bank account
-
నా బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉందో పట్టించుకోను: ఆర్ మాధవన్
హీరో మాధవన్ (R Madhavan) తమిళంతోపాటు తెలుగు, హిందీలోనూ పలు సినిమాల్లో నటించారు. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్‌తో 3 ఇడియట్స్ మూవీ చేశాడు. అప్పట్లో ఆ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇటీవల హిసాబ్ బార్బార్ మూవీతో అభిమానులను పలకరించాడు. ఈ సినిమా నేరుగా ఓటీటీలోనే విడుదలైంది.అయితే తాజాగా హీరో మాధవన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన ఆర్థిక క్రమశిక్షణ, జీవనశైలి గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన బ్యాంక్ బ్యాలెన్స్ గురించి ఎప్పుడు ఆలోచించలేదని ఆయన అన్నారు. నా బ్యాంక్ ఖాతా పట్ల నేను అభద్రతా భావంతో ఉంటానని తెలిపారు. నా దగ్గర ఎంత ఉందో నాకు తెలియదు.. కానీ ప్రతిసారీ నేను బ్యాలెన్స్ చెక్ చేసుకునేందుకు ఇష్టపడను అన్నారు. ఎందుకంటే అలా చేయడం వల్ల నాకు ఎలాంటి ఉపయోగం ఉంటుందో నాకు తెలియదు కానీ.. నేను ఎంత సంపాదిస్తున్నానో.. ఎంత ఖర్చు పెడుతున్నానో నాకు కచ్చితమైన అవగాహన అయితే ఉంది' అని వెల్లడించారు.కెప్టెన్ లైసెన్స్ ఉంది..తన కొత్త నైవుణ్యం గురించి మాధవన్ మాట్లాడుతూ.. "నా దగ్గర ఒక సాధారణమైన చిన్న పడవ ఉంది. అది నా కుటుంబానికి సరిపోతుంది. కొవిడ్ సమయంలో నేను నేర్చుకున్న కొత్త నైపుణ్యం నా కెప్టెన్ లైసెన్స్ పొందడమే. బోట్లో నావిగేట్ చేయడం నేర్చుకున్నా. ఇదేమీ కష్టమైన పని కాదు. మీరు కూడా 10-15 రోజులు నేర్చుకుంటే లైసెన్స్ వచ్చేస్తుందని' సలహా ఇచ్చారు.మాధవన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం హిసాబ్ బరాబర్ . అశ్వని ధర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో కీర్తి కుల్హరి, నీల్ నితిన్ ముకేశ్, రష్మీ దేశాయ్, ఫైజల్ రషీద్ కీలక పాత్రల్లో నటించారు. ఈ థ్రిల్లర్ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజైంది. జనవరి 24 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. అతను ఫాతిమా సనా షేక్‌తో కలిసి ఆప్ జైసా కోయిలో చిత్రంలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. -
పెట్లకు డబ్బులు కాస్తాయి!
సాక్షి, హైదరాబాద్: ‘డబ్బుల్దేముంది.. కుక్కను కొడితే రాల్తాయి..’అంటుంటారు. ఈ బడాయి మాటలకేం గానీ.. మీ కుక్కను ముద్దు చేసి, ముస్తాబు చేసి, ఆ మురిపాల ముచ్చట్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే మాత్రం నికరంగా నాలుగు రాళ్లయితే మీ బ్యాంక్ అకౌంట్లోకి వచ్చి పడతాయి. పోనీ మీకు గ్రామసింహం లేదా? మరేం ఫర్వాలేదు.. మీ పిల్లి మాతల్లి వయ్యారాలను, కళ్లు మూసుకుని ఆ మార్జాల మహారాణి వేసే దొంగ వేషాలను రీల్స్‌గా, షార్ట్స్‌గా షూట్ చేసి పోస్ట్ చేసినా మీకొచ్చేది వస్తుంది. ముందు మీ పెట్ (పెంపుడు జంతువు) నలుగురి కళ్లలో పడుతుంది. వెనకే ఫాలోవర్స్ వెంటపడతారు. వాళ్లను చూసి ప్రొడక్ట్ ప్రమోటర్స్ మిమ్మల్ని ఫాలో అయిపోతారు.కంటెంట్‌ని బట్టి పేమెంట్పెట్ అకౌంట్ ఓపెన్ చేయగానే ‘డబ్బే డబ్బు’.. ‘వద్దంటే డబ్బు’అనేంతగా వెంటనే ఏమీ వచ్చిపడదు కానీ, అంతకన్నా ఎక్కువగానే ఒక ‘పెట్ ఇన్ఫ్లుయెన్సర్’గా కొన్నాళ్లకు మీకు గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపు మీకు ఒక్కో పోస్టుకు రూ. 5,000 నుంచి రు.15,000 వరకు పెట్ కేర్ బ్రాండ్స్ నుంచి వచ్చేలా చేస్తుంది. మీ పెట్ ఎంత పాపులర్ అయితే మీకంత పేమెంట్. అబ్బా.. మూగజీవులతో ఏం చెప్పిస్తాం, ఏం మెప్పిస్తాం అనుకోకండి. మీలో కంటెంట్ ఉంటే చాలు.. వాటికి మాటలు వచ్చేసినట్లే. మరి మాలో క్రియేటివిటీ ఉండొద్దా అంటారా? ఆ సంగతి మీ పెట్స్‌కి వదిలి పెట్టండి. అవి ఇచ్చే క్యూట్ ఫీలింగ్స్‌తో మీలోంచి ఒక్క క్రియేటివిటీ ఏంటి.. మొత్తం కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, కెమెరా, స్టార్ట్, యాక్షన్ అన్నీ తన్నుకొచ్చేస్తాయి. వెయ్యికి పైగా అకౌంట్లు ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ టెక్ ప్లాట్‌ఫామ్ ‘కోరజ్’డేటా ప్రకారం సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇండియాకు చెందినవి 1,200 వరకు యాక్టివ్ పెట్ ఇన్ఫ్లుయెన్సర్ అకౌంట్లు ఉన్నాయి. వెయ్యికి పైగా ఫాలోవర్స్, 12,000కు పైగా లైకులు, ఒక పోస్టుకు సగటున 1,30,000 వ్యూస్ ఉండే ఈ అకౌంట్లు.. 100 కోట్ల డాలర్ల విలువైన భారతీయ పెట్ కేర్ మార్కెట్లో ఇప్పుడు ఒక భాగం. వీటిలో ‘ఆస్కార్’అనే అకౌంట్ పేరు కలిగిన ఐదేళ్ల వయసున్న గోల్డెన్ రిట్రీవర్ జాతి శునకానికి ఇన్‌స్ట్రాగామ్ హ్యాండిల్లో 2,49,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. రీల్‌కు రూ.15,000 వరకు! ఇండియాలోనే ఓరియో, నిక్కి, మిల్లీ, డూడిల్, పాపిన్స్, సింబా, నిఫ్టి, జోయ్ అనేవి మంచి పేరున్న పెట్ అకౌంట్లు. ‘కారా బెల్’అనే క్యాట్ (పిల్లి) ఇన్‌ఫ్లుయెన్సర్‌కు ఇన్‌స్ట్రాగామ్‌లో 15,400 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ పర్షియన్ జాతి పిల్లి ఫ్యాషన్‌లో హొయలు ఒలికిస్తూ, అందంలో అధునాతనాన్ని చిలికేస్తూ, ఆరోగ్యానికి టిప్స్‌ని అందిస్తూ ఉంటుంది. ‘నల’, ‘మీను’అనే క్యాట్ ఇన్ఫ్లుయెన్సర్లకు కూడా మంచి గుర్తింపు ఉంది. 15,000–50,000 మధ్య ఫాలోవర్స్ ఉన్న ఏ పెట్ ఇన్ఫ్లుయెన్సర్కైనా ఒక రీల్‌కు, షార్ట్‌కు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ఆదాయం వస్తుంది. డబ్బే కాదు, ఉచితంగా పెట్ కేర్ ప్రొడక్ట్‌లు కూడా లభిస్తాయి. పెట్ కేర్ బ్రాండ్స్ తమ ప్రమోషన్ కోసం పోస్ట్‌కి ఇంత అని చెల్లిస్తాయి. పెట్ ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలంటే..!పెట్ ఇన్ఫ్లుయెన్సర్ కావాలంటే మొదట మీ పెట్‌కు (కుక్క, పిల్లి, ఇతర పెంపుడు జంతువులు ఏవైనా) కెమెరాను అలవాటు చేయండి. ఆ తర్వాత మీరనుకున్న థీమ్‌ను బట్టి పెట్‌కు అవసరమైన హంగుల్ని, ఆర్భాటాలను తగిలించండి. నిద్ర లేచినప్పుడు, ఆవలిస్తున్నప్పుడు, తింటున్నప్పుడు, స్నానం చేయిస్తున్నప్పుడు, దుస్తులు తొడిగాక, జర్నీలో మీతో పాటు ఉన్నప్పుడు.. ఇలా ప్రతి సందర్భంలోనూ వాటి ఫీలింగ్స్‌ని కెమెరాలోకి లాగేసుకోండి. కాప్షన్ పెట్టి నెట్లోకి వదిలేయండి. అందులో ఏదైనా సామాజిక సందేశం అంతర్లీనంగా ఉంటే మరీ మంచిది. ఫాలోవర్స్ పెరుగుతారు. స్పాన్సరర్లు వచ్చేస్తారు. పెట్ మూడ్ బాగోలేనప్పుడు మాత్రం షూట్ పెట్టుకోకండి. -
ఆర్బీఐ కొత్త రూల్: ఎంతో మేలు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI).. బ్యాంక్ ఖాతాదారులకు ఎప్పటికప్పుడు మెరుగైన సేవలను అందించడానికి కావలసిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే.. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలలో పెద్ద సంఖ్యలో డిపాజిట్ ఖాతాలకు నామినీలు లేదని వెల్లడించింది. తప్పనిసరిగా ఖాతాదారులకు నామినీలు ఉండాలని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది.మరణించిన డిపాజిటర్ల ఖాతాలో డబ్బు ఉన్నట్లయితే.. దానిని తీసుకోవడానికి కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీనిని నివారించడానికి ఆర్బీఐ ఈ కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే ఉన్న ఖాతాదారులు లేదా కొత్త ఖాతాదారులందరికీ.. ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలు, సేవింగ్స్ ఖాతాలు, సేఫ్టీ లాకర్లు వంటివి ఉన్నట్లయితే వారందరికీ నామినీలు ఉండేలా చూడాల్సిందిగా ఆర్బీఐ చెప్పింది.అర్హత కలిగిన వ్యక్తి నామినీ అయితే.. మరణించిన వ్యక్తి పొదుపు ఖాతా, ఫిక్స్డ్ డిపాజిట్ లేదా సేఫ్ డిపాజిట్ లాకర్ల నుంచి నిధులను ఎటువంటి సమస్య లేకుండానే బదిలీ చేయవచ్చు.ఖాతాదారులు.. నామినీలను కలిగి ఉన్నారా లేదా అనే విషయాలను గురించి బ్యాంకులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాలి. మార్చి 31 నుంచి ప్రతి మూడు నెలలకు ఓ సారి.. దీనికి సంబంధించిన వివరాలను కూడా తెలియజేయాలని ఆర్బీఐ ఆదేశించింది. డిపాజిట్ అకౌంట్లకు సంబంధించిన దరఖాస్తు పత్రాలలో కూడా.. నామినీ పేరును తెలియజేసేలా, మార్పులు చేయాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ సూచించింది.నామినీ ఎవరు?ఖాతాదారుడు మరణిస్తే.. తమ నిధులను ఎవరికి బదిలీ చేయాలనుకుంటున్నాడో అతడే.. నామినీ. కాబట్టి అకౌంట్ ఓపెన్ చేసే సమయంలో నామినీ పేరును చేర్చవచ్చు లేదా అకౌంట్ ఓపెన్ చేసిన తరువాత అయినా నామినీ పేరును యాడ్ చేసుకోవచ్చు.ఇదీ చదవండి: క్రెడిట్ కార్డుతో అద్దె కడుతున్నారా.. ఈ విషయాలు తెలుసా? -
ఇలాంటి చెక్కు వస్తే డబ్బు డ్రా చేసుకోలేరు..
దాదాపు అందరికీ బ్యాంకు ఖాతాలు ఉంటాయి. కానీ చెక్కులను పెద్దగా ఉపయోగించరు. వాటిలో చాలా మందికి వివిధ రకాల చెక్కుల గురించి తెలియదు . అటువంటి వాటిలో ఒకటే క్రాస్ చెక్ (Cross Cheque). ఇటాంటి చెక్ పై వైపున ఎడమ మూలలో రెండు గీతలు గీస్తారు. ఈ గీతలు ఎందుకు గీస్తారో తెలుసా? నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881 ప్రకారం క్రాస్ చెక్‌ల గురించి ఇక్కడ తెలుసుకుందాం..నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881 (Negotiable Instruments Act)లోని సెక్షన్ 123 ప్రకారం.. ఇలాంటి చెక్ జారీ చేసిన వ్యక్తి ఇది క్రాస్డ్ చెక్ అని చెక్ ఎగువన ఎడమ మూలలో రెండు లైన్లతో బ్యాంక్‌కి సూచిస్తారు. ఈ రకమైన చెక్కుతో బ్యాంకుకు వెళ్లి నగదు తీసుకునేందుకు వీలుండదు. చెక్‌ను క్రాస్ చేయడం వలన నేరుగా డబ్బు విత్ డ్రా కాకుండా చెక్ పొందిన వ్యక్తి లేదా సూచించిన ఇతర వ్యక్తుల బ్యాంక్ ఖాతాలో మాత్రమే జమ చేసుకునేందుకు ఆస్కారం ఉంటుంది. దీని కోసం చెక్ వెనుక భాగంలోవారి సంతకం అవసరం.క్రాస్ చెక్ రకాలుఅయితే క్రాస్ చెక్లలోనూ అనేక రకాలు ఉన్నాయి. మొదటిది సాధారణ క్రాసింగ్. అంటే ఇప్పటిదాకా చెప్పుకొన్న అంశాలన్నీ ఈ రకం కిందకు వస్తాయి. రెండోది ప్రత్యేక క్రాసింగ్. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881లోని సెక్షన్ 124 ప్రకారం.. చెక్ గ్రహీత నిర్దిష్ట బ్యాంక్ ఖాతాలోకి వెళ్లాలని డ్రాయర్ కోరుకున్నప్పుడు ప్రత్యేక క్రాసింగ్ చెక్‌ను జారీ చేస్తారు.ఉదాహరణకు గ్రహీత ఎక్కువ బ్యాంక్ ఖాతాలను కలిగి ఉన్నట్లయితే, చెక్కు దిగువన ఉన్న పంక్తుల మధ్య దాని పేరును వ్రాయడం ద్వారా డ్రాయర్ బ్యాంక్‌ను పేర్కొనవచ్చు.ఇక చెక్‌పై క్రాసింగ్ లైన్ల మధ్య "అకౌంట్ పేయీ" అని రాసినట్లయితే, గ్రహీత మాత్రమే దాని నుండి డబ్బును విత్‌డ్రా చేయగలరని అర్థం. అయితే, ప్రత్యేక క్రాసింగ్‌తో నిర్దిష్ట బ్యాంకును పేర్కొన్నట్లయితే, డబ్బు ఆ బ్యాంకుకు మాత్రమే వెళ్తుంది. ఇది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881లో స్పష్టంగా పేర్కొననప్పటికీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank)తో సహా అనేక బ్యాంకులు దీనిని అనుసరిస్తున్నాయి.క్రాస్డ్ చెక్కులను ఎందుకు జారీ చేస్తారంటే..క్రాస్డ్ చెక్‌ల జారీ వెనుక ఉద్దేశం ఏమిటంటే, ఉద్దేశించిన గ్రహీత ఆ మొత్తాన్ని అందుకున్నారని నిర్ధారించుకోవడం. ఆ చెక్కు తప్పుడు చేతుల్లోకి వెళ్లినా.. అందులో నుంచి డబ్బులు తీసుకోలేరు. తద్వారా దాని భద్రతను (Cheque Security) పెంచుతుంది. -
అకౌంట్ ఓపెన్ చేస్తే రూ.5000 రివార్డ్
కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసేవారికి జియో ఓ శుభవార్త చెప్పింది. 2024 డిసెంబర్ 25 నుంచి డిసెంబర్ 31 మధ్య 'జియో పేమెంట్స్ బ్యాంక్' (Jio Payments Bank)లో కొత్త సేవింగ్స్ ఖాతా ఓపెన్ చేసిన కస్టమర్లకు రూ. 5,000 విలువైన రివార్డులను అందించనున్నట్లు ప్రకటించింది.మెక్‌డొనాల్డ్స్, ఈజ్‌మైట్రిప్(EaseMyTrip), మ్యాక్స్ ఫ్యాషన్ (Max Fashion) ప్రముఖ బ్రాండ్ల కూపన్లను.. జియో పేమెంట్స్ బ్యాంక్ రివార్డులలో భాగంగా అందించనుంది. డిజిటల్ ఫస్ట్ విధానానికి ప్రసిద్ధి చెందిన ఈ బ్యాంకులో కస్టమర్లు కేవలం ఐదు నిమిషాలలోపు సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు.అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలంటే - ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లలో జియో పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు.ఆన్లైన్ విధానం➤గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్‌లో జియో మనీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.➤యాప్ ఓపెన్ చేసిన తరువాత మీ మొబైల్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్ ఉపయోగించి జియో మనీ అకౌంట్ కోసం రిజిస్టర్ చేసుకోండి.➤రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీ ద్వారా మీ ఖాతాను ధృవీకరించండి.➤ధ్రువీకరించిన తరువాత మీ వ్యక్తిగత వివరాలు, చిరునామాతో పాటు.. ఇతర అవసరమైన సమాచారంతో అప్లికేషన్ ఫామ్‌ను పూరించండి.➤అప్లికేషన్ ఫామ్ పూరించిన తరువాత ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ వంటి అవసరమైన డాక్యుమెంట్స్ స్కాన్ చేసిన కాపీలను అప్లోడ్ చేయండి.➤తరువాత యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేసుకుని.. మీ ఖాతాను సెటప్ చేయండి.➤ఇవన్నీ పూర్తయిన తరువాత.. జియో స్టోర్ లేదా జియో పేమెంట్స్ బ్యాంక్ బ్రాంచ్ని సందర్శించి మీ ఖాతాను యాక్టివేట్ చేసుకోండి.ఆఫ్‌లైన్ విధానం➡సమీపంలోని జియో స్టోర్ లేదా జియో పేమెంట్స్ బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి.. జియో రిప్రెజెంటేటివ్ను కలవని.➡జియో పేమెంట్స్ బ్యాంక్ ఖాతాను ఓపెన్ చేయడానికి అప్లికేషన్ ఫామ్ తీసుకుని, అవసరమైన వివరాలను ఫిల్ చేయండి. ➡మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఇతర అవసరమైన డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీలను అందివ్వండి. ➡ఇవన్నీ పూర్తయిన తరువాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీ ద్వారా ఖాతాను ధృవీకరించండి.➡యూజర్ నేమ్, పాస్వర్డ్ వంటి వాటిని సెట్ చేసుకోవడం ద్వారా మీ ఖాతాను యాక్టివేట్ చేసుకోండి.అవసరమైన డాక్యుమెంట్స్ & అర్హతలు● జియో పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి.. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్ (పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ కార్డ్) వంటివి అవసరమవుతాయి.● 18 సంవత్సరాలు నిండి, చెల్లుబాటు అయ్యే ఆధార్ కార్డు కలిగిన భారతీయులు జియో పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి అర్హులు. -
ఐదు గంటల్లో కోటీశ్వరుడైన 9వ తరగతి విద్యార్ధి.. అసలేం జరిగిందంటే?
బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఒక విద్యార్థి తన బ్యాంక్ ఖాతా బ్యాలెన్స్‌ను చెక్ చేసినప్పుడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఎందుకంటే తన బ్యాండ్ బ్యాలెన్స్ ఏకంగా రూ.87.63 కోట్లుగా చూపించింది. దీంతో ఐదు గంటల పాటు ఆ విద్యార్ధి కోటీశ్వరుడయ్యాడు.బీహార్‌కు చెందిన 9వ తరగతి విద్యార్థి 'సైఫ్ అలీ' రూ.500 విత్‌డ్రా చేసుకోవడానికి ఏటీఎంకు వెళ్ళాడు, ఆ సమయంలో తన బ్యాంకు బ్యాలెస్ చెక్ చేస్తే.. రూ.87.65 కోట్లు ఉన్నట్లు చూపించింది. స్క్రీన్‌పైన కనిపించే బ్యాంక్ బ్యాలెన్స్ అతన్ని ఒక్కసారిగి ఆశ్చర్యపరిచింది. సైఫ్ వెంటనే ఇంటికి వెళ్లి తన తల్లితో ఈ విషయాన్ని పంచుకున్నాడు.సైఫ్ ఖాతాలో రూ.87.63 కోట్లు ఉన్న విషయం ఆ ఊరు మొత్తం తెలిసిపోయింది. మళ్ళీ అతడు బ్యాంక్ స్టేట్మెంట్ కోసం కస్టమర్ సర్వీస్ పాయింట్‌కు వెళ్లి చెక్ చేసాడు. అప్పుడు అతని ఖాతాలో కేవలం 532 రూపాయలు మాత్రమే ఉన్నట్లు చూపించింది. అంతే కాకుండా అతని బ్యాంక్ అకౌంట్ కూడా కొంత సేపు స్తంభించింది.ఈ వింత సంఘటన కేవలం ఐదు గంటలు మాత్రమే కొనసాగింది. తనకు తెలియకుండానే వచ్చిన అదృష్టం.. తనకు తెలియకుండానే అదృశ్యమైంది. నార్త్ బీహార్ గ్రామీణ బ్యాంక్.. సైఫ్ ఖాతాలో పొరపాటున ఇంత పెద్ద మొత్తం ఎలా జమ అయ్యిందో తెలుసుకోవడానికి దర్యాప్తు ప్రారంభించింది. ఈ తప్పిదం ఎలా జరిగిందన్న దానిపై బ్యాంకు అధికారులు ఇంకా స్పష్టమైన వివరణ ఇవ్వలేదు.ఇదీ చదవండి: అంబానీ, అదానీ కంటే సంపన్నుడు: ఇప్పుడు నిలువ నీడ లేక..ఇలాంటి సంఘటనలు మొదటిసారి కాదుఅనుకోకుండా బ్యాంక్ ఖాతాలో కోట్ల రూపాయలు జమ అయిన సంఘటనలు గతంలో కూడా చాలానే వెలుగులోకి వచ్చాయి. అయితే ఆ తరువాత వచ్చిన డబ్బు వచ్చినట్లే వెనక్కి వెళ్లాయి. కొంతమంది తమకు తెలిసిన వాళ్లకు ట్రాన్స్ఫర్ చేయడం వంటివి కూడా చేశారు. కానీ ఆ డబ్బును కూడా అధికారులు మళ్ళీ కట్టించుకున్నారు. అయితే సైఫ్ ఖాతాలో పడ్డ డబ్బు, ఐదు గంటల తరువాత మాయమైంది. -
ఏటీఎం నుంచే పీఎఫ్ నిధుల డ్రా
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) సభ్యులు అతి త్వరలోనే తమ భవిష్యనిధి (పీఎఫ్) క్లెయిమ్‌ల మొత్తాన్ని ఏటీఎం నుంచి ఉపసంహరించుకునే అవకాశం అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఈపీఎఫ్‌వో సభ్యుల ఆన్లైన్ క్లెయిమ్ ఆమోదానికి 7–10 రోజుల సమయం తీసుకుంటోంది. క్లెయిమ్ పరిష్కారం తర్వాత ఆ మొత్తాన్ని సభ్యుల బ్యాంక్ ఖాతాకు బదిలీ చేస్తున్నారు. ప్రతిపాదిత కొత్త విధానంలో సభ్యులకు ప్రత్యేకమైన కార్డులు అందించనున్నారు. వీటి ద్వారా ఏటీఎం నుంచి క్లెయిమ్ మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఏడు కోట్లకు పైగా సభ్యులకు బ్యాంక్‌ల మాదిరి సేవలు అందించాలన్నది ఈపీఎఫ్‌వో ఆలోచనగా పేర్కొన్నారు. ఈపీఎఫ్‌వో తన ఐటీ సదుపాయాలను మెరుగుపరుచుకుంటోందని కార్మిక శాఖ కార్యదర్శి సుమితా దావ్రా తెలిపారు. కొత్త వ్యవస్థ అమల్లోకి వస్తే పీఎఫ్ ప్రయోజనాలు, బీమా ప్రయోజనాలను ఏటీఎంల నుంచే పొందొచ్చని చెప్పారు. -
ఎస్బీఐలో అకౌంట్ ఉందా..?
న్యూఢిల్లీ: ఎలాంటి లావాదేవీలు లేకుండా ఇనాపరేటివ్‌గా మారిన ఖాతాలను పునరుద్ధరించేందుకు ఎస్బీఐ దేశవ్యాప్త ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. వరుసగా రెండేళ్ల పాటు ఎలాంటి లావాదేవీ లేని సేవింగ్స్, కరెంట్ ఖాతాలను ఇనాపరేటివ్‌గా (నిర్వహణలో లేని) బ్యాంకులు పరిగణిస్తుంటాయి. ఈ ఖాతాలను తిరిగి యాక్టివేట్ చేసుకోవాలంటే తాజా కేవైసీ పూర్తి చేయాలి.లావాదేవీల నిర్వహణతో ఖాతాలు ఇనాపరేటివ్‌గా మారకుండా చూసుకోవచ్చన్నది ఈ కార్యక్రమం ద్వారా తాము ఇచ్చే కీలక సందేశమని ఎస్బీఐ తెలిపింది. జన్‌ధన్ ఖాతాలను యాక్టివ్‌గా ఉంచడం, కస్టమర్లు నిరంతరం లావాదేవీలు నిర్వహించేలా చూసేందుకు మళ్లీ కేవైసీ చేయాల్సిన అవసరాన్ని ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి ప్రస్తావించారు. ఈ కార్యక్రమానికి ముందు ఎస్బీఐ తమ బిజినెస్ కరస్పాండెంట్లకు గురుగ్రామ్‌లో ఒక రోజు వర్క్‌షాప్ నిర్వహించింది. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (PMJDY) ఖాతాలపై ప్రత్యేక దృష్టి సారించి, ఇన్ ఆపరేటివ్ అకౌంట్ యాక్టివేషన్ ప్రాముఖ్యత గురించి పాల్గొనేవారికి అవగాహన కల్పించడంపై ఈ వర్క్‌షాప్ దృష్టి సారించింది. -
ఒకే అకౌంట్లో వందల కోట్లు మార్పిడి!
కోరుట్ల: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా వందలాది కోట్ల మార్పిడి. మూడేళ్లలో ఓ వ్యక్తి ఖాతాలోకి మళ్లిన నగదు గురించి తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. స్టాక్ మార్కెట్ పేరిట ఓ ముఠా చేసిన సైబర్‌నేరం ఇది. మెట్‌పల్లికి చెందిన వైద్యుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు తీగ లాగితే డొంగ కదిలింది. రెండు నెలల క్రితం జగిత్యాల జిల్లాలోని మెట్‌పల్లికి చెందిన ఓ వైద్యుడిని స్టాక్‌మార్కెట్ యాప్ పేరిట ట్రాప్‌లోకి దించిన నిందితులు ఆయన ఖాతా నుంచి రూ.72లక్షలు కాజేశారు. తాను మోసపోయిన విషయం తెలుసుకున్న వైద్యుడు సైబర్‌క్రైం పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన జిల్లా పోలీస్ ఉన్నతధికారులు ఓ పోలీస్ బృందాన్ని ప్రత్యేకంగా ఏర్పాటుచేసి లోతైన విచారణ కోసం రంగంలోకి దించారు.దుబాయి కేంద్రంగా..మెట్పల్లి వైద్యుడి కేసును చాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు విచారణ మొదలుపెట్టిన క్రమంలో స్టాక్‌మార్కెట్ యాప్ పేరిట సైబర్ క్రైంకు పాల్పడిన నిందితులకు చెందిన బ్యాంక్ ఖాతాలను గుర్తించారు. ఈ నిందితులు పంజాబ్‌లోని జలంధర్‌లో ఉన్నట్లు గుర్తించి వారం క్రితం అక్కడికి వెళ్లి మకాం వేశారు. పక్క ప్రణాళికతో ముగ్గురిని పట్టుకున్నారు. ఒక్కొక్కరి ఖాతాలను పరిశీలించి స్టాక్‌మార్కెట్ పేరిట సాగుతున్న సైబర్‌క్రైం వివరాలు విచారించారు. ఈక్రమంలో ఒకరి అకౌంట్లో 2021 సంవత్సరం నుంచి దాదాపుగా రూ.50వేలు కోట్ల డబ్బుల మార్పిడి జరిగినట్లుగా గుర్తించి నివ్వెరపోయారు. ఈ ముగ్గురు నిందితులకు దుబాయిలోని ఓ ముఠా ద్వారా ట్రాన్జాక్షన్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.పోలీసుల అదుపులో నిందితులు..మెట్పల్లి వైద్యుడిని స్టాక్‌మార్కెట్ యాప్ పేరిట సైబర్ ఉచ్చులోకి లాగిన ముగ్గురు నిందితులను జగిత్యాల జిల్లా ప్రత్యేక పోలీస్ బృందం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరిని పూర్తిస్థాయిలో విచారించేందుకు జలంధర్ నుంచి జగిత్యాలకు తీసుకొచి్చనట్లు తెలిసింది. దుబాయి కేంద్రంగా సాగుతున్న సైబర్ ముఠా తీరుతెన్నులు. వారితో భాగస్వామ్యులుగా ఉన్న వ్యక్తుల వివరాలు, హవాలా మార్కెట్‌తో ఏమైనా సంబంధాలున్నాయా? అన్న దిశలో పోలీస్ విచారణ కొనసాగుతోంది. -
4.5 లక్షల ‘మ్యూల్’ ఖాతాలను స్తంభింపజేసిన కేంద్రం
సైబర్ నేరాల ద్వారా వచ్చే ఆదాయాన్ని వినియోగించుకునేందుకు వాడే దాదాపు 4.5 లక్షల ‘మ్యూల్’(మనీ లాండరింగ్ కోసం వాడే ఖాతాలు) బ్యాంక్ ఖాతాలను కేంద్రం స్తంభింపజేసింది. సైబర్ మోసగాళ్లు ఈ మ్యూల్ ఖాతాల ద్వారానే లావాదేవీలు జరుపుతున్నట్లు ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) అధికారులు తెలిపారు. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ప్రధానమంత్రి కార్యాలయం అధికారులతో జరిగిన సమావేశంలో ఈమేరకు వివరాలు వెల్లడించారు.బ్యాంకింగ్ వ్యవస్థలో మ్యూల్ ఖాతాలను వినియోగించుకుని సైబర్ నేరస్థులు చెల్లింపులు చేస్తున్నట్లు చెప్పారు. గతేడాది అన్ని బ్యాంకుల్లో కలిపి మొత్తంగా 4.5 లక్షల మ్యూల్ ఖాతాలను స్తంభింపజేసినట్లు తెలిపారు. అందులో అత్యధికంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్లున్నట్లు పేర్కొన్నారు.ఇదీ చదవండి: పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణంI4C సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్స్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ వెల్లడించిన వివరాల ప్రకారం ఎస్బీఐలోని వివిధ శాఖల్లో సుమారు 40,000 మ్యూల్ బ్యాంక్ ఖాతాలు కనుగొన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 10,000 (ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా), కెనరా బ్యాంక్‌లో 7,000 (సిండికేట్ బ్యాంక్‌తో సహా), కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో 6,000, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్‌లో 5,000 మ్యూల్ ఖాతాలు కనుగొన్నట్లు అధికారులు తెలిపారు. జనవరి 2023 నుంచి నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో సుమారు ఒక లక్ష సైబర్ ఫిర్యాదులు నమోదయ్యాయని చెప్పారు. గత ఏడాదిలో సుమారు రూ.17,000 కోట్ల నగదు మోసం జరిగిందని పేర్కొన్నారు.మ్యూల్ ఖాతాల నిర్వహణ ఇలా..సైబర్ నేరస్థులు బ్యాంకు ఖాతాదారులను నమ్మించి వారికి తెలియకుండా కేవైసీ పూర్తి చేస్తారు. మనీలాండరింగ్‌కు పాల్పడుతూ ఖాతాదారుల ప్రమేయం లేకుండా లావాదేవీలు పూర్తి చేస్తారు. లీగల్ కేసు అయితే ఖాతాదారులను అదుపులోకి తీసుకుంటారు. కాబట్టి బ్యాంకులోగానీ, బయటగానీ అపరిచితులు, బంధువులకు బ్యాంకు, వ్యక్తిగత వివరాలు తెలియజేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఓటీపీలు కూడా ఇతరులతో పంచుకోకూడదని చెబుతున్నారు. -
బ్యాంకు ఖాతాల్లో ‘హవాలా’ లావాదేవీలు
పళ్లిపట్టు(తవిుళనాడు): యువకుల బ్యాంకు ఖాతాల్లో అక్రమ లావాదేవీలకు సంబంధించి నలుగురు యువకులను ఈడీ అధికారులు అరెస్టు చేసి బెంగళూరుకు తరలించి దర్యాప్తు ముమ్మరం చేసిన ఘటన తమిళనాడులోని పళ్లిపట్టులో చోటు చేసుకుంది. తిరువళ్లూరు జిల్లాలోని పళ్లిపట్టు సమీపం కుమారాజుపేట దళితవాడకు చెందిన తమిళరసన్ (25), మెట్టూరుకు చెందిన అరవిందన్ (24), ప్రకాష్ (25)ల బ్యాంకు ఖాతాల్లో రూ.3కోట్లు అక్రమంగా జమ చేసినట్లు, గుర్తించి వారి అకౌంట్లు సీజ్ చేసిన బ్యాంకు అధికారులు ఈడీకి సమాచారం ఇచ్చారు. ముంబై. చెన్నై, బెంగళూరు, పాండిచ్చేరికి చెందిన ఈడీ అధికారుల బృందం 20 మంది గురువారం కుమారాజుపేట, మోట్టూరులో గురువారం ఉదయం నుంచి శుక్రవారం వేకువజాము వరకు దాడులు నిర్వహించి వారిని విచారించారు.తమిళరసన్ తమ్ముడు అజిత్‌కు సైతం సంబంధం ఉందని నిర్ధారించి నలుగురిని అరెస్ట్ చేసి బెంగళూరుకు తరలించారు. యువకుల ఖాతాల ద్వారా రూ.8 కోట్ల వరకు హవాలా డబ్బులు చేతులు మారినట్లు అనుమానిస్తున్నారు. ప్రధాన సూత్రధారులెవరూ అన్న కోణంలో ఈడీ విచారణ జరుపుతుంది. -
పదేళ్లలో ‘జన్‌ధన్’ విజయాలు.. సమస్యలు
దేశంలోని ప్రతి ఒక్కరికి బ్యాకింగ్ రంగ సేవలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2014లో సరిగ్గా ఇదే రోజు ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన(పీఎంజేడీఐ)ను ప్రారంభించింది. గడిచిన పదేళ్లలో ఈ పథకంలో దాదాపు 53.14 కోట్ల మంది లబ్ధిదారులు చేరారు. అందరికీ ఆర్థిక అక్షరాస్యత పెంపొందించాలనే ఆలోచనతో ప్రారంభమైన ఈ పథకం గురించి కొన్ని కీలక విషయాలు తెలుసుకుందాం.గడిచిన పదేళ్లలో 53.14 కోట్ల పీఎంజేడీవై ఖాతాలు తెరిచారు.మార్చి 2015 వరకు 15.67 కోట్లు ఉన్న ఈ బ్యాంక్ ఖాతాలు అప్పటి నుంచి 3.6 రెట్లు పెరిగాయి.ప్రస్తుతం ఈ ఖాతాల్లో మొత్తం రూ.2.31 లక్షల కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. ఆగస్టు 2015 నుంచి ఈ డిపాజిట్లు 15 రెట్లు అధికమయ్యాయి.వీటిలో దాదాపు 66.6% ఖాతాలు (35.37 కోట్లు) గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లోని లబ్ధిదారులవే కావడం విశేషం.మొత్తం ఖాతాదారుల్లో దాదాపు 55.6% (29.56 కోట్లు) మహిళలు ఉన్నారు.పీఎంజేడీవై చొరవతో దేశవ్యాప్తంగా 36.14 కోట్ల రూపే కార్డులను జారీ చేశారు. ఇది డిజిటల్ లావాదేవీల వృద్ధికి గణనీయంగా దోహదపడింది.ఈ ఖాతాల ద్వారా 2024లో సుమారు 16,443 ఆన్లైన్ లావాదేవీలు జరిగాయి. 2019లో జరిగిన 2,338 కంటే ఇది చాలా ఎక్కువ.పీఎంజేడీవై చెప్పుకోదగ్గ మైలురాళ్లు చేరుకున్నప్పటికీ, దాదాపు 8.4% ఖాతాలు ప్రస్తుతం జీరో బ్యాలెన్స్‌ను కలిగి ఉన్నాయి. దాదాపు 20% అకౌంట్లు ఇన్‌యాక్టివ్‌లో ఉన్నాయి.జన్‌ధన్ ఖాతా ఓపెన్ చేయాలంటే కనీస బ్యాలెన్స్ అవసరం లేదు. రూపే డెబిట్ కార్డ్‌లు వాడుతున్న ఖాతారులకు రూ.2 లక్షల ప్రమాద బీమా ఉంటుంది.ప్రమాదానికి ముందు 90 రోజులలోపు ఖాతాదారులు తమ రూపే డెబిట్ కార్డ్‌ను కనీసం ఒకసారైనా వాడాలి. అలా చేస్తే బీమా ప్రయోజనాలకు అర్హులవుతారు.ఏదైనా అత్యవసర సమయాల్లో ముందుగానే నగదు వినియోగించుకుని తర్వాత చెల్లించేందుకు వీలుగా రూ.10,000 ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం కల్పిస్తున్నారు.సమస్య ఏమిటంటే..చాలా జన్‌ధన్ ఖాతాల్లో ఎలాంటి లావాదేవీలు లేకుండా నిరుపయోగంగా పడి ఉన్నాయి. వీటి నిర్వహణ బ్యాంకులకు భారంగా పరిణమిస్తుంది. ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించిన కొత్తలో ప్రతి ఒక్కరికి ఆర్థిక అక్షరాస్యత అందించడమే లక్ష్యమని చెప్పుకొచ్చింది. కానీ ఇది ఆశించిన మేర నెరవేరలేదని నివేదికలు చెబుతున్నాయి. గ్రామీణులకు ఇప్పటికీ బ్యాంకు లావాదేవీలపై సరైన అవగాహన ఏర్పరలేదు. ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం ఉందనే విషయం చాలా మంది ఖాతాదారులకు తెలియదు. తెలిసినా ఈ సదుపాయాన్ని ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై సరైన అవగాహన ఉండదు.ఇదీ చదవండి: ప్రముఖ కంపెనీలో వాటా కొనుగోలు చేసిన బిగ్‌బీ కుటుంబం?ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే..జన్‌ధన్ 2.0 కార్యక్రమం కింద ఈ పథకాన్ని మరింత విస్తరించి ఖాతాదారుల్లో ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించాలని భావిస్తున్నారు. అయితే పెరుగుతున్న సాంకేతికత నేపథ్యంలో దాదాపు చాలామంది డిజిటల్ లావాదేవీల వైపు మొగ్గు చూపుతున్నారు. దాంతో కొత్త ఆర్థిక సాధనాలను అందుబాటులోకి తీసుకురావాలనీ కేంద్రం యోచిస్తోంది. ఇప్పటికే యూపీఐ, భీమ్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను జన్‌ధన్ ఖాతాలకు అనుసంధానం చేస్తున్నారు. దాంతో డిజిటల్ లావాదేవీలను పెంచాలని యోచిస్తున్నారు. -
బ్యాంక్ ఖాతాలు క్లోజ్.. సమస్య పరిష్కారానికి చర్చలు
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన తమ బ్యాంకులోని ఖాతాలను కొనసాగించేలా ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకు ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో బ్యాంకు ఉద్యోగులు అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆయా బ్యాంకు అకౌంట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఈ తరుణంలో బ్యాంకులు తిరిగి రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలు కొనసాగించేలా చర్చలు జరుపుతున్నాయి.ఈ మేరకు రెండు బ్యాంకులు విడుదల చేసిన సంయుక్త ప్రకటన ప్రకారం..‘కర్ణాటక ప్రభుత్వానికి సంబంధించిన రెండు బ్యాంకుల్లోని ఖాతాలను ఉపసంహరించుకుంటున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. అయితే దీనిపై చర్చలు సాగుతున్నాయి. సమస్యను సామరస్యంగానే పరిష్కరించుకుంటాం’ అని తెలిపాయి.ఇదీ చదవండి: ఆ బ్యాంకుల్లో ఖాతాలు క్లోజ్.. కర్ణాటక సంచలన నిర్ణయంఇటీవల కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్మెంట్ బోర్డ్, కర్ణాటక స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌కు చెందిన మొత్తం రూ.22 కోట్ల డిపాజిట్లను ఉపసంహరించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. గతంలోనూ ప్రభుత్వ శాఖలు, సంస్థలు, కార్పొరేషన్లు, బోర్డులు, స్థానిక సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఇతర సంస్థల డిపాజిట్లు, పెట్టుబడులకు సంబంధించి బ్యాంకు ఉద్యోగులు అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దాంతో ప్రభుత్వం ఆయా బ్యాంకులను హెచ్చరించింది. కానీ వాటి తీరు మార్చుకోలేదు. దాంతో ఇటీవల రూ.22 కోట్లు ఉపసంహరించుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. ఫలితంగా బ్యాంకు ఖాతాలను ముగిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఇందుకు సెప్టెంబర్ 20, 2024 చివరి తేదీగా ఖరారు చేశారు. దీనిపై రెండు బ్యాంకుల అధికారులు ప్రభుత్వంతో చర్చలు సాగిస్తున్నాయి. -
Banking Laws Amendment Bill: ఒక అకౌంట్‌కు నలుగురు నామినీలు
న్యూఢిల్లీ: ప్రభుత్వం బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు, 2024ను ప్రవేశపెట్టింది. ఒక బ్యాంకు ఖాతాకు నామినీల ఎంపికను ప్రస్తుతమున్న ఒకటి నుండి నలుగురికి పెంచడంసహా పలు కీలక అంశాలకు సంబంధించిన ఈ బిల్లును లోక్‌సభలో ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి ప్రవేశపెట్టారు. డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణ, సేవల విస్తృతి బిల్లు ప్రధాన లక్ష్యం. అన్‌క్టైమ్డ్ డివిడెండ్లను ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్‌కు బదలాయించడం, బ్యాంకింగ్ పరిపాలనా, ఆడిట్ వ్యవహారాల్లో మరింత మెరుగుదలకూడా ఈ బిల్లు దోహదపడనుంది. డైరెక్టర్íÙప్లకు సంబంధించిన వడ్డీ పరిమితిని పునరి్నర్వచించటానికి సంబంధించిన అంశం బిల్లులో మరో కీలకాంశం. దాదాపు ఆరు దశాబ్దాల క్రితం నిర్ణయించిన ప్రస్తుత పరిమితి రూ. 5 లక్షల నుంచి రూ.2 కోట్లకు పెంచడం దీని ఉద్దేశం. 2024–25 వార్షిక బడ్జెట్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించిన ఈ బిల్లును గత వారం క్యాబినెట్ ఆమోదించింది. -
ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ కావాలంటే ఇది తప్పనిసరి!
ఆదాయపు పన్ను చెల్లింపుదారులు రిఫండ్స్ పొందడానికి ఇన్కమ్ ట్యాక్స్ ఈ-ఫైలింగ్ సైట్లో తమ బ్యాంకు ఖాతాను రీ వ్యాలిడేట్ చేసుకోవాలని ఆదాయపు పన్ను శాఖ ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్ట్ చేసింది. బ్రాంచ్ మార్పులు, ఐఎఫ్ఎస్సీ మార్పులు లేదా బ్యాంకు విలీనాల కారణంగా బ్యాంక్ ఖాతా డేటాను అప్డేట్ చేసినప్పుడు రీ వ్యాలిడేషన్ చేయాల్సి ఉంటుందని ఎకనామిక్ టైమ్స్ నివేదిక తెలిపింది.ట్యాక్స్ పేయర్స్ తమ బ్యాంక్ అకౌంట్లను రీ వ్యాలిడేషన్ చేసుకునేందుకు చెల్లుబాటు అయ్యే యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో ఈ-ఫైలింగ్ పోర్టల్ లో రిజిస్టర్డ్ యూజర్ అయి ఉండాలి. రీ వ్యాలిడేషన్ చేసే బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా పాన్ కార్డుతో లింక్ అయి ఉండాలి. అలాగే కొత్త బ్యాంకు ఖాతాను జోడించాలన్నా కూడా ఆ ఖాతాను పాన్‌తో లింక్ చేసి ఉండాలి. యూజర్ కు చెల్లుబాటు అయ్యే ఐఎఫ్ఎస్సీ కోడ్, అకౌంట్ నెంబరు ఉండాలి.ఇప్పటికే ఉన్న బ్యాంకు ఖాతాను రీవాల్యులేట్ చేయండిలా..స్టెప్ 1: https://incometax.gov.in/iec/foportal/సందర్శించండిస్టెప్ 2: లాగిన్ అయ్యి ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి.స్టెప్ 3 'బ్యాంక్ అకౌంట్' ఎంచుకుని రీవాలిడేట్ మీద క్లిక్ చేయండి.స్టెప్ 4: అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సీ, ఏసీ టైప్ వంటి బ్యాంక్ అకౌంట్ వివరాలను అప్డేట్ చేయండి.స్టెప్ 5: వాలిడేట్ పై క్లిక్ చేయండి.కొత్త బ్యాంకు అకౌంట్‌ను జోడించడానికి..స్టెప్ 1: https://incometax.gov.in/iec/foportal/సందర్శించండిస్టెప్ 2: లాగిన్ అయ్యి ప్రొఫైల్ మీద క్లిక్ చేయాలి.స్టెప్ 3: మై బ్యాంక్ అకౌంట్ పై క్లిక్ చేయండి (జోడించబడిన, విఫలమైన మరియు తొలగించబడిన బ్యాంక్ అకౌంట్స్ ట్యాబ్ లు డిస్ ప్లే అవుతాయి.)స్టెప్ 4: బ్యాంక్ ఖాతాను జోడించండిస్టెప్ 5: వాలిడేట్ పై క్లిక్ చేయండి. Kind Attention Taxpayers!✅Having a validated bank account is essential for receiving of refunds. ✅An already validated bank account will require re-validation after updation of account details consequent to change in branch, IFSC, Merger of bank, etc.For Updating existing… pic.twitter.com/9DnuSMaYbP— Income Tax India (@IncomeTaxIndia) June 4, 2024 -
కోటక్ మహీంద్రా బ్యాంక్ చార్జీల్లో మార్పులు
కోటక్ మహీంద్రా బ్యాంక్ శాలరీ అకౌంట్, పొదుపు ఖాతాలపై కొన్ని సేవలకు ఛార్జీలను సవరించింది. మే 1 నుంచే ఈ మార్పులు అమల్లోకి వచ్చాయి. యావరేజ్ బ్యాలెన్స్, నగదు, ఏటీఎం లావాదేవీలకు పరిమితులు, స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఫెయిల్యూర్ ఫీజు, ఉచిత చెక్‌బుక్‌ల పరిమితికి సంబంధించిన ప్రమాణాలను బ్యాంక్ అప్డేట్ చేసింది.కీలక మార్పులు ఇవే..⇒ సగటు బ్యాలెన్స్ ప్రమాణాలుసంకల్ప్ సేవింగ్స్ అకౌంట్: సెమీ అర్బన్ అండ్ రూరల్‌లో రూ.2,500.రోజువారీ పొదుపు ఖాతా: మెట్రో అండ్ అర్బన్‌లో రూ.15,000, సెమీ అర్బన్‌లో రూ.5,000, రూరల్‌లో రూ.2,500.⇒ ఉచిత నగదు లావాదేవీ పరిమితులుడైలీ సేవింగ్స్/శాలరీ అకౌంట్, ప్రో సేవింగ్స్, క్లాసిక్ సేవింగ్స్ అకౌంట్లలో ఇప్పుడు నెలకు 5 ఉచిత లావాదేవీలు లేదా గరిష్టంగా రూ .2 లక్షలకు పరిమితం చేసింది.ప్రివీ నియాన్/మాక్సిమా ఖాతాలకు సంబంధించి ఇప్పుడు నెలకు 7 ఉచిత లావాదేవీలు లేదా రూ.5 లక్షలకు పరిమితం చేసింది. అలాగే సోలో సేవింగ్స్ ఖాతాకు నెలకు ఒక ఉచిత లావాదేవీ లేదా రూ.10,000 కు తగ్గించింది.⇒ ఏటీఎం లావాదేవీ పరిమితులుఎవ్రీడే సేవింగ్స్, క్లాసిక్ సేవింగ్స్, ప్రో సేవింగ్స్, ఏస్ సేవింగ్స్, ప్రివీ ఖాతాదారులకు కోటక్ ఏటీఎంలలో నెలకు 7 ఉచిత ట్రాన్సాక్షన్లు, ఇతర బ్యాంకు ఏటీఎంలలో అయితే నెలకు 7 ఉచిత లావాదేవీలు ఉంటాయి.కోటక్, ఇతర బ్యాంకు ఏటీఎంలలో కలిపి నెలకు గరిష్టంగా 30 ఉచిత లావాదేవీలు ఉంటాయి.ఇక ఎవ్రీడే శాలరీ, ఎడ్జ్ శాలరీ అకౌంట్లకు కోటక్ ఏటీఎంలలో నెలకు 10 ఉచిత ట్రాన్సాక్షన్స్, ఇతర బ్యాంకు ఏటీఎంలలో ఎలాంటి మార్పు లేదు. అపరిమిత ఉచిత లావాదేవీలు ఉంటాయి.⇒ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఫెయిల్యూర్ ఫీజుసేవింగ్స్, శాలరీ అకౌంట్లన్నింటికీ రూ.200 చొప్పున కొత్త రుసుము విధించనున్నారు. గతంలో ఎలాంటి చార్జీలు ఉండేవి కావు.⇒ చెక్ బుక్ లిమిట్సోలో సేవింగ్స్ అకౌంట్: ఏడాదికి 25 ఉచిత చెక్ లీవ్స్ నుంచి 5 ఉచిత చెక్ లీఫ్లకు తగ్గించారు.⇒ లావాదేవీ వైఫల్య రుసుముడెబిట్ కార్డు/ఏటీఎం వినియోగ రుసుము: సరిపడా నిధులు లేకపోవడం వల్ల లావాదేవీలు విఫలమైతే ఒక్కో లావాదేవీకి రూ.25 చార్జీ ఉంటుంది. చెక్ జారీ చేసినప్పుడు, రిటర్న్ చేసినప్పుడు తీసుకునే ఫీజు రూ.250కి పెరిగింది. -
ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉండాలి.. ఆర్బీఐ ఏం చెబుతోంది?
ఈ రోజుల్లో దాదాపు పుట్టిన బిడ్డ దగ్గర మొదలుకొని.. అందరికి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. అయితే ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉండాలి. ఎక్కువ అకౌంట్స్ ఉంటే ఏమైనా సమస్య వస్తుందా? అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. అయితే ఓ సంస్థ నుంచి మరో సంస్థకు మారిన ప్రతిసారీ బ్యాంక్ అకౌంట్ కూడా మారుతుంది. ఇలా ఒక వ్యక్తికి కనీస నాలుగు లేదా ఐదు అకౌంట్స్ ఉంటాయి. ఉద్యోగులకు మాత్రమే కాకుండా రైతులకు, సాధారణ వ్యక్తులకు కూడా మల్టిపుల్ అకౌంట్స్ ఉంటాయి.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఒక వ్యక్తికి ఇన్ని అకౌంట్స్ మాత్రమే ఉండాలి అనే నిబంధన విధించలేదు. కాబట్టి ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ అయినా ఉండవచ్చు. అయితే ప్రతి ఖాతాలోనూ మినిమమ్ బ్యాలెన్స్ అనేది ఉంచాల్సి ఉంటుంది. మినిమమ్ బ్యాలెన్స్ లేకుండా దాని కొంత మొత్తంలో ఫైన్ వేసే అవకాశం ఉంటుంది. అయితే అన్ని బ్యాంకులు ఇలా ఫైన్ వేస్తాయని చెప్పలేము. -
Rahul Gandhi: ఎస్సీ, ఎస్టీ మహిళల ఖాతాలో లక్ష
సివనీ/షాదోల్: కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రతి ఎస్సీ, ఎస్టీ మహిళ బ్యాంక్ ఖాతాకు ఏటా రూ.లక్ష జమ చేస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా సివనీ జిల్లాలోని ధనోరాలో ర్యాలీలో గిరిజనులనుద్దేశిస్తూ రాహుల్ మాట్లాడారు.‘‘ కేంద్రప్రభుత్వ విభాగాల్లో కీలకమైన ప్రభుత్వ పదవుల్లో 90 మంది ఐఏఎస్ అధికారులుంటే వారిలో కేవలం ఒకే ఒక్క గిరిజనుడు ఉన్నాడు. దేశజనాభాలో గిరిజనులు ఎనిమిది శాతంకంటే ఎక్కువే ఉంటారు. అయినా దేశంలోని టాప్ 200 కంపెనీల్లో ఒక్కదానికి కూడా గిరిజనులు యజమానులుగా లేరు. కనీసం ఆ సంస్థల్లో అత్యున్నత స్థాయి అధికారులుగానూ లేరు. దేశంలో ఒక్క మీడియా సంస్థకైనా ఆదివాసీ యజమానిగా ఉన్నారా? ఒక్కరైనా న్యూస్యాంకర్ ఉన్నారా?’ అంటూ గిరిజనుల అభ్యున్నతికి మోదీ సర్కార్ కృషిచేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మేం అధికారంలోకి వస్తే ఏడాదిలోపు ఆదివాసీల భూ హక్కుల సమస్యను పరిష్కరిస్తాం. కేంద్ర ఉద్యోగాల్లో కాంట్రాక్ట్ వ్యవస్థకు చరమగీతం పాడి 30 లక్షల కేంద్ర ఉద్యోగాలను భర్తీచేస్తాం’ అని అన్నారు. -
బ్యాంక్ అకౌంట్ లేకుండానే యూపీఐ పేమెంట్స్..!
బ్యాంక్ అకౌంట్‌తో పని లేకుండానే యూపీఐ పేమెంట్స్ చేసుకునే సదుపాయాన్ని తీసుకొచ్చింది ఫిన్ టెక్ సంస్థ మొబీక్విక్ (MobiKwik). తన ప్లాట్‌ఫారమ్‌లో 'పాకెట్ UPI' అనే కొత్త ఫీచర్‌ను ప్రకటించింది. ఇది వినియోగదారులకు బడ్జెట్, ఫైనాన్స్ మేనేజ్మెంట్పై మెరుగైన నియంత్రణను కలిగి ఉండేందుకు వీలు కల్పిస్తుందని ఫిన్‌టెక్ కంపెనీ పేర్కొంది. పాకెట్ UPI వినియోగదారులు వారి బ్యాంక్ ఖాతాను లింక్ చేయకుండానే మొబీక్విక్ వ్యాలెట్ ద్వారా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు. తద్వారా వినియోగదారులు యూపీఐ చెల్లింపులు చేసేటప్పుడు అదనపు ఎంపికతో వారి చేతుల్లో మరింత శక్తిని ఇస్తుందని వన్ మొబీక్విక్ లిమిటెడ్ (మొబీక్విక్) కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. పాకెట్ యూపీఐ యూజర్లు వారి బ్యాంక్ ఖాతా కాకుండా మొబీక్విక్ వాలెట్ నుంచి డబ్బులను బదిలీ చేయడం ద్వారా తప్పు లావాదేవీలు, ఆర్థిక మోసాల నుంచి రక్షణ పొందవచ్చు. తద్వారా ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు బహిర్గతం పరిమితం అవుతుంది. -
‘పేటీఎం’ కస్టమర్లకు సాయం చేయండి
ముంబై: యూపీఐ హ్యాండిల్ ‘పేటీఎం’ను ఉపయోగిస్తున్న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్) కస్టమర్లను 4–5 వేరే బ్యాంకులకు మార్చే అవకాశాలను పరిశీలించాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ)కి ఆర్బీఐ సూచించింది. తద్వారా చెల్లింపుల వ్యవస్థలో అంతరాయం కలగకుండా చూడాలని, కస్టమర్లకు అసౌకర్యం కలగకుండా సహాయం చేయాలని పేర్కొంది. నిబంధనల ఉల్లంఘనకు గాను మార్చి 15 నుంచి దాదాపు అన్ని కార్యకలాపాలు నిలిపివేయాలంటూ పీపీబీఎల్‌ను ఆర్బీఐ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సంస్థ కస్టమర్లకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటోంది. పీపీబీఎల్ వెబ్సైట్ ప్రకారం 30 కోట్ల వాలెట్లు, 3 కోట్ల మంది బ్యాంకు కస్టమర్లు ఉన్నారు. దేశీయంగా రిటైల్ చెల్లింపులు, సెటిల్మెంట్ వ్యవస్థను ఎన్పీసీఐ నిర్వహిస్తోంది. వేరే బ్యాంకులకు ‘పేటీఎం’ హ్యాండిల్‌ను మైగ్రేట్ చేసే క్రమంలో పేమెంట్ సరీ్వస్ ప్రొవైడర్లుగా (పీఎస్పీ) 4–5 బ్యాంకులను ఎన్పీసీఐ ఎంపిక చేయొచ్చని సూచించింది. తద్వారా ఒకే బ్యాంకుపై ఆధారపడితే తలెత్తే రిస్కులు తగ్గుతాయని తెలిపింది. ‘పేటీఎం’ హ్యాండిల్‌ను ఉపయోగిస్తున్న కస్టమర్లు, వ్యాపారుల హ్యాండిల్స్‌కు మాత్రమే మైగ్రేషన్ వర్తిస్తుందని, వేరే యూపీఐ అడ్రస్‌లు ఉన్నవారికి అవసరం లేదని పేర్కొంది. పీపీబీఎల్‌లో ఖాతాలు ఉన్న వారు మార్చి 15లోగా వేరే బ్యాంకులకు మారేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని మరోసారి సూచించింది. -
ఓటీపీలతో రూ.6.90 లక్షలకు కుచ్చుటోపీ
పెద్దదోర్నాల: ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నగదు మొత్తం మీ అకౌంట్లోకి జమ చేస్తామని నమ్మించిన సైబర్ నేరగాళ్లు బ్యాంక్ అకౌంట్లోని నగదు మొత్తాన్ని కాజేసిన ఘటన ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండల పరిధిలోని ఐనముక్కలలో ఆదివారం వెలుగు చూసింది. ఈ ఘరానా మోసంలో గ్రామానికి చెందిన ఇద్దరు సోదరులు నగదు పోగొట్టుకున్నారు. ఎస్సై అంకమరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 14వ తేదీన గ్రామానికి చెందిన చిట్యాల ఆంజనేయరెడ్డి అనే యువకుడికి గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నగదు మొత్తం ఒక్కసారే అకౌంట్లో పడుతుందని, ఫోన్ పే ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి మాట్లాడాలని సూచించాడు. తొలుత అకౌంట్ నుంచి కొంత మొత్తం కట్ అయి తిరిగి పడుతుందని మోసగాళ్లు నమ్మబలికారు. తనది ఆండ్రాయిడ్ ఫోన్ కాకపోవడంతో ఆ యువకుడు గ్రామానికి చెందిన లింగాల శ్రీను నంబర్ నుంచి గుర్తు తెలియని నంబర్‌కు కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడాడు. అయితే.. శ్రీను అకౌంట్లో అమౌంట్ తక్కువగా ఉందని చెప్పడంతో శ్రీను తమ్ముడు లింగాల రమేష్ నంబర్ నుంచి ఫోన్‌చేసి కాన్ఫరెన్స్ కాల్ కలిపి ముగ్గురూ సైబర్ నేరగాళ్లతో మాట్లాడారు. అతని మాటలు నమ్మిన రమేష్ తన ఫోన్‌కు వచ్చిన ఓటీపీ నంబర్లతో పాటు ఫోన్‌పేకు సంబంధించిన పాస్‌వర్డ్‌ను చెప్పటంతో లింగాల రమేష్ అకౌంట్లోని రూ.6.90 లక్షల నగదు మాయమైంది. అయితే.. మాయమైన డబ్బు నుంచి రూ.79 వేల నగదు తిరిగి బాధితుడి అకౌంట్‌కు జమ అయినట్లు ఎస్సై తెలిపారు. తమకు వచ్చిన ఫోన్ నంబర్‌కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అది స్విచ్చాఫ్ వస్తుండటంతో తాము మోసపోయినట్టు సోదరులు గ్రహించారు. హుటాహుటిన పోలీస్ స్టేషన్‌తో పాటు స్థానిక బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేశారు. బాధితులకు ఢిల్లీ, మధ్యప్రదేశ్ నుంచి ఫోన్లు వచ్చాయని, ఏ రాష్ట్రానికి ఫోన్ చేయాలనుకుంటే అదే భాషలతో మాట్లాడే వాళ్లతో ఫోను చేయిస్తారని, డబ్బులు వస్తాయని నమ్మకంగా ఆశ చూపి అకౌంట్లలోని డబ్బులు మాయం చేస్తారని ఎస్సై తెలిపారు. గుర్తు తెలియని నంబర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. -
‘ఖాతాదారుల సమస్యల్ని పట్టించుకోండి కొంచెం’, బ్యాంక్‌లపై ఆర్బీఐ కామెంట్
ముంబై: కస్టమర్ ఫిర్యాదుల పరిష్కారంపై బ్యాంకింగ్ మరింత దృష్టి పెట్టాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్ ఎం రాజేశ్వర్ రావు పిలుపునిచ్చారు. ‘‘ఖాతాదారుల సముపార్జనను బ్యాంకులకు తీసుకురావడానికి బ్యాంకులు తీవ్రంగా దృష్టి పెట్టాయి. అయితే కస్టమర్ ఫిర్యాదుల పరిష్కారంపై పెద్దగా శ్రద్ధ చూపడం లేదు’’ అని 2023 ఫిక్కీ బ్యాంకింగ్ వార్షిక సమావేశంలో (ఎఫ్‌ఐబీఏసీ) కార్యక్రమంలో ఆయన వ్యాఖ్యానించారు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్– ఐబీఏ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆప్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ– ఫిక్కీ ఇక్కడ బుధవారం నుంచి నిర్వహించిన రెండు రోజుల ముగింపు సమావేశంలో రాజేశ్వరావు మాట్లాడారు. ఎఫ్‌ఐబీఏసీ 2023లో గవర్నర్ శక్తికాంతదాస్ బుధవారం ప్రారంభోపన్యాసం చేసిన సంగతి తెలిసిందే. ‘‘అనిశ్చితి సమయాల్లో గెలుపు’’ అన్న అంశంపై ప్రధానంగా జరిగిన ఈ సమావేశాల్లో గురువారం డిప్యూటీ గవర్నర్ రాజేశ్వర రావు ఏమన్నారంటే.... దురదృష్టవశాత్తూ, కస్టమర్ ఫిర్యాదులకు సకాలంలో పరిష్కారాలను అందించడానికి బ్యాంకులు చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా లేవు. ముఖ్యంగా పెరుగుతున్న సాంకేతికత, ఇన్‌స్ట్రమెంట్ల స్థాయిల్లో కస్టమర్ సేవలు ఉండడం లేదు. సేవా పరిశ్రమగా గర్వించే రంగంలో ఈ తరహా పరిస్థితి ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. బ్యాంకుల బోర్డులు ఈ విషయంపైతీవ్రగా ఆలోచన చేయాలి. కస్టమర్ల ఫిర్యాదుల పరిష్కారానికి పెద్దపీట వేయాలి. టెక్ బ్యాంకింగ్ వాతావరణంలో సైబర్ సెక్యూరిటీని పటిష్టం చేయడం, సైబర్ మోసాలను నిరోధించడంపై కూడా బ్యాంకులు మరింత దృష్టి సారించాలి. వినియోగదారుని మోసగించడానికి చేసే చర్యలను పటిష్టంగా అరికట్టగలగాలి. ఆయా సమస్యల పరిష్కారం దిశలో మనం మరింత కష్టపడి పని చేయాలి. తెలివిగా పని చేయాలి. కస్టమర్ల నమ్మకాన్ని నిలుపుకోవడానికి, బ్యాంకింగ్‌ను బలోపేతం చేయడానికి, డిజిటల్ సెక్యూరిటీకి సంబంధించిన బెదిరింపుల నుండి కస్టమర్‌ను రక్షించడానికి మనం కలిసి పని చేయాలి. -
ఖాతాల్లోకి రూ.820 కోట్లు - ఆనందపడేలోపే..
గతంలో అనుకోకుండా కొంతమంది సామాన్యుల బ్యాంక్ ఖాతాల్లోకి కోట్ల రూపాయలు జమయిన సంఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి మరో సంఘటన మళ్ళీ జరిగినట్లు సోషల్ కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. యూకో బ్యాంక్ కస్టమర్లకు ఇటీవల ఒక పెద్ద జాక్‌పాట్ తగిలి.. అంతలోనే మిస్ అయిపోయింది. యూకో బ్యాంక్ ఖాతాదారుల ఖాతాల్లోకి ఏకంగా 820 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. అమౌంట్ డిపాజిట్ అయినట్లు వారి మొబైల్ నెంబర్లకు మెసేజ్‌లు కూడా వచ్చాయి. ఒక్కసారిగా లెక్కకు మించిన డబ్బు ఖాతలోకి రావడంతో కొందరు ఉబ్బితబ్బిబ్బయ్యారు. వెంటనే తేరుకున్న బ్యాంక్ జరిగిన పొరపాటుని గుర్తించి.. డబ్బు డిపాజిట్ అయిన బ్యాంక్ ఖాతాల లావాదేవీలను బ్లాక్ చేసింది. అంత కాకుండా ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్ (IMPS) కూడా నిలిపివేసింది. ఇదీ చదవండి: దీపావళికి నెట్లో ఎక్కువగా ఏం సర్చ్ చేసారంటే..? రివీల్ చేసిన సుందర్ పిచాయ్ ఈ నెల 10, 13 తేదీల్లో జరిగిన కొన్ని సాంకేతిక లోపాల కారణంగా అమౌంట్ పెద్ద మొత్తంలో ట్రాన్స్ఫర్ అయినట్లు బ్యాంక్ వెల్లడించింది. అయితే ఇప్పటికే 79 శాతం (సుమారు రూ. 649 కోట్లు) రికవరీ చేసినట్లు వెల్లడించింది. ఇంకా రావాల్సిన మొత్తం రూ. 171 కోట్లు. ఈ డబ్బు మొత్తం రికవరీ అవుతుందా? లేదా అనే సందేహాలు కూడా వినిపిస్తున్నాయి. -
లైఫ్‌టైమ్ జీరో బ్యాలెన్స్ అకౌంట్! డెబిట్, క్రెడిట్ కార్డులు కూడా...
BoB LITE Savings Account: బ్యాంక్ అకౌంట్ లేని వారికి, జీరో బ్యాలెన్స్ అకౌంట్ కావాల్సిన వారి కోసం ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) సరికొత్త అకౌంట్‌ను అందిస్తోంది. బీఓబీ ప్రత్యేక పండుగ క్యాంపెయిన్‌లో భాగంగా ‘బీఓబీ లైట్ సేవింగ్స్ అకౌంట్’ పేరిట లైఫ్‌టైమ్ జీరో బ్యాలెన్స్ అకౌంట్‌ను ప్రకటించింది. ఈ అకౌంట్‌తో మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండానే బ్యాంకింగ్ సేవలు పొందవచ్చని బ్యాంక్ ఆఫ్ బరోడా ఓ ప్రకటనలో పేర్కొంది. ఉచితంగా డెబిట్, క్రెడిట్ కార్డులు బీఓబీ లైట్ సేవింగ్స్ అకౌంట్‌తో పాటు కస్టమర్లు ఉచితంగా డెబిట్, క్రెడిట్ కార్డులు కూడా పొందవచ్చు. అయితే లైఫ్‌టైమ్ ఫ్రీ రూపే ప్లాటినమ్ డెబిట్ కార్డు కోసం సగటు త్రైమాసిక బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయాల్సి ఉంటుంది. అలాగే అర్హతను బట్టీ లైఫ్‌టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డు కూడా పొందవచ్చు. వీటితో పాటు మరిన్ని ఆఫర్లను కస్టమర్లకు బ్యాంక్ అందిస్తోంది. ఇప్పటికే వివిధ కన్జ్యూమర్ బ్రాండ్లతో ఒప్పందం చేసుకున్న బ్యాంక్ ఆఫ్ బరోడా.. డిసెంబర్ 31 వరకు వివిధ బ్రాండ్లపై ఆకర్షణీయమైన ఆఫర్లు అందిస్తోంది. రిలయన్స్ డిజిటల్, క్రోమా, మేక్ మై ట్రిప్, అమెజాన్, బుక్ మై షో, మింత్రా, స్విగ్గీ, జొమాటోలో కొనుగోళ్లపై స్పెషల్ ఆఫర్లు లభిస్తాయని బ్యాంక్ ఆఫ్ బరోడా ఓ ప్రకటనలో తెలిపింది. బీఓబీ లైట్ సేవింగ్స్ అకౌంట్ ప్రయోజనాలు ఇది లైఫ్‌టైమ్ జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్. 10 ఏళ్లు పైబడిన భారతీయ పౌరులెవరైనా ఈ కౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఉచితంగా రూపే ప్లాటినమ్ డెబిట్ కార్డు. ఇందు కోసం మెట్రో/అర్బన్‌లో రూ.3000, సెమీ అర్బన్‌లో రూ.2000, గ్రామీణ శాఖల్లో రూ.1000 త్రైమాసిక సగటు బ్యాలెన్స్ నిర్వహించాల్సి ఉంటుంది. అర్హత ఆధారంగా లైఫ్‌టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డు ఒక ఆర్థిక సవత్సరంలో ఉచితంగా 30 చెక్ లీవ్స్ -
మరో ఘటన.. ఫార్మసీ ఉద్యోగి అకౌంట్లో రూ.753 కోట్లు.. ఏం చేశాడంటే..
సామాన్యుల బ్యాంక్ ఖాతాల్లో వందలాది కోట్ల రూపాయలు వచ్చి పడుతున్నాయి. కొన్ని బ్యాంకులు పొరపాటున సమాన్యుల అకౌంట్లలో కోట్లాది రూపాయలు డిపాజిట్ చేస్తున్నాయి. ఆశ్చర్యానికి లోనైన ఖాతాదారులు తేరుకునే లోపు పొరపాట్లను తెలుసుకుని అకౌంట్లను ఫ్రీజ్ చేస్తున్నాయి. తాజాగా చెన్నైలో ఓ ఫార్మసీ ఉద్యోగి బ్యాంకు ఖాతాలో రూ.753 కోట్లు జమయ్యాయి. మహమ్మద్ ఇద్రీస్ తన కోటక్ మహీంద్రా బ్యాంకు (Kotak Mahindra bank) ఖాతా నుంచి శుక్రవారం (అక్టోబర్ 6) రూ.2000 లను స్నేహితుడికి బదిలీ చేశారు. ఈ లావాదేవీ తర్వాత, తన అకౌంట్ బ్యాలెన్స్‌ని చెక్ చేసుకోగా రూ. 753 కోట్ల బ్యాలెన్స్ కనిపించింది. బ్యాంక్ అకౌంట్లో అంత పెద్ద మొత్తం కనిపించేసరికి ఆశ్చర్యానికి, ఆందోళనకు గురైన ఇద్రిస్ వెంటనే బ్యాంక్ అధికారులకు తెలియజేశారు. దీంతో బ్యాంకు అధికారులు వెంటనే ఆయన అకౌంట్‌ను స్తంభింపజేశారు. ఈ పెద్ద మొత్తం కనిపించిన దురాశకు పోకుండా బ్యాంకు అధికారులకు తెలియజేసిన ఇద్రిస్‌పై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. తమిళనాడులో ఇలాంటి ఘటన జరగడం ఇది మూడోసారి. గతంలో చెన్నైకి చెందిన రాజ్‌కుమార్ అనే క్యాబ్ డ్రైవర్లో ఖాతాలో తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ రూ.9,000 కోట్లు డిపాజిట్ చేసింది. పొరపాటును గుర్తించిన బ్యాంకు ఆ డబ్బును వెనక్కి తీసుకుంది. అంతకు ముందు తంజావూరుకు చెందిన గణేశన్ అనే వ్యక్తి బ్యాంకు ఖాతాలోనూ రూ. 756 కోట్లు జమయ్యాయి. -
ఓటేయకుంటే బ్యాంక్ అకౌంట్ల నుంచి రూ.350 కట్! నిజమేనా?
ఎన్నికల్లో ఓటు వేయనివారి బ్యాంకు ఖాతాల నుంచి రూ.350 పెనాల్టీ కింద భారత ఎన్నికల సంఘం (ECI) కట్ చేస్తుందంటూ ఇంటర్నెట్లో ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి హిందీ వార్తపత్రికలో ప్రచురితమైన ఓ వార్త క్లిప్పింగ్ సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతోంది. ఓటు వేయడాన్ని విస్మరించినవారి బ్యాంకు ఖాతాల నుంచి రూ.350 కట్ అవుతుందని, సదురు వ్యక్తికి ఒకవేళ బ్యాంక్ అకౌంట్ లేకపోతే మొబైల్ రీఛార్జ్ నుంచి ఆ మొత్తం కట్ చేస్తారని ఆ న్యూస్ క్లిప్పింగ్‌లో ఉంది. దీన్ని కొంత మంది విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఓటు వేయకపోతే డబ్బులు కట్ అవుతాయంటూ హెచ్చరిస్తున్నారు. (అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. ఇక అన్నింటికీ ఆ సర్టిఫికెటే ఆధారం!) దీనిపై ప్రభుత్వ వార్తాసంస్థ పీఐబీకి చెందిన ఫ్యాక్ట్‌చెక్ (pib fact check) విభాగం స్పందించింది. ఇది పూర్తిగా ఫేక్ న్యూస్ (fake news) అని తేల్చింది. గతంలోనే సర్కులేట్ అయిన ఈ ఫేక్ న్యూస్ మరోసారి ప్రచారంలోకి వచ్చిందని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్’(ట్విటర్) ద్వారా పేర్కొంది. కాగా ఈ వార్త ఓ హిందీ వార్తాపత్రికలో 2019లో ప్రచురితమైంది. హోలీ ప్రాంక్‌గా దీన్ని ప్రచురించారు. అయితే ఇది అప్పటి నుంచి అసలైన వార్తగా ప్రచారం జరుగుతోంది. దీనిపై కేంద్ర ఎలక్షన్ కమిషన్ 2021లోనే క్లారిటీ ఇచ్చింది. क्या लोकसभा चुनाव में मतदान नहीं किए जाने पर बैंक अकाउंट से कटेंगे 350 रुपए❓ जानें वायरल ख़बर की सच्चाई❕#PIBFactCheck: 🔶 यह ख़बर #फ़र्ज़ी है। 🔶 @ECISVEEP ने ऐसा कोई निर्णय नहीं लिया है। 🔶 जिम्मेदार नागरिक बनें, मतदान अवश्य करें!! 🔗 https://t.co/8EwXdkIPlF pic.twitter.com/ikFLUndfCh — PIB Fact Check (@PIBFactCheck) September 15, 2023 -
బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయిందా? సింపుల్‌గా యాక్టివేట్ చేసుకోండిలా!
రిజర్వ్ బ్యాంక్ నియమాల ప్రకారం, ఒక కస్టమర్ నిర్ణీత గడువు లోపల తప్పకుండా కేవైసీ అప్డేట్ చేసుకోవాలి. అలా చేయని పక్షంలో అకౌంట్ తాత్కాలికంగా నిలిపివేస్తారు. ఇది జరిగితే లావాదేవీలు చేయడం కుదరదు. అయితే కేవైసీ ప్రక్రియ ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది. ఈ కథనంలో అకౌంట్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలనే విషయాలను తెలుసుకుందాం. కేవైసీ అప్డేట్ అనేది హై రిస్క్ కస్టమర్లకు రెండు సంవత్సరాలు, మీడియం అండ్ లో (తక్కువ) రిస్క్ కస్టమర్లకు వరుసగా 8, 10 సంవత్సరాల వరకు ఉంటుంది. RBI ప్రకారం, 2019 మే 29న జారీ చేసిన సర్క్యులర్‌ను 2023 మే 4న అప్డేట్ చేసింది. కావున దీని ప్రకారం ఖాతాదారుడు పాన్ కార్డు లేదా ఫారమ్ 16ని అందించనట్లైతే అకౌంట్ తాత్కాలికంగా నిలిపివేస్తారు. అంతకంటే ముందు బ్యాంకులు ఎస్ఎమ్ఎస్ లేదా ఈ-మెయిల్ ద్వారా కష్టమరలకు హెచ్చరికలు జారీ చేస్తాయి. అకౌంట్ యాక్టివేట్ చేయడం ఎలా? కేవైసీ పూర్తి చేయకపోతే ఖాతా తాత్కాలికంగా నిలిపివేసిన అకౌంట్‌ను మళ్ళీ రీయాక్టివేట్ చేసుకోవచ్చు. దీనికి సులభమైన మార్గాలు ఉన్నాయి. 1) కేవైసీ ఫారమ్‌తో నేరుగా బ్యాంకుని సందర్శించి యాక్టివేట్ చేసుకోవచ్చు 2) మీ బ్యాంక్ ఆన్లైన్ బ్యాంకింగ్ పోర్టల్ ద్వారా కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇదీ చదవండి: మహీంద్రా ఫస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ ఇదే! మీకు తెలుసా? ఆన్లైన్ బ్యాంకింగ్ పోర్టల్.. బ్యాంక్ ఆన్లైన్ బ్యాంకింగ్ పోర్టల్ లాగిన్ చేసి, 'KYC' ట్యాబ్ మీద క్లిక్ చేయాలి. స్క్రీన్‌పైన సూచనలను అనుసరించి మీ పేరు, చిరునామా, పుట్టిన తేదీ వంటి వివరాలు ఫిల్ చేయాలి. ఆధార్, పాన్ ఇతర అవసరమైన పత్రాల స్కాన్ చేసిన కాపీలను అప్లోడ్ చేయాలి. ఇవన్నీ పూర్తయిన తరువాత సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. ఆ తరువాత సర్వీస్ నెంబర్ పొందుతారు. దీనికి సంబంధించి ఎస్ఎమ్ఎస్ లేదా ఈ-మెయిల్ వంటివి పొందుతారు. -
పాన్‌కార్డు పనిచేయడం లేదా? మరి జీతం అకౌంట్లో పడుతుందా?
PAN - Aadhar link: ప్రతిఒక్కరి దైనందిన జీవితంలో పాన్ కార్డ్ ఓ భాగమైపోయింది. ఆర్థిక లావాదేవీలన్నింటికీ పాన్ కార్డ్ చాలా అవసరం. ఈ పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవడం ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దీనికి గడువు 2023 జూన్ 30తో ముగిసింది. ఆ తర్వాత ఆధార్‌తో లింక్ చేయని పాన్ కార్డులు పనిచేయకుండా (ఇనాపరేటివ్) పోయాయి. ఇప్పటికీ పాన్-ఆధార్ లింక్ చేయనివారు కొంతమంది ఉన్నారు. దీంతో వారి పాన్ కార్డులు ఇనాపరేటివ్ అయ్యాయి. ఈ నేపథ్యంలో అలాంటి పాన్ కార్డులున్నవారికి జీతం అకౌంట్లో క్రెడిట్ అవుతుందా అనే సందేహం తలెత్తింది. (ఎస్బీఐలో అద్భుత పథకం! గడువు కొన్ని రోజులే...) ఆధార్‌తో లింక్ చేయకపోవడంతో పాన్ కార్డులు ఇనాపరేటివ్‌గా మారడం వల్ల ఆర్థిక లావాదేవీల్లో కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ జీతం బ్యాంక్ ఖాతాకు జమ కాకుండా ఆపదు. అయితే ఈ పనిచేయని పాన్ కార్డును ఎక్కడా ఉపయోగించడానికి వీలుండదు. కానీ జీతాలు జమ చేసేది యాజమాన్యాలు కాబట్టి బ్యాంకులు ఎలాంటి ఆంక్షలు పెట్టలేవు. ఇదీ చదవండి: నిమిషాల్లో లోన్.. ఆర్బీఐ ప్రాజెక్ట్ అదుర్స్! ఆనంద్ మహీంద్రా ప్రశంస మొదట ఉచితంగా పాన్-ఆధార్ లింకింగ్‌కి 2022 మార్చి 31 వరకు ప్రభుత్వం గడవు విధించింది. ఆ తర్వాత రూ. 500 జరిమానాతో 2022 జూన్ 30 వరకు గడువును పొడిగించింది. అనంతరం రూ. 1000 జరిమానాతో 2023 మార్చి 31 వరకు, చివరిసారిగా 2023 జూన్ 30 వరకు గడవులు పొడిగించుకుంటూ వచ్చింది. తర్వాత మరోసారి గడువును ప్రభుత్వం పొడించలేదు. దీంతో 2023 జూన్ 30 తర్వాత ఆధార్‌తో లింక్ చేయని పాన్ కార్డులు ఇనాపరేటివ్‌గా మారిపోయాయి. -
యాక్సిస్ బ్యాంక్ ఖాతాదారులకు బంపరాఫర్!
ముంబై: ప్రైవేటు రంగంలోని యాక్సిస్ బ్యాంక్ కొత్త మార్గాన్ని ఎంచుకుంది. పరిశ్రమలో వినూత్నంగా సబ్స్క్రిప్షన్ (చందా) ఆధారిత సేవింగ్స్ అకౌంట్‌ను తీసుకొచ్చింది. ఈ ఖాతాలో కనీస బ్యాలన్స్ ఉంచాల్సిన అవసరం లేదు. చాలా రకాల సేవలకు విడిగా ఎలాంటి చార్జీలు పడవు. కాకపోతే ప్రతి నెలా చందా కింద రూ.150 చెల్లించుకోవాలి. లేదంటే ఏడాదికోసారి అయితే రూ.1,650 చెల్లిస్తే సరిపోతుంది. దీనికి ‘ఇన్ఫినిటీ సేవింగ్స్ అకౌంట్’ అని పేరు పెట్టింది. మెజారిటీ బ్యాంక్‌లు సేవింగ్స్ ఖాతాలను కనీస బ్యాలన్స్తో అందిస్తున్నాయి. ఇది ప్రాంతాన్ని బట్టి రూ.2,000 నుంచి రూ.15,000 మధ్య ఉంది. ఈ కనీస బ్యాలన్స్ తగ్గిపోతే పెనాల్టీ రూపంలో బ్యాంక్‌లు చార్జీలు బాదుతుంటాయి. చందా విధానంలో ఖాతాలో కనీస బ్యాలన్స్ అవసరం లేదని, దేశీయ లావాదేవీలపై ఎలాంటి చార్జీలు లేవని, ఉచిత డెబిట్ కార్డులను అందిస్తున్నట్టు, ఎన్ని సార్లు అయినా ఉచితంగా వినియోగించుకోవచ్చని యాక్సిస్ బ్యాంక్ ప్రకటించింది. -
ఏబీపీఎస్‌కు మారితేనే ఉపాధి కూలి జమ
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఉపాధిహామీ చట్టం కింద ఉపాధి పొందాలంటే తప్పనిసరిగా ఆధార్ ఆధారిత చెల్లింపు బ్రిడ్జి సిస్ట మ్ (ఏబీపీఎస్)కు మారాల్సిందే. గతంలో మూడునాలుగు పర్యాయాలు ఈ డెడ్‌లైన్ మారినా, ఇకపై ఎలాంటి పొడిగింపులు ఉండవని కేంద్ర ప్రభుత్వవర్గాలు స్పష్టం చేస్తు న్నట్టు తెలుస్తోంది. ఆగస్టు 31వ తేదీ వరకే బ్యాంక్ ఖాతా ఆధారిత, ఆధార్ ఆధారిత పద్ధతుల్లో పేమెంట్స్ చేస్తారు. ఇకపై ఆధార్–ఎనెబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (ఏఈపీఎస్) కాకుండా, సెపె్టంబర్ 1వ తేదీ నుంచి ఏబీపీఎస్ అనుసరిస్తున్నారనే విషయాన్ని గమనించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ♦ ఈ కొత్త విధానంలో భాగంగా ఉపాధి హామీ జాబ్‌కార్డ్ హోల్డర్, తన జాబ్కార్డ్ను బ్యాంక్ ఖాతా, ఆధార్‌తో అనుసంధానం చేయడంతో పాటు దీనిని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) మ్యాపర్‌తో తప్పనిసరిగా కనెక్ట్ చేయాలి. ♦ ఆధార్‌తో బ్యాంక్ అకౌంట్ సీడింగ్, ఎన్పీసీఐ మ్యాపర్‌లో మ్యాపింగ్ చేయడానికి ఖాతాదారు కేవైసీ వివరాలు, బయోమెట్రిక్, స్థానికత, ఆధార్ డేటా బేస్–బ్యాంక్ ఖాతాల్లోని వివరాల్లో తేడాలు లేకుండా చూసుకోవడం వంటివి చేయాల్సి ఉంటుంది. ♦ ఉపాధిహామీ జాబ్‌కార్డు సమాచారంలో తేడాలున్నా వేజ్ పేమెంట్ అనేది స్తంభిస్తుంది. ♦ ఉపాధి కూలీలు బ్యాంక్ ఖాతాలను తరచుగా మార్చడం, దానిని ప్రోగ్రామ్ ఆఫీసర్లు అప్డేట్ చేయకపోవడం, తదితర కారణాల నేపథ్యంలో లబ్దిదారులకు నష్టం జరగకుండా ఏబీపీఎస్ అత్యుత్తమ ప్రత్యామ్నాయమని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ స్పష్టం చేసింది. ♦క్షేత్రస్థాయిలో వివిధ జిల్లాల్లో జాబ్‌కార్డును బ్యాంక్ ఖాతా, ఆధార్‌తో అనుసంధానం చేయడంలో సిబ్బందికి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి అధికారులు చెబుతున్నారు. ఈ డెడ్‌లైన్ మరికొంతకాలం పొడిగిస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని సూచిస్తున్నారు. లిబ్టెక్ నివేదికలో ఏముందంటే... ♦కేంద్ర ప్రభుత్వం సాంకేతిక అంశాలకు ప్రాధాన్యం ఇచ్చి ఉపాధిహామీ చట్టం ఆశయాలు, లక్ష్యాలను నీరుగారుస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ♦ రాష్ట్రంలోని మొత్తం కోటీ ఐదు లక్షల మంది (ఇన్ యాక్టివ్ వర్కర్లతో సహా) ఉపాధి కూలీల్లో 42 లక్షల మంది ఏబీపీఎస్‌కి అనర్హులుగా ఉండిపోయారు. ♦ పనిచేస్తున్న 61 లక్షల కూలీల్లో (యాక్టివ్ వర్కర్స్) 5.33 లక్షల మంది ఏబీపీఎస్‌కి అర్హత సాధించలేకపోయారు. ♦ నరేగా పోర్టల్ నుంచి సమాచారాన్ని విశ్లే షించిన లిబ్టెక్ ఇండియా సంస్థ తన ని వేదికలో ఈ విషయాలను వెల్లడించింది. పేమెంట్ మిస్ కాకుండా ప్రభుత్వాలే బాధ్యత వహించాలి యాక్టివ్ వర్కర్స్ కేటగిరీలో ఏబీపీఎస్ అర్హత విషయంలో మొత్తం కార్మికుల సంఖ్యను పరిగణనలోకి తీసుకున్నపుడు గణనీయమైన సంఖ్యలో కార్మికులు దీనికి అర్హత సాధించలేదని అర్థమవుతుంది. దీంతో వారు ఉపాధి హామీ కింద పని పొందడానికి అనర్హులుగా చేస్తుంది. ఇది ఉపాధి చట్టం సూత్రాలకు స్పష్టమైన ఉల్లంఘనే. అంతేకాకుండా, గత 18 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా నికరంగా తొలగించిన దాదాపు 4 లక్షల మంది కార్మికులను ఏబీపీఎస్ అర్హత గణాంకాలు పరిగణనలోకి తీసుకోలేదు. తెలంగాణలో ఏ ఒక్క కార్మికుడు కూడా ఏబీపీఎస్ కారణంగా ఉపాధి హామీ చట్టం కింద పని, పేమెంట్ మిస్ కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. – చక్రధర్ బుద్దా,డైరెక్టర్, లిబ్టెక్ ఇండియా సంస్థ -
1 నుంచి ‘ఉపాధి’కి ఆధార్ చెల్లింపులు
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఉపాధి హామీ కూలీలకు సెప్టెంబరు 1వతేదీ నుంచి పూర్తి స్థాయిలో ఆధార్‌తో అనుసంధానం చేసిన బ్యాంకు అకౌంట్లకు మాత్రమే వేతనాలు చెల్లింపులు చేస్తారు. ఉపాధి హామీ జాబ్ కార్డు నెంబరుతో పాటు ఆధార్, బ్యాంకు ఖాతాలను ఉమ్మడిగా అనుసంధానం చేసుకుంటేనే ఆయా ఖాతాలకు వేతనాలు జమ అవుతాయి. ఈ మూడింటినీ అనుసంధానం చేసుకోని వారికి సెప్టెంబరు ఒకటో తేదీ తర్వాత ఉపాధి పథకం పనులకు హాజరైనా వేతనాలు జమ చేసే పరిస్థితి ఉండదని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం అమలులో అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఈ మేరకు కీలక మార్పులు తెచ్చింది. దీన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 1వతేదీ నుంచే అమలు చేయాలని తొలుత భావించినా చాలా రాష్ట్రాల్లో (మన రాష్ట్రం కాదు) పెద్ద సంఖ్యలో కూలీల జాబ్‌కార్డులను ఆధార్, బ్యాంకు అకౌంట్లతో అనుసంధానించే ప్రక్రియ పూర్తి కాకపోవడంతో పలు దఫాలు వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా సెప్టెంబరు ఒకటి నుంచి ఖచ్చితంగా నూతన విధానంలోనే కూలీలకు వేతనాల చెల్లింపులు ఉంటాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్రాలకు స్పష్టం చేసినట్టు అధికారులు వెల్లడించారు. కేంద్రం ఈ ప్రతిపాదనలను తేకముందు నుంచే మన రాష్ట్రంలో ఉపాధి కూలీలకు పాక్షికంగా ఆధార్ అనుసంధానంతో కూడిన వేతనాల చెల్లింపులు కొనసాగుతున్నట్లు వివరించారు. రాష్ట్రంలో పథకం అమలులో పారదర్శకత కోసం వీలైనంత మేర కూలీల జాబ్‌కార్డులను బ్యాంకు అకౌంట్లతో అనుసంధానించగా మిగతావారికి కూడా ఇప్పటివరకు వేతనాలను చెల్లిస్తున్నారు. అయితే సెప్టెంబరు ఒకటి నుంచి మాత్రం వందకు వంద శాతం తప్పనిసరిగా ఆధార్ అనుసంధానం విధానంలో వేతనాల చెల్లింపుల ప్రక్రియ ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో 99.53 శాతం అనుసంధానం ఆంధ్రప్రదేశ్‌లో 69 లక్షల కుటుంబాలకు చెందిన 1.24 కోట్ల మంది కూలీలు ఉపాధి హామీ పథకంలో పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో ఏటా గరిష్టంగా 47.74 లక్షల కుటుంబాలకు సంబంధించి దాదాపు 79.81 లక్షల మంది కూలీలు ఉపాధి పనులతో లబ్ధి పొందుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు కలిపి గత ఐదేళ్లుగా ఏటా రూ.ఐదారు వేల కోట్లకు తక్కువ కాకుండా ప్రయోజనం చేకూరుతోంది. వేతనాల చెల్లింపుల్లో కేంద్రం తెచ్చిన నూతన విధానంతో ఉపాధి హామీ కూలీలెవరూ ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే అన్ని జాగ్రత్తలు తీసుకుంది. మొత్తం 1.24 కోట్ల మంది కూలీలలో 99.53 శాతం మంది జాబ్ కార్డులు ఆధార్, బ్యాంకు అకౌంట్లతో అనుసంధానం ప్రక్రియను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. గత మూడేళ్లలో ఒక్క రోజైనా ఉపాధి పనులకు హాజరైన క్రియాశీలక కూలీలలో 97.2 శాతం మందిని కూడా ఇప్పటికే అనుసంధానించారు. ఉపాధి పథకం కూలీల జాబ్‌కార్డులను ఆధార్, బ్యాంకు అకౌంట్లతో అనుసంధానించే ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. త్రిపుర, కేరళ, లడఖ్, పుదుచ్చేరి, చత్తీస్‌గఢ్, సిక్కిం, తమిళనాడు తరువాత స్థానాల్లో ఉన్నాయి. మన రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో పేర్లు నమోదు చేసుకున్న కూలీలలో ఇంకా కేవలం 60 వేల మందికి సంబంధించి మాత్రమే ఆధార్ అనుసంధానం ప్రక్రియ పూర్తి కావాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. వారు గతంలో పేర్లు నమోదు చేసుకున్నప్పటికీ ఉపాధి పనులపై పెద్దగా ఆసక్తి చూపని వారే కావచ్చని పేర్కొంటున్నారు. -
2014కు ముందు సర్వం అవినీత, కుంభకోణాలమయం
భోపాల్: దేశంలో 2014కు ముందు మొత్తం అవినీతి, కుంభకోణాలే రాజ్యమేలాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పేద ప్రజల హక్కులను, సంపదను విచ్చలవిడిగా దోచుకున్నారని మండిపడ్డారు. పేదల కోసం ప్రభుత్వం కేటాయించిన సొమ్ము వారికి చేరకుండా మధ్యలోనే లూటీ చేశారని ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వచ్చాక ఆ అరాచకానికి తెరపడిందని, ఇప్పుడు ప్రతి పైసా నేరుగా పేదల బ్యాంకు ఖాతాల్లోకే పంపిస్తున్నామని ఉద్ఘాటించారు. నీతి ఆయోగ్ నివేదికను ఆయన ప్రస్తావించారు. గత ఐదేళ్లలో ఏకంగా 13.50 కోట్ల మంది భారతీయులు దారిద్య్ర రేఖ దిగువ(పీబీఎల్) కేటగిరీ నుంచి బయటపడ్డారంటూ నీతి ఆయోగ్ ప్రకటించిందని గుర్తుచేశారు. దేశంలో పన్నులు చెల్లించేవారి సంఖ్య భారీగా పెరిగిందని అన్నారు. పన్నుల సొమ్మును మంచి పనుల కోసం, దేశ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్న నమ్మకం వారిలో కనిపిస్తోందని చెప్పారు. సోమవారం మధ్యప్రదేశ్‌లో కొత్తగా నియమితులైన ప్రభుత్వ ఉపాధ్యాయుల శిక్షణా కార్యక్రమంలో ప్రధాని వర్చువల్‌గా ప్రసంగించారు. భోపాల్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ‘అమృతకాలంలో’ తొలి సంవత్సరం నుంచే సానుకూల వార్తలు రావడం ఆరంభమైందని, దేశంలో సంపద వృద్ధి చెందుతోందని, పేదరికం తగ్గిపోతోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్(ఐటీఆర్)లు దాఖలు చేసే వారి సగటు వార్షికాదాయం ఆదాయం 2014లో రూ.4 లక్షలు ఉండేదని, ఇప్పుడు అది రూ.13 లక్షలకు చేరిందని వెల్లడించారు. ప్రజలు దిగువ ఆదాయ వర్గం నుంచి ఎగువ ఆదాయ వర్గంలోకి చేరుకుంటున్నారని మోదీ తెలిపారు. దేశమంతటా సానుకూల వాతావరణం దేశంలో దాదాపు అన్ని రంగాలు బలోపేతం అవుతున్నాయని, అదే స్థాయిలో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని, నూతన ఉద్యోగాల సృష్టి జరుగుతోందని ప్రధాని చెప్పారు. 2014లో మన దేశం ప్రపంచంలో పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేదని, ఇప్పుడు ఐదో ఆర్థిక వ్యవస్థగా మారిందని చెప్పారు. కొత్తగా నియమితులైన 5,580 మంది ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం శిక్షణ ఇచి్చంది. -
50 కోట్ల దాటిన జన్ ధన్ యోజన ఖాతాలు.. ఉపయోగాలు ఇవే
దేశంలో ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన ( పీఎంజేడీవై ) ఖాతాల సంఖ్య 50 కోట్ల మార్క్‌ను దాటాయని, వాటిల్లో 56 శాతం మహిళలవేనని కేంద్ర ఆర్ధిక శాఖ అధికారికంగా ప్రకటించింది. మొత్తం 50 కోట్ల అకౌంట్లలో 67 శాతం రూరల్, సెమీ- అర్బన్ ప్రాంతాల ప్రజలు ఓపెన్ చేసినట్లు పేర్కొంది. ఇక ఈ అకౌంట్లలో మొత్తం రూ.2.03లక్షల కోట్లు డిపాజిట్ చేసినట్లు తెలిపిన ఆర్ధిక శాఖ.. 34 కోట్ల మందికి రూపే కార్డ్‌లను ఉచితంగా అందించినట్లు వెల్లడించింది. జన్ ధన్ యోజన ఖాతాల్లో సగటు బ్యాలెన్స్ రూ. 4,076 కాగా, వీరిలో 5.5 కోట్లకు పైగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) పొందుతున్నారని చెప్పింది. ఉపయోగాలు ఇవే కేంద్ర ప్రభుత్వం నిరుపేదలు సైతం బ్యాంకింగ్ సేవల్ని వినియోగించేందుకు 2014 లో ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (PMJDY) పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకంలో భాగంగా ఎలాంటి మినిమం బ్యాలెన్స్ లేకుండా జన్ ధన్ బ్యాంక్ ఖాతాల్ని వినియోగించుకోవచ్చు. రూపే డెబిట్ కార్డ్ తీసుకున్నవారికి రూ.2 లక్షల వరకు యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ కవరేజీ లభిస్తుంది. ఇక జన్ ధన్ అకౌంట్లో రూ.10,000 వరకు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం ఉంది. -
అకౌంట్ లో డబ్బులు లేకున్నా 80,000 విత్ డ్రా చేసుకోవచ్చు...
-
డేంజర్: ఇది జరిగితే మీ బ్యాంక్ అకౌంట్ ప్రమాదంలో ఉన్నట్టే..
ప్రపంచవ్యాప్తంగా సైబర్ మోసాలు ఎక్కువయ్యాయి. అమాయక ప్రజల డబ్బును దోచుకునేందుకు సైబర్ మోసగాళ్లు రోజుకో ఎత్తు వేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. మీ డెబిట్, క్రెడిట్ కార్డ్ వివరాలు అత్యంత తేలికగా స్కామర్ల చేతికి చేరుతున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. పలు అక్రమ వైబ్సైట్లు, టెలిగ్రామ్ చానెళ్లు డెబిట్, క్రెడిట్ కార్డ్ నంబర్లు, కార్డ్ హోల్డర్ పేర్లు, సీవీవీతో సహా వివరాలను స్కామర్లకు విక్రయిస్తున్నాయి. అదీ కూడా ఒక్కో కార్డు వివరాలు కేవలం 5 యూఎస్ డాలర్లు. అంటే రూ.410లకు మాత్రమే. పశ్చిమ దేశాలలో చెల్లింపులు ప్రాసెస్ చేయడానికి కార్డు వివరాలు ఉంటే సరిపోతుంది. ఓటీపీ అవసరం ఉండదు. అందుకే ఆయా దేశాల్లో పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. కానీ భారత్‌లో వన్ టైమ్ పాస్వర్డ్ (OTP) ద్వారా రెండు-కారకాల ప్రామాణీకరణ తప్పనిసరి. అయినప్పటికీ దీన్ని కూడా అధిగమించడానికి స్కామర్లు కొత్త మార్గాన్ని కనుగొన్నారు. ఉన్నట్టుండి సిమ్ డీయాక్టివేట్ అయితే.. బాధితుల ఒరిజినల్ సిమ్‌ను డీయాక్టివేట్ చేయడం ద్వారా స్కామర్లు ఓటీపీని ఎలా యాక్సెస్ చేస్తున్నారో భారతీయ పోలీసు అధికారులను టైమ్స్ ఆఫ్ ఇండియా ఉటంకిస్తూ పేర్కొంది. హ్యాకర్లు డెబిట్, క్రెడిట్ కార్డ్ వివరాలను బాధితుడి పేరు, ఫోన్ నంబర్‌తో సహా షాడో వెబ్సైట్లు, టెలిగ్రామ్ చానెళ్ల ద్వారా అమ్మకానికి పెడుతున్నారు. సైబర్ మోసగాళ్లు ఈ వివరాలను కొనుగోలు చేసి టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను సంప్రదించి బాధితుల సిమ్ కార్డ్ డీయాక్టివేట్ చేయిస్తున్నారు. తర్వాత డూప్లికేట్ సిమ్ పొంది ఓటీపీలను సునాయాసంగా యాక్సెస్ చేయగలుగుతున్నారు. నష్టం జరిగేంత వరకు బాధితుడి ఈ మోసం గురించి తెలియదు. కాబట్టి మీ సిమ్ కార్డ్ ఉన్నట్టుడి డీయాక్టివేట్ అయినట్లు గుర్తిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. కొన్ని నిమిషాల్లోనే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. ఈ వెబ్సైట్లను నిర్వహిస్తున్నదెవరు? నివేదిక ప్రకారం.. అక్రమ వెబ్సైట్లు, టెలిగ్రామ్ చానెళ్లను రష్యా, ఉక్రెయిన్ దేశాలకు చెందిన హ్యాకర్లు నిర్వహిస్తున్నట్లుగా తేలింది. వీళ్లు వెబ్సైట్లు, టెలిగ్రామ్ చానెళ్ల ద్వారా కార్డ్ వివరాలను హ్యాక్ చేసి విక్రయిస్తున్నారు. సంపన్న పాశ్చాత్య దేశాలకు చెందిన వారి కార్డు వివరాలకు ఒక్కో కార్డుకు 10 డాలర్లు (రూ.820) చొప్పున తీసుకుంటుండగా భారత్ సహా ఆసియా దేశాలకు చెందిన బాధితుల కార్డుల వివరాలకు చవగ్గా కేవలం 5 డాలర్లు (రూ.410)కే అమ్మేస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. 2022 జనవరిలో అటువంటి అక్రమ వెబ్సైట్ ఒకదానిని అధికారులు గుర్తించి చర్యలు తీసుకున్నారు. కానీ అలాంటి అక్రమ వెబ్సైట్లు, టెలీగ్రామ్ చానెళ్లు లెక్కకు మించి పుట్టుకొస్తున్నాయి. ఇదీ చదవండి: ఇంటర్నెట్ షట్‌డౌన్: ఆరు నెలల్లో ఇన్ని వేల కోట్ల నష్టమా? -
స్విస్ బ్యాంకుల్లోని భారతీయుల డబ్బు అన్ని వేల కోట్లా?
భారతదేశంలో చాలా మంది ప్రముఖులకు స్విస్ బ్యాంకుల్లో అకౌంట్స్ ఉంటాయని కొన్ని సందర్భాల్లో వినే ఉంటారు. స్విస్ బ్యాంకుల ఖాతాలను గురించి నిజ జీవితంలో కంటే సినిమాల్లో బ్లాక్ మనీ గురించి వచ్చే చాలా సందర్భాల్లో వినే ఉంటారు. కానీ ఈ బ్యాంకులో అకౌంట్స్ కలిగిన ఇండియన్స్ చాలా మందే ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇంతకీ స్విస్ బ్యాంకులో ఉన్న భారతీయులకు సంబంధించిన డబ్బు ఎంత ఉండొచ్చు? స్విస్ బ్యాంకు రూల్స్ ఏంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కేవలం భారతీయులు మాత్రమే కాకుండా ప్రపంచములోని చాలా దేశాల ధనవంతులు తమ డబ్బుని స్విస్ బ్యాంకులో దాచుకుంటారు. ఇతర బ్యాంకులతో పోలిస్తే స్విస్ బ్యాంకు రూల్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటాయని చెబుతారు. కావున అక్కడ అకౌంట్ ఉంటే చాలు లాకర్ ఇచ్చేస్తుంటారు. ఎవరు ఖాతా ఓపెన్ చేసారనే విషయాలు పెద్దగా పట్టించుకోరు. అంతే కాకుండా ఖాతాదారులకు సంబంధించిన వివరాలను ఎవరికీ వెల్లడించే అవకాశం లేదు. (ఇదీ చదవండి: విడుదలకు ముందే వన్‌ప్లస్ బడ్స్ వివరాలు లీక్ - ధర ఎంతంటే?) స్విట్జర్లాండ్ కేంద్ర బ్యాంక్ విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం, 2022 చివరి నాటికి భారతీయులకు, మన దేశంలోని కంపెనీలకు సంబంధించిన డబ్బు 3.42 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్ అని తెలుస్తోంది. ఇది భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 30 వేల కోట్లు. 2021 కంటే 2022లో 11 శాతం డిపాజిట్లు తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. (ఇదీ చదవండి: అట్లుంటది ముఖేష్ అంబానీ అంటే! ఆ కారు పెయింట్ ఖర్చు రూ. కోటి..) స్విస్ బ్యాంకుల్లో భారతీయుడు దాచుకున్న డబ్బుని బ్లాక్ మనీ అనలేమని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే పన్ను ఎగవేత వంటి వాటికీ అడ్డుకట్ట వేయడానికి ఇండియాకి నిరంతరం సహకరిస్తున్నామని వెల్లడించారు. దీని కోసం స్విట్జర్లాండ్ 2018లో భారత్‌లో టాక్స్ విషయాలకు సంబంధించిన సమాచార మార్పిడి కోసం ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగానే 2018 నుంచి స్విస్ బ్యాంకుల్లో ఖాతాలు కలిగి ఉన్న వారి వివరాలను భారత ట్యాక్స్ అథారిటీ చేతికి అందించినట్లు సమాచారం. -
ఇంటి దొంగ.. తమ్ముడి ఖాతా నుంచి మూడు కోట్లు హాంఫట్
హైదరాబాద్: అనారోగ్యంతో మృతి చెందిన తమ్ముడి బ్యాంక్ అకౌంట్లోంచి అన్న భారీ మొత్తంలో డబ్బు స్వాహా చేశాడు. మృతుడి భార్యకు రావాల్సిన ఇన్సూరెన్స్ డబ్బులు, ఇతర సేవింగ్స్‌ను సైతం కాజేసి జల్సాలు చేయడంతో బంధువులకు అనుమానం వచ్చి.. నిలదీయగా పొంతన లేని సమాధానాలు చెప్పాడు. మృతుడి భార్య, బంధువులు బ్యాంకుకు వెళ్లి ఆరా తీయగా రూ. 3 కోట్లు అతడు తన అకౌంట్‌కు బదిలీ చేసుకున్నట్లు వారు స్పష్టం చేశారు. దీంతో కొద్దిరోజుల క్రితం మృతుడి భార్య ఆసిఫ్‌నగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అనంతరం ఈ కేసు ప్రాధాన్యత దృష్ట్యా సీసీఎస్‌కు బదిలీ చేయడంతో ఇక్కడ కేసును రీ రిజిష్టర్ చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మెహిదీపట్నానికి చెందిన పటాన్ తబసుమ్ బాజీ భర్త సయ్యద్ నజీర్ అహ్మద్ కోవిడ్‌తో 2020లో మరణించాడు. అతను బతికున్నప్పుడు భార్య, పిల్లలపై ఇన్సూరెన్స్ చేశాడు. దీంతో పాటు తన బ్యాంక్ అకౌంట్లో కూడా కొంత డబ్బు ఉంచాడు. ఇవన్నీ తన మరణం అనంతరం భార్య పటాన్ తబసుమ్‌కు చెందేలా నామినీగా తనని చేర్చాడు. సయ్యద్ నజీర్ అహ్మద్ మృతి చెందిన తర్వాత ఇతని అన్న షేక్ జాన్ షాహీదా బాగోగులు చూసుకుంటానంటూ మృతుడి భార్య, పిల్లలకు దగ్గరయ్యాడు. తమ్ముడి పేరుపై ఉన్న బ్యాంకు లావాదేవీలన్నీ నీ పేరిట ట్రాన్స్ఫర్ చేస్తానంటూ పటాన్ తబసుమ్‌ను నమ్మించి ఆమె సంతకాలు తీసుకున్నాడు. ఆ తర్వాత రెండు ఖాతాల నుంచి దాదాపు రూ. 3 కోట్ల నగదును షేక్ జాన్ షాహీదా తన అకౌంట్‌కు బదిలీ చేసుకున్నాడు. ఆ డబ్బుతో కొత్త ఇన్నోవా కారు, బంగారు, వజ్రాల ఆభరణాలను కొనుగోలు చేశాడు. ఇదే సమయంలో యూఎస్ వెళ్లేందుకు ప్రయత్నాలు కూడా ముమ్మరం చేశాడు. ఈ క్రమంలో పటాన్ తబసుమ్‌ను చూసేందుకు బంధువులు ఇంటికి వచ్చినప్పుడు బ్యాంకు వివరాలు, పిల్లల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఆర్థికపరమైన లావాదేవీలు, మా భారం అంతా కూడా బావ షేక్ జాన్ షాహీదా చూసుకుంటున్నాడని వారికి తెలిపింది. ఈ విషయంపై అనుమానం వ్యక్తం చేసిన బంధువులు పటాన్ తబసుమ్‌ను బ్యాంకుకు తీసుకెళ్లి ఖాతాలను చూపించగా.. మృతుడి భార్య సంతకాలు చేయడంతో ఆ డబ్బు మృతుడి అన్న షేక్ జాన్ షాహీదా ఖాతాలకు క్రెడిట్ అయినట్లు నిర్ధారించారు. ఆసిఫ్‌నగర్ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయగా కేసు నమోదయ్యింది. తాజాగా ఈ కేసుకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా సీసీఎస్‌కు బదిలీ చేశారు, ఇక్కడ రీ–రిజిష్టర్ చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. -
PM Kisan: త్వరలో 14వ విడత నగదు జమ.. ఇలా చేయకపోతే రూ.2వేలు రావు
కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన పథకం ద్వారా దేశమంతటా అర్హులైన రైతులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. మోదీ సర్కార్ ఈ పథకం ప్రారంభించిన తరువాత ఇప్పటికే 13 విడతల్లో రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ కాగా.. తాజాగా 14వ విడత ఎప్పుడు విడుదల కానుందా అనేదానిపైనే అందరి దృష్టి నెలకొని ఉంది. 2019లో ప్రధానమంత్రి ప్రతిష్టాత్మకంగా ప్రధాన మంత్రి సమ్మాన్ నిధి యోజన ప్రారంభించారు. దీని ద్వారా భారతదేశంలోని లక్షల మంది రైతులకు ఆర్థిక మద్దతు లభిస్తోంది. రూ. 6వేల వార్షిక వాయిదా ద్వారా రైతుల ఖాతాలోకి నగదు చేస్తోంది మోదీ సర్కార్. అయితే ఇప్పటికే 13వ విడత రుణమాఫీ పూర్తి కావడంతో 14వ విడత నగదు ఎప్పుడు తమ ఖాతాలో జమ అవుతుందని రైతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, పీఎం కిసాన్ తదుపరి విడతను రైతుల బ్యాంకు ఖాతాలకు పంపిణీ చేయడానికి ప్రభుత్వం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటి వరకు, ఈ కార్యక్రమంలో భాగంగా అర్హులైన రైతులు ఒక్కొక్కరికి ₹2000 చొప్పున 13 చెల్లింపులు పూర్తి అయ్యాయి. అయితే, 14వ విడత నగదు విడుదలపై ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా రైతులు వారి ఖాతాలో నగదు జమ కావాలంటే ఈకేవైసీని తప్పనిసరి పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకం స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి.. మొదటగా పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ https://pmkisan.gov.in లోకి లాగిన్ అవ్వాలి. అధికారిక వెబ్సైట్ హోమ్‌పేజీలో ఫార్మర్స్ కార్నర్ అనే బటన్‌పై క్లిక్ చేయాలి. తరువాత పీఎం కిసాన్ బెనిఫిషియరీ స్టేటస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. వెబ్సైట్లో అడిగిన వివరాలు నమోదు చేయండి వన్-టైమ్ పాస్వర్డ్ కోసం గెట్ ఓటిపి అనే బటన్ పై క్లిక్ చేయండి. మీ మొబైల్‌కి వచ్చిన ఓటీపీని సబ్మిట్ చేయగలరు. అనంతరం మీరు పీఎం కిసాన్ లబ్ధిదారుని స్టేటస్ తెలుసుకోవచ్చు. చదవండి: ‘బయటకు వెళ్లి సిగరెట్ కాల్చుకో’ అన్నాడని.. -
రూ 456 కడితే రూ 2 లక్షల బెనిఫ్ట్..!
-
వెలవెలబోతున్న బ్యాంక్‌లు
సాక్షి, చైన్నె : రూ. 2 వేల నోట్ల మార్పిడి కోసం బ్యాంక్‌లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అయితే, బ్యాంక్‌లన్నీ వెలవెల బోయాయి. రిజర్వు బ్యాంక్ వద్ద మాత్రం జనం బారులు తీరి కనిపించారు. వివరాలు.. రూ. 2 వేల నోటును రద్దు చేస్తూ రిజర్వు బ్యాంక్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ నోట్లను తీసుకునేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. దీంతో తమ వద్ద ఉన్న నోట్లను బ్యాంక్‌ల ద్వారా మార్చుకోవచ్చని రిజర్వు బ్యాంక్ ప్రజలకు ఊరట కలిగింది. ఇందు కోసం బ్యాంక్‌లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. మంగళవారం నుంచి అన్ని బ్యాంక్‌లలో రూ. 2 వేల నోట్ల మార్పిడి కోసం చర్యలు తీసుకున్నారు. అయితే, బ్యాంక్‌లన్నీ వెల వెలబోయాయి. పెద్ద సంఖ్యలో జనం బారులు తీరుతారని భావించి ఏర్పాట్లు చేసినా, ఆ మేరకు ఖాతాదారులు రాకపోవడం గమనార్హం. ఇక, రాష్ట్రంలో అనేక ప్రైవేటు బ్యాంక్‌లు నోట్ల మార్పిడి కోసం వచ్చిన వారికి దరఖాస్తుల ఫాంలు ఇచ్చి పూర్తి చేయాలని సూచరించడం గమనార్హం. అయితే, ఎలాంటి వివరాలను తెలియజేయాల్సిన అవసరం లేదని రిజర్వు బ్యాంక్ పేర్కొన్నా, ప్రైవేటు బ్యాంక్‌లు వివరాలను సేకరించడం వివాదానికి దారి తీసింది. ఇక, చైన్నెలోని రిజర్వు బ్యాంక్ వద్ద ఉదయాన్నే జనం బారులు తీరి, తమ వద్ద ఉన్న నోట్లను మార్చుకున్నారు. ఒకొక్కరు రూ. 20 వేల వరకు తమ వద్ద ఉన్న రూ 2 వేల నోట్లను అందజేసి రూ. 500 నోట్లను తీసుకెళ్లారు. -
బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేయాలా? ఒక్క నిమిషం.. ఇవి తెలుసుకోండి!
ఆధునిక కాలంలో ఉద్యోగాలు చేసే వారికి మాత్రమే కాకుండా, సాధారణ ప్రజలకు కూడా ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి. అయితే తరచుగా ఉపయోగించే బ్యాంక్ అకౌంట్ కాకుండా.. నిరుపయోగంగా ఉన్న బ్యాంక్ ఖాతాలను వీలైనంత వరకు క్లోజ్ చేసుకోవడం ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు. అయితే అలాంటి బ్యాంక్ అకౌంట్స్ క్లోస్ చేసుకోవడానికంటే ముందు తప్పకుండా కొన్ని పూర్తి చేయాల్సిన పనులు ఉన్నాయి. వాటిని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ►బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేయాలనుకునే వ్యక్తి ముందుగా ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒక వేళా అందులో ఏదైనా అమౌంట్ ఉన్నట్లయితే దానిని విత్‌డ్రా చేసుకోవడం ఉత్తమం. అంతే కాకుండా ఆ బ్యాంక్ ఖాతాకు సంబంధించిన రెండు నుంచి మూడు నెలల స్టేట్మెంట్ తీసుకోవాలి. ఇది భవిష్యత్తులో మీకు తప్పకుండా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ►ఒక వేళా మీరు మీ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేయాలనుకున్నప్పుడు ఆ ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేకపోతే అకౌంట్ క్లోజ్ చేయడం వీలు కాదు. కావున నెగిటీవ్ బ్యాలెన్స్ లేకుండా ముందుగానే చూసుకోవాలి. బ్యాంకులో అకౌంట్ ఉన్నప్పుడు కొన్ని చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఆ చార్జీలు సరైన సమయంలో చెల్లించని ఎడల బ్యాంక్ బ్యాలన్స్ మైనస్‌లోకి వెళుతుంది. కావున అకౌంట్లో మినిమమ్ బ్యాలన్స్ ఉన్నప్పుడే బ్యాంక్ అకౌంట్ క్లోస్ చేయడానికి వీలుపడుతుంది. (ఇదీ చదవండి: ఎన్ఆర్ఐ ఖరీదైన కారుకి చిన్నప్పుడు ప్రయాణించిన బస్ నెంబర్ - నెట్టింట్లో ప్రశంసలు) ►గతంలో మీరు ఏదైనా బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకున్నప్పుడు నెలవారీగా మీరు చెల్లించాల్సిన ఈఎమ్ఐ, ఇతర సబ్స్క్రిప్షన్లు చెల్లించడానికి ఆటోమాటిక్ క్లియరెన్స్ ఇచ్చి ఉంటే అలాంటివి క్యాన్సిల్ చేసుకోవాలి. ఆలా చేయకపోతే మీరు సమయానికి చెల్లించాల్సిన డబ్బు చెల్లించలేరు, ఆ తరువాత అదనపు అమౌంట్ వంటివి చెల్లించాల్సి ఉంటుంది. ►ప్రస్తుతం చాలా బ్యాంకులు అకౌంట్ ఓపెన్ చేసిన ఏడాదిలోపే క్లోజ్ చేస్తే క్లోజర్ చార్జీలు విధిస్తుంది. కావున అకౌంట్ ఓపెన్ చేసిన తరువాత కనీస సంవత్సరం పూర్తయితే అప్పుడు బ్యాంకు అకౌంట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. (ఇదీ చదవండి: వారెవ్వా.. 21 నెలలు, రూ. 9000 కోట్లు - జీవితాన్ని మార్చేసిన ఒక్క యాప్!) ►ఈపీఎఫ్, ఇన్సూరెన్స్ పాలసీలు, ఇన్‌కమ్‌టాక్స్ డీటైల్స్ మీ సేవింగ్స్ అకౌంట్‌కి లింక్ అయి ఉంటే పిఎఫ్ అమౌంట్ విత్‌డ్రా చేసుకునేటప్పుడు, ఇన్‌కమ్‌టాక్స్ నుంచి రీఫండ్ వంటివి వస్తే కొంత సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి సమయంలో మీరు వేరే అకౌంట్ లింక్ చేసిన తరువాత పాత అకౌంట్ క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎట్టిపరిస్థితుల్లో మరచిపోకూడదు. -
ఒకే ఒక్క చిన్న పొరపాటు.. మొత్తం బ్యాంకు ఖాతా ఖాళీ
సాక్షి, నాగర్‌కర్నూల్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా ఇటీవల సైబర్ నేరాల కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రెప్పపాటు కాలంలో మోసానికి గురిచేసే సైబర్ నేరాలపట్ల అవగాహన కొరవడటంతోనే బాధితులు ఎక్కువ సంఖ్యలో మోసపోతున్నారు. సైబర్ మోసానికి గురై రూ.లక్షల్లో డబ్బులు కోల్పోతున్న వారిలో ఉద్యోగులు, అక్షరాస్యులు సైతం ఉంటున్నారు. సైబర్ నేరాలకు గురైన వారిలో చాలామంది బాధితులు తమ పరువు పోతుందనే ఉద్దేశంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సైతం ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రెండేళ్లలో చోటుచేసుకున్న సైబర్ నేరాల్లో అధికంగా సెల్‌ఫోన్‌కు వచ్చిన మెసేజ్‌లకు స్పందించడం, ఆన్లైన్ యాప్‌లకు సంబంధించినవే అధికంగా ఉంటున్నాయి. సైబర్ నేరస్తుల బారిన పడి మోసపోతున్న బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. 2022లో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాలకు సంబంధించి మొత్తం 250 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది గడిచిన నాలుగు నెలల్లోనే మొత్తం 43 కేసులు నమోదయ్యాయి. అలాగే పోలీస్స్టేషన్ల మెట్లు ఎక్కని బాధితుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని తెలుస్తోంది. నాగర్‌కర్నూల్ జిల్లాలోనే అత్యధిక సంఖ్యలో సైబర్ కేసులు నమోదవుతున్నాయి. ఈ జిల్లాలో 2022లో మొత్తం 69 కేసులు నమోదయ్యాయి. వీరిలో అధికంగా నాగర్‌కర్నూల్ మండలంలో 21 మంది, కల్వకుర్తిలో 11 మంది సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి పెద్దమొత్తంలో డబ్బులు కోల్పోయారు. ఈ ఏడాదిలో మొత్తం 12 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత జోగుళాంబ గద్వాల జిల్లాలో అధికంగా 57 మంది సైబర్ నేరాలకు గురయ్యారు. అవగాహన లేకపోవడం వల్లే.. సైబర్ నేరాల్లో అధికంగా అపరిచిత వ్యక్తుల నుంచి వస్తున్న మెసేజ్‌లే ఎక్కువగా ఉంటున్నాయి. మెసేజ్‌లో వచ్చిన లింకుపై క్లిక్ చేయగానే క్షణాల్లో అకౌంట్లో డబ్బులు మాయమవుతున్నాయి. తర్వాత ఆన్లైన్ యాప్‌ల్లో పెట్టుబడి పెట్టాలంటూ, ఉద్యోగాలు ఇస్తామంటూ అమాయకులకు ఎరవేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. దీనిపై సంబంఽధిత క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించకపోవడంతోనే బాధితుల సంఖ్య పెరుగుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట లోని మహేంద్రనగర్ కాలనీకి చెందిన శ్రీకాంత్ ఫోన్‌కు గతనెల 20న అపరిచిత వ్యక్తుల నుంచి మెసేజ్ వచ్చింది. ఇంట్లో నుంచే పార్ట్‌టైం జాబ్ చేస్తూ డబ్బులు సంపాదించొచ్చు అంటూ వచ్చిన లింక్‌పై నొక్కడంతో శ్రీకాంత్ అకౌంట్లో ఉన్న రూ.1.40 లక్షలు మాయమయ్యాయి. మోసపోయినట్టు గుర్తించిన బాధితుడు పోలీసులకుఫిర్యాదు చేశాడు.’ ‘వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన శ్రీనివాసులు వాట్సప్‌కు గత నెల 22న వచ్చిన మెసేజ్‌కు స్పందించాడు. అపరిచితుల నుంచి వచ్చిన వాట్సప్ లింకుపై క్లిక్ చేయగానే, అకౌంట్లో ఉన్న రూ.94 వేలు డ్రా అయినట్టు వచ్చిన మెసేజ్ చూసి కంగుతిన్నాడు. జరిగిన మోసాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇలాంటి ఘటనలు పెరిగిపోతున్నాయి.’ వెంటనే ఫిర్యాదు చేయాలి.. ఇటీవల కాలంలో సైబర్ నేరాలకు సంబంధించిన కేసులు పెరుగుతున్నా యి. అపరిచితుల నుంచి వచ్చే అనవసర మెసేజ్‌లకు స్పందించొద్దు. తక్కు వ మొత్తాలకు ఎక్కువ వడ్డీ ఇస్తామని చెప్పే ఆన్లైన్ యాప్ జోలికి వెళ్లొద్దు. మోసపోయినట్టు గుర్తించినా వెంటనే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయాలి. వెంటనే ఫిర్యాదు చేస్తే సొమ్ము రికవరీ చేసే అవకాశం ఉంటుంది. – రామేశ్వర్, ఏఎస్పీ, నాగర్‌కర్నూల్ నారాయణపేట జిల్లా మాగనూర్‌లో ఇటీవల భారీ ఆన్లైన్ మోసం వెలుగుచూసింది. తక్కువ మొత్తంలో పెట్టుబడితోనే ఎక్కువ లాభం వస్తుందంటూ చెప్పిన కేటుగాళ్ల మాయాలోపడి సుమారు 40 మంది వరకు బాధితులు మోసపోయినట్టు తెలిసింది. ‘సోలో పవర్ వరల్డ్’ అనే ఆన్లైన్ యాప్‌లో ఒకసారి రూ.20 వేలు పెట్టుబడి పెడితే రోజుకు రూ.960 చొప్పున, మొత్తం 185 రోజుల వరకు రూ.1,78,800 వస్తాయంటూ యాప్ నిర్వాహకులు నమ్మబలికారు. కొన్నిరోజుల పాటు అకౌంట్లలో డబ్బులు పడ్డ తర్వాత గత వారం రోజులుగా యాప్ ఓపెన్ కావడం లేదు. ఒకరికి తెలిసిన వారు ఒకరు ఇలా ఒకే గ్రామానికి చెందిన బాధితులు మొత్తం సుమారు రూ.8లక్షల వరకు కోల్పోయినట్టు తెలిసింది. అయితే ఇంత జరిగినా దీనిపై ఫిర్యాదు చేసేందుకు బాధితులు ముందుకు రాకపోవడం గమనార్హం. ఇలాంటి సమయాల్లో బాధితులు వెంటనే స్పందించి ఫిర్యాదు చేస్తేనే ప్రయోజనం ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. -
హలో.. పార్శిల్ ముట్టిందా? కాదు.. బ్యాంకు ఖాతా ఖాళీ అయింది
కాజీపేట: నిత్యం ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటాం. వాటికి సంబంధించిన సమాచార అన్వేషణ కోసం ఇంటర్నెట్పై ఎక్కువగా ఆధారపడుతున్నాం. ఇంటర్నెట్లోని వివిధ వెబ్సైట్ట్లను పరిశీలించే వారి సంఖ్య పెరుగుతోంది. మనిషి అవసరాన్ని గుర్తించిన కేటుగాళ్లు తమ సంపాదనకు మలుచుకుంటున్నారు. ఫలితంగా సొ మ్ము పరుల పాలవుతోంది. సేవా లోపాల పరిష్కారానికి వివిధ సంస్థల ఫోన్ నంబర్లు ఇంటర్నెట్లో బోగస్‌వి పెడుతున్నారు. వాటికి పలువురు వినియోగదారులు ఫోన్‌చేసి మోసగాళ్ల ఉచ్చులో పడి బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును పోగొట్టుకుంటున్నారు. కొరియర్ నంబర్ కోసం వెతికితే... కాజీపేటకు చెందిన అబ్దుల్ ఖాదర్ హైదరాబాద్‌లో ఉండే తన స్నేహితుడికి ఇటీవల ఓ పార్సిల్‌ను కొరియర్ చేశాడు. వారం గడుస్తున్నా కొరియర్ రాకపోయేసరికి ఇంటర్నెట్లో సంబంధిత సంస్థ కస్టమర్ కేర్ నంబర్ కోసం వెతికి దానికి ఫోన్ చేశాడు. ఆ నంబర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. తర్వాత కొద్దిసేపటికి కొరియర్ సంస్థ నుంచి అంటూ ఓ వ్యక్తి ఫోన్ చేసి పరిచయం చేసుకున్నాడు. మీ పార్సిల్ బ్రాంచి కార్యాలయంలో ఆగిందని, ప్రాసెస్ చేయడానికి రూ.2 ఫోన్ ద్వారా చెల్లించాలని కోరారు. మీకు రాము అనే కొరియర్ బాయ్ తీసుకొస్తాడని చెప్పి ఓ నంబర్ ఇచ్చాడు. ఆ నంబర్‌కు రూ.2 చెల్లిస్తే ఈ నెల 26 వరకు పార్సిల్ చేరుస్తామంటూ ఓ లింక్ పంపించాడు. నిజమే అని నమ్మిన అబ్దుల్ ఖాదర్ ఆ లింక్‌ను క్లిక్‌చేసి డబ్బు చెల్లించాడు. రెండు రోజులు దాటుతున్నా కొరియర్ సర్వీస్ అడ్రస్ లేకపోవడంతో పాటు సెల్‌ఫోన్‌కు వచ్చిన ఎస్ఎంఎస్లు చూసి అవాక్కయ్యాడు. తొమ్మిది విడుతలుగా రూ.1.36 లక్షలు ఆయన బ్యాంక్ ఖాతా నుంచి డ్రా అయ్యాయి. వెంటనే ఖాతాను బ్లాక్ చేయించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇలాంటి ఆన్లైన్ కేసులు ఒక కాజీపేట పీఎస్‌లోనే పాతికకు పైగా నమోదయ్యాయి. ఇంటర్నెట్లోని వివిధ వెబ్సైట్లలో పలువురు మోసగాళ్లు ..వివిధ కంపెనీల, బ్యాంకుల కస్టమర్ కేర్ నంబర్ అని చెప్పి తమ సొంత ఫోన్ నంబర్లను ఉంచుతున్నారు. వెబ్సైట్లలో వెతికి ఈ నంబర్లను ఉంచుతున్నారు. వెబ్సైట్లలో వెతికి ఈ నంబర్లకు ఫోన్ చేసి మోసపోకూడదు. ఆ సంస్థకు చెందిన అధీకృత వెబ్సైట్ నుంచి మాత్రమే తీసుకోవాలి. ప్రైవేట్ వెబ్సైట్లలో వివరాలు నమోదు చేయకూడదు. అవి మోసగాళ్లకు సులువుగా వెళ్తాయి. సంబంధిత కంపెనీ వెబ్సైట్లోకి వెళ్లడం ఉత్తమం. -
ఆర్బీఐ కీలక ప్రకటన..బ్యాంకుల్లో డబ్బులు దాచుకుంటున్నారా?
క్లెయిమ్ చేయని డిపాజిట్లపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ కీలక ప్రకటన చేశారు. బ్యాంక్‌లో డిపాజిట్ చేసిన మొత్తాన్ని డిపాజిటర్లు, లేదంటే లబ్ధిదారులు గుర్తించేందుకు గాను వెబ్‌పోర్టల్‌లో ప్రత్యేక డేటాబేస్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆర్బీఐ వివరాల ప్రకారం.. ఇటీవల ఆర్బీఐ డిపాజిటర్స్ అండ్ అవేర్నెస్ ఫండ్‌లో రూ. 35,012 కోట్లు ఉన్నాయి. దాదాపు 10 ఏళ్లుగా వీటిని ఎవరూ క్లెయిం చేయలేదు. అంటే ఈ మొత్తం ఇప్పటికే అనేక కుటుంబాలకు చేరి ఉండాల్సింది. కానీ, ఆయా ఫ్యామిలీలకు బహుశా ఈ విషయం తెలియకపోవడం వల్లే నిధులు పేరుకుపోయి ఉంటాయి. ఇటీవల అన్ క్లయిమ్ డిపాజిట్లపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి భగవత్ కరాద్ పార్లమెంట్లో మాట్లాడుతూ.. ప్రభుత్వ బ్యాంకుల్లో క్లయిం చేయని డిపాజిట్లు పేరుకుపోయాయని వాటిని ఆర్బీఐ ఆధ్వర్యంలోని ‘డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్’కు బ్యాంకులు బదిలీ చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ ఆర్థిక సంవత్సరం (2023-24) తొలి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశం నిర్వహించింది. అనంతరం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ మాట్లాడుతూ.. అన్ క్లయిమ్ డిపాజిట్ల కోసం వెబ్ పోర్ట్‌లలో డేటాబేస్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆయా బ్యాంక్‌లు ఆ డేటా బేస్‌లో అన్ క్లయిమ్ డిపాజట్ల గురించి తెలుసుకునేలా వీలు కల్పించనున్నట్లు తెలిపారు. అన్‌క్లయిమ్ డిపాజిట్లపై పిల్ దాఖలు ప్రముఖ బిజినెస్ జర్నలిస్ట్, రచయిత సుచేతా దలాల్ తాజాగా అన్ క్లయిమ్ డిపాజిట్ల గురించి డేటా బేస్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి (పిల్‌కు) దాఖలు చేశారు. దీనిపై కౌంటర్ దాఖలుకు ఆర్థిక శాఖకు మరింత సమయం ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం కోరినట్లు సుప్రీంకోర్టు సీజేఐ డీవై చంద్రచూడ్,జస్టిస్ జేబీ పర్దీవాలాలతో కూడిన ధర్మాసనం స్పందించింది. తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది. చదవండి👉 'AI'తో 30కోట్ల ఉద్యోగాలు ఉఫ్!.. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఏమన్నారంటే? -
క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్‌కి ట్రాన్సాక్షన్ - సులభంగా ఇలా!
ప్రస్తుతం టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో యుపిఐ చెల్లింపులతో పాటు క్రెడిట్ కార్డు వినియోగం కూడా ఎక్కువవుతోంది. అయితే చాలామంది క్రెడిట్ కార్డు వినియోగదారులకు కార్డ్ ద్వారా బ్యాంకు అకౌంట్‌కి డబ్బు జమ చేయవచ్చనే విషయం తెలిసుండకపోవచ్చు. అలాంటి వారికోసం ఈ ప్రత్యేక కథనం.. డైరెక్ట్ ట్రాన్స్ఫర్: క్రెడిట్ కార్డు నుంచి బ్యాంక్ అకౌంట్‌కి డబ్బు పంపించుకోవడానికి స్మార్ట్‌ఫోన్ లేదా ఆన్లైన్ బ్యాంకింగ్ యాప్ ఉపయోగించుకోవచ్చు. అయితే ఒక్కో బ్యాంకు రోజువారీ లిమిట్ కలిగి ఉంటుంది. కొన్ని సార్లు ట్రాన్సక్షన్ కొంత ఆలస్యం అవ్వొచ్చు, కొన్ని సార్లు వెంటనే కూడా పూర్తయిపోవచ్చు. ఇవన్నీ దేశం, కరెన్సీ, బ్యాంక్ రూల్స్ మొదలైన వాటిపైన ఆధారపడి ఉంటాయి. నెట్ బ్యాంకింగ్: నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్‌కి నగదు జమచేసుకోవచ్చు. దీని కోసం ఈ కింది రూల్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మొదట మీ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ వెబ్సైట్లో లాగిన్ అవ్వండి వెబ్సైట్ క్రెడిట్ కార్డ్ ఏరియా సెలక్ట్ చేసుకుని, ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఎంచుకోవాలి. బ్యాంక్ అకౌంట్‌కి ఎంత మొత్తానికి ట్రాన్స్ఫర్ చేయాలనుకునేది ఎంటర్ చేయండి. అవసరమైన సమాచారాన్ని ఫిల్ చేయాలి, మొత్తం ట్రాంసెక్షన్ పూర్తయ్యే వరకు అవసరమైన సమాచారం అందించి పూర్తి చేసుకోవచ్చు. ఫోన్ కాల్ ద్వారా: క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్‌కి డబ్బు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మరో సులభమైన మార్గం ఫోన్ కాల్స్. మొదట మీ క్రెడిట్ కార్డ్ కంపెనీకి కాల్ చేసి వారు అడిగే వివరాలు తెలియజేయండి. డబ్బు పంపాలన్న విషయం కూడా వారికి తెలపాలి. మీరు ఎంత మొత్తం ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్న విషయం ద్రువీకరించి పూర్తి చేసుకోవచ్చు. చెక్కును అందించడం ద్వారా: చెక్ ఇస్యూ చేయడం ద్వారా కూడా డబ్బుని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మొదటి తీసుకునే లేదా గ్రహీత పేరు దగ్గర 'సెల్ఫ్' అని వ్రాయండి చెక్కుపై రాయాల్సిన మిగిలిన వివరాలను కూడా పూర్తి చేయండి. దగ్గరగా ఉన్న బ్యాంక్ లొకేషన్లో చెక్కును డిపాజిట్ చేయాలి. ఏటీఎమ్ ద్వారా: క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ ఖాతాకు డబ్బు పంపడానికి మీరు ఏటీఎమ్ కార్డ్‌ని ఉపయోగించవచ్చు. ఏటీఎమ్ క్యాష్ విత్‌డ్రా చేయడానికి క్యాష్ అడ్వాన్స్ ఫీచర్ ఎంచుకోవాలి. తరువాత పంపాలనుకున్న మొత్తాన్ని బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయాలి. ఈ విధంగా డబ్బు జమచేయడానికి బ్యాంకులు కొంత చార్జెస్ నిర్ణయిస్థాయి. ఇది కూడా ఒక్కో బ్యాంకుకి ఒక్కోలాగా ఉంటుంది. మొబైల్ యాప్‌లు ఉపయోగించి: ప్రస్తుతం స్మార్ట్ఫోన్ల వినియోగం ఎక్కువవ్వడం వల్ల ఏదైనా దాదాపు ఆన్లైన్ ద్వారా పూర్తి చేసుకుంటున్నారు. కావున స్మార్ట్‌ఫోన్‌లో కొన్ని యాప్స్ ఉపయోగించి క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ ఖాతాకు డబ్బు పంపించుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్, డెస్క్‌టాప్, టాబ్లెట్ లేదా ల్యాప్‌టాప్ ఉపయోగించి బ్యాలెన్స్‌లను బదిలీ చేయవచ్చు. -
ఎస్బీఐ అకౌంట్ బ్రాంచ్ మారాలనుకుంటున్నారా? ఇంట్లో కూర్చొని..
ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ ఎస్బీఐ ఖాతాదారులు బ్యాంక్ కార్యకలాపాల్ని మరింత సులభతరం చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. 45 కోట్ల మంది ఖాతాదారులు, 22వేల బ్రాంచీలు, 71,617 ఆటోమెటిక్ డిపాజిట్ మెషిన్లు, విత్‌డ్రా మెషిన్లు, 62617 ఏటీఎం సెంటర్ల నుంచి సేవల్ని అందిస్తుంది. ఇప్పుడా ఖాతాదారుల సంఖ్యను పెంచేలా బ్యాంక్ సేవల్ని మరింత సులభతరం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే అకౌంట్ హోల్డర్లు పలు రకాల సేవల్ని ఆన్లైన్లో ఇంటి వద్ద నుంచి చేసుకునే వెసలుబాటు కల్పించింది. వాటిలో అతి ముఖ్యమైంది బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్‌ను ఒక బ్రాంచ్ నుంచి మరో బ్రాంచ్‌కు.. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మార్చుకునేందుకు గంటల తరబడి క్యూలైన్లలో నిల్చొని వ్యయప్రయాసలు ఎదుర్కొవాల్సి వచ్చింది. ఆ సమస్యల్ని తగ్గించేలా ఆన్లైన్లో అకౌంట్‌ను ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం కల్పించ్చింది. అయితే ఇప్పుడు మనం ఇంట్లో కూర్చొని అకౌంట్ నుంచి ఎలా ట్రాన్స్ఫర్ చేయొచ్చో తెలుసుకుందాం. ఇందుకు కోసం బ్యాంక్ విధించిన నిబంధనలకు లోబడి కేవైసీ, ఇతర వ్యక్తిగత వివరాలు తప్పనిసరిగా ఉండాలి. ఆ వివరాలు అందుబాటులో లేక పోతే అకౌంట్‌ను మార్చుకోలేం. చదవండి👉 ఈ ఉద్యోగాలు చేస్తున్నారా? అయితే వేరే జాబ్ చూసుకోవడం మంచిదంట? ఎస్బీఐ అకౌంట్‌ను ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోండిలా ♦ ముందుగా ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ ఆన్లైన్ ఎస్బీఐ. కామ్‌లో లాగిన్ అవ్వాలి ♦అందులో పర్సనల్ బ్యాంకింగ్ అనే ఆప్షన్ మనకు కనిపిస్తుంది. ఆ ఆప్షన్ పై మనం ట్యాప్ చేయాలి. ♦ట్యాప్ చేసి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి ♦అనంతరం ఈ- సర్వీస్ ట్యాబ్ అనే ఆప్షన్ మనకు కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. ♦క్లిక్ చేస్తే స్క్రిన్‌పైన ట్రాన్స్ఫర్ సేవింగ్ అకౌంట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్‌పై ట్యాప్ చేసి మీరు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్న అకౌంట్ నెంబర్‌పై క్లిక్ చేయాలి. ♦అక్కడ మీరు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్న బ్యాంక్ ఐఎఫ్ఎస్ కోడ్‌ను ఎంటర్ చేయాలి ♦ఇతర వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేసిన తర్వాత కన్ఫామ్ బటన్‌పై ట్యాప్ చేయాలి. ♦అనంతరం మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి మరోసారి కన్ఫామ్ చేయాలి ♦ ఈ ప్రాసెస్ అంతా పూర్తి చేసిన కొన్ని రోజులకు మీరు ఎక్కడికైతే బ్యాంక్ అకౌంట్‌ను ట్రాన్స్ఫర్ చేశారో అక్కడి నుంచి బ్యాంక్ అకౌంట్ సేవలు ప్రారంభమవుతాయి. ఎస్బీఐ యోనో యాప్ నుంచి సైతం ఒకవేళ మీరు ఇలా కాకుండా ఎస్బీఐ యోనో యాప్ నుంచి బ్యాంక్ ఖాతాను మార్చుకోవచ్చు. ఇలా మార్చుకోవాలంటే మీరు తప్పని సరిగా బ్యాంక్ అకౌంట్‌కు రిజిస్టర్ మొబైల్ నెంబర్ జత చేయాల్సి ఉంటుంది. If you need help in transferring your account from one branch to another, then SBI has got your back. Use YONO SBI, YONO Lite and OnlineSBI from the comfort of your homes and bank safe.#SBIAapkeSaath #StayStrongIndia #YONOSBI #YONOLite #OnlineSBI #BankSafe pic.twitter.com/WlW8bb8aBG — State Bank of India (@TheOfficialSBI) May 7, 2021 చదవండి👉 వేలకోట్ల బ్యాంక్‌ను ముంచేసి..భార్యతో పారిపోయిన సీఈవో! -
బామ్మా జర భద్రం.. ఆ లింక్స్‌పై క్లిక్ చేస్తే అంతే! ఈ టోల్ ఫ్రీ నంబర్ మీకోసమే!
విచారంగా కూర్చొని ఉన్న వర్ధనమ్మను చూసి ఏమైందని అడిగింది మనవరాలు హారిక. ‘బ్యాంకు ఖాతా నుండి డబ్బులు డ్రా అయినట్టు మెసేజ్ వచ్చింది. నేను ఆ డబ్బులు డ్రా చేయలేదు. నా దగ్గర డబ్బులు ఉన్నట్టు ఇంట్లో ఎవ్వరికీ చెప్పలేదు. బ్యాంకులో అయితే భద్రంగా ఉంటాయనుకున్నా. ఇప్పుడెలా..’ అంది మనవరాలితో దిగులుగా వర్ధనమ్మ. ‘ఎవరైనా నీకు ఇంతకుముందు ఫోన్ చేశారా..’ అడిగింది హారిక. ‘బ్యాంకు నుంచి ఫోన్ వచ్చింది. అత్యవసరం అని చెబితే, వాళ్లు పంపిన లింక్ ఫామ్‌లో వివరాలు ఇచ్చాను. అంత కన్నా ఏమీ చేయలేదు’ అంది వర్ధనమ్మ. బామ్మ సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మి మోసపోయిందని అర్ధమై, వెటనే తగిన చర్యలు తీసుకుంది హారిక. ఆ తర్వాత బామ్మకు సైబర్ మోసగాళ్ల గురించి వివరించింది. ఇంట్లో వయసు పైబడిన వారుంటే సైబర్ మోసాగాళ్ల బారిన పడకుండా ఈ విషయాలు తప్పక తెలియజేయాల్సిన అవసరం వారి పిల్లలకు ఉంది. సాధారణంగా జరిగే మోసాల్లో ప్రధానమైంది ఫిషింగ్ సైబర్ నేరగాళ్లు మీ డిజిటల్ సమాచార మొత్తాన్ని పొందడానికి ఆన్లైన్ సేవ లేదా బ్యాంక్ ఏజెంట్ల వంటి విశ్వసనీయ పరిచయాలను పెంచుకుంటారు. కొన్ని ఉదాహరణలు.. సహాయం కోసం రిక్వెస్ట్ అడుగుతారు. మీరు బహుమతిని గెలుచుకున్నారని చూపుతారు. పెన్షన్ ఫండ్ విడుదలకు కెవైసి అవసరం అంటారు. గతంలో తక్కువ ఆదాయపు పన్ను చెల్లించారు, ఇప్పుడు రెట్టింపు ఛార్జ్ పడింది అంటారు. గుర్తింపు చోరీ సైబర్ దాడి చేసే వ్యక్తులు మీ బ్యాంక్ ఖాతా వివరాలు, ఆధార్ నంబర్, ఫోన్ నంబర్, చిరునామా, డెబిట్/ క్రెడిట్ కార్డ్ వివరాలు, యుపిఐ, పిన్ నంబర్ మొదలైన వ్యక్తిగత సమాచారాన్ని పొందడానికి ప్రయత్నిస్తారు. ఆర్థిక లాభాలను పొందడానికి ఈ సమాచారం సేకరిస్తారు. దాడుల్లో రకాలు వీటిలో తరచుగా సీనియర్ డేటింగ్, ప్రిస్క్రిప్షన్ మాత్రలు, యాంటీ ఏజింగ్ ఉత్పత్తులు, పెట్టుబడి లేదా ఛారిటీ స్కామ్‌లు, స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల నుండి నకిలీ ఆర్థిక సహాయ అభ్యర్థనలకు సంబంధించిన మోసాలు ఉంటాయి. చాలా మంది సీనియర్లు ఇలాంటి మోసాలకు లోనవడానికి పెద్ద కారణం ఒంటరితనం, జ్ఞానం లేకపోవడమే. భద్రతా చిట్కాలు ►తెలియని వారి నుంచి వచ్చే ఇ–మెయిల్‌లలోని లింక్‌లపై క్లిక్ చేయవద్దు. మీకు తెలిసిన వ్యక్తుల నుండి వచ్చినవి అయినప్పటికీ, వింత లేదా ఊహించని సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇ–మెయిల్లు, వాట్సప్ సందేశాలు లేదా ఎసెమ్మెస్‌లు, సోషల్ మీడియా పోస్ట్‌లు అన్నీ హానికరమైన ఫైల్స్‌ను కలిగి ఉండే చిన్న లింక్‌లతో ►పంపినవారు మీకు తెలిసినవారే అని దృఢపరుచుకునేవరకు ఏ లింక్‌లను ఓపెన్ చేయవద్దు. స్నేహితుడు లేదా కుటుంబ సభ్యుల నుండి ఆ మెసేజ్ వచ్చినట్లు కనిపిస్తే, వారు మీకు ఏదైనా పంపినట్లు నిర్ధారించుకోవడానికి తిరిగి వారినే సంప్రదించండి. ►అనుమానిత ఫోన్ కాల్స్, రోబోకాల్స్‌ను రిసీవ్ చేసుకోకండి. కాలర్ తాను ‘‘టెక్ సపోర్ట్‘ నుండి మాట్లాడుతున్నట్టు మీతో చెప్పవచ్చు. మీ కంప్యూటర్‌కు వైరస్ సోకిందని, రిపేర్ ఉందని మీకు తప్పుగా చెప్పవచ్చు. మీరు టాక్స్ డిఫాల్టర్ లేదా పెన్షన్ ప్రాసె సింగ్ లేదా కెవైసీ కోసం అడుగుతున్న బ్యాంక్ అధికారి అని కూడా చెప్పవచ్చు. పెన్షన్ ఫండ్ మొదలైన వాటి ప్రాసెసింగ్ అని చెప్పవచ్చు. ►మీ ఫోన్ లేదా కంప్యూటర్లోని పాప్అప్ విండోలకు ప్రతిస్పందించవద్దు లేదా దానిపై క్లిక్ చేయవద్దు. మీ కంప్యూటర్ లేదా ఫోన్లో ‘అత్యవసర‘ పాప్అప్ విండో కనిపిస్తుంది. మీ డిజిటల్ పరికరానికి రిపేర్ అవసరమని లేదా ఒక ఫోన్‌ను ఆఫర్లో ‘మరొక ఫోన్‌ను పొందండి’ అంటూ మీలో ఆశను కలిగిస్తాయి. మీ కంప్యూటర్ సిస్టమ్‌కి యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేయమని అడగవచ్చు. ►అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయడం లేదా తెలియని వాటిని డౌన్లోడ్ చేసే సమయంలో సురక్షిత బ్రౌజింగ్ పద్ధతులను అనుసరించండి. మీకు తెలిసిన సీనియర్స్‌కి విశ్వసనీయ వెబ్సైట్లను మాత్రమే సందర్శించమని, వారు సురక్షితమైన సైట్లో ఉన్నారని నిర్ధారించుకోవడానికి httpr://(ప్యాడ్ లాక్ సింబల్) కోసం చూడాలని సలహా ఇవ్వండి. ►రెగ్యులర్ సాఫ్ట్వేర్ అప్డేట్లు భద్రతా లోపాలను పరిష్కరించగలవు. వారి కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్, యాంటీవైరస్ సాఫ్ట్వేర్ వంటి పరికరాలు, సాఫ్ట్వేర్లను క్రమం తప్పకుండా అప్డేట్ చేయమని సీనియర్లను ప్రోత్సహించండి. ►యాప్స్ స్టోర్ లేదా ప్లే స్టోర్ నుండి మాత్రమే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. ►ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌లను (ప్రత్యేక అక్షరాలు, పెద్ద అక్షరాలు, సంఖ్యాపరమైనవి) ఉపయోగించమని వృద్ధులను ప్రోత్సహించండి. వారి పుట్టిన తేదీ లేదా చిరునామా వంటి సులభంగా ఊహించదగిన సమాచారాన్ని ఉపయోగించవద్దు. ►తెలియని వ్యక్తులతో మీ మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌లతో రిమోట్ స్క్రీన్ షేరింగ్ చేయకండి. ►అన్ని ఇ–మెయిల్స్, సోషల్ మీడియా, బ్యాంక్ ఖాతాల కోసం రెండు కారకాల ప్రమాణీకరణను ఉపయోగించండి. మోసపోతే ఏం చేయాలంటే.. ఈ టోల్ ఫ్రీ నంబర్ 1930కి వెంటనే (ఒక గంటలోపు) ఫోన్ చేయండి. దీని ద్వారా పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంటుంది. ఈ 1930 సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్, భారత ప్రభుత్వంచే నిర్వహించబడుతుంది. దీనికి బదులుగా మీరు మీ స్థానిక సైబర్ క్రైమ్ పోలీసు అధికారుల వద్ద జరిగిన మోసం చెప్పి కంప్లయింట్ ఇవ్వచ్చు. లేదా httpr://www.cybercrime. gov.in లో ఫిర్యాదును నమోదు చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్ నుండి దూరంగా ఉండాలంటే.. ►మీ స్మార్ట్‌ఫోన్‌లో నోటిఫికేషన్లను నిలిపి వేయండి. ►మీ పడకగది, భోజనాల గదిని స్మార్ట్‌ఫోన్ రహిత జోన్‌గా మార్చండి. ►మీ స్మార్ట్‌ఫోన్‌కు బదులుగా ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్ కంప్యూటర్ నుండి సోషల్ మీడియాను యాక్సెస్ చేయండి. ►ఫోన్ వినియోగాన్ని పర్యవేక్షించడం కోసం ఆండ్రాయిడ్‌లో డిజిటల్ వెల్బీయింగ్ యాప్, ఐఓఎస్‌లో స్క్రీన్ టైమ్ యాప్‌ని ఉపయోగించండి. ►ప్రజలు తమ స్క్రీన్ వినియోగ సమయం పెరుగుతోందని భావిస్తే గ్రే స్కేల్ మోడ్ ఫీచర్‌ని ఉపయోగించండి -
బార్లో పరిచయం, టెక్కీకి శఠగోపం
సాక్షి, బనశంకరి: గుర్తు తెలియని వ్యక్తిని నమ్మి ఇంట్లో ఆశ్రయమిచ్చిన ఓ టెక్కీ రూ. లక్షల్లో వంచనకు గురయ్యాడు. ఈఘటన బెళ్లందూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. వివరాలు... సర్జాపురలో నివాసం ఉంటున్న ఆశీశ్ ఐటీ ఇంజినీర్. గతనె 15న ఇతను బార్‌కు వెళ్లాడు. ఓ గుర్తు తెలియని వ్యక్తి కలిశాడు. తన పేరు తుషార్ అలియాస్ డిటోసర్కార్ అని, ఢిల్లీకి చెందిన వాడినని, బంధువులు ఇంటికి వచ్చినట్లు నమ్మించాడు. ఒక్కరోజు తలదాచుకుంటానని.. బంధువులు నగరంలో లేరని, మరో ప్రాంతానికి వెళ్లారని, దీంతో తనకు ఇక్కడ తెలిసిన వారు ఎవరూ లేరని మాటలు కలిపాడు. ఒకరోజు ఆశ్రయం ఇవ్వాలని తన కష్టం చెప్పుకున్నాడు. అతని మాటలను నమ్మిన ఆశీశ్ అమాయకంగా ఫ్లాట్‌కు తీసుకెళ్లాడు. రాత్రి ఫ్లాట్‌లోనే నిద్రించిన తుషార్ మరుసటిరోజు ఉదయం అక్కడి నుంచి ఉడాయించాడు. ఆశీశ్ ఉదయం నిద్ర లేవగానే తుషార్ కనబడకపోగా ఫోన్లో సిమ్ కార్డు కూడా లేదు. అదేరోజు మధ్యాహ్నం ఆశీశ్ అకౌంట్ నుంచి రూ.1.64 లక్షల నగదు వేరే అకౌంట్‌కు జమ అయినట్లు మెసేజ్ వచ్చింది. ఇదే తరహాలో అతడి బ్యాంకు అకౌంట్ నుంచి దశల వారీగా పదిరోజుల్లో ఆన్లైన్లో షాపింగ్ చేసినట్లు సుమారు రూ.7.20 లక్షలు కట్ అయింది. మొత్తం రూ.8.84 లక్షలు పోయింది. తన సిమ్ కార్డు దొంగలించిన తుషార్ వేరే మొబైల్‌కు అమర్చుకుని అందులో డిజిటల్ బ్యాంక్ అకౌంట్ ద్వారా నగదు జమ చేసుకున్నట్లు తెలిసింది. బాధితుడు బెళ్లందూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. (చదవండి: వాట్సాప్‌తో ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు) -
జిందాల్ కోటెక్స్కు సెబీ షాక్
న్యూఢిల్లీ: యార్న్ సంబంధ ప్రొడక్టులు రూపొందించే జిందాల్ కోటెక్స్పై క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కొరడా ఝుళిపించింది. కంపెనీకి చెందిన బ్యాంకు, డీమ్యాట్ ఖాతాల అటాచ్‌మెంట్‌కు ఆదేశాలు జారీ చేసింది. గ్లోబల్ డిపాజిటరీ రిసీప్ట్స్(జీడీఆర్‌లు) జారీలో అవకతవకలకు సంబంధించి రూ. 14.55 కోట్ల రికవరీకి వీలు గా తాజా చర్యలు చేపట్టింది. జిందాల్ కోటెక్స్తోపాటు ముగ్గురు అధికారులపైనా చర్యలకు ఉపక్రమించింది. ఈ జాబితాలో సందీప్ జిందాల్, రాజిందర్ జిందాల్, యశ్ పాల్ జిందాల్ ఉన్నారు. వడ్డీసహా అన్ని రకాల వ్యయా లు, చార్జీలు కలిపి రూ. 14.55 కోట్ల రికవరీకిగాను కంపెనీతోపాటు ముగ్గురు అధికారుల బ్యాంకు, లాకర్లు, డీమ్యాట్ ఖాతాల అటాచ్‌మెంట్‌కు సెబీ ఆదేశించింది. ఆయా ఖాతాల కు సంబంధించి అన్ని బ్యాంకులు, మ్యూచు వల్ ఫండ్స్ ఎలాంటి డెబిట్లనూ అనుమతించవద్దంటూ సెబీ ఆదేశించింది. అయితే క్రెడిట్ లావాదేవీలకు మాత్రం అనుమతించింది. చదవండి: కస్టమర్ కంప్లైంట్.. ఫ్లిప్‌కార్ట్‌కు షాకిచ్చిన వినియోగదారుల ఫోరం! -
కస్టమర్లకు గుడ్‌న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న పీఎన్బీ!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) అన్ని కాలపరిమితులపై డిపాజిట్ రేటును అరశాతం పెంచింది. రూ.2 కోట్లలోపు ఏడాది, మూడేళ్ల మధ్య వడ్డీరేట్లు అరశాతం పెరిగి వరుసగా 6.75 శాతానికి పెరిగాయి. సీనియర్ సిటిజన్లకు అదనంగా మరో అరశాతం వడ్డీ అందుతుంది. ప్రీమెచ్యూర్ విత్‌డ్రాయెల్ అవకాశం లేని పీఎన్బీ ఉత్తమ్ స్కీమ్ కింద డిపాజిట్ రేటు 6.8 శాతానికి ఎగసింది. 666 రోజుల స్థిర డిపాజిట్లపై వార్షిక వడ్డీ రేటు 8.1 శాతంగా కొనసాగుతుంది. చదవండి: iPhone 14: వావ్ ఐఫోన్ పై మరో క్రేజీ ఆఫర్! ఇంకెందుకు ఆలస్యం..ఇప్పుడే సొంతం చేసుకోండి! -
న్యూ ఇయర్ అలర్ట్: ఆధార్ కార్డ్‌ని ఇలా ఉపయోగించండి!
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ వాటి వల్ల మంచితో పాటు చెడు కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇటీవల వ్యక్తిగత వివరాలు( మొబైల్ నంబర్, ఆధార్, బ్యాంక్ అకౌంట్ , డెబిట్ కార్డ్, పిన్ నంబర్) తెలుసుకుని సైబర్ నేరగాళ్లు మన జేబులకు చిల్లు పెడుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ సమస్యపై ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నాయి. తాజాగా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) కొత్త సంవత్సరం రానున్న సందర్భంగా ఆధార్ వినియోగంపై కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆధార్ వినియోగం ఎలా అంటే.. ఇటీవల ఆధార్ కేవలం గుర్తింపు కార్డ్‌లానే కాకుండా పలు సంక్షేమ పథకాలు, బ్యాంక్, పాన్ వంటి వాటితో జత చేయడంతో చాలా క్రీయాశీలకంగా మారింది. దీంతో సైబర్ కేటుగాళ్ల కళ్లు ఆధార్ నెంబర్‌పై పడింది. ఈ నేపథ్యంలో .. మోసాల బారిన పడకుండా యూఐడీఏఐ పలు సూచనలు చేసింది. ఇంత వరకు బ్యాంక్ ఖాతా నంబర్లు, పాన్, పాస్‌పోర్ట్‌లతో సహా ఇతర డ్యాకుమెంట్లు మాదిరిగానే ప్రజలు ఆధార్ విషయంలోనూ పలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. సోషల్ మీడియాతో పాటు ఇతర ప్లాట్‌ఫాంలతో సహా పబ్లిక్ డొమైన్లో ఆధార్ కార్డ్‌లను ఎప్పుడూ షేర్ చేయవద్దని సూచించింది. ఏ పరిస్థితిల్లోనూ ఇతరులతో ఆధార్ ఓటీపీ (OTP)ని పంచుకోకూడదని తెలిపింది. ఒక వేళ ఏదైనా విశ్వసనీయ సంస్థతో ఆధార్‌ను పంచుకునేటప్పుడు, మొబైల్ నంబర్, బ్యాంక్ ఖాతా నంబర్ లేదా పాస్‌పోర్ట్, ఓటర్ ఐడి, పాన్, రేషన్ కార్డ్ వంటి ఏదైనా ఇతర గుర్తింపు పత్రాన్ని పంచుకునే సమయంలో అదే స్థాయి జాగ్రత్తలు పాటించాలని UIDAI సూచనలు చేసింది. చదవండి: న్యూ ఇయర్ ఆఫర్: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.14,000 తగ్గింపు.. త్వరపడాలి, అప్పటివరకే! -
నగదు వ్యవహారాలు.. జాగ్రత్త, అలా చేస్తే చిక్కుల్లో పడినట్లే!
నేను రిటైర్ అయ్యాను. సర్వీసులో ఉండగా పన్నుకట్టేవాణ్ని. తర్వాత కూడా చెల్లిస్తున్నాను. నా ప్రాణ మిత్రుడు ఒక ఇల్లుఅమ్ముతున్నాడు. ఆయనకి వైట్‌లో కోటి రూపాయలు, బ్లాక్‌లో రూ. 30,00,000 వస్తుంది. ఆరూ. 30,00,000 నా బ్యాంకులో నగదుగా డిపాజిట్ చేసి, వీలైనంత త్వరగా తనకు నగదు ఇవ్వమంటున్నాడు. అలా చేయవచ్చా? ఇంతవరకు మీ ఆదాయపు పన్ను అసెస్మెంటు సజావుగాజరుగుతోంది. ఎటువంటి సమస్యా లేదు. ఇప్పుడు మీరు మీ మిత్రుడి నుంచి నగదు తీసుకుని,మీ అకౌంటులో డిపాజిట్ చేయగానే, అది డిపార్ట్మెంట్ వారి దృష్టిలో పడుతుంది.నోటీసులు ఇస్తారు. ఆరా తీస్తారు. మీరు వివరణ ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు అంతమొత్తం ఎలా వచి్చందని అడుగుతారు. ఎవరు ఇచ్చారు, ఎందుకిలా ఇచ్చారు అన్న ప్రశ్నలువస్తాయి. చట్టప్రకారం రూ. 2,00,000 దాటి నగదు తీసుకోవడం నేరం. శిక్ష పడుతుంది. ఇచ్చినవారికంటే పుచ్చుకున్న వారిని వివరణ అడుగుతారు. మీరు మీ ఫ్రెండ్ పేరుచెప్పారనుకోండి. ఆయన్ని అడుగుతారు. ఆయన దగ్గర్నుంచి ఒక ధృవీకరణ పత్రం అడుగుతారు.దీని ద్వారా ‘‘సోర్స్’’ ను నిర్ధారించవచ్చు కానీ, మీరు చట్టాన్ని ఉల్లంఘించినవారవుతారు. ఆ తర్వాత, ఆ మొత్తాన్ని విత్‌డ్రా చేయాలి. నగదులో విత్‌డ్రా చేసి మీమిత్రుడికి ఇవ్వాలి. ఈ విషయంలోనూ ఆరా తీస్తారు. వివరణ ఇవ్వాలి. నోటి వివరణసరిపోదు. ఒకవేళ నిజం చెప్పినా, నగదులో పుచ్చుకున్నందుకు మీ ఫ్రెండ్నినిలదీస్తారు. అది పెద్ద తలకాయ నొప్పి. ఈ సబ్జెక్ట్‌లో తెలుసుకోవాల్సింది ఏమిటంటే (1) నగదువ్యవహరాలు చేయకూడదు (2) నగదుడిపాజిట్/విత్‌డ్రాయల్ గురించి ఆరా తీస్తారు. ఎంక్వైరీ గట్టిగాఉంటుంది. (3) ఈఎంక్వయిరీలో ఇద్దరూ ఒకే మాట మీద నిలబడాలి. అది సాధ్యమయ్యేనా? (4) వివరణ సరిగ్గా ఉండకపోయినా, సంతృప్తికరంగా లేకపోయినా, పూర్తిగా లేకపోయినా.. ఆ రూ.30,00,00 ముందు మీ కేసులో ఆదాయంగా కలుపుతారు. ఆ తర్వాత సంగతి మీకు తెలియనిదేముంది?అందుకని ఎటువంటి నగదు తీసుకోకండి. తీసుకున్నా డిపాజిట్ చేయకండి. మీరు ఏ సహాయం చేయవచ్చంటే వారిదగ్గర్నుంచి చెక్కు రూపంలో పుచ్చుకుని, తిరిగి చెక్కు రూపంలో ఇవ్వొచ్చు. మరీ ప్రాణమిత్రుడైతే నగదు పుచ్చుకుని, దాచి నగదు ఇచ్చేయండి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. చదవండి: ఇది మరో కేజీఎఫ్.. రియల్ ఎస్టేట్ సంపాదన, భవనం మొత్తం బంగారమే! -
పీఎన్బీ కస్టమర్లకు అలర్ట్.. ఇది తప్పనిసరి, లేదంటే మీ బ్యాంక్ ఖాతాపై ఆంక్షలు తప్పవ్!
పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన కస్టమర్లకు కీలక విషయాన్ని వెల్లడించింది. తమ బ్యాంక్‌లో అకౌంట్ కలిగిన కస్టమర్లు డిసెంబర్ 12 కేవైసీ (KYC) వివరాలను అప్డేట్ చేసుకోవాలని లేదంటే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని సూచనలు చేసింది. కేవైసీ పెండింగ్‌లో ఉన్న తమ ఖాతాదారులకు పీఎన్బీ ఇప్పటికే ఎస్ఎంఎస్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది. అలాగే రిజిస్టర్డ్ అడ్రస్‌కు రెండు నోటీసులు పంపించింది. అయితే ఇది అందరికీ వర్తించదు. ఎవరి కేవైసీ అప్డేట్ ఇంకా పెండింగ్‌లో ఉందో వారికి మాత్రమేనని తెలిపింది. ఈ మేరకు పీఎన్బీ అధికారికి ట్వీటర్లో ట్వీట్ చేసింది. ట్వీట్లో ఏముంది ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. కస్టమర్లు కేవైసీ అప్డేషన్ తప్పనిసరి. 30.09.2022 నాటికి ఏ కస్టమర్ల ఖాతాకు సంబంధించి కేవైసీ పెండింగ్‌లో ఉందో వారికి మొబైల్ ఎస్ఎంఎస్, నోటీసుల ద్వారా ఈ విషయాన్ని తెలియజేశాం. ఈ నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న కస్టమర్లు వెంటనే వారి బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి 12.12.2022 లోపు ఈ అప్డేట్ ప్రక్రియని పూర్తి చేయాలి. ఇది పూర్తి చేయని కస్టమర్ల ఖాతాలపై ఆంక్షలు అమలులోకి వస్తాయని తెలిపింది. KYCని ఎలా అప్డేట్ చేయాలి పీఎన్బీ కస్టమర్లు గుర్తింపు, అడ్రస్ ప్రూఫ్, ఇటీవలి ఫోటోలు, పాన్ కార్డ్, ఇన్‌కం ప్రూఫ్, మొబైల్ నంబర్లు వంటి వివరాలను బ్యాంకుకు మెయిల్ చేయవచ్చు (తమ బ్యాంక్ అకౌంట్లో రిజస్టర్ చేసుకున్న ఈమెయిల్ ద్వారా), లేదా వ్యక్తిగతంగా ఈ సమాచారాన్ని బ్యాంకుకు వెళ్లి అందివ్వాల్సి ఉంటుంది. పీఎన్బీ ఖాతాదారులు కేవైసీ పెండింగ్‌లో ఉందో లేదా అనే సమాచారం కోసం 1800 180 2222/ 1800 103 2222 (టోల్-ఫ్రీ)/ 0120-2490000 (టోల్ చేసిన నంబర్)లో కస్టమర్ కేర్ సేవతో కనెక్ట్ కావచ్చు. Points to be noted 👇🏻 Remember: KYC updation is mandatory as per RBI guidelines. Beware: Bank does not call & request personal information of customers for KYC updation.#KYC #Banking #SmartBanking #FoolTheFraudster pic.twitter.com/f6WohISarL — Punjab National Bank (@pnbindia) November 20, 2022 చదవండి: మినిమం బ్యాలెన్స్ నిర్వహించని ఖాతాలపై పెనాల్టీ.. కేంద్రం ఏం చెప్పిందంటే? -
మినిమం బ్యాలెన్స్ నిర్వహించని ఖాతాలపై పెనాల్టీ.. కేంద్రం ఏం చెప్పిందంటే?
ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ బ్యాంక్ అకౌంట్‌ను కలిగి ఉన్నారు. ఇక ఉద్యోగులు, వ్యాపారస్తులు ఏకంగా రెండు పైనే ఖాతాలను నిర్వహిస్తున్నారు. కొందరు బ్యాంకు ఖాతాలు తెరిచి అందులో మినిమం బ్యాలెన్స్ (కనీస మొత్తంలో నగదు) నిల్వ చేయలేక జరిమానాలు, అదనపు ఛార్జీలు చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. అయితే బ్యాంక్ అకౌంట్లో ఇక మినిమం బ్యాలెన్స్ జరిమానాలపై తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవంత్ కిషన్రావ్ కారడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మినిమం బ్యాలెన్స్ నిర్వహించని ఖాతాలపై పెనాల్టీని మాఫీ చేయడంపై వ్యక్తిగత బ్యాంకుల బోర్డులు నిర్ణయం తీసుకోవచ్చని కారడ్ తెలిపారు. ‘బ్యాంకులు స్వతంత్ర సంస్థలు. పెనాల్టీని రద్దు చేసే నిర్ణయం తీసుకునే అధికారం బోర్డులకు ఉన్నాయని’ అన్నారు. బ్యాంక్ రూల్స్ ప్రకారం తక్కువ నిల్వ (మినిమం బ్యాలెన్స్) ఉన్న ఖాతాలపై జరిమాన విధిస్తున్న విషయం విదితమే. అయితే ఇలాంటి అకౌంట్లపై ఎలాంటి పెనాల్టీ వసూలు చేయవద్దని బ్యాంకులను ఆదేశించడంపై కేంద్రం పరిశీలిస్తుందా అని అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ విధంగా సమాధానమిచ్చారు. జమ్మూ కాశ్మీర్లో క్రెడిట్-డిపాజిట్ నిష్పత్తి 58 శాతంగా ఉందని, దానిని పెంచాలని అధికారులను కోరినట్లు కారడ్ తెలిపారు. అయితే ఇక్కడ క్లిష్టమైన భూభాగాలు ఉన్నప్పటికీ, జమ్మూ కాశ్మీర్లో బ్యాంకు కమ్యూనికేషన్ లేని ఒక్క గ్రామం కూడా లేదని మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. చదవండి: ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లకు బంపర్ ఆఫర్ -
పోలీసుల అకౌంట్లోకి వచ్చిపడుతున్న కోట్ల డబ్బు...టెన్షన్లో అధికారులు
ఒక పోలీస్ అకౌంట్లో 10 కోట్లు క్రెడిట్ అయ్యాయి. దీంతో అతను ఒక్కసారిగా రాత్రికి రాత్రే కోటిశ్వరుడిగా మారిపోయాడు. ఈ ఘటన పాకిస్తాన్‌లోని కరాచీలో చోటు చేసుకుంది. ఒక పోలీస్ అధికారికి తన జీతంతో పాటుగా సుమారు రూ. 10 కోట్లు అకౌంట్లో జమ అయ్యాయి. అయితే బ్యాంకు వాళ్లు ఫోన్ చేసి చెప్పేంత వరకు తనకు ఈ విషయం తెలియలేదని సదరు పోలీసు అధికారి చెబుతున్నాడు. దీంతో అతని అకౌంట్‌ని బ్లాక్ చేసి ఈ డబ్బు ఎలా క్రెడిట్ అయ్యిందని దానిపై దర్యాప్తు ప్రారంభించారు అధికారులు. అచ్చం సదరు పోలీస్‌లానే పాక్‌లోని లర్కానా ప్రాంతంలోనిమరో ముగ్గురు పోలీస్ అధికారుల అకౌంట్లోకి కూడా రూ. 5 కోట్లు చొప్పున క్రెడిట్ అయినట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఇంత మొతంలో డబ్బు ఎలా ఎక్కడ నుంచి వచ్చిందనే దానిపై అధికారులు ఆరా తీయడం ప్రారంభించారు. (చదవండి: బ్రేక్ ఇవ్వండి..ఎవరు ఇడియట్స్ అనేది తేలుద్దాం: బైడెన్ ఫైర్) -
టు లెట్.. టేక్ కేర్
హిమాయత్‌నగర్: నగరంలోని ఇల్లు ఎవరిదైనా అద్దెకు ఉందని యాడ్ కనిపిస్తే చాలు. క్షణాల్లో కొత్త ఫోన్ నంబర్ నుంచి ఇంటి యజమానికి ఫోన్ వస్తుంది. ‘నేను ఆర్మీలో అధికారిని, మీ ఇల్లు అద్దెకు ఉన్న విషయాన్ని ఇప్పుడే వెబ్సైట్లో చూశాను. మీ ఇల్లు నాకెంతో నచ్చింది’, అంటూ మోసాలకు పాల్పడుతున్నారు. ఆర్మీ అధికారులంటే ప్రజల్లో ఉన్న ఓ గొప్ప నమ్మకాన్ని సైబర్ నేరగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. మీరు ముందుగా మా అకౌంట్‌కు కొంత డబ్బు పంపండి అది ఓకే అయితే వెంటనే మీకు ఏడాదికి సరిపోయే ఇంటి అద్దె డబుల్ చెల్లిస్తామంటూ మాయ మాటలు చెప్తూ లక్షల రూపాయిలు కాజేస్తున్నారు. కేవలం ఆర్మీ అధికారులు మోసం చేయరనే ఒక నమ్మకంతో అమాయక ప్రజలు లక్షల పోగొట్టుకుంటూ సైబర్‌క్రైం పోలీసుస్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు. నమ్మకాన్ని రెట్టింపు చేస్తూ కొట్టేస్తున్నారు ఆర్మీలో పనిచేసే అధికారుల ఇల్లు అద్దె అంతా కూడా ఆర్మీనే చెల్లిస్తుంది. ఆరు నెలల నుంచి ఏడాదికి సరిపోయే అద్దెతో పాటు ఆరు నెలల అడ్వాన్స్ ముందుగానే మీ అకౌంట్లో పడుతుందని చెబుతున్నారు. దీనికి ఇంటి యజమాని ఓకే చెప్పడంతో పథకాన్ని రచిస్తున్నారు. ముందుగా మీకొక లింకు పంపుతాము దానికి కేవలం రూ. 5 పంపండి మీకు రూ. 10 వస్తాయి మా ఆర్మీ నుండంటూ సూచిస్తున్నారు. వెంటనే వాళ్లు పంపిన లింకుకు రూ. 5 పంపగానే రూ. 10 వస్తున్నాయి. ఆ తర్వాత నెల అద్దె రూ. 12 వేలు ఉంటే రెండునెలలవి రూ. 24 వేలు పంపమంటున్నారు. అవి పంపినప్పటి నుంచి సైబర్ కేటుగాళ్ల డ్రామా మొదలవుతుంది. ఏదో టెక్నికల్ సమస్య ఉందంటూ మళ్లీ పంపాలని కాజేస్తున్నారు. ఇదే తరహాలో వారం క్రితం ఓ గృహణి పలు దఫాలుగా వారు చెప్పిన లింకుకు ఒక్కరోజులో రూ. 12 లక్షలు పంపింది. ఇంకా ఇంకా అడగడంతో అప్పటికి ఆమె మోసపోయినట్లు గ్రహించి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఆర్మీ అధికారుల పేర్లు చెబుతూ ఈ దందా చేస్తున్నవారంతా కూడా రాజస్థాన్, యూపీకి చెందిన వారిగా సైబర్‌క్రైం పోలీసులు గుర్తించారు. (చదవండి: దయచేసి ఆ గుర్తులను తొలగించండి.. టీఆర్ఎస్ విజ్ఞప్తి) -
బ్యాంక్ కస్టమర్లకు వార్నింగ్.. ఆ యాప్‌లు ఉంటే మీ ఖాతా ఖాళీ,డిలీట్ చేసేయండి!
టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో పాటు ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం కూడా విపరీతంగా పెరిగిపోయింది. దీంతో పాటు బ్యాంకులు కూడా ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్లోన్లోనూ వారి సేవలను విస్తృతం చేశాయి. ఈ నేపథ్యంలో డిజిటల్ లావాదేవీలు అధికమయ్యాయి. ప్రస్తుతం లాక్డౌన్ నుంచి దుకాణాల్లో చెల్లింపులు, ఇ-కామర్స్ సంస్థల్లో కొనుగోళ్లు అన్నీ డిజిటల్ రూపంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదే అదనుగా హ్యకర్లు బ్యాంకింగ్ యాప్‌లే లక్ష్యంగా కొత్త వైరస్‌లను సృష్టించారు. మొబైల్ ఫోన్లకు వివిధ రకాలుగా మెసేజ్‌లు పంపుతున్నారు. కస్టమర్లు కూడా అవి వైరస్ లింకులని తెలియక క్లిక్ చేసి వారి ఫోన్లో ఉన్న బ్యాంకింగ్ యాప్‌ల సమాచారం నేరగాళ్లకు చేరేందుకు పరోక్షంగా కారణమవుతున్నారు. చివరికి ఖాతాలు ఖాళీ అయ్యాక లోబదిబోమంటున్నారు. బ్యాంకింగ్ యాప్‌లే లక్ష్యం.. జర జాగ్రత్త గురూ తాజాగా బ్యాంకింగ్ యాప్‌లే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు ‘సోవా’ (SOVA) అనే వైరస్ లింకులను మెసేజ్ రూపంలో ఫోన్లకు పంపుతున్నారు. అది క్లిక్ చేయగానే బ్యాంకింగ్ యాప్‌ల పాస్వర్డ్, లాగిన్ వివరాలతో పాటు పాస్వర్డ్ కూడా నేరగాళ్లకు చేరుతోంది. ఈ విషయంపై ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని పలు బ్యాంకులు హెచ్చరికలు జారీ చేశాయి. సోవా వైరస్ పలు రకాలుగా బ్యాంకింగ్, పేమెంట్ లావాదేవీలను గుర్తించడంతో పాటు క్రిప్టోకరెన్సీ వాలెట్లనూ లక్ష్యంగా చేసుకుంటున్నట్లు బయటపడింది. బ్యాంకులు ఏమంటున్నాయంటే.. అనధికారిక వెబ్సైట్లలో ఉండే ఏ లింక్‌పై కూడా క్లిక్ చేయడం మంచిది కాదని బ్యాంకులు హెచ్చరిస్తున్నాయి. ఎస్బిఐ, యాక్సిస్, వంటి బ్యాంకింగ్ యాప్‌లు కూడా కేవలం అఫిషియల్ ప్లే స్టోర్, అధికారిక వైబ్సైట్ల నుంచి మాత్రమే యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచిస్తున్నాయి. ఒకవేళ ఇతర వెబ్సైట్ల నుంచి ఇన్స్టాల్ చేసుకుని వాడుతున్నా, లేదా డౌన్లోడ్ చేసుకుని ఉన్న ప్రమాదమేనని, అలాంటి యాప్‌లను వెంటనే డెలీట్ చేయడం ఉత్తమమని చెప్తున్నాయి. ఎలా పని చేస్తుంది ఈ వైరస్.. ఎస్బీఐ(SBI) తెలిపిన సమాచారం ప్రకారం.. సోవా(SOVA) అనేది ఒక ఆండ్రాయిడ్ బ్యాంకింగ్ ట్రోజన్ మాల్వేర్. ఇది బ్యాంకు యాప్స్‌లోకి వెళ్లి కస్టమర్ల వ్యక్తిగత సమాచారం తస్కరిస్తుంది. అంతేకాకుండా యూజర్ల పర్సనల్ క్రెడెన్షియల్స్ అయిన లాగిన్, పాస్వర్డ్ వంటి ముఖ్యవివరాలను కూడా గ్రహించి వారి అకౌంట్లలోకి యాక్సెస్ పొందుతుంది. ఒకసారి ఈ వైరస్ ప్రవేశిస్తే మీ బ్యాంక్ ఖాతాను ఖాళీ చేస్తుంది. అందుకే ముందుగానే ఈ వైరస్‌ని మొబైల్‌లోకి రాకుండా చర్యలు తీసుకోవడం ఉత్తమం. చదవండి: ఫ్రెషర్స్‌కి భారీ షాక్.. ఐటీలో ఏం జరుగుతోంది, ఆఫర్ లెటర్స్ ఇచ్చిన తర్వాత క్యాన్సిల్! -
ఒకటికి మించి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా? ఇలాగైతే సమస్యలు తప్పవ్!
ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉపయోగిస్తున్నారా లేదా వాడుకోవాలని అనుకుంటున్నారా.. అయితే ఈ విషయాలు గమనించాలి లేదంటే ఇబ్బందులు తప్పవని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే.. బ్యాంక్ ఖాతా అంటే నగదును దాచుకోవడం , అవసరం ఉన్నప్పుడు నగదు విత్‌డ్రా చేసి వాడుకోవడం, మరి కొందరు ఫిక్స్డ్ డిపాట్లలో వచ్చే వడ్డీ కోసం ఉపయోగిస్తుంటారు. టెక్నాలజీ పెరిగే కొద్దీ బ్యాంకింగ్ సంస్థలు తమ సేవల పరిధిని పెంచుకుంటూ పోయాయి. ఈ నేపథ్యంలో కొన్ని సేవలకు ఛార్జీలు కూడా విధిస్తున్నాయి. ప్రస్తుత రోజుల్లో కస్టమర్లు అనుకోకుండా ఒకటికి మించి బ్యాంక్ అకౌంట్లను కలిగి ఉన్నారు. ఇలా ఎక్కువ ఖాతాలను నిర్వహించడం వల్ల ముఖ్యంగా సామాన్య ప్రజలు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అవేంటో ఓ లుక్కేద్దాం.. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఒక బ్యాంక్ అకౌంట్‌ను నిర్వహించడం సులభం పైగా మీరు మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేస్తున్నప్పుడు, మీ బ్యాంకింగ్ వివరాలు ఒకే బ్యాంకు ఖాతాలో అందుబాటులో ఉన్నందున మీ పని సులభం అవుతుంది. అయితే తప్పక అధిక బ్యాంక్ ఖాతాలు ఉపయోగించాల్సి వస్తే.. బ్యాంక్ సేవలు, ఛార్జీలు తెలుసుకునే కొత్త అకౌంట్లు ఓపెన్ చేస్తే మంచిదని సూచిస్తున్నారు. సిబిల్(CIBIL) రేటింగ్‌కు ప్రమాదం ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లను ఉపయోగించడం వల్ల మీ బ్యాంక్ ఖాతాను సరైన మినిమం బ్యాలెన్స్‌తో నిర్వహించడంలో ఒక్కో సారి కుదరకపోవచ్చు. అటువంటి సందర్భాలలో దాని ప్రభావం మీ సిబిల్( CIBIL ) రేటింగ్‌పై చూపుతుంది. సర్వీస్ ఛార్జీలు అధికం బ్యాంక్ ఖాతా కలిగిన ప్రతీ ఒక్క కస్టమర్ కూడా బ్యాంకులు విధించే ఎస్ఎంఎస్ అలర్ట్ సర్వీస్ ఛార్జ్, డెబిట్ కార్డ్ ఏంఎంసీ మొదలైన వివిధ సేవా ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కస్టమర్లు ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉపయోగిస్తుంటే వారు ఖచ్చితంగా మిగిలిన ఖాతాల ఛార్జీలను కూడా భరించాల్సిందే. అంతే కాకుండా ఎక్కువ కాలం అకౌంట్ వాడకుంటే వివిధ ఛార్జీలు పడతాయి. మినిమం బ్యాలెన్స్ ఉండాల్సిందే బ్యాంక్ సేవింగ్స్ ఖాతాను కలిగి ఉండాలంటే మినిమమ్ బ్యాలెన్స్ నిర్వహించడం తప్పనిసరి. మీకు ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉన్నట్లయితే, మీ ఖాతాలో పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్ చేసి ఉంచాల్సి వస్తుంది. ప్రస్తుత రోజుల్లో బ్యాంకులు కస్టమర్ల ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే బాదుడు మొదలుపెడుతున్నాయి. అలాంటిది వేర్వేరు బ్యాంకుల్లో కనీస మొత్తంలో నగదుని నిల్వను నిర్వహించాలంటే సామాన్యుడికి ఇది భారమే తప్ప ఉపయోగకరం కాదని నిపుణులు సూచిస్తున్నారు. అంతే కాకుండా ఎన్ని ఖాతాలు మనం ఉపయోగిస్తుంటే బ్యాంకులు విధించే ఛార్జీలు కూడా అదే స్థాయిలో ఉంటాయనే విషయాన్ని గమనించాలి. చదవండి:Chennai: నగరజీవికి మోయలేని భారం.. తప్పక కట్టాల్సిందే గురూ! -
యాహూ! డీమ్యాట్ అకౌంట్లోకి రూ.11 వేల కోట్లు, కొన్ని గంటల్లోనే..
ఒక్కోసారి అనుకోని ఘటనలు మన జీవితంలో జరుగుతుంటాయి. అయితే అందులో కొన్ని శాశ్వతంగా నిలిచిపోగా మరికొన్ని తాత్కాలికంగా మాత్రమే ఉంటాయి. ఈ తరహాలోనే ఓ వ్యక్తి తన జీవితంలో జరిగిన ఓ అనూహ్య సంఘటన వల్ల కొన్ని గంటలు కోటీశ్వరుడిగా మారాడు. అదేంటి కొన్ని గంటల వరకే బిలియనీర్‌గా మారడం ఏంటని అనుకుంటున్నారా? వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన రమేష్ సాగర్ గత ఆరు సంవత్సరాలుగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడుతూ ఉన్నాడు. ఈ క్రమంలో అతను కోటక్ సెక్యూరిటీస్‌లో ఏడాది క్రితం డీమ్మాట్ అకౌంట్‌ని తెరిచి అందులో అనేక స్టాక్స్‌లలో పెట్టుబడి పెట్టేవాడు. అయితే ఓ రోజు అనకోకుండా అతని అకౌంట్లో సుమారు 11వేల కోట్లు జమ అయ్యింది. ఈ విషయాన్ని గమనించిన రమేష్ మొదట కంగారు పడినప్పటికీ తర్వాత జాక్‌పాట్ కొట్టానని ఆనంద పడ్డాడు. వెంటనే అందులోంచి రూ. 2 కోట్లను స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి సాయంత్రం వరకు రూ. 5 లక్షలు లాభాన్ని ఆర్జించాడు. అయితే ఖాతాలో డబ్బులు క్రెడిట్ అయిన కొన్ని గంటలకే టెక్నికల్ సమస్య కారణంగా ఆ నగదు తన ఖాతాలో పడిందని, బ్యాంకు అధికారులు మెసేజ్ పంపారు. చివరకు బ్యాంకు నుంచి అతని ఖాతాలో క్రెడిట్ అయిన సొమ్ము కొన్ని గంటల్లోనే ఖాళీ అయ్యింది. కాగా బ్యాంకులో అవకతవకలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం, బీహార్ గ్రామంలోని ఇద్దరు పిల్లలు అకౌంట్లో దాదాపు వెయ్యి కోట్ల రూపాయల జమ అయిన సంగతి తెలిసిందే. చదవండి: శ్రీమంతుడు 2.0: రూ.24 వేల కోట్ల కంపెనీని విరాళంగా ఇచ్చాడు! -
కస్టమర్ల కోసం ఎస్బీఐ సరికొత్త సేవ.. ఒక్క మెసేజ్ పెడితే చాలు..
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(SBI) మరో సేవను తన కస్టమర్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం ఒక మెసేజ్‌తో ఫాస్టాగ్( FASTag) బ్యాలెన్స్‌ను చెక్ చేసుకునే సర్వీసును లాంచ్ చేసింది. దీని ద్వారా ఎస్బీఐ కస్టమర్లు ఫాస్టాగ్( FASTag) బ్యాలెన్స్‌ను సెకన్లలో తెలుసుకోగలుగుతారు. అందులో.. ఫాస్ట్‌ట్యాగ్‌ని ఉపయోగించే ఎస్బీఐ కస్టమర్లు వారి రిజిస్టర్ అయిన నంబర్ నుంచి 7208820019కి ఎస్ఎంఎస్ (SMS) పంపడం ద్వారా వారి ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్‌ను తెలుసుకోవచ్చని తెలిపింది. అయితే దీని కోసం ఎస్బీఐ కస్టమర్లు తమ మొబైల్ నెంబర్‌ను బ్యాంకు వద్ద రిజిస్టర్ చేసుకుని ఉండాలి. టోల్ గేట్ల వద్ద వాహనదారుల సమయం వృథా కాకుండా.. వారి సేవింగ్స్ అకౌంట్ల నుంచే నేరుగా నగదు కట్టేలా కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ సర్వీసులను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇలా చేస్తే చాలు సెకనులో.. మీ వాహనంలో ఇన్స్టాల్ చేసిన ఫాస్టాగ్ బ్యాలెన్స్ వివరాలు.., మీరు FTBAL అని వ్రాసి 7208820019 నంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాల్సి ఉంటుంది. అదే సమయంలో, మీకు చాలా వాహనాలు ఉంటే అప్పుడు మీరు FTBAL అని వ్రాసి 7208820019కి పంపాలి. Dear SBI FASTag Customer, send an SMS to 7208820019 from your registered mobile number to quickly know your SBI FASTag balance. #SBIFastag #SBI #AmritMahotsav pic.twitter.com/mDQQgDl7Mv — State Bank of India (@TheOfficialSBI) September 10, 2022 చదవండి: టెక్నాలజీ అంటే ఇష్టం.. రూ.13వేల ఖర్చు, పాత ఇనుప సామగ్రితో బైక్! -
వాళ్లే టార్గెట్.. పేనియర్‌బైతో యాక్సిస్ బ్యాంక్ జట్టు
మారుమూల ప్రాంతాల్లోనూ రిటైలర్లు, ఇతర కస్టమర్లకు కరెంటు, పొదుపు ఖాతాలను తెరిచే దిశగా ప్రైవేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్, డిజిటల్ సర్వీస్ నెట్వర్క్ పేనియర్‌బై జట్టు కట్టాయి. ఆధార్ ఆధారిత ఈ–కేవైసీ విధానంతో స్థానిక దుకాణాల ద్వారా కూడా సులువుగా ఖాతాల ను తెరిచేందుకు ఈ ఒప్పందం తోడ్పడగలదని యాక్సిస్ బ్యాంక్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ మునీష్ షర్డా తెలిపారు. గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లోని వారు ఆర్థిక సర్వీసుల కోసం ప్రత్యేకంగా బ్యాంకు శాఖలకు వెళ్లాల్సిన అవసరం ఉండని రీతిలో ఈ విధానాన్ని తీర్చిదిద్దినట్లు వివరించారు. ఖాతాను తెరిచేందుకు పలు పత్రాలు సమర్పించడం, సుదీర్ఘ ప్రక్రియలాంటి బాదరబందీ ఉండదని పేనియర్‌బై వ్యవస్థాపకులు ఆనంద్ కుమార్ బజాజ్ తెలిపారు. తమతో జట్టు కట్టిన స్థానిక చిన్న, మధ్య తరహా సంస్థలకు ఇకపై యాక్సిస్ బ్యాంక్ సేవలు కూడా అందుబాటులోకి వస్తాయని, వారు తమ వ్యాపార లావాదేవీలను సమర్ధమంతంగా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. చదవండి: జనవరిలో మహీంద్రా తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ.. మరో రికార్డ్ క్రియేట్ చేస్తుందా! -
కోటీశ్వరుడయ్యాడు.. ప్రపంచంలోని 25వ ధనవంతుడిగా మారాడు.. కానీ!
ఒక్కరోజు ముఖ్యమంత్రి, ఒక్కరోజు డీజీపీలా.. కొన్ని గంటలపాటు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో చేరిపోయాడు అమెరికాకు చెందిన ఓ వ్యక్తి. రాత్రికి రాత్రే బిలియనీర్ అయిపోయాడు. లూసియానాకు చెందిన డారెన్ అకౌంట్లో ఏకంగా రూ.4 లక్షల కోట్లు డిపాజిట్ అయినట్టుగా ఇటీవల మెసేజ్ వచ్చింది. షాక్ గురైన డారెన్ ఒకటికి రెండుసార్లు బ్యాలెన్స్ చెక్ చేసుకున్నాడు. బ్యాంక్ స్టేట్మెంట్ సైతం తనిఖీ చేశాడు. నిజమే! తన అకౌంటే. కానీ అంత డబ్బు ఎక్కడినుంచి వచ్చిందనేది అర్థం కాలేదు. లేనిపోని తనిఖీలు అని భయపడ్డాడు. డబ్బు ఎక్కడిదని కనుక్కోవడం కోసం బ్యాంకుకు కాల్చేశాడు. గతంలో లూసియానా పబ్లిక్‌సేఫ్టీ డిపార్ట్మెంట్లో లా ఎన్ఫోర్స్మెంట్లో పనిచేసిన డారెన్ తాను అంత డబ్బు సంపాదించలేదని, ఎవరికీ ఇచ్చింది కూడా లేదని చెప్పాడు. దీంతో మూడు రోజుల పాటు అతని అకౌంట్ ఫ్రీజ్ అయిపోయింది. ఏం జరిగిందో ఏమో గానీ.. బ్యాంకు వాళ్లు ఆ సొమ్మును వెనక్కి తీసుకున్నారు. కానీ కొన్ని గంటలపాటు మాత్రం.. డారెన్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో 25వ వ్యక్తిగా నిలిచిపోయాడు. అవునూ.. ఇంతకీ మీ అకౌంట్లో అంత డబ్బు పడితే ఏం చేస్తారు?? చదవండి: రిషి సునాక్ ఓటమి వెనక కారణలివేనా? -
చీకటి ఒప్పందాలు.. సైబర్ నేరస్తులతో బ్యాంకర్ల దోస్తీ
సాక్షి, హైదరాబాద్: ‘నగరానికి చెందిన ఓ బాధితురాలు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ మోసానికి గురైంది. తన అకౌంట్లోని సొమ్ము మాయం కాగానే ఆలస్యం చేయకుండా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే సంబంధిత బ్యాంక్ ఖాతాను ఫ్రీజ్ చేయాలని పోలీసులు బ్యాంకు నోడల్ ఏజెన్సీకి సూచించారు. అయినా సైబర్ నేరస్తుడు బాధితురాలి అకౌంట్లోని సొమ్మును స్వాహా చేసేశాడు’.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు బ్యాంక్ అధికారులు కావాలనే అకౌంట్‌ను ఫ్రీజ్ చేయడంలో ఆలస్యం చేశారన్న విషయం తెలిసి షాక్ గురయ్యారు. సైబర్ నేరస్తులు బ్యాంక్ అధికారులతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారని, కొట్టేసిన సొమ్ములో వారికీ కమీషన్లు ఇస్తున్నారన్న నిజాలు తెలిసి విస్తుపోయారు. ఝార్ఖండ్, బిహార్ తదితర రాష్ట్రాల్లోని పలు బ్యాంక్‌లలో ఈ తరహా మోసాలు ఎక్కువగా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అడ్మిని స్ట్రేటర్లు, బ్యాంకర్లు అందరూ నేరస్తులకు సహకరిస్తున్నారని సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ఒకరు తెలిపారు. జీరో అకౌంట్లయిన జన్‌ధన్ ఖాతాల్లో రోజుకు రూ.లక్ష, రూ.2 లక్షల లావాదేవీలు జరుగుతున్నా పట్టించుకోవటం లేదని తెలిపారు. బ్యాంకు ఖాతాలలో అనుమానాస్పద లావాదేవీలు గుర్తిస్తే వెంటనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి దృష్టికి తేవాలి. అధికారులు వాటిని పట్టించుకోకుండా... నేరస్తులకు సహకరిస్తున్నారని ఆయన వివరించారు. చదవండి: మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి నారాజ్! మ్యూల్ అకౌంట్లలోనే లావాదేవీలు.. నిరక్షరాస్యులు, పేదల గుర్తింపు కార్డులతో ఏజెంట్లు నకిలీ(మ్యూల్) అకౌంట్లను తెరిచి, పాస్‌బుక్, చెక్‌బుక్, డెబిట్ కార్డ్, ఫోన్ బ్యాంక్ కిట్ మొత్తాన్ని నేరస్తులకు అందజేస్తుంటారు. ఒక్కో ఖాతాకు రూ.25–30 వేలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. ఈ బినామీ అకౌంట్లలోనే సైబర్ మోసాల లావాదేవీలను నిర్వహిస్తున్నారు. గుజరాత్, బెంగాల్ వంటి రాష్ట్రాల నుంచి మ్యూల్ అకౌంట్లు ఎక్కువగా ఉన్నాయి. వీటి తాలూకు లావాదేవీలు మాత్రం బిహార్, ఝార్ఖండ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల నుంచి చేస్తున్నారు. దీంతో కేసు దర్యాప్తులో సైబర్ క్రైమ్ పోలీసులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాస్తవానికి ఖాతాదారుల చిరునామాలను ధ్రువీకరించిన తర్వాతే బ్యాంకులు అకౌంట్లను తెరవాలి. లేకపోతే వారి మీద కూడా ఐపీసీ 109 అబాట్మెంట్ సెక్షన్ కింద కేసు నమోదు చేసే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రాచకొండ సైబర్ క్రైమ్‌లో నమోదయిన ఓ కేసులో బాధితుడి నుంచి కొట్టేసిన రూ.60 లక్షల సొమ్మును నేరస్తులు అసోంకు చెందిన ఒక ఓలా డ్రైవర్ అకౌంట్లో డిపాజిట్ చేశారు. ఆ డ్రైవర్ నగదును విత్‌డ్రా చేసి నేరస్తులకు అందించాడు. ఖాతాదారుకు ఆ లావాదేవీ మోసపూరితమైనదని తెలిసినా నేరస్తుడికి సహకరించిన నేపథ్యంలో పోలీసులు ఆ డ్రైవర్‌పై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
షాకింగ్: రూ. 100 డ్రా చేద్దామని వెళితే.. కూలీ ఖాతాలో 2,700 కోట్లు
ఏటీఎంలో నుంచి డబ్బులు డ్రా చేసినా, ఎక్కడైనా బిల్ పేమెంట్ చేసినా.. అకౌంట్లో ఇంకా ఎంత మనీ ఉందో చెక్‌చేసుకునే అలవాటు చాలామందికి ఉంటుంది. కష్టపడకుండా ఒకేసారి అకౌంట్లోకి కళ్లు చెదిలో డబ్బులు వచ్చి చేరితే ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. అంతేనా.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోతే ఎంత బాగుంటుందో అని ఆశపడేవారూ లేకపోలేదు. ఇలాంటి ఓ విచిత్ర ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఓ దినసరి కూలీ కూడా క్షణాల్లో కోటీశ్వరుడిగా మారిపోయాడు. అకౌంట్లో కలలో కూడా ఊహించని మొత్తంలో అమౌంట్ చూసి కరెంట్‌షాక్ తగిలినంత పనిచేశాడు. చివరికి అసలు విషయం తెలిసి పాపం ఖంగుతున్నాడు. కన్నౌజ్ జిల్లాకు చెందిన 45 ఏళ్ల బిహారీ లాల్ ఇటుక బట్టీలో కూలీగా పనిచేస్తున్నాడు. తన జన్ ధన్ ఖాతా నుంచి రూ. 100 విత్‌డ్రా చేయడానికి ఏటీఎంకు వెళ్లాడు. అక్కడ వంద రూపాయలు డ్రా చేసిన తరువాత అతనికి ఒక మెసెజ్ వచ్చింది. ఇంకా అకౌంట్లో రూ. 2,700 కోట్లు ఉన్నట్లు మెసెజ్‌లో చూపించింది. షాక్ తిన్న బిహారీ లాల్.. బ్యాంక్ స్టేట్మెంట్ తీసి చూశాడు. అందులోనూ రూ. 2 వేల 7 వందల కోట్లు ఉన్నట్లుగానే కనిపించింది. వెంటనే బ్యాంక్ దగ్గరకు పరుగెత్తుకెళ్లి అధికారులకు ఈ విషయం చెప్పాడు. అధికారులు తనిఖీ చూస్తే బ్యాలెన్స్ కేవలం రూ.126 ఉన్నట్లు చూపించింది. దీంతో అవాక్కైన బిహారీ లాల్, తన అకౌంట్లో రూ.2700 కోట్లు చూపించిందని చెప్పాడు. అయితే అదంతా సాంకేతిక తప్పిదం అయ్యుంటుందని అధికారులు చెప్పడంతో నిరాశగా వెనుదిరిగాడు. అయితే బిహారీలాల్ అకౌంట్‌ను సీజ్ చేశామని, ఈ విషయాన్ని సీనియర్ అధికారులకు తెలియజేశామని బ్యాంక్ వాళ్లు చెప్పారు. చదవండి: ఎన్నో ఉద్యోగాలు వదులుకున్నాడు.. చివరికి కళ్లు చెదిరే ప్యాకేజీతో షాకిచ్చాడు! -
బ్యాంక్ లావాదేవీల సాఫ్ట్ కాపీని ఈడీకి సమర్పించిన చికోటి ప్రవీణ్
-
నేటి నుంచి ‘రైతుబంధు’
సాక్షి, హైదరాబాద్: ఈ వానాకాలం సీజన్లో 68.10 లక్షలమంది రైతుబంధు కింద పెట్టుబడి సాయం పొందడానికి అర్హులని వ్యవసాయ శాఖ ప్రకటించింది. మంగళవారం(నేడు) నుంచి రైతుబంధు సొమ్మును రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు వెల్లడించింది. మొదటిరోజు ఎకరా వరకు భూమి ఉన్న 19.98 లక్షల మంది రైతులకు 586.65 కోట్లు జమ చేస్తామని పేర్కొంది. 1,50,43,606 ఎకరాలకు చెందిన రైతులకు రైతుబంధు సొమ్ము అందజేసేందుకు అధికారులు సన్నాహాలు చేశారు. అందుకోసం రూ.7,521.80 కోట్లు సిద్ధం చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
పొరపాటుగా అకౌంట్లో రూ.2 కోట్లు.. వ్యక్తి ఏం చేశాడంటే..
సాక్షి, వైరా(ఖమ్మం) : ఓ వ్యక్తి ఖాతాలో పొరపాటుగా రూ.2 కోట్ల నగదు జమ కాగా.. తిరిగి జమ చేసిన కంపెనీకి అప్పగించిన వైనమిది. వివరాలిలా ఉన్నాయి. వైరాకు చెందిన గంధం వెంకటేశ్వర్లు ఖాతాలో ఈనెల 11న రూ.2 కోట్లు జమ అయినట్లు సెల్‌కు మెసేజ్ వచ్చింది. దీంతో ఆయన ఏటీఎం సెంటర్‌కు వెళ్లి చూడగా ఖాతాలో రూ.2కోట్లు జమ అయి ఉన్నాయి. కాగా, వెంకటేశ్వర్లు వైరా తహసీల్ ఎదుట నిర్మించిన భవనంలో సాబూ ఆటో జోన్ కంపెనీ(అశోక్ లేలాండ్ కంపెనీ) డీలర్ కార్యాలయాన్ని ఏర్పాటుచేశాడు. నెలనెలా సదరు డీలర్ వెంకటేశ్వర్లుకు ఇంటి అద్దెను బ్యాంకు అకౌంట్లో జమ చేసేవాడు. ఈక్రమంలోనే పొరపాటున కంపెనీకి చెల్లించాల్సిన రూ.2కోట్లను ఈయన ఖాతాలో జమ చేశారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన కంపెనీ జీఎం శేషాచారి వైరాకు చేరుకోగా.. అప్పటికే వెంకటేశ్వర్లు డీలర్‌తో చర్చిస్తున్నాడు. దీంతో మంగళవారం ఖమ్మంలోని రోటరీనగర్ ఎస్బీఐ శాఖ ద్వారా ప్రతి నిధులకు రూ.2కోట్ల చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లును కంపెనీ ప్రతినిధులు, బ్యాంకు అధికారులు అభినందించారు. -
కేటుగాళ్లకే టోకరా!
సాక్షి, హైదరాబాద్: మహేష్ బ్యాంక్ సర్వర్‌ను హ్యాక్ చేసి చెస్ట్ ఖాతాను కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్లు రూ.12.93 కోట్లను తొలుత నాలుగు ఖాతాల్లోకి మళ్లించారు. వీటిలో ఒకటి సేవింగ్ అకౌంట్ కాగా... మిగిలినవి కరెంట్ ఖాతాలు. బ్యాంక్ నుంచి సొమ్ము తమ కరెంట్ ఖాతాల్లో పడటంతో ఇద్దరు వ్యాపారులు కొంత మొత్తాన్ని దారి మళ్లించి అప్పులు తీర్చుకున్నారు. హఠాత్తుగా చోటుచేసుకున్న ఈ కోణం తాజాగా బయటపడింది. దీనివల్ల దర్యాప్తు కూడా కొంత ఆలస్యమైనట్లు పోలీసు వర్గాలు చెప్పాయి. సైబర్ నేరగాళ్లు ఎంచుకున్న వాటిలో నాగోల్‌లోని శాన్విక ఎంటర్ప్రైజెస్, కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ఫార్మా హౌస్ ఖాతాలు కూడా ఉన్నాయి. గత నెల 22 తెల్లవారుజాము నుంచి 23 సాయంత్రం వరకు బ్యాంక్ నెట్‌వర్క్‌ను తమ ఆధీనంలో ఉంచుకున్న కేటుగాళ్లు చెస్ట్ ఖాతా నుంచి వీటితోపాటు మరో రెండు ఖాతాల్లోకి బదిలీ చేశారు. ఈ నాలుగు ఖాతాల్లో పడిన మొత్తాలను దేశవ్యాప్తంగా 129 ఖాతాల్లోకి మళ్లించారు. ఈలోపు శాన్విక, ఫార్మాహౌస్ల నిర్వాహకులకు తమ ఖాతాల్లో భారీ మొత్తాలు డిపాజిట్ అవుతున్నట్లు సందేశాలు వచ్చాయి. తొలుత ఆ డబ్బుపై టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. వాళ్ల నుంచి సరైన స్పందన లేకపోవడంతో తమ అవసరాలకు వాడుకున్నారు. నవీన్ (శాన్విక ఎంటర్ప్రైజెస్) రూ.10 లక్షలు, సంపత్‌కుమార్ (ఫార్మాహౌస్) రూ.5 లక్షలు తమ వారి ఖాతాల్లోకి మళ్లించారు. స్నేహితుడిని గాంధీనగర్‌కు పంపి... ఈ సందేశాలు వస్తున్న సమయంలో నవీన్ తన స్వస్థలమైన ఓ గ్రామంలో ఉన్నాడు. అక్కడ నుంచి ఫోన్ ద్వారా నెట్ బ్యాంకింగ్ సాధ్యం కాకపోవడంతో తన స్నేహితుడికి యూజర్ ఐడీ, పాస్వర్డ్ చెప్పి తన ఖాతాలోని నగదును వేరే ఖాతాల్లోకి మళ్లించమని చెప్పాడు. దీంతో అతడు గాంధీనగర్‌లోని ఓ నెట్ సెంటర్‌కు వెళ్లి కంప్యూటర్ ద్వారా ఆపని చేశాడు. ఈ కారణంగానే దర్యాప్తు అధికారులకు గాంధీనగర్‌లోని ఇంటర్నెట్ సెంటర్ ఐపీలు వచ్చాయి. వీటి ఆధారంగా ఆ సమయంలో కంప్యూటర్ వాడిన వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అప్పుడు అతడు విషయం మొత్తం బయటపెట్టాడు. నవీన్‌ను అదుపులోకి తీసుకోగా తన స్నేహితుడు చెప్పింది నిజమేనని అంగీ కరించాడు. సంపత్‌కుమార్ నేరుగా తన భార్య ఖాతాలోకే ఆ మొత్తం మళ్లించాడు. అప్పులు తీర్చుకున్నామంటూ... అనుకోకుండా తమ ఖాతాల్లోకి వచ్చిపడుతున్న భారీ మొత్తాలను సొంతానికి వాడుకున్నట్లు వ్యాపా రులు నవీన్, సంపత్‌లు విచారణలో అంగీకరిం చారు. కాస్త సమయం ఇస్తే తిరిగి ఇచ్చేస్తామని హామీ ఇచ్చారు. ఈ వ్యవహారంలో నవీన్‌పై ఎలాం టి సందేహాలు లేవని, అయితే సంపత్ మాత్రం తనకు వచ్చిన సందేశాలను డిలీట్ చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అధికారులు చెప్తున్నారు. సైబర్ నేరగాళ్లతో ఇతడికి సంబంధాలు లేకపోయినా ఉద్దేశపూర్వకంగా నగదు మళ్లించాడా? అనేది ఆరా తీస్తున్నామని ఓ అధికారి సాక్షికి చెప్పారు. -
విస్తుపోయిన వృద్ధురాలు.. ఖాతాలోకి రూ.10 కోట్లు
రాయచూరు: పింఛన్‌తో జీవితం సాగించే వృద్ధురాలి ఖాతాలోకి ఏకంగా రూ.10 కోట్ల నగదు జమ అయిన ఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాయచూరు తాలూకా గుంజళ్లిలో నివాసం ఉంటున్న తాయమ్మ(65)కు నెలకు రూ.3వేలు పింఛన్ వస్తుంది. గత ఏడాది డిసెంబర్ 20న ఈ అవ్వ ఖాతాలోకి రూ.10 కోట్ల 38 లక్షల 62 వేల నగదు జమైంది. చదవండి: కారులో 6 ఎయిర్‌బ్యాగ్స్ ఉండాల్సిందే : గడ్కరీ అదే నెల 31న తాయమ్మ గుంజళ్లిలోని బ్యాంక్‌కు వెళ్లి పింఛన్ డ్రా చేసుకుని ఇంటికి వచ్చింది. ఆమె వెంట వెళ్లిన వ్యక్తి తాయమ్మ ఖాతాలో రూ.కోట్లలో నగదు ఉండటాన్ని గుర్తించాడు. రూ.8 లక్షలు డ్రా చేయాలని చెప్పి జనవరి 1న బ్యాంకుకు తీసుకొని వెళ్లాడు. బ్యాంకు అధికారులు అనుమానం వచ్చి ఖాతాను పరిశీలించగా కోట్లలో నగదు ఉండటంతో విస్తుపోయారు. దీనిపై విచారణ చేస్తామని, అప్పటివరకు డబ్బు డ్రా చేయవద్దని చెప్పి వారిని వెనక్కి పంపారు. బ్యాంకు అధికారులనుంచి ఎలాంటి సమాచారం అందకపోవడంతో వృద్ధురాలి భర్త రామన్న గురువారం రాయచూరు జిల్లా ఎస్పీ నిఖిల్‌కు ఫిర్యాదు చేశారు. -
కస్టమర్ కేర్‌కు ఫోన్ చేస్తే రూ. 1.72 లక్షలు మాయం
హిమాయత్‌నగర్: ఫోన్‌పేలో డబ్బులు కట్ అయ్యాయని కస్టమర్ కేర్‌కు కాల్ చేయగా.. ఉన్న వాటిని లూటీ చేశారని నగరవాసి ఒకరు మంగళవారం సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల నగరవాసి ఫోన్‌పే నుంచి కొంత డబ్బులు కట్ అయ్యాయి. తాను ఎవరికీ పంపకుండా ఇలా కట్ అవ్వడంపై తెలుసుకునేందుకు గూగుల్‌లో కనిపించిన ఫోన్‌పే కస్టమర్ కేర్ నంబర్‌కు కాల్ చేశాడు. వారు చెప్పిన విధంగా బ్యాంకు వివరాలు అన్నీ చెప్పడంతో అకౌంట్లో నుంచి రూ. 1.72 లక్షలు స్వాహా చేశారు. బజాజ్ ఫైనాన్స్ పేరుతో... బజాజ్ కార్డుపై లోను వచ్చిందని తనని ఓ వ్యక్తి మోసం చేశాడని నగర వాసి ఒకరు సిటీ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇటీవల ఓ వ్యక్తి తాను బజాజ్ ఫైనాన్స్ నుంచి మాట్లాడుతున్నానని కాల్ చేశాడు. మీ కార్డుపై రూ. 5 లక్షల రుణం మంజూరైందన్నాడు. అది మీ అకౌంట్‌కు రావాలంటే డాక్యుమెంట్స్‌కి కొంత ఖర్చు అవుతుందన్నాడు. దీనికి సరే అనడంతో పలు దఫాలుగా రూ. 2.70 లక్షలు చెల్లించాడు. ఆపై రుణం రాకపోగా మరిన్ని డబ్బులు డిమాండ్ చేయడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వినయ్ తెలిపారు. (చదవండి: నాలుగేళ్ల జైలు శిక్ష!.... రెండు రోజుల్లో విడుదల అంతలోనే..) -
మహిళ అకౌంట్లో పొరపాటున రూ. 7.7 కోట్లు జమ.. దొంగతనం కేసు!
యూకే: ఓ మహిళ అకౌంటుకు పొరబాటున ఏకంగా 7.7 కోట్ల రూపాయలు వచ్చిపడ్డాయి. ఐతే జమ చేసిన సంస్థ పొరపాటున ఈ తప్పు చేసినప్పటికీ సదరు మహిళ పిర్యాదు చేసేంత వరకూ దానిని గమనించలేదట. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. యూకేకు చెందిన మహిళ అకౌంటుకు ఆగస్టు 2020న హర్ మెజెస్టీస్ రెవెన్యూ అండ్ కస్టమ్స్ (హెచ్‌ఎమ్‌ఆర్సీ) నుంచి 7,74,839 పౌండ్లు (సుమారు 7.7 కోట్ల రూపాయలు) జమ అయ్యాయి. అంతేకాదు ఈ మిస్టరీ డిపాజిట్ నుంచి అప్పటికే 20 వేల పౌండ్లు ఖర్చు చేసింది కూడా. ఐతే ఖర్చుచేసిన మొత్తాన్ని చెల్లించే స్థితిలో ప్రస్తుతం ఆమె లేదు. తర్వాత అకౌంటును చెక్ చేసుకున్న సదరు మహిళ మిస్టరీ డిపాజిట్ గురించి తీవ్ర ఆందోళనకు గురైంది. నిజానికి ఈ విధమైన పొరబాట్లు యూకేలో సెక్షన్ 24ఎ దొంగతనం చట్టం 1968 ప్రకారం నేరంగా పరిగణించబడుతుంది. పొరపాటున జమ అయిన మొత్తాన్ని సంబంధిత వ్యక్తులకు చెల్లించవల్సిన బాధ్యత అకౌంటుదారులే నిర్వర్తించాలి. చదవండి: ఆ మూడే ఒమిక్రాన్ ప్రధాన లక్షణాలు..! వీటిని గుర్తించిన వెంటనే.. ఐతే నవంబర్ 2020లో పన్ను చెల్లించినప్పుడు హెచ్‌ఎమ్‌ఆర్సీ సిబ్బంది తమ తప్పును గమనిస్తారని మహిళ భావించింది. కానీ అలా జరగలేదు. డబ్బు ఆమె ఖాతాకు మాత్రమే కేటాయించబడినందున, ఆమె ముందుకు రాకపోతే అది ఎప్పటికీ గుర్తించబడకపోవచ్చు. దీంతో ఆమె ఫోను ద్వారా హెచ్ఎమ్ఆర్సీని సంప్రదించి పొరపాటును గుర్తుచేసింది. పార్శిల్ కస్టమ్స్ డ్యూటీ రాయితీని చెల్లించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు సిబ్బంది పొరపాటున 23.39 పౌండ్లకు బదులు అధికమొత్తాన్ని జమ చేసినట్లు హెచ్‌ఎమ్‌ఆర్సీ ఎట్టకేలకు కనుగొంది. దీని గురించి హెచ్‌ఎంఆర్‌సి ప్రతినిధి మాట్లాడుతూ.. ‘అసౌకర్యానికి చింతిస్తున్నాము. చెల్లింపును తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తాం. ఐతే ఇంత పెద్ద మొత్తం పొరబాటున క్రెడిట్ అవ్వడం ఇంతవరకూ జరగలేద’ని మీడియాకు తెలిపారు. దాదాపుగా 15 నెలల తర్వాత ఈ విషయం తాజాగా వెలుగులోకొచ్చింది. చదవండి: కోట్ల విలువచేసే ఇంటికి నిప్పంటించాడు..ఎందుకో తెలుసా? -
‘సర్.. నాకు ఐదు బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి! మంచిదేనా?’
Banking Tips: ఇవాళ రేపు అవసరానికో బ్యాంక్ ఖాతా తెరవాల్సి వస్తోంది. అలాగే ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉంటున్నవాళ్లు చాలామందే ఉంటున్నారు. అయితే ఇలా ఎక్కువగా కలిగి ఉండడం వల్ల లాభం కంటే.. ఇబ్బందులే ఎక్కువ ఎదుర్కోవాల్సి వస్తుంది. పైగా ఖాతాదారుడికి తెలియకుండానే డబ్బును పొగొట్టుకోవాల్సి వస్తుంది. అందుకే అవసరం లేని అకౌంట్లను క్లోజ్ చేయడం ఉత్తమమని సూచిస్తున్నారు బ్యాంకింగ్ నిపుణులు. ‘మినిమమ్’ ట్రబుల్ ఎక్కువ ఖాతాలు ఉంటే.. వాటిల్లో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెన్ చేయాలి. అన్ని ఖాతాల్లో ఎంతో కొంత డబ్బును డిపాజిట్ చేయాలి. ప్రధాన బ్యాంకుల్లో అకౌంట్లలో(జీరో బ్యాలెన్స్ అకౌంట్లు మినహాయించి) మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెనెన్స్ ఛార్జీలు వెయ్యి, మూడు, ఐదు వేలు, పది వేలు ఇలా ఉంటోంది. ఉదాహరణకు.. ఐదు బ్యాంకుల్లో ఖాతాలు ఉంటే.. పది, పాతిక, యాభై.. ఇలా వేల రూపాయల్లో డబ్బును ఖాతాల్లో ‘మినిమమ్ బ్యాలెన్స్’ రూపంలో ఉంచాల్సి వస్తుంది. ఇదికాకుండా ఇతర ఛార్జీల వసూలు ఉంటుంది. ఇలా ఎలా చూసినా ఇబ్బందే!. శాలరీ అకౌంట్లే ఎక్కువ! బ్యాంకులు స్టూడెంట్ అకౌంట్లు, శాలరీ అకౌంట్లుగా ‘జీరో బ్యాలెన్స్’ అకౌంట్లతో టార్గెట్లను పూర్తి చేసుకుంటాయి. ముఖ్యంగా ఉద్యోగులు కంపెనీలు మారినప్పుడు.. మరో అకౌంట్‌కు ఎక్కువగా మారిపోవాల్సి వస్తోంది. అలాంటి సందర్భాల్లో బద్ధకాన్ని వదిలి బ్యాంకులకు వెళ్లి పాత బ్యాంక్ ఖాతాను(అవసరం లేకుంటే) మూసివేయడమే మంచిది. ఎందుకంటే శాలరీ అకౌంట్లు, జీరో బ్యాలెన్స్ అకౌంట్లో చాలాకాలం డిపాజిట్ చేయకుండా ఉంటే.. సాధారణ సేవింగ్స్ అకౌంట్‌కు మారిపోతాయి. అప్పుడు కచ్చితంగా మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెన్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మెయింటెన్ చేయకపోతే.. సర్ ఛార్జీలు పడుతూనే పోతుంటాయి. ఒకానొక దశకు వచ్చేసరికి అవి వేల రూపాయల్లోకి కూడా కూడా చేరుకోవచ్చు!!. ఐటీ రిటర్న్స్ టైంలో.. కొన్ని అకౌంట్లు సంవత్సరాల తరబడి అలాగే ఉండిపోతాయి. బ్యాంకులు వాటిని మూసేయవు. కాకపోతే ఎక్కువ కాలం ట్రాన్జాక్షన్స్ జరగని అకౌంట్లను సాధారణంగా కొన్ని బ్యాంకులు డీయాక్టివేట్ చేస్తాయి. ఒకవేళ ఆ అకౌంట్లను తిరిగి ఉపయోగించుకోవాలనుకుంటే(యాక్టివేషన్ కోసం) రాతపూర్వకంగా రిక్వెస్ట్ లెటర్‌తో బ్యాంక్‌ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. పైగా సేవింగ్స్ ఖాతాల్లో(అవసరం లేనివి, పెద్దగా ఉపయోగించని అకౌంట్లు) మినిమమ్ బ్యాలెన్స్‌తో ఎలాంటి రాబడీ రాకపోగా, ఆదాయ పన్ను రిటర్నుల సమయంలో అన్ని ఖాతాల వివరాలు అందించాల్సి ఉంటుంది. అలాగే వాటి నుంచి డబ్బు సర్‌ఛార్జీల రూపంలో కట్ అయినప్పుడల్లా.. మరింత డిపాజిట్ జమ చేయాల్సి ఉంటుంది. ఇక కార్డుల మెయింటెనెన్స్, ఏటీఎం ఛార్జీలు, మొబైల్ అలర్టు అంటూ పడే ఛార్జీల సంగతి సరేసరి!. ఇలా చేస్తే బెటర్ ఒక వ్యక్తికి సగటున శాలరీ అకౌంట్, అవసరాలకు తగ్గట్లు పర్మినెంట్ అకౌంట్లు, ఉమ్మడి ఖాతాలు ఉంటే చాలు. ఉద్యోగం మారినప్పుడు వేతన ఖాతాలు మారుతుంటాయి. వీలుంటే ఉద్యోగం మారినా.. పర్మినెంట్ అకౌంట్‌నే శాలరీ అకౌంట్‌గా మార్చేసుకునే ప్రయత్నం చేయాలి. కొత్త ఖాతాకి వెళ్లినప్పుడు మాత్రం.. అవసరం లేని పాత ఖాతాల్ని మూసేయడం మంచిది. ముఖ్యంగా పీఎఫ్ అకౌంట్ల విషయంలోనూ పాత అకౌంట్లను క్లోజ్ చేసి.. కొత్త అకౌంట్లకు షిఫ్ట్ చేయడం వల్ల ఒక అదనపు అకౌంట్‌ను మెయింటెన్ చేయాల్సిన బాధ తప్పుతుంది. ఇక ఇన్వెస్ట్మెంట్ల కోసం ప్రత్యేకంగా ఖాతాలు తీసుకోకుండా.. పర్మినెంట్ అకౌంట్‌నే ఉపయోగించాలి. బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీలు వస్తాయన్నది తెలిసిందే. కానీ, ఖాతాదారుడు అన్ని ఖాతాల్లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండలేడుగా!. కాబట్టే.. అవసరాలకు తగ్గట్లు రెండు లేదా మూడు అకౌంట్ల కంటే ఎక్కువ కలిగి ఉండకపోవడమే మంచిదని ఆర్థిక సలహాదారులు చెప్తున్నారు. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేప్పుడు సింగిల్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉంటే పని తేలిక అవుతుంది. వీటికి తోడు బ్యాంక్ ట్రాన్జాక్షన్స్ను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవడం, పాస్ వర్డ్‌లను, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వ్యవహారాలను తేలికగా గుర్తుపెట్టుకోవడం ఈజీగా ఉంటుంది. -
ముంబై స్పెషల్ కోర్టులో రియాకు ఊరట
బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఆయన ప్రియురాలు రియా చక్రవర్తికి ముంబై స్పెషల్ కోర్టులో ఊరట లభించింది. సుమారు 14 నెలల నుంచి సీజ్‌లో ఉన్న ఆమె బ్యాంక్ ఖాతాలను తిరిగి ఉపయోగించుకోవడానికి న్యాయస్థానం ఆమోదం తెలిపింది. సుశాంత్ మృతి కేసులో డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొన్న రియా గతేడాది సెప్టెంబర్‌లో అరెస్టై జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా ఎన్సీబీ అధికారులు ఆమె బ్యాంక్ ఖాతాలను సీజ్ చేశారు. అంతేగాక ఆమె ల్యాప్‌టాప్, సెల్ఫోన్లను కూడా ఎన్సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చదవండి: అవన్నీ రూమర్స్ అంటూ కొట్టిపారేసిన నటి రియా చక్రవర్తి ఈ నేపథ్యంలో కొన్ని నెలల క్రితం బెయిల్‌పై బయటకు వచ్చిన రియా.. తన బ్యాంక్ ఖాతాలను తిరిగి తన విడుదల చేయాలని స్పెషల్ కోర్టును అభ్యర్థించింది. ఈ మేరకు ఆమె పిటిషన్ దాఖలే చేస్తూ ఆర్థిక పరిస్థితులు, కుటుంబ పోషణ నిమిత్తం తన బ్యాంక్ ఖాతాలను వెంటనే విడుదల చేయాలని పటిషన్లో పేర్కొంది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. వాదోపవాదాలు విన్న తర్వాత.. రియా బ్యాంక్ ఖాతాలను తిరిగి అప్పగించాలని ఆదేశించింది. అంతేకాకుండా ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్‌ని సైతం తిరిగి ఆమెకే ఇచ్చేయమని తీర్పులో పేర్కొంది. విచారణ పూర్తి అయ్యే వరకూ సెల్, ల్యాప్‌టాప్‌లను విక్రయించవద్దని కోర్టు రియాను ఆదేశించింది. -
పన్ను కట్టే విధమెట్టిదనిన...
ఈ కాలంలో అందరూ మాట్లాడుకునేది కేవలం ఆదాయపు పన్ను గురించే.. దీన్ని ఎలా చెల్లించాలి అంటే .. ఇప్పుడు నగదు చెల్లింపులు లేవు. అన్నీ బ్యాంకు ద్వారా చేయడమే. చలాన్ సరిగ్గా నింపి మీకు ఏ బ్యాంకులో అకౌంటు ఉందో అందులో ‘యువర్–సెల్ఫ్‘ అని మీ చెక్ రాసి ఇస్తే, బ్యాంకు వాళ్లు అప్పటికప్పుడో లేదా ఆ తర్వాతో మీకు చలాన్ ఇస్తారు. ఆన్లైన్ విధానంలోనూ చెల్లించవచ్చు. తగిన జాగ్రత్తలు వహించి చేయాలి. పేమెంట్ పూర్తయిన తర్వాత ఆటోమేటిక్‌గా చలాన్ జనరేట్ అవుతుంది. ఈ చలాన్లను జాగ్రత్తగా భద్రపర్చుకోండి. మీ పేరు, పాన్, అసెస్మెంట్ సంవత్సరం మొదలైనవన్నీ జాగ్రత్తగా రాయండి. ప్రస్తుతం అందరూ రిటర్నులు వేస్తున్నారు. పన్ను భారాన్ని లెక్కించి, అందులోనుంచి అడ్వాన్స్ ట్యాక్స్, టీడీఎస్, టీసీఎస్ మినహాయించగా ఇంకా భారం చెల్లించాల్సి ఉంటే ఆ మొత్తాన్ని చెల్లించాలి. ఇలాంటి మొత్తాన్ని చెల్లించడాన్ని ‘సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్‘ అంటారు. దీనితో సాధారణ పరిస్థితుల్లో ఎటువంటి తేడాలు, తప్పులు, తడకలు లేకపోతే పన్నుభారం ఏర్పడదు. టైప్ ఆఫ్ పేమెంట్ దగ్గర ’300’ నంబర్ దగ్గర టిక్ చేయాలి. రిటర్నులను ఫైల్ చేసిన తర్వాత అధికారులు వాటిని చెక్ చేస్తారు. దీనినే మదింపు లేదా అసెస్మెంట్ అని అంటారు. ఈ అసెస్మెంట్ వలన ఆదాయం మారవచ్చు. డిడక్షన్లు మారవచ్చు. మినహాయింపు మారవచ్చు. ఫలితంగా పన్నుభారం మారవచ్చు. ఇంకా పన్ను చెల్లించాల్సి ఉంటే ’డిమాండ్’ అని చెప్తారు ఆర్డర్లో. ఆ మొత్తం చెల్లించేటప్పుడు ’400’ అనే కాలం దగ్గర టిక్ చేయాలి. దీనిని ’ట్యాక్స్ ఆన్ రెగ్యులర్ అసెస్మెంట్’ అని అంటారు. ఒకవేళ రిఫండ్ ఉంటే దాన్ని నేరుగా మీ బ్యాంకు ఖాతాలోకి జమ చేస్తారు. స్థిరాస్తి అమ్మకం మీద టీడీఎస్ చెల్లించేటప్పుడు కాలం ’800’ దగ్గర టిక్ చేయాలి. మరో ముఖ్యమైన పద్ధతి.. అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించడం. ఈ మొత్తాన్ని చెల్లించేటప్పుడు కాలం ’100’ దగ్గర టిక్ చేయాలి. మీకు తెలిసే ఉంటుంది. మీరు చెల్లించాల్సిన పన్ను భారాన్ని ముందుగానే లెక్కించి, టీడీఎస్ మొత్తాన్ని తీసివేయగా.. మిగిలిన మొత్తం రూ. 10,000 (పది వేల రూపాయలు) దాటితే అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాలి. ఇలాంటి మొత్తాన్ని నాలుగు వాయిదాలలో చెల్లించాలి. మొదటి విడతలో 15 శాతం (జూన్ 15 లోగా), రెండో విడత 30 శాతం (సెప్టెంబర్ 15 లోగా), మూడో విడత 30 శాతం (డిసెంబర్ 15 లోగా), చివరి విడత 25 శాతం (మార్చి 15 లోగా) కట్టాలి. దీనికి సంబంధించి జూన్, సెప్టెంబర్, డిసెంబర్, మార్చి నెలల్లో గడువు తేదీలు ఉంటాయని గుర్తుంచుకోవాలి. ఈ ప్రకారం చెల్లించినప్పుడు సరిగ్గా వివరాలు రాయండి. ఈ విధంగా ఒక అసెసీ తన పన్ను భారాన్ని అడ్వాన్స్ ట్యాక్స్, టీడీఎస్, టీసీఎస్, సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఏ అసెస్మెంట్ సంవత్సరం, ఏ టైప్ అన్నది జాగ్రత్తగా చూసుకోవాలి. తదనుగుణంగా పన్ను భారం చెల్లించాలి. -
ఖాతాలో రూ. 52 కోట్లు జమ, ప్రభుత్వాన్ని వేడుకున్న వృద్ధుడు
పట్నా: బీహార్‌లో ఇటీవల పలువురి అకౌంట్లలో కోట్లాది రూపాయల డబ్బు జమ అవుతోంది. గురువారం ఇద్దరు విద్యార్థులు ఖాతాలో రూ. 960 కోట్లు జమ అయినట్లు వార్త వైరల్ కాగా, శుక్రవారం మరో వృద్ధుడి ఖాతాలో ఏకంగా రూ. 52 కోట్లు జమ అయినట్లు తేలింది. ఈ ఘటన ముజఫరాపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. బ్యాంకులో పింఛన్ ఖాతా బయోమెట్రిక్ వెరిఫికేషన్ కోసం వెళ్లిన వృద్ధుడు రామ్ బహదూర్షా తన ఖాతాలోని బ్యాలెన్స్ చెక్ చేసుకున్నాడు. అతని అకౌంట్లో ఏకంగా రూ. 52 కోట్లు జమ అయినట్లు తెలుసుకున్నారు. అంత డబ్బు తన ఖాతాలో ఉండటం తనకు ఆశ్చర్యం కలిగించిందని చెప్పాడు. ఇలా అత్యధిక మొత్తం బ్యాంకులో జమ అయితే ఆయా ఖాతాలను అధికారులు నిలిపివేస్తున్నారు. తన ఖాతాలో పడిన సొమ్ము నుంచి ఎంతో కొంత తనకు అందించాలని వృద్ధుడు ప్రభుత్వాన్ని కోరాడు. (చదవండి: Bamboo Day: వెదురు విస్తీర్ణంలో భారత్ రెండో ప్లేస్, కానీ.. ఆ చిన్నదేశాల కంటే కిందనే!) -
షాకింగ్: ఇద్దరు విద్యార్థుల బ్యాంక్ అకౌంట్లలో ఏకంగా రూ. 900 కోట్లు జమ!
పాట్నా: ఇటీవల బిహార్‌లోని ఖగారియా జిల్లాలో ఓ వ్యక్తి బ్యాంకు ఖాతాలో పొరపాటున రూ.5.5 లక్షలు డిపాజిట్ అయిన విషయం తెలిసిందే. అయితే అవి తనకు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చారని, వాటిని తిరిగి ఇవ్వనని తెగించి చెప్పాడు. దీంతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇది జరిగిన రోజుల వ్యవధిలోనే అదే బిహార్‌లో మరొకటి వెలుగులోకి వచ్చింది. కానీ ఈసారి డబ్బులు లక్షల్లో కాదు ఏకంగా వందల కోట్ల రూపాయలు అకౌంట్లో జమయ్యాయి. అది కూడా పాఠశాలకు వెళ్లే పిల్లల అకౌంట్లలో. 10, 100 రూపాయలకే ఆనందపడే చిన్న పిల్లలు ఒకేసారి వారి అకౌంట్లలో రూ. 900 కోట్ల రూపాయలు జమ అయితే ఎలా ఉంటుంది. వారి సంతోషానికి అవధులు లేకుండా పోయింది. వివరాల్లోకి వెళితే.. కటిహార్ జిల్లాలోని బౌరా పంచాయితీ పరిధిలోని పస్తియా గ్రామానికి చెందిన ఆశిష్, విశ్వాస్ అనే ఇద్దరు విద్యార్థులకు బిహార్ గ్రామీణ్ బ్యాంకులో ఖాతాలు ఉన్నాయి. వీరి పాఠశాల యూనిఫామ్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నగదు తమ ఖాతాలో జమ అయ్యిందో లేదో అని తెలుసుకునేందుకు తమ తల్లిదండ్రులతో కలిసి ఊరిలోని ఇంటర్నెట్ వద్దకు వెళ్లారు.. బ్యాలెన్స్ చెక్ చేసుకున్న తర్వత వారి ఖాతాల్లో భారీగా నగదు ఉన్నట్లు తెలుసుకుని షాక్‌కు గురయ్యారు. ఆరో తరగతి చదివే ఆశిష్ ఖాతాలో రూ. 6.2 కోట్లు.. గురు చరణ్ విశ్వాస్ ఖాతాలో రూ.900 కోట్లు జమయ్యాయి. ఈ విషయాన్ని గ్రామ అధికారి ధృవీకరించగా. ఈ సంఘటనపై బ్యాంక్ అధికారులు విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. డబ్బుల విషయం తెలిసి బ్యాంక్ మేనేజర్ మనోజ్ గుప్తా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇద్దరు అబ్బాయిల బ్యాంక్ అకౌంట్లలో భారీ మొత్తాన్ని గుర్తించినట్లు తమకు సమాచారం అందిందని దానిని తాము పరిశీలిస్తున్నట్లు తెలిపారు. చదవండి: లేదండి ప్రధాని నాకోసం ఆ పైసలు పంపారు.. తిరిగి ఇవ్వను రైలు పట్టాలపై మొసలి.. ఆగిపోయిన రైళ్లు -
బ్యాంకు ఖాతా తెరవకుండానే ఫిక్స్డ్ డిపాజిట్ చేయవచ్చు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గూగుల్ పే యూజర్లు బ్యాంక్ ఖాతా తెరవకుండానే ఫిక్స్డ్ డిపాజిట్స్ చేయవచ్చు. ఈ విధమైన సేవలను పరిశ్రమలో తొలిసారిగా తాము ఆఫర్ చేస్తున్నట్టు ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రకటించింది. ఒక ఏడాదిపాటు చేసే ఎఫ్డీలపై 6.35 శాతం వరకు వడ్డీ అందుకోవచ్చని వెల్లడించింది. రూ.5 లక్షల వరకు డిపాజిట్ గ్యారంటీ ఉంటుందని వివరించింది. వినియోగదార్లు గూగుల్ పే యాప్‌లో బిజినెస్ అండ్ బిల్స్ విభాగంలో ఈక్విటాస్ బ్యాంక్‌ను ఎంచుకోవాలి. డిపాజిట్ చేయదలచిన మొత్తం, కాల పరిమితి నిర్ధేశిస్తూ వ్యక్తిగత, కేవైసీ వివరాలను సమర్పించాలి. కాల పరిమితి ముగియక ముందే ఎఫ్డీని రద్దు చేసుకుంటే అదే రోజు వినియోగదారుకు చెందిన బ్యాంక్ ఖాతాలో డబ్బు జమ అవుతుందని ఈక్విటాస్ వెల్లడిం చింది. చదవండి: పండుగ సెంటిమెంట్, కార్లను తెగకొనేస్తున్నారు -
పబ్–జీ ఖర్చు 10 లక్షలు
ముంబై: పబ్–జీ గేమ్‌కు బానిసైన ఓ 16 ఏళ్ల బాలుడు తన తల్లి బ్యాంక్ ఖాతాలోని రూ. 10 లక్షలను ఆట కోసం ఖర్చు చేసిన ఘటన ముంబైలో చోటు చేసుకుంది. బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల రోజులుగా బాలుడు పబ్–జీకి బానిసయ్యాడని, తల్లి బ్యాంక్ ఖాతా నుంచి రూ. 10 లక్షలను వర్చువల్ కరెన్సీగా మార్చి ఖర్చు చేశాడని పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తించి మందలించడంతో ఓ లెటర్ రాసి ఇంటి నుంచి పారిపోయాడు. క్రైమ్ బ్రాంచ్ అధికారులు బాలున్ని పట్టుకొని తల్లిదండ్రులకు అప్పగించారు. -
బ్యాంక్ ఖాతా నుంచి 1.2 కోట్లు మాయం.. కంప్లైంట్ ఇవ్వడంతో..
సాక్షి, సిటీబ్యూరో: ఎర్రమంజిల్‌లోని బ్యాంక్ ఆఫ్ బహ్రేన్ అండ్ కువైట్‌లో ఉన్న ముగ్గురు మృతుల జాయింట్ అకౌంట్ నుంచి మాయమైన రూ.1.2 కోట్లు భద్రంగా ఉన్నాయి. ఈ మేరకు ఆ బ్యాంకు అధికారులు సోమవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సాంకేతిక తప్పిదం వల్లే ఆ డబ్బు వేరే ఖాతాలోకి వెళ్లిందని, తక్షణం అప్రమత్తమై వెనక్కు తెచ్చామని స్పష్టం చేశారు. డబ్బు ఇలా వెనక్కు వచ్చింది.. ఖైరతాబాద్‌కు చెందిన వైద్యులు డాక్టర్ శంషద్ హుస్సేన్‌తో పాటు ఆయన భార్య, కుమారుడు డాక్టర్ బెహజిత్ హుస్సేన్‌లకు బ్యాంక్ ఆఫ్ బహ్రేన్ అండ్ కువైట్‌లో జాయింట్ అకౌంట్ ఉంది. కొన్నాళ్ల క్రితం అనారోగ్య కారణాలతో ముగ్గురూ వేర్వేరు సమయాల్లో మరణించారు. అప్పటికే ఈ జాయింట్ ఖాతాలో రూ.2 కోట్లకు పైగా నిల్వ ఉంది. ఖాతాదారుల మృతి విషయం తెలుసుకున్న బ్యాంకు అధికారులు ఆ అకౌంట్‌ను డెబిట్ ఫ్రీజ్ చేశారు. దీని ప్రకారం తదుపరి ఉత్తర్వుల వరకు ఎవరూ ఆ నగదును డ్రా చేయడం, మళ్లించడం సాధ్యం కాదు. గతంలో బ్యాంక్‌ను సంప్రదించిన బెహజిత్ హుస్సేన్ భార్య మిర్హత్ హుస్సేన్ తన భర్త, అత్తమామలకు సంబంధించిన ఆదాయపు పన్ను బకాయిలు చెల్లించడానికి ఖాతాలోని నగదు ఇవ్వాల్సిందిగా కోరారు. డెబిట్ ఫ్రీజ్ విషయాన్ని ఆమెకు చెప్పిన బ్యాంకు అధికారులు అది సాధ్యం కాదని చెప్పారు. బ్యాంకులో నామినిగానూ ఎవరి పేరూ పెట్టకపోవడంతో ఈ ప్రక్రియకు కొన్ని పత్రాలు కావాలని కోరారు. ఇదిలా ఉండగా... సదరు జాయింట్ అకౌంట్ నుంచి రూ.1.20 కోట్లు వేరే ఖాతాకు బదిలీ అయినట్లు మిర్హత్ వద్ద ఉన్న ఫోన్‌కు సందేశాలు వచ్చాయి. దీంతో ఆమె గత గురువారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా ఆ ఖాతా నుంచి డబ్బు ఎక్కడకు వెళ్లాయి? ఎలా వెళ్లాయి? తదితర వివరాలు కోరుతూ బ్యాంక్ అధికారులకు లేఖ రాశారు. సర్వర్ ఇబ్బందుల నేపథ్యంలో బ్యాంక్ నుంచి సోమవారం జవాబు అందింది. సాంకేతిక కారణాలతోనే ఆ బదిలీలు జరిగాయని, తిరిగి మృతల ఖాతాలోకి డబ్బు మళ్లించామని స్పష్టం చేశారు. దీంతో మిర్హత్ ఫిర్యాదు మేరకు నమోదైన కేసును మూసేయాలని నిర్ణయించామని ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. -
వీడియో గేమ్: గంటలో లక్ష ఫసక్.. కారు అమ్ముకున్న తండ్రి
వీడియో గేమ్‌ల పేరుతో జేబులు గుల్ల చేసుకుంటున్న కేసులు చూస్తూనే ఉన్నాం. అయితే అధికారిక గేమ్ వంకతో ఓ వ్యక్తిని నిలువునా దోచిన వైనం బ్రిటన్‌లో చోటు చేసుకుంది. అతని ఏడేళ్ల కొడుకు వీడియోగేమ్ ఆడుతూ చేసిన పనితో.. కారు అమ్మేసి మరీ ఆ డబ్బు కట్టాల్సి వచ్చింది. లండన్: నార్త్ వేల్స్‌కి చెందిన ఏడేళ్ల బాలుడు అషాజ్ తన తండ్రి ఐఫోన్లో ‘డ్రాగన్స్: రైజ్ ఆఫ్ బెర్క్’ వీడియో గేమ్ ఆడాడు. ఆట మధ్యలో ఒక్కో లెవల్ దాటుకుంటూ పోతుండగా.. మధ్య వచ్చిన యాప్ యాడ్స్‌ను క్లిక్ చేసుకుంటూ పోయాడు. అలా గంట వ్యవధిలో సుమారు రెండు పౌండ్ల నుంచి వంద పౌండ్ల విలువ చేసే యాప్స్ కొన్నింటిని కొనుక్కుంటూ పోయాడు. ఆ మొత్తం ఎమౌంట్ 1,289 పౌండ్లకు(మన కరెన్సీలో లక్షా ముప్ఫై వేలదాకా) చేరింది. ఈ-మెయిల్స్ ద్వారా యాపిల్ కంపెనీ నుంచి బిల్లులు జనరేట్ అయిన విషయం గుర్తించిన ఆ పిల్లాడి తండ్రి ముహమ్మద్ ముతాజా.. షాక్ తిన్నాడు. కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ అయిన ముతాజా.. అంత స్తోమత లేకపోవడంతో కారును అమ్మేసుకున్నాడు. ఆషాజ్కు ఫోన్ పాస్ వర్డ్ తెలిసినప్పటికీ.. ఆటలో అపరిమిత కొనుగోలు వ్యవహారంపై రచ్చ మొదలైంది. పచ్చి మోసం నిజానికి అది ఫ్రీ వెర్షన్ గేమ్. నాలుగేళ్లు పైబడిన పిల్లలు ఎవరైనా ఆడోచ్చు. కానీ, అంతేసి అమౌంట్ యాప్‌ల కొనుగోలు యాడ్లను ఇవ్వడంపై ముతాజా అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. కొనుగోళ్లను.. అందులో పెద్ద మొత్తం ఎమౌంట్తో అనుమతించడం పెద్ద మోసమని ముతాజా వాపోతున్నాడు. ఇదొక పెద్ద స్కామ్‌గా భావిస్తూ.. యాపిల్ కంపెనీకి ఫిర్యాదు చేశాడు. అయితే కొంతలో కొంత ఊరటగా.. 207 పౌండ్లు(సుమారు 21 వేలు) వెనక్కి వచ్చాయి. మరోవైపు పిల్లల గేమ్‌ల్లో పరిమితులు లేని కొనుగోళ్ల వ్యవహారంపై ఆయన కోర్టును ఆశ్రయించాడు. చదవండి: వయసు 24.. సంపాదన ఊహించలేనంత! -
మహిళకు భారీ షాక్.. అకౌంట్లో ఏకంగా రూ.7400 కోట్లు!
వాషింగ్టన్: వంద రూపాయాలు డ్రా చేద్దామని వెళ్లిన వ్యక్తికి తన ఖాతాలో ఏకంగా వేల కోట్ల రూపాయలు ఉన్నాయని తెలిస్తే.. ఎలా ఉంటుంది.. ఒక్కసారిగా గుండె ఆగినంత పనవుతుంది. ఆ సంతోషంలో నిజంగానే హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇదే అనుభవం ఎదురయ్యింది ఫ్లోరిడాకు చెందిన ఓ మహిళకు. 20 డాలర్లు డ్రా చేద్దామని ఏటీఎంకు వెళ్లింది. అయితే ఆమె అకౌంట్లో సరిపడా మొత్తం లేవని.. ఇప్పుడు 20 డాలర్లు డ్రా చేస్తే అది ఓవర్‌డ్రాఫ్ట్ కిందకు వస్తుందని మెసేజ్ వచ్చింది. పర్లేదు అనుకుని డబ్బులు డ్రా చేయడానికి ప్రయత్నించింది కానీ కుదరలేదు. సదరు మహిళ అసలు తన బ్యాంక్ అకౌంట్లో ఎంత అమౌంట్ ఉందో చెక్ చేయగా.. దిమ్మ తిరిగే బొమ్మ కనిపించింది. ఏకంగా తన ఖాతాలో బిలయన్ డాలర్లు(7400 కోట్ల రూపాయలు) ఉన్నట్లు చూపింది. ఇది చూసి ఆ మహిళకు ఒక్కసారిగా గుండె ఆగినంత పనయ్యింది. వెంటనే బ్యాంక్‌కు వెళ్లి విషయం చెప్పగా.. వారు కూడా చెక్ చేశారు. ఆమె అకౌంట్లోకి ఇంత మొత్తం ఎలా వచ్చిందో వివరించారు. వాస్తవానికి సదరు మహిళ అకౌంట్లో నెగిటివ్ బిలియన్ డాలర్ల సొమ్ము ఉంది. మోసాలను నివారించడానికి ఈ పద్దతిని ఉపయోగిస్తారు. అనుమానాస్పదంగా తోచిన వ్యక్తి అకౌంట్‌ను లాక్ చేసినప్పుడు ఇలా కనిపిస్తుంది అని తెలిపారు. ఫలితంగా సదరు మహిళ 20 డాలర్లను కూడా డ్రా చేసుకోలేకపోయింది అని వివరించారు. చదవండి: ఆన్లైన్ క్లాసులని ఫోన్ ఇస్తే ఏకంగా.. -
రూ.12 ప్రీమియంతో రూ.2 లక్షల బీమా పొందండి
ప్రస్తుతం కరోనా లాంటి విపత్కర పరిస్థితులు చూశాక? ప్రతి ఒక్కరూ తమ కుటుంబాన్ని భవిష్యత్ సమస్యల నుంచి సురక్షితంగా ఉంచడానికి బీమా పొందడం చాలా ముఖ్యం. అయితే, భీమా ప్రీమియం చెల్లించడం అనేది అంత తేలికైన విషయం కాదు. మరి దిగువ మధ్య తరగతి కుటుంబాలు ఈ ప్రీమియాన్ని భరించలేక బీమా తీసుకోవడం మానేస్తారు. ఇలాంటి వారికి సహాయం చేయడానికి కేంద్రం ప్రభుత్వం ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజనను 2015లో తీసుకొచ్చింది. ఈ విషయం చాలా మందికి తెలియదు. ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజనలో చేరడానికి సంవత్సరానికి కేవలం 12 రూపాయల ప్రీమియం చెల్లించడం ద్వారా 2 లక్షల వరకు భీమా పొందవచ్చు. ఇతర భీమా పాలసీలతో పోలిస్తే ఈ ప్రమాద బీమా పథకం చాలా చౌకగా ఉంటుంది. బలహీన వర్గాల ప్రజల భవిష్యత్తును భద్రతతో పాటు కుటుంబ సభ్యులు ఆర్ధికంగా సురక్షితంగా ఉండేందుకు సహాయం చేస్తుంది. దీని కింద చేరిన వారికి ఏదైనా ప్రమాదవశాత్తు మరణం, పూర్తి వైకల్యానికి గురైతే రూ.2లక్షలు, పాక్షిక వైకల్యానికి రూ. 1 లక్ష రూపాయలు అందుతాయి. ప్రీమియం కింద ఏడాదికి రూ.12 మొత్తాన్ని ఖాతాదారుడి బ్యాంక్ ఖాతా నుంచి (ఆటో-డెబిట్' సౌకర్యం ఉంది) కట్ చేస్తారు. అర్హత: 18 నుంచి 70 ఏళ్ల మధ్య వయస్సు గలవారు ఈ విధానాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. వార్షిక పునరుద్ధరణ ప్రాతిపదికన జూన్ 1 నుండి మే 31 కాలానికి భీమా కవరేజ్ అందుతుంది. బ్యాంక్ ఖాతాకు ఆధార్ తప్పని సరిగా లింకు అయ్యి ఉండాలి. కావాల్సిన పత్రాలు: అప్లికెంట్ ఆధార్ కార్డు గుర్తింపు కార్డు బ్యాంక్ ఖాతా పాస్ బుక్ వయస్సు ధృవీకరణ పత్రం ఆదాయ ధృవీకరణ పత్రం మొబైల్ నెంబర్ పాస్ పోర్ట్ ఫోటో ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజనకు ధరఖాస్తు చేసుకోవడానికి మీ బ్యాంక్ హోమ్ సంప్రదించవచ్చు లేదా వివరణాత్మక సమాచారం కోసం మీరు PM Surkasha Bima Yojana వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. చదవండి: కరోనా సంక్షోభంపై రఘురాం రాజన్ కీలక వ్యాఖ్యలు -
‘నేను బతికే ఉన్నాను.. గుర్తించండి’
పారిస్: బతికి ఉన్న మనిషిని చనిపోయారని ప్రకటిస్తే.. ఎంత బాధగా ఉంటుందో అనుభవించే వారికే తెలుస్తుంది. సాధారణంగా మన దగ్గర యూట్యూబ్ చానెళ్లు.. అప్పుడప్పుడు మీడియా సంస్థలు కూడా బతికి ఉన్న మనుషులను చనిపోయారని ప్రకటించి.. ఆ తర్వాత నాలుక కర్చుకుంటాయి. ఇక మన ప్రభుత్వ సంస్థల నుంచి పెన్షన్ లాంటివి పొందాలంటే అధికారులు మనం బతికి ఉన్నామనే సర్టిఫికెట్ తీసుకురమ్మాంటారు. చెట్టంత మనిషి ఎదురుగా ఉంటే నమ్మరు.. స్టాంప్ వేసిన కాగితం తెచ్చిస్తేనే.. మనం బతికి ఉన్నామనడానికి నిదర్శనం అని నమ్ముతారు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి ఫ్రాన్స్‌లో చోటు చేసుకుంది. ఓ 58 ఏళ్ల మహిళ తాను బతికే ఉన్నానని.. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని కోరుతూ.. కోర్టు మెట్లు ఎక్కింది. జీన్ పౌచైన్ అనే మహిళ తాను బతికి ఉన్నానని గుర్తించండి అంటూ 2017 నవంబర్ నుంచి ప్రభుత్వ సంస్థలను కోరుతుంది. ఆ వివరాలు.. జాన్ ఫౌచెన్ అనే మహిళ చనిపోయిందంటూ ఆమె భర్తతో పాటు పని చేసిన ఓ ఉద్యోగి ప్రభుత్వానికి తెలియజేశాడు. దాంతో అధికారులు ఆమెకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్, ఐడీ కార్డ్, బ్యాంక్ అకౌంట్ వంటి రికార్డులను శాశ్వతంగా తొలగించారు. ఆమె ఉద్యోగం కూడా కోల్పోయి.. ఇబ్బంది పడుతున్నారు. ఇందుకు కారణం ఏంటి అంటే ఫౌచైన్, ఆమె భర్త, కుమారుడు పని చేస్తున్న క్లీనింగ్ కంపెనీ 2000 సంవత్సరంలో ఓ పెద్ద కాట్రాంక్ట్ కోల్పోయింది. ఆ తర్వాత 2004లో కార్మిక ట్రిబ్యునల్ ఫౌచైన్ 14 వేల యూరోల నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అయితే అదృష్టవశాత్తు కేసు సంస్థపై రిజిస్టర్ కావడంతో ఫౌచైన్ బతికి పోయిది. ఈ క్రమంలో సదరు మాజీ ఉద్యోగి ఇదే కేసులో ఫౌచైన్ భర్త, కుమారుడి మీద కేసు నెగ్గడం కోసం ఆమె మరణించింది అంటూ ఫేక్ పత్రాలను సమర్పించాడు. దాంతో అధికారులు ఆమెకు సంబంధించిన రికార్డులను శాశ్వతంగా తొలగించారు. మాజీ ఉద్యోగి ఫౌచైన్పై రెండుసార్లు కేసు పెట్టడానికి ప్రయత్నించాడు కాని ఫలించలేదు. (చదవండి: వెలుగులోకి 100 ఏళ్లనాటి పావురాయి సందేశం) ఈ సందర్భంగా ఫౌచైన్ తరపు న్యాయవాది మాట్లాడుతూ.. ‘ఇది ఒక మతిలేని కేసు. అధికారులు ఎలాంటి దర్యాప్తు, ఆధారాలను తనిఖీ చేయకుండా ఆమె చనిపోయిందని ప్రకటించారు. ఒక్కరు కూడా క్రాస్ చెక్ చేసుకోలేదు’ అంటూ మండిపడ్డారు. మనికొందరు మాత్రం కాంట్రాక్ట్ లాస్ కేసులో నుంచి బయటపడటం కోసం ఫౌచైన్ తప్పుడు పత్రాలు సృష్టించిందని ఆరోపిస్తున్నారు. ఈ వ్యాఖ్యల్ని ఆమె ఖండించారు. ‘నేను మరణించలేదని.. సంస్థలు తెలుపుతున్నాయి.. అలా అని నేను బతికి ఉన్నానని కూడా ప్రకటించడం లేదు. ఈ ప్రకటన చేయించడం కోసం నేను ఫైట్ చేస్తున్నాను’ అంటూ ఫౌచైన్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. -
రామమందిర ట్రస్ట్ నుంచి భారీగా సొమ్ము మాయం
లక్నో: అయోధ్య రామజన్మభూమి మందిర నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఈ ఆలయ నిర్మాణానికి భారీగా విరాళాలు కూడా అందుతున్నాయి. ఈ నేపథ్యంలో రామ జన్మభూమి ట్రస్టుకు చెందిన అధికారిక బ్యాంకు ఖాతాల నుంచి భారీగా సొమ్ము మాయమైంది. సెప్టెంబర్ 1వ తేదీన లక్నోలోని బ్యాంకు నుంచి రూ.6 లక్షల రూపాయలు, మరో రెండు రోజుల తరువాత మూడున్నర లక్షల రూపాయలను ట్రస్ట్ చెక్ పేరుతో విత్‌డ్రా చేసుకున్నారు. అయితే ముచ్చటగా మూడోసారి ఏకంగా 9.86 లక్షల రూపాయలకు టోకరా వేశారు. అయితే అంత పెద్ద మొత్తం డబ్బు కావడంతో బ్యాంకు అధికారులకు సందేహం వచ్చి ట్రస్ట్ వారికి ఫోన్ చేయగా విషయం బయటపడింది. (రాముడిపై సినిమాకు ఇదే సరైన సమయం: రాజమౌళి) ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయోధ్య పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా అయోధ్యలో రామ మందిరం నిర్మాణ పనులు సెప్టెంబర్ 17 తర్వాత ప్రారంభమవుతాయని రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. మందిర నిర్మాణం కోసం ముంబై, హైదరాబాద్ సుమారు 100 మంది కార్మికులు నిర్మాణ పనుల్లో పాల్గొంటారని.. వారందరికీ ముందే కరోనా పరీక్షలు చేయిస్తామని అధికారులు వెల్లడించారు. థర్మల్ స్రీనింగ్ తర్వాతే విధుల్లోకి అనుమతిస్తామని తెలిపారు. (అయోధ్య భూమిపూజ: రావణుని గుడిలో వేడుకలు) -
ఆన్లైన్ క్లాసులని ఫోన్ ఇస్తే ఏకంగా..
ఛండీగర్ : ఆన్లైన్ క్లాసులని మొబైల్ ఫోన్ ఇస్తే కేవలం నెల రోజుల్లోనే 16 లక్షల రూపాయలను స్వాహా చేశాడు ఓ టీనేజీ యువకుడు. పబ్జీ గేమ్ ఆడుతూ వివిధ టోర్నమెంట్లు, పాస్‌లు, సహా వివిధ మందుగుండు సామాగ్రిని కొనడానికి ఆ డబ్బాంతా ఖర్చుపెట్టాడు. అయితే పోనీ పాపం అని వదిలేయకుండా డబ్బు విలువ తెలిసేలా అతడ్ని ఓ స్కూటర్ రీపెయిర్ దుకాణంలో పనికి పెట్టాడు అతని తండ్రి. ఈ ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. ఖాగర్ నగరానికి చెందిన 17 ఏళ్ల బాలుడు ఆన్లైన్ క్లాసుల కోసం తల్లిదండ్రుల మొబైల్ ఫోన్లను వాడేవాడు. అయితే పేరేంట్స్ బ్యాంకు ఖాతా, ఏటీఎం కార్డు తదితర వివరాలన్నీ మొబైల్ ఫోన్లేనే సేవ్ చేసి ఉండటంతో ఇదే అదనుగా భావించాడు. చదువు పేరిట ఎక్కువ సమయం ఫోన్లోనే గడుపుతూ పబ్జీ గేమ్‌లో వివిధ టోర్నమెంట్ల కోసం డబ్బు ఖర్చుపెట్టాడు. ఈ లావాదేవీలకు సంబంధించి మెసేజ్‌లు రాగానే వెంటనే డిలీట్ చేసేవాడు. దీంతో తల్లిదండ్రులకు కూడా ఏమాత్రం అనుమానం రాలేదు. ఇంకా తెలివిగా తల్లి ఖాతా నుంచి తండ్రికి, అతని నుంచి తల్లి ఖాతాలకు అనేక సందర్భాల్లో లావాదేవిలు జరిపాడు. దీంతో వారిద్దరి అకౌంట్లోంచి మొత్తం డబ్బులు స్వాహా చేశాడు. చివరికి తల్లి ప్రావిడెంట్ ఫండ్ డబ్బు మెత్తాన్ని ఖర్చుపెట్టాడు. (పంజాబ్ సీఎం కీలక నిర్ణయం ) కొన్ని రోజులకి బ్యాంకు వెళ్లిన తల్లిదండ్రులకి వాళ్ల అకౌంట్లోంచి 16 లక్షలు డ్రా చేశారని చెప్పడంతో ఖంగుతిన్నారు. మొదట సైబర్ నేరగాళ్ల పనేమో అని ఖంగారు పడి పోలీస్‌స్టేషన్‌కి వెళ్లారు. తీరా విచారణలో 17 ఏళ్ల కొడుకే ఇంటి దొంగ అని తేలడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎన్నో నెలలుగా కష్టపడి ఒక్కో రూపాయి కూడగట్టుకొని వైద్యం, కొడుకు చదువు కోసం దాచిపె్ట్టిన డబ్బంతా ఒక్కసారిగా ఆవిరయ్యింది. దీంతో కొడుక్కి డబ్బు విలువ తెలియజేసేలా అతన్ని ఓ స్కూటర్ రిపేయర్ దుకాణంలో పనికి పెట్టాడు. తద్వారా డబ్బు సంపాదించడం ఎంత కష్టమో తెలుస్తుంది అని తండ్రి పేర్కొన్నారు . అన్ని గేమ్స్ కంటే మే, జూన్ నెలలో పబ్జీ అత్యధిక లాభాలను అర్జించినట్లు సెన్సార్ టవర్ వెల్లడించింది. అంతేకాకుండా పబ్జీకి అలవాడుపడి పలువురు టీనేజర్లు ఆత్మహత్య చేసుకున్న ఉదంతాలు కూడా అనేకం. పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తుందని ఇటీవలె పాకిస్తాన్ పబ్జీ ఆటను నిషేదించింది. (వలస కార్మికులను ముందుగానే పంపి ఉంటే.. ) -
గూగుల్ పేతో జాక్‌పాట్!
పెనుకొండ: గూగుల్ పే ద్వారా స్నేహితుడికి నగదు బదిలీ చేసినందుకు ఓ యువకుడికి లక్ష రూపాయల రివార్డు లభించింది. అనంతపురం జిల్లా పెనుకొండ పట్టణానికి చెందిన సూర్యప్రకాశ్ శుక్రవారం తన స్నేహితుడికి రూ.3 వేలను గూగుల్ పే యాప్‌లో బదిలీ చేశాడు. నగదు బదిలీ అయిన కొద్ది సేపటికి సూర్యప్రకాశ్ బ్యాంకు ఖాతాకు రూ.1,00,107 జమ అయినట్టు గూగుల్ పే నుంచి మెసేజ్ వచ్చింది. ఊహించని విధంగా నగదు రావడంతో సూర్యప్రకాశ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. -
ఫేస్/ఐరిస్‌తోనే ఇక మొబైల్ బ్యాంకింగ్!
సాక్షి, అమరావతి: మొబైల్ బ్యాంకింగ్ విధానంలో సైబర్ ఆర్థిక నేరాల నియంత్రణకు కేంద్రం నడుం బిగించింది. వన్ టైం పాస్వర్డ్ (ఓటీపీ) విధానానికి బదులు.. ఫేస్/ఐరిస్ గుర్తింపు విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు సైబర్ భద్రత విధానాన్ని రూపొందించి అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఓటీపీ ఆధారంగా నిర్వహిస్తున్న మొబైల్ బ్యాంకింగ్‌లో మోసాలు జరుగుతూనే ఉన్నాయి. సైబర్ నేరగాళ్లు ఫోన్లు, బ్యాంకు అకౌంట్లను హ్యాక్ చేస్తూ నేరాలకు పాల్పడుతున్నారు. క్షణాల్లోనే నగదును మరో ఖాతాకు బదిలీ చేస్తున్నారు. మొబైల్ బ్యాంకింగ్ ఖాతాదారులు ఈ విషయాన్ని గ్రహించే లోగానే అకౌంట్లలో నగదు మాయమైపోతోంది. త్వరలో జాతీయ సైబర్ భద్రత విధానం ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న భారత్‌లో సైబర్ ఆర్థిక నేరాలను సత్వరం అరికట్టాల్సిన అవసరముందని సైబర్ పోలీస్, ఆర్థిక రంగ నిపుణులు సూచిస్తున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మొబైల్ బ్యాంకింగ్‌లో సైబర్ నేరాలను అరికట్టేందుకు కార్యాచరణకు సన్నద్ధమైంది. సైబర్ నేరగాళ్లు తమ మోసాలకు ప్రధాన సాధనంగా చేసుకుంటున్న ఓటీపీ నంబర్ విధానాన్ని తొలగించాలని భావిస్తోంది. ఆ స్థానంలో ఖాతాదారుల ముఖ గుర్తింపు (ఫేస్ రికగ్నైజేషన్), ఐరిస్ గుర్తింపు విధానాన్ని ప్రవేశపెట్టాలని కేంద్ర హోంశాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. స్మార్ట్‌ఫోన్‌లో సంబంధిత ఖాతాదారుడి ముఖం/ఐరిస్ గుర్తింపును సరిచూశాకే ఖాతా నుంచి నగదు చెల్లింపు జరిగే విధానాన్ని అమలు చేయనున్నారు. అందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను ఇప్పటికే రూపొందించి ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ఈ విధానంలో సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయొచ్చని సైబర్ పోలీసింగ్ నిపుణులు నిర్ధారించారు. దాంతో ఈ విధానాన్ని అధికారికంగా దేశమంతా అమలుచేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ అంశంపై కేంద్ర హోంశాఖ ఇప్పటికే రిజర్వ్ బ్యాంకుతో చర్చించింది. మొబైల్ బ్యాంకింగ్ విధానంలో ఫేస్ /ఐరిస్ గుర్తింపు ప్రక్రియను సైబర్ భద్రత విధానంలో పొందుపరచాల్సి ఉంది. అందుకు అవసరమైన జాతీయ సైబర్ భద్రత విధానం–2020ను కేంద్ర హోంశాఖ ఇప్పటికే రూపొందించింది. త్వరలోనే దీనికి కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుందని అధికారవర్గాలు తెలిపాయి. అనంతరం బ్యాంకులతో సమావేశం నిర్వహించి ఫేస్/ఐరిస్ గుర్తింపుతోనే మొబైల్ బ్యాంకింగ్ నిర్వహించేలా సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేయిస్తారని ఓ ఉన్నతాధికారి చెప్పారు. ఈ కొత్త విధానంతో మొబైల్ బ్యాంకింగ్‌కు సంబంధించిన సైబర్ నేరాలను సమర్థంగా అరికట్టొచ్చని సైబర్ క్రైం పోలీస్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఆందోళనకర స్థాయిలో ఆర్థిక నేరాల పెరుగుదల గత ఐదేళ్లలో దేశంలో సైబర్ ఆర్థిక నేరాలు దాదాపు 300శాతం పెరగడం ఆందోళనకరంగా మారింది. ప్రధానంగా 2016 నుంచి ఈ నేరాల తీవ్రత అమాంతంగా పెరుగుతోంది. దేశంలో స్మార్ట్ ఫోన్ల వాడకం పెరగడం, ప్రజలు మొబైల్ బ్యాంకింగ్ వైపు మొగ్గుచూపుతుండటంతో అదే స్థాయిలో సైబర్ నేరాలూ పెరుగుతున్నాయి. గత ఐదేళ్లలో దేశంలో సైబర్ ఆర్థిక నేరాల గణాంకాలిలా ఉన్నాయి.. -
భార్య అకౌంట్లో రూ. 30 కోట్లు..
బెంగళూరు: తన భార్య బ్యాంకు అకౌంట్లో రూ. 30 కోట్లు పడటంతో చన్నపట్నానికి చెందిన సయ్యద్ మాలిక్ బుర్హాన్ అనే పూల విక్రేత షాక్‌కు గురయ్యాడు. డిసెంబర్ 2న బ్యాంకు అధికారులు అతని ఇంటికి వచ్చి ఆ డబ్బులు ఎక్కడినుంచి వచ్చాయని ప్రశ్నించడంతో ఈ విషయం బయటికొచ్చింది. గతంలో తాను ఓ సారి ఓ ఆన్లైన్ పోర్టల్ నుంచి చీర కొన్నానని, అప్పుడు తాను కారును గెలుచుకున్నానని చెప్పి తన బ్యాంకు ఖాతా వివరాలను ఎవరో ఫోన్ చేసి అడిగారని గుర్తు చేసుకున్నాడు. అప్పటి నుంచి తమ ఖాతాల్లోకి అంత డబ్బు ఎలా వచ్చిందో తెలియక తిరుగుతున్నట్లు పేర్కొన్నారు. -
ఖాతాల్లోని డబ్బులు మాయం.. 24 గంటలే కీలకం!
సాక్షి, సిటీబ్యూరో: ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటున్న సమాజం ఎన్నో రంగాల్లో ముందడుగు వేస్తోంది. ఇదే క్రమంలో నేరాలు సైతం కొత్త పంథాను పేట్రేగిపోతున్నాయి. ఆన్లైన్ లావాదేవీల వ్యవహరం ఊపందుకోవడంతో సైబర్ నేరాల తీవ్రత పెరుగుతోంది. ఒకప్పుడు ఆఫ్‌లైన్‌లో జరిగిన నేరాలు.. ఇప్పుడూ ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. మొన్నటిదాకా క్లోనింగ్‌కు చేసిన నేరగాళ్లు ప్రస్తుతం ఈ– కామర్స్ మోసాల వైపు దృష్టి సారించారు. తమ వ్యాపార లాభాల కోసం ఆన్లైన్లో వివరాలు పొందుపరిస్తే చాలు ఆర్డర్ కోసమంటూ నమ్మించి ఏకంగా సంబంధిత వ్యక్తుల బ్యాంక్ ఖాతాల నుంచే డబ్బులు తస్కరిస్తున్న ఘటనలు ఇటీవలి కాలంలో పెరిగాయి. ఆన్లైన్లో జరిగే ఏ నేరమైనా ముఖ్యంగా ఆర్థిక అంశాలకు సంబంధించిన మోసం కేసుల్లో సత్వర ఫిర్యాదుతోనే డబ్బు రికవరీకి అవకాశముంటుంది. బాధితులకు కూడా న్యాయం జరుగుతుంది. సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు ఇలా.. మోసానికి గురైన బాధితుడు 24 గంటల్లో స్పందించడం కీలకం. తొలుత బ్యాంక్ అధికారులను సంప్రదించి లావాదేవీల వివరాల ప్రతిని తీసుకొని సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఆ ఫిర్యాదు ఆధారంగా జరిగిన మోసాన్ని వివరిస్తూ పోలీసులు వెంటనే ఈ– కామర్స్ వెబ్సైట్ల ప్రతినిధులకు మెయిల్ పంపిస్తారు. అవసరమైతే ఫోన్లోనూ సంప్రదించి తక్షణమే ఆ లావాదేవీని ఆపేందుకు కృషి చేస్తారు. తద్వారా సైబర్ నేరగాళ్ల పాలైన సొమ్మును బాధితుడి ఖాతాకు తిరిగి పంపిస్తారు. ఈ రకంగా సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో సత్వర ఫిర్యాదుతో పూర్తి స్థాయిలో డబ్బులు రికవరీ అయిన ఘటనలు ఉన్నాయి. ఈ నేరాలు ఎక్కువగా ముంబై, ఢిల్లీ, ఝార్ఖండ్, ఉత్తరప్రదేశ్, బిహార్ కేంద్రాలుగా సాగుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. సకాలంలో ఫిర్యాదు చేసిన వారిలో 80 శాతం మందికిపైగా సొమ్మును తిరిగి తెప్పించగలిగారు. సత్వర స్పందనను బట్టి ఒక్కో ఘటనలో 20 నుంచి 95 శాతం వరకు డబ్బు రికవరీ అవుతుండడంతో బాధితులకు ఉపశమనం చేకూరుతోంది. నాడు క్లోనింగ్.. నేడు ఈ– కామర్స్ సైబర్ నేరాలకు పెట్టింది పేరైనా నైజీరియన్లు తొలినాళ్లలో డెబిట్‌కార్డుల క్లోనింగ్‌కు పాల్పడేవారు. ఏటీఎం కేంద్రాల వద్ద మాటువేసి డబ్బు డ్రా చేసేందుకు సహాయం చేస్తామని అమాయకులను నమ్మించి ఏటీఎం, పిన్ నంబర్లను తెలుసుకునేవారు. సెక్యూరిటీ సిబ్బంది లేని ఏటీఎం యంత్రాల్లో రహస్యంగా ఓ పరికరాన్ని అమర్చి ఎవరైనా డబ్బు డ్రా చేస్తే వివరాలు ఆ పరికరంలో నమోదయ్యేలా చేసేవారు. తర్వాత వివరాల ఆధారంగా క్లోనింగ్ ప్రక్రియలో కొత్త కార్డు తయారుచేసి వేర్వేరు చోట్ల ఏటీఎంల ద్వారా బాధితుల ఖాతా నుంచి డబ్బు కాజేసేవారు. అప్పట్లో ఇదే తరహా మోసాలు కొనసాగించిన నైజీరియన్లు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని సరికొత్త రీతిలో డబ్బులు స్వాహా చేస్తున్నారు. బ్యాంక్ ఖాతా వివరాలను భద్రపరిచే సర్వీస్ ప్రొవైడర్ల నుంచి వాటిని సంపాదిస్తున్నారు. బ్యాంక్ నుంచే ఫోన్ చేసినట్లు నమ్మిస్తూ ఏటీఎం, పిన్, సీవీవీ నంబర్లను తెలుసుకుంటున్నారు. ఏటీఎం బ్లాక్ అయింది. తిరిగి రెన్యూవల్ చేయాలనో, అప్డేట్ చేయాలనో చెప్పి వివరాలు లాగించేస్తున్నారు. తర్వాత బాధితుల ఖాతా నుంచి డబ్బుల్ని కొల్లగొడుతున్నారు. ఓటీపీకి సైతం గాలం.. డెబిట్ కార్డు చేతిలో లేకపోతే పిన్ నంబర్ తెలిసినా ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేయడం సాధ్యం కానందున నేరగాళ్లు ఈ కామర్స్ వెబ్సైట్లను ఇందుకు అనువుగా ఉపయోగించుకుంటున్నారు. బాధితులకే నేరుగా ఫోన్‌కాల్ చేసి కార్డును అప్డేట్ చేసే ప్రక్రియలో భాగంగా ఇదివరకే మీరు రిజిస్టర్ చేసుకున్న మొబైల్‌కు కోడ్ (వాస్తవానికి అదే వన్‌టైమ్ పాస్వర్డ్)ను పంపిస్తున్నామంటూ నమ్మిస్తారు. పేరు, ఫోన్‌నంబర్, చిరునామా.. ఇలా వివరాలను కచ్చితంగా చెబుతుండడంతో చాలా సందర్భాల్లో నేరగాళ్లను బ్యాంక్ ప్రతినిధులుగా బాధితులు భ్రమపడుతున్నారు. వాస్తవానికి ఖాతాదారుల వివరాలను సర్వీస్ ప్రొవైడర్ల నుంచి కొనుగోలు చేస్తున్న నేరగాళ్లు, తమను తాము బ్యాంక్ ప్రతినిధులుగానే భ్రమింపజేస్తున్నారు. ఈ క్రమంలో సెల్‌నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎలాంటి భయం లేకుండా నేరగాళ్లకు చెప్పేస్తున్నారు. దీంతో నేరగాళ్లు సులభంగా ఖాతాల నుంచి డబ్బులను తీసుకోగలుగుతున్నారు. ఇలా వీలైనన్నిసార్లు బాధితులకు ఫోన్‌కాల్ చేస్తున్న నేరగాళ్లు అందినకాడికి దండుకుంటున్నారు. ఇటీవల ఓ బ్యూటీపార్లర్ నడుపుతున్న యువతి రూ.94,572 నష్టపోవడం గమనార్హం. నయా మోసాలు ఇలా.. ♦ ఓ బ్యూటీపార్లర్ నడుపుతున్న యువతి జస్ట్ డయల్‌లో తన సంస్థను రిజిస్టర్ చేసుకుంది. జస్ట్ డయల్ ద్వారా సదరు బ్యూటీపార్లర్‌ను సంప్రదించిన ఓ మోసగాడు సినీ పరిశ్రమకు చెందినవాడినని పరిచయం చేసుకొని 30 మంది మహిళలకు వధువులాగా మేకప్ చేస్తే రూ.5 లక్షల వరకు చెల్లిస్తామని చెప్పారు. ఈ మాటలు నమ్మిన యజమానురాలు మేకప్ చేసేందుకు మీ ఇంటికి వస్తానని చెప్పింది. ఆ వెంటనే మీకు డబ్బులు పంపిస్తానంటూ బ్యాంక్ ఖాతా వివరాలు తీసుకున్నాడు. మీ బ్యాంక్ ఖాతాలో రూ.2 లక్షలు డిపాజిట్ చేసినా సాంకేతిక కారణాలతో కనిపించలేదని, అవి రిటర్న్ చేస్తే మళ్లీ పంపిస్తానంటూ చెప్పాడు. ఇది నమ్మి ఆమె రూ.2 లక్షలు పంపించి మోసపోయింది. ♦ ఓ నిరుద్యోగి వివిధ జాబ్ పోర్టల్స్‌లో రెజ్యూమ్ నిక్షిప్తం చేశాడు. గత నెల 7న రోహన్ నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. రూ.10లక్షల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించామన్నాడు. ఆ వెంటనే మాన్స్టర్ జాబ్స్.కో అనే లింక్‌ను బాధితుడి సెల్‌ఫోన్‌కు పంపాడు. ఇందులో లాగిన్ అయిన బాధితుడు కూకట్పల్లి వాసి నందమ్ మహా విష్ణు వర్ధన్ నెట్‌బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లించబోయాడు. బ్యాంక్ ఖాతా వివరాలతో పాటు తన సెల్‌కు వచ్చిన ఓటీపీ నమోదు చేయగానే ‘ఎర్రర్ అకర్డ్.. ప్లీజ్ ట్రై లేటర్’ అని వచ్చింది. ఆ తర్వాత రూ.94,572 అతని ఖాతా నుంచి బదిలీ అయ్యాయని సంక్షిప్త సమాచారం వచ్చింది. ఆ కాల్స్‌కు స్పందించొద్దు.. బ్యాంక్ ప్రతినిధులు ఎట్టి పరిస్థితుల్లో ఫోన్ చేసి వివరాలు అడగరు. ఒకవేళ అటువంటి కాల్స్ వస్తే పట్టించుకోకుండా ఉండటం ఉత్తమం. ఒకవేళ ఆ వివరాలు చెప్పాల్సి వస్తే నేరుగా బ్యాంక్‌కే వెళ్లి చెప్పడం మంచిది. ఫోన్లో చెప్పడం శ్రేయస్కరం కాదు. బ్యాంక్ ఖాతా నుంచి డబ్బు డ్రా అయినట్టు తెలిస్తే సాధ్యమైనంత తొందరగా ఫిర్యాదు చేయాలి. కొంతమంది మీ ఉత్పత్తులు కొంటామంటూ ఆన్లైన్లో వివిధ సంస్థల వివరాలు అడిగి ఆన్లైన్ లావాదేవీల యాప్‌ల లింక్ పంపి మరీ డబ్బు కొల్లగొడుతున్నారు. ఫోన్ల ద్వారా వచ్చే ఏ కాల్‌కైనా స్పందించవద్దు. – రోహిణి ప్రియదర్శిని,సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ -
‘జగనన్న అమ్మ ఒడి’తో మీ కలలు సాకారం
సాక్షి, అమరావతి: ‘జగనన్న అమ్మ ఒడి’ పథకం ద్వారా పేదింటి పిల్లల చదువులు సాకారం అవుతాయని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. పేదింటి తల్లులు తమ పిల్లలను బడికి పంపి మంచి చదువులు చదివించుకొనేందుకు ఏటా రూ.15 వేలు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేయిస్తున్నామని, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని వారి పిల్లలు మరింత వృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు. అమ్మ ఒడితో పాటు విద్యార్థుల బంగారు భవితవ్యం కోసం మరో 3 విప్లవాత్మక చర్యలు తీసుకుంటున్నామని సీఎం పేర్కొన్నారు. ఈమేరకు ‘జగనన్న అమ్మ ఒడి’కి ఎంపికైన పేదింటి తల్లులకు ముఖ్యమంత్రి లేఖ రాశారు. ఉద్యోగావకాశాలు మెరుగుపడేలా ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమం, నాడు–నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పన, నాణ్యమైన, పుష్టికరమైన మధ్యాహ్న భోజనం అమలు కార్యక్రమాలను చేపడుతున్నామని సీఎం లేఖలో తెలిపారు. లేఖలోని అంశాలు ఇవీ... మాట నిలబెట్టుకుంటున్నా.. ‘‘జగనన్న అమ్మ ఒడి పథకం ద్వారా ఆర్థిక సహాయం అందుకోనున్న ప్రతి తల్లికీ నమస్కరిస్తూ అభినందనలు తెలియచేస్తూ ఈ ఉత్తరం రాస్తున్నా. పేదింటి తల్లులు తమ పిల్లలను చదివించుకోడానికి పడుతున్న ఇబ్బందుల్ని నా సుదీర్ఘ పాదయాత్రలో కళ్లారా చూశా. అలాంటి తల్లుల్లో మీరు కూడా ఒకరు. మీలాంటి నిరుపేద తల్లులు పిల్లల్ని చదివించుకోవడానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం నేరుగా అందచేస్తే మీ కష్టాలు కొంతవరకైనా తీరుతాయని, మీ కలలు నెరవేరతాయని భావించా. అందుకని ‘అమ్మ– ఒడి’ అనే పథకం ప్రారంభిస్తానని, ప్రతి పేదింటి తల్లికీ పిల్లల చదువులకోసం ఆర్థిక సహాయం అందచేస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో మాట ఇచ్చా. ఆ మాట నిలుపుకొంటూ ఇప్పడు రూ.15,000 మీ బ్యాంకు ఖాతాకు, పాతబకాయిలకు సర్దుబాటు చెయ్యకుండా నేరుగా బదిలీ చేస్తున్నాం. ఈ సొమ్ముతో మీ పిల్లల్ని మరింత బాగా చదివించుకోవాలని కోరుకుంటున్నా. దేశంలోనే తొలిసారి.. పిల్లల చదువుకు తల్లుల పేదరికం అడ్డుకాకూడదని మన ప్రభుత్వం చేపట్టిన ఈ మహత్తర పథకం రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశంలోనే మొట్టమొదటిసారి. మీలాంటి తల్లులు దాదాపు 43 లక్షల మందికి సుమారు రూ.6,455 కోట్ల మేర ఈ విధంగా ఆర్థిక సహాయం అందిస్తున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. మరో మూడు విప్లవాత్మక చర్యలు.. మీ పిల్లలను బడికి పంపించాక చక్కటి చదువు చెప్పటం కోసం మరో మూడు విప్లవాత్మక చర్యలు కూడా తీసుకుంటున్నాం. మొదటిది పిల్లలకు చక్కటి ఉద్యోగ అవకాశాల కోసం మన పాఠశాలలన్నింటిలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడుతున్నాం. రెండోది.. పాఠశాలల్లో మంచినీరు, విద్యుత్తు, మరుగుదొడ్లు లాంటి కనీస సదుపాయాలు మెరుగుపరుస్తూ ‘మనబడి నాడు–నేడు’ కార్యక్రమం కింద పాఠశాలల రూపురేఖల్ని మూడేళ్లలో మార్చబోతున్నాం. ఇక మూడవది.. పిల్లలకు పాఠశాలల్లో అందించే మధ్యాహ్న భోజనం మరింత నాణ్యమైనదిగా, పుష్టికరంగానూ ఉండేందుకు సంక్రాంతి సెలవుల తరువాత నుంచి కొత్త మెనూ అమలు చేయబోతున్నాం. మీ పిల్లలు ఈ అవకాశాలన్నీ అందిపుచ్చుకొని మరింత వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ... మీ .. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి -
‘జంతారా’ మంతర్.. ఖాతాల్లో నగదు ఖాళీ
సాక్షి, సిటీబ్యూరో: పెరుగుతున్న సాంకేతికతతో పాటే సైబర్ నేరగాళ్లూ మోసాల్లో ఆరితేరుతున్నారు. మొన్నటి వరకు విషింగ్ కాల్స్ (బ్యాంకు ప్రతినిధులమంటూ ఫోన్ చేసి ఏటీఎం కార్డు వివరాలు, ఓటీపీలు తెలుసుకుని మోసం చేయడం)తో చెలరేగిపోయిన నేరగాళ్లు ఇప్పుడు ఫిషింగ్ గూగుల్ లింక్స్ (ఆయా బ్యాంకుల ఆన్లైన్ చిరునామాలను పోలి ఉండే లింక్‌లను పంపి ఎర వేయడాన్ని ‘ఫిషింగ్’గా వ్యవహరిస్తున్నారు)తో అమాయకులను నిండా ముంచుతున్నారు. ఇలా వివిధ బ్యాంక్ వినియోగదారుల సెల్ఫోన్లకు ఫిషింగ్ లింక్‌లు పంపి ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్‌నేమ్, పాస్వర్డ్ తదితర క్రెడెన్షియల్స్ తస్కరించి, ఆ ఖాతాల్లోని నగదును మొబైల్ వ్యాలెట్లకు బదిలీ చేసి షాపింగ్ చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా వందల మందిని మోసగించిన జార్ఖండ్ రాష్ట్రం జంతారాకు చెందిన ఈ ముఠా గుట్టు సైబరాబాద్‌కు చెందిన ఓ ప్రముఖ వైద్యురాలి ఫిర్యాదుతో రట్టయ్యింది. ప్రధాన సూత్రధారి సంజయ్ కుమార్ మండల్ అలియాస్ బబ్లూ తప్పించుకోగా, ముఠాలోని ఐదుగురు పట్టుబడ్డారు. వీరి నుంచి రూ.2,66,000 నగదు, 12 గ్రాముల బంగారు గొలుసు, ఆరు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని, సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీనివాస్, సీఐ శ్రీనివాస్‌తో కలిసి సీపీ సజ్జనార్ మీడియాకు బుధవారం కేసు వివరాలు వెల్లడించారు. ఇలా ఎర వేస్తారు ఆయా బ్యాంకుల నుంచి ఖాతాదారుల్ని అలర్ట్ చేస్తూ వివిధ మెసేజ్‌లు వస్తుంటాయి. జంతారా ముఠా.. ఈ మెసేజ్‌లను పోలిన లింకులను తయారుచేసి బల్క్‌గా బ్యాంక్ ఖాతాదారుల సెల్ఫోన్లకు పంపిస్తోంది. ‘మీ బ్యాంకు లావాదేవీల క్లోజింగ్ స్టేట్మెంట్ పూర్తి కాలేదు. ముంబైలోని ఆర్బీఐకి నో యువర్ కస్టమర్ (కేవైసీ) తనిఖీ వివరాలు రాకపోవడంతో మీ డెబిట్ కార్డు అక్టోబర్ 21న బ్లాక్ అవుతుంది. ఈ కింది లింక్ క్లిక్ చేసి వివరాలు వెంటనే సబ్మిట్ చేయండి’ అంటూ పలువురికి ఫిషింగ్ గూగుల్ లింక్ పంపించింది. దేశవ్యాప్తంగా పలువురు ఇది నిజమేనని నమ్మి తమ బ్యాంక్ ఖాతా, ఇంటర్నెట్ క్రెడెన్షియల్ వివరాలను ఆ లింక్ అడ్రస్‌కు పంపారు. పోలీసులకు పట్టుబడిన ముఠా సభ్యులు మోసాలు ఇలా.. ఖాతాదారుల నుంచి అందిన వివరాల ఆధారంగా వారి ఖాతాల్లోని డబ్బులను పేటీఎం, ఫోన్‌పేతో పాటు వివిధ మొబైల్ ఈ–వ్యాలెట్లకు ముఠా బదిలీ చేస్తోంది. ముఠా సూత్రధారి సంజయ్ కుమార్ మండల్.. తన ముఠా సభ్యులతో ఈ–వ్యాలెట్ల ద్వారా తనిష్క్, బిగ్‌బజార్ స్టోర్స్‌లో ఆన్లైన్లో గిఫ్ట్ వోచర్లు కొనుగోలు చేయిస్తున్నాడు. ఈ గిఫ్ట్ ఓచర్లతో ముఠా సభ్యులు ఆయా షోరూంలలో బంగారు ఆభరణాలు, ఎలక్ట్రానిక్ గూడ్స్ కొనుగోలు చేస్తున్నారు. ఆపై వాటిని బయట అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ముఠాలో ఎవరెవరిది ఏ పాత్ర? సంజయ్ కుమార్ మండల్: ముఠా సూత్రధారి. సైబర్ నేరాల్లో ఎప్పటికప్పుడు ‘అప్డేట్’ అవుతూ 2016 నుంచి మోసాలకు పాల్పడుతున్నాడు. రామ్‌కుమార్ మండల్:వివిధ బుకింగ్ యాప్‌ల్లో నమోదయ్యే వారి కార్డు వివరాలు సేకరించి క్లోనింగ్ కార్డులు తయారు చేస్తుంటాడు. జామ్రుద్దీన్ అన్సారీ: ‘ఫిషింగ్ లింక్’ల ద్వారా అమాయకుల ఖాతాల్లోని నగదును ఈ–వ్యాలెట్లలోకి బదిలీ చేస్తూ.. పంజాబ్‌లో తనకు తెలిసిన వారి ద్వారా వివిధ సంస్థల గిఫ్ట్ వోచర్స్‌ను కొనుగోలు చేయించేవాడు. ఇందుకు వారికి కొంత కమీషన్ ఇచ్చి డబ్బులు తీసుకునేవాడు. జితేంద్ర మండల్: సోదరుడు రాజేంద్ర మండల్‌తో కలిసి 2016 నుంచి ఈ–వ్యాలెట్ మోసాలకు పాల్పడుతున్నాడు. బిరేందర్ కుమార్ మండల్: ముంబైలో కారు డ్రైవర్. ఐదు శాతం కమీషన్ తీసుకొని రామ్‌కుమార్ మండల్ ఈ–వ్యాలెట్‌లో బదిలీ చేసిన వాటితో దాన్బడ్, బొకారాలోని తనిష్క్ జ్యువెలరీ స్టోర్‌లో గిఫ్ట్ వోచర్లు (తనిష్క్ దుకాణాల్లో ఎక్కడైనా బంగారం కొనుగోలు చేసే కూపన్లు) కొని అతనికిచ్చేవాడు. రోహిత్ రాజ్: బిహార్ రాష్ట్రం సొహ్సరైలో మొబైల్ ఫోన్ దుకాణం నడుపుతున్న ఇతను ఐదు శాతం కమీషన్ తీసుకొని గిఫ్ట్ వోచర్లు ఇస్తుంటాడు. వైద్యురాలి ఫిర్యాదుతో గుట్టు రట్టు అక్టోబర్ 21న ఈ ముఠా పంపిన ఫిషింగ్ గూగుల్ లింక్ నగరానికి చెందిన ప్రముఖ వైద్యురాలికి వచ్చింది. అది నిజమేనని నమ్మి బ్యాంక్ ఖాతా, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలను ఆమె పొందుపరిచారు. దీంతో ఆమె ఖాతాలోని రూ.5,29,000 నగదు వివిధ మొబైల్ ఈ–వ్యాలెట్లకు బదిలీ అయ్యాయి. వెంటనే గుర్తించిన ఆమె అదే నెల 23న సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాంకేతిక ఆధారాలు సంపాదించిన పోలీసులు జంతారాకు వెళ్లి వారం పాటు మాటు వేశారు. అనంతరం ముఠాలోని రామ్‌కుమార్ మండల్, జామ్రుద్దీన్ అన్సారీ, జితేంద్ర మండల్, బిరేందర్ కుమార్ మండల్, రోహిత్ రాజ్‌ను పట్టుకుని ట్రాన్సిట్ వారంట్‌పై బుధవారం నగరానికి తీసుకొచ్చారు. -
బ్యాంకు ఖాతాకు ఆధార్ అవసరం లేదు...
న్యూఢిల్లీ: ఒక ప్రాంతం నుంచి మరో చోటకు మారిన వారు బ్యాంకు ఖాతాను తెరిచేందుకు ఇబ్బంది పడకుండా కేవైసీ నిబంధనల్లో ప్రభుత్వం మార్పులుచేసింది. వలసదారులు సెల్ఫ్ డిక్లరేషన్‌తోనే ఖాతాను తెరిచే విధంగా వెసులుబాటును కల్పించింది. ఆధార్‌తో పనిలేకుండా, స్థానిక చిరునామా కింద నివాస రుజువుగా బ్యాంక్ శాఖలో స్వీయ ప్రకటనను ఇస్తే సరిపోతుందని రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే తెలియజేశారు. -
నాలుగు నొక్కగానే.. ఖాతాలో 15వేలు మాయం!
సాక్షి, పలమనేరు : నాలుగును నొక్కండని ఓ నంబరు నుంచి వచ్చిన వాయిస్ రికార్డింగ్ విని ఆ సంఖ్యను నొక్కగానే ఓ వ్యక్తి ఖాతాలో రూ.15వేలు మాయమైన ఘటన పలమనేరులో శనివారం చోటు చేసుకుంది. వివరాలు..స్థానిక గుడియాత్తం రోడ్డులో ఆదెప్ప అనే వ్యక్తి మీ–సేవ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. బ్యాంకులో మీకు ఏదైనా సమస్యలుంటే తెలుసుకోవచ్చునని శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు అతని మొబైల్‌కు 02264427800 అనే నంబరు నుంచి వాయిస్ రికార్డింగ్ వచ్చింది. తెలుగులో సమాచారం వినేందుకు 4 నొక్కాలని చెప్పడంతో అతను అలాగే చేశాడు. ఇంతలో కాల్ కట్ అయి నిమిషాల వ్యవధిలో అతని ఖాతా నుంచి రూ.1000, రూ.200, రూ.6000, రూ. 150 ఇలా డబ్బులు డ్రా అవుతున్నట్టు ఎస్ఎంఎస్లు వచ్చాయి. దీంతో బాధితుడు బ్యాంకుకు పరుగులు తీసి తన ఖాతాను బ్లాక్ చేయించాడు. ఆలోపే 40 లావాదేవీలు జరిగి అతని ఖాతాలోని 15వేలు డ్రా అయ్యాయి. ఇదంతా సైబర్ నేరగాళ్ల పనంటూ బ్యాంకు అధికారులు తేల్చిచెప్పడంతో బాధితుడు గొల్లుమన్నాడు. స్థానిక పోలీసులకు శనివారం రాత్రి ఫిర్యాదు చేశాడు. -
షాక్.. ఫ్రీగా బ్యాంకు ఖాతాలో రూ.85 లక్షలు..!
హారిస్బర్గ్ : పెన్సిల్వేనియాలో నివాసముండే అమెరికన్ రాబర్ట్ తన ఖాతాలోకి అప్పనంగా భారీ మొత్తం వచ్చిపడటంతో షాక్‌కు గురయ్యాడు. రూ.86 లక్షలు అతని ఖాతాలో జమైన విషయాన్ని భార్య టిఫ్ఫాని విలియమ్స్‌కు చెప్పాడు. ఇంకేముంది ఇద్దరికీ ఎప్పుడూలేని కోరికలు, సౌఖ్యాలు గుర్తొచ్చాయి. 15 రోజుల్లోనే దాదాపు రూ. 70 లక్షలు ఖర్చు చేసి.. అదీఇదీ అని కాకుండా అన్ని కొనేశారు. రెండు ఖరీదైన కార్లు కూడా కొనిపడేశారు. ఈ నేపథ్యంలో ‘టెల్లర్ ఎర్రర్’ కారణంగా పొరపాటుగా డబ్బులు రాబర్ట్ ఖాతాలో జమైనట్టు బ్యాంకు అధికారులు గుర్తించారు. వెంటనే రికవరీ కోసం సిబ్బందిని అతని ఇంటికి పంపింది. కానీ, అప్పటికే ఉన్న సొమ్ములన్నీ విచ్చలవడిగా ఖర్చు చేయడంతో ఆ దంపతులు చేతుల్తేశారు. అయితే, అరెస్టు తప్పదని భావించిన టిఫ్ఫాని ఎలాగైనా ఆ మొత్తం కడతామని నమ్మబలికింది. రికవరీ సిబ్బంది కళ్లుగప్పి దంపతులిద్దరూ తప్పించుకుని తిరగడం మొదలు పెట్టారు. చివరకు బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. వారిపై దొంగతనం, మోసం కేసులు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. 18 లక్షల పూచీకత్తుపై కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది. ఇదిలాఉండగా.. దూరపు చుట్టానికి కూడా ఆ దంపతులు రూ.10 లక్షల ఆర్థిక సాయం చేయడం గమనార్హం. -
చెక్కు పంపిస్తానని చెక్కేశాడు..
సాక్షి, సిటీబ్యూరో: కారు షోరూమ్ యజమానినంటూ బ్యాంక్ అధికారులకు ఫోన్లు చేసి బ్యాంక్ ఖాతా వివరాలు చెప్పి తన వ్యక్తిగత బ్యాంక్ ఖాతాకు రూ.8 లక్షలు బదిలీ చేయించుకుని మోసం చేసిన ప్రధాన నిందితుడితో పాటు మరో ముగ్గురిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.మూడు లక్షల నగదు, వోక్స్ వ్యాగన్ పోలో కారు, ఏడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో క్రైమ్స్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని, ఏసీపీ శ్రీనివాస్‌తో కలిసి సీపీ సజ్జనార్ మంగళవారం వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన అరుణ్‌కుమార్ 12వ తరగతి వరకు చదువుకున్నాడు, ఓ దాడి కేసులో దస్నా జైలుకు వెళ్లిన అతడికి వీరేందర్ సాహూ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతడి నుంచి నేరాలు చేయడంపై అవగాహన పెంచుకున్న అరుణ్‌కుమార్ తన స్నేహితులైన మోహిత్ కుమార్, మనోజ్‌కుమార్, ఢిల్లీకి చెందిన లోకేశ్ తమర్‌లతో కలిసి తొలుత వీరేంద్ర సాహూకు కమీషన్ పద్ధతిన బ్యాంక్ ఖాతాలు సమకూర్చేవారు. అనంతరం స్వయంగా మోసాలు మోదలు పెట్టిన అరుణ్ కుమార్ సైబర్ నేరాలను ఎంచుకున్నాడు. ఇందులో భాగంగా ఇంటర్నెట్లో పలు నగరాల్లోని కారు షోరూమ్ వివరాలు సేకరించి ఆయా సంస్థల్లోని సేల్స్ టీమ్స్‌కు ఫోన్లు చేసి షోరూమ్ యజమాని పేరు, బ్యాంక్ పేరు, ఖాతాల వివరాలు సేకరించేవాడు. దీంతో పాటు కార్లు కొనుగోలు చేస్తున్నట్లు చెప్పడంతో అతడి వలలో పడిన షోరూం నిర్వాహకులు క్యాన్సల్డ్ చెక్‌ను వాట్సాప్ ద్వారా పంపేవారు. పూర్తి వివరాలు సేకరించిన అనంతరం అరుణ్‌కుమార్ పథకం ప్రకారం సదరు షోరూమ్ బ్యాంక్ ఖాతా ఉన్న అధికారులకు ఫోన్ చేసి మీ బ్యాంక్‌లో భారీగా ఫిక్స్డ్ డిపాజిట్లు చేయాలనుకుంటున్నట్లు చెప్పి వారిని వలలో వేసుకునేవాడు. వారు తన మాటలతో సంతృప్తి చెందినట్లు భావించిన అనంతరం ఒరిజినల్ చెక్‌ను బ్యాంక్‌కు పంపిస్తానని తన షోరూమ్ బ్యాంక్ ఖాతా నుంచి ఇతర బ్యాంక్ ఖాతాలకు డబ్బులు జమచేయించుకునేవాడు. ఇదే తరహాలో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఓ బ్యాంక్ మేనేజర్ రూ.8,20,000 బదిలీ చేశాడు. అనంతరం తాను మోసపోయినట్లు గుర్తించిన అతను ఈ నెల 10న సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాస్ నేతృత్వంలోని బృందం టెక్నికల్ డాటాతో ఉత్తరప్రదేశ్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకుని ట్రాన్సిట్‌వారంట్‌పై మంగళవారం సిటీకి తీసుకొచ్చారు. న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ‘కారు షోరూమ్ ఉద్యోగులు యజమాన్య వివరాలను గుర్తు తెలియని వ్యక్తులతో ఫోన్ లో షేర్ చేయవద్దు. వాట్సాప్‌లలో కూడా చెక్‌లు పంపవద్దు. అలాగే బ్యాంక్ అధికారులు కూడా తమ కస్టమర్లు చెక్ ఇచ్చిన తర్వాతే నగదు బదిలీచేయాలి’ అని సీపీ సజ్జనార్ సూచించారు. ముఠాను పట్టుకున్న సిబ్బందిని రివార్డులతో సత్కరించారు. -
ఫోర్జరీ సంతకాలతో 1.30కోట్లు స్వాహ!
సాక్షి, నల్గొండ : రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగా నల్లగొండ సిండికేట్ బ్యాంకులో రుణం పొంది ఫరంలోని మరో ఇద్దరి సంతకాలను ఫోర్జరీ చేసి ఇద్దరు కేటుగాళ్లు బ్యాంకు అధికారులనే బురిడీ కొట్టించారు. వివరాల్లోకి వెళ్లితే తిరుమలగిరి మండలంలోని అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆర్ఎస్ఎస్ మండల అధ్యక్షుడు శాగం రాఘవరెడ్డితో పాటు అదే గ్రామానికి చెందిన నాగేండ్ల కృష్ణారెడ్డితో పాటు మరో ఏడుగురు కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగా ఒక ఫరంగా ఏర్పడ్డారు. వీరంతా హాలియాలోని బస్టాండ్ సమీపంలోని మహావీర్ కాంప్లెక్స్ పేర నూతన బిల్డింగ్ నిర్మాణం చేపట్టారు. మహావీర్ కాంప్లెక్స్ బిల్డింగ్ నిర్మాణానికి 2014–15లో నల్లగొండ జిల్లా కేంద్రంలోని సిండికేట్ బ్యాంకులో రూ. 2కోట్ల రుణం పొందారు. అయితే మహావీర్ కాంప్లెక్స్ ఫరంలోని శాగం రాఘవరెడ్డి, నాగేండ్ల కృష్ణారెడ్డి, కాంసాని సాంబ శివారెడ్డి, మల్లు కృష్ణారెడ్డి పేరిట జాయింట్ ఖాతాను తెరిచి చెక్‌బుక్ తీసుకున్నారు. సిండికేట్ బ్యాంకు నుంచి జాయింట్ ఖాతాలోకి రూ. 2కోట్లు జమ అయిన విషయం తెలుసుకున్న శాగం రాఘవరెడ్డి, నాగేండ్ల కృష్ణారెడ్డి మిగిలిన మరో ఇద్దరి సభ్యుల సంతకాలను చెక్కుల మీద ఫోర్జరీ చేసి రూ. 1.30 కోట్లు డ్రాచేశారు. ఈక్రమంలో మహావీర్ కాంప్లెక్స్ కన్స్ట్రక్షన్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్న విషయంలో మల్లు కృష్ణారెడ్డికి శాగం రాఘవరెడ్డి, నాగేండ్ల కృష్ణారెడ్డికి గొడవ జరిగింది. దీంతో మల్లు కృష్ణారెడ్డి సిండికేట్ బ్యాంకుకు వెళ్లి జాయింట్ ఖాతాలో ఉన్న డబ్బు ల వివరాలపై మేనేజర్ వద్ద ఆరా తీశారు. జాయింట్ ఖాతాలో నిల్వ ఉన్న రూ. 2 కోట్ల నుంచి రూ.1.30 కోట్లు డ్రా అయినట్లు వెలుగులోకి రావడంతో సదరు పార్ట్నర్ మల్లు కృష్ణారెడ్డి బ్యాంకు మేనేజర్‌ను గట్టిగా నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మహావీర్ కాంప్లెక్స్ పేరా బ్యాంకులో రూ. 2కోట్లు రుణం పొంది ఫరం సభ్యుల సంతకాలు ఫోర్జరీ చేసి డబ్బులు డ్రా చేసిన వారిపై బ్యాంకు మేనేజర్ ఐదేళ్ల క్రితం కేసు పెట్టారు. చెక్కు ఫోర్జరీ కేసు విషయంలో చెక్కులను హెదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపడంతో సంతకాలు ఫోర్జరీ అయిన విషయాన్ని నిపుణులు తేల్చడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు శాగం రాఘవరెడ్డి అరెస్టు చేయగా నాగేండ్ల కృష్ణారెడ్డి పరారీలో ఉన్నట్లు తెలిసింది. -
మొబైల్ నెంబర్ మారుస్తున్నారా ! ఐతే జాగ్రత్త
కర్ణాటక, బనశంకరి : బ్యాంక్ అకౌంట్‌కు లింక్ అఇన మీ మొబైల్ నెంబరు మార్చాలని ఆలోచిస్తున్నారా అలాగైతే హుషార్ కావాల్సిందే. నిర్లక్ష్యం వహిస్తే మీ అకౌంట్లో ఉన్న నగదు దోచేయడం ఖాయం. ఓ వ్యక్తి కొనుగోలు చేసిన సిమ్‌కార్డుకు బ్యాంక్ అకౌంట్‌కు లింక్ కాబడిన మొబైల్ నెంబరు తీసుకున్న మరో వ్యక్తి పేటీఎం వ్యాలెట్ వినియోగించి అతడి అకౌంట్ నుంచి నగదు దోచేసిన ఘటన వెలుగుచూసింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్ మొబైల్ బ్యాంకింగ్ ఇతర బ్యాంకింగ్ సేవలకు మొబైల్ నెంబరు కచ్చితంగా ఉండాలి. సైబర్ క్రైం నేరాలను అడ్డుకట్టవేయడం, భద్రత కోసం భారతీయ రిజర్వుబ్యాంక్ కూడా ఇప్పటికే లింక్ ఆదేశాలు జారీ చేస్తూ ఆర్దినెన్స్ విడుదల చేసింది. ఈ సేవలను పొందినప్పుడు మొబైల్ కు వచ్చే ఓటీపీ చాలా ముఖ్యం. దీనిపై నిఘా వహించకపోతే బ్యాంక్ అకౌంట్లో నగదు మాయం కావడం తథ్యం. కొడగు జిల్లా కుశాలనగరకు చెందిన వ్యక్తి అష్రఫ్ దుబాయిలో ఉంటున్నాడు. ఇతను తన బ్యాంక్ అకౌంట్‌కు, పేటీఎం, వ్యాలెట్‌కు లింక్ చేసి మొబైల్ నెంబర్‌ను ఇటీవల తొలగించాడు. కానీ కొత్త మొబైల్ నెంబరును బ్యాంక్‌లో లింక్ చేయలేదు. దుబాయి నుంచి అష్రఫ్ కుశాలనగర బ్యాంక్ అకౌంట్‌కు నగదు జమచేసి తల్లిదండ్రులకు పంపించేవాడు. కానీ అష్రఫ్ తొలగించిన మొబైల్ నెంబరు సిమ్‌కార్డు కంపెనీ దావణగెరె భరత్ అనే వ్యక్తికి విక్రయించింది. భరత్ కొనుగోలు చేసిన కొత్త సిమ్‌కార్డుకు అష్రఫ్ బ్యాంకింగ్ మెసేజ్‌లు మొబైల్‌కు వస్తున్నాయి. మొదట పట్టించుకోని భరత్ అనంతరం మొబైల్‌కు పేటీఎం, వ్యాలెట్ యాక్టివేట్ చేసుకున్నాడు. తక్షణం అష్రఫ్ బ్యాంక్ అకౌంట్‌తో సహ సింక్ కాబడింది. అనంతరం భరత్ పేటీఎం వ్యాలెట్‌తో తన బ్యాంక్ అకౌంట్‌కు నాలుగురోజుల్లో రూ.79,994 వేలు నగదు జమ అయింది. దీంతో కంగారుపడిన అష్రఫ్ కొడగు జిల్లా సీఐఎన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు మొబైల్ నెంబర్ ఆధారంగా భరత్‌ను బుదవారం అరెస్ట్ చేశారు. -
కొత్త తరహాలో ఎరువుల సబ్సిడీ బదిలీ
న్యూఢిల్లీ: ఎరువులకు సంబంధించి రూ.70 వేల కోట్ల సబ్సిడీని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేసేందుకు కేంద్రం 3 కొత్త సాంకేతికతలను ప్రవేశపెట్టింది. జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఎరువుల సరఫరా, లభ్యత, అవసరం తదితర వివరాలతో కూడిన ప్లాట్‌ఫాం, అభివృద్ధిపరిచిన పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) సాఫ్ట్వేర్, డెస్క్‌టాప్ పీవోఎస్ వెర్షన్‌ను అందుబాటులోకి తెచ్చారు. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి (డీబీటీ) ఎరువుల సబ్సిడీ బదిలీ చేసే పథకం రెండో విడతలో భాగంగా ఈ మేరకు ఈ సాంకేతికతలను కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. ఎరువుల సబ్సిడీ డీబీటీ మొదటి విడతను కేంద్రం 2017 అక్టోబర్‌లో ప్రవేశపెట్టింది. ఈ విడతలో పీవోఎస్ మెషీన్లలో నిక్షిప్తమైన డేటాను సరిచూసి సబ్సిడీ మొత్తాన్ని కంపెనీలకు బదిలీ చేసేవారు. ‘తాజా సాంకేతికతతో నేరుగా రైతులకు చేరువయ్యేందుకు ఎంతో దోహదపడుతుంది. ఎరువుల రంగంలో పారదర్శకత పెరుగుతుంది’అని ఎరువుల శాఖ మంత్రి సదానంద గౌడ పేర్కొన్నారు. ఇప్పటివరకు 13 వెర్షన్ల పీవోఎస్ సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తెచ్చామని, దేశంలోని 2.24 లక్షల రిటెయిల్ ఎరువుల దుకాణాల్లో పీవోఎస్ సాఫ్ట్‌వేర్‌ను తెచ్చామన్నారు. ల్యాప్టాప్స్, కంప్యూటర్లలో ఎరువుల విక్రయాలకు హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్‌ను వినియోగించొచ్చని చెప్పారు. -
గ్యాస్ సబ్సిడీ తిప్పలు ..!
సాక్షి, సిటీబ్యూరో: వంట గ్యాస్‌కు నగదు బదిలీ పథకం చుక్కలు చూపిస్తోంది. ఎల్పీజీ సిలిండర్ డోర్ డెలివరీ జరిగి పక్షం రోజులు గడిచినా నగదు బదిలీ కింద సబ్సిడీ సొమ్ము బ్యాంక్ ఖాతాల్లో జమ కావడం లేదనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. వంట గ్యాస్‌కు నగదు బదిలీ పథకం పేదల పాలిట శాపంగా తయారైంది. డీబీటీ పథకం అమలు ప్రారంభంలో కొన్ని అవాంతరాలు ఎదురైనా ఆ తర్వాత సక్రమంగానే బ్యాంక్ ఖాతాలో సబ్సిడీ సొమ్ము జమవుతూ వచ్చింది. తాజాగా కొన్ని మాసాలుగా తిరిగి పాత పరిస్థితి పునరావృత్తం అవుతోంది. సబ్సిడీ సొమ్ము 25 రోజులు దాటినా జమ కాని పరిస్థితి నెలకొంది. కొందరికి అసలు సబ్సిడీ జమ నిలిచిపోయింది. సంబంధిత లబ్ధిదారులు డిస్ట్రిబ్యూటర్ను సంప్రదిస్తే సరైన స్పందన లభించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి ధర చెల్లించి... వినియోగదారులకు వంటగ్యాస్ సిలిండర్ సబ్సిడీపై డోర్ డెలివరీ జరుగుతున్న పూర్తి ధర చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సబ్సిడీ సిలిండర్ ధర మినహాయించి మిగిలిన సొమ్ము నగదు బదిలీ కింద వినియోగదారుడి బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. ఇదీ కేవలం ఏడాదికి 12 సిలిండర్లకు మాత్రమే సబ్సిడీ వర్తిస్తోంది. ఆ తర్వాత సిలిండర్లపై సబ్సిడీ వర్తించదు. బ్యాంక్‌లో సైతం నగదు జమ కాదు. ఇదీలా ఉండగా సబ్సిడీ సిలిండర్‌కు పూర్తి ధర చెల్లించి కొనుగోలు చేయడం పేదలకు ఆర్థిక భారంగా తయారైంది. ఆ తర్వాత సబ్సిడీ ధరపోనూ మిగిలిన నగదు తిరిగి బ్యాంక్ ఖాతాలో జమ అయినా ముందు చెల్లింపు కష్టతరంగా తయారైంది. తాజా గా ఆ డబ్బు కూడా జమకాకపోవడంతో వినియోగదారులకు మరింత ఆర్థిక ఇక్కట్లు తప్పడం లేదు. దీంతో లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. 29.21లక్షల పైనే.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 28.21లక్షల వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. మొత్త 125 ఏజెన్సీల ద్వారా ప్రతిరోజు డిమాండ్ ను బట్టి ఆయిల్ కంపెనీల నుంచి డిస్ట్రిబ్యూటర్లకు సరఫరా అవుతోంది. అక్కడి నుంచి బుకింగ్ ద్వా రా వినియోగదారులకు డోర్ డెలివరీ జరుగుతోంది. ప్రధానంగా ఐఓసీకి సంబంధించిన 11.94 లక్షలు, బీపీసీఎల్‌కు సంబంధించిన 4.96 లక్షలు, హెచ్‌పీసీఎల్‌కు సంబంధించిన 11.31 లక్షల కనెక్షన్లు ఉన్నట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. హైదరాబాద్‌లో వంట గ్యాస్ ధర ఎల్పీజీ సిలిండర్ ధర : రూ.762.35 బ్యాంకులో జమ : రూ. 257.79 -
మహబూబ్‌నగర్‌లో ఆన్లైన్ మోసం
సాక్షి, మహబూబ్‌నగర్ క్రైం: రుణాలు ఇస్తామని చెప్పి.. బ్యాంకు ఖాతా వివరాలు తెలుసుకొని ఖాతాలో ఉన్న రూ.94వేల నగదును ఆన్లైన్ ద్వారా తస్కరించారు. బాధితులు మోసపోయామని తెలుసుకొని ఆలస్యంగా ఫిర్యాదు చేశారు. రూరల్ ఎస్ఐ భాస్కర్‌రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. జిల్లా కేంద్రంలోని లక్ష్మీనగర్ కాలనీకి చెందిన వెంకటరాములు వృత్తిరీత్య ఓ ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. జనవరి 3న వెంకటరాములు సెల్‌ఫోన్‌కు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి మేము మహీంద్ర ఫైనాన్స్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నామని చెప్పారు. మీ సెల్ నంబర్‌కు లక్కీడిప్ తగిలింది మా కంపెనీ నుంచి తక్కువ వడ్డీకి లోన్ ఇస్తున్నామని నమ్మించారు. దీంతో బాధితుడు వెంకటరాములు రూ.6లక్షల రుణం కావాలని కోరాడు. దీంతో వారు అతని బ్యాంకు ఖాతా వివరాలు, జీతం వివరాలు అడగటంతో వివరాలన్నింటిని తెలిపాడు. ఆ తర్వాత మీ ఖాతాలో కనీసం రూ.35వేలు ఉండాలని చెప్పారు. ఆ తర్వాత వెంకటరాములు సెల్‌కు వచ్చిన మెసెజ్ వివరాలు తెలుసుకొని అతడి ఖాతాలో నుంచి రూ.34,999లను ఆన్లైన్ ద్వారా డ్రా చేశారు. ఆ వెంటనే బాధితుడు అదే నంబర్‌కు ఫోన్ చేసి నా ఖాతాలో డబ్బు కట్ చేశారని అడిగితే లోన్ వచ్చే సమయంలో రూ.6లక్షలతో పాటు ఇప్పుడు కట్ అయిన డబ్బు కూడా వస్తోందని చెప్పి ఫోన్ కట్ చేశారు. మళ్లీ జనవరి 4వ తేదీన బాధితుడు వెంకటరాములు అదే నంబర్‌కు ఫోన్ చేసి నాకు రూ.10లక్షల రుణం కావాలని అడిగాడు. వారు ఒక ఖాతా నుంచి ఒకరికి మాత్రమే లోన్ ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత వెంకటరాములు మరో తెలిసిన వ్యక్తి నవనీత బ్యాంకు ఖాతా వివరాలు చెప్పాడు. దీంతో ఆ ఖాతాలో నుంచి కూడా రూ.60వేల నగదు కట్ చేసుకున్నారు. ఆ తర్వాత ఎన్నిసార్లు సంబంధిత సెల్ఫోన్లకు ఫోన్ చేసినా పని చేయలేదు. దీంతో ఈ నెల 26న రుణాలు ఇస్తామని మోసం చేసిన వ్యక్తులను అరెస్టు చేసినట్లు పలు దినపత్రికల్లో వచ్చిన కథనాలు చూసి బాధితుడు ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. -
ప్రతీ అభ్యర్థికి ప్రత్యేక బ్యాంకు ఖాతా
సాక్షి, అమరావతి: లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే ప్రతీ అభ్యర్ధి ప్రత్యేకంగా ఎన్నికల వ్యయం కోసం బ్యాంకు ఖాతాను తెరవాల్సి ఉంటుంది. నామినేషన్ దాఖలకు ముందు రోజునే ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరవాలి. నామినేషన్ దాఖలు చేసిన తేదీ నుంచి ఖర్చు చేసిన వ్యయం, అభ్యర్ధికి వచ్చే ఎన్నికల విరాళాలు అన్ని ఆ బ్యాంకు ఖాతా నుంచే జరగాలి. రోజుకు పది వేల రూపాయల లోపు వ్యయాన్ని నగదు రూపంలో చేయవచ్చు. పది వేలు దాటిన వ్యయాన్ని చెక్, ఆన్లైన్ లావాదేవీల్లోనే చేయాలని ఎన్నికల నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. తెలుపు, గులాబీ, పసుపు పేజీల రిజిష్టర్లు ప్రతీ అభ్యర్ధి రోజు వారీ వ్యయానికి సంబంధించిన వివరాల కోసం ప్రత్యేకంగా రిజిష్టర్లను ఏర్పాటు చేసుకోవాలి. రోజు వారీ వ్యయానికి సంబంధించి తెలుపు పేజీలతో కూడిన రిజిష్టర్‌ను, నగదు నిర్వహణకు సంబంధించి గులాబీ పేజీల రిజిష్టర్‌ను, బ్యాంకు నిర్వహణకు సంబంధించి పసుపు పేజీల రిజిష్టర్‌ను నిర్వహించాల్సి ఉంటుంది. పోటీ చేసే ప్రతీ అభ్యర్ధి ఈ లావాదేవీల నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఏజెంటును ఏర్పాటు చేసుకోవాలని ఎన్నికల సంఘం అధికారులు సూచించారు. ఆ ఏజెంటువిరాళాలతో పాటు, వ్యయానికి సంబంధించి పూర్తి వివరాలను పైన పేర్కొన్న మూడు రిజిష్టర్లలో పొందుపరాచాల్సి ఉంటుంది. అందులో అభ్యర్థికి వచ్చే విరాళాలు పార్టీ నుంచా, వ్యక్తుల నుంచా లేదా సొంత నగదా అనే వివరాలను కూడా రిజిష్టర్‌లో పొందుపరచాలి. ప్రచార వ్యయంపై ప్రత్యేక దృషి అభ్యర్ధుల ప్రచారం వ్యయాన్ని పరిశీలించేందుకు ప్రత్యేకంగా ఎన్నికల సంఘం పరిశీలకులను నియమిస్తోంది. ఆ పరిశీలకులు అయా అభ్యర్ధుల ఎన్నికల ప్రచార వ్యయంపై నిఘా ఉంచడంతో పాటు మూడు రిజిష్టర్లను, బ్యాంకు లావాదేవీలను ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తారు. రాష్ట్రంలో లోక్‌సభ అభ్యర్థి ఎన్నికల వ్యయం 70 లక్షల రూపాయలుగాను, అసెంబ్లీ అభ్యర్థి ఎన్నికల వ్యయం 28 లక్షల రూపాయలుగా ఎన్నికల సంఘం నిర్ధారించింది.అభ్యర్థి వాహనాలు, ప్రచారానికి సంబంధించిన మెటీరియల్, బహిరంగ సభలు, ర్యాలీలు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ఎస్ఎంఎస్తో పాటు ఇంకా ఇతర రంగాల ద్వారా చేసిన ఖర్చు ప్రచార వ్యయంలోకే వస్తాయి. ఇంకా ఆ అభ్యర్థి తరపున ప్రచారం చేసిన వ్యక్తుల వ్యయాన్ని కూడా అభ్యర్థి ప్రచార వ్యయంగానే పరిగణిస్తారు. -
బ్యాంకు ఖాతాలపై నిఘా
చిత్తూరు అర్బన్ : ఎన్నికల తరుణంలో అక్రమ నగదు లావాదేవీలను అరికట్టేందుకు బ్యాంకర్లు సహకరించాలని చిత్తూరు ఎస్పీ విక్రాంత్ పాటిల్ కోరారు. పెద్ద మొత్తంలో నగదు నిల్వలు, బదిలీ లు జరుగుతున్న వాటిపై నిఘా ఉంచాలన్నారు. మంగళవారం చిత్తూరు నగరంలోని పోలీసు అతి థి గృహంలో బ్యాంకు అధికారులు, వాణిజ్య ప న్నులశాఖ అధికారులతో సమావేశం నిర్వహిం చారు. ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి రోజుకు రూ.20 వేలకు మించి నగదు బదిలీ చేయడానికి వీల్లేదని,అభ్యర్థిఖాతాలో రూ.10 వేలకు మించి డిపాజిట్లు ఉండకూడదన్నారు. కొ న్నిసార్లు ఓటర్లను మభ్య పెట్టడానికి ఒక్కసారిగా 40 నుంచి 50 మంది ఖాతాల్లో ఏకకా లంలో పెద్ద ఎత్తున డబ్బులు జమ అవుతుంటా యని, అలాం టి సమాచారాన్ని అం దజేయాలన్నారు. ఇక నిఫ్ట్, ఆర్టీజీఎస్ ఇతర ఆన్లైన్ లావాదేవీలపై కూడా ఆంక్షలు ఉన్నాయన్నారు. ఎక్సైజ్ అధి కారులు సైతం అక్రమ మద్యాన్ని అరికట్టడానికి పోలీసుశాఖతో కలిసి పనిచేయాలన్నారు. లీడ్ బ్యాంకు మేనేజరు గణపతి, డీఎస్పీలు సుబ్బారావు, సీఐలు సాయినాథ్, మహేశ్వర్ పాల్గొన్నారు. -
‘ఆధార్’ సవరణకు లోక్‌సభ ఆమోదం
న్యూఢిల్లీ: ఆధార్, రెండు అనుబంధ చట్టాల సవరణ బిల్లుకు లోక్‌సభ శుక్రవారం ఆమోదం తెలిపింది. దీని ప్రకారం బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు, మొబైల్ కనెక్షన్ పొందేందుకు పౌరులు ఆధార్ వివరాలు సమర్పించాల్సిన అవసరం లేదు. మొబైల్, బ్యాంకు సేవలకు ఆధార్ తప్పనిసరి కాదని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా చట్టంలో ఈ సవరణ చేశారు. ఆధార్‌తో పాటు టెలిగ్రాఫ్, మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టాల్లో సవరణలు చేశారు. ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తన ఆధార్ కార్డు చూపుతూ ‘ నా ఆధార్ కార్డులో నా పేరు, చిరునామా, నా తండ్రి పేరు మాత్రమే ఉన్నాయి. నా కులం, మతం, ఆరోగ్య పరిస్థితి ఇందులో లేవు. భారతీయులందరి ఆధార్ సురక్షితం. కోర్టు ఆదేశాలను పాటిస్తున్నాం’ అని భావోద్వేగంతో మాట్లాడారు. సవరణ చట్టంలో ఏముందంటే.. ► 18 ఏళ్లు నిండిన తరువాత ఆధార్‌ను రద్దుచేసుకునేందుకు మైనర్లకు అవకాశం. ► ఆధార్ వినియోగంలో నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు ► పౌరులు స్వచ్ఛందంగా సమకూర్చిన బయోమెట్రిక్ వివరాలు, ఆధార్ సంఖ్యను సర్వీస్ ప్రొవైడర్లు భద్రపరచరాదు ► ఆధార్ లేని కారణంగా బ్యాంక్, మొబైల్ సేవల్ని నిరాకరించరాదు ► వినియోగదారుల ఐడీ ధ్రువీకరణ కోసం మొబైల్ కంపెనీలు ఆధార్‌తో పాటు పాస్‌పోర్ట్ లేదా కేంద్రం జారీచేసే ఇతర పత్రాల్ని కూడా పరిశీలించొచ్చు -
హీరో మహేష్‌కు ఝలక్: బ్యాంకు ఖాతాలు సీజ్
-
మీ ఖాతాల్లోకి ఆ 15 లక్షలు వచ్చేస్తాయ్..
సాక్షి, న్యూఢిల్లీ : విదేశాల్లో నల్లధనాన్ని భారత్‌కు రప్పిస్తే ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ 15 లక్షలు జమచేయవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి రాందాస్ అథవలే స్పందించారు. విపక్షాలు పదేపదే ఈ హామీ గురించి మోదీని టార్గెట్ చేస్తున్న క్రమంలో కేంద్ర మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరి ఖాతాలోకి రూ 15 లక్షలు ఒక్కసారిగా కాకుండా నెమ్మదిగా చేరుతాయని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం వద్ద అంత డబ్బు లేదని, ఆర్బీఐని నిధులు సమకూర్చాలని కోరితే ఇవ్వడం లేదని చెప్పారు. అందుకే అంతమొత్తం సమీకరించలేకపోయామన్నారు. ఆర్బీఐ ప్రభుత్వానికి డబ్బులు ఇస్తామని హామీ ఇచ్చినా సాంకేతిక కారణాలు అడ్డంకిగా మారాయన్నారు. ఇక ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లో అధికారంలోకి రావడంపై అథవలే వ్యాఖ్యానిస్తూ కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుపొందినా, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి మోదీ తిరిగి ప్రధాని అవుతారన్నారు. -
ఆధార్ నిబంధనల సవరణకు క్యాబినెట్ ఓకే..
న్యూఢిల్లీ: బ్యాంకు ఖాతాలు, మొబైల్ నంబర్లకు ఆధార్‌ను అనుసంధానించడాన్ని చట్టబద్ధం చేసే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి టెలిగ్రాఫ్ చట్టం, మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టాలకు సవరణలు చేసే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ సోమవారం ఆమోదముద్ర వేసింది. ఆధార్ ఆధారంగా కొత్త మొబైల్ కనెక్షన్స్ ఇవ్వడానికి, బ్యాంక్ ఖాతాలు తెరవడానికి దీనితో చట్టబద్ధత లభిస్తుంది. వీటికోసం కస్టమర్లు ఆయా సంస్థలకు తమ ఆధార్‌ను ఇష్టపూర్వకంగా ఇవ్వొచ్చు. మొబైల్ సిమ్ కార్డుల జారీకి, బ్యాంక్ ఖాతాలు తెరవడానికి ఆధార్ తప్పనిసరన్న సెక్షన్ 57ని సుప్రీం కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ప్రైవేట్ కంపెనీలు ఆధార్‌ను వినియోగించడంపై ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో క్యాబినెట్ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. -
మోదీ మోసం చేశారు: రాహుల్
సాగర్/దామోహ్: ఏటా రెండు కోట్ల ఉద్యోగాల సృష్టి, ప్రతిఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షల నగదు జమ వంటి బూటకపు హామీలతో దేశ ప్రజల్ని ప్రధాని నరేంద్ర మోదీ మోసం చేశారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లోని సాగర్, దామోహ్‌లో జరిగిన బహిరంగ సభల్లో మోదీపై రాహుల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘ఈ దేశంలో నరేంద్ర మోదీ, నీరవ్ మోదీ, లలిత్ మోదీ ఎలా ఉన్నారో మీకు తెలుసా? దేశానికి కాపలాదారుడినని చెప్పుకునే మోదీ, సామాన్యులను ‘మిత్రులారా!’ అని సంబోధిస్తారు. కానీ ప్రజల సొమ్ముతో విదేశాలకు చెక్కేసిన నీరవ్ మోదీ, ఇతర రుణ ఎగవేతదారులను ‘భాయీ (సోదరా!)’ అని పిలుస్తారు. పనామా పేపర్లలో సీఎం కుమారుడి పేరుందని తాను చెప్పగానే శివరాజ్ సింగ్ తీవ్రంగా స్పందించటాన్ని బట్టి, ఈ వ్యవహారంలో వాస్తవం మరేదో ఉందని అనిపిస్తోందన్నారు. -
బ్యాంక్ ఖాతాలపై కన్ను...
సాక్షి, కల్వకుర్తి టౌన్ : ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అడ్డుకునేందుకు ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. నామినేషన్ల పర్వం సోమవారంతో ముగిసింది. ఎన్నికల ప్రచారానికి తక్కువ సమయం ఉండటంతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాజకీయ పార్టీల నాయకులు వివిధ మార్గాలలో తమ ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రధానంగా డబ్బుతో ఓటర్లను ఆకట్టుకునేందుకు వేస్తున్న ఎత్తుగడలను అడ్డుకునేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అనుమానిత బ్యాంకు లావాదేవీలపై దృష్టి పెట్టాలని అధికారులకు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారులు ఆదేశాలిచ్చారు. ఒకేసారి ఖాతాల్లో నగదు జమకావటం.. గతంలో తక్కువ లావాదేవీలు జరిగిన ఖాతాలలో ఈ మధ్య ఎక్కువగా లావాదేవీలు నిర్వహిస్తే వెంటనే నిఘా పెంచాలని ఆదేశాలు జారీ అయ్యాయి. విస్తృత తనిఖీలు ముఖ్యంగా జీరో ఖాతాల విషయమై అధికారులు లోతుగా పరిశీలన చేస్తున్నారు. జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఆయా చెక్‌పోస్టుల వద్ద చేపట్టిన తనిఖీల్లో నేటి వరకు రూ.లక్షల్లో నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సరైన నగదే అయితే సంబంధిత వ్యక్తులు ఆధారాలు చూపించి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అభ్యర్థుల లావాదేవీలపై ఒక్కో అభ్యర్థి ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం రూ.28 లక్షల మాత్రమే ఖర్చుచేయాలి. రోజువారి ఖర్చుల వివరాలను సైతం ఎన్నికల అధికారులకు చెప్పాలి. ఒకసారి నామినేషన్ పక్రియ పూర్తయిన తర్వాత, ఆ తర్వాత జరిగే ప్రతీ లావాదేవీలను ఎన్నికల వ్యయంగా పరిగణిస్తారు. కొంతమంది అభ్యర్ధులు తమ పేర్ల మీద కాకుండా బినామీల పేర్ల మీద ఎక్కువగా లావాదేవీలు చేస్తుంటారు. ఇప్పటికే బరిలో నిలిచిన అభ్యర్ధులు డబ్బులను సమకూర్చుకుంటున్నారు. ఇలాంటి లావాదేవీలను కూడా అధికారులు డేగకన్నుతో పరిశీలిస్తున్నారు. పరిమితి దాటితే పరిశీలన ఎన్నికల సమయంలో బ్యాంకుల్లో ఖాతాలపై ఆదాయపు పన్ను, పోలీస్ శాఖ అధికారులు నిఘా పెట్టారు. ముఖ్యంగా జీరో అకౌంట్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. సాధారణంగా రూ.49,999 లావాదేవీలపై ఆంక్షలు ఉండవు. రూ.50వేలు దాటితే పాన్ కార్డు నంబర్‌ను తప్పనిసరిగా బ్యాంక్ అధికారులకు అందించాలి. ఎన్నికల నేపథ్యంలో రంగంలోకి దిగిన అధికారులు ఏ మాత్రం అనుమానం కలిగినా సంబంధిత ఖాతాలపై ఆరా తీస్తున్నారు. రూ.లక్ష రూపాయలకు మించిన లావాదేవీలు జరిగిన ఖాతాలపై దృష్టి సారిస్తున్నారు. డిజిటల్ లావాదేవీల ద్వారా డబ్బులు చేర్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను గుర్తించిన అధికారులు వాటిపైన కూడా దృష్టి సారించారు. మహిళా సంఘాల సభ్యులు, ఉపాధి హామీ కూలీలు, ఫించన్ దారుల ఖాతాలను కచ్చితంగా పరిశీలిస్తున్నారు. పరిమితికి మించిన లావాదేవీలు జరిగిన ఖాతాల వివరాలను అధికారులకు సమాచారం అందిస్తున్నారు. -
అభ్యర్థులు ప్రత్యేక బ్యాంక్ ఖాతా తెరవాలి
ఖమ్మంసహకారనగర్: శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రత్యేకంగా బ్యాంక్ ఖాతాను తెరి చి ఖాతా నంబర్‌ను నామినేషన్ ఫారంలో తెలియజేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ పేర్కొన్నారు. ఆదివారం కలెక్టరేట్లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలు ర్యాండమైజేషన్ నిర్వహించారు. అనంతరం రిట ర్నింగ్ అధికారులకు ఆన్లైన్ ద్వారా బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీ ప్యాట్లను కేటాయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కర్ణన్ మాట్లాడుతూ నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థు లు ఈ నెల 12 నుంచి 19వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సంబంధిత రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలను సమర్పించాలని చెప్పారు. నామినేషన్‌తో పాటు ఫారం–26 అఫిడవిట్లో అభ్యర్థి పెండింగ్ నేర చరిత్ర వివరాలను తప్పనిసరిగా సమర్పించాలని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అఫిడవిట్ ఫారం–26లో సమర్పించిన అభ్యర్థి నేర చరిత్ర పెండింగ్ వివరాలను నియోజకవర్గ స్థాయిలో అభ్యర్థి, రాష్ట్రస్థాయిలో అభ్యర్థికి సంబంధించిన రాజకీయ పార్టీ పోలింగ్ కంటే రెండు రోజుల ముందు వరకు కనీసం మూడుసార్లు సర్క్యులేషన్ కలిగిన పేపర్లో, కేబుల్ టీవీలో ప్రచారం, ప్రసారం చేయాలని పేర్కొన్నారు. మొదటి ర్యాండమైజేషన్ పూర్తయిన ఈవీఎంలను నియోజకవర్గ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో రవాణా చేస్తామని, నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థులు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను పాటించాలని సూచించారు. సమావేశంలో జేసీ ఎంకే ఆయేషా, సబ్ కలెక్టర్ అనురాగ్ జయంతి, రిటర్నింగ్ అధికారులు జె.శ్రీనివాసరావు, ఆర్.దశరథ్, బి.శివాజీ, ఇన్చార్జ్ డీఆర్వో మదన్‌గోపాల్, ఎన్నికల డీటీ రాంబాబు, వివిధ పార్టీల నాయకులు ప్రకాష్, సింహాద్రి యాదవ్, శింగు నర్సింహారావు, విద్యాసాగర్, ప్రదీప్, ఖాజామియా తదితరులు పాల్గొన్నారు. -
బ్యాంకు ఖాతాల్లో సొమ్ము మాయం!
గుంటూరు, పిడుగురాళ్లరూరల్: పల్నాడుకు ‘సైబర్’ సెగ తగిలింది. కాయకష్టం చేసి పేదలు దాచుకున్న సొమ్ము బ్యాంకు ఖాతాల్లోంచి మాయమవుతోం ది. బ్యాంకు సిబ్బందిని అడిగితే నిర్లక్ష్య సమాధానమే వస్తుండటంతో బాధితులు లబోదిబోమంటున్నారు. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తున్నారు. పట్టణంలోని బ్యాంక్ఆఫ్ ఇండియాలో 2015లో షేక్ హుస్సేనమ్మ ఖాతా తెరచింది. గత శుక్రవారం బ్యాంక్ వద్దకు వచ్చి నగదు తీసుకునేందుకు డ్రా ఫారంను పూర్తి చేసి నగదు తీసుకునేందుకు ప్రయత్నించగా అకౌంటెంట్ మీరు తీసుకోవాల్సిన అంత లేదని రూ. 14,920లు మాత్ర మే ఉన్నాయని చెప్పారు. ఒక్కసారిగా కంగుతిన్న హుస్సేనమ్మ బ్యాంక్ మేనేజర్ బట్టాచార్యకు ఫిర్యాదు చేసింది. దీంతో మేనేజర్ ఆమె అకౌంట్ నంబర్‌ను సేకరించి ఆ నగదు ఎలా దారి మళ్లిం తో తెలుసుకుంటామని, మంగళవారం బ్యాంక్ వద్దకు రమ్మని చెప్పారు. హుస్సేనమ్మ తన తమ్ముడు సైదాతో బ్యాంక్ మేనేజర్‌ను కలవగా ఏటీఎం ద్వారా నగదు డ్రా చేశారని చెప్పారు. ఇదేలా సాధ్యం.. హుస్సేనమ్మ తనకు సంతకం చేయటం రాదని, వేలిముద్ర మాత్రమే వేస్తానని, అసతు తనకు ఏటీఎం కార్డేలేదని వాపోయింది. అకౌంట్లో నుంచి డబ్బులు ఎలా డ్రా అయ్యాయని బ్యాంక్ మేనేజర్‌ను ప్రశ్నించగా తాము ఏమీ చేయలేమని, పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టుకోమని సమాధానం చెప్పారు. ఈ క్రమంలో పట్టణ పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేశారు. ఇది ఇలా ఉండగా ఈ నెల 10న మండలంలోని జానపాడు గ్రామానికి చెందిన పసుపులేటి ఓబయ్య అనే వ్యక్తి అకౌంట్ నుంచి బ్యాంక్ మేనేజర్ పేరుతో ఫోన్ ద్వారా అకౌంట్, ఏటీఎం వివరాలు తెలుసుకొని రూ.95 వేలు నగదు డ్రా చేశారు. ఓబయ్య వెంటనే జానపాడు చైతన్య గోదావరి బ్యాంక్ మేనేజర్‌తో సహా వచ్చి ఫిర్యాదు చేశారు. నాకు ఏటీఎం లేదు.. నాకు చదువురాదయ్యా... కూడబెట్టుకున్న డబ్బులు బ్యాంక్‌లో దాచుకున్నాను. కానీ ఏటీఎం ద్వారా డబ్బు ఖాజేశారంటే నాకు ఎడుపే వస్తుంది. ఏమీ చేయాలో అర్థం కావటం లేదు. నా దగ్గర ఉన్నా ఉండేయోమే. ఈ బ్యాంక్ వారిని నమ్మి పూర్తిగా నష్టపోయాను. నాకు న్యాయం చేయండి.– హుస్సేనమ్మ,బాధితురాలు -
ఆటో డ్రైవర్ అకౌంట్లో రూ.300 కోట్లు!
కరాచీ : ఆయన ఓ ఆటో డ్రైవర్ కానీ ఆయన బ్యాంకు అకౌంట్లో రూ.300 కోట్ల రూపాయలు ఉన్నాయి. అదేంటీ అన్ని కోట్ల రూపాయలు ఉండి ఆటో తోలాల్సిన అవసమేముంది అనుకుంటున్నారా..? అంత డబ్బు తన దగ్గర ఉందని ఆయనకే తెలియదు పాపం. దర్యాప్తు సంస్థ అధికారులు నుంచి ఫోన్‌కాల్ రావడంతో అసలు విషయం తెలిసి ఆశ్చర్యానికి గురయ్యారు. పాకిస్తాన్‌లోని కరాచీ పట్టణానికి చెందిన ముహమ్మద్ రషీద్ ఆటో డ్రైవింగ్ చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇటీవల రషీద్ బ్యాంకు అకౌంట్ నుంచి రూ.300 కోట్ల లావాదేవీలు జరిగినట్లు పాకిస్తాన్ దర్యాప్తు సంస్థ అధికారులు గుర్తించారు. రషీద్‌ను తమ కార్యాలయానికి పిలిపించిన ఫెడరల్ దర్యాప్తు సంస్థ (ఎఫ్ఐఏ) ఈ విషయంపై ఆరా తీసింది. అయితే, తన ఖాతాలోకి అంత డబ్బు ఎలా వచ్చిందో తెలియదని ఆ డ్రైవర్ అంటున్నాడు. విచారణ అనంతరం రషీద్ మీడియాతో మాట్లాడుతూ..‘నన్ను ఎఫ్ఐఏ కార్యాలయానికి రమ్మంటే వెళ్లాను. నేను చాలా భయపడిపోయాను. అధికారులు నా అకౌంట్ వివరాలు చూపెడుతూ దాని ద్వారా రూ.300 కోట్ల లావాదేవీలు జరిగాయని చెప్పారు.అది విని ఆశ్చర్యానికి గురయ్యాను. నేను 2005లో ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేశాను. ఆ సమయంలో బ్యాంకు ఖాతా తెరిచాను. నా జీతం డబ్బులు అందులో వేసేవారు. కొద్ది నెలల తర్వాత నేను ఆ ఉద్యోగం మానేసి ఆటో తోలుకుంటున్నాను. నా జీవితంలో ఇంత వరకు లక్ష రూపాయలు కూడా చూడలేదు. అలాంటిది మూడువందల కోట్ల రూపాయలు నా అకౌంట్లో ఉందనడం నా ఊహకు కూడా అందని విషయం. ఇప్పటికీ నేను అద్దె ఇంట్లోనే ఉంటున్నాను. నా ఖాతాను ఎవరో ఉపయోగించుకుని లావాదేవీలు జరిపారు. ఈ విషయాలన్నింటినీ అధికారులకు చెప్పాను’ అని రషీద్ తెలిపారు. కాగా, కొన్ని రోజుల క్రితమే పాకిస్తాన్లో ఇటువంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. కరాచీలో ఉన్న ఓటిఫిన్ సెంటర్ యనమానీ అకౌంట్లో ఆయనకు తెలియకుండానే రూ.200 కోట్లు వచ్చి పడ్డాయి. ఈ లావాదేవీలు ఎవరు జరిపారనే అంశంపై ఎఫ్ఐఏ అధికారులు విచారణ చేపట్టారు. -
త్వరలో నీ బ్యాంకు అకౌంట్ క్లోజ్ కాబోతోంది..
చీరాల రూరల్: సైబర్ నేరగాళ్ల దెబ్బకు బ్యాంకు అకౌంట్లోని డబ్బులు కూడా క్షణాల్లో మాయమవుతున్నాయి. మూడు రోజుల క్రితం ఇటువంటి సంఘటన చీరాలలో ఒకటి వెలుగు చూసింది. త్వరలో బ్యాంకు అకౌంట్ క్లోజ్ కాబోతోంది.. అకౌంట్‌కు సంబంధించిన పూర్తి సమాచారం అంటే ఆధార్ నంబర్, పాన్, ఏటీఎం పిన్ నంబర్ చెప్పాలంటూ ఓ అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్‌కాల్ రావడంతో కంగారు పడిన బాధితుడు వారు అడిగిన పూర్తి సమాచారం టకటకా అందించాడు. ఇంకేముంది క్షణాల్లో అతడి బ్యాంకు అకౌంట్ నుంచి రెండు దఫాలుగా రూ.95 వేలు మాయం చేశారు. బాధితుడు మోసపోయినట్లు గ్రహించి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. టూటౌన్ సీఐ రామారావు కథనం ప్రకారం.. పేరాల భావనారుషి పేటలో నివాసం ఉండే మార్పు బాలమోషేకు అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి తాను హైదరాబాద్ యాక్సిస్ బ్యాంకు నుంచి మాట్లాడుతున్నట్లు చెప్పాడు. త్వరలో నీ బ్యాంకు అకౌంట్ క్లోజ్ కాబోతోంది.. బ్యాంకు అకౌంట్‌కు సంబంధించిన ఏటీఎం పిన్ నంబర్‌తో పాటు పాన్‌కార్డు, ఆధార్ నంబర్ చెప్పాలని కోరాడు. ఇంకేముంది ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అపరిచిత వ్యక్తి అడిగిన సమాచారాన్నంతా బాల మోషే చెప్పేశాడు. వివరాలు చెప్పిన కొద్దిసేపటికి మోషే సెల్‌ఫోన్‌కు ఒకసారి రూ.50 వేలు, మరోసారి రూ.45 వేలు నగదు డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది. బాధితుడు ఆందోళన చెంది బ్యాంకు మేనేజర్‌ను కలిసి జరిగిన విషయం వివరించాడు. మేనేజర్ సలహా మేరకు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
దర్జాగా దోపిడీ
పశ్చిమగోదావరి, తణుకు: అతను ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ చదివాడు.. సర్జికల్ వస్తువులు హోల్‌సేల్‌గా విక్రయిస్తుంటాడు.. అయితే అడ్డదారుల్లో డబ్బు సంపాదించాలని వచ్చిన ఆలోచనను అమల్లో పెట్టాడు.. శాఖా పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించి వారికి ఫోన్ చేసి మీకు సాయం చేస్తాను.. ఇబ్బందులు లేకుండా గట్టెక్కిస్తానంటూ నమ్మబలికి వారి నుంచి డబ్బు లాగుతాడు.. అతనే శ్రీకాకుళం జిల్లా ఎడ్చర్ల మండలం కుసిలేపురం గ్రామానికి చెందిన వెలమల నారాయణరావు అలియాస్ నాయుడు. పెట్టుబడి కేవలం నెట్లో దినపత్రికలు చదవడం.. వాటిలో వచ్చిన వార్తల ఆధారంగా ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వాధికారులకు ఫోన్‌చేసి బెదిరించడం ఇతని ప్రవృత్తి. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉండ్రాజవరం మండలం సత్యవాడ గ్రామంలో మద్యం తాగి ఇద్దరు మృతి చెందిన ఘటనను ఆధారం చేసుకుని ఒక ఎక్సైజ్ ఎస్సై నుంచి రూ.1.50 లక్షలు గుంజాడు. మరో ఎక్సైజ్ సీఐ నుంచి డబ్బు గుంజే క్రమంలో పోలీసులకు పట్టుబడ్డాడు. ఉన్నతాధికారిగా పరిచయం చేసుకుని.. వెలమ నారాయణరావుకు ఇంటర్నెట్లో దినపత్రికలు(ఈ పేపర్) చదవటం అలవాటు. గత నెల 17న దినపత్రికల్లో సత్యవాడ ఘటనకు సంబం ధించిన వార్తలు అతడు చదివాడు. వాటిని ఆధారం చేసుకుని ఎక్సైజ్ అధికారుల నుంచి డబ్బు గుంజాలని పన్నాగం పన్నాడు. ఎక్సైజ్‌శాఖకు సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేసి తణుకు సర్కిల్ పరిధిలోని ఎక్సైజ్ అధికారుల ఫోన్ నంబర్లు సేకరించాడు. సత్యవాడ ఘటనకు సంబంధించి ఆ ప్రాంత పరిధిలోని మహిళా ఎక్సై జ్ ఎస్సైకు ఫోన్ చేసి మీరు శాఖాపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తాను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విజయవాడ కమిషనరేట్ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నానని, తన పేరు నాయుడని చెప్పి పరిచయం చేసుకున్నాడు. తన బ్యాంకు ఖాతాకు రూ.2 లక్షలు జమ చేయాలన్నాడు. ఇబ్బందుల నుంచి మిమ్మల్ని గట్టెక్కిస్తానని చెప్పడంతో నిజమని నమ్మిన ఆమె రూ.1.50 లక్షలు ఇస్తానని చెప్పింది. దీంతో సరే అని చెప్పిన నాయుడు ఒక బ్యాంకు ఖాతా నంబర్ ఇచ్చాడు. దీంతో నాలుగు దఫాలుగా ఆమె రూ.1.50 లక్షలు జమ చేసింది. ఇదే అదునుగా మరుసటి రోజు ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావుకు ఫోన్ చేసి ఇదే తరహాలో బెదిరించాడు. దీంతో అనుమానం వచ్చిన సీఐ సుబ్బారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు కాల్ వచ్చిన ఫోన్ నంబరు, నాయుడు ఇచ్చిన బ్యాంకు ఖాతా నంబరు ఆధారంగా తణుకు సీఐ కేఏ స్వామి, పట్టణ ఎస్సై డి.ఆదినారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అడ్వకేట్ బ్యాంకు ఖాతా నంబరువాడుకున్న మోసగాడు ప్రభుత్వాధికారులను మోసంచేసి వారి నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్న వెలమల నారాయణరావు అలియాస్ నాయుడు బండారం అతని స్నేహితుడు, న్యాయవాది నామా బలరాంశేఖర్ ద్వారా బయటపడింది. నారాయణరావు ప్రభుత్వాధికారులకు బలరాంశేఖర్ బ్యాంకు ఖాతా నంబరు ఇచ్చేవాడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన శేఖర్‌కు ఓసారి మార్నింగ్ వాక్‌లో పరిచయమైన నారాయణరావు తనకు కొందరు డబ్బు ఇవ్వాలని, మీ బ్యాంకు ఖాతా నంబర్ చెబితే వినియోగించుకుంటానని చెప్పడంతో నమ్మిన ఆయన బ్యాంకు ఖాతా నంబర్ ఇచ్చాడు. ఇలా ఎక్సైజ్ శాఖ అధికారులకు ఇచ్చిన బ్యాంకు ఖాతా నంబర్ ఆధారంగా చిరునామా సేకరించిన పోలీసులు బలరాంశేఖర్ను తణుకు తీసుకువచ్చి విచారించగా మొత్తం మోసం బయటపడింది. అడ్వకేట్ శేఖర్ ద్వారా నారాయణరావును అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని ఫోన్ కాల్ డేటాను పరిశీలించి నిర్ధారించుకుని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.1.50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడు నారాయణరావును అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. -
3 రోజులు... 30 సార్లు!
సాక్షి, హైదరాబాద్: ఫోన్ కాల్, ఎస్సెమ్మెస్, ఈ–మెయిల్స్ ద్వారా ఎరవేసి అందినకాడికి దండుకునే సైబర్ నేరగాళ్లు నానాటికీ రెచ్చిపోతున్నారు. సైబర్ క్రిమినల్స్ చేతిలో రూ.6 లక్షలు మోసపోయిన ఓ వృద్ధుడు శుక్రవారం సిటీ సీసీఎస్ అధీనంలోని సైబర్ క్రైమ్ ఠాణాను ఆశ్రయించారు. తన ఫోన్‌కు వచ్చిన వన్ టైమ్ పాస్‌వర్డ్‌ను(ఓటీపీ) ఏకంగా 30 సార్లు నేరగాళ్లకు చెప్పేయడం గమనార్హం. చాదర్‌ఘాట్ ప్రాంతానికి చెందిన మోహన్ ప్రభుత్వ ఉద్యోగిగా పని చేసి పదవీ విరమణ పొంది భార్యతో కలిసి జీవిస్తున్నారు. ఇటీవల ఆయనకు ఓ నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. కాల్ చేసిన కేటుగాళ్లు తాము బ్యాంకు అధికారులమంటూ పరిచయం చేసుకుని, మీ డెబిట్ కార్డ్ వివరాలను అప్డేట్ చేయాలని చెప్పి కార్డు నంబర్, సీవీవీ కోడ్‌తో పాటు ఇతర వివరాలు తీసుకున్నారు. ఆ వివరాలతో బాధితుడి బ్యాంకు ఖాతాలోకి యాక్సిసయ్యారు. మళ్లీ ఫోన్ చేసి కార్డు అప్డేషన్ దాదాపు పూర్తయిందని ఇక ఓటీపీ ఎంటర్ చేయడమే మిగిలిందని చెప్పారు. మీ ఫోన్‌కు వచ్చే ఆ నంబర్ చెప్పాలంటూ కోరారు. మోహన్ అలానే చేయడంతో ఆయన ఖాతాలోని డబ్బు స్వాహా చేయడం మొదలు పెట్టారు. ఇలా 3 రోజుల్లో దాదాపు 30 సార్లు ఓటీపీలు తెలుసుకుని బాధితుడి బ్యాంకు ఖాతా నుంచి రూ.6 లక్షలు వివిధ ఈ–కామర్స్ యాప్స్‌తో పాటు పేటీఎంలోకి మళ్లించుకున్నారు. ఎట్టకేలకు విషయం గుర్తించిన మోహన్ శుక్రవారం సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఏసీపీ విజయ్ ప్రకాశ్ తివారీ దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక విచారణ నేపథ్యంలో నేరగాళ్లు జార్ఖండ్ కేంద్రంగా కథ నడిపినట్లు వెలుగులోకి వచ్చింది. సాంకేతిక ఆధారాలతో పాటు ఈ–కామర్స్ యాప్స్ ఆధారంగా దర్యాప్తు అధికారులు ముందుకు వెళుతున్నారు. -
బ్యాంక్ లింక్: మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మారిందా?
సాక్షి, సిటీబ్యూరో: బ్యాంకు ఖాతాలకు సంబంధించిన లావాదేవీలపై అప్రమత్తత కోసం ప్రతి ఒక్కరం రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇది బ్యాంకు అధికారిక రికార్డుల్లో నమోదవుతుంది. ఈ సెల్ నంబర్ ఆధారంగానే కొన్ని ఆర్థిక లావాదేవీల యాప్స్ పని చేస్తుంటాయి. ఇంతటి కీలకమైన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా భారీ మూల్యం తప్పదు. నగరానికి చెందిన ఓ ఎన్ఆర్ఐ చూపిన చిన్న నిర్లక్ష్యం రూ.7 లక్షల నష్టాన్ని మిగిల్చింది. దీనిపై ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిటీ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ బి.మధుసూదన్ సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విదేశాలకు వెళ్లడంతో... నగరానికి చెందిన ఓ యువతికి ఐసీఐసీఐ బ్యాంకులో ఖాతా ఉంది. కొన్నేళ్ల క్రితం తెరిచిన ఈ ఖాతాకు తన ప్రీ పెయిడ్ సెల్‌ఫోన్ నెంబర్‌కు లింకు చేసుకుంది. సదరు బ్యాంకు ఖాతాలో జరిగిన ప్రతి లావాదేవీపై అలర్ట్ వచ్చేలా ఈ నెంబర్‌ను రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌గా మార్చుకున్నారు. గడిచిన కొన్నేళ్లుగా విదేశాల్లో ఉంటున్న ఈ యువతి ఎన్ఆర్ఐగా మారారు. నాలుగు నెలల క్రితం తన సెల్‌ఫోన్ నెంబర్ మార్చుకుని ‘రిజిస్టర్డ్ నెంబర్’ వదిలేశారు. ఈ విషయాన్ని ఈ–మెయిల్ రూపంలో బ్యాంకు దృష్టికి తీసుకువెళ్లారు. తన పాత నెంబర్‌కు బదులుగా కొత్తగా మరో నెంబర్‌ను ఖాతాతో లింకు చేయాల్సిందిగా అందులో కోరారు. అయితే బ్యాంకు నిబంధనల ప్రకారం వినియోగదారుడు స్వయంగా వచ్చి, నిర్ణీత దరఖాస్తు పూరించి ఇస్తేనే ఈ మార్పిడి సాధ్యమవుతుంది. ఇదే విషయాన్ని బ్యాంకు అధికారులు ఎన్ఆర్ఐకి సమాచారం ఇచ్చారు. ఆపై ఆమె ఆ విషయం మర్చిపోయారు. ఎడాపెడా వాడేసిన నిందితుడు... సెల్‌ఫోన్ సర్వీస్ ప్రొవైడర్ల నిబంధనల ప్రకారం ఏదైనా ప్రీ–పెయిడ్ నెంబర్‌ను వినియోగదారుడు కొన్నాళ్ల పాటు వినియోగించకుంటే దాన్ని వేరే వినియోగదారుడికి ఎలాట్ చేసేస్తారు. దీని ప్రకారమే ఎన్ఆర్ఐకి చెందిన ‘రిజిస్టర్డ్ నెంబర్’ను సర్వీస్ ప్రొవైడర్ నాలుగు నెలల క్రితం మరో వ్యక్తికి కేటాయించారు. ఇటీవల అందుబాటులోకి వచ్చిన కొన్ని ఆర్థిక లావాదేవీల యాప్స్‌లో ఓ లోపం ఉంది. బ్యాంకు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌తో ఉన్న ఫోన్లో వీటిని డౌన్లోడ్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా ఆ ఖాతాను యాక్సస్ చేసే అవకాశం ఉంది. దీంతో ఎన్ఆర్ఐ నెంబర్ పొందిన యువకుడు తన సెల్ఫోన్లో కొన్ని ఈ తరహా యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడంతో ఆమె బ్యాంకు ఖాతాతో అనుసంధానమైంది. లావాదేవీలకు సంబంధించిన అలర్ట్స్, ఓటీపీలు సైతం ఇదే నెంబర్‌కు రావడం అతడికి కలిసి వచ్చింది. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న అతగాడు ఎన్ఆర్ఐ ఖాతాలో ఉన్న నగదును తన ఖాతాలోకి మళ్లించాడు.మూడునెలల్లో రూ.7లక్షలు స్వాహా చేశాడు. రంగంలోకి దిగిన సైబర్ కాప్స్... ఈ వ్యవహారంపై విదేశాల్లో ఉన్న యువతికి సమాచారం రాకపోవడంతో ఆమె తన ఖాతాలోకి నగదు జమ చేస్తూనే ఉన్నారు. ఈ మొత్తాన్ని ఓ వ్యక్తి కాజేస్తున్నాడనే అంశమే ఆమె దృష్టికి వెళ్లలేదు. ఇటీవల ఆమె తండ్రి సదరు బ్యాంకు ఖాతాను పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే అందులో ఉండాల్సిన మొత్తం లేనట్లు గుర్తించారు. లెక్కలు చూడగా దాదాపు రూ.7 లక్షల వరకు తేడా రావడంతో వెంటనే అప్రమత్తమయ్యారు. సోమవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ బి.మధుసూదన్ దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక ఆధారాలను బట్టి సదరు యువకుడు ఏపీలోని చిత్తూరుకు చెందిన వాడిగా భావిస్తున్నారు. సెల్‌ఫోన్ నెంబర్‌తో పాటు బ్యాంకు ఖాతా వివరాలు ఆధారంగా దర్యాప్తు చేస్తున్న సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. -
ఆన్లైన్ ప్రేమపెళ్లి మోసాలు
బొమ్మనహళ్లి: ఆన్లైన్ వివాహ సంబంధాలు యువతీ యువకుల బ్యాంకు ఖాతాలను కొల్లగొడుతున్నాయి. బెంగళూరు మహా నగరంలో ఇటీవల ఇలాంటి నయ వంచన బారిన పడిన వారు వందల సంఖ్యలో ఉన్నప్పటికీ, పరువు పోతుందనే భయంతో గుట్టు చప్పుడు కాకుండా ఉండిపోతున్నారు. ఇటీవల ఓ టెకీ రూ.60 లక్షలు పోగొట్టుకున్నాడంటే, ఈ పెళ్లి మోసం ఎంత తారస్థాయికి చేరిందో ఊహించు కోవచ్చు. ఆన్లైన్లో ఓ మోడల్ ఫొటోను చూసి, ఆమె తనను పెళ్లి చేసుకుంటుందనే నమ్మకంతో ఆ మొత్తాన్ని సమర్పించుకున్నాడు. ఇలా మోసపోయిన వారు పోలీసులకు మౌఖికంగా తప్ప, రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం లేదు. అలా చేస్తే...సమాజంలో నగుబాట్ల పాలవుతామని, ప్రస్తుత గ్యాసిప్ లోకంలో భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకుంటామనే భయం వారిని పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయించడం లేదు. గత ఏడాది 20 మంది మాత్రమే ఇలాంటి నయవంచన కేసుల్లో పోలీసులకు ఫిర్యాదు చేయగలిగారు. ఈ ఏడాది ఆరు నెలల్లోనే ఆ సంఖ్య దాటిపోయింది. వాస్తవానికి ఈ మోసం బారిన పడిన వారితో పోల్చుకుంటే ఈ సంఖ్య చాలా తక్కువని సైబర్ క్రైమ్ పోలీసులే అంగీకరిస్తున్నారు. ఎక్కడినుంచైనా మోసం చేయవచ్చు:... ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఈ మోసాలకు పాల్పడవచ్చు. మోసగాళ్లు భారతీయ బ్యాంకు ఖాతాలను నిర్వహిస్తూ ఉంటారు. తద్వారా నగదు బదిలీకి ఎలాంటి అవాంతరాలుండవు. బాధితులను సంప్రదించడానికి లెక్కలేనన్ని సిమ్ కార్డులు వినియోగిస్తారు. ముఠాలోని మహిళ బాధితులతో తరచూ మాట్లాడడం ద్వారా వారిలో నమ్మకం కలిగేలా చూస్తుంది. నివారణోపాయాలు:.... ఫేస్బుక్లో అపరిచిత వ్యక్తుల ఫ్రెండ్ రిక్వెస్టులను తిరస్కరించాలి. ఏకాంత దృశ్యాలతో కూడిన ఫొటోలను ఎవరితోనూ షేర్ చేయకూడదు. ఆన్లైన్లో సంప్రదించిన వ్యక్తుల బ్యాంకు ఖాతాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ నగదు బదిలీ చేయకూడదు. బాధితులంతా యువతీ యువకులే బాధిత యువతీ యువకులు 19 నుంచి 35 ఏళ్ల వారే. ఈ మోసాలకు మూల స్థానాలు ఆఫ్రికా దేశాలు. వారంతా సాంకేతిక కోవిదులే కాకుం డా, ఎవరినైనా కబుర్లతో మెల్లగా బుట్టలో పడేసే వాక్చాతుర్యం కలిగిన వారు కూడా. ఈ మొత్తం వ్యవహారంలో ఏ సందర్భంలోనూ వారు బాధితులకు ముఖాముఖి తారసపడరు. అసలీ వ్యవహారమంతా చాలా సరళంగా సాగిపోతుందని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. వారు చెబు తున్న ప్రకారం...ఈ మోసాలకు పాల్పడే వారంతా ముఠాలుగా ఉంటా రు. సాధారణంగా ఒక్కో గ్యాంగులో ఇద్దరు పురుషులు, ఓ మహిళ ఉం టారు. ఢిల్లీ, బిహార్, ఈశాన్య రాష్ట్రాల్లోని నిరుద్యోగ యువతీ యువకులతో ఆఫ్రికన్లు ముందుగానే ఒడంబడికలు కూడా చేసుకుని ఉంటారు. ఫేస్బుక్ లేదా వివాహ వేదికల సైట్లలో బాధితులను ఎంచుకుంటారు. బాధితుల్లో ఆర్థికంగా బాగా ఉన్న వారిని ఎంచుకుని చాటింగ్ మొదలెడతారు. వీరిలో కూడా బాగా భావోద్వేగానికి లోనయ్యే వారిని చూసుకుని, డబ్బులు గుంజు కోవడం ప్రారంభిస్తారు. ఈ డబ్బులు లాక్కోవడంలో నమ్మదగిన కట్టు కథలు చెబుతారు. తీరా డబ్బులు తమ ఖాతాల్లోకి పడ్డాక, ఆ గ్యాంగు పత్తా లేకుండా పోతుంది. అప్పటికి కానీ బాధితునికి జ్ఞానోదయం కాదు. అప్పటికే బ్యాంకు ఖాతాలు కనీస నగదు నిల్వలతో వెక్కిరిస్తూ ఉంటాయి. మోసపోయిన వెంటనే బాధితులు తమను సంప్రదిస్తే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. బాగా కాలయాపన చేసి తమ వద్దకు రావడం వల్ల మోసగాళ్లను పట్టుకోలేమని తెలిపారు. బాధితుల్లో చాలా మంది అవతలి వ్యక్తుల సంభాషణలను నిజమేనని భావించి, ప్రేమ అనే ఊహా లోకాల్లో విహరిస్తూ ఉంటారని చెప్పారు. వారెంత గుడ్డిగా మోస పోతారంటే...చాటింగ్ సాగిస్తున్న అవతలి వ్యక్తులు, ఫొటోల్లో తాము చూస్తున్న వారు వేర్వేరనే వాస్తవాన్ని ఏ సందర్భంలోనూ గుర్తించలేరని వివరించారు. ఈ మోసాలు ఎలా ఉంటాయంటే... సైబర్ పోలీసులు చెబుతున్న ప్రకారం.. ఒక పురుషుడు, స్త్రీ పేరు చెప్పుకుంటూ అవతలి పురుషునితో చాటింగ్ ప్రారంభిస్తాడు. ఓ ఫేస్బుక్ యూజర్ ప్రొఫైల్ పిక్చర్‌ను ఉయోగించి బాధితుని వలలో వేసుకుంటాడు. సంభాషణలు చాలా శృంగారభరితంగా సాగుతాయి. ఇదే సమయంలో మార్ఫింగ్ ఫొటోలతో బాధితుని నమ్మించి, అతని ఏకాంత దృశ్యాల చిత్రాలను తీసుకుంటాడు. ఇక అంతే...డబ్బులు గుంజుకోవడం ప్రారంభమవుతుంది. ఒక పురుషుడు, మరో మహిళతో వివాహ వేదిక సైట్లో సంప్రదిస్తాడు. చాటింగ్ కూడా మొదలవుతుంది. తాను విదేశాల్లో ఉంటానని, కళ్లు చెదిరే సంపాదన అని నమ్మబలుకుతాడు. ఎట్టకేలకు అతనితో వివాహానికి మహిళ సమ్మతిస్తుంది. ముహూర్తం తేదీ కూడా ఖరారవుతుంది. పెళ్లికి కొద్ది రోజుల ముందు అతను ఆమెను ఫోనులో సంప్రదిస్తాడు. కస్టమ్స్‌లో దొరికిపోయానని, బయట పడడానికి కొన్ని లక్షలు అవసరమవుతాయని చెబుతాడు. కాబోయే వధువు వెంటనే తన బ్యాంకు ఖాతాలోని మొత్తాన్ని అతని ఖాతాకు బదిలీ చేస్తుంది. డేటింగ్ సైట్లలో సంప్రదింపులు సాగించే జంట తక్కువ సమయంలోనే చాలా దగ్గరైపోతారు. విదేశాల నుంచి తానో కానుక పంపానని, అయితే అది కస్టమ్స్ అధికారుల వద్ద చిక్కుకుందని అతను ఆమెకు ఫోన్ ద్వారా తెలియజేస్తాడు. విమానాశ్రయంలో తమ మనిషి ఉంటాడని, అతనికి డబ్బు చెల్లిస్తే కానుకను విడిపించుకుని ఇస్తాడని నమ్మబలుకుతాడు. విమానాశ్రయంలో ముఠాకు చెందిన వ్యక్తి ఉంటాడు. అతను బాధిత మహిళ వద్ద డబ్బు తీసుకుని, తర్వాత కనబడడు. -
‘రైతుబంధు’కు కొత్త బ్యాంకు ఖాతాలు
సాక్షి, హైదరాబాద్: పెట్టుబడి వదులుకునే వారి నగదు, రాష్ట్ర రైతు సమన్వయ సమితికి విదేశాల నుంచి అందే నిధులు, కొన్ని రకాల చెక్కుల సొమ్ము తక్కువ లేదా ఎక్కువ ఉండటం వంటి వాటి జమ కోసం వ్యవసాయ శాఖ కొత్తగా బ్యాంకు ఖాతాలను తెరిచింది. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ ఎం.జగన్మోహన్ బుధవారం నిర్దేశిత ఎనిమిది బ్యాంకుల్లో ఈ ఖాతాలు తెరిచారు. గివ్ ఇట్ అప్ కింద దాదాపు రూ.30 లక్షలకు పైగా విలువైన చెక్కులను వ్యవసాయ శాఖకు కొందరు అందజేశారు. ఆ సొమ్మును ఎక్కడ జమ చేయాలో తెలియక అలాగే ఉంచారు. ఇక రైతు సమన్వయ సమితి చేసే కార్యక్రమాలకు నిధులు ఇస్తామని విదేశాల్లో ఉండే అనేకమంది తెలంగాణ వాసులు ముందుకు వస్తున్నారు. అటువంటి చెక్కుల సొమ్ము జమ చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఖాతాలు తెరిచినట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. రాష్ట్రం లో ఇప్పటివరకు 9,085 గ్రామాల్లో చెక్కుల పంపిణీ పూర్తయినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. కాగా, పట్టాదారు పాసు పుస్తకం పొందని రైతుల చెక్కులను తహసీల్దార్ ధ్రువీకరణ పత్రం తీసుకొస్తే క్లియర్ చేయాలని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు. -
రైలు రద్దయితే నేరుగా ఖాతాలోకే రీఫండ్
న్యూఢిల్లీ: ఏదేనీ రైలు తొలి స్టేషన్ నుంచి చివరి స్టేషన్ వరకు మొత్తంగా రద్దయితే, ఆ రైలుకు ఆన్లైన్లో రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు టికెట్ డబ్బులు నేరుగా బ్యాంకు ఖాతాలోకే ఆటోమేటిక్‌గా వెనక్కు వస్తాయని ఐఆర్సీటీసీ (ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) స్పష్టంచేసింది. ప్రయాణికులు తమ టికెట్‌ను రద్దుచేసుకుని రీఫండ్ కోసం అభ్యర్థించాల్సిన అవసరం లేదంది. రైలు పూర్తిగా రద్దయినప్పుడు ఆ రైలు ఎక్కాల్సిన ప్రయాణికులందరి పీఎన్ఆర్లు ఆటోమేటిక్‌గా రద్దవుతాయంది. ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా ప్రయాణికులు టికెట్ రిజర్వేషన్ చేసుకునే సమయంలో ఏ బ్యాంకు ఖాతాను/కార్డును వాడతారో ఆ ఖాతాలోకే నేరుగా డబ్బులు జమ అవుతాయని తెలిపింది. కాగా, ఆన్లైన్లో టికెట్లు బుక్ చేశాక, రైలు బయలుదేరే సమయానికి కూడా బెర్తు/సీటు కన్ఫర్మ్ అవ్వకపోతే కూడా ఆ వెయిట్‌లిస్టింగ్ టికెట్లు ఆటోమేటిక్‌గా రద్దయ్యి రీఫండ్ నేరుగా బ్యాంకు ఖాతాలోకొస్తాయి. -
పెన్షన్‌దారులకు ఆ రెండు తప్పనిసరి
న్యూఢిల్లీ : నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్పీఎస్) సబ్స్క్రైబర్లకు మొబైల్ నెంబర్, బ్యాంకు అకౌంట్‌ను పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ పీఎఫ్ఆర్డీఏ తప్పనిసరి చేస్తున్నట్టు ఆర్థిక మంత్రిత్వశాఖ పేర్కొంది. మనీ లాండరింగ్ నివారణ చట్ట మార్గదర్శకాల ప్రకారం, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ప్రస్తుతమున్న సబ్స్క్రైబర్లకు, కొత్త సబ్స్క్రైబర్లకు ఫారిన్ అకౌంట్ ట్యాక్స్ కంప్లియెన్స్ యాక్ట్, సెంట్రల్ రిజిస్ట్రీ ఆఫ్ సెక్యురిటైజేషన్ అసెట్ రికన్స్ట్రక్షన్ అండ్ సెక్యురిటీ ఇంటరెస్ట్‌లను తప్పనిసరి చేసింది. నేషనల్ పెన్షన్ స్కీమ్‌ను సులభతరం చేసేందుకు, మెరుగుపరుచేందుకు ఎప్పడికప్పుడు పెన్షన్ అథారిటీ పలు కార్యక్రమాలను చేపడుతోంది. ఈ క్రమంలోనే సబ్స్క్రైబర్ల ప్రయోజనార్థం, ఆపరేషన్‌ను సులభతరం చేసేందుకు బ్యాంకు అకౌంట్ వివరాలను, మొబైల్ నెంబర్‌ను తప్పనిసరి చేసిన్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. సబ్స్క్రైబర్లు తప్పనిసరి నమోదు చేయాల్సిన వాటిలో వివరాలను కచ్చితంగా వెల్లడించాల్సి ఉందని, వాటిని బ్లాంక్‌గా వదిలేయకూడదని మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఒకవేళ బ్లాంక్‌గా వదిలేస్తే దరఖాస్తు తిరస్కరించబడుతుందని పేర్కొంది. -
సురేష్ ఆచూకీ లభ్యం
సూర్యాపేట క్రైం : రూ.కోట్లల్లో అప్పులు చేసి ఉడాయించిన సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన కస్తూరి సురేష్ ఆచూకీని ఎట్టకేలకు పోలీసులు కనిపెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. గురువారం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ప్రకాశ్‌జాదవ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సురేష్‌ను మీడియా ఎదుట ప్రవేశపెట్టి కేసు వివరాలు వెల్లడించారు. పదేళ్లుగా ‘ఆన్లైన్’ వ్యాపారం బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి కస్తూరి జనార్దన్ కుమారుడు సురేష్ పదేళ్ల నుంచి ఆన్లైన్ (ఫారెక్స్) వ్యాపారం చేస్తున్నాడని ఎస్పీ తెలిపారు. 2009 నుంచి ఆన్లైన్ వ్యాపారం చేస్తున్న సురేష్ రూ.10 వేల నుంచి రూ.లక్షలు అప్పులు చేసి రూ.5 నుంచి రూ.7ల వరకు వడ్డీలు చెల్లిస్తూ వస్తున్నాడు. ఆన్లైన్ వ్యాపారంలో పెద్ద ఎత్తున నగదు పెట్టేందుకు సూర్యాపేటకు చెందిన 47 మంది నుంచి రూ.6 కోట్ల వరకు అప్పులు చేశాడు. ప్రతి నెలా అసలు ఉంచి.. వడ్డీ ఇస్తూ సురేష్ వ్యాపారం సాగిస్తు వస్తున్నాడన్నారు. ఎవరి దగ్గరైనా వడ్డీకి తీసుకున్న డబ్బులకు ప్రతినెలా 10వ తేదీన వడ్డీ చెల్లించేవాడన్నారు. అదే మాదిరిగా గత ఏడాది.. ఆగస్టు, సెప్టెంబర్ నెల 10వ తేదీన తీసుకున్న నగదుకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అప్పులిచ్చిన వారు ఒత్తిడి చేయడంతో.. డబ్బులు ఇచ్చిన వారు వడ్డీ .. లేదా అసలైనా ఇవ్వాలని ఒత్తిడి పెంచడంతో చేసేదేమి లేక.. సెప్టెంబర్ 10వ తేదీ సాయంత్రం సురేష్ తన భార్య ప్రభాతకు పూణె వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. పదో తేదీ రాత్రి ఇంటికి రాకుండా తిరిగి 11వ తేదీన పూణెలో డబ్బుల కోసం వెళ్తున్నానని మరోమారు భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. డబ్బుల కోసం ఎంత ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో తిరిగి భార్యకు 12వ తేదీన సాయంత్రం ఫోన్ చేసి చెప్పి డబ్బు కోసం ప్రయత్నం చేస్తున్నానని.. నా కోసం.. ఇంటి వద్దకు అప్పులవారు వస్తారు.. అమ్మనాన్న దగ్గరి నుంచి వెళ్లిపోండని చెప్పాడు. దీంతో చేసేదేమి లేక భార్య ప్రభాత అత్తమామలకు చెప్పి 13వ తేదీన వారి ఇంటికి వెళ్లిపోయింది. తిరిగి అత్తమాతలు జనార్దన్, చంద్రకళలు ఫోన్ చేయడంతో ప్రభాత 16వ తేదీన సాయంత్రం సూర్యాపేటలోని వారి నివాసానికి చేరుకుంది. 16వ తేదీన సురేష్ కన్పించకుండా పోయారంటూ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో భార్య ప్రభాత ఫిర్యాదు కూడా చేసింది. 11 వ తేదీ రాత్రి నుంచి సురేష్ ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉండడంతో చేసేదేమి లేక.. 17వ తేదీన అర్ధరాత్రి కూడా సురేష్‌కు పదే పదే ఫోన్ చేసినప్పటికీ స్విచ్ ఆఫ్ లో ఉండడంతో కుటుంబ యజమాని అయిన జనార్దన్‌తో పాటు భార్య చంద్రకళ, చిన్న కుమారుడు అశోక్, సురేష్ భార్య ప్రభాత, కుమార్తెలు సాన్విక, రుత్వికలు సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డారు. సెప్టెంబర్ 25న యూట్యూబ్‌లో చూసి.. అరువు ఇచ్చిన వారి నుంచి వేధింపులు తాళలేక ఇంట్లో నుంచి వెళ్లిపోయిన సురేష్‌కు తన తల్లిదండ్రులు, తమ్ముడు, భార్య, కుమార్తెలు మృతిచెందిన విషయం సెప్టెంబర్ 25వ తేదీన యూట్యూబ్‌లో చూసి తెలుసుకున్నాడు. అప్పుడు సురేష్ వారణాసిలో ఉన్న సురేష్ భయంతో ఇక్కడికి రాలేకపోయాడు. వారణాసి నుంచి వయా, కోల్కత్తా, వరంగల్, వైజాగ్, విజయవాడలో తిరిగాడు. అందరి అప్పులు తీర్చేస్తా.. ఎవరి వద్ద నుంచి అప్పు తీసుకున్నానో.. వారందరికీ చెల్లించేందుకు గాను తనకు రెండుమూడేళ్ల సమయం ఇస్తే తీరుస్తానని సురేష్ మీడియా ఎదుట చెప్పాడు. ఆన్లైన్ మార్కెటింగ్‌లో షేర్లు పెట్టేందుకే రూ.6 కోట్లు తీసుకున్నట్లు తెలిపాడు. వ్యాపారంలో నష్టం రావడంతోనే ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయనన్నారు. ఈలోపు మా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్నట్లు వారం రోజులకే తెలిసిందన్నారు. భయంతోనే ఇక్కడికి రాలేకపోయనని తెలిపాడు.– కస్తూరి సురేష్ బ్యాంకు ఖాతాపై నిఘాపెట్టి.. అయితే సురేష్ మిస్సింగ్ కేసు నమోదునైప్పటి నుంచి సూర్యాపేట డీఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం గాలింపు చర్యలు చేపట్టింది. అప్పటి నుంచి సురేష్ బ్యాంకు ఖాతాలపై నిఘాపెట్టి నగదు లావాదేవీలపై దృష్టి సారించారు. ఇటీవల విశాఖపట్నంలో అతడి ఖాతానుంచి లావాదేవీలు జరగడంతో ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గొర్ల కృష్ణ, గోదేషి కరుణాకర్‌లు వైజాగ్ వెళ్లి సురేష్‌ను అదుపులోకి తీసుకున్నట్టు ఎస్పీ వివరించారు. అయితే ఇప్పటి వరకు సురేష్‌పై అప్పులిచ్చిన వారు ఎవరూ కూడా ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. సురేష్‌పై మిస్సింగ్ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. కేసును చాకచక్యంగా ఛేదించిన ఎస్ఐ శ్రీనివాస్, ఐడీపార్టీ బృందాన్ని ఎస్పీ ఈ సందర్భంగా అభినందించారు. సమావేశంలో డీఎస్పీ నాగేశ్వరరావు ఉన్నారు. అరువే..అంతం చేసింది.. సురేష్ జల్సాలకు అలవాటు పడి అనతికాలంలో కోట్లల్లోకి ఎదగాలన్న ఆశ కుటుంబాన్ని అంతం చేసేలా చేసింది. అయిన వాళ్ల నుంచే కాకుండా.. స్నేహితులు, సమీప బంధువుల నుంచి రూ. కోట్లల్లో అరువు తీసుకున్నాడు. ఆన్లైన్ వ్యాపారంలో బాగా కలిసివస్తుందని ఆశపడ్డాడు. బెంగళూరు, చెన్నై, ముంబై, కోల్కత్తాలతో పాటు గోవా లాంటి ప్రాంతాల్లో ఆన్లైన్ వ్యాపారంలో జోరుగా పాలుపంచుకున్నట్లు తెలిసింది. ఈ వ్యాపారం కొన్ని రోజుల పాటు బాగానే సాగినప్పటికీ అరువు తెచ్చిన వాళ్లకు లక్ష రూపాయలకు నెలకు రూ.10 వేల వడ్డీ కూడా ఇచ్చి తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. అలా ఆశపడ్డ వారు పెద్ద మొత్తంలో సురేష్‌కు ఎక్కువ నగదును ముట్టజెప్పారు. తిరిగి చెల్లించడంలో ఇబ్బందులు ఎదురవడంతో ఉడాయించాడు. తీరా అప్పులిచ్చిన వారు ఇంటిమీద పడడంతో కుటుంబ పెద్దతో సహా మరో ఐదుగురు సామూహిక ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. -
ఆధార్ లింక్ పేరుతో వేల రూపాయలు స్వాహా
థానే : ఆధార్ లింక్ పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు ఓ సీనియర్ సిటిజన్ అకౌంట్ నుంచి వేల రూపాయలు స్వాహా చేశారు. కోప్రి పోలీసు స్టేషన్ పరిధిలో ఇది చోటు చేసుకుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, ఐపీసీ సంబంధిత చట్టాల కింద దీనిపై కోప్రి పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. నగరానికి చెందిన బపురావు షింగోట్కు ఏప్రిల్ 2న ఓ ఫోన్ కాల్ వచ్చింది. మీ బ్యాంకు అకౌంట్‌ను, ఆధార్ నెంబర్‌తో లింక్ చేస్తున్నామని ఆ ఫోన్ చేసిన వ్యక్తులు చెప్పారు. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి మీ మొబైల్ నెంబర్‌కు పంపిన ‘వెరిఫికేషన్ కోడ్’ను పంపించమని వారు అడిగారు. టెక్ట్స్ మెసేజ్ రూపంలో తాను పొందిన మెసేజ్‌ను షింగోట్ వారికి చెప్పాడు. ఇక అంతే, షింగోట్ అకౌంట్ నుంచి కొద్ది క్షణాల్లో 75 వేల రూపాయలు విత్‌డ్రా అయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తులు తన బ్యాంకు అకౌంట్ నుంచి నగదు విత్‌డ్రా చేశారని తెలుసుకున్న షింగోట్ వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. బ్యాంకులు నగదును ఆన్లైన్లో ట్రాన్సఫర్ చేయాలంటే వన్ టైమ్ పాస్వర్డ్లు ఎంతో అవసరం. ఓటీపీ టైప్ చేస్తే, లావాదేవీ పూర్తవుతుంది. దీన్నే క్యాష్ చేసుకున్న కొందరు బ్యాంకు వారిగా కాల్స్ చేస్తూ.. ఆధార్ లింక్ ప్రక్రియ చేపడుతున్నామంటూ... ఈ వన్‌టైమ్ పాస్‌వర్డ్‌ను రాబడుతున్నారు. నిజంగానే బ్యాంకు అధికారులు ఆధార్ లింక్ చేపడుతున్నారని భావిస్తున్న కస్టమర్లు ఈ పాస్వర్డ్ చెప్పి వేల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. ప్రస్తుతం దీనిపై కేసు నమోదు చేసుకున్న కోప్రి పోలీసులు దీనిపై విచారణ చేపడుతున్నారు. -
అకౌంట్లోకి 10 కోట్లు, డ్రా చేసుకోవడానికి వెళ్తే..
న్యూఢిల్లీ : రాజధాని ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఒక్కసారిగా మిలీనియర్ అయిపోయాడు. అనుకోకుండా ఆయన బ్యాంకు అకౌంట్లోకి రూ.9,99,99,999 నగదు వచ్చి చేరింది. అంటే దాదాపు రూ.10 కోట్లన్నమాట. వివరాల్లోకి వెళ్తే.. వినోద్ కుమార్ అనే వ్యక్తి ఢిల్లీలో మొబైల్ షాపు నడుపుతున్నాడు. అతని అకౌంట్లోకి రూ.9,99,99,999 నగదు క్రెడిట్ అయినట్టు వినోద్‌కు ఎస్ఎంఎస్ అలర్ట్ వచ్చింది. ఒక్కసారిగా అతని అకౌంట్లోకి ఇంత నగదు వచ్చి చేరడంతో, వినోద్, అతని కుటుంబ సభ్యులు ఆనందానికి అవధులు లేకుండా పోయింది. లక్షాధికారి హోదాతో మురిసిపోయిన వినోద్, ఈ నగదును విత్‌డ్రా చేయడానికి ఏటీఎంకి వెళ్లాడు. కానీ ఆ ఆనందమంతా సెకన్లలో ఆవిరైపోయింది. అతని అకౌంట్ బ్లాక్ అయినట్టు ఏటీఎం చూపించింది. వినోద్, తన కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీలోని జహంగిర్‌పురి ఏరియాలో నివాసముంటున్నాడు. జహంగ్పురిలోని ఎస్బీఐ బ్రాంచులో అతను సేవింగ్స్ అకౌంట్ కలిగి ఉన్నాడు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో వినోద్‌కు ఈ ఎస్ఎంఎస్ అలర్ట్ వచ్చింది. తొలుత ఇదేదో మెసేజ్ అని భావించిన వినోద్, తర్వాత ఆ మెసేజ్‌ను అతని స్నేహితులు, కుటుంబసభ్యులకు చూపించాడు. ఆ మెసేజ్ చూసిన వారు, నిజంగానే వినోద్ ఖాతాలో రూ.9,99,99,999 కోట్లు క్రెడిట్ అయినట్టు చెప్పారు. దీంతో తాను ఒక్కసారిగా లక్షాధికారి అయిపోయినట్టు తెలుసుకున్నాడు. వెంటనే ఏటీఎం వద్దకు పరిగెత్తాడు. కానీ లక్షాధికారి అయిపోయాయనే ఆనందం వినోద్‌కు క్షణాల్లో ఆవిరై పోయి, అకౌంట్ బ్లాక్ అయినట్టు తెలిసింది. ఈ సంఘటనపై నేడు వినోద్ బ్రాంచు మేనేజర్‌ను కలిసినట్టు తెలిసింది. తన అకౌంట్‌ను అన్‌బ్లాక్ చేసుకోవడానికి ఓ అప్లికేషన్ కూడా సమర్పించినట్టు రిపోర్టులు పేర్కొన్నాయి. -
ఒక్క ఫోన్‌కాల్.. రూ.42 లక్షలు మాయం
చిత్తూరు అర్బన్: ఒక్క ఫోన్‌కాల్.. ఇద్దరి వద్ద ఉన్న రూ.42 లక్షల్ని మాయం చేసింది. ఎవరు, ఏమిటని ఆలోచించకుండా సెల్‌ఫోన్‌కు వచ్చే కాల్స్‌కు, మెసేజ్‌లకు రిప్లై ఇవ్వడం ద్వారా బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.లక్షలు మోసపోయినట్లు గుర్తిం చారు. బాధితులు సోమవారం చిత్తూరు నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పోలీసు గ్రీవెన్స్‌డేకు ఏఎస్పీ రాధికను కలిసి గోడు వెల్లబోసుకున్నారు. గంగాధరనెల్లూరు మండలం ఎల్లమరాజులపల్లెకు చెంది న లోకనాథరెడ్డి భారత సైన్యంలో జేసీవోగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. ఇటీవల ఆయనకు ఒక ఫోన్‌కాల్ వచ్చింది. తాము ఢిల్లీలోని కోకా–కోలా శీతల పానీయం కంపెనీ నుంచి మాట్లాడుతున్నట్లు పరిచయం చేసుకున్నారు. జిల్లాలో తమ ఉత్పత్తులను విక్రయించడానికి ఏజెన్సీ ఇస్తామని నమ్మబలి కారు. తొలుత కాస్త అనుమానించినా ఫోన్లో అవతలివారి మాటలను బట్టి నమ్మేశాడు. ఇలా ఏజెన్సీ కోసం దశలవారీగా తన బ్యాంకు ఖాతా నుంచి రూ.33,56,361 డిపాజిట్ చేశాడు. అయినా ఇంకా కొంత డిపాజిట్ చేయాలని చెప్పడంతో లోకనాథరెడ్డి గట్టిగా కేకలు వేశాడు. దీంతో ఫోన్ స్విచ్ఆఫ్ చేసే శారు. ఏంచేయాలో తెలియని బాధితుడు ఏఎస్పీని కలిసి తన బాధను విన్నవించుకున్నాడు. చిత్తూరు నగరం ఎస్టేట్ రోడ్డులో ఉన్న రఘురామ్‌నగర్ కాలనీకి చెందిన అరుణకుమారి సెల్‌ఫోన్‌కు ఓ మెసేజ్ వచ్చింది. అందులో శ్యామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ ఇటీవల నిర్వహించిన లక్కీడిప్‌లో రూ.1.50 కోట్ల విలువైన బహుమతి గెలుచుకున్నారని, మెయిల్, ఫోన్, చిరుమానా చెప్పాలని ఉంది. ఆమె వివరాలు ఇచ్చింది. తర్వాత ఓ బ్యాంకు ఖాతా నెంబరు ఇచ్చి ఇందులో తాము చెప్పినంత నగదు డిపాజిట్ చేయాలని అవతలి వ్యక్తులు పేర్కొన్నారు. అరుణకుమారి తన ఖాతా నుంచి పలుమార్లు రూ.8.58 లక్షలు ఆ కంపెనీ చెప్పిన ఖాతాలోకి వేసింది. తీరా తాను మోసపోయినట్లు నిర్ధారించుకుని పోలీసులను ఆశ్రయించింది. ఈ రెండు ఘటనల్ని సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఏఎస్పీ అధికారులను ఆదేశించారు. -
బ్యాంకు ఖాతాలో రూ.10 కోట్లు డబ్బులు మాయం
-
బ్యాంకు ఖాతాలో డబ్బులు మాయం
రంగారెడ్డి జిల్లా : మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ గ్రామంలో గల దక్కన్ గ్రామీణ బ్యాంకులో ఖాతాదారుల బ్యాంకు ఖాతాలో డబ్బులు మాయం అయ్యాయి. సుమారు 30 మందికి సంబంధించిన ఖాతాలలో అవకతవకలు జరిగినట్లు సమాచారం అందింది. ఈ బ్యాంకు పరిధిలో ఎక్కువ మంది రైతులే బాధితులుగా ఉన్నట్లు తేలింది. బ్యాంక్ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి నిధులు కాజేసినట్లు వెల్లడైంది.ఈ రోజు కొందరు ఖాతాదారులు వారి డబ్బులను తీసుకోవడానికి బ్యాంకుకి రావడంతో సిబ్బంది వారి ఖాతాలు పరిశీలించారు. అందులో డబ్బులు లేకపోవడంతో విషయం బయటికి తెలిసింది. అంతే కాక వారికి బ్యాంక్‌లో డిపాజిట్ చేసినట్లు ఇచ్చిన ధ్రువీకరణ పత్రంలో సంతకం ఫోర్జరీ చేసినట్లు తేలింది. సుమారు రూ.3 కోట్ల నిధులు మాయం అయినట్లు తెలుస్తోంది. దీనిపై బ్యాంకు అధికారులను వివరణ కోరగా వారు ఇప్పుడే ఏమి చెప్పలేమని తెలిపారు. దీంతో బాధితులు మీడియాని ఆశ్రయించారు. -
తెరవెనుక దొంగలు
నేడు శాస్త్ర సాంకేతిక రంగం పరుగులు పెడుతోంది. టెక్నాలజీ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. దీన్ని కొందరు నేరగాళ్లు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఆన్లైన్ మోసాలకు దిగుతున్నారు. అమాయకుల నుంచి రూ.లక్షలు దోచుకుంటున్నారు. ఇలాంటి కేసులు తిరుపతి క్రైం పోలీసు స్టేషన్ పరిధిలో అధికమవుతున్నాయి. ఇప్పటికే 35 మందికి పైగా ఆన్లైన్ మోసాల బారిన పడ్డారు. పోలీసు స్టేషన్లకు చేరుకుని లబోదిబోమంటున్నారు. తిరుపతి క్రైం: నైజీరియన్లతోపాటు మరికొందరు విదేశీయులు వీసాపై ఢిల్లీ, ముంబయి, కోల్కత్తా వంటి మెట్రో నగరాలకు చేరుకుంటున్నారు. అక్కడ లాడ్జీల్లో గదులు అద్దెకు తీసుకుని స్థానికంగా ఉన్న కొందరితో ఆపరేషన్ చేస్తున్నారు. ఏజెంట్ల ద్వారా తెప్పించుకున్న ఈమెయిల్ అడ్రస్‌లతోపాటు, మొబైల్‌కు మెసేజ్ పంపుతున్నారు. ఇందులో లాటరీ వచ్చిందని ఆశలు రేపుతున్నారు. దీంతో స్పందించిన అమాయకులు తమ బ్యాంకు ఖాతా నెంబర్, ఏటీఎం, పిన్, ఓటీపీ నెంబర్ చెబుతున్నారు. దుండగులు ఆయా నగరాల నుంచే ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఆన్లైన్ మోసాలతో అప్రమత్తంగా ఉండాలి ఆన్లైన్ నేరగాళ్లు అనేక విధాలుగా మోసాలకు పాల్పడుతున్నారు. వీటిని నియంత్రించేందుకు అర్బన్ జిల్లా ఎస్పీ అభిషేక్ మొహంతి ఆదేశాల మేరకు ఓ ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేశాం. ఇప్పటికే పలు కేసుల్లో నిందితులను అరెస్టు చేసి చార్జిషీట్లు వేశాం. ప్రజలకు అవగాహన కలిగేలా సైబర్ క్రైంపై ప్రచారం చేస్తున్నాం. తప్పుడు ప్రకటనలు, నిరుద్యోగులు, మాయలేడీల వలలో పడకండి. లాటరీ వచ్చిందని డబ్బులు కడితే ఇంటికి వస్తాయని నమ్మి మోసపోకండి. – క్రైం డీఎస్పీ రవిశంకర్‌రెడ్డి ఆన్లైన్లో మోసాలు ఇలా ♦ ఓ యువకుడికి అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. పలానా కంపెనీ నుంచి నగదును తమ అకౌంట్‌కు బదిలీ చేస్తున్నామని అవతలి వ్యక్తి తెలిపాడు. నీకు పంపిన పాస్వర్డ్ చెప్పాలని కోరాడు. ఆ యువకుడు పాస్వర్డ్ చెప్పిన వెంటనే తన అకౌంట్లో ఉన్న రూ.26 వేలు అతని అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ♦ తిరుపతికి చెందిన ఒక యువకుడికి పేస్‌బుక్‌లో ఒక అందమైన అమ్మాయి పరిచయమైంది. ఇద్దరూ గంటల తరబడి మాట్లాడుకునే వారు. ఈ క్రమంలో ఆ అమ్మాయి తనకు నగదు ఇవ్వాలని, మళ్లీ ఇస్తానని చెప్పి రూ.వేలు కాజేసింది. తర్వాత ఫేస్ బుక్ అకౌంట్ కనిపించకుండా పోయింది. దీనిపై బాధితుడు క్రైం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ♦ క్విక్కర్, ఓఎల్ఎక్స్ సంస్థలను సైతం సైబర్ నేరగాళ్లు అడ్డాగా చేసుకుంటున్నారు. ఆకర్షణీయమైన వస్తువులను పెట్టి తక్కువ ధరలకే విక్రయిస్తామని చెబుతున్నారు. అలా ఆశపడ్డ వ్యక్తి అకౌంట్లో డబ్బులు వేయించుకుని మోసం చేస్తున్నారు. ♦ బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం. మీ ఆధార్ నెంబర్‌ను బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేయాలి. ఒకసారి మీ అకౌంట్ నెంబర్ చెప్పండి అని తెలిపి అకౌంట్ నెంబర్ తెలుసుకుని పాస్వర్డ్ పంపుతారు. పాస్వర్డ్ పంపితే ఆధార్ కార్డు అనుసంధానం అవుతుందని నమ్మబలుకుతారు. అలా చెప్పిన వెంటనే అకౌంట్లోని డబ్బులను వారి అకౌంట్‌కు బదిలీ చేసుకుంటున్నారు. ఈ తరహా కేసులు సైతం నగరంలో అధికంగానే నమోదవుతున్నాయి. -
మీ బ్యాంకు ఖాతాకు నామినీ ఎవరు?
ఆర్థిక లావాదేవీలన్నింటికీ కీలకం బ్యాంకు ఖాతాయే. మ్యూచువల్ ఫండ్స్‌ను సిప్ చేయాలన్నా, స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టాలన్నా, బిల్లులు చెల్లించాలన్నా... ఇంకా బీమా ప్రీమియం, ఈఎంఐలు... వచ్చే ఆదాయానికి, వెళ్లే ఖర్చులకు బ్యాంకు ఖాతాయే కీలకం. కానీ, దురదృష్టవశాత్తూ ఖాతాదారుడికి ఏదైనా జరిగితే పరిస్థితేంటి? బోంబే హైకోర్టు ముందుకు ఈ మధ్యే ఓ పిటిషన్ వచ్చింది. 63 ఏళ్ల మహిళ తన భర్త అపస్మారక స్థితికి చేరుకోవడంతో చికిత్సకయ్యే ఖర్చులను అతడి బ్యాంకు ఖాతా నుంచి చెల్లించబోయింది. నిబంధనలు అడ్డుతగిలాయి. దీంతో తనను గార్డియన్‌గా నియమించాలని కోరుతూ ఆమె కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. కొన్ని సందర్భాల్లో నియంత్రణలు మంచివే. కానీ, అన్నివేళలా కాదు. కాబట్టి బ్యాంకు ఖాతా నిర్వహించటమెలా? మీ ఖాతాపై మీ కుటుంబ సభ్యులకు అవాంతరాల్లేని అధికారం ఇవ్వడం ఎలా? అనే వివరాలు తెలియజేసేదే ఈ కథనం... నామినేషన్ తప్పనిసరి... బ్యాంకులో ఖాతా ప్రారంభంలోనే నామినేషన్‌ను నమోదు చేయడం మర్చిపోవద్దు. ఖాతాదారుడు మరణించిన సందర్భాల్లో ఖాతాకు సంబంధించిన క్లెయిమ్‌లను సులభతరం చేస్తుంది. నిజానికి నామినీగా ఉండేవారు చట్ట బద్ధమైన వారసులే కానక్కర్లేదు. వేర్వేరు కావచ్చు. నామినీ ఎవరినీ పేర్కొనకపోతే ఖాతాలో ఉన్న నగదు, ఫైనల్ సెటిల్మెంట్కు వారసులే అర్హులవుతారని ఫెడరల్ బ్యాంకు డిజిటల్ బ్యాంకింగ్ హెడ్ కేఏ బాబు తెలియజేశారు. ఒకరి పేరును ఖాతాకు నామినీగా ఇచ్చి ఉంటే, ఆ తర్వాత ఎప్పుడు అవసరమైతే అప్పుడు, ఎన్ని సార్లయినా నామినీని మార్చుకునే అవకాశం ఉంటుంది. కానీ, ఖాతాదారుడు లేదా లాకర్ యజమాని జీవించి ఉండి, కోమాలోకి వెళ్లడం లేదా ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అచేతనంగా మారితే ఏంటి పరిస్థితి...? ఇటువంటి సందర్భాల్లో బ్యాంకు నామినీకి ఖాతాపై అధికారం ఇవ్వదు. ఈ నేపథ్యంలో జాయింట్ అకౌంట్ ఒక్కటే పరిష్కారం. ఈ జాయింట్ అకౌంట్లోనూ (ఇద్దరు లేదా ముగ్గురు ఉమ్మడిగా ప్రారంభించే ఖాతా) పలు వర్గీకరణాలున్నాయి. ఇద్దరూ లేదా ఏ ఒక్కరైనా... ‘ఐదర్ ఆర్ సర్వైవర్’ అని పేర్కొనే ఈ ఖాతాను ఖాతాదారులు ఇద్దరూ నిర్వహించుకోవచ్చు. ఇద్దరికీ సంపూర్ణ హక్కులు ఉంటాయి. ఏ లావాదేవీకి సంబంధించినదైనా ఇద్దరూ కలిసి సంతకాలు పెట్టాల్సిన అవసరం లేదు. జాయింట్ ఖాతా అయినప్పటికీ ఎవరికి అవసరమైనప్పుడు వారు లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. కనుక భార్యా, భర్తలు ఉమ్మడిగా ఈ ఖాతాను కలిగి ఉండడం లాభదాయకం. జాయింటు ఖాతా అవసరమా...? జాయింట్ ఖాతాకు పలు ప్రయోజనాలున్నాయి. ఇద్దరు ఖాతాదారులూ ఖాతాను అవసరమైనప్పుడు నిర్వహించుకోవచ్చు. దంపతులు అయితే వారు తమ ఆర్థిక లావాదేవీలను ఒకే ఖాతా నుంచి సులభంగా సమీక్షించుకోవచ్చు. ఐదర్ ఆర్ సర్వైవర్ ఖాతాకు నామినేషన్ ఇచ్చి ఉన్నప్పటికీ, ఖాతాదారుడు మరణిస్తే రెండో ఖాతాదారుడికే అధికారం లభిస్తుంది కానీ, నామినీకి కాదు. ఇద్దరు ఖాతాదారులు మరణించిన తర్వాతే నామినీ అవసరం వస్తుంది. తొలి ఖాతాదారు తరవాతే... ఫార్మర్ ఆర్ సర్వైవర్... అని పేర్కొనే ఈ ఖాతా కూడా ఉమ్మడి ఖాతానే అయినప్పటికీ ఖాతాను మొదటి ఖాతాదారుడే (ఫార్మర్) నిర్వహించేందుకు అనుమతి ఉంటుంది. కాల వ్యవధికి ముందే డిపాజిట్ మొత్తాన్ని చెల్లించేటట్టు అయితే ఇద్దరి సంతకాలూ అవసరం అవుతాయి. ఒకవేళ ఖాతాదారుడికి ఏదైనా జరిగితే అప్పుడు సర్వైవర్ లేదా రెండో ఖాతాదారుడు ఆ ఖాతాపై అధికారం పొందుతారు. అయితే, ఈ విధంగా ఖాతా నిర్వహణకు అనుమతి పొందేందుకు ఖాతాదారుడి మరణ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. రెండో ఖాతాదారుడు ఖాతాపై అధికారాన్ని రెండు రకాల పరిస్థితులో పొందొచ్చు. మొదటి ఖాతాదారుడు మరణించినప్పుడు లేదా ఇద్దరు ఖాతాదారులు కలసి దరఖాస్తు ఇచ్చిన సందర్భంలో. మొదటి ఖాతాదారుడు జీవించి ఉండగా, రెండో ఖాతాదారుడికి అధికారికం ఇచ్చే చట్టబద్ధమైన హక్కు బ్యాంకుకు లేదు. ఈ సందర్భాల్లో కోర్టు నుంచి డిక్రీ పొందాల్సి ఉంటుంది’’ అని ఫెడరల్ బ్యాంకుకు చెందిన కేఏ బాబు వివరించారు. ఖాతాదారుడు నిర్వహించలేని పరిస్థితుల్లో... ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఖాతాదారుడు అనారోగ్యం కారణంగా చెక్కుపై సంతకం చేయలేని, బ్యాంకు శాఖకు వచ్చి నగదు విత్‌డ్రా చేసుకోలేని శారీరక అచేతన పరిస్థితుల్లో ఉంటే... చెక్కు లేదా విత్‌డ్రాయల్ ఫామ్‌పై వేలిముద్రను వేయవచ్చు. కాకపోతే బ్యాంకుకు తెలిసిన ఇద్దరు సాక్షులు దీన్ని ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఇందులో ఒకరు బ్యాంకు ఉద్యోగి అయి ఉండాలి. అలాగే, శారీరకంగా కదల్లేని పరిస్థితుల్లో బ్యాంకుకు రాలేని, వేలి ముద్ర వేయలేని పరిస్థితి ఉంటే అతని తరఫున ఎవరైనా తమ వేలి ముద్రలను చేయవచ్చు. కాకపోతే దీన్ని ఇద్దరు సాక్షులు ధ్రువీకరించాలి. వారిలో ఒకరు బ్యాంకు ఉద్యోగి అయి ఉండడం తప్పనిసరి. ప్రత్యామ్నాయ మార్గమిదీ... జాయింట్ ఖాతా విషయంలో ఐదర్ ఆర్ సర్వైవర్ ఎంచుకోవచ్చని ‘లాడర్ 7’ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ వ్యవస్థాపకులు సురేష్ సెడగోపన్ సూచించారు. అలాగే, పవర్ ఆఫ్ అటార్నీ (పీవోఏ) కూడా పరిశీలించొచ్చన్నారు. పీవోఏ అన్నది ఓ వ్యక్తి తరఫున కొన్ని రకాల చర్యలు నిర్వహించేందుకు ఓ వ్యక్తికి అధికారాలను చట్టబద్ధంగా ఇవ్వడం. స్థిర, చరాస్తులకూ ఇది వర్తిస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ తమ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ముందుచూపుతో నామినేషన్ లేదా పీవోఏ ఇవ్వడం ద్వారా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అలాగే, అన్ని పత్రాలను ఒకేచోట అందుబాటులో ఉంచడం అవసరం. -
సరస్వతీదేవి సాక్షిగా దోపిడీ పర్వం
నిర్మల్: బాసర జ్ఞాన సరస్వతీ ఆలయ సొమ్మును అక్కడ పని చేసే అధికారులు యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారు. ఆలయ ఉన్నత స్థాయి అధికారితో పాటు.. అతని తర్వాతి స్థాయి అధికారి ఓ పద్ధతిగా ఈ దోపిడీ పర్వాన్ని కొనసాగిస్తున్నారు. పనిమనిషి పేరిట బ్యాంకు ఖాతా తెరిచి ఈ దోపిడీ పర్వాన్ని ఓ పద్ధతి ప్రకారం నడిపిస్తున్నారు. ఇలా ఇచ్చి.. ఇలా తీసుకుంటారు.. బాసరలో నిత్యపూజలు, ఉత్సవాలు, ఇతర కార్యక్రమాలు, భక్తుల సౌకర్యాల కోసం వస్తువుల కొనుగోలుతో పాటు అనేక రకాల ఖర్చులు ఉంటాయి. వీటన్నింటికీ దేవాదాయ శాఖ బిల్లులు తీసుకుని డబ్బులు చెల్లిస్తుంది. ఇదే విధానం ఇప్పుడు ఇక్కడి అధికారులకు కలిసి వస్తోంది. పూజా సామగ్రి, ఇతరత్రా వస్తువులను కొనుగోలు చేసే దుకాణాల నుంచి ముందుగా అధిక మొత్తంలో బిల్లులు తీసుకొని, ఆ మేరకు డబ్బులు చెల్లిస్తున్నారు. సదరు దుకాణదారులు తమకు రావాల్సిన అసలైన బిల్లు తీసుకుని, అదనంగా వచ్చిన డబ్బులను తిరిగి అధికారులు సూచించిన బినామీ వ్యక్తి ఖాతాలోకి జమ చేస్తారు. ఇలా సికింద్రాబాద్‌లోని ఓ జనరల్ దుకాణం, మహారాష్ట్రలోని మరో దుకాణం నుంచి ఇచ్చి పుచ్చుకోవడాలు జరిగాయి. బినామీ ఖాతాల నుంచి వాటాలు.. బినామీ వ్యక్తి ఖాతాల్లోకి నగదు చేరిన వెంటనే వాటాల పంపకాలు జరిగిపోతుంటాయి. ఆలయంలోని పెద్దసారు, చిన్నసారుతో పాటు వివిధ స్థాయిల ఉద్యోగులకూ ఇందులో వాటాలు ఉంటాయి. స్థాయిల వారీగా ఈ పంపకాలు జరుగుతాయి. ఇలా బినామీలను పెట్టుకుని కథంతా నడిపేది ఆలయంలో చిన్నసారే కనుక.. ఆయనకు కాస్త ఎక్కువ మొత్తంలో వెళ్తున్నట్లు సమాచారం. ఈ అధికారులు నేరుగా డబ్బులు తీసుకోకుండా.. తమ కుటుంబసభ్యుల ఖాతాల్లో వేసుకుంటారు. సిబ్బంది ఎరియర్సూ వదల్లేదు.. ఆలయం కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి సంబంధించి ఎరియర్స్నూ ఆలయ అధికారులు వదిలి పెట్టలేదు. 2016 నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఆలయంలోని వివిధ విభాగాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు రూ.లక్షల్లో ఎరియర్స్ వచ్చాయి. ఈ డబ్బులన్నీ ఆయా ఏజెన్సీలు అధికారుల బినామీ ఖాతాలో జమ చేయించుకున్నారు. ఎరియర్స్‌కు సంబంధించి డబ్బులో రూ.2 లక్షలను బినామీ వ్యక్తి ఆలయ ఉన్నతాధికారి కోడలి బ్యాంకు అకౌంట్లోకి చేర్చడం గమనార్హం. ఎవరికీ అనుమానం రాకుండా రూ.2 లక్షలు ఒకేసారి వేయకుండా ఐదుసార్లు రూ.40 వేల చొప్పున ఈ ఖాతాలో జమచేసినట్లు సమాచారం. ఇక అదే రోజు ద్వితీయ స్థాయి అధికారి ఎవరికీ అనుమానం రాకుండా తన బినామీకి సంబంధించిన ఏటీఎం కార్డు నుంచే డబ్బులు డ్రా చేసుకున్నట్లు సమాచారం. వీరితో పాటు పలువురు కిందిస్థాయి అధికారులు, సిబ్బందికి వారి స్థాయికి తగ్గట్లు డబ్బులు ముట్టినట్లు తెలిసింది. చిన్నసారే సూత్రధారి..! ఆలయంలో కొనసాగుతున్న అవినీతి పర్వానికి అక్కడ కొనసాగుతున్న ద్వితీయ స్థాయి అధికారి ప్రధాన కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయన గతంలోనే అక్రమాలకు పాల్పడ్డాడన్న కారణంతో సస్పెండ్ చేసి, అనంతరం కొండగట్టుకు డిప్యుటేషన్‌పై పంపించారు. గోదావరి పుష్కరాలపుడు మళ్లీ పైరవీతో బాసరకే చేరుకున్నారు. అప్పుడు మళ్లీ అవినీతి, అక్రమాలకు పాల్పడటంతో ఇలాంటి అధికారిని ఆలయానికి ఎందుకు తీసుకొచ్చారంటూ ఓ ట్రస్టు బోర్డు సభ్యుడు ఏకంగా తన పదవికే రాజీనామా చేశారు. ఇలా చేతులు మారాయి.. - 24–05–2017న మహారాష్ట్రకు చెందిన దుకాణదారుడి నుంచి బినామీ వ్యక్తి ఖాతా (ఎస్బీఐ 62211311029)లోకి రూ.1,50,000 జమ అయ్యాయి. అదేరోజు బినామీ వ్యక్తి తన ఖాతాలో నుంచి ఆలయానికి చెందిన ఓ ఉద్యోగి భార్య అకౌంట్ (62240751111)కు రూ.40 వేలు, రూ.20వేల చొప్పున రెండుసార్లు ట్రాన్స్ఫర్ చేశాడు. అలాగే చిన్నసారుకు సంబంధించిన ఓ మహిళ ఖాతా (62031507489)లోకి రూ.30 వేలు జమచేశాడు. - 29–05–2017న ఆలయ అధికారులు కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించి వచ్చిన ఎరియర్స్ రూ.1,05,192 లను ఓ కాంట్రాక్టు ఉద్యోగి అకౌంట్ (52170507610)లోకి జమ చేశారు. సదరు కాంట్రాక్టు ఉద్యోగి అందులో నుంచి వెంటనే బినామీ వ్యక్తికి చెందిన ఖాతా (62211311029)లోకి రూ.40 వేలు, రూ.30 వేల చొప్పున మొత్తం 70వేల రూపాయలు పంపించాడు. - 29–05–2017 రోజునే వాగ్దేవి కో–ఆపరేటివ్ లేబర్ సొసైటీ నుంచి చెక్ (నం.363101) ద్వారా బినామీ వ్యక్తి ఖాతాలోకి రూ.1,83,200 జమ అయ్యాయి. ఈ డబ్బులు ఆలయంలోని 86 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించినవిగా భావిస్తున్నారు. - ఆలయ సిబ్బంది ఎరియర్స్ 29–05– 2017న బినామీ వ్యక్తి ఖాతాల్లోకి వచ్చిన డబ్బుల్లో నుంచి 30–05–2017న రూ.40వేల చొప్పున ఐదుసార్లు అంటే మొత్తం రూ.2 లక్షలను ఉన్నతాధికారి కోడలి ఖాతా (62495094834)లోకి ట్రాన్స్ఫర్ అయ్యాయి. - 01–06–2017 రోజున బినామీ వ్యక్తి అకౌంట్ నుంచి ఆలయంలోని ఓ చిరు ఉద్యోగి ఖాతా (52170508400)లోకి రూ.10వేలు ట్రాన్స్ఫర్ అయ్యాయి. - 06–06–2017 రోజున బినామీ వ్యక్తి ఖాతా నుంచి ద్వితీయ స్థాయి అధికారి భార్య ఖాతా (52170497974)లోకి రూ.26వేలు చేరాయి. ఎంక్వైరీ చేయిస్తాం.. ఆలయంలో అధికారులు బినామీలను పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఇప్పటివరకు దృష్టికి రాలేదు. అలాంటిది ఏదైనా ఉంటే తప్పకుండా విచారణ చేయిస్తాం. ఈ విషయం నిజమని తేలితే ఎంతటి వారున్నా చర్యలు తీసుకుంటాం. నాకు వ్యక్తిగతంగా ఎలాంటి బినామీలు లేరు. ఇలాంటి ఆరోపణలపై విచారణ జరిపిస్తాం. – సుధాకర్‌రెడ్డి, ఈఓ, బాసర ఆలయం -
బ్యాంకు అకౌంట్లపై నియంత్రణ ఒకరికి.. ఒక్కటే!
సురేశ్‌కి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మూడు ఖాతాలున్నాయి. ఒకటి హైదరాబాద్‌లో ఆపరేషన్లకు ఉపయోగిస్తుండగా... ఇంకొకటి ఊళ్లో వ్యవసాయ ఆదాయం కోసం వాడుతున్నాడు. మూడో ఖాతాను డీమ్యాట్ కార్యకలాపాల కోసం విడిగా వినియోగిస్తున్నాడు. ఇప్పటికైతే సురేశ్‌కు ఎలాంటి ఇబ్బందీ లేదు. కానీ త్వరలో ఈ మూడింటికి బదులు ఒకే ఖాతా ఉండబోతోంది. అది ఏ ఖాతా అన్నది సురేశ్ ఇష్టం. మొత్తంగా చూస్తే ఈ మూడు ఖాతాలూ కలిసిపోతాయన్న మాట!!. శ్రీధర్‌కు మూడు వేర్వేరు బ్యాంకుల్లో మూడు ఖాతాలున్నాయి. నెట్వర్క్ పెద్దది కదా అని ఎస్బీఐ... ఇంటికి దగ్గర కదా అని మరో ప్రభుత్వ బ్యాంక్... ఆన్లైన్ సేవలు బాగున్నాయని ఓ ప్రైవేటు రంగ బ్యాంక్... ఈ మూడు ఖాతాలూ వాడుతున్నాడు. మున్ముందు శ్రీధర్‌కు ఈ మూడు ఖాతాల స్థానంలో ఒకటే ఉండబోతోంది. అది ఏ బ్యాంక్‌లో ఉంచుకోవాలన్నది శ్రీధర్ ఇష్టం. అదీ పరిస్థితి. బ్యాంకింగ్ సంస్కరణల్లో భాగంగా సర్కారు చేపడుతున్న ఈ చర్యలతో... చిన్నస్థాయి ప్రైవేటు బ్యాంక్‌లతో పాటు కొన్ని ప్రభుత్వ బ్యాంక్‌లకూ ఇబ్బందులు తప్పేలా లేవు. ఒక మనిషికి ఒకటే బ్యాంకు ఖాతా!! ఇదీ ప్రభుత్వం అమలు చేయబోతున్న తాజా సంస్కరణ. ఇప్పటికే ఆర్బీఐ నుంచి బ్యాంక్‌లకు ఈ మేరకు సూత్రప్రాయంగా సమాచారం అందింది. తొలి దశలో ఒక బ్యాంక్‌లో వేర్వేరు శాఖల్లో రెండేసి ఖాతాలుంటే అందులో ఒకదాన్నే కొనసాగించి... మరొకటి బ్యాంక్‌లే రద్దు చేస్తాయి. కొన్ని బ్యాంకుల్లో ఈ ప్రక్రియ మొదలయింది. ఆధార్ అనుసంధానం పూర్తయ్యాక ఇది వేగవంతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి ఒకరికి ఒకటికన్నా ఎక్కువ బ్యాంకు ఖాతాలుండటం అనేది సహజం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లనే తీసుకుంటే ఇక్కడ దాదాపు 2,150 ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకులు, 5 గ్రామీణ బ్యాంకులున్నాయి. వీటికి ఏపీలో 6,552, తెలంగాణలో 4,875 బ్రాంచీలుండగా... వీటన్నింటిలో కలిపి దాదాపు 8 కోట్ల ఖాతాలున్నాయి. వీటిల్లో కనీసం 15 శాతం... అంటే 1.20 కోట్ల ఖాతాలు డూప్లికేషనేనని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రీజినల్ రూరల్ బ్యాంక్ ఆఫీసర్స్ జనరల్ సెక్రటరీ ఎస్. వెంకటేశ్వర్ రెడ్డి ‘సాక్షి బిజినెస్ బ్యూరో’తో చెప్పారు. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణాలు, నగరాల్లోనే బహుళ అకౌంట్లు ఎక్కువగా ఉన్నాయన్నారు. గత 3 నెలల్లో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ నుంచి బహుళ ఖాతాలున్నాయన్న కారణంగా లక్ష అకౌంట్లను తొలగించామని కూడా ఆయన వెల్లడించారు. ‘‘తెలుగు రాష్ట్రాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 3 వేల బ్రాంచీలు, దాదాపు 2.4 కోట్ల ఖాతాలున్నాయి. ఒకరికి వేర్వేరు బ్రాంచీల్లో బహుళ ఖాతాలుంటే వాటిని రద్దు చేసుకుని ఒకటే ఉంచాలని సలహా ఇస్తున్నాం’’అని ఎస్బీఐ చీఫ్ మేనేజర్ ఒకరు చెప్పారు. ‘‘ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇంట్రా బ్యాంక్ అకౌంట్ పోర్టబులిటీకి ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. నో యువర్ కస్టమర్ (కేవైసీ) వివరాలు సమగ్రంగా, డిజిటల్‌గా ఉన్నట్లయితే కస్టమర్లు అదే బ్యాంక్‌కు చెందిన ఇతర బ్రాంచీకి మార్చుకునే వీలుంది. ఎలాంటి చార్జీల్లేకుండా ఎన్నిసార్లయినా మార్చుకునే వీలుంది’’అని ఆయన తెలియజేశారు. ఖాతా తెరిచిన 6 నెలల్లోపు రద్దు చేసుకుంటే రూ.250–300 వరకు చార్జీ ఉంటుంది. ఆ సమయం దాటితే ఎలాంటి జరిమానాలుండవు. అకౌంట్ పోర్టబిలిటీ.. మొబైల్ పోర్టబిలిటీ లానే బ్యాంక్ అకౌంట్ పోర్టబిలిటీని తీసుకొచ్చేందుకు ఆర్బీఐ యోచిస్తోంది. కస్టమర్లకు మరింత మెరుగైన, వేగవంతమైన సేవలందించడంతో పాటు చట్ట విరుద్ధమైన లావాదేవీలకు అవకాశం లేకుండా పోర్టబిలిటీ సేవలను తేవాలని లకిష్యంచింది. ముందుగా పొదుపు ఖాతాలకు పోర్టబిలిటీని అందుబాటులోకి తేనున్నట్లు సమాచారం. ఇటీవల బ్యాంకింగ్ అంబుడ్స్‌మెన్ వార్షిక సదస్సులో... ప్రధాన బ్యాంకులు దీని సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఆర్బీఐ కోరింది కూడా. అయితే అధార్ అనుసంధానం పూర్తయిన తర్వాతే పోర్టబులిటీపై నివేదికను సమర్పిస్తామని తెలంగాణకు చెందిన నోడల్ బ్యాంక్ అధికారి ఒకరు చెప్పారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 80 శాతం ఎస్బీఐ ఖాతాలకు ఆధార్ అనుసంధానం పూర్తయిందని, మరో నెల రోజుల్లో వంద శాతం పూర్తి చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సాఫ్ట్వేర్, డాటాబేస్‌తో సవాళ్లు.. అకౌంట్ పోర్టబిలిటీ అనేది బ్యాంకులకు సవాలే. ఎందుకంటే ఖాతా ప్రారంభంలో చేసే ఫైల్ స్ట్రక్చర్, బ్యాంకులు వినియోగించే సాఫ్ట్వేర్లను మార్చాల్సి ఉంటుంది. అన్ని బ్యాంకులూ ఒకే డేటాబేస్‌ను వినియోగించాలి. ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కూడా. ప్రస్తుతం దేశంలోని అన్ని బ్యాంక్‌లూ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్, ఫినాకిల్, ఫ్లెక్స్క్యూబ్ సాఫ్ట్వేర్లను వినియోగిస్తున్నాయి. 60 శాతానికి పైగా బ్యాంక్‌లు కోర్ బ్యాంకింగ్ సాంకేతికతనే వినియోగిస్తున్నాయని వీటిని టీసీఎస్, ఇన్ఫోసిస్ అభివృద్ధి చేశాయని ఎస్బీఐ చీఫ్ మేనేజర్ ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. అలాగే బ్యాంక్‌లకు సంబంధించిన ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్ (ఐఎఫ్ఎస్సీ), మొబైల్ మనీ ఐడెంటిఫియర్ (ఎంఎంఐడీ)లల్లో కూడా మార్పులు చేయాల్సి ఉంటుంది. అయితే వాటి అభివృద్ధి పనులను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి (ఎన్పీసీఐ) అప్పగించారని కూడా తెలిసింది. ఇప్పటికే ఎన్పీసీఐ భీమ్, ఐఎంపీఎస్, యూపీఐ వంటి సాంకేతికతను అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. అకౌంట్ నంబర్లు కూడా సమస్యే.. కస్టమర్ల సంఖ్య ఆధారంగా బ్యాంక్ స్థాయిని బట్టి ఖాతా నంబరు 10 నుంచి 20 అంకెలుంటుంది. ఎందరు కస్టమర్లుంటే అన్ని డిజిట్స్ పెరుగుతాయన్న మాట. ఉదాహరణకు సిటీ బ్యాంక్ ఖాతాకు 10 అంకెలు, ఎస్బీఐకు 11, ఐసీఐసీఐకి 12, హెచ్‌డీఎఫ్‌సీకి 14, అత్యధికంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) ఖాతాకు 16 అంకెలున్నాయి. పోర్టబిలిటీలో అన్ని బ్యాంక్ ఖాతాల నంబర్ల సంఖ్య సమానంగా ఉండాలి. ఇది బ్యాంక్ సాఫ్ట్వేర్ అభివృద్ధి సంస్థలకు కొంత సవాలే అయినప్పటికీ గతంలో సక్సెసయ్యారు కనుక సులువయ్యే అవకాశముందనేది నిపుణుల మాట. గతంలో భారతీయ మహిళా బ్యాంక్ (బీఎంబీ) ఎస్బీఐలో విలీనమైనప్పుడు రెండు బ్యాంకుల నంబర్ల సంఖ్యను మ్యాపింగ్ చేశారు. బీఎంబీకి 12 అంకెలు, ఎస్బీఐకి 11 అంకెలుండేవి. విలీనం తర్వాత రెండు బ్యాంకుల ఖాతాలకూ 11 అంకెలనే కేటాయించారు. బ్యాంకుల మధ్య పోటీ పెరుగుతుంది.. ప్రపంచ దేశాల్లో ఎక్కడా బ్యాంక్ అకౌంట్ పోర్టబిలిటీ లేదు. ఇక్కడ అందుబాటులోకి తెస్తే ప్రపంచ బ్యాంకింగ్ రంగంలో భారత్ తొలి దేశమవుతుంది. పోర్టబిలిటీతో బ్యాంకుల మధ్య పోటీ పెరుగుతుంది. పాత కస్టమర్లను కాపాడుకుంటూనే కొత్త కస్టమర్లను ఆకర్షించడంలో భాగంగా మెరుగైన, వేగవంతమైన సేవలందిస్తాయి. తక్కువ చార్జీలుండే బ్యాంకులకు మళ్లే ప్రమాదం ఉంటుంది కనుక బ్యాంకులు కూడా చార్జీలను, వడ్డీ రేట్లను తగ్గిస్తాయి. ఇక ఒకటే బ్యాంక్‌లో ఒకటే ఖాతాను తీసుకొస్తే చాలా బ్యాంకుల్లో నగదు ప్రవాహం తగ్గిపోతుంది. డిపాజిట్లు, లావాదేవీలు తగ్గి చిన్న బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు కనుమరుగయ్యే ప్రమాదముంది. ఇదీ... దేశీ బ్యాంకింగ్ స్వరూపం మొత్తం ప్రభుత్వ, ప్రైవేట్, గ్రామీణ బ్యాంకులు 12,100 ఈ మూడు రకాలకూ ఉన్న మొత్తం బ్రాంచీలు 1,35,946 మొత్తం పొదుపు ఖాతాల సంఖ్య 38.8కోట్లు మొత్తం కరెంట్ ఖాతాలు 2.83కోట్లు మొత్తం జన్‌ధన్ ఖాతాలు 30.6కోట్లు బహుళ అకౌంట్లు (అంచనా) 1617కోట్లు శ్రీనాథ్ ఆడెపు (హైదరాబాద్, బిజినెస్ బ్యూరో) -
ఖాతా ఉపయోగించడం లేదా..?
స్టేషన్ మహబూబ్‌నగర్: చిట్‌ఫండ్ కంపెనీ లేదా ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి చెక్కు వస్తుంది.. ఖాతా ఉంటేనే ఆ చెక్కును నగదుగా మార్చుకోవాల్సిన పరిస్థితి. ఇంకేముంది అవసరమున్నా, లేకున్నా అప్పటికప్పుడు బ్యాంకులో ఖాతా తీస్తాం.. ఆ చెక్కును మార్చుకున్నాక ఖాతాతో పని అయిపోతుంది. అసలు ఖాతా ఉందనే విషయాన్ని కూడా చాలా మంది మరిచిపోతుంటారు. ఇలాంటి ఖాతాలు ప్రతీ బ్యాంకులో వేల సంఖ్యలో ఉంటాయని అంచనా. ఆర్బీఐ నిబంధనల ప్రకారం రెండేళ్లపాటు ఎలాంటి డెబిట్, క్రెడిట్ లావాదేవీలు జరగకపోతే అటువంటి ఖాతాలను ఇన్ఆపరేటివ్ ఖాతాలుగా బ్యాంకులు పరిగణిస్తాయి. ఇలాంటి ఖాతాల విషయంలో ఆర్బీఐ ఇటీవల బ్యాంకులకు పలు మార్గదర్శకాలను జారీ చేసింది. అవేంటో తెలుసుకుందాం.. ఆర్బీఐ మార్గదర్శకాలు.. ⇔ నిర్ణీత కాలంలో లభించే వడ్డీ, బ్యాంకు రుసుంలు కాకుండా ఏడాదిపాటు ఏ ఇతర లావాదేవీలు జరగని ఖాతాలపై వార్షిక సమీక్ష జరపాలి. ⇔ ఖాతాలు ఇన్ఆపరేటివ్గా ఉన్న విషయాన్ని ఖాతాదారులకు రాతపూర్వకంగా తెలియజేస్తూ అందుకు కారణాలను తెలుసుకోవాలి. ఏ కారణంతోనైనా ఖాతాదారుడు మరో కొత్త ఖాతాను నిర్వహిస్తుంటే పాత ఖాతాలోని నగదు అందులో బదిలీ చేయొచ్చు. ⇔ ఖాతాదారుడికి సమాచారం అందించేందుకు ప్రయత్నించినప్పుడు ఎలాంటి వివరాలు లభించకపోతే సదరు వ్యక్తిని బ్యాంకుకు పరిచయం చేసిన వ్యక్తికి సమాచారం ఇవ్వాలి. ⇔ వినియోగదారుడు ఖాతా నిర్వహించకపోవడానికి గల కారణాలను తెలియపరిస్తే ఇన్ఆపరేటివ్గా ఉన్న ఖాతాలకు ఏడాదిపాటు గడువు విధిస్తూ మళ్లీ ఖాతాను వినియోగించాల్సిందిగా సూచించవచ్చు. ⇔ గడువులోపు ఖాతాలను పట్టించుకోకుండా వదిలేస్తే వాటిని ఇన్ఆపరేటివ్గా ప్రకటించొచ్చు. ⇔ ఖాతాదారులకు పంపించే ఉత్తరాలు చేరకుండా వెనక్కి వస్తుంటే, చట్టబద్ధ వారసులు, బంధువులు, స్నేహితుల ద్వారా ఖాతాదారుడి చిరునామా కోసం ప్రయత్నించాలి. ⇔ ఇన్ఆపరేటివ్ ఖాతాలుగా ప్రకటించే విషయంలో ఖాతాదారుడు చేసే డెబిట్, క్రెడిట్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. బ్యాంకు జమ చేసే వడ్డీ, వసూలు చేసే సేవా రుసుము లను లెక్కలోకి తీసుకోరు. బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ ఖాతాలో జమ అవడం, బీమా పాలసీ ప్రీమియం కోసం ఖాతాలో నుంచి డబ్బు డెబిట్ అవడం లాంటి థర్డ్ పార్టీ లావాదేవీలు సైతం ఖాతాదారుడు జరిపే లావాదేవీలు అవుతాయి. ⇔ మోసపూరిత ఖాతాల విషయంలో బ్యాంకులు నిరంతరం నిఘా ఉంచడం సాధారణం. ఈ నేపథ్యంలో ఖాతాలను వర్గీకరించేటప్పుడు ఖాతాదారుడికి సమాచారం లేకుండా బ్యాంకులు వివరాలను రాబడుతూ ఉంటాయి. ⇔ ఇన్ఆపరేటివ్ ఖాతాగా ప్రకటించినప్పటికీ సదరు ఖాతాదారులకు ఎటువంటి అసౌకర్యమూ కలగజేయరాదు. అనుమానాస్పద లావాదేవీలను బ్యాంకులు పర్యవేక్షించడం వాటి బాధ్యతలో భాగమే. ⇔ భద్రతా చర్యల్లో భాగంగా ఒకవేళ ఖాతాను తాత్కాలికంగా ఇన్ఆపరేటివ్ ప్రకటించినా, ఖాతా వర్గీకరణ ఆధారంగా నియమ నింబంధనల మేరకు ఖాతా కొనసాగింపుకు వీలుంటుంది. ఇలా కొనసాగించే ముందు లావాదేవీ/ఖాతా కచ్చితత్వాన్ని ఖాతాదారుడి వ్యక్తిగత గుర్తింపును నిర్ధా రించి తదుపరి చర్యలుంటాయి. ⇔ ఇన్ఆపరేటివ్ ఖాతాలను ఉపయోగించేలా చేసేందుకు ఎటువంటి రుసుములు విధించరాదు. ⇔ పొదుపు ఖాతాలను నిర్వహిస్తున్నా, లేకపోయినా అందుకు తగిన వడ్డీ మాత్రం బ్యాంకు తప్పనిసరిగా జమ చేయాలి. ⇔ ఫిక్స్డ్ డిపాజిట్లు విషయంలో మెచ్యూరిటీ తీరిన తర్వాత పొదుపు ఖాతాకు వర్తించే వడ్డీ అమలవుతుంది. ⇔ పదేళ్లకు పైబడిన ఇన్క్లెయిమ్ డిపాజిట్లు, ఇన్ఆపరేటివ్ ఖాతాలకు సంబంధించి వారి పేరు, చిరునామాలను బ్యాంకులు తమ వెబ్సైట్లలో పొందుపర్చాల్సిందిగా ఆర్బీఐ సూచించింది. ఖాతా సంఖ్య, ఖాతా రకం, బ్రాంచి వంటి వివరాలు వెబ్సైట్లో పెట్టొద్దు. -
అకౌంట్ ఓపెన్ చేయడానికి ఖర్చెంతో తెలుసా?
సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకు ఖాతా తెరవడం ఏముందిలే.. బ్యాంక్‌కు వెళ్లి కావాల్సిన డాక్యుమెంట్లు సమర్పిస్తే చాలనుకుంటున్నారా? అసలు ఎప్పుడైనా బ్యాంకు అకౌంట్ తెరవడానికి ఖర్చెంత అవుతుందో ఆలోచించారా? కనిపించకుండానే ఈ ప్రక్రియకు బాగానే ఖర్చు అవుతుందట. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) తాజాగా విడుదల చేసిన రిపోర్టులో ఇది తెలిసింది. బ్యాంకు ఖాతా తెరవడానికి మూడు సార్లు మీరు బ్యాంకుకు వెళ్తే, దాదాపు 139 రూపాయల మేర ఖర్చు అవుతుందట. తొలిసారి బ్యాంకుకు వెళ్లినప్పుడు కావాల్సిన వివరాలు కనుక్కోవడం, రెండో సారి కావాల్సిన పత్రాలు సమర్పించడం, అనంతరం బ్యాంకు ఖాతా తెరిచినట్టు బ్యాంకు సిబ్బంది ఇచ్చే డాక్యుమెంట్లను స్వీకరించడం ఇలా వెళ్లిన ప్రతిసారి అయ్యే ఖర్చులు మొత్తం 139 రూపాయల మేర అవుతుందని ఆర్బీఐ రిపోర్టు పేర్కొంది. ఈ మొత్తం ప్రక్రియకు అయ్యే సమయం కూడా 7 గంటల 28 నిమిషాలని రిపోర్టు తెలిపింది. బ్యాంకింగ్ స్టాఫ్‌తో డీల్ చేయడం వినియోగదారులకు మరింత సమయం పడుతుందని చెప్పింది. ముఖ్యంగా డాక్యుమెంటేషన్ సమయంలో ఎక్కువగా సమయం వెచ్చించాల్సి వస్తుందని వెల్లడించింది. 2016లో బ్యాంకుల ఆడిట్లో వెల్లడైన డేటా మేరకు ముందస్తు ప్రక్రియలన్నీ అయిపోయిన తర్వాత కేవలం డాక్యుమెంటేషన్ కోసమే రెండు గంటల మేర సమయం పడుతుందట. దీని ఖర్చు కూడా 77 రూపాయలని తెలిసింది. పలు పత్రాల్లో వివరాలు నింపడానికి 20 నిమిషాల సమయాన్ని వెచ్చించాల్సి వస్తుంది. ట్రావెలింగ్కు 3 గంటల 22 నిమిషాలు.. ఇలా మొత్తంగా ఏడు గంటల 28 నిమిషాల మేర సమయాన్ని బ్యాంకు అకౌంట్ తెరవడానికే వినియోగించాల్సి వస్తుందని ఆర్బీఐ రిపోర్టు వెల్లడించింది. టెక్నాలజీ మార్గాలతో బేసిక్ బ్యాంకింగ్ ఖర్చులను తగ్గించాలని భావిస్తున్నట్టు ఆర్బీఐ రిపోర్టు తెలిపింది. జన్‌ధన్, ఆధార్, మొబైల్ ఫోన్ ద్వారా ఖర్చులు తగ్గించడానికి సాయపడతాయని పేర్కొంది. -
బ్యాంకు ఖాతాలకు ఆధార్ ముప్పు!
-
బ్యాంకు ఖాతాలకు ఆధార్ ముప్పు!
సరిగా సీడింగ్ జరగక ఖాతాలు బ్లాక్ అయ్యే అవకాశం - రాష్ట్రంలో సుమారు 3 కోట్ల బ్యాంకు ఖాతాలకు సమస్య సాక్షి, హైదరాబాద్: బ్యాంకు ఖాతాలకు ఆధార్ ముప్పు వచ్చి పడింది.. వాటిని అనుసంధానించే ప్రక్రియ తప్పటడుగులేసింది.. రాష్ట్రంలోని మొత్తం 4.70 కోట్ల బ్యాంకు ఖాతాల్లో దాదాపు మూడు కోట్లకుపైగా ఖాతాలకు సమస్య వచ్చి పడింది. ఈ ఖాతాలకు సరిగా ఆధార్ సీడింగ్ జరగలేదని.. వాట న్నింటినీ బ్లాక్ చేసే అవకాశముందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. రాష్ట్రంలోని 87 శాతం బ్యాంకు ఖాతాలకు ఆధార్ సీడింగ్ పూర్తయినట్లు రాష్ట్ర ప్రభుత్వం నివేదించగా.. అందులో ఏకంగా 74 శాతం ఖాతాల కు, ఆధార్ వివరాలకు పొంతనలేదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. రెండు రోజుల కిందట రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు, బ్యాంకర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ వివరాలను వెల్లడించింది. కేవలం 13 శాతం బ్యాంకు ఖాతాలు, ఆ ఖాతాదారుల ఆధార్ సమాచారం సరిపోలిందని పేర్కొంది. ఆధార్ సీడింగ్ ప్రక్రియ సరిగ్గా జరగని తీరుపై ఆందోళన వ్యక్తం చేసింది. ఖాతాదారుల పేర్లలో, ఆధార్ నంబర్లలో, ఇతర వివరాల్లో తప్పులు ఉన్న నేపథ్యంలో.. భారీగా బోగస్ సీడింగ్ జరిగినట్లు సందేహం వ్యక్తం చేసింది. బ్యాంకర్ల నిర్లక్ష్యంతో.. బ్యాంకర్లు తూతూమంత్రంగా ఆధార్ నంబర్లను ఖాతాలకు జత చేశారని కేంద్ర ఆర్థిక శాఖ అభిప్రాయపడింది. ఆధార్ కార్డు సంబంధిత ఖాతాదారుడిదేనా.. ఇచ్చిన పాన్ నంబర్ సరిగ్గా ఉందా.. వంటి వివరాలను ధ్రువీకరించుకోకపోవటంతో ఈ పరిస్థితి తలెత్తిందని పేర్కొంది. కేంద్రం వద్ద ఉన్న ఆధార్ డేటాబేస్, పాన్ నంబర్ డేటాబేస్లకు బ్యాంకు ఖాతాల్లోని ఆధార్ నంబర్లకు పొంతన లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేసింది. పక్కాగా పరిశీలన వివరాల్లో తప్పులుండటంతో సీడింగ్ ప్రక్రియను మరింత పక్కాగా నిర్వహించాలని రాష్ట్రంలోని బ్యాంకర్లను కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశించింది. ఈ ఏడాది డిసెంబర్ 31లోగా ఖాతాదారులంతా తమ ఆధార్ కార్డులను సమర్పించి ఖాతాలోని వివరాలు ఆధార్‌తో సరిపోలినవో, లేదో ధ్రువీకరించుకునేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. ఆధార్, పాన్‌కార్డులను సమర్పించడంతోపాటు.. ఆ వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు సరిపోలినవో, లేదో సరిచూసుకోవాలని ఖాతాదా రులకు సూచించింది. ఆధార్ సీడింగ్ చేయని బ్యాంకు ఖాతాల్లో డిసెంబర్ 31వ తేదీ తర్వాత లావాదేవీలన్నీ స్తంభించిపోతాయని.. నగదు తీసుకోవడం, జమచేయటం కూడా కుదరదని మరోసారి స్పష్టం చేసింది. మిగిలిన నాలుగు నెలల వ్యవధిలోనే ఆధార్ కార్డుల సీడింగ్‌ను పక్కాగా పూర్తిచేసేలా బ్యాంకులు స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించాలని సూచించింది. గడువు తేదీ సమీపిస్తే ఒక్కసారిగా ఖాతాదారుల రద్దీ పెరిగిపోతుందని, అందువల్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. ధ్రువీకరణ తప్పనిసరి కేంద్ర ఆర్థిక శాఖ సూచనల ప్రకా రం.. ఇప్పటికే ఆధార్ కార్డులు, పాన్ కార్డులను సమర్పించిన ఖాతాదారులు సైతం తమ బ్యాంకు ఖాతా వివరాలతో వాటిని ధ్రువీకరించుకోవాలని ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి. ఆధార్ కార్డు తమదేనని ధ్రువీకరించేందుకు మొబైల్ ‘వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ)’లేదా బయో మెట్రిక్ విధానం ద్వారా బ్రాంచికి రుజువు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. విధిగా ఖాతాదారులందరూ బ్యాంకు శాఖలను సంప్రదించి ఆధార్ సీడింగ్ చేసుకోవాలని సూచిస్తున్నాయి. ఎందుకింత నిర్లిప్తత? ఆధార్ సీడింగ్‌పై కేంద్రం హెచ్చరించినా బ్యాంకర్లు నిర్లిప్తంగా వ్యవహరిం చడమే సమస్యకు కారణమనే అభిప్రా యం వ్యక్తమవుతోంది. ఆధార్ కార్డులు, పాన్‌కార్డుల వివరాలను తమ ఖాతాల్లోని వివరాలతో సరిపోల్చుకునేందుకు బ్యాం కులకు అవకాశమున్నా.. పొరపాట్లు తలె త్తడం గమనార్హం. అయితే బ్యాంకులకు వచ్చే ఖాతాదారుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని.. ఆన్లైన్, డిజిటల్ లావా దేవీలు పెరగడంతో పూర్తిస్థాయిలో ఆధార్ సీడింగ్ చేయలేకపోతున్నట్లు ఇటీవలి వీడియో కాన్ఫరెన్స్‌లో బ్యాంకర్లు వివరణ ఇచ్చారు. కానీ తొలిసారి సీడింగ్ చేసినప్పు డే ధ్రువీకరించుకుని (అథెంటికే షన్ చేసి) ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదని కేంద్రం స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యం లోనే ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టి, తగిన ప్రచారం చేసి ఆధార్ సీడింగ్ ప్రక్రియను పక్కాగా చేపట్టాలని సూచించింది. -
ఫోన్ లిఫ్ట్ చేస్తే ఖాతాలో నగదు మాయం
కాణిపాకం ఉద్యోగులే టార్గెట్ వారం రోజుల్లో పది మంది బాధితులు కాణిపాకం: కాణిపాకం వాసులకు పది రోజులుగా కంటి మీద కునుకులేకుండా పోతోంది. ఆలయ ఉద్యోగులే టార్గెట్‌గా అనామక వ్యక్తులు ఫోన్ చేస్తున్నారు. ఆ ఫోన్ లిఫ్ట్ చేయగానే వారి బ్యాంకు అకౌంట్లో నగదు మాయమైపోతోంది. ఇలా వారం రోజుల్లో దాదాపు పది మంది నగదు కోల్పోయారు. దేవస్థానం వద్ద పోలీసు స్టేషన్లో పనిచేసే ఒక అధికారికి ఇటీవల ఓ నంబరు నుంచి ఫోను వచ్చింది. ‘మేము ఎస్బీఐ నుంచి మాట్లాడుతున్నాము.. మీ అకౌంట్ నంబరు నిలిపివేయబడింది. పునరుద్ధరించుకోండి’ అంటూ అవతలి వ్యక్తి చెప్పారు. అకౌంట్ నంబర్.. ఏటీఎం నంబర్ చెప్పాల్సిందిగా కోరాడు. వివరాలు చెప్పిన కొద్ది సేపటికే ఆయన అకౌంట్ నుంచి డబ్బు వేరే అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ అయినట్లు మెసేజ్ వచ్చింది. అదేవిధంగా దేవస్థానంలోని శివాలయంలో పనిచేసే ఓ ప్రధాన అర్చకుడికి ఫోను వచ్చింది. పై వివరాలన్నీ చెప్పడంతో కొద్ది క్షణాల్లోనే రూ.30 వేలు అకౌంట్లో నుంచి తొలగిపోయినట్లు ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. దీంతో ఆయనకు గుండె ఆగినంత పనైంది. బ్యాంకు మేనేజర్‌ను సంప్రదించి విషయం తెలియజేశారు. పరిశీలిస్తామని మేనేజర్ సమాధానం చెప్పారు. చదువురాని వారే టార్గెట్.. చదువురాని వారిని వారి మాటల ఆధారంగా అంచనా వేస్తారు. అటు పిమ్మట పూర్తి వివరాలను రాబడతారు. అక్కడి నుంచి గుట్టుచప్పుడు కాకుండా తమపని కానిచ్చేస్తున్నారు. వీరు ప్రధానంగా డ్వాక్రా మహిళలు, ఉపాధి సిబ్బంది, గ్రామీణ మహిళలు, దుకాణాలు నిర్వహిస్తున్న వారినే లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఫోన్ చేశారు... నగదు పోయింది సోమవారం ఉదయం 7 గంటలకు ఎస్బీహెచ్ మేనేజర్ రామచంద్రారెడ్డిని అంటూ 970906564 నుంచి ఫోన్ వచ్చింది. ‘మీ ఖాతా నిలిపివేయబడింది. మీ ఖాతా నంబర్, ఏటీఎం కార్డు నంబర్, పిన్ నంబర్ చెప్పమని’ అడిగారు. తెలియజేశాను. 10 నిమిషాల్లోనే ఖాతాలోని నగదు పూర్తిగా మాయమైం ది. ఖాతాలో ఉన్న రూ.30 వేలు చోరీ చేశారు. – శేఖర్, కాణిపాకం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అడ్రస్ లేని నంబర్లతో ఫోన్ చేసి నగదు స్వాహా చేస్తున్నట్లు తెలుస్తోంది. కాణిపాకం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు, ఫైనాన్స్, లక్కీ డ్రా, లాటరీ సెంటర్ల నుంచి ఫోను చేస్తున్నట్లుగా చెబితే వివరాలు చెప్పొద్దు. అప్రమత్తంగా ఉండాలి. –ఎత్తిరాజులు, కాణిపాకం ఏఎస్ఐ -
ఆధార్ ఇవ్వకపోతే, 'అకౌంట్' క్లోజ్
బ్యాంకు ఖాతాకు ఆధార్ తప్పనిసరి రూ.50,000, ఆపైబడిన లావాదేవీలకూ ఉండాల్సిందే న్యూఢిల్లీ: కొత్త బ్యాంకు ఖాతాకు ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్రప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీచేసింది. ఈ మేరకు కేంద్ర రెవిన్యూ శాఖ తాజాగా నోటిఫికేషన్ విడుదలచేసింది. బ్యాంకులో కొత్త ఖాతా తెరవాలంటే ఇకపై ఖచ్చితంగా ఆధార్ నంబర్‌ను తెలపాలి. అంతేకాకుండా రూ.50,000, అంతకు మించిన మొత్తాల లావాదేవీలకు సైతం ఆధార్ నంబర్‌ను తప్పనిసరి చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇప్పటికే బ్యాంకు ఖాతా ఉన్న వినియోగదారులు ఈ ఏడాది డిసెంబర్ 31లోగా తమ ఆధార్ నంబర్‌ను తెలపాల్సి ఉంటుంది. అలా నంబర్ ఇవ్వని పక్షంలో సంబంధిత ఖాతాల లావాదేవీలను స్తంభింపజేస్తామని నోటిఫికేషన్లో స్పష్టంచేశారు. వేర్వేరు పాన్ నంబర్ల సాయంతో కొందరు పన్నులను ఎగవేస్తున్న నేపథ్యంలో ప్రతీ పాన్ నంబర్‌తోపాటు ఆధార్ నంబర్‌నూ జతచేయాలని గతంలోనే ప్రభుత్వం సూచించింది. వ్యక్తులు, సంస్థలు, ఉమ్మడి వ్యాపార సంస్థలు పాన్ లేదా ఫారమ్ 60తోపాటు ఆధార్ నంబర్ ఇవ్వాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. సరైన కేవైసీ పత్రాలు లేకుండా కొత్త చిన్న మొత్తాల ఖాతా తెరవాలంటే గరిష్టంగా రూ.50,000 మాత్రమే డిపాజిట్ చేయాలని సూచించారు. ప్రధాన బ్యాంకుల శాఖల్లోనే ఇలాంటి ఖాతాలను తెరవాలని కొత్త నిబంధన పెట్టారు. ఏడాదిలోపు ఆయా ఖాతాకు సంబంధించిన కేవైసీ పత్రాలను ఖచ్చితంగా జతపరచాల్సి ఉంటుంది. కొత్తగా ఖాతా తెరిచే వ్యక్తి ఆధార్ నంబర్ లేకపోతే, ఆధార్ కోసం ఎన్రోల్ చేసుకున్న నంబర్‌ను తెలపాలి. ఆరు నెలల్లోపు ఆధార్ నంబర్‌ను బ్యాంకు శాఖకు అందజేయాలి. ఆయా ఖాతాల నెలవారీ, వార్షిక లావాదేవీలను, ఖాతాలోకి నగదు జమాలపై బ్యాంకుల ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుంది. -
సేవలు నచ్చలేదా...బ్యాంక్ మార్చెయ్!
♦ బ్యాంకు ఖాతాకూ పోర్టబిలిటీ! ♦ అకౌంట్ నంబర్ మాత్రం అదే... ♦ ఈ దిశగా బ్యాంకులు అడుగులు వేయాలన్న ఆర్బీఐ ముంబై: మొబైల్ నంబర్ మారకుండా టెలికం కంపెనీని మార్చేసినట్టుగానే... సేవలు బాగోలేని బ్యాంకుకు గుడ్‌బై చెప్పేసి అదే ఖాతా నంబర్‌తో మరో బ్యాంకు శాఖకు మారిపోయే రోజు భవిష్యత్తులో సాకారం కానుంది. అప్పటి వరకూ మీకున్న రుణ చరిత్రను కోల్పోవాల్సిన పని కూడా లేదు. ఈ దిశగా బ్యాంకులు అడుగులు వేయాలని ఆర్బీఐ సూచించింది. ముంబైలో మంగళవారం బ్యాంకింగ్ కోడ్స్ అండ్ స్టాండర్డ్స్ బోర్డ్ ఆఫ్ ఇండియా (బీసీఎస్‌బీఐ) నిర్వహించిన సమావేశంలో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎస్ఎస్ ముంద్రా పాల్గొన్నారు. బ్యాంకు ఖాతాల్లో కనీస నగదు నిల్వలు, వాటిపై చార్జీలు, బ్యాంకు ఖాతా పోర్టబులిటీ సహా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఖాతా పోర్టబిలిటీ సాధ్యమే... ‘‘గత రెండు సంవత్సరాల్లో ఆధార్ నమోదు కార్యక్రమం చోటు చేసుకుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ) చెల్లింపుల ప్లాట్‌ఫామ్‌లను రూపొందించింది. పలు యాప్‌లను కూడా తీసుకురావడం జరిగింది. వీటన్నింటి దృష్ట్యా ఖాతా నంబర్ పోర్టబిలిటీకి చాలా అవకాశం ఉంది’’ అని ముంద్రా పేర్కొన్నారు. ఆర్బీఐ నియంత్రనపరమైన సూచన కాకుండా, బ్యాంకింగ్ రంగంలోని భాగస్వాములు అందరి ఉమ్మడి కృషితో ఈ సౌకర్యం అమల్లోకి వస్తే మంచిదన్నారు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ దీన్ని పరిశీలనలోకి తీసుకుని, అమలు దిశగా పనిని ప్రారంభించాలని ముంద్రా సూచించారు. తప్పనిసరైన ఈ పరిస్థితికి బ్యాంకులు సిద్ధం కావాలని, దేశీయ బ్యాంకింగ్ రంగంలో ఖాతా నంబర్ పోర్టబిలిటీ ఏ విధంగా అమలు చేయాలన్న దానిపై ఆలోచన చేయాలన్నారు. పోర్టబులిటీ ఆచరణలోకి వస్తే కస్టమర్ కనీసం మారు మాట్లాడకుండానే సులభంగా బయటకు వెళ్లిపోవడం అనుభవంలోకి వస్తుందన్నారు. బ్యాంకు ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్, మొబైల్ నంబర్ ఐడెంటిఫయర్ (ఎంఎంఐడీ) ఈ తరహా ఎన్నో నంబర్లు ప్రస్తుతం దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్నాయి. అయితే, ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ఆధార్ చెల్లింపుల విధానంలో బ్యాంకు ఖాతాకు ఆధార్ నంబర్‌ను అనుసంధానిస్తే, లావాదేవీలన్నీ ఆధార్ నంబర్ ఆధారంగానే జరుగుతాయి. ముంద్రా గతంలోనూ ఖాతా నంబర్ పోర్టబిలిటీని ప్రతిపాదించారు. ఇది ఆచరణలోకి వస్తే ఈ సదుపాయం కలిగిన తొలి దేశం మనదే అవుతుంది. ఒకే బ్యాంకు పరిధిలో ఒక శాఖ నుంచి మరో శాఖకు అదే ఖాతా నంబర్‌తో మారే సదుపాయం కల్పించాలని ఆర్బీఐ 2012 ఏప్రిల్‌లోనే బ్యాంకులను కోరింది. సామాన్యులకు సేవలను నిరాకరించరాదు ఖాతాల్లో కనీస నగదు నిల్వలు ఎంతుండాలి, ప్రీమియం సేవలపై చార్జీలను నిర్ణయించుకునే స్వేచ్ఛను బ్యాంకులకు ఇవ్వడం జరిగిందని... కానీ, సామాన్యులకు సేవలను నిరాకరించడం, దూరం చేయడం కోసం వీటిని వినియోగించుకోరాదని ముంద్రా అన్నారు. కొన్ని బ్యాంకుల్లో ఈ చర్యలను తాము గమనించినట్టు చెప్పారు. ‘‘కొన్ని సేవలకు చార్జీలను వసూలు చేయడం వల్ల నష్టం లేదు. కానీ, కొందరు కస్టమర్లను దూరంగా ఉంచేందుకు ఈ తరహా నిబంధనలు రూపొందించలేదు’’ అని ఆయన స్పష్టం చేశారు. అందరికీ బ్యాంకు సేవలను అందుబాటులో ఉంచడంపైనే తమ దృష్టిగానీ, ఈ తరహా సేవలకు బ్యాంకులు ఎంత చార్జీలు వసూలు చేస్తున్నాయన్నదానిపై కాదని ఆయన పేర్కొన్నారు. ఆన్లైన్ మోసాల నుంచి కస్టమర్లకు రక్షణ ఎలక్ట్రానిక్ విధానంలో జరిగే మోసపూరిత లావాదేవీల నుంచి ఖాతాదారులకు రక్షణ కల్పించే దిశగా ఆర్బీఐ త్వరలో తుది మార్గదర్శకాలు తీసుకురానుందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎస్ఎస్ ముంద్రా చెప్పారు. ఖాతాదారుడి ప్రమేయం లేకుండా అనధికారికంగా జరిగే లావాదేవీల్లో... ఖాతాదారుడి బాధ్యతను పరిమితం చేయనున్నట్టు చెప్పారు. వాస్తవానికి ముసాయిదా మార్గదర్శకాలను ఆర్బీఐ గతేడాది ఆగస్ట్‌లోనే విడుదల చేసి, అభిప్రాయాలను స్వీకరించింది. భాగస్వాముల నుంచి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా తుది మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేస్తామని ముంద్రా తెలిపారు. మోసపూరిత లావాదేవీల గురించి రిపోర్ట్ చేసేందుకు కాల పరిమితి, ఖాతాదారులు, బ్యాంకుల బాధ్యతను మార్గదర్శకాల్లో పొందుపరుస్తామని చెప్పారు. బ్యాంకులు సైతం తమ ఐటీ భద్రతా వ్యవస్థలను పటిష్టం చేసుకోవాలని సూచించారు. -
రోడ్డెక్కిన అన్నదాత
- బ్యాంకు ఖాతాల్లో జమ అయిన ధాన్యం బిల్లులు - పక్షం రోజులుగా తిరుగుతున్నా నో క్యాష్ బోర్డు దర్శనం - ఆగ్రహించిన రైతులు.. నిరసన మోత్కూరు: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల కేంద్రంలో సోమవారం రైతులు ధాన్యం బిల్లుల కోసం రాస్తారోకో నిర్వహించారు. మోత్కూరు, అడ్డగూడూర్ మండలాల పరిధిలో ఐకేపీ ఆధ్వర్యంలో 9 ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహించారు. ఆయా కేంద్రాల్లో ఇప్పటి వరకు 1,927 మంది రైతులు ధాన్యం విక్రయించారు. 976 మంది రైతులకు సంబంధించి రూ. 9.36 కోట్లు ఆన్లైన్లో నమోదు చేశారు. వీరిలో 791 మంది రైతులకు రూ.7.18 కోట్లు వారి ఖాతాల్లో జమ అయ్యాయి. మోత్కూరు రైతు సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కొనుగోలు కేంద్రంలో సుమారు 498 రైతు లకు సంబంధించి రూ.1.60 కోట్లు ఆన్లైన్ లో నమోదు చేశారు. వారి డబ్బులను మోత్కూరులోని స్టేట్ బ్యాంక్‌లో జమ చేశారు. డబ్బులు డ్రా చేసుకోవడానికి రైతులు పక్షం రోజులుగా బ్యాంక్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా నో క్యాష్ బోర్డు దర్శ నమిస్తోంది. సోమవారం ఉదయాన్నే సుమారు 100 మం ది రైతులు బ్యాంకుకు వచ్చి బారులుదీరా రు. తీరా బ్యాంకు తెరిచాక నో క్యాష్ బోర్డు పెట్టడంతో ఆగ్రహించి రోడెక్కారు. అష్టక ష్టాలుపడి మార్కెట్లో ధాన్యాన్ని అమ్ముకు న్నామని, ఖాతాలో జమైన డబ్బులు, డ్రా చేసుకోవడానికి రెండు వారాలుగా తిరుగు తున్నా నో క్యాష్‌బోర్డు పెడుతున్నారని రైతు లు ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు రాగానే ఇవ్వడానికి ప్రయత్నిస్తానని మేనేజర్ రాజు హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. -
పాన్ తో పనులెన్నో..
► నోట్లరద్దుతో నగరంలో పెరిగిన పాన్ కార్డుల సంస్కృతి ► బ్యాంకు ఖాతాలకూ తప్పనిసరి చిత్తూరు ఎడ్యుకేషన్: నేడు ప్రతి ఒక్కరికీ పాన్ కార్డు అవసరం పెరిగింది. ఆదాయపన్ను శాఖ ప్రతి ఒక్కరికీ కేటాయించే శాశ్వత ఖాతా సంఖ్యను పర్మినెంట్ అకౌంట్ నంబర్ అంటారు. అంకెలు, అక్షరాలు కలిపి ఆ పాన్ కార్డులో పది ఉంటాయి. చాలా మందికి పాన్ కార్డు ఎక్కడ ఇవ్వాలి...? ఎక్కడ వద్దు..? అనే విషయంలో తికమకపడుతుంటారు. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినప్పటికీ ఇప్పటికీ చాలా మందికి పాన్ కార్డు గురించి తెలియకపోవడం, ఎలా తీసుకోవాలో, దాని ఉపయోగాలేమిటీ...? అన్న అంశాలపై అవగాహన లేదు. ప్రస్తుతం చిత్తూరు నియోజకవర్గంలోని ప్రజలు పాన్ కార్డు పై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. వాహనం కొనాలన్నా, బ్యాంకులో ఖాతా ఓపెన్ చేయాలన్నా, అమ్మకాలు జరిపే సమయాల్లో తదితర వాటికి పా¯ŒSకార్డు తప్పనిసరి కావడంతో నగర వాసులు వీటిపై మక్కువ చూపుతున్నారు. దరఖాస్తు ఇలా.. పాన్ కార్డుకు సంబంధించిన సేవలను మెరుగుపరచడం కోసం ప్రతి నగరంలోని పాన్ సేవా కేంద్రాలుంటాయి. వీటితోపాటు స్పెషలిటేషన్ కేంద్రాల్లోనూ పాన్ కార్డుల కోసం సంప్రదించవచ్చు. ఆకార్డు కోసం సంబంధిత వ్యక్తి పాస్‌పోర్టు సైజు కలర్ ఫొటో, వ్యక్తిగత గుర్తింపు పత్రం, చిరునామా పత్రాలను ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఆధార్, పాస్‌పోర్టు, పదోతరగతి మార్కుల జాబితా, ఓటర్ ఐడీ, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు వాటిలో ఏదో ఒకటి తీసుకెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసిన 15 రోజుల తరువాత సంబంధిత వ్యక్తి చిరునామాకు పోస్టు ద్వారా పాన్ కార్డు అందుతుంది. ఎప్పుడు అవసరమంటే. ► రూ.50 వేలు పైబడి బ్యాంకులో నగదు డిపాజిట్ చేసే సమయంలో. ► బ్యాంకులో ఖాతా తెరిచేటప్పుడు ► డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలు తెరవడానికి ► చెక్కులు, డీడీల లావాదేవీలు రూ.50 వేలను మించితే ► స్థిరాస్తి, వాహనాల కొనుగోలు, అమ్మకాలు జరిపేటప్పుడు ► హోటళ్లు, విలాసాలు ఖర్చుల వంటి వాటి కోసం రూ.20 వేల కంటే ఎక్కువ నగదు చెల్లించాల్సి వచ్చినప్పుడు -
బ్యాంకు అకౌంట్ లేకపోయినా ఆధార్ ఉంటే చాలు
న్యూఢిల్లీ : బ్యాంకు అకౌంట్ లేకుండానే మనీని పంపొచ్చు, తీసుకోవచ్చు. అది ఎలా అనుకుంటున్నారా? 12 అంకెల ఆధార్ నెంబర్ తో ఇదంతా సాధ్యపడుతుందట. మీ 12 నెంబర్ల ఈ ఆధారే ఇక సింగిల్ పాయింట్ పేమెంట్ అడ్రస్‌గా మారబోతోంది. త్వరలో రాబోతున్న పేమెంట్స్ బ్యాంకు ఇండియా పోస్టు ద్వారా 112 కోట్లకు పైనున్న భారతీయులు కేవలం ఆధార్ నెంబర్ తోనే నగదు తీసుకునేలా, పంపించేలా సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికి బ్యాంకు అకౌంట్ లింక్ అయి ఉందా? లేదా? అనేది అవసరం లేదు. ప్రస్తుతం ఆధార్ తనకు తాను పేమెంట్ అడ్రస్ లాగా లేదని ఇండియా పోస్టు సీఈవో ఏపీ సింగ్ తెలిపారు. కానీ 2017 సెప్టెంబర్ నుంచి ప్రారంభించబోతున్న పేమెంట్స్ బ్యాంకు ఆపరేషన్ లో మొత్తం మార్పులు చోటుచేసుకుంటాయని చెప్పారు. మొదట దేశవ్యాప్తంగా ఉన్న 650 జిల్లాలో కవర్ చేస్తామన్నారు. పేమెంట్ సిస్టమ్ ను మరింత సులభతరం చేసేలా ఈ ప్రక్రియను తీసుకురాబోతున్నామన్నారు. పేమెంట్స్ ను మరింత సులభతరం చేయడానికి పరిష్కారం ఆధార్ ను పేమెంట్ అడ్రస్ చేయడమేనని తాము భావించామని ఏపీ సింగ్ పేర్కొన్నారు. దీంతో ఎక్కడి నుంచి వచ్చే పేమెంట్లనైనా ఆధార్ రిసీవ్ చేసుకుంటుందని తెలిపారు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ)కు సింగ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ గా వ్యవహరించారు. ప్రస్తుతం 40 కోట్ల బ్యాంకు అకౌంట్లు ఆధార్ తో లింకయ్యాయి. ప్రతినెలా 2 కోట్ల ప్రజలు తమ యూనిక్ నెంబర్ ను తమ అకౌంట్లకు లింక్ చేసుకుంటున్నారు. -
చెక్కుల, ఖాతాల ద్వారానే వేతనాల చెల్లింపు
న్యూఢిల్లీ: పరిశ్రమల యాజమాన్యాలు కార్మికులకు చెల్లించాల్సిన వేతనాల్ని చెక్కులు లేదా వారి బ్యాంకు ఖాతాలకు జమ చేయాలని పేర్కొంటూ ప్రభుత్వం శుక్రవారం లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టింది. పేమెంట్ ఆఫ్ వేజెస్(సవరణ) బిల్లు 2017ను, కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ బిల్లును సభ ముందుంచారు. పేమెంట్ ఆఫ్ వేజెస్(సవరణ) బిల్లు 2016, స్థానంలో దీన్ని ప్రవేశపెట్టారు. ఇంతకుముందు ఈ అంశంపై జారీ చేసిన ఆర్డినెన్స్ ను కూడా రద్దు చేయాలని సూచించారు. -
క్యాష్‌లెస్ ప’రేషాన్’
రేషన్ సరుకుల పంపిణీలో నగదు రహిత లావాదేవీలు బ్యాంక్ ఖాతాలున్న వారికే సరఫరా 3 మండలాలు, అన్ని పట్టణాల్లో నిలిచిన సరుకుల పంపిణీ బలవంతపు ప్రయోగాలపై మండిపడుతున్న జనం జిల్లావ్యాప్తంగా మూతపడిన డిపోలు కొవ్వూరు : నగదు రహిత లావాదేవీల జపం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రజాహితాన్ని పూర్తిగా పక్కన పెట్టింది. జిల్లాలో అన్ని రేషన్ డిపోల్లో క్యాష్‌లెస్ విధానం అమలు చేయాలని అధికారులు ఆదేశించారు. దీంతో శుక్రవారం జిల్లావ్యాప్తంగా రేషన్ సరుకుల పంపిణీ నిలిచిపోయింది. నేరుగా డబ్బులిస్తే సరుకులు ఇచ్చేది లేదని.. బ్యాంకు ద్వారా చెల్లిస్తేనే పంపిణీ చేస్తామని డీలర్లు చెబుతుండటంతో పేదలు అష్టకష్టాలు పడుతున్నారు. నగదు రహితంగా రేషన్ సరుకులు పొందాలంటే కార్డుదారుడికి తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ ఉండాలి. అదికూడా ఆధార్ నంబర్‌తో అనుసంధానమై ఉండాలి. సరుకులు పొందాలంటే కార్డుదారుడి అకౌంట్లో కనీసం రూ.100 నగదు ఉండాలి. తెలుపు రంగు రేషన్ కార్డుదారులంతా నిరుపేదలే కావడంతో వారంతా నగదు రహిత లావాదేవీలు నిర్వహించే అవకాశం లేక నిత్యావసర సరుకుల పొందేందుకు అవస్థలు పడుతున్నారు. ఇప్పటివరకు నగదు రహితంతోపాటు నగదు తీసుకుని కూడా సరుకులు అందించేవారు. ఈ నెల నుంచి నగదు విధానాన్ని పూర్తిగా రద్దు చేశారు. నగదు రహిత లావాదేవీ ద్వారా మాత్రమే సరుకులు ఇస్తామని అధికారులు భీష్మించడంతో పేదలు అవస్థలు పడుతున్నారు. పేదలపై బలవంతపు ప్రయోగాలు చేయడం విమర్శలు తావిస్తుంది. 25 శాతం కార్డులకే సరుకులు జిల్లాలో 2,163 రేషన్ దుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో 11,96,775 తెల్లరేషన్ కార్డుదారులు ఉన్నారు. గత నెల నుంచి నగదు రహిత విధానాన్ని అమలు చేస్తూ.. కొత్త ఈపోస్ మెషిన్లు అందించారు. దెందులూరు, చాగల్లు, తాళ్లపూడి మండలాలతోపాటు 8 పురపాలక సంఘాలు, ఏలూరు నగరంతో కలిపి 759 రేషన్ డీలర్లకు ఎన్‌లాజిక్స్ మెషిన్లు, మిగిలిన 45 మండలాల్లోని 1,401 డిపోలకు విజన్‌టెక్ మెషిన్లు అందించారు. విజన్‌టెక్ మెసిన్లలో క్యాష్‌లెస్ విధానం బాగా పనిచేస్తోంది. గత నెలలో ప్రయోగత్మాకంగా పరిశీలించిన అధికారులు ఈనెల నుంచి పూర్తిస్థాయిలో నగదు రహిత లావాదేవీలు జరపాలని ఆదేశాలిచ్చారు. అయితే, ఎన్‌లాజిక్స్ మెషిన్లలో నగదు రహిత విధానం పనిచేయడం లేదు. ఈ కారణంగా రేషన్ సరుకుల పంపిణీని దెందులూరు, చాగల్లు, తాళ్లపూడి మండలాలతోపాటు జిల్లాలోని అన్ని పట్టణాల్లో శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి నిలిపివేశారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 3,18,314 కార్డుదారులకు (25.95 శాతం మందికి)మాత్రమే సరుకులు పంపిణీ చేశారు. జిల్లాలో శుక్రవారం సాయంత్రానికి కేవలం 89,637 మంది కార్డుదారులు మాత్రమే క్యాష్‌లెస్‌ను వినియోగించుకున్నారు. ప్రతినెలా 1నుంచి 5వ తేదీ లోపు సరుకుల పంపిణీ పూర్తి చేసే వారు. నాలుగైదు శాతం మిగిలితే వారికి 15వ తేదీ వరకు అందించేవారు. అటువంటిది ఈనెల 3వ తేదీ నాటికి కేవలం 26 శాతం మాత్రమే సరుకులు పంపిణీ పూర్తయ్యింది. ఎన్‌లాజిక్స్ మెషిన్లలో స్టాఫ్‌వేర్‌ను మార్పుచేసి సరుకులు పంపిణీ చేస్తామని చెబుతున్నా.. ఇది పూర్తికావడానికి చాలారోజులు పట్టే అవకాశం ఉంది. పేదలను ఇబ్బందులు పెట్టడం సరికాదు రేషన్ డిపోల్లో సరుకుల పంపిణీని నగదు రహిత లావాదేవీలతో ముడిపెట్టడం సరికాదు. నిరక్షరాస్యులైన పేదలకు క్యాష్‌లెస్ లావాదేవీలపై అవగాహన ఉండదు. ఈ విధానం పేరుతో బ్యాంక్ అకౌంట్లు తెరవాలంటే కష్టం. సరుకులు తెచ్చుకునే సమయానికి ఖాతాలో సొమ్ములు ఉండాల్సి ఉంటుంది. రేషన్ సరుకుల తెచ్చుకోవాలంటే బ్యాంక్‌కు వెళ్లి అకౌంట్లో సొమ్ము జమ చేయాల్సి ఉంటుంది. పరిజ్ఞానం లేని అమాయకులపై పెనుభారం మోపడమే. డబ్బులు తీసుకెళ్లినా సరుకులు అందించాలి. బలవంతపు విధానాలతో ప్రభుత్వం పేదలను ఇబ్బందులకు గురిచేసే పద్ధతి మార్చుకోవాలి. తానేటి వనిత, మాజీ ఎమ్మెల్యే సరుకులు పంపిణీ ఆపమనలేదు ఎనలాజిక్స్ ఈపోస్ యంత్రాల్లో సాఫ్ట్వేర్ ఆప్డేట్ చేయడం వాస్తవం. సరుకులు పంపిణీ ఆపమని ఏవిధమైన ఆదేశాలు ఇవ్వలేదు. ఏలూరులో సొమ్ములు చెల్లించిన వారికి సరుకులు అందిస్తున్నారు. కొవ్వూరులోను, ఇతర పట్టణాల్లోను రేషన్ సరుకుల పంపిణీ నిలిపివేసిన విషయమై మాకెలాంటి సమాచారం లేదు. సయ్యద్ యాసీన్, జిల్లా పౌర సరఫరాశాఖ అధికారి 15వ తేదీ వరకు సరుకులిస్తాం నగదు రహిత లావాదేవీలను ప్రజలకు అలవాటు చేసే ప్రక్రియలో భాగంగానే ఎన్‌లాజిక్స్ ఈపోస్ యంత్రాలున్న చోట్ల సరుకులు పంపిణీ ఈ రోజు ఆగింది. సాఫ్ట్వేర్ ఆప్డేట్ చేస్తున్నాం. శనివారం నుంచి వీటిలోనూ యధావిధిగా సరుకులు అందిస్తాం. ఈపోస్ యంత్రాలు వినియోగించుకోని వాళ్లకు నగదు తీసుకుని సరుకులు అందిస్తాం. ఈ విషయంలో అపోహలు పడాల్సిన అవసరం లేదు. పి.కోటేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ -
బ్యాంక్ ఖాతాలుంటేనే పింఛన్లు!
36వేల మందికి ఆసరా పింఛన్లు నిలిపివేసిన సెర్ప్ సాక్షి, హైదరాబాద్: ఆసరా పింఛన్లను నేరుగా లబ్ధిదారుడికి అందించే మాన్యువల్ పంపిణీ విధానానికి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) చెల్లుచీటి ఇచ్చింది. ఇకపై ఈ పథకంలోని 36 లక్షల మంది లబ్ధిదారులకు బ్యాంక్ లేదా పోస్టాఫీస్ ఖాతాల ద్వారానే పింఛన్ సొమ్మును అందించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ నెల నుంచే కొత్త విధానం అమల్లోకి రావడంతో గత డిసెంబర్ నెల పింఛన్‌ను జనవరిలో అందుకోవాల్సిన సుమారు 35,937 మంది లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పలేదు. సదరు లబ్ధిదారులకు బ్యాంక్ లేదా పోస్టాఫీస్ ఖాతాలు లేనందున డిసెంబర్ పింఛన్లను నిలిపివేశామని, ఒకవేళ వారు వెంటనే ఖాతాలు తెరిచినట్లయితే వచ్చే నెల పింఛన్‌తోపాటు బకాయిలను అందజేస్తామని సెర్ప్ అధికారులు చెబుతున్నారు. -
వారం రోజుల్లో బ్యాంక్ ఖాతాలకు డబ్బు
– కందుల కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన మార్క్‌ఫెడ్ అధికారులు పత్తికొండ టౌన్: కందులు అమ్మిన వారం రోజుల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేస్తామని మార్క్‌ఫెడ్ రాష్ట్ర డీఓ పవన్‌కుమార్, జిల్లా మేనేజర్ పరిమళజ్యోతి తెలిపారు. శుక్రవారం స్థానిక వ్యవసాయమార్కెట్ యార్డులోని కందుల కొనుగోలు కేంద్రాన్ని మార్క్‌ఫెడ్ అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 9 జిల్లాల్లో కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందన్నారు. ప్రస్తుతం కర్నూలులో 13, అనంతపురంలో 14, కృష్ణా జిల్లాలో 8 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇవి మూడు నెలలపాటు కొనసాగుతాయన్నారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర రూ.5,050కు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. కందుల ధర ఎట్టి పరిస్థితుల్లోనూ పెరిగే అవకాశం లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మార్కెట్‌కమిటీ సెక్రెటరీ రూప్‌కుమార్, కేడీసీఎంఎస్ మేనేజర్ మురళి, సిబ్బంది మల్లికార్జున, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఆదోనిలో మరో సైబర్ నేరం
- బ్యాంకు ఖాతా నుంచి రూ.33,990 మాయం - లబోదిబోమంటున్న బాధితుడు ఆదోని: ఆన్లైన్ లావాదేవీలు నిరుపేదల కష్టార్జితానికి ఎసరు పెడుతున్నాయి. నెల తిరిగే లోగా పట్టణానికి చెందిన ఇద్దరు ఆన్లైన్ లావా దేవీల అక్రమాల బాధితులుగా మారారు. ఈ నెల 13న పట్టణానికి చెందిన జయమ్మ రూ.48వేలు మోసపోగా తాజాగా సోమవారం లక్ష్మన్న అనే వ్యక్తి ఖాతా నుంచి రూ. 33,990 మాయమైంది. బాధితుడి వివరాల మేరకు.. మండలం పరిధిలోని బైచిగేరి గ్రామానికి చెందిన ఎం లక్ష్మన్న పట్టణంలోని సాయి నర్శింగ్ హోం ల్యాబ్‌లో టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. ఆదోని స్టేట్ బ్యాంకు ప్రధాన శాఖలో ఉన్న తన సేవింగ్స్ ఖాతాలో డబ్బును పొదుపు చేసుకుంటున్నాడు. తల్లి, దండ్రులు కష్టపడి పండించిన పంట అమ్మగా వచ్చిన డబ్బును కూడా అదే ఖాతాలో జమ చేశాడు. గత నెల 5న బ్యాంకుకు వెళ్లి రూ.4వేలు డ్రా చేశాడు. అయితే అంతకు ముందు రోజు డిసెంబరు 4న తన ఖాతా నుంచి రూ.33,990 ఫ్లిప్‌కార్ట్ ఖాతాకు జమ అయినట్లు తెలసుకుని గొల్లుమన్నాడు. గుర్తు తెలియని వ్యక్తి లక్ష్మన్న ఏటీఎం పిన్ నంబరు తెలుసుకుని ఆన్లైన్లో షాపింగ్ చేసినట్లు తెలుస్తోంది. లక్ష్మన్న ఫ్లిప్‌కార్ట్ సంస్థకు ఫోన్ చేయగా పోలీసుల ద్వారా వస్తే వివరాలు అందిస్తామని సమాధానం వచ్చింది. బ్యాంకు అధికారులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారని లక్ష్మన్న ‘సాక్షి’కి తెలిపాడు. -
చిట్టీల వ్యాపారీ పరార్?
ఆదోని: పట్టణానికి చెందిన చిట్టీల వ్యాపారీ పరార్ కావడంతో బాధితులు లబోదిబో మంటున్నారు. ఎంఐజీలో నివాసమున్న వ్యాపారీ ఇంటికి మూడు రోజులుగా తాళం వేలాడుతోంది. ముందు కుటుంబంతో ఊరెళ్లి ఉండొచ్చని భావించారు. అయితే ఫోన్లో కూడా అందుబాటులోకి రాకపోవడంతో కొందరు బాధితులు గురువారం అతని ఇంటికెళ్లి కిటికీలోంచి లోపల చూడగా విలువైన సామగ్రి కనిపించక పోవడంతో ఇరుగు పొరుగువారిని విచారించారు. రాత్రికి రాత్రే ఊడాయించినట్లు తెలుసుకొని బోరుమంటున్నారు. అతని బ్యాంక్ ఖాతాలు కూడా కొందరు పరిశీలించగా డబ్బు నిల్వ లేకపోవడంతో మోసపోయామని తెలుసుకొని గొల్లుమంటున్నారు. పిల్లల పెళ్లిళ్లు, చదువులకు, ఇళ్లు, స్థలాలు కొనుగోలు కోసం చాలా మంది ప్రతి నెలా చిట్టీల రూపంలో పొదుపు చేసుకుంటున్నారు. వ్యాపారీ చాలా ఏళ్లుగా చిట్టీలు నడుపుతూ అందరిని నమ్మించాడు. మొదట చిన్ని చిన్న చిట్టీల వేసి ఆతర్వాత రూ. లక్షల చీటీలు వేయించాడు. మొత్తం డబ్బును చేత పట్టుకొని కుటుంబంతో సహ పారిపోవడంతో ఎన్నో ఆశలతో చిట్టీలు వేసుకున్న వారికి దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. బాధితుల్లో కొందరు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. -
పూలమ్ముకునే మహిళ ఖాతాలోకి 5.81 కోట్లు
మైసూరు (కర్ణాటక): పూలు అమ్ముకునే ఓ మహిళ బ్యాంకు ఖాతాలో ఏకంగా రూ.5.81 కోట్ల నగదు జమ అయిన ఉదంతం కర్ణాటకలోని మైసూరు జిల్లా హుల్లహళ్లిలో శుక్రవారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన నాగరాజు భార్య నీలా స్థానిక బస్టాండ్‌లో పూల వ్యాపారం చేస్తోంది. ఆమెకు గ్రామంలోని కార్పొరేషన్ బ్యాంకులో జన్‌ధన్ ఖాతా ఉంది. ఈ నెల 8న ఆమె ఖాతాలో రూ. 5.81 కోట్లు జమ అయ్యింది. ఆమె బుధవారం బ్యాంకుకు వెళ్లింది. ఖాతా పుస్తకాన్ని ఎంట్రీ చేయించగా.. రూ. 5.81 కోట్ల నగదు జమ అయినట్లు తేలింది. ఉక్కిరిబిక్కిరైన ఆమె మేనేజర్‌ను కలిసి పాస్‌పుస్తకం చూపించింది. అయితే.. ఆ మొత్తం ఎలా జమ అయ్యిందో తనకు కూడా తెలియదని మేనేజర్ చెప్పారు. అయితే.. ఆ మొత్తం ఎవరు జమ చేశారనే విషయాన్ని వారు వెల్లడించలేదు. -
ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేయించాలి
జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ కాకినాడ సిటీ : ప్రతి ఒక్కరూ వారి బ్యాంక్ ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేయించుకోవాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ సూచించారు. గురువారం కలెక్టరేట్ విధానగౌతమి హాల్లో వివిధ మండలాల అధికారులు, వ్యాపారులకు నగదు రహిత లావాదేవీలపై ఇ¯ŒSఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫైనా¯Œ్స కార్పొరేష¯ŒS (ఐడీఎఫ్సీ) శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ మండలానికి రెండు గ్రామాలను ఎంపిక చేసి నగదు రహిత లావాదేవీలు నిర్వహించడానికి చర్యలు చేపట్టామన్నారు. ఆయా గ్రామాల్లోని వ్యాపారులు యాప్‌ను డౌ¯ŒSలోడ్ చేసుకుని బయోమెట్రిక్ ఆధారిత నగదు రహిత లావాదేవీలు నిర్వహిస్తారన్నారు. ఇప్పటికే జిల్లాలో 200 బయోమెట్రిక్ సాధనాలు అందుబాటులో ఉన్నాయని, వాటిలో రాజమహేంద్రవరానికి 30, కాకినాడకు 25, పెద్దాపురానికి 40, అమలాపురానికి 60, రామచంద్రపురానికి 30, పౌరసరఫరాలశాఖకు 10, మార్కెటింగ్ శాఖకు ఐదు ఇచ్చామని తెలిపారు. బయోమెట్రిక్ సాధనాల ద్వారా నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. నగదు రహిత లావాదేవీల్లో వినియోగదారులకు ఎలాంటి చార్జీలు, వ్యాపారస్తులకు సర్వీసు చార్జీలు ఉండవన్నారు. వినియోగదారుని వేలిముద్రే బ్యాంకు పాస్వర్డ్ అన్నారు. వేలిముద్ర వేయడం ద్వారా కస్టమర్ బ్యాంకు ఖాతా నుంచి సొమ్ము వ్యాపారునికి బదిలీ అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాలశాఖాధికారి వి.రవికిరణ్, ఎ¯ŒSఐసీ డీఐవో ఎస్.ఉస్మాన్, సుబ్బారావు, రాజమహేంద్రవరం ఐడీఎఫ్సీ మేనేజర్ మీరావలి, పలు మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు. -
ఆ లావాదేవీలతో సంబంధం లేదు
రైతు ఖాతాలో రూ.కోట్ల జమపై ల్యాన్‌కో ఎండీ వివరణ కర్నూలు(అర్బన్): కర్నూలు జిల్లా పెద్దకడబూరుకు చెందిన అబ్రçహాం అనే రైతు బ్యాంకు ఖాతాకు జమ అయిన రూ.1,96,07,926 మొత్తానికి తమ కంపెనీకి సంబంధంలేదని ల్యాన్‌కో అమర్ కంటక్ కంపెనీ సీఎం విజయ్‌కుమార్ తాతపూడి తెలిపారు. తన ఖాతాలో కొద్ది రోజులుగా పెద్ద మొత్తాలు జమ అవడం, మళ్లీ విత్‌డ్రా అవుతుండడంతో రైతు అబ్రహాం శుక్రవారం పత్రికలకు సమాచారమిచ్చిన విషయం విదితమే. తన మొబైల్‌కు వచ్చిన మెసేజ్‌ల ప్రకారం ల్యాన్‌కో నుంచి జమ అయినట్లు ఉన్నాయని రైతు చెప్పారు. దీనిపై ఆ కంపెనీ ఎండీ స్పందిస్తూ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. -
రూ.కోటి జమ.. వెంటనే విత్‌డ్రా
-
రూ.కోటి జమ.. వెంటనే విత్‌డ్రా
► రైతు ఖాతాలో ఈ నెల 24 నుంచి రోజూ సాగుతున్న తంతు ► ఈ మేరకు రైతు మొబైల్‌కు రోజూ మెసేజ్‌ల పరంపర ► కర్నూలు జిల్లా పెద్దకడబూరులో ఘటన ఎమ్మిగనూరు రూరల్: ఓ రైతు ఖాతాలో అతని అనుమతి లేకుండానే రూ.కోటి జమ అవుతూ.. డ్రా అవుతున్న చిత్రమిది.. ఈ నెల 24వ తేదీ నుంచి ఈ తంతు కొనసాగుతోంది. రైతు ఖాతాలో డబ్బులు జమవుతున్నట్టు.. అలాగే డ్రా అవుతున్నట్టుగా మొబైల్ నంబర్‌కు మెసేజ్‌లు వస్తున్నాయి. దీంతో భయపడిన ఆ రైతు విషయాన్ని శుక్రవారం రాత్రి మీడియాకు వెల్లడించారు.ఆ వివరాలిలా ఉన్నాయి... కర్నూలు జిల్లా పెద్దకడబూరు గ్రామానికి చెందిన అబ్రహం అనే రైతుకు అక్కడే ఆంధ్రా ప్రగతి గ్రామీణ బ్యాంక్‌లో ఖాతా ఉంది. ఇతని బ్యాంక్ అకౌంట్లో ఈ నెల 24వ తేదీ నుంచి రోజూ భారీమొత్తంలో నగదు జమ అయి.. విత్‌డ్రా అవుతున్నట్టుగా అతని సెల్‌కు మెసేజ్‌లు వస్తున్నాయి. వాటిని చూసి భయపడిన అబ్రహం.. తనకు తెలిసిన వ్యక్తి అయిన ఎమ్మిగనూరుకు చెందిన మల్లెల ఆల్ఫ్రెడ్రాజుకు శుక్రవారం రాత్రి తెలిపాడు. దీంతో ఆల్ఫ్రెడ్రాజు.. ఈ విషయాన్ని విలేకరులకు తెలియజేశారు. రైతు సెల్ నంబర్ 9989050379కు వస్తున్న మెసేజ్‌లను చూపించారు. ఇప్పటివరకు 68 మెసేజ్‌లు వచ్చాయన్నారు. 30వ తేదీ ఉదయం 11.24కు రూ.1,96,07926 జమ అయినట్లు.. సాయంత్రం 5.44కు రూ.1,33,48781 డ్రా అయినట్లు సెల్‌కు వచ్చిన మెసేజ్‌ను చూపించారు. ఈ నగదు ల్యాన్ కో అమర్ కంటక్ పవర్ లిమిటెడ్ పేరున అబ్రహం అకౌంట్లో జమవుతోంది. ఈ భారీ మోసంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాల్సిన అవసరముంది.