Baahubali 2
-
Pushpa 2 Collection: రప్పా రప్పా సరికొత్త రికార్డప్పా
పుష్పరాజ్ (‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్పాత్ర పేరు) అస్సలు తగ్గడం లేదు. వసూళ్ల విషయంలో రప్పా రప్పా అంటూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. కేవలం 32 రోజుల్లోనే ‘పుష్ప 2 : ది రూల్’ ప్రపంచ వ్యాప్తంగా రూ.1831 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి, సరికొత్త రికార్డు సృష్టించినట్లు మేకర్స్ ప్రకటించారు. అల్లు అర్జున్ , రష్మికా మందన్నా జోడీగా నటించిన చిత్రం ‘పుష్ప 2: ది రూల్’. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల ప్రత్యేకపాటలో నటించారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా డిసెంబరు 5న విడుదలైంది.అయితే డిసెంబరు 4 నుంచి ప్రీమియర్స్ మొదలైన సంగతి తెలిసిందే. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా 12,500 స్క్రీన్ లలో ‘పుష్ప 2: ది రూల్’ విడుదలైంది. సినిమా రిలీజైన 32 రోజుల్లోనే రూ.1831 కోట్లు గ్రాస్ వసూలు చేసి, రూ.1810 కోట్లు వసూలు చేసిన ‘బాహుబలి–2’ సినిమా వసూళ్లను ‘పుష్ప 2’ అధిగమించి, సరికొత్త రికార్డును క్రియేట్ చేసినట్లు చిత్రబృందం పేర్కొంది. ఇదిలా ఉంటే.. ఆమీర్‌ఖాన్ నటించిన హిందీ సినిమా ‘దంగల్’ ప్రపంచవ్యాప్తంగా రూ.2 వేల కోట్లకుపైగా వసూళ్లతో ఆల్‌టైమ్ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే రూ.1831 కోట్ల వసూళ్లతో రెండో స్థానంలో ‘పుష్ప 2: ది రూల్’ నిలిచింది. కాగా బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాల్లో మాత్రం ‘పుష్ప 2: ది రూల్’ మొదటి స్థానంలో నిలిచింది. -
నార్త్ మార్కెట్ ను టార్గెట్ చేస్తున్న టాలీవుడ్
-
హిందీలో అత్యధిక వసూళ్లు చేసిన 2వ సినిమా కేజీయఫ్ 2, తొలి సినిమా ఏదో తెలుసా?
KGF 2 Becomes All Time Second Highest Hindi Grosser: ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కేజీయఫ్ 2 కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ మూవీ విడుదలై మూడు వారాలకు పైగా గడుస్తున్న ఇప్పటికీ థియేటర్లో ఈ మూవీ హావా కొనసాగుతూనే ఉంది. యశ్ హీరోగా, ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజే విడుదలైన అన్ని భాషల్లో (కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ) భారీ వసూళ్లను రాబట్టింది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ బాలీవుడ్లో అరుదైన ఘనతను సాధించింది. చదవండి: విరాట పర్యం రిలీజ్ డేట్ వచ్చేసింది, ఆ రోజే బిగ్స్క్రీన్పై సందడి విడుదలైన 22 రోజుల్లోనే ఈ మూవీ దంగల్ లైఫ్‌టైం కలెక్షన్స్‌ను దాటేసి అప్పటికి వరకు ఉన్న ఆ మూవీ రికార్డును చెరిపేసింది. ‘దంగల్’ చిత్రం లైఫ్‌టైం రన్లో రూ. 387.40 కోట్లు వసూలు చేయగా... కేవలం 22 రోజుల్లోనే ఆ రికార్డును 'కేజీఎఫ్2' అధిగమించింది. ఇక నిన్నటి(మే 5) వరకు కేజీయఫ్ 2 బి-టౌన్ బాక్సాఫీసు వద్ద రూ. 391.65 కోట్లు వసూలు చేసింది. ఈ రోజు(మే 6) కలెక్షన్స్‌తో రూ. 400 కోట్ల పైగా వసూలు చేసే అవకాశం ఉందని గురువారం ప్రముఖ ట్రెడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ వెల్లడించగా.. రమేశ్ బాలా అనే మరో ట్రెడ్ అనలిస్ట్ నేటితో కేజీయఫ్ 2 రూ. 400 కోట్ల క్లబ్‌లోకి చేరిందని తెలిపాడు. చదవండి: ఉపాసన.. నా మైండ్లోనూ అదే ఉంది, కానీ మనం కొద్ది రోజులు ఆగాల్సిందే! దీంతో హిందీలో అత్యధిక వసూళ్లు రాబట్టిన రెండో సౌత్ సినిమాగా కేజీయఫ్ 2 నిలిచింది. ఇప్పటి వరకు హిందీలో అత్యధిక వసూళు చేసిన దక్షిణాది సినిమాల్లో బాహుబలి 2 మొదటి స్థానంలో ఉంది. బాహుబలి 2 హిందీ వెర్షన్ అక్కడ రూ. 511.30 కోట్లు వసూలు చేసింది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే హిందీలో ఇప్పటి వరకు కేవలం రెండు చిత్రాలు మాత్రమే రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. ఆ రెండూ దక్షిణాది చిత్రాలే (బాహుబలి2, కేజీఎఫ్2) కావడం విశేషం. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4231450453.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘రాజ్ కపూర్ తర్వాత ప్రభాస్‌కే’
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచదేశాలకు చాటిచెప్పిన చిత్రం ‘బాహుబలి’. ఎన్నో రికార్డులు, అవార్డులు ఘనతలు అందుకున్న ‘బాహుబలి’ కీర్తి కిరీటంలో మరో కలికుతురాయి వచ్చిచేరింది. బాహుబలిలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటనకు గాను ‘రష్యా ఆడియన్స్ హార్ట్’ అవార్డుకు ఎంపికయ్యాడు. 2015కు గాను ప్రకంటించిన అవార్డుల జాబితాలో ప్రభాస్‌కు అభిమానులను మెప్పించిన విభాగంలో అవార్డు లభించింది. రష్యాలోని సినీ ప్రేక్షకుల అభిమానాన్ని విపరీతంగా పొందడంతోనే ప్రభాస్‌కు ఈ అవార్డు లభించిందని అక్కడి ప్రతినిధులు పేర్కొంటున్నారు. (రిజర్వ్ ఫారెస్ట్ దత్తత తీసుకుంటా..) ఇక ఈ అవార్డు అందుకుంటున్న రెండో భారతీయ నటుడిగా ప్రభాస్ నిలవనున్నాడు. గతంలో దిగ్గజ నటుడు రాజ్‌కపూర్ ఈ అవార్డును అందుకున్నారు. శ్రీ 420, అవారా, ఆరాధన వంటి చిత్రాలతో రష్యన్ ప్రేక్షకుల హృదయాన్ని గెలుచుకుని రష్యన్ అభిమానులను మెప్పించిన రాజ్ కపూర్ 30ఏళ్ల క్రితం ఈ అవార్డును అందుకున్నారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి, బాహుబలి2 చిత్రాలు ఎంతటి చరిత్ర సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రభాస్‌తో పాటు రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ, నాజర్ తదితరులు ఈ చిత్రంలో నటించి మెప్పించారు. (ప్రభాస్ కళ్లు నాకు చాలా ఇష్టం..) -
బాహుబలికి ముందు ఆ సినిమానే!
సాక్షి, హైదరాబాద్: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన దృశ్యకావ్యం ‘బాహుబలి’... ఈ సినిమా విడుదలై చాలాకాలమైన ఇప్పటికీ ప్రపంచంలో ఎక్కడో చోట ఈ సినిమా ప్రదర్శితమవుతూనే ఉంది. తాజాగా ‘బాహుబలి ది బిగినింగ్’ చిత్రాన్ని లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్లో ప్రదర్శించారు. ఇప్పటివరకు రాయల్ ఆల్బర్ట్ హాల్లో ప్రదర్శించిన తొలి ఇంగ్లిషేతర సినిమా ‘బాహుబలి’ కావడం విశేషం. ఈ సినిమా ప్రదర్శనకు దర్శకుడు రాజమౌళితోపాటు రానా, ప్రభాస్, అనుష్క, కీరవాణి, శోభూ యార్లగడ్డ తదితరులు హాజరయ్యారు. చిత్ర ప్రదర్శన సందర్భంగా ప్రభాస్, రానా బీబీసీ విలేకరి హరూన్ రషీద్‌తో ముచ్చటించారు. బాహుబలి సక్సెస్ గురించి తమ ఆనందానుభూతులను పంచుకున్నారు. ‘బాహుబలి’ కి ముందు తెలుగు సినిమాలు ఏమైనా ఈ స్థాయిలో దేశవ్యాప్తంగా ప్రభావం చూపించాయా? అని రషీద్ ప్రశ్నించగా.. దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘శివ’ చిత్రాన్ని ప్రభాస్ ప్రస్తావించారు. ‘30, సంవత్సరాల కిందట రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘శివ’ సినిమా దేశవ్యాప్తంగా సత్తాను చాటింది’ అని తెలిపారు. అయితే,బాహుబలి సినిమా అంతకుమించి దేశవ్యాప్తంగా అన్నిచోట్ల విజయం సాధించిందని, విదేశాల్లోనూ గొప్పగా ప్రేక్షకుల ఆదరణ పొందిందని ప్రభాస్ తెలిపారు. నాగార్జున హీరోగా వర్మ తెరకెక్కించిన ‘శివ’ సినిమా ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. -
‘బాహుబలి’కి భల్లాలదేవ విషెస్
హైదరాబాద్: పుట్టినరోజు సందర్భంగా యంగ్ రెబల్ స్టార్, టాలీవుడ్ గ్లోబల్ స్టార్ ప్రభాస్‌కు బర్త్‌డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో సినీ ప్రముఖులు, అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బాహుబలి ప్రభాస్ మరిన్ని గొప్ప సినిమాలు తీయాలని, ఆయన కెరీర్ గొప్పగా సాగాలని, మున్ముందు భారీ విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. బాహుబలి సినిమాలో భల్లాలదేవుడిగా ప్రభాస్‌కు పోటీగా నటించిన రానా కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో విషెస్ తెలిపారు. "జన్మదిన శుభాకాంక్షలు సోదరా... నీ అందమైన మనస్సు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. లవ్ యూ" అంటూ రానా ప్రభాస్‌కు విషెస్ చెప్పారు. ప్రభాస్ తో కలిసి నవ్వులు చిందిస్తున్న ఫొటోను కూడా ఆయన పోస్ట్ చేశారు. 'బాహుబలి' సినిమాలో ప్రభాస్-రానా పోటాపోటీగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం మూడేళ్లకుపైగా కలిసి పనిచేసిన ఈ ఇద్దరు స్టార్స్ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. బాహుబలిగా ప్రభాస్‌కు ఎంత పేరు వచ్చిందో.. భల్లాలదేవగా రానాకు కూడా ప్రేక్షకులు అంతగానే ఫిదా అయ్యారు. -
బాహుబలిని దాటలేకపోయిన ‘అవెంజర్స్’
ఈ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన భారీ చిత్రం అవెంజర్స్ ఎండ్ గేమ్. మార్వెల్ సంస్థ తెరకెక్కించిన సూపర్ హిట్ సిరీస్‌లో చివరి చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇండియాలోనూ భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ జరగటం, సింగిల్ స్క్రిన్స్లోనూ పెద్ద సంఖ్యలో సినిమా రిలీజ్ కావటంతో రికార్డ్లను తిరగరాయటం ఖాయం అని భావించారు. ఒక దశలో భారత్‌లో తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన బాహుబలి 2 రికార్డును అవెంజర్స్ తుడిచేస్తుందన్న టాక్ వినిపించింది. అయితే బాహుబలి 2 రికార్డ్‌ను అవెంజర్స్ అందుకోలేకపోయింది. బాహుబలి 2 తొలి రోజు 63 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా అవెంజర్స్ మాత్రం 53 కోట్లతో సరిపెట్టుకుంది. శంకర్ తెరకెక్కించిన విజువల్ వంబర్ 2.ఓ 59 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. బాలీవుడ్ మూవీ థగ్స్ ఆఫ్ హిందూస్థాన్, కబాలి చిత్రాలు నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. -
బాహుబలి-2 రికార్డు బద్ధలు
ఇండియన్ భాక్సాఫీస్ వద్ద బాహుబలి ది కంక్లూజన్ సృష్టించిన రికార్డులు ఇంకా కళ్ల ముందు మెదులుతున్నాయి. హిందీతోపాటు విడుదలైన అన్ని భాషల్లోనూ బెంచ్ మార్క్ రికార్డులను క్రియేట్ చేసింది. అప్పటి నుంచి విడుదలైన చిత్రాలు భారీస్థాయిలో స్క్రీన్లలో రిలీజ్ చేసినప్పటికీ ఆ ఫీట్‌ను అందుకోలేకపోయాయి. అయితే ఎట్టకేలకు రీసెంట్ రిలీజ్ సంజు బాహుబలి-2 నెలకొల్పిన ఓ రికార్డును మాత్రం అధిగమించింది. ఈ చిత్రం ఆదివారం(మూడో రోజు) రూ. 46.71 కోట్ల కలెక్షన్లు వసూలు చేసింది. అంతకు ముందు ఆ రికార్డు రూ.46.50 కోట్లతో బాహుబలి-2(హిందీ వర్షన్) పేరిట ఉంది. ఏదైతేనేం మొత్తానికి బాహుబలి-2కి చెందిన ఓ రికార్డును అధిగమించామని బాలీవుడ్ మీడియా కథనాలు ప్రచురించేస్తోంది. రాజ్‌కుమార్ హిరాణీ డైరెక్షన్లో రణ్‌బీర్ కపూర్ లీడ్ రోల్లో నటించిన సంజు కేవలం మూడు రోజుల్లోనే రూ. 120 కోట్లు వసూలు చేసి ఈ ఏడాది బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. తొలిరోజ దాదాపు రూ.35 కోట్లు వసూలు చేసి ఈ ఏడాది హయ్యెస్ట్ ఓపెనర్‌గా నిలవటంతోపాటు.. రణ్‌బీర్ కెరీర్ బెస్ట్ ఓపెనర్‌గా కూడా నిలిచింది. సాహోరే.. హైబ్రిడ్ పిల్లా -
సౌత్ ఫిలింఫేర్ అవార్డులు-2018
సాక్షి, హైదరాబాద్: దక్షిణ చలన చిత్ర పరిశ్రమకు సంబంధించి జియో ఫిలింఫేర్ అవార్డులు-2018 వేడుకల్లో బాహుబలి ది కంక్లూజన్ సత్తా చాటింది. 65వ సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల కార్యక్రమం గత సాయంత్రం(శనివారం) హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో అంగరంగ వైభవంగా జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ చిత్ర పరిశ్రమల నటీనటులు ఈ వేడుకకు పెద్ద ఎత్తున హాజరయ్యారు. తెలుగులో బాహుబలి-2 చిత్రం ఉత్తమ చిత్రంతోపాటు మొత్తం 8 విభాగాల్లో అవార్డులు కొల్లగొట్టింది. అర్జున్ రెడ్డికి చిత్రానికిగానూ ఉత్తమ నటుడిగా విజయ్ దేవరకొండ, క్రిటిక్స్ విభాగంలో వెంకటేష్ దగ్గుబాటి గురు చిత్రానికి, ఫిదా చిత్రానికిగానూ ఉత్తమ నటిగా సాయి పల్లవి, క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ నటిగా రితికా సింగ్(గురు చిత్రానికి), దర్శకధీరుడు రాజమౌళికి బాహుబలి-2కి ఉత్తమ దర్శకుడిగా ఫిలిం ఫేర్ అవార్డులు దక్కాయి. దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణకి జీవితకాల సాఫల్య పురస్కారం(లైఫ్ టైమ్ అచీవ్మెంట్) అవార్డు అందించారు. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మళయాళ చిత్రాల అవార్డులను కేటగిరీలుగా పరిశీలిస్తే... తెలుగు ఉత్తమ చిత్రం - బాహుబలి 2 ఉత్తమ దర్శకుడు - రాజమౌళి (బాహుబలి 2) ఉత్తమ నటుడు - విజయ్ దేవరకొండ (అర్జున్ రెడ్డి) ఉత్తమ నటి - సాయి పల్లవి (ఫిదా) ఉత్తమ నటుడు (విమర్శకుల విభాగం) - వెంకటేష్ (గురు సినిమా) ఉత్తమ నటి (విమర్శకుల విభాగం) - రితికా సింగ్ (గురు) ఉత్తమ సహాయ నటి - రమ్యకృష్ణ (బాహుబలి 2) ఉత్తమ సహాయ నటుడు - రానా దగ్గుబాటి (బాహుబలి 2) ఉత్తమ నటి (తొలి పరిచయం) - కల్యాణ్ ప్రియదర్శన్ (హలో) ఉత్తమ సినిమాటోగ్రాఫర్ - సెంథిల్ కుమార్ (బాహుబలి 2) ఉత్తమ కొరియోగ్రాఫర్ - శేఖర్ మాస్టర్ (ఖైదీ, ఫిదా) - అమ్మడూ లెట్స్ డూ కుమ్ముడు, వచ్చిండే ఉత్తమ గేయ రచయిత - ఎమ్ ఎమ్ కీరవాణి (బాహుబలి 2 - దండాలయ్యా సాంగ్) జీవితకాల సాఫల్య పురస్కారం - కైకాల సత్యనారాయణ ఉత్తమ నేపథ్య గాయకుడు - హేమ చంద్ర (ఫిదా - ఊసుపోదు సాంగ్) ఉత్తమ నేపథ్య గాయని - మధు ప్రియ (ఫిదా - వచ్చిండే సాంగ్) ఉత్తమ సంగీత దర్శకుడు - ఎమ్ ఎమ్ కీరవాణి (బాహుబలి 2) ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ - సాబు సిరిల్ (బాహుబలి 2) తమిళం (కోలీవుడ్) ఉత్తమ చిత్రం - అరమ్ ఉత్తమ దర్శకుడు - పుష్కర్ గాయత్రి (విక్రమ్ వేద) ఉత్తమ నటుడు - విజయ్ సేతుపతి (విక్రమ్ వేద) ఉత్తమ నటి - నయనతార (అరమ్) ఉత్తమ నటుడు (విమర్శకుల విభాగం) - మాధవన్ (విక్రమ్ వేద), కార్తీ (థీరమ్ అడిగరం ఒంద్రు) ఉత్తమ నటి (విమర్శకుల విభాగం) - అదితి బాలన్ (ఆరువి) ఉత్తమ గేయ రచయిత (బెస్ట్ లిరిక్స్) - వైరముత్తు (కాట్రు వెలియిదయ్ - వాన్ మూవీ) ఉత్తమ సహాయ నటి - నిత్యా మీనన్ ఉత్తమ సహాయ నటుడు - ప్రసన్న ఉత్తమ నేపథ్య గాయకుడు - అనిరుధ్ రవిచందర్ ఉత్తమ నేపథ్య గాయని - శశా తిరుపతి ఉత్తమ సంగీత దర్శకుడు - ఏఆర్ రెహ్మాన్ (మెర్సల్) ఉత్తమ తొలి నటుడు - వసంత్ రవి (తారామణి) మాలీవుడ్(మళయాళం) ఉత్తమ చిత్రం - తొండిముథలుమ్ దృక్సాక్షియుమ్ ఉత్తమ దర్శకుడు - దిలీష్ పోతెన్ ఉత్తమ నటుడు - ఫహద్ ఫజిల్ ఉత్తమ నటి - పార్వతి (టేక్ ఆఫ్) ఉత్తమ నటుడు (విమర్శకుల అవార్డు) - టొవినో థామస్ ఉత్తమ నటి (విమర్శకుల అవార్డు) - మంజూ వారియర్ ఉత్తమ సహాయ నటి - శాంతి కృష్ణ ఉత్తమ సహాయ నటుడు - అలెన్సియెర్ ఉత్తమ గేయ రచయిత (బెస్ట్ లిరిక్స్) - అన్వర్ అలీ (మిజియి నిన్ను మిజియిలెక్కు) ఉత్తమ నేపథ్య గాయకుడు - షాబాజ్ అమన్ ఉత్తమ నేపథ్య గాయని - కేఎస్ చిత్ర ఉత్తమ సంగీత దర్శకుడు - రెక్స్ విజయన్ (మాయనది) ఉత్తమ తొలిచిత్ర నటుడు - ఆంటోనీ వర్గీస్ (అంగామలి డైరీస్) ఉత్తమ తొలిచిత్ర నటి - ఐశ్వర్య లక్ష్మి కన్నడ(శాండల్‌వుడ్) ఉత్తమ చిత్రం - ఒందు మొట్టెయ కథె ఉత్తమ దర్శకుడు - తరుణ్ సుధీర్ (చౌక) ఉత్తమ నటుడు - రాజ్ కుమార ఉత్తమ నటి - శ్రుతి హరిహరన్ ఉత్తమ నటుడు (విమర్శకుల అవార్డు) - ధనంజయ ఉత్తమ నటి (విమర్శకుల అవార్డు) - శ్రద్ధా శ్రీనాథ్ ఉత్తమ గేయ రచయిత (బెస్ట్ లిరిక్స్) - వి. నాగేంద్ర ప్రసాద్ (అప్పా ఐ లవ్యూ - చౌక) ఉత్తమ సహాయ నటి - భవానీ ప్రకాశ్ ఉత్తమ సహాయ నటుడు - పి రవిశంకర్ ఉత్తమ నేపథ్య గాయకుడు - అర్మాన్ మాలిక్ ఉత్తమ నేపథ్య గాయని - అనురాధ భట్ ఉత్తమ సంగీత దర్శకుడు - బీజే భరత్ -
సాహోరే.. హైబ్రిడ్ పిల్లా
సాక్షి, హైదరాబాద్: బాహుబలి సిరీస్ సృష్టించిన ప్రభంజనం తెలియంది కాదు. మరోవైపు ఫిదా చిత్రం టాలీవుడ్లో క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. రెండూ కూడా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించినవే. కలెక్షన్లపరంగా సంగతి పక్కనపెడితే మ్యూజిక్ పరంగా మాత్రం ఫిదానే ఎక్కువగా ఆకట్టుకుంది. ఇందుకు నిదర్శనంగా యూట్యూబ్‌లో ఓ రికార్డును ప్రస్తావిస్తున్నారు. బాహుబలి-2లోని టైటిల్ సాంగ్ సాహోరో బాహుబలి పాట కన్నా ఫిదాలోని వచ్చించే సాంగ్ ఎక్కువగా వ్యూవ్స్ రావటం విశేషం. సాహోరే సాంగ్ 11 నెలల్లో సాధించిన వ్యూవ్స్‌ను వచ్చిండే సాంగ్ 7 నెలల్లోనే దాటేసింది. బాహుబలి ది కంక్లూజన్‌కి ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందించగా.. ఫిదాకు శక్తికాంత్ సంగీతం అందించారు. హైబ్రిడ్ పిల్ల సాయి పల్లవి చేసిన మ్యాజిక్ అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ స్క్రీన్ షాట్లతో హల్ చల్ చేస్తున్నారు. -
సాహోరే సాంగ్ కన్న వచ్చించే సాంగ్ ఎక్కువ వ్యూవ్స్
-
నువ్వు ఆగు మిత్రమా.. నేను వెళతాను..!!
సాక్షి, హైదరాబాద్ : బాహుబలి-ది కంక్లూజన్ పార్ట్‌కు చైనీయులు ఫిదా అయిపోయారు. హీరో ప్రభాస్‌ను ఏకంగా హాలీవుడ్ స్టార్స్‌తో పోల్చుతూ ఓ చైనీయుడు చేసిన పోస్టు సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. బ్లాక్ పాంథర్‌ను కలిసిన ప్రభాస్.. తాను ముందు వెళ్తానని ఆపుతున్నట్లు, శత్రువును చీల్చిచెండాటానికి వెళ్తున్న ఎవెంజర్స్ సీరియస్‌గా చూస్తుంటే.. ప్రభాస్ మాత్రం చిరునవ్వుతో శత్రువును చూస్తున్నట్లు ఫొటోషాప్ చేసిన ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. ఈ నెల 4వ తేదీన బాహుబలి 2ను చైనాలో విడుదల చేశారు. 10 తేదీ వరకూ చిత్రం రూ. 68 కోట్ల మేర వసూళ్లు రాబట్టినట్లు తెలిసింది. అయితే, చైనాలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-5 చిత్రాలకు భారీ దూరంలోనే ప్రభాస్ ఉన్నాడని చెప్పుకోవాలి. చైనాలో దంగల్, సిక్రెట్ సూపర్ స్టార్, బజరంగీ భాయిజాన్, హిందీ మీడియం, పీకే చిత్రాలు వరుసగా అత్యధిక వసూళ్లు రాబట్టాయి. -
రాజమౌళికి బిగ్ షాక్
దర్శక ధీరుడు రాజమౌళికి ఊహించని షాక్ తగిలింది. బాహుబలి-2 చైనా వర్షన్ దారుణమైన ఫలితాన్ని రాబడుతోంది. ఇప్పటిదాకా కనీసం రూ. 100 కోట్లు కూడా వసూలు చేయకపోవటం విశేషం. అమీర్ ఖాన్ దంగల్ చిత్రం చైనాలో రూ. 1200 కోట్లు వసూలు చేయగా(ఫుల్ రన్లో).. ఇక్కడ యావరేజ్ టాక్ సొంతం చేసుకున్న ‘సీక్రెట్ సూపర్ స్టార్’ చిత్రం సైతం రూ. 700 కోట్లు రాబట్టడం గమనార్హం. అంతెందుకు బాలీవుడ్లో చిన్న సినిమాగా విడుదలై విజయం సాధించిన హిందీ మీడియం కూడా చైనాలో రూ. 200 కోట్ల కలెక్షన్లు సాధించింది. దీంతో ఇండియాలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ బాహుబలి-2 కూడా మంచి వసూళ్లనే రాబడుతుందని రిలీజ్‌కు ముందు మేకర్లు భావించారు. బాహుబలి మొదటి భాగం ఫలితం తేడా కొట్టడంతో జాగ్రత్త పడ్డ జక్కన్న హాలీవుడ్ టెక్నీషియన్ విన్సెంట్ టబైల్లాన్ను రంగంలోకి దించారు. విన్సెంట్(ది ఇన్క్రిడబుల్ హల్క్, క్లాష్ ఆఫ్ ది టైటాన్స్ చిత్రాల ఫేమ్) ఎడిటింగ్ వర్క్‌తో చిత్రం బాహుబలి-2 ష్యూర్ హిట్ అని అంతా భావించారు. కానీ, సీన్ ఇప్పుడు పూర్తిగా రివర్స్ కావటంతో ఖంగుతినటం రాజమౌళి అండ్ నిర్మాతల వంతు అయ్యింది. మే 4వ తేదీన 7 వేలకు పైగా స్క్రీన్లలో రిలీజైన బాహుబలి-2.. మంగళవారం వరకు చిత్రం రూ.63 కోట్లు వసూలు చేసింది. అయితే ఇప్పటిదాకా వచ్చిన వసూళ్లతో త్రీ ఇడియట్స్, ధూమ్-3 చిత్రాల వసూళ్లను మాత్రం అధిగమించింది. కాగా, ఎస్ ఎస్ రాజమౌళి సృష్టించిన కళాఖండం బాహుబలి సిరీస్ ఇండియాలో సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. భారత బాక్సాఫీస్ వద్ద వేగంగా వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టిన చిత్రంగా బాహుబలి ది కంక్లూజన్ రికార్డు సృష్టించింది. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ. 18 వందల కోట్లు వసూళ్లు చేసింది. హిందీ వర్షన్ ఇండియాతోపాలు విదేశాల్లోనూ భారీగా వసూళ్లు రాబట్టింది. ఈ మధ్యే బాహుబలి-2 జపాన్‌లో విడుదలై ఘన విజయం సాధించింది. #Baahubali2 continues to struggle... Remains on the lower side in CHINA... Fri $ 2.43 mn Sat $ 2.94 mn Sun $ 2.30 mn Mon $ 0.89 mn Tue $ 0.82 mn Total: $ 9.38 mn [₹ 63.19 cr] — taran adarsh (@taran_adarsh) 9 May 2018 -
ప్చ్: చైనాలో బాహుబలి-2 కలెక్షన్లు కూడా..!
దర్శకదీరుడు రాజమౌళి దృశ్యకావ్యం ‘బాహుబలి: ద కన్‌క్లూజన్’ భారీ అంచనాలతో చైనాలో విడుదలైంది. బాహుబలి మొదటి పార్టు చైనాలో ఫెయిల్ కావడంతో ఎన్నో జాగ్రత్తలు తీసుకొని.. చిత్రబృందం పొరుగుదేశంలో గతవారం ఈ సినిమాను విడుదల చేశారు. చైనీయుల అభిరుచికి తగినట్టు మార్పులు చేసినప్పటికీ.. బాహుబలి-2 సినిమా అక్కడి సినీ ప్రేమికులను ఆకట్టుకోలేకపోయింది. తొలిరోజు ఈ సినిమాకు భారీ వసూళ్లు వచ్చాయి. దీంతో చైనాలోనూ బాహుబలి ప్రభంజనం ఖాయమని భావించారు. కానీ, ఆ తర్వాతి రోజుల్లో ప్రేక్షకులను థియేటర్ల వైపునకు రప్పించడంలో ఈ సినిమా విఫలమైంది. మొత్తంగా మొదటి మూడురోజుల్లో బాహుబలి-2 రూ. 51.20 కోట్లు వసూలు చేసిందని తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. గతంలో మొదటి వీకెండ్లో ఆమిర్ ఖాన్ సీక్రెట్ సూపర్‌స్టార్ రూ. 173.82 కోట్లు వసూలుచేస్తే.. ఇర్ఫాన్ ఖాన్ హిందీ మీడియం సినిమా రూ. 102.18 కోట్లు రాబట్టింది. కానీ బాహుబలి-2 మాత్రం మొదటివారంలో ఆశించినంత వసూళ్లు రాబట్టలేకపోయింది. ‘చైనాలో బాహుబలి-2 ఆశించినంత వసూళ్లు రాబట్టడం లేదు. శుక్రవారం 2.43 మిలియన్ డాలర్లు రాబట్టిన ఈ సినిమా శనివారం 2.92 మిలియన్ డాలర్లు, ఆదివారం 2.26 మిలియన్ డాలర్లు.. మొత్తంగా 7.63 మిలియన్ డాలర్లు (రూ. 51.20 కోట్లు) వసూలు చేసింది’ అని తరణ్ ట్వీట్ చేశారు. తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి చేర్చిన బాహుబలి 2 ఈ శుక్రవారం చైనాలో భారీగా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. బాహుబలి తొలి భాగం చైనాలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవటంతో రెండో భాగం విషయంలో చిత్రయూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. హాలీవుడ్ సాంకేతిక నిపుణులతో చైనా ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా సినిమాను మరోసారి ఎడిటింగ్ చేయించారు. అంతేకాదు ఏకంగా 7వేలకు పైగా స్క్రీన్లలో సినిమాను రిలీజ్ చేశారు. బాహుబలి నిర్మాతలు తీసుకున్న జాగ్రత్తలు తొలిరోజు ఫలించినట్టు కనిపించినా.. ఆ తర్వాత మాత్రం కలెక్షన్లు ఊపందుకోలేదు. అయితే, బాహుబలి తొలి భాగం చైనాలో ఫుల్ రన్లో సాధించిన 1.18 మిలియన్ డాలర్ల కలెక్షన్లను.. బాహుబలి 2 తొలి రోజే సాధించింది. -
బాహుబలి లైఫ్ టైం వసూళ్లు ఒక్క రోజులోనే..!
తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి చేర్చిన బాహుబలి 2 ఈ శుక్రవారం చైనాలో భారీగా రిలీజ్ అయ్యింది. బాహుబలి తొలి భాగం చైనాలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవటంతో రెండో భాగం విషయంలో చిత్రయూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. హాలీవుడ్ సాంకేతిక నిపుణులతో చైనా ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా సినిమాను మరోసారి ఎడిటింగ్ చేయించారు. అంతేకాదు ఏకంగా 7వేలకు పైగా స్క్రీన్లలో సినిమాను రిలీజ్ చేశారు. బాహుబలి నిర్మాతలు తీసుకున్న జాగ్రత్తలు బాగానే ఫలించినట్టున్నాయి. బాహుబలి 2 తొలి రోజు 2.85 మిలియన్ డాలర్లు (19 కోట్లు) కలెక్ట్ చేసింది. కేవలం తొలి షోతోనే మిలియన్ మార్క్‌ను అందుకొని సత్తా చాటింది. బాహుబలి తొలి భాగం చైనాలో ఫుల్ రన్లో సాధించిన 1.18 మిలియన్ డాలర్ల కలెక్షన్లను.. బాహుబలి 2 తొలి రోజే సాధించటం విశేషం. అంతేకాదు చైనాలో ఘనవిజయం సాధించిన దంగల్, భజరంగీ బాయ్‌జాన్ సినిమాల తొలి రోజు కలెక్షన్ రికార్డ్లను సైతం చెరిపేసిన బాహుబలి 2, అక్కడ తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. తొలి రెండు స్థానాల్లో వరుసగా ఆమిర్ ఖాన్ సీక్రెట్ సూపర్ స్టార్, ఇర్ఫాన్ ఖాన్ హిందీ మీడియం సినిమాలు ఉన్నాయి. -
‘బాహుబలి 2’ భారీ రిలీజ్
తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది బాహుబలి 2. దాదాపు అన్ని భాషల్లో టాప్ గ్రాసర్‌గా చరిత్ర సృష్టించింది ఈ సినిమా. ఓవర్సీస్ లో కూడా సరికొత్త రికార్డులు సృష్టించిన బాహుబలి 2 ఈ శుక్రవారం చైనాలో రిలీజ్ అవుతోంది. చైనాలోని ఐమాక్స్ స్క్రీన్స్ మీద రిలీజ్ అవుతున్న తొలి భారతీయ సినిమాగా మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకున్న బాహుబలి 2కు సంబంధించి మరో ఆసక్తికర వార్త ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ సినిమా చైనాలో 7000లకు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ కానుంది. దంగల్ సినిమా 7000 వేల స్క్రీన్స్ మీదే రిలీజ్ కాగా బాహుబలి అంతకు మించి భారీ స్థాయిలో విడుదలవుతోంది. దంగల్ రికార్డ్‌ను చెరిపేసిన బాహుబలి 2.. 8000 స్క్రీన్లపై రిలీజ్ అయిన భజరంగీ బాయ్‌జాన్ రికార్డ్‌ను మాత్రం దాటలేకపోయింది. బాహుబలి తొలి భాగం చైనాలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. మరి బాహుబలి 2 అయినా సత్తా చాటుతుందేమో చూడాలి. -
ఈ రోజు నాకెప్పటికీ ప్రత్యేకమే : ప్రభాస్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన విజువల్ వండర్ బాహుబలి. రెండు భాగాలుగా రిలీజ్ అయిన ఈ సిరీస్‌లో రెండో భాగం రిలీజ్ అయిన ఏడాది పూర్తయ్యింది. ఈ సందర్భంగా తన ఆనందాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నాడు ప్రభాస్. ‘మా సినిమా బాహుబలి 2 విడుదలై ఏడాది పూర్తయ్యింది. ఈ రోజు నాకు ఎప్పటికీ ప్రత్యేకమే. నా అందమైన, భావోద్వేగ ప్రయాణంలో భాగమైనందకు కృతజ్ఞతలు. దర్శకుడు రాజమౌళికి, బాహుబలి చిత్రయూనిట్ కు నా కృతజ్ఞతలతో పాటు శుభాకాంక్షలు’ అంటూ తన ఫేస్బుక్ పేజ్ లో పోస్ట్ చేశాడు ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ సాహో సినిమా పనుల్లో బిజీగా ఉండగా రాజమౌళి బాహుబలి 2 సినిమాను జపాన్‌లో ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. నిర్మాత శోభు యార్లగడ్డతో కలిసి జపాన్ పర్యటనలో ఉన్న జక్కన్న అక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. మే 4 బాహుబలి 2ను చైనాలో భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ లు ఇతర కీలక పాత్రలో నటించిన ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో కలెక్షన్ల సునామీ సృష్టించింది. -
చైనాలో ‘బాహుబలి 2’ రికార్డ్
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన విజువల్ వండర్ బాహుబలి. రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించటమే కాదు ప్రపంచ దేశాల్లోనూ భారీ వసూళ్లను రాబట్టింది. ఇటీవల జపాన్ లో రిలీజ్ అయిన బాహుబలి 2కి అక్కడి ప్రజలు ఘనవిజయాన్ని అంధించారు. మే 4న ఈ సినిమా చైనాలోనూ భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. బాహుబలి 1.. చైనాలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోవటంతో రెండవ భాగం విషయంలో మరింత శ్రద్ధ తీసుకొని పక్కాగా ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే హాలీవుడ్ సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో బాహుబలి 2 సినిమాను చైనా రిలీజ్ కోసం రీ ఎడిట్ చేసి సిద్ధం చేశారు. బాహుబలి 2 చైనాలో సరికొత్త రికార్డ్‌ను సొంతం చేసుకోనుంది. చైనాలోని ఐమాక్స్ స్క్రీన్స్ మీద రిలీజ్ అవుతున్న తొలి భారతీయ చిత్రంగా బాహుబలి 2 రికార్డ్ సృష్టించనుంది.మరి బాహుబలి ఈ సారైన చైనా బాక్సాఫీస్‌ను కొల్లగొడతాడేమో చూడాలి. Pleased that @BaahubaliMovie 2 will be the first Indian film to have an @IMAX release in China on May 4th. It's big but very tough market to crack. Hoping for the best! — Shobu Yarlagadda (@Shobu_) 26 April 2018 -
చైనాలో బాహుబలి-2.. రిలీజ్ డేట్ ఫిక్స్!
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన భారీ ప్రాజెక్టు బాహుబలి. రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమా దేశవ్యాప్తంగానే విదేశాల్లోనూ కలెక్షన్ల సునామీ సృష్టించింది. 'బాహుబలి 2: ది కంక్లూజన్' చైనాలో విడుదల చేసేందుకు అంతా సిద్ధం చేశారు. మే 4న చైనా ప్రేక్షకులు థియేటర్లలో బాహుబలి రెండో భాగాన్ని చూడబోతున్నారంటూ కథనాలు కొన్ని రోజులుగా వస్తున్న విషయం విదితమే. చైనాలో విడుదల కోసం మూవీ యూనిట్ ఎడిటింగ్ నిమిత్తం హాలీవుడ్ ఎడిటర్ విన్సెంట్ టబైల్లాన్ను తీసుకున్నారు. ఎడిటింగ్ చేయడంలో విన్సెంట్ నిపుణుడు. 'ది ఇన్క్రిడబుల్ హల్క్', 'క్లాష్ ఆఫ్ ది టైటాన్స్' చిత్రాలకు పనిచేశాడు. బాహుబలి రెండో భాగం చైనాలో విజయవంతం అవుతుందని రాజమౌళి అండ్ కో ధీమాగా ఉన్నారు. ఇటీవల బాహుబలి 2 జపాన్‌లో విడుదలై ప్రభంజనం సృష్టిస్తోంది. హౌస్‌ఫుల్ కలెక్షన్లు సాధిస్తున్న ‘బాహుబలి 2’ మిలియన్ డాలర్ మార్క్‌ను క్రాస్ చేసి దూసుకుపోతోంది. గత ఏడాది ఏప్రిల్ 28న రిలీజ్ అయిన బాహుబలి 2 హవా ఇప్పటికీ కనిపిస్తూనే ఉంది. -
రాజమౌళికి మహేష్ శుభాకాంక్షలు
బాహుబలి 2 సినిమా జాతీయ చలన చిత్ర అవార్డుల్లో సత్తా చాటడంపై సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలుగును అంతర్జాతీయ స్థాయికి చేర్చిన దర్శక ధీరుడు రాజమౌళిని అభిమానులతో పాటు సినీ వర్గాలు కూడా ఆకానికెత్తేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా రాజమౌళికి, బాహుబలి టీంకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఘనవిజయం సాధించినందుకు శుభాకాంక్షలు. మీ సినిమా బాహుబలి భారతీయ సినీచరిత్రలో ఓ మైలురాయి. మిమ్మల్ని చూసి మేమంతా గర్వపడుతున్నాం’ అంటూ ట్వీట్ చేశారు. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన భరత్ అనే నేను ఈ శుక్రవారం రిలీజ్‌కు రెడీ అవుతుండగా.. రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల కాంబినేషన్లో మల్టీ స్టారర్ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. అంతేకాదు మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కాల్సి ఉంది. కేయల్ నారాయణ ఈ కాంబినేషన్ లో సినిమాను తెరకెక్కించేందుకు ఇప్పటికే ఒప్పందం చేసుకున్నారు. Congratulations @ssrajamouli for the massive win at the #NationalAwards2018. Your film, Baahubali is an important landmark in Indian cinema. We are all very proud of you. — Mahesh Babu (@urstrulyMahesh) 14 April 2018 -
జపాన్ బాక్సాఫీస్ బద్దలు కొట్టిన బాహుబలి
దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన భారీ చిత్రం బాహుబలి. రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించటమే కాదు ప్రపంచ దేశాల్లోనూ భారీ వసూళ్లను రాబట్టింది. ఇటీవల జపాన్ లో రిలీజ్ అయిన బాహుబలి అక్కడి ప్రజలు ఘనవిజయాన్ని అంధించారు. బాహుబలి సినిమాలో క్యారెక్టర్స్‌కు ఫిదా అయిన జపాన్ ప్రజలు థియేటర్లలో ఆ పాత్రల వేశధారణలో సందడి చేశారు. తాజాగా బాహుబలి 2 జపాన్ లో అరుదైన ఘనత సాధించింది. ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్లు సాధిస్తూ దూసుకుపోతున్న ‘బాహుబలి 2’ వన్ మిలియన్ డాలర్ మార్క్‌ను క్రాస్ చేసింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ తమ ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అంతేకాదు బాహుబలి 2లోని సాహోరే పాట యూట్యూబ్ లో 100 మిలియన్ల (పదికోట్ల) వ్యూస్ సాధించింది. గత ఏడాది ఏప్రిల్ 28న రిలీజ్ అయిన బాహుబలి 2 హవా ఇప్పటికీ కనిపిస్తూనే ఉంది. -
బాహుబలి-2ని క్రాస్ చేసిన స్పైడర్!
సాక్షి, చెన్నై : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్పైడర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది తెలిసిందే. ద్విబాషా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రంలో తమిళ వాసనలు ఎక్కువైపోవటంతో, హీరోయిజాన్ని దర్శకుడు తక్కువగా ఎలివేట్ చేయటంతో ఫ్యాన్స్ సైతం పెదవి విరిచారు. అయితే ఈ చిత్రంలో కోలీవుడ్‌లో ఇప్పుడు ఓ రికార్డును క్రియేట్ చేసింది. తాజాగా ఈ చిత్రం బుల్లితెరపై ప్రదర్శించగా.. 10.4 రేటింగ్ సాధించింది. గతంలో బాహుబలి ది కంక్లూజన్ తమిళ వర్షన్‌కు అక్కడ 10.33 రేటింగ్ దక్కింది. దీంతో మహేష్ స్పైడర్ బుల్లితెరపై బాహుబలి-2 టీఆర్పీని దాటేసినట్లయ్యింది. మురుగదాస్ దర్శకుడు కావటం, సూర్య విలన్, మహేష్ క్రేజ్ మూలంగానే ఈ ఘనత సాధించినట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే ఇదయదళపతి విజయ్ మెర్సల్ చిత్రంతో పోలిస్తే ఈ రెండు చిత్రాలు అత్యధిక టీఆర్పీ సాధించినట్లు కోలీవుడ్ మీడియా వెల్లడించటం ఇక్కడ మరో విశేషం. -
హర్రర్ చిత్రంలో సత్యరాజ్
కోలీవుడ్‌లో హర్రర్ కథా చిత్రాల ట్రెండ్ చాలా కాలంగానే కొనసాగుతోంది. ఇందుకు కారణం ప్రేక్షకుల ఆదరణే అని చెప్పవచ్చు. ఇకపోతే దక్షిణ భారతీయ సినిమాలో ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించి ఆ పాత్రకు జీవం పోసే నటుడు సత్యరాజ్. ఈ మధ్య బాహుబలి చిత్రంతో తన పేరును దేశ వ్యాప్తంగా ఇనుమడింపజేసుకున్న ఈయన తాజాగా హర్రర్ థ్రిల్లర్ కథా చిత్రంలో ప్రధాన పాత్రను పోషించడానికి సిద్ధం అవుతున్నారు. దీన్ని కళ్లపడం చిత్ర ఫేమ్ వేల్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్ర వివరాలను ఆయన తెలుపుతూ పాత్రలకు నప్పే నటులను ఎంపిక చేసుకోవడం చిత్రానికి చాలా ముఖ్యం అని తాను భావిస్తానన్నారు. ఆ విధంగా తాజా చిత్రానికి సత్యరాజ్ నటించడానికి ఒప్పుకోవడంతో సగం పని తగ్గిందని అన్నారు. ఇది ఒక ఎఫ్ఎం రేడియో స్టూడియో నేపథ్యంలో సాగే సూపర్ నేచురల్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. ఒక రాత్రి ఎఫ్ఎం.రేడియో స్టూడియోలో జరిగిన సంఘటన ఇతివృత్తంగా చిత్రం ఉంటుందన్నారు. దీన్ని ఒక ఎఫ్ఎం స్టూడియోలోనే చిత్రీకరించనున్నట్లు తెలిపారు. ఒక నూతన నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుందని, ప్రస్తుతం ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతోందని చెప్పారు. హర్రర్ కథా చిత్రాల్లో ఈ చిత్రం వైవిధ్యభరితంగా ఉంటుందని దర్శకుడు వేల్ పేర్కొన్నారు. ఇంకాపేరు నిర్ణయించని ఈ సినిమా ఉత్కంఠ భరిత సన్నివేశాలతో అన్ని వర్గాలను అలరించే చిత్రంగా ఉంటుందని అన్నారు. -
బాహుబలి.. ఓ పాఠం!
‘బాహుబలి’ సినిమా ఖాతాలో మరో రికార్డు చేరింది. అదేంటంటే.. ‘బాహుబలి’ సినిమా సక్సెస్‌ను పాఠంగా చెప్పబోతున్నారు. ఈ చిత్ర విజయాన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ (ఐఐఎమ్ఎ) ఓ కేస్ స్టడీగా తీసుకుని, పరిశోధన చేయనున్నట్లు అక్కడి ప్రొఫెసర్ భరతన్ కందస్వామి పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ– ‘‘సీక్వెల్‌గా వచ్చిన ‘బాహుబలి’ చక్కని మార్కెటింగ్ స్ట్రాటజీతో మంచి వసూళ్లు రాబట్టింది. సీక్వెల్స్ తీస్తున్నప్పుడు ఫస్ట్ పార్ట్ సక్సెస్ అయితే రెండో పార్ట్‌కి పబ్లిసిటీ ఈజీగా వస్తుంది. మార్కెటింగ్ సులువు అవుతుంది. ప్రధానంగా నేను సీక్వెల్స్ నిర్మాణం, మార్కెటింగ్ మంత్ర, కలెక్షన్స్ మీద దృష్టి పెట్టబోతున్నాను. ఈ విషయాల్లో అవగాహన కల్పించడంతో పాటు విద్యార్థులకు డిజిటల్ మార్కెట్ గురించి కూడా చెబుతాం. సినిమా ఇండస్ట్రీ గురించి అన్ని కోణాల నుంచి విద్యార్థులకు తెలియజేయనున్నాం.అందుకే సక్సెస్ సాధించిన ‘బాహుబలి’ సినిమాను ఓ కేస్ స్టడీగా తీసుకోవాలని నిర్ణయించుకున్నాం’’ అన్నారు. రాజమౌళి దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన ‘బాహుబలి’ బాక్సాఫీస్ దగ్గర ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్ ముఖ్య తారలుగా నటించిన ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీకి గర్వకారణంగా నిలిచింది. -
త్వరలో జపాన్‌లో ‘బాహుబలి 2’ రిలీజ్
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలుగు సినిమా బాహుబలి హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. వెండితెర మీదే కాదు బుల్లితెర మీద కూడా సత్తా చాటిన ఈ భారీ చిత్రం త్వరలో ఓవర్ సీస్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఇప్పటికే పలు దేశాల్లో భారీ వసూళ్లు సాధించగా ముందు ముందు మరిన్ని దేశాల్లో రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు చిత్రయూనిట్. ఈ నెల 29న బాహుబలి 2 జపాన్ లో భారీగా రిలీజ్ అవుతోంది. జపనీస్ భాషలో డబ్ చేసి భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు జపాన్ సెన్సార్ బోర్డ్ ‘జీ’ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. మన సెన్సార్ బోర్డ్ అందించే క్లీన్ యు సర్టిఫికేట్ కు ఇది సమానం. త్వరలోనే కొరియా, చైనా తో పాటు ఇతర ఆసియా దేశాల్లో బాహుబలి 2 రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. -
యూట్యూబ్ వ్యూస్ లో బాహుబలి 2 రికార్డ్
భారతీయ సినిమా చరిత్రలోని అన్ని రికార్డ్ లను తిరగరాసిన తెలుగు సినిమా బాహుబలి 2 హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, అనుష్కలు ప్రధాన పాత్రలో తెరకెక్కిన బాహుబలి 2 సంచలన విజయం సాధించటమే కాదు అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు రివార్డులతో పాటు భారీ వసూళ్లను కూడా సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ చేసిన బాహుబలి 2, 2017 యూట్యూబ్ లోనూ రికార్డ్ సృష్టించింది. 2017లో అత్యధిక మంది వీక్షించిన సినిమా ట్రైలర్ల జాబితాలో బాహుబలి 2 సినిమా రెండో స్థానంలో నిలిచింది. 9 కోట్ల 10 లక్షలకుపైగా వ్యూస్ సాధించి హాలీవుడ్ సినిమా అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్ తొలి స్థానంలో నిలవగా 8 కోట్లకుపైగా వ్యూస్ తో బాహుబలి 2 ట్రైలర్ రెండో స్థానంలో నిలిచింది. హాలీవుడ్ సూపర్ హిట్ సినిమాలు ఇన్ క్రెడిబుల్స్ 2, థోర్ : రాగ్నరాక్ బాహుబలి 2 తరువాతి స్థానాల్లో నిలవగా బాలీవుడ్ సినిమాలు టైగర్ జిందాహై, పద్మావతి చిత్రాల ట్రైలర్లు 5 కోట్లకు పైగా వ్యూస్ సాధించాయి. -
ప్చ్... బాహుబలిని మాత్రం బీట్ చెయ్యట్లేదు!
సాక్షి, సినిమా : బాలీవుడ్‌కు ఎట్టకేలకు కాస్త ఊరట లభించింది. ఈ యేడాది రెండు వందల కోట్లు వసూలు చేసిన తొలి హిందీ చిత్రంగా గోల్మాల్ అగెయిన్ నిలిచింది. ఆదివారం వసూళ్లతో ఈ మార్క్ చేరుకుందని సినీ ట్రేడ్ విశ్లేషకుడు తరన్ ఆదర్శ్ ట్విట్టర్లో తెలియజేశారు. తద్వారా వరుణ్ ధావన్ నటించిన జుద్వా-2 చిత్రాన్ని వెనక్కి నెట్టి గోల్మాల్ అగెయిన్ రెండో స్థానంలో నిలిచింది. ఇక 500 కోట్లకు పైగా వసూళ్లతో బాహుబలి ది కంక్లూజన్ మొదటి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. డబ్బింగ్ చిత్రంగా విడుదలైన బాహుబలి-2 ఎవరూ ఊహించని రేంజ్లో ప్రభంజనం సృష్టించగా... తర్వాత వచ్చిన సల్మాన్ ట్యూబ్‌లైట్, షారూఖ్ జబ్ హ్యారీ మెట్ సెజల్, అక్షయ్ కుమార్ టాయ్ లెట్ చిత్రాలు మ్యాజిక్ చేస్తాయని భావించినప్పటికీ అది జరగలేదు. దీంతో ఈ యేడాది కనీసం రెండు వందల కోట్ల క్లబ్లో కూడా ఏ చిత్రం చేరదేమోనని అంతా భావించారు. అయితే దీపావళికి రిలీజ్ అయిన గోల్మాల్ అగెయిన్‌కు అమీర్ ఖాన్ సీక్రెట్ సూపర్‌స్టార్ ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. ప్రపంచవ్యాప్తంగా 3500 స్క్రీన్లలో విడుదలైన ఈ చిత్రం.. విదేశాల్లో 732 స్క్రీన్లలో రిలీజ్ అయి 46 కోట్లు రాబట్టింది. అజయ్ దేవగన్, టబు, పరిణితీ చోప్రా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి భారీ యాక్షన్ చిత్రాన్ని దర్శకుడు రోహిత్ శెట్టి డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. మొత్తానికి 200 కోట్లు రాబట్టి ఈ యేడాది ఇప్పటిదాకా హయ్యెస్ట్ వసూళ్లు రాబట్టిన హిందీ చిత్రంగా నిలిచింది. ఇక ఇప్పుడు అందరి కళ్లు సంజయ్ లీలా భన్సాలీ పద్మావతి చిత్రంపైనే ఉన్నాయి. -
బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ చేసిన సల్మాన్
ఇటీవల వరుస ఫ్లాప్ లతో ఇబ్బందుల్లో పడ్డ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం టైగర్ జిందాహై. గతంలో ఘనవిజయం సాధించిన ఏక్తా టైగర్ కు సీక్వల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ నెలాఖరున రిలీజ్ అవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ ట్రైలర్ గత చిత్రాల డిజిటల్ రికార్డులన్నింటినీ చెరిపేస్తూ దూసుకుపోతోంది. తాజాగా యూట్యూబ్‌లో అత్యధిక లైక్‌లు సాధించిన భారతీయ చిత్ర ట్రైలర్‌గా రికార్డ్ సృష్టించింది టైగర్ జిందాహై. గతంలో ఐదున్నర లక్షల లైకులతో బాహుబలి 2 ట్రైలర్ పేరిట ఉన్న రికార్డ్‌ను 7 లక్షలకు పైగా లైకులతో టైగర్ జిందాహై ట్రైలర్ బ్రేక్ చేసింది. అంతేకాదు ఇప్పటికే మూడు కోట్ల వ్యూస్‌కు చేరువలో ఉన్న ఈ ట్రైలర్, త్వరలో అత్యధిక వ్యూస్ సాదించిన ట్రైలర్‌గా కూడా రికార్డ్ సృష్టింస్తుందని భావిస్తున్నారు. సల్మాన్ సరసన కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అలీ అబ్బాస్ జాఫర్ దర్శకుడు, యష్ రాజ్ ఫిలింస్ సంస్థ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తోంది. అయితే ట్రైలర్ల లిస్ట్ లో బాహుబలి, ట్రైగర్ జిందాహైలు ముందున్నా.. తమిళ సినిమా ‘మెర్సల్’ టీజర్ 10లక్షలకు పైగా లైకులు సాదదించి ఎవరికీ అందని స్థాయిలో నిలిచింది. -
'ఇంతకన్నా గొప్ప ఆదివారం రాదు'
బాహుబలి 2 సినిమా వెండితెర మీదే కాదు బుల్లితెర మీద కూడా సంచలనాలు నమోదు చేస్తుందని చిత్రయూనిట్ ఎంతో నమ్మకంగా ఉంది. అందుకే ఒకేసారి మూడు భాషల్లో టీవీ ప్రసారానికి రంగం సిద్ధం చేసింది. ఎలాంటి పండుగ సీజన్ కాకపోయినా.. బాహుబలి ప్రదర్శనే ఓ పండుగు అన్నట్టుగా ప్రచారం చేశారు చిత్రయూనిట్. ఆదివారం (08-10-2017) హిందీ, తమిళ, తెలుగు భాషల్లో రెండు గంటల తేడాతో సినిమాను ప్రసారం చేయనున్నారు.స ఈ ప్రీమియర్స్ షోస్ పై హీరో ప్రభాస్ ఆసక్తికరంగా స్పందించాడు. తన ఫేస్ బుక్ పేజ్ లో బాహుబలి 2 సినిమాను టీవీలో చూసి ఆనందించాలని కోరిన ప్రభాస్, ఇంతకంటే గొప్ప ఆదివారం రాదంటూ కామెంట్ చేశాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి 2 ప్రపంచ వ్యాప్తంగా 1500 కోట్లకు పైగా వసూళ్లు సాదించి సంచలనం సృష్టించింది. -
ఓవర్సీస్ రికార్డ్: బాహుబలి, ధూమ్ తరువాత స్పైడరే..!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ స్పైడర్. సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఓవర్ సీస్ లో ఒక రోజు ముందుగానే ప్రీమియర్ షోస్ ప్రారంభమయ్యాయి. అమెరికాలో తెలుగు, తమిళ భాషల్లో కలిపి మూడు వందలకు పైగా థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఓవర్ సీస్ లో ప్రీమియర్ షోస్ తోనే స్పైడర్ పది లక్షల డాలర్లు వసూళు చేసినట్టుగా ఫోర్బ్స్ సంస్థ ఓ వార్తలో పేర్కొంది. వారాంతంలో కాకుండా వీక్ డేస్ లో రిలీజ్ అయి ఈ ఫీట్ సాధించిన మూడో భారతీయ చిత్రంగా స్పైడర్ రికార్డ్ సృష్టించింది. స్పైడర్ కన్నా ముందు ధూమ్ 3, బాహుబలి 2 సినిమాలు మాత్రమే ఈ ఫీట్ సాధించాయి. ఇప్పటికే తొలివారం అడ్వాన్స్ బుకింగ్స్ అయిపోవటంతో తొలివారాంతనికి స్పైడర్ మరిన్ని రికార్డ్ లు బద్ధలు కొడుతుందని భావిస్తున్నారు. -
భారత్ నుంచి ఆస్కార్ బరిలో 'న్యూటన్'
ఈ ఏడాది ఆస్కార్ బరిలో విదేశీ చిత్రం కేటగిరిలో పోటి పడబోయే భారతీయ చిత్రాన్ని ప్రకటించారు. బాలీవుడ్ విలక్షణ నటుడు రాజ్ కుమార్ రావు లీడ్ రోల్ లో తెరకెక్కిన న్యూటన్ సినిమా ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో పోటికి పంపనున్నారు. ఈ మేరకు జ్యూరీ సభ్యులు ప్రకటన విడుదల చేశారు. దాదాపు 26 చిత్రాలను పరిశీలించిన జ్యూరీ చివరకు న్యూటన్ ను ఎంపిక చేసింది. తెలుగు నుంచి బాహుబలి 2తో పాటు గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాలను కూడా పరిశీలించినట్టుగా జ్యూరీ చైర్మన్ సీవీ రెడ్డి తెలిపారు. -
బాహుబలి 2 ఇంకా చూడలేదు: సూపర్ స్టార్
ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు నమోదు చేసిన బాహుబలి సినిమాపై టాలీవుడ్ బాలీవుడ్ సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురించినా.. బాలీవుడ్ ఖాన్ లు మాత్రం పెద్దగా స్పందించిన సందర్భాలు లేవు. సల్మాన్, షారూఖ్ లాంటి స్టార్ గతంలో బాహుబలి రిజల్ట్ పై స్పందించారు. ఏదో మొక్కుబడి బాహుబలి ఇంకా చూడలేదు.. కానీ మంచి టాక్ సొంతం చేసుకోవటం ఆనందంగా ఉందంటూ కామెంట్ చేశారు. తాజాగా మరో బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ కూడా ఇలాగే స్పందించాడు. ప్రస్తుతం తానే స్వయంగా నటిస్తూ నిర్మించిన సీక్రెట్ సూపర్ స్టార్ సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన ఆమిర్, బాహుబలి సినిమా ఇంకా చూడలేదని తెలిపాడు. సినిమా రిలీజ్ అయి 100 రోజులు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా సంబరాలు జరుగుతున్న నేపథ్యంలో ఆమిర్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. బాహుబలి 2 హిందీ వర్షన్ 500 కోట్లకు పైగా వసూళు చేసింది కథ, ఆ సినిమా కలెక్షన్లు చూస్తూ మీకు భయం వేయటం లేదా అన్న ప్రశ్నకు 'బాహుబలి 2 రిజల్ట్ తో మన హిందీ సినిమా స్థాయి ఏంటనేది మనకు తెలిసింది. ఇంకా మంచి సినిమాలు తీయాలి. అలాగే బాహుబలి 2 అంతటి ఘనవిజయం సాధించటం ఆనందంగా ఉంది. కాని నేను ఇంకా సినిమాను చూడలేదు. త్వరలోనే చూస్తాను' అంటూ కామెంట్ చేశాడు. -
'నా సినిమాను బాహుబలి 2 మింగేసింది'
ముంబయి: తన సినిమా బిజినెస్‌ను బాహుబలి 2 మింగేసిందని ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా అన్నారు. తన చిత్రం మేరి ప్యారీ బిందు బాక్సాపీస్ వద్ద రాబట్టిన వసూళ్లు చిత్రంపై ప్రేక్షకులు ప్రతిస్పందనవంటి విషయాలను ఆయన వద్ద ప్రస్తావించగా ఆయన పై విధంగా స్పందించారు. 'నా చిత్రానికి నా కుటుంబం నుంచి మిత్రుల నుంచి ప్రేక్షకుల నుంచి భిన్న స్పందన వచ్చింది. కొంతమంది నచ్చిందని చెప్పారు. కొంతమంది నచ్చలేదని చెప్పారు. ఏదేమైనా వ్యాపారపరంగా నా సినిమాపై బాహుబలి 2 ప్రభావం కొద్దిగా పడిందనే చెప్పగలను. నా సినిమా విడుదలయ్యే సమయానికి థియేటర్లలో బాహుబలి 2 లేకుంటే కచ్చితంగా నా సినిమా మరిన్ని వసూళ్లు రాబట్టేది. నా చిత్ర బిజినెస్‌ను బాహుబలి 2 మింగేసింది' అని ఆయన తెలిపారు. బాహుబలి 2 ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 28న విడుదల కాగా మేరి ప్యారీ బిందు మాత్రం మే నెలలో విడుదలైంది. -
విదేశాల్లో బాహుబలి కలెక్షన్లు ఎంతో తెలుసా..
న్యూఢిల్లీ: బాహుబలి, తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా. హాలీవుడ్ దర్శకులు సైతం సాహో అనే విధంగా బాహుబలిని రాజమౌళి తెరకెక్కించారు. అది సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. రికార్డులు అన్నీ తిరగ రాసింది. ఇప్పడు ఏ రికార్డైనా నాన్-బాహుబలి రికార్డుగా చెప్పకుంటున్నారంటే అది సృష్టించిన సంచలనం అలాంటింది. దేశ విదేశాల్లో రికార్డులు కొట్టింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 1000 కోట్ల బెంచ్ మార్కును దాటిన చిత్రంగా బాక్సాఫీసు వద్ద కొత్త ఫీట్‌ను సృష్టించింది. ఇప్పుడు తాజాగా మరో రికార్డు బాహుబలి ఒడిలో చేరింది. బాక్సాఫీస్ ఇండియా తాజా రిపోర్టు ప్రకారం బాహుబలి-2 విదేశాల్లో రూ.801 కోట్లు వసూలు చేసింది. ఇది ఏభారతీయ చిత్రం ఇప్పటివరకూ చేరుకోలేని రికార్డు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే రష్యాలో ఏర్పాటు చేసిన 39వ అంతర్జాతీయ సినీ ఫెస్టివల్లో మొదటిసారి ఇండియన్ పనోరమ పేరుతో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. బ్యాడ్‌మ్యాన్, ఎ డెత్ ఇన్ ద గంజ్, బేయార్, యూటర్న్, కోతనోడి చిత్రాలతోపాటు బాహుబలి సిరీస్‌ను కూడా ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. -
ప్రభాస్‌తో కరణ్ భారీ డీల్..?
బాహుబలి సినిమాతో ప్రభాస్ జాతీయ స్థాయి నటుడిగా ఎదిగాడు. తొలి భాగం రిలీజ్ అయిన తరువాత పలు బాలీవుడ్ సినిమాల్లో ప్రభాస్‌కు ఆఫర్లు వచ్చాయి. అయితే బాహుబలి పూర్తయితే గాని ఇతర సినిమాలు అంగీకరించకూడదని నిర్ణయం తీసుకున్న ప్రభాస్, అన్నింటిని రిజెక్ట్ చేశాడు. రెండో భాగం రిలీజ్ తరువాత ప్రభాస్ రేంజ్ మరింతగా పెరిగిపోయింది. ముఖ్యంగా బాలీవుడ్లో బాహుబలి 2 సృష్టిస్తున్న సంచలనాలతో అక్కడి నిర్మాతలు కూడా ప్రభాస్ డేట్స్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. అదే సమయంలో బాహుబలి సినిమాకు బాలీవుడ్ సమర్పకుడిగా వ్యవహరించిన కరణ్ జోహర్, ప్రభాస్‌తో స్ట్రయిట్ బాలీవుడ్ సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. ఒకేసారి రెండు, మూడు సినిమాలకు అగ్రిమెంట్ చేసుకునేలా ప్రభాస్‌తో చర్చలు జరుపుతున్నాడట. గతంలో బాహుబలి 2 సక్సెస్ పార్టీ ఇచ్చాడు కరణ్. కానీ ఆ సమయంలో ప్రభాస్ విదేశాల్లో ఉండటంతో ఆ పార్టీలో పాల్గొనలేదు. అందుకే ఇటీవల ప్రభాస్ కోసం ప్రత్యేకంగా ఓ పార్టీ ఇచ్చాడు కరణ్. ఈ పార్టీలోనే ప్రభాస్‌తో వరుసగా సినిమాలు చేసేందుకు చర్చించాడట. ప్రభాస్ కూడా కరణ్‌తో డీల్‌కు సుముఖంగానే ఉన్నాడన్న టాక్ వినిపిస్తోంది. -
పెరోల్‌పై వచ్చి బాహుబలి 2 చూసి జంపయింది
అహ్మదాబాద్: పైకి చూడటానికి ఆమె ఒక సన్యాసి. పేరు జై శ్రీ గిరి. ఒక స్వచ్ఛంద సంస్థను కూడా నడుపుతూ ఓ ఆలయాన్ని నిర్వహిస్తోంది. ఈ ఏడాది తొలి రోజుల్లో (జనవరిలో) గుజరాత్ పోలీసులు ఆమె ఆశ్రయంపై దాడులు నిర్వహించగా బిత్తరపోయే విషయాలు వెలుగుచూశాయి. పెద్ద మొత్తంలో అక్రమ మార్గంలో బంగారం కొనుగోలు చేసి అడ్డంగా దొరికిపోయింది. తన ఆశ్రమంలో కోట్ల విలువైన బంగారు బిస్కెట్లతోపాటు మద్యం సీసాలు కూడా పెద్ద మొత్తంలో లభించాయి. దీంతో ఆమెను అరెస్టు చేశారు. అప్పటి నుంచి విచారణ ఖైదీగా ఉంచిన పోలీసులు ఇటీవలె ఆరోగ్య పరీక్షల నిమిత్తం పెరోల్‌పై నలుగురు పోలీసులను గార్డులగా ఇచ్చి బయటకు పంపించారు. అయితే, ఆరోగ్య పరీక్షల పేరిట బయటకు వచ్చిన ఆమె పరీక్షలు పూర్తి చేసుకున్న తర్వాత తనకు కొంత విరామం కావాలంటూ బ్రతిమిలాడుకుంది. అహ్మదాబాద్‌లోని హిమాలయన్ మాల్‌కు తన వ్యక్తిగత లాయర్, పోలీసు గార్డులతో వెళ్లింది. ఏం చక్కా నచ్చిన ఫుడ్డు లాగించేసి.. అనంతరం తాఫీగా మసాజ్ చేయించుకుంది. ఆ వెంటనే భారత దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టించి ఇప్పటికీ విజయవంతంగా దూసుకెళుతున్న బాహుబలి 2 చిత్రాన్ని చూసింది. ఆ సమయంలో నిరంతరం ఫోన్లో మాట్లాడిన ఆమె తన పెరోల్ మరింత పొడిగించే అవకాశం ఉందా అని కనుక్కుంది. అయితే, ఎప్పుడైతే ఆమె పెరోల్ గడువు పొడిగించడం లేదని తెలిసిందో ఆ వెంటనే తాను వాష్ రూమ్‌కు వెళ్లొస్తానని చెప్పి వెళ్లి అటునుంచి అటే పారిపోయింది. దీంతో బిత్తరపోవడం ఆమెకు కాపలాగా ఉన్న గార్డుల వంతైంది. ఈ ఘటనపై పోలీసులు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యి గార్డుల నిర్లక్ష్యం కారణంగానే ఆమె పారిపోయిందంటూ వారిని, ఆమె న్యాయవాదిని అరెస్టు చేశారు. ఈ నలుగురు గార్డులకు కూడా ఈ మధ్య శిక్షణ పూర్తయిందట. ప్రస్తుతం ఇతర పోలీసులు ఆమెను పట్టుకునే పనిలో పడ్డారు. ఈమె దాదాపు రూ.5కోట్ల విలువైన బంగారాన్ని అక్రమ మార్గంలో ఈ ఏడాది జనవరిలో కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. -
50 రోజులు, 1050 సెంటర్లు
హైదరాబాద్: బాక్సాఫీసు వద్ద ‘బాహుబలి 2’ హవా కొనసాగుతోంది. ఇప్పటికే రికార్డులు మీద రికార్డులు సాధించిన ఈ చిత్రరాజం మరో ఘనత సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదల నేటికి 50 రోజులు పూర్తయింది. దేశవ్యాప్తంగా 1050 సెంటర్లలో ఇంకా ‘బాహుబలి 2’ సినిమా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది. 50 రోజులు గడిచినా ఈ సినిమాకు ఆదరణ తగ్గకపోవడం విశేషం. భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం నిలిచిన ‘బాహుబలి 2’ మున్ముందు మరిన్ని రికార్డులు సృష్టించనుంది. త్వరలో చైనాతో పాటు మరికొన్ని దేశాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. దీంతో ఆల్‌టైమ్ రికార్డు కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచే అవకాశముందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రూ. 2 వేల కోట్లు సాధించే తొలి భారతీయ సినిమా అవుతుందని భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిలోనూ హైయ్యస్ట్ గ్రాస్ కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డ్ సృష్టించిన బాహుబలి 2 ఇప్పటి వరకు రూ. 1650 కోట్లకు పైగా వసూలు చేసింది. కాగా, ఈ నెల 22న ప్రారంభం కానున్న మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో బాహుబలి 2ను ప్రారంభ చిత్రంగా ప్రదర్శించనుండటం విశేషం. -
బాహుబలి 2కు మరో అరుదైన గౌరవం
రికార్డ్ కలెక్షన్లు సాధించి బిగెస్ట్ ఇండియన్ ఫిలింగా అవతరించిన బాహుబలి సంచలనాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎన్నో జాతీయ అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శితమైన ఈ సినిమాను మరో ప్రెస్టీజియస్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించనున్నారు. ఈ నెల 22న ప్రారంభం కానున్న మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో బాహుబలి 2ను ప్రారంభ చిత్రంగా ప్రదర్శించనున్నారు. ఇటీవల జరిగి కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌తో పాటు రొమేనియా ఫిలిం ఫెస్టివల్ లోనూ బాహుబలి 2కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మాస్కోలోనే అదే స్పందన వస్తుందని ఆశిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిలోనూ హైయ్యస్ట్ గ్రాస్ సాధించిన సినిమాగా రికార్డ్ సృష్టించిన బాహుబలి 2 ఇప్పటి వరకు 1650 కోట్లకు పైగా వసూలు చేసింది. త్వరలో చైనాతో పాటు మరికొన్ని దేశాల్లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తుండటంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. -
బాహుబలి-2 వీడియో; గంటల్లో వేలకొద్దీ వ్యూస్
ఇప్పటికే రూ.1500 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి అర్ధశతదినోత్సవానికి చేరువవుతోన్నా ‘బాహుబలి-2 (ది కన్‌క్లూజన్)’ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. బాలీవుడ్లో గతవారం కొత్త సినిమాలు విడుదలైనా ఎక్కువ మంది ప్రేక్షకులు బాహుబలికే జైకొట్టారు. ఆదివారం విడుదలైన వీడియో సాంగ్ విషయంలోనూ నెటిజన్లు విపరీతమైన ఆసక్తి కనబర్చారు. బాహుబలి 2 సినిమా టైటిల్స్ పడేప్పుడు వినిపించే ‘ఒక ప్రాణం..’ పాట వీడియోను.. టైటిల్స్ లేకుండా ప్రత్యేకంగా విడుదలచేశారు లహరి మ్యూజిక్ వారు. ‘ఒక ప్రాణం..’ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో పబ్లిష్ అయిన రెండు గంటల వ్యవధిలోనే దాదాపు 80వేల మంది వీక్షించారు. బాహుబలి టీజర్లు, ట్రైలర్ల మాదిరే వీడియో సాంగ్స్ కూడా భారీ సంఖ్యలో హిట్స్ సాధిస్తుండటం గమనార్హం. ‘ఒక ప్రాణం..’ పాటను ఎంఎం కీరవాణి స్వయంగా రాసి, స్వరపర్చగా, ఆయన తనయుడు కాలభైరవ ఆలపించారు. అద్భుతమైన హెచ్డీలో రూపొందించిన ఆ పాట మీకోసం.. -
మాది జన్మజన్మల అనుబంధం
‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?’ అనే ప్రశ్న ‘బాహుబలి 2’ విడుదల వరకూ వెంటాడింది. రిలీజయ్యాక ఆ ప్రశ్నకు సమాధానం దొరికేసింది. ఇప్పుడు పలు ప్రశ్నలు వెంటాడుతున్నాయి. వాటిలో భల్లాలదేవ రానా భార్య పాత్రధారి ఎవరు? అనే ప్రశ్న ఒకటి. ఈ ప్రశ్నను రానాని డైరెక్ట్‌గా అడిగేశాడు ఓ వ్యక్తి. సోషల్ మీడియా ద్వారా రానా తన అభిమానులతో కాసేపు ముచ్చటించారు. అందరూ అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు చెప్పారు. గతంలో ‘బాహుబలి’లో మీ భార్య ఎవరు? అని ఒకరు అడిగితే, ‘సరోగసి’ ద్వారా నా కొడుకు భద్ర పుట్టాడంటూ సరదాగా సమాధానం చెప్పి, తప్పించుకున్నారు రానా. అయితే ఈసారి ఓ అభిమాని ట్విట్టర్ వేదికగా రానా ముందు ఈ ప్రశ్న ఉంచాడు. ‘బాహుబలి 2’లో మీ భార్య ఎవరన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. దీనికి మీరు సమాధానం చెప్పాల్సిందే’ అన్నాడు. ‘కాజల్’ అంటూ సమాధానమిచ్చాడు రానా. ‘ఇక నేనేం చెప్తాను. మాది జన్మజన్మల అనుబంధం’ అంటూ రానా ట్వీట్‌కి ట్విట్టర్ ద్వారానే కాజల్ సరదాగా సమాధానం ఇచ్చారు. ఈ ఇద్దరూ ప్రస్తుతం ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంలో జంటగా నటిస్తున్న విషయం తెలిసిందే. మరోసారి రాణిగా... కంగనా రనౌత్ లీడ్ రోల్లో నటించిన బాలీవుడ్ ‘క్వీన్’ ఎంత హిట్ అయిందో తెలిసిందే. ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని తమిళ నటుడు, దర్శకుడు త్యాగరాజన్ రైట్స్ కొనుక్కున్నారు. నటి రేవతి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తమన్నా లీడ్ రోల్లో ఈ చిత్రం తీయనున్నారని గతంలో వార్తలొచ్చాయి. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయి, సినిమా మొదలవుతుందనే టైమ్‌కి ఈ చిత్రం నుంచి తమన్నా తప్పుకున్నారనే వార్త వచ్చింది. ఆమె స్థానంలో కాజల్ అగర్వాల్‌ను తీసుకున్నారని తెలిసింది. కాగా పరుల్ యాదవ్ లీడ్ రోల్లో రమేష్ అరవింద్ దర్శకత్వంలో కన్నడ రీమేక్‌ను ఇప్పటికే స్టార్ట్ చేశారట త్యాగరాజన్. -
ప్రభాస్ గురించి ఓ ఫన్నీ సీక్రెట్ చెప్పిన రాజమౌళి
హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా విడుదలై రికార్డులు సృష్టిస్తున్న చిత్రం బాహుబలి 2. వసూళ్ల పరంగా భారతదేశంలోనే కాకుండా మొత్తం ప్రపంచ దేశాల్లో కూడా ఈ సినిమా దుమ్మురేపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ పలురకాలుగా బాహుబలి 2 మానియా కొనసాగుతోంది. ఈ సినిమాకు సంబంధించి వెలుగులోకి వస్తున్న కొత్త విషయాలు ఆసక్తిని రేపుతుండగా చిత్ర దర్శకుడు రాజమౌళి ఈ సినిమా హీరో ప్రభాస్ గురించి ఓ ఫన్నీ సీక్రెట్ చెప్పాడు. కండలు తిరిగిన ప్రభాస్ దేహం వెనుక బిర్యానీ మాయ ఉందంట. అవునూ సినిమా కోసం ప్రభాస్, రానాలు తమ దేహాన్ని ఎంత ఫిట్నెస్గా ఉంచుకున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రానా గురించి పక్కన పెడితే ప్రభాస్ మాత్రం 15 రకాల బిర్యానీలు తినేవాడంట. ఈ విషయాన్ని రాజమౌళి బ్రిటన్‌లో ఓ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ విద్యార్థులకు తెలియజేశారు. చేపలు, మటన్‌తో కూడిన బిర్యానీలు, అందులో కర్రీలు, ఫ్రైలతో తెగ లాగించేశాడంట. ‘వాళ్లు(ప్రభాస్, రానా) ఎలాంటి డైట్‌ఫాలో అయినా నేను అడ్డు చెప్పే వాడిని కాదు. వారిపై ఒత్తిడి కూడా చేయలేదు. కానీ, ఈ సందర్భంగా మీకు ప్రభాస్ గురించి ఓ ఫన్నీ సంఘటన చెబుతాను. ప్రభాస్ బాహుబలి 2 షూటింగ్ సమయంలో కనీసం 10 నుంచి 15 రకాల బిర్యానీలు తినేవాడు’ అంటూ సరదాగా చెప్పుకొచ్చాడు రాజమౌళి. -
బాహుబలి కన్నా.. నా కలెక్షన్లే ఎక్కువ : సల్మాన్
ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్న బాహుబలి సినిమాపై బాలీవుడ్ స్టార్స్ మాత్రం ఆచితూచి స్పందిస్తున్నారు. బాహుబలి 2 రిలీజ్ అయి ఘనవిజయం సాధించిన తరువాత కూడా చాలా కాలం పాటు బాలీవుడ్ హీరోలు ఈ సినిమాపై స్పందించలేదు. అయితే ఇండియన్ సినిమా అంటే బాహుబలే అనే స్థాయి కలెక్షన్లు నమోదు కావటంతో తప్పనిసరి పరిస్థితుల్లో షారూఖ్, ఆమిర్ లాంటి స్టార్స్ సినిమా చూడలేదు గానీ.. బాహుబలి గొప్ప సినిమా అంటూ కామెంట్ చేశారు. తాజాగా ఈ లిస్ట్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా చేరిపోయాడు. ఈద్ కానుకగా రిలీజ్ అవుతున్న ట్యూబ్‌లైట్ సినిమా ప్రమోషన్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సల్మాన్.. బాహుబలి కలెక్షన్లపై స్పందించాడు. అయితే బాహుబలి గొప్ప సినిమానే అన్న సల్మాన్, బాహుబలి కలెక్షన్ల కన్నా.. నా కలెక్షన్లే ఎక్కువంటూ మెలికపెట్టాడు. బాహుబలి సినిమాను నాలుగేళ్ల పాటు తెరకెక్కించారు. నేను ఏడాదికి రెండు సినిమాలు చేస్తూ వస్తున్నా.. అవన్ని కలుపుకుంటే బాహుబలి వసూళ్ల కన్నా నా కలెక్షన్లే ఎక్కువ కదా..! అంటూ మీడియాకు ఎదురు ప్రశ్న వేశాడు. -
చెరిగిపోయిన బాహుబలి 2 రికార్డు
ముంబై: బాహుబలి 2, దంగల్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద హోరాహోరీ తలపడుతున్నాయి. తాజాగా బాహుబలి 2 నెలకొల్పిన రికార్డును దంగల్ దాటేసింది. అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన భారతీయ సినిమాగా నిలిచింది. చైనాలో సునామీ వసూళ్లుతో దూసుకుపోతున్న ఆమిర్ ఖాన్ సినిమా గ్రాస్ వసూళ్లలో కొత్త రికార్డు నెలకొల్పినట్టు ప్రముఖ సినిమా జర్నలిస్టు హరిచరణ్ పుడిపెద్ది తెలిపారు. బాహుబలి 2 సినిమా నాలుగు బాషల్లో (హిందీ తెలుగు, తమిళం, మలయాళం) రూ.1530 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్టు వెల్లడించారు. దంగల్ నాలుగు బాషల్లో(హిందీ, తమిళం, తెలుగు, మాండరిన్) రూ. 1743 గ్రాస్ వసూళ్లు సాధించినట్టు తెలిపారు. మే 5న చైనాలో విడుదలైన దంగల్ ఇప్పటివరకు రూ. 810 కోట్లు కలెక్షన్లు రాబట్టింది. అయితే దంగల్ రికార్డును బాహుబలి 2 అధిగమించే అవకాశాలున్నాయి. ఈ సినిమాను త్వరలోనే చైనాలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దంగల్ భారీ విజయం సాధించడంతో బాహుబలి 2 సినిమాను కూడా అక్కడ విడుదల చేసే యోచనలో ఉన్నారని ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. త్వరలో విడుదల తేదీ ప్రకటించనున్నారని తెలిపారు. ఇంకా పలు దేశాల్లో ఈ చిత్రరాజన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. With its WW gross collections, #AamirKhan's #Dangal has officially beaten #Baahubali2 at the box-office. Well deserved success pic.twitter.com/R7b8cUZxc7 — Haricharan Pudipeddi (@pudiharicharan) 25 May 2017 -
పోలీసులకు నిద్రలేకుండా చేసిన బాహుబలి 2
జైపూర్: ప్రపంచవ్యాప్తంగా రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతున్న ‘బాహుబలి 2’ సినిమా ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. సరిహద్దులతో సంబంధం లేకుండా రికార్డుల సునామీ సృష్టిస్తున్న ఈ చిత్రరాజం బుధవారం రాత్రంతా జైపూర్ పోలీసులకు నిద్రలేకుండా చేసింది. వివరాల్లోకి వెళ్లితే.. శక్తినగర్ ప్రాంతంలో ముగ్గురు చిన్నారులు తప్పిపోయినట్టు బుధవారం సాయంత్రం జోత్వారా పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు అందింది. 8 నుంచి 13 ఏళ్ల వయసున్న ముగ్గురు చిన్నారుల్లో ఇద్దరు సోదరులు, వారి స్నేహితుడు ఉన్నాడు. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నగరాన్ని జల్లెడ పట్టారు. ‘నగరంలో చాలా చోట్ల గాలించాం. ఇన్ఫార్మర్ల సహాయం తీసుకున్నాం. రాత్రంతా పెట్రోలింగ్ వాహనాలతో సిటీ అంతా తిరిగామ’ని జోత్వారా ఎస్ఐ గురుదత్ సైనీ తెలిపారు. గురువారం తెల్లవారుజామున చిన్నారుల ఆచూకీ తెలియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. జోత్వారాలోని ఓ ఆలయం వద్ద చిన్నారులను కనుగొన్నారు. తర్వాత చిన్నారుల చెప్పిన మాటలు విని పోలీసులు అవాక్కయ్యారు. బాహుబలి 2 సినిమా చూడడానికి వెళ్లి తప్పిపోయామని చెప్పడంతో ఆశ్చర్యపోవడం పోలీసుల వంతైంది. ‘సమీపంలో ఉన్న ధియేటర్లో బాహుబలి 2 సినిమాకు చూడటానికి వెళ్లమని చెప్పారు. టిక్కెట్లు దొరక్కపోవడంతో వాళ్లు సినిమా చూడలేకపోయారు. ఆలస్యంగా వెళితే ఇంట్లో తిడతారన్న భయంతో తిరుగు పయనమయ్యారు. కంగారులో దారి తప్పిపోయామని’ చిన్నారులు చెప్పినట్టు జోత్వారా పోలీసు అసిస్టెంట్ కమిషనర్ ఆస్ మహ్మద్ తెలిపారు. ముగ్గురు చిన్నారులను వారి తల్లిదండ్రులకు అప్పగించినట్టు చెప్పారు. చిన్నారులు సురక్షితంగా ఉన్నారని, వారిని తమ ఇళ్లలో దించామని స్టేషన్ హౌస్ అధికారి వెల్లడించారు. ‘రాత్రంతా నిద్ర లేదు. ఇంటికెళ్లి విశ్రాంతి తీసుకోవాల’ని ఆయన చెప్పడం గమనార్హం. -
బాహుబలి-2కి రెహ్మాన్ టార్గెట్ ఎంతో తెలుసా?
చెన్నై: ఆస్కార్ విన్నర్, ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహ్మాన్ "బాహుబలి 2’’పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే రికార్డ్ కలెక్షన్లతో సునామీ సృష్టిస్తున్న బాహుబలి-2 పై తన అంచనాలను సోమవారం వెలిబుచ్చారు. "బాహుబలి 2 (ది కన్‌క్లూజన్) బాక్స్ ఆఫీసు వద్ద రూ.2వేలకోట్లను అధిగమిస్తుందని తెలిపారు. చెన్నైలో ఈ సినిమాను వీక్షించిన రెహ్మాన్ తన ఫేస్బుక్ పేజీలో ఈ బాహుబలి విజయాలన ప్రస్తావించారు. త్వరలోనే బాక్స్ ఆఫీసు వద్ద రూ.2వేకోట్ల రూపాయలను దాటిపోతుందని తాను నమ్ముతున్నాని పేర్కొన్నారు. ప్రపంచంలో భారతీయసినిమాకు ఒక కొత్త గుర్తింపును తీసుకొచ్చారంటూ చిత్రం బృందంపై ప్రశంసలు కురిపించారు. దక్షిణ భారతీయకు వసూళ్ల వరదగేట్లను తెరిచారని కొనియాడారు.దర్శకుడు, రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణిలకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా బాహుబలికి కొత్త టార్గెట్‌ను సెట్ చేశారు. దీనికి రాజమౌళి స్పందిస్తూ.. మీ అభినందనలు సినిమాకు మరింత వన్నెతెచ్చినట్టు తెలిపారు. కాగా ఎస్. రాజమౌళి దర్వకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందిన బాహుబలి రెండవభాగం ప్రపంచ వ్యాప్తంగా రికార్డుల వర్షంతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోఇప్పటికే రూ .1,500 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే. To Rajamouli garu, Keeravani garu and the whole team of BB2... Just finished watching it in Chennai. I hope it... https://t.co/3xd19PXNq5 — A.R.Rahman (@arrahman) May 21, 2017 Thanks you very much sir. Your appreciation makes it very special.. -
బాహుబలి 2 : విజయయాత్రలో మరో మజిలీ
బాహుబలి 2 మరో అరుదైన ఘనతను సాధించింది. 1000 కోట్ల వసూళ్లు సాధించిన తొలి భారతీయ సినిమాగా రికార్డ్ సృష్టించిన ఈ సినిమా తరువాత మరో పదిరోజుల్లో 1500 కోట్ల కలెక్షన్లు సాధించి సత్తా చాటింది. ఇప్పటికే దాదాపు అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ కు వచ్చేసిన బాహుబలి ఇప్పటికీ భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ముఖ్యంగా ఓవర్ సీస్ లో బాహుబలి కలెక్షన్ల జోరు బాలీవుడ్ తారలకు కూడా చుక్కలు చూపిస్తోంది. ఈ శుక్రవారంతో 1500 కోట్ల వసూళ్లు సాధించిన తొలి భారతీయ సినిమాగా రికార్డ్ సృష్టించిన బాహుబలి 2 ఫుల్ రన్ లో మరిన్ని సంచలనాలు నమోదు చేసే దిశగా దూసుకుపోతోంది. త్వరలో సింగపూర్ లో రిలీజ్ అవుతున్న బాహుబలి 2ను ఈ ఏడాది చివర్లో చైనా, జపాన్ దేశాల్లో భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అక్కడ కూడా ఇదే రెస్పాన్స్ వస్తే 2000 కోట్ల కలెక్షన్లు కూడా సాధ్యమే అంటున్నారు విశ్లేషకులు. It's getting Bigger and Bigger... SUCH A REMARKABLE MILESTONE!! THANK YOU EVERYONE FOR YOUR SUPPORT! #1500CroreBaahubali pic.twitter.com/C7htwLDxS7 — Baahubali (@BaahubaliMovie) 19 May 2017 -
బాహుబలికి షాక్ : పిల్లలకు నో ఎంట్రీ
ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న బాహబలి 2కి షాక్ తగిలింది. చందమామ కథలా భారీ రాజప్రాసాదాలు, గుర్రాలు, ఏనుగులు, యుద్ధ సన్నివేశాలతో తెరకెక్కిన ఈసినిమాను ఎక్కువగా పిల్లలే ఇష్టపడతారు. అయితే సినిమాలో రక్తపాతం ఎక్కువగా ఉందన్న కారణంతో సింగపూర్ సెన్సార్ బోర్డ్ ఏ(ఎన్సీ 16) సర్టిఫికేట్ జారీ చేసింది. దీంతో 16 ఏళ్ల లోపు పిల్లలను ఆ దేశంలో బాహుబలి 2 సినిమాను చూసేందుకు అనుమతించరు. ఈ విషయం పై స్పందించిన భారత సెన్సార్ బోర్డ్ చైర్మన్ పహ్లాజ్ నిహ్లానీ.. భారత్‌లో బాహుబలి 2కి ఎలాంటి కట్స్ లేకుండా యు/ఎ సర్టిఫికేట్‌ను జారీ చేశాం. కానీ సింగపూర్ సెన్సార్ బోర్డ్ మాత్రం ఈ సినిమా హింసాత్మకంగా ఉందని భావించింది. ముఖ్యంగా సైనికుల తలలు నరికే సన్నివేశాలే ఏ సర్టిఫికేట్ రావడానికి కారణమన్నారు. సింగపూర్‌తో పాటు మరికొన్ని ఆసియా, యూరప్ దేశాల్లోనూ బాహుబలికి ఏ సర్టిఫికేట్ జారీ చేశారు. -
బాహుబలి 2 : మరో మైల్స్టోన్కు చేరువలో..!
ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి సంచలనాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే వెయ్యి కోట్ల వసూళ్లు సాధించి చరిత్ర సృష్టించిన ఈ విజువల్ వండర్, ఇప్పుడు మరో అరుదైన ఘనతకు చేరువైంది. ఇప్పటికే 1450 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా వారాంతానికి 1500 కోట్ల మార్క్ ను కూడా దాటేయనుంది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ సినిమాగా బాహుబలి 2 రికార్డ్ సృష్టించనుంది. మొదటి రెండు వారాల్లో భారత్ లోనే 1012 కోట్ల వసూళ్లు సాధించిన ఈ సినిమా ఓవర్ సీస్ తో కలిపి 1250 కోట్ల సాధించింది. తాజా లెక్కల ప్రకారం 19 రోజుల్లో బాహుబలి 2 భారత్ లో 1189 కోట్లు, ఓవర్ సీస్ లో 261 కోట్ల వసూళ్లు సాధించి 1450 కోట్ల మార్క్ కు చేరిన తొలి భారతీయ చిత్రంగా నిలిచింది. మరో రెండు రోజుల్లో 1500 కోట్ల మార్క్ అందుకుంటుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు. ప్రభాస్, రానాలు ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి ఇప్పటి వరకు ఉన్న ఇండియన్ రికార్డ్స్ అన్నింటినీ చెరిపేస్తూ దూసుకుపోతోంది. -
బాహుబలి 2 అద్భుతం : మాట మార్చిన కేఆర్కే
సౌత్ నార్త్ అన్న తేడాలేకుండా పెద్ద చిత్రాలు ఏవి రిలీజ్ అయిన నెగెటివ్ ట్వీట్ లతో హల్ చల్ చేస్తుంటాడు బాలీవుడ్ క్రిటిక్ కమాల్ ఆర్ ఖాన్. గతంలో పవన్ కళ్యాణ్ సినిమాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కమాల్, బాహుబలి 2 రిలీజ్ సమయంలోనే అదే స్థాయిలో నోరు పారేసుకున్నాడు. ప్రభాస్ ను జిరాఫీతో పోల్చిన కమాల్, రాజమౌళిపై కూడా అలాంటి కామెంట్సే చేశాడు. అయితే ప్రస్తుతం బాలీవుడ్ లో బాహుబలి 2 సాధిస్తున్న కలెక్షన్లు చూసి ఈ ఎనలిస్ట్ కమ్ క్రిటిక్ మాట మార్చాడు. 'బాహుబలి 2 ఓ సినిమా కాదు.. ఉద్యమం. ప్రతి ఒక్కరు ఆ సినిమాలో భాగం కావాలని కోరుకుంటారు. బాహుబలి 2 సాధించిన విజయాన్ని రిపీట్ చేయటం రానున్న 30 ఏళ్లలో సాధ్యం కాదు. మూడో ఆదివారం కూడా బాహుబలి 2(హిందీ వర్షన్) 20 కోట్లకు పైగా వసూళు చేసింది. ఇది సాదారణ విషయం కాదు. రాజమౌళికి దేవుడి ఇచ్చిన ఆశీర్వాదం' అంటూ ట్వీట్ చేశాడు. అంతేకాదు బాహుబలి 2 యూనిట్ కు క్షమాపణలు కూడా చెప్పాడు. తప్పుడు రివ్యూ ఇచ్చినందుకు క్షమించండి. నాకు నచ్చకపోయినా ప్రజలకు నచ్చింది. క్షమించండి రాజమౌళి' అంటూ ట్వీట్ చేశాడు. I m very sorry for my wrong review of #Baahubali2! I didn't like it but ppl like it n Janta Ki Awaaz means Nakkare Khuda. Sorry @ssrajamouli — KRK (@kamaalrkhan) 14 May 2017 #Baahubali2 is not a film anymor. It's a movement n evrybody wants to becom part of it. It will not happen again with any film in next 30Yrs — KRK (@kamaalrkhan) 15 May 2017 Hindi #Baahubali2 collected approx 20Cr on 3rd Sunday n definitely it's not a normal business. It's blessing of the GOD for @ssrajamouli — KRK (@kamaalrkhan) 15 May 2017 -
బాహుబలిపై నోరువిప్పిన బాలీవుడ్ హీరో
ఇండియన్ సినిమాను తొలిసారిగా 1000 కోట్ల క్లబ్ లో నిలబెట్టిన భారీ చిత్రం బాహుబలి 2. భారీ వసూళ్లతో భారత్ లోని ఇండస్ట్రీ రికార్డు లన్నింటినీ బద్ధలు కొట్టిన బాహుబలి, బాలీవుడ్ స్టార్స్ కు కూడా చుక్కలు చూపించింది. అందుకే మీడియా సాధారణ ప్రేక్షకులు బాహుబలిని ఆకాశానికి ఎత్తేసినా.. బాలీవుడ్ స్టార్ హీరోలు మాత్రం ఈ సినిమా పై స్పందించలేదు. ప్రస్తుతం హిందీ ఇండస్ట్రీ లో టాప్ ప్లేస్ లో ఒక్క స్టార్ హీరో కూడా బాహుబలి సక్సెస్ పై మాట్లాడలేదు. తాజాగా కిలాడీ అక్షయ్ కుమార్ బాహుబలి 2 సక్సెస్ పై స్పంధించాడు. సినిమా రిలీజ్ అయిన రెండు వారాల తరువాత బాహుబలి 2కు సంబంధించిన ట్వీట్ చేశాడు అక్షయ్ కుమార్. 'ఫైనల్ గా బాహుబలి సినిమా చూశా. వస్తున్న హైప్, సక్సెస్ కు బాహుబలి 2కి అర్హత ఉంది. భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. చిత్రయూనిట్ కు శుభాకాంక్షలు' అంటూ ట్వీట్ చేశాడు అక్షయ్. Finally saw #BaahubaliTheConclusion, it deserves every bit of hype & success,taking Indian cinema 2 an international level.Congrats 2 d team — Akshay Kumar (@akshaykumar) 15 May 2017 -
కట్టప్పకు బాలీవుడ్ హీరో భార్య ఫిదా
ముంబై: బాహుబలి2 విడుదలైన తర్వాత మొత్తం ప్రేక్షకులు సినీలోకమంతా ప్రభాస్, రాజమౌళి, కట్టప్ప, శివగామిలాంటి పాత్రలను తెగ పొగిడేస్తుండగా ప్రముఖ బాలీవుడ్ నటి, నటుడు అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా మాత్రం కట్టప్పపై మనసు పారేసుకుంది. బాహుబలి సినిమాలో మహిష్మతి సామ్రాజ్యంలో బానిస సేన నాయకుడిగా సత్యరాజ్ పోషించిన కట్టప్ప పాత్రను తెగ ఇష్టపడుతోంది. అందులో భాగంగా సోషల్ మీడియా ఖాతా ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేసింది. తాను కట్టప్పకు ఎలా అభిమానిగా మారిపోయాననే విషయాన్ని వివరించింది. ‘నేను బాహుబలి 2 చూశాను. నా కూతురు కోపంతో తన తండ్రిని కట్టప్ప అని పిలుస్తోంది. ఎంతలా అంటే ఒక వ్యసనంలాగా.. కట్టప్ప అని తను మూడుసార్లు అరిచేంత వరకు కూడా మేం అస్సలు అపలేకపోతున్నాం’ అంటూ ట్వింకిల్ ఖన్నా చెప్పుకొచ్చింది. -
అలా అయితే బాగుండేది: రాజమౌళి
సాక్షి, బళ్లారి: తమిళం తరహాలో కన్నడంలో కూడా బాహుబలి–2 చిత్ర అనువాదానికి అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదని ఆ చిత్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అన్నారు. ఆయన శనివారం బళ్లారి సిటీలోని రాధిక సినిమా థియేటర్లో బాహుబలి–2ను వీక్షించారు. అనంతరం విలేకరుల తో మాట్లాడారు. బాహుబలి–2 దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ కావడం సంతోషంగా ఉందన్నారు. తనతో పాటు హీరో, హీరోయిన్లు, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ శ్రమించడం ఈ విజయానికి దోహదపడిందన్నారు. ప్రస్తుతం మరో కొత్త ప్రాజెక్టు ఏదీ లేదని చెప్పారు. ఈ సక్సెస్‌ను తాను, తన కుటుంబం ఆస్వాదిస్తున్నామని చెప్పారు. మరోవైపు ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి శనివారం బెంగళూరు వచ్చిన ‘భల్లాలదేవ’ రానా దగ్గుబాటికి ప్రభాస్ ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు. కెంపేగౌడ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో రానాకు కర్ణాటక ప్రభాస్ అభిమాన సంఘం గౌరవ అధ్యక్షుడు రంజిత్ రెడ్డి, అధ్యక్షుడు అశిష్, సభ్యులు ఆయనకు స్వాగతం పలికి మైసూరు పేటెతో సన్మానించారు. -
బాహుబలి టీం కారణంగానే స్పైడర్ వాయిదా..?
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ ఇంటలిజెన్స్ అధికారిగా నటిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ముందుగా జూన్ 23నే రిలీజ్ చేయాలని భావించారు. తరువాత ఆగస్టుకు వాయిదా వేశారు. తాజా సమాచారం ప్రకారం స్పైడర్ ఆగస్టులోనూ రిలీజ్ అయ్యే చాన్స్ లేదట. దసరా కానుకగా అక్టోబర్‌లో సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే స్పైడర్ ఆలస్యం వెనుక బాహుబలి టీం ఉందన్న టాక్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బాహుబలి 2 సంచలనాలు నమోదు చేస్తుండటంతో స్పైడర్ సినిమా విషయంలో కూడా గ్రాఫిక్స్ మీద ఎక్కువ సమయం, బడ్జెట్ కేటాయించాలని నిర్ణయించారు యూనిట్. అందుకే కమల్ కణ్నన్ ఆధ్వర్యంలో మకుటతో గ్రాఫిక్స్ చేయిస్తున్నారు. అయితే బాహుబలి సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న మకుట, ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కావటంలేదు. ఎంత సమయమైనా కేటాయించి క్వాలిటీ గ్రాఫిక్స్‌ను రెడీ చేస్తున్నారు. ఇదే విషయాన్ని స్పైడర్ టీంకు కూడా చెప్పడంతో చేసేదేమి లేక సినిమాను వాయిదా వేయాలని భావిస్తున్నారు చిత్రయూనిట్. -
రాజమౌళి నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై మరో న్యూస్..!
బాహుబలి 2 రిలీజ్ అయిన దగ్గర నుంచి రాజమౌళి చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. యంగ్ హీరోలతో చిన్న ప్రాజెక్ట్ చేస్తారని.. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ హీరోగా సినిమా ఉంటుందని.. తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతాన్ని తెరకెక్కిస్తాడని.. రకరకాల వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఈ లిస్ట్‌లో మరో వార్త కూడా చేరిపోయింది. తాజాగా సమచారం ప్రకారం జక్కన్న తన నెక్ట్స్ సినిమాను మహేష్ హీరోగా రూపొందించాలని భావిస్తున్నాడట. చాలా కాలం క్రితమే మహేష్ బాబు హీరోగా కెయల్ నారాయణ నిర్మాణంలో సినిమా చేసేందుకు అగ్రిమెంట్ చేసుకున్నాడు రాజమౌళి. ఇప్పుడు ఆ అగ్రిమెంట్ ప్రకారం సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడన్న వార్త హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ సినిమాలో నటిస్తున్న మహేష్, తరువాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమాను స్టార్ట్ చేయనున్నాడు. మరి రాజమౌళి.. మహేష్‌తోనే సినిమా చేయాలని భావిస్తే ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుంది..? కొరటాల ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టి రాజమౌళితో సినిమా చేస్తాడా..? లేక రాజమౌళి కొరటాల సినిమా పూర్తయ్యే వరకు వెయిట్ చేస్తాడా..? కొరటాల సినిమా తరువాత వంశీ పైడిపల్లి, త్రివిక్రమ్ శ్రీనివాస్లతోనూ మహేష్ బాబుకు కమిట్మెంట్స్ ఉన్నాయి. ఇవన్ని పక్కన పెట్టి రాజమౌళి సినిమాను ఓకె చేస్తాడా..? అసలు విషయం తెలియాలంటే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే. -
ఆల్‌టైమ్ టాప్ ‘బాహుబలి 2’
ముంబై: భారత చలనచిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా చరిత్ర సృష్టించిన ‘బాహుబలి 2’ మరో ఘనత సాధించింది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి గుండెకాయగా పరిగణించబడే బాలీవుడ్‌లోనూ టాప్‌గా నిలిచింది. హిందీలో అత్యధిక కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమాగా సరికొత్త రికార్డు సృష్టించింది. ‘దంగల్’ పేరిట ఉన్న రికార్డును రెండు వారాల్లోనే తుడిచిపెట్టేసింది. రూ. 375 కోట్ల నెట్ వసూళ్లతో ఇప్పటివరకు దంగల్ అగ్రస్థానంలో ఉంది. బాహుబలి 2 హిందీ సినిమా రూ. 390.25 కోట్ల నెట్ కలెక్షన్లతో ఆల్‌టైమ్ టాప్‌గా నిలిచింది. మొదటి వారంలో రూ. 247 కోట్లు, రెండో వారంలో రూ. 143.25 కోట్లు రాబట్టిందని ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. అమెరికాలో రూ. 100 కోట్లు వసూలు చేసిన మొట్టమొదటి భారతీయ సినిమాగా నిలిచింది. తమిళనాడులోనూ రూ. 100 కోట్ల మైలురాయికి చేరువగా ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 250 కోట్లుపైగా కలెక్ట్ చేసింది. కేరళలో రూ. 50 కోట్లుపైగా బిజినెస్ చేసింది. మరోవైపు భారతదేశంలోనే రూ. 1000 కోట్లు వసూలు చేసి సరికొత్త చరిత్ర లిఖించింది. -
బాహుబలి 2 : భారత్‌లోనే 1000 కోట్లు
సినిమా రిలీజ్ అయి రెండు వారాలు గడుస్తున్నా బాహుబలి 2 రికార్డ్‌లు వేట కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే దాదాపు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఉన్న అన్ని రికార్డులను తుడిచి పెట్టేసిన బాహుబలి 2, ఇప్పుడు సరికొత్త రికార్డ్ లను సెట్ చేస్తూ దూసుకెళుతుంది. రిలీజ్ అయిన 9 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 1000 కోట్ల వసూళ్లు సాధించి.. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చిత్రంగా అవతరించింది బాహుబలి. తాజాగా 14 రోజుల్లో కేవలం భారత్ లోనే వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సినిమాగా బాహుబలి చరిత్ర సృష్టించింది. ఇప్పట్లో ఏ భారతీయ సినిమా ఈ రికార్డును అందుకోవటం అసాధ్యం అంటున్నారు విశ్లేషకులు. భారత్‌లో తెలుగు, హిందీతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ భారీగా రిలీజ్ అయిన బాహుబలి రెండు వారాల్లో 1020 కోట్ల గ్రాస్ వసూళు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి వసూళ్లు 1300 కోట్లకు చేరువలో ఉన్నాయి. -
ఖర్చు నబ్బే కరోడ్... ఫాయిదా 285.35 కోట్లు!
-
ఖర్చు నబ్బే కరోడ్... ఫాయిదా 285.35 కోట్లు!
‘బాహుబలి–2’ హిందీ వెర్షన్ లెక్కల చిట్టా ఇది. థియేటర్లలో సినిమా ఇంకా బాగా ఆడుతోంది కనుక లాభం మరింత పెరిగే అవకాశముంది. ‘బాహుబలి–2’ హిందీ థియేట్రికల్ రైట్స్‌ను రూ. 80కోట్లకు సొంతం చేసుకున్న కరణ్ జోహార్ పబ్లిసిటీకి ఓ 10 కోట్లు ఖర్చుపెట్టారట! మొత్తం ఖర్చు నబ్బే (90) కరోడ్. ఇప్పటివరకు ఇండియాలో ఈ సినిమా హిందీ వెర్షన్ రూ. 375.35 కోట్లు కలెక్ట్ చేసింది. అంటే నిర్మాతకు రూ. 285.35కోట్లు ఫాయిదా (లాభం). ఇంకో ఫాయిదా ఏంటంటే.. పన్నెండు కోట్లు కలెక్ట్ చేస్తే ఆమిర్‌ఖాన్ ‘దంగల్’ ఇండియా (రూ. 387.38 కోట్లు) రికార్డును బీట్ చేసేస్తుంది. 12 కోట్లు ఏంటి? 25 కోట్లు కలెక్ట్ చేసి రూ. 400 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా (హిందీ నెట్)గా ‘బాహుబలి–2’ రికార్డు సృష్టిస్తుందని ట్రేడ్ పండితుల అంచనా. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరల్డ్ వైడ్‌గా వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా తమిళ నాడులో వంద కోట్ల దిశగా దూసుకెళ్తోంది. -
బాహుబలి.. మరో ప్రశ్న!
‘బాహుబలి: ది బిగినింగ్’ సినిమా ప్రేక్షకులకు కొన్ని ప్రశ్నలను మిగిల్చింది. వీటికి ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ సమాధానాలు దొరుకుతాయని భావించారు. అయితే కొన్ని ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానాలు లభించలేదు. భల్లాలదేవుడి భార్య ఎవరు? అనేది అందులో ఒకటి. భద్ర(అడివి శేష్)ను భల్లాలదేవ కుమారుడిగా మొదటి భాగంలో చూపించారు. దేవసేనను భల్లాలదేవ చెర నుంచి విడిపించే సమయంలో భద్రను చంపుతాడు మహేంద్ర బాహుబలి(శివుడు). అయితే బాహుబలి 2లో భల్లాలదేవుడి భార్య ఎవరో చూపిస్తారని ఆశించిన ప్రేక్షకులకు ఆశాభంగం ఎదురైంది. భద్ర తల్లి ఎవరనే ప్రశ్నకు భల్లాలదేవ(దగ్గుబాటి రానా) సరదాగా సమాధానం ఇచ్చాడు. ‘ సరోగసి(అద్దె గర్భం) ద్వారా భద్ర పుట్టాడని, అతడికి తల్లి లేద’ని సరదాగా జవాబిచ్చాడు. మొత్తానికి భల్లాలదేవ ప్రేక్షకుల అనుమానాన్ని నివృత్తి చేశాడు. ప్రేక్షకుల ప్రశ్నల మాటెలావున్నా బాక్సాఫీస్ వద్ద ‘బాహుబలి 2’ హవా కొనసాగుతోంది. రెండో వారంలోనూ రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. -
బాహుబలి సక్సెస్‌కి కారణం ప్రభాస్ కాదట..!
బాహుబలి సక్సెస్‌తో ప్రభాస్ ఒక్కసారిగా నేషనల్ స్టార్‌గా మారిపోయాడు. ముఖ్యంగా ఒక్క ప్రాజెక్ట్ కోసం ఐదేళ్ల సమయం కేటాయించిన డార్లింగ్ కమిట్మెంట్కు ఇండియన్ ఇండస్ట్రీ అంతా సాహో అంటుంది. అదే సమయంలో బాహుబలి సక్సెస్‌లో రాజమౌళితో పాటు ప్రభాస్‌కు అదే స్థాయిలో క్రెడిట్ ఇచ్చారు క్రిటిక్స్. కానీ ఓ బాలీవుడ్ దర్శకుడు మాత్రం బాహుబలి సక్సెస్‌లో ప్రభాస్ క్రెడిట్ ఏం లేదంటూ తేల్చేశాడు. బాలీవుడ్ మాస్ మసాల ఎంటర్‌టైనర్స్‌ను తెరకెక్కించే రోహిత్ శెట్టి బాహుబలి సక్సెస్‌లో ప్రభాస్ కెడ్రిట్ ఏం లేదంటున్నాడు. కేవలం కథ, దర్శకత్వం వల్లనే బాహుబలి అంతటి ఘన విజయం సాధించిందన్న రోహిత్, నటీనటులు సక్సెస్ హెల్ప్ అయ్యారేగాని వారి గొప్పతనం ఏమి లేదన్నట్టుగా మాట్లాడాడు. అంతేకాదు బాలీవుడ్ జనాలు సినిమా ప్రమోషన్ ఎలా చేయాలో బాహుబలి టీం నుంచి నేర్చుకోవాలని తెలిపాడు. అయితే బాహుబలి సక్సెస్ ప్రభాస్ క్రెడిట్ ఏం లేదంటూనే అవకాశం వస్తే ప్రభాస్ హీరోగా సినిమాను తెరకెక్కిస్తానని తన మనసులోని కోరికను బయటపెట్టాడు. -
బాహుబలి: ఇంకేమైనా రికార్డులు మిగిలాయా?
హిందీలోకి డబ్ అయిన ఒక తెలుగు సినిమా సృష్టిస్తున్న సంచలనం చూసి మార్కెట్ వర్గాలతో పాటు విమర్శకులు కూడా నోళ్లు వెళ్లబెడుతున్నారు. ఇప్పటికే హిందీ వెర్షన్ ఒక్కదాంట్లోనే రూ. 300 కోట్లకు పైగా నెట్ వసూళ్లు చేసిన బాహుబలి-2 సినిమా, ఇప్పుడు రూ. 350 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. ఈ విషయాన్ని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ స్వయంగా ట్వీట్ చేశాడు. ఇప్పటికే బాహుబలి 2 సినిమా చాలా రికార్డులు బద్దలు కొట్టిందని ఆయన తెలిపారు. ఫాస్టెస్ట్ 50 కోట్లు, ఫాస్టెస్ట్ 100 కోట్లు, ఫాస్టెస్ట్ 150 కోట్లు, ఫాస్టెస్ట్ 200 కోట్లు, ఫాస్టెస్ట్ 250 కోట్లు, ఫాస్టెస్ట్ 300 కోట్లు... వీటన్నింటినీ ఇప్పటికే దాటేసిందని, ఇప్పుడు రూ. 350 కోట్ల వైపు వెళ్తోందని చెప్పారు. ఈ సినిమా నిజంగా ఒక గేమ్‌ఛేంజర్ అని ఆయన ప్రశంసించారు. అయితే, ఉత్తరాదిలో మాత్రం కొందరు దక్షిణాది సినిమా ఇంతలా విజయం సాధించడం ఏంటన్న భావనలోనే ఉన్నట్లుంది. 'డియర్ బాహుబలి.. దంగల్ పని ఇంకా అయిపోలేదు, కలెక్షన్లు వస్తున్నాయి' అంటూ జాతీయ మీడియాలోని ఒక వర్గం వ్యాఖ్యానించింది. ఆమిర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా బాహుబలి వసూళ్లను దాటి వెళ్తుందన్న ఉద్దేశంలో అలా రాశారు. #Baahubali2 RECORDS: Fastest ₹ 50 cr... Fastest ₹ 100 cr... Fastest ₹ 150 cr... Fastest ₹ 200 cr... Fastest ₹ 250 cr... Fastest ₹ 300 cr... — taran adarsh (@taran_adarsh) 9 May 2017 #Baahubali2 is now set to cross ₹ 350 cr, the FASTEST to achieve it. Seriously, is there any record left? This film is truly a GAME CHANGER! — taran adarsh (@taran_adarsh) 9 May 2017 -
రాజమౌళికి ప్రఖ్యాత దర్శకుడి ప్రశంస
హైదరాబాద్: బాహుబలి సిరీస్‌ను తెరకెక్కించి ఘన విజయం సాధించిన దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళిపై ప్రశంసలు కురుస్తున్నాయి. వందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో సినిమా తీసిన రాజమౌళి తెగువను కొనియాడుతున్నారు. ప్రఖ్యాత దర్శకుడు శేఖర్ కపూర్ కూడా ఈ జాబితాలో చేరారు. రాజమౌళిని ప్రశంసిస్తూ ట్వీట్ పెట్టారు. ‘సృజనాత్మక తెగువ ప్రదర్శించి, ఎన్నో కష్టాలను అధిగమించి బాహుబలి 2 సినిమా తీసిన రాజమౌళిని ఎంతో అభిమానిస్తున్నాన’ని ట్వీట్ చేశారు. దీనికి ఎంతో వినమ్రంగా రాజమౌళి సమాధానమిచ్చారు. ‘ఫెయిల్యూర్ గురించి భయపడుతూనే సృజనాత్మక ధైర్యంతో ముందడుగు వేస్తుంటాను. మీ శైలిలో సినిమాలు తీయాలన్నది నా కోరిక. కానీ మీలా సినిమాలు తీయలేనని నాకు తెలుసున’ని రాజమౌళి ట్వీట్ పెట్టారు. దీనిపై శేఖర్ కపూర్ స్పందిస్తూ... ‘అపజయం పట్ల భయం సృజనాత్మకతకు గొప్ప చోదకంగా పనిచేస్తుంది. భయాన్ని తెలివైన సృజనాత్మక ప్రక్రియగా మార్చడంలో రాజమౌళి పనితనం అద్భుతమ’ని పేర్కొన్నారు. మరోవైపు బాక్సాఫీస్ వద్ద ‘బాహుబలి 2’ కలెక్షన్ల సునామీ కొనసాగుతోంది. బాలీవుడ్ నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన శేఖర్ కపూర్.. మిస్టర్ ఇండియా, మసూమ్, బండిట్ క్వీన్, క్వీన్ ఎలిజబెత్, ది గోల్డెన్ ఏజ్ సినిమాలు తీశారు. Why I admire @ssrajamouli ? He showed creative courage and grit to beat all odds #Bahubali2 — Shekhar Kapur (@shekharkapur) 8 May 2017 @shekharkapur Sir my creative courage is always interlaced with constant fear of failure. I So wish to be as rebellious as you, but also know that i cant — rajamouli ss (@ssrajamouli) 8 May 2017 @ssrajamouli Fear of failure is a great driver of creativity. You've managed to turn that fear into brilliant creative action. Wonderful @ssrajamouli — Shekhar Kapur (@shekharkapur) 8 May 2017 -
బాహుబలిని తట్టుకున్న పవర్ పాండి
భారీ బడ్జెట్ చిత్రం ‘బాహుబలి–2’ విడుదలైన సమయంలో మరో సినిమా రిలీజ్ అంటే రిస్కే. అందుకే ఈ సినిమా విడుదలైన ఏప్రిల్ 28న వేరే ఏ తెలుగు సినిమాలనూ విడుదల చేయలేదు. అంతకు వారం క్రితం రిలీజైన వాటిలో కూడా ఆశించిన ఫలితాన్ని సాధించినవి లేవు. కానీ, తమిళంలో మాత్రం ‘పవర్ పాండ్’ చిత్రం ‘బాహుబలి–2’ని తట్టుకుని నిలబడింది. హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 14న విడుదలైంది. మొదటి రోజునే హిట్ టాక్ తెచ్చుకోవ డంతో ప్రేక్షకాదరణ పెరిగింది. ‘బాహుబలి–2’ విడుదలయ్యాక కూడా ఈ సినిమా వసూళ్లు నిలకడగా ఉండటం విశేషం. ఈ చిత్రం సాధించిన విజయాన్ని దృష్టిలో పెట్టుకుని ధనుష్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారట. ఫస్ట్ పార్ట్‌లో సీనియర్ నటుడు రాజ్‌కిరణ్ టైటిల్ రోల్ చేశారు. ధనుష్ అతిథి పాత్ర చేశారు. సీక్వెల్లో మామ రజనీకాంత్‌ను నటింపజేయాలని ధనుష్ అనుకుంటున్నారట. -
బాహుబలి 2లో తమన్నా సీన్స్ ఏమయ్యాయ్..?
బాహుబలి తొలి భాగంలో కీలక పాత్రలో కనిపించిన తమన్నా, సెకండ్ పార్ట్ లో మాత్రం కొన్ని షాట్స్ కే పరిమితమైంది. బాహబలి 2 రిలీజ్ కు ముందు పలు ప్రమోషన్ కార్యక్రమాల్లో తమన్నా తన పాత్రో సెకండ్ పార్ట్ లోనూ చాలా సీన్స్ లో కనిపిస్తుందని తెలిపింది. కానీ సినిమా రిలీజ్ అయ్యే సరికి సీన్ మారిపోయింది. రెండు మూడు షాట్స్ తప్ప తమన్నకు సెకండ్ పార్ట్‌లో పెద్దగా స్కోప్ లేదు. అయితే ముందుగా చెప్పినట్టుగా తమన్నాతో కొన్ని పోరాట సన్నివేశాలను చిత్రీకరించాడట దర్శకుడు రాజమౌళి, కానీ ఆ సీన్స్‌లో గ్రాఫిక్స్ ఆశించిన స్థాయిలో లేకపోవటంతో చివరి నిమిషంలో ఆ సీన్స్‌ను తొలగించి సినిమా రిలీజ్ చేశారు. ఏ రకంగా సినిమా క్వాలిటీ విషయంలో వెనక్కి తగ్గకూడదన్న ఉద్దేశంతో రాజమౌళి ఈ నిర్ణయం తీసుకున్నాడట. దీంతో సెకండ్ పార్ట్‌లో తమన్నా క్యారెక్టర్ మెరుపుతీగలా అలా కనిపించి ఇలా వెళ్లిపోయింది. -
బాహుబలి 2కు భారీ ఇన్సూరెన్స్
రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతున్న బాహుబలి 2 సినిమాకు సంబంధించిన ప్రతీ వార్త టాలీవుడ్ లో వైరల్ అయిపోతుంది. సినిమా రిలీజ్ తరువాత యూనిట్ సభ్యులు చేస్తున్న ప్రతి కామెంట్ ను మీడియాతో పాటు సాధరణ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ భారీ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఒకటి బయటకు వచ్చింది. ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి తెరకెక్కించిన ఈ సినిమాకు నిర్మాణ దశలో ఏవైన ఇబ్బందులు ఎదురవుతాయనే ఆలోచనతో భారీ మొత్తానికి సినిమాను ఇన్సూరెన్స్ చేయించినట్టుగా తెలుస్తోంది. ఫ్యూచర్ జనరలి ఇన్సూరెన్స్ కంపెనీ.. ఫిలిం ఇన్సూరెన్స్ ప్యాకేజీ కింద బాహుబలి చిత్రాన్ని 200 కోట్లకు ఇన్సూరెన్స్ చేసినట్టుగా తెలిపింది. షూటింగ్ సమయంలో లేదా పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో ఎలాంటి ప్రమాదం జరిగినా పాలసీ వర్తిస్తుందని సంస్థ తెలిపింది. అంతేకాదు షూటింగ్ సమయంలో నటులు గాయపడినా, మరణించినా.. ప్రకృతి వైపరీత్యాల కారణంగా షూటింగ్ ఆలస్యమైన భీమా వర్తించేలా పాలసీ చేశారు. ప్రస్తుతం భారీ చిత్రాల నిర్మాణ పెరుగుతుండటంతో భీమ చేస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతుందని ఫ్యూచర్ జనరలీ ఎమ్‌డి కేజీ కృష్ణమూర్తి తెలిపారు. కేవలం 2017లోనే 160 చిత్రాలకు ఇన్సూరెన్స్ చేశారు. వీటిలో బాలీవుడ్ సినిమాలు కూడా ఉన్నాయి. దక్షిణాదిలో ఇన్సూరెన్స్ చేస్తున్న సినిమాలు తక్కువని అందుకు ప్రస్తుతం తమ సంస్థ సౌత్ సినిమాల మీద దృష్టి పెట్టిందన్నారు కృష్ణమూర్తి. ఇప్పటి వరకు ఈ సంస్థ 372 సినిమాలకు ఇన్సూరెన్స్ చేసింది. -
బాహుబలి 2పై బ్యాన్ తప్పదా..?
ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు నమోదు చేస్తున్న బాహుబలి 2 రిలీజ్ కోసం పాకిస్తాన్ సినీ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట. అంతేకాదు అక్కడి ప్రేక్షకులు బాహుబలి 2ను పాక్‌లో రిలీజ్ చేయాలంటే సోషల్ మీడియలో పెద్ద ఎత్తున మేసేజ్‌లు కూడా పెడుతున్నారు. దీంతో బాహుబలి నిర్మాతలు కూడా పాక్ రిలీజ్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది. భారత్‌లో తెరకెక్కిన చాలా సినిమాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల లోనూ రిలీజ్ అవుతుంటాయి. షారూఖ్ లాంటి స్టార్ హీరోలకు పాకిస్తాన్‌లోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే బాహుబలి రిలీజ్‌పై పాక్ సెన్సార్ బోర్డ్ ఎలా స్పందిస్తుందో అన్న అనుమానం కలుగుతుంది. హిందుత్వాన్ని ప్రమోట్ చేసే సన్నివేశాలున్న సినిమాలను పాక్‌లో రిలీజ్ చేసేందుకు అక్కడి సెన్సార్ బోర్డ్ అంగీకరించదు. గతంలో ఈ కారణంగానే సల్మాన్ ఖాన్ నటించిన బజరంగీ భాయ్‌జాన్ సినిమాపై పాక్ బ్యాన్ విధించింది. అయితే బాహుబలి సినిమా కావాలంటూ పాకిస్తాన్ యువతే కోరుతుండటంతో ఈ సినిమాపై సానుకూలంగా స్పందిస్తారనే ఆశిస్తున్నారు. మరి బాహుబలి పాక్‌లో రిలీజ్ అవుతుందా..? లేక బ్యాన్ బారిన పడుతుందా తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. -
‘బాహుబలి 2’కు భారీగా బీమా
హైదరాబాద్: విజువల్ వండర్ ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ సినిమాకు రూ. 200 కోట్లకు పైగా బీమా చేసినట్టు ఫ్యూచర్ జనరాలీ ఇన్సూరెన్స్ కంపెనీ వెల్లడించింది. ఫిల్మ్ ప్యాకేజీ ఇన్సూరెన్స్ కింద ఈ మొత్తానికి బీమా చేసినట్టు తెలిపింది. ప్రిప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్లో ఏదైనా ప్రమాదం జరిగితే ఈ పాలసీ కింద కవరేజీ ఉంటుందని వివరించింది. ‘మరణం, నటులకు అనారోగ్యం, ప్రకృతి విపత్తులు, ప్రమాదాల కారణంగా సినిమా షెడ్యూల్ లో జాప్యం జరిగినా బీమా వర్తిస్తుంది. షూటింగ్ జరుగుతుండగా ఎక్విప్మెంట్ పాడైనా బీమా చెల్లిస్తామ’ని ఫ్యూచర్ జనరాలీ ఒక ప్రకటనలో తెలిపింది. సినిమాలకు బీమా చేయడం పెరుగుతోందని ఫ్యూచర్ జనరాలీ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ కేజీ కృష్ణమూర్తి రావు తెలిపారు. 2017 ఆర్థిక సంవత్సరంలో 160 సినిమాలకు బీమా చేశామని, వీటిలో ఎక్కువగా బాలీవుడ్ సినిమాలున్నాయని చెప్పారు. దక్షిణాది సినిమాలపై దృష్టి పెట్టామని, ఫిల్మ్ ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా ఇన్సూరెన్స్ చేస్తున్నట్టు చెప్పారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన ఈ సినిమా భారతదేశంలో భారీ బడ్జెట్ తో తెర కెక్కిన చిత్రంగా నిలిచింది. -
మరో రెండు భాషల్లోకి బాహుబలి-2
హైదరాబాద్: టాలీవుడ్ అగ్రదర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి విజువల్ వండర్ ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ రికార్డులు తిరగరాస్తుంది. కేవలం భారత్ లోనే కాదు అమెరికా, సహా ఇతర దేశాల్లో కొత్త చర్రిత లిఖిస్తోంది బాహుబలి-2. ఈ మూవీని మరో రెండు భాషల్లోకి డబ్బింగ్ చేసి రెండు దేశాల ప్రేక్షకులకు ఈ విజువల్ వండర్ ను చేరువ చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా రికార్డుస్థాయిలో తొమ్మిది వేల స్క్రీన్లపై విడుదలైన తొలి టాలీవుడ్ చిత్రంగానూ బాహుబలి-2 రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. ‘బాహుబలి: ది బిగనింగ్’ మూవీకి చైనాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. తొలిభాగం చైనాలో మంచి ఆదరణ సొంతం చేసుకోవడంతో, రెండో భాగమైన బాహుబలి-2ను చైనీస్ భాషలోకి డబ్బింగ్ చేసి చైనా ప్రేక్షకులకు చేరువ కావాలని కసరత్తు మొదలుపెట్టినట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు భారీస్థాయిలో అభిమానులున్న జపాన్ లోనూ విడుదల చేస్తే బాహుబలి-2 ప్రభంజనం సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభాస్, దగ్గుబాటి రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ ప్రధాన పాత్రల్లో కనిపించిన ఈ మూవీ ఇప్పటికే రూ.800 కోట్లు కొల్లగొట్టి వెయ్యి కోట్ల క్లబ్ లో చేరనున్న తొలి భారతీయ చిత్రంగా నిలవనుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. -
రజనీతో సినిమాపై రాజమౌళి స్పందన
బాహుబలితో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం హాలీడే మూడ్‌లో ఉన్నాడు. ఐదేళ్లుగా బాహుబలి పనులతో అలసిపోయిన జక్కన్న ప్రస్తుతం లండన్‌లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే అక్కడ కూడా రాజమౌళిని మీడియా విడిచిపెట్టడం లేదు. అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ జక్కన్నను ఇంటర్య్వూ చేసింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు రాజమౌళి. ముఖ్యంగా బాహుబలి తరువాత రాజమౌళి చేయబోయే సినిమాపై ప్రదానంగా చర్చ జరుగుతుంది. రజనీకాంత్ లాంటి స్టార్ హీరోతో రాజమౌళి సినిమా చేస్తే అవతార్ రికార్డ్‌లు కూడా బ్రేక్ అవుతాయంటూ పలువురు సినీ ప్రముఖులు కామెంట్ చేయటంతో రాజమౌళి.. ఇంటర్య్యూలో ఈ విషయం పై స్పందించాడు. 'రజనీకాంత్ ఇండియాలోనే టాప్ స్టార్స్ లో ఒకరు. ఏ దర్శకుడైనా ఆయనతో సినిమా చేయాలనుకుంటాడు. నేను కూడా చేయాలనుకుంటున్నాను. అయితే ఆయన ఇమేజ్‌కు తగ్గ కథ దొరికితే తప్పకుండా రజనీతో సినిమా చేస్తాను. ఆ అవకాశం వస్తే నాకన్న సంతోషించే వ్యక్తి మరొకరు ఉండరు' అన్నాడు. ప్రభాస్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2 ప్రస్తుతం కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఇప్పటికే 700 కోట్ల కు పైగా వసూళ్లు సాధించిన ఈ భారీ చిత్రం, సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఏరియాల్లో రికార్డ్ లను తిరగరాస్తోంది. అంతేకాదు ఓవర్ సీస్ లోనూ హయ్యస్ట్ గ్రాసర్ గా ఉన్న దంగల్ రికార్డ్ ను మరో 24 గంటల్లో బాహుబలి 2 బద్ధలు కొట్టడం కాయంగా కనిపిస్తోంది. -
బాహుబలి 2.. ఆ దేశంలోనూ ఇండస్ట్రీ హిట్..!
బాహుబలి కలెక్షన్ల సునామీ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే నేషనల్ లెవల్లో ఉన్న ఎన్నో రికార్డ్ లను చెరిపేసిన ఈ విజువల్ వండర్, ఓవర్ సీస్ లోనూ అదే జోరు చూపిస్తుంది. బాలీవుడ్ టాప్ స్టార్స్‌కు చెమటలు పట్టిస్తూ తిరిగులేని రికార్డ్లను సొంతం చేసుకుంటుంది. ఇప్పటికే ఇండియాస్ బిగెస్ట్ బ్లాక్ బస్టర్‌గా పేరు తెచ్చుకున్న బాహుబలి 2, మరో దేశంలోనూ ఇండస్ట్రీ హిట్‌గా అవతరించనుంది. భారత్‌లో సంచలనాలు నమోదు చేస్తున్న బాహుబలి పొరుగు దేశమైన నేపాల్లోనూ అదే జోరు చూపిస్తోంది. ఇప్పటికే అక్కడ పది కోట్ల వసూళ్లు సాధించిన బాహుబలి, అతి త్వరలో నేపాల్‌లోనే అత్యథిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డ్ సృష్టించనుంది. ఇప్పటి వరకు 17 కోట్లతో 'చక్క పంజా' అనే సినిమా అక్కడ హయ్యస్ట్ గ్రాస్‌గా ఉంది. మరో వారం రోజుల్లో బాహుబలి 2 ఈ రికార్డ్‌ను చెరిపేస్తుందని భావిస్తున్నారు. దీంతో భారత్‌తో పాటు నేపాల్ లోనూ బాహుబలి 2 ఇండస్ట్రీ హిట్‌గా నిలవనుంది. -
బాహుబలి హద్దులు చెరిపేసింది : రామ్ చరణ్
బాహుబలి 2 సినిమాకు సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే తెలుగు, తమిళ, హిందీ స్టార్స్ బాహుబలి యూనిట్‌పై అభినందనల జల్లు కురిపిస్తుండగా, తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా స్పందించాడు. మంగళవారం రాత్రి చిరంజీవి, రామ్ చరణ్‌లు బాహుబలి స్పెషల్ స్క్రీనింగ్ చూసిన తరువాత చరణ్ తన సోషల్ మీడియా పేజ్‌లో స్పందించాడు. బాహుబలి నిజంగా ఇండియాస్ బిగెస్ట్ బ్లాక్ బస్టర్ అన్న చరణ్, రాజమౌళి ఊహ, విజువలైజేషన్లు సినిమా మళ్లీ మళ్లీ చూసేలా చేస్తున్నాయన్నాడు. ఒక గొప్ప సినిమా అన్ని రకాల హద్దులను చెరిపేస్తుందని మరోసారి రుజువైందని, బాహుబలి ఫిలింమేకర్స్కు ఇన్సిపిరేషన్ అంటూ కీర్తించాడు.నటీనటులపై కూడా అదే స్థాయిలో స్పందించాడు చరణ్. డార్లింగ్ ప్రభాస్ బాహుబలిగా అద్భుతంగా కనిపించాడు, నటించాడు. నా మిత్రుడు రానా తన కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్తో ఆకట్టుకున్నాడు. అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్‌ల నటన కట్టిపడేస్తుంది అంటూ తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేశాడు. -
హ్యాపిడేస్ హీరోకు గోల్డెన్ ఛాన్స్
హ్యాపిడేస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన నటుడు రాహుల్ హరిదాస్. ఈ యంగ్ హీరో హ్యాపిడేస్ తరువాత ఒకటి రెండు సినిమాల్లో నటించినా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అయితే తాజా వెంకటాపురం సినిమాతో మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ యంగ్ హీరోకు ఓ గోల్డెన్ ఛాన్స్ తలుపు తట్టింది. బాహుబలి ది కన్‌క్లూజన్ సినిమాను కోలీవుడ్‌లో రిలీజ్ చేసిన కె ప్రొడక్షన్ సంస్థ రాహుల్ హీరోగా ఓ సినిమాను నిర్మించనుంది. టాలీవుడ్లో పాగా వేసేందుకు ప్లాన్ చేస్తున్న కె ప్రొడక్షన్ సంస్థ ఇప్పటికే రానా, రెజీనా లీడ్ రోల్స్‌లో 1945 అనే బైలింగ్యువల్ సినిమాను ప్రారంభించింది. అదే సమయంలో రాహుల్ హీరోగా అడ్వంచరస్ డ్రామాను తెరకెక్కించడానికి రెడీ అవుతుంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. రాహుల్ హీరోగా తెరకెక్కిన వెంకటాపురం మే 12న రిలీజ్‌కు రెడీ అవుతోంది. -
రానాపై నోరు పారేసుకున్న బాలీవుడ్ క్రిటిక్
బాహుబలి 2 సినిమాకు ప్రపంచమంతా బ్రహ్మరథం పడుతుంటే కొంత మంది బాలీవుడ్ ప్రముఖులు మాత్రం ఆ విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. బాలీవుడ్ లో చిన్న సినిమాల విషయంలో కూడా స్పందించే కొంత మంది స్టార్స్, ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన బాహుబలి 2పై స్పందించకపోవటం పై అభిమానులు ఫైర్ అవుతున్నారు. అయితే తనకు తాను క్రిటిక్ అని చెప్పుకునే ఓ కమాల్ ఆర్ ఖాన్ మరో అడుగు ముందుకేసి బాహుబలి 2 యూనిట్ సభ్యులపై విమర్శలకు దిగుతున్నాడు. రానా ట్విట్టర్ పేజ్ స్క్రీన్ షాట్ ను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన కమాల్ ఆర్ ఖాన్. 'నేను ఈ ఇడియట్ ని ఎప్పుడు ఫాలో అవులేదు. ఈ రోజు వరకు అతని గురించి ట్వీట్ కూడా చేయలేదు. అయినా తను మెదడు లేని వాడిగా ప్రూవ్ చేసుకునేందుకు నన్ను బ్లాక్ చేశాడు' అంటూ ట్వీట్ చేశాడు. కమాల్ ట్వీట్ పై జాతీయ మీడియాలో వార్తలు రావడంతో రానా స్పందించాడు. 'ఆ మొరటు వ్యక్తిని ఏడాది కిందటే బ్లాక్ చేశాను' అంటూ రిప్లై ఇచ్చాడు రానా. మరి రానా స్పందన పై కేఆర్ కే ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. I never followed this idiot neither tweeted about him till date. Still he blocked me to prove that he is brainless. pic.twitter.com/W93uhUOPuo — KRK (@kamaalrkhan) 2 May 2017 Blocked that bloke almost a year ago!!https://t.co/26IySsZtqU — Rana Daggubati (@RanaDaggubati) 2 May 2017 -
ప్రభాస్.. ఒకేసారి రెండు సినిమాల్లో..!
బాహుబలి సినిమాతో యూనివర్సల్ స్టార్ గామారిపోయిన ప్రభాస్, ఇక మీద అభిమానులను వరుస సినిమాలతో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో సాహో సినిమాను ప్రారంభించాడు. టీజర్ కోసం కొద్ది రోజుల షూటింగ్ కూడా చేసిన యూనిట్ ప్రస్తుతం బ్రేక్ తీసుకుంది. ప్రభాస్ హాలీడే ట్రిప్ ముగిసిన తరువాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు మరో సినిమాను కూడా సెట్స్ మీదకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడు ప్రభాస్. యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కిన జిల్ సినిమాతో ఆకట్టుకున్న దర్శకుడు రాధా కృష్ణన్ దర్శకత్వంలో మరో సినిమాను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. సాహోతో పాటు రాధాకృష్ణన్ సినిమా షూటింగ్ లోనూ ఒకేసారి పాల్గొనేలా డేట్స్ అడ్జస్ట్ చేసుకుంటున్నాడట. త్వరలోనే ఈ రెండు సినిమాలపై అధికారిక ప్రకటన వెలువడనుందన్న ప్రచారం జరుగుతోంది. -
బాహుబలి 2.. ఆ రెండు దాటితే క్లీన్ స్వీప్
బాహుబలి 2 బాలీవుడ్ టాప్ స్టార్స్‌కు కూడా చెమటలు పట్టిస్తోంది. ఇప్పట్లో బ్రేక్ చేయడం సాధ్యం కాదనిపించే ఎన్నో రికార్డ్ లను బాహుబలి అవలీలాగా చెరిపేసింది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్లో బాహుబలి జోరు మామూలుగా లేదు. ఖాన్ త్రయం సెట్ చేసిన ఎన్నో రికార్డ్లను బాహుబలి ఇప్పటికే బద్ధలు కొట్టింది. అత్యధిక థియేటర్ల రిలీజ్, అత్యధిక అడ్వాన్స్ బుకింగ్స్ లాంటి రికార్డ్‌లు బాహుబలి పేరు మీదకు మారిపోయాయి. అయితే ఓవర్ సీస్లో బాహుబలి ముందున్నవి కేవలం రెండు రికార్డ్‌లు మాత్రమే. ఆమిర్ ఖాన్ హీరోగా తెరకెక్కిన పీకే ఓవర్ సీస్లో 10.56 మిలియన్ డాలర్లు వసూళు చేయగా, దంగల్ సినిమా 12.36 మిలియన్ డాలర్లు వసూళు చేసింది. అయితే పీకే రికార్డ్‌ను సోమవారం దాటేయనున్న బాహుబలి 2, దంగల్ రికార్డ్‌ను బ్రేక్ చేయడానికి ఎంత సమయం తీసుకుంటుందో చూడాలి. అత్యంత సమీపంలో ఉన్న ఈ రెండు రికార్డ్లను చెరిపేసి బాహుబలి 2 ఓవర్ సీస్ రికార్డ్లను క్లీన్ స్వీప్ చేయటం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. అంతేకాదు ఫుల్ రన్లో బాహుబలి 2, 20 మిలియన్ల మార్క్‌ను సైతం అందుకోవటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ శుక్రవారం హాలీవుడ్ సినిమా గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ రిలీజ్ అవుతుండటంతో బాహుబలి 2 థియేటర్లకు కోత పడనుంది. కానీ తరువాత మరో నెలన్నర పాటు పెద్ద సినిమాలేవి లేక పోవటం బాహుబలి 2కి కలిసొచ్చే అంశం. మరి ముందు ముందు ఈ విజువల్ వండర్ ఓవర్ సీస్లో ఇంకెన్నీ రికార్డ్‌లు సెట్ చేస్తుందో చూడాలి. -
బాహుబలి 2లో ఐదు తప్పులు..!
బాహుబలి 2 ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అదే స్థాయిలో యూనిట్ ప్రసంశల వర్షం కురుస్తోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు బాహుబలి 2పై తమ అభిప్రాయాలు వెల్లడించగా. యువ దర్శకుడు విఘ్నేష్ శివన్ మాత్రం ఆసక్తికరంగా స్పందిచాడు. బాహుబలి 2లో ఐదు తప్పులున్నాయంటూ తన ట్విట్టర్ పేజ్‌లో పోస్ట్ చేశాడు. ఇంతకీ విఘ్నేష్ చెపుతున్న ఆ తప్పులేంటంటే. '1. కేవలం 120 రూపాయలకే సినిమా చూడాల్సి రావడం. దీనికి పరిష్కారం, నిర్మాత కోసం థియేటర్ల ముందు కలెక్షన్ బాక్స్ లు పెట్టాలి. 2. సినిమా డ్యూరేషన్ చాలా తక్కువగా ఉంది. మూడు గంటల్లోనే సినిమా పూర్తయిపోవడాన్ని సినీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 3. అత్యంత డీటెయిల్డ్ గా సినిమాను చిత్రీకరించటం.. దీని వల్ల ఇన్నాళ్లు తాము పర్ఫెక్ట్ గా సినిమా చేస్తున్నామనుకునే చాలా మంది దర్శకుల తల పొగరు తగ్గుతుంది. 4. ఇది కన్‌క్లూజన్ అవ్వడానికి వీల్లేదు. ఈ సీరీస్ లో మరో పది సినిమాలు త్వరలోనే చూడాలని కోరుకుంటున్నాం. 5. భవిష్యత్తు ఎంతో కష్టంగా ఉండనుంది. ఎందుకంటే ఈ స్థాయి రికార్డ్ లను బద్ధలు కొట్టి సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేయాలంటే మన పరిశ్రమకు ఎన్నో ఏళ్లు పడుతుంది.' అంటూ తన ట్విట్టర్ పేజ్ లో పోస్ట్ చేసిన విఘ్నేష్ శివన్, రాజమౌళి, ప్రభాస్, రమ్యకృష్ణ, సత్యరాజ్ రానాలకు శుబాకాంక్షలు తెలిపాడు. 5 Mistakes in #Baahubali2 Frm Legend @ssrajamouli sir's Masterpiece! TakeABow@meramyakrishnan #prabas #satyaraj @RanaDaggubati &team pic.twitter.com/GRPD3HLnVH — Vignesh ShivN (@VigneshShivN) 1 May 2017 -
హాలిడే తప్పదు మామా
‘‘నువ్వు నా పక్కన ఉన్నంతవరకూ నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామా’’... ‘బాహుబలి–2’లో కట్టప్పతో అమరేంద్ర బాహుబలి ఈ డైలాగ్ చెబుతాడు. కట్టప్ప ఎవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అమరేంద్ర బాహుబలి అంటే ప్రభాస్ అని కూడా తెలుసు. ఇప్పుడు ఇదే డైలాగ్‌ని మార్చి చెప్పమని ప్రభాస్‌ని అడిగితే.. ‘‘నాలుగేళ్లు నాన్‌స్టాప్‌గా పని చేసిన తర్వాత హాలిడే తీసుకోక తప్పదు మామా...’’ అంటారు. అవును మరి. ‘బాహుబలి’ రెండు భాగాల కోసం ప్రభాస్ మామూలుగా కష్టపడలేదు. నాలుగేళ్లు పూర్తిగా ఈ సినిమాకు డెడికేట్ అయిన ప్రభాస్ కొంచెం రిలాక్స్ కావాలనుకుంటున్నారు. ‘బాహుబలి–2’ రిలీజ్ అయ్యి, మంచి టాక్ తెచ్చుకుంది. పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించింది. ఇక, నెక్ట్స్ మూవీ షూట్లో బిజీ అయ్యేలోపు విశ్రాంతి తీసుకుంటే బాగుంటుందనుకున్నారు. అందుకే ప్రభాస్ యూఎస్ చెక్కేశారు. హాలిడే ఎన్ని రోజులు డార్లింగ్? అని అభిమానుల మనసులో ప్రశ్న మెదలకుండా మానదు. ఒక నెల యూస్‌లో ఉండి, డార్లింగ్ ప్రభాస్ ఇండియా వచ్చేస్తారు. ఆ తర్వాత సుజిత్ డైరెక్షన్లో చేస్తోన్న సినిమాతో బిజీ అయిపోతారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఆ సంగతలా ఉంచితే.. ‘బాహుబలి’ తపస్సులో ఐదేళ్లకు పైనే ఇన్వాల్వ్ అయిన రాజమౌళి కుటుంబం కూడా టూర్ ప్లాన్ చేసుకున్నారు. ఈ కుటుంబం లండన్ వెళ్లింది. -
బాహుబలి దర్శకుడు, నిర్మాతలపై ఫిర్యాదు
హైదరాబాద్: ఇటీవల విడుదలైన బాహుబలి–2 సినిమాలో తమ కులాన్ని కించపరిచే విధంగా ‘కటిక చీకటి’ అనే పదాన్ని వాడి ఆరె కటికల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని ఆరోపిస్తూ బాహుబలి సినిమా దర్శక, నిర్మాతలపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ ఆదివారం ఆరెకటిక పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు గోగికార్ సుధాకర్ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సినిమాలో కటిక చీకటి అన్న పదాన్ని వాడటం వల్ల సెన్సార్ నిబంధనలను కూడా ఉల్లంఘించారని ఆయన ఆరోపించారు. ఆ పదాన్ని తొలగించకపోతే దర్శకుడు రాజమౌళి ఇంటిని ముట్టడిస్తామని అప్పటికీ మార్పు రాకపోతే సినిమా థియేటర్ల వద్ద ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఫిర్యాదు చేసిన వారిలో సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు అనిల్‌కుమార్, మహేష్, సంతోష్, గురుచరణ్ తదితరులు ఉన్నారు. పోలీసులు ఫిర్యాదును స్వీకరించారు. న్యాయసలహా అనంతరం కేసు నమోదు చేయాలా వద్దా నిర్ణయం తీసుకుంటామని సీఐ శ్రీనివాస్ తెలిపారు. -
రెండ్రోజుల్లో బాహుబలి కలెక్షన్లు ఎంతో తెలుసా!
హైదరాబాద్: టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'బాహుబలి: ది కంక్లూజన్' బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. బాలీవుడ్ మూవీ సుల్తాన్ రికార్డును బద్దలుకొట్టింది బాహుబలి-2. తొలి వారాంతంలో రూ. 210.5 కోట్లతో ఉన్న సుల్తాన్ మూవీ గ్రాస్ కలెక్షన్లను కేవలం రెండు రోజుల్లోనే 217 కోట్లతో టాలీవుడ్ మూవీ అదిగమించింది. బాహుబలి-2 రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.382.5 కోట్ల వసూళ్లు రాబట్టి 400కోట్ల కబ్ల్ వైపునకు పరుగులు తీస్తుంది. ఈ విషయాన్ని మూవీ ట్రేడ్ అనలిస్ట్ రమేశ్ బాలా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. భారత్‌లో ఓవరాల్‌గా 285 కోట్లు రాబట్టిన బాహుబలి-2, అమెరికాలో 52.5 కోట్లు, ఇతర దేశాల్లో రూ.45 కోట్ల భారీ వసూళ్లతో చరిత్ర సృష్టించింది. భారత్‌లో తొలివారాంతంలో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలవడంతో దర్శకుడు రాజమౌళికి ప్రశంసల వెల్లువ కొనసాగుతోంది. ఇప్పటివరకూ ఆమీర్ ఖాన్ నటించిన పీకే మూవీ ఓవరాల్‌గా 792 కోట్ల వసూళ్లతో భారత్‌లో అగ్రస్థానంలో ఉంది. అయితే బాహుబలి పీకే రికార్డులను తిరగరాసి తొలి వారం రోజుల్లోనే పీకే వసూళ్లను అధిగమిస్తుందని మూవీ ట్రేడ్ అనలిస్టులు భావిస్తున్నారు. #Baahubali2 / #BaahubaliTheConclusion 2 Days WW BO:#India Gross: ₹ 285 Crs#USA - ₹ 52.5 Crs RoW - ₹ 45 Crs Total - ₹ 382.5 Crs — Ramesh Bala (@rameshlaus) 30 April 2017 #Baahubali2 's Day 1 WW Gross - ₹ 217 cr beats #Sultan 's 1st Wknd WW Gross of ₹ 210.5 cr to emerge All-time No.1 1st Wknd Indian Grosser.. — Ramesh Bala (@rameshlaus) 30 April 2017 -
ఉద్వేగానికి గురైన శివగామి
హైదరాబాద్: జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తున్న బాహుబలి 2 సినిమాలో శివగామి దేవి పాత్రలో రమ్యకృష్ణ సత్తాచాటింది. ఈ సినిమాలో ప్రభాస్, రానా, సత్యరాజ్‌లతో పాటు రమ్యకృష్ణ నటనకు ప్రశంసలు వస్తున్నాయి. రమ్యకృష్ణకు ఫోన్ కాల్స్, మెసేజ్, సోషల్ మీడియా ద్వారా అభినందనలు వెల్లువెత్తున్నాయి. బాహుబలి 2లో తన పాత్రకు వస్తున్న స్పందన, ప్రశంసలు చూసి ఆమె ఉద్వేగానికి గురైంది. తనకు అభినందనలు తెలిపినవారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. 'అభిమానులకు ధన్యవాదాలు. ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ చేసి అభినందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మీరు నాపై చూపుతున్న ప్రేమాభిమానాలు, మద్దతు వల్లే ఈ రోజు ఈ స్థానంలో ఉన్నా. లేకుంటే ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదు. నాకు చాలా సంతోషంగా, ఉద్వేగంగా ఉంది. జై మహిష్మతి' అంటూ రమ్యకృష్ణ ట్వీట్ చేసింది. ఆమె కెరీర్లో పేరు తెచ్చిన పాత్రల్లో బాహుబలిలోని 'శివగామి' ఒకటి. ఈ సినిమాలో రమ్య నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. -
రాజమౌళికి అభినందనల వెల్లువ
హైదరాబాద్: జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తున్న బాహుబలి 2 సినిమా దర్శకుడు రాజమౌళిపై అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ట్విట్టర్లో ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్, సినీ ప్రముఖులు చిరంజీవి, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ భట్, శేఖర్ కపూర్, ధనుష్, కుష్బూ సుందర్ తదితరులు రాజమౌళిని అభినందించారు. బాహుబలి 2 సినిమా చూశానని, హాలీవుడ్ స్థాయిలో ఉందంటూ వెంకయ్య నాయుడు ట్విట్టర్లో రాజమౌళిని అభినందించారు. రాజమౌళి స్పందిస్తూ తనకు అభినందనలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశాడు. టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ‘బాహుబలి ది కంక్లూజన్’ పై రివ్యూలు పాజిటివ్‌గా ఉన్నాయి. ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, అనుష్క, సత్యరాజ్‌ల నటనకు, సాంకేతిక నిపుణుల పనితీరుకు ప్రశంసలు వస్తున్నాయి. శుక్రవారం విడుదలైన ఈ సినిమా భారీ కలెక్షన్లు సాధిస్తోంది. -
జీవితాంతం గుర్తుంచుకుంటా : రాజమౌళి
ఐదేళ్లుగా రాజమౌళి చేస్తున్న యజ్ఞం పూర్తయి బాహుబలి 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ బడ్జెట్ తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ఎదురైన ఇబ్బందులపై రాజమౌళి స్పందించాడు. ఆదివారానికి రిలీజ్ హడావిడి కాస్త తగ్గటంతో తన సోషల్ మీడియా పేజ్ లో తనకు అండగా ఉన్న అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశాడు. 'బాహుబలి లాంటి భారీ ప్రాజెక్ట్ కు రిలీజ్ సమయంలో ఇబ్బందులు ఎదురవ్వటం సహజం. బాహుబలి అభిమానుల ప్రేమ, సపోర్ట్ మూలంగానే ఆ ఇబ్బందులన్నింటినీ యూనిట్ దాటగలిగింది. గత ఐదేళ్లుగా మాతో ఉండి, ప్రతీ సందర్భంలో మమ్మల్ని ఎంకరేజ్ చేసిన అందరికీ థ్యాంక్స్. మీరు మా మిగతా జీవితమంతా గుర్తుండి పోయే ఘనవిజయాన్ని అందించారు' అంటూ ప్రేక్షకులకు ట్వీట్ల రూపంలో కృతజ్ఞతలు తెలిపాడు రాజమౌళి. Its only natural that a big project like Baahubali faces hurdles during release. I must say that the enormous love and support that was — rajamouli ss (@ssrajamouli) 30 April 2017 given by Baahubali Fans made us cruise through the obstacles. Thank you everyone who have been with us for the past 5 years encouraging us — rajamouli ss (@ssrajamouli) 30 April 2017 at every turn. You have given us such a big success that we can keep it in our hearts for the rest of our lives. 🙏🙏🙏🙏 — rajamouli ss (@ssrajamouli) 30 April 2017 -
బాహుబలి ఫ్యాన్స్‌ను హర్ట్ చేశాడు..!
శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాహుబలి యూనిట్‌పై సినీ వర్గాల నుంచి సామాన్య ప్రజల వరకు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ లిస్ట్‌లో టాలీవుడ్ దర్శకుడు గుణశేఖర్ కూడా చేరాడు. కీరవాణి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను ప్రశంసిస్తూ స్వహస్తాలతో ఓ లెటర్ రాసిన గుణశేఖర్, రాజమౌళి దర్శకత్వ ప్రతిభను కీర్తిస్తూ తన సోషల్ మీడియా పేజ్‌లో కామెంట్ చేశాడు.అయితే ఈ కామెంటే ఇప్పుడు బాహుబలి ఫ్యాన్స్‌ను హర్ట్ చేసింది. సినిమా అనేది ఎంతటి బలమైన మీడియమో మరోసారి నిరూపించినందుకు శుభాకాంక్షలన్న గుణశేఖర్, ఓ మామూలు కథను కూడా మీ అద్భుతమైన దర్శకత్వ ప్రతిభతో గొప్పగా చిత్రీకరించినందుకు హాట్సాఫ్ అంటూ కామెంట్ చేశాడు. కేవలం విజయేంద్ర ప్రసాధ్ అందించిన కథ, ఆయన సృష్టించిన పాత్రల వల్లే ఇంతటి విజయం సాధ్యమైందని బాహుబలి యూనిట్ చెపుతున్న తరుణంలో గుణశేఖర్ ఆ కథను సింపుల్ స్టోరి అంటూ తేల్చేయటం రాజమౌళి, ప్రభాస్ అభిమానులకు కోపం తెప్పిస్తోంది. ఇప్పటికే గుణశేఖర్ కామెంట్స్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. @ssrajamouli pic.twitter.com/xrl4BJW8rp — Gunasekhar (@Gunasekhar1) 28 April 2017 -
బాహుబలి 2పై మెగాస్టార్ కామెంట్స్
ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు నమోదు చేస్తున్న బాహుబలి యూనిట్‌ను మెగాస్టార్ చిరంజీవి ప్రశంసించాడు. 'బాహుబలి- ది కంక్లూజన్ ఒక అద్భుతం.. ఆ అద్భుతాన్ని సృష్టించిన రాజమౌళి అభినందనీయుడు. తెలుగు సినిమా సత్తా దేశ విదేశాల్లో చాటిన అద్భుత శిల్పికి హెట్సాఫ్. బాహుబలిలో నటించిన ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, అనుష్క, సత్యరాజ్, నాజర్ ఇతర నటీనటులతో పాటు ప్రత్యేకంగా విజయేంద్రప్రసాద్, కీరవాణి గారికి, సెంథిల్‌కి, మిగిలిన సాంకేతిక నిపుణులకు నా ప్రత్యేక అభినందనలు. జయహో... రాజమౌళి' అంటూ యూనిట్ సభ్యులను ఆకాశానికి ఎత్తేశారు. గురువారం రాత్రి ప్రీమియర్ షోలతో ప్రారంభమైన బాహుబలి 2 ప్రభంజనం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. తొలి రోజే 200 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఒక్క ఇండియన్ మార్కెట్ లోనే 125 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్టు ప్రముఖ బాలీవుడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ప్రకటించారు. లాంగ్ వీకెండ్ కూడా కావటంతో మరో మూడు రోజుల పాటు బాహుబలి 2 మరిన్ని రికార్డ్‌లు నమోదు చేసే అవకాశం ఉంది. Best regards to @BaahubaliMovie @ssrajamouli - #Chiranjeevi pic.twitter.com/SmFAbV0QBY — Konidela Pro Company (@KonidelaPro) 30 April 2017 -
రాజమౌళి నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై మరో న్యూస్
బాహుబలి 2 సినిమాతో ప్రపంచాన్ని తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన దర్శకధీరుడు రాజమౌళి. బాహుబలితో దేశంలోనే అత్యుత్తమ దర్శకుల్లో ఒకడిగా నిలిచిన రాజమౌళి చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి. చాలా రోజులుగా సినీ అభిమానులను వేదిస్తున్న ప్రశ్న ఇది. బాహుబలి కన్నా భారీగా మహాభారతాన్ని తెరకెక్కిస్తాడని కొద్ది రోజులు ప్రచారం జరిగింది. అయితే రాజమౌళి స్వయంగా ఇప్పట్లో మహాభారతం ఉండదన్న స్టేట్మెంట్ ఇచ్చేయటంతో.. ఓ బాలీవుడ్ సినిమా చేయబోతున్నాడని, టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోతో చిన్న సినిమా చేస్తాడని రకరకాల ప్రచారాలు జరిగాయి. అయితే తాజాగా మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. రాజమౌళి ప్రముఖ నిర్మాత డివివి దానయ్య బ్యానర్ లో సినిమా చేసేందుకు చాలా కాలం క్రితమే అడ్వాన్స్ తీసుకున్నారట. ఇప్పుడు అదే ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించనున్నాడన్న ప్రచారం కూడా జరుగుతోంది. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో డీజే దువ్వాడ జగన్నాథమ్ షూటింగ్ లో బిజీగా ఉన్న బన్నీ ఆ తరువాత లింగుస్వామితో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. ఒక వేళ జక్కన్న లైన్ లోకి వస్తే లింగుస్వామి సినిమాను పక్కన పెట్టేసి రాజమౌళి సినిమాకే ఓటేసే ఆలోచనలో ఉన్నాడట. మరి నిజంగానే ఈ ప్రాజెక్ట్ రెడీ అవుతుందా లేదా తెలియాలంటే మాత్రం అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే. -
బాహుబలి దెబ్బకు కుంగ్ ఫూ మటాష్
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సష్టిస్తున్న బాహుబలి–2 (ది కక్లూజన్) సినిమా దెబ్బకు ప్రేక్షకాధారణ పొందుతున్న అస్సామీస్ చిత్రం సీక్వెల్ ‘లోకల్ కుంగ్ ఫూ–2’ తీవ్రంగా దెబ్బతిన్నది. బాహుబలి చిత్రం ప్రదర్శన కోసం బాగా నడుస్తున్న తమ చిత్రాన్ని అర్ధాంతరంగా థియేటర్ల నుంచి తొలగించి తమకు అన్యాయం చేశారని నిర్మాత కెన్నీ బాసుమత్రే వాపోతున్నారు. ఆయన లోకల్ కుంగ్ ఫూను 2015లో తీశారు. ఆ సినిమా బాగా నడవడంతో ఇప్పుడు దానికి సీక్వెల్ తీశారు. ఈ సీక్వెల్ 19వ తేదీన విడుదలైంది. అస్సామీస్ యుద్ధ కళలను కామెడీ పద్ధతిలో చూపించడం వల్ల తమ చిత్రం ప్రేక్షకాధరణ ఊహించినట్లే పెరిగిందని చెప్పారు. సాధారణంగా చిన్న బడ్జెట్లో తీసే అస్సామీస్ చిత్రాలు రెండో వారంలో ఊపందకుంటాయని ఆయన చెప్పారు. రెండో వారంలో దాదాపు సినిమా హాళ్లు నిండుతున్న సమయంలో తమ సినిమాను ఎత్తేసి బాహుబలి–2 హిందీ వర్షన్‌కు థియేటర్లు అవకాశం ఇవ్వడం వల్ల తమకు అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు. మొదటి భాగం హిట్టయిన కారణంగా కొంచెం ఎక్కువ బడ్జెట్‌తోనే సినిమాను తీశామని, మరో వారం ఆడితేగానీ తాము పెట్టిన పెట్టుబడి తిరిగి రాదని ఆయన అన్నారు. తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాల్లోలాగా స్థానిక సినిమాలకు రక్షణ కల్పిస్తూ ప్రభుత్వం చట్టం తీసుకరావాలని ఆయన డిమాండ్ చేశారు. తప్పనిసరిగా స్థానిక సినిమాలకు కొన్ని స్క్రీన్లను కేటాయిస్తూ తమిళనాడు, మహారాష్ట్రలో ప్రత్యేక రాష్ట్ర చట్టాలున్నాయి. ఇంతకుముందు షారూక్ ఖాన్ నటించిన రాయీస్ చిత్రం విడుదల సందర్భంగా కూడా బాగా నడుస్తున్న ఓ అస్సామీ సినిమాను అర్ధంతరంగా ఎత్తివేశారు. దీనిపై ఆ సినిమా దర్శకుడు హిమాంషు ప్రసాద్ ఏకంగా మైన్మార్‌లో తలదాచుకున్న అల్ఫా నాయకుడు పరేశ్ బారువాకు ఓ లేఖ రాశారు. దాంతో బారువా ఓ స్థానిక టీవీ ముందుకొచ్చి అస్సామీ సినిమాల ప్రదర్శనకు ప్రాధాన్యత ఇవ్వకపోతే అంతు చూస్తానని థియేటర్ యజమానులను హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకొచ్చి తమిళనాడు, మహారాష్ట్ర తరహాలో ప్రత్యేక చట్టం తీసుకొచ్చేందుకు థియేటర్ యజమానుల సంఘంతో చర్చలు జరిపింది. ఆ చర్చలు ఓ కొలిక్కి రాకపోవడంతో ఆ సమస్య అలాగే ఉండి పోయింది. అస్సామీ చిత్రాలు ఏడాదికి దాదాపు 40 చిత్రాలు విడుదలవుతాయని, అవన్ని చిన్న బడ్జెట్ చిత్రాలవడం, ప్రజలు కూడా వాటికన్నా హిందీ చిత్రాలను చూసేందుకు ఇష్ట పడడం వల్ల తమకు అసలు లాభాలు రావని, తమ థియేటర్ల నిర్వహణకు, సిబ్బంది జీతాలు చెల్లించేందుకే తాము హిందీ సినిమాలపై ఆధారపడాల్సి వస్తోందని థియేటర్ యజమానులు చెబుతున్నారు. ఈ విషయాన్ని మరోసారి మీడియా ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లగా త్వరలోనే ఈ చట్టం తీసుకొస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. -
ఫ్యాన్స్‌కు శివగామి థ్యాంక్స్
శుక్రవారం రిలీజ్ అయిన బాహుబలి 2 సక్సెస్‌లో కీలక పాత్ర పోషించిన సీనియర్ నటి రమ్యకృష్ణ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. సినిమాలో రాజమాత శివగామి దేవిగా అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న రమ్యకృష్ణ, తనకు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసింది. ' ట్విట్టర్, ఫేస్ బుక్ పేజ్‌లతో పాటు ఫోన్ చేసి, మేసేజ్ చేసి శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ నా కృతజ్ఞతలు. ఈ రోజు నేను ఉన్న ఈ పొజిషన్‌కు మీ ప్రేమ, ఆదరణే కారణం. జై మాహిష్మతి' అంటూ ట్వీట్ చేసింది రమ్యకృష్ణ. ఈ శుక్రవారం రిలీజ్ అయిన బాహుబలి 2 సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఇండియన్ బాక్సాఫీస్ రికార్డ్ లను చెరిపేస్తూ ఇప్పటికే 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఓవర్ సీస్ లోనూ సత్తా చాటుతున్న బాహుబలి ఫుల్ రన్ లో 1000 కోట్ల వసూళ్ల సాధించటం కాయంగా కనిపిస్తోంది. I thank each and everyone who have taken the effort to call me, message me and wish me through my FB page and twitter a BIG THANK YOU.... — Ramya Krishnan (@meramyakrishnan) 29 April 2017 Love you all...without your love, affection and support I wouldn't be where I am today, I am so overwhelmed....Jai Mahishmathi.. — Ramya Krishnan (@meramyakrishnan) 29 April 2017 -
బాహుబలి 2లో సమాధానం దొరకని ప్రశ్నలు
బాహుబలి తొలి భాగం రిలీజ్ అయిన దగ్గర నుంచి సినీ జనాలను వేదిస్తున్న ప్రశ్న కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు.? అయితే ఈ ప్రశ్నకు బాహుబలి 2 సమాధానం ఇచ్చిన దర్శకుడు రాజమౌళి, చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే బాహుబలి 2వ భాగాన్ని ముగించేశాడు. ఇప్పుడు ఆ సమాధానం దొరకని ప్రశ్నలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. బాహుబలి తొలి భాగంలో శివుడు, భల్లాలదేవుడి కొడుకు భధ్రని తల నరికి చంపాడు. అయితే రెండో భాగంలో భల్లాలదేవుడి భార్యకు సంబంధించిన సన్నివేశాలుంటాయి భావించిన ప్రేక్షకులకు ఆమె ఎవరన్నది సమాధానం దొరకని ప్రశ్నగానే మిగిలిపోయింది. రెండో భాగంలోనూ భల్లాలదేవుడి కొడుకు ప్రస్థావన ఉన్నా భార్యను మాత్రం చూపించలేదు. తొలిభాగంలో కాలకేయల నేపథ్యం వాళ్ల నాయకుడికి వివరాలను సవివరంగా చూపించిన చిత్రయూనిట్ రెండో భాగంలో కుంతల రాజ్యం మీద దాడిచేసిన పిండారీల నేపథ్యం నాయకుడిపై పెద్దగా దృష్టి పెట్టలేదు. అదే సమయంలో తొలిభాగంలో ఏ సాయం కావాలన్న ఈ మిత్రుడన్నాడంటూ కట్టప్పకు మాట ఇచ్చిన అస్లాం ఖాన్ రెండో భాగంలో కనిపిస్తాడని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. క్లైమాక్స్ మహిష్మతి మీద దండెత్తడానికి శివుడికి సైనికబలం పెద్దగా లేకపోయినా అస్లాం ఖాన్ సాయం మాత్రం తీసుకోలేదు. అంతేకాదు దేవసేనను విడిపించడానికి ప్రాణత్యాగానికి సైతం సిద్ధమైన అంవతిక నేపథ్యం కుటుంబం లాంటి వివరాలను కూడా ఎక్కడా ప్రస్థావించలేదు. ఇప్పటికే సినిమా నిడివి పెరిగిపోవటంతో కొన్ని విషయాలను చూసి చూడనట్టు వదిలేశారో..? లేక అవి అంత ముఖ్యం కాదనుకున్నారోగాని..? సోషల్ మీడియాకు మాత్రం మంచి టాపిక్ ఇచ్చారు బాహుబలి టీం. -
రాజమౌళిపై మహేష్ ప్రశంసలు
బాహుబలి 2పై ప్రశంసల జల్లు కురుస్తూనే ఉంది. ఇప్పటికే టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ ప్రముఖులు బాహుబలి సినిమాపై స్పందించగా తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా బాహుబలి టీం ను ఆకాశానికి ఎత్తేశారు. ముఖ్యం రాజమౌళిని కథ చెప్పడంలో మాస్టర్ గా కీర్తించిన మహేష్, బాహుబలి 2 అంచనాలను దాటింది అంటూ ట్వీట్ చేశాడు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాహుబలి 2 తొలి షో నుంచే సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఇప్పటికే 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్టుగా ప్రచారం జరుగుతుండగా తొలి వారాంతంలో ఈ సినిమా 300 కోట్లకు పైగా బిజినెస్ చేస్తుందని భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న ఇండియన్ సినిమా రికార్డ్ లన్ని చెరిపేస్తున్న ఈ భారీ చిత్రం 1000 కోట్ల వసూళ్ల సాధిస్తుందని భావిస్తున్నారు. The master storyteller is back! #Baahubali2 is an event film which exceeds expectations! — Mahesh Babu (@urstrulyMahesh) 29 April 2017 Mind boggling stuff, a game changer! Hats off to @ssrajamouli and the entire team! — Mahesh Babu (@urstrulyMahesh) 29 April 2017 -
'ఈ దశాబ్దపు అత్యుత్తమ దర్శకుడు'
బాహుబలి 2 చిత్రంతో రాజమౌళి రేంజ్ భారీగా పెరిగిపోయింది. ఇండియన్ సినిమా కమర్షియల్ హద్దులు చెరిపేసిన రాజమౌళి, ఈ దశాబ్ధపు అత్యుత్తమ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ మాట చెప్పింది ఎవరో కాదు. బాలీవుడ్ దర్శకుడు నిర్మాత కరణ్ జోహర్. బాహుబలి సినిమాను బాలీవుడ్ లో తన బ్యానర్ పై రిలీజ్ చేస్తున్న కరణ్, సినిమాను సినిమాకు పని చేసిన యూనిట్ సభ్యులను ఆకాశానికి ఎత్తేస్తున్నాడు. అందులో భాగంగా రాజమౌళితో కలిసి దిగిన సెల్ఫీని తన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన కరణ్ 'ఈ దశాబ్దపు టాప్ డైరెక్టర్ తో నేను. ఈ జీనియస్ తో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నా. మా కాలంలో ఖచ్చితంగా ఇతనే అత్యుత్తమ దర్శకుడు' అంటూ ట్వీట్ చేశాడు కరణ్ జోహర్. ఎంతో మంది లెజెండరీ దర్శకులు ఉండగా రాజమౌళి అత్యుత్తమ దర్శకుడంటూ కరణ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సౌత్ తో పాటు నార్త్ ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ గా మారాయి. With the movie man of the decade!!!! @ssrajamouli ...it's an honour to collaborate with his genius!! Truly the BEST director of our time! pic.twitter.com/08f4oRnonS — Karan Johar (@karanjohar) 28 April 2017 -
బాహుబలి 2 ఫస్ట్ డే రికార్డ్..!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాహుబలి 2 శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పెయిడ్ ప్రీమియర్స్ పేరుతో గురువారం రాత్రి నుంచి బాహుబలి కలెక్షన్ల వేట మొదలైనా.. అఫీషియల్‌గా శుక్రవారం ఎర్లీ మార్నింగ్ షోతో బాహుబలి హవా మొదలైంది. ఇప్పటికే బిజినెస్ ఎనలిస్ట్‌లు చెప్పిన లెక్కల ప్రకారం మొత్తం మీద బాహుబలి 2 తొలి రోజే దాదాపు వంద కోట్ల వరకు వసూళ్లు సాధింస్తుందని భావించారు. అయితే అందరికీ షాక్ ఇస్తూ తొలి 24 గంటల్లో కేవలం భారత మార్కెట్ లోనే బాహుబలి 2 ఏకంగా 125 కోట్ల కలెక్షన్లు సాధించి రికార్డ్ సృష్టించింది. సౌత్‌లో వందకోట్ల వసూళ్లు ఫుల్ రన్లో సాధించటమే కష్టంగా ఉన్న రోజుల్లో.. తొలి రోజే 125 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన బాహుబలి ఆల్ టైం రికార్డ్‌ను సెట్ చేసింది. ఇప్పటికే బాలీవుడ్ రికార్డ్ లను కూడా బద్దలు కొట్టడం ప్రారంభించిన ఈ భారీ చిత్రం, ఫుల్ రన్లో 1000 కోట్ల గ్రాస్ వసూలు చేయటం కాయం అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో 55 కోట్లు, హిందీలో 38 కోట్లు, కర్ణాటకలో 12 కోట్లు, కేరళలో 9 కోట్లు, తమిళనాట 11 కోట్ల వసూళ్లు సాధించినట్టుగా తెలుస్తోంది. వీటితో పాటు ఓవర్ సీస్ కలెక్షన్లు కూడా కలుపుకుంటే తొలి రోజే 150 కోట్ల మార్క్ కు బాహుబలి 2 చేరువైనట్టే. అయితే అనధికారిక సమాచారం ప్రకారం కలెక్షన్లు 180 కోట్ల వరకు ఉండొచ్చన్న ప్రచారం కూడా జరుగుతోంది. #Baahubali2 Record Breaker AP & Nizam 55 cr Hindi 38 cr Karnataka 12 cr Kerala 9 cr TN 11 cr Total " 125 cr " on Opening Day in India. pic.twitter.com/L2Gxoqi715 — Umair Sandhu (@sandhumerry) 28 April 2017 #Baahubali2 SMASHED All Boxoffice RECORDS in India ! It collected Net HISTORIC " 125 cr " on Opening Day in #India ! Celebration Time -
తొలిరోజు బాహుబలి రికార్డు కలెక్షన్లు!
-
బాహుబలి-2, ప్రభాస్‌పై చెలరేగిపోయిన కేఆర్కే
ముంబై: సెన్సేషనల్ టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి సినిమా బాహుబలి-2(ద కంక్లూజన్)పై బాలీవుడ్ ఫిల్మి క్రిటిక్ ,పబ్లిసిటీ కింగ్ కమల్ ఆర్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వివాదాస్పద మూవీ రివ్యూలతో పాపులర్ అయిన కమల్ తాజాగా రాజమౌళి ప్రతిష్టాత్మక మూవీ బాహుబలి-2ని టార్గెట్ చేశాడు. ట్విట్టర్ వేదికగా బాలీవుడ్ -2 సినిమాను రివ్యూ చేస్తూ ఒక వీడియోను పోస్ట్ చేశాడు. ఇందులో విమర్శల బుల్లెట్ల వర్షం కురిపించాడు. అంతేకాదు హీరో ప్రభాస్పైకూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒంటెలా కనిపించే ప్రభాస్‌ను హిందీ నిర్మాతలు ఎవరైనా తీసుకుంటే, వారు కచ్చితంగా ఇడియట్స్ అంటూ చెలరేగిపోయి ట్వీట్ చేశాడు. బాహుబలి2 లో కథే లేదు. రాజమౌళి దర్శకత్వం అస్సలు బాగోలేదు. సంగీతం గురించి అసలు మాట్లాడక్కర్లేదు. ఎంటర్ టైన్మెంట్ లేదు. ఎమోషన్ లేదు. విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఘోరం. థియేటర్లో ఉన్న ప్రేక్షకులను చాలా డిస్టర్బ్ చేస్తుంది. రియాల్టీకి దగ్గరగా లేదు. వాస్తవానికి వేలమైళ్ల దూరంలోఉంది. సంగీతం హిందీ ప్రేక్షకులకు అస్పలు నచ్చదు. ఇది కమల్ ఆర్ ఖాన్ రివ్యూ. అంతేకాదు ఈ సినిమా చూడడం శుద్ధ దండుగ అని తేల్చేశాడు. డబ్బులు, సమయం వృధా చేసుకోవద్దంటూ ప్రేక్షకులకు ఓ సలహా ఇచ్చేశాడు. ఫస్ట్ పార్ట్‌తో పోల్చితే పదిశాతం కూడా బాగా లేదన్నాడు. ఇక ఎడిటర్‌పై అయితే తీవ్ర విమర్శలు గుప్పించాడు. మూడు గంటలు తీయాల్సిన మెటీరియలేదు.. వేస్ట్ అంటూ ప్రస్తావించాడు. అంతేకాదు ఈ సినిమా పిల్లలు కంప్యూటర్ వీడియో గేమ్‌లా చూడ్డానికి బావుంటుందంటూ పేర్కొన్నాడు. అయితే రానా దగ్గుపాటి, అనుష్క శెట్టి, ప్రభాస్ బాగా నటించారని చెప్పాడు. ఈ సినిమాకు వన్ రేటింగ్ ఇచ్చాడు. బిజినెస్ రేటింగ్ మాత్రం 8 ఎనిమిది ఇచ్చాడు. ఈ సినిమాకు ఇచ్చిన హైప్ కారణంగా 2నుంచి 3 వందల కోట్లు వసూలు చేస్తుందని వ్యాఖ్యానించాడు. కమల్ వీడియోపై ప్రభాస్ అభిమానులు మండిపడుతున్నారు. సౌత్ సినిమాలంటే బాలీవుడ్ వాళ్లకి చిన్నచూపని, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కమల్ ఆర్ ఖాన్ కు అలవాటేనంటూ కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. ట్రెండ్‌ని తనకు అనుకూలంగా మార్చుకుని తిరిగి వార్తల్లోకి రావడమే ఆయన లక్ష్యమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. If some Hindi producers are taking Prabhas who looks like 🐫in their films then definitely they are idiots. #Baahubali is working not Prabhas — KRK (@kamaalrkhan) April 29, 2017 -
బాహుబలి 2పై వర్మ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ.. బాహుబలి 2 సినిమా, దర్శకుడు రాజమౌళిపై ప్రశంసలు కురిపించాడు. కాలాన్ని క్రీస్తు పూర్వం (బీసీ), క్రీస్తు శకం (ఏడీ)గా విభజించినట్టుగా.. భారతీయ సినిమాను కూడా బాహుబలికి ముందు (బీబీ), బాహుబలి తర్వాత (ఏబీ)గా పరిగణిస్తారని వర్మ ట్వీట్ చేశాడు. వజ్రం లాంటి రాజమౌళిని బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ గుర్తించినందుకు, బాహుబలి సినిమాను ఇష్టపడే భారతీయులందరూ ఆయనకు పాదాభివందనం చేయాలని వర్మ పేర్కొన్నాడు. ఖాన్లు, రోషన్లు, చోప్రాల కంటే రాజమౌళి గొప్పవాడని స్పష్టమైందని, అతని ప్రతిభను గుర్తించిన కరణ్ జోహార్‌కు సెల్యూట్ చేస్తున్నానని ట్వీట్ చేశాడు. బాలీవుడ్‌లోని ప్రతి సూపర్ స్టార్, ప్రతి సూపర్ డైరెక్టర్.. బాహుబలి 2 క్రేజును చూసి వణుకుతున్నారని వర్మ వ్యాఖ్యానించాడు. శుక్రవారం దేశ వ్యాప్తంగా 6500 స్ర్కీన్లపై విడుదలైన బాహుబలి-2 తొలిరోజు రికార్డు కలెక్షన్లు సాధిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ‘బాహుబలి ది కంక్లూజన్’ పై రివ్యూలు పాజిటివ్‌గా ఉన్నాయి. ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, అనుష్క, సత్యరాజ్‌ల నటనకు, సాంకేతిక నిపుణుల పనితీరుకు ప్రశంసలు వస్తున్నాయి. Every super star nd every super director in entire Bollywood is shivering in various places looking at impact of @ssrajamouli 's Bahubali2 — Ram Gopal Varma (@RGVzoomin) 28 April 2017 Like world was divided into BC and AD (before death of Christ nd after ) Indian cinema is going to be BB and AB(before Bahubali and after) — Ram Gopal Varma (@RGVzoomin) 28 April 2017 All people of india who luvd BB2 should touch the feet of @karanjohar for him having the genius to discover a diamond like @ssrajamouli — Ram Gopal Varma (@RGVzoomin) 28 April 2017 Going by MegaDinosaur day1 it's clear @ssrajamouli is bigger than all Khans,Roshans and Chopras..I salute @karanjohar for discovering him — Ram Gopal Varma (@RGVzoomin) 28 April 2017 -
బాహు బాహుబలి
కొత్త సినిమా గురూ! బాహుబలి –2 నటీనటులు: అమరేంద్ర బాహుబలి/ మహేంద్ర బాహుబలి (శివుడు) : ప్రభాస్, దేవసేన: అనుష్క, శివగామి: రమ్యకృష్ణ, భల్లాలదేవ: రానా, బిజ్జలదేవ: నాజర్, కట్టప్ప: సత్యరాజ్, అవంతిక: తమన్నా తదితరులు కెమేరా: సెంథిల్‌కుమార్ మాటలు: అజయ్, విజయ్ సంగీతం: ఎమ్.ఎమ్. కీరవాణి నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని దర్శకత్వం: ఎస్.ఎస్. రాజమౌళి కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?ఇది కదా క్వశ్చన్! బాహుబలి పార్ట్1 టీజర్. అవును.. ఎందుకు చంపాడు అని తెలుసుకోడానికే కదా ఆడియన్స్ అంతా ‘బాహుబలి 2’కి వెళ్లింది. కాని రాజమౌళి మ్యాజిక్‌తో ఆ సంగతే మర్చిపోయారు! స్క్రీన్‌ప్లే బహు బాగుంది. నటనా కౌశలం బహుబహు బాగుంది. చివరికి సినిమా... ‘బహు బాహుబలి’ అనిపించుకుంది. కథ: తమ్ముడు ప్రభాస్ హ్యాపీ. ‘నువ్వే కింగ్’ అని పెద్దమ్మ రమ్యకృష్ణ మాహిష్మతిని అతడికి రాసిచ్చేసిందిగా మరి! పెద్దమ్మ గైడెన్స్ అండ్ పర్మిషన్తో... ఈ హ్యాపీనెస్లో ఎంచక్కా కంట్రీ టూర్ వేశాడు ప్రభాస్. ఈ టూర్ అతడి అన్న రానాకు నచ్చలేదు. ఎందుకు నచ్చుతుంది? బ్లడీ ఫెలో కాలకేయుణ్ణి రానా చంపితే... అమ్మ రమ్యకృష్ణ తమ్ముడు ప్రభాస్‌ను కింగ్‌ను చేయాలనుకుంది. దాంతో పిచ్చ కోపంగా ఉన్నాడు. కానీ, అమ్మను ఎదిరించలేడు. ఎదిరిస్తే... ఏం జరుగుతుందో తెలుసు! కట్టప్పకు చెప్పి చంపించేసినా చంపించేస్తుంది. కన్నకొడుకు కంటే... కంట్రీలో ప్రజల క్షేమమే రమ్యకృష్ణకు ఇంపార్టెంట్. ఛాన్స్ చూసి తమ్ముణ్ణి చావు దెబ్బ కొట్టాలనేది రానా ప్లాన్. సరిగ్గా ఆ టైమ్‌లోనే కంట్రీ టూర్‌కి వెళ్లిన తమ్ముడు ప్రభాస్ ఫారిన్ కంట్రీ కుంతల ప్రిన్సెస్ అనుష్కతో ప్రేమలో పడ్డాడని రానాకు టెలిగ్రామ్ వస్తుంది. తమ్ముడు లవ్ మేటర్‌ను అమ్మ దగ్గర లీక్ చేశాడనుకుంటున్నారా? లేదు. అనుష్కను నేను లవ్ చేస్తున్నానని చెబుతాడు. ఆల్రెడీ అక్కడ కుంతలలో అనుష్కను లవ్‌లో దింపడానికి ప్రభాస్ ఫుల్లుగా ట్రై చేస్తుంటాడు. కాబోయే కింగ్ అని కాకుండా... కామన్‌మేన్‌గా కుంతలలో అడుగు పెడతాడు. ఈ న్యూస్ రమ్యకృష్ణకు తెలీదు. దాంతో కన్న కొడుకు రానా చెప్పిన లవ్ కహానీ వినేసి, నమ్మేసి... ‘అనుష్క నీదే’ అని కుంతలకు పెళ్లి కార్డు, నగలు, గట్రా పంపిస్తుంది. మఫ్టీలో కుంతలలోనే ఉన్న ప్రభాస్... పెద్దమ్మకు తన లవ్ మేటర్ తెలిసిందేమోనని హ్యాపీ ఫీలవుతాడు. కట్ చేస్తే... ‘తూచ్! నా ఇష్టం లేకుండా నా పెళ్లి డిసైడ్ చేయడానికి నువ్వెవరు?’ అనే రేంజ్లో వాటన్నిటినీ రివర్స్‌లో వెనక్కి పంపిస్తుంది అనుష్క. దాంతో రమ్యకృష్ణ ఈగో హర్ట్ అవుతుంది. ఇమ్మీడియట్‌గా అనుష్కను అరెస్ట్ చేసి తీసుకురమ్మని ప్రభాస్‌కు మేటర్ పోస్ట్ చేస్తుంది. అది అందుకునే టైమ్‌కి ప్రభాస్ లవర్ అనుష్క పక్కనే ఉంటాడు. ఓ పక్క పెద్దమ్మ మాటను కాదనలేడు. మరోపక్క లవర్‌ను అరెస్ట్ చేయలేడు. ‘మై హూనా’ అని అనుష్కకు అభయహస్తం ఇచ్చి... మాహిష్మతికి తీసుకు వెళ్తాడు. అక్కడేమో... రానాను పెళ్లి చేసుకోమని అనుష్కకు రాజమాత రమ్యకృష్ణ హుకూం జారీ చేస్తుంది. ‘నో.. నో! నేను ప్రభాస్‌నే పెళ్లి చేసుకుంటా. అతణ్ణి లవ్ చేశా’ అని అనుష్క కుండబద్దలు కొట్టినట్టు చెప్పేస్తుంది. రాజ్యమా? లవ్వరా తేల్చుకోమని ప్రభాస్ ముందు రమ్యకృష్ణ పజిల్ పెడుతుంది. లవ్వరే ముఖ్యం అని, అనుష్కను పెళ్లాడతాడు. దాంతో రమ్యకృష్ణకు కోపం వస్తుంది. రిజల్ట్... ప్రభాస్‌కి సేనాధిపతిగా డిమోషన్, రానాకు కింగ్‌గా ప్రమోషన్. రానా దీన్ని ఫస్ట్ సక్సెస్‌గా ఫీలవుతాడు. అయినా ప్రభాస్ హ్యాపీనే! ఎందుకంటే... చిన్నప్పుడు పెద్దమ్మ చెప్పిన ధర్మానికి, న్యాయానికి కట్టుబడి ఉన్నానని. రానా మాత్రం హ్యాపీగా లేడు. తనకంటే తమ్ముడికే ప్రజల్లో ఎక్కువ పాపులారిటీ ఉండడం చూసి సహించలేడు. దాంతో ఓ ప్లాన్ ప్రకారం రాజమహల్ నుంచి పంపించేస్తాడు. సింహం ఎక్కడున్నా సింహమే అన్నట్టు... రాజమహల్ నుంచి వెలి వేయబడ్డ ప్రభాస్‌ను ప్రజలు ఫుల్ రెస్పెక్ట్‌తో చూసుకుంటారు. ఇప్పుడు రానాలో అసహనం, కోపం, బాధ మరింత పెరుగుతాయి. అమ్మకు ప్రభాస్‌పై లేనిపోని మాటలు చెబుతాడు. కొడుక్కి నాజర్ ఫుల్ సపోర్ట్. ఏదో ఒకటి చేసి ప్రభాస్‌ను పైలోకాలకు పంపించాలనేది రానా, నాజర్‌ల ప్లాన్. అదీ తమ చేతికి మట్టి అంటకుండా రమ్యకృష్ణ ఆర్డర్స్‌తో చంపించాలనుకుంటారు. వీళ్ల ప్లాన్ వర్కౌట్ అవుతుంది. మాహిష్మతికి కట్టుబానిస కట్టప్పకు ప్రభాస్‌ను చంపమని రమ్యకృష్ణ ఆర్డర్స్ ఇష్యూ చేస్తుంది. కట్టప్ప బాహుబలిని చంపేస్తాడు. అప్పుడు రానా హ్యాపీ. కానీ, రమ్యకృష్ణ అన్‌హ్యాపీ. కన్నకొడుకు ప్లాన్ వల్లే పెంపుడు కొడుకు ప్రభాస్‌ను పోగొట్టుకున్నానని ఫీలవుతుంది. చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా ప్రభాస్ కొడుకు, అప్పుడే పుట్టిన బుల్లి ప్రభాస్ (మహేంద్ర బాహుబలి)ని రాజుగా ప్రకటిస్తుంది. కానీ, ఏం లాభం? పరిస్థితులన్నీ రమ్యకృష్ణ చేయి దాటేస్తాయి. పుట్టిన బిడ్డను రానా చంపించాలనుకుంటాడు. రమ్యకృష్ణ బిడ్డతో ఊరు దాటుతుంది. పాతికేళ్ల క్రితం జరిగిన ఈ కథ విన్న బుల్లి ప్రభాస్ పెదనాన్న రానాపై ఎలా పగ తీర్చుకున్నాడు? అసలు, ప్రభాస్‌ను చంపమని రమ్యకృష్ణ ఆర్డర్ ఇచ్చేంతలా రానా, నాజర్‌లు ఆమెకు ఏం చెప్పారు? అనేది మిగతా సినిమా!! విశ్లేషణ: రూ.100 సినిమా టికెట్‌ను వందలు, వేలు పోసి కొనుక్కుంటున్న ప్రేక్షకులకు, ఇంచు మించు ఏడాదిన్నరగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న జనాలకు ఈ కథంతా ఎందుకు? ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?’ – ఈ క్వశ్చన్‌కు ఆన్సర్ దొరికితే చాలు! ఆన్సర్ చాలా సింపుల్... రమ్యకృష్ణ చెప్పడంతో కట్టప్ప అలియాస్ సత్యరాజ్.. బాహుబలిని చంపేశాడంతే. కానీ, రాజమౌళి స్క్రీన్‌పై అంత సింపుల్‌గా చూపించలేదు. బాహుబలిని కట్టప్ప చంపే సీన్ వచ్చేసరికి... భారీ ఎమోషన్ బిల్డప్ చేశాడు. కట్టప్ప బాహుబలిని చంపేయడం గ్యారెంటీ. కానీ, ఎలా చంపుతాడు? అనే ఆసక్తిని ప్రేక్షకుల్లో రేకెత్తించాడు. అసలు స్క్రీన్ మీద సినిమా స్టారై్టన కాసేపటికి ఆ క్వశ్చన్ ఎవరికీ గుర్తుండదు. అందంగా ఏనుగు విల్లును ఎక్కుపెడితే, దానిపై ఎక్కిన బాహుబలి మాంచి స్టైల్‌గా బాణం సంధిస్తాడు. ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్ ఇది. వారెవ్వా... అనే రేంజ్లో ఉన్న ఈ సీన్ చూసిన తర్వాత కట్టప్ప క్వశ్చన్ ఏం గుర్తుంటుంది? ఆ తర్వాత వచ్చే ‘సాహోరే బాహుబలి..’ సాంగ్, అనుష్కతో కామెడీ టచ్ ఇచ్చిన లవ్ ట్రాక్, వార్ ఎపిసోడ్, ‘హంసనావ..’ సాంగ్‌లో విజువల్స్... ప్రతిదీ ఫెంటాస్టిక్. ఈలోపు సినిమా ప్రీ–ఇంటర్వెల్‌కు చేరుకుంటుంది. అప్పుడు ‘నువ్వు తప్పు చేశావ్ అమ్మా. ఆడదాని మనసు తెలుసుకోకుండా మరొకరికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నావ్’ అని రమ్యకృష్ణకు ప్రభాస్ ఎదురుతిరిగే సీన్ చూస్తున్నప్పుడు... ఇదేంటి? సినిమా ఇలా టర్న్ అవుతుందని ప్రతి ప్రేక్షకుడూ ఫీలయ్యేలా రాజమౌళి తెరపై పాత్రల మధ్య సంఘర్షణను చూపించాడు. రానాను రాజును చేసి, ప్రభాస్‌ను సేనాధిపతి చేసిన సీన్ ఫ్లాట్‌గా వెళ్తుందేంటి? అనుకునేలోపు... ఇంటర్వెల్లో మాంచి కిక్ ఇచ్చాడు రాజమౌళి. సేనాధిపతిగా ప్రభాస్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ‘బాహుబలి... జయహో బాహుబలి’ అని మాహిష్మతి ప్రజలంతా హర్షధ్వానాలు చేస్తుంటే రోమాలు నిక్కబొడుచుకోవడం గ్యారెంటీ. అక్కడ ఇంటర్వెల్. సెకండాఫ్ స్టారై్టన తర్వాత ఇంకో సీన్ ఉంటుంది అసలు... హీరోయిజమ్‌కు పీక్స్. అప్పటికే ప్రభాస్‌ను సేనాధిపతి పోస్ట్ నుంచి రానా అండ్ కో పక్కకు తప్పిస్తారు. చేయని తప్పుకు అనుష్కను దోషిగా చిత్రీకరించి రాజదర్బార్‌లో నిలబెడతారు. వాదోపవాదనలు జరుగుతున్న టైమ్‌లో ప్రభాస్ రాజదర్బార్‌లోకి ఎంట్రీ ఇస్తాడు. నడక, నడత, రాజసం, కోపం... అన్నీ చూపిస్తాడు. అసలు ఏం జరిగిందో తెలుసుకున్న తర్వాత ‘ఆడదాని మీద చెయ్యేస్తే తెగాల్సింది వేళ్లు కాదు, తల’ అంటూ నరికే సీన్ సినిమాకే హైలైట్. ఆడియన్స్ క్లాప్స్ కొట్టే సీన్ అది. తర్వాత సీన్ బై సీన్... బాహుబలిని చంపడానికి రానా, నాజర్‌లు వేసే ఎత్తులు కట్టప్ప చేత ఎలా చంపిస్తారు? కట్టప్ప ఎలా చంపుతాడు? అనే ఆసక్తి రేకెత్తిస్తాయి తప్ప, ఎందుకు చంపుతున్నాడు? అనే ప్రశ్నను ప్రేక్షకుల మనస్సుల్లో ఏ మూలనా రానీయదు. ఈ సీన్ పూర్తిగా చెప్పేస్తే థియేటర్లలో సినిమా చూడబోయే ప్రేక్షకులు థ్రిల్ మిస్ అవుతారు. ఈ సీన్ తర్వాత తండ్రిని చంపినోళ్లపై శివుడు పగ తీర్చుకుంటే చూడాలని ప్రేక్షకులు ఆశపడతారు. బాహుబలి మరణంతో ఫ్లాష్‌బ్యాక్ ముగిస్తే, భల్లాలదేవను శివుడు చంపే యుద్ధంతో సినిమా ముగుస్తుంది. యుద్ధం ప్రారంభానికి ముందు ప్రభాస్, రానాల్లో ఒకరినొకరు చంపేయాలనే కసిని రాజమౌళి మలిచిన తీరు సూపర్బ్. క్లైమాక్స్ హాలీవుడ్ సినిమాలను తలపిస్తుంది. నటీనటులందరూ అద్భుతంగా నటించారు. రాజమౌళి ఊహలను విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్ కమల్ కణ్ణన్ అద్భుతంగా ఆవిష్కరించారు. కీరవాణి పాటల్లో ‘సాహోరే బాహుబలి..’, ‘హంసనావ..’, ‘హైసా రుద్రస్సా..’ బాగున్నాయి. రీ–రికార్డింగ్ అద్భుతం. రాజమౌళి ఊహపై నమ్మకంతో వందల కోట్లను ఖర్చుపెట్టిన నిర్మాతలను తప్పకుండా అభినందించాలి. టేకింగ్, విజువల్ ఎఫెక్ట్స్ హాలీవుడ్ స్థాయిలో ఉన్నప్పటికీ... మన ప్రేక్షకులకు కావాల్సిన భావోద్వేగాలను రాజమౌళి మిస్ కాలేదు. ఇప్పటివరకూ భారతీయ వెండితెరపై ఎవరూ ఆవిష్కరించని ఓ అద్భుత దృశ్యకావ్యం ‘బాహుబలి’!! రీక్యాప్ : ‘బాహుబలి : ది బిగినింగ్’ కథ అవిటివాడు కావడంతో నాజర్‌కు మాహిష్మతికి మహారాజు అయ్యే ఛాన్స్ రాదు. అందువల్ల, తమ్ముడు పగ్గాలు చేపడతాడు. దురదృష్టవశాత్తూ నాజర్ తమ్ముడు ఓ యుద్ధంలో మరణిస్తాడు. అప్పటికి అతని భార్య గర్భిణి. ఆమె ఓ అబ్బాయికి జన్మనిస్తుంది. అతడే మన హీరో ప్రభాస్. అప్పటికే నాజర్, రమ్యకృష్ణ దంపతులకు ఓ అబ్బాయి ఉంటాడు. మహారాజు మరణంతో ఎదురుతిరిగిన సామంతులకు రమ్యకృష్ణ మృత్యుఒడి చూపిస్తుంది. ఆ టైమ్‌లో నాకు దక్కని రాజ్యాధికారం కనీసం నా కొడుక్కి అయినా దక్కుతుందని నాజర్ ఆశపడతాడు. రానాను కాబోయే కింగ్‌గా ప్రకటించమంటాడు. కానీ, రమ్యకృష్ణ ఒప్పుకోదు. పెద్దయిన తర్వాత రానా, ప్రభాస్‌లలో ఎవరికి యోగ్యత ఉంటే వాళ్లకి కింగ్డమ్ రాసిస్తానని చెబుతుంది. వీళ్లిద్దరూ పెద్దయ్యే టైమ్‌కు కాలకేయులు మాహిష్మతిపైకి యుద్ధానికి దిగుతారు. కాలకేయుల కింగ్‌ను ఎవరు చంపితే అతణ్ణి మాహిష్మతికి రాజును చేస్తానని రమ్యకృష్ణ పిల్లలిద్దరికీ టెస్ట్ పెడుతుంది. ఈ టెస్టులో రానా పాసవుతాడు. కానీ, కాలకేయుణ్ణి చంపే క్రమంలో రానా రూల్స్ పాటించలేదని ప్రభాస్‌ను రాజుగా ప్రకటిస్తుంది – ఇదీ మెయిన్ కథ. అందులో ఇంకో కథ గూడెంలో పెరిగే శివుడిది. అతను పెద్ద ప్రభాస్ కొడుకు. మరి గూడెంలో ఎందుకు పెరిగాడు? అతడి తల్లి అనుష్కను మాహిష్మతిలో రానా ఎందుకు సంకెళ్లతో కట్టిపడేశాడు? ఆమెను విముక్తురాలను చేయాలని ప్రయత్నిస్తున్న తమన్నా (అవంతిక) అండ్ గ్యాంగ్ ఎవరు? బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? ఎన్నో ప్రశ్నలు. వాటన్నిటికీ పార్ట్ 2లో సమాధానాలు దొరికాయి. సాహో రాజమౌళి : క్రిష్ సినిమా పూర్తయ్యాక చప్పట్లు కొట్టాను. తెర మీద రాజమౌళి స్టాంప్ కనిపించగానే ఈల వేశాను. ‘న్యూ కైండ్ ఆఫ్ మూవీ’. విజయేంద్రప్రసాద్‌గారు అద్భుతమైన పాత్రలు రాశారు. రాజమౌళిగారు అంతే అద్భుతంగా తీశారు. ప్రభాస్, రానా, అనుష్క.. ఇలా అందరి నటన వంక పెట్టడానికి వీలు లేని విధంగా ఉంది. ∙ఎమోషనల్‌గా ఈ సినిమా ఎపిక్ లెవల్లో ఉంది. మొదటి నుంచి చివరి వరకూ ఎంతో గ్రిప్పింగ్‌గా తీశారు. అద్భుతమైన మాహిష్మతి ప్రపంచంలోకి తీసుకెళ్లినందుకు సాహో రాజమౌళిగారు. సినిమా మొదట్లో తల్లి శివగామి (రమ్యకృష్ణ) అడుగు తప్పకూడదని అమరేంద్ర బాహుబలి రథాన్ని ముందుకు తీసుకు వస్తాడు. అది ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్. అలాగే, సినిమా చివర్లో తల్లి దేవసేన (అనుష్క) అడుగు తప్పకూడదని మహేంద్ర బాహుబలి తపన పడతాడు. ఆరంభంలో ఎంత ఎమోషనల్‌గా ఉందో చివర్లోనూ అంతే ఎమోషనల్‌గా ఈ సీన్స్ ఉన్నాయి. నాకు చాలా చాలా నచ్చాయి. ∙నిర్మాతలు శోభు, ప్రసాద్గార్లను అభినందించాల్సిందే. ఇండియన్ సినిమాని మరో లెవల్‌కి తీసుకెళ్లే సినిమా నిర్మించారు. వీళ్లకెవరూ సాటి రారు. నాకా అర్హత ఉందా అనిపించింది : సుకుమార్ నేను కూడా సినిమా గురించి అందరిలాగానే ఎదురు చూశాను. బాహుబలి ఎలా ఉండబోతుందో అనే ఆలోచనలతో థియేటర్లోకి ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయ్యేటప్పుడు డైరెక్టర్ లాగా వెళ్లాను. సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ లాగా వచ్చాను. బయటకు వచ్చినప్పుడు ప్రేక్షకులు ఆటోగ్రాఫ్‌లు, ఫోటోగ్రాఫ్‌లు అడుగుతుంటే ఇవ్వాలా? వద్దా అని ఆలోచించాను. ఎందుకంటే... అవి ఇచ్చే అర్హత ఉందా లేదా అని. అంతే కానీ పొగరుతో కాదు. ఇంతకంటే ఏమని చెప్పను సినిమా గురించి. బాహుబలి స్పెక్టాక్యులర్ మూవీ. బ్లాక్ టికెట్ @1500 ‘బాహుబలి–2’ని చూడాలనే ప్రేక్షకుల ఆసక్తిని క్యాష్ చేసుకునే దిశలో ‘బ్లాక్ టికెట్స్’ అమ్మకం జోరుగా సాగింది. డిమాండ్‌ను, ప్రాంతాన్ని బట్టి ఒక్కో టికెట్‌ను సుమారు రూ. 1000 నుండి రూ.1500 రూపాయలకు విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు పలువురు ప్రేక్షకులు ఆరోపించారు. టికెట్లకు డిమాండ్ అధికం కావడంతో థియేటర్ల మేనేజర్లు ఒత్తిడిని తట్టుకోలేక ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం విశేషం. పలు థియేటర్లలో మార్నింగ్ షోలకు విద్యుత్ అంతరాయం కలగడంతో.. వెంటనే జనరేటర్ స్టార్ట్ చేసి సినిమాను నడిపించడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. బాహుబలి ఆభరణాల ప్రదర్శన ‘బాహుబలి’ చిత్రానికి అధికారిక జ్యూయలరి డిజైనర్, సరఫరాదారుగా వ్యవహరించిన హైదరాబాద్‌లోని అమ్రపాలి జ్యూయలరి షో రూమ్‌లో చిత్రానికి వాడిన పలు ఆభరణాలను శుక్రవారం ప్రదర్శించారు. రాజస్థాన్‌కు చెందిన కళాకారులు దాదాపు ఏడాదిన్నర కాలం డిజైన్లు రూపొందించి తయారు చేసినట్లు నిర్వాహుకులు తెలిపారు. వివిధ సైజులు, డిజైన్లతో దాదాపు 1500 రకాలు రూపొందించగా అందులో 150 కిలోల బరువున్న 1000 డిజైన్లను సినిమాలో వాడినట్లు పేర్కొన్నారు. రూ. 600 నుంచి రూ. 58 వేల వరకు విలువ చేసే ఆభరణాలు తయారు చేసినట్లు తెలిపారు. పిల్లలకు బర్త్‌డే గిఫ్ట్... ‘బాహుబలి’ ‘బాహుబలి 2’ విడుదల కోసం సామాన్య సినీ ప్రేక్షకులే కాదు.. సినిమాతో పాటు ఇతర రంగాల ప్రముఖులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. శుక్రవారం ఆ తరుణం రానే వచ్చింది. ‘బాహుబలి 2’ విడుదలైంది. థియేటర్లలో ప్రేక్షకుల ఆనందానికి అవధుల్లేవు. హంగామా చేశారు. పలువురు సినిమా సెలబ్రిటీలు కూడా ఆ చిత్రాన్ని చూసి తమ ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. కాగా, శుక్రవారం తన పుట్టినరోజును పురస్కరించుకుని హీరోయిన్ సమంత పలువురు పిల్లలతో కలిసి ‘బాహుబలి 2’ వీక్షించి, తన ప్రేమను చాటుకున్నారు. తమ అభిమాన కథానాయికతో కలిసి సినిమా చూసిన పిల్లలు ఆనంద డోలికల్లో మునిగి తేలారు. తమిళనాడులో మార్నింగ్ షోలు లేవు ‘బాహుబలి–2’ని ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని తమిళనాడులో ముందే టికెట్లు బుక్ చేసుకున్న ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది. అన్ని థియేటర్ల ముందు ‘మార్నింగ్ షో’ రద్దు అనే బోర్డ్ చూసి, కొందరు ఆందోళనకు దిగారు. కొన్ని థియేటర్లలో లాఠీ చార్జ్ కూడా జరిగింది. ‘ఆన్ లైన్’లో టిక్కెట్స్ బుక్ చేసుకున్నవాళ్లు షో రద్దయిన సమాచారాన్ని మెసేజ్ ద్వారా తెలియజేస్తే బాగుండేదని పేర్కొన్నారు. నిర్మాతలు, పంపిణీదారుల మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో ఏర్పడిన వివాదం షోల రద్దుకు కారణం అయింది. చివరికి తమిళ పరిశ్రమ పెద్దలు జోక్యం చేసుకుని, సమస్యను పరిష్కరించడంతో మధ్నాహ్నం నుంచి షోలు మొదలయ్యాయి. సెకండాఫ్ ముందు! బెంగళూరులోని పీవీఆర్ ఎరేనా మాల్లో ‘బాహుబలి–2’ సినిమా చూసినవాళ్లు డబుల్ ధమాకా దక్కించుకున్నారు. సినిమా సెకండాఫ్‌ని రెండు సార్లు చూసే ఛాన్స్ కొట్టేశారు. అదేంటీ అనుకుంటున్నారా? థియేటర్ నిర్వాహకులు పొరపాటున ముందే సెకండాఫ్‌ని ప్రదర్శించారు. సినిమా క్లైమాక్స్‌కి చేరుకుంటున్న సమయంలో తాము రెండో సగం చూస్తున్నామని ఆడియన్స్ గ్రహించారు. అంతే.. మొదట్నుంచీ సినిమా ప్రదర్శించమని డిమాండ్ చేశారు. చేసిన పొరపాటు దిద్దుకోవాలి కదా. థియేటర్ నిర్వాహకులు మళ్లీ సినిమాని ప్రదర్శించారు. ఆ రకంగా సినిమా ద్వితీయార్ధాన్ని ప్రేక్షకులు రెండుసార్లు చూడగలిగారు. కూకట్‌పల్లిలో ‘బాహుబలి’ బృందం సందడి హైదరాబాద్ కూకట్పల్లి వాసులకు ఓ స్వీట్ షాక్. ‘బాహుబలి’ సినిమా చూడ్డానికి శ్రీ భ్రమరాంబ థియేటర్‌కు వెళ్లినవాళ్లకు ‘బాహుబలి’ చిత్రబృందాన్ని చూసే ఛాన్స్ దక్కింది. దర్శకుడు రాజమౌళి, ఆయన భార్య రమ, హీరోయిన్ అనుష్క, కీరవాణి దంపతులు తదితరులు థియేటర్లో ప్రేక్షకులతో కలిసి చిత్రాన్ని వీక్షించారు. ప్రేక్షకులు చిత్రబృందాన్ని చూసి ఆనందానికి గురయ్యారు. కొందరు రాజమౌళి వద్దకు వెళ్లి కరచాలనం చేశారు. మరికొందరు సెల్ఫీల కోసం పోటీలు పడడంతో థియేటర్వద్ద సందడి నెలకొంది. దేశవ్యాప్తంగా 70 కోట్లు! భారీ అంచనాల నడుమ విడుదలైన ‘భాహుబలి–2’ వసూళ్ల పరంగా రికార్డులు సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కలుపుకుని శుక్రవారం 70 కోట్లు వసూళ్లు వస్తాయని ట్రేడ్ పండితులు అంచనా వేశారు. వారాంతానికి 230 నుంచి 240 కోట్ల రూపాయలు వసూలు చేయడం ఖాయమని ఎగ్జిబిటర్ అక్షయ్ రతి అంటున్నారు. హిందీ అనువాదం మొదటి రోజున 40 కోట్లు వసూలు సాధిస్తుందని, వారాంతానికి 100 కోట్లు దక్కించుకుంటుందని ట్రేడ్ విశ్లేషకుడు కోమల్ నహతా అంటున్నారు. మొదటి రోజు కలక్షన్ల పరంగా ‘బాహుబలి–2’ రికార్డ్ బ్రేక్ చేస్తుందని కూడా ఆయన అన్నారు. ఇండియన్ సినిమాల్లో ‘బాహుబలి’ బిగ్గెస్ట్ హిట్ కావడం ఖాయం అని కూడా పేర్కొన్నారు. అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రాలు పీకే, దంగల్, సుల్తాన్ల రికార్డులను ‘బాహుబలి’ బద్దలు కొట్టడం ఖాయం అని కోమల్ నహతా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. దేశవ్యాప్తంగా మొదటి రోజు 70 కోట్లు వసూళ్లు సాధిస్తే.. ఓవర్సీస్తో కలుపుకుని 120 కోట్లు సాధించిందన్నది బాక్సాఫీస్ వర్గాల సమాచారం. ప్రభాస్ పెళ్లి ప్రస్తుతానికి సస్పెన్స్ నటుడు కృష్ణంరాజు ఆయన సతీమణి శ్యామల ‘బాహుబలి–2’ని వీక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. కృష్ణంరాజు మాట్లాడుతూ – ‘‘మా అబ్బాయి ప్రభాస్ సాధించిన దానికంటే రాజమౌళి ఘనత గొప్పది. కెప్టన్ ఈజ్ ఆల్వేస్ కెప్టెన్. కథను ఉపయోగించుకోవడం కానీ , టెక్నిషియన్లను ఉపయోగించుకోవడం గానీ, సినిమాను గొప్ప లెవల్‌కు తీసుకెళ్ళడం డైరెక్టర్ గొప్పదనం. మన తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతర్జాతీయ స్థాయికి వెళ్ళడానికి మరికొన్నేళ్ళు పడుతుందుకున్నా కానీ ‘బాహుబలి’తో ఇప్పుడే అది సాధ్యమైంది. మేం వంద సినిమాలు చేస్తే ఎన్ని గుర్తు ఉంటాయి? నేను 200ల సినిమాలు చేశా. వాటిలో భక్తకన్నప్ప, బొబ్బిలి బ్రహ్మన్న, అమరదీపం.. అలా కొన్ని గుర్తు ఉన్నాయి. సరిగ్గా 20 కూడా గుర్తుకు రావు. ప్రభాస్ ఇంకో 40 సినిమాలు చేసినా ఇలాంటి సినిమా వస్తుందని చెప్పలేం. ఒకటో, రెండో ఉంటాయేమో. అందుచేత ఎన్ని సినిమాలు చేశాం అని కాదు. ఎన్ని గొప్ప సినిమాలు చేశాం అనేదే ముఖ్యం. నాకు రాఘవేంద్రరావుగారు ఎలానో ప్రభాస్‌కు రాజమౌళి అలా. రాజమౌళి మౌల్డ్ చేసిన పద్ధతి కానీ, ఫెర్మార్మెన్స్ రాబట్టుకున్న తీరుగానీ గొప్పవి. ప్రభాస్ ఇప్పుడు ఇంటర్నేషనల్ ఆర్టిస్టు అయ్యాడు’’ అన్నారు. ఇంతకీ ప్రభాస్ పెళ్లెప్పుడు? అనడిగితే – ‘‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్నది ఇన్నాళ్లూ ఎలా సస్పెన్స్‌లా ఉండేదో.. ఇప్పుడు ప్రభాస్ పెళ్లి కూడా అంతే. ప్రస్తుతం మేం ‘బాహుబలి–2’ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాం’’ అని శ్యామల సరదాగా అన్నారు. ‘దంగల్’ను మించిన బాహుబలి సెకనుకు 12 టికెట్ల చొప్పున 3.3 (30 లక్షల 30 వేలు) మిలియన్లకు పైగా టిక్కెట్లు ‘బాహుబలి–2’ ప్రీ బుకింగ్ కోసం అమ్ముడుపోయాయని బుక్ మై షో నిర్వాహకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పార్ట్ 1తో పోలిస్తే ఇది 350 శాతం అధికమని వెల్లడించారు. బాహుబలి టిక్కెట్ల బుకింగ్ కొరకు దేశవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వచ్చిందని, ముఖ్యంగా సౌత్ నుంచి సైట్‌కు ఎక్కువ హిట్స్ వచ్చాయని తెలిపారు. సినిమా విడుదలకు రెండు రోజులు సమయం ఉన్నప్పటికీ ఈ ప్రీ బుకింగ్స్ బాగా జరిగాయి. ఈ రికార్డు ఇంతకు ముందు ఆమిర్ ఖాన్ ‘దంగల్’ దక్కించుకుందని, తాజాగా ‘బాహుబలి ది కన్‌క్లూజన్’ ఆ రికార్డుని అధిగమించిందని వెబ్సైట్ నిర్వాహకులు పేర్కొన్నారు. ⇒ మన తరంలో ఉన్న ఉత్తమ దర్శకుల్లో రాజమౌళిగారు ఒకరు. ఆయన తీసిన అద్భుత చిత్రం ‘బాహుబలి’. ఇటువంటి జినీయస్ డైరెక్టర్‌కి నా వంతు సహకారం అందించడం ఆనందంగా ఉంది. – దర్శక–నిర్మాత కరణ్ జోహార్ ⇒ ‘బాహుబలి–2’ భారతీయ సినిమా ఫైనెస్ట్ కాన్వాస్. ఒక్క తెలుగు సినిమానే కాదు.. రాజమౌళి మొత్తం భారతీయ సినిమాని వేరే లెవల్‌కి తీసుకెళ్లారు. రాజమౌళి విజన్‌ని తమ అద్భుత నటనతో సపోర్ట్ చేసినందుకు ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణలకు అభినందనలు. రాజమౌళి విజన్‌కి జీవం పోయడానికి ఈ చిత్రాన్ని నిర్మించిన శోభు, ప్రసాద్‌లకు, నటించిన ఇతర నటీనటులు, పని చేసిన సాంకేతిక నిపుణులకు అభినందనలు. – హీరో జూనియర్ ఎన్టీఆర్ ⇒ నువ్వు మా పక్కన ఉన్నంత వరకు తెలుగు సినిమా గురించి మాట్లాడే మగాడు ఇంకా పుట్టలేదు రాజమౌళి మామ. తెలుగు వారందరూ గర్వపడేలా సినిమా తీశారు. సినిమా పండగలా ఉంది. – హీరో నాని ⇒ శుక్రవారం ఉదయం ‘బాహుబలి 2’ చిత్రం చూశా. రాజమౌళిగారికి దండాలు. ఈ చిత్రంలోని ప్రతి ఫ్రేమ్‌ని, ప్రతి ఒక్కర్నీ ఆయన ప్రేమించారు. – మంచు మనోజ్ ⇒బాహుబలిలో సమ్‌థింగ్ స్పెషల్ ఏదో ఉంది. కొన్ని సినిమాలను చూసినప్పుడు ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది అనిపిస్తుంటుంది. అలాంటి వాటికి ఉదాహరణే ‘బాహుబలి’. – హీరో రామ్ ⇒బాహుబలి ఎంత బాగుందో మాటల్లో చెప్పలేను. మొత్తం టీమ్‌కి సెల్యూట్. ప్రభాస్ నటన నచ్చింది. ఈ సినిమా ఓ మాస్టర్ పీస్ లాంటిది. – హీరో ధనుష్ ⇒‘బాహుబలి–2’ గురించి మంచి రిపోర్ట్స్ అందుతున్నాయి. ప్రస్తుతం హాలిడే ట్రిప్‌లో ఉన్నాను. ఈ ట్రిప్‌కి ముగింపు పలికి ‘బాహుబలి’ చూడాలనుకుంటేన్నాను. ‘డార్లింగ్’ ప్రభాస్, రాజమౌళిగారు తదితర బృందానికి శుభాకాంక్షలు. – దర్శకుడు కొరటాల శివ ⇒ భారతదేశం గర్వించదగ్గ చిత్రాన్ని మాకు బహుమతిగా ఇచ్చినందుకు రాజమౌళిసార్‌కి, ఆయన సైన్యానికి అభినందనలు. ప్రభాస్, రానాతో పాటు నటీనటులు, టెక్నీషియన్స్ ఐదేళ్లు అంకితభావంతో చేసిన కృషికి నిదర్శనమే ‘బాహుబలి’. ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసి సినిమాకి గౌరవం ఇవ్వండి. ఇప్పుడిక భారతీయ సినిమా ‘బాహుబలి’కి ముందు ‘బాహుబలి’కి తర్వాత అయింది. ద వన్ అండ్ ఓన్లీ డార్లింగ్ ప్రభాస్ ఎప్పటిలాగే తన హీరోయిజాన్ని ప్రదర్శించటానికి ఇంకా ఇష్టపడ్డాడు. కీరవాణిగారి నేపథ్య సంగీతం ప్రతి క్షణం ఎంతో తీవ్రత కలిగించింది. – హీరో అఖిల్ -
తొలిరోజు బాహుబలి రికార్డు కలెక్షన్లు!
ముంబై: దేశ వ్యాప్తంగా 6500 స్ర్కీన్లపై విడుదలైన బాహుబలి-2 తొలిరోజు రికార్డు కలెక్షన్లు సాధిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. శుక్రవారం విడుదలైన ఈ సినిమా.. ఈ ఏడాదిలో తొలిరోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టిస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తొలి మూడు రోజుల్లో ఈ సినిమా 200 కోట్ల రూపాయల కోట్ల క్లబ్లో చేరినా ఆశ్చర్యం లేదని డిస్ట్రిబ్యూటర్ అక్షయ్ రతి చెప్పారు. తొలిరోజు 70 కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రావచ్చని అంచనా వేశారు. బాలీవుడ్లో ఘనవిజయం సాధించిన ఆమీర్ ఖాన్ దంగల్ సినిమా పేరిట ఉన్న అడ్వాన్స్ బుకింగ్ రికార్డును బాహుబలి-2 బ్రేక్ చేసిందని బుక్‌మైషో నిర్వాహకులు చెప్పారు. ఇప్పటికే 10 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్టు తెలిపారు. 'దేశ వ్యాప్తంగా వస్తున్న సమాచారం ప్రకారం బాహుబలి-2 థియేటర్ల బయట హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. భారీగా ప్రేక్షకుల రాకతో థియేటర్ల బయట సందడి నెలకొంది' అంటూ బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకలో ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు పోటెత్తగా, ఉత్తరాదిన కూడా సినిమా హాళ్లు 90 శాతం నిండాయని అంచనా. టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ‘బాహుబలి ది కంక్లూజన్’ పై రివ్యూలు పాజిటివ్‌గా ఉన్నాయి. ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, అనుష్క, సత్యరాజ్‌ల నటనకు, సాంకేతిక నిపుణుల పనితీరుకు ప్రశంసలు వస్తున్నాయి. -
అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే 3 మిలియన్లు
బాహుబలి 2 రిలీజ్ కు మరికొన్ని గంటల సమయం మాత్రం ఉంది. ఇప్పటికే రికార్డ్ ల వేట మొదలు పెట్టిన బాహుబలి.. యుఎస్ లో సంచలనాలు నమోదు చేస్తోంది. ఓవర్ సీస్ కలెక్షన్లలో మినియన్ మార్క్ చేరుకునేందుకు చాలా మంది స్టార్ హీరోలు కష్టపడుతుంటే బాహుబలి అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 3 మిలియన్లకు పైగా కలెక్ట్ చేసేసింది. బాహుబలి ప్రీ సేల్స్ లోనే మూడు మిలియన్లకు పైగా వసూళ్లు సాధించినట్టుగా యుఎస్ డిస్ట్రిబ్యూటర్స్ గ్రేట్ ఇండియా ఫిలిం ప్రకటించారు. ఇప్పటికే భారీగా బుకింగ్స్ జరుగుతుండటంతో ప్రతీ గంటకు లక్ష డాలర్ల చొప్పున కలెక్ట్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. బాహుబలి ఈ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుండగా, ప్రీమియర్స్ షోను గురువారం రాత్రి నుంచే ప్రారంభిస్తున్నారు. కేవలం ఓవర్ సీస్ లోనే కాకుండా ఇండియాలోనూ ప్రీమియర్స్ షోస్ పేరుతో గురువారం రాత్రి నుంచే బాహుబలి ప్రదర్శనలు ప్రారంభిస్తున్నారు. -
ఓవర్ సీస్లో బాహుబలికి షాక్..!
ప్రపంచ వ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ చేస్తున్న బాహుబలి 2 నిర్మాతలకు ఓవర్ సీస్ ఆడియన్స్ షాక్ ఇచ్చారు. తొలి భాగం ఘనవిజయం సాధించటం, రెండో భాగంపై అంతకు మించి భారీ హైప్ క్రియేట్ అవ్వటంతో భారీ రేట్లకు డిస్ట్రిబ్యూషన్ హక్కులను అమ్మారు. ఒక్క అమెరికాలోనే బాహుబలి 2 వంద కోట్లు వసూళ్లు సాధిస్తే తప్ప అక్కడి డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్ లోకి వెల్లే అవకాశం లేదట. దీంతో అదే స్థాయిలో టికెట్ రేట్లను పెంచి క్యాష్ చేసుకునే పనిలో ఉన్నారు ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూటర్స్. మామూలుగా ఇండియన్ సినిమాలు ఓవర్ సీస్ లో రిలీజ్ అయితే టికెట్ ధర పది డాలర్ల లోపే ఉంటుంది. కానీ బాహుబలి 2 సినిమా టికెట్ ను మాత్రం 30 డాలర్లకు పైగా విక్రయించేందుకు నిర్ణయించారు. ఈ భారీ రేట్లపై స్పందించిన కెనడా వాసులు బాహుబలి యూనిట్ కు షాక్ ఇచ్చారు. టికెట్ రేట్లు తగ్గించకపోతే బాహుబలి సినిమాను బైకాట్ చేయాలంటూ ఒట్టావా తెలుగు అసోషియన్ నిర్ణయం తీసుకుందన్న ప్రచారం జరుగుతోంది. ఓవర్ సీస్ ఆడియన్స్ ఇచ్చిన షాక్ తో దిగి వచ్చిన డిస్ట్రిబ్యూటర్ లు టికెట్ ధరను 12.25 డాలర్లకు తగ్గించారు. మరికొన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి రిపీట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. -
బాహుబలి 2 ఇంటర్వెల్ సీన్ వీడియో..!
-
బాహుబలి 2 ఇంటర్వెల్ సీన్ వీడియో..!
బాహుబలి 2 రిలీజ్ సమయం దగ్గర పడుతుండటంతో సోషల్ మీడియాలో సినిమాకు సంబంధించిన స్టిల్స్, సీన్స్ హడావిడి మొదలైంది. లీకువీరులు సినిమా రిలీజ్‌కు ముందే బాహుబలి 2కు సంబంధించిన సీన్స్‌ను సోషల్ మీడియాలో పెట్టేశారు. అయితే వీటిలో బాహుబలి ఇంటర్వెల్ సీన్ అంటూ సర్క్యూలేట్ అవుతున్న వీడియో ఒకటి ఆసక్తికరంగా మారింది. శివగామి గెటప్ లో రమ్యకృష్ణ కనిపిస్తున్న ఈ వీడియో ఏడాది కింద టీవీలలో వచ్చిన ఓ యాడ్‌కు సంబంధించిందని తెలిసి ఫ్యాన్స్ నవ్వుకుంటున్నారు. బాహుబలి తొలిభాగం ఫీవర్ నడుస్తున్న సమయంలో ఆ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు పాత ఈ వీడియోనే బాహుబలి 2 ఇంటర్వల్ సీన్ లీక్ అంటూ సోషల్ మీడియాలో తిరిగి పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. -
‘బాహుబలి 2’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది!
ముంబై: ప్రేక్షకులు అమితాసక్తితో ఎదురుచూస్తున్న ‘బాహుబలి 2’ ఎలా ఉండబోతోంది. ఈ ప్రశ్నకు మరికొద్ది గంటల్లో సమాధానం లభించబోతోంది. ముంబైలో ఈరోజు రాత్రి బాలీవుడ్ ప్రముఖుల కోసం ప్రీమియర్ వేయనున్నారు. అయితే ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టాక్ బయటకు వచ్చింది. ‘బాహుబలి 2’ అద్భుతంగా ఉందని ఈ సినిమాను వీక్షించిన కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యులు వెల్లడించారు. బాహుబలి మొదటి భాగం కంటే ఎంతో గొప్పగా, మెరుగ్గా ఉందని సెన్సార్ బోర్డు సభ్యుడొకరు ‘డీఎన్ఏ’ పత్రికతో చెప్పారు. ‘మొదటి భాగంతో పోలిస్తే బాహుబలి 2 ఎక్కువసేపు ఉంటుంది. దాదాపు మూడు గంటలపాటు సాగుతుంది. ఉత్కంఠభరితంగా సాగే కథనంతో మనకు సమయమే తెలియదు. సింగిల్ ఫ్రేమ్, షాట్, డైలాగుల్లో ఒక్క పదం కూడా కట్ చేయలేదు. ఒక్క కట్ కూడా చెప్పలేదు. పోరాట సన్నివేశాలు చాలా బాగా తీశారు. ముఖ్యంగా యుద్ధ సన్నివేశాలు హాలీవుడ్ కంటే సూపర్‌గా ఉన్నాయి. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 8 కంటే కూడా బాగున్నాయి. ప్రేక్షకులు తప్పకుండా హ్యాపీగా ఫీలవుతార’’ని తెలిపారు. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న విషయాన్ని ప్రేక్షకులకు వదిలేయాలని, ఇది ఆడియన్స్ ను ఆశ్చర్యచకితులను చేస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రభాస్, రానా పోటీపడి నటించారని ప్రశంసించారు. ‘రెండు సింహాలు దీటుగా తలపడినట్టు వీరిద్దరూ నటించారు. కొన్ని సన్నివేశాల్లో కంటతడి కూడా పెట్టిస్తారు. దీని గురించి నేను వెల్లడించను. ఈసారి ఇద్దరూ సమానంగా ఆకట్టుకుంటార’ని వివరించారు. -
బాహుబలి 2.. మూడు కిలోమీటర్ల క్యూ
మరో 24గంటల్లో బాహుబలి 2 విడుదలకానుంది. దాదాపు రెండేళ్లపాటు ఆసక్తి ఎదురుచూసిన జనం ఇప్పుడిక ఆగలేమంటూ థియేటర్ల బాటపట్టారు. ఎక్కడపడితే అక్కడ భారీగా క్యూలు దర్శనం ఇస్తున్నాయి. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఓ వీడియో ఒకటి బాహుబలి 2 మానియా ఎంత ఉందో చూపిస్తోంది. ప్రసాద్ ఐమాక్స్ ఆరుబయట దాదాపు మూడు కిలో మీటర్ల పొడవునా క్యూ కట్టి ఉన్నట్లు అందులో కనిపిస్తోంది. ఉదయం 7గంటల ప్రాంతంలో ఆ వీడియో తీసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆన్లైన్లో చాలామంది బుక్ చేసుకున్నా థియేటర్ వద్ద నిల్చొని టికెట్ పొందిన వారి ముఖాల్లో మాత్రం సంతోషం వెళ్లి విరుస్తోంది. నగరంలో టికెట్ అత్యధిక ధర రూ.250వరకే ఉండగా చిత్ర పరిశ్రమ వర్గాల ప్రకారం టికెట్‌కు రూ.600 అంతకంటే మించి చెల్లించి మరీ తీసుకెళుతున్నారంట. బ్లాక్‌లో మాత్రం ఒక్క టికెట్ వెయ్యి నుంచి రూ.4వేల వరకు విక్రయిస్తున్నారని సమాచారం. ఏదేమైనా మొత్తానికి బాహుబలి 2 తుఫాన్ మరోసారి ప్రేక్షకులను థియేటర్ల ముంచెత్తుతోందని స్పష్టమవుతోంది. -
బాహుబలి రిలీజ్ తరువాత జక్కన్న ప్లాన్స్
బాహుబలి సినిమా కోసం ఐదేళ్ల పాటు కష్టపడ్డ రాజమౌళి, త్వరలో లాంగ్ హాలీడే ట్రిప్ కు వెళ్లనున్నాడు. ఈ శుక్రవారం బాహుబలి 2 ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా హాలీవుడ్ సినిమాలకు కూడా షాక్ ఇస్తున్న బాహుబలి ఇండియన్స్ సినిమా కలెక్షన్ల రికార్డ్ లను బద్ధలు కొట్టడం కాయం అన్న టాక్ వినిపిస్తోంది. ఇంతటి భారీ చిత్రం తరువాత రాజమౌళి కొన్ని నెలల పాటు రెస్ట్ తీసుకోవాలని భావిస్తున్నారు. బాహుబలి 2 ప్రమోషన్ కార్యక్రమాలు ముగించుకొని భూటాన్ వెళ్లనున్నాడు. ఆసియాలో సంతోషకరమైన దేశంగా భూటాన్ కు పేరుంది. చాలా రోజులుగా భూటాన్ చూడలనుకుంటున్న జక్కన్న తన హాలీడే ట్రిప్ ను అక్కడే ప్లాన్ చేశారు. అంతేకాదు మహాభారతాన్ని ఇప్పట్లో తెరకెక్కించనన్న రాజమౌళి, తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే చాలా కథలు సిద్ధం చేశారని, త్వరలోనే తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇస్తానని వెల్లడించారు. -
బాహుబలి లీక్‌పై నిర్మాత క్లారిటీ
ప్రపంచవ్యాప్తంగా భారీ రిలీజ్ కు రెడీ అవుతున్న బాహుబలి 2 సినిమాను పైరసీ భూతం భయపెడుతోంది. సాంకేతికంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా లీకులను మాత్రం అరికట్ట లేకపోతున్నారు. తాజాగా బాహుబలి 2 సినిమా ప్రదర్శనకు సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఎక్కడా షోస్ పడక ముందే ఈ ఫోటోస్ బయటకు రావటంతో సినిమా లీకైంది ప్రచారం మొదలైంది. అయితే ఈ విషయంపై నిర్మాత శోభు యార్లగడ్డ క్లారిటీ ఇచ్చారు. ఇంత వరకు బాహుబలి 2కు సంబంధించిన ప్రదర్శనలు మొదలు కాలేదని తెలిపారు. అయితే పలు దేశాల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాను ఆయా దేశాల్లో సెన్సార్ సభ్యులకు ప్రదర్శన వేశామని తెలిపారు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో తిరుగుతున్న ఫోటోలు సెన్సార్ సమయంలో తీసినవే అయి ఉంటాయని భావిస్తున్నారు. Except for screening to various "censor boards" in different countries, there have been no screenings of @BaahubaliMovie 2 till now anywhere — Shobu Yarlagadda (@Shobu_) 26 April 2017 -
హాలీవుడ్ సినిమాలకన్నా బాహుబలికే ఎక్కువ..!
ఈ శుక్రవారం రిలీజ్‌కు రెడీ అవుతున్న బాహుబలి 2 ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు నమోదు చేస్తోంది. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్‌లో సరికొత్త రికార్డ్ సెట్ చేసిన బాహుబలి అడ్వాన్స్ బుకింగ్స్‌లోనూ అదే జోరు చూపిస్తోంది. కేవలం ఇండియాలోనే కాదు, ఓవర్ సీస్లోనూ బాహుబలి అడ్వాన్స్ బుకింగ్స్ సరికొత్త రికార్డ్‌లు నమోదు చేస్తున్నాయి. పలు హాలీవుడ్ చిత్రాలను కూడా వెనక్కి నెట్టి బాహుబలి సత్తాచాటుతోంది. గల్ఫ్ దేశాల్లో భారీగా రిలీజ్ అవుతున్న బాహుబలి, అడ్వాన్స్ బుకింగ్స్‌లో కొత్త చరిత్ర సృష్టిస్తోంది. ఈ విషయాన్ని బాహుబలి గల్ఫ్ డిస్ట్రిబ్యూటర్ ఫార్స్ ఫిలిమ్స్ అధినేత గులాన్ స్వయంగా వెల్లడించాడు. ఇప్పటికే బాహుబలి 2కు సంబంధించి లక్షకు పైగా టికెట్లు అమ్ముడైనట్టుగా ప్రకటించారు. హాలీవుడ్ రీసెంట్ సూపర్ హిట్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 8కు కూడా ఈ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరగలేదని వెల్లడించారు. ప్రస్తుతం బాహుబలి టీం దుబాయ్‌లో సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. -
3 రోజుల్లో బాహుబలి-2 రిలీజ్: ఆ స్టాక్ అదుర్స్
తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో మారుమోగించిన బాహుబలి సినిమా కంక్లూజన్ పార్ట్ ఇంకో మూడు రోజుల్లో రిలీజ్ కు సిద్ధమవుతోంది. దాదాపు 9 వేల సిల్వర్ స్క్రీన్లలో మనల్ని అలరించడానికి వచ్చేస్తోంది. ఈ నేపథ్యంలో బాహుబలి-2 కిక్ మల్టిఫ్లెక్స్ ఆపరేటర్ పీవీఆర్ లిమిటెడ్ స్టాక్ కు భలే జోషిచ్చింది. బీఎస్ఈలో పీవీఆర్ లిమిటెడ్ స్టాక్ 2.60 శాతం మేర లాభపడుతూ 1614 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఫిల్మ్ ఎంటర్ టైన్మెంట్ కంపెనీ పీవీఆర్. ఇది ముఖ్యంగా మూడు బిజినెస్ సెగ్మెంట్లలో తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. మూవీ ఎగ్జిబిషన్, మూవీ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ ను వంటి ఇతర కార్యకలాపాలను ఈ కంపెనీ అందిస్తోంది. ఏడాది ఏడాదికి కంపెనీ స్టాక్ 41.17 శాతం పెరిగింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా దాదాపు 7508 కోట్లకు పెరిగినట్టు తెలిసింది. మొత్తం కంపెనీకి చెందిన 28,614 షేర్లు చేతులు మారినట్టు వెల్లడైంది. మరో మూవీ డిస్ట్రిబ్యూటర్ ఐనాక్స్ లీజర్ మాత్రం స్వల్పంగా నష్టపోతోంది.ఇటీవలే బాహుబలి 2 విడుదల సందర్భంగా సిల్వర్ స్క్రీన్లపైకి వచ్చిన బాహుబలి 1కు కూడా మంచి స్పందనే వచ్చింది. రీ-రిలీజ్ ను పురస్కరించుకుని అప్పుడు కూడా మల్టిఫ్లెక్స్ ఆపరేటర్ల షేర్లు దుమ్మురేపాయి. మల్టిప్లెక్స్ ఆపరేటర్లకు మార్చి క్వార్టర్ ఎంతో లాభదాయకమైన త్రైమాసికమని మార్కెట్ విశ్లేషకులు చెప్పారు. దంగాల్, రాయిస్, కబాలి, జోలీ ఎల్ఎల్బీ2, బద్రినాథ్ కి దుల్హానియా వసూళ్లు ఈ కంపెనీ షేర్లకు భారీగా కలిసివచ్చిందని పేర్కొన్నారు. -
రష్యన్ సినిమాలో బాహుబలి స్టార్
కెరీర్ స్టార్టింగ్ నుంచి టాలీవుడ్‌తో పాటు ఇతర భాషల్లోనూ సినిమాలు చేస్తూ వచ్చిన టాలీవుడ్ హంక్ రానా.. ఇప్పుడో హాలీవుడ్ సినిమాకు ఓకె చెప్పాడు. ఇప్పటికే బాహుబలి సినిమాలో బల్లాల దేవుడి పాత్రతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ టాల్ హీరో ఓ రష్యన్ సినిమాలో లీడ్ రోల్లో నటించేందుకు అంగీకరించాడు. ఇప్పటికే ఏ మూమెంటరీ లాప్స్ ఆఫ్ రీజన్ అనే హాలీవుడ్ సినిమాకు సైన్ చేశాడు రానా. ఈ సినిమాలో లాస్ ఏంజెల్స్‌లో సెటిల్ అయిన ఇండియన్ బిజినెస్‌మేన్‌గా కనిపించనున్నాడు. ఆదిత్య భట్టాచార్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఆ తరువాత మరో రష్యన్ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. ప్రస్తుతానికి ఈ సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడించకపోయినా.. రానా యోధుడిగా కనిపించే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. -
'మహాభారత'లో నటిస్తా : ప్రభాస్
బాహుబలి 2 ప్రమోషన్ లో బిజీగా ఉన్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ప్రస్తుతం కేరళలో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ఈ సందర్భంగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో తెరకెక్కుతున్న ది మహాభారత సినిమాపై స్పందించాడు. 1000 కోట్ల బడ్జెట్ తో అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కుతున్న మహాభారతలో కీలకమైన భీముడి పాత్రకు మోహన్ లాల్ కరెక్ట్ చాయిస్ అన్నాడు ప్రభాస్. అంతేకాదు.. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో మరేదైన పాత్రకు తనను సంప్రదిస్తే అందులో నటించేందుకు సిద్ధమే అంటూ ప్రకటించాడు. ఇప్పటికే కృష్ణుడి పాత్రకు మహేష్ బాబును సంప్రదించే ఆలోచనలో ఉన్న మహాభారత టీం.. ప్రభాస్‌ను ఇతర పాత్రలకు కన్సిడర్ చేస్తారేమో చూడాలి. ప్రభాస్ లీడ్ రోల్ లో తెరకెక్కిన బాహుబలి 2 ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు 9000 వేల థియేటర్లలో బాహుబలి 2 రిలీజ్ కు ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. -
బాహుబలి 2 తొలి షో పడిందా..?
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బాహుబలి ఫీవర్ నడుస్తోంది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన రాజమౌళి విజువల్ వండర్ బాహుబలి 2 ఈ శుక్రవారం భారీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇప్పటి వరకు యూనిట్ చెప్పిన సమాచారం ప్రకారం గురువారం ( ఏప్రిల్ 27) సాయంత్రం ఓవర్ సీస్ ప్రీమియర్ షోలతో బాహుబలి 2 రిలీజ్ కానుంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న కొన్ని ఫోటోలు, ఇప్పటికే ప్రీమియర్ పడిందా అన్న అనుమానాలు కలిస్తోంది. సిల్వర్ స్క్రీన్ మీద బాహుబలి 2 టైటిల్ తో పాటు, ప్రభాస్ స్టిల్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే ప్రభాస్ స్టిల్ టీజర్, సాంగ్ ప్రొమోస్ లో కనిపించింది కాకపోవటంతో ప్రీవ్యూస్ స్టార్ట్ అయ్యాయన్న ప్రచారం జరుగుతోంది. అయితే నిజంగానే ప్రీవ్యూ షోస్ స్టార్ట్ అయ్యాయా.. లేక ఆ ఫోటోలు బాహుబలి టీం, సెన్సార్ టీం లు సినిమా చూస్తున్నప్పుడు తీసినవా అన్న విషయంపై మాత్రం క్లారిటీ లేదు. -
బాహుబలి దెబ్బకు రికార్డు బద్దలు!
ముంబై: ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ సినిమా బాక్సాఫీస్ అన్ని రికార్డులను తిరగరాస్తుందా? భారత సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలుస్తోందా? అంటే అవుననే అంటున్నారు నెటిజన్లు. బాహుబలి దెబ్బకు రికార్డులు బద్దలు కావడం ఖాయమని ప్రముఖ బిజినెస్ ఎనలిస్ట్, విమర్శకుడు తరణ్ ఆదర్శ్ తన ట్విటర్ పేజీలో పెట్టిన ఒపీయన్ పోల్ లో 70 శాతం మంది అభిప్రాయపడ్డారు. అప్పుడే వసూళ్ల గురించి మాట్లాడుకోవడం సరికాదని 30 శాతం మంది పేర్కొన్నారు. ‘వాతావరణం వేడిగా, తేమగా ఉంది. కానీ బాక్సాఫీస్ మాత్రం చాలా చల్లగా ఉంది. సినిమా వ్యాపారాన్ని మళ్లీ పుంజుకునేలా చేసేందుకు బాహుబలి 2 వస్తోంది. బాక్సాఫీస్ వద్ద తుఫాను రాబోతోంద’ని తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 2’ చిత్రం ఈ నెల 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమా కోసం అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విడుదల రోజున ఒక్క బెంగళూరులోనే 850పైగా షోలు వేయనున్నారు. పది రోజుల పాటు రోజుకు ఆరు షోలు ప్రదర్శించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతిచ్చింది. విడుదల రోజునే బాహుబలి రికార్డులు సృష్టించడం ఖాయమని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. -
నటి బికినీ వేసుకోవలసిందేనా?
ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేయాలంటే బికినీ వేసుకోవలసిందేనా? స్కిన్ షో తప్పనిసరా? అనడిగితే... ‘‘స్కిన్ షోకి ప్రేక్షకులు ఎట్రాక్ట్ అవుతారనేది అపోహే. నేను నమ్మను’’ అంటున్నారు తమన్నా. హీరోయిన్గా మీకు మీరు ఏవైనా పరిమితులు పెట్టుకున్నారా? అని తమన్నాను ప్రశ్నిస్తే... ‘‘యస్. కొన్ని ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే ముందు మా అమ్మానాన్నలకు కొన్ని ప్రామిస్‌లు చేశా. నాకు కంఫర్ట్‌బుల్‌గా లేని బట్టలను నేను వేసుకోను. అయినా వేసుకునే డ్రెస్సులు మనకు పాపులారిటీ తీసుకురావు. ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేయడానికి నేను బికినీ వేసుకోవలసిన అవసరం లేదని నా అభిప్రాయం. నేనెప్పుడూ అలా చేయను’’ అని సమాధానం ఇచ్చారు. ఈ శుక్రవారం వస్తోన్న ‘బాహుబలి–2’ మినహా... ప్రస్తుతం తమన్నా చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. తమిళంలో ఓ మూడున్నాయి. హిందీలో ప్రభుదేవాతో కలసి చేస్తున్న సినిమాలో చెవిటి, మూగ అమ్మాయిగా నటిస్తున్నారు. ప్రతి వారం రెండు మూడు సినిమాలు తమన్నా తలుపు తడుతున్నాయట. తెలుగులోనూ అవకాశాలు వస్తున్నాయట. మంచి కథల కోసం ఎదురు చూస్తున్నానని తమన్నా చెప్పుకొచ్చారు. -
మహాభారతాన్ని తప్పకుండా తెరకెక్కిస్తా : రాజమౌళి
బాహుబలి 2 రిలీజ్ కు రెడీ కావటంతో రాజమౌళి చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్ పై చర్య మొదలైంది. గతంలో పలు సందర్భాల్లో తాను మహాభారతాన్ని తెరకెక్కించాలని భావిస్తున్నానని రాజమౌళి చెప్పటంతో బాహుబలి తరువాత మహాభారతమే సెట్స్ మీదకు వెళ్తుందని భావించారు. అయితే రాజమౌళి మాత్రం మహాభారతానికి తెర రూపం ఇచ్చేంత అనుభవం తనకింకా రాలేదని అందుకు ఇంకా సమయం పడుతుందని చెపుతూ వస్తున్నాడు. తాజాగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ 1000 కోట్ల తో మహాభారతాన్ని తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించటంతో మరోసారి రాజమౌళి మహాభారతం చర్చకు వచ్చింది. మోహన్ లాల్ అంత భారీగా రూపొందించిన తరువాత తిరిగి రాజమౌళి అదే కథను తీస్తాడా అన్న అనుమానం వ్యక్తం అయ్యింది. అయితే ప్రస్తుతం బాహుబలి 2 ప్రమోషన్ లో బిజీగా ఉన్న జక్కన మహాభారతం తీసే ఆలోచనపై మరోసారి క్లారిటీ ఇచ్చాడు. తాను తప్పకుండా మహాభారతాన్ని తెరకెక్కిస్తానని చెప్పాడు. అయితే అదే మరో ఏడాదిలోనా.. లేక పదేళ్ల తరువాతనా అన్న విషయం మాత్రం ఇప్పుడే చెప్పలేనని తెలిపాడు. మహాభారతం మహాసముద్రమన్న జక్కన అందులో మోహన్ లాల్ టీం కొంత తీస్తే నేను కొంత తీస్తానని అలా ఎంతమందైనా చేయోచ్చని తెలిపాడు. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2 ఈ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుండగా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. -
బాహుబలి ఫ్యాన్స్‌కి ఎయిర్టెల్ బంపర్ ఆఫర్
హైదరాబాద్:భారత అతిపెద్ద, అతివేగమైన టెలికాం సేవల సంస్థ భారతి ఎయిర్టెల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. తమ ఖాతాదారుల సౌలభ్యంకోసం బాహుబలి దకన్క్లూజన్ టీంతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో 4జీ డాటా సేవలందించే స్పెషల్ 4 జీ సిమ్ లను లాంచ్ చేసింది. 'బాహుబలి' పేరుతో లాంచ్ చేసిన ఈ బాహుబలి సిమ్ ద్వారా ఉచిత 4జీడేటాను అందించనున్నట్టు ఎయిర్టెల్ తెలిపింది. దీంతోపాటు 4జీ రీచార్జ్ ప్యాక్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్న ప్రకటించింది. ఇందుకు బాహుబలి-2తో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంటున్నట్లు భారతీ ఎయిర్టెల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సీఈఓ వెంకటేష్ విజయరాఘవన్ ప్రకటించారు. బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్ హోటల్లో బాహుబలి దర్శకుడు రాజమౌళి, హీరో లు ప్రభాస్, రానా, నటి అనుష్క తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా బాహుబలి నెట్‌వర్క్‌ను లాంచ్ చేశారు. బాహుబలి టీం సోషల్‌మీడియాను బాగా ఉపయోగించుకుందని రాజమౌళి చెప్పారు. ఈ ఘనత నిర్మాత శోభుకి, ఆర్కా టీంకు దక్కుతుందన్నారు. వివిధ డిజిటల్ ప్లాట్ ప్లాంలపై బాహుబలి-2 ప్రమోషన్ చేపడతామని ఎయిర్టెల్ కన్స్యూమర్ బిజినెస్ & చీఫ్ మార్కెటింగ్ డైరెక్టర్ రాజ్ పూడిపెద్ది చెప్పారు. అలాగే తమ కస్టమర్లు ప్రత్యేక బాహుబలి-2 మేకింగ్ కంటెంట్‌ను అందించనున్నట్టు తెలిపారు. ఎయిర్టెల్ నుంచి బాహుబలి సిమ్‌తోపాటు ఉచిత 4జీ డేటా, బాహుబలి 4జీ రీఛార్జ్ ప్యాక్, బాహుబలి కంటెంట్‌లో భాగంగా వీడియోలు, వింక్ మ్యూజిక్, గెస్ట్ ఎడిటర్స్, ఇలా ప్రత్యేకమైన ఉత్పత్తులు అందిస్తున్నట్లు విజయరాఘవన్ తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఎయిర్టెల్ 4జీ వినియోగదారుల కోసం లైవ్ ఓపెన్ ఇంటరాక్టివ్ క్యాంపెయిన్ త్వరలో నిర్వహించనుంది. అయితే రీఛార్జ్ ప్యాక్‌లపై వివరాలను స్పష్టంగా తెలియలేదు. కాగా శనివారం విడుదలైన ఈ ప్రతిష్టాత్మక సినిమాకు సంబంధించి ప్రమోషన్ ప్రోమో దుమ్ము రేపుతోంది. బాహుబలి 2 ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 28న థియేటర్లను పలకరించనుంది. -
బాహుబలి వీడియో సాంగ్ ప్రోమో విడుదల
భళి భళిరా భళి.. సాహోరే బాహుబలి అంటూ సాగే పాట వీడియో సాంగ్ ప్రోమోను బాహుబలి టీమ్ విడుదల చేసింది. లహరి మ్యూజిక్, టీ సిరీస్ సంయుక్తంగా ఈ వీడియోను విడుదల చేశాయి. ముందుగా నల్లగుర్రం మీద దూసుకొస్తున్న ప్రభాస్, ఆ తర్వాత సింహాసనం మీద అధిష్టించడం.. ఆ సమయంలో వేలాది మంది మాహిష్మతీ ప్రజలు పూలతో స్వాగతం పలకడం... ఆపై ఏనుగు మీద సవారీ చేస్తూ ప్రభాస్ వస్తుంటే ముందు కట్టప్ప, శివగామి ఉండటం, ప్రజల జయజయ ధ్వానాల మధ్య ఇద్దరు చిన్న పిల్లలను చెరో భుజం మీద ఎక్కించుకుని తీసుకురావడం లాంటి సన్నివేశాలన్నీ ఈ పాటలో ఉన్నాయి. మాహిష్మతిలో మోహరించిన సైన్యం, యుద్ధానికి సన్నద్ధమవుతున్న బాహుబలి, ఏనుగు తొండానికి ఓ అతిపెద్ద విల్లు అమర్చి, దాని నుంచి ఒక్క చేత్తో నిప్పులు చిమ్మే అతిపెద్ద బాణాన్ని సంధించడం లాంటి దృశ్యాలు గగుర్పొడిచేలా ఉంటాయి. గొడ్డలి చేతపట్టడం, గాల్లోకి ఎగిరి ఒకేసారి మూడు బాణాలు సంధించడం, ముగ్గురు శత్రుసైనికుల మీదకు బల్లెం దించి ముగ్గురినీ ఒకేసారి కాలితో పడగొట్టడం, బ్యాక్‌గ్రౌండ్‌లో సూర్యుడు ఉండగా చేసే కత్తిసాము.. ఇలా ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. పూర్తి పాట కాకుండా పాట ప్రోమోతోనే రాజమౌళి మరోసారి బాహుబలి -2 సినిమా మీద ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేశారనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఈ వీడియో పోస్ట్ చేసిన మొదటి అరగంటలోనే యూట్యూబ్‌లో దాదాపు 60 వేల వరకు వ్యూస్ వచ్చాయి. -
బాహుబలి వీడియో సాంగ్ ప్రోమో విడుదల
-
బాహుబలి 2 రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్
కర్ణాటకలో రెండు వారాలుగా బాహుబలి 2 రిలీజ్ విషయంలో జరుగుతున్న హై డ్రామాకు తెరపడింది. కావేరి జలాల విషయంలో సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలతో కన్నడిగుల మనోభావాలు దెబ్బతిన్నాయన్న ఆరోపణతో ఆయన కీలక పాత్రలో నటించిన బాహుబలి 2 రిలీజ్ ను అడ్డుకుంటామంటూ ప్రకటించారు ఆందోళనకారులు. బాహుబలి 2లో కట్టప్ప పాత్రలో నటించిన సత్యరాజ్ క్షమాపణ చెపితేనే రిలీజ్ కు అంగీకరిస్తామని ప్రకటించారు. రాజమౌళి కోరినా కన్నడ ప్రజాసంఘాలు దిగిరాకపోవటంతో కట్టప్ప దిగిరాక తప్పలేదు. శుక్రవారం కట్టప్ప వీడియో మెసేజ్ రూపంలో కన్నడిగులకు క్షమాపణ తెలపటంతో బాహుబలి 2 రిలీజ్ కు లైన్ క్లియర్ అయ్యింది. కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న కన్నడిగులు సత్యరాజ్ క్షమాపణలు చెప్పిన తరువాత ఆందోళన విరమిస్తున్నట్టుగా ప్రకటించారు. దీంతో ఏప్రిల్ 28న కర్ణాటకలో కూడా బాహుబలి భారీ ఎత్తున రిలీజ్ కు సిద్ధమవుతోంది. -
ప్రభాస్.. రిలీజ్ వాయిదా వేశాడా..?
బాహుబలి సినిమాతో జాతీయ స్థాయి ఫేం సంపాదించుకున్న యంగ్ హీరో ప్రభాస్ మరోసారి బాహుబలిగా అభిమానులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఈ నెల 28న బాహుబలి 2 సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. అయితే సినిమా రిలీజ్ కన్నా ముందే ప్రభాస్ నెక్ట్స్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, బాహుబలి 2 తో పాటు టీజర్ ను రిలీజ్ చేస్తారన్న వార్త యంగ్ రెబల్ స్టార్ అభిమానులను ఖుషీ చేసింది. అయితే తాజా సమాచారం ప్రకారం 23న రిలీజ్ చేస్తారని భావించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేయటం లేదని తెలుస్తోంది. అంతేకాదు బాహుబలి 2 సినిమాతో పాటు ప్రభాస్ నెక్ట్స్ సినిమాకు సంబంధించిన టీజర్ మాత్రమే రిలీజ్ చేయనున్నారు. టైటిల్ ను కూడా మరికొద్ది రోజులు తరువాత ప్రకటిస్తారని తెలుస్తుంది. అయితే ఇంత వరకు ఈ విషయాలపై చిత్రయూనిట్ అధికారికంగా స్పందిచలేదు. -
అసలు కట్టప్ప ఏమన్నాడు?
న్యూఢిల్లీ: బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న ప్రశ్న ఇంతకాలం ప్రేక్షకుల మదిని తొలుస్తూ వచ్చింది. ఆ స్థానంలో కట్టప్ప కన్నడిగులకు క్షమాపణ చెబుతారా, లేదా ? అన్న ప్రశ్న ఆక్రమించింది. చెప్పినా దుమారం రేపిన వివాదం సమసిపోతుందా? సినిమా సకాలంలో విడుదలవుతుందా? అని బాహుబలి అభిమానుల్లో ఆందోళన అంకురించింది. బాహుబలి దర్శకుడు రాజమౌలి సోషల్ మీడియా ద్వారా కట్టప్ప తరఫు బేషరుతుగా కన్నడిగులకు క్షమాపణలు చెప్పారు. ఆ మరుసటి రోజే, అంటే శుక్రవారం కట్టప్ప పాత్రధారి, తమిళనటుడు సత్యరాజ్ కూడా కన్నడిగులకు క్షమాపణలు చెప్పారు. ఎప్పుడో చేసిన తన వ్యాఖ్యలు కన్నడిగులను నొప్పించి ఉంటే అందుకు క్షమాపణులు చెబుతున్నానని చెప్పారు. ఈ నెల 28వ తేదీన విడుదల కావాల్సిన బాహుబలి–2 చిత్రం విడుదలను అడ్డుకోరాదని వేడుకున్నారు. ఇంతకు కన్నడిగులను అవమానించేలా సత్యరాజ్ ఏమన్నారు? ఎప్పుడన్నారు? అన్న ప్రశ్నలు కూడా సినిమా ప్రేక్షకులకు కలుగుతున్నాయి. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య 800 కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తున్న కావేరీ నదీ పంపకాలపై ఇరు రాష్ట్రాల మధ్య ఎప్పటి నుంచో వివాదం నెలకొన్న విషయం తెల్సిందే. ఇరు రాష్ట్రాల నటులు ఎన్నో ఏళ్లుగా వారి వారి ప్రభుత్వాల వైఖరీలకు మద్దతుగా ప్రజాందోళనలకు మద్దతిస్తున్నారు. ధర్నాలు, బైఠాయింపుల్లో కూడా పొల్గొంటున్నారు. 2008లో చెన్నైలో నిర్వహించిన ఓ ధర్నా కార్యక్రమంలో రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి నటులు పాల్గొన్నారు. ఇదే కార్యక్రమంలో సత్యరాజ్ మాట్లాడుతూ ‘కుక్కలు ఉచ్చపోస్తుంటే మౌనం వహించే మానులా తమిళప్రజలు ఉండరాదు’ అన్నారు. ఈ వ్యాఖ్యలపై కన్నడ సంఘాలు మండిపడ్డాయి. కాలక్రమంలో ఈ మాటలు ఇరు రాష్ట్రాల ప్రజలు మరచిపోయారు. బహూశ సత్యరాజ్ కూడా మరచిపోయి ఉంటారు. బాహుబలి–2 విడుదలను పురస్కరించుకొని కొందరు నాడు సత్యరాజ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు. ఏప్రిల్ 28న విడుదలవుతున్న బాహుబలిని అడ్డుకోవడంతోపాటు మొత్తం బెంగళూరు బంద్‌కు వటల్ నాగరాజ్ నాయకత్వంలోని ‘కన్నడ చలవలి వటల్ పక్ష’ సంఘం పిలుపునిచ్చింది. అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బేషరుతుగా సత్యరాజ్ క్షమాపణలు చెబితేగానీ విడుదలను అనుమతించమని నాగరాజ్ హెచ్చరించారు. దానికి కన్నడి చలనచిత్ర వాణిజ్య మండలి కూడా మద్దతు పలికింది. సత్యరాజ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు చేసినవా, ఎప్పుడో చేసినవా అన్న అంశంతో తమకు సంబంధం లేదని, ఆ వ్యాఖ్యలు కర్ణాటకను, కన్నడిగులను అవమానపరిచే విధంగా ఉన్నాయని మండలి వ్యాఖ్యానించింది. గతంలో నాగరాజ్‌ను పెద్ద కమెడియన్ అంటూ కూడా సత్యరాజ్ ఎద్దేవ చేశారు. ఈ నేపథ్యంలోనే సత్యరాజ్ క్షమాపణల పత్రాన్ని చదవి దాన్ని వీడియోతీసి మీడియాలకు విడుదల చేశారు. కన్నడ సంఘాలు సత్యరాజ్‌ను బేషరుతుగా క్షమాపణలు చెప్పాలని కోరితే క్షమాపణలు చెప్పిన సత్యరాజ్ చివరలో తాను తమిళ ప్రజల పోరాటానికి ఎప్పుడూ అండగా నిలబడతానని కూడా చెప్పారు. మరి ఇంతటితో వివాదం సమసిపోతుందా, లేదా చూడాలి. వివాదానికి తెరపడకపోతే వాస్తవానికి సత్యరాజ్‌కు వచ్చే నష్టమేమి లేదు. 45 కోట్ల రూపాయలకుపైగా డబ్బులుపెట్టి చిత్రం హక్కులుకొన్ని కన్నడ డిస్ట్రిబ్యూటర్లే నష్టపోతారు. -
ఎట్టకేలకు దిగొచ్చిన ‘కట్టప్ప’
-
ఎట్టకేలకు దిగొచ్చిన ‘కట్టప్ప’
చెన్నై: కన్నడిగుల ఆందోళనతో ‘కట్టప్ప’ దిగొచ్చాడు. కన్నడ ప్రజలకు వ్యతిరేకంగా 9 ఏళ్ల క్రితం తాను చేసిన వ్యాఖ్యలపై తమిళ నటుడు సత్యరాజ్ క్షమాపణ చెప్పారు. తాను కన్నడ ప్రజలకు వ్యతిరేకం కాదని, వివాదానికి ముగింపు పలకాలని విజ్ఞప్తి చేశారు. తన వ్యాఖ్యలు బాహుబలి-2 సినిమా విడుదలకు అడ్డంకి కారాదని ఆకాంక్షించారు. తన వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడివుంటే క్షమించాలని వేడుకున్నాడు. బాహుబలి-2 సినిమాను అడ్డుకోవద్దని కన్నడీగులను కోరాడు. ఈ మేరకు లేఖ చదువుతూ వీడియో విడుదల చేశాడు. తమిళ ప్రజల సంక్షేమం కోసం మాట్లాడుతూనేవుంటానని, సినిమాల్లో అవకాశాలు పోయినా లెక్కచేయనని చెప్పారు. కావేరి నదీ జలాల వివాదం నేపథ్యంలో తమకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన సత్యరాజ్ క్షమాపణ చెప్పకుంటే బాహుబలి-2 సినిమాను అడ్డుకుంటామని కన్నడ సంఘాలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. తమ సినిమాను అడ్డుకోవద్దని కన్నడ ప్రజలను దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి స్వయంగా కోరాడు. భారీ వ్యయంతో తెరకెక్కిన తమ సినిమాను అడ్డుకుంటే తీవ్రంగా నష్టపోతామని తెలిపాడు. రిలీజ్ అడ్డుకుంటే అందరూ నష్టపోవాల్సి వస్తుందని, బాహుబలి తొలి భాగాన్ని ఆదరించినట్టుగానే కన్నడ ప్రేక్షకులు బాహుబలి-2 కూడా ఆదరించాలని విజ్ఞప్తి చేశాడు. -
కన్నడ ప్రజలకు రాజమౌళి విజ్ఞప్తి
బాహుబలి 2 సినిమా రిలీజ్ పై కన్నడ ప్రజలు స్పందిస్తున్న తీరు చిత్రయూనిట్ ను ఇబ్బంది పెడుతోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అనుకున్న స్థాయిలో రిలీజ్ కాకపోతే కలెక్షన్ల మీద ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో కన్నడ ప్రజలకు రాజమౌళి స్వయంగా రిలీజ్ అడ్డుకోవద్దంటూ విజ్ఞప్తి చేశారు. తన సోషల్ మీడియా పేజ్ లో ఓ వీడియో పోస్ట్ చేసిన రాజమౌళి కన్నడలో మాట్లాడి వారికి మరింత చేరువయ్యే ప్రయత్నం చేశాడు. నాకు కన్నడ సరిగా రాదు.. ఏవైనా తప్పులుంటే క్షమించండి అంటూ ప్రారంభించిన జక్కన చాలా ఏళ్ల క్రితం సత్యరాజ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పుడు సినిమాను అడ్డుకోవద్దని కోరారు. ఆ వ్యాఖ్యలు కేవలం సత్యరాజ్ వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అని, వాటితో బాహుబలి యూనిట్ కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. సినిమా కోసం ఎంతో మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు కష్టపడి పని చేశారు. రిలీజ్ అడ్డుకుంటే అందరూ నష్టపోవాల్సి వస్తుందని, బాహుబలి తొలి భాగాన్ని ఆదరించినట్టుగానే కన్నడ ప్రేక్షకులు బాహుబలి రెండో భాగాన్ని కూడా ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. An appeal to all the Kannada friends... pic.twitter.com/5rJWMixnZF — rajamouli ss (@ssrajamouli) 20 April 2017 -
కన్నడ ప్రజలకు రాజమౌళి విజ్ఞప్తి
-
‘బాహుబలి’ విడుదల కానివ్వం
బెంగుళూరు: తమిళనటుడు, బాహుబలి చిత్రంలో కట్టప్ప పాత్రధారి సత్యరాజ్ బేషరతుగా క్షమాపణ చెప్పేవరకూ ‘బాహుబలి– ది కన్‌క్లూజన్’ చిత్రాన్ని రాష్ట్రంలో విడుదల కానివ్వమని కన్నడ సంఘాలు హెచ్చరించాయి. ఏప్రిల్ 28న బాహుబలి రిలీజ్ కానున్న వేళ ‘కన్నడ ఒకోటా’ సంస్థ బెంగుళూరు బంద్‌కు పిలుపునిచ్చింది. ‘కావేరీ జలాల విషయంలో కన్నడిగుల గురించి గతంలో సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలు హద్దు దాటాయి. మేం చిత్రాన్ని విడుదల కానివ్వం. మా కార్యకర్తలు ప్రతి జిల్లాలో సినిమా ప్రదర్శనను అడ్డుకుంటారు. కాదు కూడదని రిలీజ్ చేస్తే ఎగ్జిబిటర్లు తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది’ అని ఒకోటా అధ్యక్షుడు వతల్ నాగరాజ్ హెచ్చరించారు. ఈ ఆందోళనకు కర్ణాటక ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ మద్దతు తెలిపింది. -
లాస్ట్ వర్కింగ్ డే : రాజమౌళి
నాలుగేళ్లకు పైగా బాహుబలి సినిమాకే అంకితమై పోయిన రాజమౌళికి ఎట్టకేలకు విముక్తి లభించింది. వంద కోట్ల బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన బాహుబలికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ విషయాన్ని అభిమానలుతో పంచుకుంటూ దాదాపు ఇదే లాస్ట్ వర్కింగ్ డే అంటూ ట్వీట్ చేశాడు రాజమౌళి. ఈ ప్రయాణంలో ఆనందంగా నవ్వుకున్న సందర్భాలు బాధతో ఒళ్లు జలదరించిన అనుభవాలు ఎన్నో ఉన్నాయంటూ గుర్తు చేసుకున్నాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2 తెలుగు వర్షన్ సోమవారం సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా పూర్తి చేసుకుంది. తమిళ, మలయాళ, హిందీ వర్షన్ సెన్సార్ పూర్తి కావాల్సి ఉంది. భారీ గ్రాఫిక్స్, యుద్ధ సన్నివేశాలతో తెరకెక్కిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ యు/ఎ సర్టిఫికేట్ ను జారీ చేసింది. సినిమా నిడివి రెండు గంటల 45 నిమిషాలుగా తెలుస్తోంది. రిలీజ్ విషయంలోనూ సరికొత్త రికార్డ్ లు క్రియేట్ చేస్తున్న బాహుబలి ఈ నెల 28న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. Last working day......hope fully..🙂 What a journey..what an experience.. I am both smiling with joy and wincing with pain.. — rajamouli ss (@ssrajamouli) 18 April 2017 -
లక్ష కోట్ల సినిమా అయినా ఇప్పట్లో చేయను!
కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి. ‘బాహుబలి’ చూసి ప్రభాస్ కటౌట్‌కి తగ్గ క్యారెక్టర్లో కత్తిలా నటించాడన్నారు. సినిమా సూపర్ హిట్టయింది. ఇప్పుడు సేమ్ కటౌట్ సెకండ్ పార్ట్‌తో వస్తోంది. సో.. అన్ని కళ్లూ ‘బాహుబలి–2’ పైనే. రాజమౌళి దర్శకత్వంలో శోభూ యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రభాస్‌తో ఇంటర్వ్యూ... ‘బాహుబలి’ని కట్టప్ప ఎందుకు చంపాడో ఇప్పుడైనా చెబుతారా? ఎందుకనేది తెలిస్తే మీరు సినిమాను ఎంజాయ్ చేయలేరు. ఒక్క సీన్లో కాదు... ఓ 10, 20, 30 సీన్లలో జరిగిన అంశాలు చంపడానికి కారణమవుతాయి. ఈ ప్రశ్నకు ఎవరూ ఒక్క మాటలో ఆన్సర్ చెప్పలేరు. ప్రేక్షకులు ఈ ప్రశ్న పదే పదే అడుగుతున్నారంటే వాళ్లెంతగా సినిమాను ప్రేమించారో ఊహించుకోవచ్చు. రాజమౌళి ఆ ప్రశ్నతో సినిమాను ముగిస్తారని మీకూ, యూనిట్ సభ్యులకూ ముందే తెలుసా? లేదు. లక్కీగా... ‘బాహుబలి’ రిలీజ్‌కు ముందే పార్ట్–2లో ఇంపార్టెంట్ సీన్స్ షూట్ చేశాం. అందువల్ల, సెట్లో చాలామంది ఆ సీన్స్ తీసినప్పుడు సరిగ్గా చూడలేదు. రిలీజ్ తర్వాత షూటింగ్ చేసుంటే యూనిట్ అందరికీ తెలిసేది. సీక్రెట్ బయటకు వచ్చేసేది. ‘బాహుబలి’ బ్లాక్ బస్టర్ అవుతుందని ముందే ఊహించారా? లేదు. రాజమౌళి విజన్‌ను మేమంతా గుడ్డిగా నమ్మాం. మేం ఊహించిన దానికంటే సినిమా భారీ హిట్టయ్యింది. రిలీజ్ డే హిట్ టాక్ వచ్చిన తర్వాత వీవీ వినాయక్‌గారు, రాజమౌళి, నేనూ కలిశాం. అప్పుడు వినాయక్‌గారు ‘దేవసేన సంకెళ్లతో ఎందుకుంది? శివగామి ఎందుకు చచ్చిపోయింది? కట్టప్ప ఎందుకు చంపాడు? సినిమాలో ఇటువంటివి పది ప్రశ్నలుండగా... బ్లాక్‌బస్టర్ టాక్ ఎలా వచ్చింది? ఎలా ఇంత పెద్ద హిట్ అయింది?’ అనడిగారు. నాకు కథ పూర్తిగా తెలుసు కాబట్టి, ఇలాంటి ప్రశ్నల గురించి ఆలోచించలేదు. శివుడి కాలిని కట్టప్ప నెత్తి మీద పెట్టుకోవడం ఓ ట్విస్ట్ అవుతుందనుకున్నానంతే. బహుశా... ప్రేక్షకులకు సినిమాలో కొత్తదనం నచ్చిందేమో! యుద్ధాలు, చారిత్రక నేపథ్యం నచ్చాయేమో! ఏదో మేజిక్ అయితే జరిగింది. ‘బాహుబలి–2’పై భారీ అంచనాలున్నాయి. మీకు టెన్షన్‌గా ఉందా? కాన్ఫిడెంట్‌గా ఉన్నారా? పార్ట్–1కి టెన్షన్ పడ్డా. ఎందుకంటే నిర్మాతలు బాగా రిస్క్ చేశారు. తెలుగులో ఎంత వసూలు చేస్తుంది? తమిళంలో చూస్తారా? లేదా? హిందీలో అసలు ఆడుతుందా? అనేవి తెలీకుండా మా నిర్మాతలు శోభు, ప్రసాద్‌లు భారీగా ఖర్చు పెట్టారు. సినిమా ఫ్లాప్ అయితే... వాళ్ల కోసం నేనో మూడు, రాజమౌళి ఓ మూడు సినిమాలు చేసినా నిర్మాతలు బయట పడలేరు. మళ్లీ సినిమా చేసి, విడుదల చేసినా... వడ్డీలు, గట్రా ఆ ఆలోచన వస్తేనే భయంగా ఉంది. ఎవరు ఏం చేసినా నిర్మాతలను సేవ్ చేయలేమనే భయంకరమైన టెన్షన్ ఉండేది. మంచి రిజల్ట్ వచ్చేసరికి హ్యాపీ. ఇప్పుడూ టెన్షన్‌గా ఉంది. కానీ, ఫస్ట్ పార్ట్ అంత లేదు. ఓ వారం తర్వాత మెల్లగా టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ‘బాహుబలి’లో క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ మాత్రమే చూశారు. పార్ట్–2లో అసలు కథ, డ్రామా, రెండు యుద్ధాలున్నాయి. మహాభారతాన్ని తలపిస్తుంది. ప్రేక్షకులకు నచ్చుతుందనుకుంటున్నా. బాహుబలి’ సక్సెస్ చూసి నిర్మాతలు సేఫ్ అనుకున్నారా? అంతే కదా. రాజమౌళి ఎంత హార్డ్‌వర్క్ చేశాడు? నేను ఎన్నేళ్లు టైమ్ కేటాయించాను? అనేవి పక్కన పెడితే... లైఫ్‌లో మళ్లీ సంపాదించుకోలేని డబ్బులను నిర్మాతలు ఖర్చుపెట్టారు. ‘బాహుబలి’ హిట్ అయితే ఫ్లాప్ కిందే లెక్క. బ్లాక్ బస్టర్ అవ్వాలి. వేరే ఛాయిస్ లేదు. పెద్ద హిట్టయినా నిర్మాతలకు ఏం మిగల్లేదంటే ఎంత ఖర్చు పెట్టారో ఆలోచించండి. ‘బాహుబలి’ హిట్టవ్వకపోతే పార్ట్–2 ఆపేయాలి. అప్పటికే 30 శాతం షూటింగ్ చేసేశాం. మళ్లీ, మరో సినిమా అంటే కష్టమే కదా! మీరు, రాజమౌళి తప్పిస్తే ‘బాహుబలి’ టీమ్ వేరే సినిమాలు చేశారు.. నేను, రాజమౌళి వేరే సినిమాలు చేస్తే... ఇంకో ఎనిమిదేళ్లు పట్టేదేమో (నవ్వులు)! ఈ మహాయజ్ఞంలో నా వంతుగా మొదట నేను చేయాల్సింది ఏంటంటే... రాజమౌళికి టైమ్ ఇవ్వాలి. మధ్యలో నేనింకో సినిమా చేస్తూ... ‘క్లైమాక్స్ ఒక్కటే డార్లింగ్. రెండు రోజుల్లో వచ్చేస్తా’ వంటì పర్మిషన్లు అడగ కూడదనుకున్నా. ‘బాహుబలి’ ఓ ప్రయోగం. ప్రతిదీ మాకు ఓ ఎక్స్‌పీరియన్సే. వార్ సీన్స్ 80 రోజులు అనుకుంటే 120 రోజులైంది. నేను మరో సినిమా చేస్తే, అది ప్లానింగ్ ప్రకారం జరక్కపోతే మరిన్ని సమస్యలు. ఈ సినిమాలో వార్ సీన్స్‌పై హాలీవుడ్ ప్రభావం ఎక్కువ ఉందనే టాక్ రావడంపై మీ కామెంట్? ‘ధీవర..’ సాంగ్ చూశారు కాదా! మేఘాల పైనుంచి వాటర్ ఫాల్స్ రావడం ఏంటి? రాజమౌళి తప్ప మరొకరు అలా ఆలోచించలేరు. కరణ్ జోహార్‌కు చూపిస్తే... ‘ఏంటిది ‘అవతార్’లా ఉంది’ అన్నారు. ఆ వాటర్ ఫాల్స్ సీక్వెన్స్ హాలీవుడ్ కంటే బాగా వచ్చిందని నా వ్యక్తిగత అభిప్రాయం. వార్ సీన్లూ బాగున్నాయి. హాలీవుడ్వి ఇంకా బాగుండొచ్చు. ‘బాహుబలి’కి నాలుగేళ్లు కష్టపడ్డారు. పార్ట్–1తో దేశవ్యాప్తంగా మీకు మంచి పేరొచ్చింది. మరో సినిమాకు మళ్లీ ఇంత కష్టపడే ఆలోచన ఉందా? ఇప్పుడా మైండ్‌సెట్‌లో లేను. ‘బాహుబలి’ని ఎంజాయ్ చేశా. వెంటనే ఈ టైప్ మూవీకి ఎవరైనా అడిగి, అది లక్ష కోట్ల సినిమా అని చెప్పినా చేయను. నాలుగేళ్ల తర్వాత అయితే చేస్తానేమో. పేరొస్తే ఏంటి? రాకపోతే ఏంటి? నేను ఎంజాయ్ చేయలేనిది నాకెందుకు? ఇకపై, ఏడాదికి రెండు సినిమాలు చేస్తానన్నారు. సాధ్యమేనా? సాధ్యమే. కానీ, యాక్షన్‌తో అయితే అంత సులభం కాదు. హాలీవుడ్ తరహాలో ప్రీ–ప్రొడక్షన్ వర్క్స్, గట్రా చేస్తే ఎంత పెద్ద సినిమా అయినా నాలుగు నెలల్లో పూర్తి చేయొచ్చు. కీరవాణిగారు ప్రభాస్‌కి గర్వం లేదన్నారు. మీరేమంటారు? ఏమో... గర్వం లేనట్లు నటిస్తున్నానేమో! (నవ్వులు) ఇప్పుడీ సినిమాను ఉదాహరణగా తీసుకుంటే... నేను కథ రాయలేదు, దర్శకత్వం చేయలేదు. అలాంటప్పుడు ఎందుకు గర్వపడాలి? రాజమౌళిపై నమ్మకంతో, నాకు పేరు రావాలని చేశా. ఈ సినిమాతో మీలో సహనం పెరిగిందా? పెదనాన్నగారు మొగల్తూరు ఎంపీగా చేసినప్పుడు నాలో సహనం అనేది వచ్చింది. ఎందుకంటే నెల రోజులు నాకు మొగల్తూరు బాధ్యతలు అప్పగించారు. నా దగ్గరకొచ్చిన ప్రతి ఒక్కరూ తమ సమస్యలను, పార్టీ గొడవలను చెప్పేవారు. ఏం సమాధానం చెప్పాలో తెలీదు, రాజకీయాలు అసలే తెలీదు. నావల్ల ఒక్క ఓటు కూడా రాదు. కనీసం పోకుండా చూద్దామని వాళ్లు చెప్పేవన్నీ వినేవాణ్ణి. నెల తర్వాత పెదనాన్నగారికి దండం పెట్టి... మీ రాజకీయాలు నాకు సంబంధం లేదు. లైఫ్‌లో ఇంకోసారి పిలవద్దని చెప్పా. నాకు రాజకీయాలు సెట్ కావు. హాలీవుడ్‌కి, బాలీవుడ్‌కి వెళ్తున్నారట? నెక్స్›్ట సినిమా ఎప్పుడు? ఈ సినిమాతో నిజాలు, పుకార్లు... చాలా ప్రచారంలోకి వచ్చేశాయి. హిందీ సినిమా చేస్తానేమో. హాలీవుడ్ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ఓ నెల తర్వాత దర్శకులు సుజీత్, రాధాకృష్ణలతో చేయబోయే సినిమాల చిత్రీకరణను దాదాపు ఒకేసారి ప్రారంభించాలనుకుంటున్నాం. ‘బాహుబలి’ తర్వాత ఏ సినిమా చేస్తే ఎలా రిసీవ్ చేసుకుంటారోననే భయం ఉందా? ప్రచార చిత్రాల నుంచి ప్రేక్షకుల ఇమేజ్ మార్చొచ్చు. ఉదాహరణకు ‘ఛత్రపతి’ తర్వాత ‘డార్లింగ్’ను ప్రేక్షకులు అంగీకరించారు కదా! ‘ఛత్రపతి’లో 20, 30మందిని నరికేసిన మాస్ హీరో ‘మిస్టర్ పర్ఫెక్ట్’ క్లైమాక్స్‌లో ‘నేను తప్పు చేశా, సారీ’ అనే సీన్ చేస్తే అంగీకరించారు కదా! పోస్టర్స్, ట్రైలర్స్‌తో ప్రేక్షకులు సినిమాపై ఓ అవగాహనకు వస్తారు. లేదంటే... ఓ పెద్ద హిట్ తర్వాత హీరోలు సినిమాలు ఆపేయాలి. ‘బాహుబలి’ తర్వాత ఎలాంటి సినిమా చేయాలనే టెన్షన్ ఎప్పుడూ లేదు. ‘బాహుబలి’ సినిమా తీసినన్ని రోజులూ స్కూల్‌కి వెళ్లినట్టుంది అన్నారు! నిజమే. ఓ సీన్ తీయడానికి 30, 40 లక్షలంట! వన్మోర్ చెబితే... అన్నీ సెట్ చేయడానికి 3, 4 గంటలు పట్టేది. పైగా, ఎంతో లాస్. అందువల్ల, త్వరగా నిద్రలేచి షూటింగ్‌కి వెళ్లాలనుకునేవాణ్ణి. దాంతో స్కూల్‌కి వెళ్లినట్లనిపించింది. ‘మిర్చి’కి నా స్నేహితులే నిర్మాతలు. తొమ్మిదింటికి షూటింగ్‌కి వస్తానని చెప్పొచ్చు. ఒకవేళ రాజమౌళి వింటాడనుకున్నా... నిర్మాతల ఖర్చు చూసి నేనే భయపడేవాణ్ణి. -
వివాదంపై స్పందించిన రాజమౌళి
చెన్నై: కన్నడిగులపై తమిళ నటుడు సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కర్ణాటకలో బాహుబలి-2 సినిమాను అడ్డుకుంటామని ప్రకటించడంపై దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి స్పందించారు. ఈ వివాదాన్ని ఇప్పుడు తెరపైకి తీసుకురావడం సమంజసం కాదని 'ఇండియాటుడే'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 'దాదాపు ఐదేళ్లుగా సత్యరాజ్ తో కలిసి పనిచేస్తున్నా. ఇతరులను బాధ పెట్టేవిధంగా ఆయన నడుచుకోవడం నేనింతవరకు చూడలేదు. ఆయన వ్యాఖ్యలకు సంబంధించి ఇంటర్నెట్ లో పోస్ట్ చేసిన వీడియోల గురించి విచారించాం. అవి తొమ్మిదేళ్ల క్రితం నాటివని తెలిసింది. దీని తర్వాత ఆయన నటించిన 30 సినిమాలు కర్ణాటకలో విడుదలయ్యాయి. బాహుబలి: ది బిగినింగ్ కూడా అందులో ఒకటి. అప్పుడు ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఇప్పుడు హఠాత్తుగా ఈ వివాదాన్ని తెరపైకి తెచ్చారు. ఈ సమయంలో వివాదం చేయడం కరెక్ట్ కాద'ని రాజమౌళి అన్నారు. దగ్గుబాటి రానా మాట్లాడుతూ... 'సత్యరాజ్ 10 ఏళ్ల క్రితం మాట్లాడిన మాటలవి. బాహుబలి మొదటి భాగం కర్ణాటకలో కూడా విడుదలై అందరి అభిమానాన్ని సంపాదించింది. ఘన విజయాన్ని అందుకుంది. వివాదాన్ని మళ్లీ తెరపైకి ప్రచారం పొందాలని కొందరు భావిస్తున్నార'ని అన్నారు. కావేరి నదీ జలాల వివాదం నేపథ్యంలో కన్నడిగులపై సత్యరాజ్ అభ్యంతకర వ్యాఖ్యలు చేశారని, ఆయన క్షమాపణ చెప్పేవరకు బాహుబలి-2 సినిమాను విడుదలకానీయబోమని వటల్ నాగరాజ్ అనే కార్యకర్త హెచ్చరించారు. -
రిలీజ్‌కు ముందే బాహుబలి రికార్డుల వేట
ప్రస్తుతం జాతీయ స్థాయిలో భారీ హైప్ క్రియేట్ చేస్తున్న సౌత్ సినిమా బాహుబలి 2. తొలి భాగం సంచలన విజయం సాధిచటంతో సీక్వల్పై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. అందుకు తగ్గట్టుగా చిత్రయూనిట్ తొలి భాగానికి మించి ఎన్నో అద్భుతాలు ఈ సీక్వల్లో ఉన్నాయంటూ ప్రచారం చేస్తోంది. అంతేకాదు రిలీజ్ విషయంలోనూ ఇండియన్ సినిమా రికార్డ్ లన్నింటినీ చెరిపేసే దిశగా దూసుకుపోతోంది బాహుబలి. ఈ నెల 28న రిలీజ్‌కు రెడీ అవుతున్న బాహుబలి 2ను ఓవర్ సీస్లో భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తారు. గతంలో ఏ ఇండియన్ సినిమాకు చేయని విధంగా 1050 థియేటర్లలో బాహుబలి 2 రిలీజ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫారిన్లో ఉన్న భారతీయులతో పాటు అక్కడి వారు కూడా బాహుబలి సినిమా చూసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే కొన్ని థియేటర్స్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ అయిపోయాయి. అనుకున్న స్థాయిలో ఓవర్ సీస్లో బాహుబలికి థియేటర్స్ దొరికితే, తొలి రోజు కలెక్షన్ల విషయంలో బాలీవుడ్ సినిమాలకు కూడా షాక్ ఇవ్వటం కాయంగా కనిసిస్తోంది. -
మూగ, చెవిటి పాత్రలో స్టార్ హీరోయిన్
ప్రస్తుతం స్టార్ హీరోయిన్లందరూ లేడీ ఓరియంటెడ్ సినిమాల మీద దృష్టిపెడుతున్నారు. అలా కుదరని పక్షంలో ఉన్నంతలో తమ పాత్రతో నటిగా ప్రూవ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అనుష్క, నయనతార లాంటి స్టార్ హీరోయిన్స్ పర్ఫామెన్స్ ఓరియంటెడ్ రోల్స్‌లో సక్సెస్ సాధించగా మిల్కీ బ్యూటీ తమన్నా కూడా అదే ప్రయత్నాల్లో ఉంది. సౌత్ ఇండస్ట్రీలో గ్లామర్ హీరోయిన్గా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న తమన్నా ఇప్పుడు నటిగా ప్రూవ్ చేసుకోవాలని తాపత్రేయపడుతోంది. అందుకే అభినేత్రి సినిమాలో డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. కానీ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోవటంతో తమన్నా కష్టం వృథా అయ్యింది. అయితే తాజాగా మరో ఛాలెంజిగ్ రోల్‌కు ఓకె చెప్పింది ఈ హాట్ బ్యూటీ. ప్రస్తుతం బాహుబలి 2 ప్రమోషన్లో బిజీగా ఉన్న తమన్నా, ఈ పనులన్ని పూర్తయ్యాక, బాలీవుడ్ దర్శకుడు వసు భగ్నాని నిర్మాణంలో ఓ సినిమా చేయనుంది. ఈ సినిమాలో తమన్నా మూగ, చెవిటి అమ్మాయిగా నటిస్తుందట. ఈ సినిమాతో నటిగా తాను అనుకున్న ఇమేజ్ వస్తుందన్న నమ్మకంతో ఉంది తమ్ము. అంతేకాదు మరోసారి ప్రభుదేవా దర్శకత్వంలో నటించేందుకు అంగీకరించానన్న తమన్నా, ఆ సినిమాతో తన క్యారెక్టర్ అభిమానులకు షాక్ ఇస్తుందని తెలిపింది. -
'సాహో' ప్రభాస్..!
త్వరలో బాహుబలి 2తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న ప్రభాస్, తన నెక్ట్స్ సినిమాను కూడా లైన్లో పెట్టాడు. ప్రభాస్‌తో సినిమా చేసేందుకు చాలా కాలంగా ఎదురుచూస్తున్న సుజిత్ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ ఎడ్వంచరస్ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు బాహుబలి ఫ్లేవర్ అద్దే పనిలో పడ్డారు చిత్రయూనిట్. బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న డార్లింగ్, నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను కూడా అదే స్థాయిలో ప్లాన్ చేస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సాహో అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇప్పటికే ఈ టైటిల్‌ను నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ చేయించింది. అంతేకాదు ఈ ప్రాజెక్ట్‌పై మరింత హైప్ క్రియేట్ చేసేందుకు బాహుబలి 2తో పాటు సాహో టీజర్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు, ప్రస్తుతం టీజర్‌కు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. త్వరలోనే ప్రభాస్, సుజిత్‌ల సినిమా టైటిల్ పై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానుంది. -
తొలి రోజే ప్రభాస్ నమ్మాడు: రాజమౌళి
హైదరాబాద్: తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకదిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి ఫ్రాంచైజీలో వస్తున్న సీక్వెల్ మూవీ బాహుబలి-2 కోసం టాలీవుడ్ అభిమానులతో పాటు ఇండస్ట్రీ ప్రముఖులు ఎదురుచూస్తున్నారు. బాహుబలి ప్రాజెక్టు గురించి ఇటీవల ఓ సందర్భంలో రాజమౌళి మాట్లాడుతూ.. తమ హీరో ప్రభాస్ షూటింగ్ మొదలైన తొలిరోజు నుంచే మూవీపై ఎంతో నమ్మకంగా ఉన్నాడని చెప్పారు. మూవీ యూనిట్‌కు ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చిపెడుతుందని ప్రభాస్ అప్పుడే ఊహించాడని అన్నారు. ఆ నమ్మకంతోనే ప్రభాస్ ఎంతో మనసుపెట్టి, తీవ్రంగా శ్రమించడంతో పాటు యూనిట్ అందరికీ ప్రభాస్ ఎంతో స్ఫూర్తిగా నిలిచాడని రాజమౌళి కొనియాడారు. 'బాహుబలి: ది బిగినింగ్' సీక్వెల్ గా తెరకెక్కిన బాహుబలి–2 ఈ నెల 28న రికార్డుస్థాయిలో 6500 థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. త్రిడీలో విడుదల చేయాలని భావించామని, అయితే ఆ స్థాయిలో పిక్సల్స్‌ను క్యాప్చర్ చేయడం కష్టమన్నారు. మూవీకి విజువల్ ఎఫెక్ట్స్ ప్లస్ పాయింట్ అని.. త్రిడీలో అది ప్రభావవంతంగా కనిపించదని నిర్మాత శోభు యార్లగడ్డ కూడా భావించారని మరిన్ని విషయాలను రాజమౌళి వివరించారు. -
వర్చువల్ రియాల్టీలో ప్రీ–రిలీజ్ ఫంక్షన్!
ట్రెయిలర్‌తోనే రికార్డులు సృష్టించిన మెగా మూవీ ‘బాహుబలి–2’ మరో సంచలనానికి తెరతీస్తోంది. ప్రపంచంలోనే తొలిసారిగా ఈ సినిమా ప్రీ–రిలీజ్ ఫంక్షన్‌ను వర్చువల్ రియాల్టీలో ప్రసారం చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ రోజు సాయంత్రం ఈ వేడుక జరగనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని వర్చువల్ రియాల్టీలోనూ ప్రసారం చేసేందుకు సినిమా కంప్యూటర్ గ్రాఫిక్స్‌కు హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్లు అందిస్తున్న సంస్థ ఏఎండీకి చెందిన రేడియాన్ టెక్నాలజీస్ గ్రూప్ అన్ని ఏర్పాట్లు చేసింది. ‘బాహుబలి–2’ నిర్మాణ సమయంలో ఈ సంస్థ రెండు వర్చువల్ రియాల్టీ బిట్లను అభివృద్ధి చేసింది. ‘బీబీ360సీసీ’ పేరుతో అభివృద్ధి చేసిన 32 కెమెరాలున్న సూపర్ వీఆర్ క్యాప్చరింగ్ కెమేరాతో వీటిని చిత్రీకరించింది. ఈ 32 కెమేరాల్లోని దృశ్యాలను సీన్‌గా మార్చేందుకు లూమ్ పేరుతో ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ఒకదాన్ని తయారు చేశారు. ఒకవైపు షూటింగ్ జరుగుతూండగానే.. మరోవైపు ఈ సాఫ్ట్వేర్ వర్చువల్ రియాల్టీ సీన్స్‌ను సిద్ధం చేస్తూంటుంది. ఇలా చిత్రీకరించిన సీన్స్‌ను వీఆర్ హెడ్‌సెట్‌తో చూసినప్పుడు.. ప్రేక్షకుడికి తాను సన్నివేశం మధ్యలో ఉన్న అనుభూతి కలుగుతుంది. అమరేంద్ర బాహుబలి పాత్రలో ప్రభాస్ చేసే యుద్ధ విన్యాసాలు మన పక్కనే జరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. తమ సంస్థ అభివృద్ధి చేసిన గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ (జీపీయూ), బీబీ360సీసీ కెమేరా, లూమ్ సాఫ్ట్వేర్లను కలిపి ఉపయోగించడం ద్వారా అత్యద్భుతమైన నాణ్యతతో వర్చువల్ రియాల్టీ సన్నివేశాలను సిద్ధం చేయవచ్చునని ఏఎండీ అంటోంది. పైగా.. లూమ్ సాఫ్ట్‌వేర్‌ను ఓపెన్ సోర్స్ పద్ధతిలో అభివృద్ధి చేసినందున.. దీన్ని ఎవరైనా వాడుకునే వీలుంటుందని సంస్థ ఉన్నతాధికారి రాజా కోడూరి తెలిపారు. ‘బాహుబలి’ కోసం తాము వీఆర్‌లో రెండు సీన్స్ సిద్ధం చేశామని, దీంట్లో ఒకటి బాహుబలి సెట్స్‌కు సంబంధించినది కాగా, రెండోది ‘ది స్వోర్డ్ ఆఫ్ బాహుబలి’ అని ఆయన చెప్పారు. బాహుబలి సెట్స్ తాలూకు వీఆర్ క్లిప్‌ను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసే ప్రత్యేకమైన పాడ్స్లలో ప్రేక్షకులకు ఉచితంగా ప్రదర్శించనున్నారు. -
బాహుబలి 2 ట్రైలర్‌పై ఆసక్తికర విషయాలు
-
బాహుబలికి అంబాని సాయం నిజమేనా..?
భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాహుబలి 2 ట్రైలర్ చరిత్రకు తిరగరాస్తూ రికార్డ్ వ్యూస్ సాధించిన సంగతి తెలిసిందే. మరే భారతీయ సినిమాకు సాధ్యం కానీ స్థాయిలో 24 గంటల్లో 50 మిలియన్ల( 5 కోట్ల)కు పైగా వ్యూస్ సాధించి సరికొత్త రికార్డ్ సృష్టించింది ఈ సినిమా. అంతేకాదు లైక్స్ విషయంలో అంతర్జాతీయ చిత్రాలకు బిగ్ టార్గెట్‌ను సెట్ చేసింది. ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యధిక లైక్స్ సాధించిన 'అవెంజర్స్ : ఏజ్ ఆఫ్ అల్ట్రాన్స్' మించి పోయింది బాహుబలి. అవెంజర్స్‌కు 5 లక్షల 16 వేల లైక్స్ వచ్చాయి. బాహుబలి 2 ట్రైలర్ కేవలం 24 గంటల్లోనే ఈ రికార్డ్‌ను బ్రేక్ చేసింది. వ్యూస్ పరంగా అవెంజర్స్‌ను బీట్ చేయలేకపోయినా.. 5 లక్షల 57 వేలకు పైగా లైక్స్ సాధించి హాలీవుడ్ సినిమాలకు సవాల్ విసిరింది. అయితే బాహుబలి ఇంతటి భారీ రికార్డ్‌లు సాధించటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన మొబైల్ నెట్వర్క్ సంస్థ జియో, ఫ్రీ ఆఫర్ కారణంగానే బాహుబలికి ఈ రికార్డ్ సాధ్యమయ్యిందన్న ప్రచారం జరుగుతోంది. ఈ ఫ్రీ ఆఫర్ ఈ నెలాఖరున ముగుస్తుండటంతో ఇక పై రాబోయే చిత్రాల టీజర్లు. ట్రైలర్లకు ఈ రికార్డ్‌లు సాధ్యం కాకపోవచ్చని భావిస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన బాహుబలి తెలుగు ట్రైలర్ ను ఇప్పటి వరకు రెండున్నర కోట్ల మందికి పైగా వీక్షించారు. -
'బాహుబలి దెబ్బకు ఆత్మహత్య చేసుకుంటారేమో'
ఎప్పుడూ ఎవరినో ఒకర్ని టార్గెట్ చేసి వివాదాస్పద ట్వీట్లు చేసే రామ్ గోపాల్ వర్మ మరోసారి స్పీడు పెంచాడు. గురువారం బాహుబలి 2 ట్రైలర్ రిలీజ్ అయిన నేపథ్యంలో మరోసారి తన ట్వీట్లకు పని చెప్పాడు. ముందుగా ఈ ట్రైలర్‌ను ఆకాశానికి ఎత్తేసిన వర్మ, రాజమౌళితో పాటు ఇతర యూనిట్ సభ్యులపై ప్రశంసల వర్షం కరిపించాడు. అదే సమయంలో టాలీవుడ్ టాప్ స్టార్లను టార్గెట్ చేస్తూ తనదైన స్టైల్లో విమర్శలు చేశాడు. తాజాగా బాహుబలి 2 ట్రైలర్ 50 మిలియన్ల( 5 కోట్ల) వ్యూస్ సాధించిన సందర్భంగా 'ఈ ఫిగర్‌ని చూసి టాలీవుడ్లో ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటారో అని భయంగా ఉంది' అంటూ ట్వీట్ చేశాడు. గురువారం ఉదయం రిలీజ్ చేసిన బాహుబలి ట్రైలర్ 24 గంటల్లోనే 50 మిలియన్ వ్యూస్‌కు పైగా సాధించింది. ఈ ఘనత సాదించిన తొలి భారతీయ చిత్రం ఇదే కావటం విశేషం. ఇప్పటికే బాహుబలి రెండో భాగం మీద అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఆ అంచనాలు మరింత పెంచేందుకు యూనిట్ సభ్యులు ప్రయత్నిస్తున్నారు. అందుకే రెండో భాగం రిలీజ్‌కు వారం రోజుల ముందు బాహుబలి తొలి భాగాన్ని మరోసారి థియేటర్లలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 600 కోట్ల వరకు కలెక్షన్లు సాధించిన బాహుబలి రీ రిలీజ్లో మరెన్ని సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి. Ee figureni choosi Tollywood lo yenthamandhi aatma hatya chesukuntaro ani bhayamgaa vundhi😟 pic.twitter.com/PVa3owezUh — Ram Gopal Varma (@RGVzoomin) 17 March 2017 -
దేశం మీసం తిప్పుతుందా?
-
ఆరు గంటల్లో కోటి వ్యూస్..!
బాహుబలి 2 ట్రైలర్ రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే చరిత్ర సృష్టించింది. మరే సినిమాకు సాధ్యం కాని స్థాయిలో విడుదలైన ఆరు గంటల వ్యవధిలోనే కోటి వ్యూస్ సాధించి సరికొత్త రికార్డ్ సృష్టించింది. భారతీయ సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బాహుబలి 2 ట్రైలర్ గురువారం ఉదయం తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అయ్యింది. ట్రైలర్ రిలీజ్ అయిన ఆరు గంటల్లోనే అన్ని భాషల్లో కలిపి కోటికి పైగా వ్యూస్ సాధించి రికార్డ్ సృష్టించింది. తొలి భాగం ఘనవిజయం సాధించిన నేపథ్యంలో రెండో భాగం ఎలా ఉండబోతోందో అని అభిమానులతో పాటు సినీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అభిమానుల అంచనాలను మరింత పెంచుతూ బాహుబలి 2, ఓ విజువల్ వండర్లా తెరకెక్కింది. భారీ యుద్ధ సన్నివేశాలతో పాటు రాజమౌళి మార్క్ ఎమోషనల్ సీన్స్, కీరవాణి స్టైల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. ఇలా అన్ని కలిసి ఈ ట్రైలర్ స్థాయిని మరింత పెంచాయి. పలువురు సినీ ప్రముఖులు ట్రైలర్ అద్భుతం అంటూ కీర్తించటం కూడా బాహుబలి రికార్డ్లను తిరగరాసేందుకు హెల్ప్ అయ్యింది. ఈ నెల 25న బాహుబలి 2 ఆడియో రిలీజ్ అవుతుండగా.. ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ అవుతోంది. -
'మీ నాడి వేగం పెరుగుతుంది.. ఊపిరి ఆగిపోతుంది'
జాతీయ స్ధాయిలో భారీ హైప్ క్రియేట్ చేసిన బాహుబలి 2 ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే పోస్టర్స్, టీజర్‌తో అంచనాలను పెంచేసిన బాహుబలి టీం.. ట్రైలర్‌తో మరోసారి ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ను పీక్స్‌కు తీసుకెళ్లింది. గురువారం రిలీజ్ అయిన బాహుబలి 2 ట్రైలర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా ఇంతటి భారీ చిత్రాన్ని తెరకెక్కించిన రాజమౌళిని ఇండస్ట్రీ ప్రముఖులు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. పలువురు టాలీవుడ్ స్టార్స్ ట్విట్టర్ ద్వారా తమ అనుభూతిని పంచుకున్నారు. రాజమౌళితో హ్యట్రిక్ సినిమాలు చేసిన ఎన్టీఆర్ 'గతంలో ఎప్పుడు తెలియని అనుభవం. మీ నాడి వేగం పెరుగుతుంది. ఊపిరి ఆగిపోతుంది. కన్ను రెప్ప కూడా వేయలేరు. కుద్దూస్ జక్కన్న' అంటూ ట్వీట్ చేశాడు. ఎన్టీఆర్ అన్న, హీరో కళ్యాణ్ రామ్ 'రోమాలు నిక్కబొడుచుకోవటం గ్యారెంటీ. బాహుబలి 2 ట్రైలర్ అవుట్ స్టాండింగ్. ప్రభాస్, రానా, రాజమౌళి గారికి శుభాకాంక్షలు' అంటూ ట్వీట్ చేశాడు. మరో హీరో అల్లరి నరేష్ కూడా బాహుబలి ట్రైలర్‌పై స్పందించాడు.'ఇది నిజంగా అద్భుతం, రాజమౌళి, శోభు, ప్రభాస్, రానా, ఆర్కా మీడియా వర్క్ ఇతర యూనిట్ సభ్యులకు హ్యాట్స్ ఆఫ్' అని ట్వీట్ చేశాడు. గాయని స్మిత ఓ ఆంగ్ల సామెతతోబాహుబలి ట్రైలర్ తెలుగు సినీ ప్రముఖుల గౌరవాన్ని పెంచే, ఇతర సినీరంగాల వారు అసూయ చెందే అద్భుతం అంటూ ట్వీట్ చేసింది. హీరోయిన్ సమంత, హీరోలు రామ్, సందీప్ కిషన్, వెన్నెల కిశోర్ లాంటి ఇతర సినీ ప్రముఖులు బాహుబలి ట్రైలర్ పై స్పందించారు. బాహుబలి సినిమాకు పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు కూడా ట్రైలర్ పై తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. An experience unlike any other.your pulse races your breath stops and you can't stop staring.kudos Jakkana @ssrajamouli #Baahubali2trailer — tarakaram n (@tarak9999) 16 March 2017 Selfie with @ssrajamouli @Shobu_ @RanaDaggubati #Prasad and Team at the Trailer launch. #Baahubali2Trailer pic.twitter.com/47diapZOlp — KK Senthil Kumar (@DOPSenthilKumar) 16 March 2017 #Baahubali2trailer is truly king size!Hats off to the genius @ssrajamouli & team @Shobu_ Prabhas @RanaDaggubati @arkamediaworks — Allari Naresh (@allarinaresh) 16 March 2017 A trailer that guarantees goosebumps. #Baahubali2trailer is outstanding. Congratulations Prabhas, @RanaDaggubati, @ssrajamouli garu and team — Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) 16 March 2017 -
బాహుబలి-2:ఆరు గంటల్లో కోటి వ్యూస్..!
-
బాహుబలి 2 ట్రైలర్ వచ్చేసింది
సగటు తెలుగు సినిమా ప్రేక్షకుడు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బాహుబలి 2 ది కంక్లూజన్ ట్రైలర్ వచ్చేసింది. తెలుగు, తమిళం, హిందీ, మళయాళం భాషల్లో బాహుబలి 2 ది కంక్లూజన్ ట్రైలర్లు విడుదలయ్యాయి. మొదట ఒక నిమిషం 52 సెకన్ల నిడివి కలిగిన తమిళ ట్రైలర్ ఆన్లైన్లో బయటకొచ్చింది. ఆ తర్వాత రెండు నిమిషాల 24 సెకన్ల నిడివి కలిగిన హిందీ ట్రైలర్‌ను కరణ్ జోహర్ ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. గురువారం ఉదయం సినీమ్యాక్స్‌లో తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ విడుదల కార్యక్రమానికి ప్రభాస్, రానాలు హాజరయ్యారు. సినిమాపై ఉన్న అంచనాలను నిజం చేస్తూ మైండ్ బ్లోయింగ్ వీఎఫ్ఎక్స్తో ట్రైలర్ రూపుదిద్దుకుంది. రమ్యకృష్ణ కాలిని ఎవరో తాకుతున్నట్లు మొదలైన తమిళ ట్రైలర్.. బాహుబలిని కట్టప్ప పొడిచి చంపడం.. లాంటి ఉత్కంఠ భరిత సీన్లతో ముందుకు సాగింది. అయితే, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్నను పొడిగిస్తూ.. ప్రశ్నార్ధకంగానే ఉంచేశారు. బాహుబలి-2లో ప్రభాస్, రానాలు ఈ సినిమాలో హీరో, విలన్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే. అనుష్క, తమన్నాలు హీరోయిన్లు. ఆర్కా మీడియా వర్క్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. సత్యరాజ్, రమ్యకృష్ణ, నాజర్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు ట్రైలర్ The most awaited "Baahubali2 - The Conclusion" Trailer is finally out! #Baahubali2Trailerhttps://t.co/KrGFW0rq3g — Baahubali (@BaahubaliMovie) March 16, 2017 తమిళం ట్రైలర్ #Baahubali2trailer mind blowing vfx... Just Wainting to see pic.twitter.com/xvPWiC9DD5 — Shivajisajiv (@shivajisajiv2) March 16, 2017 హిందీ ట్రైలర్ #Baahubali2Trailer https://t.co/53YkDNxqkh @ssrajamouli #Arka #AAFilms @dharmamovies #Prabhas @RanaDaggubati — Karan Johar (@karanjohar) March 16, 2017 -
2 నిమిషాల 20 సెకన్ల అద్భుతం
తెలుగు తెర మీద ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న బాహుబలి 2కు కౌంట్ డౌన్ మొదలైంది. వరుస పోస్టర్లతో సందడి చేస్తున్న బాహుబలి టీం గురువారం ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్.. ట్రైలర్ మీద అంచనాలను తారా స్థాయికి తీసుకెళ్లింది. దీంతో ఫుల్ ట్రైలర్ కోసం అభిమానులు, సినీ వర్గాలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ ట్రైలర్ ను దాదాపు 300ల థియేటర్లలో ప్రదర్శించేందుకు చిత్రయూనిట్ ఏర్పాట్లు చేస్తోంది. అభిమానుల అంచనాలను మరింత పెంచేస్తూ.. బాహుబలి 2కు సంబంధించి మరో అప్ డేట్ అభిమానులను ఖుషీ చేస్తోంది. సాధారణంగా తెలుగు సినిమాకు ఒక నిమిషం నుంచి ఒకటిన్నర నిమిషం లెంగ్త్ ఉండే ట్రైలర్లను రిలీజ్ చేస్తుంటారు. కానీ బాహుబలి 2 మాత్రం అభిమానులకు మరింత వినోదాన్ని పంచనుంది. అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ట్రైలర్‌ను కూడా అదే స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. హాలీవుడ్ సినిమాల తరహాలో 2 నిమిషాల 20 సెకన్లు ఉండేలా ట్రైలర్‌ను డిజైన్ చేశారు. ఇప్పటికే ట్రైలర్‌కు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. బోర్డ్ సభ్యులు ఈ ట్రైలర్ కు యుఎ సర్టిఫికేట్ జారీ చేశారు. సినిమా గ్రాండియర్‌తో పాటు క్యారెక్టర్స్, పోరాట సన్నివేశాలు ఇలా అన్ని అంశాలకు సంబంధించిన హింట్స్‌ను ట్రైలర్లో పొందుపరిచారన్న టాక్ వినిపిస్తోంది. ముంబైలో జరిగే భారీ ఈవెంట్లో హిందీ ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారు. అలాగే గురువారం ఉదయం తెలుగు రాష్ట్రాల్లోని ఎంపిక చేసిన థియేటర్లలో బాహుబలి 2 ట్రైలర్‌ను ప్రదర్శిస్తున్నారు. యూట్యూబ్‌లో బాహుబలి 2 ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు మాత్రం గురువారం సాయంత్రం వరకు ఎదురుచూడాల్సిందే. -
బాహుబలి-2 ట్రైలర్ పీక్ సీన్ వచ్చేసింది
-
బాహుబలి-2 ట్రైలర్ పీక్ సీన్ వచ్చేసింది
చెన్నై: బాహుబలి-2 సునామీ షురూ అయింది. ఫస్ట్‌లుక్, మోషన్ పిక్చర్స్, విజువల్ ఎఫెక్ట్స్ విశేషాలతో ఇప్పటికే బాహుబలిని మించిన స్థాయిలో బాహుబలి-2కి ప్రచారం ప్రారంభించిన చిత్ర యూనిట్ తాజాగా మరోసారి ప్రేక్షకుల ఆసక్తిని పీక్ స్టేజ్‌కు తీసుకెళ్లింది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ గురువారం విడుదల కానుండగా అప్పటి వరకు వెయిట్ చేయడం తమ వల్లకాదు అని ప్రేక్షకుడు అనుకునేంత రేంజ్లో ట్రైలర్‌లోని ప్రభాస్‌పై ఉన్న చిన్న నిడివి సీన్‌ను విడుదల చేసింది. ఈ ట్రైలర్లో తాజాగా విడుదల చేసిన ఈ బిట్ సీన్ ఉత్తాన దశదని చెప్పుకోవచ్చంట. నిజానికి అది ఉండటం కూడా అలాగే ఉంది. తల నుంచి రక్తం కారుతుండగా రౌద్ర రూపంతో ఉన్న ప్రభాస్ కళ్లు ఎర్రజేసి శత్రువువైపుగా చూస్తున్నట్లుగా ఉన్న ఆ వీడియో చూస్తుంటే నిజంగానే ట్రైలర్కోసం ఏ మాత్రం వెయిట్ చేయబోమని అనుకునే అవకాశం లేకపోలేదు. బాహుబలి-2 ట్రైలర్ అధికారికంగా ఈ గురువారం (మార్చి-16)న విడుదలవుతున్న విషయం తెలిసిందే. -
మార్చి 16న బాహుబలి 2 ట్రైలర్ రిలీజ్
-
అఫీషియల్ : మార్చి 16న బాహుబలి 2 ట్రైలర్ రిలీజ్
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న భారీ విజువల్ వండర్ బాహుబలి 2. ఇప్పటికే తొలి భాగంతో ఇండస్ట్రీ రికార్డ్లను తిరగరాసిన బాహుబలి 2తో మరోసారి బాక్సాఫీస్ మీదకు దండెత్తుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ మధ్యే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన బాహుబలి టీం ట్రైలర్ లాంచ్‌తో సినిమా మీద అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. తొలి భాగం కన్నా భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ కోసం సినీ అభిమానులతో పాటు ఇండస్ట్రీ ప్రముఖులు కూడా ఎదురుచూస్తున్నారు. ఇంత హైప్ క్రియేట్ చేస్తున్న బాహుబలి 2 ట్రైలర్ రిలీజ్‌కు ముహుర్తం ఫిక్స్ అయ్యింది. మార్చి 16న సెలెక్ట్ చేసిన కొన్ని థియేటర్స్‌లో ఉదయం 9 గంటలకు బాహుబలి 2 ట్రైలర్‌ను ప్రదర్శించనున్నారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు యూట్యూబ్‌లో రిలీజ్ చేయనున్నారు. బాహుబలి 2 ట్రైలర్ ఇప్పటి వరకు ఉన్న యూట్యూబ్ రికార్డ్స్ అన్నింటినీ చెరిపేస్తుందన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. -
బాహుబలి 2లో శరద్ కేల్కర్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటుడు శరద్ కేల్కర్. ఈ సినిమా ఫ్లాప్ అయిన శరద్ లుక్ కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఈ హ్యాండ్సమ్ విలన్ మరోసారి టాలీవుడ్ న్యూస్ లో ప్రముఖంగా వినిపిస్తున్నాడు. ప్రతీ దక్షిణాది నటుడు చిన్న అవకాశం దొరికినా చాలు అని ఎదురుచూస్తున్న బాహుబలి సినిమాలో భాగం పంచుకున్నాడు శరద్. అయితే బాహుబలి శరద్ నటుడిగా కనిపించటం లేదు. బాహుబలి హిందీ వర్షన్ తొలి భాగంలో ప్రభాస్ పాత్రకు డబ్బింగ్ చెప్పిన శరద్ తాజాగా బాహుబలి 2 ట్రైలర్ లో ప్రభాస్ కు డబ్బింగ్ పూర్తి చేశాడు. ఈ సందర్భంగా రాజమౌళితో కలిసి దిగిన ఫోటోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన శరద్ కేల్కర్, ' బాహుబలి సినిమాకు పనిచేయటం గౌరవంగా ఫీల్ అవుతున్నా.. రాజమౌళి గారికి కృతజ్ఞతలు. ట్రైలర్ త్వరలోనే వస్తోంది' అంటూ ట్వీట్ చేశాడు. Honoured to be a part of #BaahubaliTheConclusion. Thank u @ssrajamouli sir. Trailer coming soon. #VoiceOfBaahubali @karanjohar @DharmaMovies pic.twitter.com/BCR6sXtJzi — Sharad Kelkar (@SharadK7) 9 March 2017 -
భాగమతి రిలీజ్ వాయిదా..?
టాలీవుడ్లో లేడీ సూపర్ స్టార్‌గా ఎదుగుతున్న యోగా బ్యూటి అనుష్క నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ సినిమా భాగమతి. హర్రర్ జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుష్క టైటిల్ రోల్లో నటిస్తోంది. పిల్ల జమీందార్ ఫేం అశోక్ దర్శకత్వంతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ సినిమాను ముందుగా అనుకున్న సమయం కన్నా ఆలస్యంగా రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. ఈ సినిమాను మే నెలలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే తాజాగా అనుష్క కోరిక మేరకు సినిమాను ఆగస్టు రెండు వారంలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల అనుష్క కీలక పాత్రల్లో నటించిన సింగం 3, ఓం నమో వేంకటేశాయ సినిమాలు వెంట వెంటనే రిలీజ్ అయి ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. ఈ నేపథ్యంలో బాహుబలి 2 రిలీజ్ అయిన వెంటనే భాగమతి రిలీజ్ అయితే బాహుబలి ఎఫెక్ట్ భాగమతి మీదపడుతుందని భావిస్తుందట స్వీటి. అందుకే ఆ సినిమాను రెండు నెలలు వాయిదా వేయాలని కోరింది. అనుష్క కోరికను మన్నించి భాగమతి టీం స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా భాగమతిని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
బాహుబలి 2 ట్రైలర్ రెడీ అయ్యిందోచ్
సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బాహుబలి 2 ట్రైలర్ త్వరలోనే రిలీజ్ కానుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేస్తామంటూ ప్రకటించిన రాజమౌళి ఆ దిశగా అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రెడీ అయిపోయిన ట్రైలర్ ను ఫైనల్ గా తెరపై ఎలా ఉందో పరీక్షిస్తున్నారు. ఈ విషయన్నా చిత్ర సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ ట్రైలర్ కు తుదిమెరుగులు దిద్దుతున్నారు. ఈ సందర్భంగా తెరపై ట్రైలర్ ఎలా ఉందో పరీక్షిస్తున్న సమయంలో తీసిన ఓ ఫోటోను తన ట్విట్టర్ పేజ్ లో పోస్ట్ చేశాడు సెంథిల్. 'అన్నపూర్ణ స్టూడియోస్ లో బాహుబలి 2 ట్రైలర్ పై వర్క్ చేస్తున్నాము. సీవీ రావ్, శివకుమార్ లతో కలిసి తెర అంతా సరిగా వస్తుందో లేదో పరీక్షిస్తున్నాము' అంటూ కామెంట్ చేశాడు. అంటే మరో వారం, పదిరోజుల్లో బాహుబలి 2 ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చే చాన్స్ ఉంది. At#AnnapurnaStudios Working on Trailer of #Baahubali2 Making sure Everything is Fine with the Screen Calibration, With #CVRao & #ShivaKumar pic.twitter.com/BsvKlOO6Js— KK Senthil Kumar (@DOPSenthilKumar) 2 March 2017 -
బాహుబలి 2 ఆడియో రిలీజ్‌కు భారీ ప్లాన్స్
నేషనల్ లెవల్లో భారీ హైప్ క్రియేట్ చేస్తున్న బాహుబలి 2 సినిమా రిలీజ్‌కు కౌంట్ డౌన్ మొదలైంది. ఇప్పటికే ఫస్ట్ లుక్‌తో ఆకట్టుకున్న జక్కన్న టీం త్వరలోనే థియట్రికల్ ట్రైలర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తోంది. అదే సమయంలో ఆడియో రిలీజ్‌ను భారీ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తతోంది. తొలి భాగం రిలీజ్ సమయంలో ఆడియో విడుదల వేడుకకు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. దీంతో రెండో భాగం విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. ఉగాది రోజున భారీ ఎత్తున నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్న ఈ వేడుకను రామోజీ ఫిలిం సిటీలోనే మాహిష్మతి సెట్ దగ్గర నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారు. అది కుదరని పక్షంలో ఫిలిం సిటీలోనే మరోప్రాంతంలో ఆడియో వేడుకను నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆడియో విడుదలకు కావాల్సి ఏర్పాట్లు కూడా ప్రారంభించారన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న బాహుబలి 2 ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. -
అనుష్క లుక్‌పై రాజమౌళి క్లారిటీ
-
అనుష్క లుక్‌పై రాజమౌళి క్లారిటీ
బాహుబలి 2 రిలీజ్ టైం దగ్గర పడుతుండటంతో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న ప్రశ్నతో పాటు మరో ప్రశ్న కూడా అభిమానులను వేదిస్తోంది. ఇటీవల బొద్దుగుమ్మగా మారిన యోగా బ్యూటి అనుష్కను రాజమౌళి ఈ సినిమాలో ఎలా చూపించబోతున్నాడో అని అభిమానులు కంగారు పడుతున్నారు. బాహుబలి తొలి భాగంలో అనుష్క పాత్ర చాలా చిన్నది. ఆ కాస్త సేపు కూడా డీ గ్లామర్ రోల్లో కనిపించటంతో అనుష్క గ్లామరస్ లుక్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ ఇటీవల విడుదలైన సింగం 3, ఓం నమో వేంకటేశాయ సినిమాల రిలీజ్ తరువాత అభిమానుల్లో కంగారు మొదలైంది. బాహుబలి సినిమాలో అనుష్క రాణీగా కనిపించాల్సి ఉంది. కానీ ఇప్పుడున్న లుక్‌లో రాణీగా చూపిస్తే ఎలా ఉంటుంది. అదే సమయంలో కొన్ని పోరాట సన్నివేశాల్లో కూడా కనిపించనుండటంతో అనుష్క పాత్ర సినిమాకు మైనస్ అవుతుందేమో అన్న అనుమానం ఏర్పడింది. అయితే బాహుబలి 2లో అనుష్క లుక్‌పై రాజమౌళి క్లారిటీ ఇచ్చాడు. శివరాత్రి సందర్భంగా ఇచ్చిన ప్రత్యేక ఇంటర్య్వూలో సినిమా విశేషాలను పంచుకున్నాడు జక్కన్న. రెండో భాగంలో అనుష్క కనిపించే సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ ఎప్పుడో అయిపోయిందట. ఇటీవల జరిగిన షూటింగ్లో కొన్ని షాట్స్ మాత్రమే చిత్రీకరించామన్న రాజమౌళి, అనుష్క లుక్ ఫస్ట్ లుక్‌లో కనిపించినంత గ్లామరస్ గానే ఉంటుందని హామీ ఇచ్చాడు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ఏప్రిల్ 28న రిలీజ్ చేసేందుకు ప్లాన్ అవుతున్నారు.