bangalore
-
యూట్యూబ్ చూసి నేర్చుకున్నా: రన్యా రావు
బెంగళూరు: దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన కన్నడ నటి రన్యా రావు కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే రావు బెయిల్ అర్జీపై తీర్పును బెంగళూరులోని ఆర్థిక నేరాల విభాగం ప్రత్యేక కోర్టు 14వ తేదీకి రిజర్వు చేసింది. ఇక రన్యా బంగారం దందాలో కొత్త కొత్త సంగతులు వెలుగులోకి వస్తున్నాయి.తాజాగా ఈ కేసులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు ఆమెను కస్టడీకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. విచారణ సందర్భంగా ఆమె పలు విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. విచారణలో రన్యా రావు..‘దుబాయ్ నుంచి ఇంతకుముందు ఎప్పుడూ బంగారాన్ని అక్రమంగా తీసుకురాలేదు. స్మగ్లింగ్ చేయడం ఇదే మొదటిసారి. ఎవరికీ కనబడకుండా బంగారాన్ని ఎలా దాచాలన్నది యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నా’ అంటూ అధికారులకు చెప్పినట్లు సమాచారం.ఇదిలా ఉండగా.. రన్యా రావు బంగారు స్మగ్లింగ్ కేసులో రాష్ట్ర పోలీసులు అధికారాలను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై సీఐడీ దర్యాప్తునకు అనుమతిస్తూ జారీ చేసిన ఉత్తర్వును కర్ణాటక ప్రభుత్వం బుధవారం ఉపసంహరించుకుంది. అయితే, కర్ణాటక ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి గౌరవ్ గుప్తా నేతృత్వంలో రన్యా రావు తండ్రి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) కె రామచంద్రరావు పాత్రపై దర్యాప్తు కొనసాగుతుందని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.తరుణ్ మాస్టర్ మైండ్ దుబాయ్‌లో బంగారం కొనుగోలు చేయడం, తిరిగి రావడం ఎలా అనే అన్ని వివరాలను నటి రన్య స్నేహితుడు, పారిశ్రామికవేత్త కుమారుడు తరుణ్‌రాజు మార్గదర్శకం చేసినట్లు డీఆర్ఐ అధికారుల విచారణలో వెలుగుచూసింది. పట్టుబడిన తరుణ్‌రాజును విచారిస్తున్నారు. దుబాయ్‌కు వెళ్లే రన్యాతో నిరంతరం సంప్రదించేవాడు. అతడు చెప్పినట్లు ఆమె నడుచుకునేది. విదేశాల నుంచి బంగారం తీసుకొచ్చే కొరియర్‌గా ఆమెను వాడుకున్నాడని డీఆర్ఐ భావిస్తోంది. ఇద్దరినీ ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారణ జరిపారు. కొన్నేళ్లుగా రన్యారావుతో తరుణ్‌రాజు ఆత్మీయంగా ఉంటున్నాడు. అతనికి దుబాయ్‌లో కొందరు పారిశ్రామికవేత్తలు బాగా తెలుసు. భారీగా ధన సంపాదన ఆశతో బంగారం స్మగ్లింగ్‌లో నిమగ్నమయ్యాడు. అతనిని ఐదురోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారణ చేపట్టారు. ఇందులో రన్యా స్నేహితుల పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది.సమగ్ర విచారణ జరగాలి: మంత్రి లక్ష్మి నటి రన్యా రావు బంగారం కేసును సమగ్రంగా దర్యాప్తు చేస్తేనే నిజానిజాలు వెలుగులోకి వస్తాయని మహిళా శిశు సంక్షేమ మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ తెలిపారు. ఈ కేసులో ఓ ప్రముఖ మంత్రి హస్తం ఉందనే ఆరోపణలపై బుధవారం విధానసౌధలో విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. కేసు పూర్తి స్థాయిలో విచారణ జరగాలన్నారు. గ్యారంటీ పథకాలను కమిటీల గొడవపై స్పందిస్తూ ఆ కమిటీలను రద్దుచేయాలని ప్రతిపక్షాలు చేపట్టిన ధర్నాకు అర్థం లేదన్నారు. తమ పథకాలను పోలిన స్కీములను అమలు చేసిన కొన్ని బీజేపీ ప్రభుత్వాలు రెండు నెలల తరువాత రద్దు చేశాయని ఆరోపించారు. -
తుంగభద్ర కాలువ వద్ద దారుణం.. అర్ధరాత్రి టూరిస్ట్ మహిళపై..
బెంగళూరు: కర్ణాటకలో అమానుష ఘటన చోటుచేసుకుంది. మన దేశానికి అపఖ్యాతి మూటగట్టుకునే విధంగా కొందరు మూకలు దారుణానికి ఒడిగట్టారు. భారత పర్యటనకు వచ్చిన ఇజ్రాయెల్ యువతి, మరో మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన బెంగళూరుకు 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొప్పల్‌లో చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఇద్దరు మహిళల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం వారికి ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది.వివరాల ప్రకారం.. కొప్పల్‌కు చెందిన మహిళ(29) పర్యాటకుల కోసం హోమ్ స్టే నిర్వహిస్తోంది. విదేశాల నుంచి వచ్చే టూరిస్టులకు తన ఇంట్లో ఆశ్రయం ఇస్తూ ఆదాయం పొందుతోంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఇజ్రాయెల్ నుంచి ఓ మహిళ, అమెరికా నుంచి వచ్చిన డేనియల్ సహా మరో ఇద్దరికి ఆశ్రయం కల్పించింది. దీంతో, వారంతా ఆమె ఇంట్లోనే ఉంటున్నారు. అయితే, గురువారం వారంతా డిన్నర్ చేసిన అనంతరం బయటకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు.Israeli Tourist, Homestay Owner Gang-Raped While Stargazing In Karnataka pic.twitter.com/DbtuOlGuxp— NDTV (@ndtv) March 8, 2025అనంతరం, సోనాపూర్ సమీపంలోని తుంగభద్ర కెనాల్ ఒడ్డుకు వెళ్లాలని నిర్ణయించారు. దీంతో, వారంతా గురువారం రాత్రి 11:30 గంటల సమయంలో తుంగభద్ర కాలువ వద్దకు వెళ్లారు. కాలువ ఒడ్డున కూర్చుని నక్షత్రాలను చూస్తూ మాట్లాడుకుంటుండగా గుర్తు తెలియని వ్యక్తులు కొందరు అక్కడికి వచ్చి వారిపై దాడి చేశారు. టూరిస్టులలోని ముగ్గురు మగవాళ్లను కాలువలోకి తోసేసి, ఇజ్రాయెల్ పౌరురాలితో పాటు హోమ్ స్టే యజమానిపై అత్యాచారం చేసి పారిపోయారు. కాలువలో పడ్డ డేనియల్, మహారాష్ట్రకు చెందిన పంకజ్ బయటకు రాగా, ఒడిశాకు చెందిన బిబాష్ జాడ మాత్రం తెలియరాలేదు. ఈ క్రమంలో టూరిస్టులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరు యువతులను ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు స్పష్టం చేశారు. -
జుట్టు దొంగలు
బెంగళూరు: రాత్రిళ్లు వజ్రాభరణాల దుకాణాలు, ఏటీఎంలను కొల్లగొట్టి దొంగలు కోట్ల విలువైన నగదు, బంగారాన్ని కొట్టేసే ఘటనలు రోజు ఏదో ఒక రాష్ట్రంలో చూస్తున్నే ఉన్నాం. కానీ ఈసారి కొందరు దొంగలు తమ చోరకళలో వైవిధ్యం ప్రదర్శించారు. బంగారం కొట్టేస్తే దానిని నగదుగా, ఒక వేళ నగదును కొట్టేస్తే నేరుగా వాడుకునే వెసులుబాటు దొంగలకు ఉంది. కానీ చోరీ చేసిన దానిని వెంటనే నగదుగా వాడుకునే అవకాశం లేకపోయినా సరే కొందరు దొంగలు జుట్టుపై కన్నేశారు. జుట్టుపై అంటే వ్యక్తుల తలపై ఉండే జుట్టుపై కాదు. అప్పటికే మొక్కు రూపంలోనో, మరేదైనా కారణంగానో తలనీలాలను కత్తిరించగా వాటిని సేకరించిన ఓ వ్యాపారి తన గిడ్డంగిలో భద్రపరిచగా దానిని దొంగలు చోరీచేసి ఎత్తుకుపోయారు. కిలోల కొద్దీ జుట్టును చోరశిఖామణులు కొట్టేసిన ఘటన కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది. దాదాపు రూ.90 లక్షల నుంచి రూ.1 కోటి విలువైన జుట్టును కొట్టేసిన వార్త తెలిసి ఆ గోడౌన్ యజమాని లబోదిబోమని ఏడ్వడంతో జుట్టు దోపిడీ వార్త ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చోరీ విషయం తెల్సి పోలీసులు భారతీయ న్యాయసంహిత చట్టాల కింద కేసు నమోదుచేసి దర్యాప్తు మొదలెట్టారు. తెలిసిన వ్యక్తుల పనేనా? కోటి విలువైన సరుకు ఉందన్న పక్కా సమాచారంతోనే దొంగలు చోరీకి తెగబడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల చైనా నుంచి వచి్చన ఒక వ్యాపారి ఈ జుట్టును సరిచూసుకుని మార్కింగ్ వేసి మరీ వెళ్లారని యజమాని వెంకటస్వామి పోలీసులకు చెప్పారు. ఫిబ్రవరి 28 అర్ధరాత్రి పెద్దకారులో వచ్చిన ఆరుగురు దొంగలు వెంట తెచ్చుకున్న ఇనుపరాడ్లతో గోడౌన్ షట్టర్‌ను పగలగొట్టి తెరచి 27 సంచులను ఒక్కోటి ఎత్తుకెళ్లడం మొదలెట్టారు. ఇది గమనించిన సమీపంలోని ఓ వ్యక్తి ఆరాతీయగా ‘‘ఈ సరుకుంతా మాదే. వేరే చోటుకు తరలిస్తున్నాం’’అని దొంగలు తెలుగులో ఏమాత్రం అనుమానంరాని రీతిలో అతనికి చెప్పారని పోలీసులు తెలిపారు. హడావిడిగా కారులోకి ఎక్కించడం, జుట్టు రోడ్డపై చెల్లాచెదురుగా పడటం గమనించిన మరో వ్యక్తి వెంటనే హెల్ప్‌లైన్ 112కు ఫోన్‌చేసి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకోగా అప్పటికే దొంగలు ఉడాయించారు. లక్ష్మీపుర క్రాస్ ప్రాంతంలో కేశాల వ్యాపారులు ఎక్కువ. ఈ సరకు విషయం తెల్సిన వ్యక్తులే ఈ దొంగతనం చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అంతర్రాష్ట కేశాల వ్యాపారంలో ఉన్న వ్యక్తుల హస్తం ఈ చోరీలో ఉండొచ్చనే అనుమానాలు పోలీసులు వ్యక్తంచేశారు. 850 కేజీల జుట్టు ఉత్తర బెంగళూరు ప్రాంతానికి చెందిన 73 ఏళ్ల కె.వెంకటస్వామి అనే వ్యాపా రి తన గోడౌన్‌ను హెబ్బళ్ ప్రాంతం నుంచి లక్ష్మీపుర క్రాస్ అనే ప్రాంతానికి ఫి బ్రవరి 12వ తేదీన మార్చారు. ఇతను కే శాల వ్యాపారం చేస్తుంటారు. కడప, శ్రీ కాకుళం ఇలా ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లాల్లో ఊరూరు తిరిగి జనం దగ్గర జుట్టును కొందరు వ్యక్తులు డబ్బులకు సేకరించిన ఏజెంట్లకు విక్రయిస్తారు. ఆ ఏజెంట్లను జుట్టును వెంకటస్వామి వంటి వ్యాపారులకు విక్రయిస్తారు. అలా తన వద్దకు వచి్చన జుట్టును వెంకటస్వామి హైదరాబాద్‌లోని ఒక వ్యాపారికి విక్రయిస్తారు. ఆ వ్యాపారి బర్మాకు ఎగు మతి చేస్తారు. అది ఆ తర్వాత చైనాకు తరలిపోతుంది. అక్కడ అత్యంత నాణ్యమైన విగ్గులను తయారుచేస్తారు. భారతీయుల జుట్టుతో తయారైన విగ్గులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. అంతటి విలువైన 850 కేజీల జుట్టును ఏజెంట్ల నుంచి కొనుగోలు చేసి వెంకటస్వామి తన గోడౌన్లో 27 సంచుల్లో భద్రపరిచారు. -
రూ.50 లక్షలు, బెంజ్ కారు కావాలి
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): ప్రేమించుకుని పెళ్లికి సిద్ధమయ్యారు. కానీ అత్యాశతో వరకట్నం కోసం కక్కుర్తి పడ్డారు. అలిగిన వరుడు, అతని తల్లితండ్రులు, బంధువులు పెళ్లి మండపం నుంచి పరారయ్యారు. ఈ వింత సంఘటన బెంగళూరులో వెలుగు చూసింది. న్యాయం చేయాలంటూ వధువు తండ్రి ఉప్పారపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కాలేజీ నుంచి ప్రేమ వధువరులు ఇద్దరూ కాలేజీ రోజుల నుంచి స్నేహితులు. ప్రేమలో పడి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ప్రస్తుతం ఫ్రాన్స్‌లో ఉద్యోగాలు చేస్తున్నారు. గత ఏడాది జూలై నెలలో ఇండియాకు వచ్చిన యువతి ప్రేమ గురించి తల్లిదండ్రులకు తెలిపింది. ఇరువైపుల పెద్దలు మాట్లాడి గతేడాది జూలైలో నిశ్చితార్థం చేశారు. మార్చి 2న 2025లో వివాహం కూడా నిశ్చయించారు. గత ఫిబ్రవరి 17న షాపింగ్ కోసం ఫ్రాన్స్ నుండి ఢిల్లీకి వచ్చిన యువతి ఓ హోటల్లో బస చేసింది. ప్రియుడు ప్రేమ్ కూడా వచ్చి యూరోపియన్ సంస్కృతి ప్రకారం పెళ్లికి ముందే ఇద్దరూ శారీరకంగా కలవాలని కథలు చెప్పి ఆమెను లొంగదీసుకున్నాడు. పొద్దున పెళ్లనగా గొడవ వివాహ వేడుకల కోసం ఫిబ్రవరి 28 నుంచి మార్చి 2 వరకూ బెంగళూరు గాందీనగర్‌లోని రైల్వే ఆఫీసర్స్ ఎన్‌క్లేవ్‌లోని నంది క్లబ్‌ని బుక్ చేశారు. 28న సంగీత్, మెహందీ వేడుకలను జరిపారు. మార్చి 1న రాత్రి వరుడు, తల్లితండ్రులు గొడవకు దిగారు. రూ.50 లక్షల నగదు, అర్ధ కేజీ బంగారం, ఒక బెంజ్ కారును కట్నంగా ఇవ్వాలని పట్టుబట్టారు. వధువు తండ్రి తన చేత కాదని చెప్పాడు. కొంతసేపటికి వరుని కుటుంబం మొత్తం పరారైంది. తెల్లవారితే జరగాల్సిన పెళ్లి జరగలేదు. ఫిర్యాదు మేరకు పోలీసులు వరుడు ప్రేమ్, అతని తల్లిదండ్రులు శివకుమార్, రాధలపై కేసు నమోదు చేసుకున్నారు. -
అక్రమ బంగారంతో దొరికిపోయిన హీరోయిన్.. ఏకంగా డీజీపీ కూతురేనట!
ప్రముఖ కన్నడ నటి రన్యా రావు బంగారం అక్రమ రవాణా చేస్తూ అడ్డంగా దొరికిపోయింది. దాదాపు 14.8 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు యత్నిస్తుండగా ఆమెను బెంగళూరు విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి బంగారాన్ని తీసుకొస్తుండగా ఎయిర్‌పోర్ట్‌లో ఆమెను అరెస్ట్ చేశారు. కేవలం 15 రోజుల్లోనే రన్యా రావ్ నాలుగుసార్లు దుబాయ్ వెళ్లి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. పక్కా ప్రణాళికతోనే రన్య రావును అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇంతకీ ఎవరు ఈ రాన్యా రావు అని నెటిజన్స్ తెగ వెతికేస్తున్నారు. అసలు ఆమె డీజీపీ కూతురు అని చెప్పడంతో పలువురు ఆరా తీస్తున్నారు. ఆ వివరాలేంటో మీరు చూసేయండి.రన్యా రావు స్వస్థలం కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా కాగా.. నటనలో అడుగు పెట్టక ముందు బెంగళూరులో విద్యను అభ్యసించింది. 2014లో ఆమె మాణిక్య చిత్రంలో ప్రముఖ హీరో కిచ్చా సుదీప్ సరసన శాండల్‌వుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీని తెలుగులో ప్రభాస్ నటించిన మిర్చి చిత్రానికి రీమేక్‌గా కన్నడలో తెరకెక్కించారు. ఆ తర్వాత దాదాపు రెండేళ్ల తర్వాత విక్రమ్ ప్రభు సరసన వాఘాతో తమిళంలో అడుగుపెట్టింది. 2017లో యాక్షన్ కామెడీ చిత్రం పటాకీతో కన్నడలో రీ ఎంట్రీ ఇచ్చింది. తెలుగు సినిమా పటాస్‌కి రీమేక్‌గా రూపొందించిన ఈ చిత్రంలో సంగీత పాత్రలో మెప్పించింది. ఈ చిత్రంలో కన్నడ నటుడు గణేష్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంది. చివరిసారిగా పటాకీ కనిపించిన రాన్యా రావు ఆ తర్వాత సినిమాలకు దూరమైంది. తాజాగా బంగారం తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబడింది. ప్రస్తుతం ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించారు.డీజీపీ కూతురే రాన్యా రావ్..మరోవైపు రన్యా రావు డీజీపీ కూతురు అని తెలుస్తోంది. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP)గా ఉన్న ఐపీఎస్ అధికారి రామచంద్రరావు సవతి కుమార్తె అని సమాచారం. -
మహిళల సంతోషమే దేశానికి సంపద : శ్రీ శ్రీ రవిశంకర్
బెంగుళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రం 10వ అంతర్జాతీయ మహిళా సదస్సు ఘనంగా జరిగింది. వివిధ రంగాలకు చెందిన మహిళలు పాల్గొన్న ఈ సదస్సులో తమను తాము కొత్తగా ఆవిష్కరించుకుని, శ్రేయస్సును అందుకునే దిశగా అడుగులు పడ్డాయి. సామాజిక, లౌకిక విషయాలపై లోతైన చర్చలు, ప్రగాఢమైన మానసిక విశ్రాంతి నిచ్చే అంతరంగ ప్రయాణాలు, వాటికి తోడుగా సాంస్కృతిక ప్రదర్శనలు కలగలిసి ఆహుతుల కోసం ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించాయి. బహ్రెయిన్‌కు చెందిన మహిళా సైనిక సైనికాధికారిణి, ఒక భారతీయ నటి, టర్కీదేశపు డిజిటల్, కృత్రిమ మేధ కళాకారుడు కలుసుకుని,మనస్సు, చైతన్యం - వీటిపై సృజనాత్మకత ప్రభావం గురించి చర్చించారు.ప్రముఖ బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా తన అభిప్రాయాన్ని పంచుకుంటూ, “నేను ఎదుగుతున్న దశలో కళలు నాకు ధ్యానాన్ని నేర్పాయి. అది సహజంగా జరిగిపోయింది. ఐతే నేను ఇక్కడ అడుగుపెట్టిన మరుక్షణమే నా శక్తిసామర్థ్యాలలో చిత్రమైన మార్పును గమనించాను. ప్రజలు మంచిగా ఉంటూ, అందరి మంచినీ కోరుకున్నప్పుడే సృజనాత్మకత వృద్ధి చెందుతుంది.” అని అన్నారుబహ్రెయిన్ సైనిక, క్రీడా విభాగాలకు అధిపతిగా పనిచేస్తున్న కుమారి నూరా అబ్దుల్లా మాట్లాడుతూ, “సైన్యంలో ఆజ్ఞలను పాటించడమే తప్ప సృజనాత్మకతకు తావు లేదు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ను చూసిన తర్వాత, మార్పును సృష్టించేందుకు స్వేచ్ఛ అవసరమని, నిజమైన సృజనాత్మకత సమాజాభివృద్ధికి ఉపయోగపడుతుందని నేను గ్రహించాను.” అన్నారు.ఈ సదస్సుకు చోదకశక్తిగా ఉన్న చైర్ పర్సన్ భానుమతి నరసింహన్ మాట్లాడుతూ, మహిళల జీవితంలో విశ్రాంతి, పని మధ్య సమతుల్యత ఉండాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. “మహిళలుగా మనము మరింత ఎక్కువగా, మరింత త్వరగా సాధించాలనే ఆతృతలో ఉంటాము. నిజానికి మీరు తగినంత విశ్రాంతి తీసుకున్నపుడే మీరు అనుకున్నవి సాధించగలరు. ఇది విశ్రాంతిగా, ప్రశాంతంగా ఉండేందుకు తగిన సమయం.” అని పేర్కొన్నారు. శ్రీ శ్రీ రవిశంకర్ 180 దేశాలలో కోట్లాదిప్రజలకు అంతర్గత శాంతిని అందించడంలో ప్రపంచ శాంతి నాయకుడు గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ పోషించిన పాత్రను ఈ సదస్సుకు హాజరైన పలువురు ప్రముఖులు కొనియాడారు. ఆధ్యాత్మిక విలువలను పరిరక్షించడంలో గురుదేవ్ పాత్రను ప్రశంసిస్తూ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, “భారతదేశం ఆధ్యాత్మిక దేశం, కానీ మారుతున్న కాలంతో మనం మన మూలాలకు దూరమవుతున్నాము. అందుకోసమే, మనం మరచిపోయిన విలువలను గుర్తుచేందుకు, మనకు స్ఫూర్తినిచ్చేందుకుగురుదేవ్ వంటి ఆధ్యాత్మిక నాయకులు ఇక్కడ ఉన్నారు.” అని అన్నారు.ప్రతిష్టాత్మకమైన విశాలాక్షి అవార్డు అందుకున్న సందర్భంగా కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి స్మృతి ఇరానీ, "ఒక సాధుపుంగవునికి జన్మనిచ్చిన తల్లి పేరు మీద అవార్డును అందుకోవడం కంటే గొప్ప బహుమతి మరొకటి లేదు." అని భావోద్వేగానికి గురయ్యారు.జపాన్ మాజీ ప్రథమ మహిళ అకీ అబే మాట్లాడుతూ, హింసలేని ప్రపంచం కోసం గురుదేవ్ దృక్పథాన్నితన స్వీయ అనుభవంతో పోల్చి చూశారు. ఆమె భర్త, జపాన్ మాజీ ప్రధాని షింజో అబే దుండగుని కాల్పులలో మరణించిన సంగతి విదితమే.“ప్రతి నేరస్థుడిలో ఒక బాధితుడు ఉంటాడని గురుదేవ్ చెప్పడం నేను విన్నాను. నా భర్త ప్రాణం తీసిన వ్యక్తిని ద్వేషించే బదులు, నేను కరుణించగలనా? అటువంటి హింస జరుగకుండా ఉండేందుకు నేను ఏమైనా సహాయం చేయగలనా? కేవలం నేరం జరిగిన తర్వాత బాధితులకు మద్దతిచ్చే సమాజం కంటే, నేరాలు తక్కువ జరిగే సమాజమే ఖచ్చితంగా మెరుగ్గా ఉంటుంది.” అని ఆమె అన్నారు.సీతా చరితం: సాంస్కృతికదృశ్య వైభవంఈ 10వ అంతర్జాతీయ మహిళా సదస్సు కేవలం చర్చలు, ఆత్మపరిశీలనలకు మాత్రమే పరిమితం కాకుండా, సీతా చరితం అనే చక్కని రంగస్థల సాంస్కృతిక ప్రదర్శనకు, వేదికగా కూడా మారింది. భారతీయ కావ్యమైన రామాయణాన్ని ఏ షరతులూ లేని ప్రేమ, జ్ఞానం, ఆత్మస్థైర్యం, భక్తి, కరుణరసాల కలయికగా సీతాదేవి దృక్కోణం నుండి చూపే ప్రయత్నం ఇక్కడ జరిగింది. 500మంది కళాకారులు 30 విభిన్న సంగీత నృత్య రీతులను మేళవించి, దేశంలో మొట్టమొదటిసారిగా 4-డి సాంకేతికతను ఉపయోగించి చేసిన సంగీత నృత్య రూపకం ప్రపంచం నలుమూలలనుండి హాజరైన ఆహుతులను మంత్రముగ్ధులను చేసింది.కాలానికి అతీతంగా, మానవాళికి ఆదర్శంగా నిలచిన రామకథను ఈ ప్రదర్శన 190 దేశాలకు తీసుకువెళుతుంది. ఇంగ్లీషులో రూపొందించిన స్క్రిప్ట్ కోసం 20కి పైగా వివిధ భాషలు, సంస్కృతులలోని రామాయణాలను పరిశీలించారనీ, ఇది నిజమైన ప్రపంచ సాంస్కృతిక అనుభూతిని కలిగిస్తుందని నిర్వాహకులు తెలిపారు. సీతా చరితం నిర్మాణం వెనుక ఉన్న ప్రేరణ గురించి సృజనాత్మక దర్శకురాలు శ్రీవిద్యా వర్చస్వి మాట్లాడుతూ, “సీతమ్మవారి కథ పరివర్తకు ప్రతిబింబంగా నిలుస్తుంది. అంతే కాక, ఈ నాటకం, స్క్రిప్ట్, డైలాగ్‌లు అన్నీ గురుదేవుల జ్ఞానంతో నిండి ఉన్నాయి.” అని అన్నారు. -
బెంగళూరులో దారుణం.. టోల్గేట్ వద్ద అరాచకం!
బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. టోల్గేట్ వద్ద ఓ వ్యక్తిని కారు కొంత దూరం లాకెళ్లి పడేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.వివరాల ప్రకారం.. కర్ణాటకలోని నెలమంగళలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. టోల్‌బూత్ వద్ద ఇద్దరు వ్యక్తుల మధ్య వాగ్వాదం జరిగింది. టోల్గేట్ వద్ద ఓ కారును మరో కారు ఓవర్ టేక్ చేయడంతో సదరు కారులో వ్యక్తి.. ముందుకు వచ్చి కారులో ఉన్న వ్యక్తిని ప్రశ్నించారు. దీంతో, టోల్బూత్లో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ముందు కారులో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి ఆవేశంతో రగిలిపోయాడు.ఈ క్రమంలోనే కారు స్టార్ చేసి.. వాగ్వాదానికి దిగిన వ్యక్తి కాలర్ పట్టుకుని కారును ముందుకు నడిపాడు. ఆ తర్వాత కారు ఆ వ్యక్తిని దాదాపు 50 మీటర్ల దూరం కారు ఈడ్చుకెళ్లింది. కొంత దూరం వెళ్లాక అతడిని వదిలిపెట్టడంతో ఆయన కిందపడిపోయాడు. కారు డ్రైవర్ మాత్రం ఆగకుండా వెళ్లిపోయాడు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. Shocking Incident in Bengaluru!A man was dragged for 50 meters by a car at Nelamangala toll booth after an argument over overtaking. The entire incident was caught on CCTV. Police have launched an investigation to identify the accused. #Bengaluru #RoadRage #ViralVideo pic.twitter.com/mFJ8YOMXoQ— Shubham Rai (@shubhamrai80) February 16, 2025 -
ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్ షో - ఆకట్టుకున్న యుద్ధ విమానాల విన్యాసాలు (ఫోటోలు)
-
భార్య పుట్టింటికి వెళ్లిందని ఆటోడ్రైవర్ సంబరం
బొమ్మనహళ్లి: బెంగళూరు నగరంలో నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్ ఒకరు తన భార్య పుట్టింటికి వెళ్లడంతో తనకు సంతోషంగా ఉందని పోస్టర్‌ను తన ఆటోకి వేసుకొని తన ఆటోలో ఎక్కిన ప్రయాణికులకు బిస్కెట్లు పంపిణీ చేసిన సంఘటన బెంగళూరు నగరంలో చోటు చేసుకుంది. దానిని ఒక ప్రయాణికుడు ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ప్రస్తుతం అది చక్కర్లు కొడుతోంది. ఆటో డ్రైవర్ తన ఆటోలో ఉన్న తన సీటు వెనుకాల పోస్టర్‌ను కన్నడతోపాటు ఇంగ్లిష్‌లో వేయడంతో పాటు దాని పక్కనే బిస్కెట్లు పెట్టి తన ఆటో ఎక్కిన వారికి వాటిని ఇవ్వడంతో పాటు సంతోషం వ్యక్తం చేశాడు. దాంతో ఒక ప్రయాణికుడు ఆటో డ్రైవర్ సంతోషాన్ని చూసి దానిని సోషల్ మీడియాలో పెట్టాడు. దాంతో ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. View this post on Instagram A post shared by EPIC MEDIA (@_epic69) -
వైద్య లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసేలా వింత శిశువు జననం..!
బెంగళూరు: వైద్య లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసేలా వింత శిశువు జిల్లాలోని నంజనగూడు తాలూకాలోని హురా గ్రామంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో జన్మించింది. పుట్టిన శిశువును చూసి తల్లిదండ్రులు, వైద్యులు నోరెళ్లబెట్టారు. విచిత్రమైన కళ్లు, పెదవులు, ఒళ్లంతా బొగ్గులా నలుపు రంగుతో కూడి చూపరులకు వింత గొలిపింది. హురా గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వ్యాప్తిలోని ఒక గ్రామానికి చెందిన గర్భిణి నెలలు నిండి ప్రసవానికి చేరింది. కాన్పు కాగా శిశువు వింత ఆకారంతో జన్మించడం చూసి అవాక్కయ్యారు. శిశువు ఆరోగ్యం బాగా లేకపోవడంతో మైసూరులోని చెలువాంబ ఆస్పత్రిలో ఐసీయూలో చేర్పించారు.ఇది రెండోసారిఈ మహిళకు వింత శిశువు జన్మించడం ఇది రెండవసారి. కొన్నేళ్ల క్రితం ఇదే దంపతులకు ఇలాంటి రూపం కలిగిన శిశువు జన్మించింది. నాలుగైదు రోజుల తర్వాత మరణించింది. ఇప్పుడు పునరావృతమైంది. ఈ పరిణామం వైద్య లోకానికి సవాలు విసిరినట్లయింది. చాలా దగ్గరి బంధువుల మధ్య పెళ్లి జరగడం, లేదా ఆ దంపతులలో విపరీతమైన జన్యు సమస్యలు ఉండడం వల్ల ఇలా జరుగుతుందని వైద్యులు తెలిపారు. -
బెంగళూరుకు తెలుగు వారియర్స్ కెప్టెన్.. తొలి మ్యాచ్‌కు రెడీ
సినీ, క్రీడా అభిమానులను అలరించే సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌కు అంతా సిద్ధమైంది. బెంగళూరు చిన్నస్వామి స్డేడియం వేదికగా ఈ ఏడాది సీసీఎల్(CCL) ప్రారంభం కానుంది. దాదాపు 7 జట్లు ఈ సారి కప్ కోసం పోటీపడుతున్నాయి. తెలుగు వారియర్స్(Telugu Warriors) తన తొలి మ్యాచ్‌లో కన్నడ బుల్డోజర్స్‌ను ఢీకొట్టనుంది. ఇటీవలే హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలుగు వారియర్స్ కెప్టెన్ అఖిల్ అక్కినేని మాట్లాడారు. ఇప్పటికే నాలుగుసార్లు కప్ గెలిచామమని.. ఈ సారి కూడా ఛాంపియన్స్ అవుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.సీసీఎల్ తొలి మ్యాచ్ కోసం అక్కినేని అఖిల్ ఇప్పటికే బెంగళూరు చేరుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో అఖిల్ వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ లీగ్ తొలి మ్యాచ్‌లో చెన్నై రైనోస్, బెంగాల్ టైగర్స్ తలపడనుండగా.. ఆ తర్వాత జరిగే రెండో మ్యాచ్‌లో తెలుగు వారియర్స్ తన కప్ వేటను ప్రారంభించనుంది. సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో కర్ణాటక బుల్డోజర్స్తో తలపడుతోంది.INDIA'S BIGGEST SPORTAINMENT EVENT CCL STARTS *TOMORROW*... The 11th season of #CelebrityCricketLeague [#CCL] starts on 8 Feb 2025... Witness the thrill as #India's leading stars clash on the cricket field.Watch LIVE on #SonyTen3 and #Hotstar.#CCL2025Live | #CCL2025 | #CCL11 pic.twitter.com/7NKrABg4Vc— taran adarsh (@taran_adarsh) February 7, 2025#AkhilAkkineni off to Bengaluru for the Telugu Warriors' first match in #CCL @AkhilAkkineni8 ❤️❤️❤️❤️❤️#Akhil6 pic.twitter.com/0FlVsPj29p— 𝐀𝐤𝐡𝐢𝐥𝐅𝐫𝐞𝐚𝐤𝐬_𝐅𝐂 (@AkhilFreaks_FC) February 7, 2025 -
ఐపీఎల్‌కు ముందే క్రికెట్ సమరం.. సిద్ధమంటోన్న అఖిల్ అక్కినేని
క్రికెట్ సంబరానికి అంతా సిద్ధమైంది. ఇన్ని రోజుల తెరపై అభిమానులను అలరించిన సినీ తారలు గ్రౌండ్లో అడుగుపెట్టనున్నారు. ఇప్పుడు నటనతో కాదు.. బ్యాట్, బాల్‌తో ఫ్యాన్స్‌ను ఆకట్టుకోనున్నారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా సీసీఎల్ (సెలబ్రిటీ క్రికెట్ లీగ్) సమరానికి సమయం ఆసన్నమైంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఫిబ్రవరి 8 నుంచి ఈ క్రికెట్ సమరం మొదలు కానుంది. ఈనేపథ్యంలోనే తాజాగా హైదరాబాద్‌లో టాలీవుడ్ సినీ తారలకు చెందిన తెలుగు వారియర్స్ టీమ్ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈవెంట్లో జట్టు కెప్టెన్ అఖిల్ (Akhil Akkineni)తో పాటు తమన్, ఆది, అశ్విన్, రఘు, సామ్రాట్ పాల్గొన్నారు. జట్టు యజమాని సచిన్ జోషి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కినేని అఖిల్ మాట్లాడుతూ.. మేము నాలుగుసార్లు కప్ గెలిచామని వెల్లడించారు. ఈసారి మేమే ఛాంపియన్స్‌గా నిలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.కాగా.. ఈ సీసీఎల్ లీగ్‌లో మొత్తం 7 సినీ సెలబ్రిటీ జట్లు తలపడనున్నాయి. చెన్నై రైనోస్, ముంబై హీరోస్, తెలుగు వారియర్స్, కర్ణాటక బుల్డోజర్స్, బెంగాల్ టైగర్స్, పంజాబ్ ది షేర్, బోజ్‌పురి దబాంగ్స్ పోటీ పడుతున్నాయి. ఈ నెల 8న బెంగళూరు వేదికగా ఈ టోర్నీ మొదలు కానుంది. ప్రస్తుతం జరుగుతున్న 11 వ సీజన్ జనవరి 31న హైదరాబాద్‌లోనే ప్రారంభం కావాల్సి ఉండగా.. అనివార్య కారణాలతో షెడ్యూల్లో మార్పులు చేశారు.కాగా.. ఈ ఏడాది సీసీఎల్ టోర్నమెంట్ ఫిబ్రవరి 8న బెంగళూరులో ప్రారంభమై మార్చి 2 వరకు కొనసాగుతుంది. తొలి రోజు మ్యాచ్‌లో చెన్నై రైనోస్, బెంగాల్ టైగర్స్, సాయంత్రం కర్ణాటక బుల్డోజర్స్ టీమ్.. తెలుగు వారియర్స్‌ను ఢీకొంటుంది. హైదరాబాద్‌లో ఈనెల 14,15 తేదీల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సీజన్లో కూడా అఖిల్ అక్కినేని తెలుగు వారియర్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ మ్యాచ్‌లన్నీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతాయి. సెమీ-ఫైనల్, ఫైనల్ మార్చి 1, 2 తేదీల్లో జరగనున్నాయి. #TFNExclusive: Actor @AkhilAkkineni8 and Music sensation @MusicThaman snapped at CCL Telugu Warrior event in Hyderabad!!🏏📸#AkhilAkkineni #Thaman #Tollywood #TeluguFilmNagar pic.twitter.com/WDxjeEsr1S— Telugu FilmNagar (@telugufilmnagar) February 2, 2025 The excitement is building! ⏳ Just 6 days to go for A23 Rummy CCL 2025! 🏏🔥 Brace yourselves for an electrifying season where cinema meets cricket!🎟 Grab your tickets now: https://t.co/xvVGHVHEcj📺 Catch the action LIVE on Sony Sports Ten 3 & Disney+ Hotstar#A23Rummy… pic.twitter.com/lBRRZaiwyH— CCL (@ccl) February 2, 2025 -
బెంగళూరుకు చేరుకున్న వైఎస్ జగన్
సాక్షి బెంగళూరు: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) శుక్రవారం బెంగళూరుకు చేరుకున్నారు. లండన్ నుంచి వైఎస్ జగన్ దంపతులు శుక్రవారం ఉదయం బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చారు. అక్కడి నుంచి నగరంలోని తమ నివాసానికి వెళ్లారు. విదేశీ పర్యటన ముగించుకుని జగన్ వస్తున్నట్లు తెలుసుకున్న వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా విమానాశ్రయం వద్దకు చేరుకుని ఆయనకు ఘన స్వాగతం పలికారు. మరోవైపు జగన్ బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. -
స్పేస్–ఎక్స్ ఉపగ్రహాల తయారీలో తెలుగుతేజం
సోలాపూర్: భారతదేశంలో తొలిసారిగా బెంగళూరుకు చెందిన ఫిక్సెల్ కంపెనీ ఇటీవలే అంతరిక్షంలోకి మూడు ఉపగ్రహాలను పంపింది. ఈ ఉపగ్రహాల తయారీ బృందంలో తెలుగబ్బాయి నీరజ్ గాడి కూడా ఉండటం తమకు గర్వకారణమని స్థానిక తెలుగుప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం ‘మన్‌కీ బాత్’లో ఈ విషయాన్ని ప్రస్తావించి అభినందనలు తెలియజేశారని సంతోషం వ్యక్తంచేస్తున్నారు. జనవరి 15న విజయవంతంగా... భారతదేశ చరిత్రలో కేంద్ర ప్రభుత్వ సంస్థ’ ఇస్రో’ మాత్రమే అంతరిక్షంలోకి పంపింది. అయితే తొలిసారిగా బెంగళూరుకు చెందిన ప్రైవేటు కంపెనీ ఫిక్సెల్ ఆధ్యర్యంలో జనవరి 15న అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి ప్రఖ్యాత స్పేస్–ఎక్స్ కంపెనీకి చెందిన మూడు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపారు. ఈ ప్రాజెక్టులో పట్టణానికి చెందిన నీరజ్ గాడి ప్రొడక్షన్ మేనేజర్‌గా వ్యవహరించారు. ఘన వారసత్వానికి ధీటుగా విజయం.. రాజస్థాన్ లోని బిట్స్పిలానీలో బి. ఇ.(మెకానికల్), ఫ్రాన్స్ లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పూర్తిచేసిన నీరజ్ గాడి 2022లో ఫిక్సెల్ కంపెనీలో ప్రొడక్షన్ ఇంజనీర్ గా చేరారు. నీరజ్ గాడి పట్టణంలో ప్రసిద్ధిగాంచిన షాప్ యాక్ట్ కన్సల్టెంట్, అశ్విని సహకార రుగ్నాలయ మాజీ డైరెక్టర్ రామచంద్ర గాడి మనవడు. నీరజ్ తండ్రి ముంబైలోని యూ నియన్ బ్యాంక్ అఫ్ ఇండియా ప్రధాన కార్యాలయంలో ఉన్నత స్థాయి అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. సీనియర్ పాత్రికేయుడు వేణుగోపాల్ గాడి నీరజ్‌కు బాబాయి అవుతారు. జనార్ధన్ గాడి తనయుడు అలాగే పట్టణంలో సీనియర్ పాత్రికేయుడైన వేణుగోపాల్ గాడి సోద రుని కుమారుడు. ఉపగ్రహాలతో సూక్ష్మ శాస్త్రీయ సమాచారం ఫిక్సెల్ కంపెనీ‘ హైపర్ స్పెక్ట్రల్ పిక్చర్‘కు సంబంధించిన అంశాలపై పనిచేస్తుంది. కాగా ఈ కంపెనీ పంపిన ఉపగ్రహాలు భూమిపై ఉన్న వివిధ వస్తువుల ఫోటోలను తీస్తాయి. సుమారు 200 రకాల రంగుల్లో చిత్రాలను వీటి ద్వారా సంగ్రహించవచ్చు. దీని ద్వారా చెట్లు, పంటలు, నేల, గాలి, నీరు మొదలైన అంశాలపై గురించి సూక్ష్మశాస్త్రీయ సమాచారాన్ని పొందవచ్చు. -
స్టార్ హీరోను కలిసిన సీఎం..
శాండల్‌వుడ్ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ వెద్య చికిత్స కోసం గతేడాది డిసెంబర్లో అమెరికా వెళ్లారు. ప్రముఖ మియామీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఆయన చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. త్వరలోనే మీ అందరినీ కలుస్తానని శివరాజ్ కుమార్ తన భార్యతో కలిసి ఓ వీడియో సందేశం రిలీజ్ చేశారు.తాజాగా శివరాజ్ కుమార్ జనవరి 26న బెంగళూరు చేరుకున్నారు. క్యాన్సర్ నుంచి ఆయన పూర్తిగా కోలుకుని స్వదేశానికి తిరిగొచ్చారు. దీంతో ఆయనను చూసేందుకు వేలాదిమంది అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా తన వైద్య చికిత్స గురించి అభిమానులతో మాట్లాడారు. నా అభిమానులు, శ్రేయోభిలాషుల ప్రేమ, మద్దతు వల్లే తాను కోలుకున్నానని అన్నారు. మళ్లీ మీ అందరి సినిమాలతో అలరించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని శివరాజ్ కుమార్ తెలిపారు. దాదాపు ఆరుగంటలపాటు తనకు శస్త్ర చికిత్స జరిగిందని..రెండో రోజు నుంచే నడవడం ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ ప్రయాణంలో నా భార్య, కూతురు తనకు అండగా నిలిచారని అన్నారు.కాగా.. శివ రాజ్‌కుమార్ చివరిగా కన్నడ చిత్రం భైరతి రణగల్‌లో కనిపించారు. ఈ సినిమా గతేడాది నవంబర్ 15, 2024న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఉత్తరకాండ, 45, భైరవనా కోనే పాటతో సహా పలు చిత్రాలలో పని చేయనున్నారు. అంతేకాకుండా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సన చిత్రం ఆర్సీ 16లోనూ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు.శివరాజ్ కుమార్‌ను కలిసిన సీఎం..శివరాజ్ కుమార్‌ను కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కలిశారు. ఆయన నివాసానికి వెళ్లిన ముఖ్యమంత్రి ఆరోగ్యం, చికిత్సపై ఆరా తీశారు. -
‘మాజీ ఎమ్మెల్యేతో నాకు డీల్స్’
మండ్య: బెంగళూరుతో సహా పలుచోట్ల నగలు, నగదు మోసగించిన కేసుల్లో నిందితురాలు ఐశ్వర్యగౌడ సంచలన వ్యాఖ్యలు చేసింది. జిల్లాలోని మళవళ్ళి మాజీ ఎమ్మెల్యే డాక్టర్.కే. అన్నదాని, నా మధ్య ఒక వ్యవహారం జరిగింది. ఇప్పుడాయన నేనెవరో కూడా మరిచిపోయారు. ఎన్నికల్లో ఓడిపోయి డిప్రెషన్లో నన్ను మరిచిపోయారేమో అని హేళన చేశారు. మండ్యలో సైబర్ క్రైం పోలీసు స్టేషన్‌కు విచారణకు హాజరయ్యారు. తరువాత మీడియాతో మాట్లాడారు. నాకు– అన్నదానికి కొన్ని వ్యవవహారాలు జరిగాయి. అన్నదాని మంచివారు అని ఆయన అనుచరులు చెప్పుకోనివ్వండి. క్రిమినల్స్, మోసగాళ్లు తప్పుడు మాటలు చెబుతారు. నేను ఎవరు అనేది ఆయన మరిచిపోయారు. అన్నదాని నాకు ఒంటరిగా దొరకాలి, అప్పుడు నేను ఎవరు, ఎలా పరిచయం అయ్యాను, ఆయనకు– నాకు మధ్య జరిగిన డీల్స్ ఏమిటి అని గుర్తు చేస్తాను అని మండిపడింది. దీనిపై కేసు పెట్టినా భయపడను, ఆయనకు ధైర్యం నా ముందుకు వచ్చి మాట్లాడమని చెప్పండి అని సవాల్ చేసిం -
తల్లి కోసం బెంగళూరులో ఫ్లాట్ కొన్న తేజస్విని.. నిజంగా గ్రేట్! (ఫోటోలు)
-
ఇన్‌స్టా లవ్.. బెంగుళూరుకు పయనమైన ముగ్గురు బాలికలు
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): ఇంస్టాగ్రామ్లో మూడు నెలల క్రితం పరిచయమైన ఓ వ్యక్తి మాయమాటలు నమ్మి ఓ బాలిక ఇల్లు వదిలి బెంగళూరుకు పయనం కాగా.. ఆమెకు తోడుగా మరో ఇద్దరు బాలికలు వెళ్లేందుకు ప్రయత్నించిన ఘటన అజిత్‌సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. నార్త్‌జోన్ ఏసీపీ స్రవంతిరాయ్ తన కార్యాలయంలో ఈ కేసు వివరాలను మీడియాకు వెల్ల్లడించారు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు.. న్యూరాజరాజేశ్వరీపేటకు చెందిన ఓ బాలిక సమీపంలోని ఓ మదర్సాలో చదువుకొని ఇంటి వద్దే ఉంటోంది. ఆమెకు ఇంస్టాగ్రామ్లో బెంగళూరుకు చెందిన యువకుడితో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. వీరిద్దరి మధ్యలో ఆ యువకుడి స్నేహితుడైన గుంటూరు జిల్లా పెదనందిపాడుకు చెందిన వేణు(23) అనే యువకుడు రావడంతో వారి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. అప్పటి నుంచి వారు దూరంగా ఉంటుండగా.. మూడు నెలల క్రితం నుంచి వేణు ప్రేమ పేరుతో ఆ బాలికకు మాయమాటలు చెబుతూ వచ్చాడు. తనతో వస్తే బెంగళూరు తీసుకెళ్లి పెళ్లిచేసుకుంటానని నమ్మించడంతో అతగాడి మాటలు విన్న ఆ బాలిక విషయాన్ని తన ఇద్దరి స్నేహితులకు చెప్పింది. దీంతో ఆ ఇరువురు బాలికలు తాము కూడా బెంగళూరు వస్తామని చెప్పడంతో వేణు వారిని తెనాలికి రమ్మని చెప్పాడు. ప్రణాళిక ప్రకారం బాలికలను గురువారం రాత్రి తెనాలికి రప్పించిన వేణు అక్కడ తన స్నేహితులైన కేతవత్ యువరాజ్‌నాయక్(21), పెద్ద వెంకటేశ్వర్లు(30)ను బాలికలకు పరిచయం చేశాడు. ఉదయాన్నే బెంగళూరుకు రైలులో వెళ్దామని, టికెట్లు కూడా తీసుకున్నామని బాలికలకు చూపించాడు. ఈ రాత్రికి మనం అందరం గుంటూరు జిల్లా చేబ్రోలులోని పెద్ద వెంకటేశ్వర్లు ఇంట్లో ఉందామనుకొని పయనమయ్యారు. గంటల వ్యవధిలో బాలికల ఆచూకీ.. ముగ్గురు బాలికలు కనిపించడం లేదంటూ గురువారం రాత్రి 11 గంటల సమయంలో సింగ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో సింగ్‌నగర్ సీఐ వెంకటేశ్వర్లు వెంటనే స్పందించి.. ఎస్ఐ సేనాపతి శ్రీనివాసరావు నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. యువకుల ఇంస్టాగ్రామ్ ఐడీ నంబర్లు, బండి నంబర్ల ఆధారంగా పోలీసులు తెనాలి చేరుకొని బాలికలు, ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో ఉంటున్న బాలిక పాత స్నేహితుడు నిందితులను పట్టించడంలో పోలీసులకు సహాయం చేసినట్లు తెలిసింది. బాలికలను వీరు వేరే రాష్ట్రంలోకి తీసుకువెళ్లి వారి జీవితాలను నాశనం చేసేందుకు పన్నాగం పన్నినట్లుగా తెలుస్తోంది. మరో కేసు కూడా.. అదేరోజు అదే ప్రాంతానికి చెందిన మూడో తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ల బాలిక కూడా అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందగా ఆ బాలిక ఆచూకీని కూడా గంటల వ్యవధిలోనే గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించినట్లు ఏసీపీ వివరించారు. ఒకే రోజు రెండు కేసులలో నలుగురు బాలికల ఆచూ కీని తెలుసుకొని, కేసులను ఛేదించిన బృందాలను సీపీ రాజశేఖర్‌బాబు, డీసీపీ రామకృష్ణ ప్రత్యేకంగా అభినందించినట్లు స్రవంతిరాయ్ తెలిపారు. -
శ్రీరాములును పైకి తెచ్చింది నేనే
సాక్షి, బళ్లారి: రాష్ట్ర బీజేపీలో, అందులోను ఉమ్మడి బళ్లారి కాషాయ దళంలో చీలికలు ప్రస్ఫుటమయ్యయి. ఒకనాటి ఆప్త మిత్రులు నేడు కత్తులు నూరడం గమనార్హం. మాజీ మంత్రులు శ్రీరాములు, గాలి జనార్దనరెడ్డి మధ్య విమర్శలు తీవ్ర తరమయ్యాయి. శ్రీరాములు ఒకప్పుడు ఎక్కడ ఉండేవాడు, ఆయన రాజకీయంగా ఎదిగేలా చేసింది నేనే. బీజేపీ నుంచి వెళ్లాలనుకుంటే వెళ్లని, కానీ నాపై ఆరోపణలు ఎందుకు చేయాలి? ఆయన రాజకీయంగా ఎలా ఎదిగారన్నది ఆత్మావలోకనం చేసుకుంటే మంచిదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి పేర్కొన్నారు. ఆయన గురువారం బెంగళూరులో తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. కర్మ ఎవరిని వదలదని, తనను కూడా వదలదని, ఎవరు చేసిన కర్మ వారు అనుభవించాల్సిందేనని వేదాంతధోరణిలో అన్నారు. శ్రీరాములుకు బీజేపీలో ఉండడం ఇష్టం లేకపోతే ఏ నిర్ణయమైనా తీసుకోనీ, నాపై నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదని సూచించారు. ఢిల్లీ నాయకుల సహకారంతోనే తాను మళ్లీ బీజేపీలోకి వచ్చానన్నారు. 40 ఏళ్ల కిందట పరిస్థితి ఏమిటి? 40 సంవత్సరాల క్రితం శ్రీరాములు పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకోవాలని, ఆయన ఎదగడానికి తాను ఎంతో శ్రమించానని గత పరిణామాలను జనార్దనరెడ్డి ఏకరువు పెట్టారు. అప్పట్లో శ్రీరాములుపై ఓ మర్డర్ కేసు ఉండేదని, ఆయన్ను సన్మార్గంలోకి తీసుకుని వచ్చాను. ఎమ్మెల్యే, మంత్రి కావడానికి పాటుపడ్డాను. మొళకాల్మూరులో నిలబడినప్పుడు ఒక్క రోజు అయినా అక్కడ ప్రచారం చేశారా? మరి నేను అక్కడే మకాం వేసి గెలిపించలేదా అని అన్నారు. శ్రీరాములు కాంగ్రెస్‌లో చేరే యత్నాల్లో ఉన్నారు, కాంగ్రెస్ ముఖ్య నేతలతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోందని జనార్దనరెడ్డి చెప్పడం విశేషం. తాను నోరు విప్పితే విచారణ సంస్థలు వచ్చి తనిఖీ చేయాల్సి వస్తుందని పరోక్షంగా హెచ్చరించారు. శ్రీరాములుకు ఢిల్లీ పెద్దల పిలుపు సండూరు ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడానికి శ్రీరాములు పనిచేయకపోవడమే కారణమని పార్టీ ఇన్చార్జి రాధామోహన్‌దాస్ అగర్వాల్ అసంతృప్తి వ్యక్తంచేయడం, దీంతో శ్రీరాములు.. గాలి జనార్దనరెడ్డిపై విమర్శలు గుప్పించడంతో బీజేపీ అధిష్టానం మేలుకుంది. గురువారం బళ్లారిలో ఉన్న శ్రీరాములుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నడ్డా ఫోన్ చేసి మాట్లాడారు. మాటల యుద్ధం ఆపాలని, ఢిల్లీకి వచ్చి అంతా మాట్లాడాలని సూచించారు. వచ్చే వారంలో తాను ఢిల్లీకి వచ్చి పార్టీ పెద్దలను కలిసి జరిగిన వాస్తవాలను వివరిస్తానని శ్రీరాములు బదులిచ్చినట్లు సమాచారం. అలాగే పలువురు రాష్ట్ర సీనియర్లతోనూ ఫోన్ చర్చలు జరిగాయి. -
సీఎం సిద్ధరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు
బెంగళూరు: హోం మంత్రి జీ. పరమేశ్వర రాజీనామా చేయాలని ప్రతిపక్ష బీజేపీ చేస్తున్న డిమాండ్‌ను కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఖండించారు. బీజేపీ హయాంలో మహిళలపై దారుణాలు జరగలేదా? అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సిద్ధరామయ్య వ్యాఖ్యలపై ప్రతి పక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. సీఎం హోదాలో ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సరికాదని హెచ్చరిస్తున్నాయి. ఇంతకి ఏం జరిగిందంటే?సిలికాన్ సిటీ బెంగళూరు దారుణాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. గతవారం ఆరేళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. నిన్న(సోమవారం) సాయంత్రం తన సోదరుడి ఇంటికి వెళ్లేందుకు బస్సు కోసం ఎదురు చూస్తున్న మహిళపై ఇద్దరు అగంతకులు హత్యాచారానికి పాల్పడ్డారు. లిఫ్ట్ పేరుతో మహిళను తమ వాహనంపై ఎక్కించుకున్నారు. అనంతరం, నిర్మానుష్య ప్రదేశంలో బాధితురాలి వద్ద ఉన్న డబ్బు, నగల్ని దోచుకున్నారు. ఆపై దారుణానికి ఒడిగట్టారు. దారుణంపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలపై బాధ్యత వహిస్తూ హోం మంత్రి రాజీనామా చేయాలని చేస్తున్న ప్రతిపక్షాల డిమాండ్‌పై సీఎం సిద్ధరామయ్య స్పందించారు. బీజేపీ హయాంలో మహిళలపై దారుణాలు జరగలేదా? కేసులు నమోదు కాలేదా? మహిళలకు రక్షణ కల్పించాలి. కానీ సమాజంలో జరిగే చెడు పట్ల మేం కఠినంగా వ్యవహరిస్తాం’ అని అన్నారు. సామూహిక అత్యాచార కేసులో ట్విస్ట్బెంగళూరు సామూహిక అత్యాచార కేసులో ట్విస్ట్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ నిందితులు గణేష్, శ్రవణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల దర్యాప్తులో నిందితులు బాధిత మహిళ నుంచి డబ్బులు దోచుకునేందుకు యత్నించారు. కానీ బాధితురాలి వద్ద డబ్బులు లేకపోవడంతో బదులుగా లైంగిక చర్యల్లో పాల్గొనేందుకు మహిళ అంగీకరించినట్లు నిందితులు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ఫిర్యాదు దోపిడీ, లైంగిక వేధింపులకు సంబంధించినది. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశాం’ అని బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద అన్నారు. -
విషాద మలుపుల ప్రేమ
కృష్ణరాజపురం: బెంగళూరులో ప్రేమ వ్యవహారాలు ప్రాణాలు తీస్తున్నాయి. ఇటీవల పెళ్లయిన యువతి, అవివాహిత యువకుడు ప్రేమ ఫలించలేదని ఆత్మహత్యలు చేసుకోవడం తెలిసిందే. ప్రేయసిని ఓ ప్రియుడు చంపిన ఘటన కుందలహళ్లిలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఘటన పూర్వాపరాలు.. ఉజ్మాఖాన్, ఇమ్దాద్ బాషా, ఇద్దరూ టెక్కీలుగా పనిచేసేవారు. పరస్పరం ప్రేమలో ఉన్నారు. అయితే వారి ప్రేమను వారి కుటుంబ సభ్యులు వ్యతిరేకించడంతో ఇద్దరూ వేర్వేరుగా పెళ్లిళ్లు చేసుకున్నారు. కానీ ఇటీవల ఇద్దరూ విడాకులు తీసుకుని మళ్లీ తమ పాత ప్రేమ వ్యవహారాన్ని కొనసాగించారు. గత నెల 30న కుందలహళ్లిలో కలుసుకున్నారు. ఆ సమయంలో ఏదో విషయానికి వాగ్వాదం జరగడంతో ప్రియుడు ఇమ్దాద్ బాషా ఆమెను గొంతు పిసికి చంపేశాడు. చాలా గంటలపాటు అక్కడే ఒంటరిగా గడిపాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు తామిద్దరం విషం తాగి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వాట్సాప్ మెసేజ్ చేశాడు.పోస్టుమార్టంలో ఇలాబంధువులు చేరుకుని చూడగా ఉజ్మాఖాన్ మరణించి ఉంది, అతడు అపస్మారక స్థితిలో ఉన్నాడు. మృతదేహానికి జరిపిన పోస్టుమార్టం నివేదికలో ఇమ్దాద్ బాషా మెసేజ్ చేయడానికి 10 గంటల ముందే ఆమె మరణించినట్లు వెలుగులోకి వచ్చింది. ఇమ్దాద్ బాషాను అదుపులోకి తీసుకున్న హెచ్ఏఎల్ పోలీసుల విచారణలో మరొక టెక్కీ యువకునితో ఉజ్మాఖాన్ చనువుగా ఉంటోందని, అతనిని పెళ్లి చేసు కుంటానని చెప్పడం వల్లనే తాను ఆమెను చంపేసినట్లు ఒప్పకున్నాడు. అరెస్టు చేసి విచారణ చేపట్టారు. -
బెంగళూరులో అమెరికా కాన్సులేట్ ప్రారంభం
శివాజీనగర: బెంగళూరులో శుక్రవారం ప్రారంభమైన అమెరికా కాన్సులేట్ కార్యాలయం కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధానికి వేదికగా మారింది. స్థానిక జేడబ్ల్యూ మారియెట్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ల సమక్షంలో భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి కాన్సులేట్ ప్రారంభాన్ని ప్రకటించారు. విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ మాట్లాడుతూ తనకు కర్ణాటకతో విడదీయరాని అనుబంధముందని చెప్పారు. అనంతరం కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ మాట్లాడారు. ‘ఎస్ఎం కృష్ణ సీఎం, విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నప్పటి నుంచి గత 24 ఏళ్లుగా కాన్సులేట్ కార్యాలయం కోసం ప్రయత్నిస్తున్నాం. ఆయనతోపాటు నేను కూడా ఉన్నాను’అని అన్నారు. దీనిపై కరా్టటక బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య స్పందిస్తూ.. గతంలో ఎందరు ప్రయత్నించినప్పటికీ ప్రధానమంత్రి మోదీ, విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ స్వయంగా జోక్యం చేసుకున్న తర్వాతే కాన్సులేట్‌కు మార్గం సుగమమైందంటూ ఎదురుదాడికి దిగారు. తాను కూడా అప్పటి అమెరికా రాయబారితో మాట్లాడినట్లు మాజీ సీఎం కుమారస్వామి సోషల్‌మీడియాలో అప్పటి ఫొటోలను పోస్ట్ చేశారు. -
వింటేజ్ క్రేజ్ : ఆమె ‘పద్మిని’ జాతి స్త్రీ... ఇంట్రస్టింగ్ స్టోరీ!
నీకు ఇష్టమైన కారు ఏదో చెప్పు? అంటే క్రెటా అనో ఆడి అనో మెర్సిడెస్ అనో, బిఎండబ్ల్యూ అనో...ఇంకా మరికొన్ని అత్యాధునిక, ఖరీదైన లగ్జరీ కార్ల పేర్లు చెప్పేవాళ్లనే మనం చూసి ఉంటాం కాబట్టి అదేమీ విశేషం కాదు. కానీ నీ కలల కారు గురించి చెప్పు అంటే ప్రీమియర్ పద్మిని అని ఎవరైనా చెబితే... కేవలం ఆశ్చర్యపోవడం మాత్రమే కాదు స్పృహ తప్పినా ఆశ్చర్యం లేదు. అవును మరి ప్రీమియర్ పద్మిని అనే కార్ ఒకటి ఉండేదని, ఉందని కూడా చాలా మందికి తెలియని నవ నాగరిక ప్రపంచంలో... ఆ పురాతన కార్ కోసం అన్వేషించి పట్టుకుని అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని దానికి జవసత్వాలను సమకూర్చి.. తన పుట్టిన రోజున తనకు దక్కిన అపురూప బహుమతిగా మురిసిపోతూ ప్రపంచానికి పరిచయం చేయడం ఏదైతే ఉందో... అందుకే ఆ అమ్మాయి నెటిజన్ల ప్రశంసలకు నోచుకుంటోంది.సొగసైన, హై–టెక్ కార్లు రోడ్లపై ఆధిపత్యం చెలాయించే కార్పొరేట్ ప్రపంచంలో, ఒక బెంగళూరు ఐటీ ఉద్యోగిని క్లాసిక్ కార్ ప్రీమియర్ పద్మినికి సరికొత్త యజమానిగా మారారు. భారతదేశంలో ఒకప్పుడు హుందాతనానికి అధునాతనతకు చిహ్నంగా కొంత కాలం పాటు హల్చల్ చేసిన ఈ కారు, గడిచిన విలాసవంతమైన యుగానికి ప్రాతినిధ్యం వహించింది అని చెప్పొచ్చు. అంతేకాదు రచన మహదిమనే అనే యువతి చిన్ననాటి జ్ఞాపకాలలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది.ఆమె ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా తాను కొనుగోలు చేసిన పాతకాలపు కారును, ఇంటికి తెచ్చుకున్న ఆనందాన్ని తన అనుభవాన్ని ఇన్‌స్ట్రాగామ్‌లో వీడియోలో పంచుకున్నారు. View this post on Instagram A post shared by Rachana Mahadimane (@rachanamahadimane) ఆమె తన ప్రియమైన ప్రీమియర్ పద్మిని మహదిమనే తన చిన్ననాటి కలను జీవం పోస్తున్నట్లు వీడియో చూపిస్తుంది. కొన్నేళ్ల తర్వాత తన కలల కారును ఎలా కనిపెట్టిందో ఆమె దీనిలో తెలియజేసింది. నెలల తరబడి ఖచ్చితమైన చేయించిన మరమ్మతులు అందమైన పౌడర్ బ్లూ పెయింట్ జాబ్ తరువాత, పాతకాలపు కారు ఎలా దాని పూర్వ వైభవానికి పూర్వపు అందానికి చేరుకుందో వివరించింది.‘నాకు నేను పించింగ్ వేస్తున్నాను. నా పుట్టినరోజు కోసం నేను ఈ కారు కొన్నాను ఇది నా కలల కారు, నేను చిన్నప్పటి నుండి ఈ కారు గురించి కలలు కన్నాను‘ అని ఎమ్మెల్యే మహదిమనే వీడియోలో తెలిపారు. ఆమె చిన్ననాటి జ్ఞాపకాలు ఎన్నో ఈ కార్‌తో ముడిపడి ఉండడం తో ఈ కార్ తనకొక భావోద్వేగ అనుబంధం అంటూ ఆ యువతి పొందుతున్న ఉద్వేగాన్ని ఇప్పుడు నెటిజనులు సైతం ఆస్వాదిస్తున్నారు.‘‘గత ‘సంవత్సరాన్ని అత్యద్భుతంగా ముగించడం అంటే ఇదే ఇది ఇంతకంటే మెరుగ్గా ఏదైనా ఉండగలదా? నా డ్రీమ్ కారులో ఓపికగా పనిచేసి, దానిని ఈ అందానికి మార్చినందుకు కార్ రిపేర్ చేసిన బృందానికి ధన్యవాదాలు’’ అంటూ ఆమె ఈ వీడియోలో చెప్పింది.అత్యాధునిక ఖరీదైన కార్లు లేదా మరేదైనా సరే కొనుగోలు చేయడం అంటే మనం సాధించిన, అందుకున్న విజయ ఫలాలను నలుగురికీ ప్రదర్శించడమే కావచ్చు కానీ పాతవి, మరపురాని మధుర జ్ఞాపకాలను నెమరువేసుకోవడం, ఆ అనుభూతులను తిరిగి మన దరికి చేర్చుకోవడం మాత్రం ఖచ్చితంగా గొప్ప విజయమే అని చెప్పాలి. అలాంటి విజయాలను అందిస్తుంది కాబట్టే... వింటేజ్ ఇప్పటికీ కొందరికి క్రేజ్. -
మహిళలకు ఫ్రీ బస్సా? ఇదెక్కడి న్యాయం అంటూ ట్వీట్ : ఇచ్చిపడేసిన నెటిజనులు
అటు కర్ణాటక, ఇటు తెలంగాణాలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు పథకం మహిళలను బాగా ప్రయోజనకరంగా మారింది. మరోవైపు ఉచిత ప్రయాణంపై అనేక సందర్భాల్లో తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి. తాజాగా బెంగళూరుకు చెందిన వ్యక్తి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ చర్చకు దారి తీసింది. ప్రస్తుతం దీనిపై తెగ చర్చ నడుస్తోంది.బెంగళూరుకు చెందిన కిరణ్ కుమార్ అనే వ్యక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై తన అభిప్రాయాన్ని ట్విటర్లో పంచుకున్నాడు. అసలు కేవలం ఆధార్ చూపించిబస్సులో ప్రయాణించడం ఎంతవరకు న్యాయం అంటూ తన అక్కసంతా వెళ్లగక్కాడు. కుమార్ పోస్ట్‌లో అందించిన వివరాల ప్రకారం బెంగళూరు నుండి మైసూరుకు KSRTC బస్సులో ప్రయాణ ఛార్జీ రూ.210. ఈ బస్సులో 50 మంది ప్రయాణికులలో దాదాపు 30 మంది మహిళలు. 20 మంది పురుషులు డబ్బులుచెల్లించి టికెట్ తీసుకుంటే, ఆధార్ చూపించి 30మంది ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఇది న్యాయమా? సమానత్వం అంటే ఇదేనా?. ఒక వృద్ధుడు చెల్లించడానికి నోట్లు దొరక్క ఇబ్బంది పడుతోంటే, మరో పక్క వీడియో కాల్లో ఒక ధనిక యువతి దర్జాగా ఫ్రీగా వెళుతోంది అంటూ చెప్పుకొచ్చాడు.ప్రభుత్వం అంత మిగులు ఆదాయాన్ని ఆర్జిస్తుంటే, విమానాశ్రయ షటిల్ సర్వీస్ తరహాలో సార్వత్రిక ఉచిత బస్సు సేవను ప్రకటించవచ్చు కదా అని ప్రశ్నించాడు. ప్రపంచవ్యాప్తంగా, సబ్సిడీలు, సంక్షేమం భరించలేని వారికి కదా ఇచ్చేది, కానీ బెంగళూరు , మైసూరు వంటి నగరాల్లో ధనవంతులైన మహిళలకు ఉచిత పథకమా అంటూ ఆక్రోశమంతా వెళ్లగక్కాడు. ఓట్ల కోసం ఉచితాలనే దుర్మార్గపు చక్రంలోకి ప్రవేశించాం, సమీప భవిష్యత్తులోదీన్నుంచి బయటపడటం కష్టం అంటూ వాపోయాడు.దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. చాలామంది ఈ పథకాన్ని సమర్థించారు. సాధారణంగా ఉచితాలను ఆమోదించను కానీ రెండుమూడు సార్లు BMTCలో ప్రయాణించా. బస్సులో ప్రయాణించే చాలా మంది మహిళలు రోజువారీ వేతన కార్మికులు లేదా సాధారణ ఉద్యోగులే కనుక..అది చూసి మంచిగా అనిపించింది ఒక యూజర్ వ్యాఖ్యానించారు. "ఇది ఉచితాలు కాదు. ప్రజలు ఇచ్చే పన్నులకు బదులుగా ప్రభుత్వం సమాజానికి తిరిగి చెల్లిస్తోంది. ఇది అర్థం చేసుకోకపోతే, ప్రజాస్వామ్య ప్రభుత్వం ,పాలనా సూత్రాలు అర్థం కావు అంటూ మరో వినియోగడదారుడు చురకలేశాడు.మరి కొంతమంది ఆయన వాదను సమర్ధించారు. తాము చెల్లించే ఇలా పోతున్నాయి.. ఇది తనకు నచ్చలేదు అంటూ మహిళల ఫ్రీ బస్సు పథకంపై ప్రతికూలంగా స్పందించారు. నెగెటివ్ కామెంట్స్‘‘మీ వాదన సరైనదే. ఉచితం కాదు.. 50శాతం చేయండి. మహిళలకు ఈ ఉచిత ప్రయాణం పాఠశాల, కళాశాల ,పనికి వెళ్లే సాధారణ ప్రయాణికులకు కష్టంగా మారింది.’’ "నా ఆదాయపు పన్నును రోడ్లు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఉపయోగించాలి... అర్హత లేని వారికి ఉచితాలను పంపిణీ చేయడానికి కాదు" I took an early morning bus to Mysuru, from Bengaluru. ₹210 fare. Comfortable KSRTC bus and a world class highway for fast travel.But I got a few thoughts. 1) Nearly 30 of the 50 passengers were women. Just show Aadhar and travel free. Is this fair? Is it equality? 2) 20… pic.twitter.com/2TfkzF88IA— Kiran Kumar S (@KiranKS) January 8, 2025 "ఇతరులు చెల్లించడానికి ఇబ్బంది పడుతుండగా, సంపన్న మహిళలకు ఉచితాలను అందజేయడం. ఓటు బ్యాంకు రాజకీయం తప్ప మరొకటి కాదు. సబ్సిడీలను మౌలిక సదుపాయాలు లేదా నిజంగా అవసరమైన వారికి సహాయం చేయడం వంటి నిజమైన సమస్యలకు ఉపయోగించాలి. ఇలా కొంతమందిపై అదనపు భారం ఎందుకుమోపాలి? ఇది స్పష్టమైన అసమానత, పురోగతి కాదు" -
బెంగళూరులో 23 నుండి ఐఎంటీఈఎక్స్ 2025
న్యూఢిల్లీ: మెషిన్ టూల్ పరిశ్రమకు సంబంధించి జనవరి 23 నుండి 29 వరకు బెంగళూరులో ఐఎంటీఈఎక్స్ 2025 ఎగ్జిబిషన్ జరగనుంది. ఇందులో అమెరికా, జర్మనీ, ఇటలీ, జపాన్ తదితర 23 దేశాల నుండి 1,100కు పైగా ఎగ్జిబిటర్లు పాల్గోనున్నారు. సుమారు 90,000 చ.మీ. విస్తీర్ణంలో నిర్వహించే ఎగ్జిబిషన్లో టూల్‌టెక్, డిజిటల్ మాన్యుఫాక్చరింగ్ మొదలైన కార్యక్రమాల్లో భారత తయారీ సాంకేతికత సామర్థ్యాలను ప్రతిబింబించే పలు ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. మెషిన్ టూల్ రంగ సంస్థలు కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఇది ఉపయోగపడగలదని ఐఎంటీఎంఏ ప్రెసిడెంట్ రాజేంద్ర ఎస్ రాజమాణె తెలిపారు. -
బీబీఎంపీ బోర్ల స్కాం.. రెండోరోజూ ఈడీ తనిఖీలు
బనశంకరి: బెంగళూరు మహానగర పాలికెలో బోరుబావుల తవ్వకం, ఆర్ఓ ప్లాంట్ల ఏర్పాటు పథకంలో 2016–2019 మధ్య కోట్లాది రూపాయల అక్రమాల ఆరోపణలపై ఈడీ అధికారులు రెండవ రోజు బుధవారం కూడా తనిఖీలు కొనసాగించారు. పాలికె చీఫ్ ఇంజినీర్ బీఎన్.ప్రహ్లాద్రావ్ ఆఫీసులో సోదాలు చేశారు. బీబీఎంపీ చీఫ్ అకౌంటెంట్ బీనా ను విచారించారు. పాలికె ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, 8 వలయాల చీఫ్ ఇంజినీర్లను పాలికె ఆఫీసుకు పిలిపించి కూలంకుషంగా సమాచారం రాబట్టారు. బొమ్మనహళ్లి, ఆర్ఆర్.నగర, మహదేవపుర, యలహంక, దాసరహళ్లి నియోజకవర్గాల్లోని 68 వార్డుల్లో 9,558 బోర్‌వెల్స్ తవ్వారు. దీంతో పాటు 976 వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశామని బీబీఎంపీ అధికారులు లెక్కలు చూపారు. కానీ వెయ్యి బోర్లను తవ్వకుండానే తప్పుడు లెక్కలు చూపించి కోట్లాదిరూపాయల్ని కైంకర్యం చేశారని ఆరోపణలున్నాయి. మొత్తం రూ.400 కోట్లకు పైగా స్వాహా చేసినట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి. -
దేశంలో మూడు HMPV కేసులు.. అయినా భయం వద్దు..
బెంగళూరు : చైనాలో పుట్టిన కరోనా వైరస్ తరహాలో హెచ్ఎంపీవీ (hmpv) వైరస్ కోరలు చాస్తోంది. ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాల ప్రజలు ఈ వైరస్ బారిన పడగా.. తాజాగా, భారత్‌లో మూడు వైరస్ కేసులు నమోదుయ్యాయి. కర్ణాటక రాజధాని బెంగళూరు బాపిస్ట్ ఆస్పత్రిలోని 3, 8 నెలల వయసున్న ఇద్దరు చిన్నారులకు, గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లో ఒకరికి వైరస్ సోకినట్లు ఐసీఎంఆర్ (icmr) నిర్ధారించింది.వైరస్ కేసుల నమోదుపై కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి కర్నాటక మంత్రి దినేష్ గుండూరావు (dinesh gundu rao) స్పందించారు. భారత్‌లో రెండు హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదయ్యాయని నివేదికలు వెలువడ్డాయి.ఆ రెండు కేసుల్లో ఒక కేసుపై స్పష్టత లేదు. రిపోర్ట్లు సైతం అలాగే ఉన్నాయి. హెచ్ఎంవీపీ అనేది ఇప్పటికే ఉన్న వైరస్. ఇది గత కొనేళ్లుగా వ్యాపిస్తోంది. ఏటా కొంత మంది దీని బారిన పడుతున్నారు. ఇది కొత్త వైరస్ కాదు. ఇక తాజాగా వైరస్ వ్యాప్తి చెందిన చిన్నారి విదేశాల నుంచి ఇక్కడి వచ్చిన దాఖలాలు లేవు. చైనా, మలేషియా, మరే ఇతర దేశంతో సంబంధం లేదు.చైనా నుంచి వచ్చిన రిపోర్ట్లు చిన్నారుల్లో వైరస్ వ్యాప్తికి హెచ్ఎంపీవీ కొత్త వేరియంట్ ఉండవచ్చునని సూచిస్తున్నప్పటికీ, మా వద్ద ఇంకా పూర్తి వివరాలు లేవు. ఇదే అంశంపై కేంద్రం మరిన్ని వివరాలు సేకరిస్తోంది. ఈ సందర్భంగా హెచ్ఎంపీవీ వైరస్ కొత్తది కాదని గుర్తించాలి. భయపడొద్దు. ఇది సాధారణంగా దగ్గు, జ్వరం వంటి సాధారణ లక్షణాలను కలిగి ఉంటుంది. తగు జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ దానంతట అదే తగ్గుముఖం పడుతుంది’ అని అన్నారు. After the detection of two hMPV cases in #Karnataka, state Health Minister @dineshgrao said that the report has come out that this is the first case of HMPV in India, which is inaccurate. HMPV is an existing virus that has been circulating for years, and a certain percentage of… pic.twitter.com/1RwELP6hga— South First (@TheSouthfirst) January 6, 2025 -
China HMPV Virus: భారత్‌లో తొలి కేసు నమోదు.. ఎక్కడంటే?
బెంగళూరు: భారత్‌లో చైనాకు చెందిన కొత్త వైరస్ హెచ్ఎంపీవీ వైరస్ పాజిటివ్ కేసు నమోదైంది. బెంగళూరుకు చెందిన ఎనిమిది నెలల చిన్నారిలో వైరస్ లక్షణాలు వైద్యులు గుర్తించారు. చైనా (China)లో హెచ్ఎంపీవీ (HMPV)వైరస్ కలకలం సృష్టిస్తోన్న వేళ భారత్‌లో తొలి పాజిటివ్ కేసు నమోదైంది. బెంగళూరులో ఎనిమిది నెలల చిన్నారిలో ఈ వైరస్ పాజిటివ్‌గా తేలింది. దీనిపై కర్ణాటక ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పందించింది. రాష్ట్రంలోని ల్యాబ్‌లో ఈ పరీక్ష నిర్వహించలేదని తెలిపింది. ఆ రిపోర్టు ఓ ప్రైవేటు ఆస్పత్రి నుంచి వచ్చిందని, దానిపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని వెల్లడించింది. అయితే దీనిపై కేంద్ర ఆరోగ్యశాఖ నుంచి ఎలాంటి ధ్రువీకరణ రాలేదు.🚨 India reports first case of HMPV virus; an 8-month-old baby tests positive in Bengaluru. pic.twitter.com/M5y9QJsYwP— Mohit khemariya 🗿 (@Mohitkhemariya_) January 6, 2025ఏమిటీ హెచ్ఎంపీవీ?హెచ్ఎంపీవీ ఇన్ఫెక్షన్ లక్షణాలు కరోనా, ఫ్లూ, ఇతర శ్వాసకోశ వ్యాధులను పోలి ఉంటాయి.దగ్గు, జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి వంటివి ఉంటాయి.వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో బ్రాంకైటిస్, నిమోనియాకు దారితీసే అవకాశం ఉంటుంది.ఇన్ఫెక్షన్ సోకిన 3-6 రోజుల లోపు ఈ వ్యాధి లక్షణాలు బయటపడతాయి.ఇది ఎగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్. కొన్నిసార్లు దిగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ను కూడా కలిగించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.దీనివల్ల నిమోనియా, ఆస్థమా తీవ్రం అవుతాయని వివరిస్తున్నారు.చిన్నారులు, వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఇది తీవ్ర అనారోగ్యాన్ని కలిగించే అవకాశం ఉందని అంటున్నారు.వ్యాప్తి ఇలా..దగ్గు, తుమ్ము వల్ల వెలువడే తుంపర్లతో వ్యాప్తి చెందుతుంది.వైరస్ బారిన పడిన వ్యక్తులతో సన్నిహితంగా మెలగడం, కరచాలనం చేయడం వల్ల వ్యాపిస్తుంది.వైరస్ వ్యాపించిన ప్రాంతాలను తాకిన చేతులతో నోరు, ముక్కు, కళ్లను తాకడం కారణం.నివారణ ఇలా..తరచూ సబ్బుతో కనీసం 20 సెకన్ల పాటు చేతులను కడుక్కోవాలి.చేతులు శుభ్రం చేసుకోకుండా కళ్లు, ముక్కు, నోటిని తాకకూడదు.ఇన్ఫెక్షన్ బారినపడిన వ్యక్తులకు దూరంగా ఉండాలి.జలుబు లక్షణాలు ఉన్నవారు మాస్కు ధరించాలి.దగ్గు, తుమ్ము వచ్చేప్పుడు నోరు, ముక్కును కవర్ చేసుకోవాలి.వైరస్ సోకినవారు బయట తిరగకూడదు. -
బెంగళూరు రేవ్ పార్టీ కేసు.. నటి హేమకు రిలీఫ్
బెంగళూరు రేవ్ పార్టీ (Bengaluru Rave Party) కేసులో టాలీవుడ్ నటి హేమకు(Hema) రిలీఫ్ దక్కింది. ఈ కేసులో ఎలాంటి చర్యలు చేపట్టవద్దని కర్ణాటక హైకోర్టు స్టే విధించింది. మరో నాలుగు వారాల తర్వాత ఈ కేసుపై విచారణ చేపడతామని వాయిదా వేసింది.కాగా.. గతంలో రేవ్ పార్టీకి హాజరైన టాలీవుడ్ నటి హేమ డ్రగ్స్ తీసుకున్నారంటూ కేసు నమోదైన సంగతి తెలిసిందే. తనపై నమోదైన కేసును కొట్టేయాలని హేమ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఆమె తరఫున న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. ఇరువురి వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం నాలుగు వారాల పాటు స్టే విధించింది. అప్పటివరకూ ఈ స్టే కొనసాగుతుందని పేర్కొంది.కాగా.. గతేడాది మే నెలలో బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో సినీ నటి హేమను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఆ తర్వాత బెయిల్‌పై ఆమె విడుదలయ్యారు. ఈ క్రమంలో తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని హేమ స్పష్టం చేశారు.మా సస్పెన్షన్ ఎత్తివేత..బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమ అరెస్టు అయిన సంగతి తెలిసిందే. అనంతరం ఆమెకు బెయిల్ కూడా రావడం జరిగింది. ఈ వివాదంలో చిక్కుకున్న హైమపై నైతికంగా ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు చర్యలు తీసుకున్నారు. మా నుంచి ఆమె ప్రాథమిక సభ్యత్వాన్ని వారు ఆ సమయంలో తొలగించారు. అయితే హేమకు నిర్వహించిన రక్త పరీక్షలలో నెగటివ్ వచ్చిందని అందుకు సంబంధించిన రిపోర్టులను కూడా ఆమె సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. ఆపై కోర్టు కూడా ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో హేమపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్లు ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) ప్రకటించింది. అయితే, మీడియాతో సెన్సిటివ్ విషయాల గురించి మాట్లాడవద్దని హేమకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సూచించింది. -
హైదరాబాద్ సహా మూడు నగరాలకు ఫుల్ డిమాండ్: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి
పూణే: ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. వాతావరణ మార్పుల కారణంగా రానున్న కాలంలో బెంగళూరు, హైదరాబాద్, పూణే నగరాలకు భారీ ఎత్తున వలసలు ఉంటాయని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో వలసల లేకుండా ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.పూణేలో జరిగిన ఒక కార్యక్రమంలో నారాయణమూర్తి మాట్లాడుతూ..‘భారత్ సహా పలు దేశాల్లో(ఆఫ్రికన్) ఇటీవలి కాలంలో వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ కారణంగా ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. వాతావరణ మార్పుల కారణంగా రాబోయే రెండు దశాబ్దాల్లో కొన్ని దేశాల ప్రజలు భారత్‌వైపు చూసే అవకాశం ఉంది. దేశంలోని కొన్ని ప్రాంతాలు నివాసయోగ్యంగా ఉండటంతో వారు ఇక్కడికి వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఫలితంగా పెద్ద ఎత్తున వలసలు కొనసాగుతాయని అన్నారు.ఇదే సమయంలో భారత్ విషయానికి వస్తే హైదరాబాద్, బెంగళూరు, పూణే వంటి నగరాల్లోకి వలసలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అందుకే వారంతా ఇక్కడే వచ్చేందుకు చూస్తారు. అప్పుడు ట్రాఫిక్ సమస్యలు, కాలుష్యం కారణంగా ఇక్కడ పరిస్థితులు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో వలసలను అడ్డుకునేందుకు ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. కార్పొరేట్ ప్రపంచం, రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు కలిసి వాతావరణ మార్పు సమస్యను పరిష్కరించాలని సూచనలు చేశారు. ఇదిలా ఉండగా.. అంతకుముందు వారంలో 70 గంటలు పనిచేయాలంటూ నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ చేరాలంటే దేశ యువత వారానికి 70 గంటలు చొప్పున పని చేయాల్సిందేనని కుండ బద్ధలుకొట్టారు. లేకుంటే పేదరికం నుంచి ఎలా బయటపడగలమని? ప్రశ్నించారు. మన దేశంలో ఇంకా 80కోట్ల మంది ఉచిత రేషన్ అందుకుంటున్నారు. అంటే ఆ 80 కోట్ల మంది ఇంకా పేదరికంలో ఉన్నట్లే కదా..! అందుకే మన ఆశలు, ఆకాంక్షలను ఉన్నతంగా ఉంచుకోవాలి. వారానికి 70 గంటలు పని చేయలేకపోతే మనం ఈ పేదరికాన్ని ఎలా అధిగమించగలం? మనం కష్టపడి పనిచేసే స్థితిలో లేకపోతే ఇంకెవరు పనిచేస్తారు?. భవిష్యత్తు కోసం మనమంతా కలసికట్టుగా బాధ్యత తీసుకోవాలని పిలుపు ఇచ్చారు. Infosys CEO Narayana Murthy warns of urban overload due to climate change pic.twitter.com/85EwbchiOD— NDTV (@ndtv) December 22, 2024 -
నీతా అంబానీయా మజాకా : ఆమె బ్యాగు ధరతో కారు కొనేయొచ్చట!
మహిళల ప్రీమియర్ లీగ్ సీజన్ 3 కోసం నిర్వహించిన మినీ వేలంలో ముంబై ఇండియన్స్ ఓనర్ నీతా అంబానీ తనదైన స్టైల్‌తో ఆకట్టుకున్నారు. సందర్భానికి తగ్గట్టు తన డ్రెస్సింగ్ స్టైల్‌తో అదరగొట్టడం మాత్రమే కాదు, హై-ఎండ్ యాక్సెసరీలతో స్పెషల్ లుక్‌లో అందరి కళ్లను తనవైపు తిప్పుకోవడంలో నీతా అంబానీ ముందుంటారు. తాజాగా బెంగళూరులో నిర్వహించిన WPL 2025 మినీ వేలం ఈవెంట్లో మరోసారి ఈ విషయాన్నే రుజువుచేశారు. ముఖ్యంగా ఆమె చేతిలోని పింక్ బ్యాగ్ హాట్ టాపిక్‌గా నిలిచింది.నీతా అంబానీ పవర్ లుక్!ఈ వేలం కార్యక్రమం కోసం నీతా అంబానీ నీతా అంబానీ పవర్లుక్లో అదర గొట్టారు. ఈ బిజినెస్ ఐకాన్ పవర్ షోల్డర్లు, డబుల్ కాలర్స్‌తో కూడిన చిక్ పాస్టెల్ పింక్ బ్లేజర్‌ను ధరించారు. స్టైలిష్ డెనిమ్ బ్లేజర్‌కు జతగా విలాసవంతమైన హ్యాండ్‌బ్యాగ్‌తో కనిపించారు. అంతేనా డైమండ్ స్టడ్స్, హార్ట్ షేప్డ్ లాకెట్టు నెక్లెస్, తెల్లటి చేతి గడియారం , హై హీల్స్‌తో తన స్టయిల్‌కి లగ్జరీ టచ్ ఇచ్చారు.ఇదీ చదవండి: ముంబై ఇండియన్స్ మహిళా టీం, యువ ప్రతిభకు ప్రాధాన్యం : నీతా పింక్ హ్యాండ్బ్యాగ్ఈ ఔట్‌ఫిట్‌కు తగ్గట్టుగా పర్ఫెక్ట్ మ్యాచింగ్‌తో ధరించిన పింక్ హ్యాండ్‌బ్యాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పింక్ అండ్ వైట్ గోయార్డిన్ కాన్వాస్, చెవ్రోచెస్ కాల్ఫ్స్కిన్ సైగాన్ స్ట్రక్చర్ ఉన్న ఈ వాచ్ ధరతో ఒక కారు కొనేయొచ్చంటే నమ్ముతారా? ప్రఖ్యాత బ్రాండ్ గోయార్డ్ బ్రాండ్‌కు చెందిన బ్యాగ్ ధర సుమారు 10 లక్షల(12వేల అమెరికా డాలర్లు) రూపాయలట.కాగా మహిళల ప్రీమియర్ లీగ్ సీజన్ 3 కోసం రిలయన్స్ఫౌండేన్ చైర్పర్సన్ నీతా అంబానీ యాజమాన్యలోని ముంబై ఇండియన్స్ పటిష్టమైన టీంను సిద్ధం చేసింది. WPL 2025 ఆదివారం బెంగుళూరులో జరిగిన వేలంలో కొత్తగా నలుగురు మహిళా క్రికెటర్లను జట్టులో చేర్చుకుంది. దీనిపై నీతా అంబానీ సంతోషం వ్యక్తం చేశారు. -
నేడు డబ్ల్యూపీఎల్ మినీ వేలం
బెంగళూరు: ఇటీవల ఐపీఎల్ మెగా వేలంలో ప్లేయర్లపై కనకవర్షం కురవగా... ఇప్పుడు మహిళల వంతు వచ్చిoది. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మినీ వేలానికి రంగం సిద్ధమైంది. ఆదివారం బెంగళూరు వేదికగా డబ్ల్యూపీఎల్ మినీ వేలం జరగనుంది. ఈ మినీ వేలంలో 120 మంది ప్లేయర్లు పాల్గొంటున్నారు. ఐదు ఫ్రాంచైజీలలో కలిపి మొత్తం 19 స్థానాల కోసం భారత్ నుంచి 91 మంది ప్లేయర్లు, విదేశాల నుంచి 29 మంది ప్లేయర్లు బరిలో ఉన్నారు. ఇందులో అసోసియేషన్ దేశాలకు చెందిన ముగ్గురు ప్లేయర్లు ఉన్నారు. గుజరాత్ ఫ్రాంచైజీ వద్ద అత్యధికంగా రూ.4.4 కోట్లు ఉన్నాయి. యూపీ వారియర్స్ జట్టు ముగ్గురు ప్లేయర్లను కొనుగోలు చేసుకోవాల్సి ఉండగా... గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీలు తలా నలుగురు ప్లేయర్లను కొనుగోలు చేయనున్నాయి. ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద అందరికంటే తక్కువగా రూ.2.5 కోట్లు ఉన్నాయి. విదేశీ ప్లేయర్లలో వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డాటిన్, ఇంగ్లండ్ కెపె్టన్ హీథర్ నైట్ రూ.50 లక్షల కనీస ధరతో వేలానికి రానున్నారు. భారత ఆటగాళ్లలో ఆల్‌రౌండర్ స్నేహ్ రాణా రూ.30 లక్షల కనీస ధరతో వేలంలో పాల్గొననుంది. ఢిల్లీకి చెందిన లెఫ్టార్మ్ అన్షు నాగర్ 13 ఏళ్ల వయసులోనే వేలం బరిలో నిలిచింది. -
భార్య కేసు పెట్టిందని.. 40పేజీల డెత్‌నోట్ రాసి
బనశంకరి: భార్య తనపై కేసు పెట్టిందనే ఆవేదనతో భర్త 40 పేజీల డెత్‌నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బెంగళూరులో సోమవారం వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అతుల్ సుభాష్ (35) మారతహళ్లి మంజునాథ లేఔట్లో నివాసం ఉంటున్నారు. ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తాడని సమాచారం. ఇతని భార్య గొడవపడి యూపీలో పుట్టింటికి వెళ్లిపోయి అక్కడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో అప్పటినుంచి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.కుమార్తెకు కానుక కొనుగోలుఆదివారం అర్ధరాత్రి 40 పేజీల డెత్‌నోట్ రాసి, పలు రకాల డాక్యుమెంట్లను జత చేసి ఓ సేవా సంస్థ వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేశాడు. తన కుటుంబానికి సాయం చేయాలని కోరాడు. తన ఇంటి తాళం ఎక్కడ ఉంది, ఏయే పనులు జరిగాయి, పెండింగ్ పనులు ఎన్ని ఉన్నాయి అనే వివరాలను అందులో రాశాడు. చివరి క్షణంలో తన నాలుగేళ్ల కుమార్తె జ్ఞాపకం రావడంతో ఒక కానుకను కొనుగోలు చేసి ఉంచాడు. దానిని ఆమెకు ఇవ్వాలని రాశాడు. ఈ డెత్‌నోట్‌ను సుప్రీంకోర్టుకు పంపాలని కోరాడు.3 రోజుల నుంచి సన్నాహాలుగత మూడురోజుల నుంచి అతడు ఆత్మహత్యకు సన్నద్ధమైనట్లు తెలుస్తోంది. డే1, డే 2, డే3 ఏమేం చేయాలి అనేది ఇంట్లో బోర్డు మీద కాగితాల్లో రాసి అతికించాడు. ఉదయం నిద్ర లేచినప్పటినుంచి ఆత్మహత్య చేసుకునే వరకు ఏమేం పనులు చేయాలి అని గుర్తు చేసుకున్నాడు. ఇక న్యాయం జరగడమే మిగిలి ఉంది అని ఆంగ్లంలో రాశాడు. ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందిన వెంటనే మారతహళ్లి పోలీసులు చేరుకుని పరిశీలించి డెత్‌నోట్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. యూపీలోని భార్య, కుటుంబానికి సమాచారం అందించారు. అతడు సున్నిత మన స్కుడని, కుటుంబ గొడవల వల్ల తీవ్రమైన డిప్రెషన్‌కు గురయ్యాడని, అందువల్లే ఇలా చేశాడని పలువురు నెటిజన్లు సానుభూతి తెలిపారు. -
ఆండ్రోమెడాలో వెలుగుల పున్నమి
సువిశాల విశ్వంలో ఎన్నెన్నో నక్షత్ర మండలాలు (గెలాక్సీలు)న్నాయి. మన నక్షత్ర మండలాన్ని పాలపుంత (మిల్కీవే) అంటారన్నది తెలిసిందే. మనకు సమీపంలో ఉన్న అతిపెద్ద నక్షత్ర మండలం ఆండ్రోమెడా. ఈ గెలాక్సీలో అరుదైన దృశ్యాన్ని బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (ఐఐఏ) బృందం కెమెరాలో బంధించింది. గెలాక్సీలోని నక్షత్రాలపై ఉన్నట్టుండి పేలుడు సంభవించి భిన్న రంగులతో కూడిన అత్యధిక కాంతి వెలువడడాన్ని నోహ్‌వై అంటారు. ఆండ్రోమెడా నక్షత్ర మండలంలో ఇలాంటి నోహ్‌వై నుంచి పరారుణ ఉద్గారాలను తొలిసారిగా గుర్తించారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన ఆస్ట్రోశాట్ ఉపగ్రహంపై అమర్చిన అ్రల్టావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ (యూవీఐటీ) ద్వారా ఈ ఉద్గారాలను చిత్రీకరించారు. నోహ్‌వై సాధారణంగా బైనరీ నక్షత్ర వ్యవస్థలో సంభవిస్తూ ఉంటుంది. భూమి పరిమాణంలో ఉన్న మరుగుజ్జు నక్షత్రం మరో నక్షత్రానికి సమీపంలో పరిభ్రమిస్తున్నప్పుడు ఈ పరిణామాన్ని చూడొచ్చు. ఒక నక్షత్రం తన గురుత్వాకర్షణ శక్తితో మరో నక్షత్రంలోని పదార్థాన్ని ఆకర్షిస్తే శక్తివంతమైన థర్మోన్యూక్లియర్ రియాక్షన్ జరుగుతుంది. దాంతో హఠాత్తుగా మిరుమిట్లు గొలిపే వెలుగుతో నక్షత్రంపై పేలుడు సంభవిస్తుంది. ఆండ్రోమెడా గెలాక్సీలో నోహ్‌వై నుంచి 42 దాకా అ్రల్టావైలెట్ ఉద్గారాలను గుర్తించడం విశేషం. వీటిపై మరింత అధ్యయనం చేస్తున్నారు. ఈ వివరాలను అస్ట్రో ఫిజికల్ జర్నల్‌లో ప్రచురించారు. నక్షత్ర మండలాల గురించి తెలుసుకోవడానికి ఈ సమాచారం తోడ్పడుతుందని భావిస్తున్నారు. నోహ్‌వై రహస్యాలను ఛేదించడానికి భవిష్యత్తులో అ్రల్టావైలెట్, ఎక్స్–రే మిషన్లలో పరిశోధనలకు సైతం ఉపయోగపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
దీపికా పదుకొణె లైఫ్ రీస్టార్ట్.. సింగర్‌కి కన్నడ నేర్పిస్తూ (ఫొటోలు)
-
‘ప్రగతి’ సూపర్ సక్సెస్
సాక్షి బెంగళూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న పథకాలు, ప్రాజెక్టులపై ఎప్పటికప్పడు సమీక్ష జరుపుతూ సమయానికి పనులు పూర్తయ్యేలా చేసేందుకు నేరుగా ప్రధాని మోదీ పాల్గొని నిర్వహించే వర్చువల్ సమావేశం ప్రో–యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ (ప్రగతి) కార్యక్రమం అద్భుత ఫలితాలనిస్తోందని ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం కితాబునిచ్చింది. రెండో తేదీన బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో జరిగిన కార్యక్రమంలో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ‘ప్రగతి’కార్యక్రమంపై జరిపిన అధ్యయనాన్ని ఒక బిజినెస్ స్కూల్ కేస్ స్టడీ రూపంలో విడుదల చేసింది. ‘గ్రిడ్లాక్ టూ గ్రోత్’పేరిట చేసిన అధ్యయనంలో ప్రగతి కార్యక్రమం అమలు, వాటి ఫలితాలను విశ్లేషించింది. దేశంలో భారీ ఎత్తున మౌలిక వసతులు, సామాజికాభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రగతి పథకం ద్వారా విజయవంతంగా అమలు చేస్తున్నారని ఆక్స్ఫర్డ్ ప్రశంసించింది. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో నిర్వహించిన ఈ పరిశోధనలో ‘ప్రగతి’కార్యక్రమం ద్వారా దేశంలో జరిగిన డిజిటల్ గవర్నెన్స్ అభివృద్ధిని ఆక్స్ఫర్డ్ ప్రస్తావించింది. 2015లో ‘ప్రగతి’ప్రస్థానం మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు 205 బిలియన్ డాలర్ల విలువైన 340 ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తిచేశారని వెల్లడించింది. ‘ప్రగతి’కార్యక్రమంలో భాగంగా సుమారు 50 వేల కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణం జరిగిందని, రెట్టింపు స్థాయిలో విమానాశ్రయాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపింది. మౌలికవసతుల కల్పన కోసం ఖర్చు చేసిన ప్రతి రూపాయి జీడీపీలో రూ. 2.5 నుంచి రూ. 3.5 మేర తిరిగి లబ్ధి చేకూర్చినట్లు ఆక్స్ఫర్డ్ అధ్యయనం తెలిపింది. ప్రధాన మంత్రి మౌలికవసతుల అభివృద్ధి కోసం ఉద్దేశించిన పీఎం గతిశక్తి, పర్యావరణ అనుమతుల నిమిత్తం రూపొందించిన పరివేశ్లను నిర్వహించడంలో ఈ ప్రగతి ఎంతగానో దోహదపడిందని వర్సిటీ తెలిపింది. గతంలో పర్యావరణ అనుమతుల కోసం 600 రోజులు పడుతుండగా ప్రస్తుతం ‘ప్రగతి’కారణంగా జీఐఎస్ మ్యాపింగ్, డ్రోన్ పర్యవేక్షణ ద్వారా ఆ గడువు దాదాపు 75 రోజులకు తగ్గిందని వెల్లడించింది. గ్రామాల్లోని కుళాయి కనెక్షన్స్ కూడా కేవలం ఐదేళ్లలో 17 శాతం నుంచి 79 శాతానికి పెరిగినట్లు తెలిపింది. -
బెంగళూరు ట్రాఫిక్.. ఇలా చేస్తే నో టెన్షన్!
‘రష్యాలో ఒక మూల నుంచి ఇంకో మూలకు కారులో ప్రయాణించాలంటే 149 గంటలు పడుతుంది. అంతసేపు ప్రయాణించినా ఇంకా రష్యాలోనే ఉంటాం. బెంగళూరు పరిస్థితి కూడా సరిగ్గా ఇలాగే ఉంది’ బెంగళూరు ట్రాఫిక్ రద్దీపై ఇటీవల ఎక్స్‌లో ఓ మహిళ పెట్టిన పోస్ట్ ఇది. ఇండియా ఐటీ క్యాపిటల్‌గా పేరుగాంచిన బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలు నిత్యకృత్యం. బెంగళూరు వాసులు రోడ్డు మీదకు వచ్చారంటే నరకప్రాయమే. ట్రాఫిక్ రద్దీతో గంటలకొద్దీ రోడ్లపై గడపాల్సి ఉంటుంది. తమ ట్రాఫిక్ కష్టాలను సోషల్ మీడియా వేదికగా ఏకరువు పెడుతుంటారు. జోకులు, సెటైర్లు కూడా షేర్ చేస్తుంటారు.బెంగళూరు మెట్రో సిటీలో జనాభా అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతంలో బెంగళూరు మహా నగరంలో దాదాపు 1.4 కోట్ల మంది నివసిస్తున్నారు. పెరుగుతున్న జనాభా కారణంగా వ్యక్తిగత వాహనాల వినియోగం కూడా అధికం కావడంతో ట్రాఫిక్ రద్దీ నానాటికీ ఎక్కువవుతోంది. నగర రహదారులు వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. ఫలితంగా ఎక్కడా చూసినా ట్రాఫిక్ జామ్‌లే దర్శనమిస్తున్నాయి. ఈ కష్టాల నుంచి గట్టెక్కడానికి ట్రాఫిక్‌ను నియంత్రించే వ్యూహాత్మక, సమగ్ర విధానం చాలా అవసరమని బెంగళూరు వాసులు అభిప్రాయపడుతున్నారు.ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం చేయాల్సిన వాటి గురించి బెంగళూరు వాసి ఒకరు ఎక్స్‌లో పెట్టిన పోస్ట్ తాజాగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వచ్చే ఐదేళ్లలో చేపట్టాల్సిన చర్యల గురించి ప్రస్తావించడం ఆలోచింపజేస్తోంది. బెంగళూరులో ప్రస్తుతం 1.05 కోట్ల ప్రైవేటు వాహనాలు ఉండగా, గత అక్టోబర్ నెలలో కొత్తగా 70 వేల ప్రైవేటు వెహికిల్స్ రోడ్డెక్కినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. బెంగళూరులో ట్రాఫిక్ రద్దీకి ఎక్కువగా (87.6 శాతం) ప్రైవేటు వాహనాలు కారణమవుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే బెంగళూరులో ట్రాఫిక్ మరింత నరకప్రాయం అవుతుంది. ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ప్రభుత్వం దీర్ఘకాలిక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి 5 ఏళ్లలో చేపట్టాల్సిన చర్యలు..1. బెంగళూరు జనాభాలో ప్రస్తుతం 10 శాతం మంది మాత్రమే ప్రజా రవాణా వ్యవస్థను వినియోగిస్తున్నారు. ఈ సంఖ్యను 70 శాతానికి పెంచాలి.2. ఆర్టీసీ బస్సు, మెట్రో రైలు, సైకిల్ రైడ్ వంటి బహుముఖ ప్రయాణాలను ప్రోత్సహించాలి.3. ఆక్రమణలు తొలిగించి వీధులను ప్రయాణానికి అనువుగా మార్చాలి. పాదచారులు ఏ ఆటంకాలు లేకుండా నడిచేలా ఉండాలి.చదవండి: ఇండియా సిలికాన్ సిటీలో సిగ్నల్ దాటాలంటే చుక్కలే4. బెంగళూరులో బస్సుల సంఖ్య పెంచాలి. పెద్ద బస్సులతో పాటు మినీ బస్సులు కూడా అవసరం. నివాస ప్రాంతాల నుంచి మెట్రో రైలు, పెద్ద బస్సులకు అనుసంధానంగా మినీ బస్సులు నడపాలి.5. నగరంలోని అన్ని ప్రాంతాలను కవర్ చేస్తూ, ఎక్కువ మంది ప్రయాణించేలా మెట్రో రైలు పరిధిని విస్తరించాలి. సబర్బన్ రైలు సేవలను కూడా విస్తృతం చేయాలి.6. ఫుట్‌పాత్‌లు, సైకిల్, బస్ లేన్లకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రయాణం సాఫీగా సాగేలా చూడాలి. BENGALURU city is now home to 1.4 crore people & 1.05 crore private vehiclesThe city added around 70k new private vehicles in the last month, with Private vehicles now dominating 87.6% of trafficSteps needed to be taken during the next 5 years as a major priority for the city… pic.twitter.com/ulagWNybVR— Karnataka Weather (@Bnglrweatherman) November 21, 2024 -
సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాలో.. సిగ్నల్ దాటాలంటే చుక్కలే
సాక్షి బెంగళూరు: ఐటీ ఇండస్ట్రీలో దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తూ సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన బెంగళూరు నగరం ప్రస్తుతం ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుని విలవిల్లాడుతోంది. నగర వాసులకు ట్రాఫిక్ అనేది నేడు అతిపెద్ద సమస్యల్లో ఒకటిగా మారింది. రద్దీ సమయాల్లో ఒక్కో ట్రాఫిక్ సిగ్నల్ దాటాలంటే రెండు మూడు సార్లు ఆగి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ప్రశాంత వాతావరణం, నిండైన పచ్చదనంతో ఒకప్పుడు ఉద్యాననగరంగా గుర్తింపు పొందిన బెంగళూరులో ప్రస్తుతం జనాభా సంఖ్య కంటే వాహనాల సంఖ్య ఎక్కువగా ఉంది. ఏటా వాహనాల సంఖ్య భారీగా పెరుగుతూ రావడంతో ప్రస్తుతం నగరంలో రోడ్ల సమర్థ్యానికి మించి వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రస్తుతం నగరంలో 1.40 కోట్లకు పైగా వాహనాలు ఉన్నాయి. దీంతో రోడ్ల విస్తరణకు బీబీఎంపీ (బృహత్ బెంగళూరు మహానగర పాలికె) అడుగులు వేస్తోంది. దశాబ్ద కాలంలో మారిన నగరం..శరవేగంగా విస్తరిస్తున్న మహానగరం కావడం, కాంక్రీటీకరణ, అభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ తదితర కారణాల వల్ల బెంగళూరు గడిచిన దశాబ్ద కాలంలో ఎంతో మారిపోయింది. విస్తరిస్తున్న నగరానికి అనుగుణంగా మెట్రో, ఫ్లయ్వోవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించినప్పటికీ ట్రాఫిక్ రద్దీకి పరిష్కారం దొరకడంలేదు. రోడ్ల విస్తరణ అభివృద్ధికి కావాల్సిన స్థలాన్ని స్వాదీనం చేసుకునేందుకు అవసరమైన ఆరి్థక వనరులు బీబీఎంపీ వద్ద లేకపోవడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. బెంగళూరు ట్రాఫిక్ రద్దీపై ఒక మహిళ ఇటీవల ఎక్స్‌లో చేసిన చిన్న పోస్టు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రష్యాలో ఒక మూల నుంచి ఇంకో మూలకు కారులో ప్రయాణించాలంటే 149 గంటలు పడుతుందని, అంత సేపు ప్రయాణించినా ఇంకా రష్యాలోనే ఉంటారని, బెంగళూరు పరిస్థితి కూడా సరిగ్గా ఇలాగే ఉందంటూ ఇక్కడి ట్రాఫిక్ని ఎద్దేవా చేస్తూ అనఘ అనే మహిళ ఎక్స్‌లో పోస్టు చేసింది. ఈ ట్వీట్‌పై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.ప్రస్తుతం ఈ ట్వీట్‌కు పది లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఆమె చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం ఇంటర్నెట్లో భారీ చర్చకు తెరతీసింది. అయితే బెంగళూరు ట్రాఫిక్ రద్దీకి ఆమె ట్వీట్ ఒక చిన్న ఉదాహరణ మాత్రమేనని, నగరవాసులను ఎవ్వరిని కదిలించినా ఇలాంటి ట్రాఫిక్ వ్యథలు వందల కొద్దీ చెబుతారని నెటిజన్లు అంటున్నారు.బీబీఎంపీ పరిధిలో రహదారుల పొడవు: 12,878 కి.మీఇందులో ఆర్టిరియల్, సబ్ ఆర్టిరియల్ (అధిక సామర్థ్యంగల) రోడ్లు: 1344.84 కి.మీ నగరంలో రిజిష్టర్ అయిన వాహనాల సంఖ్య: 1.40 కోట్లుటామ్టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ ప్రకారందేశంలో అత్యధిక ట్రాఫిక్ ఉండే నగరాల్లో బెంగళూరు స్థానం: 1ప్రపంచంలో అత్యధిక ట్రాఫిక్ ఉండే నగరాల్లో బెంగళూరు స్థానం: 6నగరంలో సగటున 10 కి.మీ ప్రయాణించేందుకు పట్టే సమయం: 28 నిమిషాలు -
బెంగళూరుకు తొలి ఓటమి
మార్గావ్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో తిరుగులేని ఆధిక్యం ప్రదర్శిస్తున్న బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్‌కు భంగపాటు ఎదురైంది. తాజా సీజన్లో ఓటమి లేకుండా సాగుతున్న బెంగళూరు జట్టు... శనివారం జరిగిన పోరులో 0–3తో గోవా ఫుట్‌బాల్ క్లబ్ చేతిలో ఓడింది. సీజన్లో రెండో విజయం నమోదు చేసుకున్న గోవా జట్టు తరఫున ఆర్మాండో సాడికు (63వ నిమిషంలో), బ్రిసన్ ఫెర్నాండెస్ (72వ ని.లో), డెజాన్ డ్రాజిక్ (90+3వ నిమిషంలో) తలా ఒక గోల్ చేశారు. భారత జాతీయ ఫుట్‌బాల్ జట్టు కోచ్ మనోలో మార్క్వెజ్ శిక్షణలో బరిలోకి దిగిన గోవా జట్టు... మ్యాచ్‌పై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. నిర్ణీత సమయంలో గోవా 19 షాట్లు ఆడగా... బెంగళూరు బుల్స్ 8 షాట్లు ఆడింది. లక్ష్యంపైకి ఐదు షాట్లు సంధించిన గోవా... అందులో మూడింటిని గోల్ పోస్ట్‌లోకి పంపింది. ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు 5 విజయాలు, ఒక పరాజయం, ఒక ‘డ్రాతో 16 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు 7 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, 2 పరాజయాలు, 3 ‘డ్రా’లు నమోదు చేసుకున్న గోవా 9 పాయింట్లతో పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఆదివారం జరగనున్న మ్యాచ్‌ల్లో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్‌బాల్ క్లబ్‌తో ఒడిషా ఫుట్‌బాల్ క్లబ్‌తో... ముంబై సిటీ జట్టుతో కేరళ బ్లాస్టర్స్ ఫుట్‌బాల్ క్లబ్ తలపడతాయి. -
'స్వీట్ స్టార్టప్': జస్ట్ కప్ కేక్స్‌తో ఏడాదికి ఏకంగా..!
బెంగళూరులో మేఘనా జైన్ కూడా ఈ దీపావళికి ఒక కళ. ఆమె నడుపుతున్న ‘డ్రీమ్ ఎ డజన్ ’ నుండి ప్రత్యేక ఆర్డర్లపై వెళ్లే గిఫ్టు హ్యాంపర్లు అక్కడి కార్పోరేట్ ఆఫీస్‌లను మతాబుల్ని మించిన తియ్యటి వెలుగులతో కాంతిపుంజాల్లా మార్చేస్తుంటాయి. 6 రకాల కప్‌కేక్‌లు, 12 రకాల కేక్ వెరైటీలు, వేర్వేరు రుచుల్లోని కేక్కప్స్, చీజ్ కేక్స్‌ను అందమైన హ్యాంపర్లో చుట్టి డెలివరీ చేస్తుంటుంది ‘డ్రీమ్ ఎ డజన్ ’. ఆ స్వీట్ స్టార్టప్ యువ అధిపతే మేఘన! ఒక్క దీపావళికి మాత్రమే కాదు, అన్ని సందర్భాలకు, అన్ని సీజన్లలో ఇక్కడి కప్కేక్లకు మంచి గిరాకీ ఉంటుంది. ఇంత చిన్న వయసులో మేఘన ఏడాదికి కోటి రూపాయల బిజినెస్ చేస్తుందంటే ఇక చూడండి!మేఘన రాజస్థానీ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. స్వీట్లంటే ఇష్టమే కానీ, స్వీట్స్ బిజినెస్ చేయాలన్న ఆలోచన ఏమాత్రం లేని 18 ఏళ్ల వయసులో ఓ రోజు తమ పొరుగున ఉన్న వాళ్లు సమ్మర్ బేకింగ్ క్లాసులు పెడితే వెళ్లింది మేఘన. కేక్‌ను బేక్ చేయటం నేర్చుకుంది. తర్వాత్తర్వాత తను బేక్ చేసిన కేక్‌లను ఇంట్లో, బయట, కాలేజ్‌లో అంతా మెచ్చుకోవటం ఆమెకు ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. అంతేకాదు, తిరుచ్చిలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ‘బిజినెస్ ఐడియా’ల పోటీ పెడితే మేఘన చెప్పిన కప్‌కేక్‌ల ఐడియాకు మూడో ప్రైజ్ లభించింది! వెంటనే ఇండియన్ ఏంజెల్ నెట్వర్క్ వాళ్లొచ్చి ‘‘అమ్మాయ్.. మేము ఇన్వెస్ట్ చేస్తాం. నువ్వు కేక్‌ల బిజినెస్‌కి సిద్ధమేనా? అని అడిగారు! మేఘన డైలమాలో పడిపోయింది. చదువా? బిజినెస్సా? కొంత ఆలోచన తర్వాత చదువు వైపే మొగ్గు చూపింది. డిగ్రీ అయ్యాక మేఘన బెంగళూరులోని ‘ఇన్నర్ చెఫ్’లో డెజర్ట్ విభాగంలో చేరింది. ఫుడ్ టెక్నాలజీ కంపెనీ అది. తర్వాత ‘కేక్వాలా’లో ట్రై నింగ్ తీసుకుంది. తర్వాత ‘స్టార్‌బక్స్’లో ఉద్యోగానికి దరఖాస్తు చేసింది. అది రాలేదు. అప్పుడే సొంత బిజినెస్ గురించి ఆలోచించింది. అప్పటికే మేఘన కప్‌కేక్‌ల తయారీ తోపాటు, హ్యాంపర్ డిజైనింగ్‌లో మంచి నైపుణ్యం సంపాదించింది. అయితే 2018లో ‘డ్రీమ్ ఎ డజన్‌ను ప్రారంభించబోతుండగా ‘ఉద్యోగం ఇస్తాం రమ్మని’ స్టార్‌బక్స్ నుంచి పిలుపు! ఈసారి డైలమాలో పడలేదు మేఘన. స్టార్ బక్స్‌ను వద్దనుకుంది. కొద్ది పెట్టుబడితో కేక్ బిజినెస్‌ను స్టార్ట్ చేసింది. కరోనా సమయంలో కాస్త ఒడిదుడుకులకు లోనైనా తన ‘డ్రీమ్’ను నిలబెట్టుకుంది.మేఘన దగ్గర ప్రస్తుతం 20 మంది ముఖ్య విభాగాలలో పని చేస్తున్నారు. వారిలో ఎక్కువమంది మహిళలే. అలాగే హ్యాంపర్స్తోపాటు ఇచ్చే పెయింటెడ్ మాస్క్‌లు, ప్రమిదలు, కొవ్వొత్తుల తయారీని స్థానిక స్వయం సహాయక మహిళా బృందాలకు అప్పగిస్తోంది మేఘన. ఆ విధంగా వారికి కూడా ఆర్థికంగా చేదోడుగా ఉంటోంది. చేతిలో నైపుణ్యం ఉండి, బిజినెస్ చేయాలన్న తపన ఉన్న యువతరానికి మేఘన కచ్చితంగా ఒక రోల్ మోడల్. (చదవండి: -
భారీ వర్షాలతో బెంగళూరు అతలాకుతలం..
బనశంకరి: కర్ణాటక రాజధాని బెంగళూరులో నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జన జీవనం అస్తవ్యస్తమైంది. నగరంలోని బాబుసాబ్ పాళ్యలో నిర్మాణ దశలో ఉన్న బహుళ అంతస్తుల కట్టడం మంగళవారం సాయంత్రం కుప్ప కూలింది. ఈ ఘటనలో ఒకరు చనిపోయారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది, స్థానికులు పది మందిని క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. శిథిలాల కింద మరో ఏడుగురి వరకు చిక్కుకుని ఉన్నట్లు చెబుతున్నారు. ఘటన సమయంలో భవనంలో 18 మంది వరకు కూలీలున్నట్లు తెలిసింది.జల దిగ్బంధంలో అపార్ట్మెంట్లు బంగాళాఖాతంలో అల్ప పీడనం, ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో శనివారం రాత్రి నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మంగళవారం యలహంకలోని కేంద్రీయ విహార్ అపార్ట్మెంట్ సెల్లార్లోకి చెరువు నీరు పోటెత్తింది. దీంతో అపార్ట్మెంట్లోని 2 వేల మంది చిక్కుబడి పోయారు. 650 కుటుంబాలకు గాను 250 కుటుంబాలను బయటకు తరలించారు. -
వరద గుప్పిట్లో బెంగళూరు
-
Congress MLA: న్యూడ్ కాల్స్.. అత్యాచారం
మాజీ ఎంపీ హెచ్డీ ప్రజ్వల్, తరువాత ఎమ్మెల్సీ హెచ్డీ సూరజ్‌లు లైంగిక దాడుల కేసుల్లో అరెస్టయ్యారు. ఆపై బెంగళూరులో సీనియర్ బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న కూడా అత్యాచారం, హనీ ట్రాప్ కేసుల్లో కటకటాలు లెక్కిస్తున్నారు. ఈ జాబితా ఇంతటితో ఆగలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణి కూడా చేరారు. న్యూడ్ కాల్స్, అత్యాచారం ఆరోపణలతో ఓ మహిళ ఆయనపై ఫిర్యాదు చేయడం రాజకీయాల్లో కుదుపు ఏర్పడింది. ప్రజాప్రతినిధులు అంటే ఇలా కూడా ఉంటారా? అని ప్రజలు ముక్కున వేలేసుకునేలా కేసుల గోల సాగుతోంది.దొడ్డబళ్లాపురం: ఇప్పటికే ముడా ఆరోపణలతో సతమతమవుతున్న రాష్ట్ర కాంగ్రెస్ సర్కారుకు మరో తలనొప్పి ఎదురైంది. పార్టీ ఎమ్మెల్యేపై అత్యాచారం ఆరోపణలు గుప్పుమన్నాయి. ధార్వాడ కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ కులకరి్ణపై బెంగళూరు సంజయ్ నగర పోలీస్‌స్టేషన్‌లో అత్యాచారం కేసు నమోదయింది. కులకర్ణి పీఏ అర్జున్‌పై కూడా ఐటీ చట్టం, ఇతర అభియోగాల కింద కేసులు నమోదయ్యాయి. మహిళ ఫిర్యాదులో ఏముంది.. ఎమ్మెల్యే వినయ్ కులకర్ణి తనపై అత్యాచారం చేయడంతోపాటు హింసించారని ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసారు పోలీసులు. 2022లో కులకరి్ణని తాను ఒక రైతు ద్వారా కలిసానని, ఎమ్మెల్యే రాత్రిపూట వీడియో కాల్ చేసి నగ్నంగా మారాలని ఒత్తిడి చేసేవాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. తరువాత బెంగళూరు హెబ్బాళలోని ఇంటికి రావాలని బెదిరించేవాడని, రాకపోతే రౌడీలను పంపించేవాడని, ఏప్రిల్ నెలలో తనను బెళగావికి పిలిపించుకుని అక్కడే తనను లైంగికంగా వేధించాడని ఆరోపించింది. ఆగస్టు 24న పని నిమిత్తం బెంగళూరుకు వచ్చినప్పుడు తనను ఎయిర్‌పోర్టు సమీపంలోని నిర్జన ప్రదేశంలో కారులో అత్యాచారం చేసినట్టు పేర్కొంది. అక్టోబర్ 2న కూడా తనను ధర్మస్థలం తీసుకువెళ్లి అక్కడా అత్యాచారం చేశాడని తెలిపింది. ఈ తతంగంపై కొన్ని వీడియో కాల్స్ మంగళవారమే లీక్ కావడంతో కలకలం ఏర్పడింది.బ్లాక్మెయిల్ చేస్తున్నారు: ఎమ్మెల్యే ఈ ఆరోపణలపై వినయ్ కులకర్ణి స్పందిస్తూ మహిళ తనను బ్లాక్మెయిల్ చేస్తోందని, ప్రైవేటు టీవీ చానెల్ ఎండీ ఒకరు తనను రూ.2కోట్లు ఇవ్వాలని బెదిరించాడని సంజయ్‌నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
రెడ్ వెల్వెట్, బ్లాక్ ఫారెస్ట్ తెగ లాగించేస్తున్నారా? అయితే కేన్సర్ ముప్పు
పుట్టినరోజు, పెళ్లి రోజు, నూతన సంవత్సరం, ఇలా వేడుక ఏదైనా కేక్ ఉండాల్సిందే. ఖరీదైనా సరే.. రెడ్ వెల్వెట్, బ్లాక్ ఫారెస్ట్ కేక్స్ ఉంటే ఇక ఆ సందర్భానికి మరింత జోష్. వీటిని అంటే అంతలా ఇష్టపడతారు. కానీ వీటిని ఆకర్షణీయంగా తయారు చేసేందుకు వాడే రంగులు కేన్సర్ కారకమవుతున్నాయని కర్ణాటక ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ డిపార్ట్మెంట్ షాకింగ్ న్యూస్ చెప్పింది. ఈ రెండు రకాలతోపాటు మరో 12 పాపులర్ కేక్స్ తయారీకి వాడే రంగులతో జాగ్రత్త అని హెచ్చరించింది. అందం, ఆకర్షణ కోసం వంటకాల్లో రంగులు వాడటం కొత్త కాదు కానీ.. వీటిల్లో కొన్ని మరీ ముఖ్యంగా కృత్రిమంగా తయారు చేసిన రంగులు కేన్సర్‌ను కలుగజేస్తాయని శాస్త్రవేత్తలు చాలాకాలంగా హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ విభాగం బెంగళూరులోని బేకరీల్లోని కేక్స్‌పై పరీక్షలు నిర్వహించింది. అల్లురా రెడ్, సన్‌సెట్ ఎల్లో ఎఫ్‌సిఎఫ్, పోన్సో 4ఆర్, టార్ట్రాజైన్ ,కార్మోయిసిన్ వంటి హానికరమైన కృత్రిమ రంగుల వీటి తయారీకి వాడుతున్నట్లు గుర్తించింది. ఇవన్నీ కేన్సర్ ముప్పును పెంచేవేనని స్పష్టం చేసింది. శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలకూ ఈ కృత్రిమ రంగులు కారణమవుతాయని తెలిపింది.ఈ ఫలితాల దృష్ట్యా, కర్ణాటక ఆహార భద్రత, నాణ్యత విభాగం ఆహార భద్రతా నిబంధనలను పాటించాలని, వినియోగ యోగ్యమైన పదార్థాలనే ఉత్పత్తుల తయారీలో ఉపయోగించాలని బేకరీలను కోరింది. వినియోగదారులు కూడా కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలని సూచించింది. (శతాబ్దాల శాప భయం : చీర సింగారించుకుని మరీ పురుషుల గర్భా నృత్యం)గోబీ మంచూరియా, కబాబ్‌లు, పానీ పూరీ లాంటి వాటిల్లోనూ కేన్సర్ కారక కృత్రిమ రంగులు వాడినట్లు కర్ణాటక ప్రభుత్వం గతంలోనే గుర్తించింది. అంతేకాకుండా.. రోడమైన్-బి లాంటి రంగులపై నిషేధం విధించింది కూడా. ఇలాంటి కృత్రిమ రంగుల వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది కూడా. -
భారత క్రికెట్లో ‘కొత్త’ కళ
దాదాపు ఇరవై నాలుగేళ్ల క్రితం భారత వర్ధమాన క్రికెటర్లను తీర్చిదిద్దేందుకు, అత్యుత్తమ సౌకర్యాలతో శిక్షణ ఇచ్చేందుకు బీసీసీఐ బెంగళూరులో జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)ని ఏర్పాటు చేసింది... నగరం నడి»ొడ్డున చిన్నస్వామి స్టేడియం ఆవరణలోనే ఇంతకాలం అది కొనసాగింది...క్రికెట్లో వస్తూ వచి్చన మార్పుల నేపథ్యంలో మరింత అధునాతన సౌకర్యాలతో దానిని విస్తరించాలని భావించిన బోర్డు నగర శివార్లలో 2008లోనే భూమిని కొనుగోలు చేసింది. కానీ వేర్వేరు కారణాలతో దాని ఏర్పాటు ఆలస్యం కాగా... ఎట్టకేలకు ఇన్నేళ్ల తర్వాత అద్భుత సౌకర్యాలతో అది సిద్ధమైంది. జాతీయ క్రికెట్ అకాడమీనుంచి పేరు మార్చుకొని బీసీసీఐ ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ గా క్రికెటర్లకు అందుబాటులోకి వచి్చంది. బెంగళూరు: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (బీసీఈ)ని అధికారికంగా ప్రారంభించారు. ఆదివారం జరిగిన ఈ ప్రారం¿ోత్సవ కార్యక్రమంలో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తదితరులు పాల్గొన్నారు. భారత సీనియర్ జట్టుకు వివిధ సిరీస్‌లకు ముందు క్యాంప్‌లు, యువ ఆటగాళ్లకు శిక్షణ, గాయపడిన క్రికెటర్లకు చికిత్స, స్పోర్ట్స్ సైన్స్, రీహాబిలిటేషన్... ఇలా అన్నింటి కోసం ఇక్కడ అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు సిద్ధంగా ఉన్నాయి. ఆ్రస్టేలియాలోని బ్రిస్బేన్‌లో, ఇంగ్లండ్‌లోని లాఫ్బారోలో ఇలాంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లు ఉన్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుంటూనే భారత్‌లో అలాంటి కేంద్రం కావాలని భావించిన బోర్డు దీనిని సిద్ధం చేసింది. 16 ఏళ్ల క్రితమే భూమిని తీసుకున్నా...వివిధ అడ్డంకులతో పని సాగలేదు. తుది అనుమతులు 2020 చివర్లో రాగా, కోవిడ్ కారణంగా అంతా ఆగిపోయింది. ఎట్టకేలకు ఫిబ్రవరి 2022లో పని మొదలు పెట్టి ఇప్పుడు పూర్తి చేశారు. ప్రస్తుతం ఉన్న ఎన్సీఏను దశలవారీగా ఇక్కడకు తరలిస్తారు. 2021 డిసెంబర్ నుంచి ఎన్సీఏ హెడ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరిస్తున్నారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విశేషాలు... → మొత్తం 40 ఎకరాల విస్తీర్ణంలో ఈ కేంద్రం ఉంది. తాజా నిర్మాణంలో 33 ఎకరాలను వాడుకున్నారు. తర్వాతి స్థాయిలో విస్తరణ కోసం మరో 7 ఎకరాలను ఖాళీగా ఉంచారు. → ఐసీసీ ప్రమాణాలకు అనుగుణంగా ఫస్ట్ క్లాస్ స్థాయి మ్యాచ్‌లు నిర్వహించగలిగే మూడు పెద్ద మైదానాలు అందుబాటులో ఉన్నాయి. మూడు భిన్న స్వభావం ఉన్న పిచ్‌లు మన ఆటగాళ్లు అన్ని రకాలుగా సన్నద్ధమయ్యేందుకు పనికొస్తాయి. → ప్రధాన గ్రౌండ్లో ఆధునిక తరహా ఫ్లడ్లైట్లతో పాటు సబ్ ఎయిర్ డ్రైనేజ్ వ్యవస్థ, మ్యాచ్‌ల ప్రసారానికి ఏర్పాట్లు, మొత్తం 13 పిచ్‌లు ఉన్నాయి. ముంబై నుంచి తెప్పించిన ఎర్ర మట్టితో ఈ పిచ్‌లు రూపొందించారు. ఇక్కడి బౌండరీ 85 గజాల దూరంలో ఉండటం విశేషం. → మిగతా రెండు గ్రౌండ్లను ప్రధానంగా ప్రాక్టీస్ కోసం వినియోగిస్తారు. దక్షిణ కర్ణాటకలోని మాండ్యానుంచి, ఒడిషా నుంచి తెప్పించిన నల్లరేగడి మట్టితో మొత్తం 20 పిచ్‌లు తయారు చేశారు. ఇక్కడ బౌండరీ 75 గజాలుగా ఉంది. → మొత్తం 9 వేర్వేరు భాగాలుగా విభజించి 45 అవుట్డోర్ నెట్ ప్రాక్టీస్ పిచ్‌లు అందుబాటులో ఉంచారు. ఫీల్డింగ్ ప్రాక్టీస్ ఏరియా దీనికి అదనం. → ఇండోర్ ప్రాక్టీస్ మైదానంలో ఆ్రస్టేలియా, ఇంగ్లండ్లను పోలిన ఎనిమిది ప్రాక్టీస్ పిచ్‌లు ఉన్నాయి. → నాలుగు ప్రత్యేక అథ్లెటిక్ ట్రాక్‌లు ఈ ప్రాంగణంలో ఉన్నాయి. బీసీఈలోని ఉన్న సౌకర్యాలను మునుŠుమందు క్రికెటేతర ఆటగాళ్లు కూడా వినియోగించుకునేందుకు అవకాశం కలి్పస్తామని...ముఖ్యంగా ఒలింపియన్లు ఇక్కడ సిద్ధమయ్యేందుకు అన్ని సౌకర్యాలు ఉన్నాయని జై షా వెల్లడించారు. నేను ప్రపంచంలో ఇలాంటి ఎన్నో సెంటర్లకు వెళ్లాను. కానీ ఇంత మంచి సౌకర్యాలు ఎక్కడా లేవు. భారత క్రికెటర్లందరి కోసం ప్రపంచంలో అత్యంత ఆధునిక సౌకర్యాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. తాము అన్ని రకాలుగా అత్యుత్తమ ఆటగాళ్లుగా ఎదిగేందుకు ఇక్కడ అవకాశం ఉంది. ఈ క్రమంలో మన జట్టు అన్ని ఫార్మాట్లలో బెస్ట్ టీమ్‌గా ఎదుగుతుంది. ఇకపై అండర్–15 స్థాయి ఆటగాళ్ల మొదలు సీనియర్ వరకు ఏడాది పాటు నిరంతరాయంగా ఇక్కడ కార్యకలాపాలు కొనసాగుతాయి. అన్నింటికంటే ముఖ్యమైంది మూడు భిన్నమైన పిచ్‌లు ఉండటం. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ క్రికెట్ ఆడినా దాని కోసం ఒకే వేదికపై సిద్ధమయ్యే అవకాశం ఇది కలి్పస్తుంది. –వీవీఎస్ లక్ష్మణ్, బీసీఈ హెడ్ -
కన్నడిగులపై అనుచిత వ్యాఖ్యలు
దొడ్డబళ్లాపురం: రాజధాని బెంగళూరు నుండి ఉత్తర భారతీయులు వెళ్లిపోతే బెంగళూరు ఖాళీ అవుతుందని ఇన్‌స్టాలో రీల్స్ చేస్తూ అవమానకరంగా మాట్లాడిన ఉత్తర భారత యువతిని ఆమె పని చేస్తున్న కంపెనీ నుండి తొలగించారు. ఉత్తర భారత్‌కు చెందిన సుగంధ శర్మ అనే యువతి ఇటీవల రీల్స్ చేసి నార్త్ ఇండియన్స్ బెంగళూరు వదిలి పోతే బెంగళూరు ఖాళీ అవుతుందని, కన్నడిగులు కొన్ని విషయాలలో మరీ ఎక్కువ చేస్తారని వ్యంగ్యంగా మాట్లాడింది. పీజీలు ఖాళీ అవుతాయని, కోరమంగలలో అన్ని క్లబ్‌లు మూసుకోవాలని, అందమైన ఆడపిల్లలు చేసే పంజాబీ నృత్యాలు మిస్ అవుతారని వెటకారంగా మాట్లాడింది. మేమంతా వెళ్లిపోతే బెంగళూరు కనుమరుగు అవుతుందని వ్యాఖ్యలు చేసింది.దీంతో కన్నడిగులు తక్షణం బెంగళూరు వదిలిపోవాలని ఆమెకు కౌంటర్ ఇచ్చారు. సదరు రీల్ గంటల్లోనే వైరల్‌గా మారింది. దీంతో కంపెనీ వారు ఆమెను ఉద్యోగంలోంచి తొలగించారని సమాచారం. -
ముడా స్కామ్: సీఎం సిద్ధరామయ్యకు షాక్
బెంగళూరు: కర్ణాటకలో సంచలనం సృష్టించిన ముడా స్కామ్ కేసులో సీఎం సిద్ధరామయ్యకు షాక్ తగిలింది. ఈ కేసులో గవర్నర్ ఆదేశాలను సవాల్ చేస్తూ.. సిద్ధరామయ్య దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. ముడా స్మామ్‌లో గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. ఇక.. గవర్నర్ ఆదేశాలను సీఎం సిద్ధరామయ్య హైకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు తాజాగా హైకోర్టు తీర్పు వెల్లడించింది. బెంగళూరు సహా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు కట్టుదిట్టమై భద్రత ఏర్పాటు చేశారు.మైసూరు పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ(ముడా) భూముల కేటాయింపుల వివాదంలో.. ఖరీదైన భూములు ఆయన భార్య పార్వతికి దక్కేలా సిద్ధరామయ్య కుట్ర చేశారని సమాచార హక్కు చట్టం కార్యకర్తలు టీజే అబ్రహాం, ఎస్పీ ప్రదీప్, స్నేహమయి కృష్ణ చేసిన అభ్యర్థనపై రాష్ట్ర గవర్నర్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఏకంగా ముఖ్యమంత్రిపై విచారణ చేపట్టేందుకు గవర్నర్ థావర్ చంద్ గెహ్లోత్ అనుమతి ఇవ్వటం కర్ణాటక రాజకీయల్లో సంచలనం సృష్టించింది. ఇదిలాఉండగా... సిద్ధరామయ్య భార్య పార్వతికి మైసూరులోని కేసరే గ్రామంలో 3 ఎకరాల భూమి ఉంది. దాన్ని ఆమె సోదరుడు మల్లికార్జున్ ఆమెకు బహుమతిగా ఇచ్చారు. అయితే, ఈ భూమిని అభివృద్ధి కోసం ముడా స్వాధీనం చేసుకుంది. పరిహారం కింద 2021లో పార్వతికి దక్షిణ మైసూరులోని ప్రధాన ప్రాంతమైన విజయనగర్‌లో 38,283 చదరపు అడుగుల ప్లాట్‌ను ప్రభుత్వం కేటాయించింది. పరిహారం కింది ఇచ్చిన ప్లాట్ మార్కెట్ విలువ కేసరేలో ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న భూమికంటే ఎక్కువ అని బీజేపీ ఆరోపించింది. దీంతో ముడా కుంభకోణం తెరపైకి వచ్చింది.చదవండి: కర్ణాటకలో మరో కుంభకోణం కలకలం.. కోవిడ్ వేళ వెయ్యి కోట్ల స్కాం -
దయాగుణం కలిగి ఉండండి
బెంగళూరు: గొప్ప తెలివితేటలే కాదు, తోటివారి పట్ల దయాగుణం కలిగి ఉండటం ఎంతో అవసరమని యువ పట్టభద్రులకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ ఉద్బోధించారు. ఆదివారం ఆయన బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీ(ఎన్ఎల్ఎస్ఐయూ)లో జరిగిన 32వ స్నాతకోత్సవంలో ప్రసంగించారు. అకడెమిక్ బ్లాక్ విస్తరణ పనులకు అనంతరం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రసంగించారు. ‘నిజమైన నాయకత్వ ప్రతిభ గలవారు తమ బలాలతోపాటు బలహీనతలను కూడా గుర్తించగలరు. తమకున్న బలంతో ఇతరులకు తోడ్పాటునిస్తూ, తమ బలహీనతలను అధిగమించేందుకు ఇతరుల సాయం తీసుకుంటారు’అని సీజేఐ వివరించారు. అడ్డంకులను అధిగమించే క్రమంలో కుటుంబంతోపాటు స్నేహితుల మద్దతు ఎంతో అవసరమని చెప్పారు. తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ, నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎంతో సహనంతో మెలగాలన్నారు. ‘నిర్ణయం తీసుకునే ప్రక్రియ అనిశి్చతితో కూడి ఉంటుంది, అయినా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ అనిశ్చితి కొనసాగేది కొంతకాలమే. మీరు ఎంచుకునే మార్గం ఏదైనప్పటికీ, భవిష్యత్తులో మీ సొంత నిర్ణయాలు సానుకూల పరిణామాలను కలిగిస్తాయి. ఈ క్రమంలో సహనం, వినయం అనే సద్గుణాలను ఎన్నడూ వీడరాదని కోరుతున్నాను’అని జస్టిస్ చంద్రచూడ్ చెప్పారు. ‘వేగంగా మారుతున్న ప్రపంచం, అవసరాలు, వాతావరణ మార్పులు, సోషల్ మీడియా వంటి కొత్త వినోద సాధనాలు, సామాజిక దురాచారాలను మార్చాలనే ఆత్రుత సంక్లిష్ట సమస్యలకు స్వల్పకాలిక ఫలితాలను కోరేలా చేస్తున్నాయి’అంటూ ఆయన ఇలాంటి సమయంలో సహనంతో మెలగాల్సిన అవసరం ఎంతో ఉందని నొక్కిచెప్పారు. ‘హడావుడిగా తీసుకునే నిర్ణయాలకు ఎక్కువ శక్తిని వెచి్చంచాల్సి ఉంటుంది. ఇలాంటివి దీర్ఘకాలంలో మీ మానసిక ఆరోగ్యానికి చేటు కల్గిస్తాయి. దీర్ఘకాలంలో సానుకూల లక్ష్యాలను సాధించడం కూడా కష్టమవుతుంది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది’అని ఆయన యువ న్యాయవాదులను హెచ్చరించారు. న్యాయమూర్తిగా 24 ఏళ్లపాటు పనిచేశాక నాకో విషయం అర్థమయింది. మనదేశంలోని కోర్టుల్లో మనం మూడో వ్యక్తిగా కాకుండా మొదటి వ్యక్తిగా వాదిస్తాం ఎందుకంటే.. కోర్టుల్లో మనం క్లయింట్ల కోసం వాదించం. మనమే క్లయింట్లుగా వాదనలు సాగిస్తాం. వారికి ప్రతినిధులుగా మాత్రమే కాదు, వారి గొంతుక, వారి లాయర్‌గా, విజేతలుగా ఉంటాం’అని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. -
మెట్రో.. అవుతోందా సూసైడ్ స్పాట్?
సాక్షి, బెంగళూరు: బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలను తీర్చేలా ఉన్న మెట్రో రైలు వ్యవస్థ ఆధునికతగా ప్రతిరూపంగా ఆకర్షిస్తోంది. కానీ ఇలాంటి నమ్మ మెట్రో స్టేషన్లు సూసైడ్ స్పాట్‌గా మారడం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. ఈ ఏడాదిలో 9 నెలల్లో 7 ఆత్మహత్యాయత్నాలు జరగడం గమనార్హం. చనిపోతామంటూ మెట్రో రైలు పట్టాలపై దూకుతున్న ఘటనలు తలనొప్పిగా మారాయి. ఫలితంగా మెట్రో రైలు సేవలకు అంతరాయం ఏర్పడడంతో పాటు ప్రయాణికులు భయాందోళనకు గురవుతుంటారు.గ్లాస్ డోర్లు ఎక్కడ?ఈ ప్రమాదాల నివారణ కోసం పీఎస్డీ (ఫ్లాట్‌ఫారం స్క్రీనింగ్ డోర్)ని ఏర్పాటు చేయాలని గత కొన్నేళ్లుగా డిమాండ్లు వినిపిస్తున్నా ఎందుకు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ, చైన్నె, కొచ్చి మెట్రోలో ఈ పీఎస్డీ డోర్లను ఏర్పాటు చేశారు. అయితే నమ్మ మెట్రోలో మాత్రం ఇంకా ఆచరణలోకి రాకపోవడం గమనార్హం. ఈ డోర్లను అమర్చితే ట్రాక్‌పైకి ప్రయాణికులు పడిపోయే, దూకే ఘటనలు తప్పిపోతాయని నిపుణులు తెలిపారు. మెట్రో స్టేషన్‌కు రైలు వచ్చినప్పుడు మాత్రమే ఈ స్క్రీనింగ్ డోర్లు తెరుచుకుంటాయి. ప్రయాణికులు రైల్లోకి ఎక్కిన తర్వాత తిరిగి మూసుకుపోతాయి. ఇలా ప్రయాణికుల భద్రతలో ఎంతో కీలకమైన పీఎస్డీ డోర్లను వెంటనే బెంగళూరు మెట్రో స్టేషన్లలో కూడా అమర్చాలని చెబుతున్నారు. నమ్మ మెట్రో ప్రారంభమై 13 ఏళ్లు పూర్తి అయింది. ఇంతవరకు రక్షణ గోడలు ఏర్పాటు చేయకపోవడం ఆశ్చర్యకరమని విమర్శలున్నాయి.ఈ ఏడాది జరిగిన కొన్ని సంఘటనలు జనవరి 01– మొబైల్ పడిపోయిందని..ఇందిరా నగర మెట్రో రైల్వే స్టేషన్లో ట్రాక్‌పై పడిన మొబైల్‌ను తీసేందుకు ఒక మహిళ ట్రాక్‌పైకి దిగింది. సిబ్బంది వెంటనే ఆ మహిళను గుర్తించి బయటకు లాగి ప్రాణాన్ని కాపాడారు. పట్టాలకు హై ఓల్టేజ్ కరెంటు అనుసంధానమై ఉంటుంది. తగిలితే ప్రాణాలు పోవచ్చు. ఈ ఘటనతో 15 నిమిషాలు రైలు సేవలు నిలిచిపోయాయి. జనవరి 5 – యువకుడు దూకి..కేరళకు చెందిన షారోన్ (23) అనే యువకుడు జాలహళ్లి మెట్రో స్టేషన్లో ఆత్మహత్య చేసుకోవాలని రైలు వస్తుండగా పట్టాల మీదకు దూకాడు. ఆ వ్యక్తిని చూసిన లోకోపైలట్ వెంటనే అత్యవసర బ్రేకులను ఉపయోగించి రైలు నిలిచిపోయేలా చేయడంతో ప్రాణాపాయం తప్పింది. జనవరి 6 – నల్ల పిల్లి ఆటంకంజేపీ నగర మెట్రో రైల్వే స్టేషన్లో పట్టాలపై నల్లటి పిల్లి ఒకటి కనిపించింది. మెట్రో రైల్వే స్టేషన్ సిబ్బంది ఆ పిల్లిని అక్కడి నుంచి తరిమేసేందుకు నానా తిప్పలు పడ్డారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా కూడా మారాయి. మార్చి 12– పట్టాలపై నడకజ్ఞానభారతి మెట్రో స్టేషన్–పట్టణగెరె మెట్రో స్టేషన్ మధ్య వయడక్ట్లో ఒక గుర్తు తెలియని వ్యక్తి కనిపించాడు. మెట్రో పట్టాలపై ఉన్న వయడక్ట్‌పై నడుచుకుంటూ వెళుతున్నాడు. దీంతో కూడా మెట్రో సేవలు కొంత సమయం నిలిచిపోయాయి. మార్చి 21– లా విద్యార్థి ఆత్మహత్యఅత్తిగుప్పే మెట్రోస్టేషన్లో 19 ఏళ్ల ధ్రువ్ టక్కర్ అనే లా విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. స్టేషన్‌కు రైలు వస్తుండగా నేరుగా పట్టాలపైకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు మానసిక ఒత్తిడి కారణంగా ప్రాథమికంగా నిర్ధారించారు. ఆగస్టు 3 – మరో ఆత్మహత్యదొడ్డకల్లసంద్ర మెట్రో స్టేషన్లో ట్రైన్ రావడాన్ని గమనించిన 35 ఏళ్ల వ్యక్తి ట్రాక్ మీదకు దూకాడు. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. ఈ ప్రమాదంతో చాలా సమయం వరకు మెట్రో రైలు సేవలు నిలిచిపోయాయి.సెప్టెంబర్ 17 – మరో ఆత్మహత్యాయత్నం..జ్ఞానభారతి మెట్రో స్టేషన్లో రైలు రావడాన్ని గమనించి ఆత్మహత్య చేసుకునేందుకు ట్రాక్ మీదకు దూకాడు. ఈసందర్భంలో మెట్రో సెక్యురిటీ సిబ్బంది సిద్ధార్థ జైన్ అతని ప్రాణాలను కాపాడారు. బ్యాంకులో రూ. 3 లక్షల అప్పు చేసి తీర్చలేకనే బాధతో ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిసింది.అత్యాధునిక సౌకర్యాలతో కూడిన మెట్రో రైళ్లు, స్టేషన్లకు వెళ్లడం ఒక మంచి అనుభూతిగా ఉంటుంది. అందుకే ఎంతోమంది అవసరం లేకపోయినా మెట్రో రైళ్లలో ప్రయాణిస్తారు. అనేక ఊర్ల నుంచి నిత్యం పెద్దసంఖ్యలో ఔత్సాహికులు మెట్రో సేవల కోసం వస్తుంటారు. కానీ కొందరికి మాత్రం అది ఆత్మహత్యకు అనువైన ప్రాంతంగా కనిపిస్తోంది. చిన్న చిన్న సమస్యలకు కుంగిపోయి మెట్రో పట్టాలపైకి దూకాలని వస్తారు. ఈ సమస్యను నివారించడం మెట్రోకు చిక్కుముడిగా మారింది. -
సలాం రామయ్య అంకుల్..! కంట తడి పెట్టించే వీడియో!
సోషల్ మీడియాలో మంచీ చెడూ రెండూ ఉన్నాయి. పెద్ద మనసుతో చేసే మంచి పని ఏదైనా నెటిజన్లును ఆకట్టుకుంటుంది. బెంగళూరులో రామయ్య మామయ్య స్టోరీ నెట్టింట చక్కర్లు కొడుతోంది. చెప్పులు కుట్టుకొని పొట్టపోసుకునే రామయ్య చేసిన పని లక్షలాది మంది హృదయాలను హత్తుకుంది. తన చిన్న ప్రపంచంలో మూగజీవులకు చోటిచ్చిన అపురూప మనిషిగా ప్రశంసలు దక్కించుకున్నాడు. View this post on Instagram A post shared by 𝕃𝔼𝕀𝔸 ♡ The Golden Indie (@leia_the_golden_indie) బెంగుళూరులోని వైట్‌ఫీల్డ్‌లోని డెకాథ్లాన్ షాప్ బైట ఒక చెప్పులు కుట్టుకునే వృత్తిలోఉన్నాడురామయ్య. ఆయన పనిచేసే చిన్న బడ్డీకొట్టులోనే తనతోపాటు మరికొన్నిమూగ జీవాలను ఆశ్రయం ఇచ్చి వాటికి పెద్ద దిక్కయ్యాడు. ఒకటీ రెండూ, కాదు దాదాపు 15 జంతువులు ఆయన చేరదీశాడు. వీటిల్లో రెండు వీధి కుక్కలు, పిల్లి కూన అతని పక్కనే ఆడుకుంటూ ఉంటాయి. వాటి కడుపు నింపడం మాత్రమే కాదు, దెబ్బలు తగిలితే ఆసుపత్రికి కూడా తీసుకెళ్లేంత దయాయుడు. ఈ రామయ్య. అందుకే అతణ్ని అందరూ రామయ్య మామయ్య అని పిలుచుకుంటారట. లియా ది గోల్డెన్ ఇండీ' అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో 2023, డిసెంబరులో అతనికి బంధించిన స్టోరీ పోస్ట్ చేశారు. “మీరు ఎప్పుడైనా అక్కడికి వెళితే, ఒక్క క్షణం ఆగండి, నిజమైన ప్రేమ, దయ , దాతృత్వం ఎలా ఉంటుందో కళ్లారా చూడండి.. పాత బూట్లను రిపేర్ చేయడానికి పని చేసే ఆ చిన్న స్థలంలోనే, కనీసం 3 కుక్కలు వెచ్చగా నిద్రపోతూ ఉంటుంది. ఒక బుజ్జి పిల్లి కూన ఆడుకుంటూ ఉంటుంది’’ అని తెలిపారు. అతని కోసం విరాళాలు సేకరణ కూడా చేపట్టారు.దీంతో రామయ్యంకుల్పై ప్రశంసలు వెల్లువెత్తాయి. మంచి మనసుతో రామయ్య చేస్తున్న పనికి ముగ్దులై అతని సాయం చేయడానికి ముందుకొచ్చారు.రామయ్య అంకుల్ ఫండ్ రైజర్ పేజీ ప్రకారం దేశం నలుమూలలనుండి విరాళాలొచ్చాయి. ‘నీకేమైనా కావాలా అంటే... నాకేమీ అవసరం లేదు..వాటికి అన్నం పెడితే చాలు’ అని చెప్పేవాడట ప్రేమతో. మొత్తం వసూలు చేసిన తర్వాత, చందాదారులందరి పేర్లతో ఒక కార్డు తయారు చేసి గత వారం రామయ్య అంకుల్‌కి అందించారు. ఇందులో సగం వీధిజంతువుల సంక్షేమం కోసం మిగతాసగం ఆయన ఖాతాలోను జమచేశారు. దీంతో సంతోషంగా కన్నీళ్లు పెట్టుకున్నాడు రామయ్య. దాతలందరికి కృతజ్ఞతలు తెలిపాడు. నాలుగు నెలల క్రితమే తన భార్య చనిపోయిందని, తన కూతురిని పెంచే బాధ్యత తనపైనే ఉందంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. దాతలు ఇచ్చిన కార్డును తన దుకాణంలో వేలాడ దీసుకున్నాడు సగర్వంగా. “ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా, మనస్ఫూర్తిగా ఇవ్వడం అంటే అంటే ఏమిటో మాకు చూపించినందుకు రామయ్య రామయ్యకు ధన్యవాదాలు. తమ వద్ద ఉన్న సమృద్ధిగా ఉన్నదాంట్లోంచి ఏదో కొద్దిగా ఇవ్వడం గొప్ప కాదు, తనకున్న చిన్నమొత్తంలోంచే ఘనంగా ఇవ్వడంలోనే ఉంది అసలు మానవత్వం అంటూ లియా ది గోల్డెన్ ఇండీ' అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ రాసుకొచ్చారు. -
కొరియోగ్రాఫర్ జానీ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్, జనసేన సస్పెండెడ్ నేత జానీ మాస్టర్(షేక్ జానీ బాషా) ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. గోవాలో జానీని ట్రేస్ చేసిన సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు.. అక్కడే అరెస్ట్ చేశారు. సహా కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న జానీపై.. నార్సింగి పీఎస్‌లో సెప్టెంబర్ 15వ తేదీన కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఆపై జానీ ఆచూకీ లేకపోవడంతో.. పరారైనట్లు పోలీసులు ప్రకటించారు. చివరకు.. గోవాలో అరెస్ట్ చేసి అక్కడే కోర్టులో హాజరుపరిచ్చారు. గోవా కోర్టు పీటీ వారెంట్‌కు అనుమతిస్తూ.. 24 గంటల్లోగా ఉప్పరపల్లి కోర్టులో జానీ బాషాను హాజరుపరచాలని ఆదేశించింది. దీంతో జానీని పోలీసులు తరలించే ప్రయత్నాల్లో ఉన్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలతో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆపై ఆమె మైనర్‌గా ఉన్నప్పటి నుంచే వేధించసాగాడని బాధితురాలు చెప్పడంతో జానీపై పోక్సో చట్టం కింద కేసు జత చేశారు. అయితే కేసు తర్వాత జానీ ఆచూకీ తెలియరాలేదు. భార్యతో సహా అజ్ఞాతంలోకి వెళ్లిపోయి.. తన ఫోన్ స్విచ్ఛాప్ చేసుకున్నాడు. ఇది కూడా చదవండి: లైంగిక వేధింపుల కేసు.. జానీ మాస్టర్‌కు బిగుస్తున్న ఉచ్చు!తొలుత పోలీసులు కొండపూర్లోని నివాసానికి వెళ్లి చూడగా.. తాళం వేసి ఉంది. ఆపై స్వస్థలం నెల్లూరులో ఉండొచ్చని వెళ్లి చూడగా.. అక్కడా లేడు. ఆ తర్వాత లడ్ఢాఖ్‌లో ఉన్నాడన్న సమాచారంతో అక్కడికి వెళ్లి స్థానిక పోలీసులను సంప్రదించారు. మొత్తంగా నాలుగు టీంలతో ఆపరేషన్ జానీ ముమ్మరంగా కొనసాగగా.. చివరకు గోవాలో పట్టుబడ్డాడు. తెలుగుతో పాటు కోలీవుడ్, హిందీలోనూ పలు స్టార్ హీరోలకు జానీ కొరియోగ్రాఫ్ చేశాడు. అంతేకాదు.. పవన్ కల్యాణ్ జనసేనలోనూ మొదటి నుంచి క్రియాశీలకంగా పని చేస్తున్నాడు. అయితే.. లైంగిక వేధింపులు వెలుగులోకి రావడంతో పార్టీ అతన్ని దూరం పెడుతున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది. ఇది కూడా చదవండి: జానీ మాస్టర్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి: బీజేపీ మహిళా మోర్చా -
Actor Darshan: కారాగారంలో 100 రోజులు
సాక్షి, బెంగళూరు: మెజిస్టిక్ సినిమా 100 రోజుల ప్రదర్శన తర్వాత ఆ చిత్ర హీరో దర్శన్ స్టార్ నటునిగా మారారు. అనేక హిట్ సినిమాలతో టాప్ హీరోలలో ఒకరిగా ఆయన వెలుగొందుతున్న సమయంలో సినిమాలో మాదిరిగానే కథ మలుపు తిరిగింది. రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్, ఆయన ప్రియురాలు పవిత్రగౌడ జైలు పాలై 100 రోజులు పూర్తయింది. సినీ పరిశ్రమలో 100 రోజులకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఒక నటునికి 100 రోజులు అనేది ఎంతో ముఖ్యమైన ఘట్టం.. 100 రోజులు సినిమా ఆడితే చాలు వెంటనే అదృష్టం తిరగబడి రాత్రికి రాత్రి స్టార్ అయిపోతారు. 2001లో దర్శన్ తాను నటించిన మొదటి సినిమా మెజిస్టిక్ గాంధీనగరలో రికార్డులు సృష్టించింది. ఆ తర్వాత ఎన్నో వంద రోజుల సినిమాల్లో నటించిన దర్శన్ జైలులోనూ వంద రోజుల జీవితాన్ని పూర్తి చేసుకోవడం అభిమానులను కలచివేస్తోంది. జైలు నుంచి తమ అభిమాన నటుడు ఎప్పుడు బయటకు విడుదల అవుతారని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.జూన్ 8న చెడు మలుపు...👉 జూన్ 8– దర్శన్ స్నేహితురాలు పవిత్ర గౌడకు చెడుగా మెసేజ్ చేశాడనే కారణంతో చిత్రదుర్గ నుంచి రేణుకాస్వామిని బెంగళూరుకు పిలిపించి దారుణంగా భౌతిక దాడి చేసి దర్శన్ గ్యాంగ్ హత్య చేసింది.అదే రోజు రేణుకస్వామి చనిపోయిన విషయాన్ని దర్శన్‌కు ఫోన్ ద్వారా తెలియజేశారు. రాత్రి వేళ రేణుకస్వామి మృతదేహాన్ని సుమనహళ్లి రాజకాలువలో విసిరేశారు.👉 జూన్ 9 – ఉదయం 8 గంటలకు రాజకాలువ వద్ద రేణుకాస్వామి మృతదేహం లభ్యమైంది. ఉదయం 8.30 గంటలకు కామాక్షిపాళ్య పోలీసులు వచ్చి పరిశీలించి కేసు నమోదు చేశారు.👉 జూన్ 10 – దర్శన్ సూచనల మేరకు ఆయన గ్యాంగ్‌లోని ముగ్గురు సహచరులు పోలీసు స్టేషన్లో లొంగిపోయారు. పోలీసుల విచారణలో అసలు నిజం బయటకు వచ్చింది. దర్శన్, పవిత్ర గౌడ పేర్లు విచారణలో బయటకు వచ్చాయి. ఆ రోజు రాత్రి మైసూరుకు బెంగళూరు పోలీసులు వెళ్లారు. దర్శన్ ఉండే ప్రాంతాన్ని గుర్తించారు. కేసులో ఇతర నిందితులను అరెస్టు చేశారు.👉 జూన్ 11 – ఉదయం 6.30 గంటలకు మైసూరు ర్యాడిసన్ హోటల్లో జిమ్ చేస్తున్న దర్శన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం బెంగళూరుకు తరలించారు. దర్శన్ అరెస్టు శాండల్‌వుడ్ మొత్తం ఉలిక్కిపడేలా చేసింది. -
హైవే.. ఇక హైస్పీడ్వే
ఎన్‌హెచ్–44.. దేశంలోనే అతి పెద్ద జాతీయ రహదారి. కశ్మీర్ రాజధాని శ్రీనగర్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు 3,745 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ రహదారి 11 రాష్రాల్లోని 30 ప్రధాన నగరాలను అనుసంధానిస్తోంది. జాతీయ రవాణా వ్యవస్థలో ఎన్‌హెచ్–44 అత్యంత కీలకమైంది. ఈ రహదారిలో బెంగళూరు–హైదరాబాద్ నగరాల మధ్య వాహనాల రద్దీ అధికంగా ఉంది. ఇప్పుడున్న ‘ఫోర్ వే’ సౌలభ్యంగా ఉన్నా.. ఐదేళ్లలో వాహనాల రద్దీ తీవ్రంగా పెరిగింది.ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్‌కు సరిపోని పరిస్థితి. కర్నూలు సమీపంలోని పుల్లూరు టోల్గేట్ నుంచి బెంగళూరు–హైదరాబాద్ మధ్య నిత్యం 16 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. అలాగే అమకతాడు టోల్గేట్ పరిధిలో 11 వేల వాహనాలు వెళ్లొస్తున్నాయి. దేశంలో అభివృద్ధి చెందిన, చెందుతున్న నగరాల్లో బెంగళూరు–హైదరాబాద్ ప్రధానమైనవి. ఐటీతో పాటు పారిశ్రామికంగా రెండు నగరాలు అభివృద్ధి చెందాయి. రెండు నగరాల మధ్య 583 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణం చేసేవారి సంఖ్య కూడాఎక్కువే. కొందరు రైళ్లు, విమానాల్లో వెళుతున్నా అధిక శాతం రోడ్డు మార్గంలోనే ప్రయాణిస్తున్నారు. దీంతో వాహనాల రద్దీ పెరిగింది. ముఖ్యంగా కార్ల వినియోగం అధికమైంది. ట్రాఫిక్ పెరగడాన్ని గుర్తించిన కేందప్రభుత్వం భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ రహదారిని 6 లేన్లుగా విస్తరించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి డీపీఆర్ (డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) సిద్ధం చేయాలని అనంతపురం నేషనల్ హైవే అధికారులకు సూచించింది. పూర్తయిన భూసేకరణ.. నిర్మాణ ఖర్చులతోనే డీపీఆర్ ఎన్‌హెచ్–44ను డబుల్ లైన్ నుంచి నాలుగు లేన్ల రహదారిగా విస్తరించే సమయంలోనే ఆరు లేన్లకు సంబంధించి భూసేకరణ జరిగింది. అప్పట్లో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని 6 లేన్ల కోసం భూసేకరణ చేశారు. 4 లేన్ల రహదారిని నిర్మించి తక్కిన భూమిని రిజర్వ్‌గా ఉంచారు. ఇప్పుడు కేవలం రహదారిని 6 లేన్లకు విస్తరించేందుకు అవసరమైన ఖర్చును మాత్రమే అంచనా వేసి డీపీఆర్ రూపొందిస్తున్నారు. కల్వర్టులు, వంతెనలు ఇతరత్రా ఖర్చులు లెక్కిస్తున్నారు. భూసేకరణలో సమస్యలు, కోర్టు వివాదాలు కూడా లేవు. దీంతో డీపీఆర్‌ను జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు పంపిస్తే ఆమోదముద్ర వేసి టెండర్లు పిలుస్తారు.‘సీమ’ వాసులకు ప్రయాణం మరింత సులభంఎన్హెచ్–44 విస్తరణతో ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాలతో పాటు వైఎస్సార్ జిల్లా వాసులకు ప్రయాణం సులభం కానుంది. కర్నూలు–హైదరాబాద్ 217.7 కిలోమీటర్లు ఉంది. ప్రస్తుతం 4గంటల సమయం పడుతోంది. అలాగే కర్నూలు–బెంగళూరు మధ్య 359.4 కిలోమీటర్ల దూరం ఉంది. ప్రయాణానికి 7 గంటలు పడుతోంది. ఎన్‌హెచ్–44 విస్తరిస్తే సమయం తగ్గే అవకాశం ఉంది. అనంతపురం జిల్లా వాసులకూ హైదరాబాద్, బెంగళూరుకు ప్రయాణ సమయం తగ్గనుంది. కడప, చిత్తూరు జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వెళ్లాలనుకునే వారికి కర్నూలు నుంచి, బెంగళూరుకు ప్రయాణించే వైఎస్సార్ జిల్లా వాసులకు కొడికొండ చెక్‌పోస్ట్ సమీపంలోని కొండూరు నుంచి ప్రయాణం వేగవంతం కానుంది. హైదరాబాద్–బెంగళూరు ఇండ్రస్టియల్ కారిడార్‌లో నోడ్ పాయింట్‌గా కేంద్రం ఓర్వకల్లు మెగా ఇండ్రస్టియల్ హబ్‌ను గుర్తించింది. ఎన్‌హెచ్–44 విస్తరణ పారిశ్రామికంగానూ ఉపయోగపడనుంది.డీపీఆర్ సిద్ధమవుతోందిబెంగళూరు–హైదరాబాద్ నేషనల్ హైవేను 12 లేన్లుగా విస్తరిస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. 4 నుంచి 6 లేన్లకు విస్తరిస్తున్నాం. ఇందుకు సంబంధించి డీపీఆర్ రూపొందిస్తున్నాం. భూసేకరణ సమస్య లేదు. దీంతో 2, 3 నెలల్లో డీపీఆర్‌ను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తాం. దీని ఆధారంగా కేంద్రం విస్తరణపై నిర్ణయం తీసుకోనుంది. – రఘు, ప్రాజెక్ట్ డైరెక్టర్, నేషనల్ హైవేస్ అథారిటీ, అనంతపురం -
ఎవరిని వదిలిపెట్టను వార్నింగ్ ఇచ్చిన హేమ
-
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో మరో ట్విస్ట్
-
సినిమా విడుదలకు ముందు షాక్.. హీరోకు రోడ్డు ప్రమాదం..!
ప్రముఖ కన్నడ హీరో కిరణ్ రాజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. బెంగళూరులోని కెంగేరి సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్‌కు గురైంది. మంగళవారం సాయంత్రం ఓ అనాథాశ్రమం నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో హీరోకు గాయాలు కావడంతో.. ప్రస్తుతం ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు ట్విటర్లో వైరలవుతున్నాయి.(ఇది చదవండి: హీరో జీవాకు రోడ్డు ప్రమాదం)కాగా.. కిరణ్ రాజ్ శాండల్‌వుడ్‌లో కన్నడతి సీరియల్‌తో ఫేమస్ అయ్యాడు. తెలుగులో నువ్వే నా ప్రాణం అనే చిత్రంలో హీరోగా నటించారు. అంతేకాకుండా పలు రియాలిటీ షోలలోనూ పాల్గొన్నారు. బాలీవుడ్లో హీరోస్, లవ్ బై ఛాన్స్, యే రిష్తా క్యా కెహ్లతా హై, తు ఆషికి వంటి సీరియల్స్‌లో కనిపించారు. కిరణ్ రాజ్ తాజాగా రోనీ: ది రూలర్ చిత్రంలో నటించారు. ఈ మూవీ సెప్టెంబర్ 12న థియేటర్లలో విడుదల కానుంది. కిరణ్ రాజ్ నటించిన చిత్రం రిలీజ్‌కు ముందే ప్రమాదం జరగడంతో ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. .#KiranRaj, the actor from #Kannadati serial, who was looking forward for his big screen release this week, met with an accident last night, while returning from an act of kindness - visiting an orphanage! Currently hospitalised, we wish him a speedy recovery. Let's come… pic.twitter.com/NFC5M3bFyo— A Sharadhaa (@sharadasrinidhi) September 11, 2024 -
యువతిపై ఓలా డ్రైవర్ దాడి, స్పందించిన ఓలా: వీడియో వైరల్
బెంగళూరులో ఓలా ఆటో డ్రైవర్ ఒక యువతిపై అనుచితంగా ప్రవర్తించి, దుర్బాషలాడి, దాడిచేసిన ఘటన కలకలం రేపింది. బుధవారం జరిగినఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చర్చనీయాంశంగా మారింది. బాధిత యువతి ఎక్స్‌లో షేర్ చేసిన వివరాల ప్రకారం తన స్నేహితురాలితో కలిసి బెంగళూరు సిటీలో ఓలా ఆటో రైడ్‌ను బుక్ చేసుకున్నారు. తొందరగా వెళ్లాలనే ఉద్దేశంలో ఇద్దరూ ఓలా రైడ్ కోసం ప్రయత్నించగా ఇద్దరివీ బుక్ అయ్యాయి. ఇదే వివాదానికి దారి తీసింది. ముందుగా వచ్చిన ఆటోలో యువతులిద్దరూ ఎక్కి కూర్చున్నారు. ఇంతలో 15 నిమిషాలు ఆలస్యం చూపించిన రెండో ఆటోను రద్దు చేసింది. కానీ అక్కడికి చేరుకున్న రెండో ఆటోవాలా తన రైడ్ ఎందుకు క్యాన్సిల్ చేశారంటూ వాదనకు దిగాడు. అంతేకాదు పెట్రోల్ ఊరికే వస్తుందా, అంటూ రెచ్చిపోయాడు. అంతటితో ఆగలేదు దుర్భాషలాడుతూ ఆమెపై దాడికి దిగాడు ఆటో డ్రైవర్. దీంతో నన్ను చెంపపై ఎందుకు కొట్టావ్ అంటూ ఆమె గట్టిగా నిలదీసింది. అప్పటిదాకా చోద్యం చూస్తూ కూర్చున్న మిగిలిన డ్రైవర్లు, జోక్యం చేసుకుని అతగాడిని పక్కకు తీసుకెళ్లారు.Yesterday I faced severe harassment and was physically assaulted by your auto driver in Bangalore after a simple ride cancellation. Despite reporting, your customer support has been unresponsive. Immediate action is needed! @Olacabs @ola_supports @BlrCityPolice pic.twitter.com/iTkXFKDMS7— Niti (@nihihiti) September 4, 2024కాగా బాధిత యువతి నితి తన నిరాశను వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేసింది. ఓలా కస్టమర్ సపోర్ట్ ఫిర్యాదు చేసినా, ఆటోమేటెడ్ ప్రత్యుత్తరాలు మాత్రమే అందాయి తప్ప, అంతకుమించి ఎలాంటి స్పందన లేదని ట్వీట్ చేసింది. తన స్నేహితురాలు క్లాస్ మిస్ కాకుండా చూసుకోవడానికి రెండు ఆటోలను బుక్ చేసుకోవడం మాత్రమే తమ తప్పు అని, రైడ్ రద్దుపై వివాదాలు సర్వసాధారణమైనప్పటికీ, డ్రైవర్ బెదిరింపులు, అమానుష ప్రవర్తన హద్దు మీరిందంటూ ఆగ్రహం చేసింది. అయితే దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు.ఓలా స్పందనఈ వీడియో వైరల్ కావడంతో ఈ ఘటనపై ఓలా స్పందించింది. డ్రైవర్ చర్యలను ఖండిస్తోంది. నిందితుడైన డ్రైవర్‌పై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. అటువంటి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించి తమ ప్రయాణీకుల భద్రతకు భరోసాకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది. -
వహ్వా రసం పూరి.. తింటారా మైమరచి!
మీరెప్పుడైనా పానీ పూరి తిన్నారా? వాటిల్లో రకరకాల ఫ్లేవర్స్ రుచి చూశారా?తినే ఉంటారు! మరి.. రసం పూరి?దీన్ని తినాలంటే మాత్రం మీరు... కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపికి వెళ్లాల్సిందే! ఎందుకంటే అక్కడి ‘విప్ర’ ఛాట్ హోమ్‌కు వెళ్లాల్సిందే! జూనియర్ ఎన్టీఆర్, కాంతార హీరో రిషభ్ శెట్టిలు ఇటీవల దర్శించుకున్న ప్రఖ్యాత శ్రీకృష్ణ దేవాలయం మాత్రమే కాకుండా.. ఉడుపి టమోటా రసంకు చాలా ప్రసిద్ధి. శ్రీకృష్ణ మఠం నిత్యాన్నదాన కార్యక్రమంలో ఈ వంటకం ఓ స్పెషల్ అట్రాక్షన్. దీని రుచి, పరిమళం వేరే లెవల్ అని అంటారు అభిమానులు. ఇంతలా చాలామంది అభిమానం చూరగొన్న వంటకానికి మరింత ప్రచారం కల్పించాలని అనుకున్నారో ఏమో తెలియదు కానీ.. ‘విప్ర’ ఛాట్ హోమ్ వారు సాధారణ పానీ పూరి స్థానంలో రసం పూరిని ప్రవేశపెట్టారు. ఉడుపి రసంను పూరీల్లో పోసి ఇస్తారన్నమాట! ఈ సారి మీరేమైనా ఉడుపి వెళితే ఒకసారి ట్రై చేసి చూడండి మరి! మధుకర్ ఆర్. మయ్యా అనే వ్యక్తి ఎక్స్ వేదికగా ఈ సరికొత్త ఛాట్ వీడియో ఒకటి పోస్ట్ చేశారుಉಡುಪಿ ಸಾರನ್ನು ಚ್ಯಾಟ್ಸ್ ರೂಪದಲ್ಲಿ ಸವಿದಿದ್ದೀರಾ| ವಿಪ್ರ ಚಾಟ್ ಹೋಮ್ ರಸಂ ಪುರಿ | ಕೃಷ್ಣ ಮಠದ ಪಾರ್ಕಿಂಗ್ ಏರಿಯಾದ ಶ್ರೀರಾಮ ಧಾಮ ಕಾಂಪ್ಲೆಕ್ಸ್ | ಉಡುಪಿಯ ಕಂಡೀರಾ pic.twitter.com/h2DPhS5H1p— Madhukara R Maiya 🇮🇳 (@madhumaiya) September 2, 2024 -
మారుతీ సుజుకీ నెక్సా విస్తరణ
న్యూఢిల్లీ: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ నెక్సా ఔట్లెట్లను పెద్ద ఎత్తున విస్తరిస్తోంది. బెంగళూరులో 500వ కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 150 స్టోర్స్‌ను ఏర్పాటు చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఇందులో 100 కేంద్రాలు చిన్న నగరాల్లో రానున్నాయని వెల్లడించింది. నెక్సా సేల్స్ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు చాలా దూకుడుగా ప్లాన్ చేశామని మారుతీ సుజుకీ ఇండియా మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ ఈ సందర్భంగా తెలిపారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు పెద్ద ఎత్తున వెళ్లాలన్నది తమ ప్రణాళిక అని వెల్లడించారు. నెక్సాలో లభించే మోడళ్లకు ఈ నగరాల నుంచి మంచి డిమాండ్ ఉందన్నారు. కార్యక్రమంలో మరో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నొబుటాకో సుజుకీ కూడా పాల్గొన్నారు.నెక్సా వాటా 37 శాతం.. మారుతీ సుజుకీ 2015 జూలైలో నెక్సా ఔట్లెట్లకు శ్రీకారం చుట్టింది. ఏడాదిలోనే 94 నగరాల్లో 100 నెక్సా షోరూంలను నెలకొలి్పంది. ప్రస్తుతం ఇగ్నిస్, బలీనో, ఫ్రాంక్స్, సియాజ్, జిమ్నీ, ఎక్స్ఎల్6, గ్రాండ్ విటారా, ఇని్వక్టో మోడళ్లను నెక్సా షోరూంలలో కంపెనీ విక్రయిస్తోంది. సంస్థ మొత్తం విక్రయాల్లో నెక్సా వాటా 37 శాతం ఉంది. 2023–24లో 54 శాతం వృద్ధితో నెక్సా షోరూంల ద్వారా 5.61 లక్షల కార్లు రోడ్డెక్కాయి. నెక్సా స్టూడియో పేరుతో చిన్న కేంద్రాలను కంపెనీ ఏర్పాటు చేస్తోంది. సంస్థ ఖాతాలో అరీనా, నెక్సా, కమర్షియల్ ఔట్లెట్ల సంఖ్య ప్రస్తుతం 3,925కు చేరుకుంది. ఇవి దేశవ్యాప్తంగా 2,577 నగరాలు, పట్టణాల్లో విస్తరించాయి. -
‘అంతా అయిపోయింది’.. మొత్తం ఉద్యోగుల తొలగింపు!
క్రియేషన్ ఇన్వెస్ట్మెంట్ మద్దతు ఉన్న అగ్రిటెక్ స్టార్టప్ రేషామండి కథ ముగిసింది. సంస్థ మొత్తం ఉద్యోగులను తొలగించిందని ఎన్‌ట్రాకర్ నివేదిక తెలిపింది. ఆడిటర్ తప్పుకోవడం, వారం రోజులుగా కంపెనీ వెబ్సైట్ డౌన్ కావడం వంటి పరిణామాలతో సంస్థ స్థితిగతులపై మరింత ఆందోళన వ్యక్తమవుతోంది.'రేషామండి కథ అయిపోయింది' అని సంబంధిత వర్గాలు తెలిపినట్లుగా ఆ నివేదిక పేర్కొంది. గత కొన్ని నెలలుగా ఉద్యోగులకు జీతాలు సహా అప్పులు చెల్లించడానికి, నిర్వహణ ఖర్చులను భరించడానికి కంపెనీ ఇబ్బంది పడుతోందని తెలిపింది. సంస్థలోని మొత్తం 500 మంది ఉద్యోగులను తొలగించినట్లు కంపెనీ సన్నిహిత వర్గాలు ధ్రువీకరించాయి.రెవెన్యూ ద్రవ్యోల్బణం, మోసపూరిత ఇన్ వాయిస్ లతో సహా పలు కార్పొరేట్ గవర్నెన్స్ సమస్యలను కంపెనీ ఎదుర్కొంది. గత నెలలో రాజీనామా చేసిన ఆడిటర్ వాకర్ చందోక్ అండ్ కో ఎల్ఎల్పీ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ)కి సమర్పించిన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఈ సమస్యలను తెలియజేసింది. రేషామండి ఆడిటింగ్ సంస్థకు రూ.14.16 లక్షలు బకాయి పడింది. బెంగళూరుకు చెందిన ఈ చింది.కంపెనీ జూలై చివరిలో సురేష్ కపూర్ అండ్ అసోసియేట్స్ అనే కొత్త ఆడిటర్‌ను నియమించుకుంది.దీనికి తోడు రేషామండి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ల (సీఎఫ్‌వో) వరుస రాజీనామాలను చవిచూసింది. 2022 మార్చి 2 నుంచి 2023 జనవరి వరకు సీఎఫ్ఓగా పనిచేసిన రితేష్ కుమార్ స్థానంలో 2023 ఏప్రిల్‌లో కేపీఎంజీ మాజీ సీఎఫ్ఓ సమద్రిత చక్రవర్తి గ్రూప్ సీఎఫ్ఓగా నియమితులయ్యారు. తర్వాత ఆయన కూడా అదే ఏడాది అక్టోబర్‌లో కంపెనీని వీడినట్లు ఇంక్ 42 నివేదించింది.రేషామండి ప్రతినిధి ప్రచురణకు ఇచ్చిన ఒక ప్రకటనలో సంస్థ ఆర్థిక ఇబ్బందులను అంగీకరించారు. "రేషామండి కొన్ని ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. మార్కెట్ నుంచి పెండింగ్ రిసీవబుల్స్ సేకరించడంపై దృష్టి పెట్టడానికి దాని సిబ్బంది, కార్యకలాపాలు, ప్రక్రియలను క్రమబద్ధీకరించింది. ఈ పరిస్థితి నుంచి బలంగా బయటపడి త్వరలోనే ట్రాక్‌లోకి రాగలమని నమ్ముతున్నాం' అని అన్నారు. -
బెంగళూరులో విద్యార్థినిపై లైంగికదాడి
బొమ్మనహళ్లి: బెంగళూరులో ఓ యువతిపై లైంగికదాడి జరిగింది. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని శనివారం రాత్రి స్నేహితులతో కలిసి కోరమంగళలోని పబ్‌కు వెళ్లింది. అర్ధరాత్రి ఒకటిన్నర సమయంలో బయలుదేరగా దారి మధ్యలో కారులో సమస్య వచ్చి ఆగిపోయింది.దీంతో రోడ్డుపై వెళుతున్న ద్విచక్ర వాహనదారుడిని లిఫ్టు అడిగి బయలుదేరింది. ఆ వ్యక్తి యువతిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి దాడి చేసి, అత్యాచారం చేసి పరారయ్యాడు. కొంతసేపటికి తేరుకున్న ఆమె తన స్నేహితులకు మెసేజ్ పంపడంతో వారు ఘటనా స్థలానికి వచ్చి ఆమెను ఆస్పత్రికి తరలించారు. లైంగిక దాడి చేసిన వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
రూ.30 వేలకోట్ల ప్రాజెక్ట్‌లకు కేబినెట్ ఆమోదం
దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో మెట్రో ప్రాజెక్టుల విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బెంగళూరు, థానే, పుణెల్లోని మెట్రో ప్రాజెక్ట్‌ల కోసం రూ.30,000 కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పింది. ఈ ప్రాజెక్ట్‌లను 2029 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దాంతోపాటు బగ్ద్గోరా, బిహ్తా, పాట్నా విమానాశ్రయాల పరిసరాల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు దాదాపు రూ.3,000 కోట్లు కేటాయించేలా మంత్రివర్గం ఆమోదం లభించిందని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.కేంద్ర కేబినెట్ సమావేశం తర్వాత ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..‘బెంగళూరు , థానే , పుణెల్లో దాదాపు రూ.30,000 కోట్ల విలువైన మెట్రో రైలు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్‌లను 2029లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దాంతోపాటు బగ్ద్గోరా, బిహ్తా, పాట్నా విమానాశ్రయ పరిసరాల్లో మౌలిక సదుపాయాలు విస్తరించేందుకు దాదాపు రూ.3,000 కోట్లు కేటాయించేలా అనుమతులు వచ్చాయి. ఈ కీలక ప్రాజెక్టులు ఆయా నగరాల వృద్ధికి దోహదపడుతాయి. 2014కి ముందు దేశంలో కేవలం ఐదు నగరాల్లో మాత్రమే మెట్రో రైలు ఉండేది. కానీ ప్రస్తుతం 21 నగరాలకు మెట్రో విస్తరించింది. ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మౌలిక సదుపాయాల కల్పనకు రూ.2 లక్షల కోట్ల ఖర్చు చేసేలా ఆమోదం లభించింది’ అన్నారు.ఇదీ చదవండి: బ్యాంక్ ఖాతాలు క్లోజ్.. సమస్య పరిష్కారానికి చర్చలు‘బెంగళూరు మెట్రో రైలు ప్రాజెక్ట్ ఫేజ్-3లో రెండు కారిడార్లను అభివృద్ధి చేయాలని కేబినెట్ నిర్ణయించింది. దాంతో ప్రభుత్వ ఖజానాపై రూ.15,611 కోట్ల భారం పడబోతోంది. ఈ ఫేజ్-3 ప్రాజెక్ట్ 44.65 కిలోమీటర్లతో 31 స్టేషన్లను అనుసంధానం చేస్తుంది. మెట్రో విస్తరణలో భాగంగా మూడో దశ పనులు పూర్తయిన తర్వాత బెంగళూరు నగరంలో 220.20 కిలోమీటర్ల మెట్రో రైలు నెట్వర్క్ ఉంటుంది. థానేలో కొత్తగా 22 స్టేషన్లతో ఏర్పాటు చేసే 29 కిమీ కారిడార్ కోసం రూ.12,200 కోట్లు ఖర్చు అవుతుంది. మహారాష్ట్రలో మంత్రివర్గం ఆమోదించిన మరో ప్రాజెక్ట్ కోసం రూ.2,954.53 కోట్లు ఖర్చు అవుతాయి’ అని మంత్రి వివరించారు. -
వీడియో: ట్రాఫిక్‌లో ఓల్వో బస్సు బీభత్సం.. వాహనాలు నుజ్జునుజ్జు
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఫుల్ ట్రాఫిక్ ఉన్న రోడ్డుపై ఓల్వో బస్సు ఒకటి అదుపు తప్పడంతో ముందున్న వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడగా.. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల ప్రకారం.. బెంగళూరులోని హెబ్బాల్ ఫ్లైఓవర్‌పై ఓ ఓల్వో బస్సు వెళ్తోంది. ఈ క్రమంలో ఉన్నట్టుండి డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోయాడు. డ్రైవర్ బ్రేకులు వేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. బస్సు ముందుకు సాగుతుండటంతో సెకన్ల కాలంలోనే ముందున్న వాహనాలపైకి దూసుకెళ్లింది. ముందుగా బైక్‌లను ఢీకొట్టిన బస్సు.. ఆపై రెండు కార్లను ఢీకొట్టి ఆగిపోయింది.ఇక, ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, వీడియో బస్సును కంట్రోల్ చేసేందుకు డ్రైవర్ ఎంత ప్రయత్నించాడో చూడవచ్చు. మరోవైపు.. ఈ ప్రమాద ఘటనపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. CCTV footage shows a Volvo bus going out of control and crashing into several vehicles. The incident, involving a BMTC AC Volvo bus, occurred at Hebbal in #Bengaluru. In this accident, two people were injured, and four cars and four bikes were damaged. pic.twitter.com/3AIMyhYVLK— Neelima Eaty (@NeelimaEaty) August 13, 2024 -
NIRF rankings 2024: ఐఐటీ మద్రాస్ టాప్
న్యూఢిల్లీ: నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్(ఎన్ఐఆర్ఎఫ్)–2024 ర్యాంకింగ్స్ విడుదలయ్యాయి. ఓవరాల్‌తోపాటు ఇంజినీరింగ్ కేటగిరీలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్ వరుసగా ఆరోసారి టాప్ ర్యాంక్‌లో నిలిచింది. ఐఐటీ హైదరాబాద్‌కు 8వ ర్యాంకు దక్కింది. ఉత్తమ యూనివర్సిటీగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) బెంగళూరు వరుసగా 9వసారి మొదటి స్థానం సంపాదించుకుంది. అదేవిధంగా, ఓవరాల్ కేటగిరీలో ఐఐఎస్సీ బెంగళూరు, ఐఐటీ బాంబే, ఐఐటీ ఢిల్లీ వరుసగా రెండు, మూడు, నాలుగు ర్యాంకులు సాధించాయి. నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్(ఎన్బీఏ) రూపొందించిన ఈ ర్యాంకింగ్స్‌ను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం విడుదల చేశారు. ఓవరాల్ టాప్–10 జాబితాలో 8 ఐఐటీలతోపాటు ఢిల్లీ ఎయిమ్స్, ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ చోటుసంపాదించాయి. యూనివర్సిటీల కేటగిరీలో టాప్–3లో బెంగళూరు ఐఐఎస్సీ, ఢిల్లీలోని జేఎన్‌యూ, జామియా మిలియా ఇస్లామియాలున్నాయి. ఇన్నోవేషన్ విభాగంలో ఐఐటీ బాంబే, ఐఐటీ మద్రాస్ తర్వాత ఐఐటీ హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వ వర్సిటీల్లో హైదరాబాద్‌లోని ఉస్మానియాకు ఆరు, విశాఖపట్టణంలోని ఆంధ్రా వర్సిటీకి ఏడో ర్యాంకు దక్కాయి.ఫార్మసీ విభాగంలో... నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఎన్ఐపీఈఆర్)హైదరాబాద్ ఈ ఏడాది రెండో స్థానానికి పడిపోయింది. ఈసారి మొదటి స్థానాన్ని జామియా హందర్డ్ దక్కించుకోగా బిట్స్ పిలానీ మూడో ర్యాంకు సాధించింది. లా యూనివర్సిటీల్లో నల్సార్ హైదరాబాద్‌కు మూడో ర్యాంకు దక్కింది. -
Tanisha Bajia: జేబులో దాగిన స్థైర్యం.. చెయ్యెత్తి జై కొట్టింది
ఆ అమ్మాయి స్కూల్‌కు వచ్చినన్ని రోజులు ఎడమ చేతిని ఎవరూ చూళ్లేదు. దానిని స్కర్ట్ జేబులో పెట్టుకుని ఉంటే అదామె అలవాటనుకున్నారు. కాని అసలు రహస్యం ఏమిటంటే ఎడమ అర చెయ్యి లేకుండా పుట్టింది తనీషా. స్కూల్లో ఎగతాళి చేయకుండా ఉండడానికి మణికట్టుకు దుపట్టా చుట్టి జేబులో దాచేది. కాని ఇప్పుడు దాచడం లేదు. గత నెల బెంగళూరులో జరిగిన 13వ జాతీయ సబ్ జూనియర్ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 400 మీటర్ల పరుగు పందెంలో గెలిచిన రజత పతకం ఆమె చేతికి గౌరవాన్ని ఆమెకు ఆత్మవిశ్వాసాన్ని తెచ్చిపెట్టింది.ఆరావళి పర్వతాలు చుట్టుముట్టిన రాజస్థాన్‌లోని సికార్ జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆగ్లోయి తనీషా సొంత గ్రామం. తన వైకల్యాన్ని చూసి ఇతర పిల్లలు ఆట పట్టించడంతో స్కూల్‌కు వెళ్లకుండా తనీషా ఎక్కువగా ఇంట్లోనే ఉండిపోయేది. దీంతో ఆమెను గ్రామానికి దూరంగా ఉన్న వేరే పాఠశాలలో చేర్పించారు. అక్కడ కూడా వెక్కిరింపులు ఎదురు కాకుండా ఉండడానికి ఉపాధ్యాయులకు, తోటిపిల్లలకు తెలియకుండా తన అంగవైకల్యాన్ని జేబులో దాచిపెట్టింది. అంగవైకల్యాన్ని దాచి పెట్టడం అంటే... ఒంటరితననానికి దగ్గర కావడమే.గెలుపుతో విముక్తి‘ఇప్పుడు నా ఎడమ చెయ్యిని దాచాల్సిన అవసరం లేదు’ అంటోంది తనీషా. అద్భుతమైన బెంగళూరు విజయంతో ఆమె ఎడమ చేయి జేబు నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడు అది అంగవైకల్యంలా అనిపించడం లేదు. ఆత్మవిశ్వాసానికి ప్రతీకలా ఉంది. ఒకప్పుడు తనీషాకు నలుగురితో కలవడం తెలియదు. నలుగురితో కలిసి నవ్వడం తెలియదు. ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి లేదు. స్వేచ్ఛా జీవితపు మాధుర్యాన్ని రుచి చూస్తోంది. ‘ఇప్పుడు నన్ను ఎవరూ ఎగతాళిగా కామెంట్ చేయడం లేదు’ చిరునవ్వుతో అంది తనీషా. గత ఏడాదిలో రాష్ట్ర, జాతీయ చాంపియన్‌షిప్‌లలో మూడు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యంతో సహా అయిదు పతకాలు సాధించింది. ‘ఈ పతకాలు నా జీవితాన్ని మార్చేసాయి. ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. నా ఆలోచనా ధోరణిలో చాలా మార్పు వచ్చింది’ అంటుంది తనీషా.తొలిసారి పట్టుదల‘నాకు 1,500 మీటర్ల తొలి పరుగు పందెం గుర్తుంది. పోటీలో నన్ను చూసి ఇతర పోటీదారులు నవ్వుతున్నారు. దాంతో పోటీలో పాల్గొనడానికి అధికారులు అనుమతి ఇవ్వడం లేదు. మా నాన్నమాత్రం ఎలాగైనా సరే, పాల్గొనాల్సిందే అన్నాడు. దాంతో సర్వశక్తులు ఒడ్డి పరుగెత్తాను.నాలుగోస్థానంలో నిలిచినప్పుడు అందరూ వచ్చి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇక ఇప్పటినుంచి నేను కూడా ఏదైనా చేయగలను అనే నమ్మకం కలిగింది’ అని ఆ రోజును గుర్తు చేసుకుంది తనీషా.జూలైలో పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ కోసం బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియానికి వెళ్లిన తనీషా వందలాది మంది ప్రేక్షకులను చూసి కంగారు పడింది. ‘ఇప్పుడు సాధించకపోతే సంవత్సరం శ్రమ వృథా అయిపోతుంది’ అనుకుంది మనసులో. అనుకోవడమే కాదు 400 మీటర్ల రేసును విజయవంతంగా పూర్తి చేసి రజత పతకం గెలుచుకుంది. ‘ఇప్పుడు ఉన్నంత సంతోషంగా నా కూతురు ఎప్పుడూ లేదు. ఆటలు ఆమెను పూర్తిగా మార్చివేసాయి’ అంటోంది తల్లి భన్వారీదేవి. నాన్న నిలబడ్డాడుపుట్టినప్పుడు ఎడమ అర చెయ్యి లేకపోవడంతో తనీషాను తండ్రి ఇంద్రజ్ బాజియా ఓ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లాడు. ఈ అమ్మాయి మీకు దేవుడు ఇచ్చిన వరం. ప్రేమగా చూసుకోండి... అన్నాడు ఆ డాక్టర్. ఆయన మాటలు తండ్రిలోని దిగులును మాయం చేశాయి. ఇక అప్పటి నుంచి ఎలాంటి వివక్షత చూపకుండా ఆమెను ఆటల్లో ప్రోత్సహించాడు తండ్రి. ‘తనీషా బాగా పరుగెడుతుంది. ఇంకా ఎన్నో విజయాలు సాధించే సామర్థ్యం ఆమెలో ఉంది. తనీషాకు శిక్షణ ఇవ్వడానికి ప్రతివారం ఆమె గ్రామానికి వెళుతుంటాను’ అంటుంది తనీషా కోచ్ సరితా బవేరియా. నేషనల్ లెవల్ ప్లేయర్ అయిన సరిత బవేరియా దివ్యాంగులైన పిల్లలకు ఆటల్లో శిక్షణ ఇస్తుంటుంది. -
బాపట్ల బిడ్డ కృష్ణ చివుకుల.. ఐఐటీ మద్రాసుకు 220 కోట్ల భారీ విరాళ ప్రకటన!
అమెరికా, బెంగళూరుల్లో కార్పొరేట్ సంస్థలు నెలకొల్పి, ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న తెలుగు తేజం కృష్ణ చివుకుల తన ఉదారతను చాటుకున్నారు. అమెరికాలో స్థిరపడ్డప్పటికీ, మాతృదేశంపై మమకారంతో ఇక్కడి పేద పిల్లలకు విద్యాదానం చేయడంలో ఆది నుంచీ ముందున్నారాయన. తాజాగా తాను ఇంజినీరింగ్ విద్యనభ్యసించిన ఐఐటీ మద్రాస్‌కు రూ. 228 కోట్ల భారీ విరాళం ప్రకటించారు.ఐఐటీ నిబంధనల ప్రకారం విరాళాలిచ్చే దాతలతో ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 6న క్యాంపస్‌లో జరిగే ఒప్పంద కార్యక్రమంలో పాల్గొనేందుకు కృష్ణ చివుకుల ప్రత్యేకంగా అమెరికా నుంచి చెన్నైకి వస్తున్నారు. బాపట్ల నుంచి ప్రస్థానం : ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లకు చెందిన డాక్టర్ కృష్ణ చివుకుల మధ్య తరగతి విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చారు.ఆయన ఐఐటీ బాంబేలో బీటెక్ చదివాక, ఐఐటీ మద్రాస్‌లో 1970 నాటికి ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో ఎంటెక్ పూర్తి చేశారు. హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ డిగ్రీ అందుకున్నారు. తుముకూర్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేశారు. యూఎస్‌లోని ప్రముఖ హాఫ్మన్ ఇండస్ట్రీస్‌కి తొలి భారతీయ గ్రూప్ ప్రెసిడెంట్, సీఈవోగా సేవలందించారు. అప్పటికి ఆయన వయసు కేవలం 37 ఏళ్లు. ఆ కంపెనీ నుంచి బయటకొచ్చి న్యూయార్క్ కేంద్రంగా ‘శివ టెక్నాలజీస్'ను నెలకొల్పారు.మాస్ స్పెక్ట్రోస్కోపిక్ సాంకేతికతను అందించడంలో ఈ సంస్థను ప్రపంచంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దారు. ఇదే కంపెనీని బెంగళూరులోనూ ఏర్పాటు చేశారు. 1997లో భారత్‌లో తొలిసారిగా మెటల్ ఇంజెక్షన్ మౌల్డింగ్ (MIM) సాంకేతికతను పరిచయం చేసింది కృష్ణానే. ఆ తర్వాత ‘ఇండో ఎంఐఎం సంస్థను బెంగళూరులో ప్రారంభించారు. ప్రస్తుతం ‘ఇండో యూఎస్ ఎంఐఎం టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో నెలకొల్పిన సంస్థకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. భారత్‌లో వీరి టర్నోవర్ రూ.వెయ్యి కోట్లకు పైనే. 2009లో ఆయన తిరుపతి జిల్లా రేణిగుంట కేంద్రంగా గౌరి వెంచర్స్‌ను స్థాపించారు.దాతృత్వంలో మేటి..కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఐఐటీ మద్రాస్‌పై కృష్ణ ఎంతో దాతృత్వం చూపిస్తున్నారు. 60 ఏళ్ల నాటి హాస్టళ్లను ఆధునికీకరించడానికి రూ.5.5 కోట్లు వెచ్చించారు. 2014లో ఐఐటీ-ఎంశాట్ పేరుతో విద్యార్థులు శాటిలైట్ రూపొందించేందుకు రూ.1.5 కోట్ల సాయాన్ని అందించారు. క్యాంపస్‌లో స్పేస్‌ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. ప్రతిభావంతులైన క్రీడాకారులకు ‘స్పోర్ట్స్ ఎక్స్‌లెన్స్ అడ్మిషన్ ప్రోగ్రాం’ పేరుతో విరాళాలు అందిస్తున్నారాయన. కృష్ణ సేవలకు గుర్తింపుగా 2015లో ఐఐటీ మద్రాస్, 2016లో ఐఐటీ బాంబే ప్రతిష్ఠాత్మక అలుమ్నస్ అవార్డు అందజేశాయి.బెంగళూరులో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 2,200 మంది పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని సమకూరుస్తున్నారు. బెంగళూరులో బాప్టిస్ట్ ఆసుపత్రిని మెరుగుపరిచి పేద పిల్లల వైద్యానికి సహకారం అందిస్తున్నారు. మైసూర్ సమీపంలోని చామరాజనగర్‌లో కృష్ణ దత్తత తీసుకున్న పాఠశాలలో 380 మంది పేద, అనాథ పిల్లలు చదువుకుంటున్నారు. ఐఐటీ మద్రాస్‌లో పరిశోధన వసతుల పెంపునకు తాజాగా ఆయన ప్రకటించిన భారీ విరాళం ఆ విద్యాసంస్థకు వరంగా మారనుంది. -
ఇలాంటి మేకవన్నె పులి మీకు తగిలిందా? మహిళలూ తస్మాత్ జాగ్రత్త!
బెంగళూరు మహానగరంలో చోటుచేసుకున్న భయానక ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. వాకింగ్ వెళ్లిన మహిళను వేధింపులకు గురిచేశాడో ప్రబుద్ధుడు. తెల్లవారుజామున 5 గంటలకు జరిగిన ఈ ఘటనసీసీటీవీ కెమెరాలో రికార్డయింది. నెట్టింట వైరల్‌గా మారిన ఈ వీడియోపై తీవ్ర ఆగ్రహం వ్యక్త మవుతోంది.బెంగళూరుకు చెందిన మహిళ కోననకుంటె ప్రాంతంలో ఒంటరిగా మార్నింగ్ వాక్కు బయలుదేరింది. మరికొద్దిసేపట్లో రానున్న తన స్నేహితురాలికోసం వెయిట్ చేస్తోంది. ఇంతలో ఎక్కడ నుంచి వచ్చాడో తెల్లని చొక్కాలో గుర్తు తెలియని వ్యక్తి ఆమెపై ఎటాక్ చేశాడు. వెనుక నుంచి ఆమెను వాటేసుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో విస్తుపోయిన బాధితురాలు తనను తాను విడిపించుకోవడానికి పెనుగులాడింది. ఎలాగో వదిలించుకునే వెళ్లిపోతోంటే మళ్లీ దొరకపుచ్చుకున్నాడు. గట్టిగా నోరుమూయాలని ప్రయత్నించాడు. కానీ ఆమె గట్ టిగట్టిగా అరవడంతో అక్కడి నుంచి ఉడాయించాడు. దీంతో ఆమెకు పెద్ద ముప్పు తప్పి నట్టయింది. మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్‌లో ‘@peepoye’ అనే పేరుతో ఉన్ ఖాతాలో ఈ వీడియో షేర్ అయ్యింది. బాధిత మహిళ రాజస్థానీ అని పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న బెంగళూరు సౌత్ పోలీసులు నిందితుడి ఆచూకీ కోసం సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.🤢 A shocking incident in #Bengaluru’s Konanakunte area: A Rajasthani woman, ready for her 5 am walk and waiting for a friend, was groped by a man who crept up on her.She tried to flee, but he sped up, and covered her mouth, attempting to sexually assault her. With such men,… pic.twitter.com/v4P0eLl1lf— Akassh Ashok Gupta (@peepoye_) August 5, 2024 కాగా ఈ ఘటనపై నెటిజన్లు ముఖ్యంగా మహిళలు స్పందించారు.ఇలాంటి మేక వన్నె పులులు చాలామంది పొంచి ఉంటారంటూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పాలవాడి నుంచి మొదలు, టీచర్లు, సొంతబంధువులు కూడా సమయం చూసి ఇలాంటి వేధింపులకు పాల్పడుతూ ఉంటారంటూ తన అనుభవాలను షేర్ చేసు కున్నారు. గట్టిగా అరవడం, తిరిగి ఎటాక్ చేయడం లాంటివి చేయాలని సూచించారు. అంతేకాదు కుటుంబం సభ్యుల సహకారంతో ఇలాంటి దుర్మార్గులపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని, తద్వారా మరోమహిళ ఇలాంటి వేధింపులకు గురి కాకుండా చూడాలని వ్యాఖ్యానించారు. -
మటన్ అంటే పరార్, వీకెండ్ అంటేనే బెంబేలు!
వీకెండ్ వస్తోంది అంటే మస్తీ మజా అన్నట్టు ఉండేది ఒకప్పుడు. కానీ ఇపుడు హెటెల్కి వెళదాం అంటేనే బెంబేలెత్తే పరిస్థితి. గొప్ప గొప్ప పేరున్న హోటల్స్‌లోనూ, ఐస్ క్రీం పార్లర్లలోనూ, బేకరీల్లోనూ ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. ఇటీవలి కాలంలో బ్రాండెడ్ అని చెప్పుకునే హోటల్స్, ఐస్ క్రీం షాపుల్లో అపరిశుభ్రవాతావరణం, పురుగులు పట్టిన వస్తువులు, కాలం తీరిన సరుకులు. తాజాగా బెంగళూరులో మటన్‌కు బదులు కుక్క మాంసం అమ్ముతున్నారనే వార్తలు ఆందోళన రేపాయి. తాజాగా మటన్ తిని ఒకే కుటుంబంలో నలుగురు మృత్యువాత పడటం కలకలం రేపింది.ఇటీవల రాజస్థాన్‌లోని జైపూర్ నుంచి బెంగళూరుకు మటన్ పేరుతో కుక్క మాంసం సరఫరా చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. తాజాగా కర్ణాటకలోని రాయచూర్ జిల్లా, కల్లూరు గ్రామంలో ఒక కుటుంబం కూడా మటన్ తెచ్చుకుని తిన్నారు. వాంతులు విరోచనాలతో ఆస్పత్రిలో చేరిన నలుగురూ ప్రాణాలు కోల్పోవడం విషాదం నింపింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. ఫుడ్ పాయిజన్ అయిందా.. లేక ఆ కుటుంబంపై ఏదైనా విషప్రయోగం జరిగిందా అనే అంశంపై విచారణ జరుపుతున్నారు. దీంతోవీకెండ్ అంటేనే భయమేస్తోందని, మటన్పేరెత్తాలంటేనే వణుకు పుడుతోందంటూ నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు పుకార్లను నమ్మవద్దని కొందరు సూచిస్తోంటే, ఇంటి ఫుడ్డే బెటర్ అంటున్నారు కొంతమంది నెటిజన్లు. కాగా మరోవైపు కుక్కమాసం విక్రయిస్తున్నారన్న పుకార్లపై స్పందించిన ఫుడ్ సెక్యూరిటీ అధికారులు అది కుక్క మాంసం కాదు మేక మాంసమే అని తేల్చిన సంగతి తెలిసిందే. ఇది గుజరాత్‌లోని కచ్-భుజ్ ప్రాంతాలలో కనిపించే సిరోహి అనే మేక జాతికి చెందినది వెల్లడించారు. వాటికి కొద్దిగా పొడుగు తోక, మచ్చలు కూడా ఉంటాయని తేల్చి చెప్పారు. మటన్ ఖరీదు ఎక్కువ కావడంతో తక్కువ రేటులో ఈ మాంసాన్ని విక్రయిస్తారని వివరణ ఇచ్చారు. ఈ ఘటనలో బీజేపీ మాజీఎంపీ ప్రతాప్ సింహ మరికొందరిపై కేసులు నమోదయ్యాయి. -
Mitti Cafe: అలీన అద్భుత దీపం...
అద్భుతాలు జరగడానికి అల్లావుద్దీన్ అద్భుత దీపం అక్కర్లేదు. కాస్త ఆత్మవిశ్వాసం ఉంటే చాలు. అలీన ఆ ఆత్మవిశ్వాసంతో సాధించిన అద్భుతం...మిట్టీ కేఫ్. ఆఫీసుల నుంచి రెస్టారెంట్ల వరకు దివ్యాంగులకు సరిౖయెన సౌకర్యాలు లేని పరిస్థితి. ‘నేను ఉద్యోగం చేస్తాను’ అని అడిగితే ‘సారీ’ చెప్పే పరిస్థితి. ఇది తెలిసి కూడా దివ్యాంగులను ఉద్యోగులుగా, ఎంటర్ప్రెన్యూర్లుగా చూడాలని కల కన్నది అలీనా అలమ్. ఇరవై మూడు సంవత్సరాల వయసులో ఆమె మొదలుపెట్టిన ‘మిట్టీ కేఫ్’ ఆ తరువాత కాలంలో అద్భుతం సృష్టించింది. ‘మిట్టి కేఫ్’ అనేది ఇప్పుడు ఒక కేఫ్ బ్రాండ్ మాత్రమే కాదు ఆత్మవిశ్వాసాన్ని ప్రతిధ్వనించే బ్రాండ్...దివ్యాంగుల కోసం పనిచేస్తున్న బెంగళూరులోని ‘సమర్థన’ ట్రస్ట్‌లో ఇంటర్న్‌షిప్ ్ర΄ోగ్రామ్ చేస్తున్న రోజుల్లో ‘మిట్టీ కేఫ్’ ఆలోచన ఆలీనా అలమ్‌కు వచ్చింది. సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా తన కలను సాకారం చేసుకోవడానికి ‘మిట్టీ కేఫ్’ మంచి ఆలోచన అనుకుంది.‘పెళ్లి చేసుకో లేదా ఉద్యోగం చెయ్’ అన్నారు తల్లిదండ్రులు. అలీనా మాత్రం సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ దారిలో నడక మొదలు పెట్టింది. దివ్యాంగుల కోసం, దివ్యాంగుల చేత నడుస్తున్న ‘మిట్టీ కేఫ్’లు సక్సెస్ అయ్యాయి.‘మన దేశంలోని లక్షలాది మంది దివ్యాంగులు సమాన అవకాశాల కోసం, ఆర్థికంగా సొంతకాళ్ల మీద నిలబడడం కోసం ఎదురుచూస్తున్నారు. సమస్య అనేది వారి సామర్థ్యం గురించి కాదు. సమస్య మనం చూసే దృష్టి కోణంలో ఉంది. వారి గురించి మనకు ఎన్నో అ΄ోహలు ఉంటాయి. చిన్న చూపు ఉంది. ఈ పరిస్థితి పూర్తిగా మారి΄ోవాలి’ అంటున్న అలీన ‘మిట్టీ కేఫ్’ ద్వారా ఎంతోమంది దివ్యాంగులకు ఉ΄ాధితో΄ాటూ ఆత్మస్థైర్యాన్నీ ఇచ్చింది.దాతలు ఇచ్చిన విరాళాలతో‘మిట్టీ కేఫ్’ మొదలైంది. ‘సంకల్పం మంచిదైతే సహాయపడడానికి సమాజం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది’ అన్నట్లు ఒక ప్రింటింగ్ ప్రెస్ యజమాని కేఫ్‌కు సంబంధించిన ΄ోస్టర్లను ఉచితంగా ముద్రించి ఇచ్చాడు.దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ‘మిట్టీ కేఫ్’లను తీర్చిదిద్దారు. దృష్టి లోపం ఉన్నవారు బిల్లింగ్ చేయడానికి వీలుగా బిల్లింగ్ సిస్టమ్‌లో ఆడియో ఫీచర్ ఉంది. మెనూ బ్రెయిలీ లిపిలో ఉంటుంది. వినికిడి లోపం ఉన్న, మూగ ఉద్యోగులు కస్టమర్లతో కమ్యూనికేట్ చేయడానికి ప్లకార్డులు కూడా ఉంటాయి.హుబ్లీలోని చిన్న షెడ్లో మొదలైన ‘మిట్టీ కేఫ్’ ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించింది. దేశవ్యాప్తంగా ఎయిర్΄ోర్ట్స్, పెద్ద కంపెనీలు, బ్యాంకులు... మొదలైన వాటిలో 46 ‘మిట్టీ కేఫ్’లు నడుస్తున్నాయి. గత సంవత్సరం సుప్రీంకోర్టు ్ర΄ాంగణం, రాష్ట్రపతి భవన్, ఐఐఎం–బెంగళూరులో ‘మిట్టీ కేఫ్’లను ్ర΄ారంభించారు. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా మరిన్ని విమాన్రాశయాలు, మెట్రో, రైల్వే స్టేషన్లలో ‘మిట్టీ కేఫ్’ లు ఏర్పాటు చేయనున్నారు.‘కరేజ్’ ‘మ్యాజిక్’ అనే మాటలు అలీన నోటి నుంచి తరచుగా వినిపిస్తుంటాయి. ‘ధైర్యం’ ఉన్న చోటే ఊహించని అద్భుతాలు, మ్యాజిక్‌లు జరుగుతాయి. ‘మిట్టీ కేఫ్’ రూపంలో అద్భుతం సృష్టించడానికి అలీనాలోని ధైర్యమే కారణం. ఆమెకు బాగా ఇష్టమైన కొటేషన్...‘ఎక్కడ దయాగుణం ఉంటుందో... అక్కడ మంచితనం ఉంటుంది.ఎక్కడ మంచితనం ఉంటుందో... అక్కడ అద్భుతం ఆవిష్కృతం అవుతుంది’‘మనం మాత్రం ఏం చేయగలం’ అనుకునే నిరాశావాదులకు అలీన ఆలమ్ విజయం కనువిప్పు లాంటిది. కొత్త దారి చూపే కాంతి కిరణంలాంటిది. ‘మిట్టీ కేఫ్’లో పనిచేసిన దివ్యాంగ ఉద్యోగులలో కొందరు సొంతంగా ఎంటర్ప్రెన్యూర్లుగా రాణించడం మరో మంచి విజయం. -
CJI D Y Chandrachud: బెయిల్ అర్జీలపై ‘సేఫ్ గేమ్’ వద్దు
బెంగళూరు: బెయిల్ అర్జీల విషయంలో ట్రయల్ కోర్టుల జడ్జీలు ‘సేఫ్ గేమ్’ ఆడుతున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. అనుమానాస్పదం అనే పేరు చెప్పి ప్రతి కేసులోనూ బెయిల్ తిరస్కరిస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఆదివారం బెంగళూరులో బెర్క్లే సెంటర్ 11వ వార్షిక సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ట్రయల్ కోర్టులు ప్రతి బెయిల్ పిటిషన్‌ను క్షుణ్ణంగా పరిశీలించాలి. కానీ అనుమానాస్పదం పేరిట అర్జీలను ట్రయల్ కోర్టుల జడ్జీలు కొట్టేస్తున్నారు. ఇలాంటి సేఫ్‌గేమ్ పనికిరాదు. బెయిల్ అర్జీలపై ఇంగిత జ్ఞానంతో ఆలోచించాలి. కేసు ప్రాముఖ్యతను బట్టి తుది నిర్ణయం తీసుకోవాలి. అంతేగానీ పై కోర్టుకు వదిలేయకూడదు. ఎందుకంటే వాళ్లంతా హైకోర్టు గడపతొక్కుతున్నారు. అక్కడా బెయిల్ దొరక్కపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నారు. అనవసరంగా అరెస్ట్ అయిన వాళ్లు కూడా సుప్రీంకోర్టు దాకా రావాల్సిన పరిస్థితి! ఇలాంటి కేసులన్నీ అంత దూరం రావడం సరికాదు’’ అన్నారు. వాతావరణ మార్పులు మహిళలు, చిన్నారులు, దివ్యాంగులపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని సీజేఐ అన్నారు. ‘‘వాతావరణ మార్పులతో వలసలు పెరుగుతున్నాయి. ప్రజలకు నాణ్యమైన జీవితం కరువవుతోంది. ఆహార కొరతతో చిన్నారులు, ఇతర సమస్యలతో మహిళలు బాధ పడుతున్నారు. ఇబ్బందుల కొలిమిలో కాలిపోతున్నారు’’ అని ఆవేదన వెలిబుచ్చారు. -
పవిత్రా గౌడకు అనారోగ్యం
బనశంకరి: రేణుకాస్వామి హత్య కేసులో జైలుపాలైన నటి పవిత్రా గౌడ అనారోగ్యానికి గురి కావడంతో పరప్పన అగ్రహార జైలులోనే ఆసుపత్రి వార్డులో చికిత్స అందిస్తున్నారు. చికిత్స తరువాత ఆమె కోలుకున్నట్లు తెలిసింది. హత్య కేసులో ప్రముఖ నటుడు దర్శన్‌తో పాటు 17 మంది నిందితులు పరప్పన జైలులో ఉన్నారు. జూన్ 11వ తేదీన నిందితులను అన్నపూర్ణేశ్వరి నగర పోలీసులు అరెస్టు చేశారు. రెండువారాల పాటు తీవ్రంగా విచారించి, తరువాత జైలుకు పంపారు. మరోవైపు దర్శన్ కూడా జైలులో ఆహారం సరిపడక ఇబ్బందులు పడుతున్నాడు. మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు తెలిసింది. సరిగా నిద్రపోవడం లేదని, నిరంతరం చింతిస్తున్నాడని సమాచారం. ఫలితంగా బాగా బరువు కూడా తగ్గిపోయాడు. -
తెలుగు రాష్ట్రాల్లోకి రివర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ల సంస్థ రివర్ తాజాగా తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరిస్తోంది. బుధవారం హైదరాబాద్‌లో తొలి స్టోర్‌ను ప్రారంభించగా మార్చి నాటికి వైజాగ్, విజయవాడ, గుంటూరులో కూడా ఏర్పాటు చేయనుంది. ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరునాటికి స్టోర్స్ సంఖ్యను 50కి పెంచుకోనున్నట్లు సంస్థ సీఈవో అరవింద్ మణి తెలిపారు. ప్రస్తుతం ఇండీ పేరిట స్కూటర్లు విక్రయిస్తున్నామని, 2026 నాటికి ఏటా 1,00,000 వాహన విక్రయాల లక్ష్యం సాధించాక రెండో మోడల్‌ను కూడా ప్రవేశపెడతామని ఆయన వివరించారు. యమహా మోటర్ కార్పొరేషన్, టయోటా వెంచర్స్ తదితర దిగ్గజాల నుంచి ఇప్పటివరకు రూ. 550 కోట్లు సమీకరించినట్లు చెప్పారు. ప్రస్తుతం నెలకు సుమారు 500 యూనిట్లుగా ఉన్న అమ్మకాలను వచ్చే మార్చి నాటికి 3,000కి పెంచుకోనున్నట్లు వివరించారు. హైదరాబాద్‌లో ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆన్ రోడ్ ధర రూ. 1,45,000గా ఉంటుందని, ఒకసారి చార్జింగ్‌తో 120 కి.మీ. వరకు రేంజి ఉంటుందని మణి చెప్పారు. -
ప్రణీత్ హనుమంతు అరెస్ట్ ఈడ్చుకొస్తున్న పోలీసులు
-
Virat Kohli: విరాట్ కోహ్లీ పబ్‌పై FIR ఏం జరిగిందంటే..!
-
మిస్టరీ.. అసలు డోల్స్ని ఎవరు చంపారు? వెరా ఏమైంది?
కొన్ని కథనాంశాలు కొందరి స్వార్థపరుల ఆలోచనల్లోంచి పుట్టుకొస్తాయి. అవి వ్యథలుగా మారి ఇంకొందరి భయాల్లోంచి, మరికొందరి నమ్మకాల్లోంచి కథలు కథలుగా వినిపిస్తాయి. బెంగళూరు చరిత్రలో వాజ్ విల్లా మిస్టరీ కూడా అలాంటిదే.‘వాజ్ విల్లా’.. 2002 వరకూ అదొక నివాసయోగ్యమైన సాధారణ ఇల్లు. ఒక హత్య, కొన్ని పుకార్లు.. ఏవో అస్పష్టమైన కదలికలతో కలగలసి ఆ ఇంటిని భూత్ బంగ్లాగా మార్చాయి. చివరికి శిథిలం చేసి.. ఛిద్రం చేసి.. చరిత్రలో కలిపేశాయి. అసలు ఆ రియల్ క్రైమ్ స్టోరీ.. హారర్ స్టోరీగా ఎలా మారింది?బెంగళూరులో ఎంతో రద్దీగా ఉండే ఎస్టీ మార్కెట్ రోడ్‌కి అతి సమీపంలో 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండేది ఆ ఇల్లు. దీన్ని 1943లో నాటి బాంబే హైకోర్టు ప్రఖ్యాత న్యాయవాది ఇ.జె. వాజ్ కట్టించారు. వెరా వాజ్, డోల్స్ వాజ్ అనే తన ఇద్దరు కుమార్తెలకు ఆ ఇంటిని బహుమతిగా ఇచ్చాడు. వెరా, డోల్స్ ఇద్దరూ వివాహం చేసుకోలేదు. వృద్ధాప్యం వరకూ అదే ఇంట్లో కలసి ఉన్నారు. అయితే 2002 సెప్టెంబర్ 4న తెల్లవారు జామున ఆ ఇంట్లోకి ఎవరో ఆగంతకులు ప్రవేశించి.. 75 ఏళ్ల డోల్స్ వాజ్ని కిరాతకంగా పొడిచి, చంపి పారిపోయారు. ఆ హత్యను వెరా కళ్లారా చూసింది.అయితే హంతకులు పారిపోవడంతో సరైన సాక్ష్యం లేకుండా పోయింది. నాటి పోలీసు కమీషనర్ హెచ్.టి. సాంగ్లియా .. 80 ఏళ్ల వయసున్న వెరాను సురక్షిత ప్రదేశానికి మార్చాలని ఆదేశించారు. అందుకు ఆమె అంగీకరించలేదు. అయినా భద్రతాకారణాల దృష్ట్యా వెరా కూడా ఆ ఇంటిని విడిచివెళ్లక తప్పలేదు. తన బంధువుల్లో కొందరు తన ఆస్తిని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన వెరా.. తన చెల్లెలి హత్యకు కారణమైన వారిని పట్టుకోవాలని ఏళ్ల పాటు న్యాయపోరాటం చేసింది. ఊరు వదిలిపోవాలంటూ వెరాకు బెదిరింపులు కూడా వచ్చాయట.డోల్స్ హత్య తర్వాత 12 ఏళ్ల పాటు ఆ ఇంట్లో మనుషులే లేకపోవడంతో.. ఆ ఇల్లు శిథిలావస్థకు చేరి.. ఆ ఇంట్లో దయ్యం ఉందని.. డోల్స్ ఆత్మ అక్కడే తిరుగుతోందని.. ఇలా ఎన్నో పుకార్లు పుట్టుకొచ్చాయి. స్థానికులూ ఆ పుకార్లను బలపరుస్తూ.. ఆ ఇంట్లో ఎవరో ఉన్నట్లుగా రాత్రుళ్లు వింత శబ్దాలు వినిపిస్తున్నాయని.. పియానో ప్లే చేస్తున్నట్లుగా అనిపిస్తోందంటూ ఆ ఇంటి ముందు నుంచి వెళ్లడానికి కూడా వణికిపోయేవారు. ఎందుకంటే డోల్స్కి పియానో అంటే చాలా ఇష్టం. ఆ విషయం చుట్టుపక్కలవారందరికీ తెలుసు. అందుకే రాత్రిళ్లు పియానో వాయించిన శబ్దం ఆ ఇంట్లోంచి వచ్చేసరికి.. విన్నవారంతా హడలిపోయేవారట. దానికి తగ్గట్టు ఆ ఇంటి చుట్టూ పెద్ద ఎత్తున గడ్డి, పిచ్చి మొక్కలు పెరిగిపోవడంతో.. చూడటానికీ భయంకరంగా ఉండేది. ఇంటి ముందు పార్క్ చేసిన హిల్మాన్ మింక్స్ అనే ఓల్డ్ మోడల్ కారు తుప్పుపట్టి ఉండేది. కిటికీ అద్దాలు పగిలిపోయి.. తలుపులు కుంగిపోయి.. ఇల్లు కూడా కళావిహీనంగా మారిపోయింది.దాంతో ఆ ఇంట్లో ఏదో ఉందన్న వార్తలు అక్కడివారిని భయపెట్టేవి. అయితే వెరా మాత్రం దాన్ని తీవ్రంగా ఖండించేది. కావాల్సినవారే తమ ఆస్తిపై కన్నేసి.. తన సోదరిని హత్య చేయించి.. ఇలా ఆత్మలు, దయ్యాలతో కేసును పక్కతోవ పట్టిస్తున్నారని వాపోయేది. అయినా ఫలితం లేదు. డోల్స్ని చంపింది ఎవరో నేటికీ తేలలేదు. ఐదేళ్ల క్రితం శిథిలమైన ఆ ఇంటిని కూల్చివేసినట్లు మీడియాలో వార్తలు కూడా వచ్చాయి.మరి ఆ కోట్ల రూపాయాల ఆస్తిని ఎవరు సొంతం చేసుకున్నారు? అసలు డోల్స్ని ఎవరు చంపారు? వెరా ఏమైంది? ఆత్మల పుకార్లు సృష్టించింది ఆస్తికోసమేనా? పియానో వాయించడంలో కూడా హత్యకు కారణం అయిన వారి హస్తం ఉందా? చుట్టుపక్కల వారిని భయపెట్టి.. కావాలనే దయ్యం కథను అల్లారా? లేదంటే నిజంగానే ఆ ఇంట్లో డోల్స్ ఆత్మ ఉండేదా? ఇలా వేటికీ సమాధానాలు లేవు. దాంతో ఈ గాథ నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. – సంహిత నిమ్మనఇవి చదవండి: పర్యాటకులకు వింత ఉద్యోగాలు.. ఏంటో తెలుసా!? -
ఆదివారం సంస్కృతం
బెంగళూరు కబ్బన్ పార్క్‌లో ఆదివారం ఉదయం వెళితే వేరే లోకానికి వచ్చామా అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ చేరిన ఒక బృందం మాట్లాడినా ఆడినా చర్చించినా వాడే భాష సంస్కృతం.అంతరించిపోయే దశలో ఉన్న సంస్కృతం ఆ పచ్చని చెట్ల మధ్య చివురులేస్తోంది.సమష్టి గుబ్బి అనే అమ్మాయి ఉచితంగా సంస్కృతం నేర్పడమే కారణం.‘శాన్‌స్క్రీట్ వీకెండ్’ అనే ఈ కార్యక్రమం అన్ని చోట్లకూ విస్తరించేలా ఉంది.బెంగళూరులోని కబ్బన్ పార్క్‌లో ఆదివారం ఉదయం వెళితే ఎవరో ఒకరు ఎదురు పడి ‘తవనామధేయం కిమ్?’ అంటారు. ‘మీ పేరేమిటి?’ అని ఆ మాటకు అర్థం. ‘మెలనెన బహు సంతోషహ’ అంటారు. ‘మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది’. ‘అహం సమష్టి’ అని పరిచయం చేసుకుంటారు. ‘నా పేరు సమష్టి’ అని దానికి అర్థం. కన్నడ, తెలుగు, తమిళం మాతృభాషగా కలిగిన బెంగళూరు వాసులు ఆ భాషను లేదా ఇంగ్లిష్‌ను మాట్లాడి మాట్లాడి విసుగు చెంది ఉంటే నాలుక గుండా వెలువడే సంస్కృతం మాటలు కొత్త ఉత్తేజాన్ని, సరదాని కలిగిస్తాయి. అందుకే రెండు నెలల క్రితం కబ్బన్ ΄ార్క్లో మొదలైన ‘శాన్‌స్క్రీట్ వీకెండ్’ కార్యక్రమం పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు ముంబై, పూణె నగరాలకు వ్యాపించే దాకా వెళ్లింది.‘స్థాయి’ సంస్థ చొరవతోబెంగళూరులోని ‘స్థాయి’ సంస్థ సంస్కృత భాష పునరుద్ధరణకు అంకితమైంది. ఈ తరానికి సంస్కృతం పరిచయం చేయడం కోసం సంస్కృతంలో పాటలు, షార్ట్‌ఫిల్మ్‌లు, పాఠాలు తయారుచేసి యూట్యూబ్‌లో పెడుతోంది. దానిని స్థాపించిన సమష్టి గుబ్బి నేరుగా కూడా సంస్కృతాన్ని పరిచయం చేద్దామని నిశ్చయించుకుని కబ్బన్ ΄ార్క్లో ఆదివారం పూట సంస్కృతం నేర్పే ఇన్ఫార్మల్ క్లాసులను మొదలెట్టింది. మొదటివారం కేవలం ఆమె స్నేహితులు మాత్రమే వచ్చారు. కాని రెండోవారానికి నోటి మాటతో కొత్తవాళ్ల రాక మొదలైంది. ఇప్పుడు ప్రతి వారాంతం చాలామంది నాగా పెట్టకుండా వచ్చి సంస్కృతం నేర్చుకుంటున్నారు. ‘అది పాఠ్యాంశంగా కాకుండా రోజువారీ కార్యకలాపాలకు ఉపయోగపడేలా నేర్పడం వల్ల అందరికీ ఆసక్తి ఏర్పడుతోంది’ అంటోంది సమష్టి.సామాన్యుల భాషే‘సంస్కృతం దేవతల భాష అంటారు. అది సామాన్యుల భాషే. ఇతర దేశాల వాళ్లు వాళ్ల ్ర΄ాచీన భాషలు మాట్లాడితే మనం ఆశ్చర్యపోము. కాని భారతీయులు సంస్కృతం మాట్లాడటం ఎందుకు ఆశ్చర్యకరం. సంస్కృతంలో సినిమాలు, నాటకాలు, ΄ాటలు, ΄ాడ్కాస్ట్లు చేయొచ్చు’ అంటుంది సమష్టి. తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయంలో ఎం.ఏ సంస్కృత గ్రామర్ చదువుకున్న సమష్టి ‘శాన్‌స్క్రిట్ స్పారో’ పేరుతో ఇన్‌స్టా అకౌంట్ ఓపెన్ చేసి సంస్కృత మాటలు నేర్పసాగింది. అది కబ్బన్ ΄ార్క్లు ముఖాముఖి కార్యక్రమంగా మారింది. సంస్కృత భాష వ్యాప్తి కోసం సమష్టి తన బృందాన్ని తీసుకుని బైక్‌మీద కొత్త ్ర΄ాంతాలకు వెళ్లి సంస్కృతాన్ని ప్రచారం చేస్తోంది. దీనికి ‘శాన్‌స్క్రిట్ రైడ్’ అని పేరు పెట్టింది. ‘శివమొగ్గ జిల్లాలోని మట్టూరు గ్రామంలో ప్రతి ఒక్కరూ సంస్కృతంలో మాట్లాడతారు. అందుకే అది సంస్కృత గ్రామంగా వాసికెక్కింది. నా బృందాన్ని ఆ ఊరికి తీసుకెళ్లాను’ అని చెప్పింది సమష్టి. ‘మార్కుల కోసం స్కూళ్లలో కాలేజీల్లో చాలా మంది సంస్కృతం చదివారు. కాని నిజజీవితంలో ఉపయోగించరు. అలాంటి వాళ్లంతా మా సంస్కృత ఆదివారాల గురించి విని సంస్కృతాన్ని తలుచుకుంటున్నారు. అది సంతోషం’ అంది సమష్టి. ఆమె తన బృందం చేత హిందీ ΄ాటలను సంస్కృతంలో డబ్ చేయించి ΄ాడిస్తుంది. ‘మై హూ డాన్’ ΄ాటను ‘అహం డాన్ అస్మి’ అని ΄ాడుతుంటే కేరింతలు వినిపిస్తాయి. ఏ భాష అయినా ఇంత సరదాగా, సజీవంగా ఉంటే ఎందుకు అంతరిస్తుంది? -
శివమొగ్గ జిల్లాలో దురాగతం.. యువతిపై లైంగికదాడి
శివమొగ్గ: శివమొగ్గ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మృగాళ్లు ఓ యువతిపై లైంగికదాడికి పాల్పడ్డారు. గాజనూరు జలాశయం వద్ద మంగళవారం సాయంత్రం ఇద్దరు యువకులతో కలిసి వచ్చిన యువతిని నలుగురు దుండగులు కిడ్నాప్ చేసి మూకుమ్మడి అత్యాచారానికి పాల్పడ్డారు.వివరాలు.. ఓ యువకుడు తన ప్రియురాలు, మరో మిత్రునితో కలిసి గాజనూరు జలాశయానికి వచ్చారు. ఈ సమయంలో నలుగురు యువకులు వారిపై దాడి చేసి కొట్టి యువతిని బెదిరించి కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. సమీపంలో ఉన్న తోటలో ఆమైపె నలుగురూ లైంగిక దాడికి ఒడిగట్టారు. ఆమె ప్రియుడు, మరో యువకుడు వెళ్లి స్థానిక తుంగానగర పోలీసులకు తెలియజేయగా గాలింపు చేపట్టారు.ఒకటిన్నర రోజు తరువాత..బుధవారం అంతా గాలించినా యువతి, దుండగుల జాడ దొరకలేదు. చివరకు గురువారం ఉదయం సమీపంలోని తోటలో యువతి అపస్మారక స్థితిలో కనిపించగా ఆమె శివమొగ్గలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వినాయక, అబి, మంజు, కౌశిక్, అనే నలుగురు అత్యాచారానికి పాల్పడినట్లు గుర్తించారు. గాజనూరులోని ఒక ఇంటిలో నలుగురు కామాంధులు ఉన్నట్లు తెలిసి పోలీసులు దాడి చేశారు. అభి, మంజును అరెస్టు చేయగా మరో ఇద్దరు పారిపోయారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
కంగనా రనౌత్‌కు చెంపదెబ్బ : ఆమె బెంగళూరుకు బదిలీ
బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పై చేయి చేసుకున్న వివాదంలో చిక్కుకున్న సీఐఎస్ఎఫ్ మహిళా జవాను కుల్విందర్ కౌర్‌కు ఊరట లభించింది. ఆమెపై సస్పెన్షన్ ఉపసంహరించుకున్నఅనంతరం, బెంగళూరులోని CISF రిజర్వ్ బెటాలియన్‌కు బదిలీ చేశారు.చంఢీగడ్ ఎయిర్‌పోర్టులో రైతు ఉద్యమాన్ని కించపర్చారంటూ సీఐఎస్ఎఫ్ జవాను కుల్విందర్ కౌర్ కంగనాను చెంప దెబ్బ కొట్టారు. ఈ కేసులో ఆమె సస్పెన్షనకు గురైంది. తాజాగా ఆమెను బెంగళూరుకు ట్రాన్స్ఫర్ చేయడం గమనార్హం.కాగా 2024 ఎన్నికల్లో బీజేపీ తరుపున హిమాచల్ ప్రదేశ్ లోని మండి నుంచి పార్లమెంట్‌కు ఎంపికైన కంగనాను గత నెలలో చంఢీగడ్ నుంచి ఢిల్లీ వస్తుండగా కౌర్ చెంపదెబ్బ కొట్టడం సంచలనం రేపింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. దీనిపై అంతర్గత విచారణ తర్వాత కౌర్‌పై ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో దాడి కేసు కూడా నమోదైంది. ఈ ఘటనలో విమర్శలతో పాటు ఆమెకు మద్దతు కూడా లభించింది. ఆమెకు తాను ఉద్యోగం ఇస్తానంటూ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ దద్లానీ, తదితరులు ఆఫర్లు కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. -
హేమ బుకాయింపు..
-
బెంగళూరు కు వైఎస్ జగన్
-
రేణుకస్వామి కేసులో ఏ1గా పవిత్ర!
బెంగళూరు: కన్నడ నటి పవిత్ర గౌడను ఆన్లైన్లో వేధించాడన్న పట్టారాని కోపంతో రేణుకస్వామి అనే చిరుద్యోగిని నటుడు దర్శన్ తూగుదీప, అతని అనుచరులు హతమార్చారన్న కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. దర్శన్ సన్నిహిత నటి పవిత్ర గౌడను ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా పేర్కొంటూ పోలీసులు గురువారం బెంగళూరులో 24వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎదుట రిమాండ్ రిపోర్ట్‌ను సమర్పించారు. స్వామికి కరెంట్ షాక్ ఇచ్చి హింసించామని ఇప్పటికే అరెస్టయిన ఒక నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. ఈ వివరాలను రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు ప్రస్తావించారు. హత్య తర్వాత అరెస్ట్, కేసు నుంచి తప్పించుకునేందుకు, మృతదేహాన్ని మాయం చేసి ఆధారాలను ధ్వంసంచేసేందుకు దర్శన్ భారీగా ఖర్చుచేశారని, అందుకోసం స్నేహితుడు మోహన్ రాజ్ నుంచి రూ.40 లక్షల అప్పు తీసుకున్నారని పోలీసులు వెల్లడించారు. షాక్ ఇచ్చేందుకు వాడిన ఎలక్ట్రిక్ షాక్ టార్చ్‌ను, ఆ రూ.40 లక్షల నగదును పోలీసులు ఇప్పటికే స్వా«దీనం చేసుకున్నారు. దర్శన్, మరో ముగ్గురిని పోలీస్ కస్టడీకి, పవిత్ర గౌడను జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని కోర్టును పోలీసులు కోరారు. ఘటనాస్థలిలో చెప్పులతో కొట్టిన పవిత్ర చిత్రదుర్గ ప్రాంతంలో రేణుకస్వామిని కిడ్నాప్‌చేసి 200 కి.మీ.ల దూరంలోని బెంగళూరుకు తీసుకొచ్చి షెడ్లో కట్టేసి కొట్టేటపుడు నటి పవిత్ర గౌడ అక్కడే ఉన్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఆమె కూడా రేణుకస్వామిని తన చెప్పులతో కొట్టారని పోలీసులు పేర్కొన్నారు. అసభ్య సందేశాలు పంపిన స్వామికి బుద్ది చెప్పాలని అక్కడే ఉన్న దర్శన్‌ను పవిత్ర ఉసిగొలి్పందని ఆయా వర్గాలు వెల్లడించాయి. రేణుకస్వామి పోస్ట్‌మార్టమ్‌లో కొత్త విషయాలు వెల్లడయ్యాయి. సున్నిత అవయవాలపై దాడితో వృషణాలు చితికిపోయాయని, ఒక చెవి కనిపించలేదని నివేదిక పేర్కొంది. రేణుకస్వామి గతంలో ఇన్‌స్టా్రగామ్‌లో పోస్ట్ చేసి డిలీట్‌చేసిన మెసేజ్‌లను వెలికి తీసివ్వాలని దాని మాతృ సంస్థ ‘మెటా’ను పోలీసులు కోరారు. -
కన్నడ హీరో దర్శన్ కేసు.. అతని భార్యకు నోటీసులు!
ప్రస్తుతం శాండల్‌వుడ్ అంతటా హీరో దర్శన్, అతని ప్రియురాలు పవిత్ర గౌడ పేర్లే వినిపిస్తున్నాయి. బెంగళూరులో జరిగిన ఓ అభిమాని హత్య కేసు వీరిద్దరిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది. తన ప్రియురాలు పవిత్రకు అసభ్యకర సందేశాలు పంపాడని రేణుకాస్వామి అనే అభిమానిని దారుణ హత్య చేశారని వీరిపై ఆరోపణలొచ్చాయి. అయితే హీరో దర్శన్‌కు ఇదివరకే పెళ్లయింది. విజయలక్ష్మిని వివాహం చేసుకోగా.. ప్రస్తుతం ఆమెకు దూరంగా ఉంటున్నారు. గత పదేళ్లుగా పవిత్ర గౌడతో రిలేషన్లో ఉన్నారు. తాజాాగ హత్య కేసులో నోటీసు అందుకున్న విజయలక్ష్మి బెంగళూరులోని అన్నపూర్ణేశ్వరి పోలీస్ స్టేషన్‌కు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో ఆయన భార్య వాంగ్మూలాన్ని బెంగళూరు పోలీసులు నమోదు చేశారు. అయితే విజయలక్ష్మి నివాసంలో దర్శన్ బూట్లు కనిపించడంతో పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. కాగా.. రేణుకస్వామి హత్య కేసులో ఇప్పటివరకు దాదాపు 13 మందిని అదుపులోకి తీసుకున్నారు.ఇండస్ట్రీకి సంబంధం లేదు: కిచ్చా సుదీప్అయికే మరోవైపు.. ఈ వ్యవహారంతో కన్నడ ఇండస్ట్రీకి సంబంధం లేదంటూ ఇప్పటికే హీరో కిచ్చా సుదీప్ కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీకి చెడ్డపేరు తీసుకురావొద్దని కోరారు. -
డబ్బు ఎలా ఖర్చు చేయాలి.. జర చెప్పండి ప్లీజ్: బెంగళూరు టెకీ జంట
పలు అవసరాలకు డబ్బులు సాయం చేయమని, ఆపదలో ఉన్నాం ఆదుకోమని అడగడం చాలా కామన్. కానీ డబ్బులు ఎక్కువగా ఉన్నాయి, ఎలా ఖర్చు చేయాలో చెప్పండి మహాప్రభో అని అడిగేవారిని ఎక్కడైనా చూశారా? సినిమాల్లో మాత్రమే కనిపించే ఇలాంటి రియల్ స్టోరీ గురించి తెలుసుకుందాం రండి! బెంగళూరు టెకీ జంట నెలకు రూ. 7 లక్షల ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. బెంగళూరులో ఇల్లు, ఖరీదైన కారు, సౌకర్యవంతమైన జీవితం. కానీ మిగిలిన డబ్బును పూర్తిగా ఎలా ఖర్చు చేయాలో తెలియడం లేదట. మిగులు ఆదాయాన్ని ఎక్కడ, ఎలా ఖర్చు చేయాలో తెలియని గందరగోళంలో ఉన్నామంటూ నెటిజనులను అభ్యర్థించడం వైరల్‌గా మారింది.భారతీయ నిపుణుల జీతాలు, ఆఫీస్ పరిస్థితులు, ఆర్థిక విషయాల గురించి చర్చించే ‘గ్రేప్‌వైన్’ అనే యాప్‌లో ఈ దంపతులు పోస్ట్ పెట్టగా ‘ఎక్స్’లోనూ చక్కర్లు కొడుతోంది. ‘గ్రేప్‌వైన్’ సహ వ్యవస్థాపకుడు, సీఈవో సౌమిల్ త్రిపాఠి ‘ఎక్స్’లో స్క్రీన్‌షాట్‌ను షేర్ చేయడంతో నెట్టింట ఇది హాట్‌టాపిక్‌గా నిలిచింది. 30 సంవత్సరాల వయస్సు గల భార్యాభర్తలు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. వార్షిక బోనస్‌తో పాటు నెలవారీ సంపాదన రూ. 7 లక్షలు. ఇందులో 2 లక్షల రూపాయలు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడతారు. ఇక నెల ఖర్చులు రూ. 1.5 లక్షలు పోను వారికి నెలకు రూ. 3లక్షలకు పైగానే మిగులుతోంది. ఈ దంపతులకు ఇంకా పిల్లలు కూడా లేరు. పైగా విలాసంగా జీవించాలనే, ఎక్కువగా ఖర్చు పెట్టాలనే కోరిక భార్యభర్తలిద్దరికీ లేదు. అందుకే మిగిలిన డబ్బును ఎలా, ఎక్కడ వినియోగించాలో అర్థం కావడంలేదు. అందుకే ఏమైనా సూచనలివ్వండి అంటూ పోస్ట్ పెట్టారు.దీంతో యూజర్లు కొంతమంది ఫన్నీగా, మరికొంతమంది సీరియస్‌గానే తెగ సలహాలిచ్చేస్తున్నారు. పబ్లిక్/ప్రైవేట్ కాస్ (లేదా రియల్ ఎస్టేట్) వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టమని, లగ్జరీ వెకేషన్‌కి వెళ్లమని కొందరు, పిల్లలకోసం ప్లాన్ చేసుకోమని ఇలా తోచినట్టు సలహాలిచ్చేశారు. దీంతోపాటు, జంతు సంక్షేమ స్వచ్ఛంద సంస్థలు లేదా అనాథాశ్రమాలకు విరాళం ఇవ్వాలని కోరారు. అంతేకాదు ''నాకు కొంత ఇవ్వండి, నాకు సరిపడా జీతం రావడం లేదు'' అని ఒకరు కమెంట్ చేశారు. మరి మీరేమంటారు.. కామెంట్ సెక్షన్లో తెలపండి. -
దర్శన్ కేసు.. రోజుకొక పేరు
దొడ్డబళ్లాపురం/ యశవంతపుర/ మైసూరు: చిత్రదుర్గకు చెందిన అభిమాని రేణుకాస్వామి హత్య కేసు రోజుకొక మలుపు తిరుగుతూ కొత్త కొత్త ముఖాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కామాక్షిపాళ్య పోలీసులు మరో నటునికి నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే కమెడియన్ చిక్కణ్ణకు నోటీసులు ఇచ్చి బెంగళూరులోని స్టోని బ్రూక్ పబ్‌లో మహజర్‌కు తీసికెళ్లారు. నటుడు యశస్ సూర్యకు కూడా విచారణకు హాజరవ్వాలని సూచించారు. హత్య జరిగిన రోజు స్టోని బ్రూక్ పబ్‌లో హీరో దర్శన్‌తో పాటు యశస్ విందులో పాల్గొన్నాడని తెలియడమే దీనికి కారణం. కాగా, పోలీసుల అదుపులో ఉన్న నటి పవిత్రగౌడ మంగళవారం అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రిలో చేర్పించినట్లు తెలిసింది.మైసూరు హోటల్లో మహజరుహీరో దర్శన్ పర్సనల్ మేనేజర్ నాగరాజు, కారు డ్రైవర్ లక్ష్మణ్‌ను మంగళవారం పోలీసులు మైసూరుకు తీసుకువచ్చి స్థల పరీశీలన జరిపారు. బెంగళూరు నుంచి పోలీసు వ్యాన్‌లో వారిని మైసూరులోని ర్యాడిసన్ బ్లూ హోటల్‌కు తీసుకువచ్చారు. హత్య సమయంలో నటుడు దర్శన్ మైసూరులో ఇదే హోటల్లో ఉంటూ లలిత మహల్లో జరుగుతున్న డెవిల్ సినిమా షూటింగ్లో పాల్గొనేవాడు. కువెంపు నగరలో ఉన్న గోల్డ్ జిమ్‌కు కూడా వెళ్లేవాడు. ఈ నేపథ్యంలో హత్య గురించి ఇక్కడ చర్చించారా అని నిందితులతో హోటల్, దర్శన్ సంచరించిన ప్రాంతాల్లో విచారణ జరిపారు. తరువాత టి.నరిసిపుర రోడ్డులో ఉన్న దర్శన్ ఫాంహౌస్‌కు తీసుకెళ్లారు.పకడ్బందీగా దర్యాప్తు: కమిషనర్రేణుకాస్వామి హత్య కేసులో పోలీసులు కాస్త ఏమరుపాటుగా ఉన్నా కేసు దారి తప్పేదని బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ దయానంద్ అన్నారు. కేసులో ఇప్పటివరకూ దర్శన్‌తో కలిపి మొత్తం 17మందిని అరెస్టు చేసి అన్ని కోణాల్లో విచారణ జరిపామన్నారు. కేసులో సాక్ష్యాధారాలను టెక్నాలజీ సాయంతో సేకరిస్తున్నట్లు చెప్పారు. ఫోరెన్సిక్, టెక్నాలజీ, చట్టపర సలహాలు తీసుకుని ముందుకు పోతున్నామన్నారు.మళ్లీ బాతుల కేసుమైసూరు సమీపంలో టి.నరిసిపుర రోడ్డులోని దర్శన్ ఫాంహౌస్‌లో అరుదైన బార్ హెడెడ్ గూస్ అనే అరుదైన జాతి బాతులు కొన్ని ఉన్నాయి. వీటిని పెంచుకోవడం నిషిద్ధం కావడంతో అటవీ సిబ్బంది గతంలో దర్శన్ దంపతులు, వారి మేనేజర్ నాగరాజుపైన కేసులు పెట్టారు. దీనిపై త్వరలో విచారణ చేపట్టనున్నారు.ఎవరు చేసినా నేరమే: ఉమాపతిదర్శన్ వ్యవహారంపై నిర్మాత ఉమాపతి స్పందిస్తూ హత్య చేయడం నేరం. అది ఎవరూ చేసినా తప్పే. అలాంటి వ్యక్తికి శిక్ష పడాలి. నాకు తెలిసినంత వరకు మృతుడు రేణుకాస్వామి వదిలేయాలని ఎంత వేడుకున్నా వదలకుండా చంపేశారని తెలిసింది. రేణుకాస్వామి భార్య గురించి ఏమి మాట్లాడాలో తెలియని పరిస్థితి. దర్శన్ అభిమానినే హత్య చేయటం ఎంతవరకు న్యాయం అని ఉమాపతి ప్రశ్నించారు. దర్శన్ దేవుడంత మనిషి అయినా కుక్క బుద్ధి కలవాడు అని విమర్శించారు. నటుల పాత్ర ఉంటే కేసు పెడతాం: హోంమంత్రిహత్య కేసులో దర్శన్‌తో పాటు ఇతర నటుల పాత్ర ఉందని తేలితే కేసు నమోదు చేసి విచారణ జరుపుతామని హోంమంత్రి జీ. పరమేశ్వర్ తెలిపారు. బెంగళూరు సదాశివనగరలో నివాసం వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన, దర్శన్ ఒక నటుడు కాబట్టి సహజంగానే అతడితో అనేకమంది నటులు కలిసి తిరుగుతుంటారని అంత మాత్రాన వారందరినీ అనుమానంతో చూడలేమన్నారు. త్వరలో రేణుకాస్వామి కుటుంబాన్ని కలిసి పరామర్శిస్తానన్నారు. ఎస్ఐ ఉద్యోగాల భర్తీ చివరిదశలో ఉందన్నారు. ఇంధన ధరల గురించి ధర్నాలు చేస్తున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వం 14 సార్లు ధరలు పెంచిన సంగతి మర్చిపోయిందా అని ప్రశ్నించారు. -
కన్నడ హీరో దర్శన్ మేనేజర్ సూసైడ్.. ఘటనాస్థలిలో కీలక ఆధారాలు!
హీరో దర్శన్ అభిమాని హత్య కేసు శాండల్‌వుడ్‌ను కుదిపేస్తోంది. ఈ కేసులో ఇప్పటికే దర్శన్, ఆయన ప్రియురాలు పవిత్ర గౌడను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసును బెంగళూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్య జరిగిన ప్రదేశంలో దర్శన్ కారు కనిపించడంతో పోలీసులు అతన్ని నిందితుడిగా చేర్చారు. ప్రస్తుతం ఈ కేసులో పవిత్ర గౌడ, దర్శన్ పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా మరో షాకింగ్ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. దర్శన్‌కు చెందిన బెంగళూరు ఫామ్‌హౌస్‌ను చూసుకునే మేనేజర్ శ్రీధర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని మృతదేహాన్ని ఫామ్‌హౌస్ సమీపంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడే సూసైడ్ నోట్‌తో పాటు వీడియో సందేశం పోలీసులకు లభించాయి.విపరీతమైన ఒంటరితనం కారణంగానే జీవితాన్ని ముగిస్తున్నట్లు సూసైడ్ నోట్లో మేనేజర్ శ్రీధర్ పేర్కొన్నాడు. ఈ కేసులో తన మిత్రులు, బంధువులకు ఎలాంటి సంబంధం లేదని.. తన మరణానికి తానే కారణమని సూసైడ్ నోట్లో రాసుకున్నాడు. అయితే మేనేజర్ ఆత్మహత్యకు, దర్శన్ అభిమాని రేణుకాస్వామి హత్య కేసుకు మధ్య ఉన్న సంబంధంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. -
బెంగళూరు రేవ్ పార్టీ.. జైలు నుంచి హేమ విడుదల
బెంగళూరు డ్రగ్స్ కేసులో నటి హేమ ఇవాళ విడుదలయ్యారు. ఈ కేసులో ఆమెకు షరతులతో కూడిన బెయిల్ లభించడంతో కొద్దిసేపటి క్రితమే జైలు నుంచి బయటికి వచ్చారు. కాగా.. బెంగళూరు నగర శివార్లలో జరిగిన రేవ్‌పార్టీలో హేమ మాదక ద్రవ్యాలను తీసుకున్నట్లు పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నటి హేమ బెయిల్ కోసం పిటిషన్ వేయగా స్థానిక కోర్టు మంజూరు చేసింది.నటి హేమ వద్ద ఎలాంటి డ్రగ్స్ లేవని, ఆమెపై ఆరోపణలు వచ్చిన పది రోజులకు వైద్య పరీక్షలు నిర్వహించారని హేమ తరఫు న్యాయవాది కోర్టులో తెలిపారు. అంతేకాకుండా హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసుల వద్ద ఎలాంటి సాక్ష్యాలు లేవని కోర్టు దృష్టికి ఆయన తీసుకువెళ్లారు. అయితే, హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు అందుకు సంబంధించిన ఆధారాలను సీసీబీ న్యాయవాది కోర్టుకు అందించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం నటి హేమకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. -
బంగారం లాంటి అవకాశం
నేత్ర గురురాజ్ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. బెంగళూరుకు చెందిన ఆమెకు అరుదైన అవకాశం దక్కింది. డైరెక్టర్‌గా, రైటర్‌గా, ఆర్టిస్ట్‌గా, సినిమాటోగ్రాఫర్‌గా... ఇలా పలు విభాగాల్లో తన ప్రతిభను నిరూపించుకోవడానికి ‘చాప్టర్ 1, ఆల్ఫా 27, అస్ట్రాలజర్స్ లక్కీ డే, జాస్మిన్ ఫ్లవర్స్’ వంటి నాలుగు షార్ట్ ఫిలింస్‌కి పని చేశారు నేత్ర. ‘జాస్మిన్ ఫ్లవర్స్’కి కథ అందించడంతో ΄ాటు ఛాయాగ్రాహకురాలిగా చేశారు. ‘చాప్టర్ 1’లో విద్యార్థినిగా నటించారు. ‘ఆల్ఫా 27’కి కెమెరా, ఎలక్ట్రికల్ డి΄ార్ట్మెంట్లో పని చేశారు. ‘అస్ట్రాలజర్స్ లక్కీ డే’కి దర్శకత్వం వహించడంతో ΄ాటు ఛాయాగ్రాహకురాలిగానూ వ్యవహరించారు. ఈ చిత్రానికి మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే ‘జాస్మిన్ ఫ్లవర్స్’కి పలు చలన చిత్రోత్సవాల్లో అవార్డులు దక్కాయి. ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ నిరూపించుకుంటున్న నేత్ర గురురాజ్ తాజాగా ఆస్కార్ అకాడమీ తరఫున గోల్డ్ రైజింగ్ ప్రోగ్రామ్‌కి ఎంపికయ్యారు. ఈ ప్రోగ్రామ్‌కి అవకాశం దక్కడం చిన్న విషయం కాదు. ప్రపంచ దేశాల్లో సినిమా రంగానికి చెందిన ప్రతిభ గల యువ ఛాయాగ్రాహకులను ఎంపిక చేసి, రెండు నెలల పాటు అకాడమీ ఆధ్వర్యంలో నిపుణుల దగ్గర మెళకువలు నేర్చుకునే అవకాశం కల్పిస్తారు. కొన్ని నెలల క్రితం సినిమాటోగ్రఫీలో మాస్టర్స్ చేయడానికి లాస్ ఏంజిల్స్ వెళ్లిన నేత్ర ‘జాస్మిన్ ఫ్లవర్స్’తో తన కెమెరా పనితనాన్ని చాటుకున్నారు. అదే ఆమెకు ఆస్కార్ అకాడమీ గోల్డ్ రైజింగ్ ప్రోగ్రామ్‌కి అవకాశం దక్కేలా చేసింది. బంగారంలాంటి ఈ అవకాశం దక్కించుకున్న నేత్రకు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. -
ఇటీవలే విడాకులు తీసుకున్న స్టార్ జంట.. మళ్లీ కలవడమేంటి?
ఏ జంట అయినా విడాకులు తీసుకుంటే దాదాపు కలవడానికి కూడా ఇష్టపడరు. ఎక్కడైనా పొరపాటున బయట ఎదురుపడినా పలకరించడం లాంటివి కూడా జరగవు. చాలా జంటలు విడాకుల తర్వాత కలిసి మాట్లాడుకోవడం జరిగే అవకాశం చాలా తక్కువ. మరీ విడాకుల తర్వాత ఇద్దరు కలిస్తే ఎలా ఉంటుంది. అంతే కాదు ఏకంగా ప్రెస్ మీట్ పెడితే ఎలా ఉంటుంది. అలాంటిదే తాజాగా జరిగింది. ఓ స్టార్ జంట తీసుకున్న నిర్ణయంపై ఫ్యాన్స్ షాకవుతున్నారు. ఆ వివరాలేంటో చూద్దాం.శాండల్‌వుడ్ జంట నివేద గౌడ, చందన్ శెట్టి ఇటీవలే విడాకులు తీసుకున్నారు. ఏడాది క్రితమే వీరిద్దరూ విడాకులకు పిటిషన్ వేయగా.. ఇటీవలే కోర్టు విడాకులు మంజూరు చేసింది. శాండల్‌వుడ్‌లో క్యూటెస్ట్ కపుల్‌గా పేరున్న ఈ జంట విడిపోవడానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. దీంతో ఫ్యాన్స్ డివోర్స్ గల కారణాలపై తెగ ఆరా తీస్తున్నారు. చందన్ శెట్టి, నివేద గౌడ ఎందుకు విడిపోయారు? విడాకులకు కారణం ఏమిటి? ఇలాంటి విషయాలపై ప్రతిరోజూ అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి.తాజాగా విడిపోయిన తర్వాత కూడా నివేద గౌడ, చందన్ శెట్టి సమావేశం నిర్వహించనున్నారు. ఇవాళ బెంగళూరులోని ఓ మాల్లో నిర్వహించే ప్రెస్మీట్లో తాము విడిపోవడానికి గల కారణాలను వివరించనున్నారు. ఈ సమావేశంలో చందన్ శెట్టి, నివేద గౌడ పాల్గొని విడాకులపై మాట్లాడనున్నారు. ఫ్యాన్స్‌కు క్లారిటీ ఇవ్వనున్నారు.కాగా.. టిక్‌టాక్ స్టార్ నివేదా గౌడ బిగ్ బాస్ సీజన్- 5తో గుర్తింపు తెచ్చుకున్నారు. అదే సమయంలో ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. ఆ తర్వాత రాపర్‌గా రాణిస్తున్న చందన్ శెట్టి.. నివేదా గౌడపై బొంబే బొంబే అనే పాట రాసి అందరినీ అలరించాడు. మైసూర్‌లోని జరిగిన దసరా వేడుకల్లో నివేద గౌడకు ప్రపోజ్ చేశాడు. అప్పట్లోనే అతని తీరు వివాదానికి దారితీసింది. అయితే ఆ తర్వాత పెళ్లి చేసుకున్న వీరిద్దరు నాలుగేళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు. -
పెన్‌డ్రైవ్ దర్యాప్తు పరుగులు
బనశంకరి: అత్యాచార బాధిత మహిళను అపహరించిన కేసులో జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణ భార్య భవానీ రేవణ్ణ శనివారం సిట్ అధికారులు విచారణ చేపట్టారు. హాసన్ జిల్లా కేఆర్ నగరలో బాధిత మహిళ అపహరణ కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు బెంగళూరులో సిట్ ఆఫీసులో భవాని హాజరయ్యారు. సిట్ అధికారులు భవానీని విచారించారు. హైకోర్టు వారంరోజుల పాటు షరతులతో కూడిన మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. సీఐడీ సముదాయంలో ఉన్న సిట్ ఆఫీసుకు భవాని లాయరుతో కలిసి వచ్చారు. తాను ఏ మహిళ ను అపహరించలేదని, తనపై కుట్ర చేశారని ఆమె చెప్పారు. సుమారు 4 గంటలపాటు విచారణ చేపట్టినప్పటికీ సమాచారం లభించలేదని సమాచారం. బాధిత మహిళ తమ ఇంట్లో పనిచేస్తుందని, నేను ఆమెను అపహరించలేదని భవాని పదేపదే చెప్పారు. షరతుల ప్రకారం భవాని రోజూ మధ్యాహ్నం 1 గంట కు సిట్ విచారణకు హాజరు కావాలి. సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరపవచ్చు. ఆపై ఆమెను పంపించి వేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులోనే భర్త రేవణ్ణ అరెస్టయి విడుదలయ్యారు.సిట్ ఆఫీసులో తల్లీ తనయుడుభవాని సిట్ ఆఫీసులో విచారణకు హాజరైనప్పడు అక్కడే పక్కగదిలో విచారణలో కుమారుడు ప్రజ్వల్ ఉన్నారు. ఒకరినొకరు పలకరించుకోలేని పరిస్థితి ఏర్పడింది. గత ఏప్రిల్ 27 నుంచి ప్రజ్వల్‌తో తల్లి భవాని ముఖాముఖి మాట్లాడింది లేదు. ప్రజ్వల్, భవానీని వేర్వేరుగా విచారించారు.హైకోర్టులో రేవణ్ణ అర్జీహాసన్ జిల్లా హొళేనరసిపుర టౌన్ పోలీస్‌స్టేషన్‌లో తనపై నమోదైన లైంగిక దాడికేసు రద్దుచేయాలని జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్డీ.రేవణ్ణ హైకోర్టులో వేసిన పిటిషన్ పై సిట్ కు హైకోర్టు నోటీస్ జారీచేసింది. జడ్జి జస్టిస్ కృష్ణ ఎస్.దీక్షిత్ ధర్మాసనం పిటిషన్‌పై ఇరు వర్గాల వాదనలను ఆలకించింది. సిట్ వాదన తెలియజేయాలని ఆదేశిస్తూ 21 తేదీకి వాయిదా వేసింది.ప్రజ్వల్ స్నేహితునికి నోటీసులుప్రజ్వల్కు విదేశాల్లో సాయం చేసిన అతని స్నేహితున్ని విచారణకు హాజరుకావాలని సిట్ నోటీస్ జారీచేసింది. 34 రోజుల పాటు ఎవరికీ అందుబాటులోకి రాకుండా ప్రజ్వల్ జర్మనీలో మకాం వేశాడు. ఇందుకు అతని స్నేహితుడు సాయం చేసినట్లు సిట్ గుర్తించింది. దీంతో విచారణకు రావాలని నోటీసులు పంపింది.కార్తీక్ గౌడ అరెస్టుహాసన్లో నగ్నచిత్రాల పెన్‌డ్రైవ్‌లను లీక్ చేసిన కేసులో సిట్ అధికారులు శనివారం కార్తీక్‌గౌడ అనే వ్యక్తిని అరెస్ట్‌చేశారు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని నిర్బంధించారు.హాసన్‌లో నివాసాలలో తనిఖీయశవంతపుర: అత్యాచారం, లైంగిక వీడియోల కేసులో మాజీ ఎంపీ ప్రజ్వల్‌కు చెందిన హాసన్ జిల్లా హొళెనరసిపురలోని నివాసంలో సిట్ అధికారులు మహజరు చేశారు. చెన్నాంబిక అనే పేరు గల ఈ ఇంటికి ప్రజ్వల్‌ను తీసుకెళ్లారు. ముందుజాగ్రత్తగా గట్టి పోలీసు బందోబస్తు నడుమ ప్రత్యేక వాహనంలో బయటకు కనబడకుండా బెంగళూరు నుంచి ప్రజ్వల్‌ను తీసుకెళ్లారు. మొదట ఆ నివాసంలో విచారణ జరిపి, మళ్లీ హాసన్‌కు తరలించారు. -
Bangalore Rave Party: ‘మా’ నుంచి హేమ సస్పెండ్
-
హేమ సభ్యత్వం రద్దు చేసే యోచనలో ‘మా’?
మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కీలక నిర్ణయం తీసుకున్నారు. టాలీవుడ్ నటి హేమ మా సభ్యత్వం సస్పెండ్ చేయడానికి అభిప్రాయాలను కోరినట్లు తెలుస్తోంది. మా అసోసియేషన్ గ్రూప్‌లో మంచు విష్ణు ఇప్పటికే సందేశం పంపించారు. ఆమె సభ్యత్వం సస్పెండ్‌కు సంబంధించిన సభ్యుల అభిప్రాయాలు సేకరించారు. అయితే హేమను సస్పెండ్ చేయాల్సిందిగా సభ్యులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. దీంతో హేమకు క్లీన్ చిట్ వచ్చేంతవరకు సస్పెండ్ చేయాలని మంచు విష్ణు నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ క్లీన్ చిట్ రాకపోతే మాత్రం శాశ్వతంగా రద్దు చేసే ఆస్కారం లేకపోలేదు. మా నిర్ణయం ఏంటన్నది రేపు మధ్యాహ్నం అధికారికంగా అధ్యక్షుడు మంచు విష్ణు వెల్లడించనున్నారు. కాగా.. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో హేమ దొరికిపోయారు. వైద్య పరీక్షల్లోనూ ఆమెకు పాజిటివ్‌గా తేలింది. ఇటీవలే ఆమెను అరెస్ట్ చేసిన బెంగళూరు పోలీసులు రిమాండ్‌కు తరలించారు. -
హేమకు వైద్య పరీక్షలు.. అలా కనిపించి షాక్ ఇచ్చిన నటి!
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో టాలీవుడ్ హేమను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలోనే ఆమెకు పాజిటివ్ రావడంతో పోలీసులు నోటీసులిచ్చారు. మొదటిసారి అనారోగ్య కారణాలతో విచారణకు హాజరు కాలేదు. హేమకు పోలీసులు రెండోసారి నోటీసులు పంపించగా వివిధ కారణాలు చెప్పి డుమ్మా కొట్టింది. సీసీబీ పోలీసులు మూడోసారి నోటీసులిచ్చారు. దీంతో ఇవాళ సీసీబీ పోలీసుల ఎదుట ఆమె హాజరయ్యారు. విచారణ పూర్తయిన అనంతరం హేమను పోలీసులు అరెస్ట్ చేశారు.అనంతరం హేమకు ప్రభుత్వాస్పత్రిలో హేమకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే వైద్య పరీక్షలకు హేమ బురఖా ధరించి హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్‌గా మారింది. ఈ కేసులో హేమను రేపు మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచనున్నారు. రేవ్ పార్టీ నిర్వహణలో హేమ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. అసలేం జరిగిందంటే..బెంగళూరు నగరశివారులోని హెబ్బగోడిలో మే 19 రాత్రి నుంచి మే 20 తెల్లవారు జాము వరకు రేవ్ పార్టీ జరిగింది. వాసు అనే వ్యక్తి పుట్టినరోజు పేరు చెప్పి 'సన్‌సెట్ టు సన్‌రైజ్ విక్టరీ' పేరిట పార్టీ ఏర్పాటు చేశాడు. పార్టీలో ఎండీఎంఏ పిల్స్, హైడ్రో గాంజా, కొకైన్ ఇతర మాదకద్రవ్యాలు తీసుకున్నారు. పార్టీకి ప్రధాన కారకులైన నిందితులు రణధీర్, మహ్మద్ సిద్ధిఖి, వాసు, అరుణ్‌కుమార్, నాగబాబును పోలీసులు ఇదివరకే అరెస్టు చేశారు.#Tollywood actress #Hema has been arrested by @CCBBangalore wen she came in Burqa to appear today after two notices in related to to Rave party which was held in #anekal, #bengaluru . Including Hema, more than 80+ people tested positive with Drug in 101 samples collected. pic.twitter.com/qxvQAUIFtx— Madhu M (@MadhunaikBunty) June 3, 2024 -
పూర్తి ఆధారాలతో హేమను అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
Lok Sabha Election 2024: ఖాతా తెరిస్తే రూ.లక్ష!
అది బెంగళూరులోని జనరల్ పోస్టాఫీస్. సాధారణంగా ఓ మోస్తరు రద్దీయే ఉంటుంది. కానీ కొన్ని రోజులుగా జనం ఇసుకేస్తే రాలనంతగా వస్తున్నారు! ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతా తెరిచేందుకు చాంతాడంత క్యూలు కడుతున్నారు. ఆశ్చర్యపోయిన సిబ్బంది సంగతేమిటని ఆరా తీస్తే, కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకొస్తే మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి పేద మహిళకు ఏడాదికి రూ.లక్ష అందిస్తామన్న హామీ ప్రభావమని తెలిసి ఆశ్చర్యపోయారు. ప్రతి మహిళ ఖాతాలో నెలకు రూ.8,500 జమ చేస్తామని ఎన్నికల ప్రచార సభల్లో రాహుల్ గాంధీ హామీ ఇవ్వడం తెలిసిందే. దాంతో కేంద్రంలో ఇండియా కూటమి వస్తే తమకు ప్రయోజనం దక్కుతుందని భావించిన స్థానికులు బెంగళూరు జనరల్ పోస్టాఫీస్ వద్ద బారులు తీరుతున్నారు. తాను పొద్దున ఎప్పుడో వచ్చానని క్యూలో నిల్చున్న ఓ మహిళ చెప్పడం గమనార్హం. ఖాతా తెరిచిన తొలి రోజు నుంచే డబ్బులు జమవుతాయని పొరుగింటావిడ చెప్పడంతో వచ్చానని మరో మహిళ వెల్లడించింది. శివాజీనగర్, చామరాజపేట చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎక్కువ మంది ఇలా వస్తున్నారు! నిజం కాదు... తపాలా శాఖ ఒక్కో ఖాతాలో రూ.2,000 నుంచి రూ.8,500 వరకు జమ చేస్తుందన్న నమ్మకంతో ఎక్కువ మంది ఖాతా తెరిచేందుకు వస్తున్నట్టు బెంగళూరు జీపీవో చీఫ్ పోస్ట్‌మాస్టర్ హెచ్ఎం మంజేశ్ చెప్పారు. ‘‘నిజానికి ఇదో వదంతి. తపాలా శాఖ ఎలాంటి చెల్లింపులు చేయడం లేదు. కాకపోతే ఆన్లైన్ నగదు బదిలీ ప్రయోజనానికి ఈ ఖాతా ఉపకరిస్తుంది’’ అని వెల్లడించారు. పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతా తెరిచేందుకు రద్దీ విపరీతంగా పెరిగిపోవడంతో, అందులో వెంటనే డబ్బులు జమవడం మొదలవుతుందన్న వార్తలు వదంతులేనంటూ కార్యాలయం ఆవరణలో పోస్టర్లు కూడా అంటించారు. అయినా రద్దీ మాత్రం తగ్గడం లేదు. దీంతో చేసేది లేక అదనపు కౌంటర్లు తెరిచారు. గతంలో రోజుకు కనాకష్టంగా 50 నుంచి 60 కొత్త ఖాతాలే తెరిచేవారు. ఇప్పుడు రోజుకు కనీసం 1,000 ఖాతాలకు పైగా తెరుస్తున్నట్టు మంజేశ్ తెలిపారు. ఇండియా కూటమి అధికారంలోకొస్తే ప్రతి నెలా రూ.8,500 ఖాతాలో జమ చేస్తామని స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్పడమే ఈ రద్దీకి కారణమని అక్కడి సిబ్బంది అంటున్నారు! – సాక్షి, నేషనల్ డెస్క్ -
బెంగళూరుకు ప్రజ్వల్ రేవణ్ణ రాక.. కర్ణాటకలో పరిస్థితేంటి?
బెంగళూరు: కర్ణాటక బీజేపీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైగింక వేధింపుల కేసు దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజల్వ్ రేవణ్ణ మే 31వ తేదీన తెల్లవారుజామున కర్ణాటక చేరుకోనున్నట్టు తెలుస్తోంది. రేపు (మే30న) జర్మనీ నుంచి బెంగళూరు బయలుదేరనున్నారు. అయితే, ఎయిర్‌పోర్టులోనే ప్రజ్వల్‌ను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. కాగా, లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థిగా కర్ణాటక నుంచి పోటీ చేసిన ప్రజ్వల్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక, ఎన్నికల నేపథ్యంలో ఆయనకు సంబంధించినవిగా చెబుతున్న కొన్ని అభ్యంతరకర వీడియోలు సోషల్ మీడియాలో బయటకు వచ్చాయి. అనంతరం, బాధిత మహిళలు ఒక్కొక్కరిగా బయటకు వచ్చి ఆయనపై ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలోనే కర్ణాటకలో ఆయనపై అత్యాచారం, కిడ్నాప్ కేసు నమోదైంది. అంతకుముందు.. ఏప్రిల్ 27నే ప్రజ్వల్ దేశం విడిచి జర్మనీకి వెళ్లిపోయారు. Suspended JD(S) leader #PrajwalRevanna, who is facing sexual abuse charges, has booked a return flight ticket to #Bengaluru from #Munich on May 30, official sources said. He is expected to land in Bengaluru in the early hours of Friday. pic.twitter.com/wIzrnFlvNF— Salar News (@EnglishSalar) May 29, 2024 అయితే, ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల వ్యవహారం రాజకీయంగా విమర్శలకు దారి తీయడంతో రేవణ్ణను భారత్‌కు రావాలని కుటుంబ సభ్యులు కోరారు. అలాగే, ఆయనను భారత్‌కు రప్పించాలని కర్ణాటక రాజకీయ నేతలు కూడా ప్రధాని మోదీని కోరారు. ఈ నేపథ్యంలో ప్రజ్వల్ రేవణ్ణ స్పందిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా తాను.. కేసు విచారణకు సహకరిస్తానని, శుక్రవారం (మే 31న) ‘సిట్’ ముందు వ్యక్తిగతంగా హాజరవుతాను. నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. నాపై తప్పుడు కేసులు బనాయించారు. ఇవన్నీ రాజకీయ కుట్రలో భాగమే. ఇప్పటికే కుంగుబాటుకు లోనయ్యాను. అయితే, న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంది’ అని కామెంట్స్ చేశారు.మరోవైపు.. ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అసభ్యకర వీడియోల కేసులో ఇద్దరు ప్రధాన నిందితులను పత్యేక దర్యాప్తు బృందం(సిట్) అరెస్ట్ చేసింది. వారిని నవీన్ గౌడ, చేతన్‌గా గుర్తించారు. #WATCH | Bengaluru, Karnataka: Special Investigation Team (SIT) officials arrested two prime accused in connection with the JD(S) suspended MP Prajwal Revanna obscene video case. The arrested have been identified as Naveen Gowda and Chetan: SIT pic.twitter.com/ChufYgVYu3— ANI (@ANI) May 29, 2024 -
వైరల్ ఫీవర్ పేరిట పోలీసుల విచారణకు నటి హేమ డుమ్మా
-
రేవ్ పార్టీ కేసులో కీలక అరెస్టులు
-
రేవ్ పార్టీ కేసు: బెంగళూరు పోలీసులకు హేమ లేఖ.. విచారణకు డుమ్మా
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నేడు నిందితులను బెంగళూరు క్రైమ్ బ్యాంచ్ పోలీసులు విచారించనున్నారు. ఇందులో భాగంగా టాలీవుడ్ నటి హేమతో పాటు మరో ఎనిమిది మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాను విచారణకు హాజరు కాలేనని హేమ పోలీసులకు లేఖ రాశారు. ఈ లేఖలో హేమ.. ఈ కేసులో తాను హాజరయ్యేందుకు కొంత సమయం కావాలని కోరారు. తాను వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్టు తెలిపారు. అయితే, హేమ లేఖను సీసీబీ పోలీసులు పరిగణలోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో విచారణకు హాజరు కావాలని హేమకు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైనట్టు సమాచారం.ఇదిలా ఉండగా.. బెంగళూరు రేవ్ పార్టీ విషయానికి వస్తే ఈ పార్టీలో దాదాపు 150 మంది పాల్గొనగా వారిలో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు బ్లడ్ శాంపిల్స్‌లో తేలింది. దీంతో, వారంతా ఈరోజు విచారణకు హాజరుకావాలని సీసీబీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన వారిలో టాలీవుడ్ నటి హేమ కూడా ఉన్నారు. అయితే రేవ్ పార్టీకి తాను హాజరుకాలేదని వీడియోలు రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు.. బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించిన కేసులో పోలీసులు ఇప్పటికే ఆరుగురిని అరెస్ట్ చేశారు. అలాగే, వారి బ్యాంకు ఖాతాలను కూడా ఫ్రీజ్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన వాసు బ్యాంక్ ఖాతాల్లో భారీ మొత్తంలో నగదు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇక, ఈ కేసులో వాసు ప్రధాన అనుచరుడు చిత్తూరుకు చెందిన అరుణ్ కుమార్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
బెంగళూరు రేవ్ పార్టీ.. ఈసారి బతికిపోయానన్న నవదీప్..!
బెంగళూరులో ఇటీవల జరిగిన రేవ్ పార్టీ టాలీవుడ్లో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. చాలామంది సెలబ్రిటీలు ఉన్నట్లు మొదట సోషల్ మీడియాలో పెద్దఎత్తున వార్తలొచ్చాయి. నటుడు శ్రీకాంత్, హేమ పేర్లు బయటికి రావడంతో వాళ్లిద్దరూ బయటికి వచ్చి క్లారిటీ ఇచ్చారు. కానీ హేమ ఆ పార్టీలో పాల్గొన్నట్లు బెంగళూరు పోలీసులు ధృవీకరించారు. ఆ తర్వాత జరిగిన బ్లడ్ శాంపిల్స్ టెస్ట్‌లో హేమకు పాజిటివ్ రావడంతో నోటీసులు కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.అయితే గతంలో టాలీవుడ్ డ్రగ్స్ కేసు సమయంలో హీరో నవదీప్ పేరు కూడా వినిపించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తాను నటిస్తోన్న కొత్త సినిమా లవ్ మౌళి ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు ఆయన హాజరయ్యారు. ఈసారి మీరు ఫేక్ న్యూస్‌లో కనిపించడం లేదు కదా సార్ అని కొందరు ప్రశ్నించారు. ఇలాంటి వార్తలొచ్చినప్పుడు మీ పేరు కూడా వినిపించేది కదా సార్ అని అడగడంతో నవదీప్ స్పందించారు.ఈ సారి అంతా మంచే జరిగిందని.. ఈ ఒక్కసారి తనను వదిలేశారని నవదీప్ నవ్వుతూ సమాధానామిచ్చాడు. రేవ్ పార్టీ అంటే.. రేయి, పగలు జరిగేదని ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఆ పార్టీ వేరు వేరు దేశాల్లో వేరే విధంగా ఉంటుందన్నారు. రొమాంటిక్ డ్రామాగా అవనీంద్ర తెరకెక్కించిన లవ్ మౌళి మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో భావన సాగి హీరోయిన్గా నటించింది. ఈ మూవీ జూన్ 7న విడుదల కానుంది. -
రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమకు మంచు విష్ణు సపోర్ట్
-
రేవ్ పార్టీ వ్యవహారంలో పలువురికి నోటీసులు
యశవంతపుర: బెంగళూరు శివార్లలోని జీఆర్ ఫామ్‌హౌస్‌లో ఈ నెల 19న జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్నవారిని సోమవారం విచారణకు రావాల్సిందిగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ప్రముఖ తెలుగు సినీ నటి హేమ సహా పలువురికి నోటీసులు ఇచ్చారు. రేవ్ పార్టీలో పాల్గొన్నవారి రక్త నమూనాలను ల్యాబ్‌లో పరీక్షించగా 86 మంది డ్రగ్స్ సేవించినట్లు తేలింది. వీరిలో పలువురు తెలుగు, కన్నడ సినీ నటీనటులు, ఇంజనీర్లు, తదితరులు ఉన్నారు.ఈ నేపథ్యంలో తెలుగు నటి హేమతో పాటు 86 మందికీ బెంగళూరు సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేసి మే 27న విచారణకు హాజరు కావాలని తెలిపారు. ఈ నెల 19న వాసు అనే వ్యక్తి పుట్టిన రోజు పేరుతో ‘సన్‌సెట్ టు సన్‌రైజ్ విక్టరీ’ పేరుతో రేవ్ పార్టీని నిర్వహించాడు. ఇందులో 100 మందికి పైగా పాల్గొన్నారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు దాడి చేయగా ఎండీఎంఎం మాత్రలు, కొకైన్, హైడ్రో గంజాయి లభించాయి. ఐదుగురి బ్యాంకు ఖాతాలు సీజ్ రేవ్ పార్టీని ఏర్పాటు చేసిన వాసు, అరుణ్‌కుమార్, నాగబాబు, రణధీర్‌బాబు, మహ్మద్ అబూబక్కర్‌లను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. తాను హైదరాబాద్‌లో ఉన్నానని, పార్టీలో లేనని హేమ పలు వీడియోల ద్వారా బుకాయించినా పోలీసులు అన్ని ఆధారాలు చూపించి విచారణకు రావాలని ఆదేశించారు. పోలీసులు అరెస్ట్ చేసిన ఐదుగురి బ్యాంకు ఖాతాల్లో రూ.లక్షల రూపాయల నగదు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆ ఖాతాలను సీజ్ చేయాలని నిర్ణయించారు. -
బెంగళూరు రేవ్ పార్టీ..టీడీపీ లీలలు..లోకేష్ అనుచరులు అరెస్ట్..
-
బెంగళూరు రేవ్ పార్టీ కేసు: చిత్తూరు అరుణ్ కుమార్ అరెస్ట్
సాక్షి, బెంగళూరు: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రేవ్ పార్టీ కేసులో ప్రధాన నిందితుడు వాసు ముఖ్య అనుచరుడు, ఈ కేసులో ఏ2గా ఉన్న అరుణ్ కుమార్‌ను బెంగళూరు క్రైం బ్యాచ్ పోలీసులు అరెస్ట్ చేశారు.వివరాల ప్రకారం.. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో చిత్తూరు జిల్లాకు చెందిన అరుణ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో అరుణ్ ఏ2గా ఉన్నాడు. బర్త్ డే పార్టీ నిర్వహించిన వాసుకు అరుణ్ ముఖ్య అనుచరుడు. కాగా, అరుణ్ కుమార్ బెంగళూరులో ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అలాగే, రేవ్ పార్టీలకు కూడా ప్లాన్ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో, అరుణ్‌ను పోలీసులు అరెస్ట్‌చేసి విచారిస్తున్నారు.ఇక, బెంగళూరులోని బీఆర్ ఫామ్ హౌస్ యజమాని గోపాల్ రెడ్డికి కూడా సీసీబీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో సోమవారం విచారణకు రావాలని ఆదేశించారు. మరోవైపు.. రేవ్ పార్టీపై పోలీసులు దాడుల నేపథ్యంలో అక్కడి నుంచి పారిపోయిన పూర్ణారెడ్డి అనే వ్యక్తి కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు.ఇదిలాఉండగా.. బెంగళూరు రేవ్ పార్టీకి వచ్చిన వారిలో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ తీసుకున్న వారిలో టాలీవుడ్ నటి హేమా, ఆషీరాయ్ కూడా ఉన్నారు. వీరి బ్లడ్ శాంపిల్స్‌లో డ్రగ్స్ తీసుకున్నట్టు ఆనవాళ్లను గుర్తించిన విషయం తెలిసిందే. ఇక, మిగతా వారి పేర్లను కూడా పోలీసులు ప్రకటించాల్సి ఉంది. ఇది కూడా చదవండి: బెంగళూరు రేవ్ పార్టీ.. తెలుగు డ్రగ్స్ పార్టీ.. -
బెంగళూరు రేవ్ పార్టీలో టీడీపీ నేతలే కీలక సూత్రదారులు
-
TDP.. తెలుగు డ్రగ్స్ పార్టీ
బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరు నగరంలో జరిగిన రేవ్ పార్టీలో టీడీపీ మూలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రేవ్ పార్టీలో డ్రగ్స్ విక్రయించిన నిందితుల్లో మరో ఇద్దరు టీడీపీ నేతలు హస్తం ఉన్న విషయం తాజాగా బయటపడింది.చిత్తూరు జిల్లా మద్దిపట్ల పల్లికి చెందిన ప్రణీత్ చౌదరితో పాటు అదే జిల్లా కొండేటివండ్ల గ్రామానికి చెందిన సుకుమార్ నాయుడు ఉన్నట్లు తేలింది. ఈ ఇద్దరూ టీడీపీ బెంగళూరు ఐటీ ఫారంకి చెందిన కీలక వ్యక్తులు. వీరికి పూతలపట్టు టీడీపీ అభ్యర్థి మురళితో సత్సంబంధాలున్నాయి.కాగా, అంతకుముందు రేవ్ పార్టీలో డ్రగ్స్ విక్రయించిన ఐదుగురు ప్రధాన నిందితుల ఫోటోలు, వివరాలను బెంగళూరు పోలీసులు వెల్లడించగా, తాజాగా ప్రణీత్ చౌదరి, సుకుమార్ నాయుడులు సైతం ఇందులో నిందితులుగా ఉన్నట్లు గుర్తించారు.చిత్తూరుకు చెందిన టీడీపీ యువనేత రణధీర్ విక్రమ్‌నాయుడు, టీడీపీ కార్యకర్త కాణిపాకానికి చెందిన అరుణ్‌కుమార్‌నాయుడులు ఈ రేవ్ పార్టీకి డ్రగ్స్ సప్లై చేశారు. వీళ్లపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.రణధీర్‌విక్రమ్‌నాయుడుకు చిత్తూరులోని టీడీపీకి చెందిన పలువురు నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయంటున్నారు. అరుణ్‌కుమార్‌నాయుడుది కాణిపాకం సమీపంలోని మద్దిపట్లపల్లెగా చెబుతున్నారు. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో జరిగిన రేవ్ పార్టీలో 101 మందిని పట్టుకున్న పోలీసులు ఐదుగురు మినహా.. మిగిలినవాళ్లను సొంత పూచికత్తుపై విడుదల చేశారు. వీళ్ల రక్తనమూనాలు సేకరించగా, విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరుకావాలని షరతు పెట్టారు.డ్రగ్స్ అయినా, స్కాములైనా సూత్రధారులు మాత్రం తెలుగు డ్రగ్స్ పార్టీ (టీడీపీ) వాళ్ళే!బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ సప్లై చేసిన వాళ్ళలో @naralokesh కి ముఖ్య అనుచరులు అయిన చిత్తూరు జిల్లాకు చెందిన మద్దిపట్ల ప్రణీత్ చౌదరి (ఐటీ ఎంప్లాయ్) కొండేటి సుకుమార్ నాయుడు (సీఈవో) Eavetop… pic.twitter.com/8zi7mwScAH— YSR Congress Party (@YSRCParty) May 24, 2024మాదక ద్రవ్యాలు విక్రయించిన ఐదుగురిలో వీరిద్దరితో పాటు మొహ్మద్ అబూబక్కర్ సిద్ధికి, ఎల్.వాసు, డి.నాగబాబులున్నారు. నిందితుల నుంచి 15.56 గ్రా. ఎండీఎంఏ పిల్స్, 6 గ్రాముల హైడ్రో గాంజా, 6.2 గ్రాముల కొకైన్‌తో పాటు ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వీళ్లపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం–1985, సెక్షన్ 8(సి), 22(బి), 22(సి), 22(ఏ), 27(బి), 25, 27, ఐపీసీ 1860 సెక్షన్ 290, 294 కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అంతా ఓ పద్ధతి ప్రకారం.. వాసు బర్త్ డే పేరుతో నిర్వహించిన ఈ రేవ్ పార్టీలో వాస్తవానికి ఎలాంటి బర్త్ డే వేడుకలు జరగలేదు. ఉద్దేశపూర్వకంగా డ్రగ్స్ విక్రయించడం, వేశ్యా గృహాన్ని నిర్వహించడాన్ని పోలీసులు గుర్తించారు. రేవ్ పార్టీలోకి వచ్చే ప్రతి ఒక్కరికీ ఓ పాస్వర్డ్ ఇచ్చారు. వాసు బర్త్ డే పార్టీ అనే యూజర్ నేమ్, పాస్వర్డ్ చెప్పినవాళ్లకు మాత్రమే ఇక్కడ ప్రవేశం ఉంటుంది. ఇందుకోసం నిర్వాహకులు ఓ ప్యాకేజీ ఇచ్చారు. ఒక్కో వ్యక్తి నుంచి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేసినట్టు తెలిసింది.‘సన్‌సెట్ టు సన్‌రైజ్ విక్టరీ’ పేరిట ఈ నెల 19వ తేదీ సాయంత్రం 5 నుంచి 20వ తేదీ ఉదయం 6 గంటల వరకు రేవ్ పార్టీ జరిగేలా ప్రణాళిక రూపొందించారు. తొలుత ఎలక్ట్రానిక్ సిటీ స్టేషన్ పరిధిలో కేసు నమోదవగా, తర్వాత హెబ్బాగోడికి బదిలీ చేయాలనుకున్నారు. తాజాగా ఈ కేసును సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ బెంగళూరు(సీసీబీ) పోలీసులకు అప్పగిస్తున్నట్లు కర్ణాటక పోలీసులు ప్రకటించారు. ఇందులో సెక్స్ రాకెట్ అంశం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానించి, ఆ దిశగా సైతం విచారణ చేస్తున్నారు.ఈ ఘటనలో పోలీసులు సీజ్ చేసిన కార్లలో ఫార్చూనర్ కారు ఏపీ 39 హెచ్ 0002 నంబర్‌తో ఉంది. ఇది చిత్తూరులోని గుడిపాల మండలం రాసనపల్లెకు చెందిన త్యాగరాజులు నాయుడు అనే వ్యక్తి పేరిట ఉంది. త్యాగరాజులు నాయుడు కారు అక్కడ ఎందుకు ఉందనే దానిపై పోలీసులు ఇప్పటికే విచారణ ప్రారంభించారు. ఇంతలోపు ఈ కారును తొమ్మిది నెలల కిందటే మరో వ్యక్తికి విక్రయించినట్లు, అతను ఇంకా కారును తన పేరిట మార్చకోలేదని కొత్త డ్రామా చేస్తున్నట్లు తెలుస్తోంది. చిత్తూరు నియోజకవర్గానికి చెందిన ఓ టీడీపీ ముఖ్య నేత ఈ కారును ఉపయోగించినట్లు సమాచారం. -
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో బిగ్ ట్విస్ట్.. పోలీసులు సస్పెండ్
బెంగళూరు: బెంగళూరులోని జీఆర్ ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణలో భాగంగా ముగ్గురు పోలీసు సిబ్బందిని ఆ శాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. రేవ్ పార్టీ గురించి తెలిసినా నిర్లక్ష్యం వహించినందుకు చర్యలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.కాగా, బెంగళూరులోని జీఆర్ ఫామ్ హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీలో ఇప్పటికే పలు ట్విస్ట్‌లు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇక, తాజాగా పోలీసు శాఖలో నిర్లక్ష్యంగా ఉన్న హెబ్బగోడి పోలీసు స్టేషన్‌కు చెందిన ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశారు. మరో ఇద్దరు పోలీసులకు ఎస్పీ మెమోలు జారీ చేశారు. సస్పెండ్ అయిన వారిలో ఏఎస్ఐ నారాయణ స్వామి, హెడ్‌కానిస్టేబుల్ గిరీష్, కానిస్టేబుల్ దేవరాజ్ ఉన్నారు. అయితే, వీరికి రేవ్ పార్టీ గురించి సమాచారం ఉన్నప్పటికీ నిరక్ష్యం వహించడంతో ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.ఇదిలా ఉండగా.. రేవ్ పార్టీలో టాలీవుడ్‌కు హేమా, ఆషీరాయ్ డ్రగ్స్ తీసుకున్నట్టు బహిర్గతమైంది. వీరి బ్లడ్ శాంపుల్స్‌లో డ్రగ్స్ తీసుకున్నట్టు వెల్లడైంది. పార్టీలో 150 మంది పాల్గొనగా.. 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. సన్‌సెట్ టు సన్‌రైజ్ విక్టరీ పేరుతో బర్త్‌డే పార్టీ ముసుగులో ఈ పార్టీ నిర్వహించారు. ఇందుకోసం నిర్వాహకులు రూ.2 లక్షల ఎంట్రీ ఫీజు తీసుకుని 200 మందిని ఆహ్వానించారు. ఈ పార్టీలోతెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటకకు చెందిన క్రికెట్ బుకీలు, సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు(తెలుగు సినీ, సీరియల్ ప్రముఖులు సైతం) పాల్గొన్నారు. -
రేవ్ పార్టీలో పట్టుబడ్డ టీడీపీ నేతలు
-
రేవ్ పార్టీలో టీడీపీ నేతలు.. కేసు నమోదు చేసిన పోలీసులు
-
‘రేవ్’ పార్టీలో చిత్తూరు టీడీపీ నేతలు!
చిత్తూరు అర్బన్: కర్ణాటకలోని బెంగళూరు నగరంలో జరిగిన రేవ్ పార్టీలో టీడీపీ మూలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రేవ్ పార్టీలో డ్రగ్స్ విక్రయించిన ఐదుగురు ప్రధాన నిందితుల ఫొటోలు, వివరాలను బెంగళూరు పోలీసులు వెల్లడించారు. వీరిలో చిత్తూరుకు చెందిన టీడీపీ యువనేత రణధీర్ విక్రమ్‌నాయుడు, టీడీపీ కార్యకర్త కాణిపాకానికి చెందిన అరుణ్కుమార్నాయుడు ఉన్నారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసిన బెంగళూరు పోలీసులు, వీళ్లపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రణధీర్‌విక్రమ్‌నాయుడుకు చిత్తూరులోని టీడీపీకి చెందిన పలువురు నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయంటున్నారు. అరుణ్‌కుమార్‌నాయుడుది కాణిపాకం సమీపంలోని మద్దిపట్లపల్లెగా చెబుతున్నారు. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో జరిగిన రేవ్ పార్టీలో 101 మందిని పట్టుకున్న పోలీసులు ఐదుగురు మినహా.. మిగిలినవాళ్లను సొంత పూచికత్తుపై విడుదల చేశారు. వీళ్ల రక్తనమూనాలు సేకరించగా, విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరుకావాలని షరతు పెట్టారు. మాదక ద్రవ్యాలు విక్రయించిన ఐదుగురిలో వీరిద్దరితో పాటు మొహ్మద్ అబూబక్కర్ సిద్ధికి, ఎల్.వాసు, డి.నాగబాబులున్నారు. నిందితుల నుంచి 15.56 గ్రా. ఎండీఎంఏ పిల్స్, 6 గ్రాముల హైడ్రో గాంజా, 6.2 గ్రాముల కొకైన్‌తో పాటు ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వీళ్లపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం–1985, సెక్షన్ 8(సి), 22(బి), 22(సి), 22(ఏ), 27(బి), 25, 27, ఐపీసీ 1860 సెక్షన్ 290, 294 కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అంతా ఓ పద్ధతి ప్రకారం.. వాసు బర్త్ డే పేరుతో నిర్వహించిన ఈ రేవ్ పార్టీలో వాస్తవానికి ఎలాంటి బర్త్ డే వేడుకలు జరగలేదు. ఉద్దేశపూర్వకంగా డ్రగ్స్ విక్రయించడం, వేశ్యా గృహాన్ని నిర్వహించడాన్ని పోలీసులు గుర్తించారు. రేవ్ పార్టీలోకి వచ్చే ప్రతి ఒక్కరికీ ఓ పాస్వర్డ్ ఇచ్చారు. వాసు బర్త్ డే పార్టీ అనే యూజర్ నేమ్, పాస్వర్డ్ చెప్పినవాళ్లకు మాత్రమే ఇక్కడ ప్రవేశం ఉంటుంది. ఇందుకోసం నిర్వాహకులు ఓ ప్యాకేజీ ఇచ్చారు. ఒక్కో వ్యక్తి నుంచి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేసినట్టు తెలిసింది. ‘సన్‌సెట్ టు సన్‌రైజ్ విక్టరీ’ పేరిట ఈ నెల 19వ తేదీ సాయంత్రం 5 నుంచి 20వ తేదీ ఉదయం 6 గంటల వరకు రేవ్ పార్టీ జరిగేలా ప్రణాళిక రూపొందించారు. తొలుత ఎలక్ట్రానిక్ సిటీ స్టేషన్ పరిధిలో కేసు నమోదవగా, తర్వాత హెబ్బాగోడికి బదిలీ చేయాలనుకున్నారు. తాజాగా ఈ కేసును సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ బెంగళూరు(సీసీబీ) పోలీసులకు అప్పగిస్తున్నట్లు కర్ణాటక పోలీసులు ప్రకటించారు. ఇందులో సెక్స్ రాకెట్ అంశం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానించి, ఆ దిశగా సైతం విచారణ చేస్తున్నారు. ఈ ఘటనలో పోలీసులు సీజ్ చేసిన కార్లలో ఫార్చూనర్ కారు ఏపీ 39 హెచ్ 0002 నంబర్‌తో ఉంది. ఇది చిత్తూరులోని గుడిపాల మండలం రాసనపల్లెకు చెందిన త్యాగరాజులు నాయుడు అనే వ్యక్తి పేరిట ఉంది. త్యాగరాజులు నాయుడు కారు అక్కడ ఎందుకు ఉందనే దానిపై పోలీసులు ఇప్పటికే విచారణ ప్రారంభించారు. ఇంతలోపు ఈ కారును తొమ్మిది నెలల కిందటే మరో వ్యక్తికి విక్రయించినట్లు, అతను ఇంకా కారును తన పేరిట మార్చకోలేదని కొత్త డ్రామా చేస్తున్నట్లు తెలుస్తోంది. చిత్తూరు నియోజకవర్గానికి చెందిన ఓ టీడీపీ ముఖ్య నేత ఈ కారును ఉపయోగించినట్లు సమాచారం. -
ఎలిమినేటర్ మ్యాచ్
-
పోలీసులు రిలీజ్ చేసిన ఫోటోపై యాంకర్ శ్యామల రియాక్షన్
-
కవర్ చేద్దాం అని వీడియో చేసి దొరికిపోయిన హేమ
-
శ్యామలపై తప్పుడు కథనాలు.. చట్టపరంగానే ముందుకెళ్తానన్న యాంకర్!
బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ టాలీవుడ్ తారలకు సమస్యలు తెచ్చిపెడుతోంది. ఇప్పటికే ఈ పార్టీకి తాము హాజరు కాలేదని హేమ, శ్రీకాంత్ వీడియోలు రిలీజ్ చేస్తూ క్లారిటీ ఇచ్చారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన బెంగళూరు పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇదిలా ఉండగా.. ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో ఊహగానాలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. తాజాగా టాలీవుడ్ యాంకర్ శ్యామలపై కొందరు అసత్య కథనాలు ప్రచారం చేశారు. ఆమె రేవ్ పార్టీలో పాల్గొన్నారంటూ కథనాలు సృష్టించారు.దీంతో తనపై వస్తున్న అసత్య వార్తలపై యాంకర్ శ్యామల గట్టిగానే స్పందించింది. తనపై తప్పుడు వార్తలు ప్రసారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని తెలిపింది. ఇప్పటికే వారిపై పరువునష్టం దావా వేసినట్లు శ్యామల వెల్లడించింది. కావాలనే తనపై ఇలాంటి తప్పుడు కథనాలు రాస్తున్నారని ఆమె మండిపడింది.అయితే యాంకర్ శ్యామల ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అందువల్లే రాజకీయ కక్షతోనే ఇలాంటి అసత్య కథనాలు రాస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తనపై తప్పుడు వార్తలు ప్రసారం చేసిన వారిపై న్యాయపోరాటం చేస్తానని శ్యామల స్పష్టం చేసింది. -
స్మోక్ పాన్: 12 ఏళ్ల బాలిక దుస్థితి తెలిస్తే జన్మలో దాని జోలికెళ్లరు
ఈ మధ్యంకాలంలో పెళ్లిళ్లు, పార్టీలలో ఎక్కడ చూసినా స్మోక్ పాన్, స్మోక్ చాకెట్ల సందడి కనిపిస్తోంది. ముఖ్యంగా 'స్మోక్ పాన్' తిన్న తర్వాత నోట్లోంచి పొగలు రావడంపై జనాలకు బాగా క్రేజ్ పెరిగింది. వాస్తవానికి ఈ స్మోక్ పాన్ ఒక రకమైన హానికరమైన రసాయన నైట్రోజన్ సహాయంతో తయారు చేస్తారు. అందుకే నైట్రోజన్ పాన్‌అని కూడా అంటారు. తాజాగా ఇలాంటి స్మోకీ పాన్ తిని ప్రాణాలకు మీదకి తెచ్చుకున్న ఉదంతం కలకలం రూపింది.టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం భారతదేశంలోని బెంగళూరు నగరానికి చెందిన 12 ఏళ్ల బాలిక లిక్విడ్ నైట్రోజన్‌తో కూడిన 'స్మోకీ పాన్'ని తిని తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరింది. పెర్ఫోరేటెడ్ పెరిటోనిటిస్ (కడుపులో రంధ్రం) వ్యాధి బారిన బాలిక పడినట్లు పరీక్షల్లో తేలింది. దీంతో వైద్యులు శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. ఆరు రోజుల తర్వాత చికిత్స తరువాత ఇంటికి చేరింది.స్మోక్ పాన్ ప్రమాదమా?నైట్రోజన్ అనే వాయువును లిక్విడ్ రూపం 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయబడుతుంది. ఈ ద్రవ నత్రజని వేగంగా ఆవిరై, పొగలు వస్తాయి. ఇది చూడ్డానికి ఆకర్షణీయంగా కనిపించినా ఆరోగ్యానికి హానికరమని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆవిరిని పీల్చడం వల్ల శ్వాస తీసు కోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయంటున్నారు. ప్యాక్ చేసిన ఆహారం నాణ్యత, షెల్ఫ్ జీవితాన్ని పెంచడానికి ద్రవ నైట్రోజన్‌ను వాడతారు. -
ఎల్లో మీడియాపై యాంకర్ శ్యామల పరువు నష్టం దావా
-
బెంగళూరు రేవ్ పార్టీ.. మరో వీడియో రిలీజ్!
బెంగళూరు రేవ్ పార్టీ టాలీవుడ్‌ను కుదిపేస్తోంది. ఈ పార్టీకి టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారంటూ వార్తలు రావడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో తాము పార్టీకి వెళ్లలేదంటూ నటి హేమ, హీరో శ్రీకాంత్ వీడియోలను రిలీజ్ చేశారు. తాము హైదరాబాద్‌లోనే ఉన్నామంటూ క్లారిటీ ఇచ్చారు. కన్నడ మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. అనవసరంగా తన పేరును లాగొద్దని విజ్ఞప్తి చేశారు.అయితే ఇదిలా ఉండగా.. హేమ తాజాగా మరో వీడియోను రిలీజ్ చేశారు. తన ఇంట్లోనే బిర్యానీ వండుతున్న వీడియోను పంచుకున్నారు. దీంతో హేమ చేసిన వీడియో మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని చెప్పేందుకు బిర్యానీ రెసీపీ చేస్తున్న వీడియోను రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. అసలేం జరిగిందంటే..బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి రేవ్ పార్టీ జరిగింది. బర్త్‌డే పార్టీ పేరుతో జీఆర్ ఫామ్‌హౌస్‌లో జరిగిన ఈ రేవ్ పార్టీపై పోలీసులు పక్కా సమాచారంతో దాడి చేశారు. ఈ పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్, కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఈ పార్టీని ఏర్పాటు చేసినట్లు బెంగళూరు పోలీసులు వెల్లడించారు. ఈ రేవ్ పార్టీలో టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ సెలబ్రిటీలు సైతం ఉన్నట్లు పెద్దఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. View this post on Instagram A post shared by KOLLA HEMA (@hemakolla1211) -
బెంగళూరు రేవ్ పార్టీ..బయటపడ్డ సంచలన నిజాలు..
-
బెంగళూరు రేవ్ పార్టీ: ఆ ఇద్దరు నటులు ఎవరు?
సాక్షి, బెంగళూరు: బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ దర్యాప్తుపై సీపీ దయానంద కీలక విషయాలు వెల్లడించారు. ఈ రేవ్ పార్టీలో ఇద్దరు నటులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. అలాగే, అనుమానితుల బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నట్టు స్పష్టం చేశారు. ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని వెల్లడించారు.కాగా, సీపీ దయానంద మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. బెంగళూరు రేవ్ పార్టీ కేసును ఎప్పుగూడ పీఎస్‌కు బదిలీ చేయడం జరిగింది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. రేవ్ పార్టీలో 150 మంది పాల్గొన్నారు. ఈ రేవ్ పార్టీలో పాల్గొన్న వారి బ్లడ్ శాంపుల్స్ స్వీకరించాము. ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయి. రేవ్ పార్టీకి డ్రగ్స్ తీసుకొచ్చిన ఐదుగురిని అరెస్ట్ చేశాము. డ్రగ్స్ కొనుగోలుపై ప్రత్యేక చట్టల ద్వారా సీరియస్ యాక్షన్స్ తీసుకుంటాము. బెంగళూరు రేవ్ పార్టీలో ఇద్దరు నటులు దొరికారు. ఇద్దరు నటుల రక్త నమునాలు తీసుకున్నాము. ఈ ఈవెంట్లో రాజకీయ ప్రముఖులెవరూ పాల్గొనలేదు. పోలీసులు వాసు, అరుణ్, సిద్ధిఖీ, రణధీర్, రాజును అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై లోతుగా దర్యాప్తు జరుగుతోంది. డ్రగ్స్ తెచ్చిన పెడ్లర్లను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అసలు వారు ఎక్కడి నుంచి డ్రగ్స్ తెస్తున్నారు. ఎక్కడెక్కడ సప్లై చేస్తున్నారు అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది’ అని అన్నారు. -
సైబర్ కేటుగాళ్లు దోచేశారు.. ఆర్బీఐ ఉద్యోగినికి రూ.24.5లక్షల టోకరా
సైబర్ నేరస్తులు బెంగళూరులోని ఆర్బీఐ ఉద్యోగిని నిండా ముంచారు. అందిన కాడికి రూ.24.5లక్షలు దోచుకున్నారు. నగరంలోని కన్నింగ్‌హామ్ రోడ్ ప్రాంతంలో నివసించే ఆర్బీఐ ఉద్యోగికి లాజిస్టిక్స్‌లో ఎగ్జిక్యూటివ్ పేరుతో ఓ అగంతకుడు ఆమెకు కాల్ చేశాడు. మేడం.. మీ పేరుతో ఓ పార్శిల్ వచ్చింది. ఆ పార్శిల్లో ముంబైలో ఐదు పాస్‌పోర్ట్‌లు, 5 కిలోల బట్టలు, మూడు క్రెడిట్ కార్డ్‌లతో పాటు ఇతర అనుమానాస్పద వస్తువులు ఉన్నాయి. ముంబై పోలీసులు మీ పార్శిల్‌పై ఆరా తీశారు. ఈ కాల్‌ను ఇప్పుడే వాళ్లకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాం..అంటూ ప్లాన్ ప్రకారం.. కాన్ఫిరెన్స్ కాల్లో మరో సైబర్ నేరస్తుడు లైన్లోకి వచ్చాడు. తనిను తాను ముంబై సీనియర్ పోలీస్ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. ఆ పార్శిల్ విదేశానికి సంబంధించింది. అది మీ పేరుమీద ఉంది. మీ ఆధార్ కార్డును ఐడి ప్రూఫ్‌గా ఉపయోగించారని అన్నాడు. మీ బ్యాంక్ అకౌంట్‌ను మనీ ల్యాండరింగ్‌కు ఉపయోగించారని మరింత బయపెట్టించాడు.ఈ కేసు సున్నిమైంది ఎవరికి చెప్పొద్దు. మీ బ్యాంక్ అకౌంట్‌ను పరిశీలిస్తున్నాం. ఆ అకౌంట్లో ఉన్న మొత్తాన్ని మేం చెప్పిన బ్యాంక్ అకౌంట్‌కు పంపించండి. విచారణ పూర్తయిన వెంటనే మీ డబ్బుల్ని మీకు పంపిస్తామని హామీ ఇచ్చాడు. సైబర్ నేరస్తుడి మాటల్ని నమ్మని బాధితురాలు తొలిసారి రూ.14.2 లక్షలు, రెండో సారి మరో అకౌంట్‌కు రూ.5.5 లక్షలు, మూడో అకౌంట్‌కు రూ.4.8 లక్షలు పంపింది. మొత్తంగా రూ.24.5లక్షల ట్రాన్స్ ఫర్ చేసింది. అయితే మరుసటి రోజు తాను మోసపోయానని గ్రహించిన ఆ మహిళ అదే రోజు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
"డ్రగ్స్ పార్టీలో హేమ" నిర్ధారించిన పోలీసులు
-
బెంగళూరు రేవ్ పార్టీపై వెలుగులోకి సంచలన విషయాలు..
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రేవ్ పార్టీలో సినీ ప్రముఖుల పేర్లు బయటకు రావడంతో ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. మరోవైపు.. బెంగళూరు రేవ్ పార్టీపై పోలీసులు తీగలాగుతున్నారు. ఇందులో భాగంగా సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. కాగా, ‘సన్‌సెట్ టూ సన్‌రైజ్ విక్టరీ’ పేరుతో వ్యాపారి, క్రికెట్ బూకీ వాసు వ్యక్తి తన పుట్టినరోజు సందర్భంగా పార్టీ ఇచ్చినట్టు పోలీసులు గుర్తించారు. పార్టీ దాదాపు 150 మంది ప్రముఖులు హాజరయ్యారు. బర్త్ డే పార్టీలో డ్రగ్స్ వినియోగించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక, ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు రేవ్ పార్టీ జరిగేలా ప్లాన్ చేసుకున్నారు. ఈ ఈవెంట్ మొత్తానికి అరుణ్ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించారు. వాసు బర్త్‌డే పార్టీకి డగ్ర్ పెడ్లర్లు సిద్ధిఖీ, రణధీర్, రాజ్ కూడా రావడంతో డ్రగ్స్ వాడినట్టు తెలుస్తోంది. మరోవైపు.. రేవ్ పార్టీ ఇచ్చిన క్రికెట్ బూకీ వాసు నేపథ్యంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రముఖులతో వాసుకు ఉన్న లింకులపై పోలీసులు విచారణ చేపట్టారు. వాసుపై ఉన్న పాత కేసులపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక, రేవ్ పార్టీలు, డ్రగ్స్ పార్టీలపై హైదరాబాద్‌లో నిఘా పెరగడంతో బెంగళూరులో ఇలా పార్టీ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ పార్టీకి తెలుగు రాష్ట్రాల నుంచి ప్రముఖులు పెద్ద సంఖ్యలోనే హాజరయ్యారు. వీరంతా రెండు రోజులుగా బెంగళూరు జీఆర్ ఫామ్‌హాస్‌లో మకాం వేసినట్టు సమాచారం. ఇక, నిన్న రేవ్ పార్టీపై రైడ్ సందర్భంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ పార్టీలో తెలుగు, కన్నడ, తమిళ సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే వాసు, అరుణ్, సిద్ధిఖీ, రణధీర్, రాజ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారికి వైద్య పరీక్షలు రేవ్ పార్టీలో పాల్గొన్నవారిని అదుపులోకి తీసుకున్నామని, రక్తం నమూనాలు సేకరించి పరీక్షలు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. రేవ్‌పార్టీలో 150 మంది ఉన్నారని డాగ్ స్క్వాడ్‌ను పిలిపించి తనిఖీలు చేపట్టామని, కొన్ని మాదకద్రవ్యాలు లభించాయని కర్ణాటక పోలీసులు వివరించారు. ‘సన్‌సెట్ టు సన్‌రైజ్ విక్టరీ’ పేరిట రేవ్ పార్టీ జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. సుమారు 15.56 గ్రా. ఎండీఎంఏ, 6.2 గ్రా. హైడ్రో గంజాయి, కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
బెంగళూరులో రేవ్ పార్టీ భగ్నం.. హైదరాబాద్ ఫామ్ హౌస్ లో నటి హేమ
-
రేవ్ పార్టీ పై హీరో శ్రీకాంత్ రియాక్షన్
-
మా ఇంట్లోనే ఉన్నా.. దయచేసి ఎవరూ నమ్మొద్దు: హీరో శ్రీకాంత్
బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ టాలీవుడ్ సెలబ్రిటీల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఇప్పటికే ఈ పార్టీలో పలువురు ప్రముఖులు పాల్గొన్నట్లు వార్తలొచ్చాయి. దీంతో టాలీవుడ్ సినీతారలు అలర్ట్ అయ్యారు. తాను అలాంటి పార్టీకి వెళ్లలేదంటూ ఇప్పటికే నటి హేమ స్పష్టం చేశారు. మరోవైపు ఆ సినీతారలు ఎవరన్న దానిపై సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. తాజాగా ఈ పార్టీకి టాలీవుడ్ హీరో, నటుడు శ్రీకాంత్ హాజరైనట్లు వార్తలొచ్చాయి. దీంతో వీటిపై ఆయన స్పందించారు. రేవ్ పార్టీలు, పబ్‌లకు వెళ్లే వ్యక్తిని కాదని అన్నారు. దయచసి తప్పుడు కథనాలను నమ్మవద్దని అభిమానులకు శ్రీకాంత్ సూచించారు. శ్రీకాంత్ మాట్లాడుతూ..'రేవ్ పార్టీలు, పబ్‌లకు వెళ్లే వ్యక్తిని కాదు. దయచేసి తప్పుడు కథనాలను నమ్మకండి. బెంగుళూరు శివారు ప్రాంతంలో నిర్వహించిన రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదు. ప్రస్తుతం నేను హైదరాబాద్‌లోని మా ఇంట్లోనే ఉన్నా. కొన్ని ఛానెల్స్‌లో నేను బెంగుళూరులోని రేవ్ పార్టీకి వెళ్లానని వార్తలొచ్చాయి. ఆ న్యూస్ చూసి నాతో సహా మా కుటుంబ సభ్యులందరూ నవ్వుకున్నాం. నేను ఇంట్లోనే ఉన్నాను. దయచేసి తప్పుడు కథనాలను నమ్మొద్దు. అందులో ఉన్న వ్యక్తి ఎవరో నాలా ఉండంటంతోనే అలా రాశారేమో. అతడికి కాస్త గడ్డం ఉంది. ముఖం కవర్ చేసుకున్నాడు. అతన్ని చూసి నేను కూడా షాకయ్యా. అచ్చం నాలా ఉన్నాడనిపించింది. నా ఇంట్లో నుంచే మాట్లాడుతున్నా. దయచేసి అసత్య కథనాలు ఎవరు నమ్మొద్దు' అని అన్నారు. అంతే కాకుండా తాను ఎప్పుడైనా బర్త్ డే పార్టీలకు వెళ్లినా కొంత సేపు అక్కడి ఉండి వచ్చేస్తానని తెలిపారు. రేవ్ పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదని.. మీడియా మిత్రులు సహా ఎవరూ నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. అసలు విషయం తెలుసుకోకుండా.. రేవ్ పార్టీలో పట్టుబడ్డ శ్రీకాంత్ అంటూ థంబ్ నెయిల్స్ పెట్టేసి రాసేస్తున్నారు.. నాలాగా ఉన్నాడనే పొరబడి ఉంటారని నేను అనుకుంటున్నా.. నేను ఇంట్లోనే ఉన్నా.. దయచేసి తప్పుడు కథనాలను నమ్మొద్దు అని అన్నారు. -
పోలీస్ స్టేషన్ పై దాడి చేసి పారిపోయిన చింతమనేని
-
బెంగళూరు రేవ్ పార్టీ.. స్పందించిన నటి హేమ
సాక్షి, బెంగళూరు: బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి రేవ్ పార్టీ జరిగింది. బర్త్‌డే పార్టీ పేరుతో జీఆర్ ఫామ్‌హౌస్‌లో జరిగిన ఈ రేవ్ పార్టీపై పోలీసులు పక్కా సమాచారంతో దాడి చేశారు. ఈ పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్, కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఈ పార్టీని ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ రేవ్ పార్టీలో టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ సెలబ్రిటీలు సైతం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్ నటి హేమ కూడా ఈ పార్టీలో భాగమైందని వార్తలు వైరలవుతుండటంతో ఆమె స్పందించింది. బెంగళూరు రేవ్ పార్టీతో తనకు ఏమాత్రం సంబంధం లేదని హేమ వెల్లడించింది. తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని స్పష్టం చేసింది. కన్నడ మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని పేర్కొంది. అనవసరంగా తన పేరును లాగొద్దని విజ్ఞప్తి చేసింది.చదవండి: Payal Rajput: ఇక్కడ నాపై బ్యాన్ విధిస్తామని బెదిరిస్తున్నారుబెంగళూరులో రేవ్‌పార్టీ కలకలం.. పట్టుబడ్డ టాలీవుడ్ ప్రముఖులు! -
పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏలూరు జిల్లా దెందులూరు టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరారీలో ఉన్నారు. పోలింగ్ రోజు రెండు మూడు చోట్ల చెదురుమదురు సంఘటనలు జరిగినా ఎక్కడా ప్రత్యక్ష సంబంధం లేకపోవడంతో ఆయనపై కేసులు నమోదు కాలేదు. పెదవేగి మండలం కొప్పులవారిగూడెం పోలింగ్ బూత్ సమీపంలో ఈ నెల 13న ఓ వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. ఈ కేసుకు సంబంధించి 16వ తేదీన రాజశేఖర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న చింతమనేని అదే రోజు భారీ సంఖ్యలో అనుచరులతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సినీ ఫక్కీలో పోలీసులపై దౌర్జన్యం చేసి నిందితుడిని బలవంతంగా తీసుకెళ్లిపోయారు. ఈ ఘటన జిల్లాలో సంచలనంగా మారడంతో పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కొన్ని గంటల వ్యవధిలోనే చింతమనేనితో పాటు మరో 14 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ఈ విషయం తెలియగానే చింతమనేనితో పాటు అతని అనుచరుల మొబైల్ ఫోన్లు విజయవాడ సమీపంలో స్విచాఫ్ చేశారు. అక్కడ నుంచి తాడేపల్లి ప్రాంతం వెళ్లి బెంగళూరుకు పరారైనట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిని పట్టుకోవడానికి పోలీస్ యంత్రాంగం ఆరుగురు సీఐల నేతృత్వంలో ఆరు స్పెషల్ టీమ్‌లను ఏర్పాటు చేసింది. నూజివీడు డీఎస్పీ కేసు పర్యవేక్షిస్తున్నారు. 94కు చేరిన కేసుల సంఖ్య...చింతమనేనిపై ఈ నెల 16న ఐపీసీ సెక్షన్ 353, 224, 225, 143, 149 కింద కేసులు నమోదు చేశారు. ఇప్పటికే చింతమనేనిపై ఎన్నికల అఫిడవిట్ ప్రకారం 93 కేసులు నమోదయ్యాయి. తాజా కేసుతో కలిపి వాటి సంఖ్య 94కు చేరింది. చింతమనేని బెంగళూరు వెళ్లినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించుకుని ప్రత్యేక టీమ్‌లను అక్కడికి పంపారు. హైదరాబాద్‌కు కూడా మరో టీమ్‌ను పంపినట్టు సమాచారం. చింతమనేని తీసుకువెళ్లిన నిందితుడు రాజశేఖర్‌ను శుక్రవారమే అరెస్టుచేసి రిమాండ్‌కు పంపారు. -
Priya Desai: అవగాహనే ప్రథమ చికిత్స!
ఈ ఫొటోను చూడండి. ఇందులో ఉన్నది షుగర్ పేషెంట్లు. ఒకరితో ఒకరు షుగర్ వ్యాధి గురించి మాట్లాడుకుంటూ అవగాహన కల్పించుకుంటున్నారు. ‘చికిత్స కంటే అవగాహన ముఖ్యం’ అంటారు ప్రియా దేశాయ్. బెంగళూరులో ఆమె పేదవారి కోసం ఉచిత క్లినిక్‌లు నడుపుతున్నారు. డయాబెటిస్, బి.పి ఉన్న వారికి సదస్సులు నిర్వహిస్తూ ఉచిత మందులు అందేలా చూస్తున్నారు. ప్రతి ఉదయం ఈ క్లినిక్‌ల ముందు క్యూ కట్టే పేషెంట్లను చూస్తే ప్రియా సేవ తెలుస్తుంది.బెంగళూరులోని శాంతి నగర్లో ఉన్న ‘అనాహత్’ క్లినిక్‌కు వెళితే ఒక బోర్డు మీద ఐదారు రకాల భోజనం ప్లేట్ల ఫొటోలు ఉంటాయి. వాటిలో రొట్టె, కూర, అన్నం, ఇతర కూరలు ఉంటాయి. ప్రతి ప్లేట్ కింద స్టార్లు ఇచ్చి ఉంటారు. ఐదు స్టార్లు ఇచ్చిన భోజనం ప్లేట్‌ను ఆహారంగా తీసుకోవాలని బీపీ, షుగర్ ఉన్న పేషెంట్లకు సులభంగా అర్థమయ్యేలా చె΄్తారు. మీ ప్లేట్లో ఏముంది అనేదే మీ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందని ఈ క్లినిక్‌లో వారానికి రెండుసార్లు జరిగే అవగాహన సదస్సుల్లో తెలియచేస్తారు. ఇలాంటి అవగాహన దీర్ఘకాలిక వ్యాధులైన షుగర్, బీపీల తీవ్రతను తగ్గిస్తాయని అంటారు ప్రియా దేశాయ్. ఆమె ఈ క్లినిక్ నిర్వాహకురాలు.10 వేల మందికి ఒక క్లినిక్బెంగళూరు జనాభా కోటీ ముప్పై లక్షలకి పైనే. కాని ఇక్కడ మొత్తం 147 ్ర΄ాథమిక ఆరోగ్య కేంద్రాలు మాత్రే ఉన్నాయి. అంటే దాదాపు 80 వేల మందికి ఒక క్లినిక్. ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసినా 30 వేల మందికి ఒక క్లినిక్ ఉండాలి. ఆదర్శవంతమైన ΄ాలనా నిర్వహణ అంటే 10 వేల మందికి ఒక క్లినిక్. ఇలాంటి స్థితిలో పేదలకు ఎలా మంచి వైద్యం అందుతుంది అని అడుగుతారు ప్రియా దేశాయ్. జర్నలిజం అభ్యసించిన ప్రియ తన తల్లి రాణీదేశాయ్ స్ఫూర్తితో వైద్య సేవారంగంలోకి వచ్చారు. అనేక స్వచ్ఛంద సంస్థల్లో పని చేసిన రాణీ దేశాయ్ తన కుమార్తెతో కలిసి ‘అనాహత్ క్లినిక్’కు అంకురార్పణ చేశారు. బెంగళూరులో ఉన్న పేదలకు వైద్యం అందించాలనేది అనాహత్ సంకల్పం. నేరుగా క్లినిక్‌కు వచ్చేవారికి వైద్యం అందిస్తూనే హెల్త్ క్యాంప్స్ ద్వారా స్లమ్స్‌లో వైద్య చికిత్స అందించడం అనాహత్ లక్ష్యం. ఇప్పటికి 3 లక్షల మందికి హెల్త్ క్యాంప్స్ ద్వారా వైద్యం అందించారు ప్రియ తన తల్లి రాణీదేశాయ్ చేయూతతో.బీపీ, షుగర్ బాధితులు‘నగరాల్లో పని చేసే దిగువ ఆదాయ వర్గాల వారు సమయానికి భోజనం చేయరు. ఆహార అలవాట్లు, నిద్రలో క్రమశిక్షణ ఉండదు. శరీరాన్ని పట్టించుకోరు. దానివల్ల బీపీ బారిన పడుతున్నారు. షుగర్ వచ్చిన వారికి షుగర్ వచ్చిన సంగతి కూడా తెలియడం లేదు. మా క్లినిక్‌కు రోజుకు వంద మంది వస్తారు. ఎక్కువ మందికి ఇవే సమస్యలు. మా కౌన్సిలింగ్స్ వల్ల ఎక్కడ ఏ పనిలో ఉన్నా రాత్రి ఎనిమిదికి భోజనం చేయడం నేర్చుకున్నారు చాలామంది’ అంటారు ప్రియా దేశాయ్. మిత్రుల దాతల సహాయంతో ఈ క్లినిక్‌ను నడుపుతున్న ప్రియ తగిన సహాయం దొరికితే సేవను విస్తరించవచ్చు అని తపన పడుతుంటారు. 70 రకాల పరీక్షలుఅనాహత్ క్లినిక్‌లో 70 రకాల టెస్ట్‌లు ఉచితంగా చేస్తారు. 100 రకాల మందులు ఉచితంగా ఇస్తారు. వైద్యుల పరీక్ష ఉంటుంది. వీరే కాకుండా ఫిజియోథెరపిస్ట్లూ సేవలు అందిస్తారు. ‘ఆనంద’ అనే కార్యక్రమం ద్వారా సైకియాట్రీ కౌన్సెలింగ్ కూడా ఉంటుంది. ‘అన్నింటికంటే ముఖ్యం మేము పేషెంట్స్‌ను ఒక కమ్యూనిటీగా మారుస్తాం. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిని ఒక గ్రూప్‌గా చేసి వారే ఒకరితో మరొకరు మాట్లాడుకుని తామంతా ఈ వ్యాధులను ఎదిరించవచ్చు అనే ధైర్యం పొందేలా చేస్తాం’ అన్నారు ప్రియ. చికిత్స అందించడం ఎంత ముఖ్యమో వ్యాధి పట్ల అవగాహన, నివారణ అంతే ముఖ్యమని భావిస్తారు ఈ క్లినిక్‌లో. అందుకే బెంగళూరు పేదలు అనాహత్ ద్వారా లబ్ధి పొందుతున్నారు. ప్రియను, ఆమె తల్లి రాణి దేశాయ్‌ను అభిమానిస్తున్నారు.‘స్లమ్స్‌లో ఉన్నవారు క్లినిక్స్‌కు రారు. స్లమ్స్‌లో హెల్త్ క్యాంప్స్ విస్తృతంగా... క్రమబద్ధంగా జరగాలి. అప్పుడే దీర్ఘకాలిక వ్యాధులు బయటపడి చికిత్స మొదలవుతుంది. లేకుంటే అనవసర మరణాలు కొనసాగుతూనే ఉంటాయి. అందుకే అందరూ ఈ విషయమై ముందుకు రావాలి’ అని కోరుతున్నారు ప్రియ. -
Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణకు ఊహించని షాక్
బెంగళూరు: లోక్‌సభ ఎన్నికల వేళ కర్ణాటక రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కర్ణాటక లైంగిక వేధింపుల కేసులో ప్రధాన నిందితుడైన ప్రజ్వల్ రేవణ్ణకు మరో షాక్ తగిలింది. తాజాగా అతడిపై అత్యాచారం కేసు నమోదైంది.వివరాల ప్రకారం.. కర్ణాటకలో సంచనలంగా మారిన ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసు విషయంలో పోలీసులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ప్రజ్వల్‌పై అత్యాచారం కేసు నమోదైంది. లైంగిక వేధింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్‌పై సిట్ అధికారులు పలు సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు. ఐపీసీ సెక్షన్ 376 (బీ) (ఎన్), 506, 354(ఏ)(2), 354(బీ), 354(సీ), ఐటీ చట్టం కింద కేసు ఫైల్ చేశారు. ఈ ఎఫ్ఐఆర్లో ప్రజ్వల్ రేవణ్ణను ఏకైక నిందితుడిగా చేర్చారు. కాగా, ఇది ప్రజ్వల్‌పై నమోదైన రెండో కేసు.ఇదిలా ఉండగా.. ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్ దర్యాప్తు చేపడుతోంది. ఇందులో భాగంగా విచారణకు హాజరవ్వాలని నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లోగా ఎస్పీ సీమా లాట్కార్ ముందు హాజరుకావాలని ఆదేశించింది. అయితే, తనకు సమయం కావాలని ప్రజ్వల్ రేవణ్ణ సిట్ అధికారులను కోరారు. Karnataka government's special investigation team (SIT) filed a rape case against Janata Dal (Secular)'s Hassan MP #PrajwalRevanna. This is the second #FIR against Prajwal Revanna, who is also the grandson of JDS chief and former PM HD Deve Gowda.The FIR against JDS' (cont) pic.twitter.com/A6tKUIFsYu— News Daily 24 (@nd24_news) May 3, 2024 ఈ నేపథ్యంలో ప్రజ్వల్ ట్విట్టర్ వేదికగా‘సిట్ ముందు హాజరుకావడానికి ఏడు రోజుల సమయం కావాలి. ఇప్పుడు నేను బెంగళూరులో లేను’ అంటూ ఒక పోస్టు చేశాడు. కాగా, ప్రజ్వల్ అభ్యర్థనను సిట్ తిరస్కరించింది. ఈ మేరకు గురువారం ఉదయం మరోసారి సమన్లు పంపింది. అనంతరం కొద్దిసేపటికే ఆయనపై లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయనపై అత్యాచారం కేసు కూడా నమోదు చేసింది.ప్రస్తుతం ప్రజ్వల్ జర్మనీలో ఉన్నట్లు తేలింది. లైంగిక వేధింపుల ఆరోపణలు వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రజ్వల్.. డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్ ఉపయోగించి ఏప్రిల్ 28న జర్మనీ పారిపోయారు. ఈ క్రమంలో మరోవైపు అతడి పాస్‌పోర్ట్ రద్దు చేసి, ప్రజ్వల్‌ను భారత్‌కు రప్పించటంలో సాయం చేయాలని ప్రధాని మోదీని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కోరారు. మరోవైపు విచారణకు హాజరు కాకపోతే దేశానికి తిరిగి వచ్చిన వెంటనే ప్రజ్వల్‌ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. -
Lok sabha elections 2024: మేం మారమంతే!
ఈసీ ఎన్ని ప్రయత్నాలు చేసినా, హోటళ్లు మొదలుకుని బార్ల దాకా ఎందరు ఎన్ని ఆకర్షణీయమైన ఆఫర్లిచి్చనా బెంగళూరు ఓటర్లు మాత్రం మారలేదు. నగరంలో ఎప్పుడూ పోలింగ్ తక్కువగా నమోదవుతుండటంతో ఈసారి ఓటర్లను పోలింగ్ బూతులకు రప్పించేందుకు ఎన్నో వ్యాపార సంస్థలు యథాశక్తి ప్రయత్నించాయి. ఓటేస్తే భారీ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించాయి. ఒక హోటల్ ఉచిత దోసెలు, మరో సంస్థ ఉచిత బీర్, ఇంకొన్ని మిల్‌్కõÙక్ తదితరాలపై 30 శాతం డిస్కౌంట్, వండర్లా వంటి రిసార్టులు ఎంట్రీ ఫీజుపై 15 శాతం తగ్గింపు వంటివి ఇచ్చాయి. కానీ ఇవేమీ బెంగళూరువాసులను కదిలించలేకపోయాయి. ఏప్రిల్ 26న కర్నాటకవ్యాప్తంగా 14 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగడం తెలిసిందే. మొత్తమ్మీద 69.23 శాతం మంది ఓటేస్తే బెంగళూరులో మాత్రం 54 శాతం మించలేదు. బెంగళూరు సెంట్రల్లో 52.81 శాతం, బెంగళూరు నార్త్‌లో 54.42 శాతం, బెంగళూరు సౌత్‌లో 52.15 శాతం పోలింగ్ నమోదైంది. బెంగళూరు రూరల్‌లో 67.29 శాతం ఓటు హక్కు నమోదవడం విశేషం! – సాక్షి, నేషనల్ డెస్క్ -
Parvathy Gopakumar: ఒంటి చేత్తో విజయం
కారణాలు, సాకులు విజయానికి విరోధులు. లక్ష్యం ఉన్నవారు ఆకాశాన్ని, పాతాళాన్ని ఏకం చేసి అనుకున్నది సాధిస్తారు. 12వ ఏట కుడి చేతిని కోల్పోయిన పార్వతి గోపకుమార్ సివిల్స్ 2023లో 282వ ర్యాంక్ సాధించడానికి ఒంటి చేత్తో పోరాడింది. ‘మీరు సంతోషంగా ఉంటేనే సరిగ్గా చదవగలరు’ అంటున్న పార్వతి సమస్యలను జయించగల చిరునవ్వును సొంతం చేసుకుంది. పార్వతి గోపకుమార్ సంతోషంగా ఉంది. ఆమెకు కలెక్టర్ కావాలని ఉంది. సివిల్స్ 2023 ఫలితాలలో 282 ర్యాంక్ సాధించింది. కాని ఆ ర్యాంక్‌కు ఐ.ఏ.ఎస్. రాకపోవచ్చు. కాని దివ్యాంగ కోటాలో చూసినప్పుడు ఆమెది టాప్ ర్యాంక్. కనుక రావచ్చు.‘మాది అలెప్పి. బెంగళూరు నేషనల్ లా స్కూల్లో చదువుకున్నాను. ఆ సమయంలో అలెప్పి కలెక్టరేట్లో ఇంటర్న్‌షిప్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో నాటి కలెక్టర్ ఎస్.సుహాస్ పనిచేసే విధానం, కలెక్టర్ స్థానంలో ఉంటే ప్రజలకు చేయదగ్గ సేవ చూసి నాక్కూడా ఐ.ఏ.ఎస్. కావాలనిపించింది. ఆ విషయం తెలిశాక కలెక్టరేట్లో అందరూ నన్ను అందుకు కష్టపడమని ్రపోత్సహించారు. 2022లో మొదటిసారి సివిల్స్ రాసినప్పుడు ప్రిలిమ్స్ దాటలేకపోయాను. ఒక సంవత్సరం విరామం ఇచ్చి 2023లో రెండోసారి రాశాక ఈ ర్యాంక్ తెచ్చుకున్నాను’ అని తెలిపింది పార్వతి. ఇప్పుడు ఆమె వయసు 26 సంవత్సరాలు. 7వ తరగతిలో ప్రమాదం2010లో పార్వతి ఏడవ తరగతిలో ఉండగా కారు ప్రమాదంలో ఆమె కుడిచేయి మోచేతి వరకు కోల్పోవాల్సి వచ్చింది. ఆ వయసులో అలాంటి నష్టం ఎవరికైనా పెద్ద దెబ్బగా ఉంటుంది. అయితే తండ్రి గోపకుమార్, తల్లి శ్రీకళ ఇచ్చిన ధైర్యంతో వెంటనే ఎడమ చేత్తో రాయడం ్రపాక్టీసు చేసింది పార్వతి. ఆ తర్వాత మూడు నెలల్లో వచ్చిన పరీక్షలు రాసి మంచి మార్కులు తెచ్చుకుంది. ఆ తర్వాత కొన్నేళ్లకు సిలికాన్, ΄్లాస్టిక్లతో చేసిన కృత్రిమ హస్తాన్ని అమర్చుకుంది.‘నాకు దివ్యాంగులు అనే పదం నచ్చదు. అందులో ఏదో బుజ్జగింపు ఉంటుంది. వికలాంగులను వికలాంగులుగానే పిలుస్తూ సమాన గౌరవం ఇవ్వాలి. చేయి కోల్పోయాక నా జీవితమే మారిపోయింది. జనం వికలాంగులతో ఎంతో మొరటుగా వ్యవహరిస్తారు. నువ్వు బ్రా ఎలా వేసుకుంటావు, ΄్యాడ్ ఎలా పెట్టుకుంటావు అని అడిగినవారు కూడా ఉన్నారు’ అని చెబుతుంది పార్వతి.మహిళా దివ్యాంగుల కోసంఐ.ఏ.ఎస్ అయ్యాక దివ్యాంగుల కోసం, ముఖ్యంగా మహిళా దివ్యాంగుల కోసం పని చేయాలనుకుంటోంది పార్వతి. ‘ప్రేమలో పడి శారీరక వాంఛను వ్యక్తం చేసే దివ్యాంగుల సినిమాలు మీరెప్పుడైనా చూశారా? దివ్యాంగులకు ప్రేమ ఏమిటి అనే ధోరణి మనది. ఇక మహిళా దివ్యాంగులైతే పెళ్లి చేసుకుని భర్త ఎదుట ఆత్మన్యూనతతో ఉండేలా తయారు చేశారు. శారీరక లోపం శరీరానికి సంబంధించింది. మేము పొందాల్సిన ప్రేమ, గౌరవం, లైంగిక జీవితం పట్ల మాకు సమాన హక్కు ఉంది. కొందరు అబ్బాయిలు మమ్మల్ని ప్రేమించి ఉద్ధరిస్తున్నామనుకుంటారు. ఇందులో ఉద్ధరణ ఏమీ లేదు. మేము కూడా సమాన మనుషులమే. అందరిలాగే మేము కూడా’ అంటోందామె. -
షాకింగ్! ఏకంగా 10 అనకొండలతో వచ్చాడు.. చివరికి..!
బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో షాకింగ్ ఉదంతం ఒకటి చోటు చేసుకుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 ఎల్లో అనకొండలను అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబట్టాడు.నిందితుడిని అరెస్టు చేసిన కస్టమ్స్ అధికారులు తదుపరి దర్యాప్తు మొదలు పెట్టారు.బ్యాంకాక్ నుంచి వచ్చిన ఒక ప్రయాణీకుడు చెక్-ఇన్ బ్యాగ్‌లో దాచిన 10 పసుపు రంగు అనకొడలను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించాడు. ఒక సూట్ కేసులో ఒక తెల్లని కవర్లో వీటిని జాగ్రత్తగా ప్యాక్ చేశాడు. కానీ తనిఖీల్లో దొరికిపోయాడు. ప్యాసింజర్ బ్యాగ్‌లో ఏకంగా 10 పసుపు రంగు అనకొండల్ని చూసిన అధికారులూ షాకయ్యారు.బెంగళూరు కస్టమ్స్ ‘ఎక్స్’లో దీనికి సంబంధించిన ఫోటోలను అధికారులు పోస్ట్ చేశారు. వన్యప్రాణుల రవాణా చట్టవిరుద్ధమని, దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. (సమ్మర్లో పిల్లలకు ఇలా చేసి పెడితే, ఇష్టంగా తింటారు, బలం కూడా!)#Indiancustomsatwork Bengaluru Air #Customs intercepted attempt to smuggle 10 yellow Anacondas concealed in checked-in bag of a pax arriving from Bangkok. Pax arrested and investigation is underway. Wildlife trafficking will not be tolerated. #CITES #WildlifeProtection 🐍✈️ pic.twitter.com/2634Bxk1Hw— Bengaluru Customs (@blrcustoms) April 22, 2024 -
యూట్యూబర్ ఓవర్ యాక్షన్.. దిమ్మతిరిగే షాక్!
సోషల్ మీడియా రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. ఓవర్ యాక్షన్ చేస్తే అది మన మెడకే చుట్టుకుంటుంది. ఛానల్ ఉంది కదా అనో, చేతిలో కెమెరా ఉంది కదా అనో విచక్షణ మరిచి ప్రవర్తించకూడదు. ఇది తెలియక చాలామంది యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్లు ఫేక్‌వార్తలు, సమాచారంతో గప్పాలు కొడుతుంటారు. తాజాగా పబ్లిసిటీ కోసం నిషిద్ధ ప్రాంతంలోకి ఉద్దేశపూర్వకంగా ఎంటరైన ఒక యూట్యూబర్‌కి దిమ్మతిరిగే షాక్ తగిలింది. విషయం ఏమిటంటే.. బెంగళూరులోని యలహంకకు చెందిన వికాస్ గౌడ (23) అడ్డంగా బుక్కయ్యాడు. ఏప్రిల్ 7వ తేదీన మధ్యాహ్నం 12 గంటల సమయంలో చెన్నైకి వెళ్లే ఎయిరిండియా విమానం టిక్కెట్ బుక్ చేసుకున్నాడు. భద్రతా తనిఖీల అనంతరం విమానాశ్రయంలోకి ప్రవేశించాడు. ఇక్కడి దాకా బాగానే వుంది. విమానం ఎక్కకుండా, విమానాశ్రయ ఆవరణలోనే తిరుగుతూ వీడియో కంటెంట్‌ను రికార్డ్ చేశాడు. ఇక్కడితో సరిపెట్టినా బావుండేది. ఎయిర్‌పోర్ట్‌లో రోజంతా బస చేసా.. అయినా తనని ఎవరూ పట్టించుకోలేదంటూ ప్రగల్భాలు పలుకుతూ ఏప్రిల్ 12న ఒక వీడియో తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాడు. విమానాశ్రయంలో మొత్తం తిరిగినా తనను ఎవరూ పట్టుకోలేదంటూ, ఎయిర్పోర్ట్ భద్రత గురించి నెగెటివ్ కామెంట్ చేశాడు. అంతా అయ్యాక డ్యామేజ్ కంట్రోల్లో పడ్డాడు. ఆ ఎయిర్పోర్ట్ వీడియోను తన ఛానెల్ నుండి తీసివేశాడు. కానీ అది కాస్తా చేరాల్సిన వారి దృష్టికి అప్పటికే చేరిపోయింది. కట్ చేస్తే.. విషయం తెలుసుకున్న ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ వింగ్ సీఐఎస్ఎఫ్ వికాస్‌పై ఫిర్యాదు చేసింది. దీంతో అతణ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐపీసీ సెక్షన్లు 505, 448 కింద కేసు కూడా నమోదు చేశారు. తన ఫ్లైట్ మిస్సయ్యానని పేర్కొంటూ, సుమారు ఆరు గంటలపాటు విమానాశ్రయంలో తిరిగాడని, కానీ అతను చెప్పినట్టుగా 24 గంటలు కాదని తన విచారణలో తేలిందని భద్రతా అధికారులు వెల్లడించారు. అతని మొబైల్ ఫోన్నుస్వాధీనం చేసుకున్నారు. ఎట్టకేలకు తను చేసింది తప్పేనని అంగీకరించాడు. ప్రచారంకోసం అలా చేశానంటూ లెంపలేసుకున్నాడు. మొత్తం మీద గౌడకు బెయిల్ మంజూరు కావడంతో బతుకు జీవుడా అంటూ బయటపడ్డాడు. -
సన్ రైజర్స్ రికార్డ్ బ్రేక్ : వీణ శ్రీవాణి మాస్ బీట్ సాంగ్ వైరల్!
ఐపీఎల్ పోరులో మరోసారి సన్‌రైజర్స్ హైదరాబాద్ దుమ్ము రేపింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ చేసి తన రికార్డ్‌ను (287/3)తానే బ్రేక్ చేసింది. చిన్నస్వామి స్టేడియంలో హైదరాబాద్ బ్యాటర్లు పరుగుల మోత మోగించారు. ముఖ్యంగా బెంగళూరు బౌలర్లకు చుక్కలు చూపించిన హెడ్ విధ్వంసమే సృష్టించాడు. దీంతో పవర్ ప్లేలో కేవలం 7.1 ఓవర్లు ముగిసేసరికి స్కోర్ 100 పరుగులు దాటడం విశేషం. దీంతో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. ఈ సందర్భాన్ని వీణ శ్రీవాణి కూడా సెలబ్రేట్ చేసుకుంది. సోషల్ మీడియాలో ఎ పుడూచురుగ్గా ఉంటూ తన అభిమానులను అలరించే శ్రీవాణి సన్‌రైజర్స్ విజయాన్ని స్పెషల్‌గా ఎంజాయ్ చేసింది. ఐపీఎల్ 2024 కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ రిలీజ్ చేసిన సాంగ్‌ను తన వీణతో అదరగొట్టేసింది శ్రీవాణి. తన వీణా వాయిద్యాన్ని కేవలం క్లాసిక్ మ్యూజిక్కు పరిమితం కాకుండా, మాస్ సాంగ్స్‌ను కూడా వాయిస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్న శ్రీవాణి తాజాగా మాస్‌బీట్ ‘‘మేము బ్రో.. పక్కా ఇంకో రేంజ్ బ్రో’ తో ఇరగదీసింది. ఇది ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేస్తోంది. View this post on Instagram A post shared by Veena Srivani (satyavani Parankusham ) (@veenasrivani_official) -
పానీ పూరీ ప్రియులకు ఇక పూనకాలే.. వైరల్ వీడియో
పానీ పూరీ అంటేనే చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ఇష్టంగా లొట్టలేసుకుంటూ తింటారు. దాని గురించి ఎన్ని వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేసినా, పానీ పూరీకున్న క్రేజ్ముందు అవన్నీ దిగదిడుపే. అందుకే దుకాణదారులు కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. తాజాగా వెరైటీ పానీపూరీ వీడియో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. బంగారం, సిల్వర్ రంగుల్లో పానీపూరీలు తెగ వైరల్అవుతున్నాయి. ఫుడ్ హ్యాండిల్ అనే ఇన్‌స్టా ఖాతా వివరాల ప్రకారం పూరీలపై బంగారు , వెండి రేకులను పూయడం ఇందులో చూడొచ్చు. బెంగళూరుకు చెందిన ఒక వ్యాపారి ఈ సరికొత్త పానీపూరీలను అమ్ముతున్నాడు. గోల్డ్, సిల్వర్ పూతతో పానీపూరీలను విక్రయిస్తున్నాడు. అంతేకాదు ఆ పానీపూరీల్లో డ్రైఫ్రూట్స్, తేనె కూడా జోడిస్తున్నాడు. వీటిని బంగారు రంగు ప్లేట్లోనే పెట్టి అందిస్తుండటం మరో విశేషం. దీన్ని షారియత్ అంటారట. దేశంలోఇదే తొలి హైజీనిక్ పానీ పూరీ అట. ఇప్పటికే 20 లక్షలకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు విభిన్నంగా స్పందించారు.కొందరు ఆ వ్యాపారి క్రియేటివిటీని మెచ్చుకుంటుంటే, మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు. ఇది ‘‘ బప్పి లాహిరి పానీ పూరి అని పిలవాలి అని ఒకరు వ్యాఖ్యానించగా, దీని పేరును కూడా మార్చండి” బ్రో అని మరొక నెటిజన్ కమెంట్ చేశారు. View this post on Instagram A post shared by Khushbu Parmar | Manan | CTT (@cherishing_the_taste_) -
బెంగళూరు కేఫ్ టెర్రరిస్టులు ఎలా దొరికారంటే?
బనశంకరి: సిలికాన్ సిటీ బెంగళూరులో రామేశ్వరం కేఫ్‌లో జరిగిన బాంబు పేలుడు గుర్తుంది కదా..! మార్చి 1, 2024న బెంగళూరు వైట్‌ఫీల్డ్‌లోని రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో 9 మంది గాయపడ్డారు. అయితే ఉగ్రవాద ఘటనలకు చాలా రోజులుగా బ్రేక్ పడ్డ తర్వాత ఈ ఘటన జరగడం అందరినీ షాక్‌కు గురి చేసింది. ఈ కేసులో నిందితులు తాము చేసిన ఓ చిన్న తప్పుతో పోలీసులకు దొరికిపోయారు. పక్కాగా ప్లాన్ చేసి తప్పించుకున్నారు ముసావీర్ హుసేన్ షాజీబ్, అబ్దుల్ మతీన్ తాహ.. ఇద్దరు ఉగ్రవాద శిక్షణలో ఆరితేరారు. పక్కాగా స్కెచ్ వేసి బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌ను ఎంచుకున్నారు. ఎన్నికల వేళ దక్షిణాది రాష్ట్రాల్లో అలజడి సృష్టించాలన్నది వీళ్ల కుట్ర. రెక్కీల తర్వాత మార్చి 1, శుక్రవారం రోజున తమ ప్లాన్ అమలు చేశారు. రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలగానే జారుకున్నారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) రంగంలోకి దిగి కేసు దర్యాప్తు ప్రారంభించింది. అప్పటికే నిందితులు సరిహద్దులు దాటేశారు. సిసి టీవీ ఫుటేజ్ సేకరించిన NIA.. నిందితుల జాడ చెప్పిన వారికి పది లక్షల బహుమానం ప్రకటించింది. అబ్బో.. ఎన్ని జాగ్రత్తలో.? బెంగళూరు నుంచి బయటపడ్డ నిందితులిద్దరూ.. చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. బాంబు అమర్చిన హుస్సేన్ షాజీబీ (30), తెర వెనక మాస్టర్‌మైండ్ మథీన్ థాహ (30) తమ ఆహార్యాన్ని మార్చేశారు. పశ్చిమబెంగాల్లోని మారుమూల ప్రాంతాలకు చేరుకున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 35 సిమ్ కార్డులు మార్చారు. ఏ ప్రాంతానికి వెళ్లినా.. కొత్త పేర్లు చెప్పి లాడ్జ్‌లు తీసుకున్నారు. వీలైనంత వరకు తక్కువ ఖరీదు ఉండే మాస్ ఏరియాల్లో.. పోలీసు గస్తీ ఎక్కడయితే తక్కువగా ఉంటుందో అలాంటి ప్రాంతాలు మాత్రమే ఎంచుకున్నారు. స్కాన్ చేసి చెల్లించే UPI పేమెంట్ ఎక్కడా చేయలేదు, కేవలం నగదు మాత్రమే చెల్లించి భోజనం, కావాల్సిన వస్తువులు కొన్నారు. ఓ జిరాక్స్ సెంటర్లో ఆధార్ కార్డులను, డ్రైవింగ్ లైసెన్స్‌లను సేకరించిన వీరిద్దరు.. వాటితో ఫేక్ ఐడెంటిటీ కార్డులను తయారు చేసి వాడారు. వీరికి ఎప్పటికప్పుడు క్రిప్టో కరెన్సీ ద్వారా నిధులు సమకూరేవని దర్యాప్తులో తేలింది. చిక్కరు.. దొరకరు పశ్చిమబెంగాల్లోని డార్జిలింగ్‌కు వచ్చిన నిందితులు అక్కడ ఒక హోటల్లో పర్యాటకుల తరహాలో మకాం వేశారు. ఒకసారి ఒక పని మీద వాడిన సిమ్‌ను వెంటనే మార్చేవారు. అలా 35 సిమ్‌కార్డులను చేతిలో ఉంచుకున్నారు. ఒక్కో పనికి ఒక్కో సిమ్ చొప్పున వాడడం పక్కనబెట్టడం. పని పూర్తి కాగానే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం. ఇలా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. పైగా ఈ సిమ్ కార్డులన్నీ నకిలీ అడ్రస్‌లు ఉపయోగించి సేకరించినవే. కొన్ని తమిళనాడు పేరుతో ఉన్నవయితే.. మరికొన్ని మహారాష్ట్ర, ఢిల్లీలోని ఫేక్ అడ్రస్‌లు, ఆధార్లతో సేకరించిన సిమ్ కార్డులు. ఈ సిమ్‌లను వినియోగించినా.. వీళ్ల ఆచూకీ NIA పసిగట్టలేకపోయింది. ఏ చిన్న ఆధారం దొరికినా.. తప్పుడు అడ్రస్‌ల కారణంగా దర్యాప్తు మాత్రం ముందుకు సాగలేదు. ఆడింది ఆట.. పాడింది పాట హోటల్లో రూం తీసుకునేటప్పుడు రిజిస్టర్లో తమ పేర్లు కాకుండా నకిలీ పేర్లు రాశారు. కొన్ని సార్లు పొరపాటున అసలు పేరు రాసి కొట్టివేసి నకిలీ పేర్లు రాశారు. పర్యాటకులమని, డార్జిలింగ్ నుంచి వస్తున్నామని, చెన్నెకు వెళుతున్నామని.. ఇలా తోచిన కారణాలను హోటల్ సిబ్బందికి చెప్పారు. నకిలీ ఆధార్ కార్డులు చూపారు. స్థానికంగా వివిధ పర్యాటక స్థలాలను సందర్శిస్తూ జల్సా చేశారు. కోల్‌కతాలో మూడు హోటల్స్‌లో ఎప్పటికప్పుడు మకాం మార్చారు. చిన్న కారణంతో చిక్కారు మకాం మార్చుతూ పశ్చిమబెంగాల్లోని చాంద్నీ అనే ప్రాంతానికి వచ్చిన వీరు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే, వీళ్లిద్దరిలో ఒకరు వాడుతున్న మొబైల్ కింద పడడంతో ఫోన్లో స్పీకర్ పాడయింది. దీన్ని రిపేర్ చేయించేందుకు.. ఫోన్లోని సిమ్ కార్డు తీసేసి.. దగ్గరలోని రిపేర్ షాప్ మైక్రోమాజిక్ ఇన్ఫోటెక్ అనే చిన్న మొబైల్ షాప్‌కు తీసుకెళ్లారు. ఫోన్‌ను పరిశీలించిన మొబైల్ షాపు మెకానిక్.. స్పీకర్ పని చేస్తుందా లేదా అని తెలియడానికి షాప్ కీపర్ తన దగ్గరున్న సిమ్‌ను ఫోన్లో వేసి రిపేర్ చేశాడు. అప్పటికే IMEA నంబర్‌పై నిఘా పెట్టిన NIA అధికారులు.. సిమ్ వేయగానే దాని ఆధారంగా అడ్రస్ కనిపెట్టారు. ఈ సారి మాత్రం పక్కాగా ఒరిజినల్ అడ్రస్ దొరికింది. మొబైల్ లొకేషన్‌ను సంపాదించిన అధికారులు.. కొన్ని గంటల్లోనే చాంద్నీ ప్రాంతానికి చేరుకున్నారు. షాప్ కీపర్ ఇచ్చిన విలువైన సమాచారంతో నిందితుల జాడ పట్టేశారు. వేర్వేరు హోటళ్ల సిబ్బంది వాంగ్మూలం, ఎన్ఐఏ బృందాలు సేకరించారు, రిజిస్టర్లు, సీసీ కెమెరా ఫుటేజీలు, గుర్తింపు కార్డులు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. -
రామేశ్వరం బ్లాస్ట్ కేసు: నిందితుడు షాజిబ్ అరెస్ట్!
సాక్షి, ఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ బాంబు పేలుడు ఘటనకు సంబంధించి నిందితుడు, ఉగ్రవాది షాజిబ్ హుస్సన్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది. వివరాల ప్రకారం.. రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు ఘటనలో నిందితుడు షాజిబ్‌ను ఎన్ఐఏ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. బాంబు పేలుడు అనంతరం పరారీలో ఉన్న షాజిబ్‌ను ఎట్టకేలకు ఎన్ఐఏ అధికారులు పట్టుకున్నారు. ఇక, పేలుళ్ల తర్వాత అతను అస్సాం, పశ్చిమ బెంగాల్లో తలదాచుకున్నట్లు ఇంటలిజెన్స్ వర్గాలు చెప్పాయి. #RameshwaramCafe accused arrested from #WestBengal pic.twitter.com/hmtccWxVXT — JOKER (@TheJokerBhai) April 12, 2024 ఇదిలా ఉండగా.. మార్చి ఒకటో తేదీన బెంగళూర్‌లోని రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటనలో 10 మంది గాయపడ్డారు. మాస్కు ధరించి వచ్చిన ఓ వ్యక్తి బాంబు ఉన్న బ్యాగును అక్కడే వదిలి వెళ్లిన వీడియోలు సీసీటీవీలో రికార్డయ్యాయి. పేలుడుతో తక్కువ తీవ్రత ఉన్న ఐఈడీ వాడటంతో ప్రాణనష్టం తప్పింది. ఈ ఘటనలో నిందితుడిని పట్టుకునేందుకు ఎస్ఐఏ రంగంలోకి దిగింది. -
ఈ ఆనంద్ మంచి ‘సరస్సు’ లాంటి వాడు.. ఇంట్రస్టింగ్ స్టోరీ
సిలికాన్ వ్యాలీ బెంగళూరు ఇటీవల నీటి కొరత సంక్షోభానికి దారితీసింది. లేక్ సిటీగా పేరొందిన బెంగళూరులోజనం గుక్కెడు నీటికోసం అల్లాడిన పరిస్థితి తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ సందర్భంలో చెరువుల పునరుద్ధరణ మిషన్కోసం అహరహం శ్రమిస్తున్న బెంగళూరుకు చెందిన మెకానికల్ ఇంజనీర్ ‘లేక్ మ్యాన్’ స్ఫూర్తిదాయక జర్నీ గురించి తెలుసుకుందాం రండి! కర్ణాటక రాజధాని బెంగళూరుకు ఎన్నో మంచి నీటి చెరువులతో కళకళలాడుతూ ఉండేది. కానీ కాంక్రీట్ జంగిల్‌గా మారిపోతున్న పరిస్థితిల్లో చెరువులన్నీ చాలా వరకు ఎండిపోయాయి. కొన్ని పూర్తిగాకనుమరుగయ్యే స్థితికి చేరాడు. దీనికితోడు తక్కువ వర్షపాతం మరింత ప్రభావితం చేసింది. ఇక్కడే మెకానికల్ ఇంజనీర్ ఆనంద్ మల్లిగవాడ్ హృదయం తప్పించిపోయింది. బాల్యంలో ఇంటికి సమీపంలోని చెరువు, దాని అందాలను ఆస్వాదించిన మల్లిగవాడ్కు చెరువుల దుస్థితి చూసి చలించిపోయాడు. ఇక అప్పటినుంచి బెంగళూరు నగర దుస్థితిని తలుచుకుని నీటి వనరుల సంరక్షణకు ఆనంద్ మల్లిగవాడ్ చెరువులను కాపాడటంలో ఒక యజ్ఞమే చేస్తున్నాడు. 36ఎకరాల ఎండిపోయిన సరస్సును కేవలం 45 రోజుల్లోనే పునరుద్ధరించి ప్రజల దృష్టిని ఆకర్షించాడు. చెరువుల పునరుద్ధరించడం కోసం తన ఉద్యోగాన్ని విడిచి పెట్టేశాడు. ఇప్పుడు పర్యావరణ పరిరక్షకుడిగా మారిన ఆనంద్, ఇప్పటివరకు 7 సరస్సులను పునరుద్ధరించాడు. అంతేకాదు 2025 నాటికి నగరంలోని 45 చెరువులకు తిరిగి జీవం పోయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. 1960లలో బెంగళూరులో దాదాపు 290 సరస్సులు ఉండేవి. 2017 నాటికి 90కి పడిపోయింది. తొలి ప్రాజెక్టుగా ఎండిపోయిన కైలాసనహళ్లి సరస్సును నీటితో నింపాలని నిర్ణయించుకున్నాడు. అందరూ చూసి నవ్వారు.. అందరూ పిచ్చి వాడన్నారు అయినా తన ప్రయాణం అపలేదు. ఈ ప్రయాణాన్ని ఒంటరిగానే ప్రారంభించాడు. అంతేకాదు ఇవాల్టి తాగు నీటి కష్టాలకు కారణం సరస్సులు, చెరువులు మాయం కావడం కూడా ఒక కారణమని అంటాడు. అందుకే భవిష్యత్తరాలకు చెరువులను ఎలా పునరుద్ధరించాలి అనే దానిపై అవగాహన కల్పించాలని అసవరం ఉందంటాడు. View this post on Instagram A post shared by Wyzr (@wyzr.in) ఒకప్పుడు బెంగళూరులో దాదాపు రెండువేల చెరువులు, ఐదొందలకు చేరడంతో వీటిరక్షణకు బిగించాడు.చెరువులను సంరక్షించుకునే క్రమంలో అనుసరించాల్సిన విధానాలను అధ్యయనం చేశాడు. నగరంలోని 180 పురాతనమైన చెరువులను పరిశీలించాడు ఆనంద్. ఎట్టకేలకు తాను పనిచేస్తున్న కంపెనీ సన్సేరా ఇంజనీరింగ్ కంపెనీని ఒప్పించి లక్ష డాలర్లు సహాయంగా పొందాడు. వీటితో బొమ్మసంద్రలోని 36 ఎకరాల కైలాసనహళ్లి చెరువుకు 2017లో మళ్లీ జీవం పోశాడు. స్థానికులు, కూలీల సహాయంతో, అతను సరస్సు ఎండిపోయిన బెడ్ నుండి నాలుగు లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించగలిగాడు. ఆ మట్టిని ఉపయోగించి సరస్సులో చిన్న చిన్న దీవులను తయారు చేశాడు. ఇపుడీ ఈ ద్వీపాలు ఇప్పుడు వేలాది పక్షులు, చెట్లతో అలరారుతున్నాయి. అలాగే 2018లో రెండెకరాల వాబసంద్రా, 2019లో 16 ఎకరాల కోనసంద్ర లేక్‌ను పునరుద్ధరించాడు. ఫార్మ, గ్రానైట్ కంపెనీల వ్యర్థాలతో నిండి వున్నచెరువును 65 రోజుల్లో 80 లక్షలతో సుందరంగా తీర్చిదిద్దాడు. మల్లిగవాడ సరస్సు పునరుద్ధరణ ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టేందుకు కార్పొరేట్లు మద్దతిచ్చారు. తిరుపాళ్య సరస్సు పునరుజ్జీవన ప్రాజెక్ట్ 180 రోజులలో పూర్తి చేశారు. పూర్తిగా ఎండిపోయిన ఈ చెరువు 30 సంవత్సరాల తర్వాత మంచినీటితో మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. దీని నిల్వ చేసే సామర్థ్యాన్ని 3 రెట్లు పెరగడం విశేషం. ముఖ్యంగా ఈ చెరువుల పునరుద్ధరణ కోసం చెరువులో పూడిక, కలుపు, మట్టిని, చెత్తను ప్లాస్టిక్ వ్యర్థాలను త్రవ్వి తీసి కట్టలను బలోపేతం చేస్తాడు. తరువాత సరస్సు చుట్టూ బాగా మొక్కలు నాటిస్తారు. తద్వారా వలస పక్షుల కోసం ద్వీపాలను కూడా సృష్టించాడు. వర్షాకాలం తర్వాత ఆరు నెలల్లోనే సరస్సులను స్వచ్ఛమైన నీటితో నిండిపోయింది. అలాగే విరాళాల ద్వారా చెరువుల రక్షణకు పూనుకున్నాడు. 3. 5 ఎకరాల్లో ఉన్న గవిని రక్షించారు. ఇప్పటివరకు 80 చెరువులకు మళ్లీ జీవం పోశాడు.దాదాపు ఎనిమిదేళ్లలో మల్లిగవాడ్ బెంగళూరులో మరో 35 సరస్సులను, అలాగే అయోధ్యలో ఏడు, లక్నోలో తొమ్మిది , ఒడిశాలో 40 చెరువును బాగు చేయడం విశేషం. దీంతో దేశవ్యాప్తంగా చెరువుల పునరుద్ధరణ నిపుణుడిగా ప్రసిద్ధి చెందాడు. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచుతూ,కార్పొరేట్ కంపెనీల సాయంతో ఈ ప్రయాణం ఇలా సాగుతోంది. 2026లో 900 ఎకరాల హెన్నాగర సరస్సును బాగు చేయాలనేది లక్ష్యం. తద్వారా చుట్టుపక్కల రైతులకు లాభం చేకూరాలని, భూగర్భ జలాలను కాపాడాలనేది ప్రయత్నం. ఆనంద్ మల్లిగవాడ్ సందేశం ‘‘సహజ వనరులను గౌరవించడం నేర్చుకుందాం. ప్రకృతిని ప్రేమించుదాం. ప్రకృతి అందించిన వనరులను మనకు అవసరమై నంత మాత్రమే వాడుకుందాం. నీటిని సంరక్షింకుందాం. జీవితంలో సగం మన కోసం జీవిద్దాం. మిగిలి జీవితాన్ని పరిరక్షణ కోసం వెచ్చించుదాం. మన భవిష్యత్తరాలకు కోసం ఇదే ఉన్నతమైన దృక్పథం. -
శివ..శివా..! క్షణం ఆలస్యమైతే.. ప్రాణాలే పోయేవి..!
భూమ్మీద నూకలుంటే ఎలాంటి ప్రమాదం నుంచి అయినా ఇట్టే బయటపడవచ్చు. బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. స్టోరీ ఏంటంటే.. బెంగళూరులోని మహాలక్ష్మీపురం లేఅవుట్ ప్రాంతంలో పెద్దగా హడావిడి లేకుండా, ప్రశాతంగా ఉంది. అయితే ఇరుకైన రోడ్డులో ఓ మహిళ ఒక ఎద్దును తోలుకుంటూ వెడుతోంది. తాను ముందు పోతూ ఎద్దును తాడుతో లాగుతోంది. ఇంతలో ఉన్నట్టుండి ఆ ఎద్దు వింతగా ప్రవర్తించింది. బైక్‌పై ఎదురుగా వస్తున్న వాహనదారుడి పైకి దూకింది. ఏదో పగ బట్టినట్టు, కావాలని చేసినట్టు అతడిపై లంఘించింది. ఈ హఠాత్మపరిణామానికి అదుపుతప్పిన అతడు ఎదురుగా వస్తున్న లారీ కిందకి దూసుకుపోయాడు. అయితే లారీ డ్రైవర్ ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా, ఎద్దు కదలికలను గమనించిన డ్రైవర్ వేసిన బ్రేక్ పనిచేయక పోయినా అతగాడి ప్రాణాలు గాల్లో కలిసి పోయేవే. అదృష్టవశవాత్తూ డ్రైవర్ అలర్ట్ అయి వాహనదారుడి ప్రాణాలను కాపాడాడు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డైనాయి. Bangalore: The bull suddenly attacked the scooty rider. The person fell under the truck coming from the front. The truck driver immediately applied the brakes. The man narrowly escaped being hit by the tire of the truck. pic.twitter.com/Jpiei3CoIL — Mayank Arhat 𝕏 (@iMayankIndian_) April 6, 2024 -
తేజస్ మార్క్1ఏ సక్సెస్
సాక్షి బెంగళూరు: అధునిక యుద్ధసామర్థ్యాలను సంతరించుకున్న నూతన తేజస్ మార్క్1ఏ తేలికపాటి యుద్ధవిమానం తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తిచేసుకుంది. గురువారం బెంగళూరులోని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) కేంద్రం నుంచి టేకాఫ్ తీసుకుని 18 నిమిషాలపాటు గాల్లో నిర్దేశిత ‘పథం’లో చక్కర్లు కొట్టింది. దీంతో తన లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తిచేసుకుంది. తేజస్ ఎంకే1ఏ సిరీస్‌లో ఎల్ఏ5033 మొట్టమొదటి తేలికపాటి యుద్ధ విమానం. హెచ్‌ఏఎల్‌లోని చీఫ్ టెస్ట్ పైలెట్ గ్రూప్ కెపె్టన్ కెకె వేణుగోపాల్(రిటైర్డ్) ఈ విమానాన్ని నడిపారు. విమాన ప్రయాణం విజయవంతమవడంతో త్వరలోనే ఈ సిరీస్‌తో అధునాతన యుద్ధవిమానాలను తయారుచేసి భారత వాయుసేనకు అప్పగించనున్నారు. ‘‘ అంతర్జాతీయ పరిణామాలు, ఆయుధాల సరఫరా వ్యవస్థపై ఒత్తిడి నెలకొన్న ఈ తరుణంలో వేగంగా అధునాతన డిజైన్‌తో స్వదేశీ 4.5 నూతనతరం యుద్ధవిమానాన్ని తయారుచేయడంలో హెచ్ఏఎల్ సఫలీకృతమైంది. ఈ విజయంలో కీలక భాగస్వాములైన రక్షణ శాఖ, భారత వాయుసేన, రక్షణ పరిశోధనాభివృద్ది సంస్థకు కృతజ్ఞతలు’ అని హెచ్ఏఎల్ చీప్ మేనేజింగ్ డైరెక్టర్ అనంతకృష్ణన్ చెప్పారు. గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణులు, ఆయుధాలు, ఆధునిక ఎల్రక్టానిక్ రాడార్, కమ్యూనికేషన్ సిస్టమ్, స్వీయ రక్షణకు జామర్ పాడ్లను దీనిలో అమర్చారు. 2028 ఫిబ్రవరిలోపు 83 తేజస్ మార్క్1ఏలను తయారుచేసి భారత వాయుసేనకు అందించనుంది. భారత వాయుసేనలో ఇప్పటికే తేజస్ ‘ ఫ్లయింగ్ డ్యాగర్’, ‘ ఫ్లయింగ్ బుల్లెట్’ పేరుతో రెండు బృందాలు ఉన్నాయి. -
వారికి మెగాస్టార్ చిరు సలహా.. ట్వీట్ వైరల్!
మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. బెంగళూరులో తీవ్రమైన నీటి ఎద్దడి నేపథ్యంలో చిరు సలహా ఇచ్చారు. నీటి సంక్షోభం నుంచి బయటపడేందుకు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. బెంగళూరులోని తన ఫామ్‌హౌస్‌లో అవలంభించిన పద్ధతులను వివరించారు. తన ఫామ్ హౌస్‌లో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతల ఫోటోలను పంచుకున్నారు. అంతే కాకుండా తన ట్వీట్లో కన్నడ భాషలో రాసుకొచ్చారు. ప్రస్తుతం మెగాస్టార్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (ఇది చదవండి: చిరంజీవి రెండుసార్లు అడిగినా నో చెప్పిన హీరో.. ఎవరంటే?) కాగా.. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో చిరు సరసన త్రిష హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని సోషియో ఫ్యాంటసీ కాన్సెప్ట్‌తో రూపొందిస్తున్నారు. 2006లో వచ్చిన స్టాలిన్ తర్వాత త్రిష మరోసారి చిరంజీవితో జతకట్టనుంది. యూవీ క్రియేషన్స్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ సినిమా 2025 సంక్రాంతికి విడుదల కానుంది. ಈ ಪೋಸ್ಟ್ ಸ್ವಲ್ಪ ಉದ್ದವಾಗಿದ್ದರೂ, ಪಾಯಿಂಟ್ ಚಿಕ್ಕದಾದರೂ... ಬಹಳ ಮುಖ್ಯ. ನಮಗೆಲ್ಲರಿಗೂ ತಿಳಿದಿರುವಂತೆ, ನೀರು ಅತ್ಯಂತ ಅಮೂಲ್ಯವಾದ ವಸ್ತು, ನೀರಿನ ಕೊರತೆಯು ದೈನಂದಿನ ಜೀವನವನ್ನು ಕಷ್ಟಕರವಾಗಿಸುತ್ತದೆ. ಇಂದು ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ನೀರಿನ ಕೊರತೆ ಎದುರಾಗಬಹುದು. ನಾಳೆ ಎಲ್ಲಿ ಬೇಕಾದರೂ ಸಂಭವಿಸಬಹುದು.ಆದ್ದರಿಂದ ನೀರನ್ನು ಸಂರಕ್ಷಿಸಲು ಸಹಾಯ… pic.twitter.com/HwoWhSiZW5 — Chiranjeevi Konidela (@KChiruTweets) March 26, 2024 -
విలాసవంతమైన ఆకాశహర్మ్యం: ఎవరిదో? ఎక్కడుందో తెలుసా?
భారతీయ బ్యాంకులకు వేల కోట్ల ఎగవేసి లండన్‌కు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. మాల్యాకు చెందిన బెంగళూరులోని ప్రతిష్టాత్మక కింగ్ ఫిషర్ టవర్స్‌పై నిర్మించిన ఇంద్రభవనం లాంటి పెంట్‌హౌస్ గురించి ఎపుడైనా విన్నారా? దాదాపు 400 అడుగుల ఎత్తులో బెంగళూరులోని కింగ్‌ఫిషర్ టవర్స్ పైభాగంలోమాన్షన్ స్టైల్ పెంట్ హౌస్‌ను నిర్మించారు. ఒకపుడు అతని పూర్వీకులకు చెందిన 4.5 ఎకరాల భూమిపై టవర్, దానిపై పెంట్‌హౌస్‌ను రూపుదిద్దుకుంది. హెలీప్యాడ్, ఇన్ఫినిటీ పూల్ ఇలాంటి మరెన్నో విలాసవంతమైన సౌకర్యాలు దీని సొంతం. హెలిప్యాడ్‌తో రెండు స్థాయిలలో (34- 35వ ఫోర్లు) 40వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. దీని విలువ 20 వేల డాలర్లకు పైమాటే. This 20 million dollar mansion was built on top of Kingfisher Towers in Bengaluru, India pic.twitter.com/Zce8Kk6Lx4 — Historic Vids (@historyinmemes) March 19, 2024 మాల్యాకు చెందిన యునైటెడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్ లిమిటెడ్ (UBHL),ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ జాయింట్ వెంచర్‌గా ఇది నిర్మితమైంది. ఇందులో యూబీహెచ్ఎల్కు 55 శాతం, ప్రెస్టీజ్ డెవలపర్‌కు 45 శాతం వాటా ఉంది. కింగ్‌ఫిషర్ టవర్స్‌లోని ఫ్లాట్లను కూడా ఏడింటిని రూ.150 కోట్లకు విక్రయించిదంటే దీని క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు. మొత్తం అమ్మకాలు 2013లోనే పూర్తి అయినట్టు భావిస్తున్నారు. అయితే మాల్యాపై మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో 2014లో UBHL ఫ్లాట్లను పెంట్ హౌస్‌ను విక్రయించకుండా దర్యాప్తు సంస్థలు నిషేధించాయి. దేశంనుంచి పారిపోయిన మాల్యాను తిరిగి దేశానికి రప్పించే ప్రయత్నంలో ఉంది కేంద్రం. -
చెల్లెలి హాస్టల్ కష్టాలు చూసి...‘జోలో’ స్నేహా చౌదరి సక్సెస్ స్టోరీ
టెక్నాలజీని అందిపుచ్చుకోవడం, ప్రత్యామ్నాయాల అన్వేషణ, క్లిష్ట సమస్యల పరిష్కారం ఇలాంటి విషయాల్లో మహిళలు ముందుంటారు. రంగం ఏదైనా సరే.. బుర్రలో ఆలోచన వచ్చిందంటే.. దానివైపు దృష్టి పెట్టారంటే.. ‘తగ్గెదేలే’ అన్నట్టు దూసుకుపోతారు. అలాంటి వారిలో కోజికోడ్‌కు చెందిన స్నేహా చౌదరి ముందు వరసలో ఉంటారు. ఇంతకీ స్నేహ సక్సెస్ జర్నీ ఏంటి? తెలుసుకుందాం రండి! స్నేహ బెంగళూరులోని RV కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుండి ఇంజనీరింగ్ పట్టాను, కోజికోడ్‌లో ఐఐఎం పూర్తి చేశారు. డెలాయిట్, ఒరాకిల్ వంటి ప్రముఖ గ్లోబల్ కంపెనీలలో స్ట్రాటజీ అండ్ ఆపరేషన్స్ కన్సల్టెంట్‌గా 10 సంవత్సరాల అనుభవం ఉంది. కానీ వీటికి భిన్నంగా, ప్రత్యేకంగా నిలవాలని భావించారు. వృత్తి జీవితంలో ఎదురైన సవాళ్లతోపాటు, వ్యాపార కుటుంబం నుండి వచ్చిన స్నేహ తానే ఒక సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. జోలో స్టే (ZoloStay) అనే సంస్థను స్థాపించారు. అయితే దీని వెనుక పెద్ద కథేఉంది. స్నేహ సోదరి ఉద్యోగం కోసం బెంగళూరు వెళ్లినపుడు వర్కింగ్ విమెన్ హాస్టల్స్, పేయింగ్ గెస్ట్ వసతులు వెతుక్కోవడంలో కొన్ని సవాళ్లు ఎదురైనాయి. వాటి తీరుపై ఒక అవగాహన వచ్చింది. వీటితోపాటు ఆల్‌లైన్ ద్వారా ఆయా సేవలను చేరుకోవడం ఎలా అనే దానిపై ఎదురైన ఇబ్బందులే దీనికి నాంది పలికాయి. ‘‘నిజాయితీగా ఉండటం అనేది సాధికారతకు కీలకమైన అంశం. ప్రత్యేకించి మహిళా ఉద్యోగుల్లో తప్పులను ఎత్తి చూపడం కంటే వారితో మాట్లాడుతూ, దాన్నుంచి నేర్చుకోవాలి. సహోద్యోగులతో అభిప్రాయాలను పంచుకోవడం అంటే వృత్తిపరమైన అభివృద్ధిని మెరుగుపరచే మార్గాల అన్వేషణే’’- స్నేహ చౌదరి . అలా మహిళలకు ఫుడ్ అండ్ వసతికి సంబంధించిన ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్ జో స్టేస్‌ను ప్రారంభించారు. రుచికరమైన , ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు, సరసమైన ధరలో, సౌకర్యవంతైన సరసమైన వసతిని అందించే లక్ష్యంతో, ఇషా చౌల్క్దహరి, డా. నిఖిల్ సిక్రి, అఖిల్ సిక్రి భాగస్వామ్యంతో 2015లో జోలో స్టేకు శ్రీకారం చుట్టారు. 40 మంది మహిళల సమక్షంలో అధికారికంగా ప్రారంభమై, అంచెలంచెలుగా విస్తరించి కో-లివింగ్ స్పేస్ బ్రాండ్‌గా ఖ్యాతి గడించింది. బెంగళూరు ప్రధాన కేంద్రంగా గురుగ్రామ్, హైదరాబాద్, కోటా, చెన్నై, ముంబైతో సహా భారతదేశంలోని 10+ నగరాల్లో విశేష సేవలందిస్తోంది. రూ.800 కోట్లకు పైగా టర్నోవర్‌తో ప్రస్తుతం జోస్టేస్ అతిపెద్ద కో-లివింగ్ స్టార్టప్‌లలో ఒకటిగా నిలిచింది. అటు స్నేహ కూడా దేశంలోని ప్రముఖ మహిళా పారిశ్రామికవేత్తలలో ఒకరిగా అవతరించారు. అలాగే డెవిల్ ఈజ్ ఇన్ డిటైల్ మాటకు నిలువెత్తు సాక్ష్యంగా edtech స్టార్టప్‌ను కూడా స్థాపించారు. దృఢ సంకల్పం , కృషి ఉంటే సాధించలేదని ఏమీలేదు అంటారు స్నేహ. అంతేకాదు కమ్యూనిటీ క్రియేషన్ ఆలోచనను ప్రోత్సహిస్తూ వీరి హాస్టల్స్‌లో ఉండే వారి మధ్య ,జోలో ప్రీమియర్ లీగ్ ద్వారా చెస్,క్యారమ్ ఛాంపియన్‌షిప్‌లు నిర్వహిస్తుంది. ఇంకా పుట్టినరోజులు, పండుగలు ,ఇంటిరీయర్ డెకరేషన్, హౌస్ కీపింగ్, రిపేర్లు, మెయింటెనెన్స్, ఫుడ్ సర్వీస్, వైఫై, DTH వంటి సర్వీసులు కూడా అందిస్తుంది. లాక్-ఇన్లు, డిపాజిట్లు, బ్రోకరేజీలు లాంటి సమస్యలేవీ జోలో ఉండవు. అంతా ఆన్లైనే. ‘జోలో దియా’ ఆవిష్కారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం 'మహిళల్లో పెట్టుబడి పెట్టండి: ప్రగతిని వేగవంతం చేయండి',థీమ్ ఆధారంగా పూర్తిగా మహిళలచే నిర్వహించే ఒక పీజీ జోలోదియాను స్టార్ట్ చేసింది. మహిళలు తమ కలలు , ఆకాంక్షలను నిర్భయంగా కొనసాగిస్తూ, సాధికారత సాగిస్తారనే తమ నమ్మకానికి జోలో దియా నిదర్శనంగా నిలుస్తోందని జోలోస్టేస్ సహ వ్యవస్థాపకురాలు స్నేహా చౌదరి పేర్కొన్నారు. 2015లో కేవలం నెలకు రూ. 5000 ప్రారంభమై బెంగళూరు, హైదరాబాద్, అత్యంత ఖరీదైన ఏరియాలో కార్ పార్కింగ్, రూఫ్‌టాప్ రెస్టారెంట్ ,జిమ్ లాంటి సౌకర్యాలతో ఉండే ప్రైవేట్ గదులు నెలకు రూ. 36వేలకు చార్జ్ చేసే స్థాయికి చేరింది. -
మె...గా దోస వరల్డ్ రికార్డు: మనసు దో‘సు’కుంటోంది!
Megadosa: భారతీయులకు, అందులోనూ దక్షిణాది వారికి దోస అంటే ప్రాణం. ఈ దోసను ఎన్ని రకాలుగా తయారు చేసినా ఆహార ప్రియుల మనసు దో‘సు’ కుంటుంది. తాజాగా ఈ దోస ప్రపంచ రికార్డు కొట్టేసింది. దోస ఏంటి రికార్డు ఏంటి అనుకుంటున్నారా? మరి ఈ వివరాలు తెలియాలటే.. ఈ స్టోరీ చదవాల్సిందే..: కర్ణాటకలో 123 అడుగుల పొడవైన దోస లాంగెస్ట్ దోసగా గిన్నిస్ ప్రపంచ రికార్డు కొట్టేసింది. ప్రముఖ ఫుడ్ బ్రాండ్ ఎంటీఆర్ ఫుడ్స్‌కు చెందిన చెఫ్‌ల బృందం ఈ మెగా దోసను తయారు చేసింది. సంస్థ 100వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, లోర్మాన్ కిచెన్ ఎక్విప్మెంట్స్ భాగస్వామ్యంతో 123.03 అడుగుల పొడవైన దోసను తయారు చేసి, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సొంతం చేసుకుంది. అంతేకాదు తన మునుపటి ప్రపంచ రికార్డు టైటిల్‌ను తానే బద్దలు కొట్టింది. చెఫ్ రెగి మాథ్యూస్ నేతృత్వంలోని 75 మంది చెఫ్‌ల బృందం దీనికోసం కష్టపడింది. నెలల పాటు ప్లాన్లు వేసుకొని మరీ విజయవంతంగా ఈ రికార్డు సాధించింది. ఈ దోస తయారీ కోసం రెడ్ రైస్ దోస పిండిని ఉపయోగించారట. 2024 మార్చి 15న బెంగుళూరులోని MTR ఫ్యాక్టరీలో ఈ ఘనతను దక్కించుకున్నామని ఈ చారిత్రాత్మక మైలురాయిని సాధించడం సంతోషంగా ఉంది అని చెఫ్ రెగి మాథ్యూస్ ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. ఈ విజయంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. -
బెంగళూరు హోటల్లో ఉజ్బెక్ మహిళ హత్య
బనశంకరి: బెంగళూరులోని ఓ హోటల్లో విదేశీ మహిళ హత్యకు గురయ్యారు. శేషాద్రిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి వెలుగుచూసింది. ఉజ్బెకిస్తాన్‌కు చెందిన జరీనా (37) వ్యాపార వీసాపై నాలుగు రోజుల క్రితం బెంగళూరుకు వచ్చారు. బుధవారం మధ్యాహ్నం శేషాద్రిపురంలో ఓ హోటల్ రెండో అంతస్తు గదిలో బస చేశారు. బుధవారం రాత్రి 10:30 గంటలైనా ఆమె బయటకు రాలేదు. అనుమానం వచి్చన హోటల్ సిబ్బంది మాస్టర్ కీ ద్వారా తెలుపు తెరిచారు. లోపల చూడగా జరీనా విగతజీవిగా కనిపించారు. వారిచ్చిన సమాచారంతో పోలీసులు ఆధారాలు సేకరించి, సీసీ ఫుటేజీ, సెల్ కాల్‌డేటా ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఎవరో గొంతు నులిమి చంపి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. -
మరో బెంగళూరు కానివ్వొద్దు.. తాగునీటి ఎద్దడిపై హైకోర్టు హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: వర్షపు నీటి నిల్వ విధానం (ఇంకుడు గుంతలు, ఆర్డబ్ల్యూఎస్హెచ్)పై సరైన చర్యలు చేపట్టకుంటే హైదరాబాద్ మరో బెంగళూరులా తాగునీటికి కూడా ఇబ్బందిపడే పరిస్థితి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంకుడు గుంతలు లేని నిర్మాణాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు కూడా నీటి వినియోగంపై అవగాహన కలిగించేలా పాఠ్యాంశాల్లో చేర్చాలని చెప్పింది. తాగునీటికి ఇబ్బంది ఉంటే గార్డెనింగ్ లాంటి వాటికి వినియోగాన్ని నియంత్రించాలంటూ సర్కారుకు పలు సూచనలు చేసింది. తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది. రాష్ట్రవ్యాప్తంగా నీటికొరత ఉందని, ప్రధానంగా జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్‌లో తాగునీటికి ఇబ్బంది పడాల్సి వస్తోందని.. అధికారులు చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరుతూ జర్నలిస్ట్ సుభాష్ చంద్రన్ 19 ఏళ్ల క్రితం హైకోర్టుకు లేఖ రాశారు. ఇందులోభాగంగా నీటి వినియోగాన్ని నియంత్రించడం, తాగునీటి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. దీన్ని న్యాయస్థానం పిటిషన్‌గా మార్చి సుమోటోగా విచారణకు స్వీకరించింది. ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించి కీలక సూచనలతో కూడిన నివేదికను హైకోర్టుకు సమర్పించింది. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌కు కాలం చెల్లిపోయిందని చట్టప్రకారం నిర్మాణాలకు అనుమతులిచ్చే విషయంలో నిబంధనలు పాటిస్తున్నామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సిద్ధివర్ధన పేర్కొన్నారు. తాగునీటి సంరక్షణ, నియంత్రణకు సంబంధించిన ఈ పిటిషన్ ద్వారా కోరిన ఉపశమనం.. తీసుకోవాల్సిన చర్యలు వేరని... ఈ నేపథ్యంలో కాలం చెల్లిందన్న వాదన సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది. ధర్మాసనం చేసిన సూచనలివీ... ► తాగునీటి పరిరక్షణ, పునర్వినియోగం, పంపిణీ లాంటి అంశాలను 3 నుంచి 5వ తరగతి పాఠ్యాంశాల్లో చేర్చే అంశాన్ని పరిశీలించాలి. 6వ తరగతి విద్యార్థులకు ఇదే అంశాలపై కొంత సిలబస్ స్థాయి పెంచి పాఠ్యాంశంగా చేర్చాలి. ► రాష్ట్రంలోని భూగర్భ జలాలను పరిశీలించి.. అవసరమైతే తాగునీటిని గార్డెనింగ్ వంటి పనులకు వినియోగించడంపై ఆంక్షలు విధించాలి. ► ఇంకుడు గుంతల్లేని నిర్మాణాలను గుర్తించడానికి, తగిన చర్యలు తీసుకోవడానికి పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి కసరత్తు చేయాలి. ► పట్టణ, స్థానిక సంస్థల్లో ఆర్డబ్ల్యూహెచ్ఎస్ నిబంధనలు అమల్లో ఉండేలా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి చర్యలు చేపట్టాలి. ► గ్రామీణ ప్రాంతాల్లో ఆర్డబ్ల్యూహెచ్ఎస్ వ్యవస్థ అవశ్యకతను తెలియజేయడానికి సర్కారు అవసరమైన చర్యలు తీసుకోవాలి. ► గతేడాది మార్చి 31న జారీచేసిన జీవో 49 అమలయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దీనికి అదనంగా చిన్న నిర్మాణాల్లో సైతం వాటర్ రీసైక్లింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేసే అంశాన్ని అధ్యయనం చేసి చర్యలు చేపట్టాలి. ► వాల్టా చట్టంలోని నిబంధనల అమలుకు సెక్షన్ 11 ప్రకారం సంబంధిత విభాగం నోటిఫికేషన్ జారీచేయాలి. ► రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బోర్‌వెల్స్ నిబంధనల ప్రకారమే కొనసాగుతున్నాయా? లేదా? అనే అంశంపై భూగర్భ జలవనరులశాఖ పరిశీలన చేపట్టి చర్యలు తీసుకోవాలి. ► పంచాయతీరాజ్ చట్టం- 2018లోని సెక్షన్ 43 (6) (2) నిబంబధనలు అమలయ్యేలా పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి చర్యలు తీసుకోవాలి. -
బెంగళూరు దాహార్తి!
దేశంలో నీటి ఎద్దడి నిత్యజీవిత వ్యథగా పరిణమించి చాలా కాలమైంది. అది స్థలకాలాదులను అధిగమించింది. దాని బారిన పడని నగరమంటూ లేదు. బెంగళూరు దాహార్తి అందులో భాగమే. అది జనాభారీత్యా దేశంలో మూడో అతి పెద్ద నగరం. సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో అది దేశానికే ఐటీ రాజధాని. కానీ తాగటానికి గుక్కెడు నీళ్లు కరువైతే ఆ భుజకీర్తులన్నీ దేనికి పనికొస్తాయి? 500 ఏళ్లనాటి ఆ నగరం గొంతెండి నీళ్ల కోసం అలమటిస్తోంది. టెకీలంతా నగరాన్నొదిలి స్వస్థలాల నుంచి పనిచేయటం మొదలుపెట్టారు. అపార్ట్మెంట్లన్నీ బేల చూపులు చూస్తున్నాయి. కోచింగ్ సెంటర్లు ఆన్లైన్ క్లాసులకు మళ్లాయి. రోడ్డుపై పోయే నీటి ట్యాంకర్ల వెనక జనం పరుగు లెడుతున్నారు. ఇది పరీక్షల కాలమైనా విద్యార్థులకు నీటి అన్వేషణ ముఖ్యమైపోయింది. కావేరి పరివాహ ప్రాంతాన్ని కరువు కాటేయటంతో నగరానికి వచ్చే నీరు తగ్గింది. భూగర్భ జలాలు అడుగంటాయి. మార్చి నెలాఖరుకు రావాల్సిన ఉష్ణోగ్రతలు బెంగళూరును ఫిబ్రవరి మూడోవారంలోనే పలకరించాయి. కోటిన్నర జనాభాగల ఆ నగరంలో వాల్‌మార్ట్ మొదలుకొని గూగుల్ వరకూ ఎన్నో అంతర్జాతీయ సంస్థలున్నాయి. ఇవిగాక బోలెడు స్టార్టప్‌లు కొలువుదీరాయి. బెంగళూరుకు సగటున రోజుకు కనీసం 185 కోట్ల లీటర్ల నీరు లభిస్తుండగా కనీసం మరో 168 కోట్ల లీటర్లు అవసరమని అంచనా. కానీ ఎక్కడుంది లభ్యత? ఇది దిక్కుతోచని స్థితి. ఆరా తీస్తే బెంగళూరు నగరానిది కూడా దేశంలోని అన్ని నగరాల వ్యథే. మౌలిక సదుపాయాల కల్పనపై కనీస స్థాయి దృష్టిపెట్టకుండా దశాబ్దాలుగా అభివృద్ధిని కేంద్రీకరించిన పర్యవసానమే ప్రస్తుత కష్టాలకు మూలకారణం. అభివృద్ధి పేరు చెప్పి వెనకా ముందూ చూడకుండా హరిత ప్రాంతాలను హరించటంవల్ల వర్షాలు గణనీయంగా తగ్గాయి. పెరుగుతున్న జనాభా పేరు చెప్పి ఆవాసప్రాంతాలను విస్తరించటం, అందుకోసం చెరువులనూ, సరస్సులనూ మాయం చేయటం అలవాటైపోయింది. 1961 నాటికి బెంగళూరు నగర పరిసరాల్లో 262 సరస్సులుండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 81కి పడిపోయింది. వాస్తవానికి ఆ సరస్సుల్లో ఇప్పటికీ జీవంతో వున్నవి కేవలం 33 మాత్రమే. జనావాసాలకు అననుకూల ప్రాంతాల్లో వుండటంవల్లే ఇవి బతికిపోయాయి. మిగిలినవి పేరుకు సరస్సులుగా వున్నా వాటిలో చుక్క నీరు కూడా కనబడదు. ఇంకా దారుణం... ఇప్పుడున్న సరస్సుల్లో 90 శాతం కాలుష్యం కారణంగా పనికిరాకపోవచ్చని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధ్యయనంలో తేలింది. లీటర్ నీటిలో కనీసం 4 మిల్లీగ్రాముల ఆక్సిజన్ వుంటేనే ఆ నీరు మెరుగ్గా వున్నట్టు లెక్క. కానీ అంతకన్నా తక్కువ స్థాయిలో ఆక్సిజన్ వున్నదని నిపుణులు తేల్చారు. ఎన్నడో 1971లో ఇరాన్‌లోని రాంసర్లో నీటి వనరుల సంరక్షణపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో కుదిరిన ఒడంబడికపై సంతకం చేసిన దేశాల్లో భారత్ కూడావుంది. కానీ దానికి అనుగుణంగా శ్రద్ధాసక్తులు కనబరిచిన దాఖలా లేదు. 2030 నాటికి నీటి అవసరాలు రెట్టింపవుతాయని నీతి ఆయోగ్ నివేదిక 2018లో చెప్పింది. మన దేశంలో కేవలం రక్షిత మంచినీరు అందక ఏటా 2 లక్షలమంది మరణిస్తున్నారని వివరించింది. అంతకు రెండేళ్లముందు దక్షిణ కన్నడ జిల్లాలోని మూద్బిద్రీలో సరస్సులపై అంతర్జాతీయ సదస్సు జరిగింది. హరిత ఆచ్ఛాదనగా వున్న పట్టణ అడవులు, తడి నేలలు వగైరాలను పట్టణీకరణ కోసం మూడు దశాబ్దాలుగా డీ నోటిఫై చేస్తున్నారనీ, ఇది బెంగళూరుకు ముప్పు కలిగిస్తుందనీ సదస్సు ఆందోళన వ్యక్తం చేసింది. కానీ ఏళ్లు గడు స్తున్నకొద్దీ ఆ ధోరణి మరింత పెరిగిందే తప్ప తగ్గలేదు. అసలు పట్టణీకరణలో స్థానిక జీవావరణం, పర్యావరణం, నీటి లభ్యత వగైరాలకు చోటేలేదు. వాటిపై ఎలాంటి అధ్యయనమూ లేదు. కేంద్రీకృత అభివృద్ధి వల్ల జనాభా అనేక రెట్లు పెరగటం, దాంతోపాటే మురుగునీటి వ్యవస్థ అస్తవ్యస్థం కావటం తరచు కనబడుతున్న వాస్తవం. స్థానికంగా వుండే చెరువులు, సరస్సులు వగైరాల్లో మురుగు నీరు విడిచిపెట్టే దురలవాటుతో అటు నీటి వనరులూ నాశనమవుతున్నాయి, ఇటు భూగర్భ జలాలు సైతం కాలుష్యం బారిన పడుతున్నాయి. నగరాలు నేల చూపులు విడిచిపెడుతున్న తీరు ఆందోళనకరం. నేల విడిచి ఆకాశంలోకి దూసుకుపోయే నగరాలకు చుక్కలు కనబడటం ఖాయమని కేప్‌టౌన్ అనుభవాలు ఆరేళ్ల క్రితమే చెప్పాయి. దక్షిణ అట్లాంటిక్ సముద్ర తీరాన దక్షిణాఫ్రికాలో వున్న ఆ నగరంలో కళ్లు చెదిరే స్థాయిలో భారీ భవంతులు దర్శనమిస్తాయి. ప్రపంచం నలుమూలల నుంచీ తరలివచ్చే వినియోగ వస్తువులతో అక్కడి మహా దుకాణాలు మెరిసిపోతుంటాయి. ఏటా కనీసం 20 లక్షలమంది ఆ నగర అందచందాల్ని చూడటానికి తరలివస్తారని అంచనా. 46 లక్షల జనాభాగల ఆ నగరం 2018లో నీటి సంక్షోభంలో చిక్కుకుని గుడ్లు తేలేసింది. ఇళ్లకూ, దుకాణ సముదాయాలకూ, కార్యాలయాలకూ నీటి సరఫరాను పూర్తిగా నిలిపేసింది. 200 నీటి కేంద్రాలవద్ద రోజుకు మనిషికి 25 లీటర్ల నీరిస్తామని అన్ని అవసరాలనూ దాంతోనే తీర్చుకోవాలని ప్రకటించింది. నీటి సంరక్షణను ఒక సంస్కృతిగా మార్చుకుని ఇప్పుడిప్పుడే కుదుటపడటం మొదలెట్టింది. కేప్‌టౌన్ కష్టాలూ, వాటిని ఆ నగరం అధిగమించిన తీరూ అధ్యయనం చేయటం ఒక్క బెంగళూరుకు మాత్రమే కాదు... అన్ని మెట్రొపాలిటన్ నగరాలకూ తక్షణావసరం. నీటి వృథాను, నష్టాలను అరికట్టడంలో... కాలాను గుణమైన ప్రణాళికల రూపకల్పనలో స్థానిక సంస్థల చొరవను పెంచితేనే ఈ సమస్యను అధిగమించగలమని పాలకులు గుర్తించటం మంచిది. -
కర్ణాటక అంతటా నీటి కటకట..!(ఫొటోలు)
-
Rameswaram Cafe Blast: నిందితుడి జాడ చెప్తే రూ.10 లక్షలు
న్యూఢిల్లీ: బెంగళూరులో మార్చి ఒకటో తేదీన రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు ఘటనలో ప్రధాన నిందితుడి సమాచారం అందిస్తే రూ.10 లక్షల బహుమతి ఇస్తామని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) బుధవారం ప్రకటించింది. ఈ మేరకు తమ అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్చేసింది. కేఫ్‌లోకి అడుగుపెట్టేటపుడు ఆ వ్యక్తి క్యాప్, మాస్్క, కళ్లద్దాలు ధరించి ఉన్నాడని ఎన్ఐఏ పేర్కొంది. నిందితుడు జాడ తెలిపిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని ఎన్ఐఏ హామీ ఇచి్చంది. ఈస్ట్ బెంగళూరులోని బ్రూక్‌ఫీల్డ్‌లో జరిగిన ఈ పేలుడు ఘటనలో 10 మంది గాయపడ్డారు. శక్తివంత పేలుడు పదార్ధం(ఐఈడీ) వాడటంతో కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకుని దర్యాప్తు బాధ్యతలను ఎన్ఐఏకు అప్పగించడం తెల్సిందే. మొదట కర్ణాటక పోలీసులు కఠినమైన చట్టవ్యతిరేక కార్యకలాపాల(నిరోధక) చట్టం, పేలుడు పదార్ధాల చట్టాల కింద కేసు నమోదుచేశారు. ముంబైలో నవంబర్ 26న ఉగ్రదాడి తర్వాత ప్రత్యేకంగా ఉగ్రసంబంధ ఘటనలపై దర్యాప్తు కోసం ఎన్ఐఏను 2008లో ఏర్పాటుచేశారు. -
Rameshwaram Cafe Bomb Blast: రవ్వ ఇడ్లీ తీసుకుని, ‘బ్యాగు’ను వదిలి..
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడుకు సంబంధించిన ఆసక్తికర మరో అప్డేట్ ముందుకు వచ్చింది. అనుమానితుడు తన బ్యాగ్‌ను రెస్టారెంట్లో ఉంచే ముందు, రవ్వ ఇడ్లీని తీసుకోవడం చూశానని కేఫ్ యజమాని దివ్య రాఘవేంద్రరావు మీడియాకు తెలిపారు. రామేశ్వరం కేఫ్ వైట్‌ఫీల్డ్ అవుట్‌లెట్‌లో పేలుడుకు దారితీసిన సంఘటనల క్రమాన్ని దివ్య రాఘవేంద్రరావు వివరిస్తూ ‘పేలుడు జరిగినప్పుడు నా మొబైల్ ఫోన్ నా దగ్గర లేదు. నేను దానిని తీసుకోగానే, దానిలో చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి. నేను మా సిబ్బందికి కాల్ చేయగా, వారు రెస్టారెంట్లో పేలుడు జరిగిందని చెప్పారు. తొలుత వంటగదిలో ఏదో కారణంగా పేలుడు సంభవించిందని అనుకున్నాను. కానీ వంటగదిలో పేలుడుకు సంబంధించిన ఆనవాళ్లు లేవు. దీంతో కస్టమర్లున్న ప్రాంతంలో పేలుడు జరిగిందని గుర్తించాం. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాక మాస్క్, మఫ్లర్ ధరించిన ఓ వ్యక్తి బిల్లింగ్ కౌంటర్ వద్దకు వచ్చి, రవ్వ ఇడ్లీ ఆర్డర్ చేసినట్లు కనిపించింది. Bengaluru cafe blast suspect caught on CCTV. Wearing a cap 👇#RameshwaramCafe#BengaluruBlast pic.twitter.com/NjlnEiAOzL — Stranger (@amarDgreat) March 2, 2024 అతను ఆర్డర్ తీసుకున్న తర్వాత ఒక మూలన కూర్చున్నాడు. ఆ ఇడ్లీలను తీనేశాక, రెస్టారెంట్ నుండి బయటకు వెళ్లే ముందు బ్యాగ్‌ను ఒక మూలన ఉంచాడు. ఇది జరిగిన కొద్ది సమయానికే పేలుడు సంభవించింది. అదృష్టవశాత్తూ పేలుడు జరిగిన చోట సిలిండర్లు లేవు. నేను ఇటీవలే బిడ్డకు జన్మనిచ్చాను. రామేశ్వరం కేఫ్, ఈమధ్యనే పుట్టిన నా బిడ్డ.. రెండింటిలో ఎలాంటి తేడా లేదు. మా అవుట్లెట్కు జరిగిన నష్టం తీవ్రంగా బాధిస్తోంది. రామేశ్వరం కేఫ్ త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది. మరింత పటిష్టమైన భద్రతా వ్యవస్థతో పనిచేస్తుంది. కేఫ్ పేలుడులో ఎటువంటి ప్రాణ నష్టం జరగనందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని కేఫ్ యజమాని దివ్య రాఘవేంద్రరావు పేర్కొన్నారు.