beach
-
సినిమాటోగ్రాఫర్ పెళ్లికి హాజరైన స్టార్ హీరో కార్తీ (ఫోటోలు)
-
విశాఖ : వెనక్కి వెళ్లిన సముద్రం ...ఆర్.కె బీచ్ లో సండే సందడి (ఫొటోలు)
-
సముద్రం ఒడ్డున రాళ్లు ఏరుతున్నారా.. వద్దొద్దు!
పిల్లలూ! మీరెప్పుడైనా సరదాగా సముద్రం చూసేందుకు వెళితే ఏం చేస్తారు? అక్కడ ఒడ్డున ఉన్న రాళ్లను ఏరుకుంటారు. వాటిని మీతోపాటు తెచ్చుకొని దాచుకుంటారు. నలుపు, తెలుపు రంగుల్లో నునుపుగా ఉండే ఆ రాళ్లు చూసేందుకు ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. వాటిని ఇంట్లో పెట్టుకొని మురిసి΄ోతుంటారు. అయితే ఇకపై ఆ పని చేయొద్దు. ఎందుకో తెలుసా?సముద్రంలో నిత్యం ఉవ్వెత్తున అలలు ఎగిసి పడుతుంటాయన్న విషయం మీకు తెలుసు కదా! ఆ అల్లు తాకిడికి తీరం కొట్టుకు΄ోకుండా రక్షించేది ఈ రాళ్లే. ఒడ్డున అందరూ ఆనందంగా ఉండాలన్నా, సముద్రం అలలు మన మీద ఉధృతంగా పడిపోకుండా ఉండాలన్నా ఈ రాళ్లు రక్షణ కవచాలుగా నిలబడతాయి. మీరు ఈ రాళ్లను మీతోపాటు తెచ్చుకుంటే ఆ రక్షణ వ్యవస్థ దెబ్బతింటుంది. దాంతో అలలు తీరాన్ని కోసుకుంటూ వెళ్లిపోతాయి. దానివల్ల ఎంతో నష్టం జరుగుతుంది. మేమొక్కరం కొన్ని రాళ్లు తెచ్చుకుంటే నిజంగా ఇంత సమస్య వస్తుందా అని అనుకోవద్దు. మీరొక్కరే కాకుండా నిత్యం ఎంతోమంది సముద్రం చూసేందుకు వస్తారు. వారంతా మీలాగే ఆలోచించి తలా ఒక రాయి తీసుకొని వెళితే నష్టం తప్పక జరుగుతుంది. అందుకే ఉత్తర ఇంగ్లండ్‌లోని కంబర్‌ల్యాండ్ కౌన్సిల్ ప్రాంతంలో కొత్తగా ఒక చట్టం తీసుకొచ్చారు. ఎవరైనా సముద్రం ఒడ్డున రాళ్లు ఏరి, తీసుకెళ్తున్నట్టు తెలిస్తే వాళ్లకు 100 పౌండ్లు(సుమారు రూ.10 వేలు) జరిమానా విధిస్తారు. ఇదంతా సముద్రాన్ని, చుట్టూ ఉన్న తీరు ప్రాంతాన్ని కాపాడటం కోసమే! మన దేశంలో అలా రాళ్లు ఏరినందుకు ఎవరూ జరిమానా వేయరు. కానీ సముద్రం చుట్టూ ఉన్న ప్రాంతానికి హాని కలగకుండా ఉండాలంటే మనమే సొంతంగా ఆ పని మానేయాలి. సముద్రం ఒడ్డున హాయిగా పరుగులు పెడుతూ, సముద్రం అలల్ని చూస్తూ గడపాలి.. కావాలంటే ఆ రాళ్లతో అక్కడే ఆడుకోవాలి తప్ప వాటిని ఏరుకొని ఇంటికి తీసుకురాకూడదు. తెలిసిందా! ఇదీ చదవండి: US Air Crash: పెళ్లి కావాల్సిన పైలట్, ఒక్కొక్కరిదీ ఒక్కో విషాదం! US air crash: భారతీయ యువతి లాస్ట్ మెసేజ్ భర్త కన్నీరుమున్నీరు -
ఫ్రెండ్స్‌తో థాయ్‌లాండ్ బీచ్‌లో చిల్ అవుతున్న హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి (ఫోటోలు)
-
కాస్ట్లీ కారు లాగుతున్న ఎద్దులు
-
ఫ్యామిలీతో అనసూయ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. బీచ్‌లో చిల్ అవుతూ!
-
సారా టెండూల్కర్ స్టన్నింగ్ లుక్స్.. హీరోయిన్స్‌ను మించి(ఫోటోలు)
-
భయపెడుతున్న విశాఖ సముద్రం
-
వైరల్ అవుతున్న నటి వరలక్ష్మి బీచ్ వెడ్డింగ్ ఫొటోలు
-
బీచ్ ఒడ్డున దీప్తి సునైనా అందాల వల.. పడిపోతారేమో జాగ్రత్త!? (ఫొటోలు)
-
Laya Gorty : నటి లయ బర్త్ డే సెలబ్రేషన్స్ బీచ్‌లో రొమాంటిక్‌గా.. ఫోటోలు చూశారా..? (ఫోటోలు)
-
బీచ్‌లో ప్రియుడు గౌతమ్‌తో రచ్చచేస్తున్న బిగ్ బాస్ 'ఇనయా సుల్తానా' (ఫోటోలు)
-
Akhila Bhargavan: సముద్రతీరంలో మలయాళ బ్యూటీ అందాలు.. ఫోటోలు
-
విశాఖపట్నం బీచ్‌లో ఫ్రెండ్షిప్ డే సందడి (ఫొటోలు)
-
Somalia: బీచ్‌లో ఆడుతున్నవారిపై తూటాలు..32 మంది మృతి
సోమాలియాలో ఘోరం చోటుచేసుకుంది. సముద్రతీరంలో ఎగిసిపడుతున్న కెరటాలతో ఉత్సాహంగా ఆడుకుంటున్న వారిపైకి ముష్కరుల తుపాకీ గుళ్లు దూసుకెళ్లాయి. ఈ ఘటనలో 32మంది మృతి చెందారు.సోమాలియా రాజధాని మొగదిషులోని రద్దీగా ఉన్న బీచ్‌లో అల్-షబాబ్ ఆత్మాహుతి బాంబర్లు అకస్మాత్తుగా దాడికి పాల్పడి, 32 మందిని పొట్టనపెట్టుకున్నారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. ఇటీవల జరిగిన అత్యంత దారుణమైన దాడుల్లో ఇదొకటని పోలీసులు అన్నారు. అల్-ఖైదాతో సంబంధం కలిగిన జిహాదీలు గత కొన్నేళ్లుగా ఫెడరల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. వారు తాజాగా లిడో బీచ్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డారు. కొద్దిక్షణాల్లోనే ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఆన్లైన్లో ప్రత్యక్షమయ్యాయి.బీచ్‌లో కాల్పులు జరిగినట్లు సమాచారం అందగానే భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సోమాలి నేషనల్ న్యూస్ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం దాడి చేసినవారిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. లిడో బీచ్‌లో గతంలోనూ అల్-షబాబ్‌తో సంబంధం కలిగిన ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. నాటి దాడిలో తొమ్మిది మంది మృతిచెందారు. -
బీచ్‌లో ఆత్మాహుతి దాడి.. 32 మంది మృతి
మొగదీషు: సోమాలియాలో ఉగ్రవాదులు మళ్లీ పంజా విసిరారు. వీకెండ్ ఎంజాయ్ చేసేందుకు రాజధాని మొగదీషులోని లిడో బీచ్‌కు వచ్చిన వారిని లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడ్డారు. బీచ్ హోటల్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పులు, పేలుడులో మొత్తం 32 మంది మృతిచెందగా మరో 63 మంది గాయపడ్డారు. మొగదీషులోని బీచ్‌లోని ఓ హోటల్లోకి చొరబడ్డ ఉగ్రవాదులు తొలుత కాల్పులు జరిపి అక్కడున్నవారిని భయభ్రాంతులకు గురి చేశారు. అనంతరం ఉగ్రవాదుల్లో ఒకరు తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ పేలుడులో చాలా మంది చనిపోయారు. పేలుడు తీవ్రతకు బీచ్‌లో మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఉగ్రవాదుల దాడి సమాచారమందుకున్న భద్రతా సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని ముగ్గురు ఉగ్రవాదులను అంతమొందించారు. మరో ఉగ్రవాదిని ప్రాణాలతో పట్టుకున్నారు. ఈ దాడికి పాల్పడింది తామేనని అల్‌ఖైదాతో సంబంధాలున్న అల్ షబాబ్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. -
నీట మునిగిన యానాం
-
సంగీతాన్ని నమ్ముకున్న పోలీసులు..
ఫిన్లండ్ తీరనగరం ఎస్పో బీచ్‌లో యువతీ యువకులు తరచు గోలగోలగా పార్టీలు చేసుకోవడం, ఆగడాలకు పాల్పడటం, బీచ్‌కు వచ్చే సాధారణ జనాలతో దురుసుగా ప్రవర్తించడం కొంతకాలంగా సమస్యగా ఉంటూ వచ్చింది. అదుపులేని యువత తరచుగా ఆగడాలకు పాల్పడుతుండటం అక్కడి పోలీసులకు తలనొప్పిగా మారింది.ఫిర్యాదులు వచ్చిప్పుడల్లా నిందితులను నిర్బంధంలోకి తీసుకోవడం, వారి మీద కేసులు పెట్టడం వంటి చర్యలు చేపడుతున్నా, వాటి వల్ల పెద్దగా ఫలితాలు కనిపించలేదు. ఆకతాయి యువతను బీచ్‌కు దూరంగా ఉంచడానికి ఏదో ఒకటి చేయాలని, సాధారణ ప్రజలు బీచ్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంచరించే వాతావరణం కల్పించాలని పోలీసులు నిశ్చయించుకున్నారు.అయితే, వారు మన పోలీసుల మాదిరిగా లాఠీలను నమ్ముకోలేదు, సంగీతాన్ని నమ్ముకున్నారు. పాప్, ర్యాప్లాంటి హోరెత్తించే సంగీతాన్ని ఇష్టపడే యువతకు శాస్త్రీయ సంగీతం అంటే సరిపడదని తెలివైన పోలీసు అధికారి ఒకరు గుర్తించారు.ప్రయోగాత్మకంగా బీచ్‌లో జనాలు ఎక్కువగా గుమిగూడే ప్రతిచోటా లౌడ్స్పీకర్లు ఏర్పాటు చేసి, శాస్త్రీయ సంగీతాన్ని వినిపించడం మొదలుపెట్టారు. శాస్త్రీయ సంగీతం ధాటికి ఆకతాయి యువత క్రమంగా బీచ్‌వైపు రావడం మానుకున్నారు. పోలీసుల సంగీతం చిట్కా ఫలించడంతో ఎస్పో నగరవాసులూ ఊపిరి పీల్చుకుంటున్నారు.ఇవి చదవండి: ఈ వింతజీవి గురించి మేరెప్పుడైనా విన్నారా..!? -
బ్యూటీఫుల్ ఫాదర్ అండ్ డాటర్
ఆటవిడుపులో భాగంగా సెలబ్రిటీలు కుటుంబంతో గడిపే సంతోష సమయాలు వారికి మాత్రమే పరిమితమైనవి కాదు. అభిమానులకు కూడా సంతోషం కలిగిస్తాయి. ‘క్రికెటర్‌గా రోహిత్‌శర్మ ఏమిటి?’ అని చెప్పడానికి బోలెడు సమాచారం ఉంది. ‘తండ్రిగా రోహిత్ ఏమిటి?’ అని చెప్పడానికి ఈ వైరల్ ఫొటో ఒక్కటి చాలు. ‘ఫాదర్స్ డే’ సందర్బంగా నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. సముద్రపు ఒడ్డున తన కూతురు సమైరతో కలిసి రోహిత్‌శర్మ ఇసుకలో పిచ్చుక గూడు కడుతున్న ఫొటో ‘ఆహా’ అనిపిస్తోంది. ఈ ఫొటోకు ‘ఫ్యామిలీ టైమ్ ఈజ్ ది బెస్ట్ టైమ్’ అని కాప్షన్ ఇచ్చారు నెటిజనులు.‘ది ఫాదర్, ది కెప్టెన్, ది హిట్‌మ్యాన్, ది భయ్యా, ది ఓపెనర్’ అని ఒక యూజర్ కామెంట్ పెట్టాడు.మరో యూజర్ ‘బ్యూటీఫుల్ డాటర్ అండ్ ఫాదర్. లవ్ యూ మై మ్యాన్’ అని కామెంట్ పెట్టాడు. -
USA: కూతురితో కలిసి ఇసుక గూళ్లు కట్టిన రోహిత్ శర్మ (ఫొటోలు)
-
వర్కలా బాయ్స్
ఇటీవల ‘ముంజమ్మల్ బాయ్స్’ సినిమా పెద్ద హిట్ అయ్యింది. బిలంలో పడ్డ స్నేహితుణ్ణి బయటకు లాగడం కథ. ఇక్కడ మనం ‘వర్కలా బాయ్స్’ని చూడొచ్చు. కర్నాటక నుంచి కేరళ విహారానికి వచ్చిన ఒక మహిళ వర్కలా బీచ్‌లో ఫోన్ జారవిడిచింది. అది అక్కడి రాళ్ల కింద చాలా లోతులో పడింది. అసలే అది ఐఫోన్. ఇంకేముంది వర్కలా అగ్నిమాపక దళం రంగంలోకి దిగింది. 7 గంటలు శ్రమించాక... ఏమైంది?విహారంలో అపశృతులు దొర్లితే మనసు పాడవుతుంది. కర్నాటక నుంచి కేరళలోని వర్కలాకు విహారానికి వచ్చిన ఒక మహిళ అక్కడి బ్లాక్ బీచ్‌లో ఉండగా పొరపాటున ఫోన్ జారింది. అది రాళ్ల కట్ట ఉన్న బీచ్. ఫోన్ రాళ్ల సందులో నుంచి లోపలికి పడిపోయింది. లక్షన్నర రూపాయల విలువ చేసే ఐఫోన్. వెంటనే ఆమె బస చేసిన హోటల్ సిబ్బంది, వర్కలా అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. రాళ్లు తొలగించి ఫోన్ తీసే వీలు లేదు. తాడుతో తీగతో బయటకు లాగడం కూడా కష్టమైంది. దానికితోడు బీచ్‌లో భారీ అలలు, వాన పనికి అంతరాయం కలిగించాయి. దాంతో మరుసటి రోజు ఉదయం వచ్చి సుమారు ఏడు గంటలు కష్టపడి ఆ ఫోన్‌ని వెలికి తీశారు. అమ్మయ్య. కథ సుఖాంతం అయ్యింది. సుఖాంతం సంతోషమే కదా ఇస్తుంది. మంజుమ్మల్ బాయ్స్‌లో కూడా కథ సుఖాంతం కావడం వల్లే అది అంత పెద్ద హిట్ అయ్యిందని అనుకోవచ్చా? -
ఒడిషాలోని బీచ్‌ల గురించి తెలిస్తే.. ఇపుడే ‘ఛలో’ అంటారు
బీచ్‌లు అనగానే మనకు సాధారణంగా గోవా, వైజాగ్ లాంటి ప్రదేశాలు ప్రధానంగా గుర్తుకు వస్తాయి. కానీ భారతదేశానికి తూర్పున ఉన్న రాష్ట్రం, 480 కి.మీ పొడవైన అందమైన తీర ప్రాంతం ఉన్న ఒడిషా కూడా అందమైన బీచ్‌లకు ప్రకృతి రమణీయ దృశ్యాలకు నిలయం. అందమైన తీరప్రాంతం, పురాతన దేవాలయాలు, గిరిజన సంస్కృతి ,వన్యప్రాణుల అభయా రణ్యాలున్నాయి ఇక్కడ. ఓడిషాలోని 7 అందమైన బీచ్‌ల గురించి తెలుసుకుందాం.<Odisha beaches are underrated. pic.twitter.com/ac50CVe6xC— Indian Tech & Infra (@IndianTechGuide) May 21, 2024 1. పూరి బీచ్ఒడిశాలోని అత్యంత ప్రసిద్ధ బీచ్‌లలో ఒకటి పూరీ బీచ్. బీచ్ ప్రేమికులు ,ఆధ్యాత్మిక అన్వేషకులు ఒడిషాలో దీన్ని టాప్ బీచ్‌గా భావిస్తారు. సముద్ర తీరం, గోల్డెన్ ఇసుక ఇక్కడి ప్రత్యేకం. అంతేకాదు అద్భుతమైన సూర్యోదయాలు ,సూర్యాస్తమయ దృశ్యాలను అస్సలు మిస్ కాకూడదు. సమీపంలోని జగన్నాథ ఆలయం మరో పెద్ద ఆకర్షణ.And early morning vibe is damn good in Odisha ⛱️ .❤️❤️#odisha#beaches #indiasbestkeptsecret #JaiJagannatha #Konark pic.twitter.com/HgnTriP7hZ— Adarsh Jyoti (@AdarshJyoti1) May 21, 20242. అస్తరంగ బీచ్పూరీ నగరానికి దగ్గరగా ఉన్న మరో బీచ్, అస్తరంగ బీచ్. ప్రశాంత వాతావరణం, ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందింది. చుట్టూ పెద్దగా ఫిషింగ్ కమ్యూనిటీలు ఉన్నాయి. ఈ బీచ్ పక్షులను వీక్షించడానికి బాగా ఇష్టపడే ప్రదేశం.పర్యాటకులు అక్కడ వివిధ రకాల వలస పక్షుల జాతులను చూడ్డానికి వస్తారు.3 ఉన్నట్టుండి మాయమయ్యే చాందీపూర్ బీచ్ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఉన్న చాందీపూర్ బీచ్ దేశంలోనే అరుదైన బీచ్‌గా ప్రత్యేక గుర్తింపు సాధించింది. బాలాసోర్ రైల్వే స్టేషన్ నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ బీచ్ చూడటానికి ఇతర బీచ్‌ల మాదిరే. కానీ నమ్మడానికి ఒకింత ఆశ్చర్యంగా అనిపించినా ఈ బీచ్ అకస్మాత్తుగా మాయమైపోతుందిట. ఈ బీచ్‌లో భారీ అలలు ఆటుపోట్లకు గురైనప్పుడు సముద్రపు నీరు సుమారు 5 కిలోమీటర్ల దూరం వెనక్కి వెళ్లిపోతుంది. దీంతో అది అక్కడికి వచ్చేవారిని సంభ్రమాశ్చర్యంలో ముంచెత్తుతుంది. మనం చూస్తున్నంత సేపు కనిపించిన సముద్రం ఉన్నట్టుండి ఒక్కసారిగా కనపడకుండా పోతుండటం విశేషం. మోనాజైట్ , టైటానియం అధికంగా ఉండే నల్ల ఇసుక, సరుగుడు చెట్లతో నిండి ఉంటుంది. ముఖ్యంగా పిక్నిక్లు పక్షులను చూడటం ఇష్టపడేవారికి ఇది బెస్ట్ ఆప్షన్.4. గోపాల్పూర్ బీచ్ఒడిశాలోని దక్షిణ భాగంలో ఉన్న గోపాల్పూర్ బీచ్. ప్రశాంతత, ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందింది. తెల్లటి ఇసుక, కొబ్బరి చెట్లతో గోపాల్పూర్ బీచ్ ఒడిషాలో సందర్శించడానికి ఉత్తమమైన బీచ్‌లలో ఒకటి. ఇక్కడ ఈత కొట్టవచ్చు, చేపలు పట్టవచ్చు.అందుకే ఇది చాలా పాపులర్ అయింది. ఇక్కడ నౌకాశ్రయం కూడా ఉంది.5. రాంచండీ బీచ్, కోణార్క్కోణార్క్ పట్టణానికి దగ్గరగా ఉన్న రాంచండి బీచ్ . UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశం గుర్తింపు పొందిన కోణార్క్ సూర్య దేవాలయానికి ఆనుకొని ఉన్నందున బీచ్ అందాలతోపాటు, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతకు కూడా ప్రసిద్ధి చెందింది. ఈబీచ్ వద్ద ఈత, సన్‌బాత్, బోటింగ్ ఫిషింగ్ లాంటివి ఇక్కడ ఎంజాయ్ చేయవచ్చు.6. బలిఘై బీచ్, పూరిపూరీ నగరానికి దగ్గరగా ఉన్న బలిఘై బీచ్ స్పష్టమైన నీలి జలాలకు ప్రసిద్ధి. చుట్టూ పచ్చని అడవులు, బంగాళాఖాతం యొక్క ఉత్కంఠభరితమైన దృశ్యాలను అందిస్తుంది. ఒంటె , గుర్రపు స్వారీలతోపాటు, బీచ్‌లో తాజా సీఫుడ్ , ప్రాంతీయ వంటకాలను విక్రయించే అనేక చిన్న ఫుడ్ సెంటర్లలో ఆస్వాదించవచ్చు.7. తలసరి బీచ్తలసరి పేరు రెండు ఒడియా పదాలైన తల ( పామ్ లేదా తాటి)సరి(వరుస) నుండి వచ్చింది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న తాటి చెట్లు ఎక్కువ ఉండటం వల్లే ఈ పేరు వచ్చిందని చెబుతారు. తాలా అనే పదానికి లయ అని కూడా అర్థం, ఇది తీరానికి వ్యతిరేకంగా వచ్చే సముద్రపు అలలలో ప్రతిబింబిస్తుందని భావిస్తారు.సువర్ణరేఖ నది తలసరి బీచ్ ఆకర్షణను రెట్టింపుచేస్తుంది. దీనితోటు ఇసుక దిబ్బలు, ఎర్ర పీతలు ఆరో ఆకర్షణ. ఈ బీచ్‌కు సమీపంలో ఉన్న బిచిత్రపూర్లోని ఫిషింగ్ పల్లెలు, మడ చెట్లు టూరిస్టులను ఆకర్షిస్తాయి. -
Tejaswini Gowda: సముద్రతీరాన ఏంజెల్లా తేజస్విని (ఫోటోలు)
-
Klin Kaara Beach Photos: క్లీంకారకు బీచ్‌ని పరిచయం చేసిన రామ్‌చరణ్.. ఫొటోలు వైరల్
-
మహాబలిపురం బీచ్‌లో తెలుగు విద్యార్థుల గల్లంతు
-
ఆ దీవి భూతల స్వరం! సకల ప్రకృతి..
ప్రకృతి వైవిధ్యమంతా ఆ దీవిలో ఒకేచోట కనువిందు చేస్తుంది. అందుకే పర్యాటక నిపుణులు ఆ దీవిని ‘ప్యారడైజ్ ఆన్ ఎర్త్’ అని అభివర్ణిస్తున్నారు. ‘ఇలా దాస్ ఫ్లోరిస్’ అనే ఈ దీవి పోర్చుగల్‌లో ఉంది. ఈ దీవిలో అందమైన బీచ్‌లు మాత్రమే కాదు, సహజమైన సరోవరాలు, జలపాతాలు, కొండలు, కోనలు, వాగులు, వంకలు చుట్టూ పచ్చగా కనిపించే దట్టమైన వనాలు ఇట్టే ఆకట్టుకుంటాయి. గుత్తులు గుత్తులుగా రంగు రంగుల పూలతో అలరారే అపురూపమైన ‘హైడ్రేంజ’ మొక్కలు ఈ దీవిలో విరివిగా ఉండటంతో ఈ దీవికి ‘ఇలా దాస్ ఫ్లోరిస్’– అంటే పూలదీవి అనే పేరువచ్చింది. ఈ దీవి తీరంలో డాల్ఫిన్లు విరివిగా కనిపిస్తాయి. ఈతకొడుతూ సేదదీరాలనుకునే వారికి, కొండలపై ట్రెక్కింగ్ చేయాలనుకునే వారికి ఈ దీవి అనువుగా ఉంటుంది. ఈ దీవిలో జనాల సందడి చాలా తక్కువ. చాలా చోట్ల ఖాళీగా మిగిలిన ఊళ్లు, ఆ ఊళ్లలోని పాతకాలం ఇళ్లు కనిపిస్తాయి. ఈ దీవికి వెళ్లే పర్యాటకులు కొందరు ఖాళీ ఊళ్లలో ఖాళీగా మిగిలిన పాత ఇళ్లనే శుభ్రం చేసుకుని తాత్కాలికంగా బస చేస్తుంటారు. పర్యాటకుల రాక ఇటీవలి కాలంలో పెరుగుతుండటంతో పోర్చుగల్ ప్రభుత్వం ఇక్కడ ఖాళీగా మిగిలిన ఊళ్లలోని ఇళ్లకు మరమ్మతులు జరిపి, వాటిని కాటేజీలుగా మార్చి పర్యాటకులకు అద్దెకు ఇవ్వడం ప్రారంభించింది. ‘ఫోర్బ్స్’ పత్రిక ఈ దీవిని యూరోప్‌లో వెలుగుచూడని రత్నాలలో ఒకటిగా అభివర్ణించడం విశేషం. (చదవండి: దశకుంచెల చిత్రకారుడు! ఏకకాలంలో రెండు చేతులతో..) -
#Lakshadweep : ప్రకృతి చెక్కిన ‘అందాలు’.. లక్షదీప్ చూసొద్దామా.. (ఫొటోలు)
-
#Maldives : బుల్లి దేశం.. మంత్రముగ్ధం.. మాల్దీవులు (ఫొటోలు)
-
భారతదేశంలోని అంత ప్రసిద్ధి కాని కొన్ని అందమైన బీచ్‌లు (ఫొటోలు)
-
లక్షద్వీప్ అందాలకు ప్రధాని మోదీ ఫిదా
-
Change Is Us: ఒడ్డును.. ఒడ్డున పడేస్తారు
పర్యావరణ పరిరక్షణ బాధ్యత మొన్న జనవరి 1 వేడుకలు. లక్షలాది మంది ముంబై బీచుల్లో చేరి ఎంజాయ్ చేశారు. మంచిదే. లెక్కలేనంత చెత్త పారబోశారు. అందమైన సాగర తీరాలను శుభ్రంగా ఉంచాలన్న స్పృహ మనకు ఎప్పుడూ లేదు. అందుకే ముంబైలోని ‘చేంజ్ ఈజ్ అజ్’ సంస్థలోని టీనేజ్ పిల్లలే ఈ క్లీనింగ్‌కి పూనుకున్నారు. బుద్ధులు వినాల్సిన పిల్లలే పెద్దలకు బుద్ధులు చెబుతున్నారు. విందామా వారి మాట? మనిషి బావిని, చెరువును తవ్వించగలడు. సముద్రాన్ని కాదు. ఒక ప్రాంతంలో సముద్రం ఉందంటే అది ప్రకృతి ఆ ప్రాంతానికి ఇచ్చిన వరం. ఎన్ని చికాకులున్నా, ఎన్ని బాధలున్నా, ఎంత బిజీగా ఉన్నా, ఎంతో సంతోషంగా అనిపించినా అలా బీచ్‌కు వెళితే, సముద్రం ఒడ్డున కూచుంటే, అలల ఘోషను వింటూ, ఆ సమతల అగాధపు గాంభీర్యాన్ని కంటూ, ఎగిరే పక్షుల వల్ల, తిరిగే పడవల వల్ల, వీచే గాలుల వల్ల ఓదార్పు పొందడం ఎంత బాగుంటుంది! కాని ఆ భావాలన్నీ పేరుకున్న చెత్త వల్ల నాశనమైతే? మన దేశంలో పేద, మధ్యతరగతి వారికి ఖర్చులేని కాలక్షేపం బీచ్. దానికి కూడా వెళ్లలేనంతగా వాటిని గలీజ్ చేస్తే? అలా చేసేంత దుర్గుణం మనుషులకే ఉంది. దానికి జవాబు యువత దగ్గర ఉంది. ఛేంజ్ ఈజ్ అజ్ ముంబైలో ఎంతలేదన్నా డజన్ అందమైన బీచ్‌లు ఉన్నాయి. అతి చిన్న ఇరుకు ఇళ్లలో జీవించే ముంబై జీవులు బీచ్‌లకు వచ్చే ఊపిరి పీల్చుకుంటారు. 75 ఏళ్ల కుంతీ ఓజా అనే మహిళ మూడు నాలుగేళ్ల క్రితం సోషల్ మీడియాలో ‘చిన్నప్పటి నుంచి చౌపాటి బీచ్‌కు వచ్చి ఆహ్లాదం పొందేదాన్ని. పసుపు రంగు ఇసుక చూడటం, చిరుతిళ్లు తినడం భలే ఉండేది. కాని ఇప్పుడు బీచ్ మొత్తం చెత్త. మా చిన్నప్పుడు మిగిలిన తిండి పారేసేవారు. ఇప్పుడు మొత్తం ప్లాస్టిక్ చెత్తను పారేస్తున్నారు’ అని రాసింది. ఆమె గోడు విన్నట్టుగా ఆ సమయంలోనే సీనియర్ ఇంటర్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు అక్షత్ షా, శుభ్ మెహతా పర్యావరణ విధ్వంసం గురించి స్కూల్లో, బయట వింటున్న వార్తలతో ప్రభావితం అయ్యారు. అప్పుడే అమెజాన్ అడవులు తగలబడటం వారిని కలిచి వేసింది. ‘మన వంతుగా ఏదో ఒకటి చేద్దాం’ అని సోషల్ మీడియా వేదికగా ‘ఛేంజ్ ఈజ్ అజ్’ గ్రూప్‌ను ప్రారంభించి ముంబైలోని బీచ్‌ల క్లీనింగ్‌కి నడుం కట్టారు. జూలై 2019న మొదటిసారి అక్షత్ షా, శుభ్ మెహతా జూలై, 2019లో మొదటిసారి చౌపాటి బీచ్‌ను క్లీన్ చేయడానికి సోషల్ మీడియాలో పిలుపునిచ్చినప్పుడు కేవలం 18 మంది టీనేజ్ విద్యార్థులు హాజరయ్యారు. వారంతా కలిసి బీచ్‌ను క్లీన్ చేయడం జనం వింతగా చూశారు. కాని మంచి పనికి కొత్త తరం అండ తప్పక లభిస్తుంది. క్రమం తప్పకుండా బీచ్‌లను క్లీన్ చేయడం, ఫొటోలను ప్రచారంలో పెట్టడంతో హైస్కూల్, కాలేజీ స్థాయి పిల్లలు స్పందించడం మొదలెట్టారు. తల్లిదండ్రులు కూడా ఈ మంచి పనికి అడ్డు చెప్పలేదు. ‘ఇప్పటి వరకూ మేము ముంబై బీచ్‌ల నుంచి 480 టన్నుల చెత్త పారబోశాం’ అంటారు అక్షత్ షా, శుభ్. ప్రస్తుతం అక్షత్ ముంబైలోనే ఉంటూ చదువుకుంటుంటే శుభ్ యూకేలో చదువుకుంటూ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నాడు. పాతిక వేలమంది వాలంటీర్లు ‘ఛేంజ్ ఈజ్ అజ్’ గ్రూప్ ఎంత సక్సెస్ అయ్యిందంటే ముంబై మొత్తం నుంచి 25,200 మంది విద్యార్థినీ విద్యార్థులు ఇందులో వాలంటీర్లుగా చేరారు. బీచ్‌ల శుభ్రత గురించి ఛేంజ్ ఈజ్ అజ్ సభ్యులు స్కూళ్లు, కాలేజీలకు తిరిగి ప్రచారం చేయడం వల్ల కూడా ఈ చేరిక సాధ్యమైంది. వీరంతా తమకు వీలున్నప్పుడల్లా ముంబైలోని బీచ్‌లను శుభ్రం చేస్తుంటారు. ముఖ్యంగా పండగలప్పుడు, డిసెంబర్ 31 వంటి సందర్భాల్లో వీరి పని ఎక్కువగా ఉంటుంది. మన దేశంలో బీచ్‌లు టూరిస్ట్ అట్రాక్షన్ కూడా. పట్టణ, నగర సంస్థలు బీచ్‌ల శుభ్రత కోసం ఎంతోకొంత నిధులు వెచ్చిస్తున్నా నిరంతర అలల్లాగే నిరంతరం చెత్త పడుతూనే ఉంటుంది. అందుకే ఇటు బంగాళాఖాతం, అటు అరేబియా సముద్రం... తీరాల పొడవునా బీచ్‌లను శుభ్రం చేయడానికి విద్యార్థినీ విద్యార్థులు నడుం బిగించాలి. వారు కదిలితే పెద్దలూ కదులుతారు. -
తీరానికి కొట్టుకొచ్చిన వింత మెటల్ షీట్లు
న్యూయార్క్: అమెరికా తూర్పు తీరానికి వింత మెటల్ షీట్లు కొట్టుకువచ్చాయి. మెటల్ షీట్లకు ఫైబర్ ఊడిపోయి ఉంది. కూర్చోవడానికి వీలుగా ఉన్న ఈ మెటల్ షీట్లను మొదట యాక్టర్ మాథ్యూ జాకబ్ పెర్రీ గుర్తించాడు. న్యూజెర్సీలోని మార్గేట్లోని బీచ్ వెంబడి నడుచుకుంటూ వెళుతుండగా కనుగొన్నాడు. వింతగా ఉన్న ఈ ఉనుపషీట్లను వీడియో తీసి టిక్‌టాక్ వీడియోలో పోస్టు చేశాడు. ఇది కాస్త వైరల్‌గా మారింది. మెటల్ షీట్లపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ''అవి ఏమిటో నాకు ఖచ్చితంగా తెలియలేదు. నేను మొదట చెట్టు కొమ్మ అనుకున్నాను. దగ్గరికొచ్చేసరికి మెటల్ షీట్లని అర్థమైంది. దగ్గరకు వచ్చేసరికి అవి విమానం సీట్లలాగే కనిపించాయి'' అని నటుడు జాకబ్ పీపుల్ మ్యాగజైన్‌తో అన్నారు. జాకబ్ పోస్టు చేసిన వీడియోలో తుప్పు పట్టిన మెటల్ షీట్లు ఇప్పటికీ స్ప్రింగ్‌లను కలిగి ఉన్నాయి. అప్పటికే ఫాబ్రిక్ ఊడిపోయింది. కొన్ని సీట్లు వాటి మధ్య మెటల్ హ్యాండ్‌రైల్‌ను కలిగి ఉన్నాయి. అవి విమానంలో ఉన్నట్లే ఉన్నాయి. ఈ వింత ఆకారాలపై సోషల్ మీడియోలో నెటిజన్లు విశేషంగా స్పందించారు. జూలై 17, 1996న అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయిన టీడబ్ల్యూఏ విమానం 800 శిథిలాల నుంచి సీట్లు వచ్చి ఉండవచ్చని చాలా మంది అభిప్రాయపడ్డారు. TZB 900 విమానం అని మరో నెటిజన్ అన్నారు. అసలు అవి విమానం సీట్లు కానేకావని తాను ఎయిర్‌క్రాఫ్ట్ మెకానిక్‌ని అని మరో నెటిజన్ పేర్కొన్నాడు. ఇదీ చదవండి: ఆర్కియాలజిస్టులకు అప్పగించిన ఆర్మీ -
బ్లూ సీ డ్రాగన్! అందంగా ఉందని టచ్ చేస్తే అంతే!
బ్లూసీ డ్రాగన్లు(గ్లాకస్ అట్లాంకస్) ఒక రకమైన సముద్రపు జీవి. ఇది చెన్నైలోని బీసెంట్ నగర్‌లోని బీచ్ తీరానికి సమీపంలో కనిపించాయి. ఇవి చూడటానికి నీలిరంగులో ఉండి వింతగా ఉంటాయి. చూస్తే పట్టుకోవాలనిపిస్తునంది. కానీ టచ్ చేశారో ఇక అంతే. చెన్నైని మిచౌంగ్ తుపాను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఈ తుపాను బీభత్సానికి బీచ్‌కి కొట్టుకొచ్చి ఉండవచ్చని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎక్కువుగా సముద్రం ఉపరితలంపైనే సంచరిస్తాయి. ఇవి చాలా విషపూరితమైనవని. ఇది కుట్టిందంటే చాలా విపరీతమైన నొప్పి వస్తుందని, ఒక్కోసారి ప్రాణాంతకం కూడా మారుతుందని అంటున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా పంచుకున్నారు. మొట్టమొదటిసారిగా ఎన్విరాన్మెంటలిస్ట్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన వత్సన్ రామ్‌కుమార్ ఈ జీవులను బీచ్‌లో గుర్తించారు. బీసెంట్ నగరంలోని బ్రోకెన్ బ్రిడ్జి సమీపంలో ఈ బ్లూసీ డ్రాగన్ సముహాన్ని చూసినట్లు తెలిపారు. అక్కడే కొందరూ వీటి కారణంగా బాధతో విలవిల లాడి ఉన్నారని, మరికొందరు ఇసుకలో చనిపోయిన ఉండటాన్నికూడా చూసినట్లు వెల్లడించారు వత్సన్. ఇవి సముద్రంలో కనిపించడం చాలా అరుదని, ఉప్పెన లేదా తుపాను సమయాల్లోనే ఒడ్డుకు నెట్టబడటంతో కనిపించడం జరుగుతుందని శాస్త్రవేత్త కిజాకుడన్ అన్నారు. ఈ నీలిరంగు డ్రాగన్ విషపూరితమైనవని, బీచ్‌ల వద్దకు వచ్చేవాళ్లకు ఇవి ప్రమాదం కలిగిస్తాయని అన్నారు. అంతేగాదు బీచ్‌ల వద్ద ఇవి కనిపిస్తే టచ్ చేయొద్దని హెచ్చరించారు కూడా. ఈ బ్లూ సీ డ్రాగన్(నీలిరంగు డ్రాగన్)ని పోర్చుగీస్ మ్యాన్ ఓ వార్ (ఫిసాలియా ఫిసాలిస్), మ్యాన్-ఆఫ్-వార్ అని కూడా పిలుస్తారని అన్నారు. ఇది ప్రధానంగా పసిఫిక్ మహాసముద్రంలో కనిపించే పసిఫిక్ మ్యాన్ ఓ' వార్ లేదా బ్లూబాటిల్ జాతిగా పరిగణిస్తారని చెప్పారు. ఇది ఫిసాలియా జాతికి చెందిన ఏకైక జాతి అని శాస్త్రవేత్త కిజాకుడన్ వెల్లడించారు. (చదవండి: ఉత్తమ ఆహార నగరాల జాబితాలో చోటు దక్కించుకున్న ఐదు భారత నగరాలు ఇవే!) -
అక్క ఇంగ్లీష్ కి ఫిదా అవ్వాల్సిందే !
-
Video: తీరానికి కొట్టుకొచ్చిన వేలాది చేపలు
టోక్యో: ఉత్తర జపాన్ బీచ్‌లో వేలాది చేపలు మృతి చెందాయి. జపాన్ ఉత్తర ద్వీపం హక్కైడోలోని హకోడేట్లో వేలాది చేపలు ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. సముద్ర కెరటాలను కమ్మేసిన మృతి చెందిన చేపలు చూసిన అధికారులను దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఆ చేపలను తినకూడదని స్థానికులకు తెలిపారు. చేపల మరణానికి కచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ ఫుకుషిమా అణు కర్మాగారం నుంచి విడుదలైన రేడియోధార్మిక పదార్థాలతో కూడిన నీటిని విడుదల చేయడమే కారణమని స్థానికులు భావిస్తున్నారు. Massive number of dead fish washing up along the coast of northern Japan pic.twitter.com/xeCn4yv5xB— DeepCoverPatriot☦️ (@samuelculper3rd) December 7, 2023 ఈ ఏడాది అక్టోబర్‌లో జపాన్ ఫుకుషిమా అణు కర్మాగారం నుండి మురుగునీటిని విడుదల చేసింది. ఈ చర్యను చైనా ఖండించింది. 2011 నుండి సేకరించబడిన 1.34 మిలియన్ టన్నుల మురుగునీటిలో కొంత భాగాన్ని పసిఫిక్‌లోకి జపాన్ మొదటిసారి ఆగష్టు 24న విడుదల చేసింది. మార్చి 2011లో సంభవించిన భూకంపం, సునామీ కారణంగా ఫుకుషిమా పవర్ ప్లాంట్ ధ్వంసమైన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: Nicolas Puech: సంరక్షకుడికి రూ. 91 వేల కోట్ల ఆస్తి -
విశాఖ ప్రమాదంలో కొత్త కోణం.. యూట్యూబర్ ఎక్కడ?
Updates.. ►విశాఖపట్నంలో ఫిషింగ్ హార్బర్లో బోట్లు దగ్ధమైన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో బాధితులను ఆదుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రమాదంపై లోతైన దర్యాప్తు జరిపి కారణాలు వెలికి తీయాలని ఆదేశించారు. మంత్రి సీదిరి అప్పలరాజును ఘటనాస్థలానికి వెళ్లాలని సూచించారు. బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు అండగా ఉండాలని, తగిన విధంగా వారికి సహాయం చేయాలని వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ►సీఎం జగన్ ఆదేశాలతో ఘటనా స్థలానికి బయలుదేరిన మంత్రి సీదిరి అప్పలరాజు. ►విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాద ఘటనలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. అగ్ని ప్రమాద ఘటన సందర్బంగా ఓ యూట్యూబర్ అక్కడ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో, సదరు యూట్యూబర్‌పై పోలీసులు కేసు నమోదు చేయనున్నట్టు తెలిపారు. రాత్రి ఫిషింగ్ హార్బర్లో పార్టీ ఏర్పాటు చేసిన యూట్యూబర్. పార్టీలో మద్యం మత్తులో గొడవ జరిగినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో, పరారీలో ఉన్న యూట్యూబర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ►విశాఖపట్నంంలోని ఫిషింగ్ హార్బర్లో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి ఓ బోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంలో 30కి పైగా బోట్లు కాలిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు. ►ఇక, సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. ఈ అగ్నిప్రమాదంలో 40కి పైగా బోట్లు కాలిపోయాయని స్థానికులు చెబుతున్నారు. ఎగిసిపడుతున్న మంటలను అధికారులు మెరైన్ బోట్లు ద్వారా అదుపులోకి తెచ్చారు. బోట్లలో నిద్రిస్తున్న వారు మంటల్లో చిక్కుకుని ఉన్నారేమో అని కార్మికులు తొలుత అనుమానించారు. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక, ఇది ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కావాలనే చేశారని స్థానికులు అనుమానిస్తున్నారు. అగ్ని ప్రమాదం కారణంగా బోట్ల యజమానులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ►మరోవైపు.. విశాఖ ఫిషింగ్ హార్బర్లో అగ్ని ప్రమాదంపై పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనా స్థలంలో వివరాలను పోలీసు కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. ప్రమాదవశాత్తు జరిగిందా? లేక ఉద్దేశపూర్వకంగా ఎవరైనా చేశారా? అన్న కోణంలో దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ప్రమాద స్థలంలో సీసీ కెమెరాల ద్వారా వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. -
Aamna Sharif: మత్తెక్కించే ఫోజులతో ఆమ్నా షరీఫ్ (ఫోటోలు)
-
Visakhapatnam: ఆహ్లాదం, విజ్ఞానం పంచేలా పార్కుల అభివృద్ధి
విశాఖపట్నం: విశాఖ అంటే మనందరికీ ఠక్కున గుర్తొచ్చేది బీచ్. కాస్త సేద తీరాలంటే.. ఆహ్లాదం కావాలంటే వెంటనే బీచ్‌లో వాలిపోతాం. ఇప్పుడు మరిన్ని ఆహ్లాదకర ప్రాంతాలను విశాఖ మహా నగర పాలక సంస్థ సిద్ధం చేస్తోంది. ఒక వైపు కొత్త రోడ్లు, కూడళ్ల విస్తరణ పనులు సాగుతుండగా.. మరోవైపు కాలనీల్లో ప్రజలు సేద తీరేలా పార్కులను తీర్చిదిద్దుతోంది. సాధారణ పార్కులకు భిన్నంగా ఉండే థీమ్ పార్కులు ఏర్పాటు చేస్తోంది. ఈ పార్కులు ఆహ్లాదం, పచ్చదనం అందిస్తూనే సబ్జెక్ట్ థీమ్‌తో మన దృష్టిని కేంద్రీకరిస్తాయి. విశాఖ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. పలు చోట్ల థీమ్ పార్కుల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. పార్కు అంటే రెండు బల్లలు.. మూడు మొక్కలు వేయడం కాదు. కాంక్రీట్ జంగిల్‌గా మారిన నగరంలో ప్రజలకు పూర్తి స్థాయిలో పార్కులు ఆహ్లాదం పంచగలగాలి. పర్యావరణానికి మేలు చేయాలి. చిన్నారులు, మహిళలు, వృద్ధులు, ఉద్యోగులకు ఉపయోగపడాలి. వాకింగ్ ట్రాక్‌లు, యోగా కేంద్రాలు, ఓపెన్ థియేటర్లు, మెడిటేషన్ సెంటర్లు, ఓపెన్ జిమ్‌లు, క్యాంటీన్లు, మరుగుదొడ్లు ఇలా అన్నీ ఉండాలి. వినోదంతో పాటు విజ్ఞానం పంచాలి. ఇవన్నీ ఒకే చోట ఉండేలా థీమ్ పార్కులు ఏర్పాటు చేస్తోంది. కోట్లాది రూపాయలు వెచ్చించి ఆధునికీరిస్తోంది. ఎక్కడెక్కడ అంటే.. ► జోన్–2 పరిధిలో రూ.7.15 కోట్లతో నాలుగు థీమ్ పార్కులను అభివృద్ధి చేస్తున్నారు. రూ.1.94 కోట్లతో జీవీఎంసీ థీమ్ పార్కు, షిప్‌యార్డ్ లేఅవుట్లో రూ.1.92 కోట్లతో యోగా అండ్ మెడిటేషన్ థీమ్ పార్కు, బక్కన్నపాలెం లచ్చిరాజు లేవుట్‌లో రూ.1.95 కోట్లతో స్పోర్ట్స్ థీమ్ పార్కు, రూ.1.34 కోట్లతో పామ్ గార్డెన్స్ థీమ్ పార్కు పనులు 50 శాతం పైనే పూర్తయ్యాయి. ► జోన్–3 పరిధిలో రూ.2.65 కోట్లతో రెండు పార్కులు అభివృద్ధి చేస్తున్నారు. వీటిలో రూ.1.53 కోట్లతో శివాజీ పార్కు ఆధునికీకరణ పనులు ప్రారంభించగా.. 90 శాతం మేర పూర్తయ్యాయి. ఎంవీపీ సెక్టార్–11లో రూ.1.12 కోట్లతో చేపడుతున్న థీమ్ పార్కు పనులు 85 శాతం మేర పూర్తయినట్లు అధికారులు తెలిపారు. ► జోన్–5బి పరిధి గుల్లలపాలెం పార్కును అభివృద్ధి చేస్తున్నారు. రూ.39.40 లక్షలతో చేపట్టిన గుల్లలపాలెం పార్కు పనులు 55 శాతం మేర పూర్తయ్యాయి. ► జోన్–8 పరిధి సుజాతనగర్లో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ థీమ్ పార్కు పనులు 60 శాతం పూర్తయ్యాయి. రూ.1.78 కోట్లతో ఈ పార్కును అభివృద్ధి చేస్తున్నారు. -
Pooja Ramachandran Beach Photos: ఫ్యామిలీతో బీచ్‌లో చిల్ అవుతున్న పూజా రామచంద్రన్ (ఫోటోలు)
-
బీచ్‌కు పోదాం.. పదా.. పదా
జలకాలాటలలో గలగల పాటలలో ఏమి హాయిలే అలా.. అనుకుంటూ బీచ్‌లో అలలపై తేలియాడుతుంటే భలే ఉంటుంది కదూ! సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాల్లో ఆ అంబుధి చెంత నిలబడి.. భానుడి వర్ణాలను చూస్తుంటే కళ్లు తిప్పుకోలేం కదూ! కడలి అందాలకు, మనలోని భావోద్వేగానికి తరతరాల అనుబంధం అది. సముద్రానికి, భారతీయ సంప్రదాయాలకు కూడా అవినాభావ సంబంధం ఉంది. సముద్ర స్నానం వల్ల మానసిక ఆనందంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న అపార వనరుల్లో సుదీర్ఘ సముద్ర తీరం ఒకటి. ఇక్కడి మన బీచ్‌లు ఎంతో ప్రఖ్యాతి పొందాయి. రుషికొండ బీచ్ ప్రపంచ గుర్తింపు సాధిస్తూ బ్లూఫ్లాగ్‌ను కూడా సొంతం చేసుకుంది. – శ్రీపాద బాలసుబ్రహ్మణ్యం, ఏపీ సెంట్రల్ డెస్క్ జోరుగా.. హుషారుగా.. అద్భుతమైన, 975 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్ సొంతం. ఇక్కడ ఎన్నో అందమైన బీచ్‌లు ఉన్నాయి. వీకెండ్ వచ్చిందంటే చాలు జనాలతో ఆ బీచ్‌లు పోటెత్తుతున్నాయి. సూర్యలంక, మైపాడు, పేరుపాలెం, మంగినపూడి తదితర బీచ్‌లకు ఆదివారాల్లో 50 వేల మందికి పైగా వచ్చి సెలవు రోజును ఎంజాయ్ చేస్తున్నారు. విశాఖ, కాకినాడ లాంటి నగరాల బీచ్‌లకు పర్యాటకుల సందడి చెప్పనక్కర్లేదు. రోజు రోజుకు పెరుగుతున్న బీచ్ పర్యాటకంతో స్థానిక ప్రజలు ఉపాధి పొందుతున్నారు. దీనికి తగ్గట్లే ప్రభుత్వం కూడా బీచ్‌ల అభివృద్ధికి నిధులు కేటాయిస్తోంది. రిసార్ట్స్ నిర్మిస్తూ.. రోడ్లు వేస్తూ ఈ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తోంది. ఆరోగ్య రహస్యాలు ఎన్నో.. సముద్రం నీటిలో సూక్ష్మపోషకాలు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఆ నీరులో ఉండే మెగ్నిషియం, సోడియం, కాల్షియం, క్లోరైడ్, సల్ఫేట్ వంటి సూక్ష్మధాతువులు చర్మానికి సహజ సౌందర్యాన్ని ఇస్తాయి. సొరియాసిస్, ఎగ్జిమా వంటి చర్మవ్యాధులతో బాధ పడేవారికి ఈ ఉప్పునీరు ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. సముద్రనీటిలో ఉండే మెగ్నిషియంమన శరీరంలోని కార్టిసోల్ స్థాయిలను తగ్గిస్తుంది. అలాగే నాడీవ్యవస్థను కంట్రోల్ చేసి మనలోని మానసిక ఒత్తిడిని నియంత్రిస్తుంది. ♦ ఉప్పునీటి స్నానం శరీరంలోని యాంటీఆక్సిడెంట్స్ ప్రక్రియ సక్రమంగా ఉండేలా నియంత్రిస్తుంది. గుండె జబ్బులు, క్యాన్సర్ల ముప్పును తగ్గించేందుకు సహకరిస్తుంది. సీ వాటర్‌లో మెగ్నిషియం ఎక్కువగా ఉండటం వల్ల మజిల్స్ రిలాక్స్ అయ్యి.. మంచి నిద్ర పడుతుంది. ♦ ట్రేస్ఎలిమెంట్స్, సూక్ష్మజీవులతో పాటు యాంటీబ్యాక్టీరియల్‌గా ఉండేవి సముద్రంలో చాలా ఉంటాయి. వీటిని చర్మం గ్రహించడం ద్వారా సహజ యాంటీబయాటిక్స్‌లా ఉపయోగపడతాయి. ♦ సముద్రంలోని ఉప్పునీరు సైనస్ ఇబ్బందులను తొలగిస్తుంది. సహజ సెలైన్ సొల్యూషన్‌గా పనిచేసి సైనస్లో పేరుకున్న మ్యూకస్‌ను క్లియర్ చేస్తుంది. ♦ రెగ్యులర్‌గా సముద్ర స్నానం చేస్తూ ఈత కొట్టడం వల్ల సహజంగా బరువు తగ్గుతారని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. బ్లూఫ్లాగ్ కోసం.. పరిశుభ్రమైన బీచ్‌లకు బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్ లభిస్తుంది. ఈ గుర్తింపును ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ (ఎఫ్ఈఈ) అనే అంతర్జాతీయ సంస్థ ఇస్తుంది. 77 దేశాల్లో ఈ సంస్థ కార్యక్రమాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించేలా బ్లూఫ్లాగ్ గుర్తింపు రావాలంటే.. ఆబీచ్ పరిసరాలు పరిశుభ్రంగా, పర్యావరణ హితంగా ఉండాలి. 33 అంశాల్లో బీచ్‌ను అభివృద్ధి చేస్తే దానికి బ్లూఫ్లాగ్ వస్తుంది. మొత్తం 50 దేశాల్లో 4,831 బీచ్‌లకు ఈ సర్టిఫికెట్ లభించింది. మన దేశంలో 12 బీచ్‌లకు ఆ సర్టిఫికేషన్ లభించగా.. మన రాష్ట్రంలో రుషికొండ (విశాఖ) బీచ్ ఈ ఘనత సాధించింది. మరిన్ని బీచ్‌లకు కూడా బ్లూఫ్లాగ్ సాధించాలని రాష్ట్ర పర్యాటక శాఖ కృతనిశ్చయంతో ఉంది. మైపాడు బీచ్‌కు తరచూ వెళ్తాం నేను ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి బీచ్‌లకు వెళ్లడం, అక్కడ స్నానం చేయడం అంటే ఎంటో ఇష్టం. సెలవు రోజుల్లో నెల్లూరు జిల్లాలోని మైపాడు బీచ్‌కు ఫ్యామిలీతో పాటు వెళ్తుంటాను. మా పిల్లలు బీచ్‌లో స్నానాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తారు. తగిన జాగ్రత్తలతో వారితో పాటు నేను కూడా ఇక్కడ స్నానం చేస్తాను. పని ఒత్తిడితో ఇక్కడికి వస్తే చాలా రిలాక్సింగ్ అనిపిస్తుంది. సముద్ర స్నానం చేస్తే మంచిదని మా పెద్దలు కూడా చెబుతుండేవారు. – కేఎన్వీ కుమార్, తిరుపతి మూడ్ మారుతుంది ♦ మానసిక ఆరోగ్యానికి బీచ్‌ల సందర్శనం ఎంతో ఉపయోగపడుతుందని స్విమ్ ఇంగ్లాండ్ సంస్థ అధ్యయనం చెబుతోంది. సముద్రంలో ఈత కొట్టడం వల్ల ఫీల్ గుడ్ మాలిక్యూల్స్ పిలిచే బీటా ఎండార్ఫిన్స్ శరీరంలో పెరుగుతాయని, రెగ్యులర్‌గా ఈతకొట్టే వాళ్లు అతి తక్కువ సార్లు మానసిక వైద్యుల్ని సంప్రదిస్తున్నారని ఆ సంస్థ నివేదికలు పేర్కొంటున్నాయి. హైడ్రోథెరపీగా కూడా బీచ్బాత్ ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ♦సముద్రంపై నుంచి వచ్చే గాలి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. బీచ్ వద్దకు వెళితే హ్యాపీ హార్మోన్‌గా పిలిచే సెరిటోనిన్ మన శరీరంలో పెరిగి, మనం రిలాక్స్ అవుతామని, సముద్ర హోరు, ఆ అనంత జలరాశి దృశ్యం మన మూడ్‌ను మారుస్తుందని ఆ అధ్యయనాలు పేర్కొన్నాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ♦మద్యం సేవించి సముద్రంలో స్నానం చేయకూడదు ♦తీవ్రమైన గాయాలు ఉన్నపుడు బీచ్‌లో స్నానం చేయకుండా ఉంటేనే మంచిది. ♦ఈతలో నైపుణ్యం ఉంటే తప్ప తీరంనుంచి దూరంగా లోపలికి వెళ్లకూడదు. ♦సముద్రంలో పెద్ద రాళ్లు ఉంటే జాగ్రత్తగా ఉండాలి. అలల తాకిడికి తల రాళ్లకు కొట్టుకునే ప్రమాదం ఉంటుంది. అలాంటి ప్రాంతాల్లో తలకిందులుగా డైవ్ చేయడం కూడా ప్రమాదం. ♦అలలు ఎక్కువగా ఉన్నపుడు జాగ్రత్త వహించాలి. బలమైన అలల మధ్య ఇరుకైన ప్రవాహాన్ని రిప్ కరెంట్ అంటారు. ఇవి మనిíÙని ఒక్కసారిగా లోతైన ప్రవాహంలోకి లాగేస్తాయి. ♦ఉరుములు, మెరుపులు ఉన్న సమయంలో సముద్రంలో ఉండటం ప్రమాదం. వెంటనే సురక్షిత ప్రదేశానికి వెళ్లిపోవాలి. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమైన బీచ్‌లు ♦రామకృష్ణ బీచ్, రుషికొండ, భీమిలి (విశాఖ) ♦మంగినపూడి (కృష్ణా జిల్లా) ♦పేరుపాలెం (పశ్చిమ గోదావరి) ♦ అంతర్వేది (అంబేడ్కర్ కోనసీమ జిల్లా) ♦ కాకినాడ (కాకినాడ జిల్లా) ♦ మైపాడు (నెల్లూరు జిల్లా) ♦ సూర్యలంక, రామాపురం (బాపట్ల జిల్లా) ♦ కళింగపట్నం, భావనపాడు (శ్రీకాకుళం జిల్లా) -
చెక్కపెట్టెలో అసలు ఏముందంటే..?
-
తీరానికి కొట్టుకొచ్చిన పెట్టె..భారీగా సంపద ఉండొచ్చని అంచనా
-
తీరానికి కొట్టుకొచ్చిన పెద్ద పెట్టె..పెట్టెలో బంగారు నిధి ?
-
విశాఖ బీచ్‌కు కొట్టుకొచ్చిన బాక్స్ ఓపెన్.. వీడిన సస్పెన్స్
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. విశాఖలోని వైఎంసీఏ బీచ్ తీరానికి ఓ భారీ చెక్క పెట్టె అలల మధ్య కొట్టుకుని వచ్చింది. శుక్రవారం రాత్రి కొందరు పర్యాటకులు, మత్స్యకారులు ఈ పెట్టెను గమనించారు. దీంతో, వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కాగా, అధికారులు రెండు ప్రొక్లెయినర్ సాయంతో భారీ పెట్టెను ఓపెన్ చేశారు. ఈ క్రమంలో అది చెక్కలతో చేసిన దిమ్మెగా అధికారులు తెల్చారు. కాగా, బీచ్‌లో పడవలకు లంగర్ వేసేందుకు ఉపయోగించే చెక్క దిమ్మె అని ఖరారు చేశారు. అంతకుముందు.. విశాఖలోని వైఎంసీఏ బీచ్ తీరానికి ఓ భారీ చెక్క పెట్టె అలల మధ్య కొట్టుకుని వచ్చింది. దీంతో, సమాచారం అందుకున్న పోలీసులకు అక్కడికి చేరుకున్నారు. పురాతమైన చెక్క పెట్టె కావడంతో ప్రొక్లెనర్ సహాయంతో ఒడ్డుకు చేర్చారు. అలాగే, రాత్రంతా పెట్టెకు పోలీసులు కాపలాగా ఉన్నారు. బీచ్‌లో పెట్టె సమాచారం స్థానికులకు తెలియడంతో దాన్ని చూసేందుకు ఎగబడ్డారు. వారిని పోలీసులు కట్టడి చేయడానికి ఇబ్బందిపడాల్సి వచ్చింది. పోలీసులు పెట్టెను.. బ్రిటీష్ కాలం నాటిదిగా అంచనా వేస్తున్నారు. పురాతన పెట్టె ఇలా ఒడ్డుకు వచ్చిందని ఆర్కియాలజీ విభాగానికి పోలీసులు సమాచారం ఇచ్చారు. ఇది కూడా చదవండి: అమెరికాను ముంచెత్తిన వరదలు... -
ఒక అబద్దం ఎలా సృష్టించబడుతుందంటే..?
-
పర్యాటకులతో సందడిగా ఉండే ఆ బీచ్..హఠాత్తుగా మూతపడింది!
పర్యాటకానికి ప్రసిద్ధిగాంచిన ఆ బీచ్ సడెన్‌గా మూతపడింది. పర్యాటకులను ఎంతగానే ఆకర్షించే ఆ బీచ్ నిశబ్ధంలోకి వెళ్లిపోయింది. కారణం వింటే నిజంగా షాకవ్వుతారు. ఎప్పుడూ మళ్లీ ఇదివరుకటి రోజుల్లా ఆ బీచ్ ఉంటుందా అని చాలామంది పర్యాటకులు ఎదురు చూస్తున్నారు. అసలు ఎందుకు ఆ బీచ్ క్లోజ్ అయ్యింది? మంచి ఆదాయాన్ని ఇచ్చేదే పర్యాటక రంగం. అందులోనూ పర్యాటకానికి పేరుగాంచిన బీచ్‌లు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మరీ అలాంటి బీచ్ ఎందుకు అలా మూగబోయింది. దాగున్న రహస్యం ఏంటంటే.. థాయ్‌లాండ్‌లోని కో ఫై ఫై లేహ్ ద్వీపంలో కొండల మధ్య ఉన్న "మాయా బే బీచ్" మంచి పర్యాటక స్పాట్‌గా పేరు. పగడపు దీవులకు ప్రసిద్ధిగాంచింది. ఈ మాయా బే పర్యాటకులను ఎంతగా ఆకర్షిస్తుందంటే చుట్టూ ఉన్న దట్టమైన మొక్కలు, నీలిరంగులో స్పష్టంగా కనిపించే నీళ్లు, బంగారు ఇసుక చూస్తే.. భూతల స్వర్గంలా ఉంటుంది. ఎప్పుడూ నిత్యం పర్యాటకులతో సందడిగా ఉండేది. అయితే ధాయ్ అధికారులు ఒక రోజు సడెన్‌గా మూసేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఏదో కొన్ని రోజులు అన్నుకున్నారు అక్కడున్న నగరవాసులు కానీ నిరవధికంగా ఏళ్ల పాటు మూతపడిపోయింది. రూ. 100 కోట్లకు పైగా ఆదాయం నిజానికి ధాయ్ అధికారులు ఈ బీచ్‌ని మూసేయడానికి ఇష్టపడలేదు. కానీ పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతున్నట్లుసంబంధిత ఆధారాలు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు అధికారులకి. థాయ్‌లాండ్‌కి పర్యాటకంగా ఈ బీచ్ నుంచే ఏకంగా రూ. 100 కోట్లకు పైగా ఆదాయం వచ్చేది. ఇక్కడకు పర్యాటకులు కారణంగా వేలాది బోట్లు వచ్చేవి. దీంతో కాలుష్యం ఏర్పడిందని, బీచ్ అంతా చెత్త చెదారంతో నిండిపోయింది. పర్యాటకుల తాకిడి కారణంగా అక్కడ ఉండే పగడపు దిబ్బలకు నష్టం వాటిల్లింది. పెద్ద సంఖ్యలో పగడపు దిబ్బలు మాయం అయినట్లు నిపుణులు అంచనా వేశారు. దీంతో థాయిలాండ్ జాతీయ ఉద్యానవనాలు, వన్యప్రాణులు,మొక్కల సంరక్షణ విభాగం అధికారులు బీచ్ మళ్లీ సాధారణ స్థితికి వచ్చే వరకు మూత వేయబడుతుందని ప్రకటించారు. మొదట నాలుగు నెలలు అన్నారు అలా ఏకంగా నాలుగేళ్లు మూతపడిపోయింది. మళ్లీ ఇటీవలే గత మే నెల నుంచి రీ ఓపెన్ అయ్యింది. ఏదీ ఏమైనా..మంచి ఆదాయ మార్గమని పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం మంచిదే కానీ దాంతో పర్యావరణ స్ప్రుహ ఉండటం అత్యంత ముఖ్యం అని చాటి చెప్పారు ఈ థాయ్ అధికారులు. (చదవండి: పూజారి కమ్ బైక్ రేసర్.. ఒకేసారి రెండు విభిన్న రంగాల్లో..) -
బీచ్‌లకు రక్షకురాలిగా 96 ఏళ్ల బామ్మ!
చెన్నైలోని బీచ్‌లను అభివృద్ధి పేరుతో ధ్వంసం చేయాలంటే అందరికీ భయం. దానికి కారణం కామాక్షి సుబ్రమణియన్. బీచ్‌లకు రక్షకురాలిగా ‘అమ్మమ్మ’గా అందరూ పిలుచుకునే కామాక్షి గత 40 ఏళ్లుగా చెన్నైలోని బీచ్‌లను కాపాడుతోంది. ఈ పనికి అందరూ పెట్టిన పేరు ‘మిషన్ కామాక్షి’. 1930లో మద్రాసులో ఒక ఘటన జరిగింది. అక్కడి బెసెంట్ నగర్ బీచ్ (ఎలియెట్స్ బీచ్)లో ఒక బ్రిటిష్ అమ్మాయి స్నానం చేస్తూ మునిగిపోబోయింది. ఒడ్డున ఉన్న కాజ్ ష్మిడ్ అనే డెన్మార్క్ నావికుడు అది గమనించాడు. వెంటనే సముద్రంలోకి పరిగెత్తి ఆ అమ్మాయిని కాపాడబోయాడు. అలల తీవ్రత ఎక్కువగా ఉండింది. అమ్మాయిని ఒడ్డుకు తోసేశాడు. తాను మాత్రం సముద్రంలో మునిగిపోయాడు. అమ్మాయి ఆ సంగతి గురించి కిక్కురుమనకుండా సాయంత్రం జరిగిన పార్టీకి హాజరైంది. కాని నాటి గవర్నర్‌కు ఎలాగో సంగతి తెలిసింది. ఆయన ఆగ్రహంతో ఆ అమ్మాయి మీద కేకలేసి కాజ్ ష్మిడ్ సాహసానికి గుర్తుగా ష్మిడ్ మెమోరియల్ కట్టించాడు. చాలా తమిళ సినిమాల్లో ఈ మెమోరియల్ కనిపిస్తుంది. అయితే ఇది అనేక ఏళ్లపాటు శిథిలావస్థలో ఉండింది. కార్పొరేషన్ వారిని వేధించి, వెంటబడి దానిని పునరుద్ధరించిన వ్యక్తి కామాక్షి సుబ్రమణియన్. ఇవాళ ష్మిడ్ మెమోరియల్ ఎంతో చక్కగా పర్యాటకుల్ని ఆకర్షిస్తూ ఉంది. ఏ సాయంత్రం బీచ్‌కు వెళ్లినా ఆ చుట్టుపక్కల నవ్వుతూ కామాక్షి సుబ్రమణియన్ కనిపిస్తుంది. బీచ్ ఒడ్డు మనిషి కామాక్షి సుబ్రమణియన్ బెసెంట్ నగర్లో పుట్టి పెరిగింది. బెసెంట్ నగర్ అడయార్ పక్కనే ఉంటుంది. పెళ్లయ్యాక భర్తతో 1980 వరకూ ఢిల్లీలో ఉండిపోయింది కామాక్షి. భర్త రాష్ట్రపతి భవన్లో కార్యదర్శిగా పని చేసేవాడు. ‘ఆ సమయంలో నా భర్త వల్ల బ్యూరోక్రసిలో ఎలాంటి అలక్ష్యం జరుగుతుందో, తెలిసీ తెలియక ఎన్ని మతలబులు చోటు చేసుకుంటాయో తెలుసుకున్నాను’ అంటుంది కామాక్షి. భర్త రిటైర్ అయ్యాక చక్కా వచ్చి బెసెంట్ నగర్లో నివాసం ఏర్పాటు చేసుకున్న కామాక్షి ఆ రోజుల్లో దట్టంగా ఉన్న చెట్లను కొందరు వంట చెరుకు కోసం కొట్టడం బాల్కనీలో నుంచి గమనించేది. ఆ చెట్లు కొట్టేస్తే నీడ ఏం కాను? అందుకని వారు రావడంతోటే పెద్దగా అరుస్తూ తరిమి కొట్టేది. ‘అలా నా పౌర సేవ మొదలైంది’ అని గుర్తు చేసుకుంది కామాక్షి. ఆమెకు రోజూ బీచ్‌కు వెళ్లడం అలవాటు అలా బీచ్ మీద ప్రేమ ఏర్పడింది. 96 ఏళ్ల వయసులో ‘నగర పౌరులకు హక్కులుంటాయి. పబ్లిక్ స్థలాలు వారి ఆహ్లాదం కోసం. పార్కులు వారికి కావాలి. పేవ్మెంట్లు కావాలి. బీచ్ శుభ్రంగా ఉండాలి. వాటి కోసం నేను పోరాటం చేస్తాను’ అంటుంది కామాక్షి. ఆ మధ్య జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 174 వ వార్డులో ఇండిపెండెంట్‌గా నిలుచుంది కామాక్షి. పత్రికలు ఆమె గురించి విస్తృతంగా రాశాయి. ‘పార్టీ జెండా కింద నిలబడితే పార్టీ పనులన్నీ సమర్థించాలి. నేను అలా చేయలేను’ అందామె. అందుకే ఓడిపోయింది కూడా. కాని నేటికీ ఆమె పౌరుల హక్కుల కోసం పని చేస్తూనే ఉంది. ‘బెసెంట్ నగర్ బీచ్ దగ్గర వాకింగ్ ట్రాక్‌ను అడ్డుకుంటూ పబ్లిక్ టాయిలెట్లు కడుతున్నారు. దానిని అడ్డుకోవడానికి ధర్నా చేస్తున్నాను’ అని ధర్నాకు కూచుందామె. కార్పొరేషన్ అధికారులకు ఆమెను చూస్తే భయం. ఎవరో ఒకరు భయపెట్టకపోతే పనులెలా జరుగుతాయి? 96 ఏళ్లలో కామాక్షి అన్ని పనులు చేస్తుంటే మనం ఎన్ని పనులు చేయాలి? (చదవండి: సబ్బులతో సాంత్వన! అదే యాసిడ్ బాధితులకు ఉపాధిగా..!) -
ఇటలీ తీరంలో పడవ బోల్తా.. ఇద్దరి మృతి
మిలాన్: ఇటలీ సముద్ర తీరానికి సమీపంలో రెండు పడవలు నీటమునిగాయి. రెండు పడవల్లో ఒకదాంట్లో 48 మంది మరో దాంట్లో 42 మంది వలసదారులు ప్రయాణిస్తున్నారని వారిలో 57 మందిని కాపాడిన ఇటలీ తీరప్రాంత రక్షణ దళాలు ఓ తల్లీ బిడ్డలను మాత్రం కాపాడలేకపోయామని గల్లంతైన మరో 30 మంది ఆచూకీ కోసం గాలిస్తున్నామని ఇటలీ కోస్ట్ గార్డులు తెలిపారు. వయా ట్యునీషియా.. స్ఫాక్స్ బీచ్ తీరంలో గత వారం 10 మృతదేహాలను కనుగొన్నామని ట్యునీషియా పోర్టు గుండా ఇటలీకి చేరుకోవడం సులభం కాబట్టి అక్రమ వలసదారులు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు చెబుతున్నారు స్ఫాక్స్ అధికారులు. తాజాగా ఈ రెండు పడవలు కూడా ట్యునీషియా పోర్టు నుండే ఇటలీ వైపుగా వచ్చాయని అవి లంపెడుసా ద్వీపం దాటగానే ఉరుములు మెరుపులతో సముద్రంలో అలజడి రేగడంతో అలల తాకిడికి అందులో ప్రయాణిస్తున్న 90 మంది వలసదారులతో సహా పడవలు బోల్తా పడ్డాయన్నారు. కోస్ట్ గార్డుల సాహసం.. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే ఇటలీ తీర రక్షణ దళాలు హుటాహుటిన స్పందించి 57 మందిని రక్షించగలిగామని తెలిపారు స్ఫాక్స్ అధికారులు. కానీ ప్రమాదంలో ఓ తల్లీ బిడ్డలను మాత్రం కాపాడలేకపోయామని. వారి మృతదేహాలు మాత్రం లభ్యమయ్యాయని తెలిపారు. పడవలోని మిగిలిన 30 మంది గల్లంతు కాగా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు. ఇలా అయితే ఎలా? ఈ రెండు పడవల్లోని వలసదారులు సహారా-ఆఫ్రికా దేశాలకు చెందిన వారే అయి ఉంటారని, ఎంతగా ప్రయత్నించినా ఆఫ్రికా దేశాల నుండి ఈ అక్రమ వలసలకు అడ్డుకట్ట వేయలేకున్నామని తెలిపారు ఇటలీ వలసల విచారణాధికారి ఇమ్మానుయేల్ రిసిఫారీ. వారాంతా మెరుగైన జీవితం కోసమే ఇటు వస్తున్నారు. అదేదో చట్టబద్దంగా వస్తే బాగుంటుంది కానీ దొడ్డిదారిన రావడం వల్లనే ఇలా ప్రమాదాల బారిన పడుతున్నారని అన్నారు. డిమాండ్ ఎక్కువ.. ఎందరో వలసదారులు చనిపోతున్నారని సముద్రంలో ప్రమాదాలను నివారించడానికి నౌకలను ఏర్పాటు చేయడం కూడా అక్రమ వలసలను ప్రోత్సహిస్తున్నట్లే ఉంది. పొరుగు దేశానికి వలసలంటే భయపడేవారు కూడా ధైర్యంగా అడుగేసి ఇటు వైపుగా కదులుతున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఈ అక్రమ వలసలు రెట్టింపయ్యాయి. 2022లో 42,600 మంది వలస వచ్చినట్లు రికార్డుల్లో నమోదు కాగా ఈ ఏడాది మాత్రం 92,000 మందికిపైగా వలస వచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. Migrants rescued from rough seas off Italy. Reports say dozens could still be missing at sea, while more stranded migrants were airlifted from rocks on the island of Lampedusa. Read more: https://t.co/cJMUPoyyWL pic.twitter.com/lbXo28Rbrd — Sky News (@SkyNews) August 7, 2023 ఇది కూడా చదవండి: మొరాకోలో ఘోర రోడ్డు ప్రమాదం.. 24 మంది మృతి.. -
బాలుడిని రక్షించిన ఫొటోగ్రాఫర్
బీచ్ రోడ్డు (విశాఖ తూర్పు): బీచ్‌లో అలల తాకిడికి కొట్టుకుపోతున్న బాలుడిని బీచ్‌లో ఫొటోలు తీసుకునే ఫొటోగ్రాఫర్ రక్షించాడు. ఆదివారం ఓ కుటుంబం బాలుడితోపాటు ఆర్కే బీచ్‌కు వచ్చింది. కుటుంబ సభ్యులంతా ఫొటోలు తీసుకోవటంలో బిజీగా ఉండటంతో బాలుడు తీరంలో ఆడుకునేందుకు వెళ్లాడు. ఒక్కసారిగా పెద్దగా వచ్చిన కెరటం బాలుడిని లోపలకు లాక్కుపోయింది. అక్కడ ఉన్న బీచ్ ఫొటోగ్రాఫర్ భాస్కరరెడ్డి వెంటనే స్పందించి బాలుడిని రక్షించాడు. ఓ చేత్తో ఖరీదైన కెమెరాను మరో చేతితో బాలుడిని రక్షించాడు. బాలుడిని వాళ్లు కుటుంబ సభ్యులకు అప్పగించగా.. భాస్కరరెడ్డిని బాలుడు కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు అభినందించారు. -
31.29 గంటల్లో 72 కి.మీ. ఈత!
కాచిగూడ: భారత్‌కు చెందిన ఆరుగురు దివ్యాంగ ఈతగాళ్లు ఇంగ్లండ్–ఫ్రాన్స్ మధ్య ఉన్న ఇంగ్లిష్ చానల్ (అట్లాంటిక్ మహాసముద్రంలోని ఓ భాగం)ను రెండు వైపులా రిలేగా ఈది సరికొత్త రికార్డు నెలకొల్పారు. హైదరాబాద్‌కు చెందిన కోచ్ రాజోరియా తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్‌కు చెందిన దివ్యాంగుడు శివకుమార్‌తోపాటు ఎన్ఏ స్నేహన్ (తమిళనాడు), ఎల్విస్ అలీ హజారికా (అస్సాం), రిమో సాహా (పశ్చిమ బెంగాల్), సత్యేంద్రసింగ్ (మధ్యప్రదేశ్), జయంత్ దూబ్లే (మహారాష్ట్ర)తో కూడిన బృందం ఇంగ్లిష్ చానల్ ఈదడానికి ఈ నెల 8న లండన్‌కు వెళ్లారు. ఈ నెల 18న కెంట్లోని డోవర్లో సమీపంలో ఉన్న షేక్స్పియర్ బీచ్ నుంచి ఈత ప్రారంభించి ఉత్తర ఫ్రాన్స్‌లోని విస్సంట్ ఒడ్డును చేరుకొని తిరిగి డోవర్ వద్ద ఉన్న ఓల్డ్ సౌత్ ఫోర్‌ల్యాండ్ లైట్‌హౌస్ వద్దకు ఈ నెల 19న చేరుకున్నారు. భారీ అలలు, జెల్లీఫిష్‌లు సహా ఇతర ప్రమాదకర సముద్ర జీవుల నుంచి తప్పించుకుంటూ మొత్తం 72 కి.మీ. దూరాన్ని కేవలం 31 గంటల్లోనే ఈదారు. తద్వారా ఇంగ్లిష్ చానల్‌ను రిలేగా ఈదిన ఆసియా ప్రాంత వాసులుగా రికార్డు సృష్టించారు. -
ఆస్ట్రేలియా బీచ్‌లో చంద్రయాన్-3 రాకెట్ శకలం.. ఇస్రో చీఫ్ క్లారిటీ
ఆస్ట్రేలియా బీచ్‌లో సముద్రం నుంచి ఒడ్డుకు కొట్టుకువచ్చిన శకలం ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తోంది. అంతేకాకుండా దీనిపై ఓ వార్త కూడా హల్‌చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ శకలాలు చంద్రయాన్-3 ప్రయోగానికి సంబంధించిన ఎల్వీఎం రాకెట్వని అంతా భావిస్తున్నారు. అయితే తీరంలో కనిపించిన రాకెట్ శకలంపై తాజాగా ఇస్రో చీఫ్ సోమనాథ్ స్పందించారు. తాము ఆ శకలాన్ని పరిశీలించకుండా అది తమదా కాదా అనేది చెప్పలేమన్నారు. అయితే ఆ శకలం మాత్రం కచ్చితంగా రాకెట్‌దేనని స్పష్టం చేశారు. మరో విషయం ఏమిటంటే.. అది భారత్ చెందిన రాకెట్ది కావచ్చు.. కాకపోవచ్చు అని సోమనాథ్ అభిప్రాయపడ్డారు. కాగా పశ్చిమ ఆస్ట్రేలియాలోని జురియన్ బే సమీపంలోని బీచ్‌లో అకస్మాత్తుగా రాకెట్ శకలాలకు సంబంధించిన వస్తువులా ఒకటి దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. అంతకు మందు భారత్ చంద్రయాన్-3ను ఎల్వీఎం రాకెట్ నింగిలోకి మోసుకెళ్లిన దృశ్యాలు ఆస్ట్రేలియన్ గగనతలంలో కనిపించడంతో ఇది చంద్రయాన్‌కు సంబంధించినది వస్తువు అయ్యిండచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఈ విషయంలో ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. తాజాగా భారతీయ అంతరిక్ష సంస్థ క్లారిటీ ఇచ్చింది. చదవండి భర్తతో విడాకులు, ఇన్‌స్టా పరిచయం ప్రేమగా.. పలుమార్లు కలుసుకుని.. ఇప్పుడు ఏకంగా.. -
ఆస్ట్రేలియా బీచ్‌లో కలకలం.. ఈ మిస్టరీ వస్తువు చంద్రయాన్-3 ప్రయోగానికి సంబంధించిందేనా?
ఆస్ట్రేలియా బీచ్‌లో ఒక మిస్టరీ వస్తువు దర్శనమిస్తోంది. అకస్మాత్తుగా సముద్రం నుంచి ఒడ్డుకు కొట్టుకువచ్చిన ఆ వస్తువు ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తోంది. అయితే ఆ శకలాలు చంద్రయాన్-3 ప్రయోగానికి సంబంధించిన ఎల్వీఎం రాకెట్ తుది శకలాలుగా అనుమానిస్తున్నారు. కాగా దీనిపై ఇంతవరకు అధికారికంగా ఎవరూ స్పందించలేదు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ ఆస్ట్రేలియాలోని జురియన్ బే సమీపంలోని బీచ్‌లో రాకెట్ శకలాలకు సంబంధించిన వస్తువులా ఒకటి దర్శనమిస్తోంది. ఆ వస్తువు ఏమయ్యి ఉండొచ్చని ఆ ప్రాంత అధికారులు విచారణను ప్రారంభించారు. ఇదిలా ఉండగా భారత్ చంద్రయాన్-3ను ఎల్వీఎం రాకెట్ నింగిలోకి మోసుకెళ్లిన దృశ్యాలు ఆస్ట్రేలియన్ గగనతలంలో కనిపించడం గమనార్హం. దీంతో ఇది చంద్రయాన్‌కు సంబంధించినది వస్తువు అయ్యిండచ్చనే ఊహాగానాలతో ట్విటర్లో కామెంట్లతో నిండిపోతోంది. అయితే ఈ విషయంలో ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. భారతీయ అంతరిక్ష సంస్థ కూడా దీనిపై ఇప్పటివరకు మౌనంగా ఉంది. పశ్చిమ ఆస్ట్రేలియాలోని జురియన్ బే సమీపంలోని బీచ్‌లో ఉన్న వస్తువుకు సంబంధించి తాము విచారణ చేస్తున్నామని ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ వరుస ట్వీట్లలో తెలిపింది. "మేము ప్రస్తుతం పశ్చిమ ఆస్ట్రేలియాలోని జురియన్ బే సమీపంలోని బీచ్‌లో ఉన్న ఈ వస్తువుకు సంబంధించిన విచారణలు చేస్తున్నాము. ఆ వస్తువు విదేశీ అంతరిక్ష ప్రయోగ వాహనం నుండి వచ్చి ఉండవచ్చుని భావిస్తున్నాం. మేము మరింత సమాచారాన్ని అందించగల వారితో సంభాషిస్తున్నాం" అని ఆస్ట్రేలియన్ అంతరిక్ష సంస్థ ట్వీట్ చేసింది. Last friday, people in Australia reported seeing a comet/UFO in the sky which turned out to be the LVM3 rocket that launched #Chandrayaan3. And now, the third stage of a PSLV rocket has washed ashore on the coast of Green Head, Western Australia! #ISRO pic.twitter.com/FFVwhooSyE — Debapratim (@debapratim_) July 17, 2023 -
'363 బీచ్‌లు' కోస్తా తీరానికి కొత్త అందాలు
సాక్షి, అమరావతి: బీచ్ పర్యాటకంతో కోస్తా తీరానికి కొత్త కళ చేకూరనుంది. 12 జిల్లాల్లో కోస్తా తీరం వెంట 363 బీచ్‌లను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఫిషరీస్ యూనివర్సిటీ, పర్యాటక శాఖ, మత్స్యశాఖలతో కూడిన 11 బృందాలు కోస్తా తీరం వెంట సర్వే చేసి ఎక్కడెక్కడ బీచ్‌లను అభివృద్ధి చేయవచ్చో గుర్తించాయి. ఆయా ప్రాంతాల్లో కోస్టల్ జోన్ టూరిజం పేరుతో మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేస్తారు. చేపల ఉత్పత్తి, మత్స్యకారుల జీవనోపాధికి విఘాతం కలగకుండా పర్యావరణానికి అనుకూలంగా బీచ్‌లను తీర్చిదిద్దనున్నారు. కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ చట్ట ప్రకారం బీచ్‌లకు అనుమతి కోసం పర్యాటక శాఖ కలెక్టర్లకు నివేదిక పంపించింది. బీచ్‌ల అభివృద్ధిపై ఇటీవల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి సమీక్షించారు.మత్స్యకారులతో పాటు టూరిజం ఆపరేటర్లను ప్రత్యేక ఆహ్వానితులుగా పిలిచి బీచ్‌లను ఖరారు చేసి పర్యాటక అథారిటీకి వివరాలు పంపాలని సూచించారు. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో67 బీచ్‌లను అభివృద్ధి చేయనున్నారు. బ్లూ ఫ్లాగ్ బీచ్‌లు ♦ మంగినపూడి (కృష్ణా జిల్లా) ♦ పేరుపాలెం, మొల్లపర్రు (పశ్చిమ గోదావరి జిల్లా) ♦ కాకినాడ (కాకినాడ జిల్లా) ♦ మైపాడు (నెల్లూరు జిల్లా) ♦ సూర్యలంక, రామాపురం (బాపట్ల జిల్లా) ♦ చింతలమోరి (బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా) బ్లూ ఫ్లాగ్ బీచ్ అంటే..? బ్లూ ఫ్లాగ్ బీచ్ అంటే 33 ప్రమాణాల ఆధారంగా ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సంస్థ బీచ్‌లను పరిశీలించి ధృవీకరిస్తుంది. పర్యావరణం, స్నానపు నీటి నాణ్యత, నిర్వహణ, భద్రత, సేవలు లాంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. బీచ్‌లు పరిశుభ్రంగా ఉండాలి. సందర్శకులకు మెరుగైన సేవలను అందించేందుకు అధికారుల కమిటీ, విశేషాలను వివరించేందుకు సిబ్బంది ఉండాలి. రుషికొండ తరహాలో 8 బ్లూఫ్లాగ్ బీచ్‌లు విశాఖలోని రుషికొండ తరహాలో మరో ఎనిమిది బ్లూ ఫ్లాగ్ బీచ్‌లను అభివృద్ధి చేయనున్నారు. పర్యాటకాన్ని ప్రోత్సహించేలా మౌలిక వసతులను కల్పించేందుకు భూ కేటాయింపు ప్రతిపాదనలను సీసీఎల్ఏకు పంపాలని సీఎస్ ఆదేశించారు. దేశంలో 10 బ్లూ ఫాగ్ బీచ్లుండగా అందులో రుషికొండ చోటు సాధించింది. కోస్టల్ జోన్ రెగ్యులేషన్‌కు అనుగుణంగా బీచ్‌ల అభివృద్ధి: కన్నబాబు కేంద్రం 2019లో విడుదల చేసిన కోస్టల్ జోన్ రెగ్యులేషన్ నోటిఫికేషన్ ప్రకారం బీచ్‌లను అభివృద్ధి చేయనున్నట్లు పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కె.కన్నబాబు తెలిపారు. మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధమైనట్లు చెప్పారు. బ్లూ ఫ్లాగ్ బీచ్‌లకు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి రాగానే పనులు చేపడతామన్నారు. స్థానికులకు ఉపాధితో పాటు సేవల రంగం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. -
బీచ్‌లో బైడెన్ సందడి.. వైరల్‌గా ఫొటోలు
డెలావర్: ఊపిరిసలపని పనుల్లో సతమతమయ్యే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ డెలావర్ బీచ్‌లో సందడి చేశారు. 80 ఏళ్ల వయసున్న బైడెన్ భార్య జిల్ బైడెన్, మనవరాలు ఫిన్నెగన్తో కలిసి బీచ్‌లో కాసేపు సన్ బాత్ తీసుకున్నారు. కుటుంబంతో కలిసి బీచ్‌లో ఎంజాయ్ చేస్తూ పని ఒత్తిళ్ల నుంచి రిలాక్సయ్యారు. బీచ్‌కి వెళ్లే వారికి అధ్యక్షుడు వస్తున్నారని సమాచారం కాస్త ముందుగా ఇచ్చారు. దీంతో బీచ్‌లో అక్కడక్కడా జనం కనిపిస్తూనే ఉన్నారు. అయిదు రోజుల యూరప్ పర్యటనకి వెళ్లడానికి ముందు శనివారం డెలావర్‌లోని రెహోబాత్ బీచ్‌కు బైడెన్ వచ్చారు. ఆ రోజు కాస్త సూర్యుడు రావడంతో సన్ బాత్ తీసుకున్న ఫొటోలు ఇంటర్నెట్లో వైరల్‌గా మారాయి. -
సూపర్ పోలీస్.. రాకాసి అలల్లో పిల్లలను కాపాడి.. వీడియో వైరల్...
ముంబయి: ముంబయిలోని జుహు బీచ్‌లో ఓ కానిస్టేబుల్ ప్రాణాలకు తెగించి ఇద్దరు పిల్లలను కాపాడారు. సముద్రంలో మునిగిపోతున్న పిల్లలను కాపాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయింది. కానిస్టేబుల్ ధైర్య సాహసాలపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఈశాన్య రుతుపవనాలు ప్రారంభమయ్యాయి. వర్షాల ధాటికి సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఈ క్రమంలో ముంబయిలోని జుహు బీచ్‌లో ఇద్దరు పిల్లలు అలల వేగానికి తట్టుకోలేక మునిగిపోయారు. ఆ సమయంలో అక్కడే ఉన్న శాంతాక్రూజ్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ విష్ణు భౌరావ్ బేలే పరిస్థితిని గమనించి రంగంలోకి దిగారు. ప్రాణాలకు తెగించి పిల్లల ప్రాణాలను కాపాడారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. కానిస్టేబుల్ ధైర్య సాహసాలను అందరూ మెచ్చుకుంటున్నారు. #WATCH | Santacruz Police station constable Vishnu Bhaurao Bele safely rescued two drowning children aged 7&10 from the sea at Juhu's Koliwada, Juhu Beach. pic.twitter.com/wnjVGJU6FP — ANI (@ANI) June 24, 2023 కాగా.. ముంబయిలో రుతుపవనాల ప్రభావం ఎక్కువగా ఉంది. శనివారం కురిసిన కుండపోత వర్షానికి ఇద్దరు మరణించారు. తీవ్ర గాలులకు చెట్లు నేలకూలాయి. రహదారులు చెరువులను తలపించాయి. కాలనీలు నీటమునిగాయి. థాణె జిల్లాలో ఓ రెస్టారెంట్ పైకప్పు కూలిన ఘటనలో పలువురు గాయపడ్డారు. ఇదీ చదవండి: కాలేజీ కుర్రాళ్ల రహస్య ‘స్టార్టప్’.. బండారం బయటపడిందిలా.. -
Anasuya Bharadwaj : బీచ్‌లో వైట్ కలర్ బికినీలో రచ్చ లేపుతున్న అనసూయ (ఫొటోలు)
-
భర్తతో బీచ్‌లో మరోసారి ఘాటు అందాలతో రెచ్చిపోయిన యాంకర్ అనసూయ (ఫొటోలు)
-
కొడుకును కాపాడబోయి...
న్యూయార్క్: భారతీయ అమెరికన్ ఒకరు తన కొడుకును కాపాడే క్రమంలో ప్రాణాలు కోల్పోయారు. కాలిఫోర్నియాలోని శాంటాక్రజ్ కౌంటీలో వారం క్రితం ఈ విషాదం చోటుచేసుకుంది. జొన్నలగడ్డ శ్రీనివాసమూర్తి కుటుంబంతో పాంథెర్ బీచ్‌కు వెళ్లారు. అలల్లో కొట్టుకుపోతున్న 12 ఏళ్ల కొడుకును కాపాడేందుకు నీళ్లలోకి దిగారు. మరొకరి సాయంతో కొడుకును ఒడ్డుకు తీసుకొచ్చారు. అంతలో బలమైన అల మూర్తిని లోపలికి లాక్కెళ్లింది. ఈత రాని ఆయన లోతైన నీళ్లలో మునిగిపోయారు. తీవ్రంగా గాయపడిన మూర్తిని సహాయక సిబ్బంది బయటికి తీసి హెలికాప్టర్లో హాస్పిటల్‌కు తరలించినా ప్రాణాలు దక్కలేదు. -
'నేను డేంజర్లో ఉన్నా' అని లవర్‌కు మెసేజ్.. కాసేపటికే ముగ్గురూ బీచ్‌లో..
క్విటో: బీచ్‌లో సరదాగా గడిపేందుకు వెళ్లిన ముగ్గురు యువతులు దారుణ హత్యకు గురయ్యారు. చనిపోవడనికి ముందు తమ ప్రియమైన వారికి వీరు పంపిన సందేశాలు కన్నీరు పెట్టిస్తున్నాయి. తాము డేంజర్లో ఉన్నామని, ఎదో జరగబోతుందని ముందే పసిగట్టి వారు మెసేజ్‌లు పంపిన కాసేపటికే కిరాతకంగా హత్యకు గురయ్యారు. దండగులు వీరి గొంతులు కోసి చిత్ర హింసలకు గురి చేసి హతమార్చారు. ఈక్వెడార్‌లోని క్వినెడే సమీపంలో ఎస్మరాల్డస్ బీచ్‌లో ఏప్రిల్ 5న జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ముగ్గురు యువతుల పేర్లు.. డెన్నిసి రేనా(19), యులియానా మాసియస్(21), నయేలి తాపియా(22). ఏప్రిల్ 4న అదృశ్యమైన వీరు ఆ మర్నాడే దారుణంగా హత్యకు గురయ్యారు. మంచి స్నేహితులైన వీరు బీచ్‌కు వెళ్లి సరదాగా గపడపాలని ప్లాన్ చేసుకున్నారు. అన్ని ఏర్పాట్లు చేసుకుని ఏప్రిల్ 4న అనుకున్నట్టే బీచ్‌కు వెళ్లారు. స్విమ్ సూట్ లాంటి దుస్తులు ధరించి అక్కడే హాయిగా సేదతీరారు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ ఈ ముగ్గురూ ఊహించని ప్రమాదంలో పడ్డారు. ఎవరో వారిని వెంబడించారు. దీంతో తమకు ఏదో జరగబోతుందని భావించి తమ ప్రియమైన వారికి సందేశాలు పంపారు. అయితే మెసేజ్‌లు రాత్రి 11:10 గంటల సమయంలో పంపడంతో కుటుంబసభ్యులు తీవ్ర భయాందోళన చెందారు. వారు అనుకున్నట్టే.. జరగకూడని ఘటన జరిగింది. నయేలి, డెన్నిసి చనిపోయే ముందు నయేలి తన సోదరికి వాట్సాప్ సందేశం పంపింది. 'ఏదో జరగబోతుంది అని నాకు అనిపిస్తుంది. అందుకే మెసేజ్ చేస్తున్నా' అని నయేలి మెసేజ్ చేసింది. సోదరి వెంటనే ఆమెకు కాల్ చేయగా.. స్విచాఫ్ వచ్చింది. నయేలికి పెళ్లైంది. నాలుగేళ్ల కుమార్తె కూడా ఉంది. దీంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మరో యువతి డెన్నిస్ హత్యకు గురికావడానికి ముందు తన బాయ్‌ఫ్రెండ్‌కు సందేశం పంపింది. 'ఏదో జరగబోతుందని నాకు అన్పిస్తుంది. ఒకవేళ నాకేదైనా జరిగితే.. ఒక్క విషయం గుర్తుంచుకో.. ఐ లవ్ యూ వెరీ మచ్' అని మెసేజ్ చేసింది. జాలర్లు చూసి.. ఆ తర్వాత కాసేపటికే ముగ్గురిని ఎవరో దారుణంగా హత్య చేశారు. బీచ్‌లో అర్ధనగ్నంగా ఉన్న వీరిని చిత్ర హింసలు పెట్టి పదునైన ఆయుధాలతో గొంతులు కోశారు. ఆ తర్వాత శవాలను పూడ్చిపెట్టారు. ఏప్రిల్ 5న చేపల వేటకు వెళ్లిన జాలర్లు.. ఓ కుక్క వీరి మృతదేహాల వద్ద తవ్వడం చూసి అక్కడకు వెళ్లగా శవాలు కన్పించాయి. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఈ హత్యలు ఎవరు చూసి ఉంటారనే విషయంపై పోలీసులకు ఇంకా ఎలాంటి క్లూ లభించలేదు. ముగ్గురిలో ఓ యువతి బీచ్‌కు వెళ్లినరోజు సమీపంలోని ఓ హోటల్లో గడిపింది. దీంతో అధికారులు క్లూ కోసం సీసీటీవీ రికార్డులను పరిశీలిస్తున్నారు. ముగ్గురిలో ఇద్దరు మంచి భవిష్యత్ కోసం వేరే దేశం వెళ్లి స్థిరపడాలనుకున్నారని, కానీ ఇంతలోనే ఇలా ప్రాణాలు కోల్పోతారని ఊహించలేదని బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చదవండి: వేరొకరి ఇంటి డోర్‌బెల్ మోగించాడని చంపేందుకు యత్నం..చివరికి.. -
ఏపీలో బీచ్ ల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు
-
గోవాలో మద్యం సేవించడం, సెల్ఫీలపై కొత్త రూల్స్.. ఇవి తెలుసుకోండి
గోవా ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?. గోవా వెళ్లి బీచ్‌లో ఎంజాయ్ చేస్తూ మందు తాగాలని అనుకుంటున్నారా?.. అయితే తాజాగా గోవా ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త మార్గదర్శకాలను ఒక్కసారి తెలుసుకోండి. లేకపోతే చిక్కుల్లో పడాల్సి వస్తుంది. ఇంతకీ ఆ గైడ్‌లైన్స్ ఏంటంటే.. గోవాకు వచ్చే పర్యాటకుల ప్రైవసీ, భద్రతను దృష్టిలో పెట్టుకుని అక్కడి బీజేపీ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను తీసుకువచ్చింది. జనవరి 26 వ తేదీన గోవా పర్యాటక శాఖ కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. ఇందులో భాగంగా గోవాకు వచ్చే పర్యాటకులు మోసపోకుండా, అసంతృప్తికి గురికాకుండా ఉండేందుకు కొన్ని కఠిన చర్యలు తీసుకుంది. బీచ్‌లో బహిరంగంగా మద్యం సేవించేవారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనున్నట్టు మార్గదర్శకాల్లో పేర్కొంది. చట్టబద్ధంగా లైసెన్స్ పొందిన ప్రాంతాల్లో బాధ్యతాయుతంగా మద్యం సేవించవచ్చు. అలాగే, ఎవరైనా టూరిస్టులు గోవాలో సన్ బాత్ లేదా బీచ్‌లో సరదాగా గడుపుతున్న సమయంలో వారికి ఫొటోలు సీక్రెట్‌గా తీయకూడదు. వారి ఫొటోలు తీయడానికి ముందస్తుగా వారి నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే, బహిరంగ ప్రదేశాల్లో వంట చేయడంపై కూడా నిషేధించారు. ఇలా చేస్తే.. వారికి రూ.50 వేల వరకు జరిమానా విధించనున్నట్టు స్పష్టం చేశారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులు పర్యాటక శాఖలో నమోదు చేసుకున్న హోటళ్లలోనే బస చేయాలని కూడా మార్గదర్శకాల్లో సూచించింది. దీంతో, పర్యాటకుల భద్రతతోపాటు వారికి భద్రతకు భంగం కలుగకుండా ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. అలాగే, ప్రమాదకర ప్రదేశాల్లో సెల్ఫీలు తీసుకోకుండా చూసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నట్టు వెల్లడించారు. అంతే కాకుండా గోవాలోని చారిత్రక కట్టడాలను పాడుచేయవద్దని పర్యాటకులకు గోవా ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నది. గోవాకు వచ్చే పర్యాటకులు ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని మార్గదర్శకాల్లో క్లియర్‌గా చెప్పారు. -
పరవాడ తంతడి బీచ్‌లో ఇద్దరు యువకుల గల్లంతు
సాక్షి, అనకాపల్లి: పరవాడ తంతడి బీచ్‌లో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. గల్లంతయినవారు అనకాపల్లికి చెందిన కడలి లీలా ప్రసాద్, లక్ష్మీవర్మగా గుర్తించారు. వీరిలో లీలా ప్రసాద్ మృతదేహాం లభ్యంకాగా, లక్ష్మీవర్మ కోసం పోలీసులు గాలిస్తున్నారు. చదవండి: (400 కిలోమీటర్లు.. రూ.568 కోట్లు.. మూడు జిల్లాలను కలుపుతూ జాతీయ రహదారి) -
Viral Video: బీచ్ లో ల్యాండ్ అయిన విమానం
-
గాల్లో ఎగిరిన కొద్దిసేపటికే ఎమర్జెన్సీ ల్యాండింగ్..దెబ్బకు తలకిందులుగా..
ఇద్దరు వ్యక్తులతో వెళ్తున్న సింగిల్ ఇంజిన్ విమానం క్రాష్ అయ్యి కెమెరాకు చిక్కింది. ఈ ఘటన న్యయార్క్లోని లాస్ ఏంజింల్స్లోని శాంటా మోనికా బీచ్‌లో చోటు చేసుకుంది. ఆ విమానం మోనికా విమానాశ్రయం నుంచి బయలు దేరిన తొమ్మిది నిమిషాలకే అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. అయితే విమానం ఎయర్ పోర్టఖి కొద్ది దూరంలో ఉండటంతో.. బీచ్‌లోని ఇసుక మీద తలకిందులుగా ల్యాండ్ అయ్యింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వాస్తవానికి పైలెట్ మాలిబుకు వెళ్లాలనుకున్నాడు. ఐతే విమానం పసిఫిక్ పాలిసేడ్స్ సమీపంలో ఇంజన్లో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో పైలెట్ శాంటా మోనికా ఎయిర్‌పోర్ట్‌కి తిరిగి రావడానికి ప్రయత్నించాడు. కానీ పీర్ సమీపంలోని బీచ్ వద్ద అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ బీచ్‌లో ల్యాండ్ చేయడమనేది మీ స్వంత అవగాహనతో చేయాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో పైలెట్‌కి బీచ్ తీరంలోవిమానాన్ని ల్యాండ్ చేయడం కష్టమై ఒక్కసారిగా తలకిందులైపోయింది. ఈ అనుహ్య ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అధికారులు వారిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి గురించి ఇంకా తెలియాల్సి ఉంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. View this post on Instagram A post shared by Frank Deville (@fthemagician) -
బీచ్‌లో ఉంగరాలు మార్చుకుని ఒక్కటైన లెస్బియన్ జంట.. ఫొటోలు వైరల్..
తిరువనంతపురం: కేరళకు చెందిన లెస్బియన్ జంట అదిలా నసరీన్, ఫాతిమా నూరా ఎట్టకేలకు ఒక్కటయ్యింది. బీచ్‌లో ఘనంగా జరిగిన వేడుకలో ఇద్దరూ ఉంగరాలు మార్చుకొని కొత్త జీవితానికి స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. కోర్టు తీర్పుతో ఈ ఇద్దరూ స్కూల్లో చదువుకునే సమయం నుంచే స్నేహితులు. ఒకరినొకరు ఇష్టపడ్డారు. కలిసి జీవించాలనుకున్నారు. కానీ ఈ జంట ప్రేమ విషయం తెలిసినప్పుడు ఇద్దరి తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. సమాజంలో తమ పరువు ఏమవుతుందని ఒప్పుకోలేదు. దీంతో ఈ ఏడాది మేలో ఇద్దరూ కోజికోడ్ పారిపోయారు. ఎల్జీబీటీక్యూ సొసైటీ ఆశ్రమంలో ఉన్నారు. అయితే తల్లిదండ్రులు వారి వద్దకు వెళ్లి పెళ్లికి ఒప్పుకుంటామని చెప్పారు. ఆ తర్వాత ఎవరి ఇళ్లకు వాళ్లను తీసుకెళ్లారు. కానీ ఇంటికెళ్లాక పెళ్లి కుదరదని మాట మార్చారు. తన ప్రేమను దక్కించుకునేందుకు నసరీన్ హైకోర్టును ఆశ్రయించగా.. తీర్పు అనుకూలంగా వచ్చింది. వీరిద్దరికి కలిసి జీవించే హక్కు ఉందని న్యాయస్థానం స్పష్టం చేసింది. చట్టబద్దమైన చిక్కులు వీడటంతో ఎల్జీబీటీక్యూ సొసైటీ వీరి కోసం బీచ్‌లో వేడుక ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్లోనే ఇద్దరూ రింగ్‌లు మార్చుకుని ఒక్కటయ్యారు. లెహంగా ధరించి, పూలదండలు వేసుకుని ఎంతో సంతోషంగా కన్పిస్తున్న ఈ జంట ఫొటోలను నసరీన్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయగా.. అవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బీచ్‌లో ఇలాంటి ఫొటో షూట్లు నిర్వహించడం ఆసక్తిగా ఉందని నసరీన్ చెప్పింది. భవిష్యత్తులో తామిద్దరం పెళ్లి చేసుకుంటామని పేర్కొంది. తండ్రి పేరుతో ఇబ్బంది.. నసరీన్, ఫాతిమా కుటుంబాలు వీళ్లను దూరం పెట్టాయి. అయితే ఇంకా ఏవైనా ఫామ్స్ ఫిల్ చేసేటప్పుడు తల్లిదండ్రుల పేర్లు ఉపయోగించాల్సి వస్తోందని, ఇది తమకు ఇబ్బందిగా ఉందని నజరీన్ చెబుతోంది. ఇటీవల తామిద్దరం ఆస్పత్రిలో చేరినప్పుడు హాస్పిటల్ ఫాంలో తండ్రి పేరు అడిగారని చెప్పుకొచ్చింది. స్వలింగ సంపర్క వివాహాలకు భారత్‌లో ఇంకా చట్టబద్దత లేదు. సేమ్ సెక్స్ రిలేషన్స్ నేరమని నిబంధనలు ఉన్నప్పటికీ 2018లో వాటిని నిలిపివేశారు. అయితే కొంతమంది స్వలింగ సంపర్కులు మాత్రం వేడుకలు నిర్వహించి అధికారికంగా ఒక్కటవుతున్నారు. ఘనంగా వివాహాలు కూడా చేసుకుంటున్నారు. చదవండి: పెళ్లి భోజనంలో మాంసం పెట్టరా? వరుడి ఫ్రెండ్స్ గొడవ.. వివాహం రద్దు.. -
ఆస్ట్రేలియాలో ఢిల్లీ పోలీసులకు చిక్కిన మోస్ట్ వాంటెడ్..
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాలో మోస్ట్ వాంటెడ్ నిందితుడిని ఢిల్లీ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నాలుగేళ్ల క్రితం ఆస్ట్రేలియా బీచ్‌లో జరిగిన ఓ యువతి హత్య కేసులో నిందితుడుగా ఉన్న రాజ్వేందర్ సింగ్‌ను(38) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2018 ఆక్టోబర్ 21న క్వీన్స్లాండ్ బీచ్‌లో నడుచుకుంటూ వెళ్తుండగా 24 ఏళ్ల తోయా కార్డింగ్లీ యువతి హత్యకు గురైంది. బీచ్ మర్డర్ కేసుగా ఈ ఘటన ఆ దేశంలో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాజ్విందర్ సింగ్ హత్య చేసిన రెండు రోజులకే దేశం విచిడి పారిపోయాడు. ఉన్నపళంగా ఉద్యోగం, భార్య, ముగ్గురు పిల్లలను వదిలి భారత్‌కు చెక్కేశాడు. పంజాబ్ రాష్ట్రం అమృత్‌సర్‌లోని బటర్ కలాన్‌కు చెందిన రాజ్ విందర్ ఆస్ట్రేలియాలోని ఇన్నిస్ ఫైల్ టౌన్లో నివసించేవాడు. అక్కడే నర్సింగ్ అసిస్టెంట్‌గా పనిచేసేవాడు. ఆస్ట్రేలియా నుంచి పారిపోయి వచ్చిన తర్వాత అతడు పంజాబ్‌లో తలదాచుకున్నాడు. అప్పటి నుంచి ఆస్ట్రేలియన్ పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. 2021 మార్చి నెలలో రాజ్విందర్ సింగ్‌ను అప్పగించాలని ఆస్ట్రేలియా భారత్‌ను కోరింది. అదే ఏడాది నవంబర్‌లో భారత్ అందుకు అంగీకరించింది. కొన్ని వారాల క్రితం రాజ్ విందర్పై క్వీన్స్లాండ్ పోలీసులు భారీ రివార్డు ప్రకటించారు. నిందితుడిని ఆచూకీ తెలిపిన వారికి 1 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు( భారత్ కరెన్సీలో దాదాపు 5 కోట్లు) నజరానా ప్రకటించారు. దీంతో ఈ విషయం అప్పట్లో సంచలనంగా మారింది. కాగా క్వీన్స్లాండ్ పోలీసులు ప్రకటించిన అత్యంత భారీ రివార్డు ఇదే. ఆస్ట్రేలియా అధికారులు, భారత్ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. ఇందు కోసం పంజాబీ, హిందీ మాట్లాడే అయిదుగురు పోలీస్‌లను ఆస్ట్రేలియన్ ప్రభుత్వం నియమించింది. ఫలితంగా నిందితుడు పోలీసులకు చిక్కాడు. చదవండి: Video: చిన్నారిపై అత్యాచారం.. నిందితుడికి ఐదు గుంజీల శిక్ష -
వామ్మో ఇంత పెద్ద చెయ్యి.. కొంపతీసి ఏలియన్‌దా?
సముద్రతీరంలో హాయిగా నడుచుకుంటూ వెళ్తున్న ఓ ప్రేమ జంటకు ఇసుకలో ఓ పొడవాటి వస్తువులాంటింది కన్పించింది. వెంటనే దాన్ని బయటకు తీయగా.. అది అస్థిపంజరం చేతి. దాని పరిమాణం చూసి ఇద్దరూ కంగుతిన్నారు. ఇది కచ్చితంగా మనిషిది కాదని, భయాందోళన వ్యక్తం చేశారు. బ్రెజిల్లో నవంబర్ 20న ఈ ఘటన జరిగింది. అస్థిపంజరం చూసి హడలిపోయిన లెటిసియా గోమ్స్, ఆమె బాయ్‌ఫ్రెండ్ డెవనీర్ సౌజ్ వెంటనే దాన్ని ఫొటో తీశారు. అది ఏ సైజులో ఉందో చెప్పేందుకు డెవనీర్ తన చెప్పును కొలమానంగా చూపాడు. దొరికిన అస్తిపంజరం చేతిలోని వేలు.. ఆ చెప్పు కంటే పెద్దగా ఉండటం చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. ఈ చేతి కచ్చితంగా సాధారణ మనుషులది కాదని, కొంపతీసి ఏలియన్స్ది అయి ఉంటుందా? అని ఈ ప్రేమికులు ఆందోళన చెందారు. మరోవైవు నెటిజన్లు దీనిపై భిన్నమైన కామెంట్లు చేశారు. ఇది కచ్చతింగా ఏలియన్ చేతి అయి ఉంటుంది, వెంటనే దీన్ని పరిశోధనకు పంపించండి అని ఓ యూజర్ కామెంట్ చేశాడు. మరో యూజర్ అది జల కన్య చేతి అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశాడు. మరో యూజర్ ఇది డైనోసార్ చేతి అయి ఉంటుందని పేర్కొన్నాడు. మరోవైపు ఇది డాల్ఫిన్, తిమింగలం వంటి జాతికి చెందిన సముద్ర జీవి అస్థి పజరం అయి ఉంటుందని, 18 నెలల క్రితం అది ఆ ప్రాంతంలోనే చనిపోయిందని ఓ సముద్ర జీవ శాస్త్రవేత్త చెప్పుకొచ్చారు. అయితే దీన్ని ధ్రువీకరించేందుకు కచ్చితంగా పరీక్షలు చేయాల్సిందేని స్పష్టం చేశారు. చదవండి: Guinness World Records: ఆ పిల్లి వయసు 26 -
భిమిలి బీచ్ లో ఇద్దరు విద్యార్థులు గల్లంతైన ఘటనలో ఒకరి మృతదేహం లభ్యం
-
భీమిలి బీచ్‌లో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ భీమిలి బీచ్‌లో విషాదం చోటుచేసుకుంది. సరదగా ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కొంతమంది ఇంజనీరింగ్ విద్యార్థులు సముద్రంలోకి దిగగా.. వారిలో ఇద్దరు గల్లంతయ్యారు. మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. తగరపువలసలో ఇంజనీరింగ్ చదువుతున్న ఈసీఈ బ్రాంచ్‌కు చెందిన సాయి, సూర్య గల్లంతైనట్టు పోలీసులు గుర్తించారు. గజ ఈతగాళ్లతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నేవీ హెలికాప్టర్లతోనూ గాలింపు చర్యలు చేపట్టారు. బీచ్ వద్దకు చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చదవండి: అమ్మా.. నాన్నకు ఏమైంది? ఎప్పుడు వస్తాడు?.. కంటతడి పెట్టించే ఘటన -
బాపట్ల : సముద్ర తీరంలో విషాదం..
-
బాపట్లలో విషాదం.. నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థుల గల్లంతు
చీరాల టౌన్: విహారయాత్ర కోసం బీచ్‌కు వచ్చిన నలుగురు విద్యార్థులు సముద్రంలో గల్లంతయ్యా రు. వారిలో ఒకరి మృతదేహం లభించింది. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. ఈ విషాద ఘటన బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం సముద్రతీరంలో గురువారం జరిగింది. చీరాల డీఎస్పీ పి.శ్రీకాంత్ తెలిపిన వివరాల మేరకు... గుంటూరుకు చెందిన జీవీఆర్‌ఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఏడుగురు విద్యార్థులు రామాపురం బీచ్‌కు వచ్చా రు. వారు సముద్రంలో స్నానం చేస్తుండగా పెద్ద అలలు వచ్చాయి. తెనాలికి చెందిన యడవల్లి రమణ (19), పులివర్తి గౌతమ్ (20), అమరావతి మండలం పరిమి గ్రామానికి చెందిన తాళ్లూరి రోహిత్ (20), హైదరాబాద్‌కు చెందిన తిరుణగిరి మహదేవ్ (18) అలల తాకిడికి నీటిలో మునిగిపోయారు. ఆ సమయంలో కేకలు వేస్తున్న విద్యార్థుల ను కాపాడేందుకు రామాపురం మత్స్యకారులు ప్రయత్నించినా, ఫలితం లేకపోయింది. కొద్దిసేపటి తర్వాత మహదేవ్ మృతదేహం ఒడ్డుకు కొట్టుకొ చ్చింది. మిగిలిన ముగ్గురు విద్యార్థుల కోసం గాలిస్తున్నారు. మహదేవ్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. తీరంలో మిన్నంటిన రోదనలు... గల్లంతైన విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, సహచర విద్యార్థులు రామాపురానికి చేరుకున్నారు. కుమారులు సముద్రంలో గల్లంతుకావడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. కష్టపడి బిడ్డలను చదివించుకుంటున్న తమపై విధి కక్షగట్టి తీసుకెళ్లిందని, తమకు కడుపుకోత మిగిల్చిందని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నా రు. చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి అక్కడికి చేరుకుని విద్యార్థులు, డీఎస్పీ పి.శ్రీకాంత్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. -
విచిత్రమైన దొంగ: పర్సు కొట్టేసి... సముద్రంలో ఈత కొట్టి ఎస్కేప్! కానీ...
చైన్‌స్నాచర్లు, పిక్ పాకెటర్స్ చాలా తెలివిగా దొంగతనం చేసి తప్పించుకుంటారు. ఎంతో స్కెచ్ వేస్తే గానీ ఒకపట్టాన దొరకరు. ఔనా! ఐతే ఈ దొంగ మాత్రం పర్సు కొట్చేసి ఏకంగా సముద్రంలో ఈతకొట్టి తప్పించుకోవాలనుకున్నాడు. వివరాల్లోకెళ్తే... ఫ్లోరిడాలో ఒక దొంగ ఒక హోటల్ పార్కింగ్ వద్ద ఉన్న ఒక మహిళ పర్సును కొట్టేశాడు. ఆ తర్వాత ఆ దొంగ తప్పించుకునేందుకు టంపా బేలో ఉండే బీచ్‌లోకి వెళ్లిపోతాడు. ఆ బీచ్ వద్దే ఉన్న కొంతమంది ఆ దొంగ సముద్రంలోకి వెళ్లడం చూస్తారు. ఆ దొంగ ఏకంగా సముద్రంలో ఈతకొట్టి తప్పించుకోవాలనుకున్నాడు. ఐతే సమాచారం అందుకున్న పోలీసులు ఆ దొంగను వెతకడం కోసం హెలికాప్టర్‌తో రంగంలోకి దిగారు. అధికారులు హెలికాఫ్టర్‌తో ఆ వ్యక్తి కోసం సముద్రం అంతా జల్లెడపడతారు. పాపం ఆ దొంగ పోలీసలు తనను వదలేటట్లు లేరని డిసైడ్ అయ్యి తనను వెంబిడిస్తున్న హెలికాప్టర్ని చూసి లొంగిపోతున్నట్లు చేతులు పైకెత్తుతాడు. కానీ ఆ దొంగ తప్పించుకోవాలన్న ప్రయాసతో ఏకంగా 200 అడుగుల లోతు వరకు ఈత కొట్టేశాడు. పోలీసులు సదరు దొంగను డెవేన్ డీన్‌గా గుర్తించి, పలు కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత పొడవైన పిల్లిగా గిన్నిస్ రికార్డు) -
Hyderabad: సిటీలో కొత్త ట్రెండ్.. ‘వర్కేషన్’ అంటే ఏంటో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కొండాపూర్‌లో నివసించే కార్పొరేట్ ఉద్యోగి వర్థన్.. గత ఏడాదిగా గోవా, మధురై, కేరళలలో ప్రకృతి అందాలను సతీసమేతంగా ఆస్వాదిస్తున్నారు. కనీసం 15 నుంచి 20 రోజుల వ్యవధి ఉండే ట్రిప్ పూర్తయిన తర్వాత నగరానికి రావడం ఓ వారం పదిరోజులు గడపడం ఆ వెంటనే మరో టూర్.. దీనిని బట్టి ఆయనను మనం వర్క్‌కి బంక్ కొట్టే వెకేషన్ లవర్‌గా భావిస్తాం. కానీ ఆయన ఆస్వాదిస్తోంది వర్కేషన్. పిక్నిక్లోనూ పనిచేసే విధానం. ట్రావెల్ కంపెనీ బుకింగ్ డాట్ కామ్ సర్వే ప్రకారం గత ఏడాదిలోనే 68 శాతం మంది భారతీయ ప్రయాణికులు రాబోయే సంవత్సరానికి తమ వర్కేషన్స్‌ను బుక్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పర్వత ప్రకృతి దృశ్యాలు బ్యాక్‌డ్రాప్‌గా వర్క్స్టేషన్ల పోస్ట్‌లు..బీచ్‌లకు ఆనుకుని ఉన్న గది ఇన్‌స్టా రీల్స్‌తో సోషల్ మీడియా పని–ప్రకృతి ప్రేమికుల వేదికగా మారింది. వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి వర్కేషన్ దాకా కోవిడ్ దెబ్బకు కార్పొరేట్ ఉద్యోగుల పనితీరు ఆన్లైన్ వర్క్, వర్క్ ఫ్రమ్ హోమ్, హైబ్రిడ్/రిమోట్ వర్కింగ్ సిస్టమ్...ఇలా రూపాంతరం చెందుతూ ఇప్పుడు వర్కేషన్‌గా ఊపందుకుంది. ‘ఇంటి నుంచి కాకుండా ఇష్టమైన టూర్లో ఉంటూ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తూనే అసైన్డ్ ప్రాజెక్టులను పూర్తి చేయడమనే వర్కింగ్ ట్రెండ్‌నే వర్కేషన్’గా పేర్కొంటున్నారు. ఈ వర్కేషన్ ప్రియుల్ని డిజిటల్ నోమాడ్స్‌గా పిలుస్తున్నారు. టీసీఎస్, ఇన్ఫోసిస్, అన్ అకాడమీ తదితర కార్పొరేట్ సంస్థలు ‘నిరవధిక వర్క్ ఫ్రమ్ హోమ్’ ప్రకటన తర్వాత ఈ ట్రెండ్ బాగా ఊపందుకుంది. వర్క్‌తో పాటే విందు, వినోదం ‘మా రిసార్ట్స్‌లో 80 శాతం వరకూ వర్కేషన్కు అనువుగా మార్చాం. బెస్ట్ వైఫై నెట్ వర్క్, ఫుడ్ ప్రీ ఆర్డర్స్ పెద్దలు పని టైమ్‌లో పిల్లల కోసం హ్యాపీ హబ్స్ ఎంటర్టైన్మెంట్ జోన్స్ ఏర్పాటు చేశాం’ అంటూ క్లబ్ మహీంద్రా రిసార్ట్స్ ప్రతినిధి చెప్పారు. కరావొకే లాంటి సరదా సంగీతాల ఈవెంట్స్‌తో పాటు సర్ఫింగ్, కయాకింగ్, స్టాండప్ పాడ్లింగ్, స్కీయింగ్, స్పిన్నింగ్, స్కేటింగ్ వంటివి వర్క్‌తో పాటు ఎంజాయ్ చేస్తున్నారు. రిషికేశ్, ధర్మశాల, కేరళ, కూర్గ్, గోవా తదితర ప్రాంతాలు నగర వర్కేషన్ ప్రియుల ఎంపిక జాబితాలో టాప్‌లో ఉన్నాయని ట్రావెల్ ఆపరేటర్ మీర్ చెప్పారు. నగరానికి చెందిన ఓ కంపెనీలో స్ట్రాటజీ హెడ్ గా పనిచేస్తున్న సూర్య తేజ గత రెండేళ్లుగా వారణాసి నుంచి గోవా..మధురై వరకు 65,000 కి.మీ ప్రయాణించాడు, మరి అత్యవసర పరిస్థితుల్లో ఎలా? అంటే సమాధానంగా సూర్య ఏమంటారంటే ‘గత 2021 అక్టోబర్‌లో నేను కేరళలోని, అరూకుట్టిలోని ఓ రిసార్ట్స్‌లో కయాకింగ్ యాక్టివిటీలో బిజీగా ఉంటూనే ఆన్లైన్ మీటింగ్‌కు హాజరయ్యా. కయాకింగ్ లాంటి యాక్టివిటీస్‌కి వెళ్లినప్పుడు నా వెంట వాటర్‌ప్రూఫ్ బ్యాగ్ తప్పనిసరిగా ఉంటుంది’ అంటూ చెప్పడం పనితో పిక్నిక్ని కలిపిన వైనానికి అద్దం పడుతుంది. ఇటీవల బాగా పాపులరయిన వాటిలో డే కేషన్స్, వర్కేషన్స్. వీటికి అనుగుణంగా మేం మా ట్రావెల్ ప్యాకేజ్‌లను డిజైన్ చేస్తున్నాం. అడ్వంచర్ యాక్టివిటీస్, నేచర్ వాక్స్, ఇగ్లూ స్టేయింగ్, హార్స్ రైడింగ్, చెట్ల మీద విందు, ఎటివి బైక్స్, పెయింట్ బాల్... ఫ్యామిలీతో సహా వచ్చేవారికి అనుగుణంగా తీర్చిదిద్దాం. మా సభ్యుల్లో దక్షిణాది నుంచి 30 శాతం ఉంటే అందులో హైదరాబాద్ వాటా పెద్దదే. –ప్రతినిధి, క్లబ్ మహేంద్రా హాలిడేస్– రిసార్ట్స్ -
బీచ్‌లో రిప్ కరెంట్.. వేరీ డేంజర్.. గజ ఈతగాళ్లు కూడా తప్పించుకోలేరు..
పిఠాపురం(కాకినాడ జిల్లా): సాగర తీరంలో కనిపించని, కడలి మాటున వేటు వేసే రిప్ కరెంట్ ఎందరో ప్రాణాలను కాటేస్తోంది. చీలిక ప్రవాహాలుగా పేర్కొనే రాకాసి అలలు ఒక్కసారిగా దాడి చేసి పెను విషాదాన్ని మిగులుస్తున్నాయి. ఏమరపాటుగా ఉంటే రెప్పపాటులో సముద్రంలోకి లాగేస్తుంటాయి. ఆగస్టు, అక్టోబర్ నెలల మధ్య ఈ రిప్ కరెంట్ అలలు ఎక్కువగా తూర్పు తీరంలో సంభవిస్తాయని పరిశోధకులు నిర్ధారించారు. కాకినాడ నుంచి విశాఖపట్నం వరకు ఉన్న తీర ప్రాంతంలో ఇవి ఎక్కువగా ఏర్పడుతున్నట్టు గుర్తించారు. ఇప్పటికే ఎక్కువ మంది వీటి వల్ల మృత్యువాత పడినట్లు గుర్తించారు. ఉప్పాడ తీరంలో ఆదివారం సంభవించిన పెను ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన ఘటన రిప్ కరెంట్ ప్రభావాన్ని గుర్తు చేస్తోంది. చదవండి: ర్యాంటాక్, జింటాక్ టాబ్లెట్స్‌తో క్యాన్సర్?.. 26 ఔషధాలను నిషేధించిన కేంద్రం రిప్ కరెంట్ అంటే.. బలమైన అలల మధ్య ఇరుకైన ప్రవాహాన్ని రిప్ కరెంట్ అంటారు. ఇవి మనిషిని ఒక్కసారిగా లోతైన ప్రదేశంలోకి లాగేస్తాయి. సముద్ర గర్భంలో సుదూర ప్రాంతంలో ఏర్పడిన గాలి ద్వారా ఏర్పడిన అలలు నీటి అడుగున బలమైన ప్రవాహంగా దూసుకు వస్తాయి. తీరానికి వచ్చే సరికి అవి రాకాసి అలలుగా మారిపోతాయి. అల ఒక్కసారిగా తీరాన్ని తాకినప్పుడు సముద్రం అడుగు భాగాన అత్యంత బలమైన ప్రవాహం ఏర్పడుతుంది. ఆ ప్రవాహంలో ఎవరు ఉన్నా రెప్పపాటులో కడలిలో కలిసి పోతారు. ఎంత గజ ఈతగాడైనా దీని నుంచి తప్పించుకోలేడు. తీరానికి వచ్చే కొద్దీ వేగం అధికమై తరంగాలు ఏర్పడతాయి. తిరిగి కెరటం వెనక్కి సముద్రంలోకి వెళ్లే టప్పుడు ఏర్పడే తీవ్రత అంతా ఇంతా కాదు. దానినే రిప్ కరెంట్ అంటారు. కరెంట్ షాక్ తగిలితే ఎంత తొందరగా ప్రాణాలు పోతాయో దానికంటే ఎక్కువగా ఇది ప్రమాదాన్ని కలిగిస్తుంది. రెండు సముద్రాలు లేదా రెండు ప్రవాహాలు కలిసే చోట ఇవి సంభవిస్తాయి. కాకినాడ నుంచి విశాఖ వరకు ఉన్న తీరంలో ఎక్కువ ప్రాంతాల్లో ఉప్పుటేరులు కాలువలు కలిసే చోట్లు ఉన్నాయి. అటువంటి చోట్ల రిప్ కరెంట్ ఏర్పడుతుంది. రిప్ కరెంట్ ప్రవాహ వేగం సెకనుకు 2 నుంచి 8 అడుగుల వరకు ఉంటుంది. ఇది అల చీలికలో ఒడ్డుకు సమాంతరంగా 10 నుంచి 20 అడుగుల వెడల్పుతో ఏర్పడుతుంది. ఇది గజ ఈతగాళ్లను, టన్నుల బరువు ఉండే వాటిని లోపలకు లాగేసే అంత బలమైనవి. ఇప్పటి వరకు రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో సుమారు 350 మంది వరకు రిప్ కరెంట్ వల్ల ప్రమాదానికి గురై అసువులు బాసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఉప్పాడ సముద్ర తీరానికి వచ్చిన అలలు ఒక్కసారిగా ఉప్పుటేరు నీటితో కలిసి బలమైన రిప్ కరెంట్‌గా మారి ప్రమాదాన్ని కలిగించి ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. రిప్ కరెంట్‌ను కనుగొనడానికి ఏయూ, ఇస్రో సంయుక్తంగా సముద్ర ప్రాజెక్టును నిర్వహిస్తోంది. సముద్ర అలలను కెమెరాల ద్వారా నిత్యం గమనిస్తూ ప్రత్యేక పరికరం ద్వారా అలల తరంగం ఎత్తు, దిశ, సమయాన్ని లెక్కిస్తారు. తద్వారా భవిష్యత్తులో రిప్ కరెంట్ ఎక్కడ ఏర్పడుతుంది? ఎలా ఏర్పడుతుంది? గుర్తించి ముందస్తు హెచ్చరికలు జారీ చేసి విధంగా ప్రయోగాలు చేస్తున్నారు. అది ప్రమాదకర ప్రదేశం ఉప్పాడలో ముగ్గురు యువకులు మృతి చెందిన ప్రాంతం రిప్ కరెంట్ ఉత్పత్తి అయ్యే ప్రాంతమే. ఎందుకంటే అక్కడ ఏలేరు కాలువ సముద్రంలో కలుస్తుంది. సముద్రం అక్కడ కొంత ఒంపు తిరిగి కూడా ఉంటుంది. అంటే అక్కడ వచ్చే కెరటాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ఇటు నుంచి అటు నుంచి ఒకేసారి కెరటం రావడం రెండు ఢీకొనడం వల్ల రిప్ కరెంట్ (స్క్వేర్ అలలు) ఏర్పడి తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తాయి. వినాయక నిమజ్జనానికి దిగిన యువకులు విగ్రమాన్ని నిమజ్జనం చేసేటప్పుడు అలల ఉధృతి తక్కువగానే ఉన్నా ఉప్పుటేరు ఉధృతి ఒక్కసారిగా పెరగడం, దానికి తోడు సముద్ర అలలు ఎక్కువ కావడంతో రెండూ కలిసి రిప్ కరెంట్‌గా మారి వారి ప్రాణాలను తీసి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆ ప్రదేశం చాలా ప్రమాదకరం కాబట్టే అక్కడ నిమజ్జనాలను అనుమతించలేదని పోలీసులు చెబుతున్నారు. మత్స్యకారులు సైతం ఆ ప్రదేశంలోకి తాము వెళ్లబోమని అక్కడ లోతు ఎక్కువగా ఉంటుందని అలలు ఉధృతి చాలా భయంగా ఉంటుందని చెబుతున్నారు. యువకులు రెండవ సారి విగ్రహాన్ని సముద్రం లోపలకు తోయడానికి వెళ్లిన సమయంలో రిప్ కరెంట్ ఉత్పత్తి అయ్యి ఉంటుందని అందుకే రెప్పపాటులో కనిపించనంతగా వెళ్లి పోయి గల్లంతయ్యారని భావిస్తున్నారు. అక్కడ నిమజ్జనాలను నిషేధించాం ఉప్పాడ హార్బర్ నిర్మాణ ప్రాంతానికి ఆనుకుని ఉన్న తీరం చాలా ప్రమాదకర ప్రదేశం అని గుర్తించారు. అందుకే అక్కడ నిమజ్జనాలను నిషేధించి ఇతర ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశాం. ఈ కారణంగానే అక్కడ బందోబస్తు ఏర్పాటు చేయలేదు. అక్కడకు ఎవరూ వెళ్లరని భావించాం. కాని అనుకోకుండా వీళ్లు అక్కడకు వెళ్లి ప్రమాదం బారిన పడ్డారు. – వైఆర్కే శ్రీనివాస్, సీఐ, పిఠాపురం షాక్ తగిలిన ఆనవాళ్లు ఉన్నాయి చనిపోయిన వారి బాడీల్లో ఆకస్మాత్తుగా మరణం సంభవించిన ఆనవాళ్లు ఉన్నాయి. ఒక్కసారిగా నీటిలో మునిగి పోవడం వల్ల ఊపిరాడక నీటిని తాగేసి చనిపోయి ఉంటారు. కేవలం కెరటాల్లో మునిగిపోయి ఊపిరాడక చనిపోయినట్లు తెలుస్తోంది. అకస్మాత్తుగా మరణం సంభవించడం అంటే షాక్ తగిలినట్లు కూడా అనుకోవచ్చు. తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినట్లు కూడా లేనందున ఒక్కసారిగా మరణం సంభవించినట్లు భావిస్తున్నాం. – కీర్తిప్రియ, ప్రభుత్వ వైద్యురాలు, పిఠాపురం సీహెచ్‌సీ (పోస్టుమార్టం చేసిన డాక్టర్) గల్లంతైన ఇద్దరి మృతదేహాలు లభ్యం కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో వినాయక నిమజ్జనానికి వెళ్లి ప్రమాదంలో సముద్రంలో గల్లంతైన ఇద్దరి మృతదేహాలు సోమవారం తీర ప్రాంతంలో లభ్యమయ్యాయి. పిఠాపురం నవఖండ్రవాడలో జరిగిన మరో ప్రమాదంలో ఇద్దరు గల్లంతు కాగా ఒకరి మృతదేహం లభ్యమయ్యింది. కొత్తపల్లి మండలం నాగులాపల్లి నేరేళ్లమ్మ తల్లి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయక మంటపం నుంచి ఆదివారం సాయంత్రం ఉప్పాడ తీరానికి నిమజ్జనాకి వెళ్లారు. అక్కడ నిమజ్జనం చేసే క్రమంలో జరిగిన ప్రమాదంలో అనిశెట్టి వెంకటరెడ్డి అలియాస్ వంశీరెడ్డి చికిత్స పొందుతూ మృతి చెందగా చింతపల్లి సతీష్‌రెడ్డి, తమిలిశెట్టి విజయవర్ధనరెడ్డి గల్లంతయ్యారు. కొత్తపల్లి మండలం పొన్నాడ శివారు కోనపాపపేట సమీపంలో తీర ప్రాంతంలో వీరి మృతదేహాలు లభ్యమయ్యాయి. పిఠాపురం సీఐ వైఆర్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సాగర తీరంలో సోమవారం ఉదయం నుంచి గాలింపు చేపట్టగా మృతదేహాలు ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో అలల మధ్య తేలియాడుతుండడంతో వాటిని ఒడ్డుకు చేర్చారు. వాటికి పిఠాపురం ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. -
దుబాయ్‌లో విలాసవంతమైన విల్లా కొన్న అంబానీ: చిన్న కొడుకు కోసమేనా?
సాక్షి,ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ దుబాయ్‌లో విలాసవంతమైన విల్లాను కొనుగోలు చేసినట్టు సమాచారం. దుబాయ్‌లోని పామ్ జుమేరాలో బీచ్ ఫ్రంట్ విల్లాను 80 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ఇదే అతిపెద్ద నివాస ప్రాపర్టీ డీల్ అని ఈ డీల్ గురించి తెలిసిన వారు చెబుతున్న మాట. తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ కోసం రూ.640 కోట్లు వెచ్చించి అత్యంత ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారని తెలుస్తోంది. బీచ్ ఒడ్డున నిర్మించిన ఈ విల్లాలో లేని లగ్జరీ సౌకర్యం అంటూ ఏదీ లేదు. 10 బెడ్రూమ్లు, ప్రైవేట్ స్పా, ఇండోర్, అవుట్డోర్ స్విమ్మింగ్ పూల్స్, ఇలా సర్వ హంగులతో 7-స్టార్ హోటల్‌కు మించి ఉంటుందట. దుబాయ్ ప్రాపర్టీ డీల్‌ను అంబానీ ఫ్యామిలీ చాలా గోప్యంగా ఉంచింది. అందుకే కొన్నది ఎవరో చెప్పకుండానే స్థానిక మీడియా కూడా దీని గురించి నివేదించింది. అలాగే ఈ విల్లా రెనోవేషన్, సెక్యూరిటీ మరింత పటిష్టంగా ఉండేందుకు మిలియన్ల డాలర్లు వెచ్చిస్తున్నట్లు వ్యాపారవర్గాలు పేర్కొంటున్నాయి. రిలయన్స్‌కు చెందిన ఆఫ్‌షోర్ ఎంటిటీతోపాటు, గ్రూప్ కార్పొరేట్ వ్యవహారాల డైరెక్టర్, ఎంపీ, దీర్ఘకాల అంబానీ మిత్రుడు పరిమల్నత్వానీ ఈ విల్లా బాధ్యతలు నిర్వహించనున్నారట. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ప్రకారం, ప్రపంచ 11వ బిలియనీర్ అంబానీ 93.3 బిలియన్ల డాలర్ల సంపదకు సంబంధించిన ముగ్గురు వారసుల్లో అనంత్ ఒకరు. తన సామ్రాజ్యాన్ని గ్రీన్ ఎనర్జీ, టెక్, ఇ-కామర్స్ రంగాలకు విస్తరించిన ముఖేశ్ అంబానీ వ్యాపార పగ్గాలను నెమ్మదిగా వారసులకు అప్పగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ ఇటీవలే టెలికాం సంస్థ రిలయన్స్ జియో ఛైర్మన్‌గా నియమితుడయ్యారు. అలాగే కుమార్తె ఈషా అంబానీకి రిలయన్స్ రీటైల్ బాధ్యతలు, అనంత్‌కు ఎనర్జీ బిజినెస్ బాధ్యతలను అప్పగించిన సంగతి తెలిసిందే. కాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జనాభాలో 80 శాతానికి మించి ప్రవాసీయులే ఉన్నారు. విదేశాలకు చెందిన, ముఖ్యంగా భారతీయులదే అక్కడి రియల్ ఎస్టేట్‌లో అధిక వాటా.దశాబ్దాలుగా అక్కడి ఆర్థికవ్యవస్థకు మూలస్తంభంగా ఉన్నారు. అలాగే ఇటీవల ఇంటిని కొనుగోలు చేసే నిబంధనలు సవరించడం, గోల్డెన్ వీసా ఆఫర్‌తో డిమాండ్ మరింత పెరిగింది. కనీసం 2 మిలియన్ దిర్హామ్‌ల విలువైన ఆస్తిని కొనుగోలు చేసిన వారికి 10 సంవత్సరాల వీసాను పొందవచ్చు. ఇప్పటికే బ్రిటీష్ ఫుట్‌బాల్ ఆటగాడు డేవిడ్ బెక్‌హామ్ తన భార్య విక్టోరియా కోసం, బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ ఇక్కడ ఆస్తులను కొనుగోలు చేశారు. -
విశాఖలో మెగా బీచ్ క్లీనింగ్ ప్రోగ్రాం..
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలోని సముద్రతీర ప్రాంతాన్ని 2027 నాటికి ప్లాస్టిక్ రహితం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి చెప్పారు. ఐదేళ్లలో రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దుతామన్నారు. విశాఖపట్నంలోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం సీఎం కార్యక్రమం అనంతరం వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. పర్యావరణాన్ని పరిరక్షించడానికి రాష్ట్రంలో దశలవారీగా ప్లాస్టిక్ నిషేధించడానికి సీఎం జగన్మోహన్రెడ్డి సంకల్పించారన్నారు. శుక్రవారం భీమిలి నుంచి ఆర్కే బీచ్ వరకు 22 వేలమందికిపైగా బీచ్‌క్లీనింగ్ చేసినట్లు తెలిపారు. త్వరలో 2.5 లక్షలమందితో బీచ్ క్లీన్‌చేసి గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు నెలకొల్పుతామని వారు పేర్కొన్నారు. 20 వేలమందికి ఉపాధి కల్పన పార్లే ఫర్ ది ఓషన్ సంస్థ సీఈవో సెరిల్ మాట్లాడుతూ విశాఖ కేంద్రంగా ప్లాస్టిక్ రీసైక్లింగ్ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రూ.16 వేల జీతంతో 20 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. మొదటిదశలో 1,100 మెట్రిక్ టన్నులు, రెండోదశలో 2,200 మెట్రిక్ టన్నులు, మూడోదశలో 3,300 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి సన్‌గ్లాసెస్, షూస్, బ్యాగ్స్, టీ–షర్టులు తయారుచేస్తామని వివరించారు. ఈ సమావేశంలో నీతి ఆయోగ్ మాజీ వైస్‌చైర్మన్ రాజీవ్‌కుమార్, జీఏఎస్‌పీ సెక్రటరీ జనరల్ శ్రీసత్యత్రిపాఠి, జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీశ తదితరులు పాల్గొన్నారు. మహాయజ్ఞంలా మెగా బీచ్‌క్లీనింగ్ విశాఖపట్నంలో శుక్రవారం ఉదయం ఆరుగంటల నుంచే భీమిలి నుంచి ఆర్కే బీచ్ వరకు 28 కిలోమీటర్ల మేర రికార్డు స్థాయిలో మెగా బీచ్‌క్లీనింగ్ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం, పార్లే సంస్థ సంయుక్తంగా 40 ప్రాంతాల్లో దాదాపు 22 వేలమందికిపైగా పాల్గొన్న ఈ కార్యక్రమం మహాయజ్ఞంలా సాగింది. 76 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆదిమూలపు సురేష్, గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, వంశీకృష్ణ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు ముత్తంశెట్టి శ్రీనివాస్, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్, వీఎంఆర్డీఏ చైర్పర్సన్ అక్కరమాని విజయనిర్మల, మేయర్ గొలగాని హరివెంకటకుమారి, డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్, ప్రత్యేక చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్, కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున, సీపీ సీహెచ్ శ్రీకాంత్, జీవిఎంసీ కమిషనర్ లక్ష్మీశ, ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్ మొల్లి అప్పారావు, కార్పొరేటర్లు, కార్పొరేషన్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. -
Photo Feature: చెట్టుకు రాఖీ.. సేమ్యాలపై జాతీయ గీతం
చెట్లను కూడా కుటుంబ సభ్యుల్లా సాకాలనే సందేశంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విశాఖ నగరంలోని రైల్వే స్టేషన్ సమీపంలో వందేళ్ల వయసున్న మర్రి చెట్టుకు గ్రీన్ క్లైమేట్ టీమ్ ప్రతినిధులు బుధవారం రక్షాబంధన్ కట్టారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా విత్తన రాఖీ కట్టి చెట్లను కాపాడతామని ప్రతినబూనారు. – సాక్షి, విశాఖపట్నం సేమ్యాలపై జాతీయ గీతం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సందర్భం పాస్తా(సేమ్యా)లపై జాతీయ గీతాన్ని రాసి అబ్బురపరుస్తోంది బాపట్ల జిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన అన్నం మహిత. కేవలం మూడు గంటల వ్యవధిలోనే ఈ గీతాన్ని రాయగలిగినట్టు ఆమె తెలిపింది. – కారంచేడు ముందుకొచ్చిన సముద్రం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని ముక్కాం, కొండ్రాజుపాలెం, చేపలకంచేరు తీరంలో ‘అల’జడి నెలకొంది. ముక్కాం, చేపలకంచేరు మధ్య బుధవారం 50 మీటర్ల మేర సముద్రం ముందుకు వచ్చింది. కెరటాల తాకిడికి ముక్కాం గ్రామ తీరంలోని రోడ్డు, మత్స్యకారుల ఇళ్లు కోతకు గురయ్యాయి. రెవెన్యూ, సచివాలయ సిబ్బంది తీర ప్రాంతాల్లో పర్యటించి మత్స్యకారులను అప్రమత్తం చేశారు. ప్రతికూల వాతావరణం దృష్ట్యా వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను హెచ్చరించారు. (క్లిక్: ఉగ్ర కృష్ణ.. మహోగ్ర గోదావరి) – భోగాపురం మనోహర దృశ్యం శ్రీశైలం డామ్ పదిగేట్లు ఎత్తివేయడంతో వరద నీరు దిగువకు పరవళ్లు తొక్కుతోంది. ఈ మనోహర దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు సందర్శకులు శ్రీశైలం ప్రాజెక్ట్ వద్దకు తరలివస్తున్నారు. పాల నురుగులా పొంగుతున్న నీటి ప్రవాహాన్ని చూస్తూ పర్యాటకులు పరశించిపోతున్నారు. (క్లిక్: ఆ కుటుంబాలకు వజ్రాల రూపంలో లక్షలు..) -
మంగమారిపేటలో ఎంటర్టైన్మెంట్ సిటీకి ప్రణాళికలు
సింగపూర్ వెళ్లే ప్రతి పర్యాటకుడూ సందర్శించే ఏకైక ప్రాంతం సెంటోసా దీవులు. భిన్నమైన పర్యాటక ప్రాంతాలన్ని ఒకే చోట కనువిందు చేసే ఈ ప్రాంతానికి వెళ్తే.. సరికొత్త ప్రపంచాన్ని చుట్టొచ్చినట్లే. సరిగ్గా ఇదే ఆలోచనతో సుందర నగరం విశాఖ తీరంలోనూ మెగా టూరిజం కాంప్లెక్స్‌కు పర్యాటక శాఖ శ్రీకారం చుడుతోంది. 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.700 కోట్ల అంచనా వ్యయంతో మొత్తం 24 విభిన్న టూరిజం ప్రాజెక్టులు ఒకే చోట రూపుదిద్దుకునే ఈ ప్రాజెక్టులో ఇప్పటికే కొన్నింటికి కేబినెట్ ఆమోదముద్ర లభించింది. త్వరలోనే స్టేక్ హోల్డర్లతో సమావేశం ఏర్పాటు చేసి, ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు టూరిజం శాఖ సన్నద్ధమవుతోంది. సాక్షి, విశాఖపట్నం: భారత్‌కు వచ్చే ప్రతి పది మంది పర్యాటకుల్లో ఐదుగురు విశాఖ నగరాన్ని సందర్శిస్తుంటారు. అందుకే పర్యాటకంగా నగరాన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి టూరిజం అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో విశాఖ నగరంలో సెంటోసా దీవుల తరహాలో ఎంటర్టైన్మెంట్ సిటీని అభివృద్ధి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం విశాఖపట్నం నుంచి 16 కి.మీ, భీమిలి నుంచి 5 కి.మీ దూరంలో ఉన్న మంగమారిపేట బీచ్‌ను ఎంపిక చేశారు. 25 ఎకరాలు.. 24 ప్రాజెక్టులు.. రూ.700 కోట్లు మంగమారిపేట బీచ్‌లో 25 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఎంటర్టైన్మెంట్ సిటీకి రూపకల్పన చేశారు. ఈ మెగా టూరిజం కాంప్లెక్స్‌లో మొత్తం 24 విభిన్న తరహా టూరిజం ప్రాజెక్టులు రానున్నాయి. ఇందుకోసం రూ.700 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ప్రస్తుతం ప్రతిపాదనల్లో ఉన్న భీమిలి–భోగాపురం ఆరులైన్ల గ్రీన్‌ఫీల్డ్ కారిడార్‌కు అనుసంధానంగా ఈ ఎంటర్టైన్మెంట్ సిటీ రానుంది. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకునేలా అత్యాధునిక టూరిజం ప్రాజెక్టులను అభివృద్ధి చేయడంతో పాటు.. ప్రాథమిక మౌలిక సదుపాయాలు కల్పించడం మొదలైన అంశాలతో టూరిజం అధికారులు ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఒకే కాంప్లెక్స్‌లో పార్కింగ్, ఫుడ్ కోర్టులు, ఇతర మౌలిక వసతులు కల్పించడం వల్ల ప్రాజెక్టు వ్యయం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ (ఏపీయూఐఎఎంఎల్) సహకారంతో ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించనుంది. పలు ప్రాజెక్టులకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇప్పటికే ఈ ఎంటర్టైన్మెంట్ సిటీలో రానున్న కొన్ని ప్రాజెక్టులకు రాష్ట్ర కేబినెట్ ఇప్పటికే ఆమోదం వేసింది. జెయింట్ వీల్, స్నో పార్క్, స్కై టవర్, టన్నెల్ అక్వేరియం వంటి ప్రధాన ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం లభించింది. మిగిలిన ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలను రూపొందించిన తర్వాత.. కేబినెట్ ముందుకు ఈ ఫైల్ రానుంది. కేబినెట్ ఆమోదం అన్నింటికీ లభించిన తర్వాత.. మెగా టూరిజం కాంప్లెక్స్‌కు వడివడిగా అడుగులు పడనున్నాయి. (క్లిక్: విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు సర్వం సిద్ధం) ఎంటర్టైన్మెంట్ సిటీ విశేషాలు ఎంటర్టైన్మెంట్ సిటీలో టన్నెల్ అక్వేరియం, జెయింట్ వీల్, స్కైటవర్, స్నోవరల్డ్తో పాటు పలు అడ్వెంచర్ ప్రాజెక్టులు అందుబాటులోకి రానున్నాయి. ఐస్ స్కల్ప్ చర్ పార్క్, అవుట్ డోర్ స్కై డైవింగ్, టెథర్డ్ గ్యాస్ బెలూన్, వేవ్ సర్ఫింగ్, ఎలివేటెడ్ ట్రాక్డ్ ట్రైన్, డైనోసర్ పార్క్, డైనోసార్ 5డీ ఇండోర్ షో, గ్లో గార్డెన్, మినియేచర్ వరల్డ్, గ్లాస్ వ్యూయింగ్ డెక్, ఈవెంట్ డోమ్, అవుట్డోర్ మువీ సిస్టమ్, పెర్ఫార్మెన్స్ థియేటర్, గ్లాస్ డెక్ రెస్ట్ అకామిడేషన్, ఫ్లోటింగ్ రెస్టారెంట్, బీచ్ రాంట్, వాటర్ బస్తో పాటు భిన్నమైన ఆటలు, చిల్డ్రన్ పార్క్, పిల్లల అడ్వెంచర్ గేమ్స్, ఇండోర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సెంటర్, స్టార్ హోటల్స్, కన్వెన్షన్ సెంటర్లు, ఫుడ్‌కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. (క్లిక్: పర్యాటక ప్రాంతాలు కళకళ.. భారీగా ఆదాయం) త్వరలోనే ఎంవోయూలు ఎంటర్టైన్మెంట్ సిటీ కోసం మంగమారిపేటని గుర్తించాం. బీచ్‌రోడ్డులో కొంత భూమి కోతకు గురైన కారణంగా ఆరు ఎకరాల స్థలాన్ని ఇప్పటికే గుర్తించాం. భూ సేకరణకు సంబంధించి చిన్న చిన్న సమస్యలున్నాయి. అవి త్వరలోనే పరిష్కృతమయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈ ప్రాజెక్టులకు సంబంధించి డీపీఆర్‌లు ఇప్పటికే పూర్తయ్యాయి. వాటికి సంబంధించి మార్పులు చేర్పులు కూడా చేపట్టాం. పెట్టుబడిదారుల కోసం మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నాం. త్వరలోనే ఇన్వెస్టర్స్ మీట్ నిర్వహించి ప్రాజెక్టు గురించి వివరించనున్నాం. ఇప్పటికే చాలా మంది ఎంటర్టైన్మెంట్ సిటీలో పెట్టుబడుల కోసం ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరలో ఎంవోయూలు నిర్వహించి, ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు సన్నద్ధంగా ఉన్నాం. – శ్రీనివాస్‌పాణి, టూరిజం రీజనల్ డైరెక్టర్ -
అనకాపల్లి జిల్లా పూడిమడక తీరంలో గల్లంతైన విద్యార్థుల మృతదేహాలు లభ్యం
-
గల్లంతైన ఆరుగురిలో నాలుగు మృతదేహాలు లభ్యం.. విద్యార్థుల కోసం కొనసాగుతున్న గాలింపు
-
అనకాపల్లి: పూడిమడక తీరంలో మరో 2 మృతదేహాలు లభ్యం
-
అనకాపల్లి జిల్లా పూడిమడక బీచ్‌లో విషాదం
-
పూడిమడిక బీచ్‌లో విద్యార్థుల గల్లంతు ఘటనపై సీఎం జగన్ ఆరా
సాక్షి, అమరావతి: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక బీచ్‌లో విద్యార్థులు గల్లంతు ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరా తీశారు. ఈ ఘటనపై సీఎం తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణమే సహాయక చర్యలు పర్యవేక్షించాలని మంత్రి గుడివాడ అమర్నాథ్ను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలంటూ అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. చదవండి: పోలవరంపై చంద్రబాబు కొంగజపం పూడిమడక బీచ్‌లో అనకాపల్లి డైట్ కాలేజీకి చెందిన ఏడుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. వారిలో ఒకరి మృతదేహాన్ని వెలికితీయగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గల్లంతైన వారిని జగదీష్, యశ్వంత్, సతీష్, గణేష్, చందుగా గుర్తించారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
అనకాపల్లి: పూడిమడక బీచ్‌లో ఏడుగురు విద్యార్థుల గల్లంతు
-
Anakapalle: పూడిమడక తీరంలో విషాదం
సాక్షి, అనకాపల్లి/సాక్షి అమరావతి: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలోని పూడిమడక మొగ వద్ద విషాదం చోటు చేసుకుంది. అనకాపల్లి పట్టణంలోని డైట్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు సముద్రపు అలలకు కొట్టుకుపోయారు. వారిలో ఒక విద్యార్థిని స్థానిక మత్స్యకారులు రక్షించారు. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థుల మృతదేహాలు లభ్యం కాగా, అవి గుడివాడ పవన్, జగదీష్, గణేష్‌లవిగా గుర్తించారు. నిన్న రాత్రి ఒక మృతదేహం లభ్యం కాగా, ఈరోజు ఉదయం రెండు మృతదేహాలను బయటకు తీశారు. మిగిలిన విద్యార్థుల కోసం రెండో రోజు రెండు హెలికాప్టర్లతో గాలింపు చర్యలు చేపట్టారు. పూడిమడక బీచ్ రాంబిల్లి మండలం సీతపాలెం బీచ్‌కు ఆనుకొని ఉంటుంది. ఇక్కడ సముద్ర తీరాన్ని ఆనుకొని కొండ ఉంటుంది. కొండ ఒక వైపు నుంచి సముద్రంలోని నీరు ఉప్పుటేరులోకి ప్రవేశిస్తుంది. సాధారణంగా ఇక్కడకు పర్యాటకులు ఎవరూ వెళ్లరు. స్థానికంగా కొందరు మత్స్యకారులే ఉంటారు. ఇంజనీరింగ్ విద్యార్థులు శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటల వరకు సెమిస్టర్ పరీక్షలు రాశారు. పరీక్ష ముగియగానే 12 మంది విద్యార్థులు బైక్‌లపై పూడిమడక బీచ్‌కి వచ్చారు. అందరూ ఇక్కడ సెల్ఫీలు దిగారు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో వారిలో ఏడుగురు సముద్రంలో స్నానానికి దిగారు. కేరింతలు కొడుతూ స్నానాలు చేస్తుండగా ఉవ్వెత్తున వచ్చిన అలలు సముద్రంలోకి లాగేశాయి. మిగతా విద్యార్థులు పెద్దగా కేకలు వేయడంతో స్థానిక మత్స్యకారులు పరుగున వచ్చారు. విద్యార్థులను రక్షించే ప్రయత్నం చేశారు. మునగపాకకు చెందిన సూరిశెట్టి తేజను మాత్రం ఒడ్డుకు తేగలిగారు. కొన ఊపిరితో ఉన్న అతన్ని వెంటనే విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక దళం, కోస్ట్‌గార్డ్ సిబ్బంది రంగంలోకి దిగారు. గాలింపు చర్యలు చేపట్టారు. ముమ్మరంగా గాలింపు చర్యలు జిల్లా కలెక్టర్ రవి పట్టాన్ శెట్టి, జిల్లా ఎస్పీ గౌతమి సాలి హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లారు. మెరైన్ పోలీసులు, కోస్ట్ గార్డు బృందాలు, ఫైర్, మత్స్యకార గజఈతగాళ్లుతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి 9 గంటల వరకు గాలింపు చర్యలు కొనసాగాయి. శనివారం తెల్లవారుజామున 5 గంటల నుంచి గాలింపు చర్యలు విస్తృతం చేస్తామని జిల్లా ఎస్పీ గౌతమి సాలి చెప్పారు. విద్యార్థులు పూడిమడక బీచ్‌కి వెళ్లడం ఇదే తొలిసారి కావడం కూడా దుర్ఘటనకు కారణమై ఉండోచ్చని పోలీసులు తెలిపారు. -
తంతడి బీచ్‌లో నాగచైతన్య సందడి
అచ్యుతాపురం(అనకాపల్లి): అక్కినేని నాగచైతన్య హీరోగా నిర్మితమవుతున్న నూతన చిత్రం షూటింగ్ తంతడి బీచ్‌లో ప్రారంభమైంది. తీరంలోని రెండు కొండల మధ్య ఏర్పాటు చేసిన సెట్టింగ్ చూపరులను ఆకట్టుకుంటోంది. పది రోజులపాటు కష్టపడి సెట్టింగ్ నిర్మించారు. గురువారం ఉదయం నుంచి షూటింగ్ జరుగుతుందని తెలియడంతో సమీప ప్రాంతాల ప్రజలు నాగ చైతన్యను చూసేందుకు తరలివచ్చారు. మరో మూడు రోజులపాటు షూటింగ్ జరగనున్నట్లు సమాచారం. చదవండి: మహారాజా సుహేల్ దేవ్‌గా రామ్‌చరణ్! -
కొత్త లైట్‌హౌస్ నిర్మాణానికి సన్నాహాలు
భీమునిపట్నం: భీమిలి బీచ్ సమీపంలో కొత్త లైట్‌హౌస్ నిర్మాణానికి అధికారులు ప్రయత్నాలు చేస్తుండడంతో త్వరలో ఇది కార్యరూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది. బ్రిటిష్ వారు ఇక్కడ ఉన్న సమయంలో సముద్రంలో పోర్టును ఏర్పాటు చేసుకోవడం ద్వారా వస్తువులు, సామాగ్రిని ఎగుమతులు, దిగుమతులు చేసుకునేవారు. ఇందుకోసం ఇక్కడకు వచ్చి వెళ్లే ఓడలకు దిక్సూచిగా ఉండడం కోసం 1854లో బీచ్ వద్ద లైట్‌హౌస్‌ను ఏర్పాటు చేశారు. దాంతోపాటు మున్సిపల్ కార్యాలయం వద్ద పోర్టు షిప్పింగ్ కార్యాలయం, బీచ్‌కు సమీపంలో లైట్‌హౌస్ నిర్వహణ చూసుకునే సిబ్బంది క్వార్టర్లు నిర్మించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత వీటి నిర్వహణ బాధ్యత కాకినాడ పోర్టు ఆధీనంలోకి వెళ్లింది. కాగా పోర్టు కార్యాలయంలో ఒక కన్సర్వేటర్, ఇద్దరు సిబ్బంది ఉండేవారు. వారు లైట్‌హౌస్ నిర్వహణ చేసేవారు. అయితే సిబ్బంది క్వార్టర్స్‌లో ఎవరూ ఉండకపోవడంతో అవి శిథిలమైపోయాయి. ఇదిలా ఉండగా సుమారు పది సంవత్సరాల క్రితం కాకినాడ పోర్టు ఆధీనంలో ఉన్న ఈ లైట్‌హౌస్ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖకు చెందిన షిప్స్ అండ్ లైట్‌హౌసెస్ విభాగం ఆధీనంలోకి వెళ్లగా వారి పర్యవేక్షణలో ఉంది. అలాగే పోర్టు కార్యాలయం మూతపడిపోవడంతో సిబ్బందిని వేరే ప్రాంతాలకు బదిలీ చేసేశారు. మత్స్యకారులకు ఉపయోగం ఇక్కడ ఉన్న లైట్‌హౌస్ బ్రిటిష్ వారి పోర్టు మూతపడిపోయి కాకినాడ పోర్టు ఆధీనంలోకి వెళ్లినప్పటికీ పని చేస్తూనే ఉంది. సాయంత్రం చీకటి పడిన తర్వాత సిబ్బంది దీన్ని వెలిగిస్తారు. ఉదయం ఆర్పేస్తారు. ఇలా రోజూ జరుగుతుంది. కాగా భీమిలితోపాటు చుట్టుపక్కల చిప్పాడ, అన్నవరం బీచ్‌రోడ్డులోని చేపలుప్పాడ, మంగమారిపేట మరికొన్ని గ్రామాల్లోని మత్స్యకారులు రోజూ రాత్రి, తెల్లవారుజామున సముద్రంలోకి చేపల వేటకు వెళ్లి తిరిగి వస్తుంటారు. వారికి ఇది దిక్సూచిగా ఉండి ఎంతగానో ఉపయోగపడుతోంది. అయితే ఇది బాగా పాతపడిపోవడం వల్ల కాంతి విహీనంగా మారడంతో అంతంత మాత్రంగానే పని చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏడు సంవత్సరాల క్రితం మరో ప్రాంతంలో వంద అడుగుల ఎత్తులో పెద్ద లైట్‌హౌస్ ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు ప్రకటించినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. ఈ క్రమంలో ఇటీవల కొత్త లైట్‌హౌస్ నిర్మాణానికి స్థల పరిశీలన కోసం అధికారుల బృందం వచ్చింది. పాత లైట్‌హౌస్ సమీపంలో శిథిలమైన సిబ్బంది క్వార్టర్స్ స్థలాన్ని పరిశీలించారు. ఇక్కడ లైట్‌హౌస్ నిర్మించడమే కాకుండా పర్యాటకులు వచ్చి సందర్శించడానికి అనుకూలంగా ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. ఈ స్థలంలో లైట్‌హౌస్ నిర్మాణం పూర్తయితే సముద్రంలో తిరిగే ఓడలకు, తీరప్రాంత మత్స్యకారులకు ఎంతో సదుపాయంగా ఉండడంతోపాటు, పర్యాటకులు సందర్శించడానికి బాగుంటుంది. -
Visakhapatnam: టూరిజంలో వైజాగ్‌కు ట్రెండ్ సెట్ చేసే సత్తా
టీ ఆఫ్ డెస్టినీగా పిలుచుకునే విశాఖ నగరానికి పర్యాటక రంగంలో ట్రెండ్ సెట్ చేసే సత్తా ఉందని కేంద్ర పర్యాటక శాఖ మాజీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ గౌర్ కంజీలాల్ అన్నారు. ప్రణాళికా బద్ధంగా వ్యవహరిస్తూ ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తే గోవా కంటే మిన్నగా విశాఖ బీచ్‌లను అభివృద్ధి చేయవచ్చన్నారు. అలాగే 10 విభిన్న రకాల టూరిజం డెస్టినేషన్‌గా వైజాగ్‌ను తీర్చిదిద్దవచ్చని వివరించారు. ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ నిర్వహించిన సదస్సులో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన గౌర్ కంజీలాల్.. టూరిజం రంగంలో విశాఖకు ఉన్న అవకాశాల్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. – సాక్షి, విశాఖపట్నం ప్రపంచంలో ప్రతి మనిషి ఆలోచనలు ఎప్పటికప్పుడు విభిన్నంగా మారిపోతున్నాయి. గ్లోబల్ మార్కెట్ టూరిజం ట్రెండ్‌కు తగినట్లుగా ఆలోచనలు చేస్తూ ప్రాజెక్టులను పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఒక ప్రాంతం గణనీయంగా అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఉంటుంది. ఈ వరుసలో అవకాశాలు పుష్కలంగా ఉన్న నగరాల జాబితాలో విశాఖపట్నం మొదటి స్థానంలో ఉంటుంది. ఇక్కడ పర్యాటక పరంగా వనరులు అపారంగా ఉన్నాయి. వాటన్నింటినీ అభివృద్ధి చేస్తే దేశంలో నంబర్ వన్‌గా మారుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. క్లీన్ అండ్ పీస్ఫుల్ బీచ్‌లుగా.. 1952 నుంచి 1980 మధ్యలో భారత్‌లో పర్యటించింది కేవలం ఒక మిలియన్ పర్యాటకులు మాత్రమే. దీనిపై మేము లండన్ వెళ్లి అధ్యయనం చేశాం. అప్పుడే ఛార్టర్ విమానాలు నడపాలన్న ప్రతిపాదనలను తీసుకొచ్చాం. క్రమంగా ఒక్కో ప్రాంతానికి ఎయిర్ కనెక్టివిటీ పెంచుతూ పర్యాటకంగా అభివృద్ధికి దోహదపడింది. ఇదే కాన్సెప్ట్‌లో వైజాగ్‌కు పెద్ద సంఖ్యలో టూరిస్టులను ఆకర్షితుల్ని చెయ్యాలి. ఇందుకు కాన్సెప్ట్ డెవలప్మెంట్ చాలా అవసరం. దేశంలో ఉన్న 365 బీచ్‌లతో పోలిస్తే.. విశాఖలో మంచి బీచ్‌లున్నాయి. వీటన్నింటినీ క్లీన్ అండ్ పీస్ఫుల్ బీచ్‌లుగా తీర్చిదిద్దాలి. తీరప్రాంత వినియోగంతో అద్భుతాలు విశాఖకు 135 కిలోమీటర్ల సువిశాల సాగర తీరం ఉన్నా.. టూరిజం పరంగా సరిగా వినియోగించుకోలేకపోతున్నారు. పోర్ట్ ఆఫ్ కాల్ పేరుతో క్రూయిజ్ టూరిజం అభివృద్ధి చేయవచ్చు. పెద్ద క్రూయిజ్‌ని సముద్ర మధ్య భాగంలో నిలిపి.. డైనింగ్, ఫంక్షన్లు నిర్వహించేలా, క్యాసినోలు మొదలైన కమర్షియల్ టూరిజంని ప్రవేశపెడితే అద్భుతంగా ఉంటుంది. గోవా ఈ తరహాలోనే అభివృద్ధి చెందింది. అక్కడ జనాభా 2 మిలియన్లుంటే.. వచ్చే పర్యాటకులు మాత్రం 5 మిలియన్లుంటారు. కారణం.. పర్యాటకుల అభిరుచికి అనుగుణంగా స్థానికుల్లోనూ మార్పు వచ్చింది. ఫలితంగా గోవా మొత్తం టూరిస్ట్ డెస్టినీగా మారిపోయింది. దానికంటే మిన్నగా విశాఖను అభివృద్ధి చేయవచ్చు. ప్రజలు ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచన చేస్తే... వైజాగ్ కచ్చితంగా.. దేశంలోనే నెంబర్ వన్ పర్యాటక ప్రాంతంగా మారుతుంది. ఛార్టర్లను అందుబాటులోకి తీసుకురావాలి.. ఛార్టర్లను విశాఖకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. పొరుగు దేశాల నుంచి ఛార్టర్లు వస్తే.. ఒకేసారి 400 మంది పర్యాటకులు వస్తారు. వారికి తగిన ఏర్పాట్లను కల్పించాల్సి ఉంది. దీనివల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయి. గల్ఫ్, ఖతార్, కౌలాలంపూర్, బ్యాంకాక్, సింగపూర్, దుబాయ్, కొలంబో మొదలైన దేశాల నుంచి ఇక్కడి పర్యాటకులకు ఆహ్వానం పలికేలా ప్యాకేజీలు రూపొందించాలి. విదేశీ పర్యాటకులకు అనుగుణంగా ఎయిర్‌పోర్టులో మౌలిక వసతులు, నగరంలో సదుపాయాలు, హాస్పిటాలిటీ పెంచాలి. వైజాగ్ ప్రపంచాన్ని టూరిస్టులకు పరిచయం చేసేందుకు స్కిల్ డెవలప్మెంట్ ఉన్న స్టాఫ్‌ని నియమించుకోవాలి. 10 విభిన్నతల టూరిజం.. బీచ్ టూరిజం, టెంపుల్ టూరిజం, క్రూయిజ్ టూరిజం, సస్టైనబుల్ టూరిజం, ఎకోటూరిజం, విలేజ్ టూరిజం, కల్చరల్ టూరిజం, అగ్రి టూరిజం, క్రియేటివ్ టూరిజం, డార్క్ టూరిజం.. ఇలా పది విభిన్న రకాల పర్యాటక అభివృద్ధికి కావల్సిన వనరులు విశాఖలో ఉన్నాయి. ఉదాహరణకు అరకులో కూల్ టూరిజం అభివృద్ధి చేయవచ్చు. గ్రామీణ విశాఖ, అరకు ప్రాంతంలో అగ్రి టూరిజం, విలేజ్ టూరిజం ప్రమోట్ చేస్తే అంతర్జాతీయ నగరాల నుంచి పర్యాటకులు క్యూ కడతారు. అదేవిధంగా.. హోమ్ స్టే సంస్కృతి తీసుకురావాలి. టూరిజం మార్కెట్లో హోమ్‌స్టేలకు మంచి డిమాండ్ ఉంది. -
బీచ్‌లో సందడి చేస్తున్న పర్యాటకులు (ఫోటోలు)
-
బిల్డింగ్‌లో బీచ్ ఉంటే ఎలా ఉంటుంది.. అదిరిపొద్దంతే కదా!
UK's First Indoor Beach: బీచ్ అనగానే విశాలమైన సముద్రం, నేలపై పరుచుకున్న ఇసుక తిన్నెలు, అప్పుడప్పుడు వచ్చిపోయే అలలు కళ్లముందు కనిపిస్తుంటాయి. మరి ఇలాంటివన్నీ బయట కాకుండా ఓ బిల్డింగ్ లాంటి ప్రదేశం లోపల ఇమిడిపోతే. అంటే ఇండోర్‌లోకి వచ్చేస్తే! బ్రిటన్‌లో అచ్చం ఇలాగే ఇండోర్ బీచ్ ఒకటి సిద్ధమవుతోంది. ఒక్క బీచ్ మాత్రమే కాదు.. మినరల్ బాత్‌లు, స్టీమ్ రూమ్‌లు, వేడి నీటి బుగ్గలు.. అబ్బో చూడముచ్చటైన చాలా అందాలు జతకూడనున్నాయి. ఈ బీచ్ పుట్టుపూర్వోత్తరాలు, ప్రత్యేకతల గురించి తెలుసుకుందామా. బ్రిటన్‌లోని మాంచెస్టర్‌లో.. బ్రిటన్‌లోని మాంచెస్టర్‌లో ఏర్పాటు చేస్తున్న ఈ బీచ్‌కు ‘థర్మ్ మాంచెస్టర్’ అని పేరు పెట్టారు. దీన్ని దాదాపు రూ.2,500 కోట్లు ఖర్చుతో నిర్మిస్తున్నారు. 2023 నాటి కల్లా సిద్ధమవ్వాల్సి ఉన్నా మరిన్ని ప్రత్యేక వసతులను జత చేసి 2025 నాటికి అందుబాటులోకి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నా రు. ఏటా 20 లక్షల మంది ఈ బీచ్‌ను సందర్శిస్తారని అంచనా వేస్తున్నారు. 28 ఎకరాల వైశాల్యంలో.. బీచ్‌ను 28 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. అంటే 19 ఫుట్ బాల్ పిచ్‌ల వైశాల్యమంత ఉంటుంది. ఇందులో ఇండోర్, ఔట్‌డోర్ పూల్స్, 35 వాటర్ స్లైడ్స్, స్టీమ్ రూమ్స్, విశ్రాంతి తీసుకోవడానికి తాటి చెట్లు ఏర్పాటు చేయనున్నారు. రోజా పువ్వు ఆకారంలో వెల్ బీయింగ్ గార్డెన్‌ను రెండెకరాల్లో రెడీ చేయనున్నారు. వందలాది చెట్లు, మొక్కలను పెంచనున్నారు. పెద్దల కోసం వేడి నీటి బుగ్గలు (వార్మ్ వాటర్ లగూన్స్), మినరల్ బాత్, స్టీమ్ రూమ్స్ సిద్ధం చేయనున్నారు. పైగా.. బార్లు, కేఫ్‌లు, స్నాక్స్ అందించే రెస్టారెంట్లు కూడా ఉంటాయి. విద్యార్థులు, ఇతర వర్గాల ప్రజల కోసం ప్రత్యేకంగా సెంటర్లు కూడా ఏర్పాటు చేయనున్నారు. రోజువారి నీటి సంబంధమైన ఫిట్నెస్ క్లాసులు, యోగా, ధ్యానానికి సంబంధించిన శిక్షణ కూడా ఇవ్వనున్నారు. -
రండి రండి.. అరుదైన అతిథులు వస్తున్నారోచ్!
ఎల్లలు లేని సాగరంలో జీవించే ఉభయచర జీవులు వడివడిగా పుట్టింటి వైపు అడుగులు వేస్తున్నాయి. అరుదైన ఈ అతిథుల ఆగమనంతో రుషికుల్య తీరం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తమ సంతానవృద్ధికి అర్ధరాత్రి దాటిన తరువాత తీరానికి చేరుకుంటున్న ఆలివ్‌రిడ్లేలు.. గుడ్లు పెట్టి, వాటిని ఇసుకలో భద్ర పరిచిన అనంతరం సంద్రంలోకి తిరిగి చేరుకుంటున్నాయ. వీటి రాకతో తీరమంతా సందడి నెలకొంది. – భువనేశ్వర్ భువనేశ్వర్: గుడ్లు పెట్టేందుకు ఏటా రుషికుల్య తీరానికి ఆలివ్‌రిడ్లే తాబేళ్లు అతిథులుగా విచ్చేయడం పర్యావరణ ప్రియులకు ఆహ్లాదపరుస్తోంది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 5,48,768 తాబేళ్లు ఈ తీరానికి చేరడం విశేషం. 2018లో అత్యధికంగా 4,82,128 ఆలివ్‌రిడ్లే ఈ ప్రాంతానికి విచ్చేశాయి. మార్చి 27 నుంచి రుషికుల్య తీరంలో తాబేళ్లు గుడ్లు పొదగడం ప్రారంభమైంది. ఈనెల 3తో ముగిసిందని డీఎఫ్ఓ అమ్లాన్ నాయక్ తెలిపారు. మరో 45 రోజుల్లో ఈ గుడ్ల నుంచి పిల్లలు బయటకు వస్తాయని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేక జాగ్రత్తలు.. అపురూపమైన ఆలివ్ రిడ్లే తాబేళ్ల ఆగమనం పురస్కరించుకుని రుషికుల్య తీరంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సువిశాల తీరాన్ని 50 సెగ్మెంట్లుగా విభజించారు. గుడ్లు పెట్టేందుకు అనుకూలమైన పర్యావరణంతో ఈ సెగ్మెంట్లు ఏర్పాటు చేయడం విశేషం. తాబేళ్ల గుడ్లని కుక్కలు, కాకులు, ఇతర పక్షలు నష్ట పరచకుండా ప్రత్యేక సంరక్షణ చర్యలు చేపడుతున్నారు. పొదిగిన గుడ్లు నుంచి బయటపడిన ఆలివ్ రిడ్లే తాబేళ్ల కొత్త సంతతి సురక్షితంగా తిరిగి సముద్ర గర్భానికి వెళ్లేంత వరకు ఈ కార్యాచరణ నిరవధికంగా కొనసాగుతుందని డీఎఫ్ఓ వివరించారు. చదవండి: కట్నంతో లాభాలెన్నో! -
Bheemili Beach: విశాఖ భీమిలీ బీచ్‌లో అరుదైన దృశ్యం..
భీమునిపట్నం(విశాఖపట్నం): భీమిలి తీరంలో సముద్రం శుక్రవారం వెనక్కి తగ్గింది. అలల ఉధృతితో ప్రతి రోజూ సముద్రం ముందుకు వస్తుంది. చాలా అరుదుగా వెనక్కి వెళ్తుంది. అయితే శుక్రవారం సముద్రం వెనక్కి వెళ్లడంతో రాళ్లు బయటపడ్డాయి. అలల ఉధృతి లేకపోవడం, హోలీ కావడంతో సందర్శకులు అధిక సంఖ్యలో తరలివచ్చి.. ఇక్కడ స్నానాలు చేశారు. కాగా.. ఇక్కడి తీరం చాలా ప్రమాదకరంగా ఉంటుంది. స్నానాలకు దిగే వారిలో చాలా మంది ప్రమాదాలకు గురవుతుంటారు. నీటి అడుగున ఉండే రాళ్లకు తగలడం వల్ల తీవ్రగాయాలపాలవడం, లేదా చనిపోవడం జరుగుతుంది. ఇక్కడ బయటపడ్డ రాళ్లను చూస్తే తీరం ఎంత ప్రమాదకరమో అర్థమవుతుంది. చదవండి: అమ్మాయిలను రప్పించి.. లాడ్జీ రూంలో గుట్టుగా వ్యభిచారం.. -
బీచ్‌లో దారుణం: ప్రియుడిని తాళ్లతో కట్టేసి.. యువతిని తోటలోకి లాక్కెళ్లి..
కోనేరుసెంటర్(మచిలీపట్నం)/కృష్ణా జిల్లా: ప్రియుడితో కలిసి బీచ్‌కు వెళ్లిన విద్యార్థినిపై మరొక వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. బందరు రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మచిలీపట్నానికి చెందిన ఓ యువతి నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ సెకండియర్ చదువుతోంది. మరో కళాశాలలో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇరువురు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. బుధవారం మధ్యాహ్నం ఇద్దరు కలిసి బందరు మండలం చినకరగ్రహారం శివారు పల్లెపాలెం సమీపంలోని బీచ్‌కు వెళ్లారు. చదవండి: వివాహేతర సంబంధం: వద్దన్నా వినకుండా.. ఆమె ఇంటివద్దకెళ్లి.. బీచ్ ఒడ్డున ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటుండగా కరగ్రహారానికి చెందిన యర్రంశెట్టి మణిదీప్, పోసిన నాగబాబు వారి వద్దకు వెళ్లారు. ప్రియుడిని మణిదీప్ తాళ్లతో కట్టివేయగా పోసిన నాగబాబు విద్యార్థినిని బలవంతంగా తోటలోకి లాక్కెళ్లి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం వారు ఇరువురిని వదిలేశారు. జరిగిన ఘోరాన్ని తలచుకుంటూ ప్రేమికులిద్దరూ ఇంటికి వెళ్లారు. ప్రేమికులు ఇద్దరు వారి పెద్దలకు చెప్పకుండా గురువారం రాత్రి బందరు రూరల్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. బాధితురాలిని పరీక్షల నిమిత్తం బందరు ప్రభుత్వాస్పత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేశారు. -
సముద్రం, భూమి కలిసి చెస్ ఆడుతూ..
ఇక్కడ సముద్ర తీరంలో చెస్ కాయిన్లలా కనిపిస్తున్నవి ఏమిటో తెలుసా?.. ఏవో శిల్పాల్లా ఉన్నాయి, ఎవరో పెట్టి ఉంటారులే అనిపిస్తోందికదా.. కానీ అవి శిల్పాలూ కాదు, ఎవరూ ఏర్పాటు చేయలేదు. ఇవి ప్రకృతి సృష్టించిన చిత్రాలు. కేవలం ఇసుకతో ఏర్పడిన చిన్నపాటి స్తంభాలు. అమెరికాలోని లేక్ మిషిగన్ ప్రాంతంలో రెండు రోజుల కింద ఈ చిత్రమైన ఇసుక ఆకృతులు ఏర్పడ్డాయి. వీటిని అక్కడ ‘హూడూస్’ అని పిలుస్తారు. (క్లిక్: అరుదైన గ్రహాంతర వజ్రం.. కాసులుంటే మీ సొంతం !) అక్కడ చలికాలంలో నీళ్లు గడ్డకట్టేంతగా ఉష్ణోగ్రతలు పడిపోతాయి. సముద్ర తీరంలో నీళ్లు ఇసుకలో చేరి అక్కడక్కడా గడ్డకడతాయని, ఆ తర్వాత అలలకు ఇసుక కోతకు గురవడం, దానికి గాలి తోడవడంతో.. ఇలా రకరకాల ఆకారాల్లో ఇసుక స్తంభాలు ఏర్పడుతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. తాజాగా టెర్రీ అబ్బాట్ అనే ఫొటోగ్రాఫర్ తీసిన ఈ చిత్రాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. సముద్రం, భూమి కలిసి సరదాగా చెస్ ఆడుతూ.. మధ్యలో వదిలేసినట్టుగా ఉన్నాయంటున్నారు నెటిజన్లు. (చదవండి: అమెరికాను వణికిస్తున్న ఇజ్జీ.. 1,200 విమానాలు రద్దు) -
చీరాల బీచ్‌లో బాలయ్య ఫ్యామిలీ సందడి
-
తంతడి తీరానికి అతిపెద్ద అతిథి
దొండపర్తి (విశాఖ దక్షిణ): ప్రపంచంలోనే అతి పెద్ద చేపగా గుర్తించబడిన వేల్ షార్క్ విశాఖ తీరానికి వచ్చింది. ఇక్కడి తంతడి బీచ్‌లో బుధవారం స్థానిక మత్స్యకారుల వలకు చిక్కింది. 50 అడుగుల పొడవు, 2 టన్నుల బరువు ఉండే చేప ఒడ్డుకు రావడాన్ని గమనించిన వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ శ్రీకాంత్ మన్నెపూరి వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారాన్ని తెలియజేశారు. విశాఖ డీఎఫ్‌వో అనంత్‌శంకర్ ఆదేశాల మేరకు సిబ్బంది వెంటనే తంతడి బీచ్‌కు చేరుకొని ప్రపంచంలోనే అతిపెద్ద చేప అయిన వేల్‌షార్క్‌గా దీనిని నిర్ధారించారు. అంతరించిపోతున్న షార్క్‌ల జాతిలో ఇదొకటిగా గుర్తించారు. షార్క్‌ను సురక్షితంగా సముద్రంలోకి పంపించే ఏర్పాట్లు చేయాలని డీఎఫ్‌వో అనంత్‌శంకర్ సూచించారు. వెంటనే అటవీ శాఖ సిబ్బంది, మత్స్యకారులు, వన్యప్రాణుల సంరక్షకులు షార్క్‌కు ఫిల్టర్ ఫీడింగ్ ఇచ్చారు. అనంతరం షార్క్‌ను సురక్షితంగా సముద్రంలోకి పంపించారు. చిక్కింది టేకు చేప.. మత్స్యకారుల వలకు భారీ టేకు చేప చిక్కింది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ గ్రామ సమీపంలోని కృష్ణా నదిలో బుధవారం చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు పోస సాయికృష్ణ, ఉట్టి వెంకటేశ్వర్లు, గంగరాజులు వేసిన వలలో 200 కిలోల బరువున్న ఈ భారీ టేకు చేప పడింది. – దాచేపల్లి -
తెల్లటి పొట్టి గౌనులో 'నాగిని'.. అదిరిందిగా మౌని
Mouni Roy Stunning Looks In Short Skirt At Beach: హాటెస్ట్ టీవీ నటీమణుల్లో మౌని రాయ్ ఒకరు. 2015-16 మధ్య వచ్చిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ టీవీ సీరియల్ 'నాగిన్ 1 (తెలుగులో నాగిని)'తో ప్రేక్షకులకు పరిచయమైంది మౌని. అందులో శివన్య (తెలుగులో శివాని)గా ఆకారాన్ని మార్చే పాము పాత్రలో నటించి అలరించింది. ఈ పాత్రకు అత్యధిక పారితోషికం పొందే హిందీ టెలివిజన్ నటీమణుల్లో ఒకరిగా స్థిరపడింది. తర్వాత ఈ సీరియల్‌కు సీక్వెల్‌గా వచ్చిన 'నాగిన్ 2'లో (2016-17) తల్లిన శివన్య, కూతురు శివంగిగా రెండు పాత్రలు పోషించింది. అయితే ఈ సీరియల్ ముద్దుగుమ్మ తన అద్భుతమైన ఫొటోలతో అభిమానులను ఎప్పుడూ అబ్బురపరుస్తుంది. భారతీయ సాంప్రదాయ దుస్తుల నుంచి స్టైలిష్, పొట్టి దుస్తుల వరకు మౌని ధరించే ప్రతి ఔట్ఫిట్లో మనోహరంగా కనిపిస్తుంది. తాజాగా తన్ ఇన్‌స్టా గ్రామ్‌లో బీచ్‌లో షికారు చేస్తున్న ఒక అందమైన వీడియోను షేర్ చేసింది మౌని. అందులో తెల్లటి పొట్టి గౌను ధరించి బీచ్‌లో వయ్యారంగా నడుస్తుంది. ఆ ఇసుకతిన్నెల్లో ఎర్రగా ప్రకాశిస్తున్న సూర్యుడికి ఎదురుగా తెల్లటి గౌనులో అతి సుందరంగా మౌని నడక చూడముచ్చటగా ఉంది. ఇదిలా ఉంటే మౌని రాయ్ తన ప్రియుడు, వ్యాపారవేత్త సూరజ్ నంబియార్‌ను జనవరి 2022లో వివాహం చేసుకుంటారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ జంట దుబాయ్ లేదా ఇటలీలో వివాహం చేసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. హిందీ సీరియల్ తర్వాత స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన గోల్డ్ చిత్రంతో బాలీవుడ్ సినీ పరిశ్రమలోకి రంగప్రవేశం చేసింది మౌని రాయ్. ఇది విమర్శకుల ప్రశంసలు అందుకోవడమై కాకుండా కమర్షియల్‌గా కూడా విజయం సాధించింది. అలాగే మౌని 'బెస్ట్ ఫీమేల్ డెబ్యూ ఫిలీంఫేర్' అవార్డుకు నామినేట్ అయింది. View this post on Instagram A post shared by mon (@imouniroy) -
విదేశీ అతిథులు రా..రమ్మంటున్నాయి..
సాక్షి,టెక్కలి(శ్రీకాకుళం): కార్తీకంలో వన విహారం చేయాలనుకునే ప్రకృతి ప్రేమికులకు మంచి విడిది టెక్కలి మండలం తేలినీలాపురం గ్రామం. అంతర్జాతీయ స్థాయిలో విశిష్టత కలిగిన పెలికాన్, పెయింటెడ్ స్టార్క్ జాతులకు చెందిన విదేశీ పక్షుల విడిది కేంద్రం ఇది. వేల కిలోమీటర్ల నుంచి ఇక్కడకు వచ్చే పక్షులను చూడడానికి సందర్శకులు ఆసక్తి చూపిస్తుంటారు. తప్పక చూడండి: ► పక్షుల విన్యాసాలను వీక్షించాలంటే వాచ్‌టవర్‌ను ఎక్కాల్సిందే. ► విదేశీ పక్షుల విశేషాల్ని సోదాహరణంగా వివరిస్తూ ఓ మ్యూజియం ఉంది. ► రావివలసలోని ఎండల మల్లికార్జున స్వామి ఆలయం ఉంది. ► భావనపాడు సముద్రతీరం అందాలు చూసి తీరాల్సినవి. ఎలా వెళ్లాలి.. ► శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి టెక్కలి 61 కిలోమీటర్ల దూరంలో ఉంది. ► టెక్కలి నుంచి 6 కిలోమీటర్ల దూరంలో తేలినీలాపురం ఉంది. ► టెక్కలి నుంచి రావివలస 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ► భావనపాడు సముద్ర తీరం టెక్కలి నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ► పూర్తి స్థాయి రవాణా సదుపాయాలున్నాయి. చదవండి: Seshachalam Hills: ట్రెక్కింగ్‌కు పెరుగుతున్న ఆదరణ -
ప్రపంచంలో మొట్టమొదటి ‘బీచ్’ మనదేశంలోనే
Unknown Facts About World First Beach In Telugu: వందల కోట్ల సంవత్సరాల కిందట లావా చల్లబడి సముద్రాల్లో హెచ్చు తగ్గుల వల్ల భూమి ఏర్పడిందని తెలుసు. కానీ అది ఎక్కడ? ఎప్పుడు? ఎలా? ఏర్పడిందనేది ఇప్పటికీ ఓ నిర్ధారణ లేదు. కానీ ప్రపంచంలో మొట్టమొదటి సముద్రతీర భూమి ఏర్పడింది జార్ఖండ్ ప్రాంతంలోని సింఘ్‌భూమ్‌లోనని పరిశోధకులు తేల్చి చెప్పారు. 330 కోట్ల నుంచి 320కోట్ల సంవత్సరాల కిందట ఏర్పడి ఉంటుందని ఇండియా, ఆస్ట్రేలియా, యూఎస్ శాస్త్రవేత్తలు చేసిన సంయుక్త పరిశోధనల్లో వెల్లడైంది. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో ఇటీవల ప్రచురితమైన పేపర్లో ఈ ఆసక్తికరమైన విషయాలను పరిశోధక బృందం వెల్లడించింది. తేలికైన రసాయనాలు చల్లబడి... సముద్ర మట్టానికి పైన 330 నుంచి 320 కోట్ల సంవత్సరాల మధ్యకాలంలో ఈ స్థిరమైన ఖండాంతర భూభాగాలు ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు గుర్తిం చారు. భూమికి 35 నుంచి 45 కిలోమీటర్ల లోతులో అగ్నిపర్వతాల నుంచి విడుదలైన సిసిలియా, క్వార్జ్ వంటి తేలికైన రసాయనాలు చల్లబడి పైకి తేలి భూమి ఏర్పడింది. ఇదంతా జరగడానికి కొన్ని వందల బిలియన్ సంవత్సరాలు పట్టి ఉండొ చ్చన్నది వారి అభిప్రాయం. కొన్ని ప్రత్యేక పోషకాలు సముద్ర నీటిలోకి చేరి ఆ నీటి నుంచి ఆక్సిజన్ తయారైందని, ఉపవాయువు పెరుగుదల దాదాపు 250 కోట్ల సంవత్సరాల కిందట ప్రారంభమైందనే ఏకాభిప్రాయానికి వచ్చారు. తరువాత బీచ్, నివాసయోగ్యమైన భూమి ఏర్పడిందన్నది శాస్త్రవేత్తల అభిప్రాయం. అక్కడి తీరంలో ఉన్న నదీమార్గాలు, ఇసుకరాళ్లను విశ్లేషించిన అనంతరం ఈ అభిప్రాయానికొచ్చారు. అయితే ఎంత భూ భాగం ఏర్పడింది, ఇవి ఎంతకాలం అలా నీటిపై తేలుతూ ఉన్నాయన్నది మాత్రం ఇప్పటికీ మిస్టరీనే. –సాక్షి సెంట్రల్ డెస్క్ పరిశోధనలకు దిక్సూచి... ‘‘ఇక్కడ ప్రత్యేకమైన అవక్షేప శిలలను గుర్తించాం. వాటి వయసు, అవి ఎలాంటి పరిస్థితుల్లో ఏర్పడ్డాయనే విషయంపై పరిశోధనలు చేశాం. ఆ శిలల్లో ఉన్న యురేనియం, లెడ్ కంటెంట్‌ను బట్టి వాటి వయసును కనుక్కోగలిగాం. ఆ రాళ్లు 310 కోట్ల సంవత్సరాల కిందటివి’’ అని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త ప్రియదర్శి చౌదరి తెలిపారు. దాదాపు ఇదే కాలంలో దక్షిణాఫ్రికాలోని కాప్‌వాల్ క్రాటన్, ఆస్ట్రేలియాలోని పిల్బరా క్రాటన్ ఏర్పడి ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ‘‘ఇదే కాదు ధార్వాడ్, బస్తర్, బుందేల్‌ఖండ్‌లలోనూ ఇలాంటి పురాతన భూభాగాలున్నాయి. వాటన్నంటినీ అర్థం చేసుకోవడానికి ఈ పరిశోధన దిక్సూచి అవుతుంది’’ అని ప్రియదర్శి చౌదరి పేర్కొన్నారు. -
మైపాడు బీచ్‌లో జలకన్య? అసలు నిజం ఏంటంటే..
సాక్షి, ఇందుకూరుపేట: ప్రముఖ పర్యాటక కేంద్రం మైపాడు బీచ్‌లో జలకన్య కలకలం అని వస్తున్న వార్తలో నిజం లేదని, ఇలాంటి వదంతులను నమ్మవద్దని ఆక్వా కోఆపరేటివ్ మార్కెట్ డైరెక్టర్ పామంజి నరసింహులు స్పష్టం చేశారు. మైపాడు బీచ్‌లో ఓ జలకన్య మత్స్యకారులకు చిక్కినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయిన విషయంపై ఆయన స్పందించారు. చదవండి: ఆయన ఎక్కడికి వెళ్లాలన్నా గుర్రంపైనే.. ఇందుకూరుపేటలో ఆయన మాట్లాడుతూ, కొందరు ఆకతాయిలు ఓ వీడియోని సృష్టించి.. పది రోజుల కిందట కర్ణాటక రాష్ట్రంలో ఈ సంఘటన జరిగినట్లు సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారన్నారు. తాజాగా గత నాలుగైదు రోజుల నుంచి ఇదే వీడియోలను మైపాడు బీచ్‌లో జరిగినట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి.. లేనిది ఉన్నట్లు చూపుతున్నారని తెలిపారు. వీటిని పోస్టు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నరసింహులు కోరారు. చదవండి: ఊర్లున్నాయి.. ప్రజలు లేరు! -
కోన ప్రాణంతో విశాఖ తీరానికి కొట్టుకు వచ్చి న డాల్ఫిన్
-
33 లక్షల లాటరీ టికెట్‌తో కొట్టుకొచ్చిన మృతదేహం
ఒట్టావా: సాధారణంగా లాటరీ గెలిస్తే ఎవరి సంతోషానికైనా హద్దులుండవు. కానీ, ఓ వ్యక్తి లాటరీ గెలిచినా ఆనందం పొందలేక పోయాడు. ఆనందం విషయం పక్కనపెడితే.. ఆయన సజీవంగా లేకపోవటం కలకలం సృష్టింస్తోంది. ఈ ఘటన కెనడాలోని అంటారియో ప్రావిన్స్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. 57 ఏళ్ల గ్రెగొరీ జార్విస్ అనే వ్యక్తి గత శుక్రవారం కెనడాలోని ఓ బీచ్‌లో విగతజీవిగా కనించాడు. స్థానికుల సమాచారంతో బీచ్‌లో అతని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చదవండి: US Govt Says : వడ్రంగి పిట్టలు ఇక కనుమరుగైనట్టేనా! అతని మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులకు విలువైన లాటరీ లభ్యమైంది. సుమారు రూ.33 లక్షల లాటరీని అతను గెలుచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. సముద్రంలో బోట్ అదుపు తప్పటం వల్ల మృతి చెందాడని, తర్వాత అతని మృతదేహం బీచ్‌కు కొట్టుకొచ్చినట్లు తెలిపారు. ఇక అతని మృతదేహం వద్ద లభించిన లాటరీ టికెట్ సెప్టెంబర్ నెల ప్రారంభంలో కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. అతను అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
సరిలేరు మాకెవ్వరూ
-
Viral Video : సముద్ర తీరంలో అద్భుతం!
ఆకాశం నుంచి వచ్చిన ఏలియన్సా ? సాగరం నుంచి పైకి ఎగిసి వచ్చిన సర్పమా ? అన్నట్టుగా పక్షుల గుంపు విన్యాసం చేసింది, క్షణాల్లోనే వివిధ ఆకారాల్లోకి మారుతూ కనువిందు చేశాయి. ఓసారి ఏలియన్స్లాగా మరోసారి పాములాగా కనిపించాయి. ఐపీఎస్ అధికారి రూప్లిన్ శర్మ తన ట్విటర్ అకౌంట్లో ఈ పక్షుల సందడికి సంబంధించిన వీడియో షేర్ చేశారు. చెప్పడం కాదు మీరు ఓ సారి వీడియోను చూసేయండి,, Sublime , Serene..#Dance of a #FockOfBirds@ParveenKaswan @susantananda3 @SudhaRamenIFS @rajkumar_ifs @OrnithophileI @online_BOC @Ornithomedia @UNEP pic.twitter.com/2aiTW4uC7r — Rupin Sharma IPS (@rupin1992) August 29, 2021 చదవండి: మొబైల్ ఫోన్‌ను ఎత్తుకుపోయిన చిలుక.. ఫన్నీవీడియో -
అంతర్వేది దగ్గర అల్లకల్లోలంగా సముద్రం
-
విహార యాత్రలో విషాదం..
కమలాపురం/ఇందుకూరుపేట(నెల్లూరు జిల్లా): స్నేహితులతో కలిసి సరదాగా సేదతీరేందుకు వచ్చి యువకుడు సముద్రంలో గల్లంతయిన సంఘటన శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని మైపాడు బీచ్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వైఎస్సార్ జిల్లా కమలాపురం టౌన్‌కు చెందిన సయ్యద్ బిలాల్ (20) స్నేహితులతో కలిసి విహార యాత్ర కోసం మైపాడు బీచ్‌కు వచ్చారు. అందరూ కలసి సంతోషంగా సముద్రంలో నీటిలో దిగి స్నానాలు ఆచరిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో అలల ఉధృతి ఎక్కువై సయ్యద్ బిలాల్ నీటిలో కొట్టుకుపోయాడు. తీరం వెంబడి ఎంత వెతికినా ఇతని జాడ తెలియలేదు. అంతవరకు కళ్ల ఎదుటే ఉన్న స్నేహితుడు గల్లంతవడంతో వెంట వచ్చిన మిత్రులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. ఎస్సై నరేష్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. పండుగ మరుసటిరోజే.. కమలాపురం పట్టణంలోని దర్గా వీధికి చెందిన బాషామోదీన్, గౌసియా దంపతులకు ఏకైక కుమారుడు బిలాల్. ఇద్దరు కుమార్తెల అనంతరం పుట్టడంతో గారాబంగా పెంచుకున్నారు. తండ్రి హోటల్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. తండ్రికి తోడుగా ఉండాలని ఇటీవల బిలాల్ కూడా స్కూటర్ మెకానిక్ షెడ్డుకు వెళ్తున్నాడు. చేతికొచ్చిన కొడుకు దూరమయ్యాడని తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.ముందు రోజు బక్రీద్ పండుగను బిలాల్ ఆనందంగా జరుపుకున్నాడు.ఆ ఆనందం అంతలోనే అవిరైంది. రెండేళ్ల క్రితం బక్రీద్ పండుగ అనంతరం ఇదే వీధికి చెందిన ముగ్గురు చిన్నారులు, ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన మరువక ముందే బిలాల్ గల్లంతు కావడం ఆ ప్రాంత వాసులను ఆందోళనకు గురి చేస్తోంది. -
12 అడుగుల భారీ తిమింగళం.. బీచ్ వద్దకు ఎవరు రావొద్దు
లండన్: యూకేలోని టీసైడ్ నదీ తీరానికి మింక్ జాతికి చెందిన 12 అడుగుల భారీ తిమింగళం కొట్టుకువచ్చింది. ఈ విషయాన్ని బ్రిటీష్ అధికారులు గురువారం ధృవీకరించారు. ఆ భారీ తిమింగళం అవశేషాన్ని తొలగించేవరకు బీచ్ వద్దకు ప్రజలు ఎవరు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే బ్రిటీష్ డైవర్స్ మెరైన్ లైఫ్ రెస్క్యూ టీం అక్కడికి చేరుకుంది. కాగా జూన్ 2న బీచ్‌కు వచ్చిన ఫియోనా రౌబోత్ అనే మహిళకు కొద్ది దూరంలో పెద్ద తిమింగళం కనిపించిదని.. కానీ అది చనిపోయిందని తెలిపింది.దానికి సంబంధించిన ఫోటోలను కూడా తన ట్విటర్లో షేర్ చేసింది. మహిళ షేర్ చేసిన ఫోటో ద్వారా విషయం తెలుసుకున్న అధికారులు తిమింగళం మృతికి గల కారణాలను కూడా అన్వేషించే పనిలో పడ్డారు. కాగా మింక్ జాతి తిమింగళాలు 9 నుంచి 10 అడుగుల పొడవు వరకు మాత్రమే ఉంటాయని వేల్ అండ్ డాల్ఫిన్ పరిరక్షణ కమిటీ పేర్కొంది. తాజాగా బయటపడిన 12 అడుగుల భారీ తిమింగళం మింక్ జాతిలో అతి పెద్దదని ఆ కమిటీ తెలిపింది. చదవండి: జాలర్లకు జాక్‌పాట్: దరిద్రం పోయి ఊరు బాగుపడింది -
వింత పదార్థం.. దీని గురించి తెలిస్తే మాకు చెప్పండి..
సాధారణంగా మనం ఎప్పుడూ చూడని కొత్తవి, వింతవి ఎదురుగా కనిపిస్తే ఆశ్చర్యంగా చూస్తూ అలాగే ఉండిపోతాం. ఒకవేళ అవి భయంకరంగా, వికారంగా ఉంటే మాత్రం భయపడతాం. ఈ విశ్వంలో ఎన్నో వింతలు, విచిత్రాలు ఉన్నాయి. ముఖ్యంగా సముద్రాల్లో అంతుచిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. సముద్ర అడుగు భాగంలో ఇప్పటి వరకూ గుర్తించని, ఏముందో కనిపెట్టని జీవులూ ఉంటాయి. అచ్చం అలాంటి ఓ వింత పదార్థాన్ని నార్త్ కరోలినా తీరంలో నేషనల్ పార్క్ అధికారులు కనుగొన్నారు. ఇది చూడటానికి గజిబిజీగా, చాలా పెద్దగా ఉంది. కేప్ లుకౌట్ నేషనల్ సీషోర్ ఫేస్బుక్లో షేర్ చేసిన దీనికి కాళ్లు, చేతులు, తల వంటి భాగాలు కూడా లేవు. ‘అంతుచిక్కని పదార్థం’ అని క్యాప్షన్‌తో పోస్టు చేసిన ఈ ఫోటోలో ఉన్న జీవి కొన్ని నెలల క్రితమే సముద్ర ఒడ్డుకు కొట్టుకొచ్చింది. అయితే ఇటీవల సోషల్ మీడియాలో పంచుకోవడంతో దీన్నిచూసిన వారంతా ఏంటని ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. దీని ఫోటోలు ప్రస్తుతం నెట్టింటా వైరల్‌గా మారుతున్నాయి. దీనిని గుర్తించడంలో అధికారులు ప్రజల సలహా కోరుతున్నారు. ఇదొక ప్రమాదకరమైన జీవి అనుకొని స్థానికులందరూ భయపడుతున్నారు. కాగా ఇది చేపలాగా ఉంటే స్క్విడ్ గుడ్డు కావచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇది అనేక ఆకారాలను కలిగి ఉంది. చిన్న చిన్న తెలుపు రంగు బాల్స్‌తో ఉన్నట్లు కనిపిస్తోంది. ‘బీచ్ మిస్టరీ - ఈ రహస్యమైన జంతువేంటో ఏమిటో మీకు తెలుసా? ఇది కొన్ని నెలల క్రితం బీచ్‌లో కనుగొన్నాం.. ఇప్పటివరకు దీనిని గుర్తించలేకపోయాం. అయితే ఇది స్క్విడ్‌కు చెందిన గుడ్డుగా భావిస్తున్నాం. ఖచ్చితంగా తెలియదు. ఎవరైనా గుర్తించడంలో మాకు సాయం చేయగలరా అని పేర్కొన్నారు.’ కాగా ఈ పోస్టుపై స్పందించిన చాలామంది అవి స్క్విడ్ గుడ్లు అని చెప్పి, వాటిని తిరిగి సముద్రంలో వదిలి పెట్టమని అధికారులను కోరారు. -
వాకింగ్ చేస్తున్నట్లు నటిస్తూ.. మహిళల ఫోటోలు తీసిన వృద్ధుడు
ఫ్లోరిడా: చూడ్డానికి పెద్ద మనిషి తరహాలో ఉన్నాడు. వయసు కూడా దాదాపు 70 ఏళ్లకు పైనే ఉంటుంది. కానీ బుద్ధి మాత్రం నికృష్టం. ఏం ఏరగని వాటిలా అటూ ఇటూ తిరుగుతూ.. రహస్యంగా బీచ్‌లో ఉన్న ఆడాళ్ల ఫోటోలు, వీడియోలు తీయడం ప్రారంభించాడు. ఇది గమనించిన ఓ యువతి ఆ వృద్ధుడి దగ్గరకు వెళ్లి ఫోన్ లాక్కొని చూడగా.. తనతో పాటు మరికొందరు మహిళల అసభ్య ఫోటోలు ఉన్నాయి. వాటిని డిలీట్ చేసి అతడి నిర్వాకం గురించి బీచ్‌లోని వారందరికి తెలిపింది. ఈ సంఘటన ఫ్లోరిడాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. ఓ మహిళ తన స్నేహితురాలితో కలిసి బీచ్‌కు వెళ్లింది. ఆ సమయంలో ఓ వృద్ధుడు మరో వ్యక్తితో మాట్లాడుతున్నట్లు నటిస్తూ.. రహస్యంగా వారి ఫోటోలు తీయడం ప్రారంభిస్తాడు. అతడి ప్రవర్తన మీద అనుమానం వచ్చిన మహిళ అతడి దగ్గరకు వెళ్లి ఫోన్ లాక్కుని చూడగా మొబైల్లో తనతో పాటు మరికొంందరి మహిళల అసభ్య ఫోటోలు ఉన్నాయి. వాటిని చూడగానే సదరు మహిళకు చిర్రెత్తుకొచ్చింది. వెంటనే వాటిని డిలీట్ చేయమని ఆదేశించిది. ఆ తర్వాత ఫోన్ గ్యాలరీ ఒపెన్ చేసి చూడగా మరి కొందరు మహిళల అసభ్య ఫోటోలు దర్శనం ఇచ్చాయ. దాంతో ఆ మహిళ అతడి ఘనకార్యం గురించి అందరికి వెల్లడించి.. వాటిని డిలీట్ చేయించింది. చదవండి: బూతులు తిడుతూ, రెస్టారెంట్ సిబ్బందిని చితక్కొట్టిన మహిళలు -
విమానంలో సాంకేతిక లోపం.. చుట్టూ సముద్రం.. చివరికి..
ఫ్లోరిడా: సాధారణంగా మనం విమానం ల్యాండింగ్ అంటే నేల పైన ల్యాండ్ అయ్యే సమయంలో చూసుంటాం. మరి నీటి మీద ల్యాండ్ చేయడం ఎప్పడైనా చూశారా? ఇదేంటి కొత్త టెక్నాలజీతో విమానం ఏమైనా మార్కెట్లోకి వచ్చిందా అని ఆలోచిస్తున్నారా. అబ్బే అలాంటిది ఏం లేదండి ఎయిర్ షోలో పాల్గొన్న ఓ విమానం అత్యవసరంగా సముద్రంలో ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ల్యాండింగ్ జరుగుతుండంగా అక్కడి ప్రజలు ఈ సన్నివేశాన్ని వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వింత ల్యాండింగ్ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని ఫ్లోరిడా ఎయిర్ షోలో ఒక అపశృతి చోటు చేసుకుంది. షోలో పాల్గొన్న ఓ విమానం ఆకాశంలో ఉండగా అనుకోకుండా సాంకేతిక సమస్య రావడంతో అత్యవసర ల్యాండ్ చేయాలని ఆ విమాన పైలట్ భావించాడు. కాకపోతే ఎయిర్ షో జరుగుతున్న ప్రాంతం సముద్రం పక్కన ఉంది. ఇంకేముంది సమీపంలో ఎక్కడ కూడా నేల కనిపించలేదు. దీంతో ఆ పైలట్ చేసేదేమి లేక అత్యవసరంగా సముద్రంలో ల్యాండ్ చేయాల్సి వచ్చింది. తెలివిగా ఆలోచించిన పైలట్ తన నైపుణ్యాన్ని ఉపయోగించి సముద్రం ఒడ్డున విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్ చేశాడు. ఈ క్రమంలో అక్కడ సేదతీరుతున్న ప్రజులు ఆశ్చర్యంగా ఈ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. సముద్రంలో ల్యాండ్ చేసిన ఈ విమానం రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటిది. దీని పేరు టీబీఎం అవెంజర్, ఇది ఒక టార్పెడో బాంబర్. దీనిని రెండవ ప్రపంచ యుద్ధంలో యు.ఎస్. నేవీ ఉపయోగించింది. యు.ఎస్. నేవీ ఉపయోగం నుంచి రిటైర్ అయిన తరువాత, ఈ విమానం కాలిఫోర్నియాలోని డేవిస్‌లో 1956 నుండి 1964 వరకు యు.ఎస్. ఫారెస్ట్రీ సర్వీస్ ఫైర్ బాంబర్‌గా ఉపయోగించారు. ( చదవండి: నదిలో పొంగి పొర్లిన పాలు, కారణం తెలియక షాకైన ప్రజలు ) -
పప్ఫర్ ఫిష్.. ఈ చేప సైనెడ్ కంటే విషపూరితం
దక్షిణాఫ్రికాలోని మిజెన్బర్గ్ బీచ్‌కు కొట్టుకొచ్చిన మృత చేపలివీ. వీటిని పప్ఫర్ ఫిష్ అంటారు. అత్యంత ప్రమాదకరమైనవి. సైనెడ్ కంటే విషపూరితం. తింటే కొన్ని గంటల్లో మరణిస్తారని స్థానికులు చెప్పారు. ఇవి ప్రధానంగా శ్వాసకోశ వ్యవస్థను దెబ్బతీస్తాయి. తద్వారా గుండెపోటు దారితీస్తుంది. చదవండి: (వామ్మో.. మమ్మీల జులుస్.. ఎంత భయంకరంగా ఉందో!) -
అమ్మో ఎంత పెద్ద షార్కో..
భువనేశ్వర్: సముద్రంలో ఉన్న షార్క్‌లను చూడటానికి ప్రతి ఒక్కరు తెగ ఆసక్తికనబరుస్తారు.. దీనికోసం సముద్రంలోనికి వెళ్ళడానికి కూడా ఆసక్తి చూపిస్తారు. అయితే ఈ షార్క్ మీకేందుకు శ్రమ ఇవ్వాలనుకుందో ఏమో తనే సముద్రం నుంచి ఒడ్డుకు కొట్టుకుని వచ్చేసింది. వివరాల్లోకి వెళ్తే.. భువనేశ్వర్‌లోని సునాపుర్ బీచ్ వద్ద 20 ఫీట్ల పొడవైన షార్క్ తీరానికి కొట్టుకుని వచ్చింది. ఇది మాములు షార్క్‌లకన్నా చాలా పెద్దది. మొదట మత్య్సకారులు చనిపోయి వచ్చిందేమోనని భావించారు. తీరా దగ్గరికి వెళ్ళిచూసేసరికి అది ప్రాణాలతోనే ఉంది. ఈ భారీ షార్క్‌ను చూడటానికి స్థానికులు, పర్యాటకులు పెద్దఎత్తున ఎగబడ్డారు. వెంటనే మత్స్యకారులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారులు షార్క్ బతికే ఉందని నిర్థారించుకుని, స్థానికుల సహకారంతో తిరిగి సముద్రంలోనికి వదిలివేశారు. అయితే, గతంలోను బాలసోర్, సునాపుర్ బీచ్‌ల వద్ద చనిపోయిన షార్క్‌లు తీరానికి కొట్టుకుని వచ్చిన సంగతి తెలిసిందే. కాగా, తిమింగలాలను వైల్డ్‌లైఫ్ ప్రొటేక్షన్యాక్ట్ కింద అంతరించిపోతున్న జీవజాతుల జాబితా కింద సంరక్షిస్తున్నారు. చదవండి: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. కుప్పలుగా తల్లో పేలు! -
బీచ్ వెంబడి 30 వేల కొబ్బరి మొక్కలు..
సాక్షి, విశాఖపట్నం: ప్రగతి భారత్ ఫౌండేషన్ ద్వారా రాష్ట్రమంతటా పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టనున్నట్టు రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ప్రగతి భారత్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా ట్రస్ట్ సభ్యులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో విజయసాయి రెడ్డితో పాటు మంత్రి అవంతి శ్రీనివాసరావు, పలువురు పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఏడాది క్రితం విశాఖ కేంద్రంగా సేవా కార్యక్రమాలు ప్రారంభించిన ప్రగతి భారత్ ట్రస్ట్ దశల వారీగా తన సేవలను రాష్ట్రమంతటా విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా విశాఖ, భీమిలి బీచ్ అందంగా తయారు చేయడానికి 30 వేల కొబ్బరి మొక్కలు నాటడానికి ప్రణాళికలు రూపొందించినట్లు విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. విశాఖ కేంద్రంగా ప్రగతి భారత్ ట్రస్ట్ చేపట్టిన సేవా కార్యక్రమాలను ప్రజాప్రతినిధులు అధికారులు కొనియాడారు. కరోనా సమయంలో పేద ప్రజలకు ట్రస్ట్ అన్ని రకాలుగా సహాయపడిందని మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలిపారు. -
వెలుగులోకి వచ్చిన రహస్య బీచ్
ఈ భూమండలం మీద ఇప్పటికీ మానవుల దృష్టికి రాని ప్రాకతిక అందచందాలెన్నో ఉన్నాయనే విషయం తెల్సిందే. అలాంటి దృశ్యాలు మానవాళి దృష్టికి అప్పుడప్పుడు రావడం వాటిని చూసి అబ్బుర పడటం కూడా మనకు తెల్సిందే. అందులో కొన్ని సామాన్యంగా కనిపించని అపురూపమైనవి కూడా ఉంటాయి. అలాంటి మెక్సికో పశ్చిమ తీరానికి మారియెట్ దీవుల్లో దాగిన రహస్య బీచ్. ఇదిపై నుంచి చూస్తే ఓ బిలంలో దాగి ఉన్నట్లు కనిపించడం ఈ బీచ్ విశేషం. దీన్ని రహస్య బీచ్‌గా వ్యవహరిస్తున్నారు. ఒకప్పుడు మెక్సికో బాంబర్లు బాంబులను దాచేందుకు ఈ దీవిని ఉపయోగించగా, ఆ తర్వాత మెక్సికో ప్రభుత్వం సైనిక్ జోన్‌గా ప్రకటించింది. ఇప్పుడు దాన్ని నేచర్ రిజర్వ్‌గా మార్చడంతో ప్రజలు దీన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు వీలయింది. ఇది పుంటా మీటాకు కొన్ని మైళ్ల దూరంలోనే ఉన్నప్పటికీ దీన్ని మొదటి నుంచి సైనిక కార్యకలాపాలకే ఉపయోగించినందున ఈ రహస్య దీవి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉండిపోయింది. పై నుంచి చూస్తే ఈ రహస్య బీచ్ ఓ బిలం లోపల ఉన్నట్లు కనిపించడానికి కారణం ఎప్పుడు బాంబులు వేయడం వల్లనే ఆ బిలం అలా ఏర్పడి ఉండవచ్చనే అనుమానాలు ఉన్నాయి. ఏదిఏమైనా టార్సిసియో స్వారెజ్ అనే వీడియో గ్రాఫర్ ఇటీవల అక్కడికెళ్లి తన డ్రోన్ కెమేరాతో బిలం బీచ్‌ను అద్భుతంగా వీడియో తీసి విడుదల చేయడం ఇప్పుడు ఈ అందాలు ప్రపంచం దృష్టికి వచ్చింది. -
అలలు.. ఇసుక... భలే మంచి అనుభూతి
వ్యాయామం ఎక్కడైనా చేయొచ్చు. ఇంట్లో లేక జిమ్‌లో. వీలున్న చోట చెమటోడుస్తుంటారు. ఇల్లు, జిమ్ కాకుండా రష్మికా మందన్నా వర్కౌట్ చేయడానికి కొత్త చోటుని వెతుక్కున్నారు. కొన్ని రోజులుగా బీచ్‌లో వర్కౌట్స్ చేస్తున్నారు. ఈ కొత్త అలవాటు గురించి రష్మికా మందన్నా మాట్లాడుతూ –‘‘బీచ్‌లో వ్యాయామం చేయడం ఇదే తొలిసారి. ఇదో సరికొత్త అనుభూతి. కొన్ని రోజుల్లోనే బీచ్‌లో వర్కౌట్స్ చేయడం వ్యసనం అయిపోయింది. అలల చప్పుళ్లు, సముద్రపు గాలి, సువాసన, సూర్యాస్తమయం చూడటం, కాళ్ల కింద ఇసుక తగలడం... భలే చక్కటి అనుభూతి. ఇక నుంచి కొత్త ప్రదేశాల్లో ఎక్కడ వర్కౌట్ చేసినా ఓ వీడియో పంచుకోవాలనిపిస్తోంది’’ అన్నారు. బీచ్‌లో వ్యాయామం చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్నారామె. -
సాగర తీరం మూగబోయింది
ఆదివారాలు, ఇతర సెలవురోజుల్లో జిల్లాలోని బీచ్‌లు కళకళలాడేవి. ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది వచ్చి సముద్ర తీరాన సేద తీరేవారు. కరోనా మహమ్మారి కారణంగా పరిస్థితి మారిపోయింది. లాక్డౌన్ విధించిన తర్వాత పర్యాటకులు వెళ్లకుండా ఆంక్షలు విధించారు. సడలించిన తర్వాత కొంతమేర మార్పు వచ్చింది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కొందరు వచ్చేవారు. అయితే తీర ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతుండడంతో స్థానికులు పర్యాటకులను రానివ్వడంలేదు. దీంతో సాగర తీరం జనసంచారం లేక వెలవెలబోతోంది. దుకాణాలు మూతబడి అనేకమంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకూరుపేట: ప్రముఖ పర్యాటక కేంద్రమైన మైపాడు బీచ్ నెల్లూరు నగరానికి 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోడ్డు మార్గం అనువుగా ఉంటుంది. తీరం వెంబడి జ్యోతిర్లింగాలయం, భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయాలు వెలిశాయి. పర్యాటక శాఖ నిర్మించిన రిసార్ట్స్ ఉన్నాయి. వసతులు బాగుండడంతో ఈ బీచ్‌కు పొరుగు రాష్ట్రాల నుంచి పర్యాటకులు, భక్తులు పెద్దఎత్తున వచ్చేవారు. వేసవిలో అయితే ఆ సంఖ్య వేలల్లో ఉండేది. కరోనా కారణంగా ప్రస్తుతం ఆ ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండడంతో గ్రామస్తులు పర్యాటకుల రాకను నిలిపివేశారు. ఐదునెలలుగా దుకాణాలు మూతపడ్డాయి. ఇప్పుడిలా.. తోటపల్లిగూడూరు: మండలంలోని కోడూరు బీచ్‌కు పర్యాటకుల రాక అధికంగా ఉండేది. ఇది నెల్లూరు నగరానికి 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. సెలవు రోజుల్లో తీరానికి వేలాదిగా పర్యాటకులు వచ్చేవారు. అనేకమంది కుటుంబసభ్యులతో వచ్చి ఆటపాటలతో సంతోషంగా గడిపేవారు. యువత సందడి ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం బీచ్‌లో జనసంచారం లేదు. లాక్డౌన్ విధించిన తర్వాత అధికారులు బీచ్ సందర్శనపై ఆంక్షలు విధించారు. దీంతో పర్యాటకులు రావడం ఆగిపోయింది. బీచ్‌లో ఉన్న దుకాణాలు సైతం మూతపడ్డాయి. వ్యాపారులు దిక్కుతోచని పరిస్థితికి చేరుకున్నారు. ఎవరూ రాకుండా.. వాకాడు: ఎప్పుడూ పర్యాటకులతో కిటకిటలాడే మండలంలోని తూపిలిపాళెం బీచ్ కరోనా వైరస్ కారణంగా వెలవెలబోతోంది. పర్యాటకులను ఆకట్టుకునే ఆహ్లాదకరమైన ప్రదేశాలు మండలంలో రెండు ఉన్నాయి. అందులో ఒకటి తూపిలిపాళెం బీచ్. రెండోది ఓడపాళెం లైట్‌హౌస్ బీచ్. ఇక్కడికి జిల్లా నుంచే కాకుండా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి, తిరుపతితోపాటు కడప తదితర ప్రాంతాల నుంచి పర్యాటకులు వేలసంఖ్యలో వచ్చేవారు. ఆదివారం వస్తే వన భోజనాలతో అనేకమంది సందడి చేసేవారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో కళ తప్పింది. లాక్డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత పర్యాటకులు తక్కువ సంఖ్యలో వచ్చారు. అయితే నెలరోజులుగా అలల ఉధృతి ఎక్కువగా ఉండడం, తీర ప్రాంత గ్రామాల్లో పలువురికి వైరస్ రావడంతో స్థానిక మత్స్యకారులు భయాందోళన చెంది దురాయి వేసి బీచ్ వద్దకు ఎవరినీ వెళ్లనివ్వడంలేదు. దీంతో ఆయా ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. దుకాణాలు పూర్తిగా మూతపడ్డాయి. వేట లేకపోవడంతో మత్స్యకారులు తీరంలో లంగరు వేసిన తమ బోట్ల వద్ద కాపలా ఉంటున్నారు. కొందరు యువకులు ఎవరి కంట పడకుండా బీచ్‌కు వస్తున్నారు. మూసివేశాం మైపాడు బీచ్‌లో పూజా సామగ్రి, కూల్‌డ్రింక్ షాపు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నా. కరోనా కారణంగా బీచ్‌కు పర్యాటకులు, భక్తులు రావడం లేదు. దీంతో దుకాణాలను మూసివేశాం. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. – శ్రీహరికోట రమణ, మైపాడు నిర్మానుష్యంగా.. విడవలూరు: కరోనా మహమ్మారి కారణంగా మండలంలోని రామతీర్థం బీచ్ కళ తప్పింది. దగ్గర్లో కామాక్షి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. బీచ్, ఆలయాన్ని చూసేందుకు ఆదివారాల్లో పర్యాటకులు అధిక సంఖ్యలో వచ్చేవారు. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. -
ఆసియా బీచ్ క్రీడలు వాయిదా
కువైట్ సిటీ: కరోనా అన్‌లాక్‌లో ఒకవైపు ఫుట్‌బాల్, క్రికెట్, ఫార్ములావన్ (ఎఫ్1) వంటి క్రీడలు పునరాగమనం చేయగా.... మరోవైపు మాత్రం పలు క్రీడా ఈవెంట్లు వాయిదా పడుతూనే ఉన్నాయి. నిన్న చైనా మాస్టర్స్, డచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలను వాయిదా వేస్తున్నట్లు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ప్రకటించగా... తాజాగా ఆ జాబితాలో ఆసియా బీచ్ క్రీడలు కూడా చేరాయి. షెడ్యూల్ ప్రకారం చైనాలోని సాన్యా నగరం వేదికగా నవంబర్ 28 నుంచి డిసెంబర్ 6 వరకు ఆరో ఆసియా బీచ్ క్రీడలు జరగాలి. అయితే చైనాతోపాటు ఇతర దేశాల్లో కరోనా వైరస్ నేపథ్యంలో ఈ క్రీడలను వాయిదా వేస్తున్నట్లు ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ (ఓసీఏ) శనివారం ప్రకటించింది. ‘ఓసీఏ, చైనీస్ ఒలింపిక్ కమిటీ (సీఓసీ), సాన్యా ఆసియా బీచ్ క్రీడల నిర్వాహక కమిటీ కలిసి తీసుకున్న నిర్ణయం ఇది’ అని ఓసీఏ పేర్కొంది. త్వరలోనే ఈవెంట్‌కు సంబంధించిన కొత్త తేదీలను ప్రకటిస్తామని ఓసీఏ తెలిపింది. ఆసియా బీచ్ క్రీడలు తొలిసారిగా బాలి వేదికగా 2008లో జరిగాయి. -
షికారుకని వచ్చి షార్క్‌కు చిక్కాడు
-
షికారుకని వచ్చి షార్క్‌కు చిక్కాడు
బ్రిస్బేన్ : బీచ్‌లో సర్ఫింగ్ చేద్దామని వచ్చిన ఒక వ్యక్తిని దాదాపు మూడు మీటర్లు ఉన్న షార్క్(పెద్ద చేప) దాడి చేసిన ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. వివరాలు.. బ్రిస్బేన్‌కు దక్షిణంగా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కింగ్స్క్లిఫ్లోని బీచ్‌కు ఒక వ్యక్తి వచ్చాడు. బీచ్‌లో సర్ఫింగ్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా దాదాపు 3మీటర్లు ఉన్న పెద్ద సొరచేప అతనిపై హఠాత్తుగా దాడి చేసింది. ఈ ప్రమాదంలో వ్యక్తి కాలు సొరచేపకు చిక్కడంతో దాని నుంచి బలంగా లాగే క్రమంలో తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో బీచ్‌కు వచ్చిన బోట్ రైడర్లు, ఇతరులు గాయపడిన వ్యక్తిని ఒడ్డుకు తీసుకువచ్చి ప్రథమ చికిత్స నిర్వహించారు. అయితే గాయం తీవ్రంగా కావడంతో కొద్దిసేపటికే ఆ వ్యక్తి మరణించాడు.(బీరు గుటగుటా తాగిన చేప: మంచిదేనా?) ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. ఇంకా ఆ వ్యక్తి ఎవరో తెలియదని.. వయసు మాత్రం 60 ఉంటుందని, బహుశా క్వీన్‌లాండ్స్ రాష్ట్రానికి చెందినవాడిగా అనుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా ప్రపంచవ్యాప్తంగా ఆస్ట్రేలియాలో షార్క్ దాడులు ఎక్కువగా ఉంటాయి. అయితే షార్క్ దాడిలో మరణాలు సంభవించడం మాత్రం అరుదుగా జరుగుతుంటుంది. గతేడాది ఆస్ట్రేలియాలో 27 షార్క్ దాడులు జరిగాయి. -
ప్రకాశం తీరానికి కొట్టుకొచ్చిన మందిరం
సాక్షి, చీరాల(ప్రకాశం) : చీరాల మండలం గవినివారిపాలెం పంచాయతీ పరిధిలోని విజయలక్ష్మీపురం సముద్ర తీరానికి ఓ మందిరం కొట్టుకు వచ్చింది. అది వెదురు బొంగులతో కూడిన నాటు పడవపై ఉంది. సుమారు 10 అడుగుల ఎత్తున ఉన్న ఈ మందిరంలో గౌతమ బుద్దుడి ఆకారంలో రాతితో తయారు చేసిన ఓ విగ్రహం ఉంది. విషయం తెలుసుకున్న స్థానికులు దీన్ని చూసేందుకు ఆసక్తి కనబర్చారు. అది రొమేనియా దేశానికి చెంది ఉంటుందని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు సోమవారం పరిశీలనకు వస్తున్నారు. -
బీచ్‌లో బికినీ వేసుకుందని..
-
బికినీ వేసుకున్నందుకు పోలీసులు ఆమెను..
మాల్దీవులు పర్యటనకు వచ్చిన బ్రిటీష్ నటికి చేదు అనుభవం ఎదురైంది. బికినీ ధరించినందుకుగానూ ఆమెకు సంకెళ్లు వేయడానికి ప్రయత్నిస్తూ పోలీసులు భీతావహ వాతావరణాన్ని సృష్టించారు. పోలీసుల తీరుతో బెంబేలెత్తిన యువతి ‘మీరు నన్ను లైంగికంగా వేధిస్తున్నారు’ అంటూ కేకలు పెట్టినా వారు పట్టించుకున్న పాపాన పోలేదు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా వైరల్ కావడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కెసీలియా జస్ట్రెంబ్స్‌కా అనే బ్రిటీష్ యువతి మఫూసిలోని బీచ్‌లో బికినీ ధరించి సముద్రం ఒడ్డున సేద తీరుతోంది. ఇది గమనించిన ముగ్గురు పోలీసులు ఒక్కసారిగా ఆమెను చుట్టుముట్టి యువతి పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఆమె ఎంత గింజుకుంటున్నా వదలకుండా చేతికి బేడీలు వేసేందుకు ప్రయత్నించారు. ఈ హఠాత్పరిణామంతో ఖంగుతిన్న నటి వారి చర్యను తీవ్రంగా ప్రతిఘటించింది. (అయ్యో! వాలెంటైన్స్ రోజు.. ఫీల్ పోయింది..) మరోవైపు ఓ పోలీసు ఆమె శరీరాన్ని కప్పేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనపై యువతి స్పందిస్తూ తనకు ఇది అవమానకరమని వాపోయింది. ‘వారి ప్రవర్తన చూసి.. నన్ను కిడ్నాప్ చేయడానికి వచ్చారనుకున్నాను. పైగా వాళ్లు నాపై దాడి చేసినపుడు నాకు శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారింది. వారి ప్రవర్తనతో నేను హడలెత్తిపోయా. నా జీవితం ప్రమాదంలో పడుతోందని విపరీతంగా భయపడిపోయాను’ అని చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. బాధిత యువతికి క్షమాపణలు చెప్పారు. యువతి పట్ల పోలీసుల తీరు అవమానకరంగా ఉందన్నారు. ఇంతకీ పోలీసులు ఆమెను అరెస్టు చేయడానికి ప్రధాన కారణం.. అక్కడి బీచ్‌లో బికినీ వేసుకోడానికి వీల్లేదన్న నిబంధన ఉండటమే. (సీక్రెట్‌ను చెప్పేసిన కురు వృద్దుడు) -
పాండిచ్చేరి బీచ్‌లో నగర వాసి గల్లంతు
కుషాయిగూడ: మిత్రులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన ఓ యువకుడు బీచ్‌లో గల్లంతయ్యాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. కుషాయిగూడ సాయినగర్ కాలనీకి నారెడ్డి ప్రతాప్‌రెడ్డి, రేణుక దంపతుల రెండో కుమారుడు నారెడ్డి నిఖిల్‌రెడ్డి అలియాస్ బంటి(22) బీటెక్ పూర్తిచేశాడు. రెండు నెలల క్రితమే గచ్చిబౌలిలోని లీవ్ స్పేస్ ఇంటీరియల్ కంపెనీలో జాబ్‌లో చేరాడు. కంపెనీకి చెందిన మిత్రులతో కలిసి గత శనివారం చెన్నై టూర్‌కు వెళ్లాడు. సోమవారం సాయంత్రం అంతా కలిసి పాండిచ్చేరి బీచ్‌కు వెళ్లారు. అందరు కలిసి సరదాగా స్నానాలు చేసి బయటకు వచ్చారు. వారిలో ఒకరు అలల్లో చిక్కుకొని హెల్ప్.. హెల్ప్ అంటూ కేకలు పెట్టాడు. గమనించిన నిఖిల్‌రెడ్డి కాపాడేందుకు సముద్రంలోకి వెళ్లి అతణిన బయటకు లాగాడు. అదే సమయంలో ఉవ్వెత్తుగా అలలు ఎగిసిపడటంతో నిఖిల్‌రెడ్డి అలల్లో కొట్టుకుపోయాడు. దీంతో ఆందోళన చెందిన తోటి మిత్రులు నిఖిల్‌రెడ్డి ఆచూకీ కోసం ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. విషయాన్ని నిఖిల్ కుటుంబ సభ్యులకు ఫోన్లో సమాచారం అందించి పాండిచ్చేరి కోటకుప్పం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. -
సంబరంలో విషాదం..
వాకాడు: నూతన సంవత్సర వేడుకలను సరదాగా బీచ్‌లో జరుపుకోవాలని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వాకాడు మండలం తూపిలిపాళెం బీచ్‌కు వచ్చిన మిత్రబృందంలో ముగ్గురు సముద్రంలో మునిగి మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు.. చిత్తూరు జిల్లా తిరుపతి లీలామహల్ సెంటర్‌కు చెందిన బత్తల సోనియా (20) (బీటెక్ 3వ సంవత్సరం) అదే ప్రాంతానికి చెందిన దేరంగుల సోను (19) (డిగ్రీ సెకెండ్ ఇయిర్), తిరుపతిలోని జీవకోన ప్రాంతానికి చెందిన రాహుల్ ద్రావిడ్ అలియాస్ మధు (20) (ఆటో డ్రైవర్), దుగ్గిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి (ప్రైవేట్ వాహన డ్రైవర్), ఎస్కే బావాజీ (ట్రావెల్స్ డ్రైవర్) కలిసి ఓ స్నేహితుడికి చెందిన కారులో మంగళవారం రాత్రి తూపిలిపాళెం బీచ్‌కు వచ్చారు. అక్కడ నిఘా ఉంచిన వాకాడు, మెరైన్ పోలీసులు వీరిని బీచ్ వద్దకు పోకుండా అడ్డుకున్నారు. దీంతో వీరు పోలీసులతో కొద్ది సేపు వాగ్వాదానికి దిగారు. ఎట్టకేలకు వెనుదిరిగి వెళ్లిపోయిన వీరు రాత్రంతా గ్రామంలోని ఓ పాఠశాలలో ఉండి అక్కడే కేక్ కట్ చేశారు. బుధవారం ఉదయాన్నే తిరిగి బీచ్ వద్దకు వెళ్లారు. కారు డ్రైవర్‌గా వచ్చిన బావాజీ ఒడ్డున ఉండిపోగా, మిగిలిన నలుగురూ సముద్రంలో స్నానానికి దిగారు. ఉధృతంగా ఎగసిపడుతున్న అలల ధాటికి నలుగురూ గల్లంతయ్యారు. ఒడ్డున ఉన్న బావాజీ కేకలు పెట్టడంతో స్థానిక మత్స్యకారులు రక్షించే ప్రయత్నం చేశారు. చంద్రశేఖర్‌రెడ్డిని మాత్రమే సురక్షితంగా బయటికి తేగలిగారు. సోనియా, సోను, రాహుల్ ద్రావిడ్‌లను తీరానికి తీసుకువచ్చినప్పటికీ అప్పటికే వారు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వెంటనే వీరిని నాయుడుపేట ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వాకాడు మండలం బాలిరెడ్డిపాళెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
సముద్రంలో స్నానానికి వెళ్లి ముగ్గురు మృతి
-
గంటలో వస్తానన్నాడు..
భీమునిపట్నం/ఆరిలోవ(విశాఖ తూర్పు): నాగుల చవితి రోజున ఆరిలోవలో విషాద చాయలు అలముకున్నాయి. భీమిలి తీర ప్రాంతంలో గురువారం ఇద్దరు ఇంటర్ విద్యార్థులు గల్లంతైన ఘటనలో ఓ విద్యార్థి మృతదేహం తీరానికి కొట్టుకురావడంతో అతని కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. మరో విద్యార్థి ఆచూకీ లభ్యంకాకపోవడంతో అతని కుటుంబం ఆందోళన చెందుతోంది. ఈ ఘటనలో మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. పోలీసులు, కుటుంబ సభ్యులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలివి.. ఆరిలోవ ప్రాంతం ఒకటో వార్డు నెహ్రూనగర్‌కు చెందిన దువ్వి శ్రీను(16), రెండోవార్డు పరిధి టి.ఐ.సి పాయింట్ ఎస్టీకాలనీకి చెందిన లంకిలపల్లి నవీన్(16), అదే ప్రాంతానికి చెందిన ఎస్.కె.గఫూర్, కె.అరుణ్, కె. సంతోష్‌లు నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియెట్(ఎంపీసీ) మొదటి సంవత్సరం చదువుతున్నారు. వీరు గురువారం భీమిలి సముద్ర తీరానికి చేరుకుని.. ఇసుకలో కొద్ది సేపు సరదాగా గడిపారు. అనంతరం గోస్తనీ, సముద్రం కలిసే సాగర సంగమం ప్రాంతంలో స్నానానికి దిగి బంతితో ఆడుకున్నారు. ఆ సమయంలో ఓ అల ఎల్.నవీన్, దువ్వి శ్రీనులను(17) లోపలకు లాక్కుపోయింది. హఠాత్తుగా జరిగిన ఈ సంఘటనకు మిగిలిన ముగ్గురు బిత్తరపోయి తీరానికి చేరుకున్నారు. ఇది గమనించిన మత్స్యకారులు పరుగెత్తుకుంటూ వచ్చి.. వారి కోసం చాలా సేపు గాలించినా ఫలితం లేకపోయింది. సాయంత్రానికి దువ్వి శ్రీను మృతదేహం గోస్తనీ అవతల వైపున తీరానికి కొట్టుకు వచ్చింది. నవీన్ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. భీమిలి ఎస్ఐ సంతోష్‌కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి, వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉదయం పుట్టలోపాలుపోసి.. దువ్వి శ్రీను ఉదయం తల్లిదండ్రులతో కలసి ముడసర్లోవలో నాగుల చవితి వేడుకలు జరుపుకున్నాడు. అక్కడ పుట్టలో పాలుపోసి తిరిగి వచ్చారు. ఒంటి గంట సమయంలో ఇంటి వద్ద తల్లి సునీత ప్రసాదం పెట్టింది భోజనం వడ్డిస్తుండగా.. ఓ స్నేహితుడు వచ్చి బయటకు రమ్మన్నాడు. దీంతో శ్రీను తోటగరువు హైస్కూ ల్ మైదానానికి వెళ్లి గంటలో వచ్చేస్తానని, ఆ తర్వాత భోజనం చేస్తానని తల్లితో చెప్పి వెళ్లిపోయాడు. భోజనం కోసం వస్తాడని ఎదురు చూస్తున్న ఆ తల్లిదండ్రులకు భీమిలి తీరంలో కొడుకు మరణించాడన్న వార్త కలచివేసింది. ఎంతో భవిష్యత్తు ఉన్న తమ కుమారుడు ఇలా అర్ధంతరంగా తనువు చాలించడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తండ్రి పైడిరాజు, తల్లి సునీత కూలి పనులు చేసుకుంటూ ఇద్దరు కుమారులు శ్రీను, కిట్టు(8వ తరగతి)లను చదివిస్తున్నారు. గల్లంతైన మరో విద్యార్థి నవీన్ తండ్రి నారాయణరావు కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. నవీన్‌కు తల్లి ఆదిలక్ష్మి, తమ్ముడు శివ (8వ తరగతి) ఉన్నారు. వీరిద్దరూ ఆయా కుటుంబాలకు పెద్ద కుమారులే. ఈ ఘటనతో ఆరిలోవ ప్రాంతంలో విషాద చాయలు నెలకొన్నాయి. -
ఆ ‘ఫొటోల’తో దుమారం
సాక్షి, న్యూఢిల్లీ : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, రీసైక్లింగ్‌కు పనికిరాని ప్లాస్టిక్‌ను నిషేధించాలని దేశ ప్రజలకు సందేశమిస్తూ అందుకు స్ఫూర్తిగా తమిళనాడులో మామల్లాపురం బీచ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్లాస్టిక్‌తోపాటు ఇతర చెత్తాచెదారాన్ని ఏరడం, ఆ తర్వాత దానికి సంబంధించిన వీడియో క్లిప్‌ను విడుదల చేయడం తెల్సిందే. చెనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, మోదీల మధ్య శనివారం జరిగిన చర్చల నేపథ్యంలో చోటు చేసుకున్న ఈ ఉదంతంపై రాద్ధాంతం చెలరేగింది. మోదీ చెత్తా చెదారాన్ని ఏరివేయడానికి ముందు, బాంబులను గుర్తించే స్క్వాడ్ వచ్చి ఆ బీచంతా తనిఖీ చేసిందని, అనంతరం కొంత మంది పారిశుద్ధ్య కార్మికులు వచ్చి ఆ బీచ్‌లో ఉద్దేశపూర్వకంగా చెత్తా చెదారాన్ని చల్లారని, ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి వచ్చి బీచ్‌లో చెత్తా చెదారాన్ని ఏరారని, అప్పటికే అక్కడ కెమెరాలు, లైట్లతో సిద్ధంగా ఉన్న వీడియో సిబ్బంది ఆ దృశ్యాన్ని చిత్రీకరించిందంటూ కొన్ని ఫొటోలు మూడు రోజులుగా సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. అందులో ఎంత వాస్తవం ఉంది ? చక్కర్లు కొడుతున్న మూడు, నాలుగు ఫొటోలు ఆ నాడు తీసినవేనా ? కనీసం అవన్నీ మామల్లాపురంకు చెందినవేనా? జాగ్రత్తగా గమనిస్తే అవి నకిలీవని తెలుసుకోవడానికి పెద్ద సమయం పట్టదు. ప్రధాని పర్యటన సందర్భంగా బాంబు స్క్వాడ్ తనికీ చేయడం అన్నది సర్వ సాధారణం. మోడీ ఏరిన ప్లాస్టిక్, చెత్త కొంచెం మాత్రమే. ఆ కొంచెం బీచ్‌లో చల్లేందుకు అంత మంది పారిశుధ్ధ్య కార్మికులు, అన్ని సంచులతో అక్కడికి రారు. పైగా పారిశుద్ధ్య కార్మికుల్లా వారు కనిపించడం లేదు. పగట పూట మోదీ యాక్షన్‌ను చిత్రీకరించేందుకు సినిమా షూటింగ్ లాంటి లైట్లు అవసరం లేదు. ఇలాంటి సందేహాలతోనే ఫొటోలను తనిఖీ చేయగా, వీడియా సిబ్బందిలా భావించిన ఫొటో స్కాట్లాండ్లోని, సెయింట్ ఆండ్రూస్ నగరంలోని ‘వెస్ట్ స్యాండ్స్’ బీచ్‌కు చెందినది. వీడియా సిబ్బందిలా భావిస్తున్నవారు. సినిమా సిబ్బంది. అక్కడ ఆ బీచ్‌లో దేశ దేశాల షూటింగ్‌లు తరచుగా జరుగుతాయి. అలాంటి ఓ షూటింగ్‌కు సంబంధించిన ఓ ఫొటోను ‘టేస్క్రీన్ డాట్ కామ్’ ఎన్నడో ప్రచురించింది. ఇక బాంబ్ స్క్వాడ్ బీచ్‌ను తనిఖీ చేస్తున్న దశ్యం ఫొటో కేరళలోని కోజికోడ్ బీచ్‌కు చెందినది. 2019 లోక్‌సభ ఎన్నికలను పురస్కరించుకొని ఏప్రిల్, 23న మోదీ ఎన్నికల సభ సందర్భంగా తనిఖీ చేసినప్పటి చిత్రం. ఇక బీచ్‌లో చెత్త పారేస్తున్నట్లు భావిస్తున్నవారు వాస్తవానికి చెత్త ఏరుతున్నారు. అది ఎక్కడి ఫొటోనో, ఎవరి ఫొటోను తెలియలేదు. అయితే స్వచ్ఛంద కార్యకర్తలు బీచ్‌ను శుభ్రం చేస్తున్న ఫొటోగా అది అర్థం అవుతోంది. మోదీ తన వీడియో క్లిప్‌ను విడుదల చేసిన కొన్ని గంటల్లోనే మోదీ దుష్ప్రచారానికి సంబంధించిన ఫొటోలు విడుదలవడంతో అవి వేగంగా సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టాయి. మోదీకి వ్యతిరేకంగా మొదట తమిళనాడులోని శివగంగ కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం మూడు ఫొటోలను విడుదల చేసినట్లు తెలుస్తోంది. అందులో రెండు ఫొటోలు బీచ్‌లో మోదీ చెత్తా చెదారాన్ని ఏరివేస్తున్నవి కాగా, ఆ దశ్యాలను చిత్రీకరిస్తున్న వీడియా సిబ్బంది అంటూ మరో చిత్రాన్ని ఆయన విడుదల చేశారు. ఆ తర్వాత కొంత సేపటికి ‘రోఫి రిపబ్లిక్’ నాలుగు ఫొటోలను పోస్ట్ చేసింది. 1. బీచ్‌ను తనిఖీ చేస్తున్న బాంబ్ స్క్వాడ్, 2.ఆ తర్వాత చెత్త వేస్తున్న దశ్యం, 3. కెమేరాలు సర్దుకున్న వీడియో సిబ్బంది, 4. ఏరుతున్న మోదీకి ఆస్కార్....అంటూ వ్యాఖ్యానాలు కూడా చేసింది. ఈ నకిలీ ఫొటోల దుష్ప్రచారంతో సంబంధం లేకుండానే ప్రధాని మోదీ యాక్షన్ కృతకంగా ఉందని, వ్యక్తిగత ప్రచారం కోసమే ఈ ఆర్భాటం అన్న వాళ్లు, ప్రజలకు స్ఫూర్తినివ్వడానికి ఆ మాత్రం యాక్షన్ ఉండాల్సిందే అంటున్న వాళ్లు లేకపోలేదు. -
బీచ్‌లో చెత్త ఎత్తిన ప్రధాని మోదీ
-
మాటల్లో కాదు చేతల్లో చూపించారు
చెన్నై: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తాను మాటలు మాత్రమే చెప్పే వ్యక్తిని కాదని నిరూపించుకున్నారు. ఎప్పుడు స్వచ్ఛత జపం చేసే ప్రధాని స్వయంగా శ్రామికుడిలా మారి చెత్తను ఎత్తారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోదీల మధ్య అనధికార భేటీ శుక్రవారం మహాబలిపురంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండో రోజు భేటీ ప్రారంభానికి ముందు మోదీ దేశ ప్రజలకు క్లీన్ అండ్ ఫిట్ సందేశాన్ని ఇచ్చారు. శనివారం ఉదయం మోదీ మహాబలిపురం బీచ్‌లో జాగింగ్ చేయడానికి వెళ్లారు. ఆ సమయంలో ఓ సాధారణ వ్యక్తిలో సముద్రం తీరంలో అరగంటపాటు తిరిగిన మోదీ... అక్కడున్న చెత్తను స్వయంగా ఆయనే శుభ్రం చేశారు. బీచ్‌లో పడి ఉన్న ప్లాస్టిక్ కవర్లను, బాటిళ్లను ఆయన చెత్తో క్లీన్ చేశారు. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను ట్విటర్లో పోస్ట్ చేస్తూ.. ‘మహాబలిపురం బీచ్‌లో అరగంట పాటు తిరిగాను. అక్కడ నేను సేకరించిన నా కలెక్షన్‌ను హోటల్ సిబ్బందిలో భాగమైన జయరాజ్‌కు అప్పగించాను. మన బహిరంగ ప్రదేశాలు శుభ్రంగా మరియు చక్కగా ఉండేలా చూద్దాం. మనం ఆరోగ్యంగా ఉండేలా చూసుకుందాం’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. ప్రధాని ట్వీట్‌కు లక్షల్లో లైకులు వస్తున్నాయి. మీరు గ్రేట్ సార్.. కేవలం మాటలకే పరిమితం కారు.. చేతల్లో చూపిస్తారు అంటూ.. నెటిజన్లు ఆయనను ప్రశంసంలతో ముంచెత్తుతున్నారు. (చదవండి: తమిళ.. చైనా మీడియాలో) -
వణుకుతున్న తీరప్రాంత గ్రామాలు
జిల్లాలోని తీరప్రాంతంలో కడలి కోత కంటిమీదకునుకులేకుండా చేస్తోంది. ఇప్పటికే వందలాది ఎకరాల భూములు సాగర గర్భంలో కలిసిపోయాయి. అయినా గత ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. అప్పట్లో పెట్టిన ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి. కేంద్రమంత్రి నిర్మలా సీతా రామన్ తీర గ్రామాన్ని దత్తత తీసుకున్నా.. ఫలితం లేదు. నరసాపురం రూరల్: జిల్లాలోని సముద్ర తీర ప్రాంతానికి పెద్ద ముప్పు పొంచి ఉంది. సుమారు రెండు దశాబ్దాల క్రితం చిన్నగా మొదలైన సముద్రపు కోత నేడు తీవ్రమైంది. దీంతో జిల్లాలోని 19 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న సముద్ర తీర ప్రాంతంలో ముఖ్యంగా మూడు కిలోమీటర్ల పరిధిలో (చినమైనవానిలంక నుంచి పెదమైనవానిలంక వరకు) గ్రామాలకు సముద్రపు కోత రూపంలో ఏ క్షణాన్నయినా ఉపద్రవం సంభవించే ప్రమాదం లేకపోలేదు. తుపానుల ప్రభావంతో సుమారు మూడు కిలోమీటర్ల పొడవునా వందలాది ఎకరాల విస్తీర్ణం కలిగిన జిరాయితీ భూములు సముద్రగర్భంలో కలిసిపోయాయని ఆ ప్రాంత ప్రజలు చెబుతున్నారు. కొబ్బరి, తాడిచెట్లతోపాటు సర్వే తోటలు కూడా కడలి గర్భంలో కలిసి పోయాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 250 ఎకరాలపైనే.. 2002 నుంచి సముద్ర గర్భంలో భూములు కలిసిపోతున్నాయి. ఇప్పటివరకు సుమారు 250 ఎకరాలకుపైనే పంటభూమి కడలిలో కలిసిపోయింది. ఏటా తుపాన్ల వల్ల కొంతమేర భూమి కలిసిపోతున్నా.. అధికారులు చూస్తూ ఉండిపోతున్నారు. ఇప్పటికైనా కోత నివారణకు యుద్ధ ప్రాతిపదికన యత్నాలు చేయకపోతే మరో రెండు దశాబ్దాలకు సముద్రం మరింత ముందుకొచ్చి చినమైనవానిలంక, పెదమైనవానిలంక గ్రామాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వాదనను అధికారులు సైతం కొట్టి పారేయలేకపోతున్నారు. రక్షణ గోడకు ప్రతిపాదనలు ఈ ప్రాంతంలో ముందుగా చినమైనవానిలంక, పెదమైనవానిలంక గ్రామాలు సముద్రపు కోతకు గురి కావడంతో పెదమైనవానిలంక గ్రామాన్ని దత్తత తీసుకున్న ప్రస్తుత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. చినమైవానిలంక నుంచి పెదమైనవానిలంకగ్రామ శివారు వరకు సిమెంట్‌తో కూడిన భారీ రాళ్లతో ఒడ్డునే రక్షణ గోడ నిర్మించాలని ప్రతిపాదించారు. 2015లో గోవా రాష్ట్రం నుంచి ప్రత్యేక కేంద్ర బృందం ఈ ప్రాంతంలో పర్యటించిన సమయంలో తీరప్రాంత రక్షణకు సుమారు రూ.200 కోట్ల వరకు ఖర్చు కాగలదని అంచనా వేసింది. అయితే అప్పటి ప్రభుత్వం మాత్రం కోత నివారణకు చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. గతంలో కూడా సముద్రకోతను అడ్డుకునేందుకు పలువురు కలెక్టర్లు చేసిన ప్రతిపాదనలనూ అప్పటి ప్రభుత్వాలు నిధుల కొరత కారణం చూపుతూ వాయిదా వేశాయి. ఎప్పటికప్పుడు తాత్కాలిక ఉపశమన చర్యలు మాత్రమే తీసుకున్నాయి. భూములను కోల్పోయిన రైతులకు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎలాంటి ప్రత్యామ్నాయ భూమిని ప్రభుత్వం అందించలేకపోయింది. సునామీ తర్వాత సముద్రం కోత 2004లో సునామీ ప్రభావం తర్వాతనే ఈ ప్రాంతంలో సముద్ర కోత పెరిగింది. థానే, నీలం, లైలా, హుద్‌హుద్, ఫొని తదితర తుపాన్ల ప్రభావం వల్ల కోత తీవ్రమైంది. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. చిన్నప్పటి నుంచి కోతను చూస్తున్నా నాకు తెలుసుండి పాత బియ్యపుతిప్ప, చినమైనవానిలంక గ్రామాల్లో తిరిగాను. నేను చూస్తుండగానే ఆ గ్రామాలు సముద్రగర్భంలో కలిసిపోయాయి. అక్కడ తోటలు, సాగుభూమి కూడా ఉండేవి. భవిషత్తులో ఇదే పరిస్థితి తలెత్తితే ఇప్పుడున్న కాస్త ఊరు కూడా సముద్రంలో కలిసిపోయే ప్రమాదముంది. ప్రభుత్వం సముద్రకోత నివారణకు తగిన చర్యలు తీసుకోవాలి.– ఒడుగు జనార్దనరావు, చినమైనవానిలంక కోత నివారణకు చర్యలు చేపట్టాలి మా ప్రాంతంలో సముద్ర కోత రోజురోజుకీ పెరిగిపోతోంది. అప్పట్లో నిర్మలా సీతారామన్ మా గ్రామాన్ని దత్తత తీసుకున్న సమయంలో కోత నివారణకు రక్షణగోడ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇంత వరకు రక్షణ గోడ నిర్మాణానికి పూనుకోలేదు. తక్షణం గోడ నిర్మాణం తలపెట్టకపోతే భవిష్యత్తులో మా ఊరు సముద్రంలో కలిసిపోవడం ఖాయం.– మైల వెంకన్న, పెదమైనవానిలంక -
ప్రపంచంలోనే అతిపెద్ద బీచ్ శుభ్రతా కార్యక్రమం
పూరి: సముద్ర తీర ప్రాంతాన్ని శుభ్రం చేయడానికి వేలాది మంది ఏకమయ్యారు. ‘మో బీచ్ శుభ్రతా కార్యక్రమం’ పేరుతో ప్రపంచంలోనే అతిపెద్ద తీరప్రాంత శుభ్రతా కార్యక్రమాన్ని ఒడిశాలోని పూరిలో చేపట్టారు. అంతర్జాతీయ తీర ప్రాంత శుభ్రతా కార్యక్రమ దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని శనివారం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. తీరప్రాంతాలను శుభ్రంగా ఉంచడం ఎంత ముఖ్యమైనదో అధికారులు వివరించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న తీరం వెంట దాదాపు 10 వేల మందికి పైగా కార్యకర్తలు బీచ్‌లను శుభ్రం చేశారు. -
తీరంలో అప్రమత్తం
నెల్లూరు(క్రైమ్): దక్షిణ తీర ప్రాంతం మీదుగా ఉగ్రవాదులు దేశంలోకి చొరబడే అవకాశం ఉందన్న కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో తీరం వెంబడి అప్రమత్తతను పెంచారు. మెరైన్ పోలీస్స్టేషన్ల పరిధిలో హై అలర్ట్ ప్రకటించారు. మెరైన్ పోలీసులతో పాటు కోస్ట్‌గార్డ్, నేవీ బృందాలు గస్తీని ముమ్మరం చేశాయి. కౌంటర్ ఇంటెలిజెన్స్ వింగ్‌లు సైతం తీర ప్రాంతంలో అపరిచితుల కదలికలు ఏమైనా ఉన్నాయాననే కోణంలో విచారణ జరుపుతున్నారు. జిల్లాలో 140 కిలోమీటర్ల తీరప్రాంతం జిల్లాలో 140 కిలోమీటర్ల మేర తీరప్రాంతం విస్తరించి ఉంది. ఈ ప్రాంతం వెంబడి 130 గ్రామాలున్నాయి. ఇస్కపల్లి, దుగరాజపట్నం, శ్రీహరికోటలో మెరైన్ పోలీస్స్టేషన్లు, కృష్ణపట్నం పోర్టులో మెరైన్ అవుట్‌పోస్ట్ ఉంది. గత నెల్లో ఉగ్రవాదులు శ్రీలంక మీదుగా తమిళనాడులోకి ప్రవేశించినట్లు నిఘా వర్గాలు పసిగట్టి అప్రమత్తం చేశాయి. తాజాగా మరోసారి దక్షిణ తీర ప్రాంతం మీదుగా ఉగ్రవాదులు చొరబడే అవకాశం ఉందనే హెచ్చరికల నేపథ్యంలో నిఘాను మరింత పటిష్టం చేశారు. తీరం వెంబడి గ్రామాల్లో మెరైన్ పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. సముద్రం నుంచి పడవల్లో ఒడ్డుకు వస్తున్న వారిని విచారిస్తున్నారు. బయోమెట్రిక్ ద్వారా వారి వేలిముద్రలను సేకరిస్తున్నారు. స్థానిక పెద్దలతో సంప్రదింపులు జరిపి కొత్త వ్యక్తులు, అనుమానాస్పదంగా ఎవరైనా సంచరిస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే సమాచారమివ్వాలని కోరారు. 1093 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు. కోస్ట్‌గార్డ్ సిబ్బంది సహకారంతో సముద్రంలో గస్తీ కాస్తున్నారు. కృష్ణపట్నం పోర్టు వద్ద పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. -
విహారం.. ప్రమాదకరం
బీచ్ అంటేనే చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిలో సరదా. సాగర తీరం చూసి తరించాలన్న ఆకాంక్ష. విశాలంగా కనిపించే బీచ్‌లు. సాగర తీరంలో ఎగిసి పడుతున్న సొగసరి అలలు. ఉవ్వెత్తున ఎగిసి దూసుకొస్తున్న కెరటాలతో సెల్ఫీలు దిగాలన్న ఉబలాట. నాటు పడవల్లో సముద్రంలో విహరించాలనే ఉరకలెత్తే ఉత్సాహం. అలల సయ్యాటతో మునిగి తేలాలన్న సరదాల మాటున విషాదాలు పొంచి ఉన్నాయి. జిల్లాలోని బీచ్‌ల్లో పర్యాటక శాఖ కానీ, పోలీసులు కానీ భద్రతా చర్యలు తీసుకోవడంలో విఫలం కావడంతో మృతుఘంటికలు మోగుతున్నాయి. రెండేళ్లలో 22 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. సాక్షి, వాకాడు (నెల్లూరు): పర్యాటకులను ఆకర్షించే బీచ్‌లు విషాద ఘాట్లుగా మిగిలిపోతున్నాయి. గత అనుభవాలను, ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని బీచ్‌ల్లో భద్రతా చర్యలు చేపట్టాల్సిన పర్యాటక శాఖ ఏ మాత్రం ముందు జాగ్రత్తలు చేపట్టడం లేదు. ఫలితంగా నిండు ప్రాణాలు జల సమాధి అవుతున్నాయి. జిల్లాలోని వాకాడు మండలం తూపిలిపాళెం, ఇందుకూరుపేట మండలంలో మైపాడు, తోటపల్లిగూడూరు మండలంలో కోడూరు, కావలి మండలం తుమ్మలపెంట బీచ్‌లు ఉన్నాయి. ఇక్కడికి జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజలతో పాటు ఇతర సమీప జిల్లాల్లోని శ్రీకాళహస్తి, చిత్తూరు, తిరుపతి, వైఎస్సార్ జిల్లాల ప్రాంతాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ప్రతి ఆదివారం, పర్యదిన సెలవుల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, పర్యాటకులు కుటుంబ సమేతంగా, స్నేహితులతో కలిసి ప్రత్యేక వాహనాల్లో వచ్చి సందడి చేస్తున్నారు. ప్రమాదాన్ని గుర్తించలేని స్థితిలో.. బీచ్‌ల్లోని తీరంలో పర్యాటకులు విహరించేందుకు అనువుగానే ఉంటుంది. తీరం వెంబడి లోతు తక్కువగా ఉండడంతో అలల్లో జలకాలాడుతూ సరదాగా సందడి చేస్తున్నారు. అయితే ఈ సరదా శృతిమించడం, ప్రమాదాలను గుర్తించలేక కొంచెం లోతుకు వెళ్లి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇతర జిల్లాల నుంచి వచ్చే పర్యాటకులు అయితే అలలను తప్పించుకోవడం తెలియక కొట్టుకుపోయి గల్లంతై విషాదంగా మిగిలిన ఘటనలు లేకపోలేదు. గడిచిన రెండేళ్లల్లో తూపిలిపాళెం బీచ్‌లో 6 మంది, కోడూరు బీచ్‌ల్లో 7 మంది, మైపాడు బీచ్‌లలో 8 మంది పర్యాటకులు విహారానికి వచ్చి కానరాని లోకాలకు వెళ్ళారు. తాజాగా కావలి తుమ్మలపెంట తీరంలో ఒకరు మృత్యువాతపడ్డాడు. కనిపించని భద్రతా చర్యలు సుదూర ప్రాంతాల నుంచే వచ్చే పర్యాటకులకు సముద్ర తీరంపై అవగాహన ఉండదు. తీరంలో దిగిన పర్యాటకులు ముందు ముందుకు వెళ్లిపోతుంటారు. అక్కడకక్కడ ప్రమాదభరిమైన గుండాలు ఉన్నాయన్న విషయం తెలియక ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇలాంటి వారికి అవగాహన కల్పించేలా పర్యాటక శాఖ అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయరు. అక్కడ భద్రతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోరు. పర్యాటకులు తీరం లోపలికి వెళ్లకుండా హెచ్చరించే పోలీసులు కనిపించరు. ప్రమాదాలు జరిగిన తర్వాత వచ్చి తదుపరి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. కొందరు యువత అయితే బీచ్‌ల్లో మద్యం తాగి మత్తులో విహరిస్తూ ప్రాణాల మీదుకు తెచ్చుకుంటున్నారు. బీచ్‌ల్లో బహిరంగా మద్యపానాన్ని అడ్డుకోవాల్సిన పోలీసులు సైతం అటు వైపు చూస్తున్న దాఖాలు లేదు. ఇంజిన్ బోటుల్లో సముద్రంపై విహారం పర్యాటకుల ఉత్సాహాన్ని సైతం స్థానిక మత్స్యకారులు క్యాష్ చేసుకుంటున్నారు. కృష్ణా, గోదావరి నదుల్లో విహారంలో విషాద ఘటనలు తెలిసినా పర్యాటకులు భద్రత లేకుండా సముద్రంపై విహారానికి వెళ్తున్నారు. పర్యాటకుల ఉత్సాహం మేరకు మత్స్యకారులు ఇంజిన్ బోటుల్లో సముద్రంపై రెండు, మూడు కిలో మీటర్లు దూరం వరకు తిప్పుతుంటారు. ముందు జాగ్రత్తగా ఎలాంటి లైఫ్ జాకెట్లు కూడా లేకుండా, ఒక్కో మనిషికి రూ.50 చొప్పున తీసుకుని బోటులో 20 నుంచి 25 మందిని వరకు తీసుకెళ్లి తిప్పుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సామర్థ్యానికి మించి పర్యాటకులను బోటుల్లో ఎక్కించడం వల్ల అలలు వచ్చినప్పుడు ఊగిసలాటకు ప్రమాదాల పాలవుతున్న ఘటనలు లేకపోలేదు. బీచ్కొచ్చే ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు సైతం ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా బోటు షికార్లు చేస్తున్నారు. మృత్యుగుండం.. జెట్టీ ప్రాంతం తూపిలిపాళెం సముద్రంలో ఎత్తిపోతల జెట్టీ ప్రాంతం మృత్యుగుండంగా ఉంది. ఉప్పు నీటి కోసం 1990లో సముద్రం లోపల నుంచి ఏర్పాటు చేసిన ఎత్తిపోతల వంతెన (జెట్టీ) శిథిలావస్థకు చేరుకుని ప్రమాద భరితంగా ఉంది. ఈ వంతెన ఒడ్డున నుంచి దాదాపు 200 మీటర్లు వరకు సముద్రంలోకి ఉంటుంది. ప్రస్తుతం ఈ వంతెన బాగా దెబ్బతిని పిల్లర్లలో సిమెంట్ పెచ్చులు ఊడిపోయి ఇనుప కమ్ములు దర్శనమిస్తున్నాయి. దీని కారణంగా ఏదైనా జరగరాని జరిగితే ఎందరో ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదం ఉంది. కొందరు మద్యం మత్తులో వంతెపై నుంచి సముద్రంలోకి దూకుతున్నారు. గతంలో ఈ వంతెనపై నుంచి దూకడం వల్ల అనేక మంది విద్యార్థులు మృత్యువాత పడ్డారు. జెట్టీ నిర్మాణ ప్రాంతంలో అతి సమీపంలో కెరటాల ఉద్ధృతితో పాటు విపరీతమైన లోతు ఉంటుంది. ఇక్కడ దిగిన పర్యాటకులు కానరాని లోకాలకు వెళుతున్నారు. ఆహ్లాదకర తీరం.. తూపిలిపాళెం బీచ్ తూపిలిపాళెం బీచ్ అంటేనే జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి విద్యార్థులు, పర్యాటకులు అధిక సంఖ్యలో చేరుకుంటారు. తీరంలో ఎటు చూసినా పచ్చని సవక తోటలు, ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. మరో పక్క నిత్యం సముద్రపు అలలతో సుందరమైన ప్రకృతి ఇక్కడ పర్యాటకులను అలరిస్తుంది. బీచ్‌కి వచ్చిన పర్యాటకులు, విద్యార్థులు ఇక్కడి అందమైన ప్రదేశాలను సందర్శించి ఉల్లాసంగా గడిపి వెళుతుంటారు. ఈ సుందరమైన ప్రదేశం వెనుక తెలియని అతి భయంకరమైన జలగండాలు ఉన్నాయన్న కఠోర నిజం స్థానికేతరులకు ఏ మాత్రం తెలియదు. ఇక్కడ జల ప్రమాదాల పరిస్థితులను చూసేంచేందుకు ఇక్కడ పర్యాటక సిబ్బంది, ప్రమాద హెచ్చరిక బోర్డులు కనిపించవు. ఈ విషయాలేవి తెలియని పర్యాటకులు, విద్యార్థులు సముద్ర స్నానాల ఉత్సాహంలో ప్రమాదాలకు గురై ఎందరో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు తూపిలిపాళెం సముద్ర తీరంలో లేకపోలేదు. గడిచిన ఐదేళ్లలో తూపిలిపాళెం తీరంలో దాదాపు 25 మందికి పైగా ప్రాణాలు విహారం మాటున జలసమాధి అయ్యాయి. ఇలా భద్రతా చర్యలు చేపట్టాలి.. తూపిలిపాళెం సమీపాన సముద్రం మొదటి ఘాట్‌లో పర్యాటకులు స్నానాలు చేసేందుకు అనువుగా ఉంటుంది. కానీ ఎక్కువ మంది జెట్టీ అందాలను చూసేందుకు జెట్టీ వద్దకే వెళ్లి ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. మిగతా బీచ్‌ల్లో కూడా ప్రత్యేకించి ఆదివారం రోజుల్లో పోలీసులు నిఘా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. స్నానాలు చేసే సమయంలో సముద్రం వద్ద బారికేడ్లు తప్పనిసరిగా ఏర్పాటు చేసి వాటిని దాటి వెళ్లనీకుండా హెచ్చరిక బోర్డులు పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. విద్యార్థులను విహారానికి పంపేటప్పుడు తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు చెప్పి పంపాలి. తమ పిల్లలు ఎవరి సంరక్షణలో వెళుతున్నారో ఆరా తీయాలి. -
తంతడి బీచ్‌లో యువకుడి గల్లంతు
విశాఖపట్నం ,అచ్యుతాపురం(యలమంచిలి): సరదా గడిపేందుకు ఆదివారం తంతడి బీచ్‌కు వచ్చిన స్నేహితుల్లో ఒకరు సముద్రంలో గల్లంతయ్యారు. ఇద్దరు స్నేహితులు స్నానం చేస్తుంగా పెద్ద కెరటం రావడంతో ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఎస్ఐ లక్ష్మణరావు అందించిన వివరాలిలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా మామిడాడ మండలం పెద్దాడ గ్రామానికి చెందిన పొన్నమల వెంకటసత్యసాయి(24), అదే మండలానికి చెందిన మరో నలుగురు యువకులు రాఘవేంద్ర, తులసీరావు, నూకేష్, రాజు పరవాడలో గోదావరి ప్లాస్టో కంటైనర్స్ సంస్థలో పనిచేస్తున్నారు. వీరంతా పరవాడలో నివాసం ఉంటున్నారు. ఆదివారం స్నేహితులంతా తంతడిబీచ్కి వచ్చారు. తులసీ, వెంకటసత్య సాయి స్నానానికి దిగారు. పెద్ద కెరటం రావడంతో వెంకటసత్యసాయి గల్లంతయ్యాడు. స్నేహితులు.. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఎస్ఐ లక్ష్మణరావు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్ల సాయంతో రాత్రివరకూ గాలింపు నిర్వహించారు. సత్యసాయి ఆచూకీ లభించలేదు. సాయి కుటుంబసభ్యులకు సమాచారం పంపి, తీరం వద్ద నిఘా ఏర్పాటుచేశారు. సాయి క్షేమంగా రావాలని తోటి మిత్రులు ప్రార్థిస్తున్నారు. -
విహారంలో విషాదం
ఇందుకూరుపేట: స్నేహితులందరూ ఆదివారం సరదాగా విహారానికి వచ్చి విషాదానికి గురయ్యారు. మండలంలోని మైపాడు బీచ్‌లో అలల తాకిడికి నీట మునిగి ఓ యువకుడు గల్లంతు కాగా, మరో యువకుడు మృతి చెందాడు. పోలీసుల సమాచారం మేరకు.. కోవూరు మండలం జమ్మిపాళెంకు చెందిన ఉడతా శ్రీహరి (19), తిరువీధి పవన్ (14) ఇరువురు కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి 15 మంది ఆదివారం మైపాడు బీచ్‌కు సేద తీరేందుకు వచ్చారు. అందరూ కలిసి సరదాగా నీటిలో స్నానాలు ఆచరిస్తున్నారు. ఈ సమయంలో అలల తాకిడికి శ్రీహరి, పవన్‌తో పాటు మరో ఇద్దరు నీటిలో మునిగిపోయారు. గమనించిన తోటి వారు కేకలు వేయడంతో స్థానిక మత్స్యకారులు నలుగురిలో ఇద్దరిని కాపాడి ఒడ్డుకు చేర్చారు. శ్రీహరి నీటిలో మునిగి మృతి చెందగా, పవన్ గల్లంతయ్యాడు. అప్పటి వరకు తమ కళ్ల ఎదుటే ఉన్న శ్రీహరి విగత జీవిగా మారడం, పవన్ కనిపించకపోవడంతో బంధువులు, స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పవన్ కోసం వెంట వచ్చిన బందువులు, స్నేహితులు తీరం వెంబడి చేరి గాలిస్తున్నారు. సమాచారం అందుకున్న సీఐ శ్రీనివాసరావు, ఎస్సై ఇంద్రసేనారెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు ఆరా తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
పార్కుల్లో మందు‘పార్టీలు’
సాక్షి, పరవాడ: ఆహ్లాదాన్ని పంచే పార్కులు అసాంఘి క కార్యకలాపాలకు నిలయంగా మారుతున్నా యి. తీర ప్రాంతాల్లోని పార్కుల్లో నిత్యం మందు‘పార్టీలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం వచ్చే పర్యాటకులు, సందర్శకులు నానా అవస్థలు పడుతున్నారు. ముత్యాలమ్మపాలెం శివారు తిక్కవానిపాలెం తీర ప్రాంతంలో ఏర్పాటు చేసిన పార్కులు అధ్వానంగా తయారయ్యాయి. తీరంలో సేద దీరడానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకుల కోసం సింహాద్రి ఎన్టీపీసీ యాజమాన్యం లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన సీ వాటర్ పార్కు, మినీ పార్కుల దుస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఇక్కడ పార్కులకు విశాఖ స్టీల్ ప్లాంటు, గాజువాక, అగనంపూడి, సబ్బవరం, అనకాపల్లి, పరవాడ, ఎన్టీపీసీ తదితర ప్రాంతాల నుంచి ప్రతీ ఆదివారం, సెలవు దినాల్లో పర్యాటకులు నిత్యం అధిక సంఖ్యలో తరలి వస్తుంటారు. వేసవి సెలవుల్లో నిత్యం విద్యార్థులతో తీర ప్రాంతాలతో పాటు పార్కులు కళకళలాడుతుంటా యి. అయితే కొందరు ఆకతాయిల వల్ల ఇవి అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. పట్టణ ప్రాంతాల నుంచి వచ్చే యువకులు పుట్టిన రోజు, పెళ్లి రోజు పేరుతో నిత్యం మందు పార్టీలు చేసుకుంటున్నారు. పర్యాటకానికి దెబ్బ... తాగిన మద్యం సీసాలు, ఆకులు, ప్లేట్లు, డ్రింకు బాటిళ్లు, సిగరెట్లు తదితర వస్తువులను ఎక్కడపడితే అక్కడే వదిలేస్తున్నారు. కొందరు ఆకతాయిలు ఖాళీ మద్యం సీసాలను చితక్కొట్టి విసేరేస్తున్నారు. చితికిన గాజు పెంకులు ఇసుకలో కూరుకుపోయి ఉంటున్నాయి. బీచ్‌లకు వస్తున్న పర్యాటకులు ఆట పాటలతో సరదాగా గడుపుతున్న సమయంలో ఇసుకలో ఉన్న గాజుపెంకులు కాళ్లకు గుచ్చుకొని తీవ్రంగా గాయపడుతున్న సంఘటనలు అనేకం. తిక్కవానిపాలెం తీరంలో ఎన్టీపీసీ జెట్టీ వద్ద ఏర్పాటు చేసిన సీ వాటర్ పార్కును ఆకతాయిలు పాల్పడుతున్న ఆసాంఘిక కార్యకలాపాల వల్ల పార్కు లోపటికి సందర్శకులను అనుమతించడం మానేశారు. ఇక్కడి మినీ పార్కును ఆకతాయిలు ఇష్టారాజ్యంగా ఉపయోగించుకుంటున్నారు. పార్కులో నిర్మించిన గొడుగుల కింద కూర్చుని మద్యం సేవిస్తున్నారు. ఆ తరువాత ఎక్కడ పడితే అక్కడ మద్యం సీసాలు, గాజు పెంకులు పడేస్తూ వెళ్లిపోతున్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన చెత్తకుండీని కూడా ఉపయోగించడం లేదు. ఆదివారమైతే అధిక సంఖ్యలో యువకులు తరలివచ్చి ఇక్కడి సరుగుడు, జీడి మామిడి తోటల్లో జూదం ఆడుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. తీరంలో ఏర్పాటు చేసిన పోలీస్ పికెట్లను ఎత్తివేయడంతో ఆకతాయిలకు ఆగడాలకు అడ్డూ అదుపులేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
బ్యాడ్మింటన్ ఆడొచ్చు... ఎక్కడైనా!
గ్వాంగ్జౌ: ఇకపై బ్యాడ్మింటన్ ఆటను బీచ్‌లలోనూ చూడొచ్చు. ఎక్కడైనా ఆడొచ్చు. అంటే ఇండోర్ కోర్టులకే పరిమితమైన బ్యాడ్మింటన్ పోటీలు త్వరలో బహిరంగ ప్రదేశాల్లోనూ జరుగుతాయి. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) అధికారికంగా కొత్త ఔట్‌డోర్ బ్యాడ్మింటన్ ఆట ‘ఎయిర్ బ్యాడ్మింటన్’ను లాంఛనంగా ప్రారంభించింది. ఇందుకోసం ప్రత్యేకించి ఎయిర్ షటిల్ కాక్‌లను తయారు చేయించింది. దీనికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారమిక్కడ జరిగింది. ఈ సందర్భంగా బీడబ్ల్యూఎఫ్ అధ్యక్షుడు పౌల్ ఎరిక్ హోయెర్ మాట్లాడుతూ ‘బ్యాడ్మింటన్ ఆటకు ఇది మరుపురాని రోజు. ఎయిర్ బ్యాడ్మింటన్‌తో మన పరిమితులు, హద్దులు చెరిగిపోతాయి. బ్యాడ్మింటన్ రాకెట్‌ను ప్రొఫెషనల్ ఆటగాళ్ల చేతిలోనే కాదు ఇకపై ఎవరి చేతుల్లోనైనా చూడొచ్చు. ఎక్కడైనా ఆడొచ్చు’ అని అన్నారు. ఈ ఎయిర్ బ్యాడ్మింటన్‌ను ప్రత్యేకించి వీళ్లే ఆడాలని లేదు. ఇక్కడే ఆడాలనే నియమం లేదు. వయస్సుతో సంబంధం లేకుండా ఎంచక్కా ఆడుకునేలా ఎయిర్ బ్యాడ్మింటన్ ఆట రూపొందింది. హార్డ్కోర్ట్, గ్రాస్‌కోర్ట్, పార్క్‌ల్లోని ఇసుకపై, గార్డెన్, వీధులు, ప్లేగ్రౌండ్స్, బీచ్‌లు అంతటా ఇప్పుడు బ్యాడ్మింటన్ ఆడొచ్చని బీడబ్ల్యూఎఫ్ అధికారికంగా వెల్లడించింది. బయటి వాతావరణానికి అనుగుణంగా ఎయిర్ బ్యాడ్మింటన్ ఆటను అభివృద్ధి చేసినట్లు ఎరిక్ హొయెర్ తెలిపారు. ప్రత్యేకమైన రాకెట్, షటిల్ కాక్‌లు బలమైన గాలుల్ని తట్టుకునేలా తయారు చేశారు. -
తీరం.. భద్రమేనా..!
ప్రభుత్వ ఉదాసీనత తీరప్రాంత భద్రతకు పెను ముప్పుగా పరిణమిస్తోంది. కంటి మీద కునుకు లేకుండా కాపలా ఉండాల్సిన మెరైన్ పోలీసులను వసతుల లేమి వెంటాడుతుండడంతో భద్రత చుక్కాని లేని నావలా తయారైంది. కొత్త మెరైన్ పోలీస్ స్టేషన్లు లేవు.. కొత్త బోట్లు రాలేదు.. ఉన్నవి కాస్త మరమ్మతులకు గురై మూలన పడ్డాయి. సిబ్బంది నియామకం కూడా లేకపోవడంతో చొరబాట్లకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో నిఘా కరువైంది. ఫలితంగా మన తీరం.. భద్రమేనా? అన్న సందేహం కలుగుతోంది. సాక్షి, అమరావతి బ్యూరో: ఈస్టర్ పర్వదినాన శ్రీలంక రాజధాని కొలంబో నగరం నెత్తురోడింది. ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడుల్లో సుమారు 359 మంది మృతి చెందారు. వందల మంది గాయాలపాలయ్యారు. దీంతో అక్కడ ఎమర్జెన్సీ ప్రకటించారు. దాడికి పాల్పడిన నిందితుల కోసం అక్కడి పోలీసు వర్గాలు, సైన్యం తీవ్రంగా గాలిస్తున్నాయి. నిందితులు తప్పించుకునే క్రమంలో సముద్రజలాల ద్వారా మన భూభాగంలోకి ప్రవేశించే అవకాశం ఉందని నిఘా వర్గాల నుంచి హెచ్చరికలు అందాయి. కేంద్రం నుంచి అందిన సమాచారంతో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రత్యేకించి తీర ప్రాంత భద్రతను పర్యవేక్షించే మెరైన్‌పోలీసు విభాగాన్ని అప్రమత్తం చేశారు. రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో ఉన్న 22 పోలీసుల స్టేషన్ల పరిధిలో పోలీసులు తీరాన్ని జల్లెడ పడుతున్నారు. అనుమానాస్పద, కొత్త వ్యక్తుల కదిలకలపై నిఘా పెట్టారు. తీరం వెంట పహారా రాష్ట్రంలోని తడ నుంచి ఇచ్ఛాపురం దాకా 972 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్న తీరంపై 22 మెరైన్ స్టేషన్ల పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ప్రత్యేకించి కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలోని తీరప్రాంతంపై ప్రధానంగా దృష్టి సారించారు. రాజధాని అమరావతి పరిధిలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రస్తుతం 5 మెరైన్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. కృష్ణా జిల్లాలో గిలకలదిండి, వరాలగుండి, పాలకాలయతిప్ప, గుంటూరు జిల్లాలో సూర్యలంక, నిజాంపట్నం మెరైన్ స్టేషన్లు ఉన్నాయి. ఆయా స్టేషన్ల పరిధిలో మెరైన్ పోలీసులు అప్రమత్తమయ్యారు. తీరం వెంట పహారా కాస్తున్నారు. గ్రామాల్లో పర్యటించి మత్స్యకారులను అప్రమత్తం చేస్తున్నారు. సముద్రజలాల్లో ఎక్కడైనా, ఎవరైనా కొత్త వ్యక్తులు తారస పడితే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. వెంటాడుతున్న వసతులలేమి! కీలకమైన రాజధాని అమరావతి ప్రాంతానికి ఐదు మెరైన్ స్టేషన్లు ఏమాత్రం సరిపోవని 2015లోనే గుర్తించారు. రెండు జిల్లాల్లో మరో నాలుగు మెరైన్ పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం అప్పట్లోనే ప్రకటించింది. ఇంతవరకు కొత్తగా ఒక్క మెరైన్ పోలీస్‌స్టేషన్‌ను కూడా ఏర్పాటు చేయనే లేదు. అలాగే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉన్న మెరైన్ పోలీస్ స్టేషన్లు మౌలిక వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. గిలకలదిండి, సూర్యలంక మెరైన్ పోలీస్స్టేషన్లకు మూడేసి చొప్పున గస్తీ బోట్లు సమకూర్చారు. అన్ని పోలీస్స్టేషన్లకు కొత్తగా మూడేసి బోట్లు సమకూర్చాలన్న ప్రతిపాదనను పట్టించుకోనేలేదు. కొన్ని స్టేషన్లలో ఉన్న బోట్లు కూడా కొన్ని నెలలుగా తీరంలోనే లంగరు వేసి ఉన్నాయి. గస్తీ నిర్వహణకు ఉన్న ఫాస్ట్ ఇంటర్‌సెప్టర్ బోట్లు తక్కువే. ప్రస్తుతం రెండు జిల్లాల పరిధిలో ఒక్క బోటే పనిచేస్తోంది. దీంతో తీరంలో గస్తీ అంతంతమాత్రంగానే ఉండటంతో చొరబాట్లకు అవకాశం లేకపోలేదని మెరైన్ పోలీసు వర్గాలే పేర్కొంటుండటం గమనార్హం. -
అలల చెంత.. అందాల ఆట
విశాఖ స్పోర్ట్స్: అందాల హరివిల్లుగా, సోయగాల పొదరిల్లుగా పేరొందిన విశాఖ ఎన్నో ప్రసిద్ధ కార్యక్రమాలకు నెలవైంది. వినోద కార్యక్రమాలకైనా, క్రీడల పోటీల్లోనయినా.. అపూర్వ ఆతిథ్యం ఇచ్చి అందరి మనసులను గెలుచుకుంది. ఈ సుందర సాగర నగరం తొలిసారిగా ఓ అంతర్జాతీయ క్రీడల పోటీలకు వేదికగా నిలుస్తోంది. భారత్‌లో తొలిసారిగా జరగబోయే ప్రపంచ టూర్ బీచ్ వాలీబాల్ పోటీలకు విశాఖ ఆతిథ్యం ఇస్తోంది. ఈ పోటీల్లో 22 దేశాలకు చెందిన రాంకింగ్ ఆటగాళ్ళు జట్లు పోటీపడుతున్నాయి. విశాఖ సాగర తీరమే వేదికగా జరగబోయే పోటీలు క్రీడాభిమానులకు ఓ వినూత్న ఉత్సాహాన్ని ఇవ్వనున్నాయి. ఈ పోటీలు 28వ తేదీనుంచి మార్చి మూడో తేదీ వరకు జరగనున్నాయి. లాంఛనంగా పోటీలు 27న రామకృష్ణా బీచ్‌లో ఏర్పాటు చేసిన వేదికపై ప్రారంభం కానున్నాయి. ఆటగాళ్లు ప్రారంభవేడుకలో కాట్ వాక్ చేయనుండడం ప్రత్యేక అకర్షణగా నిలవనుంది. ప్రపంచ వాలీబాల్ సమాఖ్య నిబందనల మేరకు ప్రత్యేకమైన ఇసుకతో కోర్టుల్ని ఏర్పాటు చేశారు. దాంతో విశాఖ క్రీడాభిమానులకు బికినీలతో బీచ్ వాల్‌బాల్ ఆడుతున్న క్రీడాకారిణుల ఆట కనువిందు చేయనుంది. గతంలో విశాఖ సాగరతీరంలో నేషనల్ బీచ్ వాలీబాల్ పోటీలు జరిగినా ఈసారి వివిధ దేశాల క్రీడాకారులు, క్రీడాకారిణులు వస్తూ ఉండడం ఓ విశేషమే. పాల్గొంటున్న దేశాలు భారత్‌తో పాటు ఆస్ట్రియా, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, ఇజ్రాయిల్, జపాన్, మలేషియా, రష్యా, సింగపూర్, దక్షిణాఫ్రికా, అమెరికా, వనౌతా దేశాలకు చెందిన మహిళా జట్లు పాల్గొంటుండగా వీటితో పాటు పురుషుల విభాగంలో కెనడా, చైనీస్ తైపే, జర్మనీ, ఇరాన్, లాత్వియా, నార్వే, పొలెండ్, ఖతార్, స్లొవేనియా, తుర్కుమెనిస్తాన్, ఉక్రేయిన్‌కు చెందిన జట్లు పాల్గొంటున్నాయి.వరల్డ్ టూర్ బీచ్ వాలీబాల్ చాంపియన్‌షిప్స్‌ను ఐదు స్టార్ల టోర్నీలుగా విభజిస్తారు. వాటిలో ప్రస్తుతం విశాఖ సాగరతీరంలో జరిగే టోర్నీ స్టార్ వన్ వేదికగా ఉంది. 21 దేశాల్లోని వేదికల్లో ఈ పోటీలు జరుగుతాయి. ఇక స్టార్ టూలో ఏడు వేదికలున్నాయి. స్టార్ 3లో ఐదు వేదికలున్నాయి. స్టార్ ఫోర్లో 12 వేదికలు, చివరిదైన స్టార్ 5 వేదికలుగా నాలుగు దేశాల్లో ఉన్నాయి. ఆయా జట్ల రాంకింగ్‌లను బట్టి ఈ వరల్ట్ టూర్ బీచ్ వాలీబాల్ పోటీల్లో పాల్గొంటారు. మెయిన్ డ్రాకు... జట్ల రాంకింగ్‌ను బట్టి మెయిన్ డ్రాకు అర్హత కల్పిస్తారు. మెయిన్ డ్రాలో పదహారు జట్లకు మాత్రమే అర్హత ఉంటుంది. మెయిన్ డ్రాకు కొన్ని జట్లను క్వాలిఫైయింగ్ రౌండ్ల ద్వారా అర్హత కల్పిస్తారు. సింగిల్ ఎలిమినేషన్‌తో నిర్వహించి అర్హత కల్పిస్తారు. ఇక మెయిన్ డ్రాకు అర్హత పొందిన వాటిని నాలుగు పూల్స్‌గా విభజించి లీగ్ పద్ధతిలో పోటీలు నిర్వహిస్తారు. తొలిరెండు స్థ్దానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్ ఫైనల్స్, సెమీస్ ఆడతాయి. అనంతరం సెమీస్ లూజర్స్‌తో మూడోస్థానానికి పోటీ జరుపుతారు. ఆపై టైటిల్ కోసం తుదిపోరు నిర్వహిస్తారు. ఫ్లడ్‌లైట్లలో పోటీలు క్వాలిఫయింగ్ రౌండ్లు 28న ఉదయం ఏడున్నర గంటల నుంచే ప్రారంభం కానుండగా ప్రధాన పోటీలు మధ్యహ్నం మూడున్నర గంటల నుంచే జరగనున్నాయి. సాయంత్రం మ్యాచ్‌ల కోసం ఫ్లడ్లైట్లను సాగరతీరంలోని కోర్టుల్లో ఏర్పాటు చేశారు. పురుషుల విభాగం: మెయిన్ డ్రాకు ఇరాన్‌కు చెందిన వకిలి– సలేమీ జోడీ ఒకటో పొజిషన్లో ఉంది. రెండో స్థానంలో సింగపూర్‌కు చెందిన తే–షెన్ జోడీ ఉంది. భారత్ విషయానికి వస్తే నరేష్– రాజు జోడీ పదో స్థానంతో ఎంట్రీ పొందింది. మహిళా విభాగం: చెక్ రిపబ్లిక్కు చెందిన బొన్నేరొవా–మాక్సిన్రోవా జోడీ 776ఎంట్రీ పాయింట్లతో ఒకటో పొజిషన్‌తో మెయిన్ డ్రాకు అర్హత సాధించింది. జపాన్‌కు చెందిన చియో–సకగుచి రెండో స్థానంలో, ఇజ్రాయిల్‌కు చెందిన స్టార్లోకోవ్–దవే మూడో స్థానంలో ఉండి మెయిన్ డ్రాకు అర్హత సాధించారు. భారత్ నుంచి దియాస్–స్టెఫీ జోడీ పదో పొజిషన్లో షాలిని–సుప్రజ పదకొండో పొజిషన్లో ఉన్నారు. భారత్‌కు అవకాశం భారత్ నుంచి ఐదు జట్లు పాల్గొంటున్నాయి. ఆతిథ్య హోదాలో మూడేసి జట్లకు మెయిన్ డ్రాకు అర్హత లభించింది. మహిళల విభాగంలో దియాస్–స్టెఫీ, ఆర్తీ లక్షి– సబిత, లావణ్య– రాజిత, షాలిని– సుప్రజ, యోగేశ్వరి– జెన్నిఫర్ జోడీలు పాల్గొంటున్నాయి. పురుషుల విభాగంలో నరేష్–కృష్ణంరాజు , రామ–ఆరోన్, ధావస్కర్–అనిల్ జోడీలు మెయిన్ డ్రాకు అర్హత సాధించగా క్వాలిఫైయింగ్ రౌండ్స్‌లో చైతన్య–రాజేష్, వివేక్–వివేక్‌రాజ్ పోటీపడనున్నారు. టిక్కెట్లు... భారత్‌లోనే తొలిసారి ఈ తరహా పోటీలు జరుగుతున్నాయి. పోటీలు వీక్షించడానికి నిర్వాహకులు టిక్కెట్లను విక్రయిస్తున్నారు. కనీస ధర ఐదు రూపాయలు కాగా రూ.750 టిక్కెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీవీఐపీలకు రెండు వేల టిక్కెట్లను ఆన్లైన్లో టిక్కెట్‌జెనీ.ఇన్ వెబ్‌లో ఉంచారు. అన్ని మాచ్లకు చూసేందుకు వీలుగా సీజన్ టికెట్‌ను ఇవ్వనున్నారు. వేదిక వద్ద టికెట్ కౌంటర్ ఏర్పాటు చేసినట్టు నిర్వాహాకులు తెలిపారు. ఐదువేల మంది కూర్చొని చూసేందుకు తగిన గాలరీని ఏర్పాటు చేశారు. ఆట ఇలా... వాలీబాల్‌కు, బీచ్ వాలీబాల్‌కు పోలికలు, కొన్ని తేడాలున్నాయి. సాధారణ వాలీబాల్‌లో ఆరుగురు ఆటగాళ్లు కోర్టులో ఉంటే బీచ్ వాలీబాల్ కేవలం ఇద్దరే ఆటగాళ్లతో కొనసాగుతుంది. చాలా పోలికలతో పాటు కొన్ని తేడాలు కూడా ఉంటాయి. తమ కోర్టులో పడ్డ బంతిని మూడో టచ్‌తో ప్రత్యర్ధి కోర్టులోకి పంపాలి. ఇందులో బ్లాక్ టచ్‌కూడా భాగమే. ర్యాలీ స్కోర్ పద్ధతిలో జరుగుతుంది. బంతి సక్రమంగా లాండ్ అయిన సర్వీస్ చేసిన వారికే పాయింట్ వస్తే తిరిగి వారే సర్వీస్ చేయచ్చు. ఇక్కడ రొటేషన్ పాటించాల్సి ఉంటుంది. వాలీ పాసింగ్, అటాక్, డిఫెన్స్, జంపింగ్ అనేవి ఆటలో ప్రత్యేక నైపుణ్యాలు. ఎఫ్‌ఐవిబి నిబంధనల మేరకు చిన్ని షార్ట్ లేదా బాతింగ్ సూట్‌తో, టాంక్ టాప్‌తో మాత్రమే ఆడతారు. పురుషులు టాప్ లేకుండా ఆడవచ్చు. బీచ్‌లో, కడలి అలల సవ్వడులను ఆస్వాది స్తూ, ఆ చల్లగాలిలో సేద తీరుతూ క్రీడాభిమానులు ఆటను ఎం జాయ్ చేస్తూ ఉండడంతో బీచ్ వాలీబాల్‌కు ఎక్కడ లేని క్రేజ్ వ చ్చింది. విదేశీయుల జీవన విధానంలో బీచ్‌కు అధిక ప్రాధాన్యం ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ క్రీడకు విశేష ఆదరణ లభించింది. కోర్టు చిన్నది వాలీబాల్ కోర్టు (వైశాల్యం 18్ఠ9 మీటర్లు)కంటే బీచ్ వాలీబాల్ కోర్టు చిన్నగా (16్ఠ8మీటర్లు) ఉంటుంది. ఫ్రీజోన్ మూడు మీటర్లుంటుంది. మార్కింగ్ లైన్ 5సెంటీమీటర్లుంటుంది, అదీ ఇసుక కాబట్టి మందమైన రంగురిబ్బన్ ఉంటుంది. కోర్టుకు సెంటర్ లైన్ ఉండదు. సైడ్‌లైన్స్, ఎండ్లైన్స్ మాత్రమే ఉంటాయి. ఇది సీనియర్స్ కోసం నిర్వహిస్తున్న టోర్నీ కనుక కోర్టు మధ్యనుంచి పురుషుల కోర్టులో 2.43 మీటర్ల ఎత్తులో.. మహిళలకు 2.24 మీటర్ల ఎత్తులో నెట్ ఉంటుంది. ఎంటీనా కోర్టులో భాగంగానే పరిగణిస్తారు. బంతి 260 నుంచి 280 గ్రాముల బరువు ఉంటుంది. ప్రతీ మ్యాచ్‌కు మూడు బంతుల్ని వినియోగిస్తారు. గెలుపు ఇలా.. బెస్ట్ ఆఫ్ త్రీ సెట్స్గానే జరగుతుంది. రెండు పాయింట్ల తేడాతో ఎవరైతే 21 పాయింట్లు సాధించగలరో ఆ జట్టే సెట్‌ను గెలిచినట్టవుతుంది. ఇలా రెండు సెట్లు ఒక జట్టే గెలుచుకుంటే మ్యాచ్‌లో విజయం సాధించినట్టే. సెట్ టై (20 ఆల్) అయితే రెండు పాయింట్లు తేడా వరకు ఆడతారు. చెరో సెట్ గెలుచుకుంటే మూడో సెట్ మాత్రం 15 పాయింట్లకే జరుగుతుంది. టోర్నీ షెడ్యూల్ ఇదీ.. బీచ్ వాలీబాల్ పోటీల్లో పాల్గొనే జట్లు 27న విశాఖకు చేరుకుంటాయి. 28న క్వాలిఫయింగ్ రౌండ్ పోటీలుంటాయి. మెయిన్ డ్రాకు అర్హత సాధించిన జట్లు 28న విశాఖ చేరుకుంటాయి. మెయిన్ డ్రా టోర్నీ మార్చి1 నుంచి 3 వరకు ఉంటుంది. రెండున క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్ జరుగుతాయి. మూడో తేదీన పురుషులు, మహిళల విభాగాలలో టైటిల్ పోరు ఉంటుంది. ఆదే రోజు జరిగే ముగింపు వేడుకతో వరల్డ్‌టూర్ బీచ్ వాలీబాల్ ముగియనుంది. –ఎఫ్‌ఐవిబి సాంకేతిక ప్రతినిధి జోప్ వాన్ ఇరిసెల్ గత విజేత గ్రీస్ 2 స్టార్ పోటీల్లో భాగంగా గతేడాది ఫిబ్రవరి కంబోడియాలో జరిగిన పోటీల్లో గ్రీస్ మహిళా జట్టు విజేతగా నిలిచింది. అర్వంతి– కరగ్కొని జోడీ టైటిల్ పోరులో అమెరికాకు చెందిన అమందా– కొరిన్ని జోడీపై 2–0 (21–14, 21–17) స్కోరుతో విజయం సాధించి టైటిల్ అందుకుంది. స్టార్ వన్ పోటీలు విశాఖ వేదికగా జరుగుతున్నాయి. గతేడాది హేగ్‌లో జరిగిన స్టార్ వన్ ఫైనల్లో రష్యా 2–0తో జర్మనీపై విజయం సాధించింది.–రాష్ట్ర వాలీబాల్ సంఘం కార్యదర్శి రమణారావు మనది 50వ దేశం అంతర్జాతీయ వాలీబాల్ ఫెడరేషన్ వరల్డ్ టూర్‌ను నిర్వహించనున్న 50వ దేశం భారత్. 2010 తర్వాత ఆసియా దేశాల్లో తొలిసారిగా బీచ్ వాలీబాల్ నిర్వహిస్తున్న దేశమూ మనదే. అదీ విశాఖ వేదికగా నిర్వహిస్తుండటం గర్వకారణం. ఈ తరహా టోర్నీ నిర్వహించడానికి సహజసిద్ధమైన సాగరతీరం ఉండాలి. అది మనకు ఉంది. అందుకే మన దేశంలో తొలిసారిగా విశాఖ వేదిౖది.జీవీఆర్ నాయుడు, రాష్ట్రవాలీబాల్ సంఘం అధ్యక్షుడు -
మృత్యు అలలు!
శ్రీకాకుళం, వజ్రపుకొత్తూరు: రథసప్తమి పుణ్యస్నానాలకని వెళ్లిన యువకుడు అలల ధాటికి గల్లంతైన ఘటన మంగళవారం వజ్రపుకొత్తూరు మండలం కంబాలరాయుడుపేట సముద్రతీరంలో చోటుచేసుకుంది. స్థానికులు, స్నేహితులు తెలిపిన వివరాల ప్రకారం.. వజ్రపుకొత్తూరు మండలం పూండి– గోవిందపురం గ్రామానికి చెందిన చిన్ని నర్సింహమూర్తి, లక్ష్మీలకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు చిన్ని కిషోర్, చిన్న కుమారుడు చిన్ని మనోజ్. కిషోర్ ఇంటర్మీడియట్ పూర్తి చేసి విశాఖపట్నంలోని ఓ డిఫెన్స్ అకాడమీలో నేవీ ఉద్యోగం కోసం శిక్షణ పొందుతున్నాడు. ఐదు రోజుల క్రితం గ్రామానికి చేరుకున్న కిషోర్ మంగళవారం రథసప్తమి కావడంతో స్నేహితులతో కలిసి కంబాలరాయుడుపేట సముద్రతీరానికి వెళ్లాడు. కాసేపు సందడిగా గడిపిన కిషోర్ తీరంలో వాలీబాల్ ఆడుతుండగా బంతి సముద్రంలోకి వెళ్లింది. దానిని తీసుకొచ్చే క్రమంలో గల్లంతయ్యాడు. వెంటనే స్నేహితులు గాలించినా ఫలితం లేకపోయింది. స్థానిక మత్స్యకారులు, యువకులు వల వేసి వెతికినా ఆచూకీ లభించలేదు. మెరైన్ పోలీసుల గాలింపు: ఈలోగా భావనపాడు నుంచి మెరైన్ సీఐ దేవుళ్లు, ఎస్ఐ జగదీష్, ఏఎస్ఐ రామచంద్రుడు సిబ్బందితో వచ్చి పరిస్థితి సమీక్షించారు. మృతదేహం లభిస్తే సమాచారం ఇవ్వాలంటూ బారువ, మంచినీళ్లపేట, దేవునల్తాడ, బావనపాడు, గుణుపల్లి, మెట్టూరు, డోకులపాడు, నువ్వలరేవు మత్సో్యకారులకు ఫోన్ల ద్వారా సమాచారం చేరవేశారు. రాత్రి 9 గంటల వరకు ఎక్కడా మృతదేహం లభ్యం కాలేదు. మరోవైపు వజ్రపుకొత్తూరు ఎస్ఐ పి.నర్సింహమూర్తి, కాశీబుగ్గ రూరల్ సీఐ శేషు, సిబ్బంది మృతదేహం కోసం గాలింపు ముమ్మరం చేశారు. కిషోర్ తండ్రి నర్సింహమూర్తి అబుదాబిలో పనిచేస్తుండటంతో కుటుంబ సభ్యులు సమాచారం అందించారు. దీంతో ఆయన హుటాహుటిన బయలు దేరినట్లు తెలిసింది. విషాదంలో కుటుంబ సభ్యులు ‘అమ్మా.. చేపలకూర చక్కగా వండు.. సముద్ర స్నానం చేసి వచ్చి తింటాను’ అంటూ కిషోర్ చెప్పిన చివరి మాటలు తలుచుకుని తల్లి లక్ష్మీ రోదిస్తున్న తీరు అక్కడి వారిని కంటతడిపెట్టించింది. పెద్ద కుమారుడు త్వరలోనే సెటిల్ అవుతాడని తల్లిదండ్రులు కోటి ఆశలు పెట్టుకున్నారు. కుమారుడికి ఉద్యోగం వస్తే విదేశాలకు వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయేందుకు తండ్రి నిర్ణయం తీసుకున్నారు. ఇంతలోనే కెరటాల రూపంలో మృత్యువు కబలించడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
యువతిని రక్షించిన లైఫ్‌గార్డులు
విశాఖపట్నం, పెదవాల్తేరు(విశాఖ తూర్పు): సముద్రంలో కొట్టుకుపోతున్న ఒక యువతిని లైఫ్‌గార్డులు రక్షించారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసకు చెందిన గొల్లపూడి జ్యోతి (20) సోమవారం ఆర్కేబీచ్కి వచ్చింది. తరువాత సముద్రంలో స్నానం చేస్తుండగా బలమైన కరెటం ఉధృతికి కొట్టుకుపోయింది. ఇంతలో అప్రమత్తమైన లైఫ్‌గార్డులు ఎం.కృష్ణ, వి.పైడిరాజు, కె.రాజు గమనించి ఆ యువతిని రక్షించి ఒడ్డుకి సురక్షితంగా చేర్చారు. యువతికి ప్రాణాపాయం తప్పడంతో సందర్శకులు, పర్యాటకులు ఆనందం వ్యక్తం చేశారు. ఆ యువతి లైఫ్‌గార్డులకు కృతజ్ఞతలు తెలిపింది. -
విదేశీ వనితపై లైంగిక దాడి: నిందితుడి అరెస్ట్
పనాజీ : గోవాలోని పాలోలెమ్ బీచ్ సమీపంలో బ్రిటన్‌కు చెందిన మహిళా టూరిస్ట్‌పై లైంగిక దాడితో పాటు దోపిడీకి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కనకోనా రైల్వే స్టేషన్ నుంచి బుధవారం తెల్లవారుజామున పాలోలెమ్ బీచ్‌కు వెళుతున్న 48 ఏళ్ల బ్రిటన్ మహిళను అడ్డగించిన దుండగుడు ఆమెను బెదిరించి రోడ్డు పక్కన పంటపొలంలోకి బలవంతంగా తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో నిందితుడిని తమిళనాడుకు చెందిన రామచంద్రప్పగా గుర్తించారు. బాధితురాలి నుంచి నిందితుడు రూ 20,000 నగదు, పాస్‌పోర్ట్, మరికొన్ని వస్తువులు దొంగిలించాడని, నగదు మినహా మిగిలిన వాటిని నేరం జరిగిన 50 మీటర్లలోపు లభించాయని గోవా ఐజీపీ జస్పాల్ సింగ్ వెల్లడించారు. బాధితురాలు పేర్కొన్న వివరాలతో పాటు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని మార్గో రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కనకోనా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
నాకూ ఓ మనసుంది
అంత అందమైన అమ్మాయిని చూడటం అదే మొదటిసారి. అంటే ఇంతకు ముందు అందమైన అమ్మాయిల్ని చూళ్లేదని కాదు, కానీ ఇంత అందంగా, అద్భుతమైన శిల్పం చెక్కినట్టు, ఎక్కడా అంగుళంలో వెయ్యోవంతు కూడా కొలత తప్పకుండా... అప్సరసలు కూడా ఇంత అందంగా ఉండరేమో! సాయం సంధ్యలో సముద్రపు ఒడ్డున కూచుని ఎగసిపడే అలల్ని చూస్తూ... పక్కనే ఎవరో కూచోవడంతో తల తిప్పి చూసి... తర్వాత తల తిప్పుకోలేక... ఎంత అవస్థో కదా! ఓవైపు ఆడపిల్ల మొహం వైపు తదేకంగా చూడకూడదన్న సంస్కారం వెనక్కి లాగుతుంటే మరోవైపు ఈ అతిలోక సౌందర్యాన్ని వీక్షించడంలో ఓ క్షణం కోల్పోయినా జీవితం వృథా అనిపిస్తోంది. ఆమె కూడా తల తిప్పి నావైపు చూసింది. తిడుతుందేమోనన్న భయంతో చూపులు మరల్చబోతూ ఆమె పెదవుల మీద పూసిన మనోహరమైన నవ్వు చూసి ఆగిపోయాను. ‘‘హలో... ఏమిటలా చూస్తున్నారు? అబద్ధం చెప్పకండి. నాకు తెలుసు మీరెందుకలా చూశారో’’ అంది. ఓవైపు గొంతు తడారిపోయి తొట్రుపాటు... మరోవైపు తనే పలకరించినందుకు ఒంట్లో అలల్లా కదులుతున్న పులకింత. ‘‘మీకు తెలుసున్నారుగా... ఇంకా చెప్పడం దేనికి?’’ అన్నాను. ‘‘మీరేం చెప్తారో విందామని’’ ‘‘రోజూ మీరు అద్దంలో మీ ముఖాన్ని చూసుకున్నప్పుడల్లా మీరనుకునేదే నా జవాబు కూడా’’ ‘‘అదే సమస్య. అద్దం మాట్లాడదుగా... దానికే మాటలు వస్తే ఎంత బాగుండేదో కదా. మీకొచ్చుగా... చెప్పండి’’ ‘‘పొగడ్తలు వినడం చాలా ఇష్టంలా ఉందే’’ ‘‘పొగడ్తలంటే ఇష్టపడని అమ్మాయిలు కూడా ఉంటారా?’’ అంటూ మరోసారి నవ్వింది. ప్రతి ఆదివారం సాయంత్రం ఈ బీచ్ ఒడ్డున కూచుని సముద్రంలో పొంగుతున్న అలల్ని చూడటం ఓ ఏడాది నుంచి నా అలవాటు. కానీ ఈ అమ్మాయిని ఎప్పుడూ చూసినట్టు గుర్తు లేదు. ‘‘మీరీ బీచ్‌కి రెగ్యులర్‌గా వస్తుంటారా?’’ అని అడిగాను.‘‘లేదు. ఇదే మొదటిసారి రావడం’’‘‘అలానా... అయితే నేను చాలా అదృష్టవంతుణ్ణి. మీరు బీచ్‌కి వచ్చిన మొదటి రోజే మీ పరిచయభాగ్యం కలిగింది. ఇంతకూ మీ పేరేమిటో చెప్పలేదు’’‘‘మీరడగలేదుగా’’ అంటూ నవ్వింది. ‘‘నా పేరు లిఖిత’’‘‘స్వీట్ నేమ్. నా పేరు సునీల్. ఇక్కడే యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్ని. మరి మీరు?’’‘‘అన్నప్రాశననాడే ఆవకాయ తినిపిస్తారా ఏమిటి?’’ తొందరెందుకు? మళ్లీ కలుస్తాంగా’’‘‘ఎప్పుడు?’’‘‘వచ్చే ఆదివారం. ఇక్కడే’’ ఆమె లేచి కదుల్తున్న అలలా వెళ్లిపోయింది.ఆదివారం ఎప్పుడొస్తుందా అని ఆరాటం... సోమవారం తర్వాత ఆదివారం వస్తే ఎంత బావుండునో కదా అనే ఆశ. నిజంగానే వస్తుందా... ఒకవేళ రాకపోతేనో అనే అనుమానాలు... ఆదివారం రానే వచ్చింది. అప్పటి వరకు రోజులు యుగాల్లా గడిపితే ఈ రోజు మాత్రం నిమిషాలే యుగాల్లా సుదీర్ఘంగా సాగి బాధిస్తున్నాయి. బీచ్‌లో ఎదురుచూస్తూ కూచున్నప్పుడు క్షణాలు యుగాల్లా... లిఖిత వచ్చింది. ఎన్ని కబుర్లో. ఆమె అందమైన నవ్వుల్ని మధ్య మధ్యలో ఆస్వాదిస్తూ... అలాంటి ఎన్ని ఆదివారాలు అందమైన అలల్లా వచ్చి వెళ్లాయో... లిఖితను చూడకుండా ఉండలేని పరిస్థితి. రోజులో అధికభాగం లిఖితను కలవరిస్తూ... పలవరిస్తూ... నేను ప్రేమలో పడ్డానని అర్థమైంది. మొదట నన్నాకర్షించింది ఆమె అందమే అయినా నన్ను కట్టి పడేసింది మాత్రం ఆమె తెలివి, వాక్చాతుర్యం.‘‘మనం పెళ్లి చేసుకుందాం’’ అన్నానో రోజు.‘‘సారీ, నేను పెళ్లికి యోగ్యురాల్ని కాను’’ లిఖిత మొహంలో సముద్రమంత ఉదాసీనత... ‘‘నీకేం తక్కువ? ఎందుకలా అనుకుంటున్నావు?’’ అన్నాను ఆశ్చర్యపోతూ.‘‘నేను తల్లిని కాలేను. ఓ బిడ్డకు జన్మనివ్వడానికి అవసరమైన యుటెరస్, ఓవరీస్, ఫాలోపియన్ ట్యూబ్స్ లాంటి అవయవాలు నాలో లేవు’’‘‘నీకెలా తెలుసు? డాక్టర్లు చెప్పారా? ఎప్పుడు చెకప్ చేయించుకున్నావు? పెళ్లి కాకముందే పిల్లల గురించి ఎందుకు డాక్టర్లని కన్సల్ట్ చేశావు?’’ అని అడిగాను.విషాదంగా నవ్వి ‘‘డాక్టర్లు చెప్పలేదు. నాకు తెలుసు’’ అంది.‘‘అదే ఎలా తెలుసు?’’ కొద్దిగా చిరాగ్గా అడిగాను.‘‘నన్నడగొద్దు. ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేను’’ అంటూ నేను పిలుస్తున్నా వినకుండా ఇసుకలో లుప్తమైపోతున్న అలలా వేగంగా వెళ్లిపోయింది.నేనీ విషయం గురించి తీవ్రంగా ఆలోచించాను. ప్రేమంటే ఆమెలోని ఉత్తమ లక్షణాల్ని ఇష్టపడటమే కాదు, లోపాల్ని కూడా అంగీకరించాలి కదా. పిల్లలు లేకున్నా పర్లేదు. కంటేనే పిల్లలా... పెంచినామన పిల్లలవుతారు. ఏ అనాథాశ్రమం నుంచో ఓ ఆడపిల్లని తెచ్చి పెంచుకుంటే చాలు. మాకు పిల్లలు లేని లోటు తీరటంతో పాటు ఆ పిల్లకు తల్లి ప్రేమనూ తండ్రి ప్రేమనూ అందించవచ్చు.ఆదివారం కలుసుకున్నప్పుడల్లా ‘‘పిల్లలు పుట్టకున్నా పర్లేదు. మనం పెళ్లి చేసుకుందాం’’ అన్నాను.లిఖిత నావైపు ఆరాధనగా చూసింది. ‘‘మీ వాళ్లతో వచ్చి మాట్లాడనా? మన మధ్య ప్రేమ చిగురించి ఇన్ని నెలలైనా నువ్విప్పటి వరకు మీ ఫ్యామిలీ గురించి ఏమీ చెప్పలేదు. మీ నాన్నగారు ఏం చేస్తారు? మీ ఇల్లెక్కడ?’’ అని అడిగాను. ‘‘సారీ... ఇంత క్రితం కూడా నువ్వు చాలాసార్లు అడిగావు. నేను చెప్పలేదు. చెప్పలేను కూడా’’‘‘అనాథవా?’’‘‘ఓ రకంగా అంతే. మరో రకంగా కాదు’’‘‘అర్థంకాని ప్రహేళికలా మాట్లాడతావెందుకు?’’‘‘నేను నిజంగానే ఓ పజిల్ని కాబట్టి’’‘‘సరే, అవన్నీ నీ వ్యక్తిగత విషయాలు. ఇప్పుడు మన పెళ్లి జరగాలంటే నీ వైపు బంధువులెవరైనా ఉండాలిగా’’‘‘బంధువులు ఎవ్వరూ లేరు. మనం పెళ్లి ఎప్పుడు చేసుకుందామో చెప్పు.తప్పించుకుని వచ్చేస్తా’’‘‘తప్పించుకుని రావడమేంటి? అంటే ఎవరైనా నిన్ను నిర్బంధించారా? అదే నిజమైతే ఇలా ప్రతి ఆదివారం బయటికి స్వేచ్ఛగా ఎలా రాగలుగుతున్నావు?’’లిఖిత మొహంలో దిగులుఅరణ్యంలా విస్తరించడం గమనించాను. ఓసారి తల తిప్పి వెనక్కి చూసింది. ఆమె కళ్లలో బెదురు...‘‘నేను స్వేచ్ఛగా తిరుగుతున్నానని అనుకుంటున్నావా? లేదు. నాకు స్వేచ్ఛ లేదు. బందీని. నా ప్రతికదలికనీ రెండు జతల కళ్లు గమనిస్తూ ఉంటాయి. స్వేచ్ఛ కోసం పరితపిస్తున్న పంజరంలో పక్షిని నేను’’ ఆమె సన్నగా ఏడుస్తోంది.‘‘నాకు అర్థమయ్యేలా చెప్పు. అవసరమైతే పోలీసుల సాయం తీసుకుందాం.నువ్వు గూండాల చెరలో ఉన్నావా? మాఫియా గ్యాంగ్ ఏదైనా నిన్ను తన గుప్పిట్లో పెట్టుకుని ఆడిస్తోందా?’’‘‘లేదు. అలాగని నేను స్వతంత్రురాల్ని కూడా కాదు’’‘‘అబ్బా... మళ్లీ పజిల్’’‘‘దయచేసి ఇంక నన్నేమీ అడక్కు. పెళ్లి ఎప్పుడు చేసుకుందామో చెప్పు. ఎలా రావాలో ఎవరి దృష్టి నుంచి తప్పించుకు రావాలో అదంతా నా సమస్య’’ అంది స్థిరంగా.‘‘సరే. నిన్ను ఇబ్బంది పెట్టే ప్రశ్నలేవీ వేయను. వచ్చే ఆదివారం ఉదయం నా గదికి వచ్చేయి. పెళ్లి చేసుకుందాం. నా అడ్రస్ కాగితం మీద రాసిస్తాను’’ అంటూ పెన్ను తీయబోతుంటే లిఖిత వారించింది.‘‘వద్దు. చెప్పు చాలు. గుర్తు పెట్టుకుంటాను’’ మళ్లా వెనక్కి తిరిగి భయం భయంగా చూస్తూ అంది.నేనూ వెనక్కి తిరిగి చూశాను. ఆదివారం కాబట్టి గుంపులు గుంపులుగా మనుషులు ఉన్నారు. ఎవరి ధ్యాసలో వాళ్లున్నారు తప్ప మావైపు పత్తేదారు కళ్లతో చూస్తున్న శాల్తీలెవ్వరూ కనిపించలేదు.అడ్రస్ చెప్పాక ‘‘తప్పకుండా వస్తాను’’ అనేసి వెళ్లిపోయింది.ఆదివారం రోజు... ఉదయం నుంచి ఉత్కంఠ... నిన్న రాత్రి నిద్రపడితే ఒట్టు. ఎడతెరిపిలేని ఆలోచనలు... ఉదయం ఐదింటికే లేచి కూచున్నా. సమయం ముందుకు కదలడం లేదన్న అసహనం. అశాంతిగా గదంతా ఏ వందసార్లు తిరిగుంటానో.పదయింది... పదకొండు... పన్నెండు... లిఖిత జాడ లేదు. నేను అడ్రస్ రాసివ్వకుండా చెప్పి తప్పు చేశానేమో! ఒకట్రెండు కొండ గుర్తులైనా చెప్పి ఉండాల్సింది. డోర్ నంబర్లో చాలా అంకెలున్నాయి. మర్చిపోయిందో ఏమో! వీధిలోకొచ్చి నిలబడ్డాను. కాళ్లు నొప్పెడుతున్నాయి. ఎన్ని గంటల నుంచి నిలబడి ఉన్నానోఏమో... మెల్లగా చీకట్లు కమ్ముకోసాగాయి. లిఖిత రాలేదు.తన దగ్గర మొబైల్ ఫోన్ లేదు. ఓ రోజు నేను కొనిస్తానన్నా విన్లేదు. తనకిష్టం ఉండదని చెప్పింది. ఇప్పుడు తను రాకపోవడానికి కారణమేమిటో తెలిసే అవకాశం లేదు. ఆదివారం వరకు ప్రాణాల్ని ఉగ్గబట్టుకుని ఎదురు చూశాను. ఆదివారం సాయంత్రం బీచ్‌లో తన కోసం కళ్లు కాయలు కాచేలా వేచి చూశాను. రాలేదు. ఆ ఆదివారమే కాదు, ఆ తర్వాత వచ్చిన ఆదివారాలప్పుడు కూడా లిఖిత బీచ్‌కి రాలేదు. చిక్కని చీకటిలాంటి నిరాశ. ఇంక ఎప్పటికీ వెల్తురనేదే కనిపించదా అనే నిస్పృహ... దుఃఖం దట్టమైన కీకారణ్యంలా నన్ను తనలోకి లాక్కుంటోంది. లిఖిత ఏమైంది? మెరుపులా మెరిసి మరుక్షణంలో మాయమైపోయినట్టు... మోసం చేసిందా? లేదు. చాలా అమాయకమైన పిల్ల. స్వచ్ఛమైన మనసున్న అమ్మాయి. తన ప్రేమ నిజమైనది. మరి ఎందుకు రాలేదు? ఎవరో తనను గమనిస్తూ ఉంటారని చెప్పిందిగా.వాళ్లేమైనా కట్టడి చేశారా? లిఖిత క్షేమంగా ఉందా? అసలీ ఊళ్లోనే ఉందా లేక ఎక్కడికైనా తీసుకెళ్లిపోయారా? నిరంతరం ఇవే ఆలోచనలు... మనశ్శాంతి కరువైంది. ఆదివారం సాయంత్రాలు బీచ్ ఒడ్డున పిచ్చోడిలాతిరగటం మాత్రం మానలేదు.ఓ ఆదివారం ఉదయం ఉరుములేని మెరుపులా లిఖిత నా రూమ్‌లో ప్రత్యక్షమైంది. భుజాల చుట్టూ గులాబి పూల డిజైన్ ఉన్న షాల్ కప్పుకుని... అందంగా ఉండే మొహం నిండా ఆందోళన...‘‘ఇన్నాళ్లూ ఏమైపోయావు?’’ అంటూ ఉద్విగ్నంగా అడిగాను.‘‘అవన్నీ చెప్పేంత సమయం లేదు. తొందరగా బయల్దేరు. మనం ఈ ఊరు విడిచిపెట్టి ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోదాం’’ అంది.ఆమె కళ్లలో భయం నగ్నంగా...‘‘ఇప్పటికిప్పుడు ఎలా వెళ్లగలం? ఎక్కడికని వెళ్లగలం?’’‘‘నాకు తెలియదు. కానీ వెళ్లిపోక తప్పదు. నా కోసం వెతుకులాట మొదలైంది. నేను కనిపిస్తే బతకనివ్వరు.చంపేస్తారు.’’‘‘ఎవరు వాళ్లు?’’ మనం పోలీస్ స్టేషన్కెళ్దాం.’’‘‘లాభం లేదు. లీగల్‌గా నేను వాళ్ల ప్రాపర్టీ. వాళ్లు నన్ను ఏమైనా చేసుకునే అధికారం ఉంది. చంపినా ముక్కలు ముక్కలుగా నరికినా పోలీసులు కూడా జోక్యం చేసుకోలేరు’’‘‘మనం ఉంటున్నది సభ్య సమాజంలో... అడవిలో కాదు. నువ్వు మేజర్‌వి. నీ ఇష్టమొచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కు నీకుంది. దాన్ని ఎవ్వరూ ప్రశ్నించలేరు.’’‘‘నేను నిన్ను ప్రేమిస్తున్నట్టు నన్ను గమనించడానికి నియమించబడ్డ వ్యక్తికి తెలిసిపోయింది. మనం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న విషయం కూడా అతను స్పష్టంగా విన్నాడు. అందువల్లనే మరునాడు నన్ను గదిలోంచికదలనీయకుండా బంధించారు.’’‘‘అదెలా సంభవం? మనం ఆ రోజు పెళ్లి గురించి మాట్లాడుకున్న సమయంలో చుట్టుపక్కల కొన్ని మీటర్ల దూరం వరకు ఎవ్వరూ లేరుగా’’ అన్నాను.‘‘నాకు తెలియకుండా నా జడపిన్నులో మైక్రో ట్రాన్స్‌మీటర్ అమర్చారు. నన్ను బంధించిన రోజు నా రక్షకుడితో బాగా గొడవ పడ్డాను. నాకు ప్రేమించే హక్కు లేదా అని అడిగాను. లేదన్నాడు. నన్ను నీకు దగ్గర చేయడంలో ఉద్దేశం నేను మానసికంగా పరిపక్వత సాధించానా లేదా, శారీరకంగా పరిపూర్ణతను పొందానా లేదా అనేది నిర్ధారించుకోవడానికి పెట్టిన పరీక్ష మాత్రమేనట. నేను మగవాళ్లని ఎంత త్వరగా ప్రేమలో పడేయగలిగితే అంత గొప్పగా సఫలీకృతురాలినైనట్టు లెక్క. వాళ్లు చేస్తున్న ప్రయోగాల్లో ఆఖరి మజిలీని నేను’’‘‘అదేం పరీక్ష? ఏం ప్రయోగాలు? నాకర్థం కావడంలేదు. మీ నాన్న ఏమైనా సైకాలజీ ప్రొఫెసరా? ఆడపిల్లల మనస్తత్వం మీద రీసెర్చ్ చేస్తున్నాడా?’’‘‘నాన్న కాదు. రక్షకుడు.. నేను నిన్ను ప్రేమలో పడేయాలి తప్ప నేను ప్రేమలో పడకూడదట. పెళ్లి మాటే తల్చుకోకూడదట. నేను పారిపోతానేమోనని కుర్చీకితాళ్లతో కట్టేసి, గదిలో పెట్టి తలుపేశారు.ఎలాగోలా తాళ్లు విప్పదీసుకుని, తలుపు తెరుచుకున్న వెంటనే అతన్ని పక్కకు నెట్టేసి బయటికి పరుగెత్తాను. కొంత మంది నా వెంట పడ్డారు. వాళ్లకు దొరక్కూడదని చాలా వేగంగా పరుగెత్తాను. అందులో ఒకడు నా మీదికి కత్తి విసిరాడు.’’ నాకు చప్పున భయమేసింది. ‘‘కత్తి విసిరాడా? ఎంతటి దుర్మార్గుడు... నీకు తగల్లేదు కదా’’ అన్నాను కంగారుపడుతూ.‘‘నా మెడకు గురిచూసి విసిరాడు. అదృష్టం. గురి తప్పింది. లేకపోతే మెడ తెగి పడిపోయి ఉండేది’’ విషాదంగా నవ్వింది.‘‘వాళ్లు ఆ రోజు మనం మాట్లాడుకున్న మాటల్ని మైక్రో ట్రాన్స్‌మీటర్ ద్వారా విని ఉంటే నా గది ఎక్కడో తెలిసిపోయి ఉండాలిగా’’‘‘తెలుసు... ఒకసారి ఎవర్నో పంపించి నీ అడ్రస్ కరెక్టో కాదో సరిచూసుకున్నారు కూడా. అందుకే చెప్పేది. మనం ఇక్కడి నుంచి తొందరగా వెళ్లిపోవాలి. వాళ్లు ఏ క్షణమైనా ఈ గదికి రావొచ్చు’’‘‘రానీయ్. వాళ్ల సంగతేంటో తేల్చుకుంటాను. చుట్టుపక్కల ఉన్న వాళ్లందర్నీమనకు రక్షణగా పిలుస్తాను. నీ మీద కత్తి విసిరిన దుర్మార్గుడి మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టి జైల్లో తోయిస్తాను’’ అన్నాను ఆవేశంగా.‘‘లాభం లేదు. నా విషయంలో ఈ చట్టాలు వర్తించవు. ప్రభుత్వం మాలాంటి వాళ్ల రక్షణ కోసం కొత్త చట్టాలు చేసే వరకు వాళ్లను ఎవ్వరూ ఏమీ చేయలేరు.’’‘‘మళ్లా పజిల్ భాషలో మాట్లాడుతున్నావు. వాళ్లేమైనా దివి నుంచి దిగొచ్చినా దేవతలా లేక వేరే గ్రహం నుంచి మన భూమి పైకొచ్చిన ఏలియన్సా?’’‘‘రెండూ కాదు. వాళ్ల ఉద్దేశంలో నాకు తెలివుండాలి కాని మనసుండకూడదు. అందులో ప్రేమలాంటి అనుభూతులు ఉండకూడదు’’‘‘నిన్నేమైనా మరబొమ్మనుకుంటున్నారా?’’‘‘మాటల్తో సమయం వృథా చేయకుండా నన్నిక్కడి నుంచి తీసుకెళ్లిపో. దూరంగా.. వీళ్లకు అందనంత దూరంగా... ప్లీజ్... బయల్దేరు. నీ వాదనలు నా విషయంలో పనికి రావు’’ అంటూనే ఆమె ఓ చేత్తో నా బట్టల్ని సూట్‌కేసులో సర్దసాగింది.‘‘ఎందుకు పనికి రావు? నువ్వూ మనిషివే. వస్తువు కాదు’’ అన్నాను కోపంగా.ఆమె భుజాల్ని కప్పి ఉన్న షాల్ కిందికి జారిపోయింది. అప్పుడు గమనించాను. ఆమెకు కుడిచేయి లేదు.ఎవరో తెగ్గొట్టేశారు. కానీ రక్తం కారటం లేదు. భుజంలోంచి ఏవో వైర్లు తెగిపోయి వేలాడుతున్నాయి. వాటి వైపు ఆశ్చర్యంతో అపనమ్మకంతో చూస్తున్న నా వైపు తిరిగి లిఖిత అంది. ‘‘ఎందుకంటే నేను మనిషిని కాదు కాబట్టి. నేను ఆండ్రాయిడ్ మరబొమ్మనే, కానీ హృదయం ఉన్న మరబొమ్మని’’ మళ్లా షాల్ని తన తెగిపోయిన చేయి కన్పించకుండా భుజాల చుట్టూ కప్పుకుని ఒంటి చేత్తో సామన్లు సర్దడంలో లీనమైపోయింది. ∙ -
కడలి కాటు!
వేర్వేరు చోట్ల సముద్రంలో మునిగి ఇద్దరు మృతి చెందగా మరొకరు గల్లంతయ్యారు. మూడు కుటుంబాల్లో విధి విషాదం చిమ్మింది. సరదాగా సముద్ర స్నానానికి వెళ్లిన ఇద్దరు కడలి కెరటాలకు బలయ్యారు. ఒకరు ఆచూకీ ఇంకా తెలియ రాలేదు. ఆడుతూ పాడుతూ సరదాగా తీరంలో గడిపేందుకు వెళ్లిన బంధువులు కన్నీటిపర్యంతం కావాల్సి వచ్చింది. ఆదివారం ఒక్క రోజే చీరాల వాడరేవు, రామాపురం సముద్ర తీరంలో మూడు విషాదకర ఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రకాశం, చీరాల: మండలంలోని ఈపూరుపాలెం సీతారాంపేటకు చెందిన చెందిన కొర్నిపాటి నరేష్ (34) కుటుంబ సభ్యులతో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని రామాపురం సముద్ర తీరానికి వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో సముద్రంలో స్నానం చేస్తుండగా అలల తాకిడికి గురై సముద్రంలోకి కొట్టుకుపోయి అరగంట తర్వాత విగత జీవై నరేష్ బయటకు కొట్టుకొచ్చాడు. ఈపూరుపాలెం పద్మనాభునిపేటకు చెందిన గోలి భార్గవ్ (17) పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. స్నేహితులతో సరదాగా వాడరేవులో స్నానం చేసేందుకు కొల్లా గణేష్‌తో పాటు మరో మిత్రుడితో కలిసి స్నానం చేసేందుకు వాడరేవుకు వచ్చాడు. అలల తాకిడికి గురై గణేష్, భార్గవ్‌లు కొట్టుకుపోయారు. కొద్ది సేపటికి తీవ్ర అపస్మారక స్థితిలో ఉన్న భార్గవ్‌ను సముద్రంలో స్నానాలు చేస్తున్న కొందరు ఒడ్డుకు తీసుకొచ్చి ఆటోలో చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. అప్పటికే భార్గవ్ మృతి చెందాడు. సముద్రంలో గల్లంతైన గణేష్ ఆచూకీ మాత్రం లభించకపోవడంతో గజ ఈతగాళ్లు, మత్య్సకారులు సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. చేతికి అందికి వచ్చిన కొడుకులను ఒక్కసారిగా కడలి కాటేయడంతో విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. మృతదేహాలను చూసి బంధువులు నిర్ఘాంతపోయారు. తమ కుటుంబానికి అండగా నిలుస్తారని ఆశించిన కుటుంబ సభ్యులు.. కుమారుల విగజీవాలను చూసి గుండెలవిసేలా విలపించారు. ఒక్కొక్కరిది ఒకో గాథ ఈపూరుపాలెం సీతారంపేటకు చెందిన కొర్నిపాటి నరేష్ చేనేత కుటుంబానికి చెందిన యువకుడు. తల్లిదండ్రులు మాస్టర్ వీవర్లుగా పని చేస్తున్నారు. కుటుంబంలో తండ్రి తర్వాత కుటుంబ బాధ్యతలను నిర్వహించే నరేష్ వ్యాపార వ్యవహారాలూ చూసుకుంటున్నాడు. కార్తీక మాసం సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు వెళ్లిన నరేష్ కుటుంబంపై విధి చిన్న చూపు చూసింది. తండ్రి కృష్ణయ్య, ఇతర కుటుంబ సభ్యులు భోరున విలపిస్తున్నారు. పద్మనాభునిపేటకు చెందిన గోలి భార్గవ్ తల్లిదండ్రులు చేనేత కూలీలుగా పనిచేసుకుంటూ కుమారుడిని ఇంటర్ చదివించుకుంటున్నారు. కొడుకు ఉన్నత చదువులు చదివి తమకు అండగా నిలుస్తాడని ఆశించిన ఆ కుంటుంబంపై విధి విషం చిమ్మడంతో భోరున విలపిస్తున్నారు. ఆస్పత్రి వద్ద మిన్నంటిన రోదనలు సముద్ర స్నానానికి వెళ్లి మృతి చెందిన నరేష్, భార్గవ్ మృతదేహాలను శవ పంచనామా కోసం చీరాల ఏరియా వైదశాలకు తీసుకొచ్చారు. మృతదేహాలను చూసేందుకు ఈపూరుపాలేనికి చెందిన మాస్టర్ వీవర్లు, చేనేత కార్మికులు అధిక సంఖ్యలో వచ్చారు. వైద్యశాల మార్చురీ వద్దకు చేరుకుని విచారం వ్యక్తం చేశారు. మృతుడి బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. దొరకని గణేష్ ఆచూకీ వాడరేవులో సముద్ర స్నానం చేస్తూ గల్లంతైన కొల్లా గణేష్ ఆచూకీ రాత్రి పొద్దుపోయే వరకూ లభించలేదు. మృతదేహం కోసం మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు తీరం ఒడ్డున ఉన్నారు. అక్కరకు రాని 108 అంబులెన్స్ ప్రమాదాల్లో గాయపడిన వారిని కాపాడాల్సిన 108 వాహనం సకాలంలో సంఘటన స్థలానికి రాకపోవడంతో క్షతగాత్రులు ఆటోలు, ద్విచక్ర వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఆదివారం తీవ్ర అపస్మారకంగా ఉన్న గోలి భార్గవ్‌ను సకాలంలో వైదశాలకు తీసుకెళ్లి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని స్థానికులు పేర్కొంటున్నారు. వాడరేవు, రామాపురం తీరంలో సముద్ర స్నానానికి వెళ్లి మృతి చెందిన ఘటనలపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సంఘటన స్థలాలను ఎస్ఐలు అనూక్, వెంకటకృష్ణ పరిశీలించి వివరాలు సేకరించారు. -
బీచ్‌లలో పురుషుల ఆగడాలు
కర్ణాటక, బొమ్మనహళ్లి: నవంబర్ నెల వచ్చిందంటే చాలు ఈ నెల నుంచి జనవరి వరకు రాష్ట్రంలో ఉన్న ప్రముఖ పర్యాటక స్థలాలు పర్యాటకులతో రద్దీగా ఉంటాయి. కానీ కొంతమంది యువకులు, పురుషుల ఆగడాల వల్ల రాష్ట్రంలో ఉన్న బీచ్‌లో పర్యాటకులు చాల మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటివాటికి అడ్డుకట్ట వేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు నాగలక్ష్మీబాయి సీఎం కుమారస్వామికి లేఖ రాశారు. బెంగళూరు, చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన యువకులు బీచ్‌లకు వెళ్ళి నగ్నంగా నీళ్ళలో ఆడుతుంటారని తమకు ఫిర్యాదులు వచ్చినట్లు ఆమె లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా గోకర్ణ, మంగళూరు, ఉడుపిలో ఉన్న బీచ్‌లో ఇలాంటి దుందుడుకు చర్యలు జరుగుతున్నాయని లేఖలో తెలిపారు. ఇక్కడ బీచ్‌ల వద్ద యువకులకు అన్ని దురలవాట్ల వస్తువులు లభిస్తున్నాయని చెప్పారు. పిల్లలు, మహిళలు ఉన్నారని కూడా చూడకుండా నగ్నంగా నీటిలో తిరుగుతున్నారని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలను తీసుకోవాలని లేఖలో కోరారు. -
రాజేష్ కోసం ఆశగా నిరీక్షణ
మల్కాపురం(విశాఖ పశ్చిమ): యారాడ తీరంలో గల్లంతై నాలుగు రోజులు గడిచినప్పటికీ రాజేష్ ఆచూకీ లభ్యం కాకపోవడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. గడిచిన ఆదివారం విహారానికి యారాడ వచ్చిన 12 మంది యువకులలో ఆరుగురు సముద్రంలో గల్లంతైన విషయం తెలిసిందే. వీరిలో సోమవారం ఇద్దరు, మంగళవారం ముగ్గురి మృతదేహాలు తీరానికి చేరాయి. మిగిలిన రాజేష్ ఆచూకీ కోసం న్యూ పోర్టు పోలీసులు బుధవారం ముమ్మరంగా గాలించారు. సాయంత్రం చీకటిపడేంత వరకూ గాలించినా ఫలితం లేకపోయింది. గురువారం మళ్లీ గాలింపు కొనసాగించనున్నారు. మరోవైపు నాలుగు రోజులు గడుస్తున్నా తమ కుమారుడి ఆచూకీ లభ్యం కాకపోవడంతో రాజేష్ తల్లిదండ్రులు తీవ్రంగా రోదిస్తున్నారు. తమ కుమారుడు క్షేమంగా తిరిగి వస్తాడని గంగమ్మ వైపు ఆశగా చూస్తున్నారు. నెల రోజుల కిందటే ప్రమాదంలో కాలు విరిగిపోతే శస్త్రచికిత్స చేయించామని, మోడ్రన్‌గా ఉండాలనుకునే కుమారుడు కనిపించకుండా పోయాడని విలపిస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి గడిపేందుకు ఇష్టపడే రాజేష్ కోసం ప్రస్తుతం ఆ కుటుంబమంతా తీరంలో ఆశగా నిరీక్షిస్తుండడం చూపరులను కలిచివేస్తోంది. మరోవైపు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజేష్ కోసం కనీసం బోట్లుపై కూడా గాలించడం లేదని ఆరోపిస్తున్నారు. -
నిరీక్షణ నిష్ఫలం
యారాడ బీచ్‌లో మూడోరోజూ కన్నీటి కెరటాలు పోటెత్తాయి. గల్లంతైన ఆరుగురు యువకుల కోసం గాలింపు చర్యలు కొనసాగాయి. అయితే కుటుంబ సభ్యులు, బంధువుల ఆశలు కరిగిపోతున్నాయి. సోమవారం ఇద్దరి మృతదేహాలు లభించగా.. మంగళవారం మరో ముగ్గురు విగత జీవులుగానే లభించారు. మరో యువకుడి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతున్నా.. ఆశలు మాత్రం ఆవిరవుతున్నాయి. మల్కాపురం(విశాఖ పశ్చిమ): సరదాగా యారాడ తీరంలో గడుపుదామని వెళ్లి రాకాసి అలలకు చిక్కిన వారిలో మరో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. గంగవరం పోర్టు తీరంలో మంగళవారం ఉదయం ఒకరిది, సాయంత్రం మరొకరి మృతదేహం లభ్యమయ్యాయి. వీరిని దేవర వాసు(21), పేరిడి తిరపతి (21)గా కుటుంబ సభ్యులు గుర్తించారు. అనంతరం రాత్రి 7 గంటల సమయంలో రాళ్ల మధ్య చిక్కుకున్న యువకుడి మృతదేహాన్ని న్యూపోర్టు పోలీసులు వెలికితీశారు. హెచ్‌బీ కాలనీ సమీప చాకలిపేట పరిధి భానునగర్‌కు చెందిన కోనా శ్రీనివాస్(21) మృతదేహంగా పోలీసులు గుర్తించారు. వెంటనే అతని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను కేజీహెచ్‌కు తరలించారు. ఇప్పటికే సోమవారం సాయంత్రం గంగవరం పోర్టు సమీపంలో వేర్వేరు ప్రాంతాల్లో నక్కా గణేష్(17), సోమిరెడ్డి దుర్గ(21) విగతజీవులుగా కనిపించిన విషయం తెలిసిందే. మిగిలిన దౌలపల్లి రాజేష్(21)ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఆశగా ఎదురుచూస్తున్నారు. నేవీ, కోస్టుగార్డు, మెరైన్ సిబ్బంది, స్థానిక పోలీసులు, గజ ఈతగాళ్లు ముమ్మరంగా గాలిస్తున్నారు. భీమిలి, ఆర్కే బీచ్, గంగవరం పోర్టు తీరం, అప్పికొండ తీరంలో గాలిస్తున్నారు. బుధవారం ఆచూకీ లభ్యమయ్యే అవకాశం ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. కోటి ఆశలతో ఎదురు చూపులు గల్లంతైన వారిలో ఇప్పటికి ఐదుగురి ఆచూకీ లభ్యం కావడంతో మిగిలిని రాజేష్ కోసం వారి బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆ ఒక్కడిని అయినా సురక్షితంగా ఒడ్డుకు చేర్చు తల్లీ అని యారా డ తీరంలో గంగమ్మను వేడుకుంటున్నారు. తిండి, నిద్ర మానుకుని యారాడ తీరంలో మూడు రోజుల నుంచి విలపిస్తుండడంతో వారి ని ఓదార్చడం ఎవరితరమూ కావడం లేదు. కంటికి రెప్పలా పెంచుకున్న కుమారులు ఇలా తమ ఆశలు ఆవిరి చేసి వెళ్లిపోయారంటూ మృతులు దేవర వాసు, తిరుపతి తల్లులు విలపిస్తున్నారు. తండ్రి మరణానంతరం ఆటో నడుపుతూ తల్లికి అండగా ఉన్న దేవర వాసు, తండ్రి చనిపోయాక తల్లి రెక్కల కష్టంతో ఐటీఐ చదువుకుని ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉన్న పేరిడి తిరుపతి మృతి తీవ్ర విషాదాన్ని నింపింది. ఇంక మాకు దిక్కెవరు అంటూ ఆ తల్లులు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టిస్తోంది. బాధిత కుటుంబాలకు వంశీకృష్ణ పరామర్శ పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): యారాడ బీచ్‌లో గల్లంతై మృతి చెందిన యువకుల కు టుంబాలను వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త వంశీ కృష్ణ శ్రీనివాస్ కేజీహెచ్ మా ర్చురీ వద్ద మంగళవారం ప రామర్శించారు. పోలీసు అధి కారులతో మాట్లాడుతూ పం చనామా త్వరగా పూర్తయ్యేలా చూడాలని కోరారు. అనంతరం హెచ్‌బీ కాలనీకి చెందిన నక్క గణేష్, దుర్గ, దుర్గానగర్‌కు చెందిన వాసు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాధితులు పేద కుటుంబాలకు చెందినవారని, కుటుంబాలకు ఆసరాగా ఉన్న వారు ప్రమాదవశాత్తు మరణించడంతో నమ్ముకున్న వారు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి పరిహారం త్వరగా అందేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కో రారు. ఆయా కుటుంబాలకు అండగా ఉంటా నని, అవసరమైన సహాయాన్ని అందిస్తానని చెప్పారు. ఆయనతోపాటు మాజీ కార్పొరేటర్ మొల్లి అప్పారావు, వైఎస్సార్ సీపీ 9వ వార్డు అధ్యక్షుడు అప్పారి గిరిబాబు పాల్గొన్నారు. -
శోక సంద్రం
క్షణాలు నిమిషాలయ్యాయి.. నిమిషాలు గంటలుగా మారాయి.. గంటలు కాస్త రోజుగా.. రోజున్నరగా.. ఇలా కాలం కరిగిపోతోంది. దాంతోపాటే వారి ఆశలు కరిగిపోతున్నాయి.. అయినా నిరీక్షణ మానలేదు.. ఏమూలో మిణుకు మిణుకుమంటున్న ఆశతో తీరానికే అతుక్కుపోయారు. నిద్ర, తిండి ఇవేవీ పట్టడంలేదు.. కన్నీటి సుడులను ఆపుకొంటూ తీరంపై రెప్పలార్చకుండా కళ్లలో వత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారు. నేవీ, కోస్టుగార్డు షిప్పులు, హెలికాప్టర్లు, గత ఈతగాళ్లు.. ఇలా అన్ని రకాలుగా సాగరాన్ని మధిస్తున్నా.. వారి అన్వేషణ పూర్తిగా ఫలించలేదు.ఆదివారం సాయంత్రం సముద్రంలో గల్లంతైన ఆరుగురు యువకుల్లో ఇప్పటివరకు ఇద్దరి ఆచూకీ మాత్రమే లభించింది.అది కూడా సోమవారం సాయంత్రం గంగవరం పోర్టు సమీపంలో వేర్వేరు ప్రాంతాల్లో దుర్గా, గణేష్‌లు విగత జీవులుగానే లభించడంతో.. వారి కుటుంబాల అన్వేషణ, నిరీక్షణ విషాదాంతమైంది.మిగిలిన నలుగురి కోసం గాలింపు కొనసాగుతున్నాయి.ఎక్కడో.. ఏమూలో మిణుకు మిణుకుమంటున్న ఆశ.. ఆ ఆశతోనే తీరంలో రెండు రోజులుగా తిండీతిప్పలు మాని అలాగే ఉండిపోయారు. ఏ క్షణంలోనైనా గాలింపు బృందాలు శుభవార్త చెబుతాయేమనని ఆతృతగా గాలింపు చర్యలను గమనిస్తూ ఉండిపోయారు.వారి రోదనలు సాగర ఘోషను మించిపోయాయి.. తుపాను ప్రభావంతో సాగర కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నా.. అంతకుమించి బాధిత కుటుంబాలు, స్నేహితుల కన్నీటి కెరటాలు పోటెత్తుతున్నాయి.ఆదివారం సాయంత్రం నుంచీ ఇక్కడే ఉండిపోయిన బాధితులకు ఆపన్నహస్తం అందిస్తూ యారాడ గ్రామస్తులు మానవత చాటుకుంటున్నారు. మల్కాపురం(విశాఖ పశ్చిమ): యారాడ సముద్రతీరానికి ఆదివారం విహారానికి వచ్చిన 12 మంది యువకుల్లో ఆరుగురు గల్లంతవడంతో అంతటా విషాదం అలుముకుంది. సోమవారం సాయంత్రం వరకు వారి కోసం తీరంలో గాలించినా ఆచూకీ లభ్యం కావడంతో అందరిలో ఉత్కంఠ రేగింది. అయితే వారిలో హెచ్‌బీకాలనీ చాకలిపేటకు చెందిన దుర్గా(20),అదే ప్రాంతం భానునగర్ ప్రాంతానికి చెందిన నక్క గణేష్ (17)లు మృతి చెందారు. వారి మృతదేహాలు సోమవారం మధ్యాహ్నం గంగవరం సముద్ర తీరం వద్దకు కొట్టుకువచ్చాయి. వీరిని గుర్తించిన అక్కడి వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో బోట్ల సాయంతో యారాడ తీరానికి తీసుకువచ్చి గల్లంతైన యువకుల బంధువులు, కుటుంబ సభ్యులకు చూపించారు. తొలుత వచ్చిన మృతదేహం దుర్గాదిగా, అనంతరం వచ్చిన మృతదేహాం గణేష్‌దిగా వారి కుటుంబ సభ్యులు గుర్తించారు. దీంతో వారి భౌతిక కాయాలను శవపంచనామా నిమిత్తం కేజీహెచ్‌కు న్యూపోర్టు పోలీసులు తరలించారు. ఆదివారం నుంచి తీరంలోనే కాగా ఆదివారం మధ్యాహ్నం నుంచి గల్లంతైన ఆరుగురి యువకుల తల్లిదండ్రులు,కుటుంబ సుభ్యలు,స్నేహితులు తిండి, నిద్ర మాని ఆశగా తీరం వైపు ఎదురుచూస్తూ అక్కడే ఉండి పోయారు. గల్లంతైన వారి ఆచూకీ తెలుసుకోనేందుకు నేవీ,కోస్టుగార్డు,మెరైన్, న్యూపోర్టు పోలీసులు,గజ ఈత గాళ్లు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం ఉదయం నుంచి రెండు హెలికాఫ్టర్ల సాయంతో తీరం పై నుంచి బైనోక్లాక్,కెమెరాలు,జూమ్ కెమెరాల సాయంతో పరిశీలించారు. మూడు బోట్లు సాయంతో ఇతర సిబ్బంది గాలింపు చర్యలు చేట్టారు.బంధువులు,స్నేహితులు, కుటుంబ సభ్యులు తిండి,నిద్ర లేకుండా బాధతో తీరంలో ఉండడంతో యారాడ గ్రామ ప్రజలు చలించిపోయారు. వీరందరికీ భోజనాలు సమకూర్చారు. మిన్నంటిన రోదనలు గల్లంతైన వారి బంధువులు,కుటుంబ సభ్యుల రోదనలతో యారాడ సముద్ర తీరం శోకసంద్రంగా మారింది. ఎన్నో ఆశలతో పెంచుకున్న కన్న బిడ్డలు యవ్వనంలోనే అనంత లోకాలకు వెళ్లిపోయారని మృతులు గణేష్,దుర్గా తల్లిదండ్రులు రోదన అక్కడ వారిని కంటతడి పెట్టించింది. చేతికి అందివస్తారన్న తమ కుమారులు ఇంతలోనే వెళ్లిపోయారని.. తమకు ఇంకెవరు దిక్కు అంటూ మృతుల తల్లిదండ్రులు అక్కడ గంగమ్మవైపు ఆక్రోశంగా చూస్తూ రోదించారు. కంటికి రెప్పలా చూసుకున్న తమ బిడ్డలను పొట్టన పెట్టుకుని మా ఆశలు చిదిమేశావంటూ విలపించారు. మిత్రులను మరవలేకున్నాం ఎంతటి ఒత్తిడిలో ఉన్న నిత్యం మేమంతా ఒక్కసారైనా,లేదా ఫోన్లోనైనా కుసల ప్రశ్నలు వేసుకోనే వారిమి. ఇప్పుడు మా తో ఎవరు కబుర్లు చెబుతారు. మా బాధలు ఎవరు పంచుకుంటారు అంటూ మృతులు,గల్లంతైన యువకుల స్నేహితులు రోదించారు. రూ.200 అడిగితే రూ. 300 ఇచ్చా స్నేహితులతో సరదాగా విహారానికి వెళ్తున్నా రూ.200 ఇవ్వు అమ్మా అని ముద్దుగా అడిగితే రెండు వందలు ఏమి సరిపోతాయి.. రూ.300 తీసుకో నాన్నా అని ఇచ్చానని మృతుడు దుర్గా తల్లి గుర్తుచేసుకున్నారు. సాయంత్రం వచ్చినప్పుడు ఏమైనా తెస్తానని చెప్పి వెళ్లిన కొడుకు మాటను గర్తుచేస్తుకుంటూ విలపించింది. బిడ్డా నాకు ఏమీతీసుకురాకుండానే పరలోకానికి పో యావా అంటూ ఆ తల్లి రోదన చూసిన వారు తల్లడిల్లిపోయారు. మాకు నవ్వులు ఎవరు పంచుతారు నాయనా విధులు ముగించుకుని ఇంటికి వచ్చే గణేష్(మృతుడు)ఇంట్లో టీవీ చూçస్తూ ఆ కార్యక్రమాలను అనుకరిస్తూ మమ్మల్ని నవ్వించేవాడు. ఇప్పుడు మమ్మల్ని ఎవరు నవ్విస్తారంటూ గణేష్ కుటుం బ సభ్యులు రోదించారు. నవ్వులు పంచుతానని చెప్పి ఇలా ఏడిపిస్తావా అంటూ వారు కన్నీటిపర్యంతమయ్యారు. -
కడలి మాటున కంటిదీపాలు
మద్దిలపాలెం( విశాఖ తూర్పు): వయసులో చిన్న వారైనా బాధ్యతలో చాలా పెద్దోలు. కన్నవారికి చేదోడువాదోడుగా ఉండాలనే తపన తప్ప చెడు వ్యసనాలతో జులాయిగా తిరిగే కుర్రాళ్లు కాదు. ఉదయం లేచింది మొదలు ఉపాది కోసం పాకుడాలాడే పిల్లలు. అలాంటి కుర్రాళ్లు కడలి మాటున కనుమరుగు కావడం దుర్గానగర్‌కాలనీ,రజకవీధి కాలనీ వాసులను విషాదంలోకి నెట్టింది. కాలనీవాసులంతా రెండురోజులుగా విషణ్ణ వదనంలో గడుపుతున్నారు. ఆదివారం నాగుల చవితి కావడంతో 12 మంది స్నేహితలు కలిసి పిక్నిక్ పేరుతో యారాడ బీచ్‌కు వెళ్లారు. ఇంటి వద్దే వంటకాలు చేసుకుని మరీ పయనం అయ్యారు. ఉదయం 11గంటలకు బయలు దేరి వెళ్లిన వారు మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి వచ్చేస్తామని ఇంట్లో వాళ్లకు చెప్పారు. అదే మూడు గంటల సమయంలో ఆరుగురు గల్లంతయ్యారనే పిడుగులాంటి వార్త వినాల్సివచ్చింది. సోమవారం నాటి రజకవీధికి చెందిన దుర్గా, గణేష్‌లు మృతదేహాలు తీరానికి కొట్టుకు వచ్చాయి. వారి కుటుంబీకుల సమక్షంలో ఆ మృతదేహాలను కేజీహెచ్ మార్చురీకి తరలించారు. కాగా ఇంకా వాసు, శ్రీను, రాజేష్, తిరుపతి జాడ సోమవారం రాత్రికీ కానరాలేదు. దీంతో ఆ నలుగురి కుటుంబాలు మరింత దుంఖంలో మునిగిపోయాయి. వారి జాడ కోసం ఎదురుచూస్తున్నారు. పది నిమిషాల ముందు మాట్లాడాడు మూడు గంటలకు వచ్చేస్తామని సరిగ్గా ఆదివారం మధ్యాహ్నం 2.50 గంటలకు చెప్పాడు. పదినిమిషాల తర్వాత కెరటాల్లో కొట్టుకుపోయాడనే దుర్వార్త తోటి స్నేహితులు చెప్పారు. ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేదు. ఉదయాన్నే ఇంటి వద్దే వంటలు చేయించాడు. మధ్యాహ్నం మూడు గంటలకు తిరిగి వచ్చేస్తామని చెప్పాడు. సరిగ్గా మూడుగంటలకు పదినిమిషాలు ముందు ఫోన్‌చేసి వచ్చేస్తున్నామన్నాడు. కెరటాలు మా కంటిదీపాలు ఆర్పేశాయమంటూ లక్ష్మి కన్నీంటి పర్యంతమయింది. పీఎంపాలెంలోని పాలిటెక్నికల్ కళాశాలలో చదువుతూ పోషణ భారంగా ఉందని భావించి మధ్యలో చదువు మానేశాడు. నాకు తోడుగా ఉండేందుకు ఆటో నడుపుతూ నన్నుపోషిస్తున్నాడు. ఇప్పడు నాకు దిక్కు ఎవరు అంటూ గుండెలు పగిలేలా రోధించింది. బాధితులకు వంశీకృష్ణ పరామర్శ యారాడ తీరంలో గల్లంతైన యువకుల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను వైఎస్సార్సీపీ తూర్పు సమన్వయకర్త వంశీకృష్ణ శ్రీనివాస్ పరామర్శించారు. జరిగిన సంఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులను ఓదార్చారు. తీరంలో ఇలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం కుటుంబాలను ఆదుకోవాలన్నారు. -
పండగ పూట పెను విషాదం