిటర్ కుదరవల్లి శ్రవణ్‌లతో పాటు మొత్తం 15 మందిపై ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), ఏపీ డిపాజిటర్ల పరిరక్షణ చట్టం, చిట్‌ఫండ్ చట్ట నిబంధనల కింద సీఐడీ కేసులు నమోదు చేసింది. అనంతరం మార్గదర్శి చిట్స్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. పలువురు ఖాతాదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించింది. వారు ఇచ్చిన వాంగ్మూలాలను రికార్డ్ చేసింది. గడువు ముగిసి ష్యూరిటీలు సమర్పించిన తరువాత కూడా బ్రాంచ్ మేనేజర్లు సకాలంలో చెల్లింపులు చేయడం లేదని పలువురు చందాదారులు దర్యాప్తు సంస్థకు వాంగ్మూలం ఇచ్చారు. సాకులు చెబుతూ ష్యూరిటీలను తిరస్కరించడం, అదనపు ష్యూరిటీలు సమర్పించాలని కోరడంతో పాటు ప్రైజ్ మొత్తాలను చెల్లించకుండా మార్గదర్శి ఇబ్బంది పెడుతోందని చందాదారులు స్పష్టంగా చెప్పారు. సకాలంలో చెల్లింపులు చేయకపోవడం, చెల్లించాల్సిన ప్రైజ్ మొత్తాన్ని డిపాజిట్‌గా తమ వద్దే అట్టిపెట్టుకోవడం, తక్కువ వడ్డీ చెల్లించడం, చెల్లింపులు ఎగవేయడం లాంటి ఉల్లంఘనలకు మార్గదర్శి చిట్స్ పాల్పడినట్లు సీఐడీ దర్యాప్తులో తేలింది. అనంతరం ఆ సంస్థ ఆడిటర్ కుదరవల్లి శ్రవణ్‌ను 2023 మార్చి 29న అరెస్ట్ చేసింది. అనంతరం సంబంధిత కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది.అప్పట్లో మార్గదర్శికి వ్యతిరేకంగా తీవ్రంగా పోరాడిన సీఐడీశ్రవణ్ కుమార్ అరెస్ట్‌ను, రిమాండ్‌ను ప్రశ్నిస్తూ ఆయన భార్య నర్మదతో పాటు శ్రవణ్ కుమార్ కూడా ఆశ్చర్యకరంగా ‘హెబియస్ కార్పస్’ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. కీలక స్థానాల్లో ‘అనుకూల’ వ్యక్తులు ఉండటంతోనే అసాధారణ రీతిలో వీరు హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారన్న ప్రచారం అప్పట్లో గట్టిగా సాగింది. ఈ పిటిషన్‌ను అప్పట్లో తీవ్రంగా వ్యతిరేకించిన సీఐడీ చాలా గట్టిగా వాదనలు వినిపించింది.ఆధారాల్లేవంటూ తాజాగా కౌంటర్మార్గదర్శి చిట్‌ఫండ్ విషయంలో కేసు నమోదు చేయడం పొరపాటు అని సంబంధిత కోర్టులో ఫైనల్ రిపోర్ట్ దాఖలు చేయనున్నామంటూ హైకోర్టులో దాఖలు చేసిన తాజా కౌంటర్లో నివేదించింది. సంబంధిత కోర్టులో ఫైనల్ రిపోర్ట్ దాఖలు చేసేందుకు సీఐడీ అదనపు డీజీని అనుమతి కోరినట్లు సీఐడీ విజయవాడ ప్రాంతీయ కార్యాలయం అదనపు ఎస్పీ డి.ప్రసాద్ తన కౌంటర్లో హైకోర్టుకు తెలిపారు. ఆధారాలు చాలకపోవడంతో మార్గదర్శిపై నమోదు చేసిన కేసును మూసివేసేందుకు అనుమతి కోరుతూ అప్పటి దర్యాప్తు అధికారి రాజశేఖరరావు సీఐడీ అదనపు డీజీకి గత ఏడాది ఆగస్టు 12న లేఖ రాశారని, ఆ లేఖను పరిశీలించిన అదనపు డీజీ మార్గదర్శి చిట్‌ఫండ్‌పై కేసు మూసివేతకు ఆగస్టు 16న అనుమతినిచ్చారని పేర్కొన్నారు. దీంతో తుది నివేదిక సిద్ధం చేసి కోర్టులో దాఖలు చేసేందుకు అనుమతినివ్వాలని అదనపు డీజీని కోరామన్నారు.నాడు కీలక ఆధారాలు ఉన్నాయన్న సీఐడీ..వాస్తవానికి మార్గదర్శి చిట్‌ఫండ్స్ అవకతవకలపై దర్యాప్తు జరిపిన సీఐడీ పకడ్బందీగా అన్ని ఆధారాలను సేకరించింది. ఇదే విషయాన్ని గతంలోనే హైకోర్టుకు నివేదించింది. మార్గదర్శి చిట్‌ఫండ్ అక్రమాల కేసులో సంస్థ యజమాని శైలజా కిరణ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ వినిపించిన వాదనల సందర్భంగా ఈ విషయాన్ని చెప్పింది. మార్గదర్శి చిట్‌ఫండ్‌కు వ్యతిరేకంగా కీలక ఆధారాలున్నాయని, అందువల్ల బెయిల్ ఇవ్వొద్దంటూ గట్టిగా వాదనలు వినిపించింది. సీఐడీ సేకరించిన ఆధారాలను పరిగణనలోకి తీసుకున్న అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఖాతాదారుల ప్రయోజనాలను పరిరక్షించే నిమిత్తం చట్ట ప్రకారం మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు చెందిన దాదాపు రూ.1,050 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. మార్గదర్శి చిట్‌ఫండ్ అక్రమాలు, అవకతవకలకు కీలక ఆధారాలున్నాయని అప్పుడు తేల్చి చెప్పిన సీఐడీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం రాగానే ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించింది. తాము సేకరించిన మౌఖిక, రాతపూర్వక ఆధారాలేవీ కూడా మార్గదర్శి చిట్‌ఫండ్ అక్రమాలను రుజువు చేసేవిగా లేవంటూ నిస్సిగ్గుగా, నిస్సహాయంగా చేతులెత్తేసింది.మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాల్లో మచ్చుకు..సకాలంలో చందాదారులకు చెల్లింపులు చేయకపోవడం.. చెల్లించాల్సిన ప్రైజ్ మొత్తాన్ని డిపాజిట్‌గా తమ వద్దే అట్టిపెట్టుకోవడం.. తక్కువ వడ్డీ చెల్లించడం.. చెల్లింపులు ఎగవేయడం.. మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాల్లో మచ్చుకు కొన్ని! చందాదారులకు చెల్లించాల్సిన ప్రైజ్‌మనీని చెల్లించకుండా వడ్డీ చెల్లింపు పేరుతో తమ వద్దే అట్టిపెట్టుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే... చెల్లింపులు చేయడానికి మార్గదర్శి చిట్‌ఫండ్స్ వద్ద సరిపడినంత డబ్బు లేకపోవడమే. తన వద్ద డబ్బు లేదు కాబట్టి చందాదారులకు చెల్లించాల్సిన డబ్బునే భవిష్యత్తులో చెల్లించాల్సిన చందాగా మార్గదర్శి చిట్‌ఫండ్స్ తమ వద్దే అట్టిపెట్టుకుంది. అలా అట్టి పెట్టుకున్న మొత్తాలను మార్గదర్శి రొటేషన్ చేస్తూ వస్తోంది. చట్ట ప్రకారం చందాదారుల డబ్బును ప్రత్యేక ఖాతాల్లో ఉంచడం తప్పనిసరి. కానీ మార్గదర్శిలో అలా ఉంచకుండా దాన్ని ఇతర అవసరాలకు మళ్లించేశారు. ఈ ఉల్లంఘనలన్నీ డిపాజిటర్ల పరిరక్షణ చట్టం పరిధిలోకి వస్తాయి. -
గ్రూప్-2 పరీక్షలు నిలుపుదల సాధ్యం కాదు: ఏపీ హైకోర్టు
సాక్షి, అమరావతి: గ్రూప్-2 పరీక్షలు నిలుపుదల సాధ్యం కాదని హైకోర్టు తెలిపింది. హరిజాంటల్ రిజర్వేషన్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తదుపరి చర్యలు నిలుపుదల చేయాలని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు.. గురువారం విచారణ జరిపింది. పరీక్ష జరగకుండా ఉంటే అర్హులైన అభ్యర్థుల ప్రయోజనాలు ప్రమాదంలో పడతాయన్న కోర్టు.. ప్రధాన పరీక్షకి 92,250 మంది అర్హత సాధించారని పేర్కొంది.వీరిలో హారిజాంటల్ రిజర్వేషన్ అభ్యంతరంపై ఇద్దరు మాత్రమే కోర్టుకు వచ్చారన్న న్యాయస్థానం.. పరీక్ష నిలుపుదల చేయటం కుదరదని స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో 10 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ మార్చి 11కి వాయిదా వేసింది. -
సబ్ రిజిస్ట్రార్లు సకాలంలో నిర్ణయం తీసుకోవాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా స్థిరాస్తులను రిజి్రస్టేషన్ చేసుకునే విధానం (ఎనీవేర్ రిజి్రస్టేషన్) కింద ప్రజలు సమరి్పంచిన డాక్యుమెంట్ల విషయంలో సబ్ రిజిస్ట్రార్లు్ల సకాలంలో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు తెలిపింది. లేని పక్షంలో అవినీతికి ఆస్కారం ఇచ్చినట్లవుతుందని పేర్కొంది. రిజి్రస్టేషన్ కోసం ప్రజలు సమర్పించే డాక్యుమెంట్లను సకాలంలో పరిష్కరించేందుకు సబ్ రిజిస్ట్రార్లకు ఏవైనా మార్గదర్శకాలు జారీ చేశారా? లేదా? చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణ ఏప్రిల్ 16కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎనీవేర్ రిజి్రస్టేషన్ విధానం కింద ఆస్తుల రిజి్రస్టేషన్‌లో రిజిస్ట్రా్టర్లు జాప్యం చేస్తున్నారంటూ నెల్లూరుకి చెందిన పి.దుర్గేష్ బాబు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది నిమ్మగడ్డ రేవతి వాదనలు వినిపిస్తూ, ఎనీవేర్ రిజిస్ట్రేషన్ కింద డాక్యుమెంట్లు సమర్పించిన తరువాత, ఆ ఆస్తులు ఎక్కడున్నాయో ఆ ప్రాంత సబ్ రిజిస్ట్రార్‌కు డాక్యుమెంట్లపై ఆమోదం కోరడం జరుగుతుందన్నారు. ఆస్తులున్న ప్రాంత సబ్ రిజిస్ట్రార్ ఆమోదం తెలిపితేనే డాక్యుమెంట్లు సమర్పించిన చోట ఉన్న సబ్ రిజిష్ట్రార్ ఆస్తులను రిజిష్టర్ చేస్తున్నారని వివరించారు. అంతేకాక జాయింట్ రిజిష్ట్రార్, సబ్ రిజిష్ట్రార్లను వ్యక్తిగతంగా కలిసిన తరువాతే రిజి్రస్టేషన్లు అవుతున్నాయని ఆమె ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. వారిని కలవకుంటే పని కావడం లేదన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లపై నిర్ణయం తీసుకునేందుకు నిర్థిష్ట కాల వ్యవధిని ఖరారు చేస్తూ మార్గదర్శకాలు జారీ చేశారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఆదేశించింది. -
ప్రభుత్వ నిర్ణయానికి మాది బాధ్యత కాదు: హైకోర్టు
సాక్షి, అమరావతి: కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖకు తామేమీ కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. బెంచ్ ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గానీ, ముఖ్యమంత్రి గానీ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి తమపై బాధ్యత లేదని తేల్చిచెప్పింది. ఈ విషయాన్ని తాము చాలా స్పష్టంగా చెబుతున్నామంది. న్యాయ వ్యవస్థ స్వతంత్రత విషయంలో ఎవరూ జోక్యం చేసుకోలేరంది. అందుకు తాము ఎంత మాత్రం అనుమతించబోమని స్పష్టం చేసింది. బెంచ్ ఏర్పాటు విషయంలో సాధ్యాసాధ్యాల పరిశీలన నిమిత్తం న్యాయమూర్తులతో ఓ కమిటీని ఏర్పాటు చేశామని తెలిపింది. ఆ కమిటీ ఏం నివేదిక ఇస్తుందో తెలియదని, అందువల్ల కమిటీ నివేదిక కోసం వేచి చూడటం మంచిదని పిటిషనర్లకు సూచించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు విషయంలో అభిప్రాయం తెలపాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయ శాఖ కార్యదర్శి గత ఏడాది నవంబర్ 20న లేఖ రాసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు న్యాయమూర్తుల కమిటీ కర్నూలులో భవనాలను పరిశీలించనుందని న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ చెప్పారు. దీంతో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ న్యాయవాదులు తాండవ యోగేష్, తురగా సాయి సూర్య హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై బుధవారం సీజే జస్టిస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.అన్ని విషయాలను కమిటీ పరిశీలిస్తుంది విచారణ మొదలు కాగానే ధర్మాసనం స్పందిస్తూ, బెంచ్ ఏర్పాటు విషయంలో సాధ్యాసాధ్యాల పరిశీలన నిమిత్తం న్యాయమూర్తులతో ఓ కమిటీని ఏర్పాటు చేశామని తెలిపింది. బెంచ్ ఏర్పాటు అవసరం ఉందా? లేదా? దేశంలో పలు చోట్ల హైకోర్టు బెంచ్‌ల ఏర్పాటు ఎలా జరిగింది? అందుకు అనుసరించిన విధి విధానాలు ఏమిటి? వంటి అన్ని విషయాలను కమిటీ పరిశీలిస్తుందని తెలిపింది. కర్నూలులో బెంచ్ ఏర్పాటుకు సంబంధించి మీడియాలో వస్తున్న కథనాలు తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయంది. క్షేత్ర స్థాయిలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే ఈ కమిటీ నివేదిక ఇస్తుందని తెలిపింది. కమిటీ నివేదిక వచ్చాక ఆ నివేదికపై న్యాయమూర్తులందరితో కూడిన ఫుల్‌కోర్టులో చర్చించి, ఓ నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఒకవేళ కమిటీ నివేదికపై అభ్యంతరం ఉంటే, దానిని సవాలు చేసుకోవచ్చని చెప్పింది. ఈ దృష్ట్యా పిల్‌ను ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో కమిటీ నివేదిక తర్వాత సవాలు చేసుకోవాలని పిటిషనర్లకు ధర్మాసనం ఆప్షన్ ఇచ్చింది. అయితే యోగేష్ తమ పిల్‌ను పెండింగ్‌లో ఉంచాలని పదే పదే అభ్యర్థించడంతో ధర్మాసనం అంగీకరిస్తూ విచారణను మూడు నెలలకు వాయిదా వేసింది. ఇదే అంశంపై న్యాయవాది గుండాల శివప్రసాద్‌రెడ్డి దాఖలు చేసిన పిల్‌ను కూడా యోగేష్ తదితరుల పిల్‌తో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అమరావతి రాజధాని విషయంలో ఇదే హైకోర్టు విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పు మేరకు బెంచ్ ఏర్పాటు చేసే అవకాశం ప్రభుత్వానికి లేదని, ఆ తీర్పును పరిశీలించాలని యోగేష్ కోరగా, తాము ఇప్పుడు పరిశీలించబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. -
కర్నూలులో బెంచ్ ఏర్పాటుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: కర్నూలులో బెంచ్ ఏర్పాటుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై ప్రభుత్వ ప్రతిపాదన సవాలు చేస్తూ దాఖలైన పిల్‌పై ఏపీ హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. లా సెక్రటరీ హైకోర్టుకి పంపిన లేఖ నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ తరుపున న్యాయవాది పేర్కొన్నారు. విచారణ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానిస్తూ... బెంచ్ ఏర్పాటుపై తమదే తుది నిర్ణయం అని తెలిపింది. ఆ లేఖ తమపై ప్రభావం చూపదని పేర్కొంది.‘‘బెంచ్ ఏర్పాటుపై స్వతంత్రంగా మేం నిర్ణయం తీసుకుంటాం. వేర్వేరు రాష్ట్రాల నుంచి బెంచ్‌ల ఏర్పాటుపై వివరాలు తెప్పించుకున్నాం. ఏపీలో బెంచ్ ఏర్పాటు అవసరం ఉందా లేదా అనే ఇతర అంశాల డేటాను తెప్పించుకుంటున్నాం’’ అని న్యాయస్థానం తెలిపింది. బెంచ్ ఏర్పాటుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు కదా?.. అప్పుడే ఎందుకు పిల్ దాఖలు చేశారని హైకోర్టు ప్రశ్నించింది.అసలు లేఖ ఇవ్వటమే న్యాయ వ్యవస్థలో జోక్యం చేసుకున్నట్లు అని.. అది నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ పేర్కొన్నారు. మేం నిర్ణయం తీసుకున్న తర్వాత పిల్ అవసరం ఉండవచ్చు ఉండక పోవచ్చు కాబట్టి విత్ డ్రా చేసుకోవాలని పిటిషనర్‌కు కోర్టు చెప్పింది. మళ్లీ పిల్ ఫైల్ చేయటానికి కొత్త అంశాలు లేవని ఈ పిల్‌ను పెండింగ్‌లో పెట్టాలని పిటిషనర్ కోరారు. తదుపరి విచారణను 3 నెలలకు కోర్టు వాయిదా వేసింది. -
ఏపీ పోలీసుల తీరుపై మరోసారి హైకోర్టు ఆగ్రహం
-
కేసులు పెట్టడం.. లోపలేయడం.. కొట్టడం..: హైకోర్టు ఆగ్రహం
సాక్షి, అమరావతి: పోలీసుల తీరుపై హైకోర్టు మరోసారి నిప్పులు చెరిగింది. వ్యక్తులపై కేసులు పెట్టడం, వారిని కొట్టడం, లోపలేయడం తప్ప మీరేం చేస్తున్నారు... అంటూ నిలదీసింది. కేసులు పెట్టి లోపలేస్తున్నారే తప్ప, ఏ కేసులోనూ దర్యాప్తు చేయడం లేదని తీవ్రంగా ఆక్షేపించింది. కోర్టు ఆదేశాలను పోలీసులు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారంటూ మండిపడింది. ఇలాంటి తీరును తాము సహించబోమని పోలీసులను హెచ్చరించింది. బొసా రమణ అనే వ్యక్తి అరెస్ట్ విషయంలో దర్యాప్తు చేసి ఉంటే, ఆ వివరాలను తమ ముందుంచేవారని, దర్యాప్తు చేయలేదు కాబట్టే, ఏ వివరాలను సమర్పించలేదని పేర్కొంది. రమణపై 27 కేసులు ఉన్నాయని చెబుతున్నారని, అలాంటప్పుడు ఈ కేసుల్లో దర్యాప్తు వివరాలను ఎందుకు తమ ముందుంచలేదని పోలీసులను ప్రశ్నించింది. రమణ అరెస్ట్ వ్యవహారాన్ని డీజీపీ దృష్టికి తీసుకెళ్లాలని గత విచారణ సమయంలో తాము ఆదేశాలు జారీ చేశామని గుర్తు చేసింది. తమ ఆదేశాల మేరకు ఈ విషయంలో డీజీపీ ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. రమణ అరెస్ట్ విషయంలో నివేదికలు ఇవ్వడానికి ప్రకాశం జిల్లా ఎస్పీ, విశాఖపట్నం కమిషనర్లకు మరింత గడువునిచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 25కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ కుంచం మహేశ్వరరావు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తన భర్తను అక్రమంగా నిర్బంధించారంటూ బొసా లక్ష్మి పిటిషన్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులను విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారంటూ విశాఖపట్నం మద్దిపాలెంలోని చైతన్యనగర్‌కి చెందిన బొసా రమణను కొద్దికాలం కిందట పోలీసులు అరెస్ట్ చేశారు. తన భర్తను ప్రకాశం జిల్లా పొదిలి, దర్శి పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, ఆయనని కోర్టులో హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ రమణ భార్య బొసా లక్ష్మి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం ఇటీవల విచారణ జరిపింది. రమణ అరెస్ట్ విషయంలో పొదిలి, దర్శి స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో)ల వివరణ కోరింది. రమణను తాము అరెస్ట్ చేయలేదని వారు కోర్టుకు చెప్పారు. ఇచ్ఛాపురం పోలీసులు మరో కేసులో రమణను అరెస్ట్ చేశారని తెలిపారు. దీంతో హైకోర్టు ఇచ్ఛాపురం ఎస్‌హెచ్‌వోను ప్రతివాదిగా చేర్చింది. అనంతరం ఇచ్ఛాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ చిన్నం నాయుడు, పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ టి.వెంకటేశ్వర్లు వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కోర్టు ముందు హాజరైన ఇద్దరు సర్కిల్ ఇన్స్పెక్టర్లు... లక్ష్మి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ మంగళవారం మరోసారి విచారణకు వచ్చింది. ధర్మాసనం ఆదేశాల మేరకు సీఐలు చిన్నం నాయుడు, వెంకటేశ్వర్లు కోర్టు ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ కోర్టు ఆదేశాలను పోలీసులు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేసింది. రమణను తమ ముందు హాజరుపరచాలన్న ఆదేశాలను అమలు చేయకపోవడమే ఇందుకు నిదర్శనమని చెప్పింది. ఇలాంటి నిర్లక్ష్యపు తీరును తాము ఎంత మాత్రం సహించేది లేదని తేల్చి చెప్పింది. ఈ సమయంలో పొదిలి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తరఫు న్యాయవాది స్పందిస్తూ, బొసా రమణపై 27 కేసులున్నాయని తెలిపారు. రమణను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపిన నాటి నుంచి ఇప్పటి వరకు ఆ కేసులో దర్యాప్తు ఎంత వరకు వచ్చిందని ధర్మాసనం ప్రశ్నించింది. కేసులు పెట్టడం, లోపలేయడం, కొట్టడం మినహా దర్యాప్తు చేయడం లేదని పేర్కొంది. -
పోలీసు స్టేషన్లలో సీసీ కెమెరాల పనితీరుపై నివేదిక ఇవ్వండి
సాక్షి, అమరావతి: వ్యక్తులను అక్రమంగా నిర్బంధించిన సమయాల్లో తమ పోలీస్ స్టేషన్లలోని సీసీ కెమెరాలు పనిచేయడం లేదంటూ పోలీసులు తరచూ చెబుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో ఉన్న సీసీ కెమెరాల పనితీరుపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో 1,392 పోలీస్ స్టేషన్లు ఉండగా, 1,001 స్టేషన్లలో మాత్రమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మిగిలిన స్టేషన్లలో ఏర్పాటు చేయకపోవడానికి కారణాలేమిటి? వాటిని ఏర్పాటు చేసేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంది.సీసీ కెమెరాలను సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఏర్పాటు చేశారా? స్టేషన్ ప్రాంగణం మొత్తం కనిపిస్తుందా అనే ప్రధాన విషయాలతో రాష్ట్రస్థాయిలో ఐటీ విభాగాన్ని పర్యవేక్షించే అధికారికి నివేదికలివ్వాలని అందరు డీఎస్పీలను ఆదేశించింది. ఆ నివేదికలను తమ ముందుంచాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అంతేకాక పోలీస్ స్టేషన్లు, జైళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటు, నిర్వహణ, మరమ్మతులు, సీసీ టీవీ ఫుటేజీ నిల్వ సామర్థ్యం తదితర వివరాలతో అదనపు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. రాష్ట్రంలోని జైళ్లలో ఉన్న 1,226 సీసీ కెమెరాల్లో 785 మాత్రమే పనిచేస్తున్నాయని, మిగిలిన వాటి మరమ్మతులపై ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంది.సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం సీసీ టీవీ ఫుటేజీని 12 నెలలు స్టోర్ చేయాలని, ప్రస్తుతం పోలీస్ స్టేషన్లలో ఎన్ని నెలల ఫుటేజ్‌ని స్టోర్ చేయవచ్చో స్పష్టతనివ్వాలని ఆదేశించింది. పోలీస్ స్టేషన్లలో రికార్డయిన ఫుటేజీని ఎక్కడ స్టోర్ చేస్తున్నారని, దాని బ్యాకప్ కోసం జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఏదైనా వ్యవస్థ ఉందా వంటి వివరాలను కూడా తమకు సమర్పించే నివేదికలో పొందుపరచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 10కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ కుంచం మహేశ్వరరావు ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు 2015లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అన్ని పోలీస్ స్టేషన్లు, జైళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాల్సి ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదంటూ న్యాయవాది తాండవ యోగేష్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం.. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం సీసీ కెమెరాల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలంటూ 2019లో ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయలేదని, తద్వారా అధికారులు కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారంటూ యోగేష్ 2022లో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు.ఈ వ్యాజ్యంపై జస్టిస్ రఘునందన్‌రావు ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ యోగేష్ జోక్యం చేసుకుంటూ.. ఇంకా 391 స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. సీసీ టీవీల స్టోరేజీ సామర్థ్యాన్ని, ఫుటేజీని ఎక్కడ భద్రపరుస్తున్నారు వంటి వివరాలను ప్రభుత్వం చెప్పలేదన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ప్రభుత్వానికి పలు కీలక ఆదేశాలు ఇచి్చంది. -
పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు.. కూటమి ప్రభుత్వంపై హైకోర్టు ప్రశ్నల వర్షం
సాక్షి,అమరావతి : రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పందించింది. పోలీస్ స్టేషన్లు, జైళ్లలో సీసీ టీవీ కెమెరాల ఏర్పాట్లపై కూటమి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా 1392 పోలీస్ స్టేషన్లు ఉంటే 1001 స్టేషన్లలోనే ఎందుకు సీసీ కెమెరాలు పెట్టారు? మిగిలిన స్టేషన్లలో ఎందుకు సీసీ కెమెరాలు పెట్టలేదు? సుప్రీంకోర్టు మార్గదర్శికాల ప్రకారం సీసీటీవీలు పెట్టరా..? పోలీస్ స్టేషన్ ప్రాంగణం మొత్తం కనిపించేలా సీసీటీవీలు ఏర్పాటు చేశారా..?అని ప్రశ్నలు సంధించింది. సీసీటీవీ కెమెరాల ఏర్పాట్లపై డీఎస్పీలందరి నుంచి నివేదిక తెప్పించుకోవాలని, ఆ నివేదికను కోర్టు ముందు ఉంచాలని సూచించింది. అదే సమయంలో జైళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాట్లపై వివరణ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
సుగాలి ప్రీతి కేసు ఇక మూలకే!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పదో తరగతి దళిత విద్యార్థిని సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతి కేసు ఇక మూలకు చేరనుంది. గత చంద్రబాబు పాలనలో జరిగిన ఈ ఘటనపై అప్పట్లో పోలీసులు తూతూమంత్రంగా విచారించారు. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని తల్లిదండ్రులు కోరగా, ఆమేరకు వైఎస్ జగన్ ఉత్తర్వులిచ్చారు. అయినా సీబీఐ దర్యాప్తు చేపట్టకపోవడంతో తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి సాగదీస్తూ వచ్చిన సీబీఐ.. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం రావడంతో పూర్తిగా యూటర్న్ తీసుకుంది. ఈ కేసులో అంత సంక్లిష్టత లేదని హైకోర్టుకు తెలిపింది. వనరుల కొరత కారణంగా చూపుతూ తాము దర్యాప్తు చేయలేమని తేల్చి చెప్పింది. ప్రీతి తల్లిదండ్రుల పిటిషన్‌ను కొట్టేయాలని హైకోర్టును కోరింది. చంద్రబాబు హయాంలో తూతూ మంత్రంగా దర్యాప్తుకర్నూలు నగర శివార్లలోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్లో పదో తరగతి చదువుతున్న సుగాలి ప్రీతీబాయ్ 2017 ఆగస్టు 19న అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఫ్యాన్‌కి ఉరేసుకుని చనిపోయినట్లు పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులకు చెప్పింది. తమ కుమార్తె ఉరి వేసుకుని చనిపోలేదని, స్కూల్ యజమాని కొడుకులు లైంగిక దాడి చేసి చంపేశారని తల్లిదండ్రులు సుగాలి రాజు నాయక్, పార్వతిదేవి ఆరోపించారు. అయినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ‘జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి’ పేరుతో సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమమే జరిగింది. అదే రోజు కర్నూలు పోలీసులు ఎస్సీ, ఎస్టీ చట్టంతో పాటు పోక్సో చట్ట నిబంధనల కింద కూడా కేసు పెట్టినా, అప్పటి ప్రభుత్వ పెద్దల తీరుతో తూతూ మంత్రంగా దర్యాప్తు జరిపారు. అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో ఆ స్కూలు కరస్పాండెంట్, ఆయన కుమారులను అరెస్ట్ చేశారు. తరువాత కొద్ది రోజులకే వారు బెయిల్‌పై బయటకు వచ్చేశారు. చంద్రబాబు హయాంలో కేసు దర్యాప్తు ముందుకు సాగలేదు.సీబీఐ స్పందించకపోవడంతో హైకోర్టులో పిటిషన్రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ, సీబీఐ కూడా స్పందించలేదు. దీంతో వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు దర్యాప్తు చేసేలా సీబీఐని ఆదేశించాలని కోరుతూ 2020 సెప్టెంబర్ 11న హైకోర్టులో ప్రీతి తల్లిదండ్రులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు సీబీఐ ఎస్పీ రఘురామ రాజన్ ఈ నెల 13న హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ప్రీతి మృతి కేసులో అంతర్రాష్ట్ర పర్యవసానాలు, తాము జోక్యం చేసుకోవాల్సినంత చట్టపరమైన సంక్లిష్టత లేవని అందులో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని సీబీఐ ప్రధాన కార్యాలయానికి కూడా తెలిపామన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు, సుప్రీంకోర్టు, హైకోర్టుల ఆదేశాల మేరకు పలు ముఖ్యమైన, సున్నిత కేసుల్లో దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.అందువల్ల తమకున్న పరిమిత వనరులతో ఈ కేసు దర్యాప్తు చేపట్టడం సాధ్యం కాదని హైకోర్టుకు వివరించారు. సీబీఐ దర్యాప్తు చేసేలా ఆదేశించాలని కోరుతూ ప్రీతి తల్లిదండ్రులు దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను కొట్టేయాలని హైకోర్టును కోరారు. ప్రీతి మృతి కేసును అప్పట్లో రాజకీయంగా వాడుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో ఎలా స్పందిస్తారో చూడాలి. న్యాయం చేసిన అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డివైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రీతి కేసులో తదుపరి దర్యాప్తునకు ఆదేశించింది. అనంతరం ఓసారి కర్నూలు వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని ప్రీతి తల్లిదండ్రులు కలిశారు. తమ కుమార్తె మృతి విషయంలో న్యాయం చేయాలని కోరారు. వారికి న్యాయం చేస్తానని జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగానే ప్రీతి మృతి కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ 2020 ఫిబ్రవరిలో ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అంతేకాక 2021లో ప్రీతి తల్లిదండ్రులకు రూ. 8 లక్షల నగదు, 5 సెంట్ల ఇంటి స్థలం, ఐదెకరాల పొలాన్ని కూడా జగన్ ప్రభుత్వం ఇచ్చింది. ప్రీతి తండ్రి రాజు నాయక్‌కు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇచ్చింది. అయినా చంద్రబాబు కనీస చర్యలు కూడా తీసుకోకపోయినా, వైఎస్ జగన్ ప్రభుత్వం రాగానే టీడీపీ, జనసేన నేతలు ఈ కేసుపై నానా రాద్ధాంతం చేశారు. -
ఏదైనా చట్ట ప్రకారమే చేయాలి
సాక్షి, అమరావతి: చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట గ్రామ పరిధిలోని అటవీ భూములను ఆక్రమించుకున్నారని ఆరోపించడంతోపాటు వాటిపై వివరణ ఇవ్వాలంటూ అధికారులు జారీ చేసిన నోటీసులను సవాలు చేస్తూ మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు, రాజంపేట ఎంపీ విథున్‌రెడ్డి, తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి, పి.ఇందిరమ్మ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. నోటీసులను రద్దు చేసి, తమ భూముల విషయంలో జోక్యం చేసుకోకుండా అధికారులను ఆదేశించాలని వారు తమ వ్యాజ్యాల్లో కోర్టును కోరారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు, ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవాలన్నా కూడా చట్ట నిబంధనలకు అనుగుణంగానే చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని అధికారులకు స్పష్టం చేసింది. తదుపరి విచారణను మార్చి 6వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.మంగళంపేట గ్రామంలోని సర్వే నంబర్ 296/2లోని 18.94 ఎకరాల భూమిపై పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి, సర్వే నంబర్ 295/1లోని 15 ఎకరాలపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, 295/1సీ లోని 21 ఎకరాలపై మిథున్‌రెడ్డి, సర్వే నంబర్లు 295/1బీలో 10.8 ఎకరాలు, 295/1డీలో 89 సెంట్లు, 296/1లో 9.11 ఎకరాల భూముల విషయంలో ఇందిరమ్మ పిటిషన్లు దాఖలు చేశారు. వీరి తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, పిటిషనర్లు అటవీ భూములను ఆక్రమించలేదని తెలిపారు. ఆ భూములను 20 ఏళ్ల కిందటే వాటి యజమానుల నుంచి కొనుగోలు చేశారని వివరించారు. అప్పట్లోనే అక్కడ నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. ఇప్పుడు వాటిని అటవీ భూములుగా పేర్కొంటూ నోటీసులు జారీ చేశారని చెప్పారు. తమ మనుషుల సమక్షంలో సర్వే చేసినట్లు పేర్కొంటూ అధికారులు వాట్సాప్ ద్వారా నోటీసులు పంపారన్నారు. నిరాధార ఆరోపణలతో ఓ పత్రిక ప్రచురించిన కథనాన్ని ఆధారంగా చేసుకుని అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆయన వివరించారు. వాదనలు విన్న న్యాయస్థానం... పిటీషనర్ల విషయంలో కఠిన చర్యలేవైనా తీసుకోవాల్సి వస్తే, చట్ట ప్రకారమే నడుచుకోవాలని అధికారులను ఆదేశించింది. -
డీజీపీని కోర్టుకు పిలుస్తాం: హైకోర్టు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోలీసులు న్యాయస్థానాల ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని, దీనిపై డీజీపీని కోర్టుకు పిలిపించి వివరణ కోరతామని హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పౌరులను అక్రమంగా నిర్బంధిస్తుండటమే కాక, నిర్బంధంలో ఉన్న వారిని తమ ముందు హాజరు పరచాలంటూ తామిస్తున్న ఆదేశాలను పోలీసులు ఏమాత్రం ఖాతరు చేయడం లేదని నిప్పులు చెరిగింది. పోలీసులు పరిధి దాటి వ్యవహరిస్తున్నారని స్పష్టంగా కనిపిస్తోందని మండిపడింది. చాలా దూరం వెళుతుండటం సరికాదని హెచ్చరించింది. రాష్ట్రంలో పరిస్థితులు ఉండాల్సింది ఇలాగేనా.. అంటూ నిలదీసింది. ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు అతన్ని చట్ట ప్రకారం మేజి్రస్టేట్ ముందు హాజరు పరచకుండానే విడుదల చేయడంపై విస్మయం వ్యక్తం చేసింది. అంతేకాక నిర్బంధించిన వ్యక్తిని తమ ముందు హాజరు పరచాలన్న ఆదేశాలను సైతం పోలీసులు పట్టించుకోలేదంటే ఏమనుకోవాలని ప్రశ్నించింది. ఈ కేసు చాలా చిన్నదని, ఇలాంటి కేసులు ఎన్నో ఉన్నాయని.. దీనిపై కోర్టు సమయం వృథా చేసుకోరాదంటూ ఇచ్ఛాపురం ఇన్స్పెక్టర్ చిన్నం నాయుడు తరఫు న్యాయవాది చెప్పడంపై హైకోర్టు ఒకింత విస్మయం వ్యక్తం చేసింది. పోలీసుల చర్యలు మీకు చిన్న విషయంగా కనిపిస్తోందా? అంటూ నిలదీసింది. మీరు మొన్నటి వరకు ఆ వైపు (కక్షిదారులు) ఉన్నారని, ఇప్పుడు ఈ వైపు (అధికారుల వైపు) ఉన్నారని, అయితే న్యాయం అందరికీ ఒక్కటేనన్న విషయం మర్చిపోవద్దని స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారాన్ని డీజీపీ, ప్రకాశం జిల్లా ఎస్పీ ముందు ఉంచాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ నూనెపల్లి హరినాథ్ ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వాంగ్మూలం నమోదు చేశాక మళ్లీ నోటీసా? ⇒ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులను విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారంటూ విశాఖపట్నం జిల్లా మద్దిపాలెంలోని చైతన్యనగర్‌కు చెందిన బొసా రమణను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో రమణ భార్య బొసా లక్ష్మీ తన భర్తను ప్రకాశం జిల్లా పొదిలి, దర్శి పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, ఆయన్ను కోర్టు ఎదుట హాజరు పరిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ⇒ ఈ వ్యాజ్యంపై జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం ఇటీవల విచారణ జరిపింది. రమణను తాము అరెస్ట్ చేయలేదని పొదిలి, దర్శి స్టేషన్ హౌజ్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో)లు హైకోర్టుకు నివేదించారు. అయితే పిటిషనర్ తరఫు న్యాయవాది పాపిడిప్పు శశిధర్‌రెడ్డి మాత్రం రమణ పోలీసుల అక్రమ నిర్బంధంలోనే ఉన్నారని వివరించారు. దీంతో హైకోర్టు తదుపరి విచారణ సమయంలో రమణను తమ ముందు హాజరు పరచాలంటూ గత ఏడాది నవంబర్ 11న ప్రకాశం జిల్లా ఎస్పీ, పొదిలి, దర్శి స్టేషన్ హౌజ్ ఆఫీసర్లను ఆదేశించింది. ⇒ నవంబర్ 13న కేసు విచారణకు రాగా, రమణను శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పోలీసులు అరెస్ట్ చేశారని, ఆయన్ను స్థానిక కోర్టు ముందు హాజరు పరచగా, కోర్టు జుడీషియల్ రిమాండ్ విధించినట్లు ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. దీంతో హైకోర్టు ఈ కేసులో ఇచ్ఛాపురం ఎస్‌హెచ్‌వోను ప్రతివాదిగా చేర్చింది. అలాగే పొదిలి, ఇచ్ఛాపురం ఎస్‌హెచ్‌వోలను స్వయంగా కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు ఇద్దరు ఎస్‌హెచ్‌వోలు ధర్మాసనం ముందు హాజరై వివరణ ఇచ్చారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినట్లు అంగీకరిస్తూ రమణ వాంగ్మూలం ఇచ్చారన్నారు. ఆ తర్వాత సెక్షన్ 41ఏ నోటీసు తీసుకోవడానికి రమణ నిరాకరించడంతో ఆయన్ను అరెస్ట్ చేసి, అనంతరం విడిచి పెట్టామని పొదిలి ఎస్‌హెచ్‌వో చెప్పారు. ⇒ తాజాగా బుధవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది. పొదిలి ఎస్‌హెచ్‌వో తీరుపై ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. ఓ వ్యక్తిని అలా ఎలా అరెస్ట్ చేస్తారని, ఓసారి వాంగ్మూలం నమోదు చేసిన తర్వాత సెక్షన్ 41ఏ నోటీసు ఇవ్వాల్సిన అవసరం ఏముందో అర్థం కావడం లేదంది. బాధ్యతాయుతమైన అధికారి అయి ఉండి, ఓ వ్యక్తిని అలా అరెస్ట్ చేసి, ఇలా వదిలేశామని ఎలా చెబుతారంటూ ప్రశ్నించింది. అరెస్ట్, విడుదల విషయంలో ఎలాంటి రికార్డు నిర్వహించక పోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో నివేదికలు ఇవ్వాలని ప్రకాశం జిల్లా ఎస్పీ, విశాఖపట్నం పోలీస్ కమిషనర్లను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. -
తిరుపతి తొక్కిసలాటపై.. తదుపరి ఆదేశాలు అక్కర్లేదు
సాక్షి, అమరావతి :వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించడంతో పాటు 40 మందికి పైగా గాయపడిన ఘటనపై హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటైన నేపథ్యంలో ఈ వ్యవహారంలో తదుపరి ఆదేశాలేవీ అవసరంలేదని హైకోర్టు స్పష్టంచేసింది. అలాగే, విచారణ కమిషన్ తన నివేదికను గవర్నర్‌కు మాత్రమే సమర్పించేలా ఆదేశాలిచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. విచారణ నివేదికను గవర్నర్‌కు మాత్రమే ఇవ్వాలన్న నిబంధన ఏదీ చట్టంలో లేదని గుర్తుచేసింది.అంతేకాక.. విచారణ గడువును 30 రోజులకే పరిమితం చేయాలన్న అభ్యర్థనను సైతం హైకోర్టు తోసిపుచ్చింది. కమిషన్స్ ఆఫ్ ఎంక్వయిరీ చట్టం కింద కమిషన్‌ను ఏర్పాటుచేయడం, విచారణ గడువును నిర్ధేశించడం పూర్తిగా ప్రభుత్వ విచక్షణాధికారమని తేల్చిచెప్పింది. కమిషన్ విచారణకు సమయం పడుతుందని.. అందువల్ల విచారణ పూర్తికి గడువును నిర్ధేశించలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది. తొక్కిసలాట ఘటనపై సిట్టింగ్ లేదా విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించడంతో పాటు, ఘటనపై విచారణ జరిపి 30 రోజుల్లో నివేదికను గవర్నర్‌కు సమర్పించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ కర్నూలు జిల్లా, పాండురంగాపురానికి చెందిన రైతు గుదిబండ ప్రభాకర్‌రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై గత వారం వాదనలు విని తీర్పు వాయిదా వేసిన ధర్మాసనం, బుధవారం తన నిర్ణయాన్ని వెలువరించింది. మరోవైపు.. తొక్కిసలాటపై విచారణకు ఆదేశించాలని కోరుతూ విజయవాడకు చెందిన వంగవీటి నరేంద్ర పిల్‌ను సైతం హైకోర్టు పరిష్కరించింది. -
చంద్రబాబుపై కేసుల విచారణ వాయిదా
సాక్షి, అమరావతి : సీఎం చంద్రబాబునాయుడు, మంత్రులు లోకేశ్, పొంగూరు నారాయణ, కింజరాపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, వ్యాపారవేత్తలు లింగమనేని రమేష్, వేమూరు హరికృష్ణ ప్రసాద్ తదితరులతో పాటు పలు కంపెనీలపై గతంలో నమోదైన కేసులన్నింటినీ సీబీఐ, ఈడీలకు అప్పగించేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)లో హైకోర్టు తదుపరి విచారణను రెండు నెలలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. 2014–19 మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా జరిగిన పలు కుంభకోణాలపై నమోదైన కేసుల్లో పోలీసులు నిష్పాక్షికంగా దర్యాప్తు చేసే పరిస్థితులు ప్రస్తుతంలేవని.. వీటి తదుపరి దర్యాప్తు బాధ్యతలను సీబీఐ, ఈడీలకు అప్పగించాలని సీనియర్ పాత్రికేయుడు, స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్ కొట్టి బాలగంగాధర తిలక్ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై బుధవారం సీజే ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.. ఇదే రకమైన వ్యవహారంలో సుప్రీంకోర్టు ఏవో ఉత్తర్వులు ఇచ్చినట్లు పత్రికల్లో చదివామని వ్యాఖ్యానించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది చింతల సుమన్ స్పందిస్తూ.. పిటిషన్ ఉపసంహరణకు సుప్రీంంకోర్టు అనుమతినిచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ.. ప్రస్తుత కేసులో చేసిన అభ్యర్థనతో సుప్రీంకోర్టులో ఓ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారని, దానిని సుప్రీంకోర్టు తోసిపుచ్చిందన్నారు. ఆ పిటిషన్లో ప్రస్తుత పిటిషనర్ బాలగంగాధర్ తిలక్ ఇంప్లీడ్ అయ్యారని, ఈ విషయాన్ని ఆయన చెప్పడంలేదన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల కాపీని కోర్టు ముందుంచుతామన్నారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ విచారణను రెండునెలలకు వాయిదా వేసింది. -
మరోసారి పోలీసులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం
సాక్షి, విజయవాడ: మరోసారి పోలీసులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు తన భర్త రమణను పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ భార్య లక్ష్మి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా పోలీసులపై ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు ఆదేశాలను పోలీసులు బేఖాతరు చేస్తున్నారంటూ సీరియస్ అయ్యింది. ‘‘రాష్ట్రంలో పరిస్థితులు ఇలాగేనా ఉండాల్సింది..?. తమ ముందున్న కేసుల్లో పోలీసులు పరిధి దాటి వ్యవహరిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. పోలీసుల చర్యలపై డీజీపీని పిలిపించి వివరణ కోరతాం’’ అని పేర్కొన్న హైకోర్టు.. రమణను అరెస్టు చేసిన పోలీసులు అతన్ని చట్ట ప్రకారం మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచకుండానే విడుదల చేయడంపై విస్మయం వ్యక్తం చేసింది.ఈ కేసులో పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని ప్రకాశం జిల్లా ఎస్పీ, విశాఖపట్నం పోలీస్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఈనెల 18కి వాయిదా వేసింది.ఇదీ చదవండి: మరో వీడియో విడుదల చేసిన కిరణ్ రాయల్ బాధితురాలు -
పోలీసులకు మా ఆదేశాలంటే గౌరవం లేదు
కోర్టు ఎప్పుడు సీసీటీవీ ఫుటేజీ కావాలని అడిగినా, ఆ వెంటనే అది మిస్టీరియస్‌గా మాయమైపోతోంది. కాలిపోయిందని మీరు చెబుతున్నారు.. నిజంగా కాలిపోయిందో, ఇంకేమైనా జరిగిందో ఎవరికి తెలుసు? ప్రతి పోలీస్‌స్టేషన్‌లో ఉన్న సీసీ టీవీలు సజావుగా పని చేస్తున్నాయా? లేదా? అన్న విషయాన్ని ప్రతి వారం సంబంధిత స్టేషన్‌హౌజ్ ఆఫీసర్ల నుంచి నివేదికలు తెప్పించుకుని రూఢీ చేసుకోవాలని ఆయా జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీ చేస్తాం. లేకపోతే ప్రతి సీసీ టీవీ ఫుటేజీ మాయమవుతూనే ఉంటుంది. కోతుల వల్ల సీసీ టీవీ కాలిపోయిందంటే మేం నమ్మాలా? తప్పులను సమర్ధించుకోవద్దు. – హైకోర్టు ధర్మాసనం సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోలీసులకు న్యాయస్థానాలు ఇచ్చే ఆదేశాలపై ఏ మాత్రం గౌరవం ఉండటం లేదని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. అక్రమ నిర్బంధాల విషయంలో వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు సంబంధిత పోలీస్‌స్టేషన్‌లోని సీసీ టీవీ ఫుటేజీని తమ ముందుంచాలని ఆదేశాలు ఇచ్చినప్పుడే, ఆ సీసీ టీవీ పుటేజీ మాయమవుతోందని తెలిపింది. ఇది చాలా మిస్టీరియస్‌గా మాయమవుతోందని, పోలీసులు చెబుతున్న కారణాలు ఎంత మాత్రం నమ్మశక్యంగా లేవని చెప్పింది. సీసీ టీవీ ఫుటేజీలు మాయమైపోతుంటే ఐజీ, ఎస్పీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే, ప్రతి పోలీస్‌స్టేషన్‌లో ఉన్న సీసీ టీవీలు సజావుగా పని చేస్తున్నాయా? లేదా? అన్న విషయాన్ని ప్రతి వారం సంబంధిత స్టేషన్‌హౌజ్ ఆఫీసర్ల నుంచి నివేదికలు తెప్పించుకుని రూఢీ చేసుకోవాలని ఆయా జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేసింది. కోతుల కారణంగా సీసీ టీవీ ఎస్ఎంపీఎస్లోని సర్క్యూట్ కాలిపోయిన కారణంగా సీసీ టీవీ ఫుటేజీని కోర్టు ముందుంచలేక పోతున్నామన్న పోలీసుల వాదనను హైకోర్టు మరోసారి తప్పు పట్టింది. సర్క్యూట్ కాలిపోవడం చేత సీసీ టీవీ ఫుటేజీ రికవరీ చేయడం సాధ్యం కాదంటూ సౌత్రిక టెక్నాలజీస్ ఇచ్చిన నివేదికపై అనుమానాలున్నాయని హైకోర్టు తెలిపింది. ఆ నివేదికలోని సంతకాలు, సీలు తేడాగా ఉన్నాయంది. ఈ నేపథ్యంలో కాలిపోయిన సీసీ టీవీ పరికరాలను తామే స్వయంగా పరిశీలిస్తామని తెలిపింది. ఆ పరికరాలను తదుపరి విచారణ సమయంలో తమ ముందుంచాలని జిల్లా ఎస్పీని ఆదేశించింది. తామిచ్చిన ఆదేశాలను అమలు చేయకుండా, సీసీ టీవీ కాలిపోయిందని.. అందువల్ల ఫుటేజీ లేదంటూ అఫిడవిట్ దాఖలు చేసిన పల్నాడు జిల్లా మాచవరం పోలీస్‌స్టేషన్, స్టేషన్ హౌజ్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో)పై జిల్లా ఎస్పీ తీసుకున్న చర్యల పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎస్పీ చర్యలు ఏ మాత్రం సంతృప్తికరంగా లేవంది. ఇంక్రిమెంట్లో కోత సరిపోదని, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందేనని తేల్చి చెప్పింది. తన సోదరుడిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను ఎందుకు ఉపసంహరించుకుంటున్నారో తెలియచేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్ కాటారి నాగరాజును ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ నూనెపల్లి హరినాథ్ ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.సోదరుడి అక్రమ నిర్బంధంపై సీసీటీవీ ఫుటేజీ కోరుతూ పిటిషన్...తన సోదరుడు కటారి గోపిరాజును పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, ఆయన్ను కోర్టు ముందు హాజరు పరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ కటారు నాగరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన సోదరుడిని నవంబర్ 3న అక్రమంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు.. 7వ తేదీనే అరెస్ట్ చేశామంటూ అబద్ధం చెబుతున్నారని, ఈ నేపథ్యంలో మాచవరం పోలీస్‌స్టేషన్‌లో నవంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు సీసీ టీవీకి సంబంధించిన ఫుటేజీని కోర్టుకు సమర్పించేలా ఆదేశాలివ్వాలంటూ కూడా ఆయన ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. నాగరాజు పిటిషన్‌పై గతంలో విచారణ జరిపిన జస్టిస్ రఘునందన్‌రావు ధర్మాసనం.. నవంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు సీసీ టీవీ ఫుటేజీని పెన్ డ్రైవ్‌లో ఉంచి సంబంధిత మేజిస్ట్రేట్ ముందుంచాలని పోలీసులను ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కూడా స్పష్టం చేసింది. అయితే సీసీ టీవీ కాలిపోయిందని, అందువల్ల ఆ ఫుటేజీని ఇవ్వలేమంటూ మాచవరం పీఎస్ స్టేషన్‌హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో) అఫిడవిట్ వేశారు. దీనిపై మండిపడ్డ హైకోర్టు, పోలీసులు ఏవో కుంటిసాకులు చెబుతూ ఆ ఫుటేజీలను తమ ముందుంచడం లేదని తప్పు పట్టింది. ఇలాంటి తమాషాలకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఎస్‌హెచ్‌వోపై చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.కోతుల వల్ల కాలిపోయింది.. తాజాగా మంగళవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, ఈ వ్యాజ్యాన్ని ఉపసంహరించుకోవాలని పిటిషనర్ నిర్ణయించుకున్నారని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ, పిటిషనర్‌కు ఏ మైనా హాని ఉందా? అని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. అనంతరం పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) విష్ణు తేజ స్పందిస్తూ, కోతుల వల్ల వైర్లలో సమస్యలు వచ్చి సర్క్యూట్ కాలిపోయిందన్నారు. సీసీ టీవీ కెమెరాల నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు మాచరం ఎస్‌హెచ్‌వోపై జిల్లా ఎస్పీ చర్యలు తీసుకున్నారని, ఏడాది పాటు ఇంక్రిమెంట్లో కోత విధించారని తెలిపారు. ఎస్‌ఎంపీఎస్ సర్క్యూట్ కాలిపోయిందని, ఇది బయటకు కనిపించదని, అందువల్ల ఫుటేజీని రికవరీ చేయడం సాధ్య పడలేదని వివరించారు. కోర్టు ఉత్తర్వులంటే తమకు గౌరవం ఉందన్నారు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, పోలీసులకు కోర్టు ఆదేశాలంటే ఏ మాత్రం గౌరవం లేదని వ్యాఖ్యానించింది. కోర్టు ఎప్పుడు సీసీ టీవీ ఫుటేజీ ఇవ్వాలని అడిగినా, ఆ వెంటనే ఆ ఫుటేజీ మిస్టీరియస్‌గా మాయమైపోతోందని తెలిపింది. కాలిపోయిందని మీరు చెబుతున్నారు.. నిజంగా కాలిపోయిందో, ఇంకేమైనా జరిగిందో ఎవరికి తెలుసంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. కోతుల వల్ల సీసీ టీవీ సర్క్యూట్ కాలిపోయిందంటే మేం నమ్మలా? అంటూ ప్రశ్నించింది. తప్పులను సమర్థించుకోవద్దని వ్యాఖ్యానించింది. కాలిపోయిన సీసీ టీవీని తామే స్వయంగా చూస్తామని, అందుకు సంబంధించిన అన్ని పరకరాలను తమ ముందుంచాలని ఎస్పీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. -
AP HC: ఈ కేసు మాకో గుణపాఠం
సాక్షి, అమరావతి : నెల్లూరులో వైఎస్సార్సీపీ నేత కె.బాలకృష్ణారెడ్డి భవనం కూల్చివేత విషయంలో ఆ నగర మునిసిపల్ కమిషనర్ సూర్యతేజ తీరుపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. భవనం విషయంలో కఠిన చర్యలేవీ తీసుకోవద్దంటూ ఇచ్చినవి మౌఖిక ఆదేశాలే తప్ప, రాతపూర్వక ఆదేశాలు కాదని, అందువల్లే భవనం కూల్చివేశామన్న కమిషనర్ వాదన హైకోర్టును ఒకింత షాక్‌కి గురి చేసింది. ఈ కేసు తమకో గుణపాఠమని హైకోర్టు తెలిపింది. ఇకపై ఇలాంటి పొరపాటు చేయబోమని, మౌఖిక ఆదేశాలు ఇవ్వబోమని, ఏ ఆదేశాలైనా రాతపూర్వకంగానే ఇస్తామని స్పష్టం చేసింది. ఇప్పటికే భవనం కూల్చివేసినందున రిట్ పిటిషన్లో తేల్చడానికి ఏమీ లేదని ఆ మేరకు పిటిషన్‌ను పరిష్కరించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వడ్డిబోయన సుజాత బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 24 గంటల్లో భవనాలను తొలగించకపోతే తామే కూల్చివేస్తామంటూ నెల్లూరు మునిసిపల్ అధికారులు ఇచి్చన ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ బాలకృష్ణారెడ్డి సంబం«దీకులు హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంపై జస్టిస్ సుజాత విచారణ జరిపారు. గత నెల 22న ఈ వ్యాజ్యం విచారణకు రాగా, తదుపరి విచారణ వరకు భవనం కూల్చివేత విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని మునిసిపల్ కార్పొరేషన్‌ను న్యాయమూర్తి ఆదేశించారు.విచారణను గత నెల 24కి వాయిదా వేశారు. అయితే, 24న వ్యాజ్యం విచారణకు రాలేదు. దీంతో హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, మునిసిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులు గత నెల 27న ఆ భవనాన్ని కూల్చేశారు. 29న ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా, భవనం కూల్చివేత ఫొటోలను పిటిషనర్ల తరపు న్యాయవాది సురేందర్‌రెడ్డి కోర్టుకు సమర్పించారు. అధికారులు చట్ట విరుద్ధంగా వ్యవహరించారని తెలిపారు. దీంతో మునిసిపల్ కమిషనర్ సూర్యతేజ వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ వ్యాజ్యం బుధవారం మరోసారి విచారణకు వచ్చిoది. సూర్యతేజ కోర్టు ముందు హాజరయ్యారు. ఆయన తరఫున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. తదుపరి విచారణ వరకు చర్యలు తీసుకోవద్దంటూ 22న కోర్టు మౌఖికంగానే ఆదేశించి, విచారణను 24కి వాయిదా వేసిందన్నారు. 23, 24 తేదీల్లో ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదని, 27న కూల్చివేశామని చెప్పారు. పిటిషనర్ల తరపున సురేందర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. 24న పిటిషన్ విచారణకు రానందున నిర్మాణాలను తొలగించేందుకు 3నెలల సమయం కోరామని, ఆ మేర అఫిడవిట్ వేస్తామని కూడా చెప్పామని వివరించారు. దీనికి ఏజీ స్పందిస్తూ.. 24 వరకే కఠిన చర్యలు తీసుకోవద్దని మౌఖికంగా చెప్పారే తప్ప, రాతపూర్వక ఆదేశాలివ్వలేదని తెలిపారు. ఈ వాదనపై న్యాయమూర్తి విస్మయం వ్యక్తం చేశారు. -
అమరావతికి ‘ఏపీఈఆర్సీ’ తరలింపు!
సాక్షిప్రతినిధి కర్నూలు : ‘‘నాలుగు సందర్భాలు.. నాలుగు రకాల ప్రకటనలు..! నోరు ఒకటి చెబుతుంది.. చేతలు మరొకటి.. దేనిదోవ దానిదే..!’’ అన్నట్లుంది సీఎం చంద్రబాబు సర్కారు తీరు. కర్నూలులో ఇప్పటికే ఏర్పాటు చేసిన సంస్థలను తరలించబోమని, అవి అక్కడి నుంచే కార్యకలాపాలు సాగిస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా చెప్పిన మూడు నెలలకే ఏపీఈఆర్సీ (రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి)ని అమరావతికి తరలించేందుకు రంగం సిద్ధం చేశారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు కు అనుకూల భవనాలను అత్యవసరంగా పరిశీలించి నివేదిక పంపాలంటూ ఈ నెల 29న కలెక్టర్ రంజిత్‌బాషాకు హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్) లేఖ రాశారు. ఈ క్రమంలో ఏపీఈఆర్సీ భవనాలతోపాటు జగన్నాథగట్టుపైన నిర్మించిన క్లస్టర్ యూనివర్సిటీ భవనాలు, నన్నూరు టోల్ ప్లాజా సమీపంలోని ఓ ప్రైవేట్ భవనాలను పరిశీలించి అధికార యంత్రాంగం నివేదిక పంపింది. ఈ మూడింటిలో ఏపీఈఆర్సీ భవనంపై హైకోర్టు బృందం సుముఖత చూపినట్లు తెలుస్తోంది. హైకోర్టు న్యాయమూర్తులతో కూడిన కమిటీ ఈ నెల 6వతేదీన కర్నూలులోని ఏపీఈఆర్సీ భవనాన్ని పరిశీలించనుంది. కమిటీలో సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరీ, జస్టిస్ రఘునందన్‌రావు, జస్టిస్ ఎన్.జయసూర్య, జస్టిస్ బి.కృష్ణమోహన్ సభ్యులుగా ఉన్నారు. రూ.25 కోట్లతో అత్యాధునికంగా.. కర్నూలులో ఏపీఈఆర్సీకి సొంత భవనాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రూ.25 కోట్లతో అత్యాధునికంగా నిర్మించింది. ఇందులో 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాన్ని నిర్మించడంతో పాటు ఐదు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అతిథి గృహాలను ఏర్పాటు చేశారు. గతేడాది మే 23న దీన్ని ప్రారంభించారు. ప్రభుత్వం కొత్తగా నిర్మించిన భవనం కావడం.. అన్ని వసతులు ఉండటం.. సిటీలోనే ఉన్నందున ప్రజల రాకపోకలకు వీలుగా ఉంటుందని దీన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కాగా కోస్తా, ఉత్తరాంధ్ర ప్రజలకు అందుబాటులో ఉండేలా విశాఖలో ఏపీఈఆర్సీ క్యాంపు కార్యాలయం 2023 ఆగస్టు 18న ప్రారంభమైంది. నేషనల్ లా వర్సిటీ సంగతి ఏమిటి? వైజాగ్‌లో ఇప్పటికే నేషనల్ లా యూనివర్సిటీ ఉన్నప్పటికీ గత ప్రభుత్వం పట్టుబట్టి కర్నూలులో మరో లా వర్సిటీని మంజూరు చేయించింది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ రెండు లా యూనివర్సిటీలు లేవు. కర్నూలులో 273 ఎకరాల్లో నిర్మించాలని భావించిన ‘జ్యుడీషియల్ సిటీ’లో 100 ఎకరాల్లో నేషనల్ లా యూనివర్సిటీని నిర్మించాలని వైఎస్ జగన్ ప్రభుత్వం భావించింది. దీనికి రూ.వెయ్యి కోట్ల నిధులు కూడా మంజూరు చేసింది.ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్రెడ్డి దీనికి భూమి పూజ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆగస్టులో బీసీఐ (బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) ప్రతినిధులతో సమావేశం సందర్భంగా అమరావతిలో ‘నేషనల్ లా యూనివర్సిటీ’ని ఏర్పాటు చేయనున్నట్లు తన ‘ఎక్స్’ ఖాతాలో ప్రకటించారు. కర్నూలుతో సంబంధం లేకుండా అమరావతిలో మరొకటి నిర్మిస్తున్నారా? లేక కర్నూలు లా యూనివర్సిటీకి మంగళం పాడనున్నారా? అనేది స్పష్టత ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత యూనివర్సిటీ పనుల్లో ఎలాంటి ముందడుగు లేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే న్యాయ సంస్థలను ఒక్కొక్కటిగా అమరావతికి తరలించడంతో పాటు లా వర్సిటీ నిర్మాణాన్ని పక్కనపెట్టనున్నట్లు స్పష్టమవుతోందని న్యాయవాదులు, అధికారవర్గాలు చెబుతున్నాయి. టీడీపీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి సీమ నుంచి అత్యధికంగా ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు దక్కాయి. ఇంత మెజార్టీ కూటమికి ఇచ్చినందుకు కర్నూలుకు హైకోర్టును ఎత్తివేసి బెంచ్‌కు పరిమితం చేయడం, న్యాయ సంస్థలను ఒక్కొక్కటిగా తరలించడం ‘సీమ’కు చంద్రబాబు ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్ అని మండిపడుతున్నారు. ఏపీఈఆర్సీ భవనంలోనే హైకోర్టు బెంచ్..! హైకోర్టు బెంచ్‌ను ఏపీఈఆర్సీ భవనంలోనే ఏర్పాటు చేయనున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. మూడు ప్రతిపాదనల్లో ఇదే ఉత్తమమని భావిస్తున్నట్లు చెబుతున్నారు. కర్నూలు సిటీ (కలెక్టరేట్) నుంచి జగన్నాథగట్టుపై ఉన్న క్లస్టర్ యూనివర్సిటీ 17.5 కిలోమీటర్లు దూరంలో ఉంది. నన్నూరు టోల్‌ప్లాజా సమీపంలోని ప్రైవేట్ భవనం 11 కి.మీ. దూరంలో ఉంది. ఏపీఈఆర్సీ 3.5 కి.మీ. దూరంలో నగరానికి చేరువలో ఉన్నందున దీనివైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.సీఎంగారూ.. ఇప్పుడేమంటారు? కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేసి ‘న్యాయ రాజధాని’గా అభివృద్ధి చేయాలని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కాంక్షించారు. అందులో భాగంగానే ఏపీఈఆర్సీ, లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్, వక్ఫ్ ట్రిబ్యునల్, సీబీఐ కోర్టులను కర్నూలులో ఏర్పాటు చేశారు. లోకాయుక్త, హెచ్ఆర్సీ ఏర్పాటుపై మద్దిపాటి శైలజ 2021లో హైకోర్టులో దాఖలు చేసిన పిల్‌పై విచారణ సందర్భంగా ఆ సంస్థలను అమరావతికి తరలించేలా నిర్ణయం తీసుకున్నట్లు టీడీపీ కూటమి ప్రభుత్వం తెలిపింది. దీనిపై విపక్ష పార్టీలు, రాయల సీమ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తడంతో కర్నూలులో నెలకొల్పిన సంస్థలను తరలించబోమని, అవి అక్కడే ఉంటాయని ముఖ్యమంత్రి చంద్రబాబు గతేడాది నవంబర్‌లో అసెంబ్లీలో తీర్మానం సందర్భంగా ప్రకటించారు. దీనికి విరుద్ధంగా ఇప్పుడు హైకోర్టు బెంచ్‌ను కర్నూలులోని ఏపీఈఆర్సీ భవనంలో ఏర్పాటు చేసేందుకు సిద్ధపడటాన్ని బట్టి ఆ సంస్థను అమరావతికి తరలించడం లాంఛనమే అని స్పష్టమవుతోంది. కర్నూలులో బెంచ్ ఏర్పాటైన తర్వాత మిగతా సంస్థలను కూడా అమరావతికి తరలించే అవకాశం ఉన్నట్లు కూటమి ప్రభుత్వం చర్యలు స్పష్టం చేస్తున్నాయి. » లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) కార్యాలయాలను కర్నూలు నుంచి అమరావతికి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో దీనికి సంబంధించి చట్ట సవరణ చేస్తాం. ఆపై తరలింపు నోటిఫికేషన్ జారీ చేస్తాం’ – నవంబర్ 13న హైకోర్టుకు స్పష్టం చేసిన కూటమి ప్రభుత్వం. » ‘లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ కర్నూలులోనే ఉంటాయి. ఇప్పటికే నెలకొల్పిన సంస్థలను తరలించబోం. ఈ విషయంపై మంత్రి నారా లోకేశ్‌తో చర్చించాం. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కృషి చేస్తున్నాం’ – నవంబర్ 15న మంత్రి టీజీ భరత్ ప్రకటన » ‘కర్నూలులో ఏర్పాటు చేసిన సంస్థలను అమరావతికి తరలించం. వాటిని అక్కడే ఉంచుతాం. హైకోర్టు బెంచ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం’ – గత నవంబర్‌లో అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన » ‘ఈ నెల 6న హైకోర్టు న్యాయమూర్తుల బృందం కర్నూలుకు వస్తోంది. దిన్నెదేవరపాడు వద్ద నిర్మించిన ఏపీఈఆర్సీ భవనాన్ని పరిశీలిస్తారు’ – తాజాగా న్యాయశాఖ మంత్రి ఫరూక్ వ్యాఖ్యలు -
వైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు భద్రత కల్పించండి: హైకోర్టు
సాక్షి,గుంటూరు: తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికపై సోమవారం(ఫిబ్రవరి2) ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. తమ పార్టీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేసే ప్రయత్నం జరుగుతోందని,సోమవారం ఉదయం ఎన్నిక సమయంలో వారు ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు వైఎస్సార్సీపీ హైకోర్టులో పిటిషన్ వేసింది.కార్పొరేటర్లకు రక్షణ కల్పించాలని పిటిషన్లో వైఎస్సార్సీపీ కోరింది. పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. కార్పొరేటర్లకు రక్షణ కల్పించాలని ఎస్పీకి వినతి పత్రం ఇవ్వాలని వైఎస్సార్సీపీకి కోర్టు సూచించింది. కార్పొరేటర్లు బయల్దేరి వెళ్లే దగ్గర నుంచి సెనేట్ హాల్ కు చేరుకునే వరకు రక్షణ కల్పించాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది.కాగా సోమవారం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికల సందర్బంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై టీడీపీ, జనసేన గూండాలు దాడి చేశారు. కార్పొరేటర్లు వెళ్తున్న బస్సుపై జనసేన, టీడీపీ కార్యకర్తల రాళ్ల రువ్వడంతో బస్సు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇదే సమయంలో సాక్షి రిపోర్టర్, కెమెరామెన్‌పై పచ్చ గూండాలు దాడికి దిగారు. కార్పొరేటర్లను బలవంతంగా ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో, అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా మారింది.పోలీసులు అక్కడ ఉన్నప్పటికీ పచ్చ మూకలు రెచ్చిపోవడం గమనార్హం. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై దాడి జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తూ నిల్చున్నారు. వారిని నిలువరించే ప్రయత్నం చేయలేదు. ఇక, బస్సుపై దాడి చేసిన వ్యక్తిని టీడీపీకి చెందిన శంకర్ యాదవ్‌గా గుర్తించారు. శంకర్ యాదవ్ ఓవరాక్షన్ చేస్తూ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. అక్కడే ఉన్న వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్తలతో అనుచితంగా వ్యవహరించారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై హత్యాయత్నం చేశారు. ఈ క్రమంలో నలుగురు కార్పొరేటర్లను టీడీపీ, జనసేన గూండాలు ఎత్తుకెళ్లారు. -
YSRCP సోషల్ మీడియాపై పోలీసుల ఓవరాక్షన్.. హైకోర్టు దెబ్బకు సీన్ రివర్స్
-
హైకోర్టు పోయె.. బెంచ్ వచ్చె!
సాక్షి, అమరావతి / సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాయలసీమవాసుల హైకోర్టు ఆశలకు శాశ్వతంగా గండికొట్టిన టీడీపీ ప్రభుత్వం.. కర్నూలులో బెంచ్ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడం ద్వారా న్యాయ రాజధానిగా చేయాలనే సంకల్పంతో గత వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jagan mohan Reddy) ప్రభుత్వం లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్, వక్ఫ్ ట్రిబ్యునల్, సీబీఐ కోర్టు, ఏపీఈఆర్సీని కర్నూలులో ఏర్పాటు చేసింది. ఇందులో ఏపీఆర్సీకి శాశ్వత భవనాన్ని నిర్మించింది. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం హైకోర్టు అమరావతిలోనే ఉంటుందని, కర్నూల్లో బెంచ్ మాత్రమే ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ క్రమంలో కర్నూలులో 15 మంది న్యాయమూర్తులకు సరిపడా వసతి, నివాస సదుపాయాలు, కోర్టు రూములు, సిబ్బంది గదులు, న్యాయవాదులకు వసతి ఇతర సౌకర్యాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని తమ ముందుంచాలని కలెక్టర్ రంజిత్ బాషాను హైకోర్టు(High Court) ఆదేశించింది.కర్నూలులో బెంచ్ ఏర్పాటు విషయంలో ప్రధాన న్యాయమూర్తి నియమించిన న్యాయమూర్తుల కమిటీ ముందు ఉంచేందుకు వీలుగా ఈ వివరాలను అందచేయాలని పేర్కొంటూ హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్) శ్రీనివాస శివరామ్ ఈ నెల 29న కలెక్టర్‌కు లేఖ రాశారు. దీన్ని అత్యవసరంగా భావించాలని కోరడంతో కలెక్టర్ తక్షణమే స్పందించి ఆర్ అండ్ బీ ఎస్ఈ, మునిసిపల్ కమిషనర్, ఆర్డీవోలకు ఈ బాధ్యతను అప్పగించగా.. కర్నూలులో మూడు భవనాలను ‘బెంచ్’ కోసం ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ప్రజలకు అందుబాటులో ఉండేలా..కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు భవనం కోసం ప్రధానంగా ఏపీఈఆర్సీ భవనాన్ని అధికారులు ప్రతిపాదించినట్లు సమాచారం. అధికారులు ప్రతిపాదించిన మూడు భవనాల్లో ఇదే కొత్తది కావడం, ప్రజలకు అందుబాటులో ఉన్నందున ఇక్కడే హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేస్తారనే చర్చ అధికార వర్గాల్లో సాగుతోంది. భవనాల గుర్తింపు కోసం ప్రభుత్వం కేవలం ఒక్క రోజు మాత్రమే గడువు ఇచ్చిన నేపథ్యంలో అధికారులు మొత్తం మూడు భవనాలను సూచించినట్లు చెబుతున్నారు. ఇందులో ఏపీఈఆర్సీ భవనంతోపాటు జగన్నాథగట్టుపై నిర్మిస్తున్న క్లస్టర్ యూనివర్సిటీ భవనం, హైదరాబాద్–చెన్నై సమీపంలోని ఓ ప్రైవేట్ భవనం ఉన్నాయి. వీటి వివరాలను కలెక్టర్ గురువారం రిజిస్ట్రార్‌కు పంపినట్లు సమాచారం. దీనిపై కలెక్టర్‌ను వివరణ కోరగా.. భవనాలను పరిశీలిస్తున్నామని, ఇంకా ఖరారు చేయలేదని వెల్లడించారు. కాగా, ఒకవేళ జగన్నాథ గట్టుపై ఉన్న భవనాలను హైకోర్టు బెంచ్(High Court Bench) కోసం ప్రతిపాదిస్తే అక్కడున్న క్లస్టర్ యూనివర్సిటీని సిల్వర్ జూబ్లీ కాలేజీ భవనాలకే పరిమితం చేసే అవకాశం ఉంది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు నిర్ణయంతో ఏపీఈఆర్సీని అమరావతికి తరలించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మంత్రివర్గం తీర్మానం కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటును ఆమోదిస్తూ గతేడాది అక్టోబర్‌లో రాష్ట్ర మంత్రి మండలి తీర్మానం చేసింది. అటు తరువాత అసెంబ్లీలో కూడా తీర్మానం చేశారు. కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు ప్రతిపాదనపై అభిప్రాయాలు తెలియచేసే నిమిత్తం ఫుల్ కోర్టుకు నివేదించాలని కోరుతూ న్యాయశాఖ కార్యదర్శి గత ఏడాది అక్టోబర్ 28న హైకోర్టు రిజిష్ట్రార్ జనరల్‌కి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా బెంచ్ ఏర్పాటుపై నలుగురు సీనియర్ న్యాయమూర్తులతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ కమిటీని నియమించారు. జస్టిస్ రవినాథ్ తిల్హరి, జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ నైనాల జయసూర్య, జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ సభ్యులుగా ఉన్న ఈ కమిటీ ఇప్పటికే ప్రాథమికంగా సమావేశమైనట్లు తెలిసింది. కమిటీ నివేదికను ప్రధాన న్యాయమూర్తి ఫుల్‌కోర్టు ముందుంచి చర్చించే అవకాశం ఉంది. ఫుల్‌కోర్టు తీసుకునే నిర్ణయం ఆధారంగా కర్నూలులో శాశ్వత బెంచ్ ఏర్పాటు ఓ కొలిక్కి వస్తుంది.15 మంది న్యాయమూర్తుల కేటాయింపు?కర్నూలులో శాశ్వత బెంచ్ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు అందుకున్న తరువాత జిల్లాల వారీగా దాఖలైన కేసుల గణాంకాలను హైకోర్టు సిద్ధం చేసినట్లు తెలిసింది. హైకోర్టులో మొత్తం కేసుల్లో 40 శాతం రాయలసీమ జిల్లాల నుంచే దాఖలవుతున్నాయి. దీని ఆధారంగా కర్నూలులో ఏర్పాటయ్యే శాశ్వత బెంచ్ న్యాయమూర్తుల సంఖ్యను ప్రాథమికంగా ఖరారు చేసినట్లు హైకోర్టు వర్గాలు చెబుతున్నాయి. హైకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 37 కాగా, ప్రస్తుతం 30 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. 40 శాతం కేసులు రాయలసీమ నుంచి దాఖలవుతున్నందున మొత్తం 37 మంది న్యాయమూర్తుల్లో అందుకు అనుగుణంగా 15 మందిని కర్నూలు(Kurnool) బెంచ్‌కు కేటాయించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు హైకోర్టు వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన 22 మంది న్యాయమూర్తులు అమరావతిలో ఉన్న హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్‌లో న్యాయమూర్తులుగా కొనసాగే వీలుంది. ఈ క్రమంలోనే కర్నూలులో 15 మంది న్యాయమూర్తులకు సరిపడా మౌలిక సదుపాయాల గురించి ఆరా తీస్తూ కర్నూలు కలెక్టర్‌కు హైకోర్టు లేఖ రాసినట్లు భావిస్తున్నారు.కర్నూలు బెంచ్ పరిధిలోకి ప్రకాశం, నెల్లూరు?ప్రకాశం, నెల్లూరు జిల్లాలను కలిపి రాయలసీమ జిల్లాలతో కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించినట్లు తెలిసింది. అయితే దీన్ని ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన నాయకులు, న్యాయవాదులు వ్యతిరేకిస్తున్నారు. కర్నూలు వెళ్లాలంటే తమకు నేరుగా రైలు సౌకర్యం లేదని, రోడ్డు ద్వారా వెళ్లాలంటే కనీసం 7 నుంచి 9 గంటల సమయం పడుతుందని ఇరు జిల్లాల వారు ప్రభుత్వానికి నివేదించారు. అయితే వీరి అభ్యంతరాలను ప్రభుత్వ పెద్దలు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. -
ఓవర్ యాక్షన్ ఫలితం.. చిక్కుల్లో ఖాకీలు
సాక్షి, తాడేపల్లి: సోషల్ మీడియా కార్యకర్తల విషయంలో ఓవర్ యాక్షన్ చేసిన ఫలితం.. శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల పోలీసు అధికారులు చిక్కుల్లో పడ్డారు. అక్రమ కేసులు పెట్టిన ఇద్దరు ఖాకీలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇద్దరినీ వ్యక్తిగతంగా సంజాయిషీ కోరింది. బోసా రమణ అనే వ్యక్తి విషయంలో పోలీసు అధికారులు.. హైకోర్టు అదేశాలను బేఖాతరు చేశారు. రమణని కోర్టు ముందు హాజరు పరచాలని ఆదేశించినా పోలీసులు పట్టించుకోలేదు.మరో కేసు ఉందంటూ పోలీసులు ఇచ్చాపురం తీసుకెళ్లారు. తమ ఆదేశాలను ధిక్కరించటంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన సీఐలు వెంకటేశ్వర్లు, చెన్నంనాయుడులకు నోటీసులు జారీ చేయాలని రెండు జిల్లాల జిల్లా జడ్జీలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇద్దరు సీఐలు ప్రభుత్వ లాయర్‌ను వినియోగించుకోకుండా వ్యక్తిగతంగా సంజాయిషీ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. -
తిరుపతి తొక్కిసలాటపై జ్యుడిషియల్ విచారణకు ఆదేశించాం
సాక్షి, అమరావతి : తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురి మృతి, 40 మందికి పైగా గాయపడిన ఘటనపై హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తితో జ్యుడిషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేశామని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం హైకోర్టుకు నివేదించింది. 6 నెలల్లో నివేదిక ఇవ్వాలని కమిషన్‌కు స్పష్టం చేశామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సింగమనేని ప్రణతి హైకోర్టు ధర్మాసనానికి తెలిపారు.తొక్కిసలాటపై సిట్టింగ్ లేదా విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని, 30 రోజుల్లో నివేదికను గవర్నర్‌కు సమర్పించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ కర్నూలు జిల్లాకు చెందిన రైతు గుదిబండ ప్రభాకర్‌రెడ్డి దాఖలు చేసిన పిల్‌పై సీజే ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది శివప్రసాద్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. విచారణ కమిషన్ నివేదికను గర్నవర్‌కు సమర్పించకపోతే ఆ నివేదికను ప్రభుత్వం బుట్టదాఖలు చేస్తుందని చెప్పారు. కమిషన్ గడువును ప్రభుత్వం నిరవధికంగా పొడిగించే అవకాశం కూడా ఉందని తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ప్రభుత్వం జ్యుడిషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ వ్యాజ్యం నిరర్థకమవుతుందని తెలిపింది. తాను కమిషన్ ఏర్పాటును మాత్రమే అడగటంలేదని, ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా ఏం చేయాలో 30 రోజుల్లో శాస్త్రీయ ఆడిట్ చేసేలా ఆదేశాలివ్వాలని కూడా కోరానని శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఈ వ్యాజ్యంలో తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది. -
ప్రజలు కోర్టుకొచ్చే పరిస్థితి ఎందుకు తెస్తున్నారు?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్టార్ల తీరుపై హైకోర్టు తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో స్పష్టమైన తీర్పులిచ్చినా అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ ఆక్షేపించింది. చట్టాల విషయంలో అధికారుల అజ్ఞానం వల్ల హైకోర్టులో పిటిషన్లు వరదలా దాఖలవుతున్నాయని, ప్రజలను కోర్టులకు వచ్చి తీరే పరిస్థితులు కల్పిస్తున్నారని స్పష్టం చేసింది. వేలంలో కొన్న ఆస్తికి మార్కెట్ విలువ ప్రకారం స్టాంపు డ్యూటీ, రిజ్రిస్టేషన్ ఫీజు వసూలు చేయడానికి వీల్లేదని పునరుద్ఘాటించింది. ఇలాంటివి పునరావృత్తం కాకుండా ఉండాలంటే రిజ్రిస్టార్, సబ్ రిజ్రిసా్టర్లకు న్యాయవ్యవస్థలో, చట్టాలలో వస్తున్న కొత్త మార్పులపై జ్ఞానోదయం కలిగించాలని స్పష్టం చేసింది. ఎప్పటికప్పుడు వర్క్‌షాపులు, శిక్షణ తరగతులు నిర్వహించాలంది. ఇందుకోసం ఓ ‘లీగల్ మాడ్యూల్’ని రూపొందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అప్పుడే సమర్థవంతమైన ఫలితాలు సాధ్యమవుతాయని తెలిపింది. ఈ లీగల్ మాడ్యూల్ రూపకల్పన విషయంలో అడ్వొకేట్ జనరల్‌తో సంప్రదించాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. నాలుగు వారాల్లో ఈ లీగల్ మాడ్యూల్‌ని రూపొందించాలని తేల్చి చెప్పింది. అనంతరం శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలంది. తమ ఈ ఆదేశాల అమలు పురోగతికి సంబంధించిన వివరాలతో 8 వారాల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రస్తుత కేసులో పిటిషనర్లు వేలంలో కొన్న ఆస్తికి దాని విలువ ఆధారంగా స్టాంప్ డ్యూటీ, రిజ్రిస్టేషన్ ఫీజు ఖరారు చేయాలని తిరుపతి సబ్ రిజ్రిస్టార్‌ను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ కీలక తీర్పు వెలువరించారు. కేసు నేపథ్యమిదీ కడపకు చెందిన కొండపనేని మల్లికార్జున, లోకేశ్ కస్తూరి, హైదరాబాద్‌కు చెందిన స్వాతి కస్తూరి తిరుపతి కెనరా బ్యాంక్ నిర్వహించిన ఈృవేలంలో తిరుపతి సెంట్రల్ పార్క్ కమర్షియల్ కాంప్లెక్స్‌లోని పలు షాపులను రూ.2.17 కోట్లకు కొనుగోలు చేశారు. ఆ ఆస్తిని తమ పేర రిజిస్టర్ చేయాలంటూ తిరుపతి సబ్ రిజ్రిస్టార్‌ను మల్లికార్జున తదితరులు ఆశ్రయించారు. సదరు ఆస్తికి మార్కెట్ విలువ (రూ.3.65 కోట్లు) ఆధారంగా 6.5 శాతం స్టాంప్ డ్యూటీ, 1 శాతం రిజ్రిస్టేషన్ ఫీజు చెల్లించాలని సబ్ రిజ్రిస్టార్ స్పష్టం చేశారు. ఈ మొత్తం చెల్లిస్తేనే రిజ్రిస్టేషన్ చేస్తామని తేల్చి చెప్పారు. తాము వేలంలో ఈ ఆస్తిని కొన్నామని, అందువల్ల మార్కెట్ విలువ ప్రకారం కాకుండా ఆస్తి విలువ (రూ.2.17 కోట్లు) ఆధారంగా స్టాంప్ డ్యూటీ, రిజ్రిస్టేషన్ ఫీజు చెల్లిస్తామని, నిబంధనలు కూడా ఇదే చెబుతున్నాయని మల్లికార్జున తదితరులు చెప్పారు. సబ్ రిజ్రిస్టార్ ఒప్పుకోకపోవడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ విచారణ జరిపారు. -
మధ్యవర్తిత్వంతో తక్కువ ఖర్చు.. సత్వర న్యాయం
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): న్యాయవాదులు మధ్యవర్తిత్వ పద్ధతులపై మెళకువలు పెంపొందించుకోవడం ద్వారా కక్షిదారులకు తక్కువ ఖర్చుతో సత్వర న్యాయాన్ని అందించవచ్చని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికారసంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ రవినాథ్ తిల్హరి అన్నారు. మధ్యవర్తిత్వం మరింతగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు న్యాయవాదులు ఎక్కువ దృష్టి సారించాలని ఆయన సూచించారు. ఏపీ న్యాయ సేవాధికారసంస్థ ఆధ్వర్యాన గుంటూరు మెడికల్ కళాశాలలో శనివారం మధ్యవర్తిత్వంపై న్యాయవాదులకు రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సదస్సును ప్రారంభించిన జస్టిస్ రవినాథ్ తిల్హరి మాట్లాడుతూ పెరిగిపోతున్న కేసుల సత్వర పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఒక మంచి అవకాశమని చెప్పారు. మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కరించుకోవడం వల్ల సమయం, డబ్బు ఆదా అవుతాయని వివరించారు. వ్యాపార, కుటుంబ వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకుంటే ఇరుపక్షాలకు ఉపయోగకరంగా ఉంటుందని సూచించారు. మధ్యవర్తిత్వంపై నెలకొన్న అపోహలు వీడాలని, ఈ విధానాన్ని ప్రజల ముంగిటకు తీసుకువెళితే న్యాయవాదులకు మరిన్ని అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారా కూడా మధ్యవర్తిత్వం: జస్టిస్ రావు రఘునందన్‌రావు సదస్సు ముగింపు సెషన్లో ఏపీ హైకోర్టు న్యాయసేవల కమిటీ చైర్మన్ జస్టిస్ రావు రఘునందన్‌రావు మాట్లాడుతూ మధ్యవర్తిత్వంపై ప్రత్యేక చట్టం చేశారని తెలిపారు. ఆన్లైన్ ద్వారా కూడా మధ్యవర్తిత్వం నిర్వహించే వెసులుబాటు ఉందని చెప్పారు. ఏపీ రాష్ట్ర న్యాయ సేవాధికారసంస్థ సభ్య కార్యదర్శి ఎం.బబిత మాట్లాడుతూ మధ్యవర్తిత్వంపై ఇటీవల వస్తున్న మార్పులు, కొత్త చట్టాలపై అవగాహన కల్పించేందుకు ఈ సదస్సు నిర్వహించామన్నారు.ఇప్పటి వరకు అన్ని బార్ అసోసియేషన్లలో, జిల్లా, మండల, హైకోర్టు స్థాయిల్లో నిర్వహించినట్లు తెలిపారు. గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వైవీఎస్‌బీజీ పార్థసారథి, ఏపీ హైకోర్టు న్యాయసేవల కమిటీ కార్యదర్శి జి.మాలతి, ఏపీ న్యాయసేవాధికార సంస్థ ఉప కార్యదర్శి డాక్టర్ హెచ్.అమర రంగేశ్వరరావు, గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టి.లీలావతి, సీనియర్ ట్రైనర్స్ రత్నతార, అరుణాచలం పాల్గొన్నారు. -
హైకోర్టు న్యాయమూర్తులుగా హరిహరనాథ శర్మ, లక్ష్మణరావు ప్రమాణం
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా అవధానం హరిహరనాథ శర్మ, డాక్టర్ యడవల్లి లక్ష్మణరావులు శుక్రవారం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన కార్యక్రమంలో వీరిద్దరి చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. అంతకు ముందు హైకోర్టు రిజిస్ట్రార్.. వీరి నియామకానికి సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జారీ చేసిన ఉత్తర్వులను చదవి వినిపించారు. అనంతరం సీజే వారి చేత ప్రమాణం చేయించారు. ఆ తర్వాత సీజే వారికి విడి విడిగా రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులను అందజేశారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, ప్రమాణం చేసిన న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు, అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, అదనపు ఏజీ ఇవన సాంబశివ ప్రతాప్, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (డీఎస్జీ) పసల పొన్నారావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కలిగినీడి చిదంబరం, హైకోర్టు రిజి్రస్టార్లు, న్యాయవావాదులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రమాణం అనంతరం వీరు సింగిల్ జడ్జీలుగా కేసులను విచారించారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు, శ్రేయోభిలాషులు వీరిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వీరి నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది. -
ఏపీ హైకోర్టుకు ఇద్దరు కొత్త జడ్జిలు
-
ఆ గిరిజన గ్రామాలు ఏమయ్యాయి?
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని 792 గిరిజన గ్రామాలకు ప్రస్తుతం 292 గ్రామాలే ఉండటంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. మిగిలిన గ్రామాలన్నీ ఏమయ్యాయని, ఎలా మాయమయ్యాయని అధికారులను నిలదీసింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని, లేని పక్షంలో తదుపరి విచారణకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యక్తిగతంగా హాజరు కావాలని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిని ఆదేశించింది. గిరిజన ప్రాంతాల పరిధిని, విస్తీర్ణాన్ని ఎందుకు, ఏ అధికారంతో కుదించేస్తున్నారో కూడా వివరించాలంది. తదుపరి విచారణను రెండు నెలలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి ర వి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గిరిజనేతరుల కోసం గిరిజన ప్రాంతాల విస్తీర్ణాన్ని అధికారులు తగ్గించేస్తున్నారని, పెద్ద సంఖ్యలో గ్రామాలను పట్టణాల్లో కలిపేస్తున్నారంటూ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు టి.వెంకట శివరాం దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై సీజే ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది ఎ. శ్యాంసుందర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. అధికారులు ఉద్దేశపూర్వకంగా గిరిజన ప్రాంతాల విస్తీర్ణాన్ని, పరిధులను కుదించేస్తున్నారని తెలిపారు. పెద్ద సంఖ్యలో గిరిజన గ్రామాలను పట్టణ ప్రాంతాల్లో కలిపేశారన్నారు. దీనివల్ల గిరిజనులు తీవ్రంగా నష్టపోతున్నారని, గిరిజనేతరులు లబ్ధి పొందుతున్నారని వివరించారు. అందుకే గిరిజన ప్రాంతాలను నిర్దిష్టంగా నోటిఫై చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. అధికారులు సమాచార హక్కు చట్టం కింద ఇచ్చిన వివరాల ప్రకారం గతంలో 792 గ్రామాలు ఉండగా, ప్రస్తుతం 292 గ్రామాలే ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ గిరిజన ప్రాంతాల పరిధులను ఎందుకు కుదించేస్తున్నారని ప్రశ్నించింది. దీనిపై కేంద్రం ఎందుకు స్పందించడంలేదని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది అయిన డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (డీఎస్జీ) పసల పొన్నారావును ప్రశ్నించింది. తాము పూర్తి వివరాలను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగామని, ఇప్పటివరకు ఇవ్వలేదని పొన్నారావు తెలిపారు. తదుపరి విచారణ నాటికి అఫిడవిట్ రూపంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ కార్యదర్శిని ధర్మాసనం ఆదేశించింది. -
Andhra Pradesh: హైకోర్టుకు ఇద్దరు అదనపు జడ్జిలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా అవధానం హరిహరనాథ శర్మ, డాక్టర్ యడవల్లి లక్ష్మణరావు నియమితులయ్యారు. వీరి నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. దీంతో ఈ ఇద్దరి నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ సంయుక్త కార్యదర్శి జగన్నాథ్ శ్రీనివాసన్ బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ఇద్దరూ శుక్రవారం అదనపు న్యాయమూర్తులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేళ్ల పాటు వీరు అదనపు న్యాయమూర్తులుగా కొనసాగుతారు. తరువాత శాశ్వత న్యాయమూర్తులుగా నియమితులవుతారు. రాష్ట్ర హైకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 37. ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తితో కలిపి 28 మంది న్యాయమూర్తులున్నారు. వీరిద్దరి నియామకంతో ఆ సంఖ్య 30కి చేరింది. మరో 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరో మూడు, నాలుగు పోస్టులు భర్తీ చేసేందుకు హైకోర్టు త్వరలో చర్యలు చేపట్టనుంది. న్యాయాధికారుల కోటా నుంచి హరిహరనాథ శర్మ, లక్ష్మణరావుల పేర్లను హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులకు సిఫారస్ చేస్తూ సుప్రీంకోర్టు సీజే నేతృత్వంలోని కొలీజియం ఈ నెల 11న తీర్మానం చేసిన విషయం తెలిసిందే. అవధానం హరిహరనాథ శర్మ...కర్నూలుకి చెందిన హరిహరనాథ శర్మ 1968 ఏప్రిల్ 16న జన్మించారు. తల్లిదండ్రులు సుబ్బమ్మ, రామచంద్రయ్య. తండ్రి పురోహితుడు. శర్మ 1988లో కర్నూలులోని ఉస్మానియా కాలేజీ నుంచి బీఎస్సీ, అదే కాలేజీ నుంచి 1993లో బీఎల్ పూర్తి చేశారు. 1994లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. అనంతరం కర్నూలు జిల్లా కోర్టులో ప్రాక్టీస్ మొదలు పెట్టారు. 1994 నుంచి 98 వరకు సీనియర్ న్యాయవాది రామకృష్ణారావు వద్ద వృత్తి మెళకువలు నేర్చుకున్నారు. 1998లో స్వతంత్రంగా ప్రాక్టీస్ ప్రారంభించి 2007 వరకు న్యాయవాదిగా కొనసాగారు. 2007లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. 2017–18లో అనంతపురం ప్రధాన జిల్లా జడ్జిగా, 2020–22లో విశాఖపట్నం ప్రధాన జిల్లా జడ్జిగా పనిచేశారు. 2022లో హైకోర్టు రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టారు. 2023 నుంచి ఏపీ జుడీషియల్ అకాడమీ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. 2016లో నాగార్జున యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్ఎం పూర్తి చేశారు.డాక్టర్ యడవల్లి లక్ష్మణరావు...ఉమ్మడి ప్రకాశం జిల్లా, కనిగిరికి చెందిన డాక్టర్ యడవల్లి లక్ష్మణరావు 1975 ఆగస్టు 3న జన్మించారు. తల్లిదండ్రులు పద్మావతి, వెంకటేశ్వర్లు. తండ్రి నెల్లూరు రహదారులు భవనాల శాఖలో సూపరింటెండెంట్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. లక్ష్మణ రావు ప్రాథమిక విద్యాభ్యాసం మొత్తం ప్రకాశం జిల్లాలో సాగింది. నెల్లూరు వీఆర్ లా కాలేజీలో న్యాయశాస్త్రం అభ్యసించారు. నాగార్జున యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేసి రెండు మెరిట్ సర్టిఫికెట్లు సాధించారు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పొందారు. క్రిమినల్ లా, కంపెనీ లాలో బంగారు పతకాలు సాధించారు. 2000 సంవత్సరంలో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు జిల్లా కావలిలో కూడా న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. అనంతరం 2014లో జిల్లా జడ్జిగా నియమితులయ్యారు. ఇందుకు సంబంధించిన పరీక్షలో రాష్ట్రంలో మొదటి ర్యాంక్ సాధించారు. మొదట ఏలూరులో మొదటి అదనపు జిల్లా జడ్జిగా పనిచేశారు. తరువాత రాష్ట్రంలో పలు చోట్ల వివిధ హోదాల్లో పనిచేశారు. 2021లో హైకోర్టు రిజిస్ట్రార్ (జుడీషియల్)గా నియమితులయ్యారు. ఆయన పనితీరు, క్రమశిక్షణ నచ్చిన హైకోర్టు ఆయనను రిజిస్ట్రార్ జనరల్ (ఆర్జీ)గా నియమించింది. 2038 వరకు లక్ష్మణరావు హైకోర్టు న్యాయమూర్తిగా ఉంటారు. -
అధికారిక నిర్ణయాలకు నేరాన్ని ఆపాదించడానికి వీల్లేదు
సాక్షి, అమరావతి : అధికారిక విధుల్లో భాగంగా తీసుకున్న నిర్ణయాలకు నేరాన్ని ఆపాదించడానికి వీల్లేదని సమాచార, పౌర సంబంధాల (ఐ అండ్ పీఆర్) శాఖ పూర్వ కమిషనర్ తుమ్మా విజయ్‌కుమార్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. పబ్లిక్ సర్వెంట్‌గా విజయ్‌కుమార్ తన విధి నిర్వహణలో ఎలాంటి అనుచిత లబ్ధిపొందలేదని ఆయన తరఫు న్యాయవాది వేలూ రి మహేశ్వరరెడ్డి వివరించారు. నియామకాల్లో అక్రమాలకు పాల్పడ్డారని, పత్రికా ప్రకటనల్లో ఓ వర్గం మీడియాకు లబ్ధి చేకూర్చారంటూ ఏసీబీ ఆరోపిస్తోందని.. అయితే, ఇందుకు నిర్ధిష్ట ఆధారాలను మాత్రం చూపడంలేదన్నారు. విధి నిర్వహణలో విజయ్‌కుమార్‌రెడ్డి చర్యలేవీ కూడా నేరపూరిత దుష్ప్రవర్తన కిందకు రావని తెలిపారు. ఆయనెలాంటి అవినీతికి కూడా పాల్పడలేదని, అందుకు సంబంధించి ఎలాంటి ఆరోపణలు కూడా లేవని మహేశ్వరరెడ్డి కోర్టుకు వివరించారు. కక్ష, పక్షపాతం దురుద్దేశాలతో ఏసీబీ తన క్లయింట్‌పై తప్పుడు కేసు నమోదు చేసిందన్నారు. తప్పుడు కేసుల నుంచి అధికారులను రక్షించేందుకే అవినీతి నిరోధక చట్టంలో సెక్షన్–17ఏను చేర్చారని.. కానీ, ప్రభుత్వం సెక్షన్–17ఏ కింద విచారణ చేసేందుకు అనుమతించడం సరికాదన్నారు. తన క్లయింట్ విచారణకు అనుమతినివ్వడం ద్వారా ఆ సెక్షన్‌ను ఏ ఉద్దేశంతో తీసుకొచ్చారో దాన్ని ప్రభుత్వం కాలరాసిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దురుద్దేశంతోనే తన క్లయింట్‌పై ఉన్న ఆరోపణల పరిధిని ఏసీబీ పెంచిందన్నారు. రీడర్షిప్, సర్క్యులేషన్‌ను ప్రామాణికంగా తీసుకునే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రకటనలు ఇచ్చినట్లు మహేశ్వర్‌రెడ్డి స్పష్టంచేశారు. దీనిని కూడా అవినీతి అనడం దారుణమన్నారు. పరిపాలనపరమైన నిర్ణయాలకు నేరాన్ని ఆపాదించడం చెల్లదన్నారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని విజయ్‌కుమార్‌రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని మహేశ్వర్‌రెడ్డి కోర్టును అభ్యర్థించారు. ఏ షరతులు విధించినా కట్టుబడి ఉంటామన్నారు. విజయ్‌కుమార్‌రెడ్డి వాదనలు ముగియడంతో ఏసీబీ వాదనల నిమిత్తం విచారణ ఈనెల 23కి వాయిదా పడింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వ ప్రకటనల జారీ, బిల్లుల చెల్లింపునకు సంబంధించి ఏసీబీ నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ విజయ్‌కుమార్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
పీజీ వైద్య విద్య నిబంధనల సవరణ సబబే
సాక్షి, అమరావతి: రాష్ట్ర వైద్యశాఖలో సివిల్ అసిస్టెంట్ సర్జన్లుగా చేరిన వారికి పీజీ వైద్య విద్యను అభ్యసించే నిమిత్తం కేటాయించే ఇన్‌సర్వీస్ కోటా నిబంధనలను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది జూలై 20న జారీ చేసిన జీవో–85లోని పలు నిబంధనలను హైకోర్టు సమర్థించింది. ఇన్‌సర్వీస్ కోటా కింద రిజర్వేషన్ సీటు పొందాలంటే నీట్ పీజీ, సూపర్ స్పెషాలిటీ పరీక్ష నోటిఫికేషన్ జారీ అయ్యే నాటికి 50 ఏళ్లు దాటి ఉండకూడదన్న నిబంధన విషయంలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. అలాగే పీజీ కోర్సు పూర్తి చేసిన తరువాత రాష్ట్రంలో పదేళ్ల పాటు సేవలు అందించాలన్న నిబంధనను కూడా సమర్థించింది. అంతేకాక ఇన్‌సర్వీస్ కోటా ఒప్పందాన్ని ఉల్లంఘించిన వారికి విధించే జరిమానాను రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షలకు పెంచడాన్ని కూడా హైకోర్టు సమర్థించింది. జీవో–85లోని ఈ నిబంధనలను ఎంతమాత్రం ఏకపక్షంగా ప్రకటించలేమని తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం ఇటీవల తీర్పు వెలు వరించింది. కాల వ్యవధి, జరిమానా పెంపు వంటి సవరణలను సవాల్ చేస్తూ మేదరమెట్ల ప్రైమరీ హెల్త్ సెంటర్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్‌గా పనిచేస్తున్న డాక్టర్ జి.చిట్టిబాబు పిటిషన్ దాఖలు చేశారు. -
నా భద్రతా బృందంతో బాషాను పంపేలా ఆదేశాలివ్వండి: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: తన కుమార్తె స్నాతకోత్సవం నిమిత్తం లండన్ వెళుతున్న నేపథ్యంలో... తన భద్రతా బృందంలో గతంలో డీఎస్పీగా వ్యవహరించిన ఎస్.మహబూబ్ బాషాను ప్రస్తుతం తన భద్రతా బృందంతోపాటు పంపేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం అత్యవసరంగా హౌస్‌మోషన్ రూపంలో దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ న్యాపతి విజయ్ విచారణ జరిపారు. వైఎస్ జగన్ తరఫున సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరామ్, న్యాయవాది శెట్టిపల్లి దుష్యంత్‌రెడ్డి వాదనలు వినిపించారు.మంగళవారం నాడు వైఎస్ జగన్ లండన్ బయలుదేరుతున్నారని, ఈ నెలాఖరు వరకు అక్కడే ఉంటారని శ్రీరామ్ తెలిపారు. లండన్ వెళ్లేందుకు కోర్టు నుంచి చట్ట ప్రకారం అనుమతులు కూడా తీసుకున్నారని ఆయన వివరించారు. జగన్‌కు ప్రాణహాని ఉన్న నేపథ్యంలో ఆయనకు జెడ్ ప్లస్ భద్రతను కల్పిస్తున్నారని చెప్పారు. ఇప్పుడు విదేశాలకు వెళుతున్న నేపథ్యంలో ఎల్లోబుక్ ప్రకారం ఆయనకు సెక్యూరిటీ ప్రొటోకాల్ కింద భద్రతను కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్ పలుమార్లు లండన్ వెళ్లారని, అప్పుడు భద్రతా బృందంలో మహబూబ్ బాషా ఉన్నారని కోర్టుకు వివరించారు. తన భద్రతాపరమైన విషయాల గురించి బాషాకు స్పష్టమైన అవగాహన ఉందని, అందువల్ల ఆయనను తన వెంట పంపాలంటూ జగన్ ఈ నెల 9న ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించారన్నారు. మంగళవారం లండన్ వెళుతున్నప్పటికీ, ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ వినతిపత్రంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఈ నేపథ్యంలో అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించామని చెప్పారు. జెడ్ ప్లస్ భద్రతను కల్పిస్తున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుని భద్రతను కల్పించి తీరాల్సి ఉండగా, ప్రభుత్వం ఇప్పటి వరకు చోద్యం చూస్తూ ఉందన్నారు. జగన్ భద్రతను ఈ ప్రభుత్వం భారీగా కుదించిందిరాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ, ఎల్లోబుక్ ప్రకారం తనకు నిర్దిష్ట వ్యక్తినే భద్రతాధికారిగా నియమించాలని కోరడానికి వీల్లేదన్నారు. శ్రీరామ్ జోక్యం చేసుకుంటూ జగన్‌కు ఉన్న భద్రతను ఈ ప్రభుత్వం భారీగా కుదించిందని, దీనిపై తాము న్యాయపోరాటం చేస్తున్నామని వివరించారు. తమ వినతిపత్రంపై నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏమిటో అర్థంకావడం లేదన్నారు. దమ్మాలపాటి స్పందిస్తూ ఆ వినతిపత్రంపై తప్పక పరిశీలన జరిపి నిర్ణయం తీసుకుంటామని, ఇందుకు కొంత సమయం పడుతుందని చెప్పారు. అందువల్ల విచారణను ఈ నెల 17కి వాయిదా వేయాలని కోరారు. తమకు అభ్యంతరం లేదని శ్రీరామ్ చెప్పారు. దీంతో న్యాయమూర్తి పూర్తి వివరాల సమర్పణ నిమిత్తం విచారణను 17కి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. -
సంక్రాంతి సంబరాల ముసుగులో కోడిపందాలు
-
న్యాయం నా వైపే ఉంది.. సుప్రీంకోర్టులోనే తేల్చుకుంటా: చెవిరెడ్డి
సాక్షి, విజయవాడ: చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేయడంతో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారు. న్యాయం తన వైపే ఉందని.. హైకోర్టు నిర్ణయంపై సుప్రీంకోర్టుకు వెళ్తానన్నారు. ఘటన జరిగిన రోజు బాలిక తండ్రి పిలిస్తేనే తాను వెళ్లానని.. కానీ తనపై అనవసరంగా ఫోక్సో కేసు పెట్టారని చెవిరెడ్డి అన్నారు. ఈ కేసును సుప్రీంకోర్టులోనే తేల్చుకుంటానని చెవిరెడ్డి స్పష్టం చేశారు.అసలు జరిగింది ఇదే..కాగా, తిరుపతి జిల్లాలో ఓ బాధిత బాలికకు అండగా నిలిచినందుకు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై ఏకంగా 11 సెక్షన్ల కింద అక్రమ కేసు నమోదు చేయడం చంద్రబాబు సర్కారు అరాచక పాలన, దుర్మార్గాలకు పరాకాష్టగా నిలుస్తోంది. చంద్రగిరి నియోజకవర్గం ఎర్రావారిపాలెం మండలానికి చెందిన 14 ఏళ్ల బాలిక పాఠశాల నుంచి వస్తుండగా కొద్ది రోజుల క్రితం కొందరు యువకులు దాడి చేసి అపహరించుకుపోయారు.కుమార్తె కోసం గాలిస్తూ వచ్చిన ఆమె తండ్రి ముళ్ల పొదల్లో బాధితురాలిని గుర్తించినట్లు చెప్పారు. ‘బడి నుంచి వస్తున్న నా బిడ్డపై దుర్మార్గులు దాడి చేశారు. ముళ్ల పొదల్లో పడవేశారు. ముసుగు ధరించిన ఇద్దరు వ్యక్తులు అడ్డగించి కత్తితో దాడిచేశారు. నీళ్లలో మత్తు బిళ్లలు కలిపి తాగించారు. చేతిపై, కడుపుపై కత్తితో కోశారు. గంటవరకు బాలిక సృహలో లేదు.నా పరువు పోయినా పరవాలేదు.. పోలీసులు నిందితులను పట్టుకుని స్టేషన్‌కు తెచ్చి ఉరితీయాలి.. అప్పుడే మాకు న్యాయం జరిగినట్లు..’ అంటూ బాధిత బాలిక తండ్రి విలపించాడు (ఆ వీడియో కూడా ఉంది). ఈ ఘటన గురించి తెలియడంతో వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చలించిపోయారు. వెంటనే 80 కిలోమీటర్లు దూరం ప్రయాణించి బాధిత బాలికను, కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. పరామర్శించేందుకు వెళ్లి న్యాయం కోసం నిలబడిన చెవిరెడ్డిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. -
తిరుపతి తొక్కిసలాట ఘటనపై పిల్ దాఖలు
అమరావతి, సాక్షి: తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించాలని ప్రభాకర్ రెడ్డి పిల్ దాఖలు చేశారు. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు జరగకుండా ప్రొటోకాల్ రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు గోదావరి పుష్కరాలక్కిసలాటలో 29 మంది మృతి చెందిన అంశాన్ని ఈ సందర్భంగా ఆయన పిటిషన్లో ప్రస్తావించారు.తిరుపతిలో వైకుంఠ ద్వార టోకెన్ల టికెట్ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. టీటీడీ నిర్లక్ష్యం.. పోలీసుల వైఫల్యంతోనే ఇంతటి ఘోరం జరిగిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాంకు ముందస్తు బెయిల్
సాక్షి, విజయవాడ: ఏపీ హైకోర్టులో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తలసిల రఘురాంకు ఊరట దక్కింది. కూటమి ప్రభుత్వం ఆయనపై నమోదు చేసిన అక్రమ కేసుల్లో ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టులో ఎమ్మెల్సీ తలశిల రఘురాం పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై ఇవాళ విచారణ చేపట్టిన కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. -
ఉల్లంఘనలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాల్సిందే
సాక్షి, అమరావతి : ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించేలా చర్యలు తీసుకోవాలన్న తమ ఆదేశాల అమలులో పురోగతి కనిపిస్తోందని హైకోర్టు తెలిపింది. హెల్మెట్ ధరించని వాహనదారులకు పోలీసు లు చలాన్లు వేయడం ఆశ్నింనించదగ్గ పరిణామమని పేర్కొంది. ఈ విధానాన్ని, అవగాహన కార్యక్రమాలను కొనసాగించాలని పోలీసులను ఆదేశించింది. గత 20 రోజుల్లోనే ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినందుకు వాహనదారుల నుంచి రూ.95 లక్షలు చలాన్ల రూపంలో వసూలు చేయడం పట్ల కూడా హైకోర్టు సంతృప్తిని వ్యక్తం చేసింది. చట్ట నిబంధనలను అత్రికమించే వారిపై కఠినంగా వ్యవహరించాల్సిందేనని తేల్చి చెప్పింది. హెల్మెట్ ధరించకపోవడం వల్ల కలిగే దుష్ప్ర భావాలు, చట్టాన్ని ఉల్లంఘిస్తే తీసుకునే చర్యల గురించి పత్రికలు, టీవీల్లో ప్రముఖంగా ప్రకటనలు ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. చలాన్లు చెల్లించని వారి వివరాలు వెంటనే రవాణా శాఖ అధికారులకు చేరేలా ఓ సాంకేతిక వ్యవస్థను అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. చలాన్ల వసూలు, హెల్మెట్ ధారణ విషయంలో చేపడుతున్న చర్యలు, చలాన్ల వసూళ్లు పెరిగాయా లేదా తదితర వివరాలను తమ ముందుంచాలని అధికారులను ఆదేశించింది. తదుపరి విచా రణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. చట్ట నిబంధనలు పాటించడం లేదంటూ కేంద్ర మోటారు వాహన సవరణ చట్ట నిబంధనలను అమలు చేయడం లేదని, ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించడంలేదని, దీంతో పెద్ద సంఖ్యలో ప్రమాదాలు, మరణాలు చోటు చేసుకుంటున్నాయంటూ న్యాయవాది తాండవ యోగేష్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)ని సీజే ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. తమ ఆదేశాల నేపథ్యంలో పోలీసులు కొంత మేర చర్యలు చేపట్టారని ధర్మాసనం తెలిపింది.అయినప్పటికీ ప్రతి 10 మందిలో ఇద్దరు ముగ్గురే హెల్మెట్ ధరిస్తున్నారంది. తన సిబ్బందిలో ఒకరిని రోడ్డుపైకి పంపి ఈ విషయాన్ని రూఢీ చేసుకున్నానని సీజే తెలిపారు. ఈ చర్యలు కొనసాగిస్తారా లేక ఆపేస్తారా అంటూ ప్రశ్నించింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సింగమనేని ప్రణతి స్పందిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేస్తున్నామని తెలిపారు. పిటిషనర్ తాండవ యోగేష్ జోక్యం చేసుకుంటూ.. విజయవాడలోనే తనిఖీలు చేస్తున్నారని, చాలా జిల్లాల్లో తనిఖీలు చేయడం లేదని చెప్పారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. చలాన్లు ఎలా వసూలు చేస్తున్నారని ప్రశ్నించింది. ఇప్పటి వరకు భౌతికంగానే వసూలు చేస్తున్నామని, యూపీఐ ద్వారా కూడా వసూలు చేస్తామని ప్రణతి చెప్పారు. గత 20 రోజుల్లో చలాన్ల రూపంలో రూ.95 లక్షలు వసూలు చేశామన్నారు. గతంలో ఈ మొత్తం ఎంత ఉండేదని ధర్మాసనం ప్రశ్నించగా.. రూ. 4 లక్షలు ఉండేదని చెప్పారు. కాగా వచ్చే విచారణలో చలాన్ల మొత్తం పెరిగిందా? తగ్గిందా? అన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది. చలాన్లు చెల్లించని వారిపై ఏం చర్యలు తీసుకుంటున్నారని, చట్టం ఏం చెబుతోందని ధర్మాసనం ఆరా తీసింది. పిటిషనర్ యోగేష్ చట్ట నిబంధనలను వివరించారు. నిర్ణీత కాల వ్యవధిలో చలాన్లు చెల్లించకుంటే అధికారులు సంబంధిత మేజి్రస్టేట్ ద్వారా ఆ వాహనాన్ని జప్తు చేయవచ్చన్నారు. -
సంక్షేమ హాస్టళ్లపై ఇంత నిర్లక్ష్యమా?
సాక్షి, అమరావతి: పేద పిల్లలు చదువుకునే సంక్షేమ హాస్టళ్ల(డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాలు)పై ఇంత నిర్లక్ష్యమా? అని రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం నిధులు కేటాయిస్తే పిల్లలెందుకు నేలపై నిద్రిస్తున్నారని నిల దీసింది. సంక్షేమ హాస్టళ్ల దుస్థితిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎంత నిధులు కేటాయించారు? అందులో ఎంత ఖర్చు చేశారు? ఇంకా ఎంత అవసరం? ఆ నిధులతో ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? తదితర వివ రాలను గణాంకాలతో సహా తమ ముందుంచాలని సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్లకు స్పష్టం చేసింది. తదుపరి విచారణకు సంక్షేమ శాఖ కమిషనర్‌ను ఆన్లైన్లో హాజరవ్వాలని తేల్చిచెప్పింది. అలాగే ప్రతి జిల్లాలో కనీసం ఐదు సంక్షేమ హాస్టళ్లను తనిఖీ చేసి.. నివేదిక ఇవ్వాలని అన్ని జిల్లాల న్యాయ సేవాధికార సంస్థలను ఆదేశించింది. విద్యార్థులతో సంభాషించి వారికి అందుతున్న సౌకర్యాలను పరిశీలించాలని.. పౌష్టికాహారం, తాగునీరు, దుప్పట్లు, దోమ తెరలు వంటి కనీస అవసరాలు తీరుతున్నాయో, లేదో తెలుసుకోవాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పిల్లలకు.. కులాలతో ఏం సంబంధం?జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం సంక్షేమ హాస్టళ్లలో తప్పనిసరిగా మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉందని.. కానీ రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లలో ఆ పరిస్థితులు లేవంటూ కాకినాడకు చెందిన కీతినీడి అఖిల్ శ్రీగురు తేజ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై బుధవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది అరుణ్ శౌరి వాదనలు వినిపిస్తూ.. సంక్షేమ హాస్టళ్లలో తగినన్ని బాత్రూమ్లు లేక ఆడపిల్లలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ధర్మాసనం స్పంది స్తూ.. దీనిపై మీ వైఖరి ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సింగమనేని ప్రణతి స్పందిస్తూ.. సంక్షేమ హాస్టళ్లకు నిధుల కేటాయింపులు పెంచామని చెప్పారు. అన్ని హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు పెంచుతామని.. ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయని తెలిపారు. 1:7 నిష్పత్తిలో మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తున్నామన్నా రు. ఈ విషయాలను కౌంటర్లో పేర్కొన్నామని ఆమె తెలిపారు. కాగా, ఆ కౌంటర్లో హాస్టళ్లలో చదువుతున్న పిల్లల కులాలను పొందుపరచడాన్ని ధర్మాసనం గమనించింది. పిల్లలకు కులాలతో ఏం సంబంధమని.. పిల్లలు పిల్లలేనని ధర్మాసనం వ్యా ఖ్యా నించింది. ప్రభుత్వ కౌంటర్ సాదాసీదాగా ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించగా.. పూర్తి వివరా లతో నివేదికను కోర్టు ముందుంచుతామని ప్రణతి చెప్పారు.ఇంత తక్కువ నిధులతో నిర్వహణ ఎలా సాధ్యం?బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మార్గదర్శకాలను అమలు చేయాల్సిందేనని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం నిధులిస్తుంటే.. విద్యార్థులు ఎందుకు నేలపై నిద్రపోతారని ప్రశ్నించింది. తగినన్ని మరుగుదొడ్లు, బెడ్లు, బెడ్షీట్లు, పౌష్టికాహారం తదితరాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి దోమ తెరలు అందించాలని ప్రభుత్వానికి గుర్తు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంక్షేమ హాస్టళ్ల కోసం రూ.143 కోట్లే కేటాయించడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మొత్తంతో హాస్టళ్ల నిర్వహణ ఎలా సాధ్యమని ప్రశ్నించింది. భావిభారత పౌరుల కోసం నామామాత్రంగా నిధులు కేటాయిస్తే ఎలా? అంటూ నిలదీసింది. 90,148 మంది విద్యార్థులకు ఇంత తక్కువ మొత్తం ఎలా సరిపోతాయని ప్రశ్నించింది. ఇప్పటి వరకు హాస్టళ్లలో మౌలిక సదుపాయాల కోసం ఎంత ఖర్చు చేశారు? ఇంకా ఎంత అవసరం? తదితర వివరాలను తమ ముందుంచాలని అధికారులను ఆదేశించింది. ప్రభుత్వ నివేదిక, జిల్లాల న్యాయ సేవాధికార సంస్థలు అందించే నివేదికలను పరిగణనలోకి తీసుకుని తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని ధర్మాసనం తెలిపింది. -
యూకే వెళ్లేందుకు వైఎస్ జగన్‌కు అనుమతి
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాజా పాస్‌పోర్ట్ పొందేందుకు అవసరమైన నిరభ్యంతర పత్రాన్ని (ఎన్వోసీ) జారీ చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఐదేళ్ల కాల వ్యవధితో వైఎస్ జగన్‌కు పాస్‌పోర్ట్ జారీ చేయాలని పాస్‌పోర్ట్ అధికారులను ఆదేశించింది. కుమార్తె డిగ్రీ ప్రదానోత్సవ కార్యక్రమం నిమిత్తం ఈ నెల 16న యునైటెడ్ కింగ్డమ్ (యూకే) వెళ్లేందుకు జగన్మోహన్రెడ్డికి అనుమతి ఇచ్చింది. ఎన్వోసీ ఇవ్వాలంటే స్వయంగా కోర్టు ముందు హాజరై, రూ.20 వేలతో వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాల్సిందేనన్న ప్రత్యేక కోర్టు ఆదేశాలను రద్దు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి మంగళవారం తీర్పు వెలువరించారు.తాజాగా ఐదేళ్ల కాల వ్యవధితో పాస్‌పోర్ట్ జారీకి ఎన్వోసీ ఇవ్వాలంటే స్వయంగా కోర్టు ముందు హాజరై, రూ.20 వేలతో వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాల్సిందేనంటూ విజయ వాడ ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై సోమవారం వాదనలు విన్న జస్టిస్ శ్రీనివాసరెడ్డి మంగళవారం తన నిర్ణయాన్ని వెలువరించారు. ‘క్రిమినల్ కేసు పెండింగ్‌లో ఉన్నప్పుడు సంబంధిత కోర్టు నుంచి నిరభ్యంతర పత్రం అడగటంలో ప్రధాన ఉద్దేశం ఏమిటంటే.. క్రిమినల్ ప్రొసీడింగ్స్‌కు దరఖాస్తు దారు అందుబాటులో ఉండేలా చూడటమే. పాస్‌పోర్ట్ కలిగి ఉండటం రాజ్యాంగం ప్రసాదించిన హక్కు. విదేశాలకు వెళ్లేందుకు తగిన పాస్‌పోర్ట్ కలిగి ఉండాలి.జగన్ మోహన్‌రెడ్డి ఈ నెల 16న తన కుమార్తె డిగ్రీ ప్రదానోత్సవంలో పాల్గొనేందుకు విదేశాలకు వెళ్లాల్సి ఉంది. జగన్మోహన్రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే. మాజీ ముఖ్యమంత్రి. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు. నారాయణ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిస్తే.. ఇదే హైకోర్టు గత నవంబర్‌లో ఉత్తర్వులిచ్చింది. జగన్ తరఫున ఆయన న్యాయవాది హాజరైతే సరిపోతుందని చెప్పింది. ఈ నేపథ్యంలో తాజా పాస్‌పోర్ట్ పొందేందుకు నిరభ్యంతర పత్రం జారీ చేయడానికి ఎలాంటి అడ్డంకి లేదు. ఎన్వోసీ జారీ చేయాలన్న జగన్ అభ్యర్థనను తిరస్కరిస్తూ ప్రత్యేక కోర్టు చెప్పిన కారణాలేవీ చెల్లవు. అందువల్ల ప్రత్యేక కోర్టు ఉత్తర్వులను రద్దు చేస్తున్నాం’ అని శ్రీనివాసరెడ్డి తన తీర్పులో పేర్కొన్నారు. -
మాజీ మంత్రి పేర్ని నాని ముందస్తు బెయిల్‌పై నేడు విచారణ
సాక్షి, అమరావతి : రేషన్ బియ్యం కేసులో మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య అలియాస్ నానిపై ఎలాంటి కఠిన చర్యలేవీ తీసుకోవద్దంటూ ఇటీవల తామిచ్చిన ఉత్తర్వులను హైకోర్టు బుధవారం వరకూ పొడిగించింది. నాని ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి సోమవారం ఉత్తర్వులిచ్చారు. రేషన్ బియ్యం కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ నాని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు రావాల్సి ఉన్నా.. రాకపోవడంతో అత్యవసర విచారణ కోసం నాని తరఫు న్యాయవాది వీసీహెచ్ నాయుడు కోర్టును అభ్యర్థించారు. దీంతో న్యాయమూర్తి లంచ్‌మోషన్ రూపంలో విచారణకు అంగీకరించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభ్యర్థన మేరకు న్యాయమూర్తి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు.పెనాల్టీ నోటీసులపై పూర్తి వివరాలివ్వండి.. ఇదే వ్యవహారంలో రూ.1.67 కోట్లు పెనాల్టీ చెల్లించాలంటూ పౌర సరఫరాల శాఖ ఇచి్చన నోటీసులను సవాలు చేస్తూ పేర్ని నాని సతీమణి, గోడౌన్ యజమాని జయసుధ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు పూర్తి వివరాలను తమ ముందుంచాలని పౌర సరఫరాల శాఖను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు సోమవారం ఉత్తర్వులిచ్చారు. ముందస్తు బెయిల్ పిటిషన్ల కొట్టివేత సాక్షి, అమరావతి : గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించి పోలీసులు నమోదు చేసిన కేసులో పలువురు నిందితులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. పిటిషనర్లపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదై ఉన్నందున చట్ట నిబంధనల ప్రకారం కింది కోర్టులోనే పిటి షన్లు దాఖలు చేసుకోవాలంది. అందువల్ల ఈ వ్యాజ్యాలకు విచారణార్హత లేదని తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ సోమవారం తీర్పు వెలువరించారు. 2023లో గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది. ఈ ఘ టనలో పోలీసులు పలువురిపై కేసులు నమో దు చేశారు. దీంతో కృష్ణారావు మరో 32 మంది హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దా ఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై ఇటీవల వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసిన న్యాయమూర్తి సోమవారం నిర్ణయాన్ని వెలువరించారు. వారికి నెల రోజుల్లో ట్రాన్సిట్ పర్మిట్లు జారీ చేయండిసాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను ఉల్లంఘించని మైనర్ మినరల్ లీజుదారులకు నెల రోజుల్లో ట్రాన్సిట్ పర్మిట్లు జారీ చేయాలని గనుల శాఖ అధికారులను హైకోర్టు ఆదేశించింది. గత ఏడాది అక్టోబర్‌లో ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు లోబడి ఈ ట్రాన్సిట్ పర్మిట్లు ఉండాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ కుంఢజడల మన్మథరావు మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. చట్ట ప్రకారం అన్ని అనుమతులు ఉన్నప్పటికీ తమకు ట్రాన్సిట్ పర్మిట్లు జారీ చేయకపోవడాన్ని సవాలు చేస్తూ ఫెడరేషన్ ఆఫ్ మైనర్ మినరల్స్ ఇండస్ట్రీ (ఫెమ్మీ) సెక్రటరీ జనరల్ చట్టి హనుమంతరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సోమవారం విచారణ జరిపిన జస్టిస్ మన్మథరావు నిబంధనల ప్రకారం ట్రాన్సిట్ పర్మిట్లు జారీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తుచేశారు. తదుపరి విచారణను ఫిబ్రవరి 10కి వాయిదా వేశారు. అంబటి పిటిషన్లో పూర్తి వివరాలివ్వండి పోలీసులకు హైకోర్టు ఆదేశం సాక్షి, అమరావతి: తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డితోపాటు తనను, తన కుటుంబ సభ్యులను కించపరుస్తూ, అసభ్యకరంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నవారిపై చర్యలు తీసుకోవాలంటూ తాను ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ మాజీ మంత్రి అంబటి రాంబాబు దాఖలు చేసిన వ్యాజ్యంలో పూర్తి వివరాలు సమరి్పంచాలని హైకోర్టు సోమవారం పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి ఉత్తర్వులు జారీచేశారు. తాను ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాధ్యులపై కేసు నమోదు చేసేలా గుంటూరు పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని రాంబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు వచి్చంది. అంబటి రాంబాబు స్వయంగా వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణ ఈ నెలాఖరుకి వాయిదా వేశారు. -
నా కుమార్తె డిగ్రీ ప్రదానోత్సవానికి వెళ్లాలి
సాక్షి, అమరావతి: తన కుమార్తె డిగ్రీ ప్రదానోత్సవ కార్యక్రమం నిమిత్తం వచ్చే వారం లండన్ వెళ్లాల్సి ఉందని, అందువల్ల తనకు తాజా పాస్‌పోర్ట్ జారీ నిమిత్తం నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) ఇచ్చేలా విజయవాడ ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టును ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఎన్వోసీ ఇవ్వాలంటే స్వయంగా కోర్టు ముందు హాజరై, రూ.20వేలతో వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాల్సిందేనన్న ప్రత్యేక కోర్టు ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ ఆయన సోమవారం హైకోర్టులో అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి విచారణ జరిపారు. వైఎస్ జగన్ తరఫున సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరామ్, న్యాయవాది శెట్టిపల్లి దుష్యంత్‌రెడ్డి వాదనలు వినిపించారు. వ్యక్తిగత పూచీకత్తుతో నిమిత్తం లేకుండా ఐదేళ్ల గడువుతో కూడిన పాస్‌పోర్ట్ జారీ నిమిత్తం ఎన్వోసీ ఇచ్చేందుకు ప్రత్యేక కోర్టు నిరాకరించిందని శ్రీరామ్ తెలిపారు. ఎన్వోసీ కావాలంటే స్వయంగా తమముందు హాజరు కావాల్సిందేనని చెప్పారన్నారు.వాస్తవానికి ఏ పరువు నష్టం కేసులో అయితే వ్యక్తిగతంగా హాజరుకావాలని ప్రత్యేక కోర్టు చెబుతుందో... ఆ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి వైఎస్ జగన్‌కు హైకోర్టు గతంలోనే మినహాయింపునిచ్చిందని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అందువల్ల వ్యక్తిగతంగా హాజరై రూ.20 వేలకు పూచీకత్తులు సమర్పించాల్సిన అవసరం లేదన్నారు. ఈ విషయాన్ని ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకోలేదన్నారు. హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఐదేళ్ల కాల వ్యవధితో కూడిన పాస్‌పోర్ట్ జారీకి ఎన్వోసీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రత్యేక కోర్టుపై ఉందన్నారు. ఈ నెల 16న లండన్‌లో తన కుమార్తె డిగ్రీ ప్రదానోత్సవ కార్యక్రమానికి వైఎస్ జగన్ హాజరుకావాల్సి ఉందని, అందువల్ల ఎన్సీవో మంజూరు చేసేలా ప్రత్యేక కోర్టును ఆదేశించాలని కోరారు.అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ, పరువునష్టం కేసులో విచారణకు మాత్రమే వ్యక్తిగత హాజరు నుంచి వైఎస్ జగన్‌కు హైకోర్టు మినహాయింపు ఇచ్చిందన్నారు. పూచీకత్తులు సమర్పించేందుకు మినహాయింపు ఇవ్వలేదని తెలిపారు. కోర్టు ఆదేశాల ప్రకారం స్వయంగా హాజరై పూచీకత్తులు సమర్పించాల్సిన బాధ్యత జగన్‌పై ఉందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. -
కోర్టులకన్నా ఎక్కువ అనుకుంటున్నారా?
సాక్షి, అమరావతి : సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రరెడ్డి అక్రమ నిర్బంధం వ్యవహారంలో పోలీసుల తీరుపై హైకోర్టు నిప్పులు చెరిగింది. రవీంద్రరెడ్డిని ఎప్పుడు నిర్బంధంలోకి తీసుకున్నారు? ఎప్పుడు అరెస్ట్ చూపారు? ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారా అన్న ప్రశ్నలకు సూటిగా సమాధానాలివ్వాలని పోలీసు లను ఆదేశించింది. ఈ కేసులో పోలీసులు మొదటి నుంచీ తమ ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తు న్నారంటూ మండిపడింది. రవీంద్రరెడ్డితో పాటు సుబ్బారెడ్డి, ఉదయ్ కుమార్‌రెడ్డిలను తమ ముందు హాజరుపరచాలని ఆదేశిస్తే కింది కోర్టు ముందు హాజరుపరిచారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.ఇలాంటి తీరును సహించేదే లేదని తేల్చి చెప్పింది. కోర్టులకన్నా ఎక్కువ అనుకుంటున్నారా అంటూ పోలీసులను నిలదీసింది. ఎస్పీ తీరు చూస్తే అలాగే అనిపిస్తోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ కేసు తీవ్రత అర్థమవుతున్నట్లు లేదని, ఆరోపణలు నిజమని తేలితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని పోలీసులను హెచ్చరించింది. ఆరోపణ లున్నా స్పందించడంలేదంటే ఏమనుకోవాలంటూ నిలదీసింది. రవీంద్రరెడ్డి అక్రమ నిర్బంధం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.పోలీసులు కోర్టునూ తప్పుదోవ పట్టిస్తున్నారుతన భర్తను అక్రమంగా నిర్బంధించారని వర్రా రవీంద్రరెడ్డి భార్య కళ్యాణి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై జస్టిస్ రఘునందన్‌రావు ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా కళ్యాణి తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పోలీసుల అన్యాయాలు, అక్రమ నిర్బంధాలకు అడ్డుకట్ట వేయాలని కోర్టును కోరారు. అవాస్తవాలతో కోర్టును సైతం తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. నవంబర్ 8న రవీంద్రరెడ్డిని అదుపులోకి తీసుకున్నారా? లేదా? అన్న విషయంపై పోలీసులు మాట్లాడటంలేదన్నారు. చట్టం కన్నా, కోర్టుల కన్నా తామే ఎక్కువ అన్నట్లు పోలీసులు వ్యవహరిస్తున్నారని తెలిపారు. కోర్టు ఆదేశించినా ఇప్పటివరకు కౌంటర్లు దాఖలు చేయలేదన్నారు.ముఖ్యంగా కడప ఎస్పీపై వ్యక్తిగతంగా ఆరోపణలు చేశామని, ఆయన ఇప్పటివరకు కౌంటర్ వేయలేదని తెలిపారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) టి.విష్ణుతేజ వాదనలు వినిపిస్తూ.. అన్నమయ్య జిల్లా ఎస్పీ కౌంటర్ దాఖలు చేశారని, ఆయనే ఇప్పుడు కడప జిల్లాకు ఇన్చార్జి ఎస్పీగా ఉన్నారని తెలిపారు. రవీంద్రరెడ్డి నిర్బంధానికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయని నిరంజన్‌రెడ్డి కోరగా.. ఆ పని తాము చేయలేమని ధర్మాసనం చెప్పింది. అలా అయితే సంబంధిత జిల్లా జడ్జికి ఆ బాధ్యతలు అప్పగించాలని నిరంజన్‌రెడ్డి సూచించారు. -
హైకోర్టులో అంబటి వాదనలు
-
సోషల్ మీడియా పోస్టులపై అంబటి వాదనలు.. కౌంటర్‌పై పోలీసులకు ఆదేశాలు
సాక్షి, అమరావతి: సోషల్ మీడియాలో వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై టీడీపీ నాయకులు పెట్టిన పోస్టులపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడాన్ని మాజీ మంత్రి అంబటి రాంబాబు సవాల్ చేశారు. ఈ క్రమంలో ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నేడు పిటిషన్‌పై విచారణ కొనసాగింది.ఈ సందర్బంగా హైకోర్టు అంబటి రాంబాబు తానే స్వయంగా వాదనలు వినిపించారు. వాదనల సందర్బంగా అంబటి..‘పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో సోషల్ మీడియాలో పెట్టిన అసభ్య పోస్టులపై ఐదుసారు ఫిర్యాదులు ఇచ్చాను. నా ఫిర్యాదులతో పోలీసులు కేసు నమోదు చేయలేదన్నారు. దీంతో, పోలీసులు తరఫు న్యాయవాది వాదిస్తూ.. తమకు ఎలాంటి సమాచారం లేదని కోర్టుకు తెలిపారు. దీంతో, ధర్మాసనం.. కౌంటర్ దాఖలు చేయమని పోలీసులు తరఫున న్యాయవాదిని ఆదేశించింది. నిన్న నాలుగు ఫిర్యాదులపై కేసు నమోదు చేసినట్లు సమాచారం ఇచ్చారని కోర్టుకు అంబటి రాంబాబు తెలిపారు.ఇదిలా ఉండగా.. అంబటి రాంబాబు పిటిషన్‌లోని కీలక అంశాలు ఇవే. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌ను కించపరుస్తున్నారు. నాపైన, నా కుటుంబ సభ్యులపైనా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అసభ్యంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సోషల్ మీడియాలో పోస్టుల పైన పోలీసులకు వేరువేరుగా ఫిర్యాదులు ఇచ్చాను. నేను ఇచ్చిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేయలేదు. అధికార పార్టీ నేతలు ఫిర్యాదు చేస్తే ప్రతిపక్ష నాయకులపై వెంటనే కేసులు పెడుతున్నారు. ప్రతిపక్ష పార్టీ నాయకుల పట్ల పోలీసుల వివక్షత చూపిస్తున్నారు. నా ఫిర్యాదుల ఆధారంగా కేసు నమోదు చేసేలా పోలీసులు ఆదేశించండి అని పేర్కొన్నారు. -
క్రిమినల్ కేసులో హైకోర్టు అరుదైన తీర్పు
సాక్షి, అమరావతి : ఓ క్రిమినల్ కేసులో హైకోర్టు అరుదైన తీర్పు వెలువరించింది. నిందితుల వాదన వినకుండా, వాదన వినిపించే అవకాశం ఇవ్వకుండా, కనీసం వారికి న్యాయ సాయం (లీగల్ ఎయిడ్) కూడా అందించకుండా కేసు విచారణ (ట్రయల్) మొదలు పెట్టి, నెల రోజుల్లో వారికి శిక్ష విధిస్తూ ఏలూరు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ట్రయల్ నిష్పాక్షికంగా జరగనప్పుడు న్యాయానికి విఘాతం కలుగుతుందని పేర్కొంటూ ఆ తీర్పును రద్దు చేసింది. తిరిగి మొదటి నుంచి (డీ నోవో) విచారణ మొదలు పెట్టాలని, 6 నెలల్లో పూర్తి చేయాలని ప్రత్యేక కోర్టును ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి, జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పోలీసుల ఆరోపణల ప్రకారం.. ఏలూరుకు చెందిన బోడ నాగ సతీష్ తన స్నేహితులైన బెహరా మోహన్, బూడిత ఉషాకిరణ్‌లతో కలిసి 2023 జూన్ 13న ఓ వివాహితపై యాసిడ్ దాడి చేశారు. దీంతో ఆమె చికిత్స పొందుతూ చనిపోయారు. దీంతో పోలీసులు వీరితో పాటు మరో ముగ్గురిపై హత్యానేరం, ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జూన్ 15న నాగ సతీష్‌తో పాటు అతని ఇద్దరు స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం దర్యాప్తు పూర్తి చేసి ఏలూరు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో జూలై 7న చార్జిషీట్ దాఖలు చేశారు. ప్రత్యేక కోర్టు ఆగస్టు 16న ట్రయల్ మొదలుపెట్టింది. అక్టోబర్ 10న తీర్పు వెలువరించింది. నాగ సతీష్, మోహన్, ఉషాకిరణ్లకు జీవిత ఖైదు విధించింది. మిగిలిన ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ నాగ సతీష్ తదితరులు హైకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై జస్టిస్ సురేష్‌రెడ్డి, జస్టిస్ శ్రీనివాస్‌రెడ్డి ధర్మాసనం విచారణ జరిపి, పై విధంగా ఆదేశాలు జారీ చేసింది. -
హైకోర్టులో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
సాక్షి,అమరావతి: రాష్ట్ర హైకోర్టులో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. హైకోర్టు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌తో పాటు న్యాయమూర్తులు పాల్గొన్నారు. 25 కేజీల కేక్‌ను కట్ చేశారు. ఉద్యోగులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం హైకోర్టు ఉద్యోగుల సంఘం 2025 సంవత్సర క్యాలెండర్‌ను సీజే ఆవిష్కరించారు. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ డాక్టర్ యడవల్లి లక్ష్మణరావు, ఇతర రిజిస్ట్రార్లు, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అక్కెన వేణుగోపాలరావు, ఉపాధ్యక్షుడు సురేంద్రనాథ్, కార్యదర్శి ఎలీషా, కార్యనిర్వాహక కార్యదర్శి చంద్రబాబు, సంయుక్త కార్యదర్శి జి.కోటేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు రేష్మ, రాంబాబు, పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. -
పట్టాభిపురం పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
-
హైకోర్టులో పేర్ని నానికి ఊరట
-
ఏపీ హైకోర్టులో పేర్ని నాని లంచ్ మోషన్ పిటిషన్
-
ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి పేర్నినానికి ఊరట
సాక్షి, విజయవాడ: ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి పేర్నినానికి ఊరట దక్కింది. పేర్నినాని దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా సోమవారం వరకు పేర్నినానిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి పేర్నినాని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ముందస్తు బెయిల్ కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. పౌరసరఫరాల సంస్థకు సంబంధించిన కేసులో పేర్ని నానిని ఏ6గా మచిలీపట్నం పోలీసులు చేర్చారు.పేర్ని నాని పై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. పేర్ని నాని కుటుంబమే లక్ష్యంగా అక్రమ కేసులు పెడుతోంది. రికవరీ మొత్తం చెల్లించినా వదలకుండా వేధింపుల పర్వానికి తెరతీసింది. పేర్ని నాని సతీమణి జయసుధకు ముందస్తు బెయిల్ రాగానే మరోసారి నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే కోటి 68 లక్షలు పేర్ని నాని కుటుంబం చెల్లించింది. మరో కోటి 67 లక్షలు రికవరీ చెల్లించాలంటూ జయసుధకు కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ నోటీసులు పంపించారు. జయసుధకు ముందస్తు బెయిల్ రాగానే పేర్ని నానిని ఏ6గా కేసులో పోలీసులు చేర్చారు.ఇదీ చదవండి: ఇదీ పన్నాగం.. చంద్రబాబు సర్కార్ బరితెగింపు..కాగా, ఈ కేసులో మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) సతీమణి జయసుధకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ మచిలీపట్నంలోని 9వ అదనపు జిల్లా కోర్టు జడ్జి ఎస్.సుజాత సోమవారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా పేర్ని జయసుధ కేసులో మచిలీపట్నం రూరల్ పోలీసులు సోమవారం రాత్రి నలుగురి ని అరెస్టు చేశారు. గోడౌన్ మేనేజర్ మానస తేజ, సివిల్ సప్లయీస్ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి, లారీ డ్రైవర్ మంగారావు, లారీ డ్రైవర్ స్నేహి తుడు ఆంజనేయులును అరెస్టు చేశారు. వీరికి జడ్జీ 12 రోజులు రిమాండ్ విధించారు. -
పల్నాడు జిల్లా మాచవరం SHO సతీష్ పై ఏపీ హైకోర్టు ఆగ్రహం
-
రాజకీయ దురుద్దేశాలతోనే కేవీ రావు తప్పుడు ఫిర్యాదు
సాక్షి, అమరావతి: కాకినాడ డీప్ సీ వాటర్ పోర్టు వాటాల బదిలీ వ్యవహారంలో కర్నాటి వెంకటేశ్వరరావు (కేవీ రావు) రాజకీయ దురుద్దేశాలతోనే తనపై సీఐడీకి ఫిర్యాదు చేశారని వైవీ విక్రాంత్‌రెడ్డి హైకోర్టుకి నివేదించారు. ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను తొక్కిపెట్టి, కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని వివరించారు. ఆయన చేస్తున్న ప్రతీ ఆరోపణను తోసిపుచ్చుతున్నట్టు విక్రాంత్‌రెడ్డి తెలిపారు. ‘నా ప్రతిష్టను దెబ్బతీయాలన్న అజెండాతోనే కేవీ రావు నాపై నిరాధార, తప్పుడు ఆరోపణలు చేశారు. ప్రస్తుతం కోర్టులో జరుగుతున్న లీగల్ ప్రొసీడింగ్స్ ద్వారా అనుచిత లబ్ధి పొందాలన్న ఉద్దేశంతోనే అలా చేశారు. నాపై చేసిన ఏ ఒక్క ఆరోపణకు కూడా ఆధారం చూపలేదు. తద్వారా చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేశారు. ఈ కేసులో నిర్ణయం వెలువరించేందుకు అత్యావశ్యకమైన పలు కీలక విషయాలను ఆయన తొక్కిపెట్టారు. వాటాల బదిలీ జరిగిన నాలుగేళ్ల తరువాత సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఇంత జాప్యం ఎందుకు జరిగిందో ఆయన ఎక్కడా చెప్పలేదు. వాటాల బదిలీ ప్రక్రియలో, మూల్యాంకనంలో, ఒప్పందాల తయారీలో కేవీ రావు క్రియాశీలకంగా వ్యవహరించారు. గత ప్రభుత్వంతో నాకున్న రాజకీయ సంబంధాల దృష్ట్యా నా ప్రతిష్టను దెబ్బతీయడానికే రాజకీయ దురుద్దేశాలతో ఆయన ఫిర్యాదు చేశారు. కేవీ రావు తన స్వీయ చర్యల నుంచి దృష్టిని మరల్చేందుకే, తన తప్పులను కప్పించుకునేందుకే నాపై తప్పుడు ఆరోపణలు చేశారు. తను బాధితుడినంటూ చెప్పుకుంటున్న కేవీరావు అందుకు ప్రాథమిక ఆధారాలను చూపడంలో విఫలమయ్యారు. న్యాయ సలహాదారులు, ఆడిటర్ల సమక్షంలోనే వాటాల బదిలీ జరిగింది’ అని విక్రాంత్‌రెడ్డి వివరించారు. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, ముందస్తు బెయిల్ కోసం తాను దాఖలు చేసిన పిటిషన్‌ను అనుమతించాలని కోర్టును కోరారు. ఈ అనుబంధ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయదలచుకుంటే చేయవచ్చని న్యాయస్థానం స్పష్టం చేయడంతో విక్రాంత్‌రెడ్డి తన వాదన వినిపిస్తూ సోమవారం ఈ మేరకు కౌంటర్ దాఖలు చేశారు. విక్రాంత్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారణ జరపనుంది. -
ఇక మీ తమాషాలు చాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పౌరుల అక్రమ నిర్బంధం విషయంలో పోలీసుల తీరును హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ‘అక్రమ నిర్బంధాల విషయంలో వాస్తవాలను రూఢీ చేసుకునేందుకు ఆయా పోలీస్స్టేషన్లలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను సమర్పించాలని మేం ఎప్పుడు ఆదేశించినా పోలీసులు ఏవో కుంటిసాకులు చెబుతున్నారు. సీసీటీవీ ఫుటేజీ సమర్పించకుండా కోర్టును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి తమాషాలకు ఫుల్స్టాప్ పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ విషయంలో పోలీసులకు గట్టి సందేశం పంపుతాం. లేనిపక్షంలో ఇలాంటి తమాషాలు కొనసాగుతూనే ఉంటాయి.’ అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. సీసీటీవీ ఫుటేజీని తమ ముందు ఉంచాలంటూ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకుండా, సీసీటీవీ కాలిపోయిందని, ఫుటేజీ లేదంటూ అఫిడవిట్ దాఖలు చేసిన పల్నాడు జిల్లా మాచవరం పోలీస్‌స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో)పై హైకోర్టు మండిపడింది.అతనిపై తక్షణమే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. అలాగే తమ ముందున్న వ్యాజ్యాల్లో అతన్ని సుమోటోగా ప్రతివాదిగా చేర్చి, కోర్టు ధిక్కార చర్యలకు ఉపక్రమిస్తామని చెప్పింది. ఈ వ్యవహారంలో పోలీసులపై ఏం చర్యలు తీసుకోవాలో స్పష్టతనివ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను జనవరి 7వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ కుంచం మహేశ్వరరావు ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.సీసీటీవీ ఫుటేజీ సమర్పణకు హైకోర్టు ఆదేశం...తన సోదరుడు కటారి గోపీరాజును పోలీసులు అక్ర మంగా నిర్బంధించారని, ఆయనను కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరు తూ కటారు నాగరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన సోదరుడిని నవంబర్ 3న అక్రమంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు, 7వ తేదీన అరెస్ట్ చేశామంటూ అబద్ధం చెబుతున్నారని, ఈ నేపథ్యంలో మాచవరం పోలీస్‌స్టేషన్‌లో నవంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు సీసీటీవీ ఫుటేజీని కోర్టుకు సమర్పించేలా ఆదేశాలివ్వాలని కూడా ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. నాగరాజు పిటిషన్‌పై గతంలో విచారణ జరిపిన జస్టిస్ రఘునందన్‌రావు ధర్మాసనం, నంబవర్ 2 నుంచి 8వ తేదీ వరకు సీసీటీవీ ఫుటేజీని పెన్‌డ్రైవ్‌లో సంబంధిత మేజిస్ట్రేట్ ముందుంచాలని పోలీసులను ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కూడా స్పష్టం చేసింది.కాలిపోయింది.. ఫుటేజీ లేదు...తాజాగా సోమవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా మాచవరం ఎస్‌హెచ్‌వో దాఖలు చేసిన కౌంటర్‌ను ధర్మాసనం పరిశీలించింది. తమ స్టేషన్లో యూపీఎస్‌తో సహా సీసీటీవీ మొత్తం కాలిపోయిందని, అందువల్ల ఫుటేజీ రికార్డ్ కాలేదని, దీంతో ఫుటేజీని కోర్టు ముందుంచలేకపోతున్నామని ఎస్‌హెచ్‌వో చెప్పడాన్ని తప్పుపట్టింది. ‘కోర్టు సీసీటీవీ ఫుటేజీని అడగ్గానే మిస్టీరియస్‌గా ఆ సీసీటీవీ ఫుటేజీ కనిపించకుండా పోతోంది. మీరు (పోలీసులు) చెబుతున్నంత సింపుల్ వ్యవహారం కాదిది. మేం కఠినంగా స్పందించకుంటే ఈ తమాషా ఆగేలా కనిపించడం లేదు.ఎస్‌హెచ్‌వోపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. లేదా మా ఆదేశాల మేరకు సీసీటీవీ పుటేజీని కోర్టుకు సమర్పించనందుకు సుమోటోగా కోర్టు ధిక్కార చర్యలు చేపట్టాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పోలీస్స్టేషన్లలో సీసీటీవీలను సక్రమంగా నిర్వహించాల్సిన బాధ్యత ఎస్‌హెచ్‌వోపై ఉంది. సీసీటీవీ పని చేయకుంటే దానిని రిపేర్ చేయించాల్సిన బాద్యూత కూడా అతనిపైనే ఉంది. ఎస్‌హెచ్‌వోపై ఎందుకు చర్యలకు ఆదేశించరాదో చెప్పండి..’ అని ప్రభుత్వానికి ధర్మాసనం స్పష్టం చేసింది. -
తప్పుడు కేసులో ఇరికించేందుకు పోలీసుల యత్నం
సాక్షి, అమరావతి: సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టకపోయినా, కులం పేరుతో ఎవరినీ దూషించకపోయినా పోలీసులు అన్యాయంగా తనను ఎస్సీ, ఎస్టీ కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని కడప ఎంపీ అవినాష్‌రెడ్డి పర్సనల్ సెక్రటరీ బండి రాఘవరెడ్డి హైకోర్టుకు నివేదించారు. బండి రాఘవరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు చెల్లదని ఆయన తరఫు సీనియర్ న్యాయవాది ఓ.మనోహర్‌రెడ్డి వివరించారు. వర్రా రవీందర్‌రెడ్డి వాంగ్మూలం పేరుతో రాఘవరెడ్డిని అరెస్టుచేసేందుకు పోలీసులు వెతుకున్నారని తెలిపారు. రవీందర్‌రెడ్డిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి బలవంతంగా వాంగ్మూలం నమోదు చేయించారన్నారు. ఆ వాంగ్మూలం పేరుతో పిటిషనర్‌తో పాటు మరికొందరిని నిందితులుగా చేర్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. గతంలో కూడా పోలీసులు మరో కేసులో ఇదే రీతిలో వ్యవహరించారన్నారు. ఇప్పుడు కూడా సంబంధంలేని కేసులో పిటిషనర్‌ను ఇరికించాలని పోలీసులు చూస్తున్నారని.. రాజకీయ కక్ష సాధింçపులో భాగంగానే పోలీసులు ఇలా చేస్తున్నారని తెలిపారు. అరెస్టు భయం ఉన్న నేపథ్యంలో ఈ ముందుస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశామన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసు ఉన్నా కూడా హైకోర్టులో ముందస్తు బెయిల్ దాఖలు చేసుకోవచ్చునని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. అనంతరం.. పోలీసుల తరఫున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) సందీప్ వాదనలు వినిపిస్తూ, ఎస్సీ, ఎస్టీ కేసుల్లో నిందితులు సంబంధిత కోర్టుల్లోనే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. నేరుగా హైకోర్టును ఆశ్రయించడానికి వీల్లేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. జనవరి 7న తీర్పును వెలువరిస్తామని న్యాయమూర్తి జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. -
జస్టిస్ గుహనాథన్ నరేందర్‌కు హైకోర్టు ఘన వీడ్కోలు
సాక్షి, అమరావతి: పదోన్నతిపై ఉత్తరాఖండ్ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ గుహనాథన్ నరేందర్‌కు హైకోర్టు మంగళవారం ఘనంగా వీడ్కోలు పలికింది. జస్టిస్ నరేందర్‌కు వీడ్కోలు ఇచ్చేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ నేతృత్వంలో న్యాయమూర్తులందరూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీజే జస్టిస్ ఠాకూర్ మాట్లాడుతూ న్యాయవ్యవస్థకు జస్టిస్ నరేందర్ వెలకట్టలేని సేవలు అందించారని కొనియాడారు. అనేక కేసుల్లో పలు కీలక తీర్పులిచ్చారని, పరిపాలనాపరంగా ఆయన అందించిన సహకారం మరువలేనిదన్నారు. ఏపీ న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా లోక్ అదాలత్‌లు సమర్థంగా జరిగేలా కృషి చేశారన్నారు. లోక్ అదాలత్‌లలో లక్ష కేసులు పరిష్కారం కావడం వెనుక ఆయన పాత్ర ఎంతో ఉందన్నారు. విజయవాడలో వరదల తరువాత ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడి బాధితులకు వీలైనంత త్వరగా సాయం అందేలా కృషి చేశారని జస్టిస్ ఠాకూర్ తెలిపారు.ప్రత్యేక ప్రతిభావంతులైన 62 మంది పిల్లలకు వినికిడి యంత్రాలు అందజేసేందుకు కృషి చేశారన్నారు. అలాగే అంధులైన పిల్లలకు వైద్య పరీక్షలు చేయించి, ఇద్దరికి కంటి చూపు వచ్చేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఆయన కృషి, సేవలు తనను ఎంతో ఆనందానికి గురి చేశాయని సీజే పేర్కొన్నారు. ఇక్కడ గడిపిన కాలం గుర్తుండిపోతుంది అనంతరం జస్టిస్ నరేందర్ మాట్లాడుతూ, హైకోర్టులో పనిచేసిన ఈ 14 నెలల కాలం తన జీవితాంతం గుర్తుండి పోతుందన్నారు. ఇక్కడి న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తనపై ఎంతో ప్రేమ, అనురాగం చూపారన్నారు. పరిపాలనపరమైన నిర్ణయాల్లో తన ఆలోచనలను సీజే ఎంతో ప్రోత్సహించారని తెలిపారు. ఇక్కడ తాను సాధించిన మంచి పేరు ఏదైనా ఉందంటే అందులో సీజేకు సగం దక్కాల్సి ఉంటుందన్నారు.అంతకుముందు రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కలిగినీడి చిదంబరం, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (డీఎస్జీ) పసల పొన్నారావు మాట్లాడారు. జస్టిస్ నరేందర్ తీర్పులు సమాజానికి మార్గదర్శకమని తెలిపారు. యువ న్యాయవాదులను ఎంతగానో ప్రోత్సహించారన్నారు.అనంతరం హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో జస్టిస్ నరేందర్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఠాకూర్ ఘనంగా సన్మానించారు. శాలువా కప్పి, దుర్గమ్మ చిత్ర పటాన్ని బహూకరించారు. హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అక్కెన వేణుగోపాలరావు నేతృత్వంలో సంఘం కార్యవర్గం కూడా జస్టిస్ నరేందర్‌ను సత్కరించింది. -
ఐటీడీపీ పోస్టులపై హైకోర్టులో అంబటి రాంబాబు పిటిషన్
అమరావతి, సాక్షి: ఐటీడీపీ అనుచిత పోస్టుల వ్యవహారంపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని.. కేసులు నమోదు చేసేలా పోలీసులకు ఆదేశాలివ్వాలని ఆయన తన పిటిషన్లో న్యాయస్థానాన్ని కోరారు.‘‘ఐటీడీపీ(iTDP)లో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు. మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కించపరుస్తున్నారు. నాపై , నాకుటుంబ సభ్యులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మేం ఇచ్చిన ఫిర్యాదులపై పోలీసులు ఒక్క కేసు నమోదు చేయలేదు. మాపై వివక్ష ప్రదర్శిస్తున్నారు’’ అని అంబటి పిటిషన్లో పేర్కొన్నారు. తన పిటిషన్ ఆధారంగా.. కేసులు నమోదు చేసేలా పోలీసులకు ఆదేశాలువ్వాలని పిటిషన్ ద్వారా అంబటి కోరారు. ఈ పిటిషన్‌పై స్వయంగా ఆయనే వాదనలు వినిపించనున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే.. ఐటీడీపీ, టీడీపీ అనుబంధ పేజీల్లో వైఎస్ జగన్(YS Jagan)పై, తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై ఆయన పోలీసులకు ఫిర్యాదులు చేశారు. అయితే అటు నుంచి ఎలాంటి స్పందన ఉండడం లేదు. దీంతో తాజాగా ఆయన పట్టాభిపురం పీఎస్ వద్ద నిరసన తెలిపారు. అయితే న్యాయం చేయకపోగా.. అంబటిపైనే పోలీసులు తిరిగి కేసు నమోదు చేయడం గమనార్హం.ఇదీ చదవండి: ఉన్న ఉద్యోగం పీకేసి.. అయినవాళ్ల కోసం! -
పోలీసుల నోటీసులను రద్దుచేయండి..
సాక్షి, అమరావతి :రేషన్ బియ్యం కేసులో సాక్షులుగా విచారణకు రావాలంటూ బందరు తాలుకా పోలీసులు తమకు జారీచేసిన నోటీసులను సవాలుచేస్తూ మాజీమంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని సాయి కృష్ణమూర్తి హైకోర్టును ఆశ్రయించారు. నోటీసులను రద్దుచేయాలని కోరుతూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అసలు తమను ఏ విధంగా సాక్షులుగా పరిగణిస్తున్నారో అర్థంకావడంలేదన్నారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం విచారణ జరగనుంది. మమ్మల్ని ఇరికించి అరెస్టుకు పోలీసుల యత్నం..బందరులో పేర్ని నాని భార్య జయసుధ ఓ గౌడన్ నిర్మించి దానిని పౌర సరఫరాల శాఖకు అద్దెకిచ్చారు. ఇందులో నిల్వచేసిన రేషన్ బియ్యంలో కొంత మాయమైనట్లు ఆరోపణలు రావడంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణ నిమిత్తం తమ ముందు హాజరుకావాలంటూ నోటీసులివ్వడంతో వాటిపై నాని, ఆయన కుమారుడు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. బియ్యం మాయం కేసులో తమను అక్రమంగా ఇరికించి, అరెస్టుచేసేందుకు పోలీసులు యత్నిçÜ్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. బియ్యం మాయంతో తమకెలాంటి సంబంధంలేదన్నారు. గోడౌన్‌ను పౌర సరఫరాల శాఖకు అద్దెకిచ్చామని, అందులో ఉన్న బియ్యం మాయమైతే బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలిగానీ, అద్దెకిచ్చిన యజమానిపై కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాజకీయ కారణాలతోనే పోలీసులు ఈ కేసు నమోదు చేశారన్నారు. తమ నుంచి ఎలాంటి సమాచారం కావాలో పోలీసులు నోటీసుల్లో పేర్కొనలేదన్నారు. బియ్యం మాయంపై కోటిరెడ్డి అనే అధికారి ఫిర్యాదు ఇచ్చారని, దాని ఆధారంగా నమోదుచేసిన కేసులో విచారణకు రావాలని మాత్రమే నోటీసుల్లో పేర్కొన్నారని వారు తెలిపారు. -
స్టాపేజ్ రిపోర్ట్ ఇవ్వకుంటే వాహన పన్ను కట్టాల్సిందే
సాక్షి, అమరావతి: మోటారు వాహన చట్టంలో నిర్దేశించిన మోటారు వాహనం లేదా వాణిజ్య వాహనాలను వాటి యజమానులు రోడ్లపై తిప్పకూడదనుకున్నప్పుడు ఆ విషయాన్ని రాతపూర్వకంగా రవాణా శాఖ అధికారులకు తెలియచేసి తీరాలని హైకోర్టు తేల్చి చెప్పింది. అప్పుడు మాత్రమే ఆ వాహనానికి పన్ను మినహాయింపు కోరడానికి వీలవుతుందని స్పష్టం చేసింది. తమ వాహనం లేదా వాహనాలు రోడ్డుపై తిరగడం లేదని, పన్ను చెల్లింపు త్రైమాసిక గడువు ముగిసిన తరువాత ఆ వాహనాలను రోడ్లపై తిప్పబోమంటూ వాహన యజమానులు ‘స్టాపేజ్ రిపోర్ట్ లేదా నాన్ యూజ్ రిపోర్ట్’ ఇవ్వకుంటే.. వాహనాలు రోడ్లపై తిరుగుతున్నట్టుగానే భావించి పన్ను విధించే అధికారం రవాణా అధికారులకు ఉందని పేర్కొంది. ఒకవేళ రవాణాయేతర వాహన యజమాని స్టాపేజ్ రిపోర్ట్ సమర్పించడంలో విఫలమైనప్పటికీ, ఆ తరువాత వాహనాన్ని తిప్పడం లేదని అధికారులకు అన్ని ఆధారాలను ఇస్తే, ఆ వాహనం తిరగడం లేదనే భావించాల్సి ఉంటుందని తెలిపింది. తమ వాహనాలు విశాఖ స్టీల్‌ప్లాంట్ లోపల సెంట్రల్ డిస్పాచ్ యార్డ్ (సీడీవై)లో తిరుగుతున్నాయని, సీడీవై ‘బహిరంగ ప్రదేశం’ కిందకు రాదని, అందువల్ల తమ వాహనాలకు మోటారు వాహన పన్ను మినహాయింపు వర్తిస్తుందన్న తారాచంద్ లాసిజ్టిక్ సొల్యూషన్స్ లిమిటెడ్ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ వాదన ఏపీ మోటారు వాహన పన్నుల చట్టంలోని సెక్షన్ 12ఏకి విరుద్ధమని తేల్చిచెప్పింది. సీడీవై బహిరంగ ప్రదేశం కిందకు రాదు కాబట్టి, తారాచంద్ కంపెనీ చెల్లించిన రూ.22.71 లక్షల పన్నును తిరిగి వారికి వెనక్కి ఇవ్వాలని రవాణా అధికారులను ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సీజే ధర్మాసనం రద్దు చేసింది. సెక్షన్ 12ఏ ప్రకారం స్టాపేజ్ రిపోర్ట్‌కు బహిరంగ ప్రదేశం, ప్రైవేటు ప్రదేశం అన్న తేడా ఏమీ ఉండదని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం రెండు రోజుల క్రితం తీర్పు వెలువరించింది. రూ.22.71 లక్షలు వెనక్కి ఇవ్వాలన్న సింగిల్ జడ్జితారాచంద్ లాసిజ్టిక్ సొల్యూషన్స్ కంపెనీ విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఐరన్ స్టోరేజీ, హ్యాండ్లింగ్ కాంట్రాక్ట్ దక్కించుకుంది. ఈ పనులకు 36 వాహనాలను వినియోగిస్తోంది. ఈ వాహనాలు అప్పటివరకు రోడ్లపై తిరిగినందుకు కాంట్రాక్ట్ పొందడానికి ముందే సదరు కంపెనీ ఆ వాహనాలకు మోటారు వాహన పన్ను చెల్లించింది. పన్ను చెల్లించిన కాల పరిమితి ముగియడంతో అధికారులు ఆ వాహనాలకు రూ.22.71 లక్షల మేర పన్ను చెల్లించాలంటూ నోటీసులు జారీ చేశారు. దీనిపై తారాచంద్ కంపెనీ తమ వాహనాలు రోడ్లపై తిరగడం లేదని, సీడీవైలోనే తిరుగుతున్నందున పన్ను మినహాయింపు ఇవ్వాలంటూనే రూ.22.71 లక్షల పన్ను చెల్లించింది. ఆ తరువాత తమ వాహనాలకు పన్ను విధించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో 2022లో పిటిషన్ దాఖలు చేసింది.దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి తారాచంద్ కంపెనీ తన వాహనాలను రోడ్లపై తిప్పలేదని, స్టీల్ ప్లాంట్ లోపల ఉన్న సీడీవైలోనే తిప్పిందని, అందువల్ల పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని తేల్చారు. ఆ కంపెనీ చెల్లించిన రూ.22.71 లక్షల పన్ను మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలని రవాణా అధికారులను ఆదేశిస్తూ తీర్పునిచ్చారు.ప్రభుత్వం అప్పీల్ చేయడంతో..ఈ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సీజే ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేసింది. దీనిపై సీజే ధర్మాసనం విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం వాహనదారు పన్ను మినహాయింపు కావాలంటే.. పన్ను చెల్లించాల్సిన త్రైమాసికం మొదలు కావడానికి ముందే సదరు వాహనం తిరగడం లేదంటూ స్టాపేజ్ రిపోర్ట్‌ను రాతపూర్వకంగా రవాణా శాఖ అధికారులకు తెలియజేసి తీరాల్సిందేనని స్పష్టం చేసింది.వాస్తవానికి మోటారు వాహన పన్ను అనేది పరిహార స్వభావంతో కూడుకున్నదని, పన్నుల ద్వారా వచ్చే మొత్తాలతోనే అన్ని వాహన రాకపోకలు సజావుగా సాగేందుకు వీలుగా రోడ్లను నిర్వహించడమన్నది ప్రభుత్వ బాధ్యత అని తెలిపింది. తారాచంద్ కంపెనీకి రూ.22.71 లక్షలు వెనక్కి ఇవ్వాలంటూ సింగిల్‌జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. -
మా తీర్పు.. మీ భాషలోనే..!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘జడ్జిమెంట్ ప్రొనౌన్స్డ్.. వైడ్ సెపరేట్ జడ్జ్మెంట్ యాజ్ ఫర్ సెక్షన్ 235 సీఆర్పీసీ’ అంటూ తీర్పులిచ్చే న్యాయమూర్తులు.. ఇప్పుడు స్థానిక భాషల్లోనే తీర్పులు చెబుతున్నారు. కోర్టు తీర్పులు నిందితులు, బాధితులకు అర్థమయ్యేలా వెబ్సైట్లలోనూ స్థానిక భాషల్లోనే పొందుపరుస్తున్నారు. ‘మా తీర్పులు.. మీ భాషల్లోనే’ అంటూ జడ్జిమెంట్స్ వెలువరిస్తున్న సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు బాటలోనే హైకోర్టులు సైతం నడుస్తున్నాయి. గతేడాది గణతంత్ర దినోత్సవం రోజున తీసుకున్న కీలక నిర్ణయం న్యాయస్థానాల్ని అన్నివర్గాలకు చేరువ చేసింది. సాంకేతికతను వినియోగిస్తూ ఇప్పటివరకూ 73,963 తీర్పుల్ని సుప్రీంకోర్టు వివిధ భాషల్లో తర్జుమా చేసి తన వెబ్సైట్లో పొందుపరిచింది. ఇదే నేపథ్యంలో 30,944 తీర్పుల్ని ఆయా హైకోర్టులు స్థానిక భాషల్లోకి మార్చాయి.షెడ్యూల్డ్ భాషల్లోనూ..షెడ్యూల్డ్ భాషల్లోనూ తీర్పులను వెలువరిస్తామని సుప్రీంకోర్టు రెండేళ్ల క్రితం ప్రకటించింది. ఎలక్ట్రానిక్ సుప్రీంకోర్టు రిపోర్ట్స్ (ఈ–ఎస్సీఆర్) ప్రాజెక్టులో భాగంగా ఇకపై రాజ్యాంగంలో పేర్కొన్న 22 షెడ్యూల్డ్ భాషల్లోనూ తీర్పులను అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేసింది. చెప్పిన విధంగానే ఇప్పటివరకూ 18 భాషల్లో తీర్పుల్ని తర్జుమా చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చిన తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కశ్మీరీ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠీ, నేపాలీ, ఒరియా, పంజాబీ, సంస్కృతం, గారో, ఖాసీ, సంథాలీ ఇలా.. విభిన్నమైన స్థానిక భాషల్లో తీర్పులను ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ–ఎస్సీఆర్ ప్రాజెక్ట్ ద్వారా వెబ్సైట్లో ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ 73,963 తీర్పులు పొందుపరిచింది. రాజస్థాన్ హైకోర్టుతో మొదలై..సుప్రీంకోర్టుతో పాటు ప్రతి హైకోర్టులో ప్రొసీడింగ్స్ అన్నీ ఆంగ్ల భాషలో జరగాలని భారత రాజ్యాంగంలోని 348(1)(ఏ) అధికరణం స్పష్టం చేసింది. అయితే, రాజ్యాంగంలోని 348(2) అధికరణం రాష్ట్రాల్లో అధికారిక వ్యవహారాలు, రాష్ట్రంలో ఉండే హైకోర్టు ప్రొసీడింగ్స్ కోసం రాష్ట్రపతి ముందస్తు అనుమతితో హిందీ లేదా మరేదైనా భాషను వినియోగించేందుకు గవర్నర్‌కు అధికారం కల్పించింది. అధికారిక భాషా చట్టం–1963లోని సెక్షన్–7 కూడా ఇదే సూచిస్తోంది. రాజస్థాన్ హైకోర్టు ప్రొసీడింగ్స్‌లో హిందీ వినియోగానికి రాజ్యాంగంలోని 348(2) అధికరణం ప్రకారం 1950లో తొలిసారి అనుమతి లభించింది. తర్వాత ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్ కోర్టులు హిందీ భాషను వినియోగించడం ప్రారంభించాయి.బీజం వేసిన మద్రాస్ హైకోర్టుమద్రాస్ హైకోర్టులో తమిళం, గుజరాత్ హైకోర్టులో గుజరాతీ, ఛత్తీస్‌గఢ్ హైకోర్టులో హిందీ, కలకత్తా హైకోర్టులో బెంగాలీ, కర్ణాటక హైకోర్టులో కన్నడ భాషలను వినియోగించేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నుంచి ప్రతిపాదనలు అందాయి. 1965 కేబినెట్ కమిటీ నిర్ణయం ప్రకారం ఈ ప్రతిపాదనలపై అప్పటి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి సలహాను అడగ్గా.. 2012 అక్టోబర్ 11న జరిగిన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సమావేశంలో ఈ ప్రతిపాదనలను అంగీకరించవద్దని తొలుత నిర్ణయించారు. అయితే.. మరోసారి తమిళనాడు ప్రభుత్వం పట్టుబట్టింది. గత నిర్ణయాన్ని సమీక్షించి తమిళంలో కోర్టు తీర్పులు వెలువరించేందుకు అంగీకారం తెలపాలంటూ 2014 జూలైలో కేంద్ర ప్రభుత్వంతో పాటు సుప్రీంకోర్టును కోరింది. అప్పుడు కూడా తిరస్కరించారు. ఇదే సమయంలో రాజ్యాంగంలోని 130వ అధికరణం ప్రకారం దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో సుప్రీంకోర్టు ధర్మాసనాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ తెరపైకి వచ్చింది.స్థానిక భాషల్లో తర్జుమా చేయాల్సిందేఈ నేపథ్యంలోనే న్యాయపరమైన ప్రొసీడింగ్స్, తీర్పులు సామాన్య ప్రజలకు మరింత సమగ్రంగా అర్థమయ్యేందుకు ఆంగ్లం నుంచి ప్రాంతీయ భాషల్లోకి అనువదించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు భావించింది. కృత్రిమ మేధ(ఏఐ)తో పాటు ట్రాన్స్లేషన్ టూల్స్‌ని ఉపయోగించి ఈ–ఎస్సీఆర్ తీర్పులను స్థానిక భాషల్లోకి అనువదించేందుకు గత సీజేఐ జస్టిస్ అభయ్ ఎస్.ఓకా నేతృత్వంలో ఏఐ సహాయక న్యాయ అనువాద సలహా కమిటీని నియమించారు. మొత్తం షెడ్యూల్లో ఉన్న 22 భాషల్లోకి తర్జుమా చేయాలని నిర్ణయించారు. గతేడాది వరకూ 16 భాషల్లో మాత్రమే చేయగా.. ప్రస్తుతం 18 భాషలకు తర్జుమా చేరుకుంది. ఇలాంటి కమిటీలే దేశంలోని అన్ని హైకోర్టుల్లోనూ ఆయా హైకోర్టుల న్యాయమూర్తుల నేతృత్వంలో ఏర్పాటయ్యాయి. తీర్పులను 16 స్థానిక భాషల్లోకి అనువదించేందుకు హైకోర్టులతో సుప్రీంకోర్టు భాగస్వామ్యమవుతోంది. -
సోషల్ మీడియా పోస్టులు వ్యవస్థీకృత నేరాలు కావు
సాక్షి, అమరావతి : సోషల్ మీడియా పోస్టులను వ్యవస్థీకృత నేరంగా పరిగణించడానికి వీల్లేదని.. వాటికి సెక్షన్–111 వర్తించదని హైకోర్టు ఇప్పటికే రెండు వేర్వేరు సందర్భాల్లో స్పష్టంచేసింది. అసలు ఏ సందర్భంలో బీఎన్ఎస్ సెక్షన్–111 (వ్యవస్థీకృత నేరం) వర్తిస్తుందో కూడా చాలా స్పష్టంగా చెప్పింది. సోషల్ మీడియా పోస్టులపై పోలీసులు ఏకపక్షంగా ఈ సెక్షన్‌ను పెడుతున్న కేసుల్లో పలువురు మేజి్రస్టేట్లు యాంత్రికంగా వ్యవహరిస్తుండటాన్ని కూడా తప్పుబట్టింది. సోషల్ మీడియా పోస్టులు ఏ విధంగా వ్యవస్థీకృత నేరం కిందకు వస్తాయనేందుకు దర్యాప్తు అధికారులు తమ రిమాండ్ రిపోర్టులో ఎలాంటి ఆధారాలు చూపకపోయినా కూడా కొందరు మేజి్రస్టేట్లు ఆ రిమాండ్ రిపోర్టుల పట్ల సంతృప్తి వ్యక్తంచేయడాన్ని ఆక్షేపించింది. హైకోర్టు పక్షం రోజుల వ్యవధిలో ఇచ్చిన తీర్పులు పోలీసులకు చెంపపెట్టు అని న్యాయ నిపుణులు చెబుతున్నారు. సులభంగా బెయిల్ రాకూడదనేతెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచి్చంది మొదలు సోషల్ మీడియా యాక్టివిస్టులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలే లక్ష్యంగా పోలీసులు వరుసగా తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. సులభంగా బెయిల్ రాకుండా చేసేందుకు సోషల్ మీడియా పోస్టులను వ్యవస్థీకృత నేరంగా పరిగణిస్తూ సెక్షన్–111 కింద ఈ కేసులు నమోదు చేస్తున్నారు. వాస్తవానికి.. ఇప్పుడు ఎవరిపై అయితే కేసులు నమోదు చేశారో వారికి ఈ సెక్షన్ వర్తించదని పోలీసులకు స్పష్టంగా తెలిసినప్పటికీ, రాజకీయ కారణాలతో వారు తప్పుడు కేసులు నమోదుకు వెనుకాడటంలేదు. సెక్షన్–111 వర్తించాలంటే.. భారతీయ న్యాయ సంహిత ప్రకారం.. ఓ నిందితునికి సెక్షన్–111 వర్తించాలంటే, ఆ వ్యక్తిపై గత పదేళ్లలో ఒకటి కంటే ఎక్కువ చార్జిషీట్ దాఖలై, అందులో కనీసం ఒక్క చార్జిషీట్నైనా కోర్టు విచారణకు స్వీకరించి ఉండాలి. ఇదే విషయాన్ని తాజాగా హైకోర్టు వెలువరించిన తీర్పులు కూడా స్పష్టంచేశాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత సోషల్ మీడియా పోస్టులపై పోలీసులు నమోదు చేసిన కేసుల్లో నిందితులుగా ఉన్న వారిలో ఎవ్వరిపై కూడా గత పదేళ్లలో కనీసం రెండు చార్జిషీట్లు దాఖలై, అందులో ఒక దానిని కోర్టు పరిగణనలోకి తీసుకున్న దాఖలాలు లేనేలేవు. కాబట్టి.. సోషల్ మీడియా పోస్టులపై ప్రస్తుతం కేసులు ఎదుర్కొంటున్న వారికి సెక్షన్–111 వర్తించే అవకాశమేలేదు. ఇదే కారణంతో తాజాగా హైకోర్టు ధర్మాసనం ఓ వ్యక్తికి కింది కోర్టు విధించిన రిమాండ్‌ను తప్పుపట్టింది. సోషల్ మీడియా కేసులకు ‘111 సెక్షన్’ వర్తించదు» కోర్టులు కూడా ఇదే విషయాన్ని స్పష్టంచేశాయి » మేమేజిస్ట్రేట్లు సైతం ఈ కేసుల్లో రిమాండ్ తిరస్కరిస్తున్నారు » సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ నిర్బంధాలు » యథేచ్చగా సుప్రీంకోర్టు మార్గదర్శకాల ఉల్లంఘన » ‘బీఎన్ఎస్ 111’ కేసులపై క్వాష్ పిటిషన్లు వేస్తున్నాం » ప్రైవేటు కేసులతో పోలీసులను న్యాయస్థానంలో నిలబెడతాం » వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ అధ్యక్షులు మలసాని మనోహర్రెడ్డిసాక్షి, అమరావతి : రాష్ట్రంలో చట్టాలను సైతం దుర్వినియోగం చేస్తూ సోషల్ మీడియా యాక్టివిస్టులను టీడీపీ కూటమి ప్రభుత్వం వేధిస్తోందని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మలసాని మనోహర్‌రెడ్డి మండిపడ్డారు. వీరిపై పోలీసులు బీఎన్ఎస్ 111 సెక్షన్ కింద కేసులు నమోదు చేస్తున్నారని.. నిజానికి, ఈ సెక్షన్ సోషల్ మీడియా కేసులకు వర్తించదని ఆయనన్నారు. అయినా కూడా పోలీసులు సోషల్ మీడియా యాక్టివిస్టులను భయభ్రాంతులకు గురిచేయాలనే కుట్రతోనే ఈ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే.. వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే వారిపై మాత్రమే బీఎన్ఎస్ 111 సెక్షన్ ప్రయోగించాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు స్పష్టంచేస్తున్నాయి. కానీ, ఏపీ పోలీసులు మాత్రం దీనిని పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఉక్కుపాదం మోపేందుకే బీఎన్ఎస్ 111 సెక్షన్‌ను వారిపై అక్రమంగా బనాయించి వేధిస్తోంది. సాధారణంగా ఈ సెక్షన్‌ను మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ సరఫరా, కిడ్నాప్, దొంగతనాలు, దోపిడీలు, బలవంతంగా ఆస్తుల స్వా«దీనం.. సుపారీలు తీసుకుని హత్యలు చేయడం, ఆరి్థక నేరాలు, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా, వ్యభిచార వృత్తిలోకి బలవంతంగా దించడం వంటి నేరాలకు పాల్పడే వారిపై ప్రయోగిస్తారు. అలాగే, ఈ చట్టం రావడానికి కనీసం పదేళ్ల ముందు నుంచి నేరాలకు పాల్పడి ఉండి.. ఒకటి కన్నా ఎక్కువ కేసుల్లో కోర్టుల్లో విచారణ ఎదుర్కొన్న నిందితులపైనే ఈ సెక్షన్‌ను వాడాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. కానీ, కూటమి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో అభంశుభం తెలియని సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఈ సెక్షన్‌ను బనాయించి వారిని ఎక్కువ కాలం జైళ్లలో నిర్బంధించే కుట్రలకు పాల్పడుతున్నారు. విచ్చలవిడిగా ఈ సెక్షన్ కింద కేసులు పెట్టి ఇప్పటికే ఎంతోమందిని జైళ్లకు పంపారు. ఈ అక్రమ నిర్బంధాలు ఎక్కువ కాలం నిలబడవని ప్రభుత్వం, పోలీసులు తెలుసుకోవాలి. ప్రైవేట్ కేసులు వేస్తాం.. ఈ నేపథ్యంలో.. ఈ సెక్షన్లు పెట్టిన అన్ని కేసుల్లోనూ క్వాష్ పిటిషన్లు వేస్తున్నాం. ఈ కేసులు బనాయిస్తున్న అధికారులపైన న్యాయస్థానాల్లో పోరాడుతాం. అర్థరాత్రి అక్రమ అరెస్టులు, తప్పుడు కేసులు బనాయించడాలు, నెంబర్లు లేని వాహనాల్లో మఫ్టీలో వచ్చి అపహరించడం.. కుటుంబ సభ్యులకు ఎఫ్ఐఆర్ ఇవ్వకపోవడం, అరెస్టు చూపకుండా.. ఆచూకీ చెప్పకుండా వారిని వేధించడం, రోజుకో పోలీస్‌స్టేషన్‌కి తిప్పడం.. ఇలా పది రోజులపాటు తిప్పిన సందర్భాలున్నాయి. ఇప్పటికే ఎన్నో కేసుల్లో హెబియస్ కార్పస్ పిటిషన్లు వేసి కార్యకర్తల ఆచూకీ తెలుసుకున్నాం. ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారందర్నీ ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తేలేదు. ప్రైవేట్ కేసులు వేసి వీటితో సంబంధమున్న ప్రతి పోలీస్ అధికారిని కోర్టులో ముద్దాయిగా నిలబెడతాం. మా దారిలోకి రాకపోతే ఏమైనా చేస్తామనే స్థాయికి ఈ కూటమి ప్రభుత్వం దిగజారిపోయింది. ఆఖరికి జడ్జీలపై నిఘా పెట్టే దారుణమైన పరిస్థితులు ఏపీలో నెలకొన్నాయి. న్యాయవాదులుగా మేం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. న్యాయవ్యవస్థ జోలికొస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నాం. -
చెట్ల ట్రాన్స్లోకేషన్పై విధాన నిర్ణయం తీసుకోండి
సాక్షి, అమరావతి: చెట్లను కొట్టేయకుండా, వాటిని వేళ్లతో సహా పెకిలించి మరో చోట నాటే ప్రక్రియ (ట్రాన్స్‌లొకేషన్)కు ప్రాధాన్యతనివ్వాలని, దీనిపై విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. ట్రాన్స్‌లొకేషన్‌కు అవసరమైన యంత్రాలు ఖరీదైనవే అయినప్పటికీ, అవి లేవని చెప్పొద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. రోడ్ల విస్తరణ, విద్యుత్ లైన్ల ఏర్పాటు, నిర్వహణ తదితరాల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా చెట్లను విచక్షణారహితంగా కొట్టేస్తుండటంపై ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. చెట్ల నరికివేత పర్యావరణానికి పెనుముప్పుగా పరిణమించిందని తెలిపింది. చెట్ల నరికివేతను గణనీయంగా తగ్గించడంతో పాటు ట్రాన్స్‌లొకేషన్ అమలు చేసేందుకు ఏం చర్యలు తీసుకుంటే బాగుంటుందో సలహాలు ఇచ్చేందుకు ఓ కమిటీని నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)ని హైకోర్టు ఆదేశించింది.ఈ కమిటీలో పలు ప్రభుత్వ శాఖల అధికారులు, పర్యావరణ నిపుణులను సభ్యులుగా నియమించాలని ఆదేశించింది. ఆ కమిటీ సలహాలను తాము పరిగణనలోకి తీసుకుంటామని చెప్పింది. మూడు నెలల్లో పూర్తి వివరాలతో స్పందనను తమ ముందుంచాలని ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 12కి వాయిదా వేసింది. ఇదే వ్యవహారంలో జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) దాఖలు చేసిన కౌంటర్‌ను పరిగణనలోకి తీసుకుంది. ట్రాన్స్‌లొకేషన్ కోసం పిల్... రోడ్ల విస్తరణ, విద్యుత్ లైన్ల ఏర్పాటు తదితరాల పేరుతో భారీ చెట్లను విచక్షణారహితంగా కొట్టేస్తున్నారని, చెట్లను కొట్టేయకుండా వాటిని మరో చోట నాటేలా ఆదేశాలు ఇవ్వాలంటూ గుంటూరుకు చెందిన వైద్య విద్యార్థి అస్మద్ మహ్మద్ షేక్ షా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం ఇటీవల విచారణకు వచ్చిoది. పిటిషనర్ తరఫు న్యాయవాది బషీర్ అహ్మద్ వాదనలు వినిపిస్తూ.. చాలా రాష్ట్రాల్లో చెట్లను నరికేయకుండా వాటిని మరో చోట నాటుతున్నారని తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణాలకు అడ్డుగా ఉన్న చెట్లను తొలగించి, మరో చోట విజయవంతంగా నాటారని తెలిపారు. ఇందుకోసం హైకోర్టులో ఓ సంస్థ పనిచేస్తోందని వివరించారు. జీపీఎఫ్, ఈపీఎఫ్ దేనిని ఇవ్వాలన్నది ప్రభుత్వ నిర్ణయం » ఫలానా స్కీంను వర్తింపజేయాలని కోర్టులు ఆదేశించలేవు »ఉద్యోగులు జీపీఎఫ్ కోరుతున్నందున దానిపై నిర్ణయం తీసుకోండి » ఆర్థిక, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శులకు హైకోర్టు ఆదేశం సాక్షి, అమరావతి: విద్యుత్ ఉద్యోగులకు ఈపీఎఫ్ స్కీం లేదా జీపీఎఫ్ స్కీంలలో దేనిని వర్తింపజేయాలన్నది పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని హైకోర్టు తేల్చి చెప్పింది. నిర్దిష్టంగా ఫలానా స్కీంను వర్తింపజేయాలని న్యాయస్థానాలు ప్రభుత్వాన్ని ఆదేశించలేవని స్పష్టం చేసింది. జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్) స్కీం వర్తింపజేయాలంటూ పలువురు విద్యుత్ ఉద్యోగులు అభ్యర్థనలు పెట్టుకున్న నేపథ్యంలో దీనిపై మూడు నెలల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శులను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. తమకు పాత పెన్షన్ స్కీం అయిన జీపీఎఫ్‌ను వర్తింపజేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ విద్యుత్ పంపిణీ సంస్థల్లో (డిస్కం) పనిచేసి పదవీ విరమణ చేసిన పలువురు ఉద్యోగులు, ప్రస్తుతం సర్వీసులో ఉన్న కొందరు ఉద్యోగులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ సుబ్బారెడ్డి శుక్రవారం విచారణ జరిపారు. ఉద్యోగుల తరఫున న్యాయవాది పీటా రామన్ వాదనలు వినిపిస్తూ.. కేంద్ర ప్రభుత్వం 2023లో జారీ చేసిన మెమోరాండం ప్రకారం పిటిషనర్లందరూ జీపీఎఫ్‌కు అర్హులని చెప్పారు. జీపీఎఫ్ కోసం పిటిషనర్లు పై అధికారులకు వినతులు ఇచ్చినా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఇది ఆర్థికపరమైన అంశమని, దీనికి ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరి అని డిస్కంలు, ఆరి్థక, ఇంధన శాఖల న్యాయవాదులు వాదనలు చెప్పారు. నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమేనని చెప్పారు. -
సజ్జల భార్గవ్ క్వాష్ పిటిషన్.. ప్రతివాదులకు కోర్టు నోటీసులు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ నేత సజ్జల భార్గవ్ రెడ్డి క్వాష్ పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అనంతరం, తదుపరి విచారణను ఫిబ్రవరి మొదటి వారానికి వాయిదా వేసింది.అంతకుముందు.. ఏపీ హైకోర్టులో సజ్జల భార్గవ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఆయన తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇది అసలు విచారణ అర్హత లేని కేసంటూ కోర్టు దృష్టికి తీసుకెళ్లారాయన. ఈ కేసులకు అసలు విచారణ అర్హత లేదు. ఎవరు పైన అయితే పోస్ట్ పెట్టారో వాళ్లు కంప్లైంట్ చేయలేదు. ఎవరో మూడో వ్యక్తి కంప్లైంట్ చేస్తే కేసు నమోదు చేశారు.ఈ పోస్టులపై ఐటీ సెక్షన్స్ బదులుగా.. పోలీసులు నాన్‌బెయిలబుల్ సెక్షన్స్ పెట్టారు. ఇది ఆర్గనైజర్ క్రైమ్ అని పోలీసులు చెప్తున్నారు. కానీ, ముమ్మాటికి ఇది అలాంటి నేరమేం కాదు అని పొన్నవోలు వాదించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. విచారణను వాయిదా వేసింది. ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవద్దన్న ఆదేశాలను పొడిగిస్తున్నట్లు తెలిపింది. -
మేజిస్ట్రేట్ చాలా యాంత్రికంగా వ్యవహరించారు
సాక్షి, అమరావతి: సోషల్ మీడియా పోస్టులను వ్యవస్థీకృత నేరంగా పరిగణిస్తూ భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 111 కింద పోలీసులు పెడుతున్న కేసుల్లో నిందితులకు మేజిస్ట్రేట్ కోర్టులు యాంత్రికంగా రిమాండ్ విధిస్తుండటాన్ని హైకోర్టు ఆక్షేపించింది. దర్యాప్తు అధికారి కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌లో నిందితుడు బీఎన్ఎస్ సెక్షన్ 111 కింద నేరం చేశారనేందుకు ఎలాంటి ఆధారాలను చూపకపోయినా మేజిస్ట్రేట్ మాత్రం ఆ సెక్షన్ కింద నేరం చేశారనేందుకు ఆధారాలున్నాయని రిమాండ్ ఉత్తర్వుల్లో పేర్కొనడాన్ని న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ కుంచం మహేశ్వరరావు ధర్మాసనం తెలిపింది. మేజిస్ట్రేట్ మెదడు ఉపయోగించకుండా, లోపభూయిష్టంగా ఉత్తర్వులిస్తున్నారని తేల్చి చెప్పింది. సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి తన కుమారుడు వెంకటరమణారెడ్డికి వినుకొండ కోర్టు విధించిన రిమాండ్‌ను రద్దు చేసి అతన్ని విడుదల చేసేలా ఆదేశాలివ్వాలంటూ పప్పుల చెలమారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ రఘునందనరావు ధర్మాసనం ఇటీవల విచారణ జరిపి, తీర్పు రిజర్వ్ చేసింది. ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ తీర్పులో మేజిస్ట్రేట్ కోర్టు తీరును తప్పుపట్టింది. ఓ వ్యక్తిపై సెక్షన్ 111 కింద కేసు పెట్టాలంటే, అతనిపై గత పదేళ్లలో ఒకటికంటే ఎక్కువ చార్జిషీట్లు దాఖలై, వాటిలో ఒకదానినైనా కోర్టు విచారణకు స్వీకరించి ఉండాలని ధర్మాసనం తెలిపింది. ప్రస్తుత కేసులో నిందితుడిపై గత పదేళ్లలో కేసులు నమోదయినట్లు గానీ, చార్జిషీట్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకున్నట్లు గానీ దర్యాప్తు అధికారి రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించలేదంది. అలాగే బీఎన్ఎస్ సెక్షన్ 47 కింద దర్యాప్తు అధికారి నిందితునికి ఇచి్చన నోటీసులో అరెస్ట్‌కు కారణాలను పేర్కొన్నట్లు మేజిస్ట్రేట్ తన ఉత్తర్వుల్లో తెలిపారని, వాస్తవానికి అరెస్ట్‌కు కారణాలను దర్యాప్తు అధికారి పేర్కొనలేదని తెలిపింది. అయినప్పటికీ దర్యాప్తు అధికారి సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌పై మేజిస్ట్రేట్ సంతృప్తి వ్యక్తం చేశారంది. మేజిస్ట్రేట్ యాంత్రికంగా వ్యవహరించడమే కాక, కనీసం నోటీసులో పేర్కొన్న అరెస్ట్‌కు కారణాలను నిందితునికి రాతపూర్వకంగా ఇచ్చారా లేదా అన్న విషయాన్ని కూడా పరిశీలించలేదని ఆక్షేపించింది. మేజిస్ట్రేట్ రిమాండ్ ఉత్తర్వుల్లో ఈ రెండు లోపాల కారణంగా ఈ హెబియస్ కార్పస్ పిటిషన్‌కు విచారణార్హత ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే దర్యాప్తు అధికారి కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌లో మాత్రం నిందితుని అరెస్ట్‌కు నిర్దిష్ట కారణాలు స్పష్టంగా పేర్కొన్నారని తెలిపింది. అందువల్ల ప్రస్తుత కేసులో నిందితుని అరెస్ట్‌ను అక్రమంగా ప్రకటించలేమంది. అందువల్ల అరెస్ట్‌ను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు తెలిపింది. పిటిషనర్ లేదా నిందితుడు వారికి చట్ట ప్రకారం ఉన్న ప్రత్యామ్నాయాలను ఉపయోగించుకోవాలని తెలిపింది. -
అన్ని కాలేజీలకు ఒకే ఫీజు సరికాదు
సాక్షి, అమరావతి: పీజీ మెడికల్, డెంటల్ కోర్సులకు రాష్ట్రంలోని మెడికల్, డెంటల్ కాలేజీలని్నంటిలో ఏకీకృత ఫీజు సరికాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ (ఏపీహెచ్ఈఆర్ఎంసీ) సిఫారసుల మేరకు 2020–21 నుంచి 2022–23 విద్యా సంవత్సరాలకు ఫీజును ఖరారు చేస్తూ ప్రభుత్వం 2020 మే 29న జారీ చేసిన జీవో 56ను రద్దు చేసింది.ఈ జీవో చట్టం ముందు నిలబడదని స్పష్టం చేసింది. ఏపీహెచ్ఈఆర్ఎంసీ అన్నీ మెడికల్, డెంటల్ కాలేజీలను ఒకే గాటన కట్టి, ఏకీకృత ఫీజు నిర్ణయించడం చట్ట విరుద్ధమన్న కాలేజీల వాదనతో హైకోర్టు ఏకీభవించింది. ఆ కాలేజీలు ప్రతిపాదించిన ఫీజుల వివరాలను పరిగణనలోకి తీసుకుని తిరిగి ఫీజు ఖరారు చేయాలని, ఆపైన రెండు నెలల్లో ఆదేశాలు జారీ చేయాలని కమిషన్‌ను ఆదేశించింది.ఒకవేళ ప్రతిపాదించిన ఫీజుతో కాలేజీలు విభేదిస్తే, ఆ కాలేజీ యాజమాన్యం అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతే తగిన ఉత్తర్వులు జారీ చేయాలంది. కమిషన్ ఫీజులను పెంచితే, పెంచిన మేర బ్యాలెన్స్ మొత్తాలను అభ్యర్థుల నుంచి వారిచి్చన హామీ మేరకు కాలేజీలు వసూలు చేసుకోవచ్చని చెప్పింది. అదనపు ఫీజు వసూలులో నిర్ణయం అంతిమంగా కాలేజీలదేనని స్పష్టం చేసింది. జీవో 56ను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం ఈ ఏడాది సెప్టెంబర్‌లో విచారణ జరిపి, తీర్పును రిజర్వ్ చేసింది. గురువారం తీర్పు వెలువరించింది.ఏకీకృత ఫీజు వల్ల కొన్ని లాభపడుతూ ఉండొచ్చు..ఏకీకృత ఫీజు విద్యార్థుల ప్రయోజనాలకు కూడా విరుద్ధం కావొచ్చునని హైకోర్టు తీర్పులో పేర్కొంది. తక్కువ ఫీజు ఉంటే మరింత ఎక్కువ చెల్లించాలని విద్యార్థులను కాలేజీలు బలవంతం చేయవచ్చునని తెలిపింది. ఏకీకృత ఫీజు వల్ల తగిన మౌలిక సదుపాయాలు, నాణ్యమైన బోధనా సిబ్బంది లేని కాలేజీలు లాభపడే అవకాశం ఉందని పేర్కొంది. మంచి సదుపాయాలు, నాణ్యమైన బోధనా సిబ్బంది కల్పిస్తున్న కాలేజీలకు ఇది నష్టం కలిగించవచ్చని తెలిపింది. ఇటువంటి కాలేజీలు ఎక్కువ ఫీజులు కోరడంలో తప్పులేదని తెలిపింది.ఫీజుల ఖరారుకు ముందు కాలేజీలు సమర్పించిన ఆదాయ, వ్యయాలు, మౌలిక సదుపాయాల వివరాలని్నంటినీ కమిషన్ పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపించడం లేదంది. ఆచరణ సాధ్యం కాని ఫీజును నిర్ణయించడం వల్ల ప్రత్యేక వృత్తి విద్యా కోర్సులు అందించే విద్యా సంస్థలు మూతపడతాయని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. ఆయా కాలేజీల నాణ్యత, సమర్థత, ఉత్పాదకతపైనా ప్రభావం చూపుతుందని తెలిపింది. -
విధి నిర్వహణలో భాగంగా... జత్వానీని విచారించడం తప్పా?
సాక్షి, అమరావతి: డాక్యుమెంట్ల ఫోర్జరీ కేసులో విచారణ చేసి అరెస్ట్ చేసినందుకే సినీనటి కాదంబరి జత్వానీ కక్షపూరితంగా తమపై తప్పుడు కేసు పెట్టారని ఐపీఎస్ అధికారులు కాంతిరాణా టాటా, విశాల్ గున్నీ, పోలీసు అధికారులు హనుమంతరావు, సత్యనారాయణలు హైకోర్టుకు నివేదించారు. కాంతిరాణా టాటా తదితరులపై కేసు నమోదు వెనుక దురుద్దేశాలు ఉన్నాయని వారి తరఫు సీనియర్ న్యాయవాదులు సుబ్రహ్మణ్యం శ్రీరాం, వేములపాటి పట్టాభి, వినోద్‌కుమార్ దేశ్‌పాండే వివరించారు. జత్వానీ ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోసం కాంతిరాణా టాటా, విశాల్ గున్నీ, కె.హనుమంతరావు, ఎం.సత్యనారాయణ, న్యాయవాది ఇనకొల్లు వెంకటేశ్వర్లు దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ కృపాసాగర్ శుక్రవారం మరోసారి విచారణ జరిపారు. కాంతిరాణ టాటా తదితరుల తరఫు సీనియర్ న్యాయవాదులు సుబ్రహ్మణ్య శ్రీరాం, వేములపాటి పట్టాభి, వినోద్ కుమార్ దేశ్‌పాండే వాదనలు వినిపిస్తూ ‘పోలీసు అధికారులుగా తమకు వచ్చిన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్ట ప్రకారం జత్వానీని విచారించడమే తప్పు అన్నట్లుగా పిటిషనర్లపై కేసులు నమోదు చేశారు. విధి నిర్వహణలో భాగంగా చేసిన చర్యలకు నేరాన్ని ఆపాదించడానికి వీల్లేదు. కేసు కట్టి విచారణ జరపడాన్ని నేరంగా పరిగణించిన దాఖలాలేవీ గతంలో లేవు. చట్ట ప్రకారం నిందితులను విచారించడం నేరం ఎలా అవుతుంది? జత్వానీ ఇచి్చన ఫిర్యాదులో పేర్లు లేకపోయినప్పటికీ పోలీసులు కొందరిని నిందితులుగా చేర్చారు. ఆమెను విచారించిన పోలీసు అధికారులు ఎవరో కూడా జత్వానీకి తెలియదు. అలాంటప్పుడు పోలీసులు కేసు ఎలా నమోదు చేస్తారు? జత్వానీ ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో ఇదే హైకోర్టు ప్రధాన నిందితుడు విద్యాసాగర్‌కు బెయిల్ మంజూరు చేసింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని పిటిషనర్లకు ముందుస్తు బెయిల్ మంజూరు చేయాలి..’ అని కోర్టును కోరారు. అనంతరం సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ జత్వానీ విషయంలో పిటిషనర్లందరూ కుట్రపూరితంగా వ్యవహరించారన్నారు. ఈ కుట్ర వెనుక ఎవరున్నారో తేల్చేందుకు వారిని కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. జత్వానీ తరఫు న్యాయవాదులు వాసిరెడ్డి ప్రభునాథ్, నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపించారు. కోర్టు సమయం ముగియడంతో తదుపరి వాదనల నిమిత్తం విచారణను న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ ఈ నెల 19కి వాయిదా వేశారు. -
చట్టం మీ చుట్టం కాదు.. సర్కారుకు కోర్టు మొట్టికాయలు
-
అందరిపైనా సెక్షన్ 111 కుదరదు
సాక్షి, అమరావతి: సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని సెక్షన్ 111 కింద వ్యవస్థీకృత నేరమంటూ కొందరిపై పోలీసులు ఉద్దేశపూర్వకంగా పెడుతున్న అడ్డగోలు కేసుల విషయంలో హైకోర్టు ఒకింత స్పష్టతనిచ్చింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌లను కించపరిచేలా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వింజమూరుకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ పెసల శివశంకర్‌రెడ్డి ఫేస్బుక్లో పోస్టులు పెట్టారంటూ కృష్ణా జిల్లా కంకిపాడు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు పులి శ్రీనివాసరావు గత నెల 8న పోలీసులకు ఫిర్యాదు చేశారు. శివశంకర్‌రెడ్డిపై పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 111 కింద కేసు నమోదు చేశారు. దీంతో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని శివశంకర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ నూనేపల్లి హరినాథ్... బీఎన్ఎస్ సెక్షన్ 111 గురించి కొంతమేర స్పష్టతను ఇస్తూ వ్యవస్థీకృత నేరాలకు సంబంధించి సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పులను ఉదహరించారు.‘ఏవరైనా ఒక వ్యక్తిపై బీఎన్ఎస్ సెక్షన్ 111 కింద కేసు పెట్టాలంటే... అతనిపై గత పదేళ్లలో ఒకటి కంటే ఎక్కువ చార్జిషీట్లు దాఖలై ఉండాలి. వాటిని సంబంధిత కోర్టు విచారణకు స్వీకరించి ఉండటం తప్పనిసరి. బీఎన్ఎస్ సెక్షన్ 111 మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నిరోధక చట్టంతోపాటు గుజరాత్ ఉగ్రవాద, వ్యవస్థీకృత నేరాల నిరోధక చట్టాలను పోలి ఉంది. మహారాష్ట్ర, గుజరాత్ చట్టాలు ఏ సందర్భాల్లో వర్తిస్తాయో సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో స్పష్టం చేసింది. ఆ చట్టాలు కూడా నిందితునిపై గత పదేళ్లలో ఒకటి కంటే ఎక్కువ చార్జిషీట్లు దాఖలై ఉండాలని, వాటిని సంబంధిత కోర్టు విచారణకు స్వీకరించి ఉండటం తప్పనిసరి అని చెబుతున్నాయి. కేరళ హైకోర్టు సైతం ఇదే రకమైన తీర్పు ఇచ్చింది.’ అని స్పష్టంచేశారు. ప్రస్తుత కేసులో పిటిషనర్‌కు బీఎన్ఎస్ సెక్షన్ 111 వర్తిస్తుందా? లేదా? అన్నది దర్యాప్తు అధికారి తన విచారణలో తేల్చాల్సి ఉంటుందని న్యాయమూర్తి తెలిపారు.ఐటీ యాక్ట్ సెక్షన్–67 పైనా స్పష్టత... ఐటీ చట్టంలోని సెక్షన్ 67 ఏ సందర్భంలో వర్తిస్తుందన్న విషయంలోను న్యాయమూర్తి స్పష్టత ఇచ్చారు. ‘అసభ్యంగా ఉన్న దాన్ని ఎల్రక్టానిక్ రూపంలో ప్రచురించడం, ప్రసారం చేయడం చేశారంటూ ఐటీ చట్టంలోని సెక్షన్ 67 కింద కేసు పెట్టారు. ఏది అసభ్యత కిందకు వస్తుందన్న దాన్ని తేల్చే ముందు సమకాలీన విలువలను, జాతీయ ప్రమాణాలను ఆధారంగా తీసుకోవాలే తప్ప, సున్నిత మనసు్కలతో కూడిన సమూహం నిర్దేశించిన ప్రమాణాలను కాదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. అసభ్యతను నిర్ధారించే ముందు విషయం మొత్తాన్ని చూడాలే తప్ప, అందులో ఓ భాగం ఆధారంగా అసభ్యతను నిర్ణయించడానికి వీల్లేదని కూడా సుప్రీంకోర్టు చెప్పింది’అని జస్టిస్ హరినాథ్ తన తీర్పులో గుర్తుచేశారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ పిటిషనర్ పెసల శివశంకర్‌రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రూ.10వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని అతన్ని ఆదేశించారు. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనేపల్లి హరినాథ్ రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఏపీ పోలీసులపై హైకోర్టు సీరియస్
-
ఇకపై మరింత మందిని కోల్పోనివ్వం
సాక్షి, అమరావతి: హెల్మెట్ లేకపోవడం వల్ల చోటు చేసుకుంటున్న మరణాలపై హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు హెల్మెట్ లేకపోవడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా 667 మంది చనిపోవడం చిన్న విషయం కాదని.. నిబంధనల అమలులో పోలీసుల అలసత్వం వల్లే ఈ పరిస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపై తాము ఈ విధంగా మరింత మందిని కోల్పోనివ్వబోమని హైకోర్టు తేల్చి చెప్పింది.ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయన్న భయాన్ని ప్రజల్లో కలిగించాలని స్పష్టం చేసింది. చలాన్లు చెల్లించని వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. రాష్ట్రంలో మోటారు వాహన చట్ట నిబంధనల అమలు విషయంలో పోలీసులు, ఆర్టీఏ అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. తదుపరి విచారణకు హాజరవ్వాలని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జనరల్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యాజ్యంలో రవాణా శాఖ కమిషనర్‌ను ప్రతివాదిగా చేర్చింది. రాష్ట్రంలో మోటారు వాహన చట్ట నిబంధనల అమలుకు ముఖ్యంగా హెల్మెట్లు ధరించని వారిపై ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఖాళీల భర్తీకి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? రాష్ట్రవ్యాప్తంగా 8,770 మంది ట్రాఫిక్ పోలీసులు ఉండాలి కానీ.. కేవలం 1,994 మందే ఉన్నారని ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించింది. ఏపీ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే వాళ్లు తెలంగాణ సరిహద్దు రాగానే సీటు బెల్టులు పెట్టుకుంటున్నారని.. ఇందుకు పోలీసులు చర్యలు తీసుకుంటారన్న భయమే కారణమని పేర్కొంది. కుటుంబానికి అండగా ఉండే వ్యక్తి ప్రమాదంలో మరణిస్తే.. ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుందన్న విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలని సూచించింది. ప్రణతి జోక్యం చేసుకుంటూ.. మొత్తం బాధ్యత పోలీసులదే అంటే సరికాదని, ప్రజలు కూడా బాధ్యతాయుతంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. ప్రజలను తప్పు పట్టొద్దని, అవగాహన కల్పించడం పోలీసుల బాధ్యత అని హితవు పలికింది. మోటారు వాహన చట్ట నిబంధనల అమలు, హెల్మెట్ ధరించడాన్ని తప్పనిసరి చేసే విషయంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. జరిమానాలు కఠినంగా వసూలు చేయాలి.. రాష్ట్రంలో కేంద్ర మోటారు వాహన సవరణ చట్ట నిబంధనలను అమలు చేయట్లేదని.. ఉల్లంఘనలకు పాల్పడిన వారికి జరిమానాలు విధించడం లేదని, దీంతో పెద్ద సంఖ్యలో వాహన ప్రమాదాలు, మరణాలు చోటుచేసుకుంటున్నాయని న్యాయవాది తాండవ యోగేశ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై బుధవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. యోగేశ్ వాదనలు వినిపిస్తూ.. హెల్మెట్ ధారణ తప్పనిసరి చేయాలని గత విచారణ సమయంలో ఇచ్చిన ఆదేశాల అమలుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. హెల్మెట్ ధారణ నిబంధన అమలుకు చర్యలు తీసుకోవాలని తాము జూన్‌లో ఆదేశాలిచి్చనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత మంది చనిపోయారని ప్రశ్నించింది. జూన్ నుంచి సెపె్టంబర్ వరకు 667 మంది చనిపోయారని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సింగమనేని ప్రణతి తెలిపారు. ఇది చిన్న విషయం కాదని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రణతి స్పందిస్తూ, జూన్ నుంచి సెప్టెంబర్ వరకు రాష్ట్రంలో 5,62,492 చలాన్లు విధించామని చెప్పారు. కృష్ణా జిల్లాలో 20,824 చలాన్లు విధించి రూ.4.63 లక్షలు జరిమానా వసూలు చేశామన్నారు. ఇది చాలా తక్కువ మొత్తమన్న ధర్మాసనం.. నిబంధనలను అమలు చేసే విషయంలో ప్రభుత్వం ఎందుకు నిస్సహాయంగా ఉందని ప్రశ్నించింది. ఉల్లంఘనలకు పాల్పడితే చర్యలు కఠినంగా ఉంటాయన్న భయాన్ని ప్రజల్లో కలిగించాలని సూచించింది. చలాన్లు కట్టని వారి విద్యుత్ సరఫరా, నీటి సరఫరా ఆపేయడం వంటి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. చలాన్లు చెల్లించకపోతే సదరు వాహనాన్ని ఎందుకు జప్తు చేయట్లేదని పోలీసులను, ఆర్టీఏ అధికారులను ప్రశ్నించింది. భారీ జరిమానాలు విధించే బదులు.. ఇప్పటికే ఉన్న జరిమానాలను కఠినంగా వసూలు చేస్తే ఫలితం ఉంటుందని అభిప్రాయపడింది. -
సౌర విద్యుత్ కొనుగోలు పిల్‌పై విచారణ వాయిదా
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీ నుంచి యూనిట్ రూ.2.49కే 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలుకు అనుమతినిస్తూ విద్యుత్ నియంత్రణ మండలి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ టీడీపీ నేత, మంత్రి పయ్యావుల కేశవ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై విచారణను హైకోర్టు జనవరి 29కి వాయిదా వేసింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే దాఖలు చేసిన కౌంటర్‌ను ఓసారి పరిశీలించి అవసరమైతే అదనపు వివరాలతో మరో కౌంటర్ దాఖలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది.ఇందుకు కొంత సమయం కావాలని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టును కోరారు. దీంతో హైకోర్టు స్పందిస్తూ.. ఈ వ్యాజ్యాల్లో తదుపరి విచారణను జనవరి చివరి వారంలో జరుపుతామని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం ఈ వ్యాజ్యాలు విచారణకు రాగా ధర్మాసనం స్పందిస్తూ.. అసలు వివాదం ఏమిటో చెప్పాలని కోరింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. యూనిట్ రూ.2.49కి సౌర విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు సెకీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందన్నారు. రాజస్థాన్‌లో ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ నుంచి రాష్ట్రానికి విద్యుత్ సరఫరా చేస్తారని.. దీని వల్ల పంపిణీ నష్టాలుంటాయన్నారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను జనవరికి వాయిదా వేసింది. -
జీవోలు రహస్యంగా ఉంచడానికి వీల్లేదు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ వెబ్సైట్లో కొన్ని జీవోలు మాత్రమే అప్లోడ్ చేసి.. మిగిలిన వాటిని ప్రజలకు తెలియకుండా రహస్యంగా ఉంచడానికి వీల్లేదని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. జీవోలన్నింటినీ ఎలా పడితే అలా కాకుండా ప్రజలకు అర్థమయ్యేందుకు వీలుగా.. ఓ వరుస క్రమంలో అప్లోడ్ చేయాల్సిందేనని తేలి్చచెప్పింది. ఏదైనా జీవోలో రహస్య సమాచారం ఉంటే.. ఆ విషయాన్ని కూడా జీవో ద్వారా తెలపాలని ఆదేశించింది. దీని వల్ల మొత్తం ప్రక్రియ పారదర్శకంగా ఉంటుందని.. ప్రజలకు సమాచారం తెలిసే అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది. అలాగే జీవోలను గతంలో మాదిరిగా వరుస క్రమంలో జీవోఐఆర్ వెబ్సైట్లో అప్లోడ్ చేసేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జీవోలను ప్రభుత్వ వెబ్సైట్లో ఉంచకపోవడం సమాచార హక్కు చట్ట నిబంధనలకు విరుద్ధమంటూ నెల్లూరుకు చెందిన జీఎంఎన్‌ఎస్ దేవి, గుంటూరుకు చెందిన కె.శ్రీనివాసరావు, అనంతపురం జిల్లాకు చెందిన ఎస్.ఆర్.ఆంజనేయులు, బాపట్ల జిల్లాకు చెందిన సింగయ్య తదితరులు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిపై సీజే ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సింగమనేని ప్రణతి వాదనలు వినిపిస్తూ, జీవోలన్నీ అప్లోడ్ చేస్తున్నామని చెప్పారు. పిటిషనర్ తరఫు న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్‌బాబు స్పందిస్తూ.. గతంలో మాదిరిగా వరుస క్రమంలో జీవోలను అప్లోడ్ చేయడం లేదన్నారు. దీని వల్ల జీవోల వివరాలు తెలిసే అవకాశం లేదని చెప్పారు. ధర్మాసనం స్పందిస్తూ.. జీవోలను ఓ వరుస క్రమంలో అప్లోడ్ చేయాల్సిందేనని ఆదేశించింది. -
ఏపీ పోలీసులపై హైకోర్టు సీరియస్
సాక్షి, విజయవాడ: హెల్మెట్ నిబంధన అమలు చేయకపోవడంపై ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు హెల్మెట్ ధరించక 667 మంది చనిపోయారని పిటిషనర్ పేర్కొన్నారు. హెల్మెట్ నిబంధన ఎందుకు అమలు చేయడం లేదంటూ పోలీసులను హైకోర్టు ప్రశ్నించింది.ఈ మరణాలకు ఎవరు బాధ్యత వహిస్తారంటూ హైకోర్టు సీరియస్ అయ్యింది. రవాణా శాఖ కమిషనర్‌ను సుమోటోగా ఇంప్లీడ్ చేసిన హైకోర్టు.. వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. విచారణను వచ్చే వారానికి కోర్టు వాయిదా వేసింది.ఇదీ చదవండి: అక్రమ నిర్బంధాలపై హైకోర్టు ఆరా.. ఖాకీలపై ఆగ్రహం -
సజ్జల రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట
-
ఏపీ హైకోర్టులో రామ్ గోపాల్ వర్మకు ఊరట
సాక్షి,గుంటూరు : ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (ఆర్జీవీ) ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆర్జీవీపై అన్నీ కేసుల్లో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఏపీలో తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని ఆయన హైకోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. నిన్నటి (సోమవారం) విచారణలో కూడా వర్మపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని చెప్పిన హైకోర్టు.. ఈరోజు(మంగళవారం) షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో ఆర్జీవీపై ప్రకాశం జిల్లా మద్దిపాడు, గుంటూరు జిల్లా తుళ్లూరు, అనకాపల్లి జిల్లా రావికమతం స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. తనపై నమోదు చేసిన కేసుల్లో ముందస్తు బెయిలు మంజూరు చేయాలంటూ ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. ఆర్జీవీపై నమోదైన అన్నీ కేసుల్లో షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. నమోదైన కేసుల విషయంలో పోలీసుల విచారణకు సహకరించాలని సూచించింది. ఇదీ చదవండి: ఏడాది కిందటి పోస్టులపై ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏమిటో!తప్పుడు చానళ్లపై కేసులు వేస్తా: ఆర్జీవీ -
రిజిస్టర్డ్ సేల్డీడ్ల రద్దు చెల్లదు
సాక్షి, అమరావతి: రిజిస్టర్డ్ సేల్డీడ్ల రద్దు విషయంలో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రిజిస్టర్డ్ సేల్డీడ్లను రద్దు చేసే ముందు బాధితులకు నోటీసులు ఇచ్చి, వారి వాదనలు వినడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఏకపక్ష రిజిస్టర్డ్ సేల్డీడ్ల రద్దు వల్ల ఆస్తిపై హక్కు కోల్పోయే బాధితులకు తమ వాదన వినిపించేందుకు ఎలాంటి అవకాశం ఇవ్వకపోవడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమే కాక, ఏకపక్ష అధికార వినియోగమేనని తేల్చి చెప్పింది. ఇందుకు సంబంధించిన నిబంధన ఏదీ రిజిస్ట్రేషన్ రూల్స్‌లో నిర్ధిష్టంగా లేకపోయినప్పటికీ, అది రూల్స్‌లో ఉన్నట్టుగానే భావించి అమలు చేయాలని అధికారులను ఆదేశించింది. ‘ఏపీ రిజిస్ట్రేషన్ రూల్స్ 26(కె)(1) ప్రకారం సేల్డీడ్లను రద్దు చేయాలంటే.. సేల్డీడ్లలో పేర్కొన్న ఆస్తులు ప్రభుత్వ/అసైన్డ్/దేవదాయ లేదా రిజిస్టర్ చేయడానికి వీల్లేని భూములు అని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి ఉండాలి. అప్పుడే ఆ ఉత్తర్వులను అమలు చేయాల్సిన సివిల్ కోర్టు/ప్రభుత్వ అధికారి సంబంధిత ఆస్తుల సేల్డీడ్లను రద్దు చేయడం సాధ్యమవుతుంది. రిజిస్టర్డ్ సేల్డీడ్లలో పేర్కొన్న ఆస్తులు పైన పేర్కొన్న కేటగిరీలో ఉన్నట్టు ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకపోతే, సేల్డీడ్ల రద్దుకు రూల్ 26(కె)(1) వర్తించదు. ఈ రూల్‌లో ఎక్కడా ఆస్తి స్వభావంపై అధికారులు విచారణ చేపట్టాలని లేదు. సేల్డీడ్లలోని భూమి ఫలానా భూమి అంటూ ప్రభుత్వ ఉత్తర్వులు ఉంటే.. దాని ఆధారంగా అధికారాన్ని ఉపయోగించవచ్చని మాత్రమే ఉంది. సేల్డీడ్ల రద్దుకు ముందు బాధిత వ్యక్తులకు నోటీసు ఇచ్చి, వారి వాదనలు వినాలని రూల్స్‌లో లేదు కాబట్టి, దానిని అలా వదిలేయాలా? దీనికి సుప్రీంకోర్టు గతంలో ఓ కేసులో సమాధానం చెప్పింది. నోటీసులు ఇచ్చి వాదనలు వినే అవసరం గురించి రూల్స్‌లో లేకుంటే.. ఆ రూల్స్‌ను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి, అధికారుల చర్యలను ఏకపక్షంగా ప్రకటించాలని కోరవచ్చని ఆ తీర్పులో చెప్పింది. అందువల్ల సేల్డీడ్ల రద్దుకు ముందు బాధిత వ్యక్తులకు నోటీసులు ఇచ్చి, వారి వాదనలు వినాలని రూల్స్‌లో లేకపోయినా.. అది రూల్స్‌లో ఉన్నట్లే భావించాలి’ అని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ఇటీవల తీర్పు వెలువరించారు.సేల్డీడ్ల రద్దుపై న్యాయ పోరాటం విశాఖ జిల్లా సబ్బవరం మండలం గాలి భీమవరం గ్రామానికి చెందిన జోరీగల బంగారం తనకు ఇరువాడ, అసకపల్లి గ్రామాల్లోని పలు సర్వే నంబర్లలో ఉన్న 4.90 ఎకరాల భూమిని జి.నాగేశ్వరరావు, ఎన్.రమణ, షేక్ ఆసీఫ్ పాషాలకు 2013లో విక్రయించారు. సబ్బవరం రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ పూర్తయింది. అధికారులు సేల్డీడ్లు కూడా జారీ చేశారు. 2014లో ఆ సేల్డీడ్లను అధికారులు రద్దు చేశారు. దీనిని సవాల్ చేస్తూ బంగారం తదితరులు 2014లో హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై ఇటీవల జస్టిస్ రఘునందన్‌రావు తుది విచారణ జరిపి పైవిధంగా తీర్పు వెలువరించారు. -
ఆధారాలు లేకుండా అరెస్టులు ?.. బాబు సర్కార్ పై హైకోర్టు సీరియస్
-
ఆధారాల్లేకుండా అరెస్టులా? వాంగ్మూలాలను సాక్ష్యాలుగా తీసుకోవాలా?... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర అసంతృప్తి
-
ఆధారాల్లేకుండా అరెస్టులా?
సాక్షి, అమరావతి : పోలీసులు ఆయా కేసుల్లో నిందితులు ఇచ్చే వాంగ్మూలాలను సాక్ష్యంగా పరిగణించాలన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. కేసుల దర్యాప్తు విషయంలో రాష్ట్ర వైఖరి పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నామని తెలిపింది. వాంగ్మూలాలను అడ్డం పెట్టుకుని నిందితులను నెలల తరబడి జైళ్లలో ఉంచాలంటే సాధ్యం కాదని తేల్చి చెప్పింది. వాంగ్మూలాలను సాక్ష్యాలుగా పరిగణించాలన్న ప్రభుత్వ వాదనను సైతం తోసిపుచ్చుతున్నట్లు తెలిపింది. ఈ వాదనతో ఏ మాత్రం ఏకీభవించలేమంది. సహ నిందితుల వాంగ్మూలాలను తమను (కోర్టులను) కూడా పరిగణనలోకి తీసుకోవాలని పోలీసులు కోరుతున్నారని, ఇది ఎంత మాత్రం సాధ్యం కాని పని అని స్పష్టం చేసింది. ఆధారాలు సేకరించకుండా వాంగ్మూలాలపై ఆధార పడాలంటే ఎలా? అంటూ పోలీసులపై అసహనం వ్యక్తం చేసింది. వాంగ్మూలాల ఆధారంగా ఇతరులను నిందితులుగా చేర్చి, అరెస్ట్ చేస్తున్న పోలీసులు.. ఆ తర్వాత ఎలాంటి దర్యాప్తు చేయకుండా, ఎలాంటి ఆధారాలు సేకరించకుండా నెలల తరబడి నిందితులను జైళ్లలో ఉంచుతున్నారంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. వాంగ్మూలాలు కేవలం దర్యాప్తునకు ఓ దారి చూపుతాయే తప్ప, వాటిని సాక్ష్యంగా తీసుకోజాలమంది. దర్యాప్తు చేయనప్పుడు నిందితులను జైళ్లలో ఉంచడం అనవసరమంది. వాళ్లను ఊరికే జైళ్లలో ఉంచి, ప్రజల డబ్బును ఎందుకు వృథా చేస్తున్నారని ప్రశ్నించింది. పేపర్ ఖాళీగా ఉందని వాంగ్మూలాల పేరుతో ఏది పడితే అది రాసేస్తామంటే ఎలా అంటూ నిలదీసింది. వాంగ్మూలాలను చూస్తుంటే నిందితులంతా రాష్ట్రానికి విశ్వాస పాత్రులుగా కనిపిస్తున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేనప్పుడు ఏ కారణంతో బెయిల్ ఇవ్వొద్దని కోర్టులను కోరుతారని పోలీసులను నిలదీసింది. చాలా కేసుల్లో ఇంతే.. ఆయా కేసుల్లో రాష్ట్రం తీరు ఎంత మాత్రం సరిగా లేదని హైకోర్టు స్పష్టం చేసింది. బెయిల్ పిటిషన్ల విషయంలో రాష్ట్రం చాలా రొటీన్‌గా వ్యవహరిస్తోందని, దీంతో హైకోర్టులో పుంఖాను పుంఖాలుగా బెయిల్ పిటిషన్లు దాఖలవుతున్నాయని తెలిపింది. వీటి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్నో వందల కిలోమీటర్ల నుంచి న్యాయం కోసం ఎంతో మంది హైకోర్టును ఆశ్రయిస్తున్నారని చెప్పింది. వీళ్లంతా నవ్వులాటకు ఈ బెయిల్ పిటిషన్లు దాఖలు చేస్తున్నారని అనుకుంటున్నారా? అంటూ తీవ్ర స్వరంతో పోలీసులను ప్రశి్నంచింది. గంజాయి కేసులో విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం ఒడ్డిమిట్ట గ్రామం వద్ద పట్టుబడిన లారీ డ్రైవర్ వాంగ్మూలం ఆధారంగా హనుమంతరావు అనే వ్యక్తిని నిందితునిగా చేర్చి, అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆ వ్యక్తికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలను సేకరించకుండా అతన్ని నాలుగు నెలలుగా జైల్లో ఉంచడంపై మండి పడింది. అతనికి బెయిల్ ఇవ్వొద్దని కోరడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. హనుమంతరావుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. హనుమంతరావు నుంచి ఎలాంటి గంజాయిని స్వాదీనం చేసుకోలేదని తెలిపింది. అతనికి వ్యతిరేకంగా పోలీసులు ఒక్క కాగితం ముక్కను కూడా ఆధారంగా చూపలేకపోయారని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ కృపాసాగర్ రాష్ట్రం తీరును తీవ్రంగా గర్హించారు. పీపీ వాదనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ దానిని తన ఉత్తర్వుల్లో రికార్డ్ చేశారు. -
1,600 మంది ఎంపీహెచ్‌ఏల తొలగింపు
సాక్షి, అమరావతి: వైద్య శాఖలో 22 ఏళ్ల వరకూ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఎంపీహెచ్ఏ) మేల్స్‌గా సేవలు అందించిన ఉద్యోగుల కుటుంబాలు రోడ్డునపడుతున్నాయి. దీంతో తమ భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరిలో కొందరు దాదాపు ఉద్యోగ విరమణ దశలో..మరికొందరు ఉద్యోగులు ఉన్నారు. 2013లో మంత్రివర్గ ఉపసంఘం ఆమోదించిన 1207 జీవో ద్వారా ఎంపికైన 1,000 మందిని, అనంతర కాలంలో ఈ జీవోను అనుసరించి మరో 500–600 మందిని ప్రభుత్వం నియమించింది. వీరిని విధుల నుంచి తొలగించాలని జిల్లాల డీఎంహెచ్వోలను ఆదేశిస్తూ గురువారం ప్రజారోగ్య డైరెక్టర్ డాక్టర్ పద్మావతి ఉత్తర్వులిచ్చారు. డీఎంహెచ్వోలు సైతం తొలగింపు ఉత్తర్వులను సదరు ఉద్యోగులకు పంపారు. తెలంగాణ హైకోర్టు తీర్పు మేరకు వీరిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు వైద్య శాఖ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2002లో ఎంపీహెచ్‌ఏల నియామకంలో అర్హతలపై సుప్రీం, హైకోర్టుల్లో కేసులు పడ్డాయి.కోర్టు ఉత్తర్వుల మేరకు ఉమ్మడి ఏపీలో 1,200 మందిని తొలగించాల్సి ఉండగా వీరిని 2013లో మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం మేరకు జోవో 1207 కింద తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. ఇప్పుడు కోర్టు ఉత్తర్వుల మేరకు ఈ 1200 మందిలో దాదాపుగా 250 మంది వరకు తెలంగాణకు వెళ్లిపోవాలి. మిగిలిన వారితో (సుమారు 1,000 మంది) కలిపి 2013లో విధుల్లోకి తీసుకున్న దాదాపు 600 మంది కలిపి మొత్తం 1600 మందిని తాజాగా విధుల నుంచి తొలగించారు. వీరందరూ 45–50 ఏళ్లు పైబడిన వాళ్లే. దశాబ్దాల పాటు సేవలు అందించిన తమను మానవతాదృక్పథంతో ప్రభుత్వం విధుల్లో కొనసాగించాలని వీరు కోరుతున్నారు. హైకోర్టు తీర్పును అమలు చేయడానికి 3 నెలల సమయం ఉందని, వారం కూడా తిరగకుండా హడావుడిగా ప్రభుత్వం విధుల నుంచి తొలగించడంపై మండిపడుతున్నారు.హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేయడానికి ఆస్కారం ఉందని, ఈ విషయాన్ని ప్రభుత్వం ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు. 2,3 రోజుల్లో కోర్టు మెమోల ద్వారా 2021–24 సంవత్సరాల్లో విధుల్లో చేరిన మరో 1,500 మందిని కూడా విధుల నుంచి తొలగించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ప్రభుత్వం పునరాలోచించాలిఎంపీహెచ్ఏల తొలగింపు విషయాన్ని ప్రభుత్వం పునరా>లోచించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు డి.ఆస్కార్ రావు కోరారు. కోర్టు తీర్పు ప్రకారం 3 నెలల ముందస్తు నోటీస్ ఇచ్చి, 3 నెలల జీతం ఇచ్చిన తర్వాతే తొలగించాలన్నారు. కనీస నియమాలు పాటించకుండా ఉద్యోగులను తొలగించడం సరికాదన్నారు. కొందరు ఉద్యోగులు రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగాల నుంచి తొలగించడం అన్యాయమన్నారు. -
బాధితుడినే నిందితుడిగా మార్చారు
సాక్షి, అమరావతి: బాధితుడినే నిందితుడిగా మార్చి.. నిందితులకు పోలీసులు మద్దతు పలుకుతున్నారని కుక్కల విద్యాసాగర్ తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. ఇలాంటి ఘటన చరిత్రలో ఎప్పుడూ జరగలేదన్నారు. సినీ నటి జత్వానీ ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వ్యాపారవేత్త కుక్కల విద్యాసాగర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై మంగళవారం జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ విచారణ జరిపారు. పిటిషనర్ తరఫున నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. సినీనటి జత్వానీ, ఆమె కుటుంబ సభ్యులు విద్యాసాగర్ నుంచి బలవంతంగా రూ.కోటి వరకు గుంజితే.. పోలీసులు రివర్స్‌లో అతనిపైనే కేసుపెట్టి ప్రాసిక్యూట్ చేయాలంటున్నారని వివరించారు. జత్వానీకి సంబంధించిన మొబైల్ ఫోన్లు, ఐపాడ్, ల్యాప్‌టాప్‌లలో కీలక సమాచారం ఉందని, డబ్బు కోసం విద్యాసాగర్‌ను బెదిరించిన మెసేజ్‌లు అందులో ఉన్నాయని తెలిపారు.అందుకే వాటిని భద్రపరచాలని తాము న్యాయ పోరాటం చేస్తున్నామని చెప్పారు. జత్వానీ చాటింగ్ మెసేజ్‌లను పోలీసులు ఉద్దేశపూర్వకంగానే బయటపెట్టడం లేదని తెలిపారు. జత్వానీ రెండు ఆధార్ కార్డులు కలిగి ఉన్నారని, కేంద్రం ఎవరికీ రెండో ఆధార్ కార్డు ఇవ్వదన్నారు. జత్వానీ సోదరుడికి అండర్ వరల్డ్‌తో సంబంధాలున్నాయని, ఈ విషయంలో కూడా పోలీసులు మౌనంగా ఉన్నారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో క్రియాశీలకంగా వ్యవహరించిన పోలీసు ఉన్నతాధికారులను ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందని, ఇందుకు జత్వానీని ఓ సాధనంగా వాడుకుంటోందన్నారు.ఆ బాధ్యత పోలీసులపై ఉందినిరంజన్రెడ్డి వాదనలపై హైకోర్టు స్పందిస్తూ.. ఇలాంటి కీలక విషయాలపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని వ్యాఖ్యానిస్తూ విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కృపాసాగర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నందిగం సురేష్ కు హైకోర్టులో ఊరట మాజీ ఎంపీ నందిగం సురేష్ కు హైకోర్టులో ఊరట లభించింది. బీజేపీ నేత, ప్రస్తుత మంత్రి సత్యకుమార్‌పై దాడి కేసులో సురేష్ రిమాండ్‌ను కోరవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. మరియమ్మ అనే మహిళ హత్య కేసులో సురేష్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నేపథ్యంలో ఆయన విషయంలో కఠిన చర్యలేవీ తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో దర్యాప్తును కొనసాగించవచ్చని పోలీసులకు స్పష్టం చేస్తూ పోలీసుల విచారణకు హాజరు కావాలని నందిగంను ఆదేశించారు. ఈ వ్యాజ్యంలో పోలీసుల తరఫున పీపీ వాదనల నిమిత్తం న్యాయమూర్తి విచారణను ఈ నెల 16కి వాయిదా వేశారు. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
వారి చుట్టూ తిరిగే ఓపికలేకే రాజీపడ్డా
సాక్షి, అమరావతి: చెక్ బౌన్స్ కేసులో ఫిర్యాదుదారు, తన మధ్య రాజీ కుదిరిందని, ఈ నేపథ్యంలో తనపై విశాఖపట్నం 7వ స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టులో జరుగుతున్న కేసు ప్రొసీడింగ్స్‌ను కొట్టేయాలని కోరుతూ హోంమంత్రి వంగలపూడి అనిత దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. ఏం రాజీ కుదిరిందో చెప్పకుండా, రాజీ కుదిరిందని చెప్పేస్తే సరిపోదని వ్యాఖ్యనించింది. ఈ సందర్భంగా హైకోర్టు, అనిత తన డబ్బు తీసుకుని ఎగవేసిందంటూ కింది కోర్టులో ఫిర్యాదు దాఖలు చేసిన వేగి శ్రీనివాసరావుతో స్వయంగా మాట్లాడింది. మీ మధ్య రాజీ కుదిరిందని అనిత పిటిషన్ దాఖలు చేశారని, రాజీ కుదిరిందా? మీరు తప్పుడు కేసు వేశారని వారు చెబుతున్నారంటూ ఆయన్ను ప్రశ్నించింది. అనిత తనకు ఇవ్వాల్సిన డబ్బు ఇస్తారని అనుకుంటున్నానని శ్రీనివాసరావు బదులిచ్చారు. తనకు వారి చుట్టూ తిరిగే ఓపిక లేదన్నారు. అందుకే రాజీ అంటే సరేనన్నానని తెలిపారు. రాజీ ఏం కుదిరిందని న్యాయస్థానం ప్రశ్నించగా, అనిత తరఫు న్యాయవాది సతీష్ స్పందిస్తూ.. కుదిరిన రాజీ ప్రకారం వేగి శ్రీనివాసరావు చెక్ బౌన్స్ కేసును కొనసాగించడానికి వీల్లేదని.. భవిష్యత్తులో కూడా ఎలాంటి కేసులు వేయడానికి వీల్లేదని తెలిపారు. న్యాయస్థానం స్పందిస్తూ, ఇది రాజీ ఎలా అవుతుందని ప్రశ్నించింది. రాజీలో ఇరుపక్షాల మధ్య ఏం ఒప్పందం కుదిరింది, సమస్యకు ఏం పరిష్కారం చూపారు, శ్రీనివాసరావుకు ఇవ్వాల్సిన దాంట్లో ఏం ఇచ్చారు.. తదితర వివరాలు ఉండాల్సిందేనని స్పష్టంచేసింది. రాజీ కుదిరిపోయిందని, దానిని రికార్డ్ చేసేయాలంటే కుదరదని తేల్చిచెప్పింది. రాజీని రికార్డ్ చేసేందుకు అవసరమైన అన్నీ వివరాలను తమ ముందుంచాలని అనితను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. -
ఏపీ జడ్జిగా తెలంగాణ అమ్మాయి
జూలపల్లి(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడ్కాపూర్ గ్రామానికి చెందిన మొగురం గాయత్రి ఆంధ్రప్రదేశ్‌లో సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. అక్కడి హైకోర్టు నిర్వహించిన పరీక్షల్లో రెండోసారి పరీక్ష రాసిన గాయత్రి.. ఈనెల 27న వెలువడిన ఫలితాల్లో సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. వడ్కాపూర్ గ్రామానికి చెందిన మొగురం మొండయ్య, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు గాయత్రి ఉన్నారు.తండ్రి వ్యవ సాయ కూలీగా గ్రామంలోనే పనిచేస్తున్నారు. కూతురిని కాకతీయ యూనివర్సిటీలో ఎల్ఎల్బీ, ఉస్మానియాలో ఎల్ఎల్ఎం చదివించారు. ఏపీ హైకోర్టు నిర్వహించిన సివిల్ జడ్జి పోటీ పరీక్షలకు తొలిసారి హాజరైన గాయత్రి.. అప్పుడు విజయం సాధించలేకపోయారు. పట్టుదలతో చదివిన ఆమె రెండోసారి పరీక్షలు రాసి తన లక్ష్యం సాధించారు. కాగా, మొండయ్య ఇద్దరు కుమారులు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు. -
న్యాయ సాయం కోరే హక్కు నిందితునికి ఉంది
సాక్షి, అమరావతి : ఏదైనా కేసులో నిందితుడిని పోలీసులు పీటీ వారెంట్ మీద మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచినప్పుడు, అతను పోలీసు లేదా జ్యూడిషియల్ కస్టడీని వ్యతిరేకిస్తూ తనకు న్యాయ సాయం అందించాలని మేజిస్ట్రేట్‌ను కోరవచ్చని హైకోర్టు తెలిపింది. అలా కోరే హక్కు నిందితుడికి ఉందని స్పష్టం చేసింది. మేజిస్ట్రేట్లు నిందితుడి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవడం తప్పనిసరి అని అభిప్రాయపడింది. సోషల్ మీడియా యాక్టివిస్టు ఇంటూరి రవికిరణ్‌కు హైకోర్టు ఈ వెసులుబాటుని ఇచ్చింది. రవికిరణ్‌కు సంబంధించి వివరాలేమీ పోలీసులు తమకు తెలియజేయడంలేదని, దీంతో న్యాయ సాయం పొందే అవకాశం లేకుండా పోతోందన్న అతని తరఫు న్యాయవాది వాదనను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. అలాగే రవికిరణ్‌పై నమోదైన కేసుల వివరాలును తమ ముందుంచాలని పోలీసులను ఆదేశించింది. పీటీ వారెంట్ల వివరాలను పోలీసులు నిందితునికి తెలియచేయాల్సిన పని లేదని తెలిపింది. తదుపరి విచారణను డిసెంబర్ 9కి వాయిదా వేసింది. తన భర్త రవికిరణ్‌పై ఉన్న కేసుల వివరాలు, పీటీ వారెంట్లపై పోలీసులు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వడంలేదంటూ ఇంటూరి సుజన హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంపై శుక్రవారం విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. సుజన తరఫున న్యాయవాది శెట్టిపల్లి దుష్యంత్‌రెడ్డి, పోలీసుల తరపున ప్రభుత్వ న్యాయవాది (హోం) ఎ.జయంతి వాదనలు వినిపించారు. -
‘మూడో వ్యక్తి కంప్లయింట్ చేస్తే కేసు పెడతారా?’
అమరావతి, సాక్షి: ఏపీ హైకోర్టులో సజ్జల భార్గవ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ(శుక్రవారం) విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఆయన తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇది అసలు విచారణ అర్హత లేని కేసంటూ కోర్టు దృష్టికి తీసుకెళ్లారాయన.ఈ కేసులకు అసలు విచారణ అర్హత లేదు. ఎవరు పైన అయితే పోస్ట్ పెట్టారో వాళ్లు కంప్లైంట్ చేయలేదు. ఎవరో మూడో వ్యక్తి కంప్లైంట్ చేస్తే కేసు నమోదు చేశారు. ఈ పోస్టులపై ఐటీ సెక్షన్స్ బదులుగా.. పోలీసులు నాన్‌బెయిలబుల్ సెక్షన్స్ పెట్టారు. ఇది ఆర్గనైజర్ క్రైమ్ అని పోలీసులు చెప్తున్నారు. కానీ, ముమ్మాటికి ఇది అలాంటి నేరమేం కాదు అని పొన్నవోలు వాదించారు.ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. తదుపరి విచారణను వచ్చేనెల 6వ తేదీకి వాయిదా వేసింది. అప్పటిదాకా అప్పటివరకు ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవద్దన్న ఆదేశాలను పొడిగిస్తున్నట్లు తెలిపింది.ఇక.. సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీందర్ రెడ్డి హెబియస్ కార్పస్ పిటిషన్ పై విచారణను వచ్చే నెల మూడో తేదీకి వాయిదా వేసింది కోర్టు. మరోవైపు.. బాపట్ల కోర్టులో వర్రా రవీందర్ రెడ్డిని మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. ‘ఏ కేసులో మిమ్మల్ని అరెస్టు చేశారో తెలుసా?’’ అని రవీందర్ రెడ్డిని మేజిస్ట్రేట్ ప్రశ్నించారు. అయితే.. కేసుకు సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్లు తనకు ఇవ్వలేదని రవీందర్‌రెడ్డి చెప్పారు. దీంతో.. పోలీసులను న్యాయమూర్తి మందలించారు. అలాగే.. వర్రాకు వచ్చే నెల 13వ తేదీదాకా రిమాండ్ విధించారు. -
ఏ కాలేజీలోనూ సీట్లు పొందని వారితో స్పెషల్ స్ట్రే కౌన్సెలింగ్
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్ స్పెషల్ స్ట్రే వేకెన్సీ సీట్ల భర్తీ విషయంలో హైకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. కర్నూలులోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ఆ జిల్లాలోని విశ్వభారతి, అమలాపురంలోని కోనసీమ మెడికల్ కాలేజీల్లో కన్వీ నర్ కోటా కింద 76 సీట్లు పెరిగిన నేపథ్యంలో వాటి భర్తీకి స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ కింద కౌన్సెలింగ్ నిర్వహించాలని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని హైకోర్టు గురువారం ఆదేశించింది. ప్రతిభ ఆధారంగానే ఈ సీట్ల భర్తీని చేపట్టాలని తేల్చి చెప్పింది. మొదటి మూడు రౌండ్లలో కన్వీనర్, యాజమాన్య, ఎన్ఆర్ఐ కోటా కింద ఏ కాలేజీల్లో సీట్లు రాని అభ్యర్థులందరి నుంచి ఆప్ష న్లు తీసుకోవాలని ఆదేశించింది. ఈ ఆదేశాలు 76 సీట్లకే పరిమితమని స్పష్టం చేసింది.ఈ సీట్ల భర్తీ వల్ల ఖాళీ అయ్యే బీడీఎస్ సీట్ల భర్తీకి కన్వీనర్ కోటా కింద తిరిగి స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ కౌన్సెలింగ్ నిర్వహించాలని చెప్పింది. కౌన్సెలింగ్‌లో విశ్వవిద్యాలయం వ్యక్తం చేసిన వాస్తవ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని స్పెషల్ స్ట్రే వేకెన్సీ కౌన్సెలింగ్‌కు నీట్లో అర్హత సాధించిన అభ్యర్థులందరినీ అనుమతించాలంటూ 25న ఇచ్చిన ఉత్తర్వుల ను కొంత మేర సవరిస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. ఇప్పటివరకు జరిగిన కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన వారికి పెరిగిన సీట్ల భర్తీలో పాల్గొనే అవకాశం ఇవ్వకుండా, తరువాతి ర్యాంకుల్లో ఉన్న వారికి కౌన్సెలింగ్ నిర్వహించడం వల్ల తాము నష్టపోతా మంటూ నలుగురు విద్యార్థినులు హైకోర్టులో పి టిషన్లు దాఖలు చేశారు.దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. నీట్లో అర్హత సాధించిన అందరినీ స్పెషల్ స్ట్రే కౌన్సెలింగ్‌కు అనుమతించాలంటూ ఈ నెల 25న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా.. నీట్లో అర్హత సాధించిన అభ్యర్థులందరినీ అనుమతిస్తే ఎన్ఎంసీ గడువైన డిసెంబర్ 6 లోగా కౌన్సెలింగ్‌ను పూర్తి చేయడం చాలా కష్టమ ని ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్, జా యింట్ రిజిస్ట్రార్ (ప్రవేశాలు)తో పాటు యూనివర్సిటీ తరపున అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీని వాస్ ధర్మాసనానికి వివరించారు. పిటిషనర్ల తర ఫున న్యాయవాది ఠాగూర్ యాదవ్ వాదించారు. ఇరుపక్షాల అభిప్రాయాలను తీసుకున్న అనంతరం ధర్మాసనం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. -
కనీస మార్కులొస్తేనే హోంగార్డులకు ఉద్యోగాలు
సాక్షి, అమరావతి: ప్రాథమిక రాత పరీక్షలో కనీస మార్కులు రాని హోంగార్డులకు ఉద్యోగాలు ఇవ్వలేమని రాష్ట్ర పోలీసు నియామక బోర్డు (ఎస్ఎల్పీఆర్బీ) చైర్మన్ ఎం.రవిప్రకాశ్ హైకోర్టుకు నివేదించారు. పోలీస్ కానిస్టేబుల్ ఎంపిక కోసం నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షలో కనీస అర్హత మార్కులు సాధించలేదంటూ తమను అనర్హులుగా ప్రకటించారంటూ పలువురు హోంగార్డులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులను దేహదారుఢ్య, తుది రాత పరీక్షలకు అనుమతించాలని పోలీసు నియామక బోర్డును ఆదేశిస్తూ ఈ నెల 12న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసు నియామక బోర్డు చైర్మన్ రవిప్రకాశ్ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. పోలీస్ కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించిన ప్రాథమిక రాత పరీక్షలో అర్హులు కాని వారికి పోస్టుల భర్తీ నిమిత్తం జారీ చేసిన నోటిఫికేషన్‌ను ప్రశ్నించే హక్కులు ఉండవని, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు సైతం స్పష్టం చేసిందని పేర్కొన్నారు. పోస్టులకు దరఖాస్తు చేసే సమయంలోనే నోటిఫికేషన్లో పేర్కొన్న షరతుల గురించి పిటిషనర్లందరికీ స్పష్టంగా తెలుసని, వాటికి అంగీకరించిన తరువాతే వారంతా ప్రాథమిక రాత పరీక్షకు హాజరయ్యారన్నారు. ప్రాథమిక రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోవడంతో వారంతా ఇప్పుడు నోటిఫికేషన్‌ను తప్పుపడుతున్నారని తెలిపారు.నోటిఫికేషన్‌లోని పేరా–7లో పేర్కొన్న స్పెషల్ కేటగిరీలు హారిజాంటల్ రిజర్వేషన్ (హోంగార్డులు, ఎన్సీసీ, ప్రతిభావంతులైన క్రీడాకారులు, పోలీసు సిబ్బంది పిల్లలు, మరణించిన పోలీసుల పిల్లలు తదితరాలు) కిందకు వస్తాయన్నారు. ఈ హారిజాంటల్‡ రిజర్వేషన్ కిందకు వచ్చే పోస్టులను కచ్చితంగా సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా భర్తీ చేసి తీరాల్సిందేనని తెలిపారు.అలా చేస్తే రిజర్వేషన్లు 50 శాతం దాటిపోతాయిరూల్ ఆఫ్ రిజర్వేషన్‌తో సంబంధం లేకుండా హోంగార్డుల కోసం కేటాయించిన కోటాలో హోంగార్డులకు ప్రత్యేక మెరిట్ జాబితా తయారు చేస్తే రిజర్వేషన్లు 50 శాతం దాటిపోతాయని, ఇది సుప్రీం తీర్పునకు విరుద్ధమవుతుందని రవిప్రకాశ్ వివరించారు. పిటిషనర్ల అభ్యర్థనను ఆమోదిస్తే మెరిట్‌కు పూర్తిగా తిలోదకాలు ఇచ్చినట్టవుతుందని, పిటిషనర్లు తమ కులం ఆధారంగా వయసు మినహాయింపు కోరుతున్నారని పేర్కొన్నారు.అయితే, తమ కేటగిరీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ కింద కనీస అర్హత మార్కులను మాత్రం ఆమోదించడం లేదన్నారు. ఇది సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని తెలిపారు. స్పెషల్ కేటగిరీ కింద హోంగార్డుల్లో కూడా ఓసీ 40 శాతం, బీసీ 35 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 30 శాతం కనీస అర్హత మార్కులుగా నిర్ణయించామన్నారు. కనీస అర్హత మార్కుల్లో ఎలాంటి మినహాయింపులు కోరే హక్కు అభ్యర్థులకు లేదని సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పులో సైతం స్పష్టం చేసిందని, వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసి సంబంధిత పిటిషన్లన్నీ కొట్టేయాలని హైకోర్టును అభ్యర్థించారు. -
ఖైదీలను ఆస్పత్రులకు పంపించడంపై ఎస్వోపీ రూపొందించండి
సాక్షి, అమరావతి:హత్యలు, కిడ్నాప్‌లు, అత్యాచారాలు, చిన్నారులపై లైంగిక వేధింపులు వంటి హేయమైన నేరాలకు పాల్పడిన వారిలో ఎంతమంది శిక్ష అనుభవిస్తున్నారు, వారిలో ఎంతమంది అనారోగ్య కారణాలతో జైలు నుంచి విడుదలయ్యారనే వివరాలను తమ ముందుంచాలని జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్‌ను హైకోర్టు ఆదేశించింది. శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు తీవ్ర అస్వస్థతకు గురై, అత్యవసర చికిత్స అవసరమైనప్పుడు వారిని బయట ఆస్పత్రులకు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు పంపే విషయంలో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్వోపీ) రూపొందించాలని కూడా జైళ్ల శాఖను ఆదేశించింది. అఫిడవిట్ రూపంలో ఆ ఎస్‌వోపీని తమ ముందుంచాలని కోరింది. ఇందుకు రెండు వారాల గడువు ఇచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ గుహనాథన్ నరేందర్, జస్టిస్ తూటా చంద్ర ధనశేఖర్ ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.మధ్యంతర బెయిల్ కోరిన కేసులో..ఉమ్మడి గుంటూరు జిల్లా బాపట్ల మండలానికి చెందిన శ్రీనివాస వర్మకి గుంటూరు పోక్సో ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధిస్తూ 2022 డిసెంబర్ 19న తీర్పునిచ్చింది. దీంతో వర్మ రాజమండ్రి కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నారు. పోక్సో కోర్టు తీర్పును సవాల్ చేస్తూ వర్మ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. తీవ్ర గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వర్మ అత్యవసర చికిత్స నిమిత్తం 6 నెలల పాటు మధ్యంతర బెయిల్ కోరుతూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌తో పాటు అనుబంధ పిటిషన్‌పై జస్టిస్ నరేందర్ ధర్మాసనం విచారణ చేపట్టింది. శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు అత్యవసర వైద్య చికిత్స అవసరమైనప్పుడు మంచి ఆస్పత్రికి వెళ్లేందుకు అనుమతి కోరుతూ హైకోర్టులో పిటిషన్లు దాఖలవుతుండటంపై ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. పిటిషనర్ వర్మకు అత్యవసర చికిత్స అవసరమైన నేపథ్యంలో అతన్ని మంగళగిరి ఎయిమ్స్‌కు తరలించి చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో జైళ్ల శాఖ డీఐజీని కోర్టుకు పిలిచి ఖైదీల అత్యవసర చికిత్స విషయంలో జైళ్ల నిబంధనలు ఏం చెబుతున్నాయో ఆరా తీసింది. చికిత్స అవసరమైన ఖైదీలను ఆరోగ్యశ్రీ పథకం కింద నెట్వర్క్ ఆస్పత్రులకు పంపుతున్నామని డీఐజీ వివరించారు. పిటిషనర్ వర్మను అలాగే నెట్వర్క్ ఆస్పత్రికి పంపి చికిత్స అందించామని తెలిపారు. ఈ సందర్భంగా ధర్మాసనం జైళ్ల నిబంధనలను పరిశీలించింది. ఖైదీలు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుంటే వారిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు పంపి చికిత్స అందించవచ్చునని, అయితే మెడికల్ ఆఫీసర్ ఆ మేర సర్టిఫికెట్ ఇస్తే చాలని నిబంధనలు చెబుతున్నాయని పేర్కొంది. అందువల్ల ఈ విషయంలో అన్ని జైళ్లకు వర్తించేలా ఓ ఎస్‌వోపీని రూపొందించాలని జైళ్ల శాఖను ఆదేశించింది. కోర్టుకొచ్చే పని లేకుండా జైలు అధికారులే చికిత్స నిమిత్తం సూపర్ స్పెషాలిటీ లేదా బయట ఆస్పత్రులకు పంపే దిశగా ఎస్వోపీ రూపొందించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. -
కర్నూలులోనే హైకోర్టు.. వైఎస్సార్సీపీ డిమాండ్
సాక్షి, కర్నూలు: కర్నూలులోనే హైకోర్టు ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. హైకోర్టు బెంచ్ కర్నూలులో ఏర్పాటుకు మంత్రి ఫరూక్ తీర్మానం ప్రవేశం పెట్టారు. ఈ సందర్భంగా హైకోర్టు ఏర్పాటుపై శాసన మండలిలో చర్చ జరిగింది.ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి మాట్లాడుతూ, శ్రీబాగ్ ఒప్పందంలో ఏముందో మంత్రి భరత్‌కు తెలియదా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కర్నూలులో హైకోర్టు బెంచ్ కాకుండా హైకోర్టు ఏర్పాటు చేయాలని.. గతంలో బీజేపీ కూడా డిక్లరేషన్ చేసిందని ఆయన గుర్తు చేశారు.హైకోర్టును కర్నూలులో పెట్టాలని బీజేపీ రాయలసీమ డిక్లరేషన్‌లో పెట్టిందని.. ఇప్పుడు హైకోర్టు కాకుండా హైకోర్టు బెంచ్ పెట్టడం ఏంటి అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ, కర్నూలులో న్యాయ రాజధాని రాకుండా గతంలో కూటమి పార్టీలు అడ్డుకున్నాయన్నారు. కర్నూల్లో హైకోర్టు పెట్టాలని బీజేపీ గతంలో డిక్లరేషన్ చేసిందన్నారు. అభివృద్ధిని అన్ని ప్రాంతాలకు సమానంగా విస్తరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భావించిందని ఆయన తెలిపారు. -
రిమాండ్ ఆర్డర్ నిందితునికి ఇవ్వాలి
సాక్షి, అమరావతి: ఏదైనా కేసులో తనకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పుడు అందుకు గల కారణాలతో కూడిన రిమాండ్ ఆర్డర్‌ను తనకు అందజేయాలని నిందితుడు కోరితే, ఆ ఆర్డర్‌ను నిందితునికి సత్వరమే అందజేయాల్సి ఉంటుందని హైకోర్టు ప్రాథమికంగా అభిప్రాయపడింది. పౌరుల హక్కులు ముడిపడి ఉన్న కేసుల్లో కింది కోర్టులు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని హైకోర్టు సూచించింది. సోషల్ మీడియా యాక్టివిస్ట్ పప్పుల వెంకటరామిరెడ్డి అరెస్టు విషయంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ కుంచం మహేశ్వరరావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. రిమాండ్ ఆర్డర్ కోసం వెంకటరామిరెడ్డి సంబంధిత కోర్టులో దరఖాస్తు చేశారో తెలుసుకోవాలని ఆయన తరఫు న్యాయవాదులకు ధర్మాసనం సూచించింది. రిమాండ్ ఆర్డర్ నిందితునికి ఇవ్వకపోతే అది చెల్లదు..తన కుమారుడు పప్పుల వెంకటరామిరెడ్డిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, కోర్టు అతనికి విధించిన రిమాండ్ చెల్లదంటూ పప్పుల చెలమారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై బుధవారం హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా చెలమారెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది ఎస్. శ్రీరామ్, న్యాయవాది శెట్టిపల్లి దుష్యంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, రిమాండ్‌కు గల కారణాలను నిందితుడైన వెంకటరామిరెడ్డికి అందచేయలేదన్నారు. రిమాండ్ ఆర్డర్‌ను నిందితునికి అందచేయడం తప్పనిసరని, అలా ఇవ్వని పక్షంలో ఆ రిమాండ్ చెల్లదన్నారు. ఇందుకు సంబంధించి పలు తీర్పులున్నాయన్నారు. అంతకుముందు.. పోలీసుల తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ, వెంకటరామిరెడ్డిని అరెస్టుచేసి కోర్టు ముందు హాజరుపరిచామన్నారు. అందువల్ల ఈ హెబియస్ కార్పస్ పిటిషన్‌కు విచారణార్హత లేదన్నారు. నిందితుడు కింది కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేశారని, అందువల్ల ఈ వ్యాజ్యంపై ఎలాంటి విచారణ అవసరంలేదన్నారు. అరెస్టుకు గల కారణాలను కూడా అతనికి తెలియజేశామన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, కింది కోర్టులు నిందితులకు వారి రిమాండ్ ఆర్డర్‌ను సత్వరమే అందజేయాలని అభిప్రాయపడింది. ఈ కేసులో నిందితుడు రిమాండ్ ఆర్డర్ కోసం దరఖాస్తు చేయలేదని తెలిపింది. ఈ సమయంలో శ్రీరామ్ స్పందిస్తూ.. ఈ విషయాన్ని తాము మరోసారి పరిశీలన చేస్తామన్నారు. దీంతో ధర్మాసనం ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను 29కి వాయిదా వేసింది. -
మీరు మా ఆదేశాలను ఉల్లంఘించారు
సాక్షి, అమరావతి: సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీందర్‌రెడ్డిని కోర్టు ముందు హాజరుపరిచే విషయంలో పోలీసులు కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని హైకోర్టు తెలిపింది. రవీందర్‌రెడ్డిని తమ ముందు (హైకోర్టు) హాజరుపరచాలని ఆదేశిస్తే, పోలీసులు ఎక్కడో హాజరుపరిచారని వ్యాఖ్యానించింది. ఈ విషయంలో వివరణ ఇవ్వాలని.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. అలాగే, ఈ వ్యాజ్యంలో జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ)ని ప్రతివాదిగా చేర్చాలని వర్రా రవీందర్‌రెడ్డి సతీమణిని కూడా ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ కుంచం మహేశ్వరరావు ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.అక్రమ నిర్బంధంపై హెబియస్ కార్పస్ పిటిషన్..తన భర్త వర్రా రవీంద్రరెడ్డి అక్రమ నిర్భంధంపై అతని భార్య కళ్యాణి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయగా ఈ వ్యాజ్యం ఈనెల 9న విచారణకు వచ్చింది. అప్పుడు, వర్ర రవీందర్‌రెడ్డిని తాము అరెస్టుచేయలేదని, అతను తమ నిర్బంధంలో లేరని పోలీసులు హైకోర్టుకు నివేదించారు. దీంతో హైకోర్టు ధర్మాసనం, వర్రా రవీంద్రరెడ్డి, సుబ్బారెడ్డి, ఉదయ్ భాస్కర్‌రెడ్డిలను తమ ముందు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది. ఈనెల 12న ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా, రవీందర్‌రెడ్డి తదితరులను అరెస్టుచేసినట్లు పోలీసులు హైకోర్టుకు తెలిపారు. విచారణ సందర్భంగా పోలీసులు వర్రాను కొట్టారని, ఆయన ఒంటిపై గాయాలు కూడా ఉన్నాయని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఈ వివరాలను అఫిడవిట్ రూపంలో తమ ముందుంచాలని రవీంద్రరెడ్డి న్యాయవాదిని ధర్మాసనం ఆదేశించిన విషయం తెలిసిందే.పోలీసులది కోర్టు ధిక్కారమే..ఈ నేపథ్యంలో.. సోమవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది. రవీందర్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి స్పందిస్తూ.. ధర్మాసనం ఆదేశించిన మేరకు పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేశామని చెప్పారు. ఈనెల 9న జరిగిన విచారణలో రవీంద్రరెడ్డి తమ నిర్బంధంలో లేరని చెప్పారని, కానీ 12న అతన్ని సంబంధిత కోర్టు ముందు హాజరుపరిచారని తెలిపారు. తప్పుడు వివరాలతో పోలీసులు కోర్టును తప్పుదోవ పట్టించడమేకాక.. 12న రవీందర్‌రెడ్డి తదితరులను తమ ముందు హాజరుపరచాలని హైకోర్టు ఆదేశిస్తే పోలీసులు కింది కోర్టు ముందు హాజరుపరిచారని చెప్పారు. అక్రమ నిర్బంధంలో పోలీసులు రవీంద్రరెడ్డిని కొట్టారని తెలిపారు. వాస్తవానికి.. రవీందర్‌రెడ్డిని పోలీసులు ఈనెల 8నే తమ అదపులోకి తీసుకున్నారని నిరంజన్‌రెడ్డి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రూల్ ఆఫ్ లా అంటే పోలీసులకు ఎంతమాత్రం గౌరవం లేదనేందుకు ఈ కేసు ఓ మంచి ఉదాహరణనన్నారు. హైకోర్టు ముందు హాజరుపరచకుండా వారిని కింది కోర్టులో హాజరుపరచడం అంటే హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనని.. ఇది కోర్టు ధిక్కారం కిందకు వస్తుందన్నారు. 48 గంటలకు మించి అక్రమంగా నిర్బంధించడం ద్వారా పోలీసులు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను హరించారన్నారు.పోలీసులను ఇలాగే వదిలేస్తే..పోలీసులు చాలా అక్రమంగా వ్యవహరిస్తున్నారని, వీటిని ఇలాగే వదిలిస్తే రేపు ఓ 100 మందిని అక్రమంగా నిర్బంధించి, వారిని కొట్టి, వారితో కావాల్సిన ప్రతిపక్ష నేతల పేర్లు చెప్పించే పరిస్థితి వస్తుందని నిరంజన్‌రెడ్డి చెప్పారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం, పోలీసులు తమ ఆదేశాలను ఉల్లంఘించారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని స్పష్టంచేసింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. పుల్లూర్ టోల్ ప్లాజా వద్ద రవీంద్రరెడ్డిని అదుపులోకి తీసుకున్నారని, అక్కడ సీసీ ఫుటేజీని భద్రపరిచేలా ఆదేశాలివ్వాలని నిరంజన్‌రెడ్డి ధర్మాసనాన్ని కోరారు. టోల్‌ప్లాజా జాతీయ రహదారుల సంస్థ అధీనంలో ఉన్న నేపథ్యంలో ఆ సంస్థను ఈ వ్యాజ్యంలో ప్రతివాదిగా చేర్చాలని కళ్యాణికి ధర్మాసనం సూచించి తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది. -
చంద్రబాబు సహా వాళ్లంతా కుంభకోణాల్లో నిందితులు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 2014–19 మధ్య జరిగిన పలు భారీ కుంభకోణాలకు సంబంధించి నమోదైన కేసుల్లో కింది కోర్టుకు సమర్పించిన చార్జిషిట్లను, ఆ కేసుల డైరీలను కోర్టు ముందుంచేలా సీఐడీ అదనపు డీజీని ఆదేశించాలని కోరుతూ స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్ కొట్టి బాలగంగాధర్ తిలక్ హైకోర్టులో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఆ కుంభకోణాల్లో నిందితులుగా ఉన్న ప్రస్తుత సీఎం చంద్రబాబు, మంత్రులు పొంగూరు నారాయణ, నారా లోకేశ్, కింజరపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర తదితరులు దర్యాప్తు అధికారులను ప్రభావితం చేసేంత శక్తిమంతమైన స్థానాల్లో ఉన్నారని, అందువల్ల కేసు డైరీల్లోని కీలక ఆధారాలను, సాక్ష్యాలను చెరిపేసే ప్రమాదం ఉందని తిలక్ తన పిటిషన్లో పేర్కొన్నారు.2014–19 మధ్య జరిగిన పలు కుంభకోణాలపై సీఐడీ నమోదు చేసిన కేసుల్లో పోలీసులు నిష్పాక్షికంగా దర్యాప్తు చేసే పరిస్థితులు ప్రస్తుతం లేవని, నిష్పాక్షిక, పారదర్శక, వేగవంత దర్యాప్తు నిమిత్తం ఈ కేసుల తదుపరి దర్యాప్తు బాధ్యతలను సీబీఐ, ఈడీలకు అప్పగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తిలక్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే తిలక్ పలు అంశాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ తాజాగా ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ యంత్రాంగం, దర్యాప్తు సంస్థలన్నీ చంద్రబాబు తదితరులకు క్లీన్‌చీట్ ఇచ్చి వారిపై నమోదైన కేసులన్నింటినీ మూసివేసేందుకు చర్యలు చేపడుతున్నాయని అనుబంధ పిటిషన్లో పేర్కొన్నారు. రూ.కోట్ల కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు కొనసాగిస్తోందని, అందులో భాగంగా పలువురు నిందితుల ఆస్తులను కూడా జప్తు చేసిందని తెలిపారు. అధికారుల్ని చంద్రబాబు లక్ష్యంగా చేసుకున్నారు ‘ఆ కుంభకోణాల్లో నిందితులుగా ఉన్న చంద్రబాబు తదితరులను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) ఐజీ, సీఐడీ అదనపు డీజీ, డీజీపీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శులు గవర్నర్‌ను కోరగలరు. అయితే వీరంతా చంద్రబాబు నియంత్రణలో పనిచేస్తున్నారు. ఐపీఎస్ అధికారుల పనితీరు మదింపు నివేదికలు (ఏపీఏఆర్) ఆమోదించే అధికారం కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు వద్దే ఉంది. అధికారులను బదిలీ చేసే సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ), శాంతి భద్రతల విభాగం కూడా ముఖ్యమంత్రి వద్దే ఉన్నాయి. అందువల్ల ముఖ్యమంత్రిగా ఆ కుంభకోణాలపై దర్యాప్తు చేసిన అధికారుల వృత్తిపరమైన జీవితాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.ఇది నిష్పాక్షిక, పారదర్శక దర్యాప్తును తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. తమపై నమోదైన కేసుల్లో ఫిర్యాదుదారులుగా ఉన్న అధికారులను చంద్రబాబు తదితరులు లక్ష్యంగా చేసుకున్నారు. ఏపీ ఫైబర్‌నెట్ కుంభకోణంపై ఫిర్యాదు చేసిన మధుసూదన్‌రెడ్డి అనే అధికారిని అకారణంగా సస్పెండ్ చేశారు. దీనిపై మధుసూదన్‌రెడ్డి న్యాయపోరాటం చేసి తిరిగి ఉద్యోగం పొందారు. తనపై ఫిర్యాదు చేసిన అధికారులపై చంద్రబాబు కక్ష తీర్చుకుంటున్నారనేందుకు ఇదో ఉదాహరణ. అంతేకాక ఆ కుంభకోణాలపై నిష్పాక్షికంగా, వృత్తిపరంగా దర్యాప్తు చేసిన, దర్యాప్తులో పాలుపంచుకున్న పలువురు అధికారులకు ఎలాంటి పోస్టింగ్‌లు ఇవ్వకుండా పక్కనపెట్టారు’ అని తిలక్ వివరించారు.ముఖ్యమంత్రి సహా ఇప్పుడున్న 25 మంది మంత్రుల్లో ఐదుగురు ఆ కుంభకోణాల్లో నిందితులుగా ఉన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులంతా కూడా ఈ నిందితుల నియంత్రణలో పనిచేస్తున్నారు. సీఐడీ దర్యాప్తు కొనసాగించినా కూడా నిందితులుగా ఉన్న వీరిని ప్రాసిక్యూట్ చేయాలని గవర్నర్‌ను కోరే ఆస్కారమే లేదు. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) చైర్మన్‌గా ముఖ్యమంత్రిగా ఉంటారు. సీఆర్డీఏ పురపాలక శాఖ పరిధిలో పనిచేస్తుంది. దానికి నారాయణ మంత్రిగా ఉన్నారు. సీఆర్డీఏకు నారాయణ వైస్ చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.వీరిద్దరూ ఆ కుంభకోణాల్లో నిందితులు. సీఆర్డీఏ, పురపాలక శాఖ అధికారులందరూ వీరి నియంత్రణలో పనిచేస్తున్నారు. ఇప్పటికే కొందరి సాక్ష్యాలను కింది కోర్టు నమోదు చేసింది. మరికొందరి సాక్ష్యాలు నమోదు చేయాల్సి ఉంది. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కింద కోర్టుకు సమర్పించిన అన్నీ రికార్డులను చంద్రబాబు, నారాయణ పరిశీలించే అవకాశం ఉంది అని తిలక్ తన పిటిషన్లో ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు, లోకేశ్ బెదిరించేలా మాట్లాడుతున్నారు‘బెయిల్ మంజూరు సందర్భంగా సుప్రీంకోర్టు, హైకోర్టు విధించిన షరతులను చంద్రబాబు, నారా లోకేశ్ ఉల్లంఘించారు. వారిపై నమోదైన కేసుల గురించి మీడియా ముందు మాట్లాడారు. దర్యాప్తు అధికారులు, కీలక సాక్షులు చంద్రబాబు నియంత్రణలో పనిచేస్తున్నారు. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వారు మాట్లాడిన మాటలన్నీ కూడా దర్యాప్తును ప్రభావితం చేసేలా, అడ్డుకునేలా ఉన్నాయి. దర్యాప్తు అధికారులను భయపెట్టేలా, బెదిరించేలా మాట్లాడుతున్నారు. కోర్టు ముందు సాక్ష్యం ఇచి్చన పలువురు అధికారులు తమ తప్పును అంగీకరించారు.క్షమాభిక్ష కోరుతూ పిటిషన్లు కూడా దాఖలు చేశారు. కుంభకోణాల్లో పొందిన నగదు టీడీపీ ఖాతాలకు చేరింది. ఈ విషయంపై దర్యాప్తు అధికారులు దర్యాప్తు చేశారా? చేస్తున్నారా? అన్న విషయాలు కేసు డైరీల్లో ఉంటాయి. ఏ కోణంలో చూసినా కూడా చంద్రబాబు తదితరులు అధికారులను, దర్యాప్తును శాసించే స్థానాల్లో ఉన్నారు. కాబట్టి వారిపై నమోదయిన కేసులకు సంబంధించిన కేసు డైరీలను, చార్జిషిట్లను కోర్టు ముందుంచేలా ఆదేశాలు ఇవ్వండి’ అని తిలక్ తన పిటిషన్లో కోర్టును కోరారు. -
హాస్టళ్లలో సం‘క్షేమం’ లేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్ల దుస్థితిపై హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తరచూ ఆందోళన కలిగించే భయంకర ఘటనలు జరుగుతున్నాయని తెలిపింది. ఇలాంటి ఘటనలపై స్పందించకపోతే భవిష్యత్ తరాలపై అది తీవ్ర ప్రభావం చూపుతుందని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపింది. ‘వివిధ సామాజిక, ఆర్ధిక నేపథ్యాల నుంచి వచ్చిన గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్న ఉద్దేశంతో సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్స్ స్కూళ్లను ఏర్పాటు చేశారు. వీటిలో చదివే విద్యార్థులు భద్రంగా, సురక్షితంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత టీచర్లు, ప్రిన్సిపల్ది. రెసిడెన్షియల్ క్యాంపస్‌లో చదువుకునే అమ్మాయిలతో అక్కడ పనిచేసే సిబ్బంది అసభ్యంగా ప్రవర్తించినా, వారిని లైంగికంగా వేధించినా అది పిల్లల తల్లిదండ్రులను భయాందోళనకు గురి చేస్తుంది. తద్వారా తమ పిల్లలను ఆ క్యాంపస్‌లో చేర్చడానికి వారు విముఖత చూపుతారు. సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ క్యాంపస్‌లలో భద్రమైన, సురక్షిత, పరిశుభ్ర వాతావరణం ఉండేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోతే విద్యా పరంగా గ్రామీణ, పట్టణ పిల్లల మధ్య అసమతుల్యత ఏర్పడుతుంది’ అని పేర్కొంది. అనంతపురం జిల్లా నార్పల మండలం బి.పప్పూరు గ్రామానికి చెందిన కె.శంకరయ్య గుత్తిలోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్లో వంట మనిషిగా పని చేస్తూ 2011 జూలై 24న ఓ విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. అధికారులు విచారించి అతన్నిసర్వీసు నుంచి తొలగించారు. దీనిని సవాలు చేస్తూ 2014 ఫిబ్రవరిలో అతను హైకోర్టును ఆశ్రయించాడు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ తుది విచారణ జరిపి.. శంకరయ్యపై తీసుకున్న చర్యలు సబబే అని మూడు రోజుల క్రితం తీర్పు వెలువరించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్ల దుస్థితిపై లోతుగా స్పందిస్తూ ప్రాథమిక మార్గదర్శకాలు జారీ చేశారు. వీటి ఆధారంగా రాష్ట్రంలోని అన్ని సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో కఠినంగా అమలయ్యే విధంగా ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించారు. కర్నూలు జిల్లా కోసిగిలో మురుగుతో పందులకు ఆవాసంగా మారిన హాస్టల్ ప్రాంగణం హైకోర్టు సూచించిన ప్రాథమిక మార్గదర్శకాలు ఇలా.. ⇒ హాస్టల్ భవనం చుట్టూ సోలార్ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్‌తో ప్రహరీ నిర్మించాలి. తప్పనిసరిగా గేటు ఏర్పాటు చేయాలి. ⇒ హాస్టల్ ప్రాంగణంలో రాకపోకలను పర్యవేక్షించడంతో పాటు వాటిని ఎంట్రీ, ఎగ్జిట్ రిజిస్టర్లో నమోదు చేయాలి. ⇒ హాస్టల్ ప్రవేశ మార్గం, కారిడార్లు, కామన్ ఏరియాలు వంటి చోట్ల విద్యార్థుల వ్యక్తిగత గోపత్యకు భంగం కలగకుండా సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. అనధికారికంగా ఆ కెమెరాలను ఆపరేట్ చేయకుండా చర్యలు తీసుకోవాలి. ⇒ మరుగుదొడ్లను శుభ్రంగా నిర్వహించాలి. తగిన నీటి సదుపాయం కల్పించాలి. ⇒ భద్రతా సిబ్బంది సహా మొత్తం సిబ్బంది నేపథ్యాన్ని సమగ్రంగా పరిశీలన చేయాలి. తరచూ శిక్షణ, అవగాహన సెషన్లు ఏర్పాటు చేయాలి. ⇒ సిబ్బంది ముఖ్యంగా ఆడ పిల్లలతో సన్నిహితంగా మెలిగే వారికి లింగ సమానత్వం గురించి, సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా తగిన శిక్షణ ఇవ్వాలి. తద్వారా సమస్య ఏదైనా ఎదురైనప్పుడు ఆడ పిల్లలు ధైర్యంగా ముందుకు వచ్చే సురక్షిత వాతావరణం కల్పించడం సాధ్యమవుతుంది. ⇒ సిబ్బందికి స్పష్టమైన ప్రవర్తనా నియమావళిని నిర్ధేశించాలి. దుష్ప్రవర్తన, అసభ్య ప్రవర్తన, వేధింపులకు ఆస్కారం లేకుండా చూడాలి. ప్రవర్తనా నియమావళిని అందరికీ కనిపించేలా ఏర్పాటు చేయాలి. ⇒ హాస్టల్ వాతావరణానికి అలవాటు పడేలా, వ్యక్తిగత సమస్యల నుంచి బయట పడేలా ఆడ పిల్లలకు మానసిక వైద్యులను అందుబాటులో ఉంచాలి. ఆత్మరక్షణకు వర్క్‌షాపులు నిర్వహించండి ⇒ హాస్టళ్లన్నీ జాతీయ శిశు సంరక్షణ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. ప్రతి చోట పోక్సో చట్టం అమలయ్యేలా చూడాలి. పోక్సో చట్టం కింద విధించే శిక్షల గురించి అందరికీ కనిపించే చోట పోస్టర్లు ఏర్పాటు చేయాలి. ఎలాంటి భయం, ఆందోళన లేకుండా ఫిర్యాదు చేసేలా వ్యవస్థ ఉండాలి. ⇒ తల్లిదండ్రులు, స్థానిక అధికారులు, విద్యా నిర్వహకులు కలిసి ఆడ పిల్లలకు మద్దతుగా నిలిచే వ్యవస్థను సృష్టించాలి. ఆడ పిల్లలు తమను తాము రక్షించుకునేందుకు వీలుగా ఆత్మ రక్షణకు సంబంధించిన వర్క్‌షాపులను తరచూ నిర్వహించాలి. దీని వల్ల అభద్రతా పరిస్థితుల్లో ఆడ పిల్లలు మనోస్థైర్యంతో ధైర్యంగా ఉండే అవకాశం ఉంటుంది. ⇒ హాస్టళ్లలో సమ వయసు్కలతో బృందాలను ఏర్పాటు చేయాలి. తద్వారా విపత్కర పరిస్థితుల్లో ఒకరి బాగోగులు మరొకరు చూసుకునే అవకాశం ఉంటుంది. భద్రత పరమైన చర్యలు సమర్థవంతంగా అమలవుతున్నాయా లేదా అన్న విషయాన్ని ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉండాలి. లోపాలు ఉంటే వాటిని గుర్తించి సరిచేయాలి. ⇒ హాస్టళ్లలో ఉండే విద్యార్థులతో పాటు వారి కుటుంబాల నుంచి ఎప్పటికప్పుడు అభిప్రాయాలు తెలుసుకుంటూ ఉండాలి. తద్వారా మరింత మెరుగైన ఏర్పాట్లు చేయడానికి ఆస్కారం ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో సాయం చేసేందుకు వీలుగా చట్టాన్ని అమలు చేసే సంస్థలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉండాలి. ⇒ ఈ చర్యలన్నింటి ద్వారా రెసిడెన్షియల్ హాస్టళ్లలో ఆడపిల్లల భద్రతకు పెద్దపీట వేసినట్లు అవుతుంది. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా సమగ్ర, ఆదేశ పూర్వక మార్గదర్శకాల రూపకల్పనకు వీలుగా ఈ తీర్పు కాపీని మహిళ, శిశు సంక్షేమ శాఖకు పంపాలని రిజిస్ట్రీని ఆదేశిస్తున్నాం.ఇప్పటికీ హాస్టళ్ల పరిస్థితిలో మార్పు లేదు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి రికార్డులను కూడా పరిశీలించారు. అనంతరం తీర్పు వెలువరిస్తూ, పిటిషనర్ తీరును తీవ్రంగా ఆక్షేపించారు. శంకరయ్యది తీవ్ర దుష్ప్రవర్తన అని తేల్చారు. హాస్టల్లో నిద్రపోతున్న బాలికల పట్ల శంకరయ్య అనుచిత ప్రవర్తన గురించి ఓ టీచర్ అధికారులకు స్పష్టమైన స్టేట్మెంట్ ఇచ్చారన్నారు. నిద్రపోయే సమయంలో తలుపులేసుకోవడంతో పాటు తాళం కూడా వేసుకోవాలని బాలికలకు ఆ టీచర్ చెప్పారంటే శంకరయ్యది ఎలాంటి అభ్యంతరకర ప్రవర్తనో అర్థం చేసుకోవచ్చన్నారు. శంకరయ్యను సర్వీసు నుంచి తొలగిస్తూ అధికారులు ఇచ్చిన ప్రొసీడింగ్స్‌లో ఎలాంటి తప్పు లేదని, వాటిని సమర్ధిస్తున్నట్లు జస్టిస్ హరినాథ్ తన తీర్పులో పేర్కొన్నారు. ఈ ఘటన జరిగి 13 ఏళ్లు గడిచిపోయినప్పటికీ సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, స్కూళ్ల పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు. -
ప్రభుత్వ పెద్దలను మెప్పించేందుకే..
సాక్షి, అమరావతి : ప్రభుత్వ పెద్దలను సంతోష పెట్టేందుకు రాష్ట్రంలో పోలీసులు అరాచకంగా వ్యవహరిస్తున్నారని సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరాం హైకోర్టుకు తెలిపారు. ఇలా చేయడంలో ప్రభుత్వ విధానమే అణచివేత ధోరణిలా ఉందని, దానినే పోలీసులు అనుసరిస్తున్నారన్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై పోలీసులు ఇష్టమొచ్చినట్లు కేసులు నమోదుచేసి అరెస్టుచేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పెద్దలను విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా పోలీసులు ఎడాపెడా కేసులు నమోదు చేస్తున్నారని, ఈ విషయంలో పోలీసులపై విచారణకు ఆదేశించాలని కోరుతూ పాత్రికేయుడు పోలా విజయ్‌బాబు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై బుధవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫున శ్రీరాం వాదనలు వినిపిస్తూ.. మతం, కులం, లింగం, పుట్టిన ప్రాంతం తదితరాల ఆధారంగా వర్గాల మధ్య శతృత్వం సృష్టిస్తూ సెక్షన్–153ఏ కింద కేసులు పెడుతున్నారన్నారు. ఈ సెక్షన్ కింద కేసు నమోదు చెల్లదని.. ఇదే హైకోర్టు గతంలో తీర్పునిచ్చిందన్నారు. ప్రజలకు వ్యతిరేకంగా పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ప్రజల విమర్శలను తట్టుకోలేక సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు పెడుతున్నారని శ్రీరాం వివరించారు. ప్రజల హక్కులను కాలరాస్తున్నారు..ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. కేసులపై అభ్యంతరం ఉంటే దానిపై న్యాయపోరాటం చేసుకోవచ్చునని వ్యాఖ్యానించింది. ఆ పనే చేస్తున్నారని, పోలీసుల అక్రమ నిర్బంధాలపై హేబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలు చేస్తున్నారని శ్రీరాం తెలిపారు. తప్పుడు కేసుల ద్వారా ప్రజల హక్కులను పోలీసులు హరిస్తున్నారన్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు ప్రజలు భయపడేలా చేస్తున్నారని వివరించారు. ప్రతీ దశలోనూ పోలీసులు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని.. ప్రభుత్వ దన్నుతోనే పోలీసులు ఇంత అరాచకానికి పాల్పడుతున్నారని ఆయన ధర్మాసనానికి వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించడాన్ని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో తప్పుపట్టిందన్నారు. ఈ పిల్ దాఖలు చేసిన తరువాత పోలీసులు నిర్ధిష్టంగా ఒకే తరహా కేసులు పెడుతున్నారని ఆయన హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కేసుల నమోదు తప్పుకాదు..ధర్మాసనం స్పందిస్తూ.. సోషల్ మీడియాలో అసభ్య, అభ్యంతరకర పోస్టులు పెడుతున్న వారిపై కేసులు నమోదు చేయడం తప్పుకాదని హైకోర్టు అభిప్రాయపడింది. తమపై (న్యాయమూర్తులు) కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని గుర్తుచేసింది. ఇలాంటి వారిపై కేసులు పెట్టకుండా పోలీసులను నియంత్రించలేమని తెలిపింది. సోషల్ మీడియా ఉన్నది ఇష్టమొచ్చినట్లు మాట్లాడటానికి, పోస్టులు పెట్టడానికి కాదని వ్యాఖ్యానించింది. అలాంటి పోస్టులు పెట్టే వారిని చట్టం ముందు నిలబెట్టడంలో తప్పేముందని ప్రశ్నించింది. కేసులపై అభ్యంతరం ఉంటే వాటిని కొట్టేయాలంటూ క్వాష్ పిటిషన్లు దాఖలు చేసుకోవాలని సూచించింది. అంతేతప్ప.. ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయడానికి వీల్లేదని స్పష్టంచేసింది. ఈ విషయంలో తగిన ఉత్తర్వులు జారీచేస్తామని వెల్లడించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. -
సజ్జల భార్గవ్ కేసు వివరాలేవీ?
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు, ఆయన సతీమణిపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేలా ప్రోత్సహించారని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ సోషల్ మీడియా పూర్వ ఇన్చార్జి సజ్జల భార్గవ్ రెడ్డిపై నమోదు చేసిన కేసు పూర్తి వివరాలను తమ ముందుంచాలని కృష్ణా జిల్లా గుడివాడ రెండో పట్టణ పోలీసులను హైకోర్టు మంగళవారం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ సజ్జల భార్గవ్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.మొసాద్ ఏజెంట్లలా మోహరించి ఉన్నారు..ఈ వ్యాజ్యంపై అత్యవసరంగా విచారణ జరపాలని భార్గవ్ తరఫు సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి న్యాయమూర్తి జస్టిస్ కృపాసాగర్‌ను కోరారు. అంత అత్యవసరం ఏముందని న్యాయమూర్తి ప్రశ్నించగా.. భార్గవ్ కోసం పోలీసులు మొసాద్ ఏజెంట్ల మాదిరిగా మోహరించారని తెలిపారు. ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన వ్యవహారమని చెప్పారు. దీంతో న్యాయమూర్తి విచారణ జరిపారు.ఎప్పుడో మార్చి, ఏప్రిల్, మే నెలల్లో పోస్టులు పెట్టారంటూ ఇప్పుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారని పొన్నవోలు తెలిపారు. సహ నిందితుడు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా భార్గవ్‌ని నిందితుడిగా చేర్చారని తెలిపారు. జూలై 1కి ముందు పెట్టిన పోస్టులపై పోలీసులు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్ కింద కేసులు పెట్టారని, వాస్తవానికి అప్పటికి ఈ చట్టాలేవీ అమల్లోకి రాలేదని తెలిపారు. ఐపీసీ, సీఆర్పీసీ కింద మాత్రమే కేసులు పెట్టాలన్నారు. భార్గవ్ రెడ్డిని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని, అందువల్ల అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. ఇదే వ్యవహారంలో మరో నిందితుడు సిరిగిరెడ్డి అర్జున్‌రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను కూడా న్యాయమూర్తి 14కి వాయిదా వేశారు.అర్జున్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది ఓ. మనోహర్‌రెడ్డి వాదనలు వినిపించారు.కాగా ఇతర ప్రాంతాల్లో నమోదైన కేసుల్లో కూడా ముందస్తు బెయిల్ కోరుతూ భార్గవ్‌రెడ్డి హైకోర్టులో మంగళవారం పిటిషన్లు దాఖలు చేశారు. -
జగన్‌కు ప్రతిపక్ష నేత హోదాపై కౌంటర్లు వేయండి
సాక్షి, అమరావతి : శాసన సభలో తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని కోరుతూ వైఎస్సార్సీపీ శాసన సభాపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై కౌంటర్లు దాఖలు చేసేందుకు శాసన సభ కార్యదర్శి, స్పీకర్ కార్యదర్శికి హైకోర్టు మరింత గడువునిచ్చింది. గతంలో కౌంటర్ల దాఖలుకు మూడు వారాల గడువునిచ్చిన హైకోర్టు, ఇప్పుడు మరో నాలుగు వారాల గడువు ఇచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. చట్ట ప్రకారం శాసన సభలో తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా శాసన సభ కార్యదర్శి, స్పీకర్ కార్యదర్శిని ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శానస సభాపక్ష నేత జగన్మోహన్రెడ్డి ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు.. శాసన సభ, స్పీకర్ కార్యదర్శులకు నోటీసులు జారీ చేసి, కౌంటర్ల దాఖలుకు ఆదేశాలిచ్చింది. తాజాగా ఈ వ్యాజ్యం సోమవారం మరోసారి విచారణకు వచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలుకు మరింత సమయం ఇవ్వాలని శాసన సభ కార్యదర్శి తరఫు న్యాయవాది గింజుపల్లి సుబ్బారావు కోరారు. స్పీకర్‌కు రాజ్యాంగపరమైన రక్షణ ఉందని, ఆ వివరాలను కూడా కౌంటర్లో పొందుపరుస్తామని చెప్పారు. దీనికి జగన్ తరపు న్యాయవాది చింతల సుమన్ స్పందిస్తూ.. హైకోర్టు గతంలోనే నోటీసులు జారీ చేసిందని చెప్పారు.చిరునామా సరిగా లేదంటూ స్పీకర్ కార్యదర్శి నోటీసులు తీసుకునేందుకు నిరాకరించారని తెలిపారు. పోస్టుమేన్ స్పీకర్ కార్యదర్శి కార్యాలయానికి వెళ్లగలిగినప్పుడు చిరునామా సరిగా లేదన్న ప్రశ్నే ఉత్పన్నం కాదని అన్నారు. న్యాయ శాఖ కార్యదర్శి తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ జోక్యం చేసుకుంటూ.. ఈ వ్యాజ్యంలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, శాసన వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చారని, అది అనవసరమని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి, కౌంటర్ల దాఖలుకు అసెంబ్లీ, స్పీకర్ కార్యదర్శులకు మరో నాలుగు వారాల గడువునిస్తూ విచారణను ఆ మేరకు వాయిదా వేశారు. -
సోషల్‌మీడియా కార్యకర్తల నిర్బంధం కేసు.. హైకోర్టుకు తిరుపతి లోకేష్
సాక్షి,గుంటూరు: సోషల్ మీడియా యాక్టివిస్ట్ తిరుపతి లోకేష్ హెబియస్ కార్పస్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టులో సోమవారం(నవంబర్ 11) విచారించింది. ఈ కేసు విచారణ సందర్భంగా తిరుపతి లోకేష్ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా పోలీసులను హైకోర్టు ఆదేశించింది. విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ కు సంబంధించి నవంబర్ ఆరో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకుఉన్నసీసీ ఫుటేజ్ కోర్టుకు సమర్పించాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. కేసు తదుపరి విచారణ ఈనెల 25వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. కాగా, ఏపీలో కొద్ది రోజులుగా యథేచ్ఛగా జరుగుతున్న సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టులు, అక్రమ నిర్బంధాలపై హైకోర్టు శుక్రవారం(నవంబర్ 8) విచారణ సందర్భంగా తీవ్రంగా స్పందించింన విషయం తెలిసిందే. అక్రమ నిర్బంధాల విషయంలో పోలీసుల తీరుపై పలు సందేహాలు వ్యక్తం చేసింది.వ్యక్తుల అరెస్ట్ విషయంలో చట్ట నిబంధనలు పాటించి తీరాల్సిందేనని పోలీసులకు తేల్చి చెప్పింది. లేని పక్షంలో తాము జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని, ఆ పరిస్థితి తేవద్దని హెచ్చరించింది. ఇది వ్యక్తుల స్వేచ్ఛతో ముడిపడి ఉందని, కాబట్టి ఈ విషయాన్ని తేలికగా తీసుకోవద్దని తేల్చి చెప్పింది. చట్ట నిబంధనలు పాటించేలా పోలీసులను చైతన్య పరచాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. విశాఖకు చెందిన సోషల్ మీడియా కార్యకర్త తిరుపతి లోకేష్‌ను సోమవారం తమ ముందు హాజరు పరచాలని పోలీసులను ఇటీవలే కోర్టు ఆదేశించింది. దీంతో పోలీసులు తిరుపతి లోకేష్‌ను పోలీసులు సోమవారం కోర్టు ముందు హాజరుపరిచారు.ఇదీ చదవండి: అక్రమ నిర్బంధాలపై హైకోర్టు ఆరా.. ఖాకీలపై ఆగ్రహం -
సీఐడీ చీఫ్ అయ్యన్నార్ వీరంగం!
సాక్షి, అమరావతి: అక్రమ కేసులతో వేధింపులకు పాల్పడుతున్న చంద్రబాబు ప్రభుత్వం మరింతగా బరితెగించింది. వలపు వలతో బడా బాబులను బురిడీ కొట్టించే కాదంబరి జత్వానీ కుట్రపూరితంగా ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించిన కేసులో న్యాయస్థానం ఆదేశాలను బేఖాతరు చేస్తూ బెదిరింపులకు దిగుతోంది. ఇందులో భాగంగా సీఐడీ చీఫ్‌గా ఉన్న అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్ రంగంలోకి దిగడం.. న్యాయస్థానం ఆదేశాలకు విరుద్ధంగా బెదిరింపులకు పాల్పడటం విభ్రాంతి కలిగిస్తోంది. ఈ కేసులో అరెస్టయిన పారిశ్రామికవేత్త కుక్కల విద్యాసాగర్‌ను కస్టడీలోకి తీసుకుని విచారణ పేరుతో తీవ్రస్థాయిలో బెదిరింపులకు పాల్పడినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో అయ్యన్నార్పై హైకోర్టుకు ఫిర్యాదు చేసేందుకు కుక్కల విద్యాసాగర్ తరఫు న్యాయవాదులు సిద్ధపడుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఏమిటంటే..వేరే గదిలోకి తీసుకువెళ్లి బెదిరింపులు..హనీట్రాప్ ట్రాక్ రికార్డ్ ఉన్న కాదంబరి జత్వానీ ఇచ్చిన ఫిర్యాదుతో పారిశ్రామికవేత్త కుక్కల విద్యాసాగర్‌ను పోలీసులు అరెస్టుచేసి న్యాయస్థానం ఆదేశాలతో రిమాండ్‌కు పంపిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తును ఇటీవల సీఐడీకి బదిలీచేసింది. దీంతో ఈ కేసు దర్యాప్తు చేపట్టిన సీఐడీ అధికారులు విద్యాసాగర్‌ను విచారణ నిమిత్తం న్యాయస్థానం అనుమతితో మూడ్రోజుల కస్టడీకి తీసుకున్నారు. గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో ఆయన్ని ఆదివారం విచారించారు. విచారణ ప్రక్రియను పూర్తిగా ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. అందుకు సీఐడీ కార్యాలయంలో ఓ గదిలో ఆడియో, వీడియో రికార్డింగ్ చేస్తూ కొంతసేపు విచారించారు. ఆ తర్వాత ఆయన్ను మరో గదిలోకి తీసుకెళ్లారు. ఆ గదిలో ఆడియో, వీడియో రికార్డింగ్‌కు ఏర్పాట్లుచేయకపోవడం గమనార్హం. మరి ఆయన్ని ఆ గదిలోకి ఎందుకు తీసుకువెళ్లారన్నది అర్థంకాలేదు. కానీ, కొన్ని క్షణాలకే సీఐడీ అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్ అక్కడికి చేరుకోవడంతో అసలు విషయం స్పష్టమైంది. ఆడియో, వీడియో రికార్డింగ్లేని ఆ గదిలో విద్యాసాగర్‌ను రవిశంకర్ అయ్యన్నార్ తీవ్రస్థాయిలో బెదిరించినట్లు సమాచారం. తాము చెప్పినట్లుగా వాంగ్మూలం ఇవ్వాలని.. లేకపోతే తీవ్ర పరిణామాలుంటాయని ఆయన పోలీసు శైలిలో హెచ్చరించారు. తాము చెప్పిన కొందరి పేర్లను వాంగ్మూలంలో పేర్కొనాలని.. వారు చెప్పినట్లే తాను చేశానని.. అంతా వారి ప్రమేయంతోనే జరిగిందనే అసత్య వాంగ్మూలాన్ని ఇవ్వాలని బెదిరించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా గతంలో తాము ఎవరెవర్ని ఎలా కేసుల్లో ఇరికించింది.. ఎంతగా వేధించిందీ చెబుతూ బెదిరించారు. ఓ సమయంలో ఆయన నిగ్రహం కోల్పోయి మరీ తీవ్రస్థాయిలో విరచుకుపడినట్లు తెలిసింది. దీంతో అసలక్కడ ఏం జరుగుతోందోనని సీఐడీ వర్గాలే కాసేపు ఆందోళన చెందాయి.అయ్యన్నార్ బెదిరింపులపై హైకోర్టుకు నివేదన..న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకుని నిర్వహిస్తున్న విచారణ సందర్భంలోనే సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ నిబంధనలను ఉల్లంఘించడంపట్ల విస్మయం వ్యక్తమవుతోంది. ఆయన వ్యవహారశైలి న్యాయస్థానం ఆదేశాలకు పూర్తి విరుద్ధంగా ఉందన్నది స్పష్టమవుతోంది. మరోవైపు.. అయ్యన్నార్ బెదిరింపులను విద్యాసాగర్ తరఫు న్యాయవాదులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లేందుకు వారు సమాయత్తమవుతున్నారు. కస్టడీలో వేధింపులు, కోర్టు ఆదేశాల ధిక్కరణ తదితర అభియోగాలతో అయ్యన్నార్‌కు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. విద్యాసాగర్ కూడా తనను రవిశంకర్ అయ్యన్నార్ ఏ రీతిలో బెదిరించిందీ.. అంతుచూస్తానని హెచ్చరించిందీ న్యాయస్థానానికి విన్నవించేందుకు సిద్ధపడుతున్నారు. ఈ నేపథ్యంలో.. ఈ కేసుకు సంబంధించి తదుపరి పరిణామాలు ఎలా ఉండనున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. -
Big Question: ఉన్మాదుల తల పగిలేలా హైకోర్టు మొట్టికాయలు..
-
సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ అరెస్టులపై హైకోర్టు సీరియస్
-
అక్రమ నిర్బంధాలపై హైకోర్టు ఆరా.. ఖాకీలపై ఆగ్రహం
సాక్షి అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా కొద్ది రోజులుగా యథేచ్ఛగా జరుగుతున్న సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టులు, అక్రమ నిర్బంధాలపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. అక్రమ నిర్బంధాల విషయంలో పోలీసుల తీరుపై పలు సందేహాలు వ్యక్తం చేసింది. ఇద్దరు సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ నిర్బంధానికి సంబంధించి రెండు పోలీస్ స్టేషన్లలో సీసీ టీవీ ఫుటేజీలను సంబంధిత మేజిస్ట్రేట్ల ఎదుట సీల్డ్ కవర్లలో అందచేయాలని పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. వ్యక్తుల అరెస్ట్ విషయంలో చట్ట నిబంధనలు పాటించి తీరాల్సిందేనని పోలీసులకు తేల్చి చెప్పింది. లేని పక్షంలో తాము జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని, ఆ పరిస్థితి తేవద్దని హెచ్చరించింది. ఇది వ్యక్తుల స్వేచ్ఛతో ముడిపడి ఉందని, కాబట్టి ఈ విషయాన్ని తేలికగా తీసుకోవద్దని తేల్చి చెప్పింది. చట్ట నిబంధనలు పాటించేలా పోలీసులను చైతన్య పరచాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. విశాఖకు చెందిన సోషల్ మీడియా కార్యకర్త తిరుపతి లోకేష్‌ను సోమవారం తమ ముందు హాజరు పరచాలని పోలీసులను ఆదేశించింది. వ్యక్తులను పోలీసులు అక్రమంగా నిర్భందించారంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు కావడం ఎక్కువ అయిందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. దీనిపై తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేస్తూ న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ కుంచం మహేశ్వరరావు ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.కోర్టును ఆశ్రయించిన బాధిత కుటుంబాలు..టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారంటూ పలువురిని పోలీసులు అక్రమంగా నిర్భంధంలోకి తీసుకుంటున్న విషయం తెలిసిందే. గత వారం రోజుల్లో 101 మందిని అక్రమంగా అరెస్టులు చేశారు. తమవారిని పోలీసులు కోర్టు ముందు హాజరు పర్చకుండా అక్రమ నిర్బంధంలో ఉంచడంపై బాధిత కుటుంబాలకు చెందిన పలువురు హైకోర్టును ఆశ్రయించారు. అక్రమంగా నిర్భందించిన తమ కుటుంబ సభ్యులను న్యాయస్థానం ఎదుట హాజరు పరిచేలా ఆదేశించాలంటూ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై జస్టిస్ రఘునందన్‌రావు ధర్మాసనం తాజాగా విచారణ జరిపింది.పౌరుల స్వేచ్ఛను కాపాడతాం..విచారణ సందర్భంగా తిరుపతి లోకేష్ తరఫు న్యాయవాది చింతల సుమన్ వాదనలు వినిపిస్తూ.. వైఎస్సార్ కుటుంబం పేరుతో వాట్సాప్ గ్రూప్‌లో ఉన్న 411 మందికి నోటీసులు ఇచ్చారని నివేదించారు. వారిలో 120 మంది విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో హాజరయ్యారని తెలిపారు. తిరుపతి లోకేష్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు ఈ నెల 5వతేదీన విశాఖ నుంచి విజయవాడ తరలించారన్నారు. లోకేష్ సోదరుడిని పిలిపించి తెల్ల కాగితాలపై సంతకాలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారని ధర్మాసనానికి నివేదించారు. ప్రస్తుతం లోకేష్ జాడ తెలియడం లేదన్నారు. ఈ సమయంలో కోర్టులో ఉన్న విజయవాడ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ జానకి రామయ్యతో ధర్మాసనం నేరుగా మాట్లాడింది. తిరుపతి లోకేష్ సోషల్ మీడియా ద్వారా ఓ గ్రూప్ నిర్వహిస్తూ అసభ్యకర పోస్టులు పెడుతున్నారని ఆయన కోర్టుకు చెప్పారు. దీనిపై ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేశామన్నారు. ఫోన్ చేయడంతో తన బావతో కలిసి లోకేష్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారన్నారు. లోకేష్‌ని విచారించిన అనంతరం నోటీసులు ఇచ్చి పంపామన్నారు. నేరానికి సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలతో ఈ నెల 10న హాజరు కావాలని ఆయనకు సూచించినట్లు చెప్పారు. జానకి రామయ్య చెప్పిన వివరాలను రికార్డు చేసిన ధర్మాసనం.. సోమవారం ఉదయం 10:30 గంటలకు లోకేష్‌ను తమ ముందు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది . ఈ నెల 4వతేదీ నుంచి 8వ తేదీ వరకు సీసీ టీవీ ఫుటేజీని భద్రపరచి సీల్డ్ కవర్లో విజయవాడ మెజిస్ట్రేట్‌కు సమర్పించాలని ఆదేశించింది. అరెస్ట్ చేసిన 24 గంటలలోపు నిందితులను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలని స్పష్టం చేసింది. చట్ట నిబంధనలను పాటించి తీరాలని లేదంటే తమ జోక్యం తప్పదని తేల్చి చెప్పింది. పౌరుల స్వేచ్ఛను కాపాడటం ఈ కోర్టు బాధ్యత అని స్పష్టం చేసింది. అంతకు ముందు పోలీసుల తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ్త సోషల్ మీడియా ద్వారా కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం, అసభ్య వ్యాఖ్యలు చేస్తున్నారని నివేదించారు. ఇలాంటి వారికి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొనగా, దీనిపై ధర్మాసనం స్పందిస్తూ చట్ట నిబంధనలను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.టేకులపల్లి స్టేషన్ ఫుటేజీ కూడా..అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం ఆత్మకూరుకు చెందిన జింకల నాగరాజు అక్రమ నిర్భందంపై దాఖలైన పిటిషన్లపై విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించించింది. టేకులపల్లి స్టేషన్‌లోని సీసీ టీవీ ఫుటేజీని భద్రపరచి సంబంధిత మేజిస్ట్రేట్ ముందు ఉంచాలని పోలీసులను ఆదేశించింది. -
అక్రమ నిర్బంధాలపై ఏపీ హైకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు జారీ
అమరావతి, సాక్షి: వైఎస్సార్సీపీ సోషల్ మీడియా సిబ్బంది అక్రమ నిర్బంధాలపై ఏపీ హైకోర్టు సీరియస్ అయ్యింది. ఈ మేరకు బాధిత కుటుంబాలు దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై కీలక ఆదేశాలు జారీ చేసింది. పోలీస్ స్టేషన్ల నుంచి సీసీటీవీ ఫుటేజీలను సమర్పించాలంటూ ఆ ఆదేశాల్లో పేర్కొంది. పోలీస్ స్టేషన్ల నుంచి సీసీటీవీ ఫుటేజీలు ఇవ్వాలి. ఈ నెల 4 నుంచి ఇవాళ్టి వరకు సీసీ ఫుటేజీలను స్థానిక మెజిస్ట్రేలకు సమర్పించాలి. పౌరస్వేచ్ఛను కాపాడడంలో ఈ కోర్టుకు బాధ్యత ఉంది. చట్టానికి లోబడి వ్యవహరిస్తున్నారా? లేదా?. ప్రొసీజర్ ఫాలో కాకపోతే.. భవిష్యత్తులో ఏం చేయాలో చూస్తాం అంటూ ప్రభుత్వానికి ధర్మాసనం హెచ్చరికలు జారీ చేసింది. ఉదయం.. హెబియస్ కార్పస్ పిటిషన్లను విచారణకు స్వీకరించిన ధర్మాసనం.. ఏపీ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. ఇన్నేసి పిటిషన్లు దాఖలు కావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో అసలేం జరుగుతోందంటూ ఏపీ ప్రభుత్వాన్ని నిలదీసింది. మధ్యాహ్నాం భోజన విరామం తర్వాత తిరిగి విచారణ ప్రారంభం కాగా.. ఇవన్నీ తప్పుడు పిటిషన్లని, తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేయాలని ధర్మాసనాన్ని అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కోరారు. అయితే ఇవన్నీ నిజమైన పిటిషనలేనని, బాధిత కుటుంబ సభ్యులే వీటిని వేశారని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. దీంతో..ఏజీ విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది. అదే టైంలో.. పిటిషన్లు వేసిన వాళ్లందరినీ పోలీసులు వదిలేశారని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు బెంచ్ దృష్టికి తీసుకువచ్చారు. అయితే ఈ వాదనపై న్యాయమూర్తులు అనుమానాలు వ్యక్తం చేశారు. ‘‘మీ మాటలు మేము ఎలా నమ్మాలి. మీరు వదిలేశారు అనడానికి ఆధారాలు ఏంటి?’’ అని ప్రశ్నిస్తూ.. ఆ ఆరుగురు ఎక్కడ ఉన్నారో వెంటనే కనుక్కుని చెప్పాలి’’ని ప్రభుత్వం తరఫున న్యాయవాదులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదే టైంలో పీఎస్‌ల సీసీటీవీ ఫుటేజీలను సమర్పించాలని స్పష్టం చేస్తూ.. తదుపరి విచారణను సోమవారానికి(11వ తేదీకి) వాయిదా వేసింది. -
AP: రాష్ట్రంలో అసలేం జరుగుతోంది?.. హెబియస్ కార్పస్ పిటిషన్లపై హైకోర్టు ఆశ్చర్యం
సాక్షి,తాడేపల్లి : కూటమి ప్రభుత్వంలో పోలీసుల అక్రమ నిర్బంధాలపై వైఎస్సార్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్‌ల కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. పదుల సంఖ్యలో హెబియస్ కార్పస్ పిటిషన్లను దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై ఇవాళ (శుక్రవారం) ఉదయం న్యాయస్థానం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా ఒకేసారి భారీ మొత్తంలో దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్లపై హైకోర్ట్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అసలు రాష్ట్రంలో ఏం జరగుతుందంటూ ప్రశ్నించింది. విచారణకు రావాలని ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌కు ఆదేశించింది. మధ్యాహ్నానికి వాయిదా వేసింది. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లు జింకాల రామాంజనేయులు, తిరుపతి లోకేష్, మునగాల హరీశ్వరరెడ్డి, నక్కిన శ్యామ్, పెద్దిరెడ్డి సుధారాణి-వెంకటరెడ్డి దంపతులు, మహమ్మద్ ఖాజాభాషాలను పోలీసులు అక్రమంగా నిర్భందించారు. పోలీసుల నిర్భందంపై బాధితుల కుటుంబ సభ్యులు హైకోర్టు మెట్లెక్కారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆరు హెబియస్ కార్పస్ పిటిషన్లను దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. విచారణలో ఒకేసారి ఇన్ని హెబియస్ కార్పస్ పిటిషన్లు పడటంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. హెబియస్ కార్పస్ పిటిషన్లపై లంచ్ తర్వాత విచారణ చేపట్టనుంది హైకోర్టు -
YSRCP సోషల్ మీడియా ప్రతినిధుల అరెస్ట్‌లు.. హైకోర్టులో పిల్ దాఖలు
గుంటూరు, సాక్షి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధుల అక్రమ అరెస్టులపై అడ్వకేట్ విజయబాబు ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఆర్టికల్ 14,19, 21ను అతిక్రమించి అరెస్టు చేశారని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు.‘‘పోలీసులు రెడ్ బుక్‌ను ఫాలో అవుతున్నారు. డీజీపీతోపాటు ఏడు మంది ఎస్పీలు, ఒక సీపీ ఎనిమిది మంది సీఐలు కొంతమంది పోలీసులు అధికార పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. ఏడేళ్లు లోపు శిక్ష పడే కేసులకు 41 ఏ నోటీస్ ఇవ్వడం లేదు. మా వద్ద ఉన్న సోషల్ మీడియా అక్రమ కేసులకు సంబంధించిన కొన్ని ఎఫ్ఐఆర్ వివరాలు ఈ పిల్ పొందుపరుస్తున్నాం. సోషల్ మీడియా అక్రమ అరెస్టులకు సంబంధించి పూర్తి వివరాలను ప్రభుత్వం అందించాలి. చట్టానికి, నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా అరెస్టు చేసిన వారికి ప్రభుత్వ నష్టపరిహారం చెల్లించాలి’ అని విజయ్ బాబు పిల్లో పేర్కొన్నారు. -
రూ.2,610 కోట్ల అక్రమ డిపాజిట్లు.. 18 ఏళ్లుగా జిత్తులు!
చట్టపరమైన చర్యల కోసం కింది కోర్టులో అ«దీకృత అధికారి ఫిర్యాదు చేస్తే దానిపై పిటిషన్..! వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు కమిషన్‌ను నియమిస్తే పిటిషన్...! అధీకృత అధికారిని నియమిస్తే పిటిషన్..! కేసు వాదించడానికి స్పెషల్ పీపీని నియమిస్తే పిటిషన్! కింది కోర్టు విచారణకు స్వీకరిస్తే పిటిషన్...! వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశిస్తే పిటిషన్..! హైకోర్టు జోక్యానికి నిరాకరిస్తే సుప్రీంకోర్టులో పిటిషన్...!! ఇలా పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ, స్టేల మీద స్టేలు పొందుతూ మార్గదర్శి, రామోజీరావు కాలం వెళ్లదీస్తూ వచ్చారు. దాని ఫలితంగానే గత 18 ఏళ్లుగా కేసు కొనసాగుతూ వస్తోంది. ప్రజల నుంచి ఏకంగా రూ.2,610 కోట్ల మేర డిపాజిట్లను అక్రమంగా వసూలు చేసిన మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని కర్త రామోజీరావు బండారం 2006 నవంబర్ 6న బట్టబయలైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చట్టం సెక్షన్ 45 ఎస్‌కు విరుద్ధంగా అక్రమంగా డిపాజిట్లు వసూలు చేయడంపై ప్రజల ముందు నిలబెట్టిన రోజు అది. ఇంత భారీ మొత్తంలో డిపాజిట్లు వసూలు చేసి అడ్డంగా దొరికిపోయిన మార్గదర్శి, రామోజీరావు చట్టం నుంచి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తూ వచ్చారు.ప్రతి దశలోనూ విచారణను అడ్డుకుంటూ వచ్చారు. అయితే ఈ కేసులో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తిరిగి విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు ఈ నెల 7వ తేదీన మరోసారి విచారణ జరపనుంది. ఆర్బీఐ చట్టం సెక్షన్ 45 ఎస్‌కు విరుద్ధంగా మార్గదర్శి డిపాజిట్లు స్వీకరించిందా? లేదా? అనే విషయాన్ని తేల్చనుంది. చట్ట విరుద్ధంగా మార్గదర్శి డిపాజిట్లు సేకరించినట్లు తేలితే వసూలు చేసిన రూ.2,610 కోట్లకు రెట్టింపు మొత్తాన్ని జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. అటు అక్రమ డిపాజిట్లు.. ఇటు నష్టాలంటూ రామోజీరావు 1972లో హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్) కింద మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను ఏర్పాటు చేశారు. 1997 కేంద్ర చట్టం ప్రకారం హెచ్‌యూఎఫ్ లాంటి అన్ ఇన్ కార్పొరేటెడ్ (చట్టపరంగా ఓ కంపెనీగా రిజిష్టర్ కాకుండా వ్యాపారం చేసేవి) సంస్థలు వ్యాపార కార్యకలాపాల కోసం ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడం నిషిద్ధం. అయితే దీన్ని ఖాతరు చేయకుండా మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్బీఐ చట్ట నిబంధనలను ఉల్లంఘించి 1997 నుంచి 2006 మార్చి నాటికి 2.75 లక్షల మంది డిపాజిటర్ల నుంచి దాదాపు రూ.2,610.38 కోట్లు అక్రమంగా వసూలు చేసింది. ఇంత భారీగా డిపాజిట్లు వసూలు చేసిన మార్గదర్శి ఆశ్చర్యకరంగా 2006 మార్చి నాటికి రూ.1,369.47 కోట్లను వృద్ధి చెందుతున్న నష్టాలుగా చూపింది. తద్వారా 50 శాతం మంది డిపాజిటర్లకు డిపాజిట్లు చెల్లించలేని పరిస్థితికి మార్గదర్శి ఫైనాన్షియర్స్ చేరింది. డొంక కదిల్చిన ఉండవల్లి... మార్గదర్శి ఫైనాన్షియర్స్ ద్వారా రామోజీ చట్ట విరుద్ధంగా డిపాజిట్లు స్వీకరించడంపై అప్పటి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ 2006 నవంబర్ 6న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదు చేశారు. మార్గదర్శి అక్రమాల తీరును బహిర్గతం చేశారు. ఇదే సమయంలో ఆ డిపాజిట్ల వివరాలను ఆర్బీఐ అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి పంపడంతోపాటు మార్గదర్శి ఫైనాన్షియర్స్ నుంచి వివరణ కోరింది.వాస్తవానికి 1997లోనే డిపాజిట్ల సేకరణపై మార్గదర్శి స్పష్టత కోరగా ప్రజల నుంచి అలా సేకరించడం చట్ట విరుద్ధమని ఆర్బీఐ అప్పుడే స్పష్టం చేసింది. అయినా సరే పట్టించుకోకుండా మార్గదర్శి చట్ట విరుద్ధంగా డిపాజిట్లు సేకరిస్తూ వచి్చంది. ఎప్పుడైతే ఉండవల్లి అరుణ్ కుమార్ ఫిర్యాదు చేశారో అప్పుడు మళ్లీ ఆర్బీఐ దీనిపై స్పందించింది. డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని ఆర్బీఐ స్పష్టంగా చెప్పింది. రంగాచారి, కృష్ణరాజు నియామకం.. డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకునే అధికారం తమకు లేదని ఆర్బీఐ చేతులెత్తేయడంతో చట్ట ప్రకారం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ముందుగా మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమాలపై నిగ్గు తేల్చి నివేదిక ఇచ్చేందుకు అప్పటి ప్రభుత్వ సలహాదారు (ఫైనాన్స్) ఎన్.రంగాచారిని, చట్ట ప్రకారం న్యాయస్థానాల్లో ఫిర్యాదు చేసేందుకు, తదనుగుణంగా చర్యలు తీసుకునేందుకు ఐపీఎస్ టి.కృష్ణరాజును అ«దీకృత అధికారిగా నియమిస్తూ జీవో జారీ చేసింది. ఈ నియామకాలను సవాలు చేస్తూ రామోజీ 2006లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా న్యాయస్థానం కొట్టివేసింది. అనంతరం 2007లో సుప్రీంకోర్టును ఆశ్రయించగా అత్యున్నత న్యాయస్థానం సైతం ఆ పిటిషన్‌ను కొట్టేసింది. ఐటీ శాఖ నుంచి సేకరించిన రంగాచారి.. డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా రంగాచారి నిర్వహించిన విచారణకు రామోజీరావు, మార్గదర్శి సహకరించకుండా కార్యాలయాల్లో తనిఖీలకు అడ్డంకులు సృష్టించారు. తమ పిటిషన్లు కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్నాయని, డాక్యుమెంట్లు ఇచ్చేది లేదంటూ మొండికేశారు. దీంతో రంగాచారి ఆ వివరాలను ఆదాయపు పన్ను శాఖ నుంచి తెప్పించుకున్నారు. ఆర్బీఐ చట్టం సెక్షన్ 45(ఎస్)కు విరుద్ధంగా మార్గదర్శి డిపాజిట్లు సేకరించడం నిజమేనని పేర్కొంటూ 2007 ఫిబ్రవరి 19న ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. వడ్డీ చెల్లించే అలవాటే మార్గదర్శికి లేదని, ఒత్తిడి చేస్తేనే చెల్లిస్తుందంటూ ఓ డిపాజిటర్ హైకోర్టుకు నివేదించటాన్ని తన నివేదికలో పొందుపరిచారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆరి్థక పరిస్థితి దారుణంగా ఉందని, అది డిపాజిట్లను తిరిగి చెల్లించే స్థితిలో లేదని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. రామోజీ పెట్టుబడి రూపాయైనా లేదు.. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ద్వారా ప్రజల నుంచి సేకరించిన డిపాజిట్లను రామోజీ తన అనుబంధ కంపెనీలకు మళ్లించడమే నష్టాలకు ప్రధాన కారణమని రంగాచారి తన విచారణలో తేల్చారు. 2000, ఆ తరువాత బ్యాలెన్స్ షీట్లను గమనిస్తే మార్గదర్శి ఫైనాన్షియర్స్‌లో రామోజీ ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదన్నారు. ప్రజల నుంచి వసూలు చేసిన డిపాజిట్లతోనే మార్గదర్శిని నడిపారని నిగ్గు తేల్చారు. కోర్టు అనుమతితో తనిఖీలు.. మరోవైపు ఈ కేసులో అ«దీకృత అధికారిగా నియమితులైన కృష్ణరాజు కోర్టు అనుమతితో మార్గదర్శి ఫైనాన్షియర్స్‌లో తనిఖీలు చేశారు. దీన్ని సవాలు చేస్తూ మార్గదర్శి, రామోజీరావు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ 14.3.2007న కోర్టు ఉత్తర్వులిచి్చంది. దీనిపై రామోజీ హైకోర్టును ఆశ్రయించగా కింది కోర్టు ఇచి్చన సెర్చ్ వారెంట్‌ను నిలుపుదల చేసింది. ఈ క్రమంలో చట్ట ఉల్లంఘనలకు పాల్పడినందుకు మార్గదర్శి ఫైనాన్షియర్స్, రామోజీరావులను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ అ«దీకృత అధికారి టి.కృష్ణరాజు 2008 జనవరి 23న నాంపల్లి మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజి్రస్టేట్ కోర్టులో ఫిర్యాదు (సీసీ నెంబర్ 540) చేశారు. దీన్ని కొట్టి వేయాలంటూ అదే ఏడాది రామోజీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. జస్టిస్ రజనీ స్టేతో మూలపడిన కేసు.. దీంతో దిక్కుతోచని రామోజీ 2010లో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. అ«దీకృత అధికారి ఇచ్చిన ఫిర్యాదులో విచారణను సెక్షన్ 45(ఎస్)(1), 45(ఎస్)(2), 58బీ(5ఏ) రెడ్ విత్ సెక్షన్ 58(ఈ)లకే పరిమితం చేయాలన్న అభ్యర్థనను తోసిపుచ్చుతూ నాంపల్లి కోర్టు 2011లో ఉత్తర్వులిచ్చి0ది. ఈ ఉత్తర్వులపై మార్గదర్శి, రామోజీ హైకోర్టును ఆశ్రయించారు. ఆర్బీఐ చట్టం పరిధిలోకి మార్గదర్శి ఫైనాన్షియర్స్ రాదంటూ వాదించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన అప్పటి న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీ మార్గదర్శిపై కృష్ణరాజు దాఖలు చేసిన ఫిర్యాదులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ 20.7. 2011న మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.‘‘స్టే’’ వల్ల కేసు అప్పటి నుంచి మూలనపడిపోయింది. అటు తరువాత వచి్చన ప్రభుత్వాలు రామోజీ గుప్పిట్లో ఉండటంతో మార్గదర్శి అక్రమాలను పట్టించుకోలేదు. విచారణ.. తీర్పు.. ఒకే రోజు ఉమ్మడి హైకోర్టు విభజన 1.1.2019న జరిగింది. 31.12.2018 ఉమ్మడి హైకోర్టుకు చివరి రోజు. అటు న్యాయవాదులు ఇటు న్యాయమూర్తులు అందరూ భావోద్వేగ వాతావరణంలో ఉన్నారు. కేసుల విచారణపై దృష్టి సారించలేని పరిస్థితిని రామోజీరావు తనకు అనుకూలంగా మలచుకున్నారు. నాంపల్లి కోర్టులో అ«దీకృత కృష్ణరాజు చేసిన ఫిర్యాదును కొట్టేయాలంటూ 2011లో తాము దాఖలు చేసిన వ్యాజ్యాలను రామోజీ విచారణకు తెప్పించారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీ విచారణ జరిపారు. రామోజీరావు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రాను రంగంలోకి దించారు. లూథ్రా వాదనలు విన్న జస్టిస్ రజనీ ఇంత పెద్ద కేసులో అదే రోజు అంటే 31వతేదీన తీర్పు కూడా ఇచ్చేశారు. రామోజీ, మార్గదర్శి వాదనను సమరి్థంచారు. హెచ్‌యూఎఫ్.. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45ఎస్ పరిధిలోకి రాదని జస్టిస్ రజనీ తన తీర్పులో తేల్చేశారు. మార్గదర్శి, రామోజీరావులను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ నాంపల్లి కోర్టులో అధీకృత అధికారి కృష్ణరాజు దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టేస్తూ తీర్పునిచ్చారు. ఇంత పెద్ద కేసులో ఒకే రోజు విచారణ జరిపి అదే రోజు తీర్పునివ్వడం అరుదైన ఘటన. అసలు ఈ కేసు విచారణకు వచ్చినట్లు గానీ, న్యాయమూర్తి ఈ విధంగా తీర్పునిచ్చినట్లుగానీ ఎవరూ గుర్తించలేదు. అటు తరువాత కొద్ది నెలలకు ఈ తీర్పు వెలుగు చూసింది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. జస్టిస్ రజనీ తీర్పుపై మార్గదర్శి, రామోజీరావు సుప్రీంకోర్టును ఆశ్రయించడం. అటు తరువాత మార్గదర్శి ఫైనాన్షియర్స్ కుంభకోణాన్ని బయటపెట్టిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అప్రమత్తమై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ 2019 డిసెంబర్ 17న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంలో ఆంధప్రదేశ్ ప్రభుత్వం ఇంప్లీడ్ అయింది. హైకోర్టు తీర్పును రద్దు చేసిన సుప్రీం.. హైకోర్టు తీర్పులో కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మార్గదర్శి, రామోజీరావు 19.9.2020న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసును కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం17.8.2022న సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అటు ఉండవల్లి అరుణ్ కుమార్, ఏపీ ప్రభుత్వం, ఇటు మార్గదర్శి, రామోజీరావు వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు 2020 నుంచి విచారిస్తూ వచ్చి0ది. మార్గదర్శి, రామోజీరావు చట్ట ఉల్లంఘనలకు పాల్పడినట్లు విచారణ సందర్భంగా ఆర్బీఐ న్యాయవాది మౌఖికంగా కోర్టుకు తెలిపారు. చివరగా ఈ ఏడాది ఏప్రిల్ 9న సుప్రీంకోర్టు ఈ వ్యాజ్యాలన్నింటిపై విచారణ జరిపింది. చట్ట ఉల్లంఘనలకు పాల్పడినందుకు రామోజీరావు, మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ అ«దీకృత అధికారి కృష్ణరాజు నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసింది. కేసుల కొట్టివేతకు సుప్రీం నిరాకరణ.. డిపాజిట్లు తిరిగి ఇచ్చేశాం కాబట్టి తనపై కేసులు కొట్టేయాలంటూ ఇదే సమయంలో రామోజీ, మార్గర్శి ఫైనాన్షియర్స్ చేసిన అభ్యర్థనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చి0ది. చట్ట విరుద్ధంగా సేకరించిన డిపాజిట్లపై నిగ్గు తేలాల్సిందేనని.. మార్గదర్శి, రామోజీకి అనుకూలంగా హైకోర్టు ఏకపక్షంగా ఇచి్చన తీర్పును పక్కనపెడుతున్నామని స్పష్టం చేసింది. కేసు లోతుల్లోకి వెళ్లి అందరి వాదనలు వినాలని, సీనియర్ న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. తాజాగా విచారణ జరిపి ఆరు నెలల్లో విచారణను ముగించాలని, సేకరించిన డిపాజిట్లకు సంబంధించి పబ్లిక్ నోటీసు ఇవ్వాలని తెలిపింది. తిరిగి విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు... సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు ఈ ఏడాది జూన్‌లో తిరిగి విచారణ ప్రారంభించింది. విచారణ జరుగుతుండగానే రామోజీరావు మరణించగా ఆయన స్థానంలో హెచ్‌యూఎఫ్ కర్తగా తనను చేర్చాలని రామోజీ కుమారుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పలు దఫాలు వాయిదాల అనంతరం పూర్తిస్థాయి వాదనల నిమిత్తం ఈ నెల 7న విచారణ చేపట్టనున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. -
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు భారీ ఊరట
-
ఉద్యోగం నుంచి తొలగించడం సబబే
సాక్షి, అమరావతి: తనకు వినికిడి లోపం ఉందని నకిలీ ధ్రువీకరణ పత్రం సమర్పించి దివ్యాంగుల కోటాలో స్కూల్ అసిస్టెంట్‌గా ఉద్యోగం సంపాదించిన ఓ మహిళను సర్వీస్ నుంచి తొలగిస్తూ విద్యాశాఖ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. సర్వీస్ నుంచి వెళ్లిపోయే స్వేచ్ఛను ఆ మహిళా టీచర్‌కు ఇస్తూ ఏపీ పరిపాలనా ట్రిబ్యునల్ (ఏపీఏటీ) ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది.తనకు వినికిడి లోపం లేదని తెలిసి కూడా.. ఆ లోపం ఉన్నట్టు నకిలీ ధ్రువీకరణ పత్రం సమర్పించి ఉద్యోగం పొందినందుకు ఆ మహిళకు రూ.లక్ష ఖర్చులు విధించింది. ఈ మొత్తాన్ని నెల రోజుల్లోపు విశాఖపట్నంలో వినికిడి లోపంతో బాధపడుతున్న వారి కోసం ప్రత్యేక స్కూల్ నిర్వహిస్తున్న ఓంకార్ అండ్ లయన్స్ ఎడ్యుకేషనల్ సొసైటీకి చెల్లించాలని ఆ మహిళను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరీ, జస్టిస్ న్యాపతి విజయ్ ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది.కేసు పూర్వాపరాలివీ2012లో నిర్వహించిన డీఎస్సీలో దివ్యాంగుల కోటా (వినికిడి లోపం) కింద స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు జి.వెంకటనాగ మారుతి అనే మహిళ ఎంపికయ్యారు. అంతకు ముందు ఆమె తనకు 70 శాతం వినికిడి వైకల్యం ఉందని దరఖాస్తులో పేర్కొన్నారు. దీంతో ఆమె ప్రకాశం జిల్లా పి.నాగులవరం జెడ్పీ హైసూ్కల్లో స్కూల్ అసిస్టెంట్‌గా నియమితులయ్యారు. అయితే.. వినికిడి లోపానికి సంబంధించి ఆమె సమర్పించిన ధ్రువీకరణ పత్రంపై ఫిర్యాదు రావడంతో విచారణ జరిపిన విద్యాశాఖ అధికారులు ఆమెను సర్వీసు నుంచి తొలగిస్తూ 2015 మార్చిలో ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ మారుతి ఏపీఏటీలో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన ట్రిబ్యునల్ మారుతిని సర్వీసు నుంచి తొలగిస్తూ అధికారులు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. స్వచ్ఛందంగా ఉద్యోగం నుంచి వెళ్లిపోయేందుకు ఆమెకు అవకాశం ఇవ్వాలని అధికారులను ఆదేశిస్తూ 2017లో తీర్పునిచ్చింది. ట్రిబ్యునల్ తీర్పును సవాల్ చేస్తూ ఆమె 2018లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ తిల్హరీ నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల తుది విచారణ జరిపింది. దివ్యాంగుల కోటా కిందకు తాను రానని తెలిసి కూడా నాగ మారుతి అదే కోటా కింద దరఖాస్తు చేసి తప్పుడు వివరాలు పొందుపరచి, నకిలీ ధ్రువీకరణ పత్రం సమర్పించి ఉద్యోగం పొందారని ధర్మాసనం తేల్చింది. ఉద్యోగం పొందేందుకు పిటిషనర్ మోసపూరితంగా వ్యవహరించారని స్పష్టం చేసింది. ఉద్యోగం నుంచి తొలగించాల్సి ఉండగా, స్వచ్ఛందంగా ఉద్యోగం నుంచి వెళ్లిపోయేందుకు అమెకు వెసులుబాటు కల్పించాలని అధికారులను ట్రిబ్యునల్ ఆదేశించడం పట్ల విస్మయం వ్యక్తం చేసింది. అమెను సర్వీసు నుంచి తొలగిస్తూ అధికారులు ఇచ్చిన ఉత్తర్వులు సబబేనంది. -
వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి ఊరట
సాక్షి, గుంటూరు : వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి ఊరట దక్కింది. పుంగనూరు కేసులో మిథున్‌రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తనపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిందంటూ ఏపీ హైకోర్టులో ఎంపీ మిథున్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం మిథున్‌రెడ్డికి బెయిల్ ఇచ్చింది. మిథున్‌రెడ్డితో పాటు మరో ఐదుగురికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
అరెస్ట్‌కు కారణాలను రాతపూర్వకంగా చెప్పాల్సిందే
సాక్షి, అమరావతి: ఏ కేసులో అయినా అరెస్ట్‌కు గల కారణాలను నిందితులకు రాతపూర్వకంగా ఇవ్వాల్సిందేనని హైకోర్టు ఆదేశించింది. ఈ విషయంలో పోలీసులు ఏకీకృత, నిర్ధిష్ట విధానాన్ని అనుసరించడం లేదన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఆ దిశగా కీలక ఆదేశాలు జారీ చేసింది. అరెస్ట్‌కు గల కారణాలను నిందితునికి రాతపూర్వకంగా తెలియచేసి తీరాలని పోలీసులను ఆదేశించింది. తద్వారా కస్టోడియల్ రిమాండ్ నుంచి తనను తాను కాపాడుకుని, బెయిల్ కోరేందుకు అవకాశం ఇవ్వాలని తేల్చిచెప్పింది. అలా చేయని పక్షంలో వివాదాస్పద అంశాల్లో వాస్తవాలేమిటన్న విషయం తేలకుండా పోతుందని పేర్కొంది.అరెస్ట్‌కు గల కారణాలను నిందితులకు రాతపూర్వకంగా తెలియచేసే విషయంలో ఏకీకృత విధానాన్ని రూపొందించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది. అరెస్ట్‌కు దారి తీసిన కేసుకు సంబంధించిన మౌలిక వివరాలను కూడా అందులో పొందుపరచాలంది. అరెస్ట్‌కు సంబంధించి ఏ కారణాలనైతే నిందితునికి తెలియచేశారో వాటిని రిమాండ్ రిపోర్ట్‌తో జత చేయాలని కూడా ఆదేశించింది.రిమాండ్ అధికారాన్ని ఉపయోగించే న్యాయాధికారులు, మేజిస్ట్రేట్లు, జడ్జీలందరూ అరెస్ట్‌కు గల కారణాలను నిందితులకు తెలియచేయాలన్న రాజ్యాంగంలోని అధికరణ 22(1)లోని ఆదేశాన్ని, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్ఎస్ఎస్)లోని సెక్షన్ 47(1)ను పోలీసులు అనుసరించారా లేదా అన్న దానిపై తమ సంతృప్తిని రికార్డ్ చేసి తీరాల్సిందేనని స్పష్టం చేసింది. అరెస్టయిన వ్యక్తికి కూడా హక్కులుంటాయని, మానవ హక్కులు కూడా వర్తిస్తాయని తెలిపింది.విద్యాసాగర్ రిమాండ్ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోంసినీ నటి కాదంబరి జత్వానీ ఫిర్యాదు మేరకు పోలీసులు నమోదు చేసిన కేసులో విజయవాడ కోర్టు తనకు రిమాండ్ విధించడాన్ని సవాల్ చేస్తూ వ్యాపారవేత్త కుక్కల విద్యాసాగర్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. విద్యాసాగర్ రిమాండ్ విషయంలో విజయవాడ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సమర్థించింది. విజయవాడ కోర్టు రిమాండ్ ఉత్తర్వులను కొట్టేసేందుకు ఎలాంటి కారణం కనిపించడం లేదంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి సోమవారం తీర్పు వెలువరించారు. ఈ తీర్పు కాపీని రాష్ట్రంలోని న్యాయాధికారులందరికీ, డీజీపీకి పంపాలని రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశించారు.ఇదే సమయంలో తన అరెస్ట్ గురించి, అరెస్ట్‌కు గల కారణాల గురించి తన కుటుంబ సభ్యులకు గానీ, స్నేహితులకు గానీ పోలీసులు తెలియచేయలేదన్న విద్యాసాగర్ వాదనను న్యాయమూర్తి తన తీర్పులో తోసిపుచ్చారు. అరెస్ట్ గురించి, అరెస్ట్‌కుగల కారణాలను పోలీసులు విద్యాసాగర్‌కు 20.09.2024 ఉదయం 6.30 గంటల సమయంలోనే తెలియచేశారన్నారు. రిమాండ్ రిపోర్ట్‌లో జతచేసిన డాక్యుమెంట్లలో విద్యాసాగర్ అరెస్ట్‌కు సంబంధించిన అరెస్ట్ మెమో కూడా ఉందని తెలిపారు. జత్వానీ ఫిర్యాదు మేరకు విద్యాసాగర్‌పై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఆయన్ను అరెస్ట్ చేశారు. విజయవాడ కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. దీనిని సవాల్ చేస్తూ విద్యాసాగర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సుదీర్ఘ విచారణ జరిపిన జస్టిస్ చక్రవర్తి సోమవారం తీర్పు చెప్పారు. -
హైకోర్టులో ఇవాళ ముగ్గురు అదనపు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం
-
బెయిల్ రద్దు కుట్రలో భాగమౌతారా?: విజయసాయిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఈడీ జప్తు చేసిన, హైకోర్టు స్టే విధించిన సరస్వతి పవర్ షేర్లను ట్రాన్స్ఫర్ చేస్తే వైఎస్ జగన్‌కు ఇబ్బందులు ఎదురై బెయిల్ రద్దు అయ్యే పరిస్థితి ఉత్పన్నం అవుతుందని తెలిసినా షర్మిల రాజకీయ కుట్రలో భాగస్వామిగా మారి కుట్రపూరితంగా వ్యవహరించారని వైఎస్సార్సీపీ రాజ్యసభ పక్ష నేత వి.విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. దీనిపై వైఎస్ జగన్ రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జీల న్యాయ సలహాను షర్మిలకు పంపించినా పెడచెవిన పెట్టారని చెప్పారు. ఏ చెల్లి అయినా ఇలా చేస్తుందా? అని సూటిగా ప్రశ్నించారు. వైఎస్సార్ చనిపోయిన పదేళ్లకు.. షర్మిలకు వివాహమైన 20 ఏళ్ల తరువాత తాను వ్యాపారాల ద్వారా సంపాదించిన వాటిల్లో రూ.200 కోట్లు ఇచ్చిన అన్న పట్ల.. తన సొంత ఆస్తిలో 40 % ఇవ్వటానికి సిద్ధపడిన అన్నపై కనీస కృతజ్ఞత లేకపోగా నువ్వు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఏమిటంటే.. చంద్రబాబుతో కలసి బెయిల్ రద్దు చేసే కుట్రలు పన్నటమేని షర్మిలను విమర్శించారు. మీరు తాజ్‌మహల్, విప్రో కావాలని అడిగితే ఇచ్చేస్తారా షర్మిలా? అని ప్రశ్నించారు. చంద్రబాబు కుయుక్తులను షర్మిల తెలుసుకోవాలని హితవు పలికారు. అతి మంచితనం వల్లే జగన్ అనర్థాలు కొని తెచ్చుకుంటున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియాతో కలిసి నిర్వహించే మీడియా సమావేశాల్లో ప్రజా సమస్యల కంటే జగన్‌పై దూషణలకే షర్మిల 95 శాతం ప్రాధాన్యమిస్తోందన్నారు. తల్లి విజయమ్మ కన్నీళ్లు తుడవడానికే ఇదంతా అని షర్మిల చెప్పడం అబద్ధమని, చంద్రబాబు కళ్లల్లో ఆనందం చూడటానికే అన్నపై కుయుక్తులు పన్నుతూ మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. తనపై, వైవీ సుబ్బారెడ్డిపై షర్మిల చేసిన వ్యాఖ్యలు, ఆస్తుల విషయంలో జగన్‌పై చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. షర్మిలది ఆస్తి తగాదా కాదని, అధికారానికి సంబంధించిందన్నారు. జగన్‌ను తిరిగి సీఎం కాకుండా చేయాలన్నదే షర్మిల ఆలోచనని, చంద్రబాబు ఇచ్చిన అజెండాతోనే ఆమె పనిచేస్తున్నారన్నారు. షర్మిల పీసీసీ అధ్యక్షురాలిగా ఉన్నా, కేంద్రంలో ఆ పార్టీకి ఎన్డీఏ వ్యతిరేకమైనా, ఆమె బాబుతో లాలూచీపడి జగన్‌పై కుట్రలు చేస్తోందన్నారు. షర్మిల మాటలను ప్రజలు నమ్మరుతల్లిని, చెల్లిని మోసం చేసిన వ్యక్తి ప్రజలకు ఏం లబ్ధి చేకూరుస్తారని ప్రశ్నించడం, జగన్‌ను నమ్మొదని చెప్పడం ఎంత ద్రోహమో, అన్యాయమో తన మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలని షర్మిలకు సూచించారు. చంద్రబాబు మాటలనే ఆమె వల్లిస్తున్నారని, ఆయన అజెండాను నెత్తిన పెట్టుకున్నారని విమర్శించారు. వైఎస్ జగన్ కోటిన్నర కుటుంబాలకు, 80 లక్షల మంది అక్క చెల్మెమ్మలకు ఆసరా ఇచ్చారని, 45 లక్షల మందికి అమ్మ ఒడి అమలు చేశారని, అలాంటి సీఎం దేశంలో ఉన్నారా? అని ప్రశ్నించారు. ఇంత మందికి మేలు చేసిన జగన్ సొంత ఇంట్లో తల్లి, చెల్లికి అన్యాయం చేస్తారని కుట్రపూరితంగా చెబుతుంటే ఎవరు నమ్ముతారని షర్మిలను నిలదీశారు. మహిళల్లో జగన్ పట్ల వ్యతిరేకత పెంచాలనే చంద్రబాబు దుర్మార్గ అజెండాకు షర్మిల సహకరిస్తోందన్నారు. తండ్రి మృతికి కారణమైన బాబుతో దోస్తీదివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి మృతికి కారణమైన చంద్రబాబుతో కలిసి షర్మిల కుట్రలు చేయడం దుర్మార్గమని సాయిరెడ్డి పేర్కొన్నారు. తన తండ్రి మరణానికి చంద్రబాబే కారణమని షర్మిల గతంలో అనేకసార్లు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ‘రాజశేఖర్‌రెడ్డి మరో 15 రోజుల్లో దుర్మార్గమైన చావు చస్తాడని’ అంతకుముందు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను గుర్తు తెచ్చుకోవాలన్నారు. వైఎస్ మరణానికి చంద్రబాబే కారణమని దీన్ని బట్టి అర్థం కావడం లేదా? అని నిలదీశారు. అలాంటి వ్యక్తితో కలిసి పనిచేయడం, పసుపు చీర కట్టుకుని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించడం, చర్చలు జరపడం, కుట్రలు చేయడం... ఇంతకన్నా అమానవీయ ప్రవర్తన ఉంటుందా? అని ప్రశ్నించారు. శంకర్రావు, ఎర్రన్నాయుడు, అశోక్ గజపతిరాజు, బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డిని వాడుకుని జగన్‌ను తప్పుడు కేసుల్లో ఇరికించి జైలుకు పంపిన విషయం మరిచిపోయారా? అని షర్మిలను ప్రశ్నించారు. జగన్ మోచేతి నీళ్లు తాగుతూ అనుకూలంగా మాట్లాడుతున్నామని తనను, వైవీ సుబ్బారెడ్డిని షర్మిల విమర్శించడం సహేతుకం కాదన్నారు. శత్రువుకు మేలు చేసేందుకు సొంత అన్ననే వేటాడి, వెంటాడి కాటేసే చెల్మెమ్మ షర్మిల మినహా ఎక్కడా చూడలేదన్నారు. వైఎస్ఆర్ ఆత్మ క్షోభకు కారణమైన షర్మిల ఎల్లో మీడియా ముందు పెట్టే కన్నీటికి విలువ లేదన్నారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయని చంద్రబాబు ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించే కుట్రలకు షర్మిలను వాడుకుంటున్నాడని విమర్శించారు.దేశంలో ఇలాంటి అన్న ఉంటాడా?వైఎస్ఆర్ బతికి ఉన్నప్పుడే ఆస్తుల పంపకం జరిగిందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ఆర్కు వచ్చిన ఆస్తులను కుమారుడు, కుమార్తెకు ఆయన జీవించి ఉన్నప్పుడే పంచారని తెలిపారు. విజయలక్ష్మీ మినరల్స్, కోడూరు మిల్స్, కోడూరు ఆఫీసు ఆస్తులు, బైరైటీస్ మినరల్స్ స్టాక్స్, 25 మెగావాట్ల సరస్వతి పవర్, ఎస్ఆర్ఎస్ హైడ్రో, 51 ఎకరాల ఇడుపులపాయ భూములు, 79 ఎకరాల శెట్టిగుంట ఆస్తులు, 7.6 ఎకరాల పులివెందుల భూములు, బంజారాహిల్స్‌లోని 280 గజాలు, విజయవాడలోని రాజ్యువరాజ్ థియేటర్లు షర్మిలకు అప్పగించారని చెప్పారు. వైఎస్ జగన్ తనకు వచ్చిన ఆస్తులను అభివృద్ధి చేశారన్నారు. జగన్ నెలకొల్పిన భారతీ సిమెంట్స్ కోసం తొలుత రూ.1,400 కోట్లు అప్పు చేశారని, ఆ తర్వాత తీర్చారని తెలిపారు. సాక్షి మీడియా మొదట్లో నష్టాన్ని చవిచూసిందన్నారు. ఈ నష్టాలు, అప్పులను షర్మిల ఎప్పుడూ పంచుకోలేదన్నారు. ఇవన్నీ జగన్ తన దక్షతతో అభివృద్ధి చేసి, లాభాల్లోకి నడిపించారని గుర్తు చేశారు. ఆయన అభివృద్ధి చేశారు కాబట్టే వాళ్ల పేర్లు పెట్టారని, తానే ఆ పేర్లు సూచించానని వెల్లడించారు. ఆమెకు ఏదైనా కంపెనీ నచ్చితే ఎవరైనా ఇస్తారా? అని ప్రశ్నించారు. జగన్ ఎన్నికల అఫిడవిట్లను పరిశీలిస్తే ఆస్తుల పంపకాలు ఏ విధంగా జరిగాయో తెలుస్తుందన్నారు. అమ్మ తటస్థతపై సందేహాలు!తన అసంబద్ధ చర్యలు కుమారుడి బెయిల్ రద్దు పరిస్థితికి దారి తీసే ప్రమాదం ఉందని తెలిసినా ఆ కుట్రలకు వైఎస్ విజయమ్మ పరోక్షంగా సహకరించడంపై సర్వత్రా తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. విజయమ్మ తటస్థతపై పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.విజయమ్మను మొదటి నుంచి భావోద్వేగాలకు గురి చేసి షర్మిల ప్రభావితం చేస్తున్నట్లు పలు సందర్భాల్లో స్పష్టమైందని నెటిజన్లు, ప్రజలు చర్చించుకుంటున్నారు. న్యాయపరమైన ఇబ్బందులు ఎదురవుతాయని తెలిసినా సరస్వతి షేర్ల ట్రాన్స్ఫర్ పత్రాలపై సంతకాలు చేయడం.. పలు సందర్భాల్లో షర్మిలకు అనుకూలంగా వ్యవహరించడం ఆమె తటస్థ వైఖరిని ప్రశ్నార్థకంగా మార్చినట్లు చర్చించుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో సైతం కొద్ది గంటల్లో ఎన్నికల ప్రచారం ముగియనున్న సమయంలో విదేశాల నుంచి విజయమ్మ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వీడియో సందేశాన్ని విడుదల చేయటాన్ని గుర్తు చేస్తున్నారు. ఇద్దరు పిల్లలను సమానంగా చూడాల్సిన అమ్మ ఒకవైపే మొగ్గడం సరికాదని పేర్కొంటున్నారు. నీ అత్యాశ, కుతంత్రాల్లో అమ్మను కూడా పావుగా వాడుకున్నావు. తప్పుడు ప్రకటనలకు అమ్మను ఓ సాక్షిగా, అమలుకర్తగా చేశావంటూ వైఎస్ జగన్ తన సోదరికి రాసిన లేఖను గుర్తు చేస్తున్నారు. ‘క్షమార్హం కాని అక్రమ చర్యల్లో అమ్మను భాగం చేశావు. గత కొద్ది సంవత్సరాలుగా అమ్మను భావోద్వేగాలకు నువ్వు వాడుకుంటున్న విషయం జగమెరిగిన సత్యం. నీ సొంత వ్యూహాల్లో అమ్మను భాగం చేశావు. కోర్టు అనుమతి లేకుండా షేర్లను బదిలీ చేస్తే నాకు న్యాయపరమైన సమస్యలు వస్తాయని తెలిసీ బదలాయింపు చేశావు. అంతేకాక షేర్ సర్టిఫికెట్లు, షేర్ ట్రాన్స్ఫర్ ఫారాలు పోయినట్లుగా అమ్మ చేత తప్పుడు ప్రకటనలు ఇప్పించావు. అంతిమంగా అక్రమ పద్ధతిలో వాటాలను బదలాయింపు చేశావు. దీనివల్ల కుమారుడిగా నాకు న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయని తెలిసి కూడా నీ చర్యల్లో భాగస్వామి అయింది. ఆమె తటస్థతపై ప్రశ్నలు తలెత్తున్నాయి. అంతేకాక ఆమె ఒకవైపే ఉందన్న భావన కలిగిస్తోంది...’ అని తీవ్ర ఆవేదనతో వైఎస్ జగన్ లేఖ రాయటాన్ని నెటిజన్లు, ప్రజలు ఉదహరిస్తున్నారు.కొద్దిరోజులుగా వరుసగా జరుగుతున్న పరిణామాలు ఈ సందేహాలకు బలం చేకూరుస్తున్నట్లు విస్తృతంగా చర్చ జరుగుతోంది. -
చట్టాన్ని గౌరవించటం తప్పా?
కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అక్రమంగా పెట్టిన కేసులున్నాయి. ఏడాదిన్నర జైల్లో ఉండి బెయిలుపై బయటకు వచ్చారాయన. పైపెచ్చు ఆ కంపెనీల ఆస్తులన్నీ ఈడీ, సీబీఐ జప్తులో ఉన్నాయి. ఆ ఆస్తులకు సంబంధించి ఎలాంటి లావాదేవీలూ జరపకూడదని హైకోర్టు ఇచ్చిన ‘స్టే’ ఉత్తర్వులూ ఉన్నాయి. మరి ఆ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే ఏమవుతుంది? దీనికి సమాధానమివ్వటానికి న్యాయనిపుణులే అక్కర్లేదు. కాస్త చదువు, ఇంకాస్త ఇంగిత జ్ఞానం ఉన్నవారెవరైనా చాలు. కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘిస్తే దాని ప్రభావం బెయిలుపైనా పడే ప్రమాదముంటుంది! ఇదిగో... సరస్వతీ పవర్ షేర్ల బదిలీ వ్యవహారంలో ఇదే జరిగింది. వైఎస్ జగన్‌కు తెలియకుండా ఆయన పేరిట ఉన్న షేర్లను తల్లి పేరిట సోదరి షర్మిలే దగ్గరుండి మార్పించేశారు. షేరు హోల్డరైన జగన్‌కు కనీసం సమాచారమూ ఇవ్వలేదు. కోర్టు స్టే ఉత్తర్వులున్నా... కనీసం కోర్టుకూ చెప్పలేదు. పెద్ద మనుషుల ఒప్పందం మాదిరి తల్లి పేరిట రాసిన అన్ రిజిస్టర్డ్ గిఫ్ట్‌డీడ్‌ను ఉపయోగించుకుని షేర్లను తల్లి పేర మార్పించేశారామె. దీంతో కంపెనీ యాజమాన్యం పూర్తిగా తల్లి చేతికి వచ్చినట్లవుతుంది. మరి ఇది కోర్టు ఉల్లంఘనే కదా? జగన్‌కు తెలియకుండా జరిగినా... కోర్టు దృష్టిలో తప్పే కదా? మరి ఈ తప్పును కోర్టు దృష్టికి తేవాల్సిన అవసరం జగన్‌కు లేదా? ఈ లావాదేవీని కోర్టు దృష్టికి తెచ్చి... రద్దు చేయమంటూ కోరటం తప్పెలా అవుతుంది? తనకు తెలియకుండా తన పేరిట చెల్లెలు చేసిన తప్పును సరిదిద్దడానికి ఆయన నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను (ఎన్సీఎల్టీని) ఆశ్రయించటాన్ని చంద్రబాబు కూటమి ఎందుకంత ఘోరమైన తప్పిదం మాదిరి ప్రచారం చేస్తోంది? దాన్ని తల్లిపై కేసు వేసినట్లుగా ఎందుకు చూడాలి? న్యాయపరంగా రక్షించుకోవటానికి జగన్ ఎన్సీఎల్టీకి వెళ్లటం తప్పెలా అవుతుంది? ఆలోగా చేయటం చట్టవిరుద్ధం కాబట్టే..సొంత అన్న న్యాయపరంగా ఇబ్బంది పడతాడని తెలిసి కూడా షర్మిల ఇలా చేయటానికి అసలు కారణం... చంద్రబాబు నాయుడు. బాబు పన్నిన లోతైన కుట్రలో షర్మిల భాగం. అంతా కలిసే జగన్‌ను ఇబ్బంది పెట్టాలనుకున్నారు. అందుకే రకరకాల కుయుక్తులు పన్నుతున్నారు. వీటిని పసిగట్టి జగన్ వెంటనే కోర్టును ఆశ్రయించటంతో... తమ పన్నాగం బెడిసికొట్టిందని గ్రహించి దీనికి ‘తల్లిపై వేసిన కేసు’గా కలర్ ఇస్తున్నారు. ఆస్తుల కోసం జగన్ తన కుటుంబీకులతోనే పోరాడుతున్నారనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అసలు సరస్వతీ పవర్లో 100 శాతాన్ని షర్మిలకు ఇచ్చేస్తానని చెప్పాక... అప్పటికే 49 శాతం తల్లిపేరిట మార్పించి... తన మాటపై మరింత భరోసా కలిగేలా మిగిలిన 51 శాతాన్ని కూడా గిఫ్ట్‌గా ఇస్తానని రాసేశారంటే ఏమిటర్థం? ఆ ఆస్తిని పూర్తిగా వదులుకున్నట్లేగా? కాకపోతే కేసులున్నాయి కనక... అవన్నీ పూర్తిగా తొలగిపోయాకే ఆ షేర్లను చట్టబద్ధంగా షర్మిల పేరిట బదిలీ చేస్తానన్నారు.ఆలోగా చేయటం చట్టవిరుద్ధం కనక తాను చేయనన్నారు. అందుకే ఒరిజినల్ షేర్ సర్టిఫికెట్లు తనవద్దే ఉంచుకున్నారు. కానీ షేర్ సర్టిఫికెట్లు పోయాయనే అబద్ధాలతో తల్లి ద్వారా షర్మిల అలాంటి చట్టవిరుద్ధమైన పని చేసేయటంతో... విధిలేక కోర్టును ఆశ్రయించారు. ఇదీ నిజం. ఇదే నిజం. -
సజ్జల పిటిషన్.. డీజీపీకి హైకోర్టు నోటీసులు
-
సజ్జల పిటిషన్.. డీజీపీకి హైకోర్టు నోటీసులు
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. కోర్టు ఆదేశాలు ఉన్నా ఎల్వోసీ ఇవ్వడంపై కోర్టు ధిక్కరణ కింద సజ్జల పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. డీజీపీ, ఎస్పీ, హోం సెక్రటరీ, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. -
మూడేళ్లయినా చార్జిషీట్ ఎందుకు వేయలేదు?
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంపై దర్యాప్తును అటకెక్కించిన సీఐడీని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టంది. 2021లో కేసు నమోదు చేసినప్పటికీ, ఇప్పటికీ దర్యాప్తు పూర్తి చేయలేదంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. మూడేళ్లు దాటినా ఎందుకు చార్జిషీట్ దాఖలు చేయలేదని అసహనం వ్యక్తం చేసింది. సీఎం చంద్రబాబు ప్రధాన నిందితునిగా ఉన్న స్కిల్ డెలప్మెంట్ కుంభకోణం కేసు దర్యాప్తును సీఐడీ ఉద్దేశపూర్వకంగానే మూలన పడేసిందని సర్వత్రా ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో హైకోర్టు సైతం ఆక్షేపించడం చర్చనీయాంశంగా మారింది. కోట్లాది రూపాయల ప్రజాధనం లూటీ అయిన ఈ కేసులో చార్జిషీట్ దాఖలు చేయకుండా సీఐడీ చేస్తున్న ఉద్దేశపూర్వక జాప్యం నిందితులకు వరంగా మారింది. ఈ కుంభకోణం మాస్టర్ మైండ్ సౌమ్యాద్రి శేఖర్ బోస్ అలియాస్ సుమన్ బోస్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు బెయిల్ ఇచ్చిన సందర్భంగా విధించిన షరతుల్లో కొన్నింటిని హైకోర్టు సడలించింది. విదేశాలకు వెళ్లేందుకు ఆయనకు అనుమతినిచ్చింది. బోస్ సరెండర్ చేసిన పాస్‌పోర్ట్‌ను వెనక్కి ఇచ్చేయాలని విశాఖపట్నం మొదటి అదనపు సెషన్స్ జడ్జిని ఆదేశించింది. రూ.25 వేలతో వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని బోస్‌ను ఆదేశించింది. విశాఖపట్నం కోర్టు ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు పాస్‌పోర్ట్‌ని సరెండర్ చేస్తానని హామీ ఇవ్వాలని బోస్‌ని ఆదేశించింది. ప్రయాణ వివరాలన్నింటినీ ముందస్తుగానే కింది కోర్టుకు తెలియజేయాలని కూడా చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.ప్రజాధనం కొల్లగొట్టి విదేశాల్లో దాచారని ఈడీ వెల్లడిసుమన్ బోస్‌ను విదేశాలకు వెళ్లేందుకు అనుమతినివ్వడాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. బోస్ పలు షెల్ కంపెనీల ద్వారా ప్రజాధనాన్ని కొల్లగొట్టి, ఆ డబ్బును విదేశాలకు తరలించారని, అందువల్ల విదేశాలకు వెళ్లేందుకు అనుమతినివ్వొదని ఈడీ తరఫు న్యాయవాది జోస్యుల భాస్కరరావు హైకోర్టును కోరారు. దీని ప్రభావం దర్యాప్తుపై పడుతుందని వివరించారు. ఈ కేసు తీవ్రత దృష్ట్యా బెయిల్ షరతులను సడలించడం సరికాదని గట్టిగా వాదించారు. -
హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా మరో ముగ్గురు
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా మహేశ్వరరావు కుంచం, తూట చంద్ర ధనశేఖర్, చల్లా గుణ రంజన్ నియమితులయ్యారు. వీరి నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. దీంతో ఈ ముగ్గురి నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయ శాఖ సంయుక్త కార్యదర్శి జగన్నాథ్ శ్రీనివాసన్ గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేళ్లు వీరు అదనపు న్యాయమూర్తులుగా కొనసాగుతారు. తరువాత శాశ్వత న్యాయమూర్తులుగా నియమితులవుతారు. హైకోర్టు మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 37 కాగా, ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తితో కలిపి 26 మంది ఉన్నారు. ఈ ముగ్గురి నియామకంతో ఆ సంఖ్య 29కి చేరింది. దీంతో మరో 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ గుహనాథన్ నరేందర్‌కు ఉత్తరాఖండ్ సీజేగా పదోన్నతి కల్పిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. ఈయన నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాల్సి ఉంది.పంపింది ఆరుగురి పేర్లు..హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ నేతృత్వంలోని కొలీజియం ఈ ఏడాది మే15న ఆరుగురు న్యాయవాదులు మహేశ్వరరావు, ధనశేఖర్, గుణ రంజన్, ఇడంకంటి కోటిరెడ్డి, గోడె రాజాబాబు, గేదెల తుహిన్ కుమార్ పేర్లను న్యాయమూర్తుల పోస్టులకి సిఫారసు చేసింది. ఈ సిఫారసులపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్‌లతో కూడిన కొలీజియం చర్చించింది. గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పనిచేసి, ప్రస్తుతం సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా ఉన్న వారి నుంచి కూడా కొలీజియం అభిప్రాయాలు తీసుకుంది. అనంతరం హైకోర్టు ప్రతిపాదించిన ఆరుగురిలో మహేశ్వరరావు, ధనశేఖర్, గుణ రంజన్‌కు సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదం తెలిపింది. వారిని న్యాయమూర్తుల పోస్టులకు సిఫారసు చేస్తూ ఈ నెల 15న తీర్మానం చేసింది. వీరి నియామకాన్ని ఆమోదించిన కేంద్రం.. వారి పేర్లను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది. రాష్ట్రపతి కూడా ఆమోదం తెలపడంతో వారి నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఈ ముగ్గురు ఎప్పుడు ప్రమాణం చేస్తారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. శనివారం లేదా సోమవారం ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉంది.మహేశ్వరరావు కుంచంకుంచం కోటేశ్వరరావు, సుశీలమ్మ దంపతులకు 1973 ఆగస్టు 12న తిరుపతిలో జన్మించారు. తండ్రి కోటేశ్వరరావు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు. తండ్రి ఉద్యోగ రీత్యా మహేశ్వరరావు అనంతపురంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. 1998లో తిరుపతి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ లా కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. అదే ఏడాది హైకోర్టులో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. 1998 నుంచి 2001 వరకు అనంతపురం జిల్లా కోర్టులో ప్రాక్టీస్ చేశారు. 2001 నుంచి హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. సీనియర్ న్యాయవాది వేదుల శ్రీనివాస్ వద్ద ఆరు నెలల పాటు జూనియర్‌గా ప్రాక్టీస్ చేశారు. అనంతరం స్వతంత్రంగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగ సంబంధిత కేసుల్లో పట్టు సాధించారు. ముఖ్యంగా సివిల్ కేసుల్లో మంచి ప్రావీణ్యం ఉంది. ప్రస్తుతం హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరిస్తున్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్, యునైటెడ్ ఇండియా ఇన్సూ్యరెన్స్ కంపెనీ, న్యూ ఇండియా ఇన్సూ్యరెన్స్ కంపెనీ, శ్రీరాం గ్రూప్ ఆఫ్ కంపెనీలకు న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారు.చల్లా గుణరంజన్చల్లా చంద్రమ్మ, నారాయణ దంపతులకు 1976 జూలై 12న జన్మించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి స్వస్థలం. తండ్రి నారాయణ కూడా న్యాయవాదే. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ ఈయనకు సోదరుడి వరుస అవుతారు. గుణరంజన్ 2001లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. సోదరుడైన కోదండరామ్ వద్దే జూనియర్‌గా న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. కోదండరామ్ జడ్జి అయిన తరువాత ఆయన ఆఫీసును గుణ రంజన్ విజయవంతంగా నడిపించారు.సుప్రీంకోర్టులో ఏపీ, తెలంగాణ హైకోర్టుల్లో, పలు ట్రిబ్యునళ్ల ముందు పలు కేసుల్లో వాదనలు వినిపించారు. పర్యావరణ, విద్యుత్, ఆర్బిట్రేషన్, కంపెనీ లా, దివాళా, పన్నుల చట్టాలతో పాటు సివిల్, క్రిమినల్ కేసుల్లో మంచి పట్టు సాధించారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరించారు. పలు సంస్థలకు న్యాయ సలహాదారుగా కూడా వ్యవహరిస్తున్నారు.తూట చంద్ర ధనశేఖర్తూట శైలజ, చంద్రశేఖరన్ దంపతులకు 1975 జూన్ 10న జన్మించారు. తిరుపతి జిల్లా సత్యవేడు స్వస్థలం. తండ్రి చంద్రశేఖరన్ గతంలో చిత్తూరు జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేశారు. సత్యవేడు జూనియర్ కాలేజీలో విద్యను అభ్యసించారు. యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్‌లో చదివారు. నెల్లూరు వీఆర్ లా కాలేజీలో లా పూర్తి చేశారు. ధనశేఖర్ 1999లో హైకోర్టులో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. మాజీ అడ్వొకేట్ జనరల్, సీనియర్ న్యాయవాది పరాంకుశం వేణుగోపాల్ వద్ద జూనియర్‌గా పనిచేశారు. 2019లో ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులయ్యారు. వాణిజ్య పన్నుల శాఖ తరఫున వాదనలు వినిపిస్తూ వస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా జీపీగా కొనసాగుతున్నారు. పలు సంస్థలకు న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారు. -
ఏపీ హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్..
-
సర్కారు నిర్ణయంతో పవన్ క్వాష్ ఉపసంహరణ
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో టీడీపీ, జనసేన నేతలపై కోర్టుల్లో దాఖలైన పరువు నష్టం కేసులన్నింటినీ ఉపసంహరించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో, గుంటూరు కోర్టులో తనపై దాఖలైన పరువు నష్టం కేసును కొట్టేయాలని కోరుతూ జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. అప్పట్లో వలంటీర్లపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు దాఖలైన పరువు నష్టం కేసును కొట్టేయాలని పవన్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.చట్ట ప్రకారం ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకునేందుకు వీలుగా ఈ వ్యాజ్యం ఉపసంహరణకు అనుమతివ్వాలని కోరుతూ శనివారం పవన్ తరఫు న్యాయవాదులు హైకోర్టును కోరారు. అత్యవసరంగా లంచ్‌మోషన్ రూపంలో విచారణ జరపాలని కోరారు. ఇందుకు కోర్టు అంగీకరించింది. తమ క్వాష్ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని, అందుకు అనుమతివ్వాలని పవన్ తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ పిటిషన్ ఉపసంహరణకు అనుమతిస్తూ శనివారం ఉత్తర్వులిచ్చారు.కాగా, గతేడాది ఏలూరులో పవన్ మాట్లాడుతూ ఏపీలో పెద్ద సంఖ్యలో ఆడ పిల్లలు కనిపించకుండా పోతున్నారని, దీని వెనుక వలంటీర్లు ఉన్నారంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రభుత్వ పరువు, ప్రతిష్టకు నష్టం కలిగించే విధంగా ఉన్నాయని, పవన్‌పై సంబంధిత కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేయాలని గుంటూరు కోర్టు పీపీని అప్పటి ప్రభుత్వం ఆదేశించింది. దీంతో పీపీ గుంటూరు కోర్టులో పవన్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
హైకోర్టు తీర్పు: పుష్పశ్రీవాణి ఎస్టీ కులానికి చెందినవారే..
జియ్యమ్మవలస: మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి ఎస్టీ కులానికి చెందిన వారంటూ హైకోర్టు తీర్పు ఇచ్చినట్టు ఆమె శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. 2019లో జరిగిన ఎన్నిల బరిలో నిలిచిన నిమ్మక జయరాజు, నిమ్మక సింహాచలం అనే ఇద్దరు వ్యక్తులు పుష్పశ్రీవాణి ఎస్టీ కాదంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు.ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు పిటిషనర్ చేసిన ఆరోపణలపై ఆధారాలు లేకపోవడంతో కేసు కొట్టేసింది. డీఎల్ఎస్సీ కమిటీ రిపోర్టు, స్టేట్ స్క్రూటినీ కమిటీ ఇచ్చిన జీవో నంబర్ 6ను పరిగణనలోకి తీసుకుని పుష్పశ్రీవాణి ఎస్టీ కులానికి చెందిన వ్యక్తిగా కోర్టు అభిప్రాయపడింది. పదేళ్లుగా ఓ వర్గం తను ఎస్టీ కాదని తప్పుడు ప్రచారం చేసిందని, చివరకు న్యాయమే గెలిచిందని పుష్పశ్రీవాణి సంతోషం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: మా మకుటం... సత్యమేవ జయతే! -
ఏపీ హైకోర్టులో సజ్జల క్వాష్ పిటిషన్
సాక్షి, తాడేపల్లి: ఏపీ హైకోర్టులో వైఎస్సార్సీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. లుక్ అవుట్ నోటీసును క్వాష్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు.వైఎస్సార్సీపీ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి.. ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. లుక్ అవుట్ నోటీసును క్వాష్ చేయాలంటూ కోర్టును ఆశ్రయించారు. ఈనెల 25వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసిన LOC ఇవ్వటంపై కోర్టు ధిక్కరణ కింద క్వాష్ పిటిషన్ వేశారు.ఇది కూడా చదవండి: ‘పత్రికా స్వేచ్ఛ అంటే కేవలం ఎల్లో మీడియాకేనా?’ -
అన్నా క్యాంటీన్లకు టీడీపీ రంగులు.. హైకోర్టు నోటీసులు
గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ కార్యాలయాలు, అన్నా క్యాంటీన్లపై టీడీపీ రంగులు వెయ్యటాన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టు పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై బుధవారం ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. గతంలో గ్రామ సచివాలయలకు బ్లూ కలర్ వేయటంపై తీర్పు ఇచ్చినట్టు పిటిషనర్ తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. బ్లూ కలర్ తొలగించాలని ఆదేశాలు ఇచ్చిందని, రంగులు తొలగించటానికి సమయం పట్టగా కోర్టు ధిక్కరణ పిటిషన్ కూడా దాఖలైందని పిటిషనర్ తరపున న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో అన్నా క్యాంటీన్లకు ఇంతకు ముందు ఏ కలర్ వేశారని హైకోర్టు ప్రశ్నించింది. అదేవిధంగా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ ఏపీ హైకోర్టు 6 వారాలకు వాయిదా వేసింది.చదవండి: ఏపీ ప్రజల కళ్లల్లో కూటమి ‘ఇసుక’! -
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
గుంటూరు, సాక్షి: ఏపీ హైకోర్టులో కూటమి ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. బుడమేరు వరదలపై చంద్రబాబు ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వరదలపై ప్రజలను ఎందుకు అప్రమత్తం చేయాలేదో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. విజయవాడ బుడమేరు వరదలపై ప్రజలను అప్రమత్తం చేయలేదనే అంశంపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు నోటీసుల జారీ చేసే విషయాన్ని తరువాత చూస్తామని హైకోర్టు పేర్కొంది.చదవండి: ‘చెత్త’ పన్ను..చంద్రన్న ఘనతే -
హైకోర్టు న్యాయమూర్తులుగా ముగ్గురు న్యాయవాదులు
సాక్షి, అమరావతి /సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తుల పోస్టులకు ముగ్గురు న్యాయవాదుల పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల కొలీజియం మంగళవారం తీర్మానం చేసింది. హైకోర్టులో న్యాయవాదులుగా వ్యవహరిస్తున్న మహేశ్వరరావు కుంచం, తూట చంద్ర ధనశేఖర్, చల్లా గుణరంజన్ కొలీజియం సిఫారసు చేసిన వారిలో ఉన్నారు. ఈ ముగ్గురి పేర్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసిన తరువాత ప్రధాని కార్యాలయం ద్వారా రాష్ట్రపతికి చేరతాయి. రాష్ట్రపతి ఆమోదముద్ర అనంతరం వారి పేర్లను నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. మహేశ్వరరావు కుంచంకుంచం కోటేశ్వరరావు, సుశీలమ్మ దంపతులకు 1973 ఆగస్టు 12న తిరుపతిలో జన్మించారు. తండ్రి కోటేశ్వరరావు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు. తండ్రి ఉద్యోగ రీత్యా మహేశ్వరరావు అనంతపురంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. 1998లో తిరుపతి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లా కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. అదే ఏడాది హైకోర్టులో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. 1998 నుంచి 2001 వరకు అనంతపురం జిల్లా కోర్టులో ప్రాక్టీస్ చేశారు. 2001 నుంచి హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. సీనియర్ న్యాయవాది వేదుల శ్రీనివాస్ వద్ద ఆరు నెలల పాటు జూనియర్‌గా ప్రాక్టీస్ చేశారు. అటు తరువాత నుంచి సొంతంగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగ సంబంధిత కేసుల్లో పట్టు సాధించారు. ముఖ్యంగా సివిల్ కేసుల్లో మంచి ప్రావీణ్యం ఉంది. ప్రస్తుతం హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరిస్తున్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ, శ్రీరాం గ్రూప్ ఆఫ్ కంపెనీలకు న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారు.తూట చంద్ర ధనశేఖర్తూట శైలజ, చంద్రశేఖరన్ దంపతులకు 1975 జూన్ 10న జన్మించారు. తిరుపతి జిల్లా సత్యవేడు స్వస్థలం, తండ్రి చంద్రశేఖరన్ గతంలో చిత్తూరు జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేశారు. సత్యవేడు జూనియర్ కాలేజీలో విద్యను అభ్యసించారు. యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్‌లో చదివారు. నెల్లూరు వీఆర్ లా కాలేజీలో న్యాయవాద విద్య పూర్తి చేశారు. ధనశేఖర్ 1999లో హైకోర్టులో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. మాజీ అడ్వొకేట్ జనరల్, సీనియర్ న్యాయవాది పరాంకుశం వేణుగోపాల్ వద్ద జూనియర్‌గా పనిచేశారు. 2019లో ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులయ్యారు. వాణిజ్య పన్నుల శాఖ తరఫున వాదనలు వినిపిస్తూ వస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా జీపీగా కొనసాగుతున్నారు. పలు సంస్థలకు న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారు.చల్లా గుణ రంజన్చల్లా చంద్రమ్మ, నారాయణ దంపతులకు 1976 జూలై 12న జన్మించారు. తాడిపత్రి స్వస్థలం. తండ్రి నారాయణ కూడా న్యాయవాదే. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ సోదరుడి వరుస అవుతారు. గుణ రంజన్ 2001లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. సోదరుడు కోదండరామ్ వద్దే జూనియర్‌గా న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. సుప్రీంకోర్టుతోపాటు ఏపీ, తెలంగాణ హైకోర్టుల్లో, పలు ట్రిబ్యునళ్ల ముందు అనేక కేసుల్లో వాదనలు వినిపించారు. పర్యావరణ, విద్యుత్, ఆర్బిట్రేషన్, కంపెనీ లా, దివాళా, పన్నుల చట్టాలతో పాటు సివిల్, క్రిమినల్ కేసుల్లో మంచి పట్టు సాధించారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరించారు. సీజే నేతృత్వంలో కొలీజియం సమావేశం..ఈ ఏడాది మే 15వ తేదీన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ నేతృత్వంలోని కొలీజియం మొత్తం ఆరుగురు న్యాయవాదుల పేర్లను హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులకు సిఫారసు చేసింది. మహేశ్వరరావు, ధనశేఖర్, చల్లా గుణరంజన్, ఇడంకంటి కోటిరెడ్డి, గోడ రాజాబాబు, గేదెల తుహిన్ కుమార్ పేర్లను సుప్రీంకోర్టుకు పంపింది. కేంద్ర హోంశాఖ ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారా వారి వివరాలు సేకరించింది. కేంద్ర న్యాయశాఖ ఇటీవల వారి పేర్లను సుప్రీంకోర్టుకు పంపింది. దీనిపై చర్చించేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్‌లతో కూడిన కొలీజియం మంగళవారం ప్రత్యేకంగా సమావేశమైంది. గతంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా పనిచేసి ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కొనసాగుతున్న నలుగురి అభిప్రాయాలు కూడా అంతకు ముందే తీసుకుంది. వారందరూ కూడా న్యాయమూర్తుల పోస్టులకు ముగ్గురు తగిన వారని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన కొలీజియం సమావేశంలో మహేశ్వరరావు, ధనశేఖర్, గుణ రంజన్ పేర్లకు ఆమోదం తెలిపింది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న అనంతరం ఆ ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తులుగా అన్ని రకాలుగా అర్హులని స్పష్టం చేసింది.ప్రస్తుతం ఏపీ హైకోర్టులో సీజేతో సహా 26 మంది న్యాయమూర్తులు ఉన్నారు. తాజాగా సుప్రీంకోర్టు సిఫారసు చేసిన ముగ్గురి పేర్లకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే న్యాయమూర్తుల సంఖ్య 29కి చేరుకుంటుంది. వాస్తవానికి హైకోర్టు కొలీజియం ఆరుగురు న్యాయవాదుల పేర్లతోపాటు ముగ్గురు న్యాయాధికారుల పేర్లను కూడా హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులకు సిఫారసు చేసింది. ఏపీ జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్ అవధానం హరిహరనాథ శర్మ, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ డాక్టర్ యడవల్లి లక్ష్మణరావు, శ్రీకాకుళం ప్రిన్సిపల్ జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా పేర్లను సిఫారసు చేసింది. అయితే ఈ ముగ్గురి విషయంలో సుప్రీంకోర్టు కొలీజియం ఏం నిర్ణయం తీసుకున్నదీ తెలియరాలేదు. -
నందిగం సురేష్‌కు బెయిల్ మంజూరు
సాక్షి, విజయవాడ: బాపట్ల మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ నేత నందిగం సురేష్‌కు బెయిల్ మంజూరైంది. ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంపై గతంలో జరిగిన దాడి ఘటనలో నందిగం సురేష్‌పై టీడీపీ అక్రమ కేసు మోపిన సంగతి తెలిసిందే.